యాయీరు ఒక రహస్య విశ్వాసి
ఆలస్యముగా వచ్చినందుకు నేను చింతించుచున్నాను, అయితే నేను బయట ఆపివేయబడ్డాను, మరియు నేను లోనికి రాలేకపోయాను. ఈ ఒక్కసారి నేను కూడికకు లోనికి రాలేకపోయాను. ఓ, ఎవరో లోనికి లాగి గేటును మూసివేశారు, మరియు ఎవరైనా దానిని తీయు వరకు మనము బయటకు వెళ్ళలేము.
ప్రభుని యొక్క సేవలో ఈ రాత్రి ఇక్కడ యుండుటను బట్టి, ఈ బయటయున్న చక్కని ప్రజలందరిని బట్టి మనము కృతజ్ఞులము మరియు ఈ రాత్రి ఆయన యొక్క రాజ్యము కొరకు గొప్ప రాత్రిగా యుంటుందని నేను నమ్ముచున్నాను, అనేక మంది రోగులైన ఆయన పిల్లలు ఈ రాత్రి బాగుపడుదురు గాక, అనేక మంది అవిశ్వాసులు, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తూ మరియు వారి పాపములకు క్షమాపణ పొంది విశ్వాసులుగా మారుదురు గాక.
ఇప్పుడు మనము ముందుకు వెళ్ళకముందు మనం ఒక్క మాట ప్రార్ధనలో మన రాజుతో మాట్లాడుచుండగా మనము తలలు వంచుదాం.
మా పరలోకపు తండ్రి, మేమంతా ఏకముగా ప్రభువు యొక్క రాకడలో ఈ వైపున కూడుకొనే ఆధిక్యతను నీవు మాకు ఇచ్చినందుకు మేము కృతజ్ఞులము, ఆయన ఎప్పుడు మహిమలో ప్రత్యక్షమౌతాడో మాకు తెలియదని గ్రహించుచున్నాము, అయితే ఇది మేము ఎరుగుదుము: ఈ మర్త్యమైన జీవితము ఆగిపోయిన తరువాత, ఈ తెరకు ఆవల చేతులతో చేయబడని ఒక గుడారము మా కొరకు ఎదురుచూస్తున్నదన్న ధన్యమైన వాగ్ధానమును మేము కలిగియున్నాము.
దేవుడు మన కొరకు ఒక మంచి గుడారమును సిద్ధపరచియున్నాడు, అందులో అక్కడ రోగుల కొరకు ఎన్నడూ ప్రార్ధన చేయుట ఉండదు. ఒక పాపికి అక్కడ ఎన్నడూ ప్రార్ధన చేయుట యుండదు. అప్పుడు ఈ మర్త్యమైనవి మరియు భూసంబంధనమైనవి గతించిపోతాయి. మేము ఇక్కడ యుండియుండగా మాలో మేము మా విడుదల కొరకు ఆత్మలో మూలుగుచున్నాము. తండ్రీ, యాత్రికులుగా మరియు పరదేశులుగా, మేము ఈ లోకసంబంధులము కాదని క్రీస్తు మమ్ములను బయటకు పిలిచియున్నాడని, ఆయన కొరకు ఎన్నుకొని యున్నాడని మేము చెప్పుకొనుచున్నాము. ఆయన వర్తమానమును మోయు ఈ అవకాశమును బట్టి మేము కృతజ్ఞులము.
ప్రభువైన యేసు, ఈ రాత్రి త్వరగా మా యొద్దకు రండి. నీ ప్రియమైన సొంత చేతులలోనికి ఈ కూడికను తీసుకొని మరియు మా అవసరములను మాలో ప్రతి ఒక్కరికి పరిచర్య చేయుము, యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
2
ఇప్పుడు, ఈ సాయంకాలము ప్రభువైన యేసును గూర్చి మనము మాట్లాడు చుండగా... గత రాత్రి మనము బహు అద్భుతమైన సమయమును కలిగియున్నాము. కూడిక యొక్క ప్రారంభములో, ఆ రీతిగా గొప్ప విశ్వాసమును మనము అరుదుగా కనుగొంటాము. అయితే ఇది కొంచెము భిన్నముగా కనబడుచున్నది. మనము గొప్ప ఆరంభమును కలిగియున్నాము, మరియు దానిని బట్టి మనకు సంతోషము. అదే విశ్వాసము కొనసాగుతుంది, వచ్చుచున్న దినములలో మన ప్రభువు ఏమిచేయనై యున్నాడో దానిని చెప్పుట కష్టము.
రేపు మధ్యాహన్నము ఈ పట్టణములోని ఆడిటోరియంలో వారు కూటమును జరిగించవలసియున్నది. బహుశ అది ఎక్కడో దానిని ఎరిగిన సోదరుల ద్వారా ఇది వరకే అది ప్రకటించబడియున్నది, మరియు రేపు రక్షణ పొందని వారిని బయటకు తోడుకొనిరండి.
మరియు ప్రతి సంఘము, సమయము... ఆదివారము రాత్రి గాని లేక ఆదివారము ఉదయము గాని మనము కూటము పెట్టము, ఎందువలననగా అది పట్టణములోని ఇతర కూడికలకు ఆటంకము కలిగిస్తుంది, ఏ కూడికకు మేము ఆటంకము కలిగించము. దేవునిని సేవించు ఎవరైనా, ఆదివారము ఉదయములు గాని, లేక రాత్రులుగాని, వారి యొక్క సొంత సంఘములో వారి విధి నిర్వహణ వద్ద వారు ఉండవలెనని మేము నమ్మతాము.
ఇక్కడయున్న సందర్శకులైన మీరు, మీకై మీరు ఇక్కడయున్న కొన్ని సంఘములను దర్శించండి. మిమ్ములను మీరు ప్రజలకు తెలియపరచుకోండి. ఈ సమాజము చూట్టూయున్న దేవుని పరిశుద్ధులతో పరిచయము కండి, మరియు రేపు మధ్యహాన్నము కూడికకు రండి. మరియు రేపు రాత్రికి మీ సొంత సంఘములలో మీ విధి నిర్వహణనొద్ద యాధావిధిగా హాజరుకండి.
ఇప్పుడు, ఈ రాత్రికి, మొదటి కొన్ని రాత్రులు ఈ రీతిగా పది రాత్రులు మనము దీర్ఘకూడికలను కలిగియున్నప్పుడు.... మన కూడికలు అరుదుగా మూడు రాత్రులు జరుగుతాయి, మూడు నుండి ఐదు రాత్రులు సరిగ్గా మితముగానే యున్నది. అయితే ఈ విషయములో ఈ గొప్ప మైదానము ఇక్కడ యున్నది, మరియు వివిధ జాతులతో నివసించుచున్న ఈ పట్టణము యొక్క కేంద్రము అంత పెద్దది కాదు, అది దరిదాపుగా, ఎవరో నాకు చెప్పియున్నారు, అది డెబ్బై-ఐదు-వేలు ఉంటుందని ఊహిస్తు౦న్నాను. కాబట్టి మనకు తగినంత స్థలము యుంటుంది.
3
నేను ఎల్లప్పుడు, నా కూటములను ఇంకా చిన్నవిగా ఉంచుతాను, కారణము, కూటపు ఖర్చులను చెల్లించుటకు నేను కానుకలు కొరకు అడుక్కోవలసిన పనిలేదు. ఆ రీతిగా నాకు సహాయము చేయుచున్నందుకు ఆ ఒక్క విషయములో నేను ప్రభువైన యేసులో అతిశయిస్తాను. రేడియో కార్యక్రమము లేక టెలివిజన్ కార్యక్రమము లేక అలాటిది నేను చెల్లించుటకు ఏదియు నాకు లేదు.
నేను కేవలము వచ్చి మిమ్మును దర్శిస్తాను, మరియు మనము కలిగియున్న చిన్న ఖర్చులు తిన్నగా మనము చెల్లించి వేస్తాము. మరియు ప్రజలు డబ్బు కొరకు అడుక్కోనుటను నేను ఎన్నడూ అనుమతించను, మనము ఎంత వరకు అప్పులోనికి వెళ్ళినప్పటికి లెక్క కాదు, వారు దానిని చేయలేరు. మా మేనేజరు ఎన్నడైనా అడుక్కోనుచూ కనబడ్డాడా, గతసారి కూడా ఆయన ఈ కూటములకు మేనేజర్‌యై యున్నాడు, ఏలయనగా మేము ప్రజల యొక్క డబ్బును తీసుకోము. మేము ఇక్కడ యున్నది మీకు సహాయపడుటకు, మీకు ఏదైనా తెచ్చుటకు ఇక్కడ యున్నాము, మరియు మీరు మాకు ఒక దీవెనగా యున్నారు, మరియు మేము మీ డబ్బు కొరకు రాము, మరియు ప్రపంచమంతట దానిని మేము శుద్దముగా మరియు తేటగా యుంచుటకు ప్రయత్నిస్తాము.
ఇప్పుడు, మేము కూటమును, ప్రభుని చిత్తమైతే, ఒక వారమునకు ఆదివారమునకు ముగిస్తాము, మరియు తరువాత గురువారము, స్విట్‌జర్ లాండ్ వెళతాను, మరియు తరువాత స్విట్‌జర్ లాండ్ నుండి బహుశ జర్మనీలోని ప్రాంక్‌ఫర్ట్‌కు, మరియు తరువాత అక్కడ నుండి ప్రభుచితమైన స్వీడన్‌కు, మరియు మరలా తిరిగి కెనడా గుండా కూటములను కొనసాగించుటకు అమెరికా వస్తాము.
4
ఇప్పుడు, మీ ప్రార్ధనలను మేము అభినందిస్తున్నాము. ప్రార్ధన పరిస్థితులను మార్చి వేస్తుంది. అక్కడ దేవుని యొక్క మనుస్సును మార్చునది ఒక్కటి మాత్రమే అక్కడ యున్నది, మరియు ప్రార్ధనైయున్నది. అయితే దేవుడు ఏదైనా చెప్పగలడు, మరియు ప్రార్ధన దానిని మార్చగలదు, అది గొప్ప ఆలోచన, అయితే అది సత్యమై యున్నది.
అది లేఖనములో ఆయన చేసియున్నాడు, ప్రవక్తయైన యెషయా, హిజ్కియా నొద్దకు వెళ్ళి, ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,'' మీరు ఊహించగలరా, (ఒక నిజమైన ప్రవక్త), ''అతడు అక్కడే చనిపోవబోవుచున్నాడని, అతని పడక మీద నుండి పైకి లేవడని, వెళ్ళి హిజ్కియాతో చెప్పుము.''
కాబట్టి యెషయా వెళ్ళి ఇలా చెప్పాడు, ''యెహోవా ఈలాగు సెలవిచ్చున్నావు, నీవు ఎక్కడయున్నావో అక్కడనే తిన్నగా నీవు చనిపోవబోవుచున్నావు, నీ పడక మీద నుండినీవు పైకి లేవవు.''
మరియు ప్రవక్త వెళ్ళిపోయినపుడు... అతడు బయటకు వెళ్ళిపోవుచుండగా బయట నిలబడియున్న ఘనులు ఇలా చెపుతున్నారు, వారన్నారు, ''ఓ, దేవుని ప్రవక్త, మా ప్రియమైన రాజు సంగతి ఏమిటి?''
''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు పడకమీద నుండి పైకి లేవడు.''
ముందు బయట ఆవరణములోనికి వెళ్ళుచుండగా సైనికులు అడుగుచున్నారు, ''ఓ, దేవుని ప్రవక్త, మా రాజు సంగతి ఏమిటి?''
''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు పడకమీద నుండి పైకి లేవడు.''
బయట యున్నపేద ప్రజలు అడుగుచున్నారు: ''ఓ, దేవుని ప్రవక్త, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని మేము నమ్ముదము. మా రాజు సంగతి ఏమిటి? ఆయన యొక్క అంతమేమైయున్నది?''
''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: అతడు తన పడక మీద నుండి పైకి లేవడు. అతడు తిన్నగా తన పడక మీదనే చనిపోవబోవుచున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.''
5
అతడు బయటకు తన చిన్న పూరి పాకలోనికి వెళ్ళాడు, వృద్ధుడైన హిజ్కియా దేవుని వైపు తిరిగి మాట్లాడుట ప్రారంభించాడు, ''ప్రభువా నీవు నన్ను కనికరించుమని బ్రతిమాలుచున్నాను, ఏలయనగా పరిపూర్ణమైన హృదయముతో నేను నీ ముందర నడిచియున్నాను.'' అది ఒక పెద్ద మాట, కాదంటారా? అలాటి సాక్ష్యము, ''నేను పరిపూర్ణమైన హృదయముతో నేను నీ ముందర నడిచాను.'' మరియు అతనికి 15 సం॥లు ఆయుష్షు అవసరమై యున్నది.
ఇప్పుడు ఇశ్రాయేలు దేశమంతటిలో భూసంబంధముగా లేక రాజకీయ సంబంధముగా మాట్లాడుచున్నాను, రాజు ఒక ఉన్నతమైన వ్యక్తియై యున్నాడు; ఆ అతి గొప్ప వ్యక్తి, రాజకీయముగా మాట్లాడుచున్నాడు, అతడు రాజుల రాజుతో మాట్లాడుచున్నాడు.
ఇప్పుడు, రాజుల రాజు అతనితో ఏమియు మాట్లాడునట్లుగా కనబడలేదు. ఆయన అతనితో మాట్లాడియున్నాడు, అయితే అది నిజముగా ఋజువు చేస్తుంది, ఆయన అతనితో మాట్లాడుచున్నాడు. అయితే దేవుడు కార్యములను చేయుటలో తన సొంత పద్ధతులను మార్గములను కలిగి యున్నాడు. మరియు అతడు ప్రవక్త యొద్దకు వెళ్ళుటకు బదులుగా, ఆయన ప్రవక్తతో అంటున్నాడు, ''ఇప్పుడు, నేను అతని ప్రార్ధనను అంగీకరించియున్నానని నీవు అతనితో చెప్పుము, మరియు 15 సం॥ల ఆయుష్షును నేను పొడిగించెదను.''
6
అది ఏ స్ధితిలో యెషయాను ఉంచినదో మీరు ఊహించగలరా? అతడు తిరిగి మరలా గేటు గుండా వచ్చుచున్నాడు: ఇలా సైనికులతో తిన్నగా చెప్పుచున్నాడు, ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: అతడు జీవించబోవుచున్నాడని చెప్పుచున్నాడు.'' ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: అతడు జీవించబోవుచున్నాడని'' ఘనులతో చెప్పుచున్నాడు. ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: అతడు జీవించబోవుచున్నాడు''.
మంచిది, నేను ఊహించగలను, '' ఈయన ఎలాటి ప్రవక్త,'' అని వారన్నారు.
అంత పెద్ద తేడా ఏమిటి? ప్రార్ధన: మరణము నుండి జీవమునకు మార్చినది. ఈ రాత్రి పాపికి అది దానిని చేస్తుంది: మరణము నుండి జీవములోనికి. ఈ రాత్రి అది ప్రతి రోగికి దానిని చేస్తుంది: రోగము నుండి ఆరోగ్యములోనికి. ప్రార్ధన పరిస్ధితులను మార్చుతుంది. కాబట్టి ఎల్లప్పుడు దానిని మనస్సులో యుంచుకోండి. ఎడతెగకుండా ప్రార్ధన చేయండి.
ఈ కూటమునకు నీవు ఒక అభ్యతంరముగా ఉండగోరినట్లైతే, ప్రార్ధన చేయవద్దు. ఈ కూటమునకు గొప్ప సహాయముగా నీవు ఉండగోరియున్నట్లైతే.... అది డబ్బు రూపములో కాదు. ఈ ఉదయము ఇక్కడ అతి గొప్ప సహాయముగా నీవు యుండవచ్చు, ఎలాగంటే ప్రతిరోజు ఒక గంట లేక రెండు గంటలు ప్రక్కకు పెట్టి ఈ కూటము కొరకు ప్రార్ధన చేయుము.
నీ హృదయములో దేవుడు భారము ఉంచినట్లైతే, బయటకు వెళ్ళి ఎవరినైనా దర్శించి వారిని కూటమునకు తీసుకొనిరమ్ము. వారులోనికి వచ్చినపుడు, వారు రక్షణ పొందనట్లైతే, వారు స్వస్థత పొందనట్లైతే, అప్పుడు వారి రక్షణ కొరకు మరియు వారి స్వస్థత కొరకు ప్రార్ధన చేయుము... వారు రోగులుగా యుండి వారికి స్వస్ధత అవసరమైయున్నట్లైతే, వారి కొరకు ప్రార్ధన చేయుము. అది ఏ కూటమునకైనా నీవు అతి గొప్పగా యిచ్చు సహాయము, అదే ఈ ఇబ్బంది తరుణములో దేవునిని వెదికి ప్రార్ధించుటయే అతి గొప్ప సహాయము.
7
ఇప్పుడు, వాక్యములోనికి వెళదాము.... మనము ఎరిగియున్నట్లుగా నా మాటలు బలహీనమైనవి, ఎందుకంటె అది ఒక మనిషి మాటలై యున్నందున, అయితే ఆయన మాట, దేవుని యొక్క నిత్యమైన మాటయైయున్నందున, అప్పుడు అవి తప్పిపోలేవు. నా మాటలు ఎంత త్వరగా తప్పిపోవాలో అంత త్వరగా తప్పిపోతాయి (నేను కేవలము ఒక నరమాత్రుడను)... మీ మాటలవలె, అయితే దేవుని మాటలు తప్పిపోవు. అవి గ్రంధములో వ్రాయబడినవి.
ఇప్పుడు, మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనము ప్రారంభము నుండి, వాక్యము మీద మనము మాట్లాడకమునుపు, లేఖనములోని ఒక భాగమును మనము చదువుదాము, ఏలయనగా, ''వినుట ద్వారా విశ్వాసము కలుగును, అది దేవుని వాక్యము వినుట ద్వారా.'' ఇప్పుడు ఆయన వాక్యమును చదువుదాము, నా మాటలు తప్పిపోవచ్చును, కాని కూటము తప్పిపోదు, ఏలయనగా అది తిరిగి ఆయన వాక్యమునకు వెళుతుంది, మరియు ఆయన వాక్యము అది ఉద్ధేశించిన దానిని నెరవేర్చును... దేనికొరకు ఉద్ధేశించబడినదో.
యేసు ఇక్కడ మాట్లాడుచున్నడు:
''ఆయన ఇంకనూ మాటలాడుచుండగా, సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి?
యేసు వారు చెప్పిన మాటలు విని - భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను.
ఇప్పుడు, చదబడిన వాక్యమునకు ఆయన తన దీవెనలను చేర్చును గాక.
8
ఇది కొంచెము ఎక్కువ లేక తక్కువగా విశ్వాసపు వర్తమానమై యున్నందున, ఇది రెండవ శ్రేణిలో, దైవిక స్వస్ధతను గూర్చి ఒక విశ్వాసపు వర్తమానముయైయున్నది. ఈ కూటముల యొక్క మన మొదటి ఉద్ధేశ్యము కొన్ని నశించిన ఆత్మలను రక్షించుటయై యున్నది. ఒక శరీరము, వారు ఎంత రోగులుగా యున్నటికి, వారు ఎంతగా మంచము పట్టినప్పటికి లెక్క కాదు, ఈ రాత్రికి వారు సంపూర్ణముగా స్వస్ధత నొందినప్పటికి లెక్క కాదు, ఒక దినమున వారు తప్పక చనిపోవలసియున్నది. అయితే అమర్త్యమైన ఆత్మ, అది స్వస్ధతనొందినపుడు శాశ్వతముగా జీవిస్తుంది.
దైవిక స్వస్ధత... అనేక సార్లు స్వస్ధతా కూటములు, భౌతికమైన స్వస్ధత మీదనే ఎక్కువ వత్తిడి చేయుచున్నట్లు చెప్పబడియున్నది. మీరు గమనించినట్లైతే, యేసు యొక్క పరిచర్యలో ఎనబై-శాతము దైవిక స్వస్ధతయై యున్నది. అయితే దైవిక స్వస్ధత గాలపు ముల్లు మీద నున్న ఎరవలె యున్నది. నీవు చేపకు గాలపు ముల్లును చూపెట్టవు కాని, దానికి ఎరను మాత్రమే చూపుతావు, ఆ రీతిగా అది ఎరను తిని గాలములో పడుతుంది. కాబట్టి, దైవిక స్వస్ధతను గూర్చి మనము తలంచునది అదియే.
ఆయన సన్నిధి పట్ల పాపులు స్పృహ కలిగియుండునట్లుగా, దేవుడు సంఘములో గొప్ప సూచక క్రియలను, అద్భుతములను నియమించియున్నాడు. భాషలతో మాట్లాడు వరము ద్వారా. అది నమ్మువారికి కాదు, అయితే అది నమ్మని వారికి, చూశారా, అవి అవిశ్వాసులకు సూచనలైయున్నవి, మరియు ఈ దినమున మనము ఎందరో అవిశ్వాసులను కలిగియున్నాము.
9
ఆఫ్రికా దేశములో, ఇండియా దేశములో, మరియు ప్రపంచములోని అనేక దేశములలో నేను బోధించియున్నాను, అయితే నేను మాట్లాడిన అతిహీనమైన అవిశ్వాసులు ఎవరనగా, అది సువార్తను ఎన్నడు వినని వ్యక్తీ కాదు; అది ఎవరనగా తన సొంత మార్గములో కేంద్రీకృతమై స్వార్ధపరుడుగా దేవుని మాటను వినని వ్యక్తియే. అలాటి నీచమైన వర్గము వారితోనే మాట్లాడుట కష్టము, ఏలయనగా ఎంతగా కేంద్రీకరింపబడి యుంటారనగా చివరకు వారిని ఏదియు కదిలించినట్లు కనబడదు. వారంటారు, ''నాతో మాట్లాడవద్దు, నేను దానిని నమ్మను.''
ఈ మధ్యకాలములోనే ఒక మనిషి నాతో ఇలా అన్నాడు, ''బ్రదర్ బ్రన్హం , నేను దైవిక స్వస్ధతను నమ్మను.''
నేనన్నాను, ''సరే, అది నీ కొరకు కాదు, అది విశ్వాసుల కొరకై యున్నది. అది నమ్మువానికి, అది వారి కొరకే, ఆది నుండియూ అది అవిశ్వాసుల కొరకై యుండలేదు.'' నేనన్నాను, ''కాబట్టి దాని నుండి నీవు ఏ లాభములను పొందలేవు. దానిని గూర్చి ఏమియూ నీవు కలత పడవద్దు.“
అతడన్నాడు, ''వ్యాధి దేవుని మహిమ కొరకై యున్నది.''
నేనన్నాను, “అది వింతగా యున్నది, నీ భార్యకు వచ్చు ఎడతెగని కడుపు నొప్పిని బట్టి: నీ భార్యకు ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు తప్పక ఆమె మహిమను నీవు కత్తిరించావు.” కాబట్టి ఆ రీతిగా మాట్లాడు ప్రజలతో ఏదో తప్పు యున్నది. ప్రజలు రోగులగుటను బట్టి దేవుడు మహిమ పొందడు. నీవు స్వస్థత పొందాలని దేవుడు కోరుచున్నాడు.
మన ధన్యమైన బైబిలు చెప్పియున్నది, ''అన్నిటికి పైగా మీరు ఆరోగ్యవంతులుగా వర్ధిల్లాలని నేను కోరుచున్నాను.'' అది లేఖనమై యున్నది. కాబట్టి, మనము దానిని కాదనలేము.
10
ఇప్పుడు విశ్వాసము కలిగియుండుటకు గాను, విశ్వాసము ఒక ఆధారమును కలిగియుండ వలసియున్నది. ఏదో వదులుగా మరియు క్రూరముగా విశ్వాసమును నీవు ఉండనియ్యలేవు. విశ్వాసము దానికై అది విశ్రమించవలసియ్నున్నది, మానవుని తర్కమను ఎగిరిపడు ఇసుక మీద కాదు. విశ్వాసము దేవుని వాక్యమనే నిశ్చలమైన బండపై ఆధారపడి యుంటుంది. విశ్వాసము తిన్నగా దేవుని వాక్యము మీదనే విశ్రమిస్తుంది.
