ఈ గొప్ప యోధుడైన యెహోషువా

ఈ గొప్ప యోధుడైన యెహోషువా

యెహోషువా. గత రాత్రి మనము గొప్ప యోధుడైన దావీదును గూర్చి మరియు క్రీస్తులో అతని యొక్క స్థానము గుర్చియూ, ఆ స్థానం కోసం అతను ఏమి చేశాడో చర్చించుకున్నాము మరియు ఈ రోజు రాత్రి యెహోషువా గురించి చర్చించుకుందాము. రేపు రాత్రి ప్రభువు చిత్తమైతే, మరొక గొప్ప పరాక్రమశాలి లేక ఎవరినైనా గూర్చి అతని యొక్క జీవితం గూర్చి తెలుసుకుందాం.

మరియు ఇప్పుడు అంత ఎక్కువగా ప్రజలు లేరు, మరియు ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది వారి యొక్క స్వస్థతలను అంగీకరించి యున్నారు. నేను చాలా సమయం వాక్యాన్ని ముందుకు తీసుకుని రావడానికి వెచ్చించియున్నాను. అదే విధంగా ప్రజలను వారి వారిస్థితులలో ఉంచుటకు వారిని ప్రోత్సహించియున్నాను.

పరిశుద్దాత్మడు దానిని చేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను, ఇక్కడ ఉన్న ప్రజలను గూర్చి ఒకటి అడగాలని ఆశపడుచున్నాను. ఇక్కడ ఉన్నటువంటి జనాంగములో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో మీ చేతులు చూపించండి? నీవు ఏ సంఘానికి సంబంధించినవాడవైనా సరే. ఓ, తొంబై-తొమ్మిది శాత౦ మంది క్రైస్తవులున్నారు. బహుశా ఎనిమిది నుండి తొమ్మిది మంది మాత్రము క్రైస్తవులు కానివారున్నారు.

మంచిది. మీరు ఆ ప్రజలను ఏమి చేయవలసి ఉన్నది? వారికి వారి యొక్క స్థానమేమిటో, అసలు వారు ఎవరో తెలియజేయాలి మరియు అపవాధిని ఏ విధంగా అదుపు చేయాలో చెప్పాలి. అలాగైతే ఈ చికాగోలో ఈ రాత్రి క్రైస్తవులు కాని వారు వేలకొలదిగా ఉన్నారు. అలాగైతే నీవే ఒక యోధుడవు కావల్సి ఉన్నది, నీవు ఒక బోధకుడవు.

2

నేను మీతో ఒకరిని గూర్చి చెబుతూ, దాన్ని ముగించకుండా అలాగే వదిలివేశాను. అతను నన్ను ఒక విమర్శాత్మక (వేలెత్తి చూపే) మాటను రాశాడు. ఇప్పుడు ఈ కూడికలో కాదు, వేరొక కూడికలో అతను నాతో, “రెవ. బ్రెన్హామ్, నీవు దేవుని యొక్క మనిషివి అని నాకు ఇప్పటి వరకూ చాలా చాలా నమ్మకమున్నది, కానీ నీ ప్రేరణ తోటి నీవు ఒక ప్రవక్తవని చెప్పుకొనుచున్నావు. అలాగున నీవు చెప్పవద్దు” అని చెప్పెను.

మంచిది, మరి నేను అతనితో, అలాగైతే ఆ మాట చెప్పినది నేను కాను; అది ఆయనే అని అన్నాను. ఆయనతో కొద్దిగా చర్చ జరిగినది. మరియు వీటన్నిటి తరువాత నేనన్నాను, నా ప్రియమిత్రుడా, నీకు నూతన నిబంధన ప్రవక్త అంటే ఏమిటో తెలుసా? అతను ఒక బోధకుడు ఖచ్చితంగా ప్రవక్త అంటే బోధకుడు. ప్రవక్త అనే పదము ఏమిటంటే, బోధకుడు లేదా జరగబోయే దానిని చెప్పువాడు.

నీవు ఆ పదమును గూర్చి బైబిల్ నిఘంటువును నమ్మనట్లయితే, ఇదిగో ఈ బైబిల్ దానిని గురించి ఏం చెబుతుందో విందాము. బైబిల్ చెప్పింది, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం అనేది ప్రవచనము యొక్క ఆత్మ.“ అది సరియేనా? గనుక యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం చెప్పు నిమిత్తము మీరందరూ ప్రవక్తలే. గమనించారా? అది ప్రవచనం యొక్క ఆత్మ యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం అనునది ప్రవచనం యొక్క ఆత్మయై యున్నది.

3

అయితే ఇప్పుడు, వాక్యము చదువుచున్నటువంటి మనలను ప్రభువు దీవించును గాక! ఈ సమయంలో మీరు యొహోషువా గ్రంధము మూడవ అధ్యాయము తీయవల్సినదిగా కోరుచున్నాను. ఒక గొప్ప యోధుడు ప్రతి సారి ఈ లేఖనమును చదివినప్పుడల్లా, ఆయనను నేను ప్రశంసిస్తుంటాను.

అప్పుడు యెహోవా యెహోషువాతో ఇట్లనెను, నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.

మరియు ఇప్పుడు అలాగే యెహోషువా గ్రంథము ఐదవ అధ్యాయము 12వ వచనం మనము చదువుదాము.

మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి.

యెహోషువా యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేతపట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను. యెహోషువ అతనియొద్దకు వెళ్లి - నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా!

అతడు - కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాననెను. యెహోషువా నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి - నా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను.

అందుకు యెహోవా సేనాధిపతి - నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్దమైనది, నీ పాదరక్షలను తీసి వేయమని యెహోషువాతో చెప్పగా. యెహోషువా అలాగు చేసెను.

4

ఇప్పుడు ప్రార్ధన చేయుదము.

తండ్రి ఈ చదవబడిన వాక్యము నీవే. నీవు వాక్యములను తీసుకుని వాటిని పరిశీలించి ఒక్కొక్కరికి మాకు దానియొక్క అసలైనటు వంటి అర్థం తెలియజేయుము. మరియు గొప్ప యోధుడైనటువంటి యెహోషువా అనబడిన నీ సేవకుని గూర్చి తెలియజేయుము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి హృదయములో, మీరు విత్తనము నాటుదురని ప్రార్ధిస్తున్నాము. పరిశుద్దాత్మ దేవుని యొక్క వాక్య విత్తనమును ప్రతి హృదయంలో నాటును గాక! అది నూరంతలుగా ఫలించును గాక, వీటన్నింటినీ మేము యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.

5

ఇప్పుడు, మనము ఈ రాత్రి గొప్ప యోధుడైన యెహోషువాను గూర్చి మాట్లాడుకుందుము. ఆయన ఐగుప్తు నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులను కలిగి ఉన్నాడు. వారందరూ ప్రయాణపు చివరి దశలో ఉన్నారు. ప్రయాణం అనునది మూడు దశలుగా ఉన్నది. ఐగుప్తు నుండి వారు మొదట బయటకు రావడం; రెండవది, అరణ్యములో నడవడము; మూడవది, పాలస్తీనా వాగ్దాన దేశమునకు చేరుట.

6

ఇప్పుడు, చాలా మంది ప్రజలు నన్ను పోల్చిచెప్పేవాడిగా చూస్తారు. నాకు నేను ఏమి చెప్పానంటే అరణ్యమార్గములో ప్రయాణం అయిపోయిన తరువాత మహిమ లోనికి వెళ్ళటమే అని చెప్పాను. అయితే, ఇప్పుడు ఈ రాత్రి ఒకరు మన మధ్యలో ఉండి ఈ విధంగా బోధిస్తున్నారు. అది వ్యత్యాసం చూపించదు. నా సహెూదరీ, సహూదరుడా ఏది యేమైయున్నప్పటికీ నా సిద్దాంతములలో నేను తప్పు అయి ఉండవచ్చు, కానీ నేను ఎప్పుడూ కూడా వాగ్దాన దేశమును పరలోకముతో పోల్చలేదు, ఎందుకనగా ఆ వాగ్దాన దేశములో యుద్ధములను వారు కలిగియున్నారు.

నేను ఒక మిల్లీయనిస్ట్ ని. మరి మనకు మిల్లీనియమ్ ఉందని నేను గట్టిగా నమ్ముతాను. భూమి మీద ఒక వెయ్యి సంవత్సరములు దేవుడు తన స్థానమును తగ్గించుకొని వచ్చియున్నాడో, అదే విధంగా, ఈ మానవాళి మొత్తం నేరుగా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. మరియు నేను నమ్ముచున్నాను, ఆ వాగ్దాన దేశము మిల్లీనియమ్ కు మాదిరిగా ఉన్నది. మిల్లీనియమ్లో వెయ్యి సంవత్సరములు ఉన్నవి.

7

మీరు గమనించినట్లయితే, వారు యోర్దానును దాటిన వెంటనే, దాని అర్థం ఏమిటంటే ఈ లోకపు ప్రయాణాన్ని ముగించుకొని వేరే ప్రదేశానికి వెళ్ళారు. ఆత్మీయమైనటువంటి మన్నాను ఆపి, ఆ కనానులో దొరికేటువంటి పంటను తిన్నారు. వారు ఆ దేశము యొక్క పంటను మళ్ళీ తిన్నారు. మరి మిల్లీనియమ్లో..... చూడండి, ఇప్పుడు మనము ఆత్మీయమైనటువంటి మన్నా తింటున్నాము. కానీ తిరిగి, తరువాత ఆ సమయంలో వారికి ఆత్మీయమన్నా అవసరం లేదు. మనము మళ్ళీ ద్రాక్షాఫలములను మనము ఆ పొలములో పండినటువంటి ఫలములను తిందుము.

మరియు బైబిల్ చెబుతుంది, అక్కడ మనము నివాసములు కట్టించుకొని అక్కడ కాపురం ఉండెదము, మరియు తోటలు నాటి వాటి పండ్లను తినెదము. మనము మిల్లీనియమ్లోనికి వచ్చినప్పుడు వెయ్యి సంవత్సరముల విశ్రాంతిలోకి వచ్చినప్పుడు యుద్దాలు, సమస్యలు, రోగములు వచ్చినప్పుడు అవన్నీ మరియు మరణము ఈ ప్రపంచం నుండి పారిపోతాయి. మనం క్రీస్తుతో కూడా ఒక వెయ్యి సంవత్సరములు తిరిగి భూమి మీదకు వస్తాము. మహిమలోనికి వెళ్ళటానికి ముందుగా ఇవన్నీ జరుగును. మనకు లేఖనము బోధిస్తున్నది అదియే.

8

ఇప్పుడు చూడండి, ఎంత అందంగా ఒక మాదిరికరంగా ఉందో చూడండి. అది ఐగుప్తు గాను, మరియు ఐగుప్తులో స్థిరపడినట్లుగా ఉండుటకు మాదిరికరంగా ఉన్నది. చాలా మంది ప్రజలు ఐగుప్తులో ఉండియున్నారు. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు యోసేపు శరీరం మాత్రం ఐగుప్తు నుండి బయటకు తేబడింది. కానీ, ఐగుప్తులో పునరుత్థానము జరగవలసియున్నది, ఎందుకనగా మన పితరులందరు ఐగుప్తులోనే సమాధి చేయబడినారు. చాలా మంది విశ్వాసులు ఐగుప్తులో సమాధి చేయబడినారు.

మరియు, ప్రయాణపు రెండవ దశ అయినటువంటి అరణ్యమార్గంలో చాలా మంది నీతిమంతులు చనిపోయినారు. మనము చూసినట్లయితే మిరియాము, అహరోను ఇంకా చాలా మంది భక్తులు ఈ ప్రయాణపు మధ్యలో చనిపోయారు, అలాగనే అక్కడ పునరుత్థానము ఉండవలసి యున్నది. అదే విధంగా వాగ్దాన దేశములో కూడా పునరుత్థానము జరగవలసి ఉంటుంది.

ఆ మూడు విషయాలు ఈ మాదిరి లూథరన్ మరియు జాన్ వెస్లీ బోధనలకు మాదిరిగా ఉన్నవి. లూథరన్ కాలంలో విశ్వాసం ద్వారా నీతీకరణ అనునది నడిచినది. లూథరన్ ప్రజలను ఐగుప్తు నుండి బయటకు నడిపించాడు. ఆ వెల్లుల్లి పాత్రల వాడకం నుండి మరియు ఈ లోకపు శరీరం నుండి బయటకు నడిపించును; రెండవదిగా, జాన్ వెస్లీ పరిశుద్దాత్మ ద్వారా; మరియు మూడవదిగా, పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము ద్వారా వారు మరలా స్వతంత్రులైనారు.

9

మొదటిగా పిలవబడినటువంటి దేవుని చేత ఎన్నుకోబడిన యెహోషువాను గమనించండి. ఆయన అరణ్యమార్గంలో ఉన్నప్పుడు, ఆయన ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులతో బయటకు వచ్చినప్పుడు వారు ఆ నలభై లేదా యాభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వాగ్దాన దేశానికి ఐదు రోజులలో దాటేవారు.

వారు బయటకు వచ్చినప్పటి నుండి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారు సణుగుకోకుండా, ఫిర్యాదులు చేయకుండా ఉన్నంత వరకూవారి ప్రయాణం హాయిగా సాగింది. దేవుడు సమకూరుస్తాడు. తరువాత వారు కాదేశ్-బర్నేయా అనే తీర్పు సింహాసనం వద్దకు వచ్చి వారు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను తిరస్కరించి వారు వెనుదిరిగి నలభై సంవత్సరాల పాటు ఆ అరణ్యంలో తిరిగారు, ఎందుకనగా వారు దేవునుని నమ్మలేదు మరియు దేవుడు ప్రవేశపెట్టిన ప్రణాళికను వారు అంగీకరించలేదు.

అటువంటి అందమైన ఈ రోజుల్లో ఉన్నటువంటి సంఘమునకు మాదిరిగా ఉన్నది. అటువంటి పద్ధతి మీదనే ఇది జరుగుతున్నది. కేవలం దేవుడు చరిత్రను మరో మార్గంలో తిరగరాస్తున్నాడు. ఏ విధంగా బయటకు పిలవబడటము, వారి ప్రయాణం మరియు వాగ్దానంలోనికి వెళ్ళుట, కాని వారు దానిని తిరస్కరించుట, అంతా ఒక అందమైన చిత్రపటమువలె మన ముందు ఉన్నది.

