కాలము యొక్క కూడలి
VGR COUNT-256 అ రికార్డు చేయుచున్నవారు ఒక క్షణం మీకు వీలైతే దయచేసి రికార్డు చేయుటను నిలిపి వేయవలెనని కోరుచున్నాను.
స్నేహితులారా, శుభోదయం. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను... [టేపులో ఖాళీగా ఉన్నది.] పాటలను నడిపించు సహోదరుడా, ఎప్పుడూ పాడే, “వారిని లోపలికి తీసుకొని రండి, వారిని లోపలికి తీసుకొని రండి.” ప్రతిష్ఠించుటకు పాడే పాటను పాడండి. అందరూ కలిసి, “చిన్న పిల్లలను లోపలికి తీసుకొని రండి,” అనే పాటను పాడండి.
వారిని లోపలికి తీసుకొని రండి;
వారిని లోపలికి తీసుకొని రండి;
పాపము యొక్క స్థితి నుండి
వారిని లోపలికి తీసుకొని రండి,
వారిని లోపలికి తీసుకొని రండి;
వారిని లోపలికి తీసుకొని రండి;
ఆ చిన్న వారిని యేసు నొద్దకు తీసుకొని రండి.
ఆమేన్. చిన్న పిల్లలయందు ఏదోక మధురమైన కార్యము గలదని మీరు తలంచుట లేదా? తేజస్సుగల ఒక చిన్న బిడ్డ యొక్క కన్నులు నావైపు చూచుచున్నప్పుడు, వారియందు వాస్తవమైన, మిక్కిలి మధురమైనది ఏదోకటి గలదు. అయితే వారు ఈ లోక కార్యములను గూర్చి ఏమీ తెలియని అమాయకులు. దేవుడే వారిని ఆ విధముగా అనుగ్రహించెను. మరియు ఈ చిన్న పిల్లలు, వారి ఇంటిలో ఉన్నవారి అనుబంధాలను కలుపునటువంటి ఏదొకటి వారియొద్ద గలదని మనమెరిగియున్నాము. అది ఒకరినొకరిని కలిపే ఆ బిడ్డ యొక్క తత్వమగును.
2
ఇప్పుడు, ఈ చిన్న పిల్లలను గూర్చి మరియు వారి విషయములను గూర్చి, ఇంకా అనేక సంగతులను మాట్లాడుటకు కొంచెము అధిక సమయము మనకు ఉన్నయెడల బాగుండును. ఈ చిన్నవారిని గూర్చి ఎన్నో చెప్పవచ్చును గాని సమయమును బట్టి చాల కష్టతరమగుచున్నది, కనుక ఇప్పుడు మనము తిన్నగా వాక్యములోనికి వెళ్ళవలసియున్నది; రికార్డు చేయుచున్నవారు ఈ ఉదయకాలపు వర్తమానమును రికార్డు చేయుటకు కోరుకొనినయెడల వారు రికార్డు చెయ్యవచ్చును. ప్రతి ఒక్కరినీ ప్రభువు అత్యధికముగా దీవించును గాక.
ఇప్పుడు ఈ దినమున, మనము దేవుని వాక్యము చదువుటకంటే మరేదియును శ్రేష్ఠమైనది లేదని నేను నమ్ముచున్నాను. కాబట్టి దేవుని వాక్యమును ప్రతీ గృహములో చదివినయెడల యుక్తమైనది.
సాధ్యమైనంత మట్టుకు ఆదివారపు పాఠశాల పిలలు ఆదివారపు పాఠశాల గదులలో నుండి వచ్చేటప్పుడు భయభక్తులతో ఉండవలెని కోరుచున్నాను. దేవుడు ఈ సంఘము కొరకు నిన్న రాత్రి నాకు అనుగ్రహించిన వర్తమానమును ఆయన యొక్క అనుగ్రహముతో నేను ప్రసంగించుటకు ప్రయత్నించునప్పుడు మీలో ప్రతీ ఒక్కొక్కరు చాలా నిశ్శబ్దముతో కూర్చొని ఆలకించవలెను.
ఇప్పుడు, మనము ధ్యానించుటకు యోవేలు 2వ అధ్యాయము, అపొస్తులుల కార్యములు 2వ అధ్యాయము. యోవేలు 2:28 మరియు అపొస్తులుల కార్యములు 2:15 నుండి ప్రారంభించుదాము. అపొస్తులుల కార్యములు 2వ అధ్యాయము గురించి ఈ ప్రవక్త ఎలా మాట్లాడుచున్నాడో చూడండి. తొలకరి వర్షము మరియు కడవరి వర్షము కురిపించునని యోవేలు 2వ అధ్యాయములో యోవేలు ప్రవచించి చెప్పుట ఆశ్చర్యము లేదా? దానిని యోవేలు ఈ అధ్యాయములోనే చెప్పెను. ఇప్పుడు మనము అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనము నుండి ప్రారంభించి కొన్ని వచనములను చదువుదాము:
మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.
యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే;
ఏమనగా - అంత్య దినములందు నేను మనష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులును, మీ కుమార్తెలును ప్రవచించెదరు, మీ యౌవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు.
ఆ దినములలో నా దాసులమీదను, నా దాసురాండ్ర మీదను, నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.
పైన ఆకాశమందు మహాత్కార్యములును, క్రింద భూమిమీద సూచక క్రియలను, రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.
ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు.
అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువారందరును రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.
3
ప్రార్ధన కొరకు కొన్ని క్షణములు మన తలలు వంచుదాము. మా దయగల పరలోకపు తండ్రీ, ఈ ఉదయ కాలమున ఈ గొప్ప భవనమందు ఒక పెద్ద తివాచీని పరచినట్లు ప్రతి తలయు భూమి యొక్క ధూళి వైపు వంటలు యున్నవి. దీనత్వముతో మా తలలును, మా హృదయములను నమ్రతతో వంచి యున్నాము. పరలోకపు తండ్రీ, మీ యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చి వాక్యములోకి ప్రవేశించి, ఎవరైతే తమ హృదయములో వాక్యము కొరకు ఒక స్థలమును కలిగియున్నారో వారందరికి దానిని అనుగ్రహించమని మేము ప్రార్ధించుచున్నాము. అది నూరంతలుగా మాలో ఫలించును గాక.
దేవా, అవిశ్వాసులైన వారు ఈ దినమున నిజ విశ్వాసులుగా మార్పుచెందవలెనని మేము ప్రార్థంచుచున్నాము. ప్రయాణమున అలసియున్న క్రైస్తవులు నూతన నిరీక్షణను పొందుకొనెదరు గాక. పరిశుద్దులు ప్రోత్సాహించబడుదురు గాక. తండ్రీ, మీరు మాట్లాడండి. మీ వాక్యము చుట్టూ మేము సహవాసము చేయునట్లు ప్రియ దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
4
ఈ ఉదయకాలమున మనము ధ్యానించే అంశమునకు పేరు చెప్పాలంటే, అది “కాలము యొక్క కూడలి.” దీనినే నేను సంఘమునకు చెప్పబోవుచున్న నా వర్తమానము యొక్క అంశము. దినములు గతించిపోవుచున్నప్పుడల్లా, యుగములు వాటి యొక్క ముగింపుకు వచ్చునప్పుడల్లా, అక్కడ అదొక కూడలి యొద్దకు వచ్చి చేరుటను చూచుచున్నాము. ప్రధాన రహదారులందు కూడలిలు ఉండును. అలాగే మనము ప్రయాణము చేయు ఈ లోక రహదారులలో కూడా కూడలిలు గలవు. అలాగే మనము మహిమకు ప్రయాణము చేయు ఆ గొప్ప పాత రాజ మార్గమున కూడా కూడలిలు గలవు.
మరియు సర్వశక్తిత్వము గూర్చి మాట్లాడాలంటే ఎల్లప్పుడూ సహజాతీతమైన అద్భుత కార్యము అచ్చట చోటు చేసుకోవలసియున్నది. సర్వశక్తియనగా అనంత శక్తియైయున్నది. కాబట్టి సర్వశక్తిని నిరూపించుటకు సహజాతీతమైన అద్భుత కార్యము అవసరమైయున్నది. సహజాతీతమైన అద్భుత కార్యము మాత్రమే దానిని చెయ్యగలదు. దేవుని వాక్యమును బోధించుటయనేది చాల మంచి విషయమే, ఎందుకనగా విశ్వాసమనేది వాక్యము వినుట వలన కలుగును. అయితే సర్వశక్తిమంతుడు ఇంకనూ జీవించుచూ పరిపాలించుచున్నాడు అని సహజాతీతమైన ఆశ్చర్య కార్యముల ద్వారా మనము రుజువు చేయగలము. అందుచేత మనము తప్పక సహజాతీతమైన ఆశ్చర్య కార్యములను కలిగియుండ వలసియున్నది.
5
మరియు ఇంతవరకు లోకము ఎరుగనంతగా సంఘము సర్వశక్తి యొక్క మహత్యమును నిరూపించవలసిన తరుణములో ఉన్నదని నేను విశ్వసించుచున్నాను. కొంత కాలముగా దేవుని లేఖన భాగములను పరిశీలించి చూచినప్పుడు, ఏడు గొప్ప కూడలిలను దేవుని వాక్యములో నేను కనుగొంటిని. ఏడు అనునది దేవుని యొక్క పరిపూర్ణ సంఖ్యయైయున్నది. ఆయన ఏడులో సంపూర్ణుడైయున్నాడు. ఆయన ఆరు దినములు పనిచేసి, ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఈ లోకము భూమిపై పరిపాలన చేయుచు జీవించుచున్నది. ఆరువేల సంవత్సరములు సంఘము ప్రయాస పడును, పిదప ఏడవది వెయ్యేండ్ల పరిపాలన. పరిశుద్ధ గ్రంథమున ఈ లెక్కలన్ని పరిపూర్ణముగా ఉన్నవి.
మరియు దేవుడు ఎల్లప్పుడూ నిర్ణీత సమయమున తన కార్యములను చేయును. కొన్నిసార్లు మనమే కొద్దిగా ఆలస్యముగా ఉందుము లేదా కొద్దిగా వేరొకలాగ ఆలోచించెదము, కాని అవన్నీ ఒక ఉద్దేశ్యము కొరకే చేయబడుచున్నవి. అయితే దేవుడు ఎల్లప్పుడూ తన వర్తమానముతో నిర్ణీత సమయమున వచ్చును.
6
మనము ఈ దినమున ఎదుర్కొనుచున్న ఈ గొప్ప విషయయులను సంఘము ఎరుగుచు, వాటిని గ్రహించవలసి యున్నదని నేను నమ్ముచున్నాను. ఇవన్నీ దేనిని సూచించుచున్నదని మనము దేవుని వాక్యములోనే అన్వేషించవలసియున్నది. అది దేవుని వాక్యములోనిది కానియెడల దానిగూర్చి నేను కొంచెము సందేహపడుదును. కాని దేవుని వాక్యము దానిగూర్చి మాట్లాడుచున్నట్లయితే మనయొక్క సాధారణమైన బోధనలకు అదెంత వ్యతిరేకముగా ఉన్నను ఆ బోధ గూర్చి నేను లెక్క చెయ్యను, ఎందుకనగా దేవుడే తన వాక్యమును క్రియ చేయునట్లు చేయుచున్నాడు. అయితే అనేక సమయములలో అది మన ఆలోచనలకు భిన్నముగా ఉండును లేదా అలాగు ఆలోచించునట్లుగా మనము బోధింపబడియుండవచ్చు.
అయితే దేవుని యొక్క సర్వశక్తి మన ఎదుట క్రియ చేయునప్పుడు దానిని మనము గుర్తించవలెను.
7
ఇప్పుడు, గత కొన్ని సంవత్సరములలో జరుగుచున్న కార్యములను గూర్చి మనము కొద్ది నిమిషములు మన తలంపులను వెనుకకు తీసుకొని వెళ్ళి పరిశీలించి చూద్దాము.
దేవుని సువార్త యొక్క సేవకునిగా మనము సరిగ్గా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క ప్రత్యక్షమగు దినములకు బహు సమీపముగా జీవించుచున్నామని నేను విశ్వసించుచున్నాను. ఆయన మొదటిసారి ఒక శిశువుగా వచ్చెను. ఈసారి దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారినందరిపై ప్రతీకారము తీర్చుకొనుటకు ఆయన మహిమ రాజుగా వచ్చుచున్నాడు. గందరగోళపు ఒత్తిడితో నిండిన ఈ దినములలో జీవించుచున్న మనము కొంచెం మన అనుదిన హడావిడి కార్యములను విడిచి, వార్తాపత్రికను ప్రశాంతముగా కొద్దిసేపు నిలబడి మన చుట్టూ జరుగుచున్నవాటిని, వాస్తవ సంభవములను గమనించిన యెడల, ఏ సందేహము లేకుండా ఏదోకటి సంభవించుటకు సిద్ధమగుచున్నదని మనము కనుగొనగలమని నేను నమ్ముచున్నాను.
8
దేవుడు తన వాక్యము ద్వారా ముందుగా తెలుపుచు దానిని ప్రత్యక్షపరచి దానిని వాక్యమందు పోల్చి చూపించకుండా ఎటువంటి సహజాతీతమైన కార్యమును లేదా ఏ ఒక్క విషయమును ఎన్నడు చెయ్యడని నేను నమ్ముచున్నాను. ఆయన ఎందుకు అలాగు చెయుచున్నాడనగా దేవుని వాక్యమునందు నడచుటలో విఫలమైపోవు మానవులు ఆయన యెదుట నిలువబడవలసి వచ్చినప్పుడు, వారు సాకులు చెప్పుటకు ఏ ఆస్కారము లేనంతగా తన వాక్యమును ఎంతో తేటగా తెలియజేయుచున్నాడు. కాబట్టి దేవుని కొరకు తగినంతగా ఏవరైతే శ్రద్ధను కలిగియుందురో - మానవుడు దానిపట్ల శ్రద్ధను కలిగియున్నయెడల, అతడు దానిని పట్టుకోగలరు.
మీరు సూపులో ఈగ పడితే దానిని అలాగే త్రాగరు కదా? లేదండీ, మీరు అలాగే త్రాగరు. అలాగే మీరు భుజించే ఆహారము చూచుటకు చెడిపోయినట్లు ఉన్నయెడల దానిని భుజించుటకు మీరు భయపడుదురు, ఎందుకనగా, టోమైన్ అనే విషపూరిత ప్రభావము కలిగిన దానిని మీరు భుజించినయెడల, అది మిమ్మల్ని కొద్ది కొద్దిగా చంపివేయునని మీకు తెలుసు. మీరు ఆ విధముగానే మీ శరీరమును సంరక్షించుకొనుచున్నారు. అలాగే మీ యొక్క ఆత్మను చెడిపోయిన ఈ లోక సంబంధమైన విషయాలతో పోషించనట్లైతే అది నశించిపోవుటకు దారి తీయును తప్ప వేరే ఏ ప్రయోజనము ఉండదు. మీరెంతగా మీ శరీరమును పోషించినను మరియు ఆ ఆహారము ఎంతగా బాగున్నను లేదా శరీరము ఎంత చక్కగా ఉన్నను అది చివరకు మట్టితో మట్టిగా ఈ భూమికే చేరుతుంది; కాని ప్రాణము ఎచ్చటో ఒక చోట నిరంతరముగా జీవించుచూ ఉండును. కాబట్టి ఈ లోక కార్యములతో నా ఆత్మను నేను నాశనము చేసుకొనుటకంటే ఎల్లప్పుడూ చెడిపోయిన సూపునే త్రాగెదను.
9
ఈ కూడలి గొప్ప కూడలిలు వచ్చుటకు ముందు లేదా ఒక నిర్ణీత కాలము సమాప్తమై వేరొక క్రొత్త దానిని ఆయన ప్రారంభించుటకు ముందు, లేదా ప్రాచీన కాలము నూతన కాలమును సంధించు స్థలమున లేదా ఒక యుగము నుండి వేరొక యుగమునకు మారుటకు ముందు దేవుడెల్లప్పుడూ తన శక్తిని కనబరుచును. కాని మానవుడు యుగములగుండా దానిని ఎల్లప్పుడు మార్చివేసి వేరొక విధముగా బోధించుచు వేరొక విధముగా నేర్పించుచు దాన్ని తారుమారు చేసి నిజమైన జీవముగల దేవుని నుండి తొలగిపోవుచున్నాడు. కాని దేవుడు ఒక నూతన యుగములోకి ప్రవేశించుటకు ముందు అనగా ఆ కూడలిలు వచ్చుటకు ముందు ఆయన గొప్ప సహజాతీతమైన అద్భుత కార్యములతోను సూచక క్రియలతోను రంగము మీద ప్రత్యక్షమగును. ఆయన ఎల్లప్పుడూ అలాగుననే చేయుచున్నాడు.
ఈ లోకమునకు సంభవించిన మొదటి వినాశమును చూడండి, అదే కూడలి. దేవుడు లోకమును సృజించి మనిషిని భూమి పై ఉంచిన పిదప జనులు పట్టణములను, గొప్ప భవనములను నిర్మించు కార్యములన్నియు ఈ లోకములో జరగడం ప్రారంభమైనవని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఈనాడు కూడా అవి అలాగునే జరుగుచున్నవాయని గమనించి చూడండి.. ఆ దినమును గూర్చి యేసు స్పష్టముగా చెప్పియున్నాడు, “నోవాహు దినములలో జరిగినట్లుగానే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినములో జరుగును.” అదే కార్యము ఈనాడు కూడా జరుగుచున్నది.
10
సరిగ్గా జల ప్రళయమునకు ముందు రాగి పనిముట్లతో, ఇనుము, ఇత్తడివంటి లోహములతో ఉపయోగించే విధానమును వారు కనుగొనిరని మీరు గమనించండి. మనము జీవించుచున్న ఈ దినములలోవున్న భవనములు ఎలా నిర్మించబడుచున్నావో చూడండి. ప్రజలు భూమి పై విస్తరించుచున్నారని వారు చెప్పుచున్నారు.
మన చుట్టూయున్న మన... మన ఈ చిన్న పట్టణము యొక్క స్థితిని గతముతో పోల్చి చూడండి. కొన్ని సంవత్సరముల క్రితం పధ్నాలుగు వేలుగా ఉండిరి, అయితే ఇప్పుడు ఇంచుమించు ఇరవై-ఏడు వేలుగా ఉన్నది. కనీసము కుందేలును వేటాడుటకు కూడా మనకు కావలసినంత స్థలము ఉండుట చాల కష్టతరమగును. ఇదంతా గృహ నిర్మాణ పధకములో చేర్చబడింది. అది నిజము. భవనములు విస్తరించుచు, అభివృద్ధి చెందుట జరుగుచున్నది. “వారు విస్తరించుట ప్రారంభించినప్పుడు, పాపము, చెడుతనము దానిలో ప్రవేశించెనని,” ఆయన చెప్పెను. మనము మార్గము యొక్క అంతమున ఉన్నామనుటకు అదే గొప్ప సూచన పలకలలో ఒకటిగా ఉన్నది. సూచన పలకలలో ఇది ఒక గొప్ప సూచనయైయున్నది.
11
గమనించండి, ఆ కాలమున నిమ్రోదనే పేరుగల ఒక వ్యక్తి బబులోనుయను గొప్ప పట్టణమును కట్టి, దాని చుట్టు ప్రక్కలవున్న పట్టణములన్నింటిని ఒక సమ్మేళనముగా కలిపి నిర్మించెను. అందువలన అవన్నీ సమ్మేళనమై ఒక గొప్ప పట్టణముగా ఏర్పడినవి. అదే బబులోను అనే పట్టణముగా అయ్యెను. దేవుడు ఆ ప్రపంచ సంయుక్త పట్టణములను ఎంతో హేయమైనవిగా భావించెను. ఈ దినమున అదే కార్యము జరుగుచున్నది. కార్మిక సమైఖ్యలు - కార్మికుల సమితి వంటి వివిధ రకముల సంకెళ్ళతో తమను తాము బంధించుచున్నారు మరియు సంఘ శాఖలలోని జనులు కూడా అలాంటి సంకెళ్ళతోనే బంధింపబడుచున్నారు. ఇది ప్రజలలో తమకంటు ఏర్పరచుకున్న సమూహములను బద్దలు చేసి ఉన్న అడ్డులన్నింటిని తొలగించి, అందరిని ఏకము చేయుచున్నది. ఏకమైన సమాఖ్యయే మొదటి వినాశనమునకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప సూచనలలో ఒకటియగును. అదే మరలా ఈ చివరి వినాశనమునకు ముందు ప్రత్యక్షమగుటను మనము కనుగొనుచున్నాము. మీరు దానిని చూడగలుగుచున్నారా?
12
గమనించండి. ఆ దినములలో ఇంకొక కార్యము జరిగినది, ఆ గొప్ప క్లిష్టమైన సమయములో పురుషుల హృదయములు మిక్కిలి చల్లగా మారిపోయి, దేవునివద్ద నుండి బహు దూరముగా తొలగిపోయెను. స్త్రీలు వారికి విగ్రహములవలె మారిపోయిరి. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చాలా చక్కనివారని చూచి తమ మనస్సుకు నచ్చినవారితో పోయి లైంగిక పాపమును చేసిరి. మనమెలాంటి దినములలో జీవించుచున్నామో నేటి దినమును గమనించండి. గౌరవనీయులైన స్త్రీలను గూర్చి నేను మాట్లాడుట లేదు, లేదండీ; వారు దేవుని యొక్క సాధనములు. కాని తమనుగూర్చి తాము శ్రద్ధవహించలేనివారై యున్నారు. వారిలో అనేకులు దానికి వ్యతిరేకముగా ప్రవర్తించుచు, “పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుచు నుండిరి.” నేను వారి గురించే మాట్లాడుచున్నాను. అది ఆ విధముగానే ఉండునని పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పెను. “నోవాహు దినములకు ముందు,” అనగా ఆ చివరి దినములలో వారు,“పెండ్లాడుచు, పెండ్లి కియ్యబడుచునుండిరి,” అని యేసు చెప్పెను.
నేడు లోకము ఎన్నో క్లిష్టమైన సమస్యలతో సతమతమగుచున్నదని మనము గ్రహించుచున్నాము. ఇవన్నీ ఈలాగు ఉండుటకు గల ఒక కారణమేమనగా, ఆ ఆత్మలు అనగా దుష్ట ఆత్మలు క్రిందికి దిగి ప్రజలలోకి ప్రవేశించి ఈ కార్యములను చేసెనని పరిశుద్ధ గ్రంథము చెప్పిన దానిని మనము గ్రహించగలము. ఆ దుష్ట ఆత్మలే మనమున్న ఈ దినములలో కూడా పని చేయుటను మనము చూచుచున్నాము.
ఇప్పుడు, మీరు గమనించండి, అది మాత్రమే కాదు, సమస్త పాతాళము తెరువబడినప్పుడు సమస్త పరలోకము కూడా తెరువబడును. వరద ప్రవాహమువలె శత్రువు బయలుదేరి వచ్చినను దేవుని ఆత్మ కూడా వాటికి విరోధముగా తన ధ్వజమెత్తును. మరియు ఈ రెండు శక్తులు ఎల్లప్పుడూ ఒకదానికొకటి ఆ కూడలుల వద్ద కనబడును.
