ఓడ (మందసం)
VGR COUNT-177 స్నేహితులారా శుభోదయము. ఈ దినము చిన్న పొరపాటు దొర్లినది. ఇక్కడ రోగుల కొరకు నేను ప్రార్ధిస్తానని ముందుగానే రేడియోలో బ్రదర్ నెవిల్ ప్రకటిస్తారని నేను మాటిచ్చియున్నాను. అయితే బ్రదర్ నెవిల్ కు దానిని అందచేయుటలో సెక్రటరీలు ఎక్కడో విఫలమైయున్నారు, ఆ కారణముచేతనే అది రేడియోలో ప్రకటించబడలేదు. కొంతమంది ప్రజలు ఈ ఉదయమున వారికి ప్రార్ధించమని ఫోను చేసి కోరియున్నారు.
2
నూతనముగా బాలుడు జన్మించియన్నాడని వారు నాకు చెప్పినదానికి నేను ఉత్సుకతకు లోనయ్యాను, దానికి నేను ఎంతో వందనస్తుడను. నర్సు ఆ బాలుడిని తీసుకొని గది వెలుపటకు వచ్చినప్పుడు నేను ఇలాగన్నాను, “జోసఫ్, నేను నీ కొరకు నాలుగు సంవత్సరములు ఎదురు చూశాను. ఇప్పుడు నీవిక్కడున్న దాన్నిబట్టి నేను సంతోషిస్తున్నాను.” నాలుగు సంవత్సరముల క్రితం, ఆ చిన్న బాలిక జన్మించుటకు ముందుగానే మాకు ఆ సంగతి తెలియును, ఎందుకనగా ఒక దినము బైబిలులోని యోసేపు యొక్క జీవితమును చదివిన తరువాత నేను ప్రార్ధించుచుండగా, నేను ఇలాగు ఆలోచించాను, “ఎంత పరిపూర్ణమైన మనుష్యుడు.” అబ్రాహము ఎన్నుకోబడినవాడు. ఇస్సాకు నీతీకరించబడినవాడు. యాకోబుకు కృపయున్నది. కాని, యోసేపు పరిపూర్ణుడు. అది ముగిసిపోయింది, గమనించారా, దానిని గురించి మరెక్కడా చెప్పబడలేదు. కాబట్టి యేసేపును గురించి నేను, ఎలా జన్మించాడు, మరియు తండ్రిని ఎలాగు ప్రేమించాడు అని ఆలోచించాను.
ఒక సంగతిని మరచాను అది ఏమిటంటే, దక్షిణాఫ్రికా నుండి వారు ఒక రంగుల కోటును అతని (కుమారుడైన జోసఫ్ కు - తర్జుమాదారుడు), కొరకు తయారుచేయున్నారని ఒక టెలిగ్రామో లేక వర్తమానమో నాకు వచ్చియున్నది. అతడి కొరకు వారు ఎదురుచూస్తున్నారు.
కాబట్టి నేను మరింత సమీపముగా వెళ్ళి ప్రార్ధించుచుట ప్రారంభించాను. “దేవా...” యేసేపు ఎంత అద్భుతమైన వ్యక్తి అని ఆలోచించి నేను కన్నీరు కార్చుచున్నాను. అతడు ఏ విధముగా 80 వెండి నాణెములకు అమ్మబడియున్నాడో, వాస్తవములో 30 వెండి నాణెములకు యేసును అమ్మినదానివలె అతడును అమ్మబడెను. అతడు ఆ గుంట నుండి పైకి తీయబడెను, మీకు తెలుసా, పరోకు కుడిప్రక్కన అతను కూర్చొనెను. యోసేపు కాకుండా మరే మనుష్యుడు కూడా రాజును చూడలేడు. బూర ఊదినప్పుడు, అతడు ముందుకు వెళ్ళుచుండగా ప్రతియొక్కరి మోకాలు వంగవలసినదే. మీకు తెలియునా, యేసు విషయములో కూడా అలాగేయున్నది, ప్రతి నాలుకా ఒప్పుకొనవలసినదే.“ నేను తిరిగి ప్రార్ధించుట ప్రారంభించాను.
3
జీవించుచున్న ప్రజలలో మూడు రకములైన ప్రాధమికమైన అంశములున్నాయి. మొదటిది మానవత్వము. రెండవది దైవిక ప్రత్యక్షత. మరియు మూడవది దర్శనము.
ఇప్పుడు, ఈ విధముగా ప్రార్ధనలో, మీరు ఎప్పుడైనా ఎవరి నిమిత్తమైననూ ప్రార్ధించిన్నట్లయితే మానవత్వముతో మనము ఇలాగంటాము, “మంచిది, నీవు స్వస్థత పొందుకుంటావని నేను ఆశిస్తున్నాను. నీతో నేను ఏకీభివిస్తున్నాను, నాకున్న విశ్వాసమంతటితో నేను ప్రయత్నిస్తున్నాను. అది ఒక మానవుడైయున్నాడు.
రెండవది, దైవిక ప్రత్యక్షత, నీకు ఏదైనా బయలుపరచబడినట్లయితే, అది ఇంకనూ జరుగకపోయినప్పటికి నీ హృదయమందు అది జరుగునని నీవు ఎరిగియుంటావు అదియే ప్రత్యక్షత.
మూడవది, ఒక దర్శనము. అది నిశ్చయముగా “యెహోవా ఈలాగు సెలవిచ్చెను.” అది ఖచ్ఛితమైనది మరియు సానుకూలమునైయున్నది.
4
ఇప్పుడది ఈ ప్రపంచములోకి ప్రవేశించియున్నది. ఏదో నాతో ఈలాగు చెప్పియున్నది, “నీకు ఒక కుమారుడు కలుగును, మరియు నీవతడిని జోసెఫ్ అని పిలిచెదవు.”
మంచిది, నాకు ఒక చిన్న కుమార్తె కలిగినది. కాబట్టి నేను ఇలా తలంచాను, “మంచిది...” దానిని బట్టి నేను ప్రభువును స్తుతించాను. ఒక నెల తరువాత, మేము మరలా తల్లితండ్రులు కాబోచున్నామని కనుగొన్నాము, అప్పుడు జోసెఫ్ రాబోవుచున్నాడని మేము అనుకున్నాము. చివరకు అదే జరిగినది, ఒక కుమార్తె; జోస్ఫైన్.
కాబట్టి చాలామంది అప్పుడు పుట్టబోయేది జోసెఫ్ అని నేను చెప్పియున్నానని తలంచారు. నేను ఇలా అన్నాను, “లేదు, లేదు. అప్పుడు జోసెఫ్ పుడతాడని నేను చెప్పలేదు.” అప్పుడు కొంతమంది నన్ను ఇలాగు అడిగారు, “మంచిది, ఒక దర్శనమందు దీనిని చూశానని నీవనలేదా?” ప్రజలు ఏ విధముగా అన్నింటిని కలగాపులగం చేయుదురో మీకు తెలుసు. నేను ఇలా అన్నాను, “నేను దానిని టేపులలో చెప్పియున్నాను. గమనించారా? వచ్చి వినండి. ఇప్పుడే జోసెఫ్ పుడతాడని నేను ఎన్నడు చెప్పియుండలేదు.” “జోసెఫ్ అనే పేరుగల కుమారుడిని నేను కలిగియుంటాను అను దానిని ప్రభువు నా హృదయమందుంచెను.” గమనించారా? నేను ఇలాగన్నాను, “అది ఎప్పుడు, ఎలాగు, లేక ఏమి జరుగునో నేనెరుగను, కాని అది జరుగనైయున్నది.” కావున అది నాకు తెలియదు. బహుశా అతనికన్నా ముందుగా నేను ఆరుగురు కుమార్తెలను కలిగియుండవచ్చును, అయిననూ అతడిక్కడ ఉండవలసిందే.“ మంచిది, అది నా హృదయము నుండి ఎన్నడూ విడిచిపోలేదు. ఆ విధముగా ముందుకు వెళ్ళాము.
5
ఆ తరువాత మరో దినమున అతడు వచ్చియున్నాడు. ఇప్పుడు ఇక్కడున్నాడు, దానిని బట్టి నేను చాలా సంతోషముగా ఉన్నాను, ప్రభువు ఏదైనా వాగ్దానము చేసియున్నట్లయితే దానిని ప్రభువు తప్పక నెరవేరుస్తాడని యెరిగియున్నాను, గమనించారా. ఆయన ఆ విధముగా చేయవలసియున్నది. దేవుడైయున్న కారణముచేత ఆయన తన వాక్యమును నెరవేర్చవలసియున్నది.
కొన్నిసార్లు నేను చేసిన వాగ్దానములను నెరవేర్చలేను. మీరు కూడా మీరు చేసిన వాగ్దానములను నెరవేర్చలేరు, ఎందుకనగా మనము మంచి ఉద్దేశ్యముతో వాగ్దానములు చేస్తాము, అయితే మనము దానిని ముందుకు కొనసాగించలేము. పరిస్థితులు, కష్టములు మరియు మొదలైనవి కొన్నిసార్లు మనము అనుకున్నవాటిని చేయలేని స్థానములో మనలను ఉంచుతాయి.
కాని, దేవుడు మాత్రము తాను పలికిన మాటకు కట్టుబడియుండును, మరియు ఆయన దానిని చేయును. తన వాక్యమును నెరవేర్చకుండుట ఆయనకు అసాధ్యమైయున్నది. ఈ ఉదయమున ఆ కారణమును బట్టియే మనము ఆయనను మనము ప్రేమిస్తున్నాము. ఆ భరోసా మీదనే మనము విశ్రాంతి తీసుకుందాము, అదేమిటంటే, మనము ఆయన యెదుట ఒప్పుకొనిన దానిని దేవుడు ఆ దినమున నెరవేర్చగల సమర్థుడు.“
6
వెలుపట ఇది ఎంతో దుర్దినమైయున్నది, కాని గుడారము లోపల సరిపడినంత చల్లగాను మరియు లోపల కిక్కిరిసిపోయేంతగా జనులు, వెనుకాల వరుసలుగా నిలబడిలేరు, కాని వాక్యమును బోధించుటకు ఇది ఎంతో మంచి సమయమైయున్నది.
గత కొద్ది గంటల నుండి ఒకవేళ పరిశుద్ధాత్ముడు... నేను తీవ్రముగా ప్రయత్నము చేస్తున్నాను, వెనుక బిల్లీ కార్డులను కలిగియున్నాడు కాబట్టి తారువాత మనము ప్రార్ధనా వరుసను కలిగియున్నాము. కాని ఇప్పుడే కాదు, నేను దానిని చేయుటలేదు. అదియే నన్ను నడిపించుచున్నది. మీరు గమనించియున్నారా? దానితో నేను చేయగలిగినది ఏదియూలేదు. ఆయన దానిని గూర్చి ఏమి చెప్పునో దానిమీదనే అంతా ఆధారపడియున్నది.
7
ఇక్కడ ఈ దిగువునేవున్న బ్రదర్ క్రాంక్ దగ్గర బ్రదర్ నెవిల్ ఉజ్జీవమును ప్రకటించియున్నాడు. అయితే నాకు బ్రదర్ క్రాంక్ ఎవరో తెలియదు. నేను గత రాత్రి ఆసుపత్రి నుండి వచ్చి బ్రదర్ రాబర్ట్ యొక్క చిత్రమును చూచుటకు వీధిలోకి అడుగుపెట్టియున్నాను. ఈ భవనమునకు చిట్టచివరన బ్రదర్ క్రాంక్ మరియు అతడి తండ్రియును ఉన్నారు. బ్రదర్ క్రాంక్ ఒక బాలుడే, అతడి వయస్సు సుమారుగా 20 లేక 21 సంవత్సరములు ఉండవచ్చును. కాని, అతని తండ్రి, అతడితోనే ఉండెను. తరువాత న్యూ-ఆల్బనీ నుండి వచ్చిన పెంతెకోస్తు బ్రదర్ మతేని ఉన్నారు. ఈ బ్రదర్ క్రాంక్ కూడా పెంతెకోస్తువాడేనని నేను నమ్ముచున్నాను.
కావున వారు మంచివారైయున్నారు, వచ్చేవారము వారియొక్క ఆరాధనను నన్నే తీసుకోమని అడిగియున్నారు. నేను అది చేయలేనని మీకు తెలుసు. ఒకవేళ ఈ శనివారము రాత్రి నేను అక్కడ ఉన్నట్లయితే, అది అద్బుతమే అవుతుంది. అది నాకు ఇంకనూ తెలియదు. దానిని నేను పరిశీలిస్తానని అతడితో చెప్పియున్నాను. రాబోవు శుక్ర, శని, మరియు ఆదివారములు నేను, తన యొద్దకు రావాలని బ్రదర్ కోబల్స్ ఆశించియున్నాడు. ఈ వారములో ఒక రాత్రి నేను మిల్టౌన్ ఉండాలని బ్రదర్ హాల్ ఆశించియున్నాడు, ఎందుకనగా తరువాత వారము నుండి వేసవి కాలము నిమిత్తము విడిచి వెళ్ళుచున్నాము. కావున ఈ చుట్టుప్రక్కలనే అక్కడక్కడ మాకు కొద్ది కూడికలు కలవు. అవి ఎక్కడున్నవో నాకు తెలియదు. త్వరలోనే తెలియచేస్తానని అతనికి నేను చెప్పియున్నాను.
8
ప్రస్తుతమునకు నా భార్య చక్కగా ఉన్నది. ప్రజలైయున్న మీ అందరి ప్రార్ధనలను నేను అభినందించుచున్నాను. కేవలము ప్రార్ధన ద్వారా మాత్రమే అలాగు జరుగును, ఎందుకనగా ఇక్కడున్న ప్రజలు కలగలసిపోయున్నారు, ఏమి జరిగియున్నదో నేను చెప్పలేను. కాని, అది సాధారణమైన సమయమునకు రావలసియున్నది, కావున ఆమె గంటలు, గంటలు సమయమును అక్కడ గడిపి వచ్చియున్నది; చూచారా. ఒకసారి గుండె పైకి ఎగిరిన తరువాత అది అక్కడనే మరణిస్తుంది. కాని, దేవుని కృపవలన, ఆమెకు ఇంతకుముందు జరిగిన కాన్పులకన్నా ఇది ఎంతో మేలైనదిగా ఉన్నది. కాబట్టి మీ అందరి ప్రార్ధనే దీనికి సహకరించియున్నదని నాకు తెలుసు. అందుచేత ప్రార్ధించిన వారినందరని నా హృదయమంతటితో అభినందిస్తున్నాను.
నా జీవితములో ఒక మలుపై, గుర్తుపెట్టబడియున్న ఆ చిన్న బాలుడి నిమిత్తము మనమందరము ప్రార్ధించుదాము... కొద్ది దినముల క్రితము ఆ బాలుడు సరిగా బయటకు రాలేడేమో అనే విధముగా పరిస్థితి ఉన్నది, పరిస్థితులన్నీ మాకు వ్యతిరేకముగా కనిపించాయి... అది పగలుకు ముందున్న చీకటివలె ఉన్నది, మానవుని యొక్క సాధారణమైన జీవితము ఆ విధముగా ఉంటుందని మీకు తెలుసు. ఆ పైనున్న గ్రీన్స్ మిల్లీలోని, స్కౌట్ రిజర్వేషన్ వద్దకు నేను వెళ్ళాను. అక్కడ నేను ఎక్కువ సేపు నిలబడలేకపోయాను, ప్రభువైన యేసుతో నేను ఒంటరిగానే అలాగే వుండిపోయాను. అన్ని సక్రమముగానే జరుగుతాయని ఆయనే నాకు భరోసాను ఇచ్చెను. అప్పుడు నేను ఇలా అన్నాను, “ప్రభువా, నీ వలనే రావలసియున్నదని నేను వాగ్దానమును పొందియున్నాను...” నాకు అనేకమైన కష్టమైన పరిస్థితులు మరియు సమయములున్నాయి.
9
మీరు చూశారా, ఈ ఉదయకాలము ఇద్దరు లేక ముగ్గురు క్రొత్తవారు మనతో ఇక్కడ ఉన్నారు. నాకు తెలియదు. ప్రార్థన చేయు నిమిత్తము ఇక్కడ నా వద్ద నేను రెండు పేర్లను కలిగియున్నాను. కాబట్టి ఇది ఒక చిన్న గుడారము యొక్క గుంపైయున్నదని నేనూహించగలను.
కాని, లోకము ఎరుగని మరియు ఏ ప్రజలు చూడని సంగతుల గుండా నేను వెళ్ళబోవుచున్నాను. (మీరు గమనించారా?), చాలా కఠినమైన సంగతులు. గీతలకు లోపలే శత్రువు పనిచేయుచున్నాడని మీకు తెలుసు. వెలుపట మీరు దానిని గమనించలేరు. అది లోపల గీతలను కత్తిరించివేయుచున్నది. కావున నేను ప్రతి చేతిని కలవాల్సియున్నది. కాబట్టి నేను దానికొరకు కనిపెట్టుచున్నాను. అలాగు జరుగనట్లయితే అది ఏమైయున్నదో అని నేను ఆశ్చర్యపోతాను... అది దయ్యము యొక్క సహవాసమై యుండకూడదని నేను ఆశిస్తాను. నాకు తెలుసు వాడు నా శత్రువైయున్నాడని, నేను వాడిని యుద్ద భూమిలోనే కలువవలసియున్నది. వాడితో యుద్దము చేయుటకు నా వద్దయున్న జీవము కలిగిన దేవుని వాక్యమనే సామగ్రిని బట్టి నేను వందనస్తుడనైయున్నాను. అది సరిపోవునది మరియు శాశ్వతమైనది.
ఇటువంటి స్థలములలో నేను దీర్ఘకాలము ఉండునట్లుగా రానైయున్న నా యొక్క కూడికలను మరలా సిద్దపరచుటకు దేవుడు సహాయము చేయునని నేను ఆశిస్తున్నాను. ప్రార్ధనలో ఉందాము.
10
దక్షిణాఫ్రికా నుండి వచ్చిన బ్రదర్ మరియు సిస్టర్ స్కోయిమాన్ ఇక్కడున్నారు. (అది దక్షిణాఫ్రికా సేవకుల సంస్థకు పెద్దయైయున్నది) అటు తరువాత రాబోవు వర్షాకాలమందు భారతదేశము మరియు మొదలైన ప్రాంతములకు వెళ్ళుటకు చూస్తున్నాము.
దక్షిణాఫ్రికా నుండి వచ్చిన బ్రదర్ థామ్స్ ఇక్కడ ఉన్నారు. ఒక దినమున అతడిని నేను కలుసుకున్నాను. అక్కడ నివసిస్తున్న ప్రజల మధ్యలో అతడు గొప్ప పరిచర్య చేయుచున్నాడు. బ్రదర్ థామ్స్ యొక్క కార్యక్రమములని ఇష్టపడుటకు కారణమేమంటే అతడు మాట్లాడు కార్యక్రమములనే చేస్తాడు, అతడు మరియు బ్రదర్ టామీ ఆస్బర్న్, ఒకరికి ఒకరు మంచి సహకారులుగా ఉన్నారని నేను అనుకుంటున్నది సరియైనదే అనుకుంటున్నాను, ఎందుకనగా అతడు స్థానిక ప్రాంతము నుండి మిషనరీలు పంపుచున్నాడు. మీకు తెలుసా, ఖచ్చితము స్థానికముగా ఉండువారికి మాత్రమే అక్కడుండేవారి గురించి బాగా తెలుస్తుంది.
