సంఘము మరియు దాని స్థితి

సంఘము మరియు దాని స్థితి

VGR COUNT -193 ఈ ఉదయ కాలపు ప్రార్థనలో ఒక విచిత్రమైన వ్యాధిని గురించి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసికొనవలసియున్నది, కాబట్టి ఆవిధముగా చేయాలని మేము అందరినీ కోరుచున్నాము. డాక్టర్లకే అది తెలియుట లేదు, వారు ఆవ్యాధికి ఏదో ఒక రకమైన పేరు పెట్టుచున్నారు, అయితే వారు దానిని విడువలేకున్నారని నేను తలంచుచున్నాను, ఎందుకనగా అదేమిటో వారికి తెలియుట లేదు, అయితే క్రీస్తునకు అది ఏమిటో తెలియును. అది ఏమిటో నేను చెప్పగలను, అది ఒక దయ్యముగా ఉన్నది, అది నిజము, అది దయ్యమే. దానికి వారు ఏ పేరు ఇవ్వగలరో, అది వారికి సంబంధించినది. అయితే అది వాడే. అదే అయి ఉన్నాడు. వాడొక దురాత్మగా ఉన్నాడు. ఇప్పుడు మనమందరము ఏకముగా కలిసి ''కేవలము విశ్వసించు'' అను పాటను పాడుదము. ప్రతి ఒక్కరు కలిసిపాడుడి.

కేవలము విశ్వసించు, కేవలము విశ్వసించు,

సమస్తమును సాధ్యమే, కేవలము విశ్వసించు;

కేవలము విశ్వసించు, కేవలము విశ్వసించు,

సమస్తమును సాధ్యమే, కేవలము విశ్వసించు.

2

మనమందరము తలలు వంచి యుండగా ఈ బాలిక కొరకు ప్రార్థించుదము.

మా పరలోకపు తండ్రీ, కేవలం నేను దానిని నా ఆలోచన నుండి తీసివేయ లేకున్నాను. అక్కడ మరణించుచున్న ఆ బాలిక ఒకరి తల్లితండ్రుల ముద్దుల కుమార్తె. ఆమె నీ సృష్టియై యున్నది, మరియు సాతాను ఆమె యౌవ్వన జీవితమును దోచుకొనుచున్నది. క్రీస్తు నామములో నేను ప్రార్థించునదేమనగా మరణపు హస్తమును నీవు నిలుపగలవు, ఆ శత్రువును వెనుకకు తరిమి వేయుము. ప్రభువా, నీవు ఎర్ర సముద్రమును ఇరు ప్రక్కల గోడల వలె నిలిపితివి, నీ స్వాస్థమైన ఇశ్రాయేలు పిల్లలు ఆ వాగ్దాన భూమిని చేరునట్లు సురక్షిత ప్రయాణమును ఆ సముద్రము ద్వారా ఇవ్వగలవు. దేవా, ప్రతి ఆటంకమును నీవు కదిలించి, ఈ బిడ్డ జీవించునట్లు చేయుము. మేము అడిగిన విదముగా అది ఇవ్వబడినది. మేము నీ యందు విశ్వసించుచు ఒక సమూహ ప్రజలుగా ఈ బిడ్డ స్వస్థత కొరకు యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

3

ఈ దినము కృతజ్ఞతగల హృదయముతో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరలా మీ యొద్దకు వచ్చియున్నాను. ఇప్పుడే కొద్ది సమయమునకు ముందుగా లూసియానా నుండి ఇంటికి వచ్చాను. ఆదివారమునకు ముందు వచ్చినట్లయిన ఆదివారపు-బడిని నేను నడుపగలనని తలంచాను. అక్కడ వాతావరణము ఎంతో వేడిగా ఉండినది. ఇక్కడ చల్లగా ఉన్నది. లూసియానా కంటె చల్లగా ఉన్నది. ఇంకా లూసియానాలో, గాలి లేని గదిలో మీరు కూర్చుండలేరు. అక్కడ ఖచ్చితముగా ఏయిర్ కండిషన్ కావలసియున్నది, లేకున్న మీకు ఆవేడి దెబ్బకు మీకు మూర్చ కలుగును.

4

అందువలన నేను ఉత్తరపు సాస్-కచ్చెవాన్ ప్రాంతమునకు వెళ్లుటకు ముందుగా, ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసికోవాలని ముందుగా వచ్చాను. రానున్న వారములో నేను వెళ్లవలసియున్నది. ఆ ప్రాంతము ప్రిన్స్ ఆల్‌బర్ట్ దగ్గర ఉన్నది. ప్రపంచములోని రహదారులు వెళ్లునంత దూరముగా అవతల వైపు నుండి అది ఉన్నది. ప్రపంచము పైనున్న సమస్త మార్గములను దాటి అది ఉన్నది. ఈసారి ఆ లోగిటి ప్రాంతములలో ఇండియన్స్ మరియు ఎస్కిమోలు ఉన్న స్థలమునకు వెళ్లుచున్నాము.

ఇప్పుడు ఈ కూటములో కెనడాలోని అన్ని ప్రాంతముల వారు కూడుచున్నారు. కొందరేమో పడమర తీరప్రాంతము నుండి వచ్చియున్నారు. అక్కడ నుండి వచ్చుచున్నామని వారు చెప్పారు. మీ ప్రార్థనలను నేను నిశ్చయముగా కోరుచున్నాను. దాని ద్వారా దేవుడు మనలను సంధించి, మనకు అధికముగా ఆయన మహిమార్థము ఈ గొప్ప కూడికను ఇచ్చుచున్నాడు. నేను కెనడా దేశమునకు వచ్చి నాలుగు, ఐదు సంవత్సరములు అగుచున్నది. అక్కడ నిజముగా కొందరు రాజరిక స్నేహితులున్నారు, వారు చాలా మంచి ప్రజలు.

