వంచన చేయు ఆత్మలు

వంచన చేయు ఆత్మలు

VGR COUNT -192 స్నేహితులారా, శుభోదయము. ఈ ఉదయవేళ ఇక్కడుండుట సంతోషముగా యున్నది, మరియు ఈ దినాన ప్రభువు మనతో ఉండి, మనకు కొంచెము నీడను ఇచ్చుచున్నాడని నమ్ముచున్నాము, చూచుచున్న మీరందరు అది ఎరుగుదురు, అది ఈ ఉదయవేళ కూడికకు మందిరములో అంత వేడిగా ఉండదు. మరియు ఇప్పుడు మనము...

నేను నమ్ముచున్నాను, అక్కడ పిల్లలున్నారని... బ్రదర్ నెవిల్, చిన్న పిల్లలు వారి తరగతి గదులకు వెళ్ళియున్నారా? నేను కొందరి చిన్న వారిని చూచుచున్నాను. వారి స్థలాలకు వారు తిరిగి తరగతులకు ఆదివారపు-బడి పాఠశాలకు పంపించబడ్డారని నేను ఆశ్చర్యపోవుచున్నాను.

2

ఇప్పుడు, నా కొరకై ప్రార్థించండి. బహుశా గత రాత్రి నేను చేయవలసిన గొప్ప తీర్మానము నాకొకటి ఉన్నది, మరియు దానిని నేను ఈ దినాన చేయవలసి యున్నది. సంఘమైన మీరు ప్రార్థించండి. తరువాత రాబోవుచున్న కూటము నాకు ఒకటి ఉన్నది. అది సరిగ్గా జర్మనీలోని ఐరన్ కర్టెన్ దారిలోనే దానికి కొద్దిగా అనుకొనియున్నది. మరియు నా కొరకు ప్రార్థించండి. కాబట్టి, అది, జర్మనీలో పెద్ద క్రీడా స్టేడియంలో మనము సరైన విధంగా ప్రారంభించగలము, దానిని హిట్లర్ యొక్క యుద్దమునకు కొంచెము ముందుగా తయారు చేసెను, మంచి స్థలమది, ఎనభై వేలు మంది కూర్చొనగలరు. దానిని నేరుగా, మనము కొనసాగించగలమని ఆశపడుచున్నాము, మరియు అటు తరువాత ఫ్రాన్స్ లోని అల్సేస్-లోరెయిన్ లోని, తరువాత; అంతట బెర్లిన్ లోని, తిరిగి వచ్చి... నా ఉద్దేశ్యము, దానికి బెర్లిన్ కు మధ్య మరియు ఫ్రాన్స్.

3

తరువాత, ప్రభుని చిత్తమైతే, చికాగోలోని కూటమునకు మనము తిరిగి వద్దాం. అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, మరియు తొమ్మిది తేదిలలో చికాగోలో నా భాగమైన స్వీడిష్ సంఘము వద్ద కూటము ప్రారంభమగునని నేను తలంచుచున్నాను. మరియు అంతట వారు, మిస్టర్. బోజ్, చికాగోలో నుండి వచ్చిన మీలో కొందరు, దీని తరువాత వచ్చుచున్న కూటమును... ఆగష్టు మొదటనో లేక సెప్టెంబర్ మొదటనో వారు కలిగియున్నారు, అది స్వీడన్ లో జరుగును.

వారంతా ఏకగ్రీవంగా వందశాతము నేను అక్కడకు రావలెనని, వారు నా కొరకు ఓటు వేసియున్నారని తెలిసి నేను చాలా సంతోషించాను. దానికై నేను అభినందించుచున్నాను, కాని నేను అటు కాని, ఇటు కాని వెళ్ళవలసియున్నది. ఎక్కడైయితే ఎక్కువ ఆత్మలు రక్షింపబడునో కచ్చితముగా అక్కడికి ప్రభువు నన్ను నడిపించునట్లు మీరు ప్రార్ధించండి. మరియు దేవుని యొక్క రాజ్యము నిమిత్తము శ్రేష్ఠమైన చిత్తము నెరవేరును గాక. ఇప్పుడు, వారు అక్కడ కూటమును కలిగియున్నారు, మరియు వారు స్వీడన్లో, ఆ కూటము నందు ప్రారంభము నుండి ఇరువై-ఐదు, ముప్పది-ఐదు వేల ప్రజలను మేము కలిగి యుందుము అని అతడన్నాడు. మరియు వారిలో చాలా మంది రక్షింపబడిన ప్రజలు ఉన్నారు.

అటు తరువాత ఇక్కడ జర్మనీలో, మంచిదే, ఎనబై వేల మంది కూర్చొనగల ఒక రంగ స్థలమును వారు కలిగియుండిరి. మనము స్విట్జర్ల్యాండ్లో ఎక్కడైయితే విడిచిపెట్టామో అక్కడ మేము అద్భుతమైన కూటము జరిపించాము, సర్వసాధారణముగా మీలో అనేకులు ఎన్నడూ వినియుండకపోవచ్చును. ప్రభువు మనల్ని బలంగా దీవించాడు, స్విట్జర్ల్యాండ్ లోని జూరిచ్, వద్ద యాబై వేలమంది ఐదు రాత్రులలోనే మారుమనస్సు పొందారు.

4

కాబట్టి, బ్రదర్ జాక్ షుల్లర్, పాత బాబ్ షుల్లర్ యొక్క అబ్బాయి, అతను మెథడిస్టువాడని, మీలో అనేకులకు ఇతను తెలియును. ఇప్పుడు వారు బెల్ఫాస్టులో ఉన్నారు, మరియు వారు సువార్త కొరకై, బిల్లిగ్రహం ఏదైతే తన కూటములో కలిగియున్నాడో దాని కంటే గొప్పదిగా చేయుటకు, ఆ స్థలాన్ని తలక్రిందులుగా చేయుచున్నారు. జాక్ చాలా మంచి యౌవన వ్యక్తి, నిండు ప్రేమ మరియు ఉత్సాహము కలిగిన వ్యక్తి. మరియు అతడు చాలా నిజాయితీపరుడు, ఇంకా అతడు ప్రభువు కొరకు గొప్ప సేవకుడని నేను నమ్ముచున్నాను. బ్రదర్ షుల్లర్ కొరకు ప్రార్థించుదము. మరియు అతడు జాక్ షుల్లర్, మరియు జాక్ మెక్ ఆర్థర్ కూడా అతనితో ఉన్నాడు. బ్రదర్ జాక్ మెక్ ఆర్థర్, అతను కూడా ఒక గొప్ప బోధకుడు. మరియు అక్కడి సంఘస్తులు, ఎన్నడూ ఐర్లాండ్ ను తాకనటువంటి ఒక గొప్ప ఉజ్జీవము ఇది అని అన్నారు. కాబట్టి మేము... ఆ మనుష్యుల కొరకు... ప్రతి రోజు వారి కొరకై ప్రార్థనకు వెళ్ళేవారము. వారు ఇద్దరూ యౌవ్వనస్తులు, నలబై సంవత్సరాలు కలిగిన వారు లేక కుటుంబములు కలిగిన వారుగా, లేక ఆ విధంగా ఉన్నారని నేననుకుంటున్నాను. మరియు మంచి స్థిరత్వము కలిగిన సువార్త బోధకులు, మనము వారిని ప్రేమించెదము

మరిప్పుడు, మీరు నన్ను మర్చిపోకూడదని నేను ప్రార్థిస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ప్రభువు నన్ను సరైన తీర్మానం చేయనిచ్చును గాక. ఏ దారిని మీరు వెళ్ళాలో తెలియని కాలములు అక్కడ యున్నవి. మీరు ఎన్నడైన ఆ స్థానాన్ని అనుభవించారా? ఒక సమయాన పౌలు ఆ స్థానాన్ని అనుభవించాడని నేను నమ్ముచున్నాను, అతడు కాడా? అది, రెండు ఇరుకు ద్వారములు: ఆ మార్గమున అతడు వెళ్ళునప్పుడు, ఎందుకు, అతను దర్శనంలో ఒక దూతను చూసెను. అది అతనికి, “మాసిదోనియాకు రా,” అని చెప్పెను. కాబట్టి ప్రభువు ఇంకా ఆయన తన దూతని కలిగియున్నాడు. అది ఆయన కాదా? పౌలు వలె నేను దాని గూర్చి నా హృదయములో దీనత్వం కలిగి ఉండగలిగినట్లయితే...

5

మరిప్పుడు, ఈ రాత్రి, ఈ మందిరములో సువార్త కూటముకై జ్ఞాపకముంచుకొని, ప్రతి యొక్కరు రండి. లూయిస్-విల్ ప్రాంతం వారైన మీరు ఈ రాత్రి, ఓపెన్ డోర్, సంఘము వద్ద, బ్రదర్ కొబైల్ వద్ద రెండు గంటలు, 7:30 నుండి 9:30 వరకు నేను మాట్లాడెదను. నేను రెండు సార్లు ఇక్కడకు రానైయున్నాను. తరువాత అతడు చాలా మంచి మనిషి, అతడు పిలిచాడు. బ్రదర్ కొబైల్ చాలా మంచి గౌరవనీయుడైన సహోదరుడు. అతడు మీకు పరిచయస్తుడని నిశ్చయంగా నేను నమ్ముచున్నాను. చాలా చక్కని సహోదరుడు, అతన్ని ఆ విధంగా తిరస్కరించలేము. ప్రార్ధించండి. అన్ని కార్యముల కంటే ముఖ్యముగా ప్రార్థించండి, మనము సరైన తీర్మానం చేయులాగున, ఆ దేవుడు మనకిచ్చునట్లుగా ప్రార్థన చేయండి.

ఇప్పుడు, సువార్త వర్తమానము మనము ప్రారంభించుటకు ముందు, మేము ఈ ఉదయమున, చిన్న పిల్లలను మేము ప్రతిష్ఠించబోవుచున్నాము. మరియు ప్రభువు కొరకు ప్రతిష్ఠించుటకై, ఇక్కడ నాకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఇప్పుడు, అనేకసార్లు అనేక సంఘాలలో... ఆ వెనుక, ఉన్న మీరు సరిగ్గా వినగలుగుచున్నారా? మీరు వినగలిగితే, సరేనా? ఇక్కడ గాలి ఫంకాలు ఉన్నాయి. నేను కొద్దిగా, మీరేమి వినలేకపోయారా. లేదు, అది సరే; అది లేకుండా నేను నశించిపోయేదనేమోనని నేను భయపడ్డాను.

6

కాబట్టి, ఆ చిన్న పిల్లలను, సంఘములలో, వారు చిన్న బిడ్డలుగా ఉండగానే, అనేకసార్లు వారు, వారిపై చిలకరిస్తారు. మరియు, బహుశా, అది కేథలిక్ సంఘము నుండి వచ్చినది, చిన్న వారిని క్రైస్తవులుగా చేయుటకై వారు చిన్న వారుగా ఉన్నపుడే వారు దానిని “బాప్తిస్మము,” అని పిలిచెదరు. శిశు బాప్తిస్మము, మెథడిస్టు సంఘము తీసుకొని వచ్చినది, మరియు అనేకులు, అనేకులు అలా అనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. శిశు బాప్తిస్మమును ఇచ్చుట, అలాంటివి చిన్న వారి పట్ల జరిగించుట, నజరీనులకు, మరియు పాత కాలపు మెథడిస్టు వారికి గల వ్యత్యాసమని నేను అనుకుంటున్నాను. కాని, అది ఏ విధంగా జరిగినప్పటికీ, అది అంత చెప్పుకోదగ్గ విషయమేమి కాదు. ఎందుకనగా, కల్వరి దాని నంతటిని సరిగ్గా తెచ్చినది, ఎందుకనగా యేసుక్రీస్తు చిన్న పిల్లలను రక్షించుటకు, మరియు లోకమును రక్షించుటకు అక్కడ చనిపోయెను.

7

మరియు ఒక చిన్న బిడ్డకు ఎటువంటి తలిదండ్రులు ఉన్నా, ఎంతటి పాపులైనప్పటికి, వారు ఎటువంటి వారైనప్పటికి, అది ఏ వ్యత్యాసమును ఇవ్వదు, ఏలయనగా యేసుక్రీస్తు యొక్క రక్తము అతన్ని శుద్దినిగా చేసెను, చూడండి, ఇది లోకపాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ఆ బిడ్డ మారుమనస్సు పొందలేదు. ఏలాగు మారుమనస్సు పొందాలో వారికి తెలియదు. తన సొంతగా ఇక్కడుండుటకు కారణము అతనికి తెలియదు. అతడు ఇక్కడెందుకు ఉంటున్నాడో అతడు చెప్పలేడు. కాని దేవుడు అతన్ని ఇక్కడకు పంపెను, మరియు అతను లోకమునకు వచ్చిన వెంటనే యేసుక్రీస్తు యొక్క రక్తము అతన్ని శుద్దినిగా చేసెను. అతనికి మంచి చెడ్డలు, తెలుసుకొను వయస్సు వచ్చునంత వరకు పాపమారోపించబడదు. మరియు అంతట అతడు అది మంచి, ఇది చెడు అని ఎరిగినప్పుడు, అతడు చేయు తప్పిదముల కొరకై పశ్చత్తాపపడవలసియున్నది. సరియే. కాబట్టి, వారిలో కొందరు వారిపై చిలకరించెదరు, మరియు లేకుంటే వారు పరలోక రాజ్యము చేరరు అని తలంచెదరు.

8

మంచిది, ఒక పరిశుద్ధాత్మ కలిగిన తలిదండ్రులకు బిడ్డ గనుక పుట్టినట్లయితే, ఆ బిడ్డ పరలోకానికి వెళ్ళును; కాని అలాగున కాకపోతే, అక్కడకు వెళ్ళడు అని ఈ విధముగా బోధచేయబడుచున్నదని వారు చెప్పుచున్నారు. అది కచ్చితముగా తప్పు. పరిశుద్ధాత్మ కలిగిన తల్లిదండ్రులైతే వారి మధ్య వ్యత్యాసమేమిటి? అది అంతా లైంగిక కోరికే, బిడ్డ కూడా ఆ విధముగానే పుట్టును. కాబట్టి, అది అంతా “పాపములో పుట్టి, అతిక్రమములతో రూపుదిద్దుకొని, అబద్దములాడుచు లోకమునకు వచ్చెను.” అది దాని యొక్క లేఖన నిబంధనలు.

కాబట్టి, యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ బిడ్డ కొరకు పరిహారించబడి శుద్ధిచేయబడినప్పుడు, అతడు చనిపోతే, కచ్చితముగా అతను దేవుని సన్నిధికి వెళ్ళును. లోకములో అతి భయంకరముగా పాపము చేయు తలిదండ్రులకు అతడు పుట్టినట్లయితే, అతడు మంచి చెడులు ఎరుగునంత వరకు అది అరోపించబడదు. మరియు అది ఏమి చేయును, ఆ తరువాత, అందుకొరకై అది క్షమించబడవలసి ఉన్నది. అప్పటి నుండి అతడు తన స్వచిత్తము చేత పశ్చత్తాపపడి అడుగవలసియున్నది. కాని అతడు పిల్లవాడుగా ఉండగా...

9

ఇప్పుడు, మనము ఆ మార్గమునే అనుసరించుటకు ప్రయత్నించవలసియున్నది. ప్రపంచములో నేను వెళ్ళు ఇక్కడున్న ఈ ఒక్క మందిరములోనే, ఇక్కడున్న ఈ మందిరములోనే సిద్ధాంతమును నేను బోధించాను, ఎందుకనగా ఇది మన సంఘమైయున్నది. మరియు జనులను వరుసక్రమములో పెట్టుటకై మేము ఈ సిద్ధాంతమును బోధించాము. ఇతర మసుష్యులు, వారి సంఘములలో, వారు దేనిని నమ్ముదురో దానినే బోధించుదురు. వారు నా సహోదరులు, మేము కొంచెము వ్యత్యాసముగా బోధించినను, అయినను మేము సహోదరులమే. మరియు, కాని, ఇక్కడ మందిరములో లేఖన సిద్ధాంతమేదో, అది మనము బోధించుకొనెదము.

మరియు అందులో, మనము పిల్లల యొక్క ప్రతిష్ఠను చూచెదము. ప్రతిష్ఠ అని మనము పిలుచునది. బైబిల్లో ఒక్కసారి మాత్రము దాని మనము కనుగొనగలము, లేక క్రొత్త నిబంధనలో ఎక్కడ చిన్న వారిని ఏదైన చేసినట్టుగానే, లేక క్రీస్తు తన కూటములో దాన్ని చేసెను, ఆయన వారిని తన చేతులతో ఎత్తి కౌగిలించుకొని, వారిపై తన చేతులుంచి వారిని ఆశీర్వదించెను, “చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి. వారి నాటంకపరచవద్దు, ఈలాటి వారిదే దేవుని రాజ్యము,” అని చెప్పెను.

10

ఇప్పుడు, ఆయన వచ్చి ఆ పనిని పూర్తిచేయుటకై దానిని మనకు విడిచిపెట్టెనని మనము గ్రహించాము. కల్వరి యొద్ద ఆయన మరణమును పొంది, ఆయన మనతో ఉండి మరియు ఆయన వెళ్ళిపోయేను... దేవుని యొద్ద నుండి లోకమునకు వచ్చి, మరలా దేవుని యొద్దకు వెళ్ళిపోయెను, లేక లోకము నుండి దేవుని యొద్దకు. మరియు మరలా పరిశుద్ధాత్మగా వచ్చి మనతో, ఉండి, ఆయన భూమిపై యున్నప్పుడు ఆయన ఏమి చేసెనో అదే కార్యములను ఆయన సంఘములో చేయుటకు పరిశుద్ధాత్మ రూపములో మనతోను, మనలోను, లోకము అంతము వరకు ఉండెను. అందుకని, మనము మన పిల్లలను ఒకరి వెంట ఒకరిని, వారిని ప్రార్థించుటకై, వారిపై చేతులుంచి వారిని దేవునికి ప్రతిష్ఠించుటకై మనము బోధకుల యొద్దకు తీసుకొని వచ్చుచున్నాము. ఒక చిన్న ప్రసంగము చేసి, మన ప్రభువు మనకును, మరియు పిల్లలకును చేసిన దానికై మనము అభినందించుదుము.

11

ఇప్పుడు, మీ చిన్న బిడ్డలు చిలకరించబడినట్లయితే, లేక ఏ విధముగానైనను మీ సంఘము యొద్ద జరిగించినట్లయిన, దానికి మేము ఒక్క కార్యమునూ వ్యతిరేఖముగా చెప్పుటలేదు; అది పరవాలేదు. కాని, లేఖన ప్రకారముగా, మనము ఒక స్థలమును కనుగొనగలము; అక్కడే యేసు, తనకు తానుగా వారిని దీవించెను. ప్రభువు చిత్తమైతే, అదే నేను చదువబోవుచున్నాను. అందులో - ఇక్కడ వాక్యములో పరిశుద్ద లూకాలో మనము కనుగొన్నాము... అది 10వ అధ్యాయమని నేను నమ్ముచున్నాను. ఆరంభము నుండి 13వ వచనము యొక్క ఆరంభము నుండి.

తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరాయన యొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి.

యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారినాటంక పరచవద్దు: దేవుని రాజ్యము ఈలాటి వారిదే.

చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము నంగీకరించనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి.

ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.

అది రమ్యమైనది కాదా? ఇప్పుడు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి. వారినాటంక పరచవద్దు, ఈలాటి వారిదే (ఈలాటి చిన్న బిడ్డలదే) దేవుని రాజ్యము,“ అని ఆయన చెప్పెను. మరియు ఆయన వారిని ఎత్తి కౌగిలించుకొని వారిని ఆశీర్వదించెను.

12

ఇప్పుడు, ఈ ఉదయవేళ, మనము ఏ విధంగా ప్రేమించాలి, ఈ వేదికపైన మనలో ఒకడిగా యేసు కూర్చొన్నట్లయితే, “ప్రభువా, నా బిడ్డను ఆశీర్వదించుము,” అని చెప్పమా? ఓ, ఎటువంటి... మన మానవ నేత్రాలు, మరియు మన హృదయాలు అది చూచుటకు ఎంతో ఆశపడును. అయితే, ఎలాగైననూ, ఆయన ఇక్కడున్నాడు, అది చేయుటకై ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. మనము అది చేశాము. ఆయన గుర్తించునట్లుగా, ఆయన పంపిన ఒకరిని మనము చేర్చుకున్నాము, అతడిని పంపిన వానిని చేర్చుకొనుము, మీరు గ్రహించారా. కాబట్టి, ఆయన ఈ ఉదయవేళ ఇక్కడే ఉన్నాడు. మరియు సహోదరి గెట్టి పియానో వద్దకు వచ్చి, చాలా కాలం క్రితం మనము పాడుకున్నటువంటి ఆ పాత పాటను, “చిన్న బిడ్డలను యేసు నొద్దకు తీసుకురండి,” అని ఆలాపించినట్లయితే, అక్కడ ఎక్కడో ఒక చోట అది పుస్తకంలో ఉన్నదని నేను నమ్ముచున్నాను. నేను నిశ్చయమని చెప్పుటలేదు. “చిన్న బిడ్డలను యేసు నొద్దకు తీసుకు రండి.” ప్రతిష్ఠించబడని ఒక చిన్న బిడ్డ, మీకొక చిన్న బిడ్డ ఉండి, మీరు ఈ ఉదయమున చిన్న బిడ్డ ప్రతిష్ఠించబడాలని అనుకున్నట్లయితే, మేము దాన్ని ఆనందముతో చేయుదము,

13

ఈ భవనంలో ఎవరైన దైవసేవకులు ఉన్నట్లయితే, మేము ఈ చిన్న బిడ్డను ప్రతిష్ఠ చేయుచుండగా బోధకులైన మీరు వచ్చి మాతో నిలువబడవలెనని అనుకున్నవారు ఎవరైన ఉన్నారా? మీరు వచ్చుటకు మేమెంతో ఆనందిస్తున్నాము. సరే, అక్కడ పుస్తకములో అది ఉన్నదా? బ్రదర్ నెవిల్ మీరు దానిని కనుగొన్నారా? అది అక్కడ లేదా. సరే. అది ఎంత మందికి తెలియును? వారిని తీసుకురండి. సరే. ఇప్పుడు అది పాడుకుందాం. తల్లి వారి పిల్లలను తీసుకువస్తుండగా మనమందరము కలిసి పాడుకుందాం. సరే.

వారిని లోనికి తీసుకురండి, వారిని లోనికి తీసుకురండి,

పాపమనే పొలములో నుండి, వారిని లోనికి తీసుకురండి;

వారిని లోనికి తీసుకురండి, వారిని లోనికి తీసుకురండి,

చిన్నవారిని యేసు నొద్దకు తీసుకురండి.

వారిని లోనికి తీసుకురండి, వారిని లోనికి తీసుకురండి,

పాపమనే పొలములో నుండి వారిని లోనికి తీసుకురండి;

వారిని లోనికి తీసుకురండి, వారిని లోనికి తీసుకురండి,

చిన్న వారిని యేసు నొద్దకు తీసుకురండి.

14

ఒక్క క్షణం మనము మన తలలు పంచుకుందామా, మా పరలోకపు తండ్రీ, ఈ ఉదయ కాలమున బలిపీఠము చుట్టూ నిలబడియున్న ఆ తలిదండ్రులైన వారు చేతుల్లో వారి చిన్న బిడ్డలను పట్టుకొని నిలబడియున్నారు, అది మీరు గొప్ప కనికరము చేత వారికి ఇచ్చియున్నారు. ప్రభువా, వారి కొరకై వారు చాలా కృతజ్ఞత కలిగియున్నారు. మరియు ఈ ఉదయవేళ, దేవుని యొక్క ఇంటిలో, వారి జీవితములను నీకు ఇచ్చుట కొరకు వారిని ప్రతిష్ఠ చేయుట కొరకై ఈ వేదిక యొద్దకు వారిని తీసుకువచ్చుచున్నారు. మీరే అనుగ్రహించియున్నారు. దేవా, నీవే వారిలో ప్రతి ఒకొక్కరిని పోషించి, ఆశీర్వదించమని, మేము ప్రార్థిస్తున్నాము. వారిని నడిపించి, మరియు దేవుని యొక్క సంరక్షించు దూతలు ప్రతీ ఒక్కరిని కావలికాయును గాక, వారి ఆయుష్కాలమంతా సంతోషమును, ఆనందమును దయచేయండి. రేపు అనునది ఉన్నట్లయితే రేపటి దినమునకు వారు దేవుని యొక్క స్త్రీ, పురుషులుగా ఎదుగుదురు.

