నగరములోనే అతి ఘోరమైన పాపి
నాకు అతి ప్రియమైన పాట యొక్క పూర్వపరాలు, దానియొక్క నేపథ్యమును, మీరు తెలుసుకొనగోరినయెడల... నా స్నేహితుడు సహోదరుడు బూత్-క్లిబ్బోర్న్ దానిని వ్రాసెను. అతడి బూట్లు అడుగు భాగము అరిగి పోయినందున దానికి కాగితపు అట్ట ముక్కలను పెట్టుకొని యుండెను. ఒక రాత్రి మొక్కజొన్న పొలములో అతడు మోకాళ్ళపై ఉంటూ ప్రేరణ ద్వారా ఈ పాటను వ్రాసెను. వైక్లిఫ్ అనే అతనికి వంద డాలర్లకు దానిని అతడు అమ్మును. వైక్లిఫ్ ఆ పాట యొక్క హక్కులను పొందుకొనెను. ఉన్న పాటలన్నింటిలో కంటే ఈ పాట నాకు అతి ప్రియమైనది. మరియు ప్రత్యేకముగా, ఈ దినములవలెనే ఆనాడు కూడా ఆయనను కేవలము ఒక ప్రవక్తగానే చేయుటకు ప్రయత్నించిరి. కాని ఆయన అత్యున్నతమైన దైవత్వమును వ్యక్తపరచుచున్న ప్రభువగు యేసుక్రీస్తుగా ఉండెను. ఆయన ప్రవక్త కంటే అత్యున్నతమైనవాడు. ఆయన దేవుడుగా ఉండెను.
2
ఈ రాత్రి కాలమున పరిశుద్ద లూకా 7వ అధ్యాయము 36వ వచనమును వాక్యపాఠముగా... మరియు మీరు గృహమునకు వెళ్ళిన తరువాత ఈ అధ్యాయమును చదివి ముగించండి. నేను ఇప్పుడే దీనిని చదివియున్నాను, ఎందుకనగా రేపు ఆదివారమని నేను ఎరిగియున్నాను. కాబట్టి ఎక్కువ సమయము ఉండాలని మనము కోరుట లేదు, కాని రేపు మీకు ఆదివారపు పాఠశాల మరియు అనేక ఆరాధనలు గలవు.
3
నేను ఇక్కడ పర్యటించుచున్నప్పుడు, ఇక్కడ కూర్చొనియున్న స్టాడ్స్లీవ్స్ మరియు పీటర్సన్స్ ఇటువంటి అనేకమంది మంచి స్నేహితులను దర్శించుటకు నిశ్చయముగా నేను ఇష్టపడెదను. కాని నా ఉద్దేశమేమనగా కూటములలో వాక్యమును బోధించుటకే ప్రాముఖ్యత ఇవ్వవలెను. కావున నేను ఎక్కడకు వెళ్ళిననూ అచ్చట స్వస్థతా కూటములు ప్రారంభమగుచున్నట్లుగా కనబడుచున్నది. ఆ విధముగా స్వస్థతా కూటములు జరుగుచున్నప్పుడు ఎవరినీ దర్శించుటకు నాకు వీలుపడదు. ఉపవాసము ఉండుటకు మరియు ప్రభువు కొరకు కనిపెట్టుకొని యుండుటకు నేను సమయమును వెచ్చించవలెను. నా స్నేహితులు దీనిని అర్థము చేసుకొనెదరని నేను నిశ్చయత కలిగియున్నాను.
36వ వచనము, మనము దీనిని చదివెదము:
పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్ళి, భోజన పంక్తిని కూర్చుండగా.
మనము ప్రార్థించుకుందాము.
పరలోకమందున్న తండ్రి, నీ మహిమ కొరకు ఈ మాటలను నీవు ఆశీర్వదించవలెనని మేము ప్రార్ధించుచున్నాము. యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
4
మనము చదివిన ఈ వాక్యములోని దృశ్యము నందు ఏదో తప్పిదమైన కార్యము ఉన్నట్లుగా కనపడుచున్నది. అది ఖచ్చితంగా సరిగ్గా లేదు. యేసును ఒక పరిసయ్యుడు తనతో వచ్చి భుజించమని అడుగుటకు గల కారణమేమిటి? ఆ పరిసయ్యునిలో చెడు ఉద్దేశ్యము గలదు, ఎందుకనగా పరిసయ్యులు యేసు అంటే ఇష్టపడరు; వారు ఆయనను ద్వేషించుచుండిరి. ఆయనతో వారు ఎటువంటి సంబంధమును కలిగియుండలేదు. సాధారణముగా ఎవరినైననూ మనము ఇష్టపడినప్పుడు, ఎవరినైననూ మనము ప్రేమించినప్పుడు, వారు వచ్చి మనతో భుజించవలెనని మనము ఆశించెదము, కాని మీ శత్రువులను మీతో వచ్చి భుజించవలెనని మీరు అడుగరు. కావున పరిసయ్యుడు తనతో వచ్చి భుజించవలెనని యేసును ఆహ్వానించు ఈ సన్నివేశమునందు ఆ పరిసయ్యుని ఉద్దేశములో ఏదో చెడు భావము గలదు.
సాధారణముగా, మనము ఎవరితోనైనా సహవాసము చేయవలెనని ఆశించెదము. పరిసయ్యులు కఠినమైన వారుగా, మెడవ౦చని వారుగా, మత భేదము కలిగిన గుంపుగా యుండుటవలన వారు యేసుతో ఏ విధమైన సహవాసమును కలిగియుండ లేదు. యేసు దేవుని యొక్క ప్రియమైన కుమారునిగా వుండెను. యవ్వన స్త్రీలు, వారికి సమానమైన వయస్సులో వుండు వారితోనే కలిసివుంటూ అనేక కార్యములు చేయుదురు. వారి మాటల సంభాషణలు, చేష్టలు అన్నీ ఒకరికొకరు పంచుకొంటూ కలిసి స్నేహముగా ఉండెదరని మనమెరుగుదుము. అలాగే వృద్ద స్త్రీలు, వృద్ద స్త్రీలతోనే కలిసి కూర్చొని సంభాషించుకొంటూ గడిపెదరు. యవ్వన పురుషులు, యవ్వన పురుషులతోనే కలిసి స్నేహము చేసెదరు. చిన్న పిల్లలు తమ వయస్సుగల పిల్లలతోనే కలిసి వీధులలో ఆడుతూ, పాడుతూ గడిపేదరు. చిన్న పిల్లలు వీధులలో ఆడుకొనెదరని పరిశుద్ధ గ్రంథములోని యెషయాలో దీనిని గూర్చి చెప్పుచున్నదని మీకు తెలుసు.
5
కాని, ఈ పరిసయ్యుడు యేసు నుండి ఏమి ఆశించుచుండెను? ఒక చిన్న బాలికను తీసుకొనండి, ఆమె ఎల్లప్పుడూ అమ్మమ్మను వెంబడించుచున్నదంటే అచ్చట ఏదో పొరపాటుయున్నదని మీకు తెలుసా? వారివురి వయస్సుల మధ్య చాలా తేడా వున్నది. వారు ఒకే విధమైన కార్యములను కలిగియుండలేరు. ఆ పిల్ల అమ్మమ్మకు గారాల మనుమరాలుగా ఉండవచ్చు లేదా అమ్మమ్మ దగ్గర ఎప్పుడూ సంచి నిండా మిఠాయిలు ఉండి వుంటాయి. కాబట్టే ఆ పిల్ల ఆ విధముగా అమ్మమ్మతోనే ఉంటుందనే ఆలోచన మనకు రావచ్చును. ఒక చిన్న పిల్ల అమ్మమ్మను వెంబడించుట మీరు చూచినప్పుడు, అక్కడ అనుమానించదగినది ఏదో వున్నది.
6
ప్రజలు ఏకముగా ఒక చోట కూడియున్నప్పుడు మీరు గమనించండి. నగరములో ఆ విధముగా కివెనిస్ అనే ఒక సంస్థ వారు కలుసుకొనెదరు. వారు కలిసినప్పుడు, వారు ఒకే విధమైన కార్యములను చేయుదురు. వారు నగరము యొక్క వ్యవహారములను గూర్చి మాట్లాడుటకు మరియు పేదవారికి సహాయము చేయుట కొరకు కార్యములను చర్చించుకొని వాటిని చేయుటకు ఇష్టపడుదురు.
మా అమ్మ ఒక పాత సామెత చెప్పుచుండేది, “ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరును.” అందులో చాలా సత్యము ఉన్నది, ఎందుకనగా మనము ఒకే రకమైన విషయములను కలిగియున్నాము. అందుచేతనే ఈ రాత్రి మనమిక్కడ కూడి వున్నాము. మీరు సినిమాలకు లేదా అటువంటి వాటికి వెళ్ళలేరు, ఎందుకనగా
క్రైస్తవులుగా మనము వాక్యము చుట్టూ సహవాసము చేయుటకు మరియు ప్రభువైన యేసును గూర్చి మాట్లాడుటకు మనము ఆశించుచూ కూడుకొనెదము.
7
కాని ఈ పరిసయ్యుడు యేసు నుండి ఏమి కోరుకొనుచున్నాడు? ఆ విషయమును గూర్చి తరువాత చూద్దాము. సమాచారమును మోసుకొని వెళ్ళే ఒక వ్యక్తి అచ్చట నిలబడియుండుట నేను చూడగలుగుచున్నాను. అతని వద్ద ఉన్న సమాచారము ఇవ్వవలసిన వారికి ఇచ్చుటకు ఆలస్యమగుచున్నది. సూర్యుడు అస్తమించుటకు సిద్దపడుచూ కొంచెము కొంచెముగా ముడుచుకు పోవుచున్నది. సమాచారమును మోసుకొచ్చిన వ్యక్తి పాలస్తీనా అంతటా రెండు రోజులుగా ప్రయాణించుచూ, ఆ నగరమునకు వెళ్ళి ఆయన ఎక్కడ వున్నాడో కనుగొనుటకు ప్రయత్నించుచుండెను. అతడు ఆ పట్టణము లోనికి వెళ్ళి అడుగగా, “ఆయన ఒక వారము క్రితము ఇచ్చటే ఉండెను, కాని ఇప్పుడు వెళ్ళిపోయెను,” అని అచ్చట ఉన్నవారు చెప్పిరి.
కావున ఇప్పుడు, ఇంతవరకు ఎన్నడూ ఏ మానవుడు మాట్లాడలేని విధముగా మాట్లాడుచున్న ఒక వ్యక్తి యొక్క మాటలను ఆలకించుటకు పెద్ద సమూహముగా గుమిగూడి వినుచున్న జనులు యొద్దకు సమాచారమును మోసుకొని వెళ్ళి ఇచ్చు వ్యక్తి నిలబడియుండెను. అచ్చట మాట్లాడుతున్న ఆయన అధికారముతో మాట్లాడుచుండెను. సమాచారము తెచ్చిన బంటు నగరము నుండి నగరమునకు ప్రయాణించుచూ, కరుకైన పాలస్తీనా దారుల మీదుగా పరుగెడుతూ వచ్చుటవలన అతని పాదములు దుమ్ముతో నిండినవైయుండెను. ఈ నజరేయుడైన యేసు ఎక్కడవున్నాడో కనుగొనుటకు వెతుకుచున్నాడు, ఎందుకనగా ధనికుడైన పరిసయ్యుడగు అతని యజమానుడు యేసును ఆహ్వానించుటకై ఇచ్చిన సమాచారమును తీసుకొనివచ్చిన పని మీద అతడు వున్నాడు.
8
యేసు మాట్లాడుట చాలించిన తరువాత ఆయన రోగుల కొరకు ప్రార్థించుటకు ప్రార్థనా కూటమును ప్రారంభించి యుండవచ్చును. కుంటివారిని బలహీనులను మరియు గ్రుడ్డివారిని తాకుటకు, ఆయన తన పరిశుద్ధ హస్తాలను చాపుచుండుటను నేను చూడగలుగుచున్నాను. పరిసయ్యుని నుండి సమాచారమును తీసుకొనివచ్చిన ఆ బంటుని అనేక మంది ప్రజలు వెనుకకు నెట్టివేయుటకు ప్రయత్నించుచున్నప్పటికీ, యేసుని సంధించు స్థలమునకు వచ్చుటకు, ఆ పెద్ద సమూహముగుండా తన మోచేతులతో వారిని నెట్టుకొనుచూ అతడు ముందుకు వచ్చుటను నేను చూచుచున్నాను. కాని, తరువాత అతడు ఎవరినో అనుకోకుండా ఢీకొనెను. అది ఫిలిప్పు లేక పేతురు అయివుండవచ్చును. మరియు అతడు, “మీ యజమానిని నేను కలుసుకోవచ్చా? నా యజమాని నుండి ఆయనకు ఒక సమాచారమును తెచ్చియున్నాననెను.”
“ఇప్పుడు ఆయన వారితో మాట్లాడుచున్నాడు. స్వస్థతా కూటమును ఆయన ముగించిన తరువాత ఆయనను నేను అడిగెదనని,” ఆ అపొస్తులుడు చెప్పెను
మరియు బహు దీర్ఘముగా స్వస్థతా కూటము జరుగుచుండగా, రోగుల కొరకు ప్రార్థించుట ఇక నిలిపివేయుట సమంజసముగా వుండునని వారు తలంచుచుండిరి. వారిలో ఒకరు, “బోధకుడా, ఇప్పుడు ఈ ప్రార్థనా వరుసను నిలిపివేయుట మంచిదని నేను అనుకొనుచున్నాను, ఎందుకనగా మనము వెళ్ళవలసిన స్థలములు ఇంకనూ వున్నవి. ఈ రోజుకి ఇది చాలును,” అనిరి.
అప్పుడు పేతురు, సమాచారము తెచ్చిన ఆ బంటుతో, “ఇప్పుడు నీతో ఆయన మాట్లాడునేమో, నేను ఆయనను అడిగెదననేను”.
కావున అతడు, “బోధకుడా, ఇక్కడ మన మధ్యనున్న జనసమూహములో దక్షిణ పాలస్తీనా నుండి వచ్చిన ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. అతడు రెండు రోజులగా ప్రయాణము చేసి అతని యజమాని నుండి నీకొక సమాచారమును తెచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇప్పుడు నీవేమైనా అతనితో మాట్లాడగలవా,” అనెను యేసుతో మాట్లాడవలెనని నీవెన్నడూ అడగనవసరము లేదు. ప్రతీ ఒక్కరితోను మాట్లాడుటకు ఆయన ఎంతో ఇష్టపడును. మరియు అందుకొరకు ఆశతో ఆయన ఎదురుచూచును. ఆయన ఎల్లప్పుడూ నీతో మాట్లాడుటకు అవకాశమును నీకు అనుగ్రహించును. ఆయన ఇప్పుడున్నరీతిగానే అప్పుడూ వుండెను. నీకున్న ఎటువంటి కార్యమైననూ లేదా ఎటువంటి సమస్య అయిననూ, మన ప్రియాతి ప్రియమైన ప్రభువువగు యేసు వాటిని తెలుసుకొనుటకు మరియు ఎల్లప్పుడూ ప్రతీ ఒక్కరితో మాట్లాడుటకు ప్రయత్నించుచూ, అందుకొరకు ఆయన అవకాశమును నీకు అనుగ్రహించుచున్నాడు.
కావున, “ఖచ్చితముగా, వచ్చిన ఆ యవ్వనస్తుని యొద్ద ఏమియున్నదో దానిని చూచుటకు నేను సంతోషించెదనని ఆయన చెప్పెను.
9
ఈ యవ్వనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి, “నీవు నజరేయుడైన యేసువి. ఫలానా నగరములోని నా యజమానుడగు డాక్టర్, పరిసయ్యుడు ఒక గొప్ప విందు ఇచ్చుటకు ఏర్పాట్లు చేయుచున్నాడు. నీవు వచ్చి ఆ గొప్ప విందులో అతిథిగా పాల్గొనవలెనని అతడు ఆశించుచున్నాడు,” అని చెప్పెను.
అపోస్తులుల అందరి కళ్ళు ఆయన ఏమి చెప్పునోనని ఆయనవైపు చూచుటను నేను చూడగలుగుచున్నాను. “ఫలానా, ఫలానా తేదీన నేను అక్కడ వుంటానని నీ యజమానితో చెప్పమనెను.” అడుగుడి మీరు పొందెదరు, యేసు ఎల్లప్పుడూ ఆ విధముగానే వుండును. మరియు ఆయన, “ఫలానా, ఫలానా తేదీలో నేనక్కడ వుండెదనని,” చెప్పెను.
పేతురు ఈలాగు చెప్పుటను నేను వినగలుగుచున్నాను “ఓ, వద్దు ప్రభువా, అక్కడకు వెళ్ళవద్దు. నిన్ను అవమానించుటకే ఆ పరిసయ్యుడు ఆహ్వానించుచున్నాడేమో? అచ్చటికి వెళ్ళడమెందుకు. ఏ మంచి కార్యము కొరకు అతడు నిన్ను ఆహ్వానించుటలేదు. ఇక్కడ పరిచర్య చేయుటకు చాలామంది రోగులు ఉండగా, అచ్చటికి వెళ్ళడమెందుకు? నిన్ను ప్రేమించుచూ నీ చుట్టూ గుమికూడి, నీతో ఒక్క క్షణం గడుపుటము కొరకు ప్రయత్నించుచున్న జనులుండగా, పరిసయ్యుడిని వెళ్ళి చూచుటకు నీవెందుకు ఆశించుచున్నావు? నీవు వెళ్ళవద్దు,” అనెను.
కాని, యేసుని ఎవరైనా, ఎప్పుడైనా, ఏదైనా అడిగినయెడల నీ కోరికకు అనుగునముగా ఆయన ఎల్లప్పుడూ ప్రత్యుత్తరమిచ్చును. “మనము అక్కడకు వెళ్ళుచున్నాము,” అని ఆయన అనెను.
10
ధనికుడైన ఈ పరిసయ్యుని ఇంటిలో ఒక నౌకరుగా ఉంటూ సమాచారము తీసుకొని వచ్చిన ఆ యవ్వనస్థుడు అతడు వచ్చిన పని అయిపోయిన తరువాత తన మత సంబధమైన కార్యములను, తన సంఘము యొక్క విధులన్నింటిని ముగించిన వెంటనే అతని యజమాని యొక్క కోరికను నెరవేర్చితినని సంతృప్తి చెందుచూ యేసు వద్ద నుండి వెనుదిరిగి, తన మార్గమున వెళ్ళుటకు బయలుదేరెను.
నిత్యజీవము యొక్క సన్నిధియందు, పరలోకపు దేవుని ఎదుట నిలబడియుండి కూడా; అయినను అతడు తన మతము మరియు సంఘము యొక్క పనులు చేసినవాడైయుండిన ఈ వ్యక్తి అతని పాపముల యొక్క క్షమాపణ కొరకు అడుగకుండా నడిచి వెళ్ళిపోవుట ఎంత పొరపాటు.
11
అతడు ఎక్కడ నిలబడెనో అక్కడ నేను నిలబడ గోరుచున్నాను. అతడు ఎక్కడైతే నిలబడి యుండెనో ఆ స్థలమందు నేను నిలబడగోరుదును. నేనేమి చేస్తానో మీకు తెలుసా? ఓ, సంఘము యొక్క వ్యవహారాలలో నేను అత్యంత ఆసక్తి చూపకుండా, ఆయన ఎదుట నిలబడుటకు నాకు అవకాశము లభించినయెడల, మొదట నేను సాష్టాంగముగా ఆయన ఎదుట సాగిలపడి, “ప్రియమైన యేసు ప్రభువా, జీవాధిపతీ, నీ క్షమా కృపను నాకు దయచేయుము,” అని అడిగెదను.
ఈ రాత్రి ఇక్కడున్న వారందరి కోరిక కూడా అదేనని నేను నమ్ముచున్నాను. మనము ఆ విధముగానే చేసెదము. కాని నేడున్న పరిస్థితిని గమనించండి. మనము సంఘము యొక్క అనేక కార్యములలో పాలుపొందుకొనుచూ వాటిని చేయుచున్నాము, మన అవసరత సంఘమునకు ఎంతో అవసరమై యున్నది. అనేక స్థలములకు వెళ్ళుచూ, వాటిలో లీనమైపోవుచూ, మనము పొందుకోవలసిన నిజమైన అవకాశవములను పొందుకొనుటలో అనేకసార్లు విఫలమగుచున్నాము. బహుశా, ఏదో ఒక రాత్రి పాటలు సాధన చేయుటకు వెళ్ళవలసి వచ్చును, మరొకటి ఏదో చేయవలసి వచ్చును. ఏదో ఒకటి, బహుశా మత సంబంధమైనది కావచ్చును. కాని అది ఏమైనప్పటికీ, రాత్రి సమయము ఎంతైనప్పటికీ లేక ఎటువంటి పని మీద నీవు వున్నప్పటికీ, పరిశుద్ధాత్మ నీ హృదయమందు మాట్లాడుచున్నప్పుడు, నీవు చేయవలసిన అతి శ్రేష్ఠమైన కార్యమేదనగా, ఆ పరిశుద్ధాత్మకు ఎల్లప్పుడూ నీవు జవాబు ఇవ్వవలెను, ఎందుకనగా ఇంకొక సమయమందు లేక మరెన్నటికినీ నీతో ఆయన మాట్లాడకపోవచ్చునేమో.
12
కాని ఈ యవ్వనస్తుడు, నిత్యజీవమునకు అంత దగ్గరగా నిలబడి యుండి కూడా, దానికొరకు అతడు అసలు అడుగనే అడుగలేదు. ఆ వ్యక్తిని మనము ఖండించుచున్నాము. కాని, మీకు తెలుసా! మీరు మరియు నేను అదే విషయమునుబట్టి దోషులుగా ఉందువేమో, ఆయన నోటి దగ్గరే ఉంటూ లేదా నిత్యజీవపు స్వరమునకు అతి సమీపముగా ఉంటూ దానివైపే చూస్తూ, దానినే గమనించుచూ ఆ యవ్వనస్తుడు చేసినట్లుగానే దానిని నిర్లక్ష్యముచేస్తూ మనము వెళ్ళిపోవుచున్నాము. అది నిజము. ఇతర విషయములలో ఎంతో ఆసక్తిని కనబరచుచున్నాము. కాని దేనియందు అత్యంత ఆసక్తిని చూపవలెనో దానియందు మనము చూపుట లేదు.
నేడు అనేకమంది జనులకు, చేయుటకు అనేక కార్యములు వారికి గలవు. ఎంతో త్వరపడుచూ బజారులో అవి ఇవి కొనుటకు వెళ్ళెదరు. అనేక కార్యములను త్వరత్వరగా చేయాలని ప్రయత్నించుచూ ఏ కార్యమును చేయలేక సమయమంతా వ్యర్థపరుస్తూ దేవుని నుండి ఎంతో దూరముగా తొలగిపోవుచున్నారు. అవును నిజము. ఆ యవ్వనస్తుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను ఖచ్చితముగా తాను చేసి ముగించాననే తలంపుతో సంతోషముగా వెళ్ళిపోయెను.
అనేక సమయములలో మనము సంఘమునకు వచ్చి ఒక కాగితముపై మన పేరును సంతకముచేసి మరియు కాపరితో కరచాలనము చేసి, నీటిలో బాప్తీస్మము పొంది, “నేను చేయవలసిన మతభక్తి చేసియున్నాను,” అని తలంచి, భ్రమలో పడి, చేయవలసిన ప్రాముఖ్యమైన విషయమును మనము వదిలి వేయుచున్నాము. అదేమనగా అనేక సమయములలో ప్రభువైన యేసుతో కొద్దిసేపైనా మాట్లాడే అవకాశమును మీరు కలిగి యుండియు దానిని మీరు చేయుట లేదు.
