దేవుని శక్తి

దేవుని శక్తి

మిమ్మును దీవించును గాక. మనం ప్రార్ధించెదము.

మా పరలోకపు తండ్రీ, ఈ రాత్రి దేవుని కుమారుడైన యేసు కొరకు మేము మీకు వందనములు చెల్లించుచున్నాము, ఈ చక్కటి సహవాస సమయంలో మేమంతా సమావేశమగునట్లు తీసికొని వచ్చునట్లు ఎవరు భూమి మీదకు వచ్చి, చనిపోయెనో అలా మా సమస్త అపరిశుభ్రత నుండి ఆయన రక్తము కడుగుచుండగా మేము ఒకరితో మరొకరు సహవాసము కలిగి ఉందుము. ఆయన ఈ రాత్రి మమ్మును చూచి నవ్వుచూ మరియు ఆయన దీవెనలు మాకివ్వవలెనని మేము ప్రార్ధించుచున్నాము. మేము యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్.

మీరు కూర్చోన వచ్చును.

సహోదరుడా జోసఫ్, నీకు వందనములు. ఆ విధమైన ప్రశంసకై నేను అయోగ్యుడను. అయితే అది అలాగే అని నేనెరుగుదును.... నేను లోకమును విడచినప్పుడు అలా నన్ను గూర్చిన అది మంచిదే అని ప్రభువు తలంచునని నేను నిరీక్షించుదును. సహోదర యోసేపూ, నీకు వందనములు. మీరందరు నా కొరకు ప్రార్ధించండి. స్నేహితులారా, మీ చక్కని ప్రశంస కొరకు మీకు కూడా వందనములు.

2

ఒకసారి ఎవరో ఒకరు, నేను బోదించుచుండగా మరియు బయటకు వెళ్ళగా, అక్కడ ఒకరు ఉండెను... ఎవరో ఒకరు, ఎవరో సహోదరుడు అనెను, “ఓ, బ్రెన్హాం సోదరుడా, నేను దానిని నిజముగా ప్రశంసించుచున్నాను.”

అక్కడ ఒక వ్యక్తి నిలచి ఉండెను; అతడు అన్నాడు, “నీకు తెలుసా, నన్ను గూర్చి ప్రజలు అలా చెప్పుటకు నేను అంగీకరించను.” అనెను, “సంగతులు ప్రజలు అలా చెప్పుటకు నేను ఇష్టపడను. వారు నన్ను కొనియాడుటకు నేను ఇష్టపడను.”

నేను అన్నాను, “నేను ఇష్టపడుదును.” నేను అన్నాను, “కేవలం అక్కడ నీకు మరియు నాకు మధ్యలో ఒక భేదము ఉన్నది; నేను దానిని గూర్చి నిజాయితీగా ఉన్నాను.” అది సరియేనని నేను తలంచాను. మనం అందరూ ఎవరో వ్యక్తి చక్కగా ఉన్న ఏదో చెప్పుటకు ఇష్టపడుదుము, మనం ఇష్టపడమా? అవును. అయితే, అప్పుడు మనం కూడా ఆయనను ఎంతగా ప్రేమించుచున్నామో మనము చెప్పువలెనని ఆయన ఇష్టపడునని నేను నమ్ముచున్నాను. మీరు అలా తలంచుట లేదా? అది సరియైనది.

3

మీకు వందనములు. నేను ఈ రాత్రి కొద్దిగా అలసిపోయాను. ఈ మధ్యాహ్నము మనం ఒక ఆరాధన కలిగి ఉన్నాము, మరియు - మరియు కనుక మనం..... అది ఇప్పుడు ఇది వరుసగా ఎనిమిది రాత్రులు, కాబట్టి నేను కొద్దిగా అలసట చెందాను, ఎక్కువగా కాదు, అయితే అది నేను మంచిగా భావించ గలుగుటకు చాలినంతగా ఉన్నది. అది ఏమనగా నేను రాత్రి నిద్రించలేకపోవుచున్నాను. నేను చాలినంతగా నిద్రించుట లేదు. అదే నన్ను ఒక విధముగా కొంచెం ఇబ్బందికి గురిచేయుచున్నది.

ఇప్పుడు, ఈ రాత్రి ప్రతీ వ్యక్తి మీ పూర్ణహృదయంతో ఆయనను ప్రేమిస్తున్నారా? ఆమెన్. అదే మార్గము, అది చక్కగా ఉన్నది. ఇప్పుడు, రేపు రాత్రి, శుక్రవారం రాత్రి... మరియు శనివారం శ్రీమతి. బ్రెన్హాం వచ్చునని నేను నమ్ముచున్నాను, ఆమె వచ్చునో లేదా రాలేదో నేను నిశ్చయముగా చెప్పలేను. మరియు ఆమె యోసేపును వెంట తీసికొని వచ్చునని నేను నిరీక్షణ కలిగి ఉన్నాను.

4

మీకు తెలియును, చిన్నవాడైన యోసేపు ఆరు సంవత్సరాలు అతడు పుట్టకముందు, నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను. నేను మిన్నియాపోలిస్ లో ఉండి ప్రార్ధనలో ఉన్నాను. నేను అతడు ఎలాంటి అద్భుతమైన వ్యక్తి అయి ఉండెనో, యోసేపు జీవితము గూర్చి చదువుచుంటిని. అప్పుడు అక్కడ ఉండెను... నా బట్టలు ఎక్కడ వ్రేలాడుచున్నవో, ఆ చిన్నరహస్య గదిలోనికి వెళ్ళాను, మరియు నేను ఆ తలుపు వేశాను. కేవలం నేను ఏడ్చుచుంటిని మరియు ఈ యోసేపు కొరకు ప్రభువుకు వందనములు చెల్లించాను.

ఏదో నాతో చెప్పెను, ఒక దర్శనము కాదు, అయితే కేవలం ఏదో నాతో చెప్పెను, “నీవు ఒక కుమారుని కలిగి ఉండగలవు, మరియు నీవు అతనికి యోసేపు అని పేరు పెట్టి పిలువగలవు.”

కనుక నేను తలంచాను, ఇప్పుడు బాగుంది, అది చక్కగా ఉన్నది. ప్రభువా, నేను నీకు వందనములు చెల్లించుచున్నాను.“ నేను దాని గూర్చి ప్రజలకు చెప్పుటకు ప్రారంభించాను. మంచిది, అకస్మాత్తుగా, ఓ, ఒక సంవత్సరం తరువాత, అక్కడ మన ఇంటిలో ఒక చిన్న బిడ్డ పుట్టి ఉండెను. అది జరిగినప్పుడు, వారిలో కొందరు అన్నారు, ”ఇది యోసేపేనా?“

నేను అన్నాను, “నాకు తెలియదు.” నేను అన్నాను, “అలా చెప్పలేదు,” ఎందుకనగా మరొకరు నాలుగు సంవత్సరాల నుండి, బాలికను కలిగి ఉంటిమి. కనుక అప్పుడు ఆ చిన్న బిడ్డ పుట్టినప్పుడు, ఒక చిన్న బాలికై ఉండెను. అప్పుడు మీరు నన్ను ఎగతాళి చేయునట్లు మాట్లాడుదురు, ప్రత్యేకముగా నా సహోదరులు, మీకు తెలియును, శరీరములో ఉన్న సహోదరులు అలా అనెను, “బిల్లీ, ప్రతిసారి అది సరియైనదిగా ఉండెనని నేను అనుకొన్నాను?”

నేను అన్నాను, “అది సరిగ్గా ఉన్నది. తొందరపడ వద్దు. అతడు ఇక్కడ ఉండగలడు.”

అనెను, “ఓ, అవును. మెడా, ముప్పై-అయిదు సంవత్సరముల వయస్సు గలిగి మరియు ప్రతిసారి ప్రసూతి కొలమాన లెక్కల ప్రకారం ప్రసవించ వలసి ఉండెను. అనెను, ”అది ఇక్కడ జరుగునని నేను ఎరుగుదును.“

నేను అన్నాను, “నిశ్చయముగా.”

అన్నాను, “అది నీకు నిశ్చయంగా ఉన్నదా?”

నేను అన్నాను, “నేను దానిని గూర్చి రూఢిగా సానుకూలత కలిగి ఉన్నాను.” నేను అన్నాను, “దేవుడు ఎల్లప్పుడు సత్యమునే చెప్పును. ఒక బిడ్డను కలిగి ఉందును మరియు అతనికి యోసేపు అని పేరు పెట్టబడును.”

కనుక వారు అన్నారు, “అది అలా ఉండదు.”

రెండు సంవత్సరాలు... ఒక సంవత్సరమైనది, రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు గతించి ఐదవ సంవత్సరములోనికి ప్రవేశించి జరుగుచుండెను. లేదు, ఇంకా యోసేపు రాలేదు.

ఆ తరువాత కొంత కాలానికి యోసేపు రాగా, నేను ఆసుపత్రి యొద్ద ఉంటిని, మరియు భార్య గదిలో ఉండెను. ఇక్కడ నర్సు క్రిందకు వచ్చెను. వారిలో కొందరు అనెను, “ఇతడు యోసేపేనా?”

నేను అన్నాను, “నేను ఎరుగను.” నేను అన్నాను, “యోసేపు వచ్చుచున్నాడని నేను ఎరుగుదును. ఎప్పుడో నేను ఎరుగను.” నేను అన్నాను, “అతడు ఇక్కడే ఉండగలడు.”

నర్సు మెట్ల క్రిందకు దిగి వచ్చెను, ఆమె అన్నది, “రెవరెండు బ్రెన్హాం!”

నేను అన్నాను, “అవును.”

చెప్పెను, “నీవు ఒక చక్కని ఏడు పౌండ్ల బరువుగల బాలుని పొందావు.”

నేను అన్నాను, “యోసేపూ నీవు చాలా కాలానికి ఇక్కడకు వచ్చావు. అయితే నీవు వచ్చినందుకు నేను నిశ్చయముగా సంతోషించుచున్నాను.” అది నిజము.

కావున

5

ప్రభువు ఏదైనా నీకు చెప్పినప్పుడు, నీవు ఆయన చెప్పినది నమ్ముము, ఎందుకనగా ఆయన అది చేయనై ఉన్నాడు, చూశారా. నీవు విచార పడవద్దు. అది కొంచెం సమయం తీసికొనవచ్చును, అయితే ఆయన అనుకొనిన మంచి సమయంలో ఆయన అది చేయును, ఆయన చేయడా? కనుక, మనం ఆయనను ప్రేమించెదము, ఎందుకనగా ఆ పద్దతిలో ఏ వాగ్దానము మీదనైనా మనము ఆయనను తీసికొనగలము. ఆయన ఏది చెప్పినప్పటికి, కేవలం అదియే ఆయన చేయును. మరియు మనము దానిని మన పూర్ణహృదయముతో నమ్మెదము.

ఇప్పుడు, ఇక్కడ క్రిందకు చూస్తుండగా - ఆర్కెస్ట్రా పిట్ లో, (సంగీత విద్వాంసులు వాయిద్యాలు మ్రోగించు స్థలం) అది సరియేనా, మీరు దానిని ఏమని పిలుస్తారు? [ఒక వ్యక్తి చెప్పెను, “అవును, నిశ్చయంగా.”] నేను ఎక్కువ సంగీత విద్వాంసులను చూచుటలేదు, నేను అలా అనుకొనుటలేదు, అయితే కొందరు టేపులు చేయుటను నేను చూస్తున్నాను. అక్కడ దిగువన ఉన్న నా సహోదరులు, లియో మరియు జేన్, మిమ్మును చూచుటకు సంతోషించుచున్నాను. ఒక పన్ను తీయుటలో మీకు నోరు ఒక పుండును కలిగి ఉన్నట్టుగా నేను విన్నాను. సరే గాని, అది ఉత్తమమే అని నేను సంతోషించుచున్నాను.“ అది చక్కగా ఉన్నది. మంచిది. ఇప్పుడు ఈ రాత్రి మనము ఆయనను ఆరాధించుచుండగా, ప్రభువా మమ్ములను కరుణించుము.

6

ఇక్కడ ఒక పాఠము కొరకై నేను చదువగోరుచున్నాను, ఎక్కడ మనము గత రాత్రి ఆ విమోచన గ్రంథములో మనము ఆరాధించిన దానిని కొనసాగించుటకు ఒక చిన్న స్థలమును కనుగొంటిమి. ఆ శనివారం నాడు అల్పాహారము అని నేను అవగాహన చేసుకొన్నాను, మరియు ఆదివారము మధ్యాహ్నం నా చిన్న సహోదరుడు టామీ-హిక్స్ ఇక్కడ మాట్లడనై ఉన్నాడు. అది సరియే గదా? మీరు అందరూ టామీ చెప్పినది విని సంతోషించెదరని నేను నిశ్చయత కలిగి ఉన్నాను, కారణం కేవలం అతడు రష్యా సరిహద్దు రేఖ వెనుక నుండి, రష్యా వెనుక నుండి అతడు వచ్చాడు.

దానిని గూర్చిన ఆ వింతైన సంగతిని గూర్చి, మీకు తెలియును, అతడు అక్కడకు వెళ్ళుచుండెనని అతడు చెప్పినప్పుడు, మేము అందరం క్రైస్తవ పనివారల అల్పాహారము యొద్ద ఉంటిమి, మరియు అతడు రష్యాకు వెళ్ళుచుండెనని అతడు చెప్పెను. మిష్టర్, ఫిషర్, ఇప్పుడు అతడు ఇక్కడే కూర్చుని ఉండవచ్చును; అతడు క్రైస్తవ పనివారల న్యాయవాదియై, చాలా చక్కనివాడై, వెనుక ప్రారంభపు అజూస స్ట్రీట్ యొద్ద, పెంతెకొస్తుకు చెందినవాడై, బాగా తెలిసినవాడు, దేశములోవున్న అందరూ, ఆ మనిషివైపు చూసారు.

కనుక మిష్టర్ ఫిషర్ మాట్లాడాడు. అతడు అన్నాడు, “మంచిదే, అతడు దాటివెళ్ళుచున్నాడని నేను నమ్ముచున్నాను.”

అతడు చెప్పెను, “మంచిదే, ఎందుకూ, మిష్టర్ ఫిషర్?”

అతడు అన్నాడు, “మంచిదే, ఆ మొదటి సంగతి.” అనెను, “ఆ రష్యావారు అప్పుడు.... మంచిది, చూడండి, వారు అతనిని లోనికి రానిచ్చారు.” అనెను, “అప్పుడు ఎవరు క్రైస్తవులో మరియు ఎవరు కాదో, ఆ కమ్యూనిస్టులు, వారు నిజముగా కనుగొనగలరు.” అనెను, “మరొక సంగతి, దీనుడుగా ఉన్న ఆ చిన్న, హాస్యాస్పదముగా ఉన్న ఆ అబ్బాయి ఇక్కడ ఏ హాని చేయడని వారు అనుకున్నారు.” కనుక వారు వానిని లోనికి రానిచ్చారు. కనుక వారు రానిచ్చారు.

అయితే అతడు వారికి కొంత హానియే చేశాడని నేను ఊహించుచున్నాను, ఎందుకనగా అతడు సువార్త యొక్క ఒక బోధకుడు మరియు దానితోనే ఒక మంచి మనిషి అయి ఉన్నాడు. కనుక అతడు అక్కడ ఉండి ఉన్నందుకు నేను వందనాలు చెల్లించుచున్నాను. ఇప్పుడు, వింతైన సంగతి, నేను కొద్దిదూరం నా మెడను చాచి, మరియు నేను అన్నాను, “ఇప్పుడు, టామీ, నీవు వెళ్ళుము మరియు తిరిగి వెనుకకు వచ్చినయెడల, అప్పుడు నేను”వెళ్ళగలను.“ కనుక ఇప్పుడు నేను ఎరుగను. ఇప్పుడు, నేను దానిలో ఉన్నాను. కనుక నేను వెళ్ళుటకు ఇష్టపడుదును, మంచిది. అయితే మనం అక్కడకు వెళ్ళినప్పుడు అది ప్రభువు యొక్క నడిపింపే అని నేను నిరీక్షణ కలిగి ఉన్నాను.

7

ఇప్పుడు, సువార్తలో.... ఇప్పుడు, ఆ నిర్గమకాండ గ్రంథము, తరచుగా 14వ అధ్యాయము. నేను ఆ 13వ అధ్యాయం ముగింపును ఇష్టపడుదును, ఆ అగ్నిస్తంభము, రాత్రి మరియు పగలు ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన అగ్నిస్తంభము. పగటివేళలో అది ఒక మేఘముగా కనిపించెను, మరియు రాత్రివేళలో ఇశ్రాయేలును నడిపించిన ఒక అగ్నిస్తంభముగా కనబడెను. అది నిబంధన దూత అయి ఉండెను, మేరి గర్భంలోనికి వచ్చి శరీరధారియై ఉండుటకు ముందే ఆయనే యేసుక్రీస్తు, క్రీస్తు కాక మరొకరు కాదు, మరియు ఆయన మరి ఎవరో కాదు. అది క్రీస్తు అయి ఉండెను. మోషే క్రీస్తును వెంబడించెను. ఆయన మోషేతో అరణ్యములో ఉండినది ఆయనే అని లేఖనము అలా చెప్పెనని క్రీస్తు చెప్పెను. ఆయన ఎవరై ఉండెననగా అదే, ఆ నిబంధన దూత.

ఇప్పుడు, 15వ వచనములో, మనం ఇలా చదవగలము.

“అంతలో యెహోవా మోషేతో - నీవేల నాకు మొఱపెట్టుచున్నావు? - సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.”

నేను ఒక విధముగా దానిని ఇష్టపడుచున్నాను, మీరు ఇష్టపడరా? ఆయన వాక్యానికి దేవుడు ఆయన దీవెనలు జతచేయును గాక.

8

ఇప్పుడు, ఈ రాత్రి వారము మధ్యలో అయి ఉన్నది. మరియు నేను ఈ రాత్రి ప్రార్ధనా కార్డులు గల ప్రజలందరిని పైకి పిలువనై ఉన్నాను. అయితే నేను ఇక్కడ ప్రారంభించిన తరువాత, నేను అలసిపోయాను, నేను కేవలం ముందుకు వెళ్ళి మరియు రోగుల కొరకు పద్ధతి ప్రకారముగా (ఎల్లప్పుడూ కలిగి) ఉండు పరిచర్యను కలిగి ఉందునని తలంచాను. దేవుని చిత్తమైనయెడల, రేపు రాత్రికి, అలా ఒక ప్రార్ధనా కార్డు పొందిన ప్రతీ వ్యక్తి కొరకు, రేపు రాత్రికి ప్రార్ధించగోరుచున్నాను.

సహోదరుడు బ్రౌను మరియు సహోదరుడు మూర్ కూడా, (మేము మొదట ప్రారంభించినప్పుడు ఆ పద్దతిలో ప్రారంభించామన్నారు.), వారు అన్నారు, “మేము వేదిక దగ్గరకు రాగలము బ్రెన్హాం సోదరుడా మీకు సహాయము చేయుదుము.”

వారు ఎల్లపుడూ ఆ విధమగు ఆరాధనలలో వెనుకకు ఆత్రుత కలిగి నా కొరకు వచ్చెదరు. మరియు నేనును కేవలం ఆత్రుత కలిగి ఆ వేదనతో కూడా దాని వెనుకకు వచ్చెదను. అది కొంచెం సేపు కొద్దిగా వింతగా ఉండ వచ్చును, అయితే అది ఇప్పుడు ఉన్న దానికన్నా మరి ఎక్కువగా మితిమీరి ఉండుటకు అది ఈ చుట్టూ సరిగానే పనిచేయును. కనుక, రేపు రాత్రికిప్రార్ధనా కార్డు కలిగిన ప్రతీ ఒకరు వేదిక పైకి పిలువబడుదురు, వారు ప్రార్ధనా కార్డులు పొందారని నేను తలంచుచున్నాను. నేను కొన్ని నిమిషాల క్రితం ఆ బాలుని అడిగాను, మరియు అక్కడ ఉన్న సహోదరులను, అలా అక్కడ ఏ ప్రార్ధనా కార్డులు అయినా ఇవ్వబడినవా అని అడిగాను. వారు అన్నారు, “ఇప్పటికే అక్కడ 200లు కార్డులు ఇవ్వబడెను.” ఐ“ మరియు ”కె“ అక్షరములు - అలా చెప్పబడెను మరియు అలా చెప్పెను, నేను ఈ రాత్రికి కొందరిని పిలువగోరినయెడల, మరియు అప్పుడు రేపు రాత్రికి వారందరి కొరకు మనము ప్రార్ధించగలము.

9

ఇప్పుడు, గత రాత్రి మనం లేఖనాల యొక్క నిర్గమకాండము గ్రంథం నుండి - ఒక సిరీస్ నడుపుతూ మాట్లాడుచున్నాము. మనం కనుగొన్నది “నిర్గమనము” అనగా “బయటకు పిలువబడుట.” దేవుడు అవిశ్వాసుల నుండి తన ప్రజలను వేరుచేయుచుండెను. అప్పుడు ఆయన వెంట తీసుకొనివెళ్ళుచుండగా, లేఖనాలలో మనం కనుగొనునది అక్కడ ఒక మిశ్రమ సముహము అలా వెళ్ళెను. నిజ విశ్వాసిని కష్టంలో ఉంచినది అదే, ఎందుకనగా అది ఒక మిశ్రమ సమూహము. వారి చెవుల రింగులు మొదలైనవి కరిగించి ఒక దూడను చేసి - ఐగుప్తులోనికి వెనుకకు వెళ్ళారు.

ఇపుడు, అసాధారణమైనది జరిగినప్పుడు, అనగా దేవుడు అద్భుతమును చేసి ఉండెను, అంతలో ప్రతి వ్యక్తియు దాని దగ్గరకు చేరెను, మరియు అప్పుడు, ఒక మిశ్రమ సమూహము బయటకు వచ్చి వెంబడించెను, ఎందుకనగా వారు వెళ్ళుచున్నారు, వారు సున్నతి చేయించుకొన్నవారు మరియు పస్కా మొదలైనవి ఆచరించెను, కాని ఇంకా వారు ఒక మిశ్రమ సమూహముగా ఉన్నారు: విశ్వాసులతో అవిశ్వాసులు. మరియు తుదకు అది వారిపై ప్రదర్శించబడెను.

ఇప్పుడు, మనం కనుగొనునది అక్కడ మూడు గొప్ప సూత్రముల మీద మనం మాట్లాడగోరుచున్నాము. ఈ నిర్గమన గ్రంథము బయటకు పిలువబడెను, వేరు చేయబడెను, మరియు ఒక విమోచన గ్రంథము కూడా. ఆ మూడు సూత్రములు మనం మాట్లాడనై ఉన్నది దయ్యపు శక్తి, మరియు విశ్వాసపు శక్తి, మరియు దేవుని శక్తి.

10

గత రాత్రి మనం కనుగొన్నది ఆ దయ్యం ఒక శక్తి కలిగి ఉండెను, మరియు ఆ శక్తి మరణం అయి ఉన్నది. మరణం తరువాత, ఆ దయ్యం ఇక ఏమీ చేయలేదు. వాడు మరణం యొద్ద పూర్తి అయ్యాడు. (వాని పని అయిపోయింది.) ఎలా వాడు తీసికొని వచ్చెను.... సరిగ్గా మోషే పుట్టబోవుచున్నప్పుడు అతడు కనుగొనబడెను, ఎందుకనగా ఒక ఎన్నికైన పాత్రగా దేవుని సేవకుని నరుకుటకు ప్రయత్నించుచూ, వాడు సమస్త పిల్లల వెంబడి వచ్చి చంపెను. హేబెలు ద్వారా అదే సంగతి వాడు ఎలా చేసెనో హేబెలు వంశం నీతి సంతానంగా రానై ఉండగా వాడు చూసినప్పుడు అదే చేసెను. అప్పుడు దేవుడు, అవును, అతని స్థానమును తీసికొనుటకు షేతును తీసికొని వచ్చెను. మరియు అప్పుడు దినవృత్తాంతములలో రాజసంతానం మరియు మత్తయి గ్రంథములో కూడా, యేసును, వాడు సమస్త పిల్లలను నరుకుటకు ప్రయత్నించుచూ.... లేక దేవుని కార్యక్రమమును ఆపుటకు వారిని ఎలా చంపెను. అయితే అక్కడ దేవుని కార్యక్రమమును ఆపుచేయుటకు ఎంత మాత్రము ఎన్నడూ ఏ మార్గము లేదు.

ఇక్కడే ఈ మధ్య కాలంలోనే వారు ఒక ప్రకటన చేశారు, అలా నీవు ఇక కేకలు వేయలేవనియు, మరియు ఈ సమస్త సంగతులు కాంగ్రెస్ లో దానిని జరిగించుటకు అనుమతి కొరకు ప్రయత్నించుచుండగా వారు సమస్త ద్వారములు మూయుదురనియు, మరియు ఒక ప్రత్యేకమైన ఫలాని సంఘానికి చెందని ప్రజలలో ప్రతివానిని, సంఘాల సమాఖ్య ఐక్యముగా కూడినప్పుడు, మరియు ఇప్పుడు ఈ ప్రపంచము కొరకు, ఈ దేశము కొరకు మృగము యొక్క ముద్రను రూపొందించనై ఉన్నారు. వారు ఎప్పుడు వారికి వారే కలసి అందరూ సమాఖ్యగా ఉందురో అప్పుడు, వారు ప్రతి ద్వారమును లాగుటకు మరియు ప్రతి ద్వారము మూయుదురు. మరియు వారు దానిని ఏదో సమయములో చేయుదురు.