ఆస్ట్రేలియా నుండి మేము ఒకరిని ఇక్కడకు పంపించవచ్చును. అతడు ఒక సహోదరుడైయుండవచ్చును, మేము అతడిని ప్రేమించవచ్చును, అతడిని అంగీకరించవచ్చును, మరియు అన్నియు చేయవచ్చును. కాని, అతడికి అమెరికా యొక్క పద్ధతులు, మార్గములు తెలియవు. అదే ఒక అమెరికన్ అయితే ఆ పనిని చక్కగా చేయగలుగుతాడు. చైనా నుండి ఇక్కడకు ఒక వ్యక్తిని పంపినట్లయితే ఏమగును? ఎందుకు, అతడు ఒక మిషనరీ అయ్యున్నాడు, బహుశా అతడు కొద్దిగా ఇంగ్లీషు మాట్లాగలడు. అది అంతయూ కత్తిరించివేయును, అది అమెరికాలోని నివసించు ఒక వ్యక్తి చూపించనంత ప్రభావమును చూపించదు, ఆమెరికన్స్ తో కలసి పనిచేయుట, వారి యొక్క ఆచార పద్ధతుల విషయములోను మొదలైనవాటి విషయములోను అంతగా ప్రభావమును చూపించదు. అది ఆ విధముగానే ఉంటుంది. ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తర మరియు దక్షిణ ప్రాంతముల నుండి వచ్చిన ప్రజలలో నిండిపోయున్నది.
11
కొద్దికాలము క్రితం, నేను ఫ్లోరిడాలో ఉన్నప్పుడు, ఒక రాత్రి కూడిక జరుగుచున్నప్పుడు ప్రియమైన బ్రదర్ జాక్సన్ మరియు గేల్ జాక్సన్ అక్కడ స్వస్థతా ప్రార్ధనలలో మార్చబడియున్నారు. నేను తిరిగి వచ్చుచున్నప్పుడు, నా యొక్క కానుకల విషయములో మొదలైనవాటి విషయముల గురించి నేను ఎవరికి తెలియనివ్వనని మీకు తెలుసు. ఒకవేళ దేవుడు సమకూర్చినట్లయితే అది సరియే. ఒకవేళ ఆయన సమకూర్చనట్లయితే, ఎందుకు, మనకు మరియొక చోట దొరుకును. కావున, గేల్ పైకివచ్చి మేనేజర్తో ఇలాగు చెప్పెను, “మంచిది, ఆర్థికపరమైన వాటి సంగతెట్లున్నది?”
అతడు ఇలా అన్నాడు, “ఓ, 1000 డాలర్లు, కొద్దిగ ఎక్కువగా - బహుశా 1500 డాలర్లు వచ్చియుంటే బాగుండును.”
అతడు ఇలా అనెను, “సమస్య ఏమిటంటే, దక్షిణవైపు వారితో ఏ విధముగా వ్యవహరించవలెనో నీవెరుగవు.” కావున అతడు పైకివచ్చి... ఇలా అనెను, “ఈ రాత్రి నేను కానుకలను పట్టవచ్చునా?”
మేనేజర్ ఇలాగనెను, “తప్పకుండా, అయితే భిక్షయాటనవలె కాదు, ఎందుకనగా బ్రదర్ బ్రెన్హాం అలాగు చేయవద్దని మాకు చెప్పియున్నారు. మేమెన్నడు భిక్షయాటన చేయము.” అతడు పైకి వచ్చి కొద్దిమాటలను చెప్పియున్నాడు, ఆ తరువాత 2000 డాలర్లు కానుకలు వచ్చియున్నాయి. అతడు ఇలా అన్నాడు, “చూడండి, బ్రదర్ బాక్స్టర్, దక్షిణపువారితో ఏ విధముగా వ్యవహరించవలెను మీకు తెలియదు, అంతే.”
మరియు అది ఆ విధముగానే ఉంటుంది. నీవు తప్పక దక్షిణపు వారియొక్క పద్దతులను ఎరిగియుండవలసినదే. నీవు తప్పక ఉత్తరము వారియొక్క పద్దతులను ఎరిగియుండవలసినదే. దూరము నుండి వచ్చిన వ్యక్తికంటే కూడా స్థానికముగా ఉండే వ్యక్తికి, వారి యొక్క పద్ధతులు మరియు వారి స్వజాతి వారియొక్క సంగతులు బాగుగా తెలియును. దర్జీ కుట్టిన చొక్కావలే చక్కగా సరిపోవును...?... అది సరియైనదే. కావున ఆ సోదరులను బట్టి నేను సంతోషిస్తున్నాను.
12
ఈ ఉదయకాలము, నేను మీతో కొద్దిసేపటిలో మాట్లాడబోవుచున్నాను. ఇప్పుడు మాట్లాడబోవు ఈ కూడికయే బహుశా నేను మీతో మాట్లాడబోవు ఆఖరి కూడికైయుండవచ్చునేమో నాకు తెలియదు. తరువాత మేము, జార్జియాలోని మాకన్ కు వెళ్లబోవుచున్నాము. అక్కడ ఆ కూడికలను ఏర్పాటు చేయుటకు సుమారుగా 42 దక్షిణ బాప్టిస్టు సంఘములు సహకరించియున్నాయని నాకు అర్ధమైనది. ఆ తరువాత అక్కడ నుండి ఫుల్-గాస్పెల్ వారి అంతర్జాతీయ క్రైస్తవ వ్యాపారుల పురుషల కూడిక నిమిత్తము డెన్వర్ కు మేము వెళ్లవలసియున్నది. ఆ తరువాత కొద్దికాలము నిమిత్తము నేను కెనడాకు వెళ్లవలసియున్నది.
అటు తరువాత బ్రదర్ స్కోమాన్ గురించి ఆలోచించవలసియున్నది... ఇతర దేశములు వెళ్లవలసియున్నదా లేక ఇదే దేశములో ఉండవలసియున్నదా అనేది పరిశీలించ వలసియున్నది. బ్రదర్ మూర్, ఇక్కడ ఈ ప్రయాణ కార్యక్రమములన్నీ చూస్తుంటారు. బ్రదర్ స్కోమాన్ ను కలుసుకోనున్న చోటులో బ్రదర్ మూర్ కూడా మాతోపాటుగానే ఉంటారు. బ్రదర్ స్కోమాన్ అక్కడికి వస్తారని మరియు అతడును మీరు ఒకరిని ఒకరు కలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను... ఈ గుడారమందు అతడును ఒకసారి మాట్లాడు అవకాశమును కలిగియుంటాడు. అతడును మరియు అతడి భార్యయును ఎంతో మంచివారు. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు నన్ను ఒక సోదరునివలె ఆదరించారు, కాబట్టి అతడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభువు యొక్క ప్రేమచేత ఆ విధముగానే ఆదరించండి.
13
బ్రదర్ నెవిల్ కి దీనిని ప్రసారం చేయుటకు తగినంత పట్టు కలిగిలేడని వారు నాకు తెలియచేశారు, ఆ సంగతి ఇక్కడికి వచ్చిన తరువాత నాకు తెలిసినది. నేను వినుచున్నాను. ఆ యొక్క ప్రసారమును ఎంతమంది విన్నారు? నేను చెప్పుచున్నాను, మహత్తరముగా వారు పాడుచున్నారు, మరియు ప్రసంగము దానికన్ననూ పై స్థితిలో సాగినది. కావున గత సాయంత్రము మంచి వర్తమానమును కలిగియున్నాము. మీరు దానిని అభినందిస్తారా? ఆయనను అవమానించుట కాదు కాని, అది సత్యమైయున్నది. ఒకవేళ బ్రదర్ నెవిల్ ఏదైనా తప్పు చేయుచున్నాడని నేను తలంచినట్లయితే, అప్పుడు నేను అతడిని వెనుకన ఉన్న గదిలోకి తీసుకొనివెళ్ళి అక్కడే మేము మాట్లాడుకుని మరియు దాని నిమిత్తము ప్రార్ధిస్తాము. ఒకవేళ అతడు ఏదైనా మంచిపని చేసినట్లయితే, అది అతనికి చెప్పుటను నేను ఇష్టపడతాను, గమనించారా? అలాగు చేయుట మనము చక్కగా ఉండుటకు సహాయపడుతుంది.
మీకు తెలుసు, దిగువన ఉన్న చిన్న సోదరునికి మంచి ఉత్తరములు పంపుట మరియు బహుకరించుట మంచిదై యున్నది. వారిని కూడా నేను అభినందిస్తున్నానని మీకు చెప్పుచున్నాను. నా భార్య, తన యొక్క ప్రేమను మరియు శుభములను మీకు తెలియచేసినది.
ఇప్పుడు, మనము దీవెనకరమైన ఆ పాత వాక్యము వైపునకు తిరుగుదాము. మనము దాన్ని చేయుటకు ముందుగా గ్రంథకర్తయైన ఆయనతో మాట్లాడుదాము.
14
మా ప్రియ రక్షకుడా, నీ నామమును మేము ఉపయోగించబోవుచున్నాము, సృష్టికర్తను, సర్వశక్తిమంతుడైన వానిని మేము కొద్దిసేపటిలో సమీపించబోవుచుండగా, తనంతట తానుగా కన్యక గర్భములోకి వచ్చినవాడు, ఆమె వలన బయటకు వచ్చిన అద్భుతమైనవాడును, ఎవరైతే మృతులకు మరియు సజీవులకు మధ్యలో నిలబడి మధ్యవర్తిగా ఉండెనో, ఆ ఏకైక మార్గమును, మధ్యవర్తియైన వానిని సమీపించబోవుచున్నాము. ఆయన యొక్క దైవికమైన వాగ్దానము ద్వారా ఆయన చెప్పినటువంటి, “తండ్రిని మీరు నా నామములో ఏమి అడిగినను, నేను దానిని చేయుదును,” ఈ మాటలను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము.
కాబట్టి ఈ దినము మేము ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాము, ప్రియ తండ్రీ, మా హృదయమంతటి నుండి కృతజ్ఞతలను అందుకొనుము, నీ యొక్క పిల్లల స్తుతులు వినుటకు మీరు ఎల్లప్పుడూ మీ యొక్క మహపవిత్ర స్థలమునకు చేరుకుంటారు. ఈ దినమున మీరు మాకిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి, ఆరోగ్యమును బట్టి, సంఘముందు జరుగుచున్న క్రియలను బట్టి, ప్రపంచమంతటిలో జరుగుచున్నవాటిని బట్టి మేము మీకు వందనస్తులమైయున్నాము. దానిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. తండ్రి, మీరు దీనిని కొనసాగించమని ప్రార్ధిస్తున్నాము, కేవలం కొనసాగించుటయే కాదు గాని, క్రియ జరుగుచున్న ప్రతిచోటా రెండింతలుగా కుమ్మరించి మేము సమయము తక్కువగా కలిగియున్నామని నమ్మునట్లుగా చేయుము. అన్ని సంగతులు అంతము వైపు చూపించుచున్నవి. అది ఎప్పుడో మేము ఎరుగము, కాని దాని కొరకు ప్రభువైన యేసు మమ్ములను అభిషేకించి సిద్ధపరచునట్లుగా చేయమని అడుగుచున్నాము.
15
తండ్రీ, నీకు వందనములు. నేను వ్యక్తిగతముగా నాకివ్వబడిన ఈ చిన్న బాలుని బట్టి మీకు వందనములు తెలియచేస్తున్నాను. నీ వాగ్దానము నాలుగు సంవత్సరములు తారాడినది. “కాని, ప్రభువైన నేనే దానిని నాటియున్నాను, దానికి దివారాత్రములు నేనే నీరు పోయుదును.” తండ్రీ, మీరు మీ యొక్క వాగ్దానములను ఎల్లప్పుడూ నిజము చేయుదురు. దర్శనముల ద్వారా, ఎదురు చూచుట ద్వారా, మట్లాడుట ద్వారా నిజము చేయుదురు. అది వాక్యమైయున్న కారణముచేతను మరియు దేవుని యొక్క వాగ్దానము చేతను జరుగును. అన్ని సంగతులు సమకూడి మేలునకై జరుగుచున్నవని ఎరిగి మేము భయపడక ముందుకు సాగుచున్నాము.
తల్లిని క్షేమముగా బయటకు తీసుకొని వచ్చిన దానినిబట్టి నీకు వందనములు. ఈ దినము దురవస్థలోను, నొప్పిలోను ఉన్నప్పుడు నేను ప్రార్ధించగా నీవు దానిని తేలిక చేసియున్నావు. తండ్రి, అది సహజమైనదేనని తెలుసును కాని నీవు ఆమెకు ఆదరణను ఇవ్వమని అడుగుచున్నాము. ఆమెను ఈ దినమంతా దీవించుము, ఆమె ఇంటికి వెళ్ళి నీ యొక్క సేవకుని ప్రక్కన నిలబడుటకు త్వరపడుచున్నది, ఇప్పుడు మేము ఇద్దరమును కలిసి అక్కడున్న యుద్ధ భూమిలో వెళ్లవలసియున్నది, యజమాని నిమిత్తము పంటను కోసి, విత్తనములను కొట్టు యొద్దకు తీసుకొని రావలసియున్నది.
ఇక్కడున్న సంఘమును దీవించుము. నీ సేవకుడును, మా కాపరియైన వానిని నమ్మకముగా తన స్థానములో నిలబడనట్లుగా దీవించుము. ఇక్కడున్న సంఘ పెద్దలను, ట్రస్టీలను మరియు మిగిలిన వారందరినీ దీవించమని మేము ప్రార్ధించుచున్నాము. మిగిలిన వారందరిమీద మీ యొక్క దీవెనలు నిలిచియుండును గాక.
16
దీవించుము, మా గుమ్మముల యొద్ద మేము కొత్తవారిని కలుసుకొనుటకై మేము ప్రార్ధించుచున్నాము. ఆరాధన ముగిసినప్పుడు, ఎమ్మాయి గ్రామములో వారు అన్నట్లుగా, “ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మన హృదయములు మండలేదా?” మేమును అనుదుము. తండ్రి, వాక్యములోనికి తీసుకొనిరమ్ము, పరిశుద్ధాత్మడే వచ్చి వాక్యమును తీసుకొనును గాక, ముందుగా ఏదియూ ధ్యానించలేదు, ఏది మాట్లాడవలసి యున్నదో ఎరుగము కాని, సమస్తమును మీకే అప్పగించుకుంటున్నాము... నీ చిత్తమే నెరవేరును గాక, యేసు నామములో ఆమేన్.
17
మీరు ఆదికాండమనే పుస్తకమును కలిగియున్నట్లయితే మనమిప్పుడు చిన్న లేఖనము చదువుటకు ఆ పుస్తకమునకు తిరుగుదాము, 6వ అధ్యాయము 8వ వచన ప్రారంభములో నుండి వాక్యములోని కొంత భాగమును చదువుదాం. దేవుని చిత్తమైనచో ఈ ఉదయకాలము భోదనా అంశముగా కొద్ది నిముషములు తీసుకొందాము, తరువాత మేము రోగుల కొరకు ప్రార్ధిస్తాము, తరువాత కాపరి ఆరాధనను ముగిస్తారు.
18
దేవుని యొక్క ఆశీర్వాదములు రెట్టింపు చేయునట్లుగా మేము ప్రార్ధిస్తున్నాము.
ఇక్కడ మొదటి వరుసలో కూర్చునియున్న చిన్న బాలికను నేను చూస్తున్నాను. ఆమె ప్రక్కనే తన తల్లి కూడా కూర్చునియున్నదని నేను నమ్ముచున్నాను... కొద్దికాలము క్రితం ఆ బాలికకు మేము ప్రార్ధించామని అనుకుంటున్నాను. నాకు జ్ఞాపకమున్నంతలో ఆ బిడ్డ సరిగా నడవలేకపోవుటయో మరేదో సమస్యతోనో ఉన్నది. ఈ దినము ఆమె ఎంతో మెరుగ్గా కనిపించుచున్నది, దాన్నిబట్టి నేను ఎంతో సంతోషముగా ఉన్నాను.
దేవునికి నిరంతరము ప్రార్ధించినప్పుడు దేవుడు మరింత ఆత్మను మరియు శక్తిని తన సంఘము మీద మరియు తన ప్రజల మీద ప్రతిచోటా కుమ్మరించును, అది మన లోపములన్నింటి కన్ననూ అధికమైన స్థితిలోకి మన విశ్వాసమును పైకి లేపును, అది మనలను జయించువారినిగాను మరియు మనలను ప్రేమించి, మనకొరకు తన ప్రాణమిచ్చిన ఆయన ద్వారా జయశాలులుగాను మార్చును.
19
ఎవరైతే బైబిలును కలిగియున్నారో:
అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
నోవహు వంశావళి యిదే: నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునైయుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు.
షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి యుండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను.
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనియుండిరి.
దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును.
చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను కీలు పూయవలెను.
చదువబడిన తన వాక్యమును దేవుడు దీవించును గాక. దేవుని చిత్తమైతే, ఈ ఉదయము నేను మాట్లాడుదామని లేక బోధించుదామని లేక కొద్దిసేపు చెప్పాలని అనుకుంటున్న అంశము “ఓడ,” (మందసము), ఓడ అంటే ఏమిటి? మరియు ఓడ యొక్క ఛాయ ఏమిటి? మరియు ఓడలోని రకములు. ఆ ఓడ ఖచ్చితముగా, పాత నిబంధనలోని ప్రతియొక్కటి క్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నాయి. మరియు పాత నిబంధనలోని వాటిన్నింటిని నెరవేర్చనది క్రీస్తే, అవన్నియు యేసుక్రీస్తులో నెరవేరియున్నాయి.
20
అది నాశన సమయమైయున్నది, నాశనముకు ముందున్న సమయమైయున్నది. భూమి అంతయూ బలాత్కారముతో నిండియున్నది.
మీరు గమనించినట్లయితే, ప్రజలు పెరుగుచున్న ప్రతిచోటా, ప్రజలు కలుసుకొను ప్రతిచోటా, ప్రజలు గొప్ప సమూహముగా ఉండు ప్రతిచోటా, అక్కడున్న పట్టణములో జనాభా విపరీతముగా పెరుగును. మొదటి సంగతి మీకు తెలుసు, అది వినోదమును తీసుకొనివచ్చుట ప్రారంభించును, అక్కడ నుండి జూదమును, జూదము నుండి త్రాగుబోతుతనమును, త్రాగుబోతుతనము నుండి వ్యభిచారము, గృహములను కూల్చుట, వివాహము - పరిత్యాగము, తరువాత హత్యలు. అది ఆ విధముగా పెరుగుతూ, పెరుగుతూ - పెరుగుతూ ఒక అంతములేని గొలుసువలె ఉండును.