13
ఈ యవ్వనస్తుడు ఈ అవకాశమును జారవిడచుకొన్నందుకుగల కారణమేమిటని నేను ఆశ్చర్యపడుచున్నాను. బహుశా, ఒక వారము క్రితము సమీపమున గల పట్టణములో ఒక గొప్ప పురాతన యూద సమాజమునకు కాపరిగా ఉంటూ డాక్టర్ పరిసయ్యుడుగా పిలవబడే అతడు, బ్రహ్మాండమైన వరండాలో తిరుగుట నేను చూడగలుగుచున్నాను. ఆ వరండా నేలపై అందమైన తివాచీలు పరచియున్నవి. ఆ చక్కని ఇల్లు గృహోపకరణములతో అలంకరించబడియున్నది. అతడు చిన్న బొద్దుగావున్న తన చేతులను రుద్దుకొనుచూ, “ఈ నగరములో నేను గౌరవముగల వ్యక్తిని, నేను పట్టభద్రుడిని, నేను డాక్టర్ గా పిలువబడుచున్నాను. పట్టణము యొక్క ముఖ్య స్థలములకు నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను డాక్టర్ పరసయ్యుడుగా గౌరవిస్తూ ”శుభోదయం డాక్టర్ పరిసయ్యుడు గారు,“ అని పిలిచెదరు. ఎన్నో లాడ్జీలకు, ఇంకా అనేకవాటికి నేను అధిపతిగా ఉన్నాను. సమాజము సభగా కూడుకొన్నప్పుడు నన్ను మాట్లాడమని అడిగెదరు. నేను చాలా చక్కగా మాట్లాడగల వక్తను కూడా, మరియు నగరములోని ముఖ్యమైనవారు నా కొరకు ఎదురుచూస్తారని నీకు తెలుసా? అతడి మాటలలో ”నేను, నేను, నేను, నేను“ అనే స్వయము అత్యధికముగా గలదు.
14
ఇక్కడ కొంత కాలము క్రితము ఒక గొప్ప సేవకుడు నాకొక ఉత్తరము వ్రాసెను, ఆ ఉత్తరంలో సగం పేజీలోపలే “నేను, నేను,” అనేది ఇరవై-రెండు సార్లు ఉండుటను నేను లెక్కపెట్టాను. “నేను” అనే స్వయము నిండినచోట యేసు వచ్చుటకు స్థలమెచ్చట ఉన్నది? నాకు అది గలదు, నాకు ఇది గలదు... నీకు ఏది ఉన్నను, ఏది లేకున్నను, దేవుడు నీకు ఇవ్వకుండా నీవు ఏదియూ కలిగియుండలేవు. కావున నీవు దానిని గ్రహించబద్దుడవై యున్నావు.
ఒకసారి కూటములో ప్రసంగించుటకు ఒక నగరమునకు నేను వెళ్ళితిని. ఆ నగరమంతటా ఒక సేవకుని యొక్క చిత్రములే కనబడినవి. ఈ ఘడియ యొక్క వ్యక్తి, ఈ కాలము యొక్క దేవుని మనిషి, ప్రజల కొరకు భారము కలిగియున్న మనిషి.“ ఈ విధముగా అతడి పేరుతోయున్న అతని చిత్రములే ఎక్కడ చూసినా ఉన్నవి. కాని యేసు పేరును ఆ పత్రికల యందు ఎక్కడా నేను చూడలేదు.
“ఎందుకని? ఒకవేళ యేసు నగరమునకు వచ్చుట లేదు కాబోలు, కేవలం ఆ వ్యక్తి మాత్రమే వచ్చుచున్నాడేమో,” అని నేను అనుకున్నాను. కావున దానిని చూస్తుంటే అలాగే అనిపించుచున్నది.
“నేను, నేను,” అనేది మాత్రమే ఈ పరిసయ్యుని యందు కలదు. మరియు అదే కార్యము ఇప్పటికీ అనేక మందిలో అలాగే వున్నది.
15
కావున అతడు నేలపై అటు ఇటు నడుచుటను మనము గమనించుచున్నాము. అతడు, “ఇప్పుడు ఈ నగరములో ఎంతో పలుకుబడిని నేను కలిగియున్నాను. వారందరూ నన్ను పరిశుద్దునిగా గౌరవించుచున్నారు, ఎందుకనగా నగరములో యున్న అతి పెద్ద సంఘమునకు నేను కాపరినని మీకు తెలుసా? అందరూ నన్ను ఉన్నతముగా గౌరవించెదరని నేను నిశ్చయతను కలిగియున్నాను. ప్రతి దినము నేను భక్తిని ప్రదర్శిస్తాను, కావున నేను నా యొక్క భక్తిలో కొంత భాగమును చూపించుటకు ఇదే సమయమని నేను అనుకొనుచున్నాను. అందుకొరకు ఒక విందును ఏర్పాటు చేసెదను. నేను పరిసయ్యుడగు డాక్టర్ లేవిని తీసుకొని వచ్చెదను. పరిసయ్యుడగు డాక్టర్ ఎజ్రాను పిలిచెదను. అటువంటి వారందరినీ నేను ఆహ్వానించెదను. నేను ఇవ్వబోయే విందులో ఒక కీలక స్వరము లేక కీలకమైన ముక్కను, దానిని ఏమని పిలచుదురో అటువంటి ఒక దానిని ఈ విందుయందున్న యెడల, సరిగ్గా అటువంటిదే నాకు అవసరమైనది. ఇప్పుడు ఈ కాపరులకు నేనెంతటి గొప్పవాడనో చూపుటకు ఒక గొప్ప వినోదము కొరకు ఏదైన ఒకదానిని నేనెక్కడ కనుగొనగలను? మరియు మీకు తెలుసా, అటువంటిది ఏదో ఒకటి చేయుటవలన ఈ నగరములో నా యొక్క పలుకుబడి మరింత ఎక్కువ అగును. మరి దాని వలన ఇంకా అనేక మంది వచ్చి నా యొక్క సంఘములో చేరెదరు,” అని తలంచుచుండెను.
అది ఎంతో చెడ్డ తలంపు. ఈనాడు ఉన్న అనేక సంఘములలో అటువంటి ఆత్మనే కలిగియున్నారు.
16
కాసేపటి తరువాత, అతడు తన చక్కటి స్థలములో ఐగుప్తు నుండి తెచ్చిన గొప్ప తివాచీ పై నడుచుచూ మరియు అతడి చిన్న, బొద్దుగానున్న చేతులను రుద్దుకొనుచూ అటు ఇటు తిరుగుచుండుట నేను చూడగలుగుచున్నాను. ఆ పరిసయ్యులు ఐశ్వర్యమంతులు, వారు ధనమును సమృద్ధిగా కలిగియుండిరి వారు శ్రేష్ఠమైన గృహములలో నివసించుచుండిరి. ఆ విధముగా ఉండుటవలన, దేవునితో వారు సరిగా వున్నారని దాని అర్థము కాదు. కానే కాదు. వారు చురకైనవారు, విద్యావంతులు, అందుకని వారు దేవునితో సరిగ్గా వున్నారనేది దాని అర్థము కాదు.
అన్ని రకములైన వేదాంత పాఠశాలలో, కళాశాలలో నుండి చక్కటి పట్టభద్రులైన అనేకమంది ప్రజలను నేను చూచియున్నాను, వారు దేవుని గూర్చి ఎక్కువగా ఎరిగిన దానికంటే పరిశుద్ధ గ్రంథములోని అ-ఆ-ఇ-లను గూర్చి ఎక్కువగా ఎరిగి యుందురు. అది నిజము. వారు విద్యావంతులైనను అది హృదయము వద్దకు వచ్చేసరికి... వారు క్రీస్తును ఎరుగరు.
17
ఒక రాత్రి నేను చెప్పినట్లుగా, ఆయనను ఎరుగుటయే జీవమైయున్నది. పుస్తకమును ఎరుగుట కాదు, సంఘమును ఎరుగుట కాదు, బోధించుట, ప్రసంగించుట ఎరుగుట కాదు, కాని క్రీస్తును, క్రీస్తు అను వ్యక్తిని ఎరుగుటయే జీవమైయున్నది.
కానుకలను, బలియర్పణలను మరియు ప్రజల యొక్క దశమ-భాగములను వారు పొందుకొనుచూ వారు ధనవంతులుగా వుండిరి, వారిలో అనేకులు చక్కటి గృహములలో నివాసముండిరి మరియు ఒక పెద్ద (ఇప్పుడు మనము పిలుస్తున్నట్లుగా) విందును ఇచ్చుటకు వారు సామర్థ్యము కలిగియుండిరి. కాని ఆ దినములలో అనేక మంది పేదవారు కూడా ఉన్నారు.
18
ఈ రాత్రి పాఠ్యాంశము కొరకు, ఆ దినములలో వారు జీవించిన విధానము గూర్చిన సమాచారమును అధిక భాగము జోసెఫస్ మరియు అనేక చరిత్రకారుల రచనల నుండి నేను తీసుకొనియున్నాను. నవీన దినముల యందుండు కార్యములను, ఆ పాత ప్రాచీన ఆచారములను నేను అచ్చట చూడగలిగితిని. వారు చక్కటి గృహములు మరియు వస్తువులు కలిగియుండిరి మరియు వాటిలో అనేకమైనటువంటివి ఈ దినమందు ఇంకనూ వున్నవి.
19
క్రిందవరకు వ్రేలాడే పెద్ద అంగీని ధరించుకొని, నేలను ఊడ్చుకొంటూ, మత సంబంధమైన టోపి పెట్టుకొని ఉన్న ఆ పరిసయ్యుడు అచ్చట ఇటు అటు నడుచుచుండుట నేను చూడగలుగుచున్నాను. అతడు, “హో, హో, దానిని గూర్చి నేనెందుకు ఆలోచించలేక పోయాను? ఆ ఆలోచన ప్రకారమే నేను చేసెదను. ఒక వారం క్రితమే దానిని నేను ఆలోచించవలసినది. అదే, ఆ గలిలయుడిని, పరిసయ్యుడు జోన్స్ ఎలాగూ ఆయనను ద్వేషించుచున్నాడు, ఎందుకనగా ఒక రోజు ఈ జోన్స్ ను చూచి, ”నీవు గడ్డిలోని పాము లాంటి వాడివని,“ ఆయన గట్టిగా గద్దించెను. కావున జోన్స్ యేసుని ద్వేషించుచుండెను. ఆయనను నేను ఆహ్వానించెదను. మరియు నేను పరిసయ్యుడగు లేవిని కూడా రమ్మనెదను, అతడు కూడా ఆయనను ద్వేషించుచున్నాడు. మై, ఆయనను అతడు ఎంతగానో ద్వేషించుచున్నాడు! కాబట్టి నేను నాకొచ్చిన ఈ ఆలోచన ప్రకారము ఖచ్చితంగా చేసెదనని,” అతడు తలంచుట నేను చూడగలుగుచున్నాను. ఆ కారణమును బట్టే వర్తమానమును మోసుకొని వెళ్ళు ఆ యవ్వనస్తుడు అక్కడ వుండెను.
20
“మేమేమి చేయుదమో నేను మీకు తెలిపెదను, ఇప్పుడు, ఆయన తనను తాను ఒక ప్రవక్త అనీ చెప్పుకొనుచున్నాడు. భవిష్యత్తులో జరిగే సంగతులు తాను చూడగలనని మరియు జరుగుచున్న సంగతులను గూర్చి తాను ఎరుగునని ఆయన చెప్పుకొనుచున్నాడు. కాని ఆయన అబద్ధికుడని మేము ఎరిగియున్నాము, ఆయనకు ఏమియూ తెలియదని మేము ఎరిగి యున్నాము. సంఘస్థులమైన మేము, విద్యావంతులగు మేము, తెలివైనవారగు మేము, మరియు పట్టభద్రులమైన మాకంటే ఆయనేమి గొప్పవాడు కాదు. ఆయన వద్ద ఏమియూ లేదని మేము ఎరిగియున్నాము. ఆయన బెయల్జెబూబు తప్ప మరేదియూ కాదు. రబ్బీయగు జోన్స్ ఏమైయున్నాడో ఆ గలిలయుడు అతనికి చెప్పినప్పుడు, ఓ, అతను ఎంతగానో కోపగించుకొనెను. ఇప్పుడు నేను ఆయనను ఇచ్చటకు ఆహ్వానించుటవలన మేము చక్కటి వినోదము కలిగియుందుము, ఏ విధముగా అవమానించాలో ఆ విధముగా ఆయనను అవమానించెదము. ఆయన ఒక అబద్దీకుడు తప్ప మరేమి కాదని మేము సరిగ్గా ఇక్కడే రుజువు చేసెదము. కావున ఆయనను మేము ఇక్కడికి రప్పించెదము కనుకనే నాకిష్టమైన నౌకరును అక్కడికి పంపితిని. అతడు ఆయనను తీసుకొని రాగలడు. ఓ, నేను దీనిని గూర్చి చాలా కాలము క్రితమే ఆలోచించవలసినది. సరే, ఇక నేను ఆహ్వాన పత్రికలు పంపించు పనిని ప్రారంభించుట మంచిదని,” అతడు తలంచుచుండెను. ఎందుకనగా, ఒక పాలనా విందుకు ఆహ్వానము లేకుండా నీవు పాల్గొనలేవు.
21
“నేనేమి నమ్ముచున్నానో దానిని నేను చేయగలనని నీతో చెప్పుచున్నాను. ఒక గొప్ప పెద్ద విందును అందరి కొరకు చేయించెదను. పేదవారు, అందరూ కాకుండా మరియు నేను కోరుకొనిన వారు మాత్రమే దానిలో పాల్గొనునట్లుగా చేసెదను. నేను చేయబోవు కార్యమును జనులు చూచునట్లుగా, ఇక్కడ ఉన్న వంటవారికి బదులుగా వేరే ప్రాంతము నుండి అతి శ్రేష్ఠమైన వంటవాళ్ళను తీసుకొని వచ్చెదను. మరియు ఒక గొర్రెను తెప్పించి, ఒక చట్రమునకు బిగించి నిప్పుతో కాల్చుచూ మసాలతో వేయించెదను. ఓ, వచ్చినవారందరు తమ పెదవులు చప్పరించుకొంటూ తినునట్లుగా నేను చేయుదును. విందు అయిపోయిన తరువాత, ఈ నజరేయుడైన యేసును ప్రవక్త కాడని మేము రుజువు చేసి ఆయనను చూసి హేళన చేయుచూ, పరిహసించుచూ, ఆనందముతో గడిపెదము. అప్పుడు జోన్స్, మరియు తదితరులు సంతోషించెదరు. ఓ, అది అద్భుతముగా వుండునని,” అతడు అనుటను నేను వినుచున్నాను.
“ఇక్కడ ఈ ఇంటి లోపల, ఇంటి వరండాలో నేను దానిని ఏర్పాటు చేస్తే ఏమంత బాగోదని నేను తలంచుచున్నాను. నీకు తెలుసా, నానొక మంచి పెద్ద (పెరడు) స్థలము గలదు. అక్కడ మంచి రుచికరమైన ద్రాక్షలు, తెల్లద్రాక్షలు గలవు. ఓ, అవి ఇప్పుడే పండుచున్నవి. అక్కడే నా భోజనపు బల్లను ఏర్పాటు చేసుకొనుట చాలా అద్భుతంగా వుండదా?” అని పరిసయ్యుడు తలంచెను.
22
అటువంటి వ్యర్థమైన దానిని వారి విధానములో ఘనముగా చేయుదురు ఖచ్చితముగా వారు దేనినైతే గొప్పగా తలంచుదురో, ఆ కార్యములు జరుపుటకు గొప్ప హంగామా చేయుదురు. అటువంటి వాటిని వారేవిధముగా చేయుచున్నారో దానిని మీరు చూచుట యుక్తముగా ఉండును. ఓ, వాక్యమును బోధించిన ప్రసంగికి డబ్బును చెల్లించుటకై ఎచ్చటో ఒక చోట సూప్ విందును ఏర్పరచుకొని దానిని తయారుచేసి ఒక గిన్నె 50 సెంట్లకు అమ్ముచూ, ఆ విందులో యేసును కేవలము ఒక ఆకర్షణగా ఉంచుటకు ప్రయత్నించెదరు. అది నిజము. అటువంటి కార్యములు చేయుటలో మనమేమియు వారికి వ్యత్యాసముగా లేము. అది నిజము.
ఈ రాత్రి “నగరములోనే అతి ఘోరమైన పాపి,” అనే అంశము మీద నేను మాట్లాడు బోవుచున్నానని మీతో నేను చెప్పియున్నాను.
ఆ పరిసయ్యుడు తాను చేయదలచిన కార్యమును చేయుటకు అతని యొద్ద సమస్తము యున్నవి. “ఈ కార్యక్రమమును అచ్చటనే ఏర్పరుస్తాను. అచ్చట పెరట్లోనే దానిని ఏర్పరచెదను. అక్కడ ద్రాక్షాగెలలు వ్రేలాడుచూ సువాసనలతో నిండిన ఆ స్థలమందే విందును ఏర్పాటు చేసి నా గొర్రెలను వధించి ప౦డించెదను. అది ఎంతో అందముగా ఉంటూ, ఎంతో అద్భుతమైన సమయమును నేను కలిగియుంటాను...” అని అతడు అనుకొనెను.
23
అచ్చట వారియొద్ద ఇండియా దేశపు పనివారు గలరు, వారు కాళ్ళకు ధరించే బూట్లకు గజ్జెలువంటి గంటలు అమర్చుకొనుటవలన వారు నడిచేటప్పుడు ఇంచుమించు ఒకలాంటి శృతిని ఆ నడకయందు కలిగించును. వారు వడ్డించేటప్పుడు ఎంతో మర్యాదపూర్వకముగా వడ్డించెదరు. పళ్ళెములను పట్టుకొని తాంబూలములను అందించునపుడు, మీరు కోరుకొను విధముగా ఎంతో మర్యాదపూర్వకముగా వాటిని వారు అందించెదరు. ఇండియా దేశపు పనివారు నైపుణ్యతను కలిగినవారు.
“ఓ, నేను అటువంటివారిని అందుకొరకు సిద్దపరచెదనని అతడు తలంచుచూ, తాను తలంచిన ప్రకారము అన్నింటినీ అతడు సిద్దపరచుచుండెను. కావున ఏదీ కూడా కొదువకాకుండా సమస్తమును సమకూర్చి మరియు సమస్తమును అందుకొరకు సిద్ధపరచెను. ఆ దినములలో ఆ దేశమందంతటా పేద ప్రజలు అనేకులుండిరి.
అటు తరువాత, చివరగా ఆ సమయము సమీపించబోవుచున్నది. అందరూ ఏ విధముగా ఇంటి లోపలి భాగమును అలంకరించుకొందురో, అలాగే ఈ పరిసయ్యుడు కూడా తన గదులలో లోపలి భాగమును ఎంతో అందముగా అలంకరించుచూ, ఆ గదులను ఏమేమి వస్తువులతో అలంకరించితే బాగుంటుందో, చూచుటకు ఏవి అందముగా ఉండునో అటువంటి సమస్త అలంకరణలతో ఆ గదులను అతడు అలంకరించెను.
24
అమెరికా దేశాధ్యక్షుడు నగరాన్ని దర్శించినట్లైతే వారేమి చేయుదురో మీకు తెలుసా? ఆ అధ్యక్షుడు వచ్చుచున్నప్పుడు, ఆ దేశ పతాకములను ఊపుచూ రంగులను వెదజల్లే తారాజువ్వలను కాల్చెదరు. రైలు బండి యొద్దకు బాలికలు అతనికి ఎదురువెళ్ళి అందమైన పుష్ప గుచ్ఛములను ఇచ్చెదరు. వీధులంతా పువ్వులను జల్లెదరు. ప్రతిఒక్కరు అందమైన వస్త్రములు ధరించి రోడ్డు ప్రక్కన నిలబడి ఆ అధ్యక్షునివైపు చేతులు ఊపుదురు. అమెరికాలో నేటికి కూడా అటువంటి కార్యములు అనేకము గలవు. అవన్నీ మంచివే, కాని విషయమేమిటంటే నగరమునకు యేసు వచ్చునప్పుడు దానిని గురించి ఎవరూ ప్రస్తావించరు. దాని గురించి ఎవరికీ తెలియదు. ఆ అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు ఎవరూ ఆయనకు స్వాగతం చెప్పరు. “దేవా, మాకు పెద్ద పెద్ద ఉజ్జీవములను అనుగ్రహించమని” అనేకసార్లు ప్రార్థించెదము. కాని ఆయన వచ్చినప్పుడు, ఆయనకు మనము అసలు స్వాగతము చెప్పము. ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎల్లప్పుడూ ఆయనకు మూడవ లేక నాల్గవ స్థానమును మాత్రమే ఇచ్చుచున్నాము.
25
అనేక సమయములలో ఎన్నో పనులతో మనము సతమతమైపోతూ ఆ పనులన్నీ చెయ్యాలనే ఆలోచనలతో మన మనస్సు నిండిపోయి ఉండుట వలన ఆయన వచ్చినప్పుడు మనమాయనను ఆరాధించలేక పోవుచున్నామని మీరెరుగుదురా, నగరములోని జనులంతా అచ్చట కూడుకొని, సేవకుల సమావేశ సభలో సేవకులందరూ కలసి అల్పాహారమును భుజించుచూ అచ్చట గొప్ప కూటము ఏర్పరచుట కొరకు అనేక ప్రణాళికలను సిద్ధపరచెదరు. ఆ ఉజ్జీవపు కూటము ఎచ్చట జరుగుచున్నదో ఆ నగరమునకు ఆయన వచ్చును.
యేసు ఆ సంఘమునకు వచ్చినప్పుడు, అచ్చటయున్న ఎవరితోనైన ఒకనితో వ్యవహరించుట మొదలు పెట్టినప్పుడు, “ఆ మూర్ఖుడిని బయటకు త్రోసి వేయండి,” అని వారు అనెదరు.
యేసు నిన్ను ఆశీర్వదించాలని మరియు నీవు ఆయనకు ప్రధాన స్థానమివ్వాలని ఆశీంచుచున్నాడు. ఓ, అవును. మనకు సమస్తము చేయుటకు సమయముండును, కాని మనము ఆయనవద్ద ప్రార్థించుటకు వారానికి ఒకసారో రాత్రికొకసారో, పడక మీద పడుకొని కేవలము కొన్ని నిమిషములు మాత్రమే సమయమును ఇస్తాము, చూచారా.
“ప్రియమైన దేవా, నన్ను ఆశీర్వదించుము, నా తల్లిని, నా తండ్రిని, నా సహోదరుని మరియు జోన్స్ గారిని ఆశీర్వదించుము. ఆమేన్,” అని చెప్పి నిద్రపోతాము. కాని మనము ఆయనకు ఆఖరి స్థానమును మాత్రమే ఇచ్చుచున్నాము. అయినా కాని ఆయన నిన్ను ఎన్నడూ త్రోసివేయడు, ఏమైనాగాని నీయెడల ఆయన మంచి దేవునిగా వుండును, అందుకే ఆయనకు నేను ప్రధాన స్థానమిచ్చుట ఎంతో వాస్తవముగా ఉన్నది.
26
ఎంతో చక్కని వస్త్రములు ధరించుకొని మరియు అందమైన టోపీని పెట్టుకొని గడచిన సంవత్సరము ఈస్టర్ పండుగ రోజు నీవు సంఘమునకు వెళ్ళితివి. ఓ, నీవు గడచిన సంవత్సరము సంఘమునకు వెళ్ళావు. మళ్ళీ ఇక వచ్చే సంవత్సరమే సంఘమునకు వెళతావు. అప్పుడే మళ్ళీ ఆ సంఘకాపరి నిన్ను చూడగలడు. ఆ విధముగానే నీవు జీవించుచూ కొనసాగిపోవుచున్నావు. దేవుని కొరకు నీవు కేవలము కొద్ది నిముషములు మాత్రమే వినియోగించుచున్నావు. నీవు సంఘమునకు వెళ్ళినప్పుడు కాపరి ఒకవేళ ఇరవై నిముషముల కంటే ఎక్కువ ప్రసంగించినయెడల, “ఓ, ఏంటి, అతను ఏమనుకొని దానిని గూర్చి అంత సేవు మాట్లాడుతున్నాడని,” కోపగించెదవు. అలాగే కదా నీవు చేయుచున్నావు?