అలా ఈ సంఘాల సమాఖ్యలో ఫలానీ శాఖకు చెందని ప్రతి వ్యక్తియు ఆ ముద్రను తీసికొనవలసి వచ్చును. అలా చేయుచు, మంచిదే, అప్పుడు, వారు తలస్తారు. అప్పుడు అలా దైవిక స్వస్థత మరియు ఈ సమస్త సంగతులనంతా వారు ఆపుదురు. అలా ఆ సంఘాలు అంగీకరించవు. అయితే వారు అది ఎన్నడూ చేయలేరు; నీవు అది చేయలేవు. దేవుని సంఘం కేవలం లోకం ఎంత నిశ్చయమో అంతగా ముందుకు కదిలిపోవును.

వారు ఇంతకు మునుపే, వారిని సింహాలకు ఆహారంగా వేశారు మరియు కొయ్యకు కట్టి వారిని కాల్చ ప్రయత్నించారు - కాని దేవుని సంఘము కేవలం అలాగే ముందుకు కదలెను. చెప్పెను, “పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలువవు.” పాతాళలోక ద్వారాలు మరియు పాతాళలోక శక్తులు దానికి వ్యతిరేకమని చూపెను మరియు అది ఎన్నడూ నిలువనేరదు. దేవుడు ఆయన సంఘముతో సరిగ్గా ముందుకు కదులును. అది ఎల్లప్పుడు ఆ విధముగానే ఉండును.

11

వారు దానిని ఆపుటకు ప్రయత్నించెను. వారు ప్రజలలో నుండి దానిని కాల్చుటకు ప్రయత్నించారు. వారు దానిని సింహాలకు ఆహారంగా వేయప్రయత్నించారు. మరియు ఆ సింహాలు దానిని తిననియ్యలేదు. కనుక వారు చాలా సంగతులు ఈ పాత కాలం భక్తిని గట్టిగా అణగ దొక్కుటకు ప్రయత్నించారు, అయితే యేసు వచ్చువరకు అది మంచిగా ఉండి కొనసాగును. ఆమెన్. కనుక అక్కడ దానిని నిలుపు చేయు మార్గము లేదు.

ఆ దయ్యం అంత చురుకైన బుద్ధిగల వ్యక్తి. మరియు వాడు వానితో మరణం యొక్క శక్తిని మోసికొని పోవును. అయితే వాడు వెళ్ళగలిగేది అలా ముందుకు మరణం వరకే అయి ఉన్నది. అయితే అప్పుడు, మనం కనుగొనగా అప్పుడు, ఆ విశ్వాసము అప్పుడు లోనికి అడుగువేసెను. మరణం వద్ద, విశ్వాసము అప్పుడు లోనికి అడుగుపెట్టెను మరియు పునరుత్థానముతో ఉన్న ఒక దేవుని గుర్తించెను. నేను నా సొంత భార్యకు చేసినట్లే మరియు విచారముతో మరియు తన చేయి మీద ఆమె బిడ్డతో ఉన్న ఒక యవ్వన తల్లిని చూచుటయు, మనం మన సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు మరియు మన ప్రియులు క్రింద పెట్టుచుండగా మన బుగ్గల నుండి కన్నీళ్ళు పడుచుండగా, అయినను ఏమియు కాదు. ఆ సమస్త సంగతులు అక్కడ నిలిచి ఉండును.

12

అక్కడ నిలచుండి, ఆ రోజును నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, ఒక చిన్న పద్దెనిమిది నెలల వయసు గలబిడ్డ, నా చేతులతో పట్టుకొనగా ఆ చిన్న వయసు గల బిల్లీ పాల్ నన్ను నేరుగా కౌగలించుకున్నాడు. వారు వారిని క్రిందపెట్టుచుండగా, ఆ తల్లి చేయి మీద పడి ఉండగా, ఆ చిన్న సహోదరి మరియు తన తల్లి వైపు చూచుచుండెను.

మరియు సేవకుడు ఇంత మన్ను తీసుకుని మరియు చెప్పెను, “బూడిదకు బూడిదగాను, మరియు ధూళికి ధూళిగాను మరియు మన్నుకు మన్నుగాను.” నా భార్య మరియు నా బిడ్డ ముఖం పై ఆ బెడ్డలు పడుచుండుట నేను విన్నప్పుడు, ఓ, మై, నా హృదయం చీల్చివేయబడి ఉండెను. అయితే అక్కడ నిలబడి ఆ పురాతన పైన్ చెట్లు గుండా దిగువకు వినుచు వచ్చుచుండగా అక్కడ ఒక పాట వచ్చుచున్నట్టు కనిపించెను: “అక్కడ నదికి అవతల ఒక స్థలము ఉన్నది,” చూశారా. సరిగ్గా మరణం మధ్యలోనే, సాతాను ఏమిచేసెనో నేను చూచిన చోటనే, కేవలం దానికి అవతల నేను పునరుత్థానము చూశాను.

“నేనే పునరుత్థానమును మరియు జీవమునై ఉన్నాను,” దేవుడు చెప్పెను, “నాయందు విశ్వాసముంచినవాడు, అతడు చనిపోయినను, అతడు బ్రతుకును... ఎవ్వరైనను....” అది ఏమై ఉండెను? అది విశ్వాసమై ఉండెను.

నేను అక్కడకు నడచి వెళ్ళాను, మరియు నేను అన్నాను, “ప్రియా, దేవుడు మిమ్మును దీవించును, మీ ఆత్మలు సమాధానంలో విశ్రాంతి నొందును. మరియు ఏదో రోజున నేను మిమ్మును మరల చూతును.” ఆమెన్.

13

ఇక్కడ ఈ మధ్యకాలం బిల్లీ మరియు నేను ఒక చిన్న పువ్వు అతని తల్లి సమాధి పైకి తీసికొన్నాము. అతడు ఒక చిన్న బాలుడు అయి ఉండెను. అతడు 8 లేక 10 సంవత్సరాల వయస్సు గలిగి, సమాధి దిగువకు వస్తూ అతడు ఏడ్చుట ఆరంబించాడు. కేవలం అది పగటి వెలుగునకు ముందై ఉండెను. నేను ఆ పుష్పమును దిగువన పెట్టాను. అతడు అతని టోపీని తన చేతిలో కలిగి ఉండెను. ఆ సమాధికి ప్రక్కనే మేము మోకాళ్ళూనాము. అతడు తన తల నా మిద ఉంచి, ఏడ్చుటకు ఆరంబించాడు. అతడు అన్నాడు, “డాడీ, మా అమ్మ అక్కడ ఉన్నది.”

నేను అన్నాను, “లేదు, లేదు, హు - హు, నీ తల్లి అక్కడ ఉన్నది. చూడండీ. అక్కడ లేదు.” నేను అన్నాను, “హనీ, మనం ఇక్కడ ఒక చిన్న గుట్టకు అడ్డంగా చూస్తున్నాము. చూడండి, అది కుప్పగా ఉన్నది.” నేను అన్నాను, “ఎందుకనగా నేను ఆమెను ఒక కాంక్రీటు పెట్టెలో ఉంచాను.” నేను అన్నాను, “అది లోపల ఉండలేదు, అయితే అక్కడ ఒక దిబ్బ ఇక్కడ అది కుప్పగా ఉన్నది. అయితే సముద్రానికి అడ్డముగా అక్కడ దానిపై ద్వారాలు పగుల గొట్టబడిన ఒకటి ఉన్నది. మృతులలో నుండి లేచినవాడు చెప్పెను, ”నా మాటలు విని, నా యందు విశ్వాసముంచువాడు అతడు చనిపోయినను, అతడు మరల బ్రతుకును. నాయందు విశ్వసించి జీవించువాడు, ఎన్నటికీ చనిపోడు.“

నేను అన్నాను, “వారు ఆయన చేతులలో క్షేమముగా ఉన్నారు. కనుక అలా మనం చూస్తున్న ఈ సమస్త నల్లటి మేఘానికి అవతల, విశ్వాసము సుదూరాన ఉన్న ఒక దేవుని పునరుత్థానమును క్షణికమైన దృష్టితో పట్టుకొనును.” కాబట్టి అలా అక్కడ సమాధికి అవతల అక్కడ ఒక నిరీక్షణ ఉన్నందుకు నేను కృతజ్ఞుడను. మరియు విశ్వాసం అలా మనలను ఆ స్థలానికి తెచ్చెను. అయినప్పటికిని నేను... విశ్వాసం అది తీసుకొనును, దేవుని వాక్యము అనే బండ మీద, మరియు నరకం యొక్క సమస్త అలలు, దాని పునాదికి ఎదురుగా కొట్టుచుండెను; అది దాని పక్షిరాజు కన్నును తీసికొనును మరియు ఆ మేఘములకు వాటి ఆవలవైపుకు గాలిలోనికి ఎగిరి వెళ్ళును. మరియు దేవుని పునరుత్థానమును మరియు వాగ్దానమును చూచును. కనుక నేను ఈ రాత్రి దాని కొరకు కృతజ్ఞుడను. మరియు మీరునూ అలా ఉన్నారని నేను ఎరుగుదును. మరియు ప్రతి విశ్వాసి అలాగే ఉన్నాడు.

14

ఆలోచించండి. అలా తెర లోపల మనం లంగరు కలిగి ఉన్నాము. కొన్ని సమయాలలో మనం అది చూడలేము, అయితే మనం అది అక్కడ ఉన్నదని ఎరుగుదుము. ఆ చిన్న బాలుడు గాలిపటం ఎగరేసినట్టే. వారన్నారు, “అది ఎక్కడ ఉన్నది?” చెప్పెను, “నేను దానిని చూడలేకున్నాను.” చెప్పెను, “అది ఇంకా అక్కడే ఉన్నదని నేనెరుగుదును, కారణం నేను దానిని స్పర్శించగలను.” కనుక అది సరియైనది. మనం దానిని చూచుటకు సమర్ధత లేకపోవచ్చును. సమయాలు అంధకారముగ అయి ఉండ వచ్చును. కొంత కాలం వరకు ఆయన ఆశీర్వదించబడిన ముఖమును ఆ మేఘాలు దాచి ఉంచవచ్చును. అయితే జ్ఞాపకముంచుకొనుడి, ఆ మేఘాలు ఆయన ముఖమును మరుగుపరచ వచ్చు, కాని అది ఆయనను మరుగుపరచలేదు. అది నీ నుండి సూర్యుని మరుగుచేయవచ్చు, అయితే అది ఇంకా ఆ మేఘాలు అవతలకు ప్రకాశించుచుండెను. మరియు విశ్వాసము ఆ మేఘానికి అవతలకు చూచును.

మరియు ఇక్కడ మోషే తల్లి ఆమె విశ్వాసమును పరీక్షించు పోరాటంలో ఉండెను. ప్రతి పిల్లవాడు, దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు, మొదట తప్పక పరీక్షించబడవలెను. దేవుడు మీ విశ్వాసమును పరీక్షించును. ఇప్పుడు, కేవలం దేవుడు సామాన్యంగా మొత్తం దాని ప్రక్కగా పోవుచున్నట్టు కనిపించెను మరియు ఏదియు లేదు. ప్రశంసించు ఒక పద్ధతియు లేదు, అంతలో కేవలం దానిని ప్రక్కకు పెట్టును. అయితే అలా ఆయన నీకు ఒక పరీక్ష ఇచ్చుట చాలా శ్రేష్ఠము, మరియు అప్పుడు నీవు పరీక్షలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చును. నేను అది ఇష్టపడతాను, నీవు ఇష్టపడవా? నీ జీవితం యొక్క అతి గొప్ప అనుభవాలు, నేను ఒక పర్వతానికి ఎదురుగా వచ్చునప్పుడు, అలా దానిని నేను జయించ లేనప్పుడు, దాని క్రింద లేక దాని చుట్టూ ఉన్నప్పుడు మరియు కేవలం ఇంకా నిలచి ఉండు, మరియు దేవుడు ఆ సంగతిని వెనుకకు కదలించును. మరియు ఆయన కదులును..... ఆ మేఘం ఎంత నల్లగా ఉన్నను ఏమియు కాదు, విశ్వాసం దయ్యం నీ ముందు అమర్చిన ఏ సంగతి కన్నా అవతల సుదూరానికి ఒక కంటితో చొచ్చుకొనిపోవును, కారణం దేవుడే మన విజయమై ఉండెను. ఆమెన్.

15

మరణము కూడా దానికది భయములను కలిగి ఉండదు. ఆ విశ్వాసి నిలబడి మరియు ఇలా చెప్పుటలో ఆశ్చర్యం లేదు, “ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరియు సమాధీ, నీ విజయం ఎక్కడ? అయితే దేవునికి స్తోత్రములు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహించును.” అలాంటి విశ్వాసము సిగ్గుపరచదు. అలాంటి విశ్వాసము జయించును.

మనకు తెలిసినంత వరకు ఇప్పుడు, ఈ తల్లి ఆమె ఒకే బిడ్డతో ఉన్నది. కాదు, నేను క్షమించమని అడుగుచున్నాను; అది ఒక బిడ్డయే అని కాదు. ఆమెకు మరొకరు ఉన్నారు, మిరియాము. కనుక ఆ తల్లి ఆమె చిన్న బిడ్డతో అలా విశ్వాసముతో, అలా ప్రత్యక్షత ద్వారా దేవుడు కదలుచుండగా జిగురుతో అంటించి జమ్ముతో చేయబడిన ఒక చిన్న గంపలో ఉంచబడెను.

16

మొత్తం దేవుని సజీవ సంఘం ప్రభువైన యేసు ప్రత్యక్షతపై నిర్మించబడినదని నీవెరుగుదువా? ఏదేను తోటలో, ఇశ్రాయేలు పిల్లలు తరువాత..... (నన్ను క్షమించండి.) కయీను మరియు హేబెలు మరియు వారు తోటలో నుండి బయటకు వెళ్ళిన తరువాత ఎలా ఆ కయీను, కమ్యూనిస్టు కాదు, వచ్చి మరియు ప్రభువును ఆరాధించెను, మరియు ఒక బలి అర్పించెను, మరియు అతడు చేయగలిగినదంతయూ చేసెను, నీవు గమనించావా?..... కయీను, చాలా భక్తిగలవాడై ఉండెను. అయితే హేబెలు, అతడు, క్రియలతో కాదు, అయితే విశ్వాసం ద్వారా, అతడు వచ్చెను అని బైబిలు చెప్పెను. కయీను కంటే శ్రేష్ఠమైన బలిని అతడు దేవునికి అర్పించెను, దేవుడు దానికి అలా అని సాక్ష్యమిచ్చెను. అతడు నీతిమంతుడై ఉండెను, ఎందుకనగా అతడు దేవుని కార్యక్రమమును చూచెను, అది అతనికి బయలు పరచబడి ఉండెను.

ఇప్పుడు, వారికి లేదు... బైబిలు అప్పుడు వ్రాయబడి ఉండలేదు. కనుక కయీను, అదే తల్లిదండ్రుల బోధలో ఉన్న అతని సహోదరుడు, దిగువకు వచ్చి, మరియు బలిని అర్పించుటకు ఫలము తెచ్చెను.... అయితే హేబెలు, ప్రత్యక్షత ద్వారా ఏదేను తోట నుండి మనలను బయటకు తెచ్చినది అది ఫలములు కాదని అతడు చూచెను, ఇంకా కొంత మంది ప్రజలు అది అలా ఉండెనని అనుకున్నారు, అయితే అది ఫలములు కాకుండెను. వానిని క్షయమైనదిగా చేసినది అతని తల్లి యొక్క రక్తము లేక వాని తండ్రి యొక్క రక్తం అయి ఉండెను. కనుక అతడు వచ్చి మరియు దైవిక ప్రత్యక్షత ద్వారా ఒక గొర్రెపిల్ల రక్తం అర్పించెను. దాని గూర్చి ఏ సంగతియు అతనికి ఏ ఒక్కరూ చెప్పనక్కరలేదు, విశ్వాసం ద్వారా దేవుని కుమారుడు వచ్చుచుండుట అతడు చూచెను, మరియు ఒక అలంకార ప్రాయముగా ఒక గొర్రెపిల్లను అర్పించెను. జగత్తు పునాది వేయబడక ముందే యేసు ఆ గొర్రెపిల్లగా వధించబడెనని అలా చూచెను.

మరియు దేవుడు సాక్ష్యమిచ్చెను, అది సత్యము. దేవుడు ఎల్లప్పుడు సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చును. ఆ కారణం చేత పునరుత్థానుడైన యేసుక్రీస్తును ప్రపంచ దేశాలకు మనం పరిచయము చేయగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఒక పురాణ కథ కాదు, అది ఒక కల్పిత కథ కాదు. అది ఒక సంపూర్ణమైన తనకు తానే దేవుడైన యెహోవా యొక్క ఖచ్చితమైన ప్రకటన, అలా మృతులలో నుండి యేసును ఆయన లేపెను. మరియు అది రుజువు చేయబడెను. దాని గూర్చి అది మంచి భాగము.

ఇప్పుడు, కయీను, అతడు అతని సహోదరుని చూచినప్పుడు, అవును, అతడు అసూయతో ఉండి అతని చంపెను. అయితే గమనించండి, ఎలా హేబెలు ఇది పొందెను.

17

ఇప్పుడు, యేసు ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు, ఒక రోజు, పర్వతము మీద నుండి రూపాంతర కొండ నుండి దిగివచ్చును, “మనుష్యకుమారుడైన నన్ను గూర్చి మనుష్యులు ఏమి చెప్పుకొనుచున్నారు?”

వారిలో కొందరు అన్నారు, “మంచిది, కొందరు నీవు మోషేవనియు చెప్పుదురు; మరియు కొందరు, ఏలియవనియు; మరియు కొందరు, ఆ ప్రవక్త అనియు మొదలైనవి అలా అందురు.”

ఆయన చెప్పెను, “అయితే నేను ఎవరినని మీరు చెప్పుకొనుచున్నారు?”

పేతురు చెప్పెను, “నీవు దేవుని సజీవ కుమారుడవైన క్రీస్తువు.”

ఆయన పేతురు వైపునకు తిరిగి మరియు చెప్పెను, “సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు (మరొక మాటలో యోనా యొక్క కుమారుడు), రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు. నీవు ఎన్నడూ దానిని ఏదైనా చదువుట ద్వారా నేర్చుకొనలేదు. నీవు ఎన్నడూ దానిని ఏ సెమినరీ ద్వారా నేర్చుకొనలేదు. నీవు ఎన్నడూ ఏ పాండిత్యము ద్వారా నేర్చుకొనలేదు, చూశారా. రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, గాని పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపరచెను. మరియు నేను చెప్పుదును, నీవు పేతురు అనబడుదువు, ఈ బండ మీద....” ఏమిటి? అలా యేసే క్రీస్తు అయి ఉండెనను ఆత్మీయ ప్రత్యక్షత, మానసిక భావన కాదు, అయితే ఆత్మీయ ప్రత్యక్షత. “రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, అయితే పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచెను. మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును; మరియు పాతాళ లోక ద్వారములు దానియెదుట నిలువనేరవు.”

18

అది ఏమై ఉన్నది? ఒక ఆత్మీయ ప్రత్యక్షత. విశ్వాసము అనగా ఏమై ఉన్నది? అలా ఆయన నీకు చేయుదుననియు లేక ఆయన వాగ్దానము చేసినదియు నీకు ఆత్మ ద్వారా బయలుపరచిన ఏదో ఒకటి అయి ఉన్నది, అది దేవుడే.

ఇప్పుడు, నీవు ఇది మాత్రమే విన్నాను: “వినుట వలన విశ్వాసము కలుగును.” అయితే వినుటయే విశ్వాసము కాదు. ఒక రొట్టె ముక్క ఇరవై-ఐదు సెంట్లుకు కొనబడెను. అయితే 25 సెంట్లు రొట్టె ముక్క కాదు, చూశారా. వినుట వలన (విశ్వాసము) కలుగును....... అలా విశ్వాసమును ఉత్పత్తి చేయు ఆ వాక్యము వినుట ద్వారా మాత్రమే తీసికొని వచ్చును.

అయితే, “విశ్వాసము నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది.” అప్పుడు నీవు చూడగలవు, నీవు వాక్యమును విందువు, దేవుడు దానిని నీకు బయలుపరచును, అలా అది సత్యమై ఉన్నది, మరియు ఆత్మ ద్వారా బయలు పరచబడిన సత్యము, దేవునికి నీ విశ్వాసమును నిర్ధారణ చేయును. మీరు దానిని గ్రహించారా?

ఇప్పుడు, గమనించండి. అప్పుడు దేవుడు అలా బండ మీద నిర్మించిన ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు.

ఇప్పుడు, మనం గమనించినయెడల ఎలా మిరియాము... లేక, లేదా మోషే యొక్క తల్లి, విశేషముగా ఆమె అక్కడ ఆమె బిడ్డతో మరణములో దానిని ఉంచుటకు నిలబడి ఉన్నప్పుడు.... ప్రతి మగ శిశువు అది పుట్టిన వెంటనే నదిలోనికి విసరివేయబడి ఉండెను. ఒక మగ బిడ్డ అయి ఉండుట చూడగానే, దానిని నదిలోనికి పడవేసెను. ఇప్పుడు ఇక్కడ తల్లి నిలబడియుండగా, అలా అతడు యోగ్యుడైన బిడ్డ అయి ఉండెనని ఎరిగి ఉండెను. అతడు దేవుని యొక్క ముందుగా ఏర్పాటు చేయబడిన కుమారుడై ఉండెను.

19

ముందుగా నిర్ణయించుట, ఆ మాట అలా ఉపయోగించుటకు ఒక మంచి మాట కాదు. “ముందు జ్ఞానము” అను ఆ మాట చాలా మంచిదై ఉన్నది. ముందుగా నిర్ణయించుట అనునది వెనుకకు ముందు జ్ఞానము వైపుకు చూచును మరియు ముందు జ్ఞానము గమ్యస్థానము వైపుకు చూచును. అయితే దేవుడు దానిని క్రమముగా స్థిరపడునట్లు చేసి, అలా నీవు ఒక చిన్న రంధ్రము గుండా వెళ్ళునట్లు చేయలేడు మరియు మరొక పద్దతిలో వెళ్ళలేవు; అయితే దేవుడు దేవునిగా ఉండు క్రమములో, ఆయన ఆది నుండి అంతము వరకు ఎరిగి ఉండెను, కనుక ఆయన దానిని ముందుగా చెప్పి ఉండెను, మరియు ఆయన క్రమములో జరుగుటకు కార్యములను స్థిరపరచెను.

ఇప్పుడు, గమనించండి. దేవుని యొక్క ముందు జ్ఞానం ద్వారా, అది ఆయన పాత్రయై ఉండుటకు అలా అది వెళ్ళనై ఉన్నదని ఆత్మీయ ప్రత్యక్షత ద్వారా అతనికి బయలుపరచబడెను. అతని తల్లి రాజాజ్ఞలకు భయపడలేదు. ఏలయనగా విశ్వాసము ద్వారా ఇశ్రాయేలు పిల్లలను - అతడు వారిని వాగ్ధాన భూమిలో పెట్టుటను ఆమె చూచెను. ఆమెన్.

విశ్వాసము ఎలాంటి శక్తి కలిగి ఉన్నది, విశ్వాసము యొక్క ఆ కన్నులు ఏమై ఉన్నవి. ఓ, అది దయ్యపు శక్తికి అవతల చాలా దూరము వెళ్ళును. ఆ దయ్యం నిన్ను మరణానికి తీసికొని వెళ్ళును, అయితే విశ్వాసము దానికి అవతలకు చూచును. ఆ దయ్యం నీకు సమాధిని చూపును, చెప్పెను, “మీలో ప్రతీ ఒక్కడూ వెళ్ళుచున్నాడు.” అది యధార్ధము. అయితే, మనం మరల తిరిగి వచ్చుచున్నాము, దేవునికి వందనములు. యేసు వచ్చునప్పుడు, ఆయన యందు నిద్రించిన వారందరు ఆయనతో వెంట బెట్టుకొని వచ్చును. కనుక దయ్యానికి కలిగిన ఏ సంగతి కంటెను విశ్వాసము ఇంకా ఎక్కువగా చాలా ఎక్కువగా శక్తివంతమైనది.