15

దేవా, ఈ ఉదయవేళ వేదిక చుట్టూ ఉన్న చిన్న బిడ్డల గుంపులో నుండి బోధకులుగాను, ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను, వాని లేవనెత్తుమని మేము ప్రార్థిస్తున్నాము. మేము ముసలివారమై యిక ముందుకు కదలలేనప్పుడు, ఇక్కడ ఆ దినాన ఉన్నవారి వలన సువార్తను వినటానికి, మమ్ములను ఒక స్థలము నుండి ఒక స్థలమునకు నడిపించవలసి ఉంటున్నది. ప్రభువా, అనుగ్రహించండి. ఒక మహిమకరమగు దినమున మా బ్రతుకులు ముగించబడి ఇది అంతయు పూర్తి అయినప్పుడు, ఈ వేదిక చుట్టూ ఉన్న తలిదండ్రులు, ఆ పాత యాకోబు వలె అతడు తన బిడ్డలను దీవించి అంత్యదినమున వారి అంతము ఎట్లుండునో వారికి చెప్పినట్లుగా మేము చెప్పుదుము గాక. అంతట పైకి చూచుచూ, “మీకు తెలుసా, నేను నా జనులతో కూడుకొనెదను,” అని చెప్పెను. ఒక మహిమకరమగు దినమున, అతడు మరియు అతని బిడ్డలందరును ఒక గొప్ప స్థలములో కలుసుకొని కూడుకొనెదమని చెప్పెను. “అతని వలె చివరి దినములో నా జీవితము ఉండును గాక,” అని బిలాము చెప్పుటలో అతిశయోక్తి లేదు. దేవా, ఈ తల్లిదండ్రుల మీద ఈ ఆశీర్వాదములను కుమ్మరించమని నేను ప్రార్థిస్తున్నాను.

మరియు ఇప్పుడు, మేము వారి మీద చేతులుంచినప్పుడు, ఎంతటి అద్భుతమైనది. ఈ భూమి మీద మనుష్యులమైన మేము మీ నామములో ఈ చిన్నవారిని దీవించుటకు ఇచ్చిన భాగ్యమును బట్టి, మేము ఏది అడిగినను, మాకు అనుగ్రహించబడునని ఎరిగితిమి, దీనిని మీరు ఎంత దీనముగా చేసియున్నారు, ప్రభువా. మేము వారిని దీవించుచుండగా, యేసు, అదృశ్యడవుగాను, సర్వశక్తిమంతుడుగాను దగ్గరగా నిలబడి మేము వారిపై చేతులుంచి ఆయనకు వారిని సమర్పణ చేయుచుండగా, ప్రతి చిన్నవారిని దీవించండి. ఆయన నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

16

[టేపులో ఖాళీవున్నది. బ్రదర్ బ్రెన్హాం బిడ్డలను ప్రతిష్ఠించుచున్నారు.] ఉత్తరదేశమున అదుగో దూరమున పాత గది మీకు ఒకటి ఉన్నది. నీవు ఈ బిడ్డను నాకు వాగ్దానము చేశావు. తండ్రి, మీ ఆశీర్వదము ఇతనిపైకి వచ్చును గాక. జోసఫ్, నా కుమారుడా, దేవునికి నిన్ను నేను సమర్పించుచున్నాను. మరియు నీ జీవితం ఆశీర్వదింపబడును గాక. జోసఫ్, నీవు ప్రవక్తవు అగుదువు గాక. దేవుని కృప నీపై ఉండును గాక, తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, నీ జీవితము ఇతరులకు దీవెనగా ఉండునట్లు నిన్ను ఎన్నడూ దీవించును గాక. యేసుక్రీస్తు నామములో, నేను అతన్ని ఆశీర్వదించుచున్నాను. ఆమెన్. [టేపులో ఖాళీవున్నది.]

చిన్నవారిని ప్రేమించెదరా? చిన్న వారికి ఏదో జరగాలని ప్రతీ తల్లి ఆమె బిడ్డ దీవించబడాలని కోరుకుంటున్నది. ఇప్పుడు, ఆ విధముగానే పెద్దలైన మనయెడల పరలోకపు తండ్రి ఈ ఉదయము చేయును గాక. మన ప్రతి యొక్కరిని ఆయన ఆశీర్వదించాలని కోరుచున్నాడు. ఆయన మన ముందు ప్రత్యేకమైన కార్యమును ఉంచునట్లు, కొద్దిగా మన చేతులు చాచి ఇలా చెప్పెదము, “ఇక్కడ, నీవు నా బిడ్డను ఆశీర్వదించాలని నేను కోరుకొంటున్నాను.” ఆయన ఆశ్చర్యకరుడు కాడా? కాబట్టి అలాంటి మన దయగల పరలోకపు తండ్రిని అభినందించగలము.

17

ఇప్పుడు, చిన్న బిడ్డల ఆశీర్వాదము గూర్చి మీకు తెలియును, నిన్న నేను లేఖనములో ఇక్కడ నేను చదువుచుంటిని, అది ఇక్కడో ఎక్కడో ఉన్నది, అది పాత నిబంధనలో యున్నది, అది ఒక గొప్ప విషయము. నేను దాన్ని త్రిప్పి చదువుటను తప్పక అభినందిస్తున్నాను. అది ఇక్కడే, సరిగ్గా ఇక్కడే యున్నది. “దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయంతటితో దానినంతయు చేయుమని దావీదుతో నతానియేలు అనెను.” నీ హృదయములో ఏమున్నదో, అది చేయు. అనేక సార్లు నేను దీనిని గమనిస్తుంటాను, క్రైస్తవ స్నేహితుడా, నేనేది చెప్పాలో అది తెలియకుండానే నేను మాట్లాడుదును మరియు అదే నేరువేరుట నేను చూస్తాను. నీ వేమి చెప్పెదవు!

18

ఒకసారి ఈ విధంగా చెప్పబడినది, యేసు కొండపై నుండి వచ్చుచున్నప్పుడు, ఆకులు మాత్రమే ఉండి, ఫలములేమి లేకుండిన ఒక చెట్టును చూసెను, మరియు ఆయన చెప్పెను, “ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక.”

ఆ మరుసటి రోజున ఆ దారి గుండా వెళ్ళుచు, ఆకులు ఎండియుండుట అపోస్తులు చూసెను. “ఎంత త్వరగా ఆ చెట్టు ఎండిపోయినదో చూడు,” అని అతడన్నాడు.

“దేవుని యందు విశ్వాసముంచుడి: మీరు ప్రార్థించినప్పుడు, మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని చెప్పుచున్నాను,” అని యేసు చెప్పెను. దానిని గురించి ఆలోచించండి! ఓ, మరియు బహుశా ఈ రోజు, ఆ గొప్ప దేవుని యొక్క పరిశుద్ధాత్మ, బలిపీఠము వద్దనే ఇక్కడే నిలబడియున్నాడు, మీరు చెప్పండి, “మంచిది, అది అలంకరించబడనవసరం లేదు. అది ఏ పెద్ద విశాలమైన స్థలము కానవసరము లేదు.”

19

యాకోబు ఒకసారి ఒక రాయి తీసుకొని, తన తలగడగా పెట్టుకున్నాడు, మరియు అది నేటికిని తలరాయిగా లేక మూల రాయిగా గుర్తించబడెను. అందుకు లోకములో ఘనులైనవారు ఇంకా ఆ రాయి చుట్టూ చేరుకుంటున్నారు, ఈ రాయి శిఖరమున రాజులు ప్రారంభోత్సవము అగుట కొరకై కేవలం మూలరాయి అక్కడ పడియున్నది. బేతేలు ఒకదాని మీద ఒకటి పెట్టబడిన కుప్పగా అయి, అది దేవుని ఇల్లుగా అయిపోయినది, నీవాసస్థలముగా అయినది. “ఇది దేవుని యొక్క ఇల్లు గాక మరొకటి కాదు,” అని యాకోబు చెప్పెను. అది ఒకదాని మీద ఒకటిగా పడియున్న రాళ్ళ కుప్ప.

అది విస్తరించబడిన గొప్ప కార్యములు తీసుకొనుట లేదు. అది సామాన్యత మరియు నమ్మెడి విశ్వాసమును అది తీసుకొనుచున్నది, దానినే అది తీసుకొనుచున్నది, దానిని అదే చేయుచున్నది.

20

ఇప్పుడు, కాలము త్వరితముగా గతించిపోవుచున్నదని ఎరిగి, సంఘము గుంపుగా ఉన్నప్పుడు, వేడి ఉండునని ఎరిగినవారమై, మేము ఎక్కువ సమయము మిమ్మును ఉంచగోరుటలేదు. కాబట్టి ఒక చిన్న పాఠ్యాంశము గురించి ఈ ఉదయమున నేను మీతో కొద్ది క్షణములు మాట్లాడుదును... అది మీకు సహాయపడునని నేను నమ్ముచున్నాను.

మరియు ఇప్పుడు, నేను, గృహము విడిచిపెట్టక ముందు, మూడు లేక నాలుగు అంశములను నేను ఇక్కడ వ్రాసాను. “నేను అక్కడికి చేరుకున్నాక, ప్రభువు నాతో ఏమి మాట్లాడునోనని నేను ఎదురుచూచుచున్నాను,” అని నేనన్నాను. చిన్న అంశములైన ఆరు విషయములను ఇక్కడ వ్రాసియున్నాను. నేను ఒకటి ఇలా వ్రాసి, ఈ విధంగా నా జేబులో ఉంచాను. “మంచిది, నేను బలిపీఠము నొద్దకు చేరుకున్నప్పుడు, ఏదో మాట్లాడుటకై బహుశా ఏదో ఆయన నాకు చెప్పును,” అని నేననుకున్నాను. ఇప్పుడు నేను ఎంత దూరముగా నున్నానో అంత దూరముగా ఉన్నాను. కాబట్టి ఏ విధముగానైన, నేను ఇక్కడ లేఖన భాగమును చదివెదను; ప్రభువు అది అర్థమగులాగున సహాయము చేయుదువు గాక. పరిశుద్ద లూకా 14వ అధ్యాయము 31వ వచనము. ప్రారంభము నుండి... పరిశుద్ద లూకా 14వ అధ్యాయము 31వ వచనము నుండి ప్రారంభించుకొనెదము.

మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునపుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?

శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.

ఆ ప్రకారమే, మీలో తనకు....

ఇప్పుడు, మీరు జాగ్రత్తగా గమనించాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు, మొదటిగా ఆయన ఇలా చెప్పెను... అది ఒక ఉపమానము. “ఇప్పుడు, ఒక రాజు వచ్చుచున్నాడు మరియు అతనికి ఇరవైవేల మంది సైనికులు ఉన్నారు; మరియు ఈ రాజు పది వేల మంది సైనికులతో అతనితో యుద్దము చేయబోవుచున్నాడు. కాబట్టి అతడు మొదటిగా కూర్చొని, అతడు అది చేయగలడో లేదో అని, సిద్దముగా ఉన్నాడా లేదా అని అడుగును కదా,” అని ఆయన చెప్పెను. అది సరే.

... తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.

చూశారా? ఇప్పుడు, ప్రభువు ఈ వాక్యమునకు తన ఆశీర్వాదమును జతచేయును గాక. ఇప్పుడు ఒక క్షణం మనం మన తలలు వంచెదము.

21

మా పరలోకపు తండ్రి, సమస్తమును ఎరిగినవాడవు నీవే, మరియు మనుష్యుల వ్యక్తిత్వాన్ని నీవు లెక్కచేయవు, ఎందుకనగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవే మనిషిని చేసితివి, అతడు కేవలం పొలములో గడ్డిపువ్వు వంటివాడు; అతడు నేడు అందముగా వుండి, రేపు అతడు నరకబడి, ఎండిపోయి కాల్చబడుటకై పోయిలోకి పోవును.

నేడు మాపై కనికరమును చూపమని మరియు మాలో ప్రతీ ఒక్కరిని లెక్కకు తీసుకొనుమని నేను మీకు ప్రార్థిస్తున్నాను. దేవా, సరిదిద్దుకొను గృహములో ఉన్నట్లుగా ఇక్కడ మేము ఉన్నాము. మేము నేడు ఏ విధముగా జీవించాలో నేర్చుకొనడానికి ఇక్కడ ఉండగా, ఓ నిత్యుడగు దేవా, ఈ దినమున మీ వాక్యముతో అది వచ్చును గాక, చాలా సంవత్సరములుగా నీ బిడ్డలుగా యున్నారు, నీ పిల్లలైన అనేక మంది ఇక్కడ కూడియున్నారు. అయితే, నేర్చుకొనుటకు, తెలుసుకొనుటకు, మేమందరము దేవుని యొక్క గృహములోనికి తిరిగి వచ్చియున్నాము. మరియు నేను మీ సేవకుడుగా నిన్ను గూర్చి అధికముగా తెలుసుకోవలెనని ఆశ కలిగివున్నాను.

మరియు సువార్త యొక్క ఆత్మ ప్రేరేపణను మా అందరి మీదకు తీసుకురమ్మని, నీ సేవకుని మీదకు తెమ్మని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క సన్నిధితో ఈ భవనమును విడిచి పోవుచున్నప్పుడు, శ్రేష్ఠమైన సేవకులము కావాలని మా హృదయాలలో ఈ ఆశ కలిగి ఉంటాము, మేము ఇక్కడ ఉండుట, ఇది మాకు ఉపయోగపడుచున్నది. ఓ కనికరముగల దేవా, నీ కుమారుడైన యేసు నామమున, ఆశీర్వాదములు మాకు దయచేయండి. ఆమెన్.

22

ఇప్పుడు, మనము చదివిన వాక్యమునకు ప్రభువు తన ఆశీర్వాదములు జోడు చేయును గాక. ఈ ఉదయమున: “వంచన చేయు ఆత్మలు, లేక, దేవుని వాక్యము,” అను అంశమును తీసుకోవలెనని కోరుచున్నాను. ఇప్పుడు, ఇది కొంచెము వింతైన అంశము, కాని అది మందిరములో ఉంటుంది. కనుక... మరియు గత బుధవారము రాత్రి... గత ఆదివారము ఉదయవేళ సువార్త సునాధమును గూర్చి నేను మాట్లాడుచుంటిని.

మరియు గత బుధవారము రాత్రి, ఆ స్త్రీ తన నుదిట చుట్టూ కలిగియున్న పలకను (బిళ్ళ) గూర్చి నేను బోధించుచుంటిని, లేక ఆమె ప్రశస్తమైన నాణెములో ఒకటి పోగొట్టుకున్నది. భర్త రాకముందే ఆమె తన ఇంటిని బాగుగా ఊడ్చి దానిని కనుగొనుటకు ప్రయత్నించుచున్నది, ఆ స్త్రీ తూర్పు దిక్కునకు సంబంధించిన స్త్రీ అయి ఉన్నది, వచ్చి కనుగొనెను, మరియు ఆమె... సంఘమునకు పోలికగా ఉన్నది.

మరియు ఒక వివాహపు గుర్తును వారు చేతి వేళ్ళకి పెట్టుకొనే వారు కాదు. అది తొమ్మిది వెండి నాణెములు కలిగిన దానిని నుదిట చుట్టూ ధరించేవారు. మరియు ఒక స్త్రీ వేశ్యగా అయినప్పుడు, ఒక వెండి నాణెమును తీసివేసి, ఆమె ఒక వేశ్య అని చూపించెదరు. మరియు ఈ స్త్రీ వేశ్య కాదు, ఒక నాణెమును ఆమె పోగొట్టుకున్నది. అయితే ఆమె భర్త దూరప్రయాణమున ఉన్నాడు, ఆ నాణెము ఆమె త్వరగా కనుగొని తన నుదిటిపై ఉన్న పలకకు తగిలించుటకు ప్రయత్నించుచున్నది, ఎందుకనగా ఆమె భర్త వచ్చినప్పుడు, ఆమె వేశ్యగా పట్టుబడినదని తెలుసుకొనును. మరియు దానిని బట్టి వారి మధ్య విభేదములు తలెత్తును. కాబట్టి ఆమె త్వరపడుచున్నది.

నేను అనేక గొప్ప విషయాలను, పోగొట్టుకొనుటను గూర్చి, దీనిని కొద్ది నిమిషాలు సంఘానికి అన్వయించుచున్నాను. మరియు ఇది తండ్రి వచ్చే సమయమైయున్నది. కాబట్టి ఇది మనము వేటాడవలసిన సమయము.

23

ఇప్పుడు సంఘము ఎరుగుచుండెను మరియు మన మందిరము...

మరియు నేను వంచన చేయు ఆత్మల పై బోధించాలని కోరుచున్నాను, అది నిజానికి దయ్యపు శాస్త్రము అని పిలువబడినది. ఈ దినాలలో మీరు దయ్యములు గూర్చి చాలా వినియున్నారు, కాని వాటి నుండి ఎలా తప్పించుకొనవలెనో కొద్దిగానే వినియుంటారు. మనమందరము దయ్యాలు ఉంటాయని మనమందరము బాగుగా ఎరుగుదుము, కాని తరువాత వాటి నుండి ఎలా తప్పించుకోవాలన్నదే విషయము. మరియు ఇప్పుడు, దేవుని యొక్క కృప చేత ఈ దయ్యములు అను పిలువబడే వాటిని గూర్చి సంధించుటకు మంచి అవకాశము; మరియు వాటిని వేదిక యొద్ద కలుసుకొని మరియు ప్రతి దినము, మరియు ఈ ఉదయ కాలమున, నేను లేఖనములోనికి తొంగిచూచి, ఇవి ఏమైయున్నవి అని కనుగొనాలని కోరుచున్నాను.

24

ఇప్పుడు, స్వస్థత కూడికలో దానిని ఎల్లప్పుడు మనము స్వస్థత పక్షాన వినియోగించాము. క్యాన్సర్, కణితి, నేత్రవ్యాధి, క్షయవ్యాధి, ఇవి అన్నియూ కూడా ప్రకృతి సంబంధమైనవి కావు; అవి అతీతమైన దయ్యాలు. లేఖనములు దానిని వివరముగా తెలుపుచున్నవి. అయితే అవి శరీరములో ఉన్న దయ్యములు, ఎదుగుదల కలిగిన క్యాన్సర్ వలె ఉన్నది; దానిలో జీవమున్నది; మరియు ఆ జీవము దయ్యమయి ఉన్నది. కంటి శుక్లాల ఎదుగుదల, క్షయ వ్యాధి యొక్క వ్యాప్తి మరియు ఇతర వ్యాధులు, అవి దయ్యములు. అది భౌతిక రూపములో యున్నది.

ఇప్పుడు, ఈ ఉదయమున మనము మాట్లాడుకోబోవుచున్నది - దయ్యములు ప్రాణములో, ఆత్మీయ రూపములో ఉంటాయని, అవి శరీరములో ఎలాగుండునో, అలాగే ప్రాణములో కూడా ఉండును, జనుల శరీరములో అవి ఒక క్యాన్సర్ గానో మరియు మరొక వ్యాధిగానో, మానవ శరీరములను పట్టుకొనుటను మనము చూస్తాము.

ఈ మధ్యనే, క్యాన్సర్ ఒక నాలుగవ-పరిమాణపు వ్యాధిగా పరిగణించబడెను, అది వేరొక పరిమాణమైయున్నది. నిశ్చయముగా, అది దయ్యపు శాస్త్రమై యున్నది. ప్రతి వ్యాధి, అది ప్రారంభము నుండి నాలుగవ-పరిమాణపు వ్యాధిగా ఉన్నది.

25

ఇప్పుడు, కాని ఇప్పుడు, శరీరములో క్యాన్సర్ గా లేక ప్రాణములో క్యాన్సర్ గా, ఈ రెండింటిలోనికి దయ్యము రాగలదు. ఇప్పుడు, అనేక జనులు, అనేక సమయాల్లో మంచి తలంపుతోనే ఉంటారు మరియు మంచి జనులు, వారు అనేక సమయాల్లో వారు కలిగియున్న వేదాంతంపైన ఆధారపడెదరు, లేక చిన్నతనము నుండే వారు ఏదో నేర్పించబడిరి, మరియు వారి ప్రాణములోను, వారి శరీరములోను కనుగొనెదరు, వారు ఇంకనూ సరికాని దానిని దేనినో వారు కలిగియున్నారు.

ఈ ఉదయమున ఇక్కడున్న మీలో అనేకులు, ఎక్కడైతే, క్రైస్తవులుగా కూడుకుంటారో ఆ జనులలో ఆ ఆత్మలు ఉండుటను మీరు చూచుటకు సందేహించవద్దు; అవి కోరదగినవి కావు. వారికి అవి అవసరము లేదు. వారు ఇలా చెప్పెదరు, “ఓ, అబద్దములాడుట నేను విడిచిపెట్టగలిగితే! కామమును నేను విడిచి పెట్టగలిగితే! నేను ఇది లేక అది విడిచి పెట్టగలిగితే!” ఇప్పుడు, అవి దయ్యములు. మరియు, ఇప్పుడు, అనేకసార్లు భక్తి వలె అవి వచ్చును. (ఆదివారపు-బడి పాఠము కాబట్టి మనము దీని వైపు చూద్దాము.) ఇప్పుడు, అనేకసార్లు అవి భక్తి రూపములో వచ్చును.

26

ఇప్పుడు, ఒకసారి, లేఖనములో, యెహోషాపాతు అను పేరు గల ఒక మనిషి అక్కడుండెను, ఒక గొప్ప మనిషి ఒక గొప్ప భక్తీపరుడైన మనిషి మరియు అతను మరొక రాజైన ఇశ్రాయేలు యొక్క రాజు దగ్గరకు వెళ్ళెను. మరియు యోహోషాపాతు యూదా రాజై యుండి. ఇశ్రాయేలు యొక్క రాజైన ఆహాబు నొద్దకు అతడు వెళ్ళెను, వారందరు కలిసి ఒకరికి ఒకరు బందుత్వము కలుపుకొని, రామోత్గీలాదు మీదికి యుద్దము చేయుటకై వెళ్ళుచున్నారు. మరియు వారు మొదటిగా ప్రార్థన చేయకుండా, దానిని చేసిరి.

ఓ, జనులు గ్రహించగలిగినట్లయితే ఎంత బాగున్ను! అందుచేత ఈ ఉదయమున నేను వచ్చి, నేను విదేశమునకు వెళ్ళుటకు నన్ను మా ప్రార్ధనలో గుర్తుచేసుకొనమని అడిగాను. అన్ని విషయములలోను ప్రార్థించండి! ఎవరో ఒకరు మరుసటి రోజు వచ్చి ఇలా అన్నారు, “బ్రదర్ బ్రెన్హం, అటువంటి కార్యము చేయుట నీవు తప్పు అని అనుకుంటున్నావా?”

“ఎందుకు దాని గూర్చి నన్ను ప్రశ్నించుచున్నావు?” అని నేనన్నాను. చూశారా, నీ మనస్సులో ప్రశ్న ఉంటే, దానిని అలాగే విడిచిపెట్టుము; ఎన్నడూ అది చేయవద్దు. దానితో అలాగే ఉండు. నీవు ఏదో ప్రారంభించాలనుకున్నప్పుడు, అది మంచి లేక చెడు అనే ప్రశ్న నీలో ఉంటే, దానికి దూరముగా ఉండు. దానిలోనికి ఎన్నడూ వెళ్ళవద్దు, అప్పుడు నీవు సరి అని నీవు తెలుసుకుందువు.

ఇప్పుడు, ప్రప్రధమముగా, అన్ని విషయములలోను ప్రార్థనాపూర్వకంగా ఆలోచించవలసినదే. “మొదట ఆయన నీతిని మరియు దేవుని యొక్క రాజ్యమును వెదకుడి, మరియు అవన్ని కార్యములు అనుగ్రహించబడును.” ఈ ఉదయమున నేను నిశ్చయముగా చెప్పుచున్నాను: పురుషుడు మరియు స్త్రీ, వారి యొక్క ప్రాణము, వారి యొక్క ఆలోచన, వారి గుణము ఎక్కడ ఉండునో ఆ స్థితిలోనికి వెళ్ళినట్లయితే, వారు దేవుని దృష్టికి సంపూర్ణులుగా ఉండెదరు. అది ఎన్నడూ ఉనికిలో లేనటువంటి గొప్ప శక్తివంతమైన సంఘములలో ఒకటి అగును.

