క్రీస్తులో దాచబడిన జీవము

క్రీస్తులో దాచబడిన జీవము

ఈ రాత్రి ఇక్కడ పరిచర్యలో ఉండుటకు ఎంతో సంతోషముగా యున్నది. నేను ఎప్పుడే కొనుగొంటిని నా యొక్క మంచి స్నేహితుడు, సహోదరుడు ఎక్బెర్గ్, మనకొరకు పాడబోవుచున్నాడు. అది నిజమేనా? ఈ స్వీడన్ నాయకులను బట్టి ఎందరు సంతోషిస్తున్నారో మీ చేతులు చూపించండి. అవును, మనమందరమూ ఇష్టపడుచున్నాము, అది మంచిది. అతని గీతములు వినుటకు నేను ఎంతగానో ఇష్టపడుదును. వారిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. సహో. ఎక్బెర్గ్, సరే మంచిది.

[సహోదరుడు కొన్ని మాటలు పలికి, ''మృదువుగా ప్రేమతో ఆయన నిన్ను చూస్తున్నాడు,'' అనే పాటను పాడి, తన సాక్ష్యమును చెప్పాడు]

సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఆ కార్యములు సులభంగా జరగలేదు. అవి జరుగవలెనంటే దేవుని సహాయం కావాలి. ఒకవేళ ప్రభువు మన సహోదరునికి తోడైయుండకపోతే ఈ రాత్రి అతడు మన మధ్య పాటలు పాడుచు ఉండేవాడు కాదు. కాని అతడు సాక్ష్యమిచ్చినట్లుగా అదంతయూ దేవుని ప్రణాళిక. చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులను నమ్మి వారి మీద ఆధారపడినట్లుగా, మనము కూడా ఆయనను నమ్మి, ఆయన మీద ఆధారపడునట్లుగా ఆయన ఈ విధంగా చేసియున్నాడు. మరియు ఆయన ఎల్లప్పుడూ దానిని నెరవేర్చును.

మరియు ఆయన పాడినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ ఇద్దరు, సహో. వేర్మల్ మరియు సహో. ఎక్బెర్గ్, వారిద్దరి పాటలు నాకు ఎంతో ప్రేరణ ఇస్తాయి; వారి యొక్క గానం.

2

కొన్ని సంవత్సరముల క్రితము, వారి అందమైన స్వీడన్ దేశములో నేను కొన్ని సభలు నిర్వహించాను. దేవుడు అక్కడ ఎన్నో గొప్ప కార్యములను జరిగించారు. ఫిన్లాండ్ దేశములో ఒక చిన్న బాలుడు మరణము నుండి లేపబడినాడు. ఆ వార్త ఆదేశము౦తటా వ్యాపించినది. మేము అక్కడ అద్భుతమైన సమయమును కలిగియున్నాము. ప్రభువు చిత్తమైతే మరియొక సారి అక్కడకు వెళ్ళి ఆ స్వీడన్ స్నేహితులను కలుసుకోవాలని ఆశిస్తున్నాను.

ఒకానొక రోజున మనమందరము ఆ అందమైన పక్షి రెక్కల మీద ఎగిరిపోయి మరెన్నడూ వెనక్కి వెళ్ళనవసరము లేని దేశములోనికి వెళ్ళుదము. అది నిజమేనా? మనము ఆ సమయము కొరకు ఎదురు చూస్తున్నాము.

3

ఇప్పుడు దినములు గతించుచుండగా, ప్రజలు ఇంకా ఎక్కువగా వచ్చినట్లయితే మనము స్వస్థతా కూడికలు ప్రారంభించవచ్చును.

మేము రాత్రంతా ప్రయాణించి కొద్దిసేపటి క్రితమే ఇక్కడకు చేరుకొన్నాము. వారు ఈ గుడారమును వేశారు. సహో ఆర్గాన్ బ్రైట్ మరియు ఇప్పుడే వేదిక మీద నుండి క్రిందకు వెళ్ళిన సహోదరుడు... అతని పేరు నాకు గుర్తుకు వచ్చుట లేదు [సహోదరుడు “మెండెన్ హాల్” అని చెప్పాడు], మెండెన్ హాల్ మరియు కొందరు సహోదరులు ఈ గుడారమును వేశారు.

గత సంవత్సరము మేము జర్మనీలో ఉన్నప్పుడు మేము దీనిని గూర్చి ప్రణాళిక వేశాము. నా పుస్తకములను జర్మనీ భాషలో అనువాదము చేసిన సహోదరునితో ఇప్పుడే నేను కరచాలనము చేశాను. ఆ సహోదరుని మేము ఎంతగానో ప్రశంసిస్తున్నాము.

4

నిశ్చయంగా జర్మన్ ప్రజలు మమ్మలను హృదయ పూర్వకముగా ఆహ్వానించారు. నేను జర్మనీ గూర్చి కొంచెం చెప్పవలసియున్నది. నా భార్య జర్మనీ సంతతి వ్యక్తి, కాబట్టి నేను కొంచెం జాగ్రత్త వహించాలి. ఒక ఐరిష్ వ్యక్తిగా నేను ఒక జర్మనీ వ్యక్తిని వివాహము చేసికొనినప్పుడు, అది నిన్ను తిన్నగా ఉంచుతుంది. మీకు తెలుసు.....

అక్కడ ఆరాధనలలో మేమెంతగానో సంతోషించాము. మరియు ప్రభువు మమ్ములను ఆశీర్వదించాడు.

మరియు తర్వాత మేము స్విట్జర్లాండ్లో ప్రవేశించాము. అది జర్మనీలోని భాగము. వారు ఒకే భాష మాట్లాడతారని భావిస్తున్నాను. కాబట్టి మేము.....

అక్కడ ప్రభువు మా మధ్య గొప్ప కార్యములు జరిగించారు. పది రాత్రులలో యాభై వేల ఆత్మలు; మరలా జర్మనీలోని లాసన్నే ప్రాంతంలో మరియొక యాభై వేల ఆత్మలు క్రీస్తు నొద్దకు వచ్చారు.

అమెరికా సంగతి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపడుతుంటాను. మిగిలిన దేశములన్నియూ ముందడుగులో ఉన్నాయి, అవి ప్రథమ ఫలములలో పాలు పొందుచున్నాయి.

5

స్వస్థతా ఆరాధనకు ప్రజలు సమకూర్చబడుచున్నారు. మరియు ఈ ఆరాధనలు నా మీద ఎంతో భారమును కలిగిస్తున్నాయి. దర్శనములు బట్టి ఎంతో భారము కలుగుచున్నది, చాలా సార్లు ప్రజలు గుంపుగా స్వస్థతలు పొందుచున్నారు. అనేక సార్లు వేలాది మంది కూడియుండగా వారిలో ఒక్కరు కూడా బలహీనుడు లేకుండా అందరూ స్వస్థత పొందియున్నారు. చూశారా?

మనము ఆ స్వస్థతా ఆరాధన కలిగియుందాము. ఒక్క వ్యక్తి యున్నా పర్వాలేదు. ఏ బేధము లేదు.

మనము కొన్ని రాత్రులు తీసికొని ప్రజలకు ఈ సమయంలో ఏది అవసరమై ఉన్నదో దానిని గూర్చి మాట్లాడాలని భావిస్తున్నాను. నేను ఉపదేశకుడను కాదు, నాకు వేదాంత జ్ఞానము లేదు. నాకు చదువు లేదు. కాని నేను కొన్నిసార్లు.....

నేను ఈ విధంగా చెప్పవచ్చును, నాకు గ్రంథమును గూర్చి ఎక్కువగా తెలియదు, కాని దాని రచయితను నేను బాగుగా ఎరుగుదును. కాబట్టి నేను ఆయనతో ఎక్కువగా సహవాసం చేయగోరుచున్నాను, కాబట్టి వారికి మేలు కలిగించు దానిని వారి ఎదుట పెట్టుటకు ప్రయత్నిస్తున్నాయి.

6

మరియు నమ్ముచు.... గొప్ప ఉజ్జీవం పొందు అనేక అవకాశములు అమెరికాకు ఇవ్వబడినప్పటికీ, అది ఇంకనూ మరింతగా చెడిపోవుచున్నది. కాబట్టి అది నన్ను హెచ్చరిస్తుంది. ఇది నా దేశము, నేను ఇక్కడ జన్మించాను, నేను దీనిని ప్రేమిస్తున్నాను, సాధ్యమైతే నేను జీవించిన దినములలోనే ఇక్కడ గొప్ప ఉజ్జీవమును చూడాలని ఆశిస్తున్నాను.

ఇప్పుడు, ఆ గొప్ప ఉజ్జీవము నేను తీసికొని రాలేను, మరి ఏ సేవకుడు తీసికొని రాలేడు. కాని దేవుడు దానిని తీసికొని వస్తున్నప్పుడు మనము దానిలో ఒక భాగముగా ఉండవచ్చును. మనలో ప్రతి ఒక్కరు దానిలో ఒక భాగమును నెరవేర్చవలసియున్నది.

7

గత రాత్రి నేను సహవాసము మీద మాట్లాడాను, మరియు ఈ రాత్రి నేను, ''క్రీస్తు అంతరంగిక జీవము'' అనే అంశము మీద మాట్లాడగోరుచున్నాను. మరియు ప్రభువు చిత్తమైతే రేపు రాత్రి... నేను ఎప్పుడు దేనిని ముందుగా సిద్ధపరచుకోను, దానిని బట్టి నీవు ప్రేరేపించబడాలి, నేను ఎన్నడు వ్రాసుకున్న నోట్సు నుండి ప్రసంగించను; నేను పొందుకొనుచున్న దానిని మాట్లాడుతాను,..... ప్రభువు చిత్తమైతే రేపు రాత్రికి పెంతెకొస్తు సంఘము ఎక్కడ తప్పిపోవుచున్నదో దానిని గూర్చి ప్రసంగిస్తాను. నేను ఆ విధంగా చేస్తానో లేదో తెలియకుండా ముందే ప్రకటిస్తున్నాను. ప్రభువు దానిని అనుమతించునని నేను నమ్ముచున్నాను.

మీరు నాతోపాటు సహించండి. నా శాయశక్తులా నేను ప్రయాసపడు చున్నాను... ఈ ప్రజల మధ్య దేవుని యొక్క గొప్ప కదలికను చూడాలని నేను ఆశిస్తున్నాను. మనమందరమూ ఒక్క విషయములో ఏకత్వము కలిగి యున్నాము, అది ఏమనగా యేసుక్రీస్తు మరియు దేవుని రాజ్యము. కాబట్టి మనము ఏ సంఘమునకు చెందిన వారము అనే విషయముతో సంబంధము లేకుండా, ప్రతి ఒక్కరూ ప్రజలు రక్షణ పొంది, దేవునితో సరి అగునట్లుగా ప్రయాసపడాలి.

అనేకమార్లు, వివిధ శాఖలకు చెందిన వేలాది మంది ప్రజలు... “మీరు పలాని శాఖకు వెళ్ళండి,'' అని నేను ఎన్నడూ చెప్పలేదు, ఎందుకనగా నేను నమ్ముచున్నాను వారిలో ప్రతి ఒక్కరూ... వారు ప్రయత్నిస్తున్నారు... వారికి తెలిసినంతలో సరియైనది చేయుటకు వారు ప్రయత్నిస్తున్నారు. వారికి కొన్ని విషయములు బోధించబడ్డాయి.

బహుశా కొందరు మిగిలిన వారికంటే లోతుగా నడుస్తుండవచ్చును. మరియు ఎవరైనా ఒక వ్యక్తి లోతైన అనుభవములో నడుస్తున్నట్లయితే, నేను అతడి మార్గములో అడ్డుగా నిలుచుటకు ప్రయత్నించను.

8

యెహోషువ నడచిన మార్గములో నేను నడవలేకపోయినట్లయితే, లేక హనోకు నడచిన మార్గములో నేను నడవలేక పోయినట్లయితే, హనోకు దేవునితో నడిచాడు, అతడు కొంతకాలము ఈ భూమి మీద నడచిన తర్వాత ఆయనతో కలిసి పరలోకమునకు కొనిపోబడ్డాడు. ఒకవేళ నేను ఆ విధంగా నడవలేకపోయినట్లయితే ఆ విధంగా నడిచే వ్యక్తి మార్గములో నేను అడ్డగా నిలువబడను. వారు ఆ విధంగా వెళ్ళుటకు సహాయం చేస్తాను. కాబట్టి మనమందరమూ ఆ లక్ష్యమును కలిగియుండాలి.

కాబట్టి మీరు వెళ్ళి ప్రజలను తీసుకొని రండి, ఒకటి లేదా రెండు రాత్రులలో స్వస్థతా కూటములు ప్రారంభమగును అని వారికి చెప్పండి మరియు ఒక్కసారి ప్రారంభమైతే ఆ దర్శనములు ఒక గొలుసువలె కొనసాగుతాయి. మనము ఆ భాగములోనికి వచ్చినప్పుడు నేను దానిని గూర్చి వివరించుదును. ఈ రోజు క్రీస్తు శరీరము ఐక్యతలోనికి వచ్చుట కొరకు ప్రయత్నిస్తున్నాను. పాపులు క్రీస్తు నొద్దకు వచ్చి తమ స్థానమును ఆయనలో కనుగొందురు.

మరియు ఈ రాత్రి ఒక చిన్న లేఖనమును తీసుకొని, దాని నుండి ఒక చిన్న అంశమును ప్రసంగిస్తున్నాను, ముప్పై లేదా నలువది నిమిషాలు కంటే ఎక్కువగా ప్రసంగించను, మరియు రేపు రాత్రి, మీరు మరువ వద్దు. ప్రభువు చిత్తమైతే నేను ప్రయత్నిస్తాను, లేఖనముల నుండి....

9

నేను లేఖనములను అనుసరించేవాడను, ప్రతిది లేఖనముల నుండి రావలసియున్నది. నేను దానిని విశ్వసించను అని చెప్పుట లేదు గాని, అది లేఖనముల నుండి రానట్లయితే దానిని నేను సరిగా గ్రహించలేను. మరియు స్వస్థతా ఆరాధన సమయంలో మేము చేసే వాటిలో ఏదైనా లేఖనముల ప్రకారము లేనట్లయితే, నీవు ఏ సంఘము నుండి వచ్చిన వ్యక్తివైనా సరే, నీవు నా యొద్దకు రమ్ము. ఎందుకనగా నేను ఖచ్చితంగా లేఖనముల ప్రకారము జీవించగోరుచున్నాను. ఎందుకనగా ఇదే పునాది. ప్రతి లేఖనము, పరిశుద్దాత్మ యొక్క అన్ని కార్యములు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం నుండి రావలసియున్నది, అప్పుడే నేను దానిని నమ్ముతాను.

పరిశుద్ధ గ్రంథములో లేని దానిని ఆయన చేయగలడు. అయిననూ ఆయన దేవుడే. కాని అది బైబిల్ నుండి వచ్చినట్లయితే నేను దానిని బాగుగా అర్థము చేసుకోగలను. నేను అట్టి విధానమును ఇష్టపడతాను, ఎందుకనగా అది సరియైనదని నేను గ్రహించగలను.

10

ఇప్పుడు మనము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము నుండి 20వ వచనము వరకు వ్రాయబడిన వాక్యభాగమును చదువుతాను.

సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్టించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది. గనుకను, దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు.

చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించును గాక. మనము ఒక్క క్షణము తలలు వంచి ప్రార్ధన చేయుదము.

11

కొద్ది నిమిషముల క్రితము ఒక సహోదరుడు కాగితము మీద ఏదో వ్రాసి నాకు ఇచ్చాడు. నేను దానిని చదివాను. ఈ రాత్రి ఇక్కడ ఒక స్త్రీ యున్నది, ఆమె స్నేహితులు లేదా ఆమె బంధువులలో ఎవరో ఒకరు ఈ రాత్రి చాలా చాలా అనారోగ్యముతో ఆసుపత్రిలో ఒక శిశువు లేదా బిడ్డ మరణమునకు సమీపముగా పడియున్నారు. ఇప్పుడు మనము, అందరమూ కలసి ప్రభువు ఆ శిశువును మరణం నుండి కాపాడునట్లుగా మనము ప్రార్ధనలో ఏకీభవించుదాము. స్నేహితులారా, ఆయన చేయగలడు.

కొన్ని సంవత్సరముల క్రితము ఇక్కడ నా వద్దకు మరణించిన బిడ్డను తీసుకు వచ్చారు. శాన్ బెర్నార్డెనో వద్ద జరిగినది మీకు గుర్తున్నదా? ఉదయమున మరణించియున్న బిడ్డను నా శరీరమునకు తాకించి ప్రార్ధించగా, నా శరీరములో ఏమియు లేదు గాని, యేసుకు చేసిన ప్రార్థన ఆ కార్యము జరిగించినది. ఆ చిన్నబిడ్డ వెంటనే జీవము పొంది కన్నులు తెరచినది.

