క్రీస్తునందు ఒక విశ్వాసి యొక్క స్ధానము

క్రీస్తునందు ఒక విశ్వాసి యొక్క స్ధానము

శుభ మద్యాహ్నం. ప్రభువయిన యేసు నామములో ఈ మద్యాహ్నం బోధించుట సంతోషిస్తున్నాము. మనము క్షమించబడ్డాము, ఏలయనగా ప్రాముఖ్యము లేనిదిగా పరిగణించు రీతిలో అది చెప్పుట మన ఉద్దేశ్యము కాదు. అయితే సహోదరుడు మూర్‌, నా మేనేజరుగా ఉన్న ఆయన, ఇక్కడ కూర్చొని ఉన్నాడు, అతడు నిన్నటి రోజున మనం నిర్మించబడిన దాని గూర్చియు మరియు అలసిపోవుటను గూర్చియు ఏదో చెప్పాడు. నేను అన్నాను, “సరే, ఇప్పుడు, నేను ఆదివారం ఉదయం బోధించెదను.” రిజర్వేషను మీద నిన్నటి రోజు మధ్యాహ్నము నాలుగు గంటలు నేను ప్రార్ధనా వరుసలో ఉన్నాను. గత రాత్రి ఎక్కువగా నిద్రపోలేదు, పైకి లేచి మరియు ఈ ఉదయవేళలో బోధించవలసి వచ్చెను. మరియు ఆ తరువాత వెళ్ళి మరియు ఈ మధ్యాహ్నము వెనుకకు రావలసి వచ్చెను.

నేను అన్నాను, “సహోదరుడు మూర్‌, మాట్లాడుతాడు...”

అతడు అన్నాడు,“ఓహ్‌, అది సరియైనదిగా ఉన్నది.”

నేను అన్నాను, “ఈ ఆదివారము మధ్యాహ్నము అప్పుడు వేదిక దగ్గరకు అప్పుడే నేను నిన్ను పిలువగలను.”

అంతలో అతడు అన్నాడు, “నేను అక్కడ ఉండుట లేదు.” ....మరి అందుచేత ఇప్పుడే మనము ఇప్పుడు మాట్లాడుకొనుచుండగా; కనుగొనియున్నాము. అతడు -అతడు నవ్వుకొనుచున్నది దాని గూర్చియే. సహోదరుడు మూర్‌ తనకుతానే మార్గము నుండి తప్పించుకొని పోవుచున్నాడు. ఓహ్‌, మంచిది.

2

జీవితము దానిలో చాలా వింతైన సంగతులు కొన్ని కలిగి ఉండును అని మీకు తెలియును, అది అలా కలిగియుండలేదా? నవ్విన దానికంటే కనుబొమ్మలు దగ్గరగా చేర్చుటకు అలా అది ఎనభై శాతము కంటే ఎక్కువగా అది కండరములను తీసుకొనునని వారు నాకు చెప్పారు. అందుచేత అప్పుడు కాస్త విశ్రాంతిగా ఉందాము, మరియు నేను అన్నాను, అలా కనుబొమ్మలు దగ్గరకు చేర్చుటకు బదులుగా కేవలము నవ్వెదము.

నా తండ్రి ఐరీష్‌ వాడై యుండి, పూర్తిగా హాస్యమాడగలవాడై యుండెను, అని మీకు తెలియును. అతడు అన్నాడు...ఆ విధముగా పలికిన వారికి, అతడు చెప్పెడివాడు, “నవ్వు మరియు ప్రపంచం నీతో కలసి నవ్వును; మరియు ఏడువుము, నీవు ఒంటరిగానే ఏడుస్తావు.” లేదా ఆ విధముగా ఉండిన ఏదైనా, “ఏడువుము మరియు ఒంటరిగానే ఏడుస్తావు” అందుచేత అదంతా అలాగే ఉండును నేను.... సంతోషించుడి. మీరు ఒక సంగతిని గూర్చియు భయపడవద్దు. నీవు క్రైస్త్రవుడవు అయిన యొడల ప్రతీ సంగతియు సరియైనదిగా ఉండును.

3

నేను ఇలా చెప్పగోరుచున్నాను, నిన్నటి రోజున అయి వుండెను. నా యొక్క అమెరికా సమావేశాలలో అది నిన్నటి రోజున ప్రకాశవంతమైన భాగముగా ఉండెను. రిజర్వేషను (ముందుగా సిద్ధం చేసిన స్థానం) మీద నిన్నటి రోజు మధ్యాహ్నము అపాచి ఇండియనులతో, అమెరికా నేల మీద నేను ఎన్నడైనా కలిగియుండిన అతి గొప్ప సమావేశము అయివున్నది. ఆ ఇండియనుల మీద ఆ పరిశుద్ధాత్మ ప్రవాహము అది పని చేసిన విధము అది నేను ఎన్నడైనా చూచినది, నా జీవితములో నేనెన్నడూ కలిగియుండలేదు. మీరక్కడ ఉండవలెనని నేను మిమ్మును కోరుచున్నాను. అది నిజముగా గుర్తించదగినది.

ఆ ఆంగ్ల-సాక్సన్‌ ప్రజలు ఏలాగున్నారో అది వింతైన విషయము, అది పశ్చిమానికి చెందినవారు లేదా ఏదో సంగతి, అతడు సామాన్యముగా అలాగుండడు... కేవలము అతడు....? అ విధముగా గ్రహించుటకు సామర్ధ్యము కలిగియుందురు. ఆ ఇండియనులు దానిని నమ్ముదురు, మరియు అది దానిని పరిష్కరించును. అతడు గ్రహించుటకు సామర్ధ్యము కలిగి ఉండగోరును.

అలా ఆ భవనములో అక్కడ ఏ వ్యక్తి అయిన ఉన్నారా? ఆ రిజర్వేషన్‌ వద్ద అక్కడ ఉన్నారా ? అవును, అక్కడ ఉన్న అనేకమైన చేతులు అలా అక్కడ ఉన్నవారు ఇక్కడ ఉండెను. మరపు రాని విషయము!

4

మరియు మేము అక్కడకు వెళ్ళకముందే... ఆయన ఎందుచేత నాతో వ్యవహరించుచున్నాడో నేను అవగాహన చేసుకొనలేకపోయాను. నేను రిజర్వేషను యొద్ద అంతకుముందు నుండి ఉన్నప్పటి నుండి రమారమిగా ఎనిమిది సంవత్సరములు అయింది. మరియు మేము అక్కడకు వెళ్ళకముందే, అకస్మాత్తుగా కారులో ఏదో సంగతి వచ్చి మరియు ఇలా చెప్పెను, “ప్రార్ధించుము.”

సహోదరుడు మూర్‌ ఆ సమయములో కారు నడుపుచున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఉన్నారు, ఆ రిజర్వేషను యొద్ద ఒక టీచరుగా ఉపయోగించబడుచున్నది, ఆమె మాతో ఉన్నది, మరియు సహోదరుడు షర్రిట్‌ మనం ప్రేమించిన సహోదరుడు మరియు సహోదరి, మరియు సహోదరుడు బ్రౌన్‌, సహోదరుడు ట్రేసి మరియు నేను.

అందుచేత నేను అన్నాను, “అలా చేయండి..” సహోదరుడు షర్రీట్‌ తానే చేయనివ్వండి....?...వారిలో మరొకరు. అందుచేత.... మరియు నేను అన్నాను, “మనం ప్రార్దించుచుండగా, సహోదరుడు మూర్‌, నడుపును. ఓహ్‌, మై, ప్రార్ధించుటకు ఏలాటి సమయము. ఆ పరిశుద్ధాత్ముడే క్రిందకు దిగివచ్చెను. అతడు అనగ, ”ఇప్పుడు ఆ మలుపువద్ద తిరుగక మునుపు ప్రార్ధించుము.“ అలా మలుపు తిరిగే రోడ్డు యొద్ద ప్రార్ధించుము.

అందుచేత నేను - దేనికంటెను - ఆ రోడ్డు ఎక్కడ ఉండెనో నాకు ఇక ఎక్కువ ఏమి తెలియదు. మేము ముందుకు నడపడానికి ముందే ఆ ప్రార్ధనకు “ఆమేన్‌” అని మేము చెప్పగానే, ఖచ్చితముగా అది పరిపూర్ణమైన సమయానికే, మేము ఆ జంక్షన్‌ యొక్క ఇరుకైన మార్గములోనికి తిరిగాము.

5

నేను అక్కడకు వెళ్ళినప్పుడు, ఒక ప్రక్కన అక్కడ ఒక చిన్న ఇల్లు ఉండెను , తారు పేపరుతో చేసిన చిన్న ఇల్లు వంటిది, మనం దానిని ఈస్ట్‌ అని పిలుస్తాము. ఇండియను సహోదరి ఆవరణ ప్రాంగణములో నుండి బయటకు వచ్చి మోకాళ్ళూని మరియు ఆమె తల క్రిందికి వంచి, మరియు ఆ పాటలు పరిచర్య మరియు మిగిలిన ప్రతీదియు జరుగుచుండగా ఎడతెగక ప్రార్ధించెను. నేను అక్కడ ప్రతీ రాత్రి ఆ వెనుక ప్రార్ధించుచున్నవారు ఐదుగురును కలిగి యుండిన యెడల, బహుశ అది ఇక్కడ బయట ఎంతో శ్రేష్టమైనదిగా ఉండియుండును, అది అలా ఉండదా? అది సరియైనదే. మీరు అది నమ్ముట లేదా? అప్పుడు అది మరపు రాని ఒక కూడికగా ఉండును.

మనం ప్రారంభించినప్పుడు, మనం ఏమైనా ప్రార్ధనా కార్డులు తీసుకొని వచ్చుట మరచిపోయాము. బిల్లీ ఎక్కడికో వెళ్ళాడు. అతడు ఆ రిజర్వేషన్‌ దగ్గరకు వెళ్ళుటను గూర్చి శ్రద్ద చూపలేదు, అతడు ఆలోచించలేదు. అతడు నిద్రపోవుటను కోరుచున్నాడని, నిద్రించుచున్నాడని నేను తలంచాను. అందుచేత ఆ ప్రార్ధనా కార్డులు లేకుండానే మేము వెళ్ళాము, దాని నిమిత్తము మనము ఏమి చేయలేము.

కానీ పరిశుద్దాత్మ వారినందరినీ క్రమముగా వరసలో ఉండులాగున చేసింది. అందుచేత అక్కడ - మేము చెవిటి, మూగ, గుడ్డి, అంగవైకల్యముగలవారు అక్కడ ఉండునని నేను తలంచాను... ఏవో ముప్పై దర్శనములు మొదలైనవి వచ్చినవని సహోదరుడు బ్రౌన్ నాతో చెప్పాడు మరియు నేను నా పాదములపై నిలబడ్డాను. మరియు అక్కడ ఉండెను-ఆ వరుసలో ఆ చుట్టూ మూడు వందలు మంది ప్రజలు ఉన్నారు, మరియు నేను కనీసము ఒక వంద, రెండు వందలు మరియు ఏభైమంది ప్రజలు నిశ్చయంగా స్వస్థత పొందారని చెప్పగలిగియుండును ఓహ్, ప్రేమతో కూడిన పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము అయి ఉండెను.

6

ఒక చిన్న బాలిక పైకి తేబడెను, ఒక చిన్న ఇండియను బాలిక, అందమైన ఒక చిన్నది, వివాహము కాని ఒక చిన్న బాలిక మరియు ఆమె కళ్ళు నల్లగా మరియు ప్రకాశవంతముగా ఉండెను. నేను వెళ్ళకముందే... ఆమె నా దగ్గరకు రాకముందే... అది ఒక మిషనెరీ సహోదరుడు, సహోదరుడు మిచిల్‌ అలా ఎవరో అయిఉండెనని నేను నమ్ముచున్నాను, అనెను, “ఆమె గుడ్డిది మరియు ఆ వరుస దిగువన ఎవరో అన్నారు, ”ఆమె గుడ్డిది“ చూచిన బాధతో వెంట వచ్చారు మరియు నా ముందుకు ఆమెను తీసుకువచ్చారు.

ఆ బిడ్డ కొరకు మన పరలోకపు తండ్రికి నేను ప్రార్ధించాను. నేను నా చేతులను ఆమె ముఖమునకు ముందుగా కదిలించాను, మరియు ఆ నల్లగా ఉన్న తేరి చూస్తున్న పెద్ద కన్నులు, కేవలము కాంతివంతమైనవి. అందుచేత అప్పుడు నేను తలంచాను, “ఆ అల్పురాలైన చిన్న వ్యక్తి, ఆ విధముగానే జీవితమంతా వెళ్ళవలసి ఉన్నది.” నేను ఆమె వెనుక నా చేతిని వేసాను. మరియు నేను విడిచిపెట్టునట్లుగా కనిపించెను... ఇది వెర్రితనముగా అనిపించవచ్చును, అయితే అది-అది సత్యమైయున్నది. నేను ఈ భూమిని విడిచినట్లుగా కనిపించెను మరియు దేవుని సింహాసనము ముందుకు వెళ్ళాను. అక్కడ యేసుక్రీస్తు రక్తము ఉండెను.

ఆ దీనమైన చిన్న ఇండియను బాలిక ఇంగ్లీష్‌ అర్ధము చేసికొనలేక పోవచ్చుననియు లేదా ఏమియు తెలియనిదై ఉన్నదనియు నేను ఎరిగియున్నాను. కనుక ఆ విధముగా ప్రభువైన యేసు రక్తము కొరకు నా విశ్వాసమును దేవుడు తెరచినట్లుగా కనిపించెను. మరియు అమెకు అది బహుమతిగా ఇచ్చెను.

కొద్ది క్షణములలో, వెనుకకు వెళ్ళి క్రింద మోకాళ్ళూని నేను మోకాళ్ళపై ఉన్నచోట రెండు, మూడు గంటలు ఉన్నాను. మరియు నా వ్రేలిని ఈ విధముగా, ఆమె కళ్ళు ముందుగా ఉంచాను. నేను దానిని కదిలించాను, ఆమె కళ్ళు ఇంకా గుడ్డిగానే ఉన్నాయి. మరియు నేను అన్నాను, “నీవు చెప్పావు; నీవు ఏది అడిగినప్పటికి....”

మరియు నేను అలా చేయగా, అప్పుడు నా వ్రేలును అటూ ఇటూ ఆడించాను మరియు ఆ ప్రేమగల నల్లని పెద్ద కళ్ళు నా వ్రేలితోపాటు ఇక్కడకు వెళ్ళెను, మరియు పరిపూర్ణముగా సాధారణముగా తయారయి మరియు తెరువబడెను...

7

కనుక అక్కడ ఎవరో బయట ప్రక్క నిలబడ్డారు, కొందరు మనుష్యులు, బాగా వస్త్రములు ధరించిన పెద్దమనుష్యులు బహుశా ప్రేక్షకులు మరియు ఆ వైద్యులు, అదేమైనప్పటికి చేయవలసినది చేసారు. మరియు ఆమెను పట్టుకొనుటకు వారు కదలి వెళ్ళుట నేను చూసాను.

నేను అన్నాను, “ఆమెను ముందుకు తీసుకు వెళ్ళండి. ”నేను అన్నాను “ఆమె చూస్తుంది”.

నేను అక్కడ బయట వారిని ఆమెతో ఉండుట చూసాను అని మీకు తెలియును మరియు ఆమె అక్కడ ఉండి, అక్కడ ఉన్న మిగిలిన వారివలె, తగినంత రీతిలో ఆ చుట్టూ నడుచుచుండెను. మరియు ఆమె తండ్రి ఆ తరువాత వరుసగుండా వచ్చాడు మరియు అతడు గుడ్డివాడు. మరియు ఆ ప్రభువైన యేసు, ఆయన యొక్క సార్వభౌమ కృపలో, సరిగ్గా అక్కడే ఆ తండ్రికి దృష్టి తిరిగి ఇచ్చెను.

పక్షవాతముతో బాధపడుచున్న చేతులతో స్త్రీలు, వారి చేతులు కదపలేక పోవుచున్నారు, వారు చేతులు పైకెత్తి మరియు దేవుని స్తుతించుచున్నారు. చెవిటి, మూగ, ఓహ్‌, ప్రతీ కార్యము ఆశీర్వదించబడిన మన ప్రభువైన యేసు చేసెను.

8

ఇండియను ప్రార్ధనా వరుసలో, నేను రాత్రంతయు దాని సంకటస్థితి నుండి బయటపడలేక పోయాను, నేను దానిని మానసికముగానే చూడగలుగుచున్నాను. ఆ సంగతి ఏమై ఉండెనో అని నేను ఆశ్చర్యపోయాను. ఈ ఉదయ వేళలో నేను పైకి లేచి మరియు నా సహోదరులుండే ఆ గదులలోనికి వెళ్లాను. కేవలము అది ఏదో కావచ్చునని తలంచాను. ఆ పరిశుద్ధాత్ముడు నన్ను కదిలించెను. అది వారే అయి వుండొచ్చునని తలంచాను.

మంచిది వారు మేగజైనుల్లో ఏదో దానినిగూర్చి లేదా మరొక దానినిగూర్చి మాట్లాడుకొనుచున్నారు. అది ఆ విధముగా లేదని నేను ఎరిగియున్నాను. అందుచేత నేను మెట్లు క్రింది భాగమునకు వెళ్ళాను. మరియు-మరియు బిల్లీ ఎక్కడ ఉండెనో ఆ గదిలోనికి నేను వెళ్ళాను, మరియు అతడు అతని యొక్క బూట్లును మెరుగుపరచుచుండెను. అందుచేత అది అక్కడ లేదు.

కనుక నేను వెనుకకు వచ్చి, నా గది వైపుగా వెళ్ళాను మరియు తలుపువేయబడెను. మరియు నేను తలంచాను, దేవా ఇది ఏమైయున్నది? నేను ఎందుచేత ఆ ఇండియను రిజర్వేషన్‌ను... నా హృదయంలో నుండి తీసివేయలేక పోవుచున్నాను.

అది దర్శనములతో కూడినదని నేను ఎరుగుదును, అయితే అది దర్శనములు కాదు. అయితే నేను ఎన్నడైనా కలిగియున్న అతి పవిత్రమైన అమెరికా సమావేశము అయియున్నది. నిన్న ఆ రిజర్వేషన్‌ యొద్ద ఉండిన దానిని ప్రభువు ఎన్నడైనా నాకిచ్చి యుండెను. ఓహ్‌, నేను 15, 18వేలమందిని కలిగియున్నాను... ?... అక్కడ మూడు లేక నాలుగు, ఐదు వందలు అయి ఉండవచ్చును. నిన్న నేను ఎరుగను, దానియొక్క...దానిలో...?... ఆ విధమైన పరిశుద్ధాత్మ ప్రవాహము ఎన్నడూ చూడలేదు. మరియు ఇక్కడ అలా ఆ రిజర్వేషన్‌ వారితో సంబంధము కలిగియున్న మీలో ఎవరైనా ప్రజలు, ఆ సమావేశము నుండి ఏమి జరిగినదో గమనించండి.

అందుచేత అపుడు మేము... నేను గదిలోనికి వెళ్ళాను. మరియు ఆ తరువాత నేను అనుకొన్నాను, “సరే, నేను లోనికి వెళ్ళి మరియు కొంచెం సేపు చదువుకొందును.”

9

నేను బోధించుటకు బయటకు వెళ్ళుచున్నాను. ప్రతీ ఒక్కరూ కనుగొనుటకు ప్రయత్నించుచున్నారు. మేము పట్టణంలో ఉండగా, ప్రతీ ఒక్కరూ అలా చేయు విధముగా మేము ప్రతీ సంఘమును దర్శించగోరుచున్నాము. మేము ప్రతీ ఆదివారపు బడికి వెళ్ళలేము. అందుచేత ఎక్కడికి వెల్లగలమో అక్కడికి వెళ్ళుదుము, మేము ఎక్కడకు అక్కడకు వెళ్లి విభజించునట్లు చూచుటకు ప్రయత్నించుచున్నాము.

