నిజమైన ద్రాక్షావల్లి మరియు అబద్దపు ద్రాక్షావల్లి

నిజమైన ద్రాక్షావల్లి మరియు అబద్దపు ద్రాక్షావల్లి

సహోదరులు మూర్మీకు వందనాలు. స్నేహితులారా శుభ సాయంకాలము… లేదా శుభ మధ్యాహ్నము. మరియు ఆ పాటను పాడినందుకు ఆ చిన్న సహోదరికి ధన్యవాదాలు, దానిని మ్రోగించినందుకు ఆ సహోదరికి కూడా ధన్యవాదాలు. అది నాకు ఎంతో ఇష్టమైన పాట, నేనెరిగిన అన్ని కీర్తనలలో అదియే నాకు ఇష్టమైనది, ఎందుచేతననగా అది మన ప్రియ ప్రభువైన యేసును గూర్చి మాట్లాడుతుంది, మరియు ఆయన ఏమైయున్నాడో తెలియజేస్తుంది: అనగా ఆయన శరీరమందు ప్రత్యక్షమైన దైవమైయున్నాడు. ఆ దినమున మనము… లోకములో వ్యర్థమైన అనేక తత్వములు కలిగియున్నాము.“ఓ, ఆయన ఒక మంచి మనిషి.” మరికొంతమంది అయితే ఇలా చెప్పారు, “మంచిది, ఆయన ఒక ప్రవక్త.”

మంచిది, ఆయన మంచి మనిషి కన్నా గొప్పవాడు. ఆయన ప్రవక్త కన్నా గొప్పవాడు. అయితే ఒక ప్రవక్త యొక్క రక్తము మనలను రక్షింపలేదు. ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క కుమారుడు—దేవుడే శరీరములోప్రత్యక్షమాయెను. ఆయన దేవుడైయుంటాడు లేదా గొప్పవాడైయుంటాడు…లోకము ఎన్నడూఎరుగని ఒక గొప్ప నేరస్థుడిని. ఆయన మానవశరీరములో చుట్టబడిన ఒక గొప్ప దైవమైయున్నాడు. మరియు ఆయన మనకొరకు ఆయన యొక్క జీవితాన్ని ఇచ్చుటకు దిగివచ్చెను. మరియు దానికొరకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఈమధ్యాహ్నకాల సమయములో ఆయన యొక్క విమోచనా ప్రణాళికలో నన్ను కూడా చేర్చియున్నాడు.

2

ఈ లోకములో నేను అంగీకరించగలిగేదేనికన్నా కూడా ఇది ఒక గొప్ప భాగ్యముగా నేను భావిస్తున్నాను. ఈ ప్రపంచము యొక్క అధ్యక్షునిగా ఉండుటకన్నా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయములో సువార్తను ప్రకటించుటయే నాకు ఒక గొప్ప భాగ్యముగా భావిస్తున్నాను. ఒక ప్రజాస్వామ్యము క్రింద ఇదంతా పరిపాలన జరుగుచున్నచో, మరియు నేను వారందరికీ ఒక అధ్యక్షునిగా ఉన్నచో మరియు తొమ్మిది వందల సంవత్సరములు జీవించగలననే భరోసా ఉన్నప్పటికీ మరియు మంచి ఆరోగ్యము, మంచి బలము ఉన్నప్పటికీ, మరియు ఈమధ్యాహ్నకాల సమయములో నేను ఉండే ఈ మార్గములో, స్థలాలను మారుస్తున్నప్పటికీ, నేను వీటినన్నిటిని కూడా డబ్బు కోసము ఎన్నడూ చేయటములేదు. నా హృదయములో దేవుని యొక్క ప్రేమతో నేను ఇచ్చట నిలువబడియున్నాను, లోకములో ఉన్న దేనికన్ననూ కూడా దీనిని గూర్చి ఇతరులకు చెప్పుటకు ప్రయత్నిస్తున్నాను. యేసుక్రీస్తు కలిగియున్నట్లుగా నేను శాంతిని కలిగియున్నాను, మరిఇంకా దేనికన్నను కూడా.

బహుశా నేను సరిగ్గా దీనిని వ్యక్తీకరించలేకపోవుచున్నానేమో అనగా ఆయనను గూర్చి నేనేమైతే అనుకొనుచున్నానో దానిని చెప్పలేకపోవుచున్నాను, మరియు నేను సరిగ్గా దానిని చెప్పలేకపోవుచున్నాను. బహుశా నా యొక్క పదజాలము ఇంకా మెరుగ్గా ఉండవలసియున్నది, అయితే నేను ఒక విషయమును ఎరుగుదును: నా హృదయమంతటితో నేను ఆయనను ప్రేమిస్తున్నాను. మరియు ఆయనను ప్రేమించే ప్రజలతో అదేరీతిగా నేను మాట్లాడుచున్నానని నేను ఎరుగుదును.

3

మరియు ఈ యొక్క గొప్ప సిలువ శ్రమల కాలములో, మరియు పునరుత్థాన కాలములో, ఆ యొక్క పరలోకము ఈ భూమిమీదకి ఈ సమయములో వ్రేలాడబడినట్లుగా ఉన్నది. నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నదేమనగా, యేసు యొక్క రెండవ రాకడ అనేది సంవత్సరము యొక్కవసంతకాలములో ప్రారంభమౌతుందని భావిస్తున్నాను, అనగా ఆ పునరుత్థానమంతయూ అలా ఉన్నట్టుగా. ఆయన సంవత్సరపు ప్రారంభపు వసంతకాలములో జన్మించియున్నాడు.

ఎవరైనా సరే ఆయన డిసెంబరు 25న జన్మించాడు, అని చెప్పినచో అది మానసికముగా ఒక గందరగోళములో ఉంటుంది. ఆ గొఱ్ఱెల కాపరులు నాలుగు అడుగుల ఎత్తులో కురుస్తున్న మంచులో ఆ కొండల మీద ఎలా గొఱ్ఱెలను కాయగలరు, అలాంటి రాత్రిన వారు గొఱ్ఱెలను ఎలా కాయగలరు, లేక అలాంటిది ఎలాచేయగలరు. లేదండి, నిజమైన ప్రారంభపు విశ్వాసులు దానిని అలా నమ్మలేరు. ఆయన ఏప్రిల్ మాసము లేదా మే మాసము మధ్యలో పుట్టియున్నాడు; లేదా అలాంటి కాలములో—వసంతకాల ప్రారంభములో, అనగా మిగతా ప్రకృతి అంతయూ ఆ సమయములోనే చిగురిస్తుంది కదా, అలా. ఆయన ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త. ఆయన ప్రకృతితోనే వచ్చియున్నాడు.

మరియు ఆరీతిగా ఆయన వసంతకాలములో జన్మించియున్నాడని నేను నమ్ముచున్నాను. అయితే ఆయన మరలా వసంతకాలములోనే వస్తాడని నాకు తెలియదు, అయితే ఆయన ప్రత్యక్షమైనపుడు ఆ యొక్క అందమైన వసంతకాలములో వస్తాడేమోనని నా భావన మాత్రమే. అయితే ఆయన ఎప్పుడు వచ్చినాసరే, నేను సిద్ధముగా ఉండవలసియున్నాను, అది ఏ కాలమైనా మనకు అనవసరం. అది మధ్యరాత్రిలోనైనా లేక పగటి వెలుగులోనైనా లేక వసంతకాలములోనైనా లేక చలికాలములోనైనా, వర్షాకాలములోనైనా, ఎన్నడైనా సరే, ఆయనను కలుసుకొనుటకు నేను సిద్ధముగా ఉండవలసియున్నాను.

4

ఇప్పుడు ఈ మధ్యాహ్నకాల సమయములో మీరు ఇచ్చటకు వచ్చినందుకు ఈ యొక్క ఆడిటోరియంలో కూర్చున్నందుకు ఎంతో అద్భుతముగా ఉన్నది. మరియు నేను చుట్టూ చూస్తున్నాను. స్నేహితులారా, కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ కొరకు ఈనాడు ఈ దేశములో శ్రద్ధ ఏమైనది? కేవలము ప్రేమిస్తున్నకొద్దిమంది మాత్రమే వచ్చియున్నారు. ఈ మధ్యాహ్నకాల సమయములో ఒక గంట వేడిమిగల ఈ యొక్క భవంతిలో ఇతరులు కూర్చోవడం వారికి చాలా వేడిగా ఉన్నది, అలా కూర్చుని సువార్తప్రసంగము వినలేకపోవుచున్నారు. అయితే వారు దూరదర్శిని చూచుటకు ఇష్టముగా ఉన్నారు, లేక ఒక సినిమాను చూచుటకు ఇష్టపడుదురు లేక అలాంటిదానిని చూచుటకు అది అత్యంతవేడిమిగల ఉక్కపోతలో కూడా లేదా అలాంటి గొప్ప ఎండలో కూడా వారు అలాంటివి చూస్తారు. నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అచ్చటే ఉండును.

కావున నిజముగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించే కొద్దిమంది కోసము వందనములు చెల్లిస్తున్నాను మరియు అట్టివారు వేడిమిగల దినమైనా వచ్చెదరు, లేక ఎలాంటిదినమైనా సువార్తను వినుటకు వచ్చెదరు. నా అభిప్రాయములో ఒక విశ్వాసికి ఈ సువార్త ఎన్నడూ ఆకర్షణ కోల్పోలేదు. ఇది ఎల్లప్పుడూ ఆ సువార్తయే.

5

ఏదోఒక దినాన, ప్రభువుకు ఇష్టమైనచో, నేను నిరీక్షిస్తున్నదేమనగా, లూసియానాలో గల ప్రియమైన శ్రీవ్ పోర్ట్‌ అనే ఈ ప్రదేశమునకు మరలా వచ్చెదనని నేను భావిస్తున్నాను. నేను చెప్పినట్లుగా ఈ ఉదయకాల సమయములో మీరు ఎల్లప్పుడూ ఆ యొక్క గుడారములో ఉండెదరు, అది నా హృదయములో ఒక గురుతుగా ఉంటుంది. మరియు అది ఎల్లప్పుడూ ఒకమధ్యాహ్నకాల సమయముగా ఉంటుంది, మేము ఆ యొక్క సువార్త శిబిరాన్నినిర్వహించినపుడు, బాక్స్‌టర్ గారు, అతడు ఈ సభలు అన్నిటికీ ఒక నిర్వహణకర్తగా ఉన్నాడు, మిగతా సభలకు కూడా, అతడు ఎప్పుడు కూడా ఆదివారము సాయంకాలమునే నన్ను ఇచ్చటకు రమ్మని కోరతాడు, నేను కూడా ఒక విశ్రాంతిగా భావిస్తాను అనగా ఒక స్వస్థతా సభకన్నా ప్రసంగించుటకే ప్రాధాన్యతను ఇస్తాను. స్వస్థతా సభ అనేది మిమ్ములను అలసటకు గురిచేస్తుంది, మరియు… అది ఎలాంటిదో దానిని నేను వివరించలేకపోవుచున్నాను. అయితే ఈ మార్గములోమనందరమూ కూడా మన గృహాల నుండి వచ్చియున్నాము, మరియు మీ యొక్క పైచొక్కాయిలను మడతపెట్టి, మీ ఇంటిదగ్గర భోజనము చేసినట్లుగా చేయుదురు.

