మార్గము సిద్ధపరచుము
VGR COUNT -150 శుభ సాయంకాలము, స్నేహితులారా. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించును గాక! మరియు బ్రదర్ నెవిల్ మీకు వందనములు, ఆ రకమైన వ్యాఖ్య కొరకు ఆశీర్వదింపబడిన మన ప్రభువు సేవలో ఈ రాత్రి గుడారానికి తిరిగి వచ్చినందుకు మరియు ఈ రాత్రి మనతో కలసి ఆయనను ఆరాధించటానికి బయట స్నేహితులను చూడటము చాలా సంతోషముగా ఉన్నది. ప్రభువు రాకడను ఈ వైపున కలవటము మరోసారి ఖచ్చితముగా గొప్ప ఆధిక్యత. మరియు మనము చూసిన తరువాత, విన్న తరువాత చాలామంది దూరముగా వెళ్ళుచున్నారు, అనుకొనని విధముగా, చాలా త్వరగా మేము ఆశ్చర్యపోతున్నాము. సమయము తర్వాత సమయము. ఆ తరువాత ఎవరో. అయితే, ఈ ఆశీర్వాదకరమైన హమీ కలిగి ఉండగా అది అలా ఉంటే “క్రీస్తులో ఉన్న దేవుని ప్రేమనుండి మనల్ని ఏదీ వేరుచేయలేదు.” అక్కడ మరణం, లేదా-లేదా ప్రస్తుతము ఏమిలేదు, లేదా భవిష్యత్‌లో ఏమి, లేదా వేరు చేయగల శక్తులు, క్రీస్తుయేసులో ఉన్న దేవుని ప్రేమనుండి మనలను ఏదియు వేరుచేయజాలవు. మరియు దీనిని తెలుసుకోవటము, ఈ భూసంబంధమైన గుడారము శిధిలమైపోయిన తరువాత మనకొరకు ఒకటి ఇది వరకే సిద్ధపరచబడియున్నది.
స్థిరపరచబడని అస్థిరమైన మరియు మనము ఆ దీవింపబడిన నిరీక్షణలో చాలా మహిమకరమైన విశ్రాంతి తీసికొంటాము.
2
నేను నా భార్య మరియు శ్రీమతి ఉడ్ మరియు వారితో మాట్లాడుతున్నాను. నేను తిరిగి వచ్చాను. నేను ఇలా అంటున్నాను, “సరే, ఇది కేవలము ప్రయాణము తరువాత ప్రయాణము, మరియు స్థలము తరువాత స్థలము అనిపిస్తుంది, కానీ ఇంకా వారు మరింత మహిమకరముగా అయినారు.
మరియు మనము రాకడకు సమీపముగా వస్తున్నాము... అని తెలిసికొనుచూ ఆ- ఆ-ఆ ప్రభువు యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది... నేను “అలాగే” అన్నాను, (మా అబ్బాయితో మాట్లాడుచున్నాను, మరియొక దినము రోడ్డు దిగువకు వస్తున్నాము, సౌత్ డకోటాలోని సియోక్స్ జలపాతము నుండి వస్తున్నాము) అప్పుడు నేను, “ఇల్లు అందమైన ప్రదేశమని మీకు తెలుసా.” మేము ఇంటికి తిరిగి వెళ్ళుచున్నాము. నేను ఇలా అన్నాను, “మనము ఈ లోకమును ప్రేమించుచున్నాము, ఇది మన యొక్క ఇల్లు.” అలా అని మనము అనుకొనకపోవచ్చు కానీ అది అలాగే ఉన్నది. మనం ఈ ఇంటి కోసము పుట్టాము. ఇది దేవుడు మనలను ఇక్కడ ఉంచాడు. మనల్ని ఇచ్చటకు తీసికొని రావటానికి మనకు వేరే మార్గము లేదు; మన యొక్క తండ్రికి లేదా తల్లికి కూడ వేరే మార్గము లేదు; అది దేవుని యొక్క చేతులలో ఉన్నది. చాలామంది పెండ్లి చేసుకున్నారు కానీ ఎన్నడు బిడ్డను కలిగి ఉండలేదు. కానీ దేవుడు మనం ఆ విధముగా భూమి మీదకు రాగలమని చూశాడు. ఆ తరువాత మనం వచ్చినప్పుడు, అణువులు, మరియు వెలుగులు మొదలైన వాటిద్వారా భూమినుండి అది తీసికొన ప్రారంభించి, మనం ఎదుగుటకు ప్రారంభించి ఒక దేహముగా నిర్మించబడ్డాము. ఆ తరువాత మనకు ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తరువాత అవి ఎదుగకుండా నిలిచిపోయెను. మనం ఎటువంటి వాటిని విభజించుచున్నను అయితే, అవి గతించిపోయాయి. మరణం లోనికి ప్రవేశించినది.
3
ఆ తరువాత ఈ భూసంబంధమైన గుడారము శిధిలమైపోయినప్పుడు అక్కడ మనకు ఇంకొక్కటి ఎదురుచూస్తున్నది. చూశారా? మనము దానిలోనికి ప్రవేశిస్తాము. మనము ఒకరినొకరము తెలుసుకుంటాము. మనము కరచాలనము చేయము; మనకు ఆ అనుభూతికి సంబంధించిన భావాలు లేవు. మనము చేయలేము... “ఎలా ఉన్నావు సహూదరుడా,” అని నేను నీకు కరచాలనం చేయలేను, ఎందుకనగా నీవు ఆ విధమైన చేతిని కలిగియుండవు, కానీ ఇంకా మనం ఇప్పుడు ఉన్నట్లుగా శరీర సంబంధమైన దేహంలో ఉండము. మనం భూసంభందమైన శరీరంలో ఉన్నాము. మరియు అప్పుడు ఇది....
ఐగుప్తు దిగువలో, ఇశ్రాయేలు పిల్లలకు వాని యెముకలను, ఒక జ్ఞాపక చిహ్నముగా విడిచి పెట్టినప్పుడు, అలా వారు ఏదో రోజున వారు బయటకు వెళ్ళనైయున్నారని తెలియునని నేను అనుకొనుచున్నాను. మరియు వారు బయటకు వెళ్ళునప్పుడు, వారితో అతని యెముకలను వాగ్ధాన భూమి వరకు తీసికొని వెళ్ళారు. మరియు ప్రతీ హెబ్రూ స్వదేశానికి తిరిగి రావాలని ఆరాటపడతారు.... కనుక, అతడు ఎంత బాగా ఆదరించబడినప్పటికి, తిరిగి స్వదేశానికి రావాలని ఆరాటపడును. వారు ప్రక్కగా వెళ్ళు ప్రతిసారి, ఆ యెముకలను చూచినప్పుడు, వారు ఏదో రోజు స్వదేశానికి రావాలని ఎరిగియున్నారు.
4
మనము ఇచ్చట ఉన్నప్పుడు ఈ స్థలమునుండి దాటిపోవటానికి వేచియున్నాము. మనము యెరూషలేములో ఒక ఖాళి సమాధిని చూస్తాము, అక్కడ ఏదో జరిగినదని మనము తెలుసుకొనుచున్నాము. ఆ తరువాత మనము మహిమపరచబడినప్పుడు... మహిమపరచబడలేదు కానీ మహిమ శరీరము మరియు మనము మాట్లాడగలము, ఒకరితో ఒకరు మాట్లాడుచూ, ఒకరినొకరు చూచుకొనుచూ, క్రీస్తుతో మనము మహిమకరమగు స్థలాలలో చుట్టూ మనము నడువగలము. బలిపీఠము క్రిందున్న ఆత్మలు “ఇంకా ఎంతవరకు అని మొర్రపెట్టుచున్నాయి” మరియు తరువాత అక్కడ ఉన్న జ్ఞాపకచిహ్నం ఏమిటి? ఆ విధముగా మనం తినడానికి మరియు త్రాగటానికి మరియు నిద్రించటానికి భూమి మీదకు వస్తున్నాము. అక్కడ ఆయన సి౦హాసనముపై కూర్చుని అధికారసంబంధమైన శరీరములో ఉంటాడు. ఆమేన్.
ఏదో రోజున ఆయన శరీర సంబంధమైన శరీరములో వస్తాడు. ఎప్పుడైతే మరలా తిరిగి వస్తాడో ఈ భూసంబంధమైన శరీరము మహిమపరచబడుతుంది. అప్పుడు మనము ఆయనవలె ఉంటాము. మరియు మనము ఆ శరీరములోనే శాశ్వతముగా జీవిస్తాము. ఏమిటి ఒక..ఏమిటి- ఏమిటి మరేదైనా విషయము? చూడు? ఇది ఇప్పటికే స్థిరపడింది. అది కేవలము.... అది అక్కడ లంగరు వేయబడింది... మరియు అనుమతి ఇవ్వబడింది...
యేసురక్తం మరియు నీతి కంటే తక్కువైన
దేనిపైనను నా నిరీక్షణలు నిర్మించుకొనలేను;
నా ప్రాణమంతయు ఇచ్చివేసినప్పుడు,
ఆయనే నా నిరీక్షణ మరియు ఆధారము.
5
దానిని సాధ్యం చేసినవాడు క్రీస్తు మాత్రమే, నా సంఘము ద్వారా కాదు, లేదా నా శాఖ ద్వారా కాదు, నా స్నేహితులు ద్వారా కాదు, క్రీస్తు ద్వారా మాత్రమే. “మిగిలిన నేలలన్నియు మునిగిపోయే ఇసుకతెన్నులే.” ఎడ్డీ ఫెర్రోనేట్ గారు ఆశ్చర్యం లేదు... వారియొక్క ఆలోచన ప్రకారము అతను పిచ్చివాడు. మరియు ఆ రోజున అక్కడ ప్రజల బానిసత్వముతో పరిశుద్దాత్మ చేరి మరియు రాజులకు రాజు ప్రారంభోత్సవ పరిచర్యలో ఇచ్చే గౌరవపట్టా యొద్ద పాడదగిన ఆ మరపురాని పాట పాడుటకు ప్రారంభించెను. పరిశుద్దాత్ముడు వచ్చి కలం పట్టుకొని “యేసునామము యొక్క శక్తికే సమస్త శుభములు.”
6
ఉత్తరాది నుండి ఇప్పుడు అద్భుతమైన నివేదిక, మేము సేవాసంబంధ పరిచర్య కలిగియున్నాము... సేవా సంబంధ పరిచర్య కాదు, మిన్నియ పోలీస్‌వద్ద క్రైస్తవ పనివారల అల్పాహారం ఏర్పాటు చేయబడింది. మరియు మేము చాలా అతిపెద్ద పనివారల అల్పాహారం విందును కలిగియున్నాము. రెండువేలమంది వచ్చియున్నారు. ఉదయకాల సమావేశములో, మరియు ఆ ప్రభువు ఒక వర్తమానము ఇచ్చియున్నారు. మరియు ఆ ఉదయము బలిపీఠపు పిలుపుతో యాభైమంది వ్యాపారవేత్తలు క్రీస్తునొద్దకు వచ్చి తిరిగి జన్మించారు. ఓహ్, అది నా హృదయాన్ని పులకింపజేసినది, వ్వాపారవేత్తలు లోనికి వచ్చియున్నారు. ప్రతిచోట మరపురాని సేవలు. సమస్త మహిమ ఆయనకే, ప్రభువు స్తుతింపబడును గాక!
ఇప్పుడు నాకు ఇక్కడ ఒక గమనిక వచ్చింది. ఇలా చెప్పబడింది, “నేను ఇండియానాపోలీస్‌లో ఎప్పుడు ఉంటాను?” జూన్ పదకొండవ తేదినుండి పదిహేనవ తేదివరకు ఇండియానాపోలీస్ కేడిల్ గుడారములో జూన్ పదకొండు నుండి పదిహేనవ తేది వరకు—పదకొండు వేలమంది కూర్చుంటారు.
ఎల్లుండి మేము లూసియానాలో, ష్రీవ్‌పోర్ట్‌కు బయలుదేరి, లూసియానాలో, ష్రీవ్‌పోర్ట్‌లో వారాంతములో అక్కడ ఉంటాము. ఆ తరువాత మేము ష్రీవ్‌పోర్ట్‌ను విడిచి, టెక్సాస్‌లోని, హ్యూస్టన్‌కు వెళ్ళి అక్కడ రెండు రోజులు ఉండబోతున్నాము. అది సోమవారము మరియు మంగళవారము.
7
ఆ తరువాత పదహారవ తేది పాత మెక్సికో—మెక్సికో సిటి, పాత మెక్సికోలో ప్రారంభిస్తాము. మిష్టర్. ఆర్గాన్ బ్రైట్ ఇప్పుడే నన్ను పిలిచారు. మరియు వారు అక్కడ అరవై వేలమంది కూర్చును సామర్థ్యంగల పెద్ద ఎద్దుల మధ్య పోటీ (బుల్ ఫైట్) జరిగే అతి పెద్ద ఆడిటోరియం సంపాదించారు. మరియు ఇప్పటికే సంతకాలు చేసిన నాలుగువందల సంఘాలు సహకరిస్తున్నాయి. మేము ఆ సమావేశములో ఒక లక్ష మందిని అంచనా వేస్తున్నాము. మరియు ఇది మొదటిసారి. (దేవుని స్తుతించటానికి మనకు ఏదైనా ఉన్నది). మెక్సికో చరిత్రలో మొదటిసారిగా, ప్రభుత్వము ప్రొటెస్టెంట్‌ను స్వాగతించడము మరియు మాకు కావలసిన స్థలాన్ని ఇవ్వటము. మెక్సికో చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ప్రొటెస్టెంట్ కు స్వాగతము పలికారు.
మరియు ఆ జనరల్ ఎజియో, మెక్సికన్ సైన్యానికి జనరల్ ఇప్పుడే తిరిగి జన్మించి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మరియు మెక్సికో గవర్నర్‌కు అతని మర్యాద ద్వారా సైనిక రక్షణతో వెళ్ళడానికి మాకు ప్రభుత్వము అధికారము ఇచ్చింది. మరియు మేము.....నాకు పెద్ద ఎద్దుల మధ్య పోటీ జరిగే అతి పెద్ద ఆడిటోరియం ఉంది. అది మెక్సికోలోనే అతి పెద్దది. దానిచుట్టూ అరవై వేలమంది కూర్చుంటారు. అంతే కాకుండ వారు పోరాటము చేసే గదితో పాటు, దాని లోపము మీకు తెలుసు. మరియు మేము ఇప్పుడు పది వరుస రాత్రులు తీసుకున్నాము. ఏ విధమైన అంతరాయము లేకుండ పది వరుస రాత్రులు నేరుగా నా కోసము ప్రార్ధించండి. నేను కేవలము అనుభూతి చెందుతున్నాను.... అక్కడ విస్తారమైన వర్షము కురుస్తున్న ధ్వని వినబడుచున్నది. నేను ఇప్పుడే-మెక్సికన్ ప్రజలు చాలా సామాన్యత, తగ్గింపు కలిగిన విశ్వాసులు. వారు కాధలిక్స్ అయి ఉన్నారు. ఒకసారి ఒప్పించబడ్డాక ఒక సత్యాన్ని సత్యమని, అందరికి స్థిరపరచబడుతుంది.