కాబట్టి మేము ...తుదకు, ఏదో నాతో చెప్పబడెను, “పుస్తకమును పట్టుకొనుము”

అక్కడ నేను లోపల దర్శనములు వ్రాసిన పుస్తకము ఉండెను. అవి నెరవేరినప్పుడు, నేను వాటిని ప్రజలకు చెప్పకముందు గుర్తుపెట్టాను. మరియు నేను దానిని పైకెత్తి పట్టుకొన్నాను. మరియు అక్కడ... 3వ రోజున.... (నేను మీ దగ్గరకు దానిని తీసుకొనిరాగలను, మరియు మీరు దానిని కోరిన యెడల మీయంత మీరే అది చదువగలరు.)

డిశంబరు మూడవరోజున న్యూయార్ములో నేను దర్శనములు చూచుటలో ఉన్నాను. ఉదయవేళలో ఏడు గంటలకు, బిల్లీ ఇంకా నిద్రించుచుండెను. నేను పడక నుండి లేచాను, మరియు కిటికీవైపుగా వెళ్ళాను, మరియు అక్కడ దేవుడు నాకు చూపించెను( నేను దాని గూర్చి మర్చిపోయాను) అది మన సమావేశములో ఒకవైపు నుండి మరొక వైపునకు జరిగినది, నేను అదంతా కాగితముపై దానిని వ్రాసియుంచాను, మరియు అది అక్కడ ఉండెను. ఆ ప్రభువు ఇది వరకే అది నాకు చూపించెను.

ఓహ్‌, మై. అది నాకు గగుర్పాటు కలిగించినది, ప్రభువు ఏలా ఆ కార్యములు జరిగించినది నాకు గగుర్పాటు కలిగించినది. అవి జరుగకముందే, ఏమి జరుగబోవుచున్నవో ఆయన చెప్పును కేవలం ఏమిటో అని... అది మరపు రానిదిగా లేదా ? ఆయన ముందే చెప్పగలడు, లేదా మొదలైనవి చెప్పును. ఆయన ఏమై ఉండెను, ఏమై ఉన్నది, మరియు ఏమై ఉండగలదు చెప్పును. చూసారా? మరపురానిదిగా.....

10

కొద్ది క్షణముల క్రితము, లోపలికి నడచి వచ్చుచుండగా, నాకు పరిచయం చేయబడిన ఒక పెద్ద మనిషి వచ్చెను. మరియు అక్కడ నిలబడి ఉండగా, ఆ మనిషి తప్పక అతని హృదయంలో కలిగి ఉండెను. నా జీవితములో నేను అతనిని ఎన్నడూ కలసికొనలేదు. అక్కడ ఒక టేబులు ఉన్నచోట ఒక స్థలం ప్రక్కగా అతడు నిలబడి ఉండుట నేను చూసాను. మరియు అతని భార్య నల్లటి తల గల ఒక విధమైన స్త్రీ అతనిని పోషించుచుండెను. ఇతడు ఒకవిధముగా పొడవైన మనిషి.

మరియు పరిశుద్ధాత్ముడు వానివైపుగా కదలి వచ్చెను, మరియు చెప్పెను, “అయ్యా,... మీరు బాధపడుచున్నారు” మరియు అక్కడ తలుపు దగ్గరనే సరిగ్గా అతడు అతని స్వస్థతను అంగీకరించెను, సరిగ్గా ఇప్పుడు ఈ భవనములో ఏదో చోట ఉండి ఉండవచ్చును, (చూసారా?) ఇక్కడే కూర్చుండి ఉండవచ్చును. వారిలో కొందరు నిలబడియున్నారు.

మనం తలంచిన దానికి ఆవలగా, ఏలాగు ప్రభువైన యేసు ప్రేమగల ఆయన కృప మరియు ప్రేమలో మనకొరకు కార్యములు చేయును. అది అలా కాదా?

11

ఇప్పుడు, ఈ మధ్యాహ్నం ప్రభువైన యేసు యొక్క రెండవ రాకడను...గూర్చి మాట్లాడనైయున్నాను. నేను చేసియుందునని చెప్పాను. సోమవారం లేదా మంగళవారము వరకు నేను దానిని ...ఏలయనగా నేను కోరినది-ఈ అంశముపై మాట్లాడుటలో చేయుటకు ప్రయత్నించుచున్నది ఏమనగా, ఈ విజ్ఞాన ప్రపంచమును ఋజువు చేయుటకు ఆ విధముగా మనము నివసించుచున్న ఈ రోజులలో - ఈ కాలములో విజ్ఞాన శాస్తమునకు సంబంధించిన యేసు యొక్క రెండవ రాకడను గూర్చి ఋజువు చేయుటకు ఎప్పుడో, నాకు తెలియదు. అయితే నేను ఇలా నమ్ముచున్నాను....

ఇప్పుడు, ఇది నాకు ప్రభువు చెప్పినది కాదు, కేవలము లేఖనముతో కలిపి సైన్సును తీసుకొనుటకు -లేదా విశేషముగా సైన్సుతో కలిపి లేఖనమును తీసుకొనుటకు, మరియు అలా ఇప్పుడు మనం నివశించుచున్న కాలము లేదా ఈ తరమును బుజువు చేయుటకు, వారు సరిగ్గా సమీపములోనే ప్రభువైన యేసుయొక్క రెండవ రాకడను చూడబోవనైయున్నారను దానివలె అది నాకు కనిపించుచున్నది. మరియు ఈనాడు అది ఉత్పత్తి చేయుటకు ఇంకా విజ్ఞానశాస్త్రము వైపునుండి చాలినంత వివరణ నేను కలిగి యుండలేదు.

అందుచేత నేను తలంచాను మేము దిగువకు వచ్చి మరియు ఈ రాత్రి మరల నేను బోధించుటకు చాలా చక్కగా ఉన్నఒక మంచి ఆదివారపు బడి పాఠమును కలిగియుండవచ్చునని, మరియు అప్పుడు ఈ రాత్రి స్వస్థత ఆరాధనలు కలిగి యుండవచ్చును. అది చక్కగా ఉండునా? మీరు ఆ విధముగా ఇష్టపడుచున్నారా?... అది పరిశుద్ధాత్మలో ఉన్నదని మనము ప్రార్థించెదము.

12

మరల ఒక సంగతి నన్ను చెప్పనివ్వండి, నా మనస్సులోనికి అది వచ్చుచుండగా ఒక భాగముగా తీసుకొనగోరుచున్నాను. ఒక సేవకుడు లేక ఇద్దరు పిలిచి మరియు మొదలైన వాటిని గూర్చి నా మేనేజరును పట్టుకున్నారు. మరో రాత్రి నేను ఆ వాఖ్యానము చేసిన దానిగూర్చి అడిగారు (అలా అది అపార్ధము చేసికొనబడెనని నేను నిశ్చయత కలిగి ఉన్నాను), అది ఆదాము మరియు అవ్వను గూర్చినది.

ఇప్పుడు, అది ఆ విధముగా చెప్పబడెను-అలా ఆదాము పాపము చేయలేదని నేను చెప్పినట్లుగా తలంచారు. ఆదాము పాపము చేసెను, మరియు శిక్షావిథికి లోనయ్యెను, మరియు దేవునిచే ఏదేను తోట నుండి తోలివేయబడెను. చూసారా? వాని మీద ఉన్న విమోచన అంగీ అది తెలియచేయుచున్నది.

చూసారా? సరే, నేను చెప్పినదేమిటంటే, అలా ఆదాము ఇష్టపూర్వకముగా పాపము చేసెను. చూసారా? చూడండి, హవ్వ నిజముగానే మోసపోయెను. అయితే ఆదాము మోసపరచబడలేదు. అతడు ఉద్దేశ్యపూర్వకముగా పాపము చేసెను. (చూసారా?) ఉద్దేశ్యపూర్వకముగా పాపము చేసెను, అతని భార్య మూలముగా అతడు ఏమి చేయుచున్నాడో ఎరిగియుండి పాపము చేసాడు. అతడు అతని భార్యతో కలసి స్థానములో ఉండెను. అప్పుడు వారు దేవుని ముందుకు వెళ్ళారు. మరియు వారు ఇద్దరు శిక్షావిధికి లోనయ్యారు.

మరియు యేసు, ఆయన ఏమి చేయుచున్నాడో అమాయకుడుగా కాకుండా, క్రిందికి దిగి వచ్చి ఆ విధముగా ఆ సంఘమును ఆయన తనకు తానే వెనుకకు విమోచింపబడునట్టుగా ఆ సంఘముతో ఆ పాపితోను ఆయన స్థానమును తీసుకొనెను. చూసారా? చూడండి. నేను దానిని ఒక పోలికగా చెప్పాను. ఆదాము అయి ఉండెను... ఉండెను... క్రీస్తు రెండవ ఆదాము. మొదటి ఆదాము ద్వారా అందరు చనిపోయారు; రెండవ ఆదాము ద్వారా అందరు జీవించారు.

13

అయితే వారు ఏర్చరచుకొనిన తప్పుడు అభిప్రాయము ఏమై ఉండెననగా పాపము చేయలేదని నేను చెప్పినట్లు వారు తలంచారు. అయితే ఆదాము పాపము చేసాడు. అయితే అతడు వాని కళ్ళ ఎదుటే బాహాటముగా పాపము చేసాడు. మరియు బదులుగా... తిమోతి గ్రంథం మూడులో ఆదాము మోసగించబడలేదని అది చెప్పెను. అయితే ఆ స్త్రీ మోసపరచబడెను, ఆపరాధములో ఉండెను. చూసారా?

ఆమె సరియైనదిగా ఉండెనని హవ్వ నిజముగా తలంచెను. అయితే సాతానుడు ఆమెను మోసగించెను. అయితే అతడు ఆదామును మోసగించ లేదు. అతడే అది పొరపాటు అని ఎరిగియుండెను. అయితే అతని భార్య కొరకైన ప్రేమమూలముగా, అతడు తనకు తానే ప్రాతినిధ్యము వహించెను. మరియు దాని ద్వారానే శిక్షావిధికి లోనాయెను. మరియు ఏదేను తోటలో నుండి బయటకు గెంటివేయబడెను.

మరియు పాపముతో నిండియున్న సంఘముతో క్రీస్తు తనకుతానే ప్రాతినిధ్యము వహించెను, మరియు శిక్షావిధికిలోనాయెను, మరియు ఆయన ఆత్మ పాతాళములోనికి వెళ్ళెను. అది సరియైనది. మరియు దేవుడు మూడవరోజున ఆయనను పైకి లేపెను. మీరు అది నమ్ముచున్నారా? చూసారా. అలా అతడు పాపము చేయలేదని అది అలా కాదు; అతడు పాపము చేసెను.

మరియు క్రీస్తు ఉండెను... ఆయన ఎన్నడూ ...పరిశుద్ధముగా ఉన్నందున పాతాళమునకు - దేవుడు ఆయనను పాతాళమునకు పంపలేదు. ఆయన పాతాళమునకు శిక్షింపబడుటకు పంపబడెను (చూసారా?) ఎందుకనగా ఆయన మన పాపములను తీసుకొనెను. మరియు క్రీస్తు చనిపోయెను, నీతిమంతునిగా కాదు; క్రీస్తు ఒక పాపిగా చనిపోయెను. చూసారా? క్రీస్తు ఎన్నడూ తనకు తాను

పాపము చేయలేదు, అయితే ఆయన మన పాపములను ఆయన మీద వేసుకొనెను.

14

ఏ లేఖన సంబంధమైన వేదాంత బోధకుడైనను వేదికను గూర్చి మీకు తెలియును, మరియు-పాతనిబంధన మరియు మొదలైన వాటిని గూర్చి. ఆయన ఆ రెండూ అయి ఉండెను... ఇక్కడ మీ దగ్గర ఉన్న ఆ సహోదరులు అది దయ్యమే ...మేక అని నమ్ముదురని నాకు తెలియును. అయితే కాదు, కాదు, లేదు, క్రీస్తు రెండు మేకలు అయి ఉండెను. (అది సరియైనది) మరణము మరియు పునరుత్ధానము రెండూ ఆయనే. మీరు చూసారా? మరియు ఆయన మన పాపములను భరించెను, మరియు ఆ తరువాత పునరుత్థానములో వచ్చెను.

మరియు అందుచేత అది సంఘము కొరకు ప్రాతినిధ్యము వహించుచున్న క్రీస్తు అయి ఉండెను. సంఘము యొక్క పాపపు స్థానమును ఆయన తీసుకొనెను, మరియు వెలుపల చీకటిలోనికి, పాతాళంలోనికి తోయబడెను, మరియు మూడవ రోజున మరలా లేచెను. మన నీతీకరణము కొరకై దేవుడాయనను పైకి లేపెను.

ఆయన అది ఒక లేఖనము యొక్క ఆధారముపై చేసెను. మరియు ఒక సేవకుడు వెనుకకు జారిన తరువాత, ఆ లేఖనము పలికెను. దావీదు చెప్పాడు, “నేను ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్దుని కుళ్ళు పట్టనీయను” ఆ విధముగా దేవుడు దానిని చేయనై ఉన్నాడని ప్రవచనం ద్వారా పలికినది, నేను ఒకే లేఖనమును పాతనిబంధనలో కనుగొనగలను. కనుక ఆయన ఆయన అత్మను పాతాళములో విడిచిపెట్టడు.

15

మరియు ఆ కారణము చేత మూడురోజులలో ఆయన లేచి యుండగలడని యేసు ఎరిగియుండెను....

ఇప్పుడు, కొంతమంది ప్రజలు అన్నారు, “ఎందుచేత, ఆయన సమాధిలో మూడురోజులు ఉండెదనని ఆయన చెప్పాడు” ఎందుచేత, ఆయన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు, కేవలము ఒక రోజు మరియు మరొక దానిలో భాగముగా ఉండి చనిపోయి, ఆయన ఆదివారం ఉదయవేళలో లేచాడు. చూసారా?

అయితే ఆయన ఎన్నడూ మూడు రోజులే అని చెప్పలేదు, ఎందుకనగా ఒక తిమింగలము కడుపులో ఉన్న యోనా పోలిక ఆయన పోలికగా ఉండెనని ఆయన ఎరిగి ఉండెను, మరియు ఆ విధముగా దావీదు చెప్పెనని ఆయన ఎరిగియుండెను, “నా పరిశుద్దుని కుళ్ళు పట్టనీయను”. మరియు డెబ్బై రెండు గంటలలో అది కుళ్ళు పట్టునని ఆయన ఎరిగెను. మరియు కొద్ది సమయములోనే అలా మూడు రాత్రులు మరియు పగళ్ళు, కాకుండానే, దేవుడు ఆయనను లేపనైయుండెను, కారణం ఆయన కుళ్ళు పట్టడు. చూసారా?

కనుక ఆయన శుక్రవారము మధ్యాహ్నము చనిపోయాడు, ఆదివారము ఉదయవేళలో లేచాడు, ఎందుచేతననగా అలా ఆయన శరీరము యొక్క ఒక కణమైనను కుళ్ళు పట్టదని దేవుడు వాగ్ధానము చేసెను, మరియు ఆయన తిరిగి లేచెను. ఆమేన్‌. ఇప్పుడు, మీరు ఆయనను ప్రేమించుచున్నారా? నా హృదయమంతటితో, అది అలాగే వుంది.

16

ఇప్పుడు, కొద్ది నిముషాలు కొరకు మాత్రమే ఇప్పుడు ఈ వైపునకు తిరిగెదము.......శ్రద్ధను మీరు నాకిచ్చిన యెడల, మనం ఒక ఆదివారపు బడి పాఠమును కలిగియుందము. మరియు ఇప్పుడు దేవుని చిత్తమైన యెడల, నేను అలా చేయుటకు ఇష్టపడుదును....

స్నేహితులారా, ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి, ముందుకు సాగుచుండగా ఎందరు నేను చెప్పినది నిజముగా మేలైనదని “ఆమేన్‌” అని చెప్పుదురు. కనుక నేను ఒక అల్పమైన - చాలా చిన్న బోధకుడను. అయితే స్నేహితులారా, నేను కేవలము ఇది బోధించుట, ఒక సిద్ధాంతముగా చేయుటకు కాదు. నేను బోధించిన దానిని నీవు ఒప్పుకొనిన యెడల, పరిపూర్ణముగా సరియైనది. చూసారా? అదంతా సరియైనదే.

మరియు మన ముక్కులు ఒకేలా వుండవని నేను ఊహించుచున్నాను....? అవును, మన ముక్కులు ఒకే విధముగా కనిపించవు, ఆ కారణముచేత అక్కడ ప్రపంచములో మనలో ఇద్దరు వారు మేము అని చెప్పజాలరు, మరియు అలాగే రె౦డు వేలిముద్రలు ఒకేలా ఉండవని చెప్పజాలరు.

అయితే కేవలము అదే విధముగా, నేను-నేను నా వేలిముద్రను, నా ముక్కును కూడ ప్రేమించుదును. అది అలా అయినచో ఒక చిన్న వ్యత్యాసకరముగా ఉండును. మీరు చూసారా ? నేను-నేను-నీవు నాది కలిగియున్నందుకు మరియు నేను నాది కలిగియున్నందుకు నేను సంతోషంచుచున్నాను. కనుక మనం-మనం యేసుక్రీస్తు యొక్క శరీరములో సభ్యులమై ఉండుట కొరకు సంతోషించుచున్నాము, మనం అలా సంతోషముగా లేమా?

17

మరియు ఇప్పుడు, ఈ బోధలో, కేవలము అది ఆ చిన్నసంగతి ఏమైయున్నది అను దానియొక్క లేఖనము యొక్క నా పరిశీలన అయియున్నది... ప్రభువు చెప్పెనని నేను చెప్పను. ఇది నాకున్న జ్ఞానమును బట్టి శ్రేష్టమైనది. చూసారా? అది తప్పు అయి ఉండవచ్చును, కారణము దానికి సంబంధించిన అది నా సొంత జ్ఞానమునకు చెందినది, అందుచేత అది అంత సమృద్ధి అయినదిగా ఉండదు.

అయితే మీరు....

నేను బోధించునప్పుడు మీరేమి చేయాలో నేను మీకు చెప్పగలను. నేను చెర్రీ వంటకము తినుచున్నప్పుడు నేను చేసినట్లే మీరును దానిని అలాగే చేయండి. నేను చెర్రీ వంటకమును ఇష్టపడుదునని, మీకు తెలియును. మీకు తెలియును గదా? సరే, అప్పుడు నీవు చెర్రీ వంటకము తినుచుండగా, మరియు మీకు విత్తనము తగిలిన యెడల ఏమిటి? నీవు వంటకమును దూరముగా విసురుదువా? నీవు ఆ విత్తనమునే దూరముగా త్రోసివేయుదువు, చెర్రీ వంటకమును తినుచూ ఉందువు.

ఎందరికి వేయించిన కోడి మాంసము ఇష్టము? మీకందరికి. నిశ్చయముగా, దక్షిణాదికి చెందిన మీరందరు వేయించిన కోడి మాంసమును ఇష్టపడుదురు, ప్రత్యేకముగా మతబోధకులు ఇష్టపడుదురు. కనుక మీరు వేయించిన కోడి మాంసము తినుచున్నప్పుడు మరియు మీకు ఒక ఎముక తగిలినప్పుడు, మీరు కోడిమాంసమునే పారవేయుదురా? ఆ ఎముకనే దూరముగా విసిరివేయుదురు. మీరు చూసారా? కాబట్టి ఇక్కడ మీరు ఏమి చేయుదురో అదే. మీరు దేనియందు విశ్వసించరో, కేవలము మీరు ఒక ప్రక్కకు తన్నివేసి, ఏది సరియైనదని తలంచెదరో దానినే తినుచూ ఉండండి. అదంతా సరియైనదే గదా ? ఆమేన్‌.

