దయ్యము యొక్క శక్తి

దయ్యము యొక్క శక్తి

కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,

సమస్తము సాధ్యము, కేవలము నమ్ముము;

కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,

సమస్తము సాధ్యము, కేవలము నమ్ముము.

మనం నిలబడి ఉండగా కేవలం ఒక్క క్షణం ప్రార్ధన కొరకు మనం తలలు వంచెదమా?

మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి మరల వచ్చుటకు మేము నీకు కృతజ్ఞులము, మరియు తండ్రివైన నిన్ను పిలచుటకు, మరియు ఈ దినములో, లేక మా జీవితములో ఎప్పుడైనా మహిమలో మాకు వ్యతిరేకముగా ఉన్నది ఏదైనా, నీ యొక్క ప్రియ కుమారుడైన ప్రభు యేసు రక్తము మా యొక్క పొరపాట్లు కొరకై క్షమించమని ఒప్పుకొని అడుగునపుడు ప్రాయశ్చిత్తము చేయును గాక.

ఈ రాత్రి ఆ గొప్ప పరిశుద్ధాత్మ రావలెననియు ఈ కుడికలోనికి వచ్చి, ప్రతి హృదయంలో ఉండి, ఆరాధనలో మహిమను పొంది, నశించిన వారిని రక్షించి, తప్పిపోయిన గొర్రెలను తిరిగి మందలోనికి రప్పించి మరియు రోగులను బాగుచేయుమని ప్రార్ధించుచున్నాము. ఆయన నామములో అడుగుచున్నాము. ఆమెన్.

మీరు కూర్చొన వచ్చును.

2

స్నేహితులారా, శుభసాయంకాలం. ఈ రాత్రి మరల ప్రభువైన యేసు నామములో పరిచర్య చేయుటకు ఇక్కడ ఉండుట సంతోషం.

కొన్ని క్షణాల క్రితం వచ్చుచుండగా, అలా సహోదరుడు మూర్ వచ్చాడని కనుగొనగానే నేను పులకరించిపోయాను. అతడు ఉండుట సంతోషము. మరియు అలా సహోదరుడు బ్రౌను, మరియు సహోదరుడు లైల్ కూడా వారితో ఉన్నారని విన్నాము. శ్రివ్-పోర్ట్ మార్గము నుండి చక్కని మనుష్యులు మరియు కొందరు చాలా చక్కని జనులు లూసియానాలో ఉన్నారు. మీరు ఎల్లప్పుడు అక్కడ ఆహ్వానించబడి ఉందురనియు నేను ఎరుగుదును.

మరియు అప్పుడు, ఒక చిన్న వ్యక్తి నన్ను కలిసెను, వారు లోనికి వచ్చుచుండగా, అక్కడ సరిగానే ఒక చిత్రము తీసుకున్నారు, మరియు అతడు నా చేయిని కరచాలనం చేసి మరియు అనెను, “సహోదరుడా బ్రెన్హాం, నేను మరచి పోయాను, కొన్ని సంవత్సరాల క్రితం నా తల్లి టి.బి. తో మరణావస్థలో పడి ఉన్నది.” చెప్పెను, “నీవు ఆమె కొరకు ప్రార్ధించావు.” చెప్పెను, “అప్పటి నుండియూ ఈ క్షణము వరకు ఆమె బాగున్నది.” కాబట్టి నేను కేవలము...

3

ఒక విమానం నుండి దిగి మరియు ఎవరో అన్నారు, “హలో, బ్రెన్హాం సోదరుడా. ఏడు లేక ఎనిమిది సంవత్సరాలు క్రితము, మా నాన్న గారికి కేన్సరు ఉండెను. అతడు బాగుపడెను.” మరియు ఇది, అది, మరియు మరొకటి కేవలం... దేవుని సింహాసనం యొద్ద నిత్యమూ పచ్చగా ఉన్న ఆ చెట్టు క్రింద కూర్చొని, ఆ సాక్ష్యములు వినుచు అంతయూ సమాప్తమైనప్పుడు, అది ఏమైయుండగలదని నేను ఆశ్చర్యపడుచున్నాను.“ మనం ఏలాగు జయించెదమో, ఆ కథ చెప్పుము, మనము సందర్భానుసారముగా అది చాలా మంచిగ అవగాహన చేసికొనగలము,” అను పాట అలా చెప్పును.

ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే, బహుశ ఈ రాత్రికి, అలా కేవలం మనం రోగుల కొరకు ప్రార్ధించెదమని నేను మీకు ఒక రాత్రి వాగ్దానం చేసియున్నాను. కేవలం.... సాధారణంగా మన సమావేశములు ఉండును ఆ సమావేశము దైవిక క్రమముచే అయి ఉండును, ఒక దైవిక వరము ద్వారా తెలిసికొనుచు జ్ఞాన వరము, లేక దానిని మీరు ఎలా పిలవగోరినప్పటికి.

మరియు కొన్ని రోజుల క్రితం, ఇక్కడ నాకు ఆలోచన వచ్చింది, నేను బయట అడవులలో ఉండగా, ప్రార్ధనలో ఉండగా అలా పరిశుద్ధాత్మ నాతో పలికెను. ఆయన చెప్పెను, “నేను ఏమి చేయమని చెప్పానో నీవు ఇంకా చేయలేదు. రోగుల కొరకు ప్రార్ధించు,” అని చెప్పెను.

4

మరియు కనుక, నేను, ఈ రాత్రి అది చేయవచ్చు మనం అలా చేయవచ్చు. ఈ రోజు నా బాలునితో చెప్పాను ఈ రాత్రికి ప్రార్ధనా కార్డులు ఇవ్వవద్దని. మనం ఏ విధంగా అయినా కేవలం సామాన్యంగా ప్రభువు ఏర్పాటు చేసి ఉన్నయెడల, రోగుల కొరకు ప్రార్ధించెదము. ఆయన ఏమి చేయనైయున్నాడో మనం ఎరుగము. అది ఆశ్చర్యకరమైన సంగతి. మనం ఆశలు పెట్టుకొని కూర్చున్నాము. కేవలం ఆయన ఏమి చేయునో మనం ఎరుగము.

మరియు ఇప్పుడు, రేపు రాత్రి, మరియు అప్పుడు కేవలం.... ఈ వారం అంతా అలాగే.... మీరు గమనించారా? ఆలోచించండి, ఇది బుధవారం రాత్రి అయి ఉన్నది.

కనుక ఇప్పుడు, మనం దేవుని వాక్యము నుండి కేవలం ఒక సంక్షిప్త భాగము చదువనై ఉన్నాము, మరియు అప్పుడు ఈ భాగం యొక్క ఎటువంటి ధనాపేక్షలేని చిన్న సేవలోనికి తిన్నగా వెళ్ళెదము, మరియు ఎక్కువగా రోగుల కొరకు ప్రార్ధించుటకు మనస్సును లగ్నం చేసెదము కనుక మిమ్మును ఆలస్యానికి గురిచేయను.

గత సాయంకాలము పరిశుద్ధాత్మ ప్రభావము క్రింద మనం అందరం ఉన్నాము, మరియు ఇక్కడ మనం పది, పదిహేను నిమిషాల వరకు ఉందుమని నేను నమ్ముచున్నాను. ప్రజలు తిరిగి వచ్చుట అద్భుతమైన కృప అనియు మరియు ప్రత్యేకముగా ఈ విధమైన వర్షంతో ఉన్న ఈ రాత్రి అది ఆశ్చర్యమైనది. అయితే మీరు చాలా ప్రేమగలవారు, మరియు మేము మిమ్మును చాలా ఎక్కువగా ప్రశంసించుచున్నాము.

5

కనుక మీకిష్టమైన యెడల, కొన్ని క్షణములు మాతో సహించుకొనుడి. మనము దేవుని వాక్యము చదువుచుండగా మరియు కొంచెం సేపు కేవలం యేసును గూర్చి మాట్లాడెదము. ఆ కారణం చేత మనము ఆయనను కొనియాడి హెచ్చించుటకు ఇక్కడ ఉన్నాము. నీవు ఆయనను ప్రేమించి, మరియు ఆయనను ఆరాధించుట, మన యొక్క ఉద్దేశ్యం అయి యున్నది. మరియు మనం ఏకముగా కలసి ఆ పద్దతిలోనే ఆరాధించెదము.

ఇప్పుడు, నిర్గమకాండము గ్రంధములో, ఈ మరపురాని పుస్తకం మీద బహుశా తరువాత రాత్రి లేక రెండు రాత్రులు నేను మాట్లాడుచుండగా కేవలం లేఖనంలోని ఒక భాగమును నేను చదువగోరుచున్నాను.

లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను.

ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వానిని దాచెను.

చదువబడిన ఆయన వాక్యమునకు ప్రభువు ఆయన ఆశీస్సులు తోడు చేయును గాక.

6

ఆయన వాక్యమును చదువుట నేను ఎల్లపుడు ఇష్టపడుదును, ఎందుకనగా నేను ఏమి చెప్పినా పొరపాటు అవ్వవచ్చు మరియు అది విఫలము కావచ్చు. అయితే నేను కేవలం ఒక వచనము ఇక్కడ చదివాను, ప్రజలు వ్యర్ధముగా రాలేదని నేనెరుగుదును, ఏలయనగా అది దేవుని వాక్యమైయున్నది, మరియు అది ఎన్నడైనను విఫలం అవ్వదు. అది ఎల్లప్పుడూ సరైనదిగా ఉండును. కాలములు మారవచ్చును, మరియు ప్రజలు మారవచ్చును, అయితే దేవుని వాక్యము ఎన్నడూ మారదు. కేవలం అది నిత్యత్వము వలె మార్పులేనిదిగా ఉన్నది.

ఇప్పుడు, ఈ నిర్గమన పుస్తకము పాత నిబంధనలో నా యొక్క అభిమాన పుస్తకాలలో ఒకటి అయి ఉన్నది. అదే మాటకు “నిర్గమనము” నిర్గమనము అనగా అర్ధము “బయటకు పిలువబడుట.” మరొక విధముగా, దాని అర్ధం సంఘము: నిర్గమనము.

వారు ఐగుప్తులో ఉండగా వారు దేవుని ప్రజలని పిలువబడిరి. మరియు అప్పుడు వారు బయటకు పిలువబడినప్పుడు అప్పుడు వారు దేవుని సంఘము అయిరి, ఏలయనగా సంఘము అనగా అర్ధం, “బయటకు పిలువబడి, వేరు చేయబడుట.”

7

ఆ విధముగా నీవు నిజ సంఘములో ఉన్నట్టుగా నీవు తెలిసికొందువు, నీవు దేవునిచే బయటకు పిలువబడినావు, లోక సంగతుల నుండి వేరైనావు, మరియు నీ పూర్ణ హృదయంతో, మరియు నీ పూర్ణ మనస్సుతోను మరియు నీ పూర్ణ ఆత్మతోను ప్రభువును ప్రేమించుము, అప్పుడు నీవు సంఘములో ఉన్నావని నీవు ఎరుగుదువు.

ఇప్పుడు, వారు విభిన్నమైన సైనిక గురుతులను నీ మీద పెట్టి ఉ౦డవచ్చు, మెధడిస్టుల వలె, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, పెంతెకోస్తు వారివలె గురుతులు పెట్టి ఉండవచ్చును; అయితే అవి కుక్కలను గుర్తించుటకు మెడలో వేసే పేర్ల గుర్తులు మాత్రమే, మీరు చూశారా.

అయితే వాటన్నింటినీ పరిశీలించిన తరువాత, నేను ఆ విధముగా దానిని ఉద్దేశించలేదు. ఇప్పుడు, నేను దానిని గూర్చి ఆలోచించలేదు. నా ఉద్దేశ్యం ఏమనగా మీరు ధరించియున్న ఆ గుర్తింపును (brand) గూర్చి, మీరు చూశారా, మరొక విధముగా. వారికి ఒక పేరు గలదు, “మీరు మెధడిస్టు సంఘానికి చెందియున్నారు,” అయితే నిజానికి అక్కడ ఒకే ఒక సంఘము ఉన్నది, మరియు ఎవరు తిరిగి-జన్మించారో వారే ఆ సంఘము. మరియు అది ఒకటి మాత్రమే సంఘమైయున్నది. నీవు ఎన్నడూ దేవుని సంఘములో చేరలేదు. అక్కడ ఎంతమాత్రము అలా చేయు ఏ మార్గము లేదు. మరియు మీరు దేవుని సంఘములోనికి జన్మించియున్నారు.

8

యేసు చెప్పెను, “ఒక మనిషి తిరిగి జన్మించితేనే గాని, దేవుని రాజ్యమును గూర్చి అవగాహన కలిగి ఉండడు.” నీవు తిరిగి జన్మించు వరకు అక్కడ అవగాహన చేసికొనుటకు ఏ పద్దతియు లేదు, మరియు అప్పుడు దేవుడే నీకు తనకుతాను బయలుపరచుకొనును, మరియు అప్పుడు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నావని అలా నీవు ఎరుగుదువు, ఏలయనగా పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఏ మనిషి యేసును క్రీస్తుగా పిలువలేడు, చూశారా.

యేసు, క్రీస్తు అని నీవెన్నడైనా ఎరిగియుండు ఒకే మార్గము, ఎప్పుడనగా ఆయనే పునరుత్థానుడైన ప్రభువైన యేసు అని అలా పరిశుద్ధాత్మ నీకు వ్యక్తిగతముగా సాక్ష్యమిచ్చును. ఏ రకమైన సూచనలు, ఏ రకమైన అద్భుతములు ఆయన ఏమి చేయును అనే ఏదియు కాదు, దేవునితో నీకు వ్యక్తిగత అనుభవము కలిగి ఉన్నంత వరకు అది నీవు ఎన్నడు ఎరుగవు.

