ఈ గొప్ప యోధుడైన దావీదు

ఈ గొప్ప యోధుడైన దావీదు

1

మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో, నాతో చదువుటకు మీరు కోరిన యెడల, మరియు 31వ వచనంతో ప్రారంభించండి.

దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను.

ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరి మనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా

సౌలు ఈ ఫిలిష్తీయని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్దాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను.

అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను - మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తికొని పోవుచుండగ,

నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని; అది నా మీదికి రాగా దానిని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.

మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు.

చదవబడిన ఆయన వాక్యామునకు ప్రభువు తన ఆశీస్సులు తోడు చేయును గాక. ఇపుడు కొన్ని క్షణాలు ఈ గొప్ప యోధుడైన దావీదును గూర్చి నేను మాట్లాడగోరుచున్నాను. మరియు రేపు రాత్రికి, దేవుని చిత్తమైతే యోధుడైన యొహోషువా మీద మాట్లాడగోరుచున్నాను.

2

ఇప్పుడు, ఈ రాత్రి దావీదును గూర్చిన రాత్రియై ఉన్నది, దావీదు ఎల్లపుడు నా హృదయంలో ఒక నిజస్థానము కలిగి ఉన్నాడు, ఎందుకనగా అతడు దేవుడు అతనితో చెప్పినట్లుగా, “నా హృదయానుసారుడైన ఒక మనిషి.” వారు ఎక్కడ నిలబడి ఉన్నారో, వారు దేనిగూర్చి మాట్లాడుచున్నారో ఎరిగిన ప్రజలను చూచుటకు నేను ఇష్టపడుచున్నాను. వారు ఏమై యున్ననూ, వారు ఏ విషయమును గూర్చి మాట్లాడుచున్నారో వారు ఎరిగిన యెడల, వారు ఏ మతమునకు చెందినా, లేక వారు ఏ అంశమును గూర్చి మాట్లాడినను; వారు దేని గూర్చి మాట్లడుచున్నారో వారు ఎరిగియున్నయెడల నేను వినుటకు ఇష్టపడుచున్నాను. మరియు నేను దానిని ఇష్టపడుదును.

3

మరియు దావీదు ఒక చిన్న బాలుడైన గొర్రెల కాపరి; అతడు తన తండ్రితో బెత్లెహేములో నివసించెను. అది ఎఫ్రాయిము గోత్రమైయుండెను. ఎఫ్రాయిమీయుడై తన తండ్రి యెషయికి ఎనిమిదవ కుమారుడైన, ఉన్నత వంశములో పుట్టిన ఒక చిన్న వ్యక్తి. మరియు దావీదు, ఈ భూమి మీద జన్మించిన ప్రారంభ దినముల నుండి, దేవుడు తనతో ఉండెనని అతడు ఎరిగియుండెను. అతడు ఆశీర్వదించబడుటకు లేక అభిషేకించబడుటకు ముందుగానే, దేవుడు అతనితో ఉండెనని ఎరిగెను. ఆ కథను బహు జాగ్రత్తగా నీవు గమనించినయెడల, దేవుడు ఎలాగు....

గత రాత్రి అదే విషయం మీద మనం మాట్లాడుకున్నాం, వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకుండా వచ్చును. అది దేవుని ఎన్నిక మరియు ముందు జ్ఞానము కనుక అలా చేసినది అదే. మనకు ఒక కోరిక ఉన్నయెడల, బైబిలు చెప్పెను, “కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువానివలననైనను కాదు గాని, కరుణించు దేవుని వలనే అవును.” చూశారా, అది నీవు ఇష్టపడుచున్నావని కాదు లేక నీవు కోరుచున్నావని కాదు, లేక అది నీకున్న కోరికలనియు కాదు, అది దేవుని చిత్తమా కాదని మనం దేవుని చిత్తమును కనుగొనవలెను, మరియు అది దేవుని చిత్తమని రూఢియైనప్పుడు, మనం దానిపై విశ్వాసముంచి ఇలా చెప్పవచ్చును, “ఇది అదే యైయున్నది.” మరియు దేవుని చిత్తానుసారమైన మార్గములో మనము సరియైన రీతిగా పరుగెత్తగలము.

4

ఇప్పుడు, తప్పిపోయిన వారిని రక్షించుట అది దేవుని చిత్తమని మనం ఎరుగుదుము. వ్యాధిగ్రస్తులను స్వస్టపరచుట అది దేవుని చిత్తమని మనం ఎరుగుదుము. ఇప్పుడు, ఆయన చిత్తములో మనం సరియైన స్థానంలో ఉండగలిగినట్లైతే, అది సమాప్తమైనది. ఈ రాత్రి చిన్న సమాజం కొరకు, ఎంత మంది ఇక్కడ రోగులున్నారు, మీ చేతులు చూపించండి. రోగులైన మీరు ప్రార్థన కొరకు ఎక్కడున్ననూ, మీ చేతులు పైకెత్తండి. ఇప్పుడు, కేవలం చూడండి, అక్కడ ఎవరులేరు. మనము ఈ రాత్రి పరిపూర్ణంగా బాగై ఇంటికి వెళదాము. మిగిలిన వారి వైపు చూడండి...

మీరు ఇంకను ఇక్కడే వున్నట్లైతే చెప్పండి, చాలా మంది ప్రజలు వారి తమ సాక్ష్యములను పంపారు. మై! ఎంత ఆశ్చర్యము. అక్కడ కేవలం వారు పలికిన వెంటనే లేక విశ్వాసం పొందిన వెంటనే ఆ ప్రజలు కొరకు ప్రభువు ఏమి చేసెనో, సహో జోసఫ్ కూడ వారి సాక్ష్యములను ఆయన పత్రికలో పెట్టుటకు వాటిని పొందుచుండెను. ప్రభువైన యేసు గొప్ప శక్తితో క్రిందకు దిగి వచ్చి మరియు వారికి తననుతాను ప్రత్యక్షపరచుకొని అన్ని రకములైన వ్యాధులను స్వస్థపరచి ప్రజల యొద్ద నుండి వెడలిపోయెను. వైద్యులు ఇది వరకే నియంత్రించలేని వ్యాధులను కూడ, మనం ఇక్కడ, చికాగోలో ఉన్నప్పటి నుండి ప్రభువు వారిని స్వస్థపరచెను మరియు వారు ఇప్పుడు బాగైయున్నారు, చూశారా.

వారిక్కడ సజీవ సాక్షులుగా ఉన్నారు. ప్రభువు పలికినట్టే వారు గృహానికి వెళ్ళచూ తమ ప్రియమైనవారు ప్రతి ఒక్కరు స్వస్థత పొందుట కనుగొన్నారు, కేవలం అదే పద్ధతిలో టేపులో వెనుకకు వెళ్ళి మరియు ఆయన ఏమి చెప్పెనో చూచి, అది సరికాదేమో గమనించండి. చూడండి, కేవలం, ఆయన ఏమి చెప్పెనో, సరిగా అలాగే జరుగనై యున్నది.

5

మరియు ఇప్పుడు, దావీదు, ఎన్నిక ద్వార, సరియైన స్థానంలో అతడు జన్మించి ఉండెను, అదే దేవుడు చెప్పెను, “వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకుండానే వచ్చును; మరియు ఎన్నికైన ఒక దేవుని సేవకునిగా అతడు జన్మించి ఉండెను. మరియు అతడు ఒక చిన్న బాలునిగా ఉన్నప్పుడు,ఆ రోజున ఇశ్రాయేలీయులు దేవుని నుండి దూరముగా పోయిరి. వారు బయటకు వెళ్ళి మరియు వారి కొరకు ఒక రాజును ఎన్నుకొనిరి. వారు అన్యజనుల వలె, మిలిగిన దేశముల వలె ప్రవర్తించగోరిరి. దేవుడే వారికి రాజై ఉండెను. అయితే మిగిలిన ప్రజల వలె వారు ప్రవర్తింపగోరెను. అలాంటి సమయంలోనే వారు కష్టాల్లో పడిరి.

మరియు నీవు ఎపుడైన ఇతరులను అనుకరించ ప్రయత్నించినప్పుడు, కష్టములు ఎదుర్కొనెదవు, నీవు అనుకరించగలవు. సహో! అప్షా ఒక చిన్న నినాదము అతడు ఉపయోగించేవాడు, “నీకు లేనిదానిని ఉన్నట్లుగా చూపించలేవు. అది నిజమే, నీకు లేనిదానిని ఉన్నట్లుగా చూపించలేవు. కనుక దానిని మనస్సులో ఉంచుకొనండి. మరియు దేనినైన అనుకరించ ప్రయత్నించు స్థితి వచ్చిన యెడల ఎందుకు నీవు అలా చేయుచున్నావు, దేవుడు దాని గూర్చి ఎరుగును మరియు ఆ ప్రజలు కూడ దాని గూర్చి ఎరుగుదురు. కనుక కేవలం నీవు ఎలా ఉన్నావో అదే రీతిగా నిలిచి ఉండుము.

6

మరియు ఇశ్రాయేలీయులు కేవలం ఆ పరిస్థితిలో నిలచి ఉండి, అయితే వారన్నారు, “మంచిది, ఇప్పుడు చూడండి. మిగిలిన దేశములన్నియు ఒక రాజును కలిగి ఉండెను, కనుక మనము కూడా ఒక రాజును ఎందుకు కలిగి ఉండకూడదు?”

పెంతెకోస్తు ప్రజలైన మీరు ఇలా ఆలోచించునప్పుడు, మీకు కూడా అదే సంభవించినది, మంచిదే, మిగిలిన సంఘాలు వారు అందరు ప్రదర్శనలకు వెళ్ళదురు మరియు వారి స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకొందురు, మరియు వారు పొట్టి వస్త్రములు ధరించెదరు. మరియు వారు క్రైస్తవులమని చెప్పదురు. మనమూ అలా ఎందుకు చేయకూడదు? మీరు అక్కడే ఉన్నారు. మీకు ధన్యవాదములు. మీరు అలా చెప్పుటను వినుటకు నేను సంతోషించుచున్నాను. ధన్యవాదములు. సరే.

పాతకాలపు మెథడిస్టు బోధకుడు ఇలా పాడెడివాడు, “మేము అడ్డుగడియలు తొలగించాము, మనం పాపంతో రాజీపడ్డాము; మేము అడ్డుగడియలు తొలగించాము; మరియు గొర్రెలు బయటకు వెళ్ళాయి, అయితే, కాని మేకలు ఎలా లోపలకు వచ్చాయి? మీరు అడ్డుగడియలు తొలగించారు, అదే - అదంతే, అది నిజము. ఇప్పుడు, నాకు ఒక కొలిచే కర్ర ఉందని అనుకొనవద్దు; నాకు లేదు. అయితే నేను - ఒక వ్యక్తిని సువార్త పట్టుకున్నప్పుడు అది నిజముగా వారిని ఏమి చేసెనో నేను చూసాను. అది నిన్ను ప్రత్యేకముగా కనబడునట్లు చేయును, ప్రత్యేకముగా ప్రవర్తించునట్లు చేయును, ప్రత్యేకముగా ధరించునట్లు చేయును, ప్రత్యేకముగా నడచునట్లు చేయును, నీవు నీ చుట్టూ మార్గమంతటిలో ప్రత్యేకముగా ఉందువు. అది సరియైనది, మరియు కేవలం ఒకసారి అడ్డుగడియలను దించి మరియు మేకలు ఎలా లోపలకు ప్రవేశించాయో గమనించుము.

7

అయితే ఇప్పుడు, ఇశ్రాయేలీయులు ఇతరులను అనుకరించగోరెను. మరి అదే సంఘం చేయగోరినది ఏమనగా అనుకరించుటకు, వెనుకకు జారిన స్థితిలోనికి వెళ్ళెను, మరియు అప్పుడు ఈ స్థితిలో, వారు ఏమి చేసిరి? వారు ఒక రాజును పొందెను. వారు ఈ రాజును ఎన్నుకొనిరి. వారు వారి రాజును కనుగొనుటకు వెళ్ళిరి మరియు వారు పెద్దదైన, ప్రజలకు ఆకర్షణీయముగా ఉండునట్లు నల్లని కాంతివంతమైన కన్నులతో, ఏడు అడుగుల నల్లని బిరుసు వెంట్రుకలు గల, ఘనమైన అందమైన మనిషిని వారు కనుగొనిరి. మరియు “ఆయన అద్భుతమైన రాజుగా” ఉంటాడని వారునుకున్నారు.

కాని దేవుడు సమూయేలునకు చెప్పిన ప్రకారము, “మనుష్యులు పై-రూపమును లక్ష్యపెట్టుదురు గాని, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”

ఇశ్రాయేలీయులు వారి రాజును ఎన్నుకొన్నప్పుడు, ఒక గొప్ప అందమైన, పెద్ద భుజములతో బలముగ కనిపించు వ్యక్తిని మరి తన సైన్యమంతటి కంటే అతడు జనసమూహములో నిలిచినప్పుడు, భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటే తల ఎత్తుగలవాడుగా కనబడెను. కాని దేవుడు వారి కొరకు తన రాజును ఎన్నిక చేసినప్పుడు, అతడు ఎర్రని ముఖము కలిగి, సన్నని కట్టేవలె బలహీనముగా, పిరికివానివలె కనిపించాడు. అది దేవుని ఎన్నిక. ఎంత తేడా! దానిలో తేడా గమనించారా? కొన్నిసార్లు ఆ విధముగా దేవుడు తన కార్యములను చేయును. మనము ఆలోచించిన దానికి పూర్తి వ్యతిరేకముగా ఆయన తన కార్యములను చేయును.

8

వైద్యుడు చెప్పెను, “సరే కాని, ఆ వ్యక్తి టి.బి.తో చనిపోవనై ఉన్నాడు. ఎన్నటికైనా వారు ఎలా బాగుపడుదురు?” అది వైద్యుల అభిప్రాయము. అతడు ఒక వైద్య విధానములో దానివైపు చూస్తున్నాడు. అయితే దేవుని, కోణములో కాదు. “నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.” తరువాత సంగతి అదియే, చూశారా.

ఒకరు ఒక విధముగ దానివైపు చూచును... ఒకరు తెలివిజ్ఞానేంద్రియం నుండి, మరియు మరొకరు ఆత్మీయ జ్ఞానేంద్రియం నుండి దానివైపు చూచును. కనుక కేవలం అది నీ విశ్వాసమును ఏ విధముగ ఆధారం చేసికున్నావో అదే. ఆ వైద్యుడు, “అది అయిపోయినదని” చెప్పిన యెడల, మరియు నీవు అది నమ్మెదవు, అది దానిని స్థిరపరచును, అది సరియే. అయితే ఆ వైద్యుడు, అది అయిపోవునని చెప్పిన యెడల, మరియు నీవు దానిని నమ్మవద్దు, ఎందుకనగా దేవుడు ఏదో వ్యత్యాసముగా చెప్పెను. ఏమి జరుగునో గమనించుము, చూశారా. కేవలం నీవు ఏ పద్ధతిని అనుసరించితివో దానిపై అది ఆధారపడి ఉండును. నీ అవయవాలను దేనికి నీవు స్వాధీనం చేయుదువో, నీవు వాటికి దాసుడవై యున్నావు.

9

ఇప్పుడు, వైద్యులకు వ్యతిరేకంగా ఏమియు లేదు. జ్ఞాపకముంచుకొనుడి, నేను వైద్యులను నమ్ముదును... ఎందుకు నేను అలా చెప్పుచున్నాను, చాలా సార్లు ప్రజలు చుట్టూ తిరుగుచూ. “సరే, ఒక వ్యక్తి వైద్యుని దగ్గరకు వెళ్ళనక్కరలేదు.” అందుకు నేను మీతో వ్యతిరేకించగలను. లేదండి, వారు దేవునికి ప్రతినిధులు. కేవలం నీ ఆటోమోబైలు నీకు అవసరమైనట్టే, అది ఒక శాస్త్రీయ పరిశోధన, అది సరియే. నీవు చాలా ఎక్కువగా నీ వైద్యునితో ఉండవచ్చు కాని ఆ వైద్యుడు నిన్ను స్వస్థపరచువాడు కాడు. దేవుడే నిన్ను స్వస్థపరచువాడు. అది సరియే. నీ వైద్యుడు కేవలం దేవునికి సహాయకుడు. అది సరియే. అయితే, ఆ వైద్యుడు ఎంతగా చేయగలడో అంత వరకే చేయును, అది అతని (హద్దు) కి పరిమితమైనది. మరియు అతడు ఏమి చూడగలిగెనో, దానిమీద మాత్రమే పని చేయును. మరియు అతడు దేనిని స్పర్శించెనో, దానిమీద మాత్రమే పనిచేయును. అతడు ఎరిగి ఉన్నదంతయూ అదే. అయితే దేవుడు మిగిలినదంతయూ స్వాధీనంలో ఉంచును.

10

మరియు వైద్యుడు ఏ విధమునైనను స్వస్థపరచలేడు. అతడు నీ యొక్క చేయిని అమర్చగలడు, అయితే అతడు గృహమును విడచినప్పుడు, నీ చేయి స్వస్ధపడలేదు. అతడు నీ చేయిని కేవలం అమర్చగలడు మరియు దేవుడు దానిని స్వస్ధపరచును. నీకు అపెండిసైటిస్ ఉన్నప్పుడు అతడు అపెండిక్స్ బయటకు తీయును, మరియు స్వస్థపరచుటకు దానిని దేవునికి వదిలి వేయును. ఏలయనగా ఔషదములు శరీర కణజాలములను నిర్మించలేవు. దాని వలన కాదు. ఔషదములు దానిని చేయలేవు. కేవలం జీవము మాత్రమే ఆ కణజాలములను నిర్మించును మరియు ఆ జీవము దేవుడే కనుక వారు స్వస్ధపరచలేరు, ఒక్కదానినైన స్వస్థపరచలేరు. వారు అలా చెప్పుకొనరు. కేవలం వారు ఎముకను అమర్చి, శస్త్ర చికిత్స చేయగలరు. శుభ్రముగా ఉంచుటకు మందులు ఇవ్వగలరు. మరియు ఆ విధముగా చేయగలరు. దేవుడు స్వస్థపరచును, అది అంత సామాన్యమైనది. కనుక మీ వైద్యుడు ఏమాత్రం ప్రాముఖ్యం లేనివానిగా చూడకు. అతడు ఒక మంచి వైద్యుడు అయిన యెడల, ఒక క్రైస్తవ వైద్యుడు.