ఆ దయ్యం దృష్టి బొమ్మలు ఉంచగలడు మరియు మిగిలిన ప్రతిదియు ఉంచగలడు, మరియు నీకు ఛాయలు కలుగజేసి, మరియు అనును, “నీవు ఉదయాన చనిపోవుచున్నావు. మరియు ఇదే ఆఖరి ఘడియ. అంతలో ఇది, అది మరియు మరొకటి అయి ఉన్నది.” అయితే అది విశ్వాసిని భయపెట్టదు. వాడు కేవలం ఒక బూటకము. దేవుడు అది సంభవించుట లేదని నాకు బయలుపరచునప్పుడు, అతడు ఏమి చెప్పునో నేను లక్ష్యము చేయను. నేను ఏ విధముగా అయినను దాని నుండి బయటకు వచ్చెదను.

20

అలా నేను జీవించడానికి, నా శరీరములో జీవించటానికి కేవలం నాకు కొన్ని దినములే విడచిపెట్టబడెనని మేయో సోదరులు నాతో చెప్పెను. నేను వారిని నమ్మాను. నేను అన్నాను, “సరే, అది నేను వెళ్ళిపోయినవాని వలె ఉన్నట్టు అది కనిపించెను.” అప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరచెను, “కేవలం నీ సేవ ప్రారంభమాయెను.” హల్లెలూయ! మేయో సోదరులు ఏమి చెప్పినా ఏమియు కాదు, వారు ఏమి చెప్పారో నేను దానిని ఆలోచించలేదు; దేవుడు ఏమి చెప్పెనో అదే నేను ఆలోచించాను.

ఈ మధ్యకాలములో ముందు ఆరు, ఏడు సంవత్సరాల క్రితం ఒక యవ్వన వ్యక్తితో ఒక ఆసుపత్రిలో నిలబడి ఉన్నాను, కొంచెం బాగానే ఉండ వచ్చును, ఒక యవ్వన మనిషి నల్లని డిప్తీరియాతో చనిపోవుచుండెను. ఆ వృద్దుడైన నాన్న ఎక్కువగా ఆ బాలుడు లేక ఆ బిడ్డ కొరకు వెళ్ళి ప్రార్ధించుటకు నన్ను పిలిచెను. అతను 15 సంవత్సరాలు వయస్సులో ఉండెను. మరియు ఆ బాలుడు చనిపోవుచుండెను. మరియు ఆ వైద్యుడు, అతడు నన్ను లోపలకు వెళ్ళుటకు అనుమతించలేదు. అతడు అన్నాడు, “నీవు లోపలకు వెళ్లలేవు. నీకు నీ సొంత పిల్లలు ఉన్నారు.”

నేను అన్నాను, “అయితే నేను తెగించి వెళ్ళగలను.”

అతడు అనెను, “అయితే నీ పిల్లలకు డిప్తీరియాను తీసికొని వెళ్ళగలవు.”

నేను అన్నాను, “డిప్తీరియ వచ్చినా వెళ్లుటకు చాలినంత విశ్వాసం నేను పొందినయెడల, అలా దేవుడు నా పిల్లలకు అది రానీయకుండా చేయడానికి చాలినంతగా విశ్వాసము పొందాను.”

అతడు అనెను, “నీవు అది చేయలేవు.” ఆ మనిషి విశ్వాసం ద్వారా కాథలిక్ అయి ఉండెను.

నేను చెప్పాను, “ఇప్పుడు, నేను ఇక్కడ నిలబడి ఉండిన ఒక యాజకుడనై ఉండినయెడల, మరియు ఆ బాలునికి ఆ చివరి సాంప్రదాయక క్రియలు ఇచ్చుటకు అనుమతించి ఉందువు, నీవు అనుమతించి ఉందువు...

“ఓ,” అతడు అనెను, “అది వ్యత్యాసమైనది.”

నేను అన్నాను, “కాదు, అది కాదు. ఆ చివరి సంప్రదాయ కార్యక్రమములు మీకు ఉండినట్లే కేవలం ఇది మాకును పవిత్రమైనదే అయి ఉన్నది.

21

మంచిది, నేను అతడిని మాటలతో ఓడించాను. కనుక అతడు పైకి వెళ్ళెను మరియు మొత్తం అంతా తెలుపుగా, నాకు బట్టలు ధరింపజేసెను, మరియు ఒక పెద్ద వస్తువు ముఖము మీదగా ఉంచెను. నేను ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను చూడలేకపోయాను. నా వెనుక మార్గములో అక్కడ ఒక గౌనుతో ఈడ్చుకొనుచూ ఇక్కడకు నేను వచ్చాను. అప్పుడు మీరు నన్ను ఎన్నడూ ఎరిగి ఉండరు. నేను అక్కడ నుండి క్రిందకు నడిచాను; అది అంతయూ సరిగ్గా ఉండెను. అక్కడకు వెళ్ళుటకు అక్కడ ఒక మార్గమే ఉన్నది. అది నియమములను వెంబడించుటయే. చతురస్రాకారంగా ఉన్న చెస్ లాంటి ఆటను ఎల్లప్పుడూ ఆడుము మరియు నీవు గెలవగలవు.

కనుక నేను అక్కడ దిగువకు వెళ్ళాను, మరియు ఆ తల్లి, తండ్రి వెంట వచ్చారు. అక్కడ ఆ బాలుడు పడి ఉండి చనిపోవుచుండెను, రెండు రోజుల నుండి అపస్మారకమైన వానిగా ఉండెను. నేను చుట్టూ తిరిగాను. నేను వానితో మాట్లాడుటకు ప్రయత్నించాను. అతడు మాట్లాడలేకపోయాడు. కనుక నేను క్రింద మోకాళ్ళు వేసాను, తండ్రి వైపు చూశాను, మరియు అతడు నావైపు చూచెను. అతని కళ్ళల్లో కన్నీళ్ళు కలిగి ఉండెను. నేను ఆ బాలుని పై నా చేతులు పెట్టాను. నేను చెప్పాను, “పరలోకపు తండ్రీ, మీరు చెప్పారు, ”నేనే పునరుత్థానమును మరియు జీవమునై ఉన్నాను' మాకు ఈ సంగతులు వాగ్దానం చేసినవాడవు నీవే. ఈ బిడ్డ యొక్క ఈ తండ్రి రోగుల కొరకు ప్రార్ధించుటకు నీవు నన్ను పంపితివని నమ్ముచూ, ప్రార్ధించుటకు ఇక్కడకు నన్ను పిలిచెను. ఇలా నేను తండ్రీ, విశ్వాస ప్రార్ధనతో అలా నీ యొక్క వస్త్రము తాకుచూ, నా పూర్ణ హృదయంతో, ప్రార్ధించుచున్నాను. విఫలము కాని విశ్వాసముతో, నా హృదయంలో నేను ఎరిగి ఉన్నంత వరకు, ఈ యవ్వన మనిషి ఆరోగ్యంగా ఉండుట కొరకు నేను నమ్ముచున్నాను.“ నేను అన్నాను, ”నేను యేసు నామములో ఇది అడుగుచున్నాను. ఆమెన్.“

పైకి లేచాను.

22

వృద్ధ తండ్రి ఆ తల్లి వైపు చూచెను మరియు అనెను, “ఓ, తల్లీ అది అద్భుతముగా లేదా?” ఆ బాలుడు కేవలం అతడు మునుపు ఎలా ఉండెనో అలాగే ఉండెను. అంతలో అతడు అనెను, “ఓ, నేను సంతోషంగా ఉన్నాను.”

ఆ చిన్న నర్సు అక్కడ నిలబడి, ఏడ్చుచూ, ఆమె చుట్టూ తిరిగి అంతలో ఆమె అన్నది, “అయ్యా, నేను అర్ధం చేసికొనలేక పోయాను.” అనెను, “మీ బాలుడు చనిపోవుచున్నాడని మీకు తెలియునా?”

అతడు అన్నాడు, “లేదు, అమ్మా, నేను అలా నమ్ముట లేదు.” ఆమె అన్నది, “సరే గానీ, ఇప్పుడు మీరు చూడండి...” అతడు అన్నాడు, అతడు అనెను, “నా బాలుడు చనిపోవుట లేదు, నా బాలుడు జీవించనై ఉన్నాడు.” అనెను, “దేవుడు దానిని వాగ్దానము చేసెను.” అంతలో అతడు అనెను.....

“ఎందుకనగా, చూడండి, విశ్వాసం కలిగి ఉండుటకు అది మంచిదే,” ఆమె అన్నది, “అయ్యా.” అయితే అనెను, “నేను మీకు చెప్పుచున్నాను,” ఆమె అన్నది, ఒక రకమైన కార్డియోగ్రాము (గుండెలో కండరాల పనితీరును నమోదు చేయునది), లేక ఎన్నడైనా వారు చేయుచున్నదేమనగా, వారు అతని గుండెపై ఒక రకమైన యంత్రమును ఉంచారు. అంతలో చెప్పెను, “ఎన్నడైనా అది ఆ విధముగా క్రిందకు వెళ్ళినప్పుడు, అది మరల వెనుకకు ఎన్నడైనా వచ్చునట్లుగా వైద్య చరిత్ర అంతటిలో అది ఎన్నడూ తెలియలేదు. చెప్పెను, ”ఆ బాలుడు మూడు నాలుగు గంటలకు మించి జీవించలేడు.“

23

అంతలో ఆ వృద్దుడైన మనిషి, నేను ఎన్నడూ మరచిపోలేను. అతడు అతని చేయిని బహుశా ఆమె లేత యవ్వన ప్రాయములోనే; ఆ చిన్న యవ్వన స్త్రీ భుజము మీద ఉంచెను. అతడు అన్నాడు, “సోదరీ, ప్రియమైన దానా,” అతడు అనెను, “నీవు ఆ యంత్రము వైపు చూస్తున్నావు. చూచుటకు నీకు ఉన్నదంతా అదే, అయితే నేను ఒక దైవిక వాగ్దానము వైపు చూస్తున్నాను.” ఆమెన్.

ఆ మరుసటి ఉదయమే ఆ బాలుడు అతని అల్పాహారము తీసికొనెను. అతనికి వివాహము అయ్యింది మరియు ఇప్పుడు ఒక బిడ్డను కలిగి ఉండెను. చూశారా, ఆ స్త్రీ, ఆమె ఎరిగినదంతయు కేవలం ఆ యంత్రము ఏమి చెప్పెనో చేయుటయై ఉండెను. అయితే ఈ వృద్దుడైన మనిషి చూచెను; విశ్వాసము దాని వెనుక నుండి అవతలకు దూసుకుపోయెను. దేవుడు, మనం ఎన్నడూ విఫమవ్వమనియు లేక మనలను ఎడబాయననియు లేక మనలను విడువననియు వాగ్దానం చేసిన దేవుని, విస్తారముగా సమృద్ధిగా చేయుటకు సమర్ధతగల దేవుని అతడు చూచెను. నీవు దేనివైపు చూచుచున్నావో దాని మీదే ఆధారపడును. క్రైస్తవులు వారు అదృశ్యమైన సంగతుల పైపు చూచెదరు, ఎందుకనగా వారు విశ్వాసము ద్వారా నడచెదరు. అది సరియేనా? మనం దానిని నమ్మేదము, ఎందుకనగా బైబిలు అలా చెప్పెను. వారు దానిని నమ్ముదురు. అది మనం ఆ విధముగా నమ్ముచున్నాము, ఎందుకనగా దేవుడు అలా చెప్పెను. విశ్వాసము పరీక్షించబడి, పరిశోధించబడెను, అది వంద శాతముగా రుజువు చేయును. ఆ విశ్వాసమునకు జవాబు ఇచ్చుటకు దేవుడు బద్దుడై ఉండును.

24

అక్కడ నిలచి ఉన్న ఆ తల్లికి అది ఏమి చేసినదో చూడుము, అలా మిగిలిన ప్రతి బిడ్డ వెళ్ళిన అదే మరణములోనికీ ఆమె బిడ్డను ఉంచెను. బహుశా మూడు నెలల వయసు గలబిడ్డ, ఒక చిన్న గంపలో పెట్టబడి, అంతే పొడవు గలిగిన ఒక చిన్న గంపలో, అంత పెద్దగా ఉన్న గంపలో ఉంచబడెను, మరేమియు కాదు గాని మెత్తని అనేక కొమ్మలు గల చెట్లువలె, రెల్లు గడ్డిని అల్లి దాని పైన జిగురు లాంటిది దానిలోనికి కలగలుపు చేసి, ఆ మొసళ్ళు మరియు మిగిలిన ప్రతి ఇతరమైనదియు ఉండు ఆ బయటకు త్రోసెను? ఎందుకనగా, అది మరణమై ఉండును. సరే, నిశ్చయముగా అది సరిగ్గా మరణము యొక్క అదే నదియై ఉండెను. అయితే విశ్వాసము ద్వారా, దానికొరకు ప్రాయశ్చిత్తము చేయబడి ఉండెను, విశ్వాసము ద్వారా — సహజ నియమముల కార్యముల ద్వారా కాదు, అయితే విశ్వాసము ద్వారా అయి ఉన్నది. ఆ మొసలి ఆ బిడ్డను వాసన చూచెనని సహజమైన నియమములు రుజువు చేసి ఉండును, మరియు అది నిజమై ఉండెను, చూశారా. లేక అక్కడ బయట ఆ మొదటి చిన్న అల దానిని ప్రక్కగా ఒరుగునట్లుగా కొట్టి ఉండును, అది అలా దానిని స్థిరపరచి యుండును. అయితే విశ్వాసము దానిని అవతలకు చూచెను.

ఆ బాలునిపై దేవుని హస్తము ఉండెనని ఆమె ఎరిగి ఉండెను. కాబట్టి, రాజు ఏమి చెప్పెనో దానికి ఆమె భయపడలేదు. విశ్వాసము ఏమి చేసెనో చూడండి. విశ్వాసం అతడిని మరణకరమైన నదిలో నుండి బయటకు తీసెను, పునరుత్థానములో ఫరో భవనమునకు అతడిని తీసికొనిపోయెను, మరియు అతడిని పెంచెను. మరియు దయ్యము యొక్క సాధనమైన భవనంలో సరిగ్గా అతనికి చదువు చెప్పించెను. దేవుడు సాతాను కళ్ళు కప్పెను. ఆ ఫరోయే ఆ పిల్లలను చంపు దయ్యము యొక్క సాధనము అయి ఉండెను, వాడు చంపనై ఉన్న ఆ పిల్లల కొరకు దేవుడు తన సాధనమును వెనుకకు పంపి, మరియు అతడిని పెంచునట్లుగా చేసెను. హల్లెలూయ.

25

చాకచక్యంగా దేవునికి చిక్కకుండా ఉండుటకు ప్రయత్నించవద్దు. దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేయుటకు మర్మమైన పద్ధతులలో ఆయన పని చేయును. దయ్యం వానిని అభిషేకించెను గనుక అపవాదిచే ఆవరించబడిన కఠిన హృదయముగల ఆ మనిషి, ఫరో, ప్రతీ యూదా శిశువును చంపుచుండెను, వారియొక్క రాజును లోనికి తీసికొని వచ్చి, మరియు అతడిని పెంచెను, మరియు చదివించెను, మరియు అతడిని పోషించెను; మరియు అదియును గాక అతని కొరకు ఒక నర్సుగా ఉండుట కొరకు అతని యొక్క తల్లిని తీసికొని వచ్చెను. ఆమెన్. విశ్వాసం చేయునది అదే. ఆ తల్లి దానిని చూచెను. విశ్వాసము ద్వారా, ఆమె దానిని చూచెను. ఆ కారణం చేత ఆమె అక్కడ దిగువకు వెళ్ళెను మరియు నిలబడెను మరియు నర్సుగా ఉండుటకు ఆమెను పిలచి, ఆమె కుమార్తె వచ్చుట కొరకు కనిపెట్టెను. చూడండి, ఆమె దానిని ఆమె మనస్సులో ఇదివరకే కలిగి ఉండెను, కారణం దేవుడు దానిని బయలుపరచెను. ఆమెన్.

కేవలం అది ఆ తల్లికి బయలుపరచినట్లే ఈ రాత్రి ప్రాయశ్చిత్తం ద్వారా అలా నీ రోగము పోయినదని దేవుడు నీకు బయలుపరచినయెడల, అది సమాప్తమైనది. ఆమెన్. విశ్వాసపు శక్తి. అలా అతడు మరలా లేచునని ఎరిగి ఉండుటకు, విశ్వాసపు శక్తితో ఆమె మరణం యొక్క అంచున ఆమె సరిగ్గా బిడ్డను ఉంచెను. ఆమెన్. అతనిని మరణము యొక్క అంచున ఉంచెను.

26

కొన్నిసార్లు శోధనలు మన మీదకు తీసుకొని రాబడును. ప్రజలు అందురు, “ఓ, నాకు వద్దని నేను కోరుకొన్నాను... నేను ఒక క్రైస్తవునిగా ఉన్నయెడల, బ్రెన్హాం సోదరుడా ఎందుచేత ఇది సంభవించినది?” ఆయన తన ప్రేమను నీకు చూపించగలుగునట్లు, దేవుడు దానిని నీ మీదకు రానిచ్చును. కనుక ఆయన నీకు రుజువు చేసి ఉండును, “నేనే పునరుత్థానమును మరియు జీవమునై యున్నాను.”

మరణము చెప్పును, “నేను ఒక అధికారము పొందాను.” ఆ రాజు యొక్క ఆజ్ఞ సమస్త బిడ్డలను ముంచి, వారిని సముద్రములో ఉంచుటయే.

ఆమె అన్నది, “నేను అతనిని సముద్రములో ఉంచుచున్నాను... లేక ప్రత్యక్షత ద్వారా, నీళ్ళక్రింద ఉంచుచున్నాను. నేను తప్పించుకొను ఒక మార్గమును సిద్దము చేసాను.” ఆమెన్. ఆమె అతనిని మరణంలో ఉంచెను. అంతలో విశ్వాసము అతనిని బయటకు తెచ్చెను మరియు ఫరో కుమార్తె యొక్క కుమారునిగా వానిని చేసెను, మరియు ఆమెను నర్సుగా చేసెను. దేవుడు ఏలాగు చేసెనో చూడండి? దేవుడు అందరిని ఏకం చేసి ఆయన సొంత మహిమ నిమిత్తం పనిచేయుచుండెను మరియు సరిగ్గా దానిని సాతాను యొక్క ముక్కు క్రింద నుంచుచూ, మరియు చెప్పుచుండును, “సాతానా, కేవలం నీవు ఎలా నీవు గుడ్డివాడవై ఉన్నావో నేను నీకు చూపించగోరుచున్నాను.” సరిగ్గా ఆ బిడ్డను వాని ముఖము క్రింద నుండి మరియు వానిని సాతానుడే పోషించునట్లు మరియు వానిగూర్చి శ్రద్ద వహించునట్లును, ఆ ప్రజలను విజయమునకు నడిపించుచూ మరియు మొత్తం దేశం అంతటిని నాశనం చేయుటకు వెళ్ళుచున్న అదే మనిషి కొరకు వానిని పోషించెను. హల్లెలూయ! ఓ, మన దేవుడు మరపురానివాడై ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉండుము. మరణము కంటే బలమైనది. నిశ్చయముగా విశ్వాసము మరణమున కంటే బలమైనదియే. కనుక ఇక్కడ విశ్వాసపు శక్తి కదలుచూ వెళ్ళును.

27

ఇప్పుడు, గమనించండి. ఇప్పుడు, అతడు పగటి వేళలో ఉండగా.. ఐగుప్తు ప్రపంచంలో అతి గొప్పదైన యుద్ద ప్రవృత్తి కలిగిన దేశమని, ప్రపంచంలో గొప్ప వాణిజ్య కేంద్రమై ఉండెనని నేను ఊహించుచున్నాను. ఏ సందేహమూ లేదు, అయితే మోషే సైనిక అధికారి శిక్షణ మరియు ప్రతి ఇతరమైన సంగతియు కలిగి ఉండెను. దేవుడు అతనికి ఆ విధమైన శిక్షణ ఇచ్చుటను కలిగి ఉండెను, ఎందుకనగా అతడు సైన్యమును నడిపించనై ఉండెను. అలా తనకు తానే నాశనము చేసికొనియుండునట్లు అలాంటి సైన్యమును నడిపించునట్లు సాతాను మోషేకు శిక్షణ నిచ్చునట్లు దేవుడు చేసెను. హల్లెలూయ! విశ్వాసము యొక్క శక్తి అదియే.

ఆమె విశ్వాసము ద్వారా అది చూచెను. అది మాత్రమే కాదు, అయితే ఆమె దాని కొరకు ఏర్పాట్లు చేసెను. ఆమె ఆ బిడ్డను ప్రాయశ్చిత్తములో ఉంచెను, మరియు ఇక్కడకు నడచి వచ్చెను, మరియు వచ్చుటకు ఆమె పిలుపు కొరకు ఒడ్డున నిలచి కనిపెట్టుచుండెను. మహిమ! నీవు అక్కడే ఉన్నావు. సమయం కొరకు కనిపెట్టుచూ, అదృశ్యుడైన వానిని చూస్తూ, విశ్వాసము ద్వారా సహించెను. ఈ బిడ్డ ఒక యోగ్యుడైన బిడ్డ అయి ఉండెనని ఆమె ఎరిగెను. దేవుడు ఏమి వాగ్దానము చేసెనో, ఆమె ఎరిగెను. పిల్లల కొరకు విడుదల సమయము సమీపించియున్నది, మరియు ఇదియే ఆ బిడ్డ అయి ఉండెనని ఆమె ఎరిగి ఉండెను. ఆమెన్.

28

ఇప్పుడు, పగటి వేళలో ప్రధాన అధికారులు, అత్యుత్తమ శిక్షణ తీసుకొని వచ్చారు. అతనికి భోజనము ఒక పళ్ళెములో సాతాను ద్వారా తేబడి, అతని పోషించుచుండెను.

ఓ, మై, ఈ రోజు అది ఉన్న విధంగానే, వేపిన కోడి మాంసము, ఒండుటకు కోయబడిన మాంస ఖండము, బంగాళ దుంపలు మరియు టీ, ప్రతియొక్కటి. అక్కడ అతడు వెనుక కూర్చుని ఉండగా, మరియు దేవుడు చెప్పెను, “సాతాను, నేను ఏమి చేయగలనో చూడుము. నీవు మిగతావారందరి కంటే గొప్ప వ్యక్తివేమీ కావు, చూశారా. నీవు కోరిన విధముగనే మేము వానిని మరణంలో ఉంచాము, అయితే అలా నా యందు విశ్వాసముంచిన సమస్త ప్రజలకు యేసుక్రీస్తు ద్వారా దూరాన నేను ఏమి చేయనై ఉన్నానో ఆ తల్లి చూచెను, విశ్వాసము ద్వారా ఆమె అది చేసెను.”

మోషే బాగా శిక్షణ పొందిన ఒక నిజమైన అధికారై ఉండెను, కారణం అతడు నడిపించగలడని ఫరో అనుకొనెను.... అతని పాదము సింహాసనం మీద ఉండెను. ఫరో అనెను, “ఏదో రోజున అతడు ఫరో కాగలడు.” మరియు అప్పుడు, అతడు అతనికి అత్యుత్తమమైన శిక్షణ ఇచ్చినప్పుడు, మరియు ఇదంతయూ దేవుడు చేయుచుండెను, కారణము ఎందుకు అమోరీయులు మరియు అలా బాగుగా శిక్షణ పొందిన మనిషి, మోషేతో, వారు ఒక భాగ్యము కలిగి ఉండలేదు; అక్కడ బయట అతని సైన్యమును క్రమములో ఉంచినప్పుడు మరియు వారితో ప్రారంభించెను. ఎందుచేత, నిశ్చయముగా కాదు. కేవలం గ్రాంటు రీచ్మండకు చేసిన దానివలే ఆయన వారిని తీసుకొనెను. వారు దానిలో చేయుటకు ఏమియులేదు. నేను మీకు చెప్పుచున్నాను. అతడు సరిగ్గా ముందుకు నడచిపోయెను, కారణం అతడు ఐగుప్తు సకల విద్యలలో శిక్షణ పొంది ఉండెను.

అంతలో అప్పుడు అతని పాఠశాల అభ్యసనం పూర్తి అయిన తరువాత, అతనికి రాత్రి అభ్యాసము పూర్తి అయిన తరువాత, తల్లి అతడిని పడక గదిలోనికి తీసుకొని వెళ్ళెను, మరియు ఆమె అతనికి శిక్షణ ఇచ్చెను. హల్లెలూయ. నీతికి సంబందించిన ఒక బోధకుడు. ఆమెకు కొద్దిగా కలదు.... గృహము నొద్ద ఆమెకు చిన్న సొంత సమాజము కలదు.

29

కనుక ఆమె అతడికి చెప్పుచూ, మోషేకు శక్షణ నిచ్చెను. ఇప్పుడు, అతడు అన్నాడు, “అమ్మా, నేను అవగాహన చేసికొన్నాను. ఇప్పుడు, ఈనాడు మనం సమస్త శిక్షణ కలిగి ఉన్నాము, అయితే ఇప్పుడు ఆ యెహోవా చేయుచున్న దానిని గూర్చి నీవేమి చెప్పుచున్నావు?”