12

ఇప్పుడు, తలలు వంచి ప్రార్థన చేద్దాము.

మా ప్రియమైన పరలోకపు తండ్రీ, ఈ రాత్రి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ సన్నిధిలోనికి వచ్చాము. ఆయన నామములో మేము ఏది అడిగినా పొందుకుంటామని ఆయన చేసిన వాగానమును ఎరిగి వచ్చియున్నాము.

నీకు అర్పించుటకు మాలో ఏ మంచియూ లేదు, గాని కేవలము ఆయన గొప్పతనమును బట్టియే నీ సన్నిధిలో దయచేయమని అడుగుచున్నాము. తండ్రీ మొదటిగా మా పాపములను, నీకు వ్యతిరేఖముగా చేసిన అతిక్రమములన్నింటినీ క్షమించమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తముతో మా పాపములను కడిగివేయండి. మా మనస్సులో ప్రతి చెడ్డ తలంపును మరియు ఈ కూటమును అడ్డగించు ప్రతి కార్యమును క్షమించండి, మేము అడుగుచున్న విషయములు, మమ్ములను క్షమించమని ప్రార్థిస్తున్నాము.

13

మరియు ఇప్పుడు, తండ్రీ, ఈ రాత్రి నీ పరిశుద్దాత్మ నీ వాక్యమును పట్టుకొనుగాక.... “వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తుని గూర్చిన మాటవలన కలుగును.” పరిశుద్ధాత్మ వలన వాక్యము ప్రతివారి హృదయములో నాటబడును గాక. ప్రభువా, దీనిని అనుగ్రహించుడి. మాకు నిజమైన పునాది అనుగ్రహించండి, మేము రోగుల కొరకు ప్రార్ధించినపుడు, ఈ దేశములో ఎన్నడూ లేనటువంటి గొప్ప ఉజ్జీవమును అనుగ్రహించండి, ప్రభువా మీరు మహిమ పొందాలని మేము ఇక్కడ కూడియున్నాము. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. దీనిని అనుగ్రహించండి. ఆలాగు చేయుము దేవా!

ఈ రాత్రి సహోదరి ఈ చీటి పంపియున్నది, ప్రభువా, ఆమెను నేను ఎరుగను. ప్రభువా, ఎవరో తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో పడియున్నారు. ప్రభువా, మీ కరుణాదూతను పంపి ఆ వ్యక్తిని బ్రతికించండి. మేము యధార్థమైన హృదయముతో ప్రార్థిస్తున్నాము. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. ప్రార్థన పరిస్థితులను మార్చును.

తండ్రీ, మేము లేఖనములలో చదివియున్నాము, మీరు హిజ్కియా అనే వ్యక్తి దగ్గరకు ప్రవక్తను పంపి, నీవు మరణమగుదువు అని చెప్పమన్నారు. అయితే అతడు గోడవైపు తన ముఖమును త్రిప్పుకొని కన్నీరు విడిచి, ''ప్రభువా, నన్ను కరుణించు అని బ్రతిమాలుకొనుచున్నాను, నీ ఎదుట నేను యధార్థమైన హృదయంతో నడుచుకున్నాను.'' అతడు వదిహేను సంవత్సరములు జీవించాలనుకొన్నాడు. దేవా, నీవు నీ ప్రవక్తను మరలా పంపించి, “నేను అతని మొర వినియున్నాను,'' అని చెప్పారు.

మరణము నుండి జీవము; ఏలయనగా ప్రార్ధన పరిస్థితులను మార్చును. ప్రభువా, మరొక్కసారి ఈ రాత్రి దానిని మాకు అనుగ్రహించండి. ఆ వ్యక్తి జీవించును గాక.

14

ఈ వార్త తీసికొని వచ్చిన వ్యక్తిని దీవించండి, ఇక్కడున్న రోగులను మరియు అవసరతలో యున్నవారిని దీవించండి, ఈ ప్రాంతములో యున్నవారందరినీ; వారితో ఉండండి.

ప్రభువా, ఇప్పుడు నిష్ప్రయోజకుడనైన నీ సేవకుడిని వాక్యము వెనుక దాయండి. ఇప్పుడు వాక్యము ప్రకటించబడి వారి హృదయములలో నాటబడును గాక, నీ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.

15

ఇప్పుడు, ఈ రాత్రి ప్రభువు ప్రతి ఒక్కరిని దీవించును గాక. మరియు యధార్థముగా ప్రార్థించండి. కేవలము ప్రార్థించుట మాత్రమే కాదు గాని నీవు ప్రార్థించిన వాటిని పొందియున్నావని విశ్వసించండి.

అనేకసార్లు ప్రజలు అనుకుంటారు, “ఓ, నాకు ఇంకా ఎక్కువ విశ్వాసము ఉంటే,” ఎంత బాగుండును అని తలంచుతారు. నేను దానిని నమ్మను. నీకు చాలినంత విశ్వాసమున్నది; నీవు కలిగియున్న విశ్వాముతో నీవు ఏమి చేయగలవో తెలుసుకోగలిగినంత జ్ఞానము నీకు కావాలి. అది చాలును. నీకు చాలినంత విశ్వాసమున్నది, దానిని ఎలా కార్య రూపములో పెట్టాలో నీకు తెలియదు. అది సరియే, అది దానిని నెరవేర్చును. స్వస్థత పొందుటకు చాలినంత విశ్వాసము లేని వారు ఒక్కరు కూడా ఇక్కడ లేరని నేను నమ్ముచున్నాను. నీ సమస్య ఎలాంటిదైనప్పటికీ నీవు దానిని పొందుకొనే సరియైన మార్గము నీకు తెలిసియున్నట్లైతే చాలు.

16

మరియు ఇప్పుడు మనము పవిత్ర పరచే ఒక జీవితం గూర్చి మాట్లాడుచున్నాము. చివరి రాత్రి నేను రక్తం ద్వారా సహవాసమును గూర్చి మీతో మాట్లాడాను; దేవుడు మనిషిని (తన) రక్తం ద్వారా తిరిగి సహవాసమునకు ఎలా తెచ్చాడు? మరియు, ఈ రాత్రి, నేను క్రీస్తులో దాచబడిన ఒక జీవమును గూర్చి మాట్లాడాలనుకొనుచున్నాను.

బైబిల్ విద్యార్థులు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారమునకు ఆవరణములు ఉండేవని ఎరుగుదురు. అవి ఆవరణము, తెర, పరిశుద్ధ స్థలము మరియు అతిపరిశుద్ధ స్థలము.

పరిశుద్ధ స్థలములో బోధించబడిన ఆ విషయములన్నియూ..... వాటిని పోల్చి చెప్పేవాడిగా పాత నిబంధనను క్రొత్త నిబంధనతో పోల్చి చెప్పుట నాకు అలవాటు. ఎందుకనగా ప్రజలు దానిని చక్కగా గ్రహిస్తారు. దానిని ఆ రీతిగా పోల్చినప్పుడు పాతది, క్రొత్త దాని యొక్క ఛాయ అని నీవు గ్రహిస్తావు. అప్పుడు అది కథారూపంలో ఉంటుంది. అప్పుడు దానిని నీవు మరచిపోలేవు ఎందుకనగా అది బయలుపరచబడిన రూపంలో నీ యొద్దకు వచ్చినది.

17

మరియు పాత నిబంధన క్రొత్త నిబంధనకు మాదిరిగా యున్నది. మరియు ప్రత్యక్ష గుడారములోపలి కార్యములు, ఈ రోజు దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు చక్కటి మాదిరిగా యున్నవి. మనము దీని ద్వారా దేవుడు మన కొరకు దాచియుంచిన దానిని పొందగలిగే స్థితిని నేర్చుకోగలిగినట్లయితే, అది ఇక్కడున్న లోయంతటిని నింపివేస్తుంది. చూశారా? నీవు దేని కొరకు వస్తున్నావో, ఎలా రావాలో ఎరుగుట ఎల్లప్పుడు మంచిది కదా? దేనినైనా ఎలా సమీపించాలో నీవు ఎరిగి యుండుట మంచిది.

నా కాలములోని రాజుల కొరకు నేను ప్రార్ధించాను. నేను రాజు ముందుకు నడిచి వెళ్ళేటప్పుడు వారు నాకు ఎట్టి సూచనలు ఇచ్చారో నాకు గుర్తున్నది. నా వీపు రాజు వైపు చూపవద్దు అని చెప్పారు, వెనక్కి వచ్చేటప్పుడు వెనక్కి నడుస్తూ రావాలి. నీవు ప్రత్యేకమైన రీతిలో సమీపించాలి, లేనట్లయితే నీవు వెనక్కి పిలువబడతావు.

నీవు ఈ దేశములో న్యాయమూర్తితో మాట్లాడుటకు న్యాయస్థానమునకు వెళ్ళినప్పుడు, ''ఓ, న్యాయమూర్తి, నీతో ఒక్క నిమిషము మాట్లాడాలి“ అని కేకలు వేయవు, చూశారా? నీవు అనుమతించబడి, ఏర్పరచబడిన మార్గములో రావాలి. ”ఘనత వహించిన, న్యాయమూర్తిగారు.....“

మరియు మనము దేవుని సమీపించునప్పుడు ఖచ్చితంగా ఆయన ఏర్పరచిన మార్గంలోనే ఆయనను సమీపించాలి. మనము సరిగా ఆయన ఏర్పరచిన మార్గములోనే నడచినప్పుడు మాత్రమే ఆయనను చేరి ఆయన మాటలు వినే భాగ్యము కలుగుతుంది.

18

పాత నిబంధనలో వెలుపలి ఆవరణములు ఉండేవి. ఆ వెలుపటి ఆవరణములో ఏమి యున్నదో మనము గమనించుదాము. తర్వాత పరిశుద్ధ స్థలము లేక మొదటి తెర, మరియు దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలము. మరియు ఆవరణములో ఏయే ఉపకరణములున్నాయి, పరిశుద్ధ స్థలములో ఏమున్నది, మరియు అతిపరిశుద్ధ స్థలములో ఏమున్నది.

మరియు ఈ రాత్రి అతిపరిశుద్ధ స్థలమును గూర్చి మాట్లాడుదాము. అక్కడ దేవుడు నివసించును. అది ఆయన నివాస స్థానము.

ఆ దినములలో ఆయన తన గుడారములో నివసించెను. ఈ రోజు ఆయన తన గుడారమైన నీలో నివసించుచున్నాడు. కాని మనము ఖచ్చితముగా ఈ స్థలమును నివాసయోగ్యమైన స్థలముగా చేయాలి. ఆవరణముగా కాదు లేక పరిశుద్ధ స్థలముగా కాదు, కాని మనము అతి పరిశుద్ధ స్థలములో, ప్రతిష్టించబడిన, దాచబడిన జీవము ఒంటరిగా దేవునితో నివసించాలి.

మనము అతిగా ఉత్తేజం చెందుతున్నాము, కృంగిపోతున్నాము, అనేక విషయములతో సతమతమగుచున్నాము. ఏదో కొదువ కలిగియున్నామని అది చూపిస్తుంది. సంఘము ఇప్పుడు తానున్న చోటు నుండి లక్షల మైళ్ళ ముందుకు వెళ్ళి యుండవలసినది. మనము ఇంకనూ కౌమార ప్రాయములోనే యున్నాము. వివాదములు, పోట్లాటలు, దెబ్బలాటలు, దిగులుతో ఉంటున్నాము. కాని నిజమునకు మనము ప్రతిష్టించబడి అతిపరిశుద్ధ స్థలములో దేవునిలో దాగియుండాలి. మనము కొంత సమయమును తీసుకొని మనము ఎక్కడికి వెళ్ళబోవుచున్నామో చూద్దాము.

19

ఇప్పుడు..... దేవుడు ఆ మూడు ఆవరణములలో నివసించుచున్నాడు. ఆయన నిశ్చయముగా సమాజముగా సమాజము నిలిచియున్న ఆవరణములో నివసించుచున్నాడు. మరియు ఆయన పరిశుద్ధ స్థలములో నివసించును. కానీ ఆయన నివాస స్థలము... ఇది అతి పరిశుద్ధ స్థలములోని ఆయన సన్నిధి యొక్క గుణలక్షణములు మాత్రమే.

అది నీకు మాదిరిగా యున్నది. నీవు పరిశుద్ధ స్థలములో గమనించినట్లయితే, గణిత శాస్త్రరీత్యా మాట్లాడినట్లయితే, మూడు దేవుని యొక్క సంపూర్ణ సంఖ్య. దేవుడు మూడులో పరిపూర్ణుడైయున్నాడు. దైవత్వము మూడులో పరిపూర్ణమైయున్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకే నిజమైన దేవుడు, మరియు యుగములు మూడులో పరిపూర్ణమైయున్నవి. మూడు, ఏడులు, పన్నెండు, ఇరవైనాలుగు, నలభై, యాభై దేవుని గణిత సంఖ్యలు. లేఖనములన్నింటిలో అవి కన్పిస్తాయి.

మరియు గమనించండి. నీవు కూడా మూడులో పరిపూర్ణమై యున్నావు. ప్రాణము, శరీరము, ఆత్మ; నీరు, రక్తము, మరియు ఆత్మ. ఆయన శరీరము నుండి వచ్చిన మూడు కార్యములతో నూతన జన్మ కలుగుతుంది. ఆయన శరీరము నుండి వచ్చిన నీరు, రక్తము, ఆత్మ అనే మూడు కార్యములతో నూతనజన్మ కలుగుతుంది.

శారీరకమైన జన్మకలుగుటకు కూడా అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు, నా ఎదుట మిశ్రిత జనులు యున్నారు, కాని మీరు వైద్యుడిని అడగండి. నేను మీ సహోదరుడను. ఒక బిడ్డ శరీర ప్రకారము జన్మించినప్పుడు, మొదట నీరు, తర్వాత రక్తము, తర్వాత జీవము: ఆత్మ.

20

మరియు నూతన జన్మ విషయములో కూడా అదే కార్యములు జరుగును. నీరు, రక్తము, ఆత్మ. విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుట, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుట, శుద్ధీకరణము, రక్తము ద్వారా శుద్దీకరించబడుట; తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీస్మము, నిన్ను అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశపెట్టుట.

ఇప్పుడు ఆ వ్యక్తి క్రీస్తులో దాచబడ్డాడు. ఈ మాటలు నేను గౌరవముతో చెప్పుచున్నాను. మనలో అనేకులు ఇంకనూ వెలుపల ఆవరణములలో ఆటలాడుచున్నారు. చూశారా? మన జీవమును క్రీస్తుతో కూడా దాచిపెట్టుట లేదు. ఆత్మ ఫలములు దానిని నిరూపిస్తున్నాయి. మీరు చూశారా? మనము అక్కడ యున్నామని తలంచవచ్చును గాని, నీ జీవితములో దానితో సరిపోల్చబడేవరకు... అదే దానిని నిరూపిస్తుంది. వారి ఫలములను బట్టి మీరు వారిని ఎరుగుదురు అని యేసు చెప్పెను. వారి మతశాఖలను బట్టి కాదు, కాని ఫలములను బట్టి మీరు వారిని ఎరుగుదురు.

21

మరియు ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సహనము, సాత్వీకము, ఆశా నిగ్రహము, ఆత్మఫలములు ఇవియే. ఈ రోజు పరిశుద్ధ గుంపు వారికి ఏమి కావాలో, కాల్వినిస్ట్ వారికి ఏమి కావాలో దేవుడు ఎరిగియున్నాడు... వారందరికి ఈ రోజు కావలసినది మరింత ఆత్మ ఫలము, దానిని నిరూపించే జీవితములు.

మనము అనేకమైన సాక్ష్యములు కలిగియున్నాము, కానీ పాతకాలపు సామెత చెప్పినట్లుగా, “నీ జీవితము బిగ్గరగా మాట్లాడుచున్నది, నేను నీ మాటలు వినలేను.'' మనము మనుష్యులందరూ చదువునట్లుగా వ్రాయబడిన దేవుని పత్రికలము.

ఇక్కడ కొద్ది కాలము క్రితము, ఈ పట్టణమునకు ఒక సువార్తికుడు వచ్చాడు. మరియు ఒక వ్యక్తి చెప్పాడు..... ఓ, అతడు గొప్ప ఉత్సాహముతో యున్నాడు. ''ఈయన మాటలు వినండి!'' అని చెప్పాడు.

