అహంకారము

అహంకారము

నాకు తెలుసు మెథడిస్టువారు నీళ్ళకు కూడా భయపడరు. కావున వారు వర్షం వస్తున్ననూ లేదా రాకపోయినను, అదే రీతిగా బయటకు వచ్చి భద్రమైన స్థలము క్రింద కూర్చుందురు. కేవలం బాప్టిస్టు వారే ఆ విధముగా ఉందురని నేను తలంచాను, కానీ మెథడిస్టు వారు కూడా అదే విధముగా ఉండుట నేను చూశాను.

కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయమందు కూడికలో ఉండుట చాలా సంతోషము. పెనుగాలి వచ్చినప్పుడు, మరియు నేను నా హోటల్‌ కిటికీ నుండి బయటకు చూశాను, నేను చెప్పాను, “ఓ, మై, సాతానా, ఎందుకు నువ్వు ఈ చెడు చేస్తున్నావు?” మరియు నేను చెప్పాను, ఈ రెండు ఆరాధనలు కొరకు నీవు ఇక్కడ తగ్గిపొమ్ము మరియు అటు తర్వాత నీవు వర్షమును పంపించుము“. మంచిది, ”దేవున్ని ప్రేమించువారికి, సమస్త కార్యములు సమకూడి మేలు కొరకే జరుగుచున్నవి“, అని వారు ఒప్పుకొనెదరు. కావున ఇది దాన్ని చల్లగా మార్చినది, కాబట్టి మీరు విసురు కొననవసరము లేదు. కాబట్టి రైతులకు వర్షము అవసరమైయున్నదని నేను అర్ధము చేసుకున్నాను, కావున దీనిని ప్రతీ చోటా చూచుటకు మనము సంతోషించెదము.

2

కొద్ది క్షణముల ముందు, ఇక్కడ కొంతమంది స్నేహితులను కలుసుకొనుట ఆనందముగా ఉన్నది. శ్రీ మరియు శ్రీమతి జెబ్‌ స్మిత్‌. మేము వారి పొలము దగ్గరే పెరిగాము. ఇక్కడే, ఒక చిన్న మార్గములలో ఎతైన కొండ క్రింద, శ్రీ మరియు శ్రీమతి స్మిత్‌, ఇక్కడే మూలన కూర్చొనియున్నారు. నేను ఒక చిన్న బాలునిగా ఉన్నప్పుడు, వారు నన్ను అన్నిచోట్లకు త్రిప్పియున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఒక చిన్న బాలునిగా ఉన్నప్పుడు, ఇండియానాకు వెళ్ళే ముందు, నా తండ్రి, శ్రీ స్మిత్‌ కొరకు పనిచేసేవారు, అని నేను తలoచుచున్నాను.

మరియు నాకు నా స్నేహితులు ఉన్నారు, మెక్‌ స్పేడెన్స్‌ మరియు అలాంటి వారు. మరియు దేశములో ఈ భాగమునుండి మరియొక మెథడిస్టు బోధకుడు, శ్రీ జాన్‌ ఓబెనన్‌. మీకు ఆయన తెలుసని నేను ఖచ్చితంగా అనుకొనుచున్నాను. నీలం కోటు వేసుకొని ఇక్కడే కూర్చొనియున్నారు, లూయిస్‌ విల్‌ నుండి నాకు చాలా వ్యక్తిగతమైన స్నేహితుడు, కెంటకీ; లూయిస్‌విల్‌లో ఇప్పుడు ఒక వ్యాపారవేత్త.

మరియు శ్రీమతి స్మిత్‌ అడిగెను అమ్మ ఇక్కడే ఉన్నదా, మరియు అక్కడ ఒక కారును చూచానని నేను తలంచాను. నా తల్లి ఇక్కడ ఉన్నదా? ఆమె ఇక్కడే ఉన్నట్లయితే, అదే నేను ఆశ్చర్యపోవుచున్నాను. వారు వస్తే ఆమెను తీసుకురావలెనని వెళ్ళిన కారును నేను చూశాను. మరియు నేను శ్రీమతి స్మిత్‌తో చెప్పాను, ఆమె ఇక్కడే ఉండవచ్చును. అమ్మా, నీవు ఇక్కడే ఉన్నావా, శ్రీమతి స్మిత్‌ బహుశా నేను తప్పుగా ఊహించియుండవచ్చు. నన్ను క్షమించు. కానీ బహుశా ఈ రాత్రి కూడికకు ఆమె రావచ్చును. వచ్చుటకు ఏదో మార్గము కలిగి ఉండుటకు, క్రిందకి దిగుటకు ఆమె ప్రయత్నిస్తున్నది. మరియు ఇక్కడ ఉన్న ఈ కారు అలాగే ఉన్నది; మరియు బిల్లీ చెప్పెను, “అమ్మమ్మ ఇక్కడే ఉన్నదని నేను ఊహించుచున్నాను”.

మరియు నేను చెప్పాను, “కారు వలె ఇది కనిపించుచున్నది.”

3

డిల్లీ అను పేరుగల ఒక వైద్యుడు, చికాగోలో నా యొక్క కూడికలో స్వస్థపరచబడ్డాడు, మరియు వారు అక్కడ ఒక పెద్ద క్లినిక్‌ కలిగియున్నారు, మరియు నయము కాని ఒక వ్యాధితో కూడికకు వచ్చారు, మరియు అద్భుతముగా బాగుపడి, మరియు వారి జీవితము ప్రభువైన యేసుకి ఇచ్చారు. మరియు దేశములో వేరు వేరు భాగములలో, అనేక వైద్యులను నేను చూశాను.

ఇక్కడ కొద్ది సమయము ముందు, డాక్టర్‌ ధియోడోర్‌ ఫాల్విస్‌, పశ్చిమ తీరమంతా, ఇక్కడనున్న వారిలో ఎవరికైనా డాక్టర్‌ ఫాల్విస్‌ తెలుసా, దైవిక స్వస్థత కేసు విషయములో ఉన్న అతడు; మరియు ఆ వ్యక్తి మార్చు చెందాడు, మరియు వ్యవసాయ నీరు పారే మురికి కాలువలో ఆయనకు నేను బాప్తిస్మము ఇచ్చియున్నాను. ఆపరేషన్ల కొరకు ప్రజలు ఆయన యొద్దకు న్యూయార్క్‌ నుండి ఎగిరి వచ్చుచున్నప్పటికి, ఆయన తన యొక్క వైద్య వృత్తిని ఆపివేసియున్నాడు. మరియు కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌ పట్టణములో ఉన్న మురికివాడలో ఒక చిన్న పరిచర్య జరిగించుచున్నాడు. డాక్టర్‌ ధియోడోర్‌ ఫాల్విస్‌, ఒక అద్భుతమైన గ్రీకు వ్యక్తి మరియు ఆయన భార్య ఆర్మేనియన్‌.

4

మరియు ఆయన భార్య అక్కడ బయట ఉన్నప్పుడు, ఒక ఆర్మేనియన్‌ స్త్రీ, క్యాన్సర్‌ వలన రెండు రొమ్ములూ తొలగించబడి చనిపోతూ ఉన్నది. మరియు ప్రభువు చెప్పెను, “మూడు రోజులలో ఆమె వీధిలో ఉండును”, మరియు అతను నన్ను చూసి నవ్వెను.

మరియు అతను చెప్పెను, “ఎంతటి అవమానము”, “మోసగాడా, నువ్వు అటువంటి అబద్ధ ఆలోచనల క్రింద ఆ స్త్రీని ఉంచియున్నావు”, అని చెప్పెను.

నేను చెప్పాను, “అది నేను కాదు, ఆయనే దానిని చెప్పియున్నాడు, అయ్యా”.

మరియు అతను చెప్పెను, “మంచిది, నీకు తెలుసా ఆ స్త్రీ రాబోవు ఆరు గంటలలో చనిపోవును.” “ఆమె ఇరవై నాలుగు గంటలనుండి స్పృహలో లేదు. ఆమె ఏ సమయములోనైనా వెళ్ళిపోవును, అని చెప్పెను.

నేను చెప్పాను, “ఒకవేళ ఆమె ఇరవై నాలుగు గంటలలో, అరుస్తూ, వీధులలో లేకపోతే, నేను ఏమి చేయుదునో నీకు చెప్పెదను. ”అబద్ధ ప్రవక్త, అని ఒక గురుతును నా వీపుపై వేసుకుంటాను, మరియు నీవు నీ యొక్క పెద్ద కాడిలాక్‌ కారును తీసుకొని వచ్చి, మరియు లాస్‌ ఏంజలస్‌ వీధులలో నన్ను త్రిప్పుము. మరియు ఒకవేళ ఆమె వీధులలో గనుక ఉన్నట్లయితే, “నకిలీ డాక్టర్‌, అని నీ వీపుపై నేను వేస్తాను, మరియు నీ ముందే నేను త్రిప్పెదను. ఇప్పుడు, మనము కేవలము చేతులు కలిపి మరియు ఇక్కడ నిలబడెదము; ఏమి జరుగునో మనము చూద్దాము...

“ కానీ అతడు దాన్ని చేయడు. మరియు ఇరవై నాలుగు గంటలలో ఆమె షాపింగ్‌ చేయుచున్నది; మరియు ఆమె ఇప్పటికీ మంచిగా ఉన్నది, ఆరోగ్యమైన స్త్రీగా ఈరోజు ఉన్నది. అది ఎనిమిది సంవత్సరముల ముందు జరిగినది. గత రాత్రి అక్కడ చనిపోబోవుచున్న, మరియు అక్కడ ఏమి జరిగినా, ఆ స్ట్రేచర్ పై ఉన్న ఆ బాలుని కదలాడులాగున చేసినది ఆ దేవుడే, మన ప్రభువైన యేసు మరణము నుండి లేచెనని అది చూపించుచున్నది. దానిని గూర్చి ఆ బాలుడు ఈ దినము నాతో చెప్పుచున్నాడు. ఆయన ఇప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తే ఆయన అలాగు ఉన్నందుకు మాకు చాలా సంతోషముగా ఉన్నది.

5

ఇప్పుడు, ఈ రాత్రి మరలా రోగుల కొరకు ప్రార్ధన చేయబోవుచున్నాము. ప్రభువు చిత్తమైతే మరియు ప్రజలైన మీతో ఇక్కడ ఒక మంచి రాత్రి కలిగియుండెదమని మేము నమ్ముచున్నాము. బహుశా కొన్నిసార్లు మరలా మనము తిరిగి ఎక్కువసేపు ఉండే సమయము పొందుకుంటాము. మనము పాస్టర్లు మరియు మొదలగువారితో కలిసి ఎక్కువసేపు ఉండే కూడికను కలిగియుండెదము.

ఇప్పుడు, ఈ రోజు నేను ఈ కేంప్‌ గ్రౌండ్స్‌లోనికి వచ్చుచున్నాను, అది నియంత్రించబడినా, లేక నియంత్రించబడకపోయినా, కానీ ఒక శాఖా సంఘము ద్వారా స్వంతం చేసుకోబడినది. మరియు హృదయమంతటితో నిశ్చయముగా ఈ సంఘమును అభినందించెదము, మెథడిస్టు సంఘము, ఎందుకనగా దీవించబడిన మన ప్రభువైన యేసు కొరకు ఈ లోకములో అది గొప్ప కార్యములు చేసినది. మరియు సువార్తను బోధించుట ద్వారా ఆ సంఘము అనేక వేల ఆత్మలను ప్రభువైన యేసు యొద్దకు నడిపించెను, ఈ జీవితం అంతమైన తర్వాత, ఆవలి వైపున మనమందరము కలుసుకున్నప్పుడు ఏమి జరుగునో అను దాని కొరకై నేను ఆశ్చర్యపడుచున్నాను.

6

పిదప ఇక్కడకు వచ్చినప్పుడు, గత రాత్రి దైవిక స్వస్థత అను విషయమును సమీపించుటలో, సిద్ధాంతపరమైన దృష్టితో దానిని నేను సమీపించలేదు, ఎందుకనగా నేను ఇక్కడ ఉన్నప్పుడే నేను దానిని తలంచాను, ప్రభువైన యేసు యొక్క జీవితము యొక్క ఉదాహరణలు మీద నేను మాట్లాడెదను. గత రాత్రి దానిని గూర్చి నేను మాట్లాడుచున్నాను, ఎందుకంటే మనము ఎంత మంచిగా కలిసి ఉన్నప్పటికీ, మరియు ఎలా... వేరు వేరు సంఘములు వేరు వేరు సిద్ధాంతములను నమ్మును. కావున మనము సంఘములో ఉన్నప్పుడు, ఏ రకమైన సిద్ధాంతము నుండైనా దూరముగా వెళ్ళిపోవుటకు, క్రైస్తవ పెద్ద మనిషిగా ఉండటానికి ఇష్టపడతాము. కేవలం అదే మనము క్రీస్తును బోధిస్తాము, మరియు ఆయన సిలువేయబడెను అను దానిపై మనమందరము అంగీకరించెదము.

కాబట్టి ఈ సువార్త పరమైన సేవలో, ఈ మధ్యాహ్నకాల సమయమందు, ప్రభువు చిత్తమైతే, మాట్లాడుటకు కేవలము కొద్ది సమయముండగా, యేసు జీవితము యొక్క సందర్భాలను గూర్చి ఇంకనూ మాట్లాడుటకు నా హృదయముపై ఉన్నట్లుగా నాకు అన్పి౦చుచున్నది. మరియు ఆ రీతిగా, మనము కేవలము నాటకీయరీతిగా లేక ఆయన చేసిన లేదా చెప్పిన కొన్నింటిని మనము ప్రస్తాపిoచెదము. మరియు ఆ రీతిగా దానితో ఎటువంటి సిద్ధాంతపు సంగతులు జతపడి ఉండవు, కేవలం స్వచ్చమైన సామాన్యమైన సువార్త మాత్రమే. నేను దానిని ప్రేమించుచున్నాను. మీరు ప్రేమించుట లేదా? అది నిజము.

7

మరియు ఇప్పుడు, మనము పుస్తకము తెరుచుటకు ముందు, మనము ఆ రీతిగా పేజీలను త్రిప్పగలము, కానీ ఆ వాక్యమును విప్పగలిగే వారు ఒక్కరే ఉన్నారు, మరియు అదియే పరిశుద్దాత్మ అంతే. దానిని వ్రాసినవాడు ఆయనే. మీరు దానిని నమ్ముచున్నారా? ఆయనే చేసాడు, ఆయన... వ్రాసాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన ఆ పాతకాలపు వ్యక్తులు, పరిశుద్ధ గ్రంథమును వ్రాసిరి. మరియు ఇది ఎవరి చేత వ్రాయబడినదనగా...నన్ను క్షమించండి, పరిశుద్ధ గ్రంథము యొక్క రచయితలు ఎంతమందో, నాకు తెలుసు, కానీ ఇప్పుడు నాకు తెలియదు. క్షమించండి, దానిని నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే నా మనసులో రెండు సంఖ్యలు ఉన్నవి. దానిని కలగలపు చేసేస్తానని నేను భయపడుచున్నాను.

కానీ ఏమైనప్పటికీ, ఇది... ఇరవై - ఎన్నో వందల సంవత్సరములు అంతకంటే ఎక్కువలోనే వ్రాయబడినది, ఒక భాగము నుండి మరొక భాగము వరకు, మరియు వేల మైళ్ళు దూరములో, మరియు వేర్వేరు కాలములు, మరియు దానిలో ఒక చిన్నభాగము కూడా రెండవదానికి వ్యతిరేకముగా ఉండదు. ఎందుకూ, మనలో ఇద్దరం ఏదో ఒకటి వ్యతిరేకించుకోకుండా ఒక వ్యక్తికి ఒక ఉత్తరాన్ని రాయలేము. అది నిజమేనా? కానీ లేఖనము ఎంత ప్రేరేపితమైనది. లేఖనములు అన్ని ప్రేరేపణ ద్వారానే ఇవ్వబడినవి, పరిశుద్ధాత్మ ద్వారా ఉత్తేజపరచబడినవి, ఆయనే ఆ వాక్యమును వ్రాసియున్నాడు; మరియు అది అందమైనది. మరియు ఆయన యొక్క దయకొరకు మనము ప్రభువైన యేసును ప్రేమిద్దాం.

8

ఇప్పుడు, లేఖనములను సరిగ్గా అనువాదము చేసే ఒకే ఒక్కడు ఆయనే. మనలో ప్రతీ ఒక్కరూ, దానిని మనము కేవలము ఒక ప్రయత్నము చేసెదము, కానీ మనము అభిషేకించబడేంత వరకూ, అప్పుడు మనము అందులోనికి వెళ్ళెదము. మరియు అందులో మనము అనేది (నేను) ఉన్నంతకాలము, అప్పుడు పరిశుద్ధాత్మ అందులో ఉండలేడు, నేను అనేది ఉన్నంత కాలము.

ఇప్పుడు, ఒకవేళ ఎవరైనా ద్వారము దగ్గరకు వెళ్తే, అక్కడ ద్వారపాలకులు లేక ఎవరైనా, కొంతమంది, స్త్రీలు వారి యొక్క గొడుగులతో, వర్షములో ఉన్నారు. ఒకవేళ వారికి వీలైనంత సౌకర్యముగా వారిని ఉంచుకొనిన యెడల, ప్రభువైన యేసు యొక్క సామాన్యమైన సువార్తను ఇటువంటి ఒక వర్షపు దినమున వినుటకు వచ్చిన ఈ ప్రజల యొక్క విధేయత మరియు యదార్ధతలను మనము అభినంధించెదము.

ఒకవేళ నేను పొరబడనట్లయితే, ముందు కూర్చున్న ఈ చిన్న స్త్రీ, ఇక్కడే శ్రీమతి వుడ్‌ ప్రక్కన నేను ఇక్కడికి వచ్చుటకు ప్రేరేపించిన వారిలో నీవు ఒకరివి కాదా? నీ పేరు నేను ఎరుగను, సహోదరీ; (సహోదరి ఒక అభిప్రాయం తెలిపినది.) నేను నీ కొరకు ప్రార్ధన చేశాను. మరియు ఒకవేళ నేను పొరబడనట్లయితే, లూయిస్‌విల్‌లో ఓపెన్‌డోర్‌ యొక్క సంఘము వద్దనే కదా? నీవు స్వస్థపరచబడ్డావు లేక ఏదో, ఒక వ్యాధితో మరియు అప్పటి నుండి, నీ హృదయము కదిలించబడినది. మరియు ఇక్కడ ఈ నగరములో ఉన్న అనేక మెథడిస్టు సంఘములలో ఒక దానిలో నీవు సభ్యురాలివి అని నేను నమ్ముచున్నాను.

9

మరియు నేను ఇక్కడకు రావాలని అది నీ హృదయము పైన ఉన్నది. నన్ను క్షమించు నీ పేరు ఏమిటో నాకు తెలియదు ... నాకు తెలియదు. కానీ ఈ సహోదరి, వుడ్స్‌తో పాటు (నా ప్రియమైన స్నేహితులు మరియు పొరుగువారు), మా ఇంటి ప్రక్కన నివసించెదరు. వారు క్రైస్తవులు, అధికారకముగా. నీవు ఒక వ్యక్తి యొక్క పొరుగు ఇంటిలో జీవించినప్పుడు, వారు ఏమైయున్నారో నీవు చక్కగా చెప్పగలవు, నీవు చెప్పగలవు కదా? అది నిజము.

కాబట్టి ఇక్కడే ఎక్కడో మీ పిల్లలలో ఇద్దరు క్రింద ఈ గట్ల మీద ఉన్నారు, శ్రీ మరియు శ్రీమతి బాంక్స్‌ వుడ్‌, ఈ సువార్త పనిలో వారు నాతో కలసి సహవాసము చేయడం నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. మరియు ఇక్కడ మన ప్రియమైన సహోదరి, కూడా ఉన్నది, నేను ఆమెను కొద్దిగా మాత్రమే ఎరిగియున్నాను, కానీ ఒక విధేయురాలైన క్రైస్తవురాలుగా ఆమె నాకు తెలుసు. మరియు ఆమె ఏ సంఘమునకు చెందినదో అందులో ఒక గొప్ప పనిచేసేదానిగా ఆమెను నేను ఎరుగుదును. మరియు ప్రభువు ఆమెను మరియు ఆమె సంఘమును, కలిపి దీవించును గాక.

10

ఇప్పుడు, నేను చెప్పుచున్న రీతిగా, పరిశుద్ధ గ్రంథమును పరిశుద్దాత్మ వ్రాసియున్నది, మరియు అది ఏ విధముగా వ్రాయబడినదనగా, అది ఏమిటి అనేది అర్ధము చేసుకొనుటకు తన మానసిక భావనతో దానిని గ్రహించుటకు ఏ మనుష్యునికి ఎటువంటి అవకాశము లేదు. దానిని నీవు ఎంత బాగుగా రాయించగలిగినప్పటికీ, మీరు ఎంత బాగుగా దానిని కలిగి ఉంచగలిగినప్పటికీ, అసలు అది ప్రారంభించుటయే తప్పు. ఎందుకనగా చూశారా? ఆయన తెలివైన వారికి మరియు వివేకముగల వారి యొక్క నేత్రములకు దానిని మరుగుచేసెను, మరియు అది ఒక ఆత్మీయ ప్రత్యక్షత.

మన ప్రభువైన యేసుయొక్క దినములలో పరిసయ్యులను మరియు సద్దూకయ్యులను చూడుము, వారు ఏవిధముగా దానిని చిత్రీకరించారో, క్రీస్తు ఎలా రాబోవుచున్నాడో మరియు అవన్నీ మరియు ఆయన వచ్చినప్పుడు, వారు ఊహించిన దానికి పూర్తి వ్యతిరేకముగా ఆయన వచ్చాడు, కేవలం ఆయన దేవుడని చూపించుటకు ... మరియు అది ...లేఖనమునకు వ్యతిరేకముగా ఆయన రాలేడు; లేఖనమును గురించి వారి యొక్క భావమునకు వ్యతిరేకముగా ఆయన వచ్చెను. కానీ ఖచ్చితముగా లేఖనము ఏమి చెప్పినదో ఆ మార్గములోనే ఆయన వచ్చెను, ఖచ్చితముగా.

11

ఇప్పుడు, నేను కొంచెము మాట్లాడుచున్నాను. శ్రీ మరియు శ్రీమతి జెబ్‌ స్మిత్‌, అక్కడ మీ ప్రదేశమును ఉపయోగించుటకు నేను చిన్న యవ్వన బాలుడను కాను. నేను ముసలివానిగా అయిపోయాను, మరియు గత దినమున నేను నా మొదటి పంటి నొప్పిని కలిగియున్నాను, మరియు ఒక పన్నును లాగివేసారు. మరియు ఒక దానిని తిరిగి దాని స్థానములో వారు పెట్టియున్నారు, మరియు ఇక్కడ నా నోటిలో నేనొక తీగను కలిగియున్నాను. మరియు ఇది నిజముగా ఒక అడ్డంకిగా ఉన్నది. నా నోటిలో నేను ఏదో అంత ఎక్కువ కలిగియున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి దీనికి నేను అలవాటు పడేంతవరకు, ఆ విధంగా అస్పష్టముగా మాట్లాడుటను బట్టి నన్ను క్షమించండి. కానీ మనము ముసలివారము అయ్యేటప్పుడు, ఆ సంగతులను నేర్చుకొనవలసియున్నది.

