ఘనుడైన రోమీయుడు

ఘనుడైన రోమీయుడు

స్నేహితులారా, శుభ సాయంకాలము. ఈ మధ్యాహ్నము ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీతో మాట్లాడుటకు నేను చాలా సంతోషముగా ఉన్నాను. మరియు మన ప్రభువు మనతో ఉంటాడని మనం నమ్ముచున్నాము. ఇప్పుడు మనం ఆయనను సమీపించక మునుపు, మనం ప్రార్ధించుకుందాము.

మా పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసు అను మీ ప్రియ కుమారుని యొక్క నామములో మేము మీ యొద్దకు వచ్చుచున్నాము. మేము మా ప్రేమను వ్యక్తపరచుచున్నాము. మరియు మేము మిమ్మును కొనియాడుచున్నాము, మరియు మీరు ఈ రాత్రి మమ్మును కలుసుకొనగలరనియు, మరియు రక్షింపబడని వారినందరిని రక్షించెదరనియు, మరియు అవసరతలలో ఉన్నవారిని మరియు వ్యాధులతో ఉన్నవారిని స్వస్థపరచుదురనియు మేము నమ్ముచున్నాము.

మరియు ఈ రాత్రి మేము ఈ భవనము విడచి వెళ్ళుచుండగా, ఎమ్మాయి నుండి వచ్చిన వారివలె మేము చెప్పగలుగుదుము గాక, “ఆయన సన్నిధిని బట్టి మన హృదయములు మనలో మండుచుండలేదా?” తండ్రి, ఈ రాత్రి మా కొరకు వ్యత్యాసముగా ఉండు ఒక చిన్నది ఏదైనా చేయుము. దేవుని కుమారుడు మృతులలో నుండి లేచి మరియు ఈ రాత్రి మా మధ్య సజీవుడైన ఒకనిగా ఉన్నావని ప్రజలు తెలుసుకొనునట్లు ఒక చిన్న అసాధారణమైనది చేయండి. మేము దానిని ఆయన ప్రియమైన నామములో అడుగుచున్నాము. ఆమేన్.

(మీరు లేఖనము చదవండి.) [జర్మను అనువాదకుడు మార్కు 7:1-10 చదివెను.]

[యెరుషలేము నుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి.

పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారామునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించెడివారు.

అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును — నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి.

అందుకాయన వారితో ఈలాగు చెప్పెను — ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.

వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్ధముగా ఆరాధించుదురు, అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే.

మీరు దేవుని ఆజ్ఞను విడచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.

మరియు ఆయన — మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు.

నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా.]

2

చదవబడిన ఆయన వాక్యమునకు ప్రభువు ఆయన ఆశీర్వాదములు జత చేయునుగాక. ఈ రాత్రి కొంచెం ఆలస్యముగా వచ్చినందుకు క్షమిచండి, కాని ఈ రోజంతా బాగా వర్షము కురుస్తూ కష్టతరముగా ఉంది. ప్రార్ధన చేయించుకొనవలెనని కోరు ప్రజలు, పెందలకడనే గుడారము యొద్దకు వచ్చి మరియు ఈ ఎదుట ఉన్న స్థలములు మీరు ఆక్రమించుకొనవలెనని మేము చెప్పుచున్నాము. ఆరు గంటల తరువాత ఏ సమయములోనైనా అవి మీ కొరకు ప్రత్యేకించి ఉంచబడెను. ఆ సమూహములు లోపల సమకూడుటకు ముందుగా.....

ఈ రాత్రి వారు ప్రార్ధనా కార్డులు ఇచ్చెదరని నేను తలంచుటలేదు, మరియు, ప్రభువు చిత్తమైతే, రేపు రాత్రి రోగుల కొరకు ప్రార్ధించగలము. కాబట్టి పెందలకడనే వచ్చుటకు జ్ఞాపకముంచుకొనండి, అది ఎవరనగా, ప్రార్ధనా కార్డులు పొందవలెనని ఉద్దేశించినవారే. ఆరు గంటల తరువాత, ఎప్పుడైనా ఏడు గంటల వరకు, ఏ సమయములోనైనా, ఆ గుడారములోనే ఉండి మరియు కూర్చుని ఉండండి.

ఇప్పుడు, ఈ రాత్రి ఒక గొప్ప సంఘటన మీద మనం మాట్లాడబోవుచున్నాము, మరియు అది ఈ ఘనుడైన వ్యక్తిని గూర్చి అయి ఉన్నది. అతడు ఒక అన్యుడు, మరియు అతనికి యుదా మతమును గూర్చి ఎక్కువగా ఏమియు తెలియదు. అయితే అతడు యేసును గూర్చి వినెను, మరియు అతని సేవకుడు చాలా రోగియై యుండెను. మరియు అతడు ఒక యూదుడైనను లేక అన్యుడైనను, అతడు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండెను, మరియు అతడు యేసు యొద్దకు పంపబడెను.

3

మీరు అతని వైఖరిని గమనించాలని నేను కోరుచున్నాను. అతడు నేను కలిగి ఉన్నాననే భావనతో అతడు సమీపించలేదు; ఆ భావనను బట్టి అతడు సమీపించలేడు. అతడు అయోగ్యుడునని చెప్పి సమీపించెను. మీరు కూడా అలాంటి ధృక్పధము కలిగి ఉండవలెనని కోరుచున్నాను, ఆదిపత్యము చెలాయించు వైఖరితో నీవు వచ్చి మరియు దేవుని నుండి ఏమియూ పొందలేవు. నీవు తప్పక భయ భక్తులతో, అణకువతో రావలెను, అప్పుడు దేవుడు నీతో వ్యవహరించగలడు. అప్పుడు నీవు ఏమి అడిగినను నీవు పొందగలవు.

మరియు ఈ రోమీయుడు తీసికొనిన ధృక్పధము అదే అయియున్నది.

అతడు ప్రభువైన యేసును సమీపించిన విధమును చూడుము. అతడు అనెను, “నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడనుకానని, నాకు నేనే, నేను భావించాను” అని చెప్పెను. “మాట మాత్రము సెలవిమ్ము,” అతడు అనెను. “నేను అధికారము కలిగియున్న మనిషిని” మరియు చెప్పెను, “నేను ఈ మనిషిని 'వెళ్ళు' మరియు ఈ మనిషిని 'రమ్ము' అని చెప్పినయెడల వారు వెళ్ళెదరు మరియు వచ్చెదరు.” “నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును” అని చెప్పెను.

అది గమనించాలని నేను మిమ్మును కోరుచున్నాను. అధికారము క్రిందున్న ఆ రోమీయుడు, తన స్వాధీనములో ఏమి ఉన్నను అది వానికి లోబడి ఉండవలసి ఉన్నదని యెరిగి యుండెను. అతని సాక్ష్యములో, యేసుక్రీస్తు సమస్త వ్యాధులకు (పైగా) అధికారిగా ఉండెను. అతని సైనికులు అతనికి విధేయులుగా ఉన్నట్లే, ఆయన అనారోగ్యమును ఆయనకు లోబడునట్లుగా చేయును. ఆ సైనికులలో ఒకడు అతనికి విధేయునిగా ఉండుటలో విఫలమైనయెడల, అది అతనికి ఒక మరణ శిక్షగా ఉండెను. మరియు దురాత్మల మీదను లేక అనారోగ్యము మీదను, అదే విధమైన అధికారము యేసులో గలదని అతడు గుర్తించెను. ఆ కారణము చేత అతడు ఇట్లనెను, “మాట మాత్రము సెలవిమ్ము.”

4

యాయీరు కుమార్తెను బ్రతికించుటకు ఆయన ప్రార్ధించుటకు వెళ్ళుటను నీవు గమనించితివా, ఆ...యాయీరు ఒక యూదుడు మరియు అతడు... ప్రజలపై చేతులుంచునట్లు అతడు శిక్షణ పొంది ఉండెను. యాయీరు అనెను, “వచ్చి, నీ చేతులు నా కుమార్తె పై పెట్టుము, మరియు ఆమె బ్రతుకును.” అని చెప్పెను. అతడు చేతులుంచుటను గూర్చి బోధించబడెను.

అయితే అన్యునికి, అతనికి అధికారము మరియు శక్తిని గూర్చి బోధించబడెను. నీవు ఏది నమ్ముచున్నావో అది దానిప్రకారము జరుగును. వారిద్దరికి క్రీస్తునందు విశ్వాసముండెను, ఒకరు అన్నారు. “మాట మాత్రము పలుకుము మరియు అది జరుగును.” మరొకరు అనెను, “నీ చేతులు మీద ఉంచుము మరియు అది జరుగును.” చూడండి, నీవు దేనిని నమ్ముచున్నావో అది దానిపై ఆధారపడి ఉంటుంది.

మంచిది, ఇప్పుడు, అది అలాగే... ఇప్పుడు, ఈ రాత్రి ఇక్కడ అది అదే విధముగా ఉన్నది. ప్రజల వ్యాధుల కొరకు ప్రార్ధించినపుడు, అలా వ్యాధుల కొరకు ప్రార్ధించే ఆ వ్యక్తిలో అక్కడ ఏదో ఉందనియు అదియే వ్యాధిని స్వస్థపరచునని అనేక మంది ప్రజలు అనుకొందురు. అది తప్పు. వ్యాధిని స్వస్థపరచుట, అది క్రీస్తులో ఉన్నది. కల్వరి యొద్ద ఆయన మరణము, లోకము యొక్క సమస్త వ్యాధులు మరియు సమస్త పాపములు కొరకు ఆయన వెల చెల్లించెను, మరియు ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తమును ఎవరు నమ్మెదరో వారు ఏమి అడిగినను దానిని పొందుకొనెదరు. ఆ సమస్య ప్రజలలోనే ఉన్నది. అది విశ్వాసము కొదువుగా ఉండుటను బట్టి.

5

ఇక్కడ ఆయన భూమి మీద శరీరధారియై ఉన్న రోజులలో, ప్రజలు అన్నారు, “ఆయన రోగులను స్వస్థపరచగలడు”; కాని ఎప్పుడైతే ఆయన ఒక మనుష్యుని పాపమును క్షమించెనో, “అది సాధ్యము కాదు,” అని వారు అన్నారు. ఆ దయ్యము దానిని మార్చివేసినది. “ఆయన పాపములు క్షమించలేడు, కాని ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరచగలడు” అని వారు అన్నారు.

కాని యేసుక్రీస్తు దేవుని ఆజ్ఞ క్రింద చనిపోయెను. “ఆయన మన అపరాధముల నిమిత్తము గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగియున్నది.” దీనిని నమ్ముట ప్రతి విశ్వాసి యొక్క వ్యక్తిగత ఆస్తి అయి ఉన్నది.