అతడు చెప్పాడు, ''మంచిది, ఆ విధంగా చేయుట నాకిష్టమే.'' అతడు చెప్పాడు, ''కాని ఈ రాత్రి నేను, మా స్వంత సంఘములో ఆరాధనకు వెళ్ళాలి. నేను రేపు రాత్రి మీతో వస్తాను.''

అతడు చెప్పాడు, ''ఓ, నీవు వచ్చే వారము వెళ్ళవచ్చును.''

''కాని మా స్వంత సంఘములో ఆరాధనలున్నాయి. మరియు ఆయన ప్రసంగం వినుటకు నేను రేపు రాత్రికి వెళ్తాను,'' అని చెప్పాడు.

అతడు చెప్పాడు, ''ఓ, కానీ ఈయన చాలా మంచి వ్యక్తి, అతడు అద్భుతమైన ప్రసంగీకుడు.''

“అతడు అద్భుతమైన వ్యక్తి అని నీవు చెప్పిన దానిని నేను సందేహించుట లేదు. నీకు తెలుసా, నేను నా సంఘ కాపరి పక్క ఇంటిలో నివసిస్తున్నాను.''

22

నా భావమును మీరు గ్రహించారా? అది నీ జీవితము. మనము ఎంతో సాంప్రదాయము కలిగిన వారిగా యుండవచ్చును. మరియు కాలిఫోర్నియాలో ఇక్కడ ఆ విషయములోనే ఎక్కువ సమస్య కలిగియున్నామని నమ్ముచున్నాను. మనము చాలా ఎక్కువ సాంప్రదాయం కలిగియున్నాము. అది నిజమని నేను నమ్ముచున్నాను. చాలా సాంప్రదాయం, అక్షరము సరియైనదే, కాని అది చంపును; కాని ఆత్మ జీవింపజేయును, కాబట్టి సరియైన జీవము నిచ్చే సరియైన ఆత్మ పొందుకొనండి. చూశారా? నీవు సరియైన జీవము కలిగియుండాలి.

మరియు వెలుపల ఆ ఆవరణములో..... ఈ భూమి మీద నీ జీవితము ఉన్నట్లుగా, నీవు మూడు గదుల గృహములో జీవిస్తున్నావు. అది నీకు తెలుసా? “సహో. బ్రన్హాం నేను నీతో విభేదిస్తున్నాను,'' అని నీవు చెప్పవచ్చును. లేదు, నీవు విభేధించలేవు. నీవు కేవలము మూడు గదుల గృహములో నివసిస్తున్నావు.

గమనించండి, అది సత్యము. మంచిది, గతకాలములో ఆయన ఆ గుడారమనే మూడు గదుల గృహములో దేవుడు నివసించాడు. సమాజము, సమాజము ఉన్న ఆవరణము, పరిశుద్ధ స్థలము, మరియు అతిపరిశుద్ధ స్థలము. మరియు ఈ మూడు గదులు దేవుని సాదృశ్యముగా ఉన్నాయి. నీవు ఎక్కి వచ్చిన మెట్లవలె యున్నది, క్రీస్తుతో సంపూర్ణముగా ప్రతిష్టించబడిన స్థానము. వంట గదిలో నీవు భోజనము చేస్తావు. పాపి కూటమునకు వచ్చి, దేవుని వాక్యమును భుజించును. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును. అతడు దేవుని వాక్యమును వినుటకు వచ్చాడు.

23

అనేక సార్లు మనము దేవుని వాక్యము స్థానములో ప్రత్యామ్నాయముగా వేరొక దానిని పెట్టుచున్నాము. వాక్యము స్థానములో గొప్ప కార్యములను, మరియొక దానిని ఏదో ఒక దానిని పెట్టుచున్నాము.

నిజమునకు సంఘము వాక్యము ప్రకటించవలసిన స్థలము. సాక్ష్యములు మంచివే, మనము చేయుచున్న కార్యములన్నియూ దాచబడిన జీవము అద్భుతమైనవి. కాని దేవుని వాక్యమునకు ప్రథమ స్థానమును ఇవ్వాలి, ఎందుకనగా పాపికి మరియు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తులకు కూడా అది అవసరమైయున్నది.

సాతానుడు తనను శోధించినప్పుడు, యేసు ఈ విధంగా చెప్పాడు, ''మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదు గాని, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, అని వ్రాయబడియున్నది.“ చూశారా? పరిశుద్దాత్మ దేవుని వాక్యమును భుజించును. ఆయన దేవుని వాక్యమును తీసికొని నీ హృదయములో పెట్టును. అది నీకు బలమును అనుగ్రహిస్తుంది. నేను దానిని ఇష్టపడుదును.

పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యమును తీసికొని దానిని చక్కగా ఒక ప్రసంగీకుడు బోధిస్తుండగా కూర్చొని దేవుని వాక్యమును ఆలకించుట నాకు ఎంతో ఇష్టము. దానితో పాటు దయాళత్వము మరియు సాత్వీకము కలిగిన ఆత్మ అప్పుడు చక్కగా అది మెత్తటి భూమిలో నాటబడి, చక్కగా పెరుగుతుంది.

24

ఇప్పుడు, సరే మనము వంటగదిలో భుజిస్తాము. అది పాపి అక్కడికి వచ్చి దేవుని వాక్యమును భుజిస్తాడు. వినుట వలన విశ్వాసము కలుగును.

అతడు దేవుని వాక్యము వినిన తర్వాత, అతడు సంఘము యొక్క సహవాసములో పాల్గొనును. అతడు వాక్యమును విని దానిని చేర్చుకొనిన తర్వాత, అప్పుడు మీరు అతడికి క్రైస్తవ బాప్తిస్మమును ఇస్తారు. దాని ద్వారా అతడు సహవాసములో ప్రవేశిస్తాడు.

తర్వాత అతడు సమాజములో ప్రవేశించును. తర్వాత నీవు వంట గది నుండి అతిధి గదిలోనికి వస్తావు. అక్కడ నీవు నీ పొరుగువారితో సహవాసము చేస్తావు. అక్కడ నీవు ఇతరులతో సహవాసము చేస్తావు.

తర్వాత పడకగది నీవు విశ్రాంతి తీసుకునే స్థలము. పగటిపూట ఎండలో కష్టపడి వచ్చిన తర్వాత, ఆ గదిలో ఒంటరిగా విశ్రాంతి తీసుకొంటావు. నా ఇంటి వద్ద ప్రార్థనా గదియే పడకగది.

కొన్ని సార్లు నేను పాతకాలపు గృహములను దర్శించినప్పుడు, ఆ తల్లలు వంట చేసేటప్పుడు వాడే పై వస్త్రముకట్టుకొని ఏడుస్తూ, కళ్లు తుడుచుకొనుచూ ఆ పడక గదిలో నుండి రావడం నేను చూశాను. ఏడుస్తూ ప్రార్థిస్తూ, ఒంటరిగా వారు దేవునితో సమయం గడుపుచున్నారు. ఓ అది ఎంత అద్భుతమైన స్థలము.

మరియు ఒక వ్యక్తి తన జీవమును అనేక రకములైన ఇతర స్థలముల నుండి వేరుచేసుకొని క్రీస్తుతో ప్రతిష్టించబడిన ఆ స్థలములో.....

25

గమనించండి, ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు ఆ స్థలములో ప్రవేశించును. సమాజము అతడిని వెంబడించును. ఒక్కసారి అతడు ఆ గొప్ప స్థలములో ప్రవేశించినప్పుడు, ఆ తెరను దాటి అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించగానే ఎవ్వరూ కూడా అతడితో పాటు లోపలకు రారు. అప్పడు అతడు దేవునితో ఒంటరిగా ఉంటాడు.

క్రీస్తుతో ప్రతిష్ఠించబడిన జీవితమునకు అది ఎంత చక్కని మాదిరిగా యున్నది. ఒక్కసారి అతడు క్రీస్తు లోపలికి ప్రవేశించినప్పుడు, అతడు లోక కార్యములకు మరణించాడు. అతడు దేవునిలో దాచబడ్డాడు, ఆ తెర అతని చుట్టూ కప్పబడినది, అది లోకమును మూసివేసినది, అప్పుడు క్రైస్తవ్యము మరియు భక్తి ప్రతి ఒక్క విశ్వాసికి ఆనందకరముగా యుండును.

ఈ రోజు ప్రజలు తమ భక్తితో యాతనలు పడుచున్నారు, నరకమును తప్పించుకోవాలంటే ఈ విధంగా చేయవలసియున్నదని వారు గ్రహించాలి. సహోదరుడా అదే మార్గము అని, ఆ విధంగానే చేయాలని నేను నమ్ముచున్నాను.

ఓ, క్రీస్తులో ప్రవేశించండి, లోక కార్యములను దూరంచేసుకొనుము, ఆయనతో సంభాషించుట, సంతోషమైన కార్యము. అది అందమైనది, అది ఆత్మను నింపి, సంతృప్తి కలుగజేయును. అది సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుగ్రహించును. ఆ సిలువలన్నియూ ఎగిరే రెక్కలు అగును. భారములన్నియూ రథ చక్రాలు అవుతాయి. ఓ, నీవు ఎగరగలవు.

26

“నా భారము సుళువైనది.'' ఆయనతో కాడి మోయుము, ఆ కాడి చుట్టూ హల్లెలూయలు చుట్టబడియున్నవి. ఒక్కసారి నీవు తెరలోపలికి ఆయన దగ్గరకు వెళ్ళినట్లయితే, ఆయన నీకు జీవమగును.

ప్రవక్త దానిని గూర్చి చెప్పాడు. పాత కాలపు ప్రజలు చెప్పారు. ఆయన తన ధర్మశాస్త్రమును నూతనముగా వ్రాయును, ఆయన వారి హృదయములో వాటిని పెట్టును.

ఇప్పుడు, సీనాయి పర్వతము కర్తవ్య స్థానము. కాని కల్వరి పర్వతము కృప నిచ్చు స్థానము. ప్రజలు ఇంకనూ సీనాయి పర్వతము దగ్గర నివసించుటకు ఇష్టపడుచున్నారు. “నేను సంఘమునకు హాజరయినచో, ఒక వేళ నేను కానుకలు చెల్లించినట్లయితే, ఒక వేళ నేను పలాని పని లేక పలాని పనిచేసినట్లయితే, ఒక వేళ నేను దీనిని విడిచి పెట్టినట్లయితే, లేక దానిని ఆపినట్లయితే,'' అది ఇంకనూ సీనాయి పర్వతము.

నీవు లోకమునకు మృతినొంది క్రీస్తు ద్వారా నీ జీవము దేవునిలో దాచబడిన స్థానమునకు వచ్చినప్పుడు, నీవు పరిశుద్దాత్మ ద్వారా ముద్రించబడినప్పుడు నీ క్రైస్తవ జీవితమంతయూ గొప్ప మహిమకరమై జయోత్సవముగా మారుతుంది. నీవు అనుదినము ఆయనలో దాచబడియున్నావు.

మనము గమనించినట్లయితే, ఒక్కసారి ఆ స్థలములో ప్రవేశించగానే అతడు లోకము నుండి పూర్తిగా వేరైపోవుచున్నాడు. అతడి చుట్టూ తెరలు వేయబడియున్నాయి. మరియు దేవునిలో దాగియున్నాడు. ప్రతిది నిజముగా మహిమకరముగా ఉంటుంది. ఒక్కసారి ఆ స్థలములో మనము క్రీస్తుతో కూడా దాచబడినప్పుడు, సమస్తము మనకు నూతన కార్యముగా ఉంటుంది.

27

మరియు ఈ స్థలములోనే అహరోను కర్ర పెట్టబడినది. అదే స్థలములో మన్నా ఉన్నది.

మన్నా... మనందరమూ ఈ మన్నాను గ్రహించుటకు పాత నిబంధనలోనికి వెళ్ళవలసియున్నది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వాగ్ధాన దేశమునకు ప్రయాణమై పోవుచున్నప్పుడు వారిని పోషించుటకు మన్నా కురిసినది. ఈ రోజు ఐగుప్తు నుండి వాగ్ధాన దేశమునకు ప్రయాణించుచున్న సంఘమునకు చక్కటి మాదిరిగా యున్నది. మనము వాగ్ధాన దేశమునకు ప్రయాణములో ఉన్నామని మీరు నమ్ముచున్నారా?

కనాను పరలోకమునకు సాదృశ్యము కాదు, ఏలయనగా కనానులో వారు యుద్ధములు చేశారు. కనాను వెయ్యేండ్ల పరిపాలనకు సాదృశ్యము. కాబట్టి మనము వెయ్యేండ్ల పరిపాలన మార్గములో యున్నాము. వారి ప్రయాణ మంతటిలో దేవుడు ప్రతి అవసరమును తీర్చునని వాగ్ధానము చేసినట్లుగా, మన ప్రయాణమంతటిలో మన అవసరములన్నియూ తీరుస్తానని వాగ్ధానము చేశాడు.

వారు వేరు చేయు స్థానమైన ఎర్ర సముద్రమును దాటిన వెంటనే, వారికి ఆహారము అవసరమైనప్పుడు దేవుడు ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపించాడు. వారికి స్వస్థత అవసరమైనప్పుడు దేవుడు మోషే ద్వారా ఇత్తడి సర్పమును నాటించాడు. వారికి మాంసము కావలసినప్పుడు గాలి చేత పూరేళ్ళను రప్పించాడు.

28

ఎల్లప్పుడూ ఆయన పోషించును. ఆయన యెహోవా యీరే, బలిని యెహోవాయే అనుగ్రహించును. ఆయన యెహోవా రాఫా, ప్రభువు స్వస్థపరచును.అవును, ఆయన ఎల్లప్పుడు అనుగ్రహించును.

వారి విషయములో ఆయన ఎలా౦టి బాధ్యత కలిగియున్నాడో మన విషయములో కూడా ఆయన అదే విధంగా బాధ్యత కలిగియున్నాడని చెప్పవచ్చును. ప్రభువు వారిని శరీరరీతిగా నడిపించినట్లుగా, ఈ రోజు ఆయన సంఘమును ఆత్మీయ వాగ్దాన దేశములోనికి నడిపించుచున్నాడు. మనకవసరమైనవన్నియూ మనకు వాగ్దానము చేయబడి యున్నవి, మన ప్రయాణములో సాగుచుండగా అవన్నియూ మనకు అనుగ్రహించబడును, ప్రభువు వైపు చూస్తూ ముందుకు సాగండి.

మీరు ఈ విషయమును గమనించండి, వారు బయటకు వెళ్ళి ఆ మన్నాను భుజించారు, అది మన కొరకు దిగి వచ్చి తన ప్రాణమును పెట్టిన క్రీస్తుకు సాదృశ్యముగా యున్నది..... కాని ప్రజలు ఉదయమున వెళ్ళి వున్నాను కూర్చుకొను చుండిరి, నీవు ఆ మన్నాను భుజించనట్లయితే, అది పాడైపోతుంది.

క్రీస్తు దగ్గరకు వచ్చి మార్పు చెందిన వ్యక్తికి అది సాదృశ్యంగా యున్నది. అతడు క్రీస్తు దగ్గరకు వచ్చి తన జీవితమును అర్పించాడు, కాని ఇంకనూ పరిశుద్ధాత్మలో దాయబడలేదు, అతడు మన్నాను భుజిస్తున్నాడని ఎరిగి అతడు తన జీవితమును కొనసాగించును.

ఈ రోజు అనేకులు వెలుపలి ఆవరణమును దాటి ఇంకనూ ముందుకు వెళ్ళట లేదు, అయినప్పటికీ వారు క్రైస్తవులే... వారు లక్షలమంది యున్నారు. వారు బాహ్యముగా క్రీస్తులో సంతోషించుచున్నారు. మేము సంఘమునకు వెళ్ళుచున్నామనే స్పృహాతో వారు ఆలయమునకు వెళ్ళుచున్నారు, కాని వారెన్నడూ అతి పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు దాగియుండలేదు.

కాని వెలుపల వారు మన్నాను భుజించారు. కాని గమనించండి, నీవు మన్నాను భుజించుచున్నట్లయితే, మీరు గమనించండి. ఆ రోజు గడిచే సమయమునకు ఆ మన్నా చెడిపోతుంది. కాబట్టి ఆవరణములో మన్నాను భుజిస్తూ తమ సమయమును గడిపే ప్రజల విషయములో అదే జరుగుతుంది.