5

మరియు వారు సంఘమునకు వెళ్లుటలో చాలా భక్తిగా ఉందురు. ఎంత చలిగా ఉన్ననూ లెక్క చేయరు. చలి కోటులు కప్పుకొని గుర్రపు బండ్లలో కూర్చొని ముప్పై మైళ్ల దూరము ఆ గుర్రములపై స్వారీ చేయుచు సంఘమునకు వచ్చెదరు. వారు ఆ మంచు దిబ్బలలో నడిచి వచ్చెదరు. వృద్దులు యౌవ్వనులు అలా కలసి వచ్చెదరు. వారు ఐక్యముగా కలిసియుందురు. ఒక కుటుంబము ఇంకోక కుంటుంబంమును కలుపుకొని ఒకటిగా కలసి నడచి అలాగే వెళ్లుదురు. ఆ విధముగా వారు త్యాగము చేయుట ద్వారా, ఆరాధన నుండి వెళ్లునప్పుడు అంత అధికముగా (ఆశీర్వాదము) పొందుదురు. త్యాగము లేనప్పుడు, ఆరాధన అనునది అధికముగా ఉండదు. మీరు మిమ్ములను తగ్గించుకొని, మీకు బాధ కలిగినప్పటికిని, కొన్ని కార్యములను ప్రక్కన ఉంచి మీ పనులను ఆపవలసియున్నది. ఆ విధముగా ఆలయమునకు వెళ్లి మీరు ఆయనను ప్రేమించుచున్నారని, దేవునికి చూపవలసియున్నది, ఆలయమునకు వెళ్లుటకు త్యాగము చేసికొనవలయును, అప్పుడే నీవు దాని నుండి కొంత మేలును పొందగలవు.

6

అది నాచిన్న పిల్లలు చేయునట్లే ఉండును. బిల్లీ పాల్... నేను చిన్న పిల్లవానిగా ఉండినప్పుడు నేను దేనిని పొందలేదు. మా అమ్మ ఒక చిరుతిండిని మాత్రము ఇచ్చును. అది కూడ ఒక్కొక్కరికి రెండు లేక మూడు వంతున లెక్కించి ఇచ్చును. క్రిస్మస్ కు మాత్రము ఒక చిన్న డబ్బా నిండుగా ఫలహారమును లేక చిన్న తుపాకిని లేక మరేదైనా పొందెదము. ఇతరులు మంచి బట్టలను, వెచ్చని చొక్కాలను మరియు సైకిళ్లను కలిగియుండుటను నేను చూచినప్పుడు నేను ఎక్కువగా దుఃఖించెదను. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, ''నాకు పిల్లలున్న యెడల వారికి నేను చేయగలిగినదంతయు చేయుదును.'' మంచిది. నా బిడ్డల కొరకు ఏదైనను తెచ్చుటకు నేను ఆకలితోనైనను ఉందును. మరియు నేను జీవించినంత కాలము...

బిల్లీ చిన్నవాడుగా ఉన్నప్పుడు, అతనికి చిన్న మూడు చక్రముల సైకిలును తెచ్చాను, మరియు అతనికి ప్రతి దానిని తెచ్చుచుండెదను. మరియు మీడా తన స్వంత బట్టలను మరియు అన్నింటిని వదలుకొని అతనికి ఏదైనా ఇచ్చుచుండెను. అయితే మేము కనుగొన్నది ఏమిటో మీకు తెలియునా? అతని కొరకు ఒక చిన్న మూడు చక్రముల సైకిలు మరియు చిన్న విల్లును దానిలోని భాణము మాత్రమే నేను తెచ్చాను మరియు అతడు ఒక చిన్న గంటెను లేదా ఒక కర్ర తీసికొని తోటలో ఒక మూలన త్రవ్వుచూ ఉండెను, చూశారా. అప్పుడు నేను, ''తరువాత తెచ్చేవి అలాంటిది కాదు'' అని చెప్పాను, చూశారా. మీరు దేనినైనను, ఎవ్వరికైనను ఇవ్వవచ్చును, కాని అది వారికి అవసరము ఉండదు. ఏదోకటి మీరు వారికొరకు వదులుకోవలసియుండును!

7

మరియు ఆ విధముగానే రక్షణ కూడ ఉన్నది. అది పూర్తి త్యాగముతో ఉన్నది. అది అలాగు ఉన్నది, సహో. రాయ్‌ గారు. అది మీరు ప్రతిదినము చేయవలసిన అర్పణగా అది ఉన్నది. దేవునికి అతి సమీపముగా చేరు కార్యమైయున్నది. మరియు, అది మీ అందరి త్యాగముగా ఉన్నదని నాకు తెలియును. ఈ ఉదయ కాలమంతయు వేడిగా ఉండు ఈ కట్టడములో కూర్చుండుట మీరు చేస్తున్న త్యాగముగా ఉన్నది. మనమిక్కడ కూర్చొని యుండగా మానవ జాతి చేయుటకై ఇవ్వబడిన ఆ గొప్ప అర్పణను మన మనస్సునందు ఉంచుకొని యుందము. అది ప్రభువైన యేసుక్రీస్తు మన స్థానమందు మరణించుటకై ఈ భూమిపైకి వచ్చునట్లు ఆయన ఆజ్ఞను పొందాడు. అది మాత్రము కాదు గాని, ఆయన ఆత్మ పాతాళములోనికి దిగి, అక్కడ మూడు రాత్రింబవళ్లు ఉండెను. మూడవ దినమున పునరుత్థానుడై, ఉన్నతమునకు ఆరోహణుడై పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున కూర్చొనియున్నాడు. అక్కడ మన కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. మనమాయన బలి (మరణమును) అంగీకరించుట ద్వారా ఆయన కృప మనకొరకు ఏర్పరచబడినది.

8

ఇప్పుడు... మనము వెళ్లుచున్న ఆ స్థలములో (ఆలయములో) అనేకమంది ప్రజలున్నారు. నిజమైన పేదవాడు, వారి పశువులలో ఒకదానిని అమ్మవలసి యుండినది, లేక గొర్రెలలో రెండింటిని లేక మూడింటిని అమ్మవలసియుండినది. ఈ కూడికలకు వచ్చుటకు గాను, వారు మరేదో ఒక దానిని అమ్మవలసియుండినది. ఆ పూర్వపు ఎస్కిమోలు వారియొద్ద ఉన్న చర్మమును అమ్మి వచ్చెదరు. నిజముగా అది వారికుటుంబములను పైకి తెచ్చుటకు కావలసియున్నది. ఆ విధముగానే ఆ ఇండియన్ వ్యాపారులు చేయవలసియున్ననది. ఇప్పుడు, వారి కొరకు కనీసము ప్రార్థించవలసిన వారమై మనమున్నాము. మనము చేయలేమా? దేవుడు వారికి ఒక గొప్పదానిని ఇచ్చునట్లు మనము ప్రార్థించెదము.