13
నిమ్రోదు తన కాలములో అచ్చటున్న సమూహములన్నింటిని ఒక కూటముగా సమకూర్చి ప్రజలందరిని బబులోను రప్పించి ఒక గొప్ప కూటమిని ఏర్పరచెను. అప్పుడే స్త్రీ, పురుషుల మధ్య లైంగిక మరియు నీచమైన కార్యములు, ఇంకానేక రకముల కార్యములు జరిగెను. కాని అదే సమయములో దేవుడు కూడా ఈ భూమిలో అనుదినము దేవునితో నడిచే కళంకములేని హనోకు అనే ఒక సాక్షిని కలిగివుండెను. కాబట్టి దురాత్మలు భూమి మీద ఏ సమయమున కనబడునో, అదే సమయమున దూతలు కూడా కనబడుచుండెను. మానవులలో ఆ దూతలు ప్రవేశించెను. ఈ దినమునకు ఇదొక చక్కని సాదృశ్యముగా ఉన్నది. దుష్టత్వము ప్రత్యక్షమగు సమయమున యోగ్యమైనది ప్రత్యక్షమగును.
గతించిపోయిన ఆ దుష్ట దినములలో వినాశము వచ్చుటకు ముందుగా దేవుని సువార్త ప్రకటించుటకు సామాన్యమైన దీనుడగు మరియు లోక జ్ఞానము అంతగా లేని, దేవుని మాటకు లోబడే హృదయముగల నోవాహు అనే వ్యక్తిని దేవుడు కలిగివుండెను. నోవాహు మరియు హానోకు ఒకే సమయంలో బోధించిరి. మరియు మీరు గమనించినట్లయితే, ప్రకటన 11వ అధ్యాయంలో “అంత్యదినములలో నా ఇద్దరు సాక్షులకు నేను అధికారమునిత్తును,” అని చెప్పబడినది. అనగా ఈ అంత్యదినములలో మరలా నా ఇద్దరు సాక్షులను పంపించెదను. “వారు ప్రజల మధ్య సూచనలు మరియు అద్భుత కార్యములను జరిపించెదరు,” అని ప్రకటన 11వ అధ్యాయంలో చెప్పబడెను.
14
నోవాహు మరియు హానోకు బోధించుచుండిన ఆ దినములను ఒక్కసారి వెనుకకు తిరిగి చూడండి. అప్పుడున్న ఆ లోకమునకు నోవాహు యొక్క ప్రసంగము వెర్రితనముగా ఉండెను. చూడండి, నోవాహు ఒక సురక్షితమైన స్థలము కొరకు ఓడను కట్టుచు సిద్ధపరచుచున్నాడు. అదే ఒక అద్భుతమైన కార్యము. అసలు ఇంతవరకు నీళ్ళు లేక ఎండిపోయిన నేల మీద ఏ విధముగా ఒక వ్యక్తి గొప్ప సముద్రము ఉన్నట్లుగా మరియు దానిలో పైకి తేలుచూ వెళ్ళే ఒక ఓడను సిద్ధపరచి, వర్షము ఆకాశ మేఘముల నుండి వర్షించబోవుచున్నదని చెప్పగలడు? అలాగు వర్షము కురియుటకు అవకాశము గలదా? కాని “విశ్వాసము ద్వారా,” నోవాహు దానిని చేసెను. అదొక అద్భుతము కాదా? నోవాహు దేవునిచేత హెచ్చరించబడి ఒక ఓడను నిర్మించెను. మీరు దానిని చూడగలుగుచున్నారా? అది చూచుటకు చాలా మూడత్వముగా కనబడినను ఫరవాలేదు. అదెంత మూఢభక్తిగా ప్రజలకు కనబడినప్పుడు అలాంటి ఒక వ్యక్తి దానికొరకు ఆసక్తితో సుత్తితో కొట్టుచు పని చేయుచుండుటయే ఒక ఆశ్చర్య కార్యము, కాని ఇతరులకు అదొక పిచ్చితనముగా కనబడెను.
అదే కార్యము మరలా ఈ దినమున కూడా జరుగుచున్నది. నిజ ప్రసంగికుడు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి సువార్తను మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఒక మేకును దిగకొట్టినట్లు ప్రసంగించినప్పుడు, రానైయున్న దేవుని న్యాయ తీర్పుకు ప్రజలను సిద్దపరస్తూ లేదా దానినుండి తప్పించి భద్రపరచుచుండగా, నవ నాగరిక సంఘము యొక్క ప్రజలు దానిని చూచి ఎగతాళి చేయుచు, నవ్వుచు, అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవని, అసలు అలాంటివేవి లేవని వారు చెప్పుచున్నారు. అది ఒక అద్భుతము, కూడలియందు ఉన్న సూచన పలక.
15
నోవాహు అద్భుత కార్యములను చేయుచూ తన పనిలో తాను నిమగ్నమై శ్రద్దగా చేసుకుంటూ కొనసాగిపోవుట మాత్రమే కాకుండా అతడు కూడా ఆ అద్భుత కార్యము కొరకు ఎదురు చూచుచున్నాడు. అదే విధముగానే ఈ దినమునున్న సంఘము సూచనలు మరియు అద్భుత కార్యములతో సువార్తను ప్రకటించుటలో భారముతో ప్రయాసపడుచు, ఒక అద్భుతము కొరకు సిద్దబడుచున్నది. కావున సంఘము ఎత్తబడుటలో తన గృహమునకు కొనిపోబడుటయే ఆ అద్భుత కార్యమైయున్నది. కాబట్టి సంఘము ప్రజలను వెలుగులోకి నడిపించుచు ఈ లోక విషయముల ద్వారా వారికి కలుగు భారముల నుండి విముక్తి చేసి వారి ఆత్మలను దేవుని సన్నిధిలో స్థిరపరచుచున్నది. ఇందునిమిత్తము సిద్దపడిన వారందరు యేసు యొక్క మహిమకరమగు రెండవ రాకడలో మధ్య ఆకాశమున ఆయనను కలుసుకొని ఆయనతో ఉందురు.
నోవాహు దినములలో జరిగినట్లు మనుష్యకుమారుని దినములలో జరుగును. జనులు తినుచూ, త్రాగుచూ, పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుచు నుండిరి, అని చెప్పబడిన ఈ సంగతులన్నియు జరుగుటను మీరు చూచుచున్నారు. దేవుని దయవలన వాటిని గ్రహించే గ్రహింపును మీకిచ్చును గాక. ఇవన్నీ సూచన చిహ్నములని, వాటిని చూచే గ్రహింపును దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకై సహజాతీతమైన సూచన క్రియలన్ని ఈ దినమున మన కన్నుల యెదుటనే జరుగుచున్నవి. కావున మనము ఆ కూడలి యొద్ద ఉన్నామని గమనించండి.
16
నోవాహు ప్రజలను హెచ్చరించుచు బోధించుటకు ఆరంభించినప్పుడు, అతనిని చూచి అనేక మంది ప్రజలు నవ్వారు, అపహసించిరి, ఎందుకనగా అతని యొక్క వర్తమానము ఆ కాలపు పరిస్థితులకు పూర్తి భిన్నముగా ఉన్నది. నేడు ప్రజలు ఏమి చెప్పుచున్నారనగా, “ప్రపంచములోనే చాల శ్రేష్ఠమైన వైద్యులు మాకు గలరు. ఏ కాలములో లేనటువంటి శ్రేష్ఠమైన వైద్యశాలలు మాకు గలవు. మాకు అది, ఇది మరియు ఇంకెన్నో మేము కలియున్నాము, కాబట్టి వేరే ఇంకేమి మాకు అవసరము లేదు,” అని చెప్పుచున్నారు. వినండి. దైవిక స్వస్థతనేది గత దినములకంటే ఈనాడే మనకు అత్యధికముగా అవసరము. ఇంకా దినములు గడిచిపోయేకొలది ఈ దైవిక స్వస్థత మరెంతో ఎక్కువగా అవసరమైయున్నది. రాబోవు దినములలో ఏ వ్యక్తియైనా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితేగాని, తన హృదయములో... అతడు సమస్త కార్యములకు తనను తెరచి ఇచ్చుకొని ఉన్నంత వరకు. కాని తీక్షణమైన తెగుళ్ళు క్రుమ్మరింపబడినప్పుడు దేవుని ముద్ర తమ నొసళ్ళ పై గలవారిని తెగుళ్ళు తాకవు. మనమిప్పుడు రహదారులు ఒకదానితో ఒకటి కలుసుకునే కూడలివద్ద ఉన్నాము.
17
మరియు నోవాహు, ఇదిగో వర్షము కురియబోచున్నదని ప్రజలను హెచ్చరించుచునే ఉన్నాడని మనము చూచుచున్నాము. వర్షమంటే ఏమిటో ఆ ప్రజలు ఎరుగరు, ఎందుకనగా అంతవరకు అసలు వర్షము వర్షింపలేదు. మరియు రెండువేల సంవత్సముల నుండి సువార్త ప్రకటించ బడుచున్నప్పటికి, ఈ లోకమునందున్న ప్రజలకు ఇంతవరకు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించుటనే దానిని గూర్చి ఎరుగకయున్నారు. సర్వశక్తిమంతుడంటే ఏమిటో వారికి అర్ధము తెలియుటలేదు. అలాగే వీధిలో తిరిగే ఒక పాపి యొక్క ఆత్మను దేవుని కుమారునిగా, కుమార్తెగా దేవుని రాజ్యములో దూతల స్థానమునకు ఈ మహోన్నతమైన సర్వశక్తిమంతుడగు దేవుని యొక్క శక్తి వారిని రూపాంతరపరచగలదని వారు గ్రహించలేకపోవుచున్నారు, ఎందుకనగా ఈ లోక సంబంధమైన కార్యముల వ్యామోహంతో వారు ఆకర్షించబడి, వాటి వెలుగు జిలుగుకి అంధులై, లోక కార్యములతో సరసములాడుచూ, అదొక అపవిత్రాత్మని కొంచెము కూడా గ్రహింపులేనివారై యున్నారు, కాని ప్రజలు ఈనాడు సిద్దపడుటకు ఇదే ఒక గొప్ప సూచన పలకగా ఉన్నది.
“ఆ సంగతులన్నియు సంభవించుట మీరు చూచినప్పుడు మీ తలలు పైకెత్తుటకును మీ విడుదల సమీపించియున్నదని,” యేసు చెప్పియున్నాడు. అది మాత్రమే కాదు గాని, హానోకు ద్వారా ఆ సూచనలను దేవుడు చూపించినప్పుడు మరియు హానోకు ద్వారా ఈ సూచనలను వారికి చూపించినప్పుడు ఈ లోకము దానిని చూచి నవ్వెను. అయితే ఒక రోజున ఉరుములు, మెరుపులును రావడం ప్రారంభమై ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. మెరుపులు ఉరుములును గర్జించుట ఆరంభమైనది. అవన్నీ వాటికవి ఒక అద్భుతమైన విషయము. పిదప వర్షము కురియుటకు ప్రారంభమైనది.
18
అయితే ఇక్కడ ఒక గొప్ప ఆశ్చర్యకార్యము జరుగుచున్నది. ఆ ఆశ్చర్యకరమగు కార్యమేదనగా దేవుడు తనయందు విశ్వాసమును కలిగియున్న సంతానమును సురక్షితముగా ఓడలో మరుగుపరచి కాపాడెను. అక్కడ ఆ ఉరుములు ఉరుముచున్నంతవరకూ వర్షము కురుస్తూనే ఉన్నది. అయితే నోవాహు దేవుని ఓడయందు విశ్రాంతి తీసుకొనుచుండెను. నోవాహు ఆ ఓడలోనికి వెళ్ళుట కొరకే ముందుగా ఏర్పర్చబడినవాడై ముందుగా అభిషేకించబడినవానిగా ఉండెను. ఆ తెగుళ్ళు వారి పై పడుచుండగా, నోవాహు సురక్షితముగా విశ్రాంతి పొందుచుండెను. ఎవరైతే పరిహసించబడెనో పిదప అతడే ఆ విశ్రాంతిలోకి ప్రవేశించెను.
ప్రభువైన యేసుక్రీస్తునకు సంపూర్తిగా తమ జీవితములను ఎవరైతే సమర్పించుకొనుటకు ఆశించెదరో, అట్టివారిని చూచి ఈ లోక ప్రజలు నవ్వుచు, పరిహసించెదరు. కాని మీరు నిత్యమగు ఆయన యొక్క హస్తములలో మరుగుపరచబడివున్నారనే దానిని వారెరుగరు. మీరు ఆ సర్వశక్తిమంతునిలో మిక్కిలి సురక్షితముగా విశ్రాంతిని పొందుకొనుచున్నారని, ఏదీ కూడా మీకు హాని కలిగించదని వారు ఎరుగకున్నారు.
వర్షపు నీరు అధికమగుట ప్రారంభమైనది, ప్రజలు కేకలు పెట్టుచు, ఏడ్చుచు, గట్టిగా అరుచుటకు ప్రారంభించిరి. ఓడ అచ్చట ఉండుటకు బదులుగా పైకి తేలుచూ కదలసాగింది. అది నోవాహుని ఒక ఉయ్యాలవలె ఊపుచున్నట్లు అలల తాకిడికి పైకి తేలుచూ వెళ్ళుచున్నది. ఖచ్చితముగా అది అట్లే ఉన్నది. అదొక సూచన చిహ్నముగా ఉన్నది. దేవుడు ఈ లోకములోనున్న పాపమంతటినీ తుడిచి వేసి, శుద్ది చేసెను. ఆయన మరలా ఒక నూతనమైన దానిని ప్రారంభించనైయున్నాడు. దానిని ఆయన చేయుటకు ముందు ఈ విధమగు సూచనలు మరియు అద్భుత కార్యములను కనబరుచును.
19
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బందీ గృహమైన ఐగుప్తులోనుండి విడుదల చేసి వారిని బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఏమి జరిగినదో గమనించండి. దేవుడు ఇశ్రాయేలీయులను విడుదల చేయుటకు ముందుగా, ఆయన మొదటగా జీవముగల సర్వశక్తిమంతుడై యున్నానని నిరూపించుటకు సహాజాతీతమకు సూచనలను చేసి వారికి కనపరచెను. ఈనాడు ప్రజలు తలంచుచునట్లుగానే ఆనాడు కూడా యాజకులు, బోధకులు, మొదలగు వారందరూ దేవుడు లేడని తలంచిరి, కాని దేవుడు ఇంకనూ సజీవుడై సర్వశక్తిమంతునిగా అద్భుతములను చేయువానిగానే ఉన్నాడు.
దేవుడు లేడని వారు తలంచిన సరిగ్గా ఆ సమయమందే చాలా సాధారణమైన దీనుడగు ఒక లేవీ కుటుంబములో దేవుడు దిగి ఒక కుమారుని అనుగ్రహించెను. అతడే విమోచకునిగా ఉండెను. మరియు ఆ చిన్న మోషేను బహు జాగ్రత్తగా ఒక పెట్టెలో మరుగుచేయబడి తీసుకొని వెళ్ళిరి. దీనిని చక్కగా వివరించి చెప్పుటకు మనకు తగినంత సమయము ఉండిన చాలా బాగుండును. అతడిని చాలా జాగ్రత్తగా ఆ నది నుండి తీసిరని మనము చూచుచున్నాము. ఆ మొసళ్ళ మధ్యనుండి మరియు వాటన్నింటి నుండి ఒక ఆశ్చర్య కార్యము జరిగెను.
అద్భుత కార్యములన్నియు గతించిపోయినవని వారు చెప్పుకుంటున్న సరిగ్గా అదే సమయమున దేవుడు మోషేను ఎలాగు భద్రపరచెనో చూడండి. ఎందుకనగా, సరిగ్గా వారు ఆ “కూడలిలో” యున్నారు. వారు దేవుని వాక్యమును కలిగియుండిరి. వారియొద్ద యోసేపు యొక్క ఎముకలు గలవు. అవన్నీ మంచివే. అవన్నీ దేనిని సూచించుచున్నవనగా, ఒక దినమున దేవుడు వారి మధ్య సజీవునిగా ఉంటూ వారిని ఏలెననుటకు గురుతులు గలవు. అవును. అయితే అది మాత్రమే కాదు గాని, ఆ వాక్యముతో పాటు ఎన్నడూ విఫలమవ్వని సర్వశక్తిమంతుడ్లైన దేవుడును వారు కలిగియున్నారు. ఆయన నిన్న, నేడు, నిరంతరమూ మారని దేవునిగా, ఏకరీతిగా వారందరి మధ్యను నిలిచి ఉన్నాడు.
20
నలభై యేండ్ల వయస్సులో నది ప్రక్కన... లేక ఎడారి ప్రాంతంలో మోషే నిలువబడియుండగా, దేవ దూత పోలికతో దేవుడు దిగి వచ్చెను. ఆయన ఐగుప్తును నాశనముచేసి తన సంతానమగు ఇశ్రాయేలీయులను వెలుపలికి తీసుకొని వచ్చి ఆ యుగమునంతటిని మార్చుటకు ముందుగా ఆయన భూమిపై ప్రత్యక్షమై, పేదవారిని మరియు అవసరతలోనున్న వారియొద్దకు దూతలను పంపి అక్కడ సూచనలు మరియు అద్భుత కార్యములను చేసెను. మరి దేవుడు తన మహిమనంతటినీ మోషేకు కనుపరచెను. కాబట్టి అతడు ఒక కర్రతో అద్భుతములను చెయ్యగలిగెను. తన చేతిని తన ఛాతీపై పెట్టి తీసినప్పుడు, కుష్ఠు వ్యాధి స్వస్థపరచగలిగెను.
అది దేనిని సూచించుచున్నది? మనమిప్పుడు మార్పుచెందుచున్న కాలమున ఉన్నామని మరియు కూడలిని సంధించే సమయమున ఉన్నామని సూచించుచున్నది. మరియు మార్పులేని ఆ గొప్ప దేవుడు ఆయన మారనివాడై, ఆనాడు ఆ కాలము యొక్క కూడలిలో అటువంటి గొప్ప అద్భుతములను చేసినట్లయితే, ఈనాడు ఈ అంత్యదినములలో సమస్త పాతాళము ఆగ్రహముతో వ్యూహపరచు ఈ సమయమున ఆయన మరింకెంత ఎక్కువగా కార్యములను చెయ్యును. ఆయన విఫలమవ్వడు. ఇది సర్వశక్తిమంతుడిని సహజాతీతమగు అద్భుతములను సంధించు సమయమైయున్నది. ఆయన ఖచ్చితముగా దానిని చేయును.
21
ఈ సహజాతీతమగు అద్భుత కార్యములు వివేచించలేని మానవుని యొక్క ఆలోచనలకు ఎన్నటికీ అది అంతుచిక్కనిది. దానిని అతడు అర్ధము చేసుకోలేడు. దానిని మీరు అర్ధము చేసుకోవాలంటే ఆ సర్వశక్తిమంతుడిని సంధించవలెను. అలాగు మీరు చేయగలిగినప్పుడు సహజాతీతమగు కార్యములను స్పర్శించగలరు. అప్పుడు మీ జీవితము మారును, మీ ఆలోచనలు మార్చబడును, మీ మనస్సు మార్చబడుతుంది, మీరు చాలా వ్యత్యాసముగా ఉండెదరు. మీ అనారోగ్యం అదృశ్యమగును, ఎందుకనగా దేవుని యొక్క గొప్ప శక్తి అంతగా మీలో ప్రవాహించును.
మోషే పొద దగ్గర ఆ సర్వశక్తిమంతుడిని చూచెను, ఆ స్వరమును వినెను. అతడు సహజాతీతమున అద్భుతములను చూచెను. కాని దేవుడు మోషేకు ఒక వర్తమానమును ఇచ్చి, ఐగుప్తీయులకు మరియు ఇశ్రాయేలీయులకు బోధించుటకు మాత్రము పంపించుటకు ఆయన తృప్తి చెందలేదు. ఎట్లనగా, సర్వశక్తిమంతుడైన దేవుడు సహజాతీతమైన అద్భుత, ఆశ్చర్య కార్యములను కేవలము ఒక్క మనిషికి మాత్రమే బయలుపరచినయెడల, ఆయన దేవునిగా ఉండలేడు. కావున ఆయన, “ఈ సూచనలను తీసుకొని వెళ్ళుము,” అని చెప్పెను. హల్లేలూయా! “నీవు ఈ సూచనలను తీసుకొని వెళ్ళి వారికి కనుపరుచుము, నేను నీతో కూడా ఉండెదనని,” చెప్పెను.
మార్పు - ఇది కాలము మార్పుచెందు సమయము, ఆ కూడలిని సంధించే సమయమిది. కావున ఏదోకటి సంభవించు సమయము ఆసన్నమైనది. కాని అది సంభవించుటకు ముందుగా దేవుడు తన హెచ్చరికతో హెచ్చరించును. “నేనింకను యెహోవానై యున్నాను, నేను జీవించువాడను మరియు నేను సర్వశక్తిమంతుడను, నేను సహజాతీతమగు అద్భుత, ఆశ్చర్య కార్యములను చేయు దేవుడనని,” చెప్పెను.
22
అతడు ఐగుప్తునకు వెళ్ళి, తన చేతి కర్రను క్రింద వేసెను, తన చేతిలోవున్న కుష్ఠును స్వస్థపరచెను. అక్కడ అతడు ఈ కార్యములను చేసెను.
మీరు ఈ సంగతులను గమనించగోరుచున్నాను: ఈ విధమైన అద్భుతములు జరుగుచు ప్రతిసారీ, సాతాను దానిని అనుకరించుచు ఎల్లప్పుడు నకిలీ కార్యములను చేయుచునే యున్నాడు. ఆ దినమున అక్కడ సాతాను ఏ విధముగా నకిలీ కార్యములను చేస్తూ మెసగించుచున్నాడు. అతడి యొక్క మోసపూరితమగు కార్యములు ఈ కూడలిలో కూడా రాబోవు అంత్యకాలమును సూచించుచున్నవి.
అక్కడ వారికి ఆ పాత సోదె చెప్పు యన్నే, యంబ్రేలు గలరు. వారు మోషేకు వ్యతిరేకముగా నిలిచిరి. వారు తమ కర్రలను విసిరినప్పుడు అవి సర్పములుగా మారినవి. మోషే చేసినట్లుగానే వారు కూడా సరిగ్గా అలాగే చేసిరి, అయితే దేవుని పక్షమున ఎవరు ఉన్నారో వారిని ఆయన రుజువుపరచెను. వారు తెగుళ్ళు వచ్చునట్లు చేసిరి గాని దైవిక స్వస్థతను వారు చెయ్యలేకపోయిరి, ఎందుకనగా దేవుడు మాత్రమే స్వస్థపర్చగలవాడు. వారు పొక్కులను రప్పించ గలిగిరి గాని వాటిని తీసివేయలేక పోయిరి. దేవుని నిజమైన దైవిక స్వస్థతయనేది తన యొక్క సహజాతీతమైన అద్భుత కార్యమని చూపించుటకు తన శక్తియందు నిలబడి ఆ కూడలిని సంధించు సమయమున ఆయన తనయొక్క సర్వశక్తిని నిరూపించెను.