ఇప్పుడు, నేను మిమ్మును మోసగించుటకు మీ యొద్దకు రాలేదు. నేను బైబిల్ మూలముగా ఇక్కడకు వచ్చాను. అది మీకు నేను బోధించుట కొరకే వచ్చాను. ఆయన చేయును అని బైబిల్ లో చెప్పిన సూచనలను నెరవేర్చుట ద్వారా మీరు దానిని అర్ధము చేసుకున్నారు అని నిశ్చయము చేసుకొనుటకు దేవుడు ఇక్కడ ఉన్నాడు.

6

ఆయన అప్పుడు ఉన్నట్లే ఈనాడు ఆయన అంత ఎక్కువగా స్వస్థపరచువాడని నేను నమ్ముచున్నాను. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని బైబిలు చెప్పుచున్నది. ఆ దినాన స్వస్థపరచుటకు ఆయన సమర్ధుడై ఉండినయెడల, ఆయన ఈ రోజు కూడా స్వస్థపరచుటకు సమర్దుడు, మరియు అక్కడ రేపు అనునది ఉన్నయెడల, ఆయన రేపునూ స్వస్థపరచగలడు. ఆయన నిన్నటి దినమున పాపము నుండి రక్షించినయెడల, ఆయన ఈ రోజు కూడా పాపము నుండి రక్షించగలడు, మరియు రేపు కూడా పాపము నుండి రక్షించును. కాని ఇది అంతయూ కల్వరి యొద్ద తగిన విధముగా చేయబడి ఉండెను. మొత్తము సమస్య అక్కడే పరిష్కరించబడి ఉండెను.

7

ఇప్పుడు, మనం బైబిలులో బోధించబడినట్లుగా, యేసు మృతులలో నుండి పైకి లేచినయెడల... ఇప్పుడు, బైబిలు సరియైనదిగా ఉన్నది లేక అది సరియైనది కానట్లుగా ఉన్నది. యేసు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని బైబిలు చెప్పుచున్నది. ఇప్పుడు, అది సరియైనది అయినచో, అప్పుడు ఆయన అదే పద్ధతిలోను, శక్తిలోను, రక్షించుటలోను, స్వస్థపరచుటలోను ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిన్న చేసిన విధముగానే ఆయన నేడునూ చేయగలడు. మరియు ఆయన శక్తి అంతయూ, ఆయన క్రియలు అన్నియూ, ఎందుకనగా ఆయన చనిపోలేదు, ఆయన మృతులలో నుండి లేచెను మరియు ఆయన చనిపోక ముందు, ఆయన చేసిన వివరణ ఇక్కడ ఉన్నది, “భూదిగంతముల వరకు వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి; నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును; నమ్మనివారికి శిక్ష విధింపబడును.”

ఒక సేవకుడు, సామాన్యముగా అంతే దూరము వెళ్ళును. నేను మార్కు 16 నుండి పేర్కొనుచున్నాను.

అయితే ఇక్కడ యేసు ఇలా చెప్పెను, “నమ్మినవారిని ఈ సూచక క్రియలు కనబడును; నా నామమున వారు దయ్యములను వెళ్లగొట్టుదరు.” మరియు ఇతర గొప్ప సూచనలు ఆయన ఇచ్చెను, రోగులు మీద చేతులు ఉంచెదరు మరియు వారు బాగుపడెదరు.

బైబిల్ వ్రాసిన తరువాత, బైబిల్ యొక్క మొదటి రెండు లేక మూడు దశాబ్దములలో విశ్వాసులను సూచనలు వెంబడించెను. పిదప అపొస్తలుల యొక్క రెండు లేక మూడవ ప్రయాణము తరువాత, వారు సహోదరత్వమును బద్దలు చేసి, వారు సంఘాలను - శాఖలుగా చేయుటకు ప్రారంభించి, లాడ్జీలు వలె చేసిరి. వారు సువార్త నుండి ఇతర విషాయలను కత్తిరించనారంభించిరి, ఎంతవరకు అనగా ఇప్పుడు దాదాపు పూర్తిగా కత్తిరించిరి.

8

ఈ రాత్రి నేను మీకు ప్రకటించునది, అది ఏ సమయంలో కంటేను ఈ రాత్రి బైబిలు పవిత్రముగాను మరియు సత్యముగా ఉన్నది. నా ప్రాణము మరియు జీవితమును దాని యొక్క ఏ మాటతోనైనను నమ్ముటకు నేను సిద్దముగా ఉన్నాను. నేను అది నమ్ముచున్నాను. అది ప్రేరణతో కూడినది. యేసు ఇక్కడ భూమి మీద ఉండినపుడు, ఆయన చేయుటకు కోరినదేదైనా చేయుటకు ఏదో గొప్ప వ్యక్తినని ఆయన చెప్పుకొనలేదని, మీరు గ్రహించగలరు. ఆయన పరిశుద్దుడైన మార్కు 5:19 లో చెప్పెను, యేసు చెప్పెను, “తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును.” కనుక అది ఒక దర్శనము అయి ఉండెను, అలా తన కుమారుడు ఏమిచేయవలెనో తండ్రి చూపించెను.

రేపు లేఖనములను పరిశీలించండి, ఏ ప్రవక్త అయినా, ఏ సమయంలో అయినా, వారు ఎన్నడైనా బయటకు వెళ్ళి ఆ శక్తులను తమలో ఉన్నవి అని తమకు తామే చెప్పుకొనా; లేదు, ఎన్నడూ అలా చేయలేదు. ఏమి చేయవలెనో ఎల్లపుడూ దేవుడు దర్శనమును ఇచ్చెను. యేసు, ఆయన ఇక్కడ ఉన్నపుడు, ఆయన ప్రేక్షక ప్రజలలోనికి చూచెను; విశ్వాసము కలిగి ఉన్నవారికి, వారి విశ్వాసమే వారిని స్వస్థపరచెనని ఆయన ప్రకటించెను.

9

వారు ఆయన యొద్దకు వచ్చినపుడు - ఆయన ప్రార్ధన వరుసలో, వారిలో ఏ పొరపాటు ఉండెనో ఆయన ఎరిగి ఉండెను, మరియు ఆయన చెప్పెను, “ఇపుడు, నేను చేయు ఈ కార్యములు, మీరును చేయుదురు, ఇంతకంటే మీరు ఎక్కువ చేయుదురు, ఎందుకనగా నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను కొంచెము కాలము లోకము నన్ను చూడదు, మీరు నన్ను చూచెదరు.”

ఇప్పుడు, గమనించండి, ఆయన రెండు తరగతులైన ప్రజలను గూర్చి స్పష్టముగా చెప్పెను. వాటిలో ఒకటి లోకము అని పిలువబడెను, లేక అవిశ్వాసి; వారు ఇక ఎన్నటికి ఆయనను చూడరు. మరియు పిదప ఆయన “మీరు” అని కొందర్ని కలిగి యుండెను. ఆయన చెప్పెను, “మీరు నన్ను చూచెదరు.” వారే విశ్వాసులు. ఎందుకనగా ఆయన అనెను, “నేను మీతో ఉందును, మీలో ఉందును, యుగసమాప్తి వరకు ఉందును.” అది ఆయనను నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవానిగా చేయలేదా?

ఆయన పరిశుద్ధాత్మ రూపములో, ఇక్కడ ఉన్నాడు. మనం ఒక అద్భుతమైన దీనములో నివసించుచున్నాము. ప్రభువైన యేసు రెండవ రాకడకు కొంచెము ముందు దినమున మనము నివసించుచున్నాము. మిమ్మును భయపెట్టుటకు నేను ఇది చెప్పుటలేదు. నీ హృదయము దేవునితో సరియైనదిగా ఉండినపుడు, అలా ఆయన వచ్చునని తెలుసుకొనుటకు నీకు అది ఆనందముగా ఉండును.

10

యేసు రెండవ సారి వచ్చినపుడు, మీరు ఎన్నడూ అంగవైకల్యము కలిగిన మరొకరిని చూడరు. వృద్ధులైన సమస్త స్త్రీలు, పురుషులు మరలా యవ్వనులుగా మారుదురు. మరణము వలననే వృద్దాప్యము నీ మీద ఉంచబడినది.

దానిని లేఖనములో మీకు చూపుటను నేను ఎంతగానో ప్రేమించి, నేను మీ భాషలో మాత్రమే నేను మాట్లాడగోరుచున్నాను, అనువాదకుల ద్వారా అది చాలా కష్టము; అది రెండింతల సమయముగా ఉన్నది. మీరు గ్రహించారని నేను అనుకొనుచున్నాను. ఈ రాత్రి నేను చెప్పినది సత్యమని ఆయన పరిశుద్ధాత్మని పంపి రుజువు చేయగలడని ప్రభువైన యేసు నందు నా నమ్మకము ఉంచుచున్నాను.

ఇప్పుడు, జాగ్రత్తగా వినండి.

(బాలుడు సూచనను ఇక్కడ పెట్టెను, కనుక మనము ప్రార్ధనా వరుసను కలిగి యుందుము. అతడు ఆ ప్రార్ధనా కార్డులు ఇచ్చెనని చెప్పెను.)

11

ఇప్పుడు, నేను మిమ్మును ఏదో అడుగ గోరుచున్నాను. నేను ఒక విధముగా నేను మీకు క్రొత్తవాడను. నేను వేల మైళ్ళు దూరం నుండి వచ్చాను. నేను ఆహ్వానము ద్వారా వచ్చాను. నేను ఆహ్వానించబడితిని. నా స్వదేశములో గత దినమున నా కార్యాలయములో నాలుగు వందల ముఖ్య పట్టణాలలో పిలుస్తున్నారు; ఆఫ్రికా, మరియు ప్రపంచమంతటా.

నేనిక్కడ ఎందుకున్నాననగా మీరు ప్రభువైన యేసును ప్రేమించుటలో నేను మీకు సహాయపడటానికే ఇక్కడున్నానని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి అయినను మామూలుగా, బుద్ధిపూర్వకముగా చనిపోవలెనని కోరుతూ మరియు నరకము, అను శిక్షించబడే ఒక స్థలమునకు వెళ్ళగోరుచున్నారని నేను నమ్ముటలేదు. మీరందరూ, మీలో ప్రతి ఒక్కరూ పరలోకము వెళ్ళవలెనని కోరుచున్నారు. నేను ఇక్కడ మంచి భాగము కొరకు ఉండని యెడల... నేను ఎన్నడూ డబ్బు తీసికొనుటకు రాలేదు. నేను డబ్బు తీసికొనను. నేను ఎన్నడూ పేరు ప్రఖ్యాతులు కొరకు రాలేదు. దేవుని యొక్క ప్రేమ మీ కొరకు నా హృదయములో ఉన్న కారణమును బట్టి నేను వచ్చాను. మరియు ఏదో దినమున దేవుని యొక్క న్యాయ పీఠము యొద్ద, నేను ఏమి చెప్పానో దాని కొరకు నేను లెక్క చెప్పవలసియున్నాను.