నేను వెళ్ళు నా ప్రయాణంలో ఏమిటో మీకు తెలియును. నేను చాలా సార్లు ఇంటర్వ్యూలలో ప్రతిచోట వైద్యవిధానమును గూర్చి మాట్లాడడం దానిని గూర్చిన పూర్తి అవగాహన కలిగియున్నను నా యొద్ద ఉన్న సేవకుల కంటే ఎక్కువగా దైవిక స్వస్థతయందు నమ్మిక ఉంచిన వైద్యులను నేను కనుగొన్నాను. అది సత్యం. చాల అరుదుగా నేను ఎన్నడైనా కలసిన ఒక వైద్య పరిజ్ఞానం తక్కువైన వైద్యుని కలిసాను. అది యదార్ధము. వారిలో చాలామంది అంటారు, “సరే కాని, నిశ్చయముగా రెవ. బ్రెన్హాం, మేము స్వస్థపరచువారమని చెప్పుకొనము, ఎందుకనగా నాకు తెలిసిన చాలామంది ప్రజలను ప్రార్ధన ద్వార మరల వెనుకకు తీసుకొనివచ్చిన, అలాంటి కేసులను నేను చూశాను” అనెను. “మంచిది నిశ్చయముగా అది అలా ఉండవలసి ఉన్నది.” చూడండి, వారు స్వస్థపరచువారిగ చెప్పుకొనుట లేదు.

ఇప్పుడు, మనం సంకుచిత మనస్సు గల కొందరిని కలిగి ఉన్నాం, మరియు స్వార్ధముతో వారు అది చేయగలరని అనుకొందురు, అందువలన అతడు ఎక్కడైనను ఏ విధముగానైనను ఏమియు పొందనేరడు. కేవలం వానిని గమనించండి. అతడు దృశ్యము నుండి త్వరగా వెలిసిపోవును. మరియు దేవునిపై విశ్వసముంచు ఒక మనుష్యుడు....

11

నా యొక్క ఒక చిన్న స్నేహితుడు, ఒక అద్భుతమైన చిన్న వైద్యుడై ఉన్నాడు. అతడు దేవునియందు నమ్మిక ఉంచాడు, కాని అతడు ఆయనను అంగీకరించలేదు. మరియు గతవారము, ఈ వారానికి ముందు అది ఇప్పుడే అయి ఉన్నది. అతడు యేసుక్రీస్తు నొద్దకు నడిపించబడెను. అతడు అన్నాడు, అతని వ్యాపారం మరియు ప్రతిదియు ఇది వరకే తన అదీనములోనికి తీసికొనబడెనని, దాని గూర్చి ఏమియు చెప్పలేదు. నేను చెప్పాను, “తొందపడద్దు, అది సరియైనదిగా ఉండగలదు.” కేవలం నీవు దేవుని నమ్మట ప్రారంభించుము, మరియు ఎంతగా అక్కడ నీ రోగులతో ఆసుపత్రిలో మరియు సంగతులలో ఎంత ఎక్కువ జయము పొందుదువో గమనించి దేవుని ఎదుట ఉంచుము. ఇంటికి వెళ్ళు ముందు, మరియు ఇతర విషయములయందు మొదటిగా ప్రార్ధించుము, మరియు కనుగొనుము.

ప్రభువు చిత్తమైతే, రేపు రాత్రికి నేను దైవిక స్వస్థతను గూర్చి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు తమ పత్రికలో వ్రాసిన అంశమును గూర్చి నేను చదువుదును.

12

ఇప్పుడు, దావీదు... లేక సౌలు, తరచుగా, అతడు ఎన్నుకొనబడినప్పుడు, ఒక ఘనమైన వ్యక్తి, చక్కగా కనబడువాడు, ఉత్సాహంగా, ఆరోగ్యంగా కనబడుచూ, నిటారు భుజములు గలిగి ఓ, ఘనమైన, తన సైన్యములన్నింటి కన్నా తల మరియు భుజములు ఎత్తుగా ఉన్నవాడు. “ఆయనే మనరాజు” అని వారన్నారు. అది వారిని దేనికి నడిపించినది? చివరకు వారి రాజును వెనుకకు జారిన స్థితికి, నడిపించినది.

మరియు ఇప్పుడు, వారి ఎన్నిక మంచిది కాదని దేవుడు చూచినప్పుడు, దేవుడు ఆయనకై ఒక రాజును ఎన్నుకొనెను. కనుక ఆయన సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, “కొమ్మను నూనెతో నింపి, యెషయి దగ్గరకు వెళ్ళమనెను, మరియు నేను.... అతని కుమారులు బయటకు పిలువబడుదురు, నేను ఎవరిని ఎన్నుకున్నానో, ఎవరిని నేను రాజుగ ఉండుటకు ఎన్నుకొన్నాను. అక్కడకు వెళ్ళినప్పుడు నేను నీకు చెప్పుదును.”

కాబట్టి అతడక్కడికి వెళ్ళాడు. కనుక సౌలు లేక సమూయేలు వలె యెషయి కూడ అనుకున్నాడు. ఈ గొప్ప పెద్ద చక్కని యవ్వనుడు. వారిందరిలో పెద్దవాడైన ఒకడు బయటకు వచ్చెను, ఒక పెద్ద ఉత్సాహంగా ఆరోగ్యంగా కనబడుచున్న వ్యక్తి, అతడు “రాజుగా ఉండబోవువాడు ఇతడే,” అనెను కనుక అతడు తన తలెత్తి అక్కడకు నడుచుకుంటూ వచ్చాడు. అది ప్రజల మీద ఉండే మానసిక ప్రభావము ఎవరైనా అదే రీతిగా ప్రవర్తిస్తారు.

13

ఇప్పుడు ఇక్కడ ఈ పట్టణంలో ఉన్న మనుష్యులు మతసంబంధులు కావలెనని కోరుచున్నారు. మొదటిగా అతడు పట్టణంలో పెద్ద సంఘమును కనుగొనెను దాని చుట్టూ సిలువలు వ్రేలాడుచుండును, గొప్ప గాజు కిటికీలు, మరియు బెంచీలు. అక్కడే అతడు దేవునిని కొనుగొనవచ్చునని అనుకొనెను, ఎందుకనగా అది పెద్ద సంఘమైయుండెను. అతడు ఉన్నత పదవిలో ఉన్నవాడై ఉండవచ్చును మరియు అక్కడకు గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు వెళ్ళెదరు. అయితే దాని అర్ధం అక్కడే దేవుడు ఉన్నాడని అర్థం కాదు. సాధారణంగా ఎక్కడో చోట ఇక్కడ మూలన ఉన్న ఒక చిన్న పురాతన మిషను దేవుని ఎన్నిక అయి ఉండవచ్చును. ఎక్కడ, వారు ఒక తంబుర వాయించుచు, వారి చేతులతో చప్పట్లు కొట్టుచున్నారో, అది కొన్నివేళల్లో దేవుడు అక్కడే ఉంటాడు. అది యధార్ధము.

చూడండి, అయితే మానవునిగ, మనుష్య ఆత్మతో, వారు గొప్ప కాంతివంతముగా ప్రకాశించు ఏదో ఒక దాని కొరకు చూస్తారు మరియు వారు ప్రకాశించుచున్న ప్రతిదాని వైపు పరుగెత్తెదరు. అయితే మెరిసేదంతయు బంగారము కాదు. నీవు అది జ్ఞాపకము ఉంచుకొనవలెను. మరియు అప్పుడు....

14

ఈ రోజు లోకములో అదే జరిగినది వారు సామాన్య రీతిలో ఉన్న నిజమైన యేసుక్రీస్తు సువార్తను త్రోసివేసారు మరియు ఏదో గొప్ప విద్యార్థిగా, చదివిన వానిగా, మృదువైన, చురుకైన బుద్ధితో, అలా మానసిక శాస్త్రమును అభ్యసించి మరియు బి.ఎ., డిగ్రీలు పొంది మరియు మొదలైన వాటికొరకు వెళ్ళచున్నారు, అది మీకు తెలియును. ఆ గొప్ప, చక్కని, సంఘాల్లో మిలియను డాలర్లు.

నేను నిన్ను ఏదో అడుగగోరుచున్నాను. ఎందుకు మీరు మిలియను డాలర్లతో సంఘాలు కట్టుచూ మరియు యేసుక్రీస్తు త్వరలో వచ్చుచున్నాడని బోధించుచున్నారు? నేను అది అర్థం చేసుకోలేదు, మీరు అర్థం చేసుకొన్నారా? నేను అది గ్రహించలేకపోయాను. యేసు త్వరగా వచ్చుచున్న యెడల, దానిని గూర్చి మనము ఎంతగా శ్రద్ధ వహించుచున్నాము? వెళ్ళి ప్రజలను రక్షించెదము. అదే అసలైన సంగతి. యేసు ఎన్నడూ, “పెద్ద సంఘములు నిర్మించండి” అని చెప్పలేదు. లేదు, ఆయన ఎన్నడూ చెప్పలేదు, వేదాంత కళాశాలలు కలిగి ఉండుడని ఆయన ఎన్నడూ చెప్పలేదు. పెద్ద సంఘాలకు నేను వ్యతిరేకిని కాను, అవి మంచివే. వేదాంత కళాశాలకు నేను వ్యతిరేకిని కాను, అవి పర్వాలేదు. కాని వాటిని చేయమని యేసు ఎన్నడూ మనకు ఆజ్ఞాపించలేదు. ఆయన ఎన్నడూ పెద్ద సంఘాలను నిర్మించమని లేక సెమినరీలు కలిగి ఉండమని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన ఎన్నడూ ఆసుపత్రులు లేక స్కూళ్ళు కట్టమని చెప్పలేదు, అయితే అవి అన్నియూ సరియైనవే. జ్ఞాపకముంచుకొనుడి, నేను వాటికి వ్యతిరేకిని కాను.

15

అయితే మనలను చేయమని ఆయన చెప్పిన ముఖ్య సూత్రమును, మనం కిందకు దించి మరియు రెండవదానని తీసుకున్నాము. మనము గొప్ప ఆసుపత్రులు, పాఠశాలలు, గొప్ప స్థలాలు మరియు వేదాంత కళాశాలలు నిర్మించి మరియు వారు చాలా తియ్యని మాటలు వారు పలుకునట్లుగా, వారి బోధకులు శిక్షణ ఇచ్చుచున్నారు. మరియు సైకాలజీని ఉపయోగించి మరియు మెడవంచక నిలచి మరి ఇలా అంటాము “ఆహమెన్” కేవలం ఎంత మర్యాదగా ఉండాలో అంతగా మరియు, అంతా అదే. ఏది మనలను అలా చేసింది? విశ్వాసములో వెనుకకు జారిన పెద్ద గుంపు. అది సరియే. అది నిజము. ఆత్మీయముగా మాట్లాడుచున్నాను, వారు చల్లబడిన నామకార్థ స్థితిలో ఉన్నారు, వారి ఆత్మీయ స్థితి సున్నా.

నేను అది హాస్యం కొరకు చెప్పలేదు, ఎందుకనగా ఇది హాస్యము చేయు స్థలము కాదు. అయితే నేను అది సత్యము కొరకు, చెప్పుచున్నాను. అదియే సత్యమైయున్నది. అది ఎలాగున మనలను ఆ స్థానములోనికి ఉంచినది, ఏలాగున మనం ఆ పెద్ద వస్తువులను కోరుచున్నాము. ఆహా అవును, మనము ఒకటి కోరుచున్నాము. ఎవరో ఒక మనిషి ఒక వ్యాపారం కలిగి మరియు అతడు వ్యాపారం చేసే మనుష్యులతో ఉండగోరుచున్నాడు. ఆ పట్టణంలో ఉన్న అతిపెద్ద చర్చికి వెళ్ళి, మరియు అతని యొక్క పేరును సంఘ పుస్తకములో నమోదు చేసి, ఆ వెనుక ఒక చోట కూర్చొనును మరియు చాలా సార్లు ఇశ్రాయేలీయులు సౌలును ఎన్నుకొన్నప్పుడు. చూశారా, అతడు తల మరియు భుజములు అన్నిటికంటే ఎత్తుగా ఉండాలని ఖచ్చితముగా వారు అలాగే చేసిరి. ప్రతీది మీకు తెలియును మరియు ఆ విధముగానే మీరు కూడా సమస్యలలోకి వెళ్లారు.

16

అయితే దేవుడు సమూయేలుతో చెప్పెను, “తైలపు కొమ్ముతీసికొని వెళ్ళుము అక్కడ, ఎవరిని అభిషేకం చేయాలో నేను నీకు చెప్పుదును.”

అవును, యెషయి అతని పెద్ద కుమారుని బయటకు తీసికొని వచ్చెను, అతడు ఆరు అడుగులు పొడవగలిగి చాలా మంచియైన ఒక పెద్దవాడైన గొప్పవాడుగా ఉండెను “రాజుగ ఉండవలసినది ఇతడొక్కడే” అని అతడనుకొనెను. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొనెను, “నిశ్చయముగా అది అతడే,” అనెను.

అతడు అలా వెళ్ళుచుండగా దేవుడు సమూయేలుకు, “అది అతడు కాదు, నేను అతనిని తృణీకరించితిని,” అని చెప్పెను. మై.

“మంచిది, ఈ వ్యక్తి ఇంచుమించుగా సరిపోవు వాడిగా యున్నాడు, మేము అతనిని బయటకు తీసికొని వస్తాము. అతడు ఒక పెద్ద అందముగా కనిపించు వ్యక్తి. అతడు ధరించిన సూటు మరియు అతని తల మీదనున్న ఆ కిరీటం బాగుగా కనబడుచున్నవి.” నీవు ప్రజల యెదుట నిలబడినప్పుడు, నీవు ఎలా కనబడుచున్నావో దానిని బట్టి అదే రీతిగా ప్రజలు ఈ రోజులలో తమ కాపరులను తీర్పు తీర్చుచున్నారు. అది ఎంత సిగ్గుకరం అవును.

మరియు అతడు దాటిపోవుచుండగా సమూయేలు అతని తైలపు కొమ్ము తీసికొని వానిపై అది కుమ్మరించుటకు పరుగెత్తెను. ఆయన “వానిని స్వీకరించవద్దు, నేను వానిని తిరస్కరించితిననెను.” అతడు ఏడవవాడు వచ్చువరకు వారిని బయటకు తీసికొని వచ్చుచుండెను, అది అలా ఉండెను. సమూయేలు “మంచిదే, నీకున్న వారంతా వీరేనా?” అని అనెను.

అవును, “నాకున్నవారంతా వీరే” అనెను. “అవును, కాని ఓ ఎక్కడో పొదలు, పిచ్చి చెట్లతో ఉన్న ప్రదేశంలో గొర్రెలను కాయుచున్న ఒక చిన్నవాడున్నాడనెను.”

“మంచిది, వెళ్ళి అతనిని తీసుకురమ్మనెను. అతడు వచ్చేంత వరకు మనము కూర్చుందుము.”

కనుక వారు అక్కడ వెనుకకు వెళ్ళారు, అక్కడున్న కొందరిలో వారి ముఖాలలో ఒక రకమైన నిరుత్సాహమును వారిలో చూడగలుగుచున్నాను. “మంచిది, నిశ్చయంగా అతడు రాజుగ ఉండబోడని వారు తలంచుచుండిరి.

కనుక ఈనాడు ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారు, అక్కడ దైవిక స్వస్థత అలాంటి ఏదైన సంగతి ఉన్నయెడల, ఇలాంటి గందరగోళ ప్రజల మధ్య అది ఉండి ఉండదు. దేవుని శక్తి వంటి ఏ సంగతి అయిననూ, అక్కడ ఉండి ఉండదు.

17

నా వద్ద వున్న ఒక స్త్రీ ఒక వార్తా విలేఖరి, ఆమె ఓరెగాన్లో ఒక రోజున నాతో ఇలాగూ చెప్పినది, “మంచిది. దైవిక స్వస్థత అలాంటిది ఎదైనా వున్న యెడల నీవు ఎవరికి బోధించుచున్నావో ఇలాంటి నిరక్ష్యరాస్యులైన గుంపు మధ్యన ఉండుననెను.”

నేను చెప్పాను, “నీవు అలా అనుకొనవద్దు. పెద్ద సంఘమునకు వెళ్ళి మరియు అక్కడ చనిపో,” అని నేను చెప్పాను. “నీవు స్వస్థపడగోరిన యెడల, ఇక్కడికి రమ్ము.”

“మంచిది, నేను అక్కడకు వచ్చేముందు మరియు బూ-హు అని వారు శబ్దము చేయుటను చూచినప్పుడు, అది నేను విన్నప్పుడు, నా వెన్నులో వణుకు పుట్టినది,” అని ఆమె చెప్పినది.

నేను అన్నాను, “నీవు ఒకవేళ పరలోకము వెళ్ళిన యెడల, నీవు ఇలాంటి విషయాలు అనేకం విన్నప్పుడు నీవు బిగుసుకుపోతావు.” అది నిజము. “నేను నీకు ఒక సంగతి చెప్పగోరుచున్నాను.” నేను అన్నాను, “నీవు చేయలేని యెడల....”

కేవలం నయమాను వలె, ఇక్కడి “యొర్దాను బురద నీటికంటె అక్కడ నా దేశంలో కేవలం ఆ నీళ్ళ మంచివి కావా?” అని అతడు అనెను. మరియు అతడు చుట్టూ తిరిగి మరియు అంతా బుకాయించుచు వెనుకకు వెళ్ళటకు ప్రారంభించెను. అతడు తనకుతాను తగ్గించుకొనుటకు ఇష్టపడలేదు. మరియు అతడు అనెను, “సరే మంచిది, నీవు నీ కుష్ట రోగంతో వెనుకకు వెళ్ళగోరిన యెడల, వెళ్ళుము.” కనుక అతడు అతని ఎతైన గుర్రము నుండి కిందకు దిగి తననుతాను తగ్గించుకొని, దేవుడు వానిని ఎక్కడ మునగమనెనో, ఆ బురద నీళ్ళలో మునిగెను. ఆయన అతని యొక్క కుష్టరోగం పోగొట్టెను. అది యధార్ధము. నీవు దేవుని మార్గంలో రావలెను. నీ స్వంత మార్గంలో కాదు, ఆయన మార్గంలో.