ఐగుప్తీయులు పొక్కులను వచ్చునట్లు చేసిరి, కాని అవి వారినే నాశనము చేసెను. అయితే దేవుని సేవకుడు వాటిని పారద్రోల గలిగెను. ఎందువలన? వారు నిజమైన దానిని చూచి అనుకరించి ఒక నకిలీ కార్యమును చెయ్యగలరు. ఈ అంత్యదినములలో సహితము ఆ విధముగానే ప్రజలు మోసగింపబడుదురని మనము బోధించబడితిమి. “యన్నే, యంబ్రేలు అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సును కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.” వారు ఏలాగు చేయగలరు? “వారు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించువారు, సజ్జన ద్వేషులు, అజితేంద్రియులు, పైకి దైవ భక్తిగలవారివలె ఉంటు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.” మనము జీవిస్తున్న ఈ దినము కూడలిని సంధించు రహదారిలో ఉన్నాము. ఇదే ఆ రహదారి ముగింపుగా, ఈ యుగము యొక్క అంతముగా వున్నది. దేవుడు దానిని రుజువు చేయుచున్నాడు. మనమెంత అద్భుతమైన దినమున జీవించుచున్నాము.
23
ఆయన ఐగుప్తునకు వెళ్ళి ఆ దేశమును ఏ విధముగా సర్వనాశనము చేసి, సూచనలు మరియు అద్భుత కార్యముల ద్వారా అచ్చటనుండి ఇశ్రాయేలీయులను పక్షిరాజు రెక్కల మీద తీసికొని వచ్చి దేవుడు తనను రుజువుపరచుకొనెను. తానేమై యున్నాడో నిరూపించుకొని తద్వారా మహిమను పొందుకొనెను, ఎందుకనగా ఆయన మన సర్వశక్తిగల దేవుడు. ఆయన మహాశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన ఫరో యొక్క రధములను ముంచివేయుటకు ముందుగా అన్ని రకముల సూచనలను యిచ్చెను. ఆయన దైవిక స్వస్థత యొక్క సూచనలను యిచ్చువాడు. ఆయన సూచక క్రియలను చేయుచు మరియు తన శక్తిని అన్ని విధములుగా నిరూపించువాడు. ఆయన జ్యేష్ఠ కుమారుని ఏలాగు రక్షించగలడో అలాగే జ్యేష్ఠ కుమారుని తీసుకోగలడు. ఆయన ఏలాగు చంపగలడో అలాగే జీవమును కాపాడగలవాడు. ఆయన ఏలాగు అద్భుతములను జరిపించగలవాడో అలాగే సహజాతీతమైన కార్యములను చేయువాడు. ఆయన సూర్యుడు, చంద్రుడు ప్రకాశించకుండా చీకటిగా మార్చివేసెను, వడగండ్లను కురిపించి దేశమంతటిని నింపివేసెను. దేశమును మెరుపులతో తాకి పశువులను మరియు సమస్తమును హతమార్చెను. ఇవన్నీ నోవాహు దినములయందు చేసినట్లుగానే ఉండెను.
మరియు ఆయన, “ఈ కడవరి దినములలో చంద్రుడు తన కాంతినిచ్చుటకు విఫలమగును, సూర్యుడు ప్రకాశించడు. దానిని చీకటి కంబళివలె కమ్ముకొని ఉండును. అది రక్తవర్ణపు వస్త్రములో ముంచబడినరీతిగా మారిపోవునని,” చెప్పెను. సూర్యుడు తన ముఖమును మరుగుచేసుకొని తనలో కన్నీళ్ళు కార్చుచు, దుఃఖముతో రక్తపు చుక్కలను చిందించు సమయమున దేవుడు ఈ భూమి పై సర్వశక్తిమంతునిగా సహజాతీతమైన కార్యములను చేయుచుండును. ముమ్మాటికి ఆయన చేయును. ఎట్లనగా ఆయన సర్వశక్తిమంతుడు. దానిగూర్చి ఆలోచించండి.
అక్కడ ఐగుప్తు దేశమునందు, ఆయన చేసిన సూచనలు మరియు అద్భుత కార్యములను మరియు ఆయన చేసిన కార్యములన్నింటిని తలంచి చూడండి. ఆయన దేవుడు. ఆయన స్థానమును మరెవ్వరూ తీసికొనజాలరు.
24
గమనించండి, దేవుడు తన ఆశ్చర్య క్రియలను జరిపించి, ఆయన ఫరోకు ఒక అవకాశమును ఇచ్చెను. కాని ఈ అవకాశమును సద్వినియోగపరుచుకొనుటలో అతడు ఘోరముగా విఫలమయ్యెను. మరియు తనకు లభించిన అవకాశమును తిరస్కరించెను. ఆ తర్వాత ఇక ఏ అవకాశము అతడికి లభించలేదు. ఒక మనిషి దేవుని యొక్క కృపను తిరస్కరించినప్పుడు, ఇక అచ్చట మిగిలి వుండునదేమనగా దేవుని యొక్క తీర్పు మాత్రమే. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, ఈ రోజున దేవుడు మనకు సహాయము చేయును గాక. ఈ వర్తమానము ముగింపునకు వచ్చుటను నీవు చూచినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించిన ఆ కృపను నీవు తిరస్కరించినట్లయితే, నీకు ఇక దైవ న్యాయతీర్పు గాక మరేమియు ఉండదు. ఆ తర్వాత వేరేది నీకు ఇక మిగిలి ఉండదు.
ఫరో అవిధేయతతో పాపము చేసి తనకివ్వబడిన కృపా దినమును తిరస్కరించినందువలన చివరకు అతనికి ఏమీ మిగిలి లేదు. ఎట్లనగా ఆ కూడలి సమీపముగా ఉండెను. మరి దేవుడే ఆ కాలము యొక్క కూడలిలో ప్రత్యక్షమయెను.
25
అబ్రాహాము మరియు లోతు జీవించిన మరియొక కాలమును చూద్దాము. అబ్రాహాము ఈ లోకమును పరిపాలించువానిగా ఉండవలసియుండెను మరియు అతని యొక్క సంతానమంతయు భూమియందు వ్యాపించవలసియుండెను. అతని బంధువు మేనల్లుడగు లోతు అతనితో కూడా ఉండెను. లోతు ఆత్మలో జన్మించుటకు, ఎన్నుకొనబడి, బయటకు పిలువబడి, మరియు ప్రత్యేకపరచబడిన జీవముగల దేవుని సంఘమునకు సాదృశ్యముగా ఉండుటకు బదులుగా ఈనాడువున్న చల్లని, సాంప్రదాయ సంఘమునకు ఒక అందమైన సాదృశ్యముగా ఉన్నాడు. కాని వారివురు ఒకే స్థలమున జీవించుచుండిరి, అయితే చివరకు ఒక సమయము వచ్చినప్పుడు లోతు తన పెద్ద గుంపును తీసుకొని సోదొమ గొమొర్రాకు వెళ్ళి నివసించెను. ఎందుకనగా అక్కడైతే వారు ప్రసిద్ధిగాంచుటకు, శ్రేష్ఠమైన భూములను కలిగియుండుటకు అవకాశమును కలిగి యుండవచ్చు. కాని అబ్రాహాము దైవ చిత్తమున నిలిచివుండి కరువుతో యుండు భూమినే ఎన్నుకొనెను. అబ్రాహాము మరియు అతని అందమైన భార్యయగు శారా దేవునిని ఆరాధించు క్రమములో ఆ కరువు భూభాగముననే నివసించిరి.
దేవుడెన్నడూ సుఖమైన పూలపాన్పువంటి సుళువైన మార్గమును వాగ్దానము చేయడు. “అన్నీ బాగుంటాయి, మీకు ఏ కీడు జరుగదు. ఏ శోధనలు మీకు రావు, లేదా మిమ్మల్ని ఏదీ తాకదు,” అనే అబద్దపు వర్తమానమును బోధించవద్దు. అట్లు చెప్పుచు ఏ క్రైస్తవునికి ఎన్నడూ అబద్దమును బోధించవద్దు. అది తప్పు. ఒక రచయిత చెప్పినట్లుగా, “అందరు పోరాడుచు రక్త కడలిగుండా ప్రయాణించి బహుమతి పొందుకొనగా, నేను మాత్రము పూలపాన్పు మీద సుళువుగా పరలోకమునకు వెళ్ళాలనుకోవటము సమంజసమా?” లేదండి. దేవుడు అతి సుళువైన మార్గమును మరియు సుఖ సౌభాగ్యమును ఎన్నడు వాగ్దానము చేయడు. అయితే సమస్త శోధనలను సహించుకునే నిత్య కృపను ఆయన వాగ్దానము చేయుచున్నాడు. మనము ఆ కృప కొరకే ఎదురు చూచుచున్నాము.
26
తన మందలకు సరిపడినంత గడ్డి ఆ పర్వతము పై లేకున్నను అబ్రాహాము దేవుని యొక్క మార్గమును ఎన్నుకొని అచ్చటే నిలిచివుండెను. కాని లోతు, అద్భుతములను నమ్మనివాడై, లోక కార్యముల వైపు తిరిగి భ్రష్టుపట్టిన సంఘమునకు మాదిరిగా ఉండెను.
చివరకు ఈ కార్యములన్ని దేవుని గాయపరచునంతటి స్థితికి వచ్చి, ఆయనే క్రియచేయు ఒక కూడలికి వచ్చువరకు అవి జరుగును. కాని దానికొరకు ఒక కాలము ఉన్నది, ఎందుకనగా అబ్రాహాము ఆ దేశమునకు వారసుడైయున్నాడు. ఓ, దేవా, క్రైస్తవులు దీనిని ఎందుకు చూడలేకపోవుచున్నారు? “హృదయ శుద్ధిగలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు; సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతింత్రుంచుకొందురు. ఆ కాలము యొక్క కూడలి చాలా సమీపముగా యున్నది. మనము కాలము యొక్క అంతమున ఉన్నామని మన తండ్రి మనకు చూపించును గాక, చూచారా.
27
అద్భుతమైనవాడు, సహజాతీతమైనవాడు, సర్వశక్తి మంతుడు సహజాతీతమైన కార్యములను చేయుచున్నాడు. ఆయన వైపు చూడండి, అబ్రాహము యొక్క కాలములో సరిగ్గా ఆ కాలము ముగింపు సమయానికి ముందు, ఈ లోకమునందు ఏమి సంభవించెనో చూడండి, అనగా గొప్ప పట్టణమగు సొదొములో ఏమి సంభవించెనో చూడండి. అబ్రాహాము ఒక గుడారమున నివసించుండెను, అతడు సమస్తమునకు వారసుడైయుండి ఒక చిన్న గుడారమున జీవించెను. కాబట్టి “అది గుడారమైనా, లేక కుటీరమైనా దానిగూర్చి నేనెందుకు బాధపడాలి?” అని ఒక కవి పాడుటలో ఏ ఆశ్చర్యము లేదు. మీరు క్రీస్తులో ఉన్నట్లయితే, సమస్తమునకు వారసులగుదురు. ఎట్లనగా, దేవుడు అబ్రాహామునకు ఈ భూమిని ఇచ్చెను మరియు ఆయనే రాజైయున్నాడు. కావున ఆ కూడలి యొక్క కాలమున మనము ఆయనలో ఉండి సర్వశక్తికి మరియు సహజాతీతమైన కార్యములన్నిటికీ వారసులమైయున్నాము.
మనము దీనిలో ముందుకు సాగిపోవుచుండగా, ఇప్పుడు ఈ విషయమును క్షుణ్ణంగా గమనించండి. ఆ కాలము యొక్క ముగింపునకు వచ్చుటకు ముందుగా దేవుడు ఏలాగు చేసెనో గమనించండి. లోతు సొదొమలో నివసించుచుండగా నికృష్టమైన కార్యములు అచ్చట అధికమగుచునే ఉన్నవి. మనుష్యులు పురుషగాములుగా మారిపోయి మిక్కిలి తారుమారుగా జీవించుచుండిరి. మానవ స్వభావమునకు విరుద్ధముగా సహజ మార్గము నుండి తొలగిపోయి వికృతమైన మార్గమును అవలంభించిరి.
28
పాటశాలయందును, ఆధునిక సంఘములలోను ఈ కార్యములు ఎంతో ఘోరమైన రీతిలో కనబడుచున్నవి. మనుష్యులు మద్యమును త్రాగుచు పొగత్రాగుచు, శారీరకమైన కోరికలను ప్రేరేపించుచు, అమ్మాయిల వెంట పరిగిడుచు, వారిని మానభంగము చేయుచు, మొదలగు నీచమైన కార్యములన్నింటిని చేయుచు, బాల్యమునుండే వారి జీవితమును నాశనము చేసుకుంటూ, వారియొక్క స్వచ్చమైన జీవితమును స్వాభావికమైన విరుద్ద పోకడలతో తారుమారుగా చేసుకునేంతగా వారు దిగజారి పోవుచున్నారు. దేవుడు వారిని నాశనమునకు అప్పగించును. మరియు స్త్రీ, పురుషుల మధ్య ఉండవలసిన నైతిక స్వాభావికమైన లైంగిక సంబంధము వారి మధ్య లేకుండా పోవునంతగా వారి జీవితాలు తారుమారైపోయెను. దెయ్యము వారిని అంతగా తన గుప్పెటలో బంధించుకొనెను.
సొదొమ, గొమొర్రాల యొక్క కూడలి వచ్చినప్పుడు ఏమి జరిగినదో చూడండి. నోవాహు దినముల యొక్క కూడలి వచ్చినప్పుడు ఏమి జరిగినదో చూడండి. వారు పెండ్లి చేసికొనుచు, పెండ్లికియ్యబడుచుండిరి. అచ్చటున్న సూచన పలకను మీరు చూడగలుగుచున్నారా? అక్కడ ఏమి జరిగినది? ఆ కాలము ముగింపునకు వచ్చుటకు ముందుగా సరిగ్గా అదే సమయమున దేవుడు భూమిపై ఒక ప్రవక్తను కలిగియుండెను. ఇదిగో ఆ కార్యము ఇచ్చటున్నది. వినండి. ఎల్లపుడూ ఒక కాలము ముగింపు సమయానికి వచ్చే ముందు, సాతాను అనుకరణచేయు తనయొక్క నకిలీలను విప్పి వదులుచున్నాడు. దేవుడు తన ప్రవక్తలను పంపుచున్నాడు. “ఈ చివరి దినములలో యౌవ్వనులు దర్శనములు చూతురు, ఆ దినములలో పనివారిమీదను పనికత్తెల మీదను నా ఆత్మను క్రుమ్మరింతును,” అని పరిశుద్ధ గ్రంథమున చెప్పబడెను. మరల తిరిగి భూమి పైన ప్రవక్తలు ప్రత్యక్షమగుదురు. దీర్ఘదర్శిలు మరల ఈ అంత్యదినములలో ప్రత్యక్షమగుదురు. మనము ఇక్కడనే ఉన్నాము. మనము సరిగ్గా ఈ కూడలియందే ఉన్నాము.
29
ఈ అంత్యదినములలో ప్రభువు ఏమి చేయునని, ఆయన ఆశీర్వాదములు ఏ విధముగా ఉండునో, సాతాను క్రియలు ఏలాగు ఉండునో, ఏ విధమైన కార్యములు జరుగునని పరిశుద్ధ ప్రవక్తల ద్వారా, యుగములు గుండా దేవుని యొక్క పవిత్ర వాక్యము ద్వారా ముందుగానే ప్రవచించబడినది. దేవుని పరిశుద్ధత ఈ లోకము యొక్క దుష్టత్వమును ఏ మాత్రము సహించదు. అయితే ఆయన దానిని ఒక కూడలికి తెచ్చుటకు ముందుగా హెచ్చరికయనే ప్రమాద సంకేతమును పంపించును.
అది మాత్రమే కాదు గాని, దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణములను నాశనము చేయుటకు ముందుగా ఆయన దేవదూతలను ఈ భూమి మీదకు పంపించగా వారు మనుష్యుల మధ్య కలిసిపోయిరి. అంతమునకు ముందుగా దూతలను పంపుదునని దేవుడు వాగ్దానము చేసియున్నాడు. మనము వారిని చూచున్నాము. సర్వశక్తిగల దేవుని యొక్క వర్తమానముతో వారు వచ్చుచున్నారు.
30
ఇదే కూడలి యొక్క సమయముగా యున్నది. నా చిన్న వయస్సు నుండి నాతో మాట్లాడిన ఆ సర్వశక్తిమంతుడిని ఇంచుమించు మూడు వారముల క్రితమే అచ్చట నిలచియుండుటను చూచితిని. నేను మూఢభక్తిగలవాడను కానని మీకు తెలియును; అయిననూ ఇది లేఖనములను నెరవేర్చుట కొరకు ఈ విధముగా జరుగుచున్నది. ఈ సత్యమునుగూర్చి, మనమెచ్చట ఉన్నామనే సూచనను ఈ సంఘము ఎరుగవలెనని నేను కోరుచున్నాను, ఎందుకనగా అప్పుడే మీరు సోమరులవలె ఉండకుండా ఉత్సాహముతోను, విభేదములు లేనివారై ఉందురు. అప్పుడు మాత్రమే ఒక యదార్ధమైన దైవభక్తిగల పురుషులుగాను, స్త్రీలుగాను జీవించగలరు. మీ హృదయములు క్రీస్తుతో హత్తుకొని ఉండును. కాబట్టి భూసంబంధమైన అల్పమైన కార్యములపై మీ దృష్టిని పెట్టవద్దు. ఎందుకనగా ఈ యుద్ధములు, ఘర్షణలు, కలవరములు మరియు బేధములు అన్నీ దయ్యమునకు చెందినవి. వాటి నుండి తొలగిపోండి. మనమిప్పుడు అంతమున ఉన్నాము.
జ్ఞాపకముంచుకోండి, ఈ కార్యములను సరిదిద్దుకొనుటకు మీకు మరియొక వారము ఉండకపోవచ్చు. అది నాకు తెలియదు. దేవునికి మాత్రమే తెలుసు. మనమిచ్చట అంతమున ఉన్నాము.
31
ఈ విధముగానే నోవాహు, తన కాలమున ఉండెను. ఈ విధముగానే ఇశ్రాయేలీయులు, వారి కాలమున ఉండెను. ఇప్పుడు అబ్రాహామును తరువాత కూడలిలో చూచుచున్నాము. అతడు (ఈ లోకము) ప్రకృతి సంబంధమైన మరియు సహాజాతీతమైన కార్యమునకు మధ్యలో ఉండెను. అచ్చటకు దూతలు దిగివచ్చిరి. వారు చూచుటకు మనుష్యులవలె వుండిరి. మహిమ. వారు ప్రవక్తయగు అబ్రాహాముతో నిలువబడి, “అబ్రాహామా, దేవుడు సహజాతీతమైన కార్యమును నెరవేర్చబోవుచున్నాడు. ఇదిగో జీవకాలము ప్రకారము వచ్చే సంవత్సరమున ఇదే సమయమున నేను మిమ్మును తప్పక దర్శింతును, నీ భార్యకు నూరు సంవత్సరములు వచ్చును, ఆమె ఒక కుమారుని కనును. నేను దైవిక స్వస్థత ద్వారా నా యొక్క శక్తిని చూపించెదను. నేను మరల నిన్ను ఒక యౌవనస్థునివలె మార్చుదును. అలాగే నేను శారాను ఒక వ్యత్యాసమైన స్త్రీగా మార్చుదును, ఆమెను మరలా యౌవనస్థురాలిగా మార్చుదును. నేను సర్వశక్తి మంతుడను, నేను ఆశ్చర్య క్రియలను చేయువాడను, అద్భుతములను చేయువాడను ఆమేన్. నేను నా యొక్క శక్తిని చూపించుదును. అబ్రాహామా మనము కూడలి యొక్క కాలమున ఉన్నాము.
అదిగో అక్కడ సొదొమలో దురాత్మలు ఉన్నవి, అవును. అవి ఈ లోకములో పనిచేయు చున్నవి“ అని చెప్పెను. అది ఈనాడు ఇచ్చట పనిచేయుచున్నవి. రేడియో మరియు టెలివిజన్లలో వినోదము, ఆకర్షణ, నీచమైన చలోక్తులువంటి వాటిని ఏ మాత్రము కత్తిరించి తొలగించకుండా లేక వాటిని పట్టించుకోకుండా, బహిరంగానే ప్రసారము చేయుచున్నారు. కొన్నిసార్లు సువార్త కూడా సామాజిక కార్యక్రమమువలె వక్రీకరించబడుచున్నది. ఈ లోకమంతా వక్రీకరించబడుచున్నది. కాని ఈ లోకము వక్రీకరించబడుచున్న అదే సమయంలో విశ్వాసులు సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమగుట ద్వారా, ఆయన చేయు క్రియల ద్వారా, ఆయన యొక్క శక్తిని బట్టి ప్రభువులో పశ్చాత్తాపముతో మారుమనస్సు పొందుచున్నారు. దేవుడు ఈలాగు తన కనికరముతో ఈ కార్యములన్నిటిని మనకు బయలుపరచుచున్నాడు.
32
వృద్ధుడగు ఆ ప్రవక్త, ఆ కరువు భూభాగమున తన గుడారములో ఉన్నప్పుడు, “అబ్రాహాము” అని పిలిచెను. అదొక గుడారమో లేదా అదొక కుటీరమో, ఏదైనాగాని దానిగూర్చి అతనికి బాధలేదు? అదేదీ కూడా అతనికి ఏ బేధమును కలిగించలేదు. ఎట్లనగా, సమస్తమునకు అతడే వారసుడు. సమస్తము తనదేయని అతనికి తెలుసు. అదే విధముగానే ఈ దినమున విశ్వాసికి కూడా ఈ విషయము తెలుసు. కాబట్టి ఈ భూసంబంధమైన విషయలను గూర్చి మనమెందుకు బాధపడవలెను? అందుచేతనే కొన్ని కూటములను కొన్ని దినముల ముందు నేను మానివేసాను. ఇందునిమిత్తము నేను ప్రజలను పిండుచు కానుకలను తియ్యాలని కోరుకొనుట లేదు. ప్రజలు ఏమనుకున్నాగాని దానిగూర్చి నేను లెక్క చేయను. దేవుడు మన అవసరములకు తగిన విధంగా ప్రతిదానిని ఆయనే తీర్చునని నేను నమ్ముచున్నాను. అవునండీ. ఈ లోకము యొక్క శ్రేష్ఠమైన కార్యములను కలిగివుండుటకంటే సాధారణమైన బిస్కెట్లను తినుచూ, సెలయేరులోని నీటిని త్రాగుచు నేను సువార్తను ప్రకటించెదను. ఏది ఏలాగున్నా మనలను మనము ఆయన చేతులకు సమర్పించుకొని, సర్వశక్తిమంతుని కొరకు ఎదురుచూచుచూ ఉండుటయే యుక్తమైనది. అదే మంచిది. ఇప్పుడు అచ్చట జరుగుచున్న దానిని గమనించండి.