అంతలో ఆమె విశ్వాసము ద్వారా వానికి చదువుట ప్రారంభించెను. అతడు సింహాసనం అధిష్టించు వయసు వచ్చినప్పుడు, అతడు ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పిలువబడుటకు తిరస్కరించెను. ఏలయనగా విశ్వాసము ద్వారా (హల్లెలూయ), తన తల్లి కొరకు ఏమి జరిగి ఉండెనో అతడు చూచెను, మరియు అతడు అదే విషయమును తీసుకొనెను.

అది పౌలు కొరకు ఏమి చేసెనో నేను చూశాను, పేతురు కొరకు అది ఏమి చేసెనో నేను చూశాను, ఇతరుల కొరకు అది ఏమి చేసెనో నేను చూశాను. నేను విశ్వాసం ద్వారా అదే సంగతి కోరుచున్నాను. ఆ మేఘం ఎంత నల్లగా కనిపించినను ఏమియు కాదు, అది దానిని చేయలేదు. కేవలం అక్కడ అవతల ఆ సూర్యుడు ప్రకాశించుచున్నాడు. ఆ సూర్యుడు ప్రకాశించు వరకు మనం సరిగ్గా కదలి ముందుకు సాగెదము.

తుఫానులు ఆయన యొక్క ధన్యకరమైన ముఖమును దాచలేవు. ఆమెన్. ఓ, అతనికి మృదువైన సముద్ర యాత్ర వాగ్దానం చేయబడలేదు. అయితే ఆయన ఎల్లప్పుడు వాగ్దానము చేసెను, “నేను మీతో ఉందును.” ఆమెన్. కనుక ఆయన ఆ చుట్టూ ఉన్నంత కాలం, అక్కడ ఏలాగు ఎంత ఎక్కువగా తుఫాను వచ్చినను అది ఏ భేదము కలిగించును? ఆ గాలులు మరియు ఆ తరంగాలు ఆయన చిత్తమునకు లోబడెను. ఆమెన్.

30

ఇప్పుడు, ఓ, విశ్వాసము అనే అద్భుతమైన సంగతిని గూర్చి, మనం దానిపై గంటలు తీసికొని వచ్చును. అతడు విశ్వాసము ద్వారా అలా పస్కా బలిని అర్పించెను. ఆ విధంగా అతడు దేవుని కలిసెను మరియు ఆయనతో మాట్లాడెను. విశ్వాసము ద్వారా అతడు దిగువకు వెళ్ళెను మరియు పస్కా గొర్రెపిల్లను అర్పించెను, బయటకు వచ్చి, మరియు ఆయన మార్గములో ఉండెను. దేవుడు ఇదంతయు విశ్వాసపు శక్తి ద్వారా చేయుచుండెను. విశ్వాసము ఏమి చేయునో చూచారా?

31

ఇప్పుడు, వారు అతనిని సరిగ్గా మార్గము మీద నుంచి వాగ్దాన భూమికి నడిపించారు. అక్కడ దేవునికి మరియు ఫరోకు మధ్య ఉన్న సమస్త పోరాటము మీకు తెలియును. ఏలాగు అతడు విశ్వాసము ద్వారా ఇది చేసెనో, అతడు విశ్వాసం ద్వారా ఇది చేసెనో, మరియు అతడు విశ్వాసం ద్వారా ఇది చేసెనో మీకు తెలియును. ఇప్పుడు, ఈ రాత్రి మన పాఠ్యంశము వారి ప్రయాణంలో మనం వారిని కనుగొన్నాము. అంతలో వారు దూరముగా చూశారు; మరియు అక్కడ ఎర్ర సముద్రము ఉన్నది, ఇరుప్రక్కలా పర్వతములు ఉన్నవి; మరియు వారు వారి కన్నులెత్తి మరియు వెనుకకు చూచెను, అక్కడ ఫరో వాని సైన్యమంతటితో, అతని శిక్షణ పొందిన సైన్యమంతటితో, అతని రథములు, మరియు ప్రతి రథము యొక్క వాని అధిపతి మరియు మొదలైన వాటితో వచ్చెను. పదివేల కొలది, అవును, బహుశా, ఒక మిలియను లేక ఇంకా ఎక్కువ, సైన్యంగా ఉన్న మనుష్యులు వచ్చుచుండగా ఇక్కడకు ధూళితో కూడిన ఒక గొప్ప మేఘము వచ్చెను. వారి మీదకు ఒక దిశలో వచ్చుచున్న తోడేళ్ళు మందతో ఇక్కడ ఈ గుంపుగా ఉన్న చిన్న గొర్రెపిల్లలు వెనుకకు మళ్ళుచుండెను.

అప్పుడు ఏమి సంభించెను? కేవలం మానవులుగా, మనం అందరం అలాగే చేయుదుము. “అలా మేము అక్కడ సమాధి అగునట్లుగా ఐగుప్తులో అక్కడ చాలినన్ని సమాధులు లేకుండెనా?” ఆ పద్దతిలోనే మనం ఆలోచిస్తాము. కొద్ది దినాలకు ముందుగా వారి కొరకు సమస్త విశ్వాసము ఏమి జరిగించెనో వారు మరచిపోయారు. మనం చేయునది ఏమనగా అదే.

ఆ మొదటి చిన్న బాధ మనలను తాకినప్పుడు, నీవు ప్రార్ధించబడిన తరువాత, “ఓ, సరేగాని, నేను దానిని పోగొట్టుకున్నానని నేను ఊహించుచున్నాను.” ఓ, మై.

కేన్సరు నుండి స్వస్థపరచబడి వేదిక దగ్గరకువచ్చుచున్న వారినిగూర్చి, గుడ్డి వారి కన్నులు తెరవబడుటను గూర్చి వినుము. ఎవరు కుంటివారో వారు మరల నడిచారు మరియు ఈ సంగతులన్నియు, మరియు మనం అది. చూచి, దానివైపు చూచి, దానిని పరీక్షించి, సరిగ్గా కదులుతూ ముందుకు సాగిపోదుము. అంతలో అప్పుడు ఆ మొదటి చిన్న పోరాటము వెంట వచ్చినప్పుడు, మనం దానిని గూర్చిన అదంతయూ మరచిపోదుము. ఆయన పునరుత్థానపు శక్తిలో ప్రభువైన యేసును చూచియు, అయితే చాలా త్వరగా మరచిపోదుము. అది దానిలో మానవాళికి చెందిన భాగమై ఉన్నది.

32

అయితే వారు అది చూశారు, మరియు వారు నిస్సహాయులు అయ్యారు. ఇప్పుడు, ఎలాంటి ఒక స్థలము. నీవు ఊహించితివా? దేవుని ఎదుట అలా గౌరవముగా నడచిన ప్రజలు, ఆయన సూత్రములలో అలా ప్రతీ ఒక్కటీ కాపాడినవారు. వారు పస్కా గొర్రెపిల్లను భుజించారు; వారు ఆ రక్తమును ప్రోక్షించారు; కేవలం మోషే దానిని ఇచ్చినట్టే, గౌరవముతో వారు ప్రతి ఉపదేశమును వెంబడించెను. మరియు అప్పుడు దేవుడు అక్కడ వారిని సరిగ్గా నడిపించెను, మరియు వారిని బంధించెను. ఓ, మై. సహాయము లేనివారై, వారు ఒక కార్యమును చేయలేక పోయిరి.

ఇక్కడ ఎర్ర సముద్రము ఉన్నది; రెండు వైపులా ఇక్కడ పర్వతాలు ఉన్నవి. అంతలో సరిగ్గా వారు ఆ చిన్న శ్రమలో చిక్కుకున్నారు, మరియు ఇక్కడ ఫరో సైన్యము వచ్చుచున్నది. దేవుడు ఒక బంధకములోనికి వారిని నడిపించెను. ఓ, అయితే, మై! అక్కడ జగత్తు ఏర్పడుటకు ముందే దేవుడు వారి ప్రయాణము యొక్క నమూనాను గీచెను. హల్లేలూయ. 'హల్లెలూయ' అని నేను అరచిన కారణమున నేను వెర్రివానినని అనుకొనవద్దు, నేను దానికి సహాయము చేయలేను; నేను ప్రేలిపోవుదును, నేను నమ్ముచున్నాను, ఒకవేళ...

“హల్లేలూయ” అనగా అర్ధము. “దేవునికి స్తోత్రము” హల్లెలూయ, మన దేవునికి స్తోత్రము. మంచిది. ఆ ఒక్క మాట నేను జర్మనీలో పలుకగలను లేక దక్షిణాఫ్రికాలో హాటన్ టాట్స్ కు కూడా, మిగిలిన ఏ భాషలో అయినా పలుకగలను. ఎక్కడైనప్పటికీ ఏమియు కాదు, అది అదే మాటై ఉన్నది, “హల్లెలూయ” అనేది అలాగే ఉండును. “మన దేవునికి స్తోత్రము.”

33

ఇప్పుడు, ఇక్కడ వారంతా అన్నివైపుల నుండి వచ్చారు, దేవుడు తన పిల్లలను ఐగుప్తు యొక్క, సరిగా ఆ ముందు భాగములోనికి త్రోయుచు, వెంట సరిగా వచ్చుచుండగా, మరియు వారిని సరిగా ఈ స్థలములో బందించెను. పరలోకపు దేవుడు ఒక అగ్నిస్తంభము ద్వారా వారిని నడిపించుచుండెను, మరియు వారిని ఈ బంధకములోనికి తీసికొని వచ్చెను.

ఇప్పుడు, అవిశ్వాసము అనగలదు, “ఎందుచేత? అతడు అది ఎందుకు చేశాడు?” అతడు దానిలో నుండి బయటకు వచ్చిన తరువాత వెంటనే, సరిగా వారు అరణ్యములో పాపములోనికి వెళ్ళిరి, సరిగ్గా అక్కడ నుండి ప్రతి సంగతి యందు, సణుగుకొనిరి. దేవుడు ఆయన పిల్లలను ఈ రకమైన మార్గముల గుండా నడిపించును.

కొందరు జలములు ద్వారా, కొందరు వరదలు ద్వారా,

కొందరు లోతైన శోధనలు గుండా, అయితే అందరూ

రక్తము ద్వారానే...

ఆమెన్. అదే పద్ధతి; కేవలం వెంబడించు. ఆయన ఎక్కడకు నడిపించుచున్నను ఏ భేదము పుట్టించవద్దు, కేవలం వెంబడించుచునే ఉండుము. అలా ఇశ్రాయేలు చేసినది ఏదో అదే మరియు సరిగ్గా ఒక బంధకములోనికి నడచెను, కాని మానవ భాగంవైపున అలా వారిని నడిపించిన ఆ గొప్ప దేవుని సమస్తమును మరచిపోయెను, వారు సమస్త అద్భుతాలను మరచిపోయిరి, మరియు ఆశ్చర్యపడుటకు ప్రారంభించి, “మనం ఏమి చేయగలము?” అనిరి.

అప్పుడు మోషే ప్రభువుకు మొర్రపెట్టెను. అంతలో ఒక స్వరము వెనుకకు వచ్చెను, ఊరక నిలచి ఉండుము (హల్లెలూయ) మరియు దేవుని యొక్క రక్షణ. చూడండి. ఏమిటో చూశారా? రక్షణ.

34

సాతాను ద్వారా ఆ ప్రదర్శన రుజువు చేయబడెను. నదిలో మరణం ఉన్నది. విశ్వాసము, విశ్వాసము యొక్క శక్తి, ఐగుప్తును విడచుచూ మరియు వారు చేసిన సమస్త సంగతులు సాతానును సర్వనాశనము చేయుట ద్వారా రుజువు చేయబడెను. అలా అది శక్తివంతముగా ఉండెనని. విశ్వాసము రుజువు చేసెను. ఇప్పుడు, దేవుని గూర్చి ఏమిటి? ఇప్పుడు, వారు ఒక బంధకములో ఉన్నారు. ఇప్పుడు, ఏదో ప్రదర్శించుట కొరకు దేవునికి అది సమయమై ఉన్నది. ప్రజలు ఇక కార్యము చేయలేక ఉండిరి. వారు ప్రతి సూత్రమును వెంబడించారు మరియూ ఒక బంధకములో ఉండెను. ఇప్పుడు, దేవుడు పనిచేయుట కొరకు అది సమయమై యున్నది. అనెను, “ఆయన ఎందుకు అది చేసెను?” ఆయన ప్రేమను వారికి చూపించుట కొరకు.

అలా ఆ కారణం చేత నీవు రోగివై ఉండవచ్చును. ఆయన ప్రేమను నీకు చూపించగోరును. ఒక సారి, నీ రోడ్డు యొక్క అంతమునకు వచ్చునట్లు ఆయన కోరును. కొన్ని వేళల్లో అది చాలా చెడ్డగా ఉన్నదని, మీకు తెలియును, కనుక కొంచెం సేపు మరియు మనం ఒక సారి పైకి చూచునట్లు దేవుడు మన వెనుక భాగము వాల్చి పరుండజేయును. అది సరియేనా? అవును. ఆయన ఆయన ప్రేమను చూపించగోరెను. ఆయన తన యొక్క శక్తిని చూపించగోరెను. దేవుడు తన శక్తిని ప్రత్యక్షపరచుటకు ఇష్టపడును.

నాలుగు-వందల-నలభై సంవత్సరాలకు ముందు ఆయన ఆబ్రహాముతో చెప్పెను. అది ఇరవై సంవత్సరాలకు ముందు... లేక నలభై అయి ఉండెను. ఆ సమయానికి ముందు, అలా ఒక బలమైన హస్తము క్రింద ఇశ్రాయేలు పిల్లలను ఆయన బయటకు తీసికొని వచ్చుచునని చెప్పెను. దేవుడు ఆయన వాగ్దానమును కాపాడవలసి ఉన్నది. అదే దేవుడు ఒక బలమైన హస్తము క్రింద వారిని బయటకు ఆయన తీసికొని వచ్చుదుననియు అలా చెప్పెను, మరియు దానిని అక్షరాలా నెరవేర్చెను, అదే దేవుడు చెప్పెను, “రోగుల మీద చేతులుంచుదురు, వారు బాగుపడుదురు.” ఆయన దానిని అక్షరార్దముగ నెరవేర్చెను. ఎందరో ఏలాగు విమర్శించినను మరియు ప్రజలు వారి వేదాంతములతో లేచినను ఏమియు కాదు మరియు ప్రత్యక్షత లేకుండా, వాక్యము యొక్క మానసిక భావనతో లేచినను ఏమియు కాదు, ఏ విధముగా అయినను దేవుడు ఆయన వాక్యమును కాపాడును. ఆమెన్.

నేను మీపై అరుచుటలేదు. ఈ సంగతిలో భయంకరమైన స్వరము ఉన్నది, మరియు ఇప్పుడు నేను సరిగ్గా చాలా ఎక్కువైన మంచిని అనుభవించుచున్నాను. కనుక నేను దానినుండి దూరముగా వెనుకకు వెళ్ళుటకు ప్రయత్నించుచున్నాను.

35

గమనించండి. దేవుడు కార్యము చేయుటకు వచ్చుట చూడగా, అది అద్భుతముగా లేదా? ఇక్కడ కొంత కాలం క్రిందట, టెక్సాస్, ఆర్లింగ్టన్ వద్ద, ఒక చిన్న దానిలో దిగువన నేను ఉంటిని.... నేను ఎక్కడ ఉన్నానో ఒక రాత్రి హోటలులోనికి వెళ్ళుచుండగా, నేను ఒక స్త్రీ ఏడ్చుట విన్నాను. నేను తలంచాను, “ఎవరో వ్యక్తి కష్టములో ఉన్నాడు. నేను చూచుటకు చుట్టూ తిరుగగా, మరియు కేవలం అది ఒక స్థలము గుండా వచ్చుట అయి ఉన్నది. అక్కడ ఇద్దరు యవ్వన బాలికలు ఉండెను, వారిలో, ఓ, బహుశా ప్రారంభం ఇరవై, ఇరవై-ఒకటి, ఇరవై-రెండు సంవత్సరాలు వయస్సులో, లేత వర్ణములో ఉన్న మరియు నల్లని తలగల బాలిక అక్కడ నిలబడి ఉండెను. వారు వారిచేతులను ఒకరినొకరు పట్టుకొని కన్నీళ్ళు కార్చుచు ఏడ్చుచుండెను.

అంతలో నేను అన్నాను, “మిస్, నన్ను క్షమించండి, నేను....” నేను అన్నాను, “నేను ఒక సేవకుడను, నేను మీకు సహాయం చేయనా?”

ఆమె అన్నది, “అవును, బ్రెన్హాం సోదరుడా.” ఆమె నన్ను ఎరుగునని నేను ఎరిగియుంటిని.

అంతలో నేను అన్నాను, “ఆ సంగతి ఏమై ఉన్నది?”

ఆమె అన్నది, “మేము వరుసలోనికి వచ్చి మరియు ఒక ప్రార్ధనా కార్డును పొందకపోవుట చూశాము. మీరు ఏ హోటలులో నిలచి ఉన్నారో మేము ఎరుగుదుము, కనుక మేము సరిగ్గా ఇక్కడే నిలచి ఉన్నాము. నీ నీడ నా చిన్న స్నేహితురాలి మీదుగా పడినయెడల, మరియు స్వస్థత పొంది ఉండును అని ఆలోచించాను.” ఓ, మై.

నేను అన్నాను, “ఆమెకు జరిగిన సంగతి ఏమై ఉన్నది?”

చెప్పెను, “అది మానసికమైనది. నేను ఆమెను ఇక్కడకు తీసికొని వచ్చాను.”

36

ఆ గొప్ప విశ్వాసములో అక్కడ నిలబడి ఉండగా, తయారు చేసికొన్న విశ్వాసము కాదు, అయితే ఒక నిజమైన విశ్వాసము - ఒక దర్శనము వచ్చెను. నేను చెప్పాను, “అవును. నీవు లుబ్బాక్ దగ్గరనున్న, ఉత్తరాన ఉన్న టెక్సాస్ నుండి వచ్చావు.” నేను అన్నాను, “వచ్చినప్పుడు అక్కడ మార్గం వెంబడి సగము కాంక్రీటు రోడ్డు మరియు మిగిలిన సగము - తారుతో వేయబడి ఉండెను. నీవు ఇక్కడకు ఆమెను ఒక పసుపురంగు బూయిక్ కారులో తీసికొని వచ్చావు.” నేను చెప్పాను, “మీరు ఆ మూలను తిరుగుటకు ప్రారంభించగా మరియు మీరిద్దరూ నవ్వుతూ ఉన్నారు, పై భాగము క్రింద పడిపోయెను, రమారమిగా మీరు పూర్తిగా నష్టపోయారు.” అంతలో ఆమె అరవగలిగినంత హెచ్చు స్థాయిలో, బాధతో భయంతో బిగ్గరగా అరచెను. నేను అన్నాను, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; ఆమె స్వస్థపడెను.” అది సరియైనది. అక్కడ...

మరుసటి రోజు, ఆమె ఆ పట్టణమును మండేటట్లు చేయుదానివలె ఉన్నది, ఆమె దయ్యము యొక్క గూడును కదిలించెను. నన్ను మీకు చెప్ప నివ్వండి. నీవు దయ్యమును కదిలించగోరినయెడల, కేవలం దైవిక స్వస్థతను బోధించండి. పేతురు పెంతెకోస్తు రోజున బోధించెను, మరియు మూడు వేలమంది ఆత్మలు రక్షించబడెను, మరియు సాతాను ఎన్నడూ కూడా కదలలేదు. అయితే రెండు రోజుల తరువాత అతడు శృంగారము అను పిలువబడు ద్వారము నొద్ద కుంటివాడై ఉండిన ఒక మనిషిని స్వస్థపరచెను, మరియు నరకంలో ఉన్నదంతయూ ఆయన మీదకు విడచిపెట్టబడెను. అది సరియైనదే. దేవుడు ఆయన శక్తిని ప్రదర్శించుట అను దానిని చూచుటకు దయ్యము ఇష్టపడదు. అతడు చాలా శక్తిని పొందానని వాడు తలంచును, అయితే అతని పని సమాప్తమాయెను. ఆమెన్. మన క్రీస్తు ప్రాబల్యముగలవాడు. మొట్ట మొదటిగా, ఒక కార్యక్రమములో, ముందుకు అడుగు వేయుము; మొదట నీవే అడుగు వేయము. వానిని నీ మీదకు ఏదో త్రోయు నివ్వకుము.

37

అదే రోజున...... ఒక రెండు రోజుల తరువాత ఇక్కడకు ఆ చిన్న బాలికలు వచ్చారు.... సహోదరుడు బాక్స్టర్ లోనికి వచ్చి మరియు అనెను, “బ్రెన్హాం సోదరుడా,” చెప్పెను, “కష్టమైన, క్లిష్ట పరిస్థితిలోనికి వచ్చాము.”

నేను అన్నాను, “ఆ సంగతి ఏమై ఉన్నది?

“ఓ,” వారు అన్నారు, “వారు ఈ రాత్రి నిన్ను గారడీవాడైన సీమోనుగా బహిర్గతము చేయబోవుచున్నారు.”

నేను అన్నాను, “ఓ, అది అలాగా?”

చెప్పెను, “అవును,” చెప్పెను, “బ్రెన్హాం సోదరుడా, ఆ పట్టణమంతయు వారు కార్డులు ఇచ్చారు,” మరియు చెప్పెను, “స్వస్థపడిన, ఆ ఇద్దరు బాలికలు, నీకు తెలియునా?”

నేను అన్నాను, “అవును.”

చెప్పెను, “వారు ఏడ్చుచూ, ఇంటికి వెళ్ళుటకు వారి బట్టలు మూట కట్టుచూ క్రింద మెట్లు దగ్గర ఉన్నారు.” అనెను, “ఓ, బ్రెన్హాం సోదరుడా, అది విషాదకరమైనది.”

నేను అన్నాను, “ఆ సంగతి ఏమై ఉన్నది?”

అతడు అన్నాడు, “సరేగాని” వారు చెప్పారు, “వారు దానిని ఇష్టపడుట లేదు, ఎందుకనగా వారి సాక్ష్యము ఇక్కడ దిగువన ఆ విధమైన భయంకరమైన పెద్ద గందరగోళముగా ఉండునట్లు కదిలించెను.” వారు మెథడిస్టులై ఉన్నారు. కనుక, వారు అన్నారు, “ఒక విధమైన పెద్ద గందరగోళముగా ఉండునట్లు కదిలించెను.....ఈ రాత్రి యఫ్.బి.ఐ., వారు నీ దగ్గరకు వచ్చి మరియు గారడీవాడైన సీమోనుగా నిన్ను బహిర్గతము చేయుదురు.”

“మంచిదే” నేను అన్నాను, “అదే నిజమైనయెడల, నేను బహిర్గతము చేయబడవలసి ఉన్నది.” చూశారా. నేను అన్నాను, “నిశ్చయముగా.”

అతడు అన్నాడు, “సరేగాని నీవు క్రిందకు వెళ్ళుట చాలా మంచిది మరియు వారితో మాట్లాడుము.” చెప్పెను, “వారు క్రింద మెట్లు దగ్గర ఉన్నారు.”

38

నేను అన్నాను, “వారు ఏ గదిలో ఉన్నారు?” అతడు నాతో చెప్పాడు. నేను వెళ్ళాను మరియు తలుపు తట్టాను. వారు తమ బట్టలు మూట కట్టుచూ, వారు ఏడ్చుచున్నారు.

“ఓ,” చెప్పెను, “బ్రెన్హాం సోదరుడా, మేము చాలా విచారించుచున్నాము.”

నేను అన్నాను, “మీరు దేనిని గూర్చి విచారపడుచున్నారు?” నేను అన్నాను...

ఆమె అన్నది, “ఓ, అలాంటి చాలా కష్టాలకు మేమే కారణమయ్యాము. మేము నిన్ను కష్టములో పెట్టాము.”

నేను అన్నాను, “మీరు పెట్టారా? మీరు నన్ను కష్టంలో పెట్టలేదు; మీరు దయ్యమును కష్టములో పెట్టారు.” నేను అన్నాను, “అలా వాడే కష్టంలో ఉన్నాడు, నేను కాదు.” అనెను.

“సరే, బ్రెన్హాం సోదరుడా,” ఆమె అన్నది, “మేము చాలా విచారించుచున్నాము.” అనెను, “మేము ఈ రోజున ఒక స్త్రీ ప్రక్కన కూర్చున్నాము, మరియు ఆమె అన్నది, మీరు ఆ బ్రెన్హాం పార్టీతో లేరా?” అనెను, “లేదు, అమ్మా.”

అనెను, “ఓ, అవును, మీరు ఉన్నారు.”

అనెను, “లేదు, కేవలం నేను అక్కడ స్వస్థపడ్డాను - ఆ మరో రాత్రి హోటల్లో స్వస్థపడ్డాను.”

చెప్పెను, “వినుము,” అనెను, “ఆ మనిషి ఒక మంత్రగాడు.” చెప్పెను, “మేము దానిని ఎరుగుదుము.”

