ఒక దాగియున్న జీవితం

ఒక దాగియున్న జీవితం

అది మంచిది. ప్రార్ధించుకొందామా. మా పరలోకపు తండ్రీ, ఈ రోజు అన్ని సంగతుల కన్నా మిన్నగా (పైగా) యేసుక్రీస్తు కొరకు నీకు మేము వందనములు తెలియజేయుచున్నాము, ఆయన దేవుని కుమారుడు, ఈ అద్భుతమైన సహవాసము లోనికి మమ్ములను విమోచించి తిరిగి తీసుకొని వచ్చుటకు ఆయన కల్వరిలో చనిపోయెను. మరియు ఈ ప్రస్తుత కాలములో మా పైన ఆయన ఆశీర్వాదముల కొరకు మేము చాలా కృతజ్ఞలము.

ఇప్పుడు, ఈ దేశము యొక్క మన ప్రియతమ దేశాధ్యక్షుడు... మరియు తండ్రీ, ఆయనకు మేము కృతజ్ఞలము, ఎందుకనగా ఆయన తీసుకొని రాబడినప్పుడు, యుద్ధము ముగిసినది. మరియు ఇపుడు రష్యాలో ఆ శాంతి ఒప్పందము కుదర్చబడియున్నట్లుగా కనిపించుచున్నది, మరియు చాలా గొప్ప సంగతులు. మరియు మా దేశ నాయకునిగా, తండ్రీ, మేము ఆయనను ప్రేమించుచున్నాము. మరియు మేము వినియున్నాము. అతడికి గుండె నొప్పి వచ్చియున్నది, మరియు అతడొక క్రైస్తవుడని మేము గ్రహించుచున్నాము మరియు అతడు నిన్ను ప్రేమించును. మరియు అతడికి, తండ్రీ, అతడు చేసినదానంతటి కొరకు మేము కృతజ్ఞులము, మరియు మా దేశానికి నాయకునిగా ఈ రోజు అటువంటి వ్యక్తి అవసరమైయున్నాడు.

2

మరియు సహోదరులముగా కలిసి, అతడి విడుదల కొరకు, నీవు అతడిని పూర్తిగా, బాగుగా స్వస్థపరిచెదవని, అతడి పైనున్న ఈ బాధలన్నీ అవి కేవలము నీకు మరింత దగ్గరకు వచ్చుటకే తీసుకొనిరాబడినవని, అతడు చేయవలసినదంతా నీపైనే ఆధారపడాలని తెలుసుకొనులాగున మేము నీకు ప్రార్ధిస్తున్నాము.

మరియు తండ్రీ, అతడు త్వరగా శ్వేతభవనమునకు (వైట్ హౌస్) తిరిగి వెళ్ళులాగున చేయండి. మరియు ఈ భూమిపై అతడు పరిపాలించు దినములన్నీ దేశముల మధ్య సమాధానముండును గాక. ప్రభువా, అనుగ్రహించండి.

మరియు ఆ పరలోకమును ఏలు ఆ గొప్ప పరిపాలకుడు వచ్చినప్పుడు, ఏ విధముగా ఉండునో, ఆ యొక్క రుచిని వ్యక్తులందరూ పొందెదరు గాక, మరియు ప్రతీ హృదయములోను శాంతి ఏలును మరియు ఇక యుద్ధములు ఉండవు. ఈ దీవెనలను అనుగ్రహించండి, తండ్రీ, యేసు నామములో అడుగుచూ ఉన్నాము. ఆమెన్.

మీరు కూర్చొనవచ్చును.

3

నేను వినుటకు కొంచెము ఆలస్యమయ్యాను, అని నేను ఊహిస్తున్నాను, పాటలు పాడుట, మరియు సహోదరుడు వైర్మోని నేను బయట కలిశాను. మరియు సహోదరుడు ఏక్ బెర్గ్ ను నేను చూడలేదు, కనుక ఈ రోజు మళ్ళీ నేను పోగొట్టుకొనియున్నానని నేను ఊహించాను. ఆ పాటలు పాడుటను నేను ఇష్టపడతాను, మంచి పాత-తరహ పాటలు పాడుట.

ఇక్కడ కొద్దిమంది ప్రసంగీకులను మీరు కలిగియున్నారని చెప్పెదరు, నేను దానిని చెప్పెదను. ఈ అందమైన సభలను చూచుట నాకు చాలా బాగుగా అనిపించుచున్నది, మరియు మిమ్ములను ఉద్దేశించి మాట్లాడుట ఈ రోజు ఇది నాకు చాలా గొప్ప భాగ్యమైయున్నది, ప్రభువును గూర్చి మీతో మాట్లాడుట, దానిని గూర్చి మీలో చాలామంది నాకు చెప్పెదరని నాకు తెలుసు. మరియు మీలో చాలా మందికి నేను ఒక శిశువును, మరియు సేవకులను ఉద్దేశించుటకు వచ్చునప్పుడు, నేను చాలా... దానిని గూర్చి కొంచెము సిగ్గుపడెదను.

4

కానీ మీకు చెప్పబడినది, విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది. మరియు నా స్నేహితుడైన, యోసేపు, గత దినమున ఖచ్చితముగా దానిలో కొంత ఉపయోగించి యున్నాడు, అతడు ఆ కూడికలో ఇచ్చినప్పుడు... ఎన్నడూ ఆయన నన్ను అడుగలేదు; “నేను దానిని ప్రకటించనా?” అని ఒకవేళ నన్ను అడిగితే, “లేదు, సహోదరుడు యోసేపు” అని చెప్పియుండెదను. కానీ దానిని అతడు ప్రకటించిన తరువాత, మంచిది, చేయడానికి ఏమీ లేదు కానీ రావడం. కనుక ఒకవేళ దయయుంచి మీరు దానిని చేయగలిగినట్లయితే, నాతో కొంచెము సహించండి. మరియు ఈ మధ్యాహ్నం కొంచెము సేపు మాట్లాడుటకు, మరియు ఈ రాత్రి... ఈ రాత్రి కూడిక కొరకు సిద్ధపడండి

5

ఇక్కడ ఈ ఫిలడెల్ఫియా సంఘములో, సహో, బోయె కొరకు, తన పనివారందరి కొరకు, మరియు చికాగోలో ఉన్న ప్రజలు మరియు చుట్టుప్రక్కల ఉన్నవారందరి కొరకు ఈ ప్రభువైన దేవుని యొక్క గొప్ప కదలికను బట్టి మేమందరము చాలా కృతజ్ఞులము. ప్రజలారా మేము మీకు కృతజ్ఞలము.

నా అభిప్రాయము ప్రకారము ఇక్కడ ఈ విధముగా ఉన్న అటువంటి సంగతులే అమెరికా యొక్క వెన్నెముకను నిలబెట్టును. ఒకవేళ మనము అమెరికాగా ఉండుటకు ప్రభువైన యేసు ఇక్కడ లేకపోతే, మనము ఏ అమెరికాను కలిగియుండే వారము కాము. అంతటి తరువాత, ప్రతీ దేశము యొక్క వెన్నెముక దాని యొక్క విలువలే, ఒక దేశములో నైతిక విలువలు ఎప్పుడు పతనమవుతాయో, అప్పుడు ఆ దేశము అయిపోయినట్లే (ముగిసినట్లే) మాతృత్వము ముక్కలైతే, ఇక బహుశా మీరు మడతపెట్టినట్లే. మిగతా అన్ని దేశములు దానిని చేసినవి మరియు మనకూ మినహాయింపు లేదు.

6

ఆ తుపాకీలు అన్నీ చివరిసారి వరుసలో పెట్టబడుతున్నవని, మరియు ఆ యంత్రములు చివరిసారి ప్రేలెదవని, ఆ గొప్ప సమయము సమీపముననే ఉన్నదని మనము నమ్మెదము: అప్పుడు రాజైన యేసు వచ్చి ఈ భూమిపైన తన పరిపాలనను తీసుకొనును. మరియు మనమందరము దాని కొరకే చూస్తున్నాము. మరియు దానికొరకే ఈ సభలు నిర్వహించబడుతున్నవి, మరియు ఆ కారణమును బట్టే మనమందరము ఇక్కడ సమకూడాము, ఎందుకనగా మనము మాట్లాడుకొనుటకు మనకు సంబంధించిన విషయాలనే కలిగియున్నాము. అవును, మన ముఖ్యమైన మీట దేవుని కుమారుడగు యేసుక్రీస్తే,

మరియు ప్రస్తుత కాలములో జరుగుతున్న ఇప్పటి సంగతులను నేను చూసినప్పుడు, నేను చాలా నిరుత్సాహాపరుడైన వ్యక్తిగా ఉంటాను. కానీ ఒకసారి నేనొక పాఠము నేర్చుకున్నాను, ఒక వ్యక్తి చెబుతుండగా ఒక చిన్న సంగతిని విన్నాను. బాగా సవారీ చేసినవాడికి వారు ఒక స్విన్ సైకిలును ఇవ్వబోతున్నారు. నేను ఈ సంఘములో లేక ఈ ప్రజల మధ్యన ప్రస్తావించానో లేదో నాకు తెలియదు.

7

పన్నెండు అంగుళముల అట్ట మీద వంద గజముల సవారీ చేసిన బాలుడు ఒక కొత్త స్విన్ సైకిల్ ను పొందుకొనగలడు. మరియు నగరములో చుట్టు ప్రక్కల ఉన్న బాలురు, వారు దానిని సవారీ చేసి మరియు పోటీని నెగ్గబోవుచున్నాము అని వారు అనుకొన్నారు. మరియు ఆడంగి వాని వలె ప్రవర్తించు ఒక చిన్న బాలుని వారు కలిగియున్నారు. అతడు దానిని జయించబోవుట లేదు అనే నిశ్చయతను వారు కలిగియున్నారు. కనుక ఆ బాలురందరూ అక్కడకు వచ్చారు... ఒకరి తర్వాత ఒకరు దానిని సవారీ చేయుటకు ప్రయత్నించారు మరియు అందరూ పడిపోయారు, కానీ ఆ చిన్న బాలుడు తప్ప. అతడు ఆ చివరి వరకు సవారీ చేసి, దిగిపోయాడు, స్విన్ సైకిల్ను గెలుపొందాడు. మిగిలిన బాలురందరూ చుట్టూ మూగి మరియు “నీవు దానిని ఏ విధముగా చేశావు?” అని అడిగారు.

అతడు చెప్పాడు “ఇప్పుడు, బాలులారా, మీరేమి చేశారో నేను మీకు చెబుతాను.” చెప్పాడు, “వారు మిమ్ములను ప్రారంభించమన్నప్పుడు ...” (వారు ప్రారంభించుటకు ఒక చిన్న తోపును వారు తోసేవారు, వాటిని పట్టుకొని, వారిని ప్రారంభమవ్వనివ్వండి). “మీరు ఈ విధముగా క్రిందకు చూచుచున్నారు, మీ సైకిల్ను బోరుపైన ఉంచుటకు ప్రయత్నించుచున్నారు,” కానీ చెప్పెను “నేను ఎప్పుడూ ఇక్కడ క్రింద గమనించలేదు. చూశారా, మీరు దానిని చేస్తే, అది మిమ్ములను వణికింపజేస్తుంది.” మరియు చెప్పాడు, “మీరు క్రిందపడ్డారు” చెప్పాడు, “నేను మాత్రము నా కళ్ళను ముగింపునందు ఉంచి మరియు ముగింపునకు వెళ్ళుటకు ముందుకు సాగుతూ ఉన్నాను.”

అది అంతే. ఒకవేళ మనము ఇక్కడే చుట్టూ చూసినట్లైతే సహోదరులారా, మనకు వణుకు పుట్టును, కానీ ముగింపులోనికి చూసెదము, ముగింపునకు.

