యాయీరు కుమార్తెను లేపుట

యాయీరు కుమార్తెను లేపుట

కాబట్టి, రోగులకు ప్రార్థించుటలో పరిచర్యను - బోధించుటలో వీలైనంత క్లుప్తముగా చేయగోరుచున్నాము. ప్రార్ధనా వరుసను కొనసాగించు కారణమును బట్టి త్వరగా క్లుప్తపరచగోరుచున్నాము. ఆ తరువాత మేము అలసిపోకుండా ఉండుటకు బలముగా ఆలోచించుచున్నాము. కేవలము బోధించుట మాత్రమే. నేను ఎప్పుడూ రోగులకు ప్రార్థన చేయుటను గూర్చి చెప్పచున్నట్లే, ప్రభువు నాకిచ్చిన వరమును ఉపయోగించుదును. నేను ఆయన యొక్క యోగ్యతలేని దాసుడను. ఏమైనా అని నా బలము బహు త్వరితముగా కోల్పోవుచుందును. అది పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా జరుగును. రోగులకు ప్రార్థించుటలో నా బలమునంతటినీ పణముగా పెట్టగోరుదును.

ఇప్పుడు, ప్రకటించబడినది అందుకొరకే రేపు రాత్రి రోగుల కొరకు ప్రార్ధించుట జరుగునని తలంచుచున్నాను. సహోదరుడు మూర్ ఏదైనా గాని రేపు కెనడాకు వెళ్లవలసియున్నాడు. అది ఒక విధంగా ప్రశ్నించదగినదే లేదా కెనడా కూటమును రద్దుపరచుకోవలెను, ఎందుకనగా అక్కడికి చేరుకొనుటకు మాకు సమయము లేదు. అది వారి యొక్క నిర్ణయము.

కావున మేము స్వస్థతా కూటమును ప్రకటించుదము... లేదా, ఏమైనా సరే రేపు రాత్రికి రోగులకు ప్రార్థించుదము. కావున మీరు ప్రార్ధించండి, మరియు రేపు రాత్రి టిక్కెట్లు పొందుటకు త్వరగా రండి, మరియు ఆ తరువాత ప్రభువు మన కొరకు చేయుదానిని ఆయనిచ్చిన ప్రకారము ప్రకటించుదము.

2

మరియు ఇప్పుడు ఎందరు ఆయనను పేమించుచున్నారు? ఆయన ఆశ్చర్యకరుడు కాడా? మనము ఈ సంగతులకు అయోగ్యులము. ఈ గొప్ప విషయములకు మనము సహవాసులముగా ఉండుటకు ఆయన అనుమతించుట ఎంత గొప్ప సంగతి అయి ఉన్నదో నేను ఆలోచించుచున్నాను.

గతరాత్రి నేను ఆలోచించుచుంటిని. గత రాత్రి వేదిక యొద్దకు నేను వచ్చినప్పుడు చీల్చబడినట్లు అయిపోయాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చదువుటకు కనీసం ఒక వాక్య సందర్భము కూడా లేదు. ఆ వేడి వాతావరణము నన్ను కరిగించినంతగా చేసినది. శీతాకాలము వచ్చినప్పుడు నేను ఫ్రీవ్-పోర్టుకు వచ్చెదను. శీతాకాల సమయములో గుడారము వేయుదము. అలాగైతే నిజంగా మనము ప్రక్కలను ఎత్తినట్లయితే, కొంత గాలి వచ్చును. నేను ఒక మంచుగడ్డను తెచ్చుకొని దానిపై కూర్చున్నట్లు [స్పష్టతలేని మాటలు]. మీతో చెప్పుచున్నాను. మీరెట్ల జీవించుచున్నారో నేనెరుగను, కాని మీరందరు అలవాటు పొందిరి; అంతే

3

ఉత్తర ప్రాంతంలోని ఆ చల్లని శీతోష్ణ స్థితిని మనము ప్రేమించుదుము. నేను లేచి వెళ్లి అక్కడ ఆరాధనలు జరిగించాలనుకొంటా, కుక్కలతో నడిపించబడు బండ్లలో వారు నా బోధని వినుటకు వచ్పుదురు. అప్పుడు సున్నాకు చలి పది - పదిహేను డిగ్రీలు తక్కువగా యుండును. ఎందుకు, వారు దుప్పట్లు కప్పుకొని అలా చుట్టుకొని వచ్చి కూర్చు౦దురు, నేను బోధించు ప్రతిసారి వారలాగే వచ్చుచుందురు. అది గడ్డకట్టునటువంటి మంచు, మీరు అలా మీ ఉపిరి వదిలినయెడల గడ్డకట్టును. అది నా మట్టుకు సరిగానే ఉండును. దానిని నేను ఇష్టపడుదును.

నేను ఇండియాన్స్ కు బోధించితిని మరయు వారు వచ్చి అలా వేల సంఖ్యలో వచ్చి కూర్చు౦దురు, కేవలము అలా దుప్పట్లపై, అది సున్నా కంటే తక్కువ ఉండును. ఓ, దానిని మేము పట్టించుకోము. కేవలము అక్కడ కూర్చునేదము, చిన్నవారు లేచి, మరియు వారి దుప్పట్లు వారి చుట్టూ చుట్టి, మరియ అక్కడ కూర్చుని వాక్యము విందురు. నేను బోధించుచుండగా, ఊపిరి గడ్డ కట్టుచున్న పరిస్థితి. అయితే నీవు ఎక్కడ నశించుచున్నావు అనే విషయానికి వస్తే అది దానిని వ్యత్యాసముగా చేయును.

4

అయితే ఇప్పుడు, మీ అందరికి అది మరో విధంగా యుండును, కాని మిమ్మును ప్రేమించుచున్నాము. ఇక్కడి ఫ్రీవ్-పోర్ట్ నుండి దిగువన ఉత్తరానికి (చూడండి), నేను వెళ్ళితే బాగుండునని మీరు తలంచినచో, ఉత్తరము నుండి పర్వతములు దాటి ప్రజలు కొరకు ఫ్రీవ్-పోర్టులో జీవించుటను ప్రేమించుచున్నాను. ఈ దక్షిణాది జనులు నా జీవితంలో ఎన్నడూ నేను చూడని చక్కని ప్రజలు. ఇక్కడున్నాను కాబట్టి నేను ఈలాగు చెప్పుట లేదు. అలాగైతే నేను వేషధారినవుదును, కాని ఇది నిజము.

నేను లెక్క చేయను... ఒక అంగడిలోనికి వెళ్లాను. దాదాపు పధ్నాలుగు సంవత్సరాల బాలుడు, నా దేశములోనికి వచ్చెను, “మీకేమి కావాలి? అనడిగాడు.” మీకు వందనములు మరల రండి“ అనలేదు గాని, ఆ చిన్నవాడు నన్న తన సోదరునిగా చూచాడు. అతడు చాలా చక్కనివాడు, ”ఇప్పుడు, మరల వచ్చి మమ్మును దర్శించండి“ అనెను.

5

మీరెరుగుదురా, నన్ను పట్టుకొనునది ఏదో అక్కడున్నది. అది నాకిష్టము. ఆ పాత-కాలపు భావన నాకిష్టము. మీరెరుగుదురా? వారాలాగే చెప్పేవారు... మియామి, ఫ్లోరిడాలో ఒక కూటములో ఉన్నాను. ఒకసారి సహోదరుడు బోస్వర్త అన్నాడు, “బ్రెన్హాం సోదరుడా, నీవు వెనక్కి వెళ్ళునప్పుడు, ఆ చిన్న గుడారములో నుండి వెనక్కి వెళ్ళునప్పుడు ఇక్కడి ఈ స్థలమును ఇచ్చిన జమీందారు నీతో కరచాలనము చేయగోరుచున్నాది.”

“ఆలాగా, ఆమె ఎవరు?” అన్నాను

“ఆమె జమీందారు,” అన్నారు.

“అదేమిటి?” నాకు తెలియుదు ఆమె వేరేరకముగు స్త్రీయా?“ అనడిగాను. నాకు చెప్పమన్నాను.

కావున ఆయన నాతో ఇట్లనెను. “ఆమె ఒక గొప్ప స్త్రీ” అంతే.

అప్పుడు నేనన్నాను, “ఆలాగయితే నన్ను చూచుటకు వచ్చిన ఈ మనుష్యులందరి మాట ఏమిటి?”

“ఆమె నీతో కరచాలనం చేయాలనుకొంటున్నది. ఆమె తలుపు దగ్గరే ఉన్నది,” అన్నాడు.

6

కావున నేను వెళ్ళాను, ఆ స్త్రీ అక్కడే యున్నది. ఆమె వేళ్ళకున్న వజ్రాలు నేను చూచినప్పుడు ఎంతో ఆశ్చర్యము! దాదాపు ప్రపంచానికి సువార్త ప్రకటించగలను. అక్కడ నిలబడి ఒక కర్ర మీదనున్న వజ్రాల జతను చూచాను. అవి ముక్కుకు చెందినవే గాని అక్కడలేవు. ఆమె ఆలాగే చేసినది. ఆమె చేతి చుట్టూ రకరకాల ఆభరణాలున్నవి. మీకు తెలియునా? ఆలాగున్నవి. నేను వెళ్తుండగా ఆమె ఆలాగు చూచినది.

ఆమె ఇట్లన్నది, “మీరేనా డాక్టర్ బ్రెన్హాం?”

“కాదమ్మా, నేను కాను. నేను సోదరుడగు బ్రెన్హాంను” అన్నాను.

అమె ఇట్లన్నది, “మంచిది, నేను మిమ్ములను కలుసుకొనుట సంతోషముగా ఉన్నది.” ఆమె తనచేతిని ఈలాగు లేపినది. మీకు తెలుసు గదా... మీకు అదెట్లుండునో తెలియును. ఇప్పుడు, ఆమె ఆలాగు ప్రవర్తించుచున్నది. మానవులు సహజంగా ఆలాగు ప్రవర్తించరని మీకు తెలియును. అది నిజము కాదా? ఇప్పుడు, వారు ఆలాగు చేయరు. ఇప్పుడు “నేను మిమ్ములను కలుసుకొనుట సంతోషము.” (ధనికులు కలుసుకొనునప్పుడు నాజూకుగా కరచాలనము చేయు విధముగా ఆమె చేయుచున్నది, అని ప్రవక్త యొక్క భావము - తె. తర్జుమాదారుడు.) ఒక కెంటకీ కొండ ప్రాంతానికి, చెందినవాడను? దాని గూర్చి నాకేమి తెలియును?

కావున నేను ఆమె వైపు చూచాను. మరియు నేనన్నాను.... నేనామె యొక్క పెద్ద బలమైన చేతిని పట్టుకొన్నాను, “మిమ్మును నేను తెలిసికొనునట్లు చూడగానే గుర్తించునట్లు ఇక్కడికి రండి,” అన్నాను. ఇప్పుడు, ప్రజలు కేవలం నటనగా కరచాలనము చేయుచున్నారు అని నేననుకొనుచున్నాను. ఇప్పుడు, నాకు ఈ మంచి దక్షిణాది బలమైన-కరచాలనం ఇష్టము. నాకు నిజంగా ఇష్టము. “హలో, బోధకుడా” అన్నది.

7

నా భార్య ఒకసారి.... మేము ఊరు చివరకు వెళ్తున్నాము. ఓ, అది జరిగి రెండు మూడు సంవత్సరాలయింది; ఆ వీధిలో ఒక యువతి ఉన్నది, ఆమెను మేము ఎరుగుదుము. ఆమె ఇట్లు అన్నది, “హలో, సోదరి బ్రెన్హాం.”

మిడా ఆ వైపు చూస్తున్నది. ఆమెతో మాట్లాడుట నేను వినలేదు. “ఇదిగో, ఆ బాలిక నీతో మాట్లాడుచున్నది.”

“ఆమెను పలకరించాను” అన్నదామె.

“నేను వినలేదు. అమె వినలేదని నాకు ఖచ్చితంగా తెలుసును,” అన్నాను.

“ఆమె వైపు చూచి నవ్వాను.” అన్నదామె.

“చిన్నగా గడ్డం ఊపితే సరిపోవునని నీవు నాకు చెప్పదలచుకొన్నావా? హలోకు బదులు అది చాలదు. వారికి తెలియునట్లుగా నిజంగా నీవు మాట్లాడాలి. చూడు” అన్నాను నేను.

ఉత్తరాదిన వారు చల్లగా ఉందురు, వేరేగా ఉందురు. నా చిన్నానను చూడ్డానికి వెళ్ళాను, మరియు వారు ఒక చోటకు వెళ్ళారు, మరియు నేను “చార్లీ అంకుల్ ఇక్కడెవరుంటారు? మీ పొరుగువారా?” అన్నాను.

“అవును.”

“ఎంతకాలం నుండి ఇక్కడుంటావ్?” అన్నాను.

“ఇరవై సంవత్సరాలు.”

“అతనెవరు?” అనడిగాను

“నాకు తెలియదు.”

“నీవెంత కాలం నుండి ఉంటున్నావో, అంతకాలం నుండి ఉంటున్నారు కదా, నీకు తెలియదా?” అన్నాను.

“అవును.”

నేననుకొన్నాను, “అతనితో ఇప్పుడే నేను పరిచయం చేసికోవాలి లేదా అంత సమయం పలకరించకుండా ఉండకూడదు. వారు ఒకరినొకరు పలకరించుకొనుట లేదు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనరు. ఇది న్యు-యార్కులోని ప్లాట్స్-బర్గ్, నేను వచ్చిన కాతలిక్కు కుటుంబము ఆలాగే యున్నది.

నా చిన్నమ్మ గతంలో మాంట్రియల్ లోని మంత సంఘంచే నడుపబడు పాఠశాలను స్థాపించినది. ఆమె అక్కడ సమాధి చేయబడినది. కావున వారు నిజమగు రాజు కాతలిక్కులు.

8

ఆ తరువాత వస్తూ... నేను ఇట్లున్నాను, “అంకుల్ చార్లీ, నా తుపాకీ కొరకు .32 గుండ్లు కావాలి. నేను జింకలను వేటాడుకొనుచున్నాను.”

“అయితే, ప్రత్యేకమగు చోటుకు వెళ్ళాలి. అక్కడ దొరుకును” అన్నాడు.

అందుకు నేనన్నాను, “సరే.” నేను వెళ్ళాను. ఆ స్థలము నాకు దొరకలేదు. చుట్టూ చూచాను. ఆ మూలన ఒకాయన నిలబడియున్నాడు. అతడు ఒక తెలివైన మనిషిలా కనిపించాడు. “బాగున్నారా?” అని అడిగాను.

అతడు నావైపు చూచి వీధిలో దిగువరకు వెళ్ళిపోబోతున్నాడు.

అయితే, “ఏదో పొరపాటు జరిగింది, బహుశా నావలన కావచ్చు” అనుకున్నాను.

కావున నేను వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి పొగాకు షాపు నుండి బయటకు వచ్చుచున్నాడు. అతడు తన పొగ కొరకు అగ్గిపుల్ల వెలిగించుచున్నాడు. అతడు ఒక చిన్న టోపీ ధరించియున్నాడు. ఒక హుందాగా కనిపించాడు.

“శుభోదయమండి, ఫలాని వస్తువులు అమ్మే చోటు ఎక్కడున్నదండీ,” అన్నాను.

అతడు ప్రక్కకు తిరిగాడు.

నేనతని వైపు చూచాను. నడుచుకుంటు వెళ్లిపోయాడు. “ఎవరో పిచ్చివారిగా ఉన్నారు. బహుశా అది నేను కావచ్చు,” అనుకున్నాను.

అది నాకు గిట్టదు. నాకు నచ్చినది... ఇక్కడున్న మీ పోలీసు కూడా మిమ్మును దారి చూపించి నడిపించగలరు. మీకు కలిగయున్నదే నాకు ఇష్టము, చాలా చక్కని జనులు. మీకు మంచి వాతావరణము దొరికినచో, అదే చాలు.

9

సహో జాక్ నాకు చల్లని వాతావరణమును గూర్చి నిశ్చయత కలిగించును. కాని ఒక్క విషయం స్నేహితులారా, తిరిగి-జన్మించిన దేవుని పిల్లలు ఒకేలాగుందురు. వారు వేరే దేశమైనా పరవాలేదు. ఆఫ్రికాలోని వేడి ప్రాంతాల్లోకి వెళ్ళాం, జర్మనీలోనికి వెళ్ళాం, ఫ్రెంచ్ వెళ్ళాం, స్విస్ వెళ్ళాం, స్వీడన్ వెళ్ళాం, నార్వే వెళ్ళాం, ఫిన్లాండ్ వెళ్ళాం, ప్రపంచమంతా తిరిగాం. ఎక్కడ నీకు తిరిగి-జన్మించిన క్రైస్తవులు కనపడినా, వారు ఒకేలా ప్రవర్తించుదురు. అవునండీ. వారు తిరిగి జన్మించిరి. అందువలననే వేరుగా ఉందురు.

ఆ మంచి దక్షిణాది ఆత్మను వారందరూ కలిగియుందురు. కొందరు దానికి “ఆమేన్” అని చెప్పిరి. “అది మంచి దక్షిణాది ఆత్మ” అని నేనన్నాను. అది వారు కలిగియున్నారు, కావున అది చాలా మంచిది.

10

ఈ రాత్రి మనము ఆయన వాక్యమును సమీపించుచున్నాము. ఆయన వాక్యము నుండి చదువగోరుచున్నాము. పరిచర్యలోనికి నేరుగా వెళ్ళుదం. మనమిప్పుడు వాక్యములోనికి వెళ్ళనైయుండగా, మీరు నా కొరకు ప్రార్థించమని కోరుచున్నాను.

కాని అన్నింటి కంటె ముందుగా, ఆయనను సంబోధించుదం [మైక్రోఫోన్ ప్రతిస్పందన శబ్దమిచ్చుచున్నది.] ఆయన తన కృపను మనము కలిగియుండునట్లు అనుగ్రహించును [మైక్రోఫోను మరల ప్రతిస్పందన శబ్దమిచ్చుచున్నది.] ఆయన వాక్యము. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినది. ఎల్.సి. సోదరుడా? ఇప్పుడు, ఆయన నాకు భాగస్వామిగా ఉండవలసినవాడు, చూడండి.

ఒకసారి టెక్సాస్ లో ప్రభుని దూత దృశ్యమును ఫోటో తీసినది, అతడు అక్కడ అగ్నిస్తంభము దగ్గరు నిలబడియున్నాడు, మంచిది, సహోదరుడు ఎల్.సి., బాప్టిస్టు బోధకుడు. నడిచి వచ్చి మరో వ్యక్తిని ముఖం మీద కొట్టెను, సహో ఎల్.సి. అతడి ఫోటోను మరుసటి రోజు పేపరులో కలిగియుండెను. ఆ భాగములను విడిగా చేతిలో పట్టుకొనిన దృశ్యములను కలిగియుండెను, ఆలాగున... ఆ తరువాత వచ్చి తన అడుగను ఉంచెను.... ఓ, ఆలాగన నేను చేశానా? ఓ, మీరు అక్కడ కలిగియున్నారు. అన్యాయంగా అతనిని నేను ఖండించను. లేదండి. అతడు మంచి సోదరుడు.

కవున, ఈ రాత్రి అన్నా జీన్ నవ్వుట నాకు కనబడుచున్నది. ఈ రోజు నీవు సహోదరుడు డాన్ నుండి కబురు విన్నావా? లేదా? సరే. మనము నమ్మునదే విశ్వాసము. సహోదరుడు డాన్ కు దేవుడు క్షేమమగు పర్యటనను ఇచ్చును గాక! అతడు దక్షిణ ఆమెరికాకు వెళ్ళచున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కుమ్మరింపు అక్కడ దక్షిణ అమెరికాలో సంభవించును గాక. మంచిది. ప్రార్ధన కొరకు మన తలలు వంచుదము.

11

అత్యంత కృపగల తండ్రి, ఈ ఆనంద భరితలగు హృదయము గల జనులు పూర్ణ సంతోషముతో, నింపబడిరి, ఎందుకనగా నీ సన్నిధి మాకు దొరికినది, నీవు మమ్మును దర్శించి యున్నావు. ఈ రాత్రి మాకు చల్లని గాలిని పంపినందుకు వందనములు. మా కొరకు దానిని బాగుచేసియున్నావు, కావున నిన్ను మేము ఆరాధించుటకు మరింత సౌకర్యము పొందుదము.

దేవా, ఈ రాత్రి మా ప్రార్ధన ఏమనగా, మా ప్రతి పాపమును క్షమించుము. మా జీవితములో ఉన్న ప్రతి పాపము క్షమించుము. నీ యొక్క గొప్ప కృప మా యొద్దకు వచ్చి మమ్మును క్షమించును గాక! ఈ రాత్రి ఈ తెర క్రిందనున్న ప్రతి పాపమును క్షమించుము. దేవా, మృతులకు సజీవులకు మధ్య నిలబడి ప్రతి అతిక్రమమును తొలగించమని ప్రార్థించుచున్నాను. మా యొక్క చిన్న విభేదములను ప్రతిదానిని క్షమించమని నీకు ప్రార్థించుచున్నాము. వాటిని ప్రక్కన పెట్టి ఈ రాత్రి నిన్ను మేము ఆత్మతోను సత్యముతోను ఆరాధించుచున్నాము.

ప్రార్ధన వరుస పిలువబడినప్పుడు, ఓ దేవా, వారి ఎన్నికను చేసికోనిమ్ము. ప్రతి ఒక్కరిని పిలుపుము. ఈ రాత్రి మేము ప్రతి రోగి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ రాత్రి ప్రతి పాపి, ప్రతి వెనుకకు జారిన వ్యక్తి సత్యజీవ మార్గమునకు వచ్చునట్లు చేయుము. నీ ప్రియ బిడ్డయగు ప్రభువైన యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

ఈ రాత్రి ప్రభువు యొక్క సన్నిధిని ఎంతో దగ్గరగా పొందుచున్నాము. వాక్యములో నుండి ఏమీ చెప్పకుండానే మనం ప్రార్ధన వరుసను ప్రారంభించవచ్చునని అనుకొనుచున్నాను. ఇక్కడ ఆయన మాటలో ఒక వాక్యము చదివి బైబిలులో సంభవించిన ఒక సంగతి గూర్చి మాట్లాడుటకు ఒక సంఘటన తీసికొందము.

దీనిని మనము పరిశుద్ధ లూకా సువార్త 8వ అధ్యాయములో 48వ వచనము నుండి తీసికొని కొద్ది సమయము పాటు ఒక అంశముగా నుండుటకు మాట్లాడుదును, అదే ఈ రాత్రి అంశము.

ఆయన ఆమెతో ఇట్లనెను. కుమార్తె, ధైర్యము కలిగి యుండుము. నీ విశ్వాసము నిన్ను బాగుచేయును; సమాధానముతో పొమ్ము.

ఆయన ఇంకా ఈ మాటలు పలుకుచుండగానే, సమాజమందరిపు అధికారి ఇంటినుండి ఒక అధికారి అక్కడికి వచ్చెను. అతడిట్లనెను, “నీ కుమార్తె చచ్చిపోయినది, గనుక బోధకుని శ్రమపెట్టవద్దు.”

కాని యేసు ఈ మాటను వినునపుడు ఆయన ఇట్లు జవాబు చెప్పెను, “భయపడకుము: నమ్మిక మాత్రముంచుము. నీవు శుద్ధి పొందెదవు... (క్షమించండి.) ఆమె స్వస్థపరచబడును.

12

ఈ రాత్రికి మన అంశము బైబిలులోని ఒక గొప్ప సాటిలేని సంఘటన. భూమి మీద ఇక్కడి ఆయన క్రియలను తిరిగి చెప్పాలని నా ఆకాంక్ష. ఆయన ఇక్కడ ఒక మానవ శరీరములో ఉండగా భూదింగంతముల వరకు తానుందునని మనకు తనను బయలుపరచుకొందునని ఆయన చెప్పెను.

యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని బైబిలు చెప్పుచున్నది. రోగులకు ప్రార్ధన చేయకముందు ఆయన సంగతులలో కొన్ని మనం మననము చేయగలిగినచో రోగులందరికి ఆ సంగతి వివరించకలిగనచో, ఆయన మృతి పొందలేదు గాని సజీవునిగా ఉన్నాడని చెప్పగలిగినచో చాలును, చూడండి.

గతించిన రోజులలో ఆయన క్రియలను ఆయన వైఖరులను మనము చూచాం, ఇప్పుడు కూడా మనము అదే ఊహించగలం. మీరాలాగు అనుకొనుట లేదా? — ఆయన ఏకరీతిగా ఉన్నయెడల?

ఈ రాత్రి చక్కని చిన్న గుంపు ప్రజలతో ఈ గంభీరమగు ఆత్మను పాలుపొందుదము. మీ ప్రతి ఒక్కరు మీ మనస్సులను ఆధీనపరచండి. ఆ మన రక్షకుడు చనిపోలేదు, ఆయన సజీవముగా ఉన్నాడు, ఇప్పుడిచటనే యున్నాడు. ఏ యుగములోనయినా గాని ఆయన ఎట్లుండునో, ఆ ప్రకారముగానే యున్నాడు. నోవహుతో ఆయనెట్లుండెనో, అట్లే యున్నాడు. అబ్రహాముతో ఎట్లుండెనో, అట్లే యున్నాడు. హెబ్రి పిల్లలతో ఆయనట్లే యున్నాడు. పితరులందరితో ఎట్లున్నాడో, అలాగే యున్నాడు. అపొస్తలులతో ఎట్లున్నాడో, ఆలాగే యున్నాడు. యుగమంతా ఆలాగే యున్నాడు. నిన్న, నేడు, నిరంతరము ఆయన ఒక్కలాగే యున్నాడు.