“ఎందుకు,” ఆమె అన్నది, “ఇక్కడ, యువతి నా యొక్క యాజమానురాలు నాతో వచ్చిన నా స్నేహితురాలు పిచ్చివారి వైద్యశాలకు వెళ్ళుచుండెను. ఆమె పరీక్షించబడెను. ఆమె ఎప్పుడూ పరిపూర్ణముగా బాగయ్యెను.”

చెప్పెను, “ఓ, అవును, నేను ఎరుగుదును. నేను నా సమావేశములో ఒక బాలుని ఉంచాను... అతని సమావేశంలో ఒక సారి టి.బి తో ఉండెను. అంతలో అతడు అక్కడకు వెళ్ళాడు మరియు వాని యొక్క తాంత్రిక - మాంత్రిక విషయాలు దానిపై జరిగించాడు.” చెప్పెను, “ఆ బిడ్డకు టి.బి సోకింది, అయితే అది దయ్యమై ఉండెను.”

39

ఏ వ్యక్తికి దానిని గూర్చి ఇక ఎక్కువ ఏమీ తెలియదు, తెలిసికొనినయెడల ఆ దయ్యానికి స్వస్థపరచుటకు ఏ ఒక్క శక్తియు లేక ఏమియు లేదు. దానిని సవాలు చేయుదును. ఒకవేళ దయ్యము స్వస్థపరచగలిగినయెడల, వాడు దేవుని సహకారిగా ఉన్నాడు. “నీ రోగములన్నింటిని స్వస్థపరచు యెహోవాను నేనే.” ఆ దయ్యానికి అది లేదు....

అక్కడ ఉన్న ఐగుప్తీయులు, వారు వారి భవిష్యత్తు గూర్చి చెప్పువారు మరియు మొదలైనవి తీసికొని వచ్చినప్పుడు - అది వారి మధ్య గొప్ప వివాదమై ఉండెను. వారు కార్యములు చేయుదురు, అయితే వారు స్వస్థపరచలేరు. ప్రతిసారి ఆ మాంత్రికులు ఏదో ఒకటి చేసి ఉన్నప్పుడు... మోషే ఏదో ఒకటి చేసినపుడు, వారు దానిని పోలికతో అనుసరించిరి; అయితే వారు దానిని తీసికొని రాగలిగి ఉండిరి, కాని వారు దానిని లేకుండునట్లు తీసివేయలేక పోయిరి. కనుక అలా స్వస్థపరచువాడు దేవుడు మాత్రమే అని అది తెలుపుచున్నది. ఆమెన్.

40

కాబట్టి ఆమె అన్నది, “మేము విచారపడుచున్నాము. మేము ఇంటికి వెళ్ళుచున్నాము. మరియు అనెను, ”కనుక మేము విచారించుచున్నాము. మేము అలా...“

నేను అన్నాను, “ఇప్పుడు చూడండి. ఆ బాలిక స్వస్థపడెనని మీకు తెలియును.”

“అవును.”

నేను అన్నాను, “దేవుడు స్వస్థపరచుటలో అద్భుతమైనవాడు కాడా?”

చెప్పెను, “అవును.”

నేను అన్నాను, “నీవు యుద్ధములో ఆయనను చూడవలసి ఉన్నది. బాలుడా, ఆయన ఆశ్చర్యకరుడు!”

చెప్పెను, “నీవు అక్కడ ఆవలకు వెళ్ళుటలేదా?”

నేను చెప్పాను, “సరే, నేను ప్రయాణించుదునని మీరు ఉద్దేశించుట లేదు, మీరు అలా ఉద్దేశ్యం కలిగి ఉన్నారా?” నేను చెప్పాను, “నిశ్చయముగా, నేను అక్కడ అవతలకు వెళుచున్నాను.”

చెప్పెను, “బ్రెన్హాం సోదరుడా, ఆ యఫ్.బి.ఐ. (నిఘా విభాగము యొక్క సమాఖ్య) వారు నీ సంగతి బయట పెట్టబోవుచున్నారు?”

నేను చెప్పాను, “ఏమి బహిర్గతము చేయబోవుచున్నారు? బహిర్గతం చేయుటకు వారికి ఏమి ఉన్నది?” నేను అన్నాను, “బహిర్గతముగా చేయబడుటకు నేను నాకు తెలిసినంత అత్యుత్తమముగా ప్రయత్నించుచున్నాను, నేను ప్రతి మనిషికి నాకు తెలిసినంత చాల మంచిగా సువార్తను అందించగలనని ప్రయత్నించుచున్నాను.” నేను అన్నాను, “నేను కొంచెం అలా వెంబడించుటకు సహాయము పొందవలెనని ఇష్టపడుదును.”

అనెను, “నీవు అవతలివైపుకు వెళ్ళుచున్నావని నీ ఉద్దేశమా?”

41

నేను అన్నాను, “నిశ్చయంగా.” నేను చెప్పాను, “రమ్ము మరియు యుద్దములో ప్రభువును చూడుము. స్వస్థపరచుటలో ఆయన ఆశ్చర్యకరుడు అని మీకు తెలియును. ఒకసారి పోరాటములో ఆయనను చూడండి ఏమిటి అని చూడండి - ఆయన అక్కడ ఎంత గొప్పవాడో చూడండి.” నేను అన్నాను, “ఓ, ఆయన పోరాటములో మరపురానివాడు.” నేను చెప్పాను అయితే ఆయన విజయమును మూటగట్టుటకు బయటకు వచ్చెననునది తప్ప, నేను ఇంకా ఆయన పోరాటంలో వచ్చుట ఎన్నడూ చూడలేదు. వారు ఆయనను నరకములో ఉంచినప్పుడు కూడ ఆయన ఆయన శిరస్సును ఉంచెను... ఓ, ఆయన పాదమును దయ్యం మెడ మీద ఉంచెను మరియు మరణం యొక్క తాళపు చెవులను ఆయన నుండి దూరముగా పారేసి, మూడవ రోజున లేచెను, మరణంలో కూడ ఆయన విజయములో బయటకు వచ్చెను.“ అనెను, ”సాతాను ఆయనపై ఏదియు ఉంచలేకపోయేను.“

సరే, నేను అవతలకు వెళ్ళాను. ఆ రాత్రి, నేను అవతలకు వెళ్ళినప్పుడు, వారు దగ్గర ఉండెను..... ఆ సంరక్షకుడు కొందరు చిన్న స్వానిష్ బాలురు బయట పట్టుకొని ఉండుట కలిగి ఉండెను........ అనెను, “ప్రార్ధనాపూర్వకముగా వ్రాయబడెను. దైవిక స్వస్థత సరియైనదిగా ఉండవచ్చును, అయితే గారడీవాడైన సీమోను ఇంకా పని మీదనే ఉండెను.”

కాబట్టి నేను నడిచాను..... నేను అన్నాను, “సహోదరుడా బాక్స్టర్, మీరు అందరు, కేవలం భవనము విడిచిపెట్టండి; వెనుకకు వెళ్ళండి.” అక్కడ మూడు, లేదా నాలుగువేల మంది ప్రజలు, లేదా అక్కడ ఐదువేల మంది ఉండెను, కేవలం అప్పుడే మీటింగు ప్రారంభమాయెను. నేను అన్నాను, “అలా నేను గారడీవాడైన సీమోనునై ఉంటినని చెప్పబడిన ఒక చిన్న టికెట్ నేను కలిగి ఉన్నాను. మరియు (F.B.I) నిఘా విభాగము యొక్క సమాఖ్య నన్ను బహిర్గతం చేయనై ఉన్నారు.” నేను అన్నాను,“మేము ఇపుడే సరిగా మన చేతుల మీద నుండి సరిగా మనం తొలగించుకొనగలము. మీరు ముందుకు రండి మరియు ఇక్కడే నన్ను బహిర్గతం చెయ్యండి. నేను మీరు రావలెనని కోరుచున్నాను.” నేను కొద్దిసేపు వేచియున్నాను.

నేను అన్నాను, “మీరు ఎక్కడ ఉన్నారు ? ఎందుకు మీరు ముందుకు వచ్చుటలేదు?” కాబట్టి నేను వేచియున్నాను, అది ఏమై ఉండెనని నేను ఆశ్చర్యపడ్డాను. దానిని గూర్చిన అది ఏమై ఉండెనో నేను ఎరుగను.

42

ఆ మూలలో కుడి ప్రక్కగా అవతల నేను గమనించాను, అక్కడ ఒక పెద్ద నల్లని ఛాయ అక్కడ నిలిచియుండెను. “అది దేనికొరకు అయి ఉన్నది?” అని నేను ఆశ్చర్యపడ్డాను. నేను వెనుకకు తిరిగి చూచాను. అది అక్కడ నుండి కదిలెను. ప్రజల మీదకు వచ్చెను మరియు పైకి బాల్కెనికి నడిచెను. మరియు నీలపురంగు సూటుతో, ఉన్న మనిషి మీదకు బూడిదరంగు సూటుతో ఉన్న ఒకని మీదకు వ్రేలాడెను. ఒక దర్శనము వచ్చెను.

నేను చెప్పాను, “అది ఎఫ్.బి.ఐ; (నిఘా విభాగము యొక్క సమాఖ్య) కాదు. అది సరిగా అక్కడ కూర్చొనివున్న వెనుకకు జారిన ఇద్దరు బోధకులే.” వారు ఈ విధంగా క్రిందకు దిగి వచ్చారు. నేను అన్నాను, “క్రిందికి దిగి రావద్దు.” నేను చెప్పాను. “ఇప్పుడు....” ముగ్గురు లేక నలుగురు ఆ గొప్ప టెక్సికన్స్ వారు పద్ధతి క్రమము లేనివారు వానిని పట్టుకొనుటకు వెళ్ళారు. నేను అన్నాను, “వద్దు వద్దు, వద్దు. అలా చేయవద్దు. ఇది రక్తమాంసములతో చేయు ఒక సంగతి కాదు. వారిని ఒంటరిగా ఉండనియ్యండి.” కారణం ఏమనగా వారు వాని మెడకు చుట్టూ ఒక త్రాడు ఉంచారు. కాబట్టి నేను చెప్పాను, “అలా చేయవద్దు.” అయితే నేను మీకు ఏదో ఒకటి తెలియజేయనివ్వండి. నేను గారడీవాడైన సీమోనును అయినయెడల, నేను బహిర్గతము కావలసిన అవసరము ఉన్నది. నేను గారడీవాడైన సీమోనును అయిన యెడల, మీరు ఇక్కడ వేదిక వద్దకు దిగిరండి. నేను గారడీవాడైన సీమోనునైనయెడల, నేను ఈ వేదిక మీదనే పడి చనిపోదును. మరియు నేను ఒక దేవుని మనిషిని అయినయెడల, మీరు క్రిందకు రండి, మరియు మీరు పొరపాటులో ఉన్న వారగుదురు, మరియు నేను ఒక దేవుని మనిషిని అయినయెడల మీరు వేదికమీదనే పడిచనిపోవుదురు, మరియు ఎవరు సరియైనవారో మరియు ఎవరు పొరపాటులో ఉన్నవారో సమాజమును చూడనివ్వండి. ఎవరు సరియైనవారో దేవునికి సాక్ష్యము ఇవ్వనియ్యండి.

కాబట్టి వారు అక్కడ కొంచెంసేపు కూర్చుని ఉన్నారు, నేను అన్నాను, “మంచిది, మనం ఒక స్తుతి కీర్తన పాడెదము.” నేను ఒక స్తుతి కీర్తన పాడుటకు ప్రారంభించినప్పుడు, వారు పైకివచ్చి మరియు ఆ వేదిక గుండా బయటకు వెళ్ళిరి. మేము ముప్పయి నిమిషాలు కనిపెట్టాము మరియు లోనికి ఏ వ్యక్తియు ఎన్నడూ రాలేదు. వారు అప్పటి నుండి ఎన్నడూ లోనికి వచ్చి ఉండలేదు. నిశ్చయముగా.

43

నేను అన్నాను, “ప్రతి చోటను, ఇలాంటి స్థితినిగూర్చి అలసి మరియు విసిగిపోయాను.” పోరాటములో దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఆయన నిన్ను పంపినప్పుడు భయపడవద్దు. అక్కడ నిలబడి మరియు దేవుని యొక్క రక్షణను చూడండి. అనెను, “ఊరక నిలుచుండుడి.” అక్కడ రక్షణను ఉత్పత్తి చేయుగల ఒకే ఒక్కరు ఉన్నారు, అది దేవుడే. ఆయన చెప్పెను, ఇప్పుడు, ఊరక నిలుచుండి మరియు దేవుని యొక్క రక్షణను చూడండి.

ఇక్కడకు సైన్యము వచ్చెను. ఓ, నేను దానిగూర్చి ఆలోచించినప్పుడు. ఇక్కడకు సైన్యం వచ్చెను మరియు ధూళి రేగుచుండెను. మోషే దేవుని యొక్క రక్షణను ఊరక నిలుచుండి చూచినప్పుడు, ఆ గొప్ప అగ్నిస్తంభము వారి ముందు వ్రేలాడుచుండగా వారిని ఈ బంధకములోనికి నడిపించి, అవతలకు కదలి వెళ్ళి, మరియు ఇశ్రాయేలీయులకు ఫరోకు మధ్యగా నిలిచెను. వారు ఆ వెలుగును నిరాకరించెను.

ఆ వెలుగును నిరాకరించిన ఏ మనిషి అయినను, వారు పొందిన అదే కార్యమును పొందుదురు. అది వారికి గాడాంధకారమయిన అర్ధరాత్రి ఆయెను. నడుచుటకు ఇశ్రాయేలు పిల్లల కొరకు ఉన్న వెలుగును ఇచ్చిన అదే వెలుగు, ఫరోను మరియు వాని సైన్యము యొక్క కన్నులకు గుడ్డితనం కలిగించెను. మీరు అజ్ఞానము అని పిలుచు అదే పరిశుద్ధాత్ముని సువార్త, ఈ రాత్రి సంఘమును మహిమకు, అధునాతన వేదాంతుల యొక్క కండ్లకు అంధకారమును తీసికొని రాగలదు.

44

అలా పునరుత్థానుడైన యేసుక్రీస్తును నిలబెట్టిన శక్తిలో ఉన్న అదే పరిశుద్ధాత్మ - ఈ రాత్రి ఈ భవనంలో అదే అధునాతన దినపు బోధకుడు మరియు వాని యొక్క సంఘము కండ్లకు గుడ్డితనము కలిగించును. అలా వారికి గుడ్డితనం కలిగించిన అదే కార్యము యేసు పునరుత్థానము మరియు పెంతెకొస్తు దినము నుండి వెలుగును ఇచ్చి ఉన్నది (హల్లెలూయ) దేవుడు దానిని చేయును. నీవు దానిని విశదీకరించగలవా? అయితే నీవు వెలుగును, అంగీకరించనియెడల, అది నీకు అంధకారముగా మారును. నీవు దానిని విమర్శించగలవు, మరియు దానిని పరిశుద్ద గుండ్రాయి అని పిలువగలవు, మరియు నీవు నీ మెడకు తీరుగటిరాయి కట్టుకొని మరియు సముద్రములో ముంచబడుట మంచిది. నీవు పరిశుద్ధాత్మను దూషించినావు. అక్కడ క్షమాపణ లేదు.

చెప్పెను, “మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడినవాడు క్షమించబడును. అయితే పరిశుద్ధాత్మునికి విరుద్దముగా నీవు మాట్లాడినయెడల, అది ఎన్నడూ క్షమించబడదు.”

అయితే, ఓ, నీకు చాలా ఎక్కవగా తెలియును. కనుక దేవుని శక్తులను మరియు క్రీస్తు పునరుత్థానమును, మరియు దైవిక స్వస్థతయందు నమ్మిక ఉంచుచూ దేవుని ఆత్మలో ఉన్న ప్రజలను నీవు అపహాస్యము చేసితివి. నీవు దానిని అపహాస్యం చేసి, “నీ ముక్కును వంచి మరియు సంఘములో నుండి బయటకు నడచిపోవుదువు.

ఈ వర్తమానము పంపిన రాజు ఎదుట నీవు నిలచి ఉన్నపుడు ఏమి జరుగునో నీవు చూడవలేనని నేను కోరుచున్నాను. ఉహ్-హు! ఓ, నీవు దానిని ఎక్కువగా పొందానని తలంచుచున్నావు, అయితే కేవలం ఆ రోజు వచ్చేవరకు కనిపెట్టుము. ఇది మనుష్యుని యొక్క దినము, ప్రభు దినము వచ్చుచున్నది. అది యధార్ధము.

45

గమనించండి. ఎలాంటి, మరపురానిది. అదే విధమైనది... ఓ, నేను అదంతయు నెరవేర్చాను. నేను మానివేయుట చాలా మంచిది. దేవుడు ఆయన శక్తిలో ఉన్నాడు. కేవలం ఒక క్షణము. దేవుడు ఆయన శక్తిలో కదులుచుండును.

ఆయన చెప్పెను, “మోషే దీనిని గూర్చి నీవు నాకు మొరపెట్టుచున్నావు? నీ చేతిలో ఉన్న కర్రను తీసికొని మరియు నీ చేతిని చాపి మరియు ముందుకు వెళ్ళుము.” హల్లెలూయా. అతని చేతిలో కర్రను పట్టుకొని మోషే ఇక్కడకు వెళ్ళెను. మరొకచేయి పైకెత్తి చెప్పచుండెను.

మనం వెలుగులో నడిచెదము, ఏలాంటి ఒక రమ్యమైన వెలుగు,

ప్రకాశవంతమైన కరుణ యొక్క మహిమ బిందువులు యొద్దకు రమ్ము.

ఒక అగ్నిస్తంభములో దేవుని దూత వారికి ముందుగా వెళ్ళుచుండెను, ఒడ్డునకు వారిని సరిగా నడిపించుచుండెను, మరియు వారు అక్కడకు వెళ్లినప్పుడు, వారి కొరకు అది గోడగా ఏర్పడెను. మరియు వారు సరిగా ఆ బంధకములో నుండి బయటకు నడిచి పోయిరి, దేవుడు ఆయన ప్రేమ మరియు శక్తిని ప్రదర్శించుచుండెను.

ఇతరమైన ఏ సహాయము లేనపుడు. ఆమెన్.

46

సాతాను యొక్క శక్తి పరిమితమైనది. విశ్వాసము యొక్క శక్తి దేవుని బయలుపరచబడిన ప్రత్యక్షతను జరిగించుటకు తీసుకొని వెళ్ళును. దేవుడు ఎవరైతే కార్యము జరిగించలేమనియు మరియు తమకు తాము ఏ సహాయం చేసికొనలేమని అనుకొందురో అలాటి వారికి సహాయం చేయును.

దేవుని యెడల గౌరవం లేని, ఆ ప్రాచీన కాలపు సామెత అలా చెప్పెను, “ఎవరైతే తమకు తామే సహాయం చేసికొనగలరో దేవుడు వారికి సహాయం చేయును.”

ఎంత అపహస్యముగా ఉన్నది! ఎవరు తమకు తామే సహాయము చేసికొనలేరో వారికే దేవుడు సహయం చేయును. ఆమెన్. ఓ, ఆయన ఆశ్చర్యకరుడు కాదా? దానిని చేయునది ఏమనగా, దేవుని శక్తియే. అలా నిత్యజీవమును ఇవ్వగలిగినది దేవుని యొక్క శక్తి మాత్రమే. ఆ సంగతి దేవుని యొక్క శక్తి మాత్రమే అయి ఉన్నది. అలా ఒక చెట్టును నిర్మించినది దేవుని శక్తియే. ప్రపంచములో సమస్త శాస్త్ర విజ్ఞానము ఒక చెట్టును నిర్మించగలది కాదు. దేవుని శక్తి చెట్టును నిర్మించును. దేవుని శక్తియే నన్ను సజీవునిగా కాపాడును.

47

దేవుడు సమస్త ఆసుపత్రులను, ఆక్సిజను టెంట్లను ప్రపంచంలో పుల్ మోటారులు (విద్యుదయస్కాంత పరికరములు)ను నీ కొరకు పిలచినయెడల, నిన్ను ఇక్కడ కాపాడలేవు. రక్షణ ప్రభువు నుండి వచ్చును. ఆ పిచ్చుకను పోషించునది అది దేవుని శక్తియే. ఆ దూరాన ఉన్న ఆ చిన్న బాతుతో అలా మాట్లాడునది అది దేవుని శక్తియే. అక్కడకు వెళ్ళు ఏ వ్యక్తియు లేడు మరియు సరస్సు నుండి దానిని వెళ్ళిపొమ్మని ప్రేరేపించి, మరియు “ లూసియానాకు వెళ్ళు,” అని చెప్పు ఏ వ్యక్తియూ లేడు. లేదు, అయ్య. ఆ సరస్సు నుండి వానిని (దానిని) ప్రేరణతో వెళ్ళమని చెప్పునది దేవుని శక్తియే. ఆ చిన్న వ్యక్తి (జీవి)కి ఏ మార్గమునకు వెళ్ళవలెనో తెలియదు.

వానిని (దానిని) దక్షిణమునకు అలా వెళ్ళమని మార్గదర్శిగా ఉన్నది దేవుని శక్తియే. వారిని యేసుక్రీస్తు దగ్గరకు నడిపించునది దేవుని శక్తియే. ఊయల దగ్గరకు జ్ఞానులను తీసికొని పోయినది దేవుని శక్తియే. ప్రతి విశ్వాసి యొక్క ఆత్మను అలా అది పులకరింపజేయునది దేవుని శక్తియే. ఆమెన్. ఎవరైతే తమంత తాము సహాయం చేసికొనలేరో అలాటి వారికి సహయము చేయుటకే దేవుని శక్తి. ఆమెన్.

ముగించు ముందుగా నీవు ఆ చిన్న పుస్తకము యొక్క ఆ చిన్న కథను చదివి ఉండవచ్చును. నేను ఒక వేటగాడును, అడవులను ప్రేమించే ఒకడని అలా మీకు తెలియును. ఇక్కడే కొంతకాలం క్రిందట, మూడు, నాలుగు లేక మూడు నెలల క్రితం కావచ్చును, ఇక్కడే ఈ చుట్టూ ఉన్న మీ బాలురు, లియో మరియు జీన్, అని నేను పిలిచే నా ఇద్దరి విద్యార్థులతో ఇక్కడే నేను కూర్చునియున్నాను. వారు ఇక్కడకు వచ్చి మరియు ఈ చుట్టూ ఉన్న ప్రాంతములో నన్ను వెంబడించారు. వారు ముందు వసారాలో కూర్చుని ఉన్నారు మరియు నేను వారికి దేవుని సంగతులు బోదించుచూ ఉంటిని.

48

మన పట్టణంలో ఒక యవ్వన స్త్రీ ఒక శిశువునకు జన్మనిచ్చినది. ఆమెకు అది అక్కరలేదు. కాబట్టి అది ఒక అందమైన యవ్వన స్త్రీ అయి ఉండెను. ఆమె ఆ బిడ్డను తీసుకుని మరియు ఒక దుప్పటిలో చుట్టి, దానికి చుట్టూ ఒక తీగెను ఉంచి మరియు ఒక టాక్సీ క్యాబ్ తీసుకొని మరియు బయటకు వంతెన మీదకు వెళ్ళి మరియు నదిలో జారవిడిచెను. వారు ఆమెను పట్టుకొని బందించారు.

కనుక మేము అక్కడ కూర్చుని దాని గూర్చి మాట్లాడుచున్నాము. ఇక్కడున్న శ్రీ. మరియు శ్రీమతి. ఉడ్, పుస్తకాలు అమ్మే మనిషి, కేవలం సరిగా నివసించుచున్నారు — కేవలం నాకు పొరుగువారిగ ద్వారము దగ్గర, వారు అక్కడే ఉన్నారు. పాల మనిషి అప్పుడే వచ్చి ఉండెను. అక్కడ ఉదయాన ముందు వసారాలో కూర్చుండెను, అది ఉండగలిగిన వేడిగా ఉన్నది, నేను ఆ రోడ్డు పైకి వచ్చుట మరియు లోనికి తిరిగిపోవుట గమనించాను. అక్కడకు నాకు మధ్యలో నాలుగు ఇళ్ళు ఉన్నవి మరియు అక్కడ అవతల అడవులు, ఆర్కిటిక్ ఊటలు ఉన్నవి, ఇక్కడకు ఆ వృద్ద పొసమ్ (possum - అమెరికాలోని ఒక జంతువు.) ఈడ్చుకొనుచూ వచ్చెను. ఏ విధమైన కంచె లేనటువంటి ఆ స్థలములలో ప్రతీ స్థలమునకు అది వెళ్ళెను. అంతలో అది రాయితో కట్టబడిన సంరక్షణ గోడ గల నా దానిలోనికి అది వచ్చెను. అది ప్రజలు నడిచే వీధిగుండా వచ్చుటకు ప్రారంభించెను.