10

ఇప్పుడు, యొహోషువా మొదటి నాయకుడుగా ఉండెను. మరి ఆ అరణ్యంలో వెయ్యింతల నీతి కలిగిన నీతిమంతులు వేల సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ, యెహోషువా దేవుని చేత ఎన్నుకోబడిన వానిగా ఉన్నాడు. మరియు ఆయన ఆ మార్గమును దాటుచున్నప్పుడు మోషే మరణించెను. ఆ తరువాత దేవుని చేత ఇతను పిలువబడ్డాడు. దేవుడు అతనిని పిలిచి అతనికి ఒక దర్శనం చూపించాడు. మరియు దేవుడు అతనితో, “నేను మోషేతో ఉన్న విధంగా నీతో కూడా ఉందును. నీవు బ్రతికి ఉన్న దినములలో ఎవ్వరూ నీ యెదుట నిలవజాలరు. భయపడవద్దు, నిబ్బరముకలిగి ధైర్యముగా నుండుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.”

11

దేవుని చేత ఎన్నిక చేయబడి, గొప్పవీరుడుగా ఉన్నటువంటి యెహోషువా ఆ దర్శనం అనంతరం ఒక రాజుని లేక ఒక గొప్ప వ్యక్తిని ఆయన ఆ యెరికో గోడల దగ్గర కలుసుకున్నప్పుడు ఆయన స్థిరంగా ఉంచబడ్డాడు. అతను ఒక యోధుడు. అప్పుడు ఆయన నిజంగా దృశ్యమైనవి ఏవో చూసెను. మరి ఆ గోడ దగ్గర నిలిచి ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఎవరని అనుకుంటున్నావు?

ఇప్పుడు యొహోషువాకి తనకు కలిగినటువంటి దర్శనములలో దేవుడు తనతో ఏ విధంగా మాట్లాడియున్నాడో మరియు ఆ గోడ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క సేవకుడని ఎరిగియున్నాడు. మరియు యెహోషువా భయపడలేదు గాని, వారు ఆ వాగ్దాన దేశములోనికి ప్రవేశించినప్పుడు ఆకాశము నుండి కురిసిన మన్నా ఆగిపోయెను. వారు ఆ భూ-పంటను తిన్నారు. ఆ పాత భూ-పంటను తినడం ప్రారంభించారు.

అయితే ఒక రోజు వారు ఎడారిలో నడుచుకుంటూ లేదా అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ యోర్దాను నుంచి యెరికోకు వచ్చినప్పుడు, అక్కడ యెహోషువా ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి నిటారుగా నిలబడి అతని కత్తి దూసి నిలిచియున్నాడు. కేవలం మానవునివలె కనబడుచున్నాడు మరియు యెహోషువా ఉన్నటువంటి యోధులలో ప్రధాన యోధుడు గనుక అతడు కూడా అతని కత్తి దూసి ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని కలవడానికి నడుచుకుంటూ వెళ్ళి అతనితో ఎవరు నీవు? నీవు మా కోసం వచ్చితివా? లేక మాకు విరోధముగా వచ్చితివా?“

అతడు తన కత్తిని నిటారుగా పైకి ఎత్తి చెప్పుట నేను చూడగలుగుచున్నాను, “లేదు, నేను ఇశ్రాయేలు దేవుడును మరియు ప్రభువైన యెహోవాకు సేనాధిపతిగా వచ్చితిని.”

ప్రభువు యొక్క సేనాధిపతి. ప్రభువు యొక్క సేనాధిపతి ఎవరు? యెహోషువా వెంటనే మోకాళ్ళూని మరియు అతని పాదరక్షలు విడిచి అతని యెదుట సాగిలపడి, ఆ సేనాధిపతితో “ప్రభువు నన్ను ఏమి చేయవలెనని కోరుచున్నాడు,” అనెను.

12

ఏరు గమనించండి, అతను అలాగు చేసిన తరువాత అతని యొక్క స్థానం పొందుకున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో అతను ఒక గొప్ప సైనికుడుగా ఉండబోవుచున్నాడు. ఏ సమయంలో కూడా, ఏ కాలంలో కూడా, ఎక్కడా కూడా యెహోషువా లాంటి సేనాధిపతి లేడు. యెహోషువాతో కూడా పోల్చతగిన వారు కూడా ఎవరూ లేరు. యెహోషువా అనే పదం, యేసు అనే పదం నుండి వచ్చినది. అంటే యేసు లేదా రక్షకుడు లేదా విమోచకుడు.

మరియు యెహోషువా ఆ మనిషిని చూసినప్పుడు ఆ మనిషి ఎవరు? ఆయన యొక్క సేనాధిపతి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రభువునకు నాయకుడు. మరి ఆ నాయకుడు ఎవరో కాదు గానీ క్రీస్తే. యెహోషువా మొదటిగా ఎవరిని చూసెను? అతడు మొదటిగా అగ్నిస్తంభమును చూసెను. మరి ఇప్పుడు అదే అగ్నిస్తంభము ఒక మనిషిగా మారి అతనికి కనిపించెను. నేను ఏమి మాట్లాడు చున్నాన్నో అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అతను ఒక మనిషిగా మారెను.

యెహోషువా తనకు తానుగానే దానిని ఉన్నట్లుగానే చూసెను: ఆ అగ్నిస్తంభము ఒక దూత వలె వారిని నడిపించి, మరలా ఒక మనిషిగా వారి యెదుట నిలబడి ప్రభువు యొక్క సేనాధిపతిగా తనకుతానుగా పిలుచుకొనెను. అతను కనబడని వాడుగా ఉండెను.

మరియు అతను ఇప్పటికీ ప్రభువు యొక్క సేనాధిపతిగా ఉన్నాడు. మునుపు చూడనటువంటి వ్యక్తి అదృశ్యమైనటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, ఆ యెరికో గోడల దగ్గర నిలుచొన్నట్లుగా, ఈ రాత్రి ఇక్కడ మన మధ్య అలాగునే నిలబడి ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ఆ మాధుర్యకరమైనటువంటి రూపము కలిగి ఉన్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం, చాలా, చాలా, చాలా వందల సంవత్సరాల క్రితం అబ్రహామును కలిసిన మెల్కీసెదకు అయి ఉన్నాడు. తల్లియైననూ, తండ్రియైననూ, ప్రారంభసంవత్సరములైననూ, లేక ముగింపు సంవత్సరాలైననూ లేనటువంటి మెల్కీసెదకుగా ఉన్నాడు.

13

తల్లియైననూ, తండ్రియైననూ, సంతతి అయిననూ, ప్రారంభ దినములైననూ, ముగింపు సంవత్సరాలైననూ లేనటువంటి వాడిగా ఉన్నటువంటి ఈ గొప్ప రాజు ఎవరు? ఇదిగో చూడుడి, అతను ఇక్కడే ఉన్నాడు. అతను ఒక రోజు సింధూర వృక్షము క్రింద అబ్రహామును కలిశాడు. అతని వస్త్రములు దుమ్ముపట్టి ఉన్నవి. అతను అబ్రహాముతో నేను ఒక అసాధారణమైన దేశము నుండి వచ్చుచున్నాను, సొదొమ పట్టణముల మీదుగా వెళ్ళచున్నాను.

మరియు అబ్రహాము అక్కడ ఏదో ఉంది అని గమనించి క్రొవ్విన దూడను తెచ్చి దానిని చంపి, మరియు దానిని బయటకు తెచ్చి మరియు ఆవు పాలను అతనికిచ్చి క్రొవ్విన దూడ మాంసమును, నిప్పుల మీదుగా కాల్చిన రొట్టెలను తనికి ఇచ్చెను. మరియు ఆయన ఆ పాలను త్రాగి, మరియు ఆ మాంసమును, ఆ రొట్టెలను తిన్నాడు. మరియు అబ్రహాము బలి అర్పణ చేసినప్పుడు అతని ఎదుట ఉన్నటువంటి వ్యక్తి అదృశ్యమాయెను. అబ్రహాము, “నేను దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను.” మెల్కీసెదకు, కనిపించనటువంటి సూత్రధారి. ఆయన అక్కడ ఏ విధంగా ఉన్నాడో, ఈ రాత్రి ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాడు. తన ప్రజలు ఎక్కడైతే కూడి ఉంటారో ఆయన ప్రతి చోటా ఉంటాడు, ఎందుకనగా అది ఆయన యొక్క ఆత్మ సంబంధమైన శరీరము. ఆ శరీరము క్రీస్తే, ఈ రాత్రి మీరు దానిని పొందుతారని ఆశిస్తున్నాను మరియు అది నిజంగా సమీపంగా ఉన్నదో చూడండి.

14

చూడండి. నా ఆత్మ నా నీడలా ఉన్నట్లయితే, నా నీడ ఒక పదార్ధానికి నీడయై ఉన్నది. ఇంకా చెప్పాలంటే, నా నీడ ఒక పదార్ధానికి ఆత్మయై ఉండవచ్చును. ఇప్పుడు మహా అద్భుతంగా దేవుని యొక్క సహజ సిద్దమైన శరీరానికి ప్రభువైన యేసు శరీరం నీడగా ఉన్నది. మరియు గమనించండి, స్వస్థతలు, శక్తి, దర్శనములు క్రీస్తులో ఉన్నట్లయితే అవి అతని నీడలో నుండి బయటకు వెళ్ళినట్లు. అయితే అప్పుడు క్రీస్తు అను శరీరం పక్షవాయువు వచ్చిన శరీరంవలె ఉంటుంది, ఎందుకనగా అతని భౌతిక శరీరం కదిలినప్పుడు, అతని నీడ కూడా దానితో పాటు కదలవలసి ఉన్నది.

మరియు మనము పరిశుద్దాత్మ బాప్తిస్మము ద్వారా క్రీస్తులో ఉన్నట్లు అయితే, క్రీస్తు యొక్క శరీరం కదిలే విధంగా, మనము ఈ భూమి మీద కదలవలసి ఉన్నది, ఎందుకనగా ఈ శరీరం ఆయనకు నీడయై ఉన్నది. ఆమేన్. ప్రతిసారి అది మాదిరికరమగు రూపములుగా ఉన్నవి. మరి ఈ రాత్రి ఇదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం అయివున్నది.

ఇప్పుడు, లోకసంబంధమైన వస్తువులను, కార్యములను తీసివేస్తుంది. దేవునిచే ముందుగా నిర్ణయించబడి, దేవునిచే పిలవబడి, దేవునిచే ఎన్నుకొనబడి, దేవునిచే ఏర్పరచబడి, దేవునిచే రక్షించబడి పరిశుద్దాత్మ ద్వారా క్రీసు శరీరంలోనికి బాప్తిస్మము పొందిన వారమై, ఆయన శరీరంలో భాగస్వాములు (సభ్యులు) గా చేయబడినాము. సజీవంగా సిద్దపాటు కలిగి ఒప్పుకోలుగా ఉన్నాము. నా శరీరంలో ఏదైనా కదిలినప్పుడు, నా యొక్క నీడ కూడా కదులుతుంది. మరియు అదే విధంగా క్రీస్తు యొక్క శరీరం కదిలినప్పుడు, ఆయనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క పరిశుద్దాత్మడు కూడా కదులును. మరియు క్రీస్తు పరలోకములో ఉన్నట్లయితే, ఆయన యొక్క భూమి మీద ఉన్న ఆత్మీయ శరీరము, ఆయన కదిలిన విధంగా కదులుతుంది. జరగనైయున్న సంగతులను గమనించండి.

జీవములోనికి వచ్చుటకు అది ప్రారంభం అవుతుంది. అది చాలా కాలము వరకు స్థంభించింది, కానీ పరిశుద్దాత్మడు వచ్చి దానిని జీవములోనికి తీసుకొని వచ్చాడు. మరియు ఇది మేల్కొని కదలవలసిన సమయం, ఎందుకనగా అది తన యొక్క స్థానమును గమనించినది.

15

యెహోషువా, మోషేతో ఉన్న నాయకుడిగా ఉండి కూడా, ఆయన గూర్చి మనం మొదటిసారిగా మోషే చేతులు పట్టుకున్నప్పుడు మాత్రమే వింటాము.

ఇప్పుడు వారు ప్రయాణం చేశారు. ఒక అందమైన చిత్రం, ఐగుప్తు యొక్క గందరగోళంలో నుండి బయటకు వస్తుంది. ఆ యొక్క వెల్లుల్లి పాత్రలను వదిలి, ఆ యొక్క లోకమును వదిలి, ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ, పాత కార్యములను, పాత వస్తువులను వెనక విడిచి, ప్రతి యొక్క తరాన్ని విడుస్తూ, మనము ఈ రోజుల్లో పిలవబడినట్లుగా, బయటకు వచ్చి ఒక తెలియని ప్రదేశంలో సంచరిస్తూ, గుర్తు తెలియని ప్రజల మధ్యలో, దేవుని ఆరాధించటం, ఎంత మాదిరికరమైన మార్పు. ఐగుప్తును విడిచిపెట్టుట, అందులో ఉన్న ఇసుక, రాతి మరియు ఆ భంజర భూములను వదిలి, ఆ అరణ్యములో గుర్తు తెలియని వ్యక్తులతో నివాసం చేస్తుండటం, కానీ అది ఒక వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు.

దేవుడు ఈ రాత్రి ప్రమాణం చేశాడు. నీవు లోకము నుండి బయటకు వచ్చినప్పుడు, నీవు ఈ భూసంబంధమైన కార్యములలో మరియు భూసంబంధమైన సహవాసాన్ని విడిచి ప్రతి విధమైన లోకసంబంధమైన పార్టీలను మరియు లోకసంబంధమైన ఆనందాలను, త్రాగుడు, ధూమపానం, జూదం, వీటన్నింటినీ నుండి నీవు వేరైపోతావు మరియు నీవు గుర్తు తెలియని ఇంతకు ముందు చూడని వారితో నడుస్తావు, వారు “ఆమేన్” చెబుతారు, మరియు ఆత్మతో నింపబడి, ప్రతి కార్యాన్నినమ్ముతూ, ప్రతి కార్యాన్ని గూర్చి నిరీక్షిస్తూ, ప్రభువు యొక్క రాకడ గూర్చి ఎదురుచూస్తూ, వారు ఈ లోకసంబంధులు ఏ మాత్రమూ కారు; వారు పరదేశులు, యాత్రికులు అని ప్రకటిసూ, లోకసంబంధమైన వాటి గూర్చి ఆశపడకుండా వాటి నుండి దూరంగా వెళతారు. నేను ఏమంటున్నానో గమనించారా?