నీవు అందువు, “మంచిది, నేను అది నమ్ముచున్నాను, ఏలయనగా బైబిలు చెప్పెను.” మంచిది, అది మంచిదే. బైబిలు, అది నిజము. అది దానిని ఎరుగును. “సరే, ఆ బోధకుడు అలా చెప్పెను.” బహుశా, అతడు దానిని ఎరుగును. “అమ్మ అలా చెప్పెను.” ఆమె అది ఎరుగును. అయితే దానిని గూర్చి నీవు ఏమి ఎరిగి ఉన్నావు? వ్యక్తిగతముగా పరిశుద్ధాత్మచే నీకు అది బయలుపరచబడనంతవరకు నీవు దానిని ఎన్నడూ ఎరుగవు. మరియు అప్పుడు, అది అంగీకరించుట ద్వారా రెండవ సారి తిరిగి జన్మించి యేసుక్రీస్తునందు ఒక నూతన సృష్టిగా నీవు మారుదువు.

9

ఇప్పుడు, నీవు రెండుసార్లు జీవించలేవు; తిరిగి జన్మించు క్రమములో నీవు ఒక్కసారే చనిపోవలెను. కాబట్టి నీ స్వార్ధమునకు నీవు చనిపోయినప్పుడు మరియు పరిశుద్ధాత్మచే కొత్తగా జన్మించావు, అక్కడ ఇక దేవుని వాక్యమును గూర్చి తర్కించుట లేదు. నీవు అలా చేయవు...... అది ఏమి చెప్పునో కేవలం నీవు అదియే తీసికొందువు, మరియు అది దానిని స్థిరపరచును. దేవుడు చెప్పెను, మరియు అది దానిని రుజువు చేయును.

కనుక ఈ మరపురాని పుస్తకం ఈనాడు ఏదో దానివలె ఉన్నది. ఈనాడు సంఘం దానికదే ఒక గొప్ప నిర్గమనంలో ఉందని నేను నమ్ముచున్నాను. మిరది నమ్ముచున్నారా? వేరు చేయు ఒక గొప్ప సమయము. దేవుడు తన ప్రజలను పిలుచుచున్నాడు. అంత్యదినాలలో అది ఆయన చేయుదునని ఆయన వాగ్దానం చేసెను. ఆయన తన ప్రజలను వేరుచేయును వారిని వేరుచేయును.

ఈ మధ్యనే మాట్లాడుచూ ఎక్కడో ఒక చోట ప్రవక్త చెప్పెను, “సాయంకాల సమయంలో వెలుగు కలుగును.” అక్కడ వెలుగు మధ్యగా ఉండు సమయం లేదు. అక్కడ ఉండును...... అక్కడ ఉదయవేళ వెలుగు కలదు, మరియు అక్కడ సాయంకాలమందు వెలుగు కలదు. మరియు అక్కడ రాత్రి కాని పగలు కాని ఒక దినము ఉండెను. ఈనాడు కేవలం స్పష్టముగా లేక, ఒక విధముగా స్థిమితముగా లేని ఏదో దానివలె ఉన్నది. మరియు అలాంటి పద్ధతిలో మనం జీవించుచున్నాము. మరియు చరిత్రాత్మకముగా, మరియు నీవు గమనించినయెడల, సూర్యుడు తూర్పున ఉదయించును, మరియు పడమర అస్తమించును. నాగరికత తూర్పున లేచి మరియు ఎల్లపుడూ పశ్చిమానికే కదలుచుండును.

మరియు ఇప్పుడు, పెంతెకోస్తు దినమున తూర్పున ఉదయించిన (ప్రారంభమైన) ఆ సంఘం తూర్పున ఉన్న ప్రజలకు అయి ఉండెను.

10

మరియు ఇప్పుడు, అది దేశముల గుండా పడమరకు ప్రయాణించుచుండగా, ఆ సువార్త తీసుకురాబడెను, అది కచ్చితముగా లేదు... మనం అన్నాము, “వెలుగును ప్రకాశింపచేయును,” అయితే కేవలం బైబిలు దినాలలో ఏ వెలుగు బోధించబడినదో మనం దాని ప్రతిస్పందన కలిగి ఉన్నాము. అయితే అక్కడ వెనుక వారు అది కలిగినట్టుగా మనము నిజముగా కలిగి ఉండలేదు, అయితే దేవుడు అది వాగ్దానం చేసెను, “సాయంకాలమందు వెలుగు కలుగును.”

అలా యేసు దేవుని కుమారుడని ఎరిగి ఉండుటకు చాలినంత వెలుగు మనం కలిగి ఉన్నాము. మనం సరిగ్గా జీవించవలెనని అలా ఎరుగుటకు చాలినంత వెలుగు మనం కలిగియున్నాము. అయితే ఆయన ఎల్లపుడూ ప్రతి యుగంలో కలిగి ఉన్నట్టుగా, ఆయన సూచనలు, మరియు ఆశ్చర్య కార్యాములు, మరియు అద్భుతాలలో ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానపు శక్తి యొక్క వెలుగు కలదు. ఏ సమయంలో అయినా దేవుడు తనంతటతాను ప్రత్యక్షపరచుకొనినప్పుడు, అక్కడ ఎల్లపుడూ సూచనలు మరియు ఆశ్చర్య కార్యములు ఉండెను.

11

కనుక క్రీస్తు శకం 33లో తూర్పు ప్రజలపై ప్రకాశించిన అదే వెలుగు, 1955 మరియు 1956లో పశ్చిమాన ప్రజల మీద ప్రకాశించెను, అదే పరిశుద్ధాత్మను, అదే ఫలితములను, అదే శక్తిని అదే యేసును, అదే ప్రజలు, అది అప్పుడు ఉన్నట్టే అదే విధమైన ప్రజల మీద చూపించుచుండెను. కనుక సాయంకాల సమయంలో వెలుగు కలిగెను.

ఆ నిర్గమనము, దేవుడు తన ప్రజలను బయటకు పిలచుచూ ఒక వ్యత్యాసమును కలిగించుచూ, ఆయన ప్రజల మధ్య ఒక వ్యత్యాసమును ఉంచుచున్నాడు.

ఇప్పుడు, ఈ వారము విమోచనము మీద ఎక్కువగా మనము మాట్లాడగోరుచున్నాము, మన స్వస్థత దేవుని విమోచనా పధకములో ఉన్నదా లేదా అనునది మాట్లాడ గోరుచున్నాము. ఇప్పుడు, మనం అది లేఖనం ద్వారా రుజువుపరచగలిగిన యెడల, అది దానిని స్థిరపరచును.

12

ఇప్పుడు, ఈ నిర్గమన పుస్తకం, ఒక పూర్తి విమోచన గ్రంధమైయున్నది. విమోచించెను అనగా, “దాని సరియైన స్థానములో ఉంచుటకు వెనుకకు తీసికొని వచ్చుట.” ఏ వస్తువునైనా విమోచించుటకు ఏదో విధముగా బయటకు వెళ్ళినది, లేక దాని సహజమైన స్థలమునకు, దాని నిజమైన స్థలమునకు అది బయట ఉండెను మరియు విమోచించుటకు అది వెనుక దాని అసలు స్థానమునకు తీసికొని వచ్చుట.

ఈ భూమిపై మనుష్యులు దేవునికి కుమారులు మరియు కుమార్తెలై యున్నారు. మరియు వారు పాపములో సంచరించినప్పుడు, వారు వారి అసలు స్థితికి బయట ఉన్నారు, మరియు యేసు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి కుమారులు మరియు కుమార్తెలుగా ఉండుటకు వారి సరైన స్థానానికి వారిని వెనుకకు విమోచించును. ఆమెన్. విమోచనము: వెనుకకు తీసికొని వచ్చుట.

13

ఒక సారి ఒక మనిషి చెప్పెను, అనెను, “బ్రెన్హాం సహోదరుడా, విమోచించుటకు,” అతడు అనెను, “ఆ దయ్యం నన్ను తాకట్టు కొట్టులో ఉంచెను, మరియు ప్రభువైన యేసు నన్ను విమోచించెను.” అది సొగసుగా మరియు సరిగ్గా ఉందని కూడా భావించాను. అలా ఆ దయ్యము నిన్ను తాకట్టు కొట్టులో ఉంచెను, అయితే యేసు వచ్చి మరియు నిన్ను విమోచించెను.

మరియు ఏదైనా విమోచించబడినప్పుడు ఎల్లప్పుడూ అక్కడ చెల్లించుటకు విమోచనా క్రయము ఉండవలెను. మరియు యేసే మన విమోచనా క్రయమైయుండెను. దేవుడాయనను పంపెను, మరియు పాపయుక్తమైన శరీర పోలికలో ఆయనను చేసెను, ఇంకా ఆయన ఇమ్మానుయేలు అయి ఉండెను. సృష్టించబడిన రక్తం ఆయనలో నివసించెను, మరియు అలా ప్రారంభంలో వలె ఆయనతో మనం నడచునట్లుగా, దేవునిలోనికి సమాధానపడునట్లు మనలను వెనుకకు విమోచించుటకు, విమోచన వెల కొరకు ఆయన ఆయన రక్తమును ఇచ్చెను. ఎప్పుడైతే మనిషి, ప్రారంభంలో తనంతటతాను కదలకుండునట్లు, దేవుడు అతనికి అవసరమైన ప్రతి సంగతియు ఏర్పరచెను. అయితే అతడు అలక్ష్యముగా, ఉన్న పిదప మరియు నిరాధారముగా ఉన్నప్పుడు, మరియు పొరపాటు చేసినప్పుడు, మరియు దేవుని నుండి పాపము అతనిని వేరు చేసినది, అప్పుడు అతడు తనకుతానే కదలవలసి వచ్చెను.

మరియు ఇప్పుడు, యేసు ప్రేమించే ఒక తండ్రి చేతుల జాగ్రత్తలోనికి వెనుకకు ఈ మనిషిని విమోచించుటకు వచ్చెను. విమోచనము: వెనుకకు తీసికొని వచ్చెను, సరియైన స్థానములో, తిరిగి పెట్టెను.

14

ఈ రాత్రి అది ఎలాంటి అద్భుత ఆలోచనగా ఉన్నది, మనం నివసించు రోజులో మనం అది తెలిసికొనుటకు, ప్రతి సహజ సంగతియు దాని పునాదియు, పడిపోవుచున్నట్లు కనిపించుచున్నప్పుడు, అలా మనం నిశ్చయంగా రక్షణ యొక్క ప్రత్యక్షత కలిగియున్నాము, అలా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తము ద్వారా మనము విమోచించబడియున్నాము. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాలలో చిందించిన ఈ నిత్యమైన ఆశీర్వాదములతో ఎవరు పాలిభాగస్తులైరో ఆ మనిషి హృదయంలో ఇచ్చు ఒక సంతోషము ఏలాంటిది.

ఈ రాత్రి నా సహోదర, సహోదరీలారా, నేను మీకు చెప్పుచున్నాను, నేను సమస్త డబ్బుతో ప్రపంచాన్ని ఒక మూటగా కట్టినను.... అవును, ఎవరో ఒకరు నాకు ఒక ఉత్తరం పంపారు, ఒక మిలియను డాలరు చెక్కు పంపారు, మరియు నేను పరలోక బ్యాంకులో ఒక మిలియను డాలరు చెక్కు ఈనాడే అది పొందాను. అది సరిగానే మార్పిడి జరుగును అనుకుంటున్నాను. మంచిది. దాని క్రింద అది యేసు నామంతో సంతకం చేయబడి ఉండినయెడల, నేను దాని గూర్చి నిశ్చయముగా నిజమైన మంచి అనుభూతిని కలిగియుండేవాడిని.

15

అవును, మరియు కేవలం ఆ ప్రియ వ్యక్తి అలా చెప్పుచుండగా ఆలోచించుటకు, ఓ, దానిలో చాలా చక్కని వ్యక్తిగత చిన్న ఉత్తరం ఉన్నది. అయితే కేవలం జ్ఞాపకముంచుకొనుడి అలా నిజముగానే ఆ చెక్కును నేను పొందుకున్నాను, మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అదే విధముగా స్వీకరించారు.

నేను ఆ చెక్కును డబ్బుగా మార్చుటకు భయపడుటలేదు. ఆమెన్. క్రీస్తు దానిపై సంతకం చేసెను, మరియు ఇక్కడ నుండి మహిమకు మన ప్రయాణమంతటిలో మనకు అవసరమైన ఏ సంగతి కొరకైనా అది మంచిది. దేవుడు మనందరకు అది ఉచితముగా ఇచ్చెను. దానిని డబ్బుగా మార్చు కొనుటకు భయపడవద్దు అనునదియే కోరదగినది.

ఇప్పుడు, విమోచించు క్రమములో, రోగము పాపము యొక్క ఒక ఫలితముగా వ్యాధికే అన్వయించవలసి ఉన్నది. ఇప్పుడు, పాపము... రోగము కొన్ని సమయాలలో నేరుగా పాపము వలన కాదు, అయితే నీకు ఉన్న ఆ రోగము పరోక్షముగా వచ్చినదై ఉండవచ్చును. నీవు దానిని నీ తల్లిదండ్రుల పాపముల నుండి, లేక మీ పితరుల తండ్రుల నుండి నీవు వారసత్వముగా పొందియుంటివి. ప్రతి తరమూ బలహీనమై మరియు తెలివిగలది, ఏలయనగా మనము తారతమ్యములను, మరియు రోగములను, మరియు శరీరం యొక్క వ్యాధులను అది తరము నుండి వారసత్వముగా అప్పగించుచున్నాము.

16

ఒక సమయంలో మనిషి చేయబడెను, మరియు అతడు రమారమిగా వెయ్యి సంవత్సరాలు నివసించెను. తరువాత సమయంలో అతడు అతని రోజులు తక్కువైనంతగా, అతని రోజులు తక్కువగుచుండెను, మరియు ఇప్పుడు, అది సరాసరి జీవితముగా నలభై లేక నలభై-అయిదు సంవత్సరాలు అని నేను అనుకొంటున్నాను. చూడండి, మనం కాలమంతటిలో బలహీనులమై పోవుచున్నాము, కేవలం దేవుని వాక్యము ఏమి చెప్పెనో నెరవేర్చుటకు ఎల్లవేళలా తెలివిగల వారముగా ఉన్నాము.

