ఈ గొప్ప సేవకుడైన, మోషే
మొదటిగా అక్కడ కూర్చొన్నది మీ అబ్బాయి అని నేను తలంచాను, సహోదరుడు ఉడ్, అక్కడ చివరన అక్కడ ఆ స్త్రీ వ్రాయుచున్న చోట, కానీ అతడు కాదు. నేను నా కన్నులు తెరచినప్పుడు, ప్రభువు యొక్క దూత అక్కడ వ్రేలాడుచున్నది. అక్కడ కూర్చొన్నది డేవిడ్ అని నేను తలంచాను. కానీ అది డేవిడ్ కాదు, అని నేను అనుకొను లేదు. నీవు డేవిడ్ ఉడ్ కాదు కదా? ఇక్కడ కూర్చొని ఉన్న నీవు, నిజముగా నీవు అతడి యొక్క కవల సహోదరుని వలె ఉన్నావు. అది డేవిడ్ ఉడ్ కాదు.
ఏదో జరుగుటను ఇప్పుడే నేను చూచియున్నాను. ఆమేన్. ఓ, ఎంత అద్భుతము. ప్రభువు యొక్క మార్గములు ఆగమ్యములు, అవి కాదా? ఆమేన్. “ఒకవేళ నీవు నమ్మలేనట్లయితే,” ఆయన చెప్పెను, “సమస్తము సాధ్యమే.”
అది సరే, మనము వాక్యమును తెరవబోవుచున్నాము. దానిని నేను నాతోనే ఉంచుకొని మరియు దేవుడే దానిని బయలుపరచవలెనని నేను నమ్ముచున్నాను, ఓ, అవసరతను ఆయన చూచుచున్నాడు.
2
ఇప్పుడు సంఖ్యాకాండములోని 20వ అధ్యాయము, త్వరగా. బహుశా దేవుని చిత్తమైతే, ప్రసంగము కొరకు ఇరవై నిమిషములు తీసుకొనెదము. మరియు ఇప్పుడు, నీవు సిద్దముగా ఉండుము. ఇప్పుడు ఏమి జరుగబోవుచున్నదో నాకు తెలియదు. ప్రభువైన యేసు మన కొరకు ఏమైనా చేయును. మీరు ఆయనను ప్రేమించుచున్నారా? “ఆమేన్,” చెప్పండి. ఇప్పుడు, “ఆమేన్” అనగా అర్థము “అలా జరుగును గాక.” చూశారా. మరియు ఇప్పుడు, మేము ఆయనను నిజముగా ప్రేమించుచున్నాము.
అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను,
నీవు కర్రను తీసుకొని, నీవును నీ సహోదరుడైన అహారోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.
యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను.
“ఈ గొప్ప సేవకుడైన మోషే,” అను దానిపై నేను ఇప్పుడు కొద్ది క్షణములు మాట్లాడగోరుచున్నాను.
3
అక్కడ కూర్చొని వ్రాసుకొనుచున్న, సహోదరీ నీకు ఏమైనా బాగుగా అనిపించుచున్నదా? ఆ చిన్న స్త్రీ కూర్చొని... ఇప్పుడు చాలా బాగుగా అనిపించుచున్నది. అవును కదా? అమ్మా, నీవు స్వస్థపడియున్నావు. ఆ చిన్న గుండె సమస్య మరియు నీవు బాధపడుచున్న సంగతులు మరియు కిడ్నీ సమస్య, అది కూడా మరియు నీకు ఉబ్బు నరములు (వారికోస్ వెయిన్స్) ఉన్నవి, అవి నిన్ను ఇబ్బంది పెట్టుచున్నవి. మరియు అది నిజమే కదా? ఒకవేళ అది నిజమే అయితే, నీ చేతిని ఊపుము. అప్పుడే నీవు స్వస్థపడెదవు. ఆమేన్. దేవునికి స్తోత్రము.
నేను చుట్టూ ఆమె వైపు చూచాను మరియు కొంచెము సేపటి క్రితము నేను ఆమెను చూశాను, ఆమె చాలా నిరుత్సాహముగా కనబడినది మరియు నేను వెనుకకు చూడటం జరిగినది, దూత అక్కడ నిలబడియుండుటను నేను చూశాను. మరియు చాలా మట్టుకు డేవిడ్ వలె ఉన్నాడు. ఇక్కడ, నీవు శ్రీ. ఉడ్ ను కలవవలసియున్నది. నీవు అతని బిడ్డవలె ఉన్నావు, అతని యొక్క ప్రతిరూపముగా. నేను వెనుకకు తిరిగాను, మరియు నేను తలంచాను, “బహుశా అతడు డేవిడ్ కావచ్చు,” ఎందుకనగా డేవిడ్ నన్ను ప్రేమించి మరియు నమ్ముచున్నాడని నాకు తెలుసు.
పిదప నేను క్రిందకు చూశాను, మరియు అది ఆ చిన్న స్త్రీపై వ్రేలాడుచున్నది. ఆమె యొక్క సమస్య ఏమిటో నేను చూశాను. ఒక్కసారే, నేను వెనుకకు చూచాను, మరియు ఆమె నవ్వుచున్నది. నేను తలంచాను, బహుశా, నేను ఆమెకు చెప్పవచ్చును మరియు అది ముగిసినది అని ఆమెకు తెలియజేయవచ్చును, కనుక ఆమె... ఆమేన్. మరియు ఆమె నా యొక్క ప్రసంగ పాఠమును లేక దేనినో తీసుకొనుచున్నది.
అది సరే. ఓ, ఆయన ఆశ్చర్యకరుడు కాదా? అది ఆ విధముగానే పనిచేయును. అది అలాగే చేయును. కేవలము... నీవు ఆయనను తప్పించుకొనలేవు. మనకు సహాయము చేయుట కొరకే ఆయన ఇక్కడ ఉండెను.
4
ఇప్పుడు, ప్రభువు చెప్పెను... మోషేకు కర్రను తీసుకొనమని చెప్పెను. ఇప్పుడు, మేము కర్ర (లేక దండము)ను గూర్చి మాటలాడగోరుచున్నాము. మరియు తీర్పుకు సంబంధించిన దండము. మోషేను గూర్చి మాటలాడుటను నేను ప్రేమించెదను. అతడు యాజకుడు, రాజు మరియు చట్టమును (ధర్మశాస్త్రము) ఇచ్చువాడు; మోషే ప్రతీది ప్రభువైన యేసుక్రీస్తునకు మాదిరియై యున్నవి.
అతడు లోకములో ఒక అందమైన బిడ్డగా జన్మించెను. ఇంకొక మాటలో, అతడొక ప్రవక్తగా జన్మించెను. వారు దేవున్ని చూచినప్పుడు వారు భయపడలేదు... మోషే జన్మించినప్పుడు ఏ రకమైన సంగతి జరిగియున్నది. అది పరిగణింపబడలేదు, కానీ మోషే జన్మించినప్పుడు ఏదో జరిగియున్నది, ఎందుకనగా అతడి యొక్క తల్లిదండ్రులు దానిని చూచియున్నారు, మరియు దానిని ఎరిగి రాజు ఏమి చెప్పినను వారు లెక్క చేయలేదు. వారి యొక్క కుమారుడు క్షేమముగా ఉండునని వారు ఎరిగియున్నారు, మరియు వారు భయపడలేదు.
5
కనుక అతడు పొదలలో నుండి తీయబడి, మరియు సరిగా పెంచబడ్డాడు. ప్రతీ విషయములోనూ అరణ్యములోనికి పోయెను, మరియు ఇశ్రాయేలు ప్రజలను నడిపించెను. ఒక చట్టమును ఇచ్చువాడు, ఒక యాజకుడు మరియు అతడు క్రీస్తు ఏమైయున్నాడో అదంతయూ అయియున్నాడు. మాదిరిగా అతడు, మరియు క్రీస్తు ముందస్తు మాదిరి అయియున్నాడు.
ఇప్పుడు, ఒకవేళ మనము గమనించినట్లయితే, మోషే, అతడికి నలభై సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి, అతడు ఫరో యొక్క కుమార్తెగా పిలువబడుటకు నిరాకరించెను. మోషే యొక్క జీవితం ఒక వృత్తములో తిరుగును, మూడు వృత్తములు; మొదటిగా, నలభై; తరువాత, ఎనభై; పిదప అతడు చనిపోయినప్పటికి నూట-ఇరవై. కేవలము ఒక పరిపూర్ణ...
నేను లేఖనము గుండా వెళ్ళగలను, మరియు కృపాయుగమును చూపించగలను, నీరు, రక్తము, ఆత్మ యొక్కయు, నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్కయు, క్రీస్తు యొక్క మొదటి, రెండవ మరియు మూడవ రాకడ. నీవు మాదిరిగా కోరుచున్న ప్రతీది, అది నేరుగా... మరియు లేఖనములో ఉన్న ప్రతీది నేరుగా వాటిలోనికి దొర్లును. ఆ అక్షరములు, ఆ విధముగా.
6
ఇప్పుడు, మరియు మోషే, అతడు... మొదటి నలభై సంవత్సరాలు అతడు బోధింపబడ్డాడు. మోషే యొక్క బోధకుడు ఎవరని మీరు అనుకొనుచున్నారు? అతడి తల్లి. అతడు అంతకన్నా ఉత్తమమైన దానిని కలిగియుండలేడు, ఎందుకనగా తన యొక్క సొంత బిడ్డను పెంచుటకు ఆమె ఒక శిక్షకురాలిగా నియమింపబడెను. నేను మీకు చెప్పెదను, దేవుడు నిశ్చయముగా అక్కడ సాతానుపై ఒకడిని లేపెను, అవును కదా? ఆయన ఖచ్చితముగా చేసెను. మరియు మోషే, ఇప్పుడు ఎరిగియుండి, అతడి యొక్కతల్లి యొద్ద నుండి తను పెంచబడిన... ఆమె ఒక ఆత్మీయురాలైన స్త్రీ.
ఆమెను గూర్చి కొద్దిగానే చెప్పబడినది, కానీ సహోదరుడా, ఆమె తన యొక్క కిరీటమును పొందుకొనునప్పుడు నేను మహిమలో ఉండగోరుచున్నాను. అవునయ్యా, ఏమి జరుగునో చూచుటకు. తిన్నగా శత్రువు యొక్క మధ్యలో ఆమె ఆ చిన్నవానికి ఎట్లు బోధించెను, తిన్నగా దాని యొక్క అగ్నిగుండము యొక్క సెగలో, మరియు ఆ ప్రదేశము నుండి దేవుని యొక్క బిడ్డలను విడిపించునది అతడే అని అతడికి చెప్పెను.
7
మోషే అది ఎరిగియుండి, ఒక పండితునిగా, “నేను బయటకు వెళ్ళి మరియు సంగతిని క్రమబద్దీకరించెదను అని నేను ఊహించుచున్నాను,” అని అతడు చెప్పెను. కనుక అతడు నలభై సంవత్సరముల వయస్సున్నవాడు, కనుక అతడు తలంచాడు, దానిని చేయుటకు నేను వృద్దుడనైపోవుచున్నాను. కనుక అతడు విషయమును తన స్వంత చేతిలోనికి తీసుకొని విఫలమయ్యెను. మరియు విషయమును మన చేతులలోనికి తీసుకొను ప్రతీసారి మనము విఫలమయ్యెదము. దేవుని నడిపింపును బట్టి సాగిపొమ్ము. ప్రభువు ఏమని చేయమని చెప్పునో, అప్పుడు నీవు దానిని చేయుము మరియు నీవు ఎన్నడూ విఫలము చెందవు. నీవు విఫలమవ్వలేవు, ఎందుకనగా నీవు ప్రభువు యొక్క నడిపింపులో కొనసాగుతున్నావు.