8
తర్వాత పాత మెక్సికో నుండి త్వరగా తిరిగి ముప్పైవ తేదికి ఇక్కడకు తిరిగి రావాలని త్వరపడుచున్నాను మరియు (అది ఈస్టర్ ఉదయము) ఇక్కడ గుడారము వద్ద సూర్యోదయ సమావేశము కొరకు మరియు దానిని అనుసరించి స్వస్థత కూడిక తర్వాత బాప్తిస్మం కార్యక్రమము అదే రాత్రి గుడారములో ఉంటుంది. మరియు మీరు మీ స్నేహితులకు తెలియజేయండి. మరియు జబ్బుపడిన మరియు రోగపీడితులందరిని ఈస్టర్ ఆరాధనకు తీసికొని రండి. సూర్యోదయ ఆరాధన తెల్లవారు జామున ఉంటుంది. దానిని అనుసరించి పది గంటలకు, తొమ్మిది-ముప్పైకు ఎప్పుడూ జరిగే ఆదివారము ఆరాధన ఉంటుంది. మీరంతా సండే స్కూలుకు ప్రణాళిక చేసుకోండి. ఆ తరువాత స్వస్థతా కూడిక అనుసరించి సాధారణముగా స్వస్థతా కూడిక మన ప్రచారములో భాగముగా ఉంటుంది.
9
మరియు అందువలన మెక్సికో సిటి మొదటిసారిగా ప్రభువు నాకు చెప్పిన ఈ క్రొత్త దర్శనము ఆ సమయములో అమలులో ఉండబోతున్నది. కాబట్టి మేము మరలా దీనిని ప్రయత్నిస్తాము. ప్రభువు చిత్తమైతే ఇక్కడే ఈస్టర్ ఆదివారము ఈ రెండు గదులను ఉపయోగించి...? ఇక్కడే, చూడండి. కాబట్టి మేము ఇక్కడ ఈస్టర్ ఉదయము గొప్ప సమయాన్ని ఆశిస్తున్నాము. మరియు ప్రభువైన యేసు మృతులలో నుండి లేచాడు అనడానికి ఋజువు ఆయన సజీవుడైయున్నాడు. అవునండి మరియు ఆయన ఆ మొదటి ఈస్టర్ నుండి ఇప్పుటి వరకు సజీవంగానే ఉన్నాడు. మరియు ఆయన ఇప్పుడు కూడ మనతో ఉన్నాడు. మరియు ఆయన తన ఆశీర్వాదాలు యొక్క ఆ గొప్ప కుమ్మరింపు ఆ ఉదయము కొరకు ఆ ప్రభువు మనకు ఇవ్వగలడని నేను నమ్ముచున్నాను.
10
తరువాత ఇక్కడనుండి మేము వెళ్ళగలము, చికాగోకు, పదకొండవ తేదివరకు, మూడవ తేది నుండి పదకొండవ తేది వరకు. మరియు మేము సోమవారము బయలుదేరి, మంగళవారము మరియు అక్కడనుండి ప్రారంభించి ...కాదు, దానిని మూడు నుండి ఎనిమిదివ తేదివరకు ఆ తరువాత పదకొండవ తేదిన చార్లెట్‌లో మేము ప్రారంభిస్తాము...కాదు, కొలంబియా, ఉత్తర కరోలీనా ఆ తరువాత ఉత్తర కరోలీనాలోని స్పిందేల్‌కి ఆ తరువాత అక్కడనుండి దక్షిణ కరోలీనాలో చార్లెట్‌కు, ఆ తరువాత ఎంకోరేజ్, అక్కడనుండి అలస్కా, అలస్మాలోని ఎంకోరేజ్ వరకు. అప్పుడు తిరిగి వస్తాము. కానీ, ఇంకా నిర్ణయించబడలేదు. బహుశా, అంతలో ఈలోగా, రహదారిపై గుడారము సిద్ధముగా ఉంటుంది.
11
ఓ, నేను ఇప్పుడే... నేను ఇప్పుడే... నేను ఏమి చేయాలనుకుంటున్నానో మీకు తెలుసా? దీనికొరకు మీరు నాతో ప్రార్ధిస్తారా? చూడండి, నేను చాలాకాలంగా, దేవుని చిత్తం అయినట్లయితే ఈ ఫాల్ సిటిలో ఆ డేరాను ఇక్కడే పెట్టటానికి, మరియు నాలుగు లేదా ఆరు వారములు సమావేశము కొరకు అక్కడనే ఉండాలని కోరుకుంటున్నాను. పోరాటము పూర్తి అయ్యేవరకు ఇచ్చటనే ఉండండి. మరియు మీరు ఇప్పుడు దానికొరకు ప్రార్ధించండి. మరియు నేను దానిని ఇక్కడ జెఫర్‌సన్‌విల్, మరియు న్యూఆల్బనీ మధ్యలో నిలబెట్టాలనుకుంటున్నాను. మరియు దానిలో దాదావు ఏడు లేదా ఎనిమిది వేలమంది కూర్చునే సామర్థ్యం అందులో ఉన్నది. మరియు రోజులు గడిచేకొద్ది, మనం మరిన్ని ఎక్కువగా చేయగలము. అది స్థిరపడేవరకు సరిగా ఇక్కడే నిలచి ఉండిపోవచ్చును. ఆమేన్.
ఆ తరువాత, నేను జూన్ పదకొండవ తేదినుండి పదిహేనవ తేదివరకు, ఇండియానాపోలీస్‌లోని క్యాడిల్ గుడారములో అని అనుకుంటున్నాను. ఆ తరువాత పదిహేడవ తేది, జూన్ ఇరవై-ఒకటవ తేదివరకు మిన్నియాపోలీస్ వద్ద అక్కడ ఫుడ్‌బాల్ స్టేడియములో ఇరవై-ఏడు వేలమంది కూర్చుంటారని నమ్ముచున్నాను. ఇది పనివారల యొక్క అంతర్జాతీయ మహా సమావేశము, బోధించటము, మరియు ప్రతిరాత్రి అనారోగ్యముగా ఉన్నవారి కొరకు ప్రార్థన చేయబడుతుంది. మరియు ఇప్పుడు, వీటికొరకు ప్రార్ధించండి, చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి.
12
నేను -ఇప్పుడు మనకు ఎక్కువ సమయము లేదని భావిస్తున్నాను. నేను దానిని అంచనా వేస్తున్నాను. ఇది ఇప్పుడు ప్రభువు చెబుతున్నాడని నేను అనను: నేను-ఈ సంవత్సరము, అమెరికా క్రీస్తును అంగీకరించగలదు లేదా క్రీస్తును తిరస్కరిస్తుంది అని నేను అంచనా వేస్తున్నాను. చూశారా? ఇది అలా అమెరికా లోపలకు ప్రవేశించే మలుపు అని నేను నమ్ముచున్నాను. ఈ రోజున మనకు ఉజ్జీవము ఉండును, మనం ఉజ్జీవమును కలిగి ఉండలేము. మరియు ఈ సంవత్సరము అమెరికా నిర్ణయము తీసికోగలదని నేను నమ్ముచున్నాను. మరియు వారు దానిని సాధిస్తారని విశ్వసిస్తున్నాను. మరియు మనము ఒక గొప్ప ఉజ్జీవమును కలిగి ఉంటాము. అది కేవలము ఊడ్చివేయడమే అవుతుంది...
మనము చాలా ఎక్కువగా బోధించుట కలిగియున్నాము. మరియు చాలా ఎక్కువ సువార్త ప్రచారము ఉన్నది. కానీ మనకు ఒక ఉజ్జీవము అవసరము, మనం కాదా? నిజమైన ఉజ్జీవము అదే మనకు అవసరము. దేవుడు మిమ్మును దీవించును గాక. అక్కడ సహోదరుడు గ్రహంను చూచినందుకు ఆనందముగా ఉన్నది. మరియు-మరియు నేను-సహోదరుడు స్మిత్ అతని ముందే సరిగా కూర్చున్నాడని నేను అనుకుంటున్నాను, బ్రదర్ స్మిత్ దేవుని సంఘము నుండి వచ్చియున్నాడు, మరియు ఇక్కడ అనేకమంది సేవకులు వచ్చియున్నారు. అని నేను ఖచ్చితముగా అనుకుంటున్నాను. మరియు మన ఆవరణములలోని అపరిచితులకు, సామాన్యులందరికి మేము స్వాగతము పలుకుచున్నాము. సహోదరులైన ప్రతి ఒక్కరికి, మీ అందరికి, మేము మిమ్ములను ప్రేమించుచున్నాము.
13
మరియు ఇప్పుడు, ఈ ప్రకటనలు వెలువడిన దానివలన, మరియు ఈ రాత్రి, సహవాస పరిచర్యకొరకు, ప్రభూ రాత్రి భోజన కూడిక అయి ఉన్నది. మరియు ఇక్కడ ఈ గుడారము నొద్ద గొప్ప సేవచేస్తున్న మన ప్రియమైన సహోదరుడు నెవిల్ కొరకు పట్టుదలతో ప్రార్దన చేయండి; మరియు ప్రతిచోట ఉన్న పరిశుద్ధులందరి కొరకు.
ఓహ్, ఎంత అవసరతగల సమయము ఎంత అవసరతగల సమయము! నేను దానిని ఆఫ్రికా నుండి విన్నాను, మరియు ఆఫ్రికా కొరకు అలా౦టి పిలుపు. మరియు సహోదరుడు ఆర్గాన్ బ్రైట్ కొద్దిసేపటి క్రితము ఫోన్‌లో చెప్పుచుండెను. అలాంటి కొన్నిదేశాలు ఇక్కడ ఉన్నాయి, అది ఎక్కడ ఉన్నదో నేను మర్చిపోయాను. ఇక్కడే స్వీడన్, స్విట్జర్లాండ్ అని నేను నమ్ముచున్నాను. (నేను దానిని ఒక నిమిషములో పొందుకుంటాను). డెన్మార్క్ ఆఫ్రికా మరియు భారతదేశములో వేర్వేరు ప్రదేశాలు. ఇదే సమయానికి అక్కడకు రావలెనని ఇది సరియైన సమయముగా చేయుటకు ఒక ప్రత్యేకమైన ఉత్తరము వ్రాసెను. ఆఫ్రికా మరియు ఇండియాలో వివిధమైన అనేకమైన ప్రదేశములు, ... హవాయి దీవులు, వేరొక దినమున, వారు ఒక ఉజ్జీవము కొరకు పిలుపునిచ్చిన దానికి దాదాపు పదిరెట్లు ఎక్కువ. క్రైస్తవ వ్యాపారస్తులు అక్కడ బయటకు వెళ్ళుటకు కోరారు. మరియు దానికి అవతల వైవునకు వెళ్ళి క్రమమును ఏర్పరచి ఒక చాప్టరును ఏర్పరచి మరియు ఆ ఉదయాన వారితో మాట్లాడారు, మరియు హవాయిలో ఒక ఉజ్జీవము ప్రారంభమయినది.
14
కాబట్టి ప్రపంచము మొత్తము మన ప్రదేశముగా మారినది, (చూడండి?) ఆ మొత్తము ప్రదేశము అంతా. మరియు మనము ఆయన యొక్క సేవకులము. కాబట్టి స్నేహితులారా, ఇది చివరి రాత్రి కావచ్చు, ఇది పోయిన సంవత్సరము కావచ్చు, లేదా చివరి తరము కావచ్చు, అవి జ్ఞాపకముంచుకొందాము. చూశారా. మనకు తెలియదు అయితే, ఎలాగైన ఇది ఒక వాస్తవమైనదని మనకు తెలియును, అలా జీవించియున్నవారు చనిపోనైయున్నారని ఎరుగుదురు. మనిషి ఒకసారి మరణించవలెనని నియమింపబడెను, మరియు తీర్పు జరుగును. మరియు ఈ రాత్రి ఇక్కడ ఎవరైన ఉన్నట్లయితే, ఎవరైన దానిని కలుసుకోవటానికి సిద్ధముగా లేకపోయినా, మరియు ఈ ఆశీర్వాదకరమైన నిరీక్షణలేనివారైన మీరు నిత్యత్వము కొరకు మీకందరికి ఒకసారి ప్రభువైన యేసు కొరకు నిర్ణయించుకొనే సమయము ఈ రాత్రే అయి ఉండవచ్చును. ఇప్పుడు మనము ప్రార్ధన చేద్దాము.
15
మా పరలోకపు తండ్రీ, మా హృదయము యొక్క లోతులో నుండి మీకు కృతాజ్ఞతా స్తుతులు చెల్లించగోరుచున్నాము, మేము ఇక్కడ వేచియున్నామని తెలుసుకొని ఎంతమాత్రము కలవరపడుటలేదు. వారు ఎన్ని అణు బాంబులు తయారుచేసిన ఏమియు కాదు, మరియు ఎంతమంది పౌరసేవ చేయు ప్రజలను వారు ఆ విమానాలను కనిపెట్టుటకు పెట్టినను ప్రపంచము నరముల బలహీనత కలిగి మరియు వణకుచున్నది. మేము కలిగి ఉన్న ఈ శుభప్రదమైన నిరీక్షణపై మేము విశ్రాంతి పొందుచున్నాము. దేవుడు క్రీస్తు ద్వారా, కల్వరిలో పూర్తిచేయబడిన వాక్యము నందు విశ్వసిస్తున్నాము. ఆ తరువాత ఈ భూసంబంధమైన గుడారము ఇక లేదని తెలుసుకొనియున్నాము. మాకొరకు ఒకటి అక్కడ ఇప్పటికే ఎదురు చూచుచున్నది. మరింత మహిమాన్వితమైన చాలా ఎక్కువైన, అక్కడ నొప్పి, భాధ, అనారోగ్యము లేని స్థలము ఉన్నదని ఎరిగియున్నాము. వృద్ధాప్యము ఎప్పటికి దానిని తాకదు. ఎన్నడైనా నెరసిన జుట్టు, ఎన్నడైనా ముడతలు ఉండవు కానీ అక్కడ మేము నిరంతరము యవ్వనముగా ఉంటాము.
సత్యము తప్ప మరేదీ చెప్పలేని ఈ ఆశీర్వాదకరమైన బైబిలు మనకు ఈ ఆశీర్వాదకరమైన నిశ్చయతను ఇచ్చినది, మరియు పరిశుద్ధాత్మ కూడ సాక్షిగా ఉండి అదే కార్యమును జరిగించి ఋజువు చేయుచున్నాడు. మా హృదయాలు దానికొరకు పరితపించుచున్నాయి. ఈ నిరీక్షణలో మనము విశ్రమించునట్లు దేవుని వాక్యమనే విత్తనములు ఈ సారవంతమైన నేలలో నాటబడెను.
16
దేవా ఈ రాత్రి క్రీస్తుకు వెలుపల ఉన్న ప్రతీ వ్యక్తిని ముట్టమని ప్రార్ధి౦చుచున్నాను, మరియు వారిని మరపురాని నడవడికకు దగ్గరగా తీసికొని రండి. ప్రభువా ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్న రోగులను స్వస్థపరచండి. ఏ సందేహము లేదు ఈ విషయములో చాలామంది ప్రజలు మా అందరి మధ్య అక్కడ అనారోగ్యముతో బందీలైయున్నారు. మరియు, మీరు వారందరిని స్వస్థపరచాలని ప్రార్ధిస్తున్నాము.