8

సహోదరుడు జాక్ ఈ రోజు భోజనపు బల్ల దగ్గర ఏదో వివరిస్తూ ఉన్నాడు, ఏదో అది నిజముగా నా హృదయపు లోతులో తాకినది. మరియు ఒక చిన్న పిల్లవాడు తప్పిపోయాడని అది చెప్పబడినది, అది ఐర్లాండ్ లేదా స్కాట్లాండ్ అని నేను నమ్ముచున్నాను. మరియు వెనుకకు ఏ విధముగా రావాలో అతడికి తెలియదు. కనుక జనులు అతడి చుట్టూ చేరి మరియు... కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు. అతడు చెప్పాడు, “మంచిది,” చెప్పాడు.... అతడు నివసించుచున్న పట్టణములో, కొండ మీద ఎక్కడో ఒక గొప్ప పెద్ద శిలువ ఉన్నది, “ఒకవేళ మీరు నాకు ఆ సిలువను చూపిస్తే, అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోగలను,” అని చెప్పాడు. అది నిజము. అది నిజము. ఒకవేళ మీరు నాకు సిలువను చూపిస్తే, నేను నా ఇంటికి దారి కనుగొనెదను. అదే ఇంటి దారి, అవును కదా? ఆమెన్.

9

ఇప్పుడు, ఇటువంటి ప్రేక్షకుల మధ్య మాట్లాడుట నాకు తెలియదు; నేను కేవలము అనుకొన్నాను నేను ఒక చిన్న వచనము లేక రెండు లేఖనములను ఇక్కడ చదివి మరియు అప్పుడు బహుశా నా సొంత పాతపద్ధతిలో నేను చేయు విధముగా కేవలము కొద్ది నిముషములు బహుశా వాక్యముపై మాట్లాడెదను అని అనుకొన్నాను.

మరియు కనుక హెబ్రి 10వ అధ్యాయము మరియు 19వ వచనము మనము చదివెదము:

గనుక సహోదరులారా, యేసు యొక్క రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది.

ఆయన యొక్క వాక్యమును ఆశీర్వదించమని మన ప్రభువును అడిగెదము.

తండ్రీ, వాక్యమును కలిగియున్నందుకు మేము చాలా కృతజ్ఞలము, ఏలయనగా వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. మరియు నీ యొక్క సేవకులుగా మేము ఈ రోజు, పురుషులు మరియు స్త్రీలుగా మేము ఇక్కడ కూర్చొనియున్నాము, ఈ సభలలో మమ్ములను మేము తాజాపరచుకొనుటకు సువార్త పొలములోనికి బయటకు వచ్చియున్నాము. మేము ప్రార్ధిస్తున్నాము, పరలోకపు తండ్రీ, నీవు ప్రతీసారి చేయుచున్నట్లుగా ఈ మధ్యాహ్నము మరియొక్కసారి తిరిగి మా దగ్గరకు రండి, ఏలయనగా నీవు వచ్చెదవని మాకు వాగ్దానము చేసియున్నావు, మరియు ఈ రోజు మమ్ములనందరినీ కలిపి దీవించండి, మరియు ప్రతీ ఒక్కరి హృదయములోను నీ వాక్యము తన విశ్రాంతి స్థానమును కనుగొనును గాక. యేసు నామములో దీనిని అడుగుచూ ఉన్నాము. ఆమెన్

10

నేను... బహుశా తలంచాను, కేవలము తెలుసుకొని, గత సాయంత్రము మరియు ఎన్నడూ ఏమి సిద్ధపడలేదు, ఎందుకనగా సాధారణముగా నేను అక్కడకు వెళ్ళినప్పుడు అది మరొకటి అయియున్నది. కానీ దీనిపై ఆలోచించుట ఏదో అలా జరిగినది: “యేసుక్రీస్తు యొక్క రక్తము వలన అతి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది.” ఈ మధ్యాహ్నము కొద్ది క్షణములకై నేను ఒక చిన్న అంశమును తీసుకొనెదనని నేను తలంచాను: “ఒక దాగియున్న జీవితము.”

11

ఇప్పుడు, మనలో చాలా మంది ఈ సభలలోను మరియు ఇలాంటి వాటిలో ఏ విధముగా దేవునితో దగ్గర నడకను కలిగియుందుమన్న దాని కొరకై కనుగొనుటకు ప్రయత్నించుచున్నాము. ఈ మధ్యాహ్నము అది సహోదరుల యొక్క మార్గమని నేను ఖచ్చితముగా చెప్పగలను. ఇప్పుడు, నేను అనుకొనుచున్నాను, బహుశా నేను సహజాతీతమైన... దాని గూర్చి మాట్లాడెదను అని, దానిని ఏ విధముగా సమీపించాలో నాకు తెలియదు. అది మీకు ఎంత మర్మయుక్తముగా ఉన్నదో నాకును అంతే. మరియు నేను అనుకొన్నాను అప్పుడు క్రీస్తుతో ఒక దాగియున్న జీవితము, ఏదో విధముగా దానిని మనము దాచియుంచెదము, మరియు దానినంతటి నుండి దూరముగా పోయెదము, మరియు క్రీస్తుతో జీవించెదము.

12

నేను హెన్రీ గ్రోట్ వైపు చూస్తున్నానా? దేవుడు నిన్ను దీవించును, సహోదరుడు హెన్రీ సహోదరుడా చాలాకాలము నుండి నేను నిన్ను చూడలేదు. నేను కేవలము అలా వెనుకకు తిరగడం జరిగినప్పుడు మరియు డాడీని చూసి అతడిని గుర్తుపట్టాను.

నేను గొప్ప నిరుత్సాహమును పొందుకొన్నప్పుడు... లేక, దాదాపు ఎనిమిది నెలలు పరిచర్య నుండి బయటకు వచ్చివేసినప్పుడు, వారు నాకు నిజమైన డాడీ మరియు సహోదరుడై యున్నారు. వారు సమయమంతా నాతోనే ఉండియున్నారు. సహోదరుడు గ్రోట్ అక్కడ, మేము ప్రార్ధించుటకు ఒక మొక్క జొన్న పొలములోనికి వెళ్ళియున్నాము, ఆ దినమును నేను ఎన్నడూ మరచిపోను. నేను చాలా బలహీనత ఉన్నవాడిని (నరాల బలహీనత); నేను దర్శనములో చాలాసేపు ఉండియున్నాను, నేను లోపల ఉన్నానో లేక బయటో నేను చెప్పలేను. నాతో పాటు ప్రార్ధించుటకు మోకాళ్ళూనిన సహోదరుడు గ్రోట్ను నేను ఎన్నడూ మరచిపోను. అతడు తన చేతులు నా చుట్టూ ఉంచి, మరియు చాలా తేలికగా చెప్పాడు, “ఇప్పుడు, నాన్నవైన దేవా, నీవు సహోదరుడు బ్రన్హాంకు వచ్చి సాయం చేయగలవా? తండ్రివైన దేవా, నీవు వచ్చి సహోదరుడు బ్రాన్హాంకు సహాయపడగలవా?” సహోదరుడు గ్రోట్, అది ఎల్లప్పుడూ నాతో నిలిచియున్నది.

ఓ, అది ఏమైయుండును, సహోదరుడు గ్రోట్, ఒక రోజు సింహాసనము క్రింద నుండి పారుచున్న జీవజలముల ఊట యొద్ద నున్న ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్ల దగ్గర నా చేయి నీ చుట్టూ వేసి అక్కడ కూర్చోవాలని నేను నిరీక్షిస్తున్నాను. మనము మన తండ్రియైన దేవుని సన్నిధిలో నిత్యమూ మరియు నిత్యము ఆయన సన్నిధిలో నివసించెదము.

13

ఇప్పుడు, బైబిలును, దేవుడు చాలా సామాన్యముగా చేసియున్నాడు. మరియు సువార్తను చాలా సుళువుగా కనీసము నిరక్షర్యాసుడనైన నా వంటి వ్యక్తికి అర్థమగులాగున, మాట్లాడి మరియు సువార్తను ప్రసంగించుటకు అవకాశము కలుగులాగున చేసెను. నేను ఇక్కడికి వచ్చుచున్నప్పుడు సహోదరులతో చెప్పాను, నిజముగా ఈ రోజు అక్కడ నిలబడి మరియు పండితులు మరియు దేశము యొక్క జ్ఞానులందరూ ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు అది తెలిసి, మరియు ఏ విధముగా నా వ్యాకరణము, అది ఎంత హీనముగా ఉండునో, మరియు ఎలా, ఓ, అర్హత లేని... కాని మీకు తెలుసా, ఒకవేళ మీరు కొంతమంది బిషప్పులు మరియు అటువంటి వారి ముందు మీరు కూర్చొనవలసివస్తే, బహుశా మీరందరూ నేను అనుభూతి చెందినట్లే చెందుదురు.

కానీ మీకు తెలుసా, సహోదరులారా, దేవుడు వేదాంత శాస్త్రములో నివాసము చేయడు. ఆయన ప్రేమలోను మరియు దీనత్వములోను నివాసము చేయును, ఎక్కడైతే నీవు, నిజముగా, ఆయనతో పరిచయము కలిగి మరియు ఆయనను ఎరిగి యుండవచ్చును. నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకనగా ఆయన కేవలము కొద్ది మందిని లేక ఒక ఫలానా సంఘ శాఖను ఎంపిక చేయలేదు. ఆయన చెప్పాడు, “ఎవరైతే ఇష్టపడెదరో, మరియు కాబట్టి అది నాకు మరియు నీకు లోపలికి వచ్చే ఒక అవకాశమును ఇచ్చి మరియు సహవాసము కలిగియుండి మరియు ఆయన గూర్చి మాట్లాడేలా చేసినది.

14

ఇప్పుడు, దేవుడు దానిని చాలా అద్భుతముగా చేసెను, అది పాత నిబంధనలో, సాధారణముగా ఒక ఆశ్రయము కొరకు ఒక అంశము కొరకు ఒక్కొక్కసారి వెళ్ళెదను... ఆయన పాత నిబంధనను ఉపమానములలోను మరియు సూచనల రూపములోను చేసియున్నాడు, ఎందుకనగా ఆయన తనను మరియు తన కార్యములను వ్యక్తపరచుటకు, అది సామాన్యమైన మనస్సు గలవారు ఆయన చిత్తము యొక్క భావన మరియు ఆయన ఏమి చేసియున్నాడనేది కలిగియుండుటకు.

చాలా సార్లు పాత నిబంధనలో, క్రొత్త దానికి సాదృశ్యముగా ఉన్న పాతదానిని కనుగొనుటకు ఏ విధముగా నేను వెనుకకు వెళ్ళాను. ప్రతీసారీ, దేవుడు చేశాడు మరియు ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆయన ఏమి చేస్తున్నాడు, ఆయన పాత నిబంధనలో ముందుగానే చూపించాడు. మరియు పాత నిబంధనలో ఎవరైతే దేవున్ని నిర్లక్ష్యము చేసారో, మరియు దేవున్ని తృణీకరించారో, మనము వారికేమి అయింది అనేది ఉదాహరణలతో చూడగలము. మరియు పాత నిబంధనలో ఎవరైతే యెహోవాలో విశ్వాసము కలిగియుండుటకు ధైర్యము చేసి మరియు బయటకు అడుగుపెట్టారో, వారికేమి అయినదో మనము చూసాము. ఇప్పుడు, మనము మన ఎంపిక చేసుకుందాము.

మరియు ఒక స్వేచ్ఛాపూరితమైన దేశము కొరకు మరియు ఒక ఆరాధనా స్థలము, ఎక్కడైతే దేవుని యొక్క విశ్వాసములో మనము ప్రతీ ఒక్కరమూ మన లంగరులు వేసి మరియు ఈ భూమిపై నుండి ఎగిరిపోయేందుకు మనము దేవునికి వందనములు తెలియజేద్దాం. ఈ రోజు దాని కొరకు నేను సంతోషిస్తున్నాను, ఎందుకనగా దానిని మీరు చేయలేని స్థలములు చాలా ఉన్నవి.