27

భౌతికమైన దానిని గూర్చి కొన్ని నిమిషములు గమనిద్దాం. ఇప్పుడు, మనము కలిగియున్నది - అనేక సంవత్సరాలు తరబడిగా (lie detector) “అబద్ధములను పరిశోధించు పరికరము,” అను పిలచు దానిని మనము కలిగియున్నాము. నీవు దానిని నీ యొక్క మణికట్టు పైన పెట్టుము, వారి తలపైన దానిని ఉంచుము. అక్కడ మీరు పొందుకొనెదరు, మరియు ఒక సత్యము వలె అబద్ద శబ్దమును చేయుటకు నీ శక్తంతటితో ప్రయత్నించుము, మరియు అది ప్రతీసారి ప్రతికూలమైన దానినే నమోదు చేయును, ఎందుకనగా మనిషి అబద్దములాడుటకు తయారు చేయబడలేదు. అబద్దమనునది మోసకరమైనది, కఠినమైనది, కీడు సంబంధమైనది. ఏన్నడైనా ఒక అబద్ధికునికంటే ఒక త్రాగుబోతును నా యొద్ద ఉంచుకొంటాను. చూశారా, ఒక అబద్దీకుడు!

మరియు మీ శరీరము అబద్దమునకై తయారు చేయబడలేదు. నీవు ఎంత పాపివైనప్పటికీ, ఈ నగరములో ఈ రోజున ఎంతో పాపాత్ముడైన వ్యక్తి పాపములోనే ఉండిపోవలెనని దేవుడు ఇష్టపడుట లేదు. నీవు ఆయన యొక్క కుమారుడవు లేక కుమార్తెను అగుటకు ఆయన కోరుకొనుచున్నాడు. ఆయన సొంత స్వరూప మందు నీవు తయారు చేయబడ్డావు. కాని నీవు అలాగు చేయునట్లుగా పాపము చేసినది, మరియు అద్దమును సత్యమని చూపించుటకు నీవు ఎంత ప్రయత్నము చేసినప్పటికీ. అది తప్పు అని రుజువు చేయుటకు విజ్ఞాన శ్రాస్త్ర సంబంధమైన పరికరము వారి యొద్ద ఉన్నది. నీవు అనుకున్నదంతయూ నీవు నిష్కళంకముగా చెప్పగలవు, కాని అది ఇంకో ప్రతికూలతనే నమోదు చేయును; ఎందుకనగా మానవుని లోపల ఒక మనసాక్షి (subconscience) ఉన్నది, ఆ మనసాక్షికి ఏది సత్యము అన్నది తెలియును. మరియు ఇక్కడ బయట నీవు ఏమి చెప్పినప్పటికి, ఆ మనసాక్షికి తెలియును అది అబద్ధమని, మరియు ఆ మనసాక్షి దానిని నమోదు చేయును.

28

అందుచేత, ఒక పురుషుడు గాని లేక స్త్రీగాని వారు తలంపులు కలిగి ఉన్నట్లయితే, మరియు వారి సాక్ష్యములు, మరియు వారి జీవితములు దేవునితో పరిపూర్ణులు కాబడుటకు, (ఆమెన్.) పరిశుద్ధాత్మ యొక్క దారిలో దేవునిలో ఒకటిగా పరిపూర్ణులు కాబడితే, ఏమి సంభవించును! ఒక పురుషుడుగాని, స్త్రీగాని పరిపూర్ణులు కాబడితే, అక్కడ వారి హృదయములో స్వేచ్ఛా, వారి అంతరంగములో విశ్వాసము నివసిస్తాయి!

అనేక జనులు బలిపీఠము నొద్దకు ప్రార్థన చేయించుకొనుటకు జ్ఞానయుక్తమైన విశ్వాసముతో వారు వచ్చెదరు, జ్ఞానసంబంధమైన విశ్వాసము చేత వారు వారి పాపములను ఒప్పుకొని సంఘములో చేరెదరు. వారి యొక్క మనస్సులోనే దానిని వారు నమ్మెదరు. వారు దానిని సమ్మెదరు ఎందుకనగా వారు దానిని విన్నారు. అది వారు నమ్ముతున్నారు ఎందుకనగా అది ఒక మంచి విధానము అని వారికి తెలియును. అయితే దేవుడు చూచినది అది కాదు.

ఆయన మీ యొక్క జ్ఞానసంబంధమైన విశ్వాసమును చూడడు. దేవుడు ఎక్కడ లోపల నివాసము చేయునో, ఆ అంతరంగములో ఉన్న హృదయమును ఆయన చూస్తాడు... మరియు అది హృదయములో నుండి వచ్చినయెడల, సమస్తము సాధ్యము; నీ ఒప్పుకోలు, నీ యొక్క జీవితముతో సరిపడును. నీ ఒప్పుకోలు నీవు జీవించు జీవితము ఏమైయున్నదో చూపును.

అయితే నీ ఒప్పుకోలు ఒకటి చెప్పి, నీ జీవితం వేరొకటి జీవించినట్లైన, ఎక్కడో ఒక చోట తప్పిదమున్నది. ఎందుకనగా నీవు జ్ఞానసంబంధమైన విశ్వాసమును కలిగియున్నావు మరియు నీ హృదయము నుండి వచ్చిన విశ్వాసమది కాదు. ఇక్కడ, బయట దేవుని యొక్క జ్ఞానమున్నదని అది చూపించును; ఇక్కడ, లోపలైతే, దయ్యము అనుమానమును కలిగిస్తుంది. నేను దైవిక స్వస్థతను నమ్ముచున్నాను, కాని అది నా కొరకు కాదు,“ చూచారా. ”అది అలాగేనేమో, కాని దాన్ని నేను నమ్ముట లేదు.“ గ్రహించారా? బయట, నీవు ”అవును,“ అని చెప్పెదవు; లోపట, నీ ఒప్పుకోలు, ”కాదు“ అని చెప్పును. అదే పరిశోధన వస్తువు, అది సరేనని రుజువు చేస్తున్నది - అది రుజువు చేస్తున్నది.

29

గమనించండి, ఈ రాజులు, వారు బయలుదేరక ముందు, వారు తప్పక... యోహోషాపొతు ఆహాబుతో సంధి చేయకముందు, మొదటిగా అతడు, “మనం ప్రార్థన చేసి ప్రభువు యొక్క చిత్తమేమైయున్నదో చూద్దాం,” అని చెప్పవలసియున్నది.

ఒక బోధకుడను నాకివ్వండి, ఒక క్రైస్తవుడను నాకివ్వండి, ఒక క్రైస్తవ గృహిణిని నాకివ్వండి, ఒక వ్యవసాయకుడను, లేక ఒక కర్మగార పనివాడిని నాకివ్వండి, వారు ప్రతి దానిలోను ప్రధమంగా దేవున్నే ఉంచెదరు. ఆ దయ్యము అతనిపై అన్ని విధములుగా బాధించినప్పటికి అతడు విజయశీలుడు కాగలడని నేను మీకు ఒక మనిషిని చూపెదను. మొదటిగా, అతడు దేవుని వేదకును! మనకు తప్పక మొదట దేవుడుండాలీ...

అయితే వారది చేయలేదు. వారంత కలగలుపై పోయారు, ఎందుకనగా ఆహాబు గొప్ప వెలుగు రాజ్యమును కలిగియున్నాడు. అతడు ఎన్నెన్నో గొప్ప కార్యములు చేశాడు. అతడు ఆడంబరం కలిగియున్నాడు, అతనికి బంగారమున్నది, అతనికి వెండియున్నది, అతను ఒక గొప్ప, జయశీలుడగు మనిషి, అయినప్పటికి అతనొక అవిశ్వాసి.

30

ఈనాడు ఈ ప్రపంచము అక్కడే ఉన్నది. అమెరికా ఈనాడు అక్కడే నిలబడివున్నది. ఆ సంఘాలు, ఈనాడు అక్కడే ఉన్నవి. ఎన్నడూ నిర్మించనటువంటి గొప్ప సంఘాలు ఈనాడు మనము నిర్మించాము. ఎన్నడూ లేనవంటి గొప్ప మెరుగు పెట్టబడిన పండితులను మనము కలిగియున్నాము. మనము ఎంతో కొంత గొప్ప వేదాంతమును మరి ఆ విధమైనవి కలిగియున్నామని తలంచుకొనుచున్నాము, దేవదూతల వలె పాటలు నేర్చుకొన్నాము, అయినా కాని అక్కడ ఎక్కడో ఒక చోట బలహీనత ఉన్నది. అక్కడ బలహీనత ఉన్నది, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము నొద్దకు వచ్చుటకు బదులుగా, వంచన చేయు ఆత్మల వలన మనుష్యుల సిద్ధాంతములోనికి వారు వెళ్ళిపోవుచున్నారు. లోకము వలె తయారగుటకు వారు ప్రయత్నం చేయుచున్నారు. హాలీవుడ్ వలె, కాంతివంతమైన దీపాలు దాని చుట్టూ ఉంచుటకు వారు ప్రయత్నం చేయుచున్నారు.

31

ఇక్కడే గత దీనాన, ఒక ప్రఖ్యాతిగాంచిన సంఘ శాఖను, కాన్సాస్ లోని సంపూర్ణ సువార్త మండలాన్ని లేక దయతో మీరు క్షమించండి, డెనవేర్లో, సభ యొద్ద, ఒక మిలియన్-డాలర్ల సంఘాన్ని నిర్మిస్తున్నారు. అదే సంఘశాఖ సువార్తను అన్యుల యొద్దకు తీసుకుపోవుటకు వేల కొలది మిషనరీలు ఏబై సెంట్లు కోసం ఎదురుచూస్తున్నారు. ఒక సేవా దృక్పదం కలిగిన మనకు ఈ రోజు ఏమి కావాలి, దేవుడు పంపించిన పరిశుద్ధాత్మ వలన జన్మించిన ఉజ్జీవము కావాలి, అట్టి వారు దేవుని యందు తృష్ణ కలిగి అడవులలోనికి నెట్టబడి, అదుగో దూరానా లోకంలోని పొరుగు వారి వలె పెద్ద భవనములు, అందమైన సంఘాలు నిర్మించుటకు బదులుగా, దేవుని కొరకు ఏదో చేయుదురు.

మనము కలిగియున్న లోకంలోని ఆ గొప్ప ఆలయములో కూర్చొని మానవ-కల్పిత సిద్ధాంత పద్దతులలో తిమ్మిరెక్కి పోవుటకంటె, పరిశుద్ధాత్మ స్వాతంత్ర్యము, దేవుని ప్రేమతో మండుచున్న హృదయములు కలిగిన వారితో లేక ఎక్కడయితే పెంట కుప్పగా ఊడ్చబడుతుందో అక్కడ సంఘ సేవ కలిగి ఆరాధన చేస్తాను. ఈ దినాన మనకు కదిలింపబడు ఉజ్జీవము కావాలి, సత్యము యొద్దకు మరలా వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యము నొద్దకు మరలా వెళ్ళాలి.

32

ఇప్పుడు, వారు అక్కడకు వెళ్ళినప్పుడు, కొద్ది సేపటి, తరువాత యోహోషాపాతు వచ్చి తనకు తానుగా ఇలాగున, “మంచిది, దీనిని గూర్చి ప్రభువును సంప్రదిద్దాం,” అని చెప్పాడు.

“సరే” యని అతడన్నాడు, ఆహాబు, అతడు నాలుగు వందల మంది తర్ఫీదు పొందిన మంచి బోధకులను సమకూర్చాడు. అతడు వారినందరిని అక్కడకు తీసుకొని వచ్చి, “వీరందరు ప్రవచించువారే,” అని చెప్పాడు.

కనుక వారు వారి ఇంద్రజాలానికి (మంత్రానికి) వెళ్ళిపోయారు, వారు పిలువడం ప్రారంభించారు. వారు “అవును, సమాధానముతో నీవు వెళ్ళుము. ప్రభువు నీతో వున్నాడు,” అని అన్నారు.

అంతట నాలుగు వందల మంది వారు సమాధానముతో వెళ్ళు అని సాక్ష్యమిచ్చారు తరువాత, చివరిగా యోహోషాపాతు ఎరిగినవాడై... నీవు పొందుకున్నావా? చూచారా, ఆ నీతిమంతుడైన మనుష్యుని హృదయములో అక్కడ ఏదో ఒక చోట తప్పిదము ఉన్నది అని అంతరంగంలో ఏదో అతనికి చెప్పింది. అక్కడ ఏదో తప్పిదమున్నది.

33

“ఇప్పుడిక్కడ నాలుగు వందల మంది మనకున్నారు. వారిలో ప్రతీ ఒక్కరు సమ్మతము తెలుపుచూ, 'వెళ్ళు, ప్రభువు నీతో ఉన్నాడు' అని చెప్పుచున్నారు,” అని ఆహాబు చెప్పెను.

కాని “మరొకరు ఎవరు నీకు లేరా?” అని యోహోషాపాతు అన్నాడు.

“మంచిదే, దేశంలో గొప్ప విద్య కలిగిన నాలుగు వందల మంది మనుష్యులు మనకున్నప్పుడు, ఆ ఒక్కడితో మనకు పనీ ఏమిటి?” అని అతడన్నాడు. వారంతా “వెళ్ళు” అని చెప్పుచున్నారు! అది మేధాసంబంధమయినది. అయితే యోహోషాపాతు హృదయములో అక్కడ ఏదో తప్పిదమున్నదని అతను ఎరిగియుండెను. ఇప్పుడు, “మనకు మరొకడు ఉన్నాడు, అతడే మికాయా, కాని నేను అతన్ని ద్వేషించుచున్నాను,” అని అతడన్నాడు. “అతడు ఎప్పుడు చెడ్డ కార్యములే పలుకుచూ, తటాలున తనదికాని వాటిలో చొరవ తీసుకొంటాడు, ఇంకా సంఘాలన్నీ మొదలగు వాటన్నిటిని హీనపరుస్తాడు,” అని చెప్పాడు. “నేను అతని ద్వేషిస్తాను,” అని అన్నాడు.

“వెళ్ళి, అతడిని తీసుకురా, అతను ఏమి చెప్పుచున్నాడో చూద్దాం,” అని అన్నాడు.

మరియు మీకాయా వచ్చినప్పుడు, అతడన్నాడు... “ఇప్పుడు, చూడు, వారు చెప్పిన విధంగానే నీవు చెప్పు,” అని వారన్నారు.

అతడన్నాడు, అతడన్నాడు, “నేను మాత్రం...” దీనిని వినుము! “దేవుడు చెప్పినది మాత్రమే నేను చెప్పెదను.” ఆమెన్. “మీ ప్రవక్తలు ఏమి చెప్పారన్నది కాదు, ఇది ఏమి చెప్పిందన్నది కాదు, మీ సంఘము ఏమి చెప్పిందన్నది కాదు, వారు ఏమి చెప్పారన్నది కాదు. దేవుడేమి చెప్పాడో అదే నేను చెప్పెదను. దేవుడు నా పెదవులపై ఉంచి ఆయన ఏమి చెప్పమని చెప్పునో, అదే నేను చెప్పెదను.” దేవుడు ఏమి చెప్పునో, అదే చెప్పునటువంటి కొంత మంది మికాయాలు ఈ దినాన్న మనకు కావాలి.

34

గమనించండి, కాబట్టి వారు అతన్ని అక్కడకు తెచ్చిరి, “ఈ రాత్రి నాకివ్వండి,” అని అతడన్నాడు. కాబట్టి ఆ రాత్రి ప్రభువు అతన్ని దర్శించెను, మరియు మరుసటి ఉదయమున అతడు తిరిగి వచ్చెను. ఆ ఇద్దరు రాజులు ద్వారము నొద్ద కూర్చొండెను, అతడన్నాడు, “వెళ్ళండి.” అతడన్నాడు, “వెళ్ళండి. కాని, ఇశ్రాయేలు కాపరిలేని గొర్రెల వలే చెదరిపోవుటను నేను చూశాను,” అని చెప్పాడు.

కాబట్టి, ఈ ఒక్క బోధకుడు, వస్త్రములు ధరించినవాడై, అతని యొద్దకు నడుచుకొని వచ్చి, అతని నోటిపై కొట్టి, “దేవుని యొక్క ఆత్మ నన్ను విడిచి యే దారిగుండా వెళ్ళినదో చెప్పమని?” అనెను.

“నీవు తిరిగి వచ్చినప్పుడు నీవు తెలుసుకొనెదవు,” అని అన్నాడు. అవును.

“ఇటు విను!” అని అతడన్నాడు. “మేమందరము దేవుని యొక్క సేవకులము, మేమందరము నాలుగు వందల మందిమి, నీవు ఒక్కడవే,” అని అతడన్నాడు.

అయితే, మికాయా, “మీకు ఇబ్బంది ఎక్కడున్నదో నేను మీకు చెప్పెదను,” అని అన్నాడు. ఆమెన్! “నేనొక దర్శనమును చూశాను,” అని చెప్పాడు. ఆమెన్! “దేవుడు ఆయన సింహసనముపై కూర్చొండుటను నేను చూశాను. ఆయన చుట్టూ పరలోక సమూహము నిలబడియుండుటను నేను చూశాను. ఈ మనుష్యుడు చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యము ప్రకారముగా ఈ మనుష్యుని పై ఏ శాపమున్నదో మనకు తెలియును,” అని అతడన్నాడు.

35

దేవుడు శపించిన దానిని మీరు దీవించలేరు, లేదా దేవుడు ఏదైతే దీవించాడో దాన్ని సాతాను శపించలేదు. అది వ్యక్తిగత వ్యవహరమైయున్నది, నీవు ఎంత పేదవాడివి లేక బుద్దిహీనుడవు అని కాదు, ఎంత విద్యలేనివాడవు లేక ఎంత పామరుడవు అని కాదు. దేవుడు ఏదైతే, ఆశీర్వదించెనో అది ఆశీర్వదించబడినది; దేవుడు దేనినైతే శపించెనో అది శపించబడినది. ఏది సరి మరియు ఏది తప్పిదమో వేరుచేయుట ఎరిగియుండుము.

మికాయా మంచిని ఎరిగియుండెను మరియు ఆ బోధకులతో ఉన్నది ప్రభువు కాదని ఎరిగెను. మంచిది, ఆ బోధకుల సంగతేంటి? గమనించండి, వారేమి చేశారు. వారు మంచి దుస్తులు ధరించెను. వారు తృప్తిగా భుజించారు. వారు, ఇద్దరు కలిసి వారి విందులకు మరియు అలాంటి విలాసములకు వచ్చారు, మరియు వారి బంధుత్వము, ఎక్కడ వారి సొంత వేదాంతము ఉంటుందో ఆ స్థలము వరకూ వచ్చారు. బైబిల్ మికాయాకు తెలిపెను, అతడు దర్శనము చూచుచున్నాడు, “దేవుడు చెప్పెను, 'ఎవరు వెళ్ళి ఆహాబును మోసపుచ్చెదరు?' అని ఆయన అన్నాడు, మరియు ఒక అబద్ధపు ఆత్మ వచ్చి, 'నేను అక్కడకు వెళ్ళి ఆహాబు అక్కడకు వెళ్ళులాగున, ఆ బోధకుల ద్వారా ఆహాబును వంచన చేసి, దేవుని యొక్క వాక్య నేరవేర్పు జరుగునట్లుగా చేయుదును అని చెప్పెను.'”

36

ఇప్పుడు, ఈ రోజు అనేక జనులు వినుచున్నారు! (ఇప్పుడు, ఆదివారపు బడిపాఠమును, నేను దాని ప్రేమిస్తాను.) చూడండి, అనేక జనులు దేవుని యొక్క వాక్యమును తీసుకొనుటకు బదులుగా, వంచన చేయు ఆత్మల మాటలను వినుచున్నారు: ఆత్మలు, అవి లోకములో ఉన్నవి. అవి దయ్యములు మరియు అవి బయట స్థలాలకు వెళ్ళి, మరియు అవి మనుష్యులు, సేవకుల మధ్యలో ఉండును; అవి సంఘస్తుల మధ్యలో ఉండును; మంచి జనుల మధ్యలో అవి ఉండును, అవి వారిని పూర్వగాధకు వచ్చే విధంగా చేస్తాయి; మరియు అవి ఇలా చెప్పు, ఇలా చేయు, మరియు బోధించు, మరియు అభ్యాసము చేయు అని చెప్పుచు, దేవుని యొక్క వాక్యమునకు విరోధమైననవి చేయును. ఈ రోజు, సేవకులు అనేకమైన వారి సంఘాలలో, జనులు జూదమును ఆడుటకు అనుమతిని ఇచ్చుచున్నారు. ఇప్పుడు, అది కేథలిక్ సంఘమే కాదు; అనేకులైన ప్రొటస్టెంట్ వారు కూడ అది చేయుదురు.

వారు ఏదో ప్రత్యామ్నాయ కార్యములు చేయుటకు ప్రయత్నించెదరు. వారేదో క్రొత్త ప్రణాళికను రూపొందించుటకు ప్రయత్నించెదరు. వారు పరిశుద్ధాత్మ స్థానమును తీసుకొనుటకు బదులుగా, విద్యను ఆచరించుటకు ప్రయత్నించెదరు. మీ మనుష్యులు ఎంతటి విద్యావంతులైనను, అది నీవు చేయుటకు ఎన్నడూ సామర్ధ్యమును కలిగిలేవు. అతనిని విద్యావంతుని చేయుట మంచి కార్యమేనని నేను అనుకుంటాను. ప్రయత్నించెదము, కాని మనము వీటి అన్నింటికి ప్రత్యామ్నయములు చేయుదము. దాని వలన పరిశుద్ధాత్మను కలిగిలేకపోతే అతని విద్య వలన అతనికి ఏమి మేలు లేదు. విద్య పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమును ఎన్నడూ తీసుకొనలేదు. ఆమేన్.

37

గమనించు. వారు, దీనికి బదులుగా, అనగా వారు పరిశుద్ధాత్మకు బదులుగా ఆ పాత-కాలపు అనుభవమును వారు ఆచరించుటకు ప్రయత్నించెదరు, ఈనాడు సంఘము నవనాగరికమైపోయినది. వారు నడిచి వెళ్ళి సహవాసమునకై వారి కుడి చేతిని ఇచ్చెదరు. మరియు వారు ఆ విధముగా అది చేయుదురు. కాని ఆ పాత-కాలపు కుర్చీలో కూర్చొని దుఖించుచుచు వారు ఎక్కడ దేవునితో సరిగ్గా ఉండుటకు పాపులను పిలుచు ఆ స్థలముకు వారు ఎన్నడు రాలేదు. అది సత్యము!

ఈ రోజు వారు దేవుని యొక్క దశమ-భాగాన్ని తీసుకొను స్థానాన్ని ఆక్రమించుకొనుటకు ప్రయత్నించుచున్నారు. వారు ఏదో ఆచరించుటకు ప్రయత్నించుచున్నారు. వారేదో వ్యత్యాసమైనది చేయుటకు ప్రయత్నించుచున్నారు. వారు వెళ్ళి సంఘములో బింకో, లాటరీ, మొదలగు ఆటలు ఆడుచున్నారు... లాటరీ దేవుని యొక్క దశమ-భాగం స్థానాన్ని ఎన్నడూ తీసుకొనలేదు. విందులు, దుప్పట్లు అమ్ముట, విహారయాత్రలు, వివిధ రకములైన అప్పులను చెల్లించుట, మొదలగునవి, దేవుని యొక్క నిత్యత్వపు దశమ-భాగమును మరియు కానుకల స్థానాన్ని అది ఎన్నడూ తీసుకోలేదు; అది ఎన్నడు చేయదు. కాని ఇంకను మనము అది చేయుటకు ప్రయత్నించుచున్నాము.

38

ఏమిటది? అది వంచన చేయు ఆత్మలు దిగి వచ్చుట, దేవుని యొక్క వాక్యమునకు బదులుగా ఏదో చేయుట. ఆయన వాక్యమునకై దేవునికి బదులుగా అనేది లేదు. అది ఎన్నడేన్నటికీ నిత్యమైనది. విశ్వాసముకు బదులుగా దేవుని యొద్ద మరొకటి ఏమియు లేదు. విశ్వాసమునకు బదులు లేదు. నిరీక్షణ విశ్వాసము యొక్క స్థానమును ఎన్నడు తీసుకోలేదు. విశ్వాసము ఒంటరిదే.... అది ఒంటరిగానే నిలుచును. అది ఎన్నడు తీసుకోదు... నిరీక్షణ దాని స్థానమును ఎన్నడు తీసుకోలేదు. నిరీక్షణ, ఒక నిరీక్షించబడువాటి యొక్క వస్తువు, కనిపించని దానికి రుజువైయున్నది, లేక విశ్వాసము, చూశారా. నిరీక్షణ అనునది ఒకటి; విశ్వాసమనునది మరొకటి. నిరీక్షణ దానికై నిరీక్షించును; విశ్వాసము దానిని పొందుకొనును. ఒకటి జ్ఞానసంబంధమైన విశ్వాసము, మరొకటి నేరుగా దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యక్షత. అది ఎన్నడు దాని స్థానమును తీసుకొనదు.