9

ఇప్పుడు, అధిక వేడిగా ఉన్నది; మిమ్ములను ఎక్కువ సమయము ఇక్కడ కూర్చుండనివ్వను. వ్యాధిగలవారి కొరకు ప్రార్థించుటకు ముందుగా, మనము మన మనస్సులను ఈ ఉదయ కాలము, ''సంఘము మరియు దాని యొక్క స్థితి'' పై ఉంచుదము. మరియు ఇప్పుడు, కొన్నిరోజుల క్రితము లూసియానాలోని ష్రీవ్‌పోర్ట్‌లో ఆ సంఘమునకు ఇవ్వబడిన వర్తమానముగా ఇది ఉన్నది. మరియు నేను నమ్మునదేమనగా అదే సంఘము యొక్క స్థితిగతులుగా ఇది ఉన్నది. దీనితో మనము ఈ ఉదయ కాలములో దేవుని ప్రార్థించెదము. అదే విధముగా సమీపించుటకు గురి పెట్టుకొనవద్దు. మనము జీవించు ఈ దినమున సహాయము చేయుమని దేవుని అడుగుదము. అంతకు ముందుగా... ఇది ఒక గొప్ప పురాతనమైన బైబిలుగా ఉన్నది. అయితే అక్కడే నిత్యజీవము యొక్క సారాంశము కూడ ఉన్నది.

10

మరియు జ్ఞాపకముంచుకొనుడి, వాక్యము దేవుడైయున్నాడు. దేవుడు ఆయన వాక్యము తప్ప మరోకటి కాదు. మనము మన నోట నుండి వచ్చు వాక్యము లేక మాటగా ఉన్నాము, మనము... ఇప్పుడు నీవు, నేను ఒక వ్యత్యాసమైన జ్ఞానములో, జ్ఞానము కలిగి, ఎందుకనగా మనము, మనమిలా చెప్పవచ్చును. ''ఓ, నేనొక కార్యమును చేయగలను'' అని మనమనస్సునందు భావించవచ్చును. అయితే పరిస్థితులు మనలను ఆ కార్యములను చేయనివ్వక పోవచ్చును, మనము చేయగలమని చెప్పిన దానిని చేయలేక పోవచ్చు. అయితే దేవుడు అలా చేయడు, ఎందుకనగా ఆయన అనంతుడుగా ఉన్నాడు. మరియు ప్రతి దానిని ఆయన ఎరిగియున్నాడు. ఉన్నటువంటిదేదైనను అయన ఎరిగియున్నాడు. రాబోవు దానిని కూడ అయన ఎరిగియున్నాడు, లేక ఆయన దాని వెనుక నిలచెదనని ఆయనకు తెలిసిన దానిని కాక ఆయన ఏదియు సెలవియ్యడు. కాబట్టి, తాను దానిని బలపర్చగలను అని తెలియకుండా, ఆయన ఏ ప్రకటనను చేయడు.

11

మరియు అబ్రాహాము, వంద సంవత్సరములు నిండిన వాడైయుండగా, లేనివాటిని అతడు పిలచాడు, అవి ఉన్నట్లే ఆయన తలంచాడు. ఇది ఇప్పుడు వ్యాధిగల వారి కొరకు ప్రార్థించువారిని ఉత్సాహపరచుటకై దీనిని చెప్పుచున్నాను. అబ్రాహాము లేని వాటిని ఉన్నట్లే పిలచాడు, ఎందుకనగా అతనితో వాగ్దానము చేసినవాడు దానిని చేయగలడని అతడు నమ్మాడు. లేక తన వాగ్దానమును నిలుపు కొనగలడని నమ్మాడు.

అబ్రాహాము డెబ్బది సంవత్పరముల వయస్సు గలవాడై యుండగా దేవుడతనితో, అప్పుడు శారాకు అరువది-ఐదు సంవత్సరమలు నిండియున్నవి. వారికొక కుమారుడు కలుగునని సెలవిచ్చాడు, ఎందుకు, అది ఎంత మాత్రమూ సాధ్యము కాదు. అయినను అతడు దానిని నమ్ముచు, ఆ బిడ్డ కొరకు ఎదురు చూచాడు. ఆ బిడ్డ అక్కడ ఉన్నట్లే ఆ బిడ్డ జన్మించుటకు ముందు ఇరువది ఐదు సంవత్సరములుగా ఎదురు చూచాడు. ఆ బిడ్డ జన్మించునప్పటికి అబ్రాహాముకు వంద మరియు శారాకు తొంబది సంవత్సరములు కావచ్చినవి, ఎందుకనగా అతడు ఆయనను నమ్మెను, లేని వాటిని ఉన్నట్లే అతడు పిలచాడు.

12

ఇప్పుడు, ఇది వ్యాధి మరియు బాధలుగల వారి కొరకు ప్రార్థించుటకై చెప్పబడినది. మీ సమస్యలు ఏవైనా కావచ్చు, మరియు మీకు ఏ విధమైన వ్యాధియైనను ఉండవచ్చు, మీరు ఎంత దుఃఖకరమైన స్థితిలో ఉన్ననూ, మీరు క్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన వాక్యమును అంగీకరించినప్పుడు అవి లేనప్పటికిని మీరు ఆ కార్యములను పిలచెదరు. అవి దేవుని వాక్యమునకు వ్యత్యాసముగాను ఉండవచ్చు. ఇప్పుడు, దేవుడు చెప్పినదేమనగా ''విశ్వాసముతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచును.'' మంచిది, ఆ విధముగా దేవుడు చెప్పినప్పుడు అంతటితో అది ముగించి పోయినది. అంతట దానిపై మన మనస్సునుంచి, ఎదురు చూచి, అది నెరవేరినట్లే నడచుకొనవలసి యున్నది, మనము అంగీకరించినప్పుడే అది జరిగిపోయినది.