ఓ, అలా బయటకు వెళ్ళి తిరుగుచూ నీవు ధరించిన నీ అందమైన వస్త్రములు అందరికి చూపించెదవు. నీవు అలా చేసినను ఆయన దాని నిమిత్తము నిన్ను ఏనాడూ ఖండించడు. ఆయన దానిని అంగీకరించెను. దానిని బట్టియే ఆయన నాకెంతో వాస్తవముగా ఉన్నాడు. అది ఎంత చిన్న స్థానమైననూ ఫర్వాలేదు, ఆయన దానిని స్వీకరించును.
“ప్రభువా, నీవు రెండవ స్థానమును తీసుకొనెదవా?” అని నీవు అడిగినయెడల.
“సరే, అలాగే నేను రెండవ స్థానము తీసుకొనెదను,” అని ఆయన చెప్పును. పరలోకపు దేవుడు, తాను సృష్టించిన ఒక సృష్టితో.
“ప్రభువా, రెండవ స్థానమును నీవు తీసుకొనెదవా?” అని నీవు అడిగినయెడల
“సరే, అలాగే నేను రెండవ స్థానమునే తీసుకొనెదను,” అని ఆయన చెప్పును.
“మూడవ స్థానమును నీవు తీసుకొనేదవా?” అని నీవు అడిగినయెడల.
“సరే, నేను మూడవ స్థానమునే తీసుకొనెదను,” అని జవాబు ఇచ్చును.
“నాల్గవ స్థానమును నీవు తీసుకొనేదవా?” అని నీవు అడిగినయెడల.
“సరే, నీవు ఎక్కడిచ్చిననూ నేను తీసుకొనెదను.” ఆయన నిన్ను ఎన్నడునూ త్రోసివేయడు. ఏ సమయమందైనా సరే ఆయన వచ్చును, నీవు ఇచ్చే ఏ స్థలమైనా, అది పైన అటక మీదైనా సరే, నీ అతిథి గదియందు నీవు ఆయనను వుంచుటకు ఇష్టపడుట లేదు. నీ స్నేహితులు వచ్చినప్పుడు మీరంతా కలసి యేసును గూర్చి మాట్లాడుచూ, నేలపై మోకాళ్ళూని ఆయన గురించే మీ ముఖ్య సంభాషణగా వుండనిచ్చి, ఆయనను గూర్చి మాట్లాడుతూ, ప్రార్థించుచూ, ఆయన చేసిన వాటికి కృతజ్ఞతలు చెల్లించుచూ మరియు ఒకరికొకరు ఆయన గురించి సాక్ష్యమివ్వవచ్చును.
ఓ, కాని మనము అలా చేయుట లేదు. అందరూ కలిసియున్నప్పుడు పరిహాసముతో కూడిన వ్యర్థమైన మాటలను మాట్లాడుచూ, కాలము గడిపెదరు. ప్రభు యేసుతో మీరు మాట్లాడాలని తలంచినప్పుడు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, అటక మీదకు ఎక్కి మాట్లాడలనుకుంటారు, లేదా నేల మాలిగయందు వెళ్ళాలనుకుంటారు. ఎప్పుడైనా ఒకసారి ఆయనతో మీరు మాట్లాడుటకు అక్కడకు, ఇక్కడకు వెళ్ళుటకు ప్రారంభించేదరు...
27
నీవు ఆయనను ఆరాధించాలని, ఆయనను కొంచెమైనా ప్రేమించాలని, నీ హృదయమును ఆయన మండించుచుండగా, కాని నీవేమో, “ఆ, నేను పాత్రలను కడుగుచున్నప్పుడు ఆయనను ఆరాధిస్తానులే,” అని అలక్ష్యము చేయుచున్నావు. కుమారి జోన్స్ నీకు ఫోను చేసి “లిడీ, మేము, ఈ రోజు బజారుకు వెళ్ళుచున్నాము, నీవు మాతో రావాలనుకుంటున్నావా?” అని అడుగును.
“ఓ, సరే, నేను మీతో బజారుకు వచ్చెదను,” అని నీవు చెప్పెదవు.
ఇక ఆ రోజు రాత్రి అలసిపోయి ఇంటికి వెళ్ళిన వెంటనే మంచము మీదకు దూకి, “దేవా, నన్ను కాపాడుము, నా తల్లిని, తండ్రిని, అందరినీ ఆశీర్వదించుము,” అంటూనే పడక మీద వాలిపోతావు. మనము ఆ విధముగానే ప్రభువగు యేసుకు చేయుచూ, ఆయనకు ఆఖరి స్థానమును ఇచ్చుచున్నాము.
28
యేసు నగరంలోనికి వచ్చునప్పుడు అక్కడ పతాకములు ఎగుర వేయుచూ, వీధులలో ప్రజలు ఆయనను గూర్చి మాట్లాడుకొనుచూ, ఆయనను మహిమపరచుచూ మరియు రోగులు, బాధితులు ఆయన యొక్క స్వస్థతా ఆశీర్వాదములను అంగీకరించుచూ మరియు బయట వీధులలో అందరికీ సాక్షమిచ్చుచూ ఉండవలెను.
కాని మనము ఆయనకు ఆఖరి స్థానమును ఇచ్చుచున్నాము. నీవు ఆయనకు ఏ స్థానమును ఇచ్చిననూ ఎడతెగక మరల మరల ఇంకా కూడా ఆ స్థానము యొద్దకే ఆయన వచ్చును. ఎవరూ నశించుట ఆయన ఇష్టపడుట లేదు, కాని అందరూ మారుమనస్సు పొందవలెనని ఆయన కోరుచున్నాడు.
ఆ పరిసయ్యుడు విందును ఇచ్చు దినము అతి సమీపముగా యుండెను. అందుకొరకు పనిచేయుటకు పని వాళ్ళందరినీ అతడు నియమించెను. ఆ చుట్టుప్రక్కలయున్న నౌకర్లందరినీ పిలిచి ఎవరెవరు ఏ, ఏ కార్యములను నిర్వహించాలో ఆ బాధ్యతలను అతడు ఆ నౌకర్లకు అప్పగించెను. రథము ముందు పరిగెత్తువాడు ముందుగా వచ్చును. ఆ దినములలో పాలస్తీనాలో ప్రయాణములు ఎక్కువగా కాలినడకనే చేయుచుండిరి. జంతువుల తరువాత వారికున్న ఏకైక రవాణా అదియే. జంతువులు బరువులను మోసెడివి.
29
డాక్టరు, రెవరెండ్ అగు ఫలానా, ఫలానా, అతడు ఒక గొప్ప రథముపై వచ్చి ఆ ఇంటి ముందు దిగును. అతడు ఇంటి లోపలికి ప్రవేశించగా, ఆ పరిసయ్యుడు అతడిని కౌగలించుకొని ఇంటిలోనికి అతడిని తీసుకొని వెళ్ళును. ఒక నౌకరు వచ్చి గుర్రములను రథము నుండి విప్పి, వాటిని శుభ్రపరిచి, శాలలో వుంచి, అతడు విందులో వుండగా, అతని రథమును శుభ్రము చేసి మిళ మిళ మెరియునట్లు చేసి సిద్దముగా ఉంచును.
30
ప్రజలలో అనేకులు కాలినడక ప్రయాణమునే చేసేవారు. వారితోపాటు జంతువులు కూడా అదే రహదారులపై నడిచేవి. నేడు మనకున్న ప్రకారము సిమెంటు రోడ్లు మరియు తారు రోడ్లు వారికి లేవు. ఆ ఎడారుల గుండా, కొండలగుండా దుమ్ము - ధూళితో నిండిన చిన్న చిన్న రహదారులు మాత్రమే వారికి యుండెడివి.
జనులు మరియు పశువులు కూడా అదే మార్గమున వెళ్ళుచుండుట వలన దుమ్ము, పశువుల నుండి పడిన వ్యర్థాలతో ఆ మార్గము దుర్వాసనతో నిండియుండును. మరియు అది ఆ దుమ్ములో కలసిపోవుట వలన మార్గము వెంబడి అతి ఘోరమైన దుర్వాసన వచ్చును. పాలస్తీనీయులు ఆ దినములలో పైన ఒక వస్త్రము వేసుకొనెడి వారు. దానిలోపల మోకాలు వరకు వచ్చు ఒక అంగీని ధరించెడి వారు. ఆ దుమ్ముతో నిండిన మార్గము ద్వారా నడుచుచూ వెళ్ళేటప్పుడు వారి వస్త్రములు దుమ్ముతో నిండిపోయి, చెమటతో తడిచిపోవును. ఆ అంగీ పొడుగుగా ఉన్నందున ఆ దుమ్మంతా వారి కాళ్ళపై పడును. దుమ్మువలన, జంతువులు ఆ మార్గముగుండా ప్రయాణించినందువలన అతడి ముఖముపైన మరియు చేతుల పైన ఆ దుమ్ము పడుట వలన ఆ మార్గములో నడిచి వెళ్ళే వ్యక్తి దగ్గర ఘోరమైన దుర్వాసన వచ్చును.
కావున ఈ విధముగా వారు నడిచి వచ్చినందు వలన వారు తిన్నగా వెళ్ళి ఆ విందులో పాల్గొనలేరు, ఎందుకనగా ఆ మార్గమునయున్న దుర్వాసన వారిపై యుండును. మరియు పాలస్తీనాలో సూర్యుని యొక్క వేడిమిగల కిరణాల చేత వారి ముఖములు మంటతో మండుచుండును.
31
ద్వారము వద్ద ఎప్పుడూ ఒక నౌకరు నిలిచియుండును. అతిథి వచ్చినప్పుడు ఈ నౌకరు ఏమి చేయాలంటే, అతిథి యొద్దకు వెళ్ళి అతడి పాదములు కడుగవలెను. అతిథిని మొదట కలుసుకొనేది ఈ పాదముల కడిగే నౌకరే. ఉన్న నౌకర్లందరి పనులన్నిటిలో మిక్కలి హీనమైన పని పాదములు కడుగు ఈ నౌకరుదే.
మన ఆశీర్వదింపబడిన ప్రభువగు యేసు అత్యున్నతమైన స్థలమగు పరలోకములో నుండి ఈ భూమి మీదకు దిగివచ్చి కాళ్ళు కడుగు అథముడైన ఆ నౌకరువలె, ఆయన కూడా ఒక అల్పమైన పనివానిగా, మానవుని పాదములు కడిగెను. దీనిని గూర్చి ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. కాని మనమేమో మంచి వస్త్రములు ధరించుచూ, చక్కని కారుల్లో ప్రయాణము చేయుచూ, మనము ఏదో పెద్ద గొప్పని మనకు మనమే తలంచుకొనుట మీకు సిగ్గుగా లేదా? మనము దేవుని నుండి ఎంతో దూరముగా తొలగిపోవుట ఎంతో విచారించదగిన విషయము. ఓ, మనము ఎంతో భక్తిపరులము. కాని, నా భావము, దేవునికి సమీపముగా వెళ్ళుము.
32
కావున కొద్ది....
నేను దీనిని చెప్పుటకు అసహ్యపడుచుచున్నాను, కాని మన దేశములో నేడు క్రైస్తువులమని చెప్పుకొనువారిలో చాలా కొద్ది మందికి మాత్రమే దేవుని గూర్చి చాలా కొద్దిగా తెలుసు. ఓ, వారు దేవునిని ఎరిగినదాని కంటే వారియొక్క మత సంబంధమైన కార్యములను గురించే వారికి ఎక్కువగా తెలియును. ఆయన తన్నుతాను తగ్గించుకొనెను. అదే ఆయనను అత్యంత ఉన్నతమైనవానిగా నేను చూచునట్లు చేసినది. ఆయన తానేదో గొప్పవాడిగా ఉండాలనో లేక ఒక గొప్ప పేరుప్రఖ్యాతలు పొందాలనో లేక ఏదో ఒక గొప్ప దానిని కలిగియుండాలని ఆశించుచూ ఆయన ఈ భూమి పైకి దిగి రాలేదు. ఆయన వారందరికి పరిచర్యచేయు ఒక సేవకునిగా మారిపోయి తననుతాను బహుగా తగ్గించుకొనెను. ఆయనే నా ప్రభువగు యేసు. ఆయన్నే నేను ప్రేమించెదను; ఆ ఒక్క ప్రభువుకే నా జీవితములో యున్న సమస్తమును సమర్పించి ఆయన కొరకు సేవ చేసెదను, ఆయన కొరకు పని చేసెదను. ప్రజలు ఆయన వైపు చూచునట్లుగా నేను చేయగలిగిన సమస్తమును చేయుదును. ఆయనను నమ్మెదను, ఆయనను ప్రేమించెదను. ఆయన రమ్యమైనవాడు. ఆయన అమూల్యమైనవాడు.
33
ఆయన ఒక పాదములు కడుగువాడై, తువాలును తీసుకొని దానిని ఆయన నడుమునకు చుట్టుకొని శిష్యుల పాదములను కడిగి, “మీలో గొప్పగా ఉండగోరువాడు అందరికీ సేవకునిగా వుండవలెనని,” చెప్పెను. అదే ఆయన చెప్పిన ఉదాహరణగా వున్నది. ఓ, కాని మనము ఈ దినమున దానికి విరుద్దముగా ఉన్నాము. “అవునండీ! అతడి పాదముల వద్ద నేను వంగను, నీకు తెలుసా, అతడు ఒకప్పుడు త్రాగుబోతు, అతని పాదములు కడగటానికి అతడితో నాకు ఏ సంబంధము లేదు. ఓ, నేనెవరో తెలుసా? నేను డాక్టర్ జోన్స్ని” అని అతడు చెప్పును, చూచారా. ఆ కారణమును బట్టే మనము చేరవలసిన స్థలమునకు చేరుకోలేకపోవుచున్నాము. మన బలిపీఠములు బలహీనముగా వుండుటకు కారణము అదియే. మన సంఘములలో సూచనలు మరియు అద్భుత కార్యములు లేకపోవుటకు కారణము అదియే. మనకు ఒక పాతకాలపు ఉజ్జీవము లేకపోవుటకు కారణము అదియే. మనము ఒట్టివారముగా ఉంటూ, ఏదో గొప్పవారమని తలంచుచున్నాము.
ఒక వ్యక్తి ఒట్టివాడై యుండియూ, అతడు తనకు తాను ఏదో గొప్పవానిగా తలంచుకొన్నప్పుడు, అతడు తన్ను తాను మోసపరచుకొనుచున్నాడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. తాను ఏమీ తెలియని ఒక పనికిరానివాడినని తనకు తాను తెలుసుకొనవలెను. తానొక పాపినని తాను తప్పక ఎరుగవలెను.
34
తరువాత, ఆ మనుష్యుని (అతిథిని) మొట్ట మొదటగా కలుసుకొనిన నౌకరు, అతడిని ఒక కుర్చీలో కూర్చొనబెట్టును. మన దక్షిణ ప్రాంతపువారు చెప్పువిధముగా, ఇంటి ముందున్న వసారాలో అతడిని ఒక చిన్న కుర్చీలో కూర్చొనబెట్టి, అతడి కాళ్ళను పైకి ఎత్తిపట్టుకొని, అతడు ధరించిన పాదరక్షలను విప్పి, చక్కటి శుభ్రమైన నీళ్ళను తీసుకొని, అతడి కాళ్ళను కడుగును, ఎందుకనగా దుమ్ముతో కూడిన మార్గమున నడచి వచ్చుట వలన, చెమట వలన దురాస్వన వచ్చును. కాబట్టి అతడు అతని పాదమును కడిగి శుభ్రము చేసి, తరువాత వాటినంతటినీ తువాలుతో బాగా తుడుచును. తరువాత మరియొక పాదమును తీసుకొని అదే విధముగా చేయును. తరువాత విందు యొద్ద ఆ అతిథిని ఆహ్వానించుటకు చక్కగా పరచియున్న అందమైన తివాచీపై నడుచుటకు మృదువైన గుడ్డతో తయారుచేసిన జోళ్ళను అతడు అతనికి ఇచ్చును. ఆ విధముగా ఒక నౌకరు ఆ అతిథికి సరిపోయే చక్కటి పాదరక్షలను తెచ్చి అతని కాళ్ళకు తోడుగును.
35
ఇప్పుడు, అతను చాలా చక్కని అనుభూతిని కలిగి యుండును. అతని పాదములు మరియు కాళ్ళు కడుగబడినవి, దుర్వాసన పోయినది. కావున తరువాత వున్న ద్వారము వద్దకు అతడు వెళ్ళును. అతడు అక్కడికి వెళ్ళినప్పుడు, అచ్చట ద్వారము దగ్గర ఉన్న వేరొక నౌకరు చేతిలో ఒక తైలపు బుడ్డి వుండును.
36
ఇప్పుడు, ఈ తైలము ఓలీవలతో తయారుచేయబడినది. అది చాలా చక్కని జటామాంసి వాసన కలిగిన అత్తరు. ఈ జటామాంసి చాలా ప్రాచుర్యము పొందిన ఆపిల్ పండువంటిది, అది చిన్న ఎర్రని ఆపిల్ పండువలే వుండును. మీకు తెలుసా, రోజా పుష్పములు పూయడము ముగిసిన తరువాత చలికాలము వస్తున్నప్పుడు, ఈ చిన్న ఆపిలు పండే కాలము వచ్చును. ఐగుప్తులో లేదా అక్కడున్న కొన్ని దేశాలలో అవి ఉండును. నేను ఒకసారి దానిని చూచితిని, అది కొద్దిగా ఆపిలు పండువలె వుండును, మరియు దానిని నీవు నీ చేతులలో ఒకటి, రెండుసార్లు రుద్దుకొంటే, నీ చేతులలో ఎంతగా దాని సువాసన ఇంకిపోవునంటే, కొన్ని వారాల తరువాత కూడా నీవు దాని వాసన చూడగలవు.
ఈ జటామాంసి తైలమును తయారుచేయుట చాలా ఖరీదైన పని. వారు ఈ పండ్లను నూరి నూనెలో వేయుదురు, ఎందుకనగా నూనె సాధారణముగా కొద్ది రోజులకు లేదా కొద్ది వారాల లేక కొద్ది నెలలకో ఒకలాంటి పాతపడిన వాసన వచ్చును. కావున ఇది దానిని ఎల్లప్పుడూ ఎంతో తాజాగా వుంచును. చాలా ఖరీదైనది... షీబా దేశపు రాణి ఎ౦త విలువైన బహుమతులను తెచ్చి సొలొమోనుకు ఇచ్చినది. వాటిలో ఇది ఒకటి, వారు ఈ ఆపిలు పండ్లను తెచ్చుటకు చాలా ఎత్తైన పర్వతముల పైకి ఎక్కి, దీని కోసి తీసుకొని వచ్చి ఈ నూనెను తయారు చేయుదురు.
37
తరువాత, ఆహ్వానించినవాని చేతులు దుమ్ముతోను మరియు చెమటతోను నిండియుండుటవలన మర్యాద నిమిత్తము అచ్చట నిలబడియున్న ఈ పనివాడు వచ్చిన అతిథి యొద్దకు వచ్చి అతని చేతులను పట్టుకొని, తైలపు బుడ్డిలోని కొంత అత్తరును తీసుకొని అతని చేతులంతయూ రుద్దును. తరువాత అతడు ఒక తువాలును అతడికి ఇచ్చును. అతడు అతని చేతులను బాగా రుద్దును. ఇంకొంచెము అత్తరును అతడికి ఇచ్చును. అతడు దానిని తన ముఖమంతటి మీద మరియు తన మెడ వెనుక భాగమున పూసుకొనును. అప్పుడు వచ్చిన అతిథిపైయున్న దుర్వాసన పోయి, మంచి ఉపశమనము కలిగించును. మీలో ఎవరైనా పాలస్తీనాను దర్శించినట్లైయితే, ఎప్పుడైనా ఈ అత్తరును నీవు పూసుకొని రుద్దుకొనినయెడల, నేను మాట్లాడేది ఏమిటో మీకు తెలియును, అది చాలా ఉపశమనము కలిగించేదిగా యుండును.
38
పాలస్తీనా సూర్యరశ్మి నుండి వచ్చు కిరణాలు శరీరమును చాలా తీవ్రముగా మండించును. కావున అక్కడ ఉండే స్త్రీ, పురుషులు ఇరువురును ఈ అత్తరును ఉపయోగించెదరు. వారు దానిని ముఖముపై పూసుకొని తరువాత దానిని వేరొక శుభ్రమైన తువాలుతో తుడుచుకొనెదరు. ఇప్పుడు వారి పాదములు శుభ్రముగా వున్నవి. వారు చక్కని కాలిజోళ్ళను కలిగివున్నారు. మరియు వారి చేతులు శుభ్రముగా వున్నవి. వారి ముఖము శుభ్రముగా నున్నది. చెమట వాసన వారి ముఖము నుండి పోయినది. ఇప్పుడు వారికి అలసట తీరినట్లుగా అనిపించును. ఇప్పుడు అతడు అతిథ్యము ఇచ్చువానిని కలుసుకొనుటకు లోపలకి వెళ్ళుటకు సిద్ధముగా వున్నాడు.
తరువాత వారు అతిథి గదిలోనికి నడచి వెళ్ళినప్పుడు, ఆతిథ్యము ఇచ్చువాడు వారిని పలకరించుటకు నిలబడియుండును. మొదటగా, అతడు ఏదైననూ చేయుటకు మునుపే, అతని కుడి చేయిపట్టుకొని, వారి ఎడమ చేతిని ఒకరి భుజములపై ఒకరు వేసుకొని కౌగిలించుకొనెదరు మరియు ఆతిథ్యము ఇచ్చువాడు తన అతిథిని దగ్గరకు తీసుకుని, ఒక వైపు అతనిని ముద్దు పెట్టుకొనును, తరువాత మరొకవైపు అతనిని ముద్దు పెట్టుకొనును. వచ్చిన అతిధిని ఈ ఆతిధ్యము ఇచ్చువాడు తన సహోదరులవలె భావించినట్లుగా చేసిన తరువాత అప్పుడు వచ్చిన అతిధిని తన సొంత గృహములో ఉన్నట్లు అతడు అనుభూతి చెందునట్లుగా అతడు చేయును. వచ్చిన అతిధి శుభ్రముగా కడుగబడెను, అతడు ఉపశమనము చెందెను, ఇప్పుడతడు ముద్దుపెట్టబడి ఆహ్వానించబడెను.
39
అతిథ్యము ఇచ్చువాడు అతిథిని ముద్దుపెట్టుకొనిన తరువాత, అప్పుడు ఆ అతిథిని పెట్టుకున్న ఆ ముద్దు ఆహ్వాంనించు ముద్దుగా యున్నది. పిదప ఆ అతిథి ఐస్ బాక్స్ వద్దకు వెళ్ళవచ్చును లేక తనికిష్టమైనది ఏదైనా చేయవచ్చును. ఇప్పుడు అతడు తన ఇంటిలో యున్నట్లుగానే అనుభూతి చెందుతూ యుండును. కాని అంచెలంచెలుగా ఇలా అన్ని చేయకపోయినంత వరకు వచ్చిన అతిథి అతిథ్యము ఇచ్చువాడు ముద్దు పెట్టుకోలేని స్థితియందు వుండును. అతడు వచ్చిన వానిని ముద్దు పెట్టుకోలేడు, ఎందుకనగా అతడికి ఇవన్నీ చెయ్యలేదు. అతనియొద్ద దుర్వాసన వచ్చును, దుమ్ముతో నిండి, చెమట వలన అతని శరీరము జిడ్డుగా యుండును.