29

మన్నా పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా యున్నది. ఈ ప్రయాణం కొరకు దేవుడు మనకు మన్నాను ఇచ్చినప్పుడు,... ఆ ప్రయాణంలో ఆయన వారికి దానిని ఇచ్చినప్పుడు, అది ఆ ప్రయాణమంతటిలో వారికి సరిపోయినది. అది పెంతుకొస్తుకు చక్కటి మాదిరిగా యున్నది. దేవుడు తన సంఘమును వెలుపలికి పిలిచి వారికి పరిశుద్ధాత్మను ఆయన పై నుండి తన సంఘము మీదకు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. మరియు యేసు వచ్చు వరకు ప్రతి తరములోను అది సరిపోవును. అవును.

ఈ రోజు సంఘమునకు మన్నా అదియే, పరిశుద్ధాత్మ యొక్క మన్నా గుర్తుంచుకొనండి, వారు తమ ప్రయాణములో ఆ జలములను దాటి ఆవలి తీరమునకు వచ్చినప్పుడు, పరిశుద్దాత్మ మన్నాను కురిపించి శారీరకముగా వారిని పోషించెను. అది శారీరక జీవమును కాపాడినది. అదే విధముగా ఒక వ్యక్తి తన స్వవిషయములో మరణించి, వాగ్ధాన దేశము కొరకు ప్రయాణం ప్రారంభించినప్పుడు, దేవుడు ఈ రోజు తన పరిశుద్ధాత్మను కుమ్మరించును.

30

పేతురు పెంతెకొస్తు దినమున ఈ విధంముగా చెప్పాడు, ''అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని ప్రవక్తయైన యోవేలు ద్వారా దేవుడు సెలవిచ్చినది ఇదియే. మరియు అతడు పరిశుద్దాత్మ అబిషేకముతో ప్రసంగించినప్పుడు.....

ప్రజలు కేకలు వేయుచూ దానిని ప్రత్యక్షపరచినారు. అక్కడ నిలువబడియున్న యూదులు హృదయములు గుచ్చబడినవారై, ''అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి,“ అని ప్రశ్నించారు.

పేతురు చెప్పాడు, ''మీరు మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్ధానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలచిన వారికందరికిని చెందును,'' అతడి ఉద్ధేశ్యము ఏమిటి? పెంతుకొస్తు దినమున కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ బాప్తిస్మము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ అనగా ప్రభువు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందును.

31

మొదటిగా ఆ మన్నా కుమ్మరించబడినప్పుడు, దేవుడు మోషేతో “ఇది పగటి పూట ఎండిపోవును,” అని చెప్పెను. ''నీవు వెళ్ళి ఒక ఓమెరు సువర్ణ పాత్ర నిండా, ఆ మన్నాను తీసుకొని, దానిని అతి పరిశుద్ధ స్థలములో పెట్టుము. నీ తరములన్నిటిలో యాజకుడు ఆ తెరను దాటి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు మొదట కుమ్మరించబడిన మన్నాను ఒక గుప్పెడు తినే హక్కు కలిగియుంటాడు.'' అది ఈ రోజుకు చక్కటి మాదిరిగా యున్నది, పేతురు చెప్పెను, “అది మీకును మీ పిల్లలకును, దూరస్థులందరికిని చెందును,” అని చెప్పాడు.

32

ఇప్పుడు, మనకు ఏదో విధమైన వేషధారణలు, భావోద్వేగములు, అవసరము లేదు. దయ్యము ఇచ్చే దానిని మనము తీసికొనవలసిన అవసరము లేదు. సమర్పించబడిన జీవితములో ఆ బలిపీఠము దగ్గరకు వచ్చే ప్రతి విశ్వాసి కేవలము నోటి నిండా మాత్రమే కాదు, గాని ఆత్మ నిండునంతగా ఆ పెంతెకొస్తు దినమున కుమ్మరించబడిన అసలైన బాప్తిస్మమును పొందుకొంటాడు. పెంతెకొస్తు దినమున కలిగిన అవే ఫలితములను అది మరలా కలిగిస్తుంది. ఆమేన్.

ఈ వాగ్దానము మీ పిల్లలకును, దూరస్తులందరికిని, ప్రభువు తన యొద్దకు ఎందరిని పిలిచాడో వారందరికి చెందును. సహోదరులారా, ప్రతిష్ఠించబడిన జీవితములో, ప్రభువైన యేసు రక్తము ద్వారా ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ఇష్టపడిన ప్రతి విశ్వాసి జీవితములోను, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఏ ఫలితములు కలిగెనో, అవే ఫలితములు వారి జీవితములోను కలిగించును.

అది సాంప్రదాయములను ముక్కలు చేయును, అది మనుష్యుల హృదయములను మార్చును. అది నిన్ను నీలోనున్న ప్రాచీన స్వభావమును తీసివేసి క్రీస్తు యేసులో నీవు ప్రవేశించునట్లు అది నిన్ను కరిగించివేయును. ఈ దేశమంతయూ ఉజ్జీవము వ్యాపించును. ఆమేన్. ఈ రోజు మనకు కావలసినది ఏమిటి: మనకు పాతకాలపు ఉజ్జీవము, దేవుని చేత పంపబడిన, పరలోకము నుండి పంపబడిన ఉజ్జీవము, పరిశుద్ధాత్మ ద్వారా తేబడిన ఉజ్జివము కావలి. అంతే కాని ఏవో కొద్ది కదలికలు, ఉద్వేగముతో కూడిన ఉజ్జీవము కాదు గాని, మనకు పాతకాలపు ఉజ్జీవము, పవత్రిమైన (హల్లెలూయ), తిరికి మరల ఆడవులలో నీలి-ఆకాశము క్రింద జరిగే ఆ పాతకాలపు ఉజ్జివములు, పాపమును అంతము చేసే భక్తి కావలెను. ఆమేన్.

అది నీ మీద తెల్లటి సున్నము కొట్టదు; నీవు తెల్లగా మారునట్లు నిన్ను కడుగుతుంది. సాతానుడు అతడు చేసే ప్రతి పనికి తెల్ల సున్నం కొడతాడు, కాని దేవుడు తెల్లగా శుభ్రం చేస్తాడు. కాబట్టి ప్రజల హృదయములను బ్రద్ధలు చేసి, ఈ మతశాఖలన్నింటిని దేవుని మహిమ కొరకు ఒక గొప్ప గుంపుగా ఐక్యపరిచే దేవుని చేత పంపబడిన పాతకాలపు ఉజ్జీవము మనకు రావాలి. ఈ రోజు సంఘమునకు అట్టి ఉజ్జీవము కావాలి. అది కాలిఫోర్నియాను మాత్రమే కాదు గాని దేశమంతటిని కదలించును.

33

ఈ రోజు సంఘము ముందుకు సాగలేకపోవుటకు కారణము, మనకు చాలా ఎక్కువగా పోడికన్నుల వారు మరియు సంఘములో చేరుట, నులివెచ్చని మరియు విశ్వాసము నుండి వెనక్కి జారిపోయిన సంఘ సభ్యులే కారణము. అది సత్యము. మనకు దేవుని చేత పంపబడిన పాతకాలపు ఉజ్జీవము, పరిశుద్ధాత్మ శక్తితో ప్రజలను విరుగగొట్టి, మారిన ప్రవర్తన, మారిన వేషధారణ, ప్రత్యేకముగా మాట్లాడుచూ, ప్రత్యేకముగా ఉండు, అనుదిన జీవితములో ప్రత్యేకత కలిగిన ప్రజలుగా ఉన్నటువంటి బైబిల్ కాలములోని పరిశుద్ధ పౌలు కాలమునాటి ఉజ్జీవము కావాలి.

ఆ శక్తి ఇప్పుడు ప్రజలను ప్రత్యేకమైన విధముగా ప్రవర్తి౦చునట్లు చేయుచున్నది, మరియు ప్రత్యేకముగా చుచునట్లు, ప్రత్యేకముగా నడచునట్లు, ప్రత్యేకముగా మాట్లాడునట్లు, ప్రత్యేకముగా ఉండునట్లు, మరియు ప్రత్యేకముగా వారి జీవితము జీవి౦చునట్లు చేయుచున్నది.

స్నేహితులారా, మనకు అలాంటి ఉజ్జీవము కావాలి. మెథడిస్టు వారికి అది కావాలి. బాప్టిస్టు వారికి అది కావాలి. పెంతెకొస్తుకు అది కావాలి. వారందరికి ఆ ఉజ్జీవము అవసరమై యున్నది. మనము తప్పు పక్షమున వహించాము. మనము తప్పు కార్యమును వెంబడించాము. ప్రతి తరములోను పరిశుద్దాత్మ కొనసాగవలసియున్నది.

మోషే అక్కడ ఆ గొప్ప పాత్రను పెట్టబడియున్నపుడు, అక్కడ ఒక్కోసారి వెలుపల ఆహారము మిగిలిపోయేది. ఇక్కడి ప్రజలకు ఒక్కోసారి క్యాంపు గ్రౌండ్లో కాళ్ళు తిమ్మిరెక్కుచున్నవి.

34

ఈ రోజు మన సంఘము యొక్క స్థితి కూడా అదే విధంముగా యున్నదని నమ్ముచున్నాను. ఈ రోజు అనేకులు తమ ప్రయాణములో ఆగిపోవుచున్నారు. అది సత్యము. కొందరు మన్నాను భుజించి చక్కగా తయారయ్యి మరలా ఆకలిగొనుచున్నారు. ఒక ఉజ్జీవము తర్వాత మరొక ఉజ్జీవమునకు ముందు నీవు మరలా నూతన పరచబడాలి.

ఓ సహోదరుడా, నీవు ఆ బుద్ధిహీనమైన కార్యములను ఆపి వేసి, ప్రభువైన యేసు రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ఎందుకు ప్రవేశించకూడదు. వెలుపల ఉన్న మన్నా అంతయూ ఈ రాత్రి లేక ఉదయము వరకే నీకు ఉండును. మరుసటి వారమునకు అది పని చేయదు. అది ఒక్క రాత్రికే ఎండిపోతుంది. కాని నీవు నీ జీవితమును ప్రతిష్ఠించుకొని, మన్నా ఎల్లప్పుడూ తాజాగా అనుదినము, సంవత్సరము వెంబడి సంవత్సరము తాజాగా ఉండే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినట్లయితే.

అక్కడ నడిచిన వ్యక్తిని నీవు కలుసుకోగలవు..... అతడు ఆరు నెలలుగా ఉజ్జీవములో లేకపోయిననూ నేను లక్ష్య పెట్టను; అతడు ఉజ్జీవపు ప్రారంభ దినములో ఎంత మధురముగా ఉన్నాడో అంతే మధురముగా ఉండును. అది నిజము. అతడిని నీవు మేఘము కమ్మిన దినమున లేక శ్రమ దినమున కలువవచ్చును. అతడు ఎల్లప్పుడూ అదే రీతిగా యుండును. ఏలయనగా అతడు దేవుని మహిమలో నివసించుచున్నాడు. ఎల్లప్పుడూ మన్నా తాజాగా యుండు స్థలములో అతడు నివసించుచున్నాడు. ఈ రోజు, రేపటి దినమున లేచి ప్రార్థన చేయుట ఆ స్థలములో ఉన్న వ్యక్తికి భారము కాదు.

సహోదరుడా, ఎల్లప్పుడు పరిశుద్ధ స్థలములో ఆయనతో నిలచి యుండుము. “ఒక వ్యక్తి ఆ విధంగా జీవించగలడా?' ఖచ్చితముగా అందుకొరకే యేసు మరణించాడు. ఆమేన్.

35

గమనించండి. అక్కడనే వారు అహరోను కర్రను పెట్టారు. బయట ఆవరణములో కాదు. యాజకత్వము కొరకు ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలుసుకొనుటకు వారు దానిని లోపల పెట్టారు. అది నేరుగా క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నదని నాకు తెలియును, కాని అది పాపికి కూడా సాదృశ్యంగా యున్నది. ఒక వ్యక్తి వేషధారణతో తన జీవితకాలమంతయూ సంఘ కార్యక్రమములలో పాల్గొనినను, అతడు ఇంకనూ పాపము మరియు అతిక్రమములలో మరణించియున్నాడు.

కాని ఆ వ్యక్తి వెలుపల ఉన్నప్పుడు, ఆ పాత కర్ర, అది కేవలము ఒక సామాన్యమైన కర్ర మాత్రమే. అది ఎండిపోయేంత వరకు అహరోను చేతిలో యున్నది, దానిలో జీవము లేదు. దేవుని నుండి నరికివేయబడిన వ్యక్తి జీవితము ఆ విధంగానే యుండును. అతడు క్రీస్తు లేని వ్యక్తి, ఆ వ్యక్తి బహుశా సంఘసభ్యుడు కావచ్చును. ఆఫ్రికా భాష మాట్లాడే వ్యక్తికి ఐగుప్తు కథలు ఏ విధంగా తెలియదో అతడికి కూడా క్రీస్తును గూర్చి ఏ మాత్రం తెలియదు.

''ఓ, నేను పలాని సంఘ సభ్యుడను.'' అది అహరోను చేతిలో యున్నది. అవును. అతడు ఉపయోగించబడుచున్నాడు గాని అతడు మృతుడు. మరియు ఆ కర్ర అతిపరిశుద్ధ స్థలములో, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలములో, పరిశుద్ధాత్మ సన్నిధిలో పెట్టబడినప్పుడు ఏమి జరిగినదో మీకు తెలుసు. ఒక్కరాత్రిలోనే అది చిగుర్చి, పుష్పించి, బాదము కాయలు కాచినది. హల్లెలూయ!

36

ఈ రోజు మనకు కావలసినది ఏమనగా, మనము సంఘ సభ్యత్వము నుండి దాటి ప్రభువైన యేసుక్రీస్తుకు సంపూర్తిగా ప్రతిష్ఠించబడి, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి.

అది చిగురించినది. అదిఏమిటి? దానిలో ఉండవలసిన జీవము లేదు. అది మృతమైనది. అది అక్కడున్న గుడారము యొక్క కర్ర వలే యున్నది. కాని అది ఒక చెట్టు అయినచో. అది బాదం చెట్టు నుండి తీయబడినది, కాని అది చనిపోయినది.

37

ఈ రోజు అనేకులు తాము మృతినొంది యుండి, ఎలాంటి ఫలములు ఫలించకుండా మేము క్రైస్తవులము అని చెప్పుకొనుచున్నారు. వారిలో జీవము ఎంత మాత్రమును లేదు. వారు నిస్సహాయ స్థితిలో నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. వారు తాము ఒక సంఘమునకు చెందిన వారము అని ఎరిగి సంచరిస్తున్నారు. అలాంటి వారు కేవలము ప్రెస్బిటేరియను మరియు లూథరన్లలో మాత్రమే కాదు గాని, పెంతెకొస్తు వారిలో కూడా యున్నారు. అది నిజము. అది సత్యము. ఈ రోజు, నీకు కావలిసింది: నీవు క్రీస్తులోనికి రావలసినదే.

ఏమి జరిగినదో చూడండి. ఇప్పుడు మొదటిగా - అది చిగిరించుటకు వీలుగా అది తిరిగి బ్రతకవలసి యున్నది. అది చిగురించినది. అది కేవలము చిగురించుట మాత్రమే కాదు గాని, అది పుష్పించినది. అది పుష్పించుట మాత్రమే కాదు గాని, అది ఫలించినది.

మరియు నీవు కూడా అదే విధంగా ఉంటావు లేదా వెలుపలి ఆవరణము నుండి తెరను దాటి క్రీస్తునొద్దకు వచ్చి అక్కడ తన జీవమును దాచిన ప్రతి విశ్వాసి యొక్క జీవితము ఆ విధంగానే ఉంటుంది. నీవు తిరిగి జీవించి, చిగురించి, పుష్పించి ఆత్మ ఫలములు ఫలిస్తావు. ఆమేన్.

నీవు నీ సమాజములో సేవకుడుగా ఉంటావు. నీవు యేసు కొరకు ఆత్మలను జయిస్తావు. నీవు నూతన వ్యక్తివి. పాతవి గతించెను. మనుష్యుల సాంప్రదాయములు విఫలం అవుతాయి, కాని నీ హృదయము దేవుని ప్రేమతో ప్రజ్వరిల్లుతుంది.

38

దేవుని సన్నిధిలో వారు ఆ పాత కర్రను పెట్టిన దాని లోపల... దేవుడు కెరూబులపైన మహిమలో నివసిస్తున్నాడు, ఆ కర్రలో ఒక్కసారిగా ఆ కార్యములు జరిగాయి.