18

గమనించండి. అప్పుడు నేను ఈ విధముగా దావీదును ఇక్కడ అతడు ఒక చిన్న గొర్రెలకాపరి కోటుతో పరుగెత్తి వచ్చుచుండుట చూడగలుగుచున్నాను. బహుశా, గొర్రె చర్మంతో చేయబడి, ఒక వస్త్రమును ధరించి - చిన్న పాతకాలపు బలహినముగా కనిపించు బాలుడు, లోనికి పరుగెత్తుకొని వచ్చెను. బైబిలు అతడు ఎర్రనివాడై ఉండెనని చెప్పెను, మరి అతడు ఏమియు కాదు గాని, కేవలం చిన్నవయస్సు గలవాడై సన్నగా, బలహీనమైన వ్యక్తి - చూచుటకు ఒక విధమైన సుందరముగా కనబడుచూ, ఒక చిన్న వ్యక్తిగా లోనికి పరుగెత్తి వచ్చెను. మరియు పరిశుద్దాత్మ ప్రవక్త మీదకు వచ్చి, “అతని తలపై నూనె పోయుము; నేను అతనిని ఎన్నుకొన్నాననెను.”

రాజుగా ఉండువాడు ఒక గొప్ప వ్యక్తియై, గొప్ప అందగాడిగా మరియు చూచుటకు బలవంతుడిగా ఉండాలనే అనుకునే ప్రజలకు ఇది ఎంతో నిరుత్సాహమై ఉండెను. అయితే అతడు ఆ బాలుడైన దావీదు తలపై నూనె పోసెను, ఆ రోజు నుండి పరిశుద్దాత్ముడు దావీదులో నుండెను. దేవుడు అతనితో ఉండెను. అతడు సంతోషముగ అరణ్యంలోనికి వెళ్ళెను.

19

వారు వెనుకకు తిరిగి వెళ్ళిరి, మరియు ఆత్మ సౌలును విడిచెను. అతడు వెనుకకు జారెను మరియు ఆత్మ సౌలును విడుచునంతగ అతడు దేవుని నుండి దూరమాయెను; మరియు దేవుని ఆత్మ స్థానములోనికి ఒక దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు పూర్తిగా నిరుత్సాహముతో చెడు సరసోక్తులు వేస్తూ మరియు చుట్టూ ఉన్న వస్తువులను తన్నుచుండెను. సోమవారం ఉదయమున కొందరు ప్రజలు అసలు ఉత్సాహం లేకుండా ఉన్నట్లుగానే అతడు ఉండెను. కనుక అతడు ఎల్లప్పుడూ అస్వస్థతగా ఉండెను. అది మీకు తెలియును? ఒక దురాత్మయని, అది ఖచ్చితగముగా ఒక దురాత్మ.

కనుక వారు చేయలేకపోయారు... ఆ వైద్యులు అతనికి ఏ మేలు చేయలేకపోయారు. వారికి అక్కడ చాలామంది వైద్యులు ఉన్నారు, అయితే వారు, అతనికి సహాయం చేయలేకపోయారు, ఎందుకనగా అది ఒక ఆత్మీయ పరిస్థితి అయి ఉండెను. కనుక ఆ మనుష్యులలో ఒకడు చుట్టూ వెళ్ళి మరియు కొన్ని స్థలాలు చూచి “మంచిది, ఎక్కడ దైవిక స్వస్థతను చేయువాడు ఉన్నాడో మేము ఎరుగుదుము.”

“ఎందుచేత, అది ఎవరైయుండెననెను?”

“యెషయికి అక్కడ వెనుక ఒక కుమారుడు ఉండెను, అతడు...” అవును, అతడు ఒక దైవిక స్వస్థత కలిగినవాడు. నిశ్చయంగా అతడైయుండెను. అతడు సంగీతం ద్వార స్వస్థపరచెను. ఆమెన్. అతనికి దురాత్మలను వెళ్ళగొట్టు ఒక వరము ఉండెను. పరిశుద్దాత్మడు ఆ రోజులలో వచ్చి ఉండలేదు, కనుక అతడు వాటిని సంగీతం ద్వార, ప్రభువు మాటలు వాయించుచుండెను. “యెహోవా నా కాపరి; నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు: శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు.” మరియు ఆ సంగీతం దురాత్మను ఎక్కువగా కలవరపరుచుటవలన, అది సౌలును విడిచి పోయెను.

20

తంతి వాయిద్యములయందు మీకు నమ్మకము లేకపోవుట సిగ్గుకరం. దురాత్మలు ఎన్నడూ దానిని ఇష్టపడలేవనుటలో ఆశ్చర్యం లేదు. అవి పోవలసి ఉన్నవి. దావీదు తంతి వాయిద్యములు వాయించుట ద్వార దురాత్మలను వెళ్ళగొట్టెను. లేఖనం చెప్పినది అదే. అది యధార్థం. దావీదు వాయించడం ప్రారంభించినప్పుడు, ఆ దురాత్మ సౌలును విడిచి పోవును. అది సరియేనా? కనుక ఈ చిన్న బాలుడు ఈ లోకంలో ఒక ఉద్దేశ్యం కొరకు పుట్టి ఉండెను. మీరు అది నమ్ముదురా?

మరియు దేవుడతనితో ఉండెనని అతడు ఎరిగెను. నిశ్చయంగా అతడు ఎరిగెను. ఎందుకనగా అతడు సమర్థత కలిగి.... అతడు ఒక దెబ్బతోనే గురిచూచి కొట్టువాడైయుండి, అతడు ఒక అడవి మనిషి అయి ఉండెను. అతనివద్ద ఒక చిన్న వడిసెల గలదు మరియు ఒక వృద్ద సింహం.... ఒక రోజు సింహము మందలోనికి పరుగెత్తి ఒక చిన్న గొర్రెను పట్టుకొని పారిపోయెను; అప్పుడు దావీదు తన వడిసెల తీసి, ఆ సింహమును కిందకు పడగొట్టెను, మరియు దానినోటి నుండి గొర్రెను బయటకు తీసెను. ఆ సింహం పైకి లేచినప్పుడు, తనకు తానే వచ్చి మరియు పైకి లేచి, కేవలం దావీదు దాని గడ్డము పట్టుకొని మరియు దానికి తన వేట కత్తిని వేసెను, మరియు అది అంతమాయెను. కనుక దేవుడు అతనితో ఉండెనని అతడు ఎరిగెను. అతడు ఎలుగుబంటిని కూడ చంపెను. మరియు దేవుడు తనతో ఉండెనని అతడు ఎరిగెను.

మరియు ఇప్పుడు, అతడు తరువాత చేసిన పని, వాయించి దయ్యాలను వెళ్ళగొట్టెను. అతడు ఆత్మతో నింపబడిన మనిషి, నేనెన్నడూ అలాంటివానిని చూడలేదు. అతడు చిన్నగా ఎర్రని వానిగా ఉన్నను, అతడు ఆత్మచేత నింపబడిన మనిషైయుండెను. దేవుడు వానితో ఉండెను.

21

అక్కడ నీవు తెలుసుకొనే మొదటి విషయం, అక్కడ యుద్ధం ప్రారంభమైనది. ఫిలిష్తీయులు అక్కడికి వచ్చి, “మంచిది ఇప్పుడు మేము ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయబోవుచున్నాము” అని ప్రకటించారు. సౌలు తన ప్రజలందరిని సమకూర్చాడు. మరియు ఆ ఎర్రని చిన్నవాడిని తండ్రి మందలను మేపుటకు ఆ పర్వత ప్రాంతములకు పంపబడ్డాడు. మరియు యెషయ తన దగ్గరనున్న పెద్ద యోధులను యుద్ధమునకు పంపించాడు. మరియు ఆ చిన్న పిల్లవాడు యుద్ధము చేయలేడు. అందువలననే అతడిని గొర్రెల యొద్దకు పంపివేసాడు. మరియు ఆ పని నెరవేర్చుటకు ఈ గొప్ప గొప్ప వ్యక్తులను పంపించాడు.

కనుక అతడు తన బాలురందరిని బయటకు పంపెను. మరియు వారికి ఖడ్గము మరియు వారి ఈటెలు మొదలైనవి ఇచ్చెదము. వారు శిక్షణ నొందిన యోధులు. వారక్కడ వారి పి.హెచ్.డి., లతో మరియు ప్రతిదానితోను యుద్ధం చేయుటకు బయటకు వెళ్ళిరి. శత్రువు ఎల్లప్పుడు అక్కడే వారితో సవాలు చేయుచుండెను.

22

కనుక అక్కడ గొల్యాతు అను పెద్ద వ్యక్తి, తొమ్మిది అడుగుల మూడు అంగుళాల పొడవైన, పెద్దవాడైన గొప్ప వ్యక్తి వచ్చెను. బయటకు నడచి వచ్చి అతడు ఈ విధముగా అనెను, “నేను నీకు ఒక ప్రతిపాదన చేయుదును. ఈ మనుష్యులందరూ ఎందుకు చావాలి?” “నా దగ్గరకు ఒక మనిషిని ఇక్కడకు పంపండి మరియు వానితో నన్ను పోరాటం చేయనివ్వండి. మరియు అతడు నన్ను చంపిన యెడల, మేము మీకు దాసులుగా ఉందుము. నేను వానిని చంపిన యెడల, మీరు మాకు దాసులుగా ఉందురు.” నిశ్చయముగా, శత్రువు నీ మీద పైచేయి సాధించినట్లు కన్పించినట్లైతే అతడు ఆ విధంగానే డంబముగా మాట్లాడుతాడు. ఓ, అతడు గొప్ప గొప్ప డప్పాలు కొడతాడు.

కనుక వారిలో ప్రతీ ఒక్కడూ, పెద్ద డిగ్రీలు కలిగిన వారందరు వణకుచున్నారు; వారందరు ఆ వ్యక్తికి భయపడుచున్నారు, కారణం అతడు గొప్ప వ్యక్తి. కనుక అతడు ఆ విధముగా నలుబది రోజులు డంబములు పలుకుచూ సవాలు విసురుచుండెను. నీవు ఎన్నడైనా గమనించావా, నలుబది అనునది శోధన యొక్క సంఖ్య అయి ఉన్నది? అది నిశ్చయమైనది. పర్వతంపై మోషే నలుబది రోజులు, వెనుకకు వచ్చి మరియు శోధించబడెను. యేసు అరణ్యంలోనికి వెళ్ళి, నలుబది రోజులుండి శోధించబడెను. నలుబది రోజులు శోధించబడుట. నలుబది రోజులు వర్షం పడెను, మరియు మొదలైనవి, నలుబది అనునది శోధన యొక్క దేవుని సంఖ్య

23

అటు తరువాత యెషయి బాలుని పిలిచి ఇలా చెప్పెను, “దావీదు నీవు కొన్ని రొట్టెలను, వేయించిన కొన్ని గోధుమలు తీసుకొని వెళ్ళి, అన్నలు ఎలా ఉన్నారో కనుగొనుము. మరియు వారి క్షేమసమాచారము కనుగొని వారు దేవుని ఎదుట సరిగా జీవించుచున్నారా లేదా కనుగొని వెనుకకు రమ్ము” అనెను.

కనుక దావీదు అతని చిన్న గాడిదను తీసికొని, మరియు దాని కళ్ళకు గంతలు వేసెనని నేను ఊహించుచున్నాను, వేయించిన గోధుమలు మరియు రొట్టెలు దాని మీద ఉంచి, మరియు యుద్దానికి దగ్గరగా వెళ్ళెను. సరేగాని, అతడు యుద్ధంలోనికి అక్కడకు వచ్చిన సమయంలో, ఆ ఉదయమున వారందరు బయట నిలచి ఉండెను, రెండు సైన్యములు భయపడుచుండెను. సరే, ఈ పెద్ద గొల్యాతు పెద్ద పౌండ్లు గల కవచమును చాతిపై ధరించి బయటకు నడచి వచ్చి అతడు గొప్ప డంబముగా — “ఇశ్రాయేలీయుల సైన్యమును నేను తృణీకరించుచున్నానెను.”

సహోదరుడా, ఆ ఉదయాన వాని మాటలు ఏ చెవిని పడకూడదో, ఆ చెవిలో పడుట జరిగెను. అక్కడ ఒక చిన్న వ్యక్తి అతడు ఎక్కడ నిలబడి ఉండెనో ఎరిగినవాడై, అక్కడ నిలచి ఉండెను. ఆమెన్

24

ఈ రాత్రి మనకు ఏది అవసరమైనది, ఎవరో ఒక్కరు వారు ఎక్కడ నిలచి ఉన్నారో ఎరిగినవారు మనకు అవసరము. ఈ రాత్రి యేసుక్రీస్తు నందు వారి స్థానమును ఎరుగు స్త్రీ - పురుషులు మనకు అవసరమైయున్నారు. మరియు ఆ దయ్యము వాని పెద్ద ప్రగల్భము పలికినప్పుడు.... నిశ్చయముగ వాడు వాని డంబమును ప్రదర్శించును. వాడు ఇంకను డంబముగానే పలుకుచున్నాడు. ఇంకను మనం గొల్యాతులు కలిగియున్నాము. మరియు దావీదులను కూడా కలిగియున్నాము. అందును బట్టి దేవునికి వందనములు.

వాడు వాని పెద్ద డంబములు పలుకుచుండెను మరియు అది అక్కడ చుట్టూ నడుస్తున్న ఒక చిన్నవాడు, అతడు చూచుటకు, అతడు ఆ విధమైన మనిషి అది పడకూడని వ్యక్తి చెవులలో పడెను. అయితే అతడు దేవుని చేత ఎన్నుకొనబడెనని అతడు ఎరిగి ఉండెను. దేవుని అభిషేకం అతని మీద ఉన్నది. అతడు దేవునిచే పరీక్షించబడెను మరియు దేవుడు ఎవరై ఉండెనో అతడు ఎరుగును. అతడు ఎక్కడ నిలబడి ఉండెనో అతడు ఎరిగెను.

ఇప్పుడు, ప్రజలైన మీకు ఇది ఎంత అందముగ ఉన్నదో గమనించవలెనని నేను మిమ్మును కోరుచున్నాను. ఇప్పుడు మనం తొందరగ ముగించాలి, ఏలయనగ నేను కేవలం ఇప్పుడు మూడు నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను.

25

గమనించండి, దావీదు ఎన్నికచే పిలువబడి ఉండెను. అతడు ఎన్నిక చేయబడెను, పిలువబడెను, అభిషేకించబడెను మరియు స్థానములో నియమించబడెను, చూశారా. దేవునిచే ఎన్నిక చేయబడి, రాజుగ ఉండుటకు కాయుచున్న గొర్రెల మంద నుండి పిలువబడెను, అభిషేకించబడెను, మరియు సరియైన స్థానములో ఉంచబడెను. చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు; అబ్రహాము - ఎన్నిక, ఇస్సాకు - నీతీకరణము, యాకోబు - కృప, మరియు యోసేపు - పరిపూర్ణత, యోసేపుకు వ్యతిరేకముగా ఏమియు లేదు. అంతా సరిగానే ఉన్నది. పిలువబడిన, నీవు అక్కడే ఉన్నావు. నీవు ఒక దావీదువై ఉన్నావా? దేవుని ద్వార మొదటగా పిలువబడినావు, ఎన్నిక చేయబడ్డావు.

ఇక్కడ ఎంత మంది క్రైస్తవులున్నారు, మీ చేయిని పైకి ఎత్తండి. నీవు ఆశించుట చేత ఒక క్రైస్తవునిగా లేవు; దేవుడు కోరిక ద్వార నీవు ఒక క్రైస్తవుడైనావు. ఆమెన్. “మొదట నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఏ మనిషియు నా దగ్గరకు రాలేడు.” జగత్తు పునాది వేయబడక మునుపే ఒక క్రైస్తవునిగా ఉండుటకు నీవు ఎన్నిక చేయబడినావు. అది లేఖనమైయున్నది. యేసు చెప్పెను, “తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఏ మనిషియూ రాలేడు.”

మొదటి సంగతి నీవు ఎన్నిక చేయబడి ఉంటివి, పిలువబడెను. దేవుడు నిన్ను ఎన్నిక చేసినప్పుడు, అప్పుడు ఆయన నిన్ను పిలిచెను, మరియు ఆయన పిలిచిన పిలుపుకు లోబడ్డావు. అటు తరువాత అభిషేక తైలము నీపై కుమ్మరించబడెను, అదియే పరిశుద్దాత్మ. అప్పుడు ఆ నూనెబుడ్డి.... బైబిలులో నూనె దేనికి మాదిరిగా ఉన్నది? పరిశుద్దాత్మకు. ఆయన ఆ నూనె నీపై కుమ్మరించినప్పుడు, అది పరిశుద్దాత్మ బాప్తిస్మమునకు సాదృశ్యమైన గురుతుగా ఉన్నది. ఆమెన్. అది మీరు గ్రహించారని నేను ఆశించుచున్నాను. అది కేవలం తాజాదనముతో వచ్చెను. ఆయన వానిపై ఆ నూనె కుమ్మరించెను, దానిని పూర్తిగా ఆ కొమ్ము అంతయూ నింపెను. ఆమెన్. కేవలము కొంత పోయుట కాదు. అదే విధముగా దేవుడు ఒక మనిషి మీద పరిశుద్దాత్మను కుమ్మరించును. పైపైన పోయుట కాదు; కేవలం వానిని ఆత్మతో అభిషేకించుచూ, దానిలోనికి అతనికి బాప్తిస్మము ఇచ్చును.

గమనించండి, సరిగా అప్పుడే అతడు, ఆ అభిషేకము వానిని తాకినప్పుడు, అతడు రాజుగా సరియైన స్థానములో ఉంచబడి ఉండెను. ఆమెన్. మీరు క్రీస్తు యేసులో రాజులు మరియు యాజకులుగా సరియైన స్థానములో ఉంచబడి ఉన్నారు. అది సరియేనా? నీవు పరిశుద్దాత్మ పొందిన ఆ క్షణములోనే, దేవుని వారసునిగా, నిన్ను ఆ రాజ్యములో ఉంచును. ఎలాటి ఒక అందమగు చిత్రము. నీవు అక్కడే ఉన్నావు.