మనము ఒక బోధకుడని పంపించుటకు బదులుగా గొప్ప సంఘాలను నిర్మించుటకు ప్రయత్నించుచున్నాము. మరి యొక్క ప్రత్యామ్నాయ మందిరమును కట్టుటకు యేసు ఎన్నడు ఎవరినీ ఏర్పాటు చేయలేదు. బైబిల్లో ఎన్నడూ నీయమించినట్లు లేదు. మనము సెమినరీలను పెట్టాము; అవి బోధకుల యొక్క స్థానము తీసుకొనెను. యేసు ఎన్నడు సెమినరీని స్థాపించమని చెప్పలేదు. అవి అన్ని మంచివే, విద్య, దాని స్థానాన్ని తీసుకొనుటకు ప్రయత్నించుచున్నది. అది ఎన్నడూ చేయలేదు. “సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను బోధించుడి,” అని యేసు వారికి ఆజ్ఞాపించెను. యుగపర్యాంతము కూడా. కాబట్టి ఈ ప్రత్యామ్నయములన్నియు, నిజమైన దాని స్థానమును ఎన్నడు తీసుకొనలేవు.

39

నిన్నటి దినమున నాకు ఒక ప్రత్యామ్నాయ అనుభవము కలిగినది.

నా మొదటి పంటి నొప్పి, దానిని బయటకు లాగి వేయవలసి వచ్చింది, ఈ ఉదయమున ఆ స్థానములో మరొక పంటిని పెట్టుకున్నాను. నేను గట్టిగా మాట్లాడలేను. నిజమైన పంటి యొక్క స్థానాన్ని అది ఎన్నడు తీసుకొనలేదు. లేదయ్యా! ఓ, మై!

నీవు ఒక మనిషిని కర్రతోనో, సున్నపు ముద్దతోనో చేసి అతనికి బట్టలు తొడిగించి నీవు ఎలాగు తయారు చేయాలను కుంటావో అలాగున చేయు. అతనికి స్పర్శ ఉండదు, మనస్సాక్షి ఉండదు; అతడు ఏ నిజమైన మనిషి యొక్క స్థానాన్ని తీసుకొనలేడు. మోసపురితమైన మారుమనస్సు వచ్చి చెప్పును, “నేను సంఘములో చేరాను, నేను బాగానే ఉంటాను. నిజమైన ఆ పాత-కాలపు దేవుడు-పంపిన, పరిశుద్ధాత్మ మారుమనస్సు కలిగి మార్పుచెందిన హృదయమును, అది ఎన్నడు తీసుకొనలేదు. అది చేయలేదు, ఎందుకనగా దానిలో జీవము లేదు; అతనికి జీవాన్నిచ్చుటకు ఏదియు లేదు.

40

ఇక్కడ కొంత కాలం క్రితం గొప్ప శిల్పకారుడు, ఒక శిల్పమును తెచ్చుటను నేను చూసాను. నా భావము మోషే యొక్క స్వరూపము అది. ఇప్పుడు నేను అతని పేరు పిలువలేను. అతను గ్రీకు శిల్పకారుడు, అతడు తన ప్రాణాన్నే ధారపోసాడు. అతడు తాను చేయునది సంపూర్తి చేయబడినదని తలంచిన తరువాత, అతడు చాలా తన్మయుడైపోయి, ఆ విగ్రహముతో, “మోషే, మాట్లాడూ! అని అతడు మోకాలు పై కొట్టెను, అది చూచుటకు ఎంతో నిజమైనదిగా ఉండెను! అది అతని తలంపుకి, మోషేను చూచుటకు చాలా సంపూర్ణముగాను, చాలా ఆదర్శముగా ఉండెను గనుక అతడు సుత్తెతో కొట్టి భావమును కలుగజేయవచ్చును అని అనుకున్నాడు.

సంఘము యొక్క మనస్సులో పెట్టండి, నీవెంత ప్రతినిధిగా ఉన్ననూ, నీకు ఎంత పెద్ద సంఘమున్నను, నీవు ఎంత బాగా పాటలు పాడినా, నీ సంఘస్తులు ఎంతటి చక్కని వస్త్రములు ధరించినా, నీవు ఇది, అది, లేక, మరేదో కలిగినను, నీవు ఎటువంటి భావోద్రేకమును కలిగినను, క్రీస్తు సంఘములోకి పరిశుద్ధాత్మ రూపములో క్రొత్తగా తిరిగి జన్మించు అనుభవము వచ్చునంత వరకూ అది జీవమును ఎన్నడూ తీసుకురాలేదు. అది ఎన్నడు దేవుని వాక్యము యొక్క స్థానాన్ని తీసుకొనలేదు. దేవుని వాక్యము ఒంటరిగానే నిలుచును.

41

మికాయా వాక్యమును కలిగియుండెను. అతడు వాక్యమును కలిగియున్నాడని అతడెరిగియుండెను. అతడు వ్రాయబడిన వాక్యము కలిగియుండెను, అలాగే దర్శనము కూడా కలిగియుండెను. దేవుడు ఆయన వాక్యములో ఏమి చెప్పియుండెనో అతడు ఎరిగియుండెను. దేవుడు దర్శనము ద్వారా ఏమి చెప్పియుండెనో అతడెరిగెను. అవి రెండును కలిసివచ్చెను. అది సత్యమని అతడెరిగెను కాబట్టి అతను భయపడలేదు.

అయితే ఈనాడు ఈ వంచన చేయు ఆత్మలు ఏమి చేయుచున్నవో చూడండి. సంఘ సభ్యులను అధికము చేయుట, సంఘ సభ్యులను గొప్పవారిగా చేయుట, ఆ పాత-కాలపు పరిశుద్ధాత్మ యొక్క బోధ వాటికి అడ్డుగడియలు వేసెను. మనుష్యులు ఒకరితో ఒకరు సాంఘిక కార్యకలాపాలు కలిగియుండి, ఆ బేస్మెంట్ లో ఆటలు ఆడుకొనుటకు అనుమతిని ఇచ్చుచున్నారు. వారు ఎక్కడైతే, పరిశుద్ధాత్మ అనుభవమునకై ప్రార్థించారో, ఆ మేడగది అనుభవానికి అది ఎన్నడు ప్రత్యామ్నయముగా పని చేయదు. స్త్రీలు ఒక చోట కలుసుకొని సరసోక్తులు (జోకులు), బుద్దిహీనమైన కార్యములు మొదలగునవి, అన్నియూ ప్రార్థన కూటము యొక్క స్థానాన్ని ఎన్నడు తీసుకొనలేవు. స్త్రీలు, వారు బయటకు వెళ్ళి, ఈ దినములలో ధరించే వస్త్రములు, అది స్త్రీకి అవమానము.

42

సహోదరుడు నెవిల్ చేసిన హెచ్చరికను నేను విన్నాను. “దీన అమెరికా జనులారా,” అని చెప్పెను. “వారి వస్త్రములన్ని విదేశీయులకు పంపియున్నారు.” వారు వారి లోదుస్తులతోనే నడిచెదరు. అది సత్యము. వారు తప్పక ఆ మిషనరీ వారికి ఇవ్వవలసియున్నది, ఎందుకనగా ఆ మిషనరి వారు, ఇతర దేశములలో ఉన్న జనులు మరియు అన్యులు వాటిని ధరిస్తున్నారు. ఈ జనులు అవి లేకుండ వారి వలే కనిపించుటకు ఇష్టపడుచున్నారు.

నేను మీకు చెప్పెదను, ఏదో వంకర చేయబడెను, అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త బోధ. ఆ దయ్యములు మీ వస్త్రములను చించివేసెను. వస్త్రములను చింపుకొనే వారు ఎవరులేరు కాని బైబిల్ లో ఒక వ్యక్తి దయ్యముచే పట్టబడినవాడై తరచు తన బట్టలను చింపుకొనేవాడు, మరియు ఈనాడు అతను శాంతము గలవాడై ఉన్నాడు. అతడు సాంఘికమైనవాడు వలె అని చెప్పెను. అది సరే. మంచి వాని వలే, అంతా ఆ విధముగా సరిగ్గానే ఉన్నాడు. “చల్లటి వాతావరణములో నీవు నీ బట్టలు తీసివేసినట్లయితే, అది నిన్ను చల్లపరుచును.” పురుషుడు - సగం ధరించిన దుస్తులు గలవాడై, వీధుల్లో తిరుగుచుండెను. మరియు స్త్రీలు కూడా ఆ విధంగానే చేయుచున్నారు. ఎందుకు, కుక్కలు ఒకదానియెడల ఒకటి కలిగియున్న గౌరవము కూడా లేనంతగా మీరు ఒకరి యెడల ఒకరికి కొంచెమైన గౌరవము లేదు. ఏమిటీ సంగతి? నేను మిమ్ములను బాధపరచాలని ప్రయత్నించుట లేదు. అది దయ్యముచే పట్టబడుట అని మీకు చెప్పుటకు నేను ప్రయత్నించుచున్నాను, మరియు వంచన చేయు ఆత్మలు, “అది పరవాలేదు,” అని చెప్పుదాని మీరు వినుచున్నారు. కాని అది ఒక అబద్ధము.

ఒక గోధుమ గింజ గోధుమనే ఉత్పత్తి చేయును. మీరు క్రైస్తవులైతే, మీరు అది చేయరు. నీవు అది చేయలేవు. నీవు అది చేయలేవు. నీవు అది ఏ మాత్రమును చేయలేవు. నీవు జ్ఞానసంబంధమైన విశ్వాసమును కలిగియుండి, “బ్రదర్ బ్రెన్హాం, నేను బైబిల్ ని నమ్ముచున్నాను,” అని చెప్పెదవు, నీవు నమ్ముట లేదని నీ జీవితం తెలియచేయుచున్నది. ఆమెన్. వంచన చేయు ఆత్మలు, దేవుని యొక్క వాక్యమును ముక్కలుగా చేయుచున్నవి.

43

మికాయా, తాను ఎక్కడ నిలబడెనో అతడెరిగియుండెను. అతడు దేవుని వాక్యమును కలిగియుండెను. అతడు జనులకు సమ్మతము లేనివాడిగా ఉండెను. అతడు సత్యమును చెప్పుటచే, వారు వారి బోధకులను ఇష్టపడునట్లుగా, ఈయనను ఎవరు ఇష్టపడలేదు.

ఇప్పుడు, మరొక విషయము సంభవించెను. ఏ పురుషునికైనా లేక స్త్రీకైనా గాని, దేవునితో అనుభవము ఉన్నట్లయితే, వారు కొద్దిగా ఉద్రేకమును కలిగి ఉంటారని నేను నమ్ముచున్నాను. అది సత్యము. నేను దానిని నమ్మెదను. కాని మీకు తెలుసా? వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంగీకరించుటకు బదులుగా ఉద్రేకతను స్వీకరించియున్నారు. వారు అధికముగా శబ్దము చేయుదురు, కాని అందులో ఏమియు ఉండదు. నీవు ఎంత పరిశుద్ధముగా జీవించగలవో నీవు అంత సందడిగా జీవించు, అంతట నీవు సరియగుదువు. నిశ్చయముగా ఉద్రేకములు మంచివే; “శరీర వ్యాయామము కొద్దిగా ఉపయోగమే.” అయితే, వంచన చేయు ఆత్మలు పరిశుద్ద జనుల గుంపులో పేరుకున్నవి. అవి వారిని పట్టుకొని వారిపై ఉండును, “ఎందుకనగా వారు కేకలు పెట్టగలరు, లేక వారు నాట్యమాడగలరు, వారు ఉద్రేకులవ్వగలరు.”

44

అక్కడొక వృద్దుడు ఉండెను, ఆ ప్రవక్తలందరికి, బోధకులందరికి ప్రధాని, తానే రెండు కొమ్ములను తయారు చేసి, చుట్టూ నాట్యమాడి, అధికముగా ఉద్రేకుడై, అతడు సత్యమని, అతడు చేయునది నిశ్చయమని అనుకుండెను; అతడు అష్పూరు సైన్యమును దేశము నుండి నెట్టివేయబోవుచున్నాడు. కాని అది అబద్దము. దేవుని వాక్యము దానికి వ్యతిరేకముగా చేయబోవుచున్నదని చెప్పెను. ఆమెన్. చూశారా, నీవు ఉద్రేకముగా సరైనవాడివే, దాని వెనుక నీవు కలిగియున్న ఉద్రేకము సరైనది అయితే, ఆ నిజమైన ఉద్రేకము, మీ ఉద్రేకమును కదిలింపజేస్తున్నది.

దావీదు ప్రభువు నొద్ద నాట్యమాడెను, మరియు తన భార్య అది చూసి నవ్వెను. మరియు దేవుడు ఆకాశము నుండి తొంగి చూసి, ఇలా చెప్పెను, “దావీదు, నీవు నా సొంత హృదయానుసారుడైన మనిషివి.” అయితే అతని ఉద్దేశ్యాలు మంచివి; దాని ముందు అతని జీవితం సరైనదే.

కాబట్టి, మనం ఉద్రేకపూరితులమవ్వగలము, అంత మాత్రమున మనము రక్షించబడ్డామని కాదు. మనము సంఘానికి వెళ్ళుచున్నామనగా, మనము రక్షించబడ్డామని కాదు. అటువంటి వంచన చేయు ఆత్మలను నమ్మవద్దు. ఒక నిజమైన దేవుని ఆత్మ, ఒక నిజమైన దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యమైయుంటున్నది. అది దేవుని యొక్క విత్తనము, అది మీ జీవితములో దేవుని ఉత్పత్తి చేయును - భక్తిగాను, పరిశుద్ధముగాను, శుద్దముగాను ఉండునట్లు చేయును.

45

అనేక మంది జనుల మధ్యలో మనము ఉద్రేకములను కనుగొనగలము, మరియు అలాంటి, అవి ముచ్చట్లు, చాడీలు చెప్పుట, మొదలగునవి అన్నియూ భక్తిహీనమైన కార్యములు. సహోదరుడా, ఆ గంధక ఆమ్లము (సల్ఫ్యూరిక్ ఆమ్లము) సంఘములో ఉన్నది; అది దయ్యపు శక్తి. ఒకరినొకరు కూడికొని వారు స్త్రీ, పురుషుల ఆత్మ గలవారై నెట్టివేయుటకై ప్రయత్నించి, “ఇది సరి కాదు, మరియు ఇది సరి కాదు, మరియు అది సరి కాదు,” అని చెప్పుదురు. ఒక వ్యక్తి పదిలో తొమ్మిది సార్లు పురికొల్పబడి దానిని నీవు తరిమినట్లయితే, అది సరి కాదు. ఆమెన్.

సహోదరుల మధ్య భేదమును దేవుడు ద్వేషించును. మర్యాదగ ఉండు, పరిశుద్దముగా ఉండు, దేవున్ని ప్రేమించు, ఆయనతో నిలబడు. బైబిల్తో నీ జీవితం పెనవేయబడినంత కాలమూ, హృదయ శుద్ధితో, కల్మషము లేని తలంపులతో, నీ సహోదరునియెడల ప్రేమ కలిగి, దేవుని యొక్క రాజ్యము కట్టబడుటకు నీవు పనిచేయు, మంచిగా వస్త్రములు ధరించు, సరిగ్గా జీవించు, మంచిగా మాట్లాడు, మంచి స్థలములకు వెళ్ళు, అంతట, నీ ఉద్రేకములన్నియూ, నీవు కోరినవన్నియు చేయగలవు, మరియు ప్రతియొక్కరూ దాని నమ్మెదరు.

“మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, అది దేనివలన సారము పొందును. అది బయటకు పారవేయబడి, మనుష్యులచే తొక్కబడును కదా,” అని యేసు చెప్పెను. మీరు కేవలం ఉప్పు అయినంత మాత్రానా, అది ప్రయోజనము కాదు; నీవు ఉప్పు అయి ఉండి, దానిలో నీవు సారము కలిగి ఉన్నట్లయితే, లోకము దప్పిగొనును. నీవు ఉప్పైతే, వారు దప్పిగొనెదరు. ఓ, మై!

46

మారువేషము క్రింద దయ్యములు, వంచన చేయు ఆత్మలచే వెళ్ళుచున్నవి. చూడండి, మనము చివరి దినములలో ఉన్నాము, మనము అంత్యకాలములో ఉన్నాము. ఏలాగున పుండు ఈ ఒకనొక దినమున పెద్దదై చితికిపోయి దాని మీద నుండి దాని మొన ఎగిరిపోవునట్లుగా, ఈ లోకం తల భాగానికి వచ్చి సిద్ధముగా ఉన్నది. అది అంతా రోత కలిగి ఉన్నది. దానిని ఏ బానిస స్వస్థపరచ జాలడు. వారు ఆ ఔషదాన్ని తిరస్కరించారు. వైద్య విధానమును వారు తిరస్కరించారు. కురుపు పెరుగుటను నీవు తీసుకో, మరియు నీవు దాని లాగివేయుటకు పెన్సిలిననో లేక మరోక అలాంటి దాని దేనినో తీసుకొనకపోతే, అది పెరిగిపోయి పెద్దదై పగిలిపోవుచున్నది.

లోకము అదే చేసినది. కొంత కాలము క్రితము, అది ప్రారంభించబడి, క్రిందికి పోయినది. వారు గొప్ప ఆలోచనలో పడిపోయారు, అబద్దపు ఆత్మలు వచ్చి జనులకు ఇది, అది లేక మరొకటి అని చెప్పుటకు ప్రారంభించెను. మనము తొమ్మిది వందలు మరియు కొన్ని వ్యత్యాసమైన సంఘ శాఖలుగా విడిపోయాము, ప్రతీయొక్కరము ప్రత్యేకమైన దృక్పదమును కలిగియున్నాము. “కాలపరిధిలో, మేము దీనిని నమ్ముచున్నాము! అది అంతా మేము నమ్ముచున్నాము,” అని వారు చెప్పుదురు. వారిలోనికి పరిశుద్ధాత్మ వచ్చుటకు అనుమతినివ్వరు. వారికి సరైన మార్గము లేదు. కేకలు పెట్టు జనుల గుంపును దేవుడు కలిగి ఉండెను. అంతట ప్రతీయొక్కరు కేకలు పెట్టుదురు. వారిలో కొందరు భాషలతో మాట్లాడగా, అంతట ప్రతీయొక్కరు భాషలు మాట్లాడెదరు. వారందరు ఈ విధముగానే చేయుదురు, ఎంత వరకు అనగా, వంచన చేయు ఆత్మలచే సంపూర్తిగా అపరిశుద్ధము చేయు వరకు (ఏమిటి?), వంచన చేయు ఆత్మ, అందులో దేవుడు లేనప్పటికీ, జనులచేత వారు ఉద్రేకులగునట్లు చేయించుచున్నది. అంతట వారు బయటకు వెళ్ళి, వారి ఇష్టము వచ్చినట్లు వారి ఇచ్ఛననుసరించి జీవించుదురు, మరియు వారిని “క్రైస్తవులు,” అని పిలచుదురు.

మరియు లోకము ముందు కూర్చొని, చూడు, “మంచిది, అటు చూడు; నేను వారి వలే మంచిగానే వున్నాను,” అని చెప్పెదరు.

47

పాపిని గూర్చి, అడవి పందిని గూర్చియు గత రాత్రి నేను చెప్పిన విధముగా. ఒక పాపి పాపే. అతన్ని పునరుద్ధరించుటకు ప్రయత్నించవద్దు. ఇది, అది, లేక మరొకటి అని అతనికి చెప్పుటకు ప్రయత్నించవద్దు. ఆరంభములోనే అతను పాపి. అది ఆరంభముతోనే ఒక పంది. అతనికి ఏ వ్యత్యాసము తెలియదు. అతడు సినిమాలకి వెళితే, అతడు ఆదివారము వెళ్ళును, మరియు అతడు బంతి ఆట ఆడును, మరియు మొదలగునవన్నియు అతడు చేయును, అతడు ఆరంభముతో ఒక పాపి. అతని స్వభావము ఒక అడవి పందిని పోలేను. ఆ ముసలి పంది, తన మూతిని క్రిందకు దించి పెంట కుప్పలో ఉన్న అన్ని విత్తనములను తినుచూ, అలాగున ప్రతిది చేయును; మంచిది, అది అడవి పంది స్వభావము. నీవు దాని తప్పు పట్టలేవు; అదొక అడవి పంది. అదే విధముగా పాపి యొక్క మార్గము కూడా. అయితే, నీవు వెళ్ళి, నేను క్రైస్తవుడను అని చెప్పుకొంటావు. అతనితో నీ నోటిని కలుపుతావు, అంతట అతని కన్న నీవు ఏమియు గొప్ప కాదు; కాని నీవు ఇంకా చెడిపోదువు. వాటి నుంచి బయటకు రా, లోకమును విడిచిపెట్టు. విడిచిపెట్టు మరియు దేవుని రానిమ్ము. విడిచిపెట్టు.

48

నీవు ఏ విధముగా విడిచిపెట్టెదవు? అనేక జనులు ఈ దినమున ఆశ్చర్యపోవుచు, చెప్పెదరు, “మంచిది, బ్రదర్ బ్రెన్హాం, నీవు ఎలాగు విడిచిపెట్టెదవు?” “విడిచిపెట్టుట,” అను దానిపై మీరు అధికముగా వేదాంతమును విన్నారని నేను ఎరుగుదును. అనేక జనులు చెమటూడ్చి విడిచిపెట్టుటకు పని చేశారు. అనేక జనులు చుట్టూ వచ్చి, “నేను నలబై దినాలు ఉపవాసము ఉండెదను, కాబట్టి నేను ఏదో చేయగలను,” అని చెప్పెదరు. నీవు నలబై దినాలు ఉపవాసముండనక్కరలేదు. నీలో ఉన్న లోకమును విడిచిపెట్టు, దయ్యపు కార్యములన్నియు వదిలిపెట్టి, నీ హృదయములోనికి దేవుని యొక్క వాక్యము తీసుకొనుము. ఏ విధముగా నీవు చేయాలో నేర్పించబడెదవు. పైకి - క్రిందకి గెంతుట ద్వారా నీవు అది చేయలేవు, లేదంటే నలబై రోజులు ఉపవాసముండుట ద్వారా నీవు దానిని చేయలేవు. సర్వశక్తిగల దేవునికి నీ హృదయమును అప్పగించుట ద్వారా అది నీవు చేయగలవు.

49

చిన్న బిడ్డవలె. ఆ వెనుక నా చిన్న బిడ్డను నేను గమనించాను, ఈ ఉదయమున తన తల్లి అతనికి చిన్న చొక్కాను తొడిగించుటకు ప్రయత్నించుచున్నది. అతడు తన చిన్న చేతిని చొక్కా చేయి భాగములో పెట్టాలనుకున్నాడు, అతడు తన చేతిని అందులో పెట్టలేకపోయాడు. అతనికి తెలియదు ఏ విధముగా తొడగాలో, మీరు అతనికి తొడుగుట ఎలాగో నేర్పించవలసి ఉన్నది. అతడు తన చేతిని అందులో ఉంచాలని అనుకుంటున్నాడు, కాని దాని చుట్టూ కొట్టుచున్నాడు. అతడు చొక్క చేయి భాగములో అతడు పెట్టలేకపోయాడు. ఆ చొక్కా రంధ్రములో అతను పెట్టలేదని, ఆయనకు తెలియును.

కాబట్టి నీవు ఇంక చాడీలు చెప్పుట, అబద్దములాడుట, ప్రతీది చేయుచున్నప్పుడు, నీవు ఇంకా దేవునితో సరిగ్గా లేవు అని నీకు తెలియునా. నీవు ఎన్ని సంఘాలకు చెందినప్పటికి, నాకు అనవసరము — నీ ప్రాణము మార్పు మారుమనస్సు పొందేంత వరకూ, నీవు దేవునితో సరిగ్గా జీవించలేవు. సహోదరుడా, అది పాతకాలపు పద్దతి, కాని అది నిన్ను మరగబెట్టి, నీ ప్రాణమునకు రసాన్ని ఇస్తుంది. నిజము!

50

అతడు చేతిని అందులో ఉంచుటకు ప్రయత్నించెను, అతడు తన చేతిని అందులో ఎలాగున పెట్టాలో చెప్పుట ఎవరో ఒకరు నేరుగా చెప్పవలసియున్నది. అంతట, అతడు తన చేతిని ఆ చిన్న చొక్కాలో పెట్టినప్పుడు, అతను సరిగా యున్నాడని అతను ఎరుగును.