12

ఈ రాత్రి నేను గృహము యొద్ద నా భార్య మరియు ఇద్దరు చిన్న బాలికలతో ఉండుటకు అవకాశమున్నది! మరియు ప్రసంగించుటకు వేలకొలది స్థలములుండెను. ఇప్పుడే నలుబది రెండు వేల మంది ప్రజలు హాజరైన పది దినముల ఉజ్జీవము ముగించబడెను. నేను మీకు సహాయపడుటకు ఇక్కడున్నానని మీరు చూడగలుగుతున్నారా?

ఇప్పుడు, ఒకవేళ యేసు... నేను ఆయనకు సరియైన ప్రతినిధిగా ఉండినయెడల... ప్రపంచమంతయూ ప్రయాణించునపుడు ప్రజలు అన్యుల దేవుళ్లను ఆరాధించుటను నేను కనుగొంటిని. ఇప్పుడు, బహుషా ఇక్కడ కూర్చున్న, కేథలిక్కులు, లూథరన్లు, బాప్టిస్టులు, పెంతెకొస్తువారు, మరియు వివిధమైన ఇతర సంఘ శాఖలు ఉన్నాయి. కాని సామాన్యముగా మీరందరూ అదే దేవుడను ఆరాధించుచున్నారు.

ఇప్పుడు, లోకములో మహ్మదీయులు అని పిలువబడే మతములున్నాయి. వారు యేసుని క్రీస్తుగా విశ్వాసించరు. అక్కడ బౌద్దులూ, సిక్కులు, జైనులు, అనేక వందల ఇతర మతములు ఉన్నవి.

13

ఈ మధ్య ఆఫ్రికాలో, కొన్ని వేల మంది రక్తముతో చిలకరించబడిన విగ్రహములను కట్టి వారి చేతిలో పట్టుకొనియున్నారు. వారు దానిని గూర్చి యధార్ధముగా ఉన్నారా? ఆ విధముగా వారికంటే అధికముగా, క్రైస్తవులుగా మనమంతట మనమే పిలువబడుచున్నాము. చిన్నవారైన తల్లులు వారి నల్లనైన చిన్నబిడ్డలను తీసుకొని, గంగానది మీద వారి దేవుళ్లకు, తినునట్లుగా వారిని బలిగా ఆ మొసళ్ళకు వారిని వేయుచున్నారు. క్రైస్తవ్యము చేసిన దానికంటే అది కొంచెం భిన్నముగా ఉన్నది, నా ఉద్దేశ్యం, మరి కొంచెం ఎక్కువ యదార్ధముగా ఇండియా దేశములో వారు శీలలపై పడుకొనెదరు, అగ్ని గుండా నడిచెదరు. చైనాలో వారి పాదమును పగలు కొట్టుకొందురు వారి నాలుకలు చీల్చుకొందురు, మరియు అనేకమైన సంగతులు వారు కోసుకొనుచూ మొదలైనవి చేయుచూ తమకు తామే శిక్షించుకొనుచుండిరి.

దేవునికి ప్రాతినిధ్యము వహించు అనేకమైన ఈ సమస్త సంగతులు తరువాత, ఈ క్రైస్తవ మతము మాత్రమే ప్రపంచంలో నిజమైన మతమైయున్నది. వారు విగ్రహములను మాత్రమే ఆరాధిస్తారు. దానికి వారికి ఒక బైబిలు కలిగి ఉండిరి, కాని దానిలో జీవము లేదు. మరియు క్రైస్తవ్యము నుండి పరిశుద్ధాత్మను తీసివేయండి, వారికున్న దానికంటే మనము ఎక్కువ కలిగి ఉండినది ఏమీ లేదు. వారి యొక్క స్థాపకులు అందరూ చనిపోయారు మరియు సమాధి చేయబడ్డారు, కాని క్రీస్తు మృతులలో నుండి పైకి లేచెను.

ఆయన చెప్పెను, “నేను మిమ్మును విడువను ఎడబాయను. నేను మీతో ఉందును.” ఆయన ఈ రాత్రి ఆయన యొక్క పునరుత్థానపు శక్తిలో ఉన్నాడు. నేను ఎరుగుదును మరియు మీరు నమ్మవలెనని నేను కోరుచున్నాను.

14

ఇప్పుడు, ఇక్కడ అనేక మందికి ప్రభువైన యేసు వచ్చి మరియు మనలను అభిషేకించినయెడల, ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నపుడు ఆయన చేసిన అదే కార్యమును చేయును, నీవు ఆయనను నీ రక్షకునిగా మరియు ప్రభువుగా అంగీకరించగలవా, మరియు ఏదో మంచి సంఘములో చేరి, నీ జీవితంలో మిగిలిన దినములన్నియు ఆయన కొరకు జీవించెదవా? నీవు ఆ గొప్ప పరలోక దేవునికి దానిని

వాగ్దానము చేయగలిగిన యెడల, నీవు నీ చేయి ఎత్తగలవా? మీకు వందనములు.

మీరు ఈ రాత్రి సరిగా వినగలుగుచున్నారా? ఇక్కడ ఈ వైపు మీరు వినగలుగుచున్నారా? మీరు వినగలుగుచున్నయెడల, మీ చేయి ఊపండి. మీరు వినగలుగుచున్నారా? ఇప్పుడు, అయినట్లయితే మీరు చేయిని ఊపండి, ఇది ఎంతో శ్రేష్టమైనదిగా ఉన్నది గదా, అది కేవలం మధ్యలో ఉన్నది.

ఇప్పుడు, ఒక క్షణం ఇప్పుడు, నా కుడిచేయి వైపు మా ఇద్దరి మాటలను సరిగా వినగలుగుచున్న యెడల, మీ చేయి ఊపండి. ఇప్పుడు, మీకు వందనములు.

ఇప్పుడు, ఎడమ చేయి వైపు, అతడు, నేను చెప్పినది మీరు వినగలుగుచున్నారా? మీరు వినగలిగినయెడల, మీ చేయిని ఊపండి.

ఇప్పుడు, మధ్య భాగములో, మీకు వందనములు. ఇప్పుడు, మధ్యలో ఉన్న అందరు అలా మేము ఇద్దరం చెప్పినది వినగలిగినయెడల, మీ చేయి ఊపండి. మీకు వందనములు. అది దానిని మంచిగా ఉంచును.

15

దాని గూర్చి ఈ రోజంతా, సహోదరులు ఇక్కడే పనిచేయుచున్నారని, నేను అనుకొనుచున్నాను. ఈ విధమైన ఒక దేశములోనికి వచ్చి, మరియు బహుశా ఏర్పాటు చేయుట అలవాటు లేక, ఆ సహోదరులు, ఈ విధమైన ఒక సమావేశములో, ఉండుట, అది కష్టమైనదే. మరియు మీ అందరూ నాకు సహాయపడగలరని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. ఇప్పుడు, ఇది గమనించండి... వారు వినుట లేదా? ఏమి చెప్పుదురు? వారు అది వినుట లేదా? అంతా సరియే, దానిని మాట్లాడెదము. ఈ దిశ వైపుగా మనం తిరుగవచ్చును. అది శ్రేష్టంగా ఉన్నదా? మీ చేయి పైకెత్తండి. అది చాలా బాగున్నది. అది నిజము.

ఇప్పుడు, వారు దానిపై రేపు మరలా పని చేయగలరు. ఆ సంగతులకు ఇక్కడ మనం సహాయం చేయలేము. మీకు ఒక క్రైస్తవ సహోదరునిగా, మాతో సహకరించిన దాని కొరకు మరియు ఈ కష్ట సమయములో మా ప్రక్క నిలచి ఉన్నందుకు నా పూర్ణ హృదయముతో నేను నిశ్చయముగా మీకు వందనములు చెప్పగోరుచున్నాను. మరియు అది సరిగా చేయుటకు వారు చేయగలిగినదంతయూ వారు చేయుచున్నారు. ఆ సమూహములు ఈ వారం చివరకు పెరిగినయెడల, నేను వారిని ఆ స్టేడియం పొందుటకు అడిగెదను. అక్కడ ఆ ధ్వనులు చాలా బాగున్నాయని నేను తలంచుచున్నాను. దేవుడు మిమ్మును దీవించును.

16

మనం ప్రార్ధన చేయుదమా.

ప్రియ ప్రభువా, మాకు ఇప్పుడు సహాయము చేయుము. నీవు మాకు ఎంతో ఎక్కువ అవసరమై ఉన్నావు మరియు ఈ విషయములలో మీరు మాకు సహాయము చేయగలరని మేము ప్రార్ధించుచున్నాము. మీ పిల్లలందరూ వాక్యము వినవలెనని మేము కోరుచున్నాము. అది వారికి విశదము చేయండి, తండ్రి, మేము యేసు నామములో ప్రార్ధించుచున్నాము. ఆమేన్.

ఇప్పుడు, ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉన్నచో మరియు ఒక క్షణము సేపు కనిపెట్టగలరు... ఇప్పుడు, యేసు ఈ రాత్రి ఇక్కడ ఉండినయెడల, మరియు ఇక్కడ ఆయన ఈ వేదిక యొద్ద తనను తాను చూపించగలిగితే అప్పుడు నీవు... ఇక్కడ వేదిక యొద్ద ఆయన ఏమిచేసెనో, అక్కడ బయటా అదే ఆయన చేయగోరును.

ఇప్పుడు, ఆయన ఇక్కడ వేదిక యొద్ద ఏదో చేయుచుండగా, ఇప్పుడు, అలా అది ప్రతీ ఒక్కరికి జరగవలెనని ఒక సూచన కాదు. నా క్రైస్తవ స్నేహితుడా, నీవు గ్రహించావా? ఇది ఇలా జరగటానికి అలా ఇక్కడ యేసు ఉన్నాడని నీవు ఎరిగియుండుటకు అనుమతి ఇచ్చు ఒక కార్యము మాత్రమే.