26

అబ్రహాము - ఎన్నిక, ఇస్సాకు - నీతికరణము. ఆ విధముగ వచ్చువాడు విశ్వాసము ద్వార నీతిమంతునిగ తీర్చబడగలడు. యాకోబు - కృప. నీవు చేసినదేమియు లేదు, అయితే దేవుని కృప ద్వార మరియు యోసేపు పరిపూర్ణతగా, నియమించబడెను. ఆమెన్. దావీదు, ఎన్నుకొనబడెను, పిలువబడెను, అభిషేకించబడెను, మరియు నియమించబడెను. నీవు ఎన్నుకొనబడినావు, పిలువబడినావు, అభిషేకించబడ్డావు మరియు యేసుక్రీస్తు శరీరములో నియమించబడినావు. “ఏలయనగా ఒకే ఆత్మ ద్వార క్రీస్తు శరీరములోనికి మనమందరం సరియైన స్థానములో నియమించబడితిమి.” మీరు ఎన్నడైనా ఇంకా దానిని పరిశోధించి ఉన్నారా?

ఇక్కడ లోపల ఒక క్రైస్తవునిగా ఉన్న ప్రతి పురుషుడు మరియు స్త్రీ నీ జీవితమంతటిలో నీ మీద ఏదో ఒక సంగతి ఉన్నదని ఎరుగుదురు. నీవు ఒక పిల్లవానిగ ఉండినప్పటి నుండి, నీవు దేవునికి సేవ చేయుటకు ఆరాటపడితివి. ఏదో సంగతి నీ హృదయమును తాకెను; అది దేవుని ఎన్నికైయుండెను.

27

దావీదుకు ఏదియు జరుగక మునుపే, అభిషేక తైలము ఆయనపై ప్రోక్షింపబడక మునుపే, దేవుడు అతనితో ఉండెనని అతడు ఎరిగియుండెను. అతడు ఒక ఎలుగుబంటిని చంపెను. అతడు వడిసెలతో ఒక సింహమును చంపెను. మరియు ఒక సామాన్య మనిషి అలా చేయుటకు అది అతీతమైనదని అతడు ఎరిగి ఉండెను. తానేమి చేయగలడో ఎరిగియున్నాడు. అతనికి తెలుసు, దేవుడు అతనితో ఉండెనని అతడు ఎరిగెను, ఏలయనగ అతని హృదయమంతా పూర్తిగా దేవుని కొరకు దాహము కలిగియుండెను.

అతడు 47వ కీర్తనలో చెప్పెను, అక్కడ ఎక్కడో చోట నేను నమ్ముచున్నాను, “దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.” తన సంగీతంతో దురాత్మలను వెళ్ళగొట్టుచున్నాడంటే ఆశ్చర్యము లేదు, అతడు వాయించుటకు ఏదో ఉన్నది. మరియు అది వాని హృదయంలో నుండి వచ్చెను. మరియు అది వాని హృదయము నుండి వచ్చెనని ఆ దయ్యము ఎరిగెను. దావీదు దేవునిచే ఎన్నుకొనబడెననివాడని ఎరిగియుండెను. మరియు అతడు ఎన్నుకొనబడి, పిలువబడెను, అభిషేకించబడెను, మరియు ఇది వరకే రాజుగా స్థానములో ఉంచబడెను. ఆమెన్.

28

నన్ను దీనిని ఈ పక్షముగా ఉంచనివ్వండి. నేను ఉద్రేకంగా ఉన్నానని అనకోవద్దు, నేను లేను. చూడండి, దీనిని నన్ను ఈ వైపుగా ఉంచనియ్యండి. ఎవరైతే.... ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసించుచూ, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినవారు ఇక్కడేందరున్నారు? చేతులు పైకెత్తిన మీరందరు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినారు. అది సరియైనదా? లేఖనము ఈలాగు చెప్పుచున్నది, “ఆయన ఎవరిని పిలిచెనో, వారిని ఆయన నీతిమంతులుగా తీర్చెను: ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఆయన మహిమపరచెను.” ఆమెన్. దేవుని చిత్తము చేయుటకు సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో నీ పేరు యేసుక్రీస్తు రక్తముతో చెరపలేని రీతిలో వ్రాసెను, ఈ భూమి మీద ఇక్కడ ఒక ఉద్దేశ్యం కొరకు, నిన్ను సరియైన స్థానములో ఉంచి, ఆయన సన్నిధిలో మహిమపరచెను. క్రైస్తవుడా, నీ స్థానము నీవు చూశావా?

29

ఓ, మై!, అక్కడ ఉన్న వ్యక్తులు అది అవగాహన చేసికొనలేదు కాని, దావీదు తనపై అభిషేక తైలమును కలిగియున్నాడు. అతడు ఎక్కడ నిలబడి ఉండెనో, అతడు ఎరిగి ఉండెను. పెద్దవాడైన గొల్యాతు అక్కడ బయట నిలబడెను. మరియు అతడు ఇలాగు పలికెను, “ఇప్పుడు, చూడండి, సరియైన విధముగ ఆలోచించెదము. ఎందుకనగా అక్కడ దేవుని సైన్యములు ఓడిపోవలసిన అవసరం లేదు.” అక్కడ నిలబడి వ్యంగ్యముగా డంబములు పలుకుచున్న ఆ వ్యక్తి వైపు చూడండి.

“మంచిది, దేవుడు అది చేసెనని మేము ఎరుగుదుము, అయితే అద్భుతాలు జరుగు రోజులు గతించెను” అని వారందరు. కాని దావీదుకు కాదు, అతడు అభిషేకించబడి ఉండెను. అతడు సరియైన స్థానములో ఎక్కడ ఉండెనో అతడు ఎరిగియుండెను.

30

నీవు అందువు, “బ్రెన్హాం సోదరుడా, ఇప్పుడు నన్ను స్వస్థపరచువానిగా నేను క్రీస్తును అంగీకరించగలనా?” నిశ్చయముగా “మంచిది, నేను ఐదు నిమిషాలలో బాగుపడనియెడల, దాని గూర్చి ఏమిటి?” నీవు ఎలాగైనను స్వస్థపడియున్నావు.

నీవు అది నమ్మిన యెడల, నీవు దానిని నమ్మితే. నీవు నన్ను ఆ ప్రశ్న అడిగి ఉండవు. నీవు నిజముగా దానిని నమ్మినప్పుడు, అక్కడ నీ మనస్సులో ఏ ప్రశ్న ఉండదు. నీవు దానిని ప్రశ్నించవద్దు; నీవు దానిని నమ్ముము. మిగతా ప్రజలు దానిని ప్రశ్నించవచ్చును, అయితే నీవు దానిని ప్రశ్నించవద్దు.

నీవు నాతో ఇలా అనిన యెడల, “బ్రెన్హాం సోదరుడా, నాకు ఓక్ వృక్షమును ఇవ్వండి.” ఎక్కడైతే ఆ పెద్ద తెల్లని ఓక్ మొదలైనవి ఉన్నవో, ఆ దక్షిణాన ఇండియానా దిగువ నుండి నీవు వచ్చావు. “నాకు ఓక్ వృక్షమును ఇవ్వండి.” మరియు నేను నీకు దాని గింజ నిచ్చాను. మంచిది, పాక్షికముగా నీవు ఓక్ వృక్షము కలిగి ఉన్నావు. అది విత్తన రూపములో ఉన్నది, అయితే అది ఓక్ వృక్షమైయున్నది; నీవు దానిని ఒక గింజ నుండి పొందినావు.

మనము దేవుని వాక్యమును తీసికొనినప్పుడు, మనము ఒక విత్తన రూపంలో పొందినాము. మనము దేవుని వాక్యముచేత దైవిక స్వస్థతను అంగీకరించగలిగినప్పుడు, అది దానిని పరిష్కరిస్తుంది. ఆమెన్. అది ఎదుగును.

ఆ పాత గోధుమ గింజను తీసికొని, మరియు దానిని నేలలో నాటిన యెడల, మరియు అక్కడ నిలబడి, మరియు కొంచెం సేపు దానిని గమనించుము, మరియు ఏమి జరిగినదో చూడుము. నీ ఓక్ వృక్షము దానితో సరిగా పైకి వచ్చును. ఎందుకనగా విత్తనములో జీవము ఉన్నది; మరియు దేవుని వాక్యము ఒక విత్తనమై ఉన్నది, మరియు అది సజీవముగా ఉన్నది. కేవలం నీవు దానిని సామాన్యముగా పొందిన యెడల, అది బైబిలు నుండి తీసికొనమనెను, “దాని ఉద్దేశ్యం నేనే అని,” (ఆమెన్), అప్పుడు నీవు ఏదో పొందావు. అది నిజము. దయ్యములన్నియు దాని నుండి నిన్ను ఆపలేవు. ఏ వ్యక్తి ఏమి చెప్పినను, నీవు దానిని నమ్మవు, ఎందుకనగా నీవు ఎక్కడ నిలబడి ఉన్నావో నీవు ఎరిగియున్నావు.

31

దావీదు చెప్పెను, “ఎందుకు మీరు ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు అక్కడ బయట నిలబడి మరియు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించునట్లు ఎందుకు అనుమతించుచున్నారు, మీ ఉద్దేశ్యమేమిటి? చెప్పండని,” దావీదు అనెను. అతడు చెప్పెను, “నేనెన్నడు దానిని అనుమతించను.”

అంతలో అతని సహోదరుడు “నేను నీ హృదయంలో చెడుతనము నేను ఎరుగుదును; ఆ యుద్ధమును గమనించవలెననియు మరియు మొదలైన వాటి కొరకు నీవవచ్చావనెను.”

అంతలో వారు దావీదును సౌలు దగ్గరకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడు సౌలు, “ఆ చిన్న వానిని ఇక్కడకు తీసుకొని రమ్మని అనెను. అతడు ఎలా కనిపించునో చూద్దాం.” అతడు వానిని అక్కడకు తీసుకొని వచ్చెను, ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చెను. “మంచిది, నీవు ఆ మనుష్యునితో పోరాడలేవు. ఎందుకనగా, బహుశా వాడు నిన్ను ఒక్క చేతితో పట్టుకొని పైకి ఎత్తగలడు.”

అతడనెను, “అయితే సౌలూ వినుము. నేను యెహోవా యందు నమ్మిక ఉంచాను. మరియు నేను ఎరుగుదును, ఇంతక ముందు చాలకాలం క్రితం, నేను నా వడిశెల తీసి మరియు నేను ఒక గొర్రెను తినబోవుచున్న ఒక సింహమును చంపాను, నేను ఒక ఎలుగుబంటిని చంపాను, మరియు దాని నోటి నుండి వాటిని బయటకు తీసి — ఆ గొర్రెపిల్లను — దాని నోటి నుండి విడిపించాను. అది పైకి లేచినప్పుడు, నేను దానిని చంపితిని.... దానిని వధించితిని.” మరియు అతడనెను, “మరి ఎంత ఎక్కువగ ఆయన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని నాచేతికప్పగించును గదా?”

32

హల్లెలూయ! అక్కడే నీవు ఉన్నావు. అతడు ఎక్కడ నిలబడి ఉన్నాడో అతడు ఎరిగెను. అతడు ఒక విశ్వాసం గల మనిషి. అతడు దేవుని నమ్మెను. దేవుడు అతనిలో ఉండెను. అతడు అభిషేకించబడెనని ఎరిగెను. మరియు మీరు ఆ సంగతి ఎరుగుదురు. మీరు అది పొందితే, మీరు క్రైస్తవులై ఉన్నారు. ఒక క్రైస్తవునిగా ఉండుటకు దేవుడు మిమ్మును ఎన్నుకొనని యెడల, నీవు ఒక క్రైస్తవునిగా ఉండి ఉండలేవు. అది దేవుని ఎన్నిక, నీది కాదు. ఏ మనిషి దేవుని వెదకలేదు. ఏ సమయంలోను, ఏ మనిషి, దేవుని వెదకలేదు. నీవు దేవుని వెదకి ఉండలేదు, అయితే దేవుడు నిన్ను వెదకెను. అది దేవునిని నీవు పిలుచుట కాదు కాని, అది దేవుడే మిమ్మును పిలుచుటైయున్నది.

మరియు దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఆయన నిన్ను ఎన్నుకొనెనని అది చూపించుచున్నది. నీవు ఆ పిలుపును అంగీకిరించావు, అది నీతీకరణము అయి ఉన్నది. అప్పుడు నీవు నీ హృదయమును క్రీస్తుకు ఇచ్చావు మరియు పరిశుద్దాత్మచే నింపబడ్డావు. మరియు ఇప్పుడు క్రీస్తు శరీరంలో నీవు ఉండవలసిన చోటులో ఉంచబడ్డావు. ఇప్పుడు, నీ పాత అలవాట్లను అది మన్పించివేసినత్లైతే, మరియు ఒక క్రైస్తవునిగా ఉండుటకు క్రైస్తవుని వలె ప్రవర్తించిననత్లైతే, అది నీ కొరకు చేసిననత్లైతే, అది నీ శరీరమును స్వస్టపరచును, కారణం అది ఒక వాగ్దానము. ఆమెన్. అక్కడే నీవు ఉన్నావు

33

గమనించండి, దావీదుకు తెలుసు అతడు ఎక్కడ నిలబడి ఉన్నాడో, “అవునండి.” దేవుడు వానితో ఉండెనని అతడు ఎరిగెను. కాబట్టి అతడు అనెను, “నేను వెళ్ళి ఫిలిష్తీయునితో పోరాడుదును.”

కనుక అది ఏ ఇతర బాలుడయినను సేవకు అతడు పిలువబడిన వెంటనే, వానిని సెమినార్ కు పంపుదురు. వారది మంచి మార్గమని అనుకొందురు మరియు వారు సౌలు దగ్గరకు అతనిని తీసుకొని వెళ్ళారు, మరియు అతడు చెప్పెను, “ఇప్పుడు కనిపెట్టు, ఇక్కడ మేము ఏ విధముగ పోరాటము చేయుదుమో నీవును అలాగే పోరాడవలసి ఉన్నది. నీవు చేయవలసిన మొదటి సంగతి, మేము శిరస్త్రాణము నీ మీద పెట్టవలసి ఉన్నది.” ఆ పెద్ద హెల్మెట్ ఆ దావీదు చిన్న తలమీద నుండి జారిపోవుచున్నదని నేను ఊహించుచున్నాను, బహుశా చూచుటకు అతని తలను ఈ విధంగ పైకి ఎత్తవలసి ఉన్నది. అప్పుడు అతని పెద్ద తలకు కట్టు కుచ్చుల టోపి అతనికి సరిపడలేదు. అది అతని కళ్ళు మీదకును చెవుల మీదకును వచ్చాయి.

కనుక అప్పుడు సౌలు, “నా కవచము ధరించమనెను.” మరియు ఏడు అడుగుల పొడవైన ఒక మనిషి, బహుశా ఐదున్నర అడుగుల కవచము ఇక్కడ వ్రేలాడుచుండగ, అది అతని మీద ఒక పొట్టిలంగా (స్కర్ట్) వలె కనిపించుట. మీరు ఉహించగలరా?

34

దావీదు ఆ విధముగా సెమినరీ అనుభవమై ఉన్న అంతయూ ధరించి ఉన్నాడు, అతడు అనెను, “చెప్పాలంటే, ఈ వస్తువులను గూర్చి నాకేమియు తెలియదనెను. వేదాంతము ఏలాగు బోధించాలో నాకు తెలియదు మరియు మీరు మాట్లాడే మిగిలిన ఈ రకమైన సంగతులను గూర్చియు మరియు ఈ చక్కని సమస్త జపమాల ప్రార్థనలు గూర్చియు నాకు తెలియదనెను.” “ఇదే నమ్మకంలో నన్ను పోనివ్వండి, నా చేతిలోని సింహమును, విడిపించిన అదే దేవునితో నన్ను ఉండనివ్వండి.”

సహోదరులారా, ఈ రాత్రి మనకు అవసరమైనది అదే సెమినరీలకు వ్యతిరేకంగా నాకేమియు లేదు, మరియు ఉన్నత పాఠశాలలకు వ్యతిరేకముగా, మరియు విద్య, మరియు మొదలైన వాటికి వ్యతిరేకత ఏమియు లేదు. అయితే ఏమనగా, దేవుడు నిన్ను పిలుచునప్పుడు, వెళ్ళుము. పదిహేను సంవత్సరాలు ఒక మిషనెరీగా ఉండుటకు నేర్చుకొనుటను గూర్చియు మరియు వారిని ఆఫ్రికాకు పంపుటను గూర్చియు ఎవరో మాట్లాడుచున్నారు. అది బుద్ధిహీనత. దేవుడు నిన్ను పిలచినట్లయితే, వెళ్ళుము. అంతయూ అదే.

శిష్యులు ఎన్నడూ విద్య కొరకు కనిపెట్టలేదు; వారిలో మిగిలిన వారిలో దానికొరకు ఎన్నడైనా దేనికైననూ కనిపెట్టలేదు. దేవుడు నిన్ను పిలచినట్లయితే, ఆయన నీ కొరకు సిద్ధముగా ఉన్నాడు; ముందుకు సాగిపొమ్ము. నీవు తెలుసుకొను మొదటి సంగతి నీవు ఒక వ్యక్తి విశ్వాసము, భావము, సిద్దాంతము నమ్మినప్పుడు అలా నీలో ఉన్న దేవుని చిన్న భాగము తీసివేయబడును.

35

ఆ రకమైన దుస్తులతో దావీదు వారితో ఎలా యుద్ధం చేయవలెనో ఎరుగడు. మైక్రోఫోను వైపు కేవలం ఎంత వేగముగా చదవగలడో అంతే వేగముగా చదవగలిగి నిలబడి బోధించుటకు గొప్ప సామర్ధ్యము కలిగిన వ్యక్తికి ప్రాముఖ్యము లేనిదానితో అతడు ఎలాగూ బోధించగలడు? అన్ని తెలిసిన వ్యక్తికి ప్రాథమిక విషయాలను బోధించినట్లున్నది. నేనైనను, నీవైనను అలాగున చేయకూడదు. ఉత్తమమైనదేమనగా, అక్కడి నుండి బయటకు వచ్చి, “ప్రభువా, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఏమి చెప్పాలని మీరు కోరుచున్నారో, అది నాకు చెప్పండి. నేను దానిగూర్చి వారికి చెప్పుదును.” ఆమెన్. మరియు ఇలా చెప్పకు, “ఇప్పుడు, ఇక్కడ నా ప్రక్క నుండి మిష్టర్ జోన్స్ దూరంగా పోయే వరకు కనిపెడతాను మరియు అప్పుడు నేను అది నమ్మెదను, అయితే అప్పుడు నేను చెప్పెదను, ఆమెన్...” ఎలాగైనను “ఆమెన్” అని చెప్పుము, దేవుడు అది చెప్పిన యెడల చేయము. అది యధార్ధము.