అబ్రాహాము తన గుడారమున కూర్చొని ఉండగా, ఆయన అతనితో సంభాషించెనని మనము చూచుచున్నాము. ఈ దేవదూతలు కూడా అతనికి ప్రత్యక్షమయ్యిరి. పిదప వారు సొదొమ గొమొర్రాలకు దిగి వెళ్ళిరి. మరియు ఆ దినమున దేవుడు వారి మధ్య అద్భుత కార్యములను చేయుటను మనము కనుగొన్నాము. దేవుడు ఆకాశమునుండి అగ్నిని కురిపించి ఆ పట్టణమంతటిని కాల్చివేసి, ఆ నేలనంతటిని శుద్దీకరించి, సమస్తమును అబ్రాహామునకు ఇచ్చెను. మరియు లోతు భార్య వెనుకుకు తిరిగి చూచి అవమానకరమైన జ్ఞాపకార్ధ చిహ్నముగా మారెను. ఆమె ఆ సొదొమ గొమొర్రా పట్టణములో సమాజములో ప్రసిద్ధిగాంచిన స్త్రీగా ఉండెను. దేవుడు ఆకాశము నుండి అగ్నిగంధకములను కురిపించినప్పుడు ఆ లోయలన్ని నేల మొలకలతో సహితం తుడిచివేయబడినవి.
33
అదెంత అద్దుతమైన సమయము. జీవించుటకు అదొక గొప్ప కాలమైయున్నది, ఎందుకనగా దేవుడు తన సర్వశక్తిలోయున్న కాలమది. ఇచ్చట మరలా వేరొక కూడలి వచ్చుచున్నది. [సమయము తక్కువగా ఉండుటవలన నేను ఒత్తిడికి లోనగుచున్నాను. కాబట్టి మనము త్వరపడవలసియున్నది.]
సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధి మరలా అక్కడకు దిగి వచ్చెను. అహాబనే ఒక వ్యక్తి యెజెబేలను స్త్రీని వివాహము చేసుకొనెను. ప్రారంభమున అతడు ఒక విశ్వాసిగానే ఉండెను. యూదునిగా పుట్టి ధర్మశాస్త్రము ప్రకారముగా ఎనిమిదవ దినమున సున్నతి చేయబడియుండెను. యెహోవా దేవుని విశ్వాసించు ఒక భయభక్తిగల కుటుంబంలో అతడు పెంచబడెను. అయితే అతడు వశపరచుకొను కన్నులుగల విగ్రహారాధికురాలి యొక్క ప్రేమలో పడెను. అది సత్యము.
అదే విధముగా ఈ దినములలో చక్కని క్రైస్తవ పురుషుల హృదయము క్రీస్తు యేసులో నిలకడగా లేనందువలన ఇలాంటి ఋద్దిలేని వశపరచుకొను ఆకర్షణలో పడిపోవుచున్నారు. అవును. ఏలాంటి దినములో మనము జీవిస్తున్నాము. ఇదేలాంటి సమయము? ఆ సూచన పలకను ముఖాముఖిగా ఇచ్చట మనము చూచుచున్నాము.
34
కానీ దేవుడు తానేమైయున్నడో నిరూపించుకునే బలపరీక్షను ఎదుర్కొనుటకు ముందుగా, ఆయన ఏలియాయనే పేరుగల ఒక ప్రవక్తను ఆ దేశమున కలిగియును ఒక సమయము ఉండెను. అతడు దేవుని యొక్క వర్తమానముతో అభిషేకించబడి ఉండెను. అతడు అద్భుత కార్యములు చేయుచు ఆ సర్వశక్తి ఇప్పటికీ సహజాతీత కార్యములను చేయుచున్నదని రుజువుపరచెను. ఆ ప్రవక్త వర్షము కురవకుండా ఆకాశమును మూసివేసెను. అందునిమిత్తమే ఆ ప్రవక్త యొక్క పరిచర్య దినములలో వర్షము కురియలేదు. ఆ తర్వాత మరలా అతడు ఆకాశమునుండి వర్షమును భూమిమీద కురియునట్లు చేసెను. దేవదూతలు అతనికి రంగమున ప్రత్యక్షమైరి (హల్లెలూయా!), వారు అతనికి కాల్చబడిన జొన్న రొట్టెలను యిచ్చిరి. దేవునితో నలుబది దినములు అరణ్యములో ఉన్నంతవరకు అవి అతడిని ప్రాణముతో జీవించునట్లు చేసెను.
అంత్యదినములలో దూతలు ప్రత్యక్షమగుదురు. ఈ దినములలో దేవదూతలు ప్రత్యక్షమగుదురని, ప్రవక్తలు ఉద్భవించెదరని, సూచక క్రియలు మరియు అద్భుత కార్యములు జరుగునని ప్రవక్తలందరూ సూచించి చెప్పిరి. అలాగే సూచన పలకలు సూచించినవి. దేవుడు ఆ చిన్న కూడలిలోనే ఆ విధముగా కార్యములను చేసినయెడల, సమస్త పాతాళము తెరువబడియున్న ఈ దినములలో ఆయన ఎటువంటి కార్యమును చేయవలసియున్నది? పరలోకమంతా తెరుబడియున్నది, దేవదూతలు ప్రత్యక్షమగుచున్నారు, సూచనలు మరియు అద్భుత కార్యములును భూమిమీద జరుగుచున్నవి. అలాగే అనుకరణ చేయుచూ నకిలీ కూడా ఉద్భవించుచున్నవి. అలాగే దేవుడు కూడా ఏది నిజమైనదో, ఏది నకిలీయో నిరూపించుచున్నాడు. ఆమేన్.
35
ఓ, నేనాయనను ప్రేమించుచున్నాను. మీరు కూడా ఆయనను ప్రేమిస్తున్నారని నమ్ముచున్నాను. మిమ్మల్ని తిట్టుచూ కేకలు పెట్టాలని ఉద్దేశ్యముతో కాదు కాని, ఆ దినము ఎటువంటిదో తలంచినప్పుడు నా అంతరంగములో అది మండుచున్నది.
ఇప్పుడు ఆయన వారిని విడుదల చేయుటకు ముందుగా, ఆయన అన్ని విధముల సూచనలను మరియు అద్భుత కార్యములను జరిగించును. ఆ ప్రవక్తను బలవంతముగా లాక్కొని రమ్మని వారిలో కొందరిని పైకి పంపిరి. ఆ ప్రవక్త, “నేను దైవజనుడనైతే, అగ్ని ఆకాశమునుండి దిగి వచ్చునుగాకని,” చెప్పెను. ప్రతీసారి అగ్ని ఏలాగు దిగి వచ్చుచ్చున్నదో గమనించండి. ప్రతిసారి ప్రవక్తలు ఏలాగు వచ్చుచ్చున్నారో చూడండి. ప్రతీసారి అద్భుతములు ఏలాగు జరుగుచున్న గమనించండి. దేవుడు తన శక్తితో, స్వస్ధతతో తననేవిధముగా నిరూపించుకొనుచున్నాడో చూడండి. ఇవన్నీ రహదారుల యొక్క ముఖ్య కూడళ్ళ వద్ద జరుగుచున్నయి. దానికి ముందుగా అది జరుగదు. సరిగ్గా కూడళ్ళవద్ద, యుగములు మారుచున్న సమయమున, కాలము మారుచున్న సమయమున అది జరుగుచున్నది.
36
ఒక్క నిమిషం ముగింపులో కొన్ని అంశములనుగూర్చి గమనించి చూద్దాము. ఇప్పుడు మనము గొప్ప ఐదవ కూడలి వద్దకు వెళ్లాము. ఇదే అన్నింటికంటే ఒక పాముఖ్యమైన కూడలి. ఎందుకనగా, ఐదనేది ఐదు అక్షరములలోవున్న యేసు (J-E-S-U-S)ను సూచించుచున్నది. ఆమేన్. పాపమనే ప్రశ్నకు ఒక సంపూర్ణమైన పరిష్కారమునిచ్చే కాలముగా అది ఉండెను. అద్భుత కార్యములను చేయు ఆయనను గూర్చి సంపూర్ణముగా అర్ధము చేసుకోగల కాలమది. అట్లే మనుష్యుల హృదయము కూడా మారవలసిన ఒక కాలముగా ఉండెను. ఎట్లనగా ధర్మశాస్త్రము గాని, న్యాయాధిపతులు గాని మరియు మొదలగువన్నీ పాపమును తీసివేయలేకపోయెను. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయలేకపోయెను. ఆ గొప్ప కూడలియొద్దకు వచ్చుటకు ముందు, అచ్చటున్న ప్రసంగీకుల మధ్యనుండి దెయ్యము లేచి మభ్యపరచి, “అద్భుత కార్యములు జరుగు కాలము గతించిపోయెను, అలాంటి కార్యమేమియు లేదు,” అని ప్రసంగించెను.
కాని అదే సమయమున దేవుడు ఈ భూమిపైకి తన దూతలను పంపించుచుండెను. దేవుని యొక్క గృహ నిర్వాహమును జరిగించుచున్న జెకర్యాయను పేరుగల వృద్దుడగు ఒక వ్యక్తి ఉండెను, అతడు ప్రార్ధించు వ్యక్తి. ఒక దినమున అతడు బలిపీఠము పై ధూపము వేయుచు ప్రజలకొరకు మధ్యవర్తిత్వము చేయుచుండగా, ధూపవేదిక కుడి ప్రక్కన ఒక గొప్ప దూత అతనికి ప్రత్యక్షమై, ఒక కూడలి యొక్క కాలము సమీపముగా ఉన్నదని రుజువుపరుచుచుండెను. వయస్సులో ఉడిగిపోయి వృద్ధాప్యమందున్న తన భార్య ద్వారా దేవుడు ఒక కుమారునికి జన్మయిచ్చుననియు, అతని పేరు యోహాను అని చెప్పెను.
37
యోహాను వచ్చి అద్భుతములను చేయుచు నిరూపించుచుండెను. యోహాను ఒక ప్రవక్త. “యోహానువంటి వ్యక్తి ఇంతవరకూ ఈ భూమి పై పుట్టలేదు,” అని యేసే స్వయముగా చెప్పెను. హల్లేలూయా. ఎందుచేత? ఆ కాలమువరకు వచ్చిన ప్రవక్తలందరికంటే యోహానే ఒక గొప్ప ప్రవక్తయై యుండెను. ఎందుకనగా, ఎన్నడు లేనంతగా దేవుడు దెయ్యమును ఎదుర్కొనిన కాలములలో అదియే ఒక గొప్ప కూడలిగా ఉండెను. దెయ్యము వారి మార్గములను అడ్డుకొనినప్పుడు ఆయన దెయ్యమును నాశనము చేయుచు, వాని దగ్గరవున్న సమస్తమును ఒలిచివేసి వానిని దోచుకునే సమయముగా ఉండెను. హల్లేలూయా.
యోహాను ఒక ప్రవక్త. ఆ కాలము యొక్క కూడలిలో గాబ్రియేలు ఒక దూతగా ప్రత్యక్షము. దేవునికే మహిమ కలుగును గాక. అది జరుగుటకు ముప్పై-మూడు సంవత్సరములకు ముందే, ఈ కూడలి సమీపముగా ఉన్నదని దేవుడు వారిని ముందుగా హెచరించుటకై అనేకసార్లు ప్రయత్నించెను. అచ్చట అవిశ్వాసులు ఇంకా దిగజారిపోతూ, దాని పై విరుచుకుపడుచూ, విభేదించుచు, దానినుండి తొలగిపోవుటకు ప్రయత్నించిరి. చివరకు ఆ విషయమును ప్రకటించుటకు పంపించిన వారినందరిని చంపివేసిరి. కాని దేవుడు అద్భుత కార్యములను చేయుటకు ఒక ప్రణాళికను కలిగి యుండెనో, అలాగే చేయుచు కొనసాగుచుండెను, ఎందుకనగా ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన దానిని చేసి తీరును; ఆయన దేవుడై యున్నాడు.
38
ఇప్పుడు ఆ సమయమున ఏమి సంభవించెనో మనము చూద్దాం, ఇచ్చటున్న ఈ సంఘటన గూర్చి పరిశీలించుచూ మనము ముందుకు సాగిపోదాం. యోహాను ఆ నదియొద్ద ప్రసంగించుటను మనము చూచుచున్నాము. అచ్చట అతడు నాకంటె గొప్ప శక్తిమంతుడు ఒకరు వచ్చుచున్నాడని ప్రకటించుచుండెను. కొంతసేపటికి సర్వశక్తిమంతుడగు ఆయనే అచ్చట ప్రత్యక్షమయ్యెను. ఆయన చుట్టబడియున్న ఒక దీన శరీరముతో వచ్చెను. ఆ మహోన్నతుడగు యెహోవా దేవుడే తన్నుతాను తన కుమారుడగు యేసుక్రీస్తులో బయలుపరచుకొనెను. ఆ సర్వశక్తిమంతుడు శరీరధారిగా మన మధ్య నివసించెను, మన మధ్య నడిచెను. హల్లేలూయా.
ఆ గలిలయ సముద్రముపై ఆయన నడచినట్లుగానే, ఒక రాత్రి ఒక దోనెలో ఆయన పరుండియుండగా, ఆ చిన్న దోనె గాలికి ఇటు అటు కొట్టుకొనుచుండగా, దానిగూర్చి ఏమియు పట్టించుకొననివానివలె ఆయన ఊరకుండెను. ఆయన అలసిపోయెను. కాని అది కూడలియొక్క కాలముగా ఉండుటచేత ఆయన దోనె అమరముపై కాలు మోపి, పైకి చూస్తూ, గాలిని గద్దించి, “నిశ్శబ్దముగా ఊరకుండుమని” సముద్రముతో చెప్పెను. నేను దీనిని మీతో చెప్పనివ్వండి, భూమికి, ఆకాశములకు సృష్టికర్త ఆ దోనెలో ఉన్నప్పుడు ప్రకృతి ఆయన మాటకు లోబడి తీరవలెను. సర్వశక్తిమంతుడు పలికినప్పుడు సహజాతీతమైన కార్యములు జరుగును. ఆమెన్.
39
ఒక దినమున శరీరమంతా కుష్ఠు రోగముతో బాధపడుచున్న ఒక కుష్ఠునిగా, ఆయన యొద్దకు వచ్చి, “ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా నీవు చేయగలవనెను.”
ఆయన అతనిని ముట్టి, “నాకిషమే, నీవు శుద్ధుడవు కమ్మని,” చెప్పెను.
ఆ సర్వశక్తిమంతుడు పలికినప్పుడు సహజాతీతమైనది జరుగును. హల్లెలూయా! మబ్బుల వెనుకనుండి సూర్యుడు వెలుపలికి వచ్చునట్లుగా, అతని కుష్ఠు రోగము మాయమయ్యెను. సర్వశక్తిమంతుడు పలికినప్పుడు నిశ్చయముగా అట్లే జరుగును. ఈ అంత్యదినములలో మరలా మాట్లాడుదునని ఆయన వాగ్దానము చేసెను. సర్వశక్తిమంతుడు మాట్లాడునప్పుడు సహజాతీతమైనవి జరుగును. అవునయ్యా.
చూడండి. ఆయన రోగులను స్వస్థపరచెను. ఆయన మృతులను జీవముతో లేపెను. ఆయన గ్రుడ్డివారి నేత్రములను తెరచెను. అది దేనిని సూచించుచున్నది? అక్కడ ఆ కూడలి సమయము వచ్చెనని ప్రజలకు నిరూపించి చూపించుచున్నది. “నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము గలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఏ మనుష్యుడును నా ప్రాణమును తీయజాలడు.”
40
ఒక దినమున యోహాను 17లో, ఆయన పైకి చూచి, “తండ్రీ, నా ఘడియ వచ్చియున్నది” హల్లేలూయా! “ఆ కూడలి సమయము ఇచ్చటే ఉన్నది. ఇప్పుడే సమస్త కార్యములు సమాప్తమైనవి. సమస్త కార్యములు సిద్ధముగా ఉన్నవి. రహదారులను కలిపే కూడలి సమయము వచ్చియున్నది. లోకము హెచ్చరింపబడినది. అపొస్తలులను నేను అభిషేకించితిని. వారు సూచనలు మరియు అద్భుత కార్యములను జరిగించిరి. మేము ఈ దేశమంతటా తిరిగితిమి, అన్ని స్థలములలో ప్రకటించితిమి. ఆ సమయము ఇదే. ఆ సమయము వచ్చియున్నది,” అని చెప్పెను.
సోదరుడా, ఈ ఉదయమున ఒక సువార్త ప్రసంగీకునిగా, నేను విశ్వసించుచున్నదేమనగా, ఈ దినమున పరిశుద్ధాత్మ క్షయమైపోయే పెదవుల ద్వారా, అనగా అభిషేకించబడిన సేవకుల ద్వారా, “ఆ ఘడియ వచ్చియున్నదని” పలుకుచున్నాడు. ఇదే ఆ సమయము, సర్వశక్తిమంతుడు జవాబిచ్చుచున్నాడు. సహజాతీత కార్యములు జరుగుచున్నవి. ఇవి జరిగి తీరవలెను. ఎట్లనగా, మనము కూడలియందున్నాము.
41
మరియు, సర్వశక్తిమంతుడగు దేవుడు అచ్చట శరీరధారిగా ప్రత్యక్షమై సహజాతీతమైన అద్భుతములన్నియు చేసెను. “కేవలము నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నా దాసుడు బ్రతుకునని” అతడు చెప్పెను. అతనికి తెలుసు. ఆ రోమ సైన్యాధికారి ఎరుగును. అతడు కూడా అధికారమునకు లోబడియుండెను. నా చేతి క్రిందవున్నవారు నాకు లోబడుదురు, అతడు చేయమన్న పనిని వారు చేయుదురు. “నేను ఒకనిని రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవునని,” అతడు చెప్పెను. నేను సహితము అధికారమునకు లోబడినవాడను మరియు నా చేతి క్రిందనున్న సమస్తము నాకు లోబడియుండును, ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, కేవలము ఒక్క మాట మాత్రము సెలవిమ్ము,“ అని చెప్పెను. హల్లేలూయా. ఆయన సర్వశక్తిమంతుడని అతనికి తెలుసు. సర్వశక్తిమంతుడు సెలవిస్తే అద్భుత కార్యము జరుగునని అతనికి తెలియును. ఓ, మై.
ఆ లాజరు సమాధియొద్ద నిలబడి ఒక సామాన్యమైన మానవునిగా ఆయన ఏడ్చెను. అప్పుడు మార్త, “ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. కాని సర్వశక్తుడగువాడు ఇప్పుడైనను పలికినా అతడు బ్రతుకును. నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించును. నీవు ఏమి చెప్పినను దానిని ఆయన నీకు చేయునని,” చెప్పెను.
42
ఆయన ఆ సమాధి దగ్గరకు నడచి వెళ్ళెను, సర్వశక్తిమంతుడైన దేవుడే మన మధ్య ప్రత్యక్షమై మనతో జీవించుచున్నాడు. “దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనియున్నాడు.” ఆయన మనతో జీవించి తన కుమారుడగు క్రీస్తు ద్వారా తనను రుజువుపరచుకొనుచున్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడై సహజాతీతమైన కార్యములను చేయుచున్నాడు. మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరమూ ఒక్కటే రీతిగా ఉన్నాడు, మరియు “నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను; యుగ పర్యంతము నేను మీతో కూడా ఉందునని,” ఆయన చెప్పియుండగా, మనము దేనికొరకు ఆలోచించుచూ ఉండాలి? ఆయన పలికినప్పుడు సహజాతీతమైన అద్భుతములు జరుగుచుండగా మనము వేరే దేనికొరకు ఎదురుచూస్తూ ఉండాలి?
ఆయన సమాధియొద్దకు కన్నీళ్ళను కార్చుచు వెళ్ళెను. పిదప ఆ సర్వశక్తి తన్నుతాను సమకూర్చుకొని, ఆ సమాధి దగ్గర ఆయన, “లాజరూ, బయటకు రమ్ము,” అని పిలిచెను. మరియు అప్పటికే ఆ శరీరము క్రుళ్ళిపోవుచు, ముక్కు దానినుండి క్రింద పడిపోయెను. నాలుగు దినముల క్రితమే అతడు మరణించెను. అతడి చర్మము నుండి పురుగులు బయటకు వచ్చుటకు ప్రారంభమైనవి. కాని ఆ క్రుళ్ళు తన యజమానుడిని ఎరిగియున్నది. హల్లేలూయా. చనిపోయిన అతనికి మరలా ఈయన జివమును ఇచ్చెను. మరియు చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి లేచి నిలబడి మరలా జీవించెను. అది సహజాతీతమైన అద్భుత కార్యము. “పునరుత్థానమును, జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు,” అని దేవుడు చెప్పెను.
43
సర్వశక్తిమంతుడు సెలవిచ్చిన చాలును, అప్పుడు ఆశ్చర్య కార్యములు సంభవించును. ఆయన దానిని ఎల్లప్పుడూ, కాలమనే కూడలి దగ్గరనే చేయును. కాబట్టి ఈ కార్యములన్ని సంభవించునప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలెను; ఎందుకనగా మనము అంత్యకాలమున ఉన్నాము. సర్వశక్తిమంతుడు సెలవియ్యగా, మృతుడైన వ్యక్తి మరలా జీవించెను. అతడు తన పాదముల మీద నిలబడి, ఆయనతో కలసి విందు ఆరగించుటకు వెళ్ళి మరియు ప్రభురాత్రి భోజనమును తీసికొనెను. ఓ, మై. ఏమి జరిగినది? ఒకానొక మహిమకరమైన దినమున, పాపములలో, అతిక్రమములలో ఒకప్పుడు చచ్చినవారివలెయున్న మనయొద్ద సర్వశక్తిమంతుడు మాట్లాడెను. పాతాళమునకు వెళ్ళుచున్న మనయొద్ద సర్వశక్తిమంతుడు మాట్లాడెను. మనము ఆ పాతాళములో నుండి మహిమకరమగు స్థానమునకు పైకి లేపబడితిమి. ఒక దినమున అనగా చివరి దినమున ప్రభురాత్రి విందును భుజించెదము. సర్వశక్తి మంతుడు ఇంకా మాట్లాడుచునే వున్నాడు. దేవుని వాక్యమే ఆ సర్వశక్తియైయున్నది. మనము దానిని విశ్వసిస్తే మరణము నుండి జీవములోకి పునరుత్థానులగుదుము. నా మాట విని నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు.“ ఆయన సర్వశక్తిమంతుడు.
మనము ఇప్పుడు నోవాహువలె ఒక ఓడను నిర్మించుచున్నాము. ఒక దినమున సహజాతీతమైన అద్భుత కార్యము జరుగనైయున్నది. ఎత్తబడుట జరుగునప్పుడు యేసు వచ్చును. ఇప్పుడు మనము సరిగ్గా ఆ కాలమనే కూడలి వద్ద వున్నాము. కావున ఈ సంగతులన్నియు సంభవించుటను చూచుచున్నప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొని, మీ విమోచన సమీపముగా ఉన్నదని తెలుసుకొండి. సర్వశక్తిమంతుడు సెలవిచ్చునప్పుడు అద్భుత కార్యములు జరుగును. “తండ్రీ, మేము ఆ కూడలి యొద్ద ఉన్నాము. నీవు ఎవరనే విషయమును నేను నిరూపించవలసియున్నది,” అని యేసు చెప్పి, మృతులను తిరిగి జీవముతో లేపెను మరియు రోగులను స్వస్థపరచెను. కాని చివరగా ఆయన వెళ్ళిపోవలసిన ఆ ఘడియ వచ్చినప్పుడు, విధేయతతో ఆయన నడచుచూ ఆ సిలువ యొద్దకు వెళ్ళి, అచ్చట మేకులతో కొట్టబడి ఆ సిలువపై వ్రేలాడెను. ఆయన పరలోక సంబంధి కానట్లుగా, పరలోకము ఆయనను తృణీకరించెను మరియు భూమిపై కూడా ఆయన తృణీకరించబడెను.