నీతిమంతుడైన ఒంటరి మానవునితో దేవుడు నడుచుచున్నప్పుడు, అతడు దేవుని కృపను పొందుకున్నాడు. అయితే మానవుడు అభివృద్ది పొందుచున్నాడో, అప్పుడు వేరేవారిని మరియు వేరేవారిని పొందుకొనుట ప్రారంభించెను, అటు తరువాత వారును ప్రారంభించియున్నారు... సాతాను లోపలకి వచ్చి పెద్ద పనులు చేయవలసివచ్చెను. ఈ మానవుడు కొద్దిగానే నమ్మెను, ఈ ప్రక్కకు ఒరుగుచున్నాడు, ఆ మానవుడు అటు ప్రక్కకు ఒరుగుచున్నాడు, సాతాను వచ్చినప్పుడు వాడు దానిని కాల్చివేశాడు. అటు తరువాత అది తారుమారై పోయి, ఎక్కువగా ఊహించుకొనుట ప్రారంభమైనది, అప్పుడే చెడిపోవుట లోపలికి వచ్చినది. ఎప్పుడైతే నోవహు...
21
తరముల మధ్యలో మీరు గమనించినట్లయితే, హేబేలును చంపిన తరువాత దేవుడు షేతుతో హేబేలు స్థానమును నింపియున్నాడు. చరిత్రకారులు మనకు చెప్పుట చేత ఆదాము మరియ అవ్వలకు 70 మంది కుమారులు మరియు కుమార్తెలు ఉన్నారని తెలిసినది. కాని, బైబిల్ లెక్క ప్రకారము ముగ్గురు కుమారులు, హాము, షేము, మరియు యాపెతు అనువారు నోవహు కుమారులైయున్నారు. నన్ను క్షమించండి. కయీను, హేబేలు మరియు షేతు ఆదాము కుమారులైయున్నారు.
కొద్దిక ఉత్సుకతకు లోనయ్యాను. యోసేపు వచ్చినది మొదలుకొని కొన్ని దినముల నుండి నేను సంగతులను కలగాపులగం చేయుచున్నాను.
హాము యొక్క వంశావళిని గమనించుము, జలప్రళయమనే నాశనము వచ్చిన తరువాత వారు దానిని దాటి అటు ప్రక్కకు చేరుకున్నారు. అతడి తరమంతయు చెడిపోయి అంతమైనది.
కయిను యొక్క వంశావళిని చూచినట్లయితే, ఇక్కడను అదే జరిగినది. వారు నోదు అనే ప్రాంతమునకు వెళ్ళెను, అక్కడ వివాహము చేసుకున్నాడు. తన భార్యను తీసుకొని అక్కడకు వెళ్ళెను, తరువాత అక్కడ ప్రజలు నెఫీలులుగా మారెను.
ఇశ్రాయేలు యొక్క సంతానము అక్కడికి వచ్చినప్పుడు వారు, కొంతమంది యొక్క చేతి వేళ్ళు 14 అంగుళముల పొడుగున్న వారిని చూశారు. ఆ గొప్ప ఆజానుబాహులను గురించి ఆలోచించండి. గొల్యాతును దావీదు చంపియున్నాడు, అతడు కూడా గొప్ప ఆజానుబాహుడే, అతడి బల్లెము నేతగాని దోనెవలె ఉన్నదని అతడన్నాడు. అతడు సుమారుగా తొమ్మిది అడుగులున్నాడు, అతడు ఎంతో బలిష్టుడని ఎంతమందికి తెలుసు...
22
కాని, మీరు గమనించినట్లయితే, కయిను నుండి ఒక గొప్ప నాగరికత వచ్చుట ప్రారంభించబడినది. ఎప్పుడైతే ప్రజలు రెట్టింపగుచున్నారో, వారు వివిధ రకములైన విద్యల కొరకు మరియు మొదలైనవాటి కొరకు బయటకు వెళ్లుట జరుగుచున్నది, కొత్తవాటిని కనిపెట్టుట మరియు తయారుచేయుట జరుగుచున్నది. వాటిలో ఒకటి, చెక్కతో పనులు చేయుట, ఓ, వారు ఏ విధముగానైతే వాటితో కట్టుటను ప్రారంభించారో, మరియు కట్టుట మరియు కట్టుట, అది కాలము అంతముగానున్నది అనుటకు ఒక సూచనైయున్నది. మనము కలిగియున్న ఈ భవనములను మీరు ఎప్పుడైనా చూసియున్నారా? ఇది మరలా కాలము యొక్క అంతమునకు ఒక సూచనైయున్నది.
వారు లోహములతో అద్భుతముగా పనిచేయువారైయున్నరు. వారు లోహముతో ఏ విధముగా పనిచేయాలో కనుగొన్నారు, లోహముతో ఏమి చేయాలో దానినే వారు చేయుచున్నారు. వారు లోహముతో ఈ దినమున ఏమి చేయుచున్నారో చూడండి, వారు లోహముతోను లేక స్టీలుతోను గృహములను తయారుచేయున్నారని వేరొక దినమున రేడియోలో చెప్పుట నేను వినియున్నాను. వారు ఆ చెక్కను కత్తిరించుచున్నారు, వారు అల్యూమినియం లేక స్టీలు నుండి దానిని తయారు చేయుచున్నారు. విద్యలోను గొప్ప గొప్ప వాటిని కనుగొనుచున్నారు, సైన్సు కూడా ఘనముగా ముందుకు వెళ్ళుచున్నది, సైన్సు కూడా అభివృద్ధి చెందినది, అది కూడా కాలము యొక్క అంతమునకు ఒక సూచనైయున్నది... గడచిన కొద్ది సంవత్సరములలో సైన్సు ఏమి చేసియున్నదో చూడండి. ఓ, మై! అది చేసియున్న కార్యమును చూడండి. అది ఏమైయున్నది. కాలము యొక్క అంతమైయున్నది. విశ్వాసులకు అది ఒక సూచనైయున్నది.
సేవకులు బలిపీఠము మీద నుండి వారికున్న శక్తియంతటితో వారు ప్రసంగము చేయుచు వారు ప్రజలకు దానిని చూపించుచున్నారు. మనము ఆ యొక్క మైలురాళ్లను దాటిపోవుచున్నాము. అన్ని కార్యములు అంతము వైపే చూపించుచున్నాయి. లేఖనముల వచనములు, ఈ దినమున మనము చదివిన మరియు నమ్ముచున్న దేవుని యొక్క బైబిలు కూడా అంతము వైపే చూపించుచున్నది, ఎంతో దూరములేదు. గొప్ప శాస్త్రీయ ప్రపంచము అంతము కూడా అంతము వైపే కనిపించేంత దూరములోనే ఉన్నదని చెప్పుచున్నది, అది మరొక మైలురైయిగా ఉన్నది. కాలండరులో ఉన్న రాశులు మొదలైనవి, ఖగోళ శాస్త్రము మరియు ప్రతియొక్కటి అంతము కనిపించేంత దూరములోనే ఉన్నదని చెప్పుచున్నది. అంతము సమీపముగానే ఉన్నదని పిరమిడ్ చెప్పుచున్నది. ప్రతియొక్క ఘనమైనది అంతము సమీపముగానే ఉన్నదని సూచించుచున్నది. మనము అంత్యకాలములో ఉన్నాము.
23
గమనించుము. కాని, దేవుడు తన సార్వభౌమ కృపలో అంత్యకాలము కన్నా ముందుగానే, యేసులో దానిని ఇప్పుడే చెప్పెను. యేసు ఇలాగనెను, “నోవహు దినములలో జలప్రళయము రాకముందు ఏలాగుండునో అలాగుండును, అప్పుడు ప్రజలు ఏమి చేయుచున్నారో, నా రాకడకు ముందుగా మరలా ఆ విధముగా ఉందురు.” ఇప్పుడు మనము దానిని చూస్తున్నాము. మనము ఆత్మీయమైన గ్రుడ్డితనములో ఉన్నాము లేకపోయినచో మనము దానిని చూడగలము. కళ్లు తెరిచి చుట్టూ చూడుము.
ఆత్మీయ గ్రుడ్డితనమునకు మరియు భౌతికమైన గ్రుడ్డితనమునకు గొప్ప వ్యత్యాసమున్నది. ఒకవేళ నాకు అవకాశమున్నట్లయితే ఎప్పుడైననూ నేను భౌతికమైనదానినే ఎంచుకుంటానని నమ్ముచున్నాను. అవును. గ్రుడ్డితనముగా అగుటకు ఒక కార్యమున్నది.
24
కొద్దికాలము క్రితం ఒక సేవకుడు ఇలాగనెను, “నీవు నిజముగా ప్రభువు యొక్క సేవకుడవైనట్లయితే, నన్ను గ్రుడ్డివానిగా చేయుము.”
నేను ఇలా అన్నాను, “నీవు ఇప్పటికే గ్రుడ్డివాడివైయున్నావు.”
అతడు, “నేనా, గ్రుడ్డివాడినా?” అనెను.
నేను, “అవునయ్యా.” ఎందుకనగా అతడు దైవికమైన స్వస్థతను పరిహసించాడు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును ఎగతాళి చేసెను, అసలు అటువంటిది ఏదియూ లేదని చెప్పెను, కాబట్టి నేను ఇలా అన్నాను, “నీవు గ్రుడ్డివాడివే,” అన్నాను.
అతడు, “లేదు, అదంతా నీ యొక్క సొంత అలంకరణేయున్నది,” అనెను.
నేను, “అది లేఖనమైయున్నది. బైబిలు ఆ విధముగా చెప్పెను,” అన్నాను.
దానికతడు, “ఎప్పుడు మనసు గ్రుడ్డిదైయున్నది?” అనెను.
నేను, “మంచిది, చాలాసార్లు మీ పితరులతో యేసు ఇలాగనెను, ”గ్రుడ్డివారైన పరిశయ్యులారా. మీకు కన్నులున్నను మీరు చూడలేరు.“ అది సత్యమైయున్నది. ”ఒకవేళ మీకు తెలిసియున్నట్లయితే ఆ సమయము ఇదేనని మీరు ఎరుగుదురు...?“ అన్నాను.
నేను ఇలా అన్నాను, “గొప్ప ప్రవక్తయైన ఎలిషా భూమి మీద ఉన్నప్పుడు దోతానులో ఉన్న సమయములో ఒకసారి ఏమి జరిగినది అంటే. ఎలీషాను పట్టుకొనుటకు సిరియా సైన్యమంతా చుట్టుముట్టియున్నారు. అప్పుడు గెహాజీ ఇలాగనెను, ”తండ్రి, వారు మనమీద పడుచున్నారు. సిరియా సైన్యముతో పట్టణమంతా ముట్టడివేయబడియున్నది.“
అతడు ఇలాగనెను, “మంచిది, వారితో ఉన్నవారికంటే మనతో ఉన్నవారు ఎక్కువమంది.”
అతడు ఇలాగనెను, “మంచిది, ఇప్పుడు వారిక్కడున్నారు, కాని నిన్ను తప్ప నేను మరెవరిని చూడలేకున్నాను.”
ఎలీషా ఇలాగనెను, “దేవా, వీని కళ్ళను తెరువుము.” అతడి కన్నులు తెరవబడినప్పుడు, అతడు ఆ వృద్ద ప్రవక్త చుట్టూ కలియ చూచినప్పుడు అగ్ని రథములు ఉండుటను, కొండలన్నియు అగ్నితో నిండియుండుటను చూచెను.
వారు ఎక్కడైతే నిలిచియున్నారో అక్కడకి నడిచిపోయెను, మరియు వారిని ఆ ప్రవక్త గ్రుడ్డివానిగా చేసెను. బయటకు వెళ్ళి, ఎలాగు? భౌతికముగా గ్రుడ్డివారిగా చేయలేదు. వారు ఒక విధముగా భౌతికముగా కూడా గ్రుడివారైనారు. అతడు వెళ్లి ఇలాగనెను, “మీరు ఎలీషా కొరకు వెదుకుచున్నారా?” అని ఎలీషాయే తనంతట తానుగా వారిని అడిగెను.
అప్పుడు వారు, “అవును, మేము అతడికొరకే వచ్చియున్నాము.” అప్పుడు ఎలీషా, “నన్ను వెంబండించండి, అతని యొద్దకు నేను మిమ్ములను నడిపిస్తాను,” అనెను. వారికి ఆ సంగతి ఏ మాత్రము తెలియదు, ఎందుకనగా వారు గ్రుడ్డివారైయున్నారు.
25
ఈ దినము, దేవుడిని, కృపను త్రోసివేసిన కారణముచేత అనేకమంది గ్రుడ్డివారుగా ఉన్నారు. వారికి ఇక కేవలం తీర్పు మాత్రమే నిలిచియున్నది. కాని, దేవుడు తన ప్రేమలో మరియు తన కృపలో ఒక సముచితమైన మార్గమును ఏర్పరిచియున్నాడు, ఆ దైవికమైన తీర్పు రాకముందే, ఒక మార్గమున్నది. తప్పించుకునేందుకు దేవుడు ఒక మార్గమును ఏర్పరచియున్నాడు, ఆ మార్గమును వెంబడించాలని ఆశించేవారి నిమిత్తమే ఆయన దానిని ఏర్పరిచియుండెను. ఆ తప్పించు మార్గమును ఏర్పరచుట అనేది ఆయన యొక్క కృపయైయున్నది. “ఏ ఒక్కరు నశించుట ఆయనకు ఇష్టములేదు కాని, అందరు మారుమనస్సు పొందుటను ఆయన ఆశించుచుండెను.”
ఈ దినమున ప్రపంచములో ఆయన తన సూచనలను, అద్భుతములను చూపించుచూ, తన ప్రజలను లేవనెత్తుచుండెను, ఘనమైన కార్యములు జరుగుచున్నాయి. పైనున్న ఆకాశములోను మరియు భూమిమీద సూచనలను చూపించుచుండెను. ఆకాశమున గాలిలో ఎగురుచున్న పళ్లెములనే సూచనను చూపించెను, పెంటగాన్ మరియు మిగతావారికి అది ఏమిటో అర్ధమగుటలేదు. పైనున్న ఆకాశములో సూచనలు, మరియు భూమి మీద బలహీనులను స్వస్థపరచు సూచనను చూపించెను, మృతులను పైకిలేపుట, గ్రుడ్డివారి కన్నులను తెరుచుట, దురాత్మలను విసరివేయుట, సువార్తను ప్రకటించుట, ఆయన రాకడకు ముందున్న సూచనలు. “ఏ ఒక్క శరీరియు నశించుట ఆయన చిత్తము కాదు కాని, అందరును మృదువుగాను, మధురముగాను మారుమనస్సు యందు మొక్కాలని ఆయన ఆశించుచున్నాడు.” కాని, క్రీస్తును త్రోసివేసినవారు మాత్రము గ్రుడ్డివారిగా నడువవలసి ఉన్నది.
ఒకవేళ ఈ దినము నేను నా దృష్టిని వద్దనుకున్నట్లయితే, నా కన్నులను బయటకు తీసివేసినట్లయితే ఏమగును? నా కన్నులు వాటి స్థానములో ఉండుటను నేను వ్యతిరేకించినట్లయితే, నేను దేనినో తీసుకొని మరియు పొడిచి వాటిని బయటకు తీసివేసినట్లయితే, ఆ తరువాత నేను చూడాలని కోరుకోను.
అది ఆత్మీయముగా అలాగునే ఉండును. దేవుని యొక్క వాక్యములోకి చూచుటకు వ్యతిరేకించినట్లయితే ఆయన యొక్క ప్రణాళికను చూచుటకు, మరియు దేవుడిని చూచుటకు ఒక మనుష్యుడు వ్యతిరేకించినట్లయితే, అది అతడు తన కన్నులను తానే పెరికివేసుకున్న విధముగానే ఉండును. దేవుని యొక్క కార్యములను చూడకుండా అతడు తన కన్నులను మూసుకొనియున్నాడు. ఎటువంటి దినమిది. ఎటువంటి సమయమిది. మనం ఈ దినమున చుట్టువున్న ఈ అంత్యకాలమును చూస్తు నేర్చుకుంటున్న ఈ పాఠము ఎటువంటి పాఠమైయున్నది.
26
కాని, నోవహు దినములలో దేవుడు తన సార్వభౌమ కృపలో ఉండెను, ఆయన ఇలాగనెను, “ఇప్పుడు, ఎవరైతే తప్పించుకోవాలని ఆశించియున్నారో వారి నిమిత్తము నీవు వెళ్లి ఒక మార్గమును ఏర్పరచాలని నేను ఆశిస్తున్నాను.” అది అద్భుతముగా లేదా? దేవా, ఏ ఒక్కరు నశించుట నీ చిత్తముకాదు, దేవుని మార్గములోకి వచ్చినవారికి తప్పించుకొనుటకు ఒక మార్గమును ఏర్పరచుచున్నాను. కావున ఆయన ఇలాగనెను, “నోవహు, నీవు ఒక ఓడను తయారుచేయాలని నేను ఆశిస్తున్నాను.”
ఇప్పుడు, ఆ పదము “ఓడ” అది ఒక తప్పించుకొనే ఒక స్థలము, ఒక దాగుకొని స్థలమైయున్నది. దాని గూర్చి పాత నిబంధనలో ముగ్గురు మాట్లాడియున్నారు. ఆ ముగ్గురు గురించి కొద్దిసేపటిలో మనము చూడబోవుచున్నాము. ఆ ముగ్గురు ఈ దినమున సంఘమునకు ఒక గొప్ప ఓడయైన క్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నారు. మూడు అనేది ధృఢపరుచుటైయున్నది, ఆ పాత సంగతులన్నియు రాబోవు వాటికి సాదృశ్యమైయున్నాయి.
27
హెబ్రీయ తల్లులు గోత్ర జనకులైన తన బిడ్డలకు జన్మను ఇచ్చునప్పుడు, ప్రతియొక్కరిని కనునప్పుడు పెద్దగా ఒక కేకవలె ఆ బిడ్డ ఏలాగు జీవించునో పలుకును, మరియు అతడి దినములలో చివరలో ఏలాగు జీవించునో పలుకును. అప్పుడు ఆమె ఏమి చేయుచున్నదో ఆమె ఎరుగదు కేవలము గొణుగుచున్నట్లుగా ఉండునని ఒక దినము నేను ఒక క్రీక్ బ్యాంకులో కూర్చుని చదివియున్నాను. ఆదికాండము 49వ అధ్యాయమును జాగ్రత్తగా చూచినట్లయితే, అది ఒక సాదృశ్యముగా తీసుకొనవచ్చును, అది వారి యొక్క ముగింపుగాయున్నది, వారెక్కడ ఉన్నారో అది ఏమైయున్నదో గమనించండి. అది అక్కడనే ఉన్నది. మై!