6

మరియు ఆరీతిగా వారు అలా చెప్పేవారు.

అది నాకు చేపల వేటకు నేను వెళ్ళటాన్ని గుర్తుచేయుచున్నది, నేను ఉత్తరాన అరణ్య భాగములో గతములో ఎప్పుడో ఒకసారి వచ్చియున్నాను. మరియు అచ్చట నేను ఒకచిన్న గుడారం వేసుకొనియున్నాను; నేను పెద్ద చేపల కోసము వేటాడటం ప్రారంభించాను. మరియు నీటిని నేను ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తుంటానో నాకు తెలియదు. బహుశా నేను బాప్టిస్టు వ్యక్తిని గనుక అలా చేస్తున్నానేమో, అయితే నీరు ఉన్నచోట నేను ఎక్కువగా దాని చుట్టూ ఉండుటకు ఇష్టపడతాను. మీకు తెలుసుకదా మొట్టమొదటగా దేవుని యొక్క ఆత్మ నీటి మీద కదలటం ప్రారంభమైనది. అదేరీతిగా మనమంతా ఎనభై శాతం నీటిచుట్టూ ఉన్నాము. కావున నేను అలా నీటిని ఇష్టపడతాను. గుడారములో నేను బాప్తిస్మము ఇచ్చినపుడు పాడే ఆ పాటను నేను వినగలను:

యోర్దాను నది ఒడ్డున నేను నిలబడియున్నాను

మరియు ఆశతో కూడిన కంటితో చూశాను

కనాను యొక్క అందమైన మరియు ఆనంద భూమిని

అచ్చటే నా యొక్క స్వాస్థ్యము ఉన్నది.

వాగ్దాన భూమి కొరకు బంధింపబడియున్నాను.

7

నేను రెండు వారాల క్రితము బాప్టిస్టు సంఘములో అభిషేకించబడ్డాను, మరియు ఆ నగరములో ఉజ్జీవమును కలిగియున్నాము. అది రెండు వారాలు సాగినది. ఆ మధ్యాహ్నకాల సమయములో మేము ఐదువందల మందికి ఆ నదిలో బాప్తిస్మమిచ్చాము మరియు ప్రభువు యొక్క దూత అచ్చటకు వచ్చి కనిపించినది. వార్తాపత్రికలు మరియు మిగతావి దానిని ప్రచురించినవి, మరియు అది ఇరవై మూడు సంవత్సరముల క్రితము జరిగినది. మరియు అచ్చట నుండి ఒక స్వరము పలికినది, ఆయన ఎలా దానిని చెప్పియున్నాడో అలాగే జరిగినది. మరియు…

నేను ఈ దినము చాలా సంతోషముగా ఉన్నాను, కృప ద్వారా నేను ఈ దినము క్రైస్తవున్ని అయ్యాను, అని నా హృదయమంతటితో నేను గట్టిగా అరవగలను: ఒక రాజ కుమారునిగా. మరియు మీరు నా యొక్క సహోదరీ సహోదరులు. మరియు మనందరమూ కూడా ఆరాజ్యము యొక్క సహ పౌరులము, అచ్చటకు మనము ఈ చీకటి ప్రపంచము గుండా ప్రయాణము చేయుచున్నాము, మనము యాత్రికులమును మరియు పరదేశులమునైయున్నామని నమ్ముచూ, మరియు ఇచ్చట ఏమీ లేదని నమ్ముచున్నాము. మరియు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై యున్నాడో ఆ పట్టణము కొరకుఎదురుచూస్తున్నాము. దేవుడు మన దేవునిగా పిలువబడుటకు సిగ్గుపరచబడడు… లేదా, ఆయన యొక్క ప్రజలము.

8

ఇప్పుడు ఆయన యొక్క దీవెనలు మీపై ఉండునుగాక. మరియు ఈ యొక్కమధ్యాహ్నకాల సమయములో, దేవుడు మనలను కలుసుకొంటాడని నేను విశ్వసిస్తున్నాను. మరియు ఒక చిన్న ఉపన్యాసము ద్వారా, నేను భావించినట్లుగా మీరు దానిని అలా పిలుస్తారు. నేను గొప్ప బోధకునికాదు; నేను కేవలము వాక్యములోనికే చూడాలనుకుంటున్నాను, దానినుండి కొన్ని వచనాలు చదువుతాను, మరియు పరిశుద్ధాత్మ ఏమి చెప్పవలెనని కోరుతుందో దానిని చెప్తాను. నేను ఎన్నడూ ఒక నోట్స్‌ను కలిగిలేను లేక దేనినుండైనా నేను బోధించలేదు; నేను కేవలము లేఖనాన్ని చదువుతాను. మరియు నేను ఎచ్చటైతేచూస్తానో దానిని గమనిస్తాను, నేను దానిని అర్థము చేసుకొన్నరీతిగా బయటకుచెప్తాను. కొన్నిసార్లు అది చాలా బాగా ఉంటుంది, ఆరీతిగా దానిని నేను పొందుకుంటాను. మరియు దానిని నేను పొందుకొనినరీతిగా, ఆ మార్గములోనే ఆరీతిగానే నేను దానిని బయటకు ఇస్తాను ఎందుచేతననగా అది నాది కాదని నేను భావిస్తాను, అయితే అది ఆయనది. మరియు ఆయన దానిని ఎలా ఇవ్వాలని కోరుకుంటాడో అలా ఇస్తాడు. అది ఇంక ఎవరి దగ్గరికీ వెళ్లకూడదు గానీ ఒక్క వ్యక్తి యొద్దకే, అనగా ఆ ఒక్క వ్యక్తితోనే ఆయన వ్యవహరించవచ్చును, మీరు చూస్తున్నారా—ఆ ఒక్క వ్యక్తి దగ్గరకే.

9

కావున ఈ మధ్యాహ్నకాల సమయములో సహోదరులైన మీరు సేవకులుగా మరియు బోధకులుగా ఇచ్చటకు వచ్చియున్నారు కనుక గుర్తుంచుకొనండి: నేను మీ యొక్క స్థానాన్ని తీసుకోవాలని ప్రయత్నించుటలేదు. ప్రభువైన యేసును గూర్చినేను ఏమి ఎరిగియున్నానో దానిని మీకు చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. ఎందుచేతననగా, నేను ఆయనను ప్రేమిస్తున్నాను. మరియు ఇది నేను మీకు బయటకు ఇవ్వాలని అనుకుంటున్నాను… నేను చెప్పినదానికి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయములో నేను లెక్కచెప్పవలసియున్నది, అనగా ఆ తీర్పు దినమున. మరియు ఈ మధ్యాహ్నకాల సమయము కొరకు మీరు కూడా లెక్క చెప్పవలసియున్నారు.మరియు నేను ఏదైనా తప్పు చెప్పినచో, దానికొరకు నేను వెలచెల్లించేటట్టుగా దేవుడు చేస్తాడు. మరియ నేను సత్యము చెప్పినచో మరియు మీరు దానిని తృణీకరించినచో, పిమ్మట మీరు కూడా వెల చెల్లించేటట్టుగా దేవుడు చేస్తాడు సుమా.

కావున ఈ మధ్యాహ్నకాల సమయములో ప్రభువు వచ్చి మనకు సహాయము చేయునుగాక, మనము ఆయన వాక్యములోనికి చూస్తుండగా ఆయన అలా చేయునుగాక.

10

మొట్టమొదటగా మనము ఆయన వాక్యములోనికి చూడటానికి ముందుగా, ఆయన దానిని మనకు చూపించేటట్టుగా ఆయనను అడుగుదాము. ఏలయనగా ఆయన అచ్చట చెప్పియున్నాడు, “యేసునైన నేను సాక్ష్యమిచ్చుటకు నా దూతను పంపియున్నాను. మరియు ఆయన నిన్నునడిపించును… ఈ గ్రంథములోనుండి ఎవరైనా ఒకదానిని తీసినచో లేదా దానికి ఏదైననూ కలిపినచో, జీవగ్రంథములోనుండి అతని యొక్క భాగము కూడా తీసివేయబడును. మరియు అతడు దీనిలోనుండి ఏదైనా తీసివేసినా లేదా కలిపినాఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు వానికి ప్రాప్తించును.” కావున సువార్త, అది వ్రాయబడిన రీతిగానే దానిని మనము బోధించెదము. మనము ఇప్పుడు ప్రార్థించెదమా.

11

తండ్రీ, మీ కుమారుడైనయేసు నామములో, ప్రియమైన అతడు, పదివేలలో సుందరుడు, లోయలో దాగిన పద్మము, మరియు వేకువచుక్క, దావీదు యొక్క చిగురు, షారోను పుష్పము, అల్ఫాయు మరియు ఓమెగయు యైయున్నవాడు. ఓ దేవా, ఆయనకు అనేక బిరుదులున్నవి, అయితే ముగింపుగా పరిశుద్ధాత్మ ఆయనను ఇమ్మానుయేలు అని చెప్పినది: అనగా దేవుడు మనకు తోడైయున్నాడు అని. మేము ఆయనను చూశాము, సంపూర్ణ కృపగలిగిన, తండ్రి యొక్కఅద్వితీయ కుమారునిగా.

ఇప్పుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయములోమీరు మీ యొక్క వాక్యాన్ని మాకు విప్పెదరని మేము ప్రార్థించుచున్నాము. మేము కేవలము చదివెదము గానీ మా అవగాహన విప్పేది మీరే. మరియు ఇప్పుడు మాయొక్క మనస్సాక్షి స్వచ్ఛమైన నీటితో కడగబడునుగాక: అదియే పరిశుద్ధాత్మ. మా యొక్క బలమును నూతనము చెయ్యండి మరియు మా యొక్క ఆత్మసంబంధమైన దృష్టిని కూడా. మా హృదయములు తెరవండి, రాబోవు నేలను చదును చెయ్యండి. లోపలికి కదలండి మరియు ఈ సభ నుండే ఆ పాత రకపు ఉజ్జీవపు విత్తనాన్ని నాటండి. మరియు లూసియానా, శ్రీవ్‌పోర్ట్ ద్వారా తుడుపుపెట్టండి, మరియు యేసు వచ్చేలోగా నశించినవారిని రక్షించండి. మరియు దీనిని మేము ఆయన యొక్క నామములో అడుగుచున్నాము. ఆమేన్.

12

ఇప్పుడు యోవేలు గ్రంథములో… ఈ ప్రవక్తలను గూర్చి చదువుటకు నేను ఇష్టపడతాను. ఎవరో ఇలా చెప్పారు, “సోదరుడు బ్రాన్హాం”, కొద్దికాలము క్రితము నాతో చెప్పారు, “మీరు ఎల్లప్పుడూ పాత నిబంధనకే ఎందుకు వెళ్తూ ఉంటారు?”