ఒకవేళ మోషే గనుక కొంచెముసేపు ఎదురుచూచినట్లయితే, మరియు సంగతులను పక్వము చెందించినట్లయితే మరియు సంగతులు... మరియు ఆ ఋతువు. నీవు ఒక మొక్కజొన్నను ఇప్పుడు ఇప్పుడే నాటి, మరియు దానిని ఒక గంటలో వెళ్ళి కోయలేవు. నీవు దానిని అక్కడే పడియుండునట్లు చేయవలెను. విత్తనము చనిపోయి, మరియు క్రుళ్ళిపోవలెను, మరియు వసంత ఋతువులో ఆ మొక్కజొన్నలో నుండి నూతన జీవము బయటకు వచ్చును.
ఆ విధముగానే ఇప్పుడు మనము చేసెదము. ప్రజల యొక్క హృదయములలో విత్తనమును మనము పెట్టుచున్నాము. ఈ గొప్ప కోత సమయము వచ్చినప్పుడు, (నేనేమి చెప్పుచున్నానో అర్థము చేసుకొనుచున్నారా?) అది ఒక రూపమును తీసుకొని, మరియు ఒక గొప్ప సంగతి జరుగును.
8
ఇప్పుడు, మోషే పరిస్థితిని తన స్వంత చేతిలోనికి తీసుకొన్న తరువాత అతడు పూర్తిగా విఫలమయ్యెనని కనుగొనెను, మరియు ఫరో యొక్క సన్నిధి నుండి మరియు దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోయెను, మరియు నలభై సంవత్సరములు ఎక్కడో ఒక అన్యునిగా జీవించెను. మరియు అతడు ఒక ఇథియోపియా బాలికను వివాహము చేసుకొనెను. మరియు ఆమె బహు ముక్కోపి. మరియు మోషే కూడా చాలా కోపము కలిగియుండెను. అదే అతడి సమస్య. మరియు కొన్నిసార్లు, ఆ ఎడారి వెనుక భాగమున సంగతులు అంత ప్రశాంతముగా లేవని నేను కేవలము ఊహించుచున్నాను. కానీ దేవుడే ఆమెను అతడికి ఇచ్చెను.
9
ఇప్పుడు, ఒకవేళ నీవు వివాహము చేసుకొన్న స్త్రీకి గనుక కొంచెము కోపము ఎక్కువ అని నీవు భావిస్తే, బహుశా దేవుడు నిన్ను నిమ్మళపరచుటకు ప్రయత్నించుచున్నాడు, (మీరు చూశారా?) మరొక విధముగా (నీకు గనుక కోపము ఎక్కువైతే, బహుశా దేవుడు నీ భార్యను నిమ్మళపరచుటకు) ప్రయత్నించుచున్నాడు.
కనుక సిప్పోరా ఒక రకమగు బహు ముక్కోపి. తన యొక్క కుమారుని గోప్యాంగ చర్మమును కత్తిరించి మరియు మోషే ముందు విసిరినప్పుడే ఆమె దానిని రుజువు చేసెను మరియు, “నీవు నాకు రక్తసంబంధమై పెనిమిటివైతివి,” అని చెప్పెను. మై! కొన్నిసార్లు సంగతులు అంత ప్రశాంతముగా లేవని నేను ఊహించగలుగుచున్నాను. మరియు అక్కడ ఆ వెనుక దేవుడు... ఆయన ఏమి చేయున్నాడు? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో దానిని బాలుని యొక్క మనస్సులో, లేక ఆ వ్యక్తి యొక్క మనస్సులోనికి నేర్పించుచున్నాడు.
మోషే అక్కడ వెనుక ఎదురుచూస్తూ ఉన్నాడు, మరియు అతడు అక్కడ ఉన్నాడు. అతడు ఏమి చేశాడు? తన మామగారైన, యిత్రో దగ్గర పనిచేయుటకు అతడు వెళ్ళియున్నాడు మరియు ఆ ఎడారి ప్రాంతములలో అతడు తన మందను కాయుచుండెను. ఈ రాత్రి దేవుని యొక్క సహవాసము నుండి బయటకు వెళ్ళిపోయిన ఒక విశ్వాసి యొక్క పరిపూర్ణ చిత్రము మన ముందు ఉన్నది.
10
అక్కడ అతడు, సహవాసము లేకుండా, ఆ నలభై సంవత్సరములలో దేవుడు అతని కొరకు చేసెను అని చెప్పుకొనుటకు ఒక్క సంగతి కూడా లేక ఏ రకముగానైనా, ఏ సహజాతీతమైనది లేదు. అతడు సహవాసమునకు వెలుపల ఉండెను మరియు సంఘము దేవుని యొక్క సహవాసము నుండి దూరమైతే అద్భుతములు ఆగిపోవును; సూచక క్రియలు మరియు ఆశ్చర్య కార్యములు ఆగిపోవును; ఉజ్జీవములు ఆగిపోవును. నీవు సహవాసము నుండి బయటకు వెళితే, దేవుడు వెంటనే బయటకు వెళ్ళిపోవును.
చేయవలసిన సంగతి ఏదనగా, (అదే కొద్దిసేపటి క్రితము నేను చెప్పుటకు ప్రయత్నించుచున్నాను) దేవుని యొక్క ప్రేమను నీలో నిలిచియుండనిమ్ము. ఆయనతో సహవాసము కలిగి ఉంటే, మరియు మనము పరిపక్వము చెందుచుండగా ఆయన ఈ ఇతర కార్యములను జత చేయును. మీరు అలా అనుకొనుటలేదా?
కనుక, మోషే, సహవాసమునకు వెలుపల, ఒక క్రొత్త దేశములో సహవాసము లేదు - కొత్త వ్యక్తుల మధ్యలో, తన సొంత ప్రజలు కాదు. అక్కడ ఉన్న ప్రజలు కూషు దేశస్తులు, మరియు అతడు ఒక యూదుడు. మరియు అక్కడ, పూర్తిగా దేవుని నుండి వేర్పాటు, అనిపించుచున్నది మరియు దేవుడు ఎల్లప్పుడు ఎరిగియుండెను, ఎంతగా గందరగోళముగా ఉన్నప్పటికీ దేవుడు - మానవుడు దేవుని యొక్క ప్రణాళికలో నుండి (ఎంత గందరగోళము) చేసినప్పటికీ, దేవుడు దానిని తిన్నగా చేయబోవుచున్నాడు. అది నిజము.
11
కనుక కేవలము తెలుసుకొనండి, ఎటువంటి మచ్చ, ముడత, కళంకము లేని ఒక సంఘము దేవుని ముందు ఉండబోవుచున్నది. దేవుడు దానిని చేయబోవుచున్నాడు. మరియు ఒకవేళ సత్యమును ప్రసంగించుటలో నేను విఫలమైనా, మరియు సహోదరుడు జోసఫ్ సత్యమును ప్రసంగించుటలో విఫలమైనా మరియు అక్కడ ఉన్న సహోదరులైన మీరు సత్యమును ప్రసంగించుటలో విఫలమైనా, “దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టించగలడు.” ఎవరో ప్రసంగించి మరియు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసమును గూర్చి పోరాడబోవుచున్నారు. ఎవరో సంఘమును ముందుకు లాగనైయున్నారు. అది నిజము.
కాబట్టి చిత్రము ఎంతగా పాడుచేయబడినప్పటికీ, మోషే సుమారుగా మూడు రోజులలో చేసిన దానిని సరిచేయుటకు దేవునికి నలభై సంవత్సరములు పట్టెను, కేవలము తిరిగి ఆ చిత్రమును సరిచేయుటకు ఆయన కేవలము మోషేను తీసుకొని మరియు ఇక్కడ కూర్చొండబెట్టెను, మరియు అతడిని సరిచేయుటకు అతడికి ఒక కోపిష్టి అయిన భార్యను ఇచ్చెను, మరియు ఆయన దానిని తిన్నగా సరిచేయు వరకు దేవుడే క్రిందకు ఇక్కడకు దిగివచ్చి తిరిగి చిత్రమును కట్టుచుండెను. కానీ దానిని చేయనైయున్నానని ఆయన నిశ్చయించుకొనెను, మరియు ఆ విధముగా చేయవలెనని ఆయన మోషేను నిర్ణయించెను. ఓ, నేను దానిని ఇష్టపడెదను.
12
దేవుడు ఏమి నిశ్చయించెనో అది జరగనైయున్నది. ఓ, అది మీకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చుట లేదా? దేవుడు ఏమి నిశ్చయించెనో, అది జరగవలయును. అది నిజము. దానిని ఏ విధముగానైనా ఆయన చేయబోవుచున్నాడు.
కనుక మనము ఎటువంటి సమయమును చూచెదము, దేవుడు తిరిగి తన చిత్రమును కట్టుచున్నాడు. ఒకరోజు, మోషే, దేవునితో సహవాసమునకు బయట, బహుశా ఇలా ఆలోచించియుండవచ్చు, మంచిది, ఇశ్రాయేలీయులు ఇలా ఆలోచించి యుండవచ్చు, మంచిది, ఇశ్రాయేలీయులు ప్రజలను విడిపించుట అనే దర్శనము అదంతా గతించి పోయియుండవచ్చును. నేను ఎడారిలోనే జీవించి, ఇక్కడే మరణింతునని నేను ఊహించుచున్నాను, దానిని గూర్చి అంతయూ అదే. నేను ఈ లోకములో ఎందుకు జన్మించాను, లేక బహుశా అక్కడ అలా నడుచుచూ ఉండవచ్చును. అతడు చేతిలో ఒక కర్రను కలిగియున్నాడు.
మరియు అతడు నడుచుచూ ఉండగా, దేవుడు ఒక దూత యొక్క రూపములో మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యెను. మరియు మోషే దానిని చూచెను, “ఇప్పుడు, ఇక్కడ, నేను తప్ప వేరే కాపరులెవ్వరూ లేనిచోట, ఆ పొద ఏ విధముగా మండుచున్నదని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఇక్కడకు ఎవరైనా వచ్చి మరియు ఆ పొదకు మంటబెట్టిరా?” అని అతడు చెప్పుచూ ఉండవచ్చును అని నేను ఊహించుచున్నాను. అతడు దానిని గమనించెను మరియు అతడు దానిని గమనించెను, అది కాలిపోలేదు... ఏదో విధముగా నీ ఏకాగ్రతను ఆకర్షించుటకు దేవుడు ఒక మార్గమును కలిగియున్నాడు, కలిగి లేడా?
13
ఆయన ఒక రోజు యాయీరును ఆకర్షించాడు, చిన్న యాయీరు అతడు దైవిక స్వస్థత యందు నమ్మిక కలిగిలేనప్పుడు... ఆయన దానిని నమ్మియున్నాడు, మరియు అతడు యాయీరు యొక్క హృదయాన్ని కోరుకున్నాడు, కనుక ఆయన కొంచెము... ఆయన చేయగలిగిన ఒక సంగతి, అతడి యొక్క కుమార్తెను మొత్తెను మరియు ఆమెను చనిపోనిచ్చెను, కాబట్టి యేసు వచ్చి ఆమెను తిరిగి లేపగలడు, కేవలము అతడిని నిజముగా ఆకర్షించుటకు. మీరు చూశారా? దేవుడు దానిని చేయును. కొన్నిసార్లు మంచము పట్టించును, కొన్నిసార్లు రోగము, కనుక మీరు గ్రహించునట్లుగా, పైకి చూచునట్లుగా ఆయన మిమ్ములను చేయును.
ఆ పాత కాపరి యొక్క కథలవలే... ఒక గొర్రెను కలిగియుండెను, వారు దాని యొక్క కాలును విరుగగొట్టిరి. అతడు అడిగాడు, “గొర్రె తన కాలును ఎలా విరుగగొట్టుకున్నది?”
ఆయన చెప్పెను, “నేను దాని కాలును విరుగగొట్టాను.”
“ఎందుకు నీ యొక్క సొంత గొర్రె యొక్క కాలును విరుగగొట్టుటకు నీవెంత క్రూరుడవు.”
14
చెప్పెను, “లేదు.” “అది నన్ను పట్టించుకొనదు,” అని చెప్పెను. అందుకే నేను దాని కాలును విరుగగొట్టవలసి వచ్చినది, అప్పుడు దానిని నా చుట్టూ వేసుకొని, (భుజాలపై) కొంచెము లాలించి, దానికి కొంత ప్రత్యేకమైన ఆహారమును ఇచ్చినయెడల, అది నన్ను ప్రేమించి మరియు నన్ను వెంబడించును.
