కాదేషు-బర్నేయా వద్ద

కాదేషు-బర్నేయా వద్ద

VGR COUNT-170 ఆమె చాలా భయపడింది, ఆమె హృదయం గంటకు తొంభై మైళ్ళ వేగంగా వెళుతుంది. కొద్దిసేపటి క్రితం ఆమె ఇంటివద్ద వుండి, మరియు ఆమె గదిలో ఉండి పాడుటకు మరియు దానిని ముగించుటకు ప్రయత్నించుచూ ఉంది.

మరియు మంచిది, అది నన్ను సహోదరుడు మూర్ యొక్క మనస్సులో పెట్టుచున్నది, అతని చిన్న బాలుడు, అతడు బోధిస్తాడు అని అతడు చెప్పాడు. అతడు ఏడు లేక ఎనిమిదేళ్ళు వయస్సువాడు, “పేపీ (Pappy), నేను బోధించగోరుచున్నాను” అని అతడు చెప్పుచుండేవాడు, కావున ఒక రాత్రి, సమాజము ముందు శ్రీ. మోర్ చెప్పాడు, “ఇప్పుడు, జనులారా” చెప్పాడు, “దావీదు, ఇక్కడ కూర్చున్నాడు (ఒక పెద్ద క్రైస్తవ మతాధికారిలా అక్కడ కూర్చున్నాడు, మీకు తెలుసు, మరియు అతడు తల పైకి ఎత్తెను).” “ఈ రాత్రి, అతడు కొద్ది సమయం బోధించగోరుచున్నాడు,” అని చెప్పాడు.

కనుక అతడు వేదికపైకి పరుగెత్తి వెళ్ళెను. మీకు తెలుసా, అతడు కుర్చీలో నుంచి క్రిందికి దుమికి, పరుగెత్తికొని వెళ్ళి మరియు ఆగిపోయాడు. మరియు అతడు దానిలోనికి చొచ్చుకుపోవాలనుకున్నాడు. మరియు అతడు ఈవైపు, మరియు ఆవైపు చూచాడు, చెప్పాడు, “అది పని చెయ్యదు,” మరియు వెనుకకు వెళ్ళి కూర్చొన్నాడు. [సహోదరుడు బ్రెన్హాం నవ్వుచున్నాడు.] నేను అనేక మారులు చూచాను, అది పని చెయ్యదు, అని నేను తలంచాను. కాని ఇప్పుడు ... అయినప్పటికీ, అది అంతా సరి అయినది.

2

వారి తల్లులు మేబెల్ మరియు మీడా మా కొరకు పాడేవారు. కొన్నిసార్లు మరల వారు పాడుటను నేను ఇష్టపడతాను. మీరు ఇష్టపడరా? వారు పాడుతుంటే వినుటకు నేను ఇష్టపడతాను. బహుశా నేను సంఘాన్ని విడిచి వెళ్ళినప్పుడు నా కొరకు, వారు పాడిన పాటను, వారిని గుంపుగా చేసి వచ్చే ఆదివారం రాత్రి పాడించెదము. అది ఎప్పుడో మీరు జ్ఞాపకముంచుకొనుడి, అది ఏమిటి - అది ఏమిటి? పాదముద్రలలో ఇసుక రేణువులు తుడిచిపెట్టబడెను, ఒక క్రొత్త వ్యక్తి ... మరియు అప్పుడు: తూర్పు నుండి పడమర నుండి వారు వచ్చెదరు, (చూద్దాం) ఆయన అతిధులవోలె, రాజుతో భుజింతురు. (అది ఆ విధంగా ఉండును అని నేను తలంచుచున్నాను.) మీరు వారిని ఇష్టపడుచున్నారా, మరుసటి ఆదివారం రాత్రి మీలో ఎంత మంది వారిని వినుటకు ఇష్టపడుచున్నారు? ఒకవేళ మీరు మనము చుట్టుప్రక్కల వుంటే? మీరు వుంటారా? మంచిది, ఖచ్చితంగా, మాబెల్, మీరిక్కడ ఉన్నారా? డాక్, ఆమె ఇక్కడ వున్నదా? ఆమె దీనిని వినుచున్నది, మరియు మీడా అక్కడ వెనుక వున్నది, కనుక వారు కొద్దిగా అభ్యాసము చేయవచ్చును. ఎందుకనగా, కొంచెం సేపు తరువాత, అమ్మాయిలు వారియొద్ద నుండి దూరముగా పారిపోవుదురు, వారు పారిపోరా? అది నిజము. ఇప్పుడు కొంచెంసేపు అభ్యసించాలి, మరియు తదుపరి వారానికి సిద్దపడవలెను.

3

ఈ రాత్రి, క్రిందకు వస్తున్నప్పుడు, మరియు క్రితమే నా కుటుంబం క్రిందికి వెళ్ళినది, మరియు కొంచెం ప్రార్ధించుట కొరకు ప్రభువుతో నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఆ పాత గుడారము గుండా వెళ్ళి మరియు ఇక్కడ కార్లు వరుసగా పెట్టి ఉండుటను చూచాను. మీకు తెలుసా, అది కొంచెము ఆ పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకొని వస్తుంది, చాలాకాలం క్రితం ఉదయం రెండు లేక మూడు గంటల వరకు, ఇక్కడ లోపల గొప్ప కూటములు కలిగి వుండేవారము. లోపలికి వచ్చి ప్రజలు ఇక్కడ చుట్టూ కూర్చొని వుండేవారు.

మీకు తెలుసా, ఆ పాతకాలములలో వున్న అనేకులు ఈ రోజు ఇక్కడ సమాధులలో వున్నారు. నా ఉద్దేశ్యము వారి శరీరములు, కాని వారు మాత్రము మహిమలో ఉన్నారు. మరియు తరాలు వస్తున్నాయి, యవ్వనులు పెరుగుతూ ఉన్నారు. మనము ఎంతో కాలం ఉండము, మనము వెళ్ళిపోతాము. మరొకతరము వస్తుంది ... వేరే, యవ్వనులు, మన స్థానాన్ని తీసుకుంటారు. అయితే అది ప్రతిదినము ప్రభువు కొరకు, ఆయన కొరకే, యోగ్యముగా మనలను జీవింపచేస్తుంది.

4

ఇప్పుడు, రేపు ప్రజలకు పనిదినము అని, నాకు తెలుసు, వారు బయటికి వెళ్ళి మరియు పనికి వెళ్ళెదరు. కనుక మనము ... ఈ రాత్రి త్వరగా బయటకు వెళ్ళుటకు ప్రయత్నించెదము దీని తరువాత ఏదైనా బాప్తిస్మ కార్యక్రమము వున్నదా? అయితే సరియే.

5

ఇప్పుడు, ఈ ఆశీర్వదించబడిన పాత పరిశుద్ధ గ్రంధమే మన మార్గము... ఊయల నుండి సమాధికి, మరియు పరలోకానికి, మార్గమంతా అయియున్నది. మరియు దీనిని మనము ప్రేమించెదము, ఎందుకనగా అట్టడుగున ఉన్న వారిని రక్షించే రక్షణ ప్రణాళికను దీని ద్వారానే మనము కనుగొనెదము. ఇప్పుడు, దీనిని తెరిచే ముందు, గ్రంధకర్తతో మాట్లాడుదాం, కొద్ది క్షణములు మన తలలు వంచుదాము.

మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి కూటములో ఇప్పటికే చేసినవన్ని, పాటలు మరియు జరిగిన అన్నిటిని బట్టి మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. మరియు యేసుక్రీస్తు నామములో, “ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడియుందురో అక్కడ నేను వారిమధ్యన ఉందునని చెప్పిన,” నీ దయ గల, వాగ్దానమును బట్టి, ఈ చిన్న భవనము యొక్క పైకప్పు క్రింద ఇక్కడ సమావేశమై ఈ రాత్రి మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మరియు నీవు ఇక్కడే వున్నావు అని మేము ఎరిగియున్నాము.

6

మరియు పంతొమ్మిది వందల సంవత్సరములుగా ఈ సువార్త బోధించబడుచున్నది, మరియు ప్రపంచ చరిత్ర మారుచున్నది, ఇంకా నీవు మారకుండా అదేరీతిగా ఉన్నావు, అని తెలుసుకొనుట మాకు ఎంతో ఆనందముగా ఉన్నది. కాలము మారుచున్నది, ప్రజలు మారుచున్నారు, దేశం మారుచున్నది, కోరికలు మరియు పద్దతులు మారుచున్నవి, కాని నీవు మారకుండా అదేరీతిగా ఉన్నావు.

మరియు తండ్రీ, ఈ రాత్రి దానినిబట్టి మేమెంతో సంతోషంగా ఉన్నాము, ఎందుకనగా నీ వాక్యము మేము చదవగలుగుచున్నందుకు ఆనందించుచున్నాము, మరియు మీరు ఎవరనేది మరియు ఒకానొక దినమున గలిలయ తీరముపై ఇసుకలో నడిచి, సిలువవేయబడి మా స్థానమును తీసుకొని, మరియు పాపియై సిలువపై మరణించి, మాకు బదులుగ, మా పాపములను తానే తన పైకి తీసుకుని, వాటిని దూరముగ మోసుకుని పోయి మరియు పాతాళములో వేసెను. మార్పులేని ప్రేమించెడి, క్షమించెడి, అర్ధం చేసుకొనెడి తండ్రి యొద్దకు సమీపించుచున్నాము, అని మేము ఎరుగుదుము.

మరియు “ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్దుని కుళ్ళుపట్టనియ్యవు,” అని ప్రవక్త చెప్పాడు. మరియు మూడవ దినమున లేపబడి, ఆరోహణమై, మనము ఒప్పుకొనిన దానికొరకు విజ్ఞాపన చేయుటకు ఈ రాత్రి మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నావు. మరియు నీవు కల్వరిలో చనిపోయి నీ విమోచన ప్రణాళికలో చేర్చిన ప్రతీ దానికొరకు ప్రాయశ్చిత్తము చెల్లించి, మా వ్యక్తిగత ఆస్తిని నీ స్వరక్తముతో కొన్నావు, దానిని ఒప్పుకొనుటకు ఒక హక్కును మరియు ఒక అధికారాన్ని మేము కలిగియున్నాము.

7

మరియు, ఈ రాత్రి, తండ్రి, ఇక్కడ ఈ గుడారపు పైకప్పు క్రింద సమకూడిన ప్రతీ యాత్రికుడి కొరకు ఒక ప్రత్యేకమైన దీవెనను మేము అడుగుచున్నాము. తండ్రీ, నిన్ను ఎరుగని స్త్రీ పురుషులు, అబ్బాయిలు మరియు అమ్మాయిలు, ఎవరైతే ఓడ వెలుపట ఉన్నారో వారిని గూర్చి కూడా ఈ రాత్రి మేము అడుగుచున్నాము. ఈ రాత్రి మీరు వారితో ఉండమని మేము ప్రార్ధిస్తున్నాము, మరియు వారిని నీ యొద్దకు ఆకర్షించుము, మరియు వారి హృదయములను పరిశుద్ధాత్మ ప్రత్యేకముగ తట్టును గాక, మరియు మా తండ్రియైన దేవుని యొద్దకు వారు పిలువబడుదురు గాక. ప్రభువా, దానిని దయ చేయుము.

ఈ రోజు పగలు మరియు రాత్రి ప్రపంచవ్యాప్తముగా జరుగుచున్న ప్రతీ కూడికను మరియు ప్రతీ సంఘమును దీవించుము. మరియు సేవకులు అందరూ బోధించునట్లు ప్రేరేపించుము, మరియు వారు విని అర్ధం చేసుకొనునట్లు, ప్రజల యొక్క హృదయములకు మరియు చెవులకు సున్నతి చేయుము, మరియు దేవుడే మహిమ పొందునుగాక. క్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

8

ఈ రాత్రి మనము సిలువయొద్దకు వచ్చి, వాక్యముపై కొంచెం బోధించుటకు, ప్రభువు ఆయన ఆశీర్వాదములు జతపరచును గాక. ఇది ఒక ఆదివారపుబడి పాఠం వలె.

మీకు తెలుసా, కొద్ది సేపటి క్రితము, అక్కడ కూర్చుని, నేను ఆలోచించుచున్నాను. మీకు తెలుసా, కొన్ని సమయాలలో అది ఒక అద్భుతముగా ఉండును, అయితే... అక్కడ ఒక పెద్ద ఖాళీ భవనం ఉన్నది, పట్టణములో ఇక్కడ, ఆ పాత డ్రీమ్ ధియేటరు. అది పదిహేను వందల నుండి రెండు వేల మంది వరకూ కూర్చొనవచ్చు, అని నేను ఊహిస్తాను. మరియు కొద్దికాలము లేక కొన్ని ఆదివారములు, ఐదు వారములు, మరియు ఆదివారం మధ్యాహ్నం స్వస్థత కూడికను విజయవంతంగా కొనసాగించుకోవచ్చు, ఇక్కడ ఉన్నది ఓల్డ్ డ్రీమ్ ధియేటర్లో, కూటములు ఒక స్థానిక ప్రచార కేంద్రం ద్వారా, ఒక గంట ప్రసారం చేయుట మనము కలిగి ఉండుట చాలా చక్కగా ఉంటుంది.

అది ఎక్కువ ఖరీదు కాదు; ఒక గంటకు, అది పందొమ్మిది, ఇరవై డాలర్లు, అట్లా ఉంటుంది. అక్కడ నా కూటముల కొరకు నేను చెల్లించుట నాకు ఎంతో సంతోషముగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజలను అందులోనికి తీసుకొని వెళ్లవచ్చు మరియు మార్పు చెందే వారికొరకు, పంపుటకు అది ఒక చక్కని స్థలముగా ఉంటుంది.

9

మరియు, మీకు తెలుసు, ఈ ఉదయము “వలవేయుట” గూర్చి మన పాస్టర్ గారి వర్తమానము నేను ఎంతో ఆనందించాను. మరియు మీరును ఆనందించారు అని నేను ఎరిగియున్నాను. మరియు అది నిజం. మరియు ఆయన చెప్పిన విధముగా, మనము వలలోనికి చేపలను తేవలెను. అది సత్యం, చూడండి, వలలోనికి చేపలను తేవలెను. మరియు అప్పుడు కలిపి ఎందుకు, మనము నిలబడెదము.

10

ఇప్పుడు, నేను, గత సాయంత్రం, సహోదరుడు జూనియర్ క్యాష్ వద్ద, (అతడి పేరు ఇదే అని నేను నమ్ముతాను), గత సాయంకాలం, అతడి కొరకు మాట్లాడుట కొరకు మనము అక్కడ ఉన్నాము, మరియు అద్భుతమైన రీతిగా ప్రభువు దిగివచ్చాడు.

మరియు భౌతికముగా మీ కళ్ళతో వేదికపై మీరును నేనును చూడగలిగిన ఒకే ఒక కార్యము, వారు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చుచున్నారు. ఒక నల్లజాతి అమ్మాయి ఇండియానా క్రింద భాగంలోనో, ఆ దిగువనో, లేక ఎక్కడో ప్రమాదం జరిగి చెవి మరియు కంఠధ్వని సంబంధిత నరములు వేరుచేయబడి (తెగిపోయి), దానివల్ల ఆమె మాట్లాడలేదు, వినలేదు. మరియు ఎక్కడో ఒక నాళము దాని స్థానం నుండి తప్పి ఆమెకు ఒక ప్రక్క పక్షవాతం కలుగజేసింది. మరియు ఆ అమ్మాయి, ఆమె తల్లి, మరియు ఆమెకు ఉన్న పెద్ద కట్టులు, ఆమెను పైకి అక్కడకు (వేదికకు) తీసుకొని వచ్చుటకు ప్రయత్నిస్తున్నారు ఒక యవ్వన ప్రాయంలో ఉన్న అమ్మాయి, చిన్నది, మరియు బహుశా పదహారు, ఆ క్రమంలో ఏదో ఒక వయస్సు అమ్మాయి.

11

మరియు ఏదో ఒక విధముగా లేక మరియొక విధముగా, పరిశుద్ధాత్మ నా ఎదుట ఆఫ్రికాను నాకు చూపించింది. మరియు నేను దానిని చూశాను. మరియు ఇక్కడ ఉన్న పుస్తకంలో నేను ఒక దర్శనమును వ్రాసాను, మొదటి ఆఫ్రికా కూడికలు కన్నా ఆఫ్రికాకు తిరిగి (రెండవసారి) వెళ్ళే కూడికలు చాలా గొప్పగా ఉంటాయి. మరియు తరువాత, ప్రజలకు ఏమి జరుగుచున్నదో తెలియడం లేదు, కాని ఒక దర్శనం జరుగుచున్నది. మరియు నేను చెప్పాను, “పరలోకపు తండ్రి ...”