మంచిది, చూడండి, నేను ఎన్నడూ కూడా ఒక సెమినరీ విద్య అనుభవాన్ని కలిగిలేను… లేదా అత్యధికమైన మనోవిజ్ఞానశాస్త్రమును కలిగిలేను… నేను కేవలము ఒకే ఒక విషయములో నిశ్చయత కలిగియుంటాను, అదేమనగా నేను సరిగ్గా ఉండాలి, నేను మాదిరులను తీసుకుంటూ ఉంటాను. మరియు నేను ఆ మాదిరి ఎలా ఉంటాదో చూడగలిగినప్పుడు, దానికి వ్యతిరేకమైన మాదిరి ఒక మంచి భావనను తీసుకోగలను. మరియు ఆ యొక్క ఛాయ ఏమిటో నేను దానిని చూడగలను… మరియు ఆ యొక్క ఛాయను ప్రతిబింబింప చేయగల ఒకే ఒక్కటి ఏమనగా… ఆ ఛాయను చూపగలిగినది వెలుగు మాత్రమే.

13

ఆ యొక్క 23వ కీర్తన ప్రజలద్వారా ఎన్నిసార్లు తప్పుడు తర్జుమా చేయబడినది. వారు చెప్పుట మీరు వింటూ ఉంటారు, “గాఢాందకారపు మరణ లోయలలోనేను సంచరించిననూ…” అది అలా అచ్చట లేదు కదా. అది ఎలా ఉన్నదనగా, “మరణఛాయ లోయ గుండా నేను నడిచిననూ…” అని ఉంది గానీ, గాఢాందకారపు అని అచ్చట లేదు.“మరణపుఛాయ లోయ గుండా నేను నడిచిననూ…” మరియు దానికిముందు ఒక ఛాయ ఉండవచ్చు, అక్కడ ఆ ఛాయను ప్రతిబింబించుటకు ఒక వెలుగు ఉండవలసియున్నది. నా భావము గ్రహించారా? అచ్చట అది లేనిచో… అప్పుడు అదంతయూ అంధకారమే, అప్పుడు అచ్చట ఏ అంధకారము ఉండదు. కావున ఛాయ ప్రతిబింబించాలంటే అచ్చట తప్పనిసరిగా వెలుగు ఉండవలసియున్నది. కావున అచ్చట కేవలము ఇప్పుడు ఛాయ ఉన్నది. మరియు ఏ ఒక్కరూ ఛాయకు లేదా నీడకు భయపడరు గదా, భయపడతామా?

కావున అదంతయూ మరణము అనగా మనకు బదులుగా యేసు మరణించియున్నాడు. మరణము అనేది ఒక ఛాయ—దానిగుండా మనము ప్రయాణము చేయవలసియున్నది, ఒక చిన్న స్థలము, మరియు అదంతయూ అదియే. వాగ్దాన భూమి నుండి ఎవరునూ మనలను తప్పించలేరు. దేవుడు ఇదివరకు దానిని మనకు వాగ్దానము చేసియున్నాడు. యేసు దానికొరకు మరణించాడు. పరిశుద్ధాత్మ మనలను అంగీకరించియున్నది, మనకు బాప్తిస్మమిచ్చియున్నది, విమోచనా దినమువరకు మనలను ముద్రించియున్నది. మనము మన యొక్క రహదారిపైన ఉన్నాము. సమస్తమును సరిగ్గా ఉండవలసియున్నది.

14

ఓ, మై. అది హృదయములోనుండి భయమును తీసివేయజాలనిచో, మరి ఇక ఏది తీసివేస్తుందో నాకు తెలియదు. ప్రజలు ఒకప్పుడు భయపడుట గూర్చి ఆలోచించినచో: “నేను చివరి వరకుఉంచగలనా అని ఆశ్చర్యపడతాను” దానికొరకుఎందుకు భయపడాలి. నేను దానిని పట్టుకొనియున్నాను అని కాదు, ఆయన దానిని పట్టుకొనియున్నాడా లేదా అనేది కావాలి. పట్టుకునేది నేను కాదు. ఆయన మనలను పట్టుకున్నచో, నేను ఆయన ద్వారా పట్టుకొనబడియున్నాను. అది నిజము. ఆయన నన్ను పట్టుకొనియున్నాడు, నేను ఆయనను పట్టుకొనియుండుట కాదండి, చూచారా. ఆయన నా కొరకు చనిపోయియున్నాడు, నేను ఆయన కొరకు చనిపోలేదు.

మరియు ఈ ఉదయకాల సమయములో ఈ ప్రసంగములో, ఆ యొక్క సిలువ మీద, ఆ మరణము దాని ముల్లును కలిగియున్నది, యేసు ఆ మరణపు ముల్లును విరిచేంత వరకు. కావున ఇప్పుడు ఆ యొక్క ముల్లు నాలో ఎంతమాత్రమును లేదు. క్రైస్తవునిగా నీలో కూడా అది లేదు. ఆ ముల్లు యేసులో ఉన్నది, అయితే దానిని ఆయన తీసివేసెను. మరణములో నుండి ఆయన దానిని విరిచివేసెను, మరియు దానిని కల్వరికి ఆయన మోసుకొనివెళ్లెను. కావున మరణములో ఇకమనము ముల్లును కలిగిలేము.

పౌలు ఇలా చెప్పటములో ఆశ్చర్యమేమీ లేదు, “ఓ మరణమా, నీ ముల్లెక్కడ? సమాధి నీ విజయమెక్కడ? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విజయమును అనుగ్రహించుచున్న మన దేవునికి వందనములు. ఆమేన్.”

15

ఇప్పుడు యోవేలు గ్రంథము… మీలో కొంతమంది మీ పరిశుద్ధ గ్రంథములను తెరుచుటనేను చూచుచున్నాను. మీరు దానిని విప్పవలెనని నేను వేచియున్నాను. లేఖనములో ఒక భాగాన్నినేను చదువదలచుకున్నాను, మరియు ఈ మధ్యాహ్నకాల సమయములో ఈ యొక్క భాగమును కొద్ది క్షణాలు మనము ఆలోచించెదము. ఈ రాత్రికాల సమయములో ఆరాధన గూర్చి మీరు మరచిపోవద్దు, చివరి కూడిక. మీరు రోగులందరినీ తీసుకుని రావలెనని నేను కోరుచున్నాను, మరియు అందరూ కూడండి, ఎక్కువమంది జనసమూహముగా రండి.

బహుశా మీ అందరితో స్రీవ్‌పోర్ట్‌లో నేను కలిసియుండుట ఇదే చివర కావొచ్చేమో, మరలా మీ అందరినీ నేనుమహిమలో కలిసేంతవరకు. దేవుడు అనుమతించినచో చాలా విషయాలు ఇంకా నాముందు చేయుటకు ఉన్నవి. నేను ఆ యొక్క ఆఫ్రికా దేశములో గల తెగలను కలుసుకొనుటకు వెళ్లాలి, ఆ యొక్క అరణ్యములో ఉన్న ప్రజల కొరకు మరియు భారతదేశములో ఉన్నవారి కొరకు వెళ్లాలి, ఆ మంత్రవైద్యుల యొద్దకు, అగ్నిని మింగేవారి యొద్దకు మరియు అనుకరణలు చేసేవారి యొద్దకు వెళ్లాలి. మరియు వారు మీకు ఏమైనా చేస్తారని నేను అనుకోవటంలేదు మరియు ఆ స్థలములోనే మిమ్ములను నేను సవాలు చేయుచున్నాను. కచ్చితముగా అచ్చటే, వారు ఒక ఇత్తడి లాగా ఉండే స్థలములో మరియు ప్రతిదానిని సవాలు చేయుచున్నాను. మీరు ఏమి మాట్లాడుచున్నారో అది మీరు బాగా ఎరుగవలసియున్నది. అది నిజము.

అయితే నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తాను, మిమ్ములను నేను ఇచ్చట స్రీవ్‌పోర్ట్‌లో కలుసుకొనినప్పటి నుండి, మరియు ఆ యొక్క అంధకార గడియలు ప్రారంభమైన పరంపర ఆ మొదలగు విషయాలు… నేను భావించాను, మంచిది, స్రీవ్‌పోర్ట్‌లో వారందరి యొక్క చేతులను పైకి ఎత్తవలెనని నేను భావించాను, మరియు కాలిఫోర్నియాలో మరియు వివిధ రకాలైన స్థలాలలో, అనగా నా కొరకు ప్రార్థించేవారు ఎవరున్నారా అని. వారు ఇప్పుడే ప్రార్థించు చున్నారు, చూచారా.

16

ఆర్కన్‌సాస్ నుండి వచ్చిన ఒక చిన్న స్త్రీ ఆమె ఈ సభలో ఉన్నది, ఇచ్చట కొద్ది రోజులక్రితం అనగా ఆమె మరియు తన యొక్క సోదరీలు వచ్చియున్నారు,

మరియు వారి భర్తలు, వారు చాలా ప్రియమైన కుటుంబము, వారు “బాబ్స్” కుటుంబము—వారు ఇప్పుడు ఎచ్చటో ఇక్కడ కూర్చొనియున్నారు. అయితే వారు ఎచ్చట ఉన్నారో వారిని నిలువబడమని మీరు అడుగవద్దు. అయితే ఆమె ఈ ఉదయకాలములో చెప్పినది, గుడారము నుండి నడుచుకుంటూ వెళ్తూ ఆమె చెప్పినది, ఆమె చెప్పినది, “బ్రాన్హాం సోదరుడా, మేము ప్రతీరోజూ ఉదయకాల సమయము నాలుగు గంటలకు నీ కోసము ప్రార్థిస్తూ ఉంటాము.” అది ఆఫ్రికాలో ఎంత సమయముగా ఉంటుందో నేను ఆలోచించుటకు ప్రయత్నించాను. అది నిజము. ఆ గడియ వారు అలా చేస్తూ ఉంటారు. అది ఎంతో అద్భుతమైనది. ఇప్పుడు:

యెహోవావాక్కు… యోవేలునకు ప్రత్యక్షమై…

పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా?

ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆబిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు.

గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి;… మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి;… పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి.

మత్తులారా, మేలుకొని,… కన్నీరు విడువుడి, ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీనోటికి రాకుండ నాశ మాయెను.

లెక్కలేని బలమైన జనాంగమునా దేశము మీదికి వచ్చియున్నది, వాటి పళ్లు సింహపుకోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.

17

ఇప్పుడు తరువాత అధ్యాయములో, యోవేలు గ్రంథము 2వఅధ్యాయము, ఇచ్చట ఇది ఒక భయంకరమైన చిత్రముగా ఉండవచ్చు—ప్రవక్త అంత్యకాలముగూర్చి మాట్లాడుచున్నాడు—ఇది ఒకవేళ 2వఅధ్యాయము యొక్క 25వ, 26వ, 27వ వచనములు కానిచో. వినండి, దేవుడు విశ్వాసులకు ఆదరణ ఇచ్చుచున్నాడు.

మీరు కడుపార తిని, తృప్తిపొంది, మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడ పురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.

నా జనులు ఇక నెన్నటికినిసిగ్గునొందరు.

అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేను మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరుదేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు; నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందకయుందురు.

మిగతా ఇరవై ఐదు లేదాముప్ఫై నిమిషాలు ఈ విషయమును గురించి మనము ఆలోచిస్తూ ఉండగా ఆయన తన యొక్క దీవెనలు ఈవాక్యము పైన ఉంచునుగాక. మిమ్ములను వేగముగా విడిచిపెట్టాలని కోరుకొనుచున్నాను, ముప్ఫై ఐదు నిమిషాలు, ఎందుకనగా వారు ప్రార్థనా అట్టలను ఇచ్చియున్నారు, మరియు ఈ రాత్రికాలసమయమున మనకు వేరొక ఆరాధన కూడిక ఉన్నది గనుక.