13

ఇప్పుడు, దానిని మన మనస్సులలో ఉంచుకొందాం. ఆయనెప్పుడును ఏకరీతిగా ఉన్నాడని గుర్తుంచుకొందును. దేవుడు తప్ప నిరంతరము అంతటా ఉండువారెవరూ లేరు మరే సృష్టి లేదు.

అపవాది గొప్ప శక్తియే. అపవాదికి ఒక గొప్ప శక్తి ఉన్నది, అపవాది తన శక్తిలో గొప్పదే; కాని వాడును దేవుని శక్తి క్రిందనే యున్నాడు. అపవాది ఒక్కసారి ఒక్క చోటునే ఉండును. వాడి దయ్యములు పలుచోట్ల చెదరి ఉండవచ్చును. చెదరి యుండును వాని దయ్యములు వాడి జతపనివారు.

కాని దేవుడు ఒక్కడు మాత్రమే సర్వాంతర్యామిగా ఉన్నాడు, దేవ దూత కాదు, కాని స్వయంగా దేవుడు. హల్లెలూయా! అది మనకు ధైర్యమునిచ్చును. “ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడియుందురో, వారి మధ్యన నేనుందును.” అది సర్వవ్యాప్తము. ప్రతిచోటను.

ఇప్పుడు, మనము కొద్ది క్షణములపాటు ఆయన క్రియలను చూద్దాం. ఆయన తన పరిశుద్ధుల పట్ల మరియు పాపుల పట్ల ఏ విధమగు వైఖరిని తీసికొనునో చూద్దాం. ఆయన తాను పని చేయుచున్న విధానము ప్రకారము తన వైఖరిని కనునబరచినచో, ఇక్కడ కూడా ఆయన ఆలాగే చేయునని మనము కనుగొందుము. ఆయన మృతులలో నుండి తిరిగి లేచెననుటకు అది ఖచ్చితముగా తప్పిపోని రుజువు.

14

మీరు ఈ రాత్రి ఆనందంగా లేరా? లోకములో వేలాది ఇతర మతములున్నవి; అయినా దానిలో ఏదియూ తమ దేవుడు జీవించియున్నట్లు చెప్పకోజాలవు.

క్రైస్తవ్యము ఒక్కటే చెప్పుకొని నిలబడగలదు. తమ దేవుడు మృతిపొంది, తిరిగి లేచెనని, క్రైస్తవ్యము మాత్రమే చెప్పకోగలదు. వారి దేవుడు భూమి మీదకి వచ్చి శరీరము ధరించి, వారి పాపములను తీసివేయుటకు చనిపోయినవాడు. ఆయన తిరిగి మరల తన శరీరములో ప్రత్యక్షమాయెను. ఆయన తన సింహాసనము మీద ప్రత్యక్షమయి, తననుతాను ప్రత్యక్షమగు వరకు బయలుపరచుకొనెను. దావీదు సింహాసనము వెయ్యేండ్ల పాలనకు పరిపాలనను స్వీకరించును. అప్పుడు ఆయనను మనము చూచెదము. సిలువ వేయబడిన యేసుక్రీస్తును మనము చూచి ఆయనను ఎరుగుదుము.

మనము ఆయన రాజ్యము, ఆయన రాజ్యాధికారము నిత్యత్వము నుండి నిత్యత్వము వరకుండును. దానిని గూర్చి ఆలోచించు. సమస్త అధికారములు, ఎక్కడున్నదియు ఆయన చేతులకు ఇయ్యబడినది. అది నిజము. ఎంత అద్భుతము.

15

మనము గాని మిషనెరీలముగా క్రిందికి వెళ్ళినచో.... మీరనవచ్చు, “బ్రెన్హాం సోదరుడా, నీవు మిషనెరీగా నిన్నునీవు చెప్పకోవచ్చును. ఆయా దేశములకు వెళ్ళి వచ్చుచున్నావు.” అవును. అది మిషనెరీ పనియే. ఒకడు బయటకు వెళ్ళి మరియు అక్కడ నివసించుట మిషనెరీ కాదు. అతడు స్థానము మార్చియున్నాడు. నీవు వెళ్ళి - నాలుగయిదు, ఎనిమిది, పది లేదా పన్నెండు సంవత్సరాలు ఉంటే కాదు. నీవు స్థలము మార్చుకొన్నావు, అంతే.

మనం ఎన్నడూ చూడని గొప్ప మిషనరీ, పౌలు. ఇక్కడకి కొన్ని నెలలు. అక్కడికి కొన్ని నెలలు వెళ్ళి వచ్చెను. అది మిషనెరీ అంటే, చూడండి. కాని వెళ్ళి ఒక చోట ఉండువాడు తన స్థలమును మార్చి ఉండవచ్చును. అతడు జర్మనీలో ఉండవచ్చును, లేదా ఆఫ్రికాలో ఉండవచ్చును. ఎక్కడో చోట ఉండవచ్చును. అక్కడతడు సంఘ కాపరిగా లేదా సువార్తికునిగా ఉండవచ్చును.

ఇప్పుడు, మనం ఈ రాత్రి అంశమును గమనించగోరుచున్నాము, చెప్పబడినది ఏమనగా, ఇది స్వస్థత సంఘటన... లేదా, మృతులలో నుండి లేపుట, ఒక చిన్న యాజకుడగు యాయీరు కుమార్తె.

16

ఈ భూమి మీద ఇక్కడ ఉన్నప్పుడు మన ప్రభువైన యేసు చాలా తీరికలేని ఒక వ్యక్తి. ఆయన గొప్ప గిరాకిలో ఉన్న వ్యక్తి. ఆయన ఎన్నడూ ఒక్క చోట నిలచి యుండలేదు. ఆయన కొద్దిసేపుండి మరలా ఎక్కడికయినా వెళ్ళిపోవలసి యుండెను.

వారాయనను పట్టణములలో నిలచియుండమని ఒప్పింపచేసిరి, “మాతో ఉండుము” అనిరి.

కాని ఆయనిట్లనెను, “నేను ఆ పట్టణమునకు వెళ్ళవలసియున్నాను. అందుకొరకే నేను పంపబడితిని.” ఒక రోజంతా ఆయన ఏ పట్టణములో నిలచియుండలేదు. ఆయన ఒక రోజు, కేవలము ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే యుండవచ్చును. ఒక అద్భుతము జరిగించెను. మిగిలిన కూటమునంతటిని ఆయన తన శిష్యులకు అప్పగించెను.

17

దీనిని కొద్ది రోజులకు ముందుగా ఆయన గొప్ప కార్యములు చేయుట మనము కనుగొందుము. మనమిప్పుడు మాట్లాడుకొనుచున్న ఈ సంఘటనకు ముందుగా ఆయన సముద్రమును దాటెను. అలసిపోయెను, సొమ్మసిల్లెను. ఆయనలో నుండి ప్రభావము పోయెను. జనులు స్వస్థత పొందిరి, ఆయన సువార్తను ప్రకటించెను. సముద్రమును దాటి ఆయన గెదరేనీయుల దేశమునకు వచ్చుచుండెను. ఆయన ఎంతో అలసిపోయెను. బహుగా అరిగిపోయెను. చివరకు ఆయన దోనె ఎక్కి ఒక మూల నడుము వాల్చెను.

వారిలో కొందరు ఆయనకు చిన్న తలగడి సిద్ధపరచిరి, ఎందుకనగా వారాయనను ప్రేమించిరి. వారు తెడ్లు వేయుచూ, పడవను నడిపించుచున్నారు. అపొస్తలులందరూ తమ తెడ్లు వేయుచున్నారు. ఆయన కొద్ది నిద్రపోయెను. అంతగా అలసి సొలసియుండెను. చూడండి, ఒకరకంగా చూచినచో ఆయన మానవుడు; ఇంకొక రీతిగా ఆయన దేవుడు. శరీరరీత్యా మానవుడు; ఆయన ఆత్మయందు దేవుడు. ఆయనాలాగే వెళ్ళెను.

పావురము గొర్రెపిల్ల మీదకి వచ్చెను. ఆ రెండు ఒక్కటాయెను. గొర్రెపిల్ల ఒక జీవి, పావురము మరొక జీవి. పావురము మరియు మనుష్యుడు. పావురము మరియు గొర్రెపిల్ల ఏకమై యున్నవి, దేవుడు శరీరమందు ప్రత్యక్షుడాయెను. అది నిజము.

ఇప్పుడు, నీ శరీరములో ఆయన ప్రత్యక్షమాయెను. దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్య వారసులుగా దత్తత పొందితిరి. అది నిజం. మీరు ప్రభువైన యేసుక్రీస్తుతో కూడ సహవారసులైతిరి. ఓ, సంఘమా, నీవు శక్తి పొందియున్నావు, దానిని వాడుకొనుటకు నీకు విశ్వాసమున్నచో చాలును. అంతే.

18

గత సాయంకాలము నోవహును గూర్చి మాట్లాడుచున్నాను. ఓడ కట్టబడినది; ఒక చెట్టు నరకబడవలెను. ఆ చెట్టు నుండి బొతును తొలగించవలెను, బొతు అనగా పిప్పి, నోవహును మరియు అతని కుటుంబమును రక్షించుటకు చెట్టు యొక్క ప్రాణము ఒక పరిహారముగా అర్పించబడవలెను.

ఓడను తయారు చేయుటకు చితిసారకపు ప్రమానును వాడవలెను. చితిసారకపు ప్రమాను మొదట నరకబడి ఎండిపోవలెను. ఆ చితిసారకపు ప్రమానులోని మంచిది కాని.... నిలువ ఉండకూడనిది....

నిలబడియున్న పాపులమైన మనకు చాలా చక్కని మాదిరి, అయినను నా స్నేహితులరా, మీలో ఉన్న జీవము యోగ్యమైనది కాదు. నీ మంచి క్రియలు మరియు నీలో ఉన్న మంచితనమంతయు నీ పాపములను పరిహరించజాలవు. నీ వంటి మరియొకటి నరకబడవలసి యున్నది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, పరిపూర్ణుడు; ఆయన శరీరములో నుండి ఆయన వీపులో నుండి సమస్తమును పరిత్యజించబడవలెను. ఆయన శరీరరముపై దెబ్బలు, ఆయన ముఖముపై ఉమ్మి, ఆయనలో గుచ్చబడిన మేకులు, ఆయన ప్రక్కలలో మేకులు; నీ జీవమునకు ఆయన రక్షకునిగా ఉండవలెనన్నచో, ఆయనలోని జీవము బయటకు ప్రవహించవలెను.

19

మనము చితిసారకపు మ్రానును కనుగొనుచున్నాము. ఓడను మొదటగా తయారు చేయవలసినది దానితోనే. అది నరకబడవలెను. దాని స్వంత జీవము ఎండిపోవలెను. అది పాపి యొక్క చిహ్నము. పాపి దేవునితో సమాధానపడుటకు ముందుగా పాపమును ఒప్పుకొనవలెను, తెల్లనగును.

అప్పుడు చితిసారకపు మ్రాను ఎంతో తేలికపాటిదిగా మారును. పశ్చాత్తాపము పొందిన పాపి దేవునికి ఎంతో ప్రీతి పాత్రునిగా కనబడును. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చును. అలాటిది మరెన్నడూ ఉండదు.

ఇప్పుడు, మీరు ఆ చితిసారపు మ్రానును నీటిలో వేసినచో, కొద్ది నిమిషములలో అది మునిగిపోవును అది నిజం.

ఇప్పుడు, పాపి పూర్తిగా ఖాళీ అయిపోయెననుకొందము. చితిసారకపు మ్రాను ఖాళీ అయినచో అది తేలికయగును, మృదువైనదియగును. అప్పుడు మనము కనుగొందము.... నీవు దిగివచ్చి దేవునిని నీ పాపములు క్షమించమని అడిగినచో, అంతకన్న తేలికగా ఎప్పుడూ మారవు. నీవు మేఘముల పై నడచినట్లు తేలికగా మారుదువు. ఖచ్చితముగా. నీ స్వంత జీవితమును ఖాలీ చేసెను; అప్పుడు దేవుడు నిన్ను ప్రత్యక్ష గుడారమునొద్దకు తీసికొని వెళ్ళును, జనుల యొద్దకు తీసికొనివెళ్ళును, మరియు నిన్ను ఇంటిలోని ఒక దూలముగా లేదా ఒక రాయిగా ఆయన చేయును.

20

ఆ చితిసారకపు మ్రాను వలె నీవును మేకుతో కొట్టబడినప్పుడు, ఎల్లప్పుడు పచ్చగా ఉండే ఆ ఫైన్ వృక్షము నుండి వారు చిక్కటి ద్రవమును తీసి దాన్ని ఉడకబెడతారు. ఒక్కసారి అది పోయబడిన తరువాత, దానివలన ఎటువంటి ప్రభావము మరియు ఎటువంటి ఉపయోగముండదు, పోయబడినప్పుడు అది స్టీలు కన్నా గట్టిగా ఉండును. మరియు అది తీర్పు వరకు నిలబడుతుంది.

నీ యొక్క పాపపు జీవితమునంతా పోయబడినప్పుడు, కల్వరి అగ్నిలో పరిశుద్ధాత్మడు వాటని కాల్చివేయును, మరియు ఆ ఆత్మతో నీవు నింపబడి, అప్పుడు దేవుని రాజ్యములోకి ముద్రించబడుదువు. “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఎందుకనగా విమోచనా దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.” ఆమేన్. లోకము తిరగబడినా, అరచిననూ అది ఒక తిరిగి-జన్మించిన క్రైస్తవుని అవి అన్నియూ ఏమియూ చేయలేవు. ఆమేన్.

పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది (ఎఫెసీ 4:30), “విమోచనా దినము వరకు మీరు ముద్రింపబడియున్నారు.” ఆమేన్. ఆ నావ నీటిగుండా వెళ్లవలసియున్నది. ఆమేన్. ఆ పాత సీయోను నావ ఒక్క దినములోనే రక్షణకై లాగబడింది (నిజము).

21

ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, మానవునిగాను మరియు దేవునిగాను; ఆయనలో దేవుడు ఉండెను.

కొద్దికాలము క్రితం ఇక్కడ ఒక స్త్రీ నాతో మాట్లాడియున్నది. ఏ మతమును నేను తక్కువ చేయాలనుకోవటంలేదు. అది వారిమీదే ఆధారపడియున్నది; అయితే ఆ గుంపుకు సంబంధించిన ఆమె ఇలా అనెను, కన్యకకు జన్మించుటను నమ్మవద్దు, మరియు క్రీస్తు ఒక మంచి వ్యక్తి మరియు కేవలం ఆయన ఒక ప్రవక్త మాత్రమే. ఆయన ప్రవక్త మాత్రమే అయినట్లయితే, నీ యొక్క మరియు నా యొక్క రక్తము వలె ఆయన యొక్క రక్తము ఉండును. ఆయన దేవుడైనా అయ్యుండాలి లేదా లోకములోనే అత్యంత గొప్ప మోసగాడు అయ్యుండాలి.

ఆమె ఇలా అన్నది, “ఆయన కేవలం ఒక మానవుడేనని నేను పరిశుద్ధ గ్రంథము ద్వారా రుజువు చేయగలను.”

నేను ఇలా సమాధానమును ఇచ్చాను, “నీవు దాన్ని చేయగలవని నేను అనుకోవటం లేదు. ప్రార్ధన చేత నేను చాలాసార్లు పరిశుద్ధ గ్రంథమును చదివియున్నాను.” ఒకవేళ పరిశుద్ధ గ్రంథము ఆ విధముగా చెప్పినది అని నీవు నాకు నిరూపించబోవునట్లయితే, నన్ను మొదటగా నీ యొక్క లేఖనములను చూడనిమ్ము.“

ఆమె ఇలా అన్నది, “పరిశుద్ధ యోహాను 11వ అధ్యాయములో లాజరు సమాధియొద్ద యేసు, ఏడ్చెను అని పరిశుద్ధ గ్రంథము తేటగా చెప్పుచున్నది.”

నేను ఇలా అన్నాను, “మంచిది, దానిలో ఏమున్నది?”

ఆమె ఇలా చెప్పినది, “ఆయన మరణము లేనివాడు కాదు. చనిపోయిన వారియొద్ద యేడ్చువాడు కేవలము మనుష్యుడు మాత్రమే.”

నేను ఇలా అన్నాను, “నీవు అక్కడ ఉన్నదానిని అంతయూ గమనించలేదు, అది నిజమే, ఆయన శరీరములో ఉన్న మనుష్యుడే, దేవుడు తన కుమారునిలో ఉండి లోకమునకు తననుతాను బయలుపరచకుంటున్నాడు. ఆయన ఒక చోట గొర్రెపిల్లగా ఉన్నాడు, కాని ఆయన మరొక చోట పావురముగా ఉన్నాడు. గొర్రెపిల్లలో పావురమున్నది. దేవుడు క్రీస్తులో ఉండి లోకమునకు తననుతాను బయలుపరచుకుంటున్నాడు.”

22

నేను ఇలాగు అనియున్నాను, “లాజరు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఒక మనుష్యునిగా ఉన్నాడు. అప్పుడాయన మానవునిగా ఉన్నాడు, కాని ఆయన తన చిన్న శరీరమును నిటారుగా ఉంచి 'లాజరు, బయటకు రా' అనగానే మరణించి నాలుగు దినములైన ఆ మనుష్యుడు లేచి ఆయన పాదముల దగ్గర నిబడియున్నాడు. అప్పుడు ఆయన, మానవుని కన్నా ఘనుడైన క్రీస్తుగా ఉన్నాడు; అక్కడ దేవుడే మాట్లడియున్నాడు.”

నేను ఇలాగు అన్నాను, “ఆ రాత్రి కొండ దిగుతున్నప్పుడు ఆయన ఆకలిగొనియుండి, ఏదైనే దొరకునేమో అని అంజూరపు చెట్టును కలియజూచుచున్నప్పుడు, ఆయన మానవునిగానే ఉన్నాడు. ఆయన మనుష్యునివలె ఆకలిగొని తినుటకు వెదుకుచున్నాడు, అప్పుడాయన మానవునిగానే ఉన్నాడు, కాని అయిదు రొట్టెలను మరియు రెండు చేపలను విరచి అయిదు వేలమందికి పంచినప్పుడు ఆయన మానవాతీతునిగా ఉన్నాడు. అక్కడ ఆ రొట్టెను విరిచినవి దేవుని యొక్క చేతులైయున్నాయి.”

అక్కడ ఆయన పంచినవి బ్రతికున్న చేపలు, గోధుమలు కావు, కాని తినుటకు సిద్ధముగా ఉన్న వండిన రొట్టె మరియు కాల్చిన చేప. ఆమేన్. ఆయన మానవుని చేసినప్పుడు ఎటువంటి అణువుతో చేసియున్నాడు? అప్పుడు ఆయన మానవునికన్నా అధికుడుగా ఉన్నాడు. ఆ అణువుకు ఆయన దేవునిగా ఉన్నాడు. ఆ దేవుడే ఆ అణువును చేసియున్నాడు. ఆ దేవుడే కాల్షియమును చేసియున్నాడు. ఆ దేవుడే జీవమును చేసియున్నాడు. ఆ దేవుడే సృష్టిని చేసియున్నాడు.

ఆయన లోకములో ఉన్నను ఆయనను లోకము ఎరుగదు. ప్రపంచము ఆయనచేత తయారుచేయబడియున్నది. “ఆయన మానవాతీతునిగా ఉన్నాడు.” అవునయ్యా. ఈ రాత్రి నేను మాట్లాడుచున్నది ఆ మానవుని గురించే. ఆ రాత్రి ఆయన భౌతికముగా ఎంతగానో అలసిపోయి లేవలేని స్థితిలో ఆ దోనేలో నిద్రించుచున్నాడు. ఆయన ఎంతగా అలసిపోయున్నాడంటే, ఆ అలల తాకిడి కూడా ఆయనను లేపలేకపోయినవి. ఆ దోనె వెనుక భాగములో ఆయన నిద్రించుచున్నప్పుడు, ఆయన మానవునిగా ఉన్నాడు.

ఆయన లేచి ఎప్పుడైతే తన కాలుని ఆ దోనె యొక్క త్రాడుపై కాలుని పెట్టి, పైకి చూస్తు, “నిశబ్దమై ఊరకుండుమని” అనియున్నాడు, వెంటనే ఆ గాలులు మరియు అలలు నెమ్మదించాయి, అప్పుడు ఆయన మానవాతీతునిగా మాట్లాడియున్నాడు, దేవుడే తన కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు పెదవుల ద్వారా మాట్లాడియున్నాడు. ఆమేన్. అది సత్యము.

23

ఒక మానవునిగా ఆయన సిలువపై కృప కొరకు యాచించెను. ఆయన మనుష్యుడు. ఆయన సిలువపై కృప కొరకు వేడుకొనినప్పుడు, ఆయన మానవుడు. కాని ఈస్టరు ఉదయూన ప్రభువు యొక్క దూత రాయిని దొర్లించగానే, ఆయన వచ్చెను, తాను దేవుడనని ఆయన నిరూపించెను. ఆ కవి చెప్పినదానిలో ఆశ్చర్యము లేదు:

జీవించుచూ, ఆయన నన్ను ప్రేమించెను; చనిపోతూ ఆయన నన్ను రక్షించెను;

సమాధి చేయబడుచూ, ఆయన నా పాపములను దూరంగా మోసికొని పోయెను;

తిరిగి లేస్తూ ఆయన ఎన్నటికీ స్వేచ్చగా న్యాయము తీర్చెను;

ఒక రోజున ఆయన వచ్చుచున్నాడు — ఓ, మహిమకర దినము!

నిశ్చయముగా ఆయన వచ్చును. ఆయన దైవనరుడు. దైవ సంబంధమైనవాడు. ఆయన కన్యకకు జన్మించెను. యెహోవా దేవుడు ఒక చిన్న కన్యకను ఆవరించగా, కన్యకకు దేవుని కుమారుడు జన్మించెను. అది ఒక ప్రత్యక్ష గుడారము - లేక, నివాస స్థలము - యెహోవాయే తనకుతానుగా. యెహోవా శరీర ఆలయములో నడిచెను. పాపమునకు వెలను ఆయన చెల్లించెను. నీవెన్నడూ ఆయనను ప్రవక్తగా చూడకుము. ఆయన ప్రవక్తలకు దేవుడు. నిశ్చయముగా ఆయన ఆలాగు ఉండెను. ఆయన ఒక మంచి మనిషికన్న గొప్పవాడు. ఆయన మంచి మనుష్యులకు దేవుడై యుండెను.

24

ఈ చిన్న ప్రాచీన సముద్రముల మీద ఇచ్చట అటు ఇటు కొట్టుకొనుచుండెను, అవి పదివేల దయ్యములు. ఆయన అలసి, పరుండి యుండగా, ఆ సముద్రము మ్రింగివేయవలెనని ఎదురు చూచుచెండును.

నీవు అలసిపోయినపుడు లేదా సొలసిపోయియున్నప్పుడు, అపవాది నీపై దాడిచేయగోరును. ఆ విధంగానే నిజంగా వాడు పనిచేయును. నీవు కొద్దిగా అలసియున్నావు, సొలసిపోయి యున్నావు, నిరుత్సాహము పొందియున్నావు. నిశ్చయంగా, వాడు యేసును ఆ బలహీన స్థితిలోనే పట్టుకొనెను. అలసి, సొలసియున్నాడు. దోనెలో కొద్దిగా నడుము వాల్చి యున్నాడు. అటు ఇటు కదలుచున్నాడు. దోనెను అటు ఇటు కుదుపుటకు సముద్రము మీదకి ఒక తుఫాను వచ్చెనని బైబిలు చెప్పుచున్నది.

శిష్యులు ఇట్లనిరి, “మేము నశించుచున్ననూ నీవు చింతలేక యున్నావా?”

ఆయన నిట్లనెను, “ఓ, మీ విశ్వాసమెక్కడ?” చుట్టూ చూచెను. ఆ గొప్ప గాలులు మరియు అలలు ఆయనకు లోబడెను. ఆయనేమి చేయుచున్నాడు? ఆ రాత్రి వరకు సముద్రమును దాటుచున్నాడు, ఎందుకనగా గదరీనీయులలోని ఒక ఆత్మ ఆయనను చేర్చుకొనుటకు సిద్ధంగా యున్నాడు: గదరెనీయులలోని ఒక ఆత్మ.

ష్రివ్-పోర్టులోని ఒక ఆత్మను చేర్చుకొనుట కొరకు ఆయన మహిమలో నుండి వచ్చును. గుర్తుంచుకొనండి, ఆయనను చేర్చుకొనుటకు సిద్ధమైనవాడు ఒక రోగి. అతడు మానసికంగా రోగియైయున్నాడు. అతడు మానసిక శాంతిలేనివాడు. మనస్సును కోల్పోయినవాడు. అతనికి వైద్యులు ఏమియూ చేయలేరు. వాడు గుహలలో ఉండెను, సమాధులలో ఉండెను. అపవాది అక్కడికే నిన్ను తీసికొనిపోవును. వాడు నిన్ను సమాధులలో ఉంచును.