ప్రభువు ఆ రీతిగా చెప్పియున్నట్లైతే, అప్పుడు అది దానిని సర్దివేస్తుంది. అది కదల్చబడదు. పురుషులారా, కొన్ని సార్లు వారు దేనినైనా ఎంతో యదార్ధముగా వివరించగలరు మరియు ఎంతో యదార్ధముగా చిత్రీకరించగలరు, అయితే ఇంకనూ విశ్వాసము దానివైపు ఎన్నడు చూడదు, ఒకవేళ అది దేవుని వాక్యమునకు విరుద్ధముగాయ్నుట్లైతే, అది తిన్నగా దేవుని వాక్యము వైపునకు చూస్తుంది.
''నిన్ను స్వస్ధపరచు యెహోవాను నేనే,'' అని ఆయన చెప్పినపుడు నీవు దానిని నమ్ముతావు, ఏలయనగా దేవుడు ఆ రీతిగా చెప్పాడు. మరియు మనము దానిని నమ్ముతాము, కారణము దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు.
11
ఇప్పుడు, మోషే దినములలో, ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు దేవుడు మోషేను పంపినపుడు, ఇశ్రాయేలు ప్రజలను అతడు విడిపించుటకు ముందు... మొదట ఫరో... యేసేపును ఎరుగని ఒక ఫరో అక్కడ లేచియున్నాడు, అతడు చురుకైన ఫరో, ఐగుప్తీయులు వేదాంతమంతటిలో తర్ఫీదు పొందిన వ్యక్తి, చురుకైన వాడు, తెలివైనవాడు, అయితే అతడుకలిగియుండలేదు... అతడు మంచి తర్కమును కలిగియున్నాడు, అయితే అతడు దేవుని వాక్యమును కలిగియుండలేదు.
ఇప్పుడు, అతడు దానిని శాస్త్రీయముగా తర్కము చేసి ఇలా అన్నాడు, ''ఇక్కడ చూడండి, వారందరూ విస్తరించిపోవుచున్నారు. వారు మనకంటే ఎక్కువ పొదుపుగల ప్రజలుగా యున్నారు; వారు అతి చిన్న ఆదాయముతో జీవించగలరు, మరియు వారు సమకూడుచున్నారు మరియు విస్తరించుచున్నారు. కాబట్టి, మనము దీనిని తప్పక వెంటనే ఆపివేయాలి, మగవారిలో చిన్న పిల్లలందరినీ మనము చంపివేద్దాము, అప్పుడు వారిక ఉండరు. వారు అంత త్వరగా ఎదగరు.
ఒక వేళ ఫరో.... అతడన్నాడు, ఒక యుద్ధము రాగలదు మరియు అలాటి యుద్ధము సంభవిస్తే, అతడన్నాడు, ''అప్పుడు వారు మన శత్రువులతో చేరి మరియు మనకు వ్యతిరేఖముగా పోరాడుతారు. వారు మనకంటే అప్పుడు గొప్పవారుగా యుంటారు మరియు మనకంటె శక్తిగలవారుగా యుంటారు.''
12
ఇప్పుడు, అతని తర్కము నిజమైయున్నది, శాస్త్రీయముగా నిజము, అయితే ఫరో ఎక్కడ తన పొరపాటును చేశాడనగా, దేవుడు వారికి గొప్ప వాగ్ధానమును ఇచ్చియున్నాడని మరియు వారిని ఎలాగైనా బయటకు తేగలడన్న సంగతిని అతడు దేవుని వాక్యములోకి చూడలేకపోయాడు.
విజ్ఞానము ఏమి చెప్పినప్పటకి లెక్కకాదు, తర్కము ఏమి చెప్పినప్పటికి లెక్క కాదు, అది దేవుని వాక్యము యొక్క ఆధారముపై యుండనియెడల, దానిని విన్న వ్యక్తి పట్ల నేను నిశ్చయముగా చింతిస్తాను. కాబట్టి, అందుచేత, విశ్వాసము తర్కము మీద విశ్రమించదు, అది దేవుని వాక్యము మీద విశ్రమిస్తుంది, దేవుడు ఏమి చెప్పియున్నాడో దానిమీద విశ్రమిస్తుంది.
13
ఇప్పుడు, మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు ముందుకు వెళ్ళెను.... ఫరో నుండి భిన్నముగా వున్న వ్యక్తియైయున్నాడు మోషే, ఫరో దానివైపు శాస్త్రీయముగా చూశాడు, అది సరే, అయితే శాస్త్రీయముగా యున్నది సరిగా యున్నను, అది దేవుని వాక్యమునకు భిన్నముగా యున్నట్లైతే, దానిని నీవు నమ్మవద్దు. అది దేవుని వాక్యమై యున్నట్లైతే, దానిని బట్టి దేవునికి వందనములు.
ఉదాహరణకు వైద్యుల, వైద్యశాలలు. కొందరు మనము వైద్యులను తప్పక కలిగియుండ రాదు అని అంటారు. మనకు వైద్యశాలలు వద్దు, మరియు ఆపరేషన్లు తప్పక మనకు వద్దు అని అంటారు. నేను దానితో సమ్మతించను. వైద్యశాలలను బట్టి, వైద్యులను బట్టి మరియు ఆపరేషన్లను బట్టి నేను కృతజ్ఞుడను. ఇక్కడకు నన్ను మోసికొని వచ్చిన కారును బట్టి నేను కృతజ్ఞుడను, అయితే, ఏ సమయములోనైనా, దేవునికి వ్యతిరేఖముగా అది పనిచేసినట్లైతే, నేను వాటితో వెర్రివాడిని కాను, అంతవరకే. అవి దేవునితో పనిచేస్తున్నప్పుడు, అవి దేవుడు మనకు ఇచ్చిన సహజమైన దీవెనలు.
మనము ధరించు వస్త్రములు, చెప్పులు కంటె మనము వాడు మంచి బూట్లు, మరియు వట్టి కాళ్ళతో వెళ్ళుట కంటే అది ఎంతో మంచిది. మనము ధరించు టోపీలు మరియు అలాంటివన్నియూ, మంచి చెడ్డల వృక్షము ఉత్పత్తి చేయక ముందు మనము కలిగియున్నవి వాటికంటె మంచివి; మరియు దానిని బట్టి దేవునికి వందనములు, ఎవరికైనా సహాయపడుటలో వెళ్ళే ప్రతి శాస్త్రీయ పరిశోధనను బట్టి మనము కృతజ్ఞులము.
14
కారణము, నా ప్రియమైన స్నేహితుడా, దీనిని గుర్తించుకో, ఏ మందు లేక ఏ వైద్యుడు లేక ఏ వైద్యశాల ఎన్నడూ ఇది వరకు ఎన్నడూ ఒక వ్యక్తిని స్వస్ధపరచలేదు మరియు ఎన్నడూ ఒక వ్యక్తిని స్వస్ధపరచజాలదు. ఈ ప్రపంచములోయున్న ఏ మందు నిన్ను స్వస్ధపరచలేదు. వైద్యుని అడగండి, వారు స్వస్ధపరచువారని చెప్పుకొనరు. మాయో సోదరుల ద్వారా రెండు సార్లు నేను ఇంటర్వ్యూ చేయబడ్డాను. వారన్నారు, ''మేము స్వస్ధపరచేవారమని చెప్పుకొనము. మేము కేవలము ప్రకృతికి సహాయపడుచున్నామని మాత్రమే చెప్పుకొంటాము. ఒకే స్వస్ధపరచువాడు యున్నాడు, అది దేవుడు.''
అది ఎంత సమాన్యాముగా యున్నదో చూడండి. ఈ రాత్రి ఈ వేదిక మీద నా చెయ్యి కోసుకొన్నట్లైతే, ఆ కత్తి గాటును స్వస్ధపరచే ఏ మందు వారి యొద్ద ప్రపంచములోనే లేదు. అతి తీవ్రమైన జలుబు వ్యాధిని తాము స్వస్ధపరచుతామని బరోస ఇచ్చే ఏ మందు మనయొద్ద లేదు. ప్రతి సంవత్సరము, వైద్యులతో సహా వేలమంది తీవ్రమైన జలుబు వ్యాధితో చనిపోవుచున్నారు, చూచారా.
పెన్సిలిన్ మందు, సల్ఫా మందులు స్వస్థపరచేవి కావు. దేవుడు స్వస్ధపపరచుచుండగా అవి కేవలము ప్రకృతికి సహాయపడుచున్నవి. ఉదాహరణకు కత్తితో నా చేయి తెగింది, ఈ రాత్రి కత్తితోనేను నా చేతిని కోసుకొన్నానను కొందాము, ఈ ప్రపంచములోని వైద్యులందరూ దానిని స్వస్ధపరచుటకు ఏమియూ చేయలేరు.
ఇప్పుడు, వారు దానిని టించర్ మరియు మెర్తియోలేటుతో దానిని శుద్ధి చేయుదురు, మరియు నాకు పెన్సీలిన్ ఇస్తారు, మరియు ఆ రీతిగా చేస్తారు, అయితే వారు దానిని స్వస్థపరచలేరు, ఏలయనగా ఏ మందు కూడా టిష్యూను నిర్మించలేదు. దేవుడు ఒక్కడు మాత్రమే సృష్టికర్తయై యున్నాడు.
15
ఇప్పుడు, వారు కలిగియున్నట్లైతే, నా చేతి మీద కత్తితో తెగిన గాయమును మాన్పు మందును వారు కలిగియున్నట్లైతే, నా కోటులోని కత్తి గాటును అది స్వస్ధపరుస్తుంది, ఈ బల్ల మీద యున్న కత్తి గాటును కూడా అది మాన్పుతుంది. అది కత్తి గాటును స్వస్ధపరచినట్లైతే, ఆ కత్తిగాటు ఎక్కడ యున్నప్పటికి అది మాన్పుతుంది... ఒక వేళ కత్తి గాటును మందు స్వస్ధపరచితే.
ఇప్పుడు, నీవంటావు, ''బ్రదర్, బ్రన్హం, నీవు చక్కగా ఏర్పరచిన మార్గమును విడిచి దూరముగా వెళ్ళుచున్నావు.''
మంచిది, నీవంటావు, ''మానవ దేహములను స్వస్ధపరచుటకు మందు తయారు చేయబడినది, నీ కోటు మరియు బల్లను స్వస్ధపరచుటకు మందు తయారు చేయబడలేదంటావు.“
మంచిది. అప్పుడు నా చేతిని కత్తితో కోసుకొని, నేను వేదికనొద్దే పడి చనిపోయాననుకొందాము. మీరు నన్ను శవములు భద్రపరచు గదికి తీసుకొని వెళ్ళి, నా దేహమును శవములను నిలువచేయు తైలములో నన్ను భద్రపరచితే, అది ఇప్పటి నుండి 50 సం॥ల వరకు నన్ను సహజముగా కనబడునట్లు చేస్తుంది, మరియు ప్రపంచములోని శ్రేష్ఠమైన వైద్యులు వచ్చి, ఆ కోయబడిన స్థలమును కుట్టనియ్యండి, మరియు రోజునకు ఐదు సార్లు పెలిసిలిన్ ఇంజక్షన్ నాకు ఇవ్వనియ్యండి, మరియు టించరు, మెధియోలేటు ఇచ్చి దాని మీద యున్న దానిని పరిష్కరించి బాగుచేయమనండి. ఆ రోజు నుండి 50 సం॥ల తరువాత కూడా ఆ తెగిన గాటు అది తెగినపుడు ఖచ్చితముగా ఎలా యున్నదో అలాగే ఆ గాటు యుంటుంది
16
అప్పుడు, మందు మానవ శరీరమును స్వస్ధపరచిట్లైతే, దానిని అది ఎందుకు బాగుచేయదు? చూడండి, అది బాగు చేయలేదు... ఇప్పుడు, అది ఇక్కడే యున్నది. నీవంటావు, ''ఓ, బ్రదర్ బ్రన్హం, ఎందుచేత, జీవము వెళ్ళిపోయినది. ఆ కారణమును బట్టియే.''
మంచిది, అదే బేధము. జీవమనగా ఏమిటో నీవు నాకు చెప్పు; దేవుడు ఎవరో నీకు చెపుతాను. అది నిజము. కాబట్టి, స్వస్ధపరచునది అది మందు కాదు. మందు టిష్యూను (అనగా రక్తములోని నార) నిర్మించలేదు. దేవుడే ఆ టిష్యూను నిర్మిస్తాడు. దేవుడు నీ యొక్క మొదటి కణమును తయారు చేశాడు. నీలో యున్న ప్రతి కణమును దేవుడు తయారు చేశాడు. మరియు ఇప్పుడు , మధ్యాహాన్నము సూచననిచ్చు కూటములలో, మీరు తరువాత అది వింటారు (మేనేజరు రానియెడల, మంచిది, మనలో కొందరు దానిని తీసుకొందాము), స్వస్ధత ఎలా జరుగుతుందో మీరు కనుగొంటారు. కాన్సర్ అనగా ఏమిటి, అది ఎక్కడ నుండి వస్తుంది, మీరు తెలుసుకొంటారు. అది మరొక క్రమమైయున్నది. అది ఒక వేరైన జీవమైయున్నది. అది ఒక భిన్నమైనది.... అది నీలోని ఒక ఎదుగుదలయై యున్నది. అది అక్కడకు చెందినది కాదు. దయ్యము దానిని అక్కడ యుంచినది. అది ఒక దయ్యమైయ్నుది. అది ఖచ్చితముగా అది అదేయై యున్నది.
17
ఇక్కడ సహజమైన శరీరము యున్నది, అది ఎంతో సహజముగా కనబడుతుంది. కొంతకాలము తరువాత దాని మీద కాన్సర్ వ్యాధి యుంటుంది. అది ఒక దేహమైయున్నది. అది టిష్యూలు, కణములు యొక్క విస్తరణయై యున్నది. అది అక్కడకు ఎలా చేరియ్నుది?.
కొన్ని సం॥ల క్రితము మీలో ప్రతి ఒక్కరూ మీ తండ్రిలో ఒక చిన్న జీవపు అంకురముగా యున్నారు. పవిత్రమైన వివాహ భాందవ్యము ద్వారా మరియు పిప్పొడి ద్వారా, ఆ చిన్న అంకురము తల్లిలోనికి వెళ్ళినది. ఆ చిన్న అండము మరియు ఆ చిన్న జీవపు అంకురము ఏకముగా కూడినవి. రక్తకణము పురుషుని బీజము నుండి వస్తుంది. ఆ రక్తము... ఆ బిడ్డ యొక్క రక్తము కొరకు తల్లి చేయునది ఏదియూ లేదు. అది తండ్రి నుండి వస్తుంది.
ఎన్నో సం॥ల క్రితము దేవుడు దానిని ఎలా ముందు చూశాడో, అది ఎలా... ఇక్కడయున్న మీలో అనేకులు వ్యవసాయదారులై యున్నారు. మీరు ఒక కోడిపెట్టను తీసుకోండి మరియు దానిని ఎన్నో గ్రుడ్లు పెట్టనీయండి, అది తన యొక్క మగ పక్షితో జీవించియుండనియెడల, ఆ గ్రుడ్లు ఎన్నడూ పొదగబడవు. అవి ఫలభరితము కాలేదు. రక్తము మగదాని నుండి వస్తుంది.
18
ఉదాహరణగా ఒక ఆడ పక్షిని తీసుకోండి. అది గూడు నిండా గ్రుడ్లు పెడుతుంది. ఆ గ్రుడ్లను రెక్కలతో కప్పుతుంది, మరియు ఆ గూటిలో ఎంతో నమ్మకముగా ఎంతో విశ్వసనీయతగా కూర్చొంటుంది. చివరకు అది గూడులో నుండి పైకిలేచి ఎగురలేనంతగా బలహీనమవుతుంది; ఒకవేళ అది తన మగపక్షితో జీవించినయెడల, ఆ గ్రుడ్లు ఆ గూడులోనే క్రుళ్ళిపోతాయి. అవి పొదగబడవు.
అది నాకు సరిగ్గా కొన్ని పాత, చల్లని, నామకార్ధ సంఘములను జ్ఞాపకము చేస్తుంది. నీవు వారిని రెక్కల క్రిందకు చేర్చుకొనవచ్చు, వారిని చుట్టూ కొట్టి దులపవచ్చు, ఫలానా అని వారిని పిలువ వచ్చు, చిన్న పిల్లల వలె వారిని లాలించి వారికి పి.హెచ్.డి. పట్టాను ఇవ్వవచ్చు, మరియు నీవు సమస్తమును చేయవచ్చు, ఇంకనూ నీవు కలిగియున్నది గూడు నిండా కుళ్ళిపోయిన గ్రుడ్లే. నీవు వీటన్నిటిని బయటకు ఎత్తి పడవేసి క్రీస్తుయేసుతో వెళ్ళుము, కొంత విశ్వాసము సంఘములోనికి తీసుకోండి, అప్పుడు అది సత్యము. క్రీస్తుతో నడవండి, నీ జతపక్షి.
నీవంటావు. ''దైవిక స్వస్ధత యందు నాకు నమ్మికలేదు. ''పరిశుద్ధాత్మయందు నాకు నమ్మకము లేదు.'' కారణము నీవు ఎన్నడూ దానితో సంబంధమునకు రాలేదు. అది అంతే. నీవు దేవునితో ఒక్కసారి సరికమ్ము, అప్పుడు దేవుని వాక్యములోని ప్రతి మాటను నీవు నమ్ముతావు. దేవుని వాక్యములో యున్న ప్రతిదీ నీకు యదార్ధముగా యుంటుంది.
19
ఆ జీవ కణము పురుషుని నుండి వస్తుంది, దేవుడు దానిని చేసియున్నాడు. ఎన్నో సం॥ల క్రితము ఆయన దానిని చేసియున్నాడు. ఆ చిన్న జీవకణము ఎదుగుటకు ఆరంభిస్తుంది, అది మానవ దేహముగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అది యున్నట్లుగా పైకి ఎదుగుతుంది. బహుశ కాన్సర్ అక్కడకు చేరుకొంటుంది. అది మరొక రీతిగా కణములు వృద్ది చెందుటగా యున్నది. అది ఎక్కడ నుండి వచ్చియున్నది?.
మొదటి సంగతి సాధారణముగా.... ఒక కాన్సర్, దానిని గూర్చి ఇప్పుడు మనము మాట్లాడుచున్నాము, అతి గొప్పగా చంపు వాటిలో అది ఒకటియై యున్నది. అది ఏ వ్యాధితోనైనా కావచ్చు, ఇబ్బంది పరచునది ఏదైనా. అది ఒక చితుకగొట్టబడిన దాని నుండి వస్తుంది, సాధారణముగా స్త్రీ యొక్క రొమ్ము పైన అది గులాబీ కాన్సర్‌కు కారణమవుతుంది, మరియు అది బొబ్బట్లు వలె యుంటుంది మరియు ఒక దాని మీద ఒకటి గుట్టగా ప్రోగవుతాయి. తగిన కాలములో దానిని పట్టుకొన్నట్లైతే, దానిని విజయ వంతముగా ఆపరేషన్ చెయ్యవచ్చు. ఒక ఎర్రని కాన్సర్ అనేది యున్నది, అది ముద్దవలె ముందుకు వెళుతుంది; మరియు వాటిలో భిన్నమైనవి యున్నవి: సర్‌కోమా కాన్సర్ అది, మరియు ఇతర భిన్నమైన కాన్సర్‌లు యున్నవి.
ఇప్పుడు అది కలిగియున్నందున మనము కాన్సర్ గురించి మాట్లాడుచున్నాము. నా భావమును మీరు చూడగలరు. వైద్యుడు దానిని తగిన సమయములో గుర్తించి దానిని కోసివేసినట్లైతే, అది ఒక విజయమవుతుంది. అతడు దానిని గుర్తించని యెడల, అది గట్టిగా పట్టుకొన్నట్లైతే, రోగి చనిపోతాడు. అది ఎదుగుచూ యుంటుంది. అది రక్తమును పీల్చివేస్తుంది. అది ఒక దయ్యమై యున్నది. ఏమి సంభవించినది? ఒక కణము...
20
సాతాను కలిగియున్నదంతయూ, ఎన్నడైనా సాతాను చేసిన దంతయూ దేవుడు సృజించిన దానికి వ్యతిరేకముగా చేయుటయే. సాతాను సృజించువాడు కాదు, అయితే దేవుడు తయారుచేసిన దానిని వాడు వంకరగా చేస్తాడు. ఆ రీతిగానే వాడు మంచిది చెడుగా వంకరగా చేస్తాడు. ఆ విధముగానే వాడు ఆ కణమును వంకరగా చేస్తాడు.
వేరైన మాటలలో చెప్పాలంటే, ఆ కణము వెనుకకు జారిపోతుంది. అది బాప్టిస్టు వారికి చెప్పుటకు ఒక పెద్ద మాటయైయున్నది, అది కాదంటారా? అయితే ఎలాగైనా, ఆ కణము వెనుకకు జారిపోతుంది, మరియు అదియే బాధను కలుగచేస్తుంది. మరియు తరువాత అది కణము మీద కణముగా వృద్ధి చెందుతుంది. ఒక దయ్యపు శక్తి ఆ కణములోనికి వస్తుంది.
నీవు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలుసా. నీవు దేవుని నుండి వచ్చావు, అయితే కాన్స ర్అని పిలువబడుతుంది ఇది ఎక్కడ నుండి వచ్చియున్నది? అది దయ్యము నుండి వచ్చియున్నది. అక్కడ జీవవమిచ్చు రెండు ఆధారములు మాత్రమే యున్నాయి, అది దేవుని నుండియైనా రావాలి లేక దయ్యము నుండియైనా రావాలి.
అది ఒక గొప్ప కణితిగా ఎదుగుచూ యుంటుంది. ఇప్పుడు, ఈ వేదిక మీద దానినే మనము వివరించుచున్నాము: కణితి గురించి కాదు, అయితే ఆ కణితిలో యున్న జీవమును గూర్చి. దానినే మనము వివరించుచున్నాము: దానిలోని జీవము.
నీవు భూమి మీద కాన్సర్‌ను కలిగియున్నట్లైతే, దాని నుండి బయటకు వచ్చు మార్గమేదనగా దైవిక స్వస్థత ద్వారానే, నీలోనుండి నీ జీవమను బయటకు పిలుచుటయే, నీవు వెంటనే నేల మీద పడిపోతావు, అయితే కొన్ని రోజులు నీవు కుదించుకుపోతావు.
21
ఒక మానవ దేహము చనిపోయినపుడు.... సమాధి కార్యక్రమము చేయువానికి అది తెలియును. సరే ఇప్పుడు, అది ఒక వేటగానికి తెలియును, ఈ రాత్రిని నీవు ఒక దుప్పిని వేటాడి, అది కాటా మీద ఎంత తూగుతుందో కుర్రవాళ్ళకు చెప్పండి. మరలా ఉదయమున ఆ దుప్పినే కాటా మీద వేసి తూయండి, రాత్రియంతటి గుండా అది ఎంత బరువును కోల్పోయిందో చూడండి. దానిని అలాగే కొన్ని దినములు ఉంచండి. మరలా కాటా మీద పెట్టండి, అది మొదటిగా యున్న బరువు కంటె ఎలా ఎంత తక్కువ తూగుతుందో చూడండి.
ఆ విధముగానే నేను రోగులకు చెపుతాను, ఇంచుమించు డెబ్బై-రెండు గంటలలో దేహము క్రుళ్ళిపోవుట ఆరంభమవుతుంది, మరియు ఆ దేహము వీధిలో పడియున్న ఒక చిన్న కుక్కవలె ఉబ్బిపోతుంది. దీర్ఘకాలము అది యున్నప్పుడు ఉబ్బిపోవుట ఆరంభమవుతుంది.