ఎలా, ఒక్కొక్కసారి మనము కేవలం మన యొక్క కన్నులు మాత్రమే తెరిచి మరియు ఆత్మీయమైన సంగతులను వినినట్లయితే, వాక్యము వచ్చినప్పుడు అది ఏమైయున్నదో మనము గ్రహించుతాము, అప్పుడు ఆత్మయే మనకు ఆ సంగతిని బయలుపరచును. ఇప్పుడు దేవుని యొక్క ఈ సంగతులను పరిశుద్ధాత్మడు తీసుకొని ఇక్కడున్న ప్రతి యొక్క బాల బాలికలు, స్త్రీ మరియు పురుషులందరి హృదయములలో ఉంచాలని నేను ప్రార్ధించుచున్నాను.
28
ఓడ. వాటిలో ఒకటి నోవహు నిర్మించెను: తప్పించుకొనుటకు ఒక మార్గము. రెండవది, మోషే పెట్టబడినది. మూడవది, ఇశ్రాయేలునకు ఇవ్వబడిన నిబంధన మందసము. మరియు నాలుగవది, ఇవి అన్నియు క్రీస్తు యేసు ద్వారా నాలుగవదానిలో నెరవేరినవి.
ఇప్పుడు మనము వెనకకు వెళ్లి మరియు మొదటగా ఆదికాండములో ప్రారంభించుదము, మందసము కొరకు సిద్ధపాటు ఎలా చేయబడినదో చూడుము, మరియు అది ఖచ్చితముగా క్రీస్తుకు పోలికగా లేదో చూడుము. మరియు ఆ మందసములో సమకూడిన వారందరూ, లేక క్రింద... మందసము వద్దకు సమాధానపడుటకు వచ్చిరి, తీర్పులలో నుండి వారందరిని సంరక్షించినది. మరియు మాదిరిలో వారు సంరిక్షింపబడినట్లుగా, మరి ఎంతగా మనము క్రీస్తులో సంరిక్షిపబడియున్నాము, అన్ని మందసములలో ఒక నిజమైన పూర్వ మాదిరి. ఓ, ఆయన అద్భుతకరుడు.
29
ఇప్పుడు మనము తిరిగి వెనుకకు వెళ్దాము, దేవుడు నోవహుతో ఇలగు చెప్పెను, “నీవు ఈ పనిని ఒక ప్రత్యేకమైన చెక్కతోనే తయారు చేయవలెను.” ఏ చెక్క అంటే ఆ చెక్క ఇక్కడ పనిచేయలేదు. మనకు నిర్దిష్టమైన దానితోనే చేయవలసి యున్నది, అది తప్పక చితిసారకపు మ్రానుతోనే చేయవలెను. చితిసారకపు మ్రాను అంటే ఏమిటో ఇక్కడే నేను కొద్ది వారముల క్రితం చదివియున్నాను. అదొక మృదువైన, తేలికగా వంగునట్టి చెక్క. దానితోనే ఆ ఓడ చేయబడినది, చేయుటకు సులభముగాను తేలికగా వంగునట్టి చెక్కతో తయారుచేయబడినది.
అది విశ్వాసియే. ఒకసారి దేవుని యొక్క చేతులలోకి వచ్చినట్లయితే, తన స్వనీతి అనే చెట్టు నుండి కత్తిరించిన తరువాత అతడు నిర్మాణకుడి చేతులలో తేలికగా వంగునట్టి చెక్కగా ఉండును, సిద్ధాంతమనే ప్రతిగాలికి ఎగిరిపడడు, కాని తేలికగా వంగునట్టి అను పదము దేవుడు వాడుకొనుటకు సులభముగా ఉండును అను దానికి చక్కగా సరిపోవును.
30
మనము దానిని గమనించినట్లయితే, ఈ చెక్క తేమను సులభముగా పీల్చుకొనును, తేమను తీసుకొనును. ఒక్క విషయమేమిటంటే మానవుడు దేవుని చేతిలో సులభముగా వంగునట్టివాడుగా ఉండుట అనేది దేవునికి గొప్ప కార్యముగా ఉండును, లేక నీవు దయ్యమునకు గొప్ప కార్యముగా ఉందువు.
ఇప్పుడు, ఈ ఓడ చక్కగా వంగునటువంటి మరియు నీటిని పీల్చుకొనే చెక్కతో తయారు చేసినట్లయితే, అది ఎక్కువసేపు నీటిపైన తేలక కొద్దిసేపటిలోనే నీటిని పీల్చుకొని మునిగిపోవును. అది బరువుగా తయారయ్యి త్వరగా మునిగిపోవును, ఎందుకనగా చితిసారకపు చెక్క తేలికైనది. నీరు దానిలోకి చొచ్చుకొనిపోగలదు.
కావున ఈ దినమున నేను దానిని గురించే ఆలోచిస్తాను. అంతే. ఈ దినమున అనేకమంది స్త్రీ మరియు పురుషులలో సమస్యలున్నాయని నేను నమ్ముచున్నాను, వారు తమను తాము పూర్తిగా సమర్పించుకొనుటకు సిద్దముగా లేరు, కాని తప్పు తరువాత తప్పును చేయుచున్నారు. ఆ కారణముచేతనే ఆ ఓడ నీళ్లతో నింపబడి కదలకుండా ముందుకు వెళ్లకుండా అక్కడనే ఉన్నది. అది అక్కడనే పైకి మరియు క్రిందకు కదులుతున్నది, అది అక్కడనే మునిగిపోవుటకు సిద్ధముగా ఉన్నది.
31
కావున అక్కడ పరిశుద్ధాత్ముడు ఏ విధమైన మార్గమును ఏర్పరచగలడు? వారు ఆ విధముగా నిలబడి ముందుకు వెళ్లలేరు. కావున దేవుడు నోవహుతో ఇలాగనెను, “లోపటను కీలును పూయుము మరియు వెలుపటను రెండువైపుల కీలును పూయుము.”
ఆ తరువాత కీలును దేని నుండి తయారు చేస్తారో అని నేను చదువియున్నాను. నేను ఒక పాత నిఘంటువును తీసుకొని వెదుకుచున్నప్పుడు నేను కీలు అనగా అర్ధమేమిటో కనుగొన్నాను. గ్రీకు భాషలో కీలు అనే పదమునకు ఒక అర్ధమున్నదని కనుగొన్నాను, అది ఒక ప్రత్యామ్నాయముగా ఉన్నది. అయితే వారు అసలు కీలును ఏలాగు తయారు చేస్తారు, వారు ఒక చెట్టును కొడతారు. అది జిడ్డువలే ఉండును, మరియు వారు దానిని బాగా కొట్టెదరు, తరువాత దానిని ఉడకబెట్టెదరు మరియు తరువాత వారు దానిని పోస్తారు. ఆ తరువాత అది కీలుగా మారును.
అది ఎంత అందముగా ఉన్నది, ఒక ప్రత్యేకమైన చెక్కను కత్తిరించి, మానవుని వలె, మానవత్వములో క్రీస్తు ఉండెను, మానవునిగా ఉండెను. మరియు సంఘము, ఆయన యొక్క ఓడగా ఉన్నది, ఆయన యొక్క సంఘములోనికి వచ్చుట, అది భూమి మీద ఉన్న ఆయన యొక్క స్వంత ఆత్మీయమైన శరీరముగా ఉన్నది. ఆ క్రీస్తే కత్తిరించబడి, మరియు ఆయన నుండి జీవము కొట్టబడియున్నది, ఆ తరువాత వచ్చిన కీలే సంఘమునకు పూయబడియున్నది.
32
ఈ చితిసారకపు చెక్క మీద ఆ వేడిగానున్న కీలును లోపట మరియు వెలుపట పోసినప్పుడు, అది దానిలో త్వరగా నానుతుంది, ఆ తరువాత అది గట్టిపడుతుంది. ఆమేన్. ఓ, మీరు గమనించారా? ఒక ముద్ర. మృదువుగా, వాక్యములో నానబెట్టుటయైయున్నది, పరిశుద్ధాత్మను క్రీస్తు కుమ్మరించుచున్నాడు అది అంతయూ పారును. ఆమేన్. అది చల్లగా ఉన్నప్పుడు అంతయూ వ్యాప్తిచెందదు. అది వేడిగానే ఉండవలసియున్నది. ఈ దినమున మనకు కావలసినది ఆ పాత-కాలపు పరిశుద్ధాత్మను కలుసుకొనుటయే, క్రిందకు కుమ్మరించబడి అంతయూ పారునట్లు అవుటయే మనకు కావలసినది.
వారు ఆ మృదువైన చితిసారకపు చెక్కను తీసుకొని ఒక పెద్ద గరిటతో దానిమీద పోసియున్నారు, మరియు అప్పుడు ఆ చితిసారకపు చెక్క మెత్తగా తయారయి సిద్ధమగును, తరువాత లోపటను మరియు వెలుపటను అలాగున చేయుదురు, ఆ కీలు దానిగుండా వెళ్ళి దాని చుట్టూత ఒక స్టీలు కవచము వలే దానిని కప్పును. ఇక ఎంతమాత్రము ఏ నీటి చుక్క దానిలోపలికి పోలేదు. అది ఒక రక్షనైయున్నది.
క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను పొందుకున్న ప్రతి వ్యక్తికి ఆయన పరిశుద్ధాత్మ అనే కోటును కప్పును, అప్పుడతడు ఏకాత్మగలవాడై క్రీస్తును తప్ప మరేదియు చూడలేడు. అతడు ఇక ఎంతమాత్రము ప్రపంచమును లెక్క చేయడు. నీవతడిని కొట్టవచ్చును, బయటకు నెట్టవచ్చును, నీవు ఏమి చేయాలనుకున్నావో వాటన్నిటిని చేయవచ్చును, కాని అతడు చూట్టు ఒక కవచమును ధరించియున్నాడు. మరోక మాటలో చెప్పాలంటే, అతడు ముద్రించబడియున్నాడు. అతడిలో ఉన్న పగుళ్ళన్నియు ముద్రించబడియున్నాయి, వారు ఆ కీలుతో చేయు పని అదియే. బైబిలు ఏమి చెప్పుచున్నది....
ఈ దినమున దీనిని ఏది ముద్రించియున్నదో మీకు తెలుసా, ఈ ఓడ దేనితో ముద్రించబడినదో మీకు తెలుసా? ఎఫసీయులకు 4:30 ఇలాగు చెప్పుచున్నది, “పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఎందుకనగా మీరు విమోచనా దినము వరకు ముద్రించబడియున్నారు (లేక కీలుతో పూయబడియున్నారు, కప్పబడియున్నారు).” ఆమేన్. అంతా ముద్రించబడియున్నది, చెక్కలోని ప్రతి చిన్న భాగము ముద్రించబడియున్నది, వెలుపటనున్న ప్రతి చిన్నభాగము, ప్రతి రంధ్రము, ప్రతి చిన్న పగులు, ఆ చెక్కలోని ప్రతి సూక్ష్మ రంధ్రము ముద్రించబడినది. మరియు దేవుని యొక్క ఆత్మతో కప్పబడినది. ఓ, అది ఎంతో అద్భుతముగా ఉన్నది.
33
నీవు దానిని చల్లదనములో ఉంచినట్లయితే, అప్పుడు నీవు గాలి లోపలికి వెళ్లు రంధ్రములను కలిగియుందువు. నీవు ఎప్పుడైనను ఒక మొద్దును కొట్టినట్లయితే లేక అలాంటిది ఏదైనా సరే అది సగముగానే ఉండును, ఎందుకనగా అది క్షణాల్లో మునిగిపోతుంది. కాని, అది వేడిగా ఉన్నప్పుడు పోసినట్లయితే అప్పుడది లోపట మరియు వెలుపట అంతయా పారి దానిని ముద్రించును. ఆమేన్.
క్రీస్తునకు మరియు ఆయన యొక్క సంఘమునకు అది ఖచ్ఛితమైన సాదృశ్యము. ఏలాగు ఒక్కటే చెట్టు కొట్టబడును, చిదుగ కొట్టబడిన తరువాత దానిని నుండి ద్రవమును తీయుదురు, ఆ తరువాత దానిని వేరొక చెట్టును తీర్పు నుండి కాపాడుకొనుటకు పూయుదురు. క్రీస్తు కత్తిరింబడియున్నాడు, ఆయన యొక్క జీవము ద్వారా, మరియు ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత, సంఘము తీర్పు నుండి తీసుకెళ్లబడినది. గమనించారా? అది ఎంత అందమైన దృశ్యముగ ఉన్నది. ఓ, మై! అది నిన్ను పులకరించునట్లుగా చేయుటలేదా? అది నీ హృదయమును ముందుకు మరియు వెనుకకు గెంతునట్లుగా చేయుటలేదా. గమనించారా, అదంతయూ క్రీస్తును గురించి మాట్లాడుచున్నది, పాత నిబంధనలో ఉన్న సమస్తము క్రీస్తుకు ఛాయగా ఉన్నది.
34
వేరొక దినమున ఎవరో ఇలాగన్నారు, “బ్రదర్ బ్రెన్హాం, ఎందుకని ఇది మరియు అది జరుగుతున్నాయి?” మంచిది, అతడు ఇప్పుడు ఇక్కడ కూర్చుని యున్నాడు. నేను ఒక బల్ల దగ్గర తినుచున్నాను. నేను ఇలా అన్నాను, “సహోదరీ, ఆ సంగతులన్నింటికి వెనుకకు రమ్ము, మరియు ప్రారంభమునకు రమ్ము, మొదటి కార్యమేమనగా మనుషుడనేవాడు ఎవరును లేనప్పుడు, ఒక్క కణముకూడా లేనప్పుడు, వారు ఆత్మగా ఉన్నారు. అది ప్రాధమికమైన భాగమైయున్నది. ఆ అత్మ సరిగా ఉన్నది. ఆ ఆత్మనుండి వచ్చిన ప్రతియొక్కటి ఈ విధముగా మరణించుచున్నాయి, అవి గృహములైనా, భూములైనా, ఆరోగ్యమైనా, అది ఏమైనప్పటికి అది మరణించవలసియున్నది, మరియు అదంతయు తిరిగి అదే ఆత్మ యొద్దకు చేరవలసియున్నది.” హల్లేలూయా! అదే ఆత్మ యొద్దకు చేరవలసియున్నది, కావున దానిని సరిగా ఉంచుము.
ఈ ప్రపంచములో నీవు ఏమి కలిగియున్నావో, ఏది కలిగిలేవో అనేది ప్రాముఖ్యము కాదు, నీ హృదయమును దేవునితో సరియైన శృతిలో ఉంచుము. సమస్తమూ, నీ యొక్క గృహములు, భూములు, నీ ధనమంతా, నీ యొక్క బలహీనతంతా, నీ ఆరోగ్యమంతా, నీ సంతానమంతా, ఈ భూమి మీద నీవు కలిగియున్నదంతా, సమస్తము నిన్ను విడిచిపోతుంది, అప్పుడు నీవు తిరిగి నేరుగా ఆ యొక్క ప్రారంభమునకు వెళ్తావు. ఒకవేళ దేవునితో నీవు సరిగా ఉన్నట్లయితే, పరలోకములో దేవుడు ఉన్నాడనేది ఏలాగైతే నిజమో అలాగునే నీవు తప్పక తిరిగి వస్తావనేది అంతే నిజము. ఒకవేళ నీవు దేవునితో సరిగా లేనిచో, నీవు తప్పక వేరొక మార్గమును వెతుక్కోవలసియున్నది. ఇక్కడ నీవు తప్పక ఒక ఎంపికను చేసుకోవలసియున్నది. క్రీస్తు కొరకు నేడే దానిని చేయుము.
35
ఓ, మై! “కీలు, కీలును పూయుము” అను పదములో మరొక అర్ధమున్నదని గమనించుము, తారును పూయుము, లేక ఆ ద్రవములో నానబెట్టుము, దాని యొక్క అర్ధము ప్రాయశ్చిత్తము.“ ”కీలు“ అర్ధము ”ప్రాయశ్చిత్తము.“ లేవీయకాండములో, అదే పదమును ఆదికాండములో కీలు అనే పదమునకు వాడియున్నారు, లేవీయకాండములో అదే పదమును ప్రాయశ్చిత్తము (పరిహారము)గా వాడియున్నారు, ఒక ప్రాయశ్చిత్తము చేయుటకు ఉపయోగించినారు. మంచిది, పరిహారము అనగా రెండిటి మధ్యన నిలిచియుండేది అని అర్ధము. ఓడలోని ఆ చితిసారకపు చెక్కలో కీలు ఉన్నది, బయట ఉంచుట లేక ఆగ్రహము నుండి విశ్వాసికి ప్రాయశ్చిత్తము చేయుట. మీరు దానిని గమనించారా?
నోవహు ఆ యొక్క జలప్రళయమనే ఆ గ్రహములోకి వెళ్ళలేడు. ఓ, ఇప్పుడే నేను దానిని చూస్తున్నాను. మీరు దానిని పొందుకున్నారా? చూడండి. అతడు తీర్పులోనికి రాలేడు, ఎందుకనగా అతడికి మరియు తీర్పుకి మధ్యలో ఒక ప్రాయశ్చిత్తమున్నది. తీర్పనగా లోకమును ముంచివేసిన జలప్రళయమే.
క్రీస్తులో ఉన్న విశ్వాసి భద్రముగాను నిశ్చింతగాను ఉన్నాడు. ఆమేన్. తనకున్న యోగ్యతను బట్టి కాదు కాని, అతడి యొక్క విధేయత వలన, విధేయతతో ఓడలోకి నడిచి వచ్చియున్నాడు. నోవహు చేసిన ఏకైక కార్యమేమంటే ఓడలోకి వచ్చుటయే. అతడు ఓడ యొక్క ద్వారమును కూడా మూయలేదు, దేవుడే ద్వారమును వేసియున్నాడు. లోపలికి రమ్ము, విశ్వాసి చేయవలసినది అదియే, కేవలం విశ్వాసముతో క్రీస్తులోకి నడచి వచ్చుటయే. మిగిలిన అన్నింటిని దేవుడే జాగ్రత్త చేయును. “నా మాటలు వినువాడు, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవమును పొందుకొనును, వాడు తీర్పులోనికి రాక - మరణమును దాటి జీవములోకి వెళ్లును, ఓడలోకి, శాశ్వతమైన రక్షణ. ఆమేన్. తీర్పు అనే ఆ బండ అవసరమైనచో దానిని కొట్టనిమ్ము.
ఎందుకు, ఆ ఓడ చివరగా కొద్దిసేపు తలక్రిందులుగా ఉండెనని నేను ఊహించుచున్నాను, ప్రతియొక్కటి కూడా అలాగునే ఉన్నదని అనుకుంటున్నాను. అయితే నోవహు క్షేమముగా ఉండెను. ఆ కీలు అతడికిని మరియు తీర్పునకు మధ్యన నిలిచియున్నది.
ఈ దినమున దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము, మనకు మరియు తీర్పునకు మధ్యన నిలిచియున్నది. ఆమేన్. “...కొట్టివేయబడక, లేక తీర్పులోకి రాక, మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు.” ఆమేన్. ఎందుకు? ఎందుకనగా అతడు ఓడలో ఉన్నాడు. ఎంత ఖచ్ఛితమైన దృశ్యమది.