“మంచిది, అక్కడ మిస్ సూసీ కూర్చుందని నేను ఎరుగుదును, ”ఆమె మా ఇంటి ప్రక్కన నివసించుచున్నది.“ సరియైన రీతిగా జీవించుము. సరియైనరీతిగా జీవించుము. నీ జీవితమును గూర్చి నీవు సిగ్గుపడుట లేదు, సిగ్గుపడుచున్నావా? నీవు సిగ్గుపడిన యెడల, అప్పుడు నీకు మార్పు పొందుట అవసరం. అది సరియైనది. మిస్ సూసీ నీవు ”ఆమెన్,“ అని చెప్పాలని ఆమె ఎదురుచూస్తుంది మరియు నీవు దేవునియందు విశ్వాసముంచి నీవు మాట్లాడుచున్న వాటిని ఉత్పత్తి చేయాలని ఆమె ఆశించుచున్నది. అది మండి౦చును కాదా? అయితే అది నీకు మంచిది. అది యద్దార్థమై ఉన్నది.

36

అతడు ఎక్కడ నిలబడి ఉండెనో దావీదు ఎరిగెను. అతడు అనెను, “అవునండి, దేవుడు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని నా చేతికి అప్పగించును.” కనుక అతడు అనెను, “నా నుండి ఈ వస్తు సముదాయము తీసివేయండి.” మరియు సౌలు వానికి చెందిన మతపరమైన విధులు ఒక దైవ మనిషికి సరిపోలేదని కనుగొనెను. అది యధార్థం.

దావీదు అనెను, “నేను ఈ చిన్న పాత వడిశెలను నమ్మాను, కాబట్టి నేను సరిగ్గా దానితో వెళ్ళుచున్నాను.”

నేను మీకు చెప్పుదును, అది నన్ను రక్షించిన పరిశుద్దాత్మ అయి ఉండెను; ఏమి జరిగినను నేను లక్ష్యము చేయను. పరిశుద్దాత్మను పొందిన ఒక మనిషిని నేను ఎరుగుదును, అలా బయట పొలంలోనికి వెళ్ళి ప్రజల మధ్య ప్రఖ్యాతి నొందిన వానిగా ఉండి మరియు దానిని తిరస్కరించెను. పురాతన పద్ధతిలో పరిశుద్దాత్మను పొందిన స్త్రీ మరియు పురుషులను నేనెరుగుదును, మరియు బయట పొలంలోనికి వెళ్ళి మరి, ఎందుకనగ కేవలం ప్రజలలో ఒక చిన్న పేరు - ప్రఖ్యాతులు వచ్చిన తరువాత దానిని వారు తిరస్కరించెను. ఓ, దేవా కృప చూపుము.

ఇంత దూరం నన్ను తీసుకు వచ్చింది పరిశుద్దాత్మ బాప్తిస్మం, పరిశుద్దాత్మ బాప్తిస్మమే నన్ను తీసుకు వచ్చినది, అంతా అదే. అవునండి. అక్కడ వెనుక అది మంచిదై ఉన్నది, అది ఇప్పుడునూ నాకు మంచిదై ఉన్నది, మరియు నా మరణ ఘడియలోనూ, కేవలం అలాగే ఉండును. అది అక్కడ వెనుక నీకు మంచిదైన యెడల, ఇప్పుడును నీకు మంచిదై ఉన్నది, మరియు నీవు చనిపోవుచున్నప్పుడు, అది మంచిదిగ ఉండును. ఆమెన్. దాని గురించి ఆలోచించండి.

37

ఇక్కడే మనం ఉన్నాం. దావీదు అనెను, “నిశ్చయముగా, ఈ వడిశెలను నేను ఏ విధంగ నమ్మాలో నేను ఎరుగుదును.” కనుక అతడు అక్కడకు బయటకు వెళ్ళి, యుద్ధము చేయుటకు సిద్ధపడెను. ఇప్పుడు, సౌలు ఇలా చెప్పుటను నేను ఊహించగలను, ఈ వ్యక్తి నా సూచనలను శిక్షణ ఇచ్చుటలో నా సామర్థ్యమును తిరస్కరించిన ఎడల ఎలాగు వెళ్ళును. వారు ఒక మిషనెరీగా అగుటకు లేక అది ఏమై ఉన్నప్పటికి దానికి ముందు, ఏ రకమైన కవచాలు వారు కలిగి ఉండవలసినది.“ ”లోకంలో ఆ చిన్నవాడు ఏమి చేయనై ఉన్నాడు ఆశ్చర్యమే?“ అనెను.

కనుక నేను అక్కడ దావీదును చూచినప్పుడు, అతడు కొన్ని రాళ్ళ ఏరుచున్నాడు. మీరు దానిని ఊహించగలరు, అతడు ఒక గ్రామీణ బాలుడు, కొన్నిరాళ్ళు ఏరుచు. అతని చిన్న పాతకాలపు వడిశెలు బయటకు లాగి మరియు దానిని ఆ విధముగా సిద్ధము చేసెను. “మంచిది, అతడు దీనితో ఏమి చేయనై ఉన్నాడు ఆశ్చర్యమే?” అనెను.

అతడు ఐదు చిన్న రాళ్ళు ఏరుకొన్నాడు, ఐదు చిన్నరాళ్ళ మరియు అతడు తన చిన్న చిక్కములో ఇక్కడ ప్రక్కగా వాటిని ఉంచాడు. నిజానికి అది ఏమై ఉన్నది, లేఖనము అది ఒక గొర్రెల కాపరి సంచి అని చెప్పెను.

వారు ఆ గొర్రెల కాపరి సంచిలో ఏమి తీసుకొని వెళతారో మీకు తెలియునా? నేను అనేక సార్లు చెప్పాను: గొర్రెల కాపరులు సాధారణముగా, ఆ గొర్రెల కాపరి సంచిలో తేనె తీసికొని వెళ్తారు. మరియు వారి గొర్రెలలో ఒకటి జబ్బుగ ఉన్నప్పుడు, వారు ఈ తేనెలో కొంత తీసుకొని ఆ రాతి మీద పోస్తారు. కేవలం దానిని కరిగించి మరియు ఆ విధంగ ఆ బండపై తేనెను పోస్తారు. మరియు ఆ గొర్రెలు ఇక్కడకు వచ్చుచుండగ, మరియు ఆ తియ్యటి పదార్ధము అది ఇష్టపడును; మరియు అది ఆ సున్నపురాయి మీద దాని నాకుటకు వెళ్ళెను; ఆ సున్నపురాయి నుండి ఆ తేనె అంతయు అది నాకినప్పుడు, ఆ జబ్బు గొర్రె బాగుపడును.

కాబట్టి ఇప్పుడు ఇక్కడ పూర్తిగా తేనెతో నింపబడిన గొర్రెల కాపరి సంచి నేను కలిగియున్నాను. మరియు నేను ఆ తేనెను యేసుక్రీస్తు అనే బండపై నేను వుంచుదును. బలహీనపడిన గొర్రెలు త్వరగా దానిని నాకవలెను; మరియు మీరు అక్కడ స్వస్థతను పొందుకొనవచ్చును. అది యదార్ధం. మరి అది ఏ సంఘము, ఏ సంస్థ మీదనూ మనము పెట్టము; అది ఎక్కడ చెందియున్నదో, అక్కడ మనము పెట్టుదుము. యేసు క్రీస్తు పైన, బండ — ఎక్కడైతే సమస్త స్వస్టత ఉండునో అక్కడ, యేసు క్రీస్తు అను ఆ బండపైన.

38

కాబట్టి అప్పుడు అతడు ఒక గొర్రెల కాపరి సంచి కలిగి ఉండెను. మరి అది మాత్రమే కాక, అయితే ఆ గొర్రెల కాపరి సంచి, నిజముగా దానిలో ఒక జేబులో డబ్బు తీసికొనిపోవును. ఆ మాట “స్క్రిప్” అనగా “డబ్బు” అని అర్ధము. కాబట్టి అతడు దానిలో డబ్బు తీసికొని పోవును. అది ఏమయి ఉన్నది? డబ్బు కొనుగోలు శక్తియైయున్నది.

ఇక్కడ దేవుని గొర్రెల కాపరి సంచి ఉన్నది. ప్రతి యాత్రికుడు లేక గొర్రెల కాపరి అక్కడ బయట ఒక గొర్రెల కాపరి సంచి కలిగి ఉండును. కాబట్టి అనారోగ్యానికి గురియై ఇక్కడ పడివున్నప్పుడు నా యొక్క సంచిలో ఏముందో చూడుము. “నీ సంకటములను కుదుర్చు యెహోవాను నేనే.” మంచిది, అది బయటకు తీయము. అది ఒక కొనుగోలు శక్తి అయి ఉన్నది. “నీవు ప్రార్ధించినప్పుడు, అది ఏమైనప్పటికిని నీవు నమ్మి, నీవు అడిగినది పొందితివని నమ్మము.” నీవు అది కోరిన యెడల, ప్రార్ధించి మరియు అది పొందితినని నమ్ముము, అప్పుడు నీవు అది కలిగి యుందువు. అది ఆ గొర్రెల కాపరి సంచిలో ఉన్నది. రాళ్ళు దాచుటకు ఒక మంచి స్థలము, అతడు ఆ రాళ్ళు అక్కడ ఉంచుటలో ఆశ్చర్యము లేదు, అది కాదా?

ఆ రాళ్ళు, ఆ చిన్న రాళ్ళు. తేనెలో దొర్లించబడి, ద్రవ్యముతో చుట్టబడిన ఆ గొర్రెల కాపరి సంచిలో మనము రాళ్లైయున్నాము. మై, మై! మరియు గొర్రెల కాపరి, యేసుక్రీస్తు ఎన్నడూ ఒక యుద్ధమును పోగొట్టుకొనలేదు. ఆ గొర్రెల యొక్క కాపరి ఈ రాత్రి ఆయన సొంత మహిమకరమైన భద్రతలో తన సంఘమును కట్టుచున్నాడు. ఆమెన్.

39

ఐదు రాళ్ళు తీసికొనెను. ఇది దేనిని సూచించుచున్నది. ఐదు దేనికి సాదృశ్యము? ఐదు రాళ్ళ వాటిలో ఒకటి జే, మరొకటి ఇ, మరియు ఎస్-యు-ఎస్. యేసు, ఐదు రాళ్ళు. మరియు యేసుక్రీస్తు అనే రాయిలో మీరు రాళ్లై యున్నారు.

మరియు అతడు వాటిని తన చిన్న గొర్రెల కాపరి సంచిలో ఉంచెను, కాబట్టి అవి మొత్తం అంతా తేనెతో చుట్టబడెను. మరియు అది మాత్రమే కాదు, గాని అవి పై నుండి శక్తి పొంది ఉన్నవి. దేవుడు ఎన్నడైనా మరల ఏకమనస్సు కలిగిన సంఘమును పొందగలిగిన యెడల, ఆయన పై నుండి శక్తిని పంపగలడు. ఏమిటా శక్తి? అది ఆయన వాక్యము నమ్మునట్లును మరియు నెరవేరునట్లు చేయును.

ఇప్పుడు ఈ గొర్రెల కాపరి సంచిలో మరియు ఇక్కడ అతడు ఆ చుట్టబడిన చిన్న తేనె గుళ్ళు ఇక్కడ ఉండెను. మరియు ఇక్కడ మరియు ఈ తేనె అంతా అక్కడ ఉ౦డెను, మరియు ఈ డబ్బు అంతా అందులో ఉండెను. దావీదు అక్కడ లోపల రాళ్ళు ఉంచెను, అంతలో గొల్యాతు ఎక్కడ నిలచి ఉండెనో చూచుటకు అతడు అవతల వైపుకు చూచెను. ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరు ఒక దావీదైయున్నారు.

40

దావీదు గొల్యాతును కలసికొనుటకు వెళ్ళినప్పుడు, గొల్యాతు అతని వైపు చూచి నవ్వెను, అంతలో “ఎర్రగ కనిపించుచున్న చిన్న పాతకాలపు బాలుడా, ఎందుచేత నన్ను కలియుటకు వచ్చుచున్నావు, నేను ఒక కుక్కనా? అనెను. అతడు చిన్నవాడై, ఎర్రని వాడై ఉండెను.

సౌలు వానిని ఏమని పిలిచాడో మీకు తెలియునా? “పురాతన కాలపు పద్ధతి కలిగిన బాలుని వలె ఉన్న ఈ పడుచువాడు ఎవరు?” అనెను. సౌలు చెప్పినదియూ అదే. “ఆ బయట ఉన్న ఆ పడుచువాడు ఎవరు?” మీకు తెలియును, పాతకాలపు, ఆడదానివలె కనబడుచున్న చిన్న వ్యక్తి, బహుశా, అతని భుజములు కిందకు వంగి ఉండెను, అంతలో అతడు ఈ చిన్న వడిసెలతో వచ్చుచున్నాడు, అయితే అతడు దేవుని ఎరిగి ఉండెను, అదియే ముఖ్యమైన సంగతి. అతడు ఒక విశ్వాసి అయి ఉండెను. అతడు ఎన్నుకొనినబడినవాడై ఉండెను. అతడు పిలువబడి ఉండెను. అతడు అభిషేకించబడి ఉండెను. మరియు అతడు స్థానములో ఉంచబడి ఉండెను. హల్లెలూయ! నీవు ఎక్కడ ఉన్ననూ కేవలము....

41

నీవు అందువు, అది అలా జరుగునా... “మంచిది, బ్రెన్హాం సోదరుడా, నేను ఒక బోధకునిగా ఉండుటకు పిలువబడలేదు.” నీవు ఒక ఇంటిలో భార్యగా ఉండుటకు పిలువబడి ఉండవచ్చు, అయితే పరిశుద్దాత్మ ద్వార నీవు యేసుక్రీస్తులో నీవు నీ స్థానములో ఉండుము. ఆమెన్. ఆ మిగిలినవారు ఉండినట్టే కేవలం నీవు దావీదు అంతటివానిగా యున్నావు.

42

యుద్ధము జరుగనై ఉన్నది, ఫిలిష్తీయులు అక్కడ నిలబడి ఉన్నారు. గొల్యాతు దూసుకు వచ్చాడు. అతడు దిగువకు వెళ్ళుట గమనించండి. కనుక ఇక్కడ నుండి దావీదు వెళ్ళచూ అతడు దిగువకు చేరి అంతలో అక్కడ బయటకు చూచుచున్నాడు, మరియు అతడు చూస్తూ - గొల్యాతును పైన-క్రింద ఆ విధముగా చూచెను. అయితే గొల్యాతుకు అవతల వైపున అతడు విజయమును చూచెను, ఎందుచేత అనగా అతడు దేవుని యందు నమ్మికయుంచెను. గొల్యాతు కంటె ఆ సింహం ఎంతగానో అపాయకరమైనదని అతడు తలంచెను, అది ఒక అడవి మృగము. ఆ మృగము యొక్క తలవైపుకు తిన్నగా కొట్టవలెనని నేను దేవుని యందు నమ్మికయంచాను. మరియు ఇక్కడ ఈ మార్గంలో కొట్టుటకు నేను దేవుని యందు నమ్మిక ఉంచగలను. ఎందుకనగా ఒక గొర్రెను రక్షించుటకు నేను ఒక సింహమును చంపాను. అది నిజము. ఆ గొర్రెను నేను రక్షించునట్లు దేవుడు అనుమతినిచ్చును, ఏలయనగా ఆయన ఆ గొర్రెను రక్షించునని నేను విశ్వాసము కలిగి ఉన్నాను.“

ఆ గొర్రెల నిమిత్తము దేవుడు కొందరు దావీదులను మనకు ఇచ్చును అది నిజం, ఆయన గొర్రెలను గూర్చి ఆయన లక్ష్యము చేసినయెడల, సజీవ దేవుని సమస్త సైన్యమును గూర్చి ఎంత ఎక్కువగా లక్ష్యము కలిగి ఉందుననెను. అంతలో అక్కడకు వచ్చి ప్రగల్భాలు పలుకుచు మరియు గొప్పలు చెప్పువానిని నేను అనుమతించలేను, “దైవిక స్వస్థత గతించిపోయినది. ఏ చోట అయినను నేను దానిని గూర్చి నీతో వాదించగలను.” ఓ మై! ఈ రోజుల్లో ఒక దినమున నీవు ఒక దావీదును కలువగలవు. మంచిది.

43

కనుక అతడు అక్కడ వేగముగా ముందుకు దూసుకొనిపోయెను, మరియు గొల్యాతు వానిని అపహసించెను మరియు వాని దేవుళ్ళ పేరుతో వానిని శపించెను, “నేను ఈ రోజున నీ శరీరమును పక్షులకును మరియు పొలంలోని జంతువులకు ఇచ్చెదను,” అనెను.

దావీదు చెప్పెను, “నీవు ఒక ఫిలిష్తీయుని పేరు మీద, ఫిలిష్తీయునిగా నన్ను కలువనై ఉన్నావు, ఒక కవచముతో, ఒక ఈటెతో, నీకున్న సమస్త మనస్తత్వ శాస్త్రముతో మరియు వేదాంతముతోను అక్కడ నీకున్న ప్రతి ఇతరమైన దానితో నీవు నన్ను ఎదుర్కొనుచున్నావు. అయితే ”నేను ఒక సంగతితో నిన్ను కలసికొనుచున్నాను, అది ఇశ్రాయేలీయుల దేవుడైన ప్రభువు నామమైయున్నది.“ హల్లెలూయ! ”నా ఇష్టము చొప్పున కాదు, అయితే ఆయన ఈ రోజున నీ తలను నాకు ఇచ్చును.“ ఆమెన్. పొలములో ఉన్న మీ ఫిలిష్తీయుల౦దరిని మరియు నీ శరీరమును అడవి జంతువులకును మరియు పక్షులకును ఆహారముగ విసరివేయుదును.”