అప్పుడు దురాత్మ రోగిలో నుండి బయటకు వెళ్ళిపోయినది, కాన్సర్ చనిపోయినది. ఏలయనగా కొన్ని రోజుల వరకు వారు చక్కగా వుంటారు. కంటి శుక్లము, కణితి, లేక అది ఏమైనను వారు కొన్ని రోజులు ఆరోగ్యముగా యుంటారు, మరియు తరువాత మొదటి కార్యము నీకు తెలుసా, అది వాయుట ప్రారంభమవుతుంది, వాపు. మరియు తరువాత రోగి నిజముగా దేవుని వాక్యప్రకారము సూచించబడనియెడల, దేనినైనా వారు నిశ్చయముగా పోగొట్టుకొన్నట్లే, వారు వారి స్వస్ధతను పోగొట్టుకొంటారు, కారణము వారు మరలా రోగగ్రస్తులవుతారు, ఇదివరకు ఎన్నడైనాయున్న దానికంటే రెండు రెట్లు చెడ్డగా మారతారు. మరియు నీవు ఎన్నడైనా స్వస్ధతనొందియున్నావని కలిగియుండు శ్రేష్ఠమైన గురుతు అదే, కచ్చితముగా: అది వాయుచున్నది. అది వెళ్ళిపోయినది.
22
అప్పుడు నీవు నిజముగా.... నీ విశ్వాసము ఎవరి మీదో నిర్మించబడియున్నట్లైతే, ఎవరో దైవిక స్వస్ధత చేయువాడు, లేక వారు కలిగియుండక పోయినను, వారు దానిని కలిగియున్నట్లుగా చెప్పుకొనే వారి మీద యున్నట్లైతే; నీ పని అయిపోయినట్లే. అయితే నీ విశ్వాసము దేవుని వాక్యము మీద నిర్మించబడియున్నట్లైతే పాతాళములోని దయ్యములన్నియూ దానిని నీవు ఎన్నడూ కాదన్నట్లు చేయలేవు, కారణము అది లోపల స్ధిరపర్చబడియున్నది.
అది ఇక్కడ మానసిక వేదాంతములో లేదు. అది నీ లోపల హృదయములో యున్నది. అది తెలివితో కూడిన విశ్వాసము కాదు. అది సర్వశక్తుడైన దేవుని చేత నీ హృదయములో మునిగియున్న విశ్వాసమైయున్నది. మార్గము ఎంత చీకటిగా యున్నప్పటికి లెక్కకాదు, నీవు ఇంకనూ దేవుని స్తుతులతో కేక వేస్తావు, కారణము అది నీకు దేవుడు బయలుపరచియున్నాడని నీకు తెలుసు మరియు అది దానిని సర్దివేస్తుంది.
ఆ కారణమును బట్టియే కొన్నిసార్లు ప్రజలకు సూచనలు అవసరమైయున్నవి. నీ విశ్వాసము దేని మీద ఉంచబడినదో ఎరిగియుండుము, ఒక మనిషి మీద కాదు, ఏదో ఒక మనిషి యొక్క సాంప్రదాయకమైన ఆచారముపైన కాదు, లేక ఏదో వింతైన అనుభూతులపై కాదు లేక మరేదో అలాటి దానిపై కాదు. నీ విశ్వాసము దేవుని వాక్యము మీద నిర్మించబడియున్నది. అక్కడే విశ్వాసము దాని యొక్క విశ్రాంతి స్థానమును తీసుకొంటుంది.
23
ఫరో యొక్క సైన్యము ఎంత గొప్పగా కనబడినప్పటికి మోషే లెక్క చేయలేదు. అది మోషేకు ఏ లెక్క కాదు. అతడు దేవునిని ఆ పైన కలుసుకొన్నప్పుడు, అతడు దేవుని వాక్యమును ఎరిగియుండెను. అతడు దేవుని యొక్క వాక్యము ద్వారా సూచించబడ్డాడు. మరియు అతడు... మండుచున్న పొదలో ఆ దూతతో ఆయనను కలుసుకొనెను.
మీరు ఊహించగలరా, కొండ మీద ఒక ప్రక్క మండే పొద యొద్ద యున్న ఒక వృద్ధ మనిషి, పొద మండుచున్నది, మరియు అతడు దానిని చూచుటకు ఒక ప్రక్కకు అడుగు వేశాడు... కొందరు ప్రజలు కేవలము ఆస్తకి కరముగా కూటములకు వచ్చినట్లు అతడును అక్కడకు వెళ్ళి, ''నేను కొన్ని ఈ ఆకులను లాగి, పరీక్షలు చేయు ఒక స్థలమునకు తీసుకు వెళ్ళి, ఆ ఆకులు ఎందుకు కాలిపోవుట లేదో నేను పరీక్షిస్తాను. ఆ ఆకులపైన అంతయూ అగ్నియున్నది, మరియు మంట తన తరువాత వాటిలో ఎలాంటి రసాయనమున్నదో నేను చూస్తాను,“ అని అంటే ఏమవుతుంది.
అలాగైతే నీవు ఎన్నడూ దేనినీ పొందలేవు... నీవు ఎన్నడైనా ఏదైనా దేవుని గురించి తెలుసుకొను ఒకే ఒక మార్గము అక్కడయున్నది; అదే విశ్వాసము ద్వారా నీవు దానిని పొందుతావు. దేవుడు ఆ రీతిగా చెప్పియున్న కారణమున నీవు దానిని నమ్ముతావు. నీ కన్నులు దానిని గూర్చి ఏమి వివరించును, అది ఏమియూ కాదు. నీవు దానిని నమ్ముతావు.
24
మోషే, ఆ దూతను చూసిన తరువాత, దేవుని యొక్క మహిమను చూసిన తరువాత... అతడు వెళ్ళక ముందు అతడు దేవుని మహిమను చూడగోరియున్నాడని మీరు గమనించారా? మరియు దేవుడు ఆయన మహిమను అతనికి చూపించాడు. అది ఏమైయుండెను? దైవిక స్వస్ధత, అతని చేతిని తన రొమ్ము మీద ఉంచినపుడు అది కుష్టు రోగముగల చెయ్యిగా మారినది, మరియు దానిని మరలా బయటకు తీసి; మళ్ళీ ఆ చేతిని రొమ్ము మీద తిరిగి యుంచినపుడు, అది స్వస్ధతపడినది. కాబట్టి దైవిక స్వస్థత దేవుని మహిమయై యున్నది.
కాబట్టి మోషే, ఆ దూతను తెలుసుకొని, అగ్నిస్థంబము అతనితో యున్నదని దానిని చూసి యున్నాడు. నేను మీకు చెపుతాను, అతడు ఇంటికి పోయి తన భార్యయైన సిప్పోరాను తీసుకొని, తన ఇద్దరు పిల్లలను ఆమెను ఒక కంచర గాడిద మీద ఎక్కించి, అతడు ఐగుప్తునకు వెళ్ళెను.
25
ఇప్పుడు నీవు ఎగతాళిగా దృశ్యమును గూర్చి మాట్లాడుము, జార్జియా ప్రజలైన మీరు దీనిని చూడండి. అక్కడ ఫరో యొక్క సైన్యమున్నది. అప్పుడు కలిగియున్న ప్రపంచ శక్తిని, అప్పటి రష్యా శక్తితో పోల్చితే అది శూన్యము. ఫరో యొక్క సైన్యము, యంత్రాలయముగా యున్న పటాలములు, వేల కొలది రధములు, గుర్రపు రౌతులు, ఈటెలు ధరించిన మనుషులు. వాళ్ళు ప్రపంచమునంతటిని ఒక్క దెబ్బతో ఓడించగలరు.
ఇక్కడ ఎనబై సం॥లు గల ఒక వృద్ధ మనిషి, నడుము వరకు వేలాడుచున్న మీసములతో, ఒక వంకర కర్రను పట్టుకొని, తన భార్య ఇద్దరు పిల్లలను రెండు తొడల మీద ఎక్కించుకొని కంచర గాడిదపై కాళ్ళు ఇటు అటు పెట్టుకొని, దేవునిని మహిమపరచుచూ అతడు ముందుకు వెళ్ళుచున్నాడు.
''మోషే, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు,“ అని కొందరు అతనితో అన్నారు.
''ఐగుప్తును స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్నాను.''
నీవు దానిని ఊహించగలవా? విజ్ఞానము దానిని గూర్చి ఏమి చెపుతుందో చూడు. దానిని గూర్చిన శ్రేష్ఠమైన భాగము ఏమనగా, అతడు దానిని చేసియున్నాడు ( ఆమెన్ ), ఏలయనగా దేవుడు దానిని వాగ్ధానము చేసియున్నాడు. మరియు దేవుని వాక్యము ఎన్నడూ తప్పిపోదు. అతడు వెళ్ళి దానిని స్వాధినపర్చుకొన్నాడు. దేవుడు మాట్లాడినపుడు వ్యతిరేఖత అనేది ఏమీ కాదు. నీవు ఎంత తీవ్రముగా రోగగ్రస్తుడవైననూ లెక్క కాదు, నీవు ఎంతగా కుంటివాడవైనప్పటికి లెక్క కాదు. వ్యతిరేఖత ఏమీ కాదు, దేవుడు మాట్లాడినపుడు, ఆయన మాట నిత్యమైయున్నది మరియు ఎన్నటికి సత్యమైయున్నది.
అతడు దానిని సాధించియున్నాడు. అది ఒక ఎగతాళిగా కనబడుచున్న దృశ్యమై యున్నది, కాని అతడు వెళ్ళి దానిని చేసియున్నాడు, కారణము అతడు విశ్వాసమును కలిగియున్నాడు. దేవుడు దానిని వాగ్ధానము చేసియున్నాడు, అది దేవుని యొక్క పరిధులలో యుంచబడియున్నదని అతడు ఎరిగియుండెను, మరియు అతడు వెళ్ళి దానిని జరిగించాడు, ఏలయనగా దేవుడు అతనితో యున్నాడు. నిశ్చయముగా.
26
ఇప్పుడు అదే సమయములో మనుష్య కుమారులు తిరిగి మరలా ఇబ్బందిలో పడ్డారు, దేవుడు మరలా తన వాగ్ధానమును పంపియున్నాడు: ఆయన కుమారుడే, ప్రభువైన యేసు. ఆయన వచ్చినపుడు ఆయన తప్పుగా అర్ధము చేసుకొనబడినాడు.... ఆ దినమున యున్న ఉపదేశకులందరూ మెస్సీయా ఎలా ఉండబోవుచున్నాడో అంతా ముందుగా దాని మీద వారు లెక్కలు వేసుకొన్నారు. ఆయన వచ్చినపుడు, అది ఈ విధానములో యుండవలసియున్నదని నిర్ణయించుకొనిరి. మరియు అది ఏమిటో మీకు తెలుసా? యూదయ బెత్లెహేములో యేసు పుట్టినపుడు, ఎలాటి గుండీలు వారి బట్టల మీద వారు ధరించవలెనో ఆ విషయమును గూర్చి ఆనాటి యాజకులు వాదించుకొనుచుండిరి. అది సత్యము, ఆయన కొండ ప్రక్కన జన్మించియుండెను, మరియు వారిలో ఒక్కడిని కూడా ఆయన ఎన్నడూ దర్శించలేదు.
దేవుని యొక్క దూతలు వచ్చి గొర్రెల కాపరులకు పాటలు పాడినవి. అది సత్యము, తూర్పు దేశములోయున్న ఆ జ్ఞానులు, నక్షత్రములను పరిశోధించువారు, ఒక మర్మమైన నక్షత్రమును వెంబడిస్తూ వచ్చారు... లేక ఒక వెలుగు వారిని క్రీస్తునొద్దకు నడిపించియున్నది.
27
ఆయన భూమి మీదయున్నప్పుడు, బోధకుల కంటే దయ్యములు ఆయనను ఎక్కువగా ఎరిగియుండెను. అది సత్యము. దయ్యములు... బోధకులు అన్నారు, ''ఈ మనిషి బెయెల్జబూబు. అతడు మనస్సులను చదువుతాడు. జాతకములు చెప్పువారందరికంటె ఇతడు అతి చెడ్డవాడని వారన్నారు. అతడు ఒక చురుకైనవాడు. నేను మీకు చెపుతాను. అతడు ఒక మనస్సును చదివేవాడు. అతడు ఒక బెయెల్జబూబు, అనగా జాతకములు చెప్పువారందరికి నాయకుడు,'' అని వారు ఆయనను పిలిచారు. ఆ ఆత్మ ఎన్నడూ చనిపోలేదు.
గమనించండి. అయితే దయ్యములు, ''నీవు ఎవరవో మాకు తెలుసు, నీవు దేవుని కుమారుడవు, పరిశుద్ధుడవు,'' అని చెప్పినవి. దయ్యము సరిగా చెప్పినది.
28
పౌలు మరియు సీల ఒక గొప్ప ఉజ్జీవాన్ని అక్కడ కలిగియుండిరి, మరియు బోధకులన్నారు, ''వీళ్ళు...'' ఆ దినమున యున్న ఉపదేశకులు, వారిలో అందరూ కాదు, అయితే ఆ గొప్ప ఉన్నతమైన సంఘములు, ''వీరు భూలోకమును తలక్రిందులు చేయువారు, వీరు ఇతరులపై అధిపత్యము చేయువారు,'' అని అన్నారు.
అయితే ఒక చిన్న వీధిలో జాతకం చెప్పుచున్న వ్యక్తి, ''ఈ మనుషులు దేవుని సేవకులు, మనకు జీవ మార్గమును బోధిస్తారు,'' అని అన్నది.
నీకు తెలుసా, నీవు ఎంత సాంప్రదాయ బద్దుడవుతావంటే, చివరకు దయ్యము పట్టిన వ్యక్తులు, నామకార్ధ మరియు ఎంతో సాంప్రదాయకముగా యున్న వ్యక్తుల కంటె, ఎక్కువ కార్యములను ఎరిగియుంటారు, అది ఒక పెద్ద గొప్ప మాట. అది నిన్ను కోసివేస్తుంది, అయితే అది నీకు మేలు చేస్తుంది. ఆమెన్.
29
కొన్ని సార్లు మనకు మందు అవసరము కాకముందు, నీకు తెలుసా, మనము బాగా రోగులముగా మారాలి. మా తల్లి మేము ఆముదమును తీసుకొన్నప్పుడు ఇలా చెప్పేది... మేము ఒక చిన్న ప్రాచీన గ్రామంలో ముతక జొన్న రొట్టెతో మరియు నల్ల కన్నులుగా కనబడు చిక్కుళ్ళ ద్వారా మేము పెంచబడ్డాము.... మరియు ప్రతి శనివారము రాత్రి దేవదారు కర్రతో చేయబడిన చెక్క తొట్టెలొ మేము స్నానము చేసేవారము, ఒక పెద్ద పాత టీకాగులో నుండి వేడి నీశ్ళు పోసుకొని మేము పది మంది పిల్లలము ఏకముగా స్నానము చేసే వారము.
మరియు నాకు గుర్తున్నది, మాలో ప్రతి ఒక్కరు శనివారము ఆముదమును తీసుకొనవలసియుండెను, ఈ రోజు వరకు దానిని నేను తట్టుకొనలేను. నేను ఆముదమును తీసుకొనుట ఆరంభించినపుడు... నా తల్లి నాతో చెప్పేది.. నేను నా ముక్కును మూసుకొనేవాడను... ''అమ్మా, అది నన్ను రోగిగా చేస్తుంది,'' అని అనేవాడను. “నేను కనీసము దానిని చూడలేను.''
ఆమె ఇలా చెప్పేది, “అది తినగా నిన్ను మంచి రోగిగా చేయనిచో అది నీకు ఏ మేలును చేయదు. ''కాబట్టి, కొన్నిసార్లు సువార్త ఆ రీతిగానే యున్నది. అది తినగా మంచి రోగిగా నిన్ను చేయని యెడల, అది నీకు ఎక్కువ మేలు చేయదు.''
30
కాబట్టి, యేసు తన హృదయములో నుండి సువార్తను క్రుమ్మరించియున్నాడు, ఏలయనగా ఆయన ఆ ఘడియకు దేవుని యొక్క ఎన్నుకొనబడిన పాత్రయైయున్నాడు, అది కయపయైయున్నాడని ప్రజలు చెప్పినప్పటికి, వారి సంఘమే వెలుగునంతయూ కలిగియున్నదని, ఇంకా ఎవరునూ ఏమి చెప్పేది ఏమీ లేదని చెప్పినప్పటికి... అయితే యేసు ఖఠినముగా వస్తాడు.... ఇప్పుడు వినండి: క్రీస్తు వాక్యము మీద వచ్చాడు. అయితే అది వారు ఎల్లప్పుడు విని యున్న దానికంటె కొంచెము భిన్నముగా యుండెను. కారణము వాక్యము పట్ల వారికి యున్న మానసిక ఆలోచనతో అది సరితూగలేదు, అప్పుడు వారు ఆయన మాట వినుట త్రోసివేసిరి. అయితే దేవుడు ఆయనలో యుండెను. దేవుడు సూచక క్రియలను మరియు అద్భుతములను చేసెను. ఆయన అన్నాడు, ''మీరు నన్ను నమ్మిన యెడల, నేను చేయు క్రియలను నమ్ముడి, ఏలయనగా తండ్రి నన్ను పంపియున్నాడని అవి సాక్ష్యమిచ్చుచున్నవి.''
మనుష్య కుమారులు: మార్గములో నుండి వెళ్ళిపోయారు, విశ్వాసము లేదు, వారి సంఘముల మీద మరియు అలాటి వాటి మీద నిర్మించబడియున్నారు, మరియు వాక్యములో విశ్వాసమే మిగలలేదు, కేవలము వారు దానిని నమ్మియున్నట్లే నమ్మిరి.
31
కాబట్టి, క్రీస్తు సంచరిస్తూ రోగులను స్వస్ధపర్చుచూ, ప్రజలతో మాట్లాడుచూ, వారి వివిధమైన రుగ్మతలను గూర్చి చెప్పుచూ లేక వారి ఇబ్బంది ఏమిటో చెప్పుచూ యున్నాడు, మరియు వారన్నారు, ''అది బెయెల్జబూబు. మీరు చూశారా, అతడు ఒక జాతకము చెప్పేవాడు. అతడు దయ్యము నుండి వచ్చాడని మాకు తెలుసు,'' మరియు అట్లు చెప్పారు. అయితే అది క్రీస్తును ఒక్క రవ్వంతా కూడా అడ్డగించలేదు. ఆయన ఒక దైవికమైన ఉద్దేశ్యముతో పంపబడియున్నాడని ఆయన ఎరిగియుండెను, కారణము ప్రభువు చెప్పినది ఆయన ఎరిగియుండెను.
ఆయన పనికి బయలు వెళ్ళాడు. దేవుని యొక్క ప్రతి నిజమైన సేవకుడు అదే చేస్తాడు. అది వంట గదిలో పనిచేయుచున్న ఒక గృహిణి వలె, ఒక చిన్న అంటులు తోము వ్యక్తి కంటే అది ఎంత మాత్రము ఎక్కువ కానట్లైతే (ఆమెన్), ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూసినపుడు ఆమె దాని కొరకు నిజముగా నిలబడుతుంది. తన పొరుగువారు ఆమెను గూర్చి ఏమి చెప్పినప్పటికి లెక్కకాదు, కారణము ఆమె తన వెంట్రుకలను పొడవుగా ఎదుగనిస్తుంది మరియు సభ్యతగల దుస్తులను ధరిస్తుంది. పొరుగు వారు ఆమెను పాతకాలపు స్త్రీగా మారిపోయింది అని చెపుతారు.
దయ్యమునకు ఏ సమయములోనైనా నేను వెర్రివాడుగా యుండుట కంటె, లోకమునకే మరి ఎక్కువగా నేను చులకనగా యుంటాను. నిశ్చయముగా నేను దానిని కలిగియున్నాను. అదే నేను ఆలోచించేది... ఒక వ్యక్తి ఎన్నడైనా తన హృదయములోనికి దేవుని యొక్క ప్రత్యక్షత కదిలినపుడు, అది వారి యొక్క పూర్తి ఉద్దేశ్యములను, వారి జీవితమును, వారి అభిరుచులను మార్చివేస్తుంది, వారు ఒకప్పుడు ఉండిన సమస్తము నుండి మార్చివేయబడ్డారు.
32
యేసు తన పరిచర్యకాలములో, అనేక మంది పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయన యందు విశ్వాసమంచారు, అయితే వారు దానిని బహిరంగముగా ఒప్పుకొనలేదు, కారణము వారు ఒప్పుకొన్నట్లైతే, వారు వారి సమాజ మందిరములలో నుండి వెలివేయబడతారని వారి సంఘముల ద్వారా హెచ్చరించబడ్డారు. ఆయన కూటములకు వారు వెళ్ళి యున్నట్లైతే, వారు వారి సంఘములో నుండి తొలగించబడతారు. కాబట్టి, అది వారిని బాధించినది. ఆయన ఎలాగైనా బోధిస్తూ ముందుకు వెళ్ళాడు.
ఇప్పుడు, మన కధ ఈ రాత్రికి ఆ రకమైన వ్యక్తులలో ఒకరి మీద వెళుతుంది, ఆయన పేరు యాయీరు, అతడు సమాజ మందిరపు అధికారియై యున్నాడు.
యాయీరు ఒక రహస్య విశ్వాసియై యున్నాడని నేను ఎల్లప్పుడు అనుకొన్నాను. అతడు తన హృదయములో నమ్మియున్నాడు, ఒక రకమైన సరిహద్దు విశ్వాసి. ఆయన ఒక దైవజనుడై యున్నాడని అతడు నిజముగా తన హృదయములో నమ్మియున్నాడు. ఆయన దేవునియొక్క నిత్యుడైన కుమారుడని, అయితే అతడు దానిని చెప్పుటకు భయపడ్డాడు, కారణము అతడు సమాజమందిరము నుండి బయటకు గెంటి వేయబడతాడు. మరియు అది ఇంకనూ నిలిచియున్నది.
కాబట్టి తరువాత, ఒక మనిషి నిజముగా తన హృదయములో యదార్ధముగా యున్నట్లైతే, అతని రంగులు ప్రకాశించుట కొరకు, దేవుడు అతని చుట్టూ ఏదైనా చేస్తాడని మనము కనుగొంటాము. సాధారణముగా కొన్ని సందర్భములలో దేవుడు దానిని చేస్తాడు.
33
కాబట్టి యేసు తన కార్యముల కొరకు బయలుదేరాడు. ఒక రాత్రి ఆయన సముద్రమును దాటాడు. తుఫానులు లేచినాయి, ఆయన ఒక దేశము నుండి బయలుదేరి మార్గమంతటి గుండా మరొక దేశమైన గెరాసీనుల దేశమునకు వెళ్ళాడు, మరియు అక్కడ ఒక దయ్యములు పట్టిన వ్యక్తిని కనుగొన్నాడు. ఆ దయ్యములు పట్టినవాడు పరుగెత్తాడు. నిజానికి, ఆయన అక్కడకు వెళ్ళిన కారణమేనగా, నిన్న రాత్రి మనము తీసుకొన్నట్లుగా తండ్రి.. యేసు అన్నాడు, ''మొదటిగా నా తండ్రి నాకు చూపనిదే నేను ఏమియూ చెయ్యను. మొదటిగా నేను దర్శనము చూస్తాను, తరువాత నేను వెళ్ళి దానిని చేస్తాను.''
యోహాను సువార్త 5:19: ''తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు, ఆయన వేటిని చేయునో, వాటిని కుమారుడును అలాగే చేయును.''
34
అప్పుడు ఆయన గెరాసేనల దేశమునకు వెళ్ళాడు, దయ్యములు పట్టిన ఒకడు ఆయనను కనికరము కొరకు పిలిచాడు. యేసు ఆ దురాత్మలతో మాట్లాడాడు, వాటిని బయటకు రమ్మని పిలిచాడు, మరియు అవన్నియూ... దురాత్మ ఒక మానవ శరీరములో నివాసమును ఏర్పరచుకోనంత వరకు అది, అవి శక్తిహీనముగా కనబడతాయి... అవి బయటకు వచ్చినపుడు, ఆ దేశము నుండి తమను తరిమివేయవద్దని కోరినవి, యేసు అక్కడ యుండుట వాటికి ఇష్టము లేదు, కాబట్టి అవి అక్కడయున్న పందుల లోనికి వెళ్ళిపోయినవి. ఒక ఉజ్జీవమును కలిగియుండుటకు వాటికి ఎంతో వెలపెట్టబడినది. అయితే ఈ దయ్యములు పట్టినవాడు తిరిగిపోయి సాక్ష్యమిచ్చుచూ దేవుని మహిమపరచెను.