15

ఇప్పుడు, ఉదాహరణకు, పాత నిబంధనలో ఏ విధముగా దేవుడు తన యొక్క ఉపమానములన్నీ ఇచ్చి మరియు తన సంగతులను పెట్టియున్నాడో అవి ఈ రోజు యొక్క ఛాయ అయియున్నవి, అప్పుడు నేను బైబిలును బోధించగల ఒకే ఒక్క మార్గము అదే. వారు పెద్ద గ్రీకు పదములు మరియు అటువంటి వాటిని గూర్చి మాట్లాడెదరు: వారు నన్ను ప్రతీరకమైన స్థలములలోను ముడివేయుదురు. కానీ ఒకవేళ దేవుడు ఛాయా రూపముగా వెనుక ఏమి చేసియున్నాడనే దానిని నేను వెనుకకు చూసినట్లైతే, అప్పుడు ఆయన ఈ రోజు ఏమి చేయుచున్నాడనే దాని యొక్క సాధారణ అవగాహన నేను కలిగియుండెదను, ఎందుకనగా అది ఒక ఛాయ.

ఒకవేళ నేను పశ్చిమకు వెళ్ళుచున్నట్లైన, మరియు సూర్యుడు తూర్పున ఉదయించుచున్నట్లైతే మరియు నా నీడ నా ముందే ఉన్నది, మరియు ఒకవేళ నన్ను నేను ఎన్నడూ చూసుకొనకుండా, లేక నేను ఏ విధముగా కనపడెదనో నేను ఎన్నడూ ఎరిగియుండక, లేక ఒక మానవునిగా, నేను నా నీడను చూసుకొనినప్పుడు నేను నా రూపమును గూర్చి ఒక అవగాహన కలిగియుంటాను. మరియు పాత నిబంధన క్రీస్తు యొక్క రాకడకు ఛాయయైయున్నది, మరియు ప్రతీది సిలువను ముందుగానే చూపించియున్నవి. మరియు క్రీస్తులో దేవుని విమోచన అంతా, ఆయన యొక్క ప్రణాళికలన్నీ రక్షణ ప్రణాళిక అంతా, అంతయూ కల్వరిలో కలుసుకొనెను.

ఇప్పుడు, పాత నిబంధనలో ఎంత అందముగా, ఈ రోజు మనము ఆనందించుచున్న ఈ పరిశుద్దాత్మను దేవుడు ముందుగా చూపించెను. ఏ విధముగా ఈ సభలలోని క్రమమును, అది ఏ విధముగా మనము కలిసి సహవాసమునకు వచ్చి మరియు కలిసి సహవాసము చేసెదమో ముందుగా చూపించియున్నాడు.

16

వెనుక మనము చూచెదము ఏ విధముగా సంఘము యొక్క ప్రారంభములో, ఏ విధముగా దేవుడు ఈ రోజు స్థానమును ముందుగా చూపించియున్నాడు, ఎక్కడ అని నేను తలంచుచున్నానో, సహోదరులారా, ఆ తరువాత ఆశీర్వాదము కొరకు మనము ఇప్పుడు ప్రవేశించబోవుచున్నాము. ప్రతీ ఒక్కరికీ తెలుసు మనము ఒక ఋణము తీసుకొనబడిన సమయములో ఉన్నాము. దైవిక స్వస్థత యొక్క గొప్ప దీవెన, మరియు బయటకు పోయియున్న సహజాతీతమైన దాని యొక్క శక్తులు, కాలములన్నిటిలోనూ కదలించబడగలిగినంత బలముగా అది నిజముగా ప్రపంచమును కదిలించి వేయుటకు ఒక ఉజ్జీవము తీసుకొని రాబడినది. ఏ కాలములోనూ ఎన్నడూ మరే సమయము లేదు, గడిచిన ఐదు లేక ఆరు సంవత్సరాలలో క్రైస్తవ్యము ప్రపంచమునంతటినీ కదిలించినట్లుగా... అది నిజము. ప్రతీ దేశములో, ప్రతీ స్థలము క్రింద, రేడియో ద్వారా ... సువార్తికుల ద్వారా,...

వేర్వేరు దేశములలో మనమొక స్థలమునకు వెళ్ళదాం, అక్కడ వారు దేవున్ని నమ్మరు, మరియు అక్కడ ఒక మామూలు మిషనరీ కొన్ని కర-పత్రికలు పంచిపెట్టడం వారు కనుగొన్నారు (అది మంచిదే), కానీ వారు ఎప్పుడైతే సహజాతీతమైన దాని యొక్క కార్యమును చూసారో, వేలాది మంది అన్యులు సిలువ యొద్ద పడి మరియు ప్రభువైన యేసును సేవించారు. ఇది ఒక శక్తివంతమైన అడుగు.

17

ఇప్పుడు, మనము ఈ భూమిని చాలా కాలము నుండి పట్టుకొని యున్నాము, మరియు నా హృదయమంతటితో నేను నమ్ముచున్నాను, అది మనము వేరొక తెరలోనికి ప్రవేశించే గడప దగ్గర ఉన్నాము, ఎక్కడికో, సంఘమునకు దేవుని యొక్క గొప్ప మర్మములు తెలియబడే చోటుకు. మరియు నేను ఒక్కడిగా, అది వచ్చినప్పుడు వర్తమానమును వినుటకు నేను నా రెండు చెవులు మరియు కళ్ళు మరియు హృదయమును తెరచియుంచెదను. దానిని పరీక్షించండి, ఏలయనగా సాతాను అనేకమైన ముందుగా వచ్చు అబద్ధికులను బయటపెట్టను, కానీ దానిని ఒక ప్రక్కన పడవేయుము; గుర్తుంచుకొనండి, మీరు దానిని చూసినప్పుడు ఏదో ఒక నిజమైనది జరుగబోతూ ఉన్నది అని అది సూచిస్తున్నది. ఎందుకనగా సాతాను ప్రతీది చేస్తాడు (నేను గత రాత్రి చెప్పియున్నట్లుగా), దేవుని యొక్క రత్నము ముందుకు రాబోవుచున్నప్పుడు దానిని అడ్డగించుటకు వాడు ప్రతీదానిని చేయును. మీరు దానిని వినెదరు. హేబేలును పట్టుకొనుటకు వాడు అడ్డ బండను ఉంచెను. యోసేపును పట్టుకొనుటకు ఒకదానిని వాడు ఉంచెను, యేసును పట్టుకొనుటకు ఒకటి మరియు అటువంటివి మరియు దానిని వాడు చేస్తాడు; మోషేను పట్టుకొనుటకు ఒకటి. ఎందుకనగా సాతాను దానిని అడ్డగించుటకు ప్రయత్నించుచున్న ఆ సంగతులను మీరు గమనించవచ్చు.

మరియు అందుకే చాలా మత విశ్వాసములు మరియు సంగతులు, దేశముపై లేవడము మనము చూస్తూ ఉన్నామని నేను నమ్ముచున్నాను. “చూడుడి; అది త్వరలోనే ఇక్కడ ఉండును,” అని చూపించే ఒక దీపస్తంభము అయియున్నది.

18

మన సహోదరుల మధ్యన నేను గమనించాను, అది మీలో చాలా మంది, సంపూర్ణ సువార్త ప్రజలుగా మీ యొద్దకు వస్తూ, స్వయముగా బాప్టిస్తు సంఘము నుండి వచ్చుచున్న నేను మరియు పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము అనే సిద్దాంతమును పరిశుద్దాత్మ యొక్క వేరైన (ప్రత్యేకమైన) కార్యముగా అంగీకరిస్తూ ఉన్నాము. మరియు అప్పుడు నేను తలంచాను, మార్టిన్ లూథరు విశ్వాసము ద్వారా నీతికరణను చేరుకున్నప్పుడు, అంతటితో అది స్థిరపడెను అని అతడు అనుకొన్నాడు. అది అతడి కాలమునకు వెలుగైయున్నది. మరియు అతడు దానిని ప్రసంగించాడు, మరియు దానిని నమ్మాడు, మరియు దానితో నిలబడ్డాడు, మరియు అది ఆ కాలమునకు వెలుగైయున్నది.

అప్పుడు అతడు వేరొక తెరలోనికి ప్రవేశించాడు, జాన్ వెస్లీ అనే వ్యక్తి... కాల్వనిజము దేశాన్ని ఊడ్చివేయడం ప్రారంభించినప్పుడు, మరియు వారు, “దేవుడు ఏమి చేయనై యున్నాడో, ఆయన చేస్తాడు, మరియు ఒక ఉజ్జీవమును కలిగియుండుట మనకు ఏ మంచిని చేయదు,” అని చెప్పుటకు స్థిరపడియున్నారు. దేవుడు జాన్ వెస్లీని లేపియున్నాడు, మరియు అతడు ఖచ్చితముగా కాల్వనిజమును నేలమట్టము చేసియున్నాడు. కృప యొక్క రెండవ కార్యము, శుద్దీకరణ యొక్క కార్యముల క్రింద, అది దానియొక్క సరియైన తూకమును కలిగియుండవలసియున్నది. నాజరీను వారు దానిని కొనసాగించిరి, మరియు దానిలో నుండి పెంతుకొస్తు వారు వచ్చారు తరువాత పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మము ఉన్నతమైన శిఖరమునకు కదులుచూ ఉన్నది.

19

మరియు ఇప్పుడు, సహోదరులు పరిశుద్దాత్మ యొక్క బాప్తిస్మమును పొందినప్పుడు, వారు చెప్పారు, “ఇదే ఆ శిఖరము; అదంతయునూ ఇదే.” కానీ, సహోదరులారా, అది తప్పు, చూడండి. దేవుని యొక్క శక్తికి శిఖరము లేదు. మనము ముందుకు కదులుచూ, కదులుచూ మరియు కదులుచూనే ఉంటాము; అవి ఇప్పటికీ తాకబడని దేవుని యొక్క అపరిమితమైన వనరులై యున్నవి, మనకు ఏమియూ తెలియని ఆశీర్వాదములు మరియు శక్తులు. అవి ఎన్నడూ కనీసము ప్రధాన దూతలకు కూడా బయలుపర్చబడలేదు, అవి ఎవరైతే నమ్ముతారో ఆయన యొక్క సంఘము ముందు అవి పడియున్నవి. “ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు.”

కనుక మనము పైకి కదులుచూ మరియు మన హక్కులను పొందుకొందాం. దేవుడు ద్వారములు తెరచి మరియు స్వాగత చాపలు పరుస్తుండగా, మనము పైకి కొనసాగుతూ మరింత లోతులలోనికి మరియు ఎన్నడూ మనకు మనము గుంపుగా చేసుకొనవద్దు, మనలను మనము శాఖలుగా మార్చుకొనుటకు, మరియు “మనము దీనిని నమ్మెదము మరియు అంతే,” అని చెప్పే స్థలమునకు వెళదాము. మనము దేవుని దగ్గర నుండి మరి ఎంత ఎక్కువగా దీనితో కలిపి మనము నమ్మెదము గాక, ప్రభువైన యేసును ప్రేమించే ప్రతీ పురుషుడు మరియు స్త్రీ యొక్క ఉద్దేశ్యము అదే అయి ఉండాలని నేను ఆలోచించుచున్నాను: ఆయన యొక్క ఉదారమైన చేతుల నుండి వచ్చుచున్న దయలన్నిటిని నీవు పొందుకొనుటకు. అదే నా హృదయమైయున్నది.

ఆ కారణము చేతనే నేను ఏ సంస్థలోను చేరలేదు లేక ఏ గుంపులతోను జతకట్ట లేదు, ఎందుకనగా ఆయన నా కొరకు ఏమి ఇచ్చును అను దాని గూర్చి మరియు దేవుని యొక్క ప్రేమ కొరకు నన్ను నేను విశాలముగా తెరచియుంచుకోవాలని కోరుచున్నాను.