ఇప్పుడు, ఇక్కడ ఈ రాత్రి నా సహోదరులారా, దైవిక స్వస్థత పూర్తిగా మాన్పునని బోధించనివారు, వ్యాధి కొరకు దేవుని యొక్క పూర్తి స్వస్థత అని, దైవిక స్వస్థతకు అన్వయించకుండ, రక్షణ కొరకు నీవు ఏలాగు అన్వయించుదువో నేను ఆశ్చర్యపడుచున్నాను. జ్ఞాపకముంచుకొనుడి, మనం ఏ వ్యాధి అయినా ఎన్నడూ కలిగియుండకముందు, మనం ఎన్నడూ ఏ పాపం కలిగియుండలేదు. అయితే పాపము ఒక ఫలితముగా వచ్చినది... లేక వ్యాధి పాపము వలన వచ్చినది. (నన్ను క్షమించండి.)

17

ఇప్పుడు, వ్యాధి అప్పుడు పాపము యొక్క ఒక లక్షణమైయున్నది. పాపము ఏది ఉత్పత్తి చేసినదో అది ఆ గుణలక్షణమై యుండెను. చెట్టువలె: అది ఆపిల్ కాయును; అది ఆ చెట్టు యొక్క లక్షణము.

ఇప్పుడు, రోగము ఉన్నయెడల... మరియు కొందరు ప్రజలు పాపము యొక్క లక్షణములన్నిటిని, దానిని వేరు చేయుటకు ప్రయత్నించెదరు. విషాదము, అలసిపోవుట, ద్వేషము, అసూయతో కూడిన అసంతృప్తి, జగడము ఆ సంగతులలో ప్రతిదానికి వారు ఒక ప్రత్యేకమైన ప్రాయశ్చితార్ధ బలి చేయనక్కరలేదు. ఆ ఒక్క ప్రాయశ్చిత్తార్ధ బలి దాని సమస్తమునకు శ్రద్ధవహించును.

ఉదాహరణకు, తరచూ నేను చెప్పినట్టుగా, అక్కడ ఒక పెద్ద జంతువు ఇక్కడ వేదిక మీద ఉండినయెడల, ఒక పెద్ద ఎలుగుబంటి, లేక ఒక సింహము, మరియు అది దాని పంజాను నా ప్రక్కలో పెట్టి మరియు నా ప్రక్కను చీల్చివేయుచుండెను, దాని పంజాను కోయగలిగి ఉ౦డే ఏదో రకమైన ఒక కత్తిని కనుగొనుటకు ప్రయత్నించుటకు అది నాకు అవసరమైయుండదు. కేవలం నేను తలలో ఉన్న దానిని కొట్టినయెడల, అది పంజాను మరియు అంతటిని చంపియుండును. ఆ జంతువును నేను చంపవలెనని కోరినయెడల, నేను దాని తలను చంపినత్లయితే - అది చాలును, పూర్తి వ్యవహారము సర్దుమనుగును.

18

మంచిది, పాపము యొక్క గుణలక్షణములలో ప్రతి దానియొక్క శిరస్సు పాపమైయున్నది. మరియు యేసు కల్వరి యొద్ద పాపముతో వ్యవహరించుటకు వచ్చినప్పుడు ఆయన పాపమును చంపెను, మరియు ఆయన దానితో వెళ్ళుచున్న ప్రతి గుణలక్షణమును చంపెను (ఆమెన్.) మరియు సంపూర్ణముగా దేవుని దగ్గరకు మనలను వెనుకకు విమోచించెను. మరియు ఈనాడు, ప్రభువైన యేసుక్రీస్తు అనే పరిపూర్ణ విమోచకుడు ద్వారా పరిపూర్ణముగా విమోచించబడిన మేము దేవుని కుమారులు మరియు కుమార్తెలైయున్నాము. ఆమెన్.

ఓ, అది దానిగూర్చి ఆలోచించినప్పుడు నన్ను సంతోషము గలవానిగా చేస్తుంది.

ఇప్పుడు, మనము దానిని పూర్తిగా పొందియుండలేదు. అది సత్యము. అయితే మనము రక్షణ యొక్క సంచకరువును కలిగియున్నాము. సంచకరువును కలిగియున్నాము. అక్కడ ఉన్నయెడల... ఇప్పుడు, మనము శోధన నుండి దాటిపోలేదు. అలాగే మనము పాపమునకు అతీతముగా లేము. అయితే, యేసు మనకు వచ్చు ప్రతీ శోధనలో మనకు సహాయం చేయును. మరియు ఇప్పుడు, నేను పొరపాటు చేసినప్పుడు, నేను మారుమనస్సు పొందుటకు నేను సిద్దముగా ఉందును. దేవునితో సరిగ్గా జీవించుటకు కోరుకొను ఇతరులు ఏ ఒకరైన అలా ఉందురు. నీవు పొరపాటు చేయుటకు కోరనియెడల, అయితే సాతానుడు ఏదో ఒక చోట నిన్ను తలక్రిందులు చేయగా, ఏలయనగా అక్కడ పాపప్రాయశ్చిత్త బలి నా కొరకు ఎదురుచూచుచున్నది. నేను నా పొరపాటును ఒప్పుకొనినయెడల, దేవుడు దానిని క్షమించును.

19

మరియు నీవు రోగివైనప్పుడు, ఆ విధముగానే ఉండును. వ్యాధి నుండి నీకు నిరోధక శక్తి ఉన్నప్పుడు అది సూచన కాదు, అయితే ప్రతి సమయములో దేవుడు ఆ వ్యాధి నుండి నీకు విడుదల కలిగించుటకు ఇష్టపడుచున్నాడు, చూశారా. నీవు రోగివైన ప్రతి సమయంలోను, నీవు దేవుని దగ్గరకు వెళ్ళి మరియు ఆయనను అడుగుము, మరియు అప్పుడు ఆయన నిన్ను విడుదల చేయుటకు ఇష్టపడుచున్నాడు, ఏలయనగా అక్కడ ప్రాయశ్చితార్ధ బలి ఉన్నది. ఏది నీకు విమోచనయైయున్నదో ఆ పాప ప్రాయశ్చిత్తార్ధ బలిలో నీకున్న విశ్వాసముపై అది ఆధారపడి ఉన్నది. మరియు మనం కలిగి ఉన్న ఈ ఆనందము కేవలము మనకు ముందుగా ఉంచబడిన బయానా ద్రవ్యము అని మనం ఎరిగినయెడల, ఆ భీమ యొక్క సంపూర్ణ ప్రయోజనం పొందినప్పుడు, అది ఏమైయుండు? అది ఏమైయుండును?

మై! పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చినప్పుడు - ఏ విధంగా ప్రజలు కేకలు పెట్టి మరియు మొర్రపెట్టి మరియు ప్రవర్తించెదరో కొందరు ప్రజలు చెప్పుదురు. మనం మహిమకు వెళ్ళినప్పుడు నిజముగా అది ఏమైయుండునో అని నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఆశ్చర్యము లేదు అది... వారు అన్నారు, “వారు సింహాసనంపై కూర్చుని, తమ చేతులలో మట్టలు పట్టుకొని, హోసన్నా దేవునికి మహిమ అని పాడుదురు. హోసన్నా.” పాడుచూ, మట్టలు ఊపుచూ, అది ఒక మరపురాని సమయముగా ఉండును. మరియు కేవలం ఆ లక్షణములే కొన్ని వేళల్లో నన్ను ఆ విధంగా బావించినట్టు చేసినయెడల, అది ఏమైయుండును? దానికి నిలబడుటకు నాకు ప్రత్యేక శరీరము కావలసియుండును. అయితే అది ఒక నిశ్చయమైన విషయమైయున్నది. ఒక శోధన వస్తుందని నేను ఎరిగినప్పుడు, మరియు నా ఆశ్రయమైయున్న ఆయన దగ్గరకు వెళ్ళుదును మరియు అప్పుడు ఆ శోధన నుండి దేవుడు నన్ను విడుదల చేయును మరియు నన్ను స్వతంత్రునిగా చేయును, నా హృదయం సంతోషించును మరియు ఆమహిమ గంటలు మ్రోగును. నేను వెనుకకు చూచి మరియు అనుకొందును, “ఓ దేవా, ఏ విధముగా మీరు అది చేశారు?”

20

నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను! మీకు తెలియును, నీవు ఎప్పుడైనా నిజంగా ఏదో దాని విషయం బాగా శోధించబడినప్పుడు, కేవలం నీవు యేసును ఆశ్రయముగా చేసికొని, నీ కళ్ళు మూసికొని, మరియు సరిగ్గా దానిప్రక్కగా ముందుకు సాగినయెడల, నీవు ఎన్నడూ వెళ్ళని మధురమైన అనుభవముగా ఉండును.

ఒక సమయంలో సమ్సోను, ఒక సింహం అతనిని చంపడానికి పరుగెత్తినప్పుడు, అతడు సింహమును చంపెను. మరియు పరిశుద్ధాత్మ అతని మీదకు వచ్చినప్పుడు, ఎందుకు, అతడు చంపెను, ఒక చిన్న పిల్లను చీల్చునట్లుగా, లేక సింహమును అతడు చంపెను. కనుక ఒక దినాన వెళ్ళుచున్నప్పుడు, అక్కడ ఒక సింహం శవంగా పడి ఉండెను. ఆ కళేబరము మరియు తేనెటీగలు అక్కడ తేనెను పట్టుగా చేసెను. మరియు అతడు అది తినెను. మరియు అతడు చెప్పెను, “అతడు ఎన్నడైనా తినిన అతి మధురమైన తేనె అయియుండెను. అతని చంపనైయున్న దానినే మరి అతడు ముందుకు వెళ్ళుచుండగా, మరియు ఆ పాత కళేబరమును చూచి, దాని నుండి ఆ తేనెను అతడు ఆనందముతో దాని నుండి అనుభవించెను. కనుక ఇప్పుడూ అది అలాగే ఉన్నది. ఆమెన్.

21

ఒకప్పుడు నేను ప్రేమించిన నేను ఆ పాత జీవితమును నేను చూడగా, మరియు ఇప్పుడు, అదంతా మధ్య రాత్రివలె చచ్చినది, నేను మీకు చెప్పుదును, నేను నా చేతులు పైకెత్తెదను మరియు ప్రభువుకు స్తోత్రములు చెల్లింతును. మరియు నా జీవితమంతా ఎన్నడైనా తినని అతి మధురమైన తేనె తిన్నాను. “అది చెప్పనశక్యమును మరియు మహిమయుక్తమైనది.” నేను ఆ ప్రక్కగా వెళ్ళినప్పుడు మరియు అక్కడ నుండి క్రిందకు చూడగా, మరియు కొంచెం సేపటి క్రితం ఒక యవ్వనస్తుని చూచినట్టుగా, ఇతరులు అనేకులు చెప్పుచున్నారు. “సహోదరుడా బ్రెన్హాం, నా తల్లి టి.బీ.తో చనిపోతుంది. ఇక్కడ ఒకడు చక్రాల కుర్చీలో ఉన్నాడు. ఈ చిన్న వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు. మరియు ఆ విధంగా ఉన్నాడు. మరియు ఇప్పుడు నీవు ప్రభువైన యేసును అడుగు. మరియు ఆయన వారిని బాగుచేయును.” నేను మీకు చెప్పుచున్నాను, అది నీ హృదయమును పైకి ఎత్తును. అది ఏమైయుండగలదు.... కేవలం అది సంచకరువు, మనం నిజంగా పూర్తి విమోచన కలిగి ఉన్నప్పుడు అది ఏమైయుండగలదు? అది అద్భుతముగా లేదా?

22

ఓ, మై! ఆ గొప్ప సమయంలో ఆ సంతోషం ఎంతగానో ఉండగలదు. అప్పుడు అలా నేను ఇక్కడ నివసించుచున్న ఈ పాత క్షయమైన తెగుళ్ళ గృహము యొక్క పునరుత్థానము నాకు వాగ్దానం చేయబడినయెడల, ఒక ప్రత్యేక గుణలక్షణము గల నూతన శరీరము, అయిన ఒక విమోచనము నాకు వాగ్దానం చేయబడినయెడల (అది ఇక ఎన్నడూ మాసిపోదు; అది ఎన్నడూ ఎండిపోదు), ఏమిటి.... ప్రాయశ్చిత్తము నుండి నేను దానిని పొందనైయున్నానని నాకు రుజువు చేయుటకు మరియు అది ఒక మనిషి పండుకొని ఉండుట చూడగా, కేన్సరుతో మంచానికి అతుక్కొని ఉండగా, నీవు చూడగా, మరియు మనం ప్రేమించు డాక్టరు అన్నాడు, “అది సహాయం చేసే దశ దాటిపోయింది,” మరియు మోకాళ్ళూని, మరియు ఆయన వాక్య ప్రకారముగా, ప్రియమైన ప్రభు యేసును అడుగగా, మరియు ఆయన ప్రాయశ్చిత్తము, అది చేయుటకు వాగ్దానం చేయబడెను, మరియు ఆరోగ్యముగాను, బలంగాను, ఆకర్షణీయమైన ముఖము కలిగిన ఆ మనుష్యుని చూడుడి, నేను మీకు చెప్పుచున్నాను, నీవెన్నడైనా తినని అది అతి మధురమైన తేనె అయి ఉన్నది. అది సరియైనది. అది నిశ్చయమైయున్నది. మరియు మనం ఆ నిశ్చయత కలిగియున్నాము. దేవుడు ఆలాగు చెప్పెను. ఆ విమోచనము విమోచించబడుటకు ఆ విమోచనా గ్రంధము.

23

ఇప్పుడు, ఈ నిర్గమన పుస్తకం కేవలం కొంచెం సేపు మాట్లాడుటకు మనం కోరుచున్న మూడు శిరస్సులపై (అంశములు) ఆధారపడి యున్నది. ఈ రాత్రి వాటిలో ఒకటి, బహుశా రెండు, మరియు అప్పుడు రేపు రాత్రికి మరొకటి పట్టుకోవచ్చు. అది సాతాను శక్తి మీద, మరియు విశ్వాసము యొక్క శక్తి మీద, మరియు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడెను.