నేను మహిమ లోకమునకు వెళ్ళినపుడు, ఒకప్పుడు దయ్యములు పట్టినవాడుగా యుండి స్వస్ధపడిన ఇతనని నేను చూడగోరుచున్నాను, మరియు అతడు స్వస్థపడిన తరువాత, గెరాసేన దేశములో పందులను పెంచువారి మీద అతని సాక్ష్యము ఎంత ఒత్తిడిని కలిగి యుండెనో నేను కనుగొనగోరుచున్నాను. అతడు నిజముగా ఆ దేశమును తప్పక కదిలించి వేసియుంటాడు, అయితే వారు ప్రియమైన యేసును కోరుకొనలేదు. వారు యేసుతో యుండుట కంటే ఆ పందులు మరియు దయ్యములతోనే యుండుట చాలా మంచిదని తలంచారు.
ఈ దినమున కూడా అదే పరిస్ధితి నిలిచియున్నది. అది సత్యము. మంచిది, నీకు ఆయన అవసరము లేని యెడల, ఆయన నిన్ను ఎన్నడూ తనకు తానుగా నీ మీద పెట్టుకొనడు. నీవు ఆయనను కోరుకొనవలసి యున్నది. నీవు ఒక అవసరతను కలిగియుండవలసియున్నది.
35
ఒక రాత్రి ఆయన కొరకు సముద్ర తీరమున వేచియుండిరి, మరియు వారు ముందుకు సాగిపోయారు. వారనుకొన్నారు, ఓ, సరే, మేము ఎలాగైనా దానిని చేయగలము, అని అనుకొన్నారు. మేము సముద్రములోనికి ముందుకు వెళ్ళిపోతాము. వారు యేసు లేకుండా ఓడలో వెళ్ళిపోయారు.
అనేకమైన కుటుంబాలతో ప్రతీ స్ధలములో ఇక్కడ వచ్చిన ఇబ్బంది అదియే. యేసు లేకుండా సముద్రం మీద ఈ వైపు నుండి ఆ వైపునకు నీవు ఓడలో వెళ్ళాలనుకుంటున్నావ్. అయితే నీవు కొంచెం దూరం వెళ్ళుటకు ముందే చిన్న బెరడుతో అక్కడ ఏదో తప్పున్నదని కనుగొంటావు. జీవితము యొక్క అలలను (ప్రవాహమును) క్రీస్తు లేకుండా నీవు ఆపలేవు లేక క్రీస్తు లేకుండా నడవలేవు.
అక్కడ వాళ్ళపని అయిపోయినది... అయితే దీన్ని నేను ప్రేమిస్తాను. (ఓ, మై, దీన్ని గూర్చి నేను ఆలోచించినపుడు.) ఇప్పుడు, వారు ఆయన లేకుండా వెళ్ళిపోయారని ఆయన ఎరిగియున్నాడు, అయితే మీరు గమనించండి, ఆయన ఒక కొండ యెక్కి సముద్రం మీద ఉన్న వారిని గమనించుచుండెను మరియు దయ్యము వారిని అక్కడ పట్టుకుని చిన్న సుడిగాలి ద్వారా క్రిందికి పైకి కొట్టుకొనుట ఆయన చూసెను. అయితే, ఆయన కన్నులు వారి మీద ఉండెను. ఆయన వారిని కనిపెట్టుచుండెను.
36
బహుశా దెయ్యము నిన్ను ఏదో ఒక స్ధలములో బయట నిన్ను పట్టుకుని, నీకు ఒక వ్యాధిని లేక ఏదో ఒక రోగమును ఇస్తుంది, లేక నీవు వెనక్కు జారిపోతావు, లేక అలాటిదేదో సంభవిస్తుంది, అయితే గుర్తుంచుకో, ఆయన మహా శిఖరములనెక్కి ఉన్నత శిఖరముల మీద కూర్చునియుండెను. ఆయన కన్నులు ఒక పిచ్చుక మీద ఉన్నవి, మరియు నాకు తెలుసు ఆయన నన్ను గమనించుచున్నాడు.
నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఆయన దేవుడైయున్నాడు, ఆయన పైకి ఎక్కి నన్ను గమనించుచున్నాడు. నీవు ఎక్కడ ఉన్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. ఈ రాత్రి మనం ఈ కూడికను కలిగియున్నామని ఆయనకు తెలుసు, దాన్ని గూర్చి మన ప్రతి ఒక్కరి పట్ల ఎంత శ్రద్ధ కలిగియుండాలో ఆయనకు తెలుసు. ఆయనపై నీకున్న ఆసక్తి ఆయన ఎరుగును. ఆయన రాజ్యం పట్ల నీకున్న ఆసక్తిని ఆయన ఎరుగును. నీ హృదయం ఎక్కడ ఉన్నదో ఆయనకు తెలుసు. కాబట్టి, ఆయన తన వాక్యమును కాయుచున్నాడు.
మరియు తరువాత, ఆ చిన్న దోనె అలలతో క్రిందికి పైకి కొట్టబడి మునుగుటకు సిద్ధమైనపుడు మనం గమనించగలము.... తెడ్లు విగిరిపోయినవి, తెరచాపలు కొట్టుకుని పోయినవి, ఓడ యొక్క కూపకము(స్థంబము) విరిగిపోయినది. వారు ఆ స్ధితిలో ఉండిరి, చిన్న దోనె నీళ్ళతో నిండిపోయి అక్కడ సముద్రములో కొట్టుకొనుచున్నాది. ''నేను వారిని అతి త్వరగా పట్టుకుంటాను, అని దెయ్యం అనుకున్నది.''
అయితే అకస్మాత్తుగా వారు చూడగా, ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చుచుండెను. అత్యంత చీకటి ఘడియలో, అప్పుడు యేసు వచ్చాడు.
37
ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీకు అంధకార ఘడియగా ఉండవచ్చు. వైద్యుడు నీకు కాన్సరు ఉన్నదనీ, క్షయవ్యాధి ఉన్నదనీ, గుండె జబ్బు ఉన్నదనీ నీకు ఏ నిరీక్షణ లేదని నిన్ను వదిలిపెట్టి ఉండవచ్చును, అయితే ఆ అత్యంత చీకటి ఘడియలోనే యేసు నడుచుకుంటూ వస్తాడు, కొన్ని సార్లు మనం ఆయనను గుర్తుపట్టలేము. వారు ఆయనను చూసియున్నారు మరియు గమనించియున్నారు, అది అన్నిటికంటే భీకర దృశ్యంగా ఉన్నది. వారు ఆయనను చూసినప్పుడు వారు భయపడ్డారు కారణం ఆయన ఒక భూతమని వారు తలంచారు.
అనేకమంది ఈ కూటములకు హాజరగుటలో ఈ రాత్రి భయపడుచున్నారు, కారణము వారంటారు, “నేను దీనిని నమ్ముతాను లేక దానిని నమ్ముతాను.” లేక వారిని ఆత్మల వద్ద విచారించువారిగా, లేక జాతకములు చెప్పువారిగా, లేక దయ్యముపట్టిన వారుగా, లేక అలాంటి వాటిలో ఏదో ఒకటిగా ఉంటారు.“
మరియు గమనించండి, ఆ సందర్భంలో ఒకే ఒక్కటి వారికి సహాయపడగలదు, వారు దానికి భయపడతారు. అనేక మంది ఈ రాత్రి రకరకాల వ్యాధులతో వైధ్యశాలలోని పడకల మీద శ్రమలోతో ఉన్నారు, మరియు వారికి సహాయపడునది ఒక్కటి మాత్రమే ఉన్నది, అదే ప్రియమైన ప్రభుయేసు; మరియు వారు ఆయనను ప్రయత్నించుటలో, ఆయనను నిరీక్షించుటలో భయపడుచున్నారు. ఆమేన్. అది యదార్ధము.
38
నీళ్ళు దోనెను నెట్టుచుండగా, ఒక క్షణము తరువాత యేసు వారితో మాట్లాడుచూ ఇలా అన్నాడు, ''భయపడ వద్దు, అది నేనే.“
పేతురు అన్నాడు ''ప్రభువా అది నీవై యుండినయెడల నాకు ఒక చిన్న పరీక్షను ఇమ్ము.''
అడుగుడి మీకియ్యబడును. కాబట్టి, ఆయన అతనికి పరీక్షను పెట్టాడు, తనకై తానుగా అతడు దాన్ని చేయుటకు ప్రయత్నించినపుడు అతడు ఓడిపోయాడు మరియు ప్రతీ వ్యక్తీ అలాగుననే తప్పిపోతాడు. అతడు యేసు మీద నుండి తన కన్నులను తీసివేసి మరియు ఆ అలలు ఎంత పెద్దగా యున్నవో అని చూచుట ప్రారంభించాడు. ఆ అలలు వ్యతిరేకంగా ఉండుట అతడు చూచినపుడు, అతడు మునిగిపోవుట ప్రారంభించాడు. ప్రార్ధించబడిన తరువాత తన శ్రమలవైపు చూచే ప్రతి మనిషి నిశ్చయంగా మునిగిపోతాడు.
నీవు నీ శ్రమలవైపు చూడరాదు. నీ కన్నులను వాగ్ధానం ఇచ్చిన వాని మీద ఉంచవలెను, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ కన్నులను ఆయన వాక్యం మీద ఉంచుము. దానిని వాగ్ధానం చేసినవాడు ఆయనే. ఆయన దానిని నెరువేర్చుటకు దానిని కాయుచున్నాడు. ఆయన దానిని తన చేతి గుప్పిలిలో ఉంచుచున్నాడు, మరియు అది ఆయన హృదయం యొక్క లోతులలో నాటబడి ఉన్నది. ఆయన మాటలు సత్యముగా ఉండవలసియున్నవి.
నీ మనస్సును వ్యాధి మీద నుండి, నీ ఇబ్బందుల మీద నుండీ తీసివేయుము. నీ కన్నులను యేసు మీద ఉంచుము.
39
తర్వాత గమనించండి ఆ సముద్రము దగ్గరికి వెళ్ళినపుడు... వారు అక్కడకు చేరుకోగానే, ఆ కొండ మీద అక్కడ ఒక చిన్న స్త్రీ ఉన్నది. బహుశా ఆమె తన డబ్బునంతయూ వైద్యుల కొరకు ఖర్చు పెట్టినది మరియు వారిలో ఎవరునూ ఆమెను ఏ మంచి చేయలేదు. బహుశా ఆమె తన వ్యవసాయ క్షేత్రమును తాకట్టు పెట్టినది, ఆమె తన కాపులను అమ్ముకున్నది, తనకు సమస్తమునూ అమ్మి వేసినది. మరియు వాటిలో ఏదియూ ఏ మేలు చేయలేదు, అయితే ఆమె యెడతెగకుండా బహు హీనమైన రోగిగా మారినది. ఎలాటి ఘడియ అది.
వైద్యులు బహుశా బహు యదార్ధంగా ఆమె యొక్క రక్తస్రావమును ఆపుటకు ప్రయత్నం చేసిరి, అయితే ఆమె ఇలా చెప్పుటను నేను ఊహించగలను, ''నేను కేవలము ఈ ప్రవక్త ఉన్న చోటికి వెళ్ళినట్లైతే, నేను ఆయన దగ్గరగా వెళ్ళి ఆయన వస్త్రములను ముట్టినట్లైతే... ఆయన చెప్పుచున్న ప్రతిమాట దేవుని వాక్యం నుండి వచ్చుచున్నదని నేను నమ్ముచున్నాను. నేను కేవలము ఆయన వస్త్రములను ముట్టినట్లైతే, నేను బాగుపడతాను. నేను ఆయనను గూర్చి ఎన్నో సంగతులను గూర్చి విన్నాను.''
మరియు ఆ రాత్రి తుఫాను వీచుచున్న సముద్రం మీదుగా యేసుతో ప్రయాణం చేస్తూ ప్రయాసపడుచున్నాప్పుడు, దెయ్యం కూటము ఆట౦కపరచుటకు వాడు తీవ్రమైన ప్రయత్నము చేయుచున్నాడు.... దేవుడు పంపిన ప్రతి కూటమునకు వాడు ఆ రీతిగా చేస్తాడు. మెధడిష్టు బాఫ్టిష్టు, మీరు ఏ సంఘములలో ఎక్కడున్నప్పటికి మీరు దాన్ని కలిగి ఉంటారు, దెయ్యం వాడు చేయగలిగినదంతా చేసి నీవు అక్కడకు వెళ్ళకుండా చేస్తాడు. నీవు ఎలాగైనా వెళ్ళుము. దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు. ఆయన అడుగులో అడుగువేసి చెప్పుము, ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: దెయ్యమును ఎదురించుము మరియు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు.''
40
కాబట్టి వారు తిన్నగా లోనికి వెళ్ళారు. అలసిపోయి రాత్రంతయూ పడవను లాగుటలో సొమ్మసిల్లిపోయిన ఆ శిష్యుల గుంపును నేను చూడగలను, యేసు ఆ దోనె యొక్క వెనుక భాగమున సమ్మతిని తెలుపుచూ తల ఊపుచున్నాడు.
ఆ చిన్న పాత దోనె ఆ నీళ్ళ సుడులలోనికి వెళ్ళినపుడు, ఆ జన సమూహములు ఈ రీతిగా చెప్పుచూ ప్రారంభించుట నేను వినగలను. ''ఇదిగో దైవీక స్వస్ధత గలవాడు వచ్చుచున్నాడు. సరే, ఆయన తప్పక ఏమి చెప్పవలసియున్నదో మనం చూద్దాం. ఆయన కొన్ని మాటలు పలుకుట నేను వినగోరుచున్నాను. బహుశా మనము చూచుటకు ఒకటి లేక రెండు అద్భుతములను చేస్తాడేమో. తండ్రి చూపించినది తప్ప ఆయన ఏదియు చేయడని ఆయన చెప్పుట నేను విన్నాను; హా, అయితే, మనం కొంత మందిని ఇక్కడకు తీసుకొని వచ్చెదము, మరియు ఆయన ఏమి చేయగలడో చూద్దాము.''
యేసు వారిని పట్టించుకోలేదు, తిన్నగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన వారితో వాదించకుండెను. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చియుండెను.
ఈ చిన్న స్త్రీ, ఆ అవిశ్వాసులలో ప్రతి ఒక్కరినీ నెట్టుకుంటూ, బహుశా ఆ జన సమూహముల మధ్య ఆ క్రింద ప్రాకుకుంటూ చివరిగా ఆయన వస్త్రపు చెంగును తాకినది, మరల పరిపూర్ణమైన సంతోషంతో వెనుకకు తిరిగినది, ఆమె విశ్వాసము ఆయనను తాకినది, ఆమె విశ్రాంతిని పొందినది. ఆమె దానిని చేసినపుడు, యేసు వెనుకకు తిరిగి ఇలా అన్నాడు, ''నన్ను ఎవరు తాకిరి?'' ఆ జనసమూహాన్ని కలియచూశాడు, వారిలో ప్రతి ఒక్కరూ మేము ఎరుగము అన్నారు. ఆయన తిన్నగా ఆ స్త్రీ వైపు చూసి ఇలా అన్నాడు, ''కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్ధపరచినది.''
41
మంచిది. ఆ సమయమునకు అటువైపు కొండ ప్రక్కన కొన్ని మైళ్ళ దూరంలో ఒక చిన్న మనిషియున్నాడు. అతడు ఒక చక్కని పరిసయ్యుల సంఘశాఖకు చెందియున్నాడు. అది అద్భుతమైన సంఘము, అతడు ఎంతో సమాజపు పేరు ప్రతిష్ఠలు కలిగియున్నాడు.
బహుశా యాయీరు ఒక గొప్ప వేదాంత పండితుడుగా అతని పట్టణంలో చక్కగా నిలబడియున్నాడు. అతడు తన బి. ఎ. పట్టాను కలిగి యుండవచ్చు. అతడు ఒక ఎల్.డి. పట్టాను కలిగియుండవచ్చు, అది ఏమైయున్నప్పటికీ అతడు ఒక పండితుడుగా చక్కగా బట్టలు ధరించియున్నాడు. ఆ యాజకుని వస్త్రముల లోలోపట అతడు ఆయన ఒక దేవుని కుమారుడైయున్నాడని అతడు నమ్మియున్నాడు. కాబట్టి, అతని విశ్వాసమును ఒప్పుకొనుటకు, దానిని పనిలో పెట్టుటకు, దేవుడు అతనికి ఒక అవకాశమిచ్చియున్నాడు.
42
మంచిది. యేసు అక్కడికి చేరుకున్నట్లు మనం కనుగొంటాము... ఆ దినమునకు ముందు రోజు బహుశా వైద్యుడు వచ్చి, సాధారణంగా ఒక క్రైస్తవుడు లేక ఒక విశ్వాసి చేయగలుగు దానిని అతడు చేసియున్నాడు, లేక అది ఏమైయున్నప్పటికీ అది చేసియున్నాడు. ఎవరైనా రోగగ్రస్తుడైనపుడు వైద్యులు వారికి చేయగలిగినంతా వారికి చేస్తారు.
యాయీరు 12 సం॥ ల వయస్సు కలిగిన ఒక కుమార్తెను కలిగియున్నాడు. ఆమె రోగి ఆయెను. దేవుడు ఏమి చేయబోవుచుండెనో ఆయన యెరిగియుండెను. ఆ కారణమును బట్టియే యేసు అక్కడకు వచ్చి యుండెను. కాబట్టి యాయీరు యొక్క 12 సం॥ ల కుమార్తె రోగి అయినది. బహుశా వైద్యులు ఆమె యొద్దకు వచ్చి ఆమెను బాగా పరీక్షించి ఇలా అన్నారు, ''మంచిది ఆమెకు కొన్ని విరుగుడులను మేము ఇస్తాము, ఈ ఉడకబెట్టిన ఆకులు మరియు చెట్టు బెరడులు తీసుకోండి బహుశా వాటి నుండి ఆమె బలము లాగుకొంటుంది. ఆమెకు కొంచెం జ్వరంగా ఉన్నది అని వారు చెప్పారు.''
దినములు గడిచినవి, శ్వాస పీల్చుట ఆగిపోవుట ప్రారంభం అయినది. ఈ విరుగుడులన్నియు - ఈ దీన మనిషి ఆ దినమున తానెరిగిన సమస్తమునూ చేయుచున్నాడు. అతడు చేయగలిగినదంతయూ చేశాడు, బహుశా కుటుంబమునకు అతడు దగ్గరి స్నేహితుడు. వైద్యుల మందులన్నియూ అతడు చెప్పిన సమస్తమూ అతడు వాడియున్నాడు, మరియు ఆ పాప ఇంకా క్షీణించిపోయినది.
చివరగా వైద్యుడు లోనికి వచ్చాడు, ఆమె నాడిని పట్టుకొని చూసి ఇలా అన్నాడు, “మంచిది యాయీరు, నీవు, నీ భార్య బయటకు రండి, నేను మీతో కొంత మాట్లాగోరుచున్నాను. ఒక విచారకరమైన విషయం నేను మీకు చెప్పవలసియున్నది. నేను మీ యొక్క వైద్యునిగా దాన్ని చెప్పుట నేను అసహ్యించుకొనుచున్నాను. అయితే నా యొద్ద నున్న శాస్త్రీయ జ్ఞానమంతటితో - నీ కుమార్తె చనిపోవుచున్నది ఆమె గుండె కొట్టుకొనుటను నేను గమనించుచున్నాను, అది ప్రతి నిమిషానికి గుండె కొట్టుకొనుట తగ్గిపోవుచున్నది. ఆమెకు ఏ మందు ఇవ్వాలో నేనెరిగిన సమస్తమూ ఇచ్చి యున్నాను. అయిననూ ఆమె ఆరోగ్యము ఎంతో ఎంతో క్షీణించిపోవుచున్నది. ఊపిరి పీల్చుట దరిదాపుగా క్షీణించినది కొన్ని క్షణములు తప్ప నీ కుమార్తె ఎక్కువ సమయం జీవించదు, కాబట్టి ఈ దిగ్భ్రాంతికి నీవు సిద్ధము కమ్ము.”
43
చిన్న యాయీరు - వైద్యుడు తాను చేయగలిగిన సమస్తమూ తాను చేసియున్నాడు - అతడు చేసిన పరిచర్య అంతటికీ ఆ వైద్యునికి చెల్లించవలసిన డబ్బును అతడు చెల్లించాడని నేను ఊహించగలను, మరియు అతడు వెళ్ళిపోయెను. చిన్న దీనురాలైన యాయీరు భార్య - యాయీరు బహుశా విలపించుచున్నారు.
అప్పుడు అతని యొక్క ఆత్మలో ఒక చిన్న నిప్పు రవ్వ మండినది. అదే నజరేతువాడైన దేవునికు మారుడైన యేసుని గూర్చి వినుట, మరియు ఆ దినమునకు దేవుడు ఆయనను పంపుతాడని ఈ కార్యములు ఆయన చేస్తాడని ఆయన వినియుండెను, ఏలయనగా యెషయా చెప్పాడు ''కుంటివాడు దుప్పివలె గంతులు వేస్తాడు'' మరియు ఆ మనిషి ఆ వాగ్ధానాన్ని నెరవేరుస్తున్నట్లైతే, అప్పుడు అతడు తనతో దేవుని మహిమను కలగి యుంటాడు. కాబట్టి అతడనుకున్నాడు.... అతడు లోనికి వెళ్ళి తన టోపీని తీసుకొనుటను నేను చూడగలను. ప్రజలందరూ ఆ సమాజ మందిరపు సభ్యులందరూ, చుట్టూ చేరి ఆ బిడ్డ చనిపోవుటను గమనించుచున్నారు. ''యాయీరు నీవెక్కడికి వెళ్ళుచున్నావు?'' అని వారు చెప్పుటను నేను వినగలను.
సరే, యాయీరు అన్నాడు, ''ఒక చిన్న సందర్శనం కోసం నేను వెళ్ళుచున్నాను.“ యేసు వచ్చుచున్నాడని తప్పక ఎవరో అతనికి చెప్పి యున్నారు. ఈ దినమున సహితము బోధించుటకు అది ఒక మంచి వర్తమానమైయున్నది, ”యేసు వచ్చుచున్నాడు.''
44
సరే, ఆయన ఆ దిగువకు వచ్చుచున్నాడని, లేక ఆ నది యొద్దకు వచ్చుచున్నాడని వారు వినియున్నారు, మరియు ఆయన వచ్చుచున్నాడని వారు వినియున్నారు. కాబట్టి ''వినుట ద్వారా విశ్వాసం కలుగును, అది దేవుని వాక్యం వినుట ద్వారా.'' కాబట్టి యాయీరు తన యాజక సంబంధమైన చిన్న టోపీని ధరించుకొని వెళ్ళుచున్నాడు. ''యాయీరు, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు? అని అతని సంఘ సభ్యులు అడుగుట నేను వినగలను.
''అతని భార్య అన్నది, “హనీ, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు?''
''అతడు అన్నాడు, “నేను యేసును చూచుటకు వెళ్ళుచున్నాను.''
అది చేయటకు ఒక మంచి కార్యమైయున్నది. ఇబ్బంది తరుణములో, యేసు నొద్దకు నీ దారిని తీసుకొనుము, ఏలయనగా ఆపత్కాలములో, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అతని సహచరులు మరియు పెద్దల బోర్డువారు అతనితో ఇలా అన్నారు, ''కుర్రవాడా, నీవు వెలివేయబడతావు. అది గుర్తుంచుకో. తదుపరి సాధారణ సమావేశం జరుగువరకు నీవు వేచియుండు, మేము నిశ్చయంగా బయటకు నిన్ను గెంటి వేస్తాము. ప్రధాన యాజకుడు ఏమన్నాడో మీకు తెలుసా ఎవరైననూ అలాటి వ్యక్తి చుట్టూ చేరి వెర్రివారైతే అట్టివారితో మాకిక పనిలేదు.