తండ్రీ, ఇప్పుడు వాక్యము దగ్గరకు వస్తున్నాము. జీవమార్గము అయిఉన్న వాక్యమును తీసికొనుము, ప్రభువా, సమస్త నాగరికతకు మూలాధారము. పరిశుద్దాత్మ ప్రతివాక్యమును తీసికొని మాకు అవసరమైన దానిని మా హృదయములో నింపుమని మేము ప్రార్ధన చేయుచున్నాము. మేము వాక్యము చుట్టూ సహవాసము కలిగియుందుము గాక! ఏలయనగా మేము ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
17
గ్రంధము నుండి చదువుట కొరకు, ఈ రాత్రి కేవలము ఒక చిన్న వచనము కోసము పాఠ్య సందర్భమును వెతకటానికి ప్రయత్నించటానికి మరియు వాక్యమునకు బాగా సరిపోయేదిగా ఉండుట కొరకు తద్వారా మనము సహవాసము కలిగి ఉండవచ్చును. రేపు సోమవారము కావటముతో విషయము గూర్చి ఆలోచించుట మనకు ఇష్టము లేదని నాకు తెలియును. పనిచేయుటకు వెనుకకు వెళ్ళవలసియున్నది, అయితే మనము దానిని ఎదుర్కొనవలెను. మరియు అనేక పర్యాయములు, మీకు తెలియును... అయితే, ఇవన్నియు పరిశీలించిన తరువాత, ఉద్యోగాలు మరియు మిగిలిన ప్రతి సంగతి కంటే, ఇది చాలా ముఖ్యమైనది. చూశారా? ఏలయనగా, నీ ఉద్యోగము ఏదో రోజున లేకుండపోవును, మరియు నీవు దానితో పాటు లేకుండపోవుదువు. అయితే, నీవు నిత్యజీవము పొందినయెడల, నీవు ఎన్నటికి అంతము లేదు. అది నిత్యమైనది. జీవముతో ముందుకే కొనసాగును, శాశ్వతముగా ఉండును.
నిత్యజీవము (దాని గూర్చి ఆలోచించుము), నిత్యజీవమునకు అంతములేదు. యుగముల కాలము గతించుచుండగా, నీవు ఇంకా అక్కడే ఉండగలవు. మిలియనుల సంవత్సరాలు గతించుచుండగా మనము ఇంకా అక్కడే ఉండగలము, కనుక ఇక్కడ ఈ భూమిమీద కేవలము కొద్ది రోజుల కొరకు, ఉద్యోగాలు అంత ఎక్కువగా ఎన్నదగినవి కావు. మనకు ఏది అవసరమైయున్నదో అది కలిగియుండుటకు, మనకు కావలసిన అల్పాహారము మరియు మొదలైనవి కొనుటకు తినుటకు మనవెంట మనకు సహాయము కొరకే అయి ఉన్నది.
18
ఇప్పుడు మొదట కోరింధీయులు 10వ అధ్యాయము 12వ వచనముతో ప్రారంభించెదము:
తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంత కంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.
ఎంత మనోహరమైన వచనము. ప్రభువు దానికి ఆయన యొక్క దీవెనలు తోడు చేయును గాక. ఒక మార్గమును సిద్దము చేయుట, ఈ రాత్రి నేను ఏమి మాట్లాడవలెనని ఇష్టపడియున్నానో అదే తెలిసికొందము...ఇప్పుడు మనము వాక్యము వినుచుండగా, ఆయన వాక్యమునకు ఆయన ఆశీర్వాదము తోడు చేయునుగాక!
19
నా అభిప్రాయము ఏమిటంటే, ఏదైతే అన్నిటికి మూలమైనదో అది వాక్యమైతే ఆ విషయాన్ని అది పట్టుకుంటుంది. చాలాసార్లు నా స్వస్థతయొక్క కూడికలలో, బోధకులు ఇప్పటికి అన్నింటిని పూర్తిచేసిన తరువాత కూడ నేను తిరిగి రావటానికి ప్రయత్నిస్తాను. మరియు-మరియు వాక్యమును తీసికొని పునాది వేయటానికి ప్రయత్నిస్తాను.
కొన్ని రాత్రుల క్రితము నాకు విమర్శతో ఉన్న ఒక చిన్న ఉత్తరము వచ్చినది. అది బాగానే ఉన్నది. ఒక వ్యక్తి నాతో అన్నాడు, “సహోదరుడా బ్రాన్హాం, ఇంకా కేవలము నీవు ఒక బాలునివే” అన్నాడు. “నువ్వు పుట్టకముందే నేను సువార్తను బోధించేవాడిని అన్నాడు,” మరియు అతను ఇలా అన్నాడు, “నాకు.... ఉన్న మొత్తము నలభై ఆరు సంవత్సరములు, కానీ ఇంకా..” అతను-అతడు ఏదో ఒక బైబిలు స్కూలు ఉపాధ్యాయుడు. అతడు చెప్పాడు, “అయితే మీలాంటి వ్యక్తి ప్రజలకు బోధించేవాడు, మరియు ఇంకా మీరు మొన్న రాత్రి చేసిన వ్యాఖ్యను చేస్తాడు.” “ఇది హాస్యాస్పదముగా ఉందని నేను భావిస్తున్నాను.” అన్నాడు. మీరు చెప్పారు అపవాదికి స్వస్థపరిచే శక్తిలేదని. “బహుశా, సాతానుకు స్వస్థపరిచే శక్తి ఉందని నేను మీకు అడిగితే ఎలా ఉంటుంది? అన్నాడు, ”ఇప్పుడు మీరు నిలబడి నాకు ఎలా తెలుసు అని నన్ను అడుగుతారు. అన్నారు. మరియు చెప్పాడు, “నేను మీకు చెప్తాను.” అన్నాడు.
20
చెప్పాడు, “మా ఊరిలో చెడు ఆత్మ కలిగిన ఒక స్త్రీ నివశించేది. ప్రజలు వైద్యము కొరకు ఆమె వద్దకు వస్తారు.” చెప్పాడు, “ఆమె వారి తలనుండి వెంట్రుకలను లాగుతుంది మరియు ఆమె వారి నరములనుండి రక్తాన్ని పంప్ చేస్తుంది. మరియు ఈ వెంట్రుకలతో చుట్టబెడుతుంది, నదివద్దకు నడచివెళ్ళి, మరియు ఆమె భుజముపైనుండి ఆ వస్తువును విసిరివేసి మరియు వెనుకకు తిరిగి చూడదు. ఆమె వెనుకకు తిరిగి చూస్తే, ”ఆ వ్యాధి ఆ మనిషికి అలాగే నిలచి ఉంటుంది. అని చెప్పెను. కానీ, ఆమె దానిని మరచిపోయినట్లుగా, నదిలో విసిరి దూరముగా పోవును..“ మరియు చెప్పాడు, ”అరవై శాతము మంది ప్రజలను స్వస్థత పొందినట్లుగా మేము గుర్తించాము“. చెప్పాడు, ”ఇప్పుడు కనుక, దయ్యము స్వస్థత చెయ్యలేనియెడల దాని గురించి ఏమిటి?“
21
కాబట్టి నేను తిరిగి అతనికి సమాధానము చెప్పాను, “నా దయగల ప్రియమైన సహోదరుడా, మీ సంవత్సరాలకు సంబంధించి అన్ని గౌరవాలతో (చూడండి?), ”మీరు బోధించిన అన్ని సంవత్సరాలకు సంబంధించిన గౌరవములతో అయితే, నేను మీకు చెప్పుచున్నాను, దయ్యానికి స్వస్థపరిచే శక్తిలేదని యేసు చెప్పాడు, మరియు అది యేసు చెప్పినట్లయితే అది నాతో స్థిరపరచబడుతుంది. ఆయన చెప్పాడు, 'ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొట్టినయెడల, తరువాత అతని యొక్క రాజ్యము విభాగింపబడి, మరియు అది అంతమగును.' మరియు అతను సాతానును వెళ్ళగొట్టలేడని చెప్పాడు. తరువాత మీరు నన్ను అడుగుతారు, ఈ ప్రజలు ఎందుకు స్వస్థత పొందారు? ఎందుకనగా, అది ఆ వ్యక్తి కాదు, ఆ మంత్రగత్తెకి దానితో చేసేదేమియు లేదు, నేను లేదా ఏ ఇతర వ్యక్తియు చేయవలసిన దానికంటే చేసేదేమియు లేదు. ప్రజలు వారియొక్క స్వస్థత కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ద్వారా వారు వస్తున్నారని ఆలోచించుచూ, అలా సమీపించుచున్నది ఆ ప్రజలే. అది వారి దేవుని యందుగల వ్యక్తిగత విశ్వాసము వారిని స్వస్థపరచుచున్నది.“ చూశారా? వారు అలా ఆలోచిస్తూ సమీపించుచున్నారు. అది మంత్రగత్తె కాదు, ఎందుకంటె అది ఆ మనిషి చేసిన దానికంటె ఇక ఎక్కువగా చేసేదేమియు లేదు.
కాబట్టి ఆ విధముగా, సువార్త మాత్రమే శక్తితో కూడిన కార్యములు చేయగలదు, లేదా దేవుని వాక్యము బోధించబడినట్లుగా మాత్రమే అది చేరుకోగలదు. మరియు మనుష్యులు దేవుని యొక్క నిత్యమైన వాక్యముపై తమ విశ్వాసమును ఉంచుతారు. “వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యము వలన కలుగును.”
22
డాక్టరు అడయార్, ఇక్కడ ఈ నగరములో, నా ప్రియమైన స్నేహితుడు, ఒక రోజున నాతో అన్నాడు, అతడు అన్నాడు, “బిల్లీ, ప్రజలు అక్కడ బయట ఉన్న చెట్టును తాకిన యెడల, అదే ఫలితాన్ని పొందుతారని నీవు అనుకోవటము లేదా?”
నేను అన్నాను, “దానియందు నీవు ఏలాగు విశ్వసించి యుందువు? నీవు సమానమైన విశ్వాస పరిమాణము కలిగియున్నచో, ఆ చెట్టును ముట్టుట నీ కొరకు అలా అది దేవుడేర్పరచిన మార్గమని నమ్ముచుండిన, అది అలా జరిగియుండును, అప్పుడు వారు దానిని జరిగించగలరు. అయితే ఆ చెట్టునందు ఎవరు విశ్వాసము కలిగియుందురు? దేవుడు ఏమి చెప్పెనో నేను దానియందు విశ్వాసము కలిగి యున్నాను, మరియు కేవలము నేను అదే తీసికొన్నాను.”
కనుక, విశ్వాసమనునది ఉద్రేకపూరిత భావనల యొక్క కూలిపోయే ఇసుక తెన్నలపై నిర్మించబడలేదు. అయితే విశ్వాసము దేవుని నిత్యమైన వాక్యమైన యుగముల బండ అను ప్రమాణముపై నిర్మించబడెను. విశ్వాసము అది సరిగా అక్కడే నిర్మించబడినప్పుడు, అక్కడే అది పవిత్రమైన విశ్రాంతి స్థలమును తీసికొని మరెన్నడు కదలదు.
23
ఇప్పుడు, ఒక మార్గమును సిద్ధము చేయుటను కేవలము ఆకస్మికముగా దేవుడు ఎన్నడైనా ఆయన కార్యాలయమును నడుపునని నేను నమ్ముటలేదు. నేను నా దానిని అలా చేయను; నీవును నీ యొక్క దానిని అలా జరిగించవు. కేవలము ఇలా చెప్పుటకు క్రీస్తు కల్వరిలో చనిపోలేదు, “మంచిది, అలా నేను ఆ విధముగా వచ్చి, భూమి మీదకు వెళ్ళి మరియు శరీరధారిగా అయినందున, ఇప్పుడు ప్రజలు నా నిమిత్తము విచారపడవచ్చును. మరియు నేను ఎంత దయగలవానిగా చనిపోయానో వారు చూచిన యెడల, వారు నిజముగా రక్షించబడినవారుగా ఉండవచ్చును...”
24
దేవుడు ఆ విధముగా చేయడు. దేవుడు ఒక ఉద్యేశ్యము (ప్రయోజనము) కొరకు చనిపోయెను: మరియు ఎవరు రక్షించబడుదురో దేవుడు ముందుగానే ఎరిగియుండి, వారినే రక్షించుట అయి ఉండెను. అది నిజము. అక్కడ ఎవరో వ్యక్తి రక్షించబడనైయుండెనని దేవుడు ఎరిగియుండెను, లేదా రక్షించబడుటకు ఒక మార్గము సిద్ధము చేసెను. కనుక, దేవుడు ఆ ప్రజలు రక్షించబడియుందురని ముందుగానే ఎరిగియుండి, వారు ఎవరో ఎరిగియుండియు ఆయన ఒక ప్రణాళికను పెట్టియుండెను.
ఇప్పుడు నాతో ఇలా అందువు, “బ్రాన్హాం సోదరుడా, అప్పుడు ఎవరు రక్షించబడగలరో దేవునికి ఖచ్చితముగా తెలియునా?” నిజముగా.
“మంచిది, అది ఎందుచేత ఇలా చెప్పుచున్నది, ఎవరూ నశింపవలెననునది ఆయన చిత్తము కాదు కదా?” ఆయన చిత్తముకాదు. ఎవరైనా నశించవలెను అనునది ఆయన చిత్తము కాదు, అయితే, అలా అందరు మారుమనస్సు పొందుటకు రావచ్చు. అయితే, దేవుడైయుండిన క్రమములో, ఎవరు అలా జరిగించగలరో ఆయనకు తెలిసి ఉండాలి, లేదా ఆయన దేవుడై ఉండడు. కారణము-ఆయన ఉన్నాడు-ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వము వ్యాపించినవాడు, ఆయన అంతటా నిండియున్నవాడు. ఆయన సర్వము తెలిసినవాడు. ఆయన ప్రతిస్థలములో ఉన్నాడు, మరియు ఆయన సర్వాధికారము కలిగినవాడు.
కాబట్టి, ముందు జ్ఞానము ద్వారా వెనుకకు చూచి, మరియు అలా ఆయన దేనిని ముందుగా చూచి ఎరిగియుండెను అని చెప్పును, ఆ కారణము చేత ఆయన ఆదినుండి అంతము ఏమైయుండునో చెప్పగలిగియుండెను. మరియు, కాబట్టి, ఇప్పుడు మనము జీవించుచున్న ఈ మరపురాని సమస్త రోజులన్నియు యెరిగియుండి, మరియు సాక్ష్యమిచ్చి, నిలబడుటకును మరియు ఇప్పుడు మనము చూచుచున్న సంగతులన్నియు చూచుటకు, దేవుడు దానికొరకు ఒక సిద్ధపాటును, చేయవలసి ఉండెను.
25
మరొక రాత్రి, చాలా ఆశ్చర్యపోయాను. ఒక చిన్న స్త్రీ వేదిక మీదకు వచ్చెను. అక్కడ అది మూడు-లక్షల-డాలర్ల విలువగల పెద్దదైన ప్రదేశము, మరియు ఆమె ముఖమునకు కొద్దిగా రంగు వేసుకుని ఉన్నది. ఆమె అక్కడ నిలబడెను. మరియు ఆమె వణుకుటకు ప్రారంభించెను. నేను చెప్పాను, పరిశుద్ధాత్మ ద్వారా, “నీవు లూధరన్ సంఘ సభ్యురాలివి.” అన్నాను.
ఆమె అన్నది, “అవును, అయ్యా.”
మరియు నేను చెప్పాను, “నీవు ఇక్కడకు ప్రార్దన చేయించుకొనుటకు వచ్చావు, నీవు ఇప్పుడు ఇలా నడుచుటకు కారణము, నీ రెండు మోకాళ్ళు పగిలిపోయాయి.” నేనన్నాను, “నాలుగు సంవత్సరాల క్రితము నీవు ఒక కారు నడుపుచున్నప్పుడు మరియు ఒక కారు ప్రమాదము వలన ఆ దెబ్బలు కారణమైయుండెను.
“ఆమె అన్నది, ”అది నిజము.“
నేను చెప్పాను, “నీ వైద్యుడు కొంచెం పొట్టిగానున్న వ్యక్తి బట్టతల మరియు కళ్ళజోడు ధరిస్తాడు” అనెను,
“అది సరియైనదే.”
మరియు నేను చెప్పాను, “ఆ మోకాళ్ళలో ఆ ఎముకకు క్షయ సోకినది, మరియు ఆ ఎముకచుట్టూ ఉన్న శరీరం కుళ్ళిపోతుంది.”...అందుచేత అతడు వైద్యం చేస్తున్నాడు.
ఆమె అన్నది, “అది యధార్ధము” ఆమె అన్నది,“అక్కడ నాకై ఏమైనా నిరీక్షణ కలదా?”.
ప్రభువైన యేసును నీవు ఎలా సమీపిస్తున్నావు అన్నదాని మీద ఆధారపడియున్నది“ నేనన్నాను....
ఆమె అన్నది, “మీరు నాకు సహాయం చేయగలరా?”
నేనన్నాను, “లేదమ్మా, ఇప్పుడు నీకు ఎవరూ సహాయం చేయలేరు. కానీ దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ఆశీర్వాదాలను పొందుకొనుటకు నీకు నీవే సహాయం చేసికోవాలి.”
మరియు ఆమె అన్నది,“ నేను ఇప్పుడు నా పూర్ణ హృదయంతో నమ్ముచున్నాను.”
నేనన్నాను, “సహోదరీ, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు.” ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, “నీవు స్వస్థత పొందావు.”
ఆమె అన్నది, “బ్రాన్హాం సహోదరుడా, నేను మోకరించలేకపోయాను”. ఆమె అన్నది, “నాలుగు సంవత్సరముల నుండి ” ఆమె అక్కడ నిలబడి, ఏడుస్తూ ఆమె చేతులు రుద్దుకొనుచున్నది. మరియు ఆ గొప్ప జన సమూహమునకు చెందిన శ్రోతలు, ఆమెను గమనించుచున్నారు, లూధరునులు, ప్రెస్పిటేరియన్లు. మరియు నేనన్నాను, “నీవు బలిపీఠం దగ్గరకు వెళ్లి అక్కడ ఎందుకు మోకరిల్లకూడదు.”
ఆమె అన్నది, “నన్ను ఇక్కడే మోకరించనీయుము, నేను ఎక్కడ స్వస్థపడ్డానో అక్కడే మోకరిస్తాను.”
ఆమె ఆ మెట్ల దగ్గర నుండి ఆమె ఎన్నడూ కదలలేదు, అయితే ఆమెకు ఆమె స్వస్థత పొందెనని ఎరిగియుండెను. ఏదో జరిగినది. చూశారా. ఆమె అది ఎరిగియుండెను. అక్కడ దానిని గూర్చిన ఏ ఊహలూ లేవు.
నేనన్నాను, “మోకరించుము.”
ఆమె రెండు మోకాళ్ళు విరిగిపోయాయి, ఆ ఎముకల మీద కండ పెరిగినది, ఆ ఎముకలు కలసిపోయాయి, నాలుగు సంవత్సరాల తరువాత మొదటిసారి, ఆ స్త్రీ ఒక యువతివలే మోకరించినది, ఆమె బుగ్గలమీద నుండి కన్నీరు కారుచున్నది, ఆమె తన చేతులు దేవుని వైపుకు ఎత్తినది; ఎందుకు, ఒక చిన్న పిల్లవలే తేలికగా, అక్కడ నుండి సరిగా పైకి లేచి మరియు ఆ వేదికను తట్టినది. అది ఏమిటి? దానికొరకు దేవుడు ఒక మార్గమును సిద్ధము చేసెను. ఇప్పుడు, ఆయన వైద్యులను పంపెను, అది సరియైనదే. మరియు వైద్యులు మంచివారే. మరియు వారు చేయకలిగిన సమస్తమూ చేశారు, కానీ దేవుడు ఒక మార్గమును సిద్దము చేయుట. మార్గమును ఏర్పరిచినవాడు, అంతే, చూశారా. వైద్యుడు వాని మార్గంలో విఫలం అయిన తరువాత, దేవుని మార్గము మన మార్గము కంటే ఎంతో ఉన్నతమైనది. ఎంత అద్భుతమైన సంగతి.
26
ఇప్పుడు ఆలోచన చేయగా, ఈ రాత్రి నీవు మరియు నేను (అలా కాదు ఇలా ఆలోచించుటకు ఇష్టపడము), అయితే మనం యథార్థంగా లోక స్వభావము కలవారము, పందులవలే అని చెప్పవచ్చును. మరియు, ఈ రాత్రి పరిశుద్దులుగా మార్పు చెందాము. ఏదో జరుగవలసియున్నది. ఇప్పుడు, మనం పందులుగా వుండి పరలోకానికి వెళ్ళలేము. మనం పరిశుద్దులుగా పరలోకానికి వెళ్లవలెను, కనుక దీనికొరకు ఒక సిద్ధపాటు చేయబడవలసియుండెను. దేవుడు పాతనిబంధనలో దానిని ఎంతో సౌందర్యముగా చూపించెను. వెనుకనున్న సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో; మరియు నిర్ణమకాండము 36 .... 32లలో.
మరియు పాపపరిహార దినమును గూర్చి మనం కనుగొనగలము. దేవుడు, క్రీస్తుగా మారి, ఆయన వచ్చునప్పుడు, ఆయన ఏమి చేయనైయుండెనో, దృష్టాంతముగా, మాదిరిలో, ఛాయా రూపములో చూపించుచున్నాడు. ప్రధానయాజకుడు చిన్న మేకలు, రెండు మేకలు తీసికొనవలెనని ఆజ్ఞాపించబడెను. మరియు పాపపరిహారము కొరకు అర్పణ కొరకు వాటిని తీసికొనమని, మరియు వాని సొంత కుటుంబము కొరకు ఒక ఎద్దును తీసికొనవలెను. ఇక్కడ మీలో అనేకులు బైబిలు చదువువారు మరియు బైబిలును అభ్యసించువారు, ఆ పరిహారములు ఏలాగుండెనో మీకు తెలియును.
27
అయితే అప్పుడు ఒక మేక..... అక్కడ ఒక లాటరీ వేయబడెను. మరియు ఆ లాటరీ ఒక మేక మీద పడెను, అది చనిపోయెను, మరియు ఆ తర్వాత ఈ మేక యొక్క రక్తం మరొక మేక మీద ఉంచబడెను, ప్రధాన యాజకుడు సజీవమైన మేక మీద చేతులుంచి, ప్రజల యొక్క పాపములు ఒప్పుకొనుచుండెను. అప్పుడు యోగ్యుడైన ఒక మనిషి ఈ సజీవమైన మేకను తన చేతులలోనికి తీసికొని మార్గము లేని ఒక స్థలంలో ఆ మేక ఎక్కడ నశించిపోవలసియుండెనో మరియు ఆ ప్రత్యేకమైన స్థలంలో ఉండుటకు, అరణ్య మార్గములోనికి వెళ్ళెను. ఈ స్థితిలో నుండి, మరలా వాని సొంత కుటుంబములోనికి, వెనుకకు వచ్చుటకు, ఇక ఎన్నటికీ కుదరదు, అయితే ఆ ప్రజల పాపములను భరించుటకు ఇక ఎన్నటికీ ప్రత్యేకముగా ఉండును.
28
ఇప్పుడు బహుశా అనేకమైన పండితులు ఇక్కడ కూర్చొని ఉన్నారని నాకు తెలియును. మరియు ప్రత్యేకముగా అడ్వంటిస్టులు, వారు “ఒక మేక క్రీస్తు అనియు మరియు మరొకటి దయ్యము అనియు వారు ఆ విధముగా చెప్పుదురు. ఇప్పుడు, సహోదరులారా, నేను దాని విషయమై కొద్దిగా వ్యత్యాసము కలిగియున్నాను. మనం దయ్యానికి బలులు అర్చించము. రెండు మేకలు క్రీస్థుకే ప్రాతినిధ్యము వహించుచున్నవి. ఆ రెండును క్రీస్తు అయి ఉండెను. క్రీస్తే మన యొక్క.... ఆయన మన పాపముల కొరకు ఆయన చిందించెను మరియు ఆయన తనకు తానే మీద వేసికొని భరించెను. దయ్యము నా పాపాలను భరించలేదు. క్రీస్తే మన పాపములను భరించువాడు. దానిని సూటిగా గ్రహించుము, అప్పుడు నీ విశ్వాసము చలించదు. క్రీస్తే మన పాపములను భరించువాడు, మరియు లోక పాపాలను భరించువాడు. సిలువనొద్ధ చనిపోవుచున్న జంతువు క్రీస్తే వినండి, ”భూమికి పునాదులు వేయబడినప్పుటి నుండి వధించబడిన గొర్రెపిల్ల.
ఆ విధముగా ఏదో రోజున దృష్థాంతముగా పొందగలమని ఎరిగియుండి, మనం చిహ్నములుగా మాత్రమే పాలిభాగస్తులమయ్యాము. ఎందుకు ఆయన జగత్తు పునాది వేయబడినప్పటి నుండి వధింపబడెను? కారణం, దేవుడు ఆయన మనస్సులో ఆ సంగతులు ఏలాగుండుననియు మరియు ఆ సంఘము ఏమైయుండెననియు, మరియు ప్రతీదియు ఏమైయుండుననియు గ్రహించెను మరియు ఆయన ఆ వాక్యమును పలికెను. దేవుడు ఆ వాక్యమును పలికినప్పుడు , సరిగా అంతలోనే అది ఎంతో మంచిగానుండెను, కనుక ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధించబడెను, మీరు దానిని గ్రహించారా? “ఆమేన్” అని సమాజము చెప్పుచున్నారు.. సంపా)
మీరు ఇప్పుడు దానిని పొందినప్పుడు, మరియు మీ విశ్వాసము..... మనిషి మీద కాదు, సంఘశాఖల మీద కాదు, అవన్నియూ మంచివే, మనిషియూ మంచివాడే. మీ విశ్వాసము కల్వరిలో క్రీస్తు యొక్క ముగించబడిన క్రియలు మీద మాత్రమే విశ్రాంతి పొందనియ్యండి, పాపము మరియు రక్షణ కొరకు. మీరు దానిని గ్రహించారా?
29
గమనించండి, క్రీస్తు వచ్చెను మరియు ఆయన చనిపోవుచున్న జంతువు అయి వుండెను. ఏలయనగా ఆయన ఇది వరకే జగత్తు పునాది వేయబడినప్పుడే వధించబడెను. మీరు దానిని గ్రహించారా? దేవుడు అది పలికెను, మరియు అది అలా వుండవలెనని చెప్పెను. కాబట్టి, దేవుడు పలికినప్పుడు, అది ఎన్నటికీ పరలోకములో స్థిరపరచబడెను.. ఆ వాక్యమే అదే....... అక్కడే ఆ విధముగా నీవు విశ్వాసము కలిగియుండవలెను. దేవునియొక్క నిత్యమైన, మారని వాక్యమని నీవు దీనిని నమ్మినయెడల అప్పుడు దేవుని వాక్యములో పలుకబడిన ప్రతీ నీతి సూత్రము ఒక విత్తనమై యున్నది. వాక్యములో అలా దేవునిచే పలుకబడిన ప్రతీ సంగతియు, ఇది వరకే మహిమలో స్థిరపరచబడెను మరియు అది నీకు కార్యము చేయుటకై ఇవ్వబడెను. కనుక దేవునియొక్క నిత్యమైన, ఆశీర్వదించబడిన వాక్యము యొక్క ఏ భాగమునైననూ తీసికొనుటకు భయపడవద్దు. మరియు నీహృదయంలో దానికి లంగరు వేయుము.
ఇప్పుడు, అది భూమిలో వుంచబడవలసియున్నది. ఇప్పుడు, ఉదాహరణముగా, నేను ఒక జొన్న గింజను తీసికొని మరియు అది నీలం రంగులో ఉన్న రాయి లేక అలా౦టిది దానిలో ఉంచిన ఉంచిన అది ఎదిగియుండదు, ఎందుకనగా అది తప్పుడు రకమైన నేల. అయితే అది మంచిదైన అభివృద్ధి చెందుతూ పెరిగే నల్ల నేలలోనికి వెళ్ళిన యెడల, అది అక్కడ నుంచినప్పుడు ఎంతో నిశ్చయముగా అది ఎదుగును.
మరియు వాక్యము ఇప్పుడు (ఇక్కడే వున్నది..) నిండుగా వున్న విశ్వాసము గల ఒక హృదయములోనికి, దేవుని వాక్యము పడినప్పుడు, కేవలం అది ఎదుగవలసి యున్నది, అది పట్టుకొనియుండును. ఆ కారణం చేత అక్కడ నిలబడిన ఆ స్త్రీ ఉండవలసినంతగా లేని ఆ కాల్షియం లోపముతో ఆమె మోకాళ్ళు పగిలిపోయి, ఆ రెండు నలిగిపోయాయి; టి.బి తో ఎముకలు మరియు ఆ.. శరీరము కూడ కుళ్ళినది. ఆమె మోకాళ్ళు వంచుటకు భయపడుటలేదు. దేనికొరకు? వాక్యము విశ్వాసముగా మారెను. మొలిచి పైకి లేచినది! నీవు అది గ్రహించావా?
30
జగత్తుకు పునాది వేయబడకముందే, క్రీస్తు ఇక్కడ వుండునని, దేవుడు చెప్పెను. మరియు ఆయన వధించబడి, నేరస్థుల కొరకు అమాయకుడై చనిపోయెను. దేవుడు దానిని పలికినప్పుడు, దేవుడు అది పలికినప్పుడు అది ఇది వరకే జరిగినది. ఇప్పుడు, అది వాక్యముగా వుండుటకు ముందు, అది ఒక ఆలోచనగా వుండవలసియున్నది, ఏలయనగా వ్యక్తపరచబడిన ఒక ఆలోచనయే వాక్యము అయి వున్నది.
మరియు అప్పుడు, దేవుడు ఆయన మనస్సులో ఈ సంగతులు పొంది వుండినయెడల, అప్పుడు అవి ఆయన మనస్సులో ఉన్నవి. అప్పుడు, ఆయన వాటిని పలికెను, మరియు (ఆయన) దేవుడు పలికినప్పుడు అవి ఎంతమంచిగా ఉండెనో, అంతమంచిగా అవి పూర్తి చేయబడెను, కారణమేమనగా ఆయన కలుషితము లేనివాడు మరియు ఇంకేమియూ చేయడు. ఆ తరువాతది, దేవుని యొక్క......ఏర్పరచబడిన బలియు, దహనబలిని అంగీకరించు ఆధారము పై, అక్కడ ముందు ఉన్న పాపులను దేవుడు రక్షించిన యెడల, ఈనాడు ఆయన అదే కార్యమును చేయవలసి యున్నది, లేదా లోనికి...ఒక మనిషిని దాని ద్వారా తీసీకొనినప్పుడు ఆయన తప్పుచేసినవాడగును.