అతను శుభ్రపరచబడిన తరువాత అలసట తీరిన తరువాతే, అతడు ఆతిథ్యం ఇచ్చువానిని కలుసుకొని, కరచాలనం చేయబడి, మరియు బుగ్గమీద ఒక వైపు ముద్దు పెట్టుకొనబడి తరువాత మరొక వైపు ముద్దు పెట్టబడి, అప్పుడు అతడు అతిధ్యము ఇచ్చువాడు అతడిని తన నిజమైన సహోదరునివలె కౌగలించుకొనును. అప్పుడు అతడు అచ్చటయున్న స్థలమంతటా తన స్వంత గృహమువలె తిరుగుచూ, అతడికి ఏది ఇష్టమైనదో, తనకేది కావలయునో అది తీసుకొనవచ్చును.
కావున అది ఆ విధముగా చేయవలసి యున్నది. అనేకమంది లోపలికి ప్రవేశించి వచ్చిరి, వచ్చినవారు ద్రాక్షారసముతో చేయబడిన మద్యమును త్రాగుచూ, ఆ మద్యముతో నిండిన గ్లాసులను సంతోషముగా ఒకరి గ్లాసుని ఇంకొకరి గ్లాసుతో ఢీకొట్టి ఉల్లాసముగా ఉండునట్లుగా ఈ పరిసయ్యుడు వచ్చిన తన అతిథిలను వినోదపరచుచుండెను. సాధారణముగా విందులలో పరిహాసాలు, ఒకరిపై ఒకరు పడుతూ నవ్వుకుంటూ, ఇటు అటు తిరుగుచూ, వెక్కిరింతలు, వెర్రి మాటలతో నేడున్నరీతిగానే వారు చేయుచుండిరి.
40
కాని నేను ఒక దృశ్యము చూచుట సంభవించినది. అక్కడ మూలన, తలవంచుకొని, చేతులు వేలాడుతూ ఒకరు కూర్చుని వున్నారు. ఎవరో ఒకరు, “అక్కడ కూర్చొని వున్నది ఎవరు?” అని అడుగుటను నేను వినుచున్నాను. ఆయన శిష్యులు బయట నుండి ఆయనను చూచుచున్నారు. మరియు ఆయన విందుకు ఆహ్వానించబడియు, నిర్లక్ష్యము చేయబడి, శుభ్రము చేయబడకుండా, ఆహ్వానించునట్లుగా ఆహ్వానపు ముద్దు పెట్టబడకుండా ఆయన చెమటతో, మురికి కాళ్ళతో, చెమట వాసనతో అక్కడ అలాగే కూర్చునియున్నాడు.
యేసు మురికితోయున్న పాదములతో అచ్చట కూర్చుని యుండగా, ఆ నౌకరు ఏ విధముగా నిర్లక్ష్యము చేస్తూ ఆయనను దాటుకొని వెళ్ళగలిగెను? అసలు యేసుని ఎలాగ అతడు దాటుకుంటూ నిర్లక్ష్యము చేస్తూ వెళ్ళగలిగాడనే దానిని గూర్చి నేను ఆలోచించాను. దానికి కారాణము ఇదే అయి యుండవచ్చును.
ఆయన చాలా సామాన్యమైన వస్త్రములను ధరించి యుండెను. సామాన్యమైన ఒక రైతు ధరించే వస్త్రములాంటి వస్త్రములను ధరించి యుండెను. ఒక సామాన్యమైన రైతువలె నడుస్తూ వచ్చెను. ఆయనను చూచి ఈయనెవరో ఒక సామాన్యమైన రైతు, అని వారు తలంచి యుందురు.
41
నేడు అనేక సమయములలో జనులు ఎదుటివారిని చూచి వారేవిధమైన ఖరీదైన వస్త్రములను ధరించియున్నారో దానిని బట్టియే వారు ఎదుటివారిని అంచనా వేయుదురు. సహోదరుడా, ఇప్పుడు నేను ఒకదానిని మీకు చెప్పనివ్వుము. ధీనుడు ధరించిన పాత నీలిరంగు చొక్కాయి లోపల యధార్థముగా స్పంధించుచుండే నిజమైన దీనహృదయాలు గలిగిన వారిని నేనెరుగుదును. అది నిజము. ఆ యధార్థమైన హృదయముగలవారు, కాలరు వెనుకకు త్రిప్పియుండు టక్సిడో కోటును ధరించలేరు. లేదండీ, కొన్నిసార్లు ధీనులు ధరించియున్న ఆ పాత నీలిరంగు చొక్కాయి క్రింద వుండు దీన హృదయములతోనే దేవుడు స్పందించగలడు.
నేను అనేక ఉజ్జీవ కూటములను జరిగించితిని. వృద్దుడైన ఒక వ్యక్తి, అతని కళ్ళ మీద వెంట్రుకలు పడుచూ వ్రేలాడుచున్నవి, అ-ఆ-ఇ-ఈలు కూడా తెలియని అతడు, ఒక పాత నీలం రంగు చొక్కా వేసుకొని, చినిగిపోయిన దానిమీద అనేక అతుకులు వేయబడి యుండెను. అతడు నా యొద్దకు వచ్చి, నా చేయిని పట్టుకొని, “బోధకుడా, నేను దానిని హృదయపూర్వకముగా అంగీకరించుచున్నానని,” చెప్పెను. సహోదరుడా, నీవు దానిని నమ్మవచ్చును. అది సరియే. డాక్టరు, రెవరండ్, ఫాదర్ లేక అనేక బిరుదులతో పిలవబడుచూ కాలరు త్రిప్పబడి, వెనుకవైపు పావురము తోకవలెవున్న కోటును ధరించి యుండు ఒక జిత్తులమారి కంటే అటువంటి యధార్థమైన దీనహృదయము గల ఒక వ్యక్తిని నా వద్ద ఏ సమయములోనైనా వుండుటకు నేను ఇష్టపడుదును. అది నిజముగా కరకుగా వున్నది, కాని అది సత్యము. ఆయనను గుర్తించుటలో వారు విఫలమైరి.
42
ఓ, అతడు ఏలాగు ఆయనను నిర్లక్ష్యము చేసెను? ఎలా అతడు ఆయనను చులకనగా చూచెను? అయన వచ్చిన ఆ దినమున నేను ఆ ఇంటిలో పనిచేసే ఒక పనివానిగా యుండుటకు ఆశించెదను. ఓ, అప్పుడు నేను ఆయన పాదములను కడిగియుందును. ఆమేన్. ఆయన కోసము వేచిచూస్తూ నేను అక్కడ నిలబడి వుండెదను. ఆయన అచ్చటకు వచ్చుచున్నట్లుగా ముందుగా నాకు తెలిసినయెడల, ఆయన రాకకొరకు ఎదురుచూస్తూ వుండెడివాడను. కాని ఆయన ఒక వెర్రివానివలే, చూచుటకు కేవలము ఒక వెర్రివానిగా యుండెను,
నేడు మనము ఆయనను చూచుటలో విఫలమవ్వుటకు కారణము అదే. అది దేవుని యొక్క శక్తిగా యున్నను, మృతులలో నుండి క్రీస్తు పునరుత్థారుడైనను దానిని వారు వెర్రితనము అని చెప్పుచూ జనులు ఆయనను గుర్తించుటలో విఫలమగుచున్నారు. మీరు దానిని ఏటవాలుగా అని పిలుచుచూ, దానిని ప్రక్కకు త్రోసివేసి, “ఆ పరిశుద్ద గుండ్రాళ్ళ గుంపుతో తెలివి తక్కువగా ప్రవర్తించవలసిన అవసరము నాకు లేదు, నేను సంఘమునకు వెళ్ళుదును, నా ప్రక్కనున్న వారికంటే నేనే మంచివానిగా నున్నానని మీరు చెప్పుదురు. నా యేసుకు నీవు ఏమి చేయుచున్నావో నీవు గుర్తించుట లేదు.
43
అక్కడ ఆయన మురికి పాదములతో కూర్చొని యుండెను. అది నాకెంతో కలతను కలిగించుచున్నది. అక్కడ వారు ఆయనను “జేసు” (Jesu) అని పిలిచెదరు. జీసస్ (Jesus)కు బదులుగా వారు “జేసు” (Jesu) అని పిలచేదరు. మురికి పాదములతో యున్న ఆ జేసును గూర్చి నేను ఆలోచించుచున్నాను. పరలోకపు రాజు మురికి పాదములతో, కూర్చొని యుండుటను మీరు ఊహించగలుగుచున్నారా?
సరే, ఈ దినముందు అదే విధముగా అది ఉన్నది. ఈ దినమందు నీవు దానిని గూర్చి ఏమియూ చేయవు, వారు ఆయనను గూర్చి మాట్లాడెదరు, మరియు ఆయనను గూర్చి అంతయూ చెప్పెదరు, ఏమిటి? ఆయస కూటములకు వచ్చి అచ్చట అనేక అద్భుత కార్యములు చేసెను. ఆయన చేసిన కార్యములను గూర్చి వారు మాట్లాడుతూ “ఓ, అది బయల్జెబూబు, అది ఒక దురాత్మ అది ఒక దెయ్యము. అవి దెయ్యము యొక్క క్రియలే కాని మరేమి కాదు. డాక్టర్, ఫలానా-ఫలానాకు దానినిగూర్చి అంతా తెలుసు.” సరే, డాక్టర్ ఫలానా-ఫలానా ఎవరైవున్నారో పరిశుద్ధ గ్రంథములో మీరు చూశారా? అనాడు ఉన్నట్లుగానే నేడు కూడా అతడు అట్లే యున్నాడు.
44
అక్కడ యేసు మురికి పాదములతో ఆహ్వానింపబడకుండా కూర్చొనియుండెను. ఆయనను ఎవరు కూడా పట్టించుకొనుట లేదు, ఈ దినము కూడా అది ఆ విధముగానే వున్నది. ఒక గొప్ప కూటము కొరకు మనము ప్రార్థన చేసెదము. ప్రార్థించుటవలన యేసు వచ్చును. ఆయన వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకొనరు. ఆ స్థలమునకు దేవుడు వచ్చును, “మన కార్యక్రమములు జరిపించుటకే సమయమంతా మనకు సరిపోతుంది. అందుకొరకు మనము చేయవలసిన పనులు చాలా ఉంటాయి. మనము జాగ్రత్తవహించవలసిన కార్యములు చాలా యుండును. మరియు అది అంతయూ... అటువంటి ఆర్భాటములతో నిమగ్నమైపోయెదము...
చాలా సమయములలో యేసు సంఘమునకు వచ్చినప్పుడు ఆయనను ఒక అతిథిగా సత్కరించుటలేదు. దానిని గ్రహించుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక! తాను ఆతిధ్యము పొందవలెనని యేసు ఆశించుచున్నాడు. సంఘము లోనికి పరిశుద్ధాత్మ వచ్చి, సంఘమును దీవించవలెనని ఆశించినప్పుడు జనులు చల్లగా మొద్దుబారిపోయి, ఏ చలనము లేకుండా కూర్చోని యుందురు. ఆ పరిసయ్యుడు చేసిన పని కూడా అదే, అనేక పనులతో ఎంతగానో మనము నిమగ్నమైపోతాము. మనము చేయవలసిన కార్యములు మనకు ఎన్నో యుండుట వలన ఇన్ని పనులు వుండగా వాటిని వదిలివేస్తే మనము ఇబ్బంది పడతమేమోనని భయపడుచున్నాము. చింతించవద్దు, నీవు యేసుకు ఉపచారము చేస్తున్నప్పుడు నీవు దేవుని పనిలోనే వున్నావు. నీవు దేనికి ఇబ్బంది పాలవ్వవు, ఎందుకనగా నీవు దేవుని పనిలో నిమగ్నమైయున్నావు. నీవు మానవుని యొక్కకా ర్యక్రమములో వుండకపోవచ్చును, కాని నీవు యేసుకు ఉపచారము చేస్తున్నప్పుడు, నీవు దేవుని పనిలోనే వున్నావు.
45
ఆయన మురికి పాదములతో అక్కడే వుండెను. శిష్యులు లోపలకి రాలేక పోవటము నేను చూడగలుగుచున్నాను. ఎందుకనగా వారు ఆహ్వానింపబడలేదు. ఆయన ఒక్కడు మాత్రమే ఆహ్వానించబడెను. మరియు నౌకర్లు ఆయనను దాటిపోతూన్నారే కాని ఆయనను పట్టించుకొనుట లేదు. ఆయన ఒక మూలకు నడిచి వెళ్ళి, కూర్చుండెను. మనము ఈ రోజు చెప్పుచున్నట్లుగా గోడకు తగిలించిన ఒక బొమ్మవలె అచ్చట ఆయన కూర్చొనెను.
“ఓ, బ్రెన్హాం సహోదరుడా!” అని నీవు అనవచ్చు.
నిజమే, ఆ పరిసయ్యుడు ఆ విధముగానే చేసాడు. ఆయనను “గోడకు తగిలించిన ఒక పువ్వుగా,” లేక గోడమీద వ్రేలాడుచున్న ఒక బొమ్మగా లేక అటువంటి ఒకదానివలె ఉపయోగించుచున్నాము. సంఘాలు ఇప్పటికీ ఆయన యెడల అదే విధముగా ప్రవర్తించుచున్నవి.
రేపు రాత్రి నాకు ఆఖరి రాత్రి అయినట్లైతే, ఇక ఎన్నటికీ సమయమనేది లేకుండా కొద్ది సమయము మాత్రమే వుండునేమో నేనెరుగను, అందుచే ఈ రాత్రి నేను మీకు ప్రకటించుచున్నాను. మృతులలో నుండి లేచిన అదే మారని యేసు ఇక్కడ మినియాపోలిస్ అనే పట్టణమునందు ఈ రాత్రి ఆనాడు ఆయనకు వున్న అదే మారని శక్తితో ఇచ్చట ఉన్నాడు. కాని ప్రజలు దానివైపు వీపు త్రిప్పుచూ దానిని మూర్ఖత్వమని అంటున్నారు. కావున ఆనాడు వారేవిధముగా ఆయనయెడల చేసిరో, నేడు కూడా ఈ రాత్రియందు అదే విధముగా ఆయనయెడల మీరు కూడా ప్రవర్తించుచున్నారని నేను మీకు ప్రకటించుచున్నాను.
46
ఓ, మీకు సంఘములువున్నవి, పారంపర్య సంప్రదాయలు, ఒక బల్లవలె బిగుసుకు పోయినట్లుగా వుండు ఆచారములు, తిన్నగా తుపాకి గొట్టమువలె ఇరుకుగా వుండు మీ పద్దతులు మీకు వున్నవి. అవి అర్థములేనివి లేక అవి ఎందుకు పనికిరానివి. ఓ, మీ వినోదములు, అందరు కలసి చేసుకునే వేడుకలు, చుట్టూ కూర్చొని పరిహాసములాడుచూ, వెక్కిరింతలతో వెర్రి చేష్టలన్నింటిని చేయుటకు మీరు ఇష్టపడుదురు. అవన్నీ భక్తికి సంబంధించినవి కావు. భక్తి అనగా ఒక ఆరాధన. మీ తలలువంచుకొని మరియు దూడ అంకె వేసినట్లు “ఆమేన్” అని అరుచుట కాదు గాని, దేవుని యొక్క ఆత్మలోనికి వెళ్ళి, శక్తితోను మరియు ఆత్మతోను దేవుని ఆరాధించుటయే నీకు అవసరమైయున్నది. అది నిజము. కాని ఓ, మనము ఈ దినమున ఎంతో బిగుసుకుపోయి మెడ వంచనిపారముగా, గర్విష్టులుగా వున్నాము. అలాగు మనము ఉండకూడదని మీకు తేలుసా? వారు కూడా ఆ విధముగానే యుండిరి. ఆ కారణముబట్టియే యేసు ఆహ్వానించబడిన తరువాత కూడా ఆయనను అవమానించునట్లుగా ఆయనకు అటువంటి స్వాగతము లభించినది.
47
మినియాపోలిస్ పట్టణయులోనూ, ఈ అమెరికా అంతటిలోనూ మరియు ప్రతీచోట, ఎన్నోసార్లు ప్రజలు ఉపవాసముండి మరియు ఏడ్చుచూ, ప్రార్థన చేసి, “ఓ దేవా, దిగి రండి, ఓ యేసు, ఒక ఉజ్జీవము కొరకు మీరు మాకు కావాలి,” అని అందురు. ఆయన ఎక్కడో ఒకచోట ఉజ్జీవము బద్దలగునట్లుగా కుమ్మరించినప్పుడు, వారు ఆయనను కారాగారములో వేయుదురు. వారు ఆయనను అంగీకరించరు, వారు వారిని మూర్ఖులని మరియు పరిశుద్ద గుండ్రాళ్ళని పిలుచుదురు. ఎందుకనగా నీవు సరియైన వ్యక్తి కోసం ఎదురు చూచుటలేదు. ఆ నౌకరును ఆయన దాటుకుంటూ వెళ్ళెను. అదిగో అక్కడ మురికి పాదములతో, దీనమైన యేసు కూర్చొని వుండెను.
అది చెప్పుటకు నేను అసహ్యపడుచుచున్నాను. నా ప్రభువు అక్కడ మురికి పాదములతో కూర్చొని వున్నాడని మరియు ఆయన ఆహ్వానించబడి కూడా, మర్యాద చేయబడకుండా వుండుటను నేను తలంచుచున్నప్పుడు - అది నాకు ఏదో కలవరము కలిగించుచున్నది. మేము మత సంబంధమైన వారమని చెప్పుకొనుచు, “ఓ, అద్భుతములు జరుగు దినములు గతించినవి, బ్రెన్హాం సహోదరుడా, అది మూర్ఖత్వము, అటువంటిది ఏదీ నీవు నమ్మవద్దు. ఓ, నీవు కేవలం మానసికముగా ఊహించుకొనుచున్నావు. ఆ విధమైనటువంటి కార్యములు ఏమియు లేవని,” చెప్పెదరు.
48
ఆయన యొక్క పునరుత్థాన శక్తియందు ఆయనను నేనెరుగుదును. మరియు ఆయన వాస్తవముగా వున్నాడని నేను ఎరుగుదును. ఆయన నా జీవమైయున్నాడు. ఆయన నా సమస్తములో సమస్తముగా నున్నాడు. మరియు నేను చూచినప్పుడు, ప్రజలు తమను తాము క్రైస్తవులని పిలుచుకొనుచూ, ఏదో ఒక రాజకీయ కూడికగానో లేక ఏకముగా కూడి ఒక చోట నిలబడి యుండి, ఏదో ఒక పాత సూప్ విందును చేసుకొంటూ ఆ విధమైన వినోద కార్యములతో యేసుకు ఎందుకూ పనికిరాని ఆతిథ్యమును ఇవ్వవలెననుకుంటున్నారు. ఆనాటి పురాతన మేడ గదిపైన అనుభవమును కలిగియుండుట లేదు. మేడగదిపైన ఏకముగా కూడుకొని ఆరాధించే ఆ పురాతన భక్తి పోయినది. మీరు మీ పనుల ఒత్తిడిలో బంధించబడి యున్నారు. మీరు పురాతన ప్రార్థనా కూటములలో పాల్గొనుటకు బదులుగా, సంఘముచుట్టూ తిరుగుతూ, ఎందుకూ పనికిరాని వెర్రిపనులు చేయుటకు, ఇంకా అనేకమైన వ్యర్థమైన పనులు చేయుటలో మీరు ఎక్కువగా నిమగ్నమైపోవుచున్నారు. విందులు, ఉద్యానవనపు వేడుకలు, ఉల్లాసపు షికారులు, మరియు అనేకరకములైన కాలక్షేపములతో గడుపుచున్నారు.
కాలక్షేపముతో గడుపుటకు క్రీస్తు ఒక ఆటవిడుపు కాదు. క్రీస్తు ఆరాధింపబడవలసిన దేవుడైవున్నాడు, ఈ మాటలు కొద్దిగా మీకు మండుచున్నట్లుగా మరియు కందిపోవునట్లుగా అనిపించవచ్చు, కాని మిమ్ములను చక్కదిద్దుటకు ఈ మాటలు మీకు ప్రయోజనకరముగా యుండును.
ఈ రోజు మనకు ఇంకా కొద్దిగా మంటతో కందుపోవునటువంటి మాటలు అవసరమైవున్నవి, నీలోయున్న లోకమును దహించుటకు, బిగుసుకుపోయే నీ స్వభావమును బయటకు తెచ్చుటకు, ఇంకా కొద్దిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండిన మంట నీకు అవసరమై వున్నది.
వారు యేసును ఆహ్వానించి యున్నప్పటికినీ, ఆయనను ఎవరూ పట్టించుకోకుండా, అసలు పలకరించకుండా, ఏ ఉపచారము చేయనందువలన, ఆయన అలాగే కూర్చొనియుండెను. ఆయన పాదములపై, ఆయన చేతులపై, మెడపై, ఆయన శరీరమంతా చెమటతో వాసన వచ్చుచూ, ఆయన ఒక ఘోరమైన పరిస్థితిలో వుండెను. వారు ఆయనను ఆలాగుననే కూర్చొని యుండునట్లుగా వదిలి వేసిరి.
49
మరి ఈ దినమున మిమ్మల్ని మీరు సేవకులని పిలుచుకుంటున్న మీలో చాలా మంది... ఇప్పుడు ఇది మిమల్ని నొప్పించవచ్చు, కాని సేవకులని చెప్పుకుంటున్న మీరు కపటబుద్దిగలవారై, నయవంచకులై, అవిశ్వాసపు లోకమునందు నిలబడి, “ఓ, పరిశద్ధ గ్రంథము, కేవలము కల్పితమే, అందులో ఏమియు లేదు,” అని చెప్పుచున్నారు. ఏకత్వమువారగు మీరు, దేవుని ఎరుగని ప్రజలైన మీరు, మీకు నన్ను చెప్పనివ్వండి, మీరు కేవలము పైకి దైవభక్తిగల వారివలె వుంటూ, దాని శక్తిని ఆశ్రయించుట లేదు.
మీరెందుకు మిమ్ములను శుభ్రపరచుకోకూడదు? మీరెందుకు సువార్త ప్రకటింపకూడదు? ఆ దినమున ఉన్నట్లుగానే, ఈ రాత్రి కూడా ఆయన మారని నిజమైన అదే యేసుగా వున్నాడు. ఆయనను ఆ విధముగా మురికితో కూర్చోనివ్వకండి. మీ ఇంటికి రమ్మని ఆయనను హక్కుతో ఆహ్వానించెదరు, మీ సంఘమునకు ఆయనను ఆహ్వానించెదరు, కాని ఆయన వచ్చినప్పుడు చివరకు ఆ పరిసయ్యుడు చేసినట్లుగానే మీరు కూడా ఆయనకు చేసెదరు. ఆనాడు పరిసయ్యులు ప్రవర్తించినట్లే, నేడు కూడా మీరు ఆ విధముగానే ప్రవర్తించుచున్నారు. మీరు ఆ పరిసయ్యలవలే ఉంటూ తిరిగి పరిసయ్యులను ఖండించెదరు.
“ప్రవక్తల యొక్క సమాధులకు మీరు మెరుగులు దిద్దుదురు, అయితే వారిని ఆ సమాధులలో పెట్టునట్లుగా చేసిన వారు మీరే,” అని యేసు అనెను. అది నిజమే.