ఆయన మీలో ప్రతీ ఒక్కరిని ఎరుగును. మీరు ఎన్నడూ తినని ఆహారమంతటిని ఆయన మీకు పంపాడు. ఆయన ఇక్కడ ఉన్నాడని చూపుటకు ఆయన ఏదో చేయగలిగిన యెడల నీవాయనను ఒప్పుకొనుము. అది నీ హృదయమంతటితో నీవు చేయగలిగిన యెడల, ఈ రాత్రి ఈ భవనంలో నుండి ఈ వ్యాధిగ్రస్తులుగా ఉన్న ఈ వరుసలో మొత్తం ప్రజలందరూ బాగుపడి బయటకు వెళ్ళుదురు. అది నాకు నేనుగా చేయలేను. నేను ఆయనకు ప్రాతినిధ్యము వహించగలను. అంతే, అది ఆయన యందు నీ యొక్క విశ్వాసము. యేసు చెప్పెను, “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది.”

17

ఇప్పుడు, ఆయన వారిని స్వస్థపరచలేదు. వారి విశ్వాసమే వారిని స్వస్థపరచెను. నతానియేలు ఆయన యొద్దకు వచ్చినపుడు, మరియు యేసు అతనిని ఎన్నడూ చూడలేదు, ఆయన చెప్పెను, “అదిగో కపటము లేని ఇశ్రాయేలీయుడు.” నేను ఈ రాత్రి స్విట్జర్లాండ్లో చెప్పనై ఉండినయెడల, నేను ఇలా చెప్పుదును, “అక్కడ ఒక నిజాయితిగా ఉన్న ఒక మనిషి, ఒక విశ్వాసి.”

నతానియేలు చెప్పెను, “బోధకుడా, నీవు నన్ను ఎప్పుడు ఎరుగుదువు?”

అది అతడిని ఆశ్చర్యపరచినది, అలా అక్కడ ఆ చిన్న మనిషి నిలుచుండి వాని ఇంతకు మునుపు ఎన్నడూ చూడకుండా, అతడు ఒక విశ్వాసి మరియు నిజాయితీ గల ఒక మనిషి అని ఏలాగు ఎరిగి ఉండెను.

అతడు అనెను, “నన్ను నీవు ఎలాగు ఎరుగుదువు?”

మరియు యేసు అతనితో అనెను, “ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, అంజూరపు చెట్టు క్రింద ప్రార్ధన చేసుకొనుచున్నపుడే.”

అంతలో నతానియేలు అనెను, “నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలీయుల రాజువు.”

18

అయితే యూదా ప్రజలు ఏమన్నారు? “అతడు ఒక గొప్ప దయ్యము. అతడు బయల్జేబూబు. ఆయన ప్రజల మనస్సును చదువుచున్నాడు, ఎందుకనగా సంఘములో వారి పేరు ప్రఖ్యాతులు గూర్చి భయపడుతున్నారు. ప్రియమైన స్నేహితుడా, నేను ఈ రాత్రి ఫిలిప్పు మరియు నతానియేలు ఉన్న ఆ స్థానమును మీరు తీసికొనవలెనని నమ్ముచున్నాను. అది ఆయనే అని మీరు గుర్తించగలరు.

యేసు మొదట మృతులలో నుండి లేచిన తరువాత, దాదాపుగా దినమంతా ఆయన యొక్క ఇద్దరు శిష్యులతో ఆయన నడిచెను, వారితో మాట్లాడెను, మరియు వారు ఆయనను ఎరుగరు.

క్రైస్తవులారా, మీతో కూడా అనేక సార్లు ఆయన నడిచెను మరియు మీరు దానిని ఎరుగరు. అయితే వారు ఆయనను లోపలకు ఆహ్వానించగా, వారి వెనుక తలుపులు మూయబడెను, పిదప ఆయన ఒంటరిగా ఉన్నపుడు చేసిన విధముగానే యేసు ఏదో చేసెను. ఆ శిష్యులు అది యేసు అని ఎరిగి ఉండెను. అంతలో ఆయన వారి మధ్య నుండి అదృశ్యుడాయెను. ఎందరు ఆ లేఖనమును చదివి ఉన్నారు? మీ చేయి ఎత్తండి. అది చక్కగా ఉన్నది.

19

ఇప్పుడు, ఈ రాత్రి యేసు..... మీ హృదయము లోనికి, మీరు ఆయనను ఆహ్వానించారా? ఒక సామాన్య మనిషి చేసిన దానికంటే వ్యత్యాసముగా ఉన్న ఒక చిన్నది ఏదో ఆయన చేయడా, చూడండి. అప్పుడు ఆయనను అంగీకరించండి, మరియు మీరు మీ పాపముల నుండి బాగైయుందురు — అది అవిశ్వాసము. అవిశ్వాసమే పాపమైయున్నది. కేవలం నీవు... నీవు కేవలము చెడునే చేయుదువు, ఎందుకనగా నీవు విశ్వసించలేదు. నీవు మంచి చేయుదువు ఎందుకనగా నీవు విశ్వసించుచున్నావు. అయితే విశ్వాసము లేక అవిశ్వాసము.

మీరు ఏ కార్డులు ఇచ్చియున్నారు? బి?

ఆ బాలురు వారు “బి” ప్రార్ధనా కార్డు ఇచ్చారని ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు, ఒక ప్రార్ధనా కార్డు కలిగిన ప్రతీ ఒక్కరు, నీ చేతిలో నుండి, దాని మీద చూడండి. మీరు ఒక అక్షరము “బి” కనుగొనగలరు. ఇప్పుడు, గత రాత్రి మనం “ఎ” కలిగి ఉన్నాము. మరియు ఈ రాత్రి వారికి “బి” కలదు.

20

ఇప్పుడు, ఎవరికి ప్రార్ధనా కార్డు బి-1 ఉన్నది మీ చేయి ఎత్తండి. బి-1? అంతా బాగుంది. ప్రార్ధనాకార్డు బి-1 ఇక్కడ సభికులలో పైన సరే, అంతాబాగుంది. బి-1, సరిగా ఇక్కడకు రండి. ప్రార్ధనా కార్డు బి-1. నేను వారిని ఒక్కొక్కరినే పిలిచెదము. అప్పుడు అక్కడ గందరగోళం ఉండదు. మంచిది. బి-1. ఇప్పుడు వారు వచ్చుచుండగా, నన్ను ఒక క్షణం మీతో మాట్లాడనివ్వండి. అంతా సరియే.

ఇప్పుడు, మన ప్రభువైన యేసు, ఇక్కడ ఉన్నాడు... ఇప్పుడు, ప్రభువైన యేసు ఉన్న వేదిక మీదకు ఎవరో వచ్చినయెడల ఏమిటి? ఎవరో ఒకరు ఇలా చెప్పినయెడల, “యేసూ, మీరు నన్ను స్వస్థపరచుదురా?”

యేసు ఏమి చెప్పును? నేను మిమ్మును ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను. ఆయన ఇలా చెప్పునా, “అవును, నేను నిన్ను స్వస్థపరచగలను.” ఆయన చెప్పును, “లేదు. నేను అది 1900 సంవత్సరములు క్రితము నేను మీ కొరకు చనిపోయినపుడే చేశాను.”

అది సంఖ్య ఒకటి గదా, సంఖ్య ఒకటి?

ఇప్పుడు బి సంఖ్య 2, నీవు నిలబడి, ముందుకు రమ్ము. అంతా సరియే సంఖ్య 3, బి-3. బి-4. బి-5, కాబట్టి మేము చూడగలుగునట్లు మీ చేయి పైకెత్తండి. మరియు మీ చేయి ఊపండి. బి-6, నీ చేయి పైకెత్తు. బి-7, చేయి పైకెత్తు.

స్నేహితులారా, మీరు ప్రార్ధనా వరుసలోనికి రాగోరనియెడల, ఒక ప్రార్ధనా కార్డును అంగీకరించవద్దు. అక్కడ ఒకరు మరొకరికి మార్చి ఇయ్యవద్దు. నీవు తప్పకుండా వచ్చి మరియు నీ సొంత కార్డు పొందగలవు మరియు సూచనలు సమాచారములు వినుము. నీవు తీసుకొని ఇతరులైన మరొకరికి ఇవ్వవద్దు. నీవు తప్పకుండా నీ సొంత కార్డును పట్టుకొని ఉండుము. వారు దానిని ఏ ఒకరికి ఇచ్చి మార్చకూడదు. అది మరల వెనుకకు వరుసలోనికి వెళ్ళును. నీవు తప్పక నీ సొంత కార్డును పట్టుకొని ఉండుము. ప్రతి ఒకరు ఒక కార్డు కలిగి యుండగలరు.

21

ఇప్పుడు, సంఖ్యి-బి. సంఖ్యి, సంఖ్య 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 25?. నేను - అలా అనేకులైన వారు ఒక్కసారే వరుసలో నిలబడగలము.

ఇక్కడ కూర్చున్న మీరు, రేపు మధ్యాహ్నము పెందలకడనే రండి; ఒక ప్రార్ధనా కార్డు మీరు పొందుకొనుటకు మీ ప్రియమైన వారిని ముందుగానే రమ్మని చెప్పండి, అప్పుడు మీరు ప్రార్ధింపబడగలరు. ఇప్పుడు, నీవు రోజులో ఏ సమయంలో అయినను వైద్యుని కార్యాలయమునకు వెళ్ళగలవు, ఎందుచేత నీవు వచ్చి యేసును చూడకూడదు. మన ప్రియులైన వైద్యులు బహుశా వారు చేయగలిగినదంతయు చేశారు; ఇప్పుడు, నీవు తప్పక యేసును నమ్మవలెను.

ఇప్పుడు, ఇక్కడ ఎంత మంది ప్రార్ధనా కార్డులు లేని రోగులున్నారు. మరియు యేసు మిమ్మును స్వస్థపరచవలెనని గోరుచున్నారు? మీ చేయి పైకెత్తండి. మీకు వందనములు. వారిలో రెండువేలు మంది.

ఇప్పుడు, ఈ రాత్రి మీలో ప్రతీ ఒక్కరు బాగుపడవలెనని కోరుచున్నారు, అప్పుడు ఆయన సేవకునిగా నేను చెప్పినది వినండి. నేను మీకు సత్యము చెప్పెదను. మీరు నా వైపు చూడవద్దు; నేను ఎవరిని గూర్చి మాట్లాడుచున్నానో, ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వైపు చూడండి. మీరు ఆయన వైపు చూడండి. మీరు అలా చేయుచున్నపుడు, మీరు అక్కడ ప్రార్ధించుటకు ప్రారంభించి మరియు ఇలా చెప్పండి, “దేవా, ఈ రాత్రి నా విశ్వాసమును నిర్ధారించండి. ఒకవేళ బ్రెన్హాం సహోదరుడు చుట్టూ తిరిగి మరియు నా జీవితంలో నేను ఏమి చేశానో లేక ఏ కారణం వలన నేను స్వస్థత పొందలేకపోయానో లేక నేను ఏమి చేయవలెనో నాతో చెప్పినయెడల, నేను దానిని అంగీకరించగలను.