25

ఒక భీమా ప్రతినిధి ఇక్కడ కొంతకాలం నా యొద్దకు వచ్చి ఇట్లనెను, “బిల్లీ, నీకు ఒక జీవిత-భీమా అమ్మాలని అనుకొనుచున్నాను.”

అలాటివి నాకేమీ లేవే అన్నాను. “నాకు భీమా ఉన్నదిలే అన్నాను.” నా భార్య నా వైపు ఆశ్చర్యంగా చూచినది. విశేషముగా అతడు నాకు అమ్మాలని ప్రయత్నము చేస్తున్న భీమా, నాకెటువంటి లేదని ఆమెకు తెలియును.

“బిల్లీ” అన్నదామె.

“అవును, నాకు భీమా ఉన్నది” అన్నాను.

“నీ భీమా ఏమిటి? ఎటువంటి భీమా పదకము అది? ఎవరు నీకిచ్చారు?” అన్నాడు.

“ప్రభువైన యేసుతో ఉన్నది” అన్నాను. ఆశీర్వాదకరమగు నిశ్చయత, యేసు నా వాడు. ఓ, ఎటువంటి దైవసంబంధియగు ముందు రుచి అది: రక్షణకు వారసుడను దేవుని వలన కొనబడితిని, ఆయనాత్మలో జన్మించితిని, ఆయన రక్తముతో కడుగబడితిని.“

“అది మంచిది, బిల్లీ. ఆ మాట వినుట నాకిష్టము, కాని అది నిన్ను సమాధిలో పెట్టదు,” అన్నాడు.

“కాని అది నన్ను బయటకు తీయును,” అని అన్నాను. అక్కడికి వెళ్ళట గూర్చి నేను భయపడుట లేదు. అది అక్కడ నుండి నన్ను విడిపించును. దానిగూర్చి నేను ఆలోచించుచున్నాను. అది నిజం. అది నిశ్చయంగా.... సమాధిలోనికి వెళ్ళుట గూర్చి నేను చింతించుట లేదు; దానిలో నుండి బయటకు వచ్చుట గురించి.

26

ఒక సంగతి నాకు తెలియును, సోదరుడా, ఆ పాత-కాలపు మంచి పరిశుద్ధాత్మ బాప్తిస్మమున్నది. గుండె కొట్టుకొను ప్రతి సారి, మరణము అను ఆ గొప్ప స్థలమునకు ఒక్క అడుగు ముందుకు వేయుచున్నాము.

ఇది నేను చెప్పగోరుచున్నాను, నేను మార్గాంతమునకు వచ్చుసరికి ఆయన పునరుత్థాన శక్తిలో నేనెరుగుదును. మృతులలో నుండి ఆయన పిలుచునప్పుడు, నా పేరు ఆయనెరుగును, లాజరును పిలిచినట్లే పిలుచును.

ఈ రాత్రి అందుకొరకే మనము పోరాడుచున్నాము: ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగించబడిన పోరాటము గూర్చి పోరాడుచున్నాము. అపుడాయన పునరుత్థాన శక్తిలో ఎరుగుదుము, చనిపోయిన దేవుడు కాదు, పశువుల తొట్టిలో ఉన్న దేవుని కాదు, అయితే ఆయన ఈ రాత్రి తన ప్రజల మధ్య లేచి సూచక క్రియలు, అద్భుతములు చేయుచూ తన గొప్ప శక్తిని చూపించుచున్న దేవుడు.

27

పాపం ఈ దీన అభాగ్యుడు సమాదుల దొడ్డిలో ఆ బయట సంచరించుచున్నాడు. చాలా సంఘములు ఆలాగే చేయుచున్నవి: నేరుగా సమాధి దగ్గరకు వెళ్ళుచున్నవి.

అక్కడికి వెళ్ళి తన్నుతాను గాయపరచుకొనుచున్నాడు... యేసునకు దూరంగా వెళ్ళినచో అంతే. ఒక మనుష్యుని దరిద్రత నుండి విడిపించుటకు యేసు సముద్రమును దాటి వెళ్ళెను. ఈ అభాగ్యుడు ఆయనను చూచిన వెంటనే, ఆయన యొద్దకు పరుగిడి వెళ్ళి, కాళ్ళ మీద పడెను. అతడు దయ్యమునకు ఎంతో లోబడి యుండెననగా, దయ్యము అతని నాలుకను ఉపయోగించుకొనెను.

నీవు దయ్యమునకు లోబడవచ్చును, మరియు నీ నాలుకను వాడు ఉపయోగించుకొనును. నీవు దేవునికి లోబడవచ్చును, దేవుడు నీ నాలుకను వాడుకొనును. అయితే మొదట, ఆయన నిన్ను వశపరచుకొనునట్లు నీవు చేయుము.

ఇప్పుడు, నీవు పాపుల వలె తిట్టుచూ, బూతులాడుచున్నయెడల దయ్యము నిన్ను పూర్తి నియంత్రణలో ఉంచుకొనును. ఒక్కసారి దేవుడు నిన్ను స్వాధీనపరచుకొననిమ్ము, మరియు నీవెట్లు మాట్లాడుదువో గమనించుకొనుము.

28

ఓ, ఎంత అద్భుతము. ఈ పిచ్చివాడు ఆయన యొద్దకు పరుగిడి వెళ్ళగా, ప్రభువైన యేసు ఆ దయ్యములను గద్దించెను. చాలామంది ఏమందురునగా, మతము నిన్ను పిచ్చివాడిని చేయును అందురు; ప్రభువైన యేసు యొక్క మతము ఆలాగు చేయదు. అది సరయిన మనస్సును నీకిచ్చును. ప్రభువైన యేసును కలిసికొనువరకు నీ యొక్క సరయిన మనస్సులో నీవుండవు. అది నిజము.

కొందరు మనుష్యులు తమ్మును తాము పెద్ద మనుష్యులుగా పిలుచుకొందురు, కాని చాలా మృగములవలె ప్రవర్తించుదురు. తల్లిని అల్లరిపాలు చేయుటకు ఆమె చేతిలోని బిడ్డను విసిరి పారవేయుదురు. అతని హృదయములలో జంతువును పోలిని కర్కశమున్నది. ఒక విధమగు జంతువువా? 250 పౌండ్ల శరీరము ఉండవచ్చును. మానవుడు కాడు. అది జంతువు. నిశ్చయంగా. మానవుని అతని శరీమను బట్టి కొలత వేయలేము. ఎత్తు, పొడవులను బట్టి కాదు. మానవుని అతని గుణలక్షణము బట్టి కొలతవేయగలము. అతడేమైయుండునో అది అతని గుణలక్షణముపై ఆధారపడియుండును.

నేను చెప్పినట్లుగా, యేసును చూచి అపేక్షించునట్లు ఆయనలో ఏ అందము లేదు. అయితే ఎంతటి గుణలక్షణము; దానిని సమస్త ప్రపంచములో ఎన్నడూ అలాంటిది చేయబడలేదు. అది సరి.

కావున, బైబిల్ చెప్పెను, మనము ఆయనను చూచినప్పుడు, అపేక్షించునట్లు ఆయనలో ఏ అందమును లేదు. మననందరము ఆయనవైపు నుండి ముఖములు త్రిప్పివేసికొన్నాము, కాని ఏమి గుణలక్షణము ఎన్నడూ ఆయనను కొలవలేము. ఎంత అద్భుతము.

29

దయ్యములు వదలిపోయిన తరువాత ఆ పిచ్చివాడు సరయిన మనస్సులోనికి వచ్చినప్పుడు, ప్రభువైన యేసును అతడు వెంబడించగోరెను. సరయిన మనస్సులోనికి వచ్చిన ప్రతివారు ప్రభువును వెంబడించగోరుదురు. మీ భావములను నేను కించపరచుట కాదు గాని, పాపులారా, అది నిజము. నీవు నీ మంచిమనస్సులోనికి వచ్చుదువు, నీవు ప్రభువైన యేసును వెంబడించగోరుదువు. యేసు నీలో నుండి నీ మనస్సును తీసివేయడు. ఆయన నీకు మంచి మనస్సునిచ్చును. ఇది నిజం.

ఇప్పుడు, గమనించండి, వారు వచ్చినప్పుడు, అక్కడ ఉజ్జీవము సంభవించును. కాని నీకు తెలుసా? ఆ ప్రజలు పందులను మేపుకొనేవారు. వారికి ఏ ఉజ్జీవము అక్కరలేదు, ఎందుకనగా వారికి ఉజ్జీవము రావలెనన్న రెండువేల పందులు ఖర్చు అగును. వారికి అన్ని పందులు ఖర్చు అగును కాబట్టి వారు ఒక ఉజ్జీవము పట్ల ఆసిక్తిగా లేరు.

30

దేశములోని అనేకులు ఈనాడు అదే వైఖరితో ఉన్నారు. అది నిజం. కొంత ఏదో ఖర్చగును. నీవు కోరుకొనవు. అంతా ఒక వెండి పళ్ళెములోకావలెను. అందువలననే మీరు దానిని బట్టి సంతోషించుటలేదు.

నేను ఏర్పాటు చేసిన గొప్ప కూటములలో ఒకటి.... అది ఎక్కడ అనగా.... మూడీ గారిది కావచ్చు; అదెవరో ఇప్పుడు నాకు గురుతు లేదు. ఎమయినా గాని ఒక ముసలి బట్టలుతుకు స్త్రీ హృదయములో దేవుడు భారముంచెను. సహో మార్ ఆ సంగతిని గుర్తుంచుకొనియుండెను. కొన్ని వందల సంవత్సరాలు క్రితం జరిగినది. కావున అతడు అంత వృద్దుడని నేను అనటం లేదు, కాని చరిత్ర ద్వారా ఆ సంగతులు ఎరుగునని నా భావము. కావున సహో మూర్ అంత వృద్ధుడని నా ఉద్దేశ్యం కాదు.

31

కాని ఈ ముసలి చాకలి స్త్రీ ప్రార్ధించినది. ఆమెకు దేవుడు చెప్పినదేమనగా, నీ ద్వారా ఒక ఉజ్జీవము వచ్చును. ఆమె వీధిలోనికి వెళ్ళి, అందరికి కరపత్రికలు పంచినది. బోధకుని రమ్మని ఆహ్వానించిది. ఆమె తన బట్టలుతుకు బల్లను తీసివేసి ఆ స్థలమును శుభ్రపరచినది. ఆమె సంపాధించిన డబ్బుతో స్థలమును అద్దెకు తీసుకొన్నది. అంతయూ శుభ్రము చేయబడినది.

వీధిలో ఉన్నవారందరు ఆమె పంచిన కరపత్రములను పారవేసిరి. ఒక చిన్న కుర్రాడు తన తండ్రి యొక్క వదులు బట్టలు వేసికొని వచ్చి, “నీవు ఏమిటి పంచుచున్నావ్?” అనడిగాడు.

అతనికి కూడా ఒక పత్రిక ఇచ్చి రమ్మని ఆహ్వానించింది. ఆ రాత్రికి బోధకుడు వచ్చినప్పుడు, ఆ స్త్రీ మరియు కుర్రాడు తప్ప కూటములో మరెవరూ లేరు. ఆ బోధకుడు, దేవునికి సత్యమైనవానిగా ఉండువాడు, అక్కడ పదివేల మంది కూర్చొని యున్నట్లుగా అతడు బోధించెను. ఆ రాత్రి వేదిక నొద్దకు చిన్న బాలుడు వచ్చెను. అది ఎ.బి. సింప్సన్ కదా? [అవును] ఎ.బి. సింప్సన్ దాదాపు ఒక అరమిలియను ఆత్మలను దేవుని యొద్దకు నడిపించెను. దానికి నాంది ఎవరు? ఆమెన్.

32

మీరు చూడండి, నీవు చేసే గొప్ప పనులు కాదు. నీవు చేయకుండా విడిచిపెట్టిన చిన్న సంగతులే. నీవు త్యాగము చేయవలెను. ఆ కారణము చేతనే ఉత్తరాది జనులు కూటమునకు వచ్చెదరు. వారు వేలకొలదిగా వచ్చెదరు. వారు చలిలోనే ఉందురు. వారు దేవుని కొరకు ఏదో చేయగోరుదురు. అదే మనము కూడా చేయవలెను. అదేమిటి అని నీవు తేడాగా చూడవద్దు. మనము దేవుని కొరకు ఏదో చెయ్యాలి. ఒక త్యాగము చేయుము. మనము దేవుని యొక్క యాజకులమని బైబిలు చెప్పుచున్నది. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచున్నాము. మన పెదవుల ఫలములు అనగా, ఆయన నామమునకు స్తుతియాగమే.

మంచిది. ఆ ప్రజలు తమకు కొన్ని పందులు ఖరీదుగా అగునని తలంచిరి. అందుకే వారు వచ్చి తమ ప్రాంతములను విడిచి పొమ్మనిరి. మీరాయనను వెళ్ళిపొమ్మనుచున్నచో, ఆయన వెళ్ళిపోవును. ఎంతోసేపు ఆయన అక్కడ నిలిచియుండడు. తనను ఆహ్వానించని చోట ఆయన ఎప్పుడూ ఉండడు. ఆయనను ఆహ్వానించు చోటికే ఎల్లప్పుడూ ఆయన వచ్చును.

33

ఒక స్త్రీ యేసు పాదములు కడుగుట గూర్చిన ప్రసంగము మీరు కొద్దికాలము క్రితం వినియుందురు. ఆయన ఎల్లప్పుడూ మనుష్యులు స్వాగతించు చోటనే యుండును. ఆయనను నీవు స్వాగతించినచో, దానిని ఆయన ఇల్లుగా భావించును.

ష్రివ్-పోర్ట్ కు ఉజ్జీవము రావలెనని మీరు అన్ని విధములుగా ప్రార్థించవచ్చును. అప్పుడు యేసు ష్రివ్-పోర్టుకు రాగలడు, ఎవరిలోనో గొప్ప ఉజ్జీవము ప్రారంభమగును; మాట్లాడుచూ, మనుష్యులను రప్పించగోరుచూ ఉన్నారు గాని ఎక్కువ భాగము జనులు దానిని మూఢభక్తి అందురు.

సంఘములు.... ఈ దేశములో, ష్రివ్-పోర్ట్ కాదు, దేశ ప్రాంతమంతా, ఒక ఉజ్జీవము కొరకు ప్రార్ధించవలెను. నీవు తెలిసికొనవలసిన మొదటి సంగతి, ఎవరో ఒక ముసలి సోదరి హృదయములో ఒక చిన్న ఉజ్జీవపు ఆత్మ బ్రద్దలగును, “ప్రభువునకు స్తోత్రము” అని చెప్పును.

“ఆహా” ఆమెను బయటకు పంపించండి. “హే, నేను బోధించునప్పుడు అది నన్ను ఆటంకపరచును?” ఎందుకు, నీవాయనను స్వాగతించుటలేదు. ఓ, ఎప్పుడో ఒకసారి ఆయనతో నీవు క్రింది గదిలో మాట్లాడవచ్చును, లేదా వేరే గదిలో లేదా ఇంకోచోట మాట్లాడవచ్చును. నీవు ఒక ప్రార్ధన కూటమున్నప్పుడు, నీవు ప్రార్ధనకు వెళ్ళుటకు బదులు, ఏవో కొనుటకు షాపింగ్ వెళ్ళదువు. త్యాగము లేదు, అందువల్లనే మనము పొందు దానిని మనము సంతోషించుట లేదు.

34

నా పిల్లల్లో నేను కనుగొన్నాను. బిల్లీ పాల్... నేను గంటకు నలభై పైసల పనిచేశాను. నేను బాలునిగా ఉన్నప్పుడు నన్నెట్లు పరామర్శించిరో నాకు తెలియును: ఏమీ ఉండేది కాదు, బడికి వెళ్ళటకు నాకు బట్టలు కూడా లేవు. “నేను చచ్చేవరకు పనిచేసినా పరవాలేదు, అతడు శ్రేష్టమైనది కలిగియుండాలి,” అని నేను అనుకున్నాను.

నేను వెళ్ళాను, అతనికి నేను చిన్నవి కనుగొన్నాను. [స్పష్టతలేని మాటలు.] అతనికి నేను చిన్న విల్లు, బాణములు మొదలగునవి కొన్నాను. నేను చిన్నవానిగా అవి చేయలేను, ఆ తరువాత నేను ఏమి కనుగొన్నానో మీరు ఎరుగుదురు. ప్రతివారం నేను కొద్దిపాటి డబ్బు దాచగోరాను. అతనికి ఏదో కొనాలని ఆశ.

మీరు తెలిసికోవలసిన మొదటి విషయము ఏమనగా, వెనక ఆవరణములో అతనిని నేను చూచాను — ఇంట్లో అతనికున్న ఆటవస్తువులన్నీ చూచాను — మనము తిను చెంచాతో త్రవ్వుచున్నాడు. చూడండి, నీకు ఎక్కువైపోయినందున దేనినీ నీవు మెచ్చుకొనవు. తక్కినదంతా, [స్పష్టతలేని మాట] వారికి కలిగినదానినే గొప్పదిగా ఎంచుకొనిరి. కావున అది మంచిదగును. ఏలయనగా అది మంచిది.

35

మీలో కొందరు త్యాగము చేయవలసియున్నారు. కాని ఆయన ఎన్నడూ మితిమీరి అలసిపోలేదు. నేనేమి చేయవలెనో మీరెరుగుదురు. నేను మహిమలోనికి వెళ్ళునప్పుడు ఆ సేన యొక్క సాక్ష్యమును వినగోరుచున్నాను. అతనికి వచ్చిన వత్తిడి ఆ గెదరీనీయుల పందుల కాపరుల నుండి వచ్చినది.

ఆ పందులను మేపు వారితో ఆ ప్రాంతమును ఆయన కాల్చివేసి యున్నాడని నేనూహించుచున్నాను, (మీరాలాగు అనుకొనుట లేదా?) అతని యొక్క సాక్ష్యముతో, వేసికొనిన బట్టలతో, సరయిన మనస్సుతో ప్రభావితము చేసెను.

సోదరీ, నిన్ను కించపరచుట లేదు; ఈ చిన్నబట్టలతో నిన్ను నీవు నగ్నంగా చేసికొనుచున్నావు. నీవు చూడు, నీ మనసు ఇంకా సరిగా లేదు. నీవు ఎపుడైనా యేసును కొనుగొనినచో, నీకు మంచి మనసు వచ్చును. నీవు బట్టలు ధరించెదవు, స్త్రీవలె ప్రవర్తించెదవు. చూడు, నీవు మార్పులు చేసికొనవలెను, నీవు నీ బట్టలు ధరించుము, వాటిని తీసివేయవద్దు. మరియు బోధకుడా, అది నీ హృదయము లోతునకు వెళ్ళునని ఆశించుచున్నాను, కావున అది సత్యమని నీవు ఎరుగుదువు. నీ జనులను ఎందుకలా చేయనిచ్చుచున్నావు? దాని గూర్చి సత్యము వారికి చెప్పుము. అది మంచిది.

36

ఇక్కడాయన సముద్రము దాటుచున్నాడు. సముద్రపు ఒడులు అటు ఇటు కదులుచున్నవి. అవి ఒడులను తాకుచున్నవి. మరల కొట్టబడుచున్నవి... ఓ, మహా అలలు... ఒడ్డును తాకునప్పుడు ఎంతగా అవి అలసిపోవుచున్నవి! అక్కడ ఒక చిన్న స్త్రీ ఆయనను కొద్దిగా కృప ఇమ్మని అడుగుటకు దగ్గరగా వెళ్ళాలనుకొనుచున్నది.

తాను ఆయన దగ్గరగా వెళ్ళలేనని ఆమె కనుగొనినది. ఆమెకు రక్తస్రావ రోగమున్నది. కావున ఆమె ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టి బాగుపడినది.

ఇప్పుడు, ఇచ్చట యాయీరు అను పేరుగల ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు. నేనెల్లప్పుడు యాయీరు పట్ల చింత పడుచుందును, ఎందుకనగా అతడు ఒక రహస్య విశ్వాసి. ఈ రాత్రి ఈ తెర క్రింద చాలామంది కూర్చొనియున్నారు. అది నిజము. సాంఘిక హోదా కొరకు ఆలాగుండుట కూడా జరుగును. ఈ సాంఘిక హోదా అనునది ఒక పాత మురికి వంటిది. అసలు ఈ సాంఘిక హోదా అనగా ఏమిటి? “ఓ, అది సంస్కృతి. మన బోధకులు సంస్కృతిని కలిగి యున్నారు. వారిని వారు ఎలా ప్రదర్శికొనుచున్నారు.” సంస్కృతి అనగా నేను ఏమనుకొనుచున్నానే మీరెరుగుదురా? సంస్కృతి అనగా ఇది: ఒకరికి కోడిపిల్లను చంపే ధైర్యముండదు, కాని ఎవరయినా దానిని చంపితే మట్టుకు కడుపునిండా తినును. అది సంస్కృతి పై నా యొక్క అంచనా. అవును.

37

ఓ, సోదరుడా, బైబిలు రక్షణ మనకు అవసరమైయున్నది - ఆ ప్రాచీన గీత యొద్దకు, మరల బైబిలు యొద్దకు మనము వెళ్ళవలెను. ఇక్కడ చిన్న యాయీరు వాటి మీద ఉన్నాడు. అది అతని హృదయము చుట్టూ ఉన్నది. వారి సేవకుల కూటము జరిగినది. ఈ ప్రాంతమునకు నజరేయుడగు యేసును రానిచ్చుటకు ఓటు తీసికొందము.

“వద్దు! ఆయనతో మనకేమీ పనిలేదు. ఆయనలో విశ్వాసముంచు ఎవరినయినా గాని వెంటనే వెలివేయవలెను. యాయీరు, ఇప్పుడు అర్థమైనాదా?” ఆ కూటములలో చిన్న యాయీరు “ఆమేన్” కూడా చెప్పలేడు. అది నిజమని తలంచుచున్నాను, చూడండి. కాని తన హృదయములో అన్నివేళలా ఆయన విశ్వసించగోరుచున్నాడు.

“కావున,” అని వారు అన్నారు. “ఇప్పుడు, యాయీరూ, నీవు గుర్తుంచుకొనుము. నీ సంఘములో నుండి ఎవరయినా వచ్చి నజరేయుడగు యేసు వలన ఏ అద్భుతమైనా జరిగినట్లు ఒప్పుకొనినయెడల వెంటనే వానిని వెలివేయవలెను. అది యూదుల ఆజ్ఞ అని నీకు తెలియును. ”అవునండీ! సమాజ మందిరములో నుండి తొలగించుడి. ప్రధాన యాజకుని నీవెరుగుదువు, బిషప్పును, సూపరింటెండెంట్ ను నీవెరుగుదువు. అన్ని చోట్లకు ఆ వార్త చెప్పబడినది. నజరేయుడగు యేసును ఎవరయినా చేర్చుకొనినచో వెను వెంటనే వానిని బహిష్కరించవలెను.“

కావున నీవెరుగుదువు, నీవు నిజంగా ఆ రహస్య విశ్వాసివి. నీ హృదయాంతరంగము నుండి నీవు చెప్పగోరుచున్నావు. ఆ పాత కాలపు భక్తి నాకు కావలెను,“ కాని నీకు తెలియునా? నీవు కేవలము... చుట్టూ ఉన్న వారిలో చాలామంది దానిని నమ్మరు. దానిని పొందుటకు దేవుడు నీకు ఒక దారి చూపును. అవును, ఆయన చూపును. ఆయన ఒక దారి చూపును.

38

కావున ఆయన యాయీరుకు ఒక దారి చూపెను. ఒక రోజున అతని చిన్న పాప రోగి అయినది. దేవుడు నీతో కూడా నీ పిల్లలతో నీ యొద్దకు వచ్చునని నీకు తెలియునా? కావున అతని చిన్న పాప జబ్బుపడినది.

ఒక చిన్న పిల్ల రోగి అయినప్పుడు ఎవరయినా గాని సహేతుకంగా ఆలోచించునదేమనగా, వైద్యునికి కబురు పంపుట. వైద్యుడు వచ్చును, పరీక్షించును, ఆకుల టానిక్ ఇచ్చును, “ఏలాగుండునో చూద్దాం అనును.”

మరుసటి రోజు తిరిగి వచ్చును, ఆ పాప ఇంకా చాలా దిగజారుచున్నది. జ్వరము అంతకంతకు ఎక్కువగుచున్నది. ఆ మరుసటి రోజు మరల వచ్చినప్పుడు గుండె కొట్టుకొనుట చూచును. “ఓ! యాయీరూ, నీకు చెప్పుటకు నేను దుఃఖించుచున్నాను గాని ఆ పాపకు ప్రతి ముందుకు నేను ప్రయత్నిము చేశాను, కాని ఆమె నివారణకు ఏమీ దొరకలేదు. అంతకంతకు ఆమె దిగజారుచున్నది. యాయీరూ, ఆ పాపను నీవిక వదులు కోవలసినదేమోననిపించుచున్నది.”

“ఓ, డాక్టరు గారూ, మీరు అంత మాట నాకు చెప్పవద్దు,” అని అన్నాడు.