20

బైబిలులో ఒకసారి నేను గమనించాను ... పాత నిబంధనలో గృహములో ఒక కుమారుడు జన్మించినప్పుడు, అతడు జన్మించినప్పుడు అతడు కుమారుడగును. అతడు ఒక గృహములో జన్మించినప్పుడు అతడు ఒక కుమారుడగును. మరియు ఆ రోజులలో సాధారణమైన, సామాన్యమైన, సాంప్రదాయమైన గృహము, కుమారునికి ఒక స్థలము మరియు ఒక బోధకుడు ఇవ్వబడును, ఆ బిడ్డను పెంచుటకు, పౌలు క్రొత్త నిబంధనలో దానిని గూర్చి అందముగా మాట్లాడియున్నాడు, ఆ బిడ్డను పెద్ద చేయుటకు బోధకుడు ఆ విధముగానే ఉండవలసియున్నది, మరియు మనలను క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చుటకు ధర్మశాస్త్రమే బోధకుడైయున్నాడు.

కానీ అప్పుడు, ఆ బిడ్డ అతడు జన్మించినప్పుడు అది ఈ రోజు సంఘమునకు మాదిరిగా ఉన్నది, పరిశుద్దాత్మ ద్వారా తిరిగి జన్మించినవాడు. మరియు నేను నమ్ముచున్నాను దేవుడు తన సంఘమునకు బోధిస్తూ ఉన్నాడు, దానిని పైకి తీసుకొని వచ్చుచున్నాడు, దానిని పైకి లేపుచున్నాడు, మరేదో జరుగుటకు ఇప్పుడు సమయమయ్యేంత వరకూ, సంఘము ఈ సమయమునకే ఎదిగియుండవలసియున్నది. కానీ ఇతరులకు బోధించవలసిన వారైయున్న మనలో చాలామంది, ఇంకనూ బైబిలు యొక్క యదార్ధమైన పాలను ఆశిస్తూ ఉన్నారు, చూడండి. మనము బోధకులమై యుండవలసియుండగా, మనకు బోధించుటకు ఎవరో అవసరమై యున్నారు. మరియు దాని కొరకు సిగ్గుతో నా తలను నేను వంచుకొనుచున్నాను, నేను తెలిసికొనిన దానికన్నా ఎక్కువగా నేను దేవుని గూర్చి తెలుసుకొనవలసియున్నది.

21

ఇప్పుడు, ఇక్కడ ఒక్క సంగతిని నేను నమ్ముచున్నాను, అది ఒక బిడ్డ... అక్కడ వెనుక బైబిలు మాట్లాడుచున్నది, అది బిడ్డ పెంచబడుతున్నప్పుడు, ఆ బిడ్డ యొక్క క్రమశిక్షణ లేక వ్యక్తిత్వమును గూర్చి ఆ తండ్రికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. ఇప్పుడు, పెంతుకొస్తు వారికి మరియు సంఘమునకు పరిశుద్దాత్మ ఈ విధముగా బోధకునిగా ఉన్నాడు. దానిని ఇచ్చు పరిశుద్దాత్మ...

గుర్తించుకొనండి, బిడ్డ, ఏమి జరుగనైయున్నప్పటికీ పరవా లేదు, అది ఒక బిడ్డగా జన్మించినది, అది ఎల్లప్పుడూ బిడ్డగానే ఉండును. మరియు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినప్పుడు, అతడు దేవుని యొక్క బిడ్డగా మారతాడు, ఏలయనగా నిజానికి అది రెండవ జన్మ అసలు ప్రారంభించబడుటకు అక్కడ లేని దాని నుండి ఒక మనుష్యునిలో ఏదో సృష్టించబడి మరియు పునరుత్పత్తి చేయుచున్నది. ప్రతీ మనుష్యుడు విశ్వాస గృహములోనికి జన్మించినప్పుడు, అతడు ఒక బిడ్డగా మారతాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఈ వ్యక్తిని వెంబడిస్తూ అతడు ఏ విధముగా ముందుకు కొనసాగుచున్నాడను దాని గూర్చి దేవుని యొద్దకు సమాచారము తెచ్చును.

22

ఇప్పుడు, ఈ బిడ్డ వయస్సుకు వచ్చిన తరువాత... ఇప్పుడు, అతడు ఇంకనూ బిడ్డే. కానీ ఒకవేళ ఆ బిడ్డ నిర్లక్ష్యముగా ఉండి, మరియు ఎన్నడూ ఏకాగ్రతను చూపకుండా, మరియు తండ్రి యొక్క పనిలో ఏమి ఆసక్తిని కలిగిలేనప్పుడు, ఆ బిడ్డ ఎన్నడూ ఆ కుటుంబములోనికి పుత్రునిగా స్వీకరించబడడు. కానీ ఒకవేళ అతడు సరైన బాలుడైనచో, ఒక మంచి బాలుడు, మరియు తండ్రి యొక్క పనిని ఇష్టపడువాడు, మరియు అతడు ఆసక్తిని కలిగియున్నాడు, మరియు తన తండ్రి యొక్క పనిని కొనసాగించుటకు అతడు ఏమి చేయగలడో వాటినన్నిటిని చేయుటకు ప్రయత్నించినవాడు, అప్పుడు ఆ బోధకుడు తండ్రి యొద్దకు ఆ మాటను తీసుకొని వచ్చును, మరియు అక్కడే కుమారునిని స్థానమందుంచుట అని పిలువబడుతుంది, లేక పౌలు గలతీయులలో దానిని ఇచ్చినట్లుగా, “పుత్రస్వీకారము.” అది యేసుక్రీస్తు ద్వారా పుత్రులముగా స్వీకరించబడుటకు ముందుగా నిర్ణయింపబడినవారమై యున్నాము, పుత్రస్వీకారము.

ఇప్పుడు, ఒక కుటుంబములోనికి జన్మించిన అదే కుమారుడు అదే కుటుంబములోనికి పత్రునిగా స్వీకరించబడును, లేక అదే కుటుంబములో పెట్టబడును, లేక అతడు జన్మించిన కుటుంబములోనికి స్థానము ఇవ్వబడును. మరియు ఈ రోజు సంఘము మధ్యలో అదే పరిశుద్దాత్మ యొక్క పని అని నేను నమ్ముచున్నాను. అపొస్తలులను, ఉపదేశకులను, ప్రవక్తలను మరియు అటువంటి వారిని స్థానమును బట్టి సంఘములో వారిని ఉంచుటకు ప్రయత్నించుచున్నది, వలె... మరియు చాలా తప్పుడు హెచ్చరికలు, అటువంటివి ప్రజల మధ్యలో కదలాడుచుండడం మనము చూశాము, అది ఒక అసలైన స్వచ్ఛమైన పుత్రస్వీకారము సమీపములోనే ఉన్నది అని సూచిస్తున్నది. నేను దానిని నమ్మెదను. దేవుడు దానిని సంఘములో ఉంచవలెను. అది దేవుని యొక్క వ్యవహారము, మనుష్యునిది కాదు.

23

ఇప్పుడు, ఈ బాలుడు వయస్సులోనికి వచ్చినప్పుడు, మరియు అతడు సిద్ధముగా ఉన్నప్పుడు తన దత్తపుత్రత్వమునకు, మరియు అతడు రుజువు చేయబడ్డాడు... ఆ బోధకుడు తండ్రితో చెప్పాడు, అది ఈ బాలుడు పుత్రస్వీకారమునకు యోగ్యుడు, అతడు ఒక బహిరంగ ప్రదేశమునకు కొనిపోబడి, మరియు అక్కడ అతడు వస్త్రము ద్వారా కప్పబడియున్నాడు (ఒక గౌరవప్రదమైన వస్త్రము, బహుశా ఊదారంగు కావచ్చు, లేక రాజరికమునకు సంబంధించిన ఏదైనా రంగు), మరియు సిద్ధము చేయబడి, పట్టణమంతా, చుట్టూ ఉన్న ప్రజలంతా, తండ్రి తన స్వంత కుమారుడిని కుటుంబములోనికి స్వీకరించుటను చూశారు. మరియు అప్పుడు అతడు కుటుంబములోనికి పుత్రుడుగా స్వీకరించబడునప్పటికి, అప్పటికే కుమారుడు, అప్పటికే బిడ్డ, అప్పటికే కృపకు వారసుడు, కానీ కుటుంబములో పెట్టబడ్డాడు. మీరు దానిని గ్రహించారా. ఇప్పుడు, అతడు కుటుంబములో పెట్టబడి మరియు అతడి స్థానము ఇవ్వబడినప్పుడు, అప్పుడు చెక్కు పైన ఆ బాలుని పేరు ఆ చెక్కు పైన తన తండ్రి సంతకమంత (పేరు) విలువైనది.

ఇప్పుడు, ఆ సమయమునకే సంఘము ఈ రోజు వచ్చియున్నదని నేను నమ్ముచున్నాను. ఆ తప్పుడు హెచ్చరికలు చూసిన తరువాత, సంఘములో తరువాత గొప్ప అడుగు దేవునిదే, కానీ ఇప్పుడు, దేవుడు తన సంఘములో సరైన రీతిలో అపొస్తలులను, ప్రవక్తలను, ఉపదేశకులను, సువార్తికులను ఉంచును, మానవ నిర్మిత సెమినరీ ద్వారా కొనబడినవారు కాదు, కానీ దేవుడు తన సంఘములో ఉంచును. వేదాంత శాస్త్రము ద్వారా నడిపించువారు మరియు రాత్రికి రాత్రే వచ్చువారు కాదు, కానీ దేవుడు తన సంఘములో ఉంచును, దేవుడు ఎన్నుకొనినట్లుగా, పరిశుద్ధాత్మ ఈ సంఘమునకు బోధించి మరియు పైకి లేపియున్నట్లుగా, మరియు అక్కడ దేవుడు తన దానిలోనికి... స్వీకరించును, స్థానములోనికి, తన కుమారులు. వారు అప్పటికే ఆయన కుమారులు, కానీ ఆయన వారి కొరకు ఉంచిన ఆ స్థానమునకు అర్హులైన వారా కాదా అని.

24

ఒకవేళ మీరు ఒక పరిపూర్ణమైన మాదిరిలో గనుక గమనించినట్లయితే, దేవుడు తన స్వంత కుమారునికి ఆ విధముగానే చేసెను. ఆయన ముగ్గురుని సాక్ష్యముగా తీసుకొని (ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోట ప్రతీ మాట స్థిరపరచబడును), పేతురు, యోహాను, మరియు యాకోబు: ప్రేమ, విశ్వాసము, మరియు నిరీక్షణ. మరియు మిగతా ప్రపంచమునంతటిని వదిలి ఆయన వారిని ఒక కొండపైకి తీసుకొని పోయెను. మరియు అక్కడ అధికారపూర్వకమైన సాక్షుల ముందు, దేవుడు తన స్వంత కుమారుడిని పుత్రునిగా స్వీకరించెను. ఆయన వారి ముందు రూపాంతరము చెందెను, మరియు ఆయన వస్త్రము సూర్యుని వలె మెరయుచుండెను.

మరియు మేఘములో నుండి ఒక స్వరము చెప్పెను, “ఈయన నా ప్రియ కుమారుడు; ఆయన మాట వినుడి.” ఆయనను కొండపైన కూర్చోబెట్టి, దానిని చూచుటకు అక్కడ సాక్షులను పెట్టి, సూర్యుని కంటే ప్రకాశవంతముగా మెరయుచున్న వస్త్రముతో ఆయనను కప్పి... తన శక్తిలో సూర్యుని వలె మెరయుచున్నది. మరియు దేవుడు పలికియున్నాడు, “ఈయన నా ప్రియ కుమారుడు; ఆయన మాట వినుడి,” అని చెప్పెను. దేవుడు తన స్వంత బిడ్డను కుటుంబములోనికి పుత్రునిగా స్వీకరించెను. “ఇక నుండి నన్ను వినరు, కానీ ఇతడు నా కుమారుడు, ఇక్కడ నుండి అతడు అధికారమును తీసుకొనును.” ఆమెన్. సంఘములో ఉపమానముగా ఆ దత్తపుత్రత్వము చాలా సమీపముగా ఉన్నది. దాని కొరకు ఇదే సమయము.