18

ఇప్పుడు, గమనించండి ఈ యొక్క ధ్యాన భాగములో, ఈ లేఖనాన్ని చూసినప్పుడు, యోవేలు… దేవుడు…ఇతడు చివరి ప్రవక్తలలో ఒకడు. ముందుగా విషయాన్ని తెలియజేయుటకుదేవుడు యోవేలును ఉపయోగించుకొనుచున్నాడు… లేక, దేవుడు ఎన్నడూ ముందుగా హెచ్చరికను ఇవ్వకున్నా తీర్పును పంపించబోడు. పరిశుద్ధాత్మరావటం గూర్చి యోవేలు చూస్తున్నాడు. అతడు ఈ దినమును ముందుగానే చూశాడు. ప్రభువు యొక్క రాకడను అతడు చూశాడు. ఇప్పుడు ఇచ్చట ఈ భాగము నేటి కొరకు మాట్లాడుచున్నది, అతడు ఈ దినముల కొరకు మాట్లాడుచున్నాడు, నిశ్చయముగా మనము ఆదినములలోనే ఇప్పుడు జీవిస్తున్నామని నేను నమ్ముచున్నాను.

19

ఇప్పుడు ఈ ప్రవచనమును చూసినచో, దేవుడు అనేకమైన ఉపమానములను ఉపయోగిస్తున్నట్టుగా మనము గమనించగలము, అవేవనగా… చాలాసార్లు ఆయన చెప్పెను, యేసు ప్రారంభములో చెప్పినట్లుగా, ఎత్తైన స్థలములు, మెట్టలు చదును చేయబడును అని చెప్పినరీతిగా. కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్టెపిల్లలవలెను గంతులు వేసెను. చాలా గురుతులు పరిశుద్ధగ్రంథములో ఉన్నవి. మరియు దేవుడు ఆయన యొక్క స్వాస్థ్యమును ఇచ్చట భూమి మీద ఉన్నట్టుగా పోల్చుచున్నాడు, ఆయన యొక్క సంఘమును, ఒక ద్రాక్షావల్లితో పోలుస్తున్నాడు. ఆయన దానిని అనేకమైన విషయాలతో పోలుస్తున్నాడు. ఒక స్త్రీతో పోలుస్తున్నాడు.

మరియు ఈసారి ఆయన దానిని ఆయన యొక్క సంఘముతో పోలుస్తున్నాడు, దానిని ఒక ద్రాక్షావల్లితో. మరియు ఆ ద్రాక్షావల్లిలో, దానిని గూర్చి రాజుల గ్రంథములో ఉన్నది, ఒక కారు ద్రాక్షావల్లినిగూర్చి అక్కడ చూస్తున్నాము. మరియు ఆ రెండు ద్రాక్షావల్లులు దగ్గరగా ఒకేలా ఉన్నవి. ఉదాహరణకు ఏలీయా ఆ యొక్క ప్రవక్తల పాఠశాలకు వెళ్లినపుడు, మరియు అతడు అచ్చటకు ఒక మనిషిని పంపించియున్నాడు, తన యొక్క బోధనలు అన్నయూ చెప్పి, ఒక తర్ఫీదు పొందిన విద్యావేత్తగా అతనిని పంపించెను, జీవించుటకు కొంత ఆహారమును తీసుకుని రమ్మని అతడు వానిని పంపించెను. వారందరు ఆకలితో ఉన్నారు.

20

అది నేటి దినము కొరకు చాలా అందమైన మాదిరి. సంఘము ఆకలిగా ఉన్నప్పుడు, ఆయన యొక్క పిల్లలు జీవాహారముతో ఆకలి తీర్చుకొనవలెనని దేవుడు ఆశిస్తున్నాడు, ఏదో ఒక సిద్ధాంతముతో కాదు, గానీ జీవపు రొట్టెతో. జీవపురొట్టె అనగా ఏమిటి? యేసు చెప్పెను, “పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే.” చెప్పెను, “మీ పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి.” హెబ్రీయులకు… లేకయోహాను సువార్త 6వ అధ్యాయము, “వారు అరణ్యములో మన్నాను తినినను వారందరూ చనిపోయిరి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును.”

లేక ఇంకొక మాటలో చెప్పాలంటే, “ఏదెనుతోటలోనున్న జీవ వృక్షమును నేనే.” అయితే వారు మరణవృక్షమును భుజించినచో, వారు చనిపోయిరి; వారు జీవవృక్షము నుండి భుజించినచో, వారు జీవించిరి. పాప ప్రాయశ్చిత్తము జరిగేంతవరకు పరిశుద్ధాత్మ ఆ యొక్క జీవ వృక్షమును సంరక్షించినది. ఇప్పుడుఆ పరిశుద్ధాత్మ జీవ వృక్షమునకు ప్రజలను నడిపించుచున్నది.

ఆదాము మరియు హవ్వలు జీవవృక్షమును పొందుటకు ప్రయత్నించిరి; అయితే ఇప్పుడు అతని పిల్లలు ఆ జీవవృక్షము నుండి దూరముగా వెళ్లిపోవుటకు ప్రయత్నించుచున్నారు. పిమ్మట పరిశుద్ధాత్మ దానిని సంరక్షించుచున్నది, ఇప్పుడు అది వారికి దానిని తెచ్చుచున్నది. అయితే వారు పరిశుద్ధాత్మయొక్క స్వరాన్ని తృణీకరించుచున్నారు, ఏలయనగా ఆ యొక్క విరోధివారిని పాపము చేయుటకు ప్రేరేపిస్తున్నాడు, మరియు ఆదిలో జీవవృక్షమునుండి వాడే వారిని దూరముగా తీసుకొనిపోయాడు.

మరియు యేసుక్రీస్తే ఆజీవపు వృక్షమైయున్నాడు.

21

ఆ స్త్రీ హవ్వ, మరణ వృక్షము. ఆమె ఈ లోకములోనికి జన్మించుట విషయములో మనమందరము ఆ రుచి చూచాము. అనగా మనమందరము స్త్రీద్వారా జన్మించాము, గనుక మనము మరణించవలసియున్నది. అయితే మనము ఒక మనిషికి జన్మించినచో అనగా యేసుక్రీస్తుకు జన్మించినచో, మనము ఎన్నడూ జీవిస్తాము. మీరు దానిని తినినచో మీరు నిశ్చయముగా చచ్చెదరు. అయితే మీరు దీనిని తినినచో మీరు నిశ్చయముగా జీవించెదరు.

ఓ, మై. ఇలాంటి సమస్యాత్మకమైన పరిస్థితులలో ఒక మానవ ప్రాణము ఈ యొక్క మహిమకరమైన మాటలలో లంగరువేసుకొనుట, నేను ఆ మహిమకరమైన మాటలను ప్రేమిస్తున్నాను, మరి ఇంక ఏదియూ దానిని చేయజాలదు. మీరు మీ యొక్క నమ్మకాన్ని మీ దేశములో ఉంచుకునేంత వరకు అది వచ్చును; అయితే మీరు దేనిలోనూ మీ నమ్మకమును ఉంచుకొనలేరు. అయితే స్థిరమైన బండయైన క్రీస్తులో మీ నమ్మకము ఉంచుకొనవలసియున్నది, నేను దానిమీదే నిల్చొంటాను. మిగతా నేలలు అన్నియూ కూరుకుపోయే ఇసుక నేలలే. ఆమేన్.

22

చెప్పెను, మీరువెళ్లి కొంత ఆహారమును ఒక పాత్రలో తీసుకుని రండి… లేకకొన్ని గింజలను గానీ, మనము త్రాగే ద్రావణాన్ని తయారు చేద్దాం. అయితే ఈ యొక్కవిద్యావేత్త బహుశా పట్టా పుచ్చుకొనియున్నాడు, Ph.D., కూడా చేసియుండవచ్చు, ఇతడు ఆహారము తీసుకువచ్చుటకు బదులుగా, అతడు ఒకవెఱ్ఱి ద్రాక్షతీగెను తీసుకువచ్చెను. అది ఒక మంచిద్రాక్షావల్లి వలే కనిపించెను, అయితే ఆ తీగె గింజలను కలిగియుండుటకు బదులుగా అడవి పొట్లకాయలను కలిగి ఉన్నది.

చూచారా, “ఒకనికి తన మార్గముసరైనదిగా కనిపించును గానీ తుదకు అది మరణమును దారితీయును.” 'ప్రభువా, ప్రభువా' అనిపిలుచు ప్రతివాడు నా రాజ్యములో ప్రవేశించడు గానీ నా తండ్రి చిత్తప్రకారము చేయువాడేప్రవేశించును.“ కావున యేసుక్రీస్తు ప్రభువును నమ్మటమే తండ్రి చిత్తమైయున్నది. మరియు తిరిగిజన్మించటమే.”ఒకడుక్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు.“

నీవు ఏ సంఘమునకు సంబంధించినవాడవైనా అనవసరం, నీ తల్లిఎంత మంచిదైనా సరే, నీతండ్రి ఎంత మంచివాడైనా సరే, నీ భార్య లేదా భర్త ఎంత మంచివారైనా సరే: “ఒకడు (ఒక్క వ్యక్తి గానీ లేదా వ్యక్తిగతముగా) క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు.”అది అంతే. అది స్రీవ్‌పోర్ట్ ను ఎన్నడూ విడిచిపెట్టదనినేను నిరీక్షిస్తున్నాను. యేసు వచ్చేంత వరకు అది ఇచ్చట ఉంటుంది, ఆ మనిషి అతడు తప్పక—తప్పకతిరిగి జన్మించవలసియున్నాడు.

23

ఈ మనిషి కొన్ని అడవి పొట్లకాయలను తీసుకుని ఒక కుండలోవేసెను, వాటినివంట చేసెను, జీవించుటకులేదా బ్రతుకుటకు అలా చేసెను. ఈ లోకములో నేడు అనేక స్థలాలలో ఇది ఎంతమాదిరిగానున్నది: ఏదో ఒకదానిని వండుచున్నారు, మంచిది, అయితే ఆ కుండలో నీవు దేనిని కలిగియున్నావు?

మరియు వారు కనుగొనియున్నారు, వారు తినుటకు ప్రారంభించినప్పుడు, ఆ కుండలో మరణమున్నది. ఒకవ్యక్తి ఇలా అరిచియున్నాడు, “ఓ, ఆ కుండలో మరణమున్నది.”

అయితే అచ్చట రెండింతల శక్తి గలిగిన ఒక వ్యక్తియున్నాడు: అతడే ఏలీయా—అతడువెళ్లి ఆ కుండలో నుండి ఒక పిడికెడు నిండా తీసుకొని, ఆయొక్క ప్రవక్తల పాఠశాలలోకి వచ్చి, అదియే అతడు భోజనమును కలిగియున్నాడు. వారు అతనికి భోజనమును పెట్టియున్నారు. మరియు అతడు ఆ యొక్కచేతితో ఆ ముద్దను తీసుకుని, మరియు ఆ యొక్క కుండలోనికి దానిని విసిరి ఇలా చెప్పెను, “ఇప్పుడు మీరు దీనిలోనుండి ఎంత తినాలనుకుంటే అంత తినండి, ఎందుకనగా ఇప్పుడు ఇది జీవమైయున్నది.”