“అవును, యాయీరు, చెప్పలేకపోవుచున్నాను గాని నా వైద్యవృత్తి నాకు చెప్పచున్నదేమనగా, ఆమెకు నేను చేయుటకు లోకములో ఏ వైద్యము లేదు. ఆమె అంతకంతకు దిగజారిపోవుచున్నది. ఇక ఆమెపై ఆశను విడిచిపెట్టు. ”ఆమె ఆత్మకు దేవుడు కృపనిచ్చును గాక,' అని మాత్రమే నేను చెప్పగలను.“

39

ఆ వైద్యుడు తాను చేయకలిగినదంతయూ చేసెను. ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు. చిన్న యాయీరు దిక్కు తోచక ఇంట్లో అటు ఇటు తిరుగుచున్నాడు. సమయమంతా అతని హృదయములో వేధించుచున్న ప్రశ్న ఒక్కటే, “యేసు ఎక్కడున్నాడో నాకు తెలిసినచో బాగుండును.” మంచిది. నజరేయుడగు యేసు కొరకు కబురు పంపినచో ఎట్లుండునో నా పై అధ్యక్షుని అడిగితే ఎట్లుండును?“ అని ఆలోచించెను.

ఇప్పుడు, అది అతడి మనసులో ఉండెను. యేసు దానిని చేయును అని అతడికి విశ్వాసము ఉండెను. మీకు ఉందా? ఆయన చేయగలడు అని అతడికి విశ్వాసము ఉండెను. కావున, అతడు వెళ్లి యేసు కొరకు కబురు పంపినచో ఎట్లుండునో అని పై అధ్యక్షుని అడుగుటకు వెళ్ళవలెనని తలచెను.

కావున అతడు సమాజ మందిరపు అధిపతిని చూడవెళ్ళెను. వారన్నారు, “ఓ యాయీరూ, ఇది హాస్యాస్పదము. మనము మోషే శిష్యులము. మోషే అద్భుతములు జరిగించెనని మన మెరుగుదుము; కాని యాయీరు, అది వందల సంవత్సరముల క్రితము జరిగినది. అద్భుతములు జరుగు రోజులు అయిపోయినవి. ఈ రోజు వంటిది ఇక అప్పుడు లేదు. నీవు చేయకలిగిన ఒకే ఒక పని ఏమనగా, సంఘము యొక్క చివరి కార్యక్రమములు చేయనిమ్ము. ఆమెను శాంతిగా మరణించనీ. అదొక్కటే చేయవలసిన పని. అది దేవుని చిత్తము కావచ్చు. నీ వైద్యుడామెకు సహాయము చేయని యెడల ఆమె మరణించుట దేవుని చిత్తము.”

40

అదెంత తప్పు. ఆలాగు అది జరుగుతున్నంత సేపు యేసు పోరాటములో ఉన్నాడు, ఎందుకనగా యాయీరు యొక్క విశ్వాసము ఆయనను అక్కడికి లాగుకొని వెళ్ళినది. మీరు అందుకొరకే ఇక్కడున్నారు.

సమయమంతా ఆయన సముద్రమును దాటిపోవలెననియే చూచుచున్నాడు. ఒకటి లేదా రెండు రాత్రుల క్రితం యేసు సువార్తలో చెప్పినది ఏమనగా, “మొదట దర్శనములో తండ్రి నాకు చూపించితేనే గాని నేను ఏమియూ చేయజాలను.” అది నిజమేనా? యోహాను 5:19: “నేను మీతో నిశ్చయముగా చెప్పచున్నదేమనగా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచుని, అదే కాని తనంతట తానూ ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును అలాగే చేయును.” తానెందుకు వెళ్ళచున్నాడో ఖచ్చితంగా యేసునకు తెలియును. మరల ఒక ఆత్మ యొక్క పిలుపు. ఆయన సముద్రమును దాటుచున్నాడు.

41

మీరు తెలిసికొనవలసిన మొదటి సంగతి ఏమనగా, యాయీరు భార్య అతనిని ఎక్కడికి వెళ్ళియున్నావు?“ అనడిగినది. అతని భార్య స్వరము నేను వినగలను.

“కుమార్తె కొరకు ప్రార్థించుట కొరకు సంఘము యొద్దకు వెళ్ళియున్నాను.”

“ఇప్పటికే ఆమె స్పృహ లేకుండా ఉన్నది.”

“ఓ, మై.” అతడు ఇట్లనుటను ఊహించుచున్నాను. యేసును నేను కనుగొనినచో ఎంత బాగుండును! ఆయనెక్కడున్నాడో, ప్రవక్తను నేను నమ్ముచున్నాను. నేనాయనయందు విశ్వాసముంచుచున్నాను. ఆయన కార్యములు చేయుట నేను చూచాను. దానిని నేను లేఖనములలో అనుసరించాను. ఇది నా ఆహారపు చీటీ. ఈ సంఘ కాపరిగా ఉన్నందున మంచిదే గాని, ఆయనను కనుగొనినచో చాలును. ఆయన ఎచ్చటున్నాడో కనుగొనినచో చాలును.“

42

మంచిది, నీవు మొదట తెలిసికోవలసినది ఏమిటో తెలియునా, వీధిలో ఎవరో పరుగిడి వచ్చుచున్నారు, “కాపరీ, ఏమి జరుగుచున్నదో నీకు తెలియునా?”

“ఏమిటి?” ఎందుకు, జనులంతా గుమిగూడిరి. ఏడ్చుచూ సానుభూతి చూపుచుండిరి. వారు మంచి యధార్థపరులగు సంఘ విశ్వాసులు. అతడు తన కుమార్తెను పోగొట్టుకొనుచున్నాడు, మరయు ఒకరు వచ్చి ఇట్లనిరి, “నీకు తెలుసా? అంత శ్రమ తరువాత మేమిక్కడికి చేరియున్నాము, ఈ బాలిక మరణించుచ్నుది; అయినా నాకర్థమగుచున్నదేమనగా, ఆ గలిలయుడగు మూఢభక్తి గల ప్రవక్త ఇప్పుడే దరికి చేరియన్నాడు.”

ఆ సమయములోనే యాయీరు గుండెలో నిరీక్షణ గంతులేసినది. వినుట వలన విశ్వాసము కలుగును. అది నిజమేనా? యేసు వచ్చెనని ఎవరో చెప్పిరి. యేసు మృతులలో నుండి లేచెనని ఈ రాత్రి ఎవరో చెప్పుచున్నారు. ఎట్టి నిరీక్షణ. ఆమేన్.

అలసిన యాయీరు అనుకొనుచున్నాడు, “ఇప్పుడే ఆయనను నేను చూస్తే ఎంత బాగుండును! నేను వ్యక్తపరచుచున్నాను. ఓ, నా ఉద్యోగం పోవును. నా సంఘము పోవును. నేనేమి చేయుదును! నేను వెళ్ళకుండుటే మంచిది. వెళ్ళి చిన్న బాలికను చూచాడు. ఆమె దాదాపు చనిపోయినది. ఏం జరిగింది?

అతని హృదయాంతరంగములో దేవుడు పని చేయనైయున్నాడు. “యాయీరూ, ఇది నీ సమయం. దేవుడు క్రీస్తునకు ఒక దర్శనం ఇచ్చెను. దేవుడు వరుసలో రెండు వైపులా పని చేయును, చూచారా.

43

అతడు తన హృదయములో ఇట్లు తలంచుచున్నాడు, నేను వెళ్ళి ఆయనను చూచెదను. కావున అతడు శ్రీమతి యాయీరును పిలచెను, “ప్రియా, నేను ఒక సంగతి ఆలోచించుచున్నాను.”

“అవును, ప్రియా, ఏమిటది?” అన్నదామె.

“మంచిది, నీకు తెలుసు నేనిచ్చట సంఘ కాపరిని.”

“అవును, కదా! అయితే ఏమిటి? ఆమె యొక్క సమాధి కార్యక్రమమునకు ఎవరిని పిలచుచున్నారు?”

“మంచిది, నేను ఆ కార్యక్రమము గూర్చి ఆలోచించుట లేదు. కొంత సేపటి క్రితం నేను సరస్సుకు అవతల నేనున్నప్పుడు గలిలయ ప్రవక్తను చూచాను. ఒక రోజున ఆయనెక్కడో అద్భుతం చేయుట చూచి ఆశ్చర్యపోయాను. అతడు మన కుమార్తెకు, మన బిడ్డకు సహాయము చేయగలడు అని నమ్ముచున్నాను. నీవును ఆలాగు అనుకొనుట లేదా?”

ఆమె అన్నది, “ప్రియమైనవాడా, నేనును ఆలాగే తలంచుచున్నాను.”

“నీవు దానిని అంతా నమ్ముచున్నావా?”

“అవును.”

“నేనూ ఆలాగే నమ్ముచున్నాను.”

ఓ, మై. ఆ ఇంటిలోనికి సమాధానము బహు త్వరగా వచ్చుచున్నది. తల్లిదండ్రులు దేవునితో సరయినప్పుడు ఆశ్చర్యము జరుగనైయున్నది.

“నీవు ఇష్టపడుచున్నావా? వారు నన్ను వెలివేయవచ్చును. అయినా నన్ను హత్తుకొందువా?”

ప్రియమైనవాడా, కుడి అయినా, ఎడమయినా నేను నీ ప్రక్కనే ఉందును. అది నా పెండ్లి ప్రమాణము. నేను నీతోనే ఉందును. నీవాయనను తీసికొని వచ్చుటకు వెళ్ళినా గాని, నీవు వచ్చు వరకు మోకాళ్ళపై ప్రార్థించుచునేయుందును. మనుష్యులు ఏమన్నా గాని పరవాలేదు. మనం దేవుని నమ్ముదాం. సంఘము వారికిష్టమొచ్చినది అనుకొననీ గాని మనము దేవుని నమ్ముదాం. అంతే. నీవు సరయిన రీతిలో ఉన్నావు. అంతే! అది దర్శనము. “మేము దేవునిని నమ్ముదుము. ఆమేన్. సరే, మంచిది. మిగిలిన వారందరూ.... దావీదు చెప్పెను, ”నేను నా ఇంటివారు యెహోవాను సేవించుదుము.“ అది మంచిది. పొరుగు వారేమన్నా పరవాలేదు. ఎవరేమి చెప్పినా గాని; ప్రభువును సేవించుదం.

44

అలసిపోయిన యాయీరు ఇట్లు తలంచియుండును. అతడు లేచి తన యాజక టోపీని ధరించుకొని బయటకు నడచుచున్నాడు. మొదటగా అతడు సమాజములోని కొందరిని కలిసికొనియుండును.

“ఎక్కడికి వెళ్తున్నావు, యాయీరూ?”

ఓ, మై. ఇప్పుడు నేనేమి చేయాలనుకొనుచున్నాను? నా నిజరూపం చూపించాలి. నేను మోసగానిగా ఉండాలా? దానిని కాదన్నచో నేను భయపడినట్లే. అప్పుడాయన నాతో కూడా రాడు. నేను నిజమైన సైనికునిగా ఉండవలెను.

అదే మార్గము. అంతే. “మంచిది, సంఘమా! ఇప్పుడు నేను మీకు చెప్పగోరుచున్నాను. నేను సరస్సు నొద్దకు వెళ్ళుచున్నాను. యేసు వచ్చెనని నేను ఇప్పుడే విన్నాను. (ఆమేన్.) యేసు చేరుకొనెనని ఇప్పుడే విన్నాను.”

ఓ, మై. నేను చాలా భక్తిపరవశముతో నిండిపోయాను. “యేసు వచ్చెను. ఆయనను తీసికొని వచ్చుటకు వెళ్ళుచున్నాను.”

“పాస్టరు గారూ, అంత సాహసం అవసరమా? నీవు తెలివైన వాడివనుకొన్నా గాని ఇంతగా దిగజార్చుకొందువా? నీ బి.ఏ, నీ డిగ్రీ ఇవన్నీ ఏమైపోయాయో? నీ క్రొత్త డిగ్రీ ఎల్.ఎల్.డి ఈ మధ్యే నీకిచ్చారు గదా? ఆ పరిశుద్దుల గుంపుగా పిలువబడుచున్న వారితో నీవు కలిసి పోదువా?”

ఏమిటిది? “నికోదేము వలె రాత్రి ఆయన యొద్దకు వెళ్ళుదునని” చెప్పలేదు. హూ. హూ. అవసరత అప్పుడే ఏర్పడినది. సోదరుడా, ఎదురు చూడలేము. ఈ రాత్రి అంతే. మనము ఆగలేము.

45

ఈ రాత్రి వార్తలు విన్నారా? మీ వార్తాపత్రికలు చదివారా? ప్రపంచమంతా అపాయములో ఉన్నది. సూయజ్ కాలువను చూడండి. మూడవ ప్రపంచ యుద్ధము రానున్నది. ఒక అణు యుద్ధము. ఆమె అల్లుకొనుచుండగానే అది సంభవించవచ్చును. మొదటి అణుబాంబు ఎవరు పేల్చుదురో వారే ముందుందురు.

సంవత్సరపు ఈ కాలములో ఎప్పుడూ లేనంత వేడిగా ఇక్కడి ఈ ప్రాంతమున్నదని మీ వార్తాపత్రికలు వ్రాయుచున్నవి. చాలా స్థలములు ఆలాగే ఉన్నవి. ఎందువలన? అణుబాంబులు తన పరిధిలో నుండి భూమి యొక్క సూర్యుని యొక్క పరిధిలోనికి భ్రమించుచున్నవి. ఏలాగు జరుగునని దేవుడు చెప్పెనో ఆలాగే జరుగును.

సమయము సమీపించినది. ఎదురుచూచే సమయం లేదు. బహు త్వరగా యేసు నొద్దకు వెళ్ళుదము. “బ్రెన్హాం సోదరుడా! నీకు విద్య ఉన్నదా? మీకు తెలుసా...” అని మీరనవచ్చు.

నాకు విద్య లేకపోవచ్చు, కాని నేను మాట్లాడుచున్నది నాకు తెలియును. గ్రంథము మరీ అంతగా నాకు తెలియక పోవచ్చును, కాని వ్రాసిన వానిని ఎరుగుదును... గ్రంథకర్తను బాగుగా ఎరుగుదును. సమాయత్తము కండి. ఇక ఏ మాత్రము ఎదురు చూడలేము. మురికివాడు ఇంకా మురికి వానిగా ఉండనిమ్ము. పరిశుద్దుని ఇంకా పరిశుద్దునిగానే ఉండనిమ్ము.

నీ తీర్మానపు ఘడియ ఇదే. నీకు అవకాశము ఇదే. ఆఖరు రాత్రి కావచ్చు. మనకు తెలియదు. యాయీరు వలె నీవు నీ గుండెను ధైర్యంగా ముందుకు చాపవలెను.

46

“మీరు నన్ను బహిష్కరించినా నాకు లెక్క లేదు. నన్ను వెలివేసినా పరవాలేదు.” ఓ, అతని యొద్ద కొంత పరిశుద్ధ ధైర్యమున్నది. ప్రతి ఒక్కరికి అది అవసరము. నీ హక్కుల కొరకు నిలబడుము. “కాని నేను నజరేయుడగు యేసు వెంట వెళ్ళెదను.”

ఎవరో వెళ్ళి, ప్రధాన అధిపతికి చెప్పారు, “వానిని దాని ప్రక్కకు ఈడ్చేయండి. వానికి మతిపోయింది. పిచ్చివాడయ్యాడు. పరిశుద్దుల గుంపని వారితో పోతుండెను. ఇది నిజము. మతి భ్రమించింది.”

లోకం ఆలాగే వారిని పిలచును. పిచ్చివారు, ఉన్మాదులు అని పిలచుదురు. ప్రధాన అధికారులు, సంఘాధికారులు అందరూ వచ్చెదరు. రహదారి మూలన వారందరూ కలిసికొని ఇతనిని అపహాస్యము చేసినారు. “ఏమయ్యా ఎక్కడికి వెళ్ళుచున్నావు?

అతని హృదయములో ఏదో కదులుచున్నది. అది నీ హృదయంలోనికి వెళ్ళినట్లయితే, ఎవరు నిన్ను ఆపగోరినా నీవు లెక్క చేయవు. అది నిజం. దేవుడు ఆ హృదయంలో పని చేయుట ప్రారంభిస్తే లోకంలో ఉన్నది గాని, నరకంలో ఉన్నది గాని ఏదీ నిన్నుఆపజాలదు. ఏలాగయినా నీవు వెళ్ళెదవు.

47

ఆయన వారికి మంచి మాటను ఇచ్చుట నేను వినగలను, “నిలబడు. నజరేయుడగు యేసును చూచుటకు నేను దారిలో ఉన్నాను.” ఆమెన్. హల్లెలూయా. “నేను నా దారిలో ఉన్నాను. ఆయన మాత్రమే ఇప్పుడు నాకు సహాయము అందించగల సమర్దుడు; నేను నా దారిలో ఉండగా నీవు ఏమిచేస్తావో అని చింత నాకు లేదు. నా యొక్క ప్రసంగికుని పట్టా నీకు కావలయునా, నీవు దానిని తీసుకొనవచ్చును. అవన్నియు అక్కడనే ఉన్నవి. వాటిని తీసుకొనుము, ఎందుకంటే నేను నా దారిలో ఉన్నాను.” ఆమేన్.

ఈ రాత్రి సంఘము ప్రారంభించవలసినది అదియే. ప్రజలు ప్రారంభించవలసినదియూ అదియే. పురాతనకాలము నుండి ఆరాధన చేస్తున్న ఆ ఎండిపోయిన, చచ్చిపోయినటువంటి ఆ థియాలజీని విసిరివేసి పునరుత్థానుడైన ప్రభువైన యేసును కనుగొనుము. ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడును, సర్వాంతర్యామియై యున్నాడు. పునరుత్థానము చెంది గలిలీయ తీరమున నడచిన దినములలో ఉన్నవానిగానే, ఇప్పుడునూ ఉన్నాడు.

48

“నా దారిలో...” అతడు యేసును చూచినప్పుడే...

ఆ స్త్రీ స్వస్థతను పొందుకున్నది. అక్కడ నిలబడి యేసు ఇలాగు చెప్పుట నేను చూస్తున్నాను, “కుమారీ, ఇదంతయు నీ విశ్వాసము వలన జరిగినది, సంతోషముగా ఉండుము.”

యాయీరు చెప్పెను, “ఓ, ఏమి జరిగినది? ఆయనేం చేస్తున్నాడు? ఆయన ఏమి చెప్పుచున్నాడు?”

పాలిపోయినటువంటి ఆ స్త్రీ వచ్చి ఇలాగు చెప్పుట నేను చూస్తున్నాను, “ఓ, హల్లెలూయా. దేవునికి మహిమ. దేవునికి స్తోత్రము.” ఆమె ఇక్కడకు అరుచుకుంటూ వచ్చింది.

యాయీరు, “ఒక్క నిముషము ఆగండి, మేడమ్, నేను మీతో కొద్దిసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను. అదేమిటి? ఏమి జరిగింది?”

“మంచిది, గతములో నాకు రక్తస్రావపు సమస్య ఉండేది.”

“ఓ, నీవు ఈ గుంపుతోనే ఉండేదానివా?”

“అవును, హు. హు. నాకున్న రక్తస్రావపు సమస్య నుండి స్వస్థత పొందుకున్నాను.” ఓ, ఆమె ఎంత సంతోషంగా ఉన్నదో.

అతడు నడవటం ప్రారంభించి, యేసుతో ఇలాగు చెప్పెను, “ఇప్పుడు, నీవు నా ఇంటికి వచ్చి మరణపు అంచున ఉన్న నా కుమార్తె మీద నీ చేతులుంచుము, అప్పుడు ఆమె బాగుపడుతుంది.”

49

యాయీరును చూడండి. అతడు ఇలా అన్నాడు, “నీవు వచ్చి ఆమె మీద చేతులుంచుము.” అతడు ఒక యూదుడైయున్నాడు. అది యూదుల యొక్క విశ్వాసము. వారు మీద చేతులుంచి ప్రార్థించుటయందు విశ్వాసముంచుతారు.

రోమీయుడు దానిని ఆశించలేదు. రోమీయుడు ఇలా అనెను, “నీవు మాట మాత్రము సెలవిమ్ము. నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను.” “నేను అధికారము క్రింద ఉన్నాను, నేను ఒక శతాధిపతిని, నా క్రింద నూరు మంది పనిచేస్తారు. నేను చెప్పిన ప్రతిదానిని వారు చేస్తారు. నేను ఒకరిని వెళ్ళమంటే, వెళతారు. ఇంకొకరిని, రమ్మంటే, వారు వస్తారు. నేను వారి మీద అటువంటి అధికారము కలిగియున్నాను.”

అతడు యేసుతో ఏమి చెప్పుచున్నాడు? “శరీరములో ఉన్న దేవుడిని నీవని నేను గుర్తించాను.” అది సత్యము. “ప్రతి వ్యాధి మరియు ప్రతి పాపము నీ అధికారము క్రింద ఉన్నాయని నేను గుర్తించాను.” హల్లెలూయా! “అవి అన్నియు నీ తీర్పులో ఉన్నాయి. ఆ కార్యము నీవు చేయగలవు. నీవు వాటితో మాట్లాడగలవు. ప్రతి దురాత్మ దానిని అంగీకరిస్తుంది.” ఆమేన్.

ఆయన వెనుకకు తిరిగి ఇలా అనెను, “ఇటువంటి విశ్వాసమును నేను ఇశ్రాయేలియలో చూడలేదు.” “నీ మార్గములో నీవు వెళ్ళము, నీవు నమ్మినదానిని బట్టి నీకు జరుగును.” ఆ బాలుడు స్వస్థత పొందుకొనెను.

50

ఒక రాత్రి పేతురుకి వాక్యము బోధింపవలసియుండెను. సముద్రములో మునిగిపోవుటకు సిద్ధముగా ఉన్న ఒక చిన్న పాత పడవలో అతడు ఉండెను, తనకున్న ఆశంతా కోల్పోయున్నాడు. మొదటి సంగతి మీకు తెలుసా, వారు మరణిస్తామనే భయముతో పెద్దగా కేకలు పెట్టుచున్నారు, ఎందుకు, నీటి మీద నడుచుకుంటూ యేసు వారివద్దకు వచ్చుచున్నాడు. వారు ఆయనను చూచి భయపడియున్నారు. వారిని ఎవరైతే కాపాడగలరో, ఆయనను చూచి వారు భయపడుతున్నారు, ఎవరైతే రక్షించగలరో ఆయనను చూచి వారు భయపడుతున్నారు, ఆయనను చూచి వారు భూతమని అనుకున్నారు. దానిని బట్టి వారు భయపడుచున్నారు.

ఈ ష్రివ్-పోర్టులో ఉన్న ప్రజలు కూడా అదే మాదిరిగా ఉన్నారు. అది సత్యము. మీకు సహాయము చేయగలిగినది ఒక్కటే, మిమ్ములను కాపాడగలిగినది ఒక్కటే, నిన్ను స్వస్థపరచగలగినది ఒక్కటే, నీ పాపము నుండి నిన్ను స్వతంత్రునిగా చేయునది ఒక్కటే, నీకున్న ప్రతి అలవాటు నుండి బయటకు తీసుకొని రాగలిగినది ఒక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మము మాత్రమే; మరి నీవు మాత్రం దాన్ని చూచి భయపడుతున్నావు. అది సత్యము.

51

ఈ కలవరపాటు కలిగిన సమయములో... ఓడలు కలసి ప్రయాణం చేయుట, హెలికాప్టర్లు నాశనకరమైన శబ్దము చేయుట ఎప్పుడైనా వినియున్నారా, నిరాశలో ఉన్న రాజ్యములు, గొప్ప సూచనలు, సముద్రపు పోటు అలలు గర్జిస్తున్నాయని ఎన్నటికి తెలయబడటం లేదు? నీవు అంత్యకాలములో ఉన్నావు.

ఆ యూదుల కాలములో ఉన్నట్లుగానే, పరిశుద్ధాత్మ యొక్క వెలుగు ముందుగా ప్రసరించుచున్నది. ఆ కాలములో ఉన్నట్లుగానే నేడును ఉన్నది. వారు తూర్పు ప్రజలైయున్నారు. సూర్యుడు వారి మీద ఉదయించి, వారికి సజీవుడును ప్రభువైన యేసు యొక్క సూచనలను మరియు అద్భుతములను చూపించుచున్నాడు.

ఈ చివరి దినములలో ఆయన సాయంకాలపు వెలుగునిస్తాను అని వాగ్దానము చేసియున్నాడు, ప్రపంచములో మనము పశ్చిమ వైపున ఉన్నాము. అంతయూ గతించిపోయినవి, ఆ వెలుగు అస్తమించుచున్నది, మృతులలో నుండి లేచిన క్రీసు మన మధ్యలో జీవించుచున్నాడని రుజువు పరచుకుంటున్నాడు.

52

సామాన్యమైనవారు, విద్య లేనివారు సత్యము మాట్లాడుచున్నారు. దేవుడు వాక్యమును స్థిరపరచుచున్నాడు. అనేకులగు దుర్నీతిపరులున్నారు. నాకది తెలుసు. దానిని మనము అంగీకరించాలి. అనేక మంది ఛాందసపరులున్నారు. అది సరియే, కాని గుర్తుంచుకొనండి, ఒక నకిలీ నోటును నీవు చూచినప్పుడు నిజమైనది తయారు చేయబడినదని గ్రహించాలి. అది సత్యమును విశదపరచుచున్నది. నిజం. ఈ సాయంకాల సమయములో ఒక నిజమైనది ఉన్నదని మాత్రమే చూపించుచున్నది.

పేతురు ఇట్లనెను, “ప్రభువా, నేను నీ గూర్చి భయపడుచున్నాను. దానిగూర్చి ఏమి ఆలోచించాలో నాకు తెలియుట లేదు; కాని అది నీవే అయినచో, వాక్యములో చూడనీయండి. నీటి మీద నన్ను నడువనిమ్ము. నీ మాటను విననిమ్ము.”

ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమునకు నీవు భయపడినట్లయిన అది వాక్యములో నీ కొరకు ఉన్నదో లేదో చూడనిమ్ము. మొదటిసారి పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినమున వచ్చినప్పుడు, వారు కేకలు వేయుచూ గంతులు వేసిరి. ఈ రోజున మీరు వారిని ఏమందురు... పెద్ద భక్తిపరులని హేళన చేసెదరు. వారు గంతులు వేయుచు, నాట్యము చేయుచూ, పడుచున్నారు.

53

వారు త్రాగినవారివలె ప్రవర్తించిరని బైబిలు చెప్పుచున్నది. అది నిజమేనా? పేతురు అక్కడ ఒక చిన్న మొద్దు మీద నిలబడి, సబ్బుపెట్టె మీదనో, మరిదేనిపైనో దొరికిన దానిమీద నిలబడి ఇట్లనెను, “యూదయ, యెరూషలేము నివాసులారా, ఇది మీకు తెలియబడవలెను. నా మాటలు వినుడి. మీరనుకొనుచున్నట్లుగా వీరు మధ్యముతో మత్తులు కారు. ఇంకా పగలు మూడవ జాము కాలేదు. ప్రవక్తయగు యోవేలు ద్వారా పలుకబడినది ఇదే. అంత్యదినములలో సర్వశరీరుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను.” ఇంకా చెప్పెను, “వారు ప్రవచించెదరు. సూచనలన్నియు కనబడును.”

వారు దీనిని వినినప్పుడు తమ హృదయములలో పొడువబడిన వారైరి. వారు ఏ మాత్రము భయపడలేను. “రక్షించబడుటకు ఏమి చేయవలెను?” అనడిగిరి.

పేతురు ఇట్లనెను, “మీ ప్రతిఒక్కరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని చెందును. ష్రివ్-పోర్టులోను, లూసియానీలోను ఆ విధంగా చెప్పుకొన్నచో, భూదిగంతముల వారికందరికిని చెందును. ఎక్కడయితే ఈ సువార్త ప్రకటించబడుచున్నదో, వారందరికిని చెందును. దేవుడు జనులను పిలచుచున్నాడు. పరిశుద్ధాత్మ వారికి అదే రీతిగా యున్నది. అది వాక్యము. ”మన ప్రభువగు దేవుడు ఎవరిని పిలచుచున్నాడో, వారందరికిని చెందును.“ అది వాక్యము.

54

ఇప్పుడు బయటకు వచ్చి నడక ప్రారంభించుము. ఆమేన్! ముసలి వేదాంత విద్య నుండి బయటకు రమ్ము, దానిని నీవు కప్పుకొనియున్నావు. ఈ రాత్రి ఈలాగు చెప్పుము, “దేవా! నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఎవరు ఏమనుకొన్నా గాని నాకక్కరలేదు.”

పేతురు ఇట్లనెను,“ ప్రభువా, అది నీవే అయితే....”

“నేను భయపడుచున్నాను గనుక పొరపాటు చేయుదునేమో?” నీవనవచ్చు.

నీవు కూర్చొన్నచోటనే ఉన్నచో తప్పక తప్ప చేయుదువు. అది నిజం. మనుష్యుల కొరకు నా యొద్ద క్రీస్తు ఉన్నాడు. దోనె మీద నుండి పేతురు అడుగు దించినప్పుడు నాకు అతని పట్ల చాలా గౌరవమున్నది. అతడు తప్పు చేసెను.

అతడు చుట్టూ చూచి, “నేను పొందాను పిల్లలారా, నేను పొందాను,” అని ప్రారంభించెను. మునిగిపో నారంభించెను. నీవు గొప్పలు చెప్పుకొంటూ వెళ్ళవలసినపనిలేదు. నీవు పరుగిడి వెళ్ళి దాని గూర్చి సాక్ష్యమియ్యవలెను. లోకమునకు యేసుక్రీస్తు గూర్చి చెప్పవలెను. నీ గూర్చి కాదు. ఆమేన్.

నీ గూర్చి నీవు గొప్పలు చెప్పవద్దు. ఆయన గూర్చి గొప్పగా చెప్పు, ఆయనకు చెందిన చోట దైవత్యమును ఆపాదించుము. శక్తి మరియు స్తుతి ఆయనకిమ్ము, ఏదో ఒక బోధకునికి కాదు. మరెవరి మీదనో పెట్టుట కాదు. నీవేదో గొప్పవానిగా అతిశయపడవద్దు. దేవుని కృప నిన్ను అందుకు పిలచినది. అది నిజం.

55

ఇక్కడాయన నడచుటకు ప్రారంభించెను. నీళ్ళ మీద నడిచెను. వాక్యము వినిన వెంటనే, వినుట ద్వారా విశ్వాసము కలుగును. వాక్యమును వినవలెను చూడండి. పేతురు వాక్యము వినెను. అది నిజం.

యేసు వచ్చుచున్నాడని మార్త వినెను. ఆమె ఆయన యొద్దకు వెళ్ళి తన సోదరుని పునరుత్థానము పొందెను. చూడండి. అది నీతి విశ్వాసము ప్రకారమే. మందసమును యాజకులు సిద్ధపరచిరి. నీటిలో వారు కాలుమోపుటయే వారి యొక్క విశ్వాసము. వారి పాదములు నీటిని తాకిన వెంటనే సముద్రం.... యొర్దాను తెరువబడెను. వారి విశ్వాసము నీటిని తాకుటయే.

ఒకసారి ఒక గ్రుడ్డివాడు సిలోయమను కొనేటిలో కడుగుకోవలెనని వాక్కు చెప్పెను. అతని కన్నుల మీద ఉమ్మి ఊయవలెను. యేసు నేలమీద ఉమ్మి వేసి, దానిలో బురదను చేసి కడుగుకోవలనెను. ఈ రోజు ష్రివ్-పోర్టులోని ఆరోగ్యాధికారులు ఏమి చెప్పెదరు? అక్కడ నిలబడి అతనితో మాట్లాడుము. [సహో బ్రెన్హాం ఉమ్మి వేయ శబ్దము చేయుచున్నాడు.] నేలమీద ఉమ్మి వేయుచూ మాట్లాడుచున్నాడు. [ఉమ్మివేయుచున్న శబ్దమును బ్రెన్హాం సోదరుడు చేయుచున్నాడు.] దానిని ఆయన చేతులకు రుద్ధి ఆ బురదను అతని కళ్ళకు రాసి సిలోయమును కోనేటిలో కడుగుకొనుము,“ అప్పుడు చూపు కలిగెను. ఆమేన్.

దైవజీవము నిచ్చు కోనేటిని కనుగొనుటకు! హల్లెలూయా, పరిశుద్ధాత్మను కనుగొనుట అతడు జీవమును కనుగొనుటయే. స్వస్థతను సంతోషమును సమాధానమును కనుగొనుటయే. ఈ రాత్రి క్రీస్తును కనుగొనుము. ఆమేన్.

56

నీ విశ్వాసము ఎక్కడ నిలచియున్నది? నీవు విశ్వసించు దానిని బట్టియే. నీ విశ్వాసము ప్రకారమే. యాయీరు వచ్చి నా కుమార్తె మీద చేతులుంచుము. ఆమె బాగుపడును, అనినచో వేరుగా నుండును. ఇక్కడికి ఆయన వచ్చెను. హృదయము స్థిరపడు వరకు చిన్న చలనము నడిపించుచుండెను. తన తలను పైకెత్తి యేసుతో కూడా నడుచుచుండెను “ప్రభువా, నేను తీర్మానము చేసికొనినందుకు చాలా సంతోషముగా ఉన్నాను.

చింతపడవద్దు. తీర్మానము చేసికొనిన వెంటనే, అపవాది నీకు కుదుపు ఇవ్వగోరును. చింతపడవద్దు, నాకు తెలిసినంత వరకు వాడికంటె పెద్ద మోసగాడెవ్వరూ లేరు. కేవలము మోసము. నా మాట వినుచున్నారా? వాడు మోసగాడు. వాడంతా అంతే వాడికి ఒక్క నైతిక శక్తి కూడా లేదు. వాడికున్న సమస్తమును యేసుక్రీస్తు కల్వరిలో తుడిచి వేసెను. కల్వరిలో మొత్తం పాపపు జరిమానా చెల్లించెను. అపవాదికి ఎట్టి చట్ట పూర్వక హక్కులు లేవు. వాడు ఒక పెద్ద మోసగాడు.

నీవనవచ్చు, “మా అమ్మ నన్ను త్రోసివేయును. మా నాన్న...” నేను లెక్క చేయను. అపవాది చెప్పినది అక్కరలేదు. యేసు నిన్ను చేర్చుకొనును. నీవు ఆనందముగాను, సమాధానముగాను ఉందువు. వాడు కేవలము ఒక మోసగాడు.

57

యేసును కలిసికొనిన తరువాత యాయీరు యొక్క అనుభవము చాలా మంచిగా ఉండెను. కలిసి వెళ్ళారు. “నాకిప్పుడు నిజమగు నిరీక్షణ దొరికినది. నా పాప బాగుపడుటకు సిద్ధముగా ఉన్నది. అవును. ఆయన అక్కడికి వెళ్ళును. ఏదో ఒక విధంగా పరిచర్య చేయును. ఆయన ఆమె మీద చేతులుంచును. మీరు మొదట తెలిసికోవలసినది ఏమనగా, ఆ పాప బాగవుట ప్రారంభమగును. ఆమె బాగవును. అవునండీ.”

అతడు తనను తాను నమ్మట జరిగెను. సమూహముతో ముందుకు త్రోసుకొనిపోయెను. చాలా బాగుండెను. “ఈ వచ్చుచున్నది ఎవరూ?” ఇదిగో, ఒకాయన వచ్చుచున్నాడు. మామూలుగా ఒక దుఃఖ వర్తమానము ఎట్లుండుననగా, వారి తలల మీద బూడిదె లేదా మురికి ఉంచుకొందురు. వారు పరుగెత్తుతూ వచ్చెదరు. అయితే ఇక్కడ ఆశ్చర్యము! వీధిలో ఏమి జరిగినది? ఏమి జరిగినదో ఆశ్చర్యమే. ఇదిగో పరుగెత్తుకొని వచ్చుచున్నాడు.

“యాయీరు! నన్ను ఎరుగుదువా?”

“అవును.”

“ఇక బోధకుని శ్రమపెట్టవద్దు యాయీరూ.”

“ఏమి ఎందుకు?... ఎందుకని? ఏమి జరిగినది?”

“నీ కుమార్తె ఎప్పుడో చనిపోయినది. ఇంకాయనను శ్రమపెట్టవద్దు.”

ఓ, ఆయన తిరిగి వెళ్ళుట నాకు కనబడుచున్నది. పేతురు దోనెలో మునిగిపోవుచున్నట్లే యున్నది. దానిని గూర్చి యేసు ఏమి చెప్పనైయున్నాడో చూచుటకు తన కన్నులు త్రిప్పెను.

58

ఆయన దానిని గూర్చి ఏమి చెప్పనైయున్నాడో చూచుటకు ఎందుకు తిరగవు? “లోకము నన్ను త్రోసివేసినది” అని నీవనవచ్చు. ఆయన దాని గూర్చి ఏమి చెప్పునో చూద్దాం. “నేను చనిపోవుదును” అని వైద్యుడు చెప్పవచ్చు. అయితే ఆయన దాని గూర్చి ఏమి చెప్పునో చూద్దాం.

యేసు దానిని గూర్చి ఏమి చెప్పునో చూచుటకు యాయీరు తన తల చుట్టూ త్రిప్పెను. ఆ చక్కని నేత్రములు అతని వైపు చూచుట కనబడుచున్నది. ఇట్లనెను, “భయపడకుము. నమ్మిక మాత్రముంచుము నీవు దేవుని యొక్క మహిమను చూచెదవు.” మహిమ. అది వాక్యము.

యాయీరు తన గుండెను కొట్టుకొనెను. ఉండకలిగినంత ధైర్యముగా ఉండెను. అవతలికి వెళ్ళెను. ఇదిగో, విలాపము చేయువాడు వచ్చుచున్నాడు. “బూ-హూ, ఆమె వెళ్ళిపోయినది. ఊ. ఆమె వెళ్ళిపోయినది.”

యేసు యాయీరు వైపు చూచెను; చాతి బయటకు చూపుచుండెను, ముందుకు వెళ్ళుచుండెను, దృష్టి మరెటు పెట్టలేదు, దారిలో నిరాటంకముగా వెళ్ళుచుండెను.

మీరు తెలిసికొనవలసిన మొదటి సంగతి ఏమనగా, రబ్బీ లెవెన్ స్కీ అచ్చట నిలబడి యుండెను. మిగిలిన రబ్బీలందరూ తమ చేతులు ముడుచుకొని ఈలాగు నిలబడియుండిరి. “ఆహా, ఇప్పుడు మీరు వెలివేయబడి యున్నారు. నీ కూతురేమీ చనిపోయింది. వైద్యుడు ఇప్పుడే వెళ్ళిపోయాడు. సహాయకులు మాత్రమే యున్నారు. ఆమెకు సుగంధ ద్రవ్యములు పూయుదురు, పడుకోబెడుదురు, ఆలాగు బయట చెప్పెదురు. ఏమయిందో చూచావా? ఇప్పుడు నీకు పని పోయింది.” అయితే యాయీరు వారొక్క మాట కూడా తనతో మాట్లాడలేదన్నట్లు మౌనంగా ఉండిపోయెను.

ఇదిగో, సంఘమంతా వచ్చినది, “కాపరీ! నీ గూర్చి మేమంతా సిగ్గుపడుచున్నాము.” అతడప్పటికే యేసు యొక్క మాట వినెను. ఆయనతో అప్పటికే సంబంధమేర్పరచుకొనెను. అతనికి ఒక నిశ్చయత దొరికినది. యేసు ఆ ప్రకారము చెప్పినచో ఇక అంతే! అది మాత్రమే అవసరము.

59

ఇంటి యొద్దకు నడచి వెళ్ళెను. వారంతా ఏమనుచున్నారనగా, “ఓ, ఆమె వెళ్ళిపోయింది. చనిపోయింది. పాపం, ఆ చిన్నది నిన్ననే చనిపోయింది.[టేపుపై ఖాళీ యున్నది.] సుగంధ ద్రవ్యములు పూసిరి. ఆమెలో రక్తము లేదు.

ఆకస్మత్తుగా ఆమె పెదవులు ఎరుపు రంగులోనికి మారుచున్నవి. ఆమె నుదుటి మీద మడతలు కదలుచున్నవి. ఆమె యొక్క పెద్ద నీలి రంగు కన్నులు తెరచుకొన్నవి. ఆమె “డాడీ” అన్నది. చుట్టూ కలియ చూచినది.

యేసు ఆమెను తన చేతితో పట్టుకొని, “ఇప్పడామెకు తినుటకు ఏమయినా పెట్టండి.” మహిమ. అదే ప్రభువైన యేసు ఆయన సర్వశక్తిమంతుడు.

నేను మృతుడనైతిని గాని ఇదిగో సదాకాలము జీవించుచున్నాను. నేను మృతులలో నుండి లేచియున్నాను. పంతొమ్మిది వందల సంవత్సరములు గడిచినది. అదే ప్రభువైన యేసు ష్రివ్-పోర్టులోను, లూసియానాలోను ఈ గుడారము క్రింద యున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.

ఈ మాట నేను చెప్పినందుకు తీర్పు దినమున నేను జవాబు ఇయ్యవలసియున్నానని ఒక్క భయము కూడా లేదు, ఎందుకనగా ఆయన ఇచ్చటున్నాడు. నేనాయనను తాకుచున్నాను. ఆయన మాట యొక్క ప్రతిచర్యను నేను చూచుచున్నాను. వారికిచ్చిన ఆయన వాక్యము ఆత్మతో నింపబడియున్నది. వారు కేవలము రొట్టె మాత్రమే తిను పిల్లలు కారు, కాని దేవుని నోటినుండి వచ్చు వాక్యమును భుజించువారు. వాక్యము బయలు వెళ్ళునప్పుడు అక్కడున్న ఆకలిగల పిల్లలు, “తండ్రీ, నీకు వందనములు, తండ్రీ నీకు వందనములు” అని చెప్పెదరు. ఓ, అది నాకిష్టము, తండ్రీ; దానిని ప్రేమించుచున్నాను.

తినుట అనగా రొట్టెలు, ముక్కలు తినుట కాదు, మరిగిన పులుసు తినుట కాదు. వారు నిత్యమగు దేవుని వాక్యము మీద పోషించబడుచున్నారు. ఆత్మ సంబంధమగు వాతావరణములో వారి ఆత్మలను నింపుకొనుచున్నారు.

60

ఆయనిక్కడున్నాడు. ఓ, ఇది లోకమునకు వింతగా కనిపించును. నిశ్చయంగా ఈ తరము యొక్క అన్ని యుగములలోను జరిగియున్నది. రానున్న యుగము కొరకు ఎదురు చూడండి. ఇది మానవుని దినము. ప్రభువు యొక్క దినము వచ్చును.

ఇపుడాయనను సేవించెదము, ఆయన వచ్చు ఆ దినమున మనము నమ్మకస్తులముగా కనుగొనవలెను. మనము నిద్రించినను లేక సజీవముగా యున్ననూ సరే. కడబూర మ్రోగగానే, మనము మేల్కొనబడుదము, పునరుత్థానపు సౌందర్యములో తిరిగి లేచెదము. ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్దులమగుదుము. ఆయన శక్తిలోను, పునరుత్థానములోను పాలుపొందుము. ఇప్పుడు మనము మన రక్షణ సంచకరువును పొందుచున్నాము. ఆమేన్. ఆమేన్.

ప్రార్థించుదుము. మన శిరములు వంచి యుండగా, ప్రతి నేత్రము మూయబడి యుండగా, దయచేసి క్రైస్తవులు ప్రార్ధించండి. ఈ రాత్రి ముడి సువార్తను ప్రకటించి యున్నాము. దానికి ఏ ముసుగు ధరిపంజేయలేదు. అందుకే ఈ రాత్రి ఆశ్చర్యపడుచున్నాను. పరిశుద్ధాత్మ ఏలాగు చెప్పవలెనని కోరెనో, ఆలాగే ముందుకు త్రోసియున్నాము. ఈ రాత్రి నేను ఆశ్చర్యపడునది ఏమనగా, ఈ గుడారము క్రింద ఒకరయినా, “ప్రభువైన యేసూ, నిన్ను నమ్ముచున్నాను, నీకు సేవచేయుదును, ఈ రాత్రి నా రక్షకునిగా యేసూ, నిన్ను అంగీకరించగోరుచున్నాను” అని చేతులెత్తి చెప్పగోరుచున్నాను. ఆలాగు ఒక్కరయినా చేతిని ఎత్తుదురా?

61

అయ్యా, దేవుడు మిమ్ము దీవించును. దేవుడు దీవించును. దేవుడు మిమ్మను దీవించునండీ. దేవుడు మిమ్ము దీవించును. దేవుడు దీవించును. యువకుడా, దేవుడు నిన్ను దీవించును. యువతిని దీవించును. ఆ సేవకుని దేవుడు దీవించును. ఇంకా ఎవరయినా ఉన్నారా? ఇదిగో ఇక్కడున్న వారిని దేవుడు దీవించును. ఎవరైనా ఉన్నారా? మీ చేతిని ఎత్తండి. ఇంకా చేతిని ఎత్తనివారున్నారా?

పాపినైన నాకు దేవుడు కృప చూపును గాక! ఇప్పుడు నేను క్రీస్తును నా రక్షకునిగా అంగీకరించగోరుచున్నాను. అన్ని విషయములలోను ఇప్పుడు నేను ఆయనను వెంబడించుటకు సిద్ధంగా ఉన్నాను. నేనాయనతో కూడా తోటలోనికి వెళ్ళెదను. ఆయనతో నేను మరణ నది యొద్దకు వెళ్ళెదను. ఆయనతో కూడా సమాధి యొద్దకు వెళ్ళెదను. ఆయనతో నేను అవతలికి వెళ్ళెదను. ఆయన ఎక్కడికి నన్ను నడిపించినచో అక్కడికి వెళ్ళెదను.

నీ హృదయము నుండి ఆ మాట పలుకుదువా? ఆయనను నీ రక్షకునిగా అంగీకరించితివనుటకు సూచనగా నీ చేతిని ఎత్తెదవా? చేయిని ఎత్తనివారు ఎవరయినా ఉన్నారా? సోదరిని దేవుడు దీవించును. మీరు నాకు కనబడుచున్నారు. దేవుడు నిన్ను దీవించును. దేవుడు కూడా మిమ్మును చూచుచున్నాడు.

62

నీ చేతిని ఎత్తునప్పుడు ఏమి జరుగును? యేసు చెప్పెను, “నా మాటలు విని (దానిని నేను బోధించియున్నాను) నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక - మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.”

ఇక్కడ ఎవరో ఒక వెనుకకు జారిన వ్యక్తి ఈ రాత్రి తిరిగి క్రీస్తునొద్దకు రాగోరుచున్నాడు. “ఓ బ్రెన్హాం సోదరుడా, నేను నీతో చెప్పుచున్నాను. నేను యాయీరు వలె యున్నాను. నా జీవితమంతా నేను రహస్య విశ్వాసిగా ఉన్నాను. దేవుడు నన్ను పిలచుచున్నాడు. నేను ప్రయత్నాలు చేశాను గాని ఎన్నడూ రాలేదు. కాని ఈ రాత్రి సమయమని నేను తలంచుచున్నాను. ఈ రాత్రి చిన్న గుడారములోనికి నేను నడిపించబడ్డాను. ప్రభువైన యేసును కనుగొందును. ఆయన ప్రత్యక్షతను చూచుముందుగా, ఆయన శక్తిని చూచు ముందుగా తోమా నమ్మినట్లు చూడవలెను....”

ఎన్నడూ చూడకయే ఆయనను విశ్వసించనివారు ఎంత గొప్ప బహుమానము పొందుదురు? ఆయన వైపు నేను నా చేతిని ఎత్తి ఈలాగున చెప్పగోరుచున్నాను, “క్రీస్తూ, ఇప్పుడే నన్ను అంగీకరించుము. నేను నీ గృహమునకు వచ్చుచున్నాను.”

ఇంకా చేతిని ఎత్తనివారెవరైనా ఉన్నారా? సోదరీ, దేవుడు నిన్ను దీవించును. సోదరీ! నిన్ను దేవుడు దీవించును. దేవుడు మిమ్మును దీవించునండీ! అది అద్భుతం. ఇంకెవరు? దేవుడు నిన్ను దీవించును. అది మందిచి, ఓ యువతీ. అది మంచిది.

63

ఇక్కడికి నా ఎడమ వైపున ఒకరు క్రీస్తును చేర్చుకొనగోరుచున్నారు. బహుశా వెనుకకు జారినవారు కావచ్చు. దేవుడు నిన్ను దీవించును. చిన్నవారలారా! నీ చేతిని చూచుచున్నాను. దేవుడు నిన్ను దీవించును. చిన్న బాలుని దేవుడు దీవించును గాక! ప్రియులను దేవుడు దీవించును. ఇద్దరు బాలికలలో మరియు ఒక బాలుడు. యుక్త వయస్సులో నున్నవారు ప్రభువైన యేసును చేర్చుకొనుటకు ఇప్పుడే చేతిని ఎత్తియున్నారు. ఆయన గృహమునకు వారు వచ్చుచున్నారు. వారు ఒప్పించబడింది. అది నిజం.

యేసుక్రీస్తు తన శక్తి అంతటితో ఇక్కడ ప్రత్యక్షము కానిచో నేను అబద్ద ప్రవక్తను. ఈ రాత్రి ఆయన తన్నుతాను ప్రత్యక్తపరచుకొననిచో, గతించిన దినములలో ఆయన జరిగించినట్లు జరిగించినచో ఇక్కడే మనమధ్య బయలుపరచబడనిచో నేను అబద్ద ప్రవక్తను. ఆయనను నేను నమ్ముచున్నాను. ఆయన ఉన్నాడని నేనెరుగుదును.

ఆయన ప్రత్యక్షమగుటకు మీరు చూచుటకు ముందు నీ రక్షకునిగా ఆయనను అంగీకరించుదువా? ఆయనిక్కడ నిలబడి యున్నాడు. ఆయన శక్తి మరియు ఆయన యొక్క ఆత్మీయ చలనము ఇక్కడ కనబడుచున్నది. దాదాపు పదిహేను, ఇరవై మంది తమ చేతులు ఎత్తియున్నారు. పాపులు యేసునొద్దకు రాగోచున్నారు.

దాదాపు ముగించుటకు ముందు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎంతమంది పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నారు? బాప్తిస్మము ఎంతమంది పొందగోరుచున్నారు? మీరు విశ్వాసులుగా ఉన్నారు. మీరు నిత్యజీవము పొందియున్నారు, ఎందుకనగా మీరు ప్రభువైన యేసును విశ్వసించియున్నారు, కాని ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిస్మము పొందగోరుచున్నారు. ఆయన మనతో ఉండును. మీరు మీ చేతులు ఎత్తుదురా? దేవుడు మిమ్మును దీవించును గాక! ఓ, జన సమూహములారా! జనుల యొక్క గొప్ప గుంపులు, మీ అందరిని దేవుడు దీవించును గాక. నిశ్చయంగా, వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందగోరుచున్నారు.

