మోషేను గురించిన బోధన

మోషేను గురించిన బోధన

VGR COUNT -327 సరి. సహోదరుడు నెవిల్, మీకు కృతజ్ఞతలు.

స్నేహితులారా, ఉదయకాలపు వందనములు. ఇది ఉదయమా లేక సాయంకాలమా అని అప్పుడప్పుడు నేను చూడవలసియున్నది. ఈ ఉదయకాలమున నేనక్కడ ఉండుటను గురించి చాలా సంతోషముగా యున్నాను. ఇక్కడ వెచ్చగా ఉన్నది, మరియు ఒక మంచి ఆహ్వానమును పొందుకున్నాను. మనకు వసంత ఋతువు లేదు; ఎండా కాలమును మరియు చలి కాలమును ఇక్కడ మనము కలిగియున్నాము. మనము ఆ విధముగానే కలిగియున్నాము. కదూ? ఎట్లైనను సమస్తమును అందుబాటులో లేకుండ యుండవచ్చును.

సరి, ఏది నన్ను ఆలస్యపరచినది: నేను ఇల్లు శుభ్రపరచుచుంటిని. మరియు అందువలననే ఈ ఉదయము నాకు ఒళ్ళు నొప్పులుగా యుండెను. మరి అది చేయుటకు నాకు అధిక సమయము పట్టెను, అయితే ఒక స్త్రీకి అంత పని కలదని నేను తలంచలేదు, మరియు ముగ్గురు పిల్లలను సిద్ధపరచి ఆదివారపు పాఠశాలకు పంపవలయును. ఓ, మై! నేను అనుకొనిన దానికంటెను అధిక పని వారికి కలదు. మరియు నేను తలంచుచుంటిని, ''సరి, ఇప్పుడు...“ గత సాయంకాలము నేను పని చేయుచుంటిని మరియు నేను సువార్త పరిచర్యను ముగించి వచ్చి అక్కడ పనిలో సహాయపడుచుంటిని. మై, పని చేయుటకు పనివారిని పెట్టుకొనవలయును కదూ? హుమ్! నేను ఒక వారమునకు ముప్పై-ఐదు డాలర్లు బిడ్డను చూచుకొనుటకు ఇచ్చెదనని చెప్పగా మరి దానిని చేయుటకు ఎవరును ముందుకు రాలేదు.

2

ఇక్కడ కొంత కాలమునకు మునుపు నేను ఒక చిన్న కాగితమును తీసికొంటిని. దీనికి దానికి సంబంధము లేదు. అతను చెప్పెను, ఇక్కడ అతను కెంటకీ యొద్ద ఒక రాజకీయవేత్తగ ఉండెను, అతను సైవిక దళములో రెండు మార్లు ఉండెనని చెప్పెను, మూడు సార్లు గాయపడెను, ఒక వీరునిగా అతడు ఆ చుట్ట ప్రక్కలలో జీవించుచుండెను, అతను అనేక కార్యములు చేసెను, ఇద్దరు బిడ్డల ప్రాణములను కాపాడెను, ఒక నది నుండి మరియు ఇంకొక మారు ఏదో ఒక కార్యమునుండి; అతను చేసినది మరిచపోతిని. చివరగా, ఆ చుట్టు ప్రక్కల అతను అన్నిటిని సరి చేయవలెనని తలంచి అతను పదవికి పోటీ చేసెను. మరి అతను పోటీ చేసినపుడు ఒక లక్షమందిలో అతడు ఐదు ఓట్లు మాత్రమే పొందెను. అతను ఆలయమునకు పోయి, ఆ చుట్టు ప్రక్కల జీవించుటయే ప్రమాదకరమని తలంచి, తాను కాల్చుకొనుటకు వారిని ఒక చిన్ని తుపాకి అడిగెను. ఆ ఊరినుండి పోవుటకు అతనికి సహాయపడుటకు సరిపడ స్నేహితులు లేకుండిరి. అది అమెరికనుల కృతజ్ఞత, అట్లేకదూ? అది సరియే. అమెరికాలో మీరు అధికముగా చేసినయెడల ఇంకను అధికముగా మీరు చేయవలెనని ఎదురు చూచెదరు. అది సరియే, మీ యొద్దనుండి అధికముగా ఎదురుచూడబడుచున్నది.

3

సరి, ఈ ఉదయము సంఘము ఎంత పరిశుభ్రముగా మరియు చక్కగా అగుపించుచున్నదో దానికి నేను మెచ్చుకొనగోరుచున్నాను, మరియు నేను పైకి వచ్చుచుండగా, గాలి వచ్చుటకు వీలుగా వారక్కడ ఒక తలుపును పెట్టియున్నారు. కావున, అది నిజముగా చాలా చక్కగాయున్నది, ధర్మకర్తలలో దీనిని చేయుటకు ఎవరు పురికొల్పిరో, అది నిజముగానే ఒక పెద్ద చక్కని మరియు ఒక చక్కటి పనితనము. నేను సరిగా చెప్పవలయుననిన అది సహోదరుడు హాల్ దానిని చేసియున్నాడని నేను అనుకొనుచున్నాను. అది చాలా చక్కటి పని.

ఇప్పుడు, కొద్దిగా ఆలస్యమైనది, అయితే పరిశుద్ధ జనులు ఎటువంటివారో మీకు తెలియునా. చూడుడి, వారికి ఒక నిర్దిష్టమైన సమయము లేదు, మనకు కలదా సహోదరుడు స్లాటర్, సహోదరుడు డీక్‌మెన్? [సహోదరులును మరియు ఇతరులును, ''లేదు“ అని చెప్పుచున్నారు.] మనకు సమస్తమును ఏ విధముగా తీసికొనెదమో అట్లే.

4

దక్షిణ ప్రాంతములో మంచి కూటములు జరిగినవి! అయితే నేను కొద్ది దినములకు మునుపే మాటలాడ తొడగితిని. నేను వరుసుగా విడువక నాలుగు నెలలుగా ప్రసంగించితిని, మరియు నాకు గుసగుసలాడుటకు కూడా స్వరము లేకుండెను. నేను సైగల ద్వారా నా భార్యతో మాటలాడితిని, మరియు ఇచ్చటికి వచ్చి పిదప వాతావరణము వేరే విధముగా ఉన్నందువలన మరియు మాకు (ఏలయనగా ఒక రోజు చల్లగా మరియు మరుసటి దినము వేడిగా ఉండును), నాకు పాతకాలపు-ప్లూ లాంటి జ్వరము వచ్చెను. మరియు నేను రెండు దినములకు మునుపు లేవ తొడగితిని. మరియు కావున, మనము మంచి ప్రభువునకు కృతజ్ఞతలుగా యున్నాము, ఆయన యొక్క మంచితనమునకు మరియు దయకు మరి ఆయన ఎంత మంచిగానున్నారో, అద్భుతమైన కూటములు అక్కడ జరిగినవి మరియు ప్రభువు అమితముగా, అపరిమితముగా మమ్ములను ఆశీర్వదించెను.

5

మరియు గత రాత్రి మధ్యరాత్రిలో సహోదరుడు ఉడ్స్ ఇంటిలో వచ్చి నన్ను సంధించెను, మరియు సహోదరుడు ఆర్గన్ బ్రైట్ ఫోనులో నన్ను పిలిచి స్విట్జర్లాండ్‌కు పోవుటకు సిద్ధపడమనిరి. కావున ఒక వయస్సు చెందిన వ్యక్తికి అది అధికము.

కావున, ఇప్పుడు మన తదుపరి కూటములు ఇండియానా పోలీస్‌నందున్న కేడ్‌లే గుడారమునందు రానున్న నెలలో పదకొండవ తేది ఆరంభింపవడును. ఇండియానా పోలీస్‌నందున్న కేడ్‌లే గుడారములో పదకొండవ తేది నుండి పదిహేను వరకు. మరి అటుపిదప అక్కడ నుండి మినియాపోలిస్, మినియాపోలీస్; ఇండియానా పోలీస్ నుండి మినియా పోలీస్, క్రైస్తవ వ్యాపారుల వ్యక్తులు.

6

ఇప్పుడు, సహోదరుడు నెవిల్ నన్ను కలిసియున్నాడని నేను తలంచుచున్నాను. మరియు నేను నిన్నటి దినమునకు మునుపు జరిపిన భూస్థాపన ఆరాధనలో నెవిల్ త్రయము వచ్చి పాటలు పాడినందులకు నేను వారిని మెచ్చుకొనగోరుచున్నాను. లిడిక్ కుటుంబములో ఎవ్వరును లేరు పాటలు పాడుటకు మరి నేను సహోదరుడు నెవిల్ అడిగితిని, శ్రీ. లిడిక్ మహిమకు పోయియున్నారు. మరియు నేను నిశ్చయముగా.... అతనియొక్క కొడుకును, (అతనిని ఇక్కడ నేను చూచుట లేదు)... మరియు తదుపరి కనుగొనియున్నాను అతను పెంపుడు కొడుకని. అతని తండ్రి చనిపోవుచున్నాడని ఎరిగి నన్ను పిలుచుకొని వచ్చుటకు నా ఇంటికి వచ్చెను, మరియు అతని తండ్రి చనిపోవుటకు ముందు రక్షింపబడెను. కావున, ఆ బాలుడు చేసిన గొప్ప కార్యము అతని తండ్రి చనిపోవుటకు మునుపు అతని కొరకు ప్రార్ధించుటకు ఎవరినో పిలుచుకొని వచ్చుటయే. మరియు నెవిల్ త్రయము అచ్చటికి వచ్చి మరి వారి కొరకు చక్కటి పాటలు పాడిరి.

కావున మరి సహోదరుడు నెవిల్ నన్ను అడిగెను, నేను ఈ ఉదయమును మరియు ఈ సాయంకాలమును మాటలాడగలనా అని. కావున మీరు గమనించుడి లేఖనములు చెప్పుచున్నవి, ''అధికముగా అడుగుడి కావున మీరు...“ కావున సహోదరుడు నెవిల్ ఆ కార్యములపై లేఖనముల ప్రకారమునున్నాడు! మరి కావున నేను నాకున్న శక్తి వరకు ప్రసంగించెదను.

7

ఇప్పుడు, ఈ రోజు ఉదయము తల్లుల దినము అని చెప్పియున్నాను, మరియు మేము చిన్న పిల్లలతో మాటలాడవలయునని యున్నాము. నేను అనుకొన్నాను ఈ ఉదయము చిన్న పిల్లలకు మంచి సమయమిది అని. ఇప్పుడు నేను తల్లి దినము నేను తలంచుచున్నాను...

ఇప్పుడు, భూమిపై మనకు తెలిసినంతవరకు నిజమైన, స్వచ్ఛమైన తల్లికంటెను మధురమైనదేదియును లేదు. ఆమె యొక్క ఘనమైన ఆత్మను దేవుడు ఆశీర్వదించును, ఒక నిజమైన, నిజమైన తల్లి. అయితే తల్లికి బదులుగా తల్లి అనెడు అనేక కార్యములను మనము కలిగియున్నాము; ఈ రోజు, అది తల్లి కాదు; వారు పిల్లలను కలిగియున్న స్త్రీలు, అయితే తల్లి కాదు. మరి సోమరిగా తిరుగుచు, నాట్యములకు పోవుచు సిగరెట్, త్రాగుడులతో లోనికి వచ్చువారు కాదు గాని పాతకాలపు తల్లి ఆమె యొక్క కుటుంబము కొరకు అక్కరగొనును. అట్లు తిరుగువారు పవిత్రమైన తల్లి అని పిలువబడుటకు అర్హులు కాదు. ఆమె బిడ్డలను కను ఒక స్త్రీ మాత్రమే, అదంతే, ఒక బిడ్డను పెంచుట; అయితే ఒక తల్లి కాదు, ఏలయనగా తల్లి అనగా దానికి నిజమైన అర్ధము కలదు. ఇప్పుడు, నేను తలంచుకొనుచున్నాను మీరు గనుక.....

8

ఇప్పుడు తల్లుల దినమును గురించి, నేను విపులముగా చెప్పదలచుచున్నాను. నాకు అక్కడ కూర్చొనియున్న తలనెరిసిన తల్లి కలదు. మరియు ఒక రోజు పరవాలేదని నేను అనుకొనుచున్నాను; అయితే ప్రతి దినమున తల్లుల దినుమగా ఉండవలయును, సంవత్సరమునకు ఒక్క మారు మాత్రము కాదు. మరియు ఈ యొక్క తల్లి దినము ఇప్పుడు సంభవించుచున్న కార్యములకు కారణము....

మరియు మనకు చేతినిండా కలదని నేను అనుకొనుచున్నాను, మరియు మనము ఒకరినొకరము ఎరిగియున్నాము. మనము ఇంటిలోనున్న వారము మరియు ఆ కారణము వలననే మనము ఈ విధముగా మాటలాడబోవుచున్నాము.

ఒక తల్లి ప్రతి దినమును అదే విధముగా గౌరవింపబడవలయును, అది సరియే, ఒక నిజమైన తల్లి. మరైతే వారు పిలుచు తల్లుల దినము, ప్రపంచములో ఒక పెద్ద వ్యాపారపు వెర్రి పనిగాయున్నది, జనులను డబ్బు కొరకు మార్పు కార్యముగా ఉన్నది. మరియు అది తల్లికి ఒక అవమానకరమైన కార్యముగా ఉన్నది, ఒక తల్లుల దినము సంవత్సరమునకు ఒక మారు, ''సరి, మనము ఆమెను చూచుటకు పోవుట లేదు, అయితే మనము ఒక గుత్తి పుష్పములను ఆమెకు పంపించుట, మరి అది చాలును.“ అది తల్లి కాదు! మై, గుడ్‌నెస్! ఒక నిజమైన తల్లి ఏ విధమైన స్త్రీ అనగా మీరు.... మిమ్ములను పెంచిన ఆమె, మరియు మీరు ఆమెను ప్రేమించెదరు, మరియు మీరు ఆమెను చూచెదరు మరియు ఆమెతో ఎల్లప్పుడును మాటలాడెదరు, మీ యొక్క ప్రేమను ఎల్లప్పుడును ఆమెకు వెల్లడించెదరు, సంవత్సరమునకు ఒక మారు కాదు.

9

అయితే నేను నాటకమును ప్రారంభించుటకు మునుపు, దీనిని నేను వ్యక్తపరచి మరి మీలో కొందరికి జ్ఞాపకపరచవలయునని కోరుచున్నాను. మరియు ఇది సంభవించిన పిదప అప్పటి నుండి అనేకులు మీలో మరణించియుందురు. అది 1933లో సంభవించెను.

కొన్ని రాత్రులకు మునుపు మీరు వార్తా పత్రికలలో చూచియున్నారా, ఆ యొక్క స్త్రీ ఆ మనుష్యుని చంపి, ఆమె యొక్క దారిలో అతనిని త్రోసి అతనిపై కారును ముందుకు వెనుకకు నడిపించెను. మరియు వారు అడిగిరి, ''నీ యొక్క మనస్సాక్షిని అది ఖండించలేదా? అని న్యాయవాదులు మరి వారు అడిగిరి, ఆమె చెప్పెను, ''దేవుడు మరియు, నేను స్త్రీలు ఏ విధముగా ఇతరుల వలన వ్యవహరింపబడుచున్నారో చూచి విసుగు చెందియున్నాము.“ హు! అవును, ఆమె ఒక విగ్రహము. అది సరియే. ''విసుగు చెందియున్నది.” ఎంత క్రిందకి ఈ దేశము దిగజారిపోవుచున్నది? న్యాయ తీర్పు లేక ఎంత దూరము పోగలము, నేను ఆశ్యర్యపడుచున్నాను? ''దేవుడు మరియు నేను?“ ఆయనపై వేయు బుద్ధిహీనతకంతయును దేవుడు కారణమైన యెడల, ఆయన దేవుడుగా ఉండలేడు, అది అంతే. ''దేవుడు మరియు నేను?” మై! దేవునికి అటువంటి దానితో సంబంధము లేదు. ఆమె అక్కడ అవస్థలోనున్నప్పుడు అప్పుడు ఆమె దానిని గురించి ఎట్లు తలంచుకొననునని ఆశ్చర్యపడుచున్నాను? ఓ!

10

అమెరికా! ఇప్పుడు నీవు గుర్తించుకొనుము, నీవు గనుక దీనిని వ్రాసియుంచుకొననియెడల, దీనిని వ్రాసుకొనుము. ఇది నేను అనుకొనుచున్నాను, చూశారా. 1933లో మనము ఆరాధనలు జరుపుకొను ఆ పాత స్థలములో అక్కడ ఇప్పుడు క్రీస్తు సంఘము ఉన్నది, అది పాత... ఇక్కడ అది, సహోదరుడు నెవిల్ ఇక్కడి నుండి నేరుగా. చార్లీ కర్న్ అక్కడ నివసించుచుండెడివాడు. అది అట్లే కదూ? మైగిన్ వీధిలో అక్కడ ఒక అనాధ ఆశ్రయము. 1933లో నా యొద్ద ఒక ఫోర్డ్ ఉండెను మరి నేను దానిని ఆ రోజు ఉదయము ప్రభువు కొరకు అర్పించితిని. మరియు ఇంటి నుండి బయలుదేరు ముందు నేనొక దర్శనమును చూచితిని. నేను దానిని వ్రాసియుంచియున్నాను, పాత పసుపు కాగితము బైబిలులో ఇంకను కాచుకొనియున్నది. చవరి కాలము వచ్చుటను నేను చూచియున్నాను.

11

మరియు, మీలో ఎందరికి 1933లో కారు ఏ విధముగా ఉండెనని గుర్తున్నది? ఓ, అది ఈ విధముగా చేయబడి, మరియు వెనుక భాగమున స్పేర్ టైర్ వ్రేలాడుటకు అనువుగా చేయబడియున్నది, ''ప్రభువు రాకడకు మునుపు కార్లు గ్రుడ్డు ఆకారము వలె అగుపించునన్న కార్యమును నేను దర్శనములో చూచియున్నాను.“ ఆ జరుగబోవు దానిని ముందుగానే చెప్పిన సంగతి ఎందరు జ్ఞాపకముంచుకొనియున్నారు? ఇక్కడ ఎవరైనను ఉన్నారా? సహోదరుడు స్టీవర్డ్ చనిపోయియున్నాడని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ మేము 1933లో ఆరాధనలను జరుపుకొనియున్నాను. అప్పటి నుండి అనేకులు ఇప్పుడు గతించిపోయి యున్నారని నేను అనుకొనుచున్నాను.

12

మరియు అమెరికనులకు మొదటి దేవుడు స్త్రీ అని నేను ఊహించియున్నాను. అదియే దాని కార్యము. సమస్తమును హాలివుడ్‌ను అనుసరించియున్నది. ఎఫ్.బి.ఐ. పైల్లో వారి రికార్డులలో ఉన్న కార్యములను నేను మీకు చెప్పినయెడల మీరు ఆశ్చర్యపడెదరు. సినిమా తారలు ఎక్కడ ఏ విధముగా తప్పులోనున్నారని, వారిలో ఏ ఒక్కరు కూడా మినహాయింపు లేకుండా అందరును వ్యభిచారులే.

మరియు ఎఫ్.బి.ఐ. సమీపకాలములో దానిని బహిరంగపరచియున్నారు. వారియొక్క సొంత ఫైలు నుండి నేను దానిని తెలుసుకున్నాను. మరియు వారందరును ఆ విధముగా జీవించుచు, వారు శోధనకు పోయినప్పుడు ఆ సినిమా తారలు వారందరు పట్టుబడినపుడు, పురుషులతో వారు ఉండిరి, ఇరవై-ఐదు మరియు యాభై డాలర్లు ఒక రాత్రికి హాలీవుడ్ ఆ పరిసర ప్రాంతములో అక్కడ వేరైన ఇండ్లు కలవు, ఒక వ్యక్తి అచ్చటికి మనుష్యులను పంపించును.

మరియు దానినే మనము టెలివిజన్లలోను, తెరలలోను అలాటి కార్యములను చూచుచున్నాము మరి దానిని పూజింప తగ్గ విగ్రహము అని పిలువ మన పిల్లలను అనుమతించుచున్నాము. మరియ పిదప దానిని “తల్లి” అని పిలుచుచున్నామా? అది తల్లి అని పిలువబడుటకు చాలా దూరముగానున్నది. అది అసహ్యము. అది ఖచ్చితముగా అట్లే. మరి ఏమైనప్పటికిని వారు దినములకు తగినట్లుగా మారుచున్నారు సరి, వారు ఏ విధమైన దుస్తులను ధరించెదరో అమెరికన్ స్త్రీలు కూడా వారివలె ధరించెదరు, సమస్తమును అట్లే. నిజముగా. మరియు అమెరికా యొక్క దేవుడు స్త్రీ. యోహోవా కాదు; దానినుండి వారు తొలగియున్నారు. ఇప్పుడు తల్లికి కాదు, ఇప్పుడు దానిని దూరముగా పెట్టుడి, అది మనము మాటలాడబోవునది పవిత్రమైన కార్యము; అయితే నేను చెప్పుచున్నది స్త్రీ గురించి.

13

మరియు గుర్తుంచుకొనుడి, ఆ గొప్ప సర్వనాశనము జరుగక మునుపు, (దీనిని ప్రభువు చెప్పియున్నాడని నేను చెప్పుటలేదు), అయితే ఇప్పటికిని లేక 77కు మధ్య ఏదో కార్యము సంభవింపనైయున్నదని నమ్ముచున్నాను. అది ఈ గంటలోనే రావచ్చును. అయితే ఇప్పటికిని మరియు 77కు మధ్య ఒక గొప్ప సర్వనాశనము లేక భూమియంతటి సంపూర్ణ నిర్మూలన, ఇప్పటికిని మరియు 77కు మధ్య, నేను దానిని 1933లో ముందుగానే చెప్పియున్నాను.

14

స్త్రీలు చెడు నడతగలవారై మరియు దేశము దిగజారుననియు, మరియు వారు తల్లిని వ్రేలాడుకొని యుందురనియు లేక ఆ విధముగా తల్లివలె ఉన్నదానిని, ఒక స్త్రీ వారికి విగ్రహము పూజించుటకు వలె అగునని నేను జరుగబోవు దానిని ముందుగానే చెప్పియున్నాను. మరియు కొద్ది కాలము అయిన పిదప ''అమెరికా ఒక స్త్రీ వలన పరిపాలింపబడును.“ అది సరియా కాదాయని దానిని గుర్తుంచుకొని చూడుడి. ఆ విధమైన కార్యము, గొప్పగా అమెరికాలో ఒక పెద్ద శక్తిగా లేక ఒక స్త్రీ అధ్యక్ష స్థానమును తీసికొనును.

గౌరవింపతగిన స్త్రీలారా, నేను దీనిని మర్యాదతో చెప్పుచున్నాను. ఒక స్త్రీ వంటగది నుండి బయటికి వచ్చినప్పుడు, ఆమె తన స్థానమును వదిలియున్నది. అది సరియే, ఆమె దానికే చెందియున్నది. దాని బయట ఆమెకు స్థానము లేదు. మరిప్పుడు వారిపై అది కఠినముగా ఉన్నది, అయితే నేను ఏది సత్యమో, బైబిలు ఏమి చెప్పుచున్నదో దానినే చెప్పుచున్నాను. బైబిలు దినములలో మగవాడు ఇంటికి యజమానిగా ఉండెడివాడు. ఇప్పుడు ఆ విధముగా లేదు. అతను కీలుబొమ్మ లేక బిడ్డలను చూచుకొను లేక అలాటివానిగా ఉన్నాడు. మరిప్పుడు కాదు, వారు ఒక కుక్కను పెంచుకొనవలయునని యున్నారు, గర్భ నిరోదకమును అవలంబించుచు మరి ఎల్లప్పుడును ఒక చిన్న వయసైన కుక్కను తమ చేతులలో ఉంచుకొనుచున్నారు, కావున మీరు రాత్రంతయు తిరుగవచ్చును.

15

నేను తల్లిని గురించి మాటలాడుట లేదు. దేవుడు వారిని ఆశీర్వదించును. ఇప్పుడు దేశమును మార్గమధ్యలో కాపాడుచున్నదేదనగా, ఒక నిజమైన, మంచి, పవిత్రమైన, దేవుని ద్వారా రక్షించబడిన తల్లి మాత్రమే. అది సరి.

అయితే మనయొక్క స్త్రీలు ఎంత క్రిందికి దిగజారియున్నారో అవమానకరముగా ఉన్నది! నా యొద్ద ఒక కత్తిరించబడిన పేపరు ముక్క కలదు, రెండవ ప్రపంచ యుద్ధమునకు పిదప దానిని నేను కత్తిరించియున్నాను, అదిట్లు చెప్పుచున్నది, ''ఆరు నెలలు వారి భర్తలు విదేశములకు పోయిన పిదప ఐదుగురిలో నలుగురి సైనికుల భార్యలు వారికి విడాకులు ఇచ్చి వేసి ఇంకొరిని వివాహము చేసికొనియున్నారు, అమెరికన్ స్త్రీల యొక్క నీతి ఎక్కడికి పోయివున్నది? మరి వారి భార్యలు వారు విదేశముల నుండి తిరిగి వచ్చు వరకు కూడా కాచుకొనలేకున్నారు! ఆ విధముగా చేయు ఆ వ్యక్తులు, పవిత్రమైన వేరైన తల్లి అని పిలువబడుటకు కూడా అర్హులు కారు. కాదు, అది అట్లు కాదు, కావున నేనెల్లప్పుడును ''స్త్రీ ద్వేషి“ అని పిలువబడుచున్నాను, అయితే నేను అట్లు కాదు. ఒక స్త్రీ అద్భుతమైన ఒక కార్యముగా ఉన్నది, ప్రత్యేకముగా ఒక తల్లి అయితే వారు వారియొక్క స్థానములో ఉండవలయును మరియు పురుషుని యొక్క స్థానమును తీసికొనకూడదు, మరియు దేవుని యొక్క ఆ స్థానమును తీసికొనకూడదు.

16

మరియు ఈ ఉదయము పరిశుద్ధ సంఘము ఈ విధముగా చెప్పుట వింటిని, ''ఒక తల్లి పరలోకమునందలి నక్షత్రములను ఏలుచున్నది, మరియు ఈలాటి కార్యములతో, కాథొలిక్కులు దానిని కన్యక మరియపై అట్లు చేయుట నేను ఊహించగలను, మరియు అటువంటి కార్యములను వారు, చనిపోయిన స్త్రీలను ఆరాధించుట, పరిశుద్ధ సెసిలియా మరియు ఆ విధముగా అటువంటి కార్యములను వారు చేయుదురు, అది చనిపోయిన వారితో సంబంధము పెంచుకొనుటవంటి ఉన్నత స్థితిగానున్నది. దానిలో ఉన్నటువంటిదేమనగా అది అదే దయ్యములతోటి సంబంధమగును. చనిపోయిన వారితో మధ్యవర్తిత్వము జరుపు ఏదైనను దయ్యముతలో సంబంధము పెంచుకొనునటువంటి కార్యమగును. కావున దేవునికి మనుష్యునికి మధ్య ఉన్నది ఒకే ఒక మధ్యవర్తి మరి అది యేసుక్రీస్తు. అది సరియే. ఏ యొక్క ఇతర పరిశుద్ధుడుగాని యేసుక్రీస్తుకు బయట ఎవరుగాని లేరు, యేసుక్రీస్తు ఒక్కడే దేవునికి మనుష్యునికి మధ్యనుండు మధ్యవర్తి. అయితే నేను సంఘములను చూచునప్పుడు, ప్రసంగ వేదికలకు వెనుకకు పోయి క్రీస్తునందున్న పవిత్రతయంతయును తీసివేసి మరియు తల్లికి ఇచ్చుచున్నారు, పవిత్రతయంతయును తీసివేసి మరి అటు పిదప వారు ఆ విధముగా చేయుటను ఆరంభించు చుండుటను మరి మీరు గ్రహించియున్నారా.

17

కావున, అయినను నిజమైన తల్లి ఉన్నది. దేవునికి స్తోత్రము! అది ఎట్లనగా మీరు ఒక వేషధారిని చూచినపుడు; ఒక నిజమైన క్రైస్తవ జీవితమును జీవించు ఒక నిజమైన క్రైస్తవుడు ఉండును. ఎల్లప్పుడును మంచికి విరోధముగా చెడు ఉండును. అది ఖచ్చితముగా సరియే. మరిప్పుడు ఆ విధమైన మంచి తల్లి మరియు మంచి బిడ్డను గురించి బైబిలు నుండి మనము మాటలాడగోరుచున్నాము.

18

ఇప్పుడు, ఈ ఉదయము మనయొద్ద మనమెంతమంది బాలురను మరియు బాలికలను కలిగియున్నామో అని నేను ఆశ్చర్యపడుచున్నాను? మీరు సహోదరుడు నెవిల్ నిన్నటి దినమున రేడియోలో చేసిన ప్రచార కార్యమును వినియున్నారా... నేను మీతో మాటలాడుచుండగా, ఎందరు చిన్న బాలురును మరియు బాలికలును ఇచ్చటికి ముందుకు వచ్చి కూర్చొనవలయునని ఉన్నారు? మీరు ఇక్కడికి రావలయునని కోరుచున్నారా? ఇక్కడ ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు సీట్లు కలవు; ఒకటిక్కడ ఆరు, మరియు కొన్ని చిన్న సీట్లు ఇక్కడ. మీరు ఇక్కడ ముందుకు రావలయునని కోరుచున్నారా, మీ తల్లి తోడు లేకుండా కూర్చుండగలుగువారు ఇక్కడికి రావలయునని కోరుచున్నారా? మీరు వచ్చుటకు స్వాగతము! [ఎవరో చెప్పుచున్నారు, ''వారు ఆదివారపు పాఠశాల గదిలో ఉన్నారు.] ఓ, అక్కడ ఆదివారపు పాఠశాల గదిలో, సరి అది మంచిది. మనము కొద్ది నిమిషములు ఆగెదము, మరి మాటలాడుకొనుచున్నప్పుడు వారు కొద్ది నిమిషములలో బయటికి వచ్చెదరు. మరియు మనము ఒక్కటిగా కూడి చిన్న నలుపు, మరియు బ్రౌన్, మరియు బ్లూ కండ్లు ఇక్కడ ఉండగా. మరి వారొక్కొక్కరితో మాటలాడెదము. ఇప్పుడు, ఎందరు ప్రభువును ప్రేమించుచున్నారో, ''ఆమేన్“ అని చెప్పుడి. అది సరి.