18

ఇప్పుడు, మనం నిజాయితీ గల భాగమును కలిగి ఉన్నాము. మనం అది కలిగియుండగా, మన ఆదివారపు బడి పాఠమునకు నాతో కలసి మీరు తిరగవలెనని నేను కోరుచున్నాను. ఈ మధ్యాహ్నవేళ కొరకు నా అంశము, కొంత సమయం వరకు, కారణం ఈ రాత్రి మనం వెనుకకు తిరిగివచ్చి, “క్రీస్తు నందు ఒక విశ్వాసి యొక్క స్థానము” అను పాఠమును బోధించుకొనెదము.

ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, మీ చేతులు పైకి ఎత్తండి. ప్రతీ చోట ఉన్న అందరు క్రైస్తవులు, మీ చేతులు పైకి ఎత్తండి. ఓహ్‌, అది అద్భుతంగా ఉన్నదనుకొనుచున్నాను. ఒక వంద శాతములాగా కనబడుచున్నది...ఇప్పుడు, నీవు ఒక విశ్వాసివి అయిన యెడల... నేను ఆ విధముగా నమ్ముచున్నాను. ఈనాడు సంఘము మీద ఉన్న అలా ఆ గొప్ప శాపము ఏమిటో నేను ఎరుగుదును. వారు ఏమైయున్నారో అది ఎరుగకయున్నారు.

ఇప్పుడు, ఈ మధ్యాహ్నము దేవుని సహాయం చేత, ఆ పరిశుద్ధ లేఖనాల ద్వారా, ఆయన మనకు సహాయపడిన యెడల, క్రీస్తునందు విశ్వాసిని సరియైన స్థానములో ఉంచుటకు మనం ప్రయత్నించుదము, మరియు క్రీస్తునందు అతని యొక్క అధికారము ఏమిటో చూపించుటకు ప్రయత్నించెదము. ఆ తరవాత అక్కడ బయట ఉన్న ప్రతీ వ్యక్తి రోగుల కొరకు ప్రార్ధించుచుందురు, మరియు- మరియు మనము ఒక గొప్ప కూటమును కలిగి ఉండగలమని నేను నిశ్చయత కలిగి ఉన్నాను.

ఇప్పుడు మనము మన ఉపోద్ఘాత భాగమును ముగించుచుండగా మన తలలు వంచెదము, మరియు ఇప్పుడు కూడిక యొక్క నిజమైన భాగమునకు వచ్చుచున్నాము.

19

ప్రేమ గల మా తండ్రీ, మొదట, నీకు నా ప్రేమను నేను వ్యక్తపరచగోరుచున్నాను, ఎందుకనగా రక్తము కారుచున్న నీ సొంత రొమ్ములోనికి ప్రేమించబడని ఒకని తీసుకొనుటకును మరియు పాప జీవితమునుండి నన్ను రక్షించుటకు ఆలాటి దయగలవాడవై యుంటివి. మరియు దానివలన, పాపము చేయు ఒక జీవితము నుండి ఆత్మీయ శక్తిని సమకూర్చుటకు రూపాంతరపరచుచు, తిరిగి జన్మించిన విశ్వాసులనుగా చేయును.

తండ్రీ, దానికొరకు మేము మీకు వందనములు చెల్లించుచున్నాము, ఏలయనగా మాలో ప్రతీ ఒక్కరి కొరకు నీవు దీనిని చేసావు, మరియు మేము నీకు కృతజ్ఞతలుగలవారమై యున్నాము. ఏలయనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, పాపులకొరకు చనిపోవుటకు భూమిమీదకు వచ్చెను, ఆ విధముగా ఆయన సజీవులకును మరియు మృతులకును మధ్యకు వెళ్ళి, నిలచి పాపముగా ఆయెను, మరియు వంతెనను నిర్మించి మార్గమును ఏర్పరచెను, ఈ విధముగా మృతులు వాక్యము వినుట ద్వారా లేపబడునట్లును మరియు ఆ లేఖనములు అంగీకరించుచూ మరియు తిరిగి జన్మించిన నూతన సృష్టిగా మారుదురు.

మరియు ఇప్పుడు, తండ్రీ, ఈనాడు అది అలా ఉండును గాక ఈనాడు మీరు మా మధ్యకు క్రిందకు దిగివచ్చి, మరియు అలా నీ వాక్యము చదువుట ద్వారా, ఆవిధముగా ఇక్కడున్న వ్యాధిగలవారై మరియు అవసరతలో యున్న ప్రతీ వ్యక్తి ప్రార్ధించవలసిన అవసరం కూడ లేకుండునట్లుగా, అయితే ఉన్నపాటున స్వస్థత పొందగలుగునట్లు, ఈ సమాజమును అటువంటి మార్గములో సరియైన స్థానములో ఉంచగలరు. క్రీస్తు వారి కొరకు ఏమి చేసెనో మరియు ఈనాడు వారు క్రీస్తులో ఏ స్థానమందు ఉన్నారో ఎక్కడైనా ఉన్న ప్రతీ వ్యాధిగ్రస్తుడు చూడగల ఒక సమయముగా అది ఉండును గాక.

ఆ విశ్వాసము యొక్క అడ్డంకులను మరియు మూఢనమ్మకాలను పగులగొట్టి ప్రభువా, ప్రతీ గోడను క్రిందకు పడునట్లు చీల్చి వేయండి. బలముగా వీచు గాలివలె ఆ పరిశుద్ధాత్ముడు అక్కడ ఆ రాత్రి దావీదు పడుకొని యుండగా, ఆ లోయలో మా కంటే ముందుగా వెళ్ళుచూ, ఆ యుద్ధము ఏలాగు ఉండునో అని ఆశ్యర్యపడును గాక. అయితే ఆ మల్బరీ పొదలో కదలుచున్న శబ్ధము, అతడు వినెను, దేవుడు ముందుగా వెళ్ళుచుండెనని ఎరిగియుండెను. దేవుడు ముందుగా వెళ్ళుచుండెనని ఎరిగియుండి అప్పుడు అతడు ఆ యుద్ధము కొరకు సిద్దపడియుండెను.

ఈనాడు మరలా ఆ కదలుచున్న మల్బరీ పొద యొక్క శబ్దమును మరలా దయచేయండి, ఆ పరిశుద్ధాత్ముడు ప్రభువైన క్రీస్తు వారికి నియమి౦చిన ఆ సరియైన స్థానములోనికి ప్రతీ ఒక్కరిని కదలించును మరియు వారు వెనుకనున్న మిగిలిన వారి జీవితమంతయు వారు సమీపముగా వెంబడించుదురు గాక. దేవా, నాకు సహాయము చెయ్యండి. మేము యేసునామములో ప్రార్ధించుచున్నాము. ఆమేన్‌.

20

ఇప్పుడు, మనం చేతి తువాళ్ళు తీసుకొనుచుండగా, ఎఫెసీయుల యొక్క గ్రంథము, వైపునకు త్రిప్పుటకు, మొదటి అధ్యాయముతో ప్రారంభించెదము.

మనం దానిని మరచిపోవుటకు ముందుగా, మనం ఎల్లప్పుడూ ఇలా చేయుటకు ఇష్టపడుదుము. నిన్న సంగతులలో ఒకటి, ప్రేమగల ఒక యౌవ్వన ఇండియను స్త్రీ వచ్చుచుండుట నేను జ్ఞాపకముంచుకొనియున్నాను, మరియు నా చేతులలో పెట్టినది... నేను నమ్ముచున్నాను అది ఏమనగా..?.. ఒక నూలు చిట్టం (హేంకి) మరియు ఒక నెక్‌ టై మరియు ఒక జత సాక్స్ తో కలిపి మెడ నుండి కాళ్ళవరకు ధరించే వాటిని ఇచ్చియున్నది.

సరే, నేను ఆమె కొరకు ప్రార్ధించుచుండగా-వాటిని నేను పట్టుకోవలెనని కోరుచున్నదేమోనని నేను తలంచాను. అయితే అప్పుడు, ప్రియమైన పరిశుద్దాత్మ మాట్లాడెను, అక్కడే నాముందు ఒక దర్శనం వచ్చెను, అతని పాదాలలో వ్యాధిగల ఆమెకు ప్రియమైన వారిలో ఒకని కొరకు అని చెప్పెను. మరియు ఆమె భర్త దేవుడు లేకుండా ఉండెను, మరియు ఆమె ఆ నెక్‌ టై వానిపై పెట్టవలెనని కోరుచున్నది. ఆ విధముగా అతడు పరిశుద్దాత్మ పొందవలెనని అలా చేసెను మరియు ఆమెకు ప్రియమైన అతడు ఈ సాక్సులు ధరించుట ద్వారా స్వస్థపడియుండెను. మై, సామాన్య విశ్వాసము, అది మరపు రానిదిగా లేదా?

అలా ఆ గుడ్డివారు చూస్తుండగా వారు చూచుటకు ప్రారంభించిన తరువాత, చెవిటివారు వినుచున్నారు; కుంటివారు స్వస్థత పొందార్ము వారు ఆసుపత్రి దిగువకు పరుగెత్తారు. మరియు వారి చిన్నపిల్లలను తీసుకొని అక్కడకు తీసుకొని వచ్చారు. అక్కడ ఒక చిన్న శిశువు ఉన్నది, కేవలము కొన్ని గంటల వయస్సు, 24 గంటల వయస్సు అలా ఏదో విధముగా, 2 రోజులు..?... ఆ చిన్నది... ఆ తల్లికి. ఆమె చుట్టెను, మరియు ఆమె ఇక్కడకు ఎలాగైనా గానీ వచ్చినది- ఆ శిశువు వ్యాధిగలదై యుండెను.

ఆ చల్లటి గాలి మంచులో ఉన్న ఆ పర్వత శిఖరముల పై భాగమునుండి వీచుచుండగా, వాటిగుండా వచ్చుచుండెను, ఆమెకు ఏ వ్యత్యాసము కలిగించలేదు, క్రీస్తు స్వస్థపరచుచుండెను; ఆమె యొక్క బిడ్డ స్వస్థపడవలెనని కోరెను.

వారిలో కొందరు ఆసుపత్రికి కూడ రాలేకుండాయుండిరి. ప్రేమ గలవారిని కలుసుకొనుటకు త్వరగా సమయానికి రాలేక పోయారు. కనుక మేము నడుపుచూ...?...నడుపుకుంటూ వెళ్ళగా, వారు అక్కడ చిన్న దుప్పట్లతో నిలబడియుండిరి మరియు నేను ఆ వస్తువులను వాటిని దీవించగా మరియు ఆ పరిశుద్ధాత్ముడు ప్రేమగల వారి దగ్గరకు ఆసుపత్రికి ఆ దుప్పట్లతోనే వెళ్ళి యుండెను. ఓహ్‌, మై... వారు ఆ శ్వేతజాతి ప్రజలను తమకుతామే సిగ్గుపడునట్లు చేసిరి.

21

ప్రార్ధించుకుందాము. పరలోకపు తండ్రీ, మా హృదయములు ద్వారా ఆ-ఆత్మ ఆ సామాన్య ప్రజల మధ్యగా, స్వచ్చమైన సామాన్య ప్రజలు కదులుచు౦డుట మేము చూడగలము. తండ్రీ, మేము భయపడుచున్నాము, అలా మాలో అనేకమైన బోధకులు ప్రజల నిమిత్తము అది చాలా సమస్యతో కూడినదిగా చేయుటకు ప్రయత్నం చేసారు.

అలా మేము ఇప్పుడు ఉన్న నేర్చుకొనుచున్న మా గొప్పదినములో ప్రతీదియు, ప్రతీ ఒక్కరూ బుద్ధి కుశలత గలవారే, చదువుకొన్నవారు పుస్తకములు చదువుటయందు వారి సమయమంతా మరియు మొదలైనవి ఖర్చు చేసిరి. మరియు పాఠశాలలో పాండిత్యమును పొందుచూ, లేదా విజ్ఞానశాస్త్రమును, సాహిత్యము మరియు గణితశాస్త్రము నేర్చుకొనుచూ, మరియు ఆ పరిశుద్ధాత్మను విడిచిపెట్టిరి ఆ కారణము చేత మనము అభివృద్ధి చెందాము- అభివృద్ధి చెందుచూ మరియు ఆ తూర్పు దేశస్తులు అత్మతో నింపబడెను. దేవుడు, కరుణించును.

ప్రభువా, అలా దానంతటి మధ్యలో, అలా నిన్ను ప్రేమించి, మరియు ఎవరు నమ్మారో, ఆ ప్రజలను మాట్లాడుటకు ప్రోత్సహించారు, వారు ఇక్కడ ప్రార్ధన చేయుటకు ఇక్కడ చేతి తువాళ్ళను ఉంచారు. ప్రభువా వారు నిన్ను ప్రేమించారు. అలా ఆ చేతి తువాళ్ళలో ప్రతీదియు దీవించవలెనని మేము ప్రార్ధించుచున్నాము, మరియు దేవా, ఆ విధముగా నీవు ఆమె జోళ్ళను దర్శించగలవు....?... నిన్న ఆ ఇండియను యువతికి జరిగినట్లుగానే, వీటికి అలా జరుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఉన్న అదే పరిశుద్దాత్మ, అలా ప్రతీ ఒక్కరు స్వస్థపడునట్లు చూచెదము గాక, ఎందుకనగా మేము యేసు నామములో ఆ విధమైన ప్రయోజనము కొరకే పంపుచున్నాము. ఆమేన్‌.

22

స్నేహితులారా నేను ఆంగ్లో-సాక్సన్‌ ప్రజలను గూర్చి మాటాలాడుచుండగా, మీరు విన్నప్పుడు, మరియు ఆ- మరియు శ్వేతజాతి ప్రజలలో ఆ బేదములు, నేను ఆ సంఘమును గూర్చి అని నా ఉద్దేశ్యము కాదు. అది బయటకు పిలువబడినవారు. చూసారా? కొన్ని నిముషాలలో అది ఏమైయున్నదో మీకు తెలియచేయనైయున్నాను. చూసారా.

నేను దానిని గూర్చి ఏమి మాట్లాడుచున్నానో, అది దేశమంతటిని గూర్చి, మొత్తం చిత్రం అంతటిని గూర్చియు అయి ఉన్నది. ఆ విధముగా అమెరికా ప్రజలు, బాగా పోషణ కలిగియుండి, వారికున్న డాక్టర్‌ ఆఫ్‌ డివినిటితో, వారికున్న పి.హెచ్‌.డితో, మరియు డి.డి.తో, ఎల్‌.ఎల్‌.డి.తో, మరియు దానంతటితో జమీందారులవలె ఉన్నారు. కేవలము వారు దానికొరకే చూస్తున్నారు.

వారంతట వారు ఏమి పొందారో మీరు చూసారా? వారు కేవలము దేవుని వాక్యమును విడిచిపెట్టారు. అది నిజము. వారు ఆయనను ఏ స్థానములో పొ౦దారో అదే. వారు సహజాతీతమైన దానిలో విశ్వసించలేదు. కేవలము వారు ఆ విధముగా విజ్ఞానశాస్త్రము మరియు విద్య మరి మొదలైన వాటిలో ముందుకి వెళ్ళారు, అలా వారు-వారు దేవుని విశదీకరించి దూరంగా పోయారు. ఆ రక్తము అంతా పోయెను; అద్భుతాలు జరుగు రోజులు గతించాయి, కేవలము దానిని విశదీకరించి పోగొట్టుకున్నారు. మరియు ఇప్పుడు సంఘములో అక్కడ ఏమియు లేదు. కేవలము ఇలా ...మంచిది, కేవలము ఇలా వుంది - అందరు కలసి కూడుకొనుచున్నారు. సహోదరుడా, క్రీస్తులో అంతా కలసి కూడుకొను తిరిగి జన్మించిన విశ్వాసుల యొక్క అది ఒక స్థలమైయున్నది.

23

ఇప్పుడు, ప్రారంభిద్దాము, కారణము ఏమనగా ఇప్పుడు మనం ఎక్కువసేపు ఉండము. నేను మిమ్మును వెనుకకు వెళ్ళమని కోరుచున్నాను. నేను అడగటం మరచిపోయాను. వారు ప్రతీ సాయంకాలము ప్రార్థనా కార్డులు ఇచ్చుచున్నారని నేను అనుకొనుచున్నాను, మరియు ఈ మధ్యాహ్నము ఆరాధన తరువాత లేక రాత్రి కూడ కావచ్చును. మరియు అప్పుడు మనకు సాధ్యమైనంత మట్టుకు అనేకులను పొందగలిగిన యెడల మనం ప్రయత్నించగలము, మరియు ఆ పరిశుద్ధాత్ముడు ఏ మార్గములో నడిపించునో సాధ్యమైన యెడల వారిని మనము పట్టుకొందము.

ఇప్పుడు, ఎఫెసీయుల గ్రంథంలో..... పౌలు, క్రీస్తు మరణించిన తరువాత 64లో రోమ్‌ నుండి ఈ గ్రంథమును వ్రాసెను. అది పెంతెకోస్తు తరువాత 31 సంవత్సరాలకు అది అయి ఉండును, అతడు అక్కడ శిరచ్చేదనము జరుగక ముందే దేశము నుండి బహిష్కరించబడెను.

ఈ మధ్యకాలములో ఎఫెసీయులకు ఈ పత్రిక ఎక్కడ వ్రాయబడెనో ఆ స్థలము దిగువన నేనుంటిని. ఆత్మలను గద్దించుచూ, సంకెళ్ళలో నుండి, ఎక్కడ ఆ అపొస్తలుడు నిలబడెనో అక్కడ చెరసాల చిన్నగదులలో, ఆ స్థలములో అక్కడ కూర్చొని ఉండగా, మరియు ఆ సంఘాలకు ఉత్తరాలు మరియు మొదలైనవి వ్రాయుచున్న అక్కడ, నేను తలంచాను, “ఒహ్‌, మై, ఆ పరిశుద్ధాత్ముడు ఈ స్థలములోనికి కదలి వచ్చెను.” కేవలము నీకు అది ఒక భావనను ఇచ్చును. అలా కేవలము నీవు - దేవుని సన్నిధిలో ఉన్నావనియు, అక్కడే వారు అతని తలను నరికి, ఆ భూగర్భంలో ఉన్న మురికి నీటి కాలువలోనికి దించి అందులో వేసిరి. దేవునికి మాత్రమే తెలియును, అయితే ఈనాడు అన్యజనుల సంఘానికి ప్రియమైన అపొస్తలుడుగా ఉన్న పరిశుద్ధ పౌలు, ఈ దర్శనములు, అతడు మనుష్యుల మధ్యలో అమర్త్యునిగా ఉన్నాడు.

24

ఇప్పుడు, ఎఫెసీయులకు వ్రాసిన ఉత్తరము, ఈ పత్రిక బయట ప్రపంచానికి కాదు, విశ్వాసులకు వ్రాయబడెను. వీరు విశ్వాసులు. ఆ కారణము చేత మొదటిగా నేను పరీక్షించి మరియు అక్కడ పాపులు మరియు అవిశ్వాసుల గుంపులుండిన యెడల, అప్పుడు నేను ఇక్కడ దీని, గూర్చి మాట్లాడలేనని, మధ్యాహ్నము నేను ఆలోచించాను. అయితే, ఇప్పుడు ఆ విధముగా అది విశ్వాసుల కొరకు అని చూచుచు, మరియు ఆ విశ్వాసులు హాజరై వుండగా, అతడు ఏ స్థానములో ఉన్నాడో ఆ విశ్వాసిని మనం చూచుటకు అనుమతించిన ఎడల అది మేలుకరముగా ఉండునని నేను తలంచాను. ఇప్పుడు, క్రైస్తవులారా, ఈ రోజున అది అవగాహన చేసికొనుటకు, గట్టిగా ప్రయత్నించండి, ఆ విధముగా ఆ వర్తమానము ఆ విశ్వాసిని అనుకూలముగా ఉండు సరియైన స్థానములో ఉంచును.