64

ఇప్పుడు, మీరు క్రొత్తవారు. మీరు మెతడిస్తు, లూధరన్లు, ప్రెస్బెటేరియన్లు. ఈ సంపూర్ణ సువార్త పరిధులలో ఉన్నారు. మీ దగ్గర నుండియే, నేను వచ్చియున్నాను. ఇంకా నేను అక్కడనే యున్నాను. మనందరమూ ఒక్కటే. మనము విభజించబడలేము. చిన్న విభజన కూడా లేదు. నేను ఎంత లూధరన్ నో అంత పెంతెకొస్తును. నేను ఎంత బాప్టిస్టునో, బాప్టిస్టు సంఘములో అభిషేకము పొందియున్నానని మీరెరుగుదురు.

ఇప్పుడే నేను మరింత మెరుగైనదానిని పొందియున్నాను. అంతకంటే ఎక్కువే. మీరు పొందిన దానికన్నఎక్కువ. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. మీరు క్రీస్తును పొందియున్నారు. నిశ్చయంగా మీరు విశ్వసించినప్పుడు, కాని బైబిలు చెప్పెను, “విశ్వసించినప్పటి నుండి మీరు పరిశుద్ధాత్మ పొందితిరా?”

ఈ మధ్య ఒక రోజున మూడి బైబిలు సంస్థ నుండి ఒక గుంపువారు వచ్చి ఇట్లనిరి, “బ్రెన్హాం సోదరుడా, దానిని నీవు బైబిలులో తీసి చూపించగలవా?”

“ఏమి, నిశ్చయంగా” అన్నాను. అపొస్తలుల కార్యములు 19 అధ్యాయము. పౌలు ఒక బాప్టిస్టును అడిగెను... బాప్టిస్టు ప్రజలు, “విశ్వసించినది మొదలుకొని మీరు పరిశుద్ధాత్మను పొందితిరా?” ఎందుకని, అనడిగాను. “నేను బాప్టిస్టుని విశ్వసించినప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందియున్నానని నేర్పింపబడితిని.”

కాని బైబిలు చెప్పెను, “విశ్వసించినది మొదలుకొని వారది పొందితిరా?”

అసలు పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతియే మాకు తెలియదు“ అనిరి.

“అయితే మీరెట్లు బాప్తిస్మము పొందితిరి?”

“యోహాను బాప్తిస్మము,” అనిరి.

“యోహాను మారుమనస్సు బాప్తిస్మమిచ్చెను (పాపక్షమాపణ కొరకు కాదు), మారుమనస్సు కొరకు. రాబోవుచున్న ఆయనను మీరు నమ్మవలెను. వారిది వినినపుడు వారు ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందిరి. వారిమీద పౌలు చేతులుంచగా, వారిమీదికి పరిశుద్ధాత్మ వచ్చెను. వారు పరిశుద్ధాత్మను పొందిరి, భాషలలో మాట్లాడిరి, దేవుని మహిమ పరచిరి, మరియు ప్రవచించిరి.

65

ఈ రాత్రి బాప్టిస్టు చర్చినకు అవసరమైనది అదే. ఆమేన్. నిశ్చయంగా డాక్టర్ రీడ్-హెడ్ దానిని పొందినప్పుడు ఆయన చెప్పినది అదే డాన్-వెల్స్ దానిని పొందినప్పుడు అతడు చెప్పినది అదే. ఈ గొప్ప వారందరూ పొందినప్పుడు చెప్పినది ఇదే - ప్రెస్బెటేరియన్, లూధరన్, చాలామంది ఇతరులు అంతే.

దినము ముందుకు కదులుచున్నది: ఘడియ ఇక్కడికి వచ్చినది. నీకు పరిశుద్దాత్మ కావలెనా? అది నీదే. నీవు రక్షించబడినావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుటను ఆశించుము. దేవుడు మిమ్మును దీవించునండి. అది నిజము. దేవుడు మిమ్మును దీవించును. అది మంచిది సరే.

మా పరమ తండ్రి, ఇప్పుడు ప్రతి ఒక్కరిని తెచ్చుచున్నాను. నమోదు చేయు దేవదూత ఇక్కడ నిలబడియున్నది. నిత్యజీవమును పొందుటకు ఈ రాత్రి తమ చేతులెత్తిన ప్రతి ఒక్కరి పేరును తీసుకొనుచున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు అర్హులైన ప్రతి పేరును తీసికొనుచున్నాను.

వాక్యము చెప్పెను, “నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.”

66

ఈ రాత్రి నుండి అయిదు వందల సంవత్సరములకు వారెట్లుందురో ఆలోచించబడి, ఎక్కడో, ఎక్కడో, అనుబాంబులు ప్రతి పర్వతమునకు పొడిగా మారుచున్నది. ఉరకలెత్తుచున్న వేడి మండే గాలులు సూర్యుని యొక్క అణువులలో నుండి ఈ పాత భూమిని నింపుచున్నవి. వారియొక్క సమాధి పలకములు ధూళి వలెను, వారి ఎముకలు దుమ్మువలెను మారుచున్నవి, కాని వారి ఆత్మలు ఎచ్చటనో దేవుని సన్నిధిని ఆనదించుచున్నవి — ఆ గొప్ప ప్రశాంత పరలోకము.

వారు దానిని నిరాకరించినయెడల, నరకములో వారు నిరంతరముందురు. ఓ, దేవా, ఎటువంటి తీర్మాన సమయము! మనుష్యులు ఎన్నిక చేసికొనునట్లుగా ఈ రాత్రి మానవుల కొరకు నీవు చేసియున్నావు. నీవు వారికిచ్చిన ఈ చిన్ని గుంపునకు నేను సువార్తను ఇచ్చి యున్నాను. వారిలో చాలామంది, డజనుల కొలది, తండ్రీ, తమ చేతులు ఎత్తియున్నారు. నీకు తెలుసును. ఒక సేవకునివలె నేను ప్రార్ధించాను. ప్రతి ఆత్మ కొరకు నేను విజ్ఞాపన చేశాను. కొద్దివారు మొదలుకొని, ముసలివారి వరకు, ధనవంతులు మొదలుకొని దరిద్రుల వరకు మధ్యవర్తిత్వము వహించాను.

వారి హృదయాంతరములలో నున్న కోరికలను తీర్చమని, దేవా, నేను ప్రార్ధించుచున్నాను. వారి ఆత్మను పరిశుద్ధాత్మతో నింపుము. వారి రోగగ్రస్తు శరీరములను బాగుచేయుము. ఈ జీవిత అంతములో నీ రాజ్యములోనికి తీసికొనుము. క్రీస్తు నామములో నేను అడుగుచున్నాను. ఆమేన్.

67

ఎంత అద్భుతము! ప్రభువైన యేసు ఎంత మాధుర్యము. నేను మిమ్మును ఒక సంగతి అడుగగోరుచున్నాను. మీ చేతిని ఎత్తిన ప్రతి ఒక్కరు. ఈ రాత్రి నేను రోగులకు ప్రార్థించుదునని వాగ్దానము చేయుచున్నాను. చేతిని ఎత్తిన ప్రతి ఒక్కరు నాకు అనుకూలతను చేయండి. మీలో కొందరు చేయి ఎత్తవలెనని ఆలోచించిరి. స్వస్థతా ప్రార్ధన కూటము ముగిసిన తరువాత మీరు ఇక్కడికి వచ్చి బల్లయొద్ద చేరి సోదరులతో కొంతసేపు ఇక్కడ ప్రార్థించుచుందురా? మీరాలాగు చేయుదురు గదా? నేనాలాగు చేయగోరుచున్నాను. మీరు జీవము పొందియున్నారు. మీరు చేతిని ఎత్తి యేసును అంగీకరించినచో ఆయన నిత్యజీవము నిచ్చెదనని మీకు వాగ్దానము చేసెను.

“నా మాటలు విని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు.” అది నిజం. ఈ రాత్రి మీరు వచ్చి క్రీస్తుకు హృదయమును ఇమ్మని నేను కోరుచున్నాను. రోగులకు ప్రార్థనా పరిచర్య కొరకు తరువాత కలిసికొనండి.

68

ఇక్కడ ఎంత మందికి ప్రార్ధనా కార్డులున్నవి? మీ చేతులు చూచెదను. ఎన్ని కార్డులూ మీరిచ్చారు? సంఖ్య ఏమిటి? “ఆర్”, “ఆర్” ఒక వంద... ఇక్కడున్న ఈ సోదరుడు ఇక్కడ నిలబడి యుండి తన చేతిని ఎత్తి దేవుని వెదకుచున్నాడు. సోదరుడా! అది నిజము కదా? దేవుడు నిన్ను దీవించును! నీవు పరిశుద్ధాత్మతో చేతులుంచుదును. నీవు పరిశుద్ధాత్మను పొందబోచున్నావని నేను విశ్వసించుచున్నాను. ఈ రాత్రి దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపనై యున్నాడు. నీవు దానిని నమ్ముచున్నావా? మన తలలు వంచుదం.

పరమ తండ్రీ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుటకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు నామములో నేనితని మీద చేతులుంచి యున్నాను. ఇప్పుడతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందును గాక! అతడు పరిశుద్ధాత్మ నింపబడు వరకు ఈ తెర క్రింద నుండి పోకుండా ఉండును గాక! ఆయనకు పూర్తి ఆధీనములో ఉండును గాక! ఆయన అతని జీవమును తీసికొని యేసుక్రీస్తునందు నూతన సృష్టిని చేయును గాక ప్రభువా! అది అనుగ్రహించుము. ఈ ఆశీర్వచనమును నేను యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక! ఇప్పుడు సంతోషించుచూ వెళ్ళుము; ఆనందముగా ఉండుము. దేవుడు నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చును గాక.

69

పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, సహనము, విశ్వాసము. అది నిజము కదా? అది పరిశుద్ధాత్మ. ఒక యాపిల్ వృక్షము ఏమిటి? అది ఒక యాపిలు చెట్టు అని నీకెట్లు తెలియును. దానికి యాపిలు పండ్లు కాయును గనుక, నీవు పరిశుద్ధాత్మను పొందితివని నీకెట్లు తెలియును? నీవు ఆత్మీయ ఫలములను ఫలించుదువు గనుక, నిజమే గదా? అదే పరిశుద్ధాత్మ మంచిది.

ప్రతి విడుదల ఆశీర్వాదమును ఈ రాత్రి ఇక్కడ ఇచ్చుటకు యేసు మృతులలో నుండి లేచియున్నాడని ఎందరు నమ్ముచున్నారు? ఆయన శరీరధారిగా ఉండి, ఈ రాత్రి ఈ వేదిక మీదకి వచ్చిసరిగ్గా ఆలాగే చేయును. నీవాయనను అంగీకరించి విశ్వసించుదువా? ఎంతమంది ఆలాగు చేయుదురు? మీ చేతులెత్తండి. సరే. అది మంచిది.

(తడిసినప్పుడు ఆగినది... మైక్రో-ఫోనులు కలగలుపు అయినవి. ఇది... దానిని కత్తిరించగలరేమో చూడండి. సరే. అది మంచిది.)

ఇప్పుడు మంచిది. మిమ్మును ఒక్కటి అడుగగోరుచున్నాను. (ఇందులో ఒక్కటి తగలించవలెనని కోరుచున్నాను. దానిని నేను సరిగా చేయుచున్నానో నాకు తెలియదు. అంతే గదా? దానితో నేను ఏదయినా చేసినచో [స్పష్టతలేని మాటలు]. ఓ, వందనములు సోదరుడా! మంచిది, మంచిది.)

70

ఈ రాత్రి నేను ఒక దానికి ప్రతినిధిగా ఉండుటకు ఇచ్చటున్నాను. యేసు మృతులలో నుండి లేచియున్నాడని మీతో చెప్పటకు నేనిక్కడున్నాను. తనంతట తాను ఏమీ చేయలేనని యేసు ఈ భూమిమీద ఉండినప్పుడు చెప్పెను. ఆలాగు చెప్పెనా?

“నా యంతట నేను ఏమీ చేయను. కుమారుడు ఏమీ చేయడు. తండ్రి ఏమి చేయవలెనని చూపించునో, దానినే ఆయన చేయును. అది నిజమేనా? ఒకామె ఆయన వస్త్రపు చెంగును తాకినది. క్రీస్తు ద్వారా దేవునిని లాగినది. అది ఆయన శరీరము. అందువలన ఆయన బలహీనుడాయెను. దేవుడెన్నడును బలహీనుడు కాడు, కాని క్రీస్తులో నున్న దేవుడు ఆయనలో నుండి వెళ్ళిపోయెను మరియు అది ఆయను బలహీనునిగా చేసెను: ప్రభావము. అది సరియేనా? ఆత్మలోని ఆయన శక్తి ఆయనలో నుండి వెళ్ళిపోయెను. ఆలాగు ఆయన బలహినుడాయెను.

ఆయన కూర్చుని మరియు ఆ బావి దగ్గర ఆమె యొక్క రహస్యము ఎక్కడో చెప్పెను. అది సరియేనా? మంచిది. అదే యేసు నిన్న. అదే యేసు ఈ రోజు. అది సరియేనా?

71

ఒక యూదుడు ఆయన యొద్దకు వచ్చెను ఒక గట్టి యూదుడు. మరి యొక యూదుడు రక్షింపబడెను. వెళ్ళి ఆయనను కనుగొనెను. ఒక పర్వతము వెనుక చుట్టూ కొన్ని మైళ్ళు వెళ్ళెను. బహుశా ఒక రోజు ప్రయాణము పట్టియుండును. “నజరేయుడైన యేసును కనుగొంటిమి, అని వచ్చి చూడమని అతడు చెప్పెను. ఆయన యోసేపు కుమారుడు.”

ఆ గట్టి యూదుడు, నిజంగా మంచివాడు, సంపూర్ణ ఒక సువార్తిక సోదరుడని చెప్పగలను. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా?“ అనడిగాడు.

“వచ్చి, చూడు” అనెను. వారు జోడుగా వెళ్ళిరి, యేసు నిలబడియున్నచోటికి నడిచి వెళ్ళిరి.

యేసు అతని చూచి ఇట్లనెను, “ఇదిగో, ఏ కపటము లేని ఇశ్రాయేలీయుడు.” ఆయనకెట్లు తెలిసెను? ఆయన ఒక మోసగాడు కావచ్చు. మరేదయినా కావచ్చు, కాని ఒక ఇశ్రాయేలీయుడు. ఏ కపటము లేదు. యధార్థపరుడు, నీతిమంతుడు. అది అతనిని ఆశ్చర్యపరిచెను.

“రబ్బీ, నీవు నన్నెట్లు ఎరుగుదువు?” అనెను.

“ఫిలిప్పు నిన్ను పలుకకముందే, ఆ చెట్టు క్రింద నీవున్నపుడే, అతడు వచ్చుచున్నప్పుడే నేను చూచాను.”

అతడేమనెను? “నీవు దేవుని కుమారుడవు. ఇశ్రాయేలుకు రాజువు.”

72

ఇప్పుడు, స్వయం భావనలతో నిండియున్న పరిసయ్యడేమనెను? “చేతులు చూచువాడితడు బయల్జెబూబు, దయ్యములకు ప్రధానుడు.”

యేసు ఇట్లనెను, “నన్ను నీవు ఆలాగనవచ్చు. నిన్ను నేను క్షమించుదును, కాని లూసియానాలోని ష్రివ్-పోర్టులో (ప్రపంచములో ఎక్కడయినా సరే), పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అవే కార్యములు చేయును, కాని దానికి విరోధముగా మాట్లాడిన, ఈ లోకమందైన లేక రాబోవు లోకమందైనను, అది ఎన్నటికి క్షమింపబడదు. ఎన్నిక నీవే చేసికొనవలెను, నీవే ఎన్నికయి యుందువు. చూచావా?

క్రీస్తు మృతులలో నుండి లేచెను మరియు అప్పుడాయన చేసినట్లయితే ఈ రాత్రి ఆయన చేయుచున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని బాగుచేయడు. ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరచినట్లు, బైబిలులో ఎక్కడయినా ఉన్నదేమో నాకు చూపించమనండి.

గుంపులుగా రోగులు పడియున్న కోనేరు వద్ద కుంటివారనేకులు పడియుండిరి. అంత మందిని మనము చూడము మరియు వినము. కుంటివారు, గ్రుడ్డివారు, ఊచచేతులు కలవారు, ఎండిపోయినవారు, త్రిప్పబడినవారు, ఇంకా చాలామంది అక్కడ పడియుండిరి. అక్కడ ముప్పది-ఎనిమిది సంవత్సరముల నుండి రోగముతో పడియున్నవాడు ఒకడుండెను. క్షయవ్యాది లేదా మరేదో? ఆయనచ్చటకు వచ్చెను.“ నీవు పరిశుద్దుడవు కాగోరుచున్నావా?” అని అడిగెను. అక్కడికి వెళ్ళమని తండ్రి చూపించెను. ఆ సమూహములో అతని కనుగొనువరకు ఆయన వెదికెను. “అదిగో అక్కడున్నాడు.” “నీవు పరిశుద్ధుడవు కాగోరుచున్నావా?”

73

గమనించండి. అతడు అక్కడున్నట్లు యేసునకు తెలియును. ఎంతకాలము నుండి ఉన్నాడో తెలియును. నిజమే కదా? “నీ పరుపు ఎత్తికొని ఇంటికి వెళ్ళుము. ఇంటికి నడిచి వెళ్ళెను. వేలాదిమంది గుంపులుగా పడియున్నారు. కుంటివారు, ఊచ చేతులుగలవారు, గ్రుడ్డివారు, తండ్రి చూపినదే ఆయన చేసెను.

దానిని నీవు నమ్ముచున్నావా? ఆనాడు వారందరూ ఆయన ద్వారా స్వస్థతపొందిరి. వారందరూ బాగవుదురని ఆయనకు తెలియునా. లేదండి. చాలమంది వారిలో వారి స్వంత విశ్వాసము వలన స్వస్థత పొందిరి.

ఒక రోజున గ్రుడ్డివారు ఆయనను వెంబడించిరి; ఇద్దరు. “దావీదు కుమారుడా, మాయందు కనికరము చూపుము. మమ్ము కరుణించుము, కరుణించుము,” అనుచుండిరి. ఆయన వీధిలో వెళ్ళుచుండెను. ఏ దర్శనము లేదు. ఇంటిలోనికి వెళ్ళెను. వారు గ్రుడ్డివానిని ఇంటిలోనికి తెచ్చిరి, “మా మీద కరుణ చూపుము.”

వారి వైపు తిరిగి, వారి కన్నులు ముట్టెను, “మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక,” అనెను. (అది నిజమేనా?) వారు నమ్మిరి, మరియు వారి కన్నులు తెరువబడెను.

74

ఒకామె ఆయన యొద్దకు రాలేకపోయెను. ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టెను. దానిని ఆయన చూడనే లేదు. శరీరక స్పర్శ ద్వారా కాదు. కాని ఆయన వెనుకకు తిరిగి ఆమెతో మాట్లాడగానే, ఆమె బాగుపడెను. ఆమె విశ్వాసము ద్వారా బాగుపడెనని ఆయన చెప్పెను.

నిర్భయంగా, బైబిలులో చాలా చోట్ల ఆలాగున్నది. నీ విశ్వాసము మీదనే ఆధారపడియున్నది. గ్రుడ్డివాడు.... ప్రభువైన యేసు నొద్దకు మూర్చరోగి వచ్చెను. తండ్రి తీసికొని వచ్చెను, “నీ శిష్యుల యొద్దకు తీసికొని వచ్చితినని గాని వారేమి చేయలేకపోయిరి. మా మీద దయచూపుదువా?”

తిరిగి దానిని ఆ వ్యక్తి మీదనే ఆయనుంచెను. “నీవు నమ్మినచో, నేను చేయగలను.”

అతనిపై బాధ్యత నుంచెను, “ప్రభువా, నేను నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము లేకుండా సహాయము చేయుము.” అవును కదా? అంతట యేసు ఆ బాలునిలో నుండి దురాత్మను పంపివేసెను, చూడండి, తండ్రి చూపినట్లయితే ఆయన పనిచేసెను, యోహాను 5:19. ఈ రాత్రి ఆయన ఆలాగే చేయును గాక. ఆయన మృతులలో నుండి తిరిగి లేచినట్లు రుజువు చేయును గాక.

75

అపుడాయన దీనిని చేయనవసరం లేదు. ప్రభువు ఇచ్చిన దైవిక వరము ద్వారా ప్రతి ఒక్కరు తెలిసికొననియ్యండి. దీనిని అందరూ చూచుటకు నేను చేయుట లేదు. దానిని దేవుడెరుగును. దేవుడు తాను దేవుడనని చూపుటకు దీనిని చేయడు. వాక్యము నెరవేరునట్లుగా ఆయనే చేయును. వారి బలహీనతలను తాను తీసికొనునట్లు బైబిలు ఈ కార్యములు చేయుచున్నట్లు చెప్పుచున్నది. రోగులను బాగు చేసెను. నెరవేరునట్లుగా ఆయన వాటిని చేయుచున్నాడు. (నిజమే కదా?) ధర్మశాస్త్రము ద్వారాను, ప్రవక్తల ద్వారాను చెప్పబడినది నెరవేరునట్లు జరిగెను.

ఆయన ఈ రాత్రి దానిని చేయుచున్నాడు. అది నెరవేర్చబడునట్లుగానే, జనులు తీర్పు దినమున ఒక నెపము కూడా చెప్పకుండునట్లుగా, తాబేలు తన గుల్లలో మూసుకొనినట్లుగా నీవు నీ జాలి మాటలను చెప్పవచ్చును. అది నీ ఇష్టం, చూచారా.

నీవు నమ్మినట్లయితే, నీవు గొప్ప కార్యములను చూచెదవు. కేవలము నమ్ముము. విశ్వాసము కలిగియుండి దేవుని నమ్ముము. ఎందుకొరకు? “నమ్మువారికి సమస్తము సాధ్యము.” అది సరియేనా? మంచిది.

76

ఇప్పుడు, పరమ తండ్రి, ఈ జనులతో కూడా నన్నునేను నీకు అప్పగించుకొనుచున్నాను. గొప్ప పరిశుద్ధాత్మ ఈ రాత్రి వచ్చునట్లు ప్రార్థించుచున్నాను. దీని ద్వారా.... నేనెప్పుడూ కూడా దీనికి అర్హుడను కాను; వరములు మరియు పిలుపు మారుమనస్సు లేకయే వచ్చును. ఉయ్యాలలో పుట్టినప్పుడు, ప్రభువా, నీవక్కడవుంటివి. ఈ యుగములోనే ఆ గొప్ప అగ్నిస్తంభము ఇంతవరకు నా జీవితమంతా వెంబడించినది. నాలో ఏమియు లేదు... నీ రాజ్యములో నున్న మిక్కిలి అల్పులకంటె నేను అధముడను, నీ దాసునిగా పిలువబడుటకు అర్హత లేనివాడను.

ఈ జనులు వినవలెనని నేను ఈ ప్రార్థన ప్రార్థించుటలేదు. ప్రభువా! దీనునిగా ఉండుటకు నేను ప్రయత్నించుటలేదు. నీవు నా హృదయమును ఎరుగుదువు. నేను వేషధారినగుదును, కాని ప్రభువా, నీవు నా హృదయమును ఎరుగుదువని ఈ ప్రార్ధన చేయుచున్నాను. నన్ను నీకు సమర్పించుకొనుచున్నాను. నా మనస్సు ద్వారా పనిచేయుము. నా హృదయము ద్వారా పనిచేయుము. నా శరీరము ద్వారా పనిచేయుము. నా హృదయాంతరంగములన్నింటితో పనిచేయుము. మరియు నా బాహ్య జీవితము కూడా నీ ప్రియ కుమారుని బయలుపరచునట్లు చేయుము. చెప్పిన వాక్యమును నీ ప్రభువైన యేసు బయలుపరచునట్లు చేయుము. “నేను చేయుచున్న ఈ కార్యములు మీరు కూడా చేసెదరు.” తండ్రీ, దీనిని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

77

అది కదా? ఏమిటి? ప్రార్థన కార్డు కదా! ప్రార్థన కార్డు మేము అంతాటా పిలుచుచున్నాము. గత రాత్రి వివిధ స్థలములలో నేను పిలిచాను. గుర్తుంచుకొనండి. 1 నుండి 20... ? మరియు 40 నుండి 50. లేదా ఆ తరువాత కావచ్చును. కావున ఈ రాత్రి ఎచ్చట నుండి పిలుద్దాం! చెప్పండి. 85 నుండి 100.

వంద అని మీరు చెప్పారా? వంద ఇచ్చారా? ప్రార్ధన కార్డు 85 ఇచ్చటున్నదా? చూద్దాం. మంచిది. అయితే అక్కడ నుండి పిలుద్దాం.

సరే 85, 86 “ఆర్” 86, “ఆర్” 86 ఎవరి దగ్గరున్నది! ఆమె దగ్గరున్నది 87 నెంబరు పిలువబడినది. నీవు కుర్చీలో కదలలేకుండా ఉన్నావు? నీ చేతులు ఎత్తుము. మేము నీ యొద్దకు వచ్చుదుము. చూశారా? ఎవరో ఒకరు నీ యొద్దకు వచ్చెదరు.

ఏమిటది? 85, 86, 87. “ఆర్” 87 ప్రార్థన కార్డుతో ఎవరైన ఉన్నారా? ఆ స్త్రీ. అక్కడ ఉన్నది. ఆమె సరే, 87, 88 ఎవరి యొద్ద ఆర్ 88 ఉన్నది? నీ చేతిని ఎత్తుదువా 89, మంచిది 90?