నిన్నటి దినము నేను మాట్లాడుచున్నాను, నేను...నా భార్యతో నేను చెప్పుచున్నాను నాకు మిగిలియున్న ఆ కొద్దిపాటి వెంట్రుకలను నేను దువ్వుకుంటున్నాను. నా భార్య నాతో అన్నది; ఆమె అన్నది, “బిల్లీ, నీవు బట్టతల వానిగా అయిపోతున్నావు.”

నేను అన్నాను, “మంచిది, హనీ,” కానీ నేను అన్నాను, “ప్రభువుకు స్తోత్రములు, అక్కడ అందులో ఒక్కటి కూడా నశించిపోదు.”

ఆమె అన్నది, “మంచిది, మరి అవి ఎక్కడ ఉన్నాయి?”

నేను అన్నాను, “నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ తర్వాత నీవు ... మరియు నీవు నాకు సమాధానము చెప్పుము, నేను నీకు సమాధానము చెప్తాను. వాటిని నేను పొందుకొనక మునుపు అవి ఎక్కడ ఉన్నాయి? అవి ముందు ఎక్కడ ఉన్నవో అక్కడే ఉన్నవి, అవి తిరిగి అక్కడనే ఉన్నవి, నేను వాటి యొద్దకు వచ్చుటకు నా కొరకు ఎదురుచూచుచున్నవి.” ఆమేన్‌. ఓ, మై.

12

కాబట్టి, నేను ఎంత ముసలివాడిని అగుచున్నప్పటికి నేను ఏమి జాగ్రత్త వహించాలి, మీరు ఎంత ముసలివారు అగుచున్నప్పటికి, ముడతలు పడుచున్నవారుగా మనం ఉన్నప్పటికి, ఎంత వంగిపోవుచున్నవారిగా అయినను, ఒక్క విషయము గూర్చి కూడా ఆలోచించనక్కర్లలేదు. ఈ దినములలో ఒక దినమున యేసు వచ్చుచున్నాడు, మరియు మనము ఒక యవ్వన పురుషునిగా మరియు స్త్రీగా తిరిగి మారిపోయి మరియు ఎప్పటికీ జీవించెదము. ఏమిటి ... ప్రతీ రక్తకణమును, ప్రతీ చిన్న...

మన శరీరములు ఓ, సూర్యరశ్మి మరియు చమురులు మరియు మొదలగు వాటితో తయారు చేయబడెను, కానీ ఎక్కడనుండో అవి వచ్చినవి. అవి ఇక్కడ లేవు. అవి అప్పుడు ఉండేవి; అంతట అవి మరలా లేవు.

కానీ నీ యొక్క శరీరమును ఒక్కటిగా పట్టుకునియున్న ప్రతీ అణువు కూడా దేవునికి తెలుసు. ప్రతీ కాంతి బిందువు, ప్రతీ రక్త కణము, ప్రతీ జీవ కణము, ప్రతీ చమురు, మరియు కాల్షియం అంతా, ఫాస్పేట్‌, మానవ శరీరములోనికి వెళ్ళు ప్రతీది భూమిలో నుండి వచ్చినదే. ప్రతీ బిందువు ఎక్కడ ఉన్నదో ఆయన ఎరుగును, మరియు ఒక రోజు, నీ ఆత్మ వదిలిపెట్టబడును, మరియు దాని యొక్క జీవము కొరకు అది కేకలు వేయును. మరియు ఒక ముసలి పురుషుడు లేదా స్తీ అనేది కాదు...

13

కానీ గమనించండి, గత దినము కెంటకీలోని, లూయిస్‌విల్‌లో నేనొక వైద్యునితో మాట్లాడుచున్నాను. మేము ఒక ఆఫ్రికన్‌ విషయముపై మాట్లాడుచున్నాము, మరియు అతడు చెప్పెను, “మంచిది”.

నేను అన్నాను, “నేను ఒక విషయము మిమ్మల్ని అడగాలని అనుకొనుచున్నాను, వైద్యుడా, నేను తిను ప్రతీసారీ ఇప్పుడు నా జీవమును నేను పునరుద్ధరించుకొనుట అనేది నిజమా?”

“తప్పకుండా,” ఆయన చెప్పెను, “నీవు ఆహారమును తీసుకొనెదవు, మరియు అది రక్తకణములను తయారు చేస్తుంది, మరియు రక్తకణములు నీ యొక్క జీవమును పునరుద్ధరింప చేస్తాయి.”

నేను అన్నాను, నేను పదహారు సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు, అది ఎందుకు నేను అదే రకమైన బీన్స్‌ గింజలను, మరియు బంగాళాదుంపలను, మరియు మొక్కజొన్న రొట్టెను, మరియు ఇంకా అనేకమైనవి తినుచున్నాను. నేను వాటిని నా పదహారు సంవత్సర ప్రాయములో తిన్నప్పుడు, నేను పెద్దవానిగా, బలవంతునిగా, ఆరోగ్యముగా అయ్యాను; అన్ని సమయములలో శక్తివంతముగా ఉండేవాడిని. మరియు ఇప్పుడూ నేను అవే తినుచున్నాను, వాటిని కొద్దిగా ఎక్కువగానే అని అనుకొనుచున్నాను, మరియు నేను ముసలివానిగా మరియు ప్రతీసారి బలహీనముగా అయిపోవుచున్నాను? నాకు అది చెప్పుము, ఒకవేళ నేను లోపల క్రొత్త జీవమును ఉంచినట్లయితే, ముప్పది సంవత్సరముల ముందు జరిగినట్లుగా ఇప్పుడు ఎందుకు అదే రీతిగా నాకు జరుగుట లేదు?“ చూశారా?

ఆయన అన్నాడు, “మంచిది ...”

నేను అన్నాను, “నేను నిన్ను ఒక విషయము అడగాలని అనుకొనుచున్నాను, ఒకవేళ నీవు ఒక గ్లాసులో నీరు పోయిచున్నట్లయితే, మరియు అది పైకి నిండుచున్నప్పుడు, ఎందుకు అది పూర్తిగా నిండుట లేదు?”

ఆయన అన్నాడు, “మంచిది ...”

నేను అన్నాను, “ఎందుకనగా దేవుడు చెప్పెను.” అది సరే, చూశారా? దేవుడు చెప్పెను.

14

మరియు మనము పైకి ఎదుగుచున్నప్పుడు ... మరియు మనము ఒక పుష్పము వలె, ఒక చిత్రము, మనము ఒకానొక వయస్సుకు ఎదుగుదుము, ఇంచుమించు ఇరవై రెండు లేదా మూడు సంవత్సరముల వయస్సు. నీవు మరియు నీ భార్యను పెండ్లి చేసుకున్నప్పుడు, ఇక్కడ ఉన్న ప్రియ వృద్ధ సహోదరుడా, నీవు మొక్కజొన్న పొలములో పని చేయుచున్నప్పుడు, ఆ చిన్న సిగ్గుతో కూడిన ఎర్రటి బుగ్గలు గల అమ్మాయిని పెండ్లి చేసుకున్నావు ... అటువంటి వారిని మనము కనుగొనలేకపోవుట ఇది చాలా బాధాకరము. ఎందుకో మీకు తెలుసా, ముప్పయి సంవత్సరములు నుండి సిగ్గుపడే ఒక్క స్త్రీని కూడ నేను చూడలేదు. ఆ నమ్రత అంతయును పోయెను. ఇప్పుడు దాని మీద ప్రారంభించాలని నేను కోరుకోవడం లేదు.

అంతయూ సరే నేను కేవలము ఒక పాత నాగరికత కలిగినవాడిని, అరణ్యవాసిని, సత్యమును నమ్మేటటువంటి బోధకుడను. ప్రభువైన యేసు యొక్క రాకడ కొరకు ఎదురుచూచుచూ, ఈ ప్రస్తుత జీవితములోప్రజలు దైవికముగా, పరిశుద్ధముగా జీవించాలని నేను నమ్ముచున్నాను.

కానీ మనము ఒక స్థానమునకు చేరుకున్నప్పుడు, సుమారు ఇరవై మూడు, మనము పెండ్లి చేసుకుంటాము, మరియు ఆ మధురమైన దానిని మన చేతిలోనికి తీసుకుని మరియు గృహమునకు వెళ్ళెదము, సహోదరులైన మీరు దానిని గుర్తించుకొనండి. మరియు అప్పుడు మీరు ఉత్తమముగా ఉండెదరు. మొదటి సంగతి నీవు తెలుసుకోవల్సింది ఏమనగా, తల్లి ఒక ఉదయమున మేల్కొని, “డాడీ, నెరిసిన జుట్టును నేను చూచాను,” అని చెప్పును.

నీవు చెప్పెదవు, “అమ్మా, ఆ యొక్క అందమైన కన్నుల క్రింద చిన్న ముడతలను నేను గమనిస్తున్నాను.” చూడండి, ఏమిటి సంగతి? మరణము వచ్చుచున్నది, అది నిన్ను చుట్టు ముట్టుటకు ఎంతో సమయము పట్టదు. అక్కడ నుండి అది బయటపడును ... కొంత సమయము తర్వాత నీవు ముసలివాడవవుదువు. అది నిన్ను తీసుకెళ్ళును, కానీ అది చేయగలిగినది అంతే. అంతే.

15

ప్రతీ రక్తకణము, ప్రతీచోట నీవు ఉత్తమమైనవాడవుగా ఉండినప్పుడు, ఖచ్చితముగా ఆ శిఖరము యొద్ద, దేవుడు చెప్పాడు, “ఇప్పుడు ఆ చిత్రము వేయబడెను. అదియే వచ్చుచున్న నా గొప్ప వెయ్యేండ్లపాలనలో ఉండాలని నేను కోరుచున్నాను, కాబట్టి నేను కేవలం ...ఇప్పుడు, మరణమా నీవు అక్కడ ఉన్నావు, కానీ ఇప్పుడు నీవు వారిని తీసుకొని వెళ్ళలేవు. వారిపై నీవు పనిచేయుటకు వెళ్ళవచ్చు, కానీ నీవు వారిని తీసుకొని వెళ్ళలేవు, నేను నిన్ను పిలిచేంతవరకు,” చూశారా?

అంతట ఆ గొప్ప పునరుత్థానములో, అప్పుడు మనము వచ్చెదము. ఆ మరణము మనకు చేసిన ప్రతీది, అది మరణము వద్దనే పూర్తియగును, మరియు అప్పుడు మనము ఒక నూతన జీవితమునకు మేల్మొనెదము. అది అద్భుతమైనదిగా ఉండదా? నెరసిన జుట్టు అంతయూ పోవును, ముసలి వయస్సు దూరము కదలిపోవును. మరియు మనము ఎప్పటికీ యవ్వనముగా ఉందుము మరియు ప్రభువు యొక్క సౌందర్యములో నిరంతరము జీవించెదము. మరియు ఎన్నడూ అనారోగ్యము కలిగియుండము, ఎన్నడూ ముసలివారిగా ఉండనక్కరలేదు, ఎన్నడూ మందులు తీసుకొనవసరము లేదు, ఎన్నడూ హాస్పిటల్‌లో ఉండనవసరము లేదు, ఎన్నడూ అంబులెన్స్‌ కేకలుండవు. ఇది అద్భుతముగా లేదా?

ఎందుకు, వారు మనల్ని వెర్రివారు అని పిలిచెదరు; ఈ ప్రపంచములో మనము అత్యంత తెలివైన వారమని నేను నమ్ముచున్నాను. మనము, నేను సరే అని చెప్పెదను, (సహోదరుడు బ్రాన్హాం నవ్వుచున్నారు), ఎందుకనగా మన ప్రభువైన యేసును మనము ప్రేమించుచున్నాము. ఈ బైబిల్‌ కలిగియున్నవన్నీ, ఆ వాగ్ధానములు, మరియు అవి మంచివి. కావున మనప్రభువు ఎంత మంచివానిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క ప్రియమైన వానితో మాట్లాడెదము. ఒకవేళ లేఖనము యొక్క కొద్దిపాటి ఉదాహరణతో, ఈ మధ్యాహ్నము ఆయన మనకు వాక్యమును తెరచినట్లయితే, అంతట మనము తొందరగా బయటకు వెళ్ళెదము, కాబట్టి ఈ రాత్రికి తిరిగి మనము రాగలము. మరియు ఒకవేళ మనము అనారోగ్యముతో ఉన్నవారికి ప్రార్ధన చేయగోరినట్లయితే, సుమారుగా, ఓహ్‌, ఆరు-ముప్పయి, ఆ విధముగా, మరికొన్ని ప్రార్ధనాకార్టులను మన బాలురు ఇస్తారని నేను నమ్ముచున్నాను.

16

మనము ప్రార్ధన చేసుకుందామా? మా పరలోకపు తండ్రీ, ఇక్కడ ఈ కెంటకీ రాష్ట్రములో, ఈ ప్రజల మధ్య ఉండుట ఈరోజు మాకు చాలా ఆనందముగా ఉన్నది. మరియు తిరిగి ఈ యొక్క గట్లు మీద, ఈ పాత శ్మశానములలో, చాలా మంది ఒక మార్కర్‌తో గుర్తు కూడ పెట్టబడలేదు. వృద్ధ పేద తండ్రి, తన ఒంటిపై ఒక చినుగుపోయిన చొక్కా మరియు పొడవాటి దుస్తులు కలిగి, అతడు ఒక సమాధి స్థలమును కూడా కొనలేడు. కానీ అతడు తన ప్రియురాలును పరుండబెట్టి, ఆమె ప్రక్కనే తన చిన్న బిడ్డను కూడపెట్టి, తన యొక్క చిన్న పందెమును పరుగెత్తాడు లేక ఒక సిలువ. కానీ పరలోకమందున్న దేవుడు, ఆ గొప్ప గ్రంథములలో, ఆ గ్రంథములను పరిశీలించినప్పుడు, ఒక పేరు వ్రాయబడియున్నది. ఆమె ఎక్కడున్నదో, ఆమె శరీరము ఎక్కడ ఉండినదో, నీకు తెలుసు.

మరియు ప్రభువా, నీవు మరచిపోవని తెలుసుకొనుటను బట్టి, నేను చాలా ఆనందముగా ఉన్నాను. మరియు ఈ దినము ఇక్కడ వారి యొక్క బిడ్డలతో కలిగియున్న సంబంధమును బట్టి మేము ఎంతో ఆనందముగా ఉన్నాము, వారు కూడా నిన్ను నమ్ముచున్నారు. మరియు ఇప్పుడు, నేను నిన్ను అడుగుచున్నాను. తండ్రీ అది నీవు మా ప్రసన్నతలోనికి రమ్ము, లేక మమ్ములను నీ యొక్క ప్రసన్నతలోనికి రానిమ్ము. మరియు మీ యొక్క ఆ గొప్ప ఉనికి, ప్రభువా, నీ మంచితనము మరియు దీవెనలతో మా యొక్క అత్మలను పైకి లేపుము. మేమేదో యోగ్యమైనవారమని కాదు, మేము అయోగ్యులము, కానీ కేవలము నీవు దానిని వాగ్ధానము చేసియున్నావు గనుక ప్రభువా, దాని కొరకు మేము చూచుచున్నాము.

ఇప్పుడు, లేఖనములన్నియూ ఒక్కటిగా ముడివేయబడియున్నవి. దానిని మన కొరకు అనువదించుటకు మనము కేవలము పరిశుద్ధాత్మను కలిగియున్నట్లయితే, పరిశుద్ధగ్రంథము అది మాట్లాడు దాని కన్నా ఎక్కువైయున్నది. దాని పైన మనము చూచునప్పుడు మనము కేవలము దానిని చదివెదము, కానీ, ఓహ్‌, పరిశుద్ధాత్మ ఏ విధముగా చెప్పుచున్నదనగా, “నా బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథములోనికి చూచినప్పుడెల్లా, ఇప్పుడు మీరు నా ముఖములోనికి చూచుచున్నారు. ఇదియే మీరు తెలుసుకోవాలని నేను కోరినది.” మరియు పరిశుద్ధాత్మ ఈ దినము దేవుని యొక్క వాక్యమును తీసుకొని, మరియు దానిని ప్రతీ హృదయమునకు చేర్చును గాక, కేవలం మనము ఆపేక్షించుచున్నట్లుగా. మరియు ఇప్పుడు వాక్యము చుట్టూ మనము సహవాసము చేయుదుము గాక. మమ్ములను ఉత్తేజపరచుము. ఏలయనగా యేసుక్రీస్తు యొక్క నామములో దీనిని అడుగుచున్నాము ఆమేన్‌.

17

పరిశుద్ధ లూకా పుస్తకములో కనుగొనియున్న, లేఖనములో ఈ చిన్న భాగములో, నా జీవితమంతటిలో నా బోధలన్నింటిలో, నా జీవితములో మునుపు ఎన్నడూ ఇటువంటి పాఠ్యాంశమును నేను సమీపించలేదు. నేను ఎన్నడూ ప్రయత్నించని ఒక క్రొత్త పాఠ్యాంశము. కానీ కొంత సమయము క్రితము నా హోటల్‌ గదిలో కూర్చొని యున్నప్పుడు, ఏదో నన్ను ఈ భాగము వద్దకు ఆకర్షించినది. మనము పరిశుద్ధ లూకా సువార్తలో దీనిని చదివెదమా? మరియు ఏడవ అధ్యాయము మరియు 36వ వచనము వద్ద మనము మొదలుపెడదాము.

పరిసయ్యులలో ఒకడు... తనతో కూడ...భోజనము చేయవలెనని ఆయన నడిగెను.

యేసు ... లేక పరిసయ్యుడు యేసును వారి యొక్క స్థలమునకు వచ్చి భోజనము చేయవలెనని కోరెను. ఇప్పుడు, అందులోని ఘటన ఏమనగా, మొత్తం అధ్యాయము అంతయు మనము చదివిన తరువాత, లేఖనము యొక్క విధానము, మరియు అది ఎలా మాట్లాడుచున్నదో మీరు చక్కగా తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు, దీనివైపు మన ఆలోచనలు త్రిప్పినట్లయితే, ఇక్కడ ఏదో తప్పు ఉన్నది. అది ... నేను దేని మీద మాట్లాడాలనుకొనుచున్నానో దానిపై లేఖనము యొక్క ఈ భాగము మనకు ఒక అభిప్రాయమును ఇచ్చుటకు సరిపోవును. మరియు నా అంశము “అహంకారము” అయ్యున్నది.

ఓహ్‌, అహంకారము అనేది ఒక శపించబడిన విషయము; చాలా భయంకరమైనది, అహంకారము అనేది చాలా చెడ్డది, కానీ మన చిన్న సంఘటనలోనికి మనము వెళ్ళినప్పుడు అక్కడ ఏదో తప్పుగా కనిపిస్తోంది. మరియు ఒక సిద్ధాంతపరమైన ఉద్దేశ్యముతో కాదు, కానీ యేసుయొక్క జీవితమునుండి, మనము దీనిని ఇప్పుడు చూడగోరుచున్నాము. సిద్ధాంతము కొరకు కాదు. కానీ అక్కడ, ఖచ్చితముగా, ఏదో తప్పు ఉన్నది, ఒక పరిసయ్యుడు యేసును చూడాలని కోరుకొనుచున్నాడు. మరియు సహవాసము కొరకు ఆయనతో తినాలని అనుకొనుచున్నాడు. మొత్తం అదంతయూ వ్యతిరేకమైనది. పరిసయ్యులు యేసును అసహ్యించుకుందురు. ఆయన వలన ఎంతమాత్రము వారికి ఎటువంటి ఉపయోగము లేదు. ఆయన వారికి ఒక బయెల్జబూబు, ఒక దయ్యము, ఒక మోసగాడు. మరియు ఏ పరిసయ్యుడుకు యేసుతో చేయుటకు ఏమియూ లేదు.

18

కానీ ఈ సీయోను, యేసు తన యొద్దకు రావాలని అతను కోరుకొనెను, మరియు ఏదో కొద్దిగా ... ఆయనతో అలరించబడాలని (గొప్ప చేయబడాలని) కోరుకొనెను. ఇప్పుడు, ఈ భావనలో ఏదో తప్పు ఉన్నది.

ఒక చిన్న అమ్మాయి తన బామ్మను ఎల్లప్పుడూ వెంబడించుట మనం చూచినప్పుడు, ఆరు-లేక ఏడు-సంవత్సరములు-వయస్సు గల చిన్నది బామ్మతో చుట్టూ తిరుగుచూ ఉన్నది, అక్కడ ఏదో జరుగుచున్నది, ఉద్దేశ్యములు మారిపోయినవి.

ఇప్పుడు, ఆరు సంవత్సరములు వయస్సు గల ఒక అమ్మాయి లేదా ఏడు లేక ఎనిమిది, తన తోటి వయస్సు గల చిన్న పిల్లల చుట్టూ ఆడుకుంటూ, ఆమె చుట్టూ అవివేకముగా తిరుగుటకు ఇష్టపడును. కానీ ఆమె తన బామ్మను ఎల్లప్పుడూ వెంబడిస్తూ ఉంది అంటే, ఇప్పుడు, అది ఆ బామ్మ నిజముగా మంచిది అయ్యుండవచ్చు, లేక ఆమె తన బామ్మకి ఇష్టురాలు అయ్యుండవచ్చు....... లేక తన బామ్మకు ఆమె ప్రియమైనది అయ్యుండవచ్చు; లేదా మీకు తెలియకపోవచ్చు, బామ్మ చాక్లెట్లు ఉన్న ఒక పెద్ద సంచిని ఎక్కడో పెట్టియుండవచ్చు. చూశారా? దానిని గూర్చిన విషయం ఏదనగా, బామ్మను వెంబడించుటయే ఆ బాలిక కలిగియున్న ఉద్దేశ్యం. మరియు ఖచ్చితముగా యేసును అసహ్యించుకొను ఈ పరిసయ్యుడు, సరియైనది కాని ఒక విధమైన ఉద్దేశ్యమును అతడు కలిగియున్నాడు.