13

రక్షణ కూడ ఆ విధముగానే ఉన్నది. మనము దానిని విశ్వసించెదము, అంగీకరించెదము, మన హృదయములలో దానిని విశ్వసించుదము, క్రీస్తును మనస్వంత రక్షకునిగా అంగీకరించి దేవుని ఎదుట నడచెదము. ఆయనను అంగీకరింతుము. ఈ ఉదయకాలము నీవిక్కడ ఒక పాపిగాను, రక్షణ లేకుండా మరియు నీకు స్వస్థత కావలసియున్న యెడల, ఒకవేళ నీవు వ్యాధితో బాధపడుచున్నను మొదటిగా ప్రభువుని అడుగుము. ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించుము, అప్పుడు నీ వ్యాధి అక్కడే విడిచిపెట్టుటకు ప్రారంభించును. అది ఏమైనప్పటికిని నీ తలంపునంతటిని (నీకు కలిగినదంతయు) పరిపూర్ణ మానవుడైన ఆ క్రీస్తుయేసుపై ఉంచినప్పుడు, అంతా కూడ చక్కపడును.

14

అందువలననీ తలంపును దానిపై ఉంచుము, ఎందుకనగా ఈ కొద్ది మాటలను వ్యాధి, బాధలలో ఉన్నవారి కొరకు చెప్పాను, దాని ద్వారా నేను ఈ ఉదయ కాలము సంఘము దాని స్థితిని గురించి మాట్లాడెదను. మరియు నాకు కలిగిన అనుభూతి ఏదనగా దైవీక స్వస్థత అనునది మంచిదైయున్నది....

అయితే నేను ష్రీవ్‌పోర్టులో ఉన్నప్పుడు, స్వస్థత కూడికలను మూడు లేక నాలుగు కూడికలను మాత్రమే అక్కడ జరిపాను. ఆ పదకొండు దినముల కూడికలలో అంతవరకే జరిపాను. దైవీక స్వస్థతపై అధిక సమయముంచుటకన్నను, మానవ ఆత్మలకు బోధించుట ఎంతో అవసరమైయున్నది. అయినను వ్యాధిలో, అవసరతలో ఉన్నవారిని దేవుడు స్వస్థపరచగలడు. ఆయన చేయగలడని ప్రపంచమంతటను నిరూపించబడినది. అయితే ఇప్పుడు ముఖ్య కార్యమేదనగా ఎన్నడూ మరణించని ఆత్మకు కావలసినదే. శరీరము మరణించును. అయితే ఆత్మ ఎన్నడూ మరణించదు. మనము ఆ స్థితిని దేవునితో ముఖాముఖిగా కలిగియుండవలసి యున్నాము.

15

నేను పలుమార్లు దీనినే చెప్పుచుందును. ప్రతీది జరుగవలయునని నేను ఆశించుచున్నాను. అయితే ఆ ఉదయము ఆ నది యొద్దకు నేను వచ్చినప్పుడు అక్కడ ఏ విధమైన ఇబ్బందిని నేను కోరుటలేదు. నేను నా టిక్కెట్టును నా చేతిలో ఉంచుకొని నా పేరు పిలచువరకు వేచియుండుటకు ఆశించుచున్నాను. క్రీచ్ సోదరుడా, ఆ పూర్వపు పౌలు చెప్పినట్లు, ''నేను ఆ పునరుత్థాన శక్తిలో ఆయనను ఎరిగియున్నాను,'' అని చెప్పుటకే నేను ఇష్టపడుచున్నాను. మరణించిన వారినుండి ఆయనను పిలచినప్పుడు, ఆ ధూళిలో నుండి నేను వచ్చెదను. ఆయన పునరుత్థాన శక్తియందు నేనాయనను ఎరుగుటకు ఇష్టపడుచున్నాను.

16

అందువలన, ఇప్పుడు, ఎవరైతే ఈ గ్రంథమునకు రచయితగా ఉన్నారో ఆయనకు మన హృదయాలతో పాటు మనతలలు వంచుదము.

మా తండ్రివైన దేవా, మాకు నీ వాక్యము తెరువబడునట్లు, నిన్ను అడుగుటకై నీ సన్నిధికి మేము వచ్చుచున్నాము. మేము పేజీలను మాత్రమే త్రిప్పగలము. అయితే పరిశుద్దాత్మ మాత్రమే వాక్యమును తెరువగలడు. అందువలన తండ్రీ, ఈ ఉదయము మా కొరకు ఆ వాక్యమును తెరువుము. మరియు అధికమైన నీ కృపను మాకు దయచేయుము. మేము నీ కొరకై వేచియున్నాము. పరిశుద్దాత్మ వాక్యములోనికి ప్రవేశించి మానవుల పెదవుల ద్వారా మానవ హృదయాలకు రానిమ్ము, మరియు అతడు దానిని తీసికొని అవసరమైన ప్రతి హృదయములో వుంచును మరియు ఈ ఆరాధన ముగియగానే మేము మా గృహములకు వెళ్లుటకు సిద్దముగా ఉందుము. మేము వినయముతో మా తలలను వంచి నీకు వందనములు చెల్లించుచు, నిన్ను స్తుతించుచున్నాము. ఇదంతయు నీవు మా కొరకు చేసిన దానిని మాకు నేర్పించిన దానికై చేయుచు క్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

17

పరిశుద్ద యోహాను వ్రాసిన పత్రికలో చదువలసిన మొదటి అధ్యాయమును, నాతో చదువుటకు ఇష్టపడువారు, బైబిలు తమయొద్ద ఉన్నవారు లేక గుర్తించు కొనుటకు ఇష్టపడువారు అలా చేయవచ్చును. మనము వాక్యము నుండి ఆ భాగమును చదువుచుండగా, పరిశుద్దాత్మ ఆ వాక్య భాగమును మనకు దయచేయునట్లు మనము ప్రార్థించెదము. మనమిప్పుడు చదువుదము, చదువగలిగినవారును చదువవచ్చును, కాని దేవుడు మాత్రమే దానిలోనున్న సారాంశమును వెలికితేగలడు. పాఠ్యభాగమును మనము చదువగలము, ఎందుకనగా అది అతని వాక్యమై యున్నది. అయితే దానిలోని సారాంశమును దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇప్పుడు, యోహాను 1వ అధ్యాయము 28వ వచనము నుండి ప్రారంభించి 32వ వచనము వరకు చదువుదము.

యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.

మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి - ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల.

నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటివాడాయెనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన.

నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను.

మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు - ఆత్మ పావురమువలె ఆకాశము నండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను.

ఆ చివరి 32వ వచనమును మరలా చదువుటకు నేను ఇష్టపడుచున్నాను.

మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు - ఆత్మ పావురమువలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను.