24

ఒక భోజన అర్పణ… ఏయొక్క ఉపదేశకునికి అయినా అది ఎరుగును, భోజన అర్పణ, అల్లాడించు పనఅర్పణ, గొప్ప అర్పణ, ఆయొక్క అర్పణలన్నియూ యేసుకు సంబంధించినవి. ఈ యొక్క చిన్న భోజన అర్పణ అనేది కోయబడిన చిన్న కాండము నుండి వచ్చును. ప్రతి చిన్న గోధుమవిత్తనము కూడా అలాగే కోయబడవలసియున్నది. మరియు వారు ఆ గింజలనుచేతినిండా పట్టుకొనిరి. అనగా ఆ కోయబడిపట్టుకొనబడిన గోధుమ గింజలన్నియూ యేసుక్రీస్తు, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.

మరియు క్రీస్తు మరణమునకు అప్పగింపబడినప్పుడు, మరణము మరియు జీవము రెండూకలిసి ఉండలేవు, పగలు మరియు రాత్రి కలిసిఉండలేవు. సూర్యుడు బయటకువచ్చినపుడు, అది ఎంత చీకటిగా ఉన్నా, చీకటిపోవలసినదే. మరియు యేసు ఆ యొక్కప్రాణము లోనికి వచ్చినపుడు, ఎంతటి గర్వమైనా, ఎలాంటిగర్విష్టి అయినా, నీవు ఎలాంటి వాడివైనా, ఎలాంటిపాపమైనా పోవలసినదే—ఇంక అది ఏదీ అచ్చట ఉండలేదు. నీనుండి లోకపు విషయాలువెళ్లిపోవలసియున్నవి.

25

కొద్దికాలము క్రితం ఒకవ్యక్తి ఇలా చెప్పెను, “బ్రాన్హాం సోదరుడా, మేము దీనిని చేయవలెనని నీవు నమ్ముచున్నావా, మరియు ప్రజలు దీనిని లేదా దానిని చేయవలసియున్నదా?”

నేను చెప్పాను, “చాలా ఓక్ వృక్షాలకుంచెలను కలిగియున్న దేశములో నేను నివసించుచున్నాను. మరియుఆ యొక్క వసంత కాలములో ఆ యొక్క చెట్ల ఆకులను తెంచుటకు మనము వెళ్లవలసిన అవసరము లేదు. అవిచలికాలములో కూడా ఉంటాయి, కేవలము మనము చేయవలసినదినూతన జీవము వచ్చేంత వరకు వేచియుండాలి. ఆ పాత ఆకులు రాలిపోతాయి. అదేరీతిగా ఒక స్త్రీ లేదా పురుషుడు, దేవుని యొక్క ఆత్మ ద్వారాజన్మించినపుడు, ఆ ప్రాచీన జీవితము వెళ్లిపోతుంది, మరియు నూతన జీవము దాని స్థానములో ఉద్భవిస్తుంది.”

26

ఇప్పుడు ఈ యొక్క ద్రాక్షాతీగెలు, ఒకనిజ ద్రాక్షావల్లి… యోహాను సువార్త 14వఅధ్యాయము, యేసు చెప్పెను ఆయన ఒకద్రాక్షావల్లిని అని, మరియు మనము తీగెలము అని. పరిశుద్ధ గ్రంథములో చాలాసార్లు, దేవుడు తన సంఘమును ఒక ద్రాక్షావల్లికి పోలుస్తూ ఉంటాడు. ఇప్పుడు, ఈయొక్క ఉపమాన భావమును సరిగ్గా అర్థము చేసుకొనుటకు… లేక, ఈయొక్క ప్రవచనము, భూమి మీదనున్న సమస్తమును…

ఏదియూ కొత్తది లేదు. సమస్తము నూగతములో ఉన్నదే; లేఖనము ఆ రీతిగా చెప్పుచున్నది. మరియు ప్రతీ తెగ మరియు ప్రతీ మూఢ భక్తి మరియు ప్రతీ సాంప్రదాయత, మరియు ప్రతీ వాదము ఇవన్నియూ కూడా ఆదికాండములోనే ప్రారంభమైనవి. మీకు అది తెలుసా? ఆదికాండము అనగా “ప్రారంభము.” మరియు ఆదికాండములో సమస్తమునూ ప్రారంభమైనది: సృష్టి ప్రారంభమాయెను, వృక్షములు ప్రారంభమాయెను, పక్షులు ప్రారంభమాయెను, మానవజీవితము ప్రారంభమైనది, మతము ప్రారంభమైనది. సమస్తమునూ ఆదికాండము నుండే ప్రారంభమైనది.

27

ఇప్పుడు ఒక చిన్న చిత్రమును మనము చూచెదము మరియు వెనుకకు వెళ్లెదము. నేను ఒక క్షణం క్రితం నా గదిలో నా కుమారుడికి ఇది చదువుచున్నాను, ప్రకటన17వ అధ్యాయము, బబులోను అని పిలువబడే ఆయొక్క ప్రాచీన మహావేశ్య మరియు తన యొక్క పిల్లలు. బబులోనుమొదటగా ఆదికాండములో ప్రారంభమైనది. పిమ్మట అది మరలా రాజైననెబుకద్నెజరు కాలములో కనిపించినది అనగా అన్యజనులకు సంబంధించి. మరలా అది ఆ కాలము నుండి తరువాత కనిపించినది ప్రకటన గ్రంథములో. బబులోను మొట్టమొదటగా విగ్రహారాధనతో ప్రారంభమైనది. ఆ గ్రంథము మధ్యలో విగ్రహారాధన ఉన్నది. ఇది క్రైస్తవ్యము క్రింద ముగింపు అగుచున్నది, అయితే ఇంకనూ అది విగ్రహారాధనే.

ఇప్పుడు ఇది ఆదికాండములోప్రారంభమైనచో, ఇది ఇచ్చట అంతమగుచున్నది. పిమ్మట రక్షణ ఆదికాండములో ప్రారంభమాయెను. అనుకరణ ఆదికాండములోనే ప్రారంభమైనది. సాంప్రదాయ వాదము ఆదికాండములోనే ప్రారంభమైనది. సమస్తమునూ ఆదికాండములోనే ప్రారంభమైనది. ఇది ఒక ద్రాక్షా తీగెలాంటిది.

28

ఇప్పుడు అచ్చట ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మనము ప్రారంభించెదము… ఆదాము మరియు హవ్వలు స్వచ్ఛమైనవారు. దేవుడు ఆదామును నేలధూళిలో నుండి నిర్మించియున్నాడు, పిమ్మట అతని యొక్కప్రక్కటెముకలోనుండి స్త్రీని సృజించాడు. అయితే ఆమె పాపము చేసినది, మరియు ఆదామును దానిలోనికి లాగినది. ఇప్పుడు ఇద్దరునూ పాపముచేసిరి. పిమ్మట దేవుడు వారిని బయటకు పంపివేసెను. వారికి ఇద్దరు కుమారులున్నారు: ఒకని పేరు కయీను, మరియొకని పేరు హేబెలు.

నేను ఒకవేళ ఇచ్చట మరుసటివారము ప్రసంగించినచో, నేను అప్పుడు వేరే ఒక అంశము మీద మాట్లాడదలచుకున్నాను: దేవుని యొక్క మూడు ప్రశ్నలమీద. “నీవు ఎచ్చటనున్నావు?” “నీవు ఏమి చేసితివి?”మరియు “నీ సహోదరుడు ఎక్కడున్నాడు?” “నీవు ఎక్కడనుంటివి?”—ఆయన ఆదాముతో మాట్లాడెను. “నీవు ఏమి చేసితివి?”—ఇది హవ్వతో మాట్లాడెను. “నీ సహోదరుడు ఎక్కడ?”—ఆయన దీనిని కయీనుతో మాట్లాడెను. దేవుడు మూడు ప్రశ్నలను అడిగెను. దీనిని గూర్చి ఆలోచించండి.

29

ఇప్పుడు బయటకు వచ్చెదము, అక్కడ ఇద్దరు అబ్బాయిలున్నారు—ఆదాము హవ్వల తరువాత—కయీను మరియు హేబెలు. మరియు వారు ఆదాము మరియు హవ్వల యొక్క పిల్లలు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా దేవుని యొద్ద అభిమానాన్ని సంపాదించుకోవలెనని అనుకున్నారు. మరియు వారు బలిపీఠము కట్టారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన భాగమేమనగా ఇప్పుడు. ఆ యొక్క సరియైన క్రింది స్థానానికి వెళ్లెదము. కయీను ఒక అవిశ్వాసి కాడు. కయీనుకూడా ఒక విశ్వాసియే.

ఓ, పరిశుద్ధాత్మ మనలను ప్రశాంతపరుచునుగాక, మనశ్రద్ధను ఆదికాండము వైపునకు మరల్చెదము మరియు ఈ చిత్రమును సజీవముగా చూచెదము. కయీను ఒక అవిశ్వాసి కాడు. కయీనుఒక విశ్వాసియే. ఒక విశ్వాసి నుండి దేవుడు ఏమైనా కోరుకున్నచో, అప్పుడు దేవుడు కయీనును తీర్పుతీర్చటములో అన్యాయస్తునిగా ఉండి, వేరే విశ్వాసిని స్వీకరించినట్లుగా ఉంటుంది.

కయీను ఒక కమ్యూనిస్టు కాదు. కయీను ఒక అవిశ్వాసి కాదు. కయీను భక్తిపరుడు మరియు గమనించండి, అతడు దేవుని ఆరాధించుటకు వచ్చెను. అతడు విశ్వాసి మాత్రమే కాదుగానీ ఆరాధకుడు కూడా. అతడు తప్పుడు తెగకు చెందినవాడుకాడు, అయితే అతడు యెహోవా దేవుని ఆరాధకుడు, ఇప్పుడు దీనిని మనము జీర్ణించుకుందాము.

గమనించండి: దేవుని యొక్క ఆరాధకుడు. ప్రజలు ఇలా చెప్పుట నేను వింటిని, “నీవు చేయవలసినదంతయూ యేసును దేవుని కుమారునిగా అంగీకరించుటయే, అప్పుడు నీవు రక్షింపబడెదవు.”అయితే చూడండి దయ్యములు కూడా అలా చేయుచున్నవి. కావున వారు అలా రక్షింపబడుటలేదు, మీకు తెలుసా. దానికన్ననూ ఇంకా అధికమైనది కావలసియున్నది. దయ్యము చెప్పెను, “నీవెవరో మేమెరుగుదుము, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు యొక్కపరిశుద్ధునివి.”…అవి బహిరంగముగా ఈ విషయమును ఒప్పుకొన్నాయి.