19

యవ్వన బిడ్డలు యవ్వనులతోనే వెళ్ళుటకు ఇష్టపడతారు. చిన్న పిల్లలు వీధులలో అడుకొనుటకు ఇష్టపడతారు; యెషయా ప్రవచించిన వాటిలో దానిని గూర్చి బైబిల్‌ చెప్పుచున్నది. వీధులలో ఆడుకొను చిన్న పిల్లలు, వారు అందరూ ఒకలాంటి వస్తువులనే కలిగియుంటారు. వారి బొమ్మలు, మరియు వారి బొంగరములు, మరియు వారికి ఇష్టమైన గుర్రములు మరియు ఇంకా అనేక వస్తువులు. చిన్న పిల్లలు చిన్న పిల్లలతోనే కలిసి ఉందురు. యవ్వన బాలికలు యవ్వన బాలికలతోనే కలిసి ఉందురు, మధ్య-వయస్సు గల స్త్రీలు మధ్య వయస్సు గలవారితోనే కలిసి ఉందురు, ముసలివారు ముసలివారితోనే ఉందురు.

క్లబ్బులు, కివానీస్‌ మరియు రోటరి, వ్యాపారుల సేవా సంస్థ, సాధారణముగా ఒకే సంగతులునే వారు కలిగియుంటారు. వారు వారి యొక్క క్లబ్బులలోనే కలుసుకొని సహవాసము కలిగియుంటారు. సమాజము కొరకు, లేదా పేదవారి పట్ల కొన్ని పరిస్థితులలో ఎలా జాగ్రత్త వహించాలి ... అనే సంగతులపై వారు మాట్లాడుకొనెదరు. వారు ఒకటిగా కలుసుకోవలసియున్నది. మరియు ఆ పాత కెంటకీ సామెతను నా తల్లి అనేకసార్లు చెప్పుట నేను వింటిని, “ఒకే ఈకలు కలిగిన పక్షులన్ని కలిసి గుంపుగా ఉండును.” అది చాలా సత్యమై యున్నది.

20

కాకులు మరియు పావురములు ఒకదానికొకటి ఎక్కువ సహవాసము కలిగియుండుట మీరెన్నడూ చూడరు. అవి రెండు వేర్వేరు జాతి పక్షులు ఒకటి ఒకదానిని కలిగియుండును, మరియు మరొకటి మరొక దానిని కలిగియుండును. ఇప్పుడు కాకి, అది ఒక కుళ్లిపోయినవాటిని తినేది. అది కేవలం చనిపోయినవాటిని తినును. కానీ పావురము చనిపోయిన వాటిని తినలేదు. ఒకవేళ పావురము చనిపోయిన వాటిని తిన్నట్లయితే, అప్పుడే ఆ పావురము చనిపోవును; దానిని అది జీర్ణము చేసుకోలేదు. పావురము-పావురముగా పిలువబడే మనకు తెలిసిన ఆ పక్షి పరిశుద్ధ గ్రంథములో పావురము పరిశుద్దాత్మకు ప్రతీకగా ఉన్నది; ఆ పావురము ఎటువంటి పిత్తాశయమును కలిగిలేదు. అది చెడును, మురికివాటిని జీర్ణము చేసుకోలేదు; ఎందుకంటే ఒకవేళ అది అలా చేసినట్లయితే, అది ఆ పావురం యొక్క మరణము అని తెలియజేస్తుంది.

ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుని యొక్క చాలా అందమైన మాదిరి: లోకము యొక్క సంగతులను జీర్ణించుకోలేడు, ఒకవేళ వారు దాన్నిచేసినట్లయితే, వెనువెంటనే ఆత్మీయముగా అది వారిని చంపి వేస్తుంది. కానీ ఆ పాత కాకిని మీరు ఎన్నడైనా గమనించారా? ఇప్పుడు, అక్కడ కుళ్ళిపోవుచున్న ఆ చనిపోయిన జంతుకళేబరముపై అది కూర్చొని యుండగలదు -సాధారణ కెంటకీ భాషలో, కుళ్ళిపోవుచున్న (చెడిపోయివున్న) మరియు దాని మీద అక్కడ కూర్చొని దినమంతయూ తినుచు ఉండగలదు. కాని పావురము దాని చుట్టుప్రక్కలకు కూడా వెళ్ళలేదు; అది కంపు కొట్టును మరియు అతడు దూరముగా ఎగిరిపోవును. కానీ ఆ కాకి దినమంతయూ అక్కడ దాని మీద కూర్చొని మరియు దానిని తినగలదు, మరియు అంతట గోధుమ పంట పొలములోనికి వెళ్ళి పావురముతో పాటు దానిని కూడా తినును.

21

కాబట్టి ఒక వేషదారి, ఒక వంచకుడు (మోసగాడు), అతడు లోకములోనికి వెళ్ళి మరియు లోకముతో సంబంధము కలిగియుండును, మరియు లోకము వలె ప్రవర్తించును, మరియు లోకములో జీవించును, మరియు లోకము యొక్క సుఖభోగములను అనుభవించును, మరియు సంఘములోనికి వచ్చి ఒక క్రైస్తవుని వలె నటించును. కానీ నిజక్రైస్తవుడు లోకములోనికి వెళ్ళలేడు మరియు తిరిగి రాలేడు; అక్కడ ఏదో తప్పు ఉన్నది. కావున అది చూపించుచున్నదేమనగా...

నీ సహవాసమును చూపించుము, నీవు ఎలాంటివాడివో నేను చెప్పగలను. నీ గృహమునకు వెళ్ళి మరియు నీవు ఏమి చదువుచున్నావో నన్ను చూడనిమ్ము, ఏ విధమైన సంగీతమును నీవు వినుచున్నావో ... నన్ను చూడనిమ్ము. నీవు ఏ విధమైన వార్తా పత్రికలను, మరియు ఏ విధమైన గ్రంథములను నీవు చదువుచున్నావో నన్ను చూడనిమ్ము. నీ యొక్క ఆఫీసులో నన్ను చూడనిమ్ము మరియు ఒక పెద్ద మొత్తములో తగిలించియున్న ఈ అసభ్యకరమైన చిత్రములను మరియు అలాంటి విషయములను చూడనిమ్ము మరియు నీవు ఒక క్రైస్తవునివి అని నాకు చెప్పెదవు నేను నీకు ఏమి చెప్పగోరుట లేదు; కానీ నీవు ఎలాంటి ఫలమును మోయుచున్నావో నా హృదయములో నేను చూడగలను. (చూశారా?), ఎందుకనగా అది నీ ఆహారము.

ఓహ్‌, నీవు చెప్తావు, “నేను సంఘమునకు చెందినవాడను. మంచిది ఇప్పుడు, నన్ను తీర్చు తీర్చుటకు నీకు సంబంధము లేదు, సహోదరుడా బ్రాన్హాం.” నిన్ను నేను తీర్పు తీర్చుటలేదు; వాక్యము నిన్ను తీర్పు తీర్చుచున్నది. అది నిజము. నీ ఫలము, నీ జీవితము నీవు ఏమైయున్నావో చెప్పును.

22

ఓ, మై, ఈ పరిసయ్యుడు దీని వెనుక ఒక రకమైన ఉద్దేశ్యమును ఖచ్చితముగా కలిగియుండవచ్చును. పరిసయ్యుడు అనగా ఏమిటి? పరిసయ్యుడు అనే పదమునకు అర్ధము ఏమిటి? కెంటకీలో మనము తరచుగా ఈ పదమును ఉపయోగించము. పరిసయ్యుడు అనే పదమునకు అర్థమేమి? గ్రీకులో, దాని అర్ధము “ఒక నటుడు, నటించే వ్యక్తులు.” ఓ, ఎవరో నటించుచు, వేషము వేయుటకు ప్రయత్నించుట. అది నాకు అసహ్యము. అటువంటి ఒక సంగతిని నేను తృణీకరిస్తాను.

చాలాసార్లు ప్రజలు ఇతర వ్యక్తుల వలె నటించుటకు ప్రయత్నించెదరు. వినుము, నీవు నీ ప్రక్క వ్యక్తి వలె నటించుటకు ప్రయత్నించుట ఆపివేసి, మరియు నీ యొక్క

సొంత నమ్మకములను నీవు అమలు చేయుము అప్పుడు నీవు చాలాకాలము మంచిగా ఉందువు. నీవు నీ వలె ఉండుము. అది సరియైనది.

చాలా మంది చిన్న పిల్లలు సినిమా చూచుటకు వెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చిన పిదప మరియు ఆ నటీమణుల వలె నటించుట మీరు చూస్తారు. మిమ్ములను బట్టి సిగ్గుగా ఉన్నది. లాస్‌ఏంజిల్స్‌, హాలీవుడ్‌లో, అక్కడ నేను చాలా కూడికలను కలిగియున్నాను, మరియు అమెరికా ప్రజల గురించి ఆ మొత్తం పరిసరాలలో పెరిగిన అనేక మంది ప్రజలు ఆ విధముగా నటించుట నేను గమనించాను (కనుగొన్నాను). మనము గొప్ప నటులము, పరిసయ్యులము అక్కడే వారున్నారు; వారిని మీరు చూడవచ్చు...వారు ఎల్లప్పుడు నటించుచూ ఉన్నంతవరకు వారు చాలా ఎక్కువగా ఆ తెర ముందు ఉండెదరు (గడిపెదరు).

23

అమెరికా ప్రజలు టెలివిజన్‌ ద్వారా, మరియు చలనచిత్రములు ద్వారా, వారు ధరించే వాటిని ఎక్కువగా చూస్తారు, చివరికి ఆ దుస్తులు వారే ధరించెదరు: చాలా చెడ్డ కార్యము మరియు దానిని మనము సంఘములోనికి తీసుకు వస్తాము, నటులు. హుమ్‌. దేవునికి అది అవసరము లేదు నటులుగా ఉండుట నుండి మనల్ని దూరముగా ఉంచుకొొనెదము. మీ వలె మీరు ఉండుడి; మీరు ఆ విధముగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. కొందరు వారు చేయలేనటువంటి దానిని చేయుటకు ప్రయత్నించుటను నేను చూచినప్పుడు నేను దానిని తృణీకరిస్తాను.

ఎటువంటి అవమానమది, దానిని నేను చాలాసార్లు గమనించాను, మరియు దేవుడు ప్రజలకు అందమైన స్వరములను ఇచ్చియున్నాడు, ఒక తలాంతు, మరియు తరువాత దానికి వారు తర్ఫీదు తీసుకొనుచున్నారు. అటువంటి శిక్షణ తీసుకున్న స్వరమును వినుటను నేను ద్వేషించెదను, పాడుటకు వారు నిలబడినప్పుడు, వారు తమ యొక్క ప్రియమైన ఊపిరిని ఎంతసేపు నిలిపియుంచగలరో ఆ సమాజమునకు చూపించుకొనుటకు, మరియు వారి యొక్క ముఖము నీలిరంగునకు వచ్చేంత వరకు వారు ఒక రకమైన శృతిని తీసుకొని స్వరమును గట్టిగా పట్టుకొని సాగదీసెదరు. మరియు వారు తిరిగి క్రిందకు వచ్చేసిన తరువాత (స్వరములో), ఆ ప్రజలు దేవుడిని ఆరాధించుట లేదు; వారి యొక్క శృతి స్వరముపైనే వారి యొక్క మనస్సు ఉండును.

24

ఎక్కడైతే సంగీత వాద్యము(organ) మరియు పియానోను నీవు మరిచిపోవుదువో, ఆ మంచి పాత పెంతెకొస్తు వారు పాడే పద్ధతిని నేను ప్రేమించెదను, (అది నిజము); ఒక రకమైన ఆచార సంబంధమైన, కార్యక్రమములలో మీరు పాలు పొందవలసినవసరము లేదు. ఎక్కడైతే చెంపల నుండి కన్నీరు కారుచున్నప్పుడు మీ చేతులను మీరు పైకెత్తెదరో, మీరు స-రి-గ-మ-ప-ని-స అని పాడుచున్నారో లేదా అని కాదు, మరియు కేవలము ఆత్మలో పాడుము. హృదయములో నుండి నీవు దేవునికి స్తోత్రము చెల్లించుము. కార్యక్రమమంతటిలో; దేవుని యొక్క కార్యక్రమములోనికి వెళ్ళుటకు మానవుని యొక్క కార్యక్రమము నుండి బయటకు రమ్ము. (చూశారా?) దాని నుండి బయటకు రమ్ము.

ఓ, మై, ఒక నటునిగా ఉండుట నుండి నన్ను విడిపించుము. మీరు ఏమైయున్నారో ఆ విధముగానే ఉండుడి; దేవుడు మిమ్ములను దీవించును. కొంత మంది సేవకులు ఆ విధముగా చేయుట మీరు చూచెదరు. వారు బలిపీఠము వద్దకు వెళ్ళి, మరియు వారి స్వరములు చాలా పెద్దగా చేస్తారు. “ఇప్పుడు నేను నా డిగ్రీని పొందుకున్నాను ...” అది ఒక రకమైన వణుకును మీ మీదకు తీసుకువస్తుంది. వారి పట్ల నేను చింతించుచున్నాను. ప్రజలు దానిని హర్షించరు. నీవు నీవుగా ఉండుము, ప్రజలు ఎక్కువగా నిన్ను అభినందించెదరు. దానిని మీరు నమ్మెదరా? కేవలం ఆ పాత సహజమైన ఔషధచెట్టు కాల్చిన మాంసపు ముద్ద, మొక్కజొన్న మొలాసస్‌ వలె ఉండుము. అది మీకు మంచి చేయును; మీరు వేరొకని వేషము ధరింపరు.

25

కానీ ఒక పరిసయ్యుడు, ఓహ్‌, ఆ పదమును నేను అసహ్యించెదను, ఒక నటుడు: కొంతమంది సహోదరీలు అటువంటి కార్యములే చేయుదురు, వారి కొరకు ఎంతో ఎక్కువ నటన వారు కలిగి ఉందురు. ఓ, “జాన్‌, ఎందుకు నీవు దానిని చేసావు?” అని వారు వారి యొక్క భర్తల యొక్క ముక్కును కత్తిరించుచున్నారు. వారు ఉండగలిగేంత చురుకైన వారిగా (తెలివిగా) వారు ఉండెదరు. ఓ, మై, వ్యూ! ఆ రకమైన ఆత్మను గనుక నీవు కలిగివుంటే దాని నుండి దేవుడు నన్ను విడుదల చేయును గాక. కానీ ఎవరినైనా టెలిఫోన్‌లో ఈ విధముగా మాట్లాడనిమ్ము, “ఓ, నీవు ఎలా ఉన్నావు? నీవు ఫోన్‌, చేసినందుకు నేను చాలా సంతోషించుచున్నాను.” నటులు, మీ కొరకు సిగ్గుగా ఉన్నది: గృహ దూతలు, రోడ్డుపైన దయ్యములు యొక్క వేషదారణ, ఎల్లప్పుడూ మీవలె మీరు ఉండుడి. ఉండుటకు ఉత్తమమైన మార్గము అదే. దీనిని మీరు నమ్మెదరా?

నిశ్చయముగా, నటులు కాదు, పరిసయ్యులు కాదు, అప్పుడు. నీవు ఎలా పరిగణించబడతావో నీకు తెలుసు. ఆదివారము సంఘమునకు వెళ్ళుము, మరియు, ఓ, సోమవారము ఉదయము ఎంత దైవభక్తి గలవాడవుగా నీవు ఉందువు, ఎవ్వరూ నీతో ఉండరు. పరిసయ్యుడా, నీవు, సంఘమునకు వెళ్ళుట అనేది నీకు ఏమి మంచి: చేసినది? ఓ, మై, హమ్‌. వారికి మార్పు అవసరము; నీకు అవసరమైనది. అదే: దాని యొక్క స్వభావమును బయటకు తీయుము. మెథడిస్టు వారు దానికి “ఆమేన్‌” చెప్పెదరు, ఎందుకనగా సరిగ్గా నేను అర్ధము చేసుకున్నట్లయితే అది మెథడిస్టు, వారి సిద్ధాంతము; శుద్ధీకరణ.

26

అది సరే, ఓ, మై, నటులారా, ఈ పరిసయ్యుడు యేసు యొద్దకు పంపబడెను. దీని వెనుక అతను ఏదో కలిగియున్నాడు. అవును, అతను అలసిపోయాడు; ఆ ప్రజలపై నుండి అతను చూచుచున్నాడు. ఆయన కష్టముగా కనబడుచున్నాడు; అతను చెమటతో ఉన్నాడు. దక్షిణ పాలస్తీనా నుండి అన్వేషించుచూ మరియు వెదకుచూ ఆయన వచ్చియున్నాడు. ఇప్పుడు ఆ గుంపులు చుట్టూ కూడియున్నారు; మరియు. రోజంతా ఆయన ఆ చెమటతో నిలబడియున్నాడు. ఆయన అలసటతో అలసిపోయి ఉన్నాడు; పాలస్తీనా రోడ్ల మీద పాదాలతో నడుస్తూ, ఆ రోడ్డు యొక్క ధూళి మరియు, దుమ్ముతో మొత్తము, ఆయన నడిచియున్నాడు. అప్పుడప్పుడు ఆగి మరియు నీళ్ళు త్రాగేవాడు. కానీ ఆయన తన తల పైకి ఎత్తి, మరియు ఆయన మరలా చూసెడివాడు,“మంచిది, నేను ఆయనను కనుగొన్నందుకు చాలా సంతోషముగా ఉన్నాను, అని కొద్దిగా నిట్టూర్చెను.

కొద్దిసేపు సుదీర్ఘముగా మాట్లాడిన తరువాత, కొంచెముగా ఆ గుంపు విడిపోవడం (తగ్గడం) మొదలవుతుండగా, మరియు తన మోచేతితో త్రోసుకొని వెళ్ళుటకు అతను మొదలుపెట్టెను. అతనికి ఒక సందేశము వచ్చినది. అతను తన మార్గములోనే ఉన్నాడు. అతను ఒక యజమానుని కలిగి ఉన్నాడు; అతని పేరు సీమోను, ఒక పరిసయ్యుడు. అతను సమాచారం చేరవేసేందుకు నియమించబడిన ఒక వ్యక్తి అతను ఈ రహస్య వర్తమానమును తీసుకొని వెళ్ళుచున్నాడు. అతను తప్పక యేసును కలుసుకోవలెను. ఒక పనివాడు, అని పాలస్తీనాలో వారు పిలచెదరు. పరిసయ్యులు వారి యొక్క గుర్రములను నడుపుటకు, మరియు వారి యొక్క తోటలను, మరియు మొదలైనవి మరియు వాటిని జాగ్రత్తగా చూసుకొని మరియు ప్రతీది చేయుటకు ఇటువంటి వారిని పుష్కలంగా కలిగివున్నారు : పనివారు, వారు పనిలోనికి వచ్చుటకు వారు కొంత మొత్తాన్ని వారికి చెల్లించెదరు.

27

మరియు ఈ పనివాడు రెండు లేదా మూడు రోజులు వెదుకుచూ ఉండవచ్చు. కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు, ఎందుకనగా తన యొక్క యజమానుడు తన ఇంటి వద్ద జరిగే విందు కొరకు యేసును కనుగొని మరియు ఆయనను ఆహ్వానించమని తనకు ఒక హుకుం జారీ చేసెను. ఆ గుంపు గుండా తన మార్గమును అతను మోచేతితో త్రోసుకొని వెళ్ళుట నేను చూసియున్నాను, మరియు బహుశా, పేతురు, లేక అది అంద్రెయ అయ్యుండ వచ్చు? నేను అచ్చట లేను; నాకు తెలియదు, కానీ “అయ్యా, మీ యజమానుని నేను చూడాలనుకుంటున్నాను,” అని అతను చెప్పుట నేను వింటిని.

మరియు ప్రియమైన శిష్యులు, ఆయన అక్కడ రోగులు కొరకు ప్రార్ధించుచున్నప్పుడు, వారు ప్రజలను యేసు నుండి దూరముగా ఉంచుటకు ఏ విధముగా ప్రయత్నిస్తున్నారో, మరియు అటువంటి సంగతి. మరలా అతను చెప్పెను, “మీ యజమానుని చూడాలని అనుకొనుచున్నాను.” మరియు యేసు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే రోగులు మరియు అందరూ చుట్టూ ఉన్నారో అక్కడికి అంద్రెయ అతడిని తీసుకొని వెళ్ళుట నేను చూస్తున్నాను; అతను చెప్పెను, “బోధకుడా, దక్షిణ పాలస్తీనా నుండి ఒక యవ్వనస్థుడు ఒక సందేశముతో (వర్తమానముతో) వచ్చియున్నాడు. అతను చాలా దూరము నుండి వచ్చియున్నాడు. మరియు అది తన యొక్క యాజమానుని నుండి అని అతను చెప్పుచున్నాడు. మరియు అతను నీతో మాట్లాడాలని ఆశించుచున్నాడు.”

28

మరియు అతను చెప్పుచున్నాడు ... ఒక సందర్భము కొరకు తన ఇంటి వద్ద విందుకు రమ్మని తన యజమానుడు ఏదైతే కోరుకొనెనో, అది చెప్పుటకు, అతడు ఆయనకు నమస్కరించి మరియు తన యొక్క సందేశము ఏమిటో ఆయనకు చెప్పెను. ఓహ్‌, మీరు మరియు నేను అక్కడ ఉండినట్లయితే, మనము దానిని ఎంత వ్యత్యాసముగా చూసి యుండెడివారము. “బోధకుడా, ఆ వేషధారి యొద్దకు వెళ్ళవద్దు. ఆ పరిసయ్యుని యొద్దకు వెళ్ళవద్దు. ఎందుకు, అతను గ్రుడ్డివాడు; అతనికి తెలియదు ... అతను నిన్ను అసహ్యించుకొనును. మరియు చుట్టూ చాలా మంది రోగులున్నారు మరియు అటువంటి సంగతులున్నవి; నీ శక్తి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అటువంటి ఒక వ్యక్తి వద్దకు నీవు వెళ్ళవద్దు; ఆ పాత మాట చెప్పుచున్నట్లుగా, ఒక ట్రంప్‌ కార్ట్‌ (ఆడుకునే ఒక కార్డు) లేదా మరేదో దాని వలె, కేవలము అతడు నిన్ను వాడుకొన ప్రయత్నించుచున్నాడు. అతనికి దాని గురించి ఒక రకమైన చెడు ప్రత్యామ్నాయం ఉన్నది. అటువంటి ఒక వ్యక్తి వద్దకు నీవు వెళ్ళవద్దు,” అని మనము చెప్పియుండెడివారము.