ఇక్కడ లోపల ఉన్న ప్రతీ విశ్వాసి వారి స్థానములో ఉండిన యెడల...మంచిదే, ఇక్కడ లోపల ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే అక్కడ విడువబడి యుండగా, ఆ విధముగా ఎక్కడైతే ఆ మొత్తం వరుసల యొక్క చక్రాల కుర్చీలో కూర్చున్న వారి నిమిత్తము నేనెంతో వందనములు చెల్లించుచున్నాను. ప్రతీ విశ్వాసియు వారి స్థానములు ఎరిగియున్న యెడల, (ఒక మంచముపై ఉన్న స్త్రీ అక్కడ వెంట చంక కర్రలతో ఉన్న మనిషి), అక్కడ ఈ భవనములో వచ్చే ఇరవై నిముషాలలో బాధపరచబడే ఒక వ్యక్తియు ఉండడు. అది నిజము. ప్రతీ మనిషియు సామాన్యముగా వానియొక్క స్థానమును యేసుక్రీస్తులో కనుగొనినయెడల, (వాని యొక్క లేదా ఆమె యొక్క స్థానము) అది ఏలాటి వ్యత్యాసమును కలిగించును. ఇప్పుడు, నేను ఎరుగుదును... మీ యొక్క మనస్సు ఎంత వేగముగా దొర్లుచున్నదో నేను అనుభవించాను. “ఇప్పుడు, బ్రాన్హాం సోదరుడా, నేను ఏ స్థానములో ఉన్నానో నేనెరుగుదును.” నీవు చేసినట్టుగా అనుకొనుచున్నావు. చూసారా? అది అలాగే ఉన్నది నీవు చేసిన యెడల అది వ్యత్యాసము ఉండి ఉండును.

25

ఆ వేదిక యొద్దకు ప్రజలు వచ్చుట నేను చూసాను. నేను ఇలా అన్నప్పుడు, “నీవు నమ్ముచున్నావా?”

“ఓహ్‌, బ్రాన్హాం సోదరుడా, నేను పూర్తిగా విశ్వసించియున్నాను.”

ఇప్పుడు, నేను వారిని చిన్నవారినిగా చేయుట నా ఉదేశ్యము అది కాదు. నేను దానిని గౌరవింతును. అయితే వారు ఇక్కడ పైగా ఉండవలసినవారు, మరియు ఇక్కడే వారు మార్గము ఇక్కడే క్రింద ఉన్నారు. అయితే అది ఏమై ఉన్నదో మీరు ఎరుగుదురా? విశ్వాసమునకు బదులుగా అది నిరీక్షణ అయిఉన్నది. విశ్వాసము సరిగ్గా ఇప్పుడే పనిచేయును. నిరీక్షణ దానికొరకు నిరీక్షించును, అయితే విశ్వాసము ఉత్పత్తి అయి ఉన్నది. విశ్వాసము అది వాస్తవముగా పనిచేయును. చూడండి, మనం ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాము, కానీ ఎక్కువగా విశ్వాసము కలిగియుండలేదు. కనుక మనము నిరీక్షణ నుండి ఈనాడు అనుకూలమైన విశ్వాసానికి మారుటకు కోరుచున్నాము. మరియు అక్కడ అనుకూలమైన విశ్వాసము మనం పొందగల ఒక మార్గము మాత్రమే గలదు. అది అనుకూలమైన సంగతులను గూర్చి అనుకూలముగా ఆలోచించుట ద్వారా అయి ఉన్నది.

ఇప్పుడు, ఉదాహరణకు, మీలో కొందరు స్రీలు ఈనాడు లేక రేపు ఇంటికి వెళ్ళిన యెడల ఏమిటి.... ఈనాడే మీరది చేయగోరుదురని నేను ఆలోచించలేదు. అయితే రేపు, మీరు వెళ్ళి మరియు మీరు కరెంటుతో ఇస్త్రీ చేయుటకు ప్లగ్ ను కలుపుదురు మరియు అక్కడ విద్యుత్‌ లేదు. ఆ కారణము చేత, మీరు ఏ చేతులను చాచి మరియు ఇలా అందురు, అయ్యో-అయ్యో-పాపము మరియు పాపము... “అక్కడ అలాటి కరెంటు వంటిది ఏదియు లేదు.”సరే, నిశ్చయంగా కాదు. మీరు మీ తీగలను ఎక్కడో ఒక చోట కలిసి పోయినట్లుగా చేశారు (తప్పుగా), అక్కడ సమృద్ధిగా కరెంటు ఉన్నది; మీరు కేవలము అది సరియైన విధముగా కలుపలేదు. అది సరియైనదే గదా...?...

ప్రార్ధించబడిన ఒకడు మరియు నీవు ఎందుచేత స్వస్థతపొందలేదు? “అక్కడ ఆ విధమైన అలాంటి స్వస్థత అను కార్యము లేదు.” కేవలము అది మిగిలినవారు ఎంత అజ్జానముగా ఉన్నారో అదే విధముగా ఉన్నారు. మిగిలినవారు స్వస్థత పొందునుండగా, నీవు ఎందుకు పొందలేకపోయావు? చూసారా? కేవలము నీవు... విచ్చిన్నమైనది ఏమనగా ఆ తీగలే... ఆ పరిశుద్ధాత్మ మాత్రమే....

26

చూడండి ఆ విద్యుచ్చక్తి... చూడండి, ఆ మొత్తం ప్రపంచం పూర్తిగా కరె౦టుతో నింపబడినది, నీకు అది తెలియునా ? నీవు న్యూయార్కు పట్టణానికి వెళ్ళగలవు. మరియు ఒక రాగి తీగను తీసుకొనుము మరియు రాగి తీగతో లాస్‌ ఏంజలస్‌కు వెళ్ళుము.... ఒక హెలికాప్టరు తీసుకొని దానిమీద ఆకాశంలో ఐదు మైళ్ళు ఎత్తుకు వెళ్ళి మరియు ఆ రాగితీగను క్రిందకు జారవేయుము. మరియు కరెంటుతో మండించి భూమిని క్రమములో ఉంచుటకు చాలినంతగా విద్యుచ్భక్తిని సేకరించుము. ఆ విధముగా చాలా సమృద్ధిగా విద్యుచ్చక్తిని ఆక్కడ భూమిమీద కలిగియుండగలము. నిశ్చయముగా.

ఇప్పుడు , ఆ ప్రపంచం మొత్తం పూర్తిగా కరెంటుతోనిండి ఉండిన యెడల, మరియు రాత్రి సమయములో ఒక పెద్ద నల్లగా ఉన్న పొలము యొక్క మధ్యలో బయట నీవు వుండగా, మరియు నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావో నీవు చూడలేవు, మరియు నీవు ఇలా బిగ్గరగా అరచుచున్నావు. “ఓహ్‌, విద్యుచ్చక్తి నా కొరకు ఒక వెలుగును పుట్టించుము. నీవు వెలుగు ఇవ్వగలవని నాకు తెలియును, అయితే వచ్చి నా కొరకు ఒక వెలుగును, విద్యుచ్భక్తిని పుట్టించుము. నీవు ఇవ్వగలవని నాకు తెలియును. ఈ అంధకార స్థలములో నుండి బయటకు ఇమ్ము. కరెంటు నీవు ఇక్కడే వున్నావని నాకు తెలియును. ఆ విధముగా నీవు ఇక్కడే వున్నావని విజ్ఞానశాస్త్రము బుజువు చేయును. వచ్చి ఒక వెలుగును పుట్టించుము.” ఇప్పుడు, కేవలము. నీవు, నీ ఊపిరి పోగొట్టుకొంటున్నావు. అంతా అదే.

27

ఇప్పుడు, ఆ విద్యుచ్చక్తి వెలిగింపబడని యెడల...సరిగ్గా ప్రవహించే దానియొక్క సమగ్రమైన విధానములో ఆ విద్యుచ్చక్తిని నీవు పొందగలిగిన యెడల, అనుకూలమైన, అది దానియొక్క సరియైన స్థానములో నీవు వుంచినయెడల అది వెలుగును ఇవ్వగలదు.

ఇప్పుడు, ఆ మొత్తం భూమీ... ఇక్కడ ఉన్న ఆ గదిమొత్తం అంతా దేవుని శక్తితో నింపబడియున్నప్పుడు, ఇక్కడ చక్రాల కుర్చీలో కూర్చొనియున్న ఈ బాలుడు నడుచుటకు కావలసినంత శక్తి కలిగియుండునట్లును, తోపుడుబండిలో ఉన్న ఈ స్తీ నడువగలుగునట్లును, ఇక్కడ ప్రక్మనే ఉన్న ప్రజలందరూ నడచునట్లును, గుడ్డివారు చూడగలుగునట్లును చేయును. అయితే మొదట నీవు చేయవలసిన సంగతి ఆ పరిశుద్ధాత్మను అనుకూలమైన సరియైన విధానములోప్రవహించునట్లు చేయుము. దానిని నీవు నమ్ముచున్వావా? అది ఇక్కడేనున్నది.

28

నీవు ఈ పర్వతమువైపు మంచి నైపుణ్యముతో త్రవ్విన బావి కలిగి ఉండిన యెడల ఏమిటి మరియు ఈ పర్వతం వైపున ఒక పంట నీళ్ళు లేక ఎండిపోవుట ఏమిటి? నీవు అక్కడ కూర్చుండి బిగ్గరగా ఇలా, “ఓహ్‌, గొప్ప శక్తితో ప్రవహించు జలమా, గొప్ప శక్తితో ప్రవహించు నీరూ, అక్కడ ఆ వైపుకు వెళ్ళి మరియు నా పంటను తడుపుము. ఓహ్‌, గొప్ప శక్తితో ప్రవహించు జలమైన నీవు, అక్కడ ఆ వైపునకు వెళ్ళి మరియు నా పంటను ప౦డించుటకు నీటితో తడుపుము.” నీయంత నీవే గొంతు బొంగురుపోయినంతగా మారుదువు. అది ఎన్నడూ కదలలేదు.

కాబట్టి నీవు బిగ్గరగా అరవగలవు; నీవు ఏడ్వగలవు; నీవు అందరికి వినబడునట్లు బిగ్గరగా అరవగలవు; నీవు పరుగెత్తగలవు; నీవు భాషలలో మాట్లాడియుందువు. నీవు పైకి-క్రిందకు ఎగరగలవు; నీవు పాటలు పాడియుందువు. నీవు ఆ సువార్తను ఉపదేశించియుందువు; అయితే నీవు పరిశుద్ధాత్మతో సామరస్యముతో (అవగాహన) పని చేయునంతవరకు, నీయంత నీవే గొంతు బొంగురుపోయినంతగా మారుదువు. మరియు ఎక్కడకు వెళ్ళలేవు. నిజము. నేను - మీరు దానిని నమ్ముచున్నారా? అది నిజము.

అయితే ఇప్పుడు, చూడండి. నీవు సరియైన భూమ్యాకర్షణ నియమాలతో పనిచేసిన యెడల, ఈ నీరు ఈ పంటకు నీరిచ్చును. అది ఆ నీటిని సరియైన విధముగా ఆ చుట్టూ ఉండునట్లులాగును మరియు ఆ పంటకు నీరునిచ్చును. నీవు భూమ్యాకర్షణ శక్తి యొక్క నియమముల ప్రకారము పని చేసిన యెడల, అలా ఆ నీరు పారుచువచ్చును. అయితే నీవు దానిని అక్కడ ఆ వైపునకు గెంతి వెళ్ళునట్లు చేయలేవు.

29

ఇప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు ఇక్కడ లోపల ఉన్న ప్రతీవ్యక్తిని స్వస్థపరచును. నీవు పధకమును అనుసరించి మరియు పరిశుద్ధ లేఖనములననుసరించి పనిచేసిన యెడల స్వస్థత జరుగును. ఈనాడు ఈ పట్టణములో అక్కడ చాలినంత - చాలినంత మంది క్రైస్తవులు ఉన్నారు, ఈనాడు ఈ భవనములో ఫోనిక్స్‌ మీదుగా ఆకాశములను మూయగలుగుటకు చాలినంత మంది క్రైస్తవులున్నారు. అది మీకు తెలియునా? అయితే నీవు ఆ ఆత్మ యొక్క చిత్తము ననుసరించి పని చేయవలెను. ఇప్పుడు, ఈనాడు మనము ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నామో అదే, వానియొక్క సరియైన స్థానములో విశ్వాసిని ఉంచవలెను. కనుక అతడు ఎక్కడ నిలచి ఉండినది చూడగలడు. కేవలము ఏ దారిన అయిన పరుగెత్తుచూ ఏలాగు వెళ్ళుచున్నావు? కేవలము నీవు గాలిని కొట్టుచున్నావు. నా ఉద్దేశ్యము ఏమిటో మీరు గ్రహించారా?

30

ఇప్పుడు, ఎఫెసీయుల పత్రికలో, ఇప్పుడు ఇక్కడ పౌలు వాదించుచున్నది, మీరు చదువుచుండగా, మీలో ప్రతీ ఒక్కరు మీకిష్టమైన యెడల మనం వాక్యమును గూర్చి మాట్లాడుకొనుచుండగా ఎంతగా భక్తి మర్యాదలతో ఉండవలెనో అంత నీతిగా ఉండుటకు ప్రయత్నించండి.

పౌలు - దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడనైన ....

ఆ మొదట ఉపోద్ఘాతము అతడు ఏవిధముగా అపొస్తలుడుగా ఉండెనో, దేవుని చిత్తము వలన అపొస్తలులు, దేవునిద్వారా అపొస్తలుడుగా పిలువబడెను. ఒక చోట అతడు మనుష్యుని మూలముగా పిలువబడలేదు, అతడు మనిషిద్వారా పంపబడలేదు కాని దేవుడే వానిని పంపెను. ఇప్పుడు, మొదటి విషయము, అతడు అపొస్తలుడు.. ఆ మాట “అపొస్తలుడు” అనగా అర్ధము “ఒక మిషనరీ లేక ”పంపబడినవాడు“ మిషనరీ అనగా అర్ధము ”పంపబడినవాడు “ మరియు ”అపొస్తలుడు“ అనగా ”పంపబడినవాడు“ రెండింటికి ఒకే పదము.

ఇప్పుడు, మనిషి ఒక మిషనెరీని పంపగలడు, లేక దేవుడు ఒక మిషనెరీని పంపగలడు. మనిషి అపొస్తలుని పంపగలడు ఎపిస్కోపిలియనులు మరియు మొదలైన ఆలాంటివారు, వారంతటవారే అపొస్తలుల సంఘం మరియు అలా పిలుచుకొనుచున్నారు. వారు అపొస్తలుల సంఘముగా ఉన్నారు. వారు వారిపై చేతులుంచి మరియు వారిని బయటకు పంపుచున్నారు; అప్పుడు దేవుడు ఒక అపొస్తలుని పంపగలడు, పంపబడినవాడు.

కనుక పౌలు మీద నీ చేతులుంచియుందువని తలంచవద్దు. దేవుడే ఆయన చేతులను పౌలుపై ఉంచెను. వానిని వాని గుర్రముమీద నుండి క్రిందకు పడవేసెను, మరియు అతడు అక్కడ ధూళిలోపడి దొర్లెను, అది అలా ఉండగా, పైకి లేచి నిలబడగా, మరియు క్రీస్తు వానితో మాట్లాడుచుండెను. పౌలు మనుష్యుని వలన కాదు, దేవుని చేత పంపబడెను. అతని పిలుపు దైవికమైనదైయుండెను. లేఖనములలో వ్రాయబడియుండి, అతని పరిచర్య వలన బుజువు చేయబడినదై, లేఖనములో పౌలు ఏమి చెప్పెనో అది సత్యమై ఉండెనని నేను నమ్ముచున్నాను, కనుక అతని పిలుపు దైవికమైనదై యుండెను.

31

పౌలు ఎఫెసీయులుకు వ్రాసిన పత్రికలో చెప్పెను, నా ఉద్దేశ్యము గలతీయ పత్రికలో 1:8లో అని, అతడు చెప్పెను, “ఈ సువార్త ఆలాగు నిశ్చయమైనది, పరలోకము నుండి దూతదిగి వచ్చి ఇది గాక వేరొక సువార్తను గూర్చి కూడ చెప్పిన యెడల అతడు శాపగ్రస్తుడగును.” ఇప్పుడు పౌలు చెప్పినది గమనించండి:

......దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడనైన...

ఇప్పుడు, అతడు క్రీస్తుయేసునందు నమ్మకమైన వారికి, ఎఫెసునొద్ద ఉన్నవారికి దానిని సమర్పించుచున్నాడు. ఇప్పుడు, గమనించండి. అతడన్నాడు..?... ఈ పత్రిక చెప్పునదేమనగా, ఆవిధముగా మొదట దేవుని చిత్తము వలన అతడు అపొస్తలుడుగా ఉండెనని చెప్పెను. దేవుడు అతనిని అపొస్తలుడుగా ఉండుటకు పిలిచెను,

మరియు ఎఫెసునొద్ద క్రీస్తు యేసునందున్నవారికి అని అతడు చెప్పెను. ఇప్పుడు మొత్తం అందరూ కాదు... ఈనాడు అమెరికా చెప్పునది ఏమనగా అది ఒక దేశమునకు, ఒక స్థలమునకు, లేక ఒక పట్టణమునకు లేక ఒక సంఘమునకు పంపబడెననెను. పౌలు ఎన్నడూ దానిని సంఘమునకు మాత్రమే పంపలేదు; అతడు దానిని అలా క్రీస్తుయేసునందున్నవారికి పంపెను. ఆ పత్రిక దేనికొరకు అనగా దానికొరకే, బయట ఉన్న దానికొరకు కాదు, కాని క్రీస్తునందున్నవారికి.

32

ఇప్పుడు, మొదట విషయము మనము తెలుసుకొనగోరునది, ఆ పత్రిక అప్పుడు ఈ దినముకొరకు అవసరం అయి ఉన్నదా? ఏలాగు క్రీస్తు యేసునందులోనికి ప్రవేశించగలరో తెలుసుకొనగలము. ఇప్పుడు, క్రీస్తుయేసును కలిగియున్నామనుటకు, అక్కడ చాలా వివిధ రకముల పద్ధతులు గలవు. వారు నీవు సంఘములోనికి చేరమన్నారు. నీవు నమ్మినయెడల అని కొందరు అన్నారు. మరియు కొందరు ఒక సంగతి చేయవలెను మరియు మరొకటి చేయవలెను అన్నారు. కొందరు దానిని బాప్తిస్మముద్వారా తీసుకొన్నారు. కొందరు దానిని సహవాసము ద్వారా తీసుకొన్నారు.

అయితే, మొదటి కొరింధీయులు 12వ అధ్యాయము చెప్పును, “ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందాము.” క్రీస్తు శరీరము అనగా, విశ్వాసుల యొక్క శరీరము అయి ఉన్నది. అది చూసారా? దేనిద్వారా? ఒక కర స్పర్శ ద్వారా కాదు, బాప్తిస్మము పద్ధతి ద్వారా కాదు, ఒక భావన ద్వారా కాదు గానీ ఒక ఆత్మ-గొప్పదైన ఆత్మ పరిశుద్ధాత్మ, ఒకే ఆత్మద్వారా మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము అయి ఉన్న ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి.