45
అయితే వినండి, సమయం వచ్చియున్నది, ఆ కఠోరమైన ఘడియలో అతను ఒక అవసరతలో వుండెను. అదే ఈ దినమున మన అవసరతయైయున్నది. ఒక అవసరత కొరకు సమయం వచ్చియున్నప్పుడు మరణం నీ తలుపును తట్టుచున్నప్పుడు, నీవు ఎన్నడూ పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మమును రుచిచూడనపుడు మరియు తిరిగి జన్మించుట, అను దేవుని శక్తిని ఎరగనపుడు.... దాన్ని గూర్చి మీరిపుడు నవ్వుతారు. అయితే అవసరత వచ్చినపుడు, నీ చుట్టూ ఎవరు నిలబడియున్నారో నీవు లెక్కచేయవు. నిన్ను వెలివేసినా, వెలివేయకపోయినా, ఎంతో నిశ్చయముగా క్రీస్తునొద్దకు వెళ్ళుటకు నీవు మార్గమును కనుగొంటావు.
ఆ దినమున నీ సంఘ సిద్ధాంతములు దానితో ఏమియూ చేయలేవు. నీవు వెళ్ళుచున్న సంఘమునకు నీవు ఎంత నమ్మకంగా ఉన్నా లెక్కకాదు. యేసు అన్నాడు, '' ఒకమనిషి తిరిగి జన్మించినట్లైతే...“ ఆ చిన్న నిప్పు రవ్వ నీవు దానిని నమ్మునట్లు చేస్తుంది, ఈ రాత్రి దానిని మీరు వినండి; విశ్వాసముతో దానికి నీరు కట్టండి దేవుడు దానిని ఒక రక్షణ చెట్టుగా నీకు దానిని ఎదుగనిస్తాడు.
46
ఇప్పుడు, ఆ చిన్న వ్యక్తి తన దారిగుండా వెళ్తున్నప్పుడు, అందరూ అతనిని విమర్శించారు... అయితే గుర్తుంచుకో, ఇప్పుడు అతడు చెప్పలేడు, “ఓ, నేను మరొక కూటము జరుగు సమయం వరకు వేచి యుంటాను.'' అది అప్పటిదై యున్నది. ఒక చర్య తీసుకోవల్సియున్నది. అతడు యేసు నొద్దకు వెళ్ళవలసియున్నది లేని యెడల ఆయన బిడ్డచనిపోతుంది. మరియు సోదరులారా ఈ రాత్రికి క్రీస్తు నొద్దకు ప్రజలను మనం తేనట్లైతే వారు చనిపోతారు. ఆ ఘడియ ఇక్కడ యున్నది.
''నేను దైవీక స్వస్ధతను వెయ్యేండ్ల పాలనలో నమ్ముతాను,'' అని ప్రజలు అంటారు. సరే, నీవు అమర్త్యుడుగా ఉన్నప్పుడు దైవీక స్వస్ధతతో నీకు అవసరత ఏముంది? ఈ రోజే ఆ దినమైయున్నది, మరొక అవకాశం లేదు. ఇదే రక్షణ దినమై యున్నది. ప్రజలను క్రీస్తు నొద్దకు తెద్దాము.
47
అప్పుడు యాయీరు ముందుకు కదులుటను నేను చూడగలను. కొద్ది సమయం తరువాత అతడు ఈ ప్రియమైన చిన్న వ్యక్తిని, వ్యాకులముతో ఉన్న కన్నులతో వంగిపోయిన భుజములతో, 30 సం॥ల వయస్సులోనే 50 సం॥లు వయస్సు గల వ్యక్తిగా కనబడుచున్న ఆయనను బహుశా దరిదాపుగా తన పని భారమును బట్టి దరిదాపుగా బూడిద రంగుగా ఆయన వెంట్రుకలు మారిపోయినవి. ఆయన 50 సం॥ల వయస్సు గలవానిగా కనబడుచున్నాడని అన్నారు. వారన్నారు, ''నీకు ఇంకా 50 సం॥ల కూడా లేవే, నీవు అబ్రహామును చూసియున్నానని చెప్పుచున్నావు.''
ఆయన అన్నాడు, ''సరే అబ్రహాముకు ముందే నేనున్నాను.''
అక్కడ ఆయన ఉండియున్నాడు, అయితే 30 సం॥ల వయస్సులో ఆయన 50 సం॥ల వయస్సు గల వ్యక్తిగా కనబడ్డాడు, బహుశా ఆయన నడుస్తూ యుండగా చిన్నగా వంగిపోయి ఉంటాడు. యాయీరు ఆయనను చూసినపుడు అక్కడ యాజకులందరూ నిలబడి ఆయనను వెక్కిరించారు, ఎగతాళి చేసి సమస్తమూ చేశారు. అయితే వారిలో కొందరు, ఆ స్త్రీని స్వస్ధపరచినందుకు దేవునిని మహిమపరచారు. ఆ యాజకుడు అన్నాడు,
''అది మనస్సు చదువుట తప్ప మరేమి కాదు. దానికక్కడ ఏమియూ లేదు.''
''ఆయనకు ఆ స్త్రీ ఎవరో తెలీదు. ఆమెకు రక్తస్రావం ఉన్నదని ఎలా తెలుసుకున్నాడు?''
''నేను అది నమ్మను. అది దెయ్యానిది. అతడు బెయెల్జబూబు.'' ఆయన్ను ఎగతాళి చేస్తూ సమస్తమూ చేశారు.
అయితే వారిలో కొందరు ''హోసన్నా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి హోసన్నా అన్ని కేకలు వేశారు.'' వారు ఆనందించుచున్నారు.
48
అప్పుడు యాజకుడు ఏమి చెబుతున్నాడో నేను చూడగలను, ''మీరు చూడండి దాన్ని ఎవరు చేయుచున్నారో, అది చెత్త అతడు హీనమైన కనుబొమ్మలు కలవాడు.“ ఓ, మై, దేవున్ని నమ్ముటకు అది కావాలా, అప్పుడు నేనును హీనమైన కనుబొమ్మలు కలవాడను. అది సత్యం. సామాన్య ప్రజలు ఆయన మాటలను సంతోషంగా విన్నారు.
అప్పుడు యాయీరుపైకి నడిచి వెళ్ళి వారిలో ఒకనిగా వీధి మాటను వ్యక్తపరచునట్లుగా అతడు కూడా వారి మధ్యలో ఒకడుగా హీనమైన కనుబొమ్మలు కలవానిగా మారాడు. అతడు పరగెత్తుకుంటూ వెళ్ళి, యేసు పాదాల మీద పడ్డాడు, మరియు అతడు అన్నాడు, ''ప్రభువా, నా యొక్క చిన్న కుమార్తె చనిపోవుటకు సిద్ధముగా ఉన్నది.''
అతడు ఈ మాటలు చెప్పుట నేను ఊహించగలను, ''నేను నీ గూర్చి విన్నాను. ఎల్లప్పుడు నా హృదయాంతరంగంలో నీవు యున్నావని నేను నమ్మియున్నాను. దానిని నేను నమ్మకూడదని నేను నేర్పించబడియున్నానని నేనెరుగుదును, అయితే ప్రభువా, నా హృదయాంతరంగంలో, నా హృదయమును నీవెరుగుదువు. ఆ స్త్రీ యొక్క రక్తస్రావమును గూర్చి నీవెరిగియున్నట్లైతే, ఈ ఇతర కార్యములన్నియూ నీవెరిగియున్నావని నాకు తెలుసు. మరియు దేవుడు నీకు చెప్పియున్నాడు. సందేహం లేకుండా నా హృదయాన్ని నీవెరుగుదువు. కాబట్టి, నేను వచ్చియున్నాను. నీవు వచ్చి నీ చేతులను ఆమె పై ఉంచుము, ఆమె జీవిస్తుంది.'' అక్కడే నీవునూ ఉన్నావు, అక్కడే నీ విశ్వాసము ఉంచబడి యున్నది.
49
ఇప్పుడు, అది యాయీరుకు, ''ఆమెపై చేతులుంచుటగా ఉన్నది.'' అది యూదుల విధానమైయున్నది. యూదులు రోగులపై చేతులు ఉంచేవారు.
అయితే శతాధిపతి ఆ రీతిగా లేడు. అతడన్నాడు, ''నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు సహితము యోగ్యుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము మరియు నా సేవకుడు బ్రతుకుతాడు.'' ఆ అధికారములను చూడండి. అతడన్నాడు, ''నేనును అధికారం క్రింద ఉన్నవాడను. నేను ఈ మనిషితో వెళ్ళి దీనిని చేయుము, అని చెప్పినప్పుడు అతడు వెళ్ళి దానిని చేస్తాడు. ఈ మనిషితో నేను 'రమ్మంటే' అతడు వస్తాడు.''
ఒక వందమంది మనుషుల మీద అతడు శతాధిపతియై యున్నాడని అతడు ఎరిగియుండెను, మరియు ఆ వందమంది ఖచ్చితముగా అతడు చెప్పినట్లు చేయవలసియున్నది. ప్రతివ్యాధి మరియు దయ్యములన్నియూ ఆయన స్వాధీనములో యున్నవని అతడు ఎరిగియుండెను. ''కేవలము మాట మాత్రము సెలవిమ్ము,'' హల్లెలూయ!
పరిశుద్ధ-దొర్లువారు అని మీరు నన్ను పిలువబోవుచున్నారని నాకు తెలుసు. మిగిలినవారందరితో తిన్నగా నీవు ముందుకు సాగవచ్చును. అది సత్యము. మీలో నుండి ఒక్కరిని అలా తయారుచేస్తే సరిపోతుంది. ఓ, ''వాక్యమును మాట్లాడుము,'' నీవు చేయవలసినదంతయూ అదే. ''కేవలమునీ మాటను సెలవిమ్ము, నా సేవకుడు జీవిస్తాడు.“ ఆమేన్.
50
యాయీరు అన్నాడు, ''చేతులు ఉంచవలసినదిగా, నేను నేర్పించబడ్డాను, కాబట్టి వచ్చి నా కుమార్తె మీద చేతులుంచుము.''
ఎలాగైనా ఆయన వెళ్ళబోవుచున్నాడని ఆయన ఎరిగియుండెను. ''మనము వెళ్ళదాము,'' అని ఆయన అన్నాడు. మరియు వారు బయలుదేరారు, చిన్న యాయీరు జనసమూహము చుట్టూ చూస్తూ యున్నాడు, మై ''నేను వస్తాను,'' అని యేసు చెప్పిన తరువాత యాయీరుకు మంచిగా అనిపించినది.
నీవు యేసుతో ఒక మాటను విన్నట్లైతే కొన్ని నిముషములలో అన్నీ, సమస్తము తేటపడుతుంది. యేసు నీతో కొంచెము మాట్లాడుటను నీవు కలిగియున్నంతవరకు, అప్పటి నుండి వారు నీ గూర్చి ఏమి చెపుతారో నీవు లెక్కచేయవు.
ఆయన దారి వెంబడి వెళ్ళుచున్నాడు. అందరిని చూట్టు చూస్తూ నవ్వుతూ తన చిన్న తలను వెనుకకు ఆడించాడు, వారు ఎంతగా నవ్వినారో అతడు లెక్క చేయలేదు. అతనిని చూసి యేసుతో నడుచుచున్నాడు. ఎవరైనా ఎన్నడైనా యేసుతో నడిచినపుడు, విమర్శకులు ఏమంటారో వారు ఎన్నడూ లెక్కచేయరు. నీవు ఎన్నడైనా యేసుతో నడిచినపుడు....
ఆయన మార్గముగుండా నడుచుచున్నాడు. “ఆయన ఒక దీర్ఘదర్శి. అతడే ఈయన ఆ మనిషి ఇతడే. దానిని ఆయన ఇతర స్థలములలో జరిగించియున్నాడు, మరియు అతడు ఇంతకు మునుపే నాకు నిశ్చయతను ఇచ్చియున్నాడు. ఇదిగో నేను వెళ్ళుచున్నాను,'' అని తిన్నగా మార్గము వెంబడి వెళ్ళుచున్నాను.
51
ఇప్పుడు దయ్యమును గమనించండి. ''నేను ఆయనను తమాషా చేస్తాను. నేను ఆయనను ఇరికిస్తాను,'' అన్నది.
ఆ సమయమునకు వారు దారిగుండా కొన్ని గంటలు ప్రయాణము చేశారు, ఒక మనిషి పరుగెత్తుకొంటూ వచ్చాడు, ''భోధకుని ఇబ్బంది పెట్టవద్దు. నీ చిన్నకుమార్తె ఇంతకు మునుపే చనిపోయినది. ఆమెను మేము బయట ఉంచినాము. ఆమె చనిపోయినది. భోధకుని ఇంకేమియు ఇబ్బంది పెట్టవద్దు,'' అని అన్నాడు.
యాయీరు దానిని విన్నప్పుడు, అతని గుండె కొట్టుకోవడం ఒక క్షణము ఆగిపోయినది. అతడు తన హృదయమును పట్టుకున్నాడు. యేసు వైపు అతడు చూశాడు. ఒక్కసారి.... తేటగా యేసు వైపు చూశాడు.... ఓ, దానిని వివరించుటకు నాకు కనీసము ఒక్క మాట దొరుకుట లేదు. అది ''అలాగు యున్నదని ఆయనకు తెలుసు, ఆయన ఎన్నడూ కలవరపడలేదు.'' ఆయన చుట్టూ ఎంత కలవరముగా యున్నప్పటికి లెక్కకాదు. ఆయన ఎల్లప్పుడు శాంతితో యుంటాడు. యాయీరు యొక్క ప్రతిస్పందనను చూచుటకు, ఆయన పవిత్రమైన కన్నులు అతని మీద పడుటను నేను చూడగలను. ఆయన అన్నాడు, ''భయపడవద్దు. కేవలము నమ్ముము, నీవు దేవుని మహిమను చూస్తావు.''
ఆయన ఎక్కడకు వెళ్ళుచున్నాడో ఆయన ఎరిగియుండెను. ఏమి సంభవించనైయున్నదో ఆయన యెరిగియుండెను. ఆ దర్శనం ఏమి మాట్లాడియుండెనో ఆయన యెరిగియుండెను. దేవుడు తన వాక్యము పట్ల నమ్మకమైనవాడుగా ఉంటాడని ఆయన యెరిగియుండెను.
52
ఆయన ఆ స్థలమునకు చేరుకున్నప్పుడు వారందరూ కేకలు వేయుచూ ఏడ్చుచుండిరి. యాయీరు యొక్క సంఘము నుండి వచ్చిన పరిసయ్యులు ఈ రీతిగా చెప్పుట నేను వినగలను, ''నీవు అక్కడ వున్నావు. నీవు అక్కడ వున్నావు. ఆ దైవిక స్వస్ధతలు చేయువారితో నిన్ను నీవు వెర్రివానిగా చేసుకొనుచున్నావు. ఆ బిడ్డ చనిపోయినదని వైద్యుడు చెప్పాడు. కాబట్టి, ఇప్పుడు నీవు చూడు, నీవు అవమానమును తెచ్చి యున్నావు. ఇప్పుడు నీవు ఏమి చేయబోవుచున్నావు.''
చిన్న యాయీరు తన తలను పైకి లేపి తిన్నగా ముందుకు లోనికి వెళ్ళాడు. బయట యున్న ప్రజలు ఏదో పెద్దదిగా చేయబోవుచున్నారు, యేసు అన్నాడు, ''నాకు దారి ఇవ్వండి'' మరొక మాటలో చెప్పాలంటే ''మీరు మౌనంగా ఉండండి,'' అని అన్నాడు. '' ఈ బాలిక చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నదని అనెను.
ఇప్పుడు, దేవున్ని ఎరుగని ఆ ప్రజలు వారు ఏమి చెప్పి యుంటారని నీవనుకొంటావు? సంఘము భోధించిన విధానంలో వారు ఆయనను యెరిగియున్నారు, అయితే రక్షణ మార్గము నాకు తెలియును, ''ఇప్పుడు మాకు తెలుసు ఆయన సంపూర్ణంగా ఒక వెర్రివాడు, ఎందుకంటే ఆమె చనిపోలేదని చెప్పుచున్నాడు. మేము ఆమెను బయట ఉంచియున్నాము. వైద్యుడు ఆమె చనిపోయినదని చెప్పాడు, బహుశా శవమును సిద్ధపరచువాడు కూడా ఆమె చనిపోయినదని చెప్పియున్నాడు. ఆమె చల్లబడిపోయి ఆ పడక మీద ఉంచబడియున్నది. ఎందుచేత, ఆమె చనిపోయినది మరియు ఈ పిచ్చివాడు ఆమె చనిపోలేదు; ఆమె నిద్రించుచున్నదని చెప్పుచున్నాడు. అలాంటి వ్యక్తితో దూరముగా ఉండుము.''
53
యేసు ఏమి చేశాడో మీకు తెలుసా, వారు ఆయనను చూసి నవ్వియున్నారు, ఆయన ఏమి చేశాడో మీకు తెలసా? ఆయన వారిని బయట ఉంచాడు, అది నిజము. కాబట్టి ఆయనను చూసి నవ్వొద్దు; నీవునూ తప్పక బయట ఉంచబడతావు. ఆయన వారిని బయట ఉంచాడు, వారందరినీ ఆయన బయటే ఉంచాడు. అలాటి అవిశ్వాసుల గుంపులో ఆయన అలాంటి కార్యాన్ని ఏదైనా ఎలా చేయగలడు? కాబట్టి విశ్వాసులు చేయవలసినది ఏమనగా వారికై వారు ఏకముగా సమాజముగా కూడి క్రీస్తు వారి మధ్యలోనికి వచ్చు వరకు ప్రార్ధన చేయవలెను, అప్పుడు అద్భుతములు, సూచక క్రియలు సంభవిస్తాయి.
ఆయన అక్కడ యున్నాడు; వారందరినీ బయట ఉంచియున్నాడు ఆ అవిశ్వాసమంతటి నుండి ఆయన దూరపరచబడ్డాడు, ఆయన అక్కడ ఆ బిడ్డ యొక్క తండ్రితో ఆ చిన్న బిడ్డతో నిలబడియున్నాడు. వారు నమ్మిక కలిగినవారు.పేతురు, యాకోబు, మరియు యోహాను మాత్రమే ఆయనతో వెళ్ళగలిగినారు: విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ. వారు మాత్రమే లోనికినడిచి వెళ్ళారు. వారి వెనుక తలుపులను మూసివేశారు.
బయట అక్కడ అవిశ్వాసమనే గోడయున్నది. అయితే యేసు ఒక శక్తితో నింపబడియున్నాడు, భూసంబంధమైన కార్యములు తప్పిపోయిన తర్వాత, ఆయన మరొక భాషతో మాట్లాడాడు, మరియు ఆయన అదిగో ఒక చిన్న బిడ్డ యొక్క ఆత్మ ఉన్న మరొక ప్రపంచంలో మాట్లాడాడు. మరియు ఆ బాలిక బిగదీసుకొని చనిపోయి యున్నది, ఇప్పుడు ఆమె తిరిగి లేచి తన పాదములు మోపి జీవముతో చిగురించినది. ఆయన మాట్లాడగా ఆమె జీవములోనికి వచ్చినది. ''తబిత'' అని ఆయన ఆమెను వెనుకకు పిలిచాడు, దాని భావము ''కుమారీ పైకి లెమ్ము.''
ఆయన ఆ బిడ్డను తన చేతులలోనికి తీసుకొని ఆమెకు కొంత ఆహారమిమ్మని ఆయన చెప్పియున్నాడు. బహుశా వారు ఆమెను శవమును భద్రపరచు తైలముతో సిద్ధపర్చారు, మరియు రక్తము ఆమె నుండి వెళ్ళిపోయినది. '' ఆమె బలమును పొందుటకు ఆహారము ఇమ్మని ఆయన చెప్పిరి.“
54
ఓ, ఇంకనూ జీవిస్తూ మరియు ఏలుచూ, ఆ దినమున యుండి యున్న అదే దేవుడు ఈ రాత్రి ఇంకనూ అదే దేవుడుగా జీవించుచున్న యేసుక్రీస్తును ఈ రాత్రి నేను యెరిగియున్నందుకు నేనెంతో సంతోషించుచున్నాను. ఆయన నిరంతరం సజీవుడుగా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగియుండుము.
కుళ్ళు దాని యొక్క యజమానిని యెరుగునని నేనెంతో సంతోషిస్తాను, ఆత్మ దాని యొక్క సృష్టికర్తను ఎరుగును, మరియు ఇంకేదియూ దాన్ని చేయలేదు, అయితే దేవుని కుమారుడు ఆమెను పిలిచిన వెంటనే అది తిరిగి రావలసియుండెను. మన పేర్లు ఆయన గ్రంధంలో యున్నట్లైతే, ఆయన తప్పక పిలుస్తాడని నేను సంతోషించుచున్నాను. మీరు సంతోషించుట లేదా?
పాపివైనా నా స్నేహితుడా, ఈ రాత్రి దేవునియొక్క కృపను బట్టి, నీ యొక్క పేరు కూడా ఆయన గ్రంధములో యుంచబడుతుందని నీ పాపమును క్షమించినవానిగా నీవు ఆయనను ఎరుగుతావని, నీ రక్షకునిగా నీవు ఆయనను ఎరుగుతావని నేను నమ్ముచున్నాను, నీవు కోరియున్నట్లైతే మేము ప్రార్ధన చేయుదుము.
పియోనా వాయించు వ్యక్తి.... లేక ఆర్గానిస్ట్, నీవు కోరినట్లైతే ముందుకు వచ్చి, ''నాతో నిలిచియుండుము,'' అను పాటను మృదువుగా వాయించుము, సహోదరీ, నీవు కోరినట్లైతే, జన సమూహము వారియొక్క తలలను ఒక్క క్షణము వంచియుండగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్ధనలో యుండండి, మీ హృదయమంతటితో నమ్ముచూ, దేవుని కుమారుడైన యేసు అన్నిటిని ఎరిగియున్నాడు, ఆయన అన్నిటిని చేయగలడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించుచున్నాడు.
55
ఇప్పుడు, నీవు ఒక క్రైస్తవుడవు కానట్లైతే, నీవు ఒక విశ్వాసివి కానట్లైతే, ''నమ్మవలసిన ఘడియ ఇదేనని,'' చెపుతూ దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను.''
మా పరలోకపు తండ్రీ, ఇప్పుడు మేము కనిపెట్టుచుండగా, ''వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది, అది దేవుని వాక్యము వినుట ద్వారా.'' తండ్రీ, మా అందరిపట్ల కనికరము చూపుమని నేను ప్రార్ధన చేయుచున్నాను. మా దోషములను మా అతిక్రమములన్నిటిని క్షమించుము. మమ్మును క్షమించుము. మరియు నీ పవిత్ర వాక్యములో ఇలా వ్రాయబడియున్నది, ''నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముకలవాడు, మరియు వాడు తీర్పులోనికి రాక, మరణములోనుండి జీవమునకు దాటియున్నాడు.'' తండ్రీ, ఈ రాత్రి అనేకులు నమ్మునట్లును మరియు నిన్ను గూర్చిన రక్షణ-జ్ఞానములోనికి తేబడుదురుగాక. మేము క్రీస్తు నామమున అడుగుచున్నాము. మరియు మా తలలు వంచి ప్రార్ధన చేయుచున్నాము.
56
ఇప్పుడు దైవ సన్నిధిలో ఎక్కడయున్న వారైనా మీలో ఒక్కరు, ''సోదరుడా బ్రన్హం, నేను ఒక పాపిని, నా కొరకు ప్రార్ధన చేయండి అని చెపుతారా, కుమారుడా, దేవుడు నిన్ను దీవించును. అయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించును మరియు దేవుడు నిన్ను దీవించును మరియు దేవుడు నిన్ను దీవించును. పైన మిద్దెల మీద యున్న వారందరిని దేవుడు దీవించునుగాక. ఓ, మై. మరలా ఈ వైపునుండి వారిని చూచుటకు నేను తిరిగి వెళ్ళుచుండగా, ప్రతిచోట నుండి మీరు వారిని చూడగలరు.
దేవా కనికరము చూపుము. ఓ, మై, నేను ఆ పైకి నా ప్రక్కగా వెళ్ళుచుండగా, ఒక్కసారి చూస్తాను... ఆ పైన, మీ చేతులను ఎత్తగలరా?