ఓ, మై, ఆ పరిసయ్యుడు, గొప్ప వ్యక్తి తన పట్టణములో గొప్ప మనుష్యుడు, సుగంధపు వాసనతో నిండియున్న భోజనశాలలో ఐగుప్తులో తయారు చేయబడిన అందమైన తివాచీపై కొద్దిరోజుల ముందు అటు ఇటు తిరుగుచూ, గుండ్రని బొద్దుగా పెద్దగా ఉన్న తన యొక్క చేతులను మృదువైన స్థితిలో ఒక దానితో ఒకటి రుద్దుతూ, కొంచెము. బొద్దుగా (టఫ్‌), “నేను దానిని ఎందుకు ముందు ఆలోచించలేదు? హ-హ-హ-హ. నిశ్చయముగా, నాకు కావలసినది అదే. ఖచ్చితముగా అదే. అది ఏమిటో నేను చెప్పెదను నేను కలిగియుండబోవుచున్న ఆ పెద్ద వినోదపు విందులో; దానిని ముందుగానే నేను ఆలోచించవలసినది. హ-హ-హ-హ ఇక్కడ మీకు తెలుసా, నజరేయుడగు యేసు ప్రతీ పేదవాని యొక్క నోట్లో ఉండెను. (అందరూ మాట్లాడుచుండెను). మరియు అది ఏమిటో నేను చెప్పెదను, మరియు ఒకవేళ అతడిని నేను నా యొక్క విందులో కలిగియుంటే, ప్రతీచోట ప్రతీ ఒక్కరూ ఆవిధముగా నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ నిలబడెదరు. నేను చేయవలసినది అదే, అది ఏమిటో తెలుసా? నేను పట్టణములోనే ఖ్యాతి గాంచిన వాడనవుదును. నా ఖ్యాతికి మరింత జోడించెదను. ఓహ్‌, దానిని నేను ముందే ఆలోచించవలసినది.”

కాబట్టి, ఆయన్ని కనుగొనడానికి ఆ అబ్బాయితో రోడ్డుపై వెతికించుట ప్రారంభించాడు. “డాక్టర్‌ జోన్స్‌ ఏమి చెప్పుదునో మీరు ఆలోచించితిరా? ఆ పరిసయ్యుడైన జోన్స్‌, నజరేతువాడైన యేసును అతను ద్వేషించును. ఆయన ఒక దయ్యమని అతడు నమ్మెను. నేను వారిని ఇక్కడ కలిగి ఉన్నట్లయితే, అది లాయర్‌ ఫలానా మరియు ఫలానా వారికి అది మంచిగా ఉండదు. అవును, ఖచ్చితముగా నా సమావేశమునకు పట్టణము యొక్క ప్రముఖులందరు వచ్చెదరు. ఎందుకనగా నేను ఆహారము బాగా పెట్టెదనని వారు ఎరుగును.” ఖచ్చితముగా, ఇతడు ఒక ధనవంతుడైన పరిసయ్యుడు. అతడు పుష్కలముగా కలిగియున్నాడు; అతను ఏమి చేయవలెనని కోరునో దానిని చేయగలడు. ఆ దేవాలయము దగ్గర, మాంసమునంతటినీ అతడు సంపాదించుకొనును. ఆ యొక్క మాంసముపై అతను ఆధారపడెను. వచ్చుచున్న దశమభాగములు మరియు సమర్పణలు మరియు ఆలయమునకు వచ్చు అన్నిటినీ అతను కలిగియుండెను. అతను పుష్కలముగా కలిగియుండెను.

29

అవును, అటువంటి ఒక విందును జరిగించుట ఎందుకు, దానితో పాలస్తీనాలో ఒక సాధారణ కుటుంబం రెండు సంవత్సరములు పోషించబడవచ్చును. కానీ ఓహ్‌, ఆ నగరములో అతను ఒక పెద్ద ధనవంతుడు. పరిసయ్యుడైన డాక్టర్‌ సీమోన్‌, చూడండి ఎటువంటివాడో. అతను ముందుకు మరియు వెనుకకు నడుస్తూ చెప్పుట నేను చూచాను, “ఖచ్చితముగా, ఓ, మై, నేను వెంటనే నా ఆహ్వానములను బయటకు పంపించెదను. మంచిది, మీకు తెలుసా ఏమిటో, అందువలన జనులందరు నను చూడగలరు, వసారా దాటి బయట అక్కడ బయట చల్లగా ఉన్న చోట దానిని నేను ఏర్పాటు చేసెదను, నేను గొప్పగా బయటకు వెళ్లాను... నాకు అక్కడ ఒక చోటు ఉన్నది, ఒక ద్రాక్షవనము (పొదరిల్లు), అక్కడ ఆ అందమైన ద్రాక్షపండ్లు క్రిందకు వ్రేలాడుచుండెను మరియు అవి ఇప్పుడే... చాలా పక్వానికి వచ్చినవి మరియు ఆ ద్రాక్షపండ్లు యొక్క వాసన ఎంతో మధురముగా ఉండును. మరియు నేను అవన్నీ అక్కడ ఉంచెదను. మరియు నా యొక్క ప్రత్యేకమైన పెద్ద బల్లను తీసుకొని అక్కడ బయట అమర్చెదను. మరియు నేను డాక్టర్‌ జోన్స్‌ను, మరియు నేను డాక్టర్‌ ఫలానా మరియు ఫలానా వారిని కలిగియుంటాను, దాక్టర్‌ ఫలానా మరియు ఫలానా, మరియు డాక్టర్‌ ఫలానా మరియు ఫలానా, మరియు ఆ నగరమంతయు నేను ఒక గొప్ప వ్యక్తినని తెలుసుకుంటుంది, నా హోదా నన్ను ఆ విధముగా చేసినది, మరియు నేను ఒక గొప్ప వ్యక్తిని. ”నేను, నేను, నేను, నేను, నేను,“ మీరు వినగలిగేది అది మాత్రమే.

“నేను ఇది చేసాను; నేను ఉత్తమమైనవాడిని; నేను దీనిని చేయుదును.” నేను, నేను, నేను మరియు క్రీస్తుకు చోటు లేదు.

30

అది ఈ రోజు మనకు కనబడుట లేదా? నేను ఫలానా మరియు ఫలానా చేస్తాను. నేను సంఘములో చేరుతాను. నేను దీనిని చేస్తాను; నేను దానిని చేస్తాను. దేవుడు మనపై దయచూపును గాక. అక్కడే అతను ఉన్నాడు, ఓహ్‌, అతను ఒక గొప్పవాడు, మరియు అక్కడ వినోదము కొరకు యేసును కలిగియుండుట ద్వారా అతను గొప్ప చేసుకొనెను. యేసు ప్రవక్త అయినప్పటికీ, ఆయన ఒక ప్రవక్త అని అతడు నమ్మలేదు. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ, ఆయనను దేవుని యొక్క కుమారునిగా అతడు నమ్మలేదు. కానీ అతను తలంచెను,“ఒకవేళ అతడిని నేను అక్కడ కలిగి ఉన్నట్లయితే, మనమందరము కొంత సరదా పొందుకొనెదము”. కాబట్టి ఆయన కొరకు అతడిని పంపెను.

యేసు ఎన్నడూ, ఎన్నడూ ఒక వాగ్ధానమును ముక్కలు చేయడు. రోజులు గడిచినవి. ఎన్నో జరిగినవి. మరియు ఈ పరిసయ్యునికి సమయము వచ్చినది... ఈ సహవాసము...లేదా, అతని యొక్క విందు ఏర్పాటు చేయబడుచున్నది, మరియు యేసు ఆయన శిష్యులకు చెప్పెను, “ఇప్పుడు, మనము వెళ్ళెదము, పాలస్తీనా నుండి దక్షిణ పాలస్తీనా వరకూ, మన మార్గము తీసుకొనెదము, ఎందుకనగా మనము ఆలస్యము కాకూడదు.

యేసు ఎన్నడూ ఒక వాగ్దానమును ముక్కలు చేయడు: ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానమును నిలబెట్టుకుంటాడు. అది ఏమైనప్పటికీ, ఆయన దానిని నిలబెట్టుకుంటాడు. దినము దగ్గర పడినది, మరియు ఆ పరిసయ్యుడు తన యొక్క వసారాలో ఏర్పాటు చేయబడిన బల్లతో కూర్చొని ఉండుట మనము చూడవచ్చు. మరియు అతని యొక్క ప్రకటనలు బయట ఉన్నవి, మరియు జనులంతా కూడుకొనుట ప్రారంభించారు. ఎంతటి ఒక గొప్పవాడు ఇతను.

31

తన యొక్క గొప్ప పెద్ద చక్కటి రథములో డాక్టర్‌ జోన్స్‌ వచ్చాడు: అతను చాలా తొందరగా తన యొక్క మనుష్యులను (అతని పనివారిని) పంపెను, మరియు అతను గుర్రములను తోలుకుని, మరియు అతడు వాటిని శాలకు తీసుకొని వెళ్ళెను, మరియు అతను గుర్రములను శుభ్రపరిచెను. మరియు అతను, “ఎలా ఉన్నావు, నా స్నేహితుడా? నిన్ను చూచుట నాకు చాలా ఆనందముగా ఉన్నది. మీరు లోపలకి వచ్చి, నాతో సందర్శించగలరా?” ఓ, అతను తగిలించుకొనుట నేను చూచుచున్నాను. “మీరు లోపలికి రాగలరా? ఎందుకు, ఇక్కడ లాయర్‌ ఫలానా మరియు ఫలానా; నేను మిమ్ములను చూచుటకు చాలా ఆనందించుచున్నాను, నాస్నేహితుడా మీరు లోపలికి రాగలరా? పనివాడు, ఆ యొక్క గుర్రములను గుర్రపుశాలకు తీసుకొని వెళ్ళెను.” ఓహ్‌, మై.

కానీ కొంత సమయము తర్వాత అతను లోపలకి వచ్చి మరియు గ్లాసులను సర్దుట మరియు మొదలైనవి చేసెను. మరియు పాలస్తీనాలో, వారు విందును ఏర్పాటు చేసినప్పుడు, మీరు ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే, వారు ఒక గొప్ప, పెద్ద బల్లను బయట ఈ విధముగా పెట్టెదరు, మరియు అటు తరువాత వారు ...మీరు క్రింద కూర్చుని మరియు తినెదరు, మీరు ఇక్కడ చేసే విధానములో... పాలస్తీనాలో మీరు క్రింద కూర్చుని తినకూడదు. ఒక సోఫావంటి దానిని వారు కలిగివుంటారు, మరియు వారు దానిని ఆ బల్లకు మూలగా అమర్చదెరు, ఈ విధముగా మరియు ప్రతీ వ్యక్తి ఈ విధముగా పడుకొనియున్నారు, మరియు అతను పడుకునే తినుచున్నాడు, అతని పాదములు అతని వెనుక ఉన్నవి.

మరియు వారు సమస్తము సిద్ధముగా ఉంచిరి, అందరు అక్కడ వినోదముతో మరియు మొదలైన వాటితో ఉన్నారు, మరియు పరిసయ్యుడు తన యొక్క ప్రముఖమైన వ్యక్తిని (సెలబ్రిటి) వినోదింపచేసే గొప్ప సమయము కలిగియున్నాడు. మీరు తెలుసుకోవాల్సిన మొదటి విషయమేమనగా, యేసు వచ్చెను, గృహములోనికి వెళ్ళెను, మరియు క్రింద కూర్చుండెను మరియు ఆయన అక్కడ ఉన్నాడని వారికి తెలియదు. ఎవ్వరికి దానిని గురించి తెలియదు. ఆయన ఎక్కడి నుండి వచ్చెను?

32

ఇప్పుడు, ఒక చిన్న చోటు, బహుశా మూలన కూర్చుని యుండవచ్చు. పరిసయ్యుడు చాలా హడావిడిలో ఉన్నాడు; అతను వేరే సంగతులు చేయవలసి యుండెను. ప్రముఖమైన వ్యక్తి, ఆ పట్టణములో పెద్ద వ్యక్తులు అక్కడ ఉన్నారు, మరియు వారిని అతడు చూసుకొనవలసియున్నది. నేను ఆశ్చర్యపడుచున్నాను, సహోదరులారా మరియు నహోదరీలారా, ఒకవేళ పెద్దలను మరియు ప్రముఖులను వినోదింప చేయడానికి మనము ఎక్కువ సమయము కేటాయించిన యెడల, ఆ విధముగా యేసు మన మధ్యలో కూర్చున్నాడని మనము మర్చిపోతాము, మూలన కూర్చుని, ఎవ్వరూ ఆయనను గమనించుట లేదు. ఒంటరిగా కూర్చునియున్నాడు. ఆయన శిష్యులు లోపలికి రాలేకపోయారు; వారు కనీసం ఆహ్వానించబడలేదు.

కాబట్టి, ఆహ్వానించబడని వారందరూ, తూర్పు ప్రాంతాలవారు, వారు బయట నిలబడి లోపలికి చూచి ఆశ్చర్యపడుచుందురు; మరియు ఏదైనా జరుగుచున్నప్పుడు ... ఓ, ఆ గుంపు కొరకు మీరు చింతించనవసరం లేదు; ఏది ఏమైనను వారు అక్కడే ఉందురు. వారు చూచుటకు వచ్చియున్నారు, ప్రేక్షకులు, చూడండి. వారు ఏమి చేయుదురో. వారు లోపలకి అనుమతించబడరు, కానీ వారు వచ్చి మరియు చూస్తూ వుండెదరు. గంటలు తరబడి గంటలు వారి యొక్క మునివైేళ్లపై నిలబడియుండెదరు, వినోదములను చూచుచుందురు. మంచి మసాలాలతో వేపబడిన మాంసము, ఆ మంచి మసాలాలతో ఉడికించిన గొర్రెమాంసము, వారు చూచినప్పుడు ఆ పేదవారి నోటిలో లాలాజలము ఊరును. ఐగుప్తు మరియు మెసపోటోమియా మరియు మొదలైన ప్రాంతముల నుండి ఆ గొప్పవన్నీయూ తీసుకు రాబడినవి.

33

ఎందుకు, ఈ పరిసయ్యుడు ఒక ధనవంతుడు, అటువంటి ఒక విధమైన ఒక పెద్ద విందును అతను పెట్టగలడు. ఒకవేళ వారు కావాలనుకుంటే పేదవారు ఆ విధముగా నిలబడి చూస్తూ ఉండవచ్చు. అన్యజాతి నుండి ఒక మార్చిడిని చేయడానికి ప్రపంచాన్ని ముక్కలు చేసే సమూహమది, మరియు అతను ప్రారంభించినప్పటి కంటే రెండు రెట్లు ఎక్కువ నరకపు బిడ్డగా అది చేయును.

అహంకారము, ఆడంబరము! అక్కడే ఆయన ఉన్నాడు, యేసు విడిచిపెట్టబడి కూర్చునియుండెను, ఏలయనగా ఆయన కలిగియున్న ఆ మురికి పాదములపై, ఆయన అసౌకర్యంగా భావించుచున్నాడని నేను ఊహించుచున్నాను. ప్రజలు పాలస్తీనాలో ప్రయాణించుచున్నప్పుడు మనము ఇప్పుడు కలిగియున్నట్లుగా ఆ రోజులలో కాలి బాటలు, మరియు రోడ్లు మరియు నూనెతో జారునట్లుగా ఉండు రోడ్లు వారు కలిగిలేరు. మురికి పాదములతో మరియు కాళ్ళతో అక్కడ కూర్చొనియున్నాడు, ఆయన తల అంటబడలేదు (నూనె రాయబడలేదు), ఆయన బుగ్గలపై ముద్దు పెట్టబడలేదు, మరియు ఆయన కాళ్ళు ఆ పేడ మరియు పాతబడిన దుమ్ముతో ఉండెను, రోడ్డు మీద వ్యర్థ వస్తువులతో, ఎక్కడైతే గుర్రములు, భారముతో మృగములు లాగుకుంటూ ఉండునో, మరియు బరువులు మోయుట, మరియు రోడ్డుపైన జంతువుల వ్యర్దాలు, ఆ పక్షులు దిగివచ్చి వాటిని(ఆ చెత్తను) చెదరగొట్టి వాటి ముక్కుతో చెల్లాచెదురు చేసెను; మరియు కొంత సమయము తర్వాత అది దుమ్ముగా మారును.

34

మరియు ఆ వ్యక్తి నడుచుచున్నాడు ... పాలస్తీనాలో ఆ క్రింద వస్త్రం మోకాలి వరకూ మూసివేయబడుతుంది, మరియు అంతట ఆ వస్త్రం దాని పైనుండి వెళుతుంది, మరియు వారు నడుస్తున్నప్పుడు, ఊగుతూవుంటుంది, ఇది చిన్న గాలులు దుమ్మును పైకి లేపుటకు కారణమవుతుంది. మరియు, ఓ ఆ యొక్క చెత్తంతయూ మీమీద పడినప్పుడు అది మురికిగా మరియు దుర్వాసనగా మారుతుంది. మరియు అక్కడ మురికి పాదములతో యేసు కూర్చునియున్నాడు. యేసు, మురికి పాదములతో, వారు ఆయనను పిలచెను. ఓ, నేను దానిని చెప్పుచున్నప్పుడు అది నాకు ఏదో చేయుచున్నది. యేసు గుర్తించబడలేదు, యేసు మురికి పాదములతో ఉండెను, ఆహ్వానించబడిన తర్వాత సమస్తమైన వారిచేత వేడుకగా చూడబడెను.

మీరు ప్రార్ధన కూడికను కలిగియున్నప్పుడు నేను ఆశ్చర్యపోవుచున్నాను, మీ యొక్క సంఘమునకు ఆయనను ఆహ్వానించెదరు, అంతట ఏదో చేయవలెనని ఆయన మీ కొరకు వచ్చును, మీరు కేవలం ఆయనను నిర్లక్ష్యము చేసెదరు. అటువంటిది మన గృహ జీవితములో మరియు ప్రతిచోట ఎక్కువగానే ఉన్నది. ఒక అధ్యక్షుడు వచ్చినప్పుడు, ఎందుకు, మై, ఆ యొక్క రైలు యొద్ద నుండే అన్ని మార్గములలో, హోటల్‌లోకి వెళ్ళే మార్గము వరకు ఆ తివాచిని పరచెదరు. వారు వీధుల్లో తిరిగెదరు, మరియు యవ్వన స్త్రీలు పుష్పములతో ముందు వెళ్ళెదరు, మరియు కాలిబాటన పుష్ప గుచ్చములతో అలంకరించెదరు, మరియు స్వాగతం యొక్క గుర్తులన్నిటితో జెండాలను వ్రేలాడదీసెదరు. కానీ యేసు పట్టణమునకు వచ్చినప్పుడు, ఆయన ఎక్కడో ఒక చిన్న పనిలో ఉండును, పిచ్చివానిగా, పరిశుద్ధ గుండ్రాయిగా పిలువబడును. ఓ, మై.

35

ఓ, గ్రుడ్డి పరిసయ్యులైన మీరు, గమనించండి; యేసు మురికి పాదములతో ఉండెను. యేసు, లోకము యొక్క పాపముల కొరకు త్వరలో మేకులు కొట్టబడబోయే ఆ పాదములు, అసౌకర్యంగా దుమ్ము మరియు పేడతో, కూర్చునియున్నాడు. ఏదేమైనను యేసు సాధారణముగా ఒక ధనవంతుల సమూహములో కొంచెము అసౌకర్యముగా ఉండును. వారు ఏ స్థలమూ, ఏమియూ ఆయనకు ఇవ్వరు; కేవలం ఆయనను కూర్చోబెట్టారు. “ఓ, మీ పెదవులతో నన్ను ఘనపరచుదురు, గాని మీ హృదయములు నాకు దూరముగా ఉన్నవి”, అని బోధకుడు చెప్పెను.

యేసు మురికి పాదములతో ఉండెను. ఆతిధ్యము లేకుండా, కడగబడకుండ, స్వాగతించబడకుండ, అక్కడ ఆయన కూర్చుండెను. చెప్పెను, “యేసూ, నీవు! ఒక తక్కువ స్థలము (చిన్న చోటు) తీసుకొనెదవా? యేసూ, నీవు ఇంటికి పిలవబడినప్పుడు నీవు ఒక చిన్నస్థలము తీసుకొనెదవా?”

“అవును, నేను చిన్నస్థలము తీసుకొానెదను” “ఏమిటి?”.

“పై అంతస్తులో చిన్న గది, లేక బహుశా రెండో అంతస్తులో, ఉండవచ్చు, ఒక చిన్న గది, లేదా క్రింద నేలమాళిగలో.” నీవు ఆయన కొరకు సిగ్గుపడుచున్నావు, ప్రముఖుల ముందు, మీ సహచరుల ముందు. ఆయన యొక్క రక్షించు కృపను చెప్పుటకై. ఆయన కొరకు సాక్ష్యమిచ్చుటకు నీవు సిగ్గుపడుచున్నావు లేదా భయపడుచున్నావు.

“కానీ ఏది ఏమైనను నీవు వచ్చెదవా, యేసు?”

“అవును, ఏది ఏమైనను నేను వచ్చెదను.”

అదే ఆయన ఒక గొప్ప పెద్ద వ్యక్తి, ప్రభువులకు ప్రభువు అని నాకు రుజువు చేయుచున్నది. “ఏది ఏమైనను వచ్చెదను, నీవు నా కొరకు ఎంతటి చిన్న స్థలము సిద్ధపరచినాగాని, ఏది ఏమైనను నేను వచ్చెదను.”

నేను దానిని ఇష్టపడెదను. ఆయన నా ప్రభువు. “ఏది ఏమైనను నేను వచ్చెదను, ఎంతటి చిన్న స్థలమైనను ఫర్వాలేదు, నేను వచ్చెదను.” ఆ ప్రధానికి సమస్తమును మీరు ఇచ్చినను, డాక్టర్‌ జోన్స్‌కి ఒక గొప్ప విందును మీరు ఇచ్చినను, కానీ యేసు వచ్చినప్పుడు, ఆయన ఎక్కడో ఒక మూలన ఉండును. ఎటువంటి ఒక పరిసయ్యుల గుంపు, వినోదింపజేసేవారు, ప్రేమ లేదు, సరదా తీర్చుకొనేవారు. “నేను చిన్న స్థలమును తీసుకొనెదను.”

36

చాలా కాలము క్రితము, క్రైస్తవుడా, నీ హృదయమును నీవు తెరువక మునుపు, ఏ విధముగా ఆయనతో నీవు వ్యవహరించావు? మీలో కొందరు క్రైస్తవులని పేర్కొనెదరు, ఏ విధముగా నీవు ఆయనను గౌరవించెదవు? ఓహ్‌, మై, ఓ, ఒక్కోసారి కొన్ని కార్యక్రమములు వచ్చుటను మీరు అనుమతిస్తారు, ఒక విధమైన ఒక చిన్న వాడిపోయిన సువార్తికుడు మరియు నీ అందమైన టోపిని, మరియు నీవు నీ యొక్క అత్యంత మనోహరమైన దుస్తులను ధరించెదవు, మరియు నీవు సంఘమునకు వెళ్ళెదవు.

ఎటువంటి ఆరాధనను మీరు ఆయనకు ఇవ్వరు; మీరు సాక్ష్యము ఇవ్వరు. కానీ ఆయన నిన్ను మందలించడు. ఆయన నిన్ను ఖండించడు. ఆయన ఆ చిన్న స్థలమునే తీసుకొనుటకు ఇష్టపడుచున్నాడు. మీ హృదయమంతయు మీరు ఆయనకు ఇవ్వరు. ఆయనకు మీరు ఎంత ఇచ్చెదరో కేవలం అంతే ఆయన తీసుకొనును. ఆయన నా ప్రభువు మరియు మీరు ఇంటికి వెళ్ళండి, “ఓహ్‌, మంచిది, అది వచ్చే నెల వరకు ఉండును; నేను మరలా తిరిగి సంఘమునకు వెళ్ళెదను.”