30

కయీను ఒక విశ్వాసి మరియు సృష్టికర్తను అంగీకరించాడు. అదిమాత్రమే కాదుగానీ, అతడు ఒక ఆరాధకుడు కూడా. ఇప్పుడు నేను భావిస్తున్నదేమనగా, ఏదెను తోట యొక్క తూర్పుదిక్కున, ఆ యొక్క తోట తూర్పుదిక్కున ఉన్నది, అచ్చట దేవదూతలు గొప్పఖడ్గ జ్వాలలను పట్టుకుని కాపలా కాస్తున్నారు, ఆఅగ్ని జ్వాల ఆ వృక్షమును కాయుచున్నది. కయీను మరియు హేబెలు ఇచ్చట పొలములో పనిచేయుచూ వారు వారి ప్రియమైన గృహము నుండి వచ్చియున్నారని ఎరిగిరి. వారు దేవునిని ఆరాధించవలెనని ప్రయత్నించిరి. పిమ్మట కయీను ఒక బలిపీఠమును నిర్మించెను, లేక ఒక సంఘమును; హేబెలుకూడా ఆయన కొరకు ఒకటి చేసెను. కయీను బలి అర్పణ అర్పించెను; హేబెలు కూడా ఒకటి అర్పించెను. కయీను మోకరించి ఆరాధించెను; హేబెలు కూడా అదే చేసియున్నాడు.

ఇప్పుడు చూడండి, దేవుడు కేవలము దేవుని యందు విశ్వాసము ఉంచితే చాలు అని భావించినచో, ఒక ఒప్పుకోలు, ఒక బలిపీఠము, ఒక సంఘ సభ్యత్వము, ఒక అర్పణ, మరియు ఒక సభ్యత్వము మరియు సంఘమునకు నమ్మకత్వము, నీ ధనములో కొంత భాగము, నీఆరాధనలో కొంత భాగము, నీవు దేనిని నమ్ముచున్నావో దానిలో నిజాయితీ, పిమ్మట దేవుడు నీతిగలదేవునిగా అప్పుడు కయీనును అంగీకరించవలసినదే.

31

త్వరలో ఈస్టర్రాబోవుచున్నది, దేశమంతటి గుండా ఈ అందమైననగరముతో కలిపి, వందల వేలకొలది డాలర్లు ఆయొక్క ఈస్టర్ పుష్పముల కోసము వెచ్చించి, బలిపీఠమును తయారు చేయుదురు. ఎందుకండి మీరు అలా చేస్తారు, అదంతయూ అన్య ఆరాధన కదా. ఈస్టర్పుష్పముల కోసము దేవుడు ఎన్నడూ ఒక బలిపీఠమును కోరుకొనలేదు, అయితే కయీను దానినే చేసియున్నాడు. మరియు రాబోవుచున్న ఈస్టర్, వారు కనీసము అలా… ప్రపంచము ఈస్టర్‌ను, క్రిస్మస్‌ను మరియు అలాంటి వాటిని చేయుచున్నది, అవన్నియూ వాణిజ్య సంబంధమైన వాటిగా తయారైపోయినవి. వాటిలో దేవుడు ఎంతమాత్రమును లేడు. లోకసంబంధమైన ఈస్టర్‌లలో ఒక కుందేలును వారు కలిగి లేదా కోడి మాంసమును తింటారు లేదా పసుపు బాతులను లేదా అటువంటి వాటిని భుజిస్తారు.

అన్యులు ఎలా ఉన్నారో మనము కూడా అలాగే చేయుచున్నాము కాదా, మరియు ఆఫ్రికాలోనున్న అన్యులు కన్నా మనము ఎక్కువగా నీచముగా చేయుచున్నాము. అయినా ఇంకనూ మీరు అలా చేయుచున్నారు. అవన్నియూ ఆపుచేయవలెనని దేవుడు మన నుండి కోరుచున్నాడు; మరియు దేవుడు సూర్యుడు ఎలా అయితే ఉదయించి, తన వెలుగు ద్వారా మిగతావాటిని బయలుపరుస్తాడో అలాగే మనమును కూడా ఆయన యొక్క వెలుగులో నడుచుకోవలెననికోరుచున్నాడు.

ఈస్టర్ అనగా క్రొత్తబట్టలు ధరించడము, అలాంటివి చేయటం తప్ప ఇంకేమున్నది చెప్పండి. మరియు సంఘసభ్యులు అందరూకూడా సంఘ వేదికలు వద్దకు వెళ్లి, వేదికలను పుష్పములతో నింపివేస్తారు, సంఘమునకు వారి నుండి చేయవలసినది చేస్తారు. మరియు వారు ఒక చెక్కును వ్రాసి వేలకొలది డాలర్లు సంఘమునకు ఇచ్చెదరు, అప్పుడువారు వాటిని కట్టెదరు, బహుశా ఒక క్రొత్త వినోదపుగదిని కడతారు. మీకు రోదన గదికావలసియున్నది! సంఘకాపరి మరియు మీరందరు అందులోనికి వెళ్లవలసియున్నది. అది నిజము.

అయితే అది అక్కడ ఉన్నది. అది ఎచ్చటనుండి వచ్చినది? మనము ఇచ్చట దానిని చూచుచున్నాము. అది ఎచ్చట నుండి ప్రారంభమైనది? అది ఆదికాండము నుండే ప్రారంభమైనది: కయీను నుండి.

32

ఇచ్చట చూడండి. ఇచ్చట ఇవన్నియూ… మీరందరూ నావైపు శ్రద్ధగా ఇప్పుడు వినవలెనని నేను కోరుచున్నాను. ఇచ్చటకు రెండు ద్రాక్షావల్లులు వచ్చినవి. ఆ రెండు కూడా ఇప్పటికీ జీవిస్తున్నాయి. యేసు ఆఉపమానమును చెప్పెను. చెప్పెను, “ఒక విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలుదేరెను; అయితే శత్రువు కూడా వానివెనుక వచ్చి విత్తెను. ఒకటి గురుగులను పైకితీసుకురాగా, ఇంకొకటి గోధుమలను పైకితీసుకువచ్చెను.”

అతడు చెప్పెను, “మనము ఆ గురుగులను పెరికివేయుదుమా… లేదా గోధుమలను పెరికివేయుదమా…లేక గురుగులను పెరికివేయుదుమా?”

ఆయన చెప్పెను, “లేదండి, ఆరెండింటిని కలిసికట్టుగా ఎదగనియ్యుడి.”

ప్రకృతి సంబంధమైన సంఘము అది పైకి ఎదుగుచూ ఉండగా అది రానురాను సాంప్రదాయముగా మరియు దుష్టత్వముగా మారిపోయెను, అయితే ఆత్మసంబంధమైన సంఘము గొప్ప వరములను పొందుకొనుచూ మరియు పైనున్న శక్తిని పొందుకొనెను. ఆ రెండు కూడా విత్తనము లోనికి వెళ్లినవి. లోకసంబంధమైన సంఘము మరి ఎక్కువ దుష్టత్వములోనికి వెళ్లియుంటుండగా, ఆత్మసంబంధమైన సంఘము శక్తివంతముగా మారెను. “సంఘము” అని పిలువబడే ప్రతీది కూడా సంఘము అని నేను భావించుట లేదు, నా భావము ఏమనగా సంఘము!తిరిగి జన్మించిన విశ్వాసులు, సభ్యత్వము ద్వారా జన్మించుట కాదండి, ఆత్మ ద్వారా జన్మించుట అనగా ఒక్క ఆత్మ ద్వారా మనము బాప్తిస్మము పొందితిమి గదా. ఆమేన్.

33

గమనించండి, అచ్చట ఆ యొక్క రెండు ఆత్మలు ఆ ఇద్దరు అబ్బాయిల మీద ఉన్నవి. ఇప్పుడు, హేబెలు ఏరీతిగా అయితే ప్రాథమికమైనవాడో కయీను కూడా అంతే. దేవుడు ఒకవేళ కోరుకొనినచో… అచ్చట ఎవరో ఒకరు నిలువబడి ఇలా చెప్పినచో, “మంచిది, ఇప్పుడు చూడండి, హేబెలు నీ బలి అంగీకరించబడుతుందా? మంచిది, ఎందుకని?”

“మంచిది”, అతడు చెప్పెను, “నేను దేవుని యందు విశ్వాసముంచుచున్నాను.”

కయీను చెప్పుచున్నాడు, “నేను కూడా.”

మంచిది అతడు చెప్పెను, “నేను ఒక… దేవునియొక్క ఆరాధికుడను.”

కయీను చెప్పెను, “నేను కూడా.”

హేబెలు చెప్పెను, “నేను నా అర్పణ దేవునికి అర్పించాను.”

కయీను చెప్పెను, “నేను కూడా చేశాను.”

మరియు అతడు చెప్పెను, “నేను దేవుని యందు విశ్వసించుచున్నాను.”

కయీను చెప్పెను, “నేను కూడా అలా చేశాను.”

హేబెలు చెప్పెను, “నేను దేవునికి ప్రార్థన చేశాను.”

కయీను చెప్పెను, “నేను కూడా అలా చేశాను.”

ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తివలే ప్రాథమిక విశ్వాసిగా ఉన్నాడు. దానికి ఏమి కారణమయ్యింది? అది ఇచ్చటనున్నది: గత రాత్రి చెప్పినదాని నుండి మీరు గ్రహించండి… లేక, ఈఉదయం చెప్పిన దానినుండి: దేవుడు తన ఎన్నిక ద్వారాఆయన యొక్క సంఘాన్ని ఎన్నుకొనెను.

34

ఇప్పుడు ఆరాధన అనేది—అవును. ఇచ్చటఒక గురుగు పైకి వచ్చినది. ఇచ్చట మరొకవైపుగా ద్రాక్షావల్లి యున్నది. ఆ రెండునూ కలిసి ఎదుగుచున్నవి. మనకు సమయము ఉంటే బాగున్నుకదా, అయితే మీరు వెనుకకు వెళ్లవలసియున్నారు, ఇప్పుడు కొద్దిగా ఆలస్యమగుచున్నట్టున్నది. ఓ, మై. అది వచ్చుచున్నట్లుగా నేను భావించుచున్నాను, నేను నిజాయితీగా చెప్పుచున్నాను. నేను భావించుచున్నాను, నాహృదయములో, ఒక ఆశీర్వాదము మన పైనవ్రేలాడుచున్నది.

చూడండి, మీరు దీనిని చూడవలెనని నేను ఆశిస్తున్నాను. ఇచ్చట అవి పైకివచ్చుచున్నవి, మేఘములు దాటివెళ్లిపోవుచున్నట్టుగా. పరిశుద్ధ గ్రంథము గుండాచూచుట. వారు ఎల్లప్పుడూ సత్యము మరియు అసత్యమును కలిగియున్నారు. మరియు యేసు చెప్పెను, “అంత్యదినములలో…” ఇప్పుడు దీనిని మీకునేను ముగించెదను. కమ్యూనిజము అనేదిక్రీస్తు విరోధి కాదు. స్టాలిన్, మొలోటో: యేసుమాట్లాడిన క్రీస్తు విరోధి వారు కాదు. యేసు చెప్పినదేమనగా, క్రీస్తు విరోధి అనేవాడు సత్యమునకు దగ్గరగా ఉంటాడు, సాధ్యమైతేవాడు ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేస్తాడు.