ఐగుప్తులో, ఇశ్రాయేలీయులు ప్రజలు ఐగుప్తుకు సంబంధించిన బడాయి వైద్యులను విడిచి పరమ వైద్యునితో ఉండుటకు వచ్చారు. వారు దేవదూతల ఆహారమైన మన్నాను తినుటకు, ఆ ఐగుప్తు యొక్క వెల్లుల్లి పాత్రలను విడిచి పెట్టారు. వారు ఐగుప్తులో ఉన్నటువంటి మట్టి నీటిని వదిలి, ఆ ఆత్మీయ బండ నుండి వచ్చే నీటిని త్రాగుటకు వచ్చిరి. ఆమేన్. మీకు అర్థమైనదా? ఆ యొక్క ప్రయాణంలో ఐగుప్తతో సంబంధాన్ని తెంచుకొని వారిని విడిచిరి.

16

వారు ఆ నీటిని దాటుకుంటూ వచ్చినప్పుడు, వారు మోషేను బట్టియు మరియు దేవుని బట్టియు బాప్తిస్మం పొందిరి. వారు ఆ ఎర్ర సముద్రమును దాటినప్పుడు, వారిలో ఒక చిన్న మురిసిపోయే సంతోషం. మిర్యాము బాగా ఉత్తేజంతో ఒక రకమైన డప్పు తీసుకొని దానిని వాయిస్తూ, నాట్యం చేసింది మరియు ఇశ్రాయేలీయుల కుమార్తెలు అయితే పాటలు పాడుతూ ఉత్తేజంతో పదాలను కలుపుతూ డప్పులు కొడుతూ నాట్యం చేసారు. వారు ఎందుకని నాట్యం చేశారు? వారికి దేనిగూర్చి అంత ఉత్తేజం? ఎందుకనగా వారిని తరుముచున్న ఐగుప్తు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రంలో ముంచివేయబడుట వారు చూశారు. ఇంకా ఇశ్రాయేలీయుల ప్రజలను కలవరపరిచే వారందరూ ఎర్ర సముద్రంలో చనిపోయారు.

ఈ రాత్రి మీకు మిర్యామును గూర్చి ఒక హాస్యాస్పద భావన కలిగి ఉండవచ్చు, కానీ ఆ యొక్క పాత పార్టీలు, ఆ యొక్క సామాజిక వ్యవహారాలు అన్నీ కూడా కొట్టుకుపోతాయి. అవి మరణించడం మీరు చూసినప్పుడు, వాటిని మీరు అస్సలు కోరుకోరు, మరియు నీవు ఆ ఎర్ర సముద్రాన్ని దాటియున్నావు. ఆ రక్త కణములు నీ యొక్క శరీరం మీద చల్లబడి అవి నీకు రోగనిరోధకమై ఉన్నది. ఆమేన్. అది నిన్ను నిర్జలీకరణం అయినట్లు చేసినది. ఆమేన్. అది నిజం, నీలో ఉన్న లోకాన్ని మొత్తం తీసివేసింది. అది నీ మీద చల్లబడింది; డిటి, డిడిటి, అని పిలుస్తారని నమ్ముచున్నాను. అది నీలో ఉన్న దోషములను బయటకు తరుమును, మరి నీవు దేవుని యొక్క టీకా వేయించుకొన్నట్లయితే, అది నీలో ఉన్న లోకాన్ని సమూలంగా తీసివేస్తుంది. అది నీలో ఉన్న పరాన్నజీవులను చంపుతుంది.

ఈ రోజు సంఘములో జరుగుతున్నది అదియే. వారు చిలకరింపు ద్వారా రావటానికి ఇష్టపడతారు. వారితో పాటుగా కొన్ని పాత కార్యములను తెచ్చుకొనుటకు ఇష్టపడతారు. వారిని వదిలివేయి, వారిని వెళ్ళనివ్వండి. ఆ చిలకరింపు ద్వారా ఆ కఠినమైన మార్గం ద్వారా, నిన్నునీవు వేరుపరచుకో, అది నీ చుట్టూ ఉన్న కార్యములను ఊపిరాడకుండా చేస్తుంది. ఆమేన్.

17

ఇప్పుడు వారు ఆ యొక్క ఎర్ర సముద్రంలో నుండి వచ్చినప్పుడు, వారు ఆ యొక్క డిడిటి టీకా వేయించుకొని వచ్చినప్పుడు, ఆ పరాన్నజీవులు బాగా కాలిపోయి ఉండవచ్చును - కానీ ఆ పరాన్నజీవులు మునుగుటకు ప్రయత్నిస్తున్నవి.

మరియు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటూ, లోకానుసారంగా జీవిస్తూ వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తూ, ఒక సంఘానికి బద్దులై ఉండి కూడా ఆ లోక కార్యాలు చేస్తూ, క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. అయితే దేవుడు ఈ రోజు తన డిడిటి టీకాలను చల్లుటకు సిద్దంగా ఉన్నాడు. ఆయన తన ప్రజలను వేరుపరుస్తున్నాడు, బయటకు పిలుస్తున్నాడు, పరిశుద్దాత్మతో నింపుచున్నాడు, వారిని విడివిడిగా ఉంచుచున్నాడు.

మీకు తెలుసా లోకము అన్నిటితో కలిసిన వారు కావాలని కోరుకుంటుంది. అయితే దేవుడు, “పౌలును, బర్నబా, నాకు ప్రత్యేకపరచుడని చెప్పెను.” దేవునికి లోకము నుండి తనను తాను వేరుచేసుకునే వారు ఆయనకు కావాలి, అప్పుడు క్రీస్తు నిన్ను స్వీకరిస్తాడు.

18

గమనించండి, వారు బయటకు వచ్చారు, వారు వారి ప్రయాణంలో ఉన్నారు. మోషే నిజంగా ఒక మంచి అనుభూతిని అనుభవిస్తున్నాడు. మరియు దేవుని యొక్క ఆత్మ అతని మీదకు వచ్చినది మరియు ఆయన లేచి ఆత్మతో నింపబడి ఒక పాట పాడెను. దేవుడు ఆ ఫరోను మరియు అతని యొక్క సైనికులను, గుర్రములను, రథములను ఏ విధంగా ముంచివేసెనో దానిని గూర్చి పాడెను. అప్పుడు వారు వారి యొక్క ప్రయాణము కొరకు సిద్ధంగా ఉన్నారు.

ఆ మార్గంలో సంఘం ఉండవలసి ఉన్నది, ఎప్పుడైతే నీవు ఒకసారి క్రీస్తు రక్తము ద్వారా సకల పాపములను కడిగివేయబడి వస్తావో, అప్పుడు నీవు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నావు. నీవు నీ యొక్క సరియైన మార్గంలో ఉన్నావు; ప్రయాణిస్తూ ఉండుము.

వారు ప్రయాణం సాగిస్తూ వెళ్తూ ఉన్నారు. సంఘానికి మాదిరిగా ఉన్నారు. కానీ అది, లూథర్ కాలంతో పోల్చినట్లయితే, వారు ఒక ప్రదేశానికి వచ్చారు — కానీ అప్పటికి వారికి సంపూర్ణమైన వాక్యం లేదు — మరియు కాదేశ్-బర్నేయా ప్రదేశానికి వచ్చినప్పుడు, అక్కడ గొప్ప నీటి బుగ్గలు మరియు దాని చుట్టూ చిన్న చిన్న నీటి బుగ్గలు ఉన్నవి. ఆ స్థలము ఒకానొక సమయంలో లోకము యొక్క తీర్పుసింహాసనంగా ఉన్నది. ఒక అందమైన తీర్పునకు మాదిరిగా ఉన్నది. నిజముగా తీర్పు అనునది దేవుని యొక్క గృహము నుండి ప్రారంభమగును మరియు వారు అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు.

19

మరి ఇప్పుడు, దేవుడు యెహోషువాతో.... లేక మోషేతో, “వెళ్ళి ప్రతి గోత్రము నుండి ఒక మనుష్యుని తీసుకురండి. మరియు వారిని వాగ్దాన దేశమునకు పంపించండి” అని చెప్పాడు, ఐగుప్తును వదిలిన కొద్ది దినముల తర్వాత, “వారిని ఆ దేశమునకు పంపి అందులో గూడాచారమైన విషయాలను సేకరించి, తిరిగి వచ్చి నాకు నివేదికను సమర్పించు అన్నాడు.”

మరియు వారు ఆ చిన్న యోర్దాను నదిని దాటి ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళి, ఆ దేశము ఎలా ఉన్నదీ, అది చక్కగా ఉన్నదా లేదా, అందులో ద్రాక్షాఫలములు ఉన్నవా, లేవా, దానిలో ఇంకా ఫలములు ఉన్నయా అని చూడసాగిరి. వారు తిరిగి వస్తున్నప్పుడు, వారు ఆ దేశము యొక్క ద్రాక్ష గుత్తులను తెచ్చి, ఇద్దరు మనుషులు వాటిని పేర్చిరి. ఏమి ద్రాక్ష గుత్తులు? నేను ఆలోచించుచుంటే, ఆ శపితమైన నేల గనుక ఆ విధముగా దాక్షకాయలు కాసినట్లయితే, శాపము లేకుండా ఉన్నది మరెన్నికాయలు కాయును?

20

ఇదిగో వారు తిరిగి వచ్చిరి, కాని వారు ఆ దేశములో చూసినప్పుడు వారు అక్కడ ఉన్న ఫిలిష్తీయులను, అమ్మోరీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను వారందరూ ఉన్నత దేహులు, వారు తమ రాజ్యములలో ఉండిరి.

వారిని చూసి వీరికి వణుకు పుట్టి, వెనుకకు వచ్చి, “ఓ” అని సమాలోచనకు పిలిచినప్పుడు, అందరు ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిరి. ఇప్పుడు ఒక అందమైన మాదిరిగా ఉన్నది. వారు నిలబడి “ఆ ప్రదేశం చాలా అందంగా ఉన్నది. అది అద్భుతం. అటువంటి ఉజ్జీవము మనం పొందితే చాలా బాగుంటుంది, కానీ దానిని మనం పొందలేము.” ఇక అంతే. ఇంకా వారు, “మనం వారికి ఆహారముగా మారతాము” అని, ఇంకా చెప్పాలంటే, “వారు చాలా పెద్దగా మరియు రాక్షసులుగా ఉన్నారు, వారు ప్రహరీ దగ్గర ఉన్నారు. వారిని ఎదురించడం అసాధ్యం. ఓ, మమ్మల్ని మా సంఘాల నుండి బయటకు తీసుకువచ్చి ఇటువంటి ప్రదేశానికి ఎందుకు తెచ్చారు?”

21

మీరు ఇది గమనించాలని నేను కోరుచున్నాను, ఇప్పుడే ఇది నా మనసుకు తోచినది. మోషే ఆ పది మంది గూడాచారులను ఆ వాగ్దాన దేశమునకు పంపినప్పుడు, అది ద్రాక్ష పంట వచ్చు కాలము. మరి అది పెంతెకోస్తుకు మాదిరిగా ఉన్నది. మొదటి ఫలములు, పెంతెకోస్తువారు కూడుకొనునట్లు, మొదటి పంటగా ఉన్నది మరియు వారు కాదేశ్-బర్నేయా వద్ద ఉన్నప్పుడు, తీర్పు దగ్గర ఉన్నప్పుడు వారు వెళ్ళి పరిశుద్దాత్మను తేగలరా లేదా అనే దాని మీద నిర్ణయించబడుతుంది, లేదా వాగ్దాన దేశములోనికి వెళ్ళగలరా లేదా, ఎక్కడ వారికి వాగ్దానం ఉన్నది.

మీరు “అది వాగ్దానం అని అందురా?”

అవును, పేతురు, “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరం పొందుదురు” అని అనెను. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును మరియు దూరస్తులందరికిని, ఇంకా చెప్పాలంటే, (చికాగోకి కూడా), ప్రభువగు దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికిని చెందును. ఈ రోజుల్లో మనం చాలా మంది ప్రజలను చూస్తాము. వారు, చాలా కష్టంగా ఉంది. మేము దానిని చేయలేము“ అని అందురు. కానీ మనము చేయగలము. ఇది కోత సమయం.

ఆ కారణం నిమిత్తమే వారు ఆ ద్రాక్ష గుత్తులను తెచ్చిరి, అవి ఆధారం కోసం తెచ్చిరి. మరి నేను కాలేబు యొహోషువాను చూడగలను. ఆ బాధ్యత వారి భుజముల మీద వేసుకుని సునాద గీతం పాడుకుంటూ, ఆ దేశమునకు వెళ్తున్నారు, ఎందుకనగా ఖచ్చితంగా వారికి ఆధారం ఉంది, వారు ఆ యొక్క దేశము చాలా సుందరమైన దేశముగా నిరూపించగలరు. వారు ఆ ద్రాక్షలను తెచ్చి ప్రతి ఇశ్రాయేలీయుడికి పంచి పెట్టారు. వారు తెచ్చిన ఆ ద్రాక్షా గుత్తులను చూడండి.

22

ఇప్పుడు, ఆ ప్రజలు సణుగుకోనుట మరియు, “ఓ, మేము దీనిని చేయలేము, దానిని చేయలేము” అని చెప్పుకొనుచుండిరి. కాలేబు మరియు యెహోషువా దానిని వినినప్పుడు, కాలేబు వారి మధ్యకు పరుగెత్తుకొని పోయి, ప్రజలను శాంతపరచి “మనం దీనిని చేయగలము,” అని అన్నాడు. యెహోషువా కాలేబు ప్రక్కన నిలబడి, “ఖచ్చితంగా మనము దీనిని చేయగలము,” ఎందుకనగా దేవుడు మనకు అది ఇచ్చెను. ఆమేన్. నాకు అది బాగా నచ్చినది. అవునండి. అది ఏమిటి? వారు క్రీస్తులో జన్మించినవారుగా ఉన్నారు. వారికి వాక్యము యొక్క జ్ఞానము ఉన్నది మరియు ఆ వాక్యమును వ్యక్తపరచెను. గుర్తుంచుకోండి, ప్రతి ఇశ్రాయేలీయుడు తనకు బోధించబడిన దేవుని వాక్యమును కలిగి ఉన్నారు. కాని అది (అనగా వాక్యము) యెహోషువా, కాలేబుల మీద ప్రభావం చూపింది, వారు మాత్రమే దానిలో దాగి ఉన్నదానిని గ్రహించారు.