సహోదరుడా, సహోదరీ, ప్రతిష్ఠించబడి దేవుని ఎదుట పెట్టబడిన జీవితము, ఈ రాత్రి నేను ప్రసంగ వేదిక దగ్గర నిలబడి యున్నంత నిశ్చయంగా, వారి జీవితములు కూడా మారును, అది నీలో యున్న పోరాటములన్నిటినీ తీసివేయును. అది నీలో ఉన్న బేధములన్నింటినీ తీసివేయును. అది నీలో ఉన్న సిద్దాంతములన్నింటినీ తీసివేయును. నీవు గనుక ఆయన సన్నిధిలోనికి వెళ్ళినట్లయితే, అది నిన్ను నిజమైన క్రైస్తవునిగా మార్చును.

ఏమి జరుగుతుందో గమనించుము, అది నూతన పరచబడుతుంది, తిరిగి నూతన పరచబడుతుంది. గమనించండి, మంచు రాత్రి పూట కురుస్తుంది. ప్రపంచము విశ్రాంతిగా ఉంటుంది. పగటి పూట అది చురుకుగా ఉంటుంది. ప్రయాసలు, పనులు, కాని ప్రతిది నిశ్శబ్దంగా నెమ్మదిగా ఉన్నప్పుడు, అప్పుడు ఏమి జరుగుతుంది? మంచు కురుస్తుంది.

39

ఉదయకాలము, నీవు ఎప్పుడైనా వేకువనే లేచావా, నీవు నిజముగా చాలా వేకువనే లేచి ఆ తాజా గాలిని పీల్చావా, అది ఎలా ఉంటుంది! అది ఎంత తాజాగా ఉండి ఎంత ఆహ్లాదకరముగా ఉంటుంది! మంచు కురిసినది.

ఓ, సహోదరి, సహోదరుడా, సంఘమునకు హాజరగుట మాత్రమే నీకు తెలిసినట్లయితే, నీవు కేవలము ఏదో సంఘములో చేరుట, లేక బాప్తిస్మము పొందుట లేక అటువంటిది ఏదో కలిగియున్నట్లయితే, నీ జీవమును క్రీస్తులో ఎందుకు దాచకూడదు? లోకము మరియు దాని చింతల నుండి దూరము అయి, ప్రశాంతముగా ఒంటరిగా మారి ఎలాంటి తాజాదనం కలుగుతుందో నెమ్మదిగా గమనించుము.

మీకు తెలుసు, యెషయా ఒకసారి దాని గూర్చి మాట్లాడినాడు. అతడు చెప్పెను, “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి. ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషలతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు. ప్రభువు సన్నిధిలో నుండి ఈ నెమ్మది కలుగుచున్నది.''

40

సన్నిధిలో ఏ విధంగా నెమ్మది కలుగుచున్నది! మరొక సంగతిని గమనించండి. ఒక్కసారి నీవు దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు, నీవు నెమ్మది పొందుతావు. నీవు దేనిని గూర్చి కలవరపడవు. నీవు ఎక్కడ నిలబడియున్నావో నీవు ఎరుగుదువు. అక్కడ ఏదో జరుగుతుంది. నీవు నిజమైన క్రైస్తవుడవని నీవు ఎరుగుదువు. నిన్ను ప్రేమించే వ్యక్తితో నీవు సంబంధము కలిగియున్నావని నీవు ఎరుగుదువు, అక్కడ ఏదో జరిగినదని నీకు తెలుసు. అది నెమ్మది కలిగిస్తుంది. అంత మాత్రమే కాదు గాని నీవు ఇతరులకు కూడా నెమ్మది కలిగిస్తావు.

నీవు చాలా మంది వ్యక్తులను చూసియుంటావు, కాని వారి మధ్య ఉండుట నీకు కష్టముగా అన్పిస్తుంది; వారిని గూర్చి ఏదో యున్నది. వారి చుట్టూ సృష్టించు శక్తియున్నది, అది భిన్నంగా కన్పిస్తుంది.

నేను ఇక్కడ ఆగి, సాధ్యమైతే దానిని గూర్చి మరికొంచెం చెప్పాలని ఆశిస్తున్నాను. నీవు కూడా ఒక చిన్న సృష్టికర్తవు.

ఆయన నీకు నూతన ఆత్మను ఇచ్చాడని చెప్పాడు, ఆ ఆత్మ దేవుని ఆత్మ కాదు; అది నీ ఆత్మ, దేవుడు నీకు నూతన ఆత్మను అనుగ్రహించును. ''నా ఆత్మను అతనిలో ఉంచుదును,'' అని ఆయన చెప్పాడు, కాని నీకు నూతన ఆత్మను ఇచ్చుటకు ఆయన నీ స్వభావమును మరింత మంచిగా, నెమ్మది పొందునట్లు చేయాలి. లేనట్లయితే, ఆయన నీతో కలసి జీవించలేడు. కాబట్టి ఆయన లోపల ప్రవేశించక ముందు ఆయన నిన్ను సరిచేయవలసి యున్నది. ''నేను నూతన ఆత్మను అనుగ్రహించుదును.'' అప్పుడు, నీవు ఆయనను ఎక్కడికైననూ తీసికొని వెళ్ళగలవు. నీవు అనేక రకములైన స్థలములకు వెళ్తావు. నీవు ఆయనతో సరిగా ప్రవర్తించునట్లుగా ఆయన నిన్ను సరిచేయవలసియున్నది.

41

కాబట్టి అది నీకు మొదట బలిపీఠము దగ్గర జరుగుతుంది. కాని నీవు దాచబడినపుడు, నీవు ఆయన ఆత్మను పొందుకుంటావు. తర్వాత పరిశుద్దాత్మను, అది దేవుడు తప్ప మరెవరో కాదు, నీలోనికి వచ్చి నివశించును. అప్పుడు నీలో ఏదో మార్పు కలుగుతుంది, నీ పొరుగువారు నిన్ను ప్రేమిస్తారు. ప్రజలు నిన్ను ఇష్టపడతారు.

నీవు ఎంతగా కేకలు వేసినప్పటికీ, నీవు ఎంతగా ప్రయాసపడినప్పటికీ, నీ పొరుగువాడు నిన్ను క్రైస్తవుడిగా గుర్తించే జీవమును నీవు కలిగి లేనట్లయితే, ఎక్కడో, ఏదో సమస్యఉన్నది. ఇప్పుడు, మనము సత్యము దగ్గరకు వద్దాము. అది నిజము అని మీకు తెలుసు. ఈ లోకములో పాతకాలపు కేకలు వేయుట, ప్రభువును స్తుతించుట, ప్రభువును ఘనపరచుట గూర్చి నాకంటే ఎక్కువగా విశ్వసించేవారు ఎవ్వరూ లేరు. నేను దానిని నమ్ముచున్నాను. ఒక జన్మించిన బిడ్డ కదలనట్లయితే, ఏడ్వకపోతే, వైద్యులు సాధారణంగా ఏమి చేస్తారో మీకు తెలుసు. అతడు కళ్ళు పట్టుకొని పైకెత్తి గట్టిగా చరుస్తాడు, అప్పుడు ఆ బిడ్డ శ్వాస తీసికొనును.

ఆ రాత్రి సంఘము యొక్క స్థితి అలాగేయున్నది, ప్రజలు, అవును, నేను తిరిగి జన్మించాను అని చెప్పినప్పుడు, దాని అర్థము ఏమిటో మీకు తెలుసా? వారు ఇంకనూ అప్పుడే జన్మించిన మృత శిశువు. వారిని మేల్కొలుపుటకు అప్పుడప్పుడు వారికి సువార్త చరుపులు అవసరమైయున్నవి. అప్పుడు వారు ఏడుస్తారు. (అది నిజము), అప్పుడు వారిలో జీవము ప్రవేశిస్తుంది. ఈ రాత్రి మనకు అది అవసరమైయున్నది. మరియు సంఘమునకు అది అవసరము. అది సరియైన మార్గములోనికి రావలసియున్నది. అది నిజము.

42

ఇప్పుడు గమనించండి. ప్రభువు సన్నిధిలో నుండి నెమ్మది, వారిని గూర్చి ఏదోయున్నది, నిజమైన క్రైస్తవునిలో ఏదోయున్నది, వారితో సహవాసము కలిగియుండుటను నీవు ఇష్టపడతావు. నీవు అలా చేయవా? అక్కడ శక్తియున్నది.

నేను నిన్ను గూర్చి మరింతగా ఎరిగినపుడు, జరిగిన సంగతులను మరింత ఎక్కువగా నీకు చెప్పటకు ఇష్టపడతాను. చూశారా? నీ చుట్టూ ఉన్న వాతావరణమును నీవే సృష్టించుకొంటావు. నీవు దానిని విశ్వసించుచున్నావా? అవును ఖచ్చితముగా.

“దేవుని నుండి పంపబడినమనుష్యుడు,'' అనే నా పుస్తకములో అనేకులు చదివియన్నారు, పోర్ట్ లాండ్, ఒరేగాన్లో ఆ రాత్రి పిచ్చి పట్టినవాడు నన్ను చంపుటకు వేదిక మీదకు పరుగెత్తి వచ్చిన సంగతి మీకు గుర్తున్నదా? నిస్సందేహముగా మీరు ఆ కథ చదివియంటారు, అది అన్ని చోట్లా లభిస్తుంది, ఏమి జరిగినది? మంచిది, పాపం ఆ వ్యక్తి... అతడి మీద నేను కోపగించుకొనలేదు. నేను అతడిని ప్రేమించాను. ఏదో జరిగినది. నేను అతడిని ప్రేమించాను.

43

అతడు సుమారుగా ఆరు అడుగుల ఎత్తు, రెండు వందల యాభై లేక అరవై పౌండ్ల బరువు కలిగి “నీ శరీరములో ప్రతి ఎముకను విరగగొడతాను,” అని అరుస్తూ వచ్చాడు. అది అతడు చేయగలడు, కాని నేను అతడిని ద్వేషించలేదు. నేను అతడిని ప్రేమించాను. నేను అతడిని బట్టి విచారించాను. అతడు బంధించబడియున్నాడు,

నేను కేకలు వేయవలసిన అవసరము లేదు. ''సాతానా, అతడిలో నుండి బైటకు రమ్ము,'' అని చెప్పాను. అతడు నేల మీద కూలిపోయాడు. అంతే చూశారా? అదే జరిగినది.

నేను ఇండియానాలో కొన్ని సంవత్సరములు గేమ్ వార్డెన్ పనిచేశాను. మీలో అనేకులు దానిని ఎరుగుదురు, ఒక రోజు సరస్సులో చేపపిల్లలు విడిచి పెట్టుటకు వెళ్ళాను. నేను అప్పటికే ప్రసంగిస్తున్నాను. నేను స్థానిక బాప్టిస్టు సంఘ కాపరిగా యున్నాను. ఆ మార్గము ఆవలి వైపున ఒక రోగి యున్నాడు. మంచిది, నేను తుపాకీ తీసికొని వెళ్ళవలసియున్నది, కాని తుపాకీ వెంటబెట్టుకొని వెళ్ళుట ఏమి అవసరము లేదు, నేను కల్చుటకు ఏమి లేదు కాబట్టి నేను తుపాకీ ట్రక్కులోనే విడిచిపెట్టాను. ''నేను ఆవలి వైపునకు వెళ్ళి ఆ సహోదరుని కొరకు ప్రార్ధిస్తాను,'' అని తలంచాను.

మరియు దానికి దిగువన.... ఓ, కొన్ని మైళ్ళ దిగువన ఒక నల్లజాతి వ్యక్తిని చంపిన ఒక పెద్ద ఎద్దు ఉన్నది. వారు దానిని అమ్మవలసి వచ్చి, హెన్రీ విల్లె, ఇండియానాలో అడవికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తికి అమ్మివేశారు.

44

వారు ఆ ఎద్దును అక్కడి వ్యక్తికి అమ్మిన సంగతిని నేను మర్చిపోయాను. ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేయుటకు, నేను ఆ పచ్చికలో సగము దూరము వెళ్ళాను. నేను అక్కడి వరకు వెళ్ళగానే అకస్మాత్తుగా, ఆ చిన్న పొదల మధ్యలోనుండి ఈ పెద్ద ఎద్దు లేచినది. అది అక్కడనే మధ్య యున్నది.

నేను వెనక్కి తిరిగి కంచెను చూశాను. పరుగెత్తుటకు అది చాలా దూరంలో యున్నది. ఎక్కుటకు అక్కడ ఏ చెట్టూ లేదు. నేను అక్కడ నిలబడిపోయాను. అది ఇక్కడకు వచ్చినది. ఏదో జరిగినది. అది ఎల్లప్పుడూ జరగాలని నేను ఆశిస్తున్నాను. అది ఎల్లప్పుడూ ఆ విధంగా జరుగదు, కాని నిజముగా చాలా తీవ్రమైన రోగమును చూసినపుడు అది జరుగుతుంది; అది మనుష్యుని కార్యము కాదు, కాని మనిషిని దేవుడు తన స్వాధీనములోనికి తీసికొనగలిగినప్పుడు అది సంభవిస్తుంది. అది ప్రతిష్టించబడినప్పుడు అది జరుగుతుంది.

45

దర్శనములు సంభవించినప్పుడు ప్రసంగ వేదిక మీద గమనించండి. ఆ దురాత్మలు కదులుచున్నప్పుడు, గమనించండి; అక్కడ ఏమి జరుగుచున్నదో గమనించండి. అది పరిశుద్ధాత్మకు లోబడిపోవుట. ఆయన వచ్చి దానిని స్వాధీనం చేసుకొనును. అది దేవుడు; అది మానవుడు కాదు. మరియు ఒక వేళ మనము దానిలో జీవించగలిగినట్లైతే. మనము దేవునిలో జీవించుదాము.

నాకు ఇరవై గజముల దూరములో ఆ ఎద్దు నిలబడియున్నది. పెద్ద కొమ్మలతో అది నా వైపునకు వస్తుంది. ఇదే అంతం, మరియు ఆ ఎద్దును ద్వేషించుటకు బదులుగా; (అది వింతగా తోచినది,) నేను దానిని ప్రేమించాను. నేను దానిని వివరించాలని ఆశిస్తున్నాను. కాని సహోదరునిగా ఒక విషయం చెప్పనిమ్ము: జీవితములో ప్రేమ కంటే గొప్ప శక్తిని నీవు ఎన్నడూ కలుసుకొనలేవు. అవునయ్యా. దయ్యములను కొట్టుట ద్వారా జయించుటకు నేను ప్రయత్నించుట లేదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను. చూశారా, దేవుడు ప్రేమ. దేవుడు ప్రేమ. ప్రేమ దేవుని కదిలించును. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.'' అది ప్రేమ, ప్రేమ జయించును.

ఎప్పుడైతే ఆ పెద్ద ఎద్దు నా వైపునకు దూసుకు వస్తుందో, మరికొద్ది క్షణాలలో మరణం తధ్యం అని నాకు తెలుసు. అప్పుడు నాకు ఏదో జరిగినది. అప్పుడు నాలో ఏదో సంభవించినది, నేను ఆ ఎద్దును ప్రేమించాను. నేను ఈ విధంగా ఆలోచించాను, ''పాపం ఆ ఎద్దు నిద్రిస్తున్నప్పుడు, నేను దాని స్థలములో ప్రవేశించాను, నేను ఇక్కడకు రాకూడదు.'' అది శాయశక్తులా నా వైపునకు కదిలినది, మరియు నేను ఈ విధంగా అన్నాను, ''ఓ, నీవు దేవునిచే సృష్టించబడిన జీవివి, నేను దేవుని సేవకుడను. అక్కడున్న ఒక దేవుని సేవకుడి కొరకు ప్రార్థించుటకు ఈ మార్గములో వెళ్ళుచున్నాను. నేను నా ప్రభువు పరిచర్యలో ఉన్నాను. నీకు ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నాను. ప్రభువైన యేసు నామములో వెనక్కి వెళ్ళి అక్కడ పరుండుము. నేను నిన్ను ఇబ్బంది పెట్టను.''

మరియు ఆ ఎద్దు ఎంతో బలంగా నా వైపునకు వస్తుంది. తన ఒడిలో బైబిల్ పెట్టుకొని ఇక్కడ కూర్చొనియున్న నా సహోదరుని చూచి నేను ఎలా భయపడనో అదే రీతిగా, ఆ ఎద్దును చూచి కూడా నేను భయపడలేదు. అది అంతే.

46

నీవు భయపడుచున్నావు. ఈ రోజు ప్రజలు భయపడుచున్నారు. నీవు దేనికి భయపడుచున్నావు? ఎందుకు, చివరకు మరణము కూడా క్రైస్తవుడిని భయపెట్టలేదు. “మరణమా నీ ముల్లెక్కడ?”