78

ప్రార్ధన కార్డులను మధ్యాహ్నము ఆరు గంటల నుండి కావలసిన వారికి ఇచ్చుచున్నాము. ఇప్పుడే, బిల్లీ చెప్పినట్లుగా ఇక్కడ ఎవరునూ లేరు. అన్నిటినీ బయటకు ఇవ్వలేము. ఇవి ఇచ్చుటకు ఎవరునూ లేరు. ప్రార్థన కార్డుల కొరకు వరస సమాన్యంగా ఉండేది, కాని వాటిని ఇచ్చుటకు కావలసినంతమంది జనులు లేరు.

చూద్దాం. 89 ఎవరి దగ్గర ఉన్నది? 90, 91, 92, 98, 94, 95, 96, 97, 98, 99, 100. వారిని వరుసలో రానీయండి. ఎంతమంది ఉన్నారో మనం చూద్దాం. ప్రార్ధన వరుస మంచిగా కొనసాగుచున్నది. కాకపోతే ప్రజలకు ఇచ్చుటలోనే ఇబ్బంది ఏర్పడినది.

అప్పుడు ప్రారంభించుదం... పదిహేను మందిని ప్రారంభించుదం, క్రిందకు వచ్చుదం. మంది చూడండి. మీ వ్యక్తి కార్డు కనుగొనండి. కొన్నిసార్లు ఒక వరుసలో ఏబది మంది వరకు ఉంటున్నారు. దర్శనములు మామూలే, నన్ను తరువాత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నవి. ఈ గుంపు ప్రారంభమైన పిదప ప్రారంభించుదం. కొద్దిగా ముందుకు వెళ్ళిన పిదప ప్రభువు మనలను ఆశీర్వదించును. మనకు చాలా వరకు మంచి విశ్వాసము నిచ్చును. అప్పుడు ప్రారంభించుదము. తిరిగి పదిహేను మరల ప్రారంభించి వెనక్కివద్దాం. ఏబది అయితే మంచిదే.

79

ఒకేసారి చాలామంది నిలబడేటట్లు కోరుటలేదు, ఎందుకనగా మీరు పిలిచిన సంఖ్యలో వచ్చారు. ఎందుకనగా మీరు... ఇద్దరు లేక ముగ్గురు తప్ప మరి ఎక్కువగా వెళ్ళలేము. అదెక్కడికి ఉండునో మనకు తెలియదు. ప్రార్ధన కార్డు 85 నుండి 100 పిలుచుచున్నాము. 85 నుండి 100, 85 నుండి 100. సరే.

ఇప్పుడు, మనమందరము బహు మాధుర్యంగా మరియు త్వరగా ప్రభువునకు తలవంచుదం. అంతట చాలా మాటలు చెప్పుదం. “ప్రభువైన యేసూ, నీకు నేను తలవంచుచున్నాను. నా ప్రభువా, శిరము వంచుచున్నాను. ఈ రాత్రి నిన్ను నమ్ముచున్నాను. నేను రోగిని. అవసరతలో ఉన్నాను. నాకు ప్రార్ధన కార్డు కూడా లేదు, కాని ప్రభువైన యేసూ, నీ దాసునితో నీవు మాట్లాడుము. ఆయనను నాతో మాట్లాడనిమ్ము అది నా విశ్వాసమును వృద్ధిపొందించి నిన్ను నమ్మునట్లు చేయును. నాతో మాట్లాడనిమ్ము. నా జీవితములో మిగిలిన దినములన్నియు నీకు సేవ చేయునట్లు నీకు విధేయత చూపుదును.

80

పరమ తండ్రీ, క్రీస్తు నామము ద్వారా ప్రార్థించుచున్నాను. మీకిప్పుడు గొప్ప పరిచర్య ఇచ్చితివి. ప్రభువా, ఈ గుడారము క్రింద నా జీవితములో ఎన్నడూ నేను చూడనంతమంది జనులు ప్రార్ధన వరుసలో వచ్చి నిలబడుట చూచాను. వారు నాకు తెలియదు. ఇక్కడ నేను నిలిచియున్నాను. ఏడవ తరగతి చదువుకొన్న బాలుడిని. ఓ దేవా, ఏలాగు... ప్రభువా, నీవు లేనిచో నేను నిస్సహాయుడను.

81

ఈ ప్రజలు చాలా సంవత్సరముల నుండి నన్ను ఎరిగియున్నారు. సహోదరుడు మూర్, మీ సేవకుడు, సహోదరుడు బ్రౌన్ మరియు మిగిలినవారు అనేకులు నాతో పాటుగా ప్రపంచ వ్యాప్తముగా కూడికలలో పాల్గోనియున్నారు. అయిననూ నేను వారి యొక్క బాషను మాట్లాలేను. పరిశుద్ధాత్ముడే క్రిందకు వచ్చి వారి గురించి సమస్తమును తెలియచేసియున్నాడు. తండ్రి, ఇదంతయూ మీ మహిమ కొరకే.

వేల-వేల సార్లు ప్రభువైన యేసును ఆరాధన చేయుటకు వచ్చియున్నాను, నీవు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నేను వినయుడై నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నీ సేవలో నేనునూ ఒక భాగమైయున్నాను, ఈ లోకములోకి వచ్చి నా రక్షకుని నేను మెచ్చుకొనుటకు నాకు అనుమతిని ఇచ్చావు. నేను నీ సేవ చేయుచుండగా, నీ ప్రజలకు సేవచేయుటకు అనుమతిని ఇచ్చియున్నావు.

ప్రభువా! ఈ రాత్రి మరోసారి నీ సన్నిధి యొక్క బయలుపాటు చేత సహాయము చేయుము, చేయుదువా?, నా హృదయములో ఉన్న ప్రతియొక్క స్తుతి, మహిమ, ఘనతా సమస్తము నీకే అని నీవు ఎరిగియున్నావని. యేసు నామములో నేను ప్రార్ధిస్తున్నాను. ఆమేన్.

[మైక్రో-ఫోన్ కు దూరముగా జరిగి సహోదరుడు బ్రెన్హాం ఎవరితోనో మాట్లాచున్నారు.] ఓహ్, అతడు నన్ను తీసుకొనిపోవు వరకు నేను ఎదురు చూడవలసియున్నది.

ఈ చేతిరుమాళ్ళ గురించి సహోదరుడు నన్ను ప్రార్థించమని అడిగియున్నారు. మీ చేతిరుమాళ్లను నేను జఫర్సన్విల్, ఇండియానాలో మరచిపోవటం జరిగింది. నేను మీకు ఒకదానిని పంపుతాను. రోగులకు ఆ విధముగా ప్రార్ధించుట ద్వారా మేము గొప్ప విజయము సాధించాము.

ప్రార్ధించినప్పుడు పొందిన అనుభూతికన్నా అవి మీకు పంపినప్పుడు నేను ఎక్కువగా ఆత్మ యొక్క అభిషేకమును పొందుకున్నాను. ఇప్పుడు, ప్రార్ధనా వరుసను చూడాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్ధనా వరసలో ఉండువారందరు నాకు ఎదురుగా వరుసగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. సహోదరుడా, ప్రార్ధనా వరుసలో ఈ విధముగా ఉండాలని తలుస్తున్నాను. గమనించారా? మంచిది. నాకు తెలిసినవారు ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు లేరని నేను అనుకుంటున్నాను.

నాకు పరిచయము లేని వారు మీ చేతులను పైకెత్తగలరా, నేను మీకు తెలియదు కదా? మంచిది. అక్కడనే మీరువున్నారు. అక్కడ ఉన్నవారిలో నేను తెలియని వారు చేతులెత్తండి, మీరు నాకు తెలియదు? ఇక్కడ ఎవరైనా అవిశ్వాసులున్నట్లయితే దాన్ని చూడండి. పరిశుద్ధాత్మ వచ్చుచున్నప్పుడు ఆయనను గమనించండి. యేసు నిన్న, నేడు, నిరంతరం, ఏకరీతిగా ఉన్నాడు. దీనిని క్రిందకు దించుదాము.

82

ఈ స్వస్థపరచు ప్రార్థనలకు రేపటి రాత్రియే చివరదని నా కుమారుని ద్వారా నేను ఇప్పుడే ప్రకటించియున్నాను. కావున మీకు సంబంధించిన బలహీనులున్నట్లయితే, రేపటి రాత్రికి తీసుకొనిరమ్ము.

స్నేహితులారా చూడండి, ఈ మార్గము గుండా చూసి మీ హృదయమంతటితో నమ్మవలసినదిగా నేను ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు కల్వరి యొద్ద మరణించుట ద్వారా దేవుడు పాపము మరియు బలహీనతల యొక్క జరిమానాను పూర్తిగా చెల్లించియున్నాడు. అది సత్యమేనా? అదంతయూ చెల్లించబడియున్నది.

కావున, ఏ మనుష్యుడు మిమ్ములను స్వస్థపరుచు నిమిత్తమై ఇంకేమియూ చెయ్యవలసిన అవసరము ఎంత మాత్రమూ లేదు. అది ముగించబడియున్నది. నిన్ను ఎవరూ కాపడలేరు. ఎందుకంటే అది ఎప్పుడో ముగించబడింది.

నీవు చేయవలసిన ఏకైక కార్యమేదనగా, ఒప్పుదల కలగి దానియందు విశ్వాసముంచుటయే. అది సత్యమేనా? కార్యము ముగించబడినది అని ఎంతమందికి తెలుసు? యేసు మరణించేటప్పుడు ఆయన సమాప్తము అనెను, అది అక్కడే ఎప్పటికి ముగించబడింది. అదియే సత్యము.

అయితే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి, “నేను స్వస్థపరచు శక్తిని కలిగియున్నాను,” అని అంటే, అతడు ఏదో తప్పును నీకు చెపుతున్నాడు. “నేను ఒకటి కలిగియున్నాను, నేను నిన్ను స్వస్థపరచగలను.” అది తప్పైయున్నది. నీకేదైనా మేలుకరమైనది జరిగినదీ అంటే, అది కల్వరి వద్దనే జరిగింది. నీ అతిక్రమములచేత అతడు గాయపడియున్నాడు, ఆ గాయపు గర్తుల చేత నీవు స్వస్థతను పొందియున్నావు. నీవు స్వస్థపడియున్నావు.

83

ఒకే ఒక సంగతేమనగా మీరు రక్షించబడియున్నారు. కొద్దికాలము క్రితం రక్షింపబడినవారు తమ చేతులను పైకెత్తండి. వారు 1900 సంవత్సరముల క్రితం రక్షింపబడియున్నారు. వారు దానిని ఇప్పుడే ఒప్పుకొనియున్నారు. ఊట తెరువబడినది, ఎవరైనా సరే, వారి చిత్తము ప్రకారము రావచ్చును. అక్కడనే సమస్తము చెల్లించబడియున్నది. ఇప్పుడు నీవు దానిని కేవలం అంగీకరించుము.

ఇప్పుడు, ఒక మానవుడు కేవలం చేయునది ఏమనగా పరిశుద్ధ గ్రంథమును నీకు బోధించుట ద్వారా నీ స్వస్థత గురించి చెప్పుటయే. కొంతమంది పెద్దలు మరియు కాపరులు నిన్ను నూనె ద్వారా అభిషేకించుతారు. అది వారియొక్క సేవయైయున్నది. ఇతరులు నీ మీద చేతులుంచుతారు. అది వారి సేవయైయున్నది. నాకు సేవ ఉన్నది అంటే అది నేను జన్మించినప్పుడే ప్రభువు, దర్శనములను చూచుట, జరుగనైయున్న సంగతులను చూచుట, జరిగిన సంగతులను చూచుట ద్వారా ప్రభువు ఇచ్చియున్నాడు.

వాటి చేత ప్రజలను వాస్తవములోనికి నడిపించబడుతున్నారు. సువార్తను ప్రకటించుట. పరిశుద్ధాత్మడు ఆ విధముగానే చేయును. పరిశుద్ధ గ్రంథమును వారికి బోధించుము, అది పరిశుద్ధాత్మ కార్యమైయున్నది. జరుగనైయున్న సంగతులు చూచుట మరియు వాటిని ముందుగానే చెప్పుట అనేది పరిశుద్ధాత్మ యొక్క కార్యమైయున్నది.

అవి సంఘములోని వరములైయున్నాయి, అవి అన్నియు దేవునివై యున్నాయి. తమకున్న ఆ వరములను వారిలో అనేకులు కోల్పోవుటనేది ఒక అవమానమైయున్నది. బాషలు మాట్లాడు వరము, బాషలకు అనువాదము చెప్పు వరము. అది చాలాసార్లు వ్యర్ధముగా ఉపయోగించబడినది, కాని అది సంఘము నుండి బయటకు తీసివేయబడలేదు. ఏది ఏమైనా అది ఇంకనూ సంఘములోనే ఉంది

84

ప్రవచన వరమున్నది; ప్రవక్తలున్నారు మరియు ప్రవచన వరమున్నది. ఇప్పుడు, ప్రవచన వరమున్నది; సంఘములో ఉన్నది, కాని ఒక ప్రవక్త ప్రవక్తగానే జన్మించును. ప్రతి ప్రవక్త లోకములో ఎప్పుడు జన్మించినా ప్రవక్తగానే జన్మించును. వరములు మరియు పిలుపులు మారుమనస్సుతో సంబంధము లేనివి. అవి శరీరము యొక్క అయిదు పెద్ద వరములు. అపొస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సంఘ కాపరులు, సువార్తికులు దేవుడు వారిని సంఘములో ఉంచెను. చూచారా?

మనము.... చాలా మంది వేషధారులగు బోధకులున్నారు. వేషధారణ ప్రవక్తలున్నారు, కాని దేవుడుంచిన వారున్నారు, ఆయనే యున్నాడు. ఆయన తన వరములు గూర్చి మాట్లాడుచున్నాడు. వారిని గూర్చి ఆయన సాక్ష్యమిచ్చుచున్నాడు.

ఇటు చూండండి. ఈ వరుసలో చాలామంది నిలబడియున్నారు. పదిహేను లేక ఇరవైలోనే పిలువబడినవారు, నాకేమీ తెలియని రీతిలో జనులు పిలువబడియున్నారు. పరిశుద్ధాత్మ వచ్చి నన్ను అభిషేకించినచో వారు గాని నన్ను నమ్మనిచో వారికేమీ జరుగదు.

నేను కాదు; మీరే మీరే. ఆ స్త్రీని బాగుచేసినది యేసు కాదు. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా ఆ స్త్రీ స్వస్థత పొందినది. చూచారా?

ఆమె ఆయనను తాకినది. ఇప్పుడు, ఈ రాత్రి ఆయన ప్రధాన యాజకుడు. మన బలహీనతలను ఆయన తాకగలడు. నీవు రోగివైనచో ఆయనను నీవు తాకగలవు, అనండి, “ఓ, ప్రభువా, నన్ను తాకుము. నిన్ను తాకుచున్నాను.” ఆయనను గమనించుము. ఆయన నీవైపు తిరిగి నీతో మాట్లాడును.

85

ఇప్పుడు, ఆయన ఆలాగు చేసినయెడల, ఇక్కడ నేను అసలు ఎవరిని ఎరుగని వారున్నారు. వారికి ఆయన భూమ్మీద ఉన్నప్పుడు ఏమి చేసెనో, అదే చేయును. చేతిని పైకెత్తి ప్రతి ఒక్కరు ఆయనను నమ్ముచున్నారు, ఆరాధించుచున్నారు. అవును కదా? ప్రభువు మిమ్ము దీవించును గాక.

అమ్మా! నీవు వచ్చినచో ఒక్క నిమిషము నీతో నేను మాట్లాడవలెను. పైకి వచ్చుటకు ముందుగా లేదా దగ్గరకు వచ్చు ముందు నీ కార్డును ఎవరికయినా ఇమ్ము. ఇప్పుడు, నీవు ఇక్కడకి వచ్చి నిలబడుము. నేను ఎదురుచూచుచున్నాను.

ఇప్పుడు, సమూహము అడుగగోరుచున్నాను. బయట వర్షము పడుచున్నది. కొద్ది నిమిషముల పాటు వీలయినంత నిశ్శబ్దంగా నీవుండుము. కేవలము - ఒక కొద్ది సమయము పరిశుద్ధాత్మ ఏమి చేయునో చూద్దాం.

86

ఇప్పుడు, ప్రతి ఒక్కరు ఆశతో చూడండి, “ఓ, ఓ, ఓ” అనవద్దు. ఆలాగు చేయవద్దు. నిశ్శబ్దంగా ఉండండి. “వినుము, దేవా, నా హృదయమంతటిలో నేను నీ యొద్దకు వచ్చియున్నాను. నమ్మికతో వచ్చాను. ఆయనను గమనించుము. నన్ను పిలుచుచున్నాడు. చూచారా? ప్రార్ధనలో ఆయనను గమనించుము. నీవు ప్రార్థన వరుసలో వచ్చినచో, ఏమీ బాగుగా లేనిచో, నీ పరిస్థితులు నీకు ఆయన చెప్పుట గమనించు.

జరుగబోవునది నేను చెప్పుట గూర్చి భయపడుదును, ఎందుకనగా ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది జరిగినది చూశారు. వేదిక యొద్దకు వచ్చిన బోధకుడు ఈ రాత్రి ఇంకా పక్షవాతముతోనే యున్నాడు. ఒకాయన కూటమునకు వచ్చియున్నాడు. జనములో కూర్చొనియున్నాడు. వేలాదిమంది ఎదుట నాకు కనికట్ల వేయుటకు చూచుచున్నాడు. అక్కడుండి చేయాలనుకొనుచున్నాడు... సైనిక శిబిరములలోనికి వెళ్ళుచూ, బాలురను కుక్కలుగా మొరుగునట్లుగా హిప్నోటైజ్ చేయుచున్నాడు మరియు వారికి హిప్నోటైజ్ చేయుచున్నాడు. వారు ఒక అవివేకుల గుంపు, కూటములో నాకు హిప్నోటైజ్ చేయుటకు అతనిని తీసికొని వచ్చారు.

పరిశుద్ధాత్మ వైపు తిరిగి ఇట్లు చెప్పినది, “నీవు అపవాది సంబంధివి,” అని అతనిని గద్దించెను. వారతనిని బట్టి బిల్డింగులో నుండి తీసికొనిపోయిరి మరియు ఇంకా ఆలాగే యున్నది.

87

మరొక వ్యక్తి వచ్చుచున్నాడు, మూర్చ రోగము. అతని సంఘమచ్చటున్నది, కాని వారు అవిశ్వాసులు. జోన్స్ బరో, అర్కన్సాలో అది జరిగెను. పెద్ద మనుష్యుల గుంపు అక్కడ సంఘముగా కూర్చొనియున్నారు. “నీ తలక్రిందకి వంచు” అని చెప్పాను.

“నా వలన కాదు” అన్నాడు. మూర్ఛవ్యాధి బాలుని విడిచిపెట్టలేదు.

నేనన్నాను, “ప్రభువా, ఇతని అపాయకర స్థితి చూడుము. ఈ బాలుని వాని నిమిత్తము బాధపడనీయొద్దు, ”సాతానా, ఈ బాలుని విడిచిపొమ్ము. ఇరవై-ఎనిమిది మంది గదిలో ఆ వ్యాధిని పొందిరి.

ఫీనిక్స్, ఆరిజోనా: పట్టణ అధికారులచ్చట కూర్చొనియుండిరి. తన తలాడించుటలేదు, కోపముతో ఉన్నాడు, దాని గూర్చి చాలా విరోధంగా ఉన్నాడు. ఆ రాత్రి సహో మూర్కు గుర్తున్నది. సహో! బ్రవున్ కూడా. ఆ తరువాత రెండు నెలలకు నన్ను లాగిరి. అతని భార్య మరియు కాలిఫోర్నియాలో బురదలో, నా బట్టలు

పట్టుకొని వదలలేదు, “ఆహా, ఆహా, ఆహా” అని ముఖం మీద మీసములతో వ్రేలాడుచూ పూర్తిగా పిచ్చి వచ్చెను.

స్నేహితులారా, మనము సంఘపు ఆట ఆడుట లేదు. ఇది పరిశుద్ధాత్మ నేను కాను; అది ఆయనే. కావున నీవు చేయుచున్నది జాగ్రత్తగా చేయుము. మరెక్కువ మర్యాదతో రావలెను. నీరిక్షణతో రమ్ము. నిశ్శబ్దముగా ఇప్పుడు నిలబడుము. దేవుడు ఏదో చేయును. నీవాయనను ఆరాధించగోరుచున్నావా? అది అద్భుతము, కాని ఇప్పుడు నిజమైన మర్యాదతో ఉండవలెను.

88

ఇప్పుడు ఈ స్త్రీ ఇక్కడ నిలబడి యున్నది. సోదరీ, నీవు, మరియు నేను అపరిచితులమని తలంచుచున్నాను. నీవు చేతిని పైకెత్తుము? నిన్ను నేను ఎరుగను. నీవు నన్నెరుగవు - మనము మొదటిసారి ఇక్కడ కలిసికొనుచున్నాము. అవును కదా? ఇది మొదటిసారి.

ఆ స్త్రీ, ఇప్పుడు చేతిని ఎత్తవలెనని నేను కోరుచున్నాను. మనం జీవితంలో ఇదే మొదటసారి కలిసికొనుట జరిగినదని చూడవలెను. అవును. ఆమె గూర్చి నాకేమీ తెలియదు. ఆమెకు నన్ను గూర్చి ఏమీ తెలియదు.

ఇప్పుడు, ఆమె రోగియైనచో ఏమిటి? మరో సమస్యయినా కావచ్చును. నేను చెప్పలేను. నాకు తెలియదు.

89

ఒక రోజున సమరయలో ఏమి జరినదో అలాంటిదే ఇక్కడ కూడా జరుగుచున్నది. ప్రభువైన యేసు, ఆయన శరీరధారిగా ఉండెను. ఒక సమరయ స్త్రీ ఉండెను. వారు కలసికొని ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండిరి. యేసు ఆమెతో సంభాషించెను. “నాకు త్రాగుటకు నీరిమ్ము,” అనెను.

ఆమె అన్నది, “యూదులకు సమరయులకు ఎటువంటి సాంగత్యము లేదు.” మీరెప్పుడైనా చదివారా? మీకా గాథ తెలియును.

“కాని నీతో మాట్లాడుచున్నది ఎవరో నీకు తెలిసినచో, నీవే దాహమునకు ఇమ్మని అడిగి యందువు.” ఆ సంభాషణ ముందుకు వెళ్ళినది. కొంతసేపటి తర్వాత యేసు ఆమె వైపు చూచి, నీ భర్తను తీసికొని రమ్మనెను. ఆయనామె సమస్యను కనుగొనెను. అది అసలు సంగతి. అవును కదా? ఆమె యొక్క సమస్య అదే కదా? అవును. వెళ్ళి, నీ భర్తను తీసికొని రమ్మనెను.

“నాకెవరూ లేరు,” అన్నదామె.

“అవును. నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి,” అన్నాడాయన.

“అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సీయా వచ్చినప్పుడు (యేసే మెస్సీయా అని మీరు నమ్ముచున్నారు కదా?) ఈ సంగతులన్నియూ చెప్పును, కాని నీవెవరవు?

“నేనే ఆయనను,” అని ఆయన చెప్పెను. చూచారా?

90

అదే మెస్సీయా యొక్క గురుతు అయినచో (దేవుని అభిషక్తుడు) పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం. గలిలయిలోని మెస్సీయా గురుతు అదే అయినచో ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఈ రాత్రి కూడా మెస్సీయా గురుతు అదే. అవును గదా?

అవిశ్వాసులు ఎన్నడూ నమ్మరు, కాని విశ్వాసులు నమ్ముదురు. ఇదే పద్ధతిలో నేను మీతో మాట్లాడుచున్నాను. నేనెరుగుదును, నేను కేవలము ఒక మానవునిగా నిలబడి మాట్లాడుచున్నాను, నిన్ను నేను ఎరుగను. కాని నీవు విశ్వాసివని నేనెరుగుదును. నీవు క్రైస్తవునివి. పాపివి లేదా విమర్శకునివి అయినచో వారు చల్లగా ఉందురు. నా మీద ఇప్పుడున్న ఆత్మ అది నీ యొద్దకు కదలవలెనని ఇప్పుడు నేను ఎదురుచూచుచున్నాను. ఏమి జరిగినదో చూడగలను.

సోదరీ, ప్రభువైన యేసు నీవెందుకు నిలబడియున్నావో నాకు తెలియపరచినచో, నాకు తెలియని దానిని తెలియనిచ్చినచో, నీవడిగిన దానిని ఆయన ఇచ్చునని నీవు నమ్ముదువా? నమ్ముదువా? మంచిది. ఆయన ఇచ్చుననియే నా యొక్క యధార్థ ప్రార్థన.

91

నేనెరుగుదును, ప్రతి వ్యక్తికి అవసరతలున్నవి. కొన్నిసార్లు అది ఆరోగ్యము. కొన్నిసార్లు అవి గృహశ్రమలు కావచ్చు. కొన్నిసార్లు అది ఆ స్త్రీ సమస్య వలె కావచ్చు. కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు కావచ్చు. ఆయన ఆర్థికముగా మనకు సహయము చేయును. నాకు ఆహరమిచ్చును. నా కుటుంబమును పోషించును. పక్షులను పోషించునట్లు మనందరిని ఆయన పోషించును. మనము. నీవు.. నేను రోగులమయితే మన సమస్య ఏమిటో ఆయనకు తెలియును.