57
[టేపు పై ఖాళీయున్నది] దానియేలు ఒక్క దర్శనమును చూసి ఎన్నో రోజులు తన హృదయములో కలవరపడ్డాడు. అది నిజమేనా? నిజము. ''మంచిది, సోదరుడా బ్రన్హం, దానిని గూర్చి నాకు తెలియదు,'' అని నీవంటావు.
మొత్తము మీద [స్పష్టత లేని మాటలు] నరముల బలహీనత గలవారుగా లెక్కించబడ్డారు. విలియం కూపర్‌ను చూడండి, అతడు వ్రాసిన పాట, '' ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి తీయబడిన రక్తముతో నింపబడిన ఊట అక్కడ యున్నది.'' ఆ పాటను వ్రాసిన తరువాత అతడు ఆత్మహత్యను చేసికొనుటకు ఒక నదిని వెదుకుటను ప్రయత్నించాడు. స్తెఫను ఫాష్టర్‌ను చూడండి, దక్షిణాది ప్రజలైన మీరు ఆ పాతకాలపు సామాన్య వర్గ ప్రజల నుండి వచ్చిన పాటలను బట్టి మీరు అతనిని ఎంతో ప్రేమిస్తారు. అతడు అతి గొప్పగా హృదయమును తాకు సామాన్య వర్గ ప్రజల పాటలను అతడు వ్రాసియున్నాడు, మరియు అతనిని చూడండి. ప్రతిసారి అతడు... ప్రతిసారి... అతడు ఒక అంగీకరించబడని వాడుగా యున్నాడు, అతడు పాట వ్రాసిన తరువాత ప్రతిసారి అతడు బయటకు వెళ్ళి త్రాగేవాడు, మరియు చివరగా ఒక సేవకుడిగా పిలువబడ్డాడు, మరియు ఒక బ్లేడును తీసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అతడు ప్రేరేపణతో పైకి వెళ్ళేవాడు.
ప్రవక్తయైన యోనాను చూడండి. మూడు రాత్రింబవళ్ళు తిమింగలము యొక్క కడుపులో ప్రయాణము చేసిన తరువాత, అతడు బయటకు వచ్చి ఎంతో శక్తివంతముగా పట్టణములో బోధించాడు... ఆ పట్టణము పరిమాణములో ఇక్కడయున్న సెయింట్ లూయిస్ నగరము వలె యున్నది. ప్రజలు పశువుల మీద సహితము గోనె పట్టలు ధరించి మారు మనస్సు పొందియున్నారని చెప్పబడినది. తరువాత అతడు వెళ్ళి ఒక పాత చెట్టుక్రింద కూర్చున్నాడు... మరియు తన ప్రాణమును తీసుకొమ్మని దేవునికి ప్రార్ధించాడు.
58
ప్రవక్తయైన ఏలీయాను చూడండి. అతడు కర్మెలు పర్వతము మీద అడుగుపెట్టిన తరువాత, అతడు ఆకాశము నుండి అగ్నిని దించియున్నాడు, మరియు అదే దినమున ఆకాశము నుండి వర్షమును పిలిచియున్నాడు, గొప్ప సూచక క్రియలను చేసియున్నాడు, మరియు దర్శనము అతనిని విడిచిన తరువాత, అరణ్యమునకు పరుగెత్తికొనిపోయాడు, మరియు నలుబది పగళ్ళు మరియు రాత్రులు అరణ్యములో తిరుగులాడాడు, మరియు దేవుడు అతనిని ఒక గుహలో కనుగొని బయటకు లాగాడు, చూడండి.
నీవు చదువు దానికంటే కొంచెము భిన్నముగా అది యుంటుంది, అయితే అది సత్యము, కాదేమో చూడండి, చూడండి. అది సత్యమైయున్నది,
చూడండి. అది నీకు ఏదో చేస్తుంది. దానిని వివరించుటవల్ల ఉపయోగము లేదు. నీవు కేవలము దానిని నమ్ముము. అంతమట్టుకే.
ఇప్పుడు, మనము... గత రాత్రి మనము ప్రార్ధనా కార్డులను పిలచుచుంటిమి. గత రాత్రి ఆ కుర్రవాడు 100 ప్రార్ధనా కార్డులను ఇచ్చి యున్నాడు. ఆ మొదటి కార్డులలో కొన్నిటిని మనము పిలిచియున్నాము. ఇప్పుడు వాటిలో మధ్య కార్డులను ఈ రాత్రి పిలుద్దాము. మనము వాటిని... కాబట్టి కొద్ది మంది ఈ పైకి వస్తారు — అది అంతమట్టుకే తీసుకొంటుంది. దేవుని ఆత్మ కదులు వరకు కొన్ని కార్డులను తీసుకొందాము, మరియు తరువాత ఆయన ఈ స్థలము అంతటా కదులుతాడు. మీరు చూడండి? అంతవరకే అది తీసుకొంటుంది. నీవు పైకి రావలసిన పనిలేదు. నీవు ఈ పైకి వచ్చి చేయవలసినది ఏమియు లేదు.
59
ఈ మొదటి రాత్రి కొంచెము నేను ప్రజలను స్పర్శించబోవుచున్నాను. ప్రతి ఒక్కరూ మానవ మాత్రులైయున్నారు. మీలో ప్రతి ఒక్కరికి ఆత్మ, మనస్సు యున్నది, మరియు ఆ ఆత్మలన్నియూ కదులుచున్నవి, మీరు దానిని తాకండి, మీరు దానిని స్పర్శిస్తారు.
ఆ కారణమును బట్టియే యేసు ఆ మనిషిని తన చేతితో పట్టుకొని జన సమూహములో నుండి బయటకు తీసుకొని వెళ్ళాడు. ఆ కారణమును బట్టియే ఈ రాత్రి నేను చెప్పియున్నాను, ఆయన ప్రతి ఒక్కరిని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోమన్నాడు... చూడండి, ప్రజలు నిజముగా విశ్వాసములోనికి అడుగుపెట్టువరకు, వారిని నీవు తప్పక నీ కొరకు బయటకు తీసుకొని వెళ్ళవలసియున్నది.
ఎక్కడనుండియైనా ప్రారంభిద్దాము. మనము చూద్దాము. మనము 51వ కార్డు నుండి ప్రారంభిద్దాము. 51వ నంబరు ప్రార్ధనా కార్డును ఎవరు కలిగియున్నారు? నీవు కలిగియున్నావా...? జన సమూహములో అదియున్నదా? ప్రార్ధనా కార్డు నెంబరు 51? నీవు కార్డు వైపు చూడుము. నీవు కలిగియున్నది నెంబరు 51 ప్రార్ధనా కార్డుయేనా? మంచిది. 52 నంబరు ప్రార్ధనా కార్డును ఎవరు కలిగియున్నారు? మనము తిన్నగా అలా వాటి వెంబడి ప్రారంభిద్దాము, అయ్యా, నీవు ఇక్కడకు వస్తావా? నెం 52? ఎవరైనా నెం52 కార్డును కలిగియున్నారా? ఓ స్త్రీ? నెం 53, నెంబరు 53ను నీవు కలిగియున్నట్లైతే నీ చేతిని ఎత్తుము? ఓ స్త్రీ, నెం 54 నీవు చేయి ఎత్తగలవా? మంచిది. నెం 55? నెం 56 ఇక్కడయున్న స్త్రీ? 57?, 58?, 59?, 60?
ఇప్పుడు, ప్రతి ఒక్కరూ, మీరందరూ బహు మర్యాదగా మీరు యున్న స్థలములోనే కూర్చొనండి. కేవలము ప్రార్ధన చేస్తూ యుండండి. ఇప్పుడు, ఆ పైన యున్న జన సమూహము, మీరున్న ప్రతిచోట ప్రార్థన చేయండి. నీవు వెనుక యున్నప్పటికీ లెక్క చెయ్యను [స్పష్టత లేని మాటలు] అది దానితో చేయునది ఏదియూలేదు. ఈ వైపు చూడండి మరియు నమ్మండి, ఏమి జరుగుతుందో చూడండి. నీ పేరు పిలుచుట కొరకు వినండి, చూడండి.
60
వినండి. ఆ వెనుకయున్న వారిలో ఎందరు రోగులుగా యున్నారు? ఈ శ్రోతలలో ఎక్కడైనా ప్రార్ధనా కార్డు లేనివారు, ప్రార్ధనా కార్డు లేకుండా రోగులైయుండి, యేసు మిమ్ములను స్వస్ధపరచవలెనని కోరువారు ఎవరు? మీ చేతులను ఎత్తండి. కేవలము ఇటు చూడండి. మై, అది అలా యుండబోవుచున్నదని నేను సరిగ్గా నమ్ముతాను...
ఇప్పుడు, మీరు ఏమి చేస్తారంటే ఇది చేయండి: చుట్టూ యుండి ప్రార్ధన చేయండి. కేవలము మర్యాదగా యుండండి. అటు ఇటు తిరుగవద్దు. అక్కడ కూర్చొనియుండి ప్రార్ధించండి, “ప్రభువైన యేసు, నేను...” మీకై మీరు ఒత్తిడి చెందవద్దు, భయపడవద్దు, కేవలము విశ్రాంతిగా యుండండి, చెప్పండి, ''ఓ, తండ్రీ, ఈ ఆకాశము క్రింద నీ సన్నిధిలో యుండటను బట్టి నేను నీకు ఎంతో కృతజ్ఞుడనై యున్నాను [స్పష్టత లేని మాటలు] ఈ రాత్రి నీవు నాకు కనికరము చూపుమని కోరుచున్నాను. నాకు అవసరము. భోధకుడు నా వైపు తిరిగి నా విశ్వాసమును ప్రోత్సహించునట్లుగా నాతో ఆయనను మాట్లాడనిమ్ము, అలా ఏదో చేయుము. నన్ను ఆయన వ్యక్తిగతముగా పిలువ నిమ్ము. ఆ ప్రోత్సాహమును నాకు ఇమ్ము, ప్రభువా, నేను నీకు ఎంతో కృతజ్ఞుడిగా యుంటాను.“
మీరు దానిని చేయండి, ఆయనను కృతజ్ఞుడిగా మర్యాదగా సమీపించండి, మరియు నీవు దానిని చేసినట్లైతే, దేవుడు నీ కొరకు దానిని చేయుటను మీరు కనుగొంటారు.
61
ఎంత మంది ఆ బయట యున్నారు? ఓ, మరికొన్ని కార్డులను పిలుద్దాము. ఆ బయట యున్నవారిలో చివరి నెంబరు ఏమిటి? సహోదరీ, నీ నెంబరు ఎంత ? నెం, 60? మరొక 5 నంబర్లు పిలుద్దాము. 61, 62, 63, 64, 65 మరియు అది ఒక చిన్న, చక్కని ఒక ప్రజల గుంపును తయారు చేస్తుంది.
నాకు తెలియదు...ఎంత మంది నిలబడియున్నారొ అది ఏ బేధమును చెయ్యదు. అది ఒకేసారి మరీ ఎక్కువ మంది ఉండకూడదని ఒక ఆలోచన మాత్రమే. మీరు చూడండి, ఏలయనగా నీవు ఎంతో దీర్ఘముగా వేచియుండాలి మరియు కొన్ని సార్లు నేను బయటకు వెళ్ళలేను, దేవుని ఆత్మ శ్రోతలలోనికి వెళుతుంది, మరియు నేను ఆత్మను తప్పక వెంబడించవలసి యున్నది. నేను చేయగలుగునది అంతవరకే.
ఇప్పుడు, ఒక్కసారి మన తలలను వంచుదాము. ప్రతి ఒక్కరు వంచియుండగా, మరియు మర్యాదగా యుండండి, మీరు ఉండవలసినంత మర్యాదగా యుండండి. నమ్మకముగా యుండండి, దేవుని యందు విశ్వాసముంచి ప్రార్ధన చేయండి.
ఓ, కనికరము చూపుము, ప్రభువా. నీ యొక్క దైవ సన్నిధిని శ్రోతల మీద ఊదమని నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను. అన్నిటిని సాధ్యపరచుము, ప్రభువా, మేము మర్యాదగా యేసు నామములో వేచియుండగా నీ పరిశుద్ధాత్మ గొప్ప, అద్భుతమైన మార్గములలో ఈ శ్రోతలను దీవించునుగాక! ఆమెన్.
62
ఇప్పుడు, ప్రతి ఒక్కరూ మర్యాదగా యుండుడి, మరియు మీరు మర్యాదగా యున్నట్లైతే... ఇప్పుడు, ఒక్క క్షణము వేచియుండండి. నేను ఈ శ్రోతల ప్రజల గుండా నేను చూడగోరుదును. మీరు ప్రార్ధనా వరుసలో మీలో ప్రతి ఒక్కరూ? మీరందరూ నాకు క్రొత్త వారేనా, ప్రతి ఒక్కరూ? మీరు నన్ను ఎరుగనివారైతే మీ చేతులను ఎత్తండి, మీరందరూ క్రొత్త వారైనట్లైతే. మంచిది.
ఇప్పుడు, నా సహచరులైన కొద్ది మందిని మాత్రమే నేను ఈ కూటములో ఎరిగియున్నాను. సహోదరుడు వుడ్, ఇక్కడ నిలబడియున్నావు. అవును, నేను ఆయనను ఎరుగుదును. ఆయన మనతో యున్నాడు. ఆయన పుస్తకములను అమ్ము వాడైయున్నాడు. నా స్నేహితులైన లియో వెర్సియర్ మరియు జెన్‌గోడ్ రికార్డుర్లతో ఇక్కడ కూర్చొనియున్నాడు. నేను... వారు తెస్తారు... వారు టేపులు మరియు తదితరమైన వాటిని కలిగియున్నారు. సహోదరుడు బీలర్ అక్కడయున్నాడు, నేను ఆయనను ఎరుగుదును, అతడు కూడా ఈ కూటములను వెంబడిస్తాడు. దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన్ టామ్స్ ఇక్కడ యున్నాడు.
నాకు తెలిసియున్నంత వరకూ, వారు మాత్రమే నేను ఎరిగియున్న ప్రజలు, మరియు బయట రోగులతో నిలబడియున్న నా కుమారుడు, ఈ మైదానములలో నేను ఎరిగినవారు వారు మాత్రమే. కొందరు చక్కని సేవకులను నేను మొన్నటి దినమున నేను కలుసుకొన్నాను, వారు ఈ కమిటీలోని సోదరులు, ఇప్పుడు వారు నాకు తెలియదు, నేననుకొంటాను, వారిని బయట నేను చూస్తాను. ఇక్కడ నేను వారిని చూచుటకు లేదు, మరియు అతి తక్కువగా వారి ముఖము నాకు గుర్తొస్తున్నది [స్పష్టత లేని మాటలు]
63
ఇప్పుడు అందరూ బహు నెమ్మదిగా యుండాలని మరియు మరి విశేషముగా మూర్చ రోగము గలవారు, మీ పిల్లలను మీ దగ్గర యుంచుకొమ్మని నేను ప్రతి ఒక్కరితో చెప్పుచున్నాను. మూర్చ వ్యాధి నా నుండి దూరముగా వెళుతుంది.
దయ్యపు ఆత్మలను వెళ్ళగొట్టుటకు నీవు పని చేయుచున్నావని నీవు గ్రహిస్తావా? మీలో ఎంతమంది దానిని గ్రహిస్తారు? మనము చూద్దాము, ఎక్కడ బడితే అక్కడ మీ హస్తములను వేయాలనుకొనుచున్నారా, బైబిలులో మీకు గుర్తున్నదా, ఆ దయ్యము పట్టినవాడు (మూర్చ వ్యాధి గలవాడు), ఎవరో వెళ్ళి, అధికారము లేకుండా ఇలా అన్నాడు, పౌలు ''భోధించుచున్న యేసును బట్టి నీకు ఆజ్ఞాపించుచున్నాను, బయటకురా?'' ఆ ఆత్మ బయటకు వచ్చి అ మనిషిలో ప్రవేశించినది.
ఈ మధ్యకాలములోనే ఇక్కడ ఒక బోధకుడు ఒక కూటమునకు వచ్చాడు, తన సంఘములో 28 మందిని అతడు కలిగియున్నాడు. ఒక చిన్న బిడ్డ వేదికమీద యున్నది, మరియు ఆ చిన్న బిడ్డకు మూర్చల వ్యాధి యున్నది, ఒక పుల్లపై గుడ్డను చుట్టి ఆ చిన్న బిడ్డ నోటిలో ఉంచబడినది... లేక, ఒక బట్టతో చుట్టిన పిన్ను, వారు దానిని కలిగియున్నారు. ఆ చిన్న బిడ్డ మూర్చ వ్యాధిని కలిగియున్నది.
నేను వారిని ఆపలేకపోయాను. అయితే ఈ సేవకుడు బయట కూర్చొనియున్నాడు, అతడు ఒక విధముగా తమాషాగా నవ్వుకొనుచున్నాడు. నేను చుట్టూ చూశాను, అందరూ తలలు వంచి కళ్ళు మూయవలసినదిగా, నేను అందరికీ చెప్పాను. వారు అది చేయలేదు, ఈ సేవకుడు అక్కడ కూర్చొనియున్నాడు. కాబట్టి, ఒక ద్వార పాలకుడు అతని యొద్దకు వెనుకకు వెళ్ళాడు. అతడన్నాడు, ''వినండి, ఇది బహిరంగ స్థలము మరియు నీవు... నా ఇష్టము వచ్చినట్లు నేను చేస్తాను,'' అని సేవకుడున్నాడు.
నేనన్నాను, ''మంచిది. అది నీకే విడిచి పెట్టాను.'' తండ్రీ ఈ దీన నిర్దోషమైన బిడ్డ, ఆ మనిషి యొక్క పాపముల కొరకు బాధపడకుండా ఉండును గాక. ఇప్పుడు, సాతానా, ఆ బిడ్డను విడిచి పొమ్ము, అయితే నీవు ఏమి చేయగోరుచున్నావో దానిని చేయుటకు నీవు స్వేచ్ఛను కలిగియున్నావు.''
వేల మంది ప్రజలు అక్కడ కూర్చొనియున్నారు. అక్కడ మొత్తము 28 మంది మీదికి ఆ మూర్చ వ్యాధి వెళ్ళినది, మరియు వారందరూ నేల మీద పడి నురుగు గక్కుచూ సమస్తమునూ చేయుచుండిరి, మరియు వారు అప్పటికే ఆ మూర్ఛ వ్యాధితో బాధపడుచున్నారు. అది వేలకొలది సందర్భములలో ఒకటై యున్నది.
కాబట్టి మీరు మర్యాదగా యుండండి. మనము ఆడుకొంటున్న సంఘము కాదు. నీవు దేవుని యొక్క సముఖములో యున్నావు, చూడు. కాబట్టి మర్యాదగా యుండండి. కూర్చొని యుండండి. ఏమి చెప్పబడినదో, ప్రభువు యొక్క ఆత్మ మిమ్ములను ఏమి చేయమని చెప్పినదో దానినే ఖచ్చితముగా మీరు చేయండి.
64
ఇప్పుడు, మీరు కోరియున్నట్లైతే, ''కేవలము నమ్ముము,'' అను పాటను మనమందరము కలిసి పాడుదాము. ఇప్పుడు అందరూ ఏకముగా పాడుదము, అందరూ కలిసి. మంచిది.
కేవలము నమ్ముము
ఇప్పుడు, పాడుచూ మీ హృదయమంతటితో నమ్మండి. అది నిజము. ఏదో నిన్ను అక్కడ భాధించుచున్నది [స్పష్టత లేని మాటలు]
....అన్నియూ సాధ్యమే, కేవలము నమ్ముము
(ప్రతి ఒక్కరూ వారి విశ్వాసమును ఒప్పుకొనుచున్నారు.)
కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,
సమస్తమునూ సాధ్యమే, కేవలము....
దీనితో నాకు ఎంత మంది చేస్తారని నేను ఆశ్చర్యపడుచున్నాను? నీ చేతిని పైకెత్తి ఈ రీతిగా దానిని పాడండి: ఇప్పుడు, నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, నేను నమ్ముచున్నాను, ఇప్పుడు నేను నమ్ముచున్నాను,
సమస్తమును సాధ్యమే,
ఇప్పుడు నేను నమ్ముచున్నాను,
ఇప్పుడు, నేను..........................
పరలోకపు తండ్రీ, ఈ సమయములో ఈ కూడిక మీదికి రమ్మని [స్పష్టత లేని మాటలు] నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను. ప్రభువు, నీవు పరిచర్య చేయుచుండగా ఈ రాత్రి మాకు సహాయము చేయుము, [స్పష్టత లేని మాటలు] నీ సన్నిధి యొక్క దూత, యేసు నామములో. ఇప్పుడు, నేను నమ్ముచున్నాను. [టేపు పై ఖాళీయున్నది]
65
ఇప్పుడు [స్పష్టత లేని మాటలు] మీరు కోరియున్నట్లైతే, ఇప్పుడు ఇటువైపు చూడండి. మీ హృదయమంతటితో నమ్మండి. ఎదురుచూస్తూ యుండండి. మీ దేహమును దేవుడు తాకునట్లు ఎదురుచూస్తూ యుండండి. ఆయన దానిని చేస్తాడు.
ఇప్పుడు, దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు నామములో, దేవుని మహిమార్ధమై ప్రతి ఆత్మను నా స్వాధీనములోనికి తీసుకొనుచున్నాను. పరిశుద్ధాత్మ మీద దృష్టిని యుంచండి.
ఇక్కడ, ఈ మనిషిని ఇక్కడకు తీసుకొనిరండి. ఇప్పుడు, అయ్యా, ఈ దారిగుండా నీవు పైకి నడిచి వచ్చుచుండగా మర్యాదగా యుండండి.... అది మంచిది. ఇప్పుడు, శ్రోతలలో యున్న ప్రజలు, మీరు ఎక్కడ యున్నప్పటికి, మర్యాదగా యుండిండి, మీ కొరకు వినండి.... నీ కొరకు, ఏలయనగా అది వెళ్ళినప్పుడు...
ఈ రాత్రి దాని యొక్క చిత్రమును వారు ప్రజలకు చూపియున్నారా? మీరు దానిని చూశారా, ఆ చిత్రములో యున్న ప్రభువు యొక్క దూత? బహుశా వారు ఏదో సమయములో దానిని మీ యొద్దకు తెస్తారు. అది ఇక్కడయున్నది. వారు దాని చిత్రమును తీసి, వాషింగ్‌టన్ డి. సి. లో దానిని కలిగియున్నారు, మరియు ఎన్నడైనా శాస్త్రీయముగా సత్యమని ఋజువు చేయబడినది సహజతీతుడైన వ్యక్తి, అది మాత్రమే దానితో తిన్నగా కాపీరైట్ యొక్క హక్కును కలిగియున్నది; టెక్సాస్‌లోని హోష్టన్‌లోని డగ్లస్ స్టూడియో.
66
ఇప్పుడు, అది వెళ్ళినపుడు, అది శ్రోతల మీద కదలుటను నేను చూస్తాను. అది ఎక్కడ యున్నదో దానిని గమని౦చవలెను. మరియు నేను మాట్లాడినపుడు, అది ఎవరో నీవు వినుము. అది ఎక్కడ ఉన్నప్పటికి మర్యాదగా ఉండండి. మరియు మీరిక్కడ నిలబడియుండగా, ప్రార్ధనా వరుసలో ఉన్న మీరు, ఆయన మీకేంచెపుతాడో మీరు సరిగ్గా వినండి, తరువాత ఖచ్చితంగా అలా చేయండి, నేను వచ్చినప్పుడు మీరు గమనిస్తారు.... ఆయన నన్ను అభిషేకించినట్లయితే, నేను అభిషేకమును, అయితే అది పరిశుద్ధాత్మయై యున్నాడు మరియు ఏదో సంభవిస్తుంది, అది ఇలా చెబుతుంది, ''యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.“ ఇప్పుడు దాన్ని గమనించండి, మరియు శ్రోతలైన మీరు అది దాన్ని చేసినపుడు, ఒక చిన్న కాగితపుముక్క మీద లేక మరి దేనిమీదైనా అది గుర్తుపెట్టుకోండి మరియు దాన్ని గమనించండి. అది సరిగ్గా నెరవేరని యెడల, దాన్ని మీరు నాకు పంపండి.