36
చెట్లు కత్తిరింబడ్డాయి, లోకములో అలాగునే ప్రారంభించబడ్డాయి, మొదటగా కత్తిరించుట, ఆ విధముగానే ప్రతి మానవుడు ప్రపంచములోకి వచ్చియున్నాడు, పాపములో జన్మించుట, పాపములో రూపింపబడుట, లోకములోకి వచ్చి అబద్దములు చెప్పుట, సరిగా ఉండకుండుట, ప్రేమగా లేకుండుట, దేవునికి వ్యతిరేకముగా ఉండుట, దేవునికి దూరముగా ఉండుట, పరాధీనములో ఉండుట, ఆశతో లేకుండుట, క్రీస్తు లేకుండా ఉండుట, చనిపోవుట, పాపిగానే సమాధిలోకి పోవుట, తీర్పుకి సిద్దముగా ఉండుట.
అప్పుడు వాక్యము రెండంచుల వాడియైన ఖడ్గముగా వచ్చి, ఆ చెట్టును కత్తిరించును, దానిని మలుచును, దానికున్న ముళ్ళన్నింటిని కత్తిరించును, దానిలోని మంచి భాగమును బయటకు తీయును, అదియే పైన తేలునదియై (ఆమేన్) నిర్మాణకుడైన క్రీస్తు చేతిలో ఉండును.
37
అక్కడ ఆయన యొక్క జీవము కల్వరిలో పోయబడినది, ప్రోక్షించబడిన ఆ రక్తము ద్వారా, ఓడలో ఉన్న వ్యక్తిని రక్షించుటకు ఒక ప్రాయశ్చిత్తము ఏర్పాటు చేయబడినది. ఓ, మై! ఎంత మంచి దృశ్యమది. ఆ తరువాత ఆ యొక్క కీలును దాని మీద పూయును... ఎందుకనగా, అది నీటిని పీల్చుకొనును. దీని నుండి మీరు ఒకదానిని గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి ఇలాగనెను, “మంచిది, నేను వాక్యమును నమ్ముదును. నేను దీనిని మరియు దానిని తీసుకుంటాను.” రక్తము లేకుండా, నీవు ప్రపంచమునకు విడిచిపెట్టబడియున్నావు. నీవు ఓడలో ఎంతగా ఉన్ననూ, ఓడ ఎలాగున్ననూ, ఎటువంటి మంచి స్థితి కలిగి నీవు ఓడలో ఉన్ననూ, నీవు తప్పక ఆ కీలుతో పూయబడవలెను, దానిలో నీవు నానబెట్టబడవలెను, పరిశుద్ధాత్మలో నీవు నానబెట్టబడవలెను, ప్రపంచమును బయటపెట్టి నీవు లోపల ఉండవలెను.
38
ఆ యొక్క క్రమము ఎంత అందమైనదిగా ఉన్నదో మీరు గమనించాలని నేను ఆశిస్తున్నాను... సమీప బంధువుడగు అనే మరొక వృక్షము కత్తిరించబడ వలసియున్నది, దాని నుండి ద్రవమంతయూ (జిగురు) బయటకు వచ్చేంతవరకు అది కొట్టబడవలసియున్నది. కాపాడబడుటకు కొట్టబడిన మరొకదాని మీద ఈ జిగురును పోయవలసియున్నది. ఆమేన్. ఈ దినమది ఎంతకాలము కాపాడుతుంది? ఎందుకనగా ఆరువేల సంవత్సరముల క్రితం పాపము జరిగినది... పర్వతముల పైన ఆ పాత ఓడ నిలిచియుండుట వారు చూచియున్నారు. ఏ యితర చెక్క కూడా అలాగున అక్కడ నిలిచియుండలేదు. ఎందుకని? ఎందుకనగా అది మరణించిన వేరొకరి కీలు చేత పూడబడియున్నది. ఆ ఓడ లోపటను మరియు వెలుపటను కీలు పూయబడి, ఒకసారి కీలు పూయబడినట్లయితే అది ఎటువంటి కార్యము చేయునో తెలియజేయుటకు అది అక్కడే ఒక జ్ఞాపక చిహ్నము మాదిరిగా నిలిచియున్నది.
ఓ, క్రీస్తు ఏమైయున్నాడో అనే ఎంత ఖచ్ఛితమైన చిత్రమది. క్రీస్తులోకి ఒకసారి విశ్వాసి వచ్చి, లోపటను మరియు వెలుపటను కీలును పూయబడిన తరువాత క్రీస్తులో విశ్వాసి యొక్క స్థానమది... నీవు చేయవలసినది అదియే... ఓడ సిద్దపడినది. నీవు చేయవలసిన ఏకైక కార్యమేమంటే, విశ్వసించి లోపలకు వచ్చి కూర్చుండుటయే.
నోవహు, లోపలికి వచ్చినప్పుడు గమనించుము. అతడు చేసిన ఏకైక కార్యమేమంటే, లోపలికి నడుచుకుని వచ్చియున్నాడు. దేవుడే ద్వారమును మూసివేసెను, తీర్పు దాటిపోయేంతవరకు నోవహు క్షేమముగా ఉన్నాడు. దేవుడే దానిని మూసివేసెను మరియు దేవుడే దానిని తెరిచెను. ఈ దినము క్రీస్తులో విశ్వాసి కూడా అలాగునే.
39
ఇప్పుడు త్వరగా గమనించుము. రెండవ ఓడ గురించి మాట్లాడబడినది, (కొద్దిసేపటిలో మనము దాని యొద్దకు వెళ్లబోవుచున్నాము), అది మోషేను గురించియై యున్నది. బైబిలు చెప్పియున్నది ఆ చిన్నపెట్టే కూడా ఒక ఓడయేనని. అతనికి జన్మని ఇచ్చిన తల్లే ఆ దానిని తయారుచేసియున్నదని గమనించండి. ఆమేన్. అది ఏదో సెమినరీకి వెళ్లి తయారుచేయలేదు, థియాలజీ అనుభవముతో దానిని తయారుచేయలేదు, కాని విశ్వాసిగా జన్మను ఇచ్చిన ఆమే ఆ ఓడను అతడు తీర్పు నుండి దాటిపోవుటకై తయారుచేసినది.
40
కావున, అక్కడ వారు కలిగియున్న చిన్న చిన్న మొక్కజొన్న, జనుమ కాడలతో ఆమె దానిని తయారుచేసినది. అవి ఇప్పటికి కూడా ఐగుప్తులో ఉన్నాయి. అక్కడున్న తల్లులు తమ చిన్నబిడ్డలను తీసుకొని నైలునదిలో వారు నడిచి వెళ్ళేటప్పుడు దానితోనే ఆ చిన్న పెట్టెలను అదే విధముగా నెట్టుకుంటూ వెళ్ళుటను మీరు చూడవచ్చును, చిన్నపెట్టెలో అతని పెట్టి ఆ నైలు నదిలో వదిలిపెట్టినది.
ఆమె వెళ్ళి ఒక చిన్న ఓడను కట్టినది. ఆమె దానిని ఏ విధముగా చేసినదంటే, వారు దానిని తయారు చేయునప్పుడు లోపటను మరియు వెలుపటను అల్లుతారు. అల్లువారు దాని లోపల మరియు బయట అల్లుదురు.
తరువాత ఆమె దానికి జిగట మన్ను పూసినది. జిగట మన్ను అనగా కీలుయై యున్నది. జిగట మన్ను అనే పదమునే తీసుకొనుము: ఒకవేళ మీకు దాన్ని “కీలు” లేక “ప్రాయశ్చిత్తము” అని ఉన్నదా, లేదా చూడుము. అటు తరువాత మీరు ఆ కాడలలో లోపటను మరియు వెలుపటను అల్లువారు అల్లిన దానిలో చిన్న చిన్న ఖాళీలు ఉండుటను చూడగలరు, కాబట్టి దానిని కీలుపట్టుకొనే యుండవలసియున్నది.
ఓ, మై! విశ్వాసి ఎలాగు... మనమందరము ఈ దినమున ఒకరు మెథడిస్టుగాను, మరొకు బాప్టిస్టుగాను, ఇంకొకరు లూథరన్ గాను, ఒకరు వన్నెస్ గాను, ఇంకొకరు త్రిత్వముగాను విడిపోవుట ఎంత అవమానకరముగా ఉన్నది. ఎంతో దయనీయముగా ఉన్నది. వారందరు దగ్గరగా కుట్టబడవలెను, ఆ తరువాత దానిమీద కీలును పోయవలెను, అప్పుడది గట్టిగా కలసియుంటుంది, అది సిమెంటు పూసినదానివలె గట్టిగా ఉండును, అప్పడే అది క్షేమంగా ఉంచగలదు. దానిమీద కీలును పోయుట అనేది అద్భుతముగా ఉన్నది.
41
ఆ తరువాత చిన్నబిడ్డలైన మోషేను ఆ పెట్టెలో పెట్టి నీరు అనే తీర్పులోకి నెట్టినది. “నీరు” అను పదమునకు ఎల్లప్పుడు, “గొప్ప జనసమూహము” అని అర్ధము. ఆ చిన్నవాడు అక్కడున్నాడు, బహుశా అతని ముఖము మీద చిన్న వస్త్రముండవచ్చును, బయట ఓడలో, నైలు నదిలో ఉన్నాడు. ఆ నది చాలా వేగముగా పారుచున్నది. అది ఇటు మరియు అటు, దిగువకు వెళ్ళుచున్నది, బలురక్కసి పొదలగుండా వెళ్లుచున్నది, మొసళ్లు మరియు ప్రతియొక్కటి అక్కడ నైలు నదిలో ఉన్నాయి. వర్షములు మరియు తుఫానులు, మంచు, మరియు పెనుగాలులు అక్కడ వీస్తున్నాయి, ఈ చిన్న ఓడ వాటి మధ్యలో స్వారీ చేసుకుంటూ వెళ్ళుచున్నది. యాజకుడు ఆ ఓడలో ఉండెను. ఆమేన్. అతడు ఒక యాజకుడైయున్నాడు. ధర్మశాస్త్రమును ఇచ్చువాడతడే. అతడు ఒక రాజు.
నోవహు కూడా, నోవహు కూడ ఒక తండ్రియైయున్నాడు. అక్కడ ఓడను తయారుచేసిన అతడు ఒక తండ్రియైయున్నాడు, తనకున్న ప్రత్యామ్నాయము చేతన అతడు ఓడలోకి వచ్చియున్నాడు.
తన స్వరక్తముతో ఓడను చేసిన క్రీస్తు, ఓడలోపల తన విశ్వాసితో సహవాసము చేయుచూ మనకు తండ్రిగాయున్నాడు. మై!
42
తన సంతనమంతా మరియు జంతువులన్నీ కూడా నోవహు యొక్క ప్రసంగమును వినియున్నాయి, తీర్పు జరుగుచున్నప్పుడు, నీరు కుమ్మరించబడినప్పుడు ఆ ఓడ అలల మీద తేలియాడుచూ వెళ్లుచున్నది, పరీక్షించబడుచూ ఒక స్థలము నుండి మరొక స్థలమునకు వెళ్లుచున్నది. నోవహు ఇలాగనెను, “పిల్లలారా, పట్టుకొనండి. దేవుడే ఈ ఓడను తయారుచేసియున్నాడు. ఈ ఓడ సూచనలకు అణుగుణముగానే తయారు చేయబడినది. దీనికి వ్యతిరేకముగా దయ్యము పంపించిన ప్రతిదానికి తట్టుకొని ఇది నిలబడగలదు.” ఓడలో నోవహు ఉన్నాడు, ప్రసంగిస్తు, తీర్పులో నుండి వారిని తీసుకొని పోవుచున్నాడు.
43
బయట ఉన్న ఆ చిన్న మోషే, రాత్రివేళ పైన ఆకాశములో ఉన్న నక్షత్రముల వెలుగును చూస్తున్నాడు, గాలి విసురుతున్నప్పుడు మరియు కొన్ని స్థలములలో ఊళను వినుచున్నాడు, ఆ పాత నైలునది గంతులు వేయుచున్నది, మరియు ఆ మొసళ్ళు మోషేని పెట్టిన ఆ పెట్టె క్రిందకు వెళుతున్నాయి. హల్లేలూయ! క్షేమంగా, రక్షించబడినది, ఒక ప్రాయశ్చిత్తము వలె అతడికిని మరియు దయ్యముచేత పంపించబడిన ఆ పెనుగాలులన్నింటి మధ్యలో నిలబడియున్నది. ఆ ఓడను ఏదియూ ఇబ్బంది పెట్టలేదు. వాటిగుండా అతడు తేలియాడుచు వెళ్లుచున్నాడు.
పరిశుద్ధాత్ముడు వాటిపైన నిలబడియుండుటను నేను చూస్తున్నాను. ఆ పెట్టెకు దగ్గరలో దేవుని యొక్క దూతలు కత్తులు దూసి కూర్చునియుండుట నేను చూస్తున్నాను. లేదయ్యా, దానిని ఏదియూ తాకలేదు.
ఆ ఓడను మునిగిపోవునట్లుగా చేయుటకు అపవాది ప్రయత్నము చేస్తున్నప్పుడు నోవహు ఇలాగు పాడుచున్నాడు, “యేసు, సిలువకు దగ్గరలో నన్ను నిలుపుము” లేక మరేదైనా అయ్యుండవచ్చును. పాతాళములో ఉన్న దయ్యములన్నీ కలిసినను దానిని ఏమియూ చేయలేవు, ఎందుకనగా దేవుని సూచనలకు అణుగుణము ఆ ఓడ తయారుచేబడినది. అక్కడ తీర్పునకు మరియు కృపకు మధ్యలో ఒక ప్రాయశ్చిత్తము నిలిచియున్నది.
అది చూచుటకు ఎంత కష్టమైనదిగా కనిపించిననూ ప్రతియొక్క విశ్వాసి ఈ దినమున అలాగుండవలసియున్నది. జీవితము ఎంతో కష్టముగా అనిపించిననూ అలాగుండవలసియున్నది. నీవు యేసు క్రీస్తులో ఉన్నంతవరకు, వర్తమానములోని ఆత్మగాని, భవిష్యత్తులోని ఆత్మగాని మనలను యేసుక్రీస్తులోని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదు. ఆమేన్. పాతాళములోని ప్రతిగాలిని అపవాది నీ మీదకు వదులుతాడు, కాని దానికిని నీకును మధ్యన దేవుడు ఒక ప్రాయశ్చిత్తమును కలిగియున్నాడు. ప్రతి అలలమీద నీవు తేలియాడుదువు. నీవు ప్రతియొక్క మొసళ్ల మంచము మీదనుండి వెళ్ళెదవు.
44
అతడు ఎక్కడ ఆగెను? ఐగుప్తు అంతటికి రాజయ్యే వరుసలోకి నేరుగా వెళ్ళి ఆగెను. హల్లేలూయా!
ఈ దినములలో ఏదో ఒక దినమున, ఈ పాత ఓడ కూడా తుఫానును కలిగియున్న ఈ యోర్దాను నది అవతలి ఒడ్డున ఆగుతుంది, అప్పుడు మనము దానిలో నుండి దేవునికి రాజులుగానూ మరియు యాజకులుగాను క్రిందికి దిగి నడుచుకుంటూ వెళ్ళెదము, ప్రాయశ్చిత్తముగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు రక్తము క్రింద నిలబడతాము, ఆ యొక్క ప్రాయశ్చిత్తము, ఆ యొక్క కృప ఉచితముగా అడిగినవారికి ఇవ్వబడును.
45
పాత నిబంధనలో ఆయన ఇలాగు చెప్పెను, “ఇప్పుడు నీవు ఒక ఓడను కట్టుము.” అతడు ప్రత్యేకమైన చెక్కతో కట్టమని చెప్పెను, “కనివిందచెట్టు.” అకాసియా చెక్క లేక ఈ చెట్టు నుండి చెక్కను తీయుము. బైబిలులో అది ఇలాగు పిలువబడినది “తుమ్మ చెక్క (షిత్తిమ్ చెక్క), అయితే అది వాస్తవమునకు కనివింద చెటైయున్నది. అదే చెక్కతో నీవు మందసమును (ఓడను) కట్టవలసియున్నది. మరియు ఇలాగు చెప్పెను, ”నీవు దానిని బంగారు తాపడముతో కప్పవలెను.“
ఆ మందసమను (ఓడను) గమనించుము, అది క్రీస్తునకు సాదృశ్యముగాయున్నది. గమనించుము, ప్రతిసారి అది సాదృశ్యముగానే ఉన్నది. మార్గమును ఏర్పరుచుటలో నోవహు, క్రీస్తునకు ఒక సాదృశ్యముగా ఉన్నాడు, మోషే కూడా ఒక సాదృశ్యముగా ఉన్నాడు.
ఇప్పుడు, ఆ నిబంధనా మందసమును (ఓడను) చూడుము. ఆయన ఇలాగు చెప్పెను, “నీవు దానిని తుమ్మ చెక్కతో చేయవలెను మరియు పైన బంగారముతో తాపడం చేయించవలెను.” లేఖనములు తెలిసిన వారు ఎవరికైనా బంగారము, దైవత్వమును గూర్చి మాట్లాడుతుందని తెలియును, మరియు చెక్క అనేది మానవత్వమును గూర్చి మాట్లాడును. ఆయన ఇలాగు చెప్పుట గమనించుము, “చెక్క పైభాగమును నీవు బంగారముతో కప్పవలెను.” అది ఆ చెక్కపైనున్న దైవత్వమే. క్రీస్తు సంఘము పైనుండెను, లోపటను మరియు వెలుపటను దైవత్వముతో కప్పబడినది.
46
దానిపైన నీవు ఒక మూతను ఉంచవలెను. అది కరుణాపీఠముగా ఉండును, అందులో ధర్మశాస్త్రమంతా విశ్రాంతి తీసుకొనును. కాని ముందుగా, నీవు దానిమీద రక్త ప్రోక్షణ చేయుదువు.“ ధర్మశాస్త్రము తీర్పును గూర్చి మాట్లాడును. కాని, ధర్మశాస్త్రమునకు మరియు సమాజమునకు మధ్యలో దైవత్వమును ఉంచుటకు ఒక స్థలముండవలసియున్నది.
అది క్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని యొక్క ఉగ్రతకు, పాతాళము యొక్క తీర్పునకు మరియు విశ్వాసికి మధ్యలో క్రీస్తు తనంతట తానుగా దైవత్వముగా నిలబడియుండెను, మన యొక్క పాపముల నుండి కాపాడుటకు మరియు మన యొక్క బలహీనతల నుండి స్వస్థపరచుటకు మార్గమందు ఒక ప్రాయశ్చిత్తమును ఏర్పరిచియున్నాడు. తీర్పునకు మార్గమునకు మధ్యలో దైవత్వము నిలిచియున్నది.