25

ఇప్పుడు, మరుగైయున్న జీవితమునకు వెళ్ళుదము మరియు ఈ పుత్రస్వీకారము అనే స్థానమునకు వెళ్ళుటకు ఇది ఏమి అవసరము అనే దానిని కనుగొందాము. ఒక దాగియున్న జీవితం: పాత నిబంధనలోని మోషే ధర్మశాస్త్రము క్రింద మనము గ్రహించియున్నాము, మనము అక్కడ కనుగొనియున్నాము... ఏ పాఠకుడికైనా తెలుసు, మూడు ఉన్నవని... రెండు తెరలు, రెండు గదులు మరియు అరణ్యములో దేవుని యొక్క గుడారమునకు మాదిరిగా ఉన్న దానిలో సమాజము. మొదటిగా సమాజము, తరువాత పరిశుద్ధ స్థలము, తరువాత అతిపరిశుద్ధ స్థలము. అది దేవుని యొక్క ఇళ్లు; అది దేవుని యొక్క నివాస స్థానము. అది నీ నివాస స్థలము.

ఇప్పుడు, మీరు కేవలము ఒక మూడు గదులు గల గృహములో జీవించెదరు, గుర్తించుకొనండి. మీరు రెండు పడక గదులు కలిగియుండవచ్చు; మీరు మూడు వంటగదులు కలిగియుండవచ్చు, కానీ మీరు కేవలము ఒక మూడు గదులు గల గృహములోనే నివసించెదరు. దేవుడు మూడు గదులు గల గృహములో నివసించెను. దేవుడు ఇక్కడ భూమిపైన ఉన్నప్పుడు, ఆయన మూడు గదులు గల ఇంటిని తీసుకొనెను. ప్రాణము, శరీరము మరియు యేసుక్రీస్తు యొక్క ఆత్మ.

26

ఆలయములో ఆయన ఆవరణములో, పరిశుద్ధ స్థలము మరియు అతిపరిశుద్ధ స్థలములో ఉండెను. ప్రతీ ఒక్కటీ ఒకదానితో ఒకటి వేరుపర్చబడియుండెను, మరియు నివాస స్థలమును చూపించుటకు ప్రతీ ఒక్కటీ వేరు వేరు ఉపకరణములను కలిగియున్నాయి, సంఘమునకు ఒక చాలా అందమైన మాదిరి. పాపి మొదటిగా వంట గది లోనికి వచ్చును, అది ఉన్నట్లుగా వంటగది; అనగా నీవు తినే స్థలము. లివింగ్ రూమ్ అనగా నీవు సహవాసము చేయు గది. మరియు పడకగది నీవు విశ్రాంతి తీసుకొనేది. ఓ, దేవా.

చూడండి, పాపి లోపలికి వచ్చును: “వినుట వలన విశ్వాసము కలుగును, దేవుని యొక్క వాక్యము వినుట.” అతడు వచ్చి వాక్యమును తినును. అప్పుడు అతడు విశ్వాసములోనికి బాప్తిస్మము పొందును, మరియు క్రీస్తుని వ్యక్తిగతమైన రక్షకునిగా అంగీకరించును, అప్పుడు అతడిని దేవునితో సహవాసము చేయుటకు లోపలికి తీసుకొని వచ్చును. కానీ అప్పుడు అతడు పడక గదిలోనికి కదులుచూ వెళ్ళును, దేవునితో ఇంక నిశ్శబ్దము, అక్కడ లోకము యొక్క కార్యములన్నీ మూతపడిపోవును, మరియు అతడు ఒంటరిగా నిశబ్దములో దేవునితో ఉన్నాడు. సహోదరులారా, సహోదరిలారా, ఆ స్థలములోనే ఈ రోజు ఈ పెంతుకొస్తు యొక్క కదలిక ఉండవలసియున్నది, “మేము త్రిత్వము,” “మేము మెథడిస్టు,” “మేము అసెంబ్లీస్,” “మేము చర్చ్-ఆఫ్-గాడ్” అని ఎక్కువగా పిచ్చి కూతలు కూయడం కాదు. మనము దేవునితో ఆ నిశ్చలమైన నిశ్శబ్దములో ఒంటరిగా ఉండవలసి యుండెను. దానిని నీవు నమ్మవా? ఖచ్చితముగా, మనము అలాగు ఉండవలసి యున్నది.

27

గమనించండి, సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు ఆ మొదటి తెరలోనికి ప్రవేశించినప్పుడు, అప్పుడు ఆ రెండవ తెర... బయట ఆ తొట్ల దగ్గర వారు బలి అర్పణను కడిగియున్నారు, తరువాత ఆ బలి వధించబడినది, ఇత్తడి బలిపీఠముపై పెట్టబడినది, మరియు ఆ రక్తము ఒక పాత్రలో ఉంచబడినది, మరియు ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి పరిహారమును చేయుటకు తెర వెనుకకు నడచియున్నాడు.

మరియు ఈ ప్రధాన యాజకుని యొక్క వస్త్రములను గమనించుడి. అతడు తెరలోనికి ప్రవేశించుటకు ముందే, అతడు తన వస్త్రములను తీసివేసి మరియు లోపలికి వెళ్ళుటకు సరైన వస్త్రములను ధరించవలెను. ఈ రోజు సంఘము అదే అయియున్నది. ఈ చిన్న సిద్దాంతపు గుంపులు మరియు సంగతులు ఇవన్నీ తీసివేయబడుట దానికి అవసరమైయున్నది, మరియు యేసుక్రీస్తు యొక్క నీతిని ధరించవలసియున్నది, మరియు లోనికి ప్రవేశించుటకు సిద్ధముగా ఉండవలయును. అతడి నడక వ్యత్యాసముగా ఉండవలెను. అతడి అంగీ అంచులకు, అతడు ఒక దానిమ్మ పండును మరియు ఒక గంటను కలిగియున్నాడు. మరియు అతడు నడుచుచుండగా, ఆ గంటలు “పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువునకు” అని మ్రోగుచున్నంత వరకు అతడి నడక చాలా పరిపూర్ణముగా ఉండెను.

28

ఈ రోజు మనకు అవసరమైనది ఏమనగా, మేము అసెంబ్లీస్, లేక చర్చ్-ఆఫ్-గాడ్, లేక ఏకత్వము, లేక అది ఏమైనా కాదు. మన యొక్క నడక ప్రజలకు, “పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువునకు,” అని మ్రోగుతూ ఉండవలెను.

ఇంకొక సంగతి, అతడు లోపలికి వెళ్ళుటకు ముందు అతడు అభిషేకింపబడవలెను. అభిషేకతైలము షారోను పుష్పముతో చేయబడినది, మరియు ఆ పుష్పము నలిపివేయబడుట ద్వారా సువాసన వచ్చుచున్నది, మరియు అది అహరోను గెడ్డము మీదుగా కారు పరిమళ-తైలము వలె పోయబడుచున్నది, అతడి అంగీ అంచుల మట్టుకు దిగుచున్నది, అభిషేక తైలముతో పూర్తిగా కప్పబడినాడు, సరిగా నడుస్తూ, సరిగా జీవిస్తూ, సరిగా కదులుతూ, సరిగా దుస్తులు ధరించి. రక్తమును అతడి ముందుగా తీసుకొని అక్కడ అతడు వెళ్ళుచున్నాడు, మరియు అతడు ఆ తెర వెనుకకు ఆ మూడవ గదిలోనికి వెళ్ళినప్పుడు, అక్కడొక తెర ఉన్నది, అది అతడి వెనుక పడిపోయినది, ఇక బాహ్య ప్రపంచము అతడిని ఇక ఎంతమాత్రము చూడలేదు. మరియు ప్రతీ మనుష్యుడు, లేక బాలుడు, లేక స్త్రీ, లేక బాలిక అయినా దేవుని యొక్క అభిషేకమును పొంది మరియు ఆ ఆలయమునకు వెనుక నడుచుచూ, దేవుని యొక్క తెరలోనికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ అతడిని ఒక రహస్యమైన స్థలములో ఉంచును. తెర అతడి వెనుక పడియున్నది, మరియు లోకము మరియు దాని సంగతులన్నీ అతడి వెనుక కత్తిరించబడియున్నవి.

29

సహోదరులారా, ఆ కారణమును బట్టే మనము దేవుని యొక్క దత్తపుత్రత్వమును పట్టుకొనుచున్నాము, మన జీవితములో ఉన్న వ్యత్యాసము, మరియు సణుగుడు, మరియు ఒకరితో ఒకరు పోట్లాడుకొనుట, ఆ కారణము చేతనే ఆ తెర మన వెనుక పడలేకపోవుచున్నది మరియు మనము ఆ దేవుని యొక్క ప్రసన్నతలోనికి వెళ్ళగలము. అది నిజము. మనము మన సంఘశాఖలపై చాలా ఆసక్తిని కలిగియున్నాము. మనము ఇతరులు ఏమి చేస్తున్నారన్న దానిపై చాలా ఆసక్తిగా ఉన్నాము, ఏమిటి... “అది నీకేమి, నీవు నన్ను వెంబడించుము.” ప్రతీ సేవకుని మధ్యలో అది వ్యక్తిగతమైన వ్యవహారము. అతడు తన ప్రసంగించడానికి ముందైనా, అతడు ప్రార్ధించుటకు ముందైనా ఏ విధముగానైనా ఒక సేవకుడు ఎల్లప్పుడు తనను తాను ఒంటరిగా చేసుకొనవలయును. అతడు ఏదైనా చేయుటకు ముందు ఆ నిశ్శబ్దమైన స్థలములో అతడు దేవునితో ఒంటరిగా ఉండవలెను, దేవునితో దాగుకొనవలెను. ఎలా, ఆ తెర ఒక్కసారి క్రిందకి వస్తూ....

30

ఇప్పుడు, ఈ తెర లోపల ఉన్న ఉపకరణములు బయటనున్న వాటికి వ్యత్యాసమైనవి. బయట ఆవరణములో ఆ జంతువును కడిగిన ఆ తొట్టె. తరువాత తెరలో ఏమున్నది? అది జంతువుల యొక్క శరీరములు కాల్చబడుట. మరియు అక్కడ దీపమునకు ప్రాతినిధ్యముగా ఉన్న ఏడు బంగారు దీపస్తంభములు, మరియు వెలుగునిచ్చును. మరియు బయటనున్న ఆవరణములకు సూర్యకాంతి ఉండును. మొదటి తెరలో అది కృత్రిమమైనది.

గమనించండి, మరియు వారు ఆ దీపముతో ఇక్కడ నడిచినప్పుడు, తరువాత వారు మరుసటి గది, అనగా, అతిపరిశుద్ధ స్థలమునకు వెళ్ళుదరు, వారక్కడ నడుస్తూనే అభిషేకింపబడియున్నారు. ఏ విధముగా దేవుడు దానిని ప్రణాళిక చేసెను; అది నిజముగా మనకు అందమైన సంగతి, దేవుని యొక్క నిత్యరక్షణ కొరకైన ఆ గొప్ప ప్రణాళికను మనము చూచెదము. ఏ విధముగా తన సేవకులు దీనిలో నడవవలయును. దీనిలోనికి ప్రవేశించుటకు ఏ విధముగా వారు తమను తాము సిద్ధము చేసుకోవాలి.