ఇక్కడ వున్న రికార్డులు సమస్తమును పైకి చేరుకుంటాయి. అందుకే ఇక్కడ ఈ కుర్రవాళ్ళు ఉన్నారు, ఆ రికార్డులను సేకరించుట మీరు చూడండి. మనము ప్రతి మాటను కలిగియున్నాము, నేను చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుండి అది ఎన్నడు ఒక్కసారి కూడా తప్పిపోలేదు. అది తప్పిపోలేదు. అది దేవుడైయున్నాడు, చూడండి. అది నేనై యున్నట్లైతే, అది ప్రతిసారి తప్పిపోతుంది, అయితే అది దేవుడై యున్నాడు, మరియు ఆయన తప్పిపోడు.
67
ఇప్పుడు, ఒక మనిషి నా ముందు నిలబడియున్నాడు, బహుశా నా వయస్సులో ఉన్న మనిషి వాస్తవానికి నాకంటే కొంచెం పెద్దవాడై ఉండకపోవచ్చు. నేనెరిగి ఉన్నంత వరకు నేను మరియు అతడు ఒకరికివొకరము క్రొత్తవారము, అయ్యా, మనము క్రొత్త వారము కాదా? మనము ఒకరిని ఒకరము ఎరుగము, అయితే మన ఇద్దరినీ దేవుడు ఎరుగును. నీవు ఈ పైకినడిచి వచ్చిన వెంటనే నీవు ఒక విశ్వాసివై యున్నావని గ్రహించాను, కారణము నీ ఆత్మ స్వాగతమును పలుకుతుంది, మరియు ఆ మార్గముగుండానే నేను అది ఎరుగుదును.
నతానియేలు ప్రభువైన యేసు దగ్గరికి వచ్చినప్పడు, ఆయన అన్నాడు, ''ఇదిగో ఒక ఇశ్రాయేలీయుడు,'' చూడండి అతడు స్వాగతము నిచ్చియున్నాడని ఆయన ఎరిగియుండెను, మీరు చూడండి. మీ వైపు నేను తిరిగిన వెంటనే, ఒకవేళ నీవు ఒక విమర్శకూడవు అయి ఉంటె, లేక ఇంకేదో అయితే, అదే అక్కడ నల్లటి నీడగా కదులుతూ ఉంటుంది, మరియు అక్కడేదో తప్పు ఉన్నదని నేను తెలుసుకుంటాను. అయితే నీవొక విశ్వాసివైయున్నట్లైతే, నీకు మరియు నాకు మధ్య ఏదో యుంటుంది, అది బహుశ నేను దేవుని సన్నిధి యొక్క దైవిక ప్రభావము క్రిందికి వెళ్ళుచున్నాను.... అది ఏమిటో నాకు తెలియదు... అయితే ఏదో సంభవించియున్నదని నీవు తెలసుకొంటావు.
ఇప్పుడు ఒక యదార్ధమైన మనిషిగా నీవున్నట్లైతే... వారు ఎరుగునట్లు ప్రజలకు మీ చేతిని పైకెత్తి చూపగలరా, ఒక మనిషిగా ఒక సహజాతీతుడైన వాని సన్నిధిలో నీవు ఉన్నావని నీవు అది చెప్పగలవు?
68
ఇప్పుడు ఈ దగ్గరగా నిలబడిన ఎవరైనా, నాకు ఆ మనిషికి మధ్యలో ఉన్నది ఆ అగ్నిస్తంభము అది నాకు ఆయనకు మధ్య చుట్టూ గుండ్రముగా తిరుగుచున్నది. అతడు దాన్నెరుగడు... ఇప్పుడు కొన్ని క్షణముల్లో అది అతని మీద కాని, లేక నా మీద కాని, ఉంచబడుతుంది. అతడు దైవిక సన్నిధిలో ఉన్నాడని ఎరుగుతాడు.
ఆ మనిషి ఎవరో నాకు తెలియదు. నేను అతడిని ఎన్నడూ చూచియుండలేదు, అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ నన్ను తప్పక అభిషేకించినట్లైతే, ఎందుచేత, ఆయన నీకు ఏదైనా చెపుతాడు మరియు అది నిన్ను ప్రోత్సహిస్తుంది లేక నిరుత్సాహ పరచుతుంది, ఏదో ఒకటి. అది నాకు తెలియదు. అది చేయుటకు ఆయన దానిని తీసుకొనవలసియున్నది. అయితే ఆయన చేసినట్లైతే, అప్పుడు నీవు దానిని ఒప్పుకొంటావు, అది సత్యమైయున్నట్లైతే, నీవు దానిని ఒప్పుకొంటావు? మరియు ఆయన నీకు దేనిని చేయమని చెప్పినను, నీవు దానిని చేయుటకు ఇష్టపడతావు! మరియు ఆయన నీకు ఏమి చెపుతాడో అది సత్యమైనయున్నట్లైతే, అప్పుడు ఆయన దైవసన్నిధి ఇక్కడ యుండి నీకు ఏమి చెప్పాలో ఆయన నాకు చెప్పుచున్నాడు, అది నిజమేనా? మంచిది, ఆయన నీకు దానిని దయచేయునని నా యదార్ధమైన ప్రార్ధనయై యున్నది, సోదరుడా!
ఈ రాత్రి నీవే ఇక్కడ మొదటి రోగివి. శ్రోతలలో యున్న ప్రజలు ఎంతో విశ్వాసముతో యున్నారు మరియు వారు ప్రతి చోట నుండి కదులుచున్నారు. రోగము యొక్క శక్తులు కదులుచున్నవి, మరియు అది ప్రజలు యొక్క విశ్వాసమే దానిని చేయుచున్నది, చూడండి. అది నేను కాదు అది వారి యొక్క సొంత విశ్వాసము దానిని లాగుకొనుచున్నది. ఆ స్త్రీని స్వస్ధపరచినది యేసు కాదు. ఆయన అన్నాడు, ''నీ విశ్వాసము నిన్ను రక్షించినది,'' చూడండి. అది కాదు... అది ఆయన కాదు. ఆమె విశ్వాసము ప్రతి చోట నుండి లాగుకొనుచున్నది.
69
అయితే నీకు మరియు నాకు మధ్య ఏదో కారుచున్నట్లు వలె నాకు కనబడుచున్నది. అది నీకు మరియు నాకు మధ్య కదులుచుండుటను నేను చూస్తాను. చుక్కల వలె ఏదో పడిపోవుచున్నది. అది ఒక... అది ఒక రక్త-వ్యాధి. అది రక్తములో ఏదోయున్నది. అది నీ రక్తములో యున్న రసాయనములు, అది వైద్యుడు ఇలా చెపుతాడు. అది ఒక.. అతడు ఒక సన్నని వ్యక్తి, ఇలా చెపుతాడు, ''అది నీ రక్తములో యున్న రసాయనము, దానికి కారణము నీ యొక్క మధుమేహ వ్యాధి.'' ఆ మధుమేహ వ్యాధివలనే ఆ రసాయనము నీ రక్తములోనికి వచ్చినది. అది నిజమేనా? ఆ మనిషి ''అది నిజమేనని, అది సత్యమని, చెప్పుచున్నాడు, అది సత్యమైనయున్నది.'' ఇప్పుడు, మీరు నమ్ముతారా?
ఇప్పుడు, చూడండి, ఎక్కువగా ఆ మనిషితో మీరు మాట్లాడండి... చూడండి, ఇప్పుడు మీరు తెలుసుకొంటారు. ఇప్పుడు, నేను నీకు కేవలము ప్రార్ధన చేస్తాను. నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఆ అభిషేకము ఆ మనిషితో మాట్లాడచుండగా, నేను ఇటువైపునకు తిరుగుతాను. అతడు తప్పక... నీవు ఎక్కువగా మాట్లాడితే... అయితే సాధారణముగా, నేను ఒక మనిషికి ఎక్కువ చెప్పను, కారణము, అక్కడ ఇతరులున్నారు, అది వారిని బాగా బలహీన పరచుతుంది. అయితే నీవు ఇప్పుడు తెలుసుకొంటావు. ఇప్పుడు, కొంచెము దీర్ఘముగా ఇప్పుడు ఆ సహోదరునితో మనము మాట్లాడుదాము, పరిశుద్ధాత్ముడు ఏమైనా చెపుతారేమో చూద్దాము.
70
దేవుని చిత్తమైయున్నట్లైతే, నీవు దానిని చూడగోరుచున్నావా? అది దేవుని చిత్తమని ప్రార్ధన చేయండి. ఇప్పుడు, నీతో మాట్లాడినపుడు మేము తెలుసుకొంటాము. ఇప్పుడు, ఏమి చెప్పబడియున్నదో అది సత్యమైయున్నది. ఆయన మరలా ఏమి చెపుతాడో మనము కొంచెము చూద్దాము. మరియు ఆయన తప్పక ఏదైనా చెప్పినట్లైతే, కారణము అది ఆయనయైయున్నాడు, అది నేను కాదు. మీకు అది తెలుసు. మీరు దానిని గ్రహిస్తారు, అయితే అది ఎన్నడైనా ఏమైయున్నదనగా, కారణము అది ఒక కలగా కనబడుచున్నది. అది మరొక ప్రపంచమైయున్నది.
అది మరలా మన మధ్య కనబడుచున్నది. అది మరొక ప్రపంచమైయున్నది. అది ఒక... అది మరొక మనిషియైయున్నాడు. మరియు ఆ మనిషి అతని కన్నులలో ఏదో లోపమును కలిగియున్నాడు, ఇంచు మించు ఒక.... ఓ, అది ఒక కుమారుడు, నీకు ఒక కుమారుడున్నాడు, నీవు కలిగిలేవా? ఆ బిడ్డ కన్నులలో ఏదో లోపమును కలిగియున్నాడు. [నేను కలిగియున్నాను], తరువాత నేను ఒక చిన్న పాపను చూచుచున్నాను. అది ఆయన కుమార్తె, ఆయన నీ యొక్క తండ్రి. ఆమె తన కన్నులలో ఏదో లోపమును కలిగియున్నది. [అది నిజమేనా, ప్రజలారా] నీవు నమ్ముచున్నావా? [నేను నమ్ముచున్నాను, నిజముగా నమ్ముచున్నాను.] ఇప్పుడు నీవు నమ్మియున్నట్లుగా, వెళ్ళుము, నీవు నమ్మినట్లుగానే దానిని కనుగొనుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, దేవుని మహిమ కొరకు నా సహోదరుని దీవించుచున్నాను. ప్రభువు నిన్ను దీవించునుగాక! నా సోదరుడా.
71
కేవలము విశ్వాసమును కలిగియుండుము. మీ హృదయమంతటితో దేవునిని నమ్మండి. నీవు నమ్ము విశ్వాసమును కలిగియున్నట్లైతే నీవు కోరిన దానిని నీవు పొందవచ్చును. [టేపు పై ఖాళీగాయున్నది] మంచిది. ఇప్పుడు, దీనికి సంబంధించినంత వరకు, జన సముహమంతయూ ఇప్పుడు స్వస్ధపడుటకు తప్పక విశ్వాసమును కలిగియుండవలెను. అది నిజమేనా ? ప్రతి ఒక్కరూ తప్పక విశ్వాసమును కలిగియుండవలెను. ప్రతి ఒక్కరూ తప్పక నమ్మాలి.
ప్రభువు యొక్క దూత (అగ్నిస్థంభము) ఆ చిన్న స్త్రీ పై వ్రేలాడుటను నేను చూస్తున్నాను, ఆమె తిన్నగా నా వైపుచూచుచున్నది, ప్రార్ధన చేయుచున్నది. సహోదరీ, నీవు తొంటి నొప్పితో బాధడుచున్నావు? అందుచేత నీవు ప్రార్ధన చేయుచున్నావు. ''ప్రభువా, ఆయన నా వైపు తిరుగునుగాక'' అని నీవన్నావు. నీవు హెర్నీయా జబ్బును కూడా కలిగియున్నావు? అది నిజము, మరియు నీవు కణితిని కలిగియున్నావు, నీవు కలిగిలేవా? అది నిజమైన యెడల నీ చేతిని ఎత్తుము. ఇప్పుడు, నీవు నీ పాదముల మీద నిలబడుము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నిన్ను బాగు చేశాడు, మరియు నీవు బాగుపడ్డావు, నీ విశ్వాసము నిన్ను స్వస్ధపరిచియున్నది.
కేవలము విశ్వాసమును కలిగియుండుము ప్రార్థన చేస్తూయుండుము, నమ్ముచూ యుండుము. అనుమానించ వద్దు. నమ్ముము, అన్నియూ సాధ్యమే. ఓ, ఎంత అద్భుతము, ప్రభువైన యేసు ఎంత ఆశ్చర్యకరుడు.
72
ఇప్పుడు, ఈ స్త్రీయేనా? వారు తీసుకొచ్చినది ఈ స్త్రీయేనా? నీవు ఒక గురుతును కలిగియున్నావని నేను నమ్ముదును. ''నీవు వ్యక్తులకు సహాయపడు వ్యక్తివి'' నీవు ఈ కూటములో పనిచేయుట లేదా, ఓ స్త్రీ మంచిది. మనము ఒకరికి ఒకరము క్రొత్త వారము అని నేను తలంచుచున్నాను. మన జీవితములో ఎన్నడైనా మనము కలుసుకొనుట ఇది మొదటిసారి అయితే మనమిద్దరము ప్రభువైన యేసుకు తెలుసు. ఆయనకు తెలియదా? ఆయన నన్ను ఎరుగును. ఆయన నిన్ను ఎరుగును. నేను ఎన్నడైనా చేసిన సమస్తమును ఆయన ఎరుగును, నీవు ఎన్నడైనా చేసిన సమస్తమును ఆయన ఎరుగును, నేను ఏమిచేయుదునో ఆయనకు తెలుసు, నీవు ఏమిచేదువో, ఆయన ఎరుగును. కాబట్టి, మన యొక్క గమ్యము ఆయన చేతులలో, ఆయన పట్టులో యున్నది.
మరియు ఆయన మాత్రమే దానిని చేయగలడు. అది మీకు తెలియునా, సహోదరీ? సరే, మనమిద్దరము పరిచయము లేని వారము మరియు దేవుడు మాత్రమే ఈ కార్యములను చేయలగలడు, ఇప్పుడు మన ప్రభువును మరియు బోధికునివలె నేను మాట్లాడినట్లైతే, ఆయన ఇక్కడ ఇప్పుడు హాజరైయున్నాడు, ఆయన బావి దగ్గర స్త్రీతో మాట్లాడియున్నాడు. ఆమె ఇబ్బంది ఏమిటో ఖచ్చితముగా పట్టుకొను వరకు ఆయన ఆమెతో సంభాషణను ప్రారంభించియున్నాడు. ఆమెతో యున్న ఒక చిక్కును ఆయన కనుగొన్నాడు, అది ఏమనగా ఆమె వ్యభిచారములో జీవించుచుండెను. ఆయన అన్నాడు, ''వెళ్ళి, నీ భర్తను పిలుచుకొని రమ్ము.''
ఆమెఅన్నది, ''నాకు ఏ భర్తయులేడు.''
ఆయన అన్నాడు, ''నీకు ఐదుగురు భర్తలున్నారు.''
ఆమె అన్నది, '' అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను.'' ఆమె అన్నది, ''మెస్సీయా వచ్చినపుడు, ఆయన ఈ కార్యములను చేస్తాడు.''
73
అదే మెస్సీయా యొక్క గురుతు. అది ఏమైయున్నది? అది ఈ దినమున మెస్సీయా యొక్క గురుతైయున్నది. అది నిజమేనా? ఏలయనగా మెస్సీయా నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. ఆయన తన నియమములలో, తన శక్తితో, తన కార్యములతో ఒకే రీతిగా యున్నాడు. మరియు మెస్సీయా తానే స్వయముగా అన్నాడు, ''మొదటిగా నేను ఏమి చేయాలో నా తండ్రి చూపించితేనే తప్ప నేను ఏమియూ చేయును.''
అయితే ఆమెతో ఆయన మాట్లాడినట్లైతే నేను మాట్లాడుచున్నాను. నీ యొక్క మానవ ఆత్మను నేను పట్టుకొనుచున్నాను, మనము ఒకరికి ఒకరము క్రొత్తవారము. ఇప్పుడు, మొదటి కార్యము ఏమనగా ఆ స్త్రీని నేను చూస్తున్నాను (శ్రోతలారా, నా స్వరము మీకు తగినంత బిగ్గరగా వినపడుచున్నాదా, అది వినపడుచున్నదని నేను నమ్ముతాను), ఆ స్త్రీ నా యొద్ద నుండి తొలగిపోవుచున్నది. ఆమె యొక్క వెన్నులో ఏదో తప్పుయున్నది. అది నిజము. ఓ, స్త్రీ అది నిజమేనా? అది నిజమైనట్లైతే, నీ యొక్క చేతిని ఎత్తుము. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎంత తప్పిపోనిదో? అక్కడే నీ ఇబ్బందియున్నది. ఖచ్చితముగా.
ఇప్పుడు, దేవుడు ఆమెను స్వస్ధపరచుతాడో, లేదో అది ఆమె యొక్క విశ్వాసముపై ఆధారపడియున్నది, చూడండి. ఈ కార్యములు ప్రజలను స్వస్ధపరచుటకు కాదు. అది దేవుడు ఇక్కడ యున్నాడని నిన్ను మెళకువగా చేయుటకే, చూడుము.
74
ఇప్పుడు, అది ఒక మనిషి అని నీవంటావు... అది నీవు ఏమని పిలిచినా సరే. నీవు దానిని పిలిచినా, అది నీ యొక్క గమ్యమును నిర్ణయిస్తుంది. నేను దానిని చెపుతాను, చూడుము.
ఏమైనను... యేసును ముఖము మీద కొట్టిన మనిషి ఏ ప్రభావమును అతడు స్పర్శించలేడు. నిశ్చయముగా లేదు. అయితే ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టిన స్త్రీ ప్రభావమును పొందినది. ఈ రాత్రి మీరు ఆయనను తాకుతారా, నన్ను కాదు. ఓ,మై, అలా తలంచవద్దు, అది నేను కాదు. అది ఆయన చూడండి. నేను కేవలము మీవంటివాడనే. మీకంటే నేను హీనమైనవాడను, తక్కువ వాడను, ఏలయనగా ఎంతో కాలముగా మీరు ఈ మార్గముగుండా యుండియున్నారు. నేను దానిలో కేవలము ఒక బాలుడను (చూడండి), మరియు మీరు నన్ను కేవలము మీ సోదరునిగా పిలవండి, నేను మీ యొద్దకు వస్తాను.
అయితే ఇక్కడయున్న దేవుని పరిశద్ధులైన కొందరు ఈ పురాతన సంఘములలో వారి యొక్క సిలువను ఎన్నో సంవత్సరములుగా మోయుచున్నారు. మీ ముందు నిలబడుటలో నేను గౌరవముగా యున్నాను, కాబట్టి నాకు నిశ్చయత యున్నది, ఒక రవ్వంత సందేహము లేకుండా నేను ప్రభువైన యేసుక్రీస్తును మీకు బహూకరించుచున్నాను. అది నిజము. ఇప్పుడు, నీవు దానిని నమ్మినట్లైతే.... నీవు నమ్ముచున్నావని నా నిరీక్షణ.
75
ఇప్పుడు, ఆ స్త్రీ, మనము చూద్దాము, ఏమిటో...? ఏమి చేసినది...? ఓ, అది వెన్నుపూస వ్యాధి. అది అదేయైయున్నదని నేను నమ్ముచున్నాను. మంచిది. ఇప్పుడు, అదే ఆమెలోయున్న బాధ, ఇప్పుడు, నేను ఆ స్త్రీతో కొంచెము ఎక్కువసేపు మాట్లాడినట్లైతే, అది ఆమెను ఎక్కువ కార్యములను లేక ఏదైనను చెపుతూనే వుంటుంది. అది తప్పక నాకు తెలియదు. ఒక్క నిమిషము కొంచెము మనము ఆమెతో మాట్లాడుదాము మరియు పరిశుద్ధాత్మ ఏమి చెపుతాడో చూద్దాము. దానిని బట్టి అది ఏదో మీరు ఊహించేది కాదని, అది ఒక యదార్ధమైయున్నదని మీరు చూడగలరు.
ఇప్పుడు, ఇది కేవలము... ఆయన అద్భుతమైన ప్రభువు యేసుయైయున్నాడు, ఎంతో ఆశ్చర్యకరుడు, ఇప్పుడే అది నన్ను విడిచి పెట్టినది. అది నా నుండి బయటకు కదిలి వెళ్ళినది. అది వెళ్ళుటకు నేను స్పర్శించాను. అది మరొకరి యొద్దకు వెళ్ళినది. ఇప్పుడు, ఏదైనా అయియున్నంత నిశ్చయముగా. ఆత్మ నన్ను విడిచి మరొకరికి యొద్దకు వెళ్ళినది. ఆ అత్మాభిషేకము నన్ను విడచి; బయటకు వెళ్ళినది. నా చేతి మీద బ్రద్దలగుచున్న చెమటను మీరు చూడండి, చూడండి, చూడండి. అది నా నుండి వెళ్ళినది. శ్రోతలలో ఎవరి యొద్దకో అది వెళ్ళినది.... మనము చూద్దాము.
76
ఇప్పుడు, ఇక్కడ.... నీవు నీ యొక్క ఆత్మలో దానిని స్పర్శించించియున్నట్లైతే... ఇప్పుడు, నిలబడియుండగా ఇక్కడే తిన్నగా చూడుము. నీవు ఆ వెలుగును చూడగలవా? ఇక్కడ కూర్చొని, నా వైపు చూస్తూయున్న ఒక చిన్న స్త్రీ మీద, అది వ్రేలాడుచున్నది. ఆమె ఒక వ్యాధితో బాధపడుచున్నది, ఆమె వెళ్ళుచుండగా ఆమె చేతిని ఏదో పట్టుకొనుటను నేను చూడగలను. ఆమె తల నొప్పితో బాధపడుచున్నది. ఆమె ఇక్కడే కూర్చొనియున్నది. ప్రభువైన యేసు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముతావా? ఆయన నిన్ను బాగుచేస్తాడు. నీవు దానిని అంగీకరించుము మరియు నమ్ముము నీవు నమ్మినట్లైతే, నీవు దానిని పొందవచ్చును. ప్రభువైన యేసు నిన్ను దీవించును, చూడుము.
నీకు ప్రార్ధనా కార్డులు అవసరములేదు, చూడుము. మీకు విశ్వాసము కావలసియున్నది. చూడుము, విశ్వాసము నిన్ను ఎలా బాగుచేస్తుందో.
77
ఇప్పుడు, ఈమెయే ఆ రోగి అని నేను నమ్ముచున్నాను. కాబట్టి మనము... ఓ, ఇప్పుడే ఆయన నీతో మాట్లాడియున్నాడు, ఆయన మాట్లాడలేదా, నీలో ఏదో తప్పు యున్నదని చెప్పుచున్నాడు.
ఇప్పుడు, ఆయన నిన్ను బాగుచేస్తాడని నీవు ఆయనను నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? [నా హృదయమంతటితో.] నేను నిన్ను చూస్తున్నాను...నీవు... నేను ఒక కట్టడాన్ని చూస్తున్నాను, నీవు యుండియున్న ఒక విధమైన కట్టడము లేక అలాంటిది. నీవు యుండియున్నావు... అది ఒక... అది ఒక.. అది ఒక హాస్పిటల్. నీవు ఇప్పుడే ఒక హాస్పిటల్ నుండి వచ్చియున్నావు. మరియు నీ రక్తపోటును పరీక్షించుట నేను చూసాను, అది అపాయకరముగా హెచ్చుగా యున్నది, గుండెపోటు తెచ్చుటకు అది సిద్ధముగా యున్నది.