18

ఇప్పుడు, ప్రభువు ఆయన ఆశీర్వాదములను, తన వాక్యముతో చేర్చును గాక ప్రతి వాక్యమును అర్థము చేసికొనుటకు మీరు ప్రయత్నించవలెననినేను ఇష్టపడుచున్నాను. వెనుక ప్రక్క నా స్వరమును వినగలుగుచున్నారా? మంచిది. వెనుక వినబడుచున్నదా? అలాగైతే మీ చేతులెత్తుడి. అది మంచిది.

19

ఇప్పుడు, ఈ ఉదయమందు ఒక ఉపమానముపై మాట్లాడుటకు నేను ఇష్టపడుచున్నాను. ఒక విధముగా, సంఘముతో పరిచయములేని వ్యక్తిగా ఇక్కడ ఎవరైనను ఉన్నయెడల వారు కూడ దీనిని గ్రహించవలెనని కోరుచున్నాను. ఇప్పుడు మనలను పునరుద్ధరించుకొనుటకే సంఘమునకు వచ్చియున్నాము. మంచి క్రైస్తవునిగా, మంచి పౌరునిగాను, మంచి తండ్రులుగా, మంచి తల్లిగాను, మంచి ఇరుగుపొరుగుగా ఉండుటకు ఇక్కడ చేరియున్నాము. మనమెందుకు వచ్చామనగా మనము వచ్చి ఆయన నామమున ఏది అడిగినను, మరియు ఎక్కడ ఇద్దరు, ముగ్గురు కూడి యుందురో అక్కడ నేనుందునని, దానిని మనకు నెరవేర్చునని ఆయన చెప్పెను.

అందువలన మనలను ఉద్దరించుకొనుటకును, మన గ్రహింపును విశాల పరచుకొనుటకును ఇక్కడ చేరుటకంటే, మరేది అధికము కాగలదు? ''నేను అందుకొరకే ఇక్కడున్నానని'' ఎందరు చెప్పగలరో చూడనివ్వుడి? ''నాకు ఇంకనూ అధిక గ్రహింపు కావలెను'' మరియు మనకు దేవుని గురించి గ్రహింపు కావలెనన్న, అది దేవుని వాక్యము నుండి రావలసినదే గాని, వేరే విధముగా మనము దానిని పొందలేదు, ఎందుకనగా మన ఆత్మల ఆకలిని తీర్చుటకు గాను దేవుడు ఇచ్చినదే వాక్యమై యున్నది. మరియు ఆ దేవుని వాక్యమును తీసి, మనలను ఆ వాక్యముచే పోషించుటకే పరిశుద్దాత్మ పంపబడెను. దానిని మీరు చూచారా? చూడండి, పరిశుద్దాత్మ దేవుడు ఎందుకు పంపబడెననగా, ఆ దేవుని వాక్యముతో ఆయన మన అవసరతలను తీర్చును. ఇప్పుడు, దేవుడు ఆ అవకాశమును ఇచ్చినందుకు నాకు చాలా ఆనందముగా ఉన్నది. మీకు లేదా? ఆయన మనలను పోషించును.

మనము ఆయన పచ్చికలోని గొర్రెలమై యున్నాము. ఇంక కొద్ది సమయములో ఆ గొర్రెలను గురించి మాట్లాడనున్నాము. మనము దేవుని యొక్క మూడు విధములైన జీవిగా ఉన్నాము. మన పూర్తి స్వాధీనమందు మనమున్నప్పుడు ఆయన మన ముందు నడిచి మార్గమును చూపును.

20

ఆయన యేసును భూమిపైకి పంపినప్పుడు అది దేవుని ఎంతో సంతోషపరచినది. ఆయన ఒక (సాధువైన) జంతువుగా (గొర్రెపిల్లగా) ప్రాతినిధ్యము వహించినందున అది ఆయనను ఎంతో సంతోషపరచినది. ఆ జంతువు ఒక గొర్రెపిల్లగా ఉన్నది. పూర్వము, ఏదెను తోటలో, యేసు యొక్క రాకడకు ముందస్తు ఛాయగా దేవుడు ఒక గొర్రెపిల్లను వధించెను. క్రీస్తు యొక్క రాకడకు ముందు ఛాయగా ఒక బలిని అర్పించెను.

ఎందుకు దేవుడు క్రీస్తుకు ప్రాతినిధ్యముగా ఒక జంతువును ఉంచెనని నేనెప్పుడును ఆశ్చర్యపడుచుందును. అయితే గొర్రెపిల్ల అనగా ఏమిటని మనము కనుగొన్నాము. ఆయన ఒక గొర్రెపిల్లను ఎన్నుకొనుటకు కారణమేమనగా, ఒక గొర్రెపిల్ల అతి సాధువైన జంతువుగాను, భూమి పైనున్న జంతుజాలమంతటిలో నమ్రత గలదిగా ఉన్నది. ఒక గొర్రెపిల్ల కన్నను సాధువైన, నమ్రతగల జంతువు మరేది లేదు. ఎంతో అమాయకముగాను, తనకు తానుగా నిలచునది కాదు. మొండిదిగా కనిపించదు. అది ఒక సాధువైన, నమ్రతగల జీవి. దేవుడు లోకమునకు క్రీస్తును చూపించుచున్నప్పుడు, ఆయన ఒక గొర్రెపిల్లను చూపెను.

21

ఇప్పుడు, దేవుడు, తండ్రియైన, యెహోవా దేవుడు పరలోకము నుండి అతి సాధువైన, ఆకాశమందు ఎగురు పక్షులన్నిటిలోను అతి వినయమైన పావురముతో తనను పోల్చుకొనుచున్నాడు. పావురము కన్నను నమ్రతగల పక్షి మరొకటి లేదు. నేను పక్షి జీవితమును మరియు వన్యమృగ జీవితమును పరిశీలించాను, అప్పుడు ఆకాశమందు ఎగురు పక్షులన్నింటిలోనూ పావురము ఒక వ్యత్యాసమైన పక్షిగా ఉన్నది. పావురము ఒక ప్రియమైన పక్షి. పావురము నమ్రతగలది. పావురమునకు పసరు తిత్తి అనునది లేదు. పక్షి జాతిలో తిత్తి (గాల్) లేని పక్షి ఇది మాత్రమే. అందువలననే ధాన్యము మరియు విత్తనములు ఉన్న స్థలములో గాక మరి ఏ స్థలమందును పావురమును చూడలేదు.