44
ఆయన చేసిన సూచనలు మరియు అద్భుత కార్యములను ప్రజలు మరియు దైవభక్తిలేని పాపపు లోకము చూచియుండియు ఆయనను నిందించి, దూషించిరి. అయితే నీళ్ళ ద్వారా వచ్చిన తీర్పు ఏ విధముగా నోవాహును మరియు ఆ ఓడను పైకి ఎత్తబడెనో ఆ విధముగానే దేవుని యొక్క తీర్పు యేసు పై క్రుమ్మరించబడినప్పుడు ఆయన పైకి ఎత్తబడెను. ఆయన మనకు బదులుగా చనిపోయి పైకి ఎత్తబడెను. నోవాహు ఓడలో విశ్రాంతిని పొందుకున్నట్లుగానే, ఒక విశ్వాసి ఆయనలో విశ్రాంతిని పొందుకొనును. న్యాయ తీర్పు సర్వమును నాశనము చేసినను దానితో విశ్వాసికి ఏదైనా సంబంధము ఉండునా? ఏదైనా బేధమును కలుగజేయునా? నిశ్చయముగా లేదు. లేదు కదా? అంతే కాదు, మరణము కూడా ఒక బంధకముగా ఉండదు, ఏ బాధ ఉండదు. “ఓ మరణమా, నీ ముల్లెక్కడ? సమాధీ, నీ విజయము ఎక్కడ?” కాబట్టే సమాధుల తోటను దాటుకొని వెళ్ళుటకు నాకు ఏ భయము ఉండదు. గట్టిగా దేవుని స్తుతిస్తూ పాడుచూ వెళ్తాను. ఎందుకనగా, నేను ఆయనలో నిరంతరము జీవించుచున్నానని ఎరుగుదును. ఖచ్చితముగా అది నిజము.
ఇప్పుడు సర్వశక్తి మాట్లాడుచున్నది. అది నా హృదయముతో, నీ హృదయముతో మాట్లాడుచున్నప్పుడు సహజాతీతమైన అద్భుతము జరుగును. ఒకప్పుడు ధైర్యములేని ఒక పాపివలె జీవించిరి. బహుశా [స్పష్టతలేని మాట] నీవు చేసినట్లే, ఒక త్రాగుబోతువలె, లేదా ఒక సిగిరెట్ త్రాగువానివలె లేదా, నాట్యమనే చిందులాటలకు వెళ్ళేవానివలె కాలమును గడుపుచు ఉండవచ్చు. కాని సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడినప్పుడు, నీవు దానిని స్వీకరించితివి. అప్పుడు నీలో ఒక సహజాతీతమైన అద్భుత కార్యము జరిగెను. పిదప నీవు మరణమునుండి విముక్తి చెంది జీవములోకి మార్చబడితివి. నీ పాపములన్ని విడిచి పెట్టితివి. సర్వశక్తిమంతుడు పలికినప్పుడు సహజాతీతమైన అద్భుత కార్యము జరిగెను. నిశ్చయముగా.
45
ఇప్పుడు ఈ ఉదయ కాలమున ఈ సంఘములో కూర్చున్నవారిలో కొంత మంది కొన్ని సంవత్సరముల క్రితము కాన్సర్ వ్యాధితో బంధించబడి మరణించుచుండిరి. కొంతమంది కుంటివారుగా, అంగవైకల్యముతో మరియు కృశించిపోయిన స్థితిలో ఉండిరి. కాని సర్వశక్తిగల దేవుడు సెలవిచ్చినప్పుడు సహజాతీతమైన కార్యము జరిగెను. ఖచ్చితముగా జరిగెను. నిశ్చయముగా. కాబట్టి మనము కాలమను కూడలి వద్ద ఉన్నాము. దీని సూచన ఏమిటి? మనము ఇప్పుడు రహదారులు కలిసే ఆ కూడలివద్ద ఉన్నాము. ఇప్పుడు మనము ఆ పాము పాలనలోనికి ప్రవేశించుటకు తయారగుచున్నాము.
ఇప్పుడు గమనించండి. మనము ముందుకు సాగుచున్నాము. వారు ఆయనను సిలువలో వేసినప్పుడు, వారు ఆయనను భూమికిని, ఆకాశమునకును మద్య వ్రేలాడదీసిరి. పరలోకము ఆయనను అంగీకరించలేకపోయెను, ఎందుకనగా ఈ లోకము యొక్క పాపములన్ని ఆయన పై మోపబడెను. ఈ లోకము ఆయనను తమ రాజుగా అంగీకరించలేదు. కావున మరణించుటకు కూడా ఒక స్థలము ఆయనకు లేకుండా పోయెను. ఈ లోకము యొక్క పాపము ఆయనపై ఉండుటచేత పరలోకమునకు ఆయన ఎక్కిపోలేకపోయెను. ఈ భూమిపై ఆయన ద్వేషించబడి, నీచమైనవానిగా ఎంచబడి, ఉమ్మివేయబడి, తృణీకరించబడి, త్రోసివేయబడెను. అయితే ఆయన భూమికిని, ఆకాశమునకును మధ్య నిలబడి ఈ రెండింటిని కలిపే ఒక వంతెనగా మార్గమును కలుగజేసెను. కాబట్టి మహిమకు వచ్చుటకు ఆశించు ప్రతీ పురుషుడు, స్త్రీ ఆయన యొక్క ప్రక్కలో నుండి కార్చిన ఆ రక్త ప్రవాహము గుండా ప్రవేశింపవచ్చు. సర్వశక్తిమంతుడు ఎంత మహోన్నతమైనవాడు.
46
పిదప ఏమి జరిగెను? సూచనలు మరియు అద్భుత కార్యములు జరిగెను. ఏమి జరిగెను? చంద్రుడు ఎడ్చుటకు ప్రారంభించెను. సూర్యుడు తన కన్నులు మూసికొని విలపించుటకు ప్రారంభించెను. సూర్యుడు మిక్కిలి వ్యధతో, విలవిలలాడిపోతూ రక్తమును చిందించుచున్న రక్త బింభమువలె మారిపోయెను. ఖచ్చితముగా అది అట్లే మారిపోయెను, ఎందుకనగా భూమ్యాకాశములను సృజించిన సృష్టికర్తను భూమి తృణీకరించుట చేత మరియు ఘోరమైన పాపమును బట్టి ఆయన పరలోకములోకి ప్రవేశించలేనంత స్థితిని అవి చూచెను. ఆయన భూమికి, ఆకాశమునకు మధ్య వ్రేలాడుచు, దేవునికి, మానవునికి మధ్య ఒక మధ్యవర్తిగా మరణించుచుండెను. సూర్యుడు దీనిని భరింపజాలక, “ఓ, నేనిక ప్రకాశింపలేను,” అని సూర్యుడు తనను మరుగుచేసుకొనెను.
నక్షత్రములు, “నేను ఈ ఘోరమైన దృశ్యమును చూడలేను,” అని చెప్పెను.
భూమి, “నేను దీనిని భరించలేను,” అని చెప్పెను. భూమి వణుకుచు సాష్టాంగముగా పడి తనలోవున్న రాళ్ళను బయటకు కక్కెను. గొప్ప అద్భుతకార్యము చోటుచేసుకున్నది [స్పష్టతలేని మాటలు] అది మార్గము యొక్క ముగింపుగా ఉన్నది. ఆ కల్వరి సిలువ వరకూ పాపము ఏలుబడి చేసెను, కాని పాపమునకు అచ్చటే వెల చల్లంచబడినది. ఓ, మై. భూమి తనలోనున్న రాళ్ళును పర్వతములపైకి విసిరివేయునంతగా కంపించెను. మృతులు సమాధులలో నుండి లేచి వచ్చునంతగా భూమి మంకరముగా కంపించెను. భూమికి నరముల బలహీనత కలిగి సాష్టాంగముగా పడెను. సూర్యునికి మూర్చ వచ్చినట్లు విలవిలలాడిపోతూ కనుమరుగైపోయెను. అతీతమైన అద్భుతము జరిగెను. (హల్లేలూయా.), అవి ఎల్లప్పుడూ కూడలియందే జరుగును.
47
కాబట్టి అచ్చట జరిగిన కార్యములన్నీ ఆ తర్వాత రాబోవుచున్న కాలము కొరకే సిద్ధపరచబడుచున్నవని గమనించండి. పదిహేను వందల సంవత్సరములుగా లోకము చీకటి యుగములోకి వెళ్ళిపోయినది. మనకు సమయము ఉన్నయెడల బాగుండును. కాని మనకు సమయము చాలా తక్కువగా ఉన్నది, నేను సరిగా పండ్రెండు గంటలకు ముగించవలెను.
ఇప్పుడు ఆ చీకటి యుగముల గుండా ఏమి సంభవించినదో గమనించండి. వెస్లీ మరియు లూథర్ కాలములలో జరిగిన దానిని చూచుటకు మనకు సమయమువుంటే బాగుండును. అది 6వ కూడలియై యున్నది. అచ్చట సంఘము గాఢాంధకార చీకటిలో నుండి విముక్తి చెంది మరలా సువార్తయను గొప్ప వెలుగులోకి తీసుకొని రాబడెను. సూచనలు మరియు అద్భుత కార్యములు జరిగెను. ఓ, దేవా, దైవిక స్వస్థత, సూచక క్రియలు మరియు అద్భుత కార్యములు ఏన్నో జరుగగా వాటి ముందు ఏ మనిషి నిలువలేక పోయెను. అది ఆయన యొక్క బలియర్పణకు, ఆయన యొక్క రెండవ రాకడకు మధ్య సంభవించు కార్యమైయున్నది. ఆ తర్వాత ఏమి జరిగెనో గమనించండి. జాన్ వెస్లీ సువార్తను ప్రసంగించినప్పుడు అచ్చటున్న సంఘముల ద్వారా మరిము అనేకుల ద్వారా అతడు కొట్టి తరిమివేయబడెను. ప్రజలు పరిశుద్ధాత్మ శక్తితో సృహ తప్పి క్రింద పడిపోయి వారి ముఖములపై నీళ్ళను జల్లి వారిని పైకి లేపునంతటి పరిస్థితి ఉండేది. ఆ సమయములో వారికి ఏమి జరిగినదో కూడా తెలియనివారిగా ఉండిరి. అచ్చట సూచనలు, మరియు అద్భుత కార్యములు, దైవిక స్వస్థతలు జరిగినవి.
48
ఇప్పుడు, సహోదరుడా, సహోదరీ దీనిని వినండి. ఇప్పుడేమి జరుగుచున్నది? మనము ఇప్పుడు అంత్యకాలములో ఉన్నాము. మనము వెయ్యేండ్ల పరిపాలనలోకి వెళ్ళనై యున్నాము. సమస్త కార్యములు దానివైపే సూచించుచున్నవి. మధ్య రాత్రికి ఇంకా కేవలం రెండు నిమిషములు మాత్రమే ఉన్నట్లుగా ఆ పాత గడియారపు ముల్లు చూపించుచున్నది. సర్వశక్తిమంతుడు సెలవిచ్చుచున్నాడు. దేవతలు ప్రత్యక్షమగుచున్నారు. ప్రవక్తలు రంగము పైకి వచ్చుచున్నారు. ప్రవక్తలు ప్రవచించున్నారు. ఈ కాలమందున్న ప్రజలుపై దర్శనములు కుమ్మరించబడుచున్న దేవుని సువార్త ప్రకటింపబడుచున్నది; రోగులు స్వస్థతతో లేపబడుచున్న; గ్రుడ్డివారు చూచుచున్నారు; చెవిటివారు వినుచున్నారు; దెయ్యములు గడగడలాడుచున్నవి; అనుకరించే మోసగాళ్ళగు యన్నే, యంబ్రేలువంటివారు ఇక్కడ ఉన్నారు. అయితే సర్వశక్తిమంతుడు సెలవిచ్చుచున్నాడు. హల్లేలూయా. మనము చివరి దినములలో జీవించుచున్నాము. మనము ఆ కూడలి యొద్ద ఉన్నాము.
మానవ హృదయములు ధైర్యము చెడి భయముతో కూలుదురు. కాలము సంకుచితమై యుండును. దేశముల మధ్య విపత్తులు జరుగును. భూమి ప్రసవ నొప్పలను అనుభవించుచు ప్రతిచోట భూకంపములు వచ్చును. ఈ కాలములో పరిస్థితులన్నియు ఈ విధముగానే ఉండునని యేసు చెప్పెను. అక్కడక్కడ భూకంపములు వచ్చును. విషయమేమిటి? తాను నాశనమునకు దగ్గరలో ఉన్నానని భూమికి తెలుసు. ఆమె ఆందోళన చెందుచున్నది. లోకము ఆందోళన చెందుచున్నది. కాని సంఘము సువార్త పై ఆనుకొని సాగిపోవుచున్నది, అదే దానియొక్క నిశ్చలమైన మార్గము. “నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను.” హల్లేలూయా.
49
“ఒకడు నీటి ద్వారా, ఆత్మద్వారా జన్మించితేనే తప్ప ఎవడును దేవుని రాజ్యములోనికి ప్రవేశించడు.” ఖచ్చితముగా ఆ రాజ్యములో దేవుని యొక్క అంగీకారమనే ముద్రను మీరు పొందుకొనియుందురు, అనగా మీ హృదయములో పరిశుద్ధాత్మతో నింపబడియుందురు. కాబట్టి అలలు ఉవ్వెత్తున ఏ వైపు లేచినను ఏ భయము లేదు. కాలము బహు చెడ్డదిగా మారిపోవుచున్నది. సర్వశక్తి కూడా పై పైకి లేచుచూ విజృంభించుచున్నది. అనుకరణ చేయు మోసగాళ్ళు కూడా అదేలాగు అనుకరణ చేయుటకు ప్రయత్నించుచున్నారు. సమస్త కార్యములను వారు ఆ విధముగానే అనుకరించుచు చెయుటకు ప్రయత్నించుచున్నారు. మరియు ఆ చివరి గొప్ప వంచకుడు లేచి, అదిగో అక్కడ ఏడు కొండలపై కూర్చుండునని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. అతడు బహుశా త్రికోణ కిరీటమును ధరించి ఉండును. అతడు ప్రజల ఎదుట ఆకాశమునుండి అగ్నిని రప్పించుగల శక్తిని కలిగి వుండును. ఆ శక్తిని ప్రజలకు ఇచ్చుటకు కూడా శక్తినిగలవాడై వుండును. అతడు ఈ చివరి దినములందు ఈ కార్యములన్నిటిని చేయునని చెప్పబడెను.
వారు తమ పుణ్యక్షేత్రములని చెప్పుకునే స్థలములలో మృతులైనవారిని మ్రొక్కుచు, ఎముకలను తాకుచు అటువంటి కార్యములను చెయ్యునట్లుగా అనుకరించుచు ప్రజలను వంచించుచున్నారు. ఈ విధముగా వారు మృతులైనవారి ఎముకలను తాకుచు, పుణ్యక్షేత్రములని చెప్పుకునే స్థలములలో మృతులైనవారిని మ్రొక్కుచున్న అదే సమయములో సర్వశక్తిమంతుడు పలుకుచు సహజాతీతమైన ఆశ్చర్య క్రియలను చేయుచుండెను. కాని వారు దీనిని చూచి, “ఓ, అవన్నీ బుద్దిలేని కార్యములని,” హేళనగా మాట్లాడే వీరు ఏ విధముగా దానిముందు నిలబడగలరు, అయితే సంఘము ఎదుగుచున్నది. దేశమంతటా గొప్ప స్వస్థతా ఉజ్జీవపు కూటములు జరుగుచున్నవి. ప్రతీ స్థలమందు సూచనలు మరియు అద్భుత కార్యములు జరుగుచున్నవి. దేవ దూతలు ప్రజలయెదుట ప్రత్యక్షమగుచున్నారు. సూచనలు మరియు అద్భుత కార్యములు ఇచ్చట జరుగుచున్నవి.
50
స్నేహితులారా, ఇవన్నీ దేనిని సూచించుచున్నవి? మనము ఇప్పుడు అంత్యకాలమున ఉన్నాము. మనము సరిగ్గా ఆ కూడలి యొద్ద ఉన్నాము. “మీ తలలను పైకి ఎత్తుకొనుడి.” ఎందుకనగా, “మీ విడుదల సమీపముగా ఉన్నాది” అని ఆయన చెప్పెను. నేనేమి చెప్పుచున్నానో మీకు అర్ధమగుచున్నదా? ఇదే ఆ కూడలి యొక్క సమయము. “అంత్యదినములందు, నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులును, మీ కుమార్తెలును ప్రవచించెదరు. మీ యౌవనులు దర్శనములు చూతురు. ”పైన ఆకాశమందు మహత్కార్యములను మీకు చూపించెదను,“ అని ప్రవక్తలు వాగ్దానము చేసియుండిరి. ఆకాశమందు ఎగిరే పళ్ళెములను మరియు అనేక వింత కార్యములను చూచెదరు. జనుల మధ్య కలవరములు కలుగును. భూమి కంపించును, గొప్ప భూకంపములు రాబోవుచున్నవి. గొప్ప అగ్ని పర్వతములు జరుగును. దేశముల మధ్య విపత్తులు సంభవించును. భయంకరమైన దురవస్థలు కలుగును, దేశములన్నియు కత్తిని తమ వెనుక పెట్టుకొని సమాధానమును కనుగొనుటకు ప్రయత్నించును. ప్రతీ స్థలమందును శ్రమలు మరియు అనేక దురవస్థలతో కమ్ముకొని ఉండును. మనుష్యులు ఇంకా మరియు ఇంకా హీనస్థితికి దిగజారిపోవుదురు. ”వరదవలె శత్రువు వచ్చినప్పుడు, ప్రభవు యొక్క ఆత్మ దానికి వ్యతిరేకముగా ధ్వజమునెత్తును.“ ఇది కూడలి యొక్క సమయమైయున్నది, ఇదే మార్గము యొక్క అంతము.
ఆఫ్రికా ఒక గొప్ప స్వస్థతా కూటములతో గర్జించుచున్నది. ప్రపంచమంతటా మరియు ప్రతీ చోటా సూచనలు మరియు అద్భుత కార్యముల జరుగుచున్నవి. ఇది దేనిని సూచించుచున్నదంటే, ఇది కూడలి యొక్క సమయము, అంత్యకాలము.
51
విశాల మార్గముగుండా గుర్రము లేని బండ్లు వేగముగా దూసుకుపోవునని, ఇంకానేక రకముల కార్యములను గూర్చి ఆయన చెప్పెను. సీయోను కుమార్తెలు ఏలాగు అలంకరించుకొని కులుకుచు నడిచెదరని, స్వలింగ సంపర్కులు మరియు వివిధ రకముల కార్యములు ఏ విధముగా బహిరంగమగుననియు, సమస్తమేలాగు తారుమారగుననియు, మనుష్యులు ఏ విధముగా ఘోరమైన మోసమునకు తమను అప్పగించుకొనెదరో మొదలగు కార్యములన్ని జరుగునని చెప్పబడెను. వారేలాగు ఉందురో, “ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించెదరు, సజ్జన ద్వేషులు, అపవాదకులుగా ఉందురని” చెప్పబడెను. కాని నా ప్రియమైన సహోదరుడా, ఈ దినములలో ఏదోక దినమందు యేసు తప్పక తిరిగి వచ్చును.
అప్పుడు మూఢభక్తులని పిలువబడే ఈ పూర్వకాలపు క్రీస్తు యొక్క సువార్తను వెంబడిస్తూ విశ్వాసించువారివద్ద సర్వశక్తిమంతుడు మాట్లాడుచు, సహజాతీతమైన అద్భుత కార్యములను జరిపించును. “నమ్మినవారివలన ఈ సూచక క్రియలు వెంబడించును. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటాలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగిననూ హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్ధతనొందుదురని,” ఆయన చెప్పెను. “వీటిని నేను చేయుటవలన మీరును చేయుదురు, ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదా కాలము మీతో కూడ ఉందును, ఈ సంగతులన్ని జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పై కెత్తుకొనుడి, మీ విడుదల సమీపముగా ఉన్నదని,” చెప్పెను.
52
స్నేహితులారా, మీరు చూచారా? నోవాహు దినములలో జరిగినట్లుగానే, మనుష్యకుమారుడు వచ్చు దినములందును అలాగే జరుగును. ఇశ్రాయేలీయుల విమోచనా దినములలో కూడా అలాగే జరిగెను. మనుష్యకుమారుడు ఆ సిలువపై వ్రేలాడినప్పుడు కూడా అలాగే జరిగెను. అదే విధముగా మనము ఇప్పుడు ఆ కూడలియందు ఉన్నాము. దేవుడెల్లప్పుడూ సహజాతీతమైన అద్భుతములను గొప్ప సూచనలు మరియు అద్భుత కార్యములను చేయుచు, రోగులను స్వస్థపరచుచు చనిపోయినవారిని మరలా జీవముతో లేపుచు, దయ్యములను వెళ్ళ గొట్టుచు, గొప్ప ఉజ్జీవపు ఆత్మను తెచ్చుచు; ఆకాశమందు, భూమిపైన సూచనలును చూపించుచు, దేశములమధ్య కలవరములను కలుగుచేయుచు, వీటన్నింటిని ఆయన కూడలి వద్దకు వచ్చు ఆ కాలమందే కనబరుచును. కాబట్టి ఇప్పుడు మనము సరిగ్గా ఆ కూడలి వద్ద వున్నాము.
అలాగైతే తదుపరిగా సంభవింపబోవు కార్యమేమిటి? క్రీస్తులో మృతులైన వారిని దేవునిలో జీవముతోవున్నవారిని ఆయన తన మహిమకొరకు కొనిపోవుటకై యేసుక్రీస్తు మరలా రెండవసారి వచ్చుటే జరుగవలసియున్నది. అప్పుడు దేవుడు ప్రతీ ఒక్కొక్కరిని ఆయనతో తీసుకొని వెళ్ళును. సాత్వికులు భూమిని స్వతంత్రించు కొందురు. గొప్ప వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభమగును. ఇకపై అక్కడ యుద్ధములు ఏ మాత్రము ఉండవు. వారు తమ ఆయుధములన్నిటిని ప్రక్కన ఒక గుట్టగా పేర్చి పెట్టెదరు. తమ ఈటెలను కొమ్మలను నరుకు కత్తులుగాను, నాగటి నక్కులుగా సాగగొట్టుదురు. ఇంకెంత మాత్రము రాజ్యముపై రాజ్యము దండెత్తక ఉండును. ఇక రోగములు ఉండవు, ఏలాంటి శ్రమలు మరియు మనో దుఃఖములు వారికి కలుగవు. అచ్చట మనము నిరంతరము ఆయన యొక్క సన్నిధిలో జీవించెదము. ఈ సూచనలు మరియు కార్యములన్ని మనము ఒక కూడలివద్ద ఉన్నామని మరియు మార్గము యొక్క ముగింపున ఉన్నామని తెలుపుచున్నవి.