అది నిజము. మరియు నీతో ఒక చిన్న పాప యున్నది, మరియు ఆ చిన్న పాపకు కాలులో ఏదో ఇబ్బంది యున్నది. కాలు కుంటిగా యున్నది, అది ఎడమకాలు అని నేను నమ్ముచున్నాను. ఆమె ఆ పాదమును ఊపుటను నేను చూసాను, మరియు ఆ పాప నీ యొక్క సహోదరి యొక్క కుమార్తె. [అవును] అది నిజము, మరియు ఆ స్త్రీ ఆ బిడ్డ యొక్క తల్లియైయున్నది, ఆమె ఒక హాస్పిటల్‌లో పనిచేస్తుంది. అది సత్యము. ఇప్పుడు, వెళ్ళి ఆబిడ్డ మీద నీ చేతిని యుంచుము, మరియు ప్రభువైన దేవుడు నీ హృదయ వాంఛను తీర్చుతాడు.
78
''ప్రభువుకు స్తోత్రము,'' అని మనము చెపుదాము, దేవుడు ఆరాధనయైయున్నాడు... ఆరాధనకు ఆయన మూలము. ''ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను మరియు సత్యముతోనూ ఆరాధించవలెను.'' నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లైతే, అది ఏమైనను నీవు పొందుతావు. కేవలము దేవుని యందు విశ్వాసమును కలిగియుండుము. నీవు నమ్మినట్లైతే, దేవుడు నీ దీవెనను నీకు ఇస్తాడు.
ఓ, మై, ఇక్కడే కూర్చొనియున్న ఈ స్త్రీ... ఈ చుట్టూ చూస్తూయున్నది, నీ చలి జ్వరమును స్వస్ధపరచుతాడని దేవునిని నీ హృదయమంతటితో నమ్ముదువా? దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముచున్నావా? అది ఒకరముగా నిన్ను ధిగ్భ్రాంతికి గురి చేసినది, అది కాదా? ఆయన నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముదువా? నీవు నమ్మియున్నట్లైతే, నీవు అడిగినది నీవు పొందవచ్చును. ఆమెన్.
అధిక రక్తపోటు? ఆ అధిక రక్తపోటును దేవుడు బాగుచేస్తాడని నీవు నమ్ముచున్నావా? నీవు అది నమ్మినట్లైతే, నీవు అడిగిన దానిని పొందవచ్చును. అది నిజము. దేవుడు నిన్ను దీవించును. ఆమెన్.
79
ఓ స్త్రీ, ఎలాయున్నావు? మనము ఒకరికి ఒకరము క్రొత్తవారము, మనము కాదా? ఇప్పుడు, మనము ఒకరికి ఒకరము క్రొత్తవారయై యున్నందున, అయితే ఇంకనూ, నీ సహోదరుడు కాక నీవు మరొకరి యొక్క సముఖములో యున్నావని నీవు ఎరుగుదువా? చూడు, అది ఆయన యొక్క సన్నిధి, నీవు చూడు, అది ఒక అద్భుతయైన భావన కాదా?
చూడండి, ఇప్పుడు అది కేంద్రీకరించుచున్నది, ఆ స్త్రీకి మరియు నాకు మధ్యలో వచ్చుచున్నది. ఆమె వెనుకకు కదులుచున్నది. ఒక నల్లని చార ఆమెను వెంబడించుచున్నది. ఎన్నో సం॥ల క్రితము ఆమె స్థితిని నేను చూచుచున్నాను. ఇప్పుడు యున్న దానికంటే ఆమె ఎంతో యవ్వనస్ధురాలుగా యున్నది. నీవు ఒక విధమైన వ్యాధితో మొత్తబడియున్నావు లేక అదికాక మరొకటిగా అది కనబడుచున్నది, వారు దానిని చేయలేక పోయారు... నిద్రలో యున్నావు... లేక అది ఒక నిద్రపోవు వ్యాధి. అదే నీవు కలిగియున్నది, మరియు అది మరలా నీ మీదికి వచ్చియున్నది. మరియు నీవు అంతయూ ఉద్రిక్తపరచు స్థానమునకు వచ్చుచున్నావు. నేను కారును తప్పక నడప గలుగుతానా అని నీవు ఆశ్చర్యపోవుటను నేను చూస్తాను. నీవు ఆ విషయములను బట్టి కలత పడ్డావు. అది సత్యమేనా? ఈ నిమిషములోనే దేవుడు నిన్ను బాగుచేయగలడని నీవు నమ్ముతావా? ఇక్కడకు రమ్ము.
మరియు పరకలోపు తండ్రీ, ఇక్కడ అన్ని సంగతులను ఎరిగియున్న నీ ఆత్మయుండగా, దేవా ఈ స్త్రీని నీవు దీవించమని నీకు ప్రార్ధన చేయుచున్నాను, నీ నామములో ఆమెను దీవించుచున్నాను, ఆమె వెళ్ళి యేసుక్రీస్తు యొక్క నామములో స్వస్ధతనొందును గాక. ఆమెన్. సహోదరీ, ప్రభువు నిన్ను దీవించునుగాక. ఆయన కనికరములు నీ మీద మరియు నీపై నిలుచును గాక.
80
ఓ స్త్రీ, ఎలా యున్నావు? మనము కూడా ఒకరికి ఒకరము క్రొత్తవారమై యున్నాము. నేను అనుకొనుచున్నాను? మనము ఒకరిని ఒకరు ఎరుగము, అయితే మన ఇద్దరిని దేవుడు ఎరుగును. అది నిజమేనా? ఆయన మన ఇద్దరిని ఎరిగియున్నట్లైతే, ఆయనకు అన్ని సంగతులు తెలుసును. ఆయన అన్ని కార్యములు చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. అన్ని కార్యములను ఆయన చేయగలడు.
నేను నిన్ను చూడలేదు... కొద్దికాలము క్రితము నీవు వెళ్ళుచున్నావు... నీవు ఒక పరీక్ష కొరకు వెళ్ళుచున్నావు మరియు అది కాన్సర్ పరీక్ష, మరియు నీవు తిరిగి వెనుకకు వెళ్ళబోవుచున్నావు. అది కాన్సర్ ఏమోనని తిరిగి పరీక్షించబడుటకు ఒక పరీక్ష కొరకు నీవు తిరిగి వెళ్ళవలసియున్నావు, అది నిజము. నేను నీ సోదరుడనైయున్నానని మరియు నీకు సత్యమును చెప్పుయున్నానని తప్పక తెలుసుకొనుము. నీవు మరొక వ్యక్తి పట్ల శ్రద్ధను కలిగియున్నావు. అది ఒక గ్రుడ్డి వ్యక్తిగాయైయున్నది, నీ చేతిలోయున్న చేతి రుమాలును తీసుకొని ఆమె మీద ఉంచుము, తరువాత కాన్సర్‌ను గూర్చి వైద్యుడు ఏమి చెపుతాడో మాకు కబురు తెమ్ము. నీవు దానిని కనుగొంటావా, అది బాగానే యున్నదా, సహోదరి, ప్రభువు నిన్ను దీవించును. ఆయన కనికరములు నీ మీద నిలుచును గాక!
మనకు సమస్తమును ధారాళముగా ఇచ్చుచున్న దేవునికి స్తుతికలుగును గాక. ఇచ్ఛయించు వానిని ఉచితముగా జీవజలముల ఊట నుండి, వచ్చి త్రాగనిమ్ము. దేవునికి స్తోత్రము. ప్రతి ఆత్మ లోబడుచున్నది. చూడండి, ఇప్పుడు, నిన్ను నీవు దాచుకొనలేవు. ఆయన ఇక్కడయున్నాడు. నీవు ఇటువైపు చూసినట్లైతే. నేను దాటివెళతాను... నేను నిన్ను స్వస్ధపరచలేను, అయితే నీ జీవితమును నీవు దాయలేవు. అది నిజము.
81
ఇక్కడ వృద్ధ స్త్రీ, ఆమె నా వైపు చూస్తున్నది. ఆమె లోపము ఏమిటో నాకు తెలుసు. ఆమె పక్షవాతమును కలిగియున్నది. ఆమె భర్త ఆమె ప్రక్కనే కూర్చొని యున్నాడు, వినిపించుట ఆయనకు కష్టముగా యున్నది. ఇక్కడ ఒక స్త్రీ కూర్చొనియున్నది, ఆమె పిత్తాశయపు వ్యాధితో బాధపడుచున్నది, ఇప్పుడే ఆమె హాస్పిటల్ నుండి వచ్చియున్నది. చక్రాల కుర్చీలోయున్న ఆ చిన్న పాప పోలియో వ్యాధితో మొత్తబడినది. విశ్వాసమును కలిగియుండుము. నమ్ముము. అదే దానికి కావలసియున్నది. నేను స్వస్థపరచలేను. ఎవరినైనా స్వస్థపరచుటకు దేవుడు ఎన్నడూ ఏమియు నాకు ఇవ్వలేదు. ఆయన సన్నిధిని తెలుసుకొనుటకు, నీ విశ్వాసము ఆయనలో ఉత్తేజపరచుటకు, ఆయన నాకు ఒక వరమును ఇచ్చియున్నాడు.
ఆ వరుసలో చివర కూర్చొనియున్న ఓ స్త్రీ, కాలేయపు జబ్బుతో బాధపడుచున్న నీవు ఏమి ఆలోచన చేయుచున్నావు? అలాగైతే యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుతాడని నీవు నమ్ముతావా? నీ మీది గుండా ఏదో వెళ్ళుటను నీవు స్పర్శించియున్నావు, అది కాదా? అది అంతే, నీవు స్వస్థపరచబడి యున్నావు. ఆమెన్.
తన చేతిని తన మీద యుంచుకొనియున్న ఆ స్త్రీ, ఆమె కూడా అదే సమయములో ఒక దీవెనను కలిగియున్నది, ఆమె బ్లాడర్ వ్యాధిని కలిగియున్నది, అలాగైతే ఆమె స్వస్థపడియున్నది. ఆమెన్. అది నిజము. అది ఖచ్చితముగా సత్యము.
82
ఆమెను ప్రక్కగా కూర్చొనియున్న స్త్రీ, ఆమె భుజములనుపైగా తాకుచున్నది, ఆమె ఒక పగుళ్ళు వ్యాధిని కలిగియున్నది, ఓ స్త్రీ, అది కాదా? అది నిజము, ఆమెన్, నీవు ఆయన సన్నిధిని దాగలేవు. ఆయన ఇక్కడ యున్నాడు. ఆమెన్. సజీవ దేవుడి యొక్క గొర్రెపిల్లకు హల్లెలూయ. సర్వాంతర్యామి. ఇద్దరు కూడిన చోట, నేను వారి మధ్యలో యుంటానన్నావు. ప్రార్ధనలో మీరు ఏది అడిగినను దానిని నేను మీకు చేస్తాను. వినండి. నేను తప్పు త్రోవ పట్టిన దురభిమానము గల వ్యక్తిని కాదు. దేవునికి అది తెలుసు.
మా పరలోకపు తండ్రి, పరోకము నుండి క్రిందికి చూచుచున్నవాడా.... అక్కడ నా ముందు యున్న శ్రోతలవైపు నేను చూస్తూ యున్నాను. పరలోకమందున్న దేవుడు, ఆయన వచ్చినపుడు, ఈ దినమున బట్టి నాకు తీర్పు దినమున తీర్పు తీర్చుతాడు, ఎడతెగకుండా ఆ వెలుగులు ఆ వెనుక శ్రోతలలో ప్రకాశించుచున్నవి. అది (వెలుగు) తగ్గిపోవుచున్నది. నేను ఎంతో ఇక్కడ బలహీనుడనగుచున్నాను, అయితే వెనుక ప్రజలు ఎందరో స్వస్థపడుచున్నారు.
83
ఖచ్చితముగా మీరు ఎవరోయని చూచుటకు, నా నుండి మీరు ఎంతో దూరముగా యున్నారు, అయితే పరలోకమందున్న దేవునికి అది తెలియును. అనేక సార్లు అక్కడ ప్రజల మీద అది ప్రకాశించినది, అక్కడ ప్రజలు తిన్నగా ఆ దారి గుండా స్వస్థపడుచున్నారని, అది నాకు దేవుని యొక్క గరుతైయున్నది, మరియు నేను ఆయన పవిత్రమైన వాక్యము మీద నిలబడియుండగా, అది సత్యమని దేవునికి తెలియును. ఆమెన్.
గమనించండి. నేను వెళ్ళిపోయిన చాలా కాలము తరువాత, అది సత్యమని మీరు తెలుసుకొంటారు. ఆమెన్. అది చేయుచున్నది నీ యొక్క విశ్వాసమే. దేవునికి స్తుతికలుగునుగాక. నేను ఆయనను ప్రేమింతును. ఆయన ఎంత అద్భుతమైన వాడైయున్నాడు. ఆయన యొక్క మంచితనమును బట్టి మనమందరము మన హృదయములన్నిటితో ఆయనకు కృతజ్ఞతను చెపుదాము. మనము కృతజ్ఞతను చెప్పవద్దా?
స్నేహితులారా, ఒక్క క్షణము నేను కనిపెట్టుచున్నాను, కొంచెము... అది ఏమిటో మీరు గ్రహించలేరు. మీరు ఒక దానిలోనికి వెళతారు... ఓ, ఆయన ఎంతో ఆశ్చర్యకరుడు. మీరు సరిగ్గా ఎత్తబడుటకు ఇప్పుడు హాజరైయుండి మనలను అభిషేకించుచున్న పరిశుద్ధాత్మ, ఒక దినమున సంఘమును ఎత్తబడుటలోనికి తీసుకొని వెళుతుందని ఎరుగుట ఎంత గొప్పసంగతై యున్నది.
ఇప్పుడు, ఈ ప్రజలు దేవునిని నమ్మియున్న ప్రజలుగా పిలువ బడినవారు, అత్యుత్సాహముగలవారు, పరశుద్ధ-రోలర్లు, నిన్ను గూర్చి నీవు తప్పక సిగ్గుపడవలసి యున్నది, కారణము దేవుడు వారితో యున్నాడు, ఆయన ఇక్కడ యున్నాడని అది ఋజువు చేయుచున్నాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలును చూడండి. ఆ గురుతు వారి ముందు యున్నది, ఆమెన్. మనము ఆయనను ఎంత ప్రేమించుదుమో, ఆయన యొక్క మంచి తనమును బట్టి మనము ఆయనను ఎంత ప్రేమించాలో. ఆయన తరతరము నుండి తరతరముల వరకు యున్నాడు. ఆయన దేవుడై యున్నాడు.
84
ఇక్కడ నిలబడియున్న మనిషి, ఇతడేనా రోగి? అయ్యా, నన్ను మన్నించండి, మనము ఒకరికి ఒకరము క్రొత్తవారము. నీవు ఎవరవో నాకు తెలియదు, అయితే కేవలము గమనించుచున్నాను... నీవు వేచి యుండాలని నా భావము కాదు, అయ్యా, అయితే, కొంచెము... నేను దానిని వివరించలేను, చూడు. నీవు ఇక్కడ యున్నావు. ఎందుకొరకో నాకు తెలియదు. నీవు ఇక్కడ ఎందుకొరకు యున్నావో ఆయనకు తెలియును, మరియు ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు. నీవు రోగివైయున్నట్లైతే, నిన్ను బలపరచువాడు ఆయన మాత్రమే. అది కుటుంబ సమస్యలై యున్నట్లైతే, ఆయన ఒక్కడు మాత్రమే దానిని తొలగించగలడు, నేను కేవలము చేయునది, ఒక దైవిక వరము ద్వారా మాత్రమే. ఆ బావి దగ్గర స్త్రీకి చెప్పినట్లుగానే చెప్పినట్లైతే... ఆమె యొక్క ఇబ్బందులు ఎక్కడ యున్నవో ఆయన ఎరిగియుండెను.
ఇప్పుడు, నేను శ్రోతలను అడుగగోరుచున్నాను. ఇక్కడ నిలబడియున్న మనిషి: పూర్తిగా నాకు క్రొత్తవాడు.
ఇప్పుడే శ్రోతలలో ఏదో సంభవించినది. అది శ్రోతలలోనికి వెళ్ళినది. పరిశుద్ధాత్మ, ఈ క్రొత్త వ్యక్తిని గూర్చి, అతడు ఇక్కడకు ఎందుకు వచ్చాడో నాకు బయలుపరచినట్లైతే, మీలో ప్రతి ఒక్కరు ఇప్పుడు దానిని నమ్ముతారా, మీరు... ప్రభువైన యేసును గూర్చి నేను మీకు సత్యమును చెప్పియున్నానని మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా?
85
అది సత్యమైయున్నది, మనము ఒకరికొకరము క్రొత్తవారము? మనము ఇదివరకు ఎన్నడూ జీవితములో కలుసుకొనలేదు. ఇదే మొదటి సారిగా మనము కలుసుకొను సమయము. నీ గూర్చి నాకు ఏమియూ తెలియదు. అయితే ఏదైనా... నీలో ఏదో లోపము యున్నట్లైతే, మరియు దేవుడు నన్ను దానిని ఎరుగనిచ్చినట్లైతే, అప్పుడు అది దేవుని యొక్క హస్తము నుండి రావలసియున్నది, అది కాదా?.
మరియు ఇప్పుడు... శ్రోతలారా, ఇప్పుడు ఇటు వైపు చూడండి. వాక్యమును దాచుకొమ్మని నేను మిమ్ములను కోరుచున్నాను. ఈ రోగ శయ్యలపై రోగులుగాయున్న మీరందరూ, మీరు ఎక్కడ యున్నప్పటికి, నేను మిమ్ములను కేవలము బాగు చేయుటకు ఎంతో ఇష్టపడతాను, అయితే నేను ఆ పని చేయలేను. నేను దానిని చేయలేను. ఏ ఇతర మనిషియు దానిని చేయలేడు. అది దేవునిలో యున్న, నీ విశ్వాసమే.
ఇక్కడ ఉన్న ప్రతిపాపి, నేను మీ యొద్దకు ఎంతగానో వచ్చి మిమ్ములను రక్షించాలని కోరుదునో, అయితే ఆ పని నేను చేయలేను. అది దేవునిలో యున్న నీ సొంత విశ్వాసమైయున్నది. నిరీక్షణ కొరకు కల్వరిలో వెల చెల్లించబడనది. నీవు... యేసు చనిపోయినప్పటి నుండి, నీవు రక్షించబడియున్నావు, అయితే నీవు దానిని అంగీకరించు వరకు, అది నీకు ఏ మేలును చేయదు. నీ స్వస్ధత కొరకు కల్వరిలో వెల చెల్లించబడినది. మీరు దానిని ఇప్పుడు అంగీకరించగలరా?
చూడండి, ఒక మనిషి ఇక్కడకు వచ్చి ఏదైనను చెప్పినట్లైతే, అది దానిని ఆలాగు చేయదు, అయితే దేవుడు అది అలాయుండునని చెప్పినట్లైతే, అప్పుడు అది ఆ రీతిగా జరగుతుంది. అది ఏమైయున్నది, నేను దానిని స్పర్శించగలను. ఇక్కడయున్న నా సోదరులారా, ఇది మనము ఈ స్టేడియంను విడువవలసిన సమయమైయున్నది. ఆ కారణమును బట్టియే, ఆ అభిషేకము ఖచ్చితముగా ప్రతి వ్యక్తి మీద యుండుటకు, నేను జన సమూహమును ఒక స్థానమునకు తెచ్చుచున్నాను. స్నేహితుడా, నీ పట్ల నాకు ఆసక్తియున్నది. మీరు స్వస్ధపడాలని నేను కోరుచున్నాను.
నీవు కేవలము... నీవు ఒకరి తల్లివైయున్నావు, నాకును ప్రియమైన తల్లియున్నది, ఆమె నా కొరకు ఈ రాత్రి ప్రార్ధనచేయుచున్నది. నీవు ఒకరి భార్యవైయున్నావు, ఈ రాత్రి నా భార్య, నా కొరకు ప్రార్ధన చేయుచున్నది. ఒకరి తండ్రి, నా తండ్రి ఈ రాత్రి వెళ్ళిపోయాడు. నీవు ఒకరి సోదరుడు మరియు ఒకరి సోదరివి... ఓ, దేవుడు మీకు సహాయము చేయునుగాక, స్నేహితుడా.
ఇప్పుడు వాక్యమును భోధించుట ద్వారా, దేవుడు కదులుటను చూచుట ద్వారా, మీరు నమ్మరా? మీరు విశ్వాసమును కలిగియున్నారని నాకు నచ్చజెప్పబడినది. ఇప్పుడు నేను ప్రయత్నించుచుండగా... జనసమూహము తగ్గిపోవుచుండగా... నేను దానిని వివరించలేను, లేక నా స్వరము మీ యొద్దకు సరిగ్గా వచ్చుచున్నదో లేదో కనీసము నేను ఎరుగలేను, అయితే నేను అది వచ్చుచున్నదని నా నమ్మకము.
86
ఇప్పుడు, ఈ మనిషి, అయ్యా కొంచెము దగ్గరగా ఇక్కడకు నీవు అడుగువేసినట్లైతే, నీ వెనుక మరొకరు అదే రీతిగా లాగుకొనుచున్నారు. కాబట్టి, మనము ఒకరికి ఒకరము క్రొత్త వారము, నేను చెప్పియున్నట్లుగా, మన ఇద్దరిని గూర్చి దేవునికి తెలుసు, మన గూర్చి ఆయనకు అంతయూ తెలుసు.
ఒకేసారి ఈ వేదికనొద్ద ఎంతమంది శ్రోతలు స్వస్ధపడియున్నారో మీరు గమనించగలరా? కారణము అది వారి విశ్వాసమును బట్టి, మీరు చూడండి. వారి విశ్వాసము దానిని చేసినది. ఇప్పుడు, నీవు ఈ పట్టణపు వ్యక్తివి కాదు, నీవు మరొక పట్టణము నుండి ఇక్కడకు వచ్చియున్నావు, నీ బాధ, నీ వీపులో యున్నది; అది నీ వెనుక బ్రద్దలైన నీ వీపులోని ఎముకలైయున్నదని వారు చెప్పారు. అది నిజము. యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతావా? ఎవరో నీ పేరుతో పిలుచుటను నేను వింటు౦న్నాను.... హగ్, మరియు నీ యొక్క ఇతర పేరు మార్టిన్. అది నిజము. అది నిజమేనా? మంచిది. దేవుడు నిన్ను దీవించును గాక.
87
''దేవునికి స్తుతికలుగును గాక,'' అని మనము చెపుదాము. మీ హృదయమంతటితో మీరు ఆయనను నమ్ముచున్నారా? ఇప్పుడు, మీరు ఎక్కడ నిలబడియున్ననూ అక్కడే... మీరు నా కొరకు ఒకటి ఒక్క నిమిషము, మీరు ఒకరి మీద ఒకరు చేతులను ఉంచుతారా? ప్రతి చోట, మార్గము గుండా అంతటా, అది మంచిది ఇప్పుడు, నాకు దేవుడు తెలుసు... మహిమ. ఈ కార్యములన్నియూ..
అక్కడ కూర్చొనియున్న మనిషిని దేవుడు ఇప్పుడే స్వస్థపరచియున్నాడు, మీ చేతులు... ''వారు ఒకరి మీద ఒకరు చేతులను ఉంచుతారు.''
మా ప్రియమైన పరలోకపు తండ్రీ, చీకటి శక్తులను అన్నిటిని మేము గద్ధించుచున్నాము. సాతానా, నీవు ఓడిపోయావు. పరిశుద్ధాత్మ అధికారమును బట్టి, మరియు ప్రభువైన యేసు పునరుత్థాన శక్తిని బట్టియు, ఈ విశ్వాసుల సమూహము సర్వశక్తిగల దేవుని సన్నిధిలోనికి వచ్చారు, సాతానా, బయటకురా, ప్రభువైన యేసు నామములో నీకు ఆజ్ఞాపించుచున్నాను, ఈ దైవ సన్నిధిలో ప్రతి వ్యక్తిని విడిచిపెట్టుము. నీవు ఓడిపోయి యున్నావు. యేసు నామములో వారిని విడువుము. ఆమెన్. మీ పాదముల పై నిలబడి, ఆయన గొప్ప మహిమకరమైన ఆయన శక్తిని బట్టి దేవునికి మహిమను ఇవ్వండి.