31

ఇప్పుడు, అతిపరిశుద్ధ స్థలమనబడే ఆ అంతరంగములోని లోపల, కృపా సింహాసనము అనే ఉపకరణము అక్కడ పెట్టబడియున్నది. మరియు ఆ నిబంధన మందసములో ఉన్నది. మరియు మందసము రెండు కెరూబులను కలిగియున్నది. మరియు అది లోపల అయియున్నది. అది పరిశుద్ధ స్థలములోని లోపల ఉపకరణమై యున్నది. తరువాత, బయటకు వస్తూంటే సువర్ణ దీపస్తంభములు, తరువాత బయట తొట్ల దగ్గరకు.

ఇప్పుడు, అది పరిపూర్ణముగా లూథరు, వెస్లీ, మరియు పెంతుకొస్తుకు మాదిరిగా ఉన్నది, ఖచ్చితముగా, ఒకవేళ ఆయన కృప మానవాళికి ఇచ్చియున్నట్లయితే ఆ మూడు అడుగులు లేక యుగములు. మనము చివరి యుగములో ఉన్నాము. నేను నా హృదయమంతటితో దానిని నమ్ముచున్నాను, చూడండి.

32

ఇప్పుడు, గమనించండి, అప్పుడు కూడా ఈ గొప్ప కదలికలో, దేవుడు ఏ విధముగా వారిని అక్కడకు ఈ గొప్ప స్థలములోనికి తీసుకొని వచ్చాడు. మోషే ఒక్కసారి దేవుడు ద్వారా చెప్పబడ్డాడు మన్నా పడటం ప్రారంభించినప్పుడు, మన్నా జీవమునకు సాదృశ్యముగా ఉన్నది: క్రీస్తు క్రిందకి దిగివచ్చుట, మరియు ఈ భూమిపైన నివసి౦చుట, అతడు మన కొరకు ప్రాణము ఇచ్చులాగున, మన్నా పరలోకము నుండి వచ్చినది, భూమిపై పడినది, మరియు ప్రజలు తమ ప్రాణమును నిలబెట్టుట కొరకు దానిని తిన్నారు. మనము ఆయన ద్వారా జీవించులాగున క్రీస్తు పరలోకము నుండి దిగివచ్చి మరియు మన్నాగా మారెను.

మరియు ఇప్పుడు గమనించండి, మన్నాను తినుచున్న ప్రజలు, వారు దానిని త్వరగా తెచ్చుకొని మరియు దానిని తినవలెను, ఎందుకనగా సూర్యుడు ఉదయించినప్పుడు, అది ఎక్కువ సమయము ఉండదు కానీ అది నశించును (పాడైపోవును): క్రీస్తు యొక్క మాదిరి, పరిశుద్దాత్మ మన్నా ఈ దినపు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. దేవుడు స్వాభావికమైన మన్నాతో సంఘమును స్వాభావికమైన దానిలోనికి తీసుకొని వచ్చినట్లుగా, ఆయన ఆత్మీయమైన మన్నాతో సంఘమును ఆత్మీయమైన దానిలోనికి తీసుకొని వచ్చుచున్నాడు. సంఘము మొదటిగా జయించినప్పుడు, ఎర్ర సముద్రమును దాటివచ్చినప్పుడు, రక్తమునకు మాదిరి, వాగ్దాన దేశమునకు వెళ్ళు మార్గములో ప్రయాణం చేయుచున్నప్పుడు, మొదటి రాత్రి మన్నా కురిసెను. ఆమెన్.

మరియు సంఘము పెంతుకొస్తు దినమున మరణములో నుండి జీవములోనికి దాటినప్పుడు, దేవుడు పరలోకము నుండి ఆత్మీయ మన్నాను కురిపించెను, యేసు తిరిగి వచ్చేంత వరకూ లేక మనము వెయ్యేండ్ల పాలనలోకి వెళ్ళేంత వరకూ, వాగ్దాన దేశములోనికి, అది సంఘమును నిలబెట్టును. ఆమెన్.

33

ఓ, వారు దానిని తీసుకొని మరియు దానిని తిన్నప్పుడు, అది మధురముగా ఉన్నదని వారు చెప్పారు. “అది బండలోని తేనెవలె రుచిగా ఉన్నది,” అని వారు చెప్పారు. తేనెవలె రుచిగా ఉన్నది. దావీదు దానిని బండలోని తేనె అని పిలిచాడు, మరియు అది అదే.

ఇప్పుడు, ఒక మాదిరిని గమనించుడి. వారు వాగ్దాన దేశములో ప్రవేశించు దినము వరకు మన్నా ఎన్నడూ పడడము ఆగిపోలేదు; నలభై సంవత్సరముల వరకూ ప్రతీ రోజూ అదే మన్నా పడుచూ ఉండెను. హల్లెలూయా! సహోదరుడా, నీవు ఏ విధముగా పరిశుద్దాత్మను తీసుకొని మరియు పెంతుకొస్తు యొద్ద విడిచిపెట్టెదవు? అది ఒక కొనసాగింపబడుచున్నపెంతుకొస్తు, ఎందుకనగా ఆ మన్నాను తినుటకు జనుల యొక్క హృదయములు కఠినములైపోయాయి... అది నిజము.

34

గమనించండి, అప్పుడు ఇది ఒక మాదిరి. ఇప్పుడు, పెంతుకొస్తు దినమున మన మన్నా... ఆ జనులు మేడగదిలోనికి వెళ్ళి, మరియు ప్రభువైన యేసు యొక్క ఆజ్ఞలకు లోబడి, మరియు ఎదురు చూచారు, మొదటిసారి పరిశుద్దాత్మ ముందుకు కొనసాగుటను గూర్చి యెరుషలేము పట్టణములో ఎదురు చూసినప్పుడు, పరలోకము నుండి సుడిగాలి వంటి ఒక శబ్దము, వారు కూర్చొనియున్న ఇంటిని నింపివేసియున్నది, అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి పైన కూర్చొన్నాయి. వారందరూ పరిశుద్దాత్మ ద్వారా నింపబడి మరియు ఆత్మ వారికి ఉచ్చారణను ఇచ్చినట్లుగా, వారు భాషలలో మాట్లాడటం ప్రారంభించిరి.

ఒక పిరికివారైన చిన్న ప్రసంగీకుల గుంపుగా ఒక మేడగదిలో దాగుకొనినవారు, వీధులలోనికి వారు పరుగెత్తియున్నారు. కానీ వారియొక్క ప్రాణములను నిలబెట్టుటకు హఠాత్తుగా క్రిందకు కుమ్మరింపబడి మన్నా అక్కడకు వచ్చెను. మరియు ఒక అనుభవముతో వారు వీధులలోనికి వెళ్ళిరి, అది అంతకు ముందెన్నడూ వారు కలిగియుండలేదు, ఆయన తన సంఘమును వాగ్దాన దేశమునకు తీసుకొని వెళ్ళు ప్రయాణములో వారిని నిలబెట్టుటకు అది దేవుని యొక్క అద్భుతమైన మాదిరియై యున్నది.

35

సహోదరులారా, గమనించండి. మరి ఎంతకాలము ఈ మన్నా (పడుతూ) ఉండును? అది పూర్తి ప్రయాణమంతా ఉండును, అనగా వారు మరొక యుగము (లేక కాలము) ను తాకేంత వరకూ, ఆ వాగ్దాన దేశములోనికి, అది ఉండును. ఇది ఎంతకాలము ఉండును? యేసు వచ్చేంత వరకూ, యేసు చెప్పెను. “మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతీవారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్దాత్మను పొందెదరు; ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, మరియు దూరస్తులందరుకును, అనగా ప్రభువైన దేవుడు పిలిచిన వారందరికిని చెందును.” ఎంతకాలము అది నిలిచియుండును? మన ప్రభువైన దేవుడు పిలిచినవారందరిని పిలుచు వరకు. మరియు కృప యొక్క యుగము ముగియబడేంత వరకూ, దేవుడు ఇంకనూ పురుషులను మరియు స్త్రీలను తన సేవకొరకు పిలుచును. కనుక ఆ పరిశుద్దాత్మ ఈ రోజుకు కూడా వాస్తవమైయున్నది. ఇప్పుడు, ఆయన ఎన్నడూ చెప్పలేదు...

ఇప్పుడు, వారు ఈ మన్నాను తినినప్పుడు, గుర్తించుకొనండి, ఒకవేళ వారు దానిని తింటే... చాలా మంది ప్రజలు దానిని తిని మరియు చెప్పారు, “ఇది అదే,” వారు ప్రతీరోజు తాజాగా దానిని సేకరించుకొనవలెను. అది నిజము. వారు ప్రతీరోజు తాజాగా, ఆ మన్నాను సేకరించుకొనవలెను, ఎందుకనగా వారు యొక్క రెండవ అడుగులో సుమారు తొమ్మిది గంటలకు, అది కరిగిపోవును. అది పాడైపోవును.

36

మరియు చాలా సార్లు ప్రజలు దేవుని యొక్క రెండవ గదిలో జీవిస్తూ ఉన్నారు, సహవాసములో కూడా, తరువాత వారు అప్పటికే వాక్యమును స్వీకరించియున్నారు, వారి జీవితములలోనికి క్రీస్తును స్వీకరించాలనే రెండవ అడుగులోనికి వారు వచ్చియున్నారు, మరియు ఇప్పటికీ ఎన్నడూ వారు ఆ రహస్యమైన గది ఏమిటో ఎరుగరు, ఆ పడకగది ఏమిటో, ఆ విశ్రాంతి స్థలమేమిటో, వారు మన్నాను తినిరి. కానీ మీరు గమనించారా, ఒకవేళ వారు దానిని ఆ విధముగా ఎక్కువసేపు ఉండనిచ్చినట్లయితే, అది చివరకు కరిగిపోవును. అక్కడ... అది పాడైపోయినది. మరియు చాలా మంది ప్రజలు ఏ విధముగానైనా చాలా కేంప్ గ్రౌండ్ (కూడికలు జరుగు మైదనాము) నొప్పులను కలిగియుందురు అని నేను అనుకొనుచున్నాను, అది వారు వెళ్ళి మరియు ఆ మైదానములో ప్రభువును తినుచున్నారు, మరియు మరొక ఉజ్జీవము రావడానికి ముందే, వారందరూ వెనుదిరిగి మరియు అన్ని రకములైన సిద్ధాంతములు లేక మరి ఏదో దానిలో వంకర చేయబడ్డారు. ఏమిటి సంగతి, సహోదరుడా, నీవు మరెన్నడూ వేరొక స్థలములో నడువలేదు.

37

దేవుడు చెప్పాడు, “మోషే, ఒక బంగారు పాత్రను చేయుము.” హల్లెలూయా! మరియు అక్కడ ఈ మన్నాను ఉంచుము. మరియు గుర్తించుకొనండి, ఒక విశ్వాసి అతడు అక్కడికి నడిచినప్పుడు, ఆ మన్నా ఎన్నడూ పాడైపోలేదు. దినములు గడిచేకొలది మరియు సంవత్సరములు గతించిన కొలది, అది ఎల్లప్పుడూ తాజాగా మరియు క్రొత్తగా మరియు మధురముగా ఉంటున్నది. మరియు క్రీస్తు నొద్దకు వచ్చు ఏ మనుష్యుడైనా మరియు దాయబడియుండి మరియు ఆ తెర అతడి వెనుక పడిపోయినచో, అతడు సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఒక గడియ నుండి మరొక దానికి, దివారాత్రములు మన్నాను తినుచున్నాడు. అది ఎల్లప్పుడూ ఆ మొదటి దినమున మీ ప్రాణమునకు చెప్పుచున్న ఆ మొదటి రోజంత మధురముగా ఉండును. ఈ రోజు మనకు అవసరమైనది అదే, ఆ సంగతులు ఎక్కడ ఉన్నవో అక్కడకు వెళ్ళి ఏదో నిలబడి మరియు అనుకరణ చేయుట కాదు, లేక ఏదో నిలబడి మరియు నటించుట కాదు, కానీ నిజముగా అక్కడికి వెళ్ళుట. ఆమెన్. ఆ వ్యక్తి ఒక్కసారి...