మేము అద్భుతముల కొరకు అడగడం లేదు. “వ్యభిచారులైన మూర్ఖతరము వారు అద్భుత క్రియలను అడుగుదురు,” అని పరిశుద్ధ గ్రంధం చెప్పుచున్నది. మరియు మేము అద్భుతములు కోరము, కాని దేవుడు అద్భుతములు చేస్తాడు. ఖచ్చితంగా అదే సమయంలో అద్భుతములు చేస్తాను, అని ఆయన చెప్పాడు. కాని ఒకవేళ మనం వాటి కొరకు వెతికితే, అద్భుతములు కలిగియుండాలి, ఏదో ఒకటి మాకు చూపించుటకు, మేము రక్షించబడ్డాము అని ఏదో ఒక ఆధారము లేక అటువంటిది.... నేను ఆధారములను నమ్మను. దేవుడిని ఆయన వాక్యమునందు పొందుటయే, మనము రక్షించబడ్డాము అనుటకు ఆధారమని నేను నమ్ముతాను. నీకు తెలిసిన గొప్ప విషయము అదియే. మరియు తరువాత ఫలములు అనుసరించును.

12

ఇప్పుడు, నేను ఆయనను అడిగాను, ఆయన దానిని దయ చేసినట్లయితే, అది మరల తిరిగి ఆఫ్రికా వెళ్ళే సమయం అని సూచిస్తుంది; ఇది, మన సంబంధాలను ఎల్లవేళలా బలపరుస్తుంది. మరియు మేము ఆ అమ్మాయి కొరకు ప్రార్ధించినప్పుడు, ఆమె మాట్లాడగలిగినది మరియు వినగలిగినది మరియు కదలగలిగినది. మన ప్రభువు చేసినది చూచుట ఎంతో అద్భుతంగా ఉన్నది.

మరియు దానిగూర్చి ఈ రాత్రి మేము సంతోషంగా ఉన్నాము, ఈ రాత్రి ఆ అమ్మాయిని చూచుటకు ఆ మనోహరమైన ఇల్లు, ఎప్పుడూలేనంత అత్యంత సంతోషంగా ఉన్నారు, అని మనము తెలుసుకొన్నాము. దాని నుండి నరములన్నీ తెగిపోయినప్పుడు, అది ఎలా జరిగినది? (చూచారా?) ఏ విధంగానూ, అవకాశం లేదు. లేదు, ఏమియు లేదు. నాలుకకు వెళ్ళేడి నరము లేక కంఠస్వరము, మరియు వినెడి నరము, అవి రెండూ ఒకే నరముపై ఉన్నవి, కాని అవి ప్రమాదం ద్వారా తెగిపోయినవి (వేరు చేయబడినవి) కాని, దేవుడు, ఏదో మార్గములో ...

ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు మీలో ఎంతమంది విన్నారు మరియు ఉన్నారు? మనము ఇక్కడ చూద్దాం. అది నిజము. మరియు ఆమె మాట్లాడగలిగినది మరియు వినగలిగినది మరియు సంభాషించగలిగినది. నేను ఇలా మాట్లాడాను, “నేను చెప్పినది వినబడుతోందా?” అని నేను చెప్పాను.

ఆమె అన్నది, “అవును.”

“నేను చెప్పినది మరల వినగలుగుచున్నావా?” అని నేను అడిగాను. “అమ్మా,” అనుము.

“అమ్మా” అని ఆమె అన్నది.

నేను చెప్పాను, “యేసు” అని అనుము.“

ఆమె “యేసు” అని అన్నది, మరియు ముందుకు వెళ్ళి మాట్లాడినది.

13

ప్రభువు అద్భుతకరుడు, ఆయన కాడా?, దయాపూర్ణుడు.

ఇప్పుడు కొన్ని వారములుగా స్వస్థత కూడికల నుండి బయటకు వచ్చుటను బట్టి మరొక కూడికను కలిగియుండుటకు, మరలా నా హృదయము సరియగుచున్నది (కొట్టుకొనుచున్నది).

ఇప్పుడు, సంఖ్యాకాండము గ్రంధమందు నేను పాత నిబంధనను ప్రేమిస్తాను. మరియు ఈ రాత్రి ఇప్పుడు సంఖ్యాకాండము గ్రంధముపై, మనము ఒక పాఠమును కలిగియుండబోవుచున్నాము. సంఖ్యాకాండము, 13వ అధ్యాయము మరియు 30వ వచనం, మరియు ప్రారంభము కొరకు ఒక వచనమును చదివెదను. మరియు అప్పుడు, మీరు చూడండి, పరిశుద్ధ గ్రంధములో నుండి మనము ఒక వచనం చదివినట్లయితే ... నాకు ఈ ఒక కార్యము తెలుసు: నా మాటలు తప్పిపోవును, ఎందుకనగా నేను ఒక మనిషిని; కాని దేవుని యొక్క వాక్యము ఎప్పుడూ తప్పిపోదు, ఎందుకనగా అది దేవుని యొక్క మాట అయివున్నది. మరియు, కనుక, వచ్చుచున్న ప్రతీ వ్యక్తి ఆశీర్వదించబడునట్లుగా ఇక్కడ వున్న ఒక వచనము తగినంత పునాదిని ఇచ్చుచున్నది, ఎందుకనగా అది వాక్యమును చదువుట తప్ప మరి ఏమియూ కాదు.

ఇప్పుడు, 30వ వచనంలో.

కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్లుదము; దానిని స్వాధీనపరచుకొందుము; దానిని జయించుటకు మనశక్తి చాలును అనెను.

మరియు ఈ వాక్యమునకు ప్రభువు ఆయన ఆశీర్వాదములు జతపరచును గాక.

14

ఇప్పుడు, ఈ రాత్రి నా యొక్క అంశము “కాదేషు బర్నేయా వద్ద.” మరియు పరిశీలించుటకు మనము కలిగియున్న ఈ అంశము ఒక చిన్న నేపధ్యము కొరకు, ఆ స్థలమునకు తీసికొని వచ్చుటకు, మరియు ఒకవేళ ప్రభువు యొక్క చిత్తమైతే ... బహుశా, ఇది అంతయు, మునుపెన్నడూ ధ్యానించలేదు. అది ఇవ్వబడినట్లుగా, కేవలం ప్రేరేపణ ద్వారా పలుకబడుచున్నది. దీనిని ఎలా బోధించాలనేది నేను ఎన్నడూ పాఠశాలలో నేర్చుకొనలేదు. మరియు దానిని నేను నాలుగు లేదా అయిదు సార్లు ప్రయత్నించాను, నిజంగా దాని నుండి ఒక భయంకరమైన గజిబిజిని చేశాను. దానిని ఎలా చేయాలో నాకు తెలియదు. అయిననూ, నేను ఆయనను ప్రేమిస్తున్నాను, మరియు నేను ఆయనపై ఆధారపడ్డాను. మరియు మీరును అదియే చేస్తారు, అని నేను ఎరిగియున్నాను.

15

కాబట్టి, ఇప్పుడు, ఆదిలో, ఇదియే ఒక చిత్రము, అది దేవుడు... అది దేవుడు ఇక్కడ మనకొరకు పరిశుద్ధ గ్రంధము ద్వారా మనము విజయం పొందునట్లు ఒక గొప్ప నాటక క్రమమును ఇక్కడ ఏర్పరిచాడు. నేను నమ్ముచున్నాను, హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో 10వ అధ్యాయము లేక 12వ అధ్యాయము, “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున, మనము కూడా ప్రతీ భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుచూ, మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.”

16

ఇప్పుడు, పాత నిబంధనంతయు, మరియు దానిలోని పాత్రలు, మరియు వ్యక్తిత్వములన్నీ క్రొత్త నిబంధనకు, మూలరాయి లేక పునాదిరాయి అయి వున్నది, ధర్మశాస్త్రమును మరియు ఈ యుగమును కలిపి జతపరిచినది. ఇది క్రైస్తవ యుగమని అనేకమంది సూచిస్తారు, కాని ఇది కాదు. ఇది పరిశుద్ధాత్మ యుగము. మూడున్నర సంవత్సరములు క్రైస్తవ యుగము కొనసాగింది. ధర్మశాస్త్రము అనేక వందల సంవత్సరమలు కొనసాగింది. మరియు తరువాత క్రొత్త నిబంధనను మరియు పాత నిబంధనను కలుపుటకు క్రైస్తవ యుగము ఒక వారధిగాను, లేక మూలరాయిగాను ఉన్నది.

మరియు పరిశుద్ధ గ్రంధములో, అనేకసార్లు, మనము చూస్తాము, మరియు అనేకసార్లు సూచిస్తాము, దానిని అపొస్తలుల కార్యములు, అని పిలుస్తాము. నేను ఎల్లప్పుడు దానిని అపొస్తలులలోని పరిశుద్ధాత్మ కార్యములు, అని సూచించుటకు ఇష్టపడతాను. ఎందుకనగా, అపొస్తలులు కేవలం మనుషులై యున్నారు, కాని అపొస్తలులలోని పరిశుద్ధాత్మయే. ఆయన కదలికను ముందుకు తీసుకొని వస్తుంది.

17

ఆయన వెళ్ళిపోయిన పిదప, ప్రభువైన యేసు క్రియలు కొనసాగించుటకై ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మయే పరిశుద్ధాత్మగా సంఘము పైకి దిగివచ్చినది, క్రీస్తు ఇక్కడ ఉన్నప్పటి కన్నా కొంచెము తక్కువ వెలుగులో.

చంద్రుడు మరియు సూర్యునివలె. సూర్యుడు లేనప్పుడు వెలుగునిచ్చుటకు చంద్రుడు పైకి వచ్చును, అది (సూర్యుడు) మరల ఉదయించిన తర్వాత చంద్రుడు వెళ్ళిపోవును. మరియు చంద్రుని వెలుగును తీసివేయునంత ప్రకాశవంతంగా సూర్యుని వెలుగు ఉండును. కాని చంద్రుని వెలుగు అనగా ఏమిటి? చంద్రుని మీద అది సూర్యుని ప్రతిబింబమైయున్నది. మరియు అది క్రీస్తుని పోలియున్నది. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆయన లోకానికి వెలుగైయున్నాడు. ఆయన వెళ్ళిపోయి, ఆయన మరలా వచ్చునంత వరకు, ఆ వెలుగులో నడుచుటకు, ఈ రోజు ఆయన వెలుగు లోకములోనికి ప్రతిబింబించేందుకు, మరలా ఆయన సంఘం మీదకు ఆ వెలుగును ప్రకాశింపజేయుచున్నాడు. మరియు అన్నిటిపై ఆయనకు అధికారము ఇవ్వబడినది. మరియు ఆయన రాజైన దావీదు సింహాసనముపై కూర్చొని, మరియు యుగయుగములు ఏలును.

18

ఇప్పుడు, మనము ఉదాహరణలుగా చూచుటకు, పాతనిబంధన ఒక అందమైన మాదిరిగా ఉన్నది, ఆ ప్రజలకు అక్కడ జరిగిన కార్యములన్ని చూచుటకు మనము అక్కడ పోల్చుచున్నాము. ఇప్పుడు, సార్వభౌముడైన దేవుడు, మరియు నన్ను రాత్రి భోజనమునకు పిలిచిన ఇంటిలో ఈ రోజు నేను బోధించుచుంటిని. మహిమలో మా ప్రియమైన వారిని మేము కలిసినప్పుడు, మేము వారిని గుర్తుపడతామా అని వారు తెలుసుకొన గోరుచున్నారు. “మంచిది,” “ఖచ్చితముగా, వారిని మనము గుర్తిస్తాము,” అని నేను చెప్పాను. చూడండి, మనము వాటిలో ... మనము ఒక మూడు రకముల శరీరములలో నివసిస్తాము: ఒకటి మానవ సంబంధమైనది; మరొకటి పరలోక సంబంధమైనది; మరియు మరొకటి మహిమ శరీరము. మరియు క్షయమైన శరీరము, మానవ శరీరములో మనము ఒకరిని మరొకరము ఎరిగియున్నప్పుడు, మరి నిశ్చయముగా ఆ మహిమ శరీరములో ఒకరికొకరము మనము ఎంతగా ఎరిగియుందుము?

అది ఈ విధంగా ఉన్నది, ధర్మశాస్త్రమే ఉత్తమమైన కార్యము ఉత్పత్తి చేసిన ఎడల, కృప మరి ఎంత గొప్ప కార్యమును ఉత్పత్తి చేయును, ఎందుకనగా అది (కృప) ధర్మశాస్త్రముకన్నా గొప్పది! మరియు చంద్రుడు వెలుగులో ఒక భాగాన్ని ఉత్పత్తి చేసిన ఎడల, సూర్యుడు వచ్చినప్పుడు, మరెంత ఎక్కువగా దానిని ప్రకాశింపజేయును! మరియు మనము ఖచ్చితముగా ఒకరినొకరము గుర్తించెదము.

19

మరియు ఇప్పుడు, అది ఈ విధంగా ఉన్నది, నేను చెప్పినట్లుగా, మానవులైన మనము జ్ఞానములో ఎదుగుచున్నాము. నీవు ఒక బాలిక లేక బాలుడిగా ఉన్నప్పటికంటే, ఇప్పుడు నీకు ఎక్కువ తెలుసు, ఎందుకనగా నీవు తెలివైనవాడవు అవుతున్నావు. మరియు మానవజాతి అంతా జ్ఞానము పొందుకుంటుంది. కాని, జంతు సామ్రాజ్యం ఎప్పుడూ జ్ఞానమును పొందలేదు అని మీరు గ్రహించారా? మీ తాత గారు నివసించిన గృహము కంటే నీవు మంచి గృహములో నివసిస్తున్నావు అని నీవు ఎరిగియున్నావు. మరియు బహుశా ఇప్పుడు మీరు కలిగియున్న దానికంటే ఎంతో మెరుగైన గృహములో మీ పిల్లలు నివసించవచ్చు.

20

కాని ఇటీవలె, అది రీడర్స్ డైజస్ట్ (పత్రికలో) లేక ఎక్కడో నేను ఒక వ్యాసమును చదివాను అని నేను నమ్ముతాను, వారు ఒక చిన్న వ్రేన్ (జీనువాయిపిట్ట) ను తీసుకొని, మరియు గూడు కట్టుటకు ఏదియు లేకుండునట్లు దానిని పంజరములో ఉంచిరి. మరియు ఆమె (ఆ ఆడపిట్ట) తన గుడ్లను పంజరపు నేలపై పెట్టవలెను. మరియు అవి బయటకు వచ్చెను, చిన్న పిట్టలు. మరియు వారు ఆ చిన్న పిల్లలు గూడు కట్టుటకు ఏదియు లేకుండునట్లు వాటిని ఒక పంజరములో పెట్టారు.

వారు పదిహేను తరాలు, పొడిగించారు, పది హేను వేర్వేరు తరములు, మీరు గమనించినట్లయితే, అది వాటి స్వభావాన్ని మార్చివేస్తుంది. తర్వాత, వ్రేన్ పిట్ట ఒక సంవత్సరములో ఒకసారి మాత్రమే అది గుడ్లు కలిగిన గూడును పెడుతుంది.

అందుకే పదిహేను తరములకు పదిహేను సంవత్సరములు పట్టింది. మరియు పదిహేను సంవత్సరముల తరువాత, (పదిహేనవ తరము పిట్టను) చిన్న వ్రేన్ పిట్టను వారు విడిచి పెట్టారు, అది ఎప్పుడూ గూడు కట్టుటకు ఒక గడ్డి పనను లేక ఏమియు అది కలిగిలేదు. ఆ చిన్న వ్రేన్ పిట్టను ఒక స్థలములో వదిలిపెట్టిన వెంటనే, మరియు అది మొట్టమొదటిగా చేసిన కార్యము అది గూడు కట్టుటకు గడ్డిని తీసికొని మరియు గూడును కట్టినది. పక్షులు ఏదెను తోటలో ఏ విధానంలో గూడు కట్టినవో అదే విధానంలో కట్టును.

21

కాని మనిషి పురోగతి చెందుతూనే ఉంటాడు, ఎక్కువ జ్ఞానమును పొందుతూ ఉన్నాడు. మొత్తం ... నేను చెప్పిన విధంగా, మీ తాతగారు, మీ నానమ్మను చూచేందుకు ఎడ్ల బండిలో వెళ్ళేవారు. మీ నాన్న మీ అమ్మను చూచేందుకు, గుర్రపు బండిని నడిపేవారు. నేను నా భార్యను చూచేందుకు, మోడల్ టీ ఫోర్డ్ (కారు) లో వెళ్ళాను. నా కుమారుడు ఎయిట్-సిలిండర్ స్పీడ్-వే (ఎనిమిది సిలిండర్లతో వేగంగా వెళ్ళే కారు) ను కలిగియున్నాడు, దానిని మీరు ఏ విధంగా పిలిచినా. బహుశా మనవళ్ళు ఒక జెట్ విమానమును కలిగియుండవచ్చు. ఆ విధానంలో, మనము పురోగతి చెందుతూనే వుంటాము, ఎందుకనగా మనము ఒక ప్రాణమును కలిగియున్నాము. ఇప్పుడు, పక్షి ప్రాణమును కలిగిలేదు. కాని మనము ఒక ప్రాణమును కలిగియున్నాము. మనము సృష్టికర్త కాదు, కాని మనము వంకర చేయగలము.

22

ఇప్పుడు, మనము కలపను సృష్టించలేము; కాని దేవుడు సృష్టించిన తరువాత, మనము ఆ కలపను తీసికొని, దాని నుండి ఒక ఇంటిని నిర్మించగలము, ఎందుకనగా మనము దేవుని యొక్క సంతానమై యున్నాము, దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలము. మనము ఎంత పతనమైనప్పటికీ, ఇంకనూ మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలమని గుర్తించవలసియున్నది. మనము పతనమైన స్థితిలోను, దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలమైయున్నాము.