44

అతడు ఎక్కడ ఉండెనో అతడు ఎరిగి ఉండెను. హల్లెలూయ! ప్రతీ దావీదు ఈ రాత్రి ఇక్కడ క్రీస్తులో తమ స్థానములో ఉన్నారు. దేవుడు దానిని ధృవీకరించెను. ఎన్నిక, పిలుపు, అభిషేకము, స్థానములో ఉంచుట. ఆయన నిన్ను ఎన్నుకొనెను మరియు నిన్ను పిలిచెను. అప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించెను, మరియు ఇప్పుడు, ఆయన నిన్ను క్రీస్తు శరీరములోనికి, ఇక్కడ ఉన్న దావీదులలో ప్రతి ఒక్కరినీ ఉంచెను.

ఆ గొల్యాతు ఎక్కడ ఉన్నాడు? “బ్రెన్హాం సోదరుడా, ఆ గొల్యాతు ఎవరు?” నిన్ను తినివేయుచున్న ఆ కేన్సరే. అది నిజము. నీ మీద వ్రేలాడుచున్న ఆ కణితి, నీ కళ్ళ మీద ఉన్న ఆ కంటి శుక్లములు, ఆ కుంటిగా ఉన్న చేయ్యి. ప్రతిదియు దాని వైపు చూచి, “అది బాగుపడదని,” చెప్పును. ఆ దయ్యము చెప్పును, “నీవు నమ్ముట మానియుండవచ్చు. నీవు ఎన్నడూ బాగుపడవు అని, నీవు ఉరకొనవచ్చు. ఆలాగు నీ వైద్యుడు చెప్పాడు, మిగిలిన వారందరూ చెప్పారు. నీవు బాగుపడలేవు.”

అయితే నిన్ను నిర్మించిన క్రీస్తు నీ త్రాగుడు నుండి, పొగత్రాగుట నుండి, అబద్దము చెప్పుట నుండి, దొంగతనము నుండి ఆపును అలా ఒక త్రాగుబోతు జీవితము నుండి, పాపము నుండి దొర్లుట మరియు ఒక దయ్యము యొక్క సమాధి నుండి నిన్ను రక్షించిన, ఆ దేవుడు నీ కొరకు అది చేసిన యెడల, ఆయన నీ టి.బి. నుండియు మరియు నీ కేన్సరు నుండియు నిన్ను రక్షించగలడు. అతడు ఒక గొల్యాతు అయి ఉన్నాడు, వాడు చెప్పుకొను గొప్పను తీసికొనవద్దు. ప్రభువైన యేసు నామములో నిలబడి మరియు వానిని బహిరంగ ప్రదర్శనకు రమ్మని సవాలు చేయుము.

ఆమెన్! హల్లెలూయ! నేను భక్తిభావన కలిగి ఉన్నాను. క్రీస్తునందు సరియైన స్థానంలో ఉండుము. విశ్వాసి తన స్థానము ఎరిగి ఉండిన యెడల, అతడు అది కలిగి ఉండును. దేవుని గొప్ప ఆత్మ ఇక్కడ ఉన్నది మరియు ఆయనను నమ్ము ఏ వ్యక్తి మీదకైనను పరిశుద్దాత్మ దిగుటకు సిద్ధముగా ఉన్నది. నీవు అది నమ్ముచున్నావా? ఆమెన్. దేవుడు దానిని వాగ్దానం చేసెను. దేవుడు అది చేయును. నీవు క్రీస్తులో ఉన్నావు.

45

గొల్యాతు ప్రగల్భాలు పలుకుచుండెను. గొల్యాతు అనును “మీరు చూడండి, గత రాత్రి మీరు ఇక్కడ ఉన్నారు మరియు స్వస్ధపడలేదు. మీరు మిగిలిన కూటాలలోనూ ఉన్నారు, స్వస్థపరచబడలేదు.”

సున్నతి లేని ఆ దయ్యము ఎవరు? దేవునితో సంబంధం లేని ఆ దయ్యం ఎవరు? ఆ వెనుక ఓడింపబడి ఏమి లేకుండా నిస్సాహయ స్థితిలో నిలబడిన ఆ దయ్యం ఎవరు? మన ప్రభువును మరియు మన జయశాలి ద్వారా వాడి యజమానుని కల్వరి యొద్ద ఓడించెను. హల్లేలూయ! అతడు అబద్ధికుడు. అంతే. మనము ఇక ఎన్నడూ వానిని నమ్మము. వానిని అణిచి వేయుము.

యేసుక్రీస్తు సాతానునికి కలిగిన ప్రతి దానిని దోచుకొనెను. ఆయన ప్రధానులను, అధికారలను, ప్రభుత్వములను పాడు చేసెను. ఆయన పరిపాలన భూమ్యాకాశములను విస్తరించియున్నది. మరియు మనం ఆయన ఏలుబడిలో పనిచేయు పిల్లలమై ఉన్నాము. హల్లెలూయ! మై! ఆయన ఎక్కడ ఉండవలెనో అది ఆయనను ఉంచును. ఆ దయ్యం అక్కడ క్రింద నుండెను మరియు క్రీస్తు విజయశీలుడై ఉండెను. మీరు దావీదులు. మీరు పిలువబడినవారు, ఎన్నిక చేయబడినవారు, అభిషేకించడినవారు. పరిశుద్దాత్మ బాప్తిస్మము చేత యేసుక్రీస్తు శరీరంలో సరియైన స్థానములో ఉంచబడినవారు. గొల్యాతూ, నీవు ఓడిపోయావు. ఆమెన్! వాడు ఈ రాత్రి ఓడిపోయాడు. హల్లెలూయ! మనం ప్రార్దించెదమా.

46

పరలోకపు తండ్రీ, కదలుచున్న ఆ ఆత్మ భావనను అనుభవించుచు, ఓ ప్రభువా, ఈ సభికులపై మీ ఆత్మ యొక్క అభిషేకము అనుభవించుటకు మీరు మధ్యాకాశములో నడచుచున్నట్టుగా కనిపించుచున్నది. ఎంతగానో మేము మిమ్మును ప్రేమించుచున్నాము, ఎంతగానో మేము మిమ్మును స్తుతించుచున్నాము. నీ నామమునకే మహిమ కలుగును.

పరలోకమందున్న దేవా ఈ రాత్రి, నేను నీకు ప్రార్ధించుచున్నాను, ఈ భవనంలో ముందుగానైనను లేక జీవితంలో ఏ సమయంలోనైనను, వారు ఎన్నడూ అనుభవించని రీతిలో అలాటి శక్తితో ఈ సభికులను మీరు అభిషేకించగలరనియు ప్రార్ధించుచున్నాను.

మరియు ఈ పిల్లలలో ప్రతీ ఒకరు, పిలువబడినవారై, దావీదువలె ఉందురు గాక, తండ్రీ, వారు పిలువబడవలసిన వారుగా ఉన్నారు. మీరు ప్రేమించిన కుమారుడు, ప్రభువైన యేసు చెప్పెను, “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” దేవుడు వారిని పిలిచెనని చెప్పెను, ఎందుకనగా ఆయన వారిని ఎన్నుకొనెను. అప్పుడే మనము ఎన్నుకొనబడినాము. అప్పుడు వారు పిలువబడి ఉన్నారు. అంతలో వారు ఆ పిలుపుకు జవాబు ఇచ్చారు. మరియు నీవు పరిశుద్దాత్మ యొక్క అభిషేకము వారి మీద కుమ్మరించి క్రీస్తు శరీరములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చావు. ఆ పెద్ద బండ (క్రీస్తు)లో వారిని సరియైన స్థానములో చిన్న రాళ్ళుగా నియమించావు. హల్లెలూయ!

47

అప్పుడు ఆ దయ్యము అక్కడ నిలబడి ఉండి వారిని భ్రమపరచుటకు ప్రయత్నించుచుండెను. మంచిది, ప్రభువైన దేవా, ఈ రాత్రి వారి ఆత్మను నీ ఆధీనములోనికి తీసికొనండి, మరియు మేము ప్రతి ఫిలిష్తీయున్ని గోడలకు వేసి నరుకుదుము గాక. హల్లెలూయ! దావీదు యొక్క ప్రధాన అధిపతియు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఇప్పుడే ఆయన శక్తితో దిగివచ్చి జనులపై ఉన్న చీకటిని, సంకెళ్లను, అవిశ్వాసమును, నరికి వేయును గాక. ఆ గొప్ప పరిశుద్దాత్మ వెలుగు ఈ భవనమంతయూ ప్రవాహము వలె వచ్చునట్లు ఆయన చేయును గాక. మునుపు ఎన్నడూ మనం చూడని ఒకరాత్రి వలె ఇది ఉండును గాక.

సర్వశక్తుడవైన దేవా, నీ మహిమ కొరకు దానిని అనుగ్రహించండి. నీ కుమారుని యొక్క నామములో మరియు సమస్త పరిశుద్ధ దూతలు, పరలోకములో మహిమ, ఆయనకు మహిమ, మరియు మీ మహిమ కొరకు అడుగుచున్నాము, తండ్రీ, వారు యేసు నిమిత్తము స్వస్థపడుదురు గాక. ఆమెన్.

48

మై! దావీదు గొల్యాతు తలను నరికిన తరువాత, అతడు ఏమి చేసెనో మికు తెలియునా? అతడు ఆ తలను పైకెత్తి, వాని చనిపోయిన శరీరము మీద తన పాదమును ఉంచి, మిగిలిన వారందరికి ఒక సాక్ష్యము కొరకు దానిని పైకెత్తి పట్టుకొనెను. “నీవు ఏమి చేయగలవో చూడుము,” అని అతడు అనెను. అది నిజము. దేవుని యందు విశ్వాసము ఉంచుము.

మరోరాత్రి ఇక్కడ మేయో సోదరుల నుండి, ఆ దీనురాలైన ఆ చిన్న స్త్రీ బహుశా ఈ రాత్రి ఇక్కడే కూర్చుని ఉండవచ్చును — వారు చేయగలిగినదంతయు చేసిరి, ఆమెకు జరిగిన సంగతి ఏమై ఉండెనో కనుగొన లేకపోయిరి. వారు ఇక్కడకు వచ్చారు. ఆ దయ్యం, “నీవు నాకు చిక్కావు” అనెను. అయితే వాక్యము వినుట వలన విశ్వాసము వచ్చును. ఆమె దేవుని నమ్మెను, ఆమె ఆ దయ్యము యొక్క తలను నరికెను, మీ ఎదుట అది పైకి ఎత్తి వ్రేలాడ జేసెను, మరియు అనెను, “చూడు, నేను ఆ మంచం మీద బందించబడ్డాను; మరియు నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, కనుక సంతోషించి నేను నిద్ర కూడ లేకుండ ఉన్నాను.” అది నిజము.

49

ఈనాడు దేశమంతటా ఉన్న వేలమందిని గూర్చి ఏలాగున్నది? మీలో గుడ్డివారు మరియు మంచంపైనే ఉండి లేవలేనివారి ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి, మీలో కొందరు ఇక్కడే కూర్చుని ఉన్నారు. గత కాలంలోనే నేను ఇక్కడ ఉన్నప్పుడు, మీరు విశ్వాసము అను ఖడ్గముతో లోనికి నడచి వచ్చారు గొల్యాతు యొక్క శిరస్సును తెగవేసి ఈ రాత్రి ఒక సాక్ష్యము కొరకు నీవు పైకి ఎత్తి పట్టుకొనుచున్నావు.

ఆ మిగిలిన సైన్యమంతయూ ఏమి చూశారు? వారు అది జరిగించబడుటను చూసినప్పుడు, వారు అన్నారు, “మేము కూడ అది చేయగలము, ఎందుకనగా మేము కూడ ఇశ్రాయేలీయులమే.” మీలో ప్రతీ ఒక్కరూ దేవుని పిల్లలు, మరియు ఆశీర్వదించబడుటకు ఒక హక్కును పొందారు. “ఇపుడే ఖడ్గమును లాగండి; వెళ్ళి బయట ఉన్న ఈ గొల్యాతులను వధించెదము.” వారు వారి యొక్క చనిపోయిన దేహములను లోయలోనికి, ఆ కొండల వైపు వాటికి పైగా ఉన్న ద్వారములోనికి వెదజల్లిరి. నిశ్చయముగా. మీరు కూడా అలా చేయగలరు. అది మీదే. అంతే. అది మీ కొరకు. అది ప్రతి విశ్వాసి కొరకు.

50

ఈ రాత్రి పరిశుద్దాత్మను పొందకుండ ఈ భవమును విడిచిపెట్టి వెళ్ళవద్దు. అక్కడ ఉన్న పురాతన సంకెళ్ళులను తెంపివేయండి, ఆ సంకెళ్ళులను విసిరివేసి ఇలా చెప్పండి, “నేను దేవుని నమ్ముచున్నాను,” జయించిన దేవుని కుమారులు, కుమార్తెలుగా బయటకు నడచి వెళ్ళండి మరియు మహిమకు ముందుకు సాగిపోవునట్లుగా, ఆ ఉదయ నక్షత్రము మిమ్మును నడిపించుచుండును. నిశ్చయముగా.

ఆ దయ్యము పైకి లేచి మరియు అనును, “మంచిది, నీవు నాకు చిక్కితివని నేను అనుకున్నాను.”

ఇలా అనుము, “నీవు చేయలేవని నేను నీకు చెప్పాను.” నడచి సరిగా ముందుకు వెళ్ళుము. అది అలాగే. మరల కూడిక యొద్దకు వచ్చి, ఆ పాత దయ్యము యొక్క తలను పట్టుకొని జాడించి, ఇలా చెప్పుము, “ఇటు చూడు నేను నీకు జ్ఞాపకమున్నానా? కొద్ది దినములు కంటే నేను ఎక్కువ రోజులు బ్రతకనని వైద్యుడు చెప్పినప్పుడు అక్కడ పడివున్న వ్యక్తిని, ఈ రాత్రి ఇంకా నేను ఇక్కడే ఉండియున్నాను.” హల్లెలూయ!

అప్పుడు ఎవరో ఒక వ్యక్తి చెప్పును, “ఆమె అది చేయగలిగిన యెడల, నేను కూడా చేయగలను; కనుక నేను ఆయన యందు నమ్మిక ఉంచగలనని నీకు తెలియును.” ఆమెన్. ఈ రాత్రి ఆ సంగతి ఏమై ఉన్నదో నీకు తెలియదు. ఓ, ఇప్పుడు ఈ విధముగా ఆ ప్రజల గుంపులోనికి వచ్చుటకు అలాగున ఆ పరిశుద్దాత్మడు ఇష్టపడును. నీవు ఎక్కడ ఉంటివో నీవు ఎరిగి తెలిసికొనినప్పుడు మాత్రమే అలా జరుగును. అనుభవములోనికి తెచ్చుకొనునప్పుడు మాత్రమే. ఈ భవనములో ఉన్నానని చెప్పుట కాదు, నీవు క్రీస్తు నందు ఉన్నావు. సరియైన స్థానములో ప్రతి సంగతియు నీదైయున్నది. సమస్తమూ నీదే; అది నీకే చెందును. ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? ఆర్గాను మీద ఆ సహోదరుడు రాగం (తాళం) ఇచ్చుచుండగా, అందరం కలసి ఒక పాట పాడుచుండగా, మనం మన చేతులు పైకెత్తెదము. “ప్రభువా, నేను నమ్ముదును,” అని కాదు అయితే, “ఇప్పుడే నేను నమ్ముచున్నాను.” ప్రతీఒకరు వారి చేతులు పైకి ఎత్తండి. మనం అందరం ఇప్పుడు ప్రతివ్యక్తి, అంతా సరియైనదిగా ఉన్నది.

ఇప్పుడు నేను నమ్ముచున్నాను, ఇప్పుడే నేను నమ్ముచున్నాను,

సమస్తమూ సాధ్యమే, ఇప్పుడే నేను నమ్ముచున్నాను;

నేను ఇప్పుడే నమ్ముచున్నాను, నేను ఇప్పుడే నమ్ముచున్నాను,

సమస్తమూ సాధ్యమే, నేను ఇప్పుడే నమ్ముచున్నాను.

51

ఓ, ఎంతో మరపురానిది. నేను ఇలా చెప్పగలిగి ఉందును, “కూడికను ముగించి, మరియు ప్రతి ఒకరు ఇతరుల చేయిపట్టి కరచాలనం చేసి మరియు ఇంటికి వెళ్ళండి.” ఈ రాత్రి ఇక్కడ చాలా స్వస్థతలు, అక్కడ అనేకమైనవి ఉండునని నేను నమ్ముచున్నాను. నిశ్చయముగా, నా పూర్ణహృదయంతో నేను నమ్ముచున్నాను.

ఇప్పుడు, మొదటిసారిగా ఇక్కడ ఎవరో వ్యక్తికి, విశ్వాసములో అవగాహన లేకుండ, బలహీనుడుగ ఉండుట జరిగి ఉండవచ్చును, అలా మీరు బాగా గ్రహింపు కలిగి ఉండునట్లు ఒక ప్రార్ధనా వరుసను పిలిచి, ప్రజలలో కొందరికి ప్రార్థించెదము. అక్కడ వెనుక యేసు ఏమి చెప్పెను? ఆయన ఏ వాగ్దానము ఇచ్చి ఉండెను? కేవలం దావీదుకు ఇచ్చినట్లుగానే, ఆయన చెప్పెను, “నేను చేయు కార్యములు మీరు కూడ చేయుదురు.” ఆయన చెప్పెను, “తండ్రి చేయునది తప్ప నేను ఏమియు చేయను. తండ్రి నాకేది చూపించునో, అదే నేను చేయుదును.”

52

ఆయన దగ్గరకు నడిచి వెళ్ళిన స్త్రీ, ఆయనతో మాట్లాడుట ప్రారంబించెను, ఆయన ఆమెతో కొంచెం సేపు మాట్లాడిన తరువాత, ఆమె బాధను కనుగొని, “వెళ్ళి నీ భర్తను తీసికొనిరమ్మని” ఆమెతో అనెను.

“నాకెవరూలేరని” చెప్పెను.

“అది నిజము, నీకు ఐదుగురు ఉన్నారు.”

ఆమె అన్నది, “నీవు ఒక ప్రవక్తవై ఉన్నావని” గ్రహించుచున్నానెను, “మెస్సీయ వచ్చినప్పుడు, ఆయన చేయునని నేను ఎరుగుదును. అది మెస్సీయ యొక్క సూచన అయి వున్నది.”

“నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను.” అనెను.