22

ఇప్పుడు, ఆ ఓడలో (నోవహు కాలమందు) ఒక పావురము ఉండినది బైబిలులో అనేక స్థలములయందు పావురము పరిశుద్దాత్మకు మాదిరిగా ప్రాతినిధ్యము వహించినది. మరియు గొర్రెపిల్ల కూడా బైబిలులో అనేక స్థలములలో క్రీస్తుకు మాదిరిగా ప్రాతినిధ్యము వహించినది. అది ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు క్రీస్తును ప్రత్యక్షపరచుచున్నది. అదే విధముగానే పావురము కూడ ఉన్నది.

మరియు ఆదికాండమందు పావురము ఆ ఓడలో గాలిలో సంచరించు మిలిగిన పక్షులన్నిటితో కలిసి నిద్రించినది; మరియు వాటిలో ఒక పక్షి బొంతకాకి, ఒక విధమైన కాకి. మరియు అక్కడ ఉన్న పక్షులలో కాకి అతి నీచమైనది: కాకి మరియు జెఎ-పక్షి, ఈ రెండునూ నాకు తెలిసిన నీచమైన పక్షులు. కాకి చాలా కాలము జీవించును మరియు అది కొన్నిసార్లు రెండు లేక మూడు వందల సంవత్సరములు జీవించును (వారు చెప్పుచున్నారు), చిలుక అంతకన్ననూ అధికముగా జీవించును.

23

అయితే పావురము తిత్తి (గాల్) లేని ఒక జంతువు లేక పక్షి. ఇప్పుడు, కాకి చచ్చిన పీనుగులపై కూర్చొని తినును. ఒక పావురము ఆ విధముగా చచ్చిన వాటిపై కూర్చొని తినుటను మీరు చూడలేరు. అది దానిని భరించలేదు. ఆ దుర్వాసనను అది భరించలేదు. అది జబ్బున పడును. చెడిన లేక క్రుళ్లిన దేనినైనను అది భరించలేదు. అది దానిని భరించలేదు. గనుక అది వాటిని తినలేదు. తినినయెడల అది వెంటనేచచ్చును, ఎందుకనగా జీర్ణముకాక కడుపునుండి వెలికి వచ్చును. ఆ విధముగా జీర్ణముకానప్పుడు ఆ పావురము చనిపోవును. అందువలన పావురము ఎల్లప్పుడు శుభ్రమైన పరిపూర్ణ స్థలమందు నివసించుట నీవు ఎప్పుడును చూచెదవు.

24

ఇప్పుడు, కాకి వ్యత్యాసమైనది. అది ఒక భక్తిహీనునికి సాదృశ్యముగా ఉన్నది. కాకి చచ్చిన దానిపై కూర్చొని తినును. తినగలిగినంతగా తిని ఎగిరిపోయి గోధుమలను కూడ తినును. అయితే పావురము గోధుమలను తినుచు మరలా వెళ్లి చచ్చినదానిని తినదు.

ఆ విధముగానే ఒక వేషదారిగా ఉన్న ఒక మనిషి ఆత్మీయముగా మంచి కార్యములను తినుచు, చెడు కార్యములను కూడ తినును. అయితే తిరిగి జన్మించిన నిజక్రైస్తవుడు పొరపాటైన కార్యములను భరించలేడు, మంచివాటిని మాత్రమే తినును. దానిని గుర్తించుడి! ఒక వ్యక్తి డ్యాన్సులకు వెళ్లుచు, త్రాగుచు, పాపములో జీవించుచు, మరలా సంఘమునకు వచ్చి ఒక పరిశుద్దునివలె కేకలు వేయుచున్నప్పుడు, అది ఏమైయున్నది, అతడు కాకి, అతడు క్రుళ్లినవాటిని, మంచివాటిని రెండింటిని తినును. అయితే ఒక నిజ క్రైస్తవుడు అటువంటి కార్యములను ఎన్నటికి భరించలేడు, ఎందుకనగా అతడు మరణము నుండి జీవమునకు దాటియున్నాడు. అందువలన అది అతనికి ఆ విధముగా చేయనివ్వదు. ఆ తలంపులు అతడు నిరాకిరించుచు చివరకు తన ముఖమును త్రిప్పుకొని వెళ్లిపోవువంతగా చేయును. ఓ, ఏమి ఆ విచిత్రము.

25

ఇప్పుడు, ఆ గొర్రెపిల్ల ఒక నమ్రతగల, చిన్నజీవి. అది తనకుతాను సహాయపడలేదు. తన స్వంత నమ్మకము తనకు లేదు, ఎందుకనగా అది తనకు తాను సహాయపడలేదు.

ఇక్కడ కొంత కాలము క్రితము పహారా చేయుచున్నప్పుడు ఒక పచ్చిక బయలుపై వెళ్లుచుంటిని, నేను ఆ విధముగా కనిపెట్టుచు వెళ్లునప్పుడు ఒక గొర్రెపిల్లను చూచాను. మిగిలినవన్నియు ఏదో ఒక విధముగా దానిని విడచివెళ్లి పోయినవి. అది మాత్రము ఒక ముళ్ల తీగల మధ్య చిక్కుకున్నది. మరియు ఆ చిన్న జీవి రక్తము కార్చుకొంటూ, అరచుచూ అక్కడే ఉన్నది. నేను సమీపమునకు వచ్చి, పైకి ఒక అర్దమైలు దూరమునకు చూచాను, అక్కడ గొర్రెల మంద ఒకటున్నది.

ఇప్పుడు, అది అక్కడ ఉండవలసియున్నది. మేము అక్కడకు వెళ్లక పోయినయెడల కాకులు ఆ చిన్న కండ్లను పొడుచుకొని తినివేసియుండును. అప్పుడు నేను ఆ చిన్న దానిని విడిపించి నా చేతులతో ఎత్తుకున్నాను. బహుశా మొదటిసారిగా ఒక మానవ హస్తము దానిపై పడియుండవచ్చును. అయినను అది ఎంతో నమ్రతగా ఉండినది. అది నడిపించుబడుటకు ఆశించుచున్నది. అది సహాయము చేయబడుటకు ఆశించుచున్నది.