దేవుడు ఒక వాగ్దానము చేస్తాడు, దేవుడు ఆ వాగ్దానమును నిలబెట్టుకోవాలి. ఓ, మీరు దానిని చూస్తున్నారు అని నేను ఆశిస్తున్నాను. సంఘమా, ఈ రాత్రి, మీరు అర్ధం చేసుకొన్నట్లయితే, మరియు గుర్తించినట్లయితే, మీరు ఒక స్తూపము నుండి స్తంభముకు వెళ్ళరు (అక్కడకు ఇక్కడకు), మరియు ఈ సంఘంలో మరియు ఆ సంఘములో చేరవు. నీకు ఆనందం కలిగించునట్లు, నీవు లోక కార్యములను వెదకవు. నీవు దేవుడిని ఆయన వాక్యముతో తీసుకొనగలిగి, మరియు అది ముగించబడినది అని నీవు తెలుసుకొనెదవు. ఖచ్చితముగా. దేవుడు ఒక వాగ్దానము చేస్తే, ఆయన ఆ వాగ్దానము నుండి కదలలేడు. ఆయన తన వాక్యమును నిలబెట్టుకొనుటకు బద్దుడై యున్నాడు.

23

“మంచిది, వారు వెనుకకు జారీ మరియు వెనుదీసారు,” అని ఎవరో చెప్పుట నేను విన్నాను. మరియు మీరు కూడా వెనుజారవచ్చు. “మంచిది, నేను దేవునితో నశించిపోయాను,” ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆయనతో కనుగొనబడితే, మీరు ఎప్పటికీ ఆయనతో నశించరు, ఎందుకనగా దేవుడు నిన్ను రక్షించి మరియు తరువాత నీకు వెనుజూపి మరియు నిన్ను దూరము చేయడు. ఆయన అలా చేసినయెడల, తన స్వంత ఉద్దేశ్యమును ఆయనే ఓడించుకొనును. కాబట్టి, ఆయన దానిని చేయలేడు. కనుక దేవుడు...

24

మనము జ్ఞానవంతులమగుచున్నాము, కాని దేవుడు ఆది నుండి అనంతుడైయున్నాడు. ఆయన పరిపూర్ణుడు. ఆయన ఎన్నడూ ఏ జ్ఞానమును పొందడు. ఆయన ఎల్లప్పుడూ ఒక్కటే రీతిగా ఉండును. కాబట్టి, ఏదైనా సంక్షోభం తలెత్తినట్లయితే, మరియు దేవుడు ఆ సంక్షోభములో దానికి అనుగుణమైన విధములో పనిచేసి; తరువాత అదే సంక్షోభము మరలా తలెత్తినప్పుడు, ఒకవేళ ఆయన అదే విధానములో పని చేయనియెడల, ఆయన ఇక్కడ పని చేసినప్పుడు, ఆయన పని చేసిన విధానము తప్పు, చూశారా.

కాబట్టి ఏ కాలములోనైనా, ఎల్లప్పుడు, ఆయన ఒకే రీతిగా ఉండవలయును. మరియు ప్రజలు ఎలా వివరించి, మరియు దైవత్వము యొక్క శక్తిని తీసివేయుటకు ప్రయత్నిస్తున్నారో, నేను దానిని అర్ధము చేసుకోలేకున్నాను. ఎందుకనగా, క్రీస్తు నిన్న, నేడు, మరియు యుగయుములు ఒక్కటే రీతిగా ఉండినయెడల, ఆయన శక్తి అదే రీతిగా ఉండును. ఆయన వైఖరి అదే రీతిగా ఉండును మరియు ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో, ఆయన ఇప్పుడూ అలాగే ఉన్నాడు, మరియు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండును. ఆయనలో నుండి ఏదియు తీసివేయబడదు. అది అంతే.

మరియు ఆయన భూమిపై నివసించిన దినములలో, ఆయన లేచి మరియు వైద్యుల సంరక్షణలో వున్న రోగులను స్వస్థపరిచి, మరియు వారిని స్వస్థపరిచాడు; ఒకవేళ ఆయన ఆ సంక్షోభములో పని చేసిన యెడల, ఆయన నిన్న, నేడు, మరియు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉంటే, ఆయన ఈ రోజూ అదే విధానములో పని చేయాలి, లేక ఆ ప్రజలకు ఆయన చేసినది తప్పు, చూశారా. ఆయన అక్కడ వాగ్దానము చేసిన యెడల, దానితో ఆయన నిలిచి యుండవలెను, కేవలం ఆయన దానితోనే నిలిచియుండాలి, దేవునిలోను మరియు ఆయన వాగ్దానములోనూ ఏ తప్పిదమును లేదు. తప్పు మనలోనే వున్నది: దానిని నమ్మునంత విశ్వాసం లేదు, లేక ఆయన వాక్యమునందు ఆయనను తీసుకొనుటలేదు.

25

ఇప్పుడు, మీరు చూడండి, మనము పక్షివలె తెలివిగలవారమైనట్లయితే, ఆదిలో అవి ఎలా ప్రవర్తించినవో అలా మనమును ప్రవర్తించేవారము. కాని మనము చాలా చురుకైన వారమైపోయాము, లోకమంతటినీ మనము వివరిస్తాము, మరియు చెప్పెదము, “ఓ, అది గతించిన దినములలో,” మరియు మనము మరొక రకమైన పరిస్థితిని నిర్మించెదము. దేవుడిని ఆయన వాక్యములో తీసుకొనుటకు బదులు, మనము కేవలం ఒక క్రొత్త సంస్థను ప్రారంభిస్తాము, చూశారా. “మంచిది, దేవుడు దానిని ఈ విధముగానే చేస్తాడు, మరియు దేవుడు దానిని ఆ విధముగానే చేస్తాడు.” ఒకవేళ మనము, పక్షులవలె, మరియు నైతిక విలువల స్వేచ్చను ఆధారముగా కాక, మార్పు చెందకుండా, మనము కేవలం దేవుడిని ఆయన వాక్యమునందు తీసికొనినట్లయితే, మరియు అదియే దానిని స్థిరపరచును, మరియు అది అంతే. “దేవుడు అలా చెప్పాడు, కాబట్టి దానిని గూర్చి అంతయూ అదే.” నిజమైన మరియు సజీవమగు దేవుడు ఇప్పటికీ ఈ రోజుకీ జీవిస్తున్నాడు అని కనుగొనుట అది ఎంత అందముగా ఉండును. ఈ గందరగోళమంతటి మధ్య, దేవుడు ఇంకనూ జీవించుచూ మరియు పరిపాలించుచున్నాడు.

26

ఇప్పుడు, ఈ నిబంధనా ప్రజలు, ఇశ్రాయేలీయులు, ఐగుప్తులో, అవిధేయతను బట్టి, మరియు వారి సహోదరుడైన యోసేపును అమ్మివేసిన దానిని బట్టి. మరియు ఐగుప్తులోనికి తీసుకొని వెళ్ళబడి, నాలుగువందల సంవత్సరములు, అక్కడ బానిసత్వములో వున్నారు. వారు ఎన్నడూ వారి నిబంధనను కోల్పోలేదు. అది మీరు గమనించాలని నేను కోరుచున్నాను. వారు వారి స్వాతంత్ర్యమును కోల్పోయారు, వారి నిబంధనను కాదు. దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబుతో నిబంధన చేసినప్పుడు, ఆయన అబ్రాహామును మరియు అతని తరువాత అతని సంతానమును కాపాడెదనని తనపై తాను ఒట్టు పెట్టుకొనెను. ఆ వాగ్దానమును నిలబెట్టుకొనుటకు దేవుడు బద్దుడై యున్నాడు.

ఆయన అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానమునకు కట్టుబడినట్లు, ఆ వాగ్దానముపై, ఆయన నీకునూ కట్టుబడి వుంటాడు. అది నిజము, నీవు అబ్రాహాము సంతానమైతే. నీవు అబ్రాహాము సంతానము ఎలా అవుతావు? “క్రీస్తులో మృతినొందిన మనము అబ్రాహాము సంతానముగా తీసుకొనబడతాము,” “మరియు వాగ్దాన ప్రకారము వారసులమైయున్నాము,” అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది, దేవుడు అబ్రాహాముకు ఉన్న మాదిరిగా నీకును కట్టుబడి వుంటాడు. అది దానిలోని భయమునంతటినీ తీసివేస్తుంది. దేనిని గూర్చియు భయపడవద్దని దేవుడు నిన్ను కోరుచున్నాడు. ఆయన చెప్పిన దానిపై భక్తితో విశ్రాంతి తీసుకొనుము.

27

మనము జీవించుచున్న ఘడియను సవాలుచేసే ఒక వ్యక్తి ఈ రోజు మనకు అవసరమైయున్నాడు. అది నిజము. మతము అను పేరు క్రింద మరియు అటువంటివి, మరియు రక్షణ అను పేరు క్రింద, అసమానతలు మరియు ప్రతీదీ సువార్తలోనికి నెమ్మదిగా వచ్చేశాయి. ఆ దినమున ఆ స్థానమును తీసుకొనుటకు దేవుడు మోషేని లేపినట్లుగా, మన మధ్యలోనూ ఎవరో లేవవలసిన అవసరం ఉన్నది.

28

అవును. వారు వారి నిబంధనను కోల్పోలేదు; వారు వారి స్వాతంత్ర్యమును కోల్పోయారు. వారు బానిసలే, కాని నిబంధన ఇంకనూ కొనసాగినది.

మరియు అక్కడ ఒక దినమున, ఐగుప్తులో వెట్టి పనులు చేయుచూ అధికారుల క్రింద వారు మూలుగుచు మరియు మొర్ర పెట్టుచున్నప్పుడు, ఎందుకనగా వారు బానిసలుగా అయ్యారు; ఈ అందమైన చిత్రమును మీరు గమనించాలి అని నేను కోరుచున్నాను. మరియు చట్టబద్దులకు ఇది తగినట్లుగా ఉండును. వినండి. “ఇప్పుడు, నీవు ఫలానా కార్యమును చేసినట్లయితే. నీవు ఫలానా కార్యమును చేసినట్లయితే,” అని దేవుడు ఎన్నడును క్రిందికి దిగివచ్చి మరియు చెప్పలేదు. దేవుని కృప మోషే అను ఒక రక్షకుడిని సమకూర్చెను. అది నిజము. ఎటువంటి షరతుల క్రింద మోషే తీసికొని రాబడలేదు, కాని సార్వభౌమైన కృప ద్వారా, దేవుడు మోషేను పంపెను. రక్షకుడిని మాత్రమే కాదు, కాని కృప ఒక విమోచకుడిని సమకూర్చినది; ఏ ధర్మశాస్త్రము, ఏదియు లేకుండానే. కేవలం దేవుని యొక్క పవిత్రమైన కృప, వారిని బయటకు తెచ్చుటకై, ఆ దేశమునకు ఒక విమోచకునిగా మరియు ఒక రక్షకునిగా ఆయన మోషేను పంపెను.

29

నేను దానిని గూర్చి తలంచినప్పుడు, అప్పుడు ఐగుప్తులో నిబంధనా ప్రజలతో వున్న అదే దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకొనుట ప్రారంభించాను, ఖచ్చితంగా ఈ రాత్రి సంఘం ఉన్న ఒత్తిడిలు అన్నిటి క్రింద మరియు భేదాభిప్రాయములలో, ఆయన చేయును, ఆయన ఒక స్వయముగా అయివున్న కృప ద్వారా, విమోచకుడిని పంపును. ఈ రాత్రి ఈ సంఘములో మనము కూర్చునియుండగా, ఈ అంత్యదినములలో, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును పొందుకొనెదము అనే నిశ్చయతను మనము కలిగియుందుము. ఆ నిబంధనా ప్రజల ప్రయత్నము లేకుండానే, దేవుడు వారికి దయ చేశాడు, కాని, ఆయన తన నిబంధనా ప్రజలకు, ఆయన పరలోకము నుండి ఉచితముగా పంపించెను, కృప యొక్క కార్యము. ఆయన వాగ్దానము యొక్క సార్వభౌమత్వముపై, ఆయన మోషేను పంపేను.

ప్రజలు బానిసత్వములోను, మరియు ప్రతిదాని క్రింద, మరియు పాపము యొక్క కాడి, మరియు అనారోగ్యము మరియు ఈ రోజు బాధ మరియు అదే సంక్షోభములో ఉన్నప్పుడు, ఆయన మొదటిసారి మోషేను పంపించినట్లు, రెండవసారి యేసుక్రీస్తుని పంపుట యందు మరి నిశ్చయముగా ఉండును. సంక్షోభము తలెత్తినప్పుడు, దేవుడు తన సార్వభౌమ కృపతో వ్యవహరించెను. ఆయన అదే కార్యము క్రింద అదే సంగతిని చేయవలసియున్నది, లేకపోతే ఆయన అక్కడ మొదట అవలంభించినప్పుడు ఆయన తప్పు చేశాడు.

మీరు దానిని చూశారా?

30

నేను ఇది చెప్ప ప్రయత్నిస్తున్నాను, సంఘములో ఈ రోజు నేను కనుగొనియున్న గొప్ప పాపము అవిశ్వాసము. అక్కడ ఉన్న ఒకే ఒక్క పాపము అదియే. అవిశ్వాసము తప్ప మరొక పాపము ఏదియు లేదు.

అక్కడ బయట ఎంత రాత్రిగా ఉన్నది, ఎంత చీకటిగా ఉన్నది? మీరు చెప్పలేరు, “ఇంత చీకటిగా ఉంది,” నా చేతులలో అంతా చీకటిగా ఉంది. ఇప్పుడు పాపమును పేర్కొనేందుకు మరియు గుర్తించుటకు కేవలం ఒకే ఒక్క మార్గం ఉన్నది. అది నీవు త్రాగుటయో, లేక నీవు పొగ త్రాగుటయో, లేక జూదమాడుట ద్వారా కాదు. అది ఈ విధముగా పేర్కొనబడుతుంది: ఎందుకనగా నీవు ఒక అవిశ్వాసివి, నీవు దానిని చేస్తావు. మరియు అది నిజము. ఎందుకనగా నీవు జూదమాడుట చేతనో, నీవు అబద్ధమాడుట చేతనో, నీవు దొంగతనము చేయుట చేతనో, ఆ కార్యములు పాపము కాదు; అవి పాపము యొక్క లక్షణములు. అది ఎందుకనగా నీలో ఒక వ్యత్యాసమైన ఆత్మ నివసిస్తున్నది. నీవు విశ్వాసివయితే, ఒక స్థిరమైన విశ్వాసివయితే, నీ ఎదురుగా ఉన్న రాత్రివలె ఆ కార్యములు మృతము మరియు చీకటి అయి ఉండును. ఖచ్చితముగా. చూశారా, ఆ కార్యములు అవిశ్వాసము యొక్క గుణలక్షణములు.

31

పరిశుద్ద యోహాను పత్రిక 3వ అధ్యాయములో, యేసు ఇట్లనెను, “విశ్వసింపనివాడికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.” నీవు మొదటి స్థానమునకు కూడా వెళ్ళలేవు. ప్రారంభములోనే నీకు తీర్పు తీర్చబడినది. కాబట్టి సంఘములో నీవు ఒక కొలకర్ర కలిగియుండాలి అని అర్ధము కాదు: “నీవు దీనిని చేసినట్లయితే, నీవు ఈ నియమములతో కొలవబడినయెడల, నీవు ఆ నియమముతో కొలవబడిన యెడల. అనేక సార్లు, సంఘానికి చెందియుండుట కొరకు ప్రజలు అటువంటి కొన్ని సంగతులను ప్రక్కకు పెడతారు, మరియు ఆ కార్యము ఇంకనూ వారి హృదయములలోనే ఉండును, మరియు వారు ప్రక్కకు జారుకొని మరియు దానిని చేస్తారు. కాని ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క అవసరతలను తీరుస్తాడో, మరియు దేవుని యొక్క ఆత్మతో తిరిగి జన్మిస్తాడో, ఆ కార్యములు అతని జీవితములో నుండి తొలగిపోతాయి. వాటిని అతడు చేయాలనుకోడు.

32

మీరు ఒక పందిని ఊహించగలరా? పంది పెంట కుప్ప యొద్దకు వెళ్ళి, మరియు అది తినును. నేను దానిని నిందించను, అది ఒక పంది, అదే దానిని అలా చేయించునది. కాని ఒక గొర్రె అలా చేయుట నీవు ఎన్నటికీ కనుగొనలేవు; ఎందుకనగా రెండు స్వభావములు ఉన్నాయి. పంది ఒక స్వభావము కలిగియుండును, మరియు గొర్రె మరొక స్వభావాన్ని కలిగియుంటుంది. మరియు ఎంతకాలమైతే ఆ స్వభావము ఆ పందిలో ఉండునో, నీవు ఎంతగా శుభ్రము చేయుటకు ప్రయత్నించినను, అది ప్రారంభము నుండి పంది గనుక దాని స్వభావము అదే విధముగా ఉండును.

మరియు కాబట్టి, అనేకసార్లు, మనము ప్రజలను తీసుకొని మరియు వారిని సంఘములోనికి తీసుకొని వచ్చెదము, మరియు అటువంటి వారిని; వారిని సభ్యులుగా చేసెదము, వారు ఎప్పుడూ రక్షింపబడరు.