అది తిరిగి-జన్మించిన ప్రతీ క్రైస్తవునితో ఆ విధముగానే ఉండును. అతడు నిజముగా దేవునిలో ఉన్నప్పుడు, తన జీతము దేవుని వాక్యముతో సరిపోవును అని అతడు చూచుకోనును, మరియు ప్రతి భాగాన్ని దానితో క్రమముగా ఉండెనని గ్రహించుకొనును. అతడు దీర్ఘశాంతము, దయాళత్వము, నెమ్మదత్వము, సాత్వికము, శక్తి, విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము కలిగి ఉంటాడు. గంథరగోళముగా ఉన్న సముద్రమువలె అతడు ఎగురుట లేదు. ప్రతి చిన్న విషయమునకు అతడు బాధపడుట లేదు. మహాసముద్రములో కలిగే గాలి తుఫానుకు సీసా మీద బెరడు ఎగిరి గెంతులు వేసినట్టు అతడు ఇక్కడకు అక్కడకు ఎగిరి గంతులేయటం లేదు. అతడు కూర్చొనును! అతని హృదయము శుద్ధిగా ఉండును, అతని ఆలోచనలు శుద్ధమైనవి, అతని అభిరుచులు శుద్ధముగా ఉండును; అతని మనుగడలు సరిగ్గా ఉండును. దేవుని యొక్క వాక్యముతో తాను సరిగ్గా క్రమముగా ఉన్నానని అతడెరుగును. నరకము అతనిని కదల్చలేదు. అతడు దేవుని యొక్క వాక్యముచే సరికాబడెను. ప్రతి స్త్రీ, పురుషుల పట్ల అతడు హృదయశుద్ది, దైవిక ప్రేమ కలిగి ఉండును. అతడు కలిగి ఉండెను... అతడు లోక కార్యకలాపాల నుండి తప్పుకుంటాడు, అవి అతనికి చచ్చినవైయుండెను. అతనికి వాటితో ఇక ఎంతమాత్రము అవసరము లేదు.

ఎందుకు, పరిశుద్ధాత్మను పొందిన బాలికకు నీవు నీచమైన వస్త్రములు ధరింపచేయలేవు, దేనికొరకో ఆమెను బయటకు తీసుకురాలేవు. లేదయ్యా.

51

ఇప్పుడు, నీవు వెళ్ళి ఆమె తప్పు చేయుచున్నదని చెప్పనవసరము లేదు, కారణము ఆమె నిన్ను నమ్మదు, ఎందుకనగా అదంతా ఆమె ఎరుగును. అదే ఆమె సంతోషము. సాయంకాలమున బయటకు వెళ్ళుచూ, ఈ చిన్న వస్తువులను ధరించుకొను స్త్రీ, ప్రభుత్వ కార్యాలయము నుండి ఇంటికి వచ్చిన తన పురుషుని, [స్పష్టతలేని మాటలు] పెరటిలో గడ్డికోయు, అని చెప్పెదరు, మరియు అది సరి అని నాకు చెప్పెదరా? స్త్రీ మీరు - మీరు చెడ్డవారని నా భావము కాదు. మీరు దుర్నితిపరులు అని నేను చెప్పుట నా ఉద్దేశ్యము కాదు. అయితే, సహోదరీ, ఒక అపవిత్రాత్మ నిన్ను పట్టుకొన్నదని నీవు గ్రహించుట లేదు. దాని కొరకు నీవు ఏమి చేయుదువు? అది చల్లగా లేదని తెలుసుకొను బుద్ధి నీకుండవలసి ఉన్నది. అది వేడిగా ఉన్నది. అక్కడ అపవిత్రాత్మ ఉన్నది.

“నేనా?, నేను సంఘానికి వెళ్ళితిని!” అని నీవు చెప్పెదవు. నెబుకద్నెజరు గొప్పవాడే. అయితే, అతడు గర్విష్టి అయినందువలన, దేవుడు అతనికి ఎద్దు ఆత్మను ఇచ్చి, మరియు ఏడు సంవత్సరములు గడ్డిని తినిపించెను. మరియు ఈ చుట్టూ ఉన్న కొందరు స్త్రీలు పెంచుకున్న రీతిగా అతని చేతివేళ్ళ గోళ్ళను పెంచుకున్నట్లు చేసెను, అది వాస్తవము. అతడు దయ్యము చేత పట్టబడెను.

52

ఒక మనిషి దయ్యము చేత పట్టబడినవాడై, తన వస్త్రములను చింపివేసుకొన్నాడు. వారు అతనికి వస్త్రములను ధరింపచేయలేకపోయిరి. నా భావమేమిటో గ్రహించారా? అది వంచన చేయు ఆత్మలు.

మీ సంఘము దానినే ఆపు చేయుచున్నది. మీ బోధకులు ఏదైన చెప్పుటకు భయపడుచున్నారు, మీరు దశమభాగాల్ని చెల్లించరని భయపడుచున్నారు. అదే కారణము. అదే ఇబ్బంది. మై! ఎలాగున ఆ రాబందుల గుంపుకు వెళ్ళి బోధించి, ప్రారంభములోనే దేవునిలో మార్పుచెందిన వారిగా చేయగలవు? అవి అన్ని సమయాలలో ముక్కుతో చచ్చిన వాటిని తినును. ఖాళీ కాబడుటకు నీకు కావలసినది ఏమిటి, ఈ తీరము నుండి ఆ తీరము వరకూ పాత-కాలపు ఉజ్జీవము, దేవునితో స్త్రీ, పురుషులు సరికాబడుట. లోక కార్యములను వదిలివేయండి! అందమైన మృధువు కలిగి - నక్క నడకల బోధను వదిలివేయండి. ఆమేన్. సువార్తను భోధించుము. “మీరు లోకమును ప్రేమించిన, లేక లోకములో ఉన్నవి ప్రేమించినను, దేవుని ప్రేమ మీలో ఉండనేరదు,” అని దేవుడు చెప్పెను.

53

జనులు రాత్రంతయు కేకలు పెట్టుచూ, క్రిందికి - మీదకు గంతులేయగలరు, ఎండిన ఆవు చర్మముపై బఠాని గింజలు వేసినట్లుగా, భాషలలో మాట్లాడగలరు; తరువాత ఉదయమునే బయటకు నడిచి వెళ్ళి, బాగా కోపము తెచ్చుకొని, రంపపు జుంకారము వలె పోట్లాడుటకు నేరుగా వెళ్ళి, సంఘములో ఒకటి చేస్తారు, అది సంఘానంతటిని ముక్కలు చేస్తుంది. అది లోకములో ఉన్న వంచన చేయు ఆత్మ తప్ప మరొకటి కాదు. దయ్యపు ఆత్మలు! ఎక్కడ దేవుని, నిర్మలత్వము, పరిశుద్ధత ఉంటున్నదో ఆ వాక్యము నొద్దకు తిరిగి రావలసియున్నది. ఆమెన్. అది సత్యము. వంచన చేయు ఆత్మలు, దేవుని యొక్క వాక్యమును ముక్కలుగా చేయుచున్నవి!

54

కొంత కాలము క్రితము ఇక్కడ ఒక మనుష్యుడు ఒక చిన్న స్త్రీని కలిగియుండెను. [స్పష్టతలేని మాటలు] కేథోలిక్ వారు అక్కడ ఉన్నారు. ఆమె స్త్రీ ధర్మము ఆగిపోవు సమయమది, ఆమె చేతులలో నుండి మరియు నొసటీ నుండి రక్తము కారుచున్నది. ఒక పరిశుద్ధాత్మ బోధకుడని, నేను తలంచాను. ఆ మనుష్యుడు ఆమె చేతులో నుండి వచ్చుచున్నదాన్ని సిసాలో పట్టుకొని దానితో జనులను అభిషేకించుటకు వెళ్ళుచుండెను. హ్యు! కనికరము! అది అంత్యక్రీస్తు! రక్తము ఆమె ముక్కు నుండి గాని లేక ఆమె నొసటీ నుండి గాని, సహోదరుడా, అది ఎక్కడ నుండి వచ్చినను నేను లెక్క చేయను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్థానమును ఏ రక్తము తీసుకొనలేదు. నేను ఏ రక్తమునైనా ఎరిగియున్నానంటే, ఆ రక్తమును మాత్రమే ఎరిగియున్నాను. ఆమె ఒక చేతి నుండి నూనెను మరొక చేతి నుండి ద్రాక్షారసమును పోసినను. కాని నీవు మరో మతసంబంధమైనదిగా వాడినను, అది దయ్యము. బోధకులు అలాంటి వాటి కోసము ఎలాగున పడిపోవుచున్నారో చూశారా!

దేవుని వాక్యము నొద్దకు మరలుటకు, మార్గదర్శ గ్రంథము నొద్దకు వచ్చుటకు మనకు ఏమి కావలేను! ఇది దేవుని యొక్క వాక్యము, దీవించబడిన పురాతన బైబిల్. “మంచిది, బ్రదర్ బ్రెన్హాం, నేను అక్కడకు వచ్చుటకు భయపడుచున్నాను. నేను కొంత ఆనందమును కోల్పోవుదునేమోనని భయపడుచున్నాను,” అని చెప్పెదరు. కారణము ఏమిటి? ఆనందము అనగా ఏమిటో నీకు తెలియదు.

55

త్రాగుబోతులు బయటకు వెళ్ళుచు త్రాగుచుండగా, వారిని గద్దించను అని నేను చెప్పాను. అతడు మత్తులో ఉంటాడు. అతనికి తెలియదు. అతడు ఉదయమునే లేస్తాడు, తాను తగిలించుకున్న కోటును తీసుకొని, బయటకు వెళ్ళి, తను రెండు లేక మూడు బీరు సీసాలు తెచ్చుకొనును, మరియు బయటకు వెళ్ళి తన కొరకు కొంత విస్కీ మరియు అలాంటి మరేదో తెచ్చుకొనును. సిగరెట్టు పీల్చే అతను, వెనుకాల కూర్చొని పొగత్రాగుతాడు, అతడొక రవాణా బండి మాదిరిగా తన ముక్కులో నుండి పొగ వదులెదడు. అది అంతే, నేను అతన్ని నిందించను; అతను ఎరిగిన ఆనందము అంతా అదే. అతను ఏరిగినది అంతా అదే. స్వభావసిద్దముగా అతడు పంది.

సంతోషము కొరకై నీవు అలాంటే వాటిపై ఆనుకొని నీవు క్రైస్తవుడవని చెప్పుకొనుట సిగ్గుచేటు, పరిశుద్ధాత్మ సువార్త ఆనందము, ఒక గొప్ప పెద్ద శక్తిగల గృహము (power house) కాక మరొకటి కాదు. పరిశుద్ధాత్మ సువార్త, ప్రతి మనిషి కొరకు పరిపూర్ణమైన మైకమైయున్నది. అది ఆ మత్తును కలిగియున్నది. యేసుక్రీస్తు యొక్క సువార్తను త్రాగుము, పరిశుద్ధాత్మ నింపబడుము, నీవు ఈ లోకమును విడచినంత వరకు నీవు త్రాగుము. ఆమెన్. ఆనందము మాటలలో వర్ణించలేనిది. మరియు నిండైన మహిమ. అది ఒక ఎడబాయని ఉత్తేజము, రాత్రి పగలు త్రాగినను అది నిరంతరము ఉండే మైకము. ఆమెన్. అదే దేవుని యొక్క వాక్యము.

56

సంఘము వచ్చి మరొక కార్యమును స్వీకరించును. వినోదము కొరకై చిన్న విందును ఏర్పాటు చేసుకొని, వారందరూ అలాగున సముద్ర తీరమున వెళ్ళిపోవుదురు. సహవాసము కొరకై, ఒకరికొకరు కలుసుకొని పేకాట ఆడుకొందురు. అది సత్యము. కొన్నిసార్లు వారి సంఘసభ్యులలో ఒకరి ఇంట్లోను, కొన్నిసార్లు ఆలయము యొక్క బేస్మెంట్ లో నాట్యము చేయుదురు. నాట్యము చేయడం, దత్తత చేయడం, తృప్తి కోసము ఏదో ఒకటి చేయడం. కారణము ఏమిటి? ఏ విధముగానైన వారు ఒక పెద్ద పందుల గుంపు. వారు ఆరంభముతోనే పందులు. వారు ఎప్పుడైన క్రీస్తును కలుసుకొనుటకు వచ్చినట్లయితే, వారు చాలా ఆనందము కలిగియుంటారు, వారికి ఆ సంగతులు మధ్యరాత్రి కంటే ప్రియముగా ఉంటాయి. సువార్త, ఆత్మను త్రాగుట, ఆనందము, మాటలతో చెప్పలేనిది మరియు నిండైన మహిమ.

పాపిని గద్దించవద్దు; అతనిపై జాలిపడుము. తన పొగగొట్టమును పెట్టుకొని అతన్ని ముందుకు సాగిపోనిమ్ము, తన మందును తాను త్రాగనీ, తను పేకాట యొద్దకు వెళ్ళని. అదే అతని సంతోషము. అతని నిందించవద్దు. అలసి, సొలసి, ఇంటి యొద్దకు వచ్చును, తనకు కొంత సంతోషము కావాలని కోరుకుంటాడు. అయితే, నీవు చేయవలసినది అతని ఎదుట భయభక్తులు గల జీవితమును జీవించి, దానికంటే వేయి రేట్లు సువార్త ఆనందమును కలిగి ఉన్నదని ఆయనకు రుజువు చేయుము. [టేపులో ఖాళీ ఉన్నది.]

మరియు అతడు ఆ స్థితిలోనే చనిపోతే, ఆ త్రాగుడుతోనే అతడు నరకానికి వెళ్ళును, అదే దయ్యము యొక్క మైకము. ఆ పాత పొగగొట్టము లాగివేసి అతడు చనిపోతే, దేవుడే అతని తీర్పరి. అతడు నాట్యము చేయుచూ, నీచమైన వస్త్రముతో వీధులో పరిగెత్తి చనిపోతే, దేవుడు అతని తీర్పరి. అయితే అక్కడొక కార్యమున్నది: స్తెఫను వలే, అతడు దేవుని యొక్క ముఖమును చూచి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకించబడిన శక్తి క్రింద చనిపోవుచున్నపుడు, “నేను పరలోకము తెరువబడుటను చూశాను, మరియు యేసు కుడి పార్శ్వమున నిలబడుటను నేను చూశాను,” అని చెప్పెను. మార్టిన్ పక్షి తన పెట్టెకు చెందినట్లు, మీరు పరలోకమునకు చెందినవారు. ఆమేన్.

57

వంచన చేయు ఆత్మలు, దేవుని యొక్క వాక్యమును ముక్కలుగా చేయుచున్నవి. వదిలివేయండి. విడిచిపెట్టు.

“బ్రదర్ బ్రెన్హాం, నీవు అది ఎలా చేశావు?”

కేవలము విడిచిపెట్టు. నీవు చేయవలసియున్నది అదే. దేవుని వాక్యమును తీసుకొనుము. ఏమి చేయుటకు ప్రయత్నం చేయవద్దు. బలిపీఠము యొద్దకు చేరి, “దేవా, నాకు పరిశుద్ధాత్మను ఇవ్వు! ప్రభువా, నాకు పరిశుద్ధాత్మను దయచేయుము!” అని అరచి కేకలు పెట్టవద్దు, నీవు బలిపీఠము మీద బాదినంత మాత్రమున ఆయన రాడు. అది ఏ మంచి చేయదు. లేదు. అది వచ్చు మార్గము అది కాదు. ఆయన వాక్యములో నుండే ఆయనను తీసుకో.

పేతురును చూడండి. అతడు చనిపోబోవుచున్నవాడిగా పేతురు ఇబ్బందిలో ఉండిపోయాడు. మరియు నీళ్ళపైన నడుచుకొంటూ, ప్రభువు వచ్చుటను అతడు చూసెను. మరియు ప్రభువా, “అది నీవైతే, నన్ను వచ్చునట్లు ఆజ్ఞాపించుము,” అని అతడన్నాడు.

ప్రభువు చెప్పెను, “నడిచి రా.”

ఇప్పుడు పేతురు, “ప్రభువా, ఇప్పుడు ఒక్క నిమిషమాగుము, నేను నీటిపై నడవగలనో లేదో చూచుటకు, నన్ను నలభై రోజులు ఉపవాసముండనీ. ఓ ప్రభువా, ఈ పడవలో ఆత్మతో నాట్యమాడి మరియు భాషలతో మాట్లాడుటకు నాకు సరిపడ్డంత ఆత్మను ఇవ్వండి, అప్పుడు నేను నడవగలను,” అని చెప్పెనా. లేదయ్యా. అతడు దేవుని యొక్క వాక్యమును తీసుకొనెను, వదిలివేయండి మరియు విడిచిపెట్టు, దేవుడు అతనిని దాని నుండి పట్టుకొనెను.

58

ఏమిటి, దేవుడు మోషేను కలుసుకొన్నప్పుడు, మరియు ఆయన ఇలా చెప్పెను, “మోషే, ఐగుపుకి వెళ్ళి ఫరోతో ఇలా చెప్పు, 'నా ప్రజలను వెళ్ళని,'” అని చెప్పెను. మోషే ఇలా చెప్పినట్లయితే, “మొదట నన్ను నలభై రోజులు ఉపవాసముండనీ, దేవా, నేను మీకు విధేయత కలిగి సరిపడ్డా విశ్వాసము ఉన్నదో లేదో చూడనీ. ప్రభువా, ఏదో ఒకటి నాకు ఇవ్వండి. మీరు నాకు ఏదో ఒకటి చూపండి. మీకు ఏదో ఒకటి చెప్పనివ్వండి, నన్ను చూడ నివ్వండి, మొదటిగా నేను ఆత్మను పొందుకున్నానా లేదా చూడనిమ్ము.” మోషే ఎన్నడూ ప్రశ్నించలేదు, అతడు దేవుని వాక్యమును ముందుగా తీసుకొని వెళ్ళిపోయెను. అదే విధంగా నీవు వాక్యమును తీసుకొని చేయవలసియున్నది. అపుడు నీవు చేయగలవని నీవు తెలుసుకొంటావు. ఆయన ఇంకా ఏదో సంభవించినంత వరకు అతడి వేచియుండలేదు; ఆయన ముందుకు వెళ్ళి మరియు దానిని చేసెను.

59

కర్మెలు పర్వతం నుండి దిగి వచ్చిన ఏలియా విషయం ఏమిటి? అతడు ఎంతో కాలము అక్కడున్నాడు? మరయు అతడు పేద విధవరాలిని కలుసుకొనెను. ఆమె ఒక పరాయి స్త్రీ, ఒక అన్యురాలు. మరియు అతడు ఆమెను అక్కడ కలుసుకొన్నపుడు, అడవిలో ఆమె కొన్ని కర్రలు ఏరుకొనుచుండెను. మరియు దేవుడు అతనికి చెప్పెను, “ఆ విధవరాలి గృహము నొద్దకు వెళ్ళుము,” అని చెప్పెను. బోధకుడు పోవుటకు ఎటువంటి స్థలమది. అంతట అతడు విధవరాలి గృహము నొద్దకు వెళ్ళెను. మరియు ఆమె చేసినది, ఆమె రెండు కర్రలను కలిగియున్నది. “ఏమి చేయుచున్నావు?” అని అన్నాడు.

“కొన్ని కర్రలు ఏరుకొంటున్నాను. నా దగ్గర రొట్టెలు చేసుకోవటానికి సరిపడ్డా పిండి మాత్రమే ఉన్నది. అది మాత్రమే మిగిలి ఉన్నది. మూడు సంవత్సరముల నుండి మాకు వర్షము లేదు,” అని చెప్పినది. “అంతట నేను దీనితో రొట్టెలు చేసుకోబోవుచున్నాను. నేను, నా కుమారుడు వీటిని తిని చనిపోబోవుచున్నాము,” అని చెప్పినది.

ఓ, హల్లెలూయా! “మొదటిగా, నాకు ఒకటి చేయుము,” అని అతడన్నాడు. నేను కొద్దిగా వెర్రివాడిగా యున్నాను, అని ఎరిగియున్నాను. ఏది ఏమైనను నేను ప్రభువు పక్షాన ఉన్నాను. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మొదటిగా నాకు ఒకటి చేయుము,” అని చెప్పాడు.

అక్కడే నీవున్నావు.

60

అదేమిటి? “మొదట ఆయన నీతిని మరియు దేవుని యొక్క రాజ్యమును వెదకుడి.” దేవుని యొక్క రాజ్యమును, మరియు ఒక చిన్న శబ్దమును కాదు; దేవుని యొక్క రాజ్యమును, మరియు కొంచెం ఉద్రేకమును కాదు; దేవుని యొక్క రాజ్యము మరియు కొద్దిగా ఇదీ లేక అది, కాదు; అయితే, “దేవుడు, ఆయన నీతి, మరియు అన్ని ఇతర కార్యములు నీలో కలిసిపోవును.” మొదట ఉంచుము... ఇప్పుడు, ఆ విధవరాలు అది విన్నది, “వినుట వలన విశ్వాసము కలుగును, దేవుని యొక్క వాక్యము వినుట వలన కలుగును.”

ఆమె అన్నది, “అది ప్రభువు యొక్క వాక్యము, ఎందుకనగా అతడే దేవుని యొక్క పరిశుద్ధమైన మనిషి, అతడు దేవుని యొక్క ప్రవక్త, మరియు అది సత్యమని నేనెరుగుదును. మరియు అదే దేవుని ఇప్పుడు, ఆమె ఏమి చేయాలో ఇరుగు పొరుగు వారిని అడుగుటకు పరుగెత్త లేదు. ఆమె వెళ్ళి, ఇతరులతో పంచుకొనుటకు ఆమె వెళ్ళలేదు. ఇరుగు పొరుగు వారికి చెప్పుటకై, ”ఇప్పుడు నీవు ఏమి ఆలోచించుచున్నావు? బోధకుడు నా ఇంటి యొద్దకు వచ్చి, ఇది ఇలా చెప్పాడు. సుసీ, దీనిని గూర్చి నీవు ఏమనుకుంటున్నావు?“ అని ఆమె అడగలేదు.

ఆమె ఖాళీ చేయుటకు లోపలికి వెళ్ళినది. ఆమె విడిచిపెట్టినది. ఆమె ఎక్కువగా పొందుకొనునట్లు, ఆమె కలిగియున్నదానిని విడిచిపెట్టినది. ఈ రోజు లోకానికి ఏమి కావలెనన్న, ఒక మంచి పాత-కాలపు పద్దతి, నీవు కలిగియున్నదానిని విడిచిపెట్టుట. హల్లెలూయా!

61

కాబట్టి ఆమె నిండుగా పొందుకోగలుగునట్లు, ఆమె ఖాళీ చేసెను. ఆమె కలిగియున్న నూనెనంతటిని ఖాళీ చేసినది; మరియు ఆమె కలిగియున్న నూనే నంతయును, ఆమెకున్న పిండినంతటిని, బోధకునికి, దేవుని రాజ్యము కొరకును ఖాళీ చేసినది. మరియు ఆమె అందులో ఉన్నదంతటిని ఖాళీ చేయుచున్నప్పుడు, దేవుడు దిగివచ్చి, కుండలో పిండిని నింపెను, బుడ్డిలో నూనెను నింపెను, ఆమె ఖాళీ చేసి మరల బోధకుని గిన్నెలో వేయుచున్నది. మరియు అది మరలా నింపబడుచుండెను. అతడు ఖాళీ చేయుచుండెను. ప్రతీసారి ఆమె ఖాళీ చేయుచున్నది, ఆయన నింపెను.

ఈనాడు, నేను చెప్పెదను, మనుష్యుడా, క్రైస్తవునిగా నటించుచున్న దానంతటిని, బుద్దిహీనతనంతటిని తీసివేసి, పరిశుద్ధాత్మ దాని స్థానమును తీసుకొననిమ్ము, అక్కడ ఉజ్జీవము ప్రారంభించబడి ఎనిమిది మరియు పెన-వీధి దేశమంతటను తుడిచి వేయును. బుద్దిహీనతను విడిచిపెట్టు, దేవుని వాక్యము నొద్దకు మరలుము. నీలో నింపబడినంతటిని ఖాళీ చేయుము. దేవుడు వచ్చుటకై, నీవు ముందుకు సాగిపో, నీవు ఖాళీకాబడు, దేవుడు నిండుకొనును. ఈ అల్ప విషయములను విడిచిపెట్టు, “నీవు ఇది చేయవలసి ఉన్నది, నీవు అది చేయవలసి ఉన్నది; నీవు అది చేయవలసి ఉండెను, నీవు ఇది చేయవలసి ఉన్నది.” దాని మర్చిపో. నీ ప్రాణములో నుండి దానిని ఖాళీ చేయుము. “దేవా, ఈ దినము నుండి నా సమస్తము నీవైయుండనిమ్ము. ప్రభువా, విరిగిన హృదయముతో నేను వచ్చాను. నలిగిన ఆత్మతో నేను వచ్చాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు తెలుసు. ఈ నలభై దినముల ఉపవాసము యొక్క ఈ బుద్దిహీనతనంతటిని మర్చిపోవాలని కోరుచున్నాను. మరియు ఇది, అది, మరొకటి అటువంటి బుద్దిహీనతను విడిచి, దేవునికి సమీపంగా రావలసియున్నది.”