37

ఏ విధముగా ఆయనను మీరు ఒంటరి చేసారు, మీ చిన్న చిన్న పార్టీలు మరియు మీ యొక్క చిన్న సంగతులన్నీ, మీ చిన్న వినోదములు, ఎందుకు, నీవు పరిసయ్యుడవు. నాప్రభువైన యేసును ఆ విధముగా చేయడం మీకు సిగ్గుచేటు. ఆయన పట్టణమునకు వచ్చినప్పుడు, మీరు ఆయనను గురించి చెడుగా మాట్లాడెదరు; మీరు ఆయనను తిరస్కరించెదరు. మీ కన్నులు తెరువుము. ఆయన మిమ్ములను కలుసుకోవలెనని వచ్చెను. మీ యొక్క ప్రార్ధనా కూడికకు మీరు ఆయనను పిలిచితిరి, కానీ ఆయన వచ్చినప్పుడు మీరు ఎటువంటి స్థానమును ఆయనకు ఇవ్వగోరరు. ఎటువంటి పరిస్థితి. ప్రజలు ఎంత గ్రుడ్డిగా ఉన్నారు.

యేసు యొక్క పాదముల యొద్దకు నడుచుటకు, ఈ యొక్క పనివానికి ఎటువంటి అవకాశం కలిగెను. ఓ, అతడి స్థానమును పొందగలనని నేను ఆశించుచున్నాను. ఆ దినము అక్కడ ఉండవలెనని ఆశించుచున్నాను. ఒక పరిసయ్యుడు చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పి ఉండెదను. ఆయనను నేను కౌగిలించుకొనియుందును. యేసు యొక్క ప్రసన్నతలో నిలబడే అవకాశమును గూర్చి తెలుసుకొనుటకు నేను చేయగలిగినదంతటిని నేను చేసెదను. ఆ దినములలో ఉన్న ఆ గ్రుడ్డి ప్రజలే, ఈ దినమూ ఉన్నారు. యేసును అంగీకరించుటకు, మరియు దూరముగా నడిచిపోయి మరియు ఆయన ఆరాధింపబడకుండా, స్వాగతింప బడకుండా వదిలివేయబడుటకు వారికి ఇవ్వబడిన ఆ అవకాశము, అదే ఆలోచన.

38

మీకు తెలుసా, పాలస్తీనా దేశములో ఆచారము, అటువంటి ఒక రాజరికమైన విందునకు మీరు ఆహ్వానించబడినప్పుడు జరిగే మొదటి సంగతి, మీరు ద్వారము. యొద్దకు వచ్చినప్పుడు, మీరు మొత్తం మురికిగా ఉండెదరు; మీరు దుర్వాసనతో ఉందురు. మీరు ఆ వినోదము కొరకు ఒక సరైనవారు కాదు. మీరు ఆ విధముగా,

మరియు చెమటతో మరియు ప్రతీ దానితో, మీ పాదముల మీద ఉన్న దానితో మరియు ప్రతీదానితో ఆ యొక్క అందమైన ఇళ్ళలో నడుచుటకు మీరు సిగ్గుపడతారు. మొదటి సంగతి ఏమిటి? ఒక అతిథి వచ్చినప్పుడు, వారు ఒక పనివానిని కలిగివుందురు.

ఉద్యోగములో (పనిలో) తక్కువ జీతము ఇవ్వబడే వ్యక్తి నా ప్రభువు తనకు తానే నడుమకు కట్టుకుని (తగ్గించుకుని) మరియు ప్రజల యొక్క పాదములను కడుగుటను నేను తలంచినప్పుడు ఆయన అత్యున్నత స్థానానికి అర్హుడైయున్నాడు. కానీ ఆయన చాలా హీనమైన స్థానమును తీసుకొనెను, వారి “యొక్క పాదముల నుండి పేద మరియు ధూళిని కడుగుటకు, అత్యంత తక్కువ స్థానము తీసుకొనెను, సేవకులలో వల దీనునిగా మారెను. ఆ పనివాడు పాదములను శుభ్రపరిచే పనికన్నా దీనమైన (హీనమైన) పనిచేసే మరొక సేవకుడు లేడు.

కానీ పాలస్తీనా, తూర్పు దేశములో, అటువంటి ఒక గృహమునకు నీవు వచ్చినప్పుడు, ఆ పనివాడు ద్వారము వద్ద నిన్ను కలుసుకొనును, బావులలో ఒకదాని దగ్గరకు వెళ్ళి మరియు అతని కొరకు మంచి స్పష్టమైన నీటితో కూడిన ఒక గొప్ప బేసిన్‌ను తీసుకొని, మరియు మీ చెప్పులను అతను తొలగించును, లేక మీ బూట్లను, అతని మోకాళ్ళపై మీ పాదములను పెట్టుకొని, మరియు అతను ఈ మురికినంతటిని, మరియు ధూళిని, మరియు పేడని, మరియు నీ యొక్క శరీరము మీద ఉన్నదంతటిని కడుగును. మరియు అంతట మరొక తువాలును అతను తీసుకొని మరియు మీ పాదములను తుడుచును, మరియు వాటిని అతను శుభపరచి క్రింద పెట్టును. మరియు పిదప మీ చెప్పులను అతను తీసుకొని మరియు పైన ఒక చిన్నపెట్టెలాంటి దానిపై వాటిని పెట్టును, ప్రవేశద్వారము యొద్ద ఈవిధముగా సరిగ్గా ఏర్పాటు చేయును. అంతట అతను వెళ్ళి, మరియు అతను ఒక జత చక్కటి మెత్తటి వస్త్రములో తయారు చేసిన సిల్క్‌ చెప్పులును కనుగొనును; అవి మృదువుగా ఉండును. అవి ఆ ఆహ్వానించే వ్యక్తి యొక్క చిరుకానుక అయ్యున్నవి. అతను అది చేసెను; అతను వాటిని అక్కడ పెట్టియున్నాడు; మీకు సౌకర్యవంతముగా సరిపోయేదానిని కనుగొనే వరకు అతను వాటిని మీ పాదాల యొద్ద ఉంచును.

39

అంతట మీ పాదములు కడగబడును, అటు తరువాత అతను మరొక స్థలమునకు మిమ్ములను పంపును, మరియు అక్కడ ఆ ద్వారమువద్ద ఒక వ్యక్తి మిమ్ములను కలుసుకొనును. మరియు అతను తన హస్తములలో ఒక చిన్న పాత్రను (బేసిన్‌) కలిగివుండెను. ఒక చిన్నకుండ వంటిది. మరియు దానిని మీరు తీసుకొని మరియు కొద్దిగా నూనెను మీ యొక్క హస్తములలోనికి వేసుకోవలెను.

ఇప్పుడు, ఆ నూనె ఒక చాలా చక్కటి జటమాంసి అనే వృక్షముతో తయారు చేయబడినది. ఏమిటది, అక్కడ అరేబియాలో పెరిగే ఒకపొద నుండి వారు దానిని పొందుకొందురు. గులాబీ వలె వికసించునట్టి ఒక చిన్న పుష్పము, మరియు అంతట ఆ గులాబి వాడిపోయినప్పుడు, అది ఒక చిన్న ఉండలాంటి దాన్ని అది విడిచిపెట్టి మరియు అది ఒక చిన్న ఆపిల్‌ వలె గట్టిపడును. మరియు అటువంటి ఒక సంగతినే ఈ చెట్టు చేసెను, కానీ నీవు దానిని తీసుకొని మరియు నీ చేతులలో దానిని నలుపవచ్చు.

వాటిలో రెండింటిని కలిగివున్న ఒక రష్యా ప్రముఖుడిని ఒకసారి నేను చూసాను; ఆ విధముగా మీ చేతుల్లో మీరు రుద్దవచ్చు, మరియు ఆ సెంటు (సువాసన) రెండువారాలు వరకు మీ చేతుల మీద ఉండును. ఇది చాలా విలువైనది, ఖరీదైనది. మరియు దీనికి చాలా డబ్బు ఖర్చవును. నూనె పాతదిగా అయిపోవును మరియు కొద్ది రోజుల్లోనే చెడువాసన వచ్చును, కానీ అక్కడ అది జరుగకమునుపే వారు ఈ యొక్క జటమాంసి అనే చెట్టుతో తయారు చేయబడిన దానిని వారు పూసెదరు ... ఓ, ఇది సువాసనను సంవత్సరములు వరకూ ఉంచును. ఆ షేబాదేశపు రాణి సొలొమోను కొరకు తీసుకువచ్చిన అతి కొద్ది విలువైన సంపదలలో ఇది ఒకటి.

40

మరియు వారు దానిని మీకు ఇచ్చెదరు, మరియు దానితో మీరు మీచేతులను శుభ్రపరచుకోవలెను, అంతట వారు ఒక తువాలును మీకు ఇచ్చెదరు, మరియు మీరు మీ చేతులను తుడుచుకోవలెను. అటు తరువాత వారు మీకు, దీనిలో మరికొంచెము ఇచ్చెదరు, మరియు దీనిని మీరు మీ యొక్క మెడపై పెట్టుకోవలెను, మెడ వెనుక, మీ బుగ్గలపై, మరియు మీ నుదుట మీద దాన్నిపెట్టుకోవలెను. పాలస్తీనాలో స్త్రీలు మరియు పురుషులు ఇరువురును దీనిని తప్పకచేయవలెను, ఎందుకనగా సూర్యకిరణాలు చాలా వేడిగా ఉండును. వారు దానిని చేసెదరు, మరియు తరువాత ఇది ఒక సువాసనను సృష్టించును. అంతట మీరు దానిని ఎక్కువ భాగములో తుడుచుకొన్న తరువాత మీరు తాజాగా ఉందురు. మీ యొక్క పాదములు శుభ్రపరచబడెను; మీరు శుభ్రపరచబడుదురు; మీ చేతులు శుభ్రముగా ఉండును; మీ ముఖము శుభ్రముగా ఉండును.

అంతట ఆతిథ్యం ఇచ్చువాని యొక్క పెద్దహాలు లోనికి మీరు తీసుకొనిపోబడతారు. తరువాత అతనిని మీరు కలుసుకున్నప్పుడు, మీరు తీసుకొనెదరు ... అతను తన కుడి చేతిని తీసుకుని మరియు నీ ఎడమ భుజముపై పెట్టును, అంతట నీవు నమస్కరించవలెను. మరియు అటు పిమ్మట నీ కుడి చేతిని తీసుకుని మరియు అతని ఎడమ భుజముపై పెట్టవలెను, మరియు అతను నమస్కరించును. అంతట అతను నిన్ను, ఒక చెంప వైపు నుండి మరొక చెంప వైపు వరకు ముద్దుపెట్టుకొనును; మరియు అదీ స్వాగతమనగా, సహవాసము యొక్క కుడి హస్తము. ఆతిథ్యం ఇచ్చువాడు నిన్ను ముద్దుపెట్టుకున్నప్పుడు, నీవు ఒక సహోదరునివి; నీవు స్వాగతించబడ్డావు (నీకు స్వాగతం).

యేసు డాక్టర్‌ జోన్స్‌ పాదములను కడుగుటలో చాలా జాగ్రత్త వహించెను ... లేక, ఆ పరిసయ్యునిది. మరియు అతను ఆ యొక్క ప్రముఖుని కొరకు చాలా జాగ్రత్త వహించెను, కానీ ఇక్కడ యేసు మురికిపాదములతో కూర్చునియుండెను. ఇక్కడ యేసు స్వాగతించబడకుండా, ఆయన మీద నూనె లేకుండా, కూర్చొని యుండెను. ఇక్కడ యేసు ముద్దు లేకుండా కూర్చొనెను. మరియు ఇంకా ఆయన యొక్క మాటను వాగ్ధానమును నిలబెట్టుకొనుటకు తన యొక్క పనిని ఆయన విడిచిపెట్టి మరియు పాలస్థీనా నుండి వచ్చెను.

41

అక్కడ దయనీయముగా ఆయన కూర్చునియుండుట నేను ఊహించుచున్నాను. మిగిలిన వారందరూ, మరియు ఆ పరిసయ్యుడు, జరిగిన కొన్ని సంగతులను గూర్చి అక్కడ సాక్ష్యమిచ్చుచున్నారు, మరియు దీనుడైన యేసు మురికి పాదములతో, అభిషేకించబడని ముఖముతో, ముద్దు లేకుండా. అక్కడ కూర్చునియుండెను. యేసు ముద్దు పెట్టబడగోరుచున్నాడు. కీర్తనలు 2లో అక్కడ ఒక లేఖనము చెప్పుచున్నది, “కుమారుని ముద్దుపెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపము త్వరగా రగులుకొనును. ”కుమారుని మద్దుపెట్టుకొనుడి,“ ఓహ్‌, నీవు ఒక్కసారి కుమారుని ముద్దు పెట్టుకునేంతవరకు ఎన్నడూ దాని అర్ధము తెలుసుకొనలేవు. కుమారుని ముద్దుపెట్టుకొనుడి, నీ యొక్క హృదయములోనికి ఆయనను స్వాగతించుము.

కానీ ఆయన ఆ మురికి పాదములతో అభిషేకించబడకుండా కూర్చుండెను. ఓహ్‌, ఎంతగా ఆయన ఇబ్బంది పడెను. పరిసయ్యుడు తన పనిలో తలమునకలై గడిపెను; యేసు ఆతిథ్యము పొందలేదని తెలుసుకొనుటకు కూడా ఖాళీలేక నగరములోని గొప్ప వ్యక్తులను అలరించడములో చాలా తీరిక లేక ఉన్నాడు. కానీ ఏది ఏమైనను ఆయన వచ్చును. ఓ, నా దేవుడా, ఏవిధముగా ...? ఏమి జరిగినది? ఆయన పాదములు కడుగకుండా ఆ ద్వారము వద్ద వున్న పనివాడు ఎలా ఆయనను లోపలికి పంపెను? దేవుడా, అతని పని నాకు కావాలని ఆశించుచున్నాను. ఆ ద్వారము నొద్ద ఆయన పాదములు కడుగుట అనే దానిని నేను ఎంతగా ప్రేమించియుందును ఆయన అక్కడ కూర్చొని యుండెనని నేను తెలుసుకొనినప్పుడు, నాయొక్క నీటితో కూడిన పాత్రతో, ఏ విధముగా ఆయనను అలరించుటకు ఆతిథ్యము ఇచ్చుటకు, నేను ఎంత ప్రేమించియుండెదను.

42

కానీ అక్కడ అతను ధనవంతులతో మరియు గర్విష్టులతో ఉండెను. వారు ఆయన గురించి ఎటువంటి జాగ్రత్త తీసుకొనలేదు. ప్రజలు తేరి చూచుటకు మరియు ఆకర్షించుటకు, ఆయన కేవలం. ఒక వినోదం అయ్యున్నాడు. సందేహం లేదు అతను తన హృదయములో, అతని కొరకు లేదా ఏదో ఒక అద్భుతము చేయమని ఆయనను అడగవచ్చును.

మరియు ఆయన అక్కడ కూర్చునియున్నప్పుడు బయట వీధిలో అక్కడ పట్టణములోనే ఒక నిజమైన చెడ్డ స్త్రీ ఉన్నది, ఒక వేశ్య. దాని గురించి వివరాల్లోకి మనము వెళ్ళడము లేదు; మీకు తెలుసా అది ఏమిటో, చెడు కీర్తి ఉన్న స్రీ, పడిపోయినది.

ఆమెను ఖండించవద్దు. వినండి, ముందు అక్కడ ఒక పడిపోయిన స్తీ ఉన్నది, అంటే, అక్కడ పడిపోయిన పురుషుడు కూడా ఉన్నట్లే బహుశా తన హృదయ మంతటితో అతని పాదాల క్రింద ఆమె జీవితపు మంటను ఆర్పేంత వరకు ఎవరో ప్రియమైన వాడిని ఆమె ప్రేమించి యుండవచ్చు. మరియు ఈ రకమైన ఒక జీవితాన్నిఆమెకు పరిచయం చేసెను.

లేఖనము చెప్పుచున్నది ఆమె ఒక గొప్ప పాపి. ఆమెతో ఎవ్వరికీ ఎలాంటి సంబంధము లేదు, కానీ అందరూ ఆమెను ఎరిగియుండెను. ఖచ్చితముగా, ఆమె ఎవరో వారు ఎరిగియున్నారు. ఆమె ఒక గొప్ప పాపి. మరియు బహుశా ఆ దారిన వెళ్ళుచుండగా, ఏ ప్రజలతోను స్వాగతించబడదు, అమె తన మునివేళ్ళపై నిలబడినది, మరియు ఆమె పైకి చూసినది, మరియు నా ప్రభువు ఎక్కడో మూలన శుభ్రము చేయబడని పాదములతో, ధనికుల మధ్య స్వాగతించబడకుండ కూర్చునియుండుట, ఆమె గమనించినది. అది ఆమెకు చాలా ఎక్కువగా అనిపించినది. ఆమె చెప్పెను, “లేదు, అది ఆయనే అని నాకు ఖచ్చితముగా తెలుసు.”

43

మీరు ఆయనను ఎరిగి మరలా తిరిగి ఆయనను మీరు చూచినప్పుడు తప్ప...యేసును ఎన్నడూ మీరు చూడలేరు. ఎవరూ ఆయన వైపు చూడలేరు మరియు ఆయన రూపాన్ని మరచిపోలేరు. నేను తలంచుచున్నాను ఆమె ఇలా చెప్పినది ... ఆమె ఎక్కడో ఆయనను వినియుండవచ్చు, ఆమె చెప్పినది, “ఓ, ఆ గొప్ప బోధకుడు అక్కడ ఉన్నాడు. కానీ ఆయన ఇక్కడ ఆ పరిసయ్యులతో ఉండెను, మరియు వారు ఆయనను కోరుకొనుటలేదు.”

ఓ, ఆమె చుట్టూ తిరిగినది; ఆమె ఇలా చెప్పుట నేను చూడగలుగుచున్నాను, “ఓ, నేను..... నేను చూడలేను.

ఓ, ఇది... నేను తప్పకుండా నా యొక్క మనస్సుని కోల్పోవుచున్నాను. ఖచ్చితముగా ... ఖచ్చితముగా నేను దానిని చేయలేను. ఓహ్‌, బహుశా... నేను చేయగలనా?“

ఆమె చుట్టూ తనపై వస్త్రములను ఒక చోట సర్దుకొని మరియు ఆ వీధిలో వెళ్ళుట నేను చూడగలను. ఇద్దరు వ్యక్తులు కలిసి వారి భుజములను చిన్నగా తట్టి, మరియు “అక్కడ చూడుము, ఏమి వచ్చుచున్నదో” అని చెప్పుట నేను చూడగలుగుచున్నాను.

ఓ, తప్పకుండా, మీరు చాలా మంచివారు. ఒకసారి నీ కళ్ళలోకి నేరుగా చూచుటకు నేను ఇష్టపడుచున్నాను, చూడుము నీవు ఎంత మంచిదానవో.

44

మీరు చెప్పెదరు, “సహోదరుడా బ్రాన్హాం, నేను వేశ్యను కాను.”

అంతయు లైంగికపరంగా అని నేను అనుకోవడం లేదు వ్యభిచారం అనేది ఉన్నత స్థాయిలో ఉన్నది. మీ యొక్క సమయాన్ని మీరు వ్యభిచారం చేయవచ్చు. ఎంత సమయం మీరు ఆయనకు ఇచ్చుచున్నారు? మీ యొక్క స్వార్ధ ఉద్దేశాలతో, చుట్టూ తిరుగుచూ“మంచిది, నేను ఈ సంఘమునకు చెందినవాడిని; నేను మంచిగా ఉన్నాను, అని చెప్పుచూ వ్యభిచరించుచున్నావు.

లేదు, మీరు చేయలేరు. దానికన్నా మీరు లైంగికముగా వ్యభిచరించుట మంచిది. పరిశుద్ధాత్మ మీ హృదయముతో మాట్లాడును, మరియు నీవు చెప్పెదవు, “నాకు దానితో ఏ సంబంధము లేదు.” గ్రుడ్డి పరిసయ్యుడా, నీవు వేశ్వవు. నీ సంగతి ఏమిటి? లోకముతో నీవు వ్యభిచారమునకు పాల్పడుతున్నావు, అదే నీవు చేయుచున్నావు.

ఓ, నీవు చెప్పెదవు, “నేను సంఘమునకు చెందినవాడిని,” మరియు చాలా చల్లగా మరియు భిన్నముగా ఉందురు. ఓహ్‌, అందమైన ప్రార్ధనలు అని మీరు చెప్పెదరు. ఓహ్, అటువంటి దొంగ భక్తిగల సంగతిని నేను అసహ్యించుకొనెదను. ఓ, నీవు ప్రార్ధించి మరియు ప్రతి అసంపూర్ణమును సంపూర్ణముగా చేసెదవు, మరియు ప్రతీ కాలమును సంపూర్ణముగా చేసెదవు. ఓహ్‌, నీవు చాలా అందముగా ప్రార్థించెదవు. దేవునితో నీవు ఆ విధముగా మాట్లాడలేవు. నీవు చెప్పుచున్న మరియు నమ్మి ముగించుచున్న నీ ప్రార్థనను నీవు వినుచున్నావు. దేవుడు, నిన్ను విడిపించుటకు సహాయము చేసి మరియు ప్రార్ధించులాగున చేయును. ప్రార్థనలను చెప్పుట ఆపుము.

45

ఓ, పరిసయ్యులు, అనేక మంది ఉన్నారు, పరిసయ్యులు. ఓ, మీరు చెప్పెదరు, “నేను సంఘమునకు చెందినవాడిని.” అది సరే; తప్పకుండా నీవు చెందియున్నావు. కానీ నా ప్రభువు పక్షమున నీవు ఎటువంటి వైఖరిని కలిగియున్నావు? ఆయన నీ యొద్దకు వచ్చి మరియు నిన్ను దీవించాలని కోరినప్పుడు, నీవు దీనిని చేయవు. “ఓ, లేదు ఆ రకమైన విషయములను నేను నమ్మను.” ఆ గుంపు కొరకే నేను మాట్లాడుచున్నాను, చాలా మతసంబంధముగా, కానీ చాలా దొంగభక్తి.