ఈ రోజు ప్రజల మనస్సులు భయంతో నిండిపోయాయి. ''ఓ, సహో. బ్రన్హం, నేను ఇక బాగుపడనని వైద్యుడు చెప్పాడు.'' నీవు దేనికి భయపడుచున్నావు? నీ కొరకు అక్కడ ఒక ఉత్తరవాదిగా యున్నాడు. ఖచ్చితంగా. ''మంచిది, సహో. బ్రన్హాం, నేను అనేక పాపములు చేశాను. నేను... ''నీవు ఎందుకు భయపడ్తావు? అక్కడ నీ కొరకు ఒక ప్రాయశ్చిత్తపు బలియున్నది. నిన్నుపేమించువాడు ఒకడు అక్కడున్నాడు. భయపడవద్దు.

యేసు నిరంతరము చెప్పుచున్న మాటలు; “భయపడకుము, మృతుడనైతిని గాని యిదిగో యుగయుగములకు సజీవుడనై యున్నాను. భయపడకుము.” అలాంటి వాతావరణమును నీ చుట్టూ ఉంచుకొనుము, అలాంటి వాతావరణమును పొందుము.

“ఇప్పుడు, అతడు మెథడిస్ట్, అతడు ఏకత్వము, అతడు త్రిత్వము వాడు. అతడు పలాని.” దానినంతటిని నీ మనస్సు నుండి తీసివేయుము.

“నేను అతడిని ప్రేమిస్తున్నాను. అతడు నా సహోదరుడు.”

“ఆమె క్యాథలిక్ ఆమె ప్రొటస్టెంటు. ఆమె.... ”దానిని నీ మనస్సు నుండి తీసివేయుము. నీ చుట్టూ ఆ వాతావరణమును కలిగియుండుము. నీవు ఆ మరొక ఆవరణములో నిలువబడి ఆ విధంగా చేయలేవు. నీవు మొదట క్రీస్తులోనికి రావలసియున్నది. నీవు ఆయన సన్నిధిలో నివసించాలి.

బైబిల్ ఈ విధంగా చెప్పుచున్నది, “జయించువానికి నేను నూతనమైన నామమును ఇచ్చెదను. అతడిలో నా ఆత్మ నుంచుదును.” గమనించండి, అక్కడ మొదట జయించుట. నీలో క్రీస్తు ఉండవలెనంటే వీటన్నింటినీ నీవు జయించాలి.

47

సంఘము కోపము జయించే విషయములో, బేధములను జయించు విషయములో ద్వేషమును జయించు విషయములో, దురభిప్రాయములను జయించు విషయంలో తప్పిపోవుచున్నది. ఈ రాత్రి కేకలువేయుచూ భాషలు మాట్లాడుచూ పైకి క్రిందకు గంతులు వేసే అనేకులు తమ పొరుగువారిని ద్వేషిస్తారు. సహోదరుడా, ఇంకనూ నీవు నశించిపోయావు. ఆ మాట చెప్పుట చాలా కష్టము, కాని అది సత్యము. జయించుము. నీవు కేవలము అప్పుడు మాత్రమే జయిస్తావు...

నీవు చెప్తావు, “నేను మన్నాను భుజిస్తున్నాను, దేవునికి మహిమ.” అవును, ఒక రోజు తర్వాత మరొక రోజున ఏమి జరుగుతుందో చూడుము. మీకు కడుపు నొప్పి వచ్చును.

మన్నా ఎల్లప్పుడూ ఎక్కడ తాజాగా ఉంటుందో అక్కడికి రమ్ము. నీ పొరుగువాడు నీ యెడల ఏ విధంగా ప్రవర్తించినా సరే, నీవు అతడిని ప్రేమిస్తావు. అది నిజము. అతడు నీతో అంగీకారము కలిగియున్నా లేకపోయినా సరే, నీవు అతనిని ప్రేమిస్తావు. నీవు ఆ విధంగానే ప్రవర్తించవలసి యున్నది. అది దాచబడిన జీవము. అది ప్రతిష్టించబడిన జీవితము. అది లోకపు తెరలకు ఆవలివైపున జీవితము. నీవు ఈలోక కార్యములకు దూరంగా మూయబడ్డావు. నీవు కేవలము క్రీస్తులో మాత్రమే జీవిస్తున్నావు. సంఘమా, నా భావమును మీరు గ్రహించారా?

మీ భావములను గాయపరచడం నాకిష్టము లేదు, కాని ఒక దినమున మీతో పాటు నేను తీర్పులో నిలబడవలసియున్నది. నేను సత్యమును ఎరిగి దానిని మీకు చెప్పినట్లయితే, ఆ బాధ్యత నేను వహించాలి. అది నిజము.

48

ఓ, కేకలు వేయుటను నేను నమ్ముచున్నాను. భాషలతో మాట్లాడుటను నేను నమ్ముచున్నాను. నేను ఈ కార్యములను నమ్ముచున్నాను. కాని సహోదరుడా, అవన్నియూ దానితో వెళ్ళవు. లేదు, అది కాదు. అది కేవలము దాని గుణలక్షణములో ఒకటి. అది నిజము. మొదటిగా నిజమైనదానిని కలిగియుండుము, అప్పుడు అది మిగిలిన వాటిని ఉత్పత్తి చేస్తుంది.

ఆ దినమున అనేకులు నా యోద్దకు వచ్చి, “ప్రభువా, నేను ఈ పనిచేయలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామములో అనేక కార్యములు చేయలేదా? అని అడుగుతారు.

అప్పుడాయన, ''అక్రమము చేయువారులారా, మీరెవరో నేను ఎరుగను, నా యొద్ద నుండి తొలగిపొండి,'' అని చెప్పును. చూశారా? జాగ్రత్తగా ఉండుము.

గమనించండి, ఈ ఎద్దు నా వైపునకు దూసుకు వస్తుంది, మరియు నేను అక్కడ నిలువబడియున్నాను. నేను చెప్పాను, ''నేను నిన్ను కలవరపరచను; నీవు వెనక్కి వెళ్ళి పడుకొనుము.“ అది నాకు ఐదు అడుగుల దూరం వరకు పరుగెత్తి వచ్చి ఆగిపోయినది. అది ఎంతో తగ్గిపోయినది. అది ఆగిపోయి అటూ ఇటూ చూచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినది. నేను ఆ ఎద్దుకు పది అడుగుల దూరములో నడుచుకుంటూ ఆ కంచె దగ్గరకు వెళ్ళాను, ఆ ఎద్దు మరలా లేవలేదు.

నేను అవతలకు వెళ్ళాను. నేను ఆ పొలమును దాటిన తర్వాత అక్కడ నిలుచున్నాను. అప్పుడు నేను సృహలోనికి వచ్చాను. ''ఏమి జరిగింది?'' అని ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను ఏడుస్తూ చేతులెత్తి దేవునిని స్తుతించాను.

49

గత వేసవి కాలములో నా పెరటిలోని గడ్డిని విద్యుత్ యంత్రముతో కత్తిరిస్తున్నాను. ప్రార్థనలు చేయించుకొనుటకు ప్రజలు వస్తూంటారు. నేను పై వస్త్రమును వేసికొని కొంచెం గడ్డి కత్తిరించిన తర్వాత, ఏమి జరుగుతుందో తెలుసా, ఎవరో ఒకరు లోపలకు వస్తారు. నేను వెనక్కి తిరిగి వస్త్రములు ధరించి లోపలకు వచ్చి, ఆ రోగి కొరకు ప్రార్థిస్తాను. కొంచెంసేపటి తర్వాత నేను వెళ్ళి మరలా ఆ పని ప్రారంభిస్తాను, ఆ విధంగా కొన్ని గంటల సమయంలో అనేక సార్లు అటూ ఇటూ తిరుగుతుంటాను.

నేను వెనకవైపు పెరటిలోనికి వెళ్ళే సమయానికి ముందువైపు పెరటిలోని గడ్డి పెరిగిపోయింది. ఎందుకనగా ప్రజలు ఆ విధంగా వచ్చుట వలన నాకు సమయం కుదిరేది కాదు.

మరియు నేను మర్చిపోయాను..... మీలో కందిరీగలు ఎందరికి తెలుసు, అవి అక్కడ పెద్ద గూడు కట్టాయి. ఆ కంచె మలుపులో ఒక చిన్న పొద దగ్గర అవి పెద్ద గూడును కట్టాయి.

విద్యుత్ ద్వారా నడిచే గడ్డి కత్తిరించు యంత్రమును నేను అక్కడి వరకు నడిపించాను. నేను వెనుకవైపు పెరటిలో ఉన్నాను, ఎవ్వరూ అక్కడ చూడరు గనుక, నా చొక్మాను తీసివేశాను. నేను ఆ యంత్రముతో గడ్డిని కత్తిరించుచూ అకస్మాత్తుగా ఆ కంచెకు తగిలాను. అది అకస్మాత్తుగా జరిగినది..... అక్కడ కందిరీగలు ఉన్న సంగతిని నేను మరచిపోయాను. అకస్మాత్తుగా ఆ పెద్ద కందిరీగలు నన్ను చుట్టుముట్టాయి. నాకు చొక్కా లేదు. అవి చాలా పెద్దగా ఉన్నాయి.

50

మంచిది, మొదటిగా నేను భయపడ్డాను, అయితే మరలా ఆకార్యం జరిగినది. ఏదో... నేను తలంచాను, ''అయ్యో ఆ చిన్న జీవులు గూటిలో ఉన్నాయి. మరియు నేను... ''అవి నన్ను ఇబ్బంది పెట్టలేదు. నేను వాటిని కదిలించాను. ఏమి జరిగినదో నాకు తెలుసు, అప్పుడు ఏదో జరిగినది. మరియు నేను అయ్యో, చిన్న జీవులు అని తలంచాను.

అక్కడ నేను ఈ విధంగా చెప్పాను, ''దేవుని సృష్టియైన చిన్న జీవులారా, దేవుడు మిమ్మలను సృష్టించాడు. నేను దేవుని సేవకుడను. నేను ఈ గడ్డిని త్వరగా శుభ్రం చేయాలి.'' మరియు అవి చుట్టూ ఘీంకరిస్తూ తిరుగుతున్నాయి. నేను వాటికి భయపడలేదు. మరియు అవి..... నేను చెప్పాను, ''ప్రభువైన యేసుక్రీస్తు నామములో, మీరు తిరిగి మీ గూటిలోనికి వెళ్ళిపోండి, ఎందుకనగా నేను త్వరగా పెరటిలోని గడ్డిని కత్తిరించాలి. ఇక నేను మిమ్మలను ఇబ్బంది పెట్టను. ప్రార్థన కొరకు దేవుని సేవకులు అక్కడ కనిపెట్టుచున్నారు.“

మరియు సహోదరుడా, మరియు నేను మిమ్మలను తీర్పు దినమున కలుస్తాను. అవి నా చుట్టూ కొన్నిసార్లు వలయాకారములో తిరిగాయి, తర్వాత వాటిలో ఒకటి ముందుకు దారి తీసినది, అప్పుడు మిగిలినవన్నియా దానిని వెంబడించి ఆ గూటిలోనికి వెళ్ళిపోయాయి. దేవుని వాతావరణము! అది నిజము. దానిలో ఏదోయున్నది.

51

భయము అనేది చాలా దారుణమైనది. మీరు ఎప్పుడైనా కుక్కను గమనించారా? నేను జీవిస్తున్న గృహములో పెద్ద షెపర్డ్ జాతి కుక్క ఉన్నది. ఈ రోజు నేను పెరడులోనికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద కుక్క నాతో పాటు వచ్చినది. అది నాకు ఇష్టం.

జర్మనీలోని గుగ్గెన్బుహ్ అను ప్రదేశములో, నేను ఎవ్వరితో కలవని ఆ చిన్న కుక్కలను నేను కలసిన వెంటనే, ఆ చిన్న కుక్క అది నా దగ్గరకు వచ్చినది. నేను వాటిని ప్రేమిస్తాను. ఆ సంగతి వాటికి తెలుసు.

మరియు నిజముగా నీవు ప్రజలను ప్రేమించినట్లయితే, ఆ సంగతిని వారు ఎరుగుదురు. నీవు ప్రజలను మభ్య పెట్టలేవు. వారు అంత మొద్దులు కాదు. నీవు ఆ విధంగా నటించవచ్చును. నీవు నటిస్తున్నావని వారు చెప్పగలరు.

నీవు నటిస్తున్న సంగతిని సాతానుడు చెప్పగలడు, అది నిజమైనప్పుడు అతడు దానిని ఎరుగును. మరియు ఒకే మార్గము..... నీవు దానిని నటించవచ్చు, ఆ విధంగా కనిపించుటకు నీవు ఎంతో ప్రయాసపడవచ్చును, కాని క్రీస్తులోనికి వచ్చే వరకు నీ కార్యము సంపూర్తికాలేదు. అది నిజము. సంపూర్ణత, సమర్పణ, దైవిక ప్రేమ కలిగి సమస్తమును అమ్మి వేసి క్రీస్తు నొద్దకు రావలెను. స్నేహితులారా అంతే, సత్యము.

52

చూడండి, అది తిరిగి తాజాగా మారినది. నీవు ఆ విధమైన తాజాదనమును అనుభవించునట్లుగా పెందలకడను లేచావా? గమనించండి. నీవు ఎప్పుడైనా గులాబీ తోటలోనికి వెళ్ళావా? ఆ కర్ర చిగిర్చినది. ఆ ఉదయకాలములో ఆ పుష్పముల సువాసన? ఎందుకని, అంతా నెమ్మదిగా యున్నది. మరియు భూమిలో నాటబడిన ప్రతి విత్తనమును ఆ మంచు ద్వారా మరలా జీవింపచేయును. అది ఆ మట్టిని తాజా పరుస్తుంది.

నీవు దేవుని విత్తనమును తీసికొని, దురభిప్రాయములు, భేదములు లేని నిజమైన మంచితనము కలిగిన హృదయమనే భూమిలో నాటుము. చక్కటి దీన హృదయములో ఆ దేవుని విత్తనమును నాటి దానిని పెరగనీయండి. దానిని ఒంటరిగా ఎదుగనీయము, ఆ మహిమ మంచు బిందువులు, ఆ ఆత్మ మీద కురిసినప్పుడు, నీవు మధురమైన, సాత్వికమైన, దీనుడైన క్రైస్తవుని, నీ పొరుగున నీవు చూస్తావు. అది నిజము.

అదే మనసు కోరుచున్నాము. లోకమునకు అదియే కావలసియున్నది. నా క్రైస్తవ స్నేహితుడా, అది నిజము.

గమనించండి, అక్కడ లోపల కూడ వెలుగున్నది. మరియు వెలుపల ఆవరణములో, ఆ సమాజము నిలిచియుండు ఆవరణములో వారు నక్షత్రములను, చంద్రుడిని కలిగియున్నారు.

నేను త్వరగా ముగించాలి, కాని ఈ చివరి మాటను వినండి. ఇప్పుడు మీతో నేను నేరుగా మాట్లాడగోరుచున్నాను.

53

వెలుపట, వారు ఏ విధమైన వెలుగును కలిగియున్నారు? వారు రాత్రివేళ నక్షత్రముల వెలుగును, చంద్రుని వెలుగును కలిగియున్నారు. వారు సూర్యుని వెలుగును కలిగియున్నారు. ఎలాంటి మేఘమైన వచ్చినప్పుడు ఆ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వారు ఎలా నడవాలో తెలియదు. రాత్రిపూట కొన్నిసార్లు చంద్రుడిని, నక్షత్రములను మేఘము కమ్మివేస్తుంది. వారములు కొన్నిరోజులు, వారములు సూర్యుడు ప్రకాశించడు. బయట అలాంటి అనుభవములు ఉంటాయి. అది నిజము.

చిన్న చిన్న సమస్యలు ఎదురుకాగానే, నీవు వెనక్కి జారిపోతావు. నీవు దూరముగా వెళ్ళిపోతావు, నీవు ఒక సంఘము నుండి మరొక సంఘమునకు, ఒక స్థలము నుండి మరొక స్థలమునకు తిరుగుతుంటావు. “ఇక నేను ఆ బాప్తిస్టు సంఘమునకు వెళ్ళను, అది నాకు ఇష్టం లేదు,'' అని చెప్పావు.

మెథడిస్ట్ వారు నీతో సరిగా ప్రవర్తించనప్పుడు, నీవు పెంతెకొస్తు దగ్గరకు పరుగెడతావు, అక్కడ నుండి నాజరీనుల దగ్గరకు వెళ్తావు. చూశావా? నీవు వెలుపటి ఆవరణములో జీవిస్తున్నావు. ఏదైనా చిన్న సంఘటన జరుగగానే, ఆ లోకసంబంధమైన వెలుగు ఆగిపోతుంది.