53
ఈ రోజు విశ్రాంతియనే మహిమకర స్థలమగు యేసుక్రీస్తులో నా ఆత్మను లంగరు వేసితినని ఎరుగుట ద్వారా నేనెంతో సంతోషించుచున్నాను. దేవుడు తనయొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా సూచనలు మరియు అద్భుత కార్యములను జరిపించుటను చూచునప్పుడు నేనెంతో ఆనందించుచున్నాను. ఈ రోజు దానిని నేను ఎరిగినవాడనై, ఇచ్చటున్న ఈ చిన్న సంఘము ముందు దీనిని ఇది వరకే చెప్పినట్లుగా ఇప్పుడు కూడా దీనిని నేను చెప్పగలుగుచున్నాను. ఏమనగా, మీరు మహోన్నతడగు దేవుని యొక్క గొప్ప, దివ్యమైన శక్తిని సర్వశక్తిలో చూచెదరు. ఆ సహజాతీతమైన శక్తి ఇంతవరకు మనము తలంచి చూడలేనంతగా లేదా నమ్మసఖ్యముకానంతగా, అత్యధికముగా, సమృధిగా ఉండును. మరియు అదిప్పుడు సరిగ్గా ద్వారము దగ్గరే ఉన్నది. అది మీ స్వంత సంఘము యొక్క ద్వారము దగ్గరే ఉన్నట్లుగా రుజువు చేయబడుచున్న దానిని మీరు చూడగలుగుచున్నారా? అందుచేత, ఓ నా ప్రియమగు స్నేహితులారా, క్రీస్తును మీరు ఎన్నడునూ విడిచి పెట్టవద్దు. సిలువను మోయుచూ ఆయన కొరకు జీవించండి. మీ హృదయములను పైకెత్తి, మీ పవిత్రమైన చేతులను దేవునివైపు ఎత్తండి. ఒకవేళ సంఘము అది, ఇదియని ఏమి చెప్పినను లేదా జనులు అలాగు, ఈలాగని ఏదైనా చెప్పినను మీ దృష్టిని దానివైపు త్రిప్పవద్దు. మీ హృదయములను క్రీస్తుపైన, సిలువపైన మాత్రము కేంద్రీకరించి ఆయన కొరకు మాత్రమే జీవించండి. దేవుడు దానిని మీకు యిచ్చును గాక. మనమిప్పుడు కాలములు సంధించు రహదారులనే కూడలి వద్ద ఉన్నాము.
ఇప్పుడు కొద్ది నిమిషములు ప్రార్థన కొరకు మన తలలు వంచుదాము. ఇప్పుడు మనము ప్రార్థనలోవుండు సమయమున, సహోదరి, “నా విశ్వాసము నీ వైపుగా పైకి చూచుచున్నది,” అనే చక్కని పాత పాటకు సంగీతమును వాయించవలెనని కోరుచున్నాను.
54
మీ తలలను వంచండి. స్నేహితులారా, మనము కూడలియొద్ద ఉన్నాము. మనము సరిగ్గా అక్కడనే ఉన్నాము. పురుషుల, స్త్రీల మధ్య వున్న ఈ వంకరతనము, ఈ గొప్ప వ్యసనమును మరియు ఈ కార్యములన్ని దేనిని సూచించుచున్నదో చూచితిరా? అదేమిటది? దానిని నేను లేఖనముల ద్వారా రుజువుపరచి చూపించాను. అవి ఎల్లప్పుడూ కూడలివద్దనే జరుగును. కాని ఎన్నడూ ఆ కూడలి యొక్క కాలము ముందు జరుగదు. ఎల్లప్పుడూ కాలమనే ఆ కూడలి వద్దనే జరుగును. కాని మనుష్యులు దీనినుండి తొలగిపోవుచు, అద్భుతములు జరుగు కాలము గతించిపోయెనని నమ్మెదరు. గమనించారా? ప్రతి యుగములోను వారు అట్లే చేసిరి.
అయితే కాలము మార్పుచెందుటకు కొంచెము ముందుగా, దేవుడు తన సర్వశక్తితో క్రిందికి దిగివచ్చి, సహజాతీతమైన అద్భుతములను జరిగించువాడై యున్నాడు. అందుచేతనే ప్రజలు నన్ను గూర్చి మరియు జరుగుచున్న కార్యములను గూర్చి మాట్లాడుకొనుచున్నారు. దానిని అట్లే విశ్వాసించుచున్న క్రైస్తవులందురు దానిని గూర్చి ఆవిధముగానే మాట్లాడుకొనుచున్నారు. అయితే విశ్వాసించినవారికి ఆనాడు ఏమి సంభవించెనో మీరు చూచారా? వారు చాలా భద్రముగా ఉండిరి. అబ్రాహాము ఎంత సురక్షితముగా ఉండవలెనో అంత సురక్షితముగా అతడు ఉండెను. ఆమేన్. అలాగునే మోషే కూడా భద్రపరచబడి ఉండెను, ఏ తెగుళ్ళు అతడినిగాని లేదా ఇశ్రాయేలీయులనుగాని తాకలేకపోయెను. నోవాహు సహోదరుడను కూడా అవి తాకలేకపోయెను. ఇవన్నీ జరుగుటకు ముందుగానే హానోకు కొనిపోబడి మహిమ అనే మెట్లు పై నిలబడి వీటిని చూచుచుండెను.
55
కావున ఈ ఉదయమున మీరు క్రీస్తు లేకుండా, మీ ఆత్మ సరియైన రీతిలో లేనట్లుగా గ్రహించినట్లయితే, మీ తలలు వంచియున్న ఈ సమయములో మిమ్మల్ని దేవుని యొద్ద సమర్పించుకొనుట యుక్తమైనదని నేను కోరుచున్నాను. నేను మరల మీవద్దకు ఎప్పుడు వచ్చి మాట్లాడెదనో నాకు తెలియదు. అయితే ఇప్పుడు మనము సరిగ్గా ఆ కూడలి యొద్ద ఉన్నాము. ఇప్పుడు ప్రార్ధనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరినచో మీ చేతులను దేవునివైపు పైకెత్తి చూపించండి. అయ్యా, దేవుడు మిమ్మును దీవించును గాక. అయ్యా, దేవుడు మిమ్మును దీవించును గాక. నీవు, నీవు, అవును, దేవుడు మిమ్మును దీవించును గాక. మీలో అనేకమంది, డజన్లకొలది చేతులను పైకెత్తిరి.
ఇప్పుడు, మీ తలలు వంచియుండగా, సంఘము మెల్లగా ఈ పాటను పాడవలెనని కోరుచున్నాను. ఇదిగో ఇచ్చట బహిరంగమైన బలిపీఠము గలదు. గనుక మీరు కోరినట్లయితే ఇచ్చటకు ముందుకు వచ్చి మీ ఆత్మ కొరకు దేవునియెద్ద నాతో కలసి ప్రార్ధన చేయ్యండి. మీతో కలసి ప్రార్ధించుటకు నేను సంతోషిస్తున్నాను,
నా విశ్వాసము నీవైపు చూచుచున్నది,
(నీవు తప్ప మరేదియు లేదు),
నీవే ఆ కల్వరి గొర్రెపిల్లవు,
దైవిక రక్షకుడా;
నేను ప్రార్ధించుచుండగా నా మొర్ర వినుము,
నా పాపములన్నియు తీసివేయుము,
ఓ, ఈ దినము నుండి నేను
సంపూర్ణముగా నీవాడనై ఉండనిమ్ము,
నీ మహోన్నతమైన కృప సంపూర్ణముగా ఉండును గాక.
మీరు ప్రార్ధన చేయుచున్నారా? మీ యెడల ఆయన కనికరమును కలిగి ఉండమని అడుగుచున్నారా? పాపములోయున్న స్నేహితుడా, మారుమనస్సు పొందుము, ఇప్పుడే నీ జీవితమును ఆయనకు సమర్పించుకొనుము.
నా ఆసక్తిని ప్రేరేపించుచున్నది,
నీవు నా కొరకు మరణించితివి,
ఓ, మీపట్ల నాకు గల ప్రేమ,
శుద్ధమైన, వెచ్చని మరియు మార్పు చెందని,
మండుచున్న అగ్నివలె రగులుకొననిమ్ము!
56
ఇప్పుడు సంగీతమును వాయించుచున్న సహోదరి మరియొక చరణమును వాయించుచుండగా, మనము ప్రార్ధిస్తూ ఉందాము. పరలోకపు తండ్రీ, ప్రభువా, చెప్పాలంటే మేమెందుకు యోగ్యులము కాము. కాని నీవు పలికి బ్రతుకుట వలననే మేము ఇచ్చటికి రాగలిగితిమి. నీవే మమ్ములను పోషించితివి మరియు మమ్ములను కాపాడితివి. ప్రభువా, మిమ్మల్ని స్వీకరించిన జనులగు మేము నిశ్చయముగా మీకు మేము చాలా కృతజ్ఞతులమై యున్నాము. ఒక దినమున మేము రూపాంతరము చెందెదమని ఎరిగివున్నాము. అప్పుడు మేము జీవించుచున్న అవమానకరమగు నీచమైన ఈ పాత శరీరము నుండి మార్పుచెంది మీ శరీరమువలె పోలికను కలిగి మలచబడతాము. కాని ఇప్పుడు ఈ ఓడలో మేము సురక్షితముగా విశ్రాంతిని పొందుచున్నాము. మరియు ఈ ఉదయ కాలమున వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జనుల వద్దకు మార్గమును చూపించు సూచన పలకను తీసుకొని వచ్చెను. ఇప్పుడు సరిగ్గా కాలము యొక్క మార్పులోను మరియు కాలము యొక్క అంతమున మేము ఉన్నాము. సూచనలు మరియు అద్భుత కార్యములు కనబడుచున్నవి. గొప్ప సంగతులు సంభవించుచున్నవి. ప్రభువా, మేము అంత్యకాలమున ఉన్నామని ఎరుగుదుము. అందువలనే ఈ సంగతులన్నియు ఇచ్చట జరుగుచున్నవి. ఏ సమయములోనైనా ప్రభువు రాకడను మేము చూడగలము.
మరియు దేవా, ప్రజల హృదయములను నీవు ఎరిగినవాడవు, ఇప్పుడు వారు ఇచ్చటకు వచ్చి దీనిని అంగీకరించునట్లు నేను వారిని ఆహ్వానించుచున్నాను. ప్రభువా, వారు వచ్చి మిమ్మల్ని స్వీకరించెదరు గాక. “నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయనని, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వసించువాడు నిత్య జీవముగలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు,” అని నీవు చెప్పితివి.
57
తండ్రీ, ఈ రోజు ప్రజల హృదయములను నీవు సంధించవలెనని నేను ప్రార్ధించుచున్నాను. వారందరూ ఒప్పుకొనునట్లుగా చెయ్యమని అడుగుటలేదు, ఎందుకనగా అటువంటి దినములు గతించిపోయినవని నేను నమ్ముచున్నాను. కాని మీయొద్దకు రావలసిన ఇంకా మిగిలివున్న కొద్దిమందిని, వివేకమైన మనస్సుతో, మంచి మనస్సాక్షితో వారియొక్క ఒప్పుకోలు ప్రకారము, విశ్వాసించి, క్రీస్తును స్వీకరించి మరియు దేవుడే స్వయముగా దిగివచ్చి తమ హృదయమున మాట్లాడుచున్నాడని రూఢీగా నమ్ముచు, ప్రభువా, వారు మీయొద్దకు రావలెనని నేను ప్రార్ధించుచున్నాను. ప్రభువా, అలాగు నీవు వారి హృదయములను ఇదివరకే తట్టియున్నట్లైతే మరలా ఈ దినమున మరొక్కసారి వారి హృదయములను తట్టమని నేను ప్రార్ధించుచున్నాను. ఒకవేళ ఇదే చివరి అవకాశమైనయెడల, తండ్రీ, నీవు దానిని అనుగ్రహించుము. నీ వాక్యము సత్యమైనది. ప్రభువా, వారిని మీకే సమర్పించుచున్నాము. ఇప్పుడు మేము ఈ చివరి చరణమును పాడుచుండగా, పరిశుద్ధాత్మ ప్రతీ హృదయములను సంధించును గాక.
ఇప్పుడు మీ తలలను వంచండి. పాపములోయున్న స్నేహితుడా, నీవు బలిపీఠమువద్ద ప్రార్ధించుటకు ఆశించినయెడల, రమ్ము. ఇప్పుడు వచ్చి క్రీస్తును అంగీకరించుము లేక వెనుకంజ వేసి భ్రష్టులైనవారులారా, ఇప్పుడే ఈ బలిపీఠము వద్దకు వచ్చి నిలబడుము. మేము మీతో కూడా ప్రార్ధించుదుము. మంచిది.
జీవితము యొక్క అంధకారములో
అడుగులు వేయుచు వెళ్ళుచున్న వేళలో,
(దానినే మీరు చేయుచున్నారు),
మరియు దుఃఖములు నన్ను ఆవరించియున్న వేళలో
(మరణము, వ్యాధి, దుఃఖము),
నీవే నా మార్చదర్శిగా ఉండుము; (ఓ, దేవా)
చీకటిని పగలుగా మార్చుము
దుఃఖపు కన్నీళ్ళను తుడిచి వేయుము.
నిన్ను వీడి నేనెన్నడు దారి తొలగిపోకుందును గాక.
58
ఇప్పుడు మీరు మీ తలలువంచి యుండగా, సహోదరుడు ఉడ్స్ నీ తలను కొంచెం పైకెత్తమని నేను కోరుచున్నాను, సహోదరుడు కాక్స్ మరియు సహోదరుడు ఫ్రీమాన్ మీరు ఈ భవనములో ఉన్నారా? మీరు మాత్రము కొంచెము మీ తలలను పైకెత్తమని నేను కోరుచున్నాను. నేను మీతో చెప్పిన విషయము మీకు జ్ఞాపకము ఉన్నదా? “నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, ప్రవక్త తన స్వంత దేశములోను, తన స్వంత జనుల మధ్య అంగీకరించబడడు.”
మా దయగల పరలోకపు తండ్రీ, మేము ఈ వర్తమానమును మీకే సమర్పించుచున్నాము. ప్రభువా, ప్రజల హృదయాంతరంగములలో విత్తనములు విత్తబడినవి. కావున మహిమకరమగు ఆ దినమున, యేసు వచ్చునప్పుడు పరిశుద్దులందరు కనుగొనబడుదురు గాక. అప్పుడు ప్రతీ ఒక్కరూ ఎత్తబడి ఆ మహిమలోకి కొనిపోబడుదురు గాక. మన ప్రభువైన యేసు తిరిగి వచ్చు ఆ దినము ఎంత సంతోషకరమైన దినముగా ఉండబోవుచున్నది? కాబట్టి మేము జీవించుచున్న ఈ దినమును గ్రహించుటనుబట్టి మేమెంతో మీకు కృతజ్ఞుతలమై యున్నాము. దేవా, నేను చేసిన ప్రతీ కార్యము నిమిత్తము పశ్చాత్తాపపడుచున్నాను. మరియు మాయంతట మేము యధార్ధముగా జీవించలేమని మేము ఎరుగుదుము. ప్రభువా, మా పుట్టుకనుండే మేము పాపులమైయున్నాము మరియు అనుదినము నేను పాపమును చేయుచునే ఉన్నానని ఎరిగినవాడనై అనుదినము నిన్నే నేను నమ్మియున్నాను. నిన్ను తృప్తిపరచని కార్యములు ప్రతి దినము నా జీవితములో జరుగుచున్నవని నేనెరుగుదును. కాబట్టి నా ప్రభువా, ఈ ఉదయ కాలమున నా స్వంత ఆత్మను ఇచ్చటున్న ఈ చిన్న గుడారములో ఈ బలిపీఠము వద్ద పెట్టుచు, సాష్టాంగముగా సాగిలపడి నా తప్పిదములను నేను ఒప్పుకొనుచు, ప్రభువా, నిన్ను నేను అంగీకరించెదను.
59
ఓ దేవా, దైవిక వరములను గూర్చి ఒకానొక రాత్రి నీవు ఆశ్చర్య రీతిలో నాకు చూపించితివి. కాని మీరు ఆశించు విధానమున నేను దానిని ఉపయోగించ లేదు. నన్ను క్షమించుము, ఆ దర్శనములో అందుకొరకు నేను పశ్చాత్తాపము చెందితిని. ఇప్పుడు కూడా నేను నివాసము చేయుచున్న ఈ పరిమాణములో మీవద్ద పశ్చాత్తాపము చెందుచున్నాను. ప్రభువా, మీరే నన్ను క్షమించి నాకు సహాయము చేయగలరు. ఈ సంగతులన్నీ భవిష్యత్తులో జరుగునని ముందుగానే మీ కృప ద్వారా నాకు తెలిపితివి. ప్రభువా, అవి అలాగు జరుగునని ఎరుగుటవలన నా ఆత్మను, నా హృదయమును మీరు పరిశుద్ధపరచమనియు, దానిని నేను మీకు సమర్పించుకొనునట్లు చేయుమనియు మీ యొద్ద దీనిని నేను విన్నవించుకొనుచున్నాను.
ఓ దేవా, భూమిని మాత్రమేగాక, ఆకాశమునుకూడా మరల ఇంకొకసారి కంపిపజేయుము. ప్రభువా, ఎక్కడైతే ఆకలితో, దాహముతో, ఏడ్చుచూ, బిక్షమెత్తు కొనుచూ, నిరీక్షించుచూ, అంధకారములో లక్షలాది అన్య ప్రజలు మరణించుచున్నారో, ప్రభువా, వారి మధ్యకు మేము వెళ్ళి పరిచర్య చేయుదుము గాక. ఓ దేవా, ఆధునిక సొదొమ, గొమొర్రా వలె, మూర్ఖత్వముతో నాశనమై, భ్రష్టమైపోయిన దేశమగు అమెరికాను కంపిపజేయుము. “ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్కా నీవెట్లు ఆకాశమునుండి పడితివి? పడిపోవునట్లుగా నీకేమీ సంభవించినది? నీవెంత చక్కగా పరిగెత్తితివి? నీకేమి జరిగెను? ఓ, యెరూషలేమా, యెరూషలేమా! కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని,” అని ఆయన కన్నీరు విడుచుచు చెప్పిన రీతిగా.
60
ఈనాడు అమెరికాను చూచి, “అమెరికా దేశమా, ఎన్నిసార్లు నేను నిన్ను దేశములకు, లోకమునకు ఒక మండుచున్న దివిటీవలె ఉంచితిని. కాని నీవు ఆ హాలివుడ్ ను స్వీకరించితివి, ఈ లోక పోకడలను వెంబడించావు. నిన్ను నీవు యన్నె, యంబ్రేలకు అప్పగించుకున్నావు. నీ పరిస్థితి ఎంతగా మారిపోయెను, ఈ దేశములో శక్తివంతమైన సేవకులు ఎంతగానో పరిచర్యను చేయుచుండిరి. దేశమంతటా సంచరించుచు తమకు సాధ్యమైనంతవరకు పరిచర్యను చేసారు. కాని నీవు దానినుండి తొలగిపోయి మరియు ఇతర దేశములకు పరుగెత్తుచున్నావు,” అని పరిశుద్ధాత్మ నా హృదయములో రోధించుచున్నాడు.
ఓ దేవా, ఆమె తన వినాశనమనే బూడిదలో కూర్చొని యున్నది. ఆమె తన జిలుగు వెలుగుల ఆకర్షణయనే తుపాకీ గొట్టము పై కూర్చునియున్నది. ఆ మహిమకరమగు దినమున దేవుని కుమారుడు తన నీతియొక్క పరిశుద్ధతతో పరలోకమునుండి ప్రత్యక్షమగునప్పుడు ఆయన ముందు మనమెక్కడ నిలుబడుదుము? ఓ దేవా, మా హృదయములు ఈ దినమున నీయందు స్థిరపడునట్లుగా చేయుదురు గాక. మా పాపములన్నింటినీ క్షమించుము.
61
మరియు తండ్రి, ఇచ్చట ఈ ఉదయకాలమునున్న సువార్త సేవకులందరిని దీవించుము. ఓ దేవా, నేడు వారు తమ హృదయములలో ఈ వర్తమానమును పదిలపరచుకొని వెళ్ళుదురు గాక. “ఇది అంత్యకాలమని, దానియొక్క సూచన పలకలను చూచుచున్నాను, మేము ఆ కూడలియను కాలముయొద్ద ఉన్నామని ఎరిగితిని. ఇచ్చట జరుగుచున్న కార్యములన్నీ దానిని సూచించుచున్నవి. నా హృదయము గత కొన్ని సంవత్సరములుగా ఎందుకొరకు కలత చెందుచున్నదో ఎరుగకుంటిని,” అని చెప్పుదురు గాక. అవును, ప్రభువా. అవును, ప్రభువా. దానిని వారు చూడనిమ్ము. వారి కన్నులు తెరువబడును గాక, వారు చుట్టూ చూచి, ఇచ్చట అది జరుగుచున్నది. “అది నిజమే, నేను చూచుచున్న ఈ దుష్ట కార్యములన్నీ సూచనలుగా ఉన్నవి. అవన్నీ శత్రువు యొద్ద నుండి వచ్చుచున్న సహాజాతీతమైన సూచనలే అగును. ఎందుచేత? అతడు గొప్ప ఆశ్చర్య కార్యములను చేయుచున్నాడు. ఎట్లనగా, ఆకాశమునుండి అగ్ని దిగివచ్చునంతటి గొప్ప ఆశ్చర్య కార్యములను చేయుచున్నాడు. అవును, వారు భూమి చుట్టూ ఉప గ్రహములను అమర్చారు. కాబట్టి శత్రువు పైనుండి తీసుకొనివచ్చు అగ్నివంటి సూచనలన్నీ ప్రకృతి సిద్ధమైన కార్యములుగా మారిపోయినవి. అతడు నకిలీ సూర్యుడులను, నకిలీ చంద్రులను వంటి అనేక కార్యములను చేసి చూపించునని,” చెప్పుదురు గాక.
62
అయితే, వారివలన గ్రహించలేని సూచనలు ఆకాశమునందు కనబడునని దేవుడు చెప్పెను. దానిని చూచుటకే మేము జీవించుచున్నాము. అందుకొరకు నేనెంతో కృతజ్ఞుడనైయున్నాను. ప్రభువా, క్రీస్తు కొరకు నేనెంతో కృతజ్ఞుడనైయున్నాను. మరియు ఇప్పుడు మీ దీన సేవకుడునగు నేను మనో దుఃఖముతో నా బుగ్గలమీద కన్నీళ్ళను కార్చుచు మరలా నా జీవితమును ఈ దినమున దేవా, మీకు సమర్పించుచున్నాను. ప్రియమైన దేవా, నేను దీనునిగా ఉండునట్లు సహాయము చేయండి. ప్రియమైన దేవా, ఇదిగో ఈ అవమానకరమగు గుడారములో నుండి యేసయ్యా నీవు నాకు మరణమును అనుమతించి నన్ను బంధించునంత వరకు మీ యొక్క పరిచర్యను చేయునట్లు నా చుట్టూ మీ కొరకు సేవ చేయు దీనులైనవారిని మాత్రమే ఉంచుము. ఇక ఆ తరువాత నేను మీతోనే ఉండుటకు కోరుకొనుచున్నాను.