పరిహారము యొక్క ఆధారముపై, చిందించబడిన జంతువుయొక్క రక్తము..మీద అక్కడ ఇంతకు ముందు దేవుడు రోగిని స్వస్థపరచిన యెడల, ఈనాడు అదే విధముగా చేయవలసియున్నది, లేదా ఆ మొదటి వ్యక్తిని ఆయన స్వస్థపరచినప్పుడు ఆయన తప్పు చేసినవాడగును. చూశారా? ఆయన మారనివాడు.
31
మనం ఎదుగుదము; మనం అనుభవజ్ఞులమగుదుము. మనం శ్రేష్టమైన సంగతులు కనుగొందుము. మనం శ్రేష్టమైన సంగతులను గూర్చి మాట్లాడుదుము. మనం శ్రేష్టమైన బట్టలు ధరిస్తాము, శ్రేష్టమైన ఒక వాహనమును నడుపుతాము. మనం అభివృద్ధి చెందుచూ ఎదుగుచున్నాము. అయితే దేవుడు ఆ పద్దతిలో అభివృద్ధి చేసికొనడు, ఎందుకనగా ఆయన ప్రారంభంలోనే పరిపూర్ణుడైయుండెను. మరియు పరిపూర్ణత అనునది ఇంకెంత మాత్రము ఎదగనిది, అది ఇదివరకే పరిపూర్ణముగా వున్నది. ఆమేన్.
కనుక ఆయన ఇలా చెప్పనవసరం లేదు, “మంచిదే, ఇది ప్రత్యేకమైన యుగము, మనం ఇప్పుడు ఒక శ్రేష్టమైన ఆలోచన పొందియున్నాము” అది అలా అయిన యెడల, ఆయన దేవుడుగా వుండలేడు. కనుక, ఆయన దేవుడైన యెడల, అక్కడ వెనుక కాలంలో ఏమి పలికెనో, ఆయన దానితో నిలబడవలసియున్నది, ఎందుకనగా ఆయన అక్కడ పరిపూర్ణుడే మరియు ఎప్పుడూ పరిపూర్ణుడే. చూశారా? మీరు దానిని గ్రహించారా? అప్పుడు ఆయన ఎదిగి అభివృద్ధి చెందడు. ఆయన అలా చేయడు...సరే గానీ, నా ఉద్దేశ్యం, ఆయన ఇంకా శేష్టమైన కార్యములను చేయడు. దీనిని ఇంకా కొంచెముగా ఇది మరి కొంచెం శ్రేష్టమైనదిగా ఉండును“ అని చెప్పుట కాదు.
నీవు అంటావు, “పాత నిబంధనలో గొర్రెపిల్లను గూర్చి ఈ గొర్రెపిల్లను గూర్చి ఏమిటి? అది ఒక మాదిరి అయి ఉండెను, దాని కొరకు అది కనిపెట్టుచుండెను, మరియు అది అలా ఉండెనని ఆయన చెప్పెను.
32
ఆయన జగత్తు పునాది వేయబడినప్పటి నుండి వధించబడిన గొర్రెపిల్లను గూర్చి ఆయన పలికెను. “నేను ఆమె సంతానమునకు మరియు సర్పసంతానమునకు వైరము కలుగజేసెదను.” ఆ తరువాత ఆ కాలము సంపూర్ణమగుట కొరకు కనిపెట్టుటకు, చిందించబడిన ఆ గొర్రెపిల్ల రక్తమును చూపించుచు, దేవుడు పాపము యొక్క పరిహారమును ఇచ్చెను. పగటి సమయములో ఆ సూర్యుని యొక్క ఉనికిని, రాత్రి సమయములో చంద్రుని ద్వారా ఆయన అదే సంగతిని కలిగించెను. సూర్యుని యొక్క ఒక ఛాయారూపములో చంద్రుడు ఉండెను, లేదా ఆ సూర్యుడు ఒక ఛాయా రూపములో చంద్రునిపై ప్రకాశించుచుండెను. సూర్యుడు, చంద్రుడు భార్య భర్తలైయున్నారు. ఆ సూర్యుడు అస్తమించునప్పుడు, ఆ సూర్యుడు వచ్చువరకు మనకు కొద్దివాటి వెలుగు ఇచ్చుటకు దాని వెలుగును అది చంద్రుని మీదకు త్రోయుచున్నది. ఆ సూర్యుడు వచ్చునప్పుడు చంద్రుడు వెలసిపోవును.
ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏవిధమైన వెలుగై ప్రకాశించెనో అదేరకపు వెలుగుతో ఎవరు మహిమలోనికి వెళ్ళారో సూర్యుడైయున్న క్రీస్తు సంఘము మీద ప్రకాశించెను. యేసు వచ్చువరకు, సంఘమే లోకమునకు వెలుగై ఉండును. మరియు అది అంతా కలసిపోవును. అది ఏకమై కలసి బయటకు వచ్చునప్పుడు, ఒకే వెలుగుగా మారు సూర్యకాంతి మరియు చంద్రకాంతివలె ఉండును. ఆ గొప్ప వెయ్యేండ్ల పాలనలో క్రీస్తు మరియు ఆయన సంఘము ఏకమైనప్పుడు, అవి కలసి ఒక్కటిగా బయటకు వచ్చును.
33
ఈ దినమున, “మీరు లోకానికి వెలుగైయున్నారు.” ఆయన సన్నిధిలో...విశేషముగా ఆయన సన్నిధిలో ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ప్రకాశించిన వెలుగును నీ ద్వార ప్రకాశింపచేయుటకు ఆయన వెలుగు నీకిచ్చియున్నాడు. పాతకార్యములన్నియు, ఈ భూమి మీద ఉన్న కార్యములన్నియు, పరలోకపు కార్యములకు సాదృశ్యమైయున్నవి. తొండలు, మరియు సాలేళ్ళు మరియు పాములు కూడ మొదలైనవి, వెనుకున్న వాటిని ప్రతిబించుచు, దురాత్మలకే సాదృశ్యముగా ఉన్నవి.
క్యాన్సరును వారు కాన్యన్సరు అని ఎందుకు పిలచుచున్నారు? ఎందుకనగా అది ఒక పీత ఆకారములో ఉన్నది. క్యాన్సరు అను పదమునకు ఆంగ్లములో పీత అని అర్ధము.
34
ఇప్పుడు, మీరు చూస్తున్న, ఆ కార్యములన్నియు ఛాయలు మరియు సాదృశ్యములు. కాబట్టి తప్పిపోయిన ఆ మేక ఒక ప్రత్యేకమైన ప్రదేశములో, అరణ్యములో దూరముగా ఉంచబడెను, తన తోటి పౌరులనుండి వేరయి, ప్రజల పాపాలను తన తలమీదనుండి మోసికొనుచూ వెళ్ళిపోయినది. ఆయన సన్నిధినుండి వేరయి మరియు అది దేవుని నుండి వేరుపడి మన పాపాలను నరకానికి మోసికొనిపోయిన క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. అక్కడ దేవుడు ఆయనను నశింపనీయలేదు... దావీదు చెప్పాడు, “ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్దుని కుళ్ళుపట్టనీయవు.” మన నీతీకరణము నిమిత్తము ఆయన మూడవ దినాన తిరిగి లేచెను. అయితే ఆయన విడిచి పెట్టబడిన మేకకు సాదృశ్యముగా ఉన్నాడు. దేవుడు సిద్ధపాటు చేయుచు, మరియు ఒక మార్గమును ఏర్పరచెను. ప్రతి సమయములో, దేవుడు ఎల్లప్పుడు తప్పించుకొను ఒక మార్గమును సిద్ధముచేయును.
35
ఆనారోగ్యము నిన్ను ఒక మూలకు నెట్టుతుంది. నీవు కైస్త్రవుడవు అయిన తరువాత సాతానుడు నిన్ను ఒక స్థలములో నొక్మియుంచును. బహుశా నీవు ఒక జూదగాడివి అయి ఉండవచ్చును. మీరు అది చూశారా? బల్లమీద పేకలు ఉన్నాయి. “జాన్, రమ్ము. అది నీలో ఉన్నదని మాకు తెలుసు.” సాతాను అక్కడ నిన్ను శోధించును. అయితే, దేవుడు, ప్రతి సమయములో, నీవు దానిని అంగీకరించగలిగితే, తప్పించుకొను ఒక మార్గమును సిద్ధము చేయును.
బహుశా నీవు ఒక త్రాగుబోతువై ఉండవచ్చును, మరియు నీ ముక్కు క్రింద గ్లాసు ఉన్నది. ఇప్పుడు, జాన్, రమ్మూ“ ఇప్పుడు నీవు ఆ స్వరమునకు లోబడినట్లయితే, నీవు మరలా సరిగా ఆ వాంతిలోకే తిన్నగా వెళ్ళగలవు. కానీ అక్కడ ఎల్లప్పుడు దేవుడున్నాడు. నీ మనస్సు పరలోకము వైపుగా త్రిప్పి, కల్వరి వైపు చూడుము, మరియు ఇలా చెప్పు, ”ఆశీర్వదించు పరిశుద్దాత్మ, నా యొద్దకు రమ్ము. నేను అవసరతలో ఉన్నాను.“ అక్కడ ఏమి జరుగుతుందో గమనించుము ప్రతి సమయములో దేవుడు తప్పించుకొను ఒక మార్గమును సిద్ధము చేయును. ఎందుకనగా; ఆయనకు ఇష్టము దేవుడు ఎల్లప్పుడు అలా చేయును.
36
ఇప్పుడు గమనించండి. లోకము యొక్క నాశనమునకు ముందుగానే పాపులుగా ఉన్నారు, దాని ద్వారా తప్పించుకొనుటకు కోరికగల వారికొరకు దేవుడు తప్పించుకొను ఒక మార్గమును ఏర్పరచెను. దేవుడు ఓడను నిర్మించి సిద్ధము చేసెను. నోవహు ఓడను నిర్మించెను. ఒక మార్గము యొక్క సిద్ధపాటు కొరకు అందుకొరకు ఒక ఓడను సిద్దపరచుచుండెను. (వినుడి) ఒక దానినుండి ... తప్పించుకొను ఒక మార్గము కొరకు.. ఉగ్రత మరియు దేవుని తీర్పు. పాపపు దేశము మీదను, పాపపు ప్రజలమీదను కుమ్మరించబడుటకు ఆకాశములలో కుప్పగా ప్రోగుచేయబడెను, వారు మెడ తిరగని ప్రజలు మరియు దానిని తిరస్కరించారు. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా నడిచారు. ప్రజల మీద తీర్పు ఉగ్రత కుమ్మరించబడుటకు ఆకాశములో ప్రోగు చేయబడుచున్నంతకాలము కరుణ కలిగిన దేవుడు దాని కొరకు ఆశపడి ఆ మార్గములో నడుచువారి కొరకు ఆయన తప్పించుకొను మార్గమును సిద్ధము చేసెను. తప్పించుకొను మార్గము!
37
న్యాయతీర్పు ఎక్కడ కుప్పలుగా పోగైనవో ఇప్పుడు మరలా అలాటి స్థానమునకు మనము వచ్చాము. చరిత్ర యొక్క ముగింపు సమయములో, మరియు దేశాలయొక్క ముగింపులో మరియు ఔన్నత్యముతో కూడిన ఒక పరిస్థితిలోనికి వచ్చుచుండగా, జలప్రళయ భయములో ఆరోజు అలా ఉండిన యెడల ఈనాడు ఇంకా ఎంత ఎక్కువగా ఉండును! ఎంతవరకనగా లోకములో పాపము శిఖరానికి చేరునంతగా, ఆమె గృహము ఎదుట త్రాగి తూలిపోయి తడబడుచున్న ఒక మనిషిగా ఉన్నంతవరకు...?...ఇంకా ఎంత ఎక్కువగా దేవుని ఉగ్రత మొత్తం అంతా ఒక కుప్పగా పోగయి మిలియనుల కంటే ఎక్కువ మంది ప్రజలపై పడి ఉన్నది. ఎంతవరకనగా-యెహోవా యొక్క సబ్బాతు వస్త్రాలు వరకు - చంద్ర, నక్షత్రాల కవతలకు వెళ్ళిపోయెను.
అప్పుడు ఆమె-ఆమె యొక్క సొంత వేదాంతములతో, స్వార్ధపూరితమైన ఆమె యొక్క సొంత బధ్రతతో, మానవ నిర్మితమైన ఆమె యొక్క సొంత ఊహతో ఆ భారము క్రింద తూలిపోవుచున్నది. వారి యొక్క ఆచార పద్ధతుల బోధల ద్వారా, దేవుని ఆజ్ఞలు నిరర్ధకము చేయుచున్నారు. దేవుని స్తుతించుట కంటే ఎక్కువగా మానవులను స్తుతించుటను ప్రేమించుచున్నారు. మన బోధకులు నులివెచ్చని స్థితిలోనికి వచ్చారు, మరియు సంఘములో చేరుటమీద ఆధారపడి ఇలా చెప్పుచున్నారు, “నీవు సంఘములో ఉన్నంతకాలము అదంతా సరియైనది. ఇక దానిగూర్చి మరచిపోవలెను.”
38
అయితే, సహోదరుడా, దేవుడు తప్పించుకొను మార్గమును ఏర్పాటు చేసెను, నీవు దేవునికి సమ్మతమగు నిబంధనలకు రావలసియున్నది, మరియు అది కృప వలన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అయి ఉన్నది. వేయబడిన పునాది తప్ప మరియొక పునాది లేదు. మరి ఏ ఇతరమైన పునాది కట్టినయెడల, అది గడ్డి దుబ్బులు మరియు మట్టిపై కట్టబడినట్లుగా ఉండును, వరదలు వచ్చి వాటిని తుడిచివేయును, మరియు దాని పతనము గొప్పదై ఉండును.
అయితే యేసు చెప్పెను, “ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేకుండును.” ఆయన కట్టినది అది దేనిమీద కట్టెను? ఆయన దేవుని కుమారుడై యుండెనను ఆత్మ సంబంధమైన బయలుపరచబడిన సత్యము మీద నిర్మించబడెను. “మనుష్య కుమారుడనైన నన్ను గూర్చి మనుష్యులు ఏమని చెప్పుచున్నారు?”
“కొందరు ఏలియా అని చెప్పుచున్నారు, మరియు కొందరు మోషే అనియు కొందరు బాప్తిస్మము ఇచ్చు యోహాను మరియు మొదలైన విధముగా చెప్పుచున్నారు.
“అయితే, నన్ను గూర్చి మీరేమని చెప్పుచున్నారు?”
సందేహము లేకుండ, రెండవసారి అవకాశము తీసికొనక... పాపాత్ముడా వినుము, ఆ పద్ధతిలోనే నీవు దానిని తీసికొనవలెను. అతడు ఆయనతో ఉండెను; ఆయన ఏమై ఉండెనో అతడు ఎరిగియుండెను. మరియు అంతలోనే అతడు రెండవసారి కూడ ఆలోచించకమునుపే, ఆ పరిశుద్ధాత్ముడు వానిని పట్టుకొనెను, మరియు అతడు అన్నాడు, “సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు.”
అన్నారు, “సీమోను బర్‌యోనా, సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు. నీవు ఎన్నడూ ఏ వ్యక్తి యొక్క వేదాంతమునుండి నీవు దీనిని నేర్చుకొనలేదు. నీవు ఏ సెమినెరీ నుండి ఎన్నడూ రాలేదు. అయితే, పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచెను. ఈ బండమీద, నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు.
వరదలు రావచ్చు మరియు ఆటుపోట్లు పోవచ్చు, ఓహ్, నోవహు జలప్రళయ తుఫానును ఎదుర్కొని ఓడలో క్షేమంగా ఉన్నట్లు, క్రీస్తులో సురక్షితముగా ఉన్నవాడు అణు సంబంధమైన ప్రవాహము మీదుగా పయనించును. ఒక్కసారి, నీ విశ్వాసమును దానిలోని అడుగునకు జారవిడువుము, సాదృశ్యములుగా, దేవుని స్థిరమైన బండమీద ఉంచి, ఏమి జరిగినదో చూడుము.
39
ప్రతీసారీ దేవుడు తప్పించుకొను ఒక మార్గమును ఏర్పరచును. ఆయన తప్పించుకొను ఒక మార్గము నేర్పరచును. కపటోపాయము పన్నిన సమయమప్పుడు, దేవుడు దేవునిగానే ఉన్నాడు. యెహోవా యీరే..యెహోవా యీరే అనగా, “ప్రభువు తనకొరకు తనకు తానే తప్పించుకొను ఒక మార్గము, నేర్పరచును .” దేవుడు దానిని ఏర్పరచగలడు ఎందుకనగా ఆయనే సృష్టికర్త.
మరియు దేవుడు, కల్వరి యొద్ద అందరి కొరకు ఒక్కసారి (ఆమేన్) అక్కడ, అక్కడ పరలోకపు ప్రధాన దూతలు, దయ్యముల యొక్క అన్ని ప్రాంతములు వణకెను, ఎపుడైతే భూమి నరముల బలహీనతకు గురిఅయి, సమాధిని కదిలించినది, మరియు ఎపుడైతే సూర్యుడు వణకుచూ, సుదూరముగా వ్రేలాడుచూ, మరియు నలుపులోనికి మారి, ఎపుడైతే చంద్ర, నక్షత్రములు వాటి స్థానముల నుండి కదలింపబడి, సకల యుగముల యందు విమోచింపబడినవారును, రాబోవు యుగములయందు విమోచింపబడబోవువారును ఆ సమయమును గుర్తించెదరు, దేవుని యొక్క కుమారుడు చనిపోయినపుడు, సాతాను యొక్క ప్రతీ శక్తిని తీసివేసెను. మరణము మరియు నరకము, మరియు సమాధి, మరియు అన్ని భయములు కూడా అక్కడ కల్వరి యొద్ద మ్రింగి వేయబడెను. ఆయన వెలకట్టలేని మూల్యమును చెల్లించి మరియు గొర్రెపిల్ల మరణించినప్పుడు, మరియు పాపము ఆయన మీద వేయబడి— ఆయన పాపమును భరించినవానిగా వుండి— నరకమునకు చెందిన వారినందరిని పట్టుకొని వెళ్ళెను, మరియు దేవుడు ఆయనను మూడవ రోజున లేపెను. ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన రక్తము ఆధారంగా, మరియు విశ్వసించిన ప్రకారము, నీతీకరింపబడి ఉన్నాము. ఆమేన్. దేవుడు తప్పించుకొను మార్గమును సిద్ధపరచినాడు.
40
ఓ, నా సహోదరుడా, నీవు అది చూచినప్పుడు.. అంబులెన్స్‌కేక వేయుటను వినుచుండగా, నీవు ఒకటి వినిన ప్రతి సమయములో, నీవు ఆ మార్గములోనే వెళ్ళుచున్నావని అది ఒక గురుతు అయిఉన్నది. నీవు ఒక సమాధి తోటలో నుండి వెళ్ళు ప్రతి సమయములో అది ఒక గురుతు అయి ఉన్నది. నీవు ఆ మార్గములోనే వెళ్ళుచున్నావు. ముఖము మీద ఒక ముడత కనిపించు సమయములో మరియు తలలో నెరసిన జుట్టు కనిపించినప్పుడు, అది ఒక గురుతు అయి ఉన్నది. నీవు అదే మార్గములో వెళ్ళుచున్నావు. పౌలు అలా చెప్పడములో ఆశ్చర్యము లేదు, నిజమైన నిరీక్షణ వేళ్ళూని మరియు వానియందు ఈ విధముగా... అతడు రహదారి అంతమునకు వచ్చినప్పుడు, ఆహా! “నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు తుద ముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని: అప్పటినుండి, నా కొరకు నీతి కిరీటము ఉంచబడియున్నది, నీతిమంతుడైన న్యాయాధిపతియైయున్న ప్రభువు, ఆ రోజున నాకు మాత్రమే కాదు, అయితే ప్రత్యక్షతను ప్రేమించువారందరికి ఉంచబడియున్నది.
ఆ కారణముచేత, ఈ పాత జీవితమును గూర్చి అలసిపోయి వ్యాధిగ్రస్తుడవయ్యావు. మేజాబల్లయొద్ద నీ ఆహారమును లేదా నీ యొక్క భార్యను, లేదా నీ పిల్లలను నీవు ప్రేమించినదానికంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతను నీవు మరెక్కువగా ప్రేమించగలవు, అప్పుడు అక్కడ ఒక జీవకిరీటము నీ కొరకు ఉంచబడెను. ఒక జీవకిరీటమే కాదు, నీ శిరస్సుపై ఒక బంగారపు జీవకిరీటము ఉంచబడును. అయితే, ఒక దేహము బాధనుండి విముక్తి పొందినది, ఆ.. దేవుని మహిమలో కిరీటముంచబడెను, యేసుక్రీస్తు యొక్క అమర్త్యత కిరిటముంచబడెను. నీ కొరకు ఉంచబడినదేదనగా అదే, అది ప్రభువే, నీతిమంతుడైన న్యాయాధిపతి ఆ దినమున నీకు ఇచ్చును. అలాటి రోజు కొరకు మనము ముందుకు చూచుచున్నాము. మనలో ప్రతి ఒకని కొరకు దేవుడు తప్పించుకొను ఒక మార్గమును ఏర్పాటు చేసియున్నాడు. నిశ్చయముగా ఆయన కలిగియున్నాడు.
41
దేవునియొక్క బిడ్డ, ప్రవక్త అయిన దానియేలు సింహాలబోను లోనికి త్రోయబడెను. అలా దానియేలు విశ్వాసముగలవాడై, అతనియొక్క కిటికీలు తెరచి మరియు రాజు ఏమి చెప్పెనో దానికి భయపడక ప్రార్ధించిన ఒక సమయము కలదు. చాటింపబడిన దానిని శ్రద్ధ వహించక, యెరుషలేము తట్టు తిరిగి ఎలాగైనను దానియేలు ప్రార్దించెను. ఒక వ్యక్తి యెరుషలేము తట్టు తిరిగి ప్రార్ధిస్తే.... ఆ పట్టణములోనే బలులను దహించేవారు.... ఆ కారణము చేతనే దానియేలు అటువైపు తిరిగి ప్రార్ధించెను. సోలోమోను మందిరమును ప్రతిష్టిస్తున్నప్పుడు ప్రభువు కూడా ఈ విధముగా చెప్పాడు. “ఏ కాలములోనైనను శ్రమపడుతున్న జనులు ఈ పరిశుద్ధ స్దలమువైపు తిరిగి ప్రార్ధించినట్లైతే, నేను ఆకాశము నుండి వారి మొరను విందును.”
42
సముద్రము మీద ఒక తుఫానులో, తిమింగలము కడుపులోనుండి, మరియు వాంతిలో నిలబడియుండగా, లోతైన సముద్రములో అడుగు భాగములో సముద్రపు నాచు అతని మెడకు చుట్టుకొనియుండగా, ఆ కారణముచేత యోనా అతడు కార్యముచేసి విశ్వాసము కలిగియుండెను. అతడు అన్నాడు, అవి అబద్దములు అయి ఉన్నవి. దేవా, అయితే మరొక్కసారి పరిశుద్ధాలయము తట్టు చూడగలను.
దేవుడు ఏదో ఒకటి చేశాడు: ఆయన యోనా కొరకు తప్పించుకొను ఒక మార్గమును ఏర్పరచుకొనెను. ఆయన ఏమి చేసెనో, ఎవరికీ తెలియదు. అదే దేవుని యొక్క సొ౦త రహస్యము. అయితే ఎక్కడది అసాధ్యమో అది ఏమియు కాదు, దేవుడు చేయగలడు-పరిస్ధితులను మార్చగలడు. ఆయన అసాధ్యములను, సాధ్యముగ చేయగలడు. మరియు నమ్మదగినవిగా మాత్రమే కాదు, అయితే అది వాస్తవమైనదానిగా చేయగలడు. మనుష్యుడు దేవునిని ఆయన వాక్యము నొద్ద తీసికొనినప్పుడు మరియు అలా మనిషి కొరకు దేవుడేర్చరచిన ఆ ఏర్పరచిన మార్గమును అంగీకరించగలడు.
దేవుడు ఏదో చేశాడు. ఆయన అక్కడ క్రింద ఆక్సిజను టెంట్‌ను ఉంచి ఉండవచ్చును. ఆ తిమింగలము కడుపులో ఆయన ఏమి చేశాడో నేనెరుగను, అయితే అక్కడ యోనాను అక్కడ మూడు రాత్రింబవళ్ళు దాచాడు, ఒక సాదృశ్యముగా, ఆ విధముగా భూగర్భములో, క్రీస్తు ఆక్సిజను లేకుండ ఉంచి ఉండును మరియు మూడవ రోజున ఆయన మరలా బయటకు వచ్చాడు. అది ఒక పోలిక, ఆయన తప్పించుకొను ఒక మార్గమును చేశాడు. ఆయన ఎల్లప్పుడు చేయును.
43
దానియేలు అక్కడ నిలబడి ఉన్నప్పుడు, మరియు ఆ సింహాలు పరుగెత్తి వచ్చుచుండగా, ఆ వృద్ధ పరిశుద్దుని హృదయములో కొంచెము భయమూ లేదు. అయితే, అక్కడ ఆయన నిలబడ్డాడు, మరియు దేవుడు ఆయన జీవితాన్ని ముగించలేదు. వానిని ఆ సింహాలు పట్టుకొనకముందే దూత వారిముందు ఆవరించియున్నది.
దమస్కుకు వెళ్ళు మార్గములో తార్సువాడైన సౌలుకు కనబడిన మండుచున్న అదే వెలుగు కనిపించుటలో సందేహములేదు. ఒక పెద్ద వెలుగు ప్రకాశించెను, వారు బయటకు చూశారు, ఏమి జరగబోవుచున్నదో వారికి తెలియదు. సౌలు గుర్రము మీద నుండి పడెను. ఒక స్వరము వెలుగునుండి ఇలా చెప్పుచుండెను, “సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావు?” అనెను,
“ప్రభువా, నీవు ఎవరవు?”
ఆయన అన్నారు, “నేను, నీవు హింసించుచున్న యేసును.”
44
దేవుని వాగ్దానమునకు అలా విశ్వాసముగా ఉన్న హెబ్రీ పిల్లలు అయి ఉండెను , ఆ విధముగా అక్కడ అగ్నిగుండములో అక్కడ పడియుండెను ... లేదా బబులోనులో, విశేషముగా, అగ్నిగుండములోనికి వెళ్ళుచుండెను. వారికి మరియు మరణమునకు మధ్య ఒక్క అడుగే ఉండెను. ఇక్కడే ఈ రాత్రి ఉన్న మనుష్యులకు అది ఎంత ఎక్కువగా అయి ఉండవచ్చును. అక్కడ నీకు మరియు నిత్యమైన ఎడబాటుకు ఒక రోజే అయి ఉండవచ్చును. ఇప్పుడే నీవు నీ యొక్క తీర్మానమును చేయుము. నీవు దానిని అంగీకరించనియెడల నీ కొరకు ఆ మార్గము ఏర్పరచబడియున్నది.
“ఒక అడుగే,” యోనాతాను దావీదుతో అన్నాడు, వారు ఆ-ఆ-ఆ విల్లును వంచినప్పుడు, “నాకు మరియు మరణమునకు మధ్య ఒక అడుగు మాత్రమే.” వారికి మరియు మరణమునకు మధ్య ఒక అడుగే. అయితే అలాటి కఠినమైన క్షణములో, దేవుడు తప్పించుకొను ఒక మార్గమును ఏర్పరచెను. మరియు ఆయన అగ్నిగుండములోనికి ప్రభువైన యేసుక్రీస్తును పంపెను. మరియు వారికంటకుండ అగ్నిని ఆర్పివేసెను.
45
మరియు ఎవరైతే దేవునితో ఐదువందల సంవత్సరములు నడచి మరియు ఒక సాక్ష్యము కలిగి ఉండెనో, అది హానోకు అయి ఉండి, అతడు “దేవుని సంతోషపరచెను.” అలా అతడు “మరణము రుచి చూడకుండా” ఒక సాక్ష్యము కలిగియుండెను. దేవుడు అది ఎలా చేసియుండెను? అతని పాదాలనుండి ఎత్తుటకు, ఆ రోజులలో ఒక విమానము కూడ లేకుండెను. అయితే దేవుడు మార్గమును ఏర్పరచెను, ఒక రూపాంతరము, మరణము రుచిచూడకుండ భూమినుండి మహిమకు హానోకును
తీసికొనిపోయెను.
అది ఒక ప్రక్కనుండి మరొక ప్రక్కకు వేరు చేయుచున్నప్పుడు, ఎవరు ఆ సముద్రమునకు ... లేదా ఆ రోజున యోర్దాను నది యొద్ద అడుగు వేశారో అది ఏలియా అయి ఉండెను. చనిపోకుండ ఏలియా పరలోకానికి వెళ్ళుటకు సిద్దపడి యుండగా, అది వానికొరకు దేవుడు ఏర్పరచిన మార్గము అయిఉండెను. ఒక జెట్ విమానము కాదు. అయితే అగ్నిగుర్రాలచేత నడిపించబడిన, ఆయన ఒక అగ్నిరధమును పంపించెను. ఆ నిమిషములో, మరణము నుండి తప్పించుకొను ఒక మార్గము దేవుడు ఆ మార్గమును, ఏర్పరచెను.
46
ఇశ్రాయేలు పిల్లలను ఎవరు నడిపించెనో అది మోషే అయి ఉండెనని, నేను నమ్ముచున్నాను... లేదా అరణ్యముగుండా వెలుగును, అగ్నిస్థ౦భమును వెంబడించుచూ, ఎవరు వారిని నడిపించెనో అది మోషే అయి ఉండెను. అంతము వరకు సహించినవాడు మోషే అయి ఉండెను. దేవుని కొరకు ఎనభై సంవత్సరాలు పరిచర్య చేసిన తరువాత, నూట ఇరవై సంవత్సరాల వయస్సులో, నూట ఇరవై సంవత్సరాల వయస్సు గలవాడై, అతని బుగ్గల మీదనుండి కన్నీళ్ళు క్రిందకు దొర్లుచుండగా, వృద్ధుడైన మనిషిగా పర్వతముపై నిలబడి మరియు వాగ్ధాన దేశములోనికి ఆవలకు చూచెను. అతడు ముండ్ల పొదలలో నుండి వచ్చెను. అతడు లోతైన జలముల గుండా కష్టాలలో నుండి నడచిపోయెను. ఆయన దుఖా: క్రాంతుడై కప్పును, ఆయన చేదుగా ఉన్న గిన్నెలోనిది రుచి చూచెను. వారికి కాపరిగా ఉండి అవిధేయులైన ప్రజలతో ఉండెను. ఆయన వారిని స్థలమునుండి స్థలానికి నడిపించెను, మరియు వారి సణుగులను భరించెను. మరియు తనకు తానే ఖాళీలో నిలబడి మరియు అనెను, “దేవా, నీవు వారిని చంపకముందు నన్ను తీసికొనుము.”
వృద్ధమనిషిగా అక్కడ నిలబడిన వాడు మోషే ఏదో విధముగా, ఏవిధముగానైనను ఎరిగి యుండి, ప్రతివిధముగ అతడు క్రీస్తుకు ఒక పోలికై ఉండెనని ఎరిగియుండెను, దేవుడు నిశ్చయముగా వానిని తీసికొనును, కారణము క్రీస్తుకు ఒక పోలికగా, ఆయన వానిని మరలా తీసికొని రావలసియుండెను క్రీస్తువలె. అతను ఒక ప్రవక్తగా పుట్టియుండెను. మరియు ఒక ప్రవక్తగా మాత్రమే గాక, అయితే నాయకునిగా మొదలైనవి. అతడు మల్బరీ ఆకులలో దాచబడెను, మరియు ఆవిధముగానే క్రీస్తు ఐగుప్తులోనికి కొనిపోబడెను. సీనాయి పర్వతము నుండి నివసించుచు క్రీస్తు ఓలీవకొండ మీద ఉన్నట్లుగా, అతడు ధర్మశాస్త్రమును ఇచ్చువాడైయుండెను.
47
అతడు వృద్ధుడుగా ఉన్నప్పుడు, మరియు మరణము అతని ముఖమువైపు తేరి చూచుచుండెను, అతడు ఆ పునరుత్దానమును ఏలా తీసికొని వచ్చును? అయితే ఆ క్రూరమైన ఆ క్షణము వచ్చినప్పుడు, దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను. ఊపిరి పోవుచున్నప్పుడు, మరియు అతని మెడలో బిలబిలమనెడు ధ్వనిలో, అతడు చూడగా, అతని ప్రక్కగా పెట్టబడియుండెను, అక్కడ ఆ బండ నిలబడియుండెను. దేవుడు ఒక బండను ఏర్పరచెను. అరణ్యములో యేసుక్రీస్తే ఆ బండ అయి ఉండెను. మోషే ఆ బండను సహించెను.
దేవా అటువంటి కార్యమును సహించుటకు నాకు కృపను దయచేయుము. నా ప్రాణము యొక్క ఊపిరి ఈ దేహములో నుండి విడువబడుచుండగా, అక్కడ నిలబడియున్న ఆ బండను నన్ను చూడనివ్వండి. ఆ బండపైన అడుగు వేయగా మరియు దేవదూతలు వచ్చెను మరియు వానిని కొనిపోయెను. ఎనిమిది వందల సంవత్సరముల తరువాత అతడు, ఏలియాతో అతడు పాలస్తీనాలో నిలబడియుండెను, ఆ సిలువ ఎదుట అక్కడ నిలబడి యుండి యేసుతో మాట్లాడుచుండెను. దేవుడు తప్పించుకొను ఒక మార్గమును ఏర్పరచును.
48
పాతనిబంధనలో రెండు అత్యంత గొప్ప సంగతులు, అలా ప్రవచనాలలో నేను చూడగలుగుచున్న రెండు గొప్ప నిజ స్థితులు ఇవి: మెస్సియా వచ్చునంత వరకు ప్రజలు, ఒక సమయము కొరకు ముందుకు చూశారు. మరియు అప్పుడు మెస్సియా వచ్చిన తరువాత ఆ విధముగా ఆ పరిశుద్దాత్ముడు వచ్చునని వారు ఒక సమయము కొరకు ముందుకు చూశారు. తుదకు, సరియైన కాలములో అక్కడ వెనుక ఉన్న సమస్త పోలికలు ఆ విధముగా వారు ప్రవక్తలు మరియు ప్రతిదాని ద్వారా కలిగియున్న సమస్త పోలికలు మరియు వారు కలిగియున్న ప్రాయశ్చిత్తములు తుదకు మెస్సియా వచ్చెను, మరియు అది స్థిరపరచబడెను. ఎందుకనగా దేవుడు అలా చెప్పెను.
అప్పుడు ముడత మచ్చలేని ఆ విధముగా ఉండు ఒక గొప్ప మహిమకరమైన సంఘము కొరకు, వారు అలాటి ఒక సమయము కొరకు వారు ముందుకు చూశారు, ఆ సంఘము భూమిమీద ఒక నక్షతముగా ప్రకాశించును. వారు ఆ సమయము కొరకు ముందుకు చూశారు. అది ఏలాగు జరుగనైయున్నది? ఆయన చనిపోయి మూడు రాత్రి౦బవళ్ళు ఉండెను. ఆయన తిరిగి లేచెను. ఆయన ఐదు వందలమందికి కనిపించెను. మరియు ఆయన పరలోకానికి ఎక్కిపోయెను. ఆయన ఇక్కడ వారిని భూమిమీద, ఒంటరిగా విడిచిపెట్టెను. ఆ నాయకుడు వెళ్ళియుండగా, ఈ మహిమకరమైన సంఘము అది ఏలాగు సాధ్యమగును? దేవుడు సంఘానికి వాగ్దానము చేసెను. ఆయన వెళ్ళిపోయిన తరువాత, ఆయన స్థానములో ఆ వెలుగు అది ఏలాగు ప్రకాశించియుండును? అక్కడ ఆయన ఇలా చెప్పినప్పుడు, “కొంచెము కాలము, లోకము నన్ను చూడదు అయినను మీరు నన్ను చూచెదరు, ఏలయనగా నేను మీతోను, మీలోను, యుగాంతము వరకు ఉంటాను. నేను చేయు కార్యములు మీరు కూడ చేయుదురు. భూదిగంతముల వరకు వెళ్ళి మరియు సువార్తను ప్రకటించుడి. నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు కనబడును.
49
వారి యొద్ద క్రీస్తు లేకుండ ఎలా వారు దానిని చేయగలిగారు? దేవుడు వారికి వాగ్ధానము ఇచ్చినప్పుడు, వారు దానిని ఎలా చేయగలిగారు? అయితే చూడండి, పరిశుద్దాత్ముడు వ్యక్తిగా క్రిందకు దిగి వచ్చినప్పుడు, దేవుడు ఒక పెంతెకొస్తును ఏర్పరచెను. మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిహారము ద్వారా వారు కడగబడిన తరువాత మర్త్యమైన మనిషి దేహమును ఆవలకు తీసికొన్నారు. ఆ పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని తీసికొని ఆయన స్వాధీనములో ఉంచుకొని మరియు వానితో సూచక క్రియలు మరియు ఆశ్యర్య కార్యములు మరియు అద్భుతములతో వెంబడించు వ్యక్తిగా పంపారు. దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను.
వారంతట వారే వారు దానిని చేయలేక యుండిరి. వారు నీవంటి మరియు నా వంటి మనుష్యులైయున్నారు. వారు దానిని ఏలాగు చేసియుండిరి. వారు చేయలేకయుండిరి. అయితే, దేవుడు తప్పించుకొను ఒక మార్గమును ఏర్పరచెను. వారు...?...మేడగదిలో ఉండగా, ఆ ప్రజలు వారిని తమాషాగ చేయుదురని తలంచారు. ఇది, అది లేదా మరొక విధముగా వారుందురని వారు తలంచారు. వారు కిటికీలన్నియు మూసారు, మరియు తలుపులు వేశారు. వారు దానిని ఏలాగు
చేసియున్నారు? వారు పిరికిపందలు. వారికి వెన్నముక లేదు. వారికి ఒక పిరికియైన కోడి వెన్నెముక ఉన్నది. మరియు నిజమైన పరిశుద్దాత్మ వెన్నెముక లేదు. వారు ద్వారాలుకు తాళాలు వేసారు. భయపడ్డారు. వారు నడచి బయటకు వెళ్ళి ప్రజలను కలియుటకు సిగ్గుపడ్డారు. వారు దానిని ఏలాగు చేసియున్నారు?
50
అయితే దేవుడు ఒక పెంతెకోస్తును, పరిశుద్దాత్మ బాప్తిస్మమును పంపాడు. వారు కిటికీలు తీసేసారు మరియు తలుపులు తెరిచారు, వారు వీధులలోనికి వెళ్ళారు. దేవుడు దానిని వాగ్ధానము చేసెను. దేవుడు వాగ్ధానం చేసినప్పుడు దేవుడు ఆయన వాక్యమును కాపాడుకొనును. ఆయన తప్పించుకొను ఒక మార్గమును ఏర్పరచును. ఆ విధముగా నీ కొరకు తప్పించుకొను ఒక మార్గము కలుగజేయకుండ నీవు సహించిన దానికంటే మరెన్నడూ ఎక్కువగా ఆయన శోధనకు గురి చేయడు.
మేఘావృతమై, వర్షించుచున్న పగలు కానీ రాత్రి కానీ ఒక దినము గుండా ఇప్పుడు మనము జీవించుచున్నాము, మనం ఇలా౦టి స్థితిలో ఉన్నాము. సంఘము సగము లోపల మరియు సగము బయట ఉన్నది. వారు ఇది ఏలాగు చేయగలిగారని వారు ఆశ్చర్యపడుచున్నారు, మరియు వారు ఏలా చేయగలరు? వారికి వెలుగు లేదు. అయితే ప్రవక్త చెప్పాడు“ సాయంకాల సమయములో వెలుగు కలుగును.” అది ఏలాగున్నది? ఆయన.. ఈ దినమున ఆ సంఘము, మహిమతో ఉన్న ఒక సంఘమును స్వీకరించుటకు యేసు వచ్చినప్పుడు, అటువంటి మహిమకరమైన సంఘం భూమిమీద అలా ఉండవలసి యున్నది. మనం కుమ్మరించబడుచున్న ఆ కడవరి వర్షమును పొందుచున్నాము. పరిశుద్ధాత్మ యొక్క రెండంతల భాగము భూమి మీదకు వచ్చుచున్నది మరియు ప్రతి దేశమును ఊడ్చివేయుచున్నది. మరియు ఉజ్జీవ జ్వాలలు ప్రతి కొండమీద మండుచున్నవి. చైనాలో, జపాన్‌లో, కొరియా నుండి చీకటి ఆఫ్రికా, మరియు ప్రతిచోట, పరిశుద్దాత్మ ఆ ప్రజలపై కుమ్మరించబడుచున్నది. దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను.
51
గ్రుడ్డివైన నా కన్నులు ఏలాగు స్వస్థపరచబడెను? దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను. హల్లెలూయ! అవునండి. ఆయన ఎల్లప్పుడు ఒక మార్గమును ఏర్పరుచును. ఇక్కడున్న నీ కొరకు అలా ఈనాడు భూమిమీద ఉన్న నీకు, దావీదు వలే యాత్రికులు పరదేశులైయున్న మీరు, ఓదార్పు కొరకు కనిపెట్టుచున్న మీకొరకు ఆయన మార్గమును ఏర్పరచును.
దావీదు యుద్దానికి వెళ్ళు చుండెను. అతడు కలత చెందినవానిగా వెళ్ళుటలేదు. ఒక సగపు మార్గపు గురుతుతో అతడు వెళ్ళుటలేదు. “అది అలా జరుగునేమో” అని అతడు ఆలోచించుచూ వెళ్ళుటలేదు. అయితే అతడు మల్బరి పొదలలో కనిపెట్టెను, ఎంతవరకనగా, కొంచెం సమయానికి, అది నిశ్శబ్దముగా ఉన్న మరణము అయి ఉండెను, ఏమియు జరుగలేదు. కొంచెం సమయానికి, వెనుకవైపు దూరాన, అతడు ఆకులు గట్టిగా మరి గట్టిగా -ఎక్కువైన శబ్దం వినుటకు ప్రారంభించెను. కొంచెంసేపటికి, గొప్పబలముగా వీచుగాలి అతని ఎదుట నుండి వెళ్ళెను. అది దేవుడైయుండెనని అతడు ఎరిగెను మరియు పరిశుద్దులైన దూత సైన్యము అతని ముందు నుండి వెళ్ళుచుండెను. మరియు అతడు అతని ఖడ్గమును దూసెను, మరియు యుద్ధము చేసెను, మరియు శత్రువుతో యుద్ధము చేసెను.
52
సహోదరుడా, పైకెగరవద్దు, నీవింకా వెళ్ళుటకు సరిగా లేనప్పుడు ఏదో మరొక విధముగా ఆలోచించవద్దు. నిలబడియుండుము! చూడుము అది ఒక సంఘములో చేరుటకాదు, బోధకునితో కరచాలనం చేయుటయు కాదు, నీళ్ళలో బాప్తిస్మము పొందుటయు కాదు. అయితే నీ హృదయములో ఒక వ్యక్తిగా, యేసుక్రీస్తు అను దేవుడేర్పరచిన బలిని అది అంగీకరించుట అయి ఉన్నది. పరిశుద్ధాత్మ నీ ముందుగా బలముగా వీచుగాలివలె కదలివెళ్ళును, మార్గము నుండి ప్రతిదియు కదలివెళ్ళును. అమెన్. అదే అది.
అప్పుడు, క్రైస్తవులుగా ఉండండి. మార్గములో ఉన్న మీరు, నిజముగా దేవునికి భయపడు మనుష్యులుగా ఉండండి. అతి త్వరలో, అక్కడ నుండి ఒక ఉజ్జీవము, ఇక్కడే ఒక పెద్దగుడారపు సమావేశములో రానైయున్నది. నేను కేవలము దానిని చూడగలను. నిజము! నీవు ఏమిచేయ గోరుచున్నావు? నీకు నీవే గుణశీలము కలిగి ప్రవర్తించుము.
53
ఇక్కడే కొంతకాలము క్రిందట, దక్షిణాది దేశాలలో దిగువన అక్కడకు ప్రజలు వెళ్ళి మరియు బానిసలు మొదలైన వారిని కొంటారు. నేను ఈ చిన్నకధను గూర్చి ఆలోచించుట జరిగినది. వారు వెళ్ళి బానిసలను కొనియుందురు, ఆ బీదలైన వ్యక్తులు కొట్టబడియుండుట వారు గమనించియున్నారు. వారు వారి దేశమును విడిచిపెట్టుటకు ఇష్టంలేకుండ ఉన్నారు. మరియు వారు ఎన్నడూ వెనుకకు రారని వారికి తెలియును. వారు ఏలాగు ఆదరించబడుచున్నారో ఆ నీగ్రో ప్రజలు అది దయ చూపించదగిన విషయము.
ఒక రోజున ఒక యవ్వన వ్యక్తి అతని భుజాలను వెనుకకు పెట్టుకొని ఉండుటను వారు గమనించారు. వారు వానిని కొట్టుటలేదు. లేదండి. కొనువాడు ఒకడు వచ్చి. అన్నాడు, “ఆ బానిసను నన్ను కొననివ్వండి.”
అతడన్నాడు,“ అతడు అమ్ముట కొరకు కాదు.”
అతడన్నాడు, “సరేగానీ, వానిని అంతెక్కువ వ్యత్యాసమైన వానిగా చేసినది ఏమిటి ? అతడు మిగిలిన వారందరి మీద యజమాని అయి ఉన్నాడా?”
అనెను, “కాదు”
అనెను, “వానిని వ్యత్యాసముగా చేసినది ఏమిటి? నీవు అతనికి తినుటకు శ్రేష్టమైన ఆహారమునిచ్చితివా?”
అనెను, “కాదు. అతడు మిగిలిన వారిలో అందరితోనే తినును.”
అనెను, “అతనిని అంత ఎక్కువ వ్యత్యాసముగా చేసినది ఏమిటి?”
అనెను, “అలా అతని తండ్రి గిరిజనులకు రాజుగా ఉన్నాడని నేను తెలుసుకొనుట జరిగెను. అతడు దూరదేశములో ఉన్నను, ఇంకా అతడు అతని యొక్క భుజాలు వెనుకకు చాచుకొనియుండెను. అతడు రాజవంశములో పుట్టిన మనిషి అయి ఉండెను. అతని తండ్రి ఒక రాజు, అతడు ఇతర దేశమునుండి వచ్చిన వాడైనను, అతని తండ్రి ఒక రాజైయున్నాడు.”
నా తండ్రి రాజ్యము మరియు ఇండ్లుగల ఐశ్యర్యవంతుడు, ఆయన యొక్క చేతిలో లోకసంపదను పట్టుకొనియున్నాడు!
మణులు వజ్రాలతో మరియు వెండి బంగారాలతో
ఆయన బోషాణములు పూర్తిగా నిండిపోయెను, ఆయనకు లెక్కలేని ఐశ్వర్యము గలదు.
54
ఇక్కడే ఈ గుడారమునకు సంబంధించిన ప్రజలమైన మనము, ఆ విధముగా దేశమును ఊడ్చివేయుచున్న ఒక ఉజ్జీవముతో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తిరుగులేని పునరుత్దానపు బుజువును కలిగియున్నాము; ఈ విధమైన అణుకువతో ఉన్న చిన్నస్థలమునుండి, బెత్లెహేము పశువులశాల కంటే మరెక్కువైనదేమియు కాదు, మరియు బహుశా మరెక్కువైన అణకువగలది. అయితే, ఇక్కడ నుండే, దేవుడు వేలు పదివేలుగా, ఊడ్చివేసి, దేవుని రాజ్యము లోనికి, పదివేలలో, మిలియనులలోనికి, అవును, దేవుడు ఒక గొప్ప ఉజ్జీవమును పంపెను.
మాతో ఒక సహపౌరునిగా నీవు ఉండగోరుచున్నావా? పాపాత్ముడా, నీ యొక్క విభేదములు క్రింద విసిరివేయుటకు, నీ యొక్క పాప జీవితమును క్రింద విసిరివేయుటకు ఈ రాత్రే నీవు సిద్ధముగా ఉన్నావా? మరియు నీ భుజములను తిన్నగా పైకి ఎత్తి కదంత్రొక్కు సైనికులైన ప్రజలుగా, ఈ సైన్యపు హోదాలో చేరుము, ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిహారము సమస్త పాపము నుండి మనలను కడుగునని నమ్ముచూ ఉండుము. మనం తలలు వంచియుండగా, మనం ప్రార్ధించుకొందాము.
55
మా దయగల పరలోకపు తండ్రీ, ఈ రాత్రి మేము నీపై ఆనుకొని కనిపెట్టియుండగా, ఈ వినుచున్న శ్రోతలుగుండా దేవుని యొక్క గొప్ప పరిశుద్ధాత్మ కదలించబడుటకు మరియు విస్తారముగా సమృద్ధిగా ఉండునట్లు ఎదురు చూచుచున్నాము. ప్రభురాత్రి భోజనము తీసికొనుచున్న విశేష దినములో, మేము ఇప్పుడే సిద్ధముగా ఉండగా, ఓ తండ్రీ దేవా, ఈ రాత్రి, పాపుల హృదయాలతో మీరు మాట్లాడగలరని మేము ప్రార్ధించుచున్నాము. ప్రభువా, వారు వచ్చుటకు అనుమతించండి, ఉద్రేకము యొక్క ఆధారము మీద కాదు, ఏదో ఒక విచారకరమైన కధమీద కాదు, అయితే, కల్తీలేని సత్యమైన దేవుని వాక్యము మీద ఆధారము. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను గ్రహించెను.”
దేవా, ఈ రాత్రి అనుగ్రహించుము, పరిశుద్ధ యోహాను 5:24లో నున్న ప్రభువైన యేసు యొక్క మాటలు, ప్రతి హృదయములో మార్మోగును: “నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు, అతడు తీర్పు లోనికి రాక జీవములోనికి దాటి అనేకులు, ఈ ఘడియలోనే, మరణములోనుండి జీవములోనిక్తి వెళ్ళునట్లుగా” యేసుక్రీస్తు నామము ద్వారా , మేము పరిశుద్దాత్మ కొరకు కనిపెట్టుచున్నాము.
56
మీ తలలు వంచియుండగా, ఆ సహోదరి వాయించుచున్నదా, అని ఆశ్చర్యపడుచున్నాను.... క్రైస్తవులైన, ప్రతి ఒకరు, ప్రార్ధనలో ఉండండి. అక్కడ నాకు కాదు, అలా దేవునికి మీ హస్తము ఎత్తియుండిన, ఒక మనుష్యుడు, స్తీ, బాలుడు లేదా ఒక బాలిక ఉన్నారా? మరియు ఇలా చెప్పండి, “ఇది యధార్ధమే.. దేవా, నేను మీకు చెప్పుటకు నాచేయి పైకెత్తుచున్నాను, న్యాయతీర్పు భూమిని మొత్తుటకు సిద్ధముగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. నేను ఈ న్యాయతీర్పు యొక్క శిక్ష క్రింద ఉన్నాను. నేను క్రైస్తవ ప్రజలయొక్క సన్నిధి నుండి, సంఘము యొక్క సన్నిధి నుండి, దేవుని నుండి వేరుచేయబడియున్నాను. నేను తప్పకుండ నిరంతరము నిత్యము నరకములో బాధపడవలసి యున్నాను. అయితే, ఈ రాత్రి ఆ విధముగా నేను తప్పకుండ దేవుని చేత ఎన్నుకొనబడినవానిగా, నాతో మీ ఆత్మ మాట్లాడుచుండగా నేను ఆ భావనను అనుభవించుచున్నాను. ఎందుకనగా, యేసు ఇలా అనెను, ”నా తండ్రి ఆకర్షిస్తేనే గానీ ఎవడును నా యొద్దకు రాడు.“ ఆ విధముగా నేను ఇప్పుడదే క్రీస్తును నా వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించగోరునట్లుగా, నేను నా హృదయములో విశేషమైన ఒక ఆకర్షణను అనుభవించుచున్నాను. మరియు దేవా, నేను నా చేయి పైకెత్తుచూ మరియు చెప్పుచున్నాను, 'నాకున్న కీడు మరియు అపకీర్తిమయమైన పాపముల కొరకు,
నీవు ఏర్పరచిన బలియగు, నీ కుమారుడైన యేను క్రీస్తును ఇప్పుడే అంగీకరించుచున్నాను. నేను ఇప్పుడే మీ వైపు నా చేతులను ఎత్తుచున్నాను. “నీవు అలా చేయగలవా?”
57
పురుషుడు లేదా స్త్రీ , బాలుడు లేదా బాలిక, ఈ క్షణములో ఇక్కడ లోపలున్నవారు మీ చేతులు పైకెత్తి మరియు ఇలా చెప్పండి, “దీనిద్వారా నేను, ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును నా రక్షకునిగా అంగీకరించుచున్నాను.” మీ తీర్మానము చేసికొనుటకు ఒక క్షణము కనిపెట్టండి. మీచేయి పైకెత్తండి. చిన్న బాలుడా, దేవుడు నిన్ను దీవించును. ఇంకా ఎవరైనా మీచేయి పైకెత్తి చెప్పండి....నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. అంతా బాగున్నది, నాకు కాదు, మీరు అది దేవుని కొరకు చేయండి. నమ్మిన అనేకులు బాప్తిస్మము పొందారు, మరియు సంఘములో చేర్చబడిరి. “మూడువేలు ఆత్మలు రక్షించబడెను.”
58
అక్కడ రక్తముతో నిండిన ఒక ఊట ఉన్నది. నిశ్చయముగా, ఇప్పుడే నీవు వదలుకొని, విశ్వాసము ద్వారా ఇలా చెప్పుము, “ప్రభువైన దేవా, ఇప్పుడే నేను వదలుకొనుచున్నాను. ఓహ్, అనేకసార్లు, నేను వేదిక దగ్గరకు వెళ్ళాను. నేను ఇది, అది చేశాను, లేదా నేను సంఘములో చేరాను. నేను ఉగ్రతనుండి తప్పించుకొనుటకు ప్రయత్నించాను. అయితే, ఈ రాత్రి నాకు బదులుగా యేసుక్రీస్తు చనిపోయాడను ఆధారముపై, ఈ విధానములో నేను వచ్చుచున్నాను. ఆయన బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల అయి ఉండెను. ఆయన బలి, మేక అయి ఉండెను. సమస్తము ఆయనే మరియు, ఆయనయందే, నేను సంపూర్ణుడను. ఆయన నా పాపములు భరించెను. కల్వరి యొద్ద ఆయన నా పాపమును తీసికొనెను. దేవుని ఉగ్రతనుండి ఆయన నా స్థానమును తీసికొనెను. నరకమునుండి ఆయన నా స్థానమును తీసికొనెను. పరలోకములో నా కొరకు ఆయన నా స్థానము తీసికొనుటకు, దేవుని కుమారునిగా ఆయెను, ఇప్పుడే నేను అదే ఆధారము పై ఇప్పుడే సరిగా అంగీకరించుచున్నాను. పాపియైన ఒకనిగా, నేను నమ్ముచున్నాను.” (టేపులో ఖాళీ ఉన్నది-ఎడిటర్)
రక్తములో పాపులు మునిగియుండగా,
మలినమైన వారి వేదనలన్నియు తొలగిపోయెను.
వారి యొక్క సమస్తము తొలగెను........
59
ప్రభువు కొరకు ఎవరో వ్యక్తి తీర్మానము చేయుచుండగా, సంఘము ప్రార్ధనలో ఉండవలెను. ప్రార్ధించండి. ఎంత ఎక్కువగా తొలగింపబడెను? వారియొక్క మలినమైన సమస్త వేదనలు. యూదుడు, అన్యుడు, బానిసగా లేదా స్వతంత్రునిగా, పాపి లేదా ఒక సంఘసభ్యుడు, యాజకుడు, వైద్యుడు, న్యాయవాది నీవు ఎవరైనప్పటికి, ఆయనను రక్షకునిగా అంగీకరించి, ప్రభువైన యేసుపై విశ్వసించుట ద్వారా , నీ యొక్క నేరమయమైన సమస్త వేదనలు వదలుకొనుము. ఇప్పుడే మనము నెమ్మదిగా పాడుచుండగా, ఈ వాక్యమును వినండి.
చనిపోవుచున్న ఆ దొంగ ఆ ఊటను చూచుటకు సంతోషించెను.....................
ఆ రహదారి యొక్క అంతమునొద్ద, సమస్త ఆశలు పోయెను,
అక్కడ ఒక ఊట కనిపించెను. ఈ రాత్రి నీయొక్క సొంత కోరికతో, నీవు అంతమందు ఉన్నావా?
.....పాపులు దిగువన మునిగిపోయిరి.....
వారియొక్క నేరమయమైన సమస్త వేదనలు వదలుకొనిరి.
వారియొక్క నేరమయమైన సమస్త వేదనలు వదలుకొనిరి.
వదలుకొనిరి....................
60
ఇప్పుడు, పరలోకపు తండ్రీ, అది అంతా నీ చేతులలో ఉంది. వాక్యము ద్వారా ఆ ఊట తెరువబడియుండగా, ఆ విధముగా వారు నిన్ను స్వీకరించగోరునట్లుగా, పెద్దవాడైన పురుషుడు మరియు యవ్వనబాలుడు వారి చేతులు ఎత్తియున్నారు. పరిశుద్ధాత్ముడవయిన ప్రభువా, మేము నీ సహవాసమును కొనియాడుచున్నాము. వారంతా కైస్తవులై యుండి, వారందరు క్షేమముగా ఉండి ఉండవచ్చును. ప్రభువా వారి హృదయాలను నీవు ఎరుగుదువు. వారెన్నడు మరలా వారి చేతిని ఎత్తి అలా౦టి కోరిక కలిగి ఉండకపోవచ్చును, లేదా ఆ విధముగా వారిని పిలిచియున్నావను ఏలా౦టి భావన కలిగియుండుటకు ఎన్నడూ మరలా అలా౦టి కోరిక కలిగి ఉండకపోవచ్చును, కృప మరియు న్యాయతీర్పునకు మధ్య ఉన్న సరిహద్దు గీతను కూడ వారు దాటి ఆవలకు వెళ్ళి ఉండవచ్చును.
తండ్రీ, సమస్య ఆ విధముగా ఉండినయెడల, కనికరము చూపండి.. దేవా, నీవు ఈ మనుష్యుని రక్షించగలవని, ప్రభువా, నేను అలా ప్రార్ధించుచున్నాను. అలా ఇప్పుడే సరియైన విధముగా, అతని హృదయము అడుగుభాగములో, పరలోకపు ఆనందగంటలు మ్రోగుచుండగా నేను ప్రార్ధించుచున్నాను. మరియు అదే మార్గములో ఆ చిన్న బాలుడు, “నా మాటలు, విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము, పొందియున్నాడు. మరియు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు..” అని అలా యేసు చెప్పిన కధనము ఎరిగియుండెను. తండ్రీ, అది నీ వాక్యమైయున్నది. మేము అది నమ్ముచున్నాము. ఆ విధముగా వారు నిత్యజీవమును అంగీకరించునట్లుగా ఇప్పుడే వారికి నిత్యజీవము యొక్క ఆనందమును ఇవ్వండి. ఆ విధముగా ఫలములు ఫలించునట్లు మరియు సంతోషించుచూ వారియొక్క జీవితము సంపూర్ణ ఆనందముతో ఉండునట్లు మీరు చేయగలరని, మేము ప్రార్ధించుచున్నాము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. మేము నీపై ఆనుకొని కనిపెట్టుచుండగా, మిగిలిన వారిని ఆశీర్వదించమని, మేము యేసు నామములో ప్రార్ధించుచున్నాము. ఆమేన్.