50
ఈనాడు, క్రీస్తుకు, పరిశుద్ధాత్మకు ఆతిథ్యము ఇవ్వడమే మనకు అవసరమైయున్నది. మురికి పాదములతో ఆయన అక్కడ కూర్చుని వుండెను, అటువంటి ఒక గుంపులో ఆయన ఆహ్వానింపబడనివానిగా వేదనతో అచ్చట యుండెను. ఈ దినమందు కూడా ఆయన ఆ విధముగానే ఉన్నాడు. గర్వాంధులైన ఒక పెద్ద గుంపుగా వారు కూడి వ్యర్థమైన పరిహాసపు మాటలు మాట్లాడుకుంటూ, వారియొక్క మత సంబంధమైన కార్యములను గూర్చి మరియు సమస్తమును గూర్చి చర్చించుకుంటూ, అచ్చట ఆయనకు ఏ ఉపచారము చేయకుండా వారు చులకనగా ఆయనను అట్లే వదిలివేసిరి. గర్వముతో బిగుసుకుపోయేలా ఇచ్చట మీ చుట్టూ ఉండే గొప్ప సంఘములకంటే, వీధిలో ఎచ్చటో ఒక మూలన ఉండు ఒక చిన్న పాత సంఘము ఈ రాత్రియందు ఆయనను ఆహ్వానించినయెడల, ఆయన ఆ ఆహ్వానము నందు ఎంతగానో సంతోషించును. అవును నిజము. ఆయన గూర్చి వారు సిగ్గుపడరు. కాని మీ సంఘములో ఉన్నత తరగతి జనులు ఉన్నారని మీరు తలంచుచున్నారు. అటువంటి ఉన్నత తరగతికి చెందిన జనులు మీ యొద్ద ఉన్నారో లేదో నాకు తెలియదు కాని వారు ఏ మాత్రము ఉన్నత తరగతికి చెందినవారు కాదు.
51
ఆ విందులో వారు మద్యముతో నిండిన గ్లాసులను ఒకదానితో ఒకటి ఢీకొట్టుచూ మద్యము సేవించుచూ, సంతోష సంబరాలతో, “జోసెఫ్ పరిసయ్యుడా, ఆనాడు జరిగిన మహాసభలో ఏమి జరిగిందో నీకు తెలుసా? హా.హా.హా... నేను నీకు చెప్పెదను, అది నీకు గుర్తున్నాదా,” అంటూ పరిహాసాలతో, నవ్వులతో మునిగిపోయిరి. “ఆ జోన్స్, ఏమి చేసాడో దానిని గురించి నేను నీకు చెబుతాను...” అంటూ వారు కలుసుకొన్నప్పుడు వారి సంభాషణలు ఎలాగు ఉంటాయో నేడు కూడా అందరూ ఏకముగా కూడినప్పుడు అటువంటి సంభాషణలతో నిమగ్నమైపోతున్నారు.
కొంతకాలము క్రితము ఒక గొప్ప సంఘమునకు సంబంధించిన ఒక కూటముకు నేను వెళ్ళితిని, ఇక్కడ కూర్చున్న వారికంటే రెండింతల మంది జనసమూహము అక్కడ కూడిరి. నగరము యొక్క ఆత్మీయ మేలుకొరకు ఆ కూటము జరుగవలసి వున్నది. వారు నన్ను ఆహ్వానించినందుకు నేను ఆశ్చర్యపడ్డాను. కాని నేను వెళ్ళినప్పుడు వారేమి చేసారో మీకు తెలుసా? ఒక ప్రసిద్ధి చెందిన సంఘశాఖవారు, “ఇప్పుడు, శ్రేష్ఠులలో ఒకరు కాదు కాని దేశములోనే అతి శ్రేష్ఠమైన ఫిడేలు వాయించువారు మరియు అతి శ్రేష్టులైన గిటారు వాయించువారు ఇక్కడ మనవద్ద వున్నారు,” అని చెప్పసాగిరి.
“సరే, అది మంచిదే, వారేమి వాయించెదరో చూసెదనని,” నేను తలంచాను.
వారేమి వాయించారో మీకు తెలుసా? దేవుడే నా తీర్పరి. ఓ,మై! బలిపీఠము వెనుక, ఒక సేవకుల కూడికలో వారు “టర్కీ ఇన్ ది స్ట్రా” (Turkey in the straw) అనే లోకపు బాణిని వాయించారు.
ఇప్పుడు, “సమీపముగా నగరములోవున్న ఒక సంఘము నుండి ప్రసిద్ధి చెందిన ఒక గాయక బృందము ఇచ్చట మనకు గలరు. వారు మన కొరకు వచ్చి పాడెదరు,” అని అతడు అన్నాడు. వారేమి పాడారో మీకు తెలుసా? “హోమ్ ఆన్ ద రేంజ్” (home on the Range). అది సంఘములో పాడే పాటలకు చెందినది కాదు, ఈనాడు ప్రజలలో ఉన్న సమస్య ఏమిటి?
ఆ తరువాత నేను వేదిక పైకి ఎక్కాను, వారు నన్ను బయటకు నెట్టివేసిరి, నేను “మీరు దేశములో అధ్యాత్మిక నాయకులుగా వుంటూ, ”టర్కీ ఇన్ ది స్ట్రా “ అనే పాటను బలిపీఠము వెనుక వాయించేదరా, మీకు సిగ్గుచేటు, మీరు నన్ను ద్వేషించుచూ, దైవిక స్వస్థతను మీరు నమ్మకపోవుటలో ఏ ఆశ్చర్యము లేదు, బోధకుల గుంపైన మీరు మిమ్మల్ని శుద్ధీకరించుకొనుటకు మరియు దేవునితో మిమ్మల్ని మీరు సరిచేసుకొనుటకు ఆ పాతకాలపు బలిపీఠపు పిలుపు మీకు అవసరమైయున్నదని,” నేను అన్నాను. అతడు బల్లపై ఈ విధముగా కొట్టుచూ, “కూర్చొనండి, కూర్చొనండి,” అని అనెను.
“ఇప్పుడు, వేదికపై మాట్లడవలసిన సమయము నాది,” అని నేను అన్నాను. కాని వారు నన్ను బయటికి నెట్టి వేశారు. ఎలాగైనా ఏది సత్యమో దానిని నేను చెప్పవలసినదే. నా మాటలనుబట్టి వారు తీర్పునందు తప్పకుండా నిలబడవలసి యుండును. ఖచ్చితముగా, అవునండీ.
52
ఈ రోజు మనకు కావలసియున్నదేమనగా శుద్దీకరించబడి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తితో నిండినవారమై, పరిశుద్ధాత్మకు ఆతిథ్యము ఇచ్చుట కొరకు దేవుని గృహము సిద్దపడవలసి యున్నది. మనము ఆయనను రమ్మని అడిగెదము, బ్రతిమాలెదము మరియు ప్రాధేయపడతాము, కాని ఆయన వచ్చినప్పుడు ఆయనను బయటకు నెట్టివేయుచున్నాము. ఆమేన్. అది నిజము. అది ఎంతటి విచారకరమైన విషయముగా యున్నది!
మురికి పాదములతో, చెమట వాసనతో, కూర్చోనియున్న యేసువైపు ఎవ్వరూ చూచుటలేదు. ఆయన ప్రజలకు సేవచేస్తున్న స్థలమును వదిలి ఎండలో రెండు రోజులు ప్రయాణించి నడిచి వచ్చెను. ఆయన కొంచెము ముందుగానే బయలు దేరెను, ఎందుకనగా ఆయన ఎన్నటికీ ఇచ్చిన మాటను తప్పిపోడు. ఆయన ఎల్లప్పుడూ చెప్పిన మాటను నిలబెట్టుకొనును. అందుకే ఆయనను నేను ప్రేమించుచున్నాను. ఆయన తన మాటను నిలబెట్టుకొనును. ఆ కారణముబట్టియే ఈ రాత్రి ఆయనయందు నాకు నమ్మకము యన్నది. ఆయన తన మాటను నిలబెట్టుకొనును. హల్లేలూయ! ఆయన ఎన్నడూ విఫలమవ్వడు. మరియు ఆయన మాట ఎన్నడూ తప్పిపోదు.
53
మరియు గుర్తుంచుకొనండి, పురుషులు లేక స్త్రీలు, బాలురు లేక బాలికలు మీరు కూడా ఆయనకు ఒక వాగ్దానము చేయండి. మీరు ఆయనను ఇక్కడ సమాధానముతోనైనా కలుసుకొనవలెను లేకపోతే ఆయనను అక్కడ తీర్పు వద్దనైనా కలుసుకొనవలయును. కాని, మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకొనవలసిన వారుగా వుండవలెను; ఆ ఒక్క పని మీరు చేయవలసిన వారుగా యున్నారు. అది నిజమే. ఆయన తన మాటను నిలబెట్టుకొనును.
ఆయన సరిగ్గా సమయమునకు అచ్చటకు వచ్చిచేరెను. ఒక్క నిముషము కూడా ఆసల్యము కాలేదు. ఆయన సరిగ్గా విందు సమయమునకు వచ్చెను. అక్కడ ఆయన ఏ ఆతిథ్యము పొందుకోకుండా అలాగే కూర్చుని వుండెను.
అక్కడ ఆ వీధిలో చూడుము, చూచుటకు ఒకటి గలదు, పైవున్న ఒక చిన్న పాత కుటీరములో నుండి ఒక తలుపు తెరుచుకొనుటను, మెట్లపై నుండి ఎవరో దిగి వచ్చుటను, వీధి వెంబడి నడుచుచూ ఒక స్త్రీ వచ్చుటను నేను చూచుచున్నాను. ఆమె ఒక నీచమైన స్త్రీవలె పరిగణింపబడుచున్నది. ఆమె ముఖముపై ముసుగువేసుకొని వున్నది. ఆమె, “ఈ రాత్రి చాలా నిశబ్దముగా నున్నది. సంగతేమిటో నాకు తెలియడము లేదు. వీధిలో ఎవరూ వున్నట్లు లేరు,” అని అనుకుంటున్నది. ఆమె ఒక వేశ్య. ఆమె ఆ నగరము చుట్టూ నడచుచున్నది. ఓ, “కాపరియగు డాక్టర్ పరిసయ్యుడు, ఒక పెద్ద విందును ఏర్పాటు చేసియున్నాడు కదా, ఆ మూలవరకు నేను నడచి వెళ్ళి చూచెదనని,” అని అనుకుంటూ ఆమె వెళ్ళీ చూచినది. ఓ, సువాసన మరియు ఆ పేద వారందరూ బయటనిలబడి, వారి నోటిలో నీళ్ళూరుచుండగా, ఈ పరిసయ్యులు లోపల మంచి గొర్రె మాంసమును తినుచూ, ద్రాక్షరసము త్రాగుచూ, చక్కటి సమయమును గడుపుచూ వుండిరి. ఆమె దానిని వాసన చూడగలిగినది. ఆమె “ఓ, అది చాలా మంచి వాసన వచ్చుచున్నది, నేను మరింత దగ్గరగా వెళ్ళి చూచెదను. ఈ ముసుగు నా ముఖము పై వున్నది గనుక, ఎవరూ నన్ను కనిపెట్టలేరు, ఎందుకనగా ఈ నగరములో నాకు చాలా నీచమైన పేరు వున్నదని,” ఆమె తలంచినది.
54
కావున ఆమె మరింత దగ్గరగా వెళ్ళెను, “ఓ, అది అద్భుతము,” కావున ఆమెను ఎవరూ నెట్టివేయకుండా, మెల్లగా ముందుకు వెళ్ళినది. ఇద్దరు మనుషులు మధ్యనుండి మెల్లగా ముందుకు వెళ్ళి ఆమె ఇలా అన్నది, “ఓ, అది భలే విందు, వారందరు ద్రాక్షరసమును త్రాగుచున్నారు, లోపల ఎంతో ఆనందముగా ఉన్నారు. అది సరియైన స్థలమే. కావున, ఇక్కడవున్న ధనికుడైన ఈ పరిసయ్యుడు నిజముగా దీనిని చేయగల సమర్థుడు, కాని ఈ పేదవారిని చూడు, చంటి బిడ్డవున్న ఆ తల్లిని చూడు, ఆమె ఇక్కడ ఏమి చేయుచున్నదని ఆశ్చర్యపోవుచున్నాను. ఆ బిడ్డ చూచుటకు అనారోగ్యముతో కనబడుచున్నది. అనారోగ్యముతోయున్న బిడ్డను ఆమె ఎందుకు ఇచ్చటకు తీసుకొని వచ్చినదని నేను ఆశ్చర్యపోవుచున్నాను. ఎందుకో ఆ తల్లి అలా చేసిందో నాకు అర్థము కావడము లేదు. అక్కడ కుంటివాడు వున్నాడు, అక్కడ గ్రుడ్డివాడూ వున్నాడు, ఆ వీధిలో యాచిస్తూ ఉండేవాడు ఇక్కడ ఏమి చేస్తున్నాడో అని ఆశ్చర్యముగా వున్నది. ఒక పరిసయ్యుని ఇంటివద్ద వీరు ఏమి చేయుచున్నారు? ఇక్కడ ఎందుకు వున్నారో నాకు తెలిడము లేదు,” అని ఆమె అనుకొనుచున్నది.
55
ఆమె పైకి చూచినది; ఆమె, “లేదు, లేదు, నేను”... ఆమె కళ్ళను నలుపుకొనినది,“ అక్కడ ఏదో పొరపాటుగా యున్నది; నేను ఖచ్చితంగా, నేను చూచుచున్నది నిజమేనా?” ఆమె మరలా చూచినది. “అది ఆయనే, అది ఆయనే, ఆయన వైపుచూడు, వారు ఆయనను ఆహ్వానించి వుండవలెను, లేకపోతే ఆయన అక్కడ లోపల వుండెడివాడు కాదు, కాని ఆయనవైపు వారెవ్వరూ శ్రద్ద చూపుటలేదు, చూడు ఆయన తననుతాను తగ్గించుకొని, తల వంచుకొని ఆ మూలలో ఎంత బాధగా కూర్చొనియున్నాడో,” అని ఆమె అనుకొనుచున్నది.
56
ఆయన పైకి లేచెను, ఆయన ఇక్కడికి నడుచుచూ వచ్చుట వలన ఆయన పాదములు, ముఖము చెమటపట్టీ మురికిగాయున్నవి. ఆయన ఒక బాటసారివలే ప్రయాణించి వచ్చుటవలన ఎవ్వరూ ఆయనను పట్టించుకొనుట లేదు. “నాకు ఈ రాత్రి మతి తప్పిపోలేదు కదా, ఖచ్చితముగా ఆయన ఆ ప్రవక్తే కదా, అవును, అది ఆయనే అయివుండాలి. ఓ, వారు ఆయనయందు శ్రద్ధచూపకపోవుటలో ఆశ్చర్యమేమి లేదు. ఆయన మురికితో, చెమట వాసనతో యున్నాడు, వారు ఆయనను శుభ్రము చేయకుండా, ఆయనను నీళ్ళతో కడుగకుండా అలాగే వదిలివేయుటయే కారణమైయున్నది,” అని అనుకొనెను.
57
ఆమె యొక్క చిన్న ముసుగు మరలా ఆమె ముఖము పై వేసుకొనెను. ఆమె వీధి గుండా వెళ్ళి, కిర్రుమనే ఆ మెట్లు మీదుగా ఇంటికి వెళ్ళి తలుపును మూసివేసినది, ఒక చిన్న బీరువా వద్దకు వెళ్ళి ఆమె దాని తలుపుతీసి దానిలో ఉన్న ఒక చిన్న సంచి తీసినది. అది ఈ విధముగావున్న ఒక మేజోడు సంచిలాంటిది కావచ్చు, ఆ డబ్బు సంచిని తీసి దానిని ఆమె క్రింద పెట్టినది, అది ఘల్లుమని ధ్వనించినది. ఆమెకు వున్నదంతా ఆ డబ్బు మాత్రమే. ఆమె దానిని చూస్తూ వాటిని బల్లపై పోసినది. ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు కారుచున్నది, “నీకు తెలుసా, ఆయన సామాన్యమైనవాడు కాదు. అచ్చటయున్న వారెవరూ ఆయనకు సమానము కాలేరు,” అని ఆమె తన మనస్సులో అనుకొనినది.
నేను మీకు చెప్పుచున్నాను, నీవు ఎవరన్నది నాకు అవసరంలేదు. కాని నీవు ఎన్నడైననూ యేసును సూటిగా చూచినట్లైతే, అది నిన్ను మార్చి వేయును, నీలో ఒక గొప్ప వ్యత్యాసమును అది కలిగించును.
“ఓ, నేనెందుకు ఏడ్చుచున్నానో నాకు తెలియడము లేదు, కాని నేను ఆయన కొరకు ఏదైనా చేయాలి. ఆయన ఆ విధముగా ఇబ్బందికరముగా అచ్చట కూర్చొనివుండుట తగదని నాలో ఏదో ఒకటి చెప్పుచున్నది... ఆయన అచ్చట. అలాగు వుండుట సరికాదు. అందుకొరకు నేను ఏదైనా ఒకటి చేసి తీరాలి,” అని ఆమె తలంచినది.
కావున ఆమె ఆ డబ్బును తీసుకొని తలుపు వద్దకు నడచినది. ఆమె “ఓ, నేను దీనిని చేయలేను, నేను దీనిని చేయలేను, ఎందుకనగా ఆయన ప్రవక్త. ఈ డబ్బును నేనేలాగు సంపాదించానో ఆయనకు తెలియును. నాకు ఈ డబ్బు ఎలాగు వచ్చెనో ఆయన ఎరుగగలడు. కావున నేను దీనిని చేయలేను... నాకు ఈ డబ్బు ఎలాగు వచ్చెనో ఆయనకు తెలుసు, కాని నాకున్నదంతా ఇది మాత్రమే. ఈ డబ్బుతోనే నేను చేయగలిగినదంతా చేయవలెను. దీనిని చేయవలెనని ఏదో ఒకటి నా హృదయంలో చెప్పుచున్నది,” దానిని చేయవలసిన విధానము అదే. అంతే.
58
స్త్రీలు ఒకలాంటి స్వభావముగలవారు. అది పురుషులకంటే భిన్నముగా వుండును. కొన్నిసార్లు వారు ఆత్మకు తమను తాము సమర్పించుకొని దానిని స్వీకరించునట్లుగా కనబడుదురు మరియు వారు ఆ ఆత్మను బహు త్వరగా పట్టుకొనునట్లుగా కనబడుదురు. అది నిజము. “ఓ, నేను దీనిని ఖచ్చితంగా చేయాలని ఏదో నాకు చెప్పుచున్నది. దానిని ఖచ్చితంగా చేయాలి,” అని ఆమె అన్నది. ఆమె ఆ చిన్న పాత మేజోడులాంటి సంచిని తీసుకొని డబ్బును చుట్టి రొమ్మున పెట్టుకొని, ముసుగుని క్రిందకు లాగుకొనెను. కిర్రుమను మెట్లమీద నుండి క్రిందకు దిగుచూ పరిమళ ద్రవ్యములు అమ్మే కొట్టుకు వెళ్ళినది.
59
ఆమె లోపలికి వెళ్ళినప్పుడు, అక్కడ వంకరగా పొడవైన ముక్కుగల ఒక వ్యక్తి కూర్చొని వుండెను. ఆ కొట్టు యజమాని బేరాలు లేక చాలా విచారముగా ఉన్నాడు, ఎందుకనగా ఆ రోజు ఎవరూ ఎటువంటి పరిమళ ద్రవ్యములు కొనుగోలు చేయలేదు. అందువలన అతను కోపముగా, నిరాశగా వుండెను. ఆమె తలుపు తీసుకొని లోపలికి వెళ్ళినది. అతను ఆమెను చూచి, “రాక, రాక, వచ్చిన బేరము చూడు ఎలాంటిదో హు, చక్కని గౌరవమైనవాడు వస్తాడనుకుంటే ఇలాంటి బేరమేమిటి?” అనుకొనెను. కనుక అతడు నేను, “నీకేమి సహాయము చేయాలి,” అని వినయముగా అడుగకుండా
“మంచిది, నీకేమి కావాలి?” అని ఆమెను అడిగెను.
“అయ్యా! కోపగించుకోవద్దు,” అని ఆమె అనెను. ఆమె ఏడ్చుచున్నదని అతడు గమనించెను.
“ఆమె ఎందుకు ఏడ్చుచున్నదో?” అని అతడు అనుకొనెను.
60
ఆమె, “అయ్యా, కొట్టులో మీ వద్దవున్న అతి శ్రేష్ఠమైన చలువరాయి పెట్టె కావాలి. నాకు మామూలు రకము కాకుండా నీ వద్దవున్నవాటీల్లో అతి శ్రేష్ఠమైనది కావాలి,” అని అనెను. నీవు ఆయనకు ఇచ్చేది అతి శ్రేష్ఠమైనదిగా ఉండాలి. అదే నీవు ఎన్నుకొనే విధానమైయున్నది. ఆయనకు నీ యొద్ద ఉన్న శ్రేష్ఠమైనవి ఇవ్వాలి. నీ యొద్ద శ్రేష్ఠమైనవి పొందుటకు ఆయన అర్హుడుగా ఉన్నాడు. కాని రెండవ రకమువంటి వాటినే ఆయనకు మనము ఇచ్చెదము. పనికిరాని ఆఖరివి మాత్రమే మనము ఆయనకు ఇచ్చెదము. కాని ఆయన అతిశ్రేష్ఠమైన వాటిని పొందుకొనుటకు అర్హుడైయున్నాడు. ఆమె సూటిగా యేసువైపు చూచినప్పుడు, ఆమె హృదయమందు ఏదో ఒకటి స్పర్శించినది. అందుకే ఆమె ఆ కొట్టు యజమానిని చూచి, “నీవద్ద వున్న వాటిలో అతి శ్రేష్ఠమైనది ఇవ్వుము” అని అన్నది. కాని మనమేమో పనికిరాని మిగిలి పోయినవి మాత్రమే ఆయనకు ఇచ్చెదము.
61
మొదట నీ కొరకు మంచివాటిని తీసుకొనెదవు, మరియు నీవు బయటకు వెళ్ళి తిరుగుచూ ఎంతో సమయమును వృధా చేస్తావు, కాని ఆదివారము ఉదయమున సంఘమునకు వెళ్ళినప్పుడు కొద్ది సమయమునే ఆయన కొరకు వెచ్చించెదవు. నీ ప్రక్కన ఇంటిలో నివసించే జోనెసకి బహుమతిని ఇవ్వడానికి ఏబది డాలర్లు ఖర్చుపెట్టెదవు లేదా సమాజములో నీ హోదాని గొప్పగా చూపించుకొనుటకు ఎంతో మూల్యము చెల్లించెదవు. చివరకు యేసు యొద్దకు వచ్చినప్పుడు నీ యొద్ద మిగిలిన వ్యర్థమైనవాటిని ఇచ్చెదవు. కాని ఆయన నీ యొద్ద యున్న అతి శ్రేష్ఠమైనవాటికి అర్హుడైయున్నాడు. ఆమె తన దగ్గరయున్నదంతా ఇచ్చివేసి, అతి శ్రేష్ఠమైన దానినే ఆయన కొరకు కొనెను. నీ యొద్ద వున్న సమస్తములో అతి శ్రేష్ఠమైనదేదో దానినే యేసు పొందుకొనుటకు అర్హుడైయున్నాడు. ఆ కారణము వలనే మనమెచ్చటా దానిని పొందుకొనలేక పొవుచున్నాము.
ఆమె, “నీ వద్దయున్న అతి శ్రేష్ఠమైనది నాకు కావాలి,” అని అడిగెను.
అతడు, “ సరే, మొదట నీ దగ్గర ఎంత డబ్బువున్నదో నేను చూడవలెను,” అని అనెను.