క్రీస్తు విరోధి కూడా భక్తిపరుడు. దానిని మనము కొద్దిగా ఒకనిమిషము అర్థము చేసుకుందాము. క్రీస్తు విరోధి అనగా క్రైస్తవ్యాన్ని ఒప్పుకొన్న మతసంబంధమైనవాడే. దీనికి యూదా ఇస్కరియోతు నాయకుడుగా ఉంటాడు, అతడు ఒక విశ్వాసి, ఆ సంఖ్యలో చేర్చబడ్డాడు, సంఘములో ఒక కోశాధికారి, ఒక సహోదరుడు, ఒకే సంఘము, లోపలకువెళ్లి మరియు వారిలో ఒకనిగా లెక్కించబడ్డాడు, మరియు దయ్యము కూడా ఒక విశ్వాసిగా ఒప్పుకొనుచున్నాడు.

ఒక్క నిమిషము మిమ్ములను మీరు విదిలించుకొనండి. పరిశుద్ధాత్మ దీనిని చేయునుగాక: మీ మనస్సాక్షిని కదిలించుకోండి.

35

గమనించండి, ఇచ్చట ద్రాక్షావల్లులు పైకి వచ్చినవి. ఆ యొక్క ఓడను గమనించండి. ఆ ఓడలో కాకి ఒక వైపున ఉన్నది; మరొక వైపున పావురము అదేగదిలో ఉన్నది. పక్షులు రెండవ అరలోఉన్నవి. ప్రాకే పురుగులు అవన్నియూ మొదటి అంతస్తులో ఉన్నవి, ఇక రెండవ అంతస్తులో ఎగిరేపక్షులు, ఆ మూడవ అంతస్తులో నోవహు మరియు తన కుటుంబము ఉన్నది. రెండవ అంతస్తులో—అదే ఓడలో, అదే గదిలో బహుశా అదే అంతస్తులో పావురము మరియు కాకి కలిసి ఉన్నవి.

కాకి చెప్పెను, “నేను ఎగురగలను.”

పావురము చెప్పెను, “నేను కూడా ఎగురగలను.”

వారు కాకిని బయటకు విడిచిపెట్టారు, అప్పుడు కాకి బయటకు వచ్చి, తేలినశవాలను తినుటలో చాలా సంతోషముగానున్నది. అయితే బయటకు వచ్చిన పావురము బయట ఉండలేకపోయినది, ఎందుకనగా దాని స్వభావముభిన్నమైనది. ఆమేన్. దేవుని ఆత్మ చేత జన్మించిన ఏ మనిషి అయినాసరే మరియు నిత్యజీవమును పొందుకొనిన ఏ వ్యక్తి అయినాసరే మరలా లోకములోనికి వెళ్లి, లోకపు విషయాలను భుజించలేడు.

మోసపోవద్దు. నీవులోకమును ప్రేమించినచో, నీవు దేవుని ప్రేమించలేవు. యేసుచెప్పెను, “మీరు దేవుని ప్రేమించినచో నన్ను కూడా ప్రేమించెదరు మరియు నా ఆజ్ఞలు పాటించనివాడు అబద్ధికుడు మరియు సత్యము వానియందు నిలువలేదు.” మరియ మీరు దేవుని ప్రేమించినచో అప్పుడు ఆ విషయములన్నియూ వెళ్లిపోయినవి, ఎందుకనగా మీరు ఇప్పుడు నిత్యజీవమును కలిగియున్నారు—విమోచన దినము వరకుపరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడియున్నారు. ఆమేన్.

36

గమనించండి, ఓ, దీనినిగూర్చి నేను ఆలోచిస్తున్నాను. పావురము ఆ కుళ్లిపోయిన శవాలను ఎందుకని తినలేదు? పావురము ఒక్కటే ఆ చేదుపదార్థము లేనట్టి పక్షి. పావురము శరీరము లోపట చేదుపదార్థము లేదు. ఆమె దానిని జీర్ణించుకోలేదు. అదేరీతిగా ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు యేసుక్రీస్తును రుచిచూచిన తరువాత లోకాన్ని మరి ఇక ఎంతమాత్రమును రుచిచూడలేడు. నీవుప్రతిసారి దానిని ఉమ్మివేయుదువు. అచ్చటే నీవున్నావు.

ఆ రెండు కూడా ఎగురగలవు. వారిరువురికి సంఘములున్నవి. ఒకేగూడులో వారిరువురు ఉన్నారు. అయితే వారిరువురిలో భేదమున్నది. కయీను మరియు హేబెలులో ఉన్నటువంటి రీతిగా—ఇటువైపు కయీను మరియు అటువైపు హేబెలు.

ఈ ఆత్మలు వెళ్లుట మీరు చూడండి. ఓ, మనము ఏశావు మరియు యాకోబుల గుండా ఎలా వచ్చాము. నిజానికి ఏశావు యాకోబు కన్నామృధువైన మనిషి. యాకోబు (మీరు నన్ను మన్నించండి, దేవుడునన్ను మన్నించుగాక) ఒక చిన్న మోసగాడు. అవును. అతడు ఏమైయున్నాడు? ఒక బద్ధకస్తుడు. అయితే అతడు దేవుని ద్వారా ఎన్నుకొనబడ్డాడు. యాకోబును దేవుడు ఎన్నుకొన్నాడు. ఏశావు తనయొక్క ముసలి అంధుడైన తండ్రిని చూసుకొనుచున్నాడు, మరియు పశువులను మేపుచున్నాడు, మరియు అలాంటివి చేయుచున్నాడు, అయితే అతడు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించాడు, మరియు యాకోబుకు అయితే దానిలో నమ్మకమున్నది. హల్లెలూయ!

నేడు కూడా అలాంటిసంఘమున్నది. ఒక వ్యక్తి ఇలా చెప్పెను, “ఓ, ఆనూతన జన్మకు సంబంధించిన విషయము, ఆ పరిశుద్ధ బండ, దానితో చేయుటకు ఏమియూ లేదు. కొంతమంది దానిని ప్రేమిస్తారు, కొంతమంది దానిని తృణీకరిస్తారు. దానిని పొందుకొనుటకు నేను ఆనందిస్తున్నాను. ఆమేన్.”

నూతనజన్మలో నేను విశ్వాసమును కలిగియున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడుట. దీనిని నీవు కలిగిలేనిచో నీ పని అయిపోయినట్టే సహోదరుడా.

37

ఇప్పుడు చూడండి, మనము దానిని బయటకు తీసుకురాగలము. ఇశ్రాయేలుకు సంబంధించిఎంత అద్భుతమైన మాదిరి అది. వారు ఈజిప్టులో నుండి బయటకు వచ్చినపుడు, వారు వాగ్దాన దేశమునకువారి యొక్క మార్గములో ఉన్నారు. వారు ప్రయాణము చేస్తూ, గుడారాలలో ఉండేవారు. వారు మోయాబు దేశమునకువచ్చియున్నారు. మోయాబు: అది ఎచ్చట నుండి వచ్చినది? లోతు యొక్క కుమార్తెలువారి తండ్రి ద్వారా ఒక బిడ్డను పొందుకున్నారు, అతడే మోయాబు.

ఇప్పుడు చూడండి మోయాబీయులు అవిశ్వాసులు కాదు. వారు యెహోవా దేవునిని ఆరాధించేవారు. నిశ్చయముగా వారు అలాచేసేవారు. వారికి అద్భుతమైన బోధకులుకూడా ఉండేవారు, వారిలో ఒకడు బిలాము—ఒకప్రవక్త. అయితే డబ్బు కొరకు బోధించే ప్రవక్తలలో ఇతడు డబ్బు కొరకు పిచ్చి కలిగిన ఒక వ్యక్తి. ఆమేన్.

వారికున్న వరములను అమ్ముకొనే వ్యక్తులు వీరు, నేడు కూడా అనేకమంది అలాచేయుచున్నారు. అద్భుతమైన వరములు కలిగినమనుషులు, లోకములో వారి వరములద్వారా ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు. అది ఒక దుష్టమైన పని. రాజీపడుచున్నారు, సరిహద్దులవద్ద, ఒక రోజు లోకములోఉంటున్నారు, మరియొక రోజు సంఘములో ఉంటున్నారు, మీరు అలా చేయరాదు. మీరు అమ్ముకొనుచున్నారు, అయితే తిరిగి జన్మించండి. మీరు ఎంతవరకు వెళ్లగలరో అంతవరకు వెళ్లండి, సరిహద్దు రేఖకు దూరముగా ఉండండి.

38

గమనించండి, అయితే వారు ఇచ్చటకు వచ్చియున్నారు. వారు రావటం మోయాబు చూసియున్నాడు. కావున మోషే ద్వారా ఇశ్రాయేలు కొంతమంది పురుషులను పంపెను. చెప్పెను, “మన సహోదరుడైన మోయాబును అడగండి, మేము మీ యొక్క దేశము గుండా వెళ్లవచ్చునా.”

రాజైన బాలాకు చెప్పెను, “లేదు, నా దేశము గుండా మీరు వెళ్లుటకు అనుమతి లేదు.”అతడు వారిని తృణీకరించెను. “అలాంటి గుంపు ప్రజలు నా ప్రదేశములో ఉండుటకు వీలులేదు, వారు అచ్చట ఆ యొక్క ఆడిటోరియంలో కూర్చొనవచ్చును. వారిని ఆ యొక్క జాక్‌మూర్ వద్దకు పంపండి.”అది సరియే. “అయితేమీ యొక్క సిద్ధాంతముతో మా యొక్క గుంపు ప్రజలను మీరు కలుషితము చేయవద్దు.” అచ్చటే మీరున్నారు.

అదే విషయము, అదేఆత్మ. దేవుడు ఆయన యొక్క మనుషులను తీసుకుంటాడు, అయితే ఆయన యొక్క ఆత్మనుకాదు. దయ్యము వాని యొక్క మనిషిని తీసుకుంటాడు, అయితే ఆ యొక్క ఆత్మనుకాదు. అదే మతసంబంధమైన మనుషులు యేసుక్రీస్తును ఖండించారు (యాజకులు, నమ్మకమైనవారు) వారే నేడు వేదిక మీద నుండి ప్రసంగిస్తున్నారు, పైకి భక్తికలిగిన వారివలే ఉండి, ఆ యొక్క శక్తిని తృణీకరించుచున్నారు. అచ్చట యాజకులు చనిపోయిరిగానీ వారిలోనున్న ఆత్మ చనిపోలేదుగదా. దానిని చూడండి.

మరియు వారు అచ్చటకు వచ్చిఇలా చెప్పిరి, “లేదండి, వారుమన దేశము గుండా వెళ్లుట లేదు.”

కావున సెమినరీ నుండి అతడుఒక బోధకుని పిలిచాడు… లేక అక్కడ కాపరత్వముచేయుచున్న వ్యక్తిని మరియు చెప్పెను, “ఇచ్చటకు వచ్చి, నా కొరకు ఈ ప్రజలను నీవుశపించాలి.”

దేవుడు ఆశీర్వదించినవానిని లోకములో నీవు ఎలా శపించగలవు?

