సహవాసము

సహవాసము

ఈ సమయమున మనము నా యొక్క మంచి మిత్రుడైన, సహోదరుడు, ఎఫ్.ఎఫ్. బోస్వర్త్ ద్వారా బూర (trumpet) యొక్క గానమును కలిగియుండబోవుచున్నాము: సహోదరుడా బోస్వర్త్. [సహోదరుడు బోస్వర్త్ ఒంటరిగా వాయిద్యమును వాయించుచున్నారు.]

 మై, సహోదరుడా బోస్వర్త్ అది ఎంతో బాగుంది. దానిని మేము నిశ్చయముగా అభినందించుచున్నాము. మరియు నీవు ఆ విధముగా దాని రాగమును సరిచేయునప్పుడు, ఒకవేళ “ఆ కల్వరి యొద్ద,” అను ఆ చిన్న పల్లవిని మేము వినగలమా అని నేను ఆశ్చర్యపోవుచున్నాను. అది నాకు ఎంతో ప్రియమైనది. దానిని నీవు వాయించగలవని నేను అనుకొనుచున్నాను. [సహోదరుడు బోస్వర్త్, వాయిద్యముతో, “ఆ కల్వరి యొద్ద,” అను పాటను ఆలపించుచున్నారు.]

 మై, అది ఆ పాత-ఉజ్జివ సమయము వలె అనిపించుచున్నది, ఎంతో కాలము క్రితము. మేము నిజముగా సహోదరుడు మరియు సహోదరి మెక్ఎనలీ యొక్క చిన్న రాకను బట్టి ఎంతగానో ఆనందించుచున్నాము. సహోదరుడా హూపర్, ఈ మైక్రో ఫోన్ నందు ఒకవేళ నీవు చెప్పుటకు ఏమైనా కలిగియున్నావా. [సహోదరుడు హూపర్ కొన్ని మాటలు చెప్పుచున్నాడు.] 

అవునయ్యా. సహోదరుడు మెక్ఎనలీ ఈ దేశములో గల గొప్ప అడవిపంది వేటగాని ప్రక్కన ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తరువాత అతడే శ్రేష్టమైనవాడు. మంచిది. ఇక్కడ ఉన్న నా భార్యతో నేను మాట్లాడాలని కోరుచున్నాను. మంచిది, హాని, నీవు ఏమి చెప్పబోవుచున్నావు?

 [సహోదరి మీడా బ్రెన్హాం చెప్పుచున్నది, “నేను ఇక్కడ ఆరిజోనాలో ఉండుటను బట్టి నిశ్చయముగా ఎంతో సంతోషించుచున్నాను, మరియు సహోదరుడు మరియు సహోదరి మెక్ఎనలీ స్నేహితులను కలుసుకొను భాగ్యమును బట్టి సంతోషించుచున్నాను.”] సహోదరుడా బోస్వర్త్, ఆరిజోనా మరియు ఇక్కడ ఉన్న ప్రజలను గురించి నీవు ఏమి తలంచుచున్నావు? [సహోదరుడు బోస్వర్త్ కొన్ని మాటలు చెప్పుచున్నాడు.]

 [సహోదరుడు మెక్ఎనలీ అడవిపంది వేటను గూర్చి వ్యాఖ్యలు చేయుచున్నాడు.] [సహోదరుడు బోస్వర్త్ మరొక ప్రదర్శన ఇచ్చుచున్నారు. టేపు పై ఖాలీ స్థలము.] సహోదరుడా మాక్, మేము ఈ యాత్రతో ఇక్కడ వచ్చినప్పటి నుండి మా కొరకు నీవు చేసిన ప్రతియొక్కటి. మరియు సర్వశక్తుడైన దేవుని నేను నమ్ముచున్నాను, ఒక రోజు మనము ఇక్కడకు తిరిగి వచ్చెదము. సహోదరుడా దేవుడు నిన్ను దీవించును గాక. నేను ఎల్లప్పుడు నీ భార్య యొక్క స్వరము వినాలని కోరుచుంటిని. సహోదరి మెక్ఎనలీ, నేను ఎన్నో మైళ్ళు దూరముగా ఉండవచ్చు, కాని నీవు దీనిని వాయించునప్పుడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. [సహోదరి మెక్ఎనలీ కొన్ని మాటలు చెప్పుచున్నది.] సరే, మంచిది వందనములు, సహోదరి మెక్ఎనలీ. అది ఎంతో ఎంతో మంచిది. ఓ, ఆమె ఒక భయపడు చిన్న స్త్రీ. అది ఒక విధముగా నాకు నచ్చినది. సహోదరుడా బోస్వర్త్, అక్కడ ఉన్న ఆ పాత బూర వద్ద ఎవరినైనా నీవు కలిగియున్నావా? మేము కొంత — మేము మరొక పాటను, సహోదరుడు మాక్ మరియు ఇతరుల కొరకు వినగోరుచున్నాము. దేవుడు నిన్ను దీవించు గాక. మంచిది, సహోదరుడా బోస్వర్త్. [సహోదరుడు బోస్వర్త్ మరొక ప్రదర్శన ఇచ్చుచున్నారు.] మంచిది, సహోదరుడా బోస్వర్త్. ఎంతో వందనములు. సహోదరుడా హూపర్, ఇంకా ఏమైనా చెప్పుటకు ఉన్నదా? ఏమియూ లేదా? హాని, ఓ, మై. మాక్, త్వరగా ఏమైనా ఈ మైక్రో ఫోను నందు చెప్పుము, నీవు చెప్పెదవా? [సహోదరుడు మెక్ఎనలీ వేటను గురించి మరి కొన్ని మాటలు చెప్పుచున్నాడు.] సరే, మంచిది. సహోదరుడా బోస్వర్త్, చెప్పుటకు నీవు ఏమైనా కలిగియున్నవా? ఏదైనా ఒకటి చెప్పుము. [సహోదరుడు బోస్వర్త్ ఒక నిమిషమున్నర మాట్లాడిరి.]

 


 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...