ఇప్పుడు, ఆదికాండము విడచిపెట్టిన తరువాత, ఇక్కడ ప్రారంభములో మనము చదువుచున్నాము, అందమైన ఆదికాండపు గ్రంధము, మనము బయటకు పిలువబడి, వేరు చేయబడిన, నిర్గమనము బోధలోనికి మనం వచ్చాము. దేవుని ప్రణాళికతో చాలా త్వరగా సాతాను పనిలో ఉండుట మనము కనుగొనగలము. అది భూలోకానికి రాకముందు, అది ఎల్లప్పుడు దేవుని కార్యక్రమంలో జోక్యం చేసికొనుటకు ప్రయత్నించిన, ఆ సర్పమును, ఆ దయ్యం యొక్క చాలా కీడు చేయునటు వంటి కంటిని మనము చూచెదము. మరియు వాడు ఎల్లప్పుడు, ఎక్కువగా, అది ఎప్పుడు వచ్చునో ఎరుగును.

24

వానివైపు చూడండి. విమోచనా గ్రంధము యొక్క నిర్గమనములో, దాదాపు మొదటి ఆధ్యాయం కనుగొనిన వెంటనే, దేవుని యొక్క కార్యక్రమము అంతటిని కోసివేయుటకు అక్కడ మనం దయ్యమును కనుగొనగలము.

ఫరో ద్వారా ఇవ్వబడిన మొదటి సంగతి, అలా వారు పిల్లలందరిని, మగ పిల్లలను విసరివేయును, హెబ్రీయులకు పుట్టినవారినందరిని, నదిలో మరియు వారిని ముంచివేయుచున్నారు.

అది ఆలోచించండి. ఆ బల్లి-కన్ను గల అదే దయ్యం. ఎలా అక్కడ వెనుక ప్రారంభంలో, హేబెలువైపు చూడండి. అది నీతిగల విత్తనం ద్వారా అలా సాతాను దానిని చూచిన వెంటనే, హేబెలు ద్వారా ఆ విమోచకుడు రానైయుండుట చూచి, త్వరగా వాడు దేవుడు వాడుకొననైయున్న ఏర్పరచబడిన సాధనము అయి ఉన్న అదే సంగతిని నాశనం చేయుటకు పని చేసెను. వాడు తిన్నగా దాని నాశనం చేయుటకు వెళ్ళెను.

25

యోసేపు సమయంలో దానివైపు చూడండి, యేసేపు ద్వారా దేవుని కుమారుడైన, యేసుక్రీస్తును దేవుడు ప్రత్యక్షపరచునప్పుడు, సాతానుడు ఎలా వచ్చెనో చూడండి, దానిని గూర్చి 27వ అధ్యాయమును గూర్చి - అక్కడ ఆదికాండం నుండి, ఎలా ఆ సాతానుడు యోసేపును నాశనం చేయుటకు వచ్చెను, మరియు అది అలా చేసియుండవచ్చును. చూడండి, దేవుడు వాడుకోనున్న అదే సాధనము.

దినవృత్తాంతములు, 22వ అధ్యాయము గూర్చి, ఆ రాజసంతానము, ఎలా వాడు దానిని నాశనం చేయుటకు ప్రయత్నించెను. మరియు మత్తయి 2లో ఎలా త్వరగా ఆ సాతానుడు పనిలో ఉండెనో చూడండి. ఆ విమోచకుడు పుట్టుటకు అదే సమయం అని వాడు ఎరిగి ఉన్నప్పుడు, వాడు రాజకీయ నాయకులలో ప్రవేశించాడు మరియు ప్రకటన నివేదిక పంపించాడు మరియు ప్రభువైన యేసును చంపు క్రమములో రెండు-సంవత్సరాల-లోపు చిన్నపిల్లల నందరినీ నాశనం చేసెను.

26

ఎలా వాడు అది చేయుటకు ప్రయత్నించెను, మరియు మత్తయి 27లో విజయం పొందెను. వాడు అది చేయుటలో విజయం పొందెను. అయితే - నాకు నచ్చిన సంగతి — సాతాను కేవలము.... వాని సామ్రాజ్యంలో నది దిగువ వరకు మాత్రమే వాడు పరిపాలన చేయును. “నది” అనగా, “మరణము, వేరు చేయుట.” సాతానుడు పాలన అంతవరకే రాగలుగును; అది ఆగును. అయితే అప్పుడు దేవుడు ప్రారంభించును.

ఈ రాత్రి అలా ప్రతీ వ్యక్తి, విశ్వాసులలో ప్రతీ ఒక్కరు, వారిపిల్లలను గూర్చియు, వారు ప్రేమించిన వారిని గూర్చియు సమాధి ప్రక్క నిలబడి ఏడ్చుచుండగా, విశ్వాసము సరిగ్గా దాని మధ్యలో నిలబడి మరియు మృతులలో నుండి ఛాయలకు సుదూరమున పునరుత్థానుడైన దేవుని చూచుట, అది ఎరిగి ఉండుటయు ఎలాంటి ఒక రమ్యమైన నిరీక్షనైయున్నది.

ఓ, ఇక్కడ ఉపమానములలో మనకు ఈ అందమైన గ్రంధము ఎలాంటి ఒక చిత్రము ఉంచియున్నది, ఎలాగు ఆ దేవుడు, అక్కడ వెనుక ఆ సంగతులను మనకు బోధించుచూ, ఆయన ఏమి చేయనైయుండెనో, మరియు ఆ పరిపూర్ణ విమోచకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తులో దాని ప్రతి వాక్యమును స్థిరపరచెను.

27

ఆ విధముగా, అలా నదికి వెళ్ళుచు, వారు చిన్న పిల్లలను తీసుకొని మరియు వారిని నదిలోనికి విసరెను. మరియు అప్పుడు, గమనించండి, అదియే సాతానుడు పరిపాలన యొక్క అంతము. వాని పరిపాలన ఆ నది దగ్గరకు అంతదూరం మాత్రమే రాగలడు, మరియు అప్పుడు వాని శక్తులు వేరుచేయబడెను. అది ఏమనగా, అలా సాతానుడు మరణము యొక్క శక్తి కలిగియున్నాడు, అయితే మరణచ్ఛాయలకు అవతలగా పునరుత్థానపు శక్తి కలిగిన సజీవుడైన దేవునికి వందనములు. అది ఎంతటి ఒక మరపురాని సంగతి.

మీరు దానివైపు చూడవలెనని నేను కోరుచున్నాను. ఒక నిమిషం శ్రమతో అభ్యాసం చేయండి. మనలో ప్రతీ ఒక్కరు, ఇక్కడ వానిదైన, ఈ లోకములో సాతానుని పరిపాలన క్రింద ఉన్నాము. దాని మీద ఒక జీవియు అక్కడ ఉండుటకు ముందుగా, వాడు అగ్నిగంధకపు రాళ్ళలో నడిచెను. అది వానికి చెందియున్నది. ఈ రాత్రియు దానికి వాడు ఒక పరిపాలకుడై ఉన్నాడు, మరియు ప్రతీ ప్రభుత్వము, మరియు ప్రతి రాజకీయమునకు, వాడు పరిపాలకుడు. ఆ కారణం చేత మనకు యుద్ధాలు, మరియు యుద్ద సమాచారములు, మరియు కష్టములు కలిగియున్నాము. అయితే, ఓ, ఆలోచించు, అప్పుడు ఏదో మహిమకరమైన దినాన!

ఓ, సాతానుడు యేసును పర్వతం పైకి తీసుకొని వెళ్ళినప్పుడు, మరియు లోకరాజ్యములను అన్నిటినీ ఆయనకు చూపించెను. అది ఎలా ఉండెనో అంతా అదే, మరియు అలాగే ఉండి ఉండును. చెప్పెను, “అవి అన్నియు నావి. నేనేమి చేయగోరుదునో వాటితో నేను చేయగలను. మరియు నీవు సాగిలపడి మరియు ఆరాధించినయెడల నేను వాటిని నీకిచ్చెదను.”

ఏ విధముగా అయినా, వెయ్యేండ్ల పాలనలో ఆయన ఆ సంగతులను పాలన చేయనైయుండెనని యేసు ఎరిగియుండెను. కనుక ఆయన చెప్పెను, “సాతానా, నా వెనుకకు వెళ్ళుము. అది ఇలాగు వ్రాయబడి ఉన్నది, నీ ప్రభువైన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను.”

28

మరియు యవ్వన స్త్రీలను, పురుషులు, మరియు వృద్ధులు ఇక్కడ బయట వీధిలో ఉన్న ప్రతిదియు సాతాను పరిపాలన క్రింద వారు త్రాగుబోతులు, శాపగ్రస్తులు, ప్రమాణాలు చేయుచు, ఆ మార్గంలో ప్రవర్తించుట సాతానుడు వాని సమస్త అవినీతిలో మనం చూడగలము. అయితే దానికి విశ్వాసపు కన్నులతో మనము అవతలకు చూడగలము, మరియు పరిపూర్ణ ప్రపంచము, పరిపూర్ణమైన ప్రజలతో ఎక్కడా శాపములేని, ఏ ప్రమాణము లేని, ఏ త్రాగుడూ, ఏమరణమూ, ఏ దుఃఖములేని వెయ్యేండ్ల పాలన సమయంలో చూడగలము. విమోచకుని మూలముగా అది అంతయు తుడిచివేయబడును.

29

ఇప్పుడు, అది మీ విశ్వాసము, ఇప్పుడు సాతాను శక్తి నుండి మరియు వాడు నది యొద్ద అంతమగును. ఆ తరువాత శక్తిలో మీ విశ్వాసము వచ్చును. దాని కొరకు దేవునికి వందనాలు. మరణమును ఎన్నడూ తాకకుండ ఏ సంగతికన్నా అవతల దేవునికి ఒక శక్తి గలదు. దేవుడు పునరుత్థానుడై ఉన్నాడు. అక్కడ.

ఇప్పుడు, సాతానుడు నది వద్ద అంతమును పెట్టెను. నది అనగా మరణము. ఆ చిన్నపిల్లలు నదిలో త్రోసివేయబడును, మరియు అది స్థిరమాయెను; వారు చనిపోయిరి. మొసళ్ళు, “ఒక రకమైన పెద్ద మొసళ్ళు” మరియు అక్కడ ఉన్న ప్రతిదియు వారిని మ్రింగినది. దాని యొక్క అంతము అదే అయి ఉండెను. నదిలో మునిగిపోయెను, నదిలో జంతువులు ద్వారా తినివేయబడెను.

ఇప్పుడు, మోషే పుట్టినప్పుడు — మోషే, దేవుని పరికరము, ఎన్నికైన, సిద్దము చేసిన, ముందుగా నిర్ణయించబడిన, ఎన్నిక చేయబడెను, తన కొరకు దేవునిచే ముందుగా నిర్ణయించబడెను. ఆ కాలములో ఆయన పనిముట్టుగా ఉండుటకు పనిచేయుటకు, వానిని పట్టుకొనుటకు సాతానుడు వాడు చేయగల ప్రతిదియు చేయుచుండెను, అయితే దేవుడు వాని మీద నుండి దానిని లాగుచుండెను.

30

ఎందుచేత? ఇక్కడ మనం కనుగొన్నది లేవీయుని ఒక కుమార్తె... లేక లేవీయుని ఒక కుమారుడు వెళ్ళి మరియు లేవీయుని ఒక కుమార్తెను పెండ్లి చేసికొనెను మరియు ఈ బిడ్డ పుట్టెను, ఆ బిడ్డ జన్మించినప్పుడు, ఒక సరియైన బిడ్డగా ఉండుట వారు చూచెను. ఆమెన్. ఇది మీరు గ్రహించారని ఆశిస్తున్నాను.

ఆమె శిశువువైపు చూచెను మరియు అక్కడ ఏదో జరిగెను. అలా వారు విడుదల పొందునట్లు సమయం దగ్గర పడినదని ఆమె ఎరుగును, మరియు ఆ పరిశుద్ధాత్మ నా ఉద్దేశ్యంలో, ఆమెకు బయలుపరచెను, “ఇది అతడే.” మరియు ఆమె రాజు యొక్క ఆజ్ఞకు మరియు అతని బెదరింపులకు భయపడలేదు.

నీవు అక్కడే ఉన్నావు. విశ్వాసము గట్టిగా పట్టుకున్నప్పుడు, భయం దూరంగా జారిపోవును. విశ్వాసం బలమైన కండరాలు మరియు పెద్ద ఛాతిని కలిగియున్నది. అది పలికినప్పుడు, ఇతరమైన ప్రతిదియు ప్రశాంతమాయెను. కేన్సరు మూసివేయబడి దారిలో నుండి బయటకు పోవును. విశ్వాసము పైకి లేచి, “స్థిరపడి సరిగ్గా ఉండుము!” అని చెప్పినప్పుడు - కణితి, టి.బి., వాటిలో తక్కినవి కదలి బయటకు పోవును. అది దానిని స్థిరపరచును.

31

ఓ, మై! అది రాజైన ఫరో, మరి ఎవ్వరై ఉండిననూ, ఆ పురాతన గృహిణి పైకి లేచి మరియు ఆ బిడ్డవైపు చూచెను, ఆమె రాజు ఏమి చెప్పెనో భయపడలేదు. మనం మాట్లాడుకొననై ఉన్న రెండవ శక్తి అదే. దయ్యము యొక్క శక్తి.... నిశ్చయంగా, వానికి శక్తి గలదు మరియు మరణమును ఏలుట, అయితే రెండవ శక్తి ఇవ్వబడెను, అది విశ్వాసమైయుండెను. విశ్వాసము సాతానుని సిగ్గుపడునట్లు చేయును. నిశ్చయముగా అది అలా చేయును.

మరియు ఆ ఇంటి గృహిణి తన చేతులతో ఆ చిన్న శిశువును పట్టుకొని, మరియు ఆమె ఆ రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. ఆ రాజు ఏమి చెప్పెనో ఆమె లక్ష్యము చేయలేదు. దేవుడు సమర్థుడనియు, మరియు దేవుడు ఆయన వాక్యమును కాపాడుననియు ఆమె ఎరిగియుండెను.