33

దానివైపు చూడండి, చితుకగొట్టబడెను, గాయపరచబడెను, చీల్చబడెను, ఆయన దైవిక స్వభావములో పాలిభాగస్తులమగునట్లుగా, రోమా ఈటెతో పొడవగా ఆయన ప్రక్కభాగము తెరవబడెను అలా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శరీరములోనికి మనం బాప్తిస్మము పొందునట్లుగా అలా జరిగెను. మీరు దానిని గ్రహించారా? ఆయన దైవిక స్వభావములో ఒక పాలిభాగస్తునిగా, ఆయన శరీరములోనికి వచ్చిన తరువాత, అప్పుడు నీవు ఒక పాలిభాగస్తునిగా కాగలవు; క్రీస్తు స్వభావము నీలో ఉన్నది. నీలో దైవిక స్వభావము ఉండగా, మోసగించుట, దొంగిలించుట, అబద్దమాడుట, వెనుకకు జారుట, మతము భావము మార్చుకొనుట, ఇతరమైన ప్రతీదియు ఎలా చేయగలవు? అది అసాధ్యములు.

దానిని లోతుగా నాననివ్వండి. కారణము అది యధార్ధము....క్రీస్థులో ఒక పాలిభాగస్తునిగా ఉండిన యెడల, అప్పుడు నీవు ఒక నూతన సృష్టివి; పాతవి గతించెను. మరియు సమస్తమును క్రొత్తవాయెను. మనకున్న సమస్త పోరాటాలు, మరియు అనవసరమైన పేచీలు, ఏమి చేయలేని సమస్యలు, గారాబముగా చేయునవి, మరియు ఈ సమస్త సంగతులు గతించిపోవును. మీరు అది గ్రహించారా?

ఆత్మ ఫలము అనగా ఏమిటి? మనం దానిని సంఘ సభ్యత్వము మీదను, కేకలు వేయుట మీద, మన క్రియలు యొక్క గొప్ప ప్రదర్శనలు మీద దానిని నాటాము. అయితే ఆత్మఫలము మొదటగా ప్రేమించుట, ఎవరిని ప్రేమించుట? నీవు ఎవరిని ప్రేమించలేక పోయావో వారిని నీవు 'ప్రేమించునప్పుడే అది యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, దయాళుత్వము, సహనము, అక్కడే అత్మఫలము ఉన్నది. కనుక నీవేమి చేసియున్నను, నీవు ఏ సంఘానికి చెంది యున్నను అది ఏమియు కాదు...

34

ఓహ్‌, నీవు ఇలా చెప్పుదువు, “ఇప్పుడు, బ్రాన్హాం సోదరుడా, నేను నీకు చెప్పుదును; నేను ఇలా చేయుదును, మరియు నేను అలా చేయుదును. అయితే ఇంకా, నేను-నేను-ఏమి పొందానో నేను ఎరుగుదును. ఎందుకనగా నేను-నేను రోగుల కొరకు ప్రార్ధించగలను మరియు వారు స్వస్థత పొందుదురు. బ్రాన్హాం సోదరుడా, దేవుడు నాకు ఈ విధముగా మరియు ఆ విధముగా మరియు మరొక విధముగా వాక్యమును బయలుపరచెను. నాయందు వాక్యము యొక్క జ్ఞానము కలిగి ఉన్నాను. నీవు పొరపడియున్నావు. నేను రోగులను స్వస్థపరచుదును. నేను భాషలు మాట్లాడుదును. నేను-నేను ఈ కార్యములు చేయుదును. నేను దయ్యములను వెళ్ళగొట్టెదను.

యేసు చెప్పెను, “ఆ రోజున అనేకులు ఇదే కధతో అనేకులు నా యొద్దకు వచ్చెదరు.” ప్రభువా, నీ నామమున నేను దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున నేను ప్రవచింపలేదా? నీ నామమున, నేను బలమైనవి చేసాను, అనేక అద్భుతకార్యాలు చేసాను గదా? మరియు అప్పుడు నేను వారితో ఇట్లందును, “అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి తొలగిపొండి. నేను మిమ్మును ఎరుగను”. ఆ రకమైనది ఆ దృశ్యమును మార్చును, అది ఆలాగున జరుగును గదా, సోదరుడా?

35

ఓహ్‌, నీవు అంటావు, “అయితే బ్రాన్హాం సోదరుడా, నేను ఆ విధముగా చేయగల ఒక మనిషి నాకు తెలియును... ఓహ్‌, అతడు- అతడు ఈ విధముగా చేయును....”

క్రియలే సూచనలుగా అతడు ఏమి చేయగలడనే మనిషి వైపు ఎన్నడూ చూడవద్దు. అలా ఎక్కడున్న గాని అతడు ఏమియు చేయలేడు. అతడు రోగులను స్వస్టపరచవచ్చును. అతడు ప్రవచించే వరములను కలిగి ఉండవచ్చును. అతడు సమస్త జ్ఞానానికి సంబంధించిన అవగాహన కలిగి ఉండవచ్చును.

పౌలు చెప్పెను, “నేను మనుష్యుల భాషలతోను మరియు దేవదూత భాషలతోను మాట్లాడినను దేవుని సమస్త మర్మములన్నిటిని అవగాహన చేసికొన్నప్పటికి; నేను పర్వతములు కదిలించగల విశ్వాసము కలిగి ఉండినను, అయితే ప్రేమ కలిగి యుండలేదు. నేను ఏ మాత్రపు వాడిని కాదు. నేను దేవదూతల భాషలతోను మరియు మనుష్యుల భాషలతోను మాట్లాడినను, నేను ఈ కార్యములన్నియు జరిగించినను, కదిలించగల జ్ఞానము కలిగి ఉన్నప్పటికి... నేను దేవుని మర్మములను అవగాహన చేసికొనగలిగినను, నేను ప్రవచింప గలిగినప్పటికి మరియు మనుష్యుల భాషలతో ప్రవచింపగలిగినప్పటికి, ఆ సమస్త కార్యములు జరిగించగలిగినప్పటికి మొదట దేవుడు ప్రేమించి, నా హృదయంలో

జీవించుచూ అత్మ ఫలములు తీసుకొని వస్తే తప్ప నేను వ్యర్ధుడను.“

36

ప్రవచించుట మంచిదే; భాషలలో మాట్లాడుట సరియైనదే. అనువాదములు సరియే. కేకలు వేయుట సరియైనదే. అయితే మొదటగా క్రీస్తులో బాప్తిస్మము పొందకుండా ఆ కార్యములన్నియు నీవు జరిగించగలవు. అవి కేవలము... అవి కేవలము ఫలములే... అవి ఆత్మ ఫలములు కాదు; అవి ఆత్మ యొక్క వరములు అయి ఉన్నవి.

ఇక్కడ ఈనాడు నేను బయటకు వెళ్ళగలిగిన యెడల ఏమిటి? మరియు ఉత్తరాదికి చెందిన గొప్పవైన యాపిలు ఆకారములో ఉన్న పండ్లు కొన్నిదిగువకు తీసుకువచ్చి, మరియు దానిని ఒక తాటిచెట్టుకు కట్టినదానివలె ఉన్నది. మరియు అనెను, “ఇప్పుడు ఇక్కడ నేను ఏలాంటి ఒక చక్కని యాపిలు చెట్టు కలిగి ఉన్నానో చూడుము.” అది సత్యమే. అక్కడే ఆ చెట్టు ఉన్నది, మరియు యాపిలు పండ్లు దానిపై వ్రేలాడుచున్నవి. అయితే అది ఆ చెట్టు యొక్క ఉత్పత్తికాదు. ఆమేన్‌.

నీవు అక్కడే ఉన్నావు. విశ్వాసము ద్వార గొప్ప కార్యములు చేయగలవు. అయినా గాని దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించకుండ ఉందువు. అక్కడే జాగ్రత్తగా ఉండుము. అపాయకరమైన ఒక మార్గములో ఉన్న పెంతెకోస్తు ప్రజలైయున్నారు. నీవు వినిన ప్రతీ సంగతియు దేవుని నుండి వచ్చినదని చెప్పవద్దు.

మీరు నా మీద కోపముగా ఉండరని నేను ఆశపడుచున్నాను. నేను మిమ్మును ప్రేమించుచున్నాను. నీవు ఒక నిజమైన వృద్ధ తండ్రిని తీసుకొనుము, వాని పిల్లలను ప్రేమించును.

మరియు ఆ విధముగా వారు గాయపరచబడబోవునున్నట్లు అది వారు గమనించకపోవుట అతడు చూచినప్పుడు, అతడు అలా హెచ్చరించనంత వరకు అతడు ఒక నిజమైన తండ్రి కాడు.

37

జాగ్రత్తగా ఉండుము. గొప్ప ఉన్నతమైన సంగతులు, గొప్ప సమూహముల వైపు చూడవద్దు. గొప్ప ప్రదర్శనలు లేక గొప్ప స్వస్థతలవైపు, లేదా ఇటువంటి గొప్ప సంగతులవైపు చూడవద్దు. ఆ గొప్ప రక్షకుడైన ప్రభువైన యేసు వైపు చూడండి.

ఆత్మ యొక్క ఫలము ప్రేమ అయి ఉన్నది. దేవుడు అనగా ఏమైయున్నాడు? ప్రేమ. మరియు నీ శత్రువును నీవు ప్రేమించలేని యెడల, అతడు గూర్చి ఏమి చెప్పినను ఏమియు కాదు. నీ పొరుగువారు నిన్ను గూర్చి అతడు ఏమి చెప్పినను ఏమియు కాదు... అది నీ హృదయం నుండి వచ్చిన యెడల, నీ పెదవులతో కాదు. క్రైస్తవునిగా దానిని నీ జ్ఞానము చేత నీవు చేయుట కాదు, గానీ నీవు ఏది చెప్పిన ఏమియు కాదు, నీ హృదయములో ఏ విధముగానైనను వారిని నీవు ప్రేమించునట్లు చేయును, నీవు ఏమి చెప్పినను అది సంబంధం లేకుండా కలుగు విషయమే. ఆ తరువాత మరల బలిపీఠము దగ్గరకు వచ్చు సమయము. కేవలము నిన్ను గూర్చి నీవు ఏమి తలంచావో ఎన్నడూ పూర్తిగా పొందలేదు లేదా నిజముగా నీవు ఏది కలిగియుండవలసియున్నావో అదియూ పూర్తిగా పొందలేదు.

38

ఓహొ, నేను అలా చెప్పుటను అసహ్యించుకొనుచున్నాను. అయినా ఇంకా, నాతో జీవించుచున్న వారి జీవితములు సరిగ్గా ఇక్కడే అలా ఇక్కడున్న ప్రజలను గూర్చి తెలిసికొనినప్పుడు అది నన్ను గాయపరచుచున్నది....మరియు ఈ ఉదయవేళ సమయములో నేను చెప్పినట్టుగా, నేను ఆకలిగొనిన యెడల, ఆకలిగా ఉన్న మీ పిల్లలకొరకు, ఇక్కడ ఒక స్థలములో టేబులు మీద కొన్ని బిస్కెట్లుతో మీరు ఇక్కడ బయట నివసించు చుండవచ్చును, మీరు వాటిని నా కొరకు విభజించి ఇచ్చుదురు. అది సరియైనదే.

అయితే ప్రేమగల నా ప్రియ స్నేహితులారా, నేను వ్యత్యాసముగా ఉండుటకు అది అలా చేయుట లేదు. నేను - నేను ఇది ఎందుకు చేయుచున్నాననగా అలా మీరు నమ్ముచున్నారు. నేను ఇలా చేయుట ఎందుకనగా, అలా మీరు నన్ను ప్రేమించుచున్నారని నేనెరుగుదును. మరియు మీరు దేవుని ఆత్మ పనిచేయుట చూసారు. మరియు అప్పుడు, ఈ విధముగా చేయుటలో, మరియు మీరు నన్ను ప్రేమించుచున్నారు మరియు ఏది సత్యమైయున్నదో నేను ఎరిగియుండి మరియు అపాయకరమైన ఒక వరుసను చూస్తూ మరియు దానిగూర్చి మిమ్మును హెచ్చరించని యెడల, నేను ఒక అబద్ద గొర్రెల కాపరిని అయి ఉండును. మరియు క్రీస్తు యొక్క ఒక నిజమైన గొర్రెల కాపరిని కాలేను.

గొప్ప ప్రదర్శనలకు వెళ్ళవద్దు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, మంచితనము, సాత్వికము, దయాళుత్వము, సహనము అక్కడే ఆత్మ ఫలము ఉన్నది.

39

ఇప్పుడు, మనం వెనుక ప్రారంభములోనికి వెళ్ళుచున్నాము; అక్కడే మనము ప్రారంభించాము. ఇప్పుడు, నీవు ముందుకు వెళ్ళిన యెడల....

ఇప్పుడు నీవు అంటావు, “బ్రాన్హాం సోదరుడా, నీవు ఆత్మ యొక్క వరములను ఖండించుచున్నావు.” (కాదనుచున్నావు).

లేదు, ఇప్పుడు ఆదాము చేసినట్లుగా దానిని పొందవద్దు. చూసారా? నేను ఆత్మ ఫలములను ఖండించుట లేదు. అవి సంఘానికి చెందినవి. అయితే ఇచ్చే వానికి బదులుగా ఆ వరముల వె౦బడి మీరు వెళ్ళుచున్నారు. మొదట అది పొందండి.

అది మీకు స్వల్పముగా కనిపించునని నేనెరుగుదును.... కారణము నేను భావము గ్రహించాను. మీరు చూసారా? అయితే అది సత్యమై యున్నది, కేవలము ఒకటి కాదు...? ...చూసారా? అది సరియైనది. నీవు వెనుకకు ఆ సంగతి దగ్గరకు రావలసియున్నావు. వద్దు... ఇప్పుడు మానవజ్ఞానముతో కాదు, గానీ నీ హృదయములో, దేవుని సమాధానము నీ హృదయంలో విశ్రాంతి నొందనిమ్ము, నిన్ను నీవు ప్రేమించిన విధముగా నీవు నీ శత్రువును ప్రేమించునట్లు చేయును.

ఎందుకనగా, మోషే కూడ వానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుచున్న ప్రజలకొరకు తనకు తానే ఖాలీలో నిలబడి అనెను, “దేవా, నా పేరును బయటకు తీసివేయుము.” ఆ విధముగానే అది ఉంది, మీరు చూసారా?

ఆయనకు ఎవరు నిర్ధయులుగా ఉన్నారో వారిని రక్షించుటకు, అలా శిక్షించబడిన వారి కొరకు అలా ఆయన ప్రాణము అర్చించునట్లు యేసు ఆ శత్రువును ప్రేమించెను; మరియు సిలువ మీద నుండి ప్రార్ధించెను, “తండ్రీ, వారేమి చేయుచున్నారో వారెరుగరు, వారిని క్షమించుము.” వారు ఆయనను అర్ధము చేసికొనలేక యుండిరి. ఆయన బోధ ఆపార్ధము చేసికొనబడెను. ఆయన జీవితము ఆపార్థము చేసికొనబడెను. ఆయన సంభాషణ ఆపార్థము చేసికొనబడెను. వారు ఆయనను అర్ధము చేసికొనలేక పోయిరి.

40

ఇప్పుడు గమనించండి. ఆయన అనెను, “క్రీస్తునందున్న వారికి...” మనము క్రీస్తులోనికి ఏలాగు ప్రవేశింపగలము? పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా. దేవుని కృప వలన, విశ్వాసము ద్వారా, ఎన్నికను అనుసరించి, నీకు పరిశుద్ధాత్మను ఇచ్చును. మీరు దానిని గ్రహించారా?

ఇప్పుడు, నీవు ఇలా చెప్పుట మూలముగా కాదు, “సరే గాని, బ్రాన్హాం సోదరుడా, నేను-నేను ఇలా చేసాను మరియు నేను అలా చేసాను.” అది అర్ధం లేని విషయము. చూసారా? మొదట నాటబడి, ఇక్కడ నీ హృదయములో తిరిగి జన్మించుట అనే వృక్షము యొక్క అనుభవము నీవు పొందవలసి యున్నది, అప్పుడు ఆ వృక్షము దానియొక్క సొంతఫలమును తీసికొని వచ్చును.

చెప్పుచున్నాను, నీవు ఇక్కడ ఉన్నావు, సిట్రస్‌ ప్రతీజాతికి చెందిన ఈ పాలనా క్షేత్రములు, పెద్దవైన పశుపాల క్షేత్రములు, ఇక్కడ వాటిని నీవు ఎలా పిలిచినప్పటికి, గొప్పదైన నీ యొక్క పొలము ఇక్కడే యున్నది.

అంతా బాగుంది. ఒక అర అంగుళము ఎత్తుగా ఉన్న అంత పెద్దదైన ఒక చిన్న నారింజ చెట్టును గూర్చి, అది ఆ విధముగా ఎన్నడూ కలిగియుండే దానిలోని ప్రతీ నారింజ దానిలో ఉందని మీకు తెలియునా? అది సరియైనదేనా? నీవు అలాంటి చిన్న నారింజ చెట్టు తీనుకొని మరియు నీవు దానిని నాటుదువు. మరియు నీవు చేయవలసిన ఒకే కార్యము దానికి నీరు పెట్టవలెను. మరియు ఆ చిన్న నారింజ చెట్టు నీటిని త్రాగవలసియున్నది.

ఇప్పుడు ఆ-ఆ ఫలము నీటిలో లేదు. ఆ ఫలము నేలలోను లేదు. ఆ ఫలము చెట్టులో ఉన్నది. మరియు ఆ చెట్టుకు చేయవలసినది మొదటగా నాటబడవలెను. అప్పుడు అది త్రాగవలసియున్నది. మరియు దానికున్న భాగముకంటే అది మరెక్కువగా త్రాగవలసియున్నది. నీ యొక్క ఆనకట్ట ఎన్నడైనా ఇక్కడ నీరు లేక ఎండిపోయిన యెడల, ఇది కొన్ని వారాలలోనే దయ్యం పట్టణము అవుతుంది... నీవు నీటిని పొందవలసియున్నది.

ప్పుచున్నాను, నీవు ఇప్పుడు ఇక్కడే ఉన్నావు, సిట్రస్‌ జాతికి చెందిన ఈ పాలనా క్షేత్రములు, ఇక్కడ వాటిని నీవు ఎలా పిలిచినప్పటికి, గొప్పదైన నీ యొక్క పొలము ఇక్కడే యున్నది. మరియు ఈనాడు మన ద్రాక్ష తోటలతో వచ్చిన సంగతి అదే, నీ సంఘమే మాట్లాడుచుండెను. మనం ఎక్కువగా ద్రాక్ష తోటలు నాటితిమి, అయితే లోనికి చాలినంత నీటిని పెట్టుట లేదు.

మరియు నీవు నాటిన యెడల, మరియు ఈ చిన్నచెట్టు పీల్చుకొనుటకు ప్రారంభించును. కేవలము అది త్రాగును. అది ఇక ఎక్కువగా త్రాగలేనంతవరకు త్రాగును; ఆ తరువాత అది దాని కంటే మరికొంత ఎక్కువగా త్రాగును, తరువాత బయటకు త్రోయబడును. అప్పుడు అది కొమ్మలను వేయును. ఆ తరువాత ఆకులు బయటకు వచ్చును. ఆ తరువాత అది నారింజలను కాయును. కుంచాలు మరియు కుంచాలుగా వందల కుంచాలుగా ఆ చెట్టునుండి కాయును.

41

మరియు ఒక మనిషి, అతడు క్రీస్తు యొద్దకు వచ్చునప్పుడు... అది మొదటగా నీకు నారింజలు ఇవ్వదు; నీవు మొదట ఆ మొక్కను తీసుకొందువు. మరియు ఆ చెట్టు యేసుక్రీస్తునందు నాటబడినదై, ఇదివరకే ఉన్న జీవపు ఊటయై ఉన్నది. మరియు యేసుక్రీస్తుయందు అతడు సరియైన స్థానములో ఉంచబడిన తరువాత అలా ప్రతీ కార్యములోను ఒక విశ్వాసి చేయవలెను... అతడు క్రీస్తునందు నియమించబడినప్పుడు ఈ భూలోక యాత్రలో అతనికి అవసరమైన ప్రతీదియు అతనికి ఈయబడును. అతడు చేయవలసినదంతా త్రాగుచూ మరియు త్రాగుచూ మరియు బయటకు నెట్టును, మరియు ప్రతీ అత్మఫలము, ప్రతీ ఆత్మీయవరము, ఆవిధముగా యేసుక్రీస్తునందున్న ప్రతీదియు అలా అతనికి - నీకు చెందియుండి మొత్తం ప్రయాణము కొరకు నీలో ఉండునంత వరకు త్రాగగలవు.