మంచిది, నీవు వచ్చి “సహోదరుడా బ్రన్హం, ఆయన మంచివాడు అని నాకు తెలుసు,” అని చెప్పావు. అది మంచిది. సరే మంచిది, నీవు ఆ మొదటి బలిపీఠము దగ్గర ఉన్నావు. నీవు పరిశుద్ధ స్థలములో ఉన్నావు,

కాని గుర్తుంచుకో, అక్కడ కూడా దీపములు ఉన్నాయి. కాని అది కృత్రిమమైనది. అక్కడ వెలుగిచ్చుటకు ఏడు దీపములు కలిగిన దీప స్థంభమున్నది. కొన్నిసార్లు ఆ వెలుగు తగ్గిపోతుంది. కొన్నిసార్లు వాటికి పొగ పడుతుంది. ఆ దీపమును గూర్చి మీకు తెలుసు, కొన్నిసార్లు అది ఆరిపోతుంది.

54

ఆ దీపము వెలుగులో ఆ విధంగానే ఉంటుంది. నీవు అక్కడ జీవిస్తున్నప్పుడు, నీవు ఈ విధంగా చెప్తావు, ''మంచిది, నేను విశ్వసిసున్నాను, కాని దానిని సంపూర్తిగా విశ్వసించలేక పోవుచున్నాను, మరియు నేను దీనిని, దానిని విశ్వసించలేక పోవుచున్నాను. నేను ఎంతగానో విశ్వసించుచున్నాను. మరియు నా సంఘము దానిని గూర్చి బోధించినట్లయితే, నేను దానిని అంగీకరించలేను.'' చూశావా, నిన్ను పొగకమ్మినది. ఆ అద్దము పూర్తి మసిబారిపోయినది, తర్వాత ఏమి జరుగుతుందో మీకు తెలుసా, ఆ దీపము ఆరిపోతుంది.

కాని లోపలి వైపు చూడుము,ఓ సహోదరుడా, ఒక వ్యక్తి ఒక్కసారి ఆ స్థలములోనికి ప్రవేశించినట్లయితే. అతడు అక్కడకు ఎందుకు వెళ్ళాడు. భూసంబంధమైన వెలుగు నుండి అతడు పూర్తిగా దూరం అయిపోయాడు. మరియు అతడు కలిగియున్న ఆ వెలుగు. ఆ కెరూబుల రెక్కల క్రింద, ఆ షెకీనా వెలుగు ప్రకాశిస్తుంది, ఆ మృదువైన వెలుగు ఎన్నటికీ ఆరిపోదు. సూర్యుడు ఏమైనా నేను లక్ష్య పెట్టను, ఆ దీపములను గూర్చి మరియు దేనిని గూర్చియు నేను లక్ష్య పెట్టను. ఏది ఏమైనప్పటికీ, ఆయన సన్నిధిలో నివసించే వ్యక్తి రాత్రింబవళ్ళు ఆ వెలుగులో నడుస్తాడు.

55

మనము కూడా ఆ స్థలములోనే ఉన్నాము. నీ అనుభవములు ఏమైనప్పటికీ ... ఒక వేళ గుండె నొప్పి అయినా, ఒకవేళ సమస్యలు అయినా, నిరుత్సాహములు అయినా, అదైనా, ఇదైనా, నీవు ఇంకనూ దేవుని వెలుగులో నడుస్తావు. నీవు పెకీనా మహిమలో, యేసు సన్నిధిలో జీవిస్తున్నావు. “దేవుని ప్రేమించువారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి,'' అనే స్థితిలో నీవు జీవిస్తున్నావు. నీవు ఆయనను ప్రేమిస్తున్నావు. నీవు మధురమైన, సాత్వికమైన క్రైస్తవ జీవితమును జీవిస్తావు. ఆ విధంగా నడుచుట నీకిష్టము కాదా?

స్థలములో జీవించుట ఇష్టము, లేనివారు ఇక్కడ ఒక్కరు కూడా లేరు. స్నేహితులారా, మీరు అక్కడనే జీవించాలి. నీవు జీవము యొక్క మర్మమును తెలుసుకోవాలంటే, ఈ కార్యములు ఎక్కడ జరుగుతాయో నీవు తెలుసుకోవాలంటే, ఒక దినమున, దేవుడు తన కృపద్వారా నన్ను అక్కడకి తీసుకు వెళ్ళాడు. అది నిజము.

అదే దానిని చేసినది. నీలో ఏమియూ లేదు. ఇక నీవు ఎంతమాత్రము నీ కొరకు నీవు జీవించవు. నీవు ఇతరుల కొరకు జీవిస్తావు.

56

ఈ రోజు వారు పంపిణీ చేస్తున్న నా చిన్న చిత్రపటమును చూశాను. నేను దానిని చూసూ, ఈ విధంగా తలంచాను, మై! మరియు నా భార్యను చూసి ఈ విధంగా తలంచాను. నేను చెప్పాను, ''నా హనీ, ఇటు చూడుము, నేను నిజముగా వృద్ధుడనైతిని. కాదా?'' నేను చెప్పాను.....

కొన్ని సంవత్సరముల క్రితము నాకు జ్ఞాపకమున్నది (ఎందుకు, అది ఎంతో కాలము గడిచినట్లుగా లేదు,) నేను బాలుడిగా ఉన్నాను. నాకు గుర్తున్నది, నేను అక్కడ నిలబడి నా నల్లటి జుట్టును చక్కగా వెనక్కి దువ్వేవాడిని. కొద్దికాలము క్రితము నా భార్య నాతో, బిల్లీ, నీకు బట్టతల వస్తుంది హనీ, అని చెప్పినది.

నేను చెప్పాను, ''కాని, హనీ నీకు తెలుసా? వాటిలో ఒక్కటి కూడా నేను పోగొట్టుకొనలేదు.“

“వాటిని పోగొట్టుకొనలేదా?” అని ఆమె అన్నది.

“లేదు” అని చెప్పాను.

“అవి ఎక్కడ ఉన్నాయి?” అని అడిగినది.

మరియు నేను చెప్పాను. ''నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలి. వాటిని నేను పొందకమునుపు అవి ఎక్కడ ఉన్నాయి? అవి అప్పుడు ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు కూడా అక్కడే నా కొరకు ఎదురుచూస్తున్నాయి. ఒకానొక మహిమకరమైన దినమున నా ప్రభువు వచ్చును మరియు సమస్తము. నేను తిరిగి పొందుకొంటాను.''

నేను జీవిస్తున్నాను. ''నేను ఆ తెరను దాటి ఎక్కడ మహిమ తగ్గిపోదో అక్కడకి వెళ్ళాను. మనము రాజు సన్నిధిలో జీవిస్తున్నాము. హల్లెలూయ. నేను బలిపీఠము మీద శుద్ధీకరించబడితిని. ఓ, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. నేను చిరిగిపోయిన తెరను దాటి మహిమ విఫలం కాని స్థలములో ప్రవేశించాను. మనము రాజు సన్నిధిలో జీవిస్తున్నాము.''

57

ఒకానొక మహిమకరమైన దినమున..... నా ఈ చిన్న పాత శరీరము, కరిగిపోతుంది. అక్కడున్న ఆ వృద్ధురాలైన తల్లులు, తండ్రులు. కొన్ని సంవత్సరముల క్రితము అందమైన ఆ యువతితో, ఆ బలిపీఠము దగ్గరికి నడచి వెళ్ళావు. కాని ప్రకృతి... అది ఎలా వెళ్ళిపోయినదో మీరు చూశారు. ఒకానొక మహిమకరమైన దినమున యేసు, దేవుని సన్నిధిలో నుండి తిరిగి వచ్చును, అప్పుడు ఒకప్పుడు మనము కలిగియున్న శ్రేష్టమైనదంతటినీ తిరిగి పొందుకొని ఆయనతో యుగయుగములు ఉందుము. హల్లెలూయ!

ఈ శరీరములు దేని నుండి తయారు చేయబడ్డాయి? కొన్ని అణువులు, కొంత వెలుగు, పెట్రోలియం మరియు మొదలైన వాటిని సమకూర్చి భూమి నుండి దేవుడు ఆ మట్టి నుండి తీసి, ఆ చిత్రమును చిత్రీకరించాడు. ఇప్పుడు మనము నెగిటివ్ లో జీవిస్తున్నాము. ఒకానొక మహిమకరమైన దినమున మరణము ఆ చిత్రమును అభివృద్ధి పరుస్తుంది, అప్పుడు మనము నూతనమైన మహిమ పరచబడిన శరీరములో ప్రవేశిస్తాము. ఇక ఎన్నడూ వృద్ధులము కాము. ఇక ఎన్నడూ రోగము, గుండె జబ్బులు రావు.

సహోదరుడా, ఆ ఆవరణము అను తెరను దాటి, నీ చుట్టూ ఉన్న లోకమును మూసివేసుకొని, నీ జీవితమును క్రీస్తుకు ప్రతిష్టించుకొని, సమర్పణ కలిగిన జీవితము కలిగియుండుట యోగ్యమైనది. నీవు దానిని విశ్వసించుచున్నావా? ఖచ్చితముగా అది యోగ్యమైనది.

ఓ, అలాంటి జీవితమును జీవించాలి. “సహో. బ్రన్హం, దేవుని కృప ద్వారా నేను అలాంటి జీవితము జీవించాలనికోరుచున్నాను,'' అని మీలో ఎందరు చెప్పగలరు? మీ చేతులుపైకెత్తండి: ''నేను ఆ విధంగా జీవించ గోరుచున్నాను.'' దేవుడు నిన్ను దీవించును గాక, మనకు అది అవసరమైయున్నదని నమ్ముచున్నాను, మీరు నమ్మట లేదా?

58

మనము ప్రార్థించుదాము.

పరలోకమందున్న మా తండ్రీ, ఆ దినము సమీపించుట మేము చూచినప్పుడు, ఆ జీవము యొక్క దారములు పెళుసుగా మారుట మేము చూస్తున్నాము. మేము వాటి మీద నడుస్తున్నాము. మాలో అనేకులు సూర్యాస్తమయమును చూచునట్లుగా శిఖరము పైకి చేరుకొన్నాము. ఆకుల వాడిపోవుచున్నవి.

ఆ రాత్రి ఈ సభలో చూచినట్లయితే, అనేక మంది తల నెరిసిన వృద్ధులైన సహోదరి, సహోదరులున్నారు. అది కొద్ది దినములలో దానిని దాటబోవుచున్నారని వారు ఎరిగియున్నారు. ప్రభువా, ఇక్కడ యువకులు కూర్చొనియున్నారు, వారి కంటె ముందు వెళ్తారు. ప్రభువా, అప్పుడు రెప్పపాటులో అందరూ మార్పు చెందుదురు. అప్పుడు నిత్యత్వము ప్రారంభమగును. అప్పుడు మేమందరమూ ఆయన సన్నిధిలో నిలువబడి ఈ జీవితమును గూర్చి లెక్క అప్పగించాలి.

ఓ, యేసు, ఈ శరీరములను మీరు ఇచ్చారు. మీ కొరకు వాటిని మీరు ప్రతిష్టించారు. ప్రభువా, ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ఆ తెర లోపలికి తీసుకువెళ్ళమని, చిన్న తేడాలు, సంఘములు, మతశాఖల బేధములను దాటించి లోపలకు తీసుకు వెళ్ళమని ప్రార్ధిస్తున్నాను. తండ్రీ, వారు నీ మహిమకరమైన వెలుగులోనికి ప్రవేశించి, ప్రభువైన యేసు దైవికమైన వెలుగులో నివసించుదురు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఆత్మ దేవునికి సమర్పించబడాలని యేసు నామములో ప్రార్ధిస్తున్నాము.

59

మనము అలాగే తలలు వంచియుండగా ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే ముందుకు నడచి వచ్చి, ఈ బలిపీఠము దగ్గర నిలువబడి, “సహోదరుడా బ్రన్హం, దేవుని సహాయము వలన ఈ రాత్రి నా జీవితమును ఆయనకు సమర్పించుకొన్నాను. ఇప్పుడే, ఆ దాచబడిన జీవమును నాకు అనుగ్రహించమని ఈ రాత్రే దేవునికి ప్రార్ధిస్తున్నాను. కాబట్టి లోక కార్యములను, ఇతరులలోని తేడాలను గమనించుట నేను మానివేస్తున్నాను. నిజముగా ఆయన కొరకు నేను జీవించగలిగే స్థలమునకు రావాలని నేను కోరుచున్నాను,'' అని చెప్పగలరా? ప్రార్ధన కొరకు మీరు వచ్చి, ఈ బలిపీఠము చుట్టూ నిలబడతారా? మీరు ఆ విధంగా చేయాలని నేను కోరుచున్నాను.

సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. అది మంచిది. ఇక్కడి వరకు రమ్ము. ఈ విధంగా చెప్పుము, ''ఈ రాత్రి, నేను సిద్ధముగా ఉన్నాను. నా జీవితమును ఆయనకు సమర్పించుచూ ప్రార్ధిస్తాను, ఆ లోపలి తెరను దాటి వెళ్తాను. ఇప్పుడే, నేను ఆయనను వేడుకొంటాను.'' ఆయన ఖచ్చితముగా చేస్తాడని నేను నమ్ముచున్నాను. దేవుడు నిన్ను దీవించును. అది అద్భుతము, ఓ, ప్రతిష్టించబడిన జీవితము కొరకు ముందుకు రండి.

60

స్నేహితుడా, గ్రుడ్డివారి కన్నులు తెరువమని, కుంటివారిని నడుచునట్లుగా, మూగవారిని మాట్లాడించమని నేను చేయు ప్రార్థనలను ఆయన ఆలకించినట్లయితే! ముగ్గురు లేక నలుగురిని ఆయన మరణం నుండి లేపుటను నేను చూశాను. నేను మత మూఢుడుని కాదు. తర్వాత దానిని మీరు తెలుసుకొంటారు. నేను మీకు సత్యము మాత్రమే చెప్పుచున్నాను. ఎందుకనగా నేను దేవునికి లెక్క చెప్పాలి. ఖచ్చితముగా, ఈ రాత్రి ప్రతిష్టించబడిన జీవితము కొరకు చేయబడిన ప్రార్థన ఆయన ఆలకిస్తారు.

ఈ ప్రజల సమూహము చూడండి. సహోదరుడా, నిన్ను కలవాలని ఆశిస్తున్నాను. దీనికంటే శ్రేష్టమైన స్థలములో సహోదరీ నిన్ను కలవాలని ఆశిస్తున్నాను. నేను ఇక్కడ నిలబడి పరిచర్య చేయుచున్నంత నిశ్చయముగా, దేవునితో సన్నిహితముగా నడవాలని ఆశిస్తున్న నా సహోదరీ, సహోదరులారా, ఆయన దానిని మీకు నిశ్చయముగా అనుగ్రహించును. ఆయన దానిని వాగ్ధానము చేశాడు. నీవు దానిని చేయగలవని ఆయన చెప్పాడు. ఇప్పుడు మన మనస్సులను మనమే సిద్ధపరచుకోవాలి, కాదా? మనము విశ్వసించాలి. ఆయన ఇప్పుడే దానిని అనుగ్రహించునని నేను విశ్వసించుచున్నాను. మీలో ప్రతి ఒక్కరికి ఆయన నూతన జీవమును అనుగ్రహించునని నేను నమ్ముచున్నాను.

61

సంఘంలో సగము మంది కంటే పైగా ఈ బలిపీఠము దగ్గరకు వచ్చి ప్రార్థించుట చూడగా అది చాలా అద్భుతముగా ఉన్నది. మిగిలిన వారిలో అనేకులు తమ జీవితములను ప్రతిష్టించుకొనుటకు, ఆయనకు సమర్పించుకొనుటకు, ఆయనకు లోపరచుకొనుటకు ముందుకు వస్తున్నారు: “ప్రభువా, ప్రతి దినము దాని కొరకు ప్రార్థించుటను బట్టి అలసిపోయాను. నేను సమస్తమును ఇప్పుడే పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను అతి పరిశుద్ధ స్థలములోనికి రావాలని ఆశిస్తున్నాను. ఈ రాత్రి తెర వెనక్కి నేను వస్తున్నాను. నేను నీ దగ్గరకు వస్తున్నాను. ఎవరు ఏమి చెప్పినా నేను లక్ష్యము చేయను. నేను ప్రభువులోనికి వస్తున్నాను. నీ సన్నిధిలో నేను ఎల్లప్పుడూ జీవిస్తాను. లోకాశలను నేను ఇష్టపడుట లేదు. నీలో ప్రతిష్టించబడిన జీవితమును నేను కోరుచున్నాను. ఈ ఉజ్జీవములో మరలా నా జీవితమును ప్రారంభించాలని నేను కోరుచున్నాను. గ్రుడ్డివారు చూచుచున్నారు, దేశమంతా సాక్ష్యములు వినిపిస్తున్నాయి, నేను వాటిలో భాగము కావాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు నా జీవితమును ప్రతిష్టించుచున్నాను. ఈ ఉజ్జీవ కాలములో నన్ను వాడుకొనుము.” ఒక సేవకుడు ఉపయోగపడినట్టే నీవు కూడా వాడబడతావు లేక ఎవరైనా. ఖచ్చితంగా నీవు చేయగలవు.