కొన్నిసార్లు దేవుడు ఆ విధముగానే చేయవలయును. ఒక రకముగా మనలను విరుగగొట్టి, ఒక్కొక్కసారి మనకు కొంచెము అదనపు ఆహారమును ఇచ్చుటకు, మీకు తెలుసా, ఒక రకముగా మనలను ఇంకొంచెము ప్రేమించుటకు ఈ రాత్రి ఖచ్చితముగా ఎందుకు నేనొక సువార్త సేవకునివలె ఉండవలసి వచ్చినదో మీకు తెలియునా, ఎందుకనగా డాక్టరు గారు నేను బ్రతకను అని చెప్పినప్పుడు, ఆయన ఒక రకమగు రోగముతో వచ్చెను. అది ఖచ్చితముగా నిజము. అది నన్ను మార్చివేసినది, నన్ను కదిలించి వేసినది.
ఒక ప్రసంగీకుని యొక్క ఆలోచనలను నేను ద్వేషించాను. మరియు ఒకసారి నేను బాంటమ్ వెయిట్ (బాక్సింగ్ లో బరువు విభాగము) పోటీలకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, “చెప్పుము!” (నీలము రంగు కోటు ధరించాడు.) “నీవు కూడా ఈ చిన్న గుంపులో పెట్టబడిన, బాప్టిస్టు బోధకులలో ఒకరిగా ఉన్నావు,” అని చెప్పాడు.
15
మరియు నేను చెప్పాను, “బాబు చూడుము, దానిని చెప్పినప్పుడు నీవు నవ్వుచున్నావు.” చెప్పుము, “నేను అప్పుడే నా భాగస్వామితో పోరాడుటకు సిద్దపడియున్నాను. నేను ఎటువంటి ప్రసంగీకుని వలే లేను.” మరియు దేవుడు ఏమి చేశాడో మీరు చూశారా? ఒకవేళ ఆయన నన్ను నా వీపుపై అలాగే పడుకోబెట్టినట్లయితే, “అంతా అయిపోయినది” అని డాక్టర్లు చెప్పేవారు.
మరియు పిదప ఆయన వచ్చి నాకు ఒక చిన్న ప్రత్యేకమైన వైద్యము చేసి, కొంచెము నూనె పోసి, మీకు తెలుసు, మరియు “ఇప్పుడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను,” అని చెప్పెను.
నేను చెప్పాను, “అవును ప్రభువా. నేను కూడా నిన్ను ప్రేమించుచున్నాను.” దానిని బట్టి, తరువాత మేము స్నేహితులుగా మారాము. కొన్నిసార్లు యేసు ఆ విధముగానే చేయును, కొంచెము గిలాదులో ఉన్న గుగ్గిలమును పోయవలెను, మీకు తెలుసు, ఆయన మిమ్ములను ప్రేమించుచున్నాడు, మిమ్ములను స్వస్థపరచును మరియు మీరు బాగవ్వాలని కోరును, మరియు ఆయనను ప్రేమించాలని, మరియు సేవించాలని, ఆయన యందు నమ్మిక యుంచాలని అని చెప్పుటకు కార్యములను నిమ్మళపరచును. ఆయన ఆశ్చర్యకరుడు కాదా?
పిదప, ఆ విధముగానే ఆయన మోషేతో చేస్తూ ఉన్నాడు, అక్కడ వెనుక. మరియు మోషే ప్రక్కకు తప్పుకొని (అతడి దృష్టిని ఆకర్షించినది) మరియు అతడు వెనుక అక్కడకు చూచాడు. మరియు అతడు తలంచాడు, “మంచిది ఇప్పుడు, మోషే, ఇప్పుడు నీవు ఇలా ఆలోచిస్తూ ఉన్నావని నేను ఊహించుచున్నాను.”
16
ఆ పేద, వృద్దుడైన మోషే అక్కడకు కుంటుచూ తన యొక్క పొడుగాటి, తెల్లని గడ్డము మరియు జుట్టుతో అక్కడకు వెళ్ళుచుండుట ప్రభువు చూచాడని నేను తలంచుచున్నాను.
“మంచిది, సంవత్సరాల క్రితము, నేనొక దర్శనమును చూచాను, మరియు దేవుడు ఇశ్రాయేలీయులు ప్రజలను ఖచ్చితముగా విడిపించునని నేను తలంచాను, కానీ దేవుడు తన యొక్క వీపును నావైపు త్రిప్పియున్నాడు. నేను ఇక్కడ వెనుక దానిపై పోరాడుచున్నాను. కనుక నేను ఈ విధముగానే నిలిచియుండవలసియున్నదని నేను తలంచుచున్నాను.”
మరియు దేవుడు ఈ విధముగా చెప్పుటను నేను ఊహించగలుగుతున్నాను, “దీనుడా, నీవు గ్రహించునట్లు చేయుట కొరకే నేను దానిని చేయవలసియున్నది. అయితే నేను నీతోనే ఉన్నానని ఇప్పుడు నేను నీకు చూపించబోవుచున్నాను.”
కాబట్టి ఆయన అతడి దృష్టిని ఆకర్షించాడు. మంచిది, మోషే దృష్టిని ఆకర్షించాలని ఆయన కోరెను. మీకు తెలుసు, దేవుడు కొన్నిసార్లు మిమ్ములను అనారోగ్యమునకు గురిచేసి మరియు ఆసుపత్రికి తీసుకు వెళ్ళును, అక్కడ ఆ వైద్యుడు నీవు బ్రదకబోవుట లేదు అని చెబుతాడు, నీ దృష్టిని ఆకర్షించటకు ఆయన ఆలాగు చేయును. నీవు దానిని పిలుస్తావు, నీవు చింతించవద్దు. వైద్యుడు చెప్పేంత వరకు నీవు ఎదురుచూస్తూ ఉండుము... ఓ, నీవు చెప్పెదవు, “నేను దైవిక స్వస్థతను నమ్మను, అటువంటిది ఏమి లేదు. అదంతయూ బుద్దిహీనత.” “ఆశలు నీరుగారి పోయినవని,” ఆ వైద్యుడిని చెప్పనివ్వండి. నీ దృష్టిని ఆకర్షించుటకు, దేవుడు నిన్ను... కార్యములను చేయుటకు ఆయన ఒక మార్గమును కలిగియున్నాడు. ఆయన తన సొంత మార్గములో వాటిని చేయును. హల్లెలూయా! మై, అది నన్ను నిజముగా అరిచెడి ఒక మెథడిస్టు వలె చేయుచున్నది.
17
చూడండి. ఎందుకనగా దానిని చేయునది, దేవుడే. మీరు చూచారా?ఆయన తన సొంత మార్గములోనే దానిని చేయును. ఆయన కేవలము... కార్యములను చేయుటకు ఆయన ఒక మార్గమును కలిగియున్నాడు, కలిగి లేడా? మరియు ఆయన కలిగి యున్నందులకు నేను చాలా సంతోషించుచున్నాను. ఆమేన్.
కనుక ఇప్పుడు మనము చూచాము, ఆయన మోషే దృష్టిని ఆకర్షించెను, కాని చెప్పుటకు, ఇప్పుడు, అది ఒక వింతైన దృశ్యముగా ఉండును. మీకు తెలుసా, ఆయన నీ దృష్టిని ఆకర్షించుటకు కొన్నిసార్లు దేవుడు కార్యములను కొంచెము వింతగా చేయును. అది నిజము.
ఎవరో నా దగ్గరకు వచ్చి మరియు, “హే, ఈ రాత్రి ప్రసంగించుటకు వారు ఇక్కడకు ఒక పరిశుద్ద బండరాయిని తీసుకుని వచ్చారని వారు చెప్పుచున్నారు. నేను కొంచెము అక్కడకు వెళ్ళి మరియు అదంతయూ దేనిగురించో చూచి వచ్చెదనని నేను నమ్ముచున్నాను,” అని చెప్పారు.
మిల్టౌన్ బాప్టిస్టు పాస్టర్, అది నా యొక్క ప్రాంతములో ఈ రాత్రి మిల్టౌన్ బాప్టిస్టు చర్చి వద్ద, విలియమ్ హాల్, ఆ వ్యక్తి అక్కడకు వచ్చాడు, ఎందుకనగా అతడు దానిని పత్రికలో వేశాడు, చెప్పాడు, “ఈ వ్యక్తి ప్రసంగించినప్పుడు నీవు ఇక్కడకు రావలెను. ఆయన చిన్న బిల్లీ సండే.”
18
మరియు అతడు ఇక్కడకు వచ్చి, మరియు ఓ, అతడు మంచి హోదా కలిగియున్నాడు. అతడి జుత్తు అతడి ముఖము పైకి వ్రేలాడుచున్నది, మరియు ఒక పన్ను బయటకు కలిగి యుండి, మరియు ఒక పెద్ద పొగాకు గొట్టము కలిగియున్నాడు, మరియు దానిని అతడు ఆలయమునకు బయట చుట్టి పెట్టియున్నాడు, ఆ విధముగా, దానిని విదిలించి వేసిన తరువాత, లోపలికి నడిచి, మరియు చెప్పాడు, “ఆ చిన్న బిల్లీ సండే ఎక్కడ? నేను అతడిని వినాలని కోరుచున్నాను.”
డీకన్ సహోదరులు చెప్పారు, “ఇప్పుడు, కూర్చొనండి, మిస్టర్ హల్.” అతడు ఒక కరుకైన వ్యక్తి.
పిదప అతడు చెప్పాడు, “బహుశా నేను ఇంకా కొంచెము దగ్గరకు వచ్చెదను. బిల్లీ సండే ఏ విధముగా ఉండునో నేను చూడగోరుచున్నాను,” అని అతడు చెప్పాడు. కేవలము అపహాస్యము చేయుచుండెను. మీరు చూశారా? మరియు ఆ రాత్రి, అతడు రక్షింపబడెను. ఆమేన్. మరియు అదే సంఘములో ఈ రాత్రి అక్కడ అతడే కాపరియైయున్నాడు.
19
చూశారా, నిన్ను ఆకర్షించుటకు దేవుడు ఒక మార్గమును కలిగియున్నాడు, అవును కదా? ఒకసారి ఆయన నిన్ను ప్రక్కకు లాగివేయును.
కనుక అతడు చెప్పాడు, “ఇప్పుడు ఇది మోషేకు కొంచెము వింతగా కనపడును, సామాన్యమైన దానిలో నుండి కొంచెము ప్రత్యేకముగా. కనుక నేను ఆ అగ్నిస్తంభమును అక్కడ ఉన్న ఆ పొదలోనికి పంపెదను, మరియు దానిని... ఎందుకనగా అదియే అతడిని ఏ విధముగానైనా అరణ్యమంతటి గుండా నడిపింపబోవుచున్నది. మరియు నేను దానిని మండుచుండుటకు ప్రారంభించెదను, మోషేను ఇక్కడకు వచ్చునట్లు చేయుదును.”
కనుక అతడు మోషే యొక్క దృష్టిని ఆకర్షించెను. కాబట్టి అతడు ఇంకొంచెము దగ్గరగా లాగబడెను, మీకు తెలుసు, “మంచిది, అది వింతగా కనబడుచున్నది. ఆ సంగతి (పొద) కాలిపోదు. అతడు మాట్లాడుటకు తగినంత దగ్గరగా వచ్చినప్పుడు... ఓ, నేను అక్కడకు వెళ్ళగోరుచున్నాను, మీరు వెళ్ళగోరుట లేదా, మాట్లాడుటకు తగినంత దూరము, మాట్లాడుటకు తగినంత దూరములోనికి రండి.
ఆయన చెప్పెను, “మోషే.”
అతడు చెప్పెను, “అవును, ప్రభువా? నేను ఇక్కడ ఉన్నాను.”
“ఇప్పుడు నీ పాదరక్షలను తీసివేయుము. నీవు పరిశుద్ధ స్థలములో నిలబడి యున్నావు.”