ప్రారంభములో వారిని గూర్చి నేను ఏమి చెప్పియున్నాను, నటులు. నటించే మతమును విడిచిపెట్టుము. పాత పద్ధతితో పునరుత్పత్తి యొక్క అనుభవమును, తిరిగి జన్మించుటను పొందుకొనుము. నా ప్రభువు, నిన్ను చూడవలెనని ఆయన ఎదురుచూచుచున్నాడు. ఆ మూలన చిన్న స్థలము తీసుకొని, ఆయన నీ కొరకు ఎదురుచూచుచున్నాడు. దాని కొరకు నిన్ను ఎన్నడూ ఆయన మందలించడు; ఆయన నిన్ను ప్రేమించును. నీవు నెలకు ఒకసారి లేదా రెండు సార్లు చర్చికి వెళ్ళేదవు. నీవు నీ యొక్క విధిని పూర్తి చేసావని నీవు అనుకొంటావు. ఓ, ఒకవేళ నీవు కేవలం ఆయనను ప్రేమించినట్లయితే, ప్రతీ దినము మరియు ప్రతీరాత్రి నీవు వెళ్ళెదవు, ఎక్కడో, మరియు ఆయనతో మాట్లాడెదవు, ఒకవేళ నీవు ఆయనను ప్రేమించినట్లయితే. కానీ దానితో ఇబ్బంది ఏదనగా మీరు సంఘముగా నటించుదురు, మతముగా నటించుదురు. ఎటువంటి ఘోరము! దానిని ఇప్పటికీ మనము కలిగియుండుట అది చాలా చెడ్డది.

46

ఈ పేద చిన్న స్త్రీ, ఆమెను నేను చూడగలుగుచున్నాను, చెడ్డపేరు గలది, చివరన ఆమె వెళ్ళుచున్నది, ఆమె పై అంతస్తులో చిన్న అటకపై ఒక చిన్న కీచుమనే అడుగుల శబ్లముతో వెళ్ళుచున్నది. ఆమె హృదయం గెంతుచూ ఉన్నది; ఆమె తన యొక్క మదిలో నుండి ఆ చిత్రమును తీసివేయలేకున్నది. ఓ దేవా, ఎవరైనా ఆయన యొక్క ప్రేమలో మరియు ఆయన వాక్యము యొక్క సామాన్యతలో ఆయనను చూస్తారో, అది మిమ్ములను ఎన్నడూ విడిచిపెట్టదు. ఏదో మిమ్ములను వెంటాడుతూ ఉంటుంది.

ఆమె ఆయనను చూసినది; ఆమె మేడ మీదకు వెళ్ళినది; ఆమె తన చిన్న డబ్బుల పెట్టెను తెరిచినది, మరియు ఆమె అక్కడ ఏదో ఒక చిన్నదానిని బయటకు తీసినది, ఒక చిన్న సంచి. దానిని ఆమె బయటకు తెచ్చినది, దానిని తెరచినది, బల్లపై శబ్ధముతో నాణెములు పడినవి. మరియు నాణెములు క్రింద పడగా, ఆమె మరలా వాటిని ఏరుకున్నది; ఆ ముఖమును ఆమె ముందు చూస్తున్నది. ఆమె చెంపల మీదుగా కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి, ఆమె గడ్డం నుండి జారుచున్నవి. చెప్పెను, “నేను దానిని చేయలేను; చేయలేను, ఏలయనగా ఆయనకు ఆ డబ్బు ఎక్కడ నుండి వచ్చినదో తెలుస్తుంది. ఎలా ఆ డబ్బును నేను సంపాదించానో ఆయనకు తెలుస్తుంది. నేను దానిని చేయలేను.”

బహుశా మరలా ఆమె దానిని అక్కడే పెట్టియుండవచ్చు. పిదప మరలా ఆమె వెళ్ళి మరియు దానిని తీసుకొనెను. ఆమె చెప్పెను, “నేను చేయలేను. నా విషయం ఏమిటి? కానీ ఆయన దేశమంతటి నుండి వచ్చి మరియు స్వాగతించబడకుండ ఉండుట నేను చూచితిని. దాని కొరకు నేను ఏమి చేయగలను? నేను కలిగియున్నదంతయు ఇదే. ఖచ్చితముగా ఆయన అర్ధము చేసుకొనును.” ఖచ్చితముగా ఆయన అర్ధము చేసుకొనును, ఖచ్చితముగా ఆయన చేసుకొనును. నేను కలిగియున్నదంతయు ఇదియే; ఖచ్చితముగా ఆయన దానిని అర్ధము చేసుకొనును.“

47

అంతట ఆమె వణుకుచూ ఉండుటను నేను చూడగలుగుచున్నాను, ఆమె చేతులలోనికి దానిని తీసుకున్నది, ఆమె యొక్క ఒడిలో దాచినది, బహుశా మోకాలి వస్త్రములో పెట్టియుండవచ్చు, దాన్ని లోపల మూటగట్టినది, ఆమె చుట్టూ బట్టలను ఆమె మూటగట్టినది, మరియు బయట వీధిలోనికి ఆమె వెళ్ళినది. ఆలస్యమగుచున్నది; వీధిలోనికి ఒక గొప్ప, మంచి అత్తరు దుకాణము యొద్దకు ఆమె వెళ్ళినది. ఆమె లోపలికి వెళ్ళినది, మరియు అక్కడ వృద్ధ గ్రద్ద ముక్కుగలిగి, రుసరుసలాడే వ్యక్తి (చిరాకుపడే ) ఆ కౌంటర్‌ వెనుక నిలబడి ఉన్నాడు. తన డబ్బును లెక్కపెట్టుకొనుచున్నాడు. “మంచిది, ఈ రోజు ఏమి మంచిది కాదు. అద్దె కూడా ఇవ్వలేను, చెడ్డ రోజు.” అతను తన మతములో ఉండగలిగినంత సనాతనమైన నిష్ట వానిగా ఉన్నప్పటికీ, పూర్తి చిరాకు గలిగి ఉండెను.

ద్వారము దగ్గరకు ఆమె వచ్చినది. ద్వారములోనికి ఆమె వచ్చినప్పుడు, అతను ఇలా చెప్పుట నేను వింటిని, “హహ్‌, ఇప్పుడు చూడుము.” ఓ, ఆమె అందరికీ బాగా తెలిసినటువంటిది. ప్రతీ ఒక్కరూ ఆమెను ఎరిగియుండెను, తప్పకుండా. ప్రతీ ఒక్కరూ ఈ స్త్రీని ఎరిగియున్నారు. ద్వారము లోపలకు ఆమె నడిచెను. మంచిది, అతను సాధారణముగా అందముగా మాట్లాడునట్లు “ఎలా ఉన్నావు?” నీ కొరకు నేను ఏమి చేయగలను? అని ఆమె దగ్గరకు నడిచి చెప్పుట లేదు, “మంచిది, ఏమిటిది?,” అని అతడు అడిగెను.

ఆమె ఆ డబ్బును కౌంటర్‌ (డబ్బు తీసుకొనెడి స్థలము) మీద- వేసినది: “ఓ , నాణెముల యొక్క శబ్దము, ఖచ్చితముగా సంగతులు మార్చబడ్డాయి. అతను ఈ విధముగా చెప్పే ఆ గుంపుకు చెందినవాడు ”యోసేపును సమాధిలో ఉంచినట్లయితే మనకు ఎంత లాభము వచ్చును?“ దాని లాభము ఎంత? ఓహ్‌, అవును, అదే ఈ రోజు ప్రజలు ఆలోచించెదరు. నేను దానితో ఎంత లాభము పొందగలను? ఎంత డబ్బు దానిలో ఉన్నది? గ్రుడ్డి పరిసయ్యుడు. యేసు ఇక్కడ ఉన్నాడు, మరియు ఆయన స్వాగతించబడాలని కోరుచున్నాడు. నీవు ఆయనను ఆహ్వానించియున్నావు.

48

అక్కడ డబ్బు ఉంచినది, ఆమె చెప్పినది, “దుకాణములో మీరు కలిగియున్న ఉత్తమమైన, పాలరాతి పెట్టె అత్తరు నిలువ చేయబడేది నాకు కావలెను.”

ఎందుకు, “నీవు ఏంత డబ్బును కలిగియున్నావో చూడనిమ్ము”, అని అతను అడిగాడు.

ఆమె దాన్ని బయట వేసినది, మరియు ఆమె వద్ద నూట ఎనభై రోమన్‌ దేనారములు ఉన్నాయి. అతను మొత్తం అన్నింటిని లెక్కపెట్టెను, అవును నీవు సరిపడినంత కలిగియున్నావు.“

ఏమిటి? ఆమెకు ఉత్తమమైనది శ్రేష్టమైనది కావలెను. ఆమె చెప్పెను, “ఆయన ఉత్తమమైనవాడు,” మరియు అత్యుత్తమైన దానికి ఆయన అర్హుడు. నీవు కలిగియున్న ఉత్తమమైనది ఆయన కోరుచున్నాడు. ఏదో ఒక చిన్న మూల ఆయనకు ఇవ్వవద్దు; మీరు కలిగియున్నదంతటిని ఆయనకు ఇవ్వుము. మీరు కలిగియున్న అత్యుత్తమైనవాటికి మరియు మీరు చేయగలిగిన అత్యుత్తమైనవాటికి ఆయనే అర్హుడు.

ఆమె కలిగియున్నదంతయు అదియే. ఆమె దానిని ఎలా సంపాధించెనో ఆమె ఎరిగియుండెను. ఆమె చెప్పెను, “ఈ మార్గములో దీనిని చేయుటను నేను అసహ్యించుకొనుచున్నాను; బహుశా నేను క్రమము తప్పియుండవచ్చు, కానీ నేను కలిగియున్న ఉత్తమమైనది ఇదియే. ఆమె ధర గురించి అతనితో వాదించలేదు; అది కానేకాదు. ఆమె కేవలము ఉత్తమమైన దానిని కోరుకొనెను. మీరు దాన్ని చూశారా? ఆమె ఉత్తమమైన దానిని కోరుకొనెను. ఆమె చెప్పెను, అదియే ఉత్తమమైనది, కాబట్టి ఆయన ఎందుకు ఉత్తమమైనది పొందుకొనకూడదు?”

49

ఆమె ఆ పాలరాయి పెట్టెను తీసుకొని, ఆమె యొక్క ఒడిలో పెట్టుకున్నది, మరియు ఇదిగో ఆమె బయలుదేరినది. ఆ వృద్ధ గ్రద్ధ ముక్కు గల యూదుడు అక్కడ బయటకు చూచుట నేను చూడగలుగుచున్నాను. ఇద్దరు వ్యక్తులు ఒకరి చేతులు మరొకరు చిన్నగా కొట్టుకొనుచూ, “చూడు అక్కడ వెళ్ళుచున్నది, అక్కడ ఆ దుకాణము నుండి ఏమి వచ్చుచున్నదో చూడుము. ఆమె అక్కడ ఏమి చేసినదో నేను ఆశ్చర్యపోవుచున్నాను.”

ఓ, వేరొకరిని తట్టుచున్న పరిసయ్యుడా, నిన్ను నీవు ఒక్కసారి చూసుకొనుము. ఓహ్‌, మీ యొక్క క్రియలలో మీరు లైంగికంగా తప్పు కాకపోవచ్చు. మీరు మద్యం త్రాగక పోవచ్చు; కానీ, ఓహ్‌, గ్రుడ్డి పరిసయ్యుడా, నీవు నా ప్రభువు కొరకు ఏమి చేయుచున్నావు? చల్లని హృదయము కలిగిన కపటవాది, ఆయనకు నీవు ఏమి చేయుచున్నావు? నీవు ఆయనను తిరస్మరించుచున్నావు. దేని కొరకు నీవు దానిని చేసియున్నావు? దానిని నీవు ఎలా చేయగలవు? మీ చుట్టూ ఆయన ప్రసన్నతను చూచుటకై, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని అలరించుటకు కోరుకుంటున్నాడని తెలుసుకొనుటకై, కానీ మీరు చాలా మంచివారు. ఓ, మీరు ఎన్నడూ నీచమైన వారిగా ఉండరు. దేవుని యొక్క అద్దములో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకొనవలెను మరియు మీరు ఎలా కనిపిస్తారో చూడుము. నీ స్వనీతి, మీ యొక్క చిన్న వేషములు మరియు చిన్న చిన్న విషయములు, మీ యొక్క చిన్న ఆచారాలన్నియూ మసకబారుతాయి.

50

నేను ఆమెను చూడగలుగుచున్నాను; ఆమె తొందరపడవలెను; ఆలస్యమగుచున్నది. ఎప్పటికీ చేయకుండుట కంటే ఆలస్యమగుట మంచిది. మరియు ఆమె అక్కడకు వెళ్ళినప్పుడు, ఆ గుంపు చుట్టూ ఉన్నప్పుడు ధనవంతులు ఎక్కడ ఉన్నారో ఆమె చెప్పగలదు. ఆ యొక్క వైన్‌ గ్లాసులు ఒకదానికొకటి తగులుకొనుట ఆమె వినగలుగుచున్నది, ఆ విధముగా, మీకు తెలుసు. వారు ఎక్కడ ఉన్నారో ఆమె అక్కడికి వెళ్ళినది. ఆయన ఎక్కడ ఉన్నాడో అని ఆమె ఆశ్చర్యపడినది. ఇప్పుడు ఆమె ఉత్సాహముగా ఉన్నది. ఆ యూదుడు, తన తలను గోక్కొనుచూ, మరియు మూలన ఉన్న వారి వైపు చూసి, చెప్పెను, “ఆమె యొక్క సంగతి ఏమిటి?” చెప్పెను, అక్కడ ఆమె బుగ్గల మీద కన్నీటి చుక్కలు కారుచున్నవి. ఆమె ఏడ్చుచున్నది, ఆమె ఇప్పుడు ఎక్కడకు వెళ్ళుచున్నదో నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఏమి జరిగినదా అని నేను ఆశ్చర్యపోవుచున్నాను.“

ఆ స్త్రీ ఆయన యొక్క ముఖమును ఆమె చూసినప్పుడు, చెప్పెను, “ఈ పరిసయ్యుల వలె ఆయన మాట్లాడడు; ఆయన వ్యత్యాసమైనవాడు. ఆ బోధకుడు పరిసయ్యుల నుండి ఒక ప్రత్యేకమైనవాడు.” అక్కడ ఏదో వ్యత్యాసమున్నదని ఆమె ఎరుగును. ఆమె పైకి చూచినప్పుడు, ఆమె తలంచినది, “నేను ఏవిధముగా అక్కడికి వెళ్ళగలను, ఆ యొక్క ధనవంతుల స్థలములోనికి వెళ్ళగలను? ఎలా దానిని నేను చేయగలను. కానీ ఆమె చేసిన ఆ సంగతి ఒక దినము ఆయన చెప్పుట వింటిని, ”ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును,“ ” అని ఆయన చెప్పెను.

51

సంగతి ఏమనగా, ఆమె అక్కడికి ఎలా వెళ్ళబోవుచున్నది అని కాదు; అమె అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నదా లేదా? ఆ గుంపులో ఆమె తన మోచేతులతో నెట్టుచూ మార్గము చేసుకొనుట నేను చూడగలుగుచున్నాను. ఎవరు ఏమి అన్ననూ లేదా ఎవరు అన్ననూ, యేసును కలుసుకొనుటకు ఆమె తన మార్గములో ఉన్నది. మీరు దానిని చేస్తారా? ఈ దినము ప్రపంచములో ఉన్న భేదములలో మీరు మీ మార్గము చేసుకొనగలరా? అసభ్యకరమైన వాటిలో నుండి, చిత్ర ప్రదర్శనల నుండి మరియు నాట్యముల నుండి మరియు మీరు చేయు కార్యముల నుండి మీరు మార్గము చేసుకొనగలరా, యేసు యొద్దకు వచ్చుటకు, మిమ్ములను మీరు కైస్తవులుగా పిలుచుకొనుటకు, అలా చేయగలరా?

ఆయన ద్వారా స్వాగతించబడుటకు ప్రభువైన యేసు వద్దకు వచ్చుటకు, నీ యొక్క లోకపరమైన సాంఘిక వినోదమంతటిని నీవు ప్రక్కన పెట్టగలవా? దేవా దయ చూపుము. ఆమె అక్కడికి చేరుటకు మోచేతులతో తోసుకొని వెళ్ళుచున్నది. ఆమె ఎంత నీచమైనదో లక్ష్యపెట్టకుండా అక్కడికి వెళ్ళుటకు ప్రయత్నించుచున్నది. ఓ అది సరైన క్రమము కాదని నేను ఎరిగియున్నాను, ఓహ్‌, ఖచ్చితముగా. అప్పుడప్పుడు దేవుడు మనలను క్రమము నుండి బయటకు వచ్చుటకు సహాయము చేయును. సమస్య ఏమనగా, మీకు చాలా ఎక్కువ క్రమము ఉండియున్నది. క్రమమునుండి బయటపడుము. సంఘము రక్షించబడుటకు చాలినంత క్రమము తప్పియుండునని నేను ఆశిస్తున్నాను.

52

యేసు నన్ను రక్షించినప్పుడు నాకు గుర్తున్నది. ఓ, మై, నేను దానిని ఎన్నడూ మరచిపోను. ఈ నా చిన్న పాత కెంటకీ హృదయము గంటకి తొంబది మైళ్ళ వేగము గెంతుచున్నది. నేను కన్నీరు కార్చాను; నేను ఏడ్చాను; నేను అరిచాను. చుట్టూ ఎవరు నిలబడియున్నారని నేను పట్టించుకోను. నేను క్రమముపై దృష్టి పెట్టుట లేదు; యేసు యొక్క ప్రసన్నతలో ఉన్నాను; నేను ఆయనను ప్రేమించియున్నాను.

ఆమె ఎంత క్రమములో ఉన్నదో, లేక ఎంత క్రమములో లేదో అని ఆమె గమనించుట లేదు. ముఖ్య సంగతి యేదనగా, యేసుని కలుసుకొనుట. అక్కడ ఆయన మురికి పాదములతో కూర్చునియున్నాడు. ముద్దు పెట్టబడకుండా ఆయన కూర్చుండెను. ఆయన స్వాగతించబడలేదు, మరియు ఆయనను స్వాగతించవలెనని ఆమె కోరుచున్నది. వారి యొక్క ఆ పాత పరిసయ్యుల క్రమమును గూర్చి వారియొక్క పాత ఆచారముల గూర్చి మరియు సంఘశాఖలను గూర్చి ఆమె పట్టించుకోలేదు. యేసును పొందుకొనుటకు ఆమె ప్రయాసపడుచున్నది. యేసు యొక్క ప్రసన్నతను వారు పొందుకునేంతవరకు, ఆ సంఘశాఖలు, మరియు ఆ అడ్డగించువారు ఆ గుంపులలో నుండి పురుషులు మరియు స్త్రీలు వారి మార్గమును తయారుచేసుకొనును. అటువంటి ఒక ఉజ్జీవమును పొందుకొనుటకు దేవా మాకు సహాయము చేయుము.

53

అవును, ఆమె యేసు యొద్దకు వెళ్ళగోరుచున్నది; ఆయన మురికి పాదములను కలిగివున్నాడు. నా ప్రభువైన దేవుడు మురికి పాదముతో కూర్చునియున్నాడు. త్వరలోనే లోకము యొక్క రక్షణ కొరకు ఆయన రక్తము చిందించబడుటకు ఒక రోమన్‌ బల్లెం వాటిగుండా వెళ్ళబోవుచున్నది. మురికి పాదములు, వాటి కొరకు ఆయన నన్ను క్షమించును గాక. ఓహ్‌, అది నన్ను బాధించుచున్నది, కానీ యేసు యొక్క మురికి పాదములు, ముద్దు పెట్టబడకుండా, ప్రేమించబడకుండా: “ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు.” ఆయన వాగ్దానమును నిలబెట్టుకొనుటకు వచ్చెను. మరియు అప్పుడు స్వాగతించబడలేదు.

లోపల మరియు బయట ఒక ఉజ్జీవపు సంవత్సరము కొరకు ఎందుకు ప్రజలైన మీరు ప్రార్ధించుచున్నారు, మరియు అది మీ పరిసరాల్లోకే వచ్చినప్పుడు, దానిని మూఢభక్తి అని నీవు తలంచెదవు. యేసు మురికిపాదములు స్వాగతించబడలేదు ఓహ్‌, ఒకవేళ అది ప్రతి పురుషుడు మరియు స్తీ యొక్క హృదయం ముక్కలు చేసినట్లయితే ... స్వాగతించబదుట. ఓ, ఆ ప్రముఖుడు, ఆ పెద్ద సంగతులు చాలా సేపు జరుగుచూ వున్నవి, కానీ యేసు స్వాగతింపబడలేదు. ఓ, మై.

54

అది జరుగుచూ ఉన్నప్పుడు గమనించండి, ఆమె త్వరగా పరిగెత్తెను. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆమె ఆయన పాదముల వద్దకు వెళ్ళెను. ఆమె ఆయన ముఖము వైపు చూసినది; ఆమె చెప్పెను, “నేను చేయలేను, ఏమి జరిగినదో నేను ఎరుగను. నాలో నేను లేను.” ఆమె ఏడ్చుచున్నది. దేవుడా ఒక్కోసారి మాకు మేము ప్రక్కకు తప్పుకొనుటకు సహాయము చేయుము.

సమస్య ఏమిటంటే, మీరు చాలా భక్తిసంబంధులు. మీరు ఒక నిర్దిష్ట మార్గములో ప్రార్ధన చేయవలెను, మూర్చతో చనిపోవుచున్న దూడవలె, సాగుతూ “ఆమెన్‌”, ఆమేన్‌ అనే దానితో నీవు ముగించెదవు. ఆ పాటలు పాడే బృందములో రంగులు పూసుకున్న ముఖములతో, మరియు యొజెబెలు వేళ్ళ యొక్క గోళ్ళతో నిలబడి పాడుచూ, మరియు అది ఏమిటో నాకు తెలియదు అన్నట్లు నటించెదరు, మరియు మీకు మీరే కైస్రవులమని పిలుచుకుందురు. ఓ గ్రుడ్డి పరిసయ్యుడా, నీతో సంగతి ఏమిటి? నా ప్రభువు పట్టణములో ఉండెను. నీ హృదయములో ఆయనను నీవు అలరించలేవా?

55

ఆయన అక్కడ కూర్చునియున్నాడు. ఆయన పాదముల వద్దకు ఆమె వచ్చినది; ఆమె నేలపై ఆ పెట్టెను పెట్టినది. ఆమె పైకి లేచుట ప్రారంభించినది. ఆమె చేయలేకపోవుచున్నది, ఆమె కేవలం చేయలేకపోవుచున్నది. ఆమె చాలా కష్టముగా ఏడ్పుచూ వున్నది, ఆమె పైకి లేవలేకపోవుచున్నది. ఆమె సగం-వంగుట వద్దనే వుండినది మరియు ఆమె పైకి లేవలేకపోవుచున్నది. స్వచ్చత యొక్క బుగ్గ (ఊట) ప్రక్కనే నిలబడియున్నదని గ్రహించినది. ఆమెను క్షమించగల ఒకే ఒక్కరి దగ్గర ఆమె నిలబడియున్నదని ఆమె గుర్తించినది.