మొదటగా వెళ్ళి ఆ చెట్టును తీసికొనగూడదు, ఆ చెట్టును తీసుకొని ఎక్కడో చోట త్రవ్వవలెను. చిన్న మొక్కను తీసికొనుము, అది క్రీస్తులో చిన్న శిశువు అయి ఉన్నది, మరియు ఇదివరకే ఉన్న క్రీస్తు జీవముతో, ఆ నీటిఊట ప్రక్కగా, దానిని స్థిరముగా ఉంచండి. అప్పుడు నీవు క్రీస్తులో సరియైన స్థానములో నియమించబడియున్నావు. మరియు ఆ పరిశుద్దాత్మద్వారా, నీవు క్రీస్తులో ఉన్నప్పుడు, అప్పుడు ఈ సమస్త పరిశుద్ధాత్మ యొక్క లక్షణములు నీలో నివసించును.

42

ఇప్పుడు, అది నారింజ చెట్టుగా పిలువబడి ఉండినయెడల ఏమిటి మరియు మొదట సంగతి నీకు తెలియును,పైకి వచ్చును, అది కలపకు ఉపయోగపడు ఒక చెట్టు నేను-నేను ఒక తాటిచెట్టు అని చెప్పగలనని నాకు తెలియదు. కలపకు ఉపయోగపడు ఒక చెట్టు అనగా ఏమిటో ఆ కారణము నీకు తెలియకపోవచ్చును, అయితే - ఇక్కడే బయట ఉన్నది. అయితే - నాకు తెలియదు. వారికి ఇక్కడ బయట ఏవైనా సైకమోర్‌ అనగా-(మేడిచెట్టు) ఉన్నవా? నేను అలా అనుకొనుట లేదు. అంతా బాగుంది. ఒక నారింజ-నీవు ఒక నారింజ చెట్టు కొరకు చూచుచున్నావు, అయితే అది తియ్యని సీమ అత్తిపండ్లు కాయుచున్నది. నీవు మిశ్రమము చేసిన చెట్లు పొందావు. చూడండి? ఓహ్‌, నీవు ఫలమును పొందుచున్నావు, కానీ సరియైన ఫలములు కావు.

ఇప్పుడు, ఒక కైస్తవునితో అది ఏమై ఉన్నదనగా అదే. మనం క్రీస్తులోనికి వచ్చినప్పుడు, మనం తప్పకుండ క్రీస్తు ఫలములు కలిగి యుండవలెను. మీరు కడుగుకొనినప్పుడు, యథార్థమైన దేవుని గురుతు క్రింద ఉండి, మీరు కూడుకొని భోజనము చేయవలెనని పౌలు చెప్పెను. మీకు అది అర్ధమైనదా? స్పేహితుడా, మొదట ఆ విధముగా అవగాహన చేసికొనండి. పునాది యొద్దకు వెనుకకు రండీ. అప్పుడు అక్కడ నుండి కట్టడం ప్రారంభించి, పైకి లేపండి.

43

ఇప్పుడు అతడు దీనిని పరిశుద్దాత్మ ద్వారా యేసుక్రీస్తునందున్నవారికి వ్రాయుచున్నాడు.

కృప వలన, ( ఇప్పుడు వారికి వందనములు తెలియచేయుచూ) మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానము కలుగును గాక...

మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

ఇప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “కేవలము బాగానే ఇంటి దగ్గర ఉండి మరియు నేను ఒక క్రైస్తవునిగా ఉండగలను.” లేదు. నీవు అలా ఉండలేవు. లేదు. నీవు నీ దేహములో మిగిలిన వాటితో ఏకమై ఉండ వలసియున్నది. ఆయన పరలోక విషయములలో యేసుక్రీస్తునందు మనలను ఐక్యపరచి ఆశీర్వదించెను.

తొంబై శాతముగా ఉన్న వి౦త అయిన అమెరికా వారిని గూర్చి మీకు తెలియునా? (వినండి, నా శరీరమంతా కుదిపి వేయబడినది) తొంభై-రెండు లేదా తొ౦భై-ఏడు (అక్కడ ఏ చోట నుండి అయిన) శాతము అమెరికా ప్రజలు ఆదివారము రోజున సంఘానికి ఎన్నడూ హాజరు అగుట లేదు. సంఘమునకు వెళ్ళుటకు బదులుగా ప్రతీ ఆదివారపు రోజున, కొందరు- వింతగా ఉన్న ఆ తొంభై శాతము వారు దయ్యము యొక్క కార్యమునకు వెళ్ళెదరు. దానిని గూర్చి ఆలోచించండి. ప్రతీ వీధి మూలలో, ప్రతి దానిలో, అందుబాటులో ఉన్న గొప్పవైన పెద్ద సంఘాలు ఉన్నాయి. మరియు అప్పుడు అక్కడ... వారు అక్కడే కూర్చొని ఉంటారు; వారు ఒకరితో ఒకరు గందరగోళములో ఉండి తమ మత విశ్వాసాలను మార్చుకొనుచు, ఏమి చేయలేని సమస్యలతో ఉండి, అప్పుడు మీరు ప్రభువైన యేసుని కనుగొంటిమి అని అంటారు. ఓహ్‌, మై. గుర్రానికి ముందుగా బండిని పెట్టుదురు.

ఇప్పుడు, ఆ ప్రభువు ఈ రాత్రే స్వస్థత కలిగించు ఒక చిన్న లేపనమును కుమ్మరించవచ్చును. మరియు ఇదంతయు ఇక్కడ ఉంచవచ్చును. అయితే అది నా హృదయముపై ఉన్నది, మరియు నేను అది బయటపెట్టి ఇవ్వవలసి ఉన్నాను. నేను ఎన్నడైనా జీవించి మరలా వెనుకకు రాగలనా అనునది నాకు తెలియదు. మరియు నేను తీర్పు సింహాసనమునొద్ద అక్కడ నిలబడగోరుచున్నాను. మనుష్యులందరి రక్తాపరాధము నుండి నేను స్వతంత్రుడనని నేను చెప్పగోరుచున్నాను.

44

స్నేహితులారా, వెనుకకు రండి. దేవుని ప్రేమ దగ్గరకు వెనుకకు రండి. ప్రతీ సిద్ధాంతముతో వంచబడిన దాని వెంబడి వెళ్ళవద్దు, మరియు ఇక్కడ మరియు అక్కడకు ఎగురుచు వెళ్ళవద్దు. ప్రతీ సమయములో ఏదో చిన్నదైన ఒకటి పైకి లేచినప్పుడు, సంఘమునుండి దూరముగా పారిపోవుట మరియు ఇటువైపునకు, మరియు ఇటువైపునకు పరుగెత్తుట జరుగును. కేవలము అది మత పద్ధతిలో గెంతుచుండును. వారు పొరపాటులో ఉండి, మాట్లాడుచున్నారని వారు అలాంటి వారని నేను చెప్పుట లేదు. అయితే వారు ఇంకా ఆకలి గల హృదయాలు కలిగిన పిల్లలైయున్నారు.

చేయుటకు మనకు ఏది అవసరము, అందరు ఏదో ఒక స్థలములో సమావేశముగా కలుసుకొనుడి, మరియు ఏకముగా రండి, దేవుని యొద్దకు వెనుకకు వచ్చి మరియు పరలోకస్థలములలో కూర్చొనుడి, అప్పుడు దేవుడు మీతో పనిచేయుటకు వెళ్ళును. గమనించారా?

....పరలోక స్థలములలో కూర్చొని ఉండుట... ఆ సంకల్పము చొప్పున...

(3వ వచనము లేదా 4వ వచనము)... ఆ సంకల్పము చొప్పున ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను...

ఆ సంకల్పము చొప్పున ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, లేదా ఆయనే ఆయనయందు మనలను ఏర్పరచుకొనెనా? ఎవరు ఎన్నిక చేసికొనెను? దేవుడు చేసెను. మీరు చేయలేదు; నేను చేయలేదు; దేవుడే చేసెను. “మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ నేను మిమ్మును ఏర్పరచుకొన్నాను.” యేసు చెప్పెను. చూడండి.

ఆ సంకల్పము చొప్పున ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను... (ఏలాగున?) మనలను ఏర్పరచుకొనెను. (ఎన్నుకొనిన వారు, ఇప్పుడు, యేసు క్రీస్తునందున్నవారు)... ఆయన... ఆయనయందు మనలను ఎన్నుకొనెను... (ఎప్పుడు? నిన్నటి రోజా? ఆ రోజుకు ముందా? లేఖనములు చెప్పినది వినండి)... జగత్తు పునాది వేయబడకముందే...

ఎన్నడూ నిశ్చయముగా నేను అది తప్పుగా చదువలేదు. అది ఆ పద్ధతి

లోనే అది ఇక్కడ కింగ్‌ జేమ్స్‌ తర్జుమాలో చదువబడును. జగత్తుకు పునాది వేయబడకముందే దేవుడు క్రీస్తునందు మిమ్మును ఎన్నుకొనెను. అప్పుడు దేవుడు అలా ఎరిగి ఉన్నచో, నీవు దేని గూర్చి భయపడుచున్నావు? యేసుక్రీస్తునందు నిన్ను ఎన్నుకొనుటకు జగత్తుకు పునాది వేయబడుటకు ముందే దేవుడు ఎరిగి యుండిన యెడల, మరియు నీవు వచ్చి మరియు ఆ పిలుపును అంగీకరించావు, నీవు దేనిగూర్చి భయపడుచున్నావు? సహోదరీలు, ఆ సంగతి ఏమైయున్నది, ఆయన స్వస్థపరచగలడు, ఆయన స్వస్థపరచలేదా? నిశ్చయముగా. సహోదరుడా, ఆ చక్రాల కుర్చీలో నున్న సహోదరీలను, మిమ్మును స్వస్థపరచడా? నిశ్చయముగా.

45

జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తునందు దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను. లేఖనము చెప్పినది ఏమనగా అదే.

ప్రేమ చేత మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్ధోషులమునై యుండవలెనని .... (దేనిలో?) ...ప్రేమచేత మనము తన యెదుట పరిశుద్దులమును నిర్దోషులమునై యుండవలెనని;

ఓహ్‌, అది నిందారహితముగాను, నిర్టోషమైనదిగాను, ఎంతమాత్రము ఒక కళంకమైనను లేకుండా ఉండును. ఇప్పుడు, ఎన్నడైనా మనము ఆ పద్ధతిలో ఏలాగు పొందగలము? మనం అలా చేయలేము. మీరు మానవులైయున్నారు, మరియు మీరు సమస్తవిధములైన పొరపాట్ల యొక్క అధీనములోనికి వెళ్ళే స్థితిలో ఉన్నారు.

ఇప్పుడు మనం దానియొక్క పరిపూర్ణత యొద్దకు వచ్చుచున్నాము, ఒక నిమిషము పాటు ఇక్కడ హెబ్రీయులకు వ్రాసిన పత్రిక వైపుకు తిరుగుదాము, దానిలో మీకిష్టమైన యెడల, హెబ్రీయుల గ్రంథములో - సరే - చెప్పెదను... 9వ వచనం నుండి ప్రారంభించెదము, లేదా 9వ అధ్యాయము మరియు 21వ వచనము. పౌలు మాట్లాడుచున్న దానిని వినండి. మొదట అటువైపు... ఇక్కడే ఒక వచనము ఒక వచనము కొరకు ఒక క్షణము 10వ అధ్యాయము తీసికొందము.

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేట యెడతెగక అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగచేయనేరవు.

46

ఇప్పుడు, ఆ అంశము పరిపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు, మర్త్యుడైన మనిషి ఎన్నడైనా ఏలాగు పరిపూర్జుడుగా కాగలడు? మరియు అయినను దేవుడు ఆయన వాక్యములో ఆ విధముగా జగత్తు పునాది వేయబడక ముందే పరిశుద్ధులుగా ఉండునట్లుగా మరియు ఆయన మనలను పరిపూర్ణులుగా చేసెను. నీవు అలా ఏలాగు చేయనైయున్నావు? మరియు యేసు చెప్పెను, “పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడై యుండునట్లు, మీరును పరిపూర్ణులెయుండుడి.” అది సరియైనదిగా ఉన్నదా ?

ఇప్పుడు, దేవుడు, జగత్తు ఏర్పడుటకు ముందే, మనం పరిశుద్దులమును, మరియు నిర్జోషులమునై యుండవలెననియు, మరియు దేవుని దృష్టిలో ఆ విధముగా నియమించిన యెడల, మరియు మనం పోరాడుచూ మరియు సణుగుచున్నాము.... మరియు దేవుడు ఈ సమస్త సంగతులు చూస్తున్నాడని నీవు తలంచుట లేదా? మరియు ఆయన అది ముందుగానే ఎరిగియున్నాడు మరియు ఆ విధముగా ఉండునట్లు మనలను నియమించి, ముందుగా నిర్ణయించియున్నాడు, ఎన్నడైనా జగత్తు రూపించకముందే మనలను ఎన్నుకొనెను... ఇప్పుడు ఆయన అది ఏలాగున చేసాడో ఇక్కడే ఉన్నది. 9వ అధ్యాయములో, 21వ వచనము.

అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడుగా వచ్చి మనకొరకు తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరియు ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా;

మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

47

ధర్మశాస్త్రం క్రింద ఛాయల మూలముగా, వారు పాపమును ఏది తీసివేయలేకపోయెనో, దానిగుండా మనము వెళ్ళాము, ఎద్దులు మరియు మేకలయొక్క చిందించబడిన రక్తము వలన ప్రవేశించారు. అది జంతువు యొక్క జీవము అయి ఉండెను. ఏలాగు ఆ జీవితము మరియు చనిపోయిన ఒక జంతువు యొక్క ప్రాణము, ఆ జీవకణము, జీవము యొక్క ఆ రక్తము బయటకు వచ్చుచుండెను, ఆ జీవము ఎన్నడైనా తిరిగి జంతువులోనికి లేదా ఒక మనిషిలోనికి వచ్చుచున్నదా? ఒక గొర్రెపిల్లయొక్క జీవము, ఒక ఆవుదూడ యొక్క ఒక మేక యొక్క లేదా ఒక జంతువు ఆవిధముగా బలి అర్చించబడినది, మన పాపముల కొరకు ఆ రక్తము బద్దలైన తరువాత ...ఆ కారణము అది ఎన్నడూ తిరిగి రాలేదు మరియు ఒక మానవజీవితో ఏదైననూ చేయుటకు ఏది కలిగి ఉండలేదు.

అయితే, దేవుడు, జగత్తుపునాదికి ముందే, దేవుని యొక్క పరిపూర్ణమైన గొర్రెపిల్లగా యేసు వచ్చునని ముందుగా నిర్ణయించెను, అలా ఆ రక్తమును అర్పి౦చుటకు లోకములోనికి ఆ రక్తమును తీసుకొని వచ్చుటకు, దేవుడు తనకుతానే ఒక కణములోనికి సృష్టించుకొనెను....?

నీవు ఈ ఘడియలో ఆయనను క్రిందకు పడవేసిన యెడల, అలా పాపికి ఒక ప్రేమ, ఆయన ప్రేమతో మరియు ఆ పరిశుద్ధాత్మ తనకుతానే అలా ఆ రక్త కణములో ఉండెను, ఆ మనిషి అర్పించిన అర్పణ తరువాత, తిరిగి వెనుకకు వచ్చి, మరియు ఆ విశ్వాసిని స్వాధీనము చేసికొనును...ఆయన యోగ్యమైన విమోచన కొనెను. ఆమేన్‌.

48

ఇప్పుడు, మీరు అది గ్రహించారా? అయితే ఏలాగున? దానిని గ్రహించారా? రక్తము ద్వారా, రక్తము ద్వారా కడుగుచు, పాపమును వేరు చేయుచు, దూరముగా తీసికొనిపోయెను, లోపల భాగములో ఉన్న క్రీస్తుతో, ఆత్మీయ జీవితములోనికి, సహవాసములోనికి వచ్చుటకు ఆ ప్రాణమును (ఆత్మను) శుభ్రము చేయుచూ, ఆ విధముగా ఆ పరిశుద్ధాత్ముడు రక్తము ద్వారా విశ్వాసిని ప్రేమించును, లోకమును మూసివేయును మరియు దేవుని యొక్క స్వభావము నీలో ఉండును; ఇంకా పొరపాట్లకు పరిమితమై యుండును, అయితే దేవుడు దానిని చూడలేడు. ఎందుకనగా అది రక్తమువలన కప్పబడెను. మానవుడు రక్తం ద్వారా చూచును. రక్తము ద్వారా ఆయన చూచిన ప్రతీ సమయములోను అది తెల్లగా కనబడును. ఆయన రక్తము ద్వారా చూచును; అది తెల్లగా కనబడును.

ఆయనను అంగీకరించునంతగా దేవుడు క్రీస్తునందు సంతోషించెను మరియు ఇలా అనెను, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను.” పరిపూర్ణునిగా ఉండిన, మరియు క్రీస్తు ద్వారా, దేవుని అత్మద్వారా తిరిగి జన్మించి, మన సాంత ఆలోచనలు మరియు ఉద్దేశ్యాలకు మనం చనిపోయాము, వేదాంతము ద్వారా నడువక, అయితే మనలోపల ఉన్న ఆత్మ ద్వారా, అప్పుడు క్రీస్తునందు మృతులైనవారు లోకసంగతులననుసరించి నడువరు, అయితే ఆత్మ సంబంధమైన సంగతులననుసరించి నడుతురు.

రోమా 8:1. చెప్పెను, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు.“ ఆ విధముగా శరీరమును అనుసరింపక పోట్లాడు, యుద్ధము చేయు మరియు అల్లకల్లోలము, అసూయపడుట, స్వార్దముతో కూడిన కార్యములు, అయితే ఆత్మ ననుసరించి నడుతురు.”

49

చూడండి, మీరు క్రీస్తు యొక్క లోపలి భాగములోనుండి నడచుచున్నారు. అప్పుడు లోక సంగతు లన్నియు గతించిపోవును, దీనికి మరియు దానికి సంబంధించి మీరు కలిగియున్న ఆ సమస్త గొప్పవైన మత విశ్వాసములు అన్నియు మాయమగును. మరియు నీ యొక్క హృదయము మరియు మనస్సు యేసుక్రీస్తు మీద ఆనుకొని వింతగా మారును. అధి నీయంత నీవే చనిపోయి మరియు తిరిగి జన్మించావని తెలియచేయుచున్నది.

ఆ తరువాత నిశ్చయంగా సంఘానికి వచ్చు సమయం అయినప్పుడు, కేవలము నీవు సంఘానికి రాకుండ ఉండలేవు. చూసారా? వెళ్ళుటకు నీవు తడబడుచుండిన యెడల కేవలము అలాగే నీవు వెళ్ళగలవు. అంతా అదే. నీవు సంఘానికి వెళ్ళుచున్నావు ఎందుచేతననగా ఆ ఆత్మ తానే క్రీస్తు యేసులో అంతా కలసి సమావశమవ్వవలెనని దానికదే సాక్ష్యమిచ్చును.

ఇప్పుడు, ఈ కధను సంక్షిప్తం చేయుటకు, తిరిగి మరల ఇప్పుడు హెబ్రీ గ్రంధము 10వ అధ్యాయము వైపు త్రిప్పుదము. మరియు అతడు ఏమి చేసెనో గమనించెదము. మరియు 14వ వచనముతో ప్రారంభించెదము. ఈ విధముగా ఉన్న ఈ మాదిరిని గమనించండి.

50

ఇప్పుడు, పాత నిబంధనలో ఏలాగున్నదనగా....విశ్వాసికి జరిగిన మొదటి సంగతి...అతడు వ్యభిచరించిన యెడల, లేదా అతడు ఏదైన చెడ్డకార్యము జరిగించినయెడల, అతడు వెళ్ళి మరియు ఒక గొర్రెపిల్లను పొందెను. అతడు ఆ గొర్రెపిల్లను యాజకుని యొద్దకు తెచ్చెను; ఆ గొర్రెపిల్లను - యాజకుడు గొర్రెపిల్ల వైపు పూర్తిగా చూచెను, ఆ విశ్వాసివైపు కాదు. అతడు ఆ గొర్రెపిల్లను చూచెను. అతడు ఆ విశ్వాసిని ఎన్నడు చూడలేదు. అతడు ఆ విశ్వాసిని గూర్చి ఏమియు లెక్కచేయలేదు. ఆ విశ్వాసి అసలు చిత్రములోనే లేడు. ఆ విశ్వాసి వచ్చాడు మరియు ఆ గొర్రెపిల్లను అక్కడ సమర్పించాడు. ఓహ్‌, సహోదరుడా. ఓహ్, నీవు అది చూచియుండిన యెడల.

నీవు అందువు, “మంచిదే గాని, నేను-నేను ఒక యౌవన మనిషిగా ఉన్నప్పుడు నేనేమి చేసానో నేనెరుగుదును. నేనేమి చేసానో నేనెరుగుదును..?...” అది ఏమియు లెక్కకు రాదు. నీవు ఆ గొర్రెపిల్లను దేవునికి సమర్పించుచున్నావు. అది గ్రహించావా? మరియు ఆ యాజకుడు ఇలా అనలేదు, “నీ ముక్కు చాలా పొడవుగా ఉన్నది; నీ చెవులు చాలా పెద్దవి. నీవు అంగీకరించవలెను....” అతడు ఆ మనిషి వైపు కూడ చూడలేదు. అతడు ఆ గొర్రెపిల్ల వైపు చూసాడు. ఆ గొర్రె పిల్లను మొత్తం అంతా పరీక్షించును. అక్కడ ఆ గొర్రెపిల్ల మీద ఏదైన మచ్చ ఉన్న యెడల, అది వెనుకకు తీసికొనమనును. అది సరియైన విధముగా ఉన్న అర్పణ కాదు. అప్పుడు ఆ మనిషి వెళ్ళి, సరియైన విధముగా ఉన్న గొర్రెపిల్లను పొందవలసియున్నది.

51

అయితే, ఆ యాజకుడు ఆ గొర్రెపిల్లను పూర్తిగా చూచినప్పుడు, మరియు అది పరిపూర్ణముగా ఉన్నది, అప్పుడు అతడు ఇలా అనును, “అంతా బాగుంది, నీవు ఈ గొర్రెపిల్లను ఎన్నుకొన్నావు అది పరిపూర్ణముగా ఉండెనని నేను కనుగొన్నాను. దానిని క్రిందపెట్టి, దాని పాదము కట్టి, దాని తలను వెనుకకు ఉండునట్లు పట్టుకొనవలెను.”

ఆ విశ్వాసి వాని చేతులను దానిమీద ఉంచి, ఇలా అనును, “దేవా, నా పాపములకొరకు నేను చనిపోవలసియున్నది, కాని ఈ గొర్రెపిల్ల నా స్థానములో చనిపోవుచున్నది.”

వారు ఆ గొర్రెపిల్ల గొంతును కోసారు. అది రక్తము కార్చుచున్నది. అతని చేతులు దానిమీద పెట్టబడియున్నవి. దాని చిన్న శరీరము వణకుచుండెను. ఆ గొర్రెపిల్ల దాని చివర అరుపు అరచినది, మరియు దాని ప్రాణము ఎగిరిపోయినది. ఒక మాదిరిగా ఉన్నదై, అయితే చిందించబడిన రక్తము ద్వారా, ఆ ప్రాణము ఆ విశ్వాసి మీదకు తిరిగి వెనుకకు రాలేదు, ఎందుకనగా అది ఒకగొర్రెపిల్ల యొక్క ప్రాణము, ఒక జంతువు ప్రాణము మరియు ఒక మానవుని ఆత్మ కాదు.

52

అయితే ఎంతో గొప్పదైయున్నది... ఓహ్‌, మీరు అది పొందారని నేను ఆశించుచున్నాను. ఆ విధముగా దేవుడు తనకుతానే ఆ గొర్రెపిల్ల ఎదుటకు క్రిందకు దిగివచ్చెను. మరియు ఆ విశ్వాసి. గమనించండి. ఇప్పుడు, చూడుము, ఆ గొర్రెపిల్ల వైపు చూడనక్కరలేదు. నీవు నీ వైపునకు చూడకుము. దేవుడు ఏవైపు చూచుట లేదు; ఆయన గొర్రెపిల్ల వైపు చూచును. ఆయన క్రీస్తువైపు చూచును, మరియు ఆయనలో ఏ లోపము లేదు. మరియు దేవుడు అర్పణను అంగీకరించెను. క్రీస్తుయేసు అను గొర్రెపిల్ల మీద నీ చేతిని ఉంచుము, ఒక పాపిగా నీ పాపములు ఒప్పుకొనుము. మరియు ఆ గొర్రెపిల్ల నీ కొరకు చనిపోయెను. గొర్రెపిల్లలో నుండి ఆ విధముగా బయటకు వచ్చిన ఆత్మ విశ్వాసి దగ్గరకు వెనుకకు వచ్చును. ఆమేన్‌.

మరియు నీవు పరిపూర్ణముగా నిలబడుము, ఎందుచేత అనగా చనిపోయిన ఆయన, అమాయకుడైన ఆయన, శక్తిమంతుడైన ఆయన, జయించువాడైన ఆయన, అంగీకరించబడిన ఆయన, ఆయన సొంత వ్యక్తిత్వములో పరిశుద్ధాత్మ రూపములో తిరిగి వచ్చెను. మరియు ఆ విశ్వాసిని శాంతిలోనికి తీసికొని వచ్చును.

అది అక్కడే ఉన్నది. నీవు కాదు, ఆయనే, దేవుడు నిన్ను కూడ చూడడు. ఆయన ఆయనను చూచును. నీవు చనిపోనవసరము లేదు; ఆయన నీ స్థానములో చనిపోయెను. ఆమేన్‌...? ...ఆయన మన అపరాధముల నిమిత్తము గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను; మన సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను, మరియు ఆయన పొందిన దెబ్బలచేత స్వస్థత పొందాము. అక్కడే ఆ పునాది ఉన్నది. ఆ గొర్రెపిల్ల దగ్గరకు రమ్ము, నీ పాపములు ఒప్పుకొనుము.

53

దేవుడు నీవు నీతిమంతునిగా తీర్చుటకు ఆయనను పైకి లేపెను, ఆ విథముగా..? ...చనిపోయిన నీ గొర్రెపిల్లలో ఉండిన అదే ఆత్మ దేవునితో సహవాసములో ఉంచుటకు నీ దగ్గరకు తిరిగి వచ్చును.

కనుక ఎంతకాలము. ఎంతకాలము? ఆ విశ్వాసి అక్కడ నుండి బయటకు పోయి, మరల వ్యభిచరించుటకు బయటకు పోయి, అతడు తన పొరుగువారికి చేయగలిగినదంతా చేయగోరెను; వారు ఇంకా అలాగే ఉన్నారు..?...అయితే ఓహ్‌, ఆ గొర్రె పిల్లలో ఉన్న అదే ఆత్మ విశ్వాసిని పరిపూర్జునిగా చేయలేదు.

దానినిగూర్చి పాలు ఏమి చెప్పెనో చూద్దాం. ఆమేన్‌. భయపడవద్దు. “ఆమేన్‌” అనగా “అది అలా జరుగును” అని అర్ధము. నేను నా పూర్ణ హృదయముతో అది నమ్ముచున్నాను.

ఈయనైతే... (ఇప్పుడు మునుపున్న ధర్మశాస్త్రము కాదు, పౌలు ధర్మశాస్త్రము నుండి కృపను వేరు చేయుచుండెను.) ...ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శతృవులను తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శమున ఆసీనుడాయెను.

అంతా యధార్థము, సహోదరుడా! నీవు నీ యొక్క మతవిశ్వాసము యొక్క వస్త్రము తొలగించుకున్నావా? వినండి.

ఒక్క అర్పణచేత .... (ప్రతీ సంవత్సరము కాదు, ప్రతీ ఉజ్జీవము కాదు, అయితే) ఈయన ఒక్క అర్పణచేత (సంపూర్ణులనుగా).... సంపూర్ణులనుగా చేసెను..(తరువాత ఉజ్జీవము వరకా) ... ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

ఈ విషయమై పరిశుద్దాత్మ కూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు.....

54

మీరు అది గ్రహించారా ? క్రీస్తు పాపితో చనిపోవుచుండెను, ఆ చనిపోయిన గొర్రెపిల్ల నుండి..? ...ఏమి రాబోవుచున్నదో చూచుటకు సమర్పించబడవలెను. అప్పుడు ఆ గొర్రెపిల్ల రక్త కణములోనున్న ఆ పరిశుద్దాత్మ క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన మన నమ్మికను బుజువు చేయుటకు పరిశుద్ధాత్మగా ఆ విశ్వాసి మీదకు వెనుకకు తిరిగివచ్చును. దేవుడు సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసెను. ఆమేన్‌.

అది ఎవరో ఒక్కరూ చేసిన కరచాలనము వలన కాదు. అది ఒక ఉద్రేకమువలన కాదు. అది ఒకసారి, లేక పదిసార్లు, ఒక బిలియను సమయాలు భాషలలో మాట్లాడుటవలన కాదు. అది దురాత్మలను బయటకు వెళ్ళగొట్టుట వలన కాదు. అది సువార్తను బోధించుటవలన కాదు, గానీ ప్రభువైన యేసు, సజీవమైన బలి అర్పణ అయిన దానివలన అయి ఉన్నది. ఆ విధముగా పరిశుద్ధపరచబడు వారిని, ఆయన సదాకాలము సహవాసములో ఉండునట్లు చేసెను. దేవుడు గతించినకాలములో, ఛాయ రూపములో విశ్వాసిని నీతిమంతులుగాచేసి, దేవుడు రక్షించెను, అయితే-ఆ కోరిక యొక్క నేరము తీసివేయబడలేదు, కోరిక కాదు, అయితే పాపముయొక్క నేరము. ఆ నేరము అక్కడే ఉండెను. దానిని జయించుట కొరకు అక్కడ ఏమియు లేదు.

55

అయితే ఇప్పుడు, క్రీస్తు శరీరములోనుండి బయటకు వచ్చిన ఆ పరిశుద్ధాత్మ జంతువులనుండి కాదు, దేవుని కుమారుడైన క్రీస్తు దేహములోనుండి బయటకు వచ్చి, ఆ పరిశుద్దాత్మ సంఘముపైకి మరలా వెనుకకు వచ్చెను. మరియు అక్కడ ఒక సమయములో, ఒకే అర్పణ ద్వారా, ఒక్కసారే, పరిశుద్ధాత్మను పొందుట ద్వారా, మరియు ఆయన దగ్గరకు వచ్చినవారు సదా కాలమునకు సంపూర్ణులనుగా చేయబడెను.

ఎఫెసీయులు 4:30, సమయము ఆదా చేయుటకు దానిని 'పేర్కొనుము; “దేవుని పరిశుద్ధాత్మను దు:ఖపరచకుడి (మీరు చాడీలు చెప్పుట ద్వారా, వెన్నుపోటును, దానిని కొనసాగించుట ద్వారా...? ...మీరే, మీయొక్క అవిశ్వాసము వలన) ...దేవుని పరిశుద్దాత్మను దు:ఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.”

ఆ విధముగా విశ్వాసము ద్వారా, మీరు కృపచేతనే రక్షించబడియున్నారు, ఏ మనిషి అయినా పొగడగల ఆ విధమైన క్రియలు ద్వారా కాదు, “ఓహ్‌, నేను ఒక మెతడిస్టును. నేను ప్రెస్పిటేరియన్‌ను..? ...నేను బాష్టిస్టును. నేను పెంతెకోస్తుకు చెందినవాడను.” ఏ మనిషియు గొప్పలు చెప్పుకొనలేడు. ఏ మనిషి దేవుని వెదకలేదు; దేవుడే మనిషిని వెదికెను.

మరియు ఆ-ఆ కారణము చేత ఆయన వానిని ఎరిగియుండెను, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే దానిని చూచెను, మరియు దానిని క్రీస్తు శరీరములో ఇక్కడుండుటకు ముందుగా నిర్ణయించెను. “ఆయన ఎవరిని పిలిచెనో, వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఆయన మహిమపరచెను.” ఆమేన్‌. నీవు అక్కడే ఉన్నావు.

56

కాలము గతించిపోవుచుండెను. నేను ఇక్కడ ఏదో మరి కొంచెం చూపించుటకు కలిగియున్నాను, లేదా మనం ముగించు ముందుగా ఒక నిమిషము, వాక్యము యొక్క వెలుగు మార్గములో, ఒక క్షణము అది నేను బోధించుటవలన క్షమించండి.

స్నేహితులారా, నా ఉద్దేశ్యము ఏమిటో మీరు గ్రహించారా? సంపూర్ణ సువార్త ప్రజలైన మనము నేను సిలువ యొక్క నమ్మకాలను నియమాలను నమ్ముచున్నాను. అయితే అది ఏమై ఉన్నదనగా, మనం గమనించుట చాలా మంచిది. సంపూర్ణ సువార్త సంఘం ఇప్పుడే సరిగ్గా రెండు విధములుగా విభజింపబడెను. వారిలో ఒక్కరూ నామకార్థముగా ఉండి, చల్లబడి, మరియు వెన్నుపోటు పొడుచుట - అపాయకరమైన దారి. మరొకటి ఇక్కడ మర్మయుక్తమైన, సమస్త విధములైన ఒక గుంపుగా ఉన్నారు. మరియు లేఖనములలోగూడ లేని ఉన్నతమైన సంగతులు పొందుచుండెను.

దానిని గమనించండి. సహోదరుడా, సరిగ్గా ఆ రోడ్డు మధ్యభాగములో నిలబడియుందుము. అదే సువార్త కొరకు నిలబడుము , రెండు వైపులనుంచి పిలుస్తూసంపూర్ణమైన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి బోధ. కానీ ఎదో ఒక వైపునకు వెళ్ళవద్దు, లేదా ఆత్మతో నింపబడి నీ చిత్తము వదలి, చూసారా.

57

నీవు గమనించని యెడల... నీవు గమనించగలవు...?... నేను ఒక నిజ కాపరికొరకు, సత్యముగా ఉండు ఒక నిజమైన కాపరికొరకు విచారపడుచున్నాను. ఇక్కడ సంఘములో ఒక ప్రధాన శక్తిగా, ఒక మూఢునిగా ఉండగోరువారున్నారు. ఇక్కడ మరొకరు దానిని ఒక వైపునకు సంప్రాదాయ పూర్వకముగా తీసికొనగోరుచున్నారు...?... అది పని చేయలేదు. మరియు సాధారణముగా, చల్లగా ఉన్న ఆ నామకార్థమైనది పొందును...? ఎందుకనగా వారు విద్యావంతులై యున్నారు, పండితులువంటివారు, మరియు ఇంకా వారిద్దరూ ఆత్మీయమైనది కలిగియుండలేదు. నీవు తెలుసుకొను ఆ మొదటి సంగతి, నీ సంఘము గడ్డకట్టుకుపోయినది. మరియు వారు గమనించని యెడల, వారిద్దరు పొగడుకొనుచున్నారు. మరియు నీవు తెలుసుకొను ఈ మొదటి సంగతి, ఆ కారణము చేత (ఎందుకనగా) వారు నిన్ను ఈ ప్రక్కకు తీసుకొని రాగలరు.

అయితే, మార్గములో నిలబడగల వివేకముతో కూడిన ఎవరో మంచి సువార్త బోధకుడను నీకు పంపమని దేవునికి ప్రార్ధించుము. మరియు అది నీకు అవసరం అయినప్పుడు కొంచెం కొద్దిగా కొట్టి అది వేగముగా కదులునట్లుగా చేయుము. మరియు నీకు అవసరం అయినప్పుడు నిన్ను ప్రేమించునట్లు ప్రార్ధించుము...?... మరియు నిన్ను లేఖన క్రమములో భద్రముగా ఉంచునట్లును, ఆత్మలో ఉండునట్లును ప్రార్థించుము. అతడు నీ ఆత్మను కని పెట్టుచున్న ఒక గొర్రెలకాపరి అయిఉన్నాడు. నీవు ఆ విధమైన కాపరిని పొందియున్న యెడల, దేవుని దగ్గరకు పరుగెత్తి మరియు ఎల్లవేళల అతని కొరకు నిరార్ధించుము. అతను చెప్పినది వినుము.

58

ఇప్పుడు, జగత్తు పునాది వేయబడకముందే దేవుడు మనలను ఎన్నుకొని మరియు ముందుగా నిర్ణయించెనని పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు.

వినండి. అబ్రహాము పొందుకొనిన విధముగా నీవు ఒక పిలుపును కలిగియుండిన యెడల ఏమిటి? నీవు అలా ఉండియుండవు.. దేవుడు అబ్రహామును కలిసిన యెడల మరియు అబ్రహామునకు ఎంతమాత్రము ఏ విధమైన షరతులు లేకుండా ఆ నిబంధన ఇచ్చెను, లేదు...? ...ఎంత మాత్రము కాదు. ఆయన అన్నాడు, “అబ్రహామా, నీవు చేయగలిగినయెడల, అని నేను అలా చేయను.” ఆయన అన్నాడు, “అబ్రహామా, నేనే చేసాను. నేను అది ఇదివరకే చేసాను.”

ఆయన ఆ విధమైన స్థితిలో కలసిన యెడల, నీవు ఆయనను నమ్ముదువా? నిశ్చయముగా నీవు నమ్ముదువు. నీకు నన్ను చెప్పనివ్వండి; ఇక్కడ లోపల వారి హృదయములో పరిశుద్ధాత్మలో ఉన్న ప్రతీ స్త్రీ మరియు పురుషుడు, అబ్రహాము కలసి చేసిన విధముగానే దేవుని కలసుకొన్నారు. దేవుడు అబ్రహామును ఏదైనా లేకుండానే పిలిచెను... ఆయన అతనిని ఎంపిక చేసుకొన్నాడు. మరియు ఆయన అబ్రహామునకు ఆ నిబంధన ఇచ్చెను మరియు అబ్రహాము సంతానమునకు కూడ ఇచ్చెను, ఏలాగనగా సహవాసములోనికి నిన్ను తీసుకొని వచ్చుచూ, కల్వరి యొద్ద చిందించబడిన రక్తము వలన ఈనాడు నీ హృదయంలో కలిగి ఉన్న క్రీస్తే అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో మీరు అబ్రహాము సంతానమైయున్నారు. ఆ సంఘటన ఫలితముగా దేవుడు నిన్ను పిలిచెను.