ఓ, మనం ఈ రాత్రి ఆ రకమైన విశ్వాసమును బాగా కూడబెట్టుకున్నయెడల. మన మధ్య ఆ విధమైన విశ్వాసము పొందుకొని నివసించినయెడల, ముఖ్యంగా మన జీవితాలలో కదులుచున్నపుడు, సంఘం ద్వారా కదులుచున్నపుడు. కేవలం ఉద్రేకపూరిత విశ్వాసము కాదు, అయితే ఒక నిజ గట్టిదైన విశ్వాసము జవాబుగా అది “కాదు” అనదు; దేవుడు అలా చెప్పెనని ఎరుగును. మరియు అది దానిని స్థిరపరచును. నేను దానిని ప్రేమిస్తున్నాను.

32

ఇప్పుడు దానివైపు చూడండి. ఆమె ఏమి చేసినది? అందరి పిల్లల పై జారీచేయబడిన మరణ శిక్షను తన శిశువు నుండి తప్పించుటకు ఆమె ప్రయత్నించలేదు, అయితే విశ్వాసము ద్వారా ఆమె ఓడను తయారు చేసెను, దానికి లోపల మరియు బయట జిగటమన్ను పూసెను. మరియు మరణ జలముల గుండా తీసికొని వెళ్ళి, పరిహారము కొరకు కీలు పూసెను.

క్రీస్తు యొక్క ఎలాంటి అందమైన ఒక చిత్రము! మరణము నుండి ఎన్నడూ తప్పించుకొనలేదు, “లేక నా చిత్తము కాదు, అయితే నీ చిత్తము జరుగును,” మరణము నుండి తప్పించుకొనుట కాదు, అయితే మరణము అనునది మీద సవారి చేయుటకు మన కొరకు పరిహారము చేయు క్రమములో మరణము పొందుటకు ఇష్టపడుచుండెను. ఇక్కడ మనం కలిగియున్నది ఎలాంటి ఒక అందమైన చిత్రము.

ఆ తల్లి వైపు చూచెదము, ఈ చిన్న జమ్ము ఆకులు కలిపి నేతగా చేసి, మరియు కొంత జిగటమన్ను తీసికొని, కనుక అది చక్కగా మరియు మెత్తగా ఉండునట్లు దానిలోపల భాగమంతటికీ పూసి, మరియు బయట అంతటా కీలు పూసెను.

33

ఇప్పుడు, లేవీకాండంలో, మీరు చదివినయెడల, మీరు “జిగటమన్ను” మరియు “కీలు” అను పదము ప్రాయశ్చిత్తము అని కూడా అనువదించబడుట కనుగొనగలరు. అది చదవండి, మరియు అది సత్యము కానియెడల కనుగొనుము. అది ప్రాయశ్చిత్తమైయున్నది. అది చేయబడి ఉండెను... నోవహు దినాలలో కూడా ప్రాయశ్చిత్తముగా పిలువబడెను, నూట-ఇరవై సంవత్సరాలు బోధించుచూ, ఇంకా తన సొంత కుటుంబము తప్ప ఏ ఆత్మలు రక్షించబడలేదు, మరియు అలా తీర్పు రానైయుండెనని ఎరిగెను. మరియు అతడు దానిని తప్పించుకొనలేడని ఎరిగియుండెను, అయితే దేవుడు అతని కొరకు ప్రాయశ్చిత్తమును సిద్దము చేసెను. నేను దానిని ప్రేమించుచున్నాను. దేవుడు ఒక మార్గము ఏర్పరచును.

దానిని లోతుగా నాననివ్వండి. సమస్య ఏమైనను, దేవుడు ఒక మార్గమును ఏర్పరచును.

ఆయన బైబిలులో యెహోవా యీరేగా పిలువబడెను. యెహోవా యీరే అనగా, “యెహోవా సమకుర్చును.” ఆమెన్. ఈ రాత్రి ఆయన ఇంకను యెహోవా యీరేగా ఉన్నాడని తెలిసికొనుటకు నేను సంతోషించుచున్నాను. పరిస్థితులు ఏమైనను, దేవుడు ఒక మార్గమును ఏర్పరచును, ఒక తప్పించుకొను మార్గమును ఏర్పరచును.

34

సాతానుడు ఒక కేన్సరుతో నిన్ను ఒక మూలకు అణచి పెట్టినను, దేవుడు ఒక తప్పించుకొను మార్గమును ఏర్పరచును. సాతానుడు నిన్ను ఒక కారు క్రింద అణచి పెట్టినను, దేవుడు ఒక తప్పించుకొను మార్గమేర్పరచును. సాతానుడు నీ నుండి దూరముగా నీ కుటుంబమును తీసివేసి ఉండవచ్చు, అయితే దేవుడు ఒక తప్పించుకొను మార్గమును ఏర్పరచును. దేవునికి ఒక మార్గము ఉన్నది.

గమనించండి. మరి ఇప్పుడు, నోవహు... ఎలా ఆయన అది సిద్దము చేసెనో, కేవలం ఒక క్షణం ఆ ఓడ వైపు చూడండి. ఇప్పుడు, కేవలం అతడు (నోవహు) బయటకు వెళ్ళి మరియు ఏదో రకమైన చెట్టును నరకలేదు, ఎందుకనగా ఏదో రకమైన సంగతి దేవుని తీర్పునకు నిలబడి ఉండదు. నీరు దైవిక తీర్పు అయియుండెను, అలా సమస్త లోకమును నాశనం చేయనై ఉండెను, మరియు అది దైవిక తీర్పును ఎదుర్కొనునదై యుండవలెను.

మరియు నా యొక్క స్నేహితుడా, ఈ రాత్రి నీవు తెలిసికొనవలెనని నేను కోరుచున్నాను, అలా అక్కడ సమస్త లోకము మీదకు ఒక దైవిక తీర్పు వచ్చుచున్నది. జ్ఞాపకముంచుకొనుడి, సాతానుడు ఇప్పుడు అతని పరిపాలన కలిగియున్నాడు. నీవు ఒక మంచి సమయాన్ని కలిగియున్నావని నీవు తలంచుచున్నావు, అయితే కనిపెట్టుము! వాని పరిపాలన అతి త్వరలో అంతమొందును. అప్పుడు దేవుని రాజ్యం స్థాపించబడును. నేను ఆ రాజ్యంలో ఉండగోరుచున్నాను.

35

ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈనాడు హింసలకు నిలబడి, నేను ప్రజల ఎదుట ఎవరి పరిపాలన మరియు రాజ్యమును గూర్చి ఎత్తి పట్టుకొనుచున్నానో, ఆ మహారాజు యొక్క రాకడకు ముందుకు చూచుచు, ఇతర దేవుళ్ళు చనిపోయినట్టుగా ఆయన చనిపోలేదు, అయితే ఆయన మృతులలో నుండి లేచి మరియు ఎన్నటికి సజీవుడైయున్నాడు.

ఆయన వైపు చూడండి. ఓ, నేను దీనిని ప్రేమిస్తున్నాను. నేను దాని గూర్చి ఆలోచించినప్పుడు అది నన్ను నిజమైన భక్తిపూరితునిగా చేయును. అది ఆలోచించుటకు!

ఇప్పుడు, నోవహు ఓడ కట్టవలసియుండగా దేవుడు ఆ రకమైన కలపను గూర్చి స్పష్టముగా చెప్పెను. మరియు అది చితిసారకపు మ్రానుగా పిలువబడెను.

ఒక రోజు, నేను పైకి చూచుట జరిగెను మరియు ఆలోచించాను. “సరే, ఏ రకమైన కలప అయియుండును?” కనుక నేను ఆ మాటను చూచుటకు ప్రారంభించగా - కలప అనగా ఏమిటో కనుగొనుటకు నిఘంటువులు మొదలైనవి వానిలోనికి చూచితిని, మరియు అప్పుడు నేను పొందాను... అది ఏమైయుండెనో కనుగొన్నాను, అది ఒక నిజమైన మెత్తని కలప, నిజమైన మెత్తని మరియు మృదువైన కలప అయ్యెను. సరే, నేను తలంచాను, చెప్పండి, విశ్వాసికి అది ఎక్కడ అన్వయించబడును? ఆ ఓడ సంఘమునకు మాదిరిగా కట్టబడెను. ఆ ఓడయే సంఘమైయుండెను. మరియు నేను అన్నాను, “ఓ, నేను అది చూశాను, దేవా.” అది విశ్వాసులచే నిర్మించబడినది. చల్లగా లేదు మరియు వ్యత్యాసాముగా లేక గట్టిగా లేదు, అయితే మృదువుగా ఉండి మరియు దేవుని చేతుల యొక్క ప్రభావమునకు త్వరగా లోనగును. ఆ ఓడ నిర్మించబడినది అలాగే.

ఓ, నేను అన్నాను, “ప్రభువునకు స్తుతి కలుగును గాక.” అది మంచిది.

36

మృదువైన హృదయంతో నీ పొరపాటును ఒప్పుకొనుటకు ఇష్టపడుచూ, చెప్పు, “దేవా ఒక పాపిని, నన్ను కరుణించుము.” అప్పుడు దేవుడు దాని గ్రహించి, కదిలించి, ఆ ఓడలో దానిని ఉంచును.

అప్పుడు సాతాను వెంటవచ్చి, చెప్పెను, “అయితే, నీవు కొంచెం బాగా ఎక్కువ చదువుము, మరియు అది ఏమైయుండెనో కనుగొనగలవు.” ఆ కలపకు.... మెత్తని కలపకు పైని రంధ్రములు కలవు. మరియు అక్కడ.... కేవలం అది నిజంగా మెత్తనిది మరియు ఆ రకమైన చితిసారకపు మ్రాను, నీవు దానిని నీటిలో ఉంచినయెడల, కొన్ని నిమిషాలలో అది ఆ ఓడను అది నీటిలో మునుగునట్లు చేయును. నీవు చితిసారకపు మానుతో ఓడను చేసినయెడల, మరియు అక్కడ నీళ్ళలో ఉంచినప్పుడు, అది అలా తెరవబడి, కనుక రంధ్రాలు తెరచికొని, ఆ నీళ్ళు సరిగ్గా దానిలోనికి నింపబడి మరియు కేవలం కొంచెం సేపటికే ఓడ మునిగిపోవునంతగా, ఆ మ్రానును మెత్తగా చేయును.

37

అయితే నేను గమనించాను, అప్పుడు దేవుడు ఈ ఓడకు కీలు పూయమని నోవహుతో చెప్పెను. దానిలోనికి కీలు పూయుము, లోపల మరియు వెలుపల, రెండువైపుల. సరే, అప్పుడు, కీలు దేనితో తయారయినదో నేను చూశాను. అది ఒక పైన్ (దేవదారు) చెట్టు అయి యుండెను, గట్టిదైన చెట్టు, ఎల్లవేళల పచ్చని చెట్టు, ఎల్లప్పుడు జీవించు చెట్టు. అది నరకబడి, మరియు దానిలో నుండి కీలు బయటకు వచ్చే వరకు కొట్టుదురు మరియు వారు ఆ చెట్టును కొట్టే ఇనుప ముక్కతో వారు కొట్టుదురు అప్పుడు వారు కీలును ఒక కుండలో ఉంచి, మరియు అది సరిగ్గా, బాగుగా కాచి, మరియు ఈ మరిగించిన కీలును ఈ చితిసారకపు మానుపై పోయగా మరియు అది తెరవబడెను, కేవలం అది పీల్చుకొనును మరియు అది ఈ కీలుతో పూర్తిగా కుమ్మరించబడినప్పుడు, అప్పుడు అది..... ఒకసారి ఆ కీలుతో పూర్తిగా నింపబడగా, అది పరిష్కారమై అది స్థిరపడెను. అది స్టీలుకంటె గట్టిదై ఉండెను.

38

మరియు నేను తలంచాను, “ప్రభువా, అది అదే. ఒక మంచి తెరవబడిన హృదయముగల వ్యక్తి మరియు పరిశుద్ధాత్మ అయిన కీలుతో కుమ్మరించబడగా, వారు సంపూర్తిగా బాగా గ్రహించు వరకు ఒక విశ్వాసిలోనికి పరిశుద్ధాత్మ మరియు అగ్నిలో కుమ్మరించబడినప్పుడు, వారు ఇక ఎంత మాత్రమూ వారికి సంబంధించిన వారే కాదు. అప్పుడు అది తరంగాలను అణచగలదు, మ్రానులు ఎదురువచ్చినప్పుడు, దారిలో నుండి అవతలకు పారద్రోలును, దారికి అడ్డు లేకుండా నొక్కివేయును. ముందుకు కొనసాగునట్లు చేయును. హల్లెలూయ! ఈనాడు కేవలం న్యాయతీర్పునకు నిలబడునది ఒక తిరిగి-జన్మించి, పరిశుద్ధాత్మతో నింపబడిన క్రైస్తవుడే. దేవుడు, దేవుని ఆత్మను కదిలించి, మరియు వారిపై అది కుమ్మరించెను, మరియు అతని యొక్క మొత్తం ఉనికి అంతయు సంపూర్ణముగా నింపును. ఆమెన్. నేను అది ఇష్టపడుచున్నాను.

అతడు కుడికి గాని లేదా ఎడమకు చూడక, దయ్యం యొక్క భూభాగములోనికి బలముగా నేట్టుకొని పోగలడు. ఆమెన్. విశ్వాసి అదే అయి ఉన్నాడు. అతడు నిజముగానే కుమ్మరించబడెను... అతడు మెత్తని-హృదయం గలవాడు మరియు కేవలం దేవుడు వానిని దైవిక ప్రేమతో పూర్తిగా కుమ్మరించెను, అలా దేవునిచే పంపబడిన దైవిక తీర్పులకు అతడు గట్టిగా అంటుకొనునట్లుగా ఉండును. మరియు అది నోవహును దాని గుండా తీసికొనిపోయెను.