“ఇమ్మానుయేలు సిరలు నుండి కారుచున్ను రక్తముతో నిండిన ఒక ఊట అక్కడ ఉండెను.” ఆమె యొక్క అపరాధములను కడిగివేయగల ఒకే సంగతి అదే, ఒక వేశ్యగా దాని యొక్క ప్రసన్నతలోనే ఆమె ఉన్నది. ఆమె ఉన్న విధముగానే ఆమె వచ్చినది. ఏమి చేయవలెనో ఆమె ఎరుగదు. ఆమె ఏడ్చుచూ ఉన్నది; ఆమె తన చేతులు పైకెత్తినది. దానిని ఆమె తట్టుకోలేకపోయినది; ఆమె చూచుచున్నది మరియు అక్కడ ఆయన ఉన్నాడు. “ఓ, ఇది సాధ్యమేనా,” అమె చెప్పెను, “అది సాధ్యమేనా, అది ఆయనే కావచ్చు, ప్రియమైన వాడు, ఆయన చెప్పుట నేను వింటిని, ”ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి? దేవా, నా హృదయమును నీవు ఎరుగుదువు. నేను మాట్లాడవలసిన అవసరము లేదు; నేను చేయలేను. నేను నాలో లేను.“

56

మరియు ఆమె ప్రయత్నిస్తున్నది మరియు ఆమె ఏడుస్తున్నది, మరియు ఆమె చెంపలపై నుండి కన్నీళ్ళు దొర్లుతూ ఉన్నవి, కన్నీటి చుక్కలు పడుచున్నవి, యేసు యొక్క మురికిపాదములపై పడుచున్నవి. ఆయన మురికి పాదముల మీద తన చెంపల 'పైనుండి కన్నీళ్ళు పోయబడుచున్నవి. మీరు తెలుసుకోవలసిన మొదటి సంగతి, ఆమె ఆయన పాదములను తుడుస్తూ ఉన్నది. ఆయన పాదములను రుద్దు చున్నది, మరియు ఆ కన్నీళ్ళు క్రిందకు కారుచూ ఉన్నవి. ఎటువంటి ఒక దీవెన! స్వచ్చమైన పశ్చాత్తాపము యొక్క కన్నీళ్ళు, పశ్చాత్తాపము యొక్క కన్నీళ్ళు, యేసు యొక్క మురికి పాదములను కడుగుచున్నవి. ఓ దేవుడా, కృప చూపించుము. విచారముయొక్క కన్నీళ్ళు: ఎటువంటి అందమైన నీరు, ఎటువంటి మెరిసే నీరు, ఆమె హృదయము నుండి వచ్చుచున్నవి.

“ప్రభువైన దేవా, నాలో ఏ మంచి లేదు, కానీ నీవు ఈ విధముగా కూర్చొనుటను చూసి నేను తట్టుకోలేను.” మరియు ఆ కన్నీళ్ళు చెంపల క్రిందకు కారుచున్నవి మరియు ఆయన పాదములను ఆ విధముగా ఆమె రుద్దుచూవున్నది, ఆమె కన్నీళ్ళతో వాటిని కడుగుచున్నది. అక్కడ ఆ పాలరాయి పెట్టెను సరిగ్గా ఏర్పాటు చేసినది, మీరు

తెలుసుకోవలసిన మొదటి సంగతి, ఆమె యొక్క అపస్మారకపు స్థితిలో, ఆమె జుట్టు క్రిందకు పడినది. ఆ కురులు క్రిందకు జారినవి. ఆమె దానిని యెరుగక మునుపే ఆమె జుట్టుతో, ఆమె తలపై ఉన్న వెంట్రుకలతో ఆయన పాదాలను తుడవడం ప్రారంభించినది.

57

దేవా దయచూపుము. ఓ, మై! నా ప్రభువా, మరియు ఆ చల్లబడిన హృదయము గల ఆ పరిసయ్యులు గుంపు, భిన్నముగా అక్కడ కూర్చొనియున్నది. ఓ, మై! ఆమె తన తలవెంట్రుకలతో దీవించబడిన ఆయన పాదములను తుడుచుచున్నది. మీలో కొంతమంది స్త్రీలు దానిని చేయుటకు మీరు మీ తలపై నిలబడవలసియున్నది. మీరు

జుట్టును కత్తిరించుకొనుచున్నారు, అది నిజము. ఒక హాస్యం కొరకు నేను దానిని చెప్పుట లేదు. పరిశుద్ధ గ్రంథము చెప్పెను, “ఆమె జుట్టులోనే ఒక స్త్రీకి మహిమ ఉన్నది.” మరియు మీరు ఆ జుట్టునే కత్తిరించుకొనుచున్నారు.

ఏమిటది? అది ఏమిటి? అది ఆమె యొక్క మహిమ. తన గురించి ఆమె కలిగియున్న ఒక మంచి విషయము ఆమె పొడవాటి జట్టు మాత్రమే, మరియు అది అంతయూ క్రింద యేసు పాదముల వద్ద పడినది. ఆమె కన్నీరు, ఆమె మొత్తం, యేసు మురికి పాదములను కడుగుచూ ఆయన పాదముల వద్ద కుమ్మరించుకొనుచున్నది. ఎటువంటి ఒక మార్గము ... అది క్రమములో లేదని నేను యెరుగుదును. మీరు క్రమము గురించి ఏమి పట్టించుకొనెదరు? ఆ గుంపులో ఏమి జరుగుచున్నది? వారు చేయుచున్న దానిని గురించి ఏమి పట్టించుకొనెదరు? మీరు యేసు యొక్క ప్రసన్నతలో (సన్నిధి) ఉన్నారు.

58

ఆ పరిసయ్యులు ఏమి చెప్పుచున్నారో అను దానిని గూర్చి ఆమె పట్టించుకోవడంలేదు. యేసు తన పాదములు వెనుకకు తీసుకొని మరియు “చెప్పెను, చెప్పెను, చెప్పెను, నీవు దీనిని చేయకూడదు అని చెప్పెనా?” లేదు, అయ్యా, ఆయన సంపూర్ణముగా అలాగే కదలకుండా ఉన్నాడు. అమె సరైన క్రమములోనే ఉన్నది, పశ్చాత్తాపము యొక్క కన్నీటితో, యేసు మురికి పాదములను ఆమె కడుగుచున్నది, ఆమె తను కలిగియున్న ఏకైక మహిమతో, ఆమె జుట్టుతో, వాటిని తుడిచినది. ఆయన విలువైన పాదముల వద్ద సమస్తమునూ పెట్టినది. ఆమె తనను తాను ప్రక్కన పెట్టినది. ఆమె కడుగుచున్నద్రి; ఆమె ఏమి చేయుచున్నదో ఆమె కనీసము ఎరుగదు.

కొంచెంసేపటి తరువాత ఆమె పైకి లేచినది. ఏమిటో ఆమెకు తెలియదు ... ఆమె చుట్టూ చూసినది. ఓ, సీమోను ఏమైనా చెప్పియున్నాడా? అవును. ఓ, తరువాత అతను తన వ్యాఖ్యలు చేసాడు. అతని ముఖము ఎర్రగా మారుట నేను చూడగలుగుచున్నాను, తన పదునైన ఉక్కువంటి, భక్తిలేని, బల్లి కళ్ళు ఆమెను కోసివేస్తున్నాయి. అతను అవేశముతో ఎర్రగా మారి మరియు తర్వాత కోపముతో ఊగిపోయెను. అతను వెళ్ళిపోవుట నేను వినగలుగుచున్నాను, అతని కార్యక్రమమునకు అంతరాయము కలిగినది. తన హృదయములో అతను చెప్పెను, “నీవు ఏ రకమైన స్త్రీ ముందు నిలబడియున్నావో నీవు ఎరుగుదువా?” అది తన ప్రతిష్టను దెబ్బ తీస్తుందని అతను తలంచెను.

59

ఎందుకు, సహోదరుడా, ఆయన పాపులతో ఉన్నప్పుడే యేసు యొక్క కీర్తి నిర్మించబడుచున్నది. యేసు కీర్తి పాపులచే బాధించబడదు; పాపుల యొక్క ప్రసన్నతలోనే అది నిర్మించబడుతుంది. అక్కడ ఆయన పాదములు కడుగుచున్నది, ఆమె పైకి లేచి, ఆ పాలరాతి పెట్టెను తీసుకున్నద్శి ఆమె కలిగియున్న ప్రతీది అక్కడ

ఉన్నది, ఆమె జుట్టు క్రిందకు వ్రేలాడుచున్నది. ఆమె ఆపైన దానిని పెలుక్కుమని విరిచినది. దానిని ముక్కలు చేసినది. అంతయూ పోసినది. వర్షము పడే రోజు కొరకు కొంత దాచిపెట్టలేదు; దానిలోనిదంతయు ఆయన పాదములపై ఆమె పోసినది. ఆమె యొద్ద ఉన్నదంతయూ ఆమె మహిమను, ఆమెను, ఆమె పశ్చాత్తాపము యొక్క

కన్నీళ్ళను, మరియు ఆ ధనమంతటిని, మరియు ఆ అత్తరు అంతయూ జటమాంసి అనే వృక్షము యొక్కపెట్టెలో ఉన్నవి. ఆమె దానిని ఆయన పాదములపై పోసినది.

ఓ దేవా, మేము జీవించుచున్న ఈ భక్తిలేని తరముపై, దయ చూపించుము, పరిసయ్యులు, అతిధి సత్కారము చేయలేనివారు ... ఆయన పాదములపై పోసినది.

60

మరియు మీకు తెలుసా సీమోను చెప్పెను, “నీవు ఎరిగియున్న యెడల ...ఒకవేళ ఈయన ప్రవక్తయైన యెడల, నేను చూడగలను అని చెప్పుకున్నట్లుగా ఒకవేళ ఈయన దర్శనములు చూచిన యెడల, ఒకవేళ ఈ వ్యక్తి దర్శనములు చూడగలిగిన యెడల, ఒకవేళ ఈయన ఒక ప్రవక్తయైన యెడల, తన పాదములు కడుగుచున్న యీ స్త్రీ ఎటువంటిదో ఈయన ఎరిగియుండును.”

ఓ, గ్రుడ్డి వేషదారీ, యేసు ఎవరో తెలుసుకోవాలంటే నీవు చాలా మంచి-మంచిగా ఉండవలెను. నీవు చాలామంచి-మంచిగా ఉండాలి; ఆ విధముగానే నీవు ఆయనతో వ్యవహరించాలి; ఈ దినము నీవు రక్షింపబడకపోవుటకు అదే కారణం అయ్యున్నది. ఆ పరిశుద్దాత్మ బాప్తిస్మము నీవు కలిగిలేకపోవుటకు కారణం అదే, ఎందుకనగా ఆయనతో నీవు ఆ విధముగా ప్రవర్తించావు, సిగ్గుపరిచావు. ఓ, గ్రుడ్డి పరిసయ్యుడా, అక్కడ అతడు తన స్వీయ ధర్మముతో (స్వనీతితో) నిలబడెను, “ఈయన భవిష్యత్తును గూర్చి చెప్పువాడైన యెడల, ఒకవేళ ఈయన ఒక ప్రవక్త అయినయెడల, యీ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఖచ్చితముగా యెరిగియుండును,” అని చెప్పెను.

61

ఆ ద్వారములోనికి ఆయన ప్రవేశించినప్పటి నుండి మొదటిసారిగా యేసు సౌకర్యంగా భావించుటను నేను చూడగలుగుచున్నాను. పాపులతోనే ఆయన ఉండును. ఆయన పైకి లేచి మరియు చెప్పెను, “సీమోను, నీకు ఒకటి చెప్పవలెనని నేను భావించుచున్నాను. నీతో మాట్లాడుటకు నేను కొన్ని సంగతులు కలిగియున్నాను,

సీమోను నేను నీ ఇంటికి వచ్చినప్పుడు ...“ ఓ దేవా, ”నేను నీ ఇంటికి వచ్చినప్పుడు,“ పరిసయ్యుడా, నేను దేనిగూర్చి మాట్లాడుచున్నానో నీవు చూడుము? ”నేను, నీ ఇంటికి వచ్చినప్పుడు, నీవు నా పాదములను కడుగలేదు, సీమోను నీవు ఎటువంటి నూనెను నాకు ఇవ్వలేదు, సీమోను నీవు నన్ను స్వాగతిస్తూ ముద్దు పెట్టుకొనలేదు, సీమోను నన్ను అహ్వానించి, ఇక్కడకు తీసుకొని వచ్చిన తరువాత, నన్ను ఆహ్వానించిన పిదప నన్ను కేవలము ఇక్కడ కూర్చుండబెట్టియున్నావు, మరియు నేను వచ్చిన తరువాత నీవు నా తలకు నూనెను ఇయ్యలేదు, నా పాదములు కడుగుకొనుటకు నీరును కూడా ఇవ్వలేదు, మరియు నీవు స్వాగతముతో నన్ను ముద్దు పెట్టుకొనలేదు.“

“కానీ ఈ పేద స్త్రీ ఆమె ఈ సమయమంతా ఏమి చేయుచున్నది? (సహోదరుడు బ్రాన్హాం ఒక ముద్దు శబ్ధము చేయుచున్నారు.) ఆయన పాదములను ముద్దు పెట్టుకొనుచున్నది. హల్లెలూయ! ఆయన పాదములను ముద్దు పెట్టుకొనుచున్నది. చెప్పెను, ”ఆమె ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి“, దేవా దయ చూపుము, నేను ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి, ఆమె నా పాదములను ముద్దుపెట్టుకొనుట మానలేదు. ఓ దేవా, ఈ దినము నా ప్రభువుకు అదేరకమైన ఆతిథ్యము వచ్చుట నేను తలంచినప్పుడు, నేను ఎంతమాత్రము బోధించలేను.

62

ఓ, మై! “నేను లోనికి వచ్చినప్పటినుండి ఈ స్తీ నా పాదములను ముద్దుపెట్టు కొనుట మానలేదు. మరియు నాకు కడుగుకొనుటకు కూడా ఏ నీరును నీవు ఇవ్వలేదు; నీవు నాకు ఎటువంటి అభిషేకమును ఇయ్యలేదు, నా ఎండిన చేతులకు మరియు నాపెదవులకు మరియు నా ముఖముపై పూసుకొనుటకు ఎటువంటి నూనెను ఇవ్వలేదు. స్వాగతిస్తూ నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, మరియు నీ ఇంటిలోనికి వచ్చుటకు నేను స్వాగతించబడి యున్నానని నాతో చెప్పలేదు. కానీ ఈ స్రీ నిరంతరము నా పాదములను ముద్దుపెట్టుకొనుచూనే యున్నది.

ఓ, ఆయన ఏమి చెప్పెనో వినుడి. అంతట ఆయన సీమోను నుండి తిరిగి, మరియు ఆయన ఈ పేద దయనీయ దరిద్రురాలుని చూచెను, ఆమె జుట్టు క్రిందకు వ్రేలాడుచున్నది, కన్నీటితో తడిచిపోయినది, మరియు వాటిపై ఆ రహదారిపై ఉన్న అవమానమంతా ఉన్నది. ఆయన పాదములను ఆమె ముద్దుపెట్టుకున్న చోట నుండి అత్తరుతో ఆమె పెదవులు నూనె కారుచున్నవి, ఆమె కన్నీళ్ళు ఆమె బుగ్గలపై నుండి కారుచున్నవి... ఆయన ఏమి చెప్పెనో వినుము, నీ విస్తారమైన పాపములన్నియు క్షమించబడెను.“ ఓ, దేవా, ”నీ విస్తారమైన పాపములన్నియూ క్షమించబడెను.“

63

. ఓ, దేవా, మర్యాదలేని ఈ తరం, మీ గృహములోనికి వచ్చి మరియు ఆతిథ్యం పొందవలెనని, ఆరాధింపబడవలెనని, మహిమ పొందవలెనని, ఘనపరచబడవలెనని ప్రభువు కోరుకొనుచుండుటను మీరు చూడలేకపోవుచున్నారా? ఓ, దేవా మాపై కృప చూపుము. మనము ప్రార్ధనచేసుకుందాము; ఒక నిమిషం పాటు మన తలలను వంచుదాము “ప్రార్థన చేయుము, అని ఏదో నాకు చెప్పుచున్నది. దేవుడా, యేసు మురికి పాదములు, యేసు వినోదింపబడలేదు మరియు ముద్దుపెట్లుకోబడలేదు యేసు స్వాగతించబడలేదు ...

కృప కలిగిన తండ్రీ , ఇంకనూ నీవు యేసు అని, మరియు వారు నిన్ను అలరించుటలో విఫలమయ్యారని తెలుసుకొనుటకు, ఈ సమాజము ముందు ఈ దినము క్రిందకు వచ్చి మరియు నీ హృదయాన్ని చిత్రించెదవా. మరియు నిన్ను అలరించుటలో వారు విఫలమైరి. వారి యొక్క చిన్న చిన్న విషయాలను వారు ప్రేమించెదరు; వారి యొక్క సంస్థలను మరియు వారి సంఘశాఖలను వారు ప్రేమించెదరు. సంఘములో వారి యొక్క చిన్న సాంఘిక వ్యవహారాలు, వారి మహిళల యొక్క సహాయక కార్యక్రమాలు మరియు అనేక ఇతర సంగతులను వారు ప్రేమించెదరు. ఆ పురుషులు వారి యొక్క పేకాటలను మరియు వారి ఆటవిడుపులను వారు ప్రేమించెదరు. మరియు యేసును స్వాగతించరు.

64

ఓ ప్రభువా, నా స్వస్థపరచువాడా, నా రక్షకుడా, నా కావలివాడా, ఓ దేవుడా, అది మీ కోసం కాకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని? దేవుడా, ఈ దినము చల్లబడిపోయిన మరియు భిన్నమైన హృదయములతో దయచేసి మాట్లాడుము; నీవు అదే ప్రేమించే కావలివానిగా ఇక్కడ ఉన్నావని వారికి తెలియజేయుము. చాలా భిన్నముగా ఉండేవారిని, వీధుల్లో చాలా సేపు తిరిగేవారిని.

మీరు ఎందుకు వేచి యున్నారు నా సహోదరుడా?

మీరు ఎందుకు ఎక్కువసేపు ఆలస్యం చేయుచున్నారు?

యేసు మీకు ఇచ్చుటకు వేచి యున్నాడు.

ఆయన పవిత్రమైన సింహాసనం ద్వారా ఒక స్థలమున

దైవికము కాని నీ యొక్క మార్గములను నీవు వదిలివేయవా? మీ యొక్క చిన్న గొడవలను విడిచిపెట్టి, ఈ రోజు ఆయన యొద్దకు రాగలవా? మనము ప్రార్ధించుచుండగా, మీ వంచిన తలలతో, “దేవా, నాపై దయ చూపుము, అని ఎంతమంది, మీ కాళ్ళపై నిలబడే చెప్పెదరు. నేను ఈ దినము వచ్చుచున్నాను; ఏదైననూ చేయుటకు, ప్రభువా, నేను సిద్ధముగా ఉన్నాను. ఈ దినము నా రక్షకునిగా నా హృదయములో నిన్ను అలరించగోరుచున్నాను. లోకము యొక్క సంగతులన్నింటీిని నేను విడువగోరుచున్నాను. ప్రపంచములోని ప్రతీ ఆనందమును నేను వదులుకొనగోరుచున్నాను.

65

నేను మీ యొక్క మంచితనముతో పూర్తిగా నిండిపోవాలని కోరుకొనుచున్నాను, అప్పుడు అది కేవలం నీవేయని నేను ఎరిగియుండెదను. నేను నిన్ను అహ్వానించి యున్నాను, కానీ నేను నిన్ను దూరం పెట్టియున్నాను. (త్రోసివేసియున్నాను). నా బిడ్డ చనిపోయినప్పుడు నేను నిన్ను సేవించెదను అని నేను నీకు చెప్పియున్నాను. నా తల్లి చనిపోయినప్పుడు, నా తండ్రి సమాధిపై పువ్వులను నేను పెట్టినప్పుడు నేను నీకు చెప్పాను, నేను చెప్పాను, “దేవా, ఒకరోజు నేను నిన్నుసేవించెదను. కానీ నిన్ను నేను పిలిచియున్నాను, మరియు నేను నిన్ను దూరం పెట్టియున్నాను, కానీ ఈ దినము నేను వచ్చుచున్నాను. కొంత సేపటి క్రితం బోధకుడు చెప్పినప్పుడు, బిడ్డ లేదా అమ్మా ఎక్కడైతే ఉన్నారో, అక్కడ ఆ మైదానం ప్రక్కవైపు ఒక చిన్న చెక్కను నిలువబెట్టినప్పుడు నేను నిన్ను సేవించెదను అని ఆ దినము చెప్పియున్నాను. ప్రభువా కానీ ఒక పరిసయ్యునివలె, నటుని వలె నేను ఉండియున్నాను. నేను వాస్తవముగా ఎన్నడూ నీ యొద్దకు రాలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ నేను వచ్చుచున్నాను. ప్రభువా, నేను నిన్ను ప్రేమించియున్నానని రుజువు చేయుటకు నేను నిలబడబోవుచున్నాను. నేను నీ కొరకు సిగ్గుపడుట లేదు. నీవు నా కొరకు ఎంతో చేసియున్నావు.

ఒక దినము జీవితము ముగిసినప్పుడు, ఓ దేవా, ఆ దినము ఆ వేశ్య నిలబడినట్లుగా నేను నిలబడగోరుచున్నాను. ఆయనతో మాట్లాడాలని నేను కోరుకొనుట లేదు; ఆయనతో మాట్లాడుటకు నేను యోగ్యుడను కాను. కానీ నేను చెప్పగోరుచున్నాను, యేసూ, నీ పాదముపై నున్న మచ్చను ముద్దుపెట్టుకోనిమ్ము, ముద్దు పెట్టుకోనిచ్చెదవా, యేసూ? కేవలము అ మచ్చను నన్ను ముద్దు పెట్టుకోనిమ్ము: అక్కడ అది నా కొరకు చేయబడినది. ఓ దేవా“

66

నేను ఒక చిన్న బిడ్డను కాను, కానీ, ఓ, మై! మీ గురించి మీకు సిగ్గుగా లేదా? నా యేసు పట్ల నీవు ప్రవర్తించిన విధానము నీకు సిగ్గుగా లేదా? నీవు వెళ్ళి కేవలము ఒక సంఘములో చేరావు. మరియు ఎన్నడూ మార్పు లేదు. నీవు ఇప్పటికీ లోకము యొక్క కార్యములను ప్రేమించెదవు, ఇప్పటికీ పాత లోకము యొక్క వినోదమును తీసుకొని మరియు దానిని ఆనందించెదవు. ఓ, తిరిగి జన్మించుట అనగా ఏమిటో నీవు ఎరుగవు. సహవాసమును కలిగివుండుట అనగా ఏమిటో నీవు ఎరుగవు. ఓ, మీరు తగినంత మంచివారని మీరు తలంచెదరు, కానీ నీవు కావు. ఇప్పుడు మీరు ఎంత మంచివారోయని కాదు; అది మీరు ఎంతగా ఆయనను ప్రేమించుచున్నారో ఒకవేళ ఆయనను నీవు ప్రేమించినట్లయితే; మీరు ఆయన ఆజ్ఞలను పాటించెదరు.