ఈ చిన్న సంఘమును దీవించండి దేవా, మా ప్రియమగు సంఘ కాపరి సహోదరుడు నెవిల్ గారిని దీవించండి. వేడిమియైనను, చలియైనను, కష్టమైనను, సంతోషమైనను అదెలాంటి కఠినమైన పరిస్థితియైనను, మా ప్రియమగు స్నేహితుడు యేసు ప్రభువు యొక్క నిష్కల్మషమైన సువార్త కొరకు ఇచ్చట నిలబడియున్నాడు. దేవా, అతనిని అతని భార్యను, అతని పిల్లలను దీవించుము. ఓ దేవా, యేసుక్రీస్తు రాకడ వచ్చువరకు ప్రజల హృదయములలో ఈ సువార్త రగులుకొని మండునట్లు అతడు చేయును గాక. మేము అతనిని ప్రేమించుచున్నాము. అతనిని ఆశీర్వదించుము. అతనికి మంచి బలమును అనుగ్రహించుము. అతడు దీన హృదయముగలవాడని, మీ సేవను చేయుచున్నాడనియు మేమెరుగుదుము. ఈ చిన్న మందను ఒకప్పుడు నేను చూచుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ మందను అతనికి అప్పగించితిని. కాబట్టి ప్రభువా, అతని నిమిత్తము నేను మీకు కృతజ్ఞుతుడునై యున్నాను. దేవా, ఇంకా అనేక గొర్రెలను ఈ మందలో చేర్చుటకు అతనికి మీరు సహాయము చెయ్యుదురుగాకని నేను ప్రార్ధించుచున్నాను. దానిని అనుగ్రహించుము.
63
దానిని ఇచ్చటున్న ప్రతీ సేవకునికి మరియు ఇచ్చటున్న వారికి మాత్రమే కాదు గాని ఈ లోకమంతటావున్న సేవకులందరికి అనుగ్రహించుము, ఎందుకనగా ఇది చాలా అవసరమైయున్న దినములని మేమెరుగుదుము; ఆ సూచనలు ఇక్కడ ఉన్నవి; దెయ్యము గర్జించుచున్న సింహామువలె బయలుదేరి తప్పుడు నిందారోపణలను చేయుచు, వేషధారియై వంచించుచుండెను. కాని దేవా, దానికి వ్యతిరేకముగా నీవు పరిశుద్ధాత్మ ద్వారా ధ్వజమును ఎత్తుచున్నావు. దానికొరకు వందనస్థులమై యున్నాము.
ఇప్పుడు, మమ్ములందరిని సమాజముగా ఆశీర్వదించండి. మరియు తండ్రీ, మేము రోగుల కొరకు ఈ దినమున ప్రార్ధించనైయుండగా, ఇక్కడున్న ప్రతీ సేవకుడిని మరలా అభిషేకించుము ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఇచ్చటున్న ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క రోగి అభిషేకించబడి ఉందురు గాక. మేము ఈ స్థలమునుండి బయలుదేరి వెళ్ళుచుండగా, ప్రతివ్యక్తియు, ధృఢమైన స్వస్ధతను పొందుకొని వెళ్ళుదురు గాక. దేవుని యొక్క మహిమ మా ఆత్మల పై ఉండును గాక, దీనిని మేము యేసు నామమున ప్రార్ధించుచున్నాము. ఆమేన్.
64
నా విశ్వాసము పైకి నీవైపు చూచుచున్నది,
నీవే ఆ కల్వరి గొర్రెపిల్ల,
ఓ, (పాడుచున్నప్పుడు మన
చేతులను పైకి ఎత్తుదాము)... దైవిక రక్షకా;
ఇప్పుడు నేను ప్రార్ధించుచుండగా ఆలకించుము,
నా పాపములన్నిటినీ తీసివేయుము,
ఓ, ఈ దినమునుండి సంపూర్ణముగా
నేను నీవానిగా ఉందును గాక.
ఇప్పుడు నెమ్మదిగా. “ప్రభువా, నాతో ఉండుము” అనే పాటను పాడుదాము.
మేము మా తలలనువంచి యుండగా, మా జీవితములను, మా ఆరాధనను, మమ్ములను, మా సమస్త కార్యములను మీకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, మమ్ములందరిని ఉపయోగించుకొనండి. ఈ దినమున ప్రతీ ఒక్కరూ ప్రేరేపించబడిన వారుగా వెళ్ళుదురు గాక. ఈ దినమును చిరకాలము మేము జ్ఞాపకములో ఉంచుకొందుము గాక, ఎందుకనగా పరిశుద్ధాత్మ మనతోవుండి మనల్ని దీవించినందులకై.
ప్రభువా, ఈ దినమందు రోగులయొక్క అవసరతలను తీర్చండి. దానిని దయ చేయండి ప్రభువా, తండ్రీ, కనికరమును కలిగియుండుము. యేసు నిమిత్తమై మీరు దీనిని చేయమని మేము ప్రార్ధించుచున్నాము.
మరియు ఇప్పుడు, గొప్ప బోధకుడా, మేమెట్లు ప్రార్ధించవలెనో ఒక దినమున నీవు మాకు బోధించితివి. దానిని మీ శిష్యులకు నేర్పించి దానినే మాకొక మాదిరిగా ఉంచితివి.
మీరు ప్రార్ధించునప్పుడు ఈ విధముగా ప్రార్ధించమని చెప్పితివి:
పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరును గాక.
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము, రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవైయున్నవి. ఆమేన్.
65
ఇప్పుడు సహోదరీ, “కేవలము నమ్ముము” అనే పాటకు సంగీతమును వాయించగలరా? మీలో ఎందరి కొరకు ప్రార్ధించవలయును? ప్రార్థించవలెనని కోరుకొనువారు మేము చూచునట్లు మీ చేతులను పైకి ఎత్తగలరా? మీరందరు నా కుడి వైపున వరుసలో నిలువబడగలరా? ఎంతమంది నిలబడగలరో నిలబడండి. అలాగే మధ్యలో కూడా వరుసగా నిలబడవచ్చు. ఇదిగో ఇక్కడవున్నవారు మీరు మధ్యలో ఉన్నవారితో కలిసి వరుసలో నిలబడండి. మంచిది. ఇప్పుడు మనము కలిసి ఈ పాటను పాడుదాం.
కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,
సమస్తమూ సాధ్యమే, కేవలము నమ్ముము,
కేవలము నమ్ముము, కేవలము నమ్ముము,
సమస్తమూ సాధ్యమే, కేవలము నమ్ముము.
ఎన్నడూ, స్వస్థత కూడికలలో పాల్గొననివారు ఎందరు ఇక్కడ వున్నారు? మీ చేతిని చూడనివ్వండి. ఓ, మీరందరూ పాల్గొనిరి. ఆశ్చర్యము.... సర్వశక్తిమంతుడు సహజాతీతమైన కార్యములను జరిగించుచున్నాడు. ఇప్పుడు ఏదోకటి సరిగ్గా నా యొద్దకు వచ్చి, నా మనస్సును మార్చుచున్నది. నిలచివున్న ఈ ప్రార్ధనా వరుసను చూచినప్పుడు మీరు ఇచ్చటనుండి వెళ్ళుటకు ఇంచుమించు మూడు గంటలు అగునని నేను తలంచుచున్నాను.
సహోదరుడు టామ్ మెర్రిడెత్ ఎక్కడ ఉన్నారు? అతడింకా ఇక్కడే వున్నారా? సహోదరుడు జూనియర్ జాక్సన్? వారిద్దరూ దేవుని సేవకులు. దైవిక స్వస్ధతను విశ్వసించువారు, సువార్త ప్రసంగికులు, మరియు సేవకులందరూ ఇచ్చటకు రావలెనని కోరుచున్నాను. ఒక్క నిమిషం ఇక్కడకు రండి...
....కేవలము నమ్ముము,
కేవలము నమ్ముము, కేవలము నమ్ముము.
సమస్తమూ సాధ్యమే, కేవలము నమ్ముము.
కేవలము నమ్ముము, కేవలము నమ్ముము.
సమస్తమూ సాధ్యమే, కేవలము నమ్ముము.
66
ఒక్క క్షణం, ఒక విషయము మిమ్ములను అడగాలనుకుంటున్నాను. ఈ వారమున మరియు ఈ ఉదయమున స్వస్థత కూటమును జరిగించనని నేను ఇదివరకే సహోదరుడు కాక్స్, మరియు ఇక్కడున్నవారిలో అనేకులవద్ద చెప్పితిని. అది మీకు కూడా తెలియును, కారణమేమనగా, నా స్నేహితులలో కొందరు నాతో ఫోనులో, సహోదరుడు డర్బన్స్ తన స్థలమున సహోదరుడు హాల్ ద్వారా స్వస్థత కూటమును, ఉజ్జీవ కూటమును జరిపించబోవుచున్నాడని చెప్పెను. కావున వారిని గౌరవించు విధముగా దీనిని చేసితిని. సంఘమా, సహోదరుడు హాల్ అచ్చట కూటమును జరిపించబోవుచున్నాడు. ఆ కూటమునుగూర్చి ప్రకటనను గత వారమున ప్రకటించాను మన సహోదరుడే ఈ కూటమును నిర్వహించుచున్నాడనే కారణమువలననే అట్లు ప్రకటనను చేసితిని. ఓ, సహోదరుడు హాల్ ఇచ్చట ఉన్నారా? ఇచ్చట ఉన్నది మీరేనా? ఓ, సహోదరుడు హాల్ మన మధ్యే ఉన్నాడు. మంచిది.
సహోదరుడు హాల్. మీ కూటమును ఈ రాత్రితో ముగించనున్నారా? మంచిది. సహోదరుడు డర్బన్ యొక్క స్థలము నదికి అవతల ప్రక్క ఉన్నది. అచ్చట స్వస్థతా కూటమును ఏర్పాటు చేసిరి. సహోదరుడు హాల్ చక్కని సహోదరుడు. అతడు నాకు తెలుసు. అతడు అభిషేకించబడిన ప్రభువు యొక్క సేవకుడు.
67
సహోదరుడా హాల్, మంచిది, నీవు నీ పరిచర్యకు వెళ్ళుటకు ముందు నీకు సమయమున్నయెడల రోగుల కొరకు ప్రార్ధించుటకు మాతో ఇచ్చట నిలబడగలరా? నీవు ఇక్కడకు రాగలవా? ఈ విధముగా రోగులకొరకై ప్రార్ధించు సేవకుడిని అక్కడ అలాగే విడిచిపెట్టుటకు నేను ఇష్టపడను. నీవు ఇక్కడకు వచ్చి మాతో రోగుల కొరకు ప్రార్ధించవలెనని నేను కోరుచున్నాను. “సహోదరుడు హాలను బట్టి ప్రభువుకు వందనములు,” అని మనము చెప్పుదము. అతడు ఈ వారములో సహోదరుడు డర్బన్ యొక్క స్థలములో కూటములను జరిపించుచున్నాడు. మనలో అనేకులు అతని కూటములలో పాల్గొనిరి, దానిలో ఏ సందేహము లేదు. అతడిని గతసారి ఇక్కడ చూచినప్పటినుండి నేను అతడిని ప్రేమించసాగాను. తన పరిచర్యలో అనేక విజయములను అతడు సాధించెను. అతడు రోగుల కొరకు ప్రార్ధించినప్పుడు దేవుడు అతనికి గొప్ప జయమును అనుగ్రహించెను. అతడు అనేక ప్రాంతములకు ప్రయాణించుచు రోగుల కొరకు ప్రార్ధించుచున్నాడని నేను నమ్ముచున్నాను.
సహోదరుడా హాల్ నీవు ప్రజల కొరకు ఏదైనా చెప్పాలని నీ మనస్సులో ఉన్నదా? మంచిది, అయ్యా. ఈ వారము సహోదరుడా హాల్ మీ కూటము చక్కగా జరిగిందా? ఇచ్చట నీవు ఉన్నందుకు మేమెంతో సంతోషించుచున్నాము.
68
ఇప్పుడు బలహీన జనులగు మీరు, అది మాత్రమే కాదు, ఇక్కడవున్న సేవకులందరము సర్వశక్తిని విశ్వసించువారై, ఒక దుర్గమువలె ఇచ్చట నిలబడి ఉన్నాము. ఈ చివరి దినములలో సర్వశక్తిమంతుడైన దేవుడు రోగుల కొరకు, ఇబ్బందులలో ఉన్నవారి కొరకు స్వస్ధతను యిచ్చుచు, అద్భుతములను జరిగించునని మేము విశ్వాసించుచున్నాము. మరియు ఆయన యొక్క సర్వశక్తి దేనినైతే చేయుదునని చెప్పియున్నాదో అవి అట్లే జరుగుటను మేము చూచుచున్నాము. కాబట్టి మేము ఈ ఉదయకాలమున మీ కొరకు ప్రార్ధించుటకే ఇక్కడ ఉన్నాము. మరియు దేవుడు దానిని జరిగించునని నేను నమ్ముచున్నాను. మరియు ఒక్క నిమిషం... [సహోదరుడు బ్రెన్హాం గారితో ఒక సహోదరుడు మాట్లాడుచున్నారు.]
ఏమిటి? రివైవల్ సెంటర్ నుండి సహోదరుడు జాక్ ఓకే వచ్చుచున్నాడా? సహోదరుడు జాక్, మీరు ఎచ్చటున్నను ఫర్వాలేదు. మీరిచ్చట ఉన్నందుకు మేము చాలా సంతోషించుచున్నాము. నా సహోదరుడు మిమ్ములను గూర్చి ఇప్పుడే చెప్పెను. మీరు ఇక్కడ భవనములో ఉన్నట్లయితే మీరెచ్చటవున్నను ఇచ్చట ముందుకు వచ్చి మాతో కలిసి నిలబడండి. ఇతర సేవకులు కూడా మీరు ఇక్కడ ఉండుటనుబట్టి చాల సంతోషించుచున్నాము. మీరు దైవిక స్వస్థతలను నమ్ముచున్నట్లయితే ఇచ్చటకు వచ్చి మాతో ఏకీభవించండి. ఈ విధముగా రోగుల కొరకు, ఇబ్బందులలోవున్న వారికొరకు ప్రార్ధించుట మన బాధ్యతయైయున్నది. అది ఖచ్చితముగా చాలా చక్కగా యున్నది.
69
ఓకే సహోదరుడా ఎక్కడ ఉన్నారు? అక్కడ నిలబడియున్నవారు సహోదరుడు ఓకేనా? కాదు. ఓకే, నేను చాలా...? ఏమంటున్నారు? చాల మంచిది, సువార్తికుల్లారా మీరు ఎవరైనా సరే ఫర్వాలేదు. రండి, మీరు పరిచర్యను చేయు సహోదరులైతే ఇచ్చట ముందుకు వచ్చి మాతో సహవాసము చేయుటకు రండి. ఓ, అది చాలా మంచిది. ఇచ్చటకు ముందుకు రండి. సహోదరుడా మీ పేరు ఏమిటి? సహోదరుడు జాక్ ఆర్కే మీరు మాతో ఉన్నందుకు చాల సంతోషము. సహోదరుడు జాక్ మనతో ఉన్నాడు. ఇప్పుడు అది చాలా చక్కని విషయము మరియు శ్రేష్ఠమైనదిగా ఉన్నది. సేవకుల్లారా మీరు ఒక్కొక్కరు ఇచ్చటకు వచ్చుచుండగా ఒకరితో ఒకరు కరచాలము చేయుచు పరిచయము చేసుకొనండి.
మరియు ఇప్పుడు, ఈ ఉదయ కాలమున దేవుడు మనలను దేనికొరకై పంపించియున్నాడనగా, మరణమునకు చేరువగానున్న ఈ ప్రజల కొరకు మనము ప్రార్ధించుటకే. అక్కడ ఆ వెనుక తెల్లని టోపి ధరించియున్న స్త్రీకి కాన్సర్ వ్యాధి ఉన్నది. ఇక్కడ నా ముందు నిలవబడియున్న ఇతనికి కాన్సర్ వ్యాధి గలదు. మరియు ఇక్కడ ఇలాంటివి అనేక కార్యములు గలవు. బాగు చెయుటకు సాధ్యములేని స్థితిలో చీలమండ విరిగి ఒక స్త్రీ ఇక్కడ పడకలో ఉన్నది. ఈ విధముగా అనేక అనేక కార్యములు ఇచ్చట గలవు. ఒక స్త్రీ ఇక్కడ కీళ్ళనొప్పులతో చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నది. దేవుడు తనను బాగు చెయ్యగలడనే విశ్వాసముతో ఆమె ఇచ్చటున్నది. దేవుడు దానిని చెయ్యునని మేము కూడా విశ్వసించుచున్నాము.
70
ఇప్పుడు, సోదరులారా? మనము చేయగలిగిన ఒకే ఒక కార్యమేమనగా వారికొరకు ప్రార్థన చేయుట తప్ప వేరేదియు లేదు. అది నిజమేనా? ప్రార్ధించండి. అది చాలు. ఇప్పుడు ప్రార్ధనలోకి వెళ్ళుటకు నాకు కొంచెము నీరసముగా ఉన్నది. మీరు చూడండి, నేను కొంచెము... నేను కఠినముగా భోదించుటవలన బలహీనముగా ఉన్నాను.
అందుచేత, ఇప్పుడు మనము మన తలలు వంచుదాము. సేవకుల్లారా, మీరందరూ, ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి ఇచ్చట వరుసలో నిలువబడమని కోరుచున్నాను. అది రోగుల కొరకు ప్రార్ధించుటకు బాగుండును. నేను కూడా మీతో వచ్చి నిలబడెదను. మనము ఒక్కొక్కరము ఒక్కొక్కరికి ప్రార్ధించుదాము. ఒకరి తరువాత ఒకరికి ప్రార్ధించునట్లు వారిని పంపించుదాము. ఈలాగు ఒకరి తరువాత ఒకరికి ప్రార్ధించునట్లు చేద్దాము. మనము ప్రార్ధించునప్పుడు మనము మన చేతులను రోగుల పై పెట్టి ప్రార్ధిస్తూ దేవుడు వారిని స్వస్థపరచునని విశ్వాసించెదము. సహోదరుల్లారా మీరు దానిని విశ్వాసించెదరా? సహోదరుడా హాల్, నీ పూర్ణహృదయముతో దీనిని విశ్వసించుచున్నావా? మంచిది. అది జరిగి తీరుతుంది.
ఇప్పుడు మనము, మీరు చేయగలిగినచో, జారిపోవద్దు, ప్రక్కకు వుండండి అక్కడ మెట్లువున్నవి నా సోదరులారా, మీరు చేయగలిగినచో, ఇక్కడ ఒక చిన్న వరుసను సిద్ధపరచండి. ఇక్కడ ఈ క్రిందనుండి నేను చేయుదును మరియు మనము కలిసి ప్రార్ధించుదాము. సంఘస్థులారా, ఈ రోగుల కొరకు మేము ప్రార్థన చేయుచుండగా మీరందరూ మాతో కలిసి ఏకీభవించగోరుచున్నాను, స్నేహితులారా, మీరు దానిని చేయగలరా?
71
ఈ ఉదయ కాలమున మీ కొరకు ప్రార్ధించుటకై ఇచ్చట మంచి సువార్తికులు, స్వస్తతా కూటములను జరుపు సేవకులు మీతో ఉన్నారు. మరియు ఈ కూటమును స్వస్థత కూటముగా మార్చినందుకు మేము చాలా సంతోషించుచున్నాము. మరొకసారి మనము ప్రార్ధించుదాము.
తండ్రీ, యేసు నామములో ఇప్పుడు మమ్మును అంగీకరించుదురు గాక. పరిశుద్ధాత్మ మా పైకి వచ్చి ఈ దినమున మేము దేనినైతే అడుగుచున్నమో వాటిని మాకు అనుగ్రహించి, మమ్ములను దీవించమని అడుగుచున్నాము. ఇప్పుడే సర్వశక్తిమంతుడగు ఆ దేవుని యొక్క గొప్ప శక్తి మా పైకి వచ్చి దిగును గాక. ఓ, దేవా, ఆనాడు కెరూబల రెక్కల క్రింద పెనవేసుకొని నివాసమైయున్న షెకీనా మహిమవలె, ఈనాడు పెనవేసుకొనియున్న సిలువ యొక్క చేతుల క్రిందవున్న ఆ మహిమ వచ్చి, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని మేము నిరీక్షించుచున్న రీతిగా ప్రభువా, ఈనాడు ఆ శక్తి మాపైకి దిగివచ్చును గాక. ఈ ఆశీర్వాదమును ప్రజలపై ఉండునట్లుగా మేము ప్రార్ధించుచున్నాము. ఏ ఒక్కరూ, ఏ ఒక్క వ్యక్తియు స్వస్థతను పొందుకొనుటకు విఫలమవ్వకుందురు గాక, ప్రతి ఒక్కరూ స్వస్థతను పొందవలెనని యేసుక్రీస్తు యొక్క నామమున అడుగుచున్నాను. ఆమేన్.
72
ఇప్పుడు, సహోదరుడా నెవిల్, మనము ప్రార్ధించుటకు ముందుగా నీవు నూనెను తీసుకొని ఈ ముందుకు వచ్చి ఇచ్చట నిలబడవలెనని కోరుచున్నాను. మనము మొదటిగా ఇక్కడ పడకలోవున్న స్త్రీ కొరకు ప్రార్ధించుదాము. ఆ తరువాత ఒక్కొక్కరి కొరకు ప్రార్ధించుదాము. మొదట ఒకరు సహోదరికి ప్రార్ధించిన పిదప ఇతరులు వచ్చి ప్రార్ధించుటకు అవకాశమును యిచ్చునట్లుగా మనము మరలా ఈ స్థలము వద్దకే తిరిగి వద్దాము. సరే మంచిది. ప్రభువు మిమ్ములను దీవించును గాక.
[సహోదరుడు బ్రెన్హాం మైక్రోఫోను నుండి ప్రక్కకు వెళ్ళి రోగుల కొరకు ప్రార్ధించుచున్నారు.] ప్రియమైన మా పరలోకపు తండ్రీ, ఇచ్చట పడకలోవున్న మా సోదరి తన జీవిత కాలమంతా ఈ పడకలోనే ఉండవలసియున్నది. కాని మా తండ్రి మేము విశ్వసించుచున్నదేమనగా, ఈ దినమున ఆమె ప్రార్థన కొరకు వచ్చినందువలన మీ సేవకుల నిమిత్తము మీరు దానిని చేసెదరని మేము విశ్వసించుచున్నాము. ఈ పరిస్థితి నుండి ఆమెకు యేసుక్రీస్తు నామమున విడుదల చేయమని దీనత్వముతో ప్రార్ధించుచున్నాము. విరిగిపోయిన ఆమె కాలు లేదా పాదములో ఎచ్చట విరిగియున్నదో అచ్చట తగినంత కాల్షియమును ఇవ్వండి. ఆమె స్వస్థతను పొందుకొని ఇచ్చటనుండి దేవుని మహిమపరచుచు నడచి వెళ్ళవలెనని ప్రార్ధించుచున్నాను. మా చేతులను ఆమె మీద పెట్టియుండగా, ఈ ఆశీర్వాదమును యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
73
తండ్రివైన దేవా, ఈ ఉదయకాలంలో ఈ వేదికనొద్ద మేము నిలిచియుండగా, ఈ నల్లజాతి సహోదరి కొరకు ప్రార్ధించుచున్నాము. ప్రభువా, ఆ దినమున యేసు గొల్గోత కొండపై కల్వరికి సిలువను మోసుకొని వెళ్ళుచుండగా, దాని భారమును మొయ్యలేక క్రింద పడిపోయినప్పుడు, ఆ మార్గముగుండా వచ్చిన ఒక నల్ల జాతి వ్యక్తి ఆయనకు సహాయము చేయుటకు ఆ సిలువను మోయుచు రక్తసిక్తమైయున్న సిలువ అడుగుజాడలలో నడుచుచు వెళ్ళెను. ఇదిగో ప్రభువా, ఇచ్చట అతని కూమార్తెలలో ఒకరివలెవున్న ఈమె బలహీనతతో, అనారోగ్యముతో చక్రాల కుర్చీలో కూర్చొనియున్నది. ప్రభువా, మీరు గనుక ఆమె యెడల దయ చూపకపోతే, తన జీవిత కాలమంతా ఈమె ఇట్లే ఉండవలసి వచ్చును. వైద్యులు తమకు అసాధ్యమని వదిలి వేసిరి. యేసు నామములో నీ కాలు బాగవు గాక. ఆమె సంపూర్ణముగా బాగయ్యి లేచి నడచును గాక. దీనిని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
[సహోదరుడు బ్రెన్హాం మైక్రోఫోను నుండి ప్రక్కకు వెళ్ళి రోగుల కొరకు ప్రార్ధించుచున్నారు.]