అందుకే వారు, “ఓ, అది మనము చేయలేము” అని అన్నారు. అయితే మిగిలిన ప్రజలు మాత్రము ఏడవటం మరియు ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. ఇంకా వారు, “ఓ మిమ్మల్ని ఎందుకు బయటకు తెచ్చిరి, మేము ఇక్కడ చావాల్సి ఉందా,” అని అనిరి. ఇప్పుడు, ఈ మన చిన్న ప్రజలు అక్కడకు వెళ్ళి చంపబడతారు. మరియు మనం అక్కడకి వెళ్ళి, వారి దగ్గర చాలా కర్కశంగా వారి చేత చంపబడతాము, అది నిశ్చయంగా జరుగుతుంది. అక్కడకి వెళితే జరిగేది అదియే.

ఈ రోజుల్లో కూడా జనులు ఆ విధంగానే చెబుతారు, “ఓ, మేము ఈ సంపూర్ణ వాక్యమును అంగీకరించము, మేము దైవీక స్వస్థతలను అంగీకరించము.” గొప్ప, గొప్ప సంఘాలు అన్నీ అలాగే ఉన్నవి. ఒక వేళ వారు సంఘములో ఎవరైనా దైవీకమైన స్వస్థత పొందినట్లయితే, వారు దానిని నమ్మినట్లయితే, ఆ సంఘమువారు వారిని, వద్దు, దాని గూర్చి చెప్పవద్దు; నాకు తెలుసు అంటారు.

23

ఇక్కడికి సమీపంలో నాకు తెలిసిన ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ ఒక విధవరాలైన స్త్రీకి సహాయం చేస్తుంది. ఆమె యూదులకు సువార్తికురాలు, మరియు ఆమెకు ఒక కుమార్తె ఉన్నది. మరియు ఆమెకు కుమార్తె పుట్టిన తరువాత ఆ కుమార్తె యొక్క కిడ్నీలు విషపూరితమైన స్థితిలో ఉండటం వలన ఆమె స్పృహ తప్పి, చావుకు దగ్గరలో ఆస్పత్రిలో ఉన్నది. ఆమె ఒక క్యాథలిక్ అబ్బాయిని వివాహము చేసుకుంది. ఆ అబ్బాయి ప్రభువునందు విశ్వాసము ఉంచాడు మరియు అతని యొక్క పాప... అతని యొక్క మొదటి పాప స్వస్థతపడినది.

ఆ సమయంలో నేను ఊరిలో లేను. నేను తిరిగి వచ్చినప్పుడు, వారు నా దగ్గరకు వచ్చి, ఆ ఆస్పత్రిలో ఉన్న స్త్రీని స్వస్థతపరచమని అడిగిరి. అయితే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక సేవకుడు (యాజకుడు) నిలబడి ఉన్నాడు. ఆమె యొక్క అత్తగారు ఆ యొక్క సేవకుని తెచ్చింది. మరియు వారు వాదించుకుంటున్నారు. వారిలో ఒకరు ప్రొటెస్టంట్ మరొకరు క్యాథలిక్ సంఘానికి చెందిన వారు. ఒకరి మీద ఒకరు వాదములు పెట్టుకుంటున్నారు. వారిలో ఒకరు, “మంచిది” అన్నారు. అయితే, ఆ సేవకుని తెచ్చిన తల్లి, “ఈమె నా మనవరాలు మరియు ఈమె యొక్క అమ్మమ్మ నరకానికి పోవుట నాకిష్టము లేదు? ఇంకా ఆమె, ”నాకావాల్సిందేమిటంటే, ఈ మా సేవకుని (యాజకుని) లోనికి పంపి, ఆమెకు మరణము ప్రసాదించేలా అభిషేకించాలి“ అని అన్నది.

24

అయితే ఆ సమయంలో, నేను నడుచుకుంటూ వెళ్ళాను, మరియు వైద్యుడు కూడా లోనికి వెళ్ళాడు. మరియు ఇక్కడ నేను ఆమె జీవం పొందటానికి అభిషేకించబోతున్నాను, మరియు ఆ సేవకుడు ఆమె మరణం పొందటానికి అభిషేకించబోతున్నాడు, మరియు ఆ వైద్యుడు మమ్ములను ఇద్దరినీ గద్దించడానికి సిద్ధంగా నిలబడి ఉన్నాడు అని నేను అనుకొనుచున్నాను. ఏమి సన్నివేశం. నేను, “ఇప్పుడు అతను మరణమును అభిషేకించుటకు వెళ్ళినట్లైతే” ఆమె జీవము పొందుకోవడానికి అభిషేకించడము వలన ఉపయోగం ఏముంది? ఇక్కడ మొత్తము తారుమారు అయ్యే అవకాశం ఉన్నది అన్నాను.

“మంచిది” అతను అన్నాడు, “ఆ ఇద్దరు అమ్మమ్మలు ఒకరి మీద ఒకరు వాదములు పెట్టుకుంటున్నారు” అని అన్నాడు.

మరి నేను చెప్పితిని, “ఆమె యొక్క తండ్రిని ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.” అయితే ఆమె తండ్రి చెప్పెను, (అతను ఒక క్యాథలిక్ సంఘానికి చెందినవాడు), అతను, “చూడండి, రెవ. బ్రెన్హా౦ మా పాప కొరకు ప్రార్ధన చేసియున్నాడు.” మరియు చెప్పెను, “ఇతను లోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి.... లోనికి వెళ్ళమని నేను చెబుతాను,” అని అనెను.

గనుక, అందరూ వెనుకకు జరిగారు, ఆ వైద్యుడు నాకు ఆ గదిని ఇచ్చినాడు. ఆ అబ్బాయి నాతో కూడా లోనికి వచ్చాడు. ఆ స్త్రీ స్రృహ తప్పి ఉన్నది. నేను ప్రార్ధించడానికి మోకరించాను. నేను మోకరించి ప్రార్ధించుచుండగా, కేవలం వినయపూర్వకంగా ప్రార్ధించాను. అయితే ఎవరో తలుపులు తట్టిరి. ఆ అబ్బాయి ఆ తలుపు వద్దకు వెళ్ళి వారితో మాట్లాడాడు. అక్కడికి ఎవరో వచ్చారు. మరొక వైద్యుడు వచ్చి ఏదో సంప్రదింపులు కోసం వచ్చాడు. ఆమెను చావునకు అప్పగించుటకు వారు చేసియున్నారు, కాబట్టి వారు ఏదో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అబ్బాయి బయటకు వెళ్ళాడు.

25

నేను పది నిమిషాలు ప్రార్ధించాను. నేను లేచి, “ఓ, ప్రభువా ఈ చిన్ని తల్లిని చనిపోనివ్వొద్దు.” అయితే నేను ప్రార్ధిస్తున్న నేలమీద నుండి పైకి లేచాను. నా కళ్ళు తుడుచుకున్నాను, ఆ సమయంలో నేను కొద్దిగా ఏడ్చాను, లేచి చుట్టూ చూడసాగాను. మరియు నేను ఆ సమయంలో ఆ స్త్రీ తన ఇంటి దగ్గర తన బిడ్డ వైపు చూస్తూ ఉండటం, “ష్” అని అనడం, మరియు ఆమె భోజనం సిద్ధపరుస్తున్నట్లు దర్శనం చూశాను. నేను ఆ స్త్రీ వైపు కొద్దిసేపు చూశాను. ఓ, మై ఏమి అనుభూతి.

ఆ దర్శనం అయిపోయిన తరువాత నేను నవ్వుతూ ఆ గది నుండి బయటకు వచ్చాను. నా కోటు నా చేతికి తగిలించుకొని వచ్చాను. తండ్రి అక్కడ నిలబడి ఉన్నాడు. మిగతా వారందరూ కూడా బయట ఉన్నారు. ఆ సేవకుడు, వైద్యుడు అందరూ అక్కడే ఉన్నారు. నేను బయటకు వచ్చినప్పుడు ఆమె భర్త, “రెవ. బ్రెన్హామ్ ఏమైనా వార్త ఉన్నదా?” అని అన్నాడు.

నేను, “అవునండి, అవును, నీ కోసం నేనొక మంచి శుభవార్తను కలిగి ఉన్నాను, ఇదిగో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీ భార్య నీ ఇంటికి స్వస్థతతో వస్తుంది.” ఇంకా నేను, “ఇప్పుడు, చాలా అద్వాన్నమైన స్థితి రాబోతుంది?” అన్నాను. ఇంకా నేను, “ఈ రాత్రి గమనముండే వారు ఆమె మీద పుల్ మోటార్ (పుల్ మోటార్ అనగా, అత్యవసరంగా ఆక్సిజన్ ను ఊపిరితిత్తులకు పంపే పరికరం) పెట్టబోవుచున్నారు, ఎందుకనగా ఆమె చాలా అనారోగ్యంతో ఉన్నది. కానీ నేను చెప్పిన విధంగా, ”అది మొత్తం అయిపోయిన తరువాత ఆమె బయటకు రాబోవుచున్నది. మరి రేపు ఇదే సమయమునకు మీ భార్య మీ ఇంట్లో ఉంటుంది. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అని అన్నాను.

26

మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అతను ఆనందించడం మొదలుపెట్టారు. మరియు అక్కడకు వచ్చినటువంటి ఆ సేవకుడు (యాజకుడు) తన తలను ఊపీ వైద్యుడు వైపు చూశాడు. ఆ వైద్యుడు కూడా అతని వైపు చూసి తన తలను ఊపి పిచ్చిపట్టిన వానివలె క్రిందికి వెళ్ళిపోయాడు గనుక వారు వెళ్ళేవరకు నేను వారిని చూస్తూనే ఉన్నాను. మరియు ఆ అబ్బాయి యొక్క తండ్రి తన దగ్గరకు వచ్చి, “చూడు, నా కుమారుడా, మనకు జరిగిన ఈ వెర్రితనము సరిపోదా?” అని అన్నాడు.

అయితే ఆ అబ్బాయి,“ చూడండి నాన్న నేను మొదటి బిడ్డను సహోదరుడు బ్రెన్హా౦ గారి దగ్గరకు తీసుకు వెళ్ళాను. అతను కనీసం నాలుగు నుండి ఐదు సార్లు ప్రార్థన చేశారు, నేను అక్కడకు తీసుకు వెళ్ళాను. మరియు అక్కడ స్వస్థత జరుగలేదు. మరి ఆ బిడ్డకు వంకర పాదములు ఉన్నవి. మరియు అతను అన్నాడు, ”ఒక రోజు నేను ఎవరితోనో అక్కడ ఉన్నాను. మరియు సహోదరుడు బ్రెన్హా౦ గారితో కూర్చొని ఉండగా అతను (బ్రెన్హా౦) నాతో మరో 24 గంటలలో నీ బిడ్డ యొక్క వంకర పాదములు దేవుడు సరిచేయబోతున్నాడు.

ఇంకా అతను అన్నాడు, “ఆ తర్వాత ఉదయ కాలమున నా భార్య నేను ఒకేసారి గంతులు వేసి ఆ బిడ్డ ఉయ్యాల వద్దకు వెళ్ళాము. అయితే ఆ బిడ్డ పాదములు మామూలు స్థితికి వచ్చాయి. ఇంకా అతను అన్నాడు ”సహోదరుడు బ్రెన్హా౦ 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు' అని అన్నాడు అంతే. నా భార్య ఖచ్చితంగా 24 గంటలలో తిరిగి ఇంటికి వస్తుంది. సరే, వెళ్ళి వస్తాను. నేను ఇంటికి వెళ్ళి అక్కడ ఆమెను తీసుకురావడానికి సమస్తమును చక్క బెట్టాలి.“ అది సరి. అతను అలాగే వెళ్ళి తన ఇంటిని చక్కబెట్టినాడు; మరి 24 గంటలలోనే ఆమె ఇంటికి వచ్చినది. ఆమె ఎప్పటిలాగే అక్కడ ఉన్నది. ఇది జరిగి రెండు సంవత్సరాలు గడిచింది.

27

మరి ఈ స్త్రీ, ఆ చిన్న బిడ్డ యొక్క అమ్మమ్మ ఆ రోగగ్రస్తురాలైన స్త్రీ యొక్క అమ్మ ఆమె. ఈ యొక్క సంఘటనను ఆమెకు ప్రతి నెల డబ్బును పంపించి యూదులకు ధనసహాయము ఇవ్వమని చెప్పిన సంస్థకు చెప్పినప్పుడు ఆమె ఈ యొక్క దైవీకమైన స్వస్థత అంగీకరించినప్పుడు, వారు ఆమెకు ఇస్తున్నటువంటి ధనసహాయమును ఆపి వేసి మరియు వారన్నారు, “మేము సహోదరుడు బ్రెన్హా౦ గారిని నిరాకరించలేము, ఆయనకు మేము వ్యతిరేకులము కాదు గానీ, మా యొక్క ప్రణాళికలో ఈ దైవీక స్వస్థత అనే దానిని చేర్చలేము” అని అన్నారు.

మంచిది అయితే, అదే గనుక అయితే నీవు దేవుని యొక్క ప్రణాళికలో లేవు! నేను దేవుని యందు సరిగా ఉండుటకు, ఈ లోకము ఎదుట వెర్రివాడిగా ఉన్నాను పర్వాలేదు. అవునండి. అది సరియైనది. దేవుడు తన కార్యములను మరియు చర్యలను వాస్తవమని నిరూపించుటకు ఆయన అద్భుతములను, సూచనలను చేయును. ఆయన ప్రతి సారి అలాగునే చేసెను, మరియు అలాగే చేస్తాడు. ఈ ప్రపంచం ఉన్నంతకాలము సహజాతీతమైన దేవుడు వాటిని అదుపు చేయుటకు ఉండును. ఆయన తన చేతులు ఉంచుటకు ప్రతి సారి ఎవరో ఒకరిని కలిగి ఉంటాడు.

28

మరి ఆయనకు ఈ రాత్రి ఒక సంఘమున్నది. అది ప్రపంచం యొక్క నలుమూలల నుండి తయారు చేయబడింది. మరి దానిలో దాగి ఉన్న అనేకమైన పనులను దేవుడు బయటకు నెట్టవలసి ఉన్నది. నేను వాటిని బయటకు నెట్టివేయలేను, మరియు నేను నెట్టివేయ జాలను. నాకు వాటిని ఎలా నెట్టివేయాలో కూడా తెలియదు. ఇంకా ఏ మనిషికి కూడా తెలియదు, కానీ వాటిని చేయునది దేవుని యొక్క పని. వాటిని గూర్చిన శ్రద్ధ ఆయన చూసుకొనును. దానిని చేయుటకు మానవుని హస్తములలో లేదు. మానవ సంబంధమైన ప్రణాళికలు ఎన్ని లేచినను, ఏమి ప్రయోజనం లేదు. ఒక వేళ ఆ ప్రణాళికతో వారు పైకి లేచిననూ వారు మరల క్రింద పడుట కాయము. కానీ దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు. మరి ఆయన ప్రణాళిక ఎవరు అంటే యేసుక్రీస్తే. నాకు తెలిసినంత వరకూ క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది పరిశుద్దాత్మ ద్వారా నడిపించుట మన శిక్షావిధి నుండి విడుదల పొందెదము.

29

యెహోషువా, దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చడం చూసిన తర్వాత, ఆయన అన్నాడు, “అది నాతోనే చక్కబడుతుంది, దేవుడు ఎర్ర సముద్రాన్ని తెరిచాడు” అని అన్నాడు. వారు ఐగుప్తు నుండి వెళ్ళక ముందు, ప్రభువు అగ్నిస్తంభముగా ఉన్నాడు, ఆ అగ్ని స్తంభము మోషే మీద మరియు అక్కడ ఉన్న వారి మీద తిరుగుతూ ఉంది. ఆయన అన్నాడు, “నేను మిమ్మలను మార్గంలో నడిపించుటకు మరియు నేను మీ కొరకు సిద్దపరచిన ప్రదేశంలోనికి తీసుకువెళ్ళటకు మీకు ముందుగా నా దూతను పంపిస్తాను. ఆయనయందు జాగ్రత్త వహించుడి. ఆయనను వేధించవద్దు; ఎందుకనగా నా నామము ఆయనతో ఉన్నది” అని అన్నాడు.

మీరు దానిని చూచారా? అది ఖచ్చితంగా క్రీస్తే అయి ఉన్నాడు, అభిషేకించబడినవాడు. “నా నామము ఆయనతో ఉన్నది.” యొహోషువా అక్కడ, ఆయనను కత్తి దూసి నిలబడిన వ్యక్తి వలె చూశాడు. మరియు ఆయనను మనం పాపపరిహార బలిపశువుగా, పునరుత్థానముగా, ఇమ్మానుయేలుగా చూస్తున్నాము. ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉండి, మధ్యవర్తిత్వం వహిస్తూ, మన విజ్ఞాపనను జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయ!

30

ఇది కొంచెం కరుకు గానూ, మరియు వెర్రితనముగానూ ఉంటుంది అని నాకు తెలుసు. కానీ చాలా మంది ప్రజలు ఆ యొక్క వెర్రితనము గూర్చి భయపడుతుంటారు. మీరు అసలు విషయం వదిలేశారు. మీరు ఒక మంచి యాపిల్ పండ్లు కాసిన చెట్లకు దిష్టి బొమ్మను పెట్టడం గ్రహించారా? అక్కడ చాలా దిష్టి బొమ్మలు లేవు. అక్కడ దిష్టి బొమ్మ ఎందుకు ఉంది. అసలైన వాటి దగ్గరకు నిన్ను రానివ్వకుండా నిన్ను భయపెట్టుటకు అవి ఉన్నది. వాటి చుట్టూ తరలించడానికి. అక్కడ ఒక నిజమైన పరిశుద్దాత్మ ఉన్నది, పరిశుద్దాత్మతో నింపబడిన విశ్వాసులు ఉన్నారు. సూచనలు, అధ్బుతములు మరియు సహజాతితమైన దేవుని యొక్క ఋజువులు. శిబిరంలో ఉన్నటువంటి రాజు, మరి అది ఇశ్రాయేలీయుల మధ్య మోయాబీయుల మధ్య చాలా వ్యత్యాసం కనపరుస్తుంది.

మరి అదే వ్యత్యాసం కయీను మరియు హేబేలు మధ్య ఉన్నది. కయీను కూడా చాలా మంచి వ్యక్తి హేబేలు వలె, కయీను దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తి, అలాగే హేబేలు కూడా. కానీ హేబేలుకు కలిగియున్న ఆత్మీయ ప్రత్యక్షత, అది పండ్ల ద్వారా కాదు, అది రక్తం ద్వారా అని ఆ ఆత్మీయ ప్రత్యక్షత అతనికి తెలియజేసింది మరియు అందువలన అతను కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పణను అర్పించెను, దానిని దేవుడు అంగీకరించెను.

31

ఇక్కడ గమనించండి, మోయాబు ఒక సహోదరుడుగా ఉండుటకు ప్రాథమిక సిద్దాంతములు కలిగి ఉండెను. అతను లేఖనానుసారంగా నేర్చుకున్న ప్రాథమిక సిద్ధాంతాన్ని కలిగి ఉండెను. మరియు ఆయన ఏడు బలిపీఠములు కట్టెను, ఏడు బలి అర్పణలు, ఏడు ఎద్దులు, ఏడు మేకలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను సాదృశ్యరూపంగా ఉన్నవి. ఆ ఇశ్రాయేలీయులు ప్రజలు అక్కడ ఉన్నట్టుగా, ఇక్కడ కూడా ప్రాథమిక సిద్దాంతములుగా ఉన్నవి.

మంచిది. దేవుడు నిన్ను ఒక మతవాదిగా అంగీకరిస్తే, మరి అప్పుడు దేవుడు ఇశ్రాయేలును అంగీకరించి, మోయాబును తిరస్కరించేవాడు కాదు. మరి అది న్యాయము లేకుండా ఉంటుంది. కయీను ఒక హేబేలు వలె ప్రాథమిక సిద్దాంతం పాటించిన వ్యక్తి, అతను ఒక విశ్వాసి. అతను ఒక సంఘమును నిర్మించెను, మరియు ఆరాధించెను, అర్పణలను అర్పించెను. దేవుని యెదుట తగ్గించుకొనెను. అది మాత్రమే ఒక విశ్వాసికి ఉండాలి అని నువ్వు అనుకుంటే....

నువ్వు, “మంచిది, నేను ఒక విశ్వాసిని” అని అనవచ్చు.

అయితే దేవుడు నీకు పరిశుద్దాత్మను ఇవ్వనట్లయితే నీవు ఇంకా విశ్వాసివి కానట్టే లెక్క అది నిజము. ఎందుకనగా దేవుడు నీకు పరిశుద్దాత్మ ఇచ్చుటకు ఒక బాధ్యత క్రింద ఉన్నాడు. మరియు ఆయన, “మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు యొక్క నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు” అని చెప్పినప్పుడు, దేవుడు మీకు దానిని ఇచ్చుటకు ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. మరి ఆ వాగ్దానము, ఎవరికి? అపొస్తలులకా? కాదండి. కాదు. పేతురు చెప్పెను, “ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును దూరస్దులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.” అది ఎంత దూరమైనప్పటికీ, అది ప్రతి విశ్వాసికి చెందును.

ఓ, బైబిల్ పండితులారా, మీరు దానిమీద రంగు పూసినా దాని వలన ఏ వ్యత్యాసము కలుగదు. ఎందుకనగా ఆమె ప్రతిచోట మొలకెత్తుతున్నది. ఆమేన్. నేను ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మరియు ఆయన ప్రజలను బట్టి చాలా సంతోషించుచున్నాను.

నేను ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నాను? మీరు ఎక్కడ ఉన్నారో మీకు చూపుటకు ప్రయత్నించుచున్నాను. మీరు మీ కన్నులు తెరిచి దూరంగా, మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో చూస్తే, ఎందుకు, మీ యొక్క అనారోగ్యం ఎండాకాలంలో పొయ్యి మీద పెట్టినటువంటి మంచుగడ్డ వలె కరిగిపోతుంది. రోగములు, ఇంక తదితరములు, ఎందుకనగా క్రీస్తు ప్రమాణం చేసెను. అది ఆయన యొక్క వాగ్దానము.

32

ఇప్పుడు గమనించండి, ఈ యొక్క దూత వారి మీద అగ్ని స్తంభముగా తిరుగుతుండగా అది ఆ విధంగా రాత్రి పూట ఉంటుంది. మరియు మధ్యాహ్నం అయితే ఒక తెల్లని మేఘంలాగా వారి మీద తిరుగులాడుతూ ఉంది. మరి వారు దాని క్రింద ఉన్నప్పుడు ఆయన, “నేను ఆయనను మీకు ముందుగా పంపుతాను,” అని అన్నాడు. ఇంకా ఆయన, “నేను మీకు పాలు - తేనెలు ప్రవహించు దేశాన్ని(పాలస్తీనా)ఇచ్చాను. అది మీదే. మీరు వెళ్ళి దానిని స్వాధీనపరుచుకోండి. మీరు చేయవలసింది అదియే” అని అన్నాడు.

మంచిది, వారు ఇక్కడ మొదలు పెట్టిరి. దేవుడు వారిని దీవిస్తున్నాడు. మరియు వారికి మహా ఆనందాన్ని కలుగజేస్తున్నాడు. మరియు వారిలో గొప్ప ఉజ్జీవాన్ని కలుగజేస్తున్నాడు. వారు ఆ విధంగా నడిచినంత కాలం ఆ విధంగా చేశారు. మరి వారు అక్కడికి చేరుకున్నాకే ఆ దేశం మొత్తము ఒక గొప్ప ప్రతిపక్షము యొక్క స్వాధీనంలో ఉండుట చూసి వారు భయపడిరి. అప్పుడు దేవుడు, “ఎంతకాలం నేను మిమ్ములను భరింతును?” ఇంకా ఆయన అన్నాడు, “మోషే మార్గము నుండి పక్కకు తప్పుకో, మరియు నేను వారిలో ప్రతి ఒక్కరిని సంహరిస్తాను. నేను వీటిని ప్రదర్శించిన తరువాత...”

మరి ఇది ఈ దినముల్లో ఉన్న పెంతెకోస్తు సంఘమునకు చిత్రముగా లేదా, ఆయన అన్నాడు, “నేను ఎన్నో అద్భుతములు వారి ముందు ప్రదర్శింపచేసి మరియు నేను పిలిచిన అవిశ్వాసులైన వారి ముఖముల ముందు ఈ అద్భుతములు చేసి వారి ముందు ప్రదర్శించినప్పటికీ, వారు ఇంకనూ నన్ను నమ్మకుండా ఉన్నారు.”

అది సంఘమునకు ఎటువంటి గద్దింపుగా ఉన్నది? “నేను ఎన్ని కార్యములు చేసితిని, నేను రోగులను స్వస్థపరచితిని, కుంటివారిని, గ్రుడ్డివారిని, నేను మరణించిన వారిని సహితము లేపితిని. నేను అద్భుతములు చేసితిని. దేశవ్యాప్తంగా అన్ని కార్యములు చేసియున్నాను, అయినప్పటికీ వారు నన్ను నమ్మటలేదు. వారికి పరిశుద్దాత్మ ఇచ్చాను, నిబంధనలోనికి తీసుకు వచ్చాను. ఇశ్రాయేలు వారికి ఆయన చేయలేదా?ఖచ్చితముగా, ఎర్ర సముద్రము ద్వారా, బాప్తిస్మము, నేను వారిని ఆనందింపజేసితిని, సంతోషింపజేసితిని, అద్భుతములు చేసితిని మరియు వారిని పోషించితిని. అయినను వారు నమ్మలేదు. మరియు ఆయన, ”అయితే దానియొక్క ఆవల ఏదో ఒక చిన్నది దాగి ఉన్నది,“ అని అన్నాడు.

“ఓ, సంఘమునకు సంబంధించిన వారమని మనం తృప్తి చెందుతాము. మనము సంఘమునకు వెళ్ళేకొద్దీ, అది సరియైనది అని అనుకుంటాము.”

33

ఇక్కడ యెహోషువా, కాలేబులు వెనుకకు వచ్చి, “ఆ యొక్క భూమి నిజం. ఇదిగో ఆధారం.” దేవునికి మహిమ కలుగును గాక! “ఇదిగో ఆధారం. దేవుని యొక్క వాగ్దానం సత్యమే. మేము నిరూపించుటకు ఇక్కడ ఆధారం ఉన్నది” అని అన్నారు.

ఇంకా వారు, “మంచిది” అన్నారు. అయితే ఇతరులు, “మీరు దానిని చేయలేరు, మీరు దానిని చేయలేరు” అని అన్నారు. మీరు చాలా వెర్రితనము కలగలపియన్నారు. “మేము దీనిని చేయలేము. మీరు చేస్తే మేము ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలో నుండి తొలగిపోతాము. మేము ఇది చేయబోతున్నాము” అని అన్నారు.

మై, అది ఈ రోజు అదే పాత ఏడుపు కాదా. అది నిజం. “ఓ అది ఎప్పుడు పని చేయదు, మీరు దానిని పనిచేసే విధంగా చేయలేరు.” లేదు మీరు దానిని చేయలేరు, కానీ ఎవరైతే అది చేయగలరు అని అంటారో దానిని వారు చేయగలరు. ఆయన నియంత్రణలో తగినంత మంది ప్రజలను ఆయన ఎప్పుడూ పొందగలిగినట్లైతే, ఆయనకు పూర్తిగా సమర్పించుకొన్నవారు దానిని చేయగలరు అని నేను చెప్పగలను.

మనకు ఈ రోజున యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారునిగా ఆధారం ఉన్నది. మృతులలో నుండి లేచినవాడుగా ఆధారము ఉంది. మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడనే ఆధారము కలిగి ఉన్నాము. మరియు మనము వెయ్యేండ్ల పాలన దిశగా వెళ్తున్నాము. హల్లెలూయ! ఏమని ఆయనను స్తుతించగలను! ఈ దినములలో ఒక దినమున మనము వెళ్తున్నాము. సైన్యములకు అధిపతియైన యెహోవా యొక్క సేనాధిపతి వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనలను అక్కడికి తీసుకొని పోవును.

34

యెహోషువా రక్షకుడు... మోషే ఒక సంఘ సంస్థకు మాదిరిగా ఉన్నాడు అతను, ధర్మశాస్త్రాన్ని తెచ్చి ఎందుకు విఫలమయ్యాడు. ఎందుకు? అతను ఎందుకు విఫలమయ్యాడు? దేవుని మహిమ పరచడానికి బదులు, తననుతాను మహిమపరచుకున్నాడు. అది సరియైనదా?

ఈ రోజుల్లో సంఘాలు కూడా అలాగున ఉన్నవి. ఎవరు పేద్ద చర్చిని నిర్మించగలరో అని ప్రయత్నిస్తున్నాడు. ఏ సంఘమువారు మంచి దుస్తులు ధరిస్తారో అని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక పట్టణం యొక్క అధికారిని (మేయర్) రాబట్టడానికి మరియు ప్రముఖులను ఎవరు రాబట్టగలరో అని ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుల్లో జరుగుతున్న విధానం అదియే. ఒక బాప్టిస్ట్ చెప్పినట్లు “యాభై-నాలుగులో ఇంకా పది లక్షల మంది చేరనున్నారు.” నేను దానిని లెక్క చేయను. పది లక్షల మంది అధికమేమిటి? అంతేనా. పది లక్షల మంది సభ్యులా? అయినా మీరు ఇంకా ఏమీ కలిగిలేరు. నేను అంత మందికి బదులుగా ఒక్క పరిశుద్దాత్మ నింపబడిన వాడు, దేవుని యొక్క పరిపూర్ణ శక్తితో నింపబడిన వాడు ఉండిన చాలును. వెయ్యి రెట్లు, వెయ్యిమంది సంఘసభ్యులు కంటే, దేవుని నమ్మి సజీవంగా ఉన్న ఒక వ్యక్తి.

మనము సంఘాలలో ఎంత మందిని సభ్యులుగా చేర్చాము అన్నది కాదు గానీ, క్రీస్తు యేసులోనికి ఎంత మందిని తెచ్చావు అనేది అవసరము. మరియు వారిని వారు సమర్పించుకొని వారి స్థానమును కనుగొని మరియు వారి యొక్క విధులలో యుగముల నుండి బండవలే నిలబడేవాడు, సిద్దంగా ఉండేవాడు అవసరము. ఓ, ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరిని అలాగున సిద్ధపరుస్తారని అనుకుంటున్నాను. మరియు ఏమి చేయాలో నీకు బయలు పరుస్తాడని అనుకుంటున్నాను. మనము మిక్కిలి క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము. బహుశా మనం కాదేశ్-బర్నేయా వద్ద ఉన్నాము.

35

చూడండి. వారు తిరస్కరించడానికి గల కారణం వారు తిరస్కరించడం వలన అరణ్యములో నలభై సంవత్సరములు ప్రయాణించారు. ఇవన్నీ ఉండటానికి గల కారణం ఏమిటి. నేను క్రీస్తు యొక్క రాకడను నమ్ముతున్నాను. అది నా హృదయం మీద ఉన్నది. నేను దీనిని చెప్పవచ్చును. యేసుక్రీస్తు యొక్క రాకడ గడువు మీరింది, గడువు మీరింది మీరు, “బోధకుడా, నీవు దేనిగూర్చి మాట్లాడుతున్నావు” అని అందురు. అది బైబిల్, “నోవాహు దినములలో ఉన్నట్లుగా, మనుష్యకుమారుని దినములలో జరుగును.”

నోవాహు దినములలో దేవుడు చాలా ఓర్పు కలిగి ఉన్నాడు. ఎవ్వరూ నాశనం అవ్వడము దేవునికి ఇష్టం లేదు. దేవుడు చాలా ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన రాకడ యొక్క గడువు పొడిగింపు జరిగింది. ప్రజలు గనుక సంపూర్ణంగా దేవుని సమర్పించుకున్నట్లయితే, నలభై సంవత్సరాల క్రితమే మనం వెయ్యేండ్ల పాలనలో ఉండేవారము. కానీ వారు దానిని చేయకుండా వారు లాగబడి, మరియు వ్యవస్థీకృతంగా వారిని వారు పాత సిద్దాంతములకు బిగించుకొని ఉన్నారు. చివరికి పెంతెకోస్తులు మరియు మిగిలినవన్నీ “మనం ఒక సంఘమును కలిగి మరియు దానిలో మనము చేరుతాము. మరియు మనం గమనిస్తాము, మనం వారి సంఘము కంటే ఎక్కువ సభ్యులను తీసుకు రాకపోతే.”

మరియు ఆ మందలో నుండి ఒకడు లేచి, “మీకు తెలుసా, యేసుక్రీస్తు తెల్లని గుర్రము మీద రావడం లేదు; ఆయన ఒక తెల్లని మేఘం మీద వస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను,” అని చెప్పును. అతన్ని వేరే చోటికి వెళ్ళి, ఒక సంస్థగా మారతాడు. అందులో కొందరు చేరుతారు. ఒక వ్యక్తి చెబుతాడు, “మీకు తెలుసా, బాప్తిస్మము ఈ విధంగా తీసుకోవాలి” అని చెప్పి; అతను ఒక సంస్థ స్థాపిస్తాడు. మరొక వ్యక్తి,, “మనము ముందుగా బాప్తిస్మము తీసుకుని ఉండాలి” అని అతను ఒక సంస్థ నిర్మించుకుంటాడు.

అది లోక సంబంధమైన వ్యవస్ధ. కానీ దేవుడు ఈ చివరి దినాలలో గందరగోళం నుండి బయటకు పిలుస్తున్నాడు. అటువంటి సమస్తమైన కార్యముల మధ్యలో నుండి ఆయన బయటకు పిలుస్తున్నాడు. మానవుడు దానిని చేయలేడు, మరియు ఎప్పటికినీ చేయజాలడు. కానీ క్రీస్తు తనకుతానే, వచ్చి మరియు పిలుస్తాడు. అప్పుడు మనం యోర్దానును దాటుతాము. మనం యోర్దానును దాటెదము.

36

ఇప్పుడు వారి వైపు చూచెదము. వారు ఆ అరణ్యములో ఉన్నారు. ఇక్కడ సాక్ష్యం ఉన్నది. అతను వారు చేయగలరని ఎందుకు నమ్మాడు? ఎందుకు, మోషే చెప్పాడు... అంటే, దేవుడు మోషేతో ఆ అగ్నిస్తంభములో నుండి ఆయన, “చూడు నేను నీకు పాలు, తేనెలు ప్రవహించు దేశాన్ని (పాలస్తీనా) ఇచ్చాను. అది మీదే. నేను దాన్ని మీ తండ్రియైన అబ్రహాముకు ఇచ్చితిని. నేను అతనితో మీరందరూ అక్కడ నివాసముందురని చెప్పియున్నాను.” మరియు మీరు ఇంకొక విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. ఎన్ని తరములు అక్కడికి రావటానికి పట్టినవి, నలభై... యాభై సంవత్సరాలు ఒక తరము బైబిల్ ప్రకారముగా. నాలుగు వందల సంవత్సరాలు, అనగా అవి ఎనిమిది తరములు.

గమనించండి, మొదటి సంగతి మీకు తెలుసా, వారు మోషే వచ్చినప్పుడు వారు వెనుకకు జారిపోయారు. వారు మరో నలభై సంవత్సరములు దూరంగా వెళ్ళారు. వారు (పాలస్తీనా) పాలు, తేనెలు ప్రవహించే దేశము వరకూ వచ్చారు. అంటే, మరో నలభై సంవత్సరములు. అంటే, పది తరములు. దాని అర్థం, పది గోత్రాలు, మరియు పరిపూర్ణ తెగలు కాని వారు. సమయాన్ని విభజించి మరియు దాన్ని స్వాధీనపరుచుకోవడానికి సంపూర్ణంగా, వారికి ప్రేరేపించే మాటలు ఎలా వచ్చాయి. ఒక్క పదం కాదు గానీ బైబిల్లో ఆదికాండము నుండి ప్రకటన వరకూ ఏది వారిని ప్రేరణకు గురిచేసింది.

37

అప్పుడు వారు కాదేశ్-బర్నేయాకు వచ్చారు. ఎక్కడైతే తీర్పు నొందుతారో అక్కడికి వచ్చారు. అప్పుడు అన్ని సంఘాలు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ చేరి సలహాలు ఇచ్చుకుంటున్నారు. “మనం పరిశుద్దాత్మ యొక్క బాప్తీస్మం పరిగణనలోకి తీసుకుందామా? మనం సంఘములో ఉన్నటువంటి వరములను పరిగణలోకి తీసుకుందామా? అది ఏమి చేస్తుందో నేను మీకు చెబుతాను. మన యొక్క పత్రాలు అన్ని కూడా ఈ విధంగా గీయబడి ఉన్నాయి, మనం దానిలోకి వెళ్ళలేము.” ఆ తర్వాత వ్యక్తి, “మనము దానిని పొందుకోలేము” అని అన్నాడు. ఇంకో వ్యక్తి, “మనము దానిని పొందుకోలేము” అని అన్నాడు.

కానీ అక్కడే ఉన్న కొంతమంది ప్రజలు, ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళారు. తిరిగి ఆధారాలతో వచ్చారు. ఆ యొక్క స్వస్థత అనునది నిజమే, ఆ యొక్క పరిశుద్దాత్మ అనునది నిజమే, ఆ దేవుని యొక్క శక్తి నిజమే, మనకు వాగ్దానం చేయబడినట్టి వాగ్దానము దేశము నిజమే, అని అన్నారు. అవునండి

38

ఇప్పుడు, యోర్దాను నదిని దాటిన తరువాత అక్కడ యోహోషువా నడుస్తూ ఉన్నాడు. అప్పుడు, అక్కడ పాత మొక్కజొన్నలు తినడం మొదలుపెట్టాడు.

నేను ఊహించగలను యోహోషువాకి ఆ ఉదయం ఒక గొప్ప దర్శనం వచ్చినది, దేవుని నుండి ఒక పలుకు, “నేను మోషేతో ఉన్నలాగున, నీతో కూడా ఉందును.” ఒక రాత్రి యోహోషువా బయటకు పిలవబడి, “ఇప్పుడు చూడుము యోహోషువా” అని ఒక దర్శనము ఇవ్వబడింది. అందులో, “ఇప్పుడు నా సేవకుడు మోషే మరణించాడు, లేచి ముందుకు సాగు, ఇజ్రాయేలీయులందరు ముందుకు సాగండి, మీ దేవుడైన మీ ప్రభువు మీతో కూడా ఉండును. నీవు బ్రతుకు దినములన్నిటను, ఏ నరుడు నీ ముందర నిలువనేరడు. నేను మోషేతో ఉన్నలాగున, నేను నీతో కూడా ఉందును. ధైర్యంగా ఉండుము, మరియు జడియకుము, కేవలం ముందుకు కొనసాగుము. నేను నీతో ఉంటాను. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకిచ్చియున్నాను.”

సహోదరుడా, పాదముద్రలు అనగా స్వాస్ద్యం. సంఘమునకు ఈ రాత్రి కావాల్సింది, ఇంకా కొన్ని పాదముద్రలు ఈ నేలలో అవసరమై ఉన్నవి. యోర్దాను దగ్గర ఎక్కువ సేపు వ్రేలాడి ఉండకుము. అక్కడ నుండి బయటకు వచ్చి మనకు ఏమి వచ్చిందో చూడు. అంతా సరిగా ఉన్నదా. ప్రతి సారి అతను ఒక పాద ముద్ర వేసినప్పుడల్లా, ఆయన యొక్క పాద ముద్రను మోపినప్పుడల్లా అది ఒక స్వాస్ధ్యమైనది.

ఆ యొక్క దర్శన అనంతరం నేను, యోహోషువా ఈ విధంగా చెప్పుట చూడగలను. అతను వారితో, “ఇప్పుడు అందరూ ఏకమై యోర్దానులో తమతమ దుస్తులు ఉతుకుకొని, తమనితాము శుద్దీకరించుకోండి. మరియు ఉదయ కాలమున దాని యొక్క తీరమునకు రండి. దేవుని యొక్క మహిమ యేమిటో నేను మీకు చూపిస్తాను” అని అన్నాడు. ఆమేన్. అతనికి ఒక దర్శనం ఉన్నది. దేవుడు అతనితో ఆయన వాక్యము చెప్పెను. ఆ వాక్యము, “నేను ఆ యొక్క నేలను ఇచ్చెదను, అది మీదే. అది మీ యొక్క స్వాస్ధ్యము” అని చెప్పెను.

39

ఇప్పుడు అతను ఎందుకని అక్కడకి వెళ్ళి ఫిలిష్తీయులను తుడిచిపెట్టలేదు, మరియు ఎందుకు అలా చేయలేదు? ఇప్పుడు ఆయన చెప్పాడు, “రండి మీరు కూడా ఏదో చేయవలసి ఉన్నది.” దేవుడు మీ యొక్క మెడ మీద ప్రతి విషయాన్ని పెట్టడు. మీరు దీనిని నమ్మవలసి యున్నది; మీరు కొద్దిగా పోరాటం చేయవలసియున్నది. పీటర్ కార్డ్ రైట్ ఆ త్రాగుబోతు వ్యక్తితో ఆ రోజు చెప్పినట్లుగా, మీలో చాలా మంది అతడు వ్రాసిన దానిని చదివి అతనికి చెప్పారు, “నీవు ఇక్కడ ఏమి చేయబోతున్నావు?”

“నేను ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేయబోతున్నా,” అని చెప్పాడు.

“నీకు ఎవరు చెప్పారు,” అని అన్నాడు.

“ప్రభువు,” అని చెప్పాడు.

“అయితే నీవు దానికి ముందుగా, నీవు నన్ను కొట్టాల్సి ఉన్నది,” అని చెప్పాడు.

“మంచిది, అది నా యొక్క తరువాత పని, అయితే సరే” అని అతని యొక్క కోటును విప్పి, అతనిని కొట్టి, అతని మీద కూర్చొని, ముఖమును కూడా కొట్టి, “నేను ఆధిపత్యం చేయాలి అంటే, నేను కొట్టి తీరాలి. ప్రభువా, నాలో ధైర్యాన్ని నింపు” అని అన్నాడు. ఆ వ్యక్తిని కొట్టి, నీకు సరిపోయినంత దొరికాయా?“

చెప్పాడు, “అవును సరిపోయాయి.” అతని చేతులు ఊపి, వెనుకకు వచ్చి రక్షించబడ్డాడు.

మనకు కావాల్సింది అదియే, మీరు కొంత పోరాటం చేయవలసియున్నది, మీ హస్తములతో కాదు, నీ యొక్క సాక్ష్యం మరియు దేవుని యొక్క శక్తితో పోరాటం చేయాలి. అలాగున నీవు జయించాలి, నీ యొక్క సాక్ష్యం మరియు గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా. సాతానుడితో చెప్పు, నన్ను బంధించుటకు ఏ బంధకములు లేవు. “నీవు నాకు ఈ రోగములు పెట్టితివి కానీ యేసుక్రీస్తు దాని నుండి నన్ను విడిపించెను. నాతో ఆయన దానిని గూర్చి వాగ్దానం చేసెను.”