47
ధర్మశాస్త్రమే న్యాయాధిపతియైయున్నది. ధర్మశాస్త్రము తీర్పు తీర్చును, కాని ఒప్పుదల కలిగిన విశ్వాసికి మరియు తీర్పునకు మధ్యలో ప్రాయశ్చిత్తము నిలుచును. వారు ఆ మందసమందు రానైయున్న తీర్పునూ ఉంచియున్నారు. కాని తీర్పు వచ్చునప్పుడు, విశ్వాసికిని మరియు తీర్పునకు మధ్యలో ఒక ప్రాయశ్చిత్తము నిలిచియున్నందున అది విశ్వాసిని ఏమియూ చేయలేదు. అక్కడ ఛాయగాను మరియు సాదృశ్యముగానున్న క్రీస్తును విశ్వాసి వచ్చి మరియు ఒప్పుకొని తరువాత చిందించినబడిన రక్తమును కరుణాపీఠము మీద ప్రోక్షించెదరు, అప్పుడతడు కృపను పొందుకుంటాడు, మరియు అతడు సంతోషముగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు, ఎందుకనగా అతడు తీర్పునుండి విడుదలను పొందుకున్నాడు.
కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు యందున్నవారికి ఏ శిక్షావిధిలేదు, క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను.“ ఎప్పుడైతే ఒక మానవునికి తాను లోకసంగతుల విషయములో మరణించానని తెలుస్తుందో, అప్పుడు వారు క్రీస్తు యేసులోకి వస్తారు, మరియు పాపలోకములో ఉన్నట్లుగా ఉండక పరిశుద్ధాత్మకు అనుగుణముగా నడుచుకుంటారు, ఇక వారికెన్నడు శిక్షావిధి ఉండదు. అతడు పాతాళము యొక్క ముఖమును చూడగలడు మరియు తీర్పును చూసి మరియు సంతోషించును, ఎందుకనగా అతనికి మరియు తీర్పునకు మధ్యలో క్రీస్తు యొక్క రక్తము ఒక ప్రాయశ్చిత్తమును ఏర్పరిచిన దానిని బట్టి అతడు సంతోషించును. ఆమేన్. అక్కడే మీరున్నారు.
విశ్వాసి ఒకసారి లోపలికి వచ్చిన తరువాత మూత మూసివేయబడుతుంది, అది సమస్తకాలమును కుదుర్చును. ఆమేన్. బంగారము, దైవత్వము దాని పైన మరియు క్రిందను, చూట్టూ తాపడము చేయబడినది, అది దైవత్వములో చుట్టబడినది. క్రీస్తులోకి వచ్చిన ప్రతియొక్క విశ్వాసి పరిశుద్ధాత్మ అనేదానిలో చుట్టబడతారు మరియు దేవునికి కుమారులు మరియు కుమార్తెలు అవుతారు.
48
బంగారమును కొట్టినట్లుగానే వారు దానిని వేడిచేసి కొడతారు. బంగారమును ఎంతగా కొట్టినట్లయితే అంత మంచి బంగారముగా తయారగును. అది సుత్తితో దెబ్బలు తినవలసియున్నది. తన ప్రతిబింబము బంగారములో కనపడువరకు దానిని అతడు కొట్టును. ఆ తరువాత అతడు దానిని కొలిమిలో కాల్చును, ఆ తరువాత దానిని మందసము మీద పోయును, తరువాత దానిని చెక్కయందు నానపెట్టును. ఓ, మై!
ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు శక్తిలో, పరిశుద్ధాత్మ మరియు అగ్ని కలసి, విశ్వాసి మీద క్రీస్తు యొక్క రక్తము ద్వారా కుమ్మరించబడినట్లయితే, అది అతనికి ఒక ప్రాయశ్చిత్తమైయుండును. అప్పుడతడు ప్రతియొక్క దైవికమైన తీర్పునుండి రక్షింపబడును. “అది బలహీనతల నుండి కూడా కాపాడునా?” అవునయ్యా. అది పరిపూర్ణముగా కాపాడును.
49
అది నిన్ను త్రోయదు, అది ఏదియు చెప్పదు, అది నిన్ను రెచ్చగొట్టదు, అది నీ మీదకు రాదు, ఇది చేయుము అది చేయుము అని చెప్పదు. “కాని, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు.” (చాలాసార్లు ఆ యొక్క ఓడ అటు ప్రక్కకు మరియు ఇటు ప్రక్కకు ఒరిగినది.), “వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును.”
ఆ ఓడ చాలాసార్లు ఎగిరిపడినది. చాలాసార్లు పైకి మరియు క్రిందకు వెళ్లినది, అది వెళ్లుచున్నప్పుడు చాలాసార్లు బలమైన గాలులు దానిమీద విసిరాయి, కాని అది అలాగునే చివరకు ఆరారాతు పర్వతము మీద నిలిచినది.
నేను చెప్పినట్లుగా అనేక మొసళ్లు ఆ చిన్న ఓడను దాటాయి, ఆ రాత్రి అనేక గాలులు వీచాయి, అది వెళ్లుచుండగా అనేకమైన చీకటి తూఫానులు వచ్చాయి, కాని అది క్షేమంగా బలురక్కసి పొదలలో నిలిచినది, ఎక్కడనుండియైతే తీయబడి ఆ దేశసింహాసనము మీదకు తీసుకొని వెళ్ళబడునో అక్కడ నిలిచినది, అత్యంత తక్కువ స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరెను. ఆమేన్.
మనము దౌర్బాగ్యులము, దిక్కుమాలిన వారము, పురుగలుకన్నా తక్కువ వారము, జీవరాశులన్నింటిలో తక్కువవారము, నీతిలో కలుషితము చెందినవారము, ఆత్మీయముగా చనిపోయి మందసము యొద్ద ఉంచబడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తముచేత పైకి లేపబడి ఆయనకు కుమారులు మరియు కుమార్తెలుగా ఉన్నాము, దేవునికి బంధువులుగాను మరియు యాజకులుగా ఉన్నాము. ఎంత అందమైన దృశ్యమది. మనము ఆ విధమైన గుర్తింపును కలిగియుండుకు ఏమి చేసియున్నాము? మానవునితో దేవుడు సంధించిన ప్రశ్నకు ఏ మానవుడు సమాధానము ఇవ్వగలడు?
50
అక్కడ మీరు మరొక అంశమును కూడా గమనించాలని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడైతే ఆ మందసము దాని స్థానమునకు వెళ్లినదో, అప్పుడు ఆయన ఇలాగనెను, “దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను.” మరో విధముగా చెప్పవలెనన్న, మందసము మీదను మరియు చుట్టూ, ఇలాగు చేయవలెను, దాని లోపల ధర్మశాస్త్రముండును. ఇక్కడ గమనించాల్సిన మరో అంశమున్నది, రొట్టెలు, కోషర్, లేక మొదటగా కురిసిన మాన్నా, మన్నాతో ఉన్న కుండను ఆ మందసము లోపల పెట్టవలెను.
సోదరుడా, దేవుడు ఎంత మంచి దేవుడో అని నీకు తెలియాలంటే నీవు ఆయనను రుచిచూడవలసియున్నది, ఒక్కసారి ఆ మందసములోకి వెళ్లి, ఎక్కడైతే మన్నా ఉంటుందో అక్కడకి వెళ్లి, ఆ పాత భూసంబంధమైన ఆచారాలు లేక మరేదో కాదు కాని, క్రీస్తులోకి వెళ్ళుము. ద్వారము యొద్దకు రమ్ము, నీ వెనకాలే దేవుడు ద్వారమును మూసివేయును, అటు తరువాత తీర్పులన్ని బయటే జరుగును.
51
అతడు లోపలికి నడిచినప్పుడు గమనించుము, అతడు ఈ మందసమును తీసుకొనెను... అహరోను చేతికర్ర అక్కడుంచబడెను. ఆ తరువాత అది పూలు పూసెను, మృతిచెందిన ఆ పాత చేతికర్ర, ఆ చేతికర్రలోని ఏ భాగములో కూడా కొద్దిగ కూడా జీవములేనేలేదు. అది ఎంతగా ఎండిపోవలసియున్నదో అంతగా ఎండిపోయినది. కాని, ఒక్కసారి నీవు దానిని పరిశుద్ధమైన స్థలములో ఉంచినట్లయితే అప్పుడది తిరిగి జీవంచును.
ప్రతి పాపి, నీవు ఎంత ఉదాసీనముగా ఉన్ననూ నేను లెక్కచేయను, ఎంత నల్లగా ఉన్ననూ నేను లెక్కచేయను, నీ జీవితము ఏమైయున్ననూ నేను లెక్కచేయను, క్రీస్తు యొక్క సన్నిధిలో నీవు తిరిగి జీవిస్తావు, వికసిస్తావు, మరియు పూత పూస్తావు, ఆత్మలో వర్ధిల్లుతావు. నీవు ఎంత బలహీనముగా ఉన్నావనేది లెక్కకానే కాదు, ఆ యొక్క ప్రాయశ్చిత్తము యొద్దకు వచ్చినట్లయితే నీవు తిరిగి జీవిస్తావు. ఎంత అద్భుతమది. మనకు ఆ యొక్క గుర్తింపు క్రింద ఎంత మంచి కార్యమున్నది. ఎంత అద్భుతమైన లేఖనమది. ఎంత అద్భుతమైన దేవుడు. ఎంతటి ఖచ్చితమైదది... అది ఎంతో నిర్దిష్టమైన పూనాదిగా ఉన్నది. ఇసుక నేలలో ఉన్న ప్రతియొక్కటి క్రుంగిపోవును. మిగిలిన స్థలములు ఇసుక నేలలో క్రుంగిపోవును.
52
దానిమీద కిరీటమువలే పెట్టుము అనుదానిని గమనించుము, ఎందుకు? అది రాజైయున్నది. ఆ పెట్టెకు పైన ఉన్న బంగారమునకు అర్థమేమిటి? దాని యొక్క అర్థమేమిటంటే, దానిపైన బంగారమును ఉంచుటనేది మానవత్వము బంగారముతో కప్పబడుచున్నదని అర్ధము. దానిపైన కిరీటము మీద రక్త ప్రోక్షణ చేస్తారు.
అది క్రీస్తునకు మరియు ఆయన యొక్క దైవత్వమునకు, ఆయన యొక్క ప్రేమకు ఎంత చక్కటి సాదృశ్యముగా ఉన్నది. ఆయన ఈ లోకములో వచ్చి మరియు మానవత్వము మీద తననుతాను ఉంచుకొనెను, ఆయన యొక్క సంఘము, ఆయన యొక్క విశ్వాసులు. దానిమీద ఆయన తన స్వరక్తమును ప్రోక్షించెను, “ఎవరైనా ఆశించినట్లయితే,” వారు రక్షింపబడుదురు. ఇద్దరు దూతలు ఆ బంగారమును కొట్టియున్నారు, వారి ఇరువురి యొక్క రెక్కలు ఎదురురెదుగా ఉండి, ఎక్కడకైతే ప్రతియొక్క విశ్వాసి వచ్చి తన పాపములను ఒప్పుకుంటాడో మరియు తన పాపములను శాంతపరచుకుంటాడో ఆ కరుణాపీఠము వైపు చూపిస్తున్నాయి.
53
ఆయనక్కడే ఉండెను. ఇప్పుడు ఆయనవైపు చూడుము. ఆ బంగారు కిరీటము, అది క్రీస్తును సూచిస్తున్నదా? అవును. భూమి మీద క్రీస్తు ఉన్నప్పుడు, ఆయన రక్తమును చిందించుటకు ఆయనకు ఒక ముళ్ళ కిరీటమును పెట్టియున్నారు. అది నిజమే. కాని చిందించబడిన రక్తము ద్వారా వచ్చిన ప్రతివిశ్వాసి ఆ ముళ్ళ కిరీటమును లాగివేసి, స్తుతి మరియు ఘనతయూ అనే మహిమా కిరీటమును పెట్టుచున్నారు. ఆయన సన్నిధిలోకి అడుగుపెట్టిన ప్రతి విశ్వాసి, ఈ ముళ్లచేత గుచ్చుకోబడి ఆయన కనుబొమ్మలో నుండి కారిన రక్తమును అంగీకరించి, స్తుతి మహిమా కిరీటమును ఆయనకు పెట్టుచున్నారు, ఘనతా, రాజులకు రాజుగా, స్వస్థపరుచువానిగా, ఆల్పాగా, ఓమేగాగా, ప్రారంభకునిగా మరియు ముగించువానిగా, ఒక లాయరుగా, సమాధానకర్తగా, బలిష్టుడైన దేవునిగా, నిత్యమైన తండ్రిగా ఉండెను.
54
తన ఓడలో నోవహునే తండ్రిగా ఉండెను. తన ఓడలో మోషేనే తండ్రిగా ఉండెను. తన ఓడలో మీకు, సంఘమునకు, విశ్వాసికి క్షేమముగా ఉంచుటకు కాపాడుటకు క్రీస్తు తండ్రిగా ఉన్నాడు.
మరొక్కసారి మీరు గమనించాలని నేను ఆశిస్తున్నాను, ఆ మందసమునును సమపించుటకు ఒక ప్రత్యేకమైన మార్గమున్నదని మీరు గమనించాలి, ఆ మందసము యొద్దకి వచ్చు ప్రతి వ్యక్తి, మొదటగా బయట ఆవరణములోకి రావలెను, ఆ తరువాత లోపలి తెర యొద్దకు రావలసియున్నది, అటు తరువాత అతి పరిశుద్ధ స్థలములోకి రావలసియున్నది. క్రీస్తు ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక యాజకునిగా, ఒక రాజుగా, కిరీటధారిగా ఉన్నాడు. మొదటగా వచ్చి ఆయన ఇక్కడ మాట్లాడుట చూడుము, ఆయన మొదటగా వచ్చినప్పుడు ఒక ప్రవక్తగా వచ్చెను.
55
క్రీస్తులోకి రావాలనుకునే ప్రతి వ్యక్తి తప్పని సరిగా మొదట ఆ సిలువయొద్దకు రావలసియున్నది. ఆ సిలువే ఆయన యొక్క యాజకత్వమైయున్నది. ఆయన యొక్క మరణము ఎక్కడ జరిగినదో దానిని సిలువ సూచిస్తుంది. ఆ సిలువ ఎక్కడున్నదో, అక్కడే. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకనే ఆయన ఏకైక కుమారుడుని ఇచ్చియున్నాడు.” అన్నిటిని దాటి సిలువ ముందుకు వచ్చే వ్యక్తులు ఎవరూ ఆయన మనస్సులో కుడి ప్రక్కన లేరు, ఆయన ముందుకు తీసుకొనివచ్చి, అయితే క్రీస్తు ఏది బోధించెను అది వినినవాడే వచ్చును, క్రీస్తే ప్రసంగికుడును, క్రీస్తే ప్రవక్తయును.
56
ఆ తరువాత ఆయన చేయు కార్యమేమనగా, ఆయన దాని ద్వారా ఆ ప్రాయశ్చిత్తము యొద్దకు వెళ్ళును. అతడు ఆ తెరయొద్దకు మధ్యవర్తిత్వము చేయుటకు ఒక మధ్యవర్తియైన ఒక యాజకునిగా వెళ్ళును, “దేవుని కుడి పార్శ్వమున కూర్చుని, విశ్వాసి కొరకు మధ్యవర్తిత్వము చేయుచున్నాడు.” విశ్వాసి ఆయన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, అతడు సిలువయొద్దకు వచ్చి దేనినైతే విశ్వసించి తన ఒప్పుదలను కలిగియుండెనో దానిమీదనే క్రీస్తు మధ్యవర్తిత్వము నడుపును.
ఇప్పుడతడు క్రీస్తు యొద్దకు వచ్చుచున్నాడు, అతడు ఇలాగనుచున్నాడు, “ఓ క్రీస్తు, సిలువ యొద్ద నీవు వాక్యము నాకు బోధించుట నాకు తెలుసును. నేను నీయందు విశ్వాసముంచుచున్నాను. నా యెడల నీవు కృపను చూపుదువా? అప్పుడు మధ్యవర్తిగా ఉన్న క్రీస్తు మధ్యవర్తిత్వము నెరుపును. అప్పుడు అతడు ఆ ఓడలోకి వెళ్లును, అక్కడ తీర్పు ఉండును, ఆ ఓడ ఆ తీర్పును భరించును, అక్కడ అవమానమును మరియు పాపమునంతయును తీసివేయబడును, మరియు అతడు దేవునితో సమన్వయ పరచబడును, రక్తమనే ప్రాయశ్చిత్తము ద్వారా అతడు దేవునితో తిరిగి సహవాసమును చేయును, మరియు నిరంతరము కాపాడబడే ఆ ఓడలో అతడుంచబడును.
57
దేనిగురించి చింతించాల్సిన అవసరతలేదు. ఏ హానియు జరుగదు. నీవు ఉండవలసినంత క్షేమముగానే ఉన్నావు. తుఫానులను రానిమ్ము. ఓ... దేనినైనా జరుగనిమ్ము, బలహీనత కొట్టనిమ్ము. సాతాను పంపించాలని ఆశించిన దేనినైనా రానిమ్ము. వాటన్నింటిలో నుండే దేవుడే నిన్ను స్థిరముగా ఉంచును. నీవు బయటకు దుమకవద్దు. క్రీస్తులోనే స్థిరముగా ఉండుము. ఇలాగనుము, “ప్రభువైన దేవా, 'ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును మరియు పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువజాలవని' అని నీవన్నావు. ప్రభువైన యేసు నేను నిన్ను నమ్ముచున్నాను. ఇప్పుడు నేను, ఆత్మకు పరలోకములోని విశ్రాంతి నిమిత్తము లంగరు వేసుకొనుచున్నాను.” ఓ, మై!
క్రీస్తు, మన రక్షణకు ఆయనే ప్రధాన నాయకుడు, గొప్ప జయశాలియైన ఆయన అక్కడనే నిలబడియుండెను. ఆయనే ఆ తెరను దిగువన ఉన్న గోడవరకు రెండుగా చీల్చెను, “ఇచ్చయించువారు ఎవరైతే ఉన్నారో” వారిని వచ్చి తన జీవములో భాగస్తులు అవ్వమని ఆహ్వానిస్తున్నాడు, ఆయన యొక్క దైవికమైన స్వస్థతలో కప్పబడమనుచున్నాడు, అప్పుడు తీర్పునందు ఏ యొక్క తీర్పు నిన్ను కొట్టలేదు.
మరియు ఒకవేళ తీర్పు వచ్చినా అది నీకు హాని చేయలేదు. నీవు కొద్ది సమయము అనారోగ్యముతో ఉండవచ్చు. నీవు కొద్ది కాలము దేనిగుండానైనా వెళ్ళవచ్చు, అయితే గుర్తుంచుకొనుము, చివరిలో క్రీస్తు ఉన్నాడు. “ఈ ఓడ ఆ చిన్న తుపాను గుండా నెమ్మదిగా కూర్చుండును,” అని ఆయన ఎన్నడు చెప్పలేదు. లేదయ్యా. పూల పాన్పును ఆయన ఎన్నడు వేయలేదు. ఆయన ఎన్నడు కార్యములు సులభముగా ఉండును అని వాగ్ధానము చేయలేదు, అయితే ఆ సమయములో నిలచునట్లు ఆయన కృపను వాగ్ధానము చేసియున్నాడు.