49

మంచిదే, ఇప్పుడు, నేను జంతువులను గూర్చి సంపూర్ణముగా అవగాహన కలిగియున్నాను. నేను వాటిని గూర్చి అభ్యాసము చేసాను. నేను కొన్ని సంవత్సరాల నుండీ గేమ్-వార్డెన్ గా ఉంటిని. నేను అరణ్య జీవితమును ప్రేమించుదును. దానిలో నివసించుదును. మరియు దానిని అభ్యాసము చేశాను. ఒక పొసమ్ అనునది, గుడ్ల గూబవలె, పగటి సమయంలో గుడ్డిగా ఉండును. అది రాత్రి సమయంలో ప్రయాణించును, దానికి అంతరాయము కలిగి మరియు ఆందోళన కలిగినప్పుడే గాని అది పగటి సమయములో ప్రయాణం చేయదు.

సరే, ఇక్కడకు ఈ పొసమ్ వచ్చెను మరియు అక్కడ నా ఇంటి వైపుకు ఎందుచేత అది సరిగ్గా తిరిగెను అని నేను ఆశ్చర్యపడ్డాను. నేను అన్నాను, “అది రాబిస్ అను వ్యాధిచే బాధపడుచు ఉండవచ్చును.” కనుక ఇక్కడ జీన్ మరియు లియో కు నేను చెప్పాను, “నేను...” బయటకు వెళ్ళి మరియు అక్కడ పెరటిలో ఉన్న ఒక గొర్రును తీసుకున్నాను, సహోదరుడు ఉడ్ గడ్డిని పోగుచేయుటకు దానిని ఉపయోగించిన చోటను అని నేను నమ్ముచున్నాను, కనుక అంతలో నేను పొసమ్ మీదుగా ఆ గొర్రును ఉంచాను. సాధారణముగా వారు “ప్లే-పొసమ్” అని ఎలా పిలిచుదురో కేవలం ముందు పళ్ళు కనబడునట్లు నవ్వుచు మరియు క్రింద పండుకొనును.

అయితే దానికి బదులుగా , అది గొర్రును పండ్లతో కొరికెను. నేను ఆశ్చర్యపడ్డాను, “సరే” నేను అన్నాను, “అది బాక్టీరియాతో అంటుకొనిన వ్యాధి అయినా అయి ఉండును, లేక అది కేవలం మరణించునంతగా కలిగిన గాయం అయి ఉండునని ఊహించుచున్నాను.” నేను ఇక్కడ గమనించాను, దీనిని క్షమించండి; ఒక విధముగా అది చెప్పుటకు అసహ్యము: అయితే దానికి అక్కడ మొత్తం అంతట పురుగులు, ఈగల వలన కలిగిన గట్టి పుండ్లు కలవు. పచ్చరంగు ఈగలు దాని మొత్తం అంతట పొడుచుచున్నవి. దాని యొక్క కాలు ఒక కుక్క వలన నమలబడెను, లేక ఒక కారు మీదుగా పరుగెత్తుట లేక ఏదో ఒక సంగతి, మరియు అది పగిలియుండును మరియు అది ఆ విధముగా ఈడ్చుచుండెను.

సరే గాని, అది దానిని కొరుకుచుండెను.

50

నేను గమనించియుండగా, ఆమె (అది) అలా ఎక్కువగా అలసిపోయి ఉండగా, నేను ఆ గొర్రును దానిపై ఉంచాను... ఇప్పుడు, ఒక పొసమ్, ఒక కంగారు (అది ఒక జంతువు) మరియు ఒక పొసమ్ ఆ రెండు జంతువులు మాత్రమే వాటి పిల్లలను మోయుటకు (మూట కట్టుటకు) జేబును (సంచివంటిది) కలిగివుండును. ఆ జేబు వదులుగా అగునంతగా, అలా అది ఎక్కువగా అలసియుండెను. ఎందుకు అది అంత కఠినంగా పోరాడుచుండెనో నేను గమనించాను; ఆ చిన్న తొమ్మిది పిల్లలను గూర్చి ఆ విధముగా తీవ్రమైన వాంఛ కలిగి ఉన్నది. అది నిరాశలో ఉన్నప్పుడు, సరే, అప్పుడు నేను ఆ బాలురతో చెప్పాను; నేను అన్నాను, “ఇప్పుడు బాలురూ ఇక్కడకు రండి. నేను మీకు ఒక పాఠమును చూపించగలను (నేర్పగలను) ఈ మూగదైన జంతువు (ఈ పొసమ్ ను) గూర్చి అక్కడ నిజముగా మరి ఎక్కువైన మాతృత్వము ఉన్నది, అక్కడ ఆమె బిడ్డను నదిలో ముంచివేసిన ఆ స్త్రీ కంటే ఎక్కువ మాతృత్వము ఉన్నది.” అది యదార్ధము.

నేను చెప్పాను, “మీరు చూడండి, ఆ స్త్రీ, ఆరోగ్యంగా ఉండి, యవ్వనురాలుగా, అందమైనదిగా ఉండి, కనుక ఆమె రహదారి ప్రక్కన ఉన్న విశ్రాంతి గదులకు పరుగెత్తి మరియు మంచి సమయము కలిగియుండి, ఆమె ఆ చిన్న దీనమైన అమాయక బిడ్డను నీట ముంచినది మరియు నదిలో పడవేసెను.” అంతలో నేను అన్నాను, ఇప్పుడు, “ఈ తల్లియైన పొసమ్, బహుశా బ్రతుకుటకు మరొక ఇరవై నిమిషాలు లేక ముప్పై నిమిషాలు ఉన్నవి. ఆమె మరణమగునంతగా గాయపరచబడి ఉండెను.” నేను అన్నాను, “ఆమె ముప్పై నిమిషాల కన్నా ఎక్కువ బ్రతకలేదు. ఆమె (అది) ఆ ముప్పై నిమిషాలు ఆ బిడ్డలు కొరకు పోరాడుటకు ఇవ్వగలదు.” నేను అన్నాను, “అక్కడ ఆ స్త్రీ కంటే అక్కడ ఈ పొసమ్ ను గూర్చి మరింత ఎక్కువ మాతృత్వము మరియు నిజమైన నీతులు కలవు.” అది అలా ఉన్నది.

ఒక స్త్రీ ఒక అద్భుతమైనది, మనుష్యుడు కూడ, అద్భుతమైనవాడే, అయితే వారు దేవుని నుండి దూరముగా తొలగిపోయినప్పుడు, వారు జంతువుల కంటే చాలా తక్కువ క్రింద స్థాయిలో ఉన్నారు. అది సరియైనది. వారు అలా ఒక జంతువు చేసియుండని కార్యములు చేయుదురు. కాబట్టి అప్పుడు, నేను గుర్తించాను....

51

కనుక అంతలో, నేను దాని నుండి ఆ గొర్రును తొలగించాను, మరియు అది ఒక నిమిషం అయినను అనుమానించలేదు. అది పైకి లేచి మరియు సరిగా పైకి వచ్చి, సరిగ్గా నా మెట్లు క్రింద ఉండెను. సరే, నేను అక్కడ పైకి వెళ్ళాను, మరియు నేను దానిని కొద్దిగా పిడికిలితో చరిచాను, మరియు కేవలము అది కదలలేదు. అది గతించియుండెను. వారు అన్నారు, “అది చనిపోయినది”.

నేను అన్నాను, “నాకు తెలియదు.” నేను నా కర్రను దానిమీద ఉంచాను. అంతలో కాదు, అది చనిపోలేదు. ఆ దీనమైన శిశువు దశలో ఉన్న చిన్న పొసమ్ లు దానినుండి పాలు త్రాగుటకు ప్రయత్నించుచుండెను.

మంచిదే, శ్రీమతి. ఉడ్, ఆమె నేను ఎన్నడైన చూచిన, ప్రేమగల దేవునిచే తిరిగి-జన్మించిన క్రైస్తవరాలు ఇక్కడ కూర్చొని ఉన్నది. అయితే జంతువుల వ్యాధులను గూర్చి దయగలిగి ఉన్నది. ఆమె అన్నది, “బ్రెన్హాం సహోదరుడా, ఇప్పుడు ఆ పొసమ్ ను చంపుటయే మానవునిగా చేయు కార్యమైయున్నది.” అనెను, బ్రెన్హాం సోదరుడా నేను నీకు చెప్పగలను,“ చెప్పెను, ”ఆ పిల్లలు దాని నుండి పాలు త్రాగుట నీవు చూస్తున్నావు అంతలో బహుశా, చనిపోయి ఉండును, లేక ఒక రెండు నిమిషాలలో చనిపోవును,“ అనెను. ”ఆ పిల్లలు చనిపోగలవు, చూశారా.“ చెప్పెను, ”కేవలం అది మరణమగుటకు, తిండి లేక మాడిపోవును.“ అంతలో అనెను, ”చేయవలసిన కార్యము, కేవలము ఆ పిల్లలను తీసుకొని మరియు వాటిని చంపుటయే, మరియు ఆ వృద్ధ తల్లి పొసమ్ ను చంపుటయే,“ కారణం ఏమనగా నీవు వాటిని పెంచలేవు, అవి కేవలం అలా ఆ విధముగా చిన్న జీవులైయుండెను.” అనెను, “నీవు వాటిని పెంచలేవు.”

52

నేను అన్నాను, “ఉడ్ సహోదరి, అది యధార్ధమని నాకు తెలియును.” అయితే నేను చెప్పాను, “కేవలము నేను అది చేయలేను.”

“ఎందుచేత?” ఆమె అన్నది, “నీవు ఒక వేటగాడివి కాదా?”

నేను అన్నాను, “అవును, కాని నేను చంపేవాడను కాదు.” నేను అన్నాను, “నేను అది ఏ మాత్రము చేయలేను.” నేను చెప్పాను, “ఆ పొసమ్ లు తినగలిగినవే. ప్రజలు వాటిని తిందురు, మరియు అవి ఆహారమైయున్నవి.” నేను అన్నాను, “నేను చాలా వాటిని చంపాను, కాని దానిని తినుటకు నేను చంపాను.” అయితే నేను చెప్పాను, “కాదు - కేవలం అలా కాదు.”

అంతలో ఆమె అన్నది, “సరే, బేంక్స్ దానిని చేయనియ్యి.” నా ప్రియమైన మంచి సన్నిహితుడయిన వ్యక్తి, అలా ఆమెకు భర్త. అంతలో అనెను, “బేంక్స్ దానిని చెయ్యనియ్యి.”

నేను అన్నాను, “అతడు కూడా ఆలాగు చేయుటకు నేను కోరను.” మంచిదే, ఆమె ముందుకు వెళ్ళినది. ఆమె చేయగలిగిన దంతా

అదే.

ఓ, ఆ పగలంతయు దాని గూర్చి తీవ్రంగా వాంచించాము. ఆ పొసమ్ ను నేను పోషించుటకు ప్రయత్నించాను. ఆమె (అది) ఇక ఎన్నడూ కదలలేదు మరియు ఆ దీన చిన్నవైన శిశువు దశలో ఆ పొసమ్ లు మరియు పాలు త్రాగుటకు ప్రయత్నించుచుండెను. అక్కడ అప్పుడు ఆ మండుచున్న సూర్యుని ఎండలో, సరిగా దాని మీద ప్రకాశించుచుండగా పడి ఉండెను. నేను అనుకున్నాను, “ఓ, మై! ఏలాటి ఒక దృశ్యము.” ఆమె (దాని) కాలు మార్గములో అలా, ఉబ్బి ఉండెను, దానికి మీదుగా అంతయూ దెబ్బలు మరియు దానిచుట్టూ అంతా ఈగలు ఉండెను. దాని మీద నీళ్ళు కుమ్మరించుటకు నేను ప్రయత్నించాను, ఆ ఈగలు తరిమివేయుటకు, అని మీకు తెలియును. అంతలో అవి మరలా వచ్చెను. మరియు, ఓ, దానిలో రక్తప్రసరణలోపం వలన భయంకర వ్యాధి ఉండెను మరియు మొదలైనవి.

కనుక నేను అన్నాను, “మై అది చూపునకు భయంకరమైనది.”

53

కాబట్టి, రాత్రి తీవ్ర వాంఛతో, సహోదరుడు ఉడ్స్ పైకి వచ్చి మరియు అతడు అనెను, “ఇప్పుడు, సహోదరుడా బ్రెన్హాం, ప్రజలు రాకపోకలు, ప్రతి దానిలో, ఈ రోజు నీవు విరామము లేకుండా ఉన్నావు,” అనెను, “నీవు ఒక చిన్న సవారీ చేయుట చాల మంచిది.” కనుక అతడు మరియు అతని భార్య, మరియు నా భార్య మరియు నేను, మేము కారులో ఎక్కి మరియు దేశమంతటిగుండా బయట మార్గంలో స్వారీ చేశాము. మేము వెంబడి అలా స్వారీ చేయుచుండగా, మరియు ఉన్నపాటున, నా భార్య, చెప్పెనని, నేను నమ్ముచున్నాను, “ఓ, అక్కడ ఆ చిన్న కుక్కపిల్ల పడియుండుట మీరు చూచుచున్నారా?”

అంతలో నేను చుట్టు తిరిగి మరియు వెనుకకు వెళ్ళాను. సరేగాని, నేను దానిని పట్టుకొనుటకు నేను బయటకు వెళ్ళాను, మరియు ఆ దీనమైన చిన్న వ్యక్తి కేవలం అంత ఎత్తు మరియు దాని గూర్చి తీవ్రమైన వాంఛ కలిగి ఉండెను కనుక అతడు జూలు కలిగిన జంతువులకు వచ్చు ఒక రకమైన చర్మ వ్యాధితో పూర్తిగ ఉండియూ, అది ఒకదానిపై మరొక చర్మపు పొరలతో మరియు దాని మీదుగా అంతయు పేలు లేక ఈగలు. కేవలం తిని వేయబడెను.

అంతలో నేను అన్నాను, “దీనమైన ఆ చిన్న జీవి.”

సహోదరి ఉడ్ అనెను, “నీవు దానిని చంపవలెనని నేను నమ్ముచున్నాను,” అనేను, “ఎందుకనగా అది చనిపోనై ఉన్నది.”

నేను అన్నాను, “ఆ దీనమైన చిన్న వ్యక్తిని, నాతో నేను దానిని గృహమునకు తీసికొని వెళ్ళనైయున్నాను.” అంతలో నేను క్రిందకు వెళ్ళాను మరియు జంతువులకు వచ్చు ఒక రకమైన చర్మవ్యాధిని మాన్పునది ఏదో పొందాను, కొన్ని పౌడర్లు మరియు దానికి వైద్యము చేయబడెను. మై, అది ఇప్పుడు ఒక చక్కని పెద్ద కుక్క.

54

అయితే అపుడు, ఆ రాత్రి పదిన్నరకు లేక పదకొండు గంటలకు తిరిగి గృహానికి వచ్చాము, అక్కడే ఆ వృద్ద పొసమ్ పడి ఉండెను.

సహోదరుడు ఉడ్ చెప్పెను, “ఆమె ఎన్నడూ కదలలేదు.” అనెను, “అది చీకటి పడినప్పుడు, అది కదిలించబడి ఉండును, అయితే ఇప్పుడు ఆమె (అది) ఎన్నడూ కదల్చబడలేదు.”

మంచిది, అది అక్కడ రాత్రంతయూ పడి ఉండెను. నేను ఆ పొసమ్ ను నా మనస్సులో నుండి తీసివేయలేకపోయాను. ఆ తరువాత ఉదయము. నేను బయటకు వెళ్ళాను, బిల్లీ లోనికి వచ్చెను. అతడు బయట లేక ఎక్కడో చోట చేపలు పట్టుకొని ఉండెను, మరియు అతడు ఇంచుమించుగా మధ్యరాత్రిలో వచ్చెను, మరియు ఆ వృద్ద పొసమ్ ఇంకా అక్కడే పడి ఉండెను.

కాబట్టి నేను....

ఆ మరుసటి ఉదయమున, నేను ఆరున్నర లేక ఏడు గంటలకు బయటకు వెళ్ళాను, నేను పైకి లేచి మరియు బయటకు వెళ్ళగా, మరియు అక్కడే ఆ వృద్ద పొసమ్ ఉండెను. మంచిది, నేను తలంచాను, “ఆమె (అది) చనిపోయెను.” నేను దానిని కొంచెముగా, ఆ విధముగా తన్ని ఉంటిని. నేను దానిని తన్ని ఉండగా, దానికి ప్రక్కగా ముందు పళ్ళతో ఒక విధమైన చిన్న నవ్వును చూశాను.

అంతలో నేను అన్నాను, “మై!” మరియు కేవలం అవి ఇంకా ఆమె (దాని) నుండి పాలు త్రాగుటకు ప్రయత్నించుచున్నట్లుగా ఆ దీనమైన చిన్న పొసమ్ కనబడెను.

నేను తలంచాను, “ఏలాటి దయతో కూడినది. అది మరల వెనుకకు ఆ జేబును (సంచివంటిది) లాగుటకు బలము లేకుండా ఉండెను.”

55

మంచిదే, నా చిన్న బాలిక, రిబ్కా అలా సమావేశాలలో కూర్చుని మరియు రోగుల కొరకు ప్రార్ధించునని మీకు తెలియును, కాబట్టి అంతలో అప్పుడు, ఆమె బయటకు వచ్చి, చూచెను. ఆమె అన్నది, “ఓ, నాన్నా, ఆ దీనమైన జీవి వైపు చూడుము.”

నేను అన్నాను, “ప్రియమైన దానా, అది భయంకరముగా లేదా.”

అంతలో ఆమె అన్నది, “ఓ, నేను దానివైపు చూడలేను.” ఆమె ఇంటిలోనికి వెనుకకు వెళ్ళెను.“

అంతలో నేను నా రహస్య గదిలోనికి వెళ్ళాను. నేను కూర్చుని, నా చేతులు ఈ విధముగ పైకెత్తాను. నేను అన్నాను, “మై, ఈనాడు నేను ఊహించుచున్నాను,” నేను అన్నాను, “ఆ పొసమ్ తో నేను ఏమి చేయగలనో నాకు తెలియదు.” నేను అక్కడ కూర్చుని ఆ విధముగా అలా ఆలోచించుచున్నాను. మరియు ఓ, నేను...

“మంచిది,” అనెను, “ఒక నిజమైన తల్లిగా ఉండుటను గూర్చి, నిన్నటి దినమున నీవు ఆమెను (దాని) గూర్చి ఒక సందేశమును బోధించి ఉంటివి,” అని ఎదో నాతో చెపెను.

నేను అన్నాను, “అవును, నేను అది ఎరుగుదును.”

56

నేను చెప్పాను, “నేను లియో మరియు జీన్ కు బోధించుచుంటిని మరయు వారికి ఆమెను (దాని) గూర్చి చెప్పుచుండగా, ఏలాటి ఒక... మరియు ఆ పాలు పోసే మనిషి మరియు వారందరికి, ఆమె ఎలాటి ఒక నిజమైన తల్లి అయి ఉండెనని చెప్పుచుంటిని. అది యథార్ధము.”

అనెను, “మంచిది,” చెప్పెను, “ఆమె పిల్లలను గూర్చి శ్రద్ద తీసికొనవలెనని ఆమె కోరుచున్న దాని గూర్చి నీవు మాట్లాడి ఉంటివి.”

నేను అన్నాను, “అవును, అది నిజము.” అంతలో నేను అన్నాను, “సరే, దాని గూర్చి ఏమిటి?”

ఆయన అనెను, “మంచిదే,” చెప్పెను,“ ఇప్పుడు నేను ఆమెను (దానిని) ఇక్కడకు పంపాను. ఆమె వచ్చి మరియు ఒక స్త్రీవలే, ప్రార్ధించబడుటకు ఆమె వంతు వచ్చు వరకు, ఇరవై-నాలుగు గంటలు, నీ ద్వారము దగ్గర పడి ఉండి కనిపెట్టుచుండెను. మరియు నీవు ఎన్నడూ ఒక మాటయు ఆమెకు (దానికి) చెప్పలేదు.”

అంతలో నేను అన్నాను, “మంచిది, నేను......” నేను తలంచాను, “నేను ఎవరితో మాట్లాడుచున్నాను? నేను తలంచాను, ”సరేగాని, ఇక్కడ ఏమి జరిగినది? నేను ఎవరితో మాట్లాడుచుంటిని? “మంచిది,” నేను అన్నాను, “నేను ఎవరో వ్యక్తికి జవాబిచ్చుచుంటిని.” కేవలం అంతలోనే అప్పుడు, నేను అది అనుభవించాను, మీకు తెలుసా. అంతలో నేను ఆలోచించాను, “ఓ దేవా, అది నీవే అయి ఉంటావా? నీ దీనమైన మూగవానిగా ఉన్న సేవకుని క్షమించండి.”

57

అంతలో నేను అక్కడ బయటకు ఎక్కడ ఆ పొసమ్ ఉండెనో అక్కడకు వెళ్ళాను. న్యాయతీర్పులో దీనితో నేను మిమ్మును కలసికొందును. అక్కడ బయటకు నడచి వెళ్ళాను, కేవలం ఆ పొసమ్ మాత్రమే కాదు, ఇంకా ఇతర సమయాలలో అది జరుగుట నేను చూశాను. అంతలో ఆ పొసమ్ ఎక్కడ ఉండెనో అక్కడ దిగువకు నడిచాను మరియు అక్కడ అది జీవము లేకుండా పడి ఉండెను.

నేను అన్నాను, “పరలోకపు తండ్రీ,” నేను అన్నాను, “అలా రోగులుగా ఉన్న మానవ జీవులను గూర్చి మీరు నాకు దర్శనములు చూపించితిరని నాకు తెలియును. మీరు వారు వచ్చి ప్రార్ధించబడవలెనని వారి హృదయముతో మీరు మాట్లాడారు, మరియు మీరు సహోదరుడు బోస్వర్తను గూర్చి అదే దర్శనము, అదే నిమిషంలో నాకు చూపించారు, మరియు ఆ దేవుని దూత దక్షిణ ఆఫ్రికా నుండి ఇరవై-నాలుగు గంటలులో ఇక్కడకు టెలిగ్రాము కొట్టారు, ఆ విధముగా అక్కడ ఆయన పడి ఉండుటను గూర్చి నాకు చెప్పారు. అయితే ఈ దీనమైన వృద్ద మూగ పశువునకు నీ శ్రేష్ఠమైన కృపయేనా? ఆమెకు ప్రాణము లేదు. ఆమెకు ప్రత్యక్షతను గూర్చియు తెలియదు. అయితే ప్రేమ అయిన దేవుడు, జీవమునకు దేవుడు, పిచ్చుకలు ఏ మాత్రం విలువలేనివి అయినప్పటికి కూడ ఆయన వాటిని ఎరుగును. యేసు చెప్పెను, ”రెండు పిచ్చుకలు ఒక పెన్నీలో నాల్గవవంతుకు అమ్మబడవా; అయితే మీ తండ్రికి వాటిలో ప్రతిఒక్క దాని గూర్చియు ఎరుగును?“

మరియు ఇక్కడ ఉన్న ఆ పొసమ్ ను గూర్చి, నేను అన్నాను, “ఆ పరిశుద్ధాత్మ ఆ వృద్ధ పొసమ్ ను నడిపించినయెడల, మరియు అది ఒక మూగ జంతువుగా, అపస్మారక స్థితిలో ఇక్కడ పడి ఉన్నది. దేవుడా నన్ను క్షమించండి. నేను అన్నాను, ”అప్పుడు మరియు నీవు కోరినయెడల.... మరియు నీవు దీని కొరకు ప్రార్ధించుటకు నన్ను కోరినయెడల, మరియు నీవు దానిని ఇక్కడకు పంపియుంటివి, మరియు నేను దానిని ఎరుగుటకు మూగవానిగా ఉంటిని, అప్పుడు తండ్రి, యేసు నామములో, ఈ తల్లిని స్వస్థపరచుమని నేను నిన్ను ప్రార్థించుచున్నాను.“

58

దేవుడే నాకు తీర్పరి, ఆ వృద్ద పొసమ్ అవతలకు తిరిగి మరియు నా వైపు చూచెను, పైకి లేచెను, దాని పిల్లలను సమకూర్చుకొనెను, మరియు వాటిని దాని చిన్న జేబు (సంచివంటిదాని) లో ఉంచికొని కుంటుట లేక ఏదైనను. “అయ్యా, మీకు వందనములు,” అని అలా చెప్పుటకు అన్నట్లుగా వెనుకకు చూచెను. ఆ విధముగా ఆ పెరటి గుండా బలముగా నడచుచూపోయెను. ఆ ద్వారము గుండా దిగువకు నడచుచూ ఆరోగ్యముగాను మరియు ఆమె ఉండవలసినంత బాగా ఉండి బయట ఆ స్థలమునకు వెళ్ళెను.

అది ఏమై ఉన్నది? దేవుని శక్తి. హల్లెలూయ. దేవుడు సృష్టిలో పాలించును. రాత్రి సమయములో ఆ నక్షత్రములను అక్కడ వ్రేలాడదీసినది ఎవరు? ఏ విజ్ఞానము శాస్త్రము దానిని చేయును? సాయంకాల సమయంలో ఆ సూర్యుని అస్తమింపజేసి మరియు దానిని ఉదయవేళలో ఉదయింపచేసినది ఎవరు? దాని కక్ష్యలో ఆ ప్రపంచమును పట్టుకొని ఉన్నది ఎవరు? దేవుని శక్తియే. ఆయనలోనున్న నీ ఆత్మను పట్టుకొని ఉన్నది ఎవరు. దేవుని శక్తియే. హల్లెలూయ. సాతాను యొక్క శక్తి పరిమితమైనది. దేవుని శక్తి అపరిమితమైనది. నేను దేవుని నమ్ముచున్నాను.