39

అక్కడ లోపల వెలుపలా అంతా జిగటమన్నుతోను మరియు కీలుతోను పూయబడిన ఆమె చిన్న ఓడతో ఈ తల్లిని చూచుటకు నేనెంతగానో ఇష్టపడుచున్నాను. మరియు ఇప్పుడు, ఆమె నది దిగువకు వచ్చినది. ఆమె ఇష్టముగా లేదు... ఆమె తన చిన్న బాలుని ఇచ్చుటకు సిద్దముగా లేదు.... ఎక్కడో వానిని దాచవలసియున్నది, అయినా విశ్వాస కన్నులతో, దేవుడు ఏమి చేయబోవుచున్నాడో ఆమె చూచెను. ఆమె ఈ చిన్న ఓడలో వానిని సరిగ్గా నది దిగువకు తీసుకొని వెళ్ళెను. మరియు స్నేహితులారా, సందేహము లేదు, అది ఒక సహజమైన కార్యమని మనము అనుకొనుటలేదు. అది ఒక అతీతమైన కార్యమై యుండవలసియున్నది.

అక్కడ ఆమె కళ్ళలో గడ్డకట్టిన కన్నీళ్ళతో నిలబడి, మరణ శవపేటికలో ఉండునట్లు ఆమె చిన్న బిడ్డను ఉంచెను, అది అక్కడ నీళ్ళ మీద ఆ కీలు పెట్టబడి ఉండెను. మరియు అలా విశ్వాసము ద్వారా సమస్త అంధకార మేఘాలు వెనుక ఆమె విశ్వసించెను, అక్కడ సజీవమైన దేవుడు గమ్యానికి ఆ బిడ్డను చేర్చునని నమ్మెను, ఏలయనగా అది ఒక యోగ్యమైన బిడ్డయని ఆమె చూచెను. ఆమెన్.

40

ఆ విధముగానే ఈ రాత్రి చిన్న పురాతన పరిశుద్ధాత్మ సంఘమును గూర్చి నేను తలంచుచున్నాను. అది ఈ విధముగా తన్నబడి ఉండవచ్చును, లేక ఆ విధముగా తన్నబడి, మరియు ప్రతివిధముగ పిలువబడెను, అయితే దేవుడు ఆ సంఘంలోనికి కీలును కుమ్మరించెనని ఎరుగుదును, మరియు ఒక దినాన - ఏలాగునో నేనెరుగను, నేను మీకు చెప్పలేను — అయితే దేవుడు దాని నిత్యగమ్య స్థానమునకు దానిని తీసికొనిపోవును. ఏలాగున నేనెరుగను. ఎందుకనగా, అది పరిశుద్ధాత్మ చేత కదలుచుండుట నేను చూస్తున్నాను. అది అంతా నాకు అతీతమైనదే. నేను దానిని అర్ధము చేసుకోను. కేవలం నేను దానిని నమ్ముచున్నాను, మరియు అది అంగీకరించాను, ఆ అలలు కదులుచుండగా, దానితో ముందుకు కదులుచున్నాను.

ఏలాగు ఆమె ఈ చిన్న ఓడకు కీలు పూసెను మరియు సముద్రము మీద దానిని ఏర్పరచెను.... జ్ఞాపకముంచుకొనుడి, ఆ సముద్రములో మొసళ్ళు ఉండెను మరియు ప్రతిదియు ఉండెను. అయితే ఆ తల్లి హృదయంలో ఒక చిన్న భయం కూడా లేకుండెను. ఆమె... ఆ బిడ్డను అక్కడ ఉంచినప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం, విశ్వాసము ద్వారా నడచిన ఆమె తండ్రి అయిన అబ్రహాము యొక్క అదే అడుగు జాడల్లో ఆమె నడచుచుండెను, మరియు లేనివాటిని ఉన్నట్టుగా పిలిచెను, ఎందుకనగా అతడు అదృశ్యుడైన వానిని చూచుచుండెను.

41

ఈ రాత్రి ఏ మనుష్యుడు లేక ఏ స్త్రీ అయినా, ఎవరు అబ్రహాము పిల్లలో, అదే విధంగా ఉన్నారు. విశ్వాసము ద్వారా నీవు పుయబడియున్నావు, ఎరుగకయే, మరియు ఏ అతీతమైన దాని చూపించలేవు... లేక, ఏదైనా సూచన, అది ఏమిటి, అయితే నీవు దానిని నమ్ముచున్నావు, ఎందుకనగా దేవుడు చెప్పియున్నాడు మరియు దేవుని వాక్యమును బట్టి నీవు తీసుకొనుచున్నావు. ఆమెన్. అది ముందుకు కొనసాగుచుండగా, ఇప్పుడు ఆయనను గమనించుము.

మై, కేవలం ఈ రాత్రులు చాలినంతగా సరిపోవడం లేదు. గమనించుము, కేవలం ఒక చోటకు నీవు వచ్చినప్పుడు, నీవు దానిని ఆపవలెను. కేవలం ఇంకా కొంచెం ముందుకు వెళదాము. కొన్ని క్షణాలు ఈ బిడ్డను వెంబడించెదము.

అక్కడ ఆమె వానిని విశ్వాసముతో నమ్ముచూ సముద్రం మీద ఉ౦చెను. కొన్నిసార్లు మనం ప్రేమించిన వారి దగ్గరకు మనం వచ్చినప్పుడు, సాదృశ్యముగా వానిని సముద్రములో... లేక నైలు నదిలో, మరణకర జలములలో ఉంచినప్పుడు. దిగులుతో కూడిన మబ్బులు ఆమెను చుట్టిముట్టినవి, ఆమె కన్నులు దానిగుండా చూడగలిగెను, మరియు ఆ మబ్బు వెనకాల పునరుత్థానము యొక్క సజీవ దేవుడు ఉన్నాడని ఎరిగియున్నది. ఆమె దానిని ఆమె కన్నులతో చుదలేకపోవుచున్నది, కాని విశ్వాసము ఆమెతో అక్కడ నిలచియుండెను. బలమైన కండరాలతో మరియు రొమ్మున వెంట్రుకలతో ఉన్న ఆ మనుష్యుడు, సుదూరాన ఉన్న మేఘాల ఆవలకు చూడగలిగెను, మరియు మేఘాల వెనుక దేవుని చూచెను.

42

మరియు ఈ రాత్రి, ఒక కేన్సరు నిన్ను జయించి ఉండవచ్చు, ఏదో మరొకటి, ఏదో వ్యాధి, పాపము అనే వ్యాధి కూడా, లేక అది ఏమైనప్పటికిని నిన్ను పట్టుకొని ఉండవచ్చు. అది చీకటిగాను మరియు అంధకారముగాను ఇప్పుడు నీకు కనబడవచ్చును, నీవు ఎన్నడూ బాగుపడవు అన్నట్టు కనబడవచ్చు. ఆ టి.బి., ఆ ప్రోస్టేట్ సమస్య, లేక ఆ ఊపిరితిత్తుల సమస్య, అది ఏమైనప్పటికిని, ఆ కణితి, ఆ అంగవైకల్యంతో ఉన్న ఆ పరిస్థితిని నీవు జయించలేనట్లు కనబడవచ్చు. “ప్రతి ఆశ పోయినదని,” డాక్టరు చెప్పవచ్చు. అయితే ఈ రాత్రి నీ ప్రక్కే నిలబడి, నిన్ను స్వాధీనము చేసుకొనుటకు సిద్ధముగా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దురాన ఉన్న విజయమును చూచు విశ్వాసపు కన్నులు నిలబడియున్నవి. హల్లెలూయ!

సాతాను మరియు వాని అంధకారమునకు దూరంగా ఉండి మరియు ప్రభువైన యేసుక్రీస్తు నందు, సర్వశక్తుడగు దేవుని విశ్వాసములో పైగా ఉందుము. యుగముల బండ మీదుగా దాని పవిత్ర స్థానము విశ్వాసము తీసికొనును, మరియు మరణం యొక్క అలలు మరియు నిరాశ దానిక్రింద నుండి దాని పునాదిని కడిగి వేయుటకు ప్రయత్నించుచు, ప్రతి తుపాను మేఘం గుండా వాడియైన ఒక పక్షిరాజు కన్ను చొచ్చికొనిపోవును. అది అక్కడ నిలబడి మరియు ఆకాశాలకు ఆవలికి చూచి, మరియు చెప్పును, “దేవుడు సరియైనవాడు,” మరియు జ్ఞానముగలవారి ఆలోచనను మరియు సజీవ దేవుని నమ్ముము. ఆమెన్.

43

విశ్వాసము ఏమి చేయును! “విశ్వాసము నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఋజువునై ఉన్నది.” అదే విశ్వాసము, మిక్కిలి చిన్న పరిమాణములో అది ప్రక్కన నిలబడియున్నది, ఈ రాత్రి నీవు కేవలం యజమాని స్వాధీనంలోనికి తీసికొననిచ్చినయెడల, మరియు... నిన్ను తీసికొనును, మరియు విశ్వసించు, మరియు దానిలో నమ్మికయుంచుము, మరియు అలా దేవుని వాక్యము సత్యమైయున్నదని నమ్ముము మరియు నీవు దానిని అంగీకరించుము, అప్పుడు విశ్వాసము నీ కొరకు అద్భుతాలు జరుగునట్లు పనిచేయును. నీవు అది నమ్ముచున్నావా?

దేవుని యొక్క వాక్యము ఇలా చెప్పెను, అది తప్పిపోని వాక్కు, “నమ్మిన వారివలన ఈ సూచనలు కనబడును. నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, లేక దురాత్మలను వెళ్ళగొట్టుదురు, మరియు కొత్త భాషలు మాట్లాడుదురు, లేక పాములను ఎత్తి పట్టుకొందురు, లేక విషకరమైన ఏది త్రాగినను, అది వారికి హానిచేయదు. వారు చేతులుంచగా, రోగులు బాగుపడెదరు.” దేవుని వాక్యము అలా చెప్పెను. ఇక్కడ ఈ రాత్రి ప్రతి ఒక్కరి హృదయంలో పనిచేయుటకు అక్కడ ఏదో ప్రయత్నించుచున్నది, చెప్పుచుండెను, “అదియే సత్యము, అయితే అది నా కొరకే నా?” అవును! దాని ఉద్దేశ్యము ఎవ్వరు ఇచ్చయింతురో వానిని రానిమ్ము! నీవే అని దాని భావము.

44

ఇక్కడ పరిశుద్ధాత్ముడు ప్రతి పాపిని రక్షించుటకు, వెనుకకు జారిన ప్రతీ ఒక్కరిని వెనుకకు త్రిప్పుటకు, రోగియైయున్న ప్రతీ వ్యక్తిని స్వస్థపరచుటకు: యేసుక్రీస్తు మరణము యొక్క గుణలక్షణములు అవి, మరియు ఆయన ఇక్కడ ప్రత్యక్షపరచుకొనుటకు ఉన్నాడు. రాత్రి వెంబడి రాత్రి మీరు ఆయనను చూచెదరు. ఘడియ వెంబడి ఘడియ మీరు ఆయన పని చేయుట చూస్తున్నారు. మరియు సరిగ్గా ఇప్పుడే, దేవుని దూత అయిన ఆశీర్వదించబడిన ఆ అభిషేకము నుండి నేను నిరంతరము కాపాడుకొనుటకు ప్రయత్నించుచుండగా, ఈ రాత్రి తప్పిపోని వ్యక్తి మనమధ్య ఉన్నాడు....

నేను ఒక సమయం కలిగియున్నాను, కారణం దర్శనాలు ఈ సమయంలో భవనం అంతటా గంతులు వేయుచున్నవి; కనుక నేను ఈ ప్రార్ధనా వరుసను కలిగియుండునట్లు దానిని నిలిపియుంచుటకు ప్రయత్నించుచున్నాను. నేను అబద్ధికుడను కాను, లేక నేను ఒక వేషధారిని కాదు. నేను మీకు సత్యము చెప్పుచున్నాను. అది నిజము. ఎందుకనగా, ఎందుకు? మీరు విశ్వాసము కలిగియుండవలెనని పరిశుద్ధాత్ముడు ఇష్టపడుచున్నాడు. మరియు ఆ పరిశుద్ధాత్మ వాక్యము మీద నివసించును. ఆ కారణము చేత అది మీలో ఎదుగును. నీవు దేవుని యొక్క వాక్యమును స్వీకరించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ విస్తరించును. అది ఇలా వ్రాయబడి ఉన్నది, “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును.” నీవు నీలో పరిశుద్ధాత్మను ఉంచినప్పుడు, వాక్యములో నుండి త్రాగునప్పుడు, నీవు విశ్వాసములో ఎదుగుట నీవు ప్రారంబించెదవు. హల్లెలూయ!

45

నేను వెర్రివాడనని మీరనుకొందురని నేను ఎరుగుదును. అది పరవాలేదు. నేను మరో మార్గంలో చేసిన దానికంటే, నేను ఈ వెర్రిలోనే మంచి భావన పొందాను, కనుక నేను ఈ విధముగానే ఉందును. ఆమెన్. దేవుని వాక్యము నమ్ముట వెర్రితనమైతే, ఒకవేళ దీనిని నమ్ముటకు నేను వెర్రివానిగా ఉండవలసినట్లయితే, నన్ను అలాగే ఉండనిమ్ము.

మృతులలో నుండి లేపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను, ఈ రాత్రి ఇక్కడ ఈ భవనంలో నిలబడియున్నాడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడై యున్నాడు, అని నేను నమ్ముచున్నాను. హల్లెలూయ! సమస్త జ్ఞానము కలిగి, సర్వోన్నత స్థలాల్లో సమస్త శూన్యమును నింపి, మరియు సర్వశక్తిమంతుడైయున్నాడు. ఆయనే నిజమైన మరియు సజీవుమైన దేవుడు.

మీరు దానిని నమ్ముచున్నారా? విశ్వసించుటకు మరియు రక్షించబడుటకును అదే మార్గము. నీవు రక్షింపబడుటకు ఏర్పరచబడిన ఒకే ఒక్క మార్గము, దానిని విశ్వసించుట. ఆయన ఇక్కడ ఉన్నాడు. శ్రోతలవైపు చూచినవాడు ఆయనే.