22

క్రైస్తవ స్నేహితులారా, నేను ఆ విధముగా చెప్పుటకు కారణం, ఆయన నా ప్రక్క నిలబడి ఉండి ఆ రాత్రి ఆయన చెప్పెను. మరియు అది సత్యము. అది ప్రపంచము చుట్టూ మొత్తము ప్రకటించబడెను. నేను చదువులేని ఒక నిరుపేదను. అయితే నేను జన్మించినపుడు నా పూర్వీకులు కేతలిక్కులు, ఐర్లాండు నుండి వచ్చినవారు. నేను జన్మించినపుడు, అక్కడ వెలుగు ఉండెను, నేను పుట్టిన ఆ చిన్న శయ్యపై పెద్ద వెలుగు వ్రేలాడుచుండెను. నా తల్లిదండ్రులు దాదాపుగా స్పృహ కోల్పోయిరి. నా జీవితమంతా అది నాతోనే ఉండెను.

నాకు 23 సంవత్సరములు వయసు వరకు నేను సంఘానికి వెళ్ళలేదు. అయినను ఆయన నన్ను అలా నడిపించి మరియు జరుగబోవు సంగతులు నాకు చెప్పెను. అప్పుడు ఒక రాత్రి నేను ఇక్కడ ప్రార్ధించుచుండగా, ఈ వెలుగులోపలికి వచ్చెను, మరియు అక్కడ ఒక గొప్ప మనిషి వెలుగులో నడచుచుండెను. నల్లని జుట్టు భుజములు వరకు క్రిందకు ఉండెను, మృదువైన ముఖము, తెల్లని అంగీ మీద ఉండెను, ఆయన చేతులు ఈ విధముగా మడిచి యుండెను, మరియు ఆయన నాతో చెప్పెను... ఆ సమయంలో నేను భయపడి యుంటిని, అంతలో ఆయన చెప్పెను, “భయపడవద్దు.”

23

ఒక చిన్న బాలునిగా ఉన్నప్పటి నుండి నేను ఆ స్వరమును విన్నాను, కాని నేను ఇంతకు మునుపు దానిని ఎన్నడూ చూడలేదు. ఆయన మాట్లాడుచున్నపుడు అది సుడిగాలులు రూపములో నేను దానిని చూశాను. ఆయన చెప్పెను, “నీవు రోగుల కొరకు ప్రార్ధించవలెనని నీకు చెప్పుటకు దేవుని సన్నిధి నుండి నేను పంపబడ్డాను. ప్రపంచమంతటికిని, నీవు పంపబడెదవు మరియు గొప్ప అద్భుతములు జరుగును,” అనెను, “ప్రజలు నిన్ను నమ్మునట్లు చేయుము మరియు నీవు ప్రార్ధించినపుడు యధార్ధముగా ఉండుము, మరియు ఒక ప్రార్ధన ఎదుట ఏ వ్యాధియు నిలబడదు.”

నేను అన్నాను, “అయ్యా...” ఇప్పుడు, అది ఒక దర్శనము కాదు. నేను ఇక్కడ నిలబడినంత నిజముగా అక్కడ ఆ మనిషి నిలబడి ఉండెను. దర్శనములు అనగా ఏమిటో నేను ఎరుగుదును; ఇది దర్శనము కాదు. మరియు ఆయన అనెను... నేను అన్నాను, “అయ్యా, నేను నా ప్రజల మధ్య నివసించుచున్నాను.” నేను అన్నాను, “నేను చదువులేనివాడను. నేను వెళ్లలేను.”

ఆయన అన్నాడు, “నీవు రాజుల కొరకు మరియు దేశ పెద్దల కొరకు ప్రార్ధించబోవుచున్నావు.” మరియు నాకు అలాగే జరిగినది. నేను నలుగురు వివిధ రాజులు కొరకు ప్రార్ధించాను; గొప్ప సూచక క్రియలు మరియు అద్భుతములు చూశాను.

అంతలో నేను అన్నాను, “అయ్యా, వారు నన్ను నమ్మరు.”

24

ఆయన అన్నాడు, “ ఇశ్రాయేలీయులకు రుజువు చేయుటకు, నా ద్వారా అతడు పంపబడినట్లు ప్రవక్త అయిన మోషేకు ఒక సూచన ఇవ్వబడినట్లుగా, కనుక నీకు సూచనలు ఇవ్వబడును,” అనెను, “వారు ఏమి కలిగియున్నారో, ఆ ప్రజల యొక్క వ్యాధులను నీవు ఎరుగగలవు.” మరియు చెప్పెను, “వారు అది నమ్మకపోయినయెడల, వారి హృదయ రహస్యములను నీవు ఎరుగుదువు.”

నేను అన్నాను, “అదియే నన్ను ఎల్లప్పుడూ వ్యాకులపరిచెను; దానినే నా సేవక సహోదరులు అది తప్పు అన్నారు.”

అప్పుడు ఆయన సూటిగా మాట్లాడెను. ఆయన అన్నాడు, “యేసు మొదటి రాకడలో ఎట్లుండెనో, అది రెండవ రాకడలోను అలాగే ఉండును. ఆ సేవకులు వారిని దర్శించిన దినమును ఎరుగక ఉండిరి.” అప్పుడు ఆయన బైబిలు నుండి యేసు చేసినది చూపుటకు లేఖనములను ఉదహరించెను. ఆయన, “నేను మీతో ఉందును,” అని చెప్పెను.

నేను అన్నాను, “నేను వెళ్ళుదును.” మరియు నేను వెళ్ళాను.

25

అక్కడ వేలు మరియు పదివేల మంది ప్రజలు రక్షించబడి మరియు స్వస్థపరచబడెను. భూమి మీద ఇది నాకు చివరి రాత్రి అయినయెడల, నేను ఈ రాత్రి చనిపోయినయెడల, నా మాటలు సత్యముగా ఉండును. శాస్త్రీయ ప్రపంచం దాని యొక్క చిత్రమును తీసికొనెను. మేము దానిని ఇక్కడ కలిగి ఉన్నాము. మత సంబంధమైన విషయములు ఉంచు హాలులో వాషింగ్టన్, డి.సి.లో కూడా అది రుజువు చేయబడెను, ఒక యంత్రము ద్వారా ఫోటో తియ్యబడిన ఏకైక సహజాతీతమైనది ఇదియే. అప్పుడు ప్రపంచమంతా, సంఘము దానిని ఎరుగును. నీ హృదయమును తెరువుము, మరియు మీరునూ చూడగలరు.

మా తండ్రీ, నీ దీనుడైన సేవకునితో ఇప్పుడు ఉండుమనియు, ప్రజల కండ్ల ఎదుట కృపను ఇయ్యవలెనని మరియు దేవుని కుమారుడవైన నీవు, యేసుక్రీస్తువనియు అలా వారు ఎరుగునట్లు మరియు నేను నీ సేవకుడనని వారు ఎరుగునట్లు యేసు నామములో వేడుకొనుచున్నాను. ఆమేన్.

(ఇప్పుడు, ఇప్పుడు, జాగ్రత్తగా ఉండుము.)

26

కూడికలో ఈ భాగము అనువాదకుని ద్వారా చేయుట, అది చాలా కష్టమైనది. అతడు అనువాదము చేయుట కొరకు నేను కనిపెట్టలేను. ఇది అభిషేకమై యున్నది. నేను ఎక్కడ దర్శనములు చూడవలెనో నాకే తెలియదు. దయచేసి నిజముగా భయభక్తులతో ఉండుము. మరియు మీ స్థలములు విడచి పెట్టవద్దు, మరియు ఈ వైపుగా చూడండి. అవి నన్ను ఎక్కువ సమయం వరకు అనుమతించవు. పూర్ణహృదయముతో నమ్మిక యుంచుము.

ఇప్పుడు, ఇక్కడ నా ఎదుట ఒక మనిషి నిలబడి ఉన్నాడు. నేను నా జీవితంలో వానిని ఎన్నడూ చూడలేదు. మేము ఒకరికి ఒకరము క్రొత్తవారము. అది సరి అయిన యెడల, అయ్యా, నీ చేయి పైకెత్తుము. ఇప్పుడు, ఇక్కడ ఉన్నది, యేసుక్రీస్తు అయిన యెడల... మరియు ఆ మనిషి అక్కడ ఏదో జరుగనై ఉన్నదని తనకు తానే ఎరుగును. అతని సహోదరుడు కాక మరొక ఏదో సన్నిధిలో అతడు ఉన్నాడని అతడు ఎరుగును. అది అలా అయిన యెడల, అయ్యా మీ చేయి పైకెత్తండి. నేను సమాజమును ఈ సన్నిధిలో నిలచి ఉండవలెనని కోరుచున్నాను. అలా వారు మాట్లాడిన అదే వెలుగు ఇప్పుడు నాకు మరియు ఆ మనిషి మధ్యలో సంచరించి స్థిరముగా ఉన్నది. ఇశ్రాయేలీయుల పిల్లలను నడిపించిన అదే అగ్నిస్తంభం అయి ఉన్నది.

ఇప్పుడు, దేవుడు ఈ మనిషికి బయలుపరచినయెడల... ఇప్పుడు, ఈ మనిషి ఇక్కడ యేసు ఎదుట నిలబడి ఉండినయెడల, మరియు ఆయన నాకిచ్చిన ఈ సూటు ఆయన ధరించినయెడల, మరియు మీరు ఇలా అందురు, “యేసూ, మీరు నన్ను స్వస్థపరచవలెనని నేను కోరుచున్నాను.”

యేసు మీతో ఇలా చెప్పును, “నేను చనిపోయినపుడే అది చేశాను.” ఆయన ఇలా అంటారు, “మీరు ఇది నమ్ముచున్నారా? స్వస్థత మరియు రక్షణ కొరకు రక్షణకు సంబంధించినదంతయూ కల్వరి యొద్ద చేయబడెను.”

27

నేను మీతో మాట్లాడుచున్న కారణం, ఆ బావి దగ్గర స్త్రీతో అలా యేసు మాట్లాడినది అదే కారణము: ఆయన ఆమె సమస్య కనుగొనునంతగా మాట్లాడెను. అప్పుడు ఆయన ఆమెకు ఆమె సమస్యను గూర్చి చెప్పెను, మరియు అది... ఆమె దానిని గూర్చి ఏమి తలంచెను, ఆమె దానిని పొందుకొనునా లేదా అనుదానిపై ఆధారపడెను.