కనుక మోషే తన చెప్పుల వారును విప్పి, కొంచెము దగ్గరగా నడిచెను, “ఇది ఏమిటి ప్రభువా?” అని అడిగాడు
20
మరియు ఆయన అన్నాడు, “నేను విన్నాను... ఇప్పుడు, మోషే, నేను నీ గురించి చూచిన దానిని గూర్చి, ఒక్క మాట కూడా నీతో చెప్పబోవుట లేదు, కానీ నేను నా ప్రజల యొక్క మూలుగులు విన్నాను, మరియు అబ్రాహాముతో నేను చేసిన నిబంధనను జ్ఞాపకముచేసుకొన్నాను.” ఆమేన్. మరొక మాటలో, ఆయన మాట. “అబ్రాహామునకు నేను చేసిన వాగ్దానమును జ్ఞాపకము చేసుకొనుచున్నాను.”
ఆయన అబ్రాహాముకు ఇచ్చిన అదే వాగ్దానమును, ఆయన మీకును ఇచ్చియున్నాడు, ఎందుకనగా మీరు అబ్రాహాము యొక్క సంతానమైయున్నారు. మరియు ఆయన చెప్పెను, “అబ్రాహాముతో నా వాగ్దానమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను, మరియు నా పిల్లలను విడిపించుటకు నేను దిగివచ్చియున్నాను, వారిని వాగ్దాన దేశమునకు నడిపించుము, మరియు నేను నిన్ను పంపుచున్నాను.
మోషే చెప్పాడు, “ఓ, మంచిది, నేను సరిగా మాట్లాడలేనని నీవు చూచియున్నావు. నేను అనర్గళముగా మాట్లాడలేను.” మరియు “నేను మంచిగా మాట్లాడలేను,” అని చెప్పాడు. మరియు, “నేను నోటి మాంద్యము గలవాడను,” అని చెప్పాడు. “నేను దానిని చేయలేను.” ఆయన చెప్పెను, “మంచిది, ఆహ్, మరియు అటువంటి వాటికి, అహారోను తన యొక్క మార్గములో ఉన్నాడు.”
కనుక ఆయన చెప్పెను, “మోషే, నీ చేతిలో ఏమున్నది?”
అతడు చెప్పెను, “ఒక కర్ర.” అతడు కలిగియున్న దంతయూ అదే, కేవలము ఒక పాత కర్ర, ఎక్కడో ఎడారిలో అతడు దానిని తీసుకొనెను, గొర్రెలను మందలలో తోలుటకు, లేక అతడు ఎక్కడికి వెళ్ళినా, వాటిని తోలుచుండెను. కేవలము ఒక పాత కర్రను అతడు విరిచియుండెను, ఎందుకనగా అతడు చెప్పెను, అది ఒక కర్ర.
21
“మోషే, దానిని క్రిందకు విసిరివేయుము,” అని ఆయన చెప్పెను. మరియు అతడు కర్రను క్రింద వేసినప్పుడు, అది ఒక సర్పముగా మారెను, మరియు మోషే పారిపోయెను. “దానిని తీసుకొనుము,” అని ఆయన చెప్పెను. మరియు తోకతో అతడు దానిని పైకి తీసెను, మరియు అది తిరిగి కర్రగా మారెను.
మోషే, “నేను ఈ రోజు వింతైన కార్యములను చూచియున్నాను,” అని చెప్పియుండవచ్చునని నేను తలంచుచున్నాను. కాబట్టి ఆ కర్ర సర్పముగా మారుట అతడు చూచెను. ఇప్పుడు, ఆ కర్ర ఏమిటి? దానిపైనే మనము మాట్లాడుకొనబోవుచున్నాము. ఆ కర్ర ఏమిటి?
అది ఇక ఎంత మాత్రము ఒక సాదారణ కర్ర కాదు. ఏలయనగా అది సర్వశక్తి గల దేవుని యొక్క తీర్పు దండమై యున్నది. అది దేనికి గురుతుగా ఉన్నది? సిలువ. మరియు పిదప, ఏ విధముగా సిలువకు అది సాదృశ్యముగా ఉన్నది? ఎందుకనగా స్వాభావికముగా అది కర్ర. ఆత్మీయముగా అది ఒక సర్పము. మరియు సర్పము ఏ విధముగా యేసుకు సాదృశ్యముగా ఉండును?
సర్పము, అది ఒక సరీసృపమై యుండగా, ఒక పాము, పాపము ఇప్పటికే తీర్పు తీర్చబడినది అను దానికి అది మాదిరిగా ఉన్నది. ఏలయనగా ఏదెను తోటలో సాతాను సర్పములోనే ఉండి పాపము చేసెను. అది సరీసృపము (ప్రాకెడిది) కాదు, అతడు మానవునికి, మరియు జంతువుకు మధ్య తప్పిపోయిన గొలుసు (Missing Link) అయియున్నాడు. మరియు అతడు అక్కడ నిలబడి లేక నిటారుగా నడిచియున్నాడు, మరియు సమస్త భూజంతువులన్నిటిలో - సరీసృపాలు కాదు - చాలా యుక్తిపరుడై యున్నాడు.
అతడు శపింపబడినప్పుడు, అతడి కాళ్ళు అతడి నుండి దూరమయ్యెను, మరియు అతడు తన కడుపుతో ప్రాకుచుండెను. మరియు అతడు ఒక సరీసృపము (ప్రాకెడి జంతువు)గా మారినప్పుడు అతడు అప్పటికే తీర్పు తీర్చబడియున్నాడని కనబడుచున్నది.
22
మరియు పిదప ఇప్పటికే తీర్పు తీర్చబడిన సర్పములోని పాపము క్రీస్తే అయియున్నాడు, జగత్తు పునాది నుండి గొర్రెపిల్ల వధించబడినది. మీరు దానిని చూచారా?
ఇప్పుడు, అతడు కర్రను తీసుకొనెను, మరియు కర్రపైనున్న సహజాతీతమైనదేదనగా ఒక సర్పము. సహజాతీతమైనది, అతడి చేతిలో ఒక సర్పము. స్వాభావికముగా, అది అతడి చేతిలో ఒక కర్ర; సిలువ మరియు క్రీస్తు కలిపి తీర్పు.
ఇదిగో అతడు ఐగుప్తుకు వెళ్ళుచున్నాడు, నేను చాలాసార్లు చెప్పినట్లుగా, “ఒక్క వ్యక్తి దండయాత్ర.” తన భార్యను, పరుగెత్తి తన భార్యను పట్టుకొని, మరియు ఆమెను గాడిదపై కూర్చొండబెట్టి, ఒక బిడ్డను ఒక తొడపై, మరొక తొడపై మరొకరిని, మరియు ఇదిగో అతడు ఐగుప్తు వైపుకు వెళ్ళుచున్నాడు, దానిని జయించుటకు వెళ్ళుచున్నాడు. జయించుటకు ఐగుప్తునకు వెళ్ళుచున్న ఒక్క వ్యక్తి దండయాత్రను మీరు ఊహించగలరా? కానీ అతడు దానిని చేయగలిగెను, ఎందుకనగా అతడు దానిని చేయునని దేవుడే అతడికి వాగ్దానము చేసేను.
23
మరియు అతడు అక్కడ ఉండియుండగా, మోషే లోనికి వెళ్ళినప్పుడు, అతడు ఈ కర్రను నదిపై అల్లాడించెను, మరియు అవి రక్తముగా మారెను. తరువాత అతడు వాటిని ఆకాశమువైపు అల్లాడించెను, మరియు సూర్యుడు నలుపాయెను. మరియు ప్రతీచోటా అతడు ఆ కర్రను, అతడి ముందు పెట్టుకున్నప్పుడు, అది తీర్పు. తీర్పు కర్రకు ముందుగా వెళ్ళెను. ఎందుకనగా కర్రయే తీర్పు దండమైయున్నది. మీరు గ్రహించారా?
ఇప్పుడు, అతడు ఈగలను కావాలని కోరినప్పుడు, అతడు ఈ కర్రను గాలిలో ఆ విధముగా లేపియున్నాడు, మరియు కొంత ధూళిని విసిరియున్నాడు, మరియు ఆ మట్టి ఎగరగా, ప్రతీచోట నుండి ఈగలు వచ్చెను. తీర్పు, దైవికమైన తీర్పు.
ఆయన ఆకాశము నుండి అగ్నిని తీసుకొని వచ్చెను, భూమి పైకి మెరుపులు, గొప్ప వడగండ్లను మరియు ప్రతీది ఆ పశువులను చంపి వేసెను, మరియు ఐగుప్తీయులను మరియు అందరినీ చంపివేసెను; తీర్పు. మోషే ముందు దేవుని యొక్క తీర్పు.
24
ఇప్పుడు, మోషే తీర్పు కర్రను అతడి ముందు పెట్టుకొని వెళ్ళెను, సంఘమునకు, ఈ రాత్రి అదే కర్ర, యేసుక్రీస్తు అయియున్నాడు. ఒకవేళ ఆ ఐగుప్తీయులు గనుక ఆ చిన్న వంకర కర్రను మోషే యొక్క చేతులలో నుండి తీసుకొనగలిగితే, వారు అతడిని కొట్టగలిగి యుండేవారు. మరియు దెయ్యము గనుక యేసుక్రీస్తు నామములో ఉన్న దైవత్వమును బయటకు తీసివేయగలిగితే, వాడు సంఘమును కొట్టియుండెడివాడు.
కానీ ఆ తీర్పు దండము తీర్పును తీసుకొనుటకు, తీర్పును తీసుకొని వచ్చుటకు మోషేకు ముందుగా వెళ్ళెను, కాబట్టే మన యొక్క తీర్పును తీసుకొనుటకు యేసు యొక్క నామము మనకు ముందుగా వెళ్ళును, మన యొక్క రోగముల నిమిత్తము తీర్పును భరించును; మరణము యొక్క తీర్పును భరించును; మన ఇబ్బందులను గూర్చిన తీర్పును భరించును.
యేసు నామమును నీతో కొనిపొమ్ము,
ప్రతీ చింత నుండి ఒక కవచముగా,
మీ చుట్టూ సమస్యలు చుట్టిముట్టినప్పుడు,
ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును శ్వాసించుము.
25
రోగము వచ్చుట ప్రారంభించినప్పుడు, ఆ యేసు నామమును ఉచ్చరించుము. అది ఏమిటి? అది తీర్పును గూర్చి దేవుని యొక్క ప్రాతినిధ్యము. క్రీస్తు ఇప్పటికే మీ పాపముల కొరకు తీర్పు పొందెను; మీ శోధన కొరకు క్రీస్తు ఇప్పటికే తీర్పు తీర్చబడెను; మీ రోగము నిమిత్తము క్రీస్తు ఇప్పటికే తీర్పు తీర్చబడెను. నేను ఏమి చెప్పుచున్నానో చూడండి? అది దేవుని యొక్క తీర్పు దండము. ఎంత కాలమైతే ఆ దండము అల్లాడించబడునో, అంత వరకూ అది తీర్పు అయియున్నది.
మోషే, ఆ రాత్రి, ఇశ్రాయేలీయులు పిల్లలను బయటకు నడిపించిన తరువాత, అక్కడ ఫరో యొక్క సైన్యము వచ్చుచున్నది, అగ్నిస్తంభము క్రిందకు వెళ్ళి, ఫరో మరియు తరుముచున్న సైన్యము మరియు ఇశ్రాయేలీయులకు మధ్య వ్రేలాడినది. అది ఇశ్రాయేలీయులకు వెలుగును మరియు ఫరోకు చీకటిని ఇచ్చియున్నది, మరియు వారిని వేరుపరిచినది. ఆమేన్. మధ్యన వెళ్ళినది. ఓ, ఆయన మన మధ్యవర్తిగా ఉన్నందుకు ఈ రోజు నేను చాలా సంతోషించుచున్నాను.