46

ఎంతమంది ఇక్కడ కలిగి... ఈ రాత్రి ప్రార్ధించబడగోరు జనులు, మీ చేతిని ఎత్తండి. ప్రార్ధన చేయించుకొనుట కొరకు నేను మిమ్మును కోరుచున్నాను. మీరు దానిని విశ్వసించునట్లు చేయుటకు నేను చాలా కాలము ప్రయత్నము చేసితిని. నేను ఒక పరిచర్యతో ఈ సంయుక్త రాష్ట్రములంతా ముందుకూ వెనుకకూ లక్ష్యం చేయకుండా తిరిగాను, అపవాది ప్రతివిధమైన అగ్నిచేత దానిని పరీక్షించినది, మరియు నూరుశాతం సత్యమైనదిగా బయటకు వచ్చెను, మరియు అది ఎల్లపుడు ఉండును, ఏలయనగా అది నేను కాదు, అది నాది కాదు, అది ఆయనది, మరియు ఆయన తన సొంతదాని కొరకు శ్రద్ద వహించగలడు.

మోషే, అబ్రహాము, దేవుని నమ్మెను. అతడు కుమారుని కలిగియుండబోవుచుండెనని ఆయన అతనికి చెప్పినపుడు, అతనికి నూరు సంవత్సరాల వయస్సు ఉండి కూడా, ఇంకా అతడు దేవుని నమ్మెను, ఎందుకనగా ఆయన ఏమి వాగ్దానం చేసెనో దానిగూర్చి శ్రద్ద వహించుటకు ఆయన సమర్థుడైయున్నాడని అతడు ఎరిగియుండెను. ఈ రాత్రి, ఇంకా ఆయన దేవుడే. యేసుక్రీస్తు ఇలా చెప్పెను, “నేను తండ్రి దగ్గరకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు మీరును చేయుదురు, వాటికంటే మరి గొప్పవియు చేయుదురు,” ఆయన అది చేయుటకు సమర్ధుడైయుండెను. ఆయన చేయగల సమర్ధుడు మాత్రమే కాదు, గాని ఆయన అది చేసియుండును, మరియు ఆయన అది చేసెను, మరియు ఆయన దానిని ఎల్లపుడూ చేయును, ఎందుకనగా ఆయన దేవుడు మరియు విఫలమవ్వడు.

47

మన సొంత మానవ జ్ఞానసంబంధమైన మన చిన్న బలహీనతై ఉన్నది, మనం దానిని ఏమని పిలచెదమంటే జ్ఞానసంబంధమైన విశ్వాసము. మనం ఒకటి ఏదో చిన్నది చదివెదము, “అవును, అది సరియైనదే, అది సరియైనదని నేను నమ్మెదను.” అది మనుష్య జ్ఞానసంబంధమైనది. సహోదరుడా, నిజముగా నీవు దానిని నమ్మునట్లు చేయుటకు ఇక్కడ క్రింద భాగంలో ఏదో జరుగవలసియున్నది. నీ మానవ జ్ఞానవిశ్వాసము తర్కించును, మరియు చెప్పును, “ఇప్పుడు, చూద్దాం. అయితే నా సమస్య చాలా కఠినమైనది, అక్కడ అది చేయ ప్రయత్నించనవసరంలేదు. నా సమస్య చాలా కఠినమైనది.” అది నీ యొక్క తర్కము అయి ఉన్నది. దేవునికి అసాధ్యమైనదేమిటి?

చాలా కాలం క్రిందట, నేను రక్షించబడినప్పుడు, ఇరవై-మూడు సంవత్సరాలపుడు, నేను నా మనస్సులో సరిగ్గా ఇలా అనుకున్నాను: దేవుడు చెప్పిన దేనిగూర్చి అయినను నేను విచారపడ గోరుటలేదు, ఎందుకనగా దేవుడు ఆయన సొంత మాటను కాపాడుకొనగల సమర్థుడు, మరియు అలా ఉన్న ఏ సంగతి అయినను దేవుడు చేయుటకు చాలా గొప్పది అయిన ఏ పని అయినా అలా ఉన్నప్పుడు, దానిని గూర్చి నాలో విచారించుట వలన ఉపయోగమేముంది? ఆమెన్.

48

ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడైనయెడల, ఆయన సమస్త కార్యములు చేయును. ఆయన సమస్త కార్యాలు చేయలేనియెడల, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాదు. కనుక నేను ఆయనను సర్వశక్తిమంతుడైన దేవునిగా నమ్ముచున్నాను. కనుక నేను నన్ను ఆయనకు అంకిత భావముతో నా ఆత్మను ఆయనకు, నా శరీరమును ఆయనకు, నా జీవితమును ఆయనకు, నా ఊపిరిని ఆయనకు, నా చావు ఆయనకు, నా పునరుత్థానము ఆయనకు అప్పగించుకొనుచున్నాను, మరియు ఒక మహిమకరమైన దినమున ఆయన వచ్చును.

అయితే ఆయన వచ్చుచుండగా, మరియు ఆయన సంఘమును నిర్మించుచుండగా, అలా ఆయన నిన్న, నేడు, నిరంతరం, ఏకరీతిగా ఉన్నాడనియు, మరియు ఆయన శక్తి ఎన్నడూ తగ్గదనియు, మరియు ఎన్నడు విఫలమవ్వడనియు, ఆయన పునరుత్థానపు శక్తి నాదని చెప్పుచు నా చేతులు చాచి ఖాళీలో నేను నిలబడగోరుచున్నాను. ఆయన మార్గమంతటి గుండా అలాగే మారనివానిగా ఉన్నాడు. ఆమెన్.

నేనాయనను ప్రేమించుచున్నాను మరియు నీవు ఆయనను ప్రేమించవలెనని కోరుచున్నాను. నీవు ఆయనను నమ్మవలెనని కోరుచున్నాను. పరిపూర్ణ ప్రేమ సమస్త భయమును పారద్రోలును. నీవు ఆయనను సరియైన విధముగు హృదయంతో నీవు ఆయనను ప్రేమించినయెడల, ఆయన యొక్క మాటను పాటించినా, పాటించకపోయినా అప్పుడు నీవు చిన్న భయాన్ని కూడా కలిగియుండవు.

49

రాత్రి వెంబడి రాత్రి, ప్రపంచం చుట్టూ మొత్తం వేలమంది ప్రజలు ఎదుట ప్లాట్-ఫామ్ పై నిలబడి ఉండగా, విమర్శకులు అక్కడ ఉండి చెప్పుచున్నారు, “అది ఇదే, అది, మరియు మరొకటి,” మంత్రగత్తెలు అక్కడ నిలబడి నీ మీద మంత్రాలు ప్రయోగించుటకు ప్రయత్నించుచూ, ఇద్దరు మధ్య పోరాటము మరియు అలాంటి సంగతులను గూర్చి నీకు సవాలు చేయునప్పుడు, ఎన్నడూ ఒకసారి అయిన, దేవుని కృప వలన ఒక అణువంత భయం ఎన్నడూ నా హృదయానికి కలగలేదని చెప్పుచున్నాను. ఒక్కసారియు కాదు. ఎందుచేత? ఆయన నా గూర్చి జాగ్రత్తవహింతునని ఆయన చెప్పెను, మరియు నేను ఆయనను నమ్ముచున్నాను. ఆ కారణముచేత నేను భయపడినయెడల, నేను పరుగెత్తి ఉందును.

అయితే నేను మీకు చెప్పుచున్నాను, యేసుక్రీస్తు నిన్ను అభిషేకించినప్పుడు, నీవు సాధారణమైన భౌతిక పదార్ధంతో తయారు కాబడలేదు. అంతే. జిబ్రాల్టర్ బండ కాదు, అయితే యుగముల బండ. యుగముల బండ మీదగా నీవు ఎక్కిపోయెదవు (అది దేవుని వాక్యము), మరియు అక్కడ నీ స్థానములో ఉండుము మరియు ఈ పరిపూర్ణ నిశ్చయతతో, పాతాళ ద్వారాలు దానికి విరుద్ధముగా యుద్ధం చేయుచుండగా, నిలచియుండుము: అలా వాగ్దానం చేసిన ఆయన విఫలము కాలేదు, ఎన్నడూ విఫలము కాడు. ఆమెన్.

అదియే విశ్వాసము. అది నీవు ఎప్పుడు భయపడలేదో అప్పుడే.

50

దయ్యం ఏమియు కాదు అయితే ఏ విధముగా అయినా బుకాయించును. కోపంతో కొట్టును, అంతా ఉరుమే మరియు మెరుపు లేదు. అయితే సహోదరుడా, నేను మీకు చెప్పుచున్నాను, పునరుత్థానుడైన యేసుక్రీస్తు మెరిసే శక్తి అక్కడ నిజమైన దాని నుంచును, దేవుని నమ్ముటకు కునికి నిద్రించుచున్నటువంటి బందించబడిన ఈ భూసంగతుల నుండి అక్షయమైన పరిధులలోనికి ప్రాణమును అలా తీవ్రమైన కుదుపుకు గురిచేయును, మరియు వాక్యము నొద్ద ఆయనను తీసికొనుము, మరియు లేనివాటిని ఉన్నట్టుగా పిలువుము. ఆమెన్.

గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడెను, బయటకు పిలువబడెను, ఒక వైపు కూర్చుండబెట్టెను. ఒక సంఘము, కొనబడెను, మరియు కడుగబడెను, మరియు సమస్యల నుండి విడిపించబడెను, మచ్చ, ముడత లేకుండా అలాంటి దాని కొరకు ఆయన వచ్చుచున్నాడు. ఈ రాత్రి సరియైన స్థానములో మన విశ్వాసము ఉంచునట్లు దేవుడు మనకు సహాయం చేయును, అక్కడ యుద్ధ భూములలోనికి బయటకు కదిలి రండి మరియు చెప్పండి, “సాతానా, నీవు అబద్దికుడవు. యేసుక్రీస్తు నన్ను స్వతంత్రునిగా చేయుటకు చనిపోయెను మరియు అది నాది. ఇక్కడ నుండి బయటికి వెళ్ళు.”

మీరు ఈ రాత్రి మీ గృహానికి వెళ్ళినప్పుడు, అసలైన ప్రజలైన మీరు, అక్కడ చుట్టూ త్రాగి, తన్నుకొంటున్న ఒక గుంపు, పొగత్రాగుచూ, మద్యపానం సేవిస్తూ, శపించుచూ, మరియు అవినీతిగా జీవిస్తూ ఉన్నపుడు, నీవు చెప్పు “ఓయీ, ఇక్కడ నుండి వెళ్ళు. ఇది నా ఇల్లు.” అతడు చెప్పును, “నేను ఒక మానవ జీవిని. ఇది మానవ జీవుల కొరకు నిర్మించబడెను, మరియు నేను ఇక్కడ ఒక హక్కును పొందాను.” నీవు చెప్పుదువు, “ఇది నా ఇల్లు. ఇది నా సంపద అని ఒక హక్కు పత్రమును నేను కలిగియున్నాను.” అప్పుడు నీవు వానికి పత్రమును చూపినయెడల, మరియు అతడు అప్పుడూ కదలనప్పుడు, అక్కడ వానిని కదిలించగల ఒక చట్టము ఉన్నది.

51

ఈ రాత్రి ఆ దయ్యం ముందుగానే సమాధికి నిన్ను పంపుటకు వచ్చి ప్రయత్నించినయెడల, నిన్ను అంగవైకల్యం గలవానిగా చేయుటకు ప్రయత్నించగా, దేవుని హక్కు పత్రమును: ఆయన పొందిన దెబ్బల చేత మేము స్వస్థతనొందాము అని చదువుము. మరియు అతడు దానిని నమ్మనియెడల, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ దేవుని చట్టము అలా వానిని తన్నివేసి, దానిని అలా రుజువు చేయును. కేవలం కేంద్రమైన యేసును జాగ్రత్తగా లెక్కించుము. ఏదైనా జరుగనియెడల కనుగొనుము. దేవుని దూతలు వారి స్థానములలో ఉందురు, మరియు ఆ దయ్యం బయటకు పోవును. నీవు అక్కడ నీ బొటన వేళ్ళపై నిలబడి, మరి చెప్పుము, “అవునండి. అది సత్యము.” ఆమెన్. ఇక్కడ పైన, లేక ఇక్కడ క్రింద, కాదు, నీవు నీ హక్కు పత్రమును స్పష్టంగా చదివావు. అది ఏమైయున్నదో నీవు ఎరుగుదువు.

ఓ, మై! కొన్ని సమయాల్లో రెక్కలు చాచి మరియు ఎగిరి పోయినట్టు భావించుదుము, నీవు దాని గూర్చి ఆలోచించినప్పుడు, నీవు అలా లేవా? ఛాయలకంటే నన్ను పైగా ఎత్తుము; దైవికమైన సహవాసం నాకు ఇమ్ము. అవునండి. ఎక్కడ సమస్తము సాధ్యమో అక్కడ నిలచియుండుము.

52

హనోకు ఏది చేసెనో అక్కడే నిలచియుండుము. మై, అతడు ఒక మధ్యాహ్నవేళ దేవునితో ఒక చిన్న విహారయాత్ర చేసెను. ఆయనతో ఇంటికి వెళ్ళెను. కేవలం తిరిగి వెనుకకు వచ్చుటకు కోరలేదు. హల్లెలూయ! ఒక ఉదయాన కాదు; ఒక సాయంకాలము. ఆమెన్. ఆ ఎత్తబడుట, పునరుత్థానము.... అతనికి ఒక సాక్ష్యముగలదు: అతడు దేవుని సంతోషపరచెను, కారణము అతడు దేవుని నమ్మెను. ఆమెన్.

అదే మనకు అవసరమైయున్నది. మనం కోరునది అదే. మనకు కలిగినదీ అదే, అయితే అది ఉపయోగించుటకు నీవు భయపడుచున్నావు. ఆమెన్.