19

ఇప్పుడు నేను తల్లులతోను మరియు పిల్లలతోను మాటలాడవలయునని యున్నాను, మరిది వారిని ఉద్దేశించియున్నది.

ఈ రాత్రి, ప్రభువు చిత్తమైన యెడల, యేసు చేసిన మొదటి అద్భుతముపై మాటలాడవలయునని ఉన్నాను, మరియు అదెట్లు చేయబడెను, మరియు ఏ శక్తితో, చేయబడెను మరియు అది చేయునపుడు ఆయనేమి చేసెను. ఆయన చేసిన మొదటి అద్భుతము ఏమిటని ఎందరికి తెలియును? అందరు కలసి చెప్పుడి.

''నీటిని ద్రాక్షారసముగా మార్చెను.“

అది సరియే, ఆయన చేసిన మొదటి అద్భుతము. ఇప్పుడు, ప్రభువు చిత్తమైన యెడల నేను ఈ ఉదయమున చదువుచుండగా, అది నా యొక్క తలంపులో వచ్చెను.

20

ఈ ఉదయమున, నేను అనుకొనుచున్నాను, మనయొక్క మంచి స్నేహితుడు శ్రీ మరియు శ్రీమతి యాకర్ అక్కడ వెనుకనున్నారు. ఈ మార్గమున నేను స్తంభమును చుట్టి వచ్చునపుడు నేను అతనిని గుర్తించుట సంభవించెను. ఆ దినమున నేను పరీక్షింపబడుచుంటిని, నేను దూరదేశముల ప్రయాణమునకు పోవునపుడు నేను పరీక్షించుకొనవలసియుండును. మరియు, అప్పుడు నేను బయటికి వచ్చినపుడు నేనెవరిని సంధించితినో తెలియునా మరి శ్రీ మరియు శ్రీమతి యాకర్. అక్కడ కార్యాలయులో కూర్చొనియున్నప్పుడు - అక్కడ కార్యాలయములో.

వైద్యుడు స్కీన్, లూయిస్‌విల్ లో ఉంటున్నతను, ఒక మంచి క్రైస్తవ సహోదరుడు. నేను నీకు చెప్పుచున్నాను, నేను నిజముగానే అక్కడ ఒక నిజమైన వ్యక్తిని కలిసితిని, అక్కడ అతను దేవునిపై ఆధారపడి మరియు దేవుని నమ్ము ఒక నిజమైన వ్యక్తి. మీకేమిటని తెలియునా? నేను మీకు చెప్పుచున్నాను, ప్రసంగీకులైన నా వంటి వారికంటెను, అధికమైన వైద్యులు దైవీక స్వస్థతను నమ్ముచున్నారు. అది సరియే. మీరు వారితో మాటలాడుడి. నేను చెప్పాను, ''నిశ్చయముగా.“ మరియు అప్పుడు నేను బయలుదేరి వచ్చుచుండగా, అతను నా చేతిని పట్టుకొని, అతను చెప్పెను, ''సహోదరుడా బ్రెన్హాం, నేను చేయగలిగిన దానియంతటి కంటెను, నీవు మానవజాతికి అధికముగా చేయుచున్నావు” అని అతను చెప్పెను. ''అది సరియే,“ చెప్పెను. ''నేను తాకలేని జనులకు కూడా నీవు సహాయపడగలవు,” అని చెప్పెను. అది సరియే.

నేను చెప్పాను, ''సరి, మీరు కుట్టు కుట్టవచ్చు లేక ఒక విరిగిన ఎముకను సరిగా కుదర్చ వచ్చును, లేక ఆ విధముగా ఏదో కార్యమును చేయగలరు. అయితే దేవుడు స్వస్థత అనుగ్రహించును.

అతను చెప్పెను, ''అది సరి.“ ఆమేన్. ఓ, నేను సరిగా అర్థము చేసికొనగల బుద్ధిగలిగిన, చక్కటి బుద్ధితో ఆలోచించగల జనులను చూచుటకు ఇష్టపడుచున్నాను. ఒక శస్త్ర చికిత్స, మరియు ఒక ముందులిచ్చు వైద్యుడు, మరియు వెన్నెముక చికిత్స నిపుణుడు, ఎముకల వైద్యుడు, దైవిక స్వస్థత మరి ఇవన్నియును కలసి, ఏ ఒక్కటియైనను ఇంకొక దానికి సహాయపడినయెడల, నేను దానిని మెచ్చుకొనెదను. మరియు ఒక వైద్యుడు ఒక ప్రసంగిని ఖండించినయెడల, మరియు ప్రసంగి ఒక వైద్యుని ఖండించినయెడల, మరియు ఒక ఎముకల వైద్యుడు శస్త్ర చికిత్సకుని ఖండించినయెడల, శస్త్ర చికిత్సకుడు మందులిచ్చు వైద్యుని ఖండించినయెడల, ప్రతియొక్క చోటును స్వార్ధము ఉన్నదనే కార్యమును మీరు ఊహించుకొనవచ్చును, అది సరి, ఏలయనగా ప్రతి ఒక్కరును నిరూపించియున్నారు ఎవరికో ఒకరికి సహాయపడియున్నారని అది ఖచ్చితముగా సరియే.

21

ఇప్పుడు, దానిలో ఉన్న కార్యమేదనగా, నేను అనుకొనుచున్నాను, మన యొక్క ఉద్దేశములు సరైనయెడల, మరియు మన హృదయములు జనుల కొరకు సరిగా ఉన్నయెడల, మన సహచరుని కొరకు, అతని జీవితము సాఫీగా కొనసాగుటకుగాను, మనమందరమును కలసి ఐక్యముగా పనిచేయవలెను, మరప్పుడు నీ యొక్క ఉద్దేశములో స్వార్ధముండదు. సమస్తమును ఉచితముగా ఇచ్చు దేవునికి స్తుతులు చెల్లించుచు ఉండెదవు. ఆమేన్. అవునయ్యా. ఓ, మనకు ఎప్పుడును ఎక్కడను స్వార్థము ఉండకూడదు; అది పరిపూర్ణముగా ఉండవలయును.

ఒక వేళ వెన్నెముక నిపుణుడు దీనికి సహాయపడినయెడల, ఎముకల వైద్యుడు దీనికి సహాయపడినయెడల, శస్త్ర చికిత్సకుడు దీనికి సహాయపడినయెడల మరి ఏదో కార్యము దానికి సహాయపడినయెడల వాటన్నిటి కొరకు మనము ప్రార్ధించెదము, ఆమేన్, దేవుడు ఆయన ప్రియమైన ప్రజలు బాగుగా మరి సంతోషముగా ఉండుటకు సహాయపడును. ఏలయనగా ఇక్కడ మనము చాలా కాలం జీవించుము, కొద్దిరోజులు మాత్రమే జీవించెదము మరియు మనము ఎక్కడికో పోవు మార్గమున ఉన్నాము. కావున మనము చేయుచున్నది ఏమనగా జీవితము కొద్దిగా సాఫీగా సాగిపోవుటకున, మరి అందువలన మీకు ఇక్కడ ఉండువరకు మేలైన సహాయము ఉండును. అందుకే మనము అనేక ప్రయత్నములు చేయుచున్నాము. ఆమేన్.

22

ఇప్పుడు, ఈ యొక్క తలంపుపై, మనము బైబిలు తెరచుటకు మునుపు మన తలలు వంచి, మరి మన ప్రియమైన రక్షకునితో మాటలాడెదము.

మా యొక్క దయగల పరలోకపు తండ్రీ, మీ యొక్క ప్రసన్నత ముందు ఈ ఉదయము మేము నమ్రతతో వచ్చుచున్నాము, మరియు భూమిపైనున్న వాటికన్నిటికంటెను, ఇక నుండి భూమిపైనుండు వాటన్నిటికి పై వారైన ప్రభువైన యేసుక్రీస్తుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఏలయనగా ఆయనే మనుష్యుని మరియు దేవుని ఒక్కటిగా తీసికొని వచ్చి మరియు బీదలైన, ఎందుకు పనికిరాని, దేవుడంటే తెలియని అన్యులైన మనలను దేవునితో సఖ్యపరచెను. దేవునికి దూరముగా మన యొక్క స్వీయ ఎన్నికతో, మనమే కోరుకొని మరి ఆయనయొద్ద నుండి దూరముగా పోయాము. మరియు మనము దేవునికి ప్రియులుగా లేనప్పటికిని, మరి ఆయన మనకొరకు వచ్చు మంచి వానిగా ఉండెను, మనమింకను పాపులుగా ఉన్నప్పటికిని, దేవునికి దూరముగా ఉన్నప్పటికిని, ఆయన యొక్క సొంత రక్తమును చిందించుట వలన, తండ్రి యొద్దకు మనలను తిరిగి సఖ్యపరచెను.

మనమెట్లు ఆయనకు స్తోత్రములు చెల్లించగలము! మరియు ఈ రోజు మధ్యవర్తిగా నిలువబడి, దేవునికి మరియు మానవునికి మధ్య ఒకే ఒకనిగా, భూమి నుండి మహిమకు చిందించిన ఆయన రక్తము ద్వారా ఒక ప్రార్ధన దేవుని యొక్క సమూహమునకు వచ్చులాగున చేయుచున్నాడు. పశువుల పాకలో జన్మించి ఈ లోకమునకు వచ్చెను. భూమి నుండి పోవునప్పుడు ఘోర శిక్షతో పోయెను. భూమికి ఆయన అక్కర లేకపోయెను. పరలోకము ఆయనను స్వీకరించలేకపోయెను, ఏలయనగా ఆయన మన పాపములను మోసినందువలన ఆయన ఒక పాపిగా ఆయెను. భూమికి ఆయన అక్కరలేని వాడాయెను, వారు ఆయనను నిరాకరించిరి, ''ఇటువంటి వ్యక్తి నుండి తొలగిపోవుడి!“ ఆయన పుట్టుటకు స్థలము లేకుండెను, లేక చనిపోవుటకు కూడా స్థలము లేకుండెను. మరియు ఆయన భూమికిని, ఆకాశమునకును మధ్య వ్రేలాడెను; పరలోకము ఆయనను స్వీకరింపలేకపోయెను, మరియు భూమి ఆయనను ఉంచుకొనలేక పోయెను. మరి ఆయన పాపముల నుండి మనలను రక్షించుటకును, మన వ్యాధులను గుణ పరచుటకును, మనకు సంతోషము మరియు భూమిపై మనము ఉన్నంతవరకు హాయిగా ఉండుటకును ఆయన చనిపోయెను. ఎటువంటి రక్షకుడు! ఓ, అయన కొరకు మీకు మేమెట్లు వందనములు చెల్లించగలము!

ఓ, దేవుడా, మా యొక్క హృదయ ఆరాధనంతయును ఆయనకు పోయబడనిమ్ము మరియు ఆయనకు మాత్రమే, మా యొక్క మర్యాద అంతయును, మరి ప్రతి యొక్క ఆరాధనయును, మా యొక్క పెదవులు లేక హృదయము నుండి వచ్చు సమస్తమును వాటన్నిటికిని అర్హుడైన ఆయనపై పెట్టబడనిమ్ము. ఒక రోజు ఆయన సింహాసనముపై కూర్చుండెను. ఆయన చేతిలో పుస్తకముతో, పరలోకము నందు ఎవరును లేక భూమిపైనున్న ఏ మనుష్యుడును దానిని చూచుటకు కూడా లేక ముద్రింపబడియున్న ముద్రలను విప్పుటకు కూడా పాత్రులు కారు. మరియు భూమి యొక్క పునాది వేసినప్పటి నుండి వధింపబడిన ఈ యొక్క గొర్రెపిల్ల వచ్చి, ఆయన యొక్క చేతిలో నుండి తీసి ముద్రలను తెరచి మరి ప్రజలకు వాక్యమును విప్పెను.

23

మరియు, తండ్రీ, ఈ రోజు మేము ప్రార్ధించుచున్నాము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మా యొక్క హృదయములను అంధకారమంతటి నుండి విడిపించి, కపటమంతటి నుండి మా నాలుకలను విడిపించి, మా పాపములంతటి నుండి మమ్ములను మన్నించి, మరియు చీకటంతటిని తీసివేసి, ఈ ఉదయము మా యొక్క హృదయములలోనికి రానిమ్ము.

మరియు ముఖ్యముగా ఈ యొక్క చిన్న బిడ్డలు దేవా, ఈ ఉదయమున వారియొక్క ప్రేమగల తల్లులతో వారిక్కడ కూర్చొనియుండగా వారిని ఆశీర్వదించును. దేవా, మాతృత్వము కొరకు మీకు స్తోత్రములు, నిజమైన స్త్రీ కొరకు! ఈ అంధకారమున్నప్పటికిని వీటి మధ్యలో మరియు విగ్రహారాధన మరియు అసహ్యము మరియు ప్రపంచము యొక్క కుళ్ళు మధ్యలో, మనము నిజమైన, స్వచ్ఛమైన తల్లులను కలిగయున్నాము. వారికొరకు మేమెట్లు స్తోత్రములు చెల్లించగలము! చిన్నవారు మరియు పెద్దవారు, ఇరువురి కొరకు మేము వందనములు చెల్లించుచున్నాము, తండ్రీ, నిజమైన మాతృత్వము కొరకు. మరియు మీరు వారిని ఆశీర్వదించవలయునని మేము ప్రార్ధించుచున్నాము దేవా.

మనలో అనేక సహోదరులును మరియు సహోదరిలును, వారియొక్క ప్రియమైన, పరిశుద్ధ తల్లి చనిపోయి ఆవలి గట్టుకు చేరియున్నారనుటకు గుర్తుగా తెల్లని రోజా పుష్పములను, లేక తెల్లని చిహ్నములను ధరించుకొని ఈ ఉదయము ఇక్కడ కూర్చొనియుండుటను చూచుచున్నాము; వారు చనిపోలేదు, అయితే నిత్యజీవమును కలిగియున్నారు. ఒకానొక రోజు వారును నదియొద్దకు వచ్చెదరు, మరి వారు ఆవలి గట్టున ఆమెను చూచుటకు వచ్చెదరు. అనేకులు ఎర్రని రోజా పువ్వులను ధరించియున్నారు, దాని అర్ధము తల్లి ఇంకను ఇక్కడే యున్నారు. దానికొరకు మేము మీకు వందనములు చెల్లించుచున్నాము.

మేము అందరమును కలిసి మీ యొక్క వాక్యమును చదువుచుండగా, మీరు మమ్ములను ఆశీర్వదించుడి, మేము క్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాము, ఆమేన్.

24

ఇప్పుడు దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. ఈ ఉదయమున మనము నేరుగా వాక్యములోనికి పోయెదము. ఇప్పుడు తల్లులకు మరియు చిన్న బిడ్డలకు నేను అనుకొనిన ఈ యొక్క చిన్న నాటకమునకు మునుపు.... మరియు వారు నేను చెప్పునది వినెదరు, ఏలయనగా దీనికి చక్కటి శబ్దము ఉన్నది. మరియు నేను ఒక చిన్న నాటకమును ఇవ్వదలచియున్నాను, ఏలయనగా ఇప్పుడు నా యొక్క ఆరాధనలను నేను గమనించి చూడగా కొన్ని సమయములలో నాటకములు ఎక్కువగా ప్రయోజనముగా ఉన్నది. మీరు ఆ విధముగా తలంచుట లేదా? చిన్న పిల్లలు దానిని చక్కగా అర్ధము చేసికొందురు. చిన్నని మెరిసే కన్నులు గల ఇరువురు బాలురు నా వైపు చూచుట నేను గమనించుచున్నాను, ఒకవేళ రేపటి దినమున్నయెడల వీరే రేపటి పౌరులు.

25

మరిప్పుడు మనకు నాటకమో లేక ఏదైనప్పటికిని సంఘములో జరిగినయెడల అది బైబిలును ఆధారపడియుండవలయును. ఆమేన్. అది బైబిలును ఆధారపడియుండవలయును. మొట్టమొదటిగా మనము మత్తయి 16వ అధ్యాయము మరి 25వ వచనమునకు త్రిప్పెదము. మరి ఈ వచనములను మనము చదివెదము. మొదట మనము చదువుటకు, సిద్దపడుచుండగా, ఆ సమయములోపల చిన్న పిల్లలు వచ్చెదరు. ఇప్పుడు మత్తయి 16:25, మనము దీనిని చదివెదము.

తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

ఇప్పుడు, ఇది చాలా ముఖ్యమైన లేఖన వాక్యము. మనమందరమును కలసి దానిని చదువుకొనెదము. మీరేమి చెప్పెదరు? ప్రతియొక్కరును, చిన్న పిల్లలు మరి అందరును కలసి ఒక్కటిగా ఇప్పుడు [సహోదరుడు బ్రెన్హాం మరియు సంఘమంతయును కలసి ఒక్కటిగా ఈ క్రింది వాక్యములను చదువుచున్నారు.]

తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

26

మీకు తెలియునా, బాలులారా, మరియు బాలికలారా, మరియు నాకు తెలియును, చిన్న పిల్లలు ఏ విధముగా దీనిని అనుభవించెదరో పెద్దలు కూడా ఆ విధముగానే అనుభవించెదరు. అయితే ఆ లేఖనములు చాలా ముఖ్యమైనవి! మరియు కొన్ని లేఖన వాక్యములు ఎంత ముఖ్యమైనవి అనగా, దేవుడు దానిని నాలుగు సువార్తలలో: మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులో ఉంచియున్నాడు! యేసు, ఆయన సొంత పెదవుల నుండి ఆరు మారులు ఇవి వచ్చియున్నవి.

27

ఇప్పుడు, మార్కులో (మనము అక్కడ దానిని త్రిప్పి చూచెదము), మరియ 8వ అధ్యాయము మార్కు మరియు 34వ వచనము మొదలుకొని, మరి నేను అక్కడ కొన్ని చదివెదను. మరియు మీరు మరల ఇక్కడ గమనించవలయునని నేను కోరుచున్నాను, యేసు దానిని మాటలాడియున్నారు అది కొంచెము పొడిగింపబడియున్నది. మరియు గుర్తుంచుకొనుడి, ఆయన దానిని ఆరు మారులు సువార్తలలో పెట్టియున్నారు, కావున అది నిశ్చయమైనది! రెండు సాక్ష్యములు, అయితే ఆయన దానిని మూడు మారులు దానిని పెట్టియున్నారు దానిని చూశారా, కావున దానిని మీరు మరువకుండ జ్ఞాపకము ఉంచుకొనండి.

అంతట ఆయన తన శిష్యులను జన సమూహమును తనయొద్దకు పిలిచి - నన్ను వెంబడింపగోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను.

ఇప్పుడు, తర్జుమా చేసిన వారిలో ఒకడు ఇట్లు పెట్టెను, ''సిలువను ఎత్తుకొనుము, మరి నన్ను ప్రతిదినము వెంబడించుము. ఇప్పుడు, ఇప్పుడు 35వ వచనము వినుము.

తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వలన వానికేమి ప్రయోజనము?

లేక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?

28

ఇప్పుడు, మనము ఈ యొక్క 35వ వచనమును తీసికొని ఒక్కటిగా చేర్చి దానిని చదివెదము. అది సరి. ఇప్పుడు మనము ఒక్కటిగా దానిని చెప్పెదము. మనము మార్కు 8:16, నేను మిమ్మల్ని మన్నించమని కోరుచున్నాను, మార్కు 8:16, 35 కాదు, నేను తప్పుగా పెట్టుకొనియున్నాను ఇంకను, మార్కు 8, నన్ను మన్నించండి. మార్కు, సరి. మార్కు, 8వ అధ్యాయము, 35వ వచనము. ఇప్పుడు, దానిని మరల ప్రయత్నించెదము. సరి. మార్కు, 8వ అధ్యాయము, 35వ వచనము. ఇప్పుడు దానిని మనము కనిపెట్టియున్నాము. మనము దానిని చదివెదము. [సహోదరుడు బ్రెన్హాం మరియు సంఘము ఈ క్రింది లేఖనములను ఒక్కటిగా చదువుచున్నారు.]

తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

29

అది అద్భుతముగా లేదూ? ఇప్పుడు చిన్న బిడ్డలు వారి యొక్క స్థలములలో వారి స్థానమును తీసికొనుచుండగా మనము మనయొక్క చిన్న కథకు పోయెదము. ద్వార పాలకులు వారిని నెమ్మదిగా ఉండులాగున చూచుచుండగా మనము మన కథను మొరలిడుచుండగా వారు బిడ్డలను లోనికి తీసికొని వచ్చెదరు. మరియు నేను, అనేక మార్లు నేనక్కడ కొద్ది దినములకు మునుపు....

నేను గత క్రైస్తవ వ్యాపార సహోదరుల కూడికలో ఉదయకాలపు ఫలహార సమయములో మాటలాడుచుండగా సహోదరుడు మరియు సహోదరి ఉడ్ నాతో కూడా ఉండిరని నేననుకుంటున్నాను. మరి నేను మేడి చెట్టెక్కిన జక్కయ్యను గురించి, నాటకమువలె చెప్పియున్నాను, అప్పుడు యేసు వచ్చెను, అతను చెత్త వేయు బుట్ట వంటి పాత్రను పట్టుకొని యేసును చూచుటకు చెట్టెక్కెనని మీకు తెలియును. మరి ఆ వ్యాపారస్ధుడు యేసు నుండి తమను మరుగుపరచుటకు చెట్టునెక్కి కూర్చుండెను. మీకు తెలియును. మరి యేసుకు అతను ఎక్కడ ఉన్నాడో తెలియకుండెను, మరియు అప్పుడు అతడు చెప్పెను, ''ఓ, వారు నాతో చెప్పుచున్నారు, ఆ మనుష్యుడు అన్ని కార్యములను ఎరిగియున్నాడు మరియు ముందుగానే జరుగబోవు కార్యములను చెప్పగలడు, మరియు చేపలో ఎక్కడున్నదని ఒక... దానిని నేను నమ్మును.“ మరియు యేసు చెట్టు చుట్టు తిరిగెను. మరియు అతను చెప్పుకొనెను, ''సరి, నన్ను చూడలేదు, నేను ఒక చెట్టుపై కూర్చొనియున్నాను.”

యేసు నిలచి మరియు పైకి చూచి చెప్పెను, ''జక్కయ్య, క్రిందికి దిగుము.“ అతను పైన ఉన్నమాట మాత్రము కాదు గాని, అయితే అతనెవరైనదియును ఎరిగి యుండెను.

కావున నేను అనుకొనుచున్నాను ఒక చిన్న నాటకము కొన్ని సమయములలో వృద్ధులకును, పెద్ద బాలురకును, మరియు బాలికలకును, చిన్నవారికి సహాయపడునట్లు వారికిని ఉపయోగకరముగా ఉండును.

30

కావున ఇప్పుడు, ఇదంతయు ముగిసిన పిదప, ''సహోదరుడా బ్రెన్హాం ఈ యొక్క గుణావిశేషములను మరియు పేర్లను మీరు ఎక్కడి నుండి సంపాదించియున్నారు?“ మీరు నన్ను అడుగవచ్చును, వాటిలో కొన్నిటికి నా యొక్క మంచి స్నేహితుడైన సహోదరుడు బూత్-క్లిబ్బర్ మరియు ఇంకొకరు గొప్ప చరిత్రకారుడైన జోసెఫ్ సహాయపడెను. మరియు ఆ పిదప దీనిని గురించిన సంఘటనలు ఈ ఉదయము మనము నాటకములో ఇవ్వబోవుచున్న ఈ కార్యములను నేను చదివిన చరిత్రలో నుండి వీటిని సంపాదించియున్నాను.

31

మనము చెప్పబోవు ఈ యొక్క కథకు ఈ ఉదయమున, మన చిన్న పిల్లలు ఇప్పుడు బయటికి వచ్చుటను నేను చూచుచునాన్ను. ఇప్పుడు చిన్న బాలురును మరియు బాలికలును మీరు రావలయునని అనుకొనుచున్న ఎంతమందియో అందరును ఇక్కడకు ముందర రావచ్చును. మా యొద్ద ఐదు లేక ఆరు ఖాళీ సీట్లు కలవు. మీరు ఇక్కడికి నేరుగా రావలయుననియున్న యెడల మీరాకను మేము ఆనదించుచున్నాము. మీరు ఇక్కడికి చిన్న నాటకమునకు సరైన సమయములో లోనికి వచ్చుచున్నారు.

మరిప్పుడు నేను ఆ విధముగానే ఈ యొక్క సమాచారమును సేకరించియున్నాను, దానిని నేను కనుగొన్నాను. ఎవరైనను చూపుటకు మరి చెప్పవచ్చును, ''సరి, నేను ఆ భాగమును బైబిలులో ఎప్పుడును చదువలేదు.“ కాని, మీరు చదివియున్న యెడల, చరిత్ర దానిని ఎత్తి చూపుచున్నది, మీరు చూశారా. కావున, కథ అంతయు అదియే, అయితే ఇది ఒక చిన్న నాటక రూపములో ఇవ్వబడియున్నది.

32

మరి, కావున అది అంతే! అదంతే! అది నా యొక్క చిన్న సహోదరుడా? ఓ, అతడు నిజముగా నీవలెనే యున్నాడు! మరియు అతను ఒక మంచి బాలుడు, అతను ఆ విధముగానే వున్నాడనీ నీవు చెప్పవచ్చును, సరి.

ఇప్పుడు, మీరు ఇక్కడికి వచ్చి మరి కూర్చొనవలయునని యున్నారా? అక్కడ ఇరువురు చిన్న బాలికలు లేక ముగ్గురు చిన్న బాలికలు. మై, అది చాలా చక్కగా మరి సొగసుగా యున్నది! ఇప్పుడు ఈ యొక్క చిన్ని కథ చిన్న బాలికలకు మరియు బాలురకు నేను కోరుచున్నాను. శ్రీమతి కొలీన్స్, అక్కడున్నది మీరు అనుకొనుచున్నాను, మరియు ఆ ఇంకొక చిన్న సహోదరి, మీరు అక్కడికి పోవలయుననియున్నారా, ప్రియమైన వారలారా, మరి కూర్చొనుడి. అవును, అక్కడొక ఖాళీ స్థలము ఉన్నదని నేను అనునకొనుచున్నాను, ఆ గౌరవింప తగిన స్త్రీ ఆమెయొక్క సాకెట్ పుస్తకమును జరిపిన యెడల మరియు పిదప ఇక్కడ ఒక రెండు సీట్లు ఉన్నవి.

ఈ యొక్క చిన్న బాలురును మరియు బాలికలందరును ఇక్కడ ముందు ఉండవలయునని నేను కోరుచున్నాను, దానివలన నేను వారితో మాటలాడగలుగుదును. ఇక్కడ, ఇక్కడ మేము కొన్ని కుర్చీలను కలిగియున్నాము. మీరు కుర్చీలను పొందులాగున మేము చేయుదుము. అవునయ్యా. ఇక్కడ కొందరు సహాయము చేయుదురు, కావున మేము ఎవరిని విడువము. ఇది చిన్న బాలురకును మరియు బాలికలకు, వారిని ఉండనిమ్ము. ఓ, మై! అది చక్కగా లేదూ? ఇప్పుడు అది.... సహోదరుడు నెవిల్ మీరు ఇంకా కొన్ని ఏర్పరచవలెను, ఇంకొక ఇరువురు వచ్చుట నేను చూచుచున్నాను. మరప్పుడు అది చాలా బాగున్నది!

ఇక్కడ ఎందరు తల్లులు ఉన్నారు? మీ చేతులు పైకెత్తుడి. ఓ, అది అద్భుతముగా ఉన్నది! ఇప్పుడు, అది చాలా బాగున్నది మరియు సొగసుగానున్నది.

33

ఇప్పుడు, మీలో వెనుకనున్న చిన్న బాలికలు, మీ తల్లి సహాయము లేకుండా ఉండగలుగు వారైన యెడల ఇచ్చటికి రావలయునని కోరుచున్నారా, ఇప్పుడే రండి, మరియు మీ తల్లి మిమ్ములను తీసుకొని ఇక్కడికి రావలయునని ఉన్న యెడల ఇప్పుడే రమ్మని చెప్పుడి. ఇది తల్లికి కూడా. సరిప్పుడు.