53

ఫిలిప్పు అక్కడ బయటకు వెళ్ళి మరియు అతడు అప్పుడే రక్షించబడెను, అంతలో అతడు చాలా మంచి సమయం కలిగి ఉండెను; దేవుని రాజ్యము అతని హృదయంలో ఉండెను; అతడు ఆనందముతో ఉండెను. అతడు తన సహచరుడను కనుగొనుటకు వెళ్ళెను. అతడు చుట్టు ప్రక్కల అంతయూ చూచెను; అతడు ఎక్కడ నుండి వచ్చెనో ఆ గ్రామమునకు వెళ్ళెను. అతడు బయట ప్రార్ధనలో నతానియేలును కనుగొనెను - ఒక చెట్టు క్రింద ప్రార్ధించుచుండెను, ఎక్కడో చోట, బహుశా అతని ఇంటి వెనుకగా బయట ఒక అంజూరపు చెట్టు క్రింద ప్రార్దించుచూ ఉండవచ్చును. ఫిలిప్పు, నతానియేలు ఇంటికి వెళ్ళి బహుశ నతానియేలు ఎక్కడ ఉన్నాడని అతని భార్యను అడిగెను. అందుకు ఆమె...

“అతడు కొద్దిసేపటి క్రితం ఆ అంజూరపు తోట యొద్దకు బయటకు నడచి వెళ్ళిననెను.”

కనుక ఫిలిప్పు నతానియేలు కొరకు చూచుచు, నడచుచుండెను. అక్కడ నతానియేలు అక్కడ బయట ఒక చెట్టు క్రింద ప్రార్ధించుచుండెను. అతడు అక్కడకు వచ్చుచుండుట వినెను, అతడు పైకి లేచి, “హలో ఫిలిప్పు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎందుకిలా వచ్చావు అనెను.

అతను చెప్పెను. “ఓ, ఇక్కడకు రమ్ము; నేను నీకు ఒక విషయం చెప్పగోరుచున్నాను,” అనెను. “నేను ఒకాయనను కనుగొన్నాను” అనెను. “ఈ రోజుల్లో ఈ దినమున, ఏమి జరుగవలసి ఉన్నదో, లేఖనాలలో చెప్పబడినది నీకు తెలియునా? నజరేయుడైన యేసు,” “యోసేపు కుమారుడు ఇక్కడ బయట ఉన్నాడు, ఆయన అద్భుతములు, మరియు సూచక క్రియలు చేయుచున్నాడు, ఆయన దేవుని దగ్గర నుండి వచ్చెననియు మేము ఎరుగుదుము.”

అతడు చెప్పెను, “ఆయన ఎక్కడ నుండి వచ్చునని నీవు చెప్పచున్నావు?”

“నజరేతు నుండి” అతడు చెప్పెను.

అతడు చెప్పెను, “మంచిదే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా?”

ఆయన చెప్పెను, “నాతో వచ్చి చూడుము. కేవలం ఇంకేమియు అడుగవద్దు. వచ్చి కనుగొనుము.” చూచుట విశ్వసించుట, నీవు ఆలోచించుము.

54

కనుక అతడు అక్కడకు నడచుచున్నాడు, అంతలో అతడు నడచుచూ అక్కడకు, ఫిలిప్పు వెళ్ళెను మరియు నతానియేలు వెంబడించి నడచుచుండగా, వారు సమాజములోనికి నడువగా, యేసు ఈ విధముగా నిలబడి ఉండెను మరియు అక్కడ నతానియేలు నేర్చుకోవాలన్న ఆసక్తిగలవాడై నిలబడి ఉండుట ఆయన చూచెనని, మీకు తెలియును. అతడు అనుకొనెను.... మీకు తెలుసు, ఆయన ఎవరో వ్యక్తిని లేక ఏదో ఒకటి స్వస్ధపరచువాడుగా ఉండవచ్చు, “నేను ఆ విధముగ నమ్ముదునని మీరు ఎరుగుదురు,” అని అతడు అనెను. బహుశా ఎవరో ఒక స్త్రీ అక్కడకు వచ్చి ఉండవచ్చును, అంతలో ఆయన అనెను, “ఇప్పుడు స్త్రీ నీవు పాలనా - పాలనా రోగములతో బాధపడుచున్నావు, మరియు నీవు నమ్మినట్లయితే.” మంచిది. ఆమె దానిని అంగీకరించెను.

ఇప్పుడు, నేను నతానియేలు అనుట వినగలను, “ఇప్పుడు, దానిని గూర్చి ఏమిటి? ఇప్పుడు, ఒక నిమిషము గమనించుము. ఆయన నన్ను గూర్చి ఎరుగడని నేను నీతో పందెము వేయగలను.”

అంతలో ఆయన (యేసు) చుట్టూ చూచి ఇలాగనెను, “ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదు.”

అతడు అన్నాడు, “బోధకుడా, నీవు నన్ను ఏలాగు ఎరుగుదువు?”

“ఓ,” ఆయన అనెను, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే.”

అందుకు నతానియేలు, “నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలుకు రాజువైయున్నావని” అనెను.

55

సీమోను ఈ విధముగ, ఇక్కడకు నడచి వచ్చుచున్నాడని, మీకు తెలియును. ఆయన సీమోనుతో. నీవు సీమోను బర్ యోనా యొక్క కుమారుడవు లేదా యోనా యొక్క కుమారుడవని అతనితో అనెను. “ఇప్పటి నుండి నీవు కేఫా.... లేక, పేతురు అని పిలువబడుదువు,” అని నా ఉద్దేశ్యము. “నీవు కేఫా అయి ఉన్నావు,” అనెను. “అయితే ఇక మీదట నీవు పేతురు అని పిలువబడుదువు, దానికి ”చిన్నరాయి,“ అని అర్ధము.” చూశారా.

ఆయన వానిని ఏలాగున ఎరుగును? అతని పేరును గూర్చి ఆయన ఏమి ఎరుగును? ఏ కారణం చేత, ఆయన అతని పేరును ఎరిగి ఉండెను; అతడు ఎక్కడ నుండి వచ్చెనో ఆయనకు తెలిసియుండెను. అప్పుడాయన పరిశుద్ధ యోహాను 5వ అధ్యాయంలో చాలా మంది కుంటి వారిని దాటిపోయి అక్కడ గడ్డి పరుపుపైన పడియున్న ఒక కుంటి వానిని స్వస్థపరిచెను. అయితే మరియు అక్కడున్న కుంటివారినందరిని విడిచి,

మంచిది అది ప్రశ్నించదగినదిగా ఉన్నది. విశ్రాంతి దినమున కుంటివాడు తన పరుపనెత్తుకొని వెళ్ళటను యూదులు కనుగొనెను. అందుచేత వారు యేసును ప్రశ్నించెను. ఆ కారణం చేత, “తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని, కుమారుడు తనంతట తాను ఏమియు చేయడని, నిశ్చయముగా, మీతో చెప్పచున్నాననెను.” తండ్రి ఏమి చేయునో కుమారునికి అదే చూపుచున్నాడు, మరియు కుమారుడును అలాగే చేయుచున్నాడు; తండ్రి పని చేయుచున్నాడు మరియు కుమారుడును అలాగే పని చేయుచున్నాడు,“ చూశారా. ఆయన చెప్పెను, ”నాయంతట నేను ఏమియు చేయుట లేదు, అయితే తండ్రి చేయునదే నేను చూచుచున్నాను, అలా నేనును తండ్రివలె చేయుచున్నాను.“

56

ఇప్పుడు, అది నిన్నటి యేసు. ఈ దినపు అదే యేసు. దావీదు యొక్క అదే దేవుడు, ఎందుకనగా ఆయన దావీదు వేరు చిగురు అయి ఉండెను. అది సరియేనా? ఆయనే ఉదయ నక్షత్రము. అది సరియేనా? ఆయన అ నుండి ఱ, అయి ఉండెను. అది గ్రీకు అక్షరములలో అల్పాయు - ఓమెగయు అయి యున్నాడు, ఆదియు, అంతమునై దావీదు వేరును చిగురైయుండి వర్తమాన - భూత - భవిష్యత్కాలములలో ఉండువాడు. ఓ, మై! ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి, సమస్తమూ ఆయనలో నివసించును. సహో, ఎక్బర్గ్ అతని యొక్క పాటలో చెప్పినట్లుగా, “దైవత్వము యొక్క సర్వసంపూర్ణత ఆయనయందు నివసించెను,” అది సరియైనదే, అతని యొక్క పాటలో, “ఆయన మహిమలో నుండి క్రిందకు.”

సహో, ఎక్బర్గ్ ను మనం కోల్పోతున్నాము. దేవుడు వాని హృదయమును దీవించును గాక. నేను ఆయనను ప్రేమించుచున్నాను. అతడు పాడే పాటలు ఆ సమావేశమునకు ఏదో చేయును. అతడు ఒక నిజమైన మనిషి అని నేను ఎరుగుదును. మనం తిరిగి కలసికొనువరకు, దేవుడు అతనితో ఉండవలెననునది, నా ప్రార్దనైయున్నది.

57

ఇప్పుడు, బిల్లీ కార్డులు ఇచ్చాడో లేదో నేను ఎరుగను. నీవు ప్రార్ధనా కార్డులు ఇచ్చావా? ఏమై ఉండెను.... బి. అంతా బాగానే ఉంది. ఎలాగు. నీవు ఏమి చేశావు... 1 నుండి 100? సరే, మొదటి దానిని తీసుకుందాము... అప్పుడు మొదటి దాని దగ్గర నుండి ప్రారంభించెదము, (బి) బి సంఖ్య 1. ఎవరి దగ్గర ... ఇప్పుడు, గతరాత్రి వేదిక దగ్గరకు, ఏ వ్యక్తియు రాకుండగా సభికులలో మనం ఒక ప్రార్ధనా వరుస కలిగి ఉన్నాము. ఈ రాత్రి కేవలం కొందరిని పైకి పిలవడానికి మనం ప్రయత్నించగలము, కానీ చేయలేము. (బి) బి. సంఖ్య 1, మీ చేయి ఎత్తండి? ప్రార్థనా కార్డు బి. సంఖ్య 1? [టేపులో ఖాళీ ఉన్నది]

58

ఆ సాక్ష్యముల నుండి ఉన్నవాటిని, మీరు జ్ఞాపక ముంచుకున్నారా? వాటిలో ఒకటి ఆ ప్రజలపై మీ చేతులు ఉంచుట అయి ఉండెను. నేను ఆ సన్నిధిని అనుభవించలేదు, అయితే నేను వేరొక మార్గములో దీనిని కనుగొనవచ్చును, మరియు అప్పుడు కొంచెంసేపటి తరువాత ఆ స్త్రీతో మరి ఏదో మాట్లాడవచ్చును. అక్కడ ఉన్నయెడల, అక్కడ ఒక వ్యాధి ఉన్నయెడల, ఎందుచేత అనగా, నేను దానిని తెలిసికొను సమర్ధత కలిగి ఉందును, కాని యెడల నేను చేసి ఉండలేను. మీరు ప్రార్ధనలో ఉండగలరా?

స్త్రీ మీరు ఎలా ఉన్నారు? మనం ఒకొరికొకరము క్రొత్తవారమని నేను అనుకొనుచున్నాను. నేను నిన్ను ఎరుగను, నా జీవితంలో నిన్ను ఎన్నడూ చూచి ఉండలేదు. అది సరియేనా? మనం పరిపూర్ణముగా క్రొత్తవారము. కేవలం నేను నీ చేయిని పట్టుకొనవలెనని కోరుచున్నాను, కేవలం ఒక క్షణమే, అలా ఉండుటయే... అవును, అమ్మా, నీవు... అది ఒక ఆత్మీయ స్థితి కాదు, అది ఒక భౌతికమైన స్థితి. అది ఏమై ఉన్నదనగా, ఒక కణితి, అది పెరుగుచున్నది.

ఇప్పుడు, చూడండి, నేను అది పైకెత్తి పట్టుకొని ఉందును... నేను మీకు ఏదో దానిని చూపించనియ్యండి. నా చేతివైపు చూడండి. అది కేవలం ఏ మనిషి చేతివలె కనబడుచున్నది, అది కాదా? ఇప్పుడు, నేను ఆ చేయిపై నా చేయిని ఉంచనై ఉన్నాను. అక్కడ ఏ భేదము లేదు గదా? ఇప్పుడు, నన్ను చేయనివ్వండి. కేవలం, నీ జేబులో పుస్తకం ఇక్కడ, ఈ వైపునకు ఉంచండి. నన్ను ఈ చేయిని ఈ వైపుగా ఇక్కడ ఉంచనివ్వండి. నా చేయిపై ఈ చేయిని ఉంచండి. అక్కడ ఏ భేదమూ లేదు గదా? అంతా సరియైనదిగా ఉంది, మరల ఈ విధముగా, ఇప్పుడు మరల మార్చండి, కేవలం పరిశుద్దాత్మ ఏమై ఉన్నదో మీకు చూపుటకు అయి ఉన్నది.

మీ చేయి ఇప్పుడు నా చేతిపై పెట్టండి. దాని వైపు చూడుము. ఇక్కడ నా చేయి వైపు చూడండి. ఉబ్బుచున్నది దాని మీద చిన్నచిన్న బుడిపెలు కనబడుచున్నవి. అది సరియేనా? ఇప్పుడు, కేవలం మీ చేయిని తీసివేయండి; మీ చేయిని తీసివేయండి. నేను నా చేయిని దాని మీద ఉ౦చగలను, ఇప్పుడు, అది ఉండదు, అది అలాగే కదా? చూడండి, ఇక్కడ ఉన్న దీనిమీద చూడండి, చూశారా? అది మరల జరుగదు.

ఇప్పుడు, నీ కుడిచేయి నా ఎడమ చేయిపై ఇక్కడ ఈ చేయి ఉంచండి. మరియు ఇప్పుడేమి జరిగినది గమనించండి. నా చేయి వైపు చూడండి. అక్కడ చూడండి? అది వాచిపోవుట చూడండి, దాని మీదుగా ఆ చిన్న తెల్లటి బొడిపెలు వ్యాపించుట చూడండి? నీకు ఒక వ్యాధి ఉన్నదని అది చూపించుచున్నది. అది ఒక క్రిమి, అది నీలో ఉన్న మరొక జీవమైయున్నది. అది నీ జీవము కాదు, చూశారా. అది మరొక జీవమైయున్నది. అక్కడ నీలో ఒక జీవము ఉన్నది.

59

ఇప్పుడు, కొన్ని నిమిషాలు మాట్లాడగలము మరియు ఆయన నాకు చెప్పిన యెడల చూడండి, ఆ పరిశుద్దాత్మ అది ఎక్కడ ఉన్నదో నిర్ణయము చేయును. ఆయన చేయని యెడల, నేను అది ఒక కణితి అని ఎలా ఎరుగుదును. అలా అది ఏమై ఉన్నదీ, అది ఒక కణితి అది లాగుచున్న పద్ధతిని బట్టి నేను చెప్పగలను. అంత ధృడముగా అది సరియేనా? కేవలం నీవు నాకు జవాబు చెప్పుము, అది సరియే, అది ఒక కణితి అయి ఉన్నది. అంతా సరియే. అది ఒక వరము యొక్క పని, మీరు చూశారా.

ఆ పరిశుద్దాత్మ నాకు అనుగ్రహము చూపనియెడల, అది నేను చెప్పలేను. అయితే ఆయన అనుగ్రహించిన యెడల, అది ఎక్కడ ఉన్నదీ ఆ కణితి ఎక్కడ ఉన్నదీ, ఆయన నాకు చెప్పిన యెడల, అవునండి. ఆ కణితి రొమ్ములో ఉన్నది. అది యధార్ధము కాదా? ఆయన ఇక్కడ ఉన్నాడు. చూశారా? అది సరియే. నీవు ఇక్కడ చికాగోలో నివసించుచున్నావు. [సాహోదరి “అవును,” అని బదులిచ్చెను.] నీ పేరు శ్రీమతి ఎ. ఎరిక్సన్. [“అది నిజము.”] నీవు ఆ అడ్రసు యొద్ద (నీవు లోనికి వెళ్ళట నేను చూచుచున్నాను). అది ఇలా పిలువబడెను. అది 1658 వీధి. అది నిజమే గదా? ఇప్పుడు ఇంటికి వెళ్ళుము మరియు బాగుపడుదువు.

విశ్వాసము కలిగి ఉండుము. అపనమ్మకముంచవద్దు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుము.

60

అంతా సరిగా ఉంది.

మీరు ఎలా ఉన్నారు? అయ్యా, మనం ఒకరికొకరం క్రొత్త వారము గదా? నా సహోదరుడా, అక్కడ ఉన్న నీవు నమ్ముచున్నావా? విశ్వాసము కలిగి ఉండుము. అయ్యా, మీ చేయి ఒక నిమిషము ఇవ్వండి. నీకు మరియు నాకు మధ్యలో ఒక వెలుగు నిలబడి ఉన్నది. నీవు బలహీనత కలిగి ఉన్నావు; అది నిజము, అయితే నీవు ఇక్కడ, నీకు ఉన్నదానికంటె ఒక గొప్ప సంగతి కొరకు ఏదో ఒక దాని కొరకు ఉన్నావు. కేవలం నీ వయస్సు గల ఒక మనిషికి మూత్రపిండములో ఒక చిన్న వ్యాధి కలదు మరియు ప్రోస్టేట్ వ్యాధి రాత్రులందు నిన్ను కలవర పరచి నిద్రలేపుచున్నది. నీవు అది కలిగి ఉన్నావు. అయితే అక్కడ మరొకటి ఏదో ఉన్నది, ఎందుచేత అనగా కేవలం అది కదలుచున్నది, నా దగ్గరకు లాగుచున్నది. అది యధార్ధము కాదా? నీవు ఆశించినట్లయితే...

నీ కష్టములు ఏమై ఉన్నవో దేవుడు నాకు బయలుపరచగలడని నీవు నమ్ముచున్నావా? అది నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముచున్నావా? ఆయన చిత్తమైన యెడల, అది ఏమైనప్పటికినీ, అది నిన్ను విడిచి పోవుటను, నీవది అంగీకరించగలవా, అయినను అది ఒక కొత్త గృహము పొందుటైనను లేక అది ఏమైనప్పటికి ఏమియు కాదు, నీకున్న కోరిక చాలినంత గొప్పది అయిన యెడల మరియు ఆయన సన్నిధిలో ఉండియూ నీవు ఏమై ఉన్నదీ ఆయన నాకు బయలుపరచగలిగిన యెడల, నీవు నమ్ముము. నేను నిన్ను స్వస్థపరచలేను; నీవు ఏమై ఉండవలెననునది నేను నీకు ఇవ్వలేను, అయితే దేవుడు ఇవ్వగలడు. నీవు అది నమ్ముచున్నావా? ఇప్పుడు, నేను ఆయన సేవకునిగా మాత్రమే కార్యము చేయగలను. అది యధార్ధమేనా?