39

ఇప్పుడు చూడండి, వారు వాస్తవముగా సమైక్య సంస్థాగతవ్యక్తులు. స్వతహాగా ఎటువంటి భూమి వారికి లేదు, వారు గుడారాలలో నివసించేవారు. మోయాబు అనేది ఒక మంచి సంఘశాఖ. రాజులతో స్థిరపడిన ఒక దేశము, మరియుఅలాంటిది. అయితే ఇశ్రాయేలీయులు అలాంటివారు కాదు. మిగతా దేశములన్నియూ స్థిరపడినవి, వారు వారియొక్క రాజ్యములను మరియు గృహాలను కలిగియున్నారు, అయితే ఇశ్రాయేలీయులు కేవలము గుడారాలలో నివసిస్తున్నారు. వారికి రాజు ఏర్పడినప్పుడు వారందరూ వెనుకకు జారిపోయిరి—అప్పుడు వారు ఒక సంస్థగా మారిపోయిరి. ఇప్పుడు అదేరీతిగా ఉన్నది. అది నిజమండి.

ఓ సోదరుడా, అది ఏవిధమైన మంచిని చేయలేదు. నేను దానిని భావించగలను. అయితే అది సత్యము. మీరుమనుషులను కలిగియున్నారు…మీరు కాథలిక్‌లను చూచినవ్వుతారు: ఒక కుండ వేరే ఒక పాత్రను చూచి నువ్వు నల్లగా ఉన్నావు అని చెప్పినట్టుగా ఉన్నది. అది నిజము. అలా చెప్పజాలదు. సంస్థలు అనగా కొంతమంది గుంపు ప్రజల ద్వారా ఏర్పడినది.

దేవునికి అలాంటి ఉద్దేశము లేదు… ఒక్కసంస్థను కూడా ఆయన వ్యవస్థీకరించలేదు; మరి ఎన్నడూ చేయడు, ఎన్నడూ జరగదు. ఆయన ఒకరాజు. ఆయన మాత్రమే…అది నిజము. నేను సంస్థకు వ్యతిరేకిని కాదు లేక దానిలో ఉన్న ప్రజలకు వ్యతిరేకిని కాదు, అయితే వారు ప్రజలను చాలా ఎక్కువగా నియంత్రిస్తున్నారు.

మీ పరిశుద్ధ గ్రంథములో చూచినట్లయితే దేవుడు ఎన్నడూ కూడా గుంపు ప్రజలను నియంత్రించలేదు లేదా వ్యవస్థీకృతము చేయలేదు, మీరు దానిని నాకు చెప్పండి, అయితే నేను దానికి ఎల్లప్పుడూ వ్యతిరేకిని. అదే దేవుడు నేడు కూడా జీవిస్తున్నాడు.

40

ఇప్పుడు ఈ మనిషిని గమనించండి, అతడు ఎచ్చట నుండి వచ్చాడో చూడండి, బిలాము బాలాకుతో చెప్పెను… అయితే బాలాకు కూడా బిలాము యొద్దకు పంపెను, మరియు చెప్పెను, “నీవు ఇచ్చటకు రమ్ము మరియు ఈ ప్రజలను శపించుము. వారిని నా దేశములో నేను ఉంచదలచుకోలేదు.”చెప్పెను, “వారు ఆ పరిశుద్ధ బండ గుంపువారు, వారిని ఇచ్చట ఉంచదలచుకోలేదు.”

“పరిశుద్ధ బండల బ్రాన్హాం సోదరుడా?”అని మీరు చెప్పవచ్చు.

అవును, వారు పరిశుద్ధ బండలే.

“నీవు దానిని నిరూపించగలవా?”

అవునండి. వారు ఎర్రని రక్తము ద్వారా ప్రయాణించగలిగినప్పుడు… లేక, ఎర్రసముద్రము ద్వారా ప్రయాణించినప్పుడు, వారికి పనులు చెప్పే గురువులు వారి వెనుక చచ్చిరి, దీన సహోదరుడు వైద్యుడైన మోషే సాధారణమైన వ్యక్తిగా ఉండిపోయెను: అతడు తనరెండు చేతులను గాలిలోనికి ఎత్తి, గట్టిగా అరిచి మరియు ఆత్మలో పాటలు పాడెను. మరియు ప్రవక్త్రిని అయిన మిర్యాము ఆమె సాధారణ వ్యక్తిగా ఉండి మరియు ఒక తంబురను తీసుకుని ఆ సముద్రపు ఒడ్డునకు పరుగెత్తి, దానిని కొడుతూ నాట్యము చేసినది. పిమ్మట ఇశ్రాయేలు కుమార్తెలు ఆమెను వెంబడించి వారు కూడా నాట్యము చేసిరి, వారు కూడా తంబురలను తీసుకుని, మ్రోగించిరి.

అది ఒక ప్రాచీన పద్ధతి కలిగినది కానిచో, పరిశుద్ధబండ మీటింగ్ కానిచో, అలాంటిది నా జీవితములో నేనెన్నడూ ఇక చూడలేదు. వారు అనధికారిక లేదా సంప్రదాయక పరిశుద్ధ బండలు. మీరు దానిని నమ్ముటలేదు గానీ అది సత్యమైయున్నది. అదియే, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—లేఖనము.” నిశ్చయముగా వారు పరిశుద్ధ బండలు; సమైక్య సంస్థాగత పరిశుద్ధబండలు. అదియే ఇక్కడకు వచ్చిన ద్రాక్షావల్లి.

41

ఇప్పుడు ఆ బోధకుడిని వీరిని శపించుటకు ఇచ్చటకు పిలిచినప్పుడు… లేక అతను వారితో ఒక వాగ్వివాదము కలిగి ఉండుటకు: “వారు తప్పు అని నిరూపించు. ఇచ్చటకు వచ్చి, వారికి దానిని నిరూపించు. వారిని శపించు. వారి సంఘాలను మూసివేయు. వారివలన ఏ ఉపయోగమును లేదు.”

నేడు కూడా అలాంటివే జరుగుచున్నవి. అలాంటిదే, మతసంబంధమైన ప్రజలు. బిలాము సరిహద్దు బోధకుడు, ఇచ్చటకు వచ్చెను, అతడు వచ్చి, చూచి, ఇలాచెప్పెను, “ఆప్రజలు ఏమి చేశారో చూడండి. ఓ, మై. వారిమీద శాప వచనము పలుకుటకు నేను నిశ్చయత కలిగి ఉన్నాను. మంచిది, వారుఎచ్చట నిలువబడియున్నారో వారికి చూపించండి.”

కావున అతడు చెప్పెను, “నా కొరకు మీరు ఏడు బలిపీఠములు కట్టండి.”అదియే వారు ఇశ్రాయేలీయుల యొక్క శిబిరములో కలిగియున్నారు: ఏడు బలిపీఠములు. అది దేవుని యొక్క పరిపూర్ణమైన సంఖ్య. చెప్పెను, “ఏడు కోడెలను మరియు ఏడు పొట్టేళ్లను దహనబలిగా అర్పించండి.” అచ్చట వారు ఎలాంటిది అర్పిస్తున్నారో అలాంటి నైవేద్యమే. చెప్పెను, “దేశములో ఘనులైన వారినిపిలవండి, గొప్ప మనుషులను పిలవండి.” మరియు వారు అదే అర్పణను అర్పించిరి. అదే రకమైన బలిపీఠాలు, ఎంత అర్పణ అర్పించాలో అంతే. అదే రకమైనది. ఏడు బలిపీఠములు కట్టండి, ఏడు కోడెలను తీసుకునిరండి, ఏడు పొట్టేళ్లను కూడా. మరియు దేశములో గొప్పవారు, బిషప్పులు, ఆర్చిబిషప్పులు మరియు D.D. లు చదివినవారు, వారందరూ బలిపీఠము చుట్టూ నిలిచి, దేవుని ఆరాధించిరి, ఆయొక్క దహన బలిని అర్పించండి. సహోదరుడా వీరు ప్రాథమిక సిద్ధాంతాలలో నమ్మకమున్నవారు? ప్రాథమికసిద్ధాంతాలను నమ్మే విశ్వాసులు ఇశ్రాయేలీయులు. అది వాస్తవమైనది.

దేవుడు ప్రాథమిక సైద్ధాంతిక వాదము(చాందస వాదము) కోరుకున్నచో: అచ్చట మోయాబు నిలువబడియున్నాడు, ఇచ్చట ఇశ్రాయేలీయులున్నారు, అతని యొక్క సహోదరుడు, ఆ యొక్క గుహలో ఉన్నాడు. ఇద్దరూ అదే దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, అదే నైవేద్యము (బలి) కింద మరియు అదే పాపపరిహార బలి. హల్లెలూయ!

42

చూడండి, అదే విషయము నేడు ప్రాథమిక సిద్ధాంతవాదుల (లేదా చాందస వాదులు)మధ్య ఉన్నది. వారు చెప్తారు, “బ్రాన్హాం సోదరుడా, మేము కన్యకకు జన్మించుట విషయములో నమ్ముచున్నామని నిరూపించగలము, మరణమునుగూర్చి, సమాధినిగూర్చి, పునరుత్థానమునుగూర్చి, రెండవరాకడను గూర్చి, మీరుఎలా నమ్ముచున్నారో అలాగే.” అది నిజము. ప్రాథమిక సిద్ధాంతవాదులతో కట్టబడి ఉండవద్దు. వారు ఏమిమాట్లాడుచున్నారో వారికి తెలియును—లేఖన పూర్వకముగామాట్లాడుట. ప్రాథమిక సిద్ధాంతవాదులవలే మీరు ఉన్నారు.

[టేపు మీద ఖాళీ ఉన్నది]… మరియు నీతిగా ఉండుటకు మరియు ప్రార్థనకు జవాబు ఇచ్చుట. ఈ ఒక్క వ్యక్తితోప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది, ఆ వ్యక్తిని శపించుటకుప్రయత్నించుట? వారిద్దరూ ఒకే రకమైన అర్పణలను అర్పించిరి. [టేపు మీద ఖాళీ ఉన్నది] వారిని నేడు ఉపయోగించుకొనుట, అదే ప్రభువైన యేసుకు అదే ప్రార్థన చేయుట, అదే రక్తము ద్వారా పరిశుద్ధ బండలు అని పిలువబడే గుంపువారు అర్పించుట.

అదే విషయము ఇచ్చట కూడ జరిగినది. ఆదికాండములోనున్న ఆ రెండు ద్రాక్షావల్లులు ఇప్పటికీ ఇచ్చటికి కూడా కదులుచూ ఉన్నవి.

43

వ్యత్యాసము ఏమిటి? ఈమనిషి ప్రాథమిక సిద్ధాంతవాది అయినచో మరియు ఈ ఒక వ్యక్తి ప్రాథమికవాది అయినచో, దానిగూర్చి ఆయన ఏమి చేయును? ఏ శాఖ దేవునితో ఉండే శాఖ? దేవుడు సూచనలు మరియు అద్భుతాలతో ఇశ్రాయేలీయులను నిరూపించెను. అయితే ఈ ప్రజలు దానినికలిగిలేరు. వారికి ఈ సూచనలు, అద్భుతాలు లేవు. వారు సహజాతీతమైన దానిని కలిగియున్నారు. వారు అరుచుట, గట్టిగా శబ్దములు చేయుట, ఆత్మలో నాట్యము చేయుట, వారు అగ్నిస్తంభాన్ని కలిగియుండుట, కొట్టబడిన బండను కలిగియుండుట, దైవిక స్వస్థత కొరకు ఇత్తడి సర్పమును కలిగియుండుట మొదలగునవి కలిగియున్నారు…

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...