62
కావున ఆమె సంచీలోయున్న డబ్బును బయటకు పోసినది. అతడు దానిని లెక్కపెట్టెను. ముప్పై రోమా దేనారములు, సరిగ్గా సరిపోవును. పెట్టెకొరకు పైకి ఎక్కి జంటామాంసి అత్తరును ఆ చలువరాయి పెట్టెలో పెట్టి ఆమెకు ఇచ్చెను. దానిని ఆమె రొమ్ములో దోపుకొనెను, కొద్దిసేపు నిలబడి ఆమె కళ్ళల్లో నుండి కారుచున్న కన్నీళ్ళను తుడుచుకొనెను, ఆమె తలుపు బయటకి తొంగి చూచెను. ఈ వైపునకు, ఆ వైపునకు చూచెను, ఎవరూ రాకపోవుట చూచి, ఆమె ముఖము పైకి ముసుగు లాగుకొనెను.
అతడు, “ఆమె ఎక్కడికి వెళ్ళుచున్నదోనని నేను అశ్చర్యపోవుచున్నాను,” అని అనెను.
ఆమె బయటికి అడుగు పెట్టి మరి వీధిలో నడుస్తూ వెళ్ళుచుండుటను నేను చూచుచున్నాను, సాధ్యమైనంత వేగంగా వెళ్ళుచున్నది. మలుపులో ఇద్దరు మనుష్యులు నిలబడి యున్నారు. “చూడు, చూడు, చూడు, అక్కడ ఎవరు వెళ్ళుచున్నారో,” అని అనుకుంటున్నారు. కృంగిపోయిన మరియు విసికిపోయిన ప్రజలను మీరు ఎల్లప్పుడూ ఎగతాళి చేయవలెనని కోరుకొనెదరు.
63
మీకు నేను చెప్పనివ్వండి, ఒక చెడు స్త్రీ ఉండుటకు ముందు ఒక చెడు పురుషుడు కూడా వుండవలయును. అది నిజము, గర్తుంచుకొనండి, ఆమె కూడా ఒక తల్లి యొక్క ముద్దు బిడ్డ. ఈ దినమున సంఘము ఈ స్థితిలో వుండుటకు కారణమేమనగా, మీ సంఘములో ఉన్నత తరగతి ప్రజలే వుండవలెనని కోరుకొనుచున్నారు. కాని మీరు విఫలమై పోయారు. ఒక వ్యభిచారిణి, తిరుగుబోతుని, దొంగసారా కాచేవాళ్ళను, నగరములోయున్న నీచమైనవారిని దేవుని యొద్దకు నడిపించుటలో సంఘము విఫలమైపోతున్నది. మనము వారియొద్దకే వెళ్ళాలని యేసు కోరుకొనుచున్నాడు, మనము అటువంటి వారిని తీసుకురావాలని ఆయన ఆశించుచున్నాడు. కాని డబ్బువున్నవారిని, ఎక్కువగా డబ్బులిచ్చేవారిని, సంఘము యొక్క అప్పులు కట్టగలిగేవారినే మనము కోరుకొనెదము. మనము దానిని “అప్పర్ క్రస్ట్” (upper crust) (రొట్టెపై బిరుసుగా వుండెడి పై భాగము, బాగా డబ్బున్న ఉన్నత తరగతి మనుషులను ఈ విధముగా పిలుచుదరు - త! దా!) అని పిలుచుదుము. దానిలో చాలా బిరుసుతనము ఉండును. అది నిజము. అది ఎంత పైగా (upper) యుండునో తెలియదుగాని చాలా బిరుసుతనము (crust) యుండును. మనము ముళ్ళ పొదలయొద్దకు, రహదారులు మరియు చిన్న సందులకు వెళ్లి, వెలివేయబడినవారిని, క్రీస్తు వద్దకు వచ్చుటకు బలవంతము చేయవలెను.
64
ఆమె పైకి వెళ్ళినది, ఆమె తనదారిలో ముందుకు కొనసాగిపోవుట నేను చూచుచున్నాను. ఆమె లోపలికి చూచినది, వారి తలల మీదుగా ఆమె చూచుచున్నది. ఇప్పుడు, “ఒక్క నిముషము ఆగు, నేను దీనిని చేయకూడదు. నాలో ఏదో తప్పిదమున్నది, నేను ఈ రాత్రి మతిలేనిదానిలా వున్నాను, మరియు నేను లోపలికి వెళ్ళలేను, వారు నన్ను తోసివేస్తారు,” అని ఆమె తలంచెను. కాని, ఆమె మరలా చూచినది. ఆయన అక్కడ దీనముగా కూర్చుని యున్నాడు, ఆయన మురికి చేతులను చూచినది. మనుషులు ఆయనను దాటుకొంటూ వెళ్ళుచున్నారు. మిగిలిన వారందరూ గొర్రె మాంసమును తినుచున్నారు, వారెవ్వరూ ఆయనకు ఏదియు ఇవ్వలేదు. ఆయన అక్కడ ఆ విందులో ఏమీ తీసుకోకుండా కేవలము, అలానే కూర్చొనియున్నాడు. మరియు వారందరూ వారి బల్లల దగ్గర, ఆ విధముగా అక్కడ ఒక ప్రక్కగా ఒరిగి తినెదరు... అది మీ బాలురికి మంచిది, ఇప్పుడు గమని౦చండి పాలస్తీనాలో ఇలా పండుకుని తినెదరు, శయ్య మీద అలా ప్రక్కగా వాలుకొని ఉందురు. కావున అందరూ అలా ఒరిగి పండుకుని తినుచూ ఉండిరి. దీనుడైన యేసు అక్కడ కేవలము ఒంటరిగా అలాగే కూర్చొనియుండెను.
65
ఆమె, “ఓ, నేను లోపలికి వెళ్తే ఆ పరిసయ్యుడు నన్ను బయటికి త్రోసివేస్తాడు, కాని నేను ఆయనను ఆ విధముగా చూస్తూ భరించలేకపోవుచున్నాను. కాబట్టి నేను కేవలము ఇలా చూస్తూ ఇక్కడే నిలబడలేను. చూడు, ఆయన చూచుటకు ఏ విధముగా యున్నాడో, చుట్టూచూస్తూ, విచారముగావున్న ఆ కన్నులను చూడు...” ఆమె క్రిందికి చూస్తున్నది, ఆమె పేతురును మరియు యాకోబును, వారందరిని చూస్తున్నది. వారు అక్కడ నిలబడి ఆయనను ఎగిరి - ఎగిరి చూస్తున్నారు. ఆయన పేతురును మరియు వారినందరినీ చూస్తూ, మరలా క్రిందకు చూస్తూ అచ్చట అలాగే వేచి చూస్తున్నాడు.
66
“నేను ఇక ఎంత మాత్రమూ ఇలా చూస్తూ నిలబడలేను, కావున నేను లోపలికి వెళ్ళవలసిందే, కాని నేను లోపలికి వెళ్ళితే, నాలాంటి ఒక స్త్రీ ఆయన ముందు ఎలా నిలబడగలను, నేను అలా చెయ్యకూడదు,” అని అనుకొనెను. కాసేపటి తరువాత ఆమె, “కాని, గలిలయలో ఆయన ఈ విధముగా చెప్పుట నేను వినియున్నాను, 'ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును, ఎరైననూ ఇష్టపడిన యెడల వానిని రానియ్యుడి,'” అన్న మాటలు నాకు గుర్తు ఉన్నవి. అయితే అది ఖచ్చితంగా నన్ను ఉద్దేశించినదే, “ఎవడైననూ ఇష్టపడినయెడల,” అది నేనే, నిశ్చయముగా నేను భారము మోయుచున్నాను. అధిక భారమును మోయుచున్నాను. ఆయన నాలాంటివారినే తనయొద్దకు రమ్మని చెప్పియున్నాడు. కావున, ఇదిగో నేను వెళ్ళుచున్నాను,“ అని అనెను. ఈ రాత్రి నీవు కూడా అటువంటి ఆలోచన కలిగి వుండాలని నేను ఆశపడుచున్నాను.
సరిగ్గా ఆ పరిసయ్యుల గుంపుగుండా ఆమె వెళ్ళుచూ తన మోచేతులతో వారిని నెట్టుకొనుచూ యేసు వద్దకు చేరుకొనెను. మేడవంచని బిర్రబిగుసుకు పోయునట్లుండు గర్విష్టులైన ఈ సంఘశాఖల ఆలోచనల మార్గముగుండా నేను వెళ్ళుటకు నా మోచేతులతో వాటనన్నింటినీ నెట్టుకుంటూ నేడు మేము క్రీస్తు వద్దకు చేరునట్లుగా, దేవా, ఈ రాత్రి మాకు సహాయము చేయమని చెప్పండి,“ ఆమేన్.
అవునండి.
67
ఆ స్థలమంతా పరిసయ్యులతో నిండిపోయియున్నను, ఆ మార్గము గుండా ఆమె వారిని నెట్టుకొనుచూ వెళ్ళిపోయెను, సరిగ్గా ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి ఆమె చేరెను. ఆమె ఆ చలువరాయి పెట్టెను పగులగొట్టి, దానిలోయున్న విలువైన అత్తరును ఆయనపై పోసినది మరియు ఆమె ఆయన పాదములపై పడి ఏడ్చుటకు ప్రారంభించినది, ఆమె ఆయన పాదములను పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ, నిమురుచూయున్నది. ఆమె కొద్దిగా... తన్ను తాను మైమరచి పోయినది. ఆమె ఏడ్చుచూ, ఆ పాదములను మెల్లగా రుద్దుటకు ఆరంభించెను మరియు [సహోదరుడు బ్రెన్హాం ముద్దుపెట్టుకొను శబ్దము చేయుచున్నాడు.] ఆయన పాదములను ఆమె ముద్దుపెట్టుకొనుచుండెను, మరియు.... మంచిది, ఆమె జీవపు ఊటవద్ద వున్నది. ఇక ఎచ్చటా ఆమె సహాయమును పోందుకోలేదు, కాని ఆమె సహాయమును పొందుకోగల ఏకైక స్థలము ఇది మాత్రమే. ఆమె తన ఒళ్ళు తెలియనంతగా పరవశించిపోతూ, తన్నుతాను మరచిపోయి. మైమరచి వుండుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఏ విధముగానైననూ రక్షింపబడునట్లుగా మనము ఎక్కువసేపు మనల్ని మనము మరచిపోయి ఆయనలో లీనమైపోయి వుండునట్లుగా దేవుడు మనకు సహాయము చేయును గాక.
68
నేను రక్షింపబడినప్పుడు నన్ను నేను మరచిపోయి ఆయనలో లీనమైపోయిన ఆ ఘడియ నాకు గుర్తున్నది. ఈ పాత పారంపర్యాచారములు, బిగుసుకు పోయినట్లుండు పద్దతులయందు నేను నాదృష్టి నిలుపలేదు. ఇప్పుడు ఈమె కూడా అదే స్థితిలోయున్నది. అచ్చటయున్న దేనిపై దృష్టిని నిలుపకుండా, ఆ విందులోనికి ఆమె దూసుకొని వెళ్ళి తనకు కావలసియున్న రక్షణ కొరకై ఆయన వద్దకు చేరుకొనెను, ఎందుకనగా ఆమె తాను రక్షింపబడవలేనని ఆశించి ఆ విధముగా చేసినది. ఇచ్చటవుండు ఈ సంఘశాఖలు మరియు మనము అటువంటి సంకల్పముతో జనులను క్రీస్తు యొద్దకు నడిపించినట్లైతే వారు రక్షింపబడెదరు.
69
జరుగుచున్న ఆ విందుకు ఆమె భంగము కలిగించినది, అయినా ఆ విందును ఎవరు లెక్కచేస్తారు? ఆమె యేసు వద్దకు వెళ్ళుచున్నది. ఆమె రక్షింపబడబోవుచున్నది. ఆమె ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను చూచి కన్నీరు కార్చుచున్నది, ఆమె ఒళ్ళంతా తడిసి ముద్దెపోయి స్నానము చేసినంతగా కన్నీళ్ళు కార్చుచున్నది, బుగ్గలపైనుండి కన్నీళ్ళు కారుచుండగా, ఆమె ఆయన పాదములను తన చేతులతో ఎత్తిపట్టుకొని ముద్దుపెట్టుకొనుచూ, సున్నితముగా రుద్దుచూ, విలపించుచూ ఆయన పాదముల యొద్దనే ఉన్నది. ఎందుకనగా ఆయన ఆ పరిస్థితిలో యుండుట చూచి ఆమె అలాగే నిలబడలేక పోయినది. ఆమె జీవపు ఊటకు కర్తయగు ఆయన పాదములను ముద్దుపెట్టుకొనుచూ, సున్నితముగా రుద్దుచూ కన్నీళ్ళతో కడుగుచూ ఆ పనిలో లీనమైపోయి తననుతాను మరచిపోయినది. ఒక మగవాని ముందు నిలబడినప్పుడు ఇంతకు ముందెన్నడూ తాను పొందుకొనని అద్భుతమైన అనుభూతిని ఆమె పొందుకొనుటయందు ఏ ఆశ్చర్యమూ లేదు. ఆమె బుగ్గలపై నుండి కన్నీళ్ళు ఇంకా కారుచునేయున్నవి. ఆమె పరవశించిపోతూ తన కనీళ్ళతోనే ఆయన పాదములను తడుపుచూ, మెల్లగా రుద్దుతూ తన్మయత్వముతో ఆయన పాదములను ముద్దుపెట్టుకొనుచున్నది. [సహోదరుడు బ్రెన్హాం మరలా ముద్దుపెట్టుకొను శబ్దము చేయుచున్నారు.] మరియు మీకు తెలుసా, యేసు...
70
“కుమారుని ముద్దు పెట్టుకొనుడి,” అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆ పరిసయ్యుడు అచ్చట కూర్చొనియున్నాగాని ఆయనను ఆహ్వానించి ముద్దు పెట్టుకొనలేదు. ఆయన పాదములను కడుగలేదు, కాని ఆమె తన కన్నీటితో ఆయన పాదములను కడిగినది.
మురికితో యున్న యేసు యొక్క పాదములను కడుగుట కొరకు ఆమె కళ్ళల్లో నుండీ కారుచున్న ఆ కన్నీళ్ళు ఎంత అద్భుతమైనవి. ప్రభువైన యేసు పాదములను కడిగే పశ్చాత్తాపముతో నిండిన ఒక పాపియొక్క స్పటికము వంటి ఆ కన్నీళ్ళు ఎంత అద్భుతమైనవి. హల్లేలూయ! ఆయనకు ఆతిథ్యమిచ్చుటకు ఎల్లప్పుడు ఎవరైనా ఒకరు యుండెదరు. ఆయన వద్దకు వచ్చేందుకు ఎవరైనా ఒక్కరైనా యుండెదరు. దేవునికే మహిమ! పశ్చాత్తాపముతో ఒక పాపియొక్క కళ్ళల్లో నుండి వచ్చు కన్నీరుతో యేసు యొక్క మురికి పాదములను కడుగుటను గురించి నేను తలంచుచున్నప్పుడు నా హృదయము మండుచున్నది. ఓ, మై! దేనిని కడుగవలెను? అసలు ఈ లోకములోనే లేని అతి శ్రేష్ఠమైన స్థలమేదనగా, ఆయన పాదసన్నిధే. అప్పుడు యేసుకు కొంచెము స్వేదతీరినట్లుగా అనిపించినది. ఎవరైతే ఆయనను ప్రేమించెదరో వారు ఆయన చుట్టూయున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఆహ్లాదకరముగా అనుభూతి చెందును. నీవు కూడా ఆయనను ఎల్లప్పుడూ ఆహ్లాదకరముగా ఉండునట్లు చేయుము.
71
ఆమె అక్కడ కూర్చొనియున్న ఆయన పాదములను తన కన్నీళ్ళతో కడుగుచూ, ఆయన పాదములను ముద్దుపెట్టుకొనుచున్నది. ఆమె తన్మయముతో ఆ పనిలో నిమగ్నమైపోయేను. ఆమె ఒంగి కూర్చొని ఆ పాదములను తన చేతిలో తీసుకొని, కన్నీళ్ళతో కడుగుచూ ముద్దుపెట్టుకొనుచూ, ఆమె తన తల వెంట్రుకలను ముందుకు తీసుకొని వచ్చుటకు ఇంకా కొంచెము వంగి తన పొడవైన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుచుచుండెను. క్రింద వరకు ఒంగుట వలన ఆమె యొక్క తల వెంట్రుకలు నేలమీద పడుచున్నవి. కావున ఆమె ఆయన పాదములు పట్టుకొని తన పొడవైన వెంట్రుకలతో తుడుచుచూ, ముద్దుపెట్టుకొనుచుండెను. ఒక తువాలు వలె తన తల వెంట్రుకలతో ఆమె ఆయన పాదములను తుడుచుచుండెను. ఆమె యొక్క పొడవైన తల వెంట్రుకలు నేలపై పడుచున్నవి.
72
“స్త్రీలకు వారియొక్క తల వెంట్రుకలు ఆమె యొక్క మహిమ కొరకు ఇవ్వబడినవి,” అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. లేఖనముల ప్రకారముగా పొడవైన ఆమె యొక్క వెంట్రుకలనుబట్టి ఆమెను ఎంతో మర్యాదపూర్వకముగా ప్రశంసించవలెను. మహిమకరమైన నీ తల వెంట్రుకలను కత్తరించుటనేది బహు నీచమైన కార్యము. అది నిజము. పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ఆ పాత-కాలపు ఒకని నేను ఇంకా అలాగే నమ్ముచున్నాను. అది నిజము. నీవు నీ తలవెంట్రుకలను కత్తిరించుటనేది ఒక తప్పుడు కార్యము. అనేకమంది ప్రసంగీకులకు ఈ మాటలు కొంత మంట పుట్టించును. ఈ మాటలను బట్టి వారు నన్ను వెలుపలికి త్రోసివేసినను ఫరవాలేదు. వీధులలో నిలబడి నేను ఇలాగే ప్రసంగించెదను. వారు త్రోసివేసినను దేవుడు నన్ను తోసివేయడు.
73
ఇంకా దానిని గూర్చి నేను మీకు చెప్పనివ్వండి.
అచ్చట ఆ స్త్రీ ప్రభువు యొక్క పాదములను తన తల వెంట్రుకలతో తుడిచినట్లుగా నేడున్న స్త్రీలు ఆ విధముగా చేయాలంటే అది వారికి చాలా అవమానముగా యుండును, ఎందుకనగా స్త్రీలగు మీరు మీ తల వెంట్రుకలతో ఆ విధముగా ఆయన పాదములను తుడవవలెననిన మీరు తలక్రిందుగా నిలబడితేగాని తుడువ గలరు. అది మీకు సిగ్గుచేటుగా అనిపించుట లేదా? పరిశుద్ధ గ్రంథములో స్త్రీకి తల వెంట్రుకలు ఆమె యొక్క మహిమ కొరకు ఇవ్వబడినవి,“ అని చెప్పుచున్నది. తల వెంట్రుకలను కత్తరించుకొను తన భార్యకు విడాకులు ఇచ్చుటకు మరియు వదిలివేయుటకు ఒక పురుషునికి పరిశుద్ధ గ్రంథము అధికారము ఇచ్చుచున్నది. అది ”ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు.“ పరిశుద్ధ గ్రంథము అలాగే చెప్పుచున్నది. మీరు ఆనాటి మంచి పద్దతుల నుండి దూరముగా తొలగిపోవుటనేది ఎంతో నీచమైన కార్యముగా ఉన్నది కదా?
ఈ పాటను పాడేవారము:
మేము అడ్డుగడియలను తీసివేసాము,
పాపముతో రాజీపడ్డాము,
అడ్డు గడియలు తీసివేసాము,
మరియు గొర్రెలు బయటకు వెళ్ళిపోయెను,
కాని మేకలు ఏ విధముగా లోపలికి వచ్చెను?
మీరు కేవలం అడ్డుగడియలను తీసివేయండి, అంతే చాలు.
ఆమె యొద్ద ఏమియున్నది? స్త్రీలకు మహిమకరముగా యుండు పొడవైన తల వెంట్రుకలను కలిగియున్నది. ఆమెకున్న సమస్తమునూ యేసు పాదముల యొద్ద ఉంచెను. మీరు అటువంటి స్థలమునకు వచ్చినప్పుడు మీకున్న సమస్తమునూ ఆయన పాదముల యొద్ద పెట్టెదరు. నీ సమస్త మహిమను [టేపులో ఖాళీ వున్నది.] ఆమె దగ్గరయున్న ధనమంతటితో, ఆమెకున్న సమస్తముతో జటామాంసి అత్తరును కొని దానినంతటినీ ఆయన తలమీద పోసెను. ఆ అత్తరులో కొంచెము కూడా మిగల్చకుండా మొత్తము ఆయన మీద క్రుమ్మరించెను. ఇక ఆమెయొద్ద ఏమీలేదు. ఆ అత్తరునంతటినీ ఆయనపై పోసినది. నీవు ఆయన దగ్గరకు రావాలనుకున్నప్పుడు నీవు చేయవలసిన విధానము అదే, నీ యొద్దనున్న సమస్త స్తుతులను, సమస్త మహిమను ఆయనపై కుమ్మరించుము. నీకు కలిగియున్న సమస్తమును ఆయన పాదములవద్ద పెట్టుము. హల్లేలూయా! అలా చేయకపోవుటవలననే మనము ఒక ఉజ్జీవమును పొందలేక పోవుచున్నాము. దానికి కారణమేమనగా, ఆ విషయములో నీవు ఒక పిసినారిగా వున్నావు, ఆమేన్. నీ యొక్క మహిమను వేరొక దానితో, ఇంకొకరితో పంచుకోవాలను కుంటున్నావు. కుమారి జోన్స్, నీకు తెలుసా, ఆమె ఈ రకమైన వస్త్రములు ధరించెను, ఆమె దీనిని చేసినది,“ అనే వ్యర్ధమైన మాటలు మాట్లాడెదవు. ఓ, నీవు ఒక పరిసయ్యరాలివి. ఎవరో ఒకరివలే వుండుటకు వారిని వెంబడించుచూ, ప్రవర్తించుటకు నీవు ఇష్టపడెదవు. ఈ దేశమును ఒక ఉజ్జీవము ద్వారా యేసు బ్రద్దలుచేయలేడు, అందులో ఏ ఆశ్చర్యము లేదు.
74
ఈ రోజు నాకు ఏమైనదో నాకు తెలియుటలేదు. కాని నా మాటలు సత్యము. ఎంతో బిర్రబిగుసుపోయివున్న వారితో అసలు మెడవంచని వారితో, చల్లగా చల్లారిపోయిన వారితో, అసలు దేనితోను ఏకీభవించని వారితో తిరుగుతూ నీవు స్నేహము కలిగియుందువు. అనగా నీవు దెయ్యముతో స్నేహముచేస్తూ వానితో పాలిభాగస్తుడవై యున్నావు. అందువలననే నీకున్న సమస్తముతో నీవు ఆయన యొద్దకు రాలేకపోవుచున్నాను. అది నిజము. నేను మిమల్ని మరలా చూడలేకపోయినయెడల, న్యాయతీర్పు దినమందు శుద్ధ హృదయముతో నేను మిమ్ములను సంధించెదను, ఎందుకనగా ఇదీ సత్యమని నేను ఎరుగుదును. అందువలననే నీవు చేయవలసిన దానిని నేను నీకు చెప్పుచున్నాను.
కాని ఈ దీన మర్త్యురాలు ఏడ్చుచూ తన కన్నీళ్ళతో ఆయన పాదములను కడుగుచూ తనకు మహిమగా ఇవ్వబడిన పొడవైన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుచుచున్నది. ఎటువంటి అద్భుతమైన సమయమది. దీనిని చూస్తూ అక్కడ నిలబడివుండవలెనని నేను ఆశించుచున్నాను. ఆమె ఎవరి ముందు నిలబడియున్నదో నేను అచ్చట ఉండాలని ఆశపడుచున్నాను. ఆమె పశ్చాత్తాపముతో కన్నీరు కార్చుచూ స్పటికమువంటి ఆ కన్నీళ్ళతో ఆయన పాదములను తడుపుచూ, కడుగుచూ, ముద్దాడుచూ, తనకు మహిమకరమైన తల వెంట్రుకలతో పాదములను తుడుచుచుండుట. ఓ, ఎంతటి అద్భుతమైన సమయమును ఆమె కలిగియున్నది. ఆ వెంట్రుకలతో ఒక తువాలువలే ఆయన పాదములను తుడుచుచూ, ముద్దాడుతూ పరవశముతో తననుతాను మరచిపోయినది.