59

నీవు ఎవరైయున్నావు? ఇక్కడే బయట ఉన్న ఒక పాపిగా ఉన్న చిన్న వాడవు. మరియు దూరాన భుజములు వంగిన వృద్ధుడవై, మరియు ఒక మంచి పరిశుద్దాత్మ కూటము ప్రక్కగా వెళ్ళుచు, ఇలా అంటావు, “అది పరిశుద్ధ గుండ్రాయిల గుంపు” నీవు ఎవరైయుంటివి అనగా అలాగే ఉన్నావు. నీవు జమిందారి వర్గానికి చెందినవాడవై నీ యొక్క నీలిరంగు కాడిలాక్‌లో, ఆ విధముగా వీధి దిగువకు పరుగెత్తుచున్నావా? ఆ మిగిలిన ప్రజలతో తినుటకు చాలా మంచిగా ఉండెనని నీవు ఆలోచించావు లేక మరొకవిధముగా ఉన్నావని ఆలోచించావు. కారణం ఏమనగా ఇతరమైన ఎవరో వ్యక్తికంటే కొ౦చెం శ్రేష్టమైన వానిగా ఉంటివని, దేవునిని మొత్తానికి వదులుకొంటివి గదా? ఈ పెద్దవైన కొన్ని సంఘాలకు చెందియుండి, మరియు నీవు ఎక్కడైతే నీ పాపములు మరుగు చేసికొనుటకు నీవు ప్రయత్నించుచున్నావో ఆ సంఘములు వెనుక దాగుకొనుచున్నావు కదా?

దేవుడు, సార్వభౌమ ఎన్నిక చేత, ఈ అద్భుతమైన సహవాసములోనికి నిన్ను పిలిచెను. నీవు నీ గర్వమును ప్రతీదియు వదులుకొన్నావు. నీవు నీ నాట్యములన్నింటిని మరియు పెద్దవైన పార్టీలను వదులుకొంటివి. మరియు ప్రేమచేత ప్రభువైన యేసులోనికి వచ్చావు. ఓహ్‌, అయితే దేవుని యొక్క రాజ్యములో సహపౌరునిగా ఉండుటకు జగత్తుపునాది వేయకబడకముందే దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించియున్నాడు.

60

ఇప్పుడు, ఒక క్షణము. ఐదు నిమిషముల కంటె కొంచెం ఎక్కువ వినండి. నీవు నిజమైన గౌరవభావములతో ఉండగలిగినయెడల, ఆ సంపూర్ణ సువార్త సంఘానికి నేను ఏదో విషయము సమర్పించగోరుచున్నాను.

శ్రద్ధగా వినండి. మనము తన యెదుట-పరిశుద్ధులమును నిర్జోషులమునై యుండవలెనని, జగత్తు పునాది వేయబడక మునుపే... (ఎఫెసీ. 1-4)

తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని...(లేదా మరొక విధమైన మాటలో, ముందు జ్ఞానము).

ఇప్పుడు, ఒక ఛాయరూపములో ఉన్న ఆ పాతనిబంధన చట్టాలను తీసికొందాము. మరియు ముగించకముందు, ఇప్పుడు ఒక క్షణము మీరు నాతో భరించగలరా?

ఇప్పుడు, ఆ ధర్మశాస్త్రము క్రింద... ఆ పాతనిబంధన చట్టము యొక్క క్రమము, అది నూతనమైనదై, దేవుడు ఈనాటికి ఇది ఒక మాదిరియైయుండెను.

ఒక మనిషి యొక్క కుటుంబములో, ఆ కుటుంబములో ఆబిడ్డ పుట్టినప్పుడు, ఆ బాలుడు జన్మించిన వెంటనే, అతడు ఆ కుటుంబము యొక్క కుమారుడై యుండెను ఆ తండ్రి అతనిని ప్రేమించెను. మరియు అప్పుడు, నీవు గలతీ పత్రిక మరియు మొదలైన వాటిలోనికి వెళ్ళిన యెడల, ఎక్కడైతే ఆ పుత్ర స్వీకారము మరియు ఆ కుమారులను దత్తత చేసికొనుట, మొదలైనవి నీవు చదువగలవు....

అప్పుడు, ఆ తండ్రికి ఆ మొత్తము ఆ రాజ్యమంతటియందు చేయుటకు చాలా పనులను కలిగి ఉండి నందువలన ఆయన ఒక శిక్షకుని లేదా ఆ కుమారుని మీద ఒక బోధకుడను నియమించెను. మరియు ఈ శిక్షకుడు ఆ బిడ్డ ఏలాగు వృద్ధి చెందుచున్నాడో ఎల్లప్పుడు తండ్రి దగ్గరకు ఒక మాటను తెచ్చెను. ఒక ఉపాధ్యాయుడు, ఆ విధముగా ఒక శిక్షకుడు అనగా, అది ఆ పాతనిబంధన నియమావళి అని ఎవరికైనను తెలియును. క్రీస్తు దగ్గరకు మనలను తీసుకొని వచ్చుటకు, ఆ చట్టము కేవలము ఒక శిక్షకునిగా ఉండెనని,లేక విద్యావంతునిగా ఉండెనని దానిని గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు.

61

ఇప్పుడు, ఇలా జరుగుచుండగా... ఆ శిక్షకుడు ఆ బాలుడు ఎదుగుచు౦డుటను గూర్చి గమనించుటకు ప్రారంభించెను. అతడు ఒక కుమారుడు. అయితే ఆ తండ్రికి అతనితో ఏమి చేయవలెనో, లేదా అతడు ఎదిగినవాడైనప్పుడు ఆయన ఏమిచేయవలసి ఉండునో ఇంకా తెలియదు. ఇప్పుడు, నా యొక్క ఫూర్తి అభిప్రాయ ప్రకారము, స్నేహితులారా ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి మరియు నేను తప్పుగా ఉండిన యెడల నా కొరకు ప్రార్థించండి.

చాలా సంవత్సరముల క్రితము ప్రారంభములో వారు పరిశుద్ధాత్మను పొంది వారు దేవుని కుమారులైనప్పుడు, ఆసంపూర్ణ సువార్త సంఘానికి ఏమి సంభవించెను. అది యధార్థము. వారు కుమారులైరి. మరియు ఆ పరిశుద్దాత్మయే దేవుని యొక్క గొప్ప గౌరవభావములో వారిని పెంచుటకు శిక్షకుడైయుండెను.

ఇప్పుడు, ఆ శిక్షకుడు ఆ పిల్లలను గమనించుచుండగా, మరియు ఆ సంఘము అభివృద్ధి చెందు చుండెను, పైకి ఎదుగుచుండెను.... వారు పుట్టిన నాటినుండి వయస్సులో ఎదుగుట చూసారు. మీరు ఇలా అంటారు, “తిరిగి జన్మించవలెను.” అది యధార్థము. నిజమైనది. నీవు తిరిగి జన్మించినప్పుడు నీవు ఎన్నడైనను ఉన్న కుమారునిగానే నీవు అదే విధమైన అంతగా కుమారునివైయుందువు...

అయితే, ఆ శిక్షకుడు ఆ తండ్రి దగ్గరుకు మాటనుతీసుకొని వచ్చుచున్నాడు. తండ్రిగా ఉన్నప్పుడు, ఆ శిక్షకుడు తండ్రి దగ్గరకు వచ్చాడు, మరియు ఆ బాలునికి తగిన వయస్సు వచ్చినప్పుడు (ఆ సంఘము ఇప్పుడు ఎక్కడ ఉండవలసినదో) అను దానిగూర్చి, వయస్సు వచ్చినప్పుడు, ప్రకాశవంతముగా మారి, బాల్యవయస్సు నుండి పరిపక్వము చేయబడిన వయస్సు యొక్క అనుభవములోనికి వచ్చినప్పుడు, ఆ బాలునికి వయస్సు వచ్చిన ఆ సమయముననుసరించి, ఆ శిక్షకుడు ఆ తండ్రి దగ్గరకు వచ్చాడు.

62

మరియు ఇది వరకే ఒక కుమారునిగా, ఆ బాలుని చూచుచూ, అయితే ఇంకా, అతడు యోగ్యుడైన ఒక కుమారునిగా ఉండని యెడల, తండ్రి వానిని, దత్తత చేసికొనలేడు. లేదా ఆయన సొంత కుటుంబములో ఉంచుకొనలేడు. అతడు అది చేయలేకపోయెను, ఎందుచేతననగా, ఆ బాలుడు అతడు ఏమి కలిగియుండెనో దానిగుండా పరుగెత్తుచుండెను. అతడు విశ్రాంతి లేని ఒక బిడ్డగా ఉండెను. అతడు అతని తండ్రి పనితో కొనసాగుటకు సమర్ధత కలిగియుండలేదు. కాబట్టి ఆ తండ్రి, వానిని ఒక కుమారునిగానే పోనిచ్చెను. అతడు ఇది వరకే ఆయన కుమారుడైయుండెను.

అయితే, అతడు ఒక చక్కని బాలుడు అయి ఉండెను. అతడు తన తండ్రి పని మీద ఉండెను. మరియు ఆ శిక్షకుడు తండ్రి దగ్గరకు మాటను తెచ్చెను. అలా ఆ కుమారుడు చక్కగా ఉండెనని చెప్పుచుండెను. అతను సమర్థత కలిగినవాడైయుండెను. అతడు అంతా యధార్థముగా ఉండెను. అప్పుడు ఆ తండ్రి కుమారుని తీసుకొని ఆ కుమారుని ఒక బహిరంగ సాక్ష్యముగా ఒక బహిరంగ స్థలములోనికి తీసుకొనివచ్చెను. మరియు ఆయన ఒక ప్రత్యేకమైన అంగీ వానిమీద ఉంచెను, మరియు ప్రజల యెదుట వానిని పైన కూర్చుండబెట్టెను.

మరియు ఆ తండ్రి, ఈ విధముగా చేయుచూ ఆయన రాజ్యము మీద ఆ కుమారునికి అధికారమును, ఆయన పనిమీదను మరియు మొదలైన వానిమీద వానికి అధికారమిచ్చెను. ఆ కుమారుడు ఆ విధముగా తన తండ్రి కలిగియుండిన అదే రకమైన అధికారముతో రాజ్యములో నిర్ధిష్టమైన కార్యములు చేయును.

63

ఇప్పుడు, వెనుక చాలా సంవత్సరముల క్రితము, ఆ సంఘము ఆత్మతో తిరిగి జన్మించియుండెను అయితే, మీరు ఒక గుంపుగా సాధారణ ఆలోచన సభగా (ది జనరల్‌ కౌన్సిల్‌) పిలువబడిరి. అసెంల్లీస్‌ ఆఫ్‌ గాడ్‌ అను అలాంటి గుంపుగా విడిపోయిరి, ఏకత్వము, ద్విత్వము, త్రిత్వము అను పిలువబడు ఒక గుంపుగా విడిపోయిరి.

దేవుని సంఘము, ఓహ్‌, కనికరము, ప్రతీవిధమైన తప్పుడు సిద్ధాంతము దేనితోనైననూ నీవుండగా, దేవుడు ఏలాగు నీయందు నమ్మకముంచగలడు? ఇంకా మీరు పిల్లలైయున్నా రు. అయితే, ఎందుచేత ఆ నిజమైన అసలైన వరములు లోపల ఉండుటలేదని మీరు ఆశ్చర్యపడు చున్నారు? మరియు...? ...ఆ దయ్యము నీకు తాళము వేసి బంధించెను. మరియు నీవు వెళ్ళలేవు. నీయంత నీవే వెనుకకు తిరుగుము. సామాన్యమైన విధేయత...?... ప్రతీ సంగతి వెనుక పరుగెత్తుచుండెను.

సహోదరుడా! అది చాలా భయంకరముగా ఉన్నది. అయితే, అది మేలుకరముగా ఉండి, అది సత్యముగా ఉన్నది.

ఇప్పుడు, నీకు నీవే వెనుకకు వెళ్ళుము...? ...దేవుని యొద్దకు. అలా రెండు పక్షములుగా ఉండు ఆ అడ్డుగోడలు పగులగొట్టబడి, ప్రేమించే ఆ పాతకాలపు స్థితికి వచ్చునంతగా, మరలా తిరిగి దేవుని యొద్దకు రమ్ము.

అసెంబ్లీస్‌ వారు పరిశుద్ధాత్మను పొందెను. ఏకత్వము వారు పరిశుద్ధాత్మను పొందారు. ద్విత్వము, త్రిత్వము, దేవుని సంఘము, ఓహ్‌, వారు పరిశుద్దాత్మను పొందారు. ఆందోళన చెందవద్దు, మీ సంఘాలను ఒకపాతకాలపు ఉజ్జీవము మరియు స్వస్థత కొరకు ఏకము చేసి తీసికొని వచ్చుచూ సహోదరత్వముతో మరల వెనుకకు రమ్ము...? ...పరిశుద్ధత...? ... ఏకమై వెనుకకు రండి.

ఆ సమావేశములో ఏమి జరిగినదో గమనించుటకు మీకు మరింత ఎక్కువ సమయం ఉన్నది. అదే దేవుడు మీరు ఏకమైయుండవలెనని పిలుచును. ఇక్కడ బయట ఉన్న సంఘమును ఐక్యము చేసి మరియు దేవుడు తన రొమ్ములో కలిగి యున్న ప్రతీ దైవికవరముతో అధికారము యొక్క అంగీని మీమీద ఉంచును. ఆయన సేవకుల లోపల ఆయన పెట్టును. అయితే, మీరు ఆందోళన చెందు చున్నంత కాలము, ఒక మనిషిని ఒక వరముతో లేవనివ్వండి....

64

ఎవరో ఒకరు ఇక్కడ.... దీనికి ముందు ఎప్పుడూ దీనిని బహిరంగముగ చెప్పలేదు. మొదలైన వాటిని లెక్క చేయను...? .. ఎందుచేత నా బాప్టిస్టు సంఘములో నుండి అసెంబ్లీస్‌ అను వారి దగ్గరకు నేను వెళ్ళలేదు గదా! ఎందుచేత నేను ఏకత్వము లేదా దేవుని సంఘము దగ్గరకు నేను వెళ్ళి ఉండలేదు? సహోదరుడా అలా నేను కలిగియుండిన ప్రభావము యొక్క ప్రతీ చిన్న ప్రభావమును ఆ సంస్థమీదపెట్టి యుంచుదును. నేను వాటిలో దేనిని తీసికొనను, అయితే, నేను ఖాళీలో సరిగ్గా నిలబడియుండి “మనం సహోదరులమైయున్నాము.” అని చెప్పుదును.

నీ ఆచారములను మరచిపొమ్ము. దేవుని పిల్లలుగా సమకూడి వచ్చెదము. మరియు ఆ విధముగా మీరు ఒకనినొకరు ప్రేమించని యెడల, అప్పుడు అక్కడే మీ అనుభవములో ఏదో పొరపాటు ఉన్నది ...?...ఉద్రేకము మీద మాత్రమే రక్షింపబడియుండెను.

మరియు ఎందుచేత ఈ సంస్థ అబద్ధకార్యములు నీ సంఘములలో పైకి లేచుచున్నవని మీరు ఆశ్చర్యపడుచున్నారు. ప్రజలు కార్యములను అనుకరణ చేయుచున్నారు. ఆ కారణముచేతనే అది అలా జరుగుచున్నది. ఆ సంఘము దానికొరకు ఆకలిగొనుచున్నది, అయితే మీరు అంతా కలసి ఏకముగా కూడుకొనలేక పోవుచున్నారు. క్రీస్తుయేసునందు మీయంత మీరే కలసి ఉండుడి. మరియు దేవుడు మీకు ఒక నిజమైన అసలైన విశ్వాసము నిచ్చును.

65

దేవుడు ఆయన సొంతకుమారునితో దానిని చేసెను. ఆయన పేతురు, యాకోబు మరియు యోహానును రూపాంతర కొండమీదకు తీసుకొనిపోయిన తరువాత ఆయన యొక్క సొంతకుమారుని పుత్రునిగా స్వీకరించెను. (దత్తత). దేవుడు ఆయనను కమ్ముకొనెను, మరియు అలా బైబిలు చెప్పెను.

అపొస్తలులు ఆయనను చూచెను. మరియు ప్రభువు ఒక అంగీని ఇచ్చి యుండెను. అయితే, రూపాంతరపు కొండమీద ముగ్గురు సాక్ష్యులయెదుట ఆ పరిశుద్ధాత్ముడు క్రిందికి దిగి వచ్చినప్పుడు... (ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యులయెదుట ప్రతీ మాట స్థిరపరచబడును). ఆయన పేతురు, యాకోబు, యోహానును తీసుకొనెను, నిరీక్షణ -నిరీక్షణ, విశ్వాసము మరియు ప్రేమ. మరియు వారిని కొండమీదకు తీసికొని వెళ్ళెను, వారిలో నుండి ఈ ముగ్గురిని, మరియు పరిశుద్ధాత్మగా ఉన్న ఆ ప్రభువైన యేసును, అక్కడ దేవుడు తన సొంతకుమారుని కమ్ముకొనెను.

మరియు ఆయన వస్త్రములు సూర్యునికాంతివలె తెల్లనివాయెను అని బైబిలు చెప్పెను. మరియు దేవుడు ఆ కుమారుని మీద అంగీని ఉంచెను. అదే పుత్ర స్వీకారము చెప్పెను, “ఈయన నా ప్రియకుమారుడు, ఆయన స్వరమును వినుము; అలా ఆ పాతనిబంధన కోరిన ప్రతీ నియమమును నెరవేర్చుచుండెను.” ఆమేన్‌.

అది ఎలా ఉన్నదనగా...? ...ఈ మధ్యాహ్నవేళలో ఈ వేదిక మీద నిలబడి యున్న బోధకుల మీద ఉన్నది, దేవుడు ఆయన సంఘమును బయట సుదూరమున పుత్ర స్వీకారములో ఎన్నడైన పంపగలుగుటకు ముందు మీరు మీయంత మీరే పరిశుద్ధాత్మతో ఏకమైయుండవలెను...? ...సజీవమైన దేవుని శక్తులు ...?...మరియు దేవుని కుటుంబములోనికి ఈ తిరిగి జన్మించిన సంఘమును (దత్తత) పుత్రునిగా స్వీకరించవలెను. మరియు అప్పుడు అదే దేవుని స౦ఘము ఆమె పాదములపై నిలబడగలిగి, మరియు ఆ ధ్వజము నెత్తుకొని దాని క్రింద కవాతు చేయుచూ కొనసాగుచుండును...?... ఆమేన్‌.

66

మనము ప్రార్ధించుకొందాము.

పరలోకపు తండ్రీ, మేము నిన్ను సమీపి౦చుచున్నాము. మమ్మును మీ జాగ్రత్తలో ఉంచండి. దేవా, ఇక్కడే ఉన్న ప్రేమ గల ఈ చిన్న సంఘము ఇక్కడే ఉన్నది. ఓహ్‌, ఒక కాపరి లేని గొర్రెలవలె ప్రతీ చోటను వారు చెదరుట నేను చూచుచున్నాను, తిరిగి జన్మించిన పిల్లలు, ప్రభువా వారి హృదయమంతటితో నిన్ను ప్రేమించుదురు;

ఓహ్‌, తండ్రీ, ఏ విథముగా నైనను వారి హృదయములను పట్టుకొనియుంచండి. అక్కడ దేవుని కొరకు పాతకాలపు ఉజ్జీవము యొక్క ఆకలి, ఫోనిక్స్‌ అంతటా వెదజల్లబడును గాక! అది ఎంతవరకు అనగా, ఆ దక్షిణ పర్వతం నుండి ఆ ఉత్తర పర్వతం వరకు, తూర్పు నుండి పడమర వరకు, అక్కడ ఆ విధముగా ఊడ్చివేయగల ఒక ఉజ్జీవము ఉండును. మరియు ఈ లోయ దేవుని యొక్క శక్తి మరియు మహిమతో ఈ లోయ ప్రకాశవంతముగా ఉండును.

యెహెజ్కేలు ఎండిన ఎముకలవలె ఏకమై ప్రతీ సంఘము ఏకమై కలసివచ్చునట్లు, మేము ప్రభువైన యేసు నామములో మేము వెళ్ళుచుండగా, ఆ సంఘము మీదకు మాంసము పొదగబడి మరియు మంచిశక్తి గల వరములతో కూడిన చర్మముతో కప్పబడును గాక! ఆమేన్‌.

ఇంతవరకున్న ఈ రాత్రిలో, దేవుడు మిమ్మును దీవించును. ఇక్కడ ఉండిన దానికొరకు ప్రభువుకు వందనములు.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...