మేమిప్పుడే ఒక వచనమును చదివియున్నామని, పిల్లలైన మీకు నేను చెప్పుచున్నాను. మీరు నాతో కలసి దానిని గుర్తించుటకు కోరుచున్నారా? మీరందరు నాతో కలసి ఈ యొక్క వచనమును చెప్పదలచుచున్నారా? ఇప్పుడు, అది మనము మాటలాడబోవుచున్న వాక్యము సరి. మత్తయి 16వ అధ్యాయము మరియు 25వ వచనములో ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క చిన్న ... ప్రతి యొక్క బాలుడును మరియు బాలికను, ఈ ఉదయము, ఇప్పుడు నాతో కలసి చెప్పండి. చెప్పండి. ''సరి. మత్తయి [బాలురును మరియు బాలికలును చెప్పుచున్నారు, ''సరి, మత్తయి.], ''16వ అధ్యాయము, 25వ వచనము.“ ఇప్పుడు మీరు నాతో కూడా కలసి చదవండి. ''తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును, ''దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.” దానిని దక్కించుకొనును! అవును, దీనిని మనము మరల చెప్పెదము. ''ఎవరైతే తన ప్రాణమును పోగొట్టుకొనునో, నా నిమిత్తము, దానిని దక్కించుకొనును.“ ఆద్భుతము!

34

ఇప్పుడు, బాలులారా మరియు బాలికలారా, మీకేమిటని తెలియునా? నిజముగా విలువగల అనేక కార్యములు ప్రపంచములో ఉన్నవి. మరి వాటిలో ఒకటి, ఈ రోజు మీతో కూడా ఉన్నటువంటిది, ఆ శరీరములో ఉన్నటువంటి ఆత్మ: మరి అదియే మీకు ప్రపంచములో ఉన్నటువంటి అతి విలువగల కార్యము. తల్లీ! అది సరియేనా? ''ఆమేన్“ అని చెప్పుడి. మీరు కలిగియున్న అతి ముఖ్యమైనది మీ యొక్క ఆత్మయే.

మరిప్పుడు మీరు మీ యొక్క ప్రాణమును కాపాడుకొనిన యెడల, అప్పుడు దానిని మీరు పోగొట్టుకొనెదరు. మరియు మీరు మీ ప్రాణమును పోగొట్టుకొనినయెడల, అప్పుడు మీరు దానిని రక్షించుకొనెదరు — మీరు మీ యొక్క ప్రాణమును యేసుకు పోగొట్టుకొనినయెడల, చూశారా, ఇంకొక విధముగా చెప్పవలయుననిన మీరు గనుక యేసును నమ్మినయెడల, మీరు ఆయనకు శిష్యులగుదురు. మరప్పుడు మీరు గనుక, ఈ విధముగా చిన్న వయస్సులో ఉన్నప్పుడు మీ యొక్క జీవమును యేసుకు ఇచ్చినయెడల, మరల పిదప... ఆయన దానిని నిత్యజీవమునకై కాపాడును. అయితే, మీరు గనుక దానిని ఉంచుకొనిన యెడల, దానిని మీరు పోగొట్టుకొనెదరు; అవును, మీరు దానిని పోగొట్టుకొనెదరు. మీరు గనుక ఈ ఇతర చుట్టు ప్రక్కలనున్న బాలికవలె మరి బాలురవలె ప్రవర్తించి, మరి బయటికి వెళ్ళి మరి వారు చేయునట్లు చేసినయెడల, అప్పుడు మీరు, దానిని పోగొట్టుకొనెదరు. అయితే మీరు గనుక మీ జీవితమును యేసుకు ఇవ్వదలచినయెడల, అప్పుడు దానిని మీరు సదాకాలమునకు మరి నిత్యముగా దక్కించుకొనెదరు.

35

ఇప్పుడు, మీర గుర్తుంచుకొనుడి, ఇప్పుడు ప్రపంచమంతటిలో మిగుల నిజమైనది ఏదనగా, మీ యొక్క చిన్న ఆత్మ. మరి దానిని మీరు ఉంచుకొనిన, దానిని మీరు పోగొట్టుకొనెదరు; మీరు గనుక యేసుకు ఇచ్చినయెడల, దానిని మీరు కాపాడుకొనెదరు. దానిని మీర నాతో చెప్పగలరా?... చెప్పిన, ''దానిని ఉంచుకొనిన, [బాలురును మరియు బాలికలును చెప్పుచున్నారు.] ''దానిని నేను పోగొట్టుకొనెదను; మరియు నేను దానిని యేసుకు ఇచ్చినయెడల, దానిని నేను దక్కించుకొనెదను.“ అదంతే! ఇప్పుడు మీరు దానిని గ్రహించియున్నారు. అది సరియే కదూ...

బాగున్నదని తలంచు తల్లులందరును, ''ఆమేన్“ అని చెప్పుడి. ఓ, అది బాగున్నది! అది మంచిది.

ఇప్పుడు, మీరు చూడుడి, మీరు చేయగలిగిన కార్యము ఒకటున్నది. ఇప్పుడు, మీరు ముందుకు సాగుడి. వారు గనుక ఆ విధముగా ప్రవర్తింపగోరినయెడల, మరి ప్రపంచ అవసరములు కావలయునని కోరినయెడల... ఒక వేళ బాలురును మరియు బాలికలును బయటికి అక్కడికి వెళ్ళి తప్పైన కథలు చెప్పుచు, మరి తప్పైన కార్యములు చెప్పుచు, చెడు కార్యములు చేయుచు, మరి మోసగించుచు మరియు దొంగిలించుచు, మరి చెడ్డ కార్యములు చేయుచు మరి పాఠశాలలో కాపీ కొట్టుచు మరియు అటువంటి కార్యములు చేయుచున్నయెడల పోనిమ్ము; వారు పోగొట్టుకొనెదరు. దానిని వారు పోగొట్టుకొనెదరు. అయితే వారు గనుక దానిని యేసుకు ఇచ్చినయెడల, దానిని వారు చేయరు, మరప్పుడు వారు దానిని దక్కించుకొనెదరు. అదే మీరు చేయవలెనని కోరుచున్నారు. అది సరియే కదూ?

36

ఇప్పుడు మనము మనయొక్క చిన్న కథను ఆరంభించనైయున్నాము. ఇప్పుడు, అది మన వెనుకటి గాథ. ఇప్పుడు, మీరు దానిని గుర్తుంచుకొనుడి. ఇప్పుడు మనము మన చిన్న కథను ఆరంభించెదము. ఇప్పుడు, వృద్ధులు, మరియు తండ్రులు మరియు తల్లులు, మీరు కూడా వినుడి; ఇప్పుడు పత్యేకముగా తల్లులైన మీరు మరియు తండ్రులు. ఇప్పుడు.... మరి మనము ఆరంభించెదము. మీరు చిన్న కథలను ఇష్టపడెదరా? మీకిష్టమా? ఓ, నేను వాటిని ఇష్టపడెదను! ప్రత్యేకముగా ఇప్పుడు... సత్యము కాని అనేక కథలను మీరు చదివెదరు. అయితే ఈ యొక్క కథ సత్యమైనది, దానిలోని ప్రతియొక్క వాక్యమును, పరిపూర్ణముగా సత్యము అది దేవుని యొక్క బైబిలులో యున్నది, కావున అది సత్యముగా ఉండవలయును, చూడుడి, ఏలయనగా అది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము సత్యమైయున్నది.

37

''ఇప్పుడు, మీకు తెలియునా,“ చెప్పెను, ''నేను చాలా అలసటగా యున్నాను. నేను చనిపోవునంతటి అలసటతో యున్నాను.”

''సరి,“ చెప్పెను, ''నీవు పైకి వెళ్ళి నిద్రపోకూడదా? మంచముపై నిద్రపో, సోఫా అక్కడ పైన యున్నది, మరి పడకకు పొమ్ము.

అతను చెప్పెను, ''అయితే, ఓ, నేను చాలా అలసటతో యున్నాను.“ అతను చెప్పెను, ''ఓ, తేనె, నీవు గనుక ఈ రోజు నేను చూసినది గనుక చూసియున్నయెడల! ఓ, నేను.... మంచిది, నాకు ఈ రాత్రి భోజనము అక్కర లేదు! ఓ, ఈ రోజు నేను చూసిన దృశ్యము చాలా భయంకరమైనది!

''సరి, ఏమిటి, నీవు చూసినది ఏమిటి?“ అని అడిగెను.

చెప్పెను, ''నేను పిల్లల ముందు దానిని నీకు చెప్పలేను, ఓ, అది చాలా భయంకరమైనది! మై, అది చాలా దుష్టమైనది అని చెప్పెను.

''సరి, నీవు చూసినది ఏమిటి?“

''సరి, నేను పైకి వెళ్ళి కొంచెం సేపు నిద్రపోయెదను, మరియ పిమ్మట మరి రాత్రి భోజనము ముగించిన పిదప, మనము బిడ్డలను పడకలో నిద్ర పుచ్చిన పిదప, అప్పుడు ఈ రోజు ఏమి జరిగినదని నేను నీకు చెప్పెదను.“ ''అది సరి,” అని ఆమె చెప్పెను.

మరి అతడు పైకి వెళ్ళెను. అతను నిద్రపోయెను. ''ఓ, చాలా అలసటగా యున్నది! ఓ, మై! మీకు తెలుసునా, తండ్రి అలసటగా యున్నప్పుడు ఎట్లుండునని, నిజముగానే అలసటగా ఉన్నాడు.

38

మరి కొద్దిసేపైన పిదప, చిన్న మెరిసే కండ్లతో బాలిక, నేలపై చుట్టును పరుగెత్తుచుండెను, మరియు అరచుచు మాటలాడుచుండెను. ''దానిని చేయవద్దు. తండ్రిని లేపివేయుదువు అని చెప్పెను మరియు, ఓ, అతను చాలా అలసటగా ఉన్నాడు. ఎంతటి అలసట అనగా అతను చనిపోవలయునంతటి అలసట. అతను ఇక నుండి జీవింపదలచలేదు. మరియు తండ్రి ఆ విధముగా ఆలసటతో ఉన్నప్పుడు, సరి, అతను కొద్దిసేపైనను నిద్రించుటకు మనము అవకాశమియ్యవలెను. అతనిని లేపవద్దు.“ మరి చిన్న మిర్యాము, అవతలి ప్రక్కకు వెళ్ళి, నెమ్మదిగా కూర్చుండెను.

మరి కొద్దిసేపైన పిదప ఆమె రాత్రి భోజనమును సిద్ధపరచి మరియు పైకి వెళ్ళి మరి ఆమె ''అమ్రాము?“ అని అతనిని పిలచెను.

మరతను చెప్పెను, ''ఇదిగో, ప్రియమైన యాకెబెదు, నేను క్రిందికి వచ్చుచున్నాను.“ కావున వారు క్రిందికి దిగి వచ్చి మీకు తెలియునా, మరియు వారు చక్కగా భుజించిరి.

39

కావున, వారు భుజించిన పిదప, మరియు చిన్న బాలుడును, మరియు చిన్న బాలికను వారు భుజించిన తరువాత తల్లి అన్నిటిని సర్ది మరి వారిని పడుకలో నిద్రింపజేసెను.

మరియు ఆమె గదిలోనికి వెళ్ళెను, ఆమె మరియు ఆమె భర్త, మరి వారు కూర్చుండిరి. ''సరి, ఇప్పుడు ఈ రోజు నీవు చూసింది ఏమిటి, అమ్రాము, అది నిన్ను ఈ రాత్రి అంత కలవరపరచినది, నీవు జీవించుటకు కూడా ఇష్టపడకపోతివి?“ అని అడిగెను.

''ఓ,“ అతను చెప్పెను, ''ప్రియులారా, నేను దానిని నేను అర్ధము చేసికొనలేకున్నాను” అని అతను చెప్పెను. ''నేను చూచాను ..... సరి, మనము ప్రతి దినమును చూచుచున్నాము, అయితే ఈ దినమున ప్రత్యేకముగా ఉండెను“ అని చెప్పెను. ''ఓ, నేను ఇంతకు మునుపు చూడనటువంటి ఘోరమైన దృశ్యమును చూశాను” అని చెప్పెను. ''మన బీద బాలురు, వారిలో కొందరు ఇరవై సంవత్సరముల వయస్సు కూడా నిండనివారు, ఆ పెద్ద పాత బండిని తను గొంతుల చుట్టు త్రాడు కట్టుకొని లాగలేక లాగుచున్నాడు. మరియు ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న బీద బిడ్డలు దానిపై పెట్టియున్న పెద్ద రాళ్ళు లాగుచుండగా, వారు దానిని ఇక ముందుకు లాగలేకపోవునంత కఠినముగానున్నది. మరియు అప్పుడు ఆ పెద్ద బండి నెమ్మదిగా పోవుచు మరి కొద్ది సేపటికి కీచుమని శబ్దము చేయుచు నిలచిపోయినది. అప్పుడు దారి పొడుగున వారిని వెంబడించుచు వచ్చుచున్న ఒకడు మితి భ్రమించిన వాడివలె, అతడు గర్జించుచు, ఈ బండిని మీరు ఎందులకు నిలిపివేశారు? వామ్! ఆ యొక్క పెద్ద పాము వలె చుట్టియున్న బలమైన త్రాడుతో వారి వీపుల వెనుక ఝులిపించగా, మరి రక్తము వారికి వెనుక నుండి కారుచుండగా మరి ఆ విధముగా క్రింది వరకు అది కారుచుండెను. మరియు ఆ బీద బిడ్డలు ఈ యొక్క త్రాడుకు వ్రేలాడుచున్నారు మరియు కేకలు వేయుచున్నారు.“

''ఓ, యాకెబెదు! తల్లీ మనమేమి చేయగలము?“ అని అడిగెను, ''మనము దేవుని యొక్క బిడ్డలము. దేవుడు మనలను ఆశీర్వదించియున్నాడు. మనము అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు బిడ్డలము. మరియు ఈ యొక్క కార్యములకు ఇక్కడ ఎందులకు మనము బానిసలముగా ఉండవలయును? ఓ, ఆ యొక్క పేద బాలురు కేకలు వేయుట చాలా ఘోరముగా ఉన్నది. ఓ, మరి నేను ప్రార్ధించుచున్నాను మరియు నేను ప్రార్ధించుచున్నాను, యాకెబెదు, మరి దేవుడు నా ప్రార్ధన ఆలకించుట లేనివానిలా కనిపించుచున్నది. నేను ప్రార్ధించుచున్నాను మరి నేను ప్రార్ధించుచున్నాను మరి ఆయన నాకు చెవినియ్యకున్నాడని అగుపించుచున్నది, ఆయన మరి నా ప్రార్ధన వినుటయే లేదు. ఆయన మరి ఇక శ్రద్ధ చూపునట్లుగా అగుపించుచున్నది,” అని అడిగెను.

''ఇప్పుడు,“ ఆమె చెప్పెను, ”అమ్రాము, చూడుము, ఇవి నీ పలికే మాటలుగా లేవు. నీవు ఒకా నిజమైన తండ్రివి, మరి నీవు.... అది పలుకుటకు నీవనిపించుట లేదు, ఏలయనగా నీవు ఎల్లప్పుడు మమ్ములను ఉత్సాహపరచుచు, దేవునియందు విశ్వాసముంచుడి అని మాకు చెప్పుచుందువు.

''ఓ, అయితే, ప్రియతమా, నేను మరి అంత ఎక్కువగా ప్రార్ధించినను మరి దేవుడింకను నా ప్రార్ధన వినకున్నాడని అనిపించుచున్నది, మరి పరిస్థితి ఇంకా దిగజారిపోవుచున్నట్లుగా కనిపించుచున్నది. నేను అధికముగా ప్రార్ధించను, ప్రార్ధించను పరిస్థితి ఇంకనూ అధ్వాన్నముగా మారుచున్నది.“

40

అయితే, చిన్న బాలకులారా మరి బాలికలారా, దేవుడు ప్రార్ధనలను వినునా? [బాలురును మరియు బాలికలును చెప్పుచున్నారు, ''ఆయన ప్రార్ధనలను వినును.] ఆయన ప్రార్ధనలను వినును. దేవుడు ఆ ప్రార్ధనకు బదులిచ్చునా? [''అవును.“] అవును. ఆయన త్వరగా బదులిచ్చునా? అన్ని సమయములలో కాదు. ఆయన చేయునా? లేదు. కొన్నిసార్లు ఆయన మనలను వేచియుంచును. అది నిజమేనా? [”అవును.“] అయితే, దేవుడు ప్రార్ధనకు బదులిచ్చును. ఆయన బదులిచ్చును కదా? మరి సమస్తమును వ్యతిరేకముగా పోవుచున్నందువలన అది మనము ప్రార్ధనను విడువలయునన్న సూచన కాదు. ఏది ఏమైనను మనము ప్రార్ధించుచునే యుండవలయును, మనము ఆ విధముగా చేయుట లేదా? అది సరి. ఇప్పుడు మీరు సరిగా బదులిచ్చియున్నారు. దేవుడు ప్రార్ధనకు బదులిచ్చును. మనమందరమును కలసి దానిని చెప్పెదము. [సహోదరుడు బ్రెన్హాం మరియు సంఘమంతయును చెప్పుచున్నారు, ''దేవుడు ప్రార్ధనకు బదులిచ్చును.] అవును. చుట్టు ప్రక్కల ఆ పరిస్ధితులు ఎట్లున్నను, ఏమైనను ఆయన బదులిచ్చును. అది సరి.

''సరి, నీవు మరల పైకి వెళ్ళి ప్రార్ధించుచున్నావా?“

''అవును.“ మరియు తండ్రికి అటకపైన ఒక రహస్యపు గది కలదు, అచ్చటికి అతను ప్రార్ధించుటకు వెళ్ళెను. కావున, అతడు ఆ రాత్రి అక్కడి నుండి లేచి అతడు ప్రక్కగా మోకాళ్ళూని, అతను చెప్పెను.... ఇప్పుడు అతను చెప్పెను, ''యాకెబెదు, ఇప్పుడు నీవు పండుకొనుటకు పొమ్ము, నీవును బిడ్డలును, ఏలయనగా నన్ను ఆటంకపరచవద్దు, ఒక వేళ నేను ఈ రోజు రాత్రంతయును ప్రార్ధింపపబోవుచున్నాను.”

41

కావున, అతను తన మోకాళ్ళూని, మరి అతడు ప్రార్ధించెను, మరియు అతను ప్రార్ధించెను. అతన చేతులు పైకెత్తి మరిట్లు చెప్పుటను నేను చూచుచున్నాను, ''ఓ, అబ్రాహామ, ఇస్సాకు, మరియు యాకోబు దేవుడా, మీ యొక్క జనులకు మారు చేసిన వాగ్దానమును గుర్తుంచుకొనుము! ఇక్కడ మేము ఐగుప్తులో బానిసత్వములో ఉన్నాము. మరియు, ఓ, మాకు పని చెప్పువారు కఠినమనవారై మమ్ములను పని చేయి౦చుచు, మరియు మమ్ములను కొట్టుచున్నారు, మరియు మా బీద జనుల గుడ్డలు విడదీసి, కొయ్యతో కొట్టుచున్నారు. మరి మేము మీ యొక్క జనులము. ఓ, దేవుడా, నిశ్చయముగా మీరు మా యొక్క ప్రార్ధనలను వినుము! నిశ్చయముగా మీరు మా యొక్క ప్రార్ధనలకు బదులిచ్చెదరు! మరి నేను ప్రార్ధించుచున్నాను, మరి నేను ప్రార్ధించుచున్నాను, మరి నేను ప్రార్ధించుచుచున్నాను, మరి మీరేమో నాకు బదులివ్వనట్లు కనిపించు చున్నది. అయితే, దేవుడా, మీరు దేవుడని, మరియు మీరు చివరగా ప్రార్ధనకు బదులిచ్చెదరని నేను నమ్ముచున్నాను.“ మరియు అతను ఆ విధముగా ఇంచుమించు రాత్రంతయును ప్రార్ధించెను.

42

మరియు మరసటి దినపు ఉదయకాలము సుమారు మూడు లేక నాలుగు గంటలకు చిన్న మెట్లు దిగి అతను చెప్పెను, అతను అక్కడ చూచినపుడు మరొక్కడ అతని చిన్న చక్కటి భార్య, చిన్న యాకెబెదు ఉండెను. ఆమె పడకపై పండుకొని నిద్రించుచుండెను. మరియు చిన్న అహరోను మరియు చిన్న మిర్యాము వారు ఇంతకు మునుపే నిద్రపోయినందువలన, వారికి సృహ లేనంతగా నిద్రించుచున్నారు. సరి, అతను, ఆమెతో చెప్పెను... “ఇప్పటికి చాలా ఆలస్యమైనది, మరి నీవు ఇప్పుడే లోనికి వచ్చితివా?” అని ఆమె అడిగెను.

“అవును, నేను రాత్రంతయును ప్రార్ధించితిని.” అతడి కన్నులు కన్నీటితో మరకలాయెను, ఏలయనగా అతను జనుల కొరకు రాత్రంతయు మొరపెట్టెను.

మరియు ఆమె అడిగెను, “ఇప్పుడిటు చూడుము, అమ్రాము, దాని కొరకు నీవు అంత కష్టపడవలదు.”

“ఇప్పుడు, అతను చెప్పెను, ”ప్రియమైనదానా, వినుము, అది మంచిది, అయితే ఇప్పుడు చూడుము. నీవు పెంచవలసిన ఇరువురు బిడ్డలు నీకు గలరు, మరియు వారి బాధ్యత నాపై ఉన్నది. ఎవరైనను మనయొక్క ప్రజలకొరకు ప్రార్ధించనియెడల, వారి గతి ఏమగును? హృదయములో జనుల గురించి భారము ఎవరికైనను లేనియెడల ఏమి జరుగును? ఎవరైనను ఒకరు ప్రార్ధించవలయును.“

“సరి,” ఆమె చెప్పుచున్నది, “ఆమ్రాము, బాధ్యత నీ ఒక్కనిదే కాదు.”

“సరి, అది అలాగుననే అగుపించుచున్నది. మరి ఏమైనను, నేను ప్రార్ధింపబోవుచున్నాను, ఎట్లన్నను, ఎల్లప్పుడును ప్రార్ధింపబోవుచున్నాను!”

43

ఆ రోజు అతడు ఉద్యోగమునకు వెళ్ళిపోయెను. మరియు ప్రతిరోజును అతను ఉద్యోగమునకు పోవుచుచున్నాడు మరి అదే విధమైన శ్రమలు. మరియు అతనికి ఒక కష్టమైన పని. వారు సున్నమును పెద్ద అచ్చులలో పోయుదురు. మరి అతడు ఆ యొక్క పెద్ద కొలిమి యొద్ద నిలుచు కొనవలయును. మరియు వారు దానిని తెరచునపుడు, ఆ యొక్క విపరీతమైన వేడిమికి అతని చర్మమంతయును బొబ్బలవుట వలన అతను బాధుపడును! అతను మరల ఆ ఇటుకలను దానిలోనికి త్రోయును మరియు వాటిని కాల్చి, గొప్ప పెద్ద రహదారులు మరియు విగ్రహ దేవతలకు గొప్ప, పెద్ద, ఎత్తైన గోపురములు మరియు సమస్తమును కట్టుటకు ఆ ఇటుకలను బయటికి తీసికొనివచ్చును. మరియు ఈ యొక్క నిజమైన క్రైస్తవ మనుష్యుడు శత్రువు కొరకు అటువంటి పరిస్థితులలో పని చేయుచున్నాడు. అయితే అతడు ఒక బానిస, అతను బానిసత్వములో ఉన్నాడు. దానిని అతడు చేయవలయును.

మరియు ప్రతి రాత్రియును అతను ఇంటికి వచ్చిన పిదప అతను ప్రార్ధించును. మరియు అతను మరల మెట్లపైకి వెనక్కి మరి ప్రార్ధించుచు మరియు ప్రార్ధించును మరియు ప్రార్ధించును, మరియు క్రిందికి తిరిగి వచ్చును. పరిస్థితి ఏమి బాగుపడకున్నది, ఇంకను దిగజారిపోవుచున్నట్లుగా కనిపించుచున్నది.

44

మరియు ఒక రోజు పనిచేయు చోట అతను ఒక పుకారు వినెను. అడిగెను, “అదేమిటి? అదేమిటి? నాకు చెప్పుడి!” ఒకరికొకరు గుసగుసలాడు కొనుచున్నారు. కొద్దిసేపైన పిదప, ఆ రోజు ముగియు లోపల, అది దేశమంతయును వ్యాపించెను.

ఏమి జరుగనైయున్నదని. అదేమిటి? ఒక ఆలోచన సభ, ఆ రోజు రాత్రి కూడనైయున్నది. వృద్ధుడైన రాజు ఫరో, వృద్ధుడైన దుర్మార్గుడైన రాజు తన జనులను ఒక్కటిగా పిలచి మరి ఇంకొక పెద్ద ఆలోచన సభ పెట్టబోవుచున్నాడు. కావున, వారికి ఈ యొక్క పెద్ద ఆలోచన సభ అక్కడ కూడనైయున్నది.

45

కావున, ఆ రోజు రాత్రి అతను చాలా కృంగినవాడై ఇంటికి వెళ్ళెను. అతను లోనికి వెళ్లెను, మరియు అతని భార్య చెప్పెను, “ప్రియమైన అమ్రాము” ఆమె అతనిని ద్వారము యొద్దనే కలిసి మరియు అతనిని ముద్దాడి మరి చెప్పెను, “నేను నీకు మంచి వేడిగా రాత్రి భోజనము సిద్ధపరచియున్నాను. అయితే, నీవు చాలా వెలవెల పోయినట్లు కనిపించుచున్నావు. కారణమేమిటని” అడిగెను?

“ఓ, యాకెబెదు, ఏమి జరుగుచున్నదని నీకు గనుక తెలిసినయెడల! ఓ, అది ఇంతకు మునుపు కంటెను చాలా భయంకరమైనదని” చెప్పెను.

“ఏమిటి?”

“ష్ .... దానిని చెప్పలేకున్నాను, పిల్లలు ఇక్కడ ఉన్నారు. రాత్రి భోజనము ముగించు వరకు కాచుకొనియుండుము, మరి దానిని గురించి నేను నీకు చెప్పెదను.”

“సరి.”

కావున ఆమె భోజనమును సిద్ధపరచి అందరికి భోజనమును పెట్టటం ముగించి మరియు పిల్లలను నిద్రింపజేసెను.

కావున, వారు లోనికి వెళ్ళిరి. “యాకెబెదు, నేను నీకు ఒక కార్యమును చెప్పదలచియున్నాను” అని చెప్పెను. “బహు భయంకరమైన కార్యము ఒకటి సంభవించుచున్నది.”

“ఏమిటి?”

“ఈ రోజు రాత్రి వారు ఇంకొక ఆలోచన సభను ఏర్పరచనైయున్నారు. మరియు వారు దానిని చేసినయెడల, వారు ఇంకను అధికముగా శ్రమలను జనులపై పెట్టబోవుచున్నారు” అని చెప్పెను.

46

కావున, మనము రాజు యొక్క గృహమునకు పోయెదము. రాజైన ఫరో అందరిని అక్కడ కూడులాగున చేసియున్నాడు, మరి అడిగెను, “దళపతులు, సేనాధిపతులు మీరందరును సరియా! ఇక్కడ ఏమి జరుగుచున్నది? ఈ చుట్టు ప్రక్కల నేను ఆజ్ఞలు ఇచ్చుచున్నాను! ఈ యొక్క జనులు ఎల్లప్పుడును పెరుగుచునే ఉన్నారు! కారణమేమిటి? మనము దీనిని నివారించలేమా?” చెప్పెను. ''ఒక రోజు ఇక్కడ ఇంకొక సైన్యము వచ్చును. మరియు గోషెనులో నున్న మన శత్రువులందరును ఈ యొక్క ఇశ్రాయేలీయులు, ఈ సైన్యముతో చేరుకొని మరియు వారు మనలను జయించి వేయుదురు. మరియు మనయొక్క ఆర్ధిక స్థితియంతయును బలహీనపరచి, మన యొక్క గొప్ప రాజ్యము నశింపబడును. వారు మనలను వశపరచుకొందురు. మీకు ఏమైనది? ఎవరైనను, పలుకుడి! మీకు ఏదైనను పరిష్కారము చెప్ప తెలియదా? ఓ, అతను చాలా నీచముగా మరి అసహ్యముగా ఉన్నాడు. సైన్యాధిపతులందరును వణకుచున్నారు.

వారిలో ఒకడు లేచి, మరి చెప్పెను, “రాజైన ఫరో చిరకాలము జీవించును గాక.”

“సరి, చెప్పుము నీవేమి చేయనైయున్నావు!”

చెప్పెను, “రాజు దీర్ఘాయుష్షుభవ. మహోన్నతమైనవారలారా,” అని చెప్పి ''మీరు ఇంకను అధికమైన శ్రమలు జనులపై పెట్టవలయునని నేను కోరుచున్నాను“ అని అతను చెప్పెను.

“నీకు కండ్లు గ్రుడ్డివైనాయా? మీరు ఇదివరకే అధికమైన బరువును జనులపై పెట్టియున్నారు, మరయినప్పటికిని వారు అధిక సంఖ్యలో పెరుగుచు పోవుచున్నారు. అదియే నీ యొక్క ఆలోచన అయినయెడల, దానిని నీ యొద్దనే ఉంచుకొనుము!” ఓ, అతను చాలా కోపముగా ఉన్నాడు.

47

కొద్ది సేపైన పిదప తన ముఖములో పెద్ద, గొప్ప నవ్వుతో ఒక దయ్యమువలె ఒకడు లేచెను. మరియు అతను చెప్పెను, “రాజైన ఫరో చిరకాలము జీవించును గాక.” “నా యొద్ద ఒక ఆలోచన కలదు” అని పలికెను.

“సరి, చెప్పుము! ఆ విధముగా ఊరక నిలుచుకొనవద్దు!” అని అడిగెను.

అతను చెప్పెను, “మీరేమి చేయగలరో దానిని నేను మీకు చెప్పెదను.” “మీకు తెలియను, ఈ యొక్క జనులు చాలా వేగముగా విస్తరించుచున్నారు” అని చెప్పెను.