ఒక కవి చెప్పినదాని గురించి ఆలోచించుచుంటిని:
ఇతరులు బహుమానమును పొందుకొనుటకు
రక్తపు సమద్రములో పయనించుచున్నప్పుడు;
నేను పూల పాన్పుపై గృహమునకు
ఎత్తుకొనిపోబడుదునా;
లేదు, నేను పాలన చేయాలంటే నేను పోరాడాలి.
ప్రభువా, నా ధైర్యమును పెంచుము.
అవునయ్యా. కష్టమైన శోధనలు వచ్చినప్పుడు వాటిని లక్ష్యపెట్టకుము. కేవలము ఓడలోనే నిలచియుండుము మరియు చెప్పుము, “దేవా, నేను నిరంతరము కాపాడబడియున్నాను. నా ఆత్మకు పరలోకందున్న విశ్రాంతి నిమిత్తము నేను లంగరు వేసికొనియున్నాను, ఇక ఎంత మాత్రము ఆ సముద్రము భయంకరముగా ఉండనేరదు. గాలివాన ఎంత భయంకరముగా వీచిననూ, లోతైన తుఫానులు వచ్చిననూ, యేసులో నేను సురక్షితముగా ఉంటాను.”
బలహీనతను రానిమ్ము, సమస్యలను రానిమ్ము, గుండెలను పగిలిపోనిమ్ము, లేక గుండెపోటును రానిమ్ము, మరియు ప్రతియొక్క దానిని రానిమ్ము అది నన్నేమి చేయలేదు. ఎన్నడూ కదల్చబడని రాజ్యమును మనము పొందుకొనబోవుచున్నాము. నేను ముందుకు మరియు వెనుకకు దూకుతానని నీవు చెప్పవద్దు, ఈ దినములలో ఏదో ఒక దినమున దేవుడే నిన్ను క్షేమముగా ఆయన యొక్క రాజ్యములోకి దించును. ఆయన యొక్క ఓడలో నీవుందువు.
కొద్దిసేపు మనము తలలు వంచియుండగా, ప్రభువు నిన్ను దీవించునుగాక.
58
మా పరలోకపు తండ్రి, మేమీ దినమున ఆయన యొక్క ఘనతను చూచుచుండగా, నోవహుతో కూడా ఆయన ఉండుటను మేము చూస్తున్నాము. ఆ అలల మీద స్వారీచేసినది ఎవరు? ఆ చిన్న చితిసారకపు చెక్కలో ఉన్నది ఎవరు? మనము నిలబడలేని ఈ గొప్ప పోరటములో ఎక్కడున్నాడు. ఈ భూమంతా ఊగిపోయినది మరియు ఎగిరిపడినది, దాని కక్ష్యలో నుండి వేవేల మైళ్ళ దూరము వెళ్లిపోయినది, సుడిగుండములో చిక్కుకున్నదానివలె ఉన్నది, ఆ యొక్క అలలు గాలిలోకి మైళ్ళ ఎత్తులో ఎగసిపడినాయి. ప్రపంచమంతా, నీటితో కప్పబడి పెద్ద పెద్ద పర్వతములు భూమట్టముతో సరిచేయబడ్డాయి, అర్థరాత్రిలో ఆ సుడిగుండము వచ్చినది. తీర్పు. చచ్చిన శరీరములు ఒకదానితో ఒకటి కొట్టుకొంటూ నీటిలో తేలియాడుచున్నాయి.
చితిసారకపు మ్రానుతో చేసిన ఒక చిన్న ఓడ, లోపటను మరియు వెలుపటను కీలు పూయబడిన చిన్న ఓడ, మరియు ఆ ఓడలోనున్న ప్రియమైన విశ్వాసులు, వారుండవలసినంత క్షేమముగా లోపలున్నారు. వారు దేనిని ఖాతరు చేయలేదు. వారికి మీరు ఏదైతే చెప్పియున్నారో వారు దానినే చేసియున్నారు. వారు నీ యొక్క సూచలను వెంబడించారు.
నీ యొక్క సూచనలను వెంబడించినవారు ఏ శిక్షావిధికి లోనవ్వరు లేక కలవరపడరు. చివరకు మీరే ఆ తుఫాను ఆపివేశారు. జీవముపైన వచ్చిన ఆ తుఫాను చివరకు ఆగిపోయినది, అప్పుడు మేము నూతన ప్రపంచములోకి క్షేమంగా వచ్చాము. ప్రియ పరలోకపు తండ్రి, వైద్యశాస్త్రము గొప్పగా ఉన్న ఈ దినములలో, ఎక్కడైతే సంఘములు ఘనమైన కార్యములు చేయుచున్నవో అక్కడ, ఈ దినము జీవమనే సముద్రం మీద తుఫాను ఎగసిపడుచున్నది, అది ఎలాగు జరుగుచున్నతో మాకు అర్దముకావటంలేదు. మేము కేవలం యేసులో లంగరు వేయబడి యున్నాము. తుఫానులు వచ్చుచున్నాయి, హింస పెరిగిపోయినది, కాని మేము ఆ సూచనలను వెంబడించుచున్నాము. దానిగుండా మేము నిన్ను చూచెదము. పరలోకపు తండ్రీ, ఈ దీవెనలను మాలో ప్రతియొక్కరిక దయచేయుము. ఈ రోజు ఉదయమున గేటు దగ్గర ఉన్న అపరిచితుడిని దీవించుము. రక్షింపబడనివారిని దీవించుము, మరియు వారు నీ బిడ్డలుగా మారును గాక.
59
మేము మా తలలు వంచియుండగా, ఒకవేళ ఇక్కడ ఎవరైనా క్రీస్తునకు వెలుపట ఉన్నట్లయితే నేను ఆశ్చర్యపోతాను, మీ చేతులను పైకెత్తి ఇలాగు చెప్పుము, “బ్రదర్ బ్రెన్హాం, నేను నా చేతిని దేవుని వైపుకు ఎత్తియున్నాను, దేవుడును మరియు నీవును చూడవచ్చును. ఆలస్యము కాకమునుపే నన్ను జ్ఞాపకము చేసికొని ఆ ఓడలోనికి తోడ్కొనిపొమ్ము. నీవు నా కొరకు ప్రార్థించెదవా?” నీవు నీ చేతిని కేవలం పైకెత్తి ఇలాగనుము, “నన్ను జ్ఞాపకము చేసుకొనుదువా?” అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. “నా జీవితములో తుఫానులు రేగినప్పుడు, నా ప్రక్కన నిలబడుము.”
స్నేహితుడా, నీ యొక్క నిర్ణయమును నేను తీసుకొనలేను. నీ కొరకు నేను కేవలం ప్రార్ధించగలను అంతే. నీ నిర్ణయమును నీవు తీసుకొనవలసియున్నది. నిజాయితీ కలిగిన ఏ యొక్క వ్యక్తి కూడా ఘనత కలిగిన ఆయన యొక్క సన్నిధికి వచ్చి ఆయన చేత వాగ్దానము చేయబడిన ప్రేమను చూడలేడు... నీ చేతిని ఎందుకని పైకెత్తియున్నావు? నీ హృదయమందు ఏదో తట్టుచున్నది. అది దేవుడు నిన్ను ఆ ఓడలోకి లాగుటకై చేయుచున్న ప్రయత్నమైయున్నది. “నా తండ్రి ఆకర్షించితేగాని నా యొద్దకు ఎవరునూ రాలేరు. నా యొద్దకు వచ్చువారెవరిని నేను త్రోసివేయను. అంత్యదినములయందు నేనతడిని పైకిలేపి, నిత్యజీవమును అతడికిచ్చెదను.”
60
భయపడవద్దు. దేవుడే గాలులను నడుపించుచున్నాడు. ఆ ఓడను దేవుడే నడుపుచున్నాడు. ఆయనకు అన్నియు సమకూర్చబడియున్నాయి, ఎందుకనగా నోవహుకు ఎటువంటి విజయములు లేవు, నోవహుకు తుఫానులు మరియు శ్రములు లేనేలేవు. క్షేమముగా ఉండుటకై మనమేదైనను చిన్న సొరంగమును ఏర్పరుచుకుని దానిలో పరుగెత్తినట్లయితే, అందులో సంతోషములేదు. మన జీవితములో ఉన్న తుఫానుల వలనే మనకు సంతోషం వస్తుంది. మనము చీకటిలో లేకపోయినట్లయితే అప్పుడు మనకు వెలుగు విలువ తెలియదు. మనము పర్వతము యొక్క దిగువన లేకపోయినట్లయితే మనకు కొండ శిఖరము యొక్క విలువ తెలియదు. మనకు అనారోగ్యము లేకపోతే మంచి ఆరోగ్యము యొక్క విలువ తెలియదు. నీవు ఒకప్పుడు పాపిగా లేనట్లయితే, నీకు రక్షణ యొక్క విలువ తెలియదు. ధర్మశాస్త్రము క్రింద దేవుడే అన్ని కార్యములు చేసియున్నాడు. నిన్ను ఆయన ప్రేమించుచున్నాడు.
ఇప్పుడు, మీరు మీ తలలు వంచియుండగా, మీ చేతులను పైకెత్తుము.
61
తండ్రియైన దేవా, ఈ దినమున ద్వారము ఇంకనూ తెరిచియుండగానే నేను ప్రార్ధించున్నాను, ప్రజలు తూర్పు మరియు పడమర నుండి, ఉత్తర మరియు దక్షిణ ప్రాంతముల నుండి వచ్చి ఇక్కడ సమకూడియున్నారు. ఆకాశమందు గొప్ప సూచనలు జరుగుతున్నాయి, భయంకరమైన దృశ్యములు కనిపిస్తున్నాయి, హైడ్రోజన్ కాల్చివేయబడుచున్నది, పరమాణువులు కూడా గాలిలోనే విభాగింపబడుచున్నాయి. పళ్ళెములు ఎగురుచున్నాయి, మిస్సైళ్ళను అంచనా వేయలేకపోవుచున్నాము, ఏదో జ్ఞానము పనిచేయుచున్నదని వారంటున్నారు, అది ఎక్కడ నుండి పనిచేయుచున్నదో వారు అంచనా వేయలేకపోతున్నారు, సైన్సు దానిని కనుగొనలేకపోయినది, అవి మర్మయుక్తముగా కాంతివేగముతో క్రింద పడుచున్నాయి. ఓ, దేవా మేము అంతమునకు సమీపములో ఉన్నాము.
హానోకు కట్టిన ఆ గొప్ప పిరమిడ్, ఆ చిట్టచివరి గదిని దాటి, రాజుగారి గది యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఇప్పుడు ఉన్నాము, ఆ ముఖ్యమైన రాయి కొరకే ప్రభువు వచ్చుచున్నాడు. ఖగోళ క్యాలండరు అంతా నేరుగానే చూపిస్తున్నది, మొదటిసారిగా చేసినట్లుగానే నక్షత్రములు దానిని తెలియచేస్తున్నాయి. ఆ జ్ఞానులు పైన ఉన్న నక్షత్రములను చూసి ఇలాగన్నారు, “అదిగో, ఆ గొప్ప రాజు రాబోవుచున్నాడు.” ఇప్పుడు, మరలా నక్షత్రములు దానినే చూపిస్తున్నాయి.
ప్రకృతంతా మూలుగుచున్నది. పురుషుల హృదయమంతా భయముతో నిండిపోయున్నది, కాలములలో కలవరమున్నది, దేశముల మధ్యలో అశాంతి ఉన్నది, సముద్రము ఘోషిస్తున్నది, ఆటు పోటు అలలు ప్రతిదానిని విరుగ గొట్టుచున్నాయి, తీరమున వందల మందిని అవి చంపుచున్నాయి, ప్రధాన మార్గములోను, విశాల మార్గములలోను సారధులు లేని రథములు వెళ్తున్నాయి, చూచుటకు ఒక టార్చిలైటు వీధులలో పరుగెత్తుచున్నట్లుగా ఉన్నది. అవి ఏమియూ కాకపోయిననూ మేము ఈ మైలురాళ్లను దాటియున్నాము.
62
ఓ దేవా, మమ్ములను త్వరగా ఆపుము. సువార్త ప్రకటించుటచేత ఈ పాపకరమైన లోకమును ఆపుము. ప్రభువైన యేసు, ఈ దినమున చేతులు పైకెత్తినవారిని కాపాడుము. మాకది దయచేయుము. నీ యొక్క కృపా విశ్రాంతి ఇక్కడున్న వారందరి మీద ఉండును గాక, వారి ఇప్పుడే సరిచేయబడుదురు గాక... నేనేమి చేయలేను, నేను ఏమి చేయగలిగినవాడిన కాను. అక్కడ మరొక కదలిక ఉన్నది.
నీవు పరిశుద్ధాత్మను పంపియున్నావు. వారి హృదయములలో అతడే వాక్యమును ఉంచును. దానిని వారు నమ్ముటచేత వారు తమ చేతులను పైకెత్తియున్నారు. నీవు ఇలాగు చెప్పియున్నావు, “నా యందు విశ్వాసముంచినవాడు ఎన్నడును మరణించడు, నిత్యజీవమును కలిగియుండును.” ప్రభువా, రమ్ము, వారిని నిరంతరము కుదుర్చుము. నీయందు వారు విశ్వాసముంచారు. వారిప్పుడు నీ వాక్యమును నమ్ముచున్నారు. నీవన్నట్లుగా, “నా మాటలను వినినవాడు (ప్రసంగించబడిన), నన్ను పంపినవానియందు విశ్వాసముంచినవాడు (మేము విశ్వసించుచున్నాము), అతడు తీర్పులోనికి రాక నిత్యజీవమును పొందుకొనును (ఎందుకనగా ఆయన దానిని ముందుగానే చేసెను), అతడు మరణమును దాటి నిత్యజీవమును పొందుకొనును.” ఓడలో క్షేమముగా ఉండును.
ప్రభువా, వారిని నూతన పురుషులుగాను, నూతన స్త్రీలనుగాను, నూతన బాలబాలికలుగాను పైకిలేపుము, ఈ చిన్న పాత గుడారము నుండి ఈ దినమున వెళ్లి, ఎక్కడైతే ఈ ప్రజలు నూతన జీవితము నిమిత్తము సమకూడుచున్నారో, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుచున్నదో, వారికి చేయమని బోధించుచున్నారో, అటువంటి అన్నిచోట్లా క్రీస్తు పైకెత్తబడును గాక. ప్రభువా, మాకది దయచేయుము. ఇప్పుడు మమ్ములను దీవించుము, మేము యేసు నామములో ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.
ఓ రక్షకుడా నన్ను దాటిపోవద్దు,
ఓ, నా మొరను ఆలకించుము,
ఇతరులు నిన్ను పిలుచుచుండగా,
నన్ను దాటిపోవద్దు,
రక్షకుడా, రక్షకుడా,
నా మొరను ఆలకించుమా,
ఇతరులు నిన్ను పిలుచుచుండగా,
నన్ను దాటిపోవద్దు,
నీ సింహసనము యొద్ద నన్నుండనీయుము
(కృపా సింహసనము యొద్ద గమనించారా? )... కృపా
ఉపశమనమును (పాపముల నుండి) కనుగొననిమ్ము
(నీ ఆత్మను దేవునితో మాట్లాడనిమ్ము)
గాయపడి విరిగిపోయిన నా ఆత్మను స్వస్థపరుచుము,
నా అవిశ్వాసములో సహాయము చేయుము,
మన తలలు వంచుదాము,
రక్షకుడా, రక్షకుడా,
నా మొరాలకించుమా,
ఇతరులు నిన్ను పిలుచుచుండగా,
నన్ను దాటిపోకుమా.
63
మన తలలు వంచియుండగా, ఓ, ప్రతిసారి ఈ పాత హాలులోకి వచ్చినప్పుడు ఈ అద్భుతమైన సమయముల గురించి నేనాలోచిస్తాను. కీలు పూయబడినదని నేను నమ్ముదును, తుఫానులు వచ్చినప్పుడు అది నన్ను ఉయ్యాలో ఊపినట్లుగా ఊపినది, అయినను నిలబడియున్నది, సమస్యల మరియు శ్రమల దినములలో నిలబడినది.
వెనుకాల అక్కడ బిల్లీ కూర్చునియుండుట నేను చూస్తున్నాను. అతడు... నేను ఆత్మ ద్వారా నడిపించబడుచున్నానని అనుభూతిని చెందుచున్నాను, ఇప్పుడు ఏదో వ్యత్యాసముగా చేయబోవుచున్నాను. ఇప్పుడు దేవుడేదో వ్యత్యాసముగా నన్ను చేయమన్నట్లుగా నేను అనుభూతిని చెందుచున్నాను. ఇక్కడ కొంతమంది ప్రజలున్నారు, శ్రీ. డి. కుక్, శ్రీ. లాంగ్, ఇర్విన్, ఇలాగు చాలామంది పేర్లు వ్రాసిన పేపరు ఇక్కడున్నది, మాటలాడుట ముగిసిన తరువాత వారు ప్రార్ధన నిమిత్తము ఇక్కడకు వస్తారు. ఇప్పుడు నేను చెప్పేది వినండి, ఆ తరువాత మనము ప్రార్ధనా వరుసను కలిగియుంటాము. ఇప్పుడే నేను బిల్లీతో చెప్పుట ప్రారంభించియున్నాను, “అక్కడున్న దారిలోకి వచ్చి కొన్ని ప్రార్ధనా కార్డులను ఇవ్వండి.”
కాని పరిశుద్ధాత్ముడు ఇలాగు చెప్పెను, “దానిని చేయవద్దు.” ఆ కారణముచేతనే నేను ఇలాగు పాడాను, “ఓ రక్షకుడా నన్ను దాటిపోవద్దు.” నేనీలాగు అనుకున్నాను, “ప్రభువా, అదేమిటి?”
64
మీకిది చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీరు నన్ను విశ్వసించినట్లయితే ఇది వినండి. అది ఏమైయున్నప్పటికి, అది నీ హృదయములో ఉన్నది, నీవు తెలుసుకోవాలనుకున్నది ఏమైయున్నప్పటికి, నీ యొక్క బలహీనత ఏమైయున్నప్పటికి, ఆయనయందు విశ్వాసముంచుము. ఆయనే నీతో మాట్లాడును. ఆయన దానిని చేయనైయున్నాడు. ఆయన నీతో వ్యక్తిగతముగా మాట్లాడును. నా హృదయమంతటితో నేను దానిని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్ముడే దానిని చేయును, నీతో మాట్లాడును, నీకు ఏది అవసరమున్నదో అది నీకు తెలియచేయును. ఆయన నీతో ఏది చెప్పియున్నాడో దానిని చేయుము. ఒకవేళ నీవు కుంటివాడవైతే, ఆయన ఇలాగనును, “పైకిలేచి నడువుము,” అప్పుడు నీవు పైకిలేచి మరియు నడువుము. ఒకవేళ నీకు కాన్సరు ఉన్నట్లయితే, ఆయన ఇలాగనును, “ఈ దినము నుండి నీవు దానిని మరచిపొమ్ము,” నీవు దానిని చేయుము. ఒకవేళ అది జరుగునో, లేదో చూడుము.