59

మనము ప్రార్ధించుకొందాము.

మా పరలోకపు తండ్రీ, ఆయన కరుణ కొరకు మరియు అలా మా కొరకు ఆయన చేసిన సమస్తము కొరకు, ఈ రాత్రి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కొరకు మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. ఆశీర్వదించబడిన ప్రాచీన బైబిలు ఆ దర్శనముల కొరకు మేము మీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ ప్రియమైన పురాతనకాలపు, పరిశుద్ద అగ్నిచేత బాగా కాల్చబడి, వండి, సిద్దం చేయబడిన ఈ పరిశుద్ద గ్రంథము, అది యుగముల గుండా దిగువకు యాత్రికుని కొరకు మార్గమును సూచించుచున్నది. ప్రభువా, మేము మీకు వందనములు చెల్లించుచున్నాము, షెకీనా మహిమవలె, నీ పరిశుద్ధాత్మ దానికి మీదుగా కదలును. మనుష్యులు ఆ బైబిలును తెరచి, దానిలోపల భాగములోనికి చూచి, అతి పరిశుద్ధ స్థలములోనికి కదలి వెళ్ళి, సర్వశక్తుడగు దేవుని సన్నిధిలో షెకీనా మహిమ క్రింద నివసించుచుదురు గాక.

చిరిగిన తెరను దాటుదురు. ఓ, ఆయన నామమునకే మహిమ.

మేము నీ శక్తి కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ రాత్రి సర్వశక్తుడవైన దేవా, ప్రయోజనము లేని నీ సేవకునికి ప్రక్కగా ఈ వేదిక దగ్గరకు వచ్చి మరియు నీవు భూమి మీద ఉన్నప్పుడు నీవు చేసిన ఆ కార్యమును చేయండి, అలా ఆ మనిషి లేక విజ్ఞాన శాస్త్రము దానిని ఉత్పత్తి చేయలేదని ఆ ప్రజలు ఎరిగి ఉండవచ్చును. అది తప్పక దేవుని శక్తి ద్వార వచ్చును.

ఆ పుష్పము పెరుగునట్లు చేసినది ఎవరు? ఒక గులాబీ పుష్పములో లేత ఎరుపు రంగు మరియు మరో దానిలో పసుపురంగును ఉంచినది ఎవరు? ఆకాశములకు రంగులను ఇచ్చినది ఎవరు? మంచు కురియు ఆ సంవత్సరంలో బ్రష్ ను తీసుకొని మరియు తెల్లటి మంచుతో కదలుచు మరియు ఆకులకు ఎరుపు మరియు పసుపు రంగును ఇచ్చినది ఎవరు? హల్లెలూయ. నిత్యత్వమంటికి దేవుడై ఉన్న, ఆ యజమాని యొక్క హస్తమే. మరణఛాయలలో వారు పడి ఉండినప్పుడు, ఆ రోగులను లేపినది ఎవరు? దేవుడు మాత్రమే.

అలా ఈ రాత్రి నీవు యేసు నామములో కదలి వచ్చి మరియు ఆ బాధపడువారిని నీ మహిమ కొరకును, మరియు రోగులను పైకి లేపవలెననియు నేను ప్రార్ధించుచున్నాను. ఆమెన్.

60

నేను మిమ్మును ఆలస్యంగా ఉంచినందుకు నేను విచారపడుచున్నాను. ఓ, నేను ఆయనను ప్రేమించుచున్నాను. కేవలం ఆలోచించినయెడల, రాజు యొక్క సన్నిధిలో మనం జీవించుచున్నాము.

నీవు ఎన్నడైనా ఈ పాతకాలపు పాటను పాడినారా?

హల్లెలూయ, హల్లెలూయ;

ఆ మహిమలు ఎన్నడూ అపజయము పోందనిచోట,

ఆ చినిగిన తెరను నేను దాటియున్నాను,

హల్లెలూయ, హల్లెలూయ;,

ఆ రాజు యొక్క సన్నిధిలో నేను నివసించుచున్నాను.

హల్లెలూయ. ఆ మహిమలు ఎన్నడూ విఫలము కానిచోట చీల్చబడిన తెరను దాటి, లోకము యొక్క మనసుకు నచ్చినట్లు పోనియ్యక కాపాడుచు, కలుషితం కాకుండా కాపాడుచు ఆ దేవుని యొక్క మహిమ సజీవముగా కాపాడు చోటను మరియు వాని మనసులో నుండి సమస్త అనుమానం మరియు చీకటిని, లోకసంబంధమైన సమస్త కార్యములు తీసివేయుచు, అవిశ్వాసిని శుద్దీకరించుచూ ప్రక్కకు పెట్టును మరియు ఒక కల్తీలేని హృదయమును ఇచ్చును. ఒక సమయంలో, దేవుడు ఆయన శాసనములను వ్రాయుచుండెను మరియు మందసము క్రింద చొరుగులో దానిని ఉంచెను. మరియు ఈ రోజున మనిషి కరుణపీఠము క్రింద ఆ మనిషి షెకీనా మహిమలో జీవించుచుండెను, దేవుడు వాని హృదయము మీద ఆయన శాసనములు వ్రాయును మరియు వాటిని జాగ్రత్తగా భద్రపరుచును.

61

నేను మరల దానిని ప్రారంభించగోరుటలేదు. ఆమెన్. ఆ రాజు యొక్క సన్నిధిలో మనం అలా నివసించగలమని ఎంతగానో సంతోషించుచున్నాను.

అక్కడ “కే” కు సంబందించినవి కొన్ని మరియు “ఐ” కు లేక “జే” లేక... అక్కడ ఏ వ్యక్తి అయినా, “కే” కార్డు కలిగిన వ్యక్తి ఉన్నాడా? నేను సరిగా చెప్పితిననుటకు మనము చూద్దాము. మంచిది. అప్పుడు అక్కడ నుండి ఏదో చోటునకు ప్రయత్నించెదము, కొద్ది మంది ప్రజలు పైకి వచ్చెదరు. మనము చూద్దాము. చాలా ఎక్కువ మంది కూడా చూపించగోరుటలేదు. మనము చూద్దాము. ఏ వ్యక్తి అయినా కే-85 అనే ప్రార్ధనా కార్డును కలిగి ఉన్నారా, మీ చేయి పైకెత్తండి? మీరు కే-85 పొందిన యెడల పరిశీలన చేసి చూడండి, ఆ స్త్రీ, అవునా? అది చక్కగా ఉన్నది. మంచిది. 86, ఎవరికి 86 ఉన్నది? మీ చేయి పైకి ఎత్తండి మీరు ఎత్తగలరా? కే-86 మంచిది. 87, అవి ఇక్కడే ఉన్నాయా? 87, మంచిది. 88, సరిగా ఇక్కడకు రండి, 89, ఎవరు 89 గలిగి ఉన్నారు? ఇక్కడే స్త్రీ ఉన్నది, 89 నీవు కలిగి ఉన్నావా? 89, దానిని ఎవరు కలిగి ఉన్నారు? మీ చేయిని పైకెత్తండి, నీవు ఎత్త కలిగిన యెడల నీవు ఎత్తగలవు. నీవు ఎత్తలేనియెడల, నీకు తరువాత కూర్చుని ఉన్నావానితో, నీ చేయి పైకెత్తమని చెప్పుము. 89? మంచిది, చక్కగా ఉంది, 90? మంచిది, ఆ స్త్రీ ఇక్కడే ఉన్నది. 91, 92, 98, 94, 95, 96, 97, 98, 99, 100. ఎవరికి కే-100 కార్డు కలిగి ఉన్నారు. మీ చేయి పైకెత్తండి.

ఇప్పుడు, మనం దీని ద్వారా పొందగలిగిన యెడల ఆ తరువాతది ప్రారంబించెదము. ఆ తరువాత ఉన్నది “జే” లేక “ఐ” తో ఉన్న ఒకటి అని నేను నమ్ముచుచున్నాను. మనం వాటిలో కొన్నిటిని ప్రారంబించెదము.

62

ఓ, నీవు ఆయనను ప్రేమించుచున్నావా? ఆయన ఆశ్చర్యకరుడు కాడా? మనం పాడే ఒక చిన్న పాట పాడుదము:

తండ్రిలో విశ్వాసము, కుమారునిలో విశ్వాసము,

పరిశుద్ధాత్మలోని విశ్వాసము ఒకనిలో మూడు ఉన్నవి;

దయ్యములు వణుకును మరియు పాపులు మేల్కొందురు; యెహోవాలోని విశ్వాసము దేనినైనను కదిలించును.

ఆమెన్. దయ్యము ఆ పురాతన హితవత్సరం పాటలను అసహ్యించుకొనును. దానిని కలసి పాడుదము. రండి.

తండ్రిలో విశ్వాసము, కుమారునిలో విశ్వాసము,

పరిశుద్ధాత్మలోని విశ్వాసము ఒకనిలో మూడు ఉన్నవి;

ఓ, దయ్యములు వణుకును మరియు పాపులు మేల్కొందురు;

యెహోవాలోని విశ్వాసము దేనినైనను కదిలించును.

63

ఆమెన్. నరకము క్రిందనున్న అనుబంధములను సరిగా దయ్యములు కళ్ళు లోనికి కదిలించి చూపించండి. అది యధార్ధము. దేవుడు ఎవరు ఎవరో వారిని తెలిసికొనినట్లు చేయును. గ్రోట్ సహోదరుడా, నీవు ఇక్కడ ఉన్నావా? నేను ఎక్కడ ఆ పాట నేర్చుకున్నానో నీవు ఎరుగుదువు, హెన్రీ గ్రోట్, నీవు ఈ భవనంలో ఉన్నావా? నీ చేయి పైకెత్తుము, అతడు ఎక్కడ ఉన్నాడు నేను ఈ రోజున వానిని చూశాను, ఎందుకనగా, ఇక్కడే నా వెనుక ఉన్నాడు, ఆ జొన్న పొలంలో బయట మనం కలసి అలా పాడుచుండుట నీకు జ్ఞాపకం ఉన్నాదా? మై, మై. అద్భుతము.

అతని నాన్నగారు నా కొరకు ప్రార్ధించుచుండెను, నేను ఇది చెప్పవలసి ఉన్నది, నేను దానిని ఈ రోజునే సంఘములో చెప్పాను. అతని నాన్న, ఆ చిన్న హలెండు దేశవాసి మాదిరిగా ఒక చిన్న మీసము కలిగి ఉన్నాడు. నాకు తెలియదు. అతడు ఈ చుట్టు ప్రక్కల ఉన్నాడా? దీని నిమిత్తం అతడు నన్ను క్షమించునని నేను ఆశిస్తున్నాను, అతడు మన పట్టణములో ఉండెను, అది మిగిలిన ఇతర పట్టణమువలె ఉన్నది, అని మీకు తెలియును, అక్కడ ఒక యవ్వన యువతి స్టోర్ (వస్తువులు నిల్వ ఉంచు ప్రదేశం) నుండి అవినీతిగా కనిపించు దుస్తులు కొంచెం చిన్నవిగా ఉన్నవి. ఆ ప్రాచీన బట్టలు, ప్రతీ చోటను మరియు ఇక్కడ మీరు ధరించిన వాటివలె, కేవలం ఏ మాత్రము సరిగాలేని విధముగా ఉన్నవి, అని మీకు తెలియును.

స్త్రీ... సహోదరి వినుము. హాని, నన్ను నీకు ఏదో చెప్పనివ్వండి. నీ మీద ఉన్న అది ఏమిటో మీరు ఎరుగుదురా? అది మీరు అలా చేయునట్లు చేయునది, అపవిత్రాత్మయే. అది యధార్ధము. అది ఒక దయ్యము అయి ఉన్నది. మీరు దానిని ఎరుగరు. మీరు అవినీతిపరులుగా ఉన్నారని నేను చెప్పుటలేదు. అయితే అక్కడ మీరు చెడ్డ ఆధారం మీద మీరు చాలా తెలివితక్కువగా ప్రవర్తించుచున్నారు, ఏమియు కాదు కాని అపవిత్రత్మయే దానిని చేసియుండెను.

64

అంతలో ఆమె ఆ విధముగా ఆమె బట్టలతో బయటకు వచ్చెను, ఆ చిన్న సహోదరుడు గ్రోట్, కేవలం అతడు ఏ విధంగా అయినను ఒక చిన్న హాస్యగాడు. అతడున్నాడు, “ఓ-హో!” అతడు అన్నాడు, “సహోదరీ, నీ స్కర్టు (స్త్రీ నడుము నుండి వ్రేలాడు వస్త్రం) నీవు మర్చిపోయావు.” ఓ, ఓ, ఓ. నన్ను జొన్న పొలములోనికి బయటకు తీసుకొని వెళ్ళి మరియు నాతో ప్రార్ధించుచూ ఉండెను. అంతలో అతడు అతని చేతితో నన్ను చుట్టి ప్రార్ధించుటకు క్రిందకు దిగెను, అతడు అన్నాడు, “ఇప్పుడు తండ్రి అయినా దేవా,” అతడు అన్నాడు, “రమ్ము, బ్రెన్హాం సోదరుని స్వస్థపరుచుము. తండ్రియైన దేవా.”

గ్రోట్ సహోదరుడా, నీవు ఎక్కడ ఉన్నావు? అతడు ఇక్కడే నీ చుట్టుప్రక్కల ఎక్కడో ఉన్నాడు. ఓ, అక్కడ అతడు అతని చేయి పైకెత్తి మార్గము వెనుక భాగములో ఉన్నాడు. ఆ రోజు జొన్న పొలంలో ఉన్నది, మీకు జ్ఞాపకము ఉన్నాదా? ఆమెన్. గ్రోట్ సహోదరుడు, అతడు అది చేసెను. ఆమెన్. ఓ, ఆయన అద్భుతకరుడు.

నేను ఈ రాత్రి భక్తితో కూడిన నిజమైన మంచిని అనుభవించుచున్నాను. ఆమెన్. ప్రతీ ఒకరు ఆయనను ప్రేమించుచున్నారా? ఇప్పుడు, సహోదరులార, దాని గూర్చి ఏమిటి? అయితే మీకు బాగుందా....... మీకుందా....... సహోదరుడు రాస్మస్, అక్కడ క్రింద ఆ ప్రార్ధనా వరుస, వరుసలో ఉన్నదా, అక్కడ దిగువలో వారిని వరుసలో అమర్చినది ఎవరో అతడే. మంచిది.

ఉడ్ సహోదరుడా, నీవు ఎక్కడ ఉన్నావు? నీవు చేయగలవా?... నాకు నీవు సహాయము చేయగలవా? నేను బిల్లీని చూడలేదు. అప్పుడు నీవు ఇవతలకు వచ్చి మరియు నాకు సహాయం చేయి, నీవు చేయగలవా? మంచిది.

65

ఇప్పుడు నేను ఆశ్చర్యపడుచున్నాను... [ఒక సహోదరుడు బ్రెన్హాం సోదరునితో మాట్లాడును]. ఓ, మీరు వారిని వెదకి పట్టుకొనినచో, అది మంచిది, అది ఒక మంచి సంగతిగా ఉండునని నేను నమ్ముచున్నాను, కారణం ఏమనగా, అది శక్తివంతమైనది మరియు నేను ప్రజలతో మాట్లాడుచుండగా అప్పుడు సరిగా ఆ వ్యక్తి వైపు చూస్తున్నప్పుడు కొన్ని సమయాలలో వారు కలవరపడతారు. అది చక్కగా ఉన్నది. ఎవరు దానిని చేసినను మీకు వందనములు. అది చాలా మంచిగా కనబడుచున్నది. దానిని గూర్చి కొంచెంసేపటి క్రితము నేను ఎందుకు ఆలోచించలేదు? మంచిది.

ఇప్పుడు, దేవుని కుమారుడైన, ప్రభువైన యేసు, ఆయన ఇశ్రాయేలు కొరకు చేసినట్టుగా, ఇప్పుడు రంగము మీదకు వచ్చెను. ఇక్కడ నేను ఒక బంధకములో ఉండి, ఇక్కడకు కదలివచ్చాను. అయితే దేవుడు ఏమి వాగ్దానం చేసెనో నేను ఎరుగుదును. అలా ఆయన దేవుడయి ఉండెనని రుజువు చేయుటకు ఆయన హెబ్రీ పిల్లలను అగ్నిగుండంలోనికి వెళ్ళనిచ్చెను. ఆయన దేవుడై ఉండెనని రుజువు చేయుటకు ఆయన దానియేలును సింహాల బోనులోనికి వెళ్ళనిచ్చెను. ఆయన దేవుడయి ఉండెనని రుజువు చేయుటకు లాజరు చనిపోయి మరియు సమాధిలో కుళ్ళుపోవునట్లు ఆయన చేసెను. ఆమెన్. ఆయన ఈ రాత్రియు అదే కార్యమును చేయగలడు, ఆయన చేయలేడా? ఆయన దేవడైవున్నాడని ఆయన రుజువు చేయగలడు.

66

ఇప్పుడు, ఈ స్త్రీ నా ఎదుట నిలబడి ఉన్నది, మేము ఒకరికి మరొకరు కొత్తవారమని అనుకొనుచున్నాను, స్త్రీ, మనం అలాగే కదా? మనం అలాగే క్రొత్తవారము. అయితే నిశ్చయముగా ఒక సంగతి కలదు; సహోదరీ, అక్కడ మన ఇద్దరిని ఎరిగిన ఒకాయన ఉన్నాడు. అది యథార్ధం. ఏదో రోజున, మనం ఆయన సన్నిధిలో నిలబడగలము, మరియు ఈ జీవితంలో మనం చేసిన ప్రతి సంగతి కొరకు లెక్క చెప్పవలసి ఉన్నది. నీవు దాని గూర్చి జాగ్రత్తగా ఉండవలెను?

జరిగిన ఏదో సంగతిని గూర్చి, నేను నీకు చెప్పుచున్నాను. కేవలం ఇప్పుడే, ఇతరమైన ఏ సంగతియూ చెప్పకముందే, ప్రభువు యొక్క దూత వచ్చి మరియూ ఇప్పుడే అభిషేకించెను. కేవలం ఇప్పుడే అది జరిగినది. దేవునికి స్తుతికలుగును గాక. అది ఈ స్త్రీని కూడ, త్వరగా తాకెను. అది నీకు తెలియును. నేను ఏదో చెప్పునప్పుడు ఒక సంగతి నిన్ను ఆశ్చర్యపరచెను. అది సరియేనా? అది సరియైనదే.

ఇప్పుడు, నీకు ఒక క్రొత్తవానిగా ఉండి, నిన్ను ఎరుగకయే, నా జీవితంలో నిన్ను ఎన్నడూ చూడలేదు, నీలో ఏ పొరపాటు ఉన్నదో లేక నీవు దేనికొరకు ఉన్నావో, దేవుడు నేను ఎరిగి ఉండునట్లు అనుమతించినయెడల, నీవు యేసును అంగీకరించగలవా? నీవు యేసును అంగీకరించగలవా? నీవు చేయగలవా? సమాజము అలా చేయగలదా?

ఇప్పుడు, మనం ఆయన సన్నిధిలో ఉన్నాము. ఆయన మన నుండి ఆయన తీసికొని ఉండును, లేక ఆయన మనలను ఒక వ్యాధితో మొత్తి ఉండును మరియు మనం దానితో చనిపోయి ఉందుము. ఆయన దేవుడు, కనుక మనం తప్పకుండ ఆయన సన్నిధిలో భయభక్తులతో ఉండవలెను. నీవు అది నమ్ముచున్నావా, నీవు నమ్ముటలేదా? కనుక నేను ఆ స్త్రీని చూస్తున్నాను. నీవు నిజముగా నరాల బలహీనతో ఉన్నావు, తీవ్రమైన బలహీన పరిస్థితులలో, నరముల బలహీనత కష్టములో బాధించబడితివి. అంతలో నేను చూశాను, నీవు ఏదో సంగతిని గూర్చి నీవు ఒక డాక్టరు దగ్గరకు వెళ్ళావు. అది ఒక అంటు వ్యాధి. ఆ అంటు వ్యాధినీ రొమ్ములో ఉన్నది. అది యధార్ధము. అది ఎడమ రొమ్ములో ఉన్నది. అలా అది ఏమై ఉన్నది, దానికి ఏది కారణమై ఉన్నది, అతనికి తెలియదని ఆ డాక్టరు చెప్పుట నేను చూడగలను.

67

ఇప్పుడు, అలా మాట్లాడునది నేను కాను, అలా నా పెదవులు ఆ మాటలు చెప్పుచుండెను, అయితే దాని మీద నాకు ఏ అదుపూ లేదు. అయితే అది ఏమి చేప్పెనో అది సత్యమయి ఉండెను. అది సరియేనా? ఇప్పుడు, యేసు మృతులలో నుండి లేచెనా? స్నేహితుడా, జ్ఞాపకముంచుకొనుము, ఇక్కడ ఈ భూమి పైన ఉన్నప్పుడు, యేసు ఏమి చేసెనో అదే. ఈ రాత్రి అది యేసే.

అప్పుడు ఆయన ఏమి చెప్పెనో ఇక్కడ ఉన్నది, ఆయన భూమిని విడచిపెట్టుచున్నప్పుడు చివరి మాటలు ఆయన చెప్పెను. నేను మీకు వాటిని ఉదాహరించగలను. ఆయన తన శిష్యులను బేతనియవరకు బయటకు నడిపించి, మరియు వారిని ఆశీర్వదించెను. అంతలో ఆయన చెప్పెను, “భూదిగంతముల వరకు వెళ్ళుడి (అది చికాగో కూడ అయి ఉండెను, అది కాదా?) మరియు సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మనివారికి శిక్ష విధించబడును. యుగాంతము వరకు నమ్మినవారిని ఈ సూచనలు వెంబడించును.” ఎంత కాలము? ఎవరికి...... ఈ సువార్త... ఎంత వరకు? అపొస్తలుల కాలం వరకా? లోకము యొక్క అంతము వరకు. నా నామమున వారు దురాత్మలను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. వారు విషకరమైనది లేక మరణకరమైనది ఏది త్రాగినను, అది వారికి హానిచేయదు. వారు రోగుల మీద చేతులుంచునప్పుడు, వారు బాగుపడుదురు.“ ఆయన చెప్పినది అదే.

మీరు అది నమ్ముచున్నారా? అప్పుడు ఆయనే ఇక్కడ హాజరయి నిలబడి ఉండగా.... మీరు నమ్మండి. అలా నేను నా చేతులు మీ మీద పెట్టి మరియు ప్రార్ధించినయెడల, దేవుడు ఒక వాగ్దానము చేసెనని నేను నమ్ముచున్నాను, మీరు దానిని నమ్మినయెడల, మీరు బాగుపడుదురు. అది సరియేనా? అప్పుడు ముందుకు రండి.

మా పరలోకపు తండ్రి, ఈ స్త్రీ మీద చేతులు పెట్టగా, ఆమె తనకు తాను ఎవరో కూడ ఎరుగని ఒక స్థితిలో, మరియు ఆమె యొక్క డాక్టరు ఆమెకు ఏమియు చెప్పి ఉండలేదు. అయితే, ప్రభువా, నీవు ఆమెకు కరుణ చూపగలవనియు మరియు ఆమెను స్వస్థపరచగలవనియు నేను ప్రార్ధించుచున్నాను. ఈ స్త్రీ యొక్క జీవితమును తీసికొనుటకు లోనికి వచ్చిన ఈ దయ్యమును నేను గద్దించుచున్నాను. దయ్యమును నేను గద్దించుచున్నాను. సాతానా - యేసుక్రీస్తు నామములో, ఆమెలో నుండి బయటకు రమ్ము. నీవు ఓడిపోయావు. నీవు మరణకరమైన ఆత్మవై ఉన్నావు, నీవు ఓడిపోయావు. మేము పునరుత్థానుడైన ప్రభువును చూశాము. ఆయన ఇక్కడే ఉన్నాడు. విశ్వాసము యొక్క కన్నులు ద్వార మంచి ఆరోగ్యములో మన సహోదరి కొరకు ఈ ఛాయకు అవతలకు ఎక్కడ నుండి ఆ సూర్యుడు ప్రకాశించుచున్నాడో అక్కడకు మేము చూచుచున్నాము. ఆయన ఆజ్ఞ చొప్పున యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు కొనసాగి ముందుకు వెళ్ళుము, మీరు బాగుపడనైయున్నారు. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును.

68

మంచిది, స్త్రీ నీవు రాగలవా? విశ్వాసము కలిగి ఉండుము. సహోదరీ, నీవు వచ్చుచుండగా, నీ పూర్ణ హృదయముతో ఆయనను నమ్ముము. సాధారణంగా, నేను ఎప్పుడు అలసితినో, నేను నీరసించి అలసిపోయాను, అయితే అప్పుడే అది చాల మంచిది, ఎందుకనగా విలియం బ్రెన్హాం వెళ్ళాడు. అప్పుడు యేసే మాట్లాడగలడు. నేను నిన్ను ఎరుగను. నాకు ఈ చిన్న స్త్రీ బలమైన పరిశుద్ధురాలుగా కనిపించుచున్నది. అయితే దేవుడు నిన్ను ఎరుగును. అక్కడ నీలో ఏ పొరపాటు ఉన్నట్లుగా కనబడుట లేదు, అయితే అక్కడ పొరపాటు ఉన్నదా లేక లేదా దేవునికే తెలియును. అది సరియైనది కాదా?

ఇప్పుడు, ఈ సమావేశంలో అక్కడ ఎవరో, ఆ పరిశుద్ధాత్ముడు వారి దగ్గరకు కదలి వెళ్ళెను. నేను దానిని పొందలేదు. ఇప్పుడు, నిజమైన గౌరవ మర్యాదగలవారై ఉండండి కదల వద్దు. కేవలం ఇప్పుడు, ఊరక నిలచి ఉండండి.

సహోదరీ, నేను నీతో మరల మాట్లాడవచ్చునా? ఇప్పుడు, ఆ స్త్రీ నా దగ్గర నుండి కదలుచుండుట నేను చూస్తున్నాను, ఇక్కడ అది మరల ఆమె దగ్గరకు వచ్చినది. ఆమె చాలా ఎక్కువ నరముల బలహీనతతో కూడ ఉన్నది, ఎందుకనగా ఆమె విచారంగా ఉండెను. ఆమె ఏదో దాని గూర్చి బాధపడెను. ఆమెకు శస్త్రచికిత్స జరిగెను మరియు ఆ శస్త్రచికిత్స ఒక కేన్సరు కొరకు అయి ఉండెను. అది విజయవంతము కాలేదు మరియు నీవు దాని గూర్చి ఆందోళన కలిగి ఉన్నావు. అయితే ఆందోళన పడవద్దు. నీవు ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో నిలబడి ఉన్నావు. ఆయన పునరుత్థానమును, జీవమునై ఉన్నాడు. నీవు అది నమ్ముచున్నావా? కేవలం ఒక క్షణము ఇక్కడకు రమ్ము.

పరలోకపు తండ్రి, ప్రభువైన యేసునామములో నేను ఈ స్త్రీని దీవించుచున్నాను మరియు నీవు ఆమెను స్వస్థపరచగలవనియు మరియు దేవుని యొక్క శక్తి ద్వారా ఆమెను బాగుచేయగలవనియు ప్రార్ధించుచున్నాను. ఆమెన్. నా సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. వెళ్ళి మరియు నీ పూర్ణహృదయముతో ఆయనను నమ్ముము. మంచిది.

69

మీరు ఎలా ఉన్నారు. ఇప్పుడు అక్కడ అదే విధమయిన చీకటి ఆత్మ.

ప్రతివ్యక్తి గౌరవ మర్యాదలతో ఉండండి. చుట్టూ తిరిగి కదలవద్దు. దయచేసి అలా చేయవద్దు. చూడండి, ఈ కార్యములు ఒకరి నుండి మరొకరి దగ్గరకు వెళ్ళును, అంతలో మీరు.... నేను దాని కొరకు ఏమి చేయగలను, మీరు దానిని తెలిసికొని ఉండలేరు కేన్సరు ఇక్కడ విడచిపెట్టినప్పుడు, అది ఇతరమైన ఏదో చోటకు వెళ్ళుచుండును. నిశ్చయముగా, అది అలా ఉన్నది. నేను దానిని పట్టుకొనలేను. మీరు కదులుచున్న యెడల, అది ఎక్కడకు వెళ్ళుచున్నదో నేను చెప్పలేను. అలా నేను చూచుచున్న అది ఒక నల్లని ఛాయ.... సరిగా ఇప్పుడు ఈ స్త్రీ మీదుగా అక్కడ ఒక కేన్సరు వ్రేలాడుచున్నది. అది ఒక నల్లని ఛాయ అయి ఉన్నది. ఆ ఛాయ ఆమెను విడచిపెట్టినయెడల... నేను ఏది పొరపాటు అయి ఉన్నదో నేను ఎలా ఎరుగుదును? అది దర్శనము ద్వారా అయి ఉన్నది. అంతలో ఆ స్త్రీ చుట్టూ ఆ నల్లగా ఉన్న మరణము వ్రేలాడుట నేను చూచుచున్నాను. దేవుడు ఆమెకు సహాయం చేయనియెడల, ఆమె నిశ్చయముగా చనిపోవును. సరే, అతడు ఇక్కడ విడచిపెట్టినప్పుడు, అతడు కోపగించును, అతనిని బహిష్కరించినయెడల, అతడు చేయగలిగినయెడల వెళ్ళుటకు అతడు ఒక స్థలమును కనుగొనగలడు. అలా అది సత్యమని మీరు ఎరుగుదురా?

బైబిలు కాలములలో ఎవరో వ్యక్తి మూర్చ రోగముతో బాధపడు దురాత్మను వదలించుటకు ప్రయత్నించుచున్నప్పుడు, దానిని చేయుటకు నిజముగా ఎవరికి అధికారము లేదో, ఏమి జరిగినదో నీవు తెలిసికొని నీవు జ్ఞాపకము చేసికొన్నావా?

70

ఇప్పుడు, నీవు ఒక కేన్సరుతో బాధపడుచున్నావు. అది మరణము అయి ఉన్నది. దేవుడు మాత్రమే నిన్ను బాగుచేయగలడు. నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు అలా ఎవరో ఒకరు కదులుతుండగా, కేవలం నేను ఒక క్షణము నీతో మాట్లాడగోరుచున్నాను. నీవు ఈ నగరము నుండి రాలేదు. నీవు మరో నగరము నుండి వచ్చావు. అది ఎక్కడ ఉన్నదో నేను నమ్ముచున్నాను... నేను ఒక గోపురమును చూస్తున్నాను; అది ఇల్లినాయిస్లో, జోలియెట్ అయి ఉన్నది. నీ పేరు క్లెయిన్, లియోనా క్లెయిన్ అయి ఉన్నది. ఇప్పుడు, నీవు వెనుకకు గృహమునకు వెళ్ళుము మరియు బాగుపడెదవు; ఇప్పుడు నీ దగ్గర నుండి ఆ అంధకారము పోయినది. దేవుడు నిన్ను దీవించును.

దేవునియందు విశ్వాసము ఉంచుము. ఓ, మై, ఏలాగు ఆ దయ్యము యేసుక్రీస్తు యొక్క ఆ మహోన్నతమైన అధికారమును గుర్తించవలసి ఉన్నది. నేను కాదు, అతడు నన్ను అసహ్యించుకొనును. అతడు నన్ను మనసులో ఉంచకొనక్కరలేదు, అయితే నేను ఎవరికి ప్రాతినిధ్యము వహించుచున్నానో ఆయనను అతడు మనసులో ఉంచుకొనవలెను. నన్ను ఇక్కడకు ఎవరు పంపారో ఆయనను అతడు మనసులో ఉంచుకొనవలసి ఉన్నది. హల్లెలూయ.

ఎలా ఉన్నావు స్త్రీ, నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముము. నేను నీకు ఒక క్రొత్తవాడను. నీవు నాకు ఒక క్రొత్తవాడవు. అయితే అక్కడ మన మధ్య మన ఇద్దరిని ఎరిగిన యేసుక్రీస్తు అను ఒకరు ఉన్నారు. యేసు పొరపాటు ఏమిటో నాకు చెప్పినయెడల, అప్పుడు దానిని నీవు అంగీకరించగలవా? మరియు దానిని నమ్మగలవా? మంచిది. కేవలం నీవు ఈ మార్గము వైపు చూడుము. ఆ కారణం చేత నేను చెప్పుచున్నాను, “చూడుము”: బైబిలులో మోషే ఒక ఇత్తడి సర్పమును నిలబెట్టెను, చూచి మరియు బ్రతకవలెనని ఇశ్రాయేలు పిల్లలతో చెప్పెను. అది సరియేనా? ఆయన అలా చేసెను. వారు చూడవలసి ఉండెను.

71

పేతురు మరియు యోహానులు శృంగారము అను ద్వారము గుండా వేళ్ళుచు చెప్పెను, “మావైపు చూడుము.” ఆ కారణం చేత నేను, “చూడుము” అని చెప్పుచున్నాను. నేను మీరు శ్రద్దగా ఉండవలెనని కోరుచున్నాను. అయితే నేను ఒక పొడవైన నీటి ధారను చూస్తున్నాను. మరియు అది కాదు..... నీవు నీ కొరకు ఇక్కడకు రాలేదు. నీవు వయస్సుగల ఒక స్త్రీ కొరకు ఇక్కడ ఉన్నావు. మరియు ఆ స్త్రీ ఒక గుండె బాధతో బాధపడుచున్నది. ఆమె నీ తల్లి అయి ఉన్నది. ఆమె ఈ దేశములో లేదు. అలా - ఆ హింసించబడిన మతము ఉన్న ఆ చుట్టూ ఆమె ఏదో చోట ఉన్నది. ఆమె ఆచుట్టు ప్రక్కల ఏదో చోట ఉన్నది, ఒక రష్యా దేశపు సైనికుడు కవాతు చేయుట నేను చూచుచున్నాను.... ఆమె రష్యాలో ఉన్నది. అది యధార్ధము. సరిగా ఇప్పుడే, గుండె బాధతో బాధపడుచున్నది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆమెను బాగుచేయగలడు. నీవు అది నమ్ముచున్నావా? అప్పుడు వెళ్ళి మరియు నీ పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచుము. దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు దీవించబడును గాక. హల్లెలూయ.

విశ్వాసము కలిగి ఉండుము. సందేహించవద్దు.

స్త్రీ, రమ్ము. విశ్వసించుచూ, రమ్ము. నేను ప్రభువు యొక్క సేవకుడనని నీవు నమ్ముచున్నావా? దేవుని యందు విశ్వాసముంచుము. నేను నిన్ను ఎరుగను. అయితే అలా ఇక్కడ మనం సన్నిధిలో ఉన్నామని మన ఇద్దరిని ఎరిగిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నారు. ఆయన మనలను ఎరుగును. ఇప్పుడు, నీ కళ్ళును గూర్చి ప్రార్ధించవలెనని అడుగుటకు నీవు ఇక్కడ ఉన్నావు. నీకు ఒక కంటి బాధ ఉన్నది అంతలో అప్పుడు నేను మరల చూడగా, విశాలముగా వ్యాపించిన నీరు ఇక్కడకు వచ్చుచున్నది. మరియు ఎక్కడ అనేకమైన కొండలు ఉన్నవో అక్కడ మరొక దేశము ఉన్నది. అది అందమైనది. అది సరస్సులతో ఉన్న భూమి అయి ఉన్నది అంతలో అక్కడ నీవలె పూర్తిగా కనబడుచున్న ఎవరో ఒకరు అక్కడ ఉన్నారు. ఆమె నీ సహోదరి. ఆమె ఆమె రక్తములో, ఏదో రకమైన ఏదో దానితో వైద్యము చేయించుకొనుచుండెను, అది రక్తమునకు సంబందించిన వ్యాధి. మరియు అది స్వీడెన్ గాదా? [స్త్రీ చెప్పుచున్నది, “అవును.”] అది సరియేనా? [“అది నిజము.”] ఆ చేతిరుమాలు ఆమె కొరకు అయి ఉన్నది. [“అవును.”] మంచిది, వెళ్ళి, యేసుక్రీస్తు నామములో దానిని ఆమెకు పంపండి మరియు ఆమె బాగుపడవచ్చును. హల్లెలూయ.

72

దేవుని యందు విశ్వాసముంచుము. నీవు నమ్ముచున్నావా? యేసు చెప్పెను, “నమ్మువానికి సమస్తమూ సాధ్యము. నమ్ముట నీవలనైతే, సమస్తమూ సాధ్యము.” నీవు అది నమ్ముచున్నావా? విశ్వాసము కలిగి ఉండుము.

అవును, సహోదరీ. అక్కడ పైన ఎర్రని టోపీతో కూర్చుండి నా వైపు చూస్తూ ఉండగా, అప్పుడు నీ విశ్వాసము ఒక సంబంధము కలిగి ఉండునట్లు చేసెను, చూశారా. కనుక అలా కుంటిగా ఉండి కీళ్ళ నొప్పితో ఉన్న నిన్ను అది విడచిపోయెను. ఇక్కడ నీవు చేయగలవు. దేవునికి స్తుతి కలుగును గాక.

ఇక్కడ, సరిగా ఇక్కడే కూర్చున్న, ఇక్కడే సరిగా ఈ వరుసలో మూడవదానిని గూర్చి, నీవు కూడ కీళ్ళ నొప్పులు మరియు ఒక పిత్తాశయము యొక్క బాధను కలిగి ఉంటివి. నీవు నమ్మినయెడల, నీవు నమ్మి ఉండవచ్చును. సహోదరీ, అది యధార్ధము. నీ విశ్వాసమే దేవునితో ఒక సంబంధమును కలిగి ఉండునట్లు చేసెను. ఆ స్త్రీ స్వస్థపరచబడి ఉండినప్పుడు, అది నిన్ను కూడ తాకెను. నీవునూ స్వస్థపరచబడి ఉన్నావు. యేసుక్రీస్తు నిన్ను ఆరోగ్యవంతమైనవానిగ చేయును. హల్లెలూయ. ప్రభువు యొక్క నామమునకే స్తుతి కలుగును గాక. దేవుని యందు విశ్వాసము ఉంచుము.

యేసు చెప్పెను, “నీవు నమ్మినయెడల, నేను చేయగలను.” నీవు నమ్ముచున్నావా?

ఆ వెనుక వీపు బాధ నుండి నీవు స్వస్థతపొంది ఉంటావని ఇక్కడకు రాకముందే, అక్కడ కుర్చీలో కూర్చుని ఉంటున్నప్పుడే కేవలం అప్పుడే నీవు స్వస్థతపొంది ఉన్నావు అని నమ్ముచున్నావా? ఆమెన్. కనుక కేవలం ఆనందించుచూ వెళ్ళుము, అంతే. “దేవునికి వందనములు,” చెప్పుచూ.

73

స్త్రీ, రమ్ము రక్తసంబంధమైన వ్యాధులు మరియు సంగతులు దేవునికి స్వస్థపరచుటకు తేలిక అయి ఉన్నది. నీవు అలా నమ్ముచున్నావా, నీవు నమ్ముటలేదా? నీవు మరియు నేను ఒక రూపాంతరము కొరకు కల్వరి దగ్గరకు వెళ్ళెదము. యేసుక్రీస్తు నామములో, అలా నా సహోదరిని బాధించుచున్న ఆ దయ్యమును గద్దించుచున్నాను, మరియు యేసు నామములో ఆమెలో నుండి అతడు బయటకు వచ్చును గాక. ఆమెన్. సహోదరీ, కొనసాగి ముందుకు, వెళ్ళుము, అలా నిన్ను ఆరోగ్యవంతునిగా చేసిన దేవుని నమ్ముచూ, ఆనందించుచూ వెళ్ళుము. నీవు దేనికొరకు అడిగి ఉంటివో నీవు అది కలిగి ఉండగలవు.

సాహోదరీ, నీకున్న మూత్రపిండము సమస్య గతించిపోయెను. కొనసాగి ముందుకు వెళ్ళుము. నమ్ముము. విశ్వాసము కలిగి ఉండుము. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. నీ పూర్ణ హృదయముతో నమ్ముము.

స్త్రీ, ఇక్కడకు రమ్ము. నీవు తిరగవలెనని కోరుచున్నాను, ఈ మార్గము వైపుచూడుము. తన నోటి మీదుగా చేతిరుమాలుతో అక్కడ కూర్చుండిన ఆ స్త్రీని చూశారా? నీవు బాధపడుచున్న అదే సంగతితో ఆమె బాధపడుచున్నది. అక్కడ నల్లగా ఉన్న సన్నని, పొడుగాటి, అడ్డదిడ్డముగా ఉన్న ఒక రేఖ మీలో ప్రతీ ఒకని నుండి పరుగెత్తుచున్నది. అది కీళ్ళకు సంబందించినదే. అది యధార్ధము. ఆమెన్. హల్లెలూయ. ఇప్పుడు, దేవునికి వందనం చెల్లించుచూ ఈ వేదిక నుండి విడచి ముందుకు కొనసాగి వెళ్ళుము. విశ్వాసముతో ఉండుము.

మహిమ! దేవుని కుమారుడు సజీవుడు.

74

నాన్న, సరిగా అక్కడ వరుస యొక్క చివరలో, అక్కడ కూర్చుని ఉండగా నీ చేతితో దిగువన ప్రార్ధించుచుండగా, అవును, అతడు నీ ప్రార్ధన వినెను. నీవు ప్రార్ధించుచుంటివి. నేను నీ ప్రార్ధన విన్నాను. నీవు నిశ్శబ్దముగా ప్రార్ధించుచుంటివి, అయితే ఆయన నీ ప్రార్ధన నేను ఎరిగి ఉండునట్లు చేయును. నీవు చెప్పావు, “ప్రభువా, ఆ తరువాత అతడు నన్ను పిలుచునట్లు చేయండి - అది చేయండి - ఈ పర్యాయము నా సమయముగా ఉండునట్లు చేయండి.” అది యధార్ధము. అవును, నీవు నరముల బలహీనతతో మానసిక శక్తిని కోల్పోయావు, నీవు కోల్పోలేదా? హ-హు! అది యధార్ధము. మరియు నీకు తెలుసా, నీవు ఈ దేశము నుండి రాలేదు. నీవు ఒక స్థలము నుండి వచ్చావు, నేను ఆ నగరమును చెప్పగలను. అది యు-టి-ఐ..... ఉటికా, ఉటికా, మెచిగన్, మంచిది, నీవు గృహమునకు తిరగి వెళ్ళగలవు, నీవు కోల్పోయిన మానసిక శక్తికి సమాప్తము కలిగెను. నీ విశ్వాసమే నిన్ను బాగుచేసెను. హల్లెలూయ. దేవుని కుమారుడైన యేసు, జీవించును మరియు పరిపాలించును. నీవు నమ్ముచున్నావా?

స్త్రీ, రమ్ము. అక్కడ కూర్చుని ఉన్నప్పుడే స్త్రీకి కలుగు ఆ బాధ నిన్ను విడచి పోయినదని, నీవు నమ్ముచున్నావా? మంచిది, అది అలా జరిగినది. ఆమెన్. కనుక నీవు ఏది అడిగి ఉంటివో, అదే నీవు పొందియున్నావు. నమ్ముము.

75

స్త్రీ, సరిగా అక్కడ వెనుక బయట కూర్చుని ఉన్న నీవు దాని గూర్చి ఏమి తలంచుచున్నావు? నడచి వెళ్ళి అక్కడ స్వస్థపడి ఉండిన ఆ స్త్రీని గమనించుము. నీవు అది నమ్ముచున్నావా? అవును, నీ కళ్ళుతో కష్టపడుచూ, నీవు బాధపడుచున్నావు, నీవు బాదించబడి ఉండలేదా? అది యధార్ధము. సరిగా ఇక్కడే నడుముపై తెల్లని కోటుతో ఆ స్త్రీ వెనుక కూర్చుని ఉన్న ఆమె మీదుగా ప్రభువు దూత నిలబడి ఉండెను. అవును. హ-హు! హ-హు! సహోదరుడా, అది అద్భుతముగా లేదా? [ఒక మనిషి చెప్పుచున్నాడు, “కేవలం ఇప్పుడే ఆయన ఆ స్త్రీ కొరకైన నా ప్రార్ధనకు జవాబు ఇచ్చెను.”] ఆమెన్. అది చక్కగా ఉన్నది. స్త్రీ, నా జీవితములో నేను నిన్ను ఎన్నడూ చూడలేదు, నేను చూశానా? కాదండి, నేను ఎన్నడూ చూడలేదు. అయితే నీవు ఇక్కడ నుండి వచ్చిన దానివి కాదు. నీవు నా రాష్ట్రమయిన, ఇండియానా నుండి వచ్చావు. అది యధార్ధము. ఇండియానాలో, అండర్సన్, ఎక్కడ యంత్రాలు ఉన్నవో, ఆ చోట నుండి వచ్చావు. హ-హు! హల్లెలూయ.

76

అక్కడ సరిగా నీకు దగ్గరలో కూర్చుని ఉన్న ఆ స్త్రీ ఆమె ఛాతిలో ఒక కష్టముతో బాధపడుచున్నది, అది యధార్ధము. హ-హు! నీవు ఇండియానాలో, మునీస్ నుండి వచ్చావు. కేవలం ఇప్పుడే ఆనందించుచూ, వెనుకకు గృహమునకు పరుగెత్తుము. హల్లెలూయ!

నీవు స్వస్థపరచబడగలవని నీవు నమ్ముదువా, సహోదరి? ప్రభువైన యేసు నామములో పొందుకొనవచ్చును. విశ్వసించుచు వెళ్ళుము. విశ్వాసము కలిగి ఉండుము.

స్త్రీ, ఒక నిమిషము ఇక్కడకు రమ్ము. ఈ మార్గము వైపు చూచి చుట్టూ తిరుగవలెనని నేను నిన్ను కోరుచున్నాను. కేవలం అక్కడ ఆ ప్రజలలో 70 శాతము మంది నీకు ఉన్న స్థితిలోనే బాధపడుచున్నారు. అది యధార్ధము. ఎంత మంది నరముల బలహీన సమస్యతో బాధపడుచున్నారు? మీ చేయి పైకి ఎత్తండి. ఏలాగు ఆత్మలు లాగుచున్నవో చూశారా? అలా యేసు మిమ్మును స్వస్థపరచుటకు ఇక్కడే ఉన్నాడని ఎంత మంది నమ్ముదురు? మీ చేయి పైకి ఎత్తండి. ఇప్పుడు గృహమునకు వెళ్ళండి. అది సమాప్తమయినది. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును.

77

ఇలా చెప్పెదము,“ ప్రభువుకు స్తోత్రము.” నేను నిన్ను అడుగగోరుచున్నాను, స్త్రీ, వారికొరకు నేను చెప్పిన అదే సమయములో నీవునూ అదే విధమైన సంగతి కలిగి ఉంటివి. అంతలో నేను అలా చెప్పగా, ఏదో ఒకటి నీకు మీదుగా వచ్చెను, అది అలా రాలేదా? మంచిది, ఇప్పుడే ఆ నరముల బలహీన స్థితి నుండి నీవు స్వస్థపరచబడి ఉన్నావు; అది ఋతుక్రమము అయి ఉన్నది. విశ్వసించుచూ గృహమునకు వెళ్ళుము.

స్త్రీ, నీవు ఏమి తలంచుచున్నావు? నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముచున్నావా? నేను నిన్ను ఎరుగను, నిన్ను ఎన్నడూ చూడలేదు. దేవుడు ఏదో ఒకటి చేశాడు. ఆమెన్. నీవు ఇక్కడ ఇతరమైన ఎవరో ఒకరికొకరు ప్రార్ధించుచున్నావు. ఆమె నీ యొక్క ఒక స్నేహితురాలు అయి ఉన్నది. అంతలో నేను ఒక గొప్ప చర్చిని మరియు చిన్న విగ్రహములు మరియు వస్తువులు చూస్తూన్నాను. నీ స్నేహితురాలు ఒక కాథలిక్ గా మారినది. ఆమెకు కేన్సరు ఉన్నది మరియు ఆ కేన్సరు ఆమె ముఖముపై ఉన్నది. మంచిది. ఆ చేతిరుమాలును ఆమె దగ్గరకు తీసికొని పొమ్ము మరియు యేసుక్రీస్తు నామములో ఆమె ఆరోగ్యవంతురాలుగ ఉండవచ్చును మరియు బాగుపడి ఉండును.

నీవు నమ్ముచున్నావా? అప్పుడు యేసుక్రీస్తు నామములో నీ పాదములపై నిలబడి మరియు నేను నీ కొరకు ప్రార్ధన చేయుచుండగా, నీ యొక్క స్వస్థతను పొందుకొనుము.

సర్వశక్తుడవైన దేవా, నేను ప్రతి దయ్యమును వెళ్ళగొట్టుచున్నాను.

యేసుక్రీస్తు నామములో, ఈ రాత్రి ఈ ప్రజల నుండి వాడు వెడలిపోయి మరియు వెళ్ళును గాక. సాతానా, నీవు శిక్షించబడి ఉన్నావు, విశ్వాసము గల కన్నులు ఇక్కడే నిలచి ఉన్న దేవుని పట్టుకొనును, సాతానా, యేసుక్రీస్తు నామములో వారిలో నుండి బయటకు రమ్ము.

మీ చేతులు పైకి ఎత్తి మరియు ఆయనకు స్తుతి చెల్లించుడి!

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...