“అవును అది సరియే!” చెప్పెను, “వారిలో కొందరికి పదునాలుగు పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని సమయములలో వారు ఇరవై పిల్లలను కూడా కలిగియున్నారు. మరి మన జనులకు ఒక బిడ్డ కూడా లేకుండాయున్నారు. వారు చాలా వేగముగా పెరుగుచు పోవుచున్నారు, వారు దేశమంతటను విస్తరించుచున్నారు” అని పలికెను.

చూశారా, దేవుడు ఏదో కార్యమును చేయుచున్నాడు. చూడుడి, దేవుడు ఎల్లప్పుడును దయ్యము యొక్క కండ్లను కప్పివేయును, మీరు చూడుడి. చూశారా. ఆయన ఏమి చేయుచున్నాడో ఆయన ఎరిగియున్నాడు, చూశారా. మరి ఈ యొక్క స్త్రీలందరును చాలా మంది పిల్లలను కలిగియున్నారు.

48

“ఎందులకు,” అతను చెప్పెను, “రాజు చిరకాలము జీవించును గాక!” సరి, ఏమిటని నేను మీకు చెప్పెదను. “ప్రతి ఒక్కొక్క సారి ఒక స్త్రీకి చిన్న మగపిల్లవాడు జన్మించినపుడు.... ఇక్కడున్న ఈ ప్రాంతములోనికి పోయి గొడ్రాల్లాంటి కొందరు స్త్రీలను ఏర్పరచుకొని, మీరు చూశారా, బిడ్డలు లేని స్త్రీలు, బిడ్డలు వద్దని కోరుకొను స్త్రీలు, మరి బిడ్డలను ప్రేమించనటువంటి స్త్రీలు, వృద్ధులై పొడుగైన ముక్కు కలిగి యున్న మాంత్రికులు. చూడుడి, ముక్కు ఎంత పొడవుగా ఉన్నయెడల అంత మంచిది! పాత, పొడుగైన వ్రేళ్ళు, రంగుపూసికొన్న ముఖములు కలిగిన మరి వారిన తీసికొని రండి. వారికి తల్లి ప్రేమ అనగా ఏమిటో తెలియదు. కావున ఒక చిన్న మగ బిడ్డ పుట్టినపుడు, వీరు అచ్చటకు వెళ్ళి మరి ఆ చిన్న బ్డిడను బయటికి తీసికొనివచ్చి, అతని తలను గోడకువేసి కొట్టి, మరియు పిదప తల్లియొద్ద దానిని పారవేయవలెను. ఒక పెద్ద బావిలో అతనిని పారవేయవలెను. ఓ, దాని కంటెను మేలైనది, అతనిని బయటికి తీసికొనివచ్చి, అతని చేతులను, కాళ్ళను కట్టివేసి, మొసళ్లు బాగా బలిసిపోవులాగున అతనిని మొసళ్లకు పారవేయవలెను. దానిని తొలగించు మార్గము అదే. అప్పుడు వారు అధికముగా పెరుగలేరు, ఏలయనగా ఏ మగవారును మిగిలియుండరు — ప్రతి పుట్టే చిన్న మగ పిల్లలను చంపివేయవలెను.”

“ఓ,” ఫరో చెప్పెను, “అది బాగున్నది! అది ఒక మంచి ఆలోచన!” దయ్యము ఏమిటని చూశారా? అతను దుర్మార్గుడు, అతనట్లే కదూ? చెప్పెను, “కావున చేయవలసిన కార్యము అదే! పోయి తీసికొని.... ఇప్పుడు, నీకు ఈ ఆలోచన కలిగినందువలన, దానిని పరామర్శించు పై అధికారిగా నిన్ను నేను నియమించుచున్నాను. నీవు వెళ్ళి నీకు తెలిసిన ఎన్నడునూ తల్లులు కాని, మరియు పిల్లలను ప్రేమింపని వృద్ధులైన స్త్రీలందరిని తీసికొనిరమ్ము.”

చూశారా, ఒక బిడ్డను తల్లి మాత్రమే ప్రేమింపగలదు. మిమ్ములను మీ తల్లి ఎట్లు ప్రేమించినదో మీకు గుర్తున్నదా? సరి, చూశారా, తల్లి చిన్న బిడ్డలను ప్రేమించును.

49

అయితే వారు బిడ్డలే లేని, బిడ్డలు అక్కర లేదని కోరువారిని, నీచమైన వృద్ధులైన స్త్రీలను తీసికొని రావలసియుండెను. మరియు చెప్పెను, “వారిని కావలి వారిగా చేయుడి. మరియు వారిని కావలివారిగా చేసినయెడల, వారు వారికిచ్చిన అజ్ఞల ద్వారా, వారు కోరుకొను ఏ ఇంటికైనను పోయి, ప్రతి యొక్క చిన్న బిడ్డను బయటికి తీసికొని వచ్చి మరియు ఒక గోడకు దాని తలను కొట్టి మరి దానిని తినుటకు మొసళ్లకు వేయవలెను. ప్రతి యొక్క చిన్న బిడ్డను!” ఓ, ఎంత క్రూరముగా ఉన్నది! అప్పుడు వారేమి చేసియున్నారో మీకు తెలియునా?

“అది సరి, అది బాగున్నది!”

50

అటు తరువాత దినమున అమ్రాము అక్కడ పని చేయుచుండగా, అతను దాని యొక్క ఆజ్ఞలు జారీ చేయుటను వినెను.

మరియు, ఓ, అతను ఇంటికి వెళ్ళెను. అతను చెప్పెను, ఓ, యాకెబెదు! ఓ, ప్రియమైనదానా, నేను నీకొక కార్యము చెప్పనిమ్ము. నీకు తెలియునా, ఏ విధమైన ఆజ్ఞలు ఇవ్వబడినవోయని? ప్రతి యొక్క చిన్న బిడ్డలందరిని చంపివేయవలెనని. మరియు అతను, ఆమెకు చెప్పెను, “ఓ, దానిని నేను భరించలేకపోతున్నాను. మరల అతను పైకి వెళ్లెను, ప్రార్ధించుటకు. ఆ రాత్రి ఇంతకు మునుపు అతను ప్రార్ధింపని విధముగా ప్రార్ధించెను.

మనము ప్రార్ధించుచుండవలయునా? ఓ, ప్రార్ధించుచుండుము! అది సరియేనా? ఏమి జరుగుచున్నప్పటికిని, ప్రార్ధించుచునే యుండుము. ప్రార్ధించుచునే యుండుము!

ఇప్పుడు, అతను వేసిన మొదటి కార్యము, మీకు తెలయునా? అతను రాత్రంతయును ప్రార్ధించెను, ''ఓ, దేవుడా, దయ కలిగియుండుము! సహాయపడుము, దేవా! మీరు ఏదో విధముగా మాకు సహాయపడవలయునని మేము ప్రార్ధించుచున్నాము.“ పగటివేళలో అతను తిరిగి క్రిందికి వచ్చెను.

51

దినము తరువాత దినము, మరి ఓ, దేశమంతటయును ఎటువంటి ఆక్రందనము! ప్రతి దినమును వారి వీధుల నుండి తల్లుల యొక్క అరుపులు వినుచున్నారు. వారు వారియొక్క చిన్న శిశువులను వారియొక్క చేతుల నుండి తీసికొనుచున్నారు.. లేక, చిన్న మగ బిడ్డలను. ఆ యొక్క వృద్ధ మాంత్రిక స్త్రీలు అక్కడికి పోయి మరి వారి కాళ్ళను పట్టుకొని తలను గోడకు వేసి కొట్టి మరియు వారిని చంపి మరణించిన పిదప వారిని మొసళ్లకు వేయుచున్నారు. దీనురాలైల తల్లి తన మోకాళ్ళూని మరియు ఆమె మొరపెట్టుచున్నది, “ఓ, నా యొక్క బిడ్డను తీసికొనిపోవద్దు! నా యొక్క బిడ్డను తీసికొనిపోవద్దు!” మరియు, ఓ, వారు ఎటువంటి సమయ

మును కలిగియుండిరి!

52

చిన్న బిడ్డలను తల్లి ఏ విధముగా ప్రేమించునో మీకు తెలియునా, ఎట్లు ఆమె అతనిని చుబుకముపై పెట్టుకొనునో. మీకు గుర్తున్నదా, ఏ విధముగా తల్లి నిన్ను తీసికొని మరియు నీకు స్నానము చేయించి, మరి నిన్ను ముద్దాడి, మరి మరి-మరి నీవు ఎంత అందముగా ఉన్నావో అని చెప్పును. మరియు నిన్ను ఎట్లు రాత్రులలో జోకొట్టి నిద్రింపజేయును మరియు, ఓ, ఒకవేళ నీవు..... ఒక చిన్న తలుపు తెరచుకొనును, ఒక చిన్న నీడలాటిది, ఏదో లోనికి వచ్చులాగున్న యెడల, ఓ, మై ఆమె త్వరగా పరుగెత్తి మరియు తలుపును మూసివేసి, చిన్న బిడ్డను మరుగు పరచి మరి మీకు తెలియును ఆ బిడ్డను తీసికొనును. ఆమె మిమ్ములను ప్రేమించెను. చూశారా. ఆమె మిమ్ములను ప్రేమించెను. ఓ, దేవుడు ఆమెకిచ్చిన ఆ చిన్న బీద కార్యమును ఆమె ప్రేమించెను, అది నిస్సహాయ స్థితిలో మరియు తనకుతాను సహాయపడలేని స్థితిలో, కావున ఆమె ఆ యొక్క చిన్న బిడ్డను ప్రేమించెను. మరియు ఆమె తన చిన్న బిడ్డలను ముద్దాడి మరియు వారితో ఆడుకొనుచు, ఏలయనగా ఆమె ఒక నిజమైన తల్లి, చూశారా.

53

అయితే, బిడ్డలను చంపు ఈ యొక్క వృద్ధ స్త్రీలకు తెలియదు తల్లియొక్క ప్రేమ ఏమిటని, వారు తల్లులు కారు. వారు తలంచుకొనునదంతయును, ఈ లోక కార్యములతో మరి సమయమును గడుపవచ్చునని, కావున, వారు లోనికి వెళ్లి ఆ యొక్క చిన్న బిడ్డలను చంపివేయుచున్నారు. మీరు చాలా చిన్నవారుగా ఉన్నందువలన దానిని గురించి గ్రహింపలేరు, అయితే అది ఇంకనూ జరుగుచునేయున్నది. అది సరియే. ఇప్పుడు పెద్దలైన మీరు నేనేమి చెప్పుచున్నానో మీకు తెలియును. అది సరియే, అది అధికముగానే యున్నది! ఓ, మీరు చెప్పవచ్చును, “నేను తీసికొందును....” అయితే గర్భనిరోధకము అదియే. అది సరి, అయితే మీరు చూడుడి తల్లి ప్రేమ అనగా ఏమిటని వారికి తెలియదు. ఇప్పుడు నేను ''నిజమైన తల్లులు!“ అని చెప్పినప్పుడు, నేను ఏ అర్ధముతో చెప్పుచున్నానో మీరు ఎరుగుదురు. అది సరియే. ఏ వ్యత్యాసమును లేదు; అదే దయ్యము! కావున అక్కడ, అప్పుడు మరి సంవత్సరమునకు వెయ్యి వంతులకు వెయ్యి వంతులకు పైగా దానిని గురించి ఆలోచించుడి. అది ఐగుప్తులో ఉన్నదాని కంటెను చాలా అసహ్యమైనది లేక మోసమైనది అక్కడ!

అప్పుడు వారు లోనికి వచ్చి, వారికి తల్లి ప్రేమ లేదు, కావున వారు ఆ చిన్న శిశువులను తీసికొని మరియు వారిని చంపెదరు. ఓ, అది ఆ విధముగా ఘోరముగా మరియు క్రూరముగా అగుచుండెను. మరియు ఒక రోజు ఇంకొక పుకారు వచ్చెను, వారు ఇంకొక ఆలోచన సభను సమావేశపరచనైయున్నారు.

54

ఫరో తన ఆలోచన సభవారినందరిని పిలిచి, వారినందరిని ఒక్కటిగా చేర్చి, మరియు అతను అక్కడికి వచ్చి మరియు చెప్పెను, “అది సరి, వారు ఇంకను పెరుగుచునే యున్నారు! ఇప్పుడు దానిని గురించి మనమేమి చేయుదుము?”

బంకమన్ను గుంటలో వయస్సైన, దయ్యము మూతి కలిగిన అదే పాత మనిషి లేచి మరి చెప్పెను, ''రాజైన ఫరో చిరకాలము జీవించును గాక. నా యొద్ద యోచన కలదు. చూడుము, మీయొద్ద పని చేయు మగవారు కలరు. వరి మొదలగునని కోసిన తరువాత మిగిలియుండు దుబ్బునుపయోగించి వారు ఆవము నుండి ఇటుకలను చేయులాగున ఒక దినమునకు ఇన్ని అని వారిచేత చేయించుచున్నారు. మీరు చిన్న బిడ్డలను మరి అలాగు చంపియున్నారు, ఆయినను వారు పెరుగుచునే యున్నారు. మీరు చేయవలసిన కార్యము స్త్రీలను కూడా పనిలో దించుటయే. మీరు గనుక స్త్రీలను పని చేయులాగున చేసిన, అప్పుడు వారు కాదు....“ ఇప్పుడు, అది స్త్రీ యొక్క స్థానము కాదు. కాదు. కావున అతను చెప్పెను, ”అయితే మీరు గనుక స్త్రీలను పనిలో పెట్టిన, మరి వారిని అక్కడ బయటపెట్టిన యెడల, మరియు వారిని ఇటుకలు చేయులాగున చేయుడి. మరప్పుడు వారు చాలా అలసటతో యుందురు, వారు ఇంటికి వచ్చినపుడు వారు తమ భర్తలకు భోజనము వండలేరు, వారు మంచి తల్లిగా ఉండలేరు, చూశారా. మరియు వారు ఆ విధముగా పనికి వచ్చిన యెడల, కావున వారు దానిని చేయలేరు. కావున, మీరు వారిని కూడా పనిలో పెట్టుడి.“

''అది బాగున్నది! మై నీవు తెలివిగలవాడవు. కావున అతను స్త్రీలనందరిని పనిలో పెట్టెను.

55

మరిక్కడ మీద అమ్రాము, ఆ రాత్రి లోనికి వచ్చెను, చెప్పెను, “ఓ, యాకెబెదు, మనమేమి చేయగలమో నాకు తెలియుట లేదు. ఇప్పుడు వారు స్త్రీలనందరిని పనిలో పెట్టుచున్నారు, వారు కూడా పని చేయవలెను. నేను నీకు చెప్పుచున్నాను, ఓ, ఏమి చేయవలెనో నాకు తెలియుట లేదు! మనము ఉత్త బానిసలము, మరియు మన పరిస్థితి చాలా నీచము కంటే మరియు నీచాతినీచముగా అగుచున్నది. నేను దీనిని ఊహించుచున్నా: దేవుడు మనకు ఏమైనను చేసినయెడల, అది మనమందరమును చనిపోయిన పిదప చేయును.”

ఇప్పుడు, దేవుడు ఆ విధముగా కాచుకొనియుండడు. ఆయన అట్లు చేయునా? కాదు. దేవుడు కొన్ని సమయములో మనలను గమనించును. ఆయన ఆ విధముగా చేయకుండునా? సరి.

కావున మరి ఆ రాత్రి, చెప్పెను, ''నేను ఇదివరకు ఎన్నడును ప్రార్ధింపని విధముగా ప్రార్ధించుటకు పైకి వెళ్ళుచున్నాను!“

ఇప్పుడ, అదే ప్రార్ధించు విధానము. అది ఆ విధముగానే కదూ? నీవు ఇంతకు మునుపు ప్రార్ధించని విధముగా ప్రార్ధించుము, నిజముగా రంగములోనికి దిగుము! చూడుడి, నీవు ఊరక పైకి వెళ్ళి మరి, ''ప్రభువా, ఫలానా వారిని ఆశీర్వదించుము మరియు ఫలానా, అని చెప్పినయెడల దేవుడు దానిపై ఇష్టత చూపడు. అయితే మీరు నిజముగా దీక్షతో కార్యములోనికి దిగినయెడల! చిన్న బాలురును మరియు బాలికలును మీరు ప్రార్ధించినపుడు పట్టుదలతో ప్రార్ధించుడి! మీరు పాఠశాలలో దానిని చేయుదురా? మీరు పాఠశాలలో సహాయపడమని దేవుని అడిగెదరా? మీరు పాఠశాలకు పోవునపుడు మరియు మంచి మార్కులు తీయకున్న యెడల మీరు లోనికి వెళ్ళి మరియు అడగరా, ''దేవా, నాకు మీరు సహాయపడవలయునని నేను కోరుచున్నాను అని?“

56

మీరు ప్రార్ధిచుచున్నారా? ఎందరు బాలురును మరియు బాలికలును ప్రార్ధించుచున్నారు? మీ యొక్క చేతులను చూడనిమ్ము. ఓ, అది మంచిది. తల్లి మరియు తండ్రియు మిమ్ములను చూడలేని, మీరు ప్రార్ధించుటకు పోవు ఒక రహస్యపు స్థలము మీకు కలదా? మీరు ఆ విధముగా ప్రార్ధించెదరా? మీరు ఆ విధముగా ప్రార్ధించుట లేదా? ఒక చిన్న స్థలమును కలిగియుండుడి మీరచ్చటికి పోయి ప్రార్ధించుడి, మరియు మీ యొక్క చిన్న ప్రార్ధనను చెప్పుడి, మీరు పడకకు పోక మునుపు ప్రతి రోజు రాత్రి దానిని మీరు చెప్పెదరా? మీరు ఉదయమున లేచునపుడు అప్పుడు? ఓ, అది బాగున్నది. కట్టడమునకు వెలుపల ఉన్న ఎందరు చిన్న బాలురు మరియు బాలికలు ప్రార్ధించువారు మీ చేతులను పైకెత్తుడి. ఓ, అది బాగుండుట లేదా! సరి, ఇప్పుడు, అది మంచిది. ఈ కార్యములన్నిటిని చేయవలెనని మీకు బోధించు ఒక నిజమైన తల్లి మరియు తండ్రి మీకు కలరని అది చూపించుచున్నది. ఇప్పుడు, ఇప్పుడు నిజముగా అవసరములో ఉన్నప్పుడు, మీరు మనఃపూర్వకముగా ప్రార్ధించుడి. మీరు ప్రార్ధించుట లేదా?

57

కావున చిన్న అమ్రాము, పైకి అతను వెళ్ళెను. ఓ, మై! అతనికి భోజనము అక్కరలేకుండెను. అతను చెప్పెను, ''అది చాలా క్రూరముగా ఉన్నది. మై!“

''ఓ,“ ఆమె చెప్పెను, ''తండ్రి, నీవు భోజనము తినవలయును.”

''నేను భోజనము చేయలేను, యాకెబెదు, నేను భోజనము చేయలేను.

ఓ, “అయితే, నీవు బరువును కోల్పోవుచున్నావు, మరియు నీవు నరముల బలహీనతతో యున్నావు, మరియు నీ యొక్క ముఖము వెలవెల పోయివున్నది. నీవు తిన్నదానినంతటిని వాంతి చేయుచున్నావు” అని చెప్పెను.

“ఓ, అయితే నాకేమి చేయవలెనో తెలియుట లేదు!” అతను చెప్పెను, “ప్రియులారా, ఎవరైనను జనులకొరకు హృదయ వేదన పడనియెడల, ఎవరైనను జనులకొరకు ప్రార్ధించని యెడల, మనమేమి చేయగలము? మనము అధ్వానమైన స్థితిలో యున్నాము. నిశ్చయముగా ఒక సమయమున, దేవుడు వినును!”

అవును, అది సరియే. అది సరియే. దేవుడు వినును మీరు కర్త్వ్యములోనికి వెళ్ళండి మరియు అక్కడనే నిలిచియుండండి!

58

ఓ, ఈ సమయమున అతను పైకి వెళ్లునపుడు వ్యత్యాసముగా వెళ్లెను. ఈ సారి అతను పైకి పోయినపుడు, అతడు మోకాళ్ళూని, అతని చేతులను గాలిలో పైకెత్తి, అరచెను, “దేవుడా, ఇప్పుడు నేను మీతో మాటలాడుచున్నాను!” ఆమేన్, కర్తవ్యములో దిగుట! “దేవా, మీకు చెవులు కలవు, మరియు మీరు వినగలరు. మీకు కండ్లు కలవు, మరియు మీరు చూడగలరు. మీకు ఒక జ్ఞాపకమున్నది, మీ యొక్క వాక్యమును మీరు ఎరిగియున్నారు. మీ యొక్క వాగ్దానమును మీరు ఎరిగియున్నారు. మీ యొద్ద నేను వేడుకొనుచున్నాను దేవా, ఇక్కడ క్రింద చూడుము! అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు దేవా, మీ యొక్క జనులు దురవస్థలో నున్నారు, మరియ వారు చనిపోవుచున్నారు. వారికొరకు ఏదైనను చేయుము, దేవుడా! మిమ్ములను వెంటనే ఇప్పుడే మాకు కావలయును! మీరు మాకు ఇప్పుడే కావలయును, లేనియెడల మేము నశించిపోయెదము. మేము మిమ్ములను పొందియుండవలయును. మేము జీవించియున్నాగాని దానిని పొందలేము.” అదెప్పుడనగా మీరు నిజముగానే ప్రార్ధించునపుడు. ఓ, అతను ప్రార్ధించెను!

59

మీకు తెలియునా, కొన్ని సమయములలో జనులు ప్రార్ధించినపుడు వారు అలసిపోవుదురు, తల్లి, తండ్రి వారు ఆ విధముగా అలసిపోవుట లేదా? ఓ, చాలా అలసట నొందెదరు! సహోదరుడు బ్రెన్హాం కొన్ని సమయములలో చాలా అలసిపోయెదరు నాకు మూర్ఛ పోవులాగున ఉండును నేను అధిక సమయము ప్రార్ధించినపుడు; భోజనము లేకుండా, మరియు అనేక దినములు అలాటి కార్యముల వలన మూర్ఛ పోవుదును; మరియు ప్రార్ధించి మరియు ప్రార్ధించి మరియు ప్రార్ధించి మరియు ప్రార్ధించి మరియు ప్రసంగించుటవలన. నేను మూర్ఛ పోవునటువంటి మరి అటువంటి పరిస్థితికి వచ్చి వేయుదును. మరియు కొన్ని సమయములలో జనులు ఆ విధముగా ఆ మార్గమున పోయెదరు. మరియు అటువ౦టి సమయమున వదలను వీలు కాదు. ముందుకు కొనసాగిపోవలయును! దేవుడు బదులిచ్చును! అవునయ్యా. వదలక పట్టుకొనుడి! అవునయ్యా!

60

కావున, అతడు చిన్న పాత కిర్రు కిర్రుమను మెట్లపైకెక్కెను. మరియు యాకెబెదు వచ్చుట నేను చూచుచున్నాను, మరియు చెప్పెను, ''ఓ, అమ్రాము, వద్దు. హనీ... నేను నమ్ముచున్నాను...“

''ఇప్పుడు, యాకెబెదు, చూడుము నీవు ఒక మంచి, ప్రియమైన....“ ఆమె అందమైనది, చక్కని చిన్న తల్లి. మరియు అతడు ఆమెను ఆ విధముగా సముదాయించుచుండెను. ''ఇప్పుడు, తల్లీ, నీవు తిరిగి పోయి అహరోనును మరి చిన్న మిర్యామును నిద్రింపజేయుము. మరియు నేను ప్రార్ధించుటకు పైకి పోవుచున్నాను. మరియు ఇప్పుడు నీవు గనుక నేను ఏడ్చుట వినినయెడల, పైకి రావద్దు.”

''సరి, అయితే, అమ్రాము, నీవేమి చేయబోవుచున్నావు ప్రియా? నీవు నీవు చనిపోవులాగున్నావు.“

61

''సరి, అయితే నేను నా యొక్క హృదయములో జనుల యొక్క భారమున్నది. దానిని గురించి నేనేమైనను చేయవలెను. నేను నా మోకాళ్ళపై ఉండవలయును. మరి కావున జనులందరును....“ అతను

చెప్పెను, “ఈ రోజు, ఈ రోజు మట్టుకు, అక్కడ ఇటుకలు చేయుచోట, నేనక్కడ ఉన్నప్పుడు చెప్పుచుంటిని, 'సరి, పిల్లలారా, దేవుడు వినును!' మరియు ఒక పెద్ద వృద్ధుడు వచ్చి, తన చేతులను తన నడుముపై ఉంచుకొని మరియు అడిగెను, 'ఆయన ఎప్పుడు వినును? ఆయన ఎప్పుడు వినును?' చూశావా, జనులు ఏ విధముగా విరక్తి భావముతో ఉన్నారో? వారు దేవునికి విరోధముగా మారుచున్నారు, ఏలయనగా వారు ప్రార్ధించుచున్నారు మరియు ప్రార్ధించుచున్నారు ఇంకా ప్రార్ధించుచున్నారు, మరి ఏమియు సంభవింపలేదు. మరియు ఇతను ప్రార్ధించుచున్నాడు ఇంకా ప్రార్ధించుచున్నాడు మరియు ప్రార్ధించుచున్నాడు, మరి ఏమియు జరుగకున్నది. మరియు యాజకులందరును చెప్పుచున్నారు, 'అద్భుతములు జరుగు దినములు ముగించియున్నవి, మరియు విగ్రహములను లేక విగ్రహ దేవుళ్లను పూజించు ఈ యొక్క పాత పని పెట్టి భాదించు వారియొద్దకు పోవుటయే, మనము చేయనైయున్న ఒకే కార్యము మరి అలాంటి కార్యము వలన. మరి మనమేమి చేయగలము?' అయితే అతను చెప్పెను, అయితే నేను యెహోవాను నమ్ముచున్నాను! ఆమేన్! ఆయన ఇప్పుడు కూడా ప్రార్ధనకు బదులిచ్చునని నేను నమ్ముచున్నాను!”

మీరు దానిని నమ్ముచున్నారా? దానిని మీరు నమ్ముచున్నారా? ఆమేన్! దానిని నమ్మువారందరును “ఆమేన్” అని చెప్పుడి. ఇంకను ప్రార్ధనను బదులిచ్చును! సరి.

62

చిన్న పెద్ద బలహీనమైన శరీరము బరువును కోల్పోయి కిర్రుకిర్రుమనుచు మెట్ల ద్వారా అతను పైకి పోయెను. అక్కడికి పోయి మరియు మోకాళ్ళూని మరియు అతను చెప్పెను, “ఓ యెహోవా!” ఓ, అతనిదివరకు ప్రార్ధించని విధముగా ప్రార్ధించెను! అతను చెప్పెను, ''యెహోవా, ఇక్కడ చూడుము! మీరు నిజమైన దేవుడవు. మీకు చెవులున్నవని మేము నమ్ముచున్నాము. మీకు కన్నులున్నవని మేము నమ్ముచున్నాము. మరియు మీరు సమస్త కార్యములను ఎరిగియున్నారు. మరియు హెబ్రీయుల యొక్క దేవుడని మేము నమ్ముచున్నాము, మరియు మేము వాగ్దాన జనులము. మీరు మీ యొక్క వాగ్దానమును కాపాడుకొనుదురని మేము నమ్ముచున్నాము.“ చెప్పెను, ''ఈ యొక్క విగ్రహారాధికులను చూడుము, మా యొక్క కాయకష్టమును తక్కువ డబ్బుకు ఉపయోగించు కొనుచున్నారు, మరియు పెద్ద రహదారులను, మరియు విగ్రహములను మరి సమస్తమును కట్టుచున్నారు. మీరు, యెహోవా, మీరు పరలోకములో కూర్చొని మరి విగ్రహారాధికులు మమ్ములను ఏలుట అనుమతించెదరా? దానిని మీరు చేయుదురని నేను నమ్ముటలేదు.” ఆమేన్!

63

ఇంకనూ దానిని ఆయన చేయునని నేను నమ్ముటలేదు! ఆమేన్! దయ్యము లోనికి వచ్చినపపుడు, దేవుడు ఇంకను దేవుడైయున్నాడు! సరి! దానిని దయ్యము చేయుటకు ఆయన అనుమతింపడు. మరియు ఈ దినములలో ఫాషన్ లు మరియు వెర్రితనము మరియు ఈ యొక్క కలుషితమైన కార్యములు జరుగుచుండగా; ఇంకనూ, దేవుడు ఇంకను తన ఆధిక్యతలో ఉన్నాడు మరియు ఆయన ఇంకనూ దేవుడు! సరి! వారి హృదయములపై భారము కలిగి, అక్కడే కాచుకొనియుండి మరియు దూరముగా ఉన్న పరలోకము తెరువబడి, దేవుడు క్రిందికి దిగివచ్చి మరి ప్రార్ధనకు బదులిచ్చు వరకు విడువక ప్రార్ధించు అమ్రాము లాంటి వారిని మనము కలిగియుండవలసిన వారమైయున్నాము. ఆమేన్.

“ఇప్పుడు ఇక్కడ చూడుము,” అతను అడిగెను, ''దేవా, ఈ విధముగా విగ్రహారాధికులు మీ యొక్క జనులను అపహసించుటను నీవు అనుమతించెదవా? వారములు మరియు నెలలు మరియు సంవత్సరములు గతించిపోయినవి. మేము విడువక ప్రార్ధించుచున్నాము. కన్నీటితో స్నానము....“

[టేపులో ఖాళీ స్థలము.]

“ఓ, దేవా, మీరు ఇటువంటి కార్యమును అనుమతించెదరా?”