ఈ కూడిక అయిన తరువాత, దేవుని చిత్తమైతే, మేము సెలవులలో వేటాడుటకు పర్వతాలపైకి వెళ్ళెదము. ఒక తుపాకి అతనికిచ్చినప్పుడు, అతడు దానిని ఉపయోగించనియెడల, అది అతనికి ఏ మేలు చేయును? అది అక్కడ పెట్టబడియున్నది, చక్కని తుపాకీ, అయితే అతడు దానిని ఉపయోగించు వరకు అది ఏ మేలు చేయదు. నీ విశ్వాసము ఆ విధముగానే ఉన్నది. ఓ, అది ఒక చక్కని విశ్వాసము. నీవు చదివితివి, నీవు నమ్మితివి, మరియు నీవు దేవునితో ఒక అనుభవము కలిగియుంటివి. నీవు నమ్ముదువు. అవును, అయితే ఏమి మేలు.... క్రియలు లేని విశ్వాసము మృతము. దానిని ఆచరణలో పెట్టు. సోమరితనముతో ఉండకుము; దానిని కొనసాగించుము.

మై! నేను కేవలం జనులలోలో కార్యములు జరుగుట ఇప్పుడే చూచాను. మనము ప్రార్ధనా వరుసను ప్రారంభించగలుగునట్లు దాని నుండి తప్పించుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను, అయితే నేను తప్పించుకొనలేను. కేవలం అది నా మీద కదులుచున్నది. హల్లెలూయ.

53

సంగతులను గూర్చి పరిశుద్ధాత్మను దుఃఖపరచనవసరం లేదు. అది నిజము. మనము ఆయన విశ్వసించెదము. నీవు ఆయనను నీ పూర్ణహృదయంతో విశ్వసించుము. ఈ సమావేశంలో ఈ రాత్రి అక్కడ కూర్చున్న ప్రజలారా, ఈ రాత్రి ఇక్కడకు వచ్చినప్పుడు ఇది ఒక శక్తివంతమైన అభిషేకము, కార్డులు లేకుండా రోగుల కొరకు ప్రార్ధించుటకు ప్రయత్నించుట, ప్రార్ధించకుండానే, కేవలం వారిని పైకి తీసికొని వచ్చుట మరియు వారిని రానిచ్చుట, మరియు వారి కొరకు ప్రార్ధించుట, నా మీద రెండు భాగములు దేవుడు కుమ్మరించినట్లు అది కనబడుచున్నది, మరియు కేవలం నేను చేయలేను..... నేను ప్రార్ధనా వరుసను పిలువలేను. కేవలం అది ప్రతి చోట కదులుతున్నది. ప్రభువైన యేసు పునరుత్థానములో నేను మా విశ్వాసమును సవాలు చేయుచున్నాను. అది నిజము. నీవు నమ్మిక మాత్రముంచుము.

54

అమ్మా, నీవు అక్కడ నీ చేయి పైకెత్తియున్నావు. నీవు నీ పూర్ణహృదయంతో నమ్ముచున్నావా? నన్ను ఆయన సేవకునిగా నీవు నమ్ముచున్నావా? యేసుక్రీస్తు నీలో ఉన్న పొరపాటు ఏమిటో నాకు తెలిపినయెడల, అక్కడ నిలచియుండి, నీవు నీ స్వస్థతను అంగీకరించగలవా? నీవు అంగీకరించగలవా? మిగిలిన మీరందరు అలా చేయగలరా, ఆయన మృతులలో నుండి లేచాడని అలా నమ్ముచు మరియు అది సరియైనదిగా ఉ౦డునట్లు నేను ప్రాతినిధ్యం వహించానా? ఇది ఏమైయున్నది? ఇది విశ్వాసమైయున్నది. అది ఏమైయుండెను? ఆయన చెప్పెను, “నేను నీతో ఉందును.” నేను ఆయనను నమ్ముచున్నాను. అది నిజము. నీవు దానిని నమ్మినయెడల, నీ బొడ్డులో నీవు కలిగియున్న ఆ విచ్ఛిన్నము పాడైన భాగము ఈ రాత్రి మానిపోవును. నీకున్న అదియే, అది కాదా? అది అలా అయినయెడల, నీ చేయి ఊపుము. మంచిది. నీవు దానిని విశ్వసించుము, నీవు అడిగినది నీవు పొందగలవు. హల్లెలూయ! దేవుని నమ్ముము. సమస్తమూ సాధ్యము. దేవుని యందు విశ్వాసము ఉంచుము.

ఓ ఆయన ఆశ్చర్యకరుడు కాడా? యేసు చెప్పెను, “నీవు నమ్మినయెడల, నేను చేయగలను.” మొదట నీవు నమ్మిక ఉంచవలెను.

55

అక్కడ ఆ వరుస చివరలో కూర్చుండిన, ఇలా చూస్తున్న నీవు, అయ్యా, నీ చేయి పైకెత్తు. ఆ మొదటి చిన్న వరుస మీద ఉండి ఇలా చూస్తున్న నీవు సైనస్ బాధతో బాదించబడ్డావు. ఆ దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా?

సరిగ్గా అక్కడే, అక్కడే సరిగ్గా నీ తరువాత కూర్చుండిన వ్యక్తి. నీవు నమ్ముము, నీవు నమ్ముదువా? నీవు నమ్మినయెడల, అమ్మా, నిలబడుము. అది నిజము. నీవు నమ్ముచున్నావా? దేవుడు నిన్ను దీవించును గాక, మరియు నీ స్వస్థతను పొందుము. ఆమెన్. అంతే.

సరిగ్గా ఇక్కడ వెనుక కూర్చున్న, అక్కడ వెనుక ఆమె చేతులు ఇలా అడ్డముగా సరిగ్గా వెనుక కూర్చున్న స్త్రీ, నీవు వెన్ను నొప్పితో బాధపడుచున్నావు, స్త్రీ - నీవు బాధపడలేదా? మరియు అదేమిటో ఎరుగవు, అది నిజము కాదా? అక్కడ వెనుక సరిగ్గా బెంచీ చివర కూర్చున్నవారు, అది నిజమైనయెడల పైకి లెమ్ము. అక్కడ వెనుక. అది నిజము. దేవుడు నిన్ను దీవించును గాక. అక్కడ దేవుని దూత సరిగ్గా ఆ స్త్రీ ప్రక్క నిలబడియున్నది. నీ వెన్నులో ఏదో పొరపాటు జరిగెను, మరియు అది ఏమైయున్నదీ నీవు ఎరుగవు. అది నిజము కాదా? అది నిజమైనయెడల, నీ చేయి పైకెత్తుము. నేను నీకు ఒక సంగతి చెప్పగలను; ఇప్పుడు అది నీలో నుండి పోయినది. ఇప్పుడు నిన్ను అది బాధించుటలేదు. అది యదార్ధమైనయెడల, నీ చేయి ముందుకు, వెనుకకు ఊపుము. అది అక్కడ ఉన్నది. అది అంతా పోయినది. చూడండి, ఆ వెలుగు అది ఆ స్త్రీ చుట్టూ తిరిగెను. ప్రభువుకు స్తోత్రము! విశ్వాసము, దానిని నమ్ముము! అబ్రహాము, ఇస్సాకు, మరియు యాకోబు దేవుడు.

56

స్త్రీ, నీవు అప్పుడే దీవించబడ్డావు, కేవలం అప్పుడే, అక్కడ ఒక నరముల బలహీనతతో బాధపడు ఒక స్త్రీ నీ తరువాత కూర్చుండెను. ఆమె తన చేతులు పైకెత్తెను. స్త్రీ, ఒక నిమిషం పైకి లెమ్ము. అక్కడ సరిగ్గా నీ ప్రక్కన కూర్చునియున్నది. మంచిది. ఇప్పుడు, నీవు కూడా గృహమునకు వెళ్ళవచ్చు. నీకున్న నరాల బలహీనత పోయినది. యేసుక్రీస్తు నిన్ను బాగుచేసెను. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. హల్లెలూయ!

హల్లెలూయ! ఈ రాత్రి అక్కడ బాల్కనీలో నీవు అక్కడ ఏమి ఆలోచించుచున్నావు? నీవు నీ హృదయం అంతటితో నమ్ముచున్నావా? నమ్మిక కలిగియుండుము. ఓ, హల్లెలూయ! నీ తక్కిన జీవితము అంతా నీవు నన్ను పరిశుద్ధ గుండ్రాయి అని పిలువ వచ్చును; లేక నాది కూడా. అది ఏ భేదము కలుగచేయదు. నేను ఎవరిని నమ్మానో నేను ఎరుగుదును. [స్పష్టతలేని మాటలు] దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సంఘానికి నిర్గమనము, అన్ని యుగాలకు విమోచకుడు ఇక్కడ ఉండి, ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నపుడు చూపించిన అదే సంగతిని ఆయన చూపించెను. దేవునికి మహిమ! నీవు నమ్ముచున్నావా? నీకు విశ్వాసము ఉన్నయెడల, నీవు కోరిన ఏదైనను నీవు పొందుకోగలవు. నీకు విశ్వాసము లేనియెడల, నీవు ఏమియు పొందుకొనలేవు.

57

అక్కడ కుర్చీలో, చక్రాల కుర్చీలో, మంచం, అది ఏమైనప్పటికీ, నీవు ఏదైననూ. అయ్యా, అక్కడ కూర్చున్న నీ సంగతి ఏమిటి? యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయెనని నీవు నమ్ముచున్నావా? నేను నిన్ను ఎరుగను, నిన్ను ఎన్నడూ చూడలేదు. ప్రార్ధనా కార్డు ఉన్నదా? నీకు లేదా? నేను ఆయన సేవకుడనని నీవు నమ్ముచున్నావా? నీవు అదే సంగతిని అంగీకరించగలవా? నీవు అక్కడ టి.బి. తో కూర్చున్నావు, అయ్యా, నీవు అలా లేవా? అది సరియైనదే. నీవు పట్టణం బయట నుండి వచ్చావు. నీవు అలా రాలేదా? బ్లూమింగ్టన్ చుట్టూ, ఇల్లినాయిస్ దిగువకు వచ్చావు, నీవు రాలేదా? అది నిజము.

అక్కడ మరో స్త్రీ సరిగ్గా నీ వెనుక, అక్కడ వెనుక కూర్చుండెను, ఆమెకు చెడిపోయి, పనిచేయని మూత్రపిండము గలదు. సరిగ్గా కూర్చుండెను... ఆమె అదే పట్టణం నుండి వచ్చెను. ఆమె అదే స్థలం నుండి వచ్చెను. చెడిపోయి పనిచేయని మూత్రపిండము. ఆమె కంటిలో రోగ సూక్ష్మక్రిములు సోకెను. అది నిజము. అక్కడ వెనుక ఆ సీటు చివర, కళ్ళజోళ్ళు ధరించిన ఒక విధమైన బూడిద రంగుతల కలిగిన స్త్రీ అక్కడ కూర్చుండెను. నేను మిమ్మును అందరిని చూశాను, బ్లూమింగ్టన్ అని పిలిచే అదే పట్టణం నుండి వచ్చుచున్నారు. స్త్రీ, అది నిజము. కళ్ళజోడుతో అక్కడ వెనుక నీ పాదాలపై పైకి లెమ్ము. నీవు కూడా బ్లూమింగ్టన్ నుండియే వచ్చావు. నీకు ప్రార్ధనా కార్డు లేదు, నీవు కలిగియున్నావా? ప్రార్ధనా కార్డు కలిగి లేవు. మంచిది. నేను దేవుని సేవకుడనని నన్ను నీవు నమ్ముచున్నావా? అయ్యా, మంచిది. చక్రాల కుర్చీలో నుండి పైకి లెమ్ము. సహోదరి, నీవు పైకి లెమ్ము మరియు గృహానికి తిరిగి వెళ్ళుము మరియు బాగుపడుము. హల్లెలూయ! దేవుని యందు నమ్మిక ఉంచుము. నీవు అది అంగీకరించగోరినయెడల, దేవుని యందు విశ్వాసము ఉంచుము. నీ పూర్ణహృదయముతో నమ్ముము. నీవు దేనిని అడిగియున్నావో, అది నీవు పొందగలవు.

58

సరిగ్గా ఇక్కడే క్రింద కూర్చున్న ఒక రంగుజాతి స్త్రీపై పరిశుద్ధాత్ముడు ఇక్కడే నిలబడియున్నాడు. సరిగ్గా ఇక్కడే వెనుక ఉన్నాడు. ఆమెకు ఒక కణితి ఉన్నది, మరియు ఆమెకు కంటి బాధగలదు. ఆమె తన చేతిని నావైపు పైకి ఊపుచున్నది. స్త్రీ, అది సరియైనది. నీ పాదాల పై నిలబడుము. యేసుక్రీస్తు నిన్ను పూర్తిగా బాగుచేయును.

నీవు నమ్ముచున్నావా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జీవించును మరియు పరిపాలించును. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన రోగం నుండి ఆరోగ్యానికి నీ నిర్గమనమైయున్నాడు. చక్రాల కుర్చీ నుండి మరలా నడచుటకు ఆయన నీ నిర్గమనమైయున్నాడు. కేన్సరు నుండి ఆరోగ్యానికి ఆయన నీ నిర్గమనమైయున్నాడు. నీవు అది నమ్ముచున్నావా? నేను యేసుక్రీస్తు నామంలో నీకు సవాలు చేయుచున్నాను. నీ పాదాలపై నిలబడి, అది నాదని చెప్పు, మరియు దానిని నమ్ముటకు చాలినంత విశ్వాసము నీవు పొందినయెడల, ఇప్పుడే దేవుడు అది నీకు ఇచ్చును.

దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో, నేను ప్రతి దయ్యమును గద్దించుచున్నాను, మరియు ప్రతి సందేహమును గద్దించుచున్నాను, మరియు పరిశుద్ధాత్మ ఈ భవనంలోనికి కదిలి మరియు ఈ పాత అవిశ్వాసమును ప్రేల్చివేసి, మరియు యేసుక్రీస్తులో ప్రతి ఒక్కరినీ స్వస్థపరచును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...