అదే ఈ రోజు కారణము, అటువంటి కలగలుపు, ప్రజల ముఖమునందు, వారికి ఎటువైపు తిరగాలో తెలియదు. ప్రజలు క్రైస్తవ్యమును ప్రకటించడము వారు చూచెదరు, మరియు లోకమునకు వారికి ఏ బేధము ఉండదు. అది ఎందుకనగా ఆ వ్యక్తి ఎన్నడూ దగ్గరకు రాలేదు, లేక ఎన్నడును తిరిగి జన్మించలేదు, ఎన్నడూ ప్రభువైన యేసును అంగీకరించలేదు, ఆయనను ఎప్పుడూ నమ్మలేదు. బహుశా వారు పనిచేసి ఉంటారు; బహుశా వారు నాట్యమాడి ఉంటారు; బహుశా వారు కేకలు వేసి ఉంటారు; వారు అన్యభాషలలో మాట్లాడి వుంటారు; బహుశా వారు ఇవన్నియు చేసి వుండవచ్చు, కాని ఎన్నడూ వారు క్రీస్తు యేసు అను వ్యక్తి యొద్దకు రాలేదు మరియు నిజానికి వారు వారి హృదయములలో తిరిగి జన్మించలేదు. ఈ కార్యములు మరణిస్తే, స్వభావము మార్పు చెంది, మరియు ఒక నూతనమైన వ్యక్తి జన్మించును.

33

ఇప్పుడు, మోషే వయస్సులో పెద్దవాడైనప్పుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడుటను అతడు తిరస్కరించాడు. దాని తరువాత అతడు ఐగుప్తీయుని వధించాడు. కాని దేవుడు అతనితో మిద్యానులో వుండి, మరియు అతడిని తిరిగి తీసికొనివచ్చాడు. మరియు ఆ మండుచున్న పొద యెదుట, ఆ దినము, అతడు పొందుకున్న ఆ అనుభవము అతడి జీవితకాలమంతయు అతనితో నిలిచియున్నది.

నేను గతరాత్రి చెప్పిన విధముగానే, ఈ రోజునూ చెప్పుచున్నాను, ఆ వ్యక్తి... మోషే ఎంత ఉత్తమముగా బోధింపబడినప్పటికీ, అతనికి ఎంత వేదాంతము తెలిసినప్పటికీ, అతడు ఎంత చక్కని సంఘ సభ్యుడిగా వుండినను. అతడి తల్లి, అతనికి ఒక మంచి బోధకురాలిగా వుంది. విద్యాభ్యాసము యొక్క ప్రతీ సూత్రము క్రిందికి అతడు తేబడ్డాడు. అతడు రాజు యొక్క కుమారుడు. కాని అతడు ఇంకా, అది చేయడంలో విఫలమై దానిని దాటేందుకు తనకుతానే ప్రయత్నించుచున్నాడు. కాని అయిదు నిమిషములు ఆ మండుచున్న పొద యొక్క సన్నిధిలో, అతడు ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోయాడు. ఏదో జరిగినది.

34

మరియు ఈ రోజు మన సెమినరీలలో, మరి ఎక్కువ వేదాంతము బోధించుట కాదు గానీ, దేవుని ఎదుట మనుష్యులు మోకరిల్లి మరియు ముఖాముఖిగా ఆయనను కలుసుకొనుటకు మండుచున్న పొద యొక్క అనుభవమునకు రావలసిన అవసరం వున్నది. ఆ దినమున యున్నట్లుగా ఈ దినమున ఒక సవాలు చేయువాడు మనకు అవసరమై వున్నాడు. దేవుడిని కలుసుకొన్న మరియు వారు ఏమి మాట్లాడుతున్నారో ఎరిగియున్న ఒక పురుషుడు మరియు స్త్రీలు మనకు అవసరమై వున్నారు. ఏదో సంఘ పుస్తకము, లేక అందరికి తెలిసిన వేదాంతము నుండి ఎవరో బోధించుటకు ప్రయత్నించుట కాదు. తిరిగి జన్మించి, మార్చబడి, ఒక నూతన సృష్టిగా చేయబడి, మండుచున్న పొద యొక్క సన్నిధిలో ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు మనకు అవసరమైయున్నాడు. ఈ దినము అటువంటి వ్యక్తి మనకు అవసరమైయున్నాడు. ఏది వచ్చినా, లేక రాకపోయినా అటువంటి వ్యక్తే ఆ మండుచున్న రేఖ పై నిలబడతాడు.

35

మోషే, తన ఆజ్ఞను పొందుకున్న తరువాత, ఐగుప్తునకు వెళ్ళి మరియు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఒక గొప్ప తప్పును కనుగొనెదము, మరియు ఒక గొప్ప కార్యము. అది ఆ దినము ఉన్నట్లుగానే, అది ఈ దినము ఉన్నది. ఎప్పుడైతే, మోషే వెళ్లి ఇశ్రాయేలీయుల యొక్క పిల్లలను తీసుకొని మరియు బయటకు తీసుకొని వచ్చాడు అని మనము కనుగొన్నామో, అసాధారణమైన జరిగినది. ఇప్పుడు అది ఇక్కడ వున్నది. నేను మిమ్మును బాధ పెట్టాలనుకోవడము లేదు. మిమ్మును కుదిపివేయాలనుకోవడము లేదు, లేక కదిలించి మీ నుండి దాచిపెట్టాలనుకోవుట లేదు, కాని నేను సత్యమునే బోధించాలని ఆశించుచున్నాను. సహోదరుడా, దానిని గూర్చి ఒక కార్యము వున్నది, సత్యము ఎన్నడూ నిన్ను ప్రముఖునిగా చేయదు; కాని సత్యము నిన్ను యదార్ధపరునిగా చేయును, అది ఒక మంచి కార్యము. మరియు మీరు ప్రముఖుడుగా ఉండుట కంటే యదార్ధపరునిగా ఉండుము. ఖచ్చితంగా నీవు ఉందువు.

36

ఇప్పుడు, మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను, అది, ఆ కార్యము జరిగినప్పుడు, అద్భుతాలు చేయబడినవి, సూచక క్రియలు మరియు మహత్కార్యములు. మరియు వారు బయటకు వచ్చినప్పుడు, “అనేకులైన మిశ్రమ సమూహము బయలుదేరారు.” ఒక కలగలుపు ప్రజల గుంపు అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. వారిలో కొందరు, విశ్వాసులు; కొందరు విశ్వసించినట్లు నటించువారు. గొప్ప అద్భుతములు జరిగియున్నవి; ప్రజలు విశ్వాసులము అని చెప్పుకొని బయటకు వచ్చారు, మరియు వారు విశ్వాసులు కాదు. అక్కడే ఈ రోజు మనకు గొప్ప ఇబ్బంది ఉన్నది. దానిపైన మనము వ్రేలును ఉంచగలము. స్త్రీ మరియు పురుషులు సంఘములోనికి వచ్చి, వారు విశ్వాసులమని ప్రకటించుకొంటారు, వారు విశ్వాసులు కాదు. నేను దానిని బలిపీఠముపై కనుగొన్నాను. నేను దానిని ప్రార్ధనా వరుసలో కనుగొన్నాను. ప్రతీ చోటా నేను దానిని కనుగొన్నాను, పురుషులు లోనికి వచ్చి, మరియు స్త్రీలు, “నేను ఒక విశ్వాసిని,” అని చెప్పువారు, మరియు విశ్వాసి అని ప్రకటించుకొనువారు, మరియు వారు విశ్వాసులు కాదు.

37

మరియు అదే ఇశ్రాయేలీయులకు ఇబ్బందులను ప్రారంభించినది. వారు ఒక స్థలమునకు వచ్చినప్పుడు, ఈ ప్రజలు కూడా బయలుదేరారు అని వారు కనుగొన్నారు. ఖచ్చితముగా, సహజాతీతమైనది జరిగినది.

ఈ రోజు మన పరిధులలో, మన సంఘములలో దానినే మనము కనుగొనుచున్నాము. దేవుడు రంగముపైకి వచ్చాడు; ఆయన రోగులను స్వస్థపరిచాడు; ఆయన మృతులను లేపాడు; ఆయన గ్రుడ్డివారి నేత్రములను తెరిచాడు; ఆయన చెవిటివారు వినునట్లు, మూగవారు మాట్లాడునట్లు చేసాడు; ఆయన కుంటివారిని స్వస్థపరిచాడు; ఆయన కేన్సర్లను ప్రజల నుండి దూరంగా తీసివేసాడు. దానిని నిరాకరించలేము! అవి వేల కొలది జరిగినవి. మరియు ఒకానొక సమయమున అది ఎనిమిదవ పెన్ వీధిలో ప్రారంభమై, మరియు ఇప్పుడు ప్రపంచము చుట్టూ పదివేల ఉజ్జీవ మంటలు ప్రతీ అన్యదేశముల పర్వతములపై మరియు ప్రతీ చోటా అవి మండుచున్నవి. సూచనలు మరియు మహత్కార్యములు జరుగుచున్నాయి, గొప్ప కార్యములు కదులుచున్నవి. దేవుడు కదులుచున్నాడు! మనము అంత్యకాలములో వున్నాము, కూడలి సమయము.

38

కావున ఇందులో, ఒక మిశ్రమ జనాంగము బయలుదేరుటను మనము కనుగొన్నాము. అనేకసార్లు, దేవుని యొక్క ప్రజలు చెప్పుచుంటారు, “అవును, నేను చేయగలను. నేను దీనిని చేస్తాను.” మరియు ఆ ప్రజలు భౌతిక సంబంధికులని మనము కనుగొన్నాము. కేవలం మొట్టమొదటి అల్పమైన శ్రమ వచ్చిన వెంటనే వారు ఐగుప్తునకు తిరిగి వెళ్ళుటను కోరుకొన్నారు. వారికి ఆ వెల్లుల్లి కుండలు కావాలి. వారికి ఆ నదిలో నుండి చేపలు కావాలి. వారికి ఉల్లి కాడలు మరియు వెల్లుల్లిపాయలు కావాలి. ఐగుప్తులో ఉన్న కార్యములు వారికి కావలెను.

అది ఈ దినము యొక్క ఒక భౌతికమైన సంఘసభ్యునికి ఒక అందమైన మరియు సరియైన మాదిరిగా ఉన్నది. అతడు లోకకార్యములను ప్రేమించును, ఎందుకనగా వాడు దేవుని సంబంధికాడు. “మీరు లోకమునైనను లేక లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. దేవుని ప్రేమ వానిలో నుండదు,” అని పరిశుద్ద గ్రంధము చెప్పుచున్నది. మరియు క్రీస్తు తిన్నగా తన ప్రకటనలన్నింటిలో ఉండువాడు. మరియు అది నిజము. మరియు ఈ రోజు ప్రజలు బయటకు పోవుటను మనము కనుగొనెదము... ఓ, నేను ఆశిస్తున్నాను దేవుడు, ఏదో విధంగా, దీనిని ఎడమవైపు, అయిదవ ప్రక్కటెముక క్రింద ఉంచి, మరియు దానిని అక్కడ చొప్పించును. ఒక వ్యక్తి, ఎంతగా నీవు నటించుటకు ప్రయత్నించిననూ, అది శ్రమ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి శ్రమ క్రింద తన ఉత్తమమైన మరియు అధ్వాన్నమైన స్థితులను కనపరచును. ఒకసారి ఒక క్రైస్తవుడిని తీసుకొని, మరియు అతడిని శ్రమ క్రింద ఉంచి మరియు అతడు ఏ విధముగా ప్రవర్తించునో గమనిస్తే, అతడు దేనినుండి చేయబడ్డాడో మీరు చెప్పగలరు.

39

సమాజంలోని, ప్రజల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడుచున్నప్పుడు, ప్రతీ ఒక్కరూ మంచిగా వెళ్ళవచ్చు, ప్రతీ ఒక్కరూ ప్రభువుని స్తుతించవచ్చు, కాని ఇబ్బంది తలెత్తనివ్వండి, మరియు ఏమి సంభవించునో గమనించండి, అప్పుడు ఏమి జరుగునో గమనించండి. అప్పుడు, మీరు ప్రక్కకు పడుచున్నారా? మీరు ఆ మిశ్రమ జనాంగములో ఒకరిగా ఉన్నారా? (వాడుకగా చెప్పునట్లు), “దానిని వాడు తీసుకొనలేడు” అని చెప్పునట్లుగా. మీరు తీసుకొనలేని వ్యక్తిగా ఉన్నారా? అది అంతే, మీరు దానితో పాటు నిలబడలేరు. సహోదరుడా, వెనుకకు జారడం మరియు ఎత్తు పల్లములు, మరియు లోపలకు వెళ్ళడం మరియు బయటకు రావడం, అటువంటి మార్గములో నీవు ఉన్న యెడల మీరు కల్వరియొద్దకు వచ్చి ఎందుకు మీకు (స్వచిత్తమునకు) మీరు చనిపోకూడదు, మరియు మీరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తిరిగి జన్మించకూడదు? ఆమెన్. మీకు ఇది అవమానము!

మీ సంఘములో నివసించు మీరు, క్రైస్తవులని చెప్పుకొను మీరు... మాకు ఇక్కడ ఏ సభ్యులు లేరు, మీరు మాత్రము ఇక్కడకు వచ్చారు, మీరు వేర్వేరు సంఘములన్నిటికీ చెందినవారు. కాని, క్రైస్తవులమని చెప్పుకొను ప్రజలైన మీరు, మరియు పిదప మీరు ఏదైతే కారో అటువంటి దానిని బయట జీవించుచున్నారు, మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాజమునకు ఋణస్దులుగా ఉన్నారు. ఆమెన్. క్రైస్తవులమని చెప్పుకొను మీరు, మరియు ఆయనను తన వాక్యమునందు తీసుకొనుటకు సిగ్గుపడుచున్నారు లేక ఆయన శక్తికి మరియు మహిమకు సాక్ష్యమిచ్చుటకు, ఏ సమయములోనైనా, మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఋణస్థులైయున్నారు. ఆమెన్. అది సత్యము. అది నిజము. వాక్యము కొరకు నిలబడుము. క్రుంగిపోయినా లేదా మునిగిపోయినా, ఆయన వాక్యముపై నిలబడుము.

40

అబ్రాహాము దానిని చేయవలసివచ్చినది, మరియు లేనివాటిని అవి ఉన్నట్టుగానే పిలిచాడు. మరియు అతడు దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మన ఇష్టపు ఎముకను తీసివేసి, క్రైస్తవ్యములో ఒక వెన్నెముక వుంచాల్సిన అవసరము ఈ రోజు మనకు ఉన్నది. అది ఉన్నది. సమస్య తలెత్తుట వారు చూచినప్పుడు, ఎవరైతే జారిపోకుండా, పడిపోకుండా, ఈ మార్గములో బయటకు పారిపోకుండా, దానిలో పాలిభాగస్తులైన స్త్రీలు మరియు పురుషులు, కొంత మంది తిరిగి జన్మించిన క్రైస్తవులు మనకు అవసరము, కాని ఒక పురుషుడు లేక స్త్రీ ఎవరైతే నిలబడి వారి రంగులు చూపించెదరో. కనీసము మీరు అలాగు చేస్తే మీ స్నేహితులైనా మిమ్ములను మరింతగా అభినందిస్తారు.

ఒక స్త్రీని అభినందించని ఆ వ్యక్తి ఎటువంటివాడు? ఆమె ఒక మట్టితో చేయబడిన కంచెపై చిరుకప్పలు అలికినట్లుగా ఉన్నంత అందవిహీనముగా ఉండనివ్వండి. ఆమె ఎంత అసహ్యముగా ఉండవలెనో అంతగా ఉండిననూ, ఆమె స్వభావములో స్త్రీగా ఉండతగినంత స్త్రీ విలువలతో నిలబడవలెను. దేశంలో ఆమె కొరకు తన టోపీ తీయగలిగినవాడు, ఒకవేళ అతడిలో కొంతైనా పురుషత్వము కలిగినవాడు, ఒక పురుషుడు కూడా లేడు. మరియు ఒక పడిపోయిన దేవుని కుమారునిగా ఉండి, ఒకవేళ వ్యక్తి దానిని ఎదుర్కొన్నట్లయితే, “ఒప్పు” ను ఒప్పు, మరియు “తప్పు”ను తప్పు అని పిలుచుచూ, తన ఒప్పుకోలుల మీద నిలబడే ఒక వ్యక్తిని గూర్చి దేవుడు స్వయముగా ఏమని తలంచును.

41

ఈ దినమున ఒక మంచి, పాత-కాలపు, పరిశుద్ద పౌలు యొక్క ఉజ్జీవము, మరియు బైబిల్ యొక్క పరిశుద్ధాత్మ తిరిగి సంఘములోనికి వచ్చుట అవసరమైయున్నది. క్రైస్తవ్యము అను పేరుతో చాలా అస్తవ్యస్తమైనది జరుగుచున్నది, కొనిపోబడుచున్నది. ఎక్కువ సంఘశాఖ ఎక్కువ వేదాంతము, ఎక్కువ విద్యను తీసుకొనుచున్నారు. మరియు నేను బలపరచుటకు ప్రయత్నించుట లేదు.