ఇప్పుడే దేవునికి ఒకసాక్షిగా మీ పాదములపై మీరు నిలబడెదరా? చెప్పుము, “ప్రభువైన యేసూ, ఒక వేషదారి వలే ఉండి నేను అలసిపోవుచున్నాను, అది నేను పొందలేకపోయినప్పటికీ, మతమును నేను పొందినట్లుగా పాత పరిసయ్యుడైన నటునివలె ఉన్నాను. ఇప్పుడే నా హృదయములోనికి నీవు రావలెనని నేను కోరుకొనుచున్నాను. ఒకవేళ కుంటివారిని వారియొక్క స్ట్రెచర్ల పైనుండి మరియు చక్రాల కుర్చీ నుండి వచ్చేలా చేసి, ఒకవేళ గ్రుడ్డివారు చూడగలిగినట్లుగా మరియు చెవిటివారు వినునట్లుగా మీరు చేసినట్లయితే, నీవు దేవుడవని నేను యెరుగుదును. నీవు నా హృదయముతో మాట్లాడుచున్నావని నేను యెరుగుదును.”

67

ప్రభువైన యేసును అంగీకరించుటకు, బాలురు లేదా బాలికలు, పురుషుడు లేదా స్త్రీ, ఇప్పుడే మీ పాదములపై మీరు నిలబడెదరా? ఏమిటి ఇక్కడ సంగతి? ఏదో తప్పు ఉన్నది. నేను ఎరుగను అని నాకు చెప్పవద్దు. సంగతి ఏమిటో మీరు ఎరుగుదురా? దానిని గురించి మీ పొరుగు వ్యక్తి ఏదో చెప్పునని మీరు భయపడుచున్నారు. ఎవరో ఏదో చెప్పెదరని మీరు భయపడుచున్నారు. యేసు ఏమి చెప్పబోవుచున్నాడు ? నీ హృదయములో యేసు స్వాగతించబడలేదు. స్నేహితుడా, ఇదే నీ చివరి సమయము కావచ్చు. సహోదరీ, ఇదే నీ చివరి సమయము అయ్యుండవచ్చు.

యేసు సమీపములోనుండెను, ఈరోజు ఆయనకు ముద్దుపెట్టబడలేదు. ఆయన పట్ల సమాజము భిన్నముగా ఉన్నది. గతరాత్రి ఆయన క్రిందకు దిగివచ్చి మరియు నీ రోగమునంతటినీ మరియు సంగతులను స్వస్థపరచెను, వారిని బాగుపరచి మరియు స్వస్థతతో గృహమునకు పంపించెను. ఈ మైదానములో ఇక్కడ ఈ చిన్న గదిలో అద్భుతములు మరియు గొప్ప సూచనలు చేయుట ద్వారా ఆయన ఇక్కడ ఈ వేదిక యొద్ద యున్నాడని క్రిందికి దిగివచ్చి చూపించెను. ఆయన వాక్యము ద్వారా, ఆయన ఇక్కడ ఉన్నాడని రుజువు చేయుటకు, మహిమ నుండి క్రిందకి దిగివచ్చెను. మరియు ఈ దినము, ఆయనను మీరు నిర్లక్ష్యము కాబడినవానిగా కూర్చుండ బెట్టియున్నారు. “ఓహ్‌, దానికి బదులుగా నేను నా విందును కలిగియుండెదను.”

68

ఈ దినము పరిసయ్యుడైన సీమోను అతను ఉన్న నరకములో ఏమి ఆలోచించును? ఆ చిన్న విందును మరలా పిలుచుటకు ఆయన ఇష్టపడునని నేను తలంచుచున్నాను. అది భిన్నముగా ఉండునని నేను ఊహించెదను. “ఓ యేసూ, నేను నీ పాదములను కడిగెదను,” అని సీమోను ఏడ్చును. నేటినుండి ఒక సంవత్సరమునకు, ఈ దినము ఇక్కడ కూర్చొనియున్న ప్రజలు ఒకవేళ వారు యేసును అంగీకరించకపోతే, నేటి నుండి ఒక సంవత్సరం, నీవు పొందుకొనెదవు అని ఆశించెదవు. ఓ యేసూ, ఒకవేళ ఆ చిన్న శిబిరము వద్దకు మరలా నేను వెళ్ళగలిగినట్లయితే, ఓ యేసూ, ఒకవేళ ఆ బోధకుడు మరలా పిలచుట నేను వినగలిగితే, యేసూ, నేను పైకి లేచెదను, ఓ నేను పైకి లేచెదను.“

చాలా ఆలస్యం అయినది! పాపము నిన్ను వేరు చేసినది. “ప్రభువా, ఆ దినము నాకు గుర్తున్నది వర్షము చాలా ఎక్కువగా కురియుచున్నది; ప్రజల యొక్క కళ్ళ నుండి కన్నీళ్ళు క్రిందకు కారుచూ ఉన్నవి. మేము నీ వైపు ఎంత కఠినముగా ఉండి యున్నామో మరియు నీవు ఏ విధముగా మమ్ములను ప్రేమించియున్నావని బోధకుడు మాకు చెప్పుచూ వున్నాడు. మరియు నేను వ్యత్యాసమైనవాడిని, ప్రభువా.” లాజరు అతనికి బోధించిన తరువాత, ఆ ధనవంతుడు ఒకసారి ఆవిధమైన ఒక అభ్యర్థనే (మనవి) కలిగియున్నాడు.

69

ఓ, మీ పంటలు బహుశా మంచిగా పండుచుండవచ్చు. పొగాకు బహుశా మంచిగా వచ్చుచున్నది, మొక్కజొన్న ఓ, సహోదరి, బహుశా రేపు మీరు కడిగే సమయమును కలిగియుండవచ్చు. బహుశా మంగళవారం నీవు ఆ క్లబ్‌కు

వెళ్ళవలసియున్నది. నా యేసుతో అది సంబంధము కలిగిలేదు. ఆయనతో నీవు ఏమి చేయుచున్నావు? “లోకముతో ఆయనను కూర్చోబెట్టుచూ, ఆయన మీద మురికి ఉంచుతూ, అది బుద్ధిహీనత; దానికి ఏమి లేదు. అది దయ్యమునకు సంబంధించినది. అది మానసిక శాస్త్రము.” మరియు మీరు కూర్చొనియున్నారు, దానిని గూర్చి ఏమీ చేయకుండా, ఆయనను ఆ విధముగా కూర్చోనివ్వండి. కానీ అది మీకు మరియు దేవునికి మధ్య ఉన్నది. ఎందుకు నీవు వేచియున్నావు, ప్రియమైన సహోదరుడా?

మీరు ఎందుకు ఎక్కువసేపు వేచి చూచుచున్నారు?

ఆయన యొక్క పరిశుద్ధ సింహాసనములో ఒక స్థానమును యేసు మీకు ఇచ్చుటకు వేచియున్నాడు.

ఎందుకు నీవు వేచి యుండెదవు? అంటే ఇక్కడ ఒక్క పురుషుడు లేక బాలుడు లేక బాలిక లేరు అని నీవు నాకు చెప్పదలచియున్నావా? ఇక్కడ కూర్చొని మరియు మీరు ఎవరో నేను ఎరుగుదునని మీకు తెలుసు. ఆ పరిశుద్దాత్మ ఇక్కడ ఉన్నదని మీకు తెలుసు, కదులుచూ, మరియు ఈ ప్రేక్షకులపై నుండి నేను చూచుచుండగా చీకటి మీపైన వ్రేలాడుచున్నది. మరియు మీరు ఎక్కడ కూర్చొనియున్నారో నేను ఎరుగుదును. మరియు ఒకవేళ నేనే ఎరిగివున్నట్లయితే, ఆయన మరి ఎంతగా ఎరిగియుండును? దేవుడు మీతో మాట్లాడుచున్నాడు, మరియు ఆయన నుండి నీ యొక్క భిన్నమైన, చల్లబడిన హృదయమును నీవు త్రిప్పివేయుచున్నావు.

70

గుర్తించుకొనుము. నేను మీకు చెప్పుచున్నాను, ఇదే చివరి సమయము అయ్యుండవచ్చు “నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు,” ఆయన కేవలం వ్యక్తి అని చూచెదరు. మీరు ఒక స్వేచ్భా జీవి అయ్యున్నారు. మీ ఎన్నికను మీరే చేసుకొనగలరు. దానిని ఈ దినమే ఎందుకు చేసుకొనకూడదు? నిత్యత్వమును తన చేతితో పట్టుకొని, అన్ని సంగతులు యొరిగియున్న ఆయన చేతిలో నీ ఆత్మను ఎందుకు పెట్టలేకపోవుచున్నావు? నిన్ను నడిపించుటకు సరియైన వాడు ఆయనే. నీవు ఎక్కడ వుండవలెనో అక్కడ ఉంచగలిగే ఒకే ఒక్కడు ఆయనే.

ఆయనతో నా అవకాశమును తీసుకొనుటకు నేను ఇష్టపడుచున్నాను. నేను చాలా సంతోషముగా ఉన్నాను. నేను దానిని చేసినందుకు చాలా సంతోషముగా ఉన్నాను. నేను చాలా సంతోషముగా ఉన్నాను, చాలా సంతోషముగా ఉన్నాను. మీ తలలు క్రిందకు వంచియుండగా నేను సమయము చూచియున్నాను. నాన్న మీకు తెలుసా, దేవుడు ఆయన హృదయమును దీవించును, నా భుజములపై అతను చనిపోవుచున్నప్పుడు ఆఖరి ప్రార్ధన అతను ప్రార్ధించెను. పేద వృద్ధ తండ్రి చాలా ఎక్కువగా త్రాగెను, ఆ పట్టణము చుట్టూ చాలా చెడ్డపేరు పొందెను మరియు అతను అలా చేసినప్పుడు, ఆ విధముగా త్రాగుచున్నప్పుడు, నేను ఒక బాలునిగా ఉన్నప్పుడు, మా పేరు ఆ పట్టణములో నిజముగా పాడైపోయెను, నేను అక్కడ నిలబడి మరియు కొందరితో మాట్లాడుచుండెడివాడను, ఒకవేళ ఆ ప్రక్కన ఎవరైనా వచ్చినయెడల, వారు నన్ను విడిచిపెట్టి మరియు వారితో మాట్లాడెదరు, ఎందుకనగా ఒక బ్రాన్హాం గనుక. ఓహ్, దేవా, ఆ పేరు ఆ మురికి నీటి కాలువలోనికి ఈడ్వబడెను.

71

గత దినమున భార్యతో నేను చెప్పియున్నాను, “చూడు హనీ, ఇప్పుడు కనీసం నేను ఇంటికి కూడ రాలేను. ప్రజలు ఆఫ్రికా నుండి, ఇండియా నుండి, ప్రపంచమంతటి నుండి వచ్చి, హోటల్‌లో కూర్చొనియున్నారు, ఐదు నిమిషముల సమయము కొరకు అడుగుచున్నారు. ప్రపంచం అంతటి నుండి ఒక్క ఐదు నిమిషముల కొరకు వచ్చియున్నారు.” నేను చెప్పాను, ప్రియమైనదానా, దానిని చేసినది ఏమిటి? నా చదువు కాదు, నాకు ఏమియూ లేదు; నా యొక్క వ్యక్తిత్వం కాదు, నాకు ఏమియు లేదు. దానిని చేసినది ఏమిటి? యేసు! ఆయనే దానిని చేసియున్నాడు; ఆయనే దానిని చేసియున్నాడు.“

ఆయన దావీదుతో చెప్పెను, “దావీదూ, నిన్ను గొర్రెల దొడ్డిలోనుండి తీసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను. నేను నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి నా జనుల మీద అధిపతిగా నియమించితిని.” ఓ దేవుడా, యేసు, “నీవు ఏమియూ కావు; నేను నిన్ను రక్షించి మరియు నా కుమారునిగా నిన్ను చేసియున్నాను. నేను నిన్ను రక్షించి మరియు ఒక యువరాజు వలె నిన్ను చేసితిని, నేను నిన్ను రక్షించి మరియు సువార్తను బోధించుటకు నిన్ను పిలచియున్నాను.” ఓ యేసు ప్రశస్తమైన మేకులుకొట్టబడిన పాదాలు మరియు చేతులు, మీ యొక్క ముళ్ళతో నొక్కబడిన నుదురు. ఓ, యేసూ, నేను నిన్ను ప్రేమించియున్నాను.

72

ఇక్కడ స్వంత మైదానములలో, నేను జన్మించిన ఈ నేలపై ఇక్కడే, ప్రభువా, చిన్న పాత పాపియైన పసిబిడ్డ. దయచేసి, ప్రియమైన దేవా, భిన్నముగా ఉన్నవారి హృదయములను వెచ్చగా చేయుము, దయలో మరియు. శాంతిలో వారితో మాట్లాడుము, గొప్ప యెహోవా, ఒక దినము మీరు రాబోవుచున్నారు మరియు మీ కోపము తీవ్రముగా ఉండును. మరొక్కసారి, ప్రభువా, నేను మొరపెట్టుచున్నాను, అంతట నేను నీకు కట్టుబడియుండెదను. నేను సమస్తమును చేసియున్నాను ఎలా చేయవలెనో నేను యెరిగియున్నాను. నేను నీ గురించి మాట్లాడుచున్నాను, ప్రభువా, మరియు నాకు ఏడుపు వచ్చుచున్నది, దానికి నేను ఏమీయూ చేయలేకపోయాను.

కొంతమంది పాపులను మీరు అనుమతించెదరా, ప్రభువా, పైకి లేచి మరియు చెప్పుము, “ఇప్పుడు, నా పాదములతో నేను నిలబడెదను, ప్రభువా, ఆ పరిసయ్యులు ఏమి చెప్పుదురో నేను పట్టించుకోను. ఎవరైననూ ఏమి చెప్పుదురో నేను పట్టించుకోను. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంఘములో నేను ఒక నిజ కైస్తవనిగా ఉండబోవుచున్నాను. నేను నిన్ను ప్రేమించబోవుచున్నాను, మరియు నేను నీ కొరకు పనిచేయబోవుచున్నాను, మరియు ఇతర పాపులను నేను నీయొద్దకు తీసుకురాబోవుచున్నాను.” దానిని అనుగ్రహించుము, ప్రభువా; దానిని అనుగ్రహించుము, దయచేసి నీవు అంగీకరించెదవా?

73

నేను ప్రతీచోట చూసియున్నాను మరియు ఒక్కరు కూడా నిలచుండుట నేను చూడలేదు. ఓ దేవా, నా ప్రియమైన కెంటకీ ప్రజలారా, నా వలె మీలో అనేక మంది పేదవారు, మొక్కజొన్న రొట్టెను మరియు ఆ దవడ మాంసపు యొక్క ముక్కను అల్పాహారముగా కలిగియుండి, ఒక కొద్దిపాటి జీవనము మీద మీరు ఇక్కడ ఉన్నత స్థానమునకు వచ్చియున్నారు. ఈ లోకములో నీకు ఏమియూ లేదు, కానీ ఈ దినము దేవుని యొక్క కుమారులుగా మరియు కుమార్తెలుగా అగుటకు నీవు అవకాశం పొందుకొనియున్నావు. ఎందుకు దానిని నీవు చేయలేవు? ఏది ఏమైనను నీవెవరవు? ఆ కొద్దిపాటి పాత వ్యవసాయం ఏమి తేల్చబోవుచున్నది. నీవు చనిపోబోవుచున్నావు మరియు దాన్ని విడిచిపెట్టవలెను. ఆ కొంచెము ప్రోగు చేయుట ఏమిటి, లేదా నీవు కలిగియున్న ఆ కొంచెము సాంఘిక ప్రతిష్ట ఏమిటి?

ఇక్కడ ఒక దినము ఆ కొండ ప్రక్కన వారు నిన్ను బయటకు ఈడ్చి వేయబోవుచున్నారు. మరియు ఒక లోయలో నిన్నుపెట్టెదరని, మరియు నీపైన కొంచెము మట్టి పోయుదురని, నీవు గుర్తించుకొనుము. ఒకవేళ నీవు యేసును ఈ దినము త్రోసివేసినట్లయితే నీ యొక్క ఆత్మ ఎక్కడ ఉండబోవుచున్నది? నిన్ను రక్షించగల, స్వస్థపరచగల, నీ పాపమును మరియు బిడియమును దూరముగా తీసివేయగల, ఒక సంఘ సభ్యునికి బదులుగా ఒక క్రైస్తవునిగా చేయగల ఒకే ఒక్క నీటి ఊట అక్కడ ఉన్నది. ఎందుకు దానిని నీవు చేయవు?

74

పరలోకపు తండ్రీ, ఈ దినము ఇక్కడ ఉన్న ఈ ప్రేక్షకులకు, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా శాశ్వతమైన, నిత్య జీవమును, నీ వాక్యము ప్రకారము, నేను ఇచ్చియున్నాను. ఎందుకు వారు దాన్ని అంగీకరించుటలేదో, నేను వారి హృదయములను యొరుగను. ఆ చీకటిని మరియు నలుపును దర్శనము ద్వారా నేను చూసియున్నాను, అది ప్రజల మీద వ్రేైలాడుచున్నది. అది నీకు తెలుసు. వారు శారీరకముగా కూడ, ఇతరుల వలె స్వస్థపరచబడుట చూశాను, వారు అక్కడ ఉండగా... కూడిక జరుగుచూయున్నది.

మరియు నీ ప్రసన్నత ఇక్కడ ఉన్నది; అది ఇంకా ఇక్కడే ఉన్నది. ప్రజలు మిమ్ములను ఎందుకు స్వీకరించరు, అది నాకు మించియున్నది. నాకు అర్ధము కావడంలేదు. బహుశా వారు ఆ గీత దాటియుండవచ్చు, ఇకపై దానిని వారు చేయలేరు. బహుశా దానిని ముందే వారు వినియుండవచ్చు, మరియు మీరు చెప్పారు, “నేను నరులతో ఎల్లప్పుడును వాదించను.” అది మీ ఇష్టము, తండ్రీ; నాకు తెలియదు. ఎవరూ కోల్పోవద్దని ప్రార్ధించుచూ, నేను వారందరినీ మీకు అనుకూలముగా సిఫోరసు చేయుచున్నాను. మీరు చేసిన ప్రతీ దానికై మీకు నా ధన్యవాదములు. మరియు వారందరిపై నీ దీవెనలను నేను అడుగుచున్నాను, తండ్రీ.

75

ఈ రాత్రి, పట్టణము యొక్క సేవకులను దీవించుము. వారిలో చాలామంది కూడికలు కలిగియున్నారు. మీ దయను మరియు ప్రేమను వారికి విస్తరించుము, తండ్రి, బహుశా ఇక్కడున్న కొందరు తమ సొంత సంఘమునకు ఈ రాత్రి హాజరు కావచ్చు, బహుశా వారు లేచి మరియు వారి సొంత సంఘము యొక్క బలిపీఠము వద్దకు వచ్చును. దానిని అనుగ్రహించుము, ప్రభువా, మరియు వారు మరింతగా నొచ్చుకొని (గద్దింపబడి) మరి వారు ఎక్కడికో వెళ్ళిపోకుందురు గాక, ఈ రాత్రి వారు గృహము నుండి వెళ్ళిపోయి ఎక్కడో మొక్కజొన్న తోటలో, లేక పడకగదిలో, భార్యను మరియు పిల్లలను తీసుకొని, లోనికి వచ్చి, “హానీ, నేను దానినుండి బయటకు రాలేకున్నాను,” అని చెప్పెదరు గాక.

బహుశా రేపు ఆ మొక్కజొన్న పొలములో, లేదా ఆ పొగాకు మడిలో ఉండి యుండవచ్చు, లేదా ఇక్కడే ఎక్కడో, ఆ రోడ్డుపై వాహనమును నడుపుచూ లేదా ఆమె ఆ సామాన్లు కడుగుచూ లేదా ఆ మంచమును సర్దుతూ ఉండవచ్చు. దేవా, బహుశా అది వారి హృదయములను మరలా వెంటాడును గాక. బహుశా ఈ రాత్రి ఆ తల దిండు నిజముగా గట్టిపడునుగాక. బహుశా వారు కల కని మేల్మొనెదరు, ఓ, ఎందుకు నేను యేసును తిరస్కరించియున్నాను? ఆయన అక్కడ కూర్చునియుండుట నేను చూసాను, కానీ భిన్నముగా ఉండుటకై నేను ఆయనను దాటి వెళ్ళిపోయాను. “అంతట వారు బహుశా మంచముపై నుండి లేచి, మరియు వచ్చి మరొక అవకాశం పొందుకొనెదరు గాక, తండ్రీ.

ఈ రాత్రి ఒక గొప్ప కూడికను మాకు ఇవ్వుము. నీ ఆత్మను మా అందరిపైన ఉంచుము, మరియు ఈ రాత్రి గొప్ప స్వస్థతలు జరుగును గాక. దాన్ని అనుగ్రహించుము, ప్రభువా, యేసు నామములో మేము ప్రార్ధించుచుండగా ఆమేన్‌. (టేపులో ఖాళీగా ఉన్నది.)

76

ఒకవేళ కొద్ది నిమిషముల క్రితము యేసు మిమ్ములను స్వస్థపరచాడని చెప్పిన యెడల ఏమగును? దానిని మీరు నమ్మెదరా? దానిని మీరు నమ్మెదరా? నీవు కలిగియున్నదంతటిని ఆ రకమైన ఒక పిత్తాశయం యొక్క పరిస్థితి మరియు అటువంటి విషయము నీ నుండి విడిచిపెట్టెనా? మీరు నమ్మిన యెడల అది వెళ్ళిపోవునా? నీవు చేయుము, అంతయు సరే. ఇప్పుడు నీకు ఏమి జరిగెనో (సంభవించెనో) చూడుము. నీ విశ్వాసమే నిన్ను బాగుపరచెను.

ఆయన మనోహరమైనవాడు; ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎంతమంది నిజముగా, బహుశా, నాకు తెలియదు, ఆయనతో నీవు కొంచెం దగ్గరగా నడుచుటను ఇష్టపదెదవా? మీరు మీ చేయిని పైకి ఎత్తెదరా? చెప్పుము, “నేను ఆయనతో కొంచెం దగ్గరగా నడవడానికి ఇష్టపడెదను.” ఒక చిన్న శృతిని పాడుము.

“కేవలం ఒక దగ్గర నడక”

కేవలం నీతో ఒక దగ్గర నడక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...