38

ఇప్పుడు గమనించండి, కేవలము విశ్వాసులు, కేవలము ఎన్నుకొనబడిన వారే దానిలోనికి వచ్చెదరు. దేవుడు నిన్ను ఎన్నుకొనియున్నాడు. ప్రకటన రెండులో చెప్పినది నేను నమ్మెదను, “జయించినవాడు...” కాబట్టి అది జయించబడినవారికి వాగ్దానము చేయబడినది.

“నేను పొగత్రాగుటను జయించాను,” అని నీవు చెబుతావు. ఆయన మాట్లాడుచున్నది దానిని గురించి కాదు. సిగరెట్లు లేక విస్కీ త్రాగవద్దు అనేదానికన్నా అదనముగా ఈ క్రైస్తవ్యమునకు చాలా కావలసి ఉన్నది. “జయించినవాడు సమస్త సంగతులను స్వాధీనపరచుకొనును, మరియు అతడు నా కుమారుడగును; నేను అతడికి దేవునిగా ఉందును, మరియు (వినండి) నేను అతడికి మరుగైయున్న మన్నాను ఇచ్చెదను. (ఆమెన్.) నేను అతడిని దూరముగా దాచియుంచెదను, మరియు అతడికి మరుగైయున్న సంగతులను ఇచ్చెదను. తెరకు ఆవలనున్న ప్రపంచమునకు దానిని గూర్చి ఏమియూ తెలియదు.” హల్లెలూయా! వారు మన్నాను తిన్నప్పటికీ, కానీ వారికి దీనిని గూర్చి తెలియదు. “నేను అతడికి మరుగైయున్న మన్నాను ఇచ్చెదను. దానిపై అతడి పేరు ఉన్న ఒక రాయిని అతనికిచ్చెదను.” నేను ఏమి చెబుతున్నానో మీకు అర్థమైనదా: పుత్రస్వీకారములోనికి ప్రవేశించుట లేక దేవునితో మరుగైయున్న స్థలము.

39

సువార్త సేవకులారా లోకము ఏమనుకొనుచున్నదని మరియు మీ సంఘశాఖలను పట్టించుకొనవద్దు, కానీ మీ హృదయములో ప్రేమను పరిపూర్ణము చేయుచున్న దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత ఉన్న మరుగైయున్న మన్నాలోనికి ప్రవేశించుటకు వెదకుడి, మరియు నీవు మరియు దేవుడు మరియు ప్రతీది విశ్రాంతిలో ఉండును. ఏదైనా రానివ్వండి, ఏదైనా, నీవు దూరముగా దాయబడి యున్నావు. జీవించుటకు ఎటువంటి స్థలమది. ఓ, నన్ను అక్కడ దాగుకొననిమ్ము. ఆ పాట చెప్పుచున్నట్లుగా, “ఆ చెట్టు క్రింద నన్ను విశ్రాంతి తీసుకొననిమ్ము, ఎక్కడైతే... స్వేచ్చగా పారునో, ఎక్కడైతే గొర్రెపిల్ల వెలుగైయుండునో, మరియు రక్షింపబడిన వారి ప్రాణములు ఎన్నడునూ చనిపోవు.” ఆమెన్.

40

ఖచ్చితముగా వారు అక్కడ మన్నాను తినిరి కానీ వారికి దీనిని గూర్చి తెలియదు. వారు ఎన్నడూ అక్కడ ఉండలేదు. నా ప్రియ సహోదరుడా, నీవు ఎన్నడైనా ఉన్నావా? నా అజ్ఞానమును అపార్ధము చేసుకొనవద్దు, కానీ నేను మిమ్ములను ఒకటి అడగాలను కొనుచున్నాను. నీ సంఘమును గూర్చి నీవు పెట్టుకొనుచున్నవాదన అంతటి కన్నా క్రీస్తే నీ జీవితములో అన్నిటి కన్నా ఎక్కువ అనే స్థానమునకు నీవు ఎన్నడైనా వచ్చావా? లోకమంతటికన్నా క్రీస్తే నీకు ఎక్కువైయున్నాడా? ఒక ఉద్రేకము నుండి లేక ఒక మానసిక కార్యము నుండి అని నా అర్ధము కాదు; మీ హృదయపు లోతులలో నుండి అని నా అర్ధము, అది అక్కడ ఏదో స్థిరపడినది, ఏదో జరుగుతూ ఉన్నది, అది ఏవిధముగా వచ్చునో మీకు తెలియదు, కానీ నీవు దాయబడి యున్నావు, మరియు నీ యొక్క పూర్తి ఉద్దేశ్యము యేసుక్రీస్తును సేవించుటై యుంటుంది. నా సహోదరుడా, నీవు ఎన్నడైనా ఆ స్థలమునకు ప్రవేశించావా?

ఎవ్వరు ఏమి చెప్పినా నీవు పట్టించుకోనటువంటి స్థానమునకు నీవు వచ్చావా, బయటకు వెళ్ళి మరియు తెలివిగా ప్రవర్తించకుండా, కానీ దేవుని యొక్క ప్రేమ నీలో చాలా లంగరువేయబడునంతగా, అది నీవిక మరేమి చూడలేవు, నీ యొక్క పూర్తి ఉద్దేశ్యము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటైయున్నది, ప్రతీ ఒక్కరి యందు ప్రేమ, ప్రతీ చోట నుండి ప్రవహిస్తున్నదా? జీవించుటకు ఎటువంటి స్థలమది. అదే దాగియున్న స్థలము. ఆ స్థలమునకే మనము రావలసియున్నది, నా సహోదరులారా, ఆ స్థలములోనే దేవుడు తన రహస్య సంగతులను బయలుపరచును. ఆ స్థలములోనే దేవుడు స్థానమందుంచుట మరియు పిలుపును చేయువాడై యున్నాడు. నేనేమి చెప్పుచున్నానో మీకు అర్థమైనదా?

41

ఈ స్థలములోనే... మనకు ఎక్కువ సమయము లేదు, ఎందుకనగా నేను తొందరపడవలసియున్నది, కానీ మరొక ఆలోచన కొరకు. ఈ స్థలములోనే వారు అహరోను యొక్క కర్రను పెట్టియున్నారు, దేవుడు ఎవరిని ఎన్నుకొన్నాడు అనే నిర్ణయము తీసుకొనుటకు, అతడు ఎన్నుకోలేదు. మరియు ఆ కర్ర ఒక ఎండిపోయిన (మృతమైన) కర్ర, ఒక్క రాత్రి సమయములోనే జీవములోనికి వచ్చెను, మొగ్గలు వచ్చెను, పువ్వులు వచ్చెను, మరియు బాదము కాయలు వచ్చెను. అది జీవములోనికి వచ్చెను, పుష్పములు తీసుకొని వచ్చెను, మరియు ఫలములు ఫలించెను, ఒక పాపి దేవుని యొద్దకు, అనగా పరిశుద్ధ స్థలమునకు తీసుకొనిరాబడుట ఒక ఖచ్చితమైన మాదిరియైయున్నది.

గుర్తించుకొనండి, ఆ కర్ర అన్ని ఇతర సంగతులను దాటుకొని వచ్చెను, మరియు అది చనిపోయేంత వరకూ అది లోపల పరిశుద్ధ స్థలములో ఉన్నది. ఆ కారణము చేతనే పరిశుద్దాత్మ నిన్ను గమనించుచున్నది. నీవు పరిశుద్దాత్మను పొందుకొన్నప్పటి నుండి, ఆయన యొక్క రాజ్యము వైపునకు నీ వైఖరి ఏ విధముగా ఉన్నదని చూస్తున్నది. ఒకవేళ అవి స్వార్ధపూరితమైన ఉద్దేశ్యములైతే, ఒకవేళ నీవు ఆలోచించిన సంగతులు సంఘశాఖను ముందుకు తీసుకొని వెళ్ళుట కొరకైతే, లేక ఒకవేళ నిన్ను బాగుగా చేయుటకు ముందుకు వెళ్ళుట కొరకైతే... నీ స్థానము, ఒకవేళ అది లోకములోనికి చూచు పురుషుడుగా చేయగోరినట్లైతే, ఒకవేళ ఎక్కడో నీకు పెద్ద ఆలయమును కట్టుట కొరకైతే, లేక ఏదో పేరు ప్రఖ్యాతులు, లేక దేవుని యొక్క రాజ్యమును ఎక్కువ చేయడము లేక అభివృద్ధిపరచుటకు కాకుండా బయట ఏదైనా, సహోదరుడా, ఏదో తప్పున్నది. ఆమెన్.

42

ఇప్పుడు, ఆ పాత ఎండిపోయిన కర్ర అక్కడకు తీసుకొనిరాబడి మరియు స్వయముగా దేవుని యొక్క ప్రసన్నతలో ఉంచబడినప్పుడు, ఏమి జరిగినది? అది మొగ్గలు వేసినది, అది పుష్పించినది, మరియు అది ఫలములు ఫలించినది, మేము జన్మించాము అని చూపించుచున్నది... ఆ కర్ర ఒక బాదము చెట్టుకు చెందినది, మరియు అది నరికి వేయబడినప్పుడు, అది చనిపోయెను. మరియు మానవుడు దేవుని యొద్ద నుండి నరికివేయబడినప్పుడు (దూరమైనప్పుడు), అతడు ఆత్మీయముగా చనిపోయెను. కాని ఒక్కసారి దేవుని యొక్క స్థలములోనికి తీసుకొనిరాబడి, దేవుని యొక్క సన్నిధి ముందు, అతను జీవములోనికి వచ్చి మరియు అతను జీవమునిచ్చును. అతడు పుష్పించును. అతడు ఫలములనిచ్చును.

దానియందు ఫలమును చూచుటకు యేసు చెట్టు నొద్దకు వచ్చెను. అది అన్నీ కలిగియున్నది ఫలము తప్ప, మరియు ఈ రోజు సంఘములతో అదే విషయమై యున్నది. మనము అన్నీ కలిగియున్నాము, ఫలము తప్ప మనము అరవగలము; మనము భాషలతో మాట్లాడగలము; మనము లేఖనములను వాదించగలము; మన యొక్క వేదాంత శాస్త్రమును మనము బోధించగలము, కానీ ఫలములను ఫలియించుటకు వచ్చినప్పుడు, ఆ చెట్టు చాలా సన్నగా ఉన్నది. ఆత్మ యొక్క ఫలములు ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సహనము. అది ఇంకనూ చాలా మంది ఆ బయటనున్న మొదటి బలిపీఠము దగ్గరే ఉన్నది అని సూచించుచున్నది. మీరు ఇంకను జనులందరికీ బహిర్గతమైయున్నారు. మీరు ఇంకనూ మీ కొరకు యోహాను ఏమనుకొనుచున్నాడు, పొరుగువాడు ఏమనుకొనును, లేక ఏదో దానిని గూర్చి వినుచున్నారు. కానీ వెనుక తెర మరియు తెరలు పడిపోయినప్పుడు, క్రీస్తు ద్వారా మీరు దేవునిలో దాగుకొనెను, చూడండి.

43

గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో పడియున్న ఒక పాపి యొక్క చిత్రము ఎంత అద్భుతముగా ఉన్నది. ఇప్పుడు, ఈ కర్ర అక్కడ పడియుండి, అది చిగురించెను. అది పరిమళము, ఆ పుష్పము యొక్క సువాసనను అది తీసుకొని వచ్చినది, మరియు అది ఫలములను ఫలించెను. మొగ్గలు వచ్చెను. ఇప్పుడు, భూసంబంధముగా మాట్లాడినట్లైతే, ఒక అద్భుతమైన మాదిరిగా అది ఇవ్వబడినది.