నిలుపు చేయుము!

62

నలబై దీనముల ఉపవాసము ఉండండి అని దేవుని వాక్యములో ఎక్కడ ఏమి చెప్పబడటం లేదు. అటువంటి కార్యము లేదు. దేవుడు నీకు చెప్పకుండా, లోకములో ఏదియు నిన్ను ఉపవాసముండమని ఎక్కడా చెప్పదు. నీవు ఉపవాసమున్నట్లయితే, నీవు వీటన్నిటి గుండా వెళ్ళవు, నీవు ఆకలిగొనవు. నీవు ఉపవాసమునప్పుడు, సహోదరుడా, నీవు అన్ని వేళల్లో సంతోషముగాను, ఆనందముగాను ఉందువు. “వేషదారివలే ఎంతో ముఖము వికారముతో, మనుష్యులు ముందు కనిపించుకోవద్దు. నలబై దినములు నేను ఉపవాసముండగా, నా పళ్ళెము నాకేమియు సరిపోలేదు. నేను మూప్పై పౌండ్ల బరువు కోల్పోయాను, మరియు ఇది గడిచిన తరువాత ముందుకన్నా ఇప్పుడు చూచుటకు బాగున్నాను అని వారు చెప్పారు,” అని చెప్పవద్దు. ఓ, అది బుద్దిహీనత. అది దయ్యము యొక్క వంచన చేయు ఆత్మలు.

బలిపీఠము యొద్ద నిలబడి మరియు ఇలా, “మహిమ, మహిమ, మహిమ,” అని ఏ మాట పలుక లేనంతవరకూ చెప్పు, “నీవు పరిశుద్ధాత్మను పొందుకొనుటకు ముందు నీవు భాషల్లో మాట్లాడవలసివున్నది,” అని చెప్పుదురు. బుద్దిహీనత. దానిని ఖాళీ చేయు! నీ పద్దతులలో నుండి దానిని బయటకు తీసి మరియు దేవుని యొక్క వాక్యము నొద్దకు రమ్ము! “మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అపుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు,” అని ఆయన చెప్పెను. దేవుడు ఆయన మాటను నిలబెట్టుకొనకపోతే, ఆయన దేవుడే కాదు. ఆమేన్. ఖాళీ చేయుము; నింపబడుము. ఆమెన్. హ్యు! నేనది ప్రేమిస్తాను; అది ఆయన వాక్యము. దేవుడు అలాగున చెప్పెను. అది సత్యము. మరియు దేవుడు అది చెప్పినప్పుడు, దేవుడు దానికై జాగ్రత్త వహించును. అది సరే. నీవు చేయు సిద్దపాటులన్నియూ, సంఘాని వెళ్ళుట నీవు చేయునవన్నియూ...

63

ఇక్కడ కార్లు తయారుచేయు దగ్గర వారు ఎక్కడయితే, పెద్ద కార్లు గుంపు.... రవాణా వాహనముల పెద్ద గుంపు కార్లు తయారుచేయుదురో, అక్కడ నేను అక్కడ పనిచేసేవాడిని. వారు పెద్ద బోగీలను నిర్మించి మరియు ప్రతి దాని చుట్టూ దేవదారు చెక్కను పొదిగి, ప్రతీది అందముగాను మరియు గట్టిగాను చేసి, పట్టాలపై దాని ఉంచెదరు, మరియు అది తలుపుకు మేకు కొడితే, ఎలాగుండిపోవునో అలాగే నిర్జీవముగా ఉండిపోవును. అక్కడ ఇంజను పెట్టబడుచున్నది, కాని ఆవిరి ఉండదు; అది అక్కడ అలాగునే ఉంటున్నది.

ఈనాడు దానికి అవసరమైనది ఏమనగా, బాయిలర్లో అగ్ని. ఈ రోజున దానికి ఏమి కావలెననగా కొంత ఆవిరి. ఈనాడు సంఘము మండుటకు ఏమి కావలెను; నీ జీవితములో ఉన్న పాపమును మరగబెట్టి, వేడిచేయునది ప్రేమైయున్నది. ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగిలేకపోతే, మీరు చూడని దేవుని ఎలా ప్రేమించగలరు? ప్రేమ విస్తారమైన పాపములను కప్పును. దేవునితో ప్రేమ కలిగియుండుడి, అంతట ఒకరినొకరు ప్రేమించెదరు, అప్పుడు నీవు సంఘమును ప్రేమించెదవు, నీవు కారణమును ప్రేమిస్తావు, దైవసంబంధమైన ప్రతీ వస్తువును ప్రేమిస్తావు; అప్పుడు లోకము యొక్క కార్యములన్నిటికి దూరముగా ఉండెదవు.

64

వంచన చేయు ఆత్మలు జనుల మధ్యకు వెళ్ళి, ఇది - అది, లేక మరొకటి అని చెప్పుచుండును, “వారు ఇది చేయవలసి ఉన్నది; వారు అది చేయవలసి ఉన్నది.” అది ఎందుకనగా సంఘ శాఖలవారు లేచి, వారు కొద్దిగా ప్రత్యక్షతను పొందుకొని, “మంచిది, ఇప్పుడు, ఆ మనిషిని నేను నమ్ముదును... నేను బైబిల్లో కేకలు వేయుట అను ఫలానా కార్యమును నేను నమ్ముదును,” అని చెప్పెదరు. అది సరే, అది సత్యము. దాని నుండి సంఘ శాఖను తయారు చేసిరి: “నీవు కేకలు పెట్టినప్పుడు, నీవు అది పొందుకున్నావు.” కాని నీవు పొందుకోలేదు.

తరువాత మరొకరు లేచి, “భాషల్లో మాట్లాడు,” అని చెప్పెదరు. అది నిజము; అది బైబిల్ లో ఉన్నది. “అయితే ఎప్పుడైతే నీవు భాషల్లో మాట్లాడావో, నీవు అది పొందుకున్నావు.” కాని అనేకులు భాషల్లో మాట్లాడిరి గాని, దానిని పొందుకోలేదు, చూశారా. అది కాదు. కాదయ్య.

వారిలో అనేకులు, “మంచిది, మేము ప్రవచనము కలిగియున్నాము,” అని చెప్పెదరు.

65

వారి తలపై కొమ్ములు పెట్టుకొని వున్న ఈ ప్రవక్తలను పరిశీలించండి, పైకి క్రిందికి ఎగురుచూ ప్రవచించుచున్నారు. మికాయా, “మి ప్రతి ఒక్కరు అబద్దమాడుచున్నారు,” అని చెప్పెను. ఆమెన్. సరే. దేవుడు ఆ విధముగా రాడు. దేవుడు యధార్థ హృదయుల దగ్గరకు, విరిగి నలిగిన ఆత్మల యొద్దకు వచ్చును. “కన్నీళు వీడుచుచు విత్తువాడు, నిస్సందేహముగా ఆనందమనే పంటను కోయును. తమతో ప్రశస్తమైన పంటను తెచ్చుకొందురు.” ఆమేన్. స్నేహితులారా, దానిని సరి చేసుకొనుము.

కాబట్టి దయ్యపు శాస్త్రములో ఎంతో, దయ్యములు మానవ ప్రాణాలలో పనిచేస్తున్నవి. దాని ఫలాలు ఎక్కడ పుట్టిస్తున్నదో గమనించు. ఒక వ్యక్తి ఎటువంటి జీవితమును జీవిస్తున్నాడో గమనించు. వారు చేయు నటనను, వారు చేయు పనులను, వారు చేయు ఆశయాలను కనిపెట్టుము. అది అసాధ్యమువలే ఉంటున్నది... మరియు నేను మీకు అది చెప్పినట్లయితే, “ఒకే మార్గము మాత్రమే... ఇక్కడ వరుసగా కార్లు ఉంచబడినవి; పరలోకము చార్లెస్-టౌన్లో ఉన్నది.; నీవు నడిచి వెళ్ళలేవు; నీవు కారులో మాత్రమే వెళ్ళగలవు. మరియు ఆ గీతను దాటు ప్రతీ మనిష్యుడు ఐదు గేలనుల ఇంధనమును తప్పనిసరిగా తెచ్చుకొనవలెను. ఇక్కడ తన కారు ఉన్నది; కాని అతడు ఇంధనము కలిగిలేకపోతే, అతడు దానిని నడపలేడు. మంచిది, ఖచ్చితముగా, పరిపూర్ణముగా పరలోకమునకు పరిపూర్ణముగా అదే మార్గము. దేవున్ని కలిగిలేక నీవు చనిపోతే, నీవు ఎన్ని కార్లు నిర్మించిన ఎంతమంచిగా నీవు జీవించిన, నేను లెక్క చేయను. దేవుని యొక్క రాజ్యములోనికి నిన్ను లాగుటకు దేవుని యొక్క ప్రేమ అక్కడ లేకపోతే, నీవు నశించినవాడవే.

66

అక్కడ నెగటివ్ మరియు పాజిటివ్ రెండును ఉన్నవి. భూ-తీగ లేకపోతే, కరెంటును నీవు పాజిటివ్ లో ఎంత నడిపించినప్పటికీ అది వెలుగదు. అది సత్యము. దేవుని యొక్క ప్రేమలో నీవు వేరు పారవలసి ఉన్నది. ఓ, సహోదరుడా! నెగిటివ్ మరియు పాజిటివ్ అను ఈ రెండు కలిసినట్లయితే, నీవు పాత-కాలపు సువార్త వెలుగు వలె నీవు వెలుగును కలిగియుందువు. అది తీరము నుండి తీరము వరకు వ్యాపించనియ్యుడి. అది లేకుండా నీవు ఎన్నడు దానిని కలిగియండలేవు. పాజిటివ్ తో నీవు ఎంతగా ఎగిరి గంతులేసి, వణికినా లెక్క లేదు, వెలుగు ప్రకాశించుటకు నీవు భూ-తీగను కలిగియుండవలసినదే. ఆమెన్.

నీవు ఎన్నడైన గమనించావా? భూ-తీగను మీరు ఇక్కడ ఉంచి, మరియు ప్రతి చిన్న భాగము నేరుగా సబ్ స్టేషనుకు వెళ్ళి, అక్కడ భూమిలో కలిసిపోవును. మరియు ఒక మనుష్యుడు ప్రతి సమయమున దేవుని వాక్యముతో పెనవేయబడవలసి ఉన్నాడు, అది తనను కల్వరీలోకి పాతుకుపోవుటకు తీసుకుపోవును. అదుగో, ఆ దురాన ఎక్కడ లంగరు వేయబడునో, ఆ దేవుని యొక్క స్థానమునకు తీసుకువచ్చును. అది సువార్త యొక్క వెలుగును ప్రకాశించును. ఆమేన్.

67

విషయమేమిటో మీకు తెలుసా? జనులు ఇక్కడున్న చల్లటి నామకార్ధమైన చచ్చిన శవాలున్న సావడిలో, వారు సువార్తను ప్రకటించినట్లు నటిస్తారు. (ఈ దేశములో ఉన్న పెద్ద సంఘ శాఖ అయిన కేథలిక్ కానీ మరో పెద్ద సంఘశాఖకు చెందినవాడు), ఒక చిన్న బోధకుడు నిన్న నా యొద్దకు వచ్చెను, “బ్రదర్ బ్రెన్హాం, నేను కొంచెము వ్యాధితోను అలసటతో ఉన్నాను,” అని అతడన్నాడు. “వారు మమ్మల్ని అందరిని బోధకులుగా చేయుచూ, మాకు అంగీలు ధరించుచున్నారు. మరియు కొన్ని కార్యములు బోధించుచున్నారు. ప్రతి మూడు నెలలకు వారు మేము ఏది బోధించవలెనో చెప్పుదురు,” అని అన్నాడు. “ఇక ఎంత మాత్రము నేను దానిని సహించలేను,” అని అన్నాడు. “నేను ఏమి చేయాలి? బయటకు వెళ్ళిపోయి సువార్తను బోధించవలెనా?” అని అతడడిగాడు.

“బ్రదర్, నీవు ఎంత కాలము ఆ సంఘ శాఖలో ఉంటావో అంత కాలము దానిని గౌరవించుము. ఏదైతే, వారు కలిగియున్నారో దాన్నే నీవు చెప్పు, కాని నీ యొక్క ప్రెసిడెంటు లేక రాష్ట్ర సూపర్నెంటు యొద్దకో వెళ్ళి, ఇలా చెప్పు, ”అయ్యా, నేను దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించితిని. ఇక్కడ దేవుని యొక్క వాక్యమున్నది. మీరు దాన్ని బోధించుటకు నాకు అనుమతిని ఇచ్చినట్లయితే, నేను మీ సంఘములో ఉంటాను. మీరు అనుమతిని ఇవ్వనట్లయితే, నేను వెళ్ళిపోయెదను. దానిని ఎవరికో ఒకరికి అప్పజెప్పండి,“ అని నేను చెప్పాను. అది చేయుటకు అదొక్కటే మార్గము. డొంక తిరుగుడుగా ఉండరాదు. నెగిటివ్ గా ఉండొద్దు. బయటకు వచ్చి సరైనది ఏమిటో చెప్పండి. నిజము.

“బ్రదర్ బ్రెన్హాం, నాకు సంఘ సభ్యులు ఉంటారని నీవు అనుకుంటున్నావా?” అని అతడన్నాడు.

“ఎక్కడ పీనుగు ఉండునో, అక్కడ పక్షిరాజులు ప్రోగవును,” అని నేను చెప్పాను. అది వాస్తవము, అవి వెంబడించును.

68

ఒకప్పుడు, ఒక మనిషి కోడి పిల్లలను పొదిగించాడు. ఇప్పుడు, ఇది సరసోక్తి కాదు; ఇది సరసోక్తి కొరకు కాదు. ఇది ఒక అంశము కొరకు చెప్పుచున్నాను. అతడు తన కోడిపెట్టను పొదిగించబోవుచుండగా, అతనికి తగిన గ్రుడ్డులు లేవు. అతడు ఒక బాతు గ్రుడ్డును దాని క్రింద పెట్టి పొదిగించాడు. మరియు అవి అన్నియు పొదగబడిన తరువాత, బాతు విచిత్రంగా కనిపించినది.

కాబట్టి ఆ కోడి పెట్టి తన కోడిపిల్లలను క్లక్ అని పిలిచినప్పుడు అవి అన్నియు వచ్చినవి, కాని ఈ బాతుకు ఆ భాష అర్థము కాలేదు. కాని ఒకనాడు, ఆ కోడి పెట్ట వాటిని ధాన్యపు కొట్టు దగ్గరకు నడిపించింది. ఆ ధాన్యపు కొట్టుకు వెనుకాల అక్కడ ఒక చిన్న కాలువ ఉన్నది. ఆ చిన్న బాతు నీటి వాసన పసిగట్టినప్పుడు, అది నీటిలోనికి వెళ్ళి ఎంత బలముగా వెళ్ళాలో అంతగా వెళ్ళిపోయినది. ఆ పెద్ద కోడిపెట్ట, “క్లక్, క్లక్, క్లక్,” అని పిలిచెను. మరియు చిన్న బాతు, “హాంక్, హాంక్, హాంక్,” అనుకుంటూ నీటిలోనికి తన తలను పెట్టినది. ఎందుకని? స్వభావముతోనే అది బాతు. సహోదరుడా, అది నీటి వాసన పసిగట్టినప్పుడు, అది దానికి దూరముగా ఉండలేకపోయినది, అది బాతుగా ఉండెను కాబట్టి.

69

మరియు నేడు నేను చెప్పుచున్నాను, ఏ జనులైనా దేవున్ని నిజముగా కనుగొనవలెనని అనుకొనుచున్నారో, వారు ఇలాగున లేక మరో విధముగా జీవించకూడదు అని సంఘము వారికి ప్రోత్సహించనవసరము లేదు. దేవుని స్వభావము నీలో ఉన్నప్పుడు, నీవు పరిశుద్దతలోనికి వెళ్ళెదవు; నీవు సరైన కార్యములు వైపు వెళ్ళెదవు. సత్యము కొరకు నీవు నిలబడెదవు; సత్యమును నీవు జరిగించెదవు. నీ ఆలోచనలు సత్యముగానే వుండును; నీవు సత్యము కోసము జీవిస్తావు. నీవు బాతువు అయితే, నీవు నీటిని ఇష్టపడెదవు. నీవు క్రైస్తవుడవు అయితే, నీవు క్రీస్తును ఇష్టపడెదవు. నీవు దయ్యపు వాడవైతే, దయ్యపు కార్యములనే ఇష్టపడెదవు. నీవు రాబందువు అయితే, నీవు చచ్చిన దానిని తినేదవు. నీవు పందివైతే, నీవు పెంటకుప్పను తినెదవు.

ఈ దినాన నీవు ఎక్కడున్నావు? సరే. ప్రభువు యొక్క కార్యములను తింటున్నానని చెప్పుచూ, అంతట వెళ్ళి దయ్యముతో పెనవేసుకొనుచున్నావా? దానిలో ఏదో తప్పిదమున్నది. ఆ ఆత్మలు చెప్పు మాటలను విడిచిపెట్టు; అవి దయ్యములు. నీవు ఒంటరిగా నిలబడవలసినప్పటికి పరవాలేదు. స్త్రీ, పురుషులు ఎవరైన దేనికైన వెలను కలిగినవారు ఎవరు అంటే, అది దేవునితో ఒంటరిగా నిలబడిన స్త్రీ, పురుషులే.

70

మికాయాను పరిశీలించండి, అతడు అక్కడ ఏ విధముగా నిలబడెనో, జీబ్రాల్టర్ యొక్క బండ వలే కాదు, కాని యుగముల బండ. “నేను ఏమియు మాట్లాడను... సెమినరీ ఏమి చెప్పినా నేను లెక్క చేయను. నా సంఘ సభ్యులు ఏమి చెప్పినా నేను లెక్క చేయను. రాజు ఏమి చెప్పినా, నేను లెక్క చేయను. వారు నా తల నరికి వేసినప్పటికి, దేవుడు నా నోటిలో ఏవైతే, పెట్టెనో దానినే నేను చెప్పెదను,” అని అతడన్నాడు. అతడు సరైనవాడు. అతడు సరైనవాడు.

ఈ దినాన స్త్రీ మరియు పురుషులు, లోకము నీ కొరకు ఏమి కలిగియున్నదో, ఏమి వేడుకుంటున్నదో, ఎవరు ఎటువంటి కీడు కలుగజేయు సూక్ష్మజీవులను కలిగియున్నారో అను దాని మీద శ్రద్ద చూపించుట లేదు మరియు, “నీవు సంఘములో చేరితే, అంతా సరిగ్గానే ఉంటావు,” అని చెప్పుచున్నారు. అవి నిశ్చయములేనివి, అబద్దము. ఎందుకని? ఇంకా నీవు పాపమనే వ్యాధిని కలిగియున్నావు. అది వాస్తవము. కాని సహోదరుడా, నేను నీకు ఒకటి చెప్పెదను, అది నిన్ను పాపము నుండి నివారించును: ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా రమ్ము, మరియు పరిశుద్ధాత్మతో నింపబడుము, అది సమస్త పాపము నుండి నిన్ను నివారించును, మరియు నీ కోరికలు పరలోకసంబంధమైనవిగా యుండును. మరియు లోక కార్యములకై నీకు సమయముండదు. మనము ప్రార్థించుకొందుమా.

71

మా పరలోకపు తండ్రి, జనులపై ఉన్న ఈ వంచన చేయు ఆత్మలను మేము చూచుచున్నప్పుడు, వారు దేవుని యొక్క కార్యములను వ్యర్థముగానెంచుదురని ఎరుగుచున్నాము, ఈ దినాన ఇక్కడున్న ప్రతి స్త్రీ, పురుషులను మీరు పట్టుకొనమని, దేవా, నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారి జీవితములు వాక్యముతో సరికాబడలేదని వారు గ్రహించు దినము ఇదే అగును గాక. ఆ దయ్యము పాత సత్య కథల పుస్తకమును నిజముగా తీసుకొని, లోకములో ఉన్న ఆ పాత రోత కలిగిన చెడ్డ కథలను, పాత అపవిత్రమైన సినిమాలను టెలివిజన్ ద్వారా, అటువంటి చెడ్డ దృశ్యములను వినునట్లుగాను చేయుచున్నది.

ఓ, దేవా, ఒక క్రైస్తవుడు అటువంటివి చూచుట అసాధ్యము! దేవా, అది మమ్ములను వ్యాధిగ్రస్తులనుగా చేయును. వాంతి వలే, అది మిమ్ములను వ్యాధిగ్రస్తులనుగా చేయునని మీరు చెప్పియున్నారు. “ఒక కుక్క తన వాంతికి తానే తిరిగినట్లుగా మరియు ఒక పంది తన బురదలోనికి వెళ్ళినట్లుగా,” అని మీరు చెప్పారు. ఒక ముసలి కుక్క ఏదో వాంతి చేయును. సగం జన్మించిన ఆ ఒకరిని చూడు, బహుశా వేషదారి అయిన ఒక వ్యక్తి బలిపీఠము నొద్దకు వచ్చి వెళ్ళిపోయి, లోకములో దానిని వాంతి చేయును, ఇంకా సరిగ్గా అక్కడే ఉంచుకొనును మరియు వారు మరగ తిరిగి వచ్చి మరియు అదే వాంతిని తినును.

ఓ, దేవా, ప్రభువా, మీ గృహమును శుభ్రపరచండి. హల్లెలూయా! పాత-కాలపు ఒప్పుకోలు కలిగిన పరిశుద్ధాత్మను పంపండి, అది, తన ప్రాణమును శుభ్రపరచి మనుష్యుడు కలిగిన ఆశను శుభ్రము చేయును. మరియు అతనిని శుభ్రపరచి, అతనిని ఒక పరలోకపు జీవిగాను చేయును. అతనికి ఇవ్వండి... పక్షిరాజువలె అతని ప్రమాణమును యవ్వనపరచండి. అతడు ఈ లోక కార్యములను అధిగమించి, పరలోకమంత ఎత్తునకు ఎగిరిపోయి, ప్రభువా, అదుగో దూరము నుండి వచ్చు ఇబ్బందులను అతడు చూచులాగున, దాన్ని అనుగ్రహించండి.

నీ యొక్క ప్రవక్తలను పక్షిరాజులుగా పోల్చియుంటివి, వారు ఆ పక్షిరాజు నేత్రము కలిగినవారై, అతడు ఎత్తునకు వెళ్ళి, అది అక్కడ జరుగక మునుపే చాలా దూరముగా చూడగలుగుచుండెను. ఓ, దేవా, ఈ చిన్న సంఘాన్ని దీవించండి. ఇక్కడికి వచ్చిన ఈ జనులను దీవించండి. ఈ దినాన్న ద్వారములో ఉన్న కొత్త వారిని దీవించండి. ఈ వర్తమానము ఏ వ్యక్తికి, వ్యక్తిగతముగా చూపించబడలేదని, అయితే నేరుగా ఖచ్చితమైన వారికి, ప్రభువా, ఎవరైతే, ఎంతో అవసరతలో ఉంటారో వారికే వర్తిస్తుందని వారు తెలుసుకొందురు గాక; దేవుని యొక్క తీర్పు దినమున మేము ఇద్దరము కలుసుకొనేదమని ఒక దినమున వారు ఎరుగుదురు గాక. మరియు మేము ఎరిగిన సత్యమును చెప్పలేనందుకై మేము బాధ్యత కలిగియున్నామని ఎరుగుదుము గాక. తండ్రి, ప్రతి హృదయము పై అది ఉండునట్లుగా, నేను యేసు నామమున ప్రార్థిస్తున్నాను.