40

ఇప్పుడు చూడండి. అతను చెప్పాడు, “నేను మీకు ఒక సూచనను పంపుదును? మార్గమంతటిలో మిమ్ములను నడిపించుటకు ఒక అగ్నిస్తంభమును పంపుదును. మీరు కేవలం దానిని వెంబడించండి. అదే మిమ్ములను తీసుకు వెళ్తుంది. అది సరి. మరియు వారు కొద్దిగా ముందుకు వెళ్ళారు. మరియు ఆ అగ్నిస్తంభము ఒక మనుష్యునివలె మారిపోయింది. మరి అతను, ”నేను ప్రభువు యొక్క సేనాధిపతిని“ అని చెప్పాడు. ”మనము ఇంత దూరం వచ్చితిమి. మనము ఇంకా కొనసాగుదము.“

ఇప్పుడు, ఆ యొక్క గొప్ప భూమి వారి ముందు ఉన్నది — పూర్తి సైనిక దళం ఉన్నది. మరియు ప్రభువు యొక్క సేనాధిపతి, అతను కూడా ఒక సైనికుడే. కాబట్టి అతను యోహోషువాతో, “ఇప్పుడు యోహోషువా, నీవు భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, మరియు నీవు బ్రతికినన్ని దినములలో ఏ వ్యక్తి నీ ముందు నిలువనేరడు.” ఓ, మై! యోహోషువా అన్నాడు, “ఇప్పుడు మేము ఆ యొక్క భూమి ఎలా ఉందో చూడాలని అనుకుంటున్నాను.”

కనుక అతను కొంత మంది గూఢచారులను బయటకు పంపాడు. వారు వెళ్ళిరి మరియు అక్కడ రాహాబు అను వేశ్య వారిని ఆ రాత్రి దాచిపెట్టినది. మీరు మరియొక సంగతిని గుర్తించాలని కోరుచున్నాను. గమనించండి, వారు అక్కడ రాహాబు అను వేశ్య ఇంటిలో పైన ఉండగా, ఏమి జరిగింది. రాహాబు అను వేశ్య వారిని ఆమె యొక్క పైకప్పు మీద ఉన్న అవిసె క్రింద వారిని దాచినది. ఆ మనుష్యులను బయటకు పంపించి తిరిగి వచ్చి వారితో 'చూడండి?' ఇంకా ఇప్పుడు దేవుడు ఏ విధంగా కదులుచున్నాడో, ఈ యొక్క యోహోషువాను ప్రోత్సాహంతో ఎలా దగ్గరగా తీసుకు వెళ్తున్నాడో చూడండి. ఆయన అన్నాడు, “ఈ యొక్క దేశం మొత్తము కూడా నిన్ను గూర్చి భయపడుతోంది.” అన్నాడు, “మేము, మీ కొరకు దేవుడు చేసిన కార్యములను విన్నాము.”

ఆమేన్. నేను దానిని ప్రేమిస్తున్నాను. చింత అవసరం లేదు, ఆయన అనగా, దేవుడు వచ్చుటకు మంచి సమయం ఉంటుంది.

“ఈ దేశం మొత్తము కూడా మిమ్మలను గూర్చి భయపడుతోంది. మేము మీ యొక్క దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా మార్చి, మిమ్ములను నడిపించుట, మరియు ఫరో సైన్యాన్ని సముద్రంలో మంచి వేయుట, ఆ అరణ్యంలో మీకు భోజనంగా మన్నాను ఇచ్చుట, మరియు ఒక ఇత్తడి సర్పమును ప్రాయశ్చిత్తముగా ఎత్తుట, ఇవన్నీ ఆయన మీ కొరకు చేసియున్నాడు. మరియు మీరు రాజులను మరియు ఓగుని నాశనం చేయుటకు ఏమి చేసియున్నారో నేను తెలుసుకున్నాను. నేను మీరు ఏమి చేశారో చూశాను, పూర్తిగా నాశనమయ్యాయి. మేము వీటిని గూర్చి విన్నప్పుడు మరియు మీరు మా మార్గమునకు తిరిగిరి అని తెలుసుకున్నప్పుడు, మేము సొమ్మసిల్లితిమి. మాలో ఎవరికీ ఇంకా ఎంత మాత్రము ధైర్యం లేకుండా ఉండెను.”

41

మరి వారు తిరిగి యోహోషువాకు తెలియజేయగా, మరి నేను ఊహించగలను, ఆయన తన ఖడ్గమును త్రిప్పుతూ, “ఆయన మనముందుగా ఉన్నాడు, దేవునికే మహిమ,” అని అన్నాడు. ఆమేన్.

వారు ఆ విధంగా భయాబ్రాంతులగునట్లు చేసినది యేమిటి? వారు ఉన్నత దేహులైనప్పటికీ, వారిని అంత భయాబ్రాంతులగునట్లు చేసినది ఏమిటి? “ఎందుకు,” వారు అన్నారు. “మేము ఆ ఉన్నత దేహుల క్రింద మిడతల వలె ఉన్నాము.” మరి వారు ఏవిధంగా సొమ్మసిల్లుదురు? వారు ఈ యొక్క పెద్ద గోడల వెనక వడిసెలు మరియు రాళ్ళు మరియు బల్లెములు ఇంకా అన్నీ కలిగి ఉన్నారు. వారు వేవేలకొలది లెక్కకు మించి ఉన్నారు. ఖచ్చితంగా వారు ఆ విధంగా ఉన్నారు. కచ్చితముగా, వారందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు.

“మనము ఈ చిన్న మందను ఎందుకు తరిమి కొట్టలేము, మన చేతికి కూడా సరియైన చిన్నవాళ్ళు, పాత చిన్న దిక్కుమాలిన వారిగా కనిపించే ప్రజలు వారు. పాత కొడవళ్ళ పట్టుకొని పోరాడటానికి వచ్చారు? వారసలు దళమునకు చెందిన వారు కాదు. వారు కేవలం పాత పాదరక్షలు ధరించినవారు. వారు యోధులు కారు. వారు శిబిరాలలో నివసించువారు, మరియు మూఢభక్తి కలిగిన వారు, మరియు పరిశుద్ధ-గుండ్రాళ్ళు. మంచిది, మనం ఎందుకు చేయలేము... ఈ సముద్రపు ఒడ్డున ఉంటూ మరియు అరుస్తూ, రంకెలు వేస్తూ, మరియు తలవంపులు తెస్తూ ఉన్నాము. ఎందుకు మనం కవచములు ధరించి వారికి ఎదురుగా వెళ్ళకూడదు?”

కానీ వారి యొక్క హృదయాలలో ఏమీ లేదు? ఎందుకు? దేవుడు, “నేను మీ ఎదుట నా భయమును వారి మీదకు పంపిస్తాను,” అని చెప్పెను. ఆమెన్. అక్కడే. “నేను మీ ఎదుట నా భయమును వారి మీదకు పంపిస్తాను, ఎందుకనగా మీరు నా ప్రజలు, నా నిబంధన ప్రజలు, నేను మిమ్మును ఎన్నిక ద్వారా పిలిచితిని. నేను మిమ్ములను ఎన్నుకొంటిని. నేను మిమ్ములను శరీరంలో పెట్టి యున్నాను మరియు మీరు సున్నతి పొందితిరి. ఇప్పుడు, మీరు విశ్వాసులు. మీరు ముందుకు కొనసాగుడి, నేను మీతో ఉన్నాను. అది అంతా మీదే.”

42

ఇప్పుడు, ఆ మాదిరిగా ఈ రోజును చూతుము. అది పాలస్తీనా అనునది ఇశ్రాయేలుకు సంబంధించినది. అది వారి యొక్క నివాసము చేయుచున్న స్థలము. మీరు గమనించితిరా? అది వారు నివాసము చేయు స్థలము, ఎందుకనగా అది ఇశ్రాయేలుకు నివాస స్థలముగా ఇవ్వబడినది. ఈ యొక్క శరీరం మీది దేవుడు దీనిని మీకు ఇచ్చియున్నాడు. ఇది మీ నివాస స్థలము. మీరు దీనిని తీసుకోవాల్సి ఉంది అని దేవుడు కోరుచున్నాడు. కానీ అపవాది క్యాన్సర్, క్షయ వ్యాధి ఇంకా అనేకమైనవి దానిలోనికి ప్రవేశపెట్టినది. మరి మీరు, “నేను వాటిని తీసివేతును” అని అనవచ్చును, నేను దీనిని చేస్తాను, నేను దానిని చేస్తాను,“ అని మీరు అనవచ్చును.

కానీ మీకు ఏమిటో తెలుసా? ఏదో సంభవించినది. ఆ యొక్క అగ్నిస్తంభము, ఆ యొక్క యోహోవా సైన్యాధిపతి మన మధ్యలోనికి వచ్చియున్నాడు. మరియు ప్రజలను తమ చెరలో ఉంచికొనియున్న ప్రతి విధమైన అపవాది ఈ రోజు చావు భయంతో ఉన్నవి. ఖచ్చితంగా, అవి అలాగున ఉండవలసి ఉన్నది. అవి సొమ్మసిల్లి ఉన్నవి. ఎందుకు? వారు విన్నారు... ఎందుకు ఫిలిష్తీయులు ఆ విధంగా సొమ్మసిల్లినారు? ఎందుకు ఆ యెరికో పట్టణం సొమ్మసిల్లినది? ఎందుకనగా దేవునిచే వాగ్దానం పొందిన ప్రజలు వారి యొక్క మార్గంలో లోనికి రాబోవుచున్నారు. ఆమేన్. వాగ్దానము పొందిన వారు ఆ ప్రజలు.

నిబంధనా ప్రజలు, యేసుక్రీస్తులో ఉన్న వాగ్దాన ప్రజలు. ఈ చివరి దినాల్లో కూడా ఒక వాగ్దానం కలిగి యందురు. అది ఏమనగా, దేవుడు వారి శరీరాన్ని లేపి దానిని పరిపూర్ణంగా చేయును. మరియు ఇప్పుడు మనం దానియొక్క గుణలక్షణాలు పొందుకొని యున్నాము. అందునిమిత్తమే వారు సొమ్మసిల్లిరి. వారుయొక్క తండ్రి అపవాది, ఆ కల్వరిలో ఓడిపోయాడు. మరియు యెహోవా యొక్క సేనాధిపతి పరిశుద్దాత్మ రూపంలో కదులుచుండెను.

తండ్రిలో విశ్వాసముంచుట, కుమారునిలో విశ్వాసముంచుట, పరిశుద్దాత్మలో విశ్వాసముంచుట, మూడుఒక్కటిగా ఉన్నది;

దయ్యములు కంపించును, మరియు పాపులు మేల్కోందురు;

యెహోవాయందు విశ్వాసముంచుట చేత ప్రతిదియూ కదులును.

43

హల్లెలూయ! దయ్యములు కదులుటకు సిద్దంగా ఉన్నవి. ఎందుకనగా సేనాధిపతి యగు యేసుక్రీస్తు చెప్పెను, “నా నామములో మీరు దయ్యములు వెళ్ళగొట్టుదురు.”

వారు నలభై సంవత్సరముల క్రితం దానిని పొందుటకు విఫలమయ్యిరి, కానీ మనం ఇప్పుడు లోనికి వస్తున్నాము. ఆ యొక్క భూమిని స్వాధీనపరుచుకొనుచున్నాము. అదే అగ్ని స్తంభము, అదే దేవుని యొక్క సేనాధిపతి. ఇది నీ యొక్క భూమి దేవుడు నీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తానని వాగ్దానం చేశాడు. ఆయన అటువంటి శరీరమును నీకిచ్చాడు. దానిని స్వాధీనపరుచుకొనుట ద్వారా అది మీదవుతుంది. అపవాది దానిని స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నిస్తుంది, కానీ ఆ విధంగా చేయు అధికారం దానికి లేదు. ఈ రాత్రి అది వణుకుచున్నది. హల్లెలూయ! ఆ గొప్ప దేవుని యొక్క శక్తి ఈ యొక్క భవనంలో తిరుగుచున్నది, సాతాను వణుకుచున్నది. వారికి కేవలం విశ్వాసమున్నచో ఏమౌతుంది మరి అలాగు ఉన్నట్లయితే, దానియొక్క ప్రాణం పోతుంది, అది వాడిలో కరిగిపోతుంది. ఎందుకు?

“ఓ,” మీరు చెప్పవచ్చు, “డాక్టర్ గారు చెప్పారు అని మీరు అనవచ్చు....”

అవును, కానీ దేవుని యొక్క సేనాధిపతి ఇప్పుడు లోనికి వచ్చుట గ్రహించుదురు. అది నిజం. వాడు ఎంత ఉన్నప్పటికీ, వాడు వైద్యుని యొక్క దృష్టికి అందనంత ఎత్తుగా ఉన్నప్పటికీ, వాడు దేవుని ఎదుట నిలవజాలడు. వాడు శారీరకంగా వైద్య శాస్త్రమునకు శిఖరము వలె ఉండవచ్చును. కానీ వాడు దేవుని ఎదుట ఆ విధంగా ఉండనేరడు. హల్లెలూయ!

44

యోహోషువా, రక్షకుడు. “యోహోషువా అనగా రక్షకుడు.” ఆయన ఇప్పుడు లోనికి వస్తున్నాడు. మీరు సమస్యత్మాకంగా తొందరపడవద్దు. నమ్ముడి. ఇక్కడ ఈ రాత్రి స్వాధీనపరుచుకొందాము. ఆమేన్. నేను దానిని ఏ విధంగా ప్రేమిస్తున్నాను. ఈ రాత్రి ఆ యొక్క అగ్నిస్తంభము మనతో ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఆ యెహోవా యొక్క సేనాధిపతి ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఖడ్గం దూసి యున్నాడు. అతడు ఆ యొక్క వైద్యసూచనకు భయపడవచ్చును లేక దానికి భయపడకపోవచ్చును. ఎందుకనగా వారు బాగా కష్టపడి ప్రయత్నించుట ద్వారా దానిని సాధించలేరు.

వారు క్యాన్సర్ ను నయం చేయుటకు ఏదో ఒకటి తీసుకు వస్తారు అని అనుకుంటున్నాను. వారు ఏదో చేయుటకు వస్తారు. కానీ, ఇప్పటి వరకూ అపవాది వారి మీద పెత్తనం దొరికిందని అనుకుంటున్నది. కానీ క్రీస్తు యొక్క ఖడ్గము వచ్చినప్పుడు, వాడు ఎన్నడునూ నిలవనేరడు. ఆయన తన ఖడ్గంతో ప్రతి విధమైన క్యాన్సర్ను నరికివేసి, దానిని పారద్రోలును. ఆయన అంధులను మరియు అపవాది బారినపడిన వారిని లేపును. ఆయన ప్రతి చోట దానిని చేయును.