75
“మరి ఆ విందు సంగతేమిటి?” అని నీవు అడగవచ్చు. ఆ విందు ఏమైనదో దానిని గురించి ఎవరు పట్టించుకొనెదరు? అంతకంటే ప్రాముఖ్యమైన విషయమేమనగా, ఒక పాపి దేవుని యొద్దకు వచ్చినది. ఆమేన్. నేడు మనకున్న సమస్య ఏమిటంటే, ఎప్పుడూ పాత ఆచారములయందు ఎక్కువగా అభిమానమును మనము కలిగియుండుటయే. అటువంటి ఆధారములేని ఆచారముల ద్వారా పాపులను దేవుని యొద్దకు మనము నడిపించలేము. హల్లేలూయ.
ఓ, దీన పాపియగు ఈమె పశ్చాత్తాపముతో కన్నీళ్ళు కార్చుచుండగా, అవి ఆమె బుగ్గల మీదనుండి కారుచూ ఆయన పాదములను తడుపుచున్నవి. ఆ పాదములను చేతులతో పట్టుకొని, ఆమె తన కన్నీళ్ళతో కడుగుచూ, తన పెదవులతో ఆయన పాదములను ముద్దుపెట్టుకొనుచూ, తనకు మహిమకరముగా ఇవ్వబడిన తన తల వెంట్రుకలతో పాదములను తుడుచుచున్న ఆ దృశ్యము ఎంతో అందమైనదిగా యున్నది. అప్పుడు యేసు అలసట నుండి సేదతీరినట్లుగా అనుభూతి చెందెను.
76
పరిసయ్యుని గూర్చి ఏమిటి? ఓ, ఆ విందు ఆగిపోయెను. నిశ్చయముగా కలవరపరచున్న ఆ సన్నివేశమును, ఆ పరిసయ్యుని నేను చూడగలుగుచున్నాను. అదిగో ఆ పాపి అక్కడ వున్నాడు. ఆ స్త్రీ కాదు; పరిసయ్యుడే ఒక పాపి. అవిశ్వాసమే పాపము. ఆ స్త్రీ ఒక విశ్వాసురాలు. ఆ పరిసయ్యుడు ఎంతో మత భక్తితో అనేక కార్యములను కలిగియున్నాగానీ, ఆ దేశములోనే అతడే అతి ఘోరమైన పాపిగా ఉన్నాడు. ఇప్పటికీ ప్రపంచములో అతి ఘోరమైన పాపలువున్నారు. బీర్ర బిగుసుకు పోయినట్లుండు గర్విష్టులు, మెడవంచని వారు, దారితప్పిపోయిన సంఘము, మరియు ఆ సంఘ కాపరి కూడా అదే విధముగా యుండును. హల్లేలూయ!
77
ఈ మాటలు వినిన తరువాత మీరు నన్ను ద్వేషించెదరు, కాని దేవుడే ఈ విధముగా దీనిని చెప్పమని నాకు చెప్పెను, కాబట్టే నేను ఈ విధముగా చెప్పవలసియున్నది. ఆమేన్. కావున నా మాటలు ఇలాగే ఉండును. పాపులకు, బిర్రబిగుసుకు పోయి గర్వముతో ఉన్నవారికే ఈ మాటలు వర్తించును.
ఈ దీన స్త్రీ ఆయన పాదములను కడిగిన తరువాత. అక్కడ పరిసయ్యుడు నిలబడి చూస్తూవుండెను, “హుమ్-హుమ్.” మై, అతని ముఖము ఎర్రగా మారిపోయి మరియు అతని పెదవులు తెల్లబారిపోవుటను నేను చూచుచున్నాను. ఓ మై, అతడు కోపోద్రేకముతో ఊగిపోవుచున్నాడు.
ఆ పరిసయ్యుడు, “జోన్స్, మీరందరూ ఇప్పుడు అటువైపు చూడండి, ఆ మనిషి ఒకవేళ ప్రవక్త అయిన యెడల లేదా దీర్ఘదర్శి అయినయెడల, తాను ఆ కోవకు చెందిన వ్యక్తినని చెప్పుకొంటున్న ఈయన, మరి ఈ స్త్రీ ఎటువంటిదో తెలిసియుండవలెను కదా? హో! ఆయన ప్రవక్త కాదు, ఏదీ కాదు. ఆ స్త్రీ ఎలాంటిదో ఆయన ఎరిగి యుండవలెను కదా? కావున ఆయన తాను చెప్పుకొనుచున్నట్లు ఒక ప్రవక్త కాదు. ఖచ్చితంగా, ఈ స్త్రీ ఆయన కీర్తిని పాడుచేయును,” అని అన్నాడు. యేసుక్రీస్తు తన పేరు ప్రతిష్ఠలను అటువంటి పాపుల మధ్యలోనే కలిగియున్నాడు. ఖచ్చితముగా, అటువంటి పాపులు మాత్రమే ఆయనను స్వీకరించెదరు. బిర్రబిగుసుకు పోయిన వారియొద్ద, మెడవంచని గర్విష్ణుల యొద్ద, ఏమీ ఫర్వాలేదులే, అని రాజీపడే వారియొద్ద, పాతకాలపు పారంపర్యాచారాలను, వాటికి చెందిన పుస్తకములను చదువుచూ అటువంటి వాటిని వెంబడించు వారియొద్ద మరియు మేము సువార్తను బోధించుచున్నామని పేరుకు చెప్పుకొను వారియొద్ద ఆయన కీర్తి వర్ధిల్లదు. నీవు నీ సంఘములో కీర్తిని కలిగియుండాలని ఆశించుచున్నట్లైతే, నీ ద్వారా ఈ లోకములో ఏ విధముగా ఆయన కీర్తిని పొందకోగలడు? ఆమేన్.
78
ఆ పరిసయ్యుడు అక్కడ వున్నాడు, అతను, “చూచారా, ఆయన దీర్ఘదర్శి అయినయెడల, ఆయన గొప్పవాడైతే, తనను తాకుచున్న ఆ స్త్రీ ఒక పాపియని ఆయన ఎరిగియుండును,” చూచారా, ఆయన చుట్టూ ఉన్నవారు ఆయననుగూర్చి ఆ విధంగా మాట్లాడుచున్నారు.
ఏమి జరిగినదో చూద్దాము, ఆయన అసలు కదలకుండా ఆమెనట్లే గమనించుచుండెను. పాపియగు ఆమె పశ్చాత్తాపపడుట ఆయన గమనించుచుండెను. ఆయన ఎంతో చక్కని అనుభూతిని చెందుతున్నాడని నేను నమ్ముచున్నాను. ఆమె తననుతాను మరచిపోయి ఆయన పాదములను కడుగుచుండుట వలన ఏ మాత్రము ఆయన తన పాదములను కదిలించినా, తాను చేయుచున్న కార్యము ఆయనకు అభ్యంతరముగా ఉన్నదేమోననీ ఆమె తలచి ఉలిక్కిపడి లేచునేమోనని ఆయన తన పాదములను కొంచెము కూడా కదిలించకుండా అలాగే కదలకుండా కూర్చొనెను.
కాసేపటి తరువాత పరిసయ్యుడు, “మీరు చూడండి, చూడండని” అనెను...
ఇప్పుడు జరిగిన మొదటి కార్యమును మీరు గమనించండి, ఆయన ప్రక్కకు జరిగి తన తల పైకి ఎత్తి చూచెను, ఆ స్త్రీ ఆగి, సగము వంగి ఆయనవైపు చూచుచున్నది. ఆమె ఆయన పాదములను ముద్దుపెట్టుకొనుటవలన, యేసు పాదములపై యున్న మురికి, తైలము, ఆమె పెదవులపైన, ముఖమంతటా అంటుకొనియుండెను మరియు ముఖము ప్రక్కనుండి వ్రేలాడుచున్న వెంట్రుకలను చూడండి. ఆమె ఆయనవైపే చూచుచున్నది. యేసు మాట్లాడుటకు ఆరంభించెను. ఆమె ఆయన వైపే చూస్తూండగా, ఆయన కూడా ఆమెవైపే చూచుచుండెను. తరువాత ఆయన పరిసయ్యునివైపు చూచెను. ఓ,మై! దీనిని గమనించండి, తీర్పునందు ఏ విధముగా వుండునో చూడండి. ఆయన, “సీమోను, నేను నీతో ఒకటి చెప్పవలయుననెను.”
79
“సీమోను, నేను నీకు చెప్పుటకు ఒక విషయము గలదు, డాక్టర్ సీమోను, నీవు నన్ను ఇక్కడికి ఆహ్వానించితివి. మరి నీవు ఆహ్వానించినందునే నేను ఇక్కడికి వచ్చితిని. నేను వచ్చినప్పుడు నా పాదములను కడుగుకొనుటకు నీళ్ళను నీవు ఇవ్వలేదు. నా ముఖమునకు మరియు నా చేతులకు తైలమును పూయలేదు. నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు. సీమోను, నీవు నన్ను ప్రేమించనూ లేదు. సీమోను, నీవు నన్ను ప్రేమించినట్లైతే, నా పాదములను నీవు కడిగియుందువు. నీవు నన్ను ప్రేమించినయెడల, నీవు నాకు తైలము పూసియుందువు, నన్ను నీవు ప్రేమించియుందువు, నాకు తైలము పూసియుందువు. నన్ను ముద్దు పెట్టుకొనియుందువు, కాని నీవు నాకు స్వాగతమే పలుకలేదు,” అని అనెను.
లావుగా, బొద్దుగాయున్న ఆ పరిసయ్యుని క్రియలు ఆ విధముగానే యుండెను, నేడు కూడా అది ఆ విధముగానే ఉన్నది. “ఓ, వారికున్న డిగ్రీ పట్టాలతో ఉబ్బిపోవుచున్నారు. అవును.
ఆయన అన్నాడు, “నీవు నన్ను ముద్దుపెట్టుకొన లేదు.” ఓ, నేను ఆయనను ముద్దుపెట్టుకొనగోరుచున్నాను. “కుమారుని ముద్దుపెట్టుకొనుడి, లేనియెడల ఆయన కోపించునని,” పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆయనను ముద్దు పెట్టుకొనుడి.
ఆయన, “నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కాని, ఈ దీన స్త్రీ, ఆమె లోపలికి ప్రవేశించినప్పటి నుండి కన్నీళ్ళతో ఆమె నా పాదములను కడుగుచూ, తన తల వెట్రుకలతో వాటిని తుడచుచూ, ఆమె ఎడతెగకుండా నా పాదములను ముద్దు పెట్టుకొనుచూనే వున్నది,” అని అనెను. (ఓ, దేవా!) “ఈ చిన్న స్త్రీ, ఆమె నా పాదములను తన కన్నీళ్ళతో కడిగెను. ఆమె చేతులతో పట్టుకుని తన తల వెంట్రుకలతో నా పాదములు తుడిచెను. ఆమె నా పాదములను ముద్దు పెట్టుకొనెను,” అని యేసు అనెను.
80
ఆమె నిలబడి వున్నది. ఏమి చెయవలెనో ఆమెకు తెలియుటలేదు. ఆమె కళ్ళు ఆయనవైపే తేరిచూచుచున్నవి.
ఆయన తిరిగి ఆమె వైపు చూసి, “ఆమె యొక్క విస్తారమైన పాపములన్నీ క్షమించబడెనని నేను చెప్పుచున్నాను,” అని చెప్పెను.
ఆ మాటలే ఆయన నాతో చెప్పవలెనని నేను కోరుచున్నాను. “విస్తారమైన ఆమె యొక్క పాపములు క్షమింపబడివి. సమాధానముతో వెళ్ళుము, బిడ్డా,” అని ఆయన చెప్పెను.
నేను ఇక ప్రసంగించలేను.
81
ఒక్క నిముషము మనము తలలు వంచెదము. [ఒక సహోదరుడు అన్యభాషలో మాట్లాడుచున్నాడు.] మీరు ఆయనను ప్రేమించుచున్నారా? మీరు ఆయనను ప్రేమించుచున్నారా? సహోదరుడా, తీర్పు దినమందు ఆయన నీకేమి తీర్పు తీర్చబోవుచున్నాడు? నీవు ఎంతో భక్తిపరుడవై వుండవచ్చును. ఈ లోకము చెప్పుదానికంటే ఆయన ఏమి చెప్పునో దానినే నేను వినగోరుదును. ఆయన చెప్పినదాని యందే నేను నిలబడాలని ఆశించుచున్నాను. నేను అచ్చట నిలబడితేనే బాగుండును. ఏదో ఒక రోజున ఆయన వద్దే నిలబడవలెనని నేను ఆశించుచున్నాను. అప్పుడు ఆయన నన్ను చూచి, “భళా! మంచి దాసుడా! చక్కగా దానిని ముగించావు, నా మంచి నమ్మకమైన దాసుడా! నీవు నమ్మకముగా ఉంటీవి. నీకు నియమించిన బాధ్యతయందు చక్కగా నిలబడితివి. నీవు దానిని తప్పించుకొనలేదు. నీవు సత్యమును చెప్పితివి. అందునిమిత్తము ఎన్ని ఇబ్బందులపాలైననూ వాటిని లెక్క చేయకుండా నీవు సత్యమునే పలికితివి. దానిని ఎంతో చక్కగా చేసి ముగించావు,” అని చెప్పును. దానికొరకే నేను ఎదురుచూచుచున్నాను. ఒక శ్రేష్ఠమైన కారు కొరకు, శ్రేష్ఠమైన స్థానము కొరకు కాదు; నాకు ఆయన కావాలి, నీ గురించి ఎవరేమనుకున్నను దానితో నీకు ఏ సంబంధములేదు.
82
నేను ఆశ్చర్యపడుచున్నాను, మనము తలలు వంచివుండగా, ఒక్క నిముషము. సంగీతము వాయించువారు దయచేసి ఒక శృతిని వాయించగలరా? ఆ స్త్రీవలె ఈ రాత్రి ఎవరైనా ఒక్కరైనా ఇక్కడ ఉండగలరా, అని నేను ఆశ్చర్యపోవుచున్నాను. వ్యభిచారివై ఉండనవసరము లేదు... నీవు వ్యభిచారివి కాకపోవచ్చు, అయితే నీవు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యభిచారివి కావచ్చు. వ్యభిచారమనగా ప్రతిసారి కేవలము లైంగిక సంబంధమే కాదు. నీవు నీ సమయాన్ని వృథాపరచుట ద్వారా, నీ విశ్వాసమును వ్యభిచారము చేయుట ద్వారా, ఏదో ఒక వర్గమునకు చెందినవారితో చేరుట ద్వారా, లేదా పాతబడి చల్లారిపోయిన జీవము లేని సంఘములో చేరుట ద్వారా కూడా నీవు ఒక వ్యభిచారివగుదువు. నీవు అదే. ఆమె ఒక అపరాధిగా యున్నట్లుగానే నీవునూ ఒక అపరాధిగానేవున్నావు. కాని ఆమెను క్షమించిన అదే ప్రభువైన యేసు దయతో నీ కొరకు వ్యాజ్యమాడుటకు ఈ రాత్రి ఇచ్చట యున్నాడు
83
నీవు ఇక్కడికి వచ్చి ఒక్క నిముషము నాతో పాటు బలిపీఠము వద్దకు వచ్చి నిలచేదవా? ఎవరైనా బలిపీఠమువద్దకు నడిచివచ్చి “నేను క్రీస్తును నా రక్షకుడిగా అంగీకరించగోరుచున్నాను,” అని చెప్పెదరా. మొదట నీ చేయి ఎత్తేదవా? “బ్రెన్హాం సహోదరుడా, నా కొరకు ప్రార్ధించ౦డని,” చెప్పెదవా.
84
ఈ భవనములో ఒక్క పాపి కూడా లేడని మీరనుకుంటున్నారా? దేవుడు నిన్ను ఆశీర్వదించును, అయ్యా! దేవుడు నిన్ను ఆశీర్వదించును. సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించును. మీరు దైవిక స్వస్థత అంటే ఇష్టపడరా! ఖచ్చితముగా, రొట్టెలను మరియు చేపలను ఇష్టపడరా! కాని నీవు ఆయన వద్దకు రావలసిన సమయము ఆసన్నమైనప్పుడు, ప్రాకుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ మరలా చిప్పలోకి దూరిపోవునట్లు దూరిపోవుచూ, మరలా మెల్లగా వెనక్కి జారిపోవుటకు నీవు ఆశించుచున్నావు.
ఓ, “నాకు వాటినిగూర్చి ఏమియూ తెలియదు,” అని వారు అనెదరు. రాత్రంతయు ఆ అంబులెన్స్ సైరన్ నాకు వినబడుచునే యుండును, ప్రతీసారి మీరు సమాధులను దాటి వెళ్లుచున్నప్పుడంతా, మీ సమాధి సంఖ్య అక్కడ వున్నదనే
దానిని గుర్తుంచుకొనండి. నిత్యత్వము అవల గట్టున ఉన్నది. ఏదో ఒక దినమున ఆయన ముందు నీవు నిలబడబోవుచున్నావు. అక్కడ నీవు పశ్చాత్తాపపడ లేవు, దానిని నీవు చేయుటకు ఇదే నీ సమయము; కావున జాగ్రత్తపడితే మంచిది.
“దేవా, నాయందు దయచూపుము, ఇప్పుడే నేను యేసును నా రక్షకునిగా అంగీకరించుదును,” అని నీ చేయి పైకెత్తి చెప్పెదవా, బాలుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.
ఇంకెవరైనా మీ చేయి పైకి ఎత్తి, “దేవా, నా యెడల కనికరము చూపుము. నాకు ఈ దినము యేసు కావలెను,” అని చెప్పెదరా. దేవుడు నిన్ను దీవించును గాక, కుమారుడా. దేవుడు నిన్ను దీవించును గాక, అమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా? అక్కడ పైన బాల్కనీలో, దేవుడు నిన్ను దీవించును గాక. అవును, నిన్ను నేను చూస్తున్నాను సహోదరుడా. దేవుడు నిన్ను దీవించును గాక. యవ్వన స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక.
85
ఓ, నాకు తెలుసు నీవు తప్పులు చేసియుండవచ్చును, కాని ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నీవు రావాలని కోరుచూ ఆయన చాచిన చేతులతో నిలబడియున్నాడు, నీవు వున్న రీతిగానే ఆయన యొద్దకు రమ్ము.
పైన బాల్కనీలో సహోదరీ, నిన్ను నేను చూస్తున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. మురికి పాదములు కలిగివుండిన అదే యేసు వైపు నీ చేయి ఎత్తియున్నావని నీవు ఎప్పటికీ మరువకు.
నేను ప్రసంగించిన అంశము అనేక సంవత్సరముల క్రిందట జరిగినది. నా ప్రియ సహోదరీ, సహోదరుడా, ఈ నగరములో కూడా అలాగే జరుగుచున్నది. సరిగ్గా ఇక్కడే ఈ రాత్రియందు. ఆయన చెప్పిన విషయమును ఆలోచించుటకు వారు ఎన్నడూ ఇష్టపడుట లేదు. నీ స్థానములో నేను వుంటే నేనేమి చేయుదునో నాకు తెలుసు, తిన్నగా ఆయన యొద్దకు నడచి వెళ్ళి, “ప్రభువైన యేసు, నా పాపములను క్షమించుము, నీ నిమిత్తము నేను ఆ మురికిని తీసుకొనెదను. ప్రభువు నిమిత్తము తృణీకరించబడిన వారిలో నేను కూడా ఒకనిగా యుండుటకు వారు నడచి వెళ్ళిన ఆ మార్గమునే నేను ఎన్నుకొనెదను. అలాగే దానిని నేను చేయుదును,” అని చెప్పుదును.
86
చేయి ఎత్తని వారు ఇంకెవరైననూ వున్నారా? నీ చేయి పైకి ఎత్తి “యేసూ, ఇదిగో నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను?” అని చెప్పుదురా. అయ్యా, అక్కడ వున్న నీవు, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఇక్కడవున్న చిన్నదానా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.
87
ఇంకెవరైనా మీ చేతిని పైకెత్తైదరా? నాకు ఆశ్చర్యముగా యున్నది మేము పిలుచుచుండగా... సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇచ్చట ఈ భవనములో స్వస్థతా కూటము జరుగుచుండగా, దేవుడేవిధముగా రోగులను స్వస్థపరచెనో, నీ హృదయ రహస్యములను ఆయన ఏ విధముగా బయలుపరచెనో, వాటిని గమనించి నీవు నమ్మినట్లయితే. ఇచ్చట ఒక డజను లేదా ఇంకా అనేకమంది చేతులు పైకెత్తెదరని నేనెరుగుదును. నాకు తెలుసు.
ఓ, నీవు ఒక క్రైస్తవుడనని చెప్పుకొనుచున్నావు, అవును, కాని నేను మాట్లాడుచున్నది దానిని గురించి కాదు. పరిసయ్యుడు కూడా అలాగే చేసెను. నేను మీకొక ఆహ్వానము ఇచ్చుచున్నాను.
మీ తలలు వంచియుండగా, మరియు పియానో వాయించుచుండగా, చేతులు పైకెత్తిన మీరందరూ మరియు ఎత్తని వారు, మీరు ఇక్కడికి వచ్చి, ఒక్క నిముషము ప్రార్థన కొరకు వచ్చి నిలబడేదరా? మీ కుర్చీలో నుండి లేచి వచ్చెదరా? ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడండి. ఎన్నడూ చూడని గ్రుడ్డివారు చూచునట్లుగా కన్నులు తెరచి కనుచూపును ఇచ్చుచూ, చెవిటివారి చెవులు వినబడునట్లుగా, బాధలలోవున్నవారు విడుదల పొందునట్లుగా దేవుడు నా ప్రార్థనను ఆలకించినయెడల, ఆనాడు చేసినట్లుగానే, ఖచ్చితముగా ఆయన అదే విధముగా ఇప్పుడు చేయును. ఆయన మీ ఆత్మలను స్వస్థపరచును. ఈ రాత్రియందు నా ఆత్మ కదిలింపబడినది. ఓ, ఆయన ఇక్కడ వున్నాడు.
88
సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా, పైకి లేవండి. “నా సమస్తము, నా రక్షకా నీకిత్తు, నా సమస్తమూ.”
మీరు సరిగ్గా ఇక్కడకు వచ్చెదరా, సరిగ్గా ఈ ప్రక్కన నిలబడెదరా? నిన్ను ప్రభువువద్దకు రమ్మని ఆహ్వానించే ఈ ఆహ్వానము నీకు ఇదే ఆఖరిసారి ఆహ్వానమై యుండునేమో? ఇంకెన్నడూ నీకు ఈ ఆహ్వానము రాదేమో? ఇక నీకు సమయమనేది ఉండకపోవచ్చు, నీవు ఇక రాలేకపోవచ్చు. అతి తొందరలో నీ జీవిత ప్రయాణము అంతమైపోవచ్చు. ఇక్కడకు వచ్చి నిలబడుటకు నీవెందుకు రాకూడదు?