72

కొద్ది క్షణములు మన తలలు వంచియుండగనే, “బ్రదర్ బ్రెన్హాం, నేను ఈ చిన్న పాత విషయములతో నేను విసిగి మరియు అలసిపోయి యున్నాను. చాలా కాలము నుండి ఈ కొద్దిపాటి కార్యములు నన్ను వెంటాడుచున్నవి. నేను అలా వెళ్ళి, బయట విషయాలే మాట్లాడుచుంటిని. నేను చేయకూడని కార్యములను నేను చేయుచుంటిని, అది ఒక క్రైస్తవుని పని కాదు అని నేను ఎరిగియుంటిని. అది చేయుటకు నేను ఇష్టపడుటలేదు; నేను దానిని చేయగోరుటలేదు, అని దేవునికి తెలుసు. ఇంకను ఆ పాతకాలపు ఆత్మను ఎన్నడూ వినుటకు నేను ఇష్టపడను. అది నన్ను క్రీస్తులో ఉన్న నిజమైన ప్రేమ మరియు స్వాతంత్ర్యమును నా జీవితమంతటి నుండి కృంగజేస్తుంది. బ్రదర్ బ్రెన్హాం, నీవు నా కొరకు ప్రార్థన చేయవలెనని నేను కోరుకుంటున్నాను. అది ఈ దినాన నన్ను విడిచిపెట్టులాగున,” అని ఈ ఉదయమున ఇక్కడున్న మీలో ఒకరు చెప్పేవారు ఉన్నారేమోనని నేను ఆశ్చర్యపోవుచున్నాను. మీరు మీ చేతిని ఎత్తుదురా? ప్రతి ఒకరి తల వంచబడియున్నది. దేవుడు మిమ్మును దీవించును గాక. ఓ మై, డజనుల కొద్ది చేతులు!

కొద్ది పాటి చిన్న చిన్న విషయాలు సంఘములో గడబిడ రేపి, మీరు మాటలాడునట్లు లేక ప్రారంభించునట్లు చేయును. ఓ, అది భక్తిహీనత. అవి సహోదరుల మధ్య విభేధాలు కలుగజేస్తాయి. అది చేయవద్దు. నీకు అది అవసరము లేదు.

73

ఆ చిన్న విషయాలు, ఆ కృంగజేసేవి, అలాంటి ప్రతీ కార్యములు నీకు అవసరము లేదు. వాటికి దూరముగా ఉండుము.

“దేవా, అది నాకు ఇకను వద్దు, వాటితో నేను విసిగి మరియు అలసట చెందియున్నాను. ఈ రోజు నేను దాని నుండి విభేదించుకొనుటకు సిద్దముగా ఉన్నాను. ప్రభువా, ఇప్పుడు నేను వచ్చుచున్నాను, మరియు నా స్వబుద్దినంతటిని తీసివేయాలనుకుంటున్నాను. నా సహోదరుడా, నన్ను సరిగ్గా ఆదరించకపోయిననూ, ఏ విధముగానైనను నేను అతని కొరకు ప్రార్థిస్తాను. నా తండ్రి నన్ను సరిగ్గా ఆదరించకపోతే, ఏ విధముగానైను నేను అతనిని ప్రేమిస్తాను. నా భార్య గానీ లేక నా భర్త గాని నన్ను సరిగ్గా ఆదరించకపోతే, దీనత్వముతో, దేవుని యొద్దకు నేను వెళ్ళుదును. ప్రభువా, నేను కేవలం మీ రాజ్యమును మాత్రమే చూచుదును. నా మనస్సు నేరుగా ఉంచాలనుకుంటున్నాను. నా హృదయము సంపూర్ణముగా, ఆనందముతో ఉండాలని కోరుచున్నాను. నిజముగా నా చుట్టూ ఇబ్బందులు అలముకొనినా, నేను ముందుకు వెళ్ళాలని కోరుచున్నాను, ఇంకనూ మీతో ఉండి, నా చేతులను ఎత్తి, మీ ముందు నా హృదయమును పెట్టుదును, ప్రభువా, ఒక దినాన నేను నిన్ను కలుసుకొనెదనని ఎరిగియున్నాను. నాకు అటువంటి అనుభూతి అవసరము. ప్రభువా, ఈనాటి నుండే నన్ను అలాగున చేయండి,” అని చెప్పండి.

మీ చేతులు మీరు ఎత్తగలరా, కొంత సమయము క్రితం ఎవరో ఒకరు, వారి చేతులను ఎత్తనివారు? దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరి, మనము తలలు వంచుకొనియుండగా, ఒక చిన్న పాటను పాడుకొనెదము. అది ఎంత మంది వాస్తవము అని నమ్ముచున్నారు? ఇప్పుడు, ఆటలు ఆడవద్దు. ఇది ఆటలాడు సమయము కాదు. ఇది పొందుకొనే సమయము. నీవు తప్పక అది పొందుకొనవలసిన సమయము ఇదే. వచ్చి దానిని ఇప్పుడే ఖాళీ చేయుము, నీవు చేయుదువా? రండి, మీకు కలిగినదంతయు దేవునికి సమర్పించండి. “దేవా, నా యొద్ద ఎక్కువ ఏమియు లేదు. నేను ఒక సాధారణ గృహిణిని. నేను ఎక్కువేమియు చేయలేను. ప్రభువా, కానీ నేను మీ బైబిల్ గ్రంథమును చదువగలను, ప్రతిదినము నేను ప్రార్థన చేయగలను. నా మనస్సునందున్న చెత్తనంతటిని నేను తీసివేయగలను. పనికిమాలినదంతయు నేను త్రోసివేయగలను. ఆ బోధకుడు ఈ ఉదయమున చెప్పిన వాటన్నింటిలో నేను నేరస్తునిగా ఉన్నాను. కాబట్టి ఈ దినాన నేను దానిని ఖాళీ చేయుచున్నాను. అది నాకవసరములేదు. దేవా, నన్ను ప్రేమతో నింపండి. నాకున్న బహు ఘోరమైన శత్రువును సహితం ప్రేమించునట్లు చేయు కార్యములతో నన్ను నింపండి. అది నాకు నిజముగా అవసరమైయున్నది,” అని చెప్పండి.

74

ఆమె వాయించుచుండగా, మనము ప్రార్థన వాక్యముతో కూడుకొనుచుండగా, ఇప్పుడు మీరు వారి మధ్యకు వచ్చి, బలిపీఠము ముందు నిలబడలేరా, అది నిజముగా నీవు నమ్మినట్లయితే, నీవు దాని విడిచిపెట్టాలనుకున్నట్లయితే, నీవు నిజముగా యధార్థముగా రావాలనుకుంటే, నీ హృదయములో అది ఉంటే, ఈ దినాన నీవు ఎన్నడూ ఈ బలిపీఠమును విడిచిపెట్టవు. మరియు “బ్రదర్ బ్రెన్హాం, ఒక్క క్షణము ఇక్కడ నేను నిలబడుటకు వచ్చియున్నాను, అవును, నీవు నా కోరకు వ్యక్తిగతముగా ప్రార్థించుము,” అని చెప్పండి. నీవు ప్రార్థనకై రావలెనని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు వచ్చెదరా? మీ తలలు వంచియుండగానే, ఎవరు చేతులెత్తి బలిపీఠము నొద్దకు వచ్చి, బలిపీఠము చుట్టూ నిలబడేదరు?

నన్ను దాటిపోవద్దు, ఓ మంచి రక్షకుడా,

నా దీన మొర్రను ఆలకించుము;

ఇతరులను నీవు పిలచుచుండగా,

ఓ, నన్ను దాటి వెళ్ళకుము,

రక్షకా, రక్షకా,

నా దీన మొర్రను ఆలకించుము;

ఇతరులను నీవు పిలచుచుండగా,

ఓ, నన్ను దాటి వెళ్ళకుము.

75

నీవెంత కాలము నుండి క్రైస్తవునిగా ఉన్ననూ, నీతో మాట్లాడుతున్న ఆ చిన్న ఆత్మను నీవు ఇంకా కలిగియుండి, అది నిన్ను తేలికగా ఎగురునట్లు చేయును, మరొకరి గూర్చి మాట్లాడునట్లు చేయును. ఎవరో ఒకరు వచ్చి మరియు వెళ్ళి మరొకరితో మాట్లాడుచుండగా, నీవు వారితో చేరి, ఓ, వారిని పడవేయుదువు. సహోదరుడా, అది తప్పు. అలాగున చేయవద్దు. అది వాగ్దాన దేశానికి నిన్ను దూరముగా ఉంచును. నీవు కలిగియుండకూడని విషయాలు నీవు కలిగి యున్నట్లయితే, నిజముగా దేవుని యొక్క ప్రేమ నీ హృదయములో ఉండదు. నీవు స్త్రీవైనా, పురుషుడవైనా, నీవు నడిచి వెళ్ళి, “దేవా, ఇక్కడ నేను నేరుగా వెళ్ళి, దాన్ని ఖాళీ చేస్తాను, ఈ ఉదయమునే ఇక్కడే, ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా ఈ బలిపీఠము నుండి వెళ్ళెదను,” అని చెప్పండి. మీరు వచ్చెదరా?

76

మీరు ఒక పాపి అని ఎరిగియుండి, ఆయన మీ రక్షకుడని తెలియని, యేసు క్రీస్తుని ఎన్నడూ అంగీకరించని పాపిగా ఇక్కడ ఎవరైన ఉన్నారా? “బ్రదర్ బ్రెన్హాం, అవును, నాకు చాలా ఆనందముగా ఉన్నదని నేననుకుంటున్నాను. నేను నాట్యములకు మరియు విందులకు మొదలగు అన్ని కార్యములకు వెళ్ళుచుంటిని. నేను చెడ్డ సినిమాలు చూశాను. మరియు నేను చెడ్డ పుస్తకములు చదివాను. పాత పురాతనమైన రోత కథల పుస్తకములను నేను చదివాను. అది చదువుచూ నేనొక రకముగా ఆనందించాను,” అని నీవు చెప్పుదువు. సహోదరుడా, అక్కడ నీలో ఏదో తప్పిదమున్నది. అదే నీ ఆకలి. చూశారా, ఆ మనిషి ఏమి చదువుచున్నాడో నన్ను చూడనివ్వండి, అతడు ఎటువంటి వాటిని చూచుచున్నాడో నన్ను చూడనివ్వండి, ఎటువంటివి వినుచున్నాడో నన్ను విననివ్వండి.

ఒకానొక రోజున, ఒక వ్యక్తి నా కారులో వచ్చుచుండెను, ఒక రకమైన చెడ్డ తరహా సంగీతమును నా రేడియోలో పెట్టాడు. “అటువంటి కార్యమును అపివేయు, నేను దానిని వినగోరుట లేదు,” అని నేను చెప్పాను. ఒక రకమైన పాత బూగీ-వూగీ చేత్త.

“ఏందుకు, నేను దానిని వినాలని ఆశిస్తున్నాను,” అని అన్నాడు.

“నీ స్వభావము తప్పు, నీవు తప్పు,” అని నేనన్నాను.

77

నేను ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత, కొద్ది దినాల తరువాత, ఒకరితో కలసి ఆ పర్వతముపైనో లేక కొండ ప్రక్కనో చేపలు పట్టుచుంటిని. చిన్న పక్షులు పాడుచున్నవి, భరతపక్షులు కూతలు కూయుచున్నవి, ఆ ముసలి వాన కోయిల గాలిలో ఎగురుచున్నది, లేక కోయిల (రాత్రి పాడేడు కోయిల) స్తుతిస్తూ పాడుచున్నది. బాలుడా, అని నేను కేకలు పెట్టాను, “చూడు, బాలుడా, అదే నా సంగీతం. నా రేడియో అదే. [స్పష్టతలేని మాటలు] నేను ఇక్కడుండగా, నా కోరకు పాడుటకై దేవుడు వాటిని పంపెను. అది నా ప్రాణమును సేదతీర్చును,” అని నేనన్నాను.

ఈ పిచ్చితనము, ఈ సరసోక్తుల గుంపులు అరచునట్లు అరచుచు, వెళ్ళుట కంటే, ఎక్కడ మీరు ఆ బహిరంగ వీధులలో ఆహరము తినకుందురో అక్కడ తినుట మేలు. అది అంతా దయ్యపు ఆహరము. పాపముతో కలగలుపై పోయిన దయ్యపు పెంటకుప్ప అది. మీరందరు అందులో అతుకబడిపోయి, ఆనందించుట లేదా? వారి చిన్న పెట్టేలో ధనమును వేసినప్పుడు, మరియు ఈ లోక మురికి అంతటను వచ్చును, అని నీవు ఆనందించుచున్నావా? నీకు సిగ్గుచేటు! నీవు దిగజారినవాడవు. నీవు దేవుని నుండి తొలగిపోయినావు. నీకు దేవుడు తెలియదు. నీ పాపములను దేవుడు క్షమించెనని నీవు ఎరిగినట్లయితే, నీవు ఎన్నడూ అటువంటి బుద్దిహీనమైనవి వినవు. అది నీకు చచ్చినదిగా ఉండును. నీవు దానినీ వాంతి చేసుకొందువు. నీకు అది అవసరము లేదు. నీవు మంచి ఆహారమును తీసుకొనెదవు; నీవు దేవుని ప్రేమించెదవు. ఈ ఉదయమున నీవు ఈ తప్పిదముల కోసము మోకాళ్ళు వంచుటకు రావటం లేదా?

78

ఇక్కడ స్త్రీ, పురుషులు సరిగ్గా మోకరించి ఉన్నారు, వారు అనేక సంవత్సరాలుగా క్రైస్తవులే. నేను వారిని క్రైస్తవులు కాకుండా చేయటం లేదు, కాని నేను వారికి ఏమి చెప్పెదననగా, దయ్యము వారి చుట్టూ వ్రేలాడుచూ, వారిని సంపూర్ణ ఆనందమునకు దూరముగా ఉంచుచున్నదని చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మయే ఆనందమైయున్నది. మరి నేను నిద్రలేచి త్రాగుదును, త్రాగినవాడనై నిద్రించుటకు మంచము పైకి వెళ్ళుదను, నేను దినమంతా త్రాగుదును, రాత్రంతా త్రాగుదును. ఓ, నేను దానిని ప్రేమించెదను. దానితో నేను చేపల వేటకు వెళ్ళుదను, “నన్ను దాటిపోవద్దు. ఓ, మంచి రక్షకుడా, నా దీన మొర్ర ఆలకించుము.” నేను వేటకు వెళ్ళుదును, మరియు దేవుని యొక్క సుత్తి పాటలు పాడుచుందును. నేను వెళ్ళు ప్రతి చోట నేను బోధించెదను. నీవు ఆ విధముగా ఉండుటకు కోరుకొనుట లేదా? నిండైన పరిశుద్ధాత్మ నిన్ను ఉత్తేజపరచును. ఓ, మై! వారు పాడు మురికి పాటలను వినెదవా? నీవు పాడగలవా?

నేను వాగ్దాన దేశము కొరకు పట్టబడియున్నాను,

నేను వాగ్దాన దేశము కొరకు పట్టబడియున్నాను,

ఓ, ఎవరు వచ్చి నాతో వెళ్ళుదరు?

నేను వాగ్దాన దేశము కొరకు పట్టబడియున్నాను,

నేను వాగ్దాన దేశము కొరకు పట్టబడియున్నాను,

నేను వాగ్దాన దేశము కొరకు పట్టబడియున్నాను,

ఓ, ఎవరు వచ్చి నాతో వెళ్ళుదరు?

నేను వాగ్దాన దేశము కొరకు పట్టబడియున్నాను,

ఆ దీవెనకరమైన విశ్రాంతిని నేను ఎప్పుడు చేరెదను,

మరియు ఎప్పటికీ దీవించబడేదను!

నేను ఎప్పుడు నా తండ్రి ముఖమును చూచెదను,

మరియు ఆయన కౌగిలిలో నిద్రించెదను?

నేను వాగ్దాన దేశము కొరకు పట్టబడియున్నాను,

నేను వాగ్దాన దేశము కొరకు పట్టబడియున్నాను,

ఓ, ఎవరు వచ్చి నాతో వెళ్ళుదరు?

నేను వాగ్దాన దేశము కొరకు పట్టబడియున్నాను.

79

నీవు వారి వెంట రావా? సంవత్సరములో ఈ కాలములోనే ఈ నది ఒడ్డునే ఆ గొప్ప వేకువ చుక్క వచ్చి నది యొడ్డున ప్రకాశించుచున్నప్పుడు, ఐదు వందల మందితో దూరాన్న నిలబడి నూట-ఇరవై మందికి బాప్తిస్మము ఇచ్చుట నాకు జ్ఞాపకమున్నది. హల్లెలూయా! అందులో నుండి ఒక స్వరము మాట్లాడి, “ఒక దినాన్న నీవు లోకమంతటికి సువార్తను వ్యాప్తి చేస్తావు,” అని చెప్పెను.

ఏ విధంగా ఒక చిన్న పేదవాడు, విద్యలేనివాడు, పొలములో ఉండే ఒక చిన్న బాలుడు చేయగలడు? అది దేవుని యొక్క కృపయే! ఆమేన్. ఓ, ఎవరు వచ్చి వెళ్ళెదరు? ఇప్పుడు ప్రతి భారాన్ని ప్రక్కన విడిచి పెట్టుము, ఆ వంచన చేయు ఆత్మలు చెప్పేది వినవద్దు. వచ్చి, దేవుని యొక్క వాక్యమును విను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు! “నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు తృప్తిపరచబడి, ఆశీర్వాదముతో వారు నింపబడెదరు.”

80

ఈ బలిపీఠము యొద్ద మనము ప్రార్థన చేయబోవుచుండగా ఇప్పుడు మన తలలు వంచుకొందాం. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయమున మీరు జ్ఞాపకముంచుకోనవలేనని నేను ఆశపడుచున్నాను. నీవు ప్రతీ భారమును మరియు చాలా సులువుగా నిన్ను చిక్కులు పెట్టు ప్రతి పాపమును ప్రక్కన పెట్టుము.

పౌలు చెప్పెను, హెబ్రీయులు 12వ అధ్యాయములో, “ఇంత గొప్ప సాక్షి నమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి.”

“ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, నమ్సోను, యొఫ్తా, దావీదు, నమూయేలను వారిని గూర్చియూ, ప్రవక్తలనుగూర్చియ వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్ళను మూసిరి; అగ్ని బలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్దములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన పొందిరి; కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను, మరియు బంధకములను ఖైదును అనుభవించిరి. తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిరి. వీరందరు తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను, వాగ్దాన ఫలము అనుభవింపలేదు; మనము లేకుండ సంపూర్ణులు కాకుండు నిమిత్తము, దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్దపరచెను.”

“ఇంత గొప్ప సాక్షినమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.”

81

యేసు, ఆయన ప్రార్థనలో, “తండ్రీ, నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.” యేసు సంఘమునకు ప్రతిష్ఠ చేయుబడెను. ఆయన పెండ్లి చేసుకొనగలడు, కాని ఆయన అది చేయలేదు. ఆయన ప్రతిష్ఠ చేయుబడెను. “తండ్రీ, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము.”

ఇప్పుడు, ప్రతి భారాన్ని ప్రక్కన పెట్టండి. నీకు కోపమున్నదా? నిన్ను గూర్చి నీకు ఏదో ఉన్నదా, నీవు మాట్లాడునప్పుడు నీవు మాట్లాడకూడనిది మాట్లాడుతున్నావా? ఓ, దేవా! ఇప్పుడే అది అక్కడ పెట్టుము. అక్కడే దానిని పెట్టుము. బలిపీఠము యొద్ద నుండి అగ్ని వచ్చి దానిని తీసివేయుటను గమనించు. దేవుని ప్రేమ దానిని దహించి వేయుటను గమనించు. స్వార్థపూరితమైన దానిని గమనించు, నీ భార్యతో నీవు మాట్లాడు విధము, నీ భర్తతో నీవు మాట్లాడు విధము, నీ పొరుగు వారితో నీవు మాట్లాడు విధము, సంఘములో ఉండు జనులతో నీవు మాట్లాడు విధమును గమనించుము, ఈ ఉదయకాలమున దానిని బలిపీఠము యొద్ద ఉంచుము, మరియు దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి, సరిగ్గా దానిని కాల్చివేయును, మరియు దేవుని యొక్క ప్రేమ దానిని కాల్చివేయును గాక.

నీవు వ్యాధితో ఉన్నావా? బలిపీఠము యొద్ద ఉంచి ఇలా చెప్పు, “ప్రభువా, అది ఇక్కడే ఉన్నది. నాలో శుద్ధ హృదయమును సృజించుము. నాలో స్వస్థపరచు శక్తిని సృజించుము.” దేవుడేమి చేయునో చూడండి. ఈ ఉదయమున దేవుడు దానిని చేయును.

82

మా పరలోకపు తండ్రి, ఈ బలిపీఠము ముందుయున్న జనులకు బదులుగా, మీ సన్నిధిలో మేము తలలు వంచి యుండగా, తండ్రి, ప్రతి యొక్కరి మీద మీ యొక్క కృప ఉండును గాక, ఇప్పుడు వారు... ప్రభువా, వారి కొరకు నేను అది చేయలేను; వారికివారే అది చేయవలసియున్నది. వారి కొరకు ఏ మనిషి చేయలేడు; వారికివారే చేసుకోవలసియున్నది. ఇప్పుడే వారి ప్రాణములు వారిలో ఇలా చెప్పును గాక, “ఓ, దేవా, ఈ కోపమును ప్రభువా, దానిని నేను ఇక్కడే విడిచి పెట్టుచున్నాను. ఇక నేనెన్నడూ దానిని తీసుకొనను. ఏమి వచ్చి, వెళ్ళినా, నాకు అనవసరము. ఇప్పటి నుండి అది నాలో నుండి వెళ్ళిపోవును గాక. ఈ నా నాలుక, ఆ వదంతులంతటి వైపు చాలా సులువుగా మాట్లాడేటట్లుగా చేయుచున్నది. ప్రభువా, దానిని ఇక్కడే నేను విడిచి పెట్టుచున్నాను. మరల దానిని నేనెన్నడునూ తీసుకోనను. ప్రభువా, నా నాలుకను శుద్దికరించుము. ”నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అయ్యో, నాకు శ్రమ,“ అని యెషయా చెప్పినట్లుగా, దేవదూతల ద్వారా నేను దానిని అనుభవించుదును గాక.

దేవదూత వచ్చి బలిపీఠము యొద్దకు వెళ్ళి, పట్టకర్ర పట్టుకొని అగ్ని నిప్పును తీసుకొని అతని పెదవులకు తగిలించి, అతన్ని శుద్దీకరించెను. దేవా, ఈ ఉదయమున తప్పుగా మాట్లాడి మరియు విరోధమును విత్తి, మాట్లాడు ప్రతీ వారిని శుద్దీకరించండి. ప్రభువా, దానిని అనుగ్రహించండి.

83

ఇక్కడ ఈ భవనములో తలవంచిన వారు (వ్యాధిగ్రస్త జనులు), వ్యాధులన్నియూ దయ్యములని ఎరుగుదురు గాక. దేవా, మీ సేవకుడిగా యేసు నామములో నేను వాటిని గద్దించుచున్నాను. ప్రతి వ్యాధిగ్రస్తునిలో నుండి అవి బయటికి వచ్చును గాక. మరియు ప్రతి అపవిత్ర మనుష్యుని, అపవిత్రమైన తలంపులు గలవారు, నీచమైన, కామవాంఛగల, స్త్రీ మరియు పురుషులు, దేవా, వారిలో నుండి వాటిని తీసివేయండి, ఇక్కడున్న వారందరు తమ సిగరెట్లు త్రాగుట విడిచిపెట్టాలని, మద్యపానాలు, విందులు, స్వలాభ కార్యములను విడిచిపెట్టాలని ప్రయత్నించుచుండగా; దేవా, మరి ఇక ఎన్నడూ అటువంటి వాటి మీద ఆశలేకుండా, పరిశుద్ధాత్మ చేత వారి హృదయములను ఉత్తేజపరచండి. వాటికి ఏ స్థలము లేదు, ఇప్పటి నుండి మీరు పరిశుద్ధాత్మతో నిండి యున్నారు.

దేవా, ఈ చిన్న సంఘమును, మండుచున్న అగ్ని పొదవలె చేయుము. ఈ లోకము తిరిగి దేవుని యొక్క మహిమను చూచులాగున, దీనిని పరిశుద్దముగాను, మండుచున్న అగ్నివలె చేయును గాక. దేవా, ఈ చిన్న ప్రజలతో ఈ ఉదయమున రెండు వందల మంది జనులతో ప్రారంభించుము. ప్రభువా, దానిని అనుగ్రహించండి.

ప్రతి మెథడిస్టును, ప్రతి బాప్టిస్టును, ప్రతి కేథలికను, ప్రతి ప్రెస్బిటేరియన్, ప్రతి పెంతుకొస్తువారిని, ప్రతి యొక్కరి హృదయాన్ని శుద్ధీకరించండి. ప్రభువా, ఈ దినాన్న నీలోనికి వారు వచ్చునట్లుగా, వారి యొక్క హృదయమును తీసుకొనుము. తండ్రి, అనుగ్రహించండి. వారి ప్రాణముల శుద్ధీకరణ కొరకై మరియు వారి యొక్క శరీరము స్వస్థపరచుటకై యేసుక్రీస్తు నామములో వారిని మీకు అప్పగించుచున్నాను, మరియు వారిని మీకు సమర్పించుచున్నాము.