ప్రజలు నడువరు, ఏమైనప్పటికీ, సంఘము ఉండవలసినంత అవిటిగా ఉన్నది. అది ఇక్కడ ఉన్నది. సంఘము ఎంత అవిటిదయిననూ, విద్య మీకు ఊతకర్ర కాదు (సహాయపడదు), మీ విశ్వాసమే మీకు ఊతకర్ర (సహాయము). ఆమేన్. నిజము. విద్య దానిని ఎన్నడూ చేయలేదు; సంఘశాఖ ఎన్నడూ దానిని చేయలేదు; మేడగది అనుభవమునకు ప్రత్యామ్నాయముగా ఉన్న ఏ సంస్థా ఎన్నడూ ఉండదు. పెంతెకోస్తు స్థానమును ఏ పాఠశాల ఎన్నడూ తీసుకొనలేదు. అది తీసుకొనదు. “శక్తి చేతనయిననూ, బలము చేతనయిననూ, కాదు గానీ నా ఆత్మ చేతనే, అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” అదియే ఈ దినము మనకు అవసరము, తిరిగి పరిశుద్ద గ్రంధము యొక్క అనుభవమునకు రండి. తిరిగి జన్మించిన క్రైస్తవులుగా, మరియు గొర్రెపిల్ల రక్తములో కడగబడి, తెలుపు చేసికొని, పునరుద్ధరించబడి, రెండవసారి జన్మించినవారు. క్రీ.శ. 66లో పరిశుద్దుడైన పౌలు కలిగియున్న ఒక ఉజ్జీవము, ఆ పాత-కాల ఉజ్జీవము, ఈ దినమున లోకమునకు అవసరము.

42

ఇప్పుడు, నా సహోదరుడా, సహోదరి, ఈ మిశ్రమ జనాంగము పైకి వెళ్ళుట మనము గమనించుచున్నాము. కొద్దిసేపటి తరువాత, వారు ఫిర్యాదులు చెప్పుట ప్రారంభించారు. దేవుని యొక్క ప్రతీ కదలికలోనూ మనము దానినే కనుగొంటాము. మెథడిష్టులైన మీరు మీ సంఘములో దానినే కనుగొంటారు; బాప్టిస్టులైన మీరు మీ సంఘములో దానినే కనుగొంటారు; ప్రెస్బిటేరియన్లైన, పెంతెకోస్తువారైన మీరు, ఎవరయిననూ, వారిని కనుగొంటారు. అది ఒక మిశ్రమ జనాంగము. అది అదే అయియున్నది. పదిహేడవ శతాబ్దములో జాన్ వెస్లీ ఒక ఉజ్జీవమును కలిగియున్నప్పుడు, ఒక మిశ్రమ జనాంగము అందులోనికి వెళ్ళినది. మార్టిన్ లూధర్ ఒక ఉజ్జీవము కలిగియున్నప్పుడు, మిశ్రమ జనాంగము వెళ్ళినది. జాన్ స్మిత్ ద్వారా, బాప్టిస్ట్ వారు ఒక ఉజ్జీవము కలిగియున్నప్పుడు, ఒక మిశ్రమజనాంగము బయలుదేరినది. పెంతెకోస్తు వారు ఒక ఉజ్జీవము కలిగియున్నప్పుడు, ఒక మిశ్రమ జనాంగము బయలుదేరినది.

43

మరియు ఖచ్చితంగా అదే అరలో వున్నది. ఒకవేళ వాస్తవమైన, నిజమైన సామాగ్రి, సంఘములో నిలచియుండి, మరియు ఈ ఇతరులు బయటకు వెళ్ళునట్లు ప్రార్ధించి, మరియు ముందుకు సాగవలెను. అలా అయిన యెడల మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, మరియు పెంతెకోస్తు సంఘములో ఉజ్జీవము కలిగియుండును. అది ఒక మిశ్రమ జనాంగము.

వారు బయటకు వెళ్ళారు. ఎప్పుడైతే వారు అక్కడకు వచ్చారో, వారు ఫిర్యాదులు చెప్పుట ప్రారంభించారు. వారు ఎడారిలో మూడు నెలలు మాత్రమే ఉన్నారు. “ఓ, నేను కొన్ని వెల్లుల్లి కలిగి ఉంటే! నేను కొన్ని ఉల్లికాడలు కలిగి ఉంటే!” అని చెప్పుట ప్రారంభించారు. వారు అక్కడకు వెళ్ళి, వెల్లుల్లిని దేవదూతల ఆహారముకు బదులు చేసియుండిరి, మరియు ఫిర్యాదు చేస్తూ ఉండిరి. ఎందుకు? వారి జీర్ణకోశము దేవదూత ఆహారమును జీర్ణించుకోలేకపోయింది.

నేడునూ అదే విషయం అయియున్నది. మనము పాత-కాలపు పరిశుద్ధాత్మ ఉజ్జీవమును కలిగిలేము, మరియు మన ఆత్మీయ జీర్ణకోశము వాస్తవమైన, సరియైన, పాతపద్దతి పరిశుద్ధాత్మను జీర్ణించుకోలేకున్నాయి. ఉజ్జీవమును కొనసాగించండి. [స్పష్టతలేని మాట] మనకు వైద్యుడు వ్రాసిన మందులు చీటీ అవసరము, అది వైద్యుడైన యేసు వ్రాసిన మందుల చీటీ, అది మనలను సరిచేస్తుంది. ఖచ్చితంగా. వారు కొనసాగించలేరు. వారు ముందుకు వెళ్తారు, వారు వెనక్కు వెళతారు. కేవలం మొదట అల్పమైన కార్యం తలెత్తినచో, ఫిర్యాదు, గజిబిజి, లోలోపల మధనపడతారు. ఒక సంఘములో అటువంటివి ఒక కార్యము ప్రారంభమైనచో, అది ఒక క్యాన్సర్ వలె ఉండును. అది సంఘమునంతటినీ చంపివేయును. అది నిజము. అది ప్రారంభమైతే మనము దానిని తప్పక బయటకు పారద్రోలాలి.

ఇప్పుడు, వారు ఎంతో దూరము వెళ్ళినప్పటికీ... ఇప్పుడు ఆలోచించండి, ఆకాశము నుంచి పడుచున్న దేవదూతల ఆహారము తింటూ, మరియు ఫిర్యాదు చేస్తున్నారు. మరియు వారు కొట్టబడిన బండ నుండి నీళ్ళు త్రాగుచున్నారు, స్వచ్ఛమైన, పరిశుద్ద జీవజలములు, మరియు ఫిర్యాదు చేస్తున్నారు. వారికి నైలు యొక్క బురదనీరు కావలెను. నేడు అదే విధముగా ఉన్నది.

44

“ఓ, బోధకుడా, నీవు చాలా ఇరుకైన మనస్తత్వము గలవాడవు. నీవు ఇటువంటి కార్యములు మరియు అటువంటి కార్యములని వాటికి వ్యతిరేఖంగా బోధింపసాగినప్పుడు, నీవు సంఘములో ఆనందమంతటినీ తీసివేయుచున్నావు,” అని ప్రజలు చెప్పుచున్నారు. సహోదరుడా, ఆమె (సంఘము) దేనిని విశ్వసించుచున్నదో దానిపై సంఘము నిలబడిన యెడల, నేడు, ఆమె (సంఘము) దేవుని యొక్క కార్యములను ప్రేమించును, మరియు లోకకార్యములను ద్వేషించును. నేడు సమస్య ఏమిటంటే, మిశ్రమ జనాంగమును కలిగియుండుటయే. ఒక మిశ్రమ జనాంగము, లోక కార్యముల యందు ఆసక్తి కలిగియున్న ప్రజలు, మరియు కొంచెముగా సంఘమును వెంబడింపగోరుచున్నారు. అదియే వారిని తొట్రిల్లునట్లు మరియు పడునట్లు చేయుచున్నది. అదియే ప్రార్ధనా కూడికలను ఆగిపోవునట్లు చేయున్నది. ఆ విధముగా, సంఘములో అన్ని రకముల సమాజములతో వ్యవస్థీకృతము చేయుచున్నారు, మరియు బలిపీఠమును తీసివేయుచున్నారు. మరియు అది మంటను కలిగియున్నది కేవలము క్రింది అంతస్తులో మాత్రమే.

అదియే బోధకుడిని పదిహేను నిమిషములు బోధించు, మరియు జపమాల లేక ఎర్రపక్షిని లేక అటువంటి వాటి నుండి తయారుచెయ్యి అని చెప్పుచున్నారు. కాని, నేను మీకు చెప్పుచున్నాను, ఒక తిరిగి జన్మించిన దేవుని సజీవ సంఘము సువార్తను వినుట కోరుకొనును; ఎందుకనగా, దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించిన ఒక మనుష్యుడు, యేసు దానిని చెప్పెను... “మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతీమాట వలనను జీవించును.” ఖచ్చితంగా జరుగును. మిశ్రమ జనాంగములు!

45

వారు బయలుదేరారు. అవును. వారు ఐగుప్తు యొక్క వారి గొప్ప స్థితులను, వారి భౌతికమైన ఆలోచనలో గర్వమును, వారి యాంత్రిక పరికరాలను, వారి వైద్య శాస్త్రములోను, వారి మార్గములో వారు కలిగియున్న యాంత్రిక శాస్త్రమును వారు విడిచిపెట్టారు. వారి స్థానములను బట్టి వారు గర్వపడుతున్నారు. గొప్ప వైద్యుడితో ప్రయాణం చేయుటను, వారు దానిని విడిచిపెట్టారు, మరియు ఇంకా ఫిర్యాదు చేస్తున్నారు. అది ఈనాటి మిశ్రమ జనాంగమువలె లేదా?

మొదటిగా మీరు తెలుసుకొనవలసిన విషయము, వారు కాదేషు-బర్నేయా అను పిలవబడు ఒక స్థలమునకు వచ్చారు. కాదేషు-బర్నేయా ఒక న్యాయపీఠము అయియున్నది, లోకము యొక్క న్యాయపీఠము. ఆ స్థలము యొక్క నిజమైన పేరు, దానియొక్క అర్ధము ఏదనగా, “ఒక గొప్ప దివ్యమైన నీటి ఊట,” ఎడారిలో నిలుచుని ఉన్న ఈ గుంపు ఖర్జూరపు వృక్షములు వలన నీటి ఊట ఉబుకుచూ, కొన్ని చిన్న గుడిసెలు, పట్టణము అని పిలువబడి, దేశములోని ప్రజలు నివాసముండు స్థలము, లేక కొంతమంది ప్రజలు మరియు వాటన్నింటితో పాటు, చిన్న చిన్న ఊటలు ప్రతిచోటా ఉబుకుచూ, ఈ గొప్ప పెద్ద ఊటచే పోషించబడుచున్నవి.

46

ఆ ఎడారిలో, సంఘమునకు అది ఎంత అందమైన చిత్రమువలె ఉన్నది, నీటిని పొందుకొనుట కొరకు, ప్రతీది కాదేషు వద్దకు రావలెను. మరియు కాబట్టి, ఆ ఒక పెద్ద ఊట, ఇతర ఊటలను పోషించుచున్నది. అది పరలోకమునకు ఒక మాదిరిగా ఉన్నది. అది దేవుని యొక్క న్యాయపీఠమునకు ఒక మాదిరిగా ఉన్నది. దేవుని యొక్క ఇంటియొద్దనే తీర్పు ప్రారంభమగును. మరియు ఈ ఒక్క గొప్ప ఊట పోషించబడుచున్నది, మరియు ఇతర చిన్న ఊటలు దాని నుండి ప్రవహించుచున్నవి, దాని అర్ధము, పరలోకము క్రీస్తు యొక్క న్యాయపీఠమై యుండి, మరియు న్యాయపీఠములో, అన్ని సంఘములు జీవమును, ఇచ్చుచున్నవి, నీరు, తీర్పు తీర్చబడుటకు ఎక్కడైనా ప్రజలు సంఘమునకు వచ్చెదరు.

47

దాని యొక్క ఇబ్బంది ఏదనగా, ఈ దినము, ప్రజలు సంఘమునకు వచ్చెదరు మరియు వారు వెన్ను తట్టబడుదురు (బుజ్జగించబడుదురు), మరియు అటువంటి సంగతులు. అది ఎందుకనగా వారు సేకరణా పళ్లెం (కానుకల పెట్టె)లో చెల్లించెదరు; ఎందుకనగా సంఘమునకు వారు డీకను అవుటకు; ఎందుకనగా వారు ఏదో అవగోరుదురు; లేదా, ఏదో ఒక, మంచి కారు నడుపుటకు, లేదా మంచి వస్త్రములు ధరించుటకు, లేక అటువంటివి. మీరు గౌరవించబడి మరియు మీరు బుజ్జగించబడుదురు. సహోదరుడా, ఈనాడు మనకు పాత-కాలపు బోధకులు ఎవరైతే నలుపుని “నలుపు,” మరియు తెలుపుని “తెలుపు” అని ప్రకటించువారు అవసరము.

బాప్తిస్మమిచ్చు యోహానువలె, ఆయన యూదయ అరణ్యములో నుండి బయటకు వచ్చినప్పుడు, అతడు సరిగ్గా బట్టలు ధరించుకొనలేదు. అతను గొర్రె చర్మమును చుట్టబెట్టుకొని, మరియు తోలుదట్టితో, ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టూ ధరించుకొన్నాడు. మరియు మారుమనస్సు విషయమై బోధించుచు అతడు బయటకు వచ్చెను. మరియు హేరోదు అతని సోదరుడైన ఫిలిప్పు భార్యను తీసికొనినప్పుడు, ఆమెను వివాహము చేసుకొని, అక్కడ కూడికకు వచ్చెను. “ఈ రాత్రి నీవు వివాహము మరియు పరిత్యాగము బోధించరాదు, ఎందుకనగా ఈ రాత్రి మన మధ్య ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. మీరు అలాంటిది ఏమీ చేయవద్దు,” అని డీకను చెప్పుటను నేను ఊహించగలను.

48

తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మను పొందుకొన్న ఒక వ్యక్తిని, ఏదైనా పాపము అను దానితో ఎన్నడైనా నిలిచియుండుటను మీరు ఊహించగలరా? బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించుటకు మూడు నెలల మునుపే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నాడు. అతడు తల్లి గర్భములోనే మృతుడైయున్నాడు, అయితే మొదటిసారి యేసు అను నామమును పలికినప్పుడు, అతడు తల్లి గర్భములోనే ఎగిరి మరియు గంతులు వేశాడు. జన్మించుటకు మూడు నెలలు మునుపే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఆత్మను పొందుకొని, లోక కార్యములతో రాజీపడు ఒక వ్యక్తిని నీవు ఊహించగలవా?

సరిగా తిన్నగా నడుచుకుంటూ వెళ్ళి మరియు అతని వ్రేలిని వాని ముక్కు క్రింద (ముఖము వైపు) చూపి, మరియు “ఆమెను కలిగియుండుట నీకు చట్టబద్దమైనది కాదు,” అని చెప్పెను. అదే మార్గము. దాని వెల అతని తల, కాని ఈ రాత్రి, అతడు అమరుడై, మరొక లోకములో విమోచించబడిన వారి మధ్య వున్నాడు. ఆమేన్. అది ప్రఖ్యాతి పొందలేదు, కాని అది సత్యము. ఆమేన్. గమనించండి.

49

“ఆమెన్,” అని నేను చెప్పినప్పుడు భయపడవద్దు, అంటే “అలా అవును గాక.” అవును. అది సత్యము. ఇప్పుడు, నేను అప్పుడప్పుడూ కొంచెం ఉత్సాహపడతాను. నేను చాలా ఉత్సాహపడుచున్నాను అని మీరు తలంచెదరు, కాని నేను అలా పడుట లేదు అని నేను ఎరిగియున్నాను. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు, నేను ఖచ్చితంగా ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు. దేనిని గూర్చి మాట్లాడుచున్నానో నాకు తెలుసు, నేను ఎవరిని గూర్చి మాట్లాడుచున్నానో నాకు తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత అందముగా ఉన్నదో గమనించండి.

50

మరియు వారు సణుగుట మరియు ఫిర్యాదులు చేయుట ప్రారంభించిరి, మరియు తుదకు వారు కాదేషు వద్దకు తేబడ్డారు. మరియు వారు కాదేషుకు వచ్చినప్పుడు, ఈ న్యాయపీఠము, తీర్పు, అప్పుడు మొత్తం అన్ని విషయములు కలిపి సమకూర్చబడినవి. మరియు ఒక మహిమకరమైన దినము, మరియు ఆ దినము ఇప్పుడు సమీపించియున్నది అని నేను విశ్వసించుచున్నాను, అప్పుడు తప్పు మరియు ఒప్పుల మధ్య వేర్పాటు ఉండును.

మరియు ఆత్మీయ అధికారముతో, మృగము యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర, లేక దేవుని యొక్క ప్రజలు, అది త్వరలో జరుగుతుంది, మరియు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. అది దానిని నేను తగినంతగా రుజువు చేయగలను అని నమ్ముతున్నాను. మృగము యొక్క ముద్ర అంటే బ్రష్టత్వము యొక్క ముద్ర. నిజమును తృణీకరించుటయే మృగము యొక్క ముద్ర; వారి తక్కిన దినములన్నీ తప్పుగా వుండుటకే వారి చెవికి రంధ్రము చేయబడినది. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తీస్మము అను దేవుని యొక్క ముద్రను పొందెదరో, ఎఫెసీయులు 4:30 చెప్పుచున్నది, “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనా దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడియున్నారు.” అది ఒక వ్యక్తి ఇకపై మధ్యస్థముగా నిలబడలేని స్థలమునకు వచ్చియున్నది. అది నిజము.

51

ఒక వ్యక్తి పరలోకమునకు వెళ్ళ ప్రయత్నించునట్లు అది యుండును. అతడు చేతినిండా టిక్కెట్లు కలిగియున్నాడు. అతడు రైలు ఎక్కినప్పుడు ఒక వ్యక్తి అతనిని అడిగాడు, చెప్పాడు, “అన్ని టిక్కెట్లు ఎందుకొరకు?” వాటిలో ఒకటి మెథడిస్టు, ఒకటి బాప్టిస్టు, ఒకటి క్రైస్తవ విజ్ఞానము, ఒకటి సెవెన్త్-డే-ఎడ్వెంటిస్టు, ఒకటి ప్రతీదీ అయియున్నది. చెప్పాడు, “నీకు ఈ టిక్కెట్లన్నీ ఎందుకొరకు?”

“మంచిది, అయ్యా, నేను మీకు చెబుతాను,” అని అతడు చెప్పాడు. “ఒకరు ఇది సత్యము అని చెప్పమన్నారు, మరియు అది సత్యము, మరియు నేను వాటన్నింటిని ప్రయత్నించాను,” అని చెప్పాడు, “వారిలో ప్రతీ ఒక్కరి యొద్ద నుండి టిక్కెట్టు తీసుకొని వచ్చెదను అని నేను తలంచాను,” అని చెప్పాడు. మరియు అతడికి తీర్పు తీర్చబడినది.

52

సహోదరుడా, పరలోకమునకు వెళ్ళుటకు ఒకే ఒక మార్గము ఉన్నది, అది క్రీస్తు యేసు ద్వారా, పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించుట ద్వారానే. “ఒకడు తిరిగి జన్మించితేనే గాని, అతడు ఏ విధముగాను రాజ్యములో ప్రవేశించడు,” అని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పెను. ఆమేన్.

స్నేహితుడా, మనము ఎటువంటి దినములో నివసించుచున్నాము; మనము ఎటువంటి కాలములో నివసించుచున్నాము, ఎటువంటి మార్పు, ఎటువంటి కదిలింపు! దేవుడు ఎల్లప్పుడు తన సంఘమును రుజువు చేసాడు. దేవుడు, ఎల్లప్పుడు, చేస్తాడు!

వారందరు బ్రెన్హాం గుడారమునకు వస్తారు అని నేను చెప్పలేను; వారందరు వాల్-స్ట్రీట్ కు వెళతారు అని నేను చెప్పను. వారందరు క్రైస్తవ సంఘమునకు, లేక ఏదో ఒక సంఘమునకు వెళ్తారు అని నేను చెప్పను. ప్రతి సంఘములో, ఆయన సభ్యులు ఉన్నారు, తిరిగి జన్మించిన తన శరీరము యొక్క సభ్యులను ఆయన కలిగియున్నాడు అని నేను చెబుతాను. మరియు వారే దేవుడికి నిజమైన వారు. మరియు వారే ప్రభువైన యేసుని తమ పూర్ణహృదయముతో, మరియు తమ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించెడివారు. వారు వారి పరిశుద్ధ గ్రంధమును చదువుటను మీరు కనుగొనెదరు, ప్రార్ధన కూడికలో దేవుని రాజ్యము కొరకు వారు చేయగలిగిన ప్రతీదీ చేయుదురు. అది సత్యము. కాని మిశ్రమ జనాంగము అమితమైన శక్తితో మరియు అణగదొక్కుతూ, మరియు తిరిగి వారిని లోకము యొక్క కార్యములలోనికి లాగుటకు ప్రయత్నించుచున్నారు. నేడు మనకు కావలసినది ఏమనగా మరొక కాదేషు-బర్నేయా, (అది నిజము), ఇక్కడయే తీర్పు ప్రారంభమగును.

53

అప్పుడు ఏమి జరిగినది? కోరహు పైకి లేచి, “మోషే కన్నా మరింత మంది పరిశుద్ధులు ఉన్నారు,” అని చెప్పెను. మరియు అతడు ఒక గొప్ప గుంపును ఒకటిగా సమకూర్చెను. మరియు ఈ గుంపుతో బయటికి వెళ్ళి, మరియు “మేమునూ ప్రవక్తలము, మరియు మేము ఇది, మరియు మేము అది,” అని అతడు చెప్పెను.

మరియు ఏమి జరిగినది? దేవుడు మోషేతో, “నిన్ను నీవు అతడి నుండి వేరుపరచుకొనుము” అని చెప్పెను. మరియు ఆయన భూమి నెరతెరచి మరియు వారిని మ్రింగివేసెను. అది ఆ సణిగెడి వారి యొక్క ముగింపు, మరియు కోరహుతో వెళ్ళిన ఆ ప్రజల యొక్క ముగింపు.

అప్పుడు ఏమి జరిగినది? “మనము వెళ్ళబోవు...” “మనము ఎక్కడకు వెళ్ళుచున్నామో, దేనిని నేను మీకు వాగ్దానం చేసితినో, ఆ దేశమును సంచరించి వేగులవారిని పంపుము,” అని దేవుడు మోషేతో చెప్పెను. ఒకవేళ వారికి అది మంచి దేశము అని దేవుడు చెప్పితే, దేవుడు తన వాగ్దానములను నెరవేర్చినట్లయితే, అలా దేవుడు చెప్పినట్లయితే, అది ఎవరినైన తప్పక, సంతృప్తిపరచేటట్లు కనిపించును.

ఇప్పుడు, మనమందరము దానిని బట్టి దేవునికి స్తోత్రము,“ అని అరచెదము. కాని, సహోదరుడా, వారికి ఆ వాగ్దానం చేసిన అదే దేవుడు, వారికి ఆయన చేసిన ప్రతీ వాగ్దానమును మనకునూ చేస్తున్నాడు. ఎందుకు మనము దానిని సందేహిస్తున్నాము? ”నీవు ఏమి చెప్ప ప్రయత్నించుచున్నావు, సహోదరుడా బ్రెన్హాం? ఇది ఒక మిశ్రమ జనాంగమా?“ అవును, ఖచ్చితంగా, అది నిజము. ఇది ఒక మిశ్రమ జనాంగము. మరియు మనము సరిగ్గా కాదేషు వద్దనే ఉన్నాము, ఎక్కడైతే మీరంతా ...

[టేపులో ఖాళీ.]

54

దేశములో గొప్ప వ్యక్తులు ఉన్నారు. మనకు ఒక జాక్ శులర్, ఒక బిల్లీ గ్రాహం ఉన్నారు; మనకు ఓరల్ రాబర్ట్స్, టామీ హిక్స్, టామీ ఆస్బర్న్ ఉన్నారు. ఈ దేశమునంతటిని ముందుకు మరియు వెనకకు తుడిచిపెట్టగల శక్తివంతమైన అనేక వ్యక్తులు ఉన్నారు. మరియు, ఈ రాత్రి, సంఘముల కంటే సారాయి విక్రయశాలలు ఎక్కువగా ఉన్నవి. మరియు అవి తరచుగా పెరుగును. విషయము ఏమిటి? అక్కడ ఒక మిశ్రమ జనాంగము ఉన్నది.

మీకు ఒక విషయము చెప్పనివ్వండి: ఈ దేశాన్ని ఒక్క ఘడియ కాకుండ, ఒక ఖచ్చితమైన దినము, ప్రార్ధన కూడిక కొరకు ప్రక్కన పెట్టినచో, వెయ్యిలో ఒక శాతం దానికి హాజరగుటకు ప్రయత్నిస్తారు; ఈ దేశమునంతటిని దేవుని వైపు త్రిప్పి, మరియు ప్రతీ సారాయి విక్రయ దుకాణమును పడగొట్టి, ప్రతీ సారాయి కాచే స్థలములను కూల్చివేసి, మరియు ప్రతీ త్రాగుబోతు త్రాగే స్థలములను పడగొట్టి, మరియు అటువంటి అన్నీ కార్యములు. మరియు ఈ చిన్న పాత కురచ దుస్తులు స్త్రీలు ధరించకుండనట్లు, మరియు అవి వీధులలో ధరించుట ఒక శిక్షాస్మృతి నేరంగా భావించి; మరియు గృహమును శుభ్రం చేసికొని, గృహమును మరియు సంఘమును, మరియు పాత-కాలపు ఉజ్జీవము వచ్చుట కొరకు, పాఠ్యాంతరములు చెప్పువారికి బదులుగా, బలిపీఠముల వెనుక బోధకులను ఉంచవలెను. అక్కడ స్త్రీ పురుషులు దేవుని కొరకు పిలుచుచు, దేశమును తుడిచిపెట్టే ఉజ్జీవమును మనము కలిగియుందుము.

మరియు అది మనము ఎన్నడు కలిగిలేని ఉత్తమ రక్షణయైయున్నది. ప్రపంచములో ఇది ఒక్కటి మాత్రమే అణుబాంబును ఆపివేయును. అవును, ఆయన రెక్కల క్రింద, బాంబు నుండి తప్పించుకొనే ఆశ్రయము మీకు ఉన్నది. ఆమెన్. అది నిజము.

55

గమనించండి, కాదేషు-బర్నేయా అను ఈ స్థలము వద్ద అక్కడ వారికి తీర్పు ఉండాలి. మరియు మోషే పండ్రెండు మందిని ఎంపిక చేసి ప్రతీ గోత్రములో నుండి ఒక్కరిని, మరియు అతడు ఆ దేశమును సంచరించి చూచుటకు వారిని పంపాడు. వారి తిరిగి వచ్చినప్పుడు, ఎటువంటి సమాచారము... మీరు గమనించియున్నారని నేను ఆశించుచున్నాను! “ఓ,” వారు చెప్పారు, “అది ఒక మంచి దేశము. ఓ, అది ఒక అద్భుతమైన దేశము. అది పాలు తేనెలు ప్రవహించేది.” “కాని,” వారిలో పదిమంది చెప్పారు, “మనము దానిని స్వాధీనపరచుకోలేము. మనము దానిని స్వాధీనపరచుకోలేము. ఓ,” చెప్పారు, “మేము అమోరీయులను, మిద్యానీయులను, మరియు కనానీయులను, మరియు వారందరిని కలుసుకున్నాము. ఎందుకు, వారి ప్రక్కన మేము మిడతల వలె కనపడ్డాము. వారు గొప్ప ఉన్నత దేహులు. మరియు వారివి ప్రాకారములు గలిగిన పట్టణములు, మరియు మనము లోనికి ప్రవేశించుటకు ఎటువంటి మార్గము లేదు. ఓ, మా హృదయములు మాలోనే జంకినవి. మనము దానిని పొందలేము.” మరియు, ప్రజల యొక్క ప్రాధాన్యతా ఓటును బట్టి, ప్రజలు దానిని స్వీకరించారు.

అయితే అక్కడనే ఇద్దరు నిలుచున్నారు, ఒకని పేరు కాలేబు, మరియు ఒకని పేరు యెహోషువ, వారు ఒక ద్రాక్షాగుత్తులను తీసుకువచ్చారు, దానిని ఇద్దరు వ్యక్తులు మోయవలసివచ్చినది. “ప్రవక్త యెదుట, మీరు నిశ్శబ్దంగా ఉండండి. మీరు నిశ్శబ్దంగా ఉండండి,” అని కాలేబు చెప్పాడు. “దానిని పొందుటకు మన శక్తి చాలును. తక్షణమే మనము వెళ్ళి, దానిని స్వాధీనపరచుకొందుము,” అని అతడు చెప్పెను.

56

ప్రజలయెదుట దేవుని యొక్క వాగ్దానమును సవాలు చేసే ఒక వ్యక్తి ఈ ఘడియలో మనకు అవసరము. ఈ అంత్యదినములలో పెంతెకోస్తు ఆశీర్వాదము కుమ్మరించెదను అని దేవుడు వాగ్దానము చేసియున్నాడు; నా ఉద్దేశ్యము నిజమైన పెంతెకోస్తు కుమ్మరింపు, మరియు అది వచ్చు సమయము ఇదియే. మరొక కాదేషు-బర్నేయ వచ్చినది. అవును, అయ్యా.

వారు చెప్పారు, “మనము దానిని సరిగ్గా పొందగలము. ఖచ్చితముగా, మనము దానిని పొందగలము.” అది ఏమిటి? ఆ పిరికి సంఘ సభ్యులు కంటికి కనబడునది మాత్రమే చూడగలుగుచున్నారు, కాని కాలేబు యెహోషువాలు దేవుని వాగ్దానమును చూచుచున్నారు. వారికి ఎంత వ్యతిరేఖత ఉన్ననూ నేను లెక్కచేయను, ఆ ఉన్నత దేహులు ఎంత పెద్దగా కనిపించిననూ, వారి కంచెలు (ప్రాకారములు) ఎంత పెద్దగా కనిపించిననూ, వారు దేవుని వాగ్దానమును చూచుచున్నారు.

మరియు ఈ రాత్రి, స్త్రీలు మరియు పురుషులు, దేవునితో వెళ్ళగోరువారు, లోకము ఏమి చెప్పుచున్నదో దృష్టి ఉంచక, మనము చేయగలమా లేక మనము చేయలేమా; దేవుడు దానిని వాగ్దానము చేసాడు, మరియు అది స్థిరపరచబడును. “దేవుడు అలా చెప్పియున్నాడు. నేను దానిని ఇష్టపడెదను. దేవుడు ఏమైనా చెప్పినప్పుడు, అది ఎప్పటికీ స్థిరపరచబడును.

57

ఈ రాత్రి నేను మీకు చెప్పుచున్నాను, అధిక మొత్తములో మనము తప్పుడు నటనలను కలిగియున్నాము. మనము తయారుచేయబడిన విశ్వాసమును అధికముగా కలిగియున్నాము. ప్రదర్శించుట కొరకు చాలా విషయాలు మనము కలిగియున్నాము. నిజముగా. ప్రజలను భయపెట్టుటకు అనుకరణ చేయు వ్యక్తిని, దయ్యము ఎల్లప్పుడునూ వాడియొక్క ముందుగా వచ్చువారిని మీ మీదకు త్రోయును. తప్పుడు పెంతెకోస్తుని మనము కలిగియున్నాము; తప్పుడు వర్షమును మనము కలిగియున్నాము; మనము ఇవి మరియు అవి తప్పుడు వాటిని కలిగియున్నాము. కాని వాటి ప్రతీ వాటి మధ్యలో ప్రతి చిన్నదానిలోను, ఒక నిజమైన పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ఉన్నది. మళ్ళీ, పెంతెకోస్తు ఆశీర్వాదము ఉన్నది. ఒక నిజమైన దైవిక స్వస్థత ఉన్నది. ఒక నిజమైన ఆత్మ ఉన్నది. నిజమైన ప్రజలు ఉన్నారు. మరియు ఇది ముందుకు నడుచు సమయము. అది నిజము.

58

ప్రజలారా, నిర్ణయము తీసుకొనే ఘడియలో ఇప్పుడు, మీ మనస్సును మీరే సిద్దపరచుకొనండి. సంఘము తన మనస్సును సిద్దపరచుకొనవలెను. ప్రతీ వ్యక్తి ఆ కీలకమైన ఘడియ అను స్థానము వద్దకు రావలెను. ఆ కీలకమైన సమయం వచ్చును అప్పుడు నీ మనస్సును సిద్దపరచుకొనవలెను. ఒక న్యాయపీఠము వద్ద, నీవు వున్నావు. “నేను అపరాధిని,” లేక “నేను నిరపరాధిని” అని నీవు చెప్పవలెను. నీవు ఆ న్యాయాధిపతి యెదుట నిలబడుచున్నప్పుడు, నీవు నీ మనస్సు సిద్దపరచుకోవాలి.

మరియు, ఈ రాత్రి, ఈ బ్రెన్హాం గుడారము తన మనస్సును సిద్దపరచుకోవాలి. మనము ముందుకన్నా వెళ్ళాలి లేక వెనుకకు అయినా వెళ్ళాలి. అది నిజము. నీవు తిరిగి వెల్లుల్లి వద్దకు మరియు ఉల్లికాడలు, మరియు ఐగుప్తులోని కార్యముల యొద్దకు వెళ్ళాలి లేక దూతల యొక్క ఆహారము యొద్దకు వెళ్ళాలి, దేవుడు వాగ్దానము చేసిన వాగ్దానభూమికి వెళ్ళాలి. పాత-కాలపు పరిశుద్ధాత్మ ఉజ్జీవము వైపుకు మనము వెళ్ళుచున్నాము, లేక పటుత్వము లేని వారిగా ఉందురు, చుట్టూ ఉన్న వాటిని సమకూర్చుకొని, మరియు ఒక రాబిన్ పిట్ట ఆపిల్ పండును ముక్కు పొడిచి తినునట్లు, మీరు మరణించు దినము వరకు ఉందురు. మీరు మీ నిర్ణయం తీసుకొనవలెను, మీరు ఇక వెళ్ళలేరు.

59

“మీరు ఎందుకు రెండు తలంపుల మధ్య నిలుచున్నారు?” అని ఏలీయా చెప్పాడు. “దేవుడు దేవుడైతే ఆయనను సేవించండి. ఆయన దేవుడు కానియెడల, అప్పుడు ఆయనను సేవింపవద్దు.” ఒకవేళ దేవుని యొక్క నిజమైన అనుభవము ఉంటే అది ఒక వ్యక్తి హృదయములో వున్న పాపమును తీసివేయును. మరియు ఒక సంఘమునకు చెందుటయో, లేక ఒక తెగకు చెందుటయో, లేక ఒక సంస్థకు చెందుటయో కాదు — నేను వాటికి వ్యతిరేకముగా ఏమియూ చెప్పను; ఆ కార్యములన్నియూ సరియే. అయితే దానిని విద్య తీసుకొని రాలేదు...

అనేక మారులు మనము ప్రయత్నించి మరియు దానినుండి బ్రద్దలైన తొట్లను పొందుకున్నాము. ఒకానొక సమయంలో, మనము నాలుగు గొప్ప సంస్థల కూటమిని కలిగియున్నప్పుడు, యుద్దములన్నిటినీ అది పరిష్కరిస్తుందని మనము భావించాము. అది యుద్ధములను పరిష్కరించలేదు; దానిలో కారుటకు ఒక రంధ్రము ఉన్నది. ఒకానొక సమయంలో, విద్యా కార్యక్రమాలు ఈ ప్రపంచమునంతటినీ రక్షించునని మనము ఆలోచన చేసాము. మరియు విద్యావంతులమైన మనము, మరియు మనము ఏమి పొందుకొన్నాము? ఒక చదువుకున్న నాస్తికుల గుంపును. అది ఖచ్చితంగా నిజము. ఒకానొక సమయంలో మానవ సమాజములు ప్రపంచాన్ని రక్షించునని మనము ఆలోచన చేసాము. మరియు వారు సమాజములు అను పిలుచు వాటి నుండి అత్యంత కిరాతక నేరస్థులు వచ్చుటను మనము కనుగొన్నాము. విద్య మరియు సమాజము లోకమును రక్షించలేవు.

లోకము కొరకు ఒకే ఒక రక్షకుడు వున్నాడు మరియు అది కలువరిలో ఉచితంగా కుమ్మరించబడిన యేసుక్రీస్తు రక్తమై యున్నది. అది ఒక వ్యక్తి చేసిన ప్రతీ పాపమును క్షమించును. “మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుకొన్నాము.”

60

ఏ స్త్రీ మరియు పురుషునికైనను, యేసుక్రీస్తు నామములో నేను సవాలు చేయుచున్నాను, ఈ రాత్రి, దేవునిని ఆయన వాగ్దానములో తీసుకొని, మరియు అది సత్యమో లేక అసత్యమో చూడండి. వైద్యులు అతడు మరణించాడు అని ప్రకటించి బయటకు నడిచి వెళ్ళిపోయినప్పుడు. మరణించిన వారు లేచుటను నేను చూచాను, సంవత్సరాలు, సంవత్సరాల నుండి పూర్తి గ్రుడ్డిగా ఉన్నవారు, ఆ గ్రుడ్డివారు చూచుటను (చూపు పొందుటను) నేను చూచాను. చెవిటి, గ్రుడ్డి మరియు కుంటి, మరియు అవిటి వారు గెంతుతూ, మరియు ఎగురుచూ మరియు ప్రభువును స్తుతించుటను నేను చూచాను. వేశ్యలు వీధులలో నుండి బయటకు వచ్చి మరియు మంచి స్త్రీలుగా మారుటను నేను చూచాను. ఆ జూదము ఆడు గదుల నుండి త్రాగుబోతులు, మరియు ఈ లోకము యొక్క జూదము ఆడు స్థలముల నుండి బయటకు వచ్చి, మరియు సున్నితమైన వ్యక్తులుగా మరియు పరిశుద్దులుగా మారుట నేను చూచాను.

ఏ వ్యక్తి అయినా ఇంకేదయినా దానిని ఉత్పత్తి చేయగలదా అని నేను సవాలు చేయుచున్నాను. మద్యాన్ని వదిలివేసిన వారికి తోడ్పడే సంస్థలలో వుండి మరియు బాగుపడుటకు ప్రయత్నించే వ్యక్తులను నేను చూచాను; విద్యుత్ షాక్ ద్వారా, ప్రతీదీ తీసుకొంటూ మరియు లోకములోని మనస్తత్వ శాస్త్రములన్నియూ, మరియు ఉత్తమ రకమునకు చెందిన వైద్యులు వారికి చికిత్స ఇవ్వాలని మరియు వారు విఫలమయ్యారు. మరియు అదే వ్యక్తి యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎన్నుకొనబడి, మరియు దేవుని యొక్క పరిశుద్దునిగా మార్చబడి, మరియు సువార్త బోధకుడిగా మార్చబడుటను నేను చూచాను. ఆమేన్.

61

నేను పరిశుద్ద-గుండ్రాయిని అని భావిస్తున్నాను? బహుశా నేను కావచ్చు. నిజము. క్రీస్తు యొద్ద దయ కనుగొనేందుకు, “పరిశుద్ద-గుండ్రాయి” అనే పేరు నేను తీసుకోవలసివస్తే, మరియు లోకముచే నిందింపబడితే, అప్పుడు నేను వారిలో ఒకడిని. అది నిజము. నేను ఆయనను ప్రేమించుచున్నాను.

62

నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీవు కాదేషు వద్ద ఉన్నావు, మీరు చూడండి, ఎక్కువసేపు నిలబడలేవు; ఎందుకు మీరు రెండు తలంపులు మధ్య నిలిచియున్నారు? ఎందుకు సంఘము మండుట లేదు? ఎందుకు ఆ స్థలము ఆ ప్రజలతో కిక్కిరిసి లేదు? ఎందుకు గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు జరుగుట లేదు? దానిని పాస్టరు పై వేయవద్దు, అది నీవే. మనము మిశ్రమజనాంగమును కలిగియున్నాము; ఒకడు ఒక ప్రక్కకు మరియు ఒకడు ఇంకొక ప్రక్కకు లాగుచున్నాడు. నీవు నిర్ణయము తీసుకొనే సమయమునకు వచ్చావు. ఒకవేళ అది పాస్టరు అయితే, అతనిని తీసివేయుము, అతడిని బయటకు పంపుము. మరియు అతడి స్థానమును ఎవరు తీసుకొనెదరో అతడిని ఉంచండి. ఒకవేళ అతడు డీకన్ అయితే, అతడిని బోర్డ్ (డీకన్ బోర్డ్) నుండి తొలగించి మరియు అతని స్థానమును ఎవరు తీసుకొంటారో వారిని ఉంచండి. సహోదరుడా, నీవు ఏమీ చేయగోరుచున్నావు? దేవుడు ఆ బాధ్యత నీపై పెట్టాడు. అది అంతే. మరియు మనలో ప్రతీ ఒక్కరూ, మన సొంత పాపముల నిమిత్తము లెక్క అప్పగించవలెను, మరియు తీర్పు దినమున సమాధానము చెప్పవలెను.

63

మనము కాదేషు-బర్నేయాలో ఉన్నాము, మరియు దేవుని యొక్క వాక్యము చెప్పినది, మనము దానిని స్వాధీనపరచుకొనగలము. దేవుని యొక్క వాక్యము చెప్పినది మనము ఒక ఉజ్జీవమును కలిగియుండగలము. ఇక్కడ ఈ సూచక క్రియలు మరియు మహత్కార్యములు అన్నియూ, అంత్యదినములలో ఆయన లేపును అని దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది, మరియు ఆయన అది చేశాడు. ప్రతీ వ్యక్తి వారి స్థానములో నిలబడి, కాని మనము చేయవలసిన కార్యము ఏదనగా మనమందరము సమకూడి మరియు ఉజ్జీవమును ప్రారంభించవలెను. అది సరిపోవును.

64

మీ నిర్ణయము ఇప్పుడు రావచ్చును. మీ నిర్ణయము మరొక సమయములో రావచ్చును. కాని అది ఇప్పుడు వచ్చినట్లయితే, మీరు దానికి సమాధానము ఇచ్చుట మంచిది. మీరనవచ్చు, “ఓ, సహోదరుడా, నేను, మంచిది, ఏదో ఒక రోజు నా నిర్ణయము తీసుకొంటాను.” మీరు దానిని తీసుకోవాలి. మరియు ఇప్పుడే అది తీసుకొనే సమయము. నీవు తీసుకొనునప్పుడు సమయము ఉండునా. నా సహోదరుడా, మీరు మీ భార్యతో వెళ్ళుచున్నప్పుడు, నీవు వివాహం చేసుకోవాలా లేక చేసుకోకూడదా అనే నిర్ణయము నీవు తీసుకోవాలి; నీవు ఒక నిర్ణయము తీసుకోవాలి. బహుశా ఇలా రావచ్చు, “నీవు వివాహము చేసుకొనకూడదు,” అని కొందరు ఈ విధముగా చెప్పవచ్చు. సరియే, “నీవు వివాహము చేసుకోవడం మంచిది,” అని కొందరు చెప్పవచ్చు. ఒకరు చెపుతారు, మంచిది, “నీవు వివాహము చేసుకొంటే నీవు ఆనందముగా ఉంటావు.” మరొకరు చెపుతారు, “నీవు నీ గొంతును కోసుకొంటున్నావు.” ఇవన్నియు వివిధ కార్యములుగా ఉన్నవి. నీవే నిర్ణయము తీసుకోవాలి. అది నిజము.

65

ఈ కాదేషు-బర్నేయా, తీర్పు, నీ కొరకు వచ్చును. అక్కడ ఒక సమయము ఉండవలసియున్నది, కొంత సమయము, కుటుంబములో భేదములు వచ్చినప్పుడు, “బహుశా ఇక్కడ ఉన్న మీలో కొందరు విడాకులు తీసుకోవాలనుకున్నారు.” అది ఏదో ఒక విధముగా తొలగిపోవాలి. నీవు ఒక నిర్ణయము తీసుకోవాలి. నా సహోదరుడా, ఈ రాత్రి నన్ను మీకు చెప్పనివ్వండి, ఏ నిర్ణయం తీసుకోవాలంటే, నీవు మరియు నీ భార్య ఒకరి చేతులు ఒకరి చుట్టూ ఉంచి, మరియు మీ మోకాళ్ళపై దేవుని ఎదుట మీరు వంగినట్లయితే, మరియ మీరు యేసుక్రీస్తుని మరియు ఆయనను మాత్రమే సేవిస్తాము అనే నిర్ణయము తీసుకొంటే, మరియు విడాకులు ఇచ్చు న్యాయస్థానములన్నీ ఖాళీ అగును. నిజము. మీ వకీలుతో మాట్లాడవలసిన అవసరత ఉండదు; మీ రక్షకునితో మాట్లాడుట అవసరమైయున్నది. అది నిజము. వకీలు మీకు సలహా ఇవ్వవచ్చును, కాని రక్షకుడు మిమ్మును రక్షించును. బహుశా ఆ వకీలు మానసిక విద్యాభ్యాసము నుండి, ఏదో మనస్తత్వ శాస్త్రం నీకు చెప్పవచ్చును, కాని యేసుక్రీస్తు ఆయన కృపను మరియు ప్రేమను నీకు ఇవ్వగలడు; అది వాటంతటి యొక్క స్థానమును భర్తీ చేయును.

66

ఈ రాత్రి నీవు అనారోగ్యముగా ఉన్నట్లయితే, క్రీస్తు నిన్ను స్వస్థపరచువాడిగా అంగీకరించుటయా, లేక లేదా అనే నిర్ణయమును నీవు తీసుకోవాలి. నీవు దానితో అలా-ఇలా కాలయాపనము చేయరాదు. “నేను ఆయనను విశ్వసిస్తాను,” లేక “నేను ఆయనను విశ్వసించను,” అని మీరు చెప్పవలసియున్నది. “నేను బాగవ బోవుచున్నాను,” లేక, “నేను బాగవ్వను, నేను బాగవుటకు తగినంత విశ్వాసము లేదు.” నీవు నిర్ణయము తీసుకోవాలి.

ఈ రాత్రి, నీవు ఒక పాపిగా ఉన్నట్లయితే, నీవు నీ నిర్ణయము తీసుకోవాలి. మీరు కాదేషు-బర్నేయా వద్ద ఉన్నారు. మీరు తీర్పు పీఠము అను స్థలము వద్ద ఉన్నారు.

ఆ చిన్న ఊటలు ఏమిటి, లేక సంఘములు, వేటికి ప్రాతినిధ్యము వహిస్తున్నాయి? తీర్పు దేవుని ఇంటి నుండే ప్రారంభమగును... యేసు అలాగు చెప్పెను; పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. తీర్పు దేవుని ఇంట నుండి ప్రారంభమగును. ఈ రాత్రి, మనము దేవుని యొక్క ఇంటిలో ఉన్నాము, మరియు నీవు నీ నిర్ణయమును తీసుకోవాలి. ఈ రాత్రి నీవు దేవుని యొద్దకు వచ్చెదవా, లేక ఆయనను క్రిందకు నెట్టెదవా, అను నీ నిర్ణయము నీవు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతీ పాపి ఆ నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకోవాలి. మీరు లోపలికి వచ్చినప్పటి కన్నా ఒక మంచి స్త్రీ మరియు పురుషునిగా మీరు ఆ ద్వారము గుండా బయటకు వెళ్ళగోరుచున్నారా, లేక మీరు లోపలికి వచ్చినప్పటి కన్నా అధ్వానముగా బయటకు వెళ్ళెదరా. ఈ రాత్రి మధ్యస్తముగా నీవు నిలబడలేవు. నీవు దానిని చేయవలసినదే.

67

ఇది నా హృదయముపై ఉండెను; ఇప్పుడు అది నా హృదయముపై ఉన్నది, ఇప్పుడు అది మీ చేతిలో ఉన్నది. మీరు మీ నిర్ణయమును తీసుకోవాలి. మరియు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. బహుశా నీవు ఒక మంచి సంఘ సభ్యుడివి కావచ్చు. బహుశా దేవుడు ఎక్కువగా కావాలి అని ఎల్లప్పుడు ఎంతో కోరిక కలిగియుండవచ్చు. దేవుని కొరకు ఏదో ఒకటి చేయగోరవచ్చు. గుర్తుంచుకొనుము, నీవు ఒకసారి మాత్రమే మర్త్యమైన వాడవు, మరియు నీవు మర్త్యమైన వాడవుగా ఉండుటకు ఈ సమయమే నీకు ఉన్న ఒకే ఒక సమయము కావచ్చు. మరియు నీవు నీ నిర్ణయమును తీసుకొనే సమయము ఇదే అవ్వవచ్చును: నీవు దేవునితో పాటు పైకి వెళ్ళగోరుచున్నావా, లేక నీవు ఎక్కడవున్నావో అక్కడే వుంటావా. ఈ రాత్రి బహుశా నీవు నీ నిర్ణయము తీసుకోవాలి. తీసుకున్నట్లయితే, మీ ప్రతీదాని నుండి విడుదల పొందునట్లు నేను ప్రార్ధన చేస్తాను.

గుర్తుంచుకొనండి, అది ఏదైనప్పటికి నేను లెక్కచేయను; అది నీ ఉద్యోగమవ్వవచ్చు, అది నీ కుటుంబమవ్వవచ్చు, అది మీరు ప్రేమించిన వారవ్వచ్చు, అది నీ సహచరులవ్వచ్చు, అది మీ భాగస్వాములవ్వచ్చు, లేక అది ఎవరయిననూ, ప్రతీ దాని నుండి విడుదల పొందుము. “నాగటి మీద చేయిపెట్టి వెనుక తట్టు చూచుటకు తిరుగువాడు దున్నుటకు పాత్రుడు కాడు.” అది నిజము.

“మనము కూడా ప్రతీ భారమును, సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి.” అది ఏమిటి? “మనము కూడా ప్రతీ భారమును, సులువుగా చిక్కులుబెట్టు అవిశ్వాసము విడిచిపెట్టి, మరియు మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” మనము ప్రార్ధించుకొందామా?

68

పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో, దేవుని యొక్క కుమారుడా, ఈ చిన్న వర్తమానమును నేను ముగించుచూ, మరియు దీనిని ప్రజల హృదయములపై విడిచిపెడుతున్నాను. స్త్రీ మరియు పురుషులందరి హృదయాలు ఎరిగినవాడవు, ప్రతీ బాలిక మరియు బాలురందరి హృదయాలు ఎరిగినవాడవు, ప్రతీ ఒక్కరి హృదయము ఎరిగినవాడవు. నీకు నా హృదయము తెలుసు. మరియు బలిపీఠము వద్ద నుండి కాపలాదారుడి వరకు, ప్రభువా, ప్రతీ వ్యక్తి యొక్క హృదయము నీవు ఎరిగియున్నావు. మాకు ఏది అవసరమో నీకు తెలుసు. మాకు తెలియదు. మేము ఎరిగిన ఒకే ఒక కార్యము, మాకు తెలుసు, మాకు యేసు అవసరము.

మరియు, ఓ దేవుని యొక్క క్రీస్తూ, నీవు వాగ్దానము చేసి మరియు దానిని నెరవేర్చవా? “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో, అక్కడ నేను వారి మధ్యన ఉందును. మరియు నా నామమున వారు నన్నేమి అడిగినను నేను చేతును,” అని నీవు చెప్పావు. మా సంఘమునకు అది ఎటువంటి సవాలు అయివున్నది, ప్రభువా; మా సమాజమునకు అది ఎటువంటి సవాలుగా ఉన్నది; మా ప్రజలకు అది ఎటువంటి సవాలుగా ఉన్నది, ఈ రాత్రి, నీవు దానిని మాకు దయచేసావు. “మీకు ఏదైనా కొదువ ఉండిన యెడల, దేవునిని అడుగుడి. అది ఆయన దయ చేయును.”

ఇప్పుడు నేను ప్రార్ధించెదను, ప్రియ పరలోకపు తండ్రీ, ఈ రాత్రి, ఒప్పుకోలును బట్టి మీరు ఉచితముగా పరిశుద్ధాత్మను కుమ్మరించెదరు. మరియు ప్రతీ హృదయమును అవసరతను బట్టి ఒప్పుకొని, మరియు వాటితో కూడా నేను, ప్రభువా, మేము నీపై ఆధారపడియున్నాము, క్రీస్తు నామములో.

69

ఇప్పుడు, మనము అలాగే మన తలలు వంచియుండగా, సహోదరి పియానాతో మనకొరకు సంగీతము అందించును. నేను మిమ్మును ఒక ప్రశ్న అడగబోవుచున్నాను. బహుశా ఇది మీరు నిర్ణయం తీసుకొనే సమయం అవవచ్చును. ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది, ఒక స్త్రీ లేక పురుషుడు, బాలుడు లేక బాలిక, క్రైస్తవుడు కాక పాపి అయిన వారు? మరియు ఈ సమయంలో ఏదయినా నీ హృదయమును తట్టుచున్నట్లు అనుభూతి చెందితే మరియు నీవు యేసుక్రీస్తు కొరకు నిర్ణయం తీసుకొనగోరుచున్నావా? నీ నిర్ణయం కొరకు నీ చేయి పైకి ఎత్తి మరియు “ఇప్పుడు క్రీస్తుని సేవిస్తాను అని నేను నా నిర్ణయం తీసుకొన్నాను,” అని చెప్పగలవా? దేవుడు నిన్ను దీవించును గాక, అయ్యా. ఇంకెవరయినా? “నేను ఇప్పుడు నా నిర్ణయం తీసుకొన్నారు.” చిన్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరయినా? అక్కడ వెనుక, చిన్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక.

ఇంకా ఎవరయినా, మీ నిర్ణయం తీసుకోగలరా? “ఇప్పుడు నేను క్రీస్తుని సేవించెదను. నేను ముగింపుకు వచ్చాను. నేను సంక్షోభంలో ఉన్నాను. ఇదే ఆ ఘడియ. నేను కాదేషు-బర్నేయా వద్ద వున్నాను. దేవుడు నా హృదయములో నిలబడియున్నాడు. నేను దాటి వెళ్ళగలనా? నా స్నేహితుడిని నేను విడువగలనా? నేను నాలోక సహచరులను విడువగలనా? దేవుడు ఎక్కడ వాగ్దానము చేశాడో, ఆ దూరంగా ఉన్న ఆ వాగ్దాన దేశము యొక్క సరిహద్దును నేను దాటగలనా? కాలము యొక్క చరిత్రలో, నేను ఒక కాలేబుని లేక ఒక యెహోషువాని అవ్వగలనా? దేవుని యొక్క గ్రంధములో నేను ఒక కాలేబుని లేక ఒక యెహోషువాని అవ్వగలనా? లేక, ఈ రాత్రి, నేను, పిరికివారి వలె వెనుకకు ముడుచుకొని, ముఖము పాలిపోయి, మరియు వెనుకకు వెళ్ళెదనా?”

70

దేవా, ప్రతీ ఒక్క స్త్రీ పురుషుల యొద్దనుండి దానిని తీసివేయుము. మరియు వారు నిర్ణయము తీసుకొని, ఈ రాత్రి క్రీస్తు కొరకు ఆమెను తీసికొనుము. మీరు మీ చేతులు ఎత్తగలరా? మరియొకరు, దేవుడు మిమ్మును దీవించును గాక. ఆ వెనుక నేను నిన్ను చూస్తున్నాను. ఇంకెవరయినా? బయట వున్నవారు, కిటికీ యొద్దకు మీరు రాగలరా? మరియు మీ చేయి కిటికీ పైన వుంచి, “నేను క్రీస్తు కొరకు నా నిర్ణయం తీసుకొనెదను సహోదరుడా బ్రెన్హాం, నేను కాదేషు-బర్నేయా వద్ద ఉన్నాను.”

ఇక్కడ ఇంకెవరయినా అది చేయగోరుచున్నారా? వెనుకకు జారిన వారు ఎవరయినా చెప్పగలరా, “నేను ఈ రాత్రి నా నిర్ణయం తీసుకొనెదను. అతిక్రమదారుని యొక్క మార్గములు కఠినముగా ఉండును. నేను ఇక లోకమును ఏ మాత్రము సేవించను. ఈ రాత్రి నుండి, ఇప్పటి నుండి, నేను క్రీస్తుని సేవించెదను. ఇప్పుడు నేను నా నిర్ణయమును తీసుకొంటిని. నేను నా చేతిని ఎత్తుతాను. నేను పాపిగా వున్నాను. మరియు నేను క్రైస్తవునిగా ఉన్నాను, కాని వెనుకకు జారినాను, మరియు దేవుడు నాయందు దయ చూపగోరుచున్నాను.”

71

ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా ఉన్నారా, క్రైస్తవులైన వారు ఒక పురుషుడు లేక ఒక దేవుని వ్యక్తి అయినవాడు, కాని మార్గములో నీవు ఆలస్యమయినావు; దేవుడు నీకు చెప్పినట్లుగా నీవు చేయలేదు; నీవు తలక్రిందలగుచున్నావు; నీవు వినకూడని సంగతులు వింటున్నావు; నీవు చేయకూడని సంగతులు చేసియున్నావు, మరియు దేవుడు నిన్ను క్షమించాలని కోరుచున్నావు. మరియు ఈ రాత్రి నుండి నీవు ఒక నూతన ప్రారంభమును కోరుచున్నావు. నీవు ఇప్పుడే దేవుని కొరకు నీ నిర్ణయం తీసుకొని, “నేను దానిని చేస్తాను,” అని చెప్పెదవా? నీవు నీ చేతిని పైకి ఎత్తగలవా? దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించునుగాక, నిన్ను, నిన్ను, నిన్ను, నిన్ను. ఓ, అది దివ్యముగా వున్నది, అంతా సరియే. ఇంకా ఎవరయినా ఉంటే మీ చేతులు ఎత్తండి? మీ చేతులు ఎత్తాలి అని నేను కోరుచున్నాను. దేవుని కొరకు, అది నీ నిర్ణయం అయియున్నది. దేవుడు మీ చేతులను చూస్తాడు. మీరు చెప్పవచ్చు, “అది ఏమి మంచి చేయును?” ఓ, దేవుని వైపు, ఒక్కసారి మీ కుడిచేతిని ఎత్తండి, మరియు అది ఏమి చేసినదో కనుగొనండి.

న్యాయస్థానములలో, మీ కుడిచేతిని ఎత్తి, ఒక అబద్దమును ప్రమాణము చేయండి, మరియు మీకు ఏమి జరుగునో చూడండి, దాని ద్వారా నీవు పట్టబడతావు. దేవుని వైపు నీ చేయి ఎత్తి మరియు ఒక ప్రమాణము చేయుము, మరియు దాని ద్వారా పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకొనునో లేదో గమనించుము. నీ దేవుడు నీ హృదయ ద్వారము వద్ద వున్నప్పుడే, నీవు నీ నిర్ణయమును తీసుకొనుము. మీరు కాదేషు-బర్నేయా వద్ద వున్నారు. దేవుడు నీకు వాగ్దానము చేసిన ప్రతీ ఆశీర్వాదము ఇక్కడే వున్నది. పాత-కాలపు ఉజ్జీవము అక్కడే పడియున్నది. అక్కడే సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, సహనము ఉన్నవి, మీ ఎదుటనే ఉన్నవి, మరియు మీరు వాటిని స్వాధీనపరచుకొనలేదు. అవి మీవి; దేవుడు వాటిని మీ కొరకు వాగ్దానము చేసాడు. అవి మీకు కావాలా?

72

విడిపోవుటకు సిద్ధముగా ఉన్న కుటుంబము ఏదైనా ఇక్కడ వున్నదా? మీరు వాదించుకొని మరియు ఒకరితో ఒకరు గడబిడగా వున్నారా, మరియు మీరు దానిని చేయరాదు అని మీకు తెలుసా, మీరు మీ భార్యయెడల, లేక భర్తయెడల ప్రవర్తించిన విధానముకై, మీరు సిగ్గుపడి, దానిని అధిగమించే కృప మీకు ఇవ్వాలని, ఈ రాత్రి ఆయన కృపతో మీరు దేవుడిని కోరుకొని, మీ చేతులను ఆమె లేక అతడి చుట్టూ వుంచి, మరియు “ప్రియమైనదానా, దేవుని యొక్క కృపనుబట్టి, ఈ రాత్రి నుండి, నేను దేవుని కొరకు జీవిస్తాను, అని మనము నిర్ణయించుకొందాము.” మీ చేయి పైకి ఎత్తండి. ఒక కుటుంబము ఏదైనా వున్నదా? ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మీ తలలు వంచియుండగా, కొంచెం మీ చేతులు ఎత్తండి.

[టేపులో ఖాళీ.] అలాగు ఎవ్వరూ లేనందున నేను వందనములు చెల్లించుచున్నాను, కాని అలా వుండినయెడల, ఆ కార్యములన్నిటిని ఎలా సంరక్షించాలో దేవుడు ఎరిగియున్నాడు.

73

ఎంతో కాలమునుండి, అనారోగ్యముగా వున్న వ్యక్తి, ఎవరయినా ఈ రాత్రి ఇక్కడ వున్నారా? మరియు వుంటే, దాని గూర్చి మీరు ప్రార్ధించబడగోరి, కాని దానిని అధిగమించేటంత విశ్వాసము కలిగిలేకవున్నారు. కాని ఇప్పుడే, మీరు మీ నిర్ణయమును తీసుకొనగోరుచున్నట్లయితే, “ప్రభువైన దేవా, ఈ ఘడియ నుండే, నేను నిన్ను సేవింపగోరుచున్నాను. మరియు ఆయన పొందిన దెబ్బలచేత నేను స్వస్థత పొందాను అని దేవుని యొక్క కృపను సాక్ష్యమిస్తూ, నేను ఇక్కడ నుండి వెలుపలికి వెళతాను. ఈ రాత్రి నుండి, దానిని నేను విశ్వసించబోవుచున్నాను.” అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక, మరియు నిన్ను కూడా. అద్భుతము. అది నిజము. కొద్ది నిమిషములలో నేను మీ కొరకు ప్రార్ధించెదను. దానిని మీకు దయ చేయులాగున దేవుడిని నేను వేడుకొనెదను.

74

ఈ రాత్రి, నేను ఆశ్చర్యపడెదను, క్రైస్తవుడు కాని ఎవరైనా ఒక వ్యక్తి, బలిపీఠము యొద్దకు నడిచి మరియు మోకరించాలనుకొంటున్నారా? బలిపీఠము సిద్దముగా వున్నది. వెనుకకు జారిన వారికి లేక అటు ఇటు తిరుగులాడే వ్యక్తికి, బహుశా అది ఎవరయినప్పటికీ, బలిపీఠము సిద్దముగా ఉన్నది. మీకు స్వాగతము. మీరు కాదేషు వద్ద ఉన్నారు. తీర్పు ప్రారంభమైనది. చాచిన చేతితో దేవుడు సిద్ధంగా నిలుచున్నాడు.

75

ఆ అనారోగ్యముగా ఉన్న వ్యక్తి తన కాళ్ళపై నిలబడి, ఇప్పుడు, క్రీస్తు తనను స్వస్థపరచువాడు అని అంగీకరించి, బహిరంగ ఒప్పుకోలును చేయాలను కొనుచున్నారు. “ఈ రాత్రి నుండి, నేను దేవుడిని విశ్వసిస్తున్నాను,” అని చెప్పి మరియు వారి కొరకు ప్రార్ధించండి. మీరు కోరినట్లయితే మీరు లేచి నిలబడమని స్వాగతిస్తున్నాము. అది సరియే. మీ ముగ్గురు నిలబడియున్నారు. మీరు కోరినట్లయితే నిలుచునియుండండి.

76

ఇప్పుడు, పరలోకపు తండ్రి, వారు తమ పాదములపై నిలుచునియుండగా, పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడు. మరియు నీకు నేను ప్రార్ధిస్తున్నాను. పరలోకపు తండ్రీ, ఈ వ్యక్తికి నీ కనికరములు అనుగ్రహించబడును, ఈ ఇరువురికి, మరియు ఈ స్త్రీకి, మరియు నిలబడియున్న మరొక వ్యక్తికి. ఓ, నిత్యుడగు దేవా, ప్రభువైన యేసుక్రీస్తు పొందిన దెబ్బలచేత, వీరు స్వస్థపడ్డారు. దేవా, నీవు దానిని దయచేసావు. ప్రజలకు నీవు దీనిని వాస్తవముగా చేసావు. మరియు నేను ప్రార్ధిస్తున్నాను...

ప్రభువా, “నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు,” అని మీరు చెప్పారు. మరియు ఇప్పుడు పరిశుద్ధాత్మ వారితో మాట్లాడినది, మరియు వేరే ఏమీ చేయలేము. ఈ రాత్రి వారిని స్వస్థపరచువాడిగా నిన్ను అంగీకరించితిరి అనే నిర్ణయమును వారు తీసుకున్నారు. మరియు బాగుపడి మరియు మంచిగా అవుదుము అని విశ్వసించువారు ఈ గుడారములో నుండి బయటకు వెళ్ళుచున్నారు. ప్రభువా, అది విఫలమవ్వదు. ఇక మరి ఎంత మాత్రము దేవుడు విఫలమవ్వడు. ఏ వ్యక్తి అయినా తన మాట కన్నా విలువైనవాడు కాడు అని మనము గ్రహించుదుము. మరియు ఈ రాత్రి, వారు నమ్మి మరియు వారు అంగీకరించారు. వారి కొరకు నేను ఈ విశ్వాస సహితమైన ప్రార్ధన చేస్తుండగా, ప్రభువా, వారు దానిని పొందుదురు గాక. క్రీస్తు నామములో. ఆమేన్. మీరు కూర్చొనవచ్చు. దేవుడు మిమ్మును దీవించును గాక. మీ హృదయమంతటితో విశ్వసించుము, మీ ఇబ్బందులు తొలగిపోయినవి.

77

ఎంతమంది ఆయనను ప్రేమిస్తూ మరియు ఆయనతో సీయోనుకు నడవగోరుచున్నారు? మీ చేతులు పైకి ఎత్తి చూపించండి. అది అద్భుతము. మీరు ఏ సంఘమునకు చెందినవారయినా ఫరవాలేదు. మంచిది. “యేసు నామమును మీతో కొనిపొమ్ము,” అని మనము పాట పాడుచుండగా మనము లేచి నిలబడుదాము. అంతా సరియే, సహోదరి, మా కొరకు నీవు ఇచ్చెదవా ....

యేసు నామము ...

ఇప్పుడు, తిరిగి మీ దగ్గర వున్నవారితో కరచాలనము చేయండి. మీ చుట్టూ ఉన్నవారిని సమీపించి కరచాలనము చేయండి.

................. శ్రమ నుండి;

అది సంతోషమును మరియు ఆదరణను నీకు ఇచ్చును,

నీవు ఎక్కడకు వెళ్ళినా దానిని తీసికొనిపొమ్ము.

ఓ ప్రశస్త నామము, (ప్రశస్త నామము), ఓ ఎంత మధురము!

భూమి యొక్క నిరీక్షణ మరియు పరలోకపు సంతోషము;

ప్రశస్త నామము, (ప్రశస్త నామము), ఓ ఎంత మధురము!

భూమి యొక్క నిరీక్షణ మరియు పరలోకపు సంతోషము.

ఆయనను ప్రేమించు మీరందరూ, మహోన్నతముగా, మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణ బలముతో, మీ చేతిని ఇలా ఎత్తండి, మరియు “ప్రభువుకు స్తోత్రము” అని చెప్పండి.

అది మంచిది. అది సరియే, ఇప్పుడు:

యేసుక్రీస్తు నామము యొద్ద వంగెదము,

ఆయన పాదముల యొద్ద సాగిలపడి లోబడదాము,

మన ప్రయాణము ముగిసినప్పుడు

పరలోక రాజులకు రాజు

మనము ఆయనకు కిరీటము దరింపచేయుదుము.

ప్రశస్త నామము, ఓ ఎంత మధురము!

భూమి యొక్క నిరీక్షణ మరియు పరలోకపు సంతోషం;

ప్రశస్త నామము, ఓ ఎంత మధురము!

భూమి యొక్క నిరీక్షణ మరియు పరలోకపు సంతోషం.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...