నీవు ఆపాయములో నిలబడినట్లయితే, ఏ వైపునకు తిరుగవలయునో తెలియనట్లయితే, అప్పుడు నీవేమి చేయవలెనో ఆయన నీకు చెప్పును. ఆయన అప్పుడే నీ హృదయములో దానిని పెట్టును. దానియందు సందేహముంచవద్దు. వెళ్లి దానిని చేయుము. ఆయన నీకు ఏమి చేయమని చెప్పెనో దానినే చేయుము. ఆయన దానిని చేయును.
65
మనము ఇలాగు తలలు వంచియుండగా, ఈ పేర్లను నేను పిలుస్తుండగా, వారు నడుచుకుంటూ కొద్దిసేపటిలోనే వేదికపైకి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ స్థానికముగా నివసించేవారు ఏవరైనా ఉన్నట్లయితే, వారు ప్రార్ధనా వరుసలోకి రావాలని ఆశించినట్లయితే, మేమందరము తలలను వంచియుండగా మీరు దారిని ఏర్పరచండి.
అది ఒక వింతైన కార్యముగా ఉన్నది, దేని గురించో పరిశుద్ధాత్ముడు చాలా వింతగా హెచ్చరించియున్నాడు. అది ఏలాగు జరుగునో అని ఆశ్చర్యపోతున్నాను, కాని ఆయన నాకు ఇప్పుడే చెప్పియున్నాడు, ఆయన సత్యమే చెప్తాడని నాకు తెలుసు. ఏవరైతే ప్రార్ధనా అవసరతను ఆశించియున్నారో, దేవుని ముందు ఏదో చిన్న సంగతి ఉన్నది, లేక ఏదైనా అవసరత, బలహీనత, ఆర్ధికముగా, భౌతికముగా, నీ యొక్క సమస్య ఏదైయున్నప్పటికి, ఇప్పుడు నీవు వేదిక యొద్దకు నడుచుకుని కొద్దిసేపటిలో రాగలవా, ఆ యొక్క వచనములను మరలా మేము పాడుచుండగా - మీరు రండి.
వచ్చేవారు తప్ప మిగిలిన వారు తలలు వంచియుండుము. చిన్న బాలికను కలిగియున్న ఒక తల్లి ఇక్కడున్నది, ఆమెను ఇక్కడకు తీసుకొని రమ్మని అడుగుచున్నాను, వేదిక మీదకు ఇక్కడకు తీసుకొని రండి. మంచిది.
రక్షకుడా, రక్షకుడా,
నా దీన మొర ఆలకించుము,
ఇతరులను నీవు పిలుచుచుండగా,
నన్ను దాటిపోకుమా.
నన్ను కృపా సింహసనము దగ్గరుండనీయుము
ఒక మధురమైన ఉపశమనము నీయుము,
గాయపడి, విరిగిన నా ఆత్మను స్వస్థపరచుము,
నా ఆవిశ్వాసములో సహాయము చేయుము.
రక్షకుడా ...........
66
నా ప్రియమైన స్నేహితులైన మీరు తలలు వంచియుండగా, నా జీవితములో చాలా ప్రయత్నములు చేసియున్నాను కాని అవన్నియు తప్పైయున్నాయి. దేవునితోను మరియు నా తోటివారితోనూ నేను నిజాయితీగా ఉండుటకు ప్రయత్నించాను. పరిశుద్ధాత్మ నాకు చెప్పియున్న ప్రకారము నేను చేయుటకు మరియు ఆ విధముగానే కదులుటకు ప్రయత్నము చేశాను. అందుకనే నేను ఒక స్థలము నుండి మరొక స్థలమునకు వెళ్లుచున్నాను, కూడికలు ఆపుట, మరియు స్థలములను మారుట, ఎందుకనగా నేను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెంబడించాను.
ఈ ఉదయము ఇక్కడ నేను ప్రసంగించుచుండగా... మనమొక ప్రార్ధనా వరుసను కలిగియుండబోతున్నాము, పైకి రండి, వివేచన మరియు వారితో మాట్లాడు నిమిత్తము ప్రజలను పైకి తీసుకొనిరండి. అయితే నాతో ఎదో ఇలాగు చెప్పెను, “ప్రజలతో ఈ సంగతి చెప్పుము...” ఆ కారణము చేతనే నేను అకస్మాత్తుగా ఆగిపోయాను, అది జరిగినది. ఇలాగు చెప్పెను, “ప్రజలను ఇక్కడకు పైకి పిలిచి మరియు వారితో చెప్పుము, 'వచ్చి నన్నడుగుము. వారికేదైన కొదువగా ఉంటే నేను చెప్పెదను.'”
67
ఆ చిన్న బాలిక ఏలాగు స్వస్థపడినదో తెలిసినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు, ఆ కాన్సరు ఏలాగు స్వస్థపడినదో తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఇక్కడున్న మీరు గొంతు సమస్యతో ఉన్నవారు ఏలాగు స్వస్థత పొందుకున్నారు తెలిస్తే ఆశ్చర్యపోతారు; ఈ కర్రలపై యున్న నీవు ఏలాగు స్వస్థత పొందుకున్నావో తెలిస్తే ఆశ్చర్యపోతావు; ఊతకర్రల పైయున్న నీవు స్వస్థపడి ఏలాగు బాగైనావో తెలిస్తే ఆశ్చర్యపోతావు; ఎలాగు గ్రుడ్డివారు స్వస్థపడి చూచుచున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు; ఏలాగు ఆ సమస్యలు మరియు ఒత్తిడి స్వస్థపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కుటుంబ సమస్య కలిగి ఉన్నట్లైతే: “బ్రదర్ బ్రెన్హాం, దానిని నేను ఏలాగు అధికమించగలను?” ఆయనిప్పుడే నీకు చెప్పును.
మిగతా సమస్యలు, మీరు దాని గురించి ఆశ్చర్యపోతారు, లేక మరో దాని గురించి. ఇప్పుడు నీ హృదయములో ఏది కొట్టుచున్నదో, దానిని వెంబడించుము అప్పుడు అది సరియైనదో, కాదో చూడుము. కేవలం దానిని వెంబడించుము మరియు అది సరియైనదో కాదో చూడుము. నీ మనస్సును మార్చుకోవద్దు. దానితోనే నిలబడియుండుము. ఆయనే నీతో మాట్లాడతానని చెప్పియుండెను.
ఇప్పుడు, ప్రతియొక్కరు కొద్దిసేపు ప్రార్ధనలో ఉందాము.
68
[బ్రదర్ బ్రెన్హాం బలిపీఠం మరియు మైకును వదిలిపెట్టి వేదికమీదనే ప్రజలకు ప్రార్ధించుట ప్రారంభించెను.]
పరలోకములో ఉన్న మా తండ్రి, నా సోదరుడిని దీవించుము. అతడి హృదయములో ఆశించిన ప్రతిదానిని అతడికి దయచేయుము.
నా సోదరి, ప్రియమైన దేవా, ఆమెను దీవించుము. ఈ దినమున ఆమె హృదయములో ఉన్న భారమును తీసివేయుము.
నా సోదరిని దీవించుము తండ్రి. ఆమె మీద ఆత్మ ఉండును గాక.
సోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమె హృదయములోని లోతైన ఆశలు నెరవేర్చుము.
అదేవిధముగా ఇక్కడున్న నా సోదరికి కూడా యేసు నామములో తండ్రి మాకది చేయుము.
ఈ ప్రియమైన చిన్న బాలికను చూడండి, తండ్రి, ఈ చిన్నబాలికు మీరు చేసిన సహయమును బట్టి మీకు వందనములు. కొద్దికాలము క్రితమే ఈ బాలిక విషయములో మీరు మాకు సహాయము చేసియున్నారు. నేను ప్రార్ధించగా, నీవు ఈ బిడ్డను పరిపూర్ణముగా స్వస్థపరిచియున్నావు, అది ఇతరులకు ఒక ప్రత్యక్షతగా ఉన్నది, ఆ విధముగా వారు నీయందు నమ్మకముంచుదురు. ఈ ఉదయము ఈ చిన్నబిడ్డను యేసుక్రీస్తు నామములో నేను దీవించుచున్నాను, ఆమె శరీరములో ఉన్న వ్యాధిని శపించుచున్నాను.
ప్రభువా, ఈ సోదరుడిని దీవించుము. ఇతడు కల్వరివైపు చూచుచుండగా ఇతని యొక్క విశ్వాసము ఎన్నడు విఫలము చెందకుండును గాక, నీవక్కడున్నావని యెరుగునుగాక; విశ్వాసము... అక్కడ ఏదైతే విశ్వాసమున్నదో, దేవుడే దానిని నిర్ధారించి మరియు నీ యొద్దకు తీసుకొనివచ్చును గాక.
69
బ్రదర్ మోర్గాను దీవించుము. అతడి హృదయ వాంఛను తీర్చుము. ఈ దినమున అతడేమి అడిగినను దానిని ప్రభువు నామములో దయచేయుము.
ప్రభువా, నా సోదరిని దీవించుము. యేసుక్రీస్తు ద్వారా ఆమె ఆశించుచున్న కార్యములు దయచేయుము.
తండ్రియైన దేవా, నా సోదరుడు, అతడి హృదయమందున్న ఆశలు ఫలించునుగాక.
మా సోదరుడు ఇక్కడున్నాడు, దేవుడు దీవించును, పరలోకపు తండ్రి, అతడి హృదయ వాంఛను, అతడు యేసుక్రీస్తులో తన ఆశను నెరవేర్చుకొనును గాక. ప్రభువా, మీరు చేసిన స్వస్థతను బట్టి మీకు వందనములు.
తండ్రియైన దేవా, నా సహోదరుని మీద చేతులుంచి అతని హృదయములోని ఆశ నిమిత్తము నేను ప్రార్ధించుండగా దానిని అతనికి దయచేయుము.
తండ్రీ, ఈ నా చిన్న సహోదరుని దీవించుము. తండ్రి, ఈ చిన్నబాలికను నేను ప్రభువైన యేసు నామములో దీవించుచున్నాను, ఆమె ఏదైతే తండ్రి నిన్ను అడిగినదో అది యేసు నామములో దయచేయుము.
ప్రభువా, నా సోదరిని యేసు నామములో దీవించుము.
[బ్రదర్ బ్రెన్హాం బలిపీఠము మీద ప్రజలకు ప్రార్ధించుట కొనసాగించుచున్నారు, అయితే అతడి యొక్క మాటాలు స్పష్టముగా వినిపించుటలేదు - సంపాదకుడు.]
70
సర్వశక్తిమంతుడైన దేవా, భూమి ఆకాశములను పరిపాలించువాడా, సరిచేయుటకు మానవుని హృదయములో నివసించువాడా, ఆకాశములో నక్షత్రములను మొదలైనవాటిని పెట్టినవాడా, సూర్యుని తన కక్ష్యలో పెట్టినది నీవే, అది అక్కడనే ఉన్నది. నీవు చంద్రుని ఆకాశములో పెట్టి, పైనుండి సముద్రమును చూచుటకు నీవే ఏర్పరిచియున్నావు, దానికి నీవేర్పరచిన సరిహద్దులను అది ఎన్నడు దాటలేదు. నీవు మాట్లాడియుండగా అవి లోబడియున్నాయి. ప్రభువైన దేవా, నీవు మానవుని హృదయముతో మాట్లాడియున్నావు. అది ఎల్లవేళలా మృదువుగా ఉండి మరియు పరిశుద్ధాత్మలో నానబెట్టబడి, దేవునిచేత ఆజ్ఞాపించబడిన సంగతులను మాత్రమే చేయును గాక.
పరలోకపు తండ్రి, ఈ ఉదయము ఏ యోగ్యతలేని నీ సేవకుడనైన నా హృదయముతో నీవు మాట్లాడియున్నావు. దానిని నేను ఈ ప్రజలతో చెప్పియున్నాను మరియు అది ఇక్కడున్న ప్రతియొక్కరితో ఆలాగునే చేసినది. తండ్రి, అప్పుడు నీ ప్రత్యక్షత యొక్క జ్ఞాపకాల లోతునకు నేను వెళ్ళవలసి వచ్చినది తరువాత నేను వారిమీద నా చేతులుంచాను.
తండ్రి, ఆ సమయములో నీవు వారి హృదయములలో దేనినైతే ఉంచియున్నావో, దేవా, వారక్కడే శాశ్వతమైన నిర్ణయమును కలిగియుందురు గాక, నీ యొక్క ఆత్మ ఇక్కడే ఉన్నదనే సంగతి వారికి తెలియును గాక, వారి హృదయములలో అది ఖచ్చితమైన స్థానములో పెట్టును గాక. ఒకవేళ వారు కుంటివారైనట్లయితే, వారు నడుచురు గాక. వారు గ్రుడ్డివారైనట్లయితే, వారు చూచుదురు గాక. వారు ఒత్తిడిలో ఉన్నట్లయితే, వారు సంతోషముగా ఉందురు గాక. వారు సమస్యలలో ఉన్నట్లయితే, అవి తీసివేయబడును గాక. ప్రభువా మాకది దయచేయుము. వారు ఒక నిర్ణయము తీసుకోవడానికి ప్రయత్నము చేయుచుండగా, ఇప్పుడే సరియైన నిర్ణయమునకు వారు వచ్చుదురు గాక. మాకు కావలసియున్న సంగతులన్నింటిని పరిశుద్ధాత్ముడే బయలుపరచును గాక. ప్రభువా, మాకది దయచేయుము. మేమిక్కడ వేదిక మీదన ఉన్నాము, నీ కొరకు ఎదురు చూచుచున్నాము, నిన్నే ఆరాధిస్తున్నాము.
71
తండ్రి, ఇక్కడున్నవారిలో ఇంకనూ నీవు ఎవరితోనైననూ మాట్లాడకపోయినట్లయితే, ఇప్పుడే నీ ఆత్మ దూసుకొని క్రిందకు వచ్చును గాక. అది ఈ వేదికమీద పైకి మరియు క్రిందకు కదులుతూ సమస్తమును బయలుపరచును గాక. ప్రభువా, ప్రతి హృదయమును తాకుము. ఎక్కడనూ ఏ సందేహము లేకుండునట్లు సానుకూలముగా మార్చుము. ప్రతియొక్క సంఘర్షణను నీ యొక్క ఆత్మ తీసివేయును గాక.
ఆ వెనుకన ఉన్న ఈ ప్రియమైన ప్రజలు నీచేత దీవించబడినవారు ఏ సమస్యా లేకుండా మంచిగా ఉందురు గాక, ఇక్కడ కూర్చునియున్నవారు ఆరోగ్యముతోను మరియు బలముతోను ఈ ఉదయము ఉందురు గాక. ఓ, ప్రభువా, వారు వారి సహచరులకు ప్రార్ధించుచున్నారు. వారికి ఒకేవిధమైన సమస్యలున్నాయి, నీవు వారికి సహాయము చేసియున్నావని వారికి తెలుసు.
తండ్రి, మేమందరము ఏక ఆత్మతో ప్రార్ధించునప్పుడే నీవు నీ ఆత్మను పంపి మరియు సమస్తమును రుజువుపరచుదువు. ప్రభువా, ఇప్పుడే, ప్రతి హృదయము, నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమునకై మేమందరము విధేయతతో ఎదురు చూస్తున్నాము, కదులుచున్నాము, ఏది సరియైనదని మేము అనుభూతి చెందుచున్నామో దానిని చేస్తున్నాము. ప్రభువా, మాకది దయచేయుము.
72
మన తలలు వంచియుండగా, ప్రతియొక్కరు ప్రార్ధనలో ఉండుము, మనము కొన్ని పాటలు పాడబోవుచున్నాము. అలసినట్లుగా ఉండవద్దు. నేను మూఢుడిని కానని మీకు తెలుసు. నేను మూఢుడిని కానని నాకును తెలుసు. అయితే నాతో ఏదో ఖచ్చితముగా మాట్లాడి ఇలాగు చెప్పినది, “నీవు వారిని పైకి పిలువుము నేనే వారితో మాట్లాడుదును.” ఆయన నాకేం చెప్పియున్నాడో అదే నేను చేశాను.
ఇప్పుడు, మనమందరము తలలు వంచియుండగా, పాటలు పాడుదాము, ఆయనేం చెప్పునో చూద్దాం. ఆయన నీకేం చెప్పినను, అది ఆయనే మాట్లాడుచున్నాడు. మనము ఆ వెలుగులో నడుచుచున్నాము, అది ఎంతో అందమైన వెలుగు, మెరయుచున్న కృపా అనే మంచుబిందువులలో నుండి వచ్చిన వెలుగది, ఆ వెలుగు దివారాత్రములు మన మీద వెలుగుచున్నది, యేసే ఈ లోకమునకు వెలుగైయున్నాడు. మనము మృదువుగా పాడుచుండగా, ప్రతియొక్కరు ప్రార్ధనలో ఉందాము.
మనము ఆ వెలుగులో నడుద్దాం, అందమైన వెలుగది,
మెరయుచున్న కృపా అనే మంచుబిందువులలో నుండి వచ్చిన వెలుగది,
ఆ వెలుగు దివారాత్రములు మన మీద వెలుగుచున్నది,
యేసే ఈ లోకమునకు వెలుగైయున్నాడు.
మనము ఆ వెలుగులో నడుద్దాం, అందమైన వెలుగది,
మెరయుచున్న కృపా అనే మంచుబిందువులలో నుండి వచ్చిన వెలుగది,
ఆ వెలుగు దివారాత్రములు మన మీద వెలుగుచున్నది,
యేసే ఈ లోకమునకు వెలుగైయున్నాడు.
మనము ఆ వెలుగులో (ఏ వెలుగది?
ఆయనే దానిని ఇప్పుడిస్తున్నాడు) నడుద్దాం, వెలుగు,
మెరయుచున్న కృపా అనే మంచుబిందువులలో నుండి వచ్చిన వెలుగది,
ఆ వెలుగు దివారాత్రములు మన మీద వెలుగుచున్నది,
యేసే ఈ లోకమునకు వెలుగైయున్నాడు.
వచ్చి ఆయనే రాజని ఒప్పుకొనుము,
యేసే ఈ లోకమునకు వెలుగైయున్నాడు,
అప్పుడు పరలోకపు గంటలు మ్రోగెను,
యేసే ఈ లోకమునకు వెలుగైయున్నాడు.
మనము ఆ వెలుగులో నడుద్దాం, అందమైన వెలుగది,
మెరయుచున్న కృపా అనే మంచుబిందువులలో నుండి వచ్చిన వెలుగది,
ఆ వెలుగు దివారాత్రములు మన మీద వెలుగుచున్నది,
యేసే ఈ లోకమునకు వెలుగైయున్నాడు.
మనము ఆ వెలుగులో నడుద్దాం, అందమైన వెలుగది,
మెరయుచున్న కృపా అనే మంచుబిందువులలో నుండి వచ్చిన వెలుగది,
ఆ వెలుగు దివారాత్రములు మన మీద వెలుగుచున్నది,
యేసే ఈ లోకమునకు వెలుగైయున్నాడు.