26
రోగములో, జీవమునకు మరియు మరణమునకు మధ్యలో, ఆయన నా మధ్యవర్తియైయున్నాడు. ఆయనే ఒక చేతితో మరణమును మరియు మరొక చేతితో జీవమును తీసుకొనువాడైయున్నాడు. మానవుణ్ణి దేవునితో జతచేయు ఆ గొలుసు ఆయనే మధ్యవర్తి
మధ్యన-వెళ్ళువాడుగా ఆయన క్రిందకి దిగి వచ్చెను. మరియు ఇశ్రాయేలీయులు ముందుకు కొనసాగుటకు ఆయన ఈ ప్రక్కన వెలుగును ప్రసరించెను, మరియు ఫరోని వెనుకకు పట్టియుంచుటకు చీకటిని చేసెను. అదే దేవుని యొక్క దూత ఈ దినము సంఘములో ఉన్నది, ముందుకు కొనసాగుటకు సంఘమునకు వెలుగును ఇచ్చుచున్నాడు మరియు దానిని తృణీకరించిన వారికి చీకటినిచ్చుచున్నాడు. మనము వెలుగు సంబంధులమైయున్నాము. ఆమేన్.
చీకటిలో నడుచునప్పుడు నీవెట్లు చూడగలవు? నీవు చూడలేవు. ఎక్కడికి వెళ్ళుచున్నావో నీవు ఎరుగవు, కానీ ఒకవేళ నీవు వెలుగులో ఉన్నట్లయితే, మరియు క్రీస్తే వెలుగు. మరియు ఆ విశ్వాసులకు ఆయన వెలుగునిచ్చుచున్నాడు, అదే సమయములో అవిశ్వాసులకు ఆయన అంధకారమును ఇచ్చుచున్నాడు. విశ్వాసికి ఒక మార్గమనే త్రోవను ఆయన చూపుచున్నాడు, మరియు అవిశ్వాసికి ఒక అంధకారమును, మరియు అడ్డు బండను ఇచ్చుచున్నాడు.
27
మరియు ఈ రాత్రి అలాగే ఉన్నది. మనము వాగ్దాన దేశమువైపు అడుగులేస్తూ ఉండగా, దైవిక స్వస్థత, భాషలతో మాట్లాడుట, కేకలు, మరియు దేవుని యొక్క మహిమలు అనువాటి యొక్క మార్గము పై దేవుడు వెలుగును ప్రసరించుచున్నాడు, వెలుగు సంబంధులైన పిల్లలకు వాటిని ప్రత్యక్షపరచుచున్నాడు, మరియు వారు ఎక్కడకు వెళ్ళుచున్నారో వారు ఎరుగకుండునట్లు, వారు తొట్రిల్లు పడునట్లు, అక్కడ చీకటిని విసిరివేయుచున్నాడు.
గుర్తించుకొనుడి అదే కర్ర, ఆ తీర్పు దండమును పట్టుకున్న అదే చేయి, అతడు క్రిందకు వచ్చినప్పుడు, మరియు దేవుని యొక్క మార్గము అక్కడ ఉన్నది, ఎర్ర సముద్రము పైన చాపెను, మరియు ఆ ఎర్ర సముద్రము, తీర్పును చూసి, భయపడి, మరియు వెనుకకు మళ్ళెను, ఇరుప్రక్కలా, మరియు స్తంభమువలె నిలిచెను. మరియు నడుస్తున్న ఇశ్రాయేలీయులు ఆరిన నేలపై సముద్రపు అడుగు భాగమున నడిచిపోయిరి.
28
మరియు సున్నతి లేనివారు, వారు ఏమీ కానప్పుడు, వారు ఏదో అయ్యున్నారని నటించుటకు ప్రయత్నించుచున్నప్పుడు, ఆ విధముగా చేయుటకు ప్రారంభించినప్పుడు, దేవుడు వారిని ఓడించెను, రథముల చక్రములను ఊడదీసెను, మరియు గుర్రములను భయపెట్టెను, అక్కడ ఆ సముద్రపు అడుగు భాగమున, ఒక గొప్ప సమూహములో వచ్చుచున్నవారిని ఓడించెను. మరియు మరొక ప్రక్క అదే తీర్పు, లోయలో పాపమున్నప్పుడు అక్కడ... దేవునికి స్తోత్రము. అది ఏమి చేయునో మీకు తెలుసా? వారికి (దారి) చూపుచున్న అదే అగ్నిస్తంభము, అది ఈ లోయ దగ్గరకు వచ్చినప్పుడు, అది నేరుగా నీళ్ళ పైన కదలాడెను మరియు వారు ఎక్కడైతే ఉన్నారో, అక్కడ దారి చేసేను.
పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకుండా, సున్నతి గలవారు నడుస్తున్న చోట నీవు నడవలేవు. హల్లెలూయా! ఓ, దాన్ని గూర్చి ఆలోచించుటకు అది నన్ను భక్తిపరవశుడిని చేయుచున్నది.
29
యుద్దము జరుగుచున్నది. ఏదో ఒక రోజు మనము రెండు గొప్ప, పెద్ద, చీకటి లోయలు.... లేక స్తంభములు, లోయ అని పిలువబడును, ఇరుప్రక్కలా గోడలను కలిగియుండును, ఆ మరణ ఛాయల లోయగుండా మనము వెళ్ళవలయును. దావీదు చెప్పెను, “నీవు నాకు తోడైయున్నందులకు, నేను ఏ అపాయమునకు భయపడను.”
మరియు వారు ఆ గొప్ప, మహిమకరమైన, అగ్నిస్తంభము యొక్క వెలుగు, ఈ నీటిపై సుడులు తిరుగుతూ ఉండటం, ఆ గొప్ప, పెద్ద, భయంకరమైన కొండలను అక్కడ చూసి, బహుశా నలభై బార్ల లోతు, క్రింద ఆ బురదలో అంత లోతులో, మరియు ప్రభువు యొక్క దూత వారిని మార్గములో నడిపించుట చూశారు. ఒకవేళ దూత గనుక వెళ్ళుచూ ఉంటే, అది ఒక మార్గమును చేయుచున్నది, మరియు మార్గములో ఎటువంటి భయము లేదని ఆ ఇశ్రాయేలీయులు ఎరిగియున్నారు. ఆమేన్.
అయితే ఈ దినములలో ఒక దినము, అటువంటి మరణాంధకార లోయ గుండానే మనము రావలసియున్నది. ఆ వేకువ చుక్క నీ ముందర నడుచుచూ, మార్గమునకు వెలుగునిచ్చి మరియు నీవు నడుచు విధముగా మార్గమును సాధ్యపరచునంత కాలము, మనము ఏ అపాయమునకు భయపడము. కొంచెము ఆవలిగట్టునే వాగ్దాన దేశము ఉన్నది. ఆమేన్. దానిని బట్టి నేను ఆనందించుచున్నాను.
గమనించండి, వారు అవతలి వైపునకు వెళ్ళిన తరువాత, ఈ సున్నతి లేని వారు చెప్పుచున్నారు, “సరే, ఒకవేళ వారు దానిని చేయగలిగితే, మేము కూడా చేయగలము.” మరియు సముద్రములో మునిగిపోయారు, గందరగోళపడి, మరియు మునిగిపోయి మరియు సముద్రపు లోతుకు వెళ్ళిపోయారు.
30
వారు కొనసాగిపోయారు. ఒక రోజు వారికి నీరు కావలసి వచ్చినప్పుడు, దేవుడు మోషేతో చెప్పెను... జాగ్రత్తగా, వినండి. ఓ, దీని యొక్క ఈ భాగమును మీరు పట్టుకొనవలెనని నేను కోరుచున్నాను. దాని యొక్క బంగారపు త్రాడు ఇక్కడ ఉన్నది. ఆ ప్రజలు, “మేమెక్కడ త్రాగుదుము, మా చిన్న బిడ్డలు ఆకలికి అలమటించుచున్నారు?” అని దాహముగొనుచూ మరియు వారు తిరుగుచూ ఉన్నారు.
వారి యొక్క చిన్న బిడ్డలు రోగము బారినపడినప్పుడు, దేవుడు ఒక ఇత్తడి సర్పమును నిలబెట్టెను: మరియొక గురుతు, మరొక కర్ర, మోషే తన చేతిలో కలిగియున్నటు వంటిది, దాని చుట్టూ ఒక సర్పము చుట్టబడి కేవలము ఒక గురుతులో ఉన్నది. అది ఏమిటి? తీర్పు. మీ భీమా పథకము యొక్క లాభములోని భాగమును (వంతు) తీసుకొనుటైయున్నది. ఆమేన్. కల్వరిపై ఆ లాభమును తీసుకొనుచున్నాము. ఎందుకనగా మోషే... యేసు చెప్పెను, “అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును పైకెత్తినట్లుగా, మనుష్యకుమారుడు కూడా పైకెత్తబడవలెను.”
31
ఆయన బహుళార్థమైన కారణముల కొరకు పైకెత్తబడెను, ఎందుకనగా వారు విమర్శించుకొనుచూ, మరియు ఒకరినొకరు తోసుకొనుచూ, మరియు ఒకరితో ఒకరు పోట్లాడుకొనుచూ, మరియు మోషేను తృణీకరించుచున్నారు. మరియు వారు పాపము చేయుచూ రోగముల బారిన పడుచున్నారు. మరియు రెండు కారణముల కొరకు అది పైకెత్తబడినది: వారి వెనుకకు జారిన తనమును క్షమించుట మరియు వారి యొక్క రోగములను స్వస్థపరచుట.
“మరియు మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడెను, ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగియున్నది.”
లేఖనము! దాని యొక్క ప్రతీ ఒత్తు, ప్రతీ మాట. దేవుని యొక్క నిత్యవాక్యము, అది ఎన్నడూ గతించిపోదు. ఆమేన్. ముఖ్యమైన మూలరాయియైన, యేసుక్రీస్తు ద్వారా వేయబడిన ఆ పునాదిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మన యొక్క ఒప్పుకోలు మరియు ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మికయుంచుట ద్వారా సజీవమైన దేవుని యొక్క ఆలయములో మనమందరము కలిపి వివిధ భాగములుగా నిర్మించబడుచున్నాము. వారిలో ఉన్న అదే వెలుగు భవనములో తిరుగుతూ ఉన్నది.
32
మోషేను గమనించండి. ఇప్పుడు, అతడు బయటకు వెళ్ళియున్నాడని అతడు చెప్పాడు, మరియు అతడు ప్రార్థించాడు, మరియు చెప్పాడు, “ప్రభువా, ఈ జనులు దాహముగొనియున్నారు, మరియు వారికిచ్చుటకు నీళ్ళు లేవు, మరియు నీళ్ళు కొరకు వారు నాకు మొర్రపెట్టుచున్నారు.” మరియు మోషే మరియు అహరోనులు గుడారము వద్దకు వెళ్ళి మరియు ప్రభువు ముందు ప్రార్థించిరి, మరియు దేవుని యొక్క షెకీనా మహిమ వారి చుట్టూ పడెను ఆమేన్. షెకీనా మహిమ, దేవుని యొక్క ప్రసన్నత వారి చుట్టూ వచ్చెను.
ఎందుకు, సహోదరుడా, ఒక మంచి, పాత-కాలపు పరిశుద్ధాత్మ కూడికలో నీవు అనుభవించిన దానికన్నా ఎక్కువేమి కాదు, దేవుని యొక్క షెకీనా మహిమ మీ మధ్యన కుమ్మరింపబడినప్పుడు అదే సంగతి.
మోషే తన చేతులను దేవుని ముందు పైకెత్తియున్నాడు, దాదాపుగా వారి ముందు రూపాంతరము చెందాడు, దేవుడు చెప్పెను, “మోషే, నేను నీ ముందు వెళ్ళెదను, మరియు ఆ బండపై ఖాళీలో నిలబడెదను.” నేను దానిని ఇష్టపడుచున్నాను. “నేను నీకు ముందుగా వెళ్ళుచూ మరియు మీకొక మార్గము సిద్ధపరచుటకు బండపై నిలబడెదను. మరియు నీవు వచ్చినప్పుడు, బండను కొట్టుము. ఇప్పుడు కర్రను తీసుకొనుము, మరియు జనులను సమకూర్చుము, మరియు వెళ్ళుము మరియు ఈ బండను కొట్టుము, మరియు ఇది ఆ బండలో నుండి నీళ్ళను బయటకు తీసుకొని వచ్చును.” ఓ, మై! “నీ ముందు నేను ఆ బండపై నిలబడుదును.”