64

ఈ రోజు నేను ఆశ్చర్యపడుచున్నాను, వందలకొలది పసిబిడ్డలు నదులలోను, మరియు మురికి నీటి గుంటలలోను విసిరివేయబడుచున్నారు మరియు జీవించుటకు అనుమతింపబడకున్నారు, మరియు గర్భస్రావము మరియు సమస్తమును జరుగుచున్నవి; ఓ, యెహోవా, ఇటువంటి కార్యములు జరుగుచుండుటకు మీరు అనుమతించుచున్నారా? ఈ రోజు విస్కీ మరియు బీరు, మరియు రాత్రులలో చీకటి కార్యములు మరియు సమస్తమును కేకలు వేయుచున్నవి. మరియు ప్రసంగ వేదికలు ఏ విధముగా బలహీనమై యున్నవనగా వాటిని గురించి ఏమైన చెప్పుటకు భయపడుచున్నవి. యోహావా ఇటువంటి వెర్రికార్యములు కొనసాగింపబడుటను మీరు అనుమతించెదరా?

ఆయన ఒక రోజు బదులిచ్చును. ఓ, ఆయనకు కోపము వచ్చిన అది భయంకరముగా ఉండును. అవునయ్యా! స్త్రీలు బయటికి వెళ్ళి మరియు బిడ్డలను చనిపోవులాగున చేయుచున్నారు; ఒక సిగిరెట్ ట్రే, దానిలోనికి బూడిద వదిలి మరియు సమస్త కార్యములును చేయుచున్నారు. మరియు ప్రజలు వారియొక్క పిల్లలను బీర్ త్రాగు చోట్లకు కూడా తీసుకొని వెళ్ళును, చిన్న బాలురును మరియు బాలికలును అక్కడ కూర్చుని, ఆరు లేక ఎనిమిది సంవత్సరముల వయస్సుగలవారు, త్రాగుచు మరియు అలాటి కార్యములలో పాల్గొనుచున్నారు. మరియు దేశము దానిని చట్టరీత్యా సరియునుచున్నది మరి అది పరవాలేదనుచున్నది. ఓ, మై! యెహోవా దానిని చూడలేదని అనుకొనుచున్నారా? వారు దేవునికిష్టమైన విధముగా ఉన్నప్పటికిని వారిని ఆ జనులను వారు పరిహసించుచున్నారు. మరియు ఈ కార్యములన్నియును, అపహాస్యము చేయబడుచున్నవి. దిగులు పడవద్దు. సరి.

65

మనమింకను కొద్ది ముందుకు వెళ్ళెదము. అతను పైన ప్రార్ధించుటను మనము చూచుచున్నాము. మరియు అతను చాలా అలసిపోయి ఉన్నాడు, అతను క్రింద పండుకొనియున్నాడు. అతను బలహీనుడై నేలపై తూలిపడేంత వరకు ప్రార్ధించియున్నాడు. అంతకు మించి అతను ముందుకు సాగలేక పోయెను, మరియు అతను కొద్దిగా తూగెను. అతడు లేచెను. “ఏమి సంభవించెను? ఓ, చూడుము, అక్కడ మూలగా నిలుచుకొని యున్నది.” అక్కడ ఒక దూత నిలుచుకొని యున్నాడు, అతని యొక్క ఖడ్గము అతని ప్రక్కగా వ్రేళాడుచున్నది. ఓ, అతను తిరిగి చూచెను, మరియు అతడు తన కండ్లను నలుపుకొనెను. అతను మోకాళ్ళపై నుండి పైకి లేచి, ''ప్రభువా, ఓ, ఓ, ఏమి... నా యొద్ద నుండి ఏమి కోరుచున్నావు?“ అని అతను అడిగెను.

66

అతను చెప్పెను, ''అమ్రాము, నేను దేవుని యొక్క దూతను. నీ యొక్క ప్రార్థనలను దేవుడు వినియున్నాడని నీకు చెప్పుటకు పరలోకము నుండి నేను పంపబడియున్నాను. మరియు ఆయన ఒక విమోచకుని పంపనైయున్నాడని నీకు చెప్పుటకు నేను వచ్చియున్నాను. ఆయన తనయొక్క వాగ్దానములన్నిటిని గుర్తుంచుకొనియున్నాడు.'' ఇప్పుడు నేను దూతను చూచుచున్నాను; అతని తట్టు చూడుము, అతను తనయొక్క ఖడ్గమును బయటికి లాగుచున్నాడు, అతను దానిని ఉత్తర దిక్కుకు చూపించుచున్నాడు. అమ్రాము చూచెను. అతను చెప్పెను, ''ఈ యొక్క ఖడ్గము చూపించు దిక్కున వాగ్దానపు భూమి కలదు. మరియు ఆ యొక్క భూమిని మీ జనులు స్వతంత్రించుకొందురని నేను అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు, మీ పితరులకు వాగ్దానము ఇచ్చయున్నాను. మరియు నేను ప్రజల యొక్క మూలుగులను, వినియున్నాను, పిల్లల యొక్క కేకలను నేను వినియున్నాను, మరియు నేను క్రిందికి దిగియున్నాను. మరియు ఈ యొక్క కార్యములో నీవు ఒక గొప్ప పాత్రధారుడవై యుందువని నీవు తెలిసికొనవలెనని నేను కోరుచున్నాను, అమ్రాము, ఏలయనగా నీవు ప్రార్ధనలో విశ్వాసముగా ఉంటివి. నీ యొక్క గృహములో నీవు విశ్వాసముగా ఉంటివి. మరియు రానున్న సంవత్సరములో ఈ వేళకు, యాకెబెదు, నీ యొక్క ప్రేమగల చిన్న భార్య ఒక మగ బిడ్డను హత్తుకొని యుండును. మరియు ఆ యొక్క చిన్న మగ బిడ్డ ఒక విమోచకునిగా యుండును.“ మహిమ!

67

అతను చెప్పెను, ''ఓ, అవును. ఓ, అవును. అవును. ఓ, అతను చాలా చక్కగా యుండెను. అతను గమనించెను, మరియు దూత పైకి ఎత్తబడెను. పరలోక మంతయును తెరువబడినలాగుండెను మరియు అతను గది నుండి బయటికి పోయెను. అతను కొద్దిసేపు కాచుకొనియుండెను. అతను చెప్పుకొనెను, ''ఓ, నేను ఒంటరిగానే యున్నాను.

త్వరితముగా అతను క్రిందికి వెళ్ళెను, మరియు చెప్పెను, ''యాకెబెదు! యాకెబెదు, త్వరగా!

''సరి, ప్రియా, ఏమి సంగతి? అని అడిగెను.

''లేచి నిలువుము!“ మరియు కిటికిలో నుండి జాబిల్లి వెన్నెల ప్రకాశించుచుండెను, ఆమె చక్కగా అగుపించుచుండెను. మరియు అతను చెప్పెను, ''నేను ఇప్పుడే ఒక దేవదూతను చూచియున్నాను, మరియు అతను ఈ కార్యములన్నిటిని నాకు చెప్పెను,” అని చెప్పెను.

''ఓ, అతనెట్లు ఉండెను?“ తల్లి అడిగెను, అతనెట్లు ఉండెను?

''ఓ, అతను చాలా చక్కగా ఉండెను. అతను ఒక ప్రకాశమైన వస్త్రమును ధరించుకొనియుండెను. అతని కండ్లు మెరయుచుండెను. మరియు అతని చేతిలో ఒక ఖడ్గముండెను, మరియు దానినతడు ఉత్తర దిక్కుకు చూపించెను,“ అని చెప్పెను, పాలస్తీనా ఆపైన మార్గములో, ఐగుప్తు నుండి వాగ్దానపు భూమిగల మార్గము అదే, నీకు తెలియునా; అతను చెప్పెను, ''అతడు దానిని ఉత్తర దిక్కుకు చూపించెను. మరియు వచ్చే సంత్సరము ఈ వేళకు మనము ఒక బిడ్డను కలిగియుందుమని, మరియు ఈ పసి బిడ్డ వచ్చి మరియు ఒక జయించువానిగా ఉండును, మరియు ఆయన యొక్క జనులను విమోచించును అని అతను చెప్పెను. ఓ, హల్లేలూయా, యాకెబెదు!”

68

మరియు ఆమె నమ్మెదిగా ఉండుటను అతడు గమనించెను. ఆమె యొక్క ముఖము, ఆమె కండ్లు ప్రకాశించుచుండెను, ఆమె యొక్క గొప్ప కండ్లు చూచుచుండెను. ''యాకెబెదు, ఏమైయ్యింది!“

''ఓ, అమ్రాము! వద్దు, వద్దు, వద్దు! మనకు ఒక మగ బిడ్డ కలడు కదూ?“

''అవును.“

''ఓ, అది ఆ విధముగా ఉండదు. నీకేమి తెలియునా? ఓ, నీకు ఈ యొక్క దర్శనము లేకుండిన. నీకు తెలియునా ఏమిటని, ఫరో చిన్న బిడ్డలందరిని చంపుచున్నాడు.“

''అవును, అయితే, నీకు తెలియునా, దేవుడు మనకు ఈ బిడ్డను ఇచ్చిన యెడల, బిడ్డను దేవుడే కాపాడును. ఆమేన్! అతనిని దేవుడు కాపాడెదనని దేవుడు వాగ్దానము చేసియున్నాడు.

సరి, మరుసటి దినమున అతను పనికి పోయెను. మరియు అక్కడున్న వారందరును అమ్రామును గమనించిరి. అతడు లోనికి వచ్చునప్పుడు, మీకు తెలియునా, అతనెప్పుడును వంగిపోయి మరియు సొమ్మసిల్లి యుండును; తన భుజములు నిటారుగా ఉండి, అడిగెను, ''నాకు ఇంకను కొన్ని ఇటుకలను అందించుడి, త్వరగా కానియ్యుడి!“

''ఏమి జరిగినది?“

''దేవునికి మహిమ! దేవుడు ప్రార్ధనకు బదులివ్వబోవుచున్నాడు.“

''ఓ, కాదు.“

69

మీకు తెలియునా, మీరు బదులు పొందినపుడు మీకు అది మంచి అనుభూతి నిచ్చును. తల్లి తండ్రులారా, మీకు తెలియునా? దేవుడు బదులిచ్చినపుడు? మీరు ఒక దర్శనమును చూడనక్కరలేదు. బదులున్నదని తెలుసుకొనిన చాలును, అంతే. అంతే, బదులక్కడ ఉన్నదని తెలుసుకొనిన చాలును.

ఇప్పుడు, చాలా జాగ్రత్తగా గమనించుడి. ఇక్కడ చూడుడి, ఏమి జరిగినదో గమనించుడి. ఇప్పుడు, మీకు తెలియునా, కొద్దిసేపైన పిదప, అడిగెను, ''అది సరి, అమ్రాము, నీకేమి జరిగినది?“

“దేవుడు ప్రార్ధనకు బదుల్విబోవుచున్నాడు! దేవుడు ప్రార్ధనకు బదులివ్వబోవుచున్నాడు!”

''సరి, ఆయన ఏ విధముగా ప్రార్ధనకు బదులివ్వబోవుచున్నాడు?“

''అది ఏ విధమైన భేదమును కలుగజేయును.“

ఒక వృద్ధుడు నడచి వచ్చి మరియు చెప్పెను, ''ఇప్పుడు, ఎప్పుడు నీవు అనుకొన్నావు ఆయన ఎప్పుడైనను ప్రార్ధనకు బదులిచ్చునని?“

''నేను నీకు చెప్పబోవుట లేదు, ఏలయనగా నీవు ఏమైనను ఒక అవిశ్వాసివి. నాకు మరియు కొన్ని ఇటుకలను అందించుడి.“ ఆ విధముగా అక్కడ విసిరివేసేను. లేదండి. మీరు లెక్క చేయరు; అవిశ్వాసులకు మీరు అన్ని కార్యములను చెప్పనక్కరలేదు. మీరట్లు చేయుదురా? అదేమి వ్యత్యాసమును కలిగించును. లేదయ్యా. నిశ్చయముగా కాదు, ''నాకు మరికొన్ని ఇటుకలను అందించుడి. హల్లేలూయా! ప్రార్ధనకు బదులిచ్చును!” అది సంభవింపనైయున్నదని మీరు ఎరిగియున్న ఎడల మీరు ఆ విధముగా అనుభూతినొందెదరు. అదట్లేకదూ? అవునాయ్యా.

''సరి, దానిని ఆయన ఎట్లు చేయగలడు?“

''మీకు ఎట్లు చెప్పినను తెలియదు, సరి ఇటుకలను అందించుచుండుడి.“ వాటన్నిటిని అక్కడ పెట్టుడి, పాత ఇటుకలను అక్కడ పేర్చుడి.

70

మరియు ఆ రాత్రి అతను ఇంటికి పోయెను, చెప్పెను, ''ఓ, యాకెబెదు, మనము ఒక బిడ్డను కలుగబోవనై యున్నాము, దానిని గురించి తలంచి చూడుము! ఓ, మరియు అతను విమోచకుడై యున్నాడు! దేవుడు అతనిని పంపనై యున్నాడు. ఓ, అది అద్భుతముగా ఉండబోవుచున్నది.“

''ఓ, అయితే నేను చాలా.....“

''ఓ, చింతించుట మానుము! చింతించుట వదలివేయుము! మై! దేవుడు ఈ కార్యమునందున్నాడు, ఇప్పుడు దేవుడు వినుచున్నాడు. దేవునికి చెవులు కలవు, దేవుడు వినగలడు. దేవునికి చేతులు కలవు, ఆయన విడిపించగలడు.'' కావున, ఓ, అతనికి అధిక విశ్వాసముండెను.

మీకు తెలియునా, మీరు విడువక ప్రార్ధించిన, మీరు బదులు పొందెదరు, అప్పుడు మీరు అధికమైన విశ్వాసమును పొందెదరు. ఓ! మీ కొరకు దేవుడు చేయునని దేనికొరకైనను మీరు ప్రార్ధించియున్నారా? చిన్న బాలికలైన వారలారా, దానిని చేయుడి, మరియు చిన్న బాలురైన మీరు? అవును. నిశ్చయముగా చేయండి. అది మీరు అది జరుగనైయున్నదని తెలిసికొన్నప్పుడు. అది సరి.

71

ఒక నిండు సంవత్సరము గడచిపోయినది. మరియు మీకు తెలియునా, మొదటి కార్యము ఒక రోజు అమ్రాము పని నుండి వచ్చెను. ఏమి జరిగెను? ఆ ముచ్చటైన చిన్న బిడ్డ, ఓ, అతను చిన్న ఇంత పొడవుగా ముద్దుగా నుండెను. కావున మరియు ఆమె అతనిని తీసి అమ్రాము చేతికి అప్పగించెను. మరియు అతను అతనిని ముద్దాడెను, మీకు తెలియునా, అతడు అతనిని ప్రేమించెను, చూశారా. మరియు తల్లి అతనిని ఎత్తుకొని యుండెను. ఓ, ఎటువంటి ఐశ్వర్యము! ఆమె చెప్పెను, ''ఓ, నేను చాలా భయపడుచున్నాను, మీకు తెలియును. ఈ యొక్క పసిబిడ్డ, అతను అటువంటి ఒ చక్కటి పసిబిడ్డగా ఉన్నాడు.“

మరియు మీకు ఇది ఏమిటని తెలియునా? బైబిలు చెప్పుచున్నది, పుట్టిన బిడ్డలలో అటువంటి అందమైన బిడ్డ లేదని. ఇప్పుడు, దానిపై తల్లులు నాతో ఏకీభవించరని నాకు తెలియును. వారు తలంచెదరు... మీ యొక్క తల్లి తలంచెను, నీవు ముచ్చటైన చిన్న బిడ్డవని. ఆ విధముగా ఆమె తలంచలేదా? అవును. దానిని తలంచుటకు ఆమెకు హక్కు కలదు. అయితే బైబిలు చెప్పుచున్నది, ఇదిక ముచ్ఛటైన చిన్న బిడ్డ. ఓ, అతను ఒక అభరణముగా ఉన్నాడు. మీకు తెలియునా దేవునియొక్క చేతులు అతనిపై యుండెను. కావున, ఓ, అతను మిగుల ముద్దైన చిన్న బిడ్డ! అతనక్కడ పండుకొని తనకు పండ్లు లేకున్నను బోసి నోటితో పండ్లికిలించులాగున చేయును.

72

మీకు ఆ విధముగా చిన్న సహోదరుడు ఎవరైనను ఉన్నారా మరి వారు పండ్లులేకున్నను పండ్లికిలించుచున్నారా, ఆ విధముగా?

మరియు మొదటి కార్యము మీకు తెలియునా, ''వా!“

''ఓ, మై గుడ్‌నెస్! వ్యూ! అనేకమైన మంత్రగత్తెలు దాగుకొనియున్నారు!“

''ఏమి సంగతి? నీవేమి చేయుచున్నావు?“

''అతనిని క్రిందికి తీసికొనిపొమ్ము. మీకు తెలియునా ఆజ్ఞ ఏమిటి అని. చూడుడి, ఒకవేళ ఆ పొడుగాటి ముక్కుగల మంత్రగత్తెలు ఇక్కడికి వచ్చినయెడల, వారు మన బిడ్డను తీసికొని మరియు చంపివేయుదురు. అది సరియే. మనము ఆ బిడ్డ ఏడవకుండా చూచుకొనవలయును.“ కావున, ఓ, బిడ్డకు ఉదయ కాలపు లేక రాత్రి ఆహారము కావలసియున్నది. కావున, తల్లి వానిని మూలకు తీసికొని వెళ్ళి, వానికి పాలిచ్చుచున్నది, మీకు తెలియునా. మరప్పుడు అతను నెమ్మదిగా ఉన్నాడు.

73

కావున, దాని తరువాత రెండు రాత్రులు వారు అతనితో ఆడుకొనుచుండిరి. మరియు అతను తిరిగి ఏడ్చుటకు ఆరంభించెను, మీకు తెలియునా, ఆమె శీఘ్రముగా వెళ్ళి మరియు దాచి, ఆ విధముగా త్వరగా అతనిని దాచి వేసెను. మరియు క్రింద, వెనుక భాగము, గోడలో, అమ్రాము బిడ్డను దాని ఉంచుటకు అతను ఒక చిన్న స్థలమును తయారు చేసెను.

మరియు మీకు తెలియునా, మొదటి కార్యము, వారు పైన ఏదో శబ్దమును వినిరి .... [సహోదరుడు బ్రెన్హాం ప్రసంగవేదికపై తట్టెను.] ''వ్యూ! త్వరగా రండి!“ ప్రతి యొక్కరును ఒక చోట కూడిరి, చెప్పెను, ''అది వారే. అది వృద్ధులైన మంత్రగత్తెలు.” వారికి పొడవైన వ్రేళ్లు, రంగు పూసిన గోళ్ళు! మరియు వృద్ధులైన మంత్రగత్తెలు అక్కడ క్రింద చూచిరి. మరియు కిటికీ గుండా చూచెను, చెప్పెను, ''అవును, అది వారే. వారు అక్కడ నిలుచుకొనియున్నారు.“

[సహోదరుడు బ్రెన్హాం ప్రసంగ వేదికపై తట్టుచున్నారు.] ''తెరువుము!“

అమ్రాము బయటికి వచ్చి, తలుపు తెరచి అడిగెను, ''మీకేమి కావలయును?“

''ఇక్కడ మీకొక బిడ్డ కలదు, మరి అది మాకు తెలియును. మరి వానిని మేము తీసికొనబోవుచున్నాము.“

''మీకిచ్చుటకు మా యొద్ద ఏ బిడ్డయును లేదు.“ (వారివ్వలేదు.)

74

''ఏట్లైనను మేము లోనికి వచ్చి మరి చూచెదము. మేము కావలి స్త్రీలము. మా యొక్క గురుతులను చూచుడి!“ మరది, ఒక స్త్రీకి ఉండకూడని కార్యము కదూ అది? అయితే, ''మేము కావలి స్త్రీలము. మేము అధికారుల నుండి అధికారము పొందియున్నాము!” మీకు తెలియునా, ఇప్పుడు మనము వారిని కలిగియున్నాము. మరియు కావున వారు లోనికి వెళ్లి అన్నియును తనిఖీ చేసిరి. వారు లోనికి వెళ్ళి సోఫాను త్రిప్పి వేసి మరియు అన్ని సొరుగులను తెరచి మరి అన్నిటిని నేలపై పడవేసి చిందరవందర చేసిరి, మరియు అన్ని పడకలను పడక దుప్పట్లును విదిలించి మరియు పైకి వెళ్ళి తండ్రికి గల రహస్య స్థలమును మరియు కనుగొనిరి. ప్రతియొక్క చోటను చూచిరి, అయితే వారు బిడ్డను కనుగొనలేక పోయిరి.

75

వారు బిడ్డను కనుగొనలేకపోయిరి, కావున వారు స్త్రీయొద్దకు నడచిపోయి మరి అడిగిరి. సరి, దీనురాలైన యాకెబెదు అక్కడ నిలచుకొనియున్నది, ఆమె యొక్క ముఖము భయాందోళనతో కూడియున్నది. వారు నడచి వచ్చి మరియు చెప్పిరి, ''ఇక్కడ చూడుము! నీవు బిడ్డను కన్న ఒక తల్లియని మాకు తెలియును. నీ యొక్క చూపు ద్వారా మేము చెప్పగలము. మాకు తెలియును, నీవు పాలిచ్చుచున్న స్త్రీయని, మరియు బిడ్డ ఇక్కడ ఉన్నదని మాకు తెలియును. మేము తిరిగి వచ్చెదము. వానిని తీసికొనెదము!“ వారు వెలుపల ద్వారముల గుండా వెళ్తూ తలుపును వారు దభాలున కొట్టి, మరియు వారు బయటికి వెళ్ళిపోయిరి.

ఆమె అడిగెను, ''ఓ, ఓ, మనమేమి చేయగలము? మనమేమి చేయగలము?“

కావున అమ్రాము చెప్పెను, ''ప్రార్ధించుము.“ చేయవలసిన కార్యము అదియే కదూ? అదియే కదూ కార్యము? ”ప్రార్ధించుము! మనము ప్రార్ధించెదము.“

“ఓ, ఓ, ఓ! నేను ఏమి చేయాలో నాకు తెలియదు. ఓ!”

కావున అతను చెప్పెను, ''ఇప్పుడు, నీవు నెమ్మదిగా యుండుము, చూడుము, మరి నీవు పోయి బిడ్డకు తిరిగి పాలియ్యుము. నేను పైకి వెళ్ళి మరల ప్రార్ధించబోవుచున్నాను.“

76

కావున, అతను పైకి వెళ్లి ప్రార్ధించెను. ''యెహోవా, మీకు చెవులు కలవు. యెహోవా, మీకు కన్నులు కలవు. యోహోవా, మీరు వినగలరు. మీరు ప్రార్ధనకు బదులివ్వగలరు. మీరు ఈ బిడ్డను మాకిచ్చియున్నారు, మీ యొక్క వాగ్దానమును మీరు మాకిచ్చియున్నారు. మరియు మీ యొక్క వాగ్దానమును మీరు కాచుకొనెదరు, నెరవేర్చెదరు, మరియు ఆ బిడ్డను కాపాడగలరు. మరి నేను నమ్మకము కలిగియున్నాను!“ అని అతను ప్రార్ధించెను.

ప్రార్ధించిన తరువాత, అతను నిజముగానే అలసటనొంది అతను ఈ విధముగా వాలిపోయి అచ్చటనే నిద్రపోయెను. అతను చాలా అలసటగా యున్నాడు! దినమంతయు పని చేసి మరి రాత్రంతయును ప్రార్ధించుచుండెను. అతను అలసిపోయియున్నాడు. మరియు అటు పిదప ఏమి జరిగినదో మీకు తెలియునా? అతను నిద్రించుచున్నప్పుడు మరియు అతను ఒక కలను కనెను.

77

మీకు తెలియునా, దేవుడు కలల ద్వారా కూడా పలుకును. ఆయన చేయలేదా? నిశ్చయముగా, ఆయన చేయును. అవును, ఆయన చేయును. ఆయన చేయగలడు, చూశారా. మరి ఆయన కలల ద్వారా మాట్లాడును.

ఓ, అతన లేచెను, మరి చెప్పెను, ''అదే అది! దానిని గురించి నేను అనుకొనుయుండవలయును. అదియే నేను చేయవలసిన కార్యము. దానిని గురించి నేను ఏమియును చెప్పను.“

క్రిందికి అతడు వచ్చెను. అతను చెప్పెను, ''యాకెబెదు!“

''ఇదో, ప్రియా? ఓ, నేను చాలా అలసిపోయి వున్నాను. నేను నిద్రపోలేక పోవుచున్నాను.“

''ఓ, నిద్ర పొమ్ము, నిద్ర పొమ్ము, అంతయును ముగిసియున్నది.“

''నీకెట్లు తెలియును?“

''ఓ, నాకు తెలియును. నాకు నమ్మకము కలదు.“

78

ప్రార్ధించుటకు తండ్రి పైకి వెళ్లుటకు బదులుగా ఆ రాత్రి, అతను క్రిందికి అడుగు భాగమును వెళ్ళెను. అతనక్కడ క్రింద అధికముగా పని చేయుటలో వుండెను. నేను ఆశ్చర్యపడుచున్నాను అతను ఏమి చేయుచున్నాడని? మనము క్రిందికి దిగి అతను ఏమి చేయుచున్నాడో చూచెదము. అతను పోవుట నేను చూచుచున్నాను..... [సహోదరుడు బ్రెన్హాం తనకుతానే నోటిలో పాడుకొనుచు, మరియు కట్టునప్పుడు వచ్చు శబ్దము లాగున శబ్దము చేయుచున్నారు.] ''స్లామ్, స్లామ్, స్లామ్.“ [సహోదరుడు బ్రెన్హాం పాడుచు౦డిరి.] ఈ రెల్లును తీసికొని మరి అది మంచిదా కాదా అని దానిని వంచి చూచుచున్నాడు. [సహోదరుడు బ్రెన్హాం తనలోతాను పాడుచు౦డిరి.] చిన్న అహరోను ఆ రోజు బయటికి పోయి చేతుల నిండా వాటిని ప్రోగుచేసి, వాటిని క్రింది భాగమున పెట్టెను, మీకు తెలియునా. [సహోదరుడు బ్రెన్హాం తనలోతాను పాడుచు౦డిరి.] ''దేవుడు నిన్ను సంరక్షించును.” [సహోదరుడు బ్రెన్హాం పాట పాడులాగున ధ్వనించుచున్నారు.] ''పాత-కాలపు మతము, అది అంతయును నిజముగానే వుండియుండవలయును!“ [సహోదరుడు బ్రెన్హాం దేనిపైనో కొట్టుచున్నారు.].... చుట్టు కొట్టుచున్నాడు.

ఆమె అడిగెను, ''అమ్రాము, నీకేమైనది?“

''హల్లెలూయా! ఏమిలేదు, ప్రియా. పొమ్ము.“

[సహోదరుడు బ్రెన్హాం పాడుచు౦డిరి.] ''ఇది పాత-కాలపు మతము.'' [సహోదరుడు బ్రెన్హాం మరల తట్టుచున్నారు.] ''ఇది పాత-కాలపు మతము.“ దీనిని ఇచ్చటికి తీసికొని రండి, మీకు తెలియునా. ''ఇది పాతకాలపు మతము.” ''ష్ ష్ ష్ ష్ ష్ ష్,“ దానిని ముద్ర వేయుము. ''మరియు అది నాకు మంచిదిగా ఉన్నది! నాకు ఇవ్వుము ఈ యొక్క పాత...” అతడు దేనినో చేయుచున్నాడు

79

మీకు తెలియునా, ఒకటి లేక రెండు వారములు గడచిన పిదప, మొదటి కార్యము మీకు తెలియునా, అతనేమి చేయుచున్నాడో అని వారు ఆశ్చర్యపడిరి.

కావున ఒక రాత్రి వారందరును నిద్రించుచుండగా, అతను మెల్లగా పైకి వచ్చి మరియు ఈ యొక్క చిన్న దానిని పైకి తెచ్చెను, మీకు తెలియునా, ఈ విధముగా దానిని పైకి తెచ్చెను. మరియు దానిని పైకి తెచ్చెను. తన భార్యయగు యాకెబెదు నిద్రించుచున్న చోట ఆ దుప్పటిని పైకి తీసి, మరియు దానిని దుప్పటి క్రింద ఉంచెను. మీకు తెలియునా, మరియు చిన్న అహరోను మరియు చిన్న మిర్యాము నిద్రించుచుండిరి. ఓ, ఆమె ఒక అందమైన చిన్నది, ఆ చిన్న బాలిక మరియు అహరోను కూడా చిన్న అందమైన బాలుడు. కావున అతను దానిని అక్కడ క్రింద ఉండెను. అతనున పిలిచెను, ''ప్రియమైన యాకెబెదు.“

ఆమె అడిగెను, ''అమ్రాము, ఈ రాత్రి సమయములో క్రింద అరలో ప్రార్ధించుచుంటివా?“

చెప్పెను, ''కాదు నేను ఇంటి క్రింద అరలో దేవునిని స్తోతించుచుంటిని.“

అడిగెను, ''నీవు ఏమి చేయుచుంటివి?“

చెప్పెను, ''నేను నీకు చెప్పదలచియున్నాను. ఇప్పుడు, నీకు తెలియును ఆ వృద్ధ మంత్రగత్తెలు మరల వచ్చుచున్నారు.“

''అవును.“

“మరియు మనమేమి చేయబోవుచున్నామో నేను నీకు చెప్పదలచియున్నాను. ఇచ్చటికి మూడు నెలలుగా ఈ యొక్క చిన్న బిడ్డను మనము ఉంచుకొనియున్నాము, మరియు ఆ చిన్నవానిని మనము ఎడబాయు సమయమైనది.”

''ఓ, అమ్రాము! నీవేమి చేయబోవుచున్నావు?“

''మనము బిడ్డను వదిలివేయాలి.“

''బిడ్డను వదిలివేయాలి?“

''అవును.“

''ఓ, నీవు కఠనముగా వున్నావు!“

''కాదు, నేను కఠినము కాదు. లేదు, లేదు, లేదు. నేనేమి చేయుచున్నానో నాకు తెలియును.“

''నీవేమి చెప్పుచున్నావు? ఎందుకు, నీవు ఫరోవలె కఠినముగా వున్నావు. మన యొక్క బిడ్డను వదిలించుకొనుటయా?“

''అవును, బిడ్డను వదలవలసిందే.“

''ఓ, మనము చేయలేము!“

''ఇప్పుడు వినుడి. మనము దానిని ఉంచుకొనినయెడల, దానిని మనము పోగొట్టుకొనెదము. మరియు ఆ పసిబిడ్డను మనకు అనుగ్రహించిన ఆయనకే మనము ఆ చిన్నవానిని మరల, ఇచ్చివేసినయెడల, దానిని ఆయన కనుగొనును.“ అది సరియేనా? ''ఇప్పుడు, నీవు అతనిని ఉంచుకొనిన ఎడల, మనము ఆ బిడ్డను పోగొట్టుకొనెదము.”

''దానిని మనమెట్లు పోగొట్టుకొనెదము?“

“ఎందుకనగా, ఆ వృద్ధులైన మంత్రగత్తెలు వచ్చి మరి ఆ బిడ్డను తీసికొనెదరు.”

80

మరియు గమనించండి, మీరు గనుక ఆ యొక్క ఆత్మను ఉంచుకొని మరి పోయి లోకపోకడ ప్రకారము జీవించినయెడల, మీరు దానిని పోగొట్టుకొనెదరు. నరకము యొక్క ప్రపంచము యొక్క మూఢమైన కార్యములు అవన్నియును మీ వెనుక ఉన్నవి. మీరు గనుక దానిని ఉంచుకొనినయెడల, దానిని పోగొట్టుకొనెదరు; అయితే, దానిని మీకిచ్చిన ఆ ఒకరికి మీరు తిరిగి ఇచ్చివేసిన యెడల, మీరు దానిని కనుగొనెదరు, మరియు దానిని ఉంచుకొనెదను. ఇపుడు అదేమిటి? మనము గనుక దానిని ఉంచుకొనిన, మనమేమి చేయగలము? [పిల్లలు చెప్పుచున్నారు, ''దానిని పోగొట్టు కొనెదము.“] దానిని పోగొట్టుకొనెదము. మనము దానిని క్రీస్తుకు ఇచ్చిన యెడల, మనము ఏమిటి? దానిని కాచుకొనెదము. [''దానిని రక్షించుకొనెదము.] ఆమేన్! అది మంచిది. ఇప్పుడు మీరు సరిగా బదులు చెప్పియున్నారు.

ఇప్పుడు, అతను చెప్పెన, ''యాకెబెదు, మనము వానిని ఉంచుకొనిన మనము వానిని పోగొట్టుకొనెదము. కావున మనము తిరిగి దానిని మనకిచ్చిన ఆ ఒకరికి ఇచ్చిన, అప్పుడు మనము దానిని కాపాడుకొనెదము.“

81

ఇప్పుడు మీకు ఒక ఆత్మ కలదు. మరియు తల్లి మరియు తండ్రి మీకు ఆ విధముగానే యుండును. అయితే మీరు దానిని ఉంచుకొనిన, మీరు దానిని పోగొట్టుకొనెదరు. అది సరియే, నరకము యొక్క మాంత్రికులు దానిని తీసికొనెదరు. వారందరును దానికొరకైయున్నారు! అయితే మీరు దానిని, మీకు దానిని అనుగ్రహించిన ఆ ఒకరికి ఇచ్చివేసినయెడల, దానిని నిత్యజీవమునకై కాపాడుకొనెదరు. హల్లేలూయా! ఆమేన్! పిల్లలారా నన్ను మన్నించుడి, నేను అతను పాత-కాలపు వానిని. మీర గనుక దానిని ఉంచుకొనిన... దానిని, మనమందరమును కలసి చెప్పెదము. [సహోదరుడు బ్రెన్హాం మరియు సంఘమంతయును కలిసి ఒక్కటిగా చెప్పుచున్నారు, ''దానిని మీరు ఉంచుకొనిన, మీరు దానిని పోగొట్టుకొనెదరు. మీరు గనుక దానిని మీకు ఇచ్చిన ఆయనకు దానిని తిరిగి సమర్పించినయెడల, దానిని మీరు కాచుకొనెదరు.“] ఆమేన్. ఇప్పుడు గుర్తుంచుకొనుడి, దానిని ఆయనకియ్యుడి.

ఇప్పుడు, మనము గమనించెదము. ఓ, ఆమె ఏడ్చుటకు ఆరంభించెను. ఆమె అడిగెను, ''ఓ, దానితో నీవు ఏమి చేయనైయున్నావు?“ ఆమె అడిగెను....

''ఇక్కడ చూడుము, నేను నీకొకటి చూపించదలచియున్నాను.“

“నా పడక క్రింద నీవేమి పెట్టియున్నావు?”

చెప్పెను, ''నీకు నేను దానిని చూపించనిమ్ము.“ మరియు అతను దానిని బయటికి లాగెను.

''ఓ, అది ఒక చిన్న రెల్లు వెదురు జాతి పెట్టె!“

82

అది ఒక చిన్న పడవ, అదే అది. దానికి చుక్కాని లేదు, మరియు దానికి తెరచాపయును లేదు, దానిపై ఫీరంగులు లేవు, మరయినప్పటికిని అది ఇంతవరకు ఆ కాలము వరకు, ఏ ఓడయును కొనిపోని మిగులు అమూల్యమైన సరుకును తీసికొనిపోనైయున్నది. అవును! దానికి ఓడను నడుపు ఏ నావికుడును లేక నావికులును లేరు. సహోదరుడా, ఆ విధమైన ఒక పడవ పెద్దవారికి కలదు, అది నాకు తెలియును!

''ఓ,“ ఆమె చెప్పెను, ''ఆమ్, నేను దానిని చూడనిమ్ము. అమ్రాము, నేను చూడని.” ఆమె అక్కడికి పోయెను.

చెప్పెను, ''ఇక్కడ చూడుము, దానిపైకి మూయుటకు ఒక మూత కలదు. చూడుము, నీవు ఆ మూతనుపైకి తెరువుము.“

చెప్పెను, ''వ్యూ! కంపు కొట్టుచున్నది! వ్యూ! మై!“

చెప్పెను, ''అవును, అది కంపు కొట్టుచున్నది.“

''ఎందులకు?“

''నేను కీలును దానిలో పోసియున్నాను. దాని చుట్టును తారు పూయబడియున్నది.“ కీలు అనగా తారు, మీకు తెలియునా, కావున వారు తారును దానిచుట్టును పూసియున్నారు. అదే అతను క్రింద నుండి కాయుచు మరియు ఆ రెల్లుకు పైగా పోసెను. దానికి అతను పూసెను. ''చూడుము, అప్పుడు నీరు దానిలోనికి పోదు. చూశారా, అది పూర్తిగా మూయబడియున్నది.'' మరియు చెప్పెను, మరది లోనికి వెళ్ల లేదు, నీరు పోలేదు. దానికి నేను కీలు పూసియున్నాను.”

చెప్పెను, ''వ్యూ, చెడ్డ వాసన కొట్టుచున్నది!“

83

పిల్లలైన మీకు తెలియునా, తారు అనగా ఏమిటని, వారు వీధులలో వేయుచుందురు, అది భయంకరమైన వాసనా! అయితే అది మూయును.... వీధిపై ఉన్న పగుళ్లనన్నిటిని మూసివేయును. మరి ఆ విధముగానే ఇది చేయును, ఇది నీటినంతటిని లోనికి రానియ్యక బయటికి తోయును

మరియు ప్రార్ధన ఒక విశ్వాసికి ఆ విధముగా చేయును. అదే ప్రతి దినమును ప్రపంచమును మీ నుండి దూరముగా పెట్టును, ఎప్పుడనగా మీరు మోకాళ్ళపై నుండి మరియు ''ప్రభువైన యేసు! అని చెప్పినపుడు. మరియు రక్తము దిగివచ్చి మరి మిమ్ములను పూర్తిగా ముద్రించి వేయును, కావున సైతాను మీ యొద్దకు రాడు. చూశారా, అది సరియే. చూశారా, కావున అప్పుడు, మై, అనేక సమయములలో జనులు చుట్టు పోయి మరియు చెప్పెదరు, ''అది భయంకరము, అయితే అది ఏ విధమైన వ్యత్యాసమును కలుగచేయదు, అది మిమ్ములను సురక్షితముగా పెట్టును, చూశారా. అదియే ముఖ్యమైన కార్యము, సురక్షితముగా పెట్టుట. చెప్పెదరు, ''నీవు పాత-కాలపు పద్ధతిలో ఉన్నావని,“ అయితే అది పరవాలేదు; మిమ్ములను అది సురక్షితముగా పెట్టును.

84

''సరి,“ అడిగెను, ''మనము ఏమి చేయనైయున్నాము?”

''సరి,“ చెప్పెను, ”మనమేమి చేయబోవుచున్నామో నేన నీకు చెప్పెదను. మనము బిడ్డను తీసికొని పోబోవుచున్నాము, మరియు మనము ఈ చిన్నవాడు విడిపోబోయే కార్యమ జరుగనైయున్నది. మరియు మనము బిడ్డలను తీసికొని మరి ఇక్కడ దానిని పెట్టి, మరియు నైలు నదిలో వానిని అక్కడ వదిలివేయుబోవున్నాము.“

''ఓ! వద్దు! వద్దు! వద్దు! అమ్రాము, నీవు మన బిడ్డను నదిలో వదలవద్దు.“

''అవును! అవును! నేనేమి చేయబోవుచున్నానో నాకు తెలియును.“ చూచారా, అతను ఒక కలకనియున్నాడు, ఏమి చేయవలెనో అతనికి తెలియును. చూశారా, దేవుడు అతనికి చెప్పియున్నాడు. అతనికి ఏమి చేయవలెనో తెలియును. అతను దీనిని కట్టియున్నాడు, మరియు నోవహు వెనుక అతని కాలములో, ఈ విధమైన పడవ నోవహును రక్షించెనని అతను దానిని దీనిలో చూసెను.

కావున అతను చెప్పెను, ''ఇక్కడ చూడుము, దానికి పైభాగమున నేను ఒక రంధ్రమును చేసిపెట్టి యున్నాను, కావున దానిద్వారా అతను ఊపిరి పీల్చగలడు. చూడుడి, అక్కడ నుండి అతను సూర్యరశ్మిని పొందగలడు.“

మరియు మీకు తెలియునా, బైబిలులో గల ఓడయందు వెనుకట అది ఆ విధముగా చేయబడియున్నది. మరియు దానిలో పై భాగమున ఒక రంధ్రము ఉండెను, కావున మీరు దాని ద్వారా చూడవచ్చును, మీరు చూడుడి, మరియు కావున అతను పైకి చూడవలయును.

కావున ఈ యొక్క బీద చిన్నారి శిశువు, పేరు లేనివాడై, ఏ పేరు కూడా లేని వాడే, చిన్న పేరు లేని బిడ్డ, మరి ఇప్పటికిని ప్రపంచములోనే ఎంతో ముచ్చటైన చిన్న బిడ్డ.

85

మరుసటి రాత్రి మరియు వారు లోనికి వచ్చి, మరియు వారు ఉదయము మూడు గంటల వరకు కాచుకొనియుండి, మరి అటు పిమ్మట అతను నడచి వెళ్ళెను. మరియు అతను ప్రార్ధించెను, అతను పోయి మరి చెప్పెను, ''ఇప్పుడు, యాకెబెదు, లేచి రమ్ము!“

కావున మరి చిన్న అహరోను మరియు చిన్న మిర్యాము, వారు లేచిరి. ఓ, ఆమె వచ్చి మరి ఆమె తన చేతులను ఉంచి, ఆమె చెప్పెను, ''తండ్రీ!“ చిన్న మిర్యాము, ఆమె చెప్పెను, ''మీరు మన చిన్న తమ్ముడు, బాబును తీసికొని వయస్సైన మొసళ్ళు ఉండు నైలు నదిలో వేయకూడదు తెలియునా?”

మరియు అతను ఆమెయొక్క చిన్న వెంట్రుకలను ఆ విధముగా వెనుకకు పెట్టెను. మరియు ఆమెకు అందమైన కన్నులు, మరియు అందమైన చిన్న వెంట్రుకలు ఉండెను. మరియు కావున అతడు ఆమెను చెంపలపై ముద్దాడెను. అతను చెప్పెను, ''ప్రియమైనదానా, అది నన్ను కూడా బాధించుచున్నది. అది నన్ను కూడా బాధించుచున్నది, అయితే మనము దీనిని చేయవలయును.“

86

మీరు చూశారా, చిన్న బాలికలును మరియు బాలురును, కొన్ని సమయములలో మనలను బాధించు కార్యములను మనము చేయవలసియుండును, అయితే దానిని ఎట్లైనను మనము చేయవలెను. మరి అమ్మాయిలు ఇట్లు చెప్పినయెడల, ''హేయ్, నీవెప్పుడైనను సిగరెట్ పట్టియున్నావా?“

మీరు చెప్పెదరు, ''లేదు.“

''సరి, ఒకటి ప్రయత్నించుము! ఓ, నేను నీ యొక్క స్నేహితుడిని, నీకు తెలియును. అవును, దానిని ప్రయత్నించుము.“

అయితే అది కొద్దిగా బాధించవచ్చును, అయితే చెప్పుము, ''హు - అహ్. అది నాకు అక్కర లేదు. చూచారా. నాకు అది అక్కర లేదు.

అడిగెదరు, ''ఈ రోజు సాయంకాలము నాతో కూడా సినిమాకు వచ్చెదవా?“

''రాను, రాను. హు, అహ్, నేను సినిమాలకు పోను.“ చూశారా. అది కొద్దిగా బాధకలుగజేయ వచ్చును, చూడుడి.

''ఓ, నీవొక పాత-కాలపు సాంప్రదాయపువాడివి.“ దానిని మీరు నమ్మవద్దు. అది కొద్దిగా బాధించవచ్చును. దానినుండి మీ తలను త్రిప్పుకొనుడి; అదియే చేయవలసిన సరైన కార్యము, మీరు చూడుడి. ఎల్లప్పుడును దానిని చేయుడి, సరైన కార్యము చేయుడి. అది సరి.

87

మరిప్పుడు అమ్మాయిలు ఈ యొక్క పాత వ్రేళ్ళపై డాన్స్ మరి అటువంటి కార్యములు నేర్చుకొనుచుండగా, మరి మీరు కూడా దానిని చేయవలయునని వారు కోరినయెడల; వారితో చెప్పుడి, ''వీలు కాదు, వీలు కాదు.“ దానిని మీరు చేయవద్దు, చూశారా.

''ఓ, సరి, అది చాలా సరదాగా ఉండును.“ అది ఎంత సరదాగా ఉన్నను మీరు పట్టించుకొనవద్దు. ఏది సరియో దానిని మీరు చేయుడి, కావున ఏది సరైనదో ఎల్లప్పుడూ దానినే మీరు చేయుడి. ఇప్పుడు దానిని మీరు గుర్తుంచుకొనుడి. దానిని మీరు మరచిపోవద్దు, మీరు ఆ విధముగా చేసెదరా?

ఇప్పుడు, వారేమి చేసిరి? వారు చిన్న బిడ్డను తీసికొని అప్పుడు, మరి వారు లేచిరి. మరియు చిన్న అహరోను వచ్చి, అతను అడిగెను, ''త౦డ్రీ, మన చిన్న బాబును మీరేమి చేయనైయున్నారు?“

అతను చెప్పెను, ''అహరోను, నా యొక్క ఒడిపై కూర్చొనుము, హనీ.“ చెప్పెను, ''చూడుము, అహరోను మనము బిడ్డను ఉంచుకొనిన, మనము ఏమి చేయగలము? [సంఘము చెప్పుచున్నది, ''దానిని పోగొట్టుకొనుదము.”] దానిని కోల్పోయెదము. అయితే మనకు వానిని ఇచ్చిన ఆయన చేతులకు మనము బిడ్డను తిరిగి అప్పగించినయెడల మనమేమి చేయగలము? [''దానిని కాచుకొనెదుమ.“] ''దానిని కాచుకొనెదుమ.” అది సరి.

''అయితే, దానిని ఏ విధముగా చేయబోవుచున్నావు, తండ్రీ?“

''నాకు తెలియదు. అదెట్లు జరుగనైయున్నదో నాకు తెలియదు, అయితే దేవుడు దానిని చేయనైయున్నాడు,“ చూశారా.

88

మరియు కావున వారప్పుడు అక్కడ చిన్న బిడ్డను పెట్టి మరియు అతను పోయెను. మరప్పుడు వారు పోవుచున్నారు, వారు తలుపు యొద్దకు పోవుచున్నారు. వారు తలుపునొద్దకు పోవుచున్నారు, అతను ఇటు-అటు వీధి గుండా చూచుచున్నాడు, వీధికి ఆ ప్రక్క చూచుచున్నాడు. అక్కడ ఎవరును, వచ్చుట లేదు. చెప్పెను, ''యాకెబెదు, రమ్ము. అహరోను రమ్ము. మిర్యాము రమ్ము. మనము వెళ్దాము.“

వారు వారియొక్క చిన్న పడవను తీసికొని మరియు నదియొద్ద నీటి మొక్కల యొద్దకు వెళ్ళిరి. పగటి వెలుగు ఇంకను సమయముండెను. మరిక్కడ చిన్న అహరోను, చిన్న మిర్యామును పట్టుకొని వచ్చుచున్నాడు. చిన్న సహోదరుడును మరియు సహోదరియును, వారు ఏడ్చుచున్నారు. మరియు బీద యాకెబెదు, ఇటు ప్రక్క ఆమె పోవుచున్నది. [సహోదరుడు బ్రెన్హాం యాకెబెదు ఏడ్చులాగున ఏడ్చి చూపించుచున్నారు.] ''ష్ -ష్ -ష్ -ష్ -ష్, వారు వీధులను గమనించుచున్నారు. జాగ్రత్తగా ఉండుడి. ష్! చిన్న బిడ్డను కట్టుచున్నారు. మరియు తల్లి బిడ్డను సర్దుచున్నది, మరి తండ్రి రెల్లు పెట్టెను సర్దుచున్నాడు.

89

వారు నదియొద్దకు పోవుచునన్నారు. అది ఒక పెద్ద గొప్ప నది, ప్రపంచములో కెల్ల రెండవ పెద్ద నది. అది పెద్ద నదులలో ఒకటి, గాలికి నీళ్ళు ఊగుచు, అనేక మొసళ్ళతో నిండియుండును. ఓ, అవి లావుగా ఉన్నవి. వ్యూ! ఆ మొసళ్ళు వారి యొక్క చిన్న బిడ్డలందరిని తినియుననవి. అవి లావుగానున్నవి. మరి ఆమె చెప్పెను, యాకెబెదు ఆమె యొక్క భర్తయైన అమ్రాముతో చెప్పెను, ''ఓ, దానిని మొసళ్లు పట్టుకొనిన ఎట్లు? దానిలోనున్న మొసళ్ళు దానిని తాకిన యెడల ఎట్లు?“

చెప్పెను, ''దిగులు పడవద్దు, అవి గనుక వారి ముక్కుతో ఆ తారును తాకిన యెడల, అవి దూరముగా పోవును, చూశారా. ఆ కారనము వలననే అది కంపు కొట్టుచున్నది, చూశారా. ఆ మొసలి తన ముక్కతో వాసన చూచి, మరి పైకెత్తి,“ చెప్పెను, ''అతను మనుష్య శరీరమును వాసన చూడలేదు, కావున అది దూరముగా పోవును. ఆ తారు చాలా ఘోరముగా వాసనగానుండుట వలన అవి పారిపోవును. అదంతయు సరిపోవును. దిగులుపడవద్దు.” కావున అమ్రాము చిన్న పడవను క్రిందికి దించెను. మరియు ఆమె చెప్పెను, ''ఇప్పుడు నీవు బిడ్డకు పాలియ్యుము.“

90

కావున తల్లి బిడ్డను తీసికొని పాలిచ్చెను, మరియు ఉదయ కాలమున ఆ బిడ్డ పాలు పరిపూర్ణముగా త్రాగువరకు ఆమె పాలిచ్చెను. మరి అటు పిదప [సహోదరుడు బ్రెన్హాం ముద్దిచ్చులాగున శబ్దము చేయుచున్నారు.] దానికి ముదిచ్చెను. మరియు పిదప వానిని ఆహారోను నొద్దకు తీసికొనిపోయెను, మరియు ఆయన వానికి ముద్దిచ్చెను. మరియు మిర్యాము నొద్దకు తీసికొనిపోయెను, ఆమె వానికి ముద్దిచ్చెను. మరియు తల్లి వానికి ముద్దిచ్చెను, మరియు ''ఓ,“ ఆమె చెప్పెను, ''నేను కేవలము.....”

''ష్ -ష్ -ష్ -ష్! ఇప్పుడు వినుడి, మనము సిపాయిలవలె ఉండవలయును, చూశారా. మనము సిపాయిలవలె ఉండవలయును. ఇప్పుడు, మీరందరును వానికి తిరిగి ముద్దియ్యవలెనని యున్నారా?“ వానిని మరల వారందరును ముద్దాడిరి. పిదప వారు దానిని అక్కడ ఉంచిరి.

మరియు తల్లి ఒక చిన్న దుప్పటిని చేసి మరియు దానిని దానిపైనుండెను; చిన్న దిండు, మరియు దానిని దానిపైనుంచెను. ఆమె చెప్పెను, ''నా యొక్క ప్రియమైన చిన్న బిడ్డా, దేవుడు నిన్ను ఆశీర్వదించును.“

''ష్-ష్-ష్-ష్. దేవుడు దానిని గురించిన అక్కడను తీసికొనును. మీరు దిగులుపడవద్దు.“

చిన్న మూతను మూసివేసెను. మరియు మీకు తెలియునా మొదటి కార్యము ఏదనగా, తండ్రి తనయొక్క కోటును తీసి వేసెను, తనయొక్క చొక్కాయిని తీసివేసెను, ఇదిగో ఇక్కడ అతను నీళ్లలోనికి మెల్లగా నడచుచు పోవుచున్నాడు.

91

ఈ యొక్క సమయములో పరలోకములో ఏమి జరుగుచున్నదని మీరు అనుకొనుచున్నారు? హల్లేలూయా! మీకు తెలియునా, ఇక్కడ కార్యములు జరుగుచున్నప్పుడు, అక్కడ పైనను ఏదో జరుగుచుండును. ఆమేన్! దేవుడు తనయొక్క సింహాసనము నుండి పైకి లేచి, నడచి, పిలిచెను, ''గాబ్రియేలు! గాబ్రియేలు! నీవెక్కడ ఉన్నావు?“

గాబ్రీయేలు చెప్పెను, ''ప్రభువా, ఇదిగో నేనిక్కడ.“

''ఒక నిమిషము ఇక్కడకు రమ్ము. నేను నీకు ఒక కార్యమును చూపించబోవుచున్నాను.“ చెప్పెను, ''దూతలందరును ఇక్కడికి రండి, నేను నీకు ఒక కార్యమును చూపింపబోవుచున్నాను. నన్ను నమ్ము జనులు నాకు కలరు. అవును, నన్ను ఆధారపడియుండు జనులు నాకు కలరు. ఒక నిమిషము ఇక్కడికి రండి! దీనిని చూచుట మీకు బాగుండును! చూడుడి!”

''అదెక్కడ ఉన్నది?“

''అక్కడ క్రింద తొంగి చూడుడి.“

''ఎక్కడా? అవును, అవును, అవును, నేను దానిని చూచుచున్నాను.“

''అక్కడ క్రింద చూడుడి. ఆ ప్రక్కన చూడుడి అక్కడ రెల్లు మరియు వెదురు మొక్కలు?

''అవును.“

''అక్కడ చూడుడి!“

''అదేమిటి?“

''అక్కడ ఒక వ్యక్తి పైకి తన చేతులును ఎత్తి, తన మోకాళ్ళూని, నన్ను పిలచుచున్నాడు. అక్కడొక ఏడ్చుచున్న తల్లి, మరియు ఏడ్చుచున్న ఇరువురు చిన్న పిల్లలు వారు చివరి వరకు నన్ను నమ్ముకొనియున్నారు. గాబ్రియేలు నీవు లోనికి వెళ్లియున్నప్పుడు నీకు గుర్తున్నదా? ఆ వ్యక్తి నీకు గుర్తున్నదా?“

''అవును, అతనిని గదిలో సంధించి మరియు ఆ రాత్రి మాట్లాడియున్నాను. హు హు.“

''అతనింకను నన్ను నమ్ముకొనియున్నాడు. నన్ను నమ్ముకొనియున్న జనులను నేను కలిగియున్నాను! చివరి వరకు నన్ను నమ్ముకొను జనులను నేను కలిగియున్నాను! అతనిని చూశారా? అతనిని గమనించుడి. అవును. ఓ, అది ధైర్యముతో కూడినదైయున్నది కదా?“

92

తండ్రి నీళ్లలో నడచి వెళ్లుచున్నాడు, చిన్న పడవను నీళ్ళలోనికి త్రోయుటకు ప్రయత్నించుచున్నాడు.

''గాబ్రియేలు!“ అని ఆయన పిలుచుటను నేను వినుచున్నాను.

''ఇదిగో, ప్రభువా?“

''రంగములోనికి పదివేలమంది దూతలను పిలువుము. వారికి అక్కడ వెళ్ళుటకు అజ్ఞలు ఇమ్ము. పరలోకపు సమూహమును బయటికి పిలువుము. పైనున్న పరలోకపు మిద్దెనుండి వారిని క్రిందికి నడిపించి మరి వారిని నైలునది యొద్ద వారిని పెట్టుము. ఏ ఒక్క మొసలి కూడా ఆ యొక్క సరుకును తాకకూడదని నేను ఆజ్ఞాపించుచున్నాను! దానిని ఏదియును తాకదు! దానియొద్దకు ఏ ఒక్క చెక్క ముక్కను కూడా రానియ్యకూడదు.'' హల్లేలూయా!

గాబ్రియేలు చెప్పెను, ''అది అలాగుననే జరుగును.“

''సరి, బూరను ధ్వనించుము!“ పదివేల దూతలు వచ్చిరి!

“అందరిని నడిపించు నాయకుడు, ప్రభువా, మీరెక్కడ నుండబోవుచున్నారు?”

''నేను అవతలి ప్రక్కనుండెదను.“ ఆయన ఎల్లప్పుడున కార్యమ యొక్క చివరి దశలో ఉందును. ''నేను అవతలి గట్టున కాచుకొనియుండెదను. నాకు ఒక ఉద్దేశము కలదు. మరి ప్రజలు నన్ను విశ్వసించునపుడు, నాకు ఒక కార్యము ఉద్దేశ్యము కలదు; వారికి సమస్తమును మంచిగా జరుగును.” సరి, ఆయన అవతలి ప్రక్కకు వెళ్ళును.

93

నేను మోషేను .... లేక చిన్న అహరోను మరియు వారు తిరిగి ఏడ్చుచు వీధిలో పోవుచున్నారు. ''ష్- ష్- ష్ -ష్- ష్, దానిని గమనించుడి.

మరియు చిన్న మిర్యాము ఇంకను అక్కడనే నిలుచుకొని గమనించుచున్నది. ఆమె చెప్పెను, ''ఓ, ఓ.“

చెప్పెను, ''మిర్యాము, రమ్ము, తెల్లవారు సమయమగుచున్నది. రమ్ము, పగలని కోడి కూయుచున్నది. రమ్ము, తెల్లవారుచున్నది. హనీ రమ్ము, మనము పోయెదము!“

''ఓ, తండ్రీ, తండ్రీ! దయచేసి ఇంకొక మారు. నేను నిలుచుకొని, దానిని ఊరకనే గమనించనిమ్ము మరియు ఏమి జరుగనైయున్నదని నన్ను చూడనిమ్ము. కొద్ది సేపైన పిదప నేను ఇంటికి వచ్చెదను“ అని చెప్పెను.

''ఓ, ''అదియును మంచి ఆలోచనయే, మిర్యాము; అది పరవాలేదు. నీవు ఊరకనే నిలుచుండి మరియు ఏమి జరుగనైయున్నదని గమనించుము. ''సరి, నేను దానిని గమనించెదను.“

''ఇప్పుడు, నీవు కొద్దిసేపైన పిదప త్వరగా ఇంటికి రమ్ము. ఏమి జరుగనైయున్నదని నీవు చూడుము. మరియు నీవు రమ్ము, ఏమి జరుగచున్నదను సమాచారము మాకు తీసికొని రమ్ము.

''సరి, తండ్రీ.“ మరియు వారు త్వరగా ఇంటికి పోయిరి.

చిన్న మిర్యాము ఆమె నిలుచుకొని మరియు ఆమె గమనించుచున్నది. మొదటి కార్యము మీకు తెలియునా, పగటి వెలుగు వచ్చినది. ''ఓ, ఓ, అక్కడ వచ్చుచున్నది ఏమిటి? సరి, అది ఒక దళసరి ముక్క. కాదు. అది మొసలియా? ఓ, అతను తిరిగి పోయెను.“

94

ఆహా! అతను దేనిని చూచెను? అనేకులు చూడనటువంటి దానిని అతను చూసెను, చూశారా. ఆ యొక్క చిన్న సరకు (పెట్టె) అక్కడ తేలుచు పోవుచుండెను. వారు అనుకొనిరి దానికి నడుపు నావికుడు లేడని, వారు అనుకొనిరి దానికి ఏ యొక్క నాయకుడు లేడని. దానికుండెను. వారు చుట్టును గుమిగూడియున్నారు.

ఇక్కడ ఒక చిన్న మొసలి వచ్చి, చెప్పెను, ''ఓ, అక్కడ చూడండి. ఇక్కడ. అతను తేలుకుంటూ వచ్చుచున్నాడు, ఆ విధముగా, అతను పోయి .... ''ఓ, వద్దు. వద్దు, వద్దు.“ మీరు ఆ యొక్క సరకు దగ్గరకు రాలేరు. అక్కడ దానిలో ఉన్నాడు దాస్యము నుండి విడుదనలు కోరు ఒక పది లక్షల యూదులను విడిపింపపబోవు బంధవిముక్తి చేయునతను, విమోచకుడు. పాతాళములోనున్న దయ్యములన్నియును అతనిని తాకలేవు. నదిలో ఈ యొక్క చిన్న తారులో చేబడిన పడవ తేరుకుంటూ పోవుచున్నది.

95

మొదటి కార్యము మీకు తెలియునా, అది ఒక సుడిలో చిక్కుకొన్నది. ''ఓ! మిర్యాము చెప్పుకొన్నది, ''ఓ! ఓ, అక్కడ దానిని చూడుడి! ఆ యొక్క నీటిసుడి, దానిని చూడుడి! ఆ విధముగా దానిని చూడుడి!“ మొదటి కార్యము మీకు తెలియునా, ఉన్నట్టుండి అది సుడి నుండి బయటికి వచ్చి కదిలిపోయెను.

ఆ విధముగా అదిపోవును. మనము కొన్ని సమయములో సుడిలో చిక్కు కొనెదము. ఈ యొక్క చిన్న పడవ, దిగులు పడవద్దు. అక్కడ ఎవరో గమనించుచున్నారు. ''ఆయనయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన దేవుని దూతలు కావలియుండెదరు.“ పదివేలమంది ఇప్పుడు అక్కడ దానితో నడచుచు పోవుచున్నారు.

96

చిన్న మిర్యాము, ఆమె పోవుచున్నద, ఆమె ఈ యొక్క పెద్ద రాతినెక్కి, మరియు ఆమె దానిని ఈ విధముగా గమనించుచుండెను. మరియు ఆమె తొంగి చూచుచుండెను, ఆమె పడవను గమనించుచుండెను. మరియు ఇక్కడ పోవుచుండెను, మరియు ఈ యొక్క గుబురుగానున్న నీటి మొక్కల మధ్య పోవుచునుండెను. కొద్ది సేపైన పిదప అది అక్కడ చిక్కుకొని నిలిచిపోయెను. చెప్పెను, ''ఓ! ఓ, ఇప్పుడు నేను ఆశ్చర్యపడుచున్నాను?“

(మరియు ఆమె యొక్క తండ్రి ఆమెతో చెప్పెను, ''ఇప్పుడు దానిని నీవు చూచుచున్నావని ఎవరును నీన్ను గమనించకుండా జాగ్రత్తగా ఉండుము. ఒకేవేళ ఎవరైనను వచ్చినయెడల నీవు దాని తట్టు చూడకుండునట్లు నటించుము, ఇంకొక ప్రక్కగా పోవుము. నీవు దానినే చూచుచున్నావని కూడా కనిపించుకొనద్దు, పోవుచువుండుము.“ ''సరి,” ఆమె చెప్పెను.)

97

అది నది ఒడ్డుననే పోవుచు అది నిలిచిపోయెను. మొదటి కార్యము మీకు తెలియునా, అది ఒక గుంపు చేపలు పట్టువారిని ఆకర్షించెను. మరి ఆమె ఏదో ఒక చిన్న ఆమ్మాయి ఊరకనే అచ్చట నడుచుచు పోవులాగున నటించెను. అది ఉదయము పది గంటలు కావచ్చుచున్నది, మీకు తెలియునా, కావున ఆమె నదిలో ఒడ్డున నడచుచు మరియు ఆమె వెనుదిరిగి చూచుచు, ప్రక్కలను చూచును, చూశారా, అది ఎక్కడికి పోవుచున్నదా అని గమనించుచుండెను.

కొద్దిసేపైన పిదప ఆమె ఇంకొక గుంపును దాటిపోయెను. అయినను గమనించుచునే యుండెను; ఇంకొంచెము దూరము పోయెను. పోవుచునుండెను, ఇంకొద్ది దూరము పోవుచుండెను.

మరియు కొద్దిసేపైన పిదప ఆమె ఒక గొప్ప గోడయొద్దకు వచ్చెను. ''ఓ, మై, అది ఈ యొక్క గొడవెనుక పోవుచున్నది!“ ఆమె ఏమి చేయగలదు? ఆమెకు ఏమి చేయవలెనో తెలియలేదు. కావున, ఆమె గోడపైకి వెళ్లలేదు, కావున ఆమె నీటిలో మెల్లగా నడచుచు మరి ఈ విధముగా అడుగులు వేయుచు, పైకి ప్రాకెను. ఆమె అక్కడికి పోయి మరియు ఆమె నడచుచుండెను.

98

మొదటి కార్యము మీకు తెలియునా, ఆమె ఒక చక్కటి తోటలో నుండెను. పువ్వులు అన్ని చోట్లన వికసించుచుండెను. మరది చాలా అందముగా నుండెను, ఇప్పుడు ఒక క్షణము వినుడి. ఇప్పుడు గమనించుడి, చిన్న అమ్మాయిలారా. అందమైన పుస్తకములు, మరియు, ఓ, చెట్లన్నియును చక్కగా కత్తిరింపబడియున్నవి. అది చాలా అందముగా నుండెను! అది ఒక శృంగార వనము. ''ఓ,“ ఆమె చెప్పెను, ''అక్కడ చూడుడి, దానిని! ఓ, అయ్యో! నేను అంతఃపురము యొక్క శృంగారవనములో ఉన్నాను, ఫరో యొక్క అంతఃపురము, ఉద్యానవనము. ఇక్కడ నేనేమి చేయగలను? ఇక్కడ గనుక వారు నన్ను పట్టుకొనిన ఎడల, ఓ, మై, వారు నాకేమి చేయుదురు?”

మరియు ఆమె గమనించెను. అక్కడ చిన్న పడవ పోవుచునుండెను, మరది అక్కడ నీటిలో నిలిచిపోయెను, మరి నీటిలో అది తేలుచునుండెను. నేనెందుకు అది ఆ విధముగా ఉన్నదని ఆశ్చర్యపడుచున్నాను? మరియు ఆమె ఎవరో మాటలాగుచుండుటను వినెను. ఆమె చెట్ల పొదల మధ్య దాగుకొనెను. ఆమె కూర్చుండి మరి ఈ విధముగా గమనించుచుండెను, మీరు తెలుసా — చిన్న మిర్యామును. అయితే ఆమె బయటికి తొంగి చూచి దానిని చూడగలదు.

99

మొదటి కార్యము మీకు తెలియునా, ఇక్కడ కొద్ది గొప్ప పెద్ద బలమైన నల్లటి మనుష్యులు ఒక పల్లకిలాంటి దానిని మోసుకొని వచ్చుచున్నారు. మరి పనికత్తెలు దానిని వెన్నంటి వచ్చచున్నారు, మరియు వారు పాడుచున్నారు. మరిక్కడ ఒక స్త్రీ వచ్చుచున్నది, మరియు ఆమె యొక్క తల చుట్టూ ఒక పెద్ద బంగారపు వంటిది, ఒక పెద్ద పాము తన మూతిని తెరిచినదాని వలే ఆ కిరిటము ముందు భాగమున ఉండెను. మరియు ఆమె చక్కగా కనిపించు స్త్రీ, మరియు ఆమె వచ్చెను. ఆమెకు ఎంతో చక్కని పైవస్త్రములు ఉండెను. మరియు ఆ పనికత్తెలలో ఒకరు చెప్పుట వినుచున్నాను, “ఘనత వహించిన రాజకుమారి, ఈ ఉదయమున నీరు వెచ్చగా ఉండునని మీరు అనుకోనుచున్నారా?”

మిర్యాము చెప్పుకొనెను, ''ఘనత వహించిన? ఓ, అది రాజకుమారి, కావున నేను ఉద్యానవనములో ఉన్నాను అనుకుంట. మరియు వారు నన్ను ఇక్కడ పట్టుకొనినయెడల, వారు నన్ను ఏమి చేయుదురు?“

100

అది సరి, ఆమె క్రిందికి వచ్చెను, మరియు ఈ నల్లటి మనుష్యులు దీనిని మోయుచు, ఈ విధముగా పట్టుకొనుచు, ఆ విధముగా నీటి ఒడ్డున నడచుచున్నారు, మరియు ఆమె తన పాదరక్షలను తీసివేసెను. మరియు ఒక పనికత్తె తువాలు పట్టుకొనియుండెను, మరియు ఇంకొకరు సబ్బును పెట్టుకొని యుండిరి. మరి ఆమె తన ఉదయకాలపు స్నానమునకై పోవుచున్నది. కావున ఆమె అక్కడ క్రిందికి పోవుచున్నది మరియు ఆమె తనయొక్క స్నానమునకై సిద్దపడుచున్నది. ఆమె తన చెప్పులను విడచి, మరియు చెప్పెను, ''నేను నా వ్రేళ్లను నీటిలో వదిలెదను మరి నీరు ఇంకను వెచ్చగా నున్నవా అని చూచెదను. ఓ, అది బాగున్నది, కేవలము.... అక్కడ ఉన్నది అది అదేమిటి?“

101

''ఓ! మిర్యాము, చిన్న మిర్యాము చెప్పుకొనెను, ''ఓ! హు-ఓ, ఆమె దానిని పసికట్టెను.“

''ఓ,“ ఆమె అడిగెను, ''అది ఒక మొసలియా?”

ఆ యొక్క పెద్ద బలమైన మనుష్యులలో ఒకడు చెప్పెను, ''ఒక నిమిషము ఉండుడి, నేను కనుగొనెదను.“ నీళ్లు చెదురునట్లు నీటిలోనికి నడిచెను. ఈ విధముగా దానిని పట్టుకొని పైకి తీసి, మరియు లోనికి నడచెను. చెప్పెను, ''ఘనత వహించిన రాజకుమారి! దానిని పనికత్తెకు ఇచ్చెను. మరియు పనికత్తె దానిని తీసికొని మరియు ఆమె యొద్దకు ఆ విధముగా ఇచ్చెను, మరియు ఆమె దానిని క్రింద ఉంచెను.

ఆమె అడిగెను, ''అదేమిటి? వ్యూ, కంపుకొట్టుచున్నది! దానిపై అంతయును తారు కలదు. ఇక్కడ చూడుము, దానిపై ఒక రంధ్రము కలదు.“

మరియు మిర్యాము చెప్పెను, ''ఓ! ఓ, అదిగో అక్కడ నా చిన్న తమ్ముడు పోవుచున్నాడు! అదిగో అక్కడ నా చిన్న తమ్ముడు పోవుచున్నాడు!“

102

కావున, వారు మరి దానిని ఈ విధముగా తెరచిరి. “ఓ, అది ఒక బిడ్డ!” మరియు అది ఆరంభించెను .... ప్రపంచములోకెల్లను అందమైన చిన్న బిడ్డ! మరియు ఓ, ద్వేషమును కలిగించు దేవుడు, ప్రేమను కూడా కలిగించగలడు; మరియు ఒక సమస్య హృదయములో ప్రేమనంతయును పెట్టగలిగిన ఆయన, ఒక తల్లికి బిడ్డపై ప్రేమను, ఆయన ఆ విధముగా ఆ యొక్క అమ్మాయి హృదయములో ఉంచెను. మరియు ఆమె చెప్పెను, ''ఇది హెబ్రీయులలో ఒక ... అదేమిటని నాకు తెలియును. అది చెడ్డవాడైన నా తండ్రి వలన ఇది జరిగెను! అతను చాలా నీరసముగానున్నాడు! అతను హెబ్రీయుల బిడ్డలనందరిని చంపవలయునని చెప్పియున్నాడు. ఎక్కడైనను పోయిపడనీ అని ఎదురు చూచుచు మరి ఆ తల్లులలో ఒకరు వారియొక్క బిడ్డను పారవేసియున్నారు. ఓ, అను దుర్మార్గుడు! సరి, అతను ఈ బిడ్డను చంపలేదు, ఏలయనగా ఇది నాది.“ హు- అహ్, చూశారా దేవుడు ఏ విధముగా చేయుచున్నాడో యని?

103

ఆమె అతనిని పైకి తీసికొని మరియు ఆమె అతనిని మద్దాడెను. మరి ఆ బిడ్డ ఏడ్చెను. మరి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు, అది ఆమె హృదయమును కరిగించుచు ఆమె చెప్పెను, ''నా చిన్న బిడ్డ.“ చెప్పెను, ''నేను అతనిని తీసికొని, మరి నేను అతనిని పిలువబోవుచున్నాను... నేను అతనికి ఒక పేరునివ్వబోవుచున్నాను.” మరియు అక్కడే అతను తన పేరును పొందెను.

అతని యొక్క పేరు ఏమిటి? [సంఘము చెప్పుచున్నది, ''మోషే.“] మోషే. మరియు మోషే అనగా ''నీటి నుండి తీయబడెను అని అర్ధము,” చూశారా.

104

ఆమె చెప్పెను, ''ఇప్పుడు నేను అతనిని మోషే అని పిలిచెను, మరి అతడు నా యొక్క సొంత బిడ్డ. నేనతనిని ఉంచుకొనెదను.“ అయితే ఇప్పుడు ఆమె చెప్పెను, ''అయితే నేను ఒక కన్యకను, నేనతనికి పాలియ్యలేను. నాకు అతనిని పోషించుటకు వేరే మార్గమే లేదు. అప్పుడు ఈ కాలమున ఉన్నట్లు సీసాలు మరియు అలాంటి కార్యములు లేవు. ఇప్పుడు స్త్రీలు సిగరెట్లు పీల్చు విధముగా అప్పటి కాలమున లేదు, వారు వారిని కలుషితము చేసికొనకుండిరి. కావున చెప్పెను, ''సరి నీకు గనుక తెలిసినయెడల ఒక....” చెప్పెను, ''ఏమి, నేనేమి చేయుదును?“ కావున ఆమె చెప్పెను, ''నేను .....”

మరియు వారిలో ఒకరు చెప్పిరి, ''నేను నీకు చెప్పెదను, ఘనత వహించిన రాజకుమారి, నేను మీ యొక్క బిడ్డకు పాలిచ్చుటకు ఒక దాదిని కనుగొనెదను.

''ఓ, ఆమె చెప్పెను, ''అది చాలా మంచి ఆలోచన.“

ఒక చిన్న కార్యమేదో పలికెను, ఒక దూత ఆ పొదలలో నిలుచుకొని, చెప్పెను, ''మిర్యాము, ఇది నీ యొక్క తరుణము! అక్కడనే నీ యొక్క సదవకాశము! చిన్న మిర్యాము పరుగెత్తెను. మరి చెప్పెను, ''నీవు ఇప్పుడు అధికముగా ఏమియు చెప్పవద్దు, నిన్ను గురించి ఏమియును చెప్పవద్దు. నీవు పోయి మరి చెప్పుము నీవొక దాదిని కనుగొనెదనని, మరి పోయి నీ యొక్క తల్లిని పిలుచుకొని రమ్ము.“

సరి, కావున ఆమె దానిని చెప్పెను, ''ఘనత వహించిన రాజకుమారి!“

105

ఇప్పుడు, సాధారణ సమయములలో ఆమె చెప్పియుండును, ''ఇక్కడ నీవేమి చేయుచున్నావు?“ అయితే, చూడుడి, దేవుడు దానినంతయును మూసివేసెను. ఎందులకు? ఆయన పదివేల దూతలను అక్కడ నడిపించియున్నాడు, చూశారా. ఆయన యొక్క కార్యక్రమము జరుగనైయున్నది. ఆయనకు అక్కడ పదివేల దూతలు నిలుచుకొనియున్నారు.

కావున మొదటి కార్యము మీకు తెలియునా, చెప్పెను ''అవును, చిన్నదానా, ఇక్కడ నీవేమి చేయుచున్నావు?“

ఆమె చెప్పెను, ''నేనిప్పుడే మిమ్ములను బిడ్డతో చూసియున్నాను. చెప్పెను, మీ కొరకు మీ బిడ్డను అక్కరగొనుటకు ఎక్కడ ఒక మంచి తల్లిగలదో నాకు తెలియును.“

ఆమె చెప్పెను, ''పోయి, ఆమెను తీసికొనిరమ్ము, మరియు చెప్పుము బిడ్డన చూచుటకు ఒక వారమునకు మూడు వందల డాలర్లు నేను ఆమెకిచ్చెదను, మరియు అంతఃపురములో ఉన్న అనేక మంచి గదులను ఆమెకిచ్చెదను. మరియు నీకు తెలియునా, ఈ యొక్క శిశువుకు పాలియ్యగల, పాలిచ్చు ఒక హెబ్రీయుల స్త్రీ ఎక్కడ ఉన్నదని. ఇది నా యొక్క బిడ్డ.“

చెప్పెను, ''సరి, ఘనత వహించిన రాజకుమారి, నేనొకరిని పిలుచుకొని వచ్చెదను,“ అని చెప్పెను.

చెప్పెను, “ఇప్పుడు, ఒక్క నిమిషమాగుము! నీవు కోటలోనికి పోక మునుపు నీవొక అందరును గ్రహించలేని రహస్యపు మాట (పాస్ వార్డ్) ఒకటి కలిగియుండవలయును. చూశావా, నీకు ఆ మాట తెలియదు. ప్రతి దినమున మాకు ఒక రహస్యపు మాట కలదు. ఈ రోజు యొక్క రహస్యపు మాట, (నీకు తెలియునా అదేమిటని?) ”ఒక కీలు పూయబడిన ముండ్ల గరిటె మరియు ఒక మోపు ఎండ వేసిన గడ్డి.“ చెప్పెను, ''నీవు ద్వారము ద్వారా రావలయుననిన దీనిని నీవు చెప్పవలయును.”

106

కావున చిన్న మిర్యాము ఇంటకి ఎంత వేగముగా వీలైనదో అంత వేగముగా వెళ్ళెను, మరియు గోడ దూకి, వీధిలో పరుగెత్తి మరియు ఈ మార్గము ద్వారా, మరియు ఈ మార్గము ద్వారా, ఎంత వేగముగా పోవలయునో అంత వేగముగా పోయెను, ఆమె ఇంటిలోనికి వెళ్ళెను.

మరియు అమ్రాము అప్పుడే ఇంటికి వచ్చెను. మరి యాకెబెదు చెప్పెను.... ఓ, వారు చాలా దుఃఖముతో నుండిరి, ఏమి జరుగుచున్నదని ఆశ్చర్యపడుచుండిరి. ఆమె చెప్పెను, ''నా యొక్క చిన్న బిడ్డ! నా యొక్క చిన్న బిడ్డ!“

అతను చెప్పెను, ''ఇప్పుడు వినుడి.“ చెప్పెను, ''నేను ఇంతకు మునుపు వీధిలో వచ్చుచుండగా, మరియు ఆ బీద తల్లి అందరిని రోజంతయును ఇంటిలో పెట్టెన. ఈ పొరుగింటిలో ఈ ఉదయము వారు వచ్చి మరియు వారు పొరుగున ఉన్న ప్రతి యొక్క బిడ్డ యొక్క తలను గోడకేసి కొట్టి చంపిరి. మరియు వారు ఎట్లు అరచును మరియు కేకలు వేయుచుండిరని చెప్పెను! ఇప్పుడు, తెలియదు మన బిడ్డకేమైనదని. వాడు ఎక్కడున్నను, మన బిడ్డ ఎక్కడున్నను, దేవుడు వానిని అక్కర తీసికొనును.”

107

అప్పుడు ఎవరో ఒకరు... [సహోదరుడు బ్రెన్హాం ప్రనసంగ వేదికపై తట్టుచున్నారు.] ''ఓ! ఓ, ఇప్పుడు వారు తలుపునొద్దయున్నారు. కావున, మరియు వారు వెళ్లి చూచిరి. అది వారు కాదు. అది మిర్యాము.

ఆమె చెప్పెను, ''ఓ! ఓ, మిర్యాము! ప్రియమైన మిర్యాము లోనికి రమ్ము! బిడ్డకు ఏమైనది?“

ఆమె చెప్పెను, ''తల్లి, నేను చాలా ఆకలితో వున్నాను.“

అడిగెను, ''అయితే బిడ్డకు ఏమైంది?“

చెప్పెను, ''తల్లీ, నేను ఆకలితోనున్నాను.“ చెప్పెను, ''ఓ, దేవునికి స్తోత్రము! హల్లేలూయా! నేను ఆకలితో ఉన్నాను, తల్లీ.”

అడిగెను, ''అయితే చిన్నారికి ఏమైనది?“

చెప్పెను, ''తల్లీ, నేను చాలా ఆకలితో యున్నాను నేను ఇంటిలోనున్న వాటినన్నిటిని తినగలను.“

''సరి, నీకు ఏదైనను తినుటకిచ్చెదను, అయితే చిన్న బాబుకు ఏమాయెను?“ అని అడిగెను.

చెప్పెను, ''ఓ, బాబు బాగున్నాడు, తల్లి, నాకు తినుటకు ఏదైనను ఇవ్వుము. ఓ, నేను చాలా సంతోషముగా ఉన్నాను!“

''అయితే వానికి ఏమి జరిగెను?“

''సరి, నాకు తినుటకు ఏదైనను ఇవ్వుము, నేను ఆకలితో ఉన్నాను.“ దానిని నీవు ఊహించగలవా?

108

ఆమె చెప్పెను, ''మిర్యాము! ఇది నీ యొక్క తల్లి మరి తండ్రి. బాబు ఎక్కడ ఉన్నాడు?“

ఆమె చెప్పెను, ''తల్లి, నేను నీకు చెప్పియున్నాను బాబును నేను చూచియున్నాను, మరియు అతడు బాగున్నాడు. ఇప్పుడు, తల్లి, నేను తినుటకు నాకే దైనను తీసికొని రమ్ము, నేను పస్తుతో వున్నాను. మీకు తెలియునా, నేను పస్తుతో వున్నాను.“ మీరు పాఠశాల నుండి ఇంటికి వచ్చునపుడు మీకెట్లు ఆకలిగా ఉండునో, ఆ విధముగా, మీకు తెలియునా; ఓ, ఏదైనను తినుటకు కావలయును.

కావున, ఆమె వెళ్ళి మరియు ఆమెకు సాండ్విచ్ ఇచ్చెను. అడిగెను, ''ఇప్పుడు నాకు చెప్పుము.“

మరి ఆమె, ''యమ్, యమ్, యమ్,'' అని నములుచు తినుచు మీకు తెలియునా, ఆ విధముగా చెప్పెను, ''తల్లి?“

అడిగెను ''సరి, బాబుకు ఏమాయెను?“

''ఏమి,“ చెప్పెను, ”తల్లీ....“ ఆమె ఆమెకు కథంతయు చెప్పెను. మరియు చెప్పెను, ''తల్లి, నీవు వెళ్ళి మీ యొక్క మంచి దుస్తులను తీసికొనుము, మరియు ఏ యొక్క పెట్టెను సర్దుకొనుము, ఏలయనగా బాబును నీవు సంరక్షించబోవుచున్నావు.” ఓ! ఓ! ఓ!

''ఏమిటి?“

మీరు గనుక దానిని పోగొట్టుకొనిన, దానిని మరల మీరు కనుగొనెదరు. అది సరియేనా? మీరు గనుక ఉంచుకొనినయెడల, దానిని మీరు పోగొట్టుకొనెదరు. మీరు గనుక దానిని ఇచ్చినయెడల, దానిని పోగొట్టుకొనినయెడల, దానిని మీరు కనుగొనెదరు. అది సరియేనా?

109

మరియు చిన్న మిర్యాము తినుచుండెను, చెప్పెను, ''అవును.“ చెప్పెను, ''ఈ రోజు నీవు అంతఃపురమునకు పోబోవుచున్నావు. మరియు అది మాత్రము కాదు, నీ యొక్క సొంత బిడ్డను సంరక్షించుటకుగాను, ఒక వారమునకు మూడు వందల డాలర్లు నీకు ఇవ్వబడును, మరియు దేశములోనున్న శ్రేష్టమైన గదులు నీకు ఇవ్వబడును.”

ప్రపంచ చరిత్రలోనే మొదటి సారి ఒక తల్లి తన సొంత బిడ్డకు పలిచ్చుటకు వేతనము ఆమెకు చెల్లింపబడెను. చూశారా, దేవుడు దానిని ఎట్లు చేసియున్నారో? హల్లేలూయా! తనయొక్క సొంత బిడ్డకు పాలిచ్చి, మరియు ఒక వారమునకు మూడు వందల డాలర్లు పొందెను, మరియు దేశములోనే శ్రేష్టమైన గదులు, దేవుడు కార్యములను చేయును, ఆయన చేయలేడా? ప్రార్ధించుట వలన లాభమున్నదా? ప్రార్ధించుట మంచిదా?

110

కావున ఆమె తన యొక్క పెట్టెను సిద్ధపరచుకొనెను. మనము త్వరగా ఇప్పుడు పోయెదము, ఇంకొక నిమిషములో మనము ముగించనైయున్నాము. ఆమె తనయొక్క పెట్టెను సర్దుకొనెను, మరియు దాని గుండా ఆమె త్వరితముగా పోయెను. మరియు మొదటి కార్యము మీకు తెలియునా, ఆమె వచ్చెను; పెద్ద వయస్సైన కావలి కాయువాడు అక్కడ తనయొక్క గొప్ప పెద్ద బల్లెముతో నిలుచుకొనియున్నాడు, అడిగెను, ''అక్కడెవరు పోవుచున్నారు?“

ఆమె చెప్పెను, ''ఒక కీలు పూయబడిన ముండ్ల గరిటె మరియు ఒక మోపు ఎండ వేసిన గడ్డి.“

''ముందుకు పోవుము.“ చూడుడి, దేవుడు ఎట్లు కార్యములను చేయును?

అటు పిదప ఉన్న ఇంకొక కావలి కాయువాని యొద్దకు పోయెను. అక్కడ అతను తన కత్తి దూసి, అడిగెను, ''ఎవరు నీవు? అక్కడ ఎవరు పోవుచున్నారు?“

చెప్పెను, ''ఒక కీలు పూయబడిన ముండ్ల గరిటె మరియు ఒక మోపు ఎండ వేసిన గడ్డి.

చెప్పెను, ''ముందుకు సాగి పొమ్ము.“ మై! చూశారా దేవుడు ఏ విధముగా కార్యములను చేయును?

అంతఃపురము వరకు పోయెను, పైకి పోతొడగెను, మరియు రాజసేవకులు అందరును బయటికి వచ్చి, తమ కత్తులను లాగిరి. ''అక్కడ ఎవరు పోవుచున్నారు?“

చెప్పెను, ''ఒక కీలు పూయబడిన ముండ్ల గరిటె మరియు ఒక మోపు ఎండవేసిన గడ్డి.

''లోనికి పొమ్ము.“

జరిగిన మొదటి కార్యము మీకు తెలియునా, ఒక వ్యక్తి బయటికి నడచి వచ్చి అడిగెను, ''ఘనత వహించిన ఆ రాజ స్త్రీ కాచుకొనియున్న ఆ స్త్రీ నీవేనా?“

''అవును.“

''మరియు ఈ రోజు ఉదయము కనుగొనబడిన ఆ యొక్క శిశువుకు పాలిచ్చి పోషింపబోవు ఆమె ఈమేనా.“

''అవును.“

చెప్పెను, ''సరి, ఆమెను లోనికి తీసికొని రమ్ము.“ కావున, ఆమె బిడ్డను లోనికి తీసికొని వచ్చెను .... లేక తల్లిని లోనికి పిలుచుకొని వచ్చెను.

111

మరియు చిన్న రాజకుమార్తె బయటికి వచ్చి, మరి ఆమె అడిగెను, ''ఒక బిడ్డను గురించి నీకేమైనను తెలియునా?

ఆమె బదులిచ్చెను, “తెలియును రాజ కుమారి.”

ఆమె అడిగెను, ''ఈ బిడ్డను చూడుము. అది చక్కగా లేదూ?

''అవును, ఘనత వహించిన రాజకుమారీ. అవును.“

''అడిగెను, ''ఒక బిడ్డకు పాలిచ్చుట నీకు తెలియునా?“

''అవును, ఘనత వహించిన రాజకుమారి, నిశ్చయముగా.“

''సరి, వారు చెప్పిరి, ''నేను నీ యొక్క జీతమైన ఒక వారమునకు మూడు వందల డాలర్లు నీకిచ్చెదను.“ హుమ్! దేవుడు మంచివాడు కాదా? మరియు చెప్పెను, ''మరియు అంతఃపురములో శ్రేష్టమైన గదులు నీకు కలవు, మరియు నీ యొక్క భోజనము నీకు పంపబడును. నీవు బయటికి వచ్చి నీ యొక్క భోజనమును కూడా వండుకొనక్కరలేదు. ''ఇప్పుడు, ఇదిగో బిడ్డ, చాలా జాగ్రత్త సుమీ. దానిని క్రింద వేయవద్దు.”