మీరు దానిని చూడగలరని నేను నమ్ముచున్నాను. అది అడ్డగించుటకో లేక వెనుకకు తన్నదు. అది చాలా వినయముగా ఉండును. నేను గొర్రెపిల్లను తీసికొని వెళ్లి ఆ మందలో చేర్చాను. కొన్ని నిమిషములలో దాని తల్లి దానిని కనుగొన్నది. అప్పుడది ఎంతో సంతోషముగా ఉండిపోయినది! ఇప్పుడది దేవుని గొర్రెపిల్లకు ఎంత సాదృశ్యముగా ఉన్నదో!

26

వారు గొర్రెలను వధించుటకు ఎక్కడకు వెళ్లునో మీకు తెలియును, గొర్రెల మందను ఆ వధించు స్థలమును ఏది తీసికొని వెళ్లునో మీకు తెలియును, అది ఒక మేకగా ఉన్నది. అయితే మేక ఆ మందను వధించు స్థలము వరకూ నడిపించి, మరియు ఆ మందను వధించు సమయములో ఆ మేక వెంటనే తప్పుకొనును. అయితే, ఓహ్, వారు మేకను వధించుచున్నప్పుడు అది తన్నుచూ, ప్రళయమును స్పష్టించును, చూశారా.

అదే విధముగానే దయ్యము కూడ చేయును. అది దేవుని పిల్లలను నీచ స్థితికి కొనిపోవును, కాని అతను చనిపోవు సమయము వచ్చినప్పుడు, నిజంగా అతడు ప్రళయమును స్పష్టించును. ఆ విధముగానే దయ్యము చేయును. ఆ విధముగానే కొన్ని సమయములలో నాగరికత ఫ్యాషన్‌లను చేసికొను అమ్మాయిలు లేక అబ్బాయిలు, తమ చేతులలో సిగరెట్లను కాలుస్తూ, విస్కీలను త్రాగుచూ, ఒకరి గొర్రెపిల్లగా ఉండు ఆ అమ్మాయిని ఎవరో కొందరు మార్గము తప్పించుచు, ఓ, అదంతయు చక్కగానే యున్నది. అక్కడ ఆలయమునకు సంబంధించినది ఏదియు లేదు.'' అని చెప్పుదురు. అయితే ఆ బాలునికి మరణము సమీపించినప్పుడు అతడు అరచుచూ, ఆక్రంధన చేయుచూ దేశమంతటను తిరుగును. అది దయ్యము చేయు విధానమైయున్నది.

27

అయితే గొర్రెపిల్ల ఎంతో నమ్రతతో నడిపించబడునదిగా ఉండును. అందువలననే దేవుడు క్రీస్తును ఒక గొర్రెపిల్లతో పోల్చెను, మరియు తనను ఒక పావురముతో పోల్చుకొనెను. మరియు ఆ దినమున యోర్దాను నది వద్ద బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు బాప్తిస్మము ఇచ్చునప్పుడు అక్కడ ఎన్నడూ జరుగని ఒక గొప్ప కార్యము జరిగినది. గమనించుము, అది ఎంతో సౌందర్యముగా ఉన్నది! ఆ గొర్రెపిల్ల, భూమిపైనున్న సమస్త జంతుజాతిలో అతి సాధువైనది, మరియు పావురము ఆకాశ పక్షులలో అతి సాధువైనది. ఇప్పుడు ఆ ఇద్దరు ఏకమగుటకు అదొక్కటే మార్గమైయున్నది. ఎప్పుడైనను ఆ పావురము ఆ గొర్రెపిల్లపై వచ్చుటకు అదొక్కటే మార్గమైయున్నది. ఇప్పుడు, ఆ పావురము దిగి వచ్చినప్పుడు యోహాను యేసుని చూచి, ''ఇదిగో లోకపాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల'' అని చెప్పెను. మరియు ''దేవుని ఆత్మ పావురము వలె అతనిపై దిగుటను చూచితిని. అందుకు నేను సాక్ష్యమిచ్చుచున్నాను'' అని యోహాను చెప్పెను. హల్లెలూయ!

మీరక్కడే గమనించవలసి యున్నది. అక్కడ ఆ పావురము మరియు గొర్రెపిల్ల ఏకమయ్యారు. అక్కడే మానవుడు దేవుడు ఒక్కటైనారు. అక్కడే ఆకాశము, భూమియు ఒకదానినొకటి కౌగిలించుకొన్నవి. హల్లెలూయ! అప్పుడే దేవుడు శరీరముగా చేయబడెను. దేవుడు ఆత్మ స్థితిలో నుండి దిగివచ్చి ఒక మనిషిగా మనమధ్య నివసించెను. అప్పుడే సమస్త నిత్యత్వము ఒకదానినొకటి కౌగిలించుకొన్నవి. అక్కడే పడిపోయిన ఆదాము సంతతి, యెహోవా దేవుడు మరియు ప్రతి దేవదూతలు ఏకమయ్యారు. దేవుడును మనిషియు ఏకమైనప్పుడు యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చునప్పుడు అది ఒక జ్ఞాపకార్థ దినముగా ఉండిపోయినది.

ఇప్పుడు, అది ఒక తోడేలుగా ఉండినట్లయిన ఏమగును? ఆ మధురమైన పావురము ఆ తోడేలుతో నిలువజాలదు.

28

ఒక సాయంత్ర సమయములో ఒక పావురము ఒక చెట్టుపై కూర్చొని కొంతసేపు కూత వేయునప్పుడు అది ఎంత మనోహరముగా ఉండునో? నేను, నా భార్యను, బిడ్డను పోగొట్టుకొనిన తరువాత... నేను చేయునదేమిటో మరొకరికి తెలియనివ్వలేదు. నా పాత కారులో కూర్చొని, తిన్నగా ఈ రహదారిలో ఉన్న ''వాల్‌నట్ రిడ్జ్'' సమాధుల తోటకు వెళ్లి, అక్కడ ఒక చెట్టు ప్రక్కగా కూర్చొని ఆ సమాధి ప్రక్కగా చూస్తూ ఉండేవాడిని. నేను కేవలము వారిని విడచిపెట్టలేక పోయాను. దానిని ఇక నేను భరించలేనట్లే కనబడినది.