చూడుము. మోషే వేచియుండవలయును. దేవుడు మోషే ముందర వెళ్ళి మరియు బండపై నిలబడెను. దీని యొక్క ఆత్మీయ అర్థమును మీరు పట్టుకొనవలెనని నేను కోరుచున్నాను. దేవుని యొక్క వాక్యము విప్పబడుచుండుట మనము చూస్తున్నప్పుడు, మీరు దానిలో స్నానము (మునకలు) చేయవచ్చును. నేను చేయగలను, మరియు మీరునూ చేయగలరని నాకు తెలుసు.
33
మరియు అక్కడ, మోషే, అప్పుడు ఆ కర్రను తీసుకొని, ఆ తీర్పు దండము, బండ యొద్దకు వెళ్ళుచున్నాడు, మరియు దేవుడు అక్కడ బండ పైన నిలబడ్డాడు. మరియు అతడు బండను కొట్టాడు. అతడు అలా చేసినప్పుడు, నీళ్ళు ఉబికి వచ్చాయి, కొంచెము కాదు, వాగు వంటిది, చిత్రకారుడు చిత్రమును గీయుట మీరు చూసియుంటారు. ఒకవేళ నేను దాహము గొనినట్లయితే, నేను దానిని ఎండిపోజేసెదను. కానీ చూడుము. రెండు లక్షల మందికి, మరియు ఒంటెలకు మరియు వారు కలిగియున్న జంతువులకు తగినంత నీరు దానిలో నుండి వచ్చియున్నవి. వరదవలె వచ్చియున్నవి. హల్లెలూయా!
అరణ్యములో వెంబడించిన ఆ బండ నేనే అని యేసు అరణ్యములో చెప్పిన దానికి అది అందమైన మాదిరిగా ఉన్నది. ఆయన యెరుషలేములోనికి, ఈ గుర్రముపై, చిన్న గాడిదపై స్వారీ చేస్తూ వచ్చినప్పుడు, ఆ దినమున ప్రజలు అక్కడ కేకలు వేయుటలో ఆశ్చర్యము లేదు. మరియు వారు కేకలు వేయుచున్నారు, ఆ నాజరీనులు, “హోసన్నా, హోసన్నా ప్రభువు నామములో వచ్చుచున్నవాడు,” అని కేకలు వేయుచున్నారు.
వారిలో కొంతమంది వ్యక్తిగత శైలి గలిగిన, కఠినమైన (బిగుతైన) యాజకులు, “వారిని నెమ్మదిగా ఉండమని చెప్పుము,” అని చెప్పిరి.
ఎందుకు, ఆయన చెప్పెను, “ఒకవేళ వారు నెమ్మదిగా ఉన్నట్లయితే, వెంటనే రాళ్ళు కేకలు వేయును.”
34
ఆ రాళ్ళు ఏమిటి. ఆ రాళ్ళు అవే నీళ్ళ ద్వారా కడగబడ్డాయి లేక వాక్యము ద్వారా నీరుపెట్టబడ్డాయి. వారే కేకలు వేయాలి. ఒకవేళ వారు నిశ్శబ్దముగా ఉంటే, వెంటనే రాళ్ళు కేకలు వేయును,“ అని చెప్పెను. ఏదో జరుగవలసియున్నది. ఆ రాళ్ళు. గమనించండి.
తరువాత, వారికి కొంత నీరు కావలసి వచ్చినప్పుడు, వారు చేయవలసిన ఒకే కార్యము, బండతో మాట్లాడవలయును. ఒక రోజు వారు ఆకలిగొన్నారు, మరియు వారు వెదకుచున్నారు. మరియు బండలోని ఈ సందులో తేనె ఉండడం వారు కనుగొన్నారు, బండ సందులలో వ్రేలాడుచున్నది.
బండ సందు అనగా, సూచనలలో, ప్రభువైన యేసు యొక్క ప్రక్కలో బళ్ళెపు గుర్తు. బండలోని సందు, అక్కడే అది కొట్టబడినది, మరియు అక్కడ, ఒక గుంపు తేనెటీగలు వచ్చి మరియు ఒక గుహను నిర్మించెను. మరియు ఆ బండలో తేనె ఉన్నది. ఆమేన్. ఎంత అందమైన సంగతి.
సమ్సోను, తన భార్యను, తన ప్రియురాలను చూచుటకు వెళ్ళుచున్నప్పుడు, మరియు ఒక సింహము వచ్చెను. చిన్నవాడు, అంత పెద్దగా ఉండి, ఏడు చిన్న గిరులు తిరిగిన జడలు వ్రేలాడుచున్నవి, చిన్న పాత, ఆడంగివానిగా ఉన్న, మరియు ఆ వ్యక్తి అంత బలముగా ఎలా ఉన్నాడనేది అర్థము చేసుకొనలేకపోయారు. మరియు ఒక గొప్ప, పెద్ద, పాత సింహము పరుగెత్తుచూ వచ్చెను, మరియు చెప్పెను, “మంచిది, ఏమి వచ్చుచున్నదో, ఇక్కడ చూడుము.” సమ్సోను, ఒక చిన్న పాత ఆడంగివానిగా అక్కడ నిలబడియుండెను. మరియు అతడి కన్నా అనేక మార్లు పెద్దగా ఉన్న సింహము వచ్చెను. మరియు అప్పుడు, ఏమి జరిగినది?
35
సమ్సోను ముందుగా నడిచి మరియు, “ఇదిగో, నిన్ను చీల్చివేసెదను,” అని చెప్పలేదు.“ అయితే ప్రభువు యొక్క ఆత్మ అతని పైకి దిగి వచ్చెను. అదే దానిని చేసియున్నది. అతడు అక్కడ అనుభూతి చెందియుండెను, మరియు ఈ ఏడు జడలు వ్రేలాడుచుండుటను అతడు అనుభూతి చెందెను. అదియే నిబంధన. మరియు అతడు ఒక సింహమును చూచి భయపడలేదు. మరణపు ముఖము ఎదుట దానిని చూచి అతడు భయడలేదు.
ఒకవేళ మీకు తిరిగి అలాగు అనిపిస్తే... ఒకవేళ సమ్సోను ఏడు జడలను అనుభూతి చెందితే, మరియు అది ఒక నిబంధన అని ఎరిగియున్నట్లయితే, ఎందుకనగా అతడు నాజీరుగా జన్మించాడు, మరి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ఒక వ్యక్తి ఎంతగా, దేవుని యొక్క శక్తిని అనుభూతి చెంది ఉండి, మరియు మీ ముందు ఉన్న శత్రువును వధించడమే నిబంధన అని ఎరిగియుండవలెను. అది రోగమైనా, అది శోధనైనా, అది ఏమైనా, దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు, దాని ముందు నిలువలేవు.
36
ముందుకు నడిచి మరియు సింహమును ఈడ్చి, ఆ చిన్న, ఉంగరాలు జట్టు కలిగిన మరుగుజ్జు, సింహము యొక్క దవడను పట్టుకొని దాని రెండుగా చీల్చివేసెను. హల్లెలూయా! మీకు కావలసినదల్లా ఒక్కటే; అది క్రీస్తు, ఆ నిబంధన. మీరు దానిని అనుభూతి చెందగలరా? ఆమేన్. ఓ, మై! ఆ నిబంధన.
అప్పుడు, అతడు ఆ సింహమును చీల్చి వేసినప్పుడు, అది ఒక చిన్న కుందేలు లేక మరేదో దానివలె ఉన్నది. ఈ విధముగా, దానిని చీల్చివేసి, మరియు దాని యొక్క కళేబరమును దూరముగా విసిరివేసి, అక్కడకు నడుచుకుంటూ వెళ్ళెను. కొన్ని రోజులకు అతడు అటుగా వచ్చెను మరియు దానిలో ఒక తేనే పుట్ట కట్టబడియుండెను. అతడిని చంపివేయడానికి వచ్చిన సింహము యొక్క కళేబరములో కట్టబడిన ఒక తేనె పుట్టలో నుండి, ఎన్నడూ తిననంత మధురమైన తేనెను అతడు తీనియుండెను, ఏలయనగా దేవుని యొక్క ఆత్మ వచ్చి మరియు అతడిని విడిపించెను.
37
మరియు ఒకవేళ ఈ రాత్రి ఏదో తప్పిదమును నీవు కలిగియున్నట్లయితే, మీ పైన కదలాడుచున్న దేవుని యొక్క ఆత్మను అనుభూతి చెంది, ఆ సంగతిని చీల్చివేయుము. మరియు మీకు తెలుసా, ఆ మొదటి సంగతి, ఇంటి యొక్క రాళ్ళను సైతము కదిలించివేయగల ఒక సాక్ష్యమును నీవు కలిగియుందువు. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి చేయబడిన, నిబంధన నీవే. ఆమేన్. కొంత మధురమైన తేనెను తినుము. నిజముగా బాగుండును.
అతడు నిలబడి ఇలా... చెప్పినప్పుడు, “అవును, సహోదరుడా, స్వస్థతను నేను నమ్ముచున్నాను.”
అద్భుతమైన కృప, ఎంత మధురమైన స్వరము,
నావంటి ఒక నీచుని రక్షించెను,
ఒకప్పుడు నేను నశించితిని, కానీ ఇప్పుడు నేను కనుగొనబడ్డాను,
నేను గ్రుడ్డివాడిని, కాని ఇప్పుడు నేను చూచుచున్నాను. ఆమేన్.
38
నేను నా చుట్టూ చేతులతో, గొప్ప, పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని, ఆ విధముగా వెళ్ళుటకు అలవాటు పడి మరియు ఎవరితోనో నడిపించబడి మరియు నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో దానిని చూడలేక యున్నప్పుడు, మరియు ఇప్పుడు, నేను ఒక సాక్ష్యమును కలిగియున్నాను. ఎందుకనగా నేను క్రీస్తు యేసులో నా స్థానమును నేను గుర్తించాను. ఆయన ఒక నిబంధన చేసెను, మరియు నేను దానిని స్వీకరించాను, మరియు ఆయనను నమ్మియున్నాను. మరియు ఈ రోజు అది తినుటకు మధురమైన తేనెగా ఉన్నది. ఇతరులకు చెప్పండి. ఇప్పుడు, తిరిగి గమనించండి, త్వరగా. మేము అక్కడికి వచ్చెదము...
అప్పుడు, ఆ బండ కొట్టబడినప్పుడు... చాలా అందమైన మాదిరి. ఆ ప్రజలు నశించిపోతూ మరియు చనిపోతూ ఉన్నారు. మరియు అది “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము కలిగియుండును,” అనుదానికి మాదిరి.
39
ఒక నశించిపోతున్న చనిపోతున్న ప్రజలు, ఒక నశించిపోతున్న, చనిపోతున్న దేశము మధ్యలో, దేవుడు అయోగ్యులను ఎంతో ప్రేమించెను. వారు ఎంత అయోగ్యులో చూడుము. మరియు దేవుడు ఎంతో ప్రేమించెను... ఓ, ఒకవేళ అది దేవుని యొక్క ప్రేమ కొరకు కాకపోతే ఆయన ప్రపంచము మొత్తమును ఈ రాత్రి నాశనము చేయును. కానీ ఆయన దానిని చేయలేడు. ఆయన ప్రేమ దానిని చేయుటకు ఆయనను అనుమతించదు కనుక “ఆయన లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతీవాడును నశింపక, కానీ జీవజలములను ఉచితముగా త్రాగనిమ్ము. ఎవరైతే వచ్చుటకు ఇచ్ఛయించుచున్నారో.”
అది చాలును! అనేకమైన ఆశీర్వాదములు కుమ్మరింపబడును! “నాయందు విశ్వాసముంచువాడు...” వేరొక మాటలో, దీనిని ఈలాగు తీసుకొనండి, “నాయందు విశ్వాసముంచువానికి అతడి ప్రాణము మధ్యలో ఒక గొప్ప, పెద్ద ఊట, నిత్యజీవములోనికి ఉబుకుచుండును.” ఓ, ఎంత అద్భుతమైన సంగతి!