74
ప్రాయమైన స్నేహితులారా, యేసు నామమున... ఆగండి, ఇక్కడ ఒక స్త్రీ ప్రార్ధింపబడుటకు వచ్చుచున్నది. నేరుగా ఇక్కడకు రమ్ము [సహోదరుడు బ్రెన్హాం మైక్రోఫోను నుండి ప్రక్కకు జరిగి ఆ స్త్రీ కొరకు ప్రార్ధించుచున్నారు.] మీరు కూడా వచ్చెదరా సహోదరులారా... మా ప్రియమైన పరలోకపు తండ్రి, మేము మా సహోదరిపై చేతులు పెట్టుచున్నాము [స్పష్టతలేని మాటలు]. ఆమె బాగావుటను చూచుటను బట్టి మేము ఎంతో కృతజ్ఞులము. ఆమె యొక్క విశ్వాసము కదలకుండును గాక, మరియు యేసు నామమున ఆమె సంపూర్తిగా బాగవును గాక. ఆమెన్.
ఇప్పుడు, ప్రభువు చెప్పినదే మనము చేసితిమి, అది సరియే కదా? మనలను దర్శించు సేవకులగు సహోదరులను కలిగియుండుట సంతోషము; సంతోషమే కదా, స్నేహితులారా? “ఆమెన్” చెప్పండి, మీరందరూ... మనము నిశ్చయముగా, నా ప్రియ సహోదరులను తిరిగి మరల మనతో ఉండుటకు ఆహ్వానించుచున్నాము. మరియు ఈ రోజు, మేము సమయానికి బయటకు వెళ్ళుటకు సిద్ధపడియున్నాము. మీరు ఇక్కడ ఉండుటను బట్టి మేము ధన్యులము.
75
మరియు నా సహోదరులారా, నేను మీ కోరకు నిరంతరమూ ప్రర్దించుదును. మరియు మీరు ఎక్కడికి వెళ్ళినను నా కొరకు ప్రార్ధించుడి, మరియు ఇప్పుడు కూడా ప్రార్ధించుడి, మరలా నేను బయటకు వెళ్ళుచున్నాను. మరియు మన దారులు సమయము తరువాత సమయము కలుసుకొనును గాక.
ఒకసారి ఓపె సహోదరుడను, అతని కుటుంబమును కాలిఫోర్నియాలో కలుసుకున్నాను. అచ్చటున్నది డాక్టరు ఓపె? ఓ, ఇతను వేరొక ఓపె సహోదరుడా. మంచిదయ్యా. ఓపె సహోదరుని కుటుంబములో ఉన్నవారు అనేకులు నాకు తెలుసు. కాని అతడు ఎవరితో సంబంధమును కలిగివున్నాడో నాకు తెలియదు. దంత వైద్యుడగు ఓపెని నేనెరుగుదును. నీవు అతనికి సంబంధించినవాడవా? ఓ,అతడు నీకు సహోదర సంబంధమగునా? మంచిది, ఇది చాలా చక్కగా ఉన్నది; అతడు మంచి మనిషి.
76
ఇప్పుడు, సంఘమా మేము మీకు ఏమి చేసితిమో చూచితిరా?మేము విశ్వసించనియెడల ఇక్కడ నిలువబడి రోగులపైమా చేతులను ఉంచలేము కదా? ఈ దినమున ప్రజలను గూర్చి మనము చూచుచున్నాము. ఇక్కడ సరిగా మన మధ్యనే ఉన్న ప్రజలలో కొంతమంది కాన్సర్ వ్యాధితోను, గ్రుడ్డితనముతో, అవిటితనముతో ఒకప్పుడు ఉండుటను మనము చూచాము. మొదటసారిగా ఇచ్చటకు వచ్చినవారు ఉన్నట్లయితే, నేను మీకు ఒక విషయమును చూపించనివ్వండి. అటువంటి పరిస్థితిలో నుండి దేవుని ద్వారా స్వస్థతనొందితినని చెప్పేవారు మీలో ఎంతమంది ఉన్నారు? మీ చేతులేత్తి చూపించండి. వారు కాన్సర్ వ్యాధి నుండి గ్రుడ్డితనం నుండి మరియు ప్రతీదాని నుండి స్వస్థతను పొందినవారు, చూచారా. ఆయన మీ కొరకు మరలా అదే చేయును, చూచారా.
మేము మా ప్రార్థనల యందు విశ్వాసమునుకలిగియున్నాము. మేము చెయ్యగలిగినదంతా కేవలము ఇది మాత్రమే. మరియు ఇప్పుడు మనము ముగించుచుండగా, సహోదరుడు నెవిల్ కు ఈ సమయమును అప్పగించుటకు ముందుగా, ఒక విషయమును చెప్పాలనుకుంటున్నాను.
ఈ రాత్రి మరలా జరుగబోవు ఆరాధనను జ్ఞాపకముంచుకోండి. మీ బంధువులలో గాని లేదా ఎవరైనా గాని ఈ ఉదయ కాలమున ప్రార్థనకు రాలేదని ఎరిగినట్లయితే, ఈ రాత్రి సమయమున సహోదరుడు హాల్, సహోదరుడు డర్బన్ స్థలములో కూటమును ఏర్పాటు చేసిరి. దాని చిరునామా ఏమిటి? [సహోదరుడు ఆ చిరనామాను తెలుపుచున్నారు.] 17వ మార్కెట్ వీధి, లూయిస్ విల్, అచ్చటే ఆ స్వస్థత కూటములను ఏర్పరచిరి. వారచ్చట ఆ కూటములను పెట్టుట వలనే నేను కూటమును జరుపుటకు ఇష్టపడుట లేదు. ఎవరైనా ఒక స్థలములో స్వస్థత కూడికను ఏర్పరచి, అదే స్థలమున వేరొకరు కూటములను ఏర్పరచి నన్ను పిలిచినయెడల నేను అచ్చటకు వెళ్ళుటకు అసహ్యించుకొనెదను. కాబట్టి ఈ ఉదయ కాలమున సహోదరుడు హాల్ కొరకు సహోదరుడు డర్బన్ తన స్థలములో కూటమును ఏర్పరచినందువలన దానిని గౌరవించు రీతిగా దీనిని చేసితినని చెప్పాను. ఎందుకనగా వారిరువురు నాకు ప్రియమగు స్నేహితులు. సహోదరులు హాల్ గారు అచ్చట స్వస్థత కూడికలను కలిగియుండగా నేను ఇచ్చట అదే స్వస్థత కూటమును జరిపించుటకు ఇష్టపడుట లేదు. ఆ విషయమున నేను రూఢీగా ఉన్నాను. కావున మనము అతనిని ప్రేమించుచున్నాము.
77
మరియు ఇప్పుడు, ఓకే సహోదరుడా మీరు ఎక్కడ బస చేయుచున్నారు? [సహోదరుడు ఓకే చిరునామా చెప్పుచున్నారు.] 4030 వెస్ట్ మార్కెట్, మరొక సహోదరుడు అక్కడ మీతోనే ఉన్నారా? మీరిద్దరు ఒకే చోట కలసి వున్నారా? సరే మంచిది. ఇప్పుడు అది 4030.... ఓ, 4030 వెస్ట్ మార్కెట్, అది లూయిస్ విల్ లో ఉండే 4030 వెస్ట్ మార్కెట్లో జరుగబోవుచున్నవి. సహోదరుడా ఓకే మీరు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు? వచ్చే వారమంతా కూటములు గలవా? చాల మంచిది. ఇప్పుడు బలహీనులైన మీరందరు 4030 వెస్ట్ మార్కెట్ వీధిలో జరుగుచున్నవి. మంచిది. అది మంచిది.
ఇంకా కొంతమంది సేవకులను నేను చూచాను. సహోదరుడా, మీకు ఎక్కడైనా కూటములు గలవా? లేదయ్యా, లేదు. అవును, మంచిది, అది చాలా మంచిది, అది చాలమంచిది.
ఇక్కడున్న ఈ సహోదరుడు యూదులకు ఒక మిషనరీగా పరిచర్య చేయుచున్నాడని నేను నమ్ముచున్నాను. అది ఆయనేనా? యూదులకు ఒక మిషనరీగా ఉంటున్నారు. బహుశా ఆయన, న్యూ-ఆల్బనీలో ఉంటున్నారని అనుకొనుచున్నాను. అతనిని ఇచ్చట మనము కలిగియుండుట చాల సంతోషకరమై యున్నది. ఎవరినైనా మరచిపోయానా? వేరే ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరిని నేను మరచిపోలేదు. ఎవరిని విడిచిపెట్టలేదని నేను నమ్ముచున్నాను. సహోదరుడు జూనియర్ జాక్సన్, అతడు న్యూ-ఆల్బనీలో నివసించుచున్నాడని మీకు తెలుసు. సహోదరులు టామ్ మెర్రీడెత్ రేడియో కార్యక్రమములను ప్రసారము చేయును. సహోదరులు మెర్రీడెత్ సహోదరుడా మీకు సంఘము ఉన్నదా? సంఘము లేదు, కేవలం రేడియో కార్యక్రమములను ప్రసారమును మాత్రమే చేయును. కొద్ది నిమిషముల క్రితమే అతడు దానిని ప్రకటించియున్నారు. ఇక్కడ చుట్టు ప్రక్కలవున్న ప్రజల కొరకు సహోదరుడు నెవిల్ ఈ రాత్రి ఆరాధనను ఏర్పాటు చేసెను. అంతేకాకుండా ఈ బుధవారము మరియు ఈ వారమంతా ఆరాధనలు గలవు. అతడు ప్రసంగించు ఆరాధనను శనివారము ఉదయమున ప్రసారము చేయబడును.
78
మంచిది. అందరూ చక్కగా ఉన్నారు కదా? అలాగైతే “ఆమేన్” అని చెప్పండి. సరే మంచిది కుమారుడా. ఈ మంచి మరిము సంతోషకరమగు సేవకులతో ఏకీభవించుటకు మీరు ఆశించినయెడల, మీరు కూడా ఈ సువార్తను ప్రకటించుచు, రోగుల కొరకు ప్రార్థించుచు వెళ్ళండి. కుమారుడా, దేవుడు దానిని మీకు దయచేయును గాక.
ఈ సమీప కాలములో ఒక యౌవనస్థుని శరీరమున ఇనుప కమ్మి గుచ్చుకొని ఈ ప్రక్కనుండి ఆ ప్రక్కకు బయటకు వచ్చి అతడిని గాయపరచెను. దానినుండి అతడు బ్రతికెను. అతని ప్రియమైన తల్లియొక్క ప్రార్థన ద్వారా అతడు బ్రతికెను. ఏదోక ప్రత్యేక ఉద్దేశ్యము కొరకు దేవుడు అతడిని కాపాడెను. ఈ ఉదయమున నేను మందిరమునకు వచ్చుటకు ముందుగా ఆ యవ్వనస్తుడిని కలిసాను. అతడు నాకు కరచాలము చేసెను. నీవే కదా, ఆ యౌవనస్థుడవని అతడిని చూచి అడిగాను.
అతడన్నాడు, “అవును, అయ్యా.”
చెప్పెను, “నాకు పరిచర్య కొరకు పిలుపు ఉన్నది.” దేవుడు అతడిపట్ల కనికరము కలిగియుండును గాక. ఇప్పుడు నా ప్రియమైన సోదరులారా... ఇదిగో ఇచ్చట గోధుమ రంగు కోటు ధరించుకొని కూర్చొనియున్న ఆ యౌవనస్థుడు, మనము కాలము యొక్క కూడలివద్ద ఉండగా, అతడు ప్రకాశించుచున్న ఒక దీపముగా మారుటకు దేవుడు అతనికి దయ చూపును గాక. కుమారుడా, సువార్తను ప్రకటించుము, సంపూర్ణ సువార్తను ప్రకటించుము, దేవుని వాక్యమంతా బోధించుటకు దేనితోను రాజీపడకుండా, సువార్తను సంపూర్ణముగా ప్రకటించుము. నీకివ్వబడిన బాధ్యతయనే స్థానమున నీవు స్థిరముగా నిలువబడుము. అప్పుడు దేవుడు నిన్ను ఒక గొప్ప పోరాట యోధునిగా తయారు చేయును.
79
ఇప్పుడు, చివరిగా రోగుల స్వస్థత కొరకు చివరగా ఒక ప్రార్ధనను చేయుదము. మా ప్రియ పరలోకపు తండ్రీ, ఈ ఉదయ కాలమున ఈ యౌవనస్థుని కొరకు వందనములు చెల్లించుచున్నాము, ప్రభువా, ఈ ఉదయ కాలమున అతడు మాతో కూర్చొని దేవుని వాక్యమును వినెను, మండుచున్న ఈ సేవకుల హృదయములను మరియు వారు రోగులపై చేతులుంచి ప్రార్థించుటను చూచెను. మరియు కాన్సరు వ్యాధి, గ్రుడ్డివారు, మూగ, చెవిటి, అవిటివారు, అటువంటి వారు ప్రార్థన ద్వారా తాము స్వస్థతను పొందుకున్నామని వారు చేతులెత్తి చూపుటను కూడా అతడు చూచెను. అది నిజముగా ఒక సవాలుగా ఉన్నది.
మేము ఈ పరిశుద్ధ వాక్యము వైపు చూచినపుడు, ఇటువంటి దినములు మరలా వచ్చునని పరిశుద్ధ గ్రంథమున చెప్పబడెను. మేము సరిగ్గా ఆ దినములలోనే ఉన్నాము. సర్వశక్తిమంతుడైన దేవుడు తన హస్తమును చాపి సూచనలు మరియు అద్భుత కార్యములను చేయుటను మేము చూచుచున్నాము. గొప్ప వర్షము కురియు ధ్వనిని ఆకాశమున మేము వినుచున్నాము. వీటి ద్వారా కడవరి వర్షము కురియు ఆఖరి ఘడియలో మేము ఉన్నామని ఎరుగుదుము. పరిస్థితులనే సంకెళ్ళతో సాతాను బంధింపబడి అగాధములో త్రోయబడును. ఇక పై జనములను మోసపుచ్చకుండునట్లుగా, సాతాను అగాధములో పడవేయబడి సంకెళ్ళతో బంధించబడును. మరియు భూమిమీద రానైయున్న ఆ వెయ్యేండ్ల పాలనలో ప్రభువైన యేసు మహిమపరచబడును, ఆయనను ఆరాధించెదము, “ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజని,” ఆయనకు కిరీటమును పెట్టి కీర్తింతుము.
80
ఎప్పుడైతే అణు శక్తి విడుదల చేయబడినప్పుడు మరియు హైడ్రోజన్లు... మరియు ఈ పాత పాపకరమైన భూమి ఈ ఒకానొక దినములో తెరువబడును. మరియు ప్రతి సముద్రము మరియు ప్రతి జలము.... సముద్రము ఎండిపోవునంతగా రోధించును. ఓ దేవా, సూర్యుడు ప్రకాశించుటకు తప్పిపోవును, మరియు చంద్రుడు అతడి వెలుగును ఇవ్వడు, ఒక అంజూరపు చెట్టు బలమైన గాలిచేత కదలింపబడినప్పుడు పడిపోయినట్లు, ఆకశ నక్షత్రములు రాలిపోవును; మరియు మనుష్యులు బండలను మరియు పర్వతములను బిగ్గరగా ఏడుస్తూ పిలిచెదరు, అట్లైతే ఈ చిన్న వెలుగు ఏ మాత్రము లెక్క. ఆ తర్వాత క్రీస్తునందు మృతులైనవారు తిరిగి లేచుదురు. ఓ, ఎంత చక్కటి పరదైసు అది. దేశములు ఒకదానిపై ఒకటి వ్యతిరేకముగా ఖడ్గమును ఎత్తవు. మేము కూడా ఇక ఎన్నడు రోగుల కొరకు ప్రార్ధించు వరుసను కలిగి ఉండము. నేడే ఆ రక్షణ దినము.
తండ్రీ, ఈ ప్రజలందరినీ నీ యొద్దకు తెచ్చియున్నాము, “నా నామమున తండ్రిని ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడును,” అని చెప్పిన దానినిబట్టి యేసు నామములో మేము మిమ్ములను వీటిని అడుగుచున్నాము. ఇవి మా ప్రార్థనవలననే జరుగుచున్నవనే విశ్వాసమును అధారము చేసుకొని అడుగుట లేదు. కాని “నా నామమున తండ్రిని ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడును,” అని మీరు చెప్పిన దానిని అధారము చేసుకొని విశ్వాసముతో అడుగుచున్నాము.
81
ఇప్పుడు, సాతానా, మిక్కిలి దుష్టుడా, ఇక్కడున్న అనేక జనులను నీవు బంధీలుగా చేసి, మరణమును వారిపై మోపి శక్తిహీనులుగా చేసితివి. మరియు అనేకులను గ్రుడ్డివారిగాను,ఇలాంటి అనేక రకములైన దుష్ట కార్యములను చేసితివి. కాని సాతానా, నీవు ఓడిపోయినవాడవు, ఎందుకనగా యేసయ్య చెప్పినట్లుగానే మేము చేసాము, అందుకే నీవు ఓడిపోయినవాడవు. అందుచేత, మా విశ్వాసముతో నీవైపు చూచుచు ఈలాగున చెప్పుచున్నాము, “ఈ జనులను విడిచిపెట్టి వెళ్ళుము.” యేసు నామములో ఈ జనులనుండి బయటకు బయటకు రా [స్పష్టతలేని మాటలు] మరియు యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరూ బాగవుదురు గాక. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు యేసు నన్ను స్వస్థపరచును అని
నేను నమ్మగలను, నేను నమ్ముదును, నేను నమ్ముచున్నాను;
నేను నమ్మగలను, నేను నమ్ముదును, నేను నమ్ముచున్నాను;
నేను నమ్మగలను, నేను నమ్ముదును, నేను నమ్ముచున్నాను;
ఆయనను ఆయన యొక్క వాక్యము ప్రకారముగా అంగీకరించెదను; నేను ఆయనను ఆయన యొక్క వాక్యము ప్రకారముగా అంగీకరించెదను;
ఆయన నాకు విడుదలను ఉచితముగా అనుగ్రహించెను.;
నేను ఆయనను ఆయన యొక్క వాక్యము ప్రకారముగా అంగీకరించెదను.
ఇప్పుడు యేసు నన్ను స్వస్థపరచును అని,
నేను నమ్మగలను, నేను నమ్ముదును, నేను నమ్ముచున్నాను;
నేను నమ్మగలను, నేను నమ్ముదును, నేను నమ్ముచున్నాను;
నేను నమ్మగలను, నేను నమ్ముదును, నేను నమ్ముచున్నాను;
82
మీరు దానిని నమ్ముచున్నారా? ఓ, ఇప్పుడు, హాలు సహోదరుడా దానిని విశ్వసించుచున్నావా? దేవుడు దానిని చేయును అని నీవు విశ్వసించుచున్నావా, సహోదరుడా. సహోదరి స్నిడర్, దానిని విశ్వసించుచున్నావా? సహోదరి, దానిని నీవు విశ్వసించుచున్నావా? సహోదరి, దానిని నీవు విశ్వసించుచున్నావా? విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది. గొప్ప యెరికో గోడలు విశ్వాసము ద్వారా కూలుటను మనము చూచాము. విశ్వాసము ద్వారా క్రీస్తు మిమ్ములను నడిపించును. మీరు విశ్వాసించుచున్నారా? ఆమేన్. మనము దానిని విశ్వాసించుచున్నాము; అసలు ఎటువంటి సందేహపు నీడను ఎన్నడూ కలిగి ఉండవద్దు [స్పష్టతలేని మాటలు] దేవుడు మనలను పంపెను, సర్వశక్తిమంతుడు మాట్లాడెను, అతీతమైనది దానిని వెంబడించి తీరవలెను. “విశ్వసించువారిని ఈ సూచక క్రియలు వెంబడించును.” ఆమేన్. ఆయన అద్భుతమైనవాడు కదా?
ఇప్పుడు ముగింపు ప్రార్థన కొరకు మన తలలను మనము వంచుదామా? మనము... మీరు మీ చుట్టూ తిరిగి ఒకరితో ఒకరు కరచాలము చేయుచూ కొద్దిసేపు సహవాసమును చేస్తూ ఉండండి. మనము ప్రార్థన కొరకు మన తలలు వంచియుండగా, సహోదరుడు నెవిల్ మనలను ప్రార్థనలో నడిపించమని అడుగుదాము. అతడు వచ్చువరకు అలాగే మన తలలు వంచి ఈ పాటను మెల్లగా పాడుచూ ఉందాము:
నేను నమ్మగలను, నేను నమ్ముదును, నేను నమ్ముచున్నాను;
నేను నమ్మగలను, నేను నమ్ముదును, నేను నమ్ముచున్నాను...
ఆయన సరిగ్గా మీ ప్రక్కనే ఉన్నాడని మీరు గుర్తుంచుకోండి. కార్యములను వాస్తవమైనవిగా చెయ్యుటకు ఆయన ఇచ్చట ఉన్నాడు. ఇప్పుడు ఆయన శక్తి మీలోనికి ప్రవేశించుటను మీరు అనుభూతి చెందండి. నేను ఆ అనుభూతిని పొందుచున్నాను. ఖచ్చితముగా మీరు ఆ అనుభూతిని పొందగలరు.
నేను ఆయనను ఆయన యొక్క వాక్యము ప్రకారముగా అంగీకరించెదను;
నేను ఆయనను ఆయన యొక్క వాక్యము ప్రకారముగా అంగీకరించెదను;
ఆయన నాకు విడుదలను ఉచితముగా అనుగ్రహించెను
(ఆ కల్వరిపై.);
నేను ఆయనను ఆయన యొక్క వాక్యము ప్రకారముగా అంగీకరించెదను.
ఇప్పుడు మనము మన తలలు వంచుదాము. సహోదరుడా నెవిల్, నీవు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు.