నమ్మినవానికి సమస్తమును సాధ్యమే

నమ్మినవానికి సమస్తమును సాధ్యమే

ఎందుకనగా తరచుగా ప్రార్ధనలో ఉండుటను బట్టి, మధ్యాహ్నమందు, మరియు తరువాత నేరుగా ఇక్కడకు వచ్చియున్నాను, ఒకవేళ నేను ప్రసంగించుటకు వెళ్ళినయెడల [టేపులో ఖాళీ.] నా నుండి మరియు ఆ కూడిక ఒక సరియైన సంగతిని కలిగియున్నట్లుగా కనబడలేదు. నేను దర్శనములను అంత స్పష్టముగా చూడలేను, ఎందుకనగా అవి రెండు వేరు వేరు అభిషేకములు. వాటిలో ఒకటి, నీవు లోపలకు తీసుకొనుట; మరొకటి, నీవు బయటకు ఇచ్చుట, చూడండి. వాటిలో ఒకటి, మీరు ప్రసంగంచుచున్నప్పుడు, మీరు అద్భుతముగా మరియు సంతోషముగా అనుభూతి చెందెదరు; మరొకటి, మీరు మరింత బలహీనముగా మరియు బలహీనముగా అయ్యేదరు, మీరు కొనసాగుతున్నప్పుడు, చూడండి. ఒకటి, మీరు దేవుని యొద్దనుండి లాగుకొనుట (చూడండి) మీరు కోరినది మరియు మరొకటి ఆయన వాక్యము ద్వారా దేవుడే మీకు ఇచ్చునది, చూడండి. వాటిలో ఒకటి ఒక దర్శనము, మరియు మరొకటి వాక్యమును ప్రసంగించుట.

2

ఇప్పుడు, ఒక చిన్న అంశము కొరకు బహుశా దేవుడే ఒక అంశమును ఇచ్చును గాక. అది పరిశుద్ధ మార్కులో ఉన్నది. దానిని పరిశుద్ధ మార్కులోని 9వ అధ్యాయము నుండి తీసుకొనెదము మరియు చదివెదము, మంచిది, అది సరిపోవుటకు, ఒక వచనము అని, మనము చెప్పెదము. 23వ వచనము తీసుకొనెదము.

అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.

అదియే మన పాట. ఇప్పుడు, అది దానిలోని అనుమానాలన్నిటిని తీసివేయును, అది తీసివేయదా? “మరియు అది నీ చిత్తమైనయెడల...?” “నమ్ముట నీవలననైతే, నమ్మువానికి సమస్తము సాధ్యము,” అని అతనితో చెప్పెను. “అది నీ చిత్తమో, లేక కాదో,” అని కాదు. అది ఆయన చిత్తము, ఒకవేళ నీవు విశ్వాసం కలిగివుంటే. ఏలయనగా ప్రభువైన యేసు ద్వారా అన్ని సంగతులు నీకు ఉచితముగా ఇవ్వబడినవి. [టేపులో ఖాళీ.] పడిపోయెను, ఆయన నీతి మరియు ఆయన బల్యర్పణ ద్వారా క్రీస్తు సంఘమునకు తీసుకొని రాబడెను, మరియు ఇప్పుడు మనము మన సంపూర్ణ విడుదల యొక్క సంచకరువును కలిగియున్నాము.

ఒక వ్యక్తి, కొంత కాలం క్రితం, నాతో మాట్లాడుచున్నాడు. మరియు అతడు చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, నీవు ఎంత పిచ్చిగా దైవీక స్వస్థతను ప్రాయశ్చిత్తములో పెట్టుచున్నావు అనుదానిని నేను చూడలేకున్నాను.”

నేను చెప్పాను, “ప్రతీ విమోచనా ఆశీర్వాదమును పరిహారములో నేను పెట్టెదను. ప్రతీది.”

3

ఇప్పుడు, యేసు రెండుసార్లు రక్తం చిందించలేదు, లేక ఆయన రెండుసార్లు మరణించలేదు, కానీ మీకవసరమైన దైవీక స్వస్థత మరియు ప్రతీ ఆశీర్వాదమును ఒక్క ప్రాయశ్చిత్తములోనే మీకు చేయబడినది. అది నిజమే. వ్యాధితో నీవు వ్యవహరించకుండా పాపముతో నీవు వ్యవహరించలేవు, మరియు నమ్మినవారికి రక్షణ సువార్తను నీవు ప్రసంగించినప్పుడు, వారి ప్రాణం కొరకు, నీవు దైవిక స్వస్థతను జతపరచాలి, ఎందుకనగా వ్యాధి అనేది పాపము యొక్క లక్షణమై యున్నది.

మనకు పాపము లేక మునుపు, మనము ఏ వ్యాధిని కలిగియుండలేదు. పాపం యొక్క ఫలితం కారణంగా వ్యాధి వచ్చును, వ్యాధితో నీవు వ్యవహరించకుండా పాపముతో నీవు వ్యవహరించలేవు. కేవలం నీవు దానిని చేయలేవు.

ఇప్పుడు, ఈ వ్యక్తి చెప్పెను, “సహో బ్రెన్హాం , సువార్త ద్వారా నేను దానిని నీకు రుజువు చేసినయెడల...” చార్లెస్ ఫుల్లర్, ఈ గాయకుడు, పాటలు పాడే కౌబోయ్ ఇప్పుడే మారియున్నాడు; సరైన పెద్ద, మంచి వ్యక్తి. ఖచ్చితంగా ఇప్పుడు అతని పేరును నేను ఆలోచించలేను. ఓ, అతడు... స్టువర్ట్ హేంబ్లేన్. మేము కలిగియున్నాము... ఆ ప్రదేశములో మేమందరము ఫోటోలు తీసుకొని మరియు వారు ఇప్పుడే పట్టణము విడిచిపెట్టిరి. కాబట్టి నేను లోనికి వచ్చాను. అతడు చెప్పెను, “నేను నీ యొక్క చిత్రమును తీయగోరుచున్నాను.”

4

కాబట్టి, దాని తరువాత అతడు ఒక నిర్వాహకున్ని కలిగియుండి మరియు వారిని పంపించారు, ఎవరైతే తెలివైనవారున్నారో, చదువును కలిగియున్నారు. నాకు ఎటువంటి చదువులేదు అని అతడు ఎరిగియున్నాడు, కాబట్టి అతడు రెండు కాళ్ళతో నాపైకి దుమికెదను అని తలంచాడు.

కాబట్టి అతడు చెప్పెను, “నేను నిన్ను అడుగగోరుచున్నాను...” అతడు నిర్వాహకునితో చెప్పెను, చెప్పెను, సహో బ్రెన్హాం యొక్క రెండు భంగిమలు తీసుకోగోరుచున్నాను. నేను నీకు హామీ ఇస్తున్నాను, నేను...“ అతడు ”నేను 45 నిమిషములు సమయం తీసుకొనినప్పుడు, అతడు ఆ సమయమున ఈ రాత్రి పరిచర్య కొరకు ఫఠనము మరియు ప్రార్ధనలో ఉంటాడు అని చెప్పెను.“ అతడు చెప్పెను, ”సహో బాక్స్టర్, నేను నీకు మాట ఇస్తున్నాను, నేను అతడిని అక్కడ కలుసుకుంటాను.“

“అది సరియే.” కాబట్టి అతడు బయటకు వెళ్ళిపోయాడు.

కాబట్టి అప్పుడు... “మంచిది,” చెప్పెను, “నేను ఒక ప్రశ్న నిన్ను అడగగోరుచున్నాను.”

నేను తలంచాను, “ఓ, నీవు పూర్తిగా నింపబడ్డావు అని నేను ఎరిగియున్నాను.”

కాబట్టి అతడు చెప్పెను, “మీరు అన్వయించు... దైవీక స్వస్థతను ప్రాయశ్చిత్తములో పెట్టుచున్నారా?”

నేను చెప్పాను, “అవునయ్యా. నేను పెట్టగలను.”

మరియు అతడు సెమినరీ నుండి ఇప్పుడే వెలుపలకు వచ్చాడు, తెలివి అంతయూ బయటకు పోయింది. మరియు అతడు చెప్పెను, “మంచిది, నీవు అన్వయించుకొనినయెడల... దైవిక స్వస్థతను ప్రాయశ్చిత్తములో పెట్టుట, సహో బ్రెన్హాం, నీవు తప్పు.”

“నేను ఆ విధంగా అనుకోవట్లేదు,” అని నేను తలంచాను.

5

మరియు అతడు చెప్పెను, “మంచిది, దైవీక స్వస్థత అనేది ప్రాయశ్చిత్తములో ఉండినయెడల, ఆ ప్రాయశ్చిత్తములో పాపము జతచేయబడినది కాబట్టి - పరిహరింపబడినది,” చెప్పెను, “మరి ఇక ఏ బాధ మనకు ఉండదు. అది ఉండినయెడల... ప్రాయశ్చిత్తములో దైవిక స్వస్థత ఉన్నత్లయితే, బాధ తీసి వేయబడును, ఏలయనగా పాపము యొక్క అనేక ప్రభావములను ప్రాయశ్చిత్తము చంపివేసినది.”

నేను తలంచాను, “సహోదరుడా నేను, నిన్ను ఒకటి అడుగగోరుచున్నాను. శోధన ఉన్నదా?”

అతడు చెప్పెను, “అవును.”

“అప్పుడు బాధ ఉన్నది.” అది సత్యము. ఖచ్చితంగా, ఖచ్చితంగా. నీ విశ్వాసమే దానిని అధిగమించేది. నిశ్చయముగా. నీ విశ్వాసమే దానిని చేయును, సమాధానమిచ్చును.

కాబట్టి, అతడు చెప్పెను, అతడు చెప్పెను, “మంచిది, నేను గనుక...” [టేపులో ఖాళీ.] యెషయా చెప్పెను [టేపులో ఖాళీ.] “...బైబిల్ ద్వారా అది నీకు ఇవ్వబడింది, దానిని నీవు అంగీకరించెదవా?”

మరియు నేను చెప్పాను, “అవునయ్యా. బైబిల్ ఆ విధముగా చెప్పినది, అప్పుడు అది సత్యము.”

6

అతడు చెప్పెను, “మంచిది, మత్తయి 8లో పరిశుద్ధ గ్రంధము చెప్పెను, 'వారు యేసు వద్దకు తీసుకొని వచ్చినప్పుడు, రోగులను మరియు బాధలలో వున్నవారందరిని, ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను, ”ఆయన మన బలహీనతలను వహించును.'“ మరియు నేను చెప్పాను... అతడు చెప్పెను, ”సహోదరుడా, ఇప్పుడు దానిని నీవు చూశావా? దానిలోని ప్రతీ సంగతి, అది ఖచ్చితంగా అక్కడే నెరవేరినది.“

నేను చెప్పాను, “మంచిది, సహోదరుడా, ప్రాయశ్చిత్తము చేయబడుటకు సంవత్సరం-ఆరు-నెలల మునుపు. అది సిలువపై యేసు చనిపోక మునుపు. ఆ సమయంలో ప్రాయశ్చిత్తము లేదు. తరువాత నీ యొక్క సిద్ధాంతమును బట్టి, అది ఇంతక మునుపు ఉన్నదాని కంటే, ప్రాయశ్చిత్తము అది చేయబడుటకు ముందు ఎక్కువ ప్రభావమును కలిగియున్నది, తరువాత అది ప్రాయశ్చిత్తముగా మారినది.

కాబట్టి తరువాత అతడు గొప్ప పెద్ద మాటలు ఉపయోగించుచూ, నా చదువు తక్కువ అని చూస్తున్నాడు. నేను చెప్పాను, “అర్ధము చెప్పే వరమును ఇంకా నేను కలిగిలేను.” నేను చెప్పాను, “నాతో ఆ పాత భాషను నీవు తేటగా మాట్లాడుము మరియు మనము దానిని గూర్చి మాట్లాడదాము.”

మరియు అతడు చెప్పుచూనే ఉన్నాడు. మరియు అతడు చెప్పెను, “ఓ, అది ప్రాయశ్చిత్తములో ఉన్నదా,” మొదలగునది.

నేను చెప్పాను, “సహోదరుడా, నేను నిన్ను ఒకటి అడగగోరుచున్నాను. దైవిక స్వస్థత వాక్యములో ఉన్నది అని నీవు నమ్ముతావా.”

7

అతడిని నేరుగా నేను ఇక్కడకు తీసుకురాగోరుచున్నాను, మరియు మార్కు సువార్తలో 11:24. యేసు చెప్పెను, “ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును,” అది ఏమి అయినను ఫరవాలేదు.

నేను చెప్పాను, “యేసు దానిని వాక్యములో ఉంచాడా... దైవిక స్వస్థత వాక్యములో వున్నదా?”

అతడు చెప్పెను, “అవును, 'మీరు అడుగుచున్న వాటినెల్లను' అని ఆయన పేర్కొన్నాడు.”

నేను చెప్పాను, “అది సత్యము.” నేను చెప్పాను, “అది ఆయన వాక్యములో పెట్టినయెడల, ఆ వాక్యము ప్రాయశ్చిత్తమునకు ముందు అయివున్నది.”

“ఓ,” అతడు చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, హాస్యాస్పదము.” చెప్పాను, “లేదయ్యా.” చెప్పెను, “అది భక్తిహీనత.”

నేను చెప్పాను, “ఓ, లేదు. అది భక్తిహీనత కాదు.” నేను చెప్పాను, “ఆయన తన వాక్యమును నిలబెట్టుకొనవలెను.”

మరియు నేను చెప్పాను, “మంచిది, నేను నీకు ఒక్కటి చెప్పెదను: ఒకానొక సమయంలో ఒక రాజు వుండెను, అతడు ఒక గొప్ప రాజ్యమును కలిగియున్నాడు, మరియు అధికారమంతయు ఆయనదే. ఆయన నియమాలు మరియు నిబంధనలు, శిక్షలు మరియు అటువంటివి చేశాడు, మరియు ఆయన చేసినప్పుడు, అతడు ఆ నేరము చేసినప్పుడు ఫలానా పాపమును కలిగియున్నాడు, దానికి శిక్ష మరణమైయున్నది.

8

“మరియు ఈ పాపము చేసిన ప్రతీ వ్యక్తి దీని నిమిత్తము మరణించవలెను. మరియు ఒక దినమున ఒక బానిస ఈ నేరము చేసాడు. అతడు మరణించవలెను. అతడు రాజు ముందుకు తీసుకొని రాబడ్డాడు. మరియు రాజు చెప్పెను, నేను మర్యాదస్తుడను. నీవు నేరము చేసావు, నా రాజ్యములోని నా నియమాల ప్రకారము నేను నా మాట నిలబెట్టుకొందును. మరియు నీతిమంతుడుగా నేను నా మాటను నెరవేర్చెదను. నా మాట ప్రకారము ఇక్కడ ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము అక్కడ లేదు. నీవు మరణించవలెను. మరియు నేను చేయగల ఒకే ఒక కార్యము నీ ప్రాణము తీయుటయే.”

మరియు ఆ బీదవాడు చెప్పెను... వణుకుట ప్రారంభించాడు.

మరియు అతడు చెప్పెను, 'ఇప్పుడు, ఒక నిమిషము ఆగుము.' చెప్పెను, 'సరిగ్గా నిలబడుము.' చెప్పెను, 'నీ ప్రాణము తీసివేయక మునుపు నేను నీకు ఏమి చేయగలను?'

“అతడు చెప్పెను, మరణశిక్షకు పాత్రుడైన ఆ బానిస చెప్పెను, 'నాకు ఒక గ్లాసు నీరు కావలెను.' మరియు ఆ రాజు చెప్పెను, 'అతడికి ఒక గ్లాసు నీరు ఇవ్వుము.' మరియు అతడు అది తీసుకొనినప్పుడు ఆ బీదవాడు తన తల తీసివేయుంచుకొనుటకు అతడు సిద్ధపడుచున్నాడు, అతడు వణుకుచున్నాడు, అతడు దానిని పట్టుకోలేకున్నాడు. మరియు రాజు చెప్పెను, 'ఒక్క నిమిషము ఆగుము. సరిగ్గా నిలబడు. నీవు ఆ నీరు త్రాగేంత వరకు నీ ప్రాణము నేను తీయబోవుట లేదు.' మరియు అతడు దానిని నేలను పడవేసెను. ఇప్పుడు అతడు ఏమి చేయబోవుచున్నాడు? ఇప్పుడు, అతడు మర్యాదస్తుడు. ఆయన తన మాటను నెరవేర్చవలెను. మరియు అతని ప్రాయశ్చిత్తము చెప్పెను అక్కడ అది ఉన్నది... లేక, నా ఉద్దేశ్యము, అతని మాట చెప్పెను ఏ శిక్షా లేదు... లేక, ఈ పాపమునకు ఏ విమోచన లేదు, మరియు అయినను అతడు నీరు త్రాగేంత వరకు అతనిని చంపను అని రాజు చెప్పెను. అది అసాధ్యము; అతడు దానిని నేలను పడవేసెను.” అది ఏమిటి అని నేను...

అతడు చెప్పెను, “అది రాజుపై ఒక తప్పుగా ఉన్నది.”

నేను చెప్పాను, “అది నిజము. మరియు దేవుడు తప్పు చేసాడు అని నీవు అనుకొందువా, దానిని తన వాక్యములో పెట్టినప్పుడు దానిని ప్రాయశ్చిత్తములో చేర్చడా? ”నేను చెప్పాను, “ఓ, సహోదరుడా, అది ఆకలితో చచ్చు వరకు ఎండబెట్టిన కోడి మాంసముతో చేసిన పులుసు వలె ఉన్నది.” నేను చెప్పాను, “అది ఎన్నడూ, పనిచేయదు. లేదు, అయ్యా. దేవుడు దానిని తన వాక్యములో పెట్టాడు, మరియు అది ఎవరయితే నమ్ముతారో వారికి మాత్రమే; కేవలం విశ్వసించినవారికి.”

9

“నమ్మినవారికి సమస్తము సాధ్యము.” మనకు తగినంత విశ్వాసము లేకపోయినా... మరియు దీనిని మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను, ఆదియందు, నీ కొరకు ప్రార్ధించుచున్న ఆ వ్యక్తికి ఆ స్వస్థత చాలా ఎక్కువైనది; అది నిజము, అవి అన్నీ కాదు. అది నీ విశ్వాసము కూడా. నీవు విశ్వాసము కలిగియుండవలెను. మనము మాట్లాడబోవుచున్న ఈ చిన్న మాటల్లో గమనించండి. “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.”

ఇప్పుడు, విశ్వాసము హృదయములో కలిగియుండుటకు, మరియు దానిని మనస్సులో కలిగియుండుటకు చాలా వ్యత్యాసమున్నది. అంతయూ కలిపి, శిరస్సులో ఉన్నదాని కన్ననూ, హృదయమనేది ఒక విభిన్నమైన మానసిక బోధకుడైయున్నాడు.

10

కేవలము రెండు సంవత్సరాల క్రితము వరకూ విజ్ఞాన శాస్త్రము కూడా దానిని ఎరుగదు. అది మీకు తెలుసా? బైబిలు చెప్పెను, “ఒక వ్యక్తి తన హృదయములో ఆలోచించుకొనును.”

విజ్ఞాన శాస్త్రము చెప్పెను, “అది ఎంత తప్పు.” చెప్పెను, “మీ హృదయమునకు అంతరంగిక బోధకులు లేరు. అది నీ శిరస్సులో ఉన్నది - నీ మెదడు (మనస్సు). నీవు నీ హృదయముతో ఆలోచించలేవు. నీవు నీ మనస్సుతోనే ఆలోచించాలి.

రెండు సంవత్సరముల క్రితము, అటువంటిది పేపరులో ఒక పెద్ద ముక్క ముద్రించినప్పుడు నేను చికాగో వీధులలో నిలబడియున్నాను (మరియు నేను ఒక పేపరు కొన్నాను), అది విజ్ఞాన శాస్త్రము మానవ హృదయములో కనుగొన్నది, (జంతువులో కాదు) మానవ హృదయములో ఒక చిన్న గది లాంటిది ఉన్నది, అక్కడ కనీసము ఒక రక్తకణము కూడా లేదు. మరియు వారు చెప్పారు, అదే ప్రాణము ఉండే స్థలము. ప్రాణము హృదయములో నివసించును.

ఓ, మై. చూడండి, దేవుడు ఎల్లప్పుడూ సత్యవంతుడు. చివరకు వారు దాని దగ్గరకు వచ్చారు, మీకు తెలుసు. చివరకు అప్పుడప్పుడు దానిని వారు చూచెదరు. కనుక దేవుడు సూర్యుడు తిరుగును (భ్రమించును) అని చెప్పినప్పుడు మరియు సైన్సు అది నిలకడగా ఉన్నది అని చెప్పినది (అదే నాకు పాఠశాలలో బోధించబడినది)...

ఇప్పుడు, కాలిఫోర్నియాలో - పెద్ద నక్షత్రశాలలు (నక్షత్రముల గమనాన్ని వీక్షించుట కొరకు) అక్కడ - ఇప్పుడు వారు చెప్పినది తప్పు అని వారు చెప్పారు. శాస్త్రీయముగా అది తప్పు అని వారు రుజువు చేశారు: సూర్యుడు కూడా పరిభ్రమించును. కనుక, అక్కడే నీవున్నావు.

11

సైన్సు సంగతులను చెప్పి, వెనుకకు తీసుకొనును, సంగతులను చెప్పి మరియు వాటిని వెనుకకు తీసుకొనును, కానీ సహోదరుడా, మీరు చదవగలిగిన ఒక పుస్తకము ఇక్కడ ఉన్నది మరియు అది ఎన్నడూ వెనుకకు తీసుకొనబడదు: దేవుని యొక్క నిత్యమైన మాట. మరియు మీ ప్రాణము దాని పైన విశ్రాంతి తీసుకొనవచ్చును. అది మీరు వివరింపవచ్చును, లేక వివరింపకపోవచ్చును ఫరవాలేదు, ఏ విధముగానైనా నేను దానిని నమ్మెదను. అది నిజము. దేవుడు అలాగు చెప్పెను, మరియు అది స్థిరపరచబడెను.

మీరు విశ్వాసములో అంత సామాన్యముగా ఉండవచ్చును, అప్పుడు దేవుడు నీ కొరకు పనిచేయుటకు వెళ్ళును. అవునయ్యా. ఆయన తన వాక్యమునకు బద్దుడై యున్నాడు. ఆయన చెప్పెను, “నమ్మినవారికి సమస్తము సాధ్యమే.” అన్ని సంగతులు! మీరు ఏ సంగతులైనా కోరుకొనినప్పుడు, వాటిని పొందుకొనియున్నామని నమ్ముడి. మీరు వాటిని పొందుకొనెదరు. ఒకవేళ మీరు వాటిని నమ్మినయెడల, అవి మీకు అనుగ్రహించబడును.“ దేవునికి కావలసినది అదే, మరియు విశ్వాసమే దేవున్ని కదిలించునదై యున్నది.

12

ఇప్పుడు, ఇక్కడ ఇది దుఃఖకరమైనది, మరియు అయినను, ఒక విలక్షణమైన విషయములోనికి మనము చూచి మరియు కొద్ది క్షణములు కొంత పరిశీలన ఇవ్వవలసియున్నది.

ఒక వింత విషయము: కేవలము కొద్ది దినములకు ముందు యేసు ఇదే మనుష్యులను పిలిచి మరియు అన్ని రకములైన వ్యాధులను స్వస్థపరచునట్లు, అన్ని రకములైన దురాత్మలను వెళ్ళగొట్టుటకు, మరియు కుష్టువ్యాధిని నయము చేయుటకు, మరియు చనిపోయిన వారిని లేపుటకు శక్తిని వారికి ఇచ్చాడు. మరియు ఆయన వారిని పంపెను, మరియు వారు వెళ్ళి దానిని చేయుచూ, మరియు సంతోషముతో తిరిగి వచ్చిరి.

కానీ యేసు విశ్రాంతి కొరకు కొండ పైకి వెళ్ళినప్పుడు, కొండ పైకి, ఈ శిష్యులు ఇక్కడ లోయలో, నిశ్చయముగా, పూర్తిగా ఒక మూర్ఛవ్యాధి విషయములో ఓడిపోవుటను మనము కనుగొనగలము. వారు ఆ దయ్యపు ఆత్మను నియంత్రించలేకపోయెను.

ఇప్పుడు, ఈ మధ్య కాలములో ఎవరో చెప్పెను, “ఆ శిష్యులు కలిగియున్నట్లుగా, ఒకవేళ నీవు రోగులను స్వస్థపరచు శక్తిని కలిగియుంటే....” ఇప్పుడు, ప్రారంభములో వారు కలిగియున్నట్లుగా నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అని ఈ ప్రజలు నమ్మరు, కానీ కేవలము వారు లేఖనమును ఎరుగరు మరియు పరిశుద్ధాత్మను ఎరుగరు. దేవుని వాగ్దానము అలాగు చెప్పెను; మరియు ఒకవేళ ప్రజలకు తమ శిరస్సులలోనికి ఎక్కువ వేదాంతము చొచ్చుకుని వెళ్ళకపోతే, అప్పుడు వారు కేవలము దేవుడిని నమ్మి మరియు దానిని స్వీకరించెదరు. అంతే.

13

ఒక వ్యక్తి ఒక వాగ్వివాదములో ఉన్నట్లుగా, అతడు ఒక వాదనను కలిగియున్నాడు. అతడు చెప్పెను, “దేవుడు అనువంటిది ఏదియూ లేదు. దేవుడు అను సంగతి ఏమియూ లేదు.” అతడు అలా చెప్పుచూనే ఉన్నాడు. మరియు ఒక చిన్న, సాదాసీదాగా కనబడుచున్న బాలుడు అతడి కళ్ళపై నుండి జుట్టు క్రిందకు వ్రేలాడుతుండగా, మరియు నిండుగా ఉన్న జాకెట్ తో అక్కడ కూర్చొని ఉన్నాడు. అతడు నడుచుకుంటూ వచ్చాడు (ఒక పన్ను ముందుకు ఉన్నది), ఆ అవిశ్వాసి ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతడు చెప్పెను... ఒక ఆపిల్ పండును ఒలవడం ప్రారంభించాడు. ఆయన అడిగాడు, “నీకు ఏమి కావాలి?”

చెప్పెను, “నేను నిన్ను కేవలము ఒక ప్రశ్న అడగగోరుచున్నాను.”

ఆయన చెప్పెను, “మంచిది, అడుగుము.”

“మంచిది, ఒక్క క్షణం ఆగుము.” అలా ఆపిల్ పండును ఒలుచుకుంటూ, దాని మధ్య-భాగమును తీసివేశాడు.

ఆయన చెప్పెను, “మంచిది, ఆ రసము, త్వరగా మరియు నీవు ఏమి అడగబోతున్నావో చెప్పు లేక నేను నిన్ను బయటకు విసిరివేసెదను.”

14

“మంచిది, ఒక్క క్షణం.” అతడు యాపిల్ ను ఒలిచి, ఒక ముక్క తీసుకొని, తన నోటిలో పెట్టుకొని, దానిని నమలడం ప్రారంభించి మరియు దానిని మ్రింగివేశాడు. చెప్పెను, “నేను నిన్ను ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను. ఈ యాపిల్ పండు తీయగా ఉన్నదా లేక వగరుగా ఉన్నదా?”

ఆ అవిశ్వాసి చెప్పెను, “నేను దానిని తినుట లేదు. నాకు తెలియదు.”

“అదే నేను అనుకొనియున్నాను” అని చెప్పి తిన్నగా వెనుకకు నడుచుకుని వెళ్ళి మరియు కూర్చొన్నాడు.

నీవు దానిని పొందుకునేంతవరకూ అసలు పరిశుద్ధాత్మ ఉన్నదో లేదో నీకు ఏలాగు తెలియును? నీవు దానిని పొందుకునేంత వరకూ, యేసు స్వస్థపరచునో లేదో నీకు ఏలాగు తెలియును? చెప్పెను, “పరిశుద్ధాత్మ ద్వారా తప్ప, యేసే క్రీస్తని ఎవ్వరూ ఒప్పుకొనలేరు.” నీవు పరిశుద్ధ గ్రంధము నుండి దానిని ఎంతగా చదివినా ఫరవాలేదు, అది పనిచేయదు. పరిశుద్ధాత్మ నీకు సాక్ష్యమివ్వవలసియున్నది — నీ జీవితములో ఆయన పునరుత్థానము — లేక అది తీపిగానా లేక వగరుగా ఉన్నదని నీకు తెలియదు. అది నిజము.

ఆ కవి చెప్పినట్లుగా, “ప్రభువు ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి.” దానిని రుచి చూడక ముందు ఎవరు ఎరిగియుండెదరు? రుచి చూసినవాడే దానిని ఎరుగును. పాత సామెత చెప్పుచున్నట్లుగా, “ఫలహారము యొక్క రుజువు ఏమిటంటే నీవు తిన్నది అయియున్నది.” కనుక అది మంచిది.

కాబట్టి, ఈ విషయములో ఈ అవిశ్వాసి ఓడించబడ్డాడు.

15

ఇప్పుడు, ఈ శిష్యులు వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఓడిపోయారు. యేసు కొండపైకి వెళ్ళెను. మరియు ఏమిటో మీకు తెలుసా? మరియు అక్కడే వారు ఓడించబడినందుకు నేను ఒక రకముగా సంతోషిస్తున్నాను, ఎందుకనగా అది కేవలము ప్రతీ సంగతిని నాకు తేటపరచినది.

చాలాసార్లు ఇలా చెప్పుటను మనము చూస్తాము, “ఓ, ఇక్కడ, జోనాసెస్ ప్రార్ధించబడటం నేను చూచాను; ఇతడు ప్రార్ధించబడటం నేను చూచాను, అది ఎన్నడూ వారికి సహాయము చేయలేదు.” ఖచ్చితము. అతడిని స్వస్థపరచగల శక్తి ఉన్న శిష్యుల ద్వారా ఆ బిడ్డ ప్రార్ధించబడెను. యేసుక్రీస్తు [అస్పష్టమైన పదములు] దానిని చేయుటకు వారికి శక్తిని ఇచ్చాడు, మరియు వారు ఓడిపోయారు. నిశ్చయముగా. దానితో చేయగలిగినది ఏమియూ లేదు.

యేసు కొండపై ఉన్నాడు, మరియు ఇక్కడ, ఎప్పుడు... నాటకములో నుండి మొదటి ఓటమి బయటకు వచ్చినది, ఆ దృశ్యము. ఇక్కడ లోయలో ఉన్న పాష్టర్లు అందరూ వచ్చి వారిని ప్రశ్నిస్తున్నారు. “ఊహ్. దానిని చేయుటకు ఆయన మీకు శక్తిని ఇచ్చియున్నాడు అని నేను తలంచాను. దానిని మీరు చేయుట చూడనివ్వండి. ఇప్పుడు, అది అక్కడ ఉన్నది.”

16

మరియు శిష్యులు ప్రార్ధిస్తూ మరియు దెయ్యమును వెళ్ళగొట్టుచున్నారు, లేక ప్రయత్నించుచున్నారు. ఆ బిడ్డ తిరిగి మూర్ఛలోనికి వెళ్ళుచున్నాడు.

చెప్పెను, “నేను నీకు చెప్పాను,” చెప్పెను, “దాని యొక్క సంగతి, అది ఒక రకమైన తంత్రము. అద్భుతములు చేయు దినములు గతించినవి.”

మరియు బహుశా, ఆ వ్యక్తి, బిడ్డ యొక్క తండ్రి, ఇక్కడ నిలబడియున్నాడు, బహుశా వెళ్ళి మరియు తన పాష్టరును తీసుకొని వచ్చి ఉండవచ్చు. “పాష్టరు గారు, దెయ్యములను వెళ్ళగొట్టెదమని చెప్పుకొనుచూ అక్కడకు ఇక్కడకు తిరుగుచున్న ఈ నజరేయుడైన యేసు అనువాని యొక్క శిష్యులను గూర్చి మీరేమనుకొనుచున్నారు,” అని చెప్పెను.

“అవును, అది ఒక టెలీపతి, (మనస్సును చదువుట). దాని వలన ఏమి జరగదు.” అయినప్పటికీ, పరిసయ్యుడైన జోన్స్ వాటన్నటిని గూర్చి ఎరిగియున్నాడు, మీకు తెలుసు.

“నేను మీకు చెప్పుచున్నాను, కొద్ది దినములలో మేము ఒక అసోసియేషన్ మీటింగును కలిగియున్నాము, మరియు ఒకవేళ నీ బిడ్డను నీవు తీసుకొని వచ్చినట్లయితే... శిష్యులు ఇక్కడే చుట్టూ తిరుగుతున్నారని నేను విన్నాను. కనుక మనము అతడిని తీసుకొని వెళ్ళి మరియు దానిని చేయమని వారికి (శిష్యులకు) సవాలు విసురుదాం. అవునయ్యా.”

ఇప్పుడు, అది కేవలము దెయ్యము, అతడు పనిచేయు విధానము అదే. “నా ముందు ఏదో ఒకటి చేయి మరియు నన్ను దానిని చూడనివ్వు.”

17

ఈ మధ్య కాలములో రేడియోలో ఒక వ్యక్తి నాకు సవాలు చేసియున్నాడు, మొదటిగా వారు స్వస్థపడియున్నారని రుజువు చేయబడితే ఎవరికైనా అతడు వేయిడాలర్లు ఇస్తాను అనెను — దైవిక స్వస్థత. నాతో పాటు ఇద్దరు డాక్టర్లను, మరియు నలుగురు వ్యక్తులను తీసుకొని వెళ్ళాను. అతడి మెట్ల దగ్గరకు వెళ్ళాను. చెప్పాను, “మంచిది, అది టెక్సాస్లో మేము దానిని కలిగియున్నాము.” అతడు చెప్పెను, “మేమేమి చేయగోరుచున్నామనగా ఒక కత్తి తీసుకొని మరియు ఒక చిన్నపిల్లవాని యొక్క చేతిని కోసెదము, మరియు సహోదరులైన మా ముందు దానిని పట్టియుంచుము, మరియు నీవు దానిని స్వస్థపరచుట మేము చూచెదము, మరియు అప్పుడు మేము నిన్ను నమ్మెదము.”

నేను చెప్పాను, “నీకు శిరస్సులో స్వస్థత అవసరమైయున్నది.” మరియు నేను చెప్పాను, “నీతో ఏదో తప్పు ఉన్నది. నీవు మానసిక స్థితి సరిగ్గా ఉన్న వ్యక్తివి కావు.” ఖచ్చితముగా. ఏ వ్యక్తి అయినా ఒక చిన్న పిల్లవాని యొక్క చేయి కోసి, దానిని అక్కడ పట్టియుంచి, తరువాత వారి ముందు దానిని స్వస్థపరచమని కోరడం. ఎందుకు, ఖచ్చితముగా, సరైన స్థితిలో ఉన్నవారు ఎవరైనా..... అది కనీసము జ్ఞానయుక్తమైన సమాధానమునకు పైగానున్నది. అది నిజము. ఖచ్చితముగా అదే.

“ఇప్పుడు,” నేను చెప్పాను, “ఇక్కడ ఉన్న ఈ స్త్రీ సంగతి ఏమిటి? మరియు ఆమె డాక్టరు ఇక్కడ నిలబడియున్నాడు, అతడు చెప్పెను, ఆమెకు కేన్సరు ఉన్నది మరియు ఆమె ఇప్పుడు బాగుగానే ఉన్నది. అదే డాక్టరు యొక్క వివరణ. నాకు ఒక మిషనెరీ యాత్రకు వెయ్యిడాలర్లు కావలెను.” అతడు నాకు ఇవ్వడు. లేదు, లేదు. ఖచ్చితముగా ఇవ్వడు.

ఓ, అది సహోదరుడు మూర్ చెప్పినట్లుగా ఉన్నది, “గుడ్లగూబ కళ్ళవలె ఉండి, అనుకరణ అంతా అలాగు ఉండి, మరియు గుడ్లగూబ కాదు.” మరియు ఆ విధముగానే ఆ సంగతులపై అలా వెళ్ళును.

18

ఇప్పుడు, కొంచెము సామాన్యముగా, “నీవు విశ్వాసమును కలిగిలేవు,” అని వచ్చి చెప్పుటకు బదులుగా, ఏదో ఒక రకమైన ఒక సంఘపు సిద్దాంతము వెనుక దాక్కొని ఉండుటకు ప్రయత్నించుట. అంతే. మీరు ఎన్నడూ పరిశుద్ధాత్మను పొందుకొనలేదు అని చెప్పుచూ, నీకు విశ్వాసమునిచ్చుటకు నీలో ఏమియూ లేదు. విశ్వాసమును కలిగియున్నది దేవుడే. మరియు కేవలము నీవు దేవునితో నింపబడినట్లయితే, నీవు విశ్వాసముతో నింపబడ్డావు.

ఒకవేళ నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవున్ని కలిగియుంటావు. ఆయన కేవలము మాటను పలుకును మరియు అది దానికదే సృష్టించుకొనును. ఆయన మాటే సృష్టించు శక్తి అయి యున్నది. ఇక్కడకు ఈ లోకము ఏలాగు వచ్చెను? ఏమీ లేని దానిలో నుండి ఆయన తీసుకొని వచ్చెను. ఆయన కేవలము, “కలుగును గాక,” అని చెప్పెను మరియు అది ఇక్కడ ఉన్నది. ఆయన తన సొంత మాటను నమ్మెను.

19

మరియు ఈ రాత్రి మీరు కూర్చొనియున్న ఈ ధూళి తన వాక్యమును సృష్టించేందుకు అది సర్వశక్తుడగు దేవుని యొక్క సృష్టించే శక్తి. ఆ ధూళి ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమైయున్నది. “ఆమెన్,” చెప్పండి. [అస్పష్టమైన పదములు]. అవునయ్యా.

ఈ రాత్రి మీరు కూర్చొనియున్న అదే ధూళి, అది దేవుని యొక్క వాక్యమై యున్నది. ఆమెన్. అక్కడ నిలబడియున్న ఆ స్తంభము అది ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమైయున్నది. ఈ రాత్రి నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడెను. ఆమెన్.

ఓ, మై, అది దెయ్యము కన్నుపై నల్ల మచ్చను ఇవ్వదా! ఓ, అది ఖచ్చితముగా చేయును. అది సత్యము; అది వాక్యమైయున్నది.

ఇప్పుడు, వారు అక్కడ ఉన్నారు, మరియు అతడు చెప్పెను, “ఇప్పుడు, వారందరూ అక్కడకు వచ్చినప్పుడు, నీ బిడ్డను తీసుకురా, మరియు ఈ శిష్యులు ఎంత శక్తిని కలిగియున్నారో నీవు చూచెదవు.”

మంచిది, వారు వారిని ఉత్సాహపరిచెను, మీకు తెలుసు, మరియు ఇక్కడ వారు చుట్టూ నిలబడియున్నారు, మరియు అసోసియేషన్ వారు వారి చేతులను వెనుకకు పెట్టుకుని చుట్టూ నిలబడియున్నారు, “ఊహ్, హూప్. అక్కడే మీరున్నారు. అతడున్న దాని కన్నా ఆ బిడ్డ ఏమీ బాగాలేడు. కొంచెము కూడా, కొంచెము కూడా.”

20

అలా చుట్టూ వ్రేలాడుచున్న వారిని చూచి నీవు ఏమి చేయుదువు? అవును. అది అక్కడ ఉన్నది. కనుక, శిష్యులందరూ దానిని పారద్రోలుటకు ప్రయత్నించుచున్నారు. ఓ, వారిప్పుడు శక్తిని కలిగియున్నారు. వారు దానిని కలిగియున్నారని యేసు చెప్పెను. దానిని చేయగల శక్తిని వ్యక్తిగతముగా క్రీస్తు వారికి ఇచ్చెను, మరియు దానిని ఇంతకు ముందు వారు చేశారు, కానీ చెప్పారు, “ఇప్పుడు దానిని నీవు చేయడం నన్ను చూడనివ్వు. నీవు దానిని చేయడం నన్ను చూడనివ్వండి.”

ఇప్పుడు, దీనిని మీ మనస్సులలో ఎప్పటికీ ఉండునట్లుగా స్థిరపరచెదను. ఎవరైనా దానిని చెప్పడం నీవు విన్నట్లైతే, ఆ వ్యక్తి ద్వారా దేయ్యము మాట్లాడుచున్నదని తెలుసుకొనండి.

వాక్యము ద్వారా మీకు చూపనివ్వండి. మొదటిసారి దెయ్యము యేసుక్రీస్తును కలుసుకున్నప్పుడు, వాడు ఆయనను సందేహించెను. సందేహము ఎల్లప్పుడూ దయ్యము నుండి వచ్చును. అక్కడ నుండే మొదటి పాపము వచ్చెను. సందేహము తప్ప మరే పాపము లేదు. అవిశ్వాసమే అసలైన ఒకే ఒక్క పాపము.

వ్యభిచారము చేయుట పాపము కాదు; పొగత్రాగుట పాపము కాదు; మద్యము త్రాగుట పాపము కాదు. అవి అవిశ్వాసము యొక్క లక్షణములు. ఆమెన్.

21

మీరు మాట్లాడెదరు... ప్రజలు చెప్పెదరు, “సహోదరుడా బ్రెన్హాం, నీవు చెప్పు... లేచి నిలబడి మరియు ప్రభువైన యేసును నమ్మి మరియు రక్షింపబడమని వారికి చెప్పుము.” దేవుడు చెప్పుచున్నది అదే. దానితో ఉన్న సమస్య ఏదనగా, “లేచి నిలబడి మరియు నీవు నమ్మినట్లుగా చేయుము,” అని నేను చెప్పను, కానీ నిజముగా నమ్ముము. అది పూర్తి సంగతిని స్థిరపరచును. అది నిజము. విశ్వాసము.

గమనించండి. ఏదెను తోటలో అసలైన మొదటి మూల పాపము ఏదనగా హవ్వ దేవుని యొక్క వాక్యమును అవిశ్వసించెను, మరియు సాతాను యేసును కలుసుకొన్నప్పుడు మరియు ఒక [అస్పష్టమైన పదము] హవ్వ యొక్క కుమారుడు, స్త్రీ సంతానము, అతడు హవ్వపై ప్రయోగించిన అదే పద్దతిని అతడు ఉపయోగించాడు.

మొదటి సంగతి ఆకలి, మరియు తరువాత సంగతి వాడు చెప్పెను, “ఒకవేళ నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడ నా ముందు ఒక అద్భుతమును చేయుము. నీవు ఏదో ఒకటి చేయడము నన్ను చూడనివ్వు - ఒక అద్భుతము.”

ఇప్పుడు, ఒక వ్యక్తి దానిని చెప్పుట నీవు వినినప్పుడు, ఆ వ్యక్తి ద్వారా ఎవరు మాట్లాడుతున్నారో నీకు తెలుసు: దెయ్యము. అది నిజము. వాడు చెప్పెను, “ఇప్పుడు నీవు ఒక అద్భుతము చేయడం నన్ను చూడనివ్వు, నా ముందు, కావున నేను దానిని చూచెదను. నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి, మరియు నీవే వాటిని పూర్తిగా తినుట నన్ను చూడనివ్వు, నీవు దేవుని కుమారుడవని నేను నమ్మెదను.”

22

తండ్రి యొక్క వాక్యముతో యేసు వెనుకకు తిరిగెను. ఆయన మరేదో చేసియుండవచ్చును. కానీ బలహీనమైన ఒక విశ్వాసికి దేవుని యొక్క ఆశీర్వాదములు తీసుకొని వచ్చుటకు, నీవు తీసుకొన... నీవు వరములను కలిగియుండనక్కరలేదు. నీవు దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసము కలిగియుండవలెను.

యేసు తన యొక్క ఏ వరములనైననూ, తన యొక్క ఏ శక్తినైననూ ఉపయోగించలేదు. ఆయన తన తండ్రి యొక్క వాక్యమును ఉపయోగించెను. ఆయన వెనుకకు తిరిగి మరియు చెప్పెను, “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాక, దేవుని నోట నుండి వచ్చు ప్రతీ మాట వలనను జీవించును.”

ఆయన ఒక ప్రవచించువాడిగా ఉన్నప్పుడు... మనకు తెలుసు ఆయన దర్శనములను చూచెను. ప్రజలలో ఉన్న తప్పు ఏమిటో ఆయన చెప్పగలిగేవాడు, వారి యొక్క హృదయ రహస్యమేమిటో వారికి చెప్పేవాడు, మరియు అటువంటివి, చెప్పెను, “యుగ సమాప్తి వరకు ఈ సూచనలు వెంబడించును.”

23

ఒక రోజు ఆయన ముఖముపై వారు వస్త్రమును కప్పారు — కొంత మంది సైనికులు — మరియు వారు ఒక కర్రతో ఆయన శిరస్సుపై కొట్టారు, మరియు, ఇప్పుడు, ప్రవచించువాడవైన నీవు...“ అని చెప్పారు. దెయ్యము — అదే ఆయనను కొట్టుచున్నది — చెప్పెను, ”ప్రవచించువాడవైన నీవు, నిన్ను ఎవరు కొట్టారో నీవు మాకు చెప్పుము మరియు మేము నిన్ను నమ్మెదము. నిన్ను ఎవరు కొట్టారో మాకు చెప్పుము; నీ కళ్ళపై ఒక వస్త్రమును కప్పియున్నది.“ యేసు ఎన్నడూ తన నోరు తెరవలేదు, ఒక్క మాట పలుకలేదు.

సిలువ యొద్ద యూదులు... వారు యేసును సిలువపై పెట్టినప్పుడు, చెప్పారు, “ఇప్పుడు, ఒకవేళ నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడ మా ముందు ఒక అద్భుతమును ప్రదర్శించుము. నీ చేతులను విడిపించుకొని మరియు క్రిందకు దిగి రమ్ము, మరియు నీవే క్రీస్తువని, దేవుని కుమారుడవని మేము నమ్మెదము.” యేసు దెయ్యమును వినలేదు. ఒక్క మాట పలుకలేదు, చూడండి.

కనుక, “నీవు ఒక అద్భుతమును చేయుట నన్ను చూడనివ్వు,” అని ఎవరైనా చెప్పుట నీవు చూచినయెడల, గుర్తించుకొనుము, అది దెయ్యము.

తన సొంత దేశమునకు ఆయన వచ్చినప్పుడు, వారు చెప్పారు, “ఇప్పుడు, అక్కడ ఆ దేశములో నీవు స్వస్థపరచుటను మేము ఇక్కడ చూడగలుగుచున్నాము; అక్కడ జరుగుచున్న స్వస్థతను మేము వినియున్నాము. ఇక్కడ మా మధ్య నీవు దానిని చేయుట మమ్ములను చూడనివ్వు; మేము దానిని చూచెదము.”

24

మరియు వారి అవిశ్వాసమును బట్టి యేసు ఆశ్చర్యపడెను, మరియు చాలా ఆశ్చర్యకార్యములు ఆయన చేయలేకపోయెను. నీ విశ్వాసమును కూడా అది తీసుకొనును, ఎందుకు? ఆయనకు శక్తి లేకనా? దేవుని యొక్క చిత్తము లేకనా? విశ్వాసము లేక - అవిశ్వాసము. ఎందుకనగా మీ అవిశ్వాసమును బట్టి, ఆయన దానిని చేయలేకపోయెను.

ఇక్కడ శిష్యులు ఓడిపోవుచున్నప్పుడు, మరియు నేరుగా వారి యొక్క ఓటమి మధ్యలో, భూమిపై నడిచిన వారందరిలో అత్యంత ప్రియమైన వ్యక్తి కొండ దిగి వచ్చుచున్నాడు: దేవుని కుమారుడైన, ప్రభువైన యేసు.

బహుశా, ఇంకనూ బలహీనముగా, అక్కడ ఒక దర్శనములోనికి ఆయన తీసుకొనిపోబడి మరియు ముందుగా చూచు... అటువంటి గొప్ప అభిషేకము క్రింద నుండి, పేతురు, యోహాను, మరియు యాకోబు ప్రభువు యొక్క రాకడను ముందుగా చూచారు; క్రమమును ముందుగా చూచారు, ఏ విధముగా ఏలియా మరియు మోషేలు మొదటిగా వచ్చి, తరువాత యేసు వచ్చును. వారు ఆయనను చూచారు, తరువాత, మొదటి రాకడ; ఏలియా మరియు మోషే; మరియు తరువాత వెనుకకు తిరిగి మరియు యేసును మాత్రమే చూచేను, వెయ్యేండ్ల పాలన తరువాత ఆయన వచ్చినప్పుడు.

25

గమనించండి, దీనిలో, మొదటి సంగతి మీరు తెలుసుకొనండి, ఇక్కడున్న వారిలో కొందరు, పరిసయ్యుడైన జోన్స్ మరియు వారు, చెప్పెదరు, “మంచిది, ఇప్పుడు చూడుము. అక్కడ ఆ మనుష్యుడు వచ్చుచున్నాడు, వారందరిలోకి ఆయనే ముఖ్యుడు. ఇక్కడ ఈ కదలికనంతటినీ ప్రారంభించినది అతడే.” కనుక, వారు అక్కడకు వెళ్ళి మరియు ఆయన ఏమి చెప్పబోవుచున్నాడని చూడగోరుచున్నారు.

కనుక శిష్యులు ప్రభువు రావడం చూచినప్పుడు, ఆయన దానిని చేయునని వారికి తెలుసు. కనుక, వారు ఆయన కొరకు వెళ్ళారు, మరియు ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ వారందరూ చుట్టూ సమకూడినప్పుడు, యేసు ఏమి చెప్పెను? కాలర్లు తిరిగియున్న ఆ గుంపు పరిసయ్యుల దగ్గరకు ఆయన నడుచుకొని వెళ్ళి, చెప్పెను, “దేనిని గూర్చి వారిని ప్రశ్నించుచున్నారు?”

ఓ, దీనమైన మురికి నీటి ప్రసంగీకుడా. ఆ తీర్పులో, ఆయన నిన్ను ఏమి ప్రశ్నించబోవుచున్నాడు? ఆయన ముందు నీవు ఇలాగే నిలబడుదువు.

అడిగాడు, “దేనిని గూర్చి వారిని ప్రశ్నించుచున్నారు? ఈ గందరగోళమంతా దేనికి? నా పిల్లలారా, దీనినేందుకు ప్రశ్నించుచున్నారు?” ఓ, మై, వారిని చుట్టూ ఆయన చూడడం నేను చూడగలుగుచున్నాను.

మరియు ఒక్కరు మాట్లాడారు, చెప్పారు, “అయ్యా.” ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండుట నేను చూస్తున్నాను, అయినను, ఆయన యొద్దకు. చెప్పెను, “అయ్యా, నేను నా బిడ్డను నీ శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చాను.” చెప్పెను, “అతడొక దురాత్మను కలిగియున్నాడు. అతడు మూగవాడు, నోటిలో నురగలు కక్కుకొనుచున్నాడు, అగ్నిలోను మరియు నీళ్ళలోను పడుచుండెను.” మరియు చెప్పెను, “అతడికి నయము చేయుటకు నేను అతడిని నీ శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చాను, మరియు దానిని గూర్చి వారు ఏమియూ చేయలేకపోయిరి.”

26

పరిసయ్యుడైన జోన్స్, పాష్టరును నేను చూడగలుగుచున్నాను.

“అవును, దానిని గూర్చి వారు ఏమియూ చేయలేకపోయిరి, కనుకనే నేను అతడిని నీ యొద్దకు తీసుకొని రాబోవుచున్నాను.” మరియు చెప్పెను, “శిష్యులు దానిని వెళ్ళగొట్టలేకపోయెను, కనుక అతడిని నేను నీ యొద్దకు తీసుకొని వచ్చాను. ఒకవేళ దానిని గూర్చి నీవు ఏమైనా చేయగలిగినయెడల — ఒకవేళ దానిని గూర్చి నీవు ఏమైనా చేయగలిగితే — ఒకవేళ...” మీకు అది అర్ధమైనదా? “ఒకవేళ,” ఓ, మై! “ఒకవేళ నీవు చేయగలిగితే, దానిని గూర్చి ఇప్పుడు ఏదో ఒకటి చేయుము.”

యేసు నిలబడి మరియు చుట్టూ చూసెను. “అతడిని ఇక్కడకు తీసుకొని రండి,” అని చెప్పెను. మరియు వారు ఆ బిడ్డను తీసుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ దెయ్యము చూపించుకొనెను. దెయ్యము ఆ విధముగానే చేయును. వాడు చూపించుకొనుటకు ఇష్టపడును. అవును. వాడు ఆ బిడ్డను ఎన్నడూ కలిగిలేనంత తీవ్రముగా మూర్ఛవ్యాధికి గురిచేసెను. అతడు అక్కడే నేలపై పడిపోయెను, యేసును భయపెట్టుటకు ప్రయత్నించుచుండెను.

అతడు నేలపై పడినప్పుడు, ముందు నురుగలు కక్కుకొనుట ప్రారంభించెను... శిష్యుల ముందు నురుగలు కక్కుకొనుచుండెను, వారు కొంచెము భయపడిరి. కానీ సహోదరుడా, నీవు ఆయనను భయపెట్టబోవుట లేదు. ఆ దెయ్యము ఈ బిడ్డను ఒక నిజమైన ఉద్రేకములోనికి పడగొట్టెను. అతడు నేలపై పడి మరియు [అస్పష్టమైన మాటలు] నేలపై దొర్లుతూ ఒక... ఆ బిడ్డను అతడు కలిగియుండే నీచమైన స్థితికి విసురుచుండెను, ఎందుకనగా అతడి సమయము సమీపించినదని అతడు ఎరిగియుండెను.

యేసు ఆ బిడ్డ వైపు చూచెను. ఆయన ఆ తండ్రికి చెప్పెను, “అతడు ఎంత కాలము నుండి ఇలా బాధింపబడుచున్నాడు?”

27

చెప్పెను, “బాల్యము నుండి. ఓ,” అతడు చెప్పెను, “అతడు అగ్నిలోను మరియు ప్రతీ దానిలోను పడును. మరియు ఆయన ధ్యాసను పొందుకొన్నప్పుడు... ఇప్పుడు, ఇక్కడ నాటకీయముగా చెప్పుకొనెదము.

ఓ, మై. ఇక్కడొక లోయ; అక్కడొక కొండ. అక్కడే ఆ కొండపై దేవుడు దిగి వచ్చెను, ఆయనను కమ్ముకొనెను. “ఈయన నా ప్రియ కుమారుడు. ఆయన మాట వినుడి,” అని చెప్పెను.

మరియు ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు అక్కడ నిలబడియున్నాడు; కొండపై, తండ్రి ఆయనతో పాటు ఉండెను. పావురము గొర్రెపిల్లపై ఉండెను; పావురము ఇంకనూ గొర్రె పిల్లపై ఉండెను, మరియు ఆయన దానిని ఎరిగియుండెను. ఆయన ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నాడు? ఇప్పుడే కొంచెము దానికి ముందే ఆయన చెప్పియున్నాడు: “నిశ్చయముగా, నిశ్చయముగా, నేను మీకు చెప్పుచున్నాను, తండ్రి... తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే అతడు చేయును.” అది నిజమేనా? పరిశుద్ధ యోహాను 5:19. “నేను దర్శనములు చూచెదను; ఏమి చేయవలెనో తండ్రి నాకు చూపించేంత వరకూ నేను ఏమియూ చేయను.” పరిశుద్ధ యోహాను 5:19. “నేను ఏమియూ చేయను.”

28

శిష్యులు ఓడిపోయారు. తండ్రి కొంచెము విరోధముగా నిలబడెను. ఎందుకు? మంచిది, ఇప్పుడు, ఆయన దానిని చేయబోవుట లేదు అని నాకు తెలుసు. ఎందుకనగా ఒకవేళ అతడు దానిని చేయకపోతే... ఒకవేళ ఈ శిష్యులు దానిని చేయలేకపోతే, అప్పుడు ఆయన కూడా దానిని చేయలేడు. పాష్టరు గారు, నేను మీతో విశ్వసించుట ప్రారంభించెదను, అది వీరు కేవలము ఒక నకిలీ గుంపు — ఒక తాయారు చేయబడిన గుంపు, ఒక గుంపు మానసిక లేక టెలీపతి లేక మరేదో దానికి చెందినవారు. అదంతయు అదే.“ దానిని హృదయములో ఆలోచించుట ప్రారంభించెను.

చూడండి అవిశ్వాసము ఏ విధముగా పట్టును తీసుకొనునో? ఓ, అది ఎన్నిసార్లు విఫలమైననూ నేను పట్టించుకొనను, ఆయన ఇంకనూ దేవుడే, స్వస్థపచువాడు. ఒకవేళ ఈ రాత్రి నేను అయిదు వందల మందికి ప్రార్ధించి మరియు ఆ అయిదు వందల మంది అందరూ ఉదయమే మరణిస్తే, ఆయన ఈ రాత్రి ఉన్నట్లుగానే రేపు కూడా అదే స్వస్థపరచువాడై యున్నాడు. దానితో చేయుటకు ఏమియూ లేదు. నాకు తెలుసు, దేవుడు అలా చెప్పెను, మరియు అది స్థిరపరచబడెను, నా వరకూ. ఆయన వాక్యము అలాగు చెప్పెను.

29

ఏలియాను చూడుము, ఒక చిన్న వృద్ధ ప్రవక్తగా అతడు బయటకు వెళ్ళినప్పుడు, పావురము అతని పై ఉండెను. కనుక, ఆహబు యాజకులనందరినీ అక్కడకు పిలిచెను మరియు ఏలియా వారి యొక్క శిరస్సులను ఖండించెను — వారు నాలుగు వందల మంది — ఆ మధ్యాహ్నము. నడిచి వెళ్ళి మరియు వర్వతము పైన కూర్చొనెను, “ఇప్పుడు, వర్షము గూర్చి నేను ప్రార్ధించబోవుచున్నాను,” అని చెప్పెను. మూడు సంవత్సరములు మరియు ఆరు నెలలు [అస్ఫష్టమైన మాట] వర్షము మరియు అతడి యొక్క ముసలి, ఎముకలతో నిండిన మోకాళ్ళ మధ్య తన తలను పెట్టుకొని, మరియు అతడు ప్రార్ధించెను, చెప్పెను, “ఓ దేవా, వర్షమును పంపుము.”

చెప్పెను, “గేహజీ, కొండపైకి ఎక్కిపోయి మరియు సముద్రము పైన ఏ మేఘములనైనా చూచెదవేమో చూడుము.”

గేహజీ పైకి వెళ్ళి చెప్పెను, “ఒక సూచన కూడా లేదు.”

ఓ, మై. అవిశ్వాసము ఎలా దానిని పట్టుకొనునో. “కానీ ఇంకనూ ఆయన దేవుడే.” చెప్పెను, “ఓ ప్రభువా, అబ్రహము, ఇస్సాకు మరియు యాకోబు దేవా, ప్రార్ధనను వినుము [టేపులో ఖాళీ]. గేహజీ, తిరిగి వెళ్ళుము.”

“మంచిది, నేను ఇప్పుడే క్రిందకు దిగి వచ్చియున్నాను.”

“తిరిగి వెళ్ళుము. మళ్ళీ చూడుము.”

“ఇత్తడి వలే కనిపించుచుండెను; వర్షము యొక్క సూచన లేదు.”

“నిలిచియుండుము.” తిరిగి శిరస్సును క్రిందకు వంచుకొనెను. “ఓ ప్రభువా, అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు దేవా, మాకు వర్షమును పంపుము. తిరిగి పైకి వెళ్ళుము.”

“ఎటువంటి తేడా లేదు.”

30

ఏడుసార్లు అతడు వెళ్ళెను. కొంతసేపటి తరువాత గేహజీ క్రిందకు వచ్చి మరియు చెప్పెను, “ఓ, మై. ఒక చిన్న మేఘము అక్కడ వ్రేలాడుటను నేను చూచాను, ఒక మానవుని హస్తము వలె ఉన్నది.”

“నీవు నా కొరకు చేయగలిగినదంతయూ అదే అయితే — నీవు నాకు సహాయము చేయగలిగినది అదే అయినయెడల, మంచిది, నేను దానిని తీసుకొనను,” అని అవిశ్వాసము ఎంత త్వరగా చెప్పియుండవచ్చును. కానీ అది దేవుని యొక్క సూచన అని ఎరిగియుండినదేదో ఏలియా తనలో కలిగియుండెను.

“మంచిది, గతరాత్రి నేను కూడికకు వెళ్ళాను, నాకు తలపోటు వచ్చినది, ఒక వారము లేక రెండు, లేక నెల వ్యాధితో ఉన్నాను. కొంచెము బాగుగా అనుభూతి చెందుచున్నాను, కానీ నేను పూర్తిగా బాగవ్వలేదు. నేను ఒక కుంటి చేతిని కలిగియున్నాను; నా వేళ్ళను నేను కదిలించగలను, కానీ, మై, అది...”

ఓ, సహోదరుడా, అవిశ్వాసము ఎంత త్వరగా పనిచేయుటకు వెళ్ళును, అక్కడే. “ఓ, నేను కొంచెము చూడగలుగుచున్నాను, నేను గ్రుడ్డివాడిని, కానీ నేను కొంచెము చూడగలుగుచున్నాను; కానీ బహుశా ఒకవేళ నేను కష్టపడి ప్రయత్నించినయెడల, నేను దానిని ముందుగానే చేసియుండెడివాడిని.” ఓ, నీవు ... నిన్ను ఏమని పిలువవలెనో నాకు తెలియదు. ఒక క్రైస్తవునిగా, నీవు మినహాయింపు, అది నిజము.

31

ఏలియా దానిని చేయలేదు. ఎప్పుడైతే ఏలియా మొదటిగా ఆ చిన్న సూచనను కలిగియున్నాడో, అతడు వెంటనే లేచి మరియు చెప్పెను, “హల్లెలూయా” — ఎంతగానో. వర్షపు నీటిని పట్టు తొట్టెను తీసుకొని వచ్చాడు, “ప్రతీ దానిని సిద్ధపరచుకొనుము. విస్తారమైన వర్షము యొక్క ధ్వనిని నేను వినుచున్నాను.”

“ఒకవేళ ఆ వ్రేలును నేను అలా ఆడించినయెడల, హల్లెలూయా! నా క్రింద నుండి చేతికర్రలు తీసివేయుము; నేను ఇక్కడకు వచ్చాను! డాక్టరుగారు, నేను మీకు నా బిల్లును చెల్లించెదను; ఇక అవి ఎంతమాత్రమును నాకు అవసరము లేదు. ధన్యవాదములు, డాక్టరు గారు, నీవు చేసిన దానియంతటి కొరకు, కానీ ఇక ఏ మాత్రము మీ సేవలు నాకు అవసరము లేదు. విస్తారమైన వర్షము యొక్క ధ్వనిని నేను వినుచున్నాను! అవునయ్యా. ఆమె ఇప్పుడే ఆ వర్షపు నీటి గొట్టము గుండా క్రిందకు వచ్చుచున్నది, మరియు నేను అక్కడే నిలిచియుండి, మరియు ఆగి మరియు దానిలోని ప్రతీది పొందుకొనెదను.” చూశారా?

ఓ, అతడు సిద్ధముగా ఉన్నాడు. అవిశ్వాసము ఎంత త్వరగా ఒక పట్టును కలిగియుండునో, మరియు బహుశా తండ్రి... ఆ కారణమును బట్టే అతడు చెప్పెను, “ఒకవేళ నీవు చేయగలిగి — ఒకవేళ ఆమె కొరకు నీవు ఏదైనా చేయగలిగినయెడల.” అది సరియే.

ఇప్పుడు, సంభాషించుటకు యేసు అతని యొద్దకు నడుచుకొని వెళ్ళెను, (బావి యొద్ద స్త్రీ దగ్గరకు వెళ్ళినట్లుగా), చెప్పెను, “ఎంత కాలము నుండి ఆ బిడ్డ ఆ విధముగా ఉన్నాడు?”

“ఓ,” అతడు చెప్పెను, “బాల్యము నుండి.” ఒకసారి వారి కళ్ళలోనికి చూస్తూ, ఏదో అతడి పైకి వచ్చెను. అప్పుడు అతడు చెప్పెను, “మా మీద దయ చూపించుము.”

32

అతడు ఒక్కసారి యేసు ముఖము పైకి చూసినప్పుడు, అది మానసికముగా మనస్సులను చదివేది కాదు అని అతడు చెప్పగలడు. మరెవ్వరూ కలిగిలేనటువంటిది ఏదో ఆ వ్యక్తి కలిగియున్నాడు అని అతడు చెప్పగలడు.

మరియు ఏ పురుషుడైనా లేక స్త్రీ అయినా సిలువను సూటిగా చూచువారు... గత దినమున... అక్కడ నా యొక్క విండీషీల్డ్ (కారు లోపల ముందు భాగము) పైన నేనొక చిన్న సిలువను కలిగియున్నాను. “సహోదరుడా బ్రెన్హాం, అది ఒక కేథలిక్ సిలువ వలె కనిపిస్తున్నది,” అని ఎంతమంది చెప్పారో నాకు తెలియదు.

అసలు కేథలిక్కులు సిలువపై హక్కును (లేక ఇష్టమును) ఎప్పుడు పొందుకున్నారు? సిలువ ఎప్పుడు కేథలిక్కు విశ్వాసము యొక్క చిహ్నముగా మారినది? సిలువనేది క్రైస్తవ విశ్వాసము యొక్క చిహ్నము, కేథలిక్కు కాదు. లేదయ్యా.

చెప్పారు, “ఎందుకు దానిని అక్కడ వ్రేలాడదీశావు?” సెల్లర్స్ బర్గ్ నుండి వచ్చుచూ, నాతో ప్రయాణించుచున్న వ్యక్తి. ఒక రకముగా నన్ను చించుతూ (వేదిస్తూ) ఉన్నాడు. ఏ విధముగానైనా దానిని చేయుటకు వారు ఇష్టపడుదురు. ఆయనను వేదించనంత కాలము, వారు నన్ను ఏమన్ననూ నేను పట్టించుకొనను.

33

“దానిని అక్కడ నీవు ఎందుకు వ్రేలాడదీశావు?” అని అడిగాడు.

నేను చెప్పాను, “నీకు తెలుసా ఏమిటో? ఈ దేశమును చూచుటకు నా తలను త్రిప్పు ప్రతీసారి, వేసవికాలము వచ్చినప్పుడు, అక్కడొక దిగంబరియైన స్త్రీ నిలబడియుండును, వీధిలో, లేక ఎక్కడైనా. నేను సిలువైపు చూచెదను. ఆమెన్. నేను దాని వైపే చూచెదను.” అతడు ఇక ఎన్నడూ ఏమి మాట్లాడలేదు.

నేను చెప్పాను, “మరియు ఇప్పుడు, నేను ఎక్కడ విమోచింపబడ్డానో నేను చూచాను. అక్కడ దానిలో నేను ఆయన గాయములను చూచాను, నేను స్వస్థపరచబడ్డాను. ఒకప్పుడు నేను గ్రుడ్డివాడిని, నేను చూచుచున్న ఈ కళ్ళను కలిగిలేను, మరియు ఒకవేళ ఆయన నన్ను స్వస్థపరిచినయెడల, నేను సరైన సంగతులను మాత్రమే చూచెదను అని, నేను ఆయనకు వాగ్దానము చేశాను. మరియు నాకు తెలుసు చూచుటకు సరైన సంగతి అదే. నేను కల్వరి వైపు చూస్తున్నాను. అది నాకు ఒక జ్ఞాపకార్ధమైనది, అది నా ప్రభువు మరణించెను, ఆయన నన్ను స్వస్థపరచెను. మరియు అక్కడే ఆ సిలువపైనే ఆయన నా పాపములను క్షమించెను. అక్కడ ఆ సిలువపైనే ఆయన నా చింతలన్నిటినీ నా నుండి దూరపరచెను. ఆ సిలువపై, ఆయన తన గాయముల ద్వారా నన్ను స్వస్థపరచెను. నేను చెప్పాను, ”నేను దానిని చూస్తాను; నా తల త్రిప్పుకొంటాను, సిలువ వైపు చూస్తాను.“ అది సరియే. దేనిని చూస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉండును. దానితో చేయగలిగినది చాలా ఉన్నది. ఒక్కసారి శిలువను చూడుము. ఎంత వ్యతాసముండునో చూడుము.

34

ఇప్పుడు, ఈ వ్యక్తి ప్రభువైన యేసు ముఖములోనికి చూసినప్పుడు, అతడు అభిషేకించబడ్డాడు. ఆయన అభిషేకించబడిన దేవుడు. ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ నిలబడి, అభిషేకించబడిన వ్యక్తి, మానవునిలో దేవుడు. మరియు ఆయన చేసినప్పుడు, ఆ వ్యక్తిని ఏదో పట్టుకొన్నది. చుట్టూ చూసి, అతడు చెప్పెను, “మా మీద దయ చూపించుము.” ఇప్పుడు, అతడు సరైన స్థలములో నిలబడ్డాడు. దయను కోరుకునే స్థలమునకు వచ్చుచున్నాడు. అతడు కృపా సింహాసనము నొద్దకు వచ్చుచున్నాడు. మరియు నీవు దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకొను ఒకే ఒక మార్గము అదే, అది కృపా సింహాసనము యొద్దకు వచ్చుట — తీర్పు కాదు, మనకు మనముగా కాదు, కానీ దేవుని యొక్క దయలను బట్టి.

ఇప్పుడు, అది స్వస్థత పొందుకొను స్థలములపై ఉన్నది. దానిలో “ఒకవేళ” అనునది లేదు. అతడు ఇప్పుడు దానిని యేసుపై ఉంచాడు. గమనించుము. “అయ్యా,” ఇక లేదు. ఇప్పుడు అతడు కొంచెము వ్యత్యాసమైనది చెప్పుచున్నాడు. యేసు తిరిగి అతడి పై దానిని ఉంచుచున్నాడు. ఆయన చెప్పెను, “ఓ, నీవు నమ్మలేవా? ఇక్కడ ఉన్న, పాష్టర్ రబ్బీ జోన్స్ ను ఓడించగలవా? నీలో ఉన్న ఈ సందేహమునంతటిని తొలగించగలవా? ఇప్పుడు నీవు నమ్మలేవా?”

35

మరియు తండ్రి ముఖము పైకి చూచాడు, చెప్పెను... కన్నీళ్ళు బుగ్గలపై నుండి కారుచున్నవి; ఏదో అతడిని తాకినది. అదే క్షణములో అతడి హృదయములో ఒక మార్పు వచ్చింది, మరియు అతడు చెప్పెను, “ప్రభువా, నేను నమ్ముచున్నాను. నన్ను క్షమించుము,” చాలా పదములు, “నా అవిశ్వాసము కొరకు నన్ను క్షమించుము. ఇప్పటివరకు పరిసయ్యులను నమ్ముటకు నేను ప్రయత్నించాను. శిష్యులు విఫలమైనప్పుడు నేను సందేహించాను. ప్రభువా, నా అవిశ్వాసమును బట్టి నన్ను క్షమించుము.” మరియు కన్నీళ్ళు క్రిందకు కారుచుండగా, దేవుని యొక్క ఆత్మ అతడి హృదయమును తాకినది, మరియు అతడు చెప్పెను, “ప్రభువా, నేను నమ్ముచున్నాను. నా అవిశ్వాసమును బట్టి నన్ను క్షమించుము, లేక, బైబిలు దానిని సూచించుచున్నది, ”నా అవిశ్వాసములో నుండి నాకు సహాయము చేయుము,“ అది ”నా అవిశ్వాసమును క్షమించుము.“

అతడు అక్కడ నిలబడ్డాడు. అది ఏమిటి? ఇప్పుడు గమనించండి. కొద్ది క్షణముల క్రితము అతడు “అయ్యా, ఒకవేళ నీవు...”

కానీ యేసు అతడి ఏకాగ్రతను పట్టుకొన్నప్పుడు, అతడు “అయ్యా,” కాదు. పెద్ద అక్షరములతో వ్రాయబడిన “ప్రభువు.” ఏమి జరిగినది? అతడు కృపా సింహాసనము యొద్దకు వచ్చినప్పుడు, అతడు దయను కనుగొన్నాడు. హల్లెలూయా! నేను పిచ్చివాడినని మీరు తలంచెదరని నాకు తెలుసు; బహుశా నేను అయియుండవచ్చు. అలా ఒంటరిగా నన్ను వెళ్ళనివ్వండి. ఈ విధముగానే నేను సంతోషముగా ఉన్నాను.

చూడండి. “ఒకవేళ మీరు చేయగలిగితే.” పాష్టరు, మీరు సరిగ్గానే చేశారని నేను నమ్ముచున్నాను. “ఒకవేళ మీరు చేయగలిగితే, మరియు అతడు ఆయన వైపు చూశాడు. ”అతడు ఎంతకాలము నుండి ఇలా ఉన్నాడు?“ అని అడిగాడు.

అతడు చెప్పెను, “బాల్యము నుండి.” అతడు చెప్పెను, “మా పైన దయ చూపించుము.” కృపా సింహాసనము, అతడు దయను కనుగొన్నాడు. క్షమాపణను అడిగి, మరియు పశ్చాత్తాపపడి మరియు, “ఇప్పుడు, ప్రభువా, నేను నమ్ముచున్నాను. నా అవిశ్వాసమును బట్టి నన్ను క్షమించుము.” ప్రభువా! ప్రభువు అనగా “యజమానత్వము.”

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...