ముప్పది-ఎనిమిది సంవత్సరముల నుండి రోగియైన వానిని ఆయనెరుగును. దాని గూర్చి ఆయనకు తెలియును. అటు తిరిగి ఆ కారణమును ఆయనడిగెను. ఆ విషయముల గూర్చి యధార్ధముగా ఉండెను. అన్ని సంగతులు ఆయనకు తెలియును. అవును కదా?

నేను ఇప్పుడు కేవలము - కేవలము... ఆ స్త్రీతో యేసు మాట్లాడుట ఆమె ఆత్మను సంధించుటయే. అంతా ఆయనే చేయుచున్నాడు. అక్కడికి వెళ్ళమని తండ్రి చెప్పియున్నాడు. అవును. ఆయనక్కడికి వెళ్ళెను. అది పరిష్కారమయినది, ఎందుకనగా ఇక్కడ ఆ స్త్రీ బయటకు వచ్చుచున్నది, కాని నీ కొరకు.... ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెప్పుచున్నాను. ఇక్కడున్న ప్రతి ఆత్మను పరిశుద్ధాత్మ ఆధీనము క్రిందికి తెచ్చుచున్నాను. నేను చూచునట్లుగా అవి క్రియ చేయును గాక!

92

ఈమె బహు ఎక్కువగా ఉద్రిక్తతలో యున్నది. ఒక నరముల స్థితిలో ఉండి ఆమె బాధపడుచున్నది. ఆమె ఇంటిలోనికి నడచుట నాకు కనబడుచున్నది. నరముల ఉద్రిక్తత, తన చేతులు పట్టుకొనియున్నది. కూర్చొనియున్నప్పుడు తన వ్రేళ్ళ పట్టుకొనియున్నది. ఆమె తన చేతులు ఈలాగు కదుపుచూ కూర్చొన్నది.

అక్కడ ఏదో యున్నది. తన వైద్యుని కోసం చూస్తున్నది లేదా మరేదో వెదకుచున్నది. అది... ఆమె భుజము వెనుక ఉన్నది. చూద్దాం. అతడు చెప్పినది నాకు వినబడలేదు. అది చిన్న స్థలము. అది ఒక చిన్న.... దానిని ఒక కణితి అందుము. నిన్ను చూచుచున్నాను. ఒక ఆస్పత్రి నొద్దగాని లేదా వైద్యశాలలో గాని ఉన్నావు. అది ఒక శస్త్రచికిత్స ఒక విధమైనది. ఓ, అది ఫిస్టులా శస్త్రచికిత్స, అది కొద్దికాలము క్రితం జరిగినది, అది ఇంకనూ స్వస్థపడలేదు. అది సత్యమైయున్నది. పరిశుద్ధాత్మడు ఆ విధముగా సెలవిచ్చెను. అది సత్యమైయున్నదా, కాదా?

అది ఆ విధముగా ఉన్నదని నీవు నమ్ముచున్నావా. నీ సహెూదరుడు కాదు, నేను కాదు, యేసు చెప్పెను, “నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును, వారు రోగుల మీద చేతులుంచగా - వారు స్వస్థతను పొందుకుంటారు.” నీవు దానిని నమ్ముచున్నావా?

పరలోకమునందున్న తండ్రీ! ఈమె మీద నా చేతులుంచి ఈ శరీరములో ఉన్న వ్యాధిని యేసుక్రీస్తు నామములో శపించుచున్నాను, ఈమె స్వస్థతను పొందుకొనును గాక. ఆమేన్. సహెూదరి దేవుడు నిన్ను దీవించును గాక. దేవునియందు విశ్వాసముంచి వెళ్ళుము.

93

నీవు నమ్ముచున్నావా? నీవు నిజముగా విశ్వాసమును కలిగియున్నావా? స్త్రీ నీవేమి చేయుచున్నావు? నీవును, నేనును మనము ఒకరికి ఒకరము అపరిచితులము. నీవు ఎవరవో నాకు తెలియదు, అది సత్యము. కాని ఆయనకు నీవు ఎవరో తెలుసు. నీకు ఎవరో ప్రార్ధనా కార్డును ఇచ్చారు, నీ కార్డు యొక్క సంఖ్య పిలువబడుతుంది. అక్కడ అది మాత్రమే జరుగవలసియున్నది.

అది సత్యమైతే, మనము అపరిచితులుగా ఉన్నట్లయితే మీ చేతులను పైకెత్తుము, కాని యేసుకి మీరు జగత్తు పునాది వేయబడకమునుపే తెలుసు. ఆయనకు నేను జగత్తు పునాది వేయబడకమునుపే తెలుసు. మనము భూమి మీదకు కేవలం ఆయన చిత్తప్రకారమే వచ్చియున్నాము. ఆయన యొక్క తండ్రి కృప మనలకు ఇక్కడకు తీసుకొని వచ్చినది. ఆయన మనలను పోషించి ఈ సమయమునకు తీసుకొని వచ్చాడు.

నేను ఒక క్రైస్తవునిగా మారుటకు ఆయన తన కృపను నాకు ఇచ్చియున్నాడు. నీవొక విశ్వాసిగాను, ఒక క్రైస్తవునిగాను మారుటకు ఆయన మీకు కృపను ఇచ్చియున్నాడు. అది సత్యమే. అందుచేత ఆయన గురించి మీతో మాట్లాడే వరమును నాకు ఇచ్చియున్నాడు, అది మాత్రమే నేను చేయగలిగినది, అది కాదా?

94

మీరు చాలా చాలా అధికమైన ఉద్రిక్తతో ఇబ్బందిపడుచున్నారు. దానిని బట్టి మీరు చాలా సార్లు తొట్రిల్లుచున్నారు. అందునుబట్టి మీరు చాలాసార్లు కార్యములను పడవేయుచున్నారు. అది సత్యము.

అప్పుడు మీరు మీ శరీరములో చాలా అధికమైన ద్రవమును కలిగియుంటారు. కొద్దికాలము క్రితం నాకు శస్త్ర చికిత్స జరిగినదని చెపుతారు. ఆ శస్త్రచికిత్సకు కారణము ఈ ద్రవమే. వారు తప్పుడు కార్యమును చేసియున్నారు, అది నిజము, ఆ కారణముచేతనే ఆ ద్రవము అక్కడ చేరుతున్నది. ఇప్పుడు దేవుడు ఆ కార్యమును నీ నుండి దూరము చేయగలడని నీవు నమ్ముచున్నావా?

ప్రియమైన దేవా! నీవు ఇక్కడ ఉన్నావని ఈ ప్రజలకు తెలియనిమ్ము, ప్రభువా, నీవు ఎలా ఉన్నావు? మా హృదయాలు మాలో ఉన్నంత దగ్గరగా నీవు ఉన్నావు. నా సహోదరికి బదులుగా నేను ప్రార్ధిస్తున్నాను, ప్రభువైన దేవా! ప్రార్థన అనే మధ్యవర్తిత్వం నిన్ను అడుగుచున్నాము, ఈ స్త్రీని బాధిస్తున్న ఆ దెయ్యమును బంధించి ఈ స్త్రీని స్వస్థపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

స్త్రీ, అది నిన్ను వదిలిపోయినదని నీవు తెలుసుకోవాలని నేను నీకు చెప్పుచున్నాను. ఈ రాత్రి నీవు ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక దారమును తీసుకొని నీ చుట్టూ కొలత పెట్టుము. దారము ఎంత పొడవుగా ఉన్నదో గమనించుము. రేపటి రాత్రి నీవు వచ్చు సమయమునకు ముందుగా మరలా అదే దారముతో కొలువుము, ఎంత వ్యత్యాసము ఆ రెండిటి మధ్య వచ్చినదో దానిని కత్తిరించి ఇక్కడ ఉన్న ఆ బల్లమీద పడవేయుము. నా కొరకు నీవు దాన్ని చేయగలవా? స్త్రీ వందనస్తుడను. సందేహములేకుండా దేవుని యందు విశ్వాసముంచుము.

95

నీవు నమ్ముచున్నావా? యేసు నిన్ను చేయమని చెప్పినది అదియే. నమ్మినవారికి సమస్తము సాధ్యమే. ఆమేన్. దేవునికే స్తుతి.

స్త్రీ, దేవుడు నీకున్న వెన్నునొప్పి అనే సమస్య నుండి స్వస్థపరచాడని నీవు నమ్ముచున్నావా? ఆయన, నిన్ను బాగుపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? నీవు చేస్తావా? మంచిది. అప్పుడు నీవు నీ స్వస్థత పొందుకుంటావు. నీ విశ్వాసము ఆ కార్యమును చేస్తుంది. ఆమేన్. దేవునికే స్తోత్రము. నమ్మినవారికి సమస్తము సాధ్యమే.

మీరు నాకు తెలియదు. నాకు మీరు తెలియుటకు ముందుగానే మీరు ఎవరో దేవునికి మాత్రమే తెలుసు. కాని మనము ఒకరికి ఒకరము అపరిచితులము, కాదా? మీరు నాకు తెలియదు. కొద్దిగా పాలిపోయునట్లుగా ఉన్నానా, కన్నులకు మీరు ఆరోగ్యముగానే కనిపించుచున్నారు, కాని దేవునికి మీ యొక్క స్థితి ఏమిటో తెలుసు. నీవు దేనికొరకు ఇక్కడ వచ్చియున్నావో తెలుసు. నాకు తెలియదు, ఒకవేళ అది ఆయన నాకు బయలుపరిస్తే తప్ప. నీవు దాన్ని నమ్ముతావా?

96

స్త్రీ యొక్క శక్తిని గూర్చి ఏదో ఉన్నది. అవును, అయ్యా. నీవు ఇక్కడ ఎవరి కొరకు వచ్చియున్నావు, అది ఎవరో కాదు కాని, నీ భర్త యొక్క బంధువుల గుర్చియై యున్నది. ఆమె ఎవరో కాదు, అతని యొక్క అమ్మమ్మ. అది సత్యము. అది సత్యము కాదా? అది సత్యము. ఆమె కాన్సరు వ్యాధితో మరణిస్తున్నది. అది సత్యము. నీ భర్తకు ఆ సంగతి తెలుసు. అతడు ఆ పాత సిగరెట్లను క్రింద పడవేసినట్లయితే, అది సత్యము, అది కాదా? ఇప్పుడు అతడి జేబులో ప్యాకెట్టు నిండుగా సిగరెట్లు ఉన్నాయి, అతడు వాటిని విసరివేసి తన తల్లి నిమిత్తము ప్రార్ధించినట్లయితే, అతడి ప్రార్థనను దేవుడు వింటాడని నేను నమ్ముచున్నాను. నేను మీ మనసులను చదువుటలేదు, అటువంటిది ఏదీ లేదు, కాని, యేసుక్రీస్తు ఇక్కడ నిలబడియున్నాడు. స్త్రీ, నీవు దానిని బట్టి మెలకువగా ఉండుము. అవును, నీవు రక్తహీనత కలిగియున్నావు. అవును నీవు రక్తహీనత కలిగియున్నావు.

నీవు అధికమైన ఉద్రిక్తత కలిగిన ఒక స్త్రీవి మరియు మరొక సంగతి ఏమిటంటే నీ రక్తములో సమస్య ఉన్నది. అది తక్కువ రక్తప్రసరణ (లో-బి.పి.), నీవు బరువు పెరుగుటకు చాలా చాలా చాలా ప్రయత్నములు చేసియున్నావు, అయినను నీవు బరువు పెరగలేదు. అది సత్యము. అది సత్యము కాదా? అది 'యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు.' గమనించారా?

నీవాయన సన్నిధిలో ఉన్నానని తలంచుచున్నావా? నీవడిగిన ప్రతి దాని కొరకు ఆయనను అంగీకరించుము. అప్పుడు పరమ తండ్రీ, ఈ స్త్రీ పై చేతులుంచి ఆమెను బాధపరచుచున్న అపవాదిని గద్దించుచున్నాను. యేసుక్రీస్తు జయించమని నేను అడుగుచున్నాను. క్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాను. ఆమేన్.

97

నీవెట్లు నమ్మకుండా ఉండగలవు? ఇంకా ఎక్కువ ఆయనేమి చేయగలడు? “నీవు నమ్మినయెడల నీకు సమస్తము సాధ్యమే.” ప్రభువుకు స్తోత్రము.

ఎంత అద్భుతము! విశ్వాసము కలిగియుండుము. ఏదో జరిగినది. అది ఎక్కడ జరిగినదో నేను చూడలేను. సమూహములో అప్పుడే ఎవరో స్వస్థత పొందిరి. నిజం. ఇక్కడే సమీపంలో జరిగినది. ప్రార్థించుట ఆపుము. నా ద్వారా అపవాది దానిని పొందనీయకండి.

సోదరీ, పిత్తాశయపు సమస్య, ఆ వెనుకన కూర్చొనియున్నది. ప్రభువైన యేసు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? అయితే నీ స్వస్థత నీవు పొందుకొనవచ్చును. దేవుడు నిన్ను దీవించును గాక.

నీవు ఆ చిన్న బాలిక వెనుక కూర్చొనియున్నావు. అక్కడ నీ వెనుక నిలబడి యున్నది. నేను చూచుచున్నాను - ప్రభువు దూత ఇక్కడకు పైన నిలబడియుండుట నాకు కనబడుచున్నది, కాని అదెక్కడ ఇంకా నేను చెప్పలేను. చిన్న పాప అక్కడ కూర్చొనియున్నది. నీవు ప్రార్థించుచున్నావు, దేవుడు నా ద్వారా, నీతో మాట్లాడమని. అది నిజమే అయితే, నీ చేతిని హల్లెలూయా.

98

ప్రభువైన యేసూ, నిన్ను ఆరాధించుచున్నాము. మేము నీకు స్తుతి మరియు మహిమ ఇచ్చుచున్నాము. నీవు షారోను పుష్పానివి. లోయలోని పద్మముగా ఉన్నావు. ఉదయ నక్షత్రమైయున్నావు. ఆమేన్.

ఆయన ఎంత అద్భుతముగా ఉన్నాడు! సరే, ఆ స్త్రీ ఆమెకు దగ్గర కూర్చొనియున్నది. కొంత జ్వరముగా ఉన్నావు. ప్రభువైన యేసు నిన్ను బాగుచేయునని నమ్ముచున్నావు గదా? నీవు నమ్మినయెడల పొందగలవు. దేవుడు నిన్ను దీవించును. మంచిది. బెత్...? ఆమెతో మాట్లాడుచూ కొద్ది నిమిషాల క్రితం బాగయినట్లు చెప్పెను. నీ చేతులు పైకెత్తుము, అది నిజమని ఖచ్చితముగా ఉండుము. కాదు, సోదరీ, నీ వెనుక నున్న చిన్న స్త్రీ, కుడిగా వెనక... నల్లని జుట్టు... అక్కడే... అపుడే నీవు తిరిగి యున్నావు. అమ్మా, ఆయన అక్కడున్నాడు. అవును. ఆమేన్. అది పోయినది. అది ఒక వ్యాధి కాదు. ముక్కులోని ఒక పరిస్థితి. చూచారా? పలచటి చర్మము. నీవు మరల ఎన్నడూ దానితో బాధపడవు అని నేను నమ్ముచున్నాను. అక్కడ దేవుడు ఒక క్రొత్త చర్మపు పొర పుట్టించగలడు. ఆయన సృష్టికర్త, ఆమేన్ హల్లెలూయా.

99

మీరెట్లున్నారు? ఓ, ఇప్పుడు నేను అలసిపోయాను, కాని నేను - ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడున్నాడని నేను నమ్ముచున్నాను. నేను సహాయపడుచున్నాను. ఒక రోజున ఆయన సహాయపడునని నిరీక్షణతో యున్నాను. మీ ప్రతి ఒక్కరు బాగుపడవలెను. నీవు చక్కని మనిషివి. నీవు నాకు ఇష్టము. మీకు వందనములు. కాని దేవుడు మీ యొక్క కఠిన పరిస్థితి నుండి స్వస్థపరచగలడు. హెర్నియాను బాగుచేయును. అది నమ్ముచున్నారా? మీరు నమ్మినచో ఒక సంగతి మీతో చెప్పెదను. మీకొక అలవాటున్నది. దానిని విడిచిపెట్టెదరా? సిగరెట్ల త్రాగుట. మీరు చేయవలసిన మరొక పని ఏమనగా, ఇప్పుడే వెంటనే క్రీస్తుకు హృదయమును ఇవ్వవలెను, ఎందుకనగా మీరు క్రైస్తవులు కారు. మీరు మీ హృదయమును క్రీస్తునకు ఇవ్వవలెను. ఆ ఉద్దేశముతో ఇక్కడికి రావలెను. అవును కదా! నిజమయినచో నీ చేతిని పైకెత్తుము. నీ పాపములు క్షమించబడినవి.

పరమతండ్రీ! యేసుక్రీస్తు నామములో నీవిట్లు చెప్పితివి. “నా మాటలు వినమని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. మన సోదరుడు మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. ఓ, దేవా... నీ శక్తికి ఒక రుజువు ఇక్కడ నేను నిలబడి యున్నాను. క్రీస్తు నామములో ఆమేన్. ప్రభువు మిమ్ము దీవించును.

ఇతడు నా సోదరుడు, పాపికాడు గాని నా సోదరుడు. దేవుడు నిన్ను దీవించును. నీ వారిలో సంతోషించుచూ వెళ్ళుము, ఆనందముతో నిండుము. ప్రభువుకు స్తోత్రము. అత్యధికముగా, సమృద్ధిగా కుమ్మరించుము. ఓ, ఎంత అద్భుతము. ఆయనెంత అద్భుతము.

100

ప్రభువైన యేసు నీ పొత్తికడుపు బాధను బాగు చేసెనని ఆ వెనుక కూర్చొనియున్న నీవు నమ్ముచున్నావా స్త్రీ, నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముచున్నయెడల దానిని నీవు పొందగలవు. నీవది పలుకుచుండగానే, ఇక్కడున్న ఈమెకు ఎక్కువ రక్త ఒత్తిడి యున్నది. అక్కడ కూర్చొన్నది. చివరి నుండి రెండవ చోటులో ప్రభువైన యేసుక్రీస్తు దానిని నీలో నుండి తీసివేయుచున్నాడని నీవు నమ్ముచున్నావా? అమ్మా! నీవు నమ్ముచున్నావా? చారల బట్టలు వేసికొనిన ఆమె. నీ పూర్ణహృదయముతో నమ్ముచున్నావా? దానిని నమ్ముచున్నచో, నీ చేతిని ఎత్తుము. పైకి ఎత్తి చూపుము. మంచిది. నీవు అక్కడున్నావు. సరే. దేవుడు నిన్ను దీవించును గాక. నీవు దానిని పొందుకొనుము. హల్లేలూయ. నేను సవాలు చేయుచున్నాను '96 విడుదలను: “ఇక్కడున్న ప్రతి ఒక్కరు.”

ఇప్పుడు మనము ఎక్కడున్నాము: “మీరు క్రీస్తు నామములో.”

అది ఏ విధముగానయినా గాని వ్రాయవచ్చునన్నట్లుగా ధ్వనించుచున్నది. క్రీస్తు నామములో మీరు దానిని నమ్మవలెను. ఆమేన్. ఓ, సరే. మంచిది. ఇప్పుడు ఎంతమంది ఇక్కడి కూటములో ఆయన తరంగమువలె వచ్చి ప్రతి వ్యక్తిని స్వస్ధపరచును అని నమ్ముచున్నారు? ఇపుడాయన అది చేయును. కేవలము గమనించండి. ఆయనను నమ్మండి. చూచి బ్రదకండి.

ఇక్కడ ఒకామెయున్నది, పూర్తిగా క్రొత్తది. నా జీవితంలో ఎక్కడా నేను చూడలేదు. దేవుడామెను ఎరుగును. నాకు తెలియదు. ఈ స్త్రీ యొక్క హృదయములోని రహస్యమును దేవుడు గనుక బయలుపరచినచో లేక నేను ఏదీ తెలియని ఎరిగిన, దానిని ఆమె తెలుసుకొనినచో, నా జీవితంలో ఎన్నడూ నేనామెను చూడలేదు. ఆమె అపరచితురాలు, కాని దేవుడు బయలుపరచినచో ఎందరు ఇప్పుడే ఆయనను నీ రక్షకునిగా, స్వస్థపరచువానిగా, రానున్న రాజుగా ఇక్కడే ఇప్పుడే అంగీకరించెదరు? దేవుడు బయలుపరచును. ఇప్పడే ఎంతమంది క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించెదరు. పరిశుద్ధాత్మ ఏదో జరిగించుటకు సిద్ధముగా ఉన్నదని నేను ఇప్పుడు తలంచుచున్నాను. మీకెన్నడయినా ఆ భావన కలిగినదా? ఇప్పుడే అది నా హృదయంలోనికి వచ్చినది. మీరు ఇప్పుడే ప్రార్ధించవలెనను భావము కలుగుచున్నది? ఇప్పుడు దానిని కేవలము నమ్మండి. ఈ బీద స్త్రీకి దేవుడు ఇప్పుడే అనుగ్రహించును గాక!

101

అమ్మా, నా వైపు చూడు మోషే జనులను కలసికొనినపుడెల్లా, తాను దేవుని ద్వారా పంపబడితినని గాని, సూచక క్రియ చేసి చూపించుట గాని వారికి ప్రకటన చేయుటగాని చేయనవసరము లేకుండెను. ఒక్కసారే ఆయన చేసి చూపెను. ఒక విధముగా నేను నమ్ముచున్నదేమనగా, ఈ సమూహము దానిని పొందుటకు సిద్ధముగా యున్నది. మనము ష్రివ్-పోర్టులో ఉన్నది మనం ఆయన కలిగియుండిన దానిలో శ్రేష్టమైనది.

ఇప్పుడు, దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు, మీరాయనను ప్రేమించుచున్నారు. నేను మిమ్మును ఎరుగను. దేవుడు మిమ్మును ఎరుగును, కాని ఇప్పుడు ఆ స్త్రీ నా యొద్దనుండి వెళ్ళుచున్నది. ఆమెకు గొంతులో ఏదో సమస్య ఉన్నది. అది గొంతు వ్యాధి. ఒక గొంతు వ్యాధి అని ఖచ్చితంగా చెప్పలేను. నీవు బోధకుని ఒక ఉపదేశమిచ్చు వ్యక్తివి. బోదకురాలగు స్త్రీ, నీవు మాట్లాడుచున్నప్పుడు, అది ఒక.... నిన్ను చూచిన తరువాత... ఆ విధంగా యున్నది. కొన్ని రాత్రులు బహుశా, నీవు నీ గొంతుతో బాధపడుచున్నావు. నీవు ఒక హృదయం బ్రద్దలయిన స్త్రీ బోధకురాలవు. నీ హృదయము మీద ఒక భారమున్నది. నీవు నన్ను ఒక సోదరునిగా ఎంచి, ఒక త్రాగుబోతు కుమారుని నిమిత్తము విజ్ఞాపన చేయుటకు వచ్చియున్నావు. నీ హృదయము బ్రద్దలయినది. నీవు స్త్రీ బోధకురాలివి, నీ కుమారుడు త్రాగుచున్నాడు. నీవు నా యొద్దకు క్రీస్తును అడగమని చెప్పుటకు వచ్చియున్నావు. అతని త్రోవలో దేవుడు అడ్డము వేసి ఆపవలెనని అడుగుచున్నావు. అది నిజమా, కాదా? అది నిజము. నీ చేతిని ఎత్తుము.

102

నీవాయనను నమ్ముచున్నావా? నీ వాయనను చేర్చుకోగురుచున్నావా? నన్ను ఆయన సేవకునిగా నీవు నమ్ముచున్నావా? నిజానికి మీలో ఎందరు స్వస్థత పొందగోరుచున్నారు. మీ హృదయమంతరంగము నుండి మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. ఒక పని చేయవలెనని మిమ్మును కోరుచున్నాను.

నేను కొన్ని గంటలు ఇక్కడ కూర్చుని యున్నాను. ఈ వేదిక పిలుపు కొనసాగవలెనని కోరుచున్నాను. కొద్దిపాటి బలము మిగిలియున్నది. ఇది నిజము, కాని ఈ వేదిక పిలుపు కొనసాగోరుచున్నాను. మీ ప్రతి ఒక్కరు బాగుపడవలెనని నేను కోరుచున్నాను. మీ ప్రతి ఒక్కరిని చూడగోరుచున్నాను. మరియు వినండి, దేవుడు దానిని మీకు రుజువు చేసెను. నేను - నేను - నేను అబద్ధ ప్రవక్తను కాను. నేనాయన దాసుడను. ఆయన తన్నుతాను ఒకదైవ వరముగా ప్రకటించుకొనెను. ఇక్కడున్న ప్రతి వ్యక్తి వెంటనే క్రీస్తు వైపు చూచినచో, మీరు స్వస్థతపొందును. దానిని మీరు నమ్ముచున్నారా?

ఇప్పుడు, మీరు ఒకరి చేతిని మరొకరిపైన వేసికొనండి. నిలబడినవారు ఎవరయినా పరవాలేదు ఒకరిపై ఒకరు చేతులుంచుకొనండి..? దేవుడు వారిని లేపును...? యేసుక్రీసు నామములో దయ్యమును నేను వెళ్ళగొట్టుచున్నాను...? ప్రతి ఒక్కరు...?

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...