84

నేను ఆశ్చర్యపోవుచున్నాను, బలిపీఠము యొద్ద మీరు, మీ యొక్క భారమును విడిచిపెట్టారా? అది అక్కడ పెట్టబడియున్నదని మీరు భావిస్తున్నారా? అది అక్కడ పెట్టబడినట్లుగా భావిస్తే, మీరే తీర్పరులు. ఆ ప్రార్థన చేయువారును నీవే. నేను బోధించడం పూర్తి చేశాను; ప్రార్థన చేయువారు మీరు. సహోదరి, సహోదరుడా, మీ భారము అక్కడ విడిచిపెట్టబడినదా? నిజముగా నీవు దానిని విడిచిపెట్టగలవా? నీవు చేయగలిగితే, నీ చేయి ఎత్తి, ఇలా చెప్పు, “అవును, దేవా, ఇప్పుడు నేను ఇక్కడ దీనిని విడిచిపెట్టాను. నా వివాదమును, ఇప్పుడే, బలిపీఠము యొద్దనే విడిచిపెట్టాను.” బలిపీఠమునకు క్రిందనున్న నా కుడి ప్రక్కగా ఉన్న స్త్రీ, దాన్ని గూర్చి ఏమిటి? దానిని నీవు అక్కడ విడిచిపెట్టగలవా? అక్కడున్న ఆ పాత కాలపు భారాన్ని నీవు విడిచి పెట్టగలవా? ఇలా చెప్పు, “అవును, కల్వరి గొర్రెపిల్లా, నా విశ్వాసము నీపై ఉన్నది.” ఇప్పుడు మనము దానిని కలసి పాడుచుండగా.

నా విశ్వాసము నీ వైపు చూచుచున్నది,

నీవు కల్వరి గొర్రెపిల్లవు,

ఓ, దైవిక రక్షకుడా;

నేను ప్రార్థించుచుండగా, నాకు చెవియొగ్గుము,

నా దోషమంతయును తీసివేయుము,

ఓ, ఈ దినము నుండి నన్ను,

నీ యొక్క పరిపూర్ణుడుగా!

85

నిజముగా భక్తి, గౌరవము గల ప్రతియొక్కరము లేచి, మన పాదములపై నిలబడుదము. ఇప్పుడు, ప్రతియొక్కరు సమీపముగా వినండి. ఏ ఒక్కరు వెళ్ళిపోవద్దు. కొంచెం... కూటము ఇంక ముగించబడలేదు. ఈ చిన్న పవిత్రతను, చిన్న ఉత్సవమును మీరు కలిగియుండవలెనని నేను కోరుకొనుచున్నాను. “జీవితము యొక్క చీకటి అగాధములో నేను పట్టబడియుండగా, మరియు నా చుట్టూ సమస్యలు విస్తరించగా, నా మార్గదర్శిగా ఉండుము. చీకటి అగాధము వెలుగుగా మారును, కన్నీటి బాధలను తుడిచివేయును, ఈ దినము నుండి సంపూర్తిగా నీవానిగా ఉండనిమ్ము!” ఇప్పుడు మీ ప్రక్కన ఉన్నవారి కొరకు పాడవద్దు, మన కన్నులను ముసి, మరియు దేవునికి మన హస్తములను ఎత్తి, నమ్మదిగా పాడెదము.

జీవితము యొక్క చీకటి అగాధములో నేను పట్టబడియుండగా,

మరియు నా చుట్టూ సమస్యలు విస్తరించగా,

నా మార్గదర్శిగా ఉండుము;

చీకటి అగాధము వెలుగుగా మారును,

కన్నీటి బాధలను తుడిచివేయును,

నీ ప్రక్క నుండి నన్ను ఎన్నడూ తప్పిపోనివ్వ వద్దు.

ఆవల నేనొక తండ్రిని కలిగియున్నాను,

ఆవల నేనొక తండ్రిని కలిగియున్నాను,

ఆవల నేనొక తండ్రిని కలిగియున్నాను,

ఆవల తీరమున.

ఓ, ఒక వెలుగు దినమున నేను వెళ్ళి ఆయనను చూచెదను,

ఒక వెలుగు దినమున నేను వెళ్ళి ఆయనను చూచెదను,

ఒక వెలుగు దినమున నేను వెళ్ళి ఆయనను చూచెదను,

ఆవల తీరమున.

ఓ, ఒక వెలుగు దినమున నేను వెళ్ళి ఆయనను చూచెదను,

ఒక వెలుగు దినమున నేను వెళ్ళి ఆయనను చూచెదను,

ఒక వెలుగు దినమున నేను వెళ్ళి ఆయనను చూచెదను,

ఆవల తీరమున.

86

ఇప్పుడు నేను ఆశ్చర్యపోవుచున్నాను, మీలో ఎంత మందికి, మరో దేశంలో తండ్రి ఉన్నాడు? మీ చేతులను చూడనివ్వండి. ఆ మరొక దేశంలో ఎంత మందికి తల్లిని కలిగియున్నారు? మీ చేతులను చూడనివ్వండి. ఎంత మందికి ఆ మరో దేశంలో మీరు రక్షకుడను కలిగియున్నారు? మీ చేతులను చూడనివ్వండి.

ఓ, ఒక సంతోషకరమైన కూడిక కాదా!

అది ఒక సంతోషకరమైన కూడిక కాదా!

అది ఒక సంతోషకరమైన కూడిక కాదా!

ఆవల తీరమున.

నీవు ఒకటి చేయాలని నేను ఆశించుచున్నాను. ఇప్పుడు ఆ పాటను మరల ఆలపించుచుండగా, మీ ప్రక్కన నిలబడియున్న వారితో కరస్పర్శ చేయాలని నేను కోరుకొనుచున్నాను, ఇలా చెప్పండి, “సహోదరుడా, సహోదరీ, ఆ మరో దేశములో నేను నిన్ను కలుసుకొనులాగున, నా కొరకు ప్రార్థించమనండి.” అది మీకు అర్థము కాకపోతే, అది చేయవద్దు. ఒకరికొకరు కలుసుకొనవలెనని ఎంత మంది కోరుకొంటున్నారు? ఇక్కడున్న మీ ప్రతియొక్కరు, అక్కడ కలుసుకొనవలెనని ఎంత మంది కోరుకొంటున్నారు? మనము, తప్పక మనము చేయగలము. ఇప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఇలా చెప్పండి, “నేను నిన్ను కలుసుకోవాలని ఆశిస్తున్నాను, సహోదరుడా. ఆ మరో దేశములో నేను నిన్ను కలుసుకోవాలని ఆశిస్తున్నాను.” ఇప్పుడు ఈ పాట పాడుచుండగా, “అదిగో దూరాన్న నా రక్షకుడను పొందుకున్నాను.” మంచిది.

అదిగో దూరాన్న నా రక్షకుడను పొందుకున్నాను,

అదిగో దూరాన్న నా రక్షకుడను పొందుకున్నాను,

అదిగో దూరాన్న నా రక్షకుడను పొందుకున్నాను,

ఆవల తీరమున.

ఓ, ఒక వెలుగు దినమున, నేను వెళ్ళి ఆయనను చూచెదను,

ఒక వెలుగు దినమున, నేను వెళ్ళి ఆయనను చూచెదను,

ఒక వెలుగు దినమున, నేను వెళ్ళి ఆయనను చూచెదను,

ఆవల తీరమున.

అది మీకు ఏ మంచి భావనను కలుగజేయుట లేదా?

యేసూ, సిలువ చెంత నన్ను దాయుము.

యేసూ నన్ను దగ్గరగానుంచుము....

ఒక ప్రశస్తమైన ఊట కలదు,

అందరికీ ఉచితము, ఒక స్వస్థతధార,

కల్వరి యొద్ద నుండి కొలను ప్రవహించును.

ప్రతియొక్కరు ఇప్పుడు మీ హస్తమును ఎత్తండి.

సిలువలో, సిలువలో

ఎప్పటికీ, నా మహిమగా నుండుము;

నా యొక్క ఎత్తబడే ఆత్మను కనుగొన్నంత వరకూ

నది ఆవల విశ్రాంతి పొందుము

నది ఆవల విశ్రాంతి పొందుము.

నేను ఆయనను ప్రేమించుచున్నాను,

నేను ఆయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను

మరియు నా రక్షణను కొనెను

ఆ కల్వరి వృక్షము పై. (దేవునికే స్తోత్రము కలుగును గాక!)

87

ఇప్పుడు నిశ్శబ్దముగా మన తలలు వంచుకొందుము. మరియు మన ఇష్టమొచ్చిన మార్గాన, మన చేతులెత్తి ఆయనను స్తోత్రించెదము. “నా ప్రాణమును రక్షించునందులకై, ప్రభువా, మీకు ధన్యవాదములు. నన్ను నిండైనవానిగా చేసినందులకై, ప్రభువా మీకు ధన్యవాదములు. మధురమైన విమోచనను ఇచ్చావు, ఉచితముగా ఇచ్చావు, ప్రభువా, మీరు చేసిన దానంతటికై మీకు ధన్యవాదములు,” అని చెప్పండి. మేము నీకు కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాము.

మేము నీకు స్తుతులర్పించుచున్నాము, ఎందుకనగా నీవు ఎంతో మనోహరుడవు. నీవు లోయలోని లిల్లీ, ఉదయ నక్షత్రము, షారోను పుష్పము, అన్నింటిలో అన్నియు. తండ్రీవీ, కుమారుడవు, పరిశుద్ధాత్మవు; అప్పుడున్నవాడవు, ఇప్పుడున్నవాడవు, రాబోవువాడవు; గొప్ప అల్ఫాయు, ఓమేగయు నీవే, దావీదు వేరు చిగురు, శాంతికి రాజువు, అద్భుతమైన వాడవు నీవే. అన్నింటిలో ఉన్నవాడవు నీవే! ప్రభువా, నీవు చేసిన అన్నింటికై మీకై ధన్యవాదములు. నా పాదములకు వెలుగుగా ఉన్న మీ వాక్యమునకై మీకు ధన్యవాదములు, ఓ, ప్రభువా, మమ్ములను మీ వెలుగులో నడిపించమని, మేము ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో. తండ్రి, అనుగ్రహించండి. ఆమెన్. మంచిది, ఒక నిమిషము మనము కూర్చొనెదము, “మనము వెలుగులో నడిచెదము.”

మనము వెలుగులో నడిచెదము, ఎంతో అందమైన వెలుగు,

దయ యొక్క మంచు బిందువులు ప్రకాశించు చోటికి రమ్ము

పగలు మరియు రాత్రి, మీ చుట్టూ ప్రకాశించుము,

యేసు, వెలుగై....

రమ్ము, పరిశుద్దులారా, మనము పాడెదము!

మనము వెలుగులో నడచెదము (శుద్దత, పరిశుద్దత)

ఎంత అందమైన వెలుగు,

దయ యొక్క మంచు బిందువులు ప్రకాశించు చోటికి రమ్ము;

పగలు మరియు రాత్రి, మీ చుట్టూ ప్రకాశించుము,

యేసు, లోకానికి వెలుగై యున్నాడు.

ఆయనను నీ రాజుగా ఒప్పుకొనుము,

యేసు, లోకానికి వెలుగై యున్నాడు;

అప్పుడు పరలోకపు గంటలు మ్రోగును,

యేసు, లోకానికి వెలుగై యున్నాడు.

ప్రతి ఒక్కరు!

మనము వెలుగులో నడిచెదము,

(నా స్నేహితుడా, ఇప్పుడు గమనించుము) అందమైన వెలుగు,

దయ యొక్క మంచు బిందువులు ప్రకాశించు చోటికి రమ్ము;

పగలు మరియు రాత్రి, మీ చుట్టూ ప్రకాశించుము,

యేసు, లోకానికి వెలుగై యున్నాడు.

88

అది మిమ్ములను ఆనందముగా చేయటము లేదా? ఎంత మంది ఆనందముగా ఉన్నారు? ఇప్పుడే మీ చేతులను ఎత్తండి. “నిజముగా నేను ఆనందిస్తున్నాను,” అని చెప్పండి. పరిశుద్ధాత్మ మీలో ఉన్న దానిని రుద్ది కడిగి శుభ్రము చేయును గాక. అంతట మనము వెలుగులో నడిచెదము. ఏది వినవద్దు.... వెలుగు అనగా ఏమిటి? నీ వాక్యమే దీపమైయున్నది.

కాబట్టి అంతటా మనము వెలుగులో నడిచెదము,

అది అందమైన వెలుగు,

దయ యొక్క మంచు బిందువులు ప్రకాశించు చోటికి రమ్ము;

పగలు మరియు రాత్రి, మీ చుట్టూ ప్రకాశించుము,

యేసు, లోకానికి వెలుగై యున్నాడు.

ఇప్పుడు, అది అద్భుతము కాదా? మనము అతి సమీపముగా పరిశీలించినట్లు కనిపించుచున్నది. మనలను పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉంచుకొనెను! మీరు ఆ విధముగా భావించుట లేదా? నేను ముగించలేనట్లుగా భావిస్తున్నాను. నేను అది చేయలేనట్లుగా కనిపించుచున్నది.

.... సువార్త రక్తము ఓడుచున్నది,

సత్యము కొరకై మరణించిన శిష్యుల యొక్క రక్తము.

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తమోడుచున్నది.

ఈ పరిశుద్ధాత్మ ప్రణాళికలో మొదట చనిపోయినది,

బాప్తీస్మము ఇచ్చు యోహాను,

అయినా అతడు పురుషుని వలె చనిపోయెను;

అంతట ప్రభువైన యేసు వచ్చెను, ఆయనను వారు సిలువ వేసిరి.

ఆయన చెప్పెను ఆత్మ పాపము నుండి జనులను రక్షించును.

పేతురు, పౌలు మరియు ప్రియుడైన యోహాను ఉన్నారు.

ఈ సువార్త ప్రకాశించునట్లుగా, వారి ప్రాణములను వారు ఇచ్చిరి;

పాతకాలపు ప్రవక్తల వలె, వారి రక్తమును కలగలిపిరి,

నిజమైన దేవుని యొక్క వాక్యము, నిజాయితీగా చెప్పబడుటకు

అప్పుడు వారు సైఫనును రాళ్ళతో కొట్టిరి,

అతడు పాపమునకు వ్యతిరేకముగా ప్రసంగించెను,

అతడు వారికి బహుగా కోపము తెప్పించెను,

అందుకే అతడి తలను వారు చిదుగగొట్టెను,

కాని అతను ఆత్మలో చనిపోయెను, అతను ఆత్మను విడిచిపెట్టెను.

కాని జీవమునిచ్చు వారి వలే, వారిని కలుసుకొనుటకు వెళ్ళెను,

బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు మొర్రపెట్టుచున్నవి,

“ఎంత వరకూ?”

తప్పు చేస్తున్న వారిని ప్రభువు, శిక్షించేంత వరకూ,

కాని తమ జీవితము యొక్క రక్తమును ఇచ్చువారు

చాలా మంది ఉండెదరు.

ఈ పరిశుద్ధాత్మ సువార్త ఒక గొప్ప వరద వలే

అది రక్తమోడుచూ ఉండును, (హల్లెలూయా)

అది రక్తమోడుచుండెను,

(నేను వారిలో ఒకనిగా ఉండగోరుచున్నాను)

పరిశుద్ధాత్మ సువార్త అది రక్తమోడుచున్నది.

సత్యము కొరకై మరణించిన శిష్యుల యొక్క రక్తము.

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తమోడుచున్నది.

89

నేరుగా బలిపీఠము నుండి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆమెన్. ఓ, ఎంత అద్భుతము! నా సహోదరులు వారి ప్రాణములో రక్తాన్ని ఇచ్చును. అనేకమైనవారు వెళ్ళి అదే కార్యమును చేయును. భయపడవద్దు, అది త్వరితముగానే తేటతెల్లమవుచున్నది; నీవు లోనికైనా వెళ్ళెదవు లేక బయటకైనా వెళ్ళెదవు. వారందరు సంఘ సమాఖ్యలోనికి చేర్చబడి, అవన్నియూ అందులో మిలితమైపోవును, వారందరు సమ్మిలితమై పోవుచున్నారు.

మరియు తమ జీవితము యొక్క రక్తమును ఇచ్చువారు

చాలా మంది ఉండెదరు.

ఈ పరిశుదాత్మ సువార్త మరియు ఇది శుద్దిచేయు వరద

అది రక్తమోడుచున్నది. అవును, రక్తమోడుచున్నది,

(ఓ, హల్లెలూయా!)

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తమోడుచున్నది,

సత్యము కొరకై మరణించిన శిష్యుల యొక్క రక్తము,

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తమోడుచున్నది.

90

మై, సంఘమునకు కొంచెము పైన ఎత్తబడుట యున్నదని నేను భావించుచున్నాను. ఓ, చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది! అన్నీ పాపములు రక్తము క్రింద ఉన్నవి. చూడండి, పరిశుద్ధాత్మ వాక్యమును ఇష్టపడును. పరిశుద్ధాత్మ దేనిని తినిపించునో అదే వాక్యము, చూడండి. ఓ, మై! అది ఆ జనుల మధ్యకు దిగివచ్చి వారి పాపములు కడిగి, వారి వ్యాధులను తీసివేసి, వారి మచ్చలను తొలగించును. ఇప్పుడు నేను త్రాగాను, నేను త్రాగగలిగినంత త్రాగాను. ఆత్మ పానము చేశాను, నా హృదయములో నుండి ప్రేమ పొర్లుచున్నది. ఎవరు ఏమి చేసినప్పటికీ, అది క్షమింపబడెను. మీ బద్ద శత్రువైన అది అంతా పోయినది. ఎవరైన ఏదైన మాటలాడిన లేక ఏదైన చెప్పినా, “అదంతా అయిపోయినది అని కోరుచున్నాను.” అంత శుద్దీకరించబడెను.

మరియు అది రక్తమోడుచున్నది, అవును, అది రక్తమోడుచున్నది

పరిశుద్ధాత్మ సువార్త అది రక్తమోడుచున్నది,

సత్యము కొరకై మరణించిన శిష్యుల యొక్క రక్తము.

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తమోడుచున్నది.

అది రక్తమోడుచున్నది.

అవును, రక్తమోడుచున్నది.

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తమోడుచున్నది.

సత్యము కొరకై మరణించిన శిష్యుల యొక్క రక్తము.

ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తమోడుచున్నది.

(ఎంత అద్భుతము!)

ఎంతటి అద్భుతమైన సమయము నీకు,

ఎంతటి అద్భుతమైన సమయము నాకు;

మన రాజైన యేసును కలుసుకొనుటకు,

మనమందరము సిద్ధపడినట్లైయితే,

ఎంతటి అద్భుతమైన సమయముగా నుండును.

ఎంతటి అద్భుతమైన సమయము నీకు,

ఎంతటి అద్భుతమైన సమయము నాకు;

మన రాజైన యేసును కలుసుకొనుటకు,

మనమందరము సిద్దపడినట్లైయితే,

ఎంతటి అద్భుతమైన సమయముగా నుండును.

మీరు అది ఇష్టపడెదరా? ప్రతి యొక్కరూ రండి!

ఎంతటి అద్భుతమైన సమయము నీకు,

ఎంతటి అద్భుతమైన సమయము నాకు;

మనమందరము సిద్ధపడినట్లైయితే,

మన రాజైన యేసును కలుసుకొనుటకు.

91

సంఘములో ఆ పాత-కాలపు ఉజ్జీవమువలే ఉన్నదని నేను భావిస్తున్నాను. మీకు అలా అనిపించుటలేదా? ఆ పాత-కాలపు వారివలె శుద్దీకరించబడుచున్నారు; మంచిది, అద్భుతమైన సమయము. మీరు ఆనందమును అనుభవించుట లేదా? ఓ! “నేను ఆయనను స్తుతించెదను, నేను ఆయనను స్తుతించెదను, పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతించెదము.” ఇప్పుడు ప్రతీ యొక్కరు అది పాడుకునెదము. మీకు అది తెలుసా? నాకు అది తెలుసు. ఎంత మంది? బ్రదర్ నెవిల్ అది నడిపింపబడినట్లుగా నాతో నీవు సహకరించుము. ఇప్పుడు మీరందరు కలిసి ఇప్పుడు ఈ ఉదయమున మీ చేతులెత్తి ఇప్పుడు అది నాతో పాడండి.

పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతించెదము;

ప్రజలైన మీరందరూ ఆయనను మహిమ పర్చండి,

ఆయన యొక్క రక్తము ప్రతీ మరకనూ తుడిచివేసింది;

ఇప్పుడు, అందరు, పాడండి!

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతించెదము;

ప్రజలైన మీరందరూ ఆయనను మహిమ పర్చండి,

పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతించెదము;

ప్రజలైన మీరందరూ ఆయనను మహిమ పర్చండి,

ఆయన యొక్క రక్తము ప్రతీ మరకనూ తుడిచివేసింది.

(ఆమెన్. అది అద్భుతము కాదా?)

ముత్యములాంటి తెల్లని పట్టణము, ఒక నివాసము,

ఒక తంబురా, మరియు ఒక కిరీటము నాకు కలదు

ఇప్పుడు నేను ఎదురుచూచుచు,

గమనించుచు మరియు ప్రార్ధించుచున్నాను.

యోహను చూచిన క్రిందకు వచ్చుచున్న ఆ తెల్లని పట్టణము కొరకు.

92

(ఆమెన్. అద్భుతము! ఓ!)

ఇప్పుడు ప్రతీ ఒక్కరము, మన పాదముల మీద నిలబడెదము. మీరు ఆనందముగా ఉన్నారని నేను ఆశీస్తున్నాను. ఈ రాత్రి కూటమును గుర్తించుకోండి. ఇప్పుడు, మన మంచి పాటైన పాత పాట వీడ్కోలు పాట పాడుకుందాం, “యేసు నామమున తలలు వంచుదాం, ఆయన పాదాల ముందు సాగిలపడుదాం, మన యాత్ర ముగించబడినప్పుడు, పరలోకమందున్న రాజుల రాజుకు పట్టాభిషేకం చేద్దాం, పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతించెదము, ప్రజలైన మీరందరూ ఆయనను మహిమపర్చండి, ఆయన యొక్క రక్తము ప్రతీ మరకనూ తుడిచివేసినది.” ఇప్పుడు, ప్రతిఒక్కరు రండి,

యేసు నామమున తలలు వంచుదాం,

ఆయన పాదాల ముందు సాగిలపడుదాం,

మన యాత్ర ముగించబడినప్పుడు,

పరలోకమందున్న రాజుల రాజుకు కీరీటము దరింప చేసెదము.

ప్రశస్త నామము (ప్రశస్త నామము),

ఓ ఎంత మధురం! (ఓ, ఎంత మధురం!)

పరలోక ఆనందము భూలోక నిరీక్షణ;

ప్రశస్త నామము (ప్రశస్త నామము),

ఓ, ఎంత మధురం (ఓ, ఎంత మధురం!)

పరలోక ఆనందము భూలోక నిరీక్షణ.

93

ఎటువంటి అద్భుతకరమైన ఉదయము, ఎటువంటి అద్భుతకరమైన సమయము. ఒక క్షణం మనము తలలు వంచుకొందాం. ఇప్పుడే ప్రతీ ఒక్కరు నేరుగా క్రీస్తువైపు, మీ రక్షకుడుగా చూడండి, నిశబ్దంగా, మీరు ఆయనకు కృతజ్ఞతలు మరియు స్తుతులు చెప్పాలని నేను కోరుకొనుచున్నాను. “ప్రభువా, నా ఆత్మను శుద్దీకరించినందుకు నేను మీకు చాలా కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నా కొరకు మీరు చేసిన దానినంతటికై ఎంతో కృతజ్ఞత తెలియజేయుచున్నాను. ప్రభువా, దినమంతా మీ ఆత్మ నాపై ఉండును గాక. ప్రభువా, నన్ను నడిపించుము. నాకు త్రోవ చూపుము. నన్ను దీవించుము.” దేవా, వారిపై మీ ఆశీర్వాదములను అనుగ్రహించండి, అదే నా ప్రార్థన. ఇప్పుడు, మనము తలలు వంచియుండగా, బ్రదర్ నెవిల్, ప్రార్ధన ద్వారా మీరు మాకు వీడ్కోలు ఇవ్వండి.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...