ఆ మనిషి ఇక్కడ దేని కొరకు ఉన్నాడో దేవుడు బయలు పరచినయెడల, అలా యేసుక్రీస్తును గూర్చి నేను మీకు సత్యమే చెప్పితినని అప్పుడు సరిగా మీ పూర్ణహృదయముతో ప్రేక్షకులైన మీరు నమ్మగలరా? మీరు నమ్మినయెడల, మీ చేయి పైకెత్తండి. ఇక్కడ మీరు అనుసరించగలరా?

మీ సహోదరులలో నేను ఒకడను, మరియు నేను అతనిని ఎరుగను. అయితే ఇప్పుడు, ఆ మనిషి నా దగ్గర నుండి కదలుటకు ప్రారంభించుచున్నాడు. ఆ మనిషి నా దగ్గర నుండి కదలుచున్నాడు, మరియు అతనికి ఒక సమస్య వచ్చినది, మరియు అది అతని ప్రక్కలో ఉన్నది. అది ఒక క్యాన్సర్ అయి ఉన్నది. అది చంపెడి ఒక మరణం అయి ఉన్నది. అతడు పరీక్షించబడి యున్నాడు. ఆ పరీక్షలో ఆ క్యాన్సర్ అతని ప్రక్క భాగము నుండి, కాలేయము లోనికి కూడా వెళ్ళెను, మరియు అతడు మరణించే ఒక స్థితిలో ఉన్నాడు. అది సత్యమై ఉన్నది. అది క్యాన్సర్ ఇప్పుడు, నీవు ఆ దేవుని నమ్ముము... అది సత్యము. అది అలా అయిన యెడల, నీ చేయి పైకెత్తుము. ఇప్పుడు నీవు నమ్ముచున్నావా?

28

ఇప్పుడు, అక్కడ అతని నుండి ఏదియు మరుగై ఉండదు. కొన్ని క్షణముల క్రితం మాట్లాడిన ఆ స్వరము ఏమై ఉన్నను, అది నీ సహోదరునిది కాదు. అది యేసుక్రీస్తు నా స్వరమును ఉపయోగించుచుండెను. ఇప్పుడు, అది ఆ మనిషి ఆ స్వరమునకు సమీపించు విధానముపై ఆధారపడును, దాని గూర్చి అతడు ఏమి ఆలోచించెనో, దాని నుండి అతడు ఏమి పొందుకొనునో ఖచ్చితముగా అదే నిర్ణయించును.

అలా ఇక్కడ నిన్ను ఎరిగి, నీ స్థితిని గూర్చి ఎరుగు ఒక శక్తి అక్కడ ఉన్నయెడల, మరియు అది సత్యమని మీరు ఎరుగుదురు, అది యేసుక్రీస్తేనని నీవు నమ్ముచున్నావా? ఆయన ఇంకా ఇక్కడే ఉండినయెడల, నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచిన యెడల, వారు బాగుపడుదురు. మీరు అది నమ్ముచున్నారా? ముందుకు రండి.

ఓ, గొప్ప పరలోకపు దేవా, మీ కరుణ ఈ మనిషి మీద, వాని శరీరము మీద ఉండును గాక. ఇతడికి శారీరిక స్వస్థతను దయచేయుము, మరియు ఈ కాన్సరును గద్దిస్తున్నాను, యేసు నామమున స్వస్థతనొంది, ఇక్కడ నుండి దేవుని స్తుతిస్తూ మరియు సంతోషముగా ఇక్కడ నుండి వెళ్ళును గాక. ఆమెన్.

ఇప్పుడు, అక్కడ ఒక వ్యత్యాసకరమైన అనుభూతి ఉన్నది. అది పోయినది. అది నిజము. ఆ క్యాన్సర్ మృతమైనది. వెళ్ళుము, దేవుడు నీతో ఉండును గాక.

దేవుని యందు విశ్వాసముంచుము. క్యాన్సర్ అనగా ఏమిటి? కణితి ఏమైయున్నది? అది ఒక జీవము. అది నీ జీవము (ప్రాణము) కాదు. అది దయ్యము యొక్క ఒక జీవమైయుండి నీ జీవమును (ప్రాణము) తీసివేయుచున్నది.

29

ఇప్పుడు, నా ఎదుట నిలబడి ఉన్న ఆ స్త్రీ అపరిచితురాలు. మేము ఒకరి కొకరు మా భాషలు మాట్లాడలేము. నేను నిన్ను ఎన్నడూ చూచి ఉండలేదు. మన మధ్యలోనికి రమ్మని ఈ మాటలు, నేను పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే చెప్పుచున్నాను. ఏమి జరుగుచున్నదో నేను ఎరుగుదును. అది సత్యమైనయెడల, నీ చేయి పైకెత్తుము. నీవు నన్ను దేవుని ప్రవక్తగా నమ్ముచున్నావా? నీవు అది నమ్ముచున్నావా? ఇప్పుడు నీవు కలిగియున్న ఆ భావన దేవుని సంబంధమైనదనియు, అలా నీవు ఆయన సన్నిధిలో నిలబడియున్నావనియూ నీవు నమ్ముచున్నావా? అప్పుడు నా వైపు చూడుము.

నేను ఒక గొప్ప భవనమును చూస్తున్నాను, మరియు అది ఒక ఆసుపత్రి. తెల్లని రంగు జుట్టు గల, ఒక స్త్రీ, రొమ్ముల మీద శస్త్ర చికిత్స చేయబడెను, మరియు ఆ రొమ్ములకు క్యాన్సర్ ఉండెను. నీ వైద్యుడు గదిలో ఉండెను, వారి ముఖాంతరములో కొన్ని విషయాలు కలిగియున్నారు. అప్పుడు నీవు ఆసుపత్రి నుండి పంపబడ్డావు, మరియు ఇప్పుడు, నీవు మరో వైద్యుని యొద్దకు వెనుకకు వెళ్ళావు, మరియు వారు కనుగొన్నారు. మరొక రొమ్ము మీద క్యాన్సర్ ఉన్నది, దేవుడు ఏమైనా చేయనియెడల, ఆమె తన యొక్క మరొక రొమ్మును కోల్పోవచ్చును. దేవుడు నిన్ను స్వస్థపరచును అని నీవు నమ్ముచున్నావా?

ప్రియమైన పరలోకపు తండ్రి, మరణము ఈ సహోదరిపై వచ్చియున్నది. మరియు మీరు ప్రేమించిన సేవకులైన, ఆ వైద్యులు, వారు చేయగలిగినదంతయూ చేశారు, అయితే వారు విఫలమయ్యిం. ఆ దయ్యము వారికి మరుగై ఉండెను.

ఓ, ప్రియమైన దేవా, ఇప్పుడే సహాయము చేయండి, ఎందుకనగా నీ వాక్యములో ఈలాగు వ్రాయబడియున్నది, “నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు.”

మరియు ఆ పాత సాతాను, అది క్యాన్సర్ గా పిలువబడెను, ఆ వైద్యునకు మరియు అతని కత్తికి నీవు మరుగై ఉండవచ్చును, అయితే నీవు దేవునికి మరుగైయుండలేవు. యేసుక్రీస్తు నామములో ఆ స్త్రీ నుండి బయటకు రా. ఆమెన్.

ఆనందించుచూ, వెళ్ళుము. మీ పరిస్థితులను గూర్చి వారము చివరలో, అవి ఏలాగు ఉన్నవో, మాకు తెలియజేయుము.

నీవు..... నీవు వెళ్ళుచున్నావు... జ్ఞాపకముంచుకొనుము, ఆయనకు నీ జీవితములో ఉన్నది తెలిసినట్లైయితే, అది ఏమైయున్నదో ఆయన ఎరుగును. వ్యత్యాసకరమైన దానిని నీవు అనుభవించుచున్నావు. మూడు రోజులలో, డెబ్బది రెండు గంటలలో, అప్పుడు నిజంగా రోగియై, నిజముగా రోగియై ఉంటావు, అయితే అలసినదానివై ఉండవద్దు. నీ స్వస్థతను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉండుము. దేవుడు నీతో ఉండును.

30

ప్రభువు స్తుతించబడును గాక. మరియు ప్రజలు అన్నారు, “ప్రభువునకు స్తోత్రము.” దేవుడు ఆరాధింపబడుటను ప్రేమించును.

ఆ స్త్రీ పరిచయములేనిది. అది యధార్ధము. నేను నిన్ను గూర్చి ఏమియు ఎరుగను. ప్రభువైన యేసు నాకు ఎంతగా బయలుపరుచునో అంతగా నేను ఆమెతో మాట్లాడెదను. అయితే ఆ వరుసలో నిలబడి ఉన్నవారి కొరకు, నీవు ఇక్కడ దేనికొరకు ఉన్నావో దేవుడు నాకు చెప్పినయెడల, నిన్ను స్వస్థపరచువానిగా ఆయనను నీవు నమ్ముదువా? నీ కొరకు నేను ఆయనను కలసికొనబోవుచుండగా, అలా అప్పుడు నీవు భయభక్తులతో ఉండుము.

వైద్యునిచే నీవు పరీక్షించబడ్డావు. వారు నీకు శస్త్ర చికిత్సను చేయగోరెను. మరియు నీకు కడుపులో మరియు కాలేయములో ఒక సమస్య గలదు. నీకు పిత్తాశయంలో సమస్యను కలిగియున్నావు. ఆ వైద్యుడు శస్త్ర చికిత్స చేయగోరెను, మరియు నీవు... ఆపరేషను చెయ్యవలెనని కోరుకొనుటలేదు. అందుచేత నీవు ఇక్కడ ఉన్నావు. మరియు నీవు చేశావు, ఇక్కడకు వచ్చుటకు ఆ అవకాశము నీవు పొందునట్లుగా నీవు ప్రార్దన చేశావు... నీవు ఒక గదిలో ఉన్నావు, మరియు దీనికొరకు నీవు ప్రార్ధన చేశావు, మరియు నీవు పిలువబడి ఉండినపుడు నిజముగా సంతోషించిన దానివయ్యావు. అది సత్యమైనది. నీ విశ్వాసమే నిన్ను రక్షించినది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, నిన్ను రోగిగా చేయుచున్న ఈ శత్రువును నేను వెళ్ళగొట్టుచున్నాను, ప్రభువైన యేసు నామములో... ప్రభువైన యేసు నామములో

ప్రార్ధింస్తునే ఉండుడి.

31

నీవు నమ్ముచున్నావా? దయచేసి పైకి లేవవద్దు. నీవు ఇబ్బందిపడుచున్నావు. పైకి లేవవద్దు. అది చాలా అగౌరవముగా ఉండును.