89
దేవుడు నిన్ను దీవించును గాక. కుమారుడా, దేవుడు నిన్ను దీవించును గాక. నీవు నిలబడగలిగితే ఇక్కడకు వచ్చి నిలబడి యుండుము. ఇంకెవరైనా? చిన్న బాలుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంచుమించు పండ్రెండు ఏళ్ళు వయస్సుగల ఈ చిన్న అబ్బాయి ఇచ్చటకు వచ్చుట చూడండి. స్పందనలేకుండా, కఠినముగా, మలినముతో మరియు అంధకారముతో నిండియున్న హృదయమును కలిగిన పెద్దవారగు మీకు సిగ్గు లేదా? ఇరవై-ఒక్క ఏళ్ళు రాకమునుపే తొంబై-ఎనిమిది శాతము మంది రక్షంపబడుచున్నారని గణాంకాలు చెప్పుచున్నాయి. మీరే సరిగ్గానే ఉన్నామనుకుంటూ, మీ పాత ఆచారములతో మీరు బాగా అతుక్కుపోయారు. “ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును.”
మీరు వచ్చెదరా? ఈ బలిపీఠము వద్ద మీ మార్గమును మీరు సరిచేసుకొనెదరా? మోకరించియున్న వీరిని చూడు, ఇక్కడికి రండి. యవ్వన స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. అక్కడ పైన బాల్కనిలో యున్నవారు, చేతులు పైకి ఎత్తిన నీవు, క్రిందికి వచ్చెదవా?
రాబోవు ఒక దినమున మారని అదే యేసుక్రీస్తు ముందు నీవు తల వంచుకొని నిలబడు సమయము ఎలాగో ఆసన్నమవ్వబోవుచున్నది, కావున ఆయన వద్దకు రమ్మని నేను నీకు ఒక ఆహ్వానము ఇచ్చుచున్నాను. నీవు ఈ ఆహ్వానమును తృణీకరించి ఒక పాపిగా మరణించిన, ఇక అప్పుడు నీకు కనికరము లభించదు, ఇక కనికరము ఉండదు. నిన్ను కనికరించు దినము ఇప్పుడే, ఈ దినమందే. ఒకనొక దినమున నీవు ఆయనను సంధించు దినము వచ్చునని గుర్తుంచుకొనుము. ఇప్పుడు నిన్ను యేసుక్రీస్తు ఆహ్వానించుచున్న ఈ దినమే ఆ కృపా దినమైయున్నది, కాని దీని తరువాత ఇదే నీకు తీర్పు దినముగా యుండును. అది నిజము.
90
క్రిందికి దిగి రండి. అది సరియే. దేవుడు నిన్ను దీవించును గాక. ఓ, యవ్వనస్తులు ప్రభువు వద్దకు వచ్చుచున్నారు. ఆమేన్. మీ పాపములు ఏమైయున్ననూ, సహోదరుడా, సహోదరీ, మిమల్ని క్షమించుటకు యేసు ఇక్కడ వున్నాడు.
ఆ చిన్న స్త్రీ, త్వరపడుచూ బలిపీఠము వద్దకు వచ్చుచున్నది. రావలసిన విధానము అదే, సరిగ్గా ఇచ్చటకు వచ్చు విధానము అదే. దేవుడు నిన్ను దీవించును గాక. అది బాగున్నది. ఇంకా ఇచ్చటవున్న వారిలో చాలా మందికి ఈ బలిపీఠము అవసరమైవున్నది. మీరు ఈ బలిపీఠము యొద్దకు రాలేరా?
పైకి చేయి ఎత్తిన సహోదరుని గూర్చి ఏమిటి? దానిని నిజముగా మనస్పూర్తిగా చేయాలనుకుంటున్నారా? లేదా, సహోదరుడా? కాదా, సహోదరి? నీవు నిజముగా మనస్పూర్తితో సమర్పించుకోవాలను కుంటున్నావా? క్రిందికి వచ్చి మరియు ఇక్కడ బలిపీఠము వద్ద మోకాళ్ళ పై యుండి, మాతో కలసి నిన్ను సమర్పించుకొనెదవా? దీనిని చేసెదవా? యేసుక్రీస్తు యొక్క ఈ వాగ్దానమును నేను మీకు ఇచ్చుచుండగా రండి, ఆయన మీ ప్రతీ పాపమును క్షమించును. మీరు వచ్చెదరా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
91
చాలా మంది వచ్చుచున్నారు, బాల్కనీలో నుండి వచ్చుచున్నారు. అది నిజము. క్రిందికి దిగిరండి, మీ కొరకు మేము వేచియున్నాము. సరిగ్గా ఇప్పుడే క్రిందికి దిగి రండి, బలిపీఠము వద్ద చాలా స్థలమున్నది. ఆ జీవ ఊట యొద్ద నా కొరకు స్థలమున్నది. చాలా విస్తారమైన స్థలమున్నది. బయటకి ఇప్పుడే రండి. దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడా! నీ చేయి ఎత్తిన నీవు, వారు అక్కడ అతనికి సహాయము చేయుచున్నారు. దేవుడు దయ చూపును గాక. ఆ విధముగానే రావలెను, తిన్నగా రండి, సాతాను మిమ్మల్ని దోచుకొనునట్లుగా వాడికి మిమల్ని అప్పగించుకోవద్దు. ఆ వెలుపలయున్న వారగు మీరు, నేడుయున్న లోకమునకు మిమల్ని సాతాను దోచుకొనునట్లుగా అప్పగించుకోవద్దు. ఆయన యొద్దకు రండి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆయనను కలుసుకోవడానికి ఆ సహోదరుడు వచ్చుచున్నాడు.
92
ఇప్పుడు, మెల్లగా పాడండి: “నా సమస్తము.” గోర్డన్ సహోదరుడా, మీరు ఇష్టపడినట్లయితే, నాకు ఇక్కడ సహాయము చేసెదవా?
నా సమస్తము,
నా సమస్తము,
ధన్యుడవగు నా రక్షకా,
నా సమస్తము సమర్పించెదన్.
నా సమస్తము.
మీరు నిజముగా ఆయనకు సమర్పించుకొనెదరని మీ భావమా? మీ సంఘమును యేసు కొరకు సమర్పించుటకు సిద్దముగా యున్నావా? ఆయనకు నీవు స్నేహితుడగుటకు నీ సభ్యత్వమును సమర్పించెదవా? పరలోకములో నీ ఉత్తరము వ్రాయబడి యుండునట్లు, నీ ఉత్తరమును సమర్పించెదవా? నీవు దానిని చేసెదవా? వచ్చుచున్న ఈ వ్యక్తిని, అతని భార్యను, ఈ రాత్రి దేవుడు వీరిని దీవించును గాక. వారి జీవితమంతటిలో వారు చేసిన అతి గొప్ప కార్యమేదనగా, ఇప్పుడే యేసు ప్రభువును అంగీకరించుచూ వచ్చుటయే. అది ఎంత అద్భుతమైనది! ఎంత మనోహరమైనది!
93
“నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయను. నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు,” అని యేసు చెప్పెను. ఇంకా ఎవరైనా వున్నారా [స్పష్టతలేని మాటలు] కేవలము రండి.
రండి. అవును, నీవే అది. అది నిజము. నీవే రావలెను. ఇచ్చటకు రావలెను. ఆమేన్. ఇంకా మీరు కూడా రండి, మేము వేచియుండగా ఇప్పుడు మిమ్మలను సమర్పించుటకు మీరు వచ్చెదరా?
నా సమస్తము సమర్పించెదన్,
నా సమస్తము,
ధన్యుడవగు నా రక్షకా,
నా సమస్తము సమర్పించేదన్.
94
“నాకు ఉన్న నా సమస్తమును నీకిచ్చెదను, నాకున్నందతయూ, నా గర్వమంతయూ, నాకున్నవన్నీ ఇక్కడ ఈ బలిపీఠము యొద్ద నీకు నేను సమర్పించెదను. ప్రియమైన దేవా, నాయందు దయ కలిగియుండుము. నా కన్నీళ్ళతో ఆ మరకను తుడిచివేయాలని నేను ఆశపడుచున్నాను. నా మరకను నీ రక్తముతో కడిగి వేయవలెనని నేను కోరుచున్నాను.” దానిని చేయగలిగినది ఏది? యేసు రక్తము గాక మరి ఏది చేయగలదు? ఇంకా కొద్దిసేపు మేము వేచివుండగా, మీరు ఇచ్చటకు రాగలరా? ఎందుకనగా నన్ను ఏదో ఒత్తిడి చేయుచున్నది. నేను మూర్ఖుడిని కానని మీకు తెలుసు. కాని, ఇంకా చాలా మంది ఇక్కడ ఈ సమయములో ఈ బలిపీఠము చూట్టూ నిలబడి వుండవలసినవారై వున్నారని నాకు అనిపించుచున్నది.
95
వెనకకు జారిపోయినవాడా, నీ సంగతేమిటి? నీవు దేవునికి దూరముగా వున్నావు. నీవు చనిపోతే నశించెదవు, ఇదే నీ సమయము. రమ్ము. లోపలికి ప్రవేశించుటకు రావలెను. నీకు స్థలమున్నది. నీవు రాలేవా?
ఇప్పుడు మరొక్కసారి పాడెదము. మనము పాడుచుండగా: “నా సమస్తము.” ఈ సమయములో ఇంకా ఎవరైనా వచ్చెదరా? సరే.
నా సమస్తము సమర్పించెదన్,
నా సమస్తము సమర్పించెదన్,
నా సమస్తము, ధన్యుడవగు నా రక్షకా,
నా సమస్తము సమర్పించెదన్.
నా సమస్తము సమర్పించెదన్.
నా సమస్తము సమర్పించెదన్.
నా సమస్తము, ధన్యుడవగు నా రక్షకా,
నా సమస్తము సమర్పించెదన్.
నా సమస్తము (మిమ్మల్ని మీరు సమర్పించుకొనెదరా?)
[బ్రెన్హాం సహోదరుడు ప్రజలను బలిపీఠము వద్దకు రమ్మనుచున్నారు.]
ధన్యుడవగు నా రక్షకా,
నా సమస్తము సమర్పించెదన్.
మిమ్మల్ని సమర్పించుకొనుట అయిపోయినదా? మీరు ఖచ్చితముగా సమర్పించుకొన్నారా? ఇంకెవరైనా వున్నారా! “కేవలము నేను ఉన్నరీతిగానే,” అనే పాటను పాడెదము. సహోదరీ, మాకు ఒక శృతిని అందించండి. “కేవలము నేను ఉన్నరీతిగానే,” నీవు ఏమి చేసియున్నను ఫరవాలేదు. కేవలము నేను ఉన్నరీతిగానే, ఏ ఒక్కనెపము లేకుండానే, నీ రక్తము నా కొరకు చిందించబడిది, నీ యొద్దకు రమ్మని నన్ను నీవు పిలుచుచుండగా, ఓ దేవుని గొర్రెపిల్లా, నేను వచ్చుచున్నాను! నేను వచ్చుచున్నాను!
దానిని పాడుచుండగా, మనము లేచి నిలబడెదము. ఇప్పుడు రండి. ఇప్పుడే రండి.
..... ఏ ఒక్క నెపము లేకుండానే,
కాని నీ రక్తము చిందింపబడినది...
(ఇప్పుడే మీరు వచ్చెదరా?)
[స్పష్టతలేని మాటలు]
నీ యొద్దకు రమ్మని నన్ను నీవు పిలుచుచుండగా,
ఓ దేవుని గొర్రెపిల్లా,
నేను వచ్చుచున్నాను!
నేను వచ్చుచున్నాను!
కేవలము నేను ఉన్నరీతిగానే,
మరి ఆలస్యము చేయకుండా
(వినండి!) అంధకారపు కళంకముతోయున్న
నా ఆత్మను (ఎందరు?) విమోచించుటకు
ఒక్కొక్క మచ్చను శద్ధిచేయగల
నీ రక్తము కొరకు నీ యొద్దకు,
ఓ దేవుని గొర్రెపిల్లా, నేను వచ్చుచున్నాను!
నేను వచ్చుచున్నాను!
96
సహోదరీ, ఇప్పుడు నెమ్మదిగా. మనము దీని రాగము పాడుచుండగా, మనము మన తలలను వంచెదము. [సహోదరుడు బ్రెన్హాం రాగమును ఆలాపించుచున్నారు.] పరలోకమందున్న మా తండ్రి, ఈ బలిపీఠము చుట్టూ ఇప్పుడు చాలా మంది పాపులు బారులు దీరియున్నారు. ప్రభువైన యేసు పాదముల వద్ద వారు తలలు వంచియున్నారు. ప్రభువైన యేసు “నా తండ్రి ఒకనిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. నా యొద్దకు వచ్చు వారందరికీ నిత్యజీవమును ఇచ్చెదను. మరియు అంత్యదినములలో వారిని లేపుదును,” అని మీరు చెప్పియున్నారు.
ప్రభువా, మీరు దానిని వాగ్దానము చేసితివి. ఆ దీన వ్యభిచారి, మీ పాదముల యొద్ద మీకు సేవచేయుచూ నిలబడియున్నట్లుగానే, ప్రభువా, ఇక్కడ చాలా మంది నిలబడియున్నారు.
అప్పుడు, మీరు ఆమె వైపు తిరిగి చూచి, “విస్తారమైన నీ పాపములన్నీ క్షమించబడియున్నవి,” అని అన్నావు. నీవు ఎవరియందు పక్షపాతము చూపువాడవు కావు. ఇచ్చట నిలబడియున్న వారికి కూడా నీవు దానినే చేసెదవు. ప్రభువా, ఈ రాత్రి దీనిని అనుగ్రహించమని నీకు నేను ప్రార్థన చేయుచున్నాను.
97
బలిపీఠము వద్దకు రానివారు చాలామంది వున్నారు. ప్రభువా, వారు ఇక్కడకు వచ్చి, ఈ రాత్రి వారి ఆత్మలను సమర్పించుకొనవలసినవారై వున్నారు. వారు దేవుని వద్ద నుండి తొలగిపోయిరి. వారు బిర్రబిగుసుకు పోయిన వారుగా మరియు నిర్లక్ష్యముతో యున్నారు. శ్రద్ధలేనివారై నీ యొద్ద నుండి తొలగిపోయిరి. అనేక సూచక క్రియలను, అద్భుత కార్యములను మరియు ఆశ్చర్య కార్యములను నీవు చేస్తూ, మృతులలో నుండి నీవు పునరుత్థానుడవై యున్నావని రుజువు చేస్తూ, ఈ వారమందు ఈ నగరముకు నీవు వచ్చావు. వారు దానిని చూసియున్నారు. ఈ రాత్రి నీవు చాచిన చేతులతో ఇక్కడ నిలబడియున్నావు. దేవా, నేను నిన్ను గూర్చి ఆలోచించుచున్నప్పుడు నా హృదయము బ్రద్దలగుచున్నది. నీవు ఇక్కడ నిలబడి జనులు నీ యొద్దకు రావలెనని వారిని బ్రతిమాలుచూ మరియు ప్రాధేయపడుచున్నావు.
98
ఓ దేవా, ఈ రాత్రి నాకేమైనదో నాకు తెలియదు. కాని దేవా, నీవు ఎవరినైతే పిలచుచున్నావో, ఈ రాత్రి వారు నిన్ను కనుగొనకుండా ఇక్కడి నుండి పోకుండా వుండునట్లు నేను ప్రార్థన చేయుచున్నాను. నా హృదయము ఏ కారణముచేతనో ఎంతో భారముగా నున్నది, నాకు తెలియదు. ప్రియ యేసూ నేను ప్రార్ధించుచున్నాను, మరొక్కసారి నేను వారిని పిలిచెదను. ఇది వరకే ఆ వ్యక్తి బలిపీఠము వద్ద లేకపోతే, త్వరగా నీ యొద్దకు వచ్చునట్లు, ప్రభువా, దయను అనుగ్రహించుము. ఇది వారికి ఆఖరి పిలుపు కావచ్చు. ఏ కారణము చేతనో నా హృదయము ఎంతో దుఃఖముతో మండునట్లు చేసితివి. యేసు నామములో నీవు వాటన్నింటిని అనుగ్రహించెదవని నేను ప్రార్థించుచున్నాను.
99
అందరూ ప్రార్థనలో ఉండండి, వుంటారా? ఈ రాత్రి ఏదో పొరపాటున్నట్లుగా ఒక వింతైన అనుభూతిని నేను చెందుచున్నాను. ఎక్కడో ఏదో పొరపాటు యున్నది. ఏమిటా పొరపాటు? ముందుకు రండి. అందరూ మీ హృదయాలను పరిశీలించుకొనవలెను. మరొక్కసారి పాడుచుండగా, ఏ పొరపాటుయున్నదో మీరు దానిని కనుగొనండి. మనము ఇప్పుడు పాడుచుండగా, ముందుకు రండి. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు, నాకు అది తెలుసు.
ఆలస్యము చేయకుండా, నేను ఉన్నరీతిగానే,
ఒక అంధకారపు కళంకముతోయున్న నా ఆత్మను విమోచించుటకు,
ఒక్కొక్క మరకను శుద్ధీకరించగల నీ యొక్క రక్తము వద్దకే,
ఓ దేవుని గొర్రెపిల్లా, నేను వచ్చుచున్నాను!
నేను వచ్చుచున్నాను!
కేవలం నేను ఉన్నరీతిగానే,
నీవు నన్ను స్వీకరించేదవు, ఆహ్వానించెదవు,
మన్నించెదవు, శుద్ధీకరించెదవు,
శ్రమను నివారించెదవు;
ఎందుకగా నీ వాగ్దానమును నేను నమ్ముచున్నాను,
ఓ దేవుని గొర్రెపిల్లా,
నేను వచ్చుచున్నాను! నేను వచ్చుచున్నాను!
ఆఖరి చరణముగా దాని తరువాత చరణమును పాడుచుండగా, మీరు చేయగలిగినట్లయితే సేవకులు వచ్చి మాతో ఇక్కడ ప్రార్థించవలెనని నేను కోరుచున్నాను. ఈ సంఘములోవున్న సేవకుల సమూహము ఒక పాతవిధానపు బలిపీఠపు పిలుపును నమ్ముచున్నారు. ఇక్కడ ఇరవై, ముప్పై మంది మోకాళ్ళూని వున్నారు. పాపులు, వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపము చెందుచున్నారు. మీరు రావాలని కొరుకున్నట్లయితే, బలిపీఠము వద్దకు వచ్చి నిలబడి మరియు వారితోపాటు ప్రార్ధన చేయండి. మీరు దానిని చేసెదరా? ఈ దాని తరువాత చరణమును పాడుచుండగా, మీరు వచ్చెదరా? ఏ క్రైస్తవ సేవకునికైనా సరే, వారికి హృదయమందు కలుగు భారము యుండును. మీకు లేనట్లయితే, మీరు కలిగియుండవలెను. మీరు కలిగియుండాలని దేవునికి తెలుసు.
100
ఈ రాత్రి ఒక నిజమైన పాత-కాలపు పెంతెకోస్తు ఆరాధనవలే ఆరాధన చేసినయెడల, రేపు రాత్రి స్వస్థతా కూడికలో దేవుడు ఏమి చేయునో మీరు గమనించి చూడండని నేను మీకు సవాలు చేయుచున్నాను. మీ కార్యములను మీరు సరిచేసుకోండి. మరియు దీనిని మీ హృదయములో భద్రపరచుకొని, దేవుడు ఏమి చేయునో గసునించి చూడండి. మీరు కేవలము దానిని గమనించి చూడండని నేడు మీకు సవాలు చేయుచున్నాను.
నేను చాలా అరుదుగా ఈ విధముగా సవాలు చేయుదును, కాని ఏదో ఒకటి నన్ను సవాలు చేయునట్లుగా చేయుచూ, ఏదో నన్ను కదిలించుచూ, మరియు నన్ను బలవంతము చేయుచున్నట్లు, అనిపించుచున్నది. ఈ బలిపీఠపు పిలుపులో నేను చాలా ఆసక్తిని కలిగియున్నాను. ఇంకా చాలామంది ఇచ్చటకు రావలసిన వారు ఇక్కడ వున్నారని నాకు అనిపించుచున్నది. ఇక్కడ ఈ బలిపీఠము చుట్టూ అనేక మందితో నిండిపోవాలని, నా హృదయమునందు నాకింకా భారము కలుగుచున్నది.
నేను దేవుని యొక్క సేవకుడైనందు వలన ఈ ఆహ్వానము దేవుని యొద్ద నుండి వచ్చుచున్నదని నేనెరుగుదును, ఈ ఆహ్వానపు పిలుపు యేసుక్రీస్తు నామమున వచ్చుచున్నదని నేను చెప్పుచున్నాను. కావున దీనిని మీరు ఏ మాత్రము నిర్లక్ష్యపరచ కూడదనే భావనతో నేను మీకు చెప్పుచున్నానని ఎరుగవలేను. ఇచ్చట ఏదో పొరపాటుయున్నది. మరొక్కసారి పాడుచుండగా, మీరు రావలెనని నేను కోరుచున్నాను. ప్రార్థన కావాలని కోరుచున్న వారందరూ, ఉద్యోగులు, పాపులు ఇంకా అనేకులు బలిపీఠము చుట్టూ ఏకముగా కూడి రండి. మరొక్కసారి పాడుటకు సహాయము చేయగలరా?
కేవలం నేను ఉన్నరీతిగానే వచ్చుచున్నాను,
నీవు నన్ను స్వీకరించెదవు, ఆహ్వానించెదవు,
క్షమించెదవు, శుద్ధీకరించెదవు,
శ్రమను నివారించెదవు;
ఎందుకనగా నీ వాగ్దానమును నేను నమ్ముచున్నాను,
ఓ దేవుని గొర్రెపిల్లా,
నేను వచ్చుచున్నాను! నేను వచ్చుచున్నాను!
101
ప్రియమైన పరలోకపు తండ్రి, ఇక్కడ చాలా మంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నేను నా శాయశక్తులా చేసియున్నాను, ప్రభువా. నీ గూర్చి నాకు తెలిసినదంతా మరియు దేవుని యొక్క సంకల్పమంతటినీ ఏది కూడా నేను మరుగుచేయక ప్రభువా, వారికి చెప్పితిని. నేను మరలావచ్చే సంవత్సరము ఇక్కడికి వచ్చినట్లయితే, ఇచ్చట కూర్చున్న వారిలో అనేకులు అప్పటికే నిత్యత్వములోనికి వెళ్ళుదురని నేనెరుగుదును. నాకు తెలుసు [స్పష్టతలేని మాటలు] నీవు ప్రభువా, మరియు నీవు వారిని ప్రేమించుచున్నావని నేను చెప్పియున్నాను, అనేక సంవత్సరముల క్రితము ఆ రాత్రి ఆ స్త్రీకి అనుగ్రహించిన అదే కనికరమును వీరియెడల కూడా నీవు కలిగియున్నావని నేను చెప్పియున్నాను. ఈ బలిపీఠమును వారి కన్నీటితో తడుపుచుండగా, ప్రభువా, చాలా మంది ఈ బలిపీఠము చుట్టూ ఇప్పుడు ఇక్కడ వున్నారు.
దేవా, ఎలాగైనా ఈ రాత్రి ఈ భవనములో పరిశుద్ధాత్మ ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని కుమ్మరించుమని నేను ప్రార్థించుచున్నాను. మరియు ప్రతీ ఒక్కరిని సంధించుము ప్రియ దేవా! దీనిని దయచేయుము. ఓ, వారి రాతి హృదయము గ్రుచ్చుకొని, మరియు క్రిందకు వచ్చి మరియు యేసుక్రీస్తు నామమున రక్షింపబడుదురు గాక.
మనము మన చేతులను ఎత్తుదము. మన చేతులను దేవునికి ఎత్తుదము. ప్రతిఒక్కరు దేవునికి ఒక ప్రార్ధనను సమర్పించండి.
సహోదరుడా గోర్డన్, క్రిందకు రమ్ము మరియు ప్రార్ధనలో నడిపించు. సహోదరుడు గోర్డన్ నడిపించుచుండగా, ఇప్పుడు క్రీస్తును స్వీకరించుము.