62

ఈ రాత్రి ఇక్కడకు వచ్చి, “దేవా, నా జీవితమును అర్పించుటకు నేను కూడా వచ్చాను,” అని చెప్పగలిగే పాపియైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఇక్కడున్న ప్రతి పాపి దానిని పొందాలని కోరుచున్నాను. ఇక్కడ ఎవరైనా పాపి ఉన్నట్లయితే, మీ చేతిని ఎత్తి, “సహోదరుడా, నా కొరకు ప్రార్థించుము. ముందుకు వచ్చే ధైర్యము నాకు లేదు, కాని నా కొరకు నీవు ప్రార్ధించాలని కోరుచున్నాను,” అని చెప్పగలవా? బలిపీఠము చుట్టూ అనేకులు చేతులు ఎత్తి నిలబడియున్నారు. పాపులు తమ జీవితములను క్రీస్తుకు సమర్పించుటకు ముందుకు వచ్చియున్నారు. వెనుక ఇంకా ఎవరైనా పాపి యున్నారా? మూడు వంతులలో రెండు వంతుల మంది బలిపీఠము చుట్టూ నిలబడియున్నారు. నీవు వస్తావా?

మనము పాట పాడుదము. “నేను ఉన్నపాటున,” సహోదరుడా నీకిష్టమైతే రమ్ము, సరే మంచిది. ఎవరైనా ఉన్నారా?

ఉన్నపాటున వచ్చుచున్నాను, ఎలాంటి సాకులు లేకుండా,

అయితే నీ రక్తము నా కొరకు ప్రోక్షించబడినది,

నీ దగ్గరకు నన్ను ఆహ్వానించావు.

ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వచ్చుచున్నాను. నేను వచ్చుచున్నాను.

63

ఇప్పుడు ఈ రాత్రి దేవుని బలిపీఠము దగ్గర నిలువబడియున్న నా ప్రియమైన స్నేహితుడా...

ఒక దినమున కొందరు కుష్టు రోగము కలిగిన వారు సమరయ గవిని దగ్గర నిలబడియున్నారు. ఆ పట్టణము సిరియనుల చేత ముట్టడి వేయబడి యున్నది. పట్టణము లోపల తినుటకు ఆహారము లేదు. వారు పాపము చేసి దేవుని నుండి దూరము అగుటను బట్టి ఒకరి బిడ్డల మాంసమును మరొకరు భుజిస్తున్నారు. ఆ సిరియా సైన్యము ముట్టడించినది. వారు ఆ వైపునకు వెళ్ళలేరు. వారు వెళ్ళినట్లయితే, వారు మరణిస్తారు. వారు ఇక్కడ ఎంతో కాలము నిలువలేరు, ఎందుకనగా వారు మరణిస్తారు.

వారికి ఒకే ఒక నిరీక్షణయున్నది. అది సిరియా సైన్యము శిబిరము దగ్గరకు వెళ్ళుట. వారు వారిని రక్షించినట్లయితే బ్రదుకుదురు. వారు విడిచిపెట్టక పోయినట్లయితే, ఎలాగైనా వారు మరణిస్తారు.

కాబట్టి వారు శత్రువైన సిరియా సైన్యము పాలెము వైపునకు బయలుదేరారు. దేవుడు వారికి గొప్ప బహుమానము ఇచ్చాడు. దేవుడు గొప్ప కలవరమును కలిగించగా సిరియనులు అందరూ పారిపోయారు. వారు తమను మాత్రమే కాపాడుకొనలేదు గాని ఆ పట్టణమంతటిని కాపాడారు.

ఇక్కడ కూర్చొనియున్న వారిలో భాషలు మాట్లాడుచూ, బాప్తీస్మము పొందిన అనేకమంది పెంతెకొస్తు వారున్నారు, కాని వారు ఇంకా ప్రతిష్ఠ చేయబడిన జీవితము కలిగిలేరు. నీకు ఇంకా అక్కడ స్థలమున్నది. చూడండి, నీవు మన్నాను భుజిస్తున్నావు. రేపు రాత్రి దానిని గురించి ఇంకా ఎక్కువగా వివరిస్తాను, దానిని గూర్చి నేను పైపైన వివరిస్తున్నాను, ఏలయనగా నేను ఎక్కడ నిలబడియున్నానో నాకు తెలుసు.

64

చూశారా, మీరు ఆ స్థలమునకు వచ్చారు. నీవు క్రీస్తులో దాచబడగలిగే ఒక రహస్య స్థలమున్నదని నీవు తెలుసుకున్నావు, నీ శత్రువులందరినీ నీవు క్షమించగలవు. నీవు ప్రజలను ప్రేమిస్తావు, ప్రజలు నిన్ను ప్రేమించగలిగే స్థితిని నీవు కలిగియుంటావు. ప్రజలు నిన్ను ప్రేమగా చూడాలనుకుంటే నీ విషయంలో నీవు ప్రేమగా ఉండాలి. నీవు నటిస్తే అది పని చేయదు, అది పని చేయదు. వారు దానిని ఎరుగుదురు. దాని మీద నీవు ఏదియూ పెట్టలేవు. అనుకునే విశ్వాసముతో ఉండవద్దు.

ఈ రోజు మన దేశము స్థితి అదియే, అధికమైన వేషధారణ, కేవలము మతసంబంధమైన కార్యములు. అనేకులు వేషధారణ కలిగి క్రైస్తవ్యమును అనుకరించుచున్నారు. క్రైస్తవులవలె కన్పించుటకు ఏవో కార్యములు చేస్తున్నారు. స్నేహితుడా, అది పనిచేయదు, దేవుడు దానిని ఎరిగియున్నాడు, సాతానుడు దానిని ఎరుగును మరియు ప్రజలు దానిని ఎరుగుదురు. నీవు నిజమైన వ్యక్తిగా ఉండాలి. నీవు అసలైన వ్యక్తిగా యుండాలి. దేవుడు దానిని గౌరవించును.

నువ్వు పుట్టగొడుగువలె ఎదగకపోవచ్చును, కాని నేను పుట్ట గొడుగుకంటే సింధూర వృక్షము వలే ఎదుగకోరుచున్నాను. తేలికగా రమ్ము, నెమ్మదిగా రమ్ము. నీ వేరులు సరిగా పాదుకొన నిమ్ము, అప్పుడు నీవు సరిగా పెరుగుతావు, అప్పుడు నీవు రావచ్చును.

65

ఈ రాత్రి, మీ సహోదరుడిగా, ప్రభువైన యేసు నందు మీ సేవకుడిగా మిమ్మలను ఒక ప్రశ్న అడగనీయుడి. యధార్ధముగా నీలో నీవు దీనిని చెప్పుము. ప్రభువైన యేసు నొద్దకు వచ్చి, ''దేవా, నా తప్పిదము నీవు ఎరిగి యున్నావు. ప్రతిదినము ఈ చిన్న చిన్న కార్యములతో పోరాడుటను నీవు ఎరుగుదువు. ఆ పోరాటము నాకు కఠినముగా యున్నది. అందుకే నేను ఇక్కడ నిలువబడ్డాను,'' అని చెప్పుము.

ముందెన్నడూ క్రీస్తు దగ్గరకు రాని పాపులారా, ఆయన దగ్గరకు రండి. ''ప్రభువా, నీ ఎదుట నేను నిలువబడ్డాను. నేను అహరోను ఎండిన కర్రను, నాలో ఏ మంచియు లేదు, కాని ప్రభువా, ఈ రాత్రి నేను నీ పాదముల యొద్ద పెట్టబడుచున్నాను.'' అది ఏ విధంగా చిగురిస్తుందో చూడుము. ఏ విధంగా ఫలిస్తుందో చూడుము.

66

యదార్ధముగా మీ హృదయాంతరంగము నుండి మీరు ఆ మాటను చెప్పండి, ఈ రాత్రి దేవుడు మీలో ప్రతి ఒక్కరిని ఆయన రాజ్యములోనికి స్వీకరించి మీ జీవితములను ప్రతిష్టించును. అది ఇప్పుడే, ఈ క్షణమందే జరుగవచ్చును. అది జరుగునని నేను విశ్వసించుచున్నాను.

నేను ఉద్వేగములకు లోనయ్యే వ్యక్తిని కాదు. నేను ఆ విధంగా నటించను. నేను నిజమైన పరిశుద్ధాత్మ భక్తిని నమ్ముచున్నాను. అది నిజము. ఇది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. సహోదరుడా, అది సత్యము. దానిని గూర్చి భోధించుటకే నేను ఇక్కడ నిలువబడియున్నాను. దానిని పరిచయము చేయుటకే ఇక్కడ నిలువబడియున్నాను.

67

ఇప్పుడు ప్రభువైన యేసు నొద్దకు నీవు ఈ రాత్రి ఆ విధముగా రావాలని నేను కోరుచున్నాను. ఆయనతో చెప్పుము, ''ప్రభువా, నేను లోపలకు రావాలని కోరుచున్నాను. ఇప్పుడు, నీవు ఈ ఆలయమును నాకిచ్చావు. నేను నీతికరణము వరకు వచ్చాను. నేను సంఘములో చేరాను. అయినప్పటికీ నేను ఇంకనూ ప్రతిష్టించబడలేదు. ప్రభువా నేను సంఘములో చేరి, సంఘ జీవితమును జీవించుటకు ప్రయత్నిస్తున్నాను, కాని నేను అనేకమైన జయాపజయములు ఎదుర్కొనుచున్నాను. ఇప్పుడు, నేను ఆ ప్రతిష్టించబడిన స్థలములోనికి వెళ్ళాలనుకొనుచున్నాను. ప్రభువా, నా లోపలికి రండి. ఈ రాత్రి నన్ను లోకములో నుండి తీసివేయండి. నా చుట్టూ తెరలు దింపి, నీ షెకీనా మహిమలో, ప్రభువు మహిమ ప్రకాశించే స్థలములో నన్ను దాచియుంచండి.''

స్నేహితులారా, వినండి. ప్రభువు దూత యొక్క చిత్రమును మీలో ఎందరు చూశారు. అది ఇక్కడి కూటములో తీయబడినది. కొన్ని రోజులలో నేను దానిని పొందుకుంటాను.

దేవుడు నాకు తీర్పరి, మీకు తెలుసు, నేను మీకు సత్యమునే చెప్పుచున్నాను. అదే ప్రభువైన యేసు.... ఇప్పుడు నేను స్వస్థపరచు అభిషేకము నుండి ఈ అభిషేకమునకు దూరంగా ఉండుటకు నేను ఎంతగానో పోరాడుచున్నాను, ఎందుకనగా చాలా తీవ్రమైన అనారోగ్యముతో బాధపడుచున్న వ్యక్తి ఒకరు ఇక్కడున్నారు. ఇప్పుడే దానిని చూస్తున్నాను. మరియు ఆ చిత్రములో మీరు చూసిన ఆ దేవుని వెలుగు, అమెరికన్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, వాషింగ్టన్ డి.సి. వారు దాని మీరు కాపీరైట్ హక్కులు కలిగియున్నారు. అది సత్యము. అది నిజము. అది ఇక్కడే యున్నది. నేను దానిని ఎరుగుదును. నేను మీకు చెప్పినది సత్యమని ఒక వారములో తెలుసుకుంటారు.

68

మరియు ఇప్పుడు మనము తలలువంచుదాం, మరియు మీలో ప్రతి ఒక్కరూ కేవలం వినయముగా, సాదారణముగా మన ప్రభువగు యేసుకు సమర్పించుకొనుడి. “ప్రభువా, నేను నీ సన్నిదికి వస్తానని మరియు నీ సేవచేయుటకు వెళ్తానని నేను నీకు ఈ రాత్రి ప్రమాణము చేయుచున్నానని చెప్పండి. నేను నా జీవితమును మరుగుచేసుకొనగోరుచున్నాను. ప్రభువా, నన్ను ఆ విధంగా చేయుము మరియు నన్ను షెకీనా మహిమతో నింపుము.”

69

ఇప్పుడు, పరలోకమందున్న తండ్రీ, ప్రభువా, నీ సేవకుడిగా ఈ ప్రియమైన పిల్లలను నీ ఎదుటకు తీసుకువస్తున్నాను, వారు ఈ బలిపీఠము చుట్టూ నిలువబడియున్నారు. వారు ఆకలితో వచ్చియున్నారు మరియు నీవు ఆకలిగొన్నా వంటే, ఎక్కడో ఆకలి కలిగించేదియున్నది, కరడు కరడును పిలుచుచున్నది. వారిలో ఏదో యుండి, “ప్రత్యేకించబడిన జీవితమున్నది, దేవుని మరింత ఎక్కువగా ఎరగాలి? అని వారితో చెప్పుచున్నది. నీవు ఆకలిగొని యున్నంత నిశ్చయంగా దానికి జవాబిచ్చుటకు అక్కడ ఏదో యున్నది. స్వీకరించు వారికి దేవుడు మరింత ఎక్కువగా అనుగ్రహించును.

తండ్రీ, ఈ రాత్రి వారిలో ప్రతి ఒక్కరిని ఆ లోపలి స్థలములోనికి, నీ ప్రియమైన సంరక్షణలోనికి తీసుకు వెళ్ళండి. వారు తమ తలలు వంచియున్నారు. వారు ఇక్కడ నిలువబడి తమ జీవితములను సమర్పించుకొనుచున్నారు. ప్రభువైన యేసు, వారు నిన్ను ప్రేమిస్తున్నారు. వారు ఇంకా జయించవలసిన కార్యములు ఉన్నవి. ప్రభువా, ఇప్పుడే అనుగ్రహించండి.

70

చాచిన చేతులతో ప్రతి ఒక్కరికి ప్రత్యక్షమైవారిని ఇప్పుడే దేవుని యొక్క ఆవరణములోనికి తీసికొని వెళ్ళండి. వారిలో అనేకులు ఈ రాత్రి నుండి తమ జీవితములను సమర్పించుకొన్నారు. దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చి ప్రతివారి హృదయము ఆ మాధుర్యమును అనుగ్రహించును గాక. ఓ, నిన్ను ప్రేమించే స్థితిని వారిలో నాటండి. వారి స్వభావమును మార్చి నిన్ను ప్రశ్నించకుండా, నిన్ను ప్రేమించగలిగే హృదయం అనుగ్రహించండి. నీ ఆత్మతో నింపబడి, నీ కొరకు ప్రతిష్టించబడిన జీవితము జీవించగలిగే కృపను అనుగ్రహించండి. ప్రభువా, ఈ రాత్రి వారు ప్రార్థించుచుండగా ప్రతి ఒక్కరి హృదయములో అది పరిష్కరించబడును గాక. యేసు, మేము నిన్ను ప్రేమిస్తున్నాము.

మమ్ములను నీ దగ్గరకు ఆహ్వానించావు. నీవు చెప్పావు, ''రండి, మీకేది ఇష్టమో నా నామములో తండ్రిని అడగండి. నేను దానిని మీకను గ్రహిస్తాను. నేను మీకు అనుగ్రహిస్తాను.'' మీరు చెప్పారు ప్రభువా, మీ వాక్యమును మీరు నెరవేర్చవలసియున్నది, ఎందుకనగా మీరు దేవుడైయున్నారు. ఇప్పుడు, మీ దగ్గరకు వచ్చి మిమ్ములను అడుగుచున్నాము, మరియు మేము దానిని పొందుకొనుచున్నాము. ఏలయనగా దానిని అనుగ్రహిస్తానని మీరు వాగ్ధానము చేశారు. ఇప్పుడు, మేము దానిని నమ్ముచున్నాము, మా విశ్వాసమనే హస్తములతో దానిని పొందుకొనుచున్నాము. కన్నీరు నిండిన కన్నులతో, ఎత్తబడిన చేతులతో సమర్పించబడిన హృదయములతో, మేము నూతన జీవమును అంగీకరిస్తున్నాము. పరిశుద్ధాత్మ శక్తిని, షెకీనా మహిమను, ప్రేమ, శక్తి, సేవ, బాప్తీస్మమును అంగీకరిస్తున్నాము. దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభువా దానిని మేము అంగీకరిస్తున్నాము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...