ప్రభువైన యేసు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? నీవు నీ ప్రక్క భాగములో ఏదో దానితో బాధపడుచున్నావు. అది ఒక పెరుగుచున్నది. అది నీ ఎడమ ప్రక్క భాగములో ఉన్నది. అది క్యాన్సర్ అయి ఉన్నదని నీవు భయపడుచున్నావు. మరియు అలా అది నిన్ను విడచిపెట్టి మరియు దూరముగా పోవలెనని నీ కొరకు ప్రార్ధన చేయించుకొనుటకు నా కొరకు నీవు వచ్చావు. అది నిజమై ఉన్నది.

ఓ, ప్రభువైన దేవా, భూమ్యాకాశములకు సృష్టికర్తా, యేసు నామములో, ఈ స్త్రీ మీదకు నీ ఆశీర్వాదములు పంపుము. ఆమేన్. వెళ్ళుము, దేవుని సమాధానము నీ మీద ఉండును.

నీ పూర్ణ హృదయంతో నీవు నమ్ముచున్నావా? యేసుక్రీస్తు ఈ రాత్రి సజీవుడై ఉండినయెడల.... నిన్ను స్వస్థపరచలేడా? కేవలం నేను ఒక మనిషిని మరియు నీవు ఇక్కడ స్వస్థత కొరకు కూడ ఉండకపోవచ్చును. నీవు మరో దానికొరకు ఇక్కడ ఉండి ఉండవచ్చును. నాకు తెలిసికొను ఏ మార్గము లేదు. కాని యేసు, సత్యమై ఉన్నవాడు తెలుసుకొనును మరియు అది సరియైనదిగా ఉండును. అప్పుడు అది అలా అయినయెడల, అప్పుడు కేవలం నమ్ముము.

నీకు గుండె జబ్బు గలదు, మరియు శస్త్రచికిత్స చెయ్యించుకొనవలెనని ఉన్నావు. మరియు అది పిత్తాశయంలో రాళ్ళు కొరకు. నీవు అది పోవలెనని కోరుచున్నావా? యేసును అంగీకరించుము. ఆమె స్వస్థపడును గాక అని యేసు నామమున నేను ఆమె మీద చేతులుంచుదును. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును.

32

మీరు ఆయనను నమ్ముచున్నారా? చెప్పండి, “ఆమేన్.”

ఇక్కడ నున్న మీ సంగతి ఏమిటి? మీ పూర్ణ హృదయంతో మీరు నమ్ముచున్నారా? ఏమిటో మీకు తెలియునా? ఇది మీకు మర్మమైనదిగా ఉన్నదని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. అది నీకు అర్థం కాదు. నేను మిమ్ములను తక్కువ చేసి మాట్లాడుటలేదు, అయితే మీరు ఎన్నడూ ఆ సహజాతీతమైన దానిగూర్చి బోధించబడలేదు. మీరు దానిని అవగాహన చేసికొనలేదు. నా మీదనున్న అదే అభిషేకము, అదే వెలుగు, నేను ఇక్కడ నిలబడినప్పటి నుండి రెండు లేక మూడుసార్లు ఈ సభికుల మీదుగా ఇటు అటు ఊగులాడుచున్నది, మరియు నీవు దాని కొరకు కదలనక్కరలేదు. మీలో ప్రతీ ఒక్కరు, సరిగా ఇప్పుడే, మీ పాదములపై నిలబడి యుండి స్వస్థపరచబడి ఉండుడి. ఆయన ఇక్కడే ఉన్నాడు. మీరు కేవలం దానిని అంగీకరించవలెను.

33

ఇప్పుడు, ఇక్కడ నిలబడి ఉన్న ఈ స్త్రీ వైపు చూడండి. స్త్రీ, నీవు బాగుండవలెనని కోరుచున్నావా? నీలో ఏ తప్పిదము ఉన్నదో దేవుడు నాకు తెలియజేసినయెడల, నీ స్వస్థతను నీవు అంగీకరించగలవా? నీకు కడుపులో సమస్య ఉన్నది. అది నిజము. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచినయెడల, వెళ్ళి తినుము. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును. అంతా సరియైనదిగా ఉన్నది.

సరిగ్గా అక్కడే కూర్చొని ఉన్న ఆ స్త్రీ నా వైపు చూస్తూ ఉన్నది, వృద్దురాలైన ఆ స్త్రీ ప్రతి ఒక్కరూ దానిని చూచునట్లుగా ఇప్పుడు కనిపించుచున్నది. అక్కడ కూర్చొని ఉన్న నెరిసిన జుత్తుగల స్త్రీ పై ఒక వెలుగు వ్రేలాడుచున్నది. ఆమె కీళ్ళవాపులతో బాధపడుచున్నది. అమ్మా, పైకి లెమ్ము, ఎక్కడ కూర్చొని ఉన్న వృద్దురాలైన స్త్రీ. నీవు నమ్మలేక పోయిన ఎడల... నీ వెనుక ఉన్న స్త్రీ దీవెనను పొందుకున్నది. సంపూర్ణముగా స్వస్థపరచమని... నేను రక్షకుడిని ప్రార్ధిస్తాను.

చూశారా, మీరు దానిని పోగొట్టుకున్నారు. స్నేహితులారా, మీరు మరచిపోయారు. మీరు ఇది పొందుకొనవలెనని కోరుచున్నాను, లేదా మీరు దేవుని ఆత్మను దుఃఖపరిచిన వారగుదురు. ఈ వైపునకు చూడండి, మరియు జాగ్రత్తగా ఉండండి. మీ ఆచారములను మరచిపొండి. ప్రభువైన యేసు ఇక్కడ ఉన్నాడు. అది మీరు గుర్తించలేరా, మీరు ఆత్మీయముగా చనిపోయినట్లే. నేను మీతో కఠినముగా మాట్లాడుట లేదు. అయితే మీలో నుండి ఆ అవిశ్వాసము అనే ఆత్మను దూరముగా పోవునట్లు చేయుటకు నేను ప్రయత్నించుచున్నాను.

34

నీవు ఉబ్బసపు స్థితిలో నుండి బయటకు రావాలనుకుంటున్నావా? నీ చెయ్యి పైకెత్తు. ఇప్పుడు, ఆయనను స్తుతించుచూ, దేవునికి వందనములు చెల్లించుచు సంతోషించుచు వెళ్ళుము. వెళ్ళుము. ఆమేన్.

ఓ, ఈ సంఘము యొక్క సంగతి ఏమైయున్నది? ఇప్పుడు, ప్రజలు, ఇదే గనుక ఆఫ్రికాలోనైతే! ఇది అమెరికాలో అయిన యెడల, ఇది స్వీడెన్లో అయి ఉన్నచో, ఈ ప్రజలు చక్రాల కుర్చీల నుండి పైకి లేచి బయటకు వచ్చియుందురు మరియు ఇక్కడ నుండి ప్రతిదియు దూరముగా వెళ్లిపోయినది. మీ కాపరుల ద్వారా మీరు సరిగా బోధించబడి ఉండలేదు. ఇది యెహోవా దేవుని యొక్క సన్నిధి అని మీరు ఎరిగి ఉండలేదు.

నీవు ఆ కడుపు సమస్య నుండి బయటకు రావాలని కోరుచున్నావా? నీ చేయి పైకెత్తుము. నీవు యేసును నమ్మితే, నీ స్వస్థతను అంగీకరించెదవా? గృహమునకు వెళ్ళి, తినుము. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును.

నీవు నమ్ముచున్నావా? నీవు గుండె సమస్యను అధిగమించగోరుచున్నావా? అప్పుడు సంతోషించుచు మార్గమున వెళ్ళుము, మరియు ఆ ప్రభువు నిన్ను దీవించును. ఆమేన్.

ఇలా చెప్పెదము, “దేవునికి వందనములు.” గమనించండి.

అమ్మా, నీ చుట్టూ నల్లగా ఉన్న ఒక ఆత్మ కలిగి ఉన్నావు. అది మరణము యొక్క ఆత్మ. నీకు క్యాన్సర్ గలదు. నీవు బాగుపడవలెనని కోరుచున్నావా? నీ చేయి పైకి ఎత్తుము మరియు యేసును అంగీకరించుము.

యేసుక్రీస్తు నామములో, క్యాన్సర్ అని పిలువబడే ఆ దయ్యమును నేను గద్దించుచున్నాను. ఆ స్త్రీని విడచి పెట్టుము. ఆమెలో నుండి బయటకు రమ్ము.

దేవునికి స్తుతి చెల్లించుచూ, ఆనందించుచూ, వెళ్ళుము. ఆమేన్

35

నీవు నమ్ముచున్నావా? అక్కడ ఆ చిన్న బాలునితో కూర్చుని ఉన్న స్త్రీ, నేను దేవుని ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? ఆ చిన్న బాలుడు మూర్చ రోగముతో బాధపడుచున్నాడు. అది నిజము. నీ చేయి పైకెత్తుము. ఇప్పుడు, మీరు చూడండి, దేవుడు సత్యమై ఉన్నాడు, మరియు యేసుక్రీస్తు నామములో అది ఈ బాలుని విడిచిపోవును గాక. నమ్ముచూ, వెళ్ళుము. మనం ఇలా చెప్పెదము, “ఆమేన్.”

నీవు ఆ కడుపు సమస్య మరియు స్త్రీకి వచ్చు సమస్య కూడా పోవలెనని కోరుచున్నావా? ఇంటికి వెళ్ళి, తినుము. యేసు నిన్ను బాగు చేయును. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును.

సర్వశక్తిగల దేవుని సన్నిధిలో నీవు ఉన్నావని నీవు నమ్ముచున్నావా? నేను ఆయన సేవకుడనని నమ్ముచున్నావా? నీకు నరముల బలహీనత అను బాధగలదు. నీవు క్రింద పడుకొని ఉన్నపుడు నీ గుండె కొట్టుకొనునట్లు చేయును. అది నిజము. అది ఇంకా ఎక్కువగుచున్నది. అది గుండె సమస్య కాదు; అది నరముల బలహీనతతో ఉన్న గుండె. నీ మార్గమున వెళ్ళుచూ ఆనందించుము; యేసును అంగీకరించి మరియు బాగుగా ఉండుము. యేసు నామములో. అది యధార్ధము. దేవుడు నిన్ను దీవించును.

విశ్వాసము కలిగియుండుము. ఒక నిమిషము అక్కడ దగ్గరగా ఒక చెవిటి ఆత్మ ఉన్నది. అది ఇక్కడే సరిగా ఇక్కడే, ఆ మనిషి మీద ఉన్నది. ప్రతి వ్యక్తి మీ తలలు వంచండి, మరియు నేను మాట్లాడుట మీరు విన్నంత వరకు మీ తల పైకెత్తవద్దు. ఎందుకనగా అతడు వినగలడు... అది ఒక చెవిటి ఆత్మ, మరియు మనము వానిని విడచిపోవునట్లుగా చేయవలెను. కనుక మీరు చెవిటివారిగా వెళ్ళకూడదనుకుంటే మీరు నా స్వరము వినునంతవరకు ఈ వైపు చూడవద్దు లేదా మీ తలను పైకి ఎత్తవద్దు.