''ఓ, దిగులు పడవద్దు, నేను చేయను, దిగులు పడవద్దు, నేను వానిని క్రింద వేయను.“

''బిడ్డను అతి జాగ్రత్తగా చూచుకొనుము.“

''దిగులు పడకుము, నేను జాగ్రత్తగా చూచకొనెదను. నేను శ్రేష్టమైన రీతిలో అక్కర తీసికొనెదను.

నిశ్చయముగా, అది ఆమె యొక్క సొంతమైనది, చూడుడి. “నేను అతి జాగ్రత్తగా అక్కర తీసికొనెదను.”

''నీవు చూడుము అది చాల చక్కనైన బిడ్డ?“

''చాలా అందముగా ఉన్నది,“ ఆమె చెప్పెను.

''సరి.“

112

తలుపు మూయబడెను, మిర్యాము, మరి ఆమె తల్లి, మరియు చిన్న మోషే లోపల ఉండిరి. మరియు అప్పుడు తలుపులు మూయబడినపుడు, ఆమె చుట్టు చూచెను. ఆమె చెప్పెను, ''మరియు ఆమె అనుకొనుచున్నది నీవు ఆమె యొక్క బిడ్డయని, హా-హా-హా-హా-హా!“ ఓ, మై ఆమె దానిని ముద్దాడెను.

ఆమె ఏమి చేసెను? ఆమె.... ఆమె దానిని ఉంచుకొనియున్నయెడల, ఆమెకు ఏమి జరిగియుండును? [సంఘము చెప్పుచున్నది, ''దానిని పోగొట్టుకొనియుండును.] ఏలయనగా ఆమె దానిని ఆమె కిచ్చిన ఒకనికి తిరిగి ఇచ్చెను, మరియు ఏమి జరిగిను? దానిని కనుగొనెను. మరి ఆమె దానిని ఉంచుకొనవచ్చును. ఇప్పుడు దానిని మనము పోగొట్టుకొనియున్న యెడల ఏమి సంభవించియుండును... మనము మన ఆత్మను ఉంచుకొనినయెడల, ఏమి సంభవించును? దానిని మనము పోగొట్టుకొనెదము. మరి మనము దానిని మనకు అనుగ్రహించిన ఆ ఒకనికి దానిని సమర్పించిన ఎడల, ఏమి సంభవించును? దానిని మనము కాచుకొనెదము. అది సరియేనా?

113

మీలో ఎందరు బలిపీఠమునొద్దకు వచ్చి మరియు ప్రార్ధింపగోరుచున్నారు? దానిని మీరు చేయగోరుచున్నారా? ఆ యొక్క చిన్న బిడ్డను యేసు అక్కర తీసికొనిన విధముగా మిమ్ములను కూడా యేసు అక్కర తీసికొనవలయునని కోరుచున్నారా? ఇప్పుడు మనమందరమును, చిన్న పిల్లలు, పీఠము చుట్టు కూడెదరా, దానిని మీరుచేయుదురా? చుట్టును వచ్చి, పీఠము చుట్టు మోకాళ్ళూనుడి, మనమందరమును ప్రార్థించెదము. చిన్న పిల్లలందరును, ఇప్పుడు ఇచ్చటికి రండి. దీనిని గురించిన నా యొక్క కథ మీరు ఇష్టపడుచున్నారా? దానిని మీరిష్టపడుచున్నారా? సరి, ఇప్పుడు మీరు బలిపీఠము చుట్టు రండి. ఇప్పుడు రండి. చిన్న పిల్లలైన మీరందరును వచ్చి, బలిపీఠము చుట్టును మోకాళ్ళూనుడి, అక్కడ మోకాళ్ళూనుడి - అక్కడనే బలిపీఠమునొద్దనే. ఆ విధముగానే. వెనుకనున్న చిన్న పిల్లలైన మీరు, ఇప్పుడు ఇక్కడికి రండి, మనము ప్రార్ధింపనైయున్నాము. సరి, మీరు వచ్చి ప్రార్ధింపవలయునని యున్నారా, వచ్చి మరి బలిపీఠము చుట్టును మోకాళ్లు వేయుడి. అది సరి. ఇప్పుడు, అది మంచిది, సరి.

మరిప్పుడు తల్లులైన మీరు కూడా రావలయునని యున్నారా, మరియు తండ్రులు, మీరు ఆ ప్రక్కన మోకాళ్లు వేయుడి.

114

ఇక్కడ ఇప్పుడు నేను చిన్న పిల్లలను ఒక కార్యమును అడుగదలచియున్నాను. ఆయన మోషేను ప్రేమించిన విధముగా యేసు మిమ్ములను ప్రేమించుచున్నాడు, మీరు నమ్ముచున్నారా? ఈ విధముగా దూతలు మిమ్ములను గమనించుచున్నారని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు, దేవుడు మీకు ఒక ఆత్మను ఇచ్చియున్నాడు. ఆయన ఇచ్చియున్నాడా? ఇప్పుడు మీరు గనుక మీ యొక్క ఆత్మను ఉంచుకొనినయెడల దానికి ఏమి సంభవించును? దానిని మీరు కోల్పోయెదరు. అయితే ఈ ఉదయము దానిని తిరిగి యేసుకు ఇచ్చిన యెడల, అప్పుడు మీరేమి చేయుదురు? ''దానిని కాచుకొనెదము.“ దానిని కాచుకొన్న యెడల, మరి పరలోకమునకు వెళ్ళెదము. ఇప్పుడు మీరు గనుక మీ యొక్క ఆత్మను రక్షించుకొనగోరినయెడల, మీరు రక్షించుకొనగోరుచున్నారా? మరియు ఎదిగి ఒక నిజమైన తల్లులుగా మరియు నిజమైన గౌరవింపతగిన స్త్రీలుగా మీరు ఉండవలయునని కోరుచున్నారా, మీరు కోరుటలేదూ; నిజమైన వ్యక్తిగా, బోధకులుగా, మరియు ఆ విధముగా? దానిని మీరు చేయగోరుట లేదా? ఇప్పుడు, మీరు చేయగోరిన ఎడల మీ యొక్క ఆత్మను యేసుకు అర్పించుడి. దానిని చేయుటకు మార్గము ఇక్కడ ఉన్నది. మీరు చెప్పుడి, ''ప్రియమైన యేసు, నేను మీకు ఇవ్వగలిగినదంతయును ఇదియే, అది నా యొక్క ఆత్మయే, అయితే మీరు మోషేను గమనించినట్లు నన్ను కూడా అక్కర తీసికొనుడి.

115

ఇప్పుడు మీలో ఎవరైనను పెద్దవారు వచ్చి మరియు మోకరింపగోరినయెడల, మీలో కొందరు తల్లులు కూడా రాగోరినయెడల, ఈ ఉదయము ఇక్కడ మీరు మోకరింపవచ్చును. మీరట్లు చేసినయెడల దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. మీరు గనుక ఇచ్చటికి వచ్చి మోకరింపగోరిన యెడల, అది మంచిది. ఇదిగో ఇక్కడ ఒక తల్లి తనయొక్క బిడ్డతో వచ్చుచున్నది. వేరెవరైనను ఉన్నారా?

ఒక తండ్రి, డాడీ, మీలో ఎవరైనను, అమ్రాము ప్రార్ధించిన విధముగా మీరు కోరినయెడల, మీరు వచ్చి మరియు మోకాళ్ళూనుడి.

తల్లి, నీవు యాకెబెదువలె ఉండగోరుచున్నావా, ఏల, మీరును వారితో కూడా వచ్చి మరియు మోకాళ్ళూనుడి.

నిశ్చయముగా, ఇది ప్రతి యొక్కరికి, ఏల? మీకు కూడా ఒక ఆత్మ యున్నది. మీరు గనుక దానిని ఉంచుకొనిన, ఏమి సంభవించును? [సంఘము చెప్పుచున్నది, ''దానిని పోగొట్టుకొనెదము.“] దానిని పోగొట్టుకొనెదము. మరియు మీరు గనుక దానిని మీకు అనుగ్రహించిన ఆ ఒకనికి దానిని తిరిగి ఇచ్చినయెడల, ఏమి సంభవించును? ''దానిని రక్షించుకొనెదరు.” దానిని నిత్యజీవమునకై మీరు ఆ విధముగా చేయవలెనని ఉన్నవారు, మరియు మనము ఈ యొక్క చిన్న పిల్లలతో, మరియు మన అందరితో కలసి ఇప్పుడు.

116

తల్లుల యొక్క దినము, ఒక అద్భుతమైన దినము, మరియు ఒకవేళ ఈ రాత్రి, నేను నా యొక్క అంశమును మార్చివేసి మరియు ఆ తల్లి ఏమి చేసెను, ఎట్లు చేసెనన్నది గురించి చెప్పెదను. ఇశ్రాయేలీయులనందరిని వాగ్దానపు భూమికి నడిపించుటకు తనయొక్క చిన్న బాలునికి తర్ఫీదునిచ్చినది ఆమెయే. ఓ, ఆమె ఒక నిజమైన తల్లి. ఆమె నిజమైన తల్లి కాదా? [పిల్లలు చెప్పుచున్నారు, ''అవును.“] ఇప్పుడు, మీరు కూడా నిజమైన తల్లిని కలిగియున్నారు, మరి తల్లి మీ కొరకు ప్రార్ధించుచున్నది. అతను ఒక నిజమైన తండ్రి. మరి తండ్రి మీ కొరకు ప్రార్ధించుచున్నాడు. మరిప్పుడు మనమందరమును కలిసి మనకు సహాయపడవలయునని యేసును అడుగుచు ప్రార్ధింపబోవుచున్నాము.

117

సహోదరుడు నెవిల్, మీరు కూడా వచ్చి, మాతో మోకరించెదరా?

మరియు మనము మన తలలు వంచెదము, ప్రతి యొక్క చోటునుండు అందరును. ఇప్పుడు సహోదరీ గెర్టీ....

ప్రియమైన పరలోకపు తండ్రీ, ఈ రోజు ఈ యొక్క చిన్న సాధారణ వెనుకటి దినములను గురించిన కథ, అందులో ఒక నిజమైన తండ్రి మరియు తల్లి, లేక ఒక నిజమైన విశ్వాసి, మీ యొద్దకు వచ్చి మరియు వారు మిమ్మును ఆరాధించి, మరియు వారు మిమ్ములను నమ్మిరి. ఆ సమయములో దుర్దశ ఆ దేశములో ఉండెను. మరియు ఒక నవీన చిన్న మోషే ఈ ఉదయమున ఇక్కడ మోకాళ్లు వేసియుండలేదని మనకెట్లు తెలియును! మరియు ప్రవక్తియునగు ఒక నవీన చిన్న మిర్యాము ఈ ఉదయమున ఇక్కడ మోకాళ్ళూని లేదని మనకెట్లు తెలియును!

ఓ, ప్రియమైన తండ్రీ, ఈ యొక్క చిన్న పిల్లలు మిమ్ములను ప్రేమించుచున్నారు, మరియు వారు రక్షింపబడవలయునని కోరుచు మరియు వారు ఒక ఆత్మను కలిగియున్నారని గుర్తెరిగి సిలువ యొద్దకు వచ్చి మరియు మోకాళ్లు వేయుచున్నారు, మరియు వారు ఇప్పుడు వారి ఆత్మను మీకు సమర్పించుచున్నారు. ఏలయనగా, మేము ఇంతకు మునుపే మీ యొక్క వాక్యమును చదివియున్నాము, ''మీరు గనుక దానిని పోగొట్టుకొనినయెడల, దానిని రక్షించుకొనెదరు; దానిని ఉంచుకోనిన యెడల, మీరు దానిని మీరు పోగొట్టుకొనెదరు.“ మరియు, తండ్రీ, వారు వారియొక్క ఆత్మలను వారియొద్దనే ఉంచుకొనవలయునని కోరుట లేదు. వారు వారియొక్క ఆత్మలను మీకు సమర్పించవలయునని ఉన్నారు, కావున దానిని వారు ఇచ్చుట వలన వారు నిత్యజీవమును కనుగొనెదరు. దానిని అనుగ్రహించుము, ప్రభువా.

118

బలిపీఠము చుట్టునున్న నీ యొక్క చిన్న బాలురును మరియు బాలికలను ఆశీర్వదించుము. ఈ ఉదయమున ఇక్కడున్న తల్లులను మరియు తండ్రులను ఆశీర్వదించుము. ఓ, మీ యొక్క ప్రేమగల కృపయు మరియు దయ వారిపై నుండనిమ్ము. మీ యొక్క పాపములను మరియు లోటుపాట్లన్నిటిని క్షమించుము. మా మధ్య నుండి వ్యాధులను తీసివేయుము.

దూతలను పంపుము! హల్లేలూయా! దేవా, మీరు గాబ్రియేలుకు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే మరి పదివేల దూతలు నడచి వచ్చిరి; మరియు ఈ ఉదయమున ఈ యొక్క పిఠమునొద్ద మోకాళ్ళూనియున్న ఈ చిన్న బీద పిల్లలను వారు చూచిన ఎడల మరెన్ని దూదలు వీరి చుట్టు వచ్చెదరు! ఈ యొక్క బలిపీఠము చుట్టును మరియు ఈ యొక్క ఆలయములో దేవుని యొక్క దూతలు నిలుచుకొనియున్నారు. జ్ఞాపకార్ధ పుస్తకములో వారి పేర్ల నెక్కించు దూతలు ఇక్కడున్నారు. వారు వారియొక్క ఆత్మలను పోగొట్టుకొనుచున్నారు, కావున వారు క్రీస్తులో దానిని కనుగొనగలరు! దానిని అనుగ్రహించుము, ప్రభువా.

119

మరియు ఈ దినము నుండి వారియొక్క చిన్న జీవితము మధురముగాను మరియు నమ్రతతో ఉండనిమ్ము. మరియు వారిని మీ చెంతకు మీరు పిలుచు వరకు, వారు వారియొక్క తల్లి తండ్రులకును మరియు వారియొక్క పరలోకు తండ్రికిని విధేయులుగా ఉండనిమ్ము. నీటి సుడులలో, వారిని వారియొక్క చిన్న ఓడలలో నడిపించుము. ప్రతి యొక్క సారి వారి పడవ దట్టమైన పొదలలో చిక్కుబడినపుడు, దేవుని యొక్క దూతలు వారిని దేవుని యొక్క ప్రేమ అను నీటి ప్రవాహములో వారు ప్రయాణించులాగున వారిని లాగనిమ్ము. దానిని అనుగ్రహించుము, ప్రభువా. మరియు వారియొక్క మార్గము చివరన వారు వారియొక్క ప్రేమగల గృహమును కనుగొననిమ్ము. మరియు వారియొక్క తల్లి మరియు వారియొక్క ప్రియులు అక్కడ మహిమలో, ఆ రోజు దేవుడు ద్వారమునొద్ద నిలిచి మరియు వారిని ఆహ్వానించును. దానిని అనుగ్రహించుము, ప్రభువా.

మా యొక్క పాపములను మరియు అతిక్రమములను మన్నించుము. మరియు ఈ రోజు నుండి పరిపూర్ణముగా మీకు మేము చెందుటకు మాకు సహాయపడుము. ఇప్పుడు ఈ చిన్న పిల్లలను మేము మీ యొక్క చేతులకు సమర్పించుచున్నాము. మరియు వారితో కూడా ఈ యొక్క తల్లులు ప్రభువా తల్లులకు అని ఇవ్వబడిన ఈ యొక్క జ్ఞాపకార్ధ సమయమున, ఈ యొక్క తల్లుల దినమున వారు సరైన తల్లులుగా ఉండనిమ్ము. మరియు వారు ఈ రోజు నుండి ఇంకొద్దిగా మెరుగైన తల్లులుగా ఉండనిమ్ము. పిల్లలు ఇంకను మంచి పిల్లలుగా ఉండనిమ్ము. మేమందరమును మీకు సేవ చేయుటలో, ప్రభువా మేము ఇంకొంచెము

ముందడుగు వేయనిమ్ము. దానిని అనుగ్రహించుము, ప్రభువా, వీటిని మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

120

ఇప్పుడు మనము ఒక చిన్న పల్లవిని పాడెదము.

యేసు మిమ్ములను రక్షించినవాడని మీరు నమ్ముచున్నారా? మీరు నిలుచుకొనియుండగా, ఇప్పుడు యేసు మిమ్ములను గమనించవలయునని మీరు కోరుచున్నారా? ఇప్పుడు ఈ విధముగా మీ చేతులను ఆయన తట్టుకు పైకెత్తుడి. మరి మిమ్ములను మీ తండ్రి తల్లుల యొద్దకు తిరిగి పోవలయునని నేను కోరుచున్నాను మరి వారందరును. ఈ తట్టుకు తిరుగుడి, ఇప్పుడు తల్లీ తండ్రి ఇక్కడ చూడుడి. మరియు చిన్న బాలికలును మరియు బాలులారా లేచి నిలువుడి. ఇప్పుడు, ఎందరు యేసును మీ యొక్క రక్షకునిగా అంగీకరించి, మరి ఆయన మోషే యెడల చేసినట్లు మిమ్ములను కూడ అక్కర తీసికొనవలయునని, మరి ఇప్పటి నుండి యేసును ఆధారపడియుండవలయునని యున్నారు, మీ చేతులు పైకెత్తబడుటను చూడనిమ్ము. మీలో ప్రతియొక్కరును. అది బాగున్నది! ఇప్పుడు ఏమి సంభవించినది? మీరు గనుక మీ యొక్క ఆత్మను ఉంచుకొనినయెడల, మీకేమి? [సంఘము చెప్పుచున్నది, ''దానిని కోల్పోయెదము.“] దానిని కోల్పోయెదము. అయితే దానిని యేసుకు ఇచ్చినయెడల, ఏమి సంభవించును? [''దానిని కాచుకొనెదము.] దానిని మీర కాచుకొనెదరు. ఇప్పుడు, యేసు మిమ్ములను ఈ ఉదయము గైకొనినయెడల ఏమగును? ఇప్పుడు మీరు యేసు యొక్క బిడ్డలు, మీరు కాదా? మీరు యేసు యొక్క చిన్న బాలురును మరియు బాలికలు.

121

కన్నీటిలో ఇక్కడ నిలుచుకొనియున్న ఈ యొక్క చిన్న బిడ్డలను చూడుడి. అది దేవునికి తెలియదని మీరు నమ్మవద్దు. ఆమేన్. రేపటి దినపు మనుష్యులు! అవును. అది సరియే. ఆమేన్.

పాపపు స్థలములలో నుండి వారిని లోనికి తీసికొని రండి;

వారిని లోనికి తీసుకొని రండి,

చిన్న పిల్లలను యేసునొద్దకు తీసికొని రండి.

''ఓ, నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను! ఇప్పుడు రండి!

ఓ, (మీరందరును) నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను,

(ఇప్పుడు మీ చేతులను పైకెత్తుడి.)

ఓ, నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను,

ఓ, నేనెట్లు యేసును ప్రేమించుచున్నాను,

ఏలయనగా ఆయన నన్ను మొదట ప్రేమించెను.

122

అది బాగుండుట లేదూ? ఇప్పుడు, ''యేసు ప్రపంచములోని చిన్న పిల్లలను ప్రేమించుచున్నాడు.“ సహోదరి, మాకు ఒక శ్రుతి వేయుడి. ఇప్పుడు మీరందరును ఈ విధముగా నా తట్టు తిరుగుడి, చిన్న బానికలైన మీరు. ''ప్రపంచములోని చిన్న పిల్లలను యేసు ప్రేమించుచున్నాడు అను పాటను నేను పాడదలచియున్నాను. అది ఎందరికి తెలియును? సరి, ఇప్పుడు దానిని పాడెదము.

యేసు చిన్న పిల్లలను ప్రేమించుచున్నాడు,

ప్రపంచములోని పిల్లలందరిని;

ఎరుపు మరి పసుపు, నలుపు మరి తెలుపు,

వారంరున ఆయన దృష్టిలో అమూల్యమైనవారు,

ప్రపంచములోని చిన్న పిల్లలను యేసు ప్రేమించుచున్నాడు.

123

ఇప్పుడు, మీరందరును సైన్యములో ఉన్నారు. అది మీరెరిగియున్నారా? మీరు దేవుని యొక్క సైన్యములో ఉన్నారని మీకు తెలియునా? ఇప్పుడు మీరు నన్ను నేరుగా చూడుడి. మరి ఇప్పుడు దీనిని నాతో కలిసి పాడుడి, ఏలయనగా మీరిప్పుడు సైనికులు. అది మీకు తెలియునా? సిలువ యొక్క సైనికులు! ఇప్పుడు, ''నేనెప్పుడును నడవను....“ అది మీకు తెలియునా? సరి. సరి, చాలా కాలము క్రిందట, నేను నేర్చుకొన్న పాత ఆదివారపు పాఠశాల పాట. ''నేనెన్నడును....'' నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను.

నేను కాల్బలముతో నడువలేక పోవచ్చును

గుర్రపు దండులో సవారి చేయలేక పోవచ్చును,

ఫిరంగులు పేల్చలేక పోవచ్చును;

శత్రువుపై నేను ఎగిరి పడలేక పోవచ్చును

అయితే నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను.

నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను,

ఓ, నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను!

మనమందరమును, ఇప్పుడు అందరును ఒక్కటిగా ఇప్పుడు. ఇప్పుడు!

నేను కాల్బలముతో నడువలేక పోవచ్చును

గుర్రపు దండులో సవారి చేయలేక పోవచ్చును,

ఫిరంగులు పేల్చలేక పోవచ్చును

శత్రువు పై నేను ఎగిరి పడలేకపోవచ్చును,

అయితే నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను.

124

దానిని మీరు స్వయముగా పాడగలరని మీరు నమ్ముచున్నారా? లాసి, పైకి రమ్ము, ఇక్కడికి రమ్ము. నేను చేయు కార్యములను మీరు కూడా పోయి చేయవలెనని నేను కోరుచున్నాను. ఇప్పుడిక్కడ బలిపీఠము వెనుకకు రండి, ఇక్కడికే రండి. నేను ఎక్కడ ఉన్నానో మీలో ప్రతి యొక్కరును కదలి రండి, చూశారా. ఇచ్చటికి నడచి రండి. పీఠమునకు ఈ ప్రక్క ఎవరును ఉండవద్దు. ఇక్కడికి రండి. ఆ విధముగానే ఈ ప్రక్క వెనుకకు రండి. ఇప్పుడు ఆ ప్రక్కకు తిరిగి, ఈ ప్రక్కకు ఈ విధముగా తిరిగి చూడుడి. అది ఆ విధముగానే, యేసును గురించి తెలుసుకొనిన పిదప చిన్న బాలురును మరియు బాలికలును ఏ విధముగా మంచిగా ఉందురో నేను మీకు చూపింపపదలచియున్నాను. ఇప్పుడు ఇచ్చటకి తిరిగి రండి, మీలో కొందరు. ఇప్పుడు అట్లే. ఇప్పుడు అక్కడ గమనించుడి.

125

ఇప్పుడు ''నేను కాల్బలముతో సైన్యములో నడువ లేకుండా పోవచ్చును,“ అని నేను చెప్పునపుడు మీరు.... కాల్బలముతో నడుచు, మీరు కూడా నడువుడి. ''నేను గుర్రపు దండులో సవారి చేయలేకపోవచ్చును,” అని నేను చెప్పినపుడు నేను చేయు కార్యములనే మీరు కూడా చేయుడి. ఇప్పుడు నాకు దూరముగా పోవుడి, ఇప్పుడు వెనుక నిలువుడి. నాకు జాగా స్థలము కావలయును. ఇంకొద్దిగా వెనుకకు, వెనుకకు ఇప్పుడు మీరు సరిగా యున్నారు. ఇప్పుడు రమ్ము, దానిని మనము పాడెదము. [సహోదరుడు బ్రెన్హాం మరియు పిల్లలు పాడునపుడు సైగలు చేయుచున్నారు.]

నేను కాల్బలముతో నడువలేక పోవచ్చును

గుర్రపు దండులో సవారి చేయలేక పోవచ్చును,

ఫిరంగులు పేల్చలేక పోవచ్చును;

శత్రువుపై నేను ఎగిరి పడలేక పోవచ్చును

అయితే నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను.

ఓ, నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను,

నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను,

ఓ, నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను! (సిద్ధముగా!)

నేను కాల్బలముతో నడువలేక పోవచ్చును

గుర్రపు దండులో సవారి చేయలేక పోవచ్చును,

ఫిరంగులు పేల్చలేక పోవచ్చును;

శత్రువుపై నేను ఎగిరి పడలేక పోవచ్చును

అయితే నేను ప్రభువు యొక్క సైన్యములో ఉన్నాను.

ఆమేన్! అట్లే నిలువుడి. దానిని ఎందరు ఇష్టపడుచున్నారు, ''ఆమేన్ అని చెప్పుడి.

126

ఇప్పుడు, పరలోకపు తండ్రి, ఈ రోజు ఈ చిన్న పిల్లలను ఆశీర్వదించుడి. ప్రభువా, వారు నీ యొక్క వారు. వారియొక్క జీవితములను వారు మీకిచ్చియున్నారు. వారు మోషే యొక్క కథను మరియు మీరెట్లు అతనిని కాపాడియున్నారని వారు వినియున్నారు. వారిని పెంచి పెద్ద చేయుటకు సహాయపడిన వారియొక్క మంచి తల్లి మరియు ఒక మంచి తండ్రిని గురించియును వారు వినియున్నారు. మరియు కావున ఈ యొక్క చిన్న పిల్లల మంచి తల్లులను మరి తండ్రులును. మరియు తండ్రీ, మీరు వారిని గమనించి మరియు కాలము ప్రవాహములో వారిని నడిపించి మరియు దేవుని యొక్క దూతల ద్వారా వారిని కాపాడవలయునని నేను ప్రార్ధించుచున్నాను. మరియు కడపటి దినములో వారిని మీ రాజ్యములో ఆహ్వానించుటకు మీరుండుడి, ప్రభువా, మేము క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

127

ఇప్పుడు, మీరు మీ యొక్క సీట్ల యొద్దకు తిరిగిపోయి మరియు మీరు ఎంత చక్కని అనుభూతిని కలిగియున్నారో తండ్రికి మరియు తల్లికి చెప్పుడి. ఆమేన్.

“ఇప్పుడు సంచరించుచున్న దినములన్నిటను వారు నడిపింపబడిరి,'' ఇప్పుడు నీకది తెలియునా, గెర్టీ?

.... వారు సంచరించుచున్నపుడు వారు నడువబడిరి,

వాగ్దాన భూమికి వారు నడిపింపబడిరి;

నిశ్చయముగా ప్రభువు యొక్క హస్తముతో నడిపింపబడిరి,

వారు కానాను యొక్క తీరమునకు తీసికొని రాబడిరి.

ప్రతి యొక్కరును!

రాత్రివేళ అగ్నియొక్క సూచనతో,

పగటివేళ మరియు మేఘము యొక్క సూచనతో,

ముందు అది పైన వ్రేలాడుచుండెను,

పగటివేళ మరియు మేఘము యొక్క సూచనతో,

ముందు అది పైన వ్రేలాడుచుండెను,

మనయొక్క మార్గమున వారు పయనించుచుండగా,

ఒక మార్గదర్శిగా మరియు ఒక నాయకునిగా, అరణ్యవాసము ముగియ వరకు,

ప్రభువును, మన యొక్క దేవుడు, ఆయన యొక్క సొంత సరైన

సమయములో

చివరకు వెలుగులోనికి మనలను నడిపించును.

128

ఎందరు ఈ ఉదయమున వ్యాధితో ఉండి మరి ప్రార్ధనను కోరుచున్నారు? మీయొక్క చేతులను చూడనిమ్ము. మనము కొద్దిగా ఆలస్యమైనందున, స్వస్థతా ఆరాధనను ఈ రాత్రికి పెట్టుకొనెదము. మరిప్పుడు చిన్న ప్రార్ధనను చెప్పి, ఏలయనగా మనకు ఆలస్యమైయున్నది.

మీరు ఈ యొక్క చిన్న కథను విని ఆనందించియున్నారా? ''ఇది చిన్న బిడ్డలకు బాగున్నదని మీరు అనుకొనుచున్నారా? అవును. మనము అనేక మార్లు వారిని గమనించక దాటి వేయుచున్నాము. దానిని మనము చేయకూడదు. చూశారా, నాకు ఆదివారపు పాఠశాలకు బోధించుటకు అవకాశము రాలేదు, మరి ఈ ఉదయము వారితో మాటలాడుటకు సమయము దొరకెను. నేను మిమ్మును అలసటనొందింపవలెనని కోరుకొనుట లేదు, అయితే ఈ యొక్క చిన్న కథను మీకు చెప్పవలయునని నేను కోరుకొనియున్నాను.

గుర్తుంచుకొనుడి, చిన్న పిల్లలారా, మీరు ఎక్కడో చదివియున్న ఒక చిన్న పాత కథ కాదు ఇది, అది సత్యము! దేవుడు దానిని చేసియున్నాడు. మరిప్పుడు ఆయన మీతో కూడా ఉన్నాడు. సరి.

మనము సెలవు తీసికొను పాటను, నెమ్మదిగా, ''ప్రతియొక్క శత్రువు నుండి, ఒక కేడెముగా, యేసు నామమును నీతో కూడా తీసికొని పొమ్ము. ఇప్పుడు పాడుచుండగా మన తలలు వంచెదము. సరి. ''నామమును తీసికొనుము.“

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...