40
మరణము యొక్క తీర్పులన్నీ దేవుడు తీసుకొనెనని గమనించుడి. నేను మరణించవలసిన మరణము, నేను వెళ్ళవలసిన నరకము; దేవుడు, తన యొక్క మరణము మరియు రోగము కొరకైన తీర్పులతో, క్రీస్తు ఆకాశమునకు మరియు భూమికిని మధ్యలో వ్రేలాడుచూ ఖాళీలో అతడిని కలుసుకొనెను. మరియు మనందరి యొక్క అతిక్రమములను దేవుడు ఆయనపై మోపెను.
మరియు తీర్పు అక్కడ కొట్టబడెను. మరియు ఈ రాత్రి సిలువ అనే ఆ ధ్వజము, లోకమునకు ఒక గ్రుడ్డితనము, కానీ ఎవరైతే ముందుకు కొనసాగుతున్నారో, వారి ముందు సిలువ వెళ్ళుచున్నవారికి, వెల చెల్లించబడెను.
చూసి మరియు జీవించుము, నా సహోదరుడా, జీవించుము.
యేసువైపు చూస్తూ, ఇప్పుడు, మరియు జీవించుము.
ఏలయనగా అది ఆయన వాక్యములో వ్రాయబడెను,
హల్లెలూయా!
అది కేవలము మనము చూసి మరియు జీవించుటయే.
41
ఒకవేళ నీవు రోగివైతే, చూసి మరియు జీవించుము. ఒకవేళ నీవు దిగజారి యున్నట్లయితే, చూడుము మరియు జీవించుము. ఒకవేళ నీవు అలసియున్నట్లయితే, చూడుము మరియు జీవించుము. ఒకవేళ పాపములోను మరియు అతిక్రమములలోను నీవు మరణించియున్నట్లయితే, చూడుము మరియు జీవించుము. అంతే. ఏలయనగా సిలువ మనకు ముందుగా వెళ్ళుచున్నది.
దేవుడే ఈ ధ్వజమును మన ముందు పెట్టుచున్నాడు, , సిలువ, దాని నుండి... ఆ సర్పము వలె, అది కర్ర కాదు; అది ప్రాయశ్చిత్తము చేయబడిన సర్పమునకు సాదృశ్యమైయున్నది. మరియు అది ఒక కొయ్య కర్రయైన సిలువ కాదు మనము మోసేది, అక్కడ ఆ గొప్ప సూచనలో ఆ గొప్ప పరిశుద్ధాత్మ చుట్టబడియున్నది, కల్వరి పై ఆ ధ్వజము, క్రీస్తులో ఉన్న ఆ పరిశుద్ధాత్మ యొక్క జీవము ఆయనలో నుండి బయటకు వచ్చెను. అది ఈ సిలువ యొద్ద నుండి, ఎవరైతే వచ్చెదరో వారి యొద్దకు వెళ్ళెను. మరియు యేసును వెంబడించుటకు ఆ సిలువే ఈ రాత్రి మన ముందు ఉన్న దేవుని యొక్క గుర్తు. మై!
42
అక్కడ బండపై నిలబడియున్న దేవున్ని గూర్చి నేను తలంచాను. దేవుడే ఆ బండ, మరియు మోషే తీర్పు దండము. తీర్పు, దేవుని యొక్క తీర్పు క్రీస్తును మొత్తెను, మనకు బదులుగా చనిపోవుచుండెను, అపరాధమునకు నిరపరాధి.
మరియు ఆయనలో నుండి రక్త కణము వచ్చెను. మనము స్వస్థపడునట్లుగా, జీవమునిచ్చు రక్తము ఆయన వెనుక నుండి కారెను; మనము రక్షింపబడునట్లుగా, ఆయన హృదయము నుండి కారెను; మన యొక్క అతిక్రమము కొరకు, మన యొక్క సమాధానము కొరకు, ఆయన కనుబొమ్మలు మరియు వాటి నుండి క్రిందకు కారెను మరియు అదంతయూ ఆయన పై మోపబడెను. అక్కడ ఆయన రక్తమోడుచున్న పురుషుడు, భూమికి మరియు ఆకాశమునకు మధ్యన వ్రేలాడుచున్నాడు, నిలబడి, పరిశుద్ధుడైన దేవుడు, క్రిందకు చూస్తూ, ఇక ఎంత మాత్రమును పాపిని చూడలేడు, ఎందుకనగా దాని కొరకు వెల చెల్లించబడిన ఆ తీర్పు గుండా ఆయన చూచెను. ఓ, నా క్రైస్తవ స్నేహితుడా, నీవు చూశావని నేను నమ్ముచున్నాను.
43
మరియు దూరముగా చూచెను. అదిగో అక్కడ ఉన్నది. దేవుని యొక్క దృష్టిలో, అది ముగించబడినది. వెల చెల్లించబడినది. నీవు విడిపించబడ్డావు. ఈ రాత్రి ప్రజలతో ఉన్న సమస్య అదే. వారు విడిపించబడియున్నారని వారు ఎరుగరు.
కొంతకాలము క్రితము ఇక్కడ, ఒక ముసలి రైతుకి ఒక మొక్కజొన్న పొలముండెను. కాకులు వచ్చి అతడి జొన్న పంటను తినివేయుచుండెను, కనుక అతడు ఒక వలను పన్ని ఒకదానిని పట్టుకొనెను. అతడు చెప్పాడు, “మిగతా వాటిని కూడా నేను పట్టుకొనెదను.” దానిని అతడు కాలు కట్టి బంధించెను. మరియు ఆ కంచెకు, ఆ ముసలి కాకి కుంటుతూ మరియు గెంతుచూ, మరియు కుంటుచూ మరియు గెంతుచూ ఉండెను, మరియు అది వెళ్ళిపోలేకపోయెను, ఎందుకనగా అతడు బంధింపబడియుండెను. అది ఆకలిగొని యుండెను, అది వెళ్ళగలిగినంత దూరము వెళ్ళి, చుట్టూ ఉన్న దానిని తినుచుండెను. అది ఆకలితో చనిపోవుచుండెను. అది ఇక ఎంత మాత్రము పైకి మరియు క్రిందకు ఎగరలేక గెంతలేనంతగా అది మారెను.
44
మిగతా కాకులన్నీ వచ్చి మరియు, “రా, జానీ కాకి. దక్షిణ దిక్కుకు వెళదాము. శీతాకాలము వచ్చుచున్నది. అక్కడే కూర్చొని ఉంటే చనిపోతావు. జానీ కాకి వెళదాము రా,” అని అరచుచుండెను.
అది చెప్పినది, “నేను రాలేను. నేను బంధింపబడియున్నాను.”
ఒక రోజు ఒక మంచి వ్యక్తి అటుగా వచ్చెను. “ఆ వృద్ద కాకి, పాపం! దానిని చూడండి, అక్కడే చుట్టూ కుంటుచుండెను. అది బలహీనుగుచుండెను,” అని చెప్పెను. కనుక అతడు దానిని పట్టుకొని, కొంచెము సవరించి, దాని కాలికున్న పట్టీని తీసివేసి, ఆ విధముగా, దానిని విడిచి పెట్టెను, “సరే, చిన్నదానా, ఎగురుము,” అని చెప్పెను.
అతడు వెళ్ళిపోయెను. మరియు ఆ ముసలి కాకి అదే వృత్తములో అలా తిరుగుతూ ఉండెను. చూశారా, అది విడువబడెను మరియు దానిని ఎరుగకుండెను. మిగతా కాకులన్నీ వచ్చి మరియు చెప్పెను, “రా, జానీ కాకి. దక్షిణమునకు వెళ్ళెదము. శీతాకాలము వచ్చుచున్నది.”
అది చెప్పెను, “నేను రాలేను. నేను ఇంకనూ కట్టబడియున్నాను.”
45
క్రీస్తు యేసులో తమ స్థానమును ఎరుగని స్త్రీ పురుషులందరితో ఈ రాత్రి ఆ విధముగానే ఉన్నది. ఆ దెయ్యము మిమ్ములను క్షయవ్యాధితో బంధించి యుండవచ్చును, క్యాన్సరుతో బంధించి యుండవచ్చును, వాడు మిమ్ములను అనేకమైన కార్యములతో బంధించి యుండవచ్నును. కానీ క్రీస్తు, సత్పురుషుడు, నీ తీర్పును వహించాడు, ఇప్పుడు మరియు ఈ రాత్రి నిన్ను విడుదల చేశాడు. నీ హృదయమును దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో నీవు ఎదగవచ్చును. మనము దక్షిణమునకు వెళ్ళకుందము, కానీ సజీవ దేవుని యొక్క గొప్ప సైన్యముగా మహిమ వైపునకు కవాతు చేసుకుంటూ నడిచిపోయెదము. మనము స్వాతంత్రులము. మిగతా వారు, “రండి” అని చెప్పుటను నీవు వినుట లేదా.
నేను ఒకప్పుడు పాపము యొక్క సంకెళ్ళతో బంధించబడియున్నాను, కానీ ఈ రాత్రి యేసుక్రీస్తు ద్వారా నేను విడుదల చేయబడ్డాడు. ఆమేన్.
46
తీర్పు, నిశ్చయముగా. క్రీస్తు మన తీర్పును తీసుకొనెను, పాపమునకు నిరపరాధి. మనము పాపులము కాకుండునట్లు ఆయన పాపముగా చేయబడెను. మనము దానిని భరించకుండునట్లుగా, మన రోగమును ఆయన భరించెను. లేఖనము “నిరీక్షణ లేని యితరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము,” అని చెప్పినట్లుగా, మనమింకనూ దుఃఖపడకుండా మన దుఃఖములను ఆయన భరించెను. ఆయన... మనకు కావలసినవన్నియూ ఆయనలోనే ఉండెను. మీరు దానిని నమ్ముచున్నారా? నిశ్చయముగా.
అక్కడ కూర్చొన్న అమ్మా, అది నీ గుండె సమస్య కొరకని నీవు నమ్మెదవా? ఆ గుండె పరిస్థితిని బట్టి నీవు నమ్మెదవా? నీ హృదయమంతటితో ఇప్పుడు దానిని నీవు అంగీకరించెదవా? అయితే ఆయన నీ గుండె సమస్యను భరించెను, ఇక ఇప్పుడు ఎంత మాత్రము అది నీకు రాదు. ఆమేన్. ఒకవేళ దానిని నీవు నమ్మినట్లయితే, నీవు దానిని పొందుకొనవచ్చును. హల్లెలూయా! అవునయ్యా.
47
“మన యతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను మరియు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగియున్నది.” తరువాత ఆయన ఆ బండ ఒకసారి కొట్టబడెను, దేవుడు మోషేకు చెప్పెను, “మోషే సాగిపొమ్ము. ఇప్పుడు నీవు చేయవలసిన ఒకే ఒక సంగతి, వెళ్ళి, ఆ బండతో మాట్లాడుము. ఇక్కడ నుండి, నీకు నీళ్ళు కావలసిన ప్రతీసారి, దానితో మాట్లాడుము. నీవు ఇక ఎంత మాత్రము దానిని కొట్టవలసిన అవసరము లేదు. నీవు రాత్రంతా పోరాడవలసిన అవసరము లేదు. నీవు చింతించవలసిన, మరియు అడుక్కొనవలసిన, మరియు ప్రార్ధించవలసిన, మరియు ఉపవాసముండవలసిన అవసరము లేదు, మరియు సాగిపొమ్ము. కేవలము ఆ బండతో మాట్లాడుము. హల్లెలూయా! మరియు అది ఆయన యొక్క నీళ్ళను తీసుకొనివచ్చును. ఆమేన్. ”ఆ బండతో మాట్లాడుము, మరియు అది దాని యొక్క నీళ్ళను తీసుకొని వచ్చును.“
నేను మీకు చెప్పెదను, ఒకసారి రక్తస్రావపు సమస్య కలిగిన ఒక స్త్రీ ఉండెను, మరియు తనకున్నదంతయూ పోగొట్టుకొనెను. ఏ వైద్యుని ద్వారా ఆమె స్వస్థతనొందలేకపోయెను. మరియు ఒక రోజు ఆమె ఆ ఒడ్డు గుండా వచ్చెను, మరియు ఆ ఆత్మీయమైన బండ దొర్లుకొని వచ్చుటను చూసెను మరియు ఆమె ఆ బండతో మాట్లాడెను. కొద్ది నిమిషముల క్రితము, ఈ స్త్రీ ఇక్కడ చేసియున్నట్లుగా, బండతో మాట్లాడెను మరియు ఆ బండలో నుండి స్వస్థతా జలములు బయటకు వచ్చెను. హల్లెలూయా!