36

యెహోవా, గొప్ప దేవుడా, ప్రభువా, ఒక క్రొత్తవానిగ, నేను ఇక్కడ ఉన్నాను. అయితే నీవే దేవుడవు నీవే సమస్త కార్యములు చేయగలవు. ఇప్పుడు, నేను వినయముతో నీ దగ్గరకు వచ్చుచున్నాను మరియు నీవు ఈ చెవిటి ఆత్మ ఈ మనిషిని విడచిపోవునట్లు చేయగలవని నేను ప్రార్ధించుచున్నాను. ఆ దయ్యము ఇది చేసెను, కనుక వాడు ఒక వాహనము ముందు అడుగు పెట్టి మరియు అతని సమయానికి ముందే చంపి ఉండును; కాని పొందుకొనుటకే నీవు ఇక్కడ ఉన్నావు. ఓ గొప్ప దేవా, నా ప్రార్థన ఆలకించుము, మరియు ఈ కీడు వాని విడచిపోవునట్లు చేయండి. మరియు అణుకువ గల నీ సేవకునిగా, నేను మీ దగ్గరకు వచ్చుచున్నాను. ఇప్పుడు, మరణము కలిగించు ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అతనిలో నుండి బయటకు రావలెనని నేను నిన్ను గద్దించుచున్నాను. (వారి తలలు వంచవలెనని వారికి చెప్పండి.) అయ్యా, ఇప్పుడు నా మాట వినగలుగుచున్నారా? మంచిది.

మీ తలలు పైకెత్తండి. ఇది వినండి (అయ్యా, నీవు స్వస్థత పొందావు.) మీ తలలు పైకెత్తండి. ఆ మనిషి స్వస్థపరచబడెను. (అయ్యా, ఎంత దిగువకు వెళ్ళినదో, వినండి.) దేవునికి స్తుతి చెల్లించుము. నీవు స్వస్థతపొందావు. ఆనందించుచూ, నీ మార్గమున వేళ్ళుము.

ఈ స్త్రీ యేనా? ప్రభువా, ఈ స్త్రీ మీదకు నీ ఆత్మ వచ్చి మరియు పూర్తిగా బాగు చేయును గాక. నేను యేసు నామములో దానిని అడుగుచున్నాను. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును. వెళ్ళుము, మరియు యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును గాక. [స్పష్టత లేని మాటలు].

ప్రభువుకు స్తోత్రము, పరలోకముందు ఉన్న ఆ దేవునికి, సర్వాధికారము ఆయనకు ఇయ్యబడినది.

37

ఒక క్షణము మాత్రమే. ఇక్కడ ఒక... ఈ స్త్రీ కూడా చెవిటిది. మీ తలలు వంచండి.

ప్రియమైన దేవా, ఈ స్త్రీ పై నేను ఆశీర్వాదము పలుకుచున్నాను. నీ కరుణ ఆమె పైకి రానివ్వండి. మీరు ఆమెను బాగు చేయగలరని నేను ప్రార్ధించుచున్నాను. ఇది నేను యేసు నామములో అడుగుచున్నాను. అది అనుగ్రహించండి. ఆమేన్.

ఆ స్త్రీ కళ్ళు సరిగా పనిచేయకుండా ఉన్నవి. బయటకు రా. నీవు చాలా బాగా చూచుచున్నావా? నీవు నా చేయి చూచుచున్నావా? నా వ్రేళ్ళు చూచుచున్నావా? నేను చేయనా నీవు నా వ్రేళ్ళు లెక్కపెట్టగలవా? నీవు నా చేయిని చూడగలుగుచున్నావా? ఇక్కడ ఈ వైపున ఉన్న నా చేయి చూచుచున్నావా? ఇప్పుడు, నీ చేతులు మీద ఉంచుము. నీ వ్రేలు నా ముక్కు మీద ఉంచుము. నీవు స్వస్థపడినావు. నీవు పునరుద్ధరించబడ్డావు.

నీ కనుగుడ్లు గట్టిపడుచున్నవి, మరియు అవి గుడ్డిగా కాబోవుచున్నవి. నా చేయిని చచ్చిన దానివలె చేయునట్లుగా నా చేయి తాడు కట్టబడినట్లుండెను. అది ఒక చెవిటి ఆత్మవలె. నీవు అర్ధము చేసికొనలేవు, ఎందుచేత ఆ నరములు చచ్చినవో వైద్యుడు అర్ధము చేసికొనలేడు. అతడు చేయు ఒకే కార్యము ఏమనగా అతడు చూచుట లేక స్పర్శించుటయే. అతడు ఆ నరము అక్కడున్నదని ఎరుగును, కాని అది ఎందుచేత చచ్చినదో అతడు ఎరుగడు.

అది ఒక ఆత్మ అని, ఒక చెవిటి ఆత్మ ఒక గుడ్డి ఆత్మ అని బైబిలు చెప్పెను, మరియు అది ప్రసరణను కత్తిరించును. ఆ తాడు విప్పినపుడు, అది శ్రేష్టమైనదిగా అగుటకు ప్రారంభించును, కారణం ఏమనగా ఆత్మ దాని నుండి వెళ్ళిపోయెను. ఇప్పుడు, శ్రేష్టమైనదిగా ఉండుట నీవు చూడగలవు. అది సరి అయినది. కాదా? నీ చేయి పైకెత్తుము. నీవు నేను చెప్పినది బాగా వినినయెడల, నీ చేయి పైకి ఎత్తుము. నీ మార్గమున వెళ్ళి, ఆనందించుచు, బాగుగా ఉండుము.

38

నీవు నమ్ముచున్నావా? నీవు స్వస్థపరచబడగోరుచున్నావా? నీకు గుండె సమస్య గలదు. యేసు నిన్ను బాగుచేయవలెనని నీవు కోరుచున్నావా? అలాగే వెళ్ళుము, మరియు యేసు నిన్ను బాగుచేయును. నీకు విశ్వాసం ఉన్నదా? నీవు నమ్ముచున్నావా?

ఆ సభికులలో బయట వారిని గూర్చి ఎట్లున్నది? అక్కడ బయట ఉన్న నీవు నమ్ముచున్నావా? ఈ వైపుగా చూడుము. ఈ మార్గము వైపు చూడుము. నమ్ముము. అలా నీవు అది చూడగలిగినట్లుగా, అది నాకు కనిపించుచున్నది. ఇక్కడే, సరిగా ఆ వెలుగు చుట్టూ తిరుగుట నీవు చూడగలుగుచున్నావా? పదహారు సంవత్సరాలు వయసుగల ఇక్కడ ఉన్న ఈ చిన్న బాలుని మీదుగా అది వ్రేలాడుచున్నది, సరిగా అది చివరలో స్థిరపడి ఉన్నది; అతనికి తల నొప్పులు ఉన్నవి. అక్కడే సరిగా ఉన్నవి. యవ్వనస్తుడా? అది నిజమని నమ్ముచున్నావా. అది నిజము. అవును. నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మినయెడల, నీ పాదములపై నిలబడుము. పైకిలెమ్ము. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. దేవుడు నిన్ను దీవించును. ఆమేన్.

39

ఈ వైపు చూడండి. నమ్ముము. నేను ఒక స్త్రీని చూచుచున్నాను; ఇశ్రాయేలీయుల పిల్లలను నడిపించిన అదే యెహోవా దేవుడు, ఆ వెలుగు సరిగా ఆమె మీదుగా వ్రేలాడుచున్నది. ఆమె కడుపులో ఒక కణితి చేత ఆమె బాధపడుచున్నది. ఆమె ఆసుపత్రులకు వెళ్ళియున్నది మరియు వారు ఆమెను తిరిగి పంపించారు. వారు ఆమెకు శస్త్రచికిత్స చేయలేకపోయారు, ఎందుకనగా ఆమెకు అధిక రక్తపోటు కలదు. అమ్మా, నీవు నమ్ముచున్నావా? మరియు నీవు దానిని నీ పూర్ణ హృదయముతో అంగీకరించగలవా? అప్పుడు దేవునికి స్తుతి చెల్లించి మరియు మహిమపరచుము. అమ్మా, అది అలాగే అయి ఉన్నది. నీ పాదములపై నిలబడుము. యేసుక్రీస్తు నిన్ను పూర్తిగా బాగుచేయును.

అది ఇక్కడే ఈ ప్రజలందరి మీదుగా ఉన్నది. నీవు నన్ను దేవుని ప్రవక్తగా నీవు నమ్ముచున్నావా? మీలో ప్రతీ ఒక్కరూ స్వస్థపడు సమయము ఇక్కడే ఉన్నది. దేవుని ప్రవక్తగా నీవు నన్ను నమ్ముచున్నావా? నేను సత్యమే చెప్పితినని నీవు నమ్ముచున్నావా? అలా దేవుడు ఇక్కడే ఉన్నాడని నీవు నమ్ముచున్నావా? అప్పుడు నేను నీకు ఏమి చెప్పానో దానిని చేయుము.

ఇక్కడ దేవుని ఆత్మ ఉండగా, మీరు మీ చేతులు ఒకని చేయి మీద మరొకరు పెట్టండి. మీ చేతులు ఒకరి మీద మరొకరు పెట్టండి. మీ చేతులు ఒకరి మీద మరొకరు పెట్టండి. మీరు గొప్ప కార్యములు చూడనైయున్న ఆ సమయము ఇదే అయి ఉన్నది, సిద్దముగా ఉండండి.

40

సర్వ శక్తిమంతుడవైన దేవా, యేసు నామములో ఆ దయ్యము బహిర్గతము చేయబడెను. యేసుక్రీస్తు జీవించుచూ మరియు పరిపాలించును, మరియు ఇక్కడ ఈ ప్రార్ధనా వరుసలో నీవు విజయము పొందియున్నావు. మరియు నీ సేవకునిగా, ప్రతీ దయ్యమును నేను గద్దించి మరియు నెదిరించుచున్నాను.

సందేహమను దయ్యమా, నీవు ఈ ప్రజలలో నుండి బయటకు రమ్ము. నేను యేసు నామములో నిన్ను గద్దిస్తున్నాను, వారిలో నుండి బయటకు రమ్ము.

మీలో ప్రతీ ఒక్కరు మీ పాదములపై లేవండి. ప్రతిచోట, పైకి లేచి నిలబడి ఉండండి. యేసుక్రీస్తు మిమ్మును బాగుచేయును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...