మరియు ఆయన ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఆ గొప్ప సహజాతీతమైన ప్రభువగు యేసుక్రీస్తు, ఆ గొప్ప “నేను” అను దేవుడు, ఆ గొప్ప ఆల్ఫా - ఒమేగా, ఆదియూ - అంతమునై యున్నవాడు. ఎందుకు? ఆ భూమి మనకు చెందినది. నా దగ్గరకు వచ్చు ప్రతి వానికి నిత్యజీవమును ఇచ్చుదును మరియు అంత్యదినమున నేను వానిని లేపుదును. ఆమేన్.

మనకు ఇక్కడ ఒక ఆధారం దొరికియున్నది. గతవారం ఎవరైతే మరణ పానుపుపై పడి ఉన్నారో, మాయో అనే హాస్పిటల్లో లేక ఇంకా ఎక్కడో ఉండి ఎప్పటికీ నయం కాని స్థితిలో ఉండి, ఏమి చేయాలో తెలియక ఉన్నవారు, ఈ రాత్రి పరిపూర్ణంగా మునుపటి స్థితికి వచ్చి, మంచిగా ఉంటారు. అది రుజువు. ఆ భూమి మనది, హల్లెలూయ! దానిని పొందుకొందుము. ఆమేన్. దానిని జయించుదము. దేవుడు దానిని మనకు వాగ్దానం చేశాడు. అది నీకు చెందినది, అది నాకు చెందినది. నీవు కత్తి దూసినట్లయితే, అది నీ యొక్క స్వాస్థ్యమే. అది అంటే. ముందుకు అడుగు వేసి మరియు ఆ గోడలను కూల్చివేయుము. హల్లెలూయ!

ఓ క్రైస్తవ యోధుడా, పోరాటం ఉన్నది,

దృఢమైన వ్యూహంలో ముఖాముఖి పోరాటం,

మెరుయుచున్నట్లు ఉన్న కవచములతో,

మరియు రంగులు ప్రవహిస్తున్నాయి.

తప్పు మరియు ఒప్పు ఈ నిమగ్నం కాబోతున్నాయి;

పోరాటం ఉన్నది, కానీ అలసిపోయి ఉండవద్దు,

దృఢంగా ఉండుము. ఆయన యొక్క శక్తివంతమైన పట్టు బిగించుకుంటుంది.

దేవుడు మనకు ఉండిన యెడల, ఆయన మహిమ మనకు ఉండును,

మనము చివరిలో విజయగీతము పాడుకుందుము.

మనము చేయవలసియున్నాము, మనమందరమూ ఆ వాగ్దాన దేశము కొరకు బంధించబడియున్నాము. పునరుత్థానుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. నీవు దానిని నమ్ముచున్నావా?

45

ఓ ప్రభువగు యేసూ, దేవుని కుమారుడా ఈ గొప్ప యోహోషువాను ఈ అన్యసంఘమునకు పంపి ఈ గందరగోళం అనబడిన అరణ్యంలో నుండి నడిపించుటకు పంపించియున్నావు. ఎందుకనగా ఈ యొక్క చిన్న భక్తులు ఈ అరణ్యంలో అటు ఇటు ప్రయాణం చేయుచున్నారు, ప్రభువా, ఒడిదుడుకులు, ముందు వెనకలు, ఎందుకనగా పిల్లల రొట్టె ముక్కలు నుండి దొంగిలించు నాయకులు ఉన్నారు. ప్రభువా, ఓ యోహోషువా, ప్రభువైన యేసూ, “నేను” ఉన్నవాడను అనబడినవాడా, ఈ రాత్రి ప్రబలమైన విశ్వాసంతో లోనికి రమ్ము. ప్రతి యొక్క వ్యాధిగ్రసులైన ప్రజలను స్వాధీన పరుచుకోండి. ఇక్కడే పాపి ఉన్నట్లయితే వారిని స్వాధీనపరుచుకోండి. వారిని కదిలించండి, మనము యోర్దాను దగ్గర ఉన్నాము అని అతనికి తెలియజేయండి.

ఓ దేవా, ఈ దినాలలో ఏదో ఒక దినాన మీ పిల్లలను ఏకము చేసి, నీ రక్తంతో శుద్ధి చేస్తావు. మీరు వారిని ఆ సముద్ర తీరం నుండి ఆ యొక్క భూమిని చూచుటకు తీసుకు వస్తావు. ఒక్క క్షణంలో మార్చండి. కను-రెప్ప-పాటులో యోర్దానును దాటించండి. మేము ఆ గడియ కొరకు ఎదురు చూస్తున్నాము.

తండ్రి, మీరు యేసుని పంపిస్తారని ప్రార్థన చేస్తున్నాము. మరియు ఆయన ఈ జనములలోకి వచ్చి ఆయన ఏదైతే చేస్తాను అన్నాడో, ఆయన చేయును గాక! మరియు రోగులను, చెరలో భాదపడుచున్న వారిని స్వస్థపరచి విడిపించును గాక! మేము ఆయన నామములో అడుగుచున్నాము. ఆమేన్.

46

దేవునియందు విశ్వాసముంచమని నేను మీతో చెప్పుచున్నాను, నా సహోదరుడా, నా సహోదరీ, ప్రభువైన యేసుక్రీస్తు జీవిస్తున్నటువంటి దైవ కుమారుడు, ఎన్నటికీ తప్పిపోడు. ఆయన ఎన్నటికీ తప్పిపోలేడు. ఈ రాత్రి మనము చూచుటకు ఏమి ఉన్నది? మనము ఒక నాయకుడిని ఈ రాత్రి కలిగి ఉన్నాము. ఆయనే రెండో యోహోషువా, ఆయన ఎవరో కాదు ప్రభువైన యేసే ప్రభువగు దేవుని యొక్క సేనాధిపతి ఆయన తన ప్రజలతో ఉన్నారు. ఆయన ఇక్కడ శక్తితో ఉన్నాడు. ఆయన సంఘములోనికి ఒక సాక్ష్యమును తెచ్చి ఆయన స్వస్థపరచును అని రుజువు చేసుకుంటున్నాడు. ఆయన తన ప్రజల ద్వారా దానిని రుజువు చేస్తున్నాడు. ఆయన వారికి పరిశుద్దాత్మ బాప్తిస్మము ఇస్తాడు. ఆయన క్రిందికి వచ్చి మరియు ఆయన యొక్క చిత్రాన్ని మనతో తీసుకు వెళ్ళనిస్తున్నాడు.

నిన్ను మెతడిస్టులో, బాప్టిస్ట్ లో, లేదా పెంతెకోస్తు లో లేదా బ్రెన్హా౦ గుడారములో చేరకుండా ఉండటానికి ఆయన చేయగలిగినంత నీయందు చేసి చూపుతున్నాడు, కానీ క్రీస్తులో చేరి ఆయనను నమ్ముటకు పిలుస్తున్నాడు. ఏది ఏమైనా, నీవు ఏ సంఘమునకు వెళ్తున్నా దానిలో చేయుటకు ఏమీ ఉండదు. నీ హృదయం దేవునితో ఉండాలి. దేవుడు చూచునది అదియే. అది నిజం. అతీతమైన పునరుత్థానము చెందిన యేసు క్రీస్తునందు నమ్మికయుంచుము.

47

ఇక్కడ ఎవరైనా పాపి ఉండి, “సరే నేను ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి, ఆ యొక్క స్థానమును పొందాలి” అని అనుకున్నట్లయితే, లేచి నిలబడుము. ఇక్కడ ఎవరైనా పాపి ప్రభువైన యేసుక్రీస్తులోనికి చేరి, ఒక విశ్వాసిగా ఉండాలని అనుకుంటే, లేచి నిలబడుము. మీరు దానిని చేయాలని అడుగుతున్నాను. ప్రభువైన యేసు.... ఇక్కడ నాకు తెలిసినంత వరకూ ఈ ప్రజలలో ఏ ఒక్క పాపి కూడా లేడు. నాకు అది తెలియదు, కానీ యేసుక్రీస్తునకు తెలుసు.

48

తెల్లని శాలువాతో కూర్చొన్న స్త్రీ, దేవుడు నీకున్నటువంటి కీళ్ళ నొప్పులను ఈ క్షణమందే స్వస్థపరచెను. నీ కాళ్ళ మీద నీవు నిలబడుము. అది పోయినది. కదా? అది నిజమైతే నీ చేయి ఊపుము, ఆ కీళ్ళనొప్పులు పోయినవి. నిజమేనా? ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరచెను, నీవు బాగైనావు.

49

ఆ వెనుక కూర్చొన్న స్త్రీ. ఆమెకు స్త్రీలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నది. ఆ వ్యక్తి యొక్క భుజముల వైపు చూస్తుంది. ఆ వెనక భాగమున కూర్చొని ఉన్నది. ఎర్ర కోటు ధరించిన స్త్రీకి ప్రక్కన ఉన్నటువంటి స్త్రీ, ఆమెకు స్త్రీలకు సంబంధించిన వ్యాధి ఉన్నది. ఆ స్త్రీ, అవును, నీ పాదముల మీద లేచి నిలబడుము. అక్కడున్నటువంటి స్త్రీ, ఆ చిన్న గోధుమ రంగుతో చాయతో ఉన్న స్త్రీ. నీకు స్త్రీలకు సంబంధించిన సమస్య ఉన్నది. కాదూ? నీకు ప్రార్థన కార్డు కూడా లేదు కదా? నీకు నీకు ప్రార్థన కార్డు లేదు కదా? సరే, నీకు అది అవసరం లేదు. నీవు ఇంటికి స్వస్థత పొంది వెళ్ళుము. అది నిజం. దేవుడు నిన్ను దీవించును గాక!

నీకు స్త్రీలకు సంబంధించిన సమస్య వలన శ్రావం కలిగి బాధపడుతున్నావు. అది నిజమేనా? అది చీము గడ్డ, అది ప్రక్కల నొప్పి, మరియు దానినుండి శ్రావం. అది నిజమేనా? నీ చేయి ఎత్తి చూపుము, అది నిజమేనా. చూడండి? నీకు అది ఇంక ఉండనే ఉండదు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచెను.

50

ఈ స్త్రీ, దేవుని యొక్క దూత ఆమె ఉన్నటువంటి స్థలములో ఉండుట నేను చూసాను. ఆమె ఒక పెద్ద స్త్రీ, ఆమె ఒక ఎర్రని కోటును ధరించియున్నది. ఆమె నరముల బలహీనత చేత బాధపడుతున్నది. ఆమె దాని నుండి విడిపించబడాలని వేడుకొనుచున్నది. అది నిజమేనా? అది నిజమైతే నీ చేయిని ఊపుము. నీవు ఇప్పుడు విడుదల పొందావు. నీవు ఇంటికి వెళ్ళవచ్చును. యేసుక్రీస్తు నిన్ను బాగుచేసెను. నిన్న ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ రోజు ఉన్నాడు.

51

యవ్వనస్తుడు, ఇక్కడే కూర్చొని యున్నాడు. ఆ పిల్లవాని భుజం మీద చేయి వేసిన, అతని ప్రక్కన కూర్చొన్నాడు. అతనితో నీవు వెళ్ళి భోజనం చేయమని చెప్పుము. అతనికి కడుపు నొప్పి సమస్య ఉన్నది. అతను ఇప్పుడు స్వస్థపడెను. దేవుడు నిన్ను దీవించును గాక! యవ్వనస్తుడా, ఇప్పుడు ఇంటికి వెళ్ళు బాగుగా ఉండబోతున్నావు. నీవు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావు కదూ? నీవు స్వస్థత పొందావని నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావు. ఒక సాక్షిగా నీవు నీ పాదముల మీద ఒక నిమిషం లేచి నిలబడుము. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళుము. నీ యొక్క ఆందోళన, నీ యొక్క కదిలిపోవుట మరియు సమస్తముతో ఉన్నావు. కానీ నీవు ఇంటికి వెళ్ళి బాగవుము. దేవుడు నిన్ను దీవించును.

52

ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఆ పురుషుడు వెనక కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక సమస్య ఉన్నది. సరిగా అక్కడ నీ వెనక, నీవు ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరచునని నమ్ముచున్నావా? మీరు నమ్ముతున్నారా? ఆయన నిన్ను బాగుపరచబోవుతున్నాడని నీవు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును గాక, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను.

నీ యొక్క హస్తము నీ పక్కన ఉన్నటువంటి స్త్రీ మీద ఉంచుము, ఆమె ఒక చీలికతో బాధపడుతున్నది. ఆమె కూడా స్వస్థపడాలని కోరుకుంటున్నది. సహోదరీ దేవుడు నిన్ను దీవించును గాక! నీవు కూడా స్వస్థత పొందావని నమ్ముచున్నావా? దేవుడు నిన్ను దీవించును గాక, నీకు ఏది కావాలో అది పొందుము.

నీ పక్కన ఉన్నటువంటి చిన్నవాడు, అతనికి మూత్రపిండాల సమస్య ఉన్నది. నీవు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా కుమారుడా? అయితే నీ పాదముల మీద లేచి నిలబడుము. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించు. నీవు స్వస్థపడ్డావని నమ్ముచున్నావా? నీవు స్వస్థత పొందావు. దేవుడు నిన్ను దీవించును గాక! అది నీలో నుండి పోయినది.

53

ఆ యోహోషువా, ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుని యొక్క దూత ప్రభువగు యేసుక్రీస్తే, ఆయన తన శక్తితోనూ, పునరుత్థానముతోనూ ఇక్కడ ఉన్నాడు. నీకు ప్రార్థన వరస అవసరం లేదు. నీకు కావలసినదల్లా విశ్వాసము మాత్రమే. నీవు దానిని నమ్ముచున్నావా? నీవు దానిని నమ్మినట్లయితే, నీ పాదముల మీద లేచి నిలబడి, నీ స్వస్థతను అంగీకరించుము. మరియు బాగుపడి ఇంటికి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామములో అంగీకరించండి, సంతోషించండి, ఆయనకు మహిమను మరియు కీర్తనను ఇవ్వండి. మిమ్ములను స్వస్థపరిచినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలపండి. మీరు దానిని నమ్మినట్లయితే, మీ చేతులు ఊపండి. లేచి నిలబడుము, మీరు అక్కడ బాగుగా కూర్చోలేరు. ప్రతి ఒక్కరూ లేచి దేవుని స్తుతించండి.

తండ్రీ, యేసుక్రీస్తు నామములో ప్రతి రోగిని స్వస్థపరచండి.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...