48
ఒక చిన్న వృద్దుడైన యాయీరు అను పేరు గల ఒకడుండెను, అతడు ప్రభువును నిజముగా ప్రేమించెను, కానీ అతడొక రహస్య ఆరాధికుడు. మరియు ఒక రోజు, అతని చిన్న బాలిక మరణించెను. అన్ని ఆశలు కోల్పోయెను, కానీ అతడు బండతో మాట్లాడెను, మరియు ఆ బండ నీళ్ళను మాత్రమే కాదు, కాని జీవమును ఇచ్చెను. జీవజలమును ఉచితముగా ఇచ్చెను.
మార్త మరియు మరియ అనే పేరులు గల స్త్రీలు, వారు ఆయనను ప్రేమించిరి. ఆయన వారి యింట నుండి వెళ్ళిపోయెను. వారి యొక్క సోదరుడు చనిపోయి అక్కడ సమాధిలో కుళ్ళిపోవుచుండెను. ఒక రోజు ఆ బండ వచ్చుచున్నదని వారి వినిరి, పట్టణములోనికి దొర్లుకొని వచ్చుచున్నది. ఆయన కొరకు మంచి వంటకములను వండుటలో మార్త చాలా ఆలస్యము చేయుచుండెను, సంగతులు, మరియు ఆత్మీయమైన వాటియందు ఆసక్తి చూపకుండెను. కానీ ఆమె హృదయమందు ఆమె దానిని నమ్మెను. ఏలయనగా అప్పుడు ఆమె ఏమైయున్నదో చూపించుకొనెను. ఆమె పరుగెత్తి వెళ్ళి, మరియు ఆమె మోకాళ్ళపై ఊని, మరియు ఆ బండతో మాట్లాడెను. ఆ బండ, తిరిగి, నిత్యత్వములోనికి పలికి మరియు ఒక చనిపోయిన వ్యక్తిని సమాధిలో నుండి లేపెను. హల్లెలూయా!
49
ఒక రాత్రి ఒక గుంపు జనసమూహము ఒక చిన్న పాత దోనెలో బయటకు వెళ్ళుచుండిరి, మరియు అది ఒక సీసా బిరడా వలె పైకీ క్రిందకీ తల్లక్రిందులగు చుండెను, ఒక స్థలము నుండి మరొక స్థలమునకు అల్లాడుచుండెను, వారు రక్షింపబడెదరు అనే ఆశలన్నీ పోయెను. మరియు ఆ దోనె అమరమున, ఆ బండ, నిద్రించుచున్నదని వారు గుర్తెరుగుట జరిగినది. వారి యొక్క సమస్యను బట్టి వారు బండతో మాట్లాడిరి, మరియు అది నిమ్మళించెను. మరియు ఆ గాలులు తమ చేతులు ముడుచుకొని మరియు ఆ సందులలోనికి వెళ్ళెను. హల్లెలూయా! మరియు అలలాడుచున్న ఆ సముద్రము, నిమ్మళించెను. ఒక తల్లి తన బిడ్డకు లాలపాడుచున్నట్లుగా. వారు ఆ బండతో మాట్లాడిరి, మరియు ఆ బండ వారు అడిగిన దానిని తీసుకొని వచ్చెను.
ఈ రాత్రి నీవు ఆయనతో మాట్లాడే విధానములో ఉన్నావా? అక్కడ కూర్చొనియున్న నీవు నీ హృద్రోగమును గూర్చి ఆయనతో మాట్లాడగలవా? దేవుడు నిన్ను స్వస్థపరచియున్నాడని నీవు నమ్మెదవా? నీవు ఆయనతో మాట్లాడునట్లుగా ఉండుము, ఉండెదవా? “ప్రభువా, నన్ను స్వస్థపరచుము,” అని నీవు చెప్పలేదా? నీవు ఆయనతో మాట్లాడియున్నావు, మరియు ఇప్పుడు నీ గుండె సమస్య పోయినది. “బండతో మాట్లాడుము. అది ఆయన నీళ్ళను తీసుకొని వచ్చును.” హల్లెలూయా!
50
మోషే, తన సమయము వచ్చినప్పుడు మరియు అన్నీ విఫలమైపోయెను, దేవుడు చెప్పెను, “పైకి రమ్ము,” మరియు అతడు వాగ్దాన దేశములోనికి చూచుటకు నెబో పర్వతము పైకి ఎక్కిపోయెను. అక్కడ మరణము సుడులు తిరుగుతూ గాలిలో వచ్చెను. మరణము అతడి చుట్టూ ఉన్నదని అతడు ఎరిగియుండెను. మరియు మోషే చుట్టూ చూచెను, మరియు అతడు చూచినప్పుడు తన ప్రక్కన ఉండెను, మరియు ఆ బండ ప్రక్కన పడియుండెను.
అతడు బండపై అడుగుపెట్టెను. అరణ్యమంతటిగుండా అతడు దానిని వెంబడించెను, లేక అది అతడిని వెంబడించెను. అతడు బండపై అడుగుపెట్టెను, మరియు దేవుడు కొంతమంది శవమును మోసేవారిని - దూతలను పంపి - మరియు బండపై నుండి, అతడిని మోసుకొనిపోయెను. హల్లెలూయా! ఆ బండ అతడు ఆకలిగొనినప్పుడు - అతడిని పోషించెను, అతడు దాహముగొనినప్పుడు - అతడికి నీళ్ళిచ్చెను, అతడు చనిపోవుచున్నప్పుడు - మహిమలోని గృహమునకు తీసుకొనిపోయెను.
51
ఈ రాత్రి నా ప్రార్ధన, “ప్రభువైన యేసూ, ఇక్కడ ఉన్న ఈ లోక సాంగత్యము నుండి నన్ను పైకి లాగి వేయుము, నేను ఇంకనూ నీతో మాట్లాడే విధానములో ఉండునట్లుగా. అది ఒక రోజు మరణాంధకార లోయ గుండా నేను వెళ్ళినప్పుడు ఆ బండ అక్కడ నిలబడియుండుటను నేను ఆశించుచున్నాను.” హల్లెలూయా! “ఆయనతో మాట్లాడే విధానములో నన్ను ఉంచుము.” నేను, స్వయముగా ఆయనతో మాట్లాడగోరుచున్నాను.
నీవు ఆయనతో మాట్లాడవలసియున్నది. ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు మరియు మీలో ప్రతీ ఒక్కరితో ఆయన మాట్లాడే విధానములో ఉన్నాడు, ఒకవేళ మీరు ఆయనతో మాట్లాడగోరినట్లయితే, దానిని నీవు నమ్ముచున్నావా? ఏలయనగా ఏ అవసరతను నీవు కలిగియున్నా, ఈ సమయములో మనము మన కాళ్ళపై లేచి నిలబడెదము. ఓ, మై!
ఓ, కొంచెము ఈ సంఘమును నా భుజములపై పెట్టుకొని, నేను దానితో నడిచి వెళ్ళిపోవలెనన్న అనుభూతిని నేను కలిగియున్నాను. ఏమిటి? ఆ బండ, క్రీస్తు యేసు ఇక్కడ ఉన్నాడు.
52
ఓ, నేనేమి ఉత్తేజితుడను కాలేదు. నేను ఎక్కడ నిలబడియున్నానో ఖచ్చితముగా నాకు తెలుసు. నేను ఏమి మాట్లాడుచున్నానో ఖచ్చితముగా నాకు తెలుసు. ఓ, ఒకవేళ నా భావములను మాత్రము నేను వ్యక్తపరచగలిగినయెడల, ఒకవేళ క్రీస్తు యేసు అయిన ఈ బండ యొక్క అభిషేకము క్రింద కూర్చొనుట అనేది నిజమగా ఏమైయున్నది, అని నేను ఈ ప్రేక్షకులకు మాత్రము చెప్పగలిగినయెడల. ఇప్పటికే వెల చెల్లించబడెను; నీ రోగమును భరించెను; నీ దుఃఖమును తీసుకొనెను, మరియు దేవుని ముందు ప్రశ్నను పరిష్కరించెను. నీ నమ్మికను ఆయన యందు ఉంచుటకు నీవు భయపడుచున్నావా?
నీవు తీర్పు తీర్చబడనవసరము లేదు. నీవు యోగ్యుడవని నీవు తలంచనవసరము లేదు; నీవు ఎన్నడూ యోగ్యుడవు కావు. కానీ నీ స్థానములో వెల చెల్లించిన ఆ క్రీస్తే యోగ్యుడైయున్నాడు. ఏదో విమోచించుటకు ప్రయత్నించుట కాదు, నీవు దానిని విమోచించలేవు, ఎందుకనగా వెల చెల్లించుటకు నీకు ధనము లేదు. కానీ దేవుడు ఆ ధనమును కలిగియున్నాడు, మరియు ఆయన క్రీస్తును పంపెను, మరియు బిల్లు కట్టివేసెను, మరియు నీ రోగము నుండి నిన్ను విమోచించెను, మరియు నీ దుఃఖములు, మరియు నీ చింతలు, మరియు నీ పాపము, మరియు నీ వెనుక జారినతనము. ఆయన ధనమును పంపెను, అదే క్రీస్తు యేసు మరియు దానిని కల్వరిపై జమ చేసెను, గొల్గొతా కొండపై. మరియు ఒకవేళ కొంచెము దానిని నీవు నమ్మగలిగినట్లయితే, ఈ రాత్రి మీలో ప్రతీ ఒక్కరూ విడుదల చేయబడియున్నారు.
53
ఓ దేవుని యొక్క క్రీస్తు, ఆ పాతకాలములో మోషే వలె రోగముతోను, మరియు ఇబ్బందులతోను ఈ నశించిపోవుచున్న ప్రజల పక్షముగా నేను నీతో మాట్లాడుతున్నాను. ఓ నిత్యుడగు దేవా, నిత్యమైన కొండల నుండి, నీ శిరస్సు పైకెత్తుము, ప్రభువా, మరియు నీ రాజ్యములోనికి ఈ ప్రజలను స్వీకరించుము, ప్రభువా, ఈ రాత్రి వారు నీ యొక్క నిబంధనను అనుభూతి చెందునంతగా ఆ పరిశుద్ధాత్మ ఈ ప్రజలను అంతగా అభిషేకించును గాక, సమ్సోను చేసినట్లుగా, నిబంధన జుత్తును అతడు అనుభూతి చెందెను. ఈ రాత్రి నీవు వారితో చేయుచున్న నిబందన ఇదే అని ప్రజలు గ్రహించునంతగా, పరిశుద్ధాత్మ ప్రతీ హృదయమునూ చుట్టుకొని యుండును మరియు వారు వెళ్ళి మరియు విడిపించబడుదురు గాక.
ప్రతీ రోగమును, ప్రతీ వ్యాధిని, ప్రతీ పాపమును నేను గద్దిస్తున్నాను. నీ సేవకునిగా, ప్రభువా, నీ యందు తగ్గించుకొని నేను చెప్పుచున్నాను, కానీ ఆ దయ్యము ముందు ఒక చేదైన గద్దింపుతో, “సాతానా, నీవు యుద్దమును ఓడిపోయావు. నీవే దానిని విడిచిపెట్టుము. వారు విడిపించబడునట్లుగా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరిలో నుండి బయటకు రమ్ము.” ఆమేన్.