నీకు అతి సన్నిహితుడగు ఎవరో ఒకని కొరకు నీవు ఇక్కడకు వచ్చియున్నావు. అది కుమారుడై ఉన్నాడు. అది నీ కుమారుడు అయి ఉన్నాడు మరియు ఆ బాలుడు అతని కన్నులలో ఏదో పొరపాటు కలిగి ఉన్నాడు. (“ఆస్టిగ్మాటిజమ్”) కంటిలోని లేక కంటి అద్దములలోని లోపము అని ఆ వైద్యుడు చెప్పాడు. ఆ బాలుడు నీ దగ్గర లేడు; అతడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఆ బాలుడు ఒక విధమైన శక్తులతో ఉన్నాడు. అతడు. అది మూర్ఛ రోగమును కలిగి యున్నాడు. అతడు మానసికముగా ఎదుగకుండ అడ్డగించే ఒక విధమైన చిన్న బాధతో ఉన్నాడు. అలాగే అది సరియైనది కాదా? నీవు అడిగిన దానిని పొందుటకు వెళ్ళనై ఉన్నావని నీవు నమ్ముదువా? అంతా బాగానే ఉంది, అప్పుడు ఇంటికి వెళ్ళుము, మరియు నీ చేయి ఆ బిడ్డపై పెట్టుము, మరియు ప్రభువైన యేసు నామములో అది పొందుకొనుము.

61

దేవునిని నమ్ముము [టేపు పై ఖాళీ ఉన్నది.] ఒక నిమిషం నీ తలను వంచుము. ఆ స్త్రీ ఆమె మీద ఒక చెవిటి ఆత్మను కలిగి ఉన్నది. నిశ్చయముగా ఒక క్షణము నీ శిరస్సును వంచుము.

గొప్ప యెహోవా దేవా, భూమ్యాకాశములు చేసినవాడవు, సమస్త వస్తువులు వాటిలో ఉన్నవి. ఈ స్త్రీ ఎంత చెడ్డదో నేను ఎరుగను, ఆమె చెవులను గూర్చి నేను ఎరుగుదును, అయితే మిరు ఇక్కడే ఉన్నారు మరియు ఆమెను స్వస్థపరచగలరు. మీరు దానిని అనుగ్రహించగలరని నేను ప్రార్ధించుచున్నాను. ఇప్పుడు మీ ఆత్మను ఆమె పైకి వచ్చినట్లు చేయండి మరియు ఆమెను బాగు చెయ్యండి. చెవిటి తనముతో బంధి౦చు ఆ దయ్యమును ఇప్పుడు అడుగుచున్నాను, “ఆ స్త్రీలో నుండి బయటకు రమ్ము. ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వార ఆమెను విడచిపెట్టుమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను.”

ఇప్పుడు నేను మాట్లాడినది నీవు విన్నావా, నీవు విన్నావా? నేను చెప్పినది నీవు వినగలుగుచున్నావా? ఇప్పుడు నీకు వినబడినవే కాదు గాని, నీవు తెలుసుకొందువు. నీకు స్త్రీలకు వచ్చు సమస్య కూడ ఉన్నది, నీకు లేదా? అది నీ దగ్గర నుండి పోయినది. నీవు అది అంగీకరించుము, నీవు అంగీకరించెదవా? అది నిన్ను గూర్చినది వింతగా కనిపించుచున్నది. నీవు.... నీకు మరియు నాకు మధ్యగా పచ్చని రంగు గల జలములు ప్రవహించుచున్నవి. నీవు ఏదో స్థలం నుండి వచ్చావు... నీవు చైనా నుండి వచ్చావు. నీవు ఒక మిషనెరీవి అయి ఉన్నావు. నీవు పసుపు రంగు ప్రజలకు (చైనా వారికి) పరిచర్య చేయుచున్నావు. నీవు నన్ను ఒక ప్రశ్న అడుగగోరుచున్నావు. అంతలో నన్ను ఇలా అడుగ గోరుచున్నావు. నీవు వెనుకకు వెళ్ళాలా లేదా అను దానిని గూర్చి నీవు ఆలోచించి ఉన్నావు. అది నిజము. ఇప్పుడు, అలా నీవు ఎప్పటి వలె ఇంటికి తిరిగి వెళ్ళి మరియు బాగుగ ఉందువని నీవు నమ్మదువా? ఆనందించుచు నీ మార్గమున వెళ్ళుము. దేవుడు నీతో ఉండును.

విశ్వాసము కలిగి ఉండుము.

62

అవునండి. కడుపులో బాధ, చాలా బాధాకరముగా తీవ్రముగానే ఉంది. మరొకసారి నీ చేయి నాకు ఇయ్యి. ఓ, అవును, చాలా బలహీనమైన కడుపు బాధ. ఇప్పుడు నిన్ను దేవుడు మాత్రమే రక్షించగలడు. నీవు దానిని నమ్ముచున్నావా? నా చేయి నీ చేతిపై ఉంచుచూ, నీకు కడుపులో బాధ ఉన్నదని నేను ఏలాగు ఎరిగి ఉందును? నా సహోదరుడా, అది ఖచ్చితముగా సరియైనది. నీవు బాగుపడనై ఉన్నావని నీవు నమ్ముచున్నావా? నీ మొదటి పేరు అలెన్, అది కదా? నీ చివరి పేరు గ్రట్స్ అది నిజము కదా? దేవుడు నిన్ను దీవించును. నీవు ఇల్లినాయిస్లో, వాకిగాన్ నుండి వచ్చావు. తిరిగి వెనుకకు వెళ్ళి, మరియు నీ రాత్రి భోజనము తినుము.

స్త్రీ సంబంధమగు వ్యాధితో నీవు బాదపడుచున్నావు, నీవు బాగుపడగలనని నీవు నమ్ముచున్నావా? నిన్ను ఏదో అడుగగోరుచున్నాను. కొన్ని నిమిషాలకు ముందు అక్కడ వెనుక ఒక కుర్చీని నీవు విడచిపెట్టేటప్పుడు, ఏదో ఒకటి జరిగి ఉన్నది, అది అలా జరుగలేదా? ఇప్పుడు, ఆనందించుచూ, ఇంటి వైపుకు వెళ్ళుము, మరియు సంతోషముగా ఉండి, దేవునికి వందనములు చెల్లించుచూ వెళ్ళుము.

63

స్త్రీలకు వచ్చు బాధ, కీళ్ళ నొప్పులు, ఇంకా చాల సమస్యలు. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయగలడని నీవు నమ్ముచున్నావా? నా సహోదరీ, నేను కూడ దానిని నమ్ముచున్నాను. పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఈ స్త్రీని దీవించుచున్నాను. ఇప్పుడు, ఆ పరిశుద్దాత్మ ఆమె దగ్గరకు వెళ్ళను గాక, మరియు ఆమె అడిగిన ఆశీర్వాదము యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఆమెన్.

సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. ఆనందించుచూ నీ మార్గములో వెళ్ళుము.

64

నీవు నమ్ముచున్నావా? నీకు మరియు నాకు మధ్యలో రక్తము వచ్చి ప్రవహించుచున్నది, అది తెల్లగా మారుచున్నది. సరే, దానికి కారణం ఏమనగా, నీకు మధుమేహ వ్యాధి ఉన్నది. మధుమేహ వ్యాధియే నిన్ను గుడ్డివానిగ చేసి పరుగెత్తించుచున్నది. మధుమేహ వ్యాధి నుండి బాగుపడి నీవు ఇంటికి వెళ్ళుచున్నావని మరియు నీవు నీ దృష్టిని పాందుచున్నావనియు మరియు నీవు విశ్వసించుచున్నావా? నీవు నిలబడి ఉన్నావని నమ్ముము, నీ సహోదరుని సన్నిధిలో కాదు, గాని ఆయన సన్నిధిలో నిలబడ్డావని నీవు నమ్ముము, నా సహోదరుడా, నేను నిన్ను దీవించుచున్నాను. మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీలో నుండి దీనిని దూరముగా తోలివేయుచున్నాను. ఆమెన్. ఆనందించుచూ, నీ పూర్ణహృదయముతో నమ్ముచూ, సంతోషించుచూ వెళ్ళుము.

నీవు సరిగా అక్కడ ఒక కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు నీవు స్వస్థపడినావని, నేను నీతో చెప్పిన యెడల ఏమిటి, నీ పూర్ణహృదయముతో దానిని నీవు నమ్ముచున్నావా? దేవుడు మిమ్మను దీవించును.

65

అయ్యా, మీరు ఎలా ఉన్నారు? నీవు నన్ను ఇలా ఉండినట్టు నమ్ముము. ప్రతీ ఒక్కరు, భక్తి భావముతో ఉండండి; కేవలం ఒక క్షణము. నీవు ఇక్కడ ఎవరో ఒకరి కొరకు ఉన్నావు. అది నీ భార్యయే. ఆమె వెనుక భాగంలో ఏదో పొరపాటు ఉన్నది. అక్కడ ఒక వెన్నెముఖ సంబంధమైన బాధ ఉన్నది.

ఆ స్త్రీ ఆమె వెనుక భాగంలో కీళ్ళ నొప్పలతో ఉన్నది, సరిగా అక్కడ వెనుక నడుముపై పింకు రంగుతో కనబడుచు, సరిగా అక్కడ కూర్చుని ఉన్నది. అవును. అయితే ఆమె నీ భార్య కాదు. అయితే నీ వెనుక భాగంలో నీకు కీళ్ళ నొప్పులు ఉన్నవి, మరియు నేను. నిలబడి ఉండుట నేను చూడగలిగి ఉన్నాను మరియు అక్కడ నీ తరువాత కూర్చున్న స్త్రీకి కూడ కీళ్ళ నొప్పులు ఉన్నవి. సరిగా నీ వెనుక ఉన్న స్త్రీకి, తెలుపురంగు దుస్తులతో ఉన్న ఆమెకు కీళ్ళనొప్పులు ఉన్నవి. అమ్మా అది సరియేనా; మీ ముగ్గురూ, పైకిలేచి నిలబడండి; వెళ్ళండి దేవుడు మిమ్మును దీవించును.

మిమ్మును లాగుచుండెడి ఆ దయ్యము అదే చూశారా? నీవు నీ భార్యను ప్రత్యేకముగా ఉండుటను కనుగొననై ఉన్నావు. ఇక ఏ కష్టమూ ఉందదు. నీకు మలద్వారమునకు సంబంధించిన బాధ కలదు, నీకు లేదా? నా సహోదరుడా, ఇప్పుడు దేవుని యందు విశ్వాసముంచుచూ వెళ్ళుము మరియు బాగుగ ఉందువు. నేను ప్రభువైన యేసు నామములో నిన్ను దీవించుచున్నాను. ఆమెన్. దేవుడు నిన్ను దీవించును.

66

మధుమేహ వ్యాధి చెడ్డ విషయమైయున్నది. అయితే యేసుక్రీస్తు స్వస్థపరచువాడు. నీవు అది నమ్ముచున్నావా? నీవు దానిని అంగీకరించెదవా? అప్పుడు యేసుక్రీస్తు నామములో, వెళ్ళి మరియు బాగయి ఉండుము. విశ్వాసము కలిగి ఉండుము.

అక్కడ చిన్న ఎర్రగా ఉన్న దుస్తులతో సరిగా ఆ వెనుక కూర్చున్న వర్ణజాతి స్త్రీ, అది ఆమెకు అవతల పట్టుకొనిన దానివలె కనబడుచున్నది. అమ్మా, నీకు ప్రార్థనా కార్డు ఉన్నదా? నీకు లేదు, లేక నీకు ఉన్నదా? నీకు ప్రార్థనా కార్డు లేదు. అక్కడ సరిగా కళ్ళజోడుతో వెనుక ఉన్న స్త్రీ నీకు ప్రార్ధనా కార్డు లేదు. నీకు లేని యెడల కేవలం ఒక నిమిషం నిలబడుము. నీ పూర్ణ హృదయంతో నమ్ముచున్నావా? నీ పూర్ణహృదయంతో యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచగలడని నమ్ముచున్నావా? ఒక శస్త్ర చికిత్స కొరకు నీవు నిర్ణయించుకొన్నావు. నీవు అది ఎరిగి ఉన్నావు. నీవు ఎరుగవా? శస్త్రచికిత్స జరిగినది. అది యధార్ధము కాదా? అయితే నీవు దానిని నమ్మగలిగిన యెడల యేసుక్రీస్తు నిన్ను బాగు చేయగలడు.

ఆ చిన్నవానిపై నీ చేయి ఉంచుము... అక్కడ నీముందు కూర్చున్న ఆ మనిషి, అక్కడ బయట కూర్చుండెను, ఎందుకనగా అతడు నరముల బలహీనత వ్యాధితో బాధపడుచున్నాడు. ప్రభువైన యేసు ద్వారా, నేను అ దయ్యమును ఖండించి గద్దించుచున్నాను. యేసుక్రీస్తు నామములో వారిని విడచిపెట్టుము. ఆమెన్. ఆమెన్.

67

ఆ స్త్రీని తీసుకొనిరమ్ము, ఓ, సజీవుడైన దేవుని పిల్లలారా, నీ ప్రభువైన యేసు ఇక్కడే ఉన్నాడని నీవు ఎరిగి ఉండలేదా? నీకు సహోదరుడు కాడు, అయితే నీకు రక్షకుడే. విశ్వాసము కలిగి ఉండుము. స్త్రీ మనం ఒకరికొకరం క్రొత్త వారము, అది నిజమై ఉన్నది. ఒక క్షణము మీ తల వంచండి.

ప్రభువా, యేసు అను నీ కుమారుని నామములో ఆమె మంచిగా మరియు మరల స్పష్టముగా వినగలిగినట్లు ఆ స్త్రీ నుండి ఈ చెవిటితనమను ఆత్మను బయటకు తీసివేయండి. సర్వశక్తుడవైన తండ్రీ, నేను యేసుక్రీస్తు నామములో ఈ దయ్యమును గద్దించుచున్నాను. ఆమెన్.

కేవలం ఒక క్షణము. నీ వినికిడిని పరీక్షించగోరుచున్నాను. ఇప్పుడు సరిగా అంతయూ నేను చెప్పినది వినగలుగుచున్నావా? ఇప్పుడు నేను చెప్పినది వినగలుగుచున్నావా? నీకు వినుటకు కష్టముగా ఉన్నది. నేను నిన్ను ఏదో అడుగగోరుచున్నాను. నీవు ఈ రాత్రి జరిగిన సేవను నమ్ముచున్నావా? ఇప్పుడు, నేను ఆ స్త్రీని ముందుకు వెళ్ళునట్లుగా చేసి ఉందును. అయితే ఏదో ఆమె దగ్గరకు నన్ను కదలునట్లుగా చేయుచున్నది. అక్కడ ఏదో ఒక వ్యత్యాసమైనది కలదు. నీ చేయి కేవలం ఒక నిమిషం చూపించుము.

ఆయన సేవకునిగా నన్ను నీవు నమ్ముచున్నావా? [“అవును.”] ఆయన దాని గూర్చి సమస్తమూ ఎరుగునట్లుగా సమస్త హృదయముల యొక్క రహస్యములు దేవుని ఎదుట బహిరంగముగా చూపించబడెనని నీవు నమ్ముచున్నావా? [“నాకు తెలియును.”] యేసుక్రీస్తు ఇక్కడ నిలబడి ఉండిన యెడల, ఈ సూటు బట్టలు నాకు ఇచ్చిన ఆయన మరియు ఈ రాత్రి దానిని ధరించి ఉండెనని నీవు నమ్ముచున్నావా? స్వస్థతకు సంబంధించినంత వరకు, ఆయన ఇది వరకే నిన్ను స్వస్థపరిచెను. అయితే ఆయన నీవు ఏమయి ఉన్నావో ఎరిగి ఉండును. నీ మీద ఉన్న ఏదో ఒక కరడు అదే నీవు కోరినట్టుగా చేయుచున్నది. అవును. నీ కడుపులో నీకు ఏదో ఒక సమస్యను కలిగి ఉన్నావు. అది ఒక కణితి, అది సరియైనదే గదా? అది చనిపోయినది. అది నీ యొద్ద నుండి పోయినది.

నీ ప్రక్కనే నిలబడి ఉన్న ఒక చిన్న బాలుని నేను చూచుచున్నాను. ఓ, అతడు ఒక చిన్న బాలుడు, నీవు నీతో ఒక చిన్న బాలుని కలిగి ఉన్నావు. అయితే అతడు నీ బాలుడు కాదు. అతడు నీ చిన్న మేనల్లుడు. అది నిజము. అతడు వెళ్ళలేడు. నీవు వానిని పాఠశాలకు పంపలేవు, ఎందుకనగా అతడు చెడ్డవైన టాన్సిల్స్ (గొంతుకు ఇరువైపులా ఉండు గ్రంథులలో ఒకటి) గలవాడు. అది సరియైనది కాదా? వెళ్ళి, ఆ చేతి తువాలు వానిపై ఉంచుము. అతడు బాగుపడును.

68

నీవు నమ్ముచున్నావా? సరిగా ఇప్పుడే ప్రభువైన యేసును స్వీకరించుము. నీవు ఎక్కడ ఉంటున్నావు? ఎన్నుకొనబడెను, పిలువబడెను, అభిషేకించబడెను, క్రీస్తులో నియమింపబడెను, యేసుక్రీస్తునందు పరలోక స్థలములలో కూర్చుండపెట్టబడెను. ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? అప్పుడు నీ పాదములపై పైకి లేచి మరియు మీలో ప్రతి ఒకరు, స్వస్థతను పొందుకొనుము. ఆమేన్.

ఓ పరలోకపు దేవా, నేను యేసుక్రీస్తు నామములో ప్రతి దయ్యమును గద్దించుచున్నాను. యేసుక్రీస్తు నామములో వారిలో నుండి బయటకు రమ్ము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...