ఆ మొదటి సంగతి ఏమనగా మనము ఆ పంటను కలిగియుండకమునుపే మనము విత్తనమును కలిగియుండాలి. మరియు ఆ విత్తనము భూమిలో పాతిపెట్టబడితే అది దాని యొక్క ఫలమును ఫలించును. అది నిజమేనా? ఇప్పుడు, మొదటి సంగతి మనము చేయవలసినదేమనగా క్రీస్తును స్వీకరించవలెను.

ఇప్పుడు, ఆ చెట్టు ప్రారంభించబడుటకు అది బాదము చెట్టుగా ఉండవలెను. మరియు క్రీస్తు, ఈ స్థలమునకు రాక మునుపే నీవు ఆయనను స్వీకరించవలెను. మరియు అప్పుడు ఈ గొప్ప దేవుని యొక్క సన్నిధిలో, అప్పుడు ఈ సంగతులు జరుగును, చూడండి. వాక్యము: క్రీస్తే వాక్యమైయున్నాడు. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు ఆ వాక్యమే దేవుడై యుండెను.” మానవుని యొక్క జీవితములోనికి క్రీస్తు వచ్చును.

44

ఇప్పుడు, గమనించండి, మొదటి సంగతి ఒక విశ్రాంతి, విత్తనమును ఎదిగేలా చేయునదేమి? ఆకాశము నుండి పడుచున్న మంచు భూమిని తాజాపరుచునని కనుగొనుటకు నీవు ఏ ఉదయమునైనా లేచియున్నావా? అది ఏ విధముగా తాజాపరచబడును? అది సమాధానముతో ఉన్నప్పుడు. మంచు పగటి సమయమున పడదు. అది శాంతిగా ఉన్నప్పుడు, ఆ మంచు రాత్రి వేళలో పడును. నీవు సణుగు కొనుచున్నంత కాలము, మరియు వాదించుచున్న మరియు ఈ భూమిపైన సంగతుల కొరకు లోలోపల మధనపడుచున్నంత కాలము, నా సహోదరుడా, ఆ మంచు నీపై ఎన్నడూ పడదు. దేవునితో ఒంటరిగా ఉండు మరియు ఆ నిమ్మళములో ఆ కృప యొక్క మంచు బిందువులు నీ పై పడును గాక.

ప్రశస్తమైన జ్ఞాపకములు, ఏ విధముగా అవి ఆలస్యము చేయును, ఏ విధముగా అవి నా ప్రాణమును నింపును; ఆ అర్థరాత్రి యొక్క నిశబ్దములో రహస్యములు తెరవబడును. ఏ విధముగా దేవుడు తన యొక్క విశ్వాసిని ఆ తెరలు అతడి చుట్టూ దించి వేసి తనకు తనను ఒంటరిగా ఉండుటకు తీసుకొని వచ్చును, ఆయన పరలోకము నుండి ఒక తాజాదనమును తీసుకొని వచ్చును, ఇక మరే ఇతర వ్యక్తి లేక దానిని తెలుసుకొనుటకు ప్రపంచములో మరే మార్గము లేదు, కేవలము అక్కడ ఉన్నవానికి తప్ప.

45

ఆ నిజమైన తాజా, చల్లని అనుభూతి కలిగియున్న ఉదయకాలమున నీవు ఎన్నడైనా నడిచావా? దేవుడు తన భూమిని నూతనపరచెను. పరిమళము: నీవు ఎప్పుడైనా ఒక గులాబీ తోటలోనికి వెళ్ళావా? నా స్థలములో క్రింద చాలా పూలచెట్లు (హనీసకల్స్) కలవు. ఆ హనీసకల్ పగటిపూట ఎండవేళ ఎక్కువగా సువాసన నివ్వదు, కానీ వేకువజామున, గాలి అంతా శుద్దీకరించబడిన తరువాత, అప్పుడు ఆ హనీసకల్ యొక్క పరిమళము... ఒక వ్యక్తి ఆ గుసగుసల నుండి బయటకు వచ్చినచో, గొడవ లాడుతూ, మధనపడుతూ, మరియు ఆ సువార్త యొక్క ఎక్కువైన పరిమళమును మీరు ఎన్నడూ పొందలేరు, కానీ దేవుని యొక్క నిశ్శబ్దములో అతడిని ఒక్కసారి ఒంటరిగా ఉండనివ్వండి.

బలిపీఠము పైకి వచ్చు ప్రతీ వ్యక్తి మొదటగా ఒంటరిగా ఉండవలయును. అప్పుడు ఫలములు వచ్చును, దాని యొక్క ఫలములను తీసికొని వచ్చును. దేవుని యొక్క సన్నిధిలో ఉండు ప్రతీ మనుష్యుడు, ఈ గొప్ప రహస్యమైన స్థలములలోనికి, దాయబడియున్నవాడు నీతి, సమాధానము, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సహనము అనే ఫలములను తీసుకొనివచ్చును. ఈ ఇతర సంగతులను గూర్చి సణుగుకొనవద్దు. అది మీ జీవితములలోనికి తీసుకొనండి, మరియు ఆ దత్తపుత్రత్వము అనే దేశములోనికి నీవు దేవునితో దాగుకొనేంత వరకూ నీవు ఎన్నడూ దానిని పొందవు.

46

ఇంకొక సంగతి, మనము ముగించే ముందు మేము మీ ఏకాగ్రతను కోరుచున్నాము. ఆ వెలుగును చూడండి; బయటనున్న ఆవరణములలో అది ఆకాశము అక్కడ దానిని వెలుగించునది; సూర్యరశ్మి, మరియు అటువంటివి. కొన్ని దినములు మబ్బుగా ఉండును; కొన్ని దినములు ఆ సూర్యుడు అసలు ప్రకాశింపనే ప్రకాశింపడు. కొన్ని దినములు అది చీకటి. ఇప్పుడు, అది ఆవరణములో అయియున్నది.

తరువాత స్థలము దేవుని యొక్క దీపమైయున్నది, నీతీకరించబడిన వారు నిలబడెదరు, మరియు అది మానవ హస్తముల ద్వారా వెలిగించబడును. అక్కడే మనము మన సంఘశాఖలను వాదించెదము, మన యొక్క భేదములను వాదించెదము, జట్టు విభాగించడం: “మరియు ఓ, నేను దైవీక స్వస్థతను నమ్మను. దేవుని దగ్గర నుండి వచ్చు ఆ దర్శనములను నేను నమ్మను. నేను దీనిని నమ్మను; నేను దానిని నమ్మను.” నీవు వాదించెదవు, ఎందుకనగా నీవు జీవిస్తూ ఉన్నావు. మీరు మన్నా తినుచున్ననూ, కానీ నీవు కృత్రిమమైన వెలుగు క్రింద జీవించుచున్నావు. అది నిజము. కొన్నిసార్లు ఆ వెలుగు ఆరిపోవును. కొన్నిసార్లు నీ దీపమునకు మసిపట్టును, కానీ ఎవరైతే దాగియుండుటకు కోరుకొనునో, ఆ తరువాత స్థలములోనికి నడుచును, అక్కడ ఎక్కడా కృత్రిమ వెలుగు లేదు.

కానీ ఈ కెరూబుల యొక్క రెక్కల మధ్యలో అక్కడ ఒక సహజాతీతమైన వెలుగు వ్రేలాడుచున్నది, అది దేవుని యొక్క వృత్తము (అగ్నిస్తంభము), అది ఆ గదినంతటినీ వెలిగించినది. మరియు ఒక వ్యక్తి ఆ షెకీనా మహిమలోనికి ప్రవేశించినప్పుడు (హల్లెలూయా!) అక్కడ సర్వశక్తుడగు దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తాడు. ఈ లోకము యొక్క అంధకారము, ఏవైనా కృత్రిమ సంఘశాఖలు, మరియు మానవ-నిర్మిత సిద్దాంతములన్నీ గతించిపోయెను, మరియు అతడు సర్వశక్తుడైన దేవుని షెకీనా మహిమలో జీవించుచున్నాడు.

47

నా సహోదరులారా, ఆ స్థలములో జీవించుట కొరకు మనము దేవున్నిఅడుగుదాం. మనము లేచి నిలబడదామా.

ఓ ప్రియ యేసుక్రీస్తు, సజీవుడైన దేవుని కుమారుడా, ఈ మధ్యాహ్నకాల సమయములో సహోదర ప్రేమతో పిలువబడే, ఫిలడెల్ఫియా సంఘముగా పిలువబడుచున్న ఈ చిన్న ఆలయములో ఇక్కడ నిలబడియున్న నా ప్రియ సహోదరీ సహోదరులారా, నేను మీ కొరకు ప్రార్థించెదను, ఓ ప్రియమైన దేవా, దైవీకమైన సన్నిధిలో ఉన్న పాష్టరు నుండి ప్రతీ సువార్తికుని వరకు, మరియు ప్రతీ గమనించదగిన పాష్టరు లేదా ఉపదేశకుని యందు దయ చూపించుము.

మరియు ఓ దేవా, సిలువను గట్టిగా హత్తుకొనుటకు ఆ పరిశుద్దాత్మ మా హృదయములను చుట్టబెట్టును గాక, మేము దానిని పొందుకునేంత వరకూ, స్వీయ త్యాగముతో, మరియు అక్కడ వెంటనే షెకీనా మహిమలోనికి పరుగెత్తును, ఎక్కడైతే మనము భూమి యందంతటా పరుగెత్తకుండా, మరియు పురుషులతో జుట్లు విరబూసుకొని, మరియు ఇది నిజమా లేక తప్పా అని వాదించుకొనకుండా, కానీ ఆయన యొక్క సన్నిధిలో జీవిస్తూ మరియు ఎదురుచూస్తూ మరియు ఆయనతోపాటు దాగియున్నవారి కొరకై భద్రపరచబడియున్న మన్నాను తినుట, ప్రభువా, అనుగ్రహించుము.

48

ఆ ఆశీర్వాదము ఈ కూడికపై పడును గాక, మరియు ఇక్కడ నుండి వెళ్ళిపోవుచున్న ప్రతీ పురుషుడు లేక స్త్రీ సర్వశక్తుడైన దేవుని యొక్క షెకీనా మహిమలో దాగియుందురు గాక, తండ్రీ, అనుగ్రహించుము యేసు నామములో నా యొక్క సహోదరీ సహోదరులకు సేవకునిగా ఈ ఆశీర్వాదమును నేను అడుగుచూ ఉన్నాను. ఆమెన్. నేను నమ్ముచున్నాను.

ఓ, నేను ఆయనను చూడగోరుచున్నాను, ఆయన ముఖము నందు,

అక్కడ ఆయన రక్షించు కృపతో నిత్యమూ జీవించుట కొరకు;

ఆ మహిమ వీధులలో నన్ను నా స్వరమును ఎత్తనిమ్ము;

చింతలు అన్నీ గతించెను, నిత్యము ఆనందించుటకు, గృహమే చివరకు.

ఆయన నామమునకు స్తోత్రము. ఏ విధముగా ఆయనను ప్రేమించెదను. ఎన్నడూ గతించిపోని ఆ షెకీనా మహిమ యొక్క సన్నిధిలో నిలువబడి, నిత్యము ఆనందించెదము. ఇదే నా కథ. ఇదే నా పాట. ఆయన ప్రసన్నతను పాడుట... దినమెల్లా ఆయనను స్తుతిస్తూ, పరిపూర్ణ సమర్పణ, అందరూ విశ్రాంతిలో, నేను మరియు రక్షకుడు నిత్యమూ దీవించబడిన వారము. అది అంతే. ఏ విధముగా ఆయనను ప్రేమించుచున్నాము. మీరు ఆయనను ప్రేమించుట లేదా? ఓ, ఏ విధముగా నేను ఆయనను చూడాలనుకొనుచున్నాను.

ఇదే నా కథ, ఇదే నా పాట,

దినమెల్లా నా రక్షకుడిని స్తుతిస్తూ;

ఇదే నా కథ, ఇదే నా పాట,

దినమెల్లా నా రక్షకుడిని స్తుతిసూ.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...