ఎనిమిది నెలల నా బిడ్డను అక్కడుంచాను. ఆ బిడ్డ తన చేతులను ముడుచుకొని చక్కగా నా యొద్దకు వచ్చుచుండెడిది, అప్పుడు నేను ఆ బూరను ఊదుచూ ఆమెతో ఏదో చెప్పుచుండెదను. అప్పుడు ఆ బిడ్డ ''గూ -గూ'' అనుచూ తన చేతులు చాచును.

ముఖ్యముగా, సాయంకాల సమయములో అక్కడ ఆ చెట్టు ప్రక్కగా కూర్చొని చూచుచుండగా, అక్కడ ఒక పొదలో ఒక పావురము కూర్చొని కూత వేయుచుండినది. ఓ, మై, ఒకవేళ నా కుమార్తె ఆత్మ ఆ విధముగా నాతో మాట్లాడుటకు తిరిగి వచ్చినదేమోనని నేను ఆశ్చర్యపడితిని. పావురపు కూతకన్నను మధురమైన దేదియు లేదు. అది ఎంతో అందముగా ఉండును. అది వర్తమానములను తెచ్చును. అది ఎంతగానో సమాధానపడుటకు ప్రయత్నించును. ఉదయముననే లేచి, అడవిలో నేను నివసించు స్థలమునకు వెళ్లినప్పుడు, అక్కడ ఎంతో ప్రశాంతముగా ఉండును. ఆ పొడవైన చెట్టుపై కూర్చొని, ఆ పావురములు ఒకదానినొకటి కూత వేయుచు పిలచుచున్నప్పుడు వినుటకు ఎంతో మనోహరముగా ఉండును.

29

గత దినము సహో. కాక్స్‌తో ఉన్నప్పుడు అక్కడ ఒక తల్లి పావురమునకు రెండు చిన్న పిల్లలుండినవి. పిల్లులు వాటిని తినకుండునట్లు, అవి ఆ భవనము పైన నివసించుచుండెను. మరియు ఆ తల్లి పావురము వాటిని పోషించును. అది క్రిందికి దిగివచ్చి, ఆ పిల్లలు చెట్టుపైకి వెళ్లునట్టు చేయును. అక్కడవి ఒకదాని మెడను ఒక దానిపై ఉంచుకొని కూర్చొనును. అవి కూత వేయుచు ఒకదానినొకటి ప్రేమించుకొనుచుండును, ఆ విధముగా నమ్రతగల ఆ రెండు చిన్నవి అక్కడ కూర్చొనియుండినవి.

అప్పుడు నేనిలా తలంచాను, ఏ విధముగా దేవుడు, (ఆ పావురము అంతటి ప్రేమగల పక్షి) ఆ పావురమువలె, ఆయన యొక్క మానవ జీవులతో ప్రేమ కలిగియుండుటకు దేవుడు ఇష్టపడుచున్నాడు. దేవుడు ప్రేమించబడుటకు ఇష్టపడుచున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించుటకు ఇష్టపడుచున్నాడు. ''దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవముపొందునట్లు ఆయనను అను గ్రహించెను.'' దేవుని నామము స్తుతించబడును గాక. అప్పుడు దేవుడు, ప్రేమించబడుటకు ఇష్టపడుచున్నాడు, ప్రేమించగల దానిని ఆయన చేశాడు ఆయనవలె వినయముగలవారిని, ఆయన చేయుచున్నాడు. ప్రేమించబడగల దానిని ఆయన చేయుచున్నాడు. ఆయన తన స్వభావముగల దానిని చేయుచున్నాడు.

30

మీ స్వభావమువలె లేని దేనినీ మీరు ప్రేమించలేరు. ప్రేమించబడునది, ప్రేమతో జత చేర్చబడవలసి యున్నది. ఒక భర్త మరియు భార్య ఒకరినొకరు ప్రేమించకొనవలసి యున్నది, అప్పుడే వారు ఎదుగగలరు. కుటుంబము ఒకరినొకరు ప్రేమించుకొనవలసి యున్నది, అప్పుడే వారు ఎదుగగలరు. ఏదో ఒకటి ప్రేమించబడవలసియున్నది! నీవు ప్రతి స్థలమును వెదకి, నీవు ప్రేమించునట్లు నీ కొరకు ఒక భార్యగా ఉండుటకు ఓ అమ్మాయిని వెదకి కనుగొందువు. ఆమె ప్రేమించగల భర్తను ఆమె వెదకును.

అదే విధముగా ఆయనను ప్రేమించు ఒక ఆత్మను దేవుడు వెదకుచున్నాడు. అందువలన ఆయన తనను ఒక వినయముగల పావురము మరియు గొర్రెపిల్ల వలె ఈ భూమిపై తెలుపుకొనుచున్నాడు. ఒక వినయముగల గొర్రెపిల్ల ఒక్క నిమిషము ఆ క్రూర తోడేలు స్వభావమును ధరించిన యెడల ఆ పావురము వెంటనే ఎగిరి వెళ్లిపోవుట, అది విడచి దూరముగా వెళ్లును.

31

అయితే ఆ గొర్రెపిల్లకు తన స్వంతముగా ఏ గొప్ప తలంపును ఆలోచించలేక యుండును. ఒక గొర్రపిల్ల, అది తప్పిపోయినప్పుడు తన నమ్మకమును పూర్తిగా పోగొట్టుకొనును. ఒక గొర్రె తన మార్గమును ఎరుగదు, అందువలననే ఒక గొర్రె దానిని మరణమునకు నడిపించును. ఒక గొర్రె తన దారి తప్పినప్పుడు, అది తన దారిని మరలా కనుగొనలేదు. ఆ కారణము చేతనే దేవుడు మనలను గొర్రెలకు, మాదిరిగా పోల్చెను. మనము దారి తప్పిపోయినప్పుడు పూర్తిగా తొలగిపోదుము. మనము కనుగొనుటకు మనకు ఏ దారి తోచదు. మరియు చేయుటకు ఒకటే ఒక మార్గమున్నది, అదేదనగా, ఆ గొర్రెల కాపరికి మనలను మనము సమర్పించుకొనుట ఒక్కటే మార్గము, మరియు ఆయనే మనలను నడిపించును.

32

ఇప్పుడు, నేను ఈ గొర్రెపిల్లను మరియు మందను చూచినప్పుడు లేక గొర్రెను, పావురమును చూచినప్పుడు, అవి ఒక్కటిగా చేయబడినవి. అప్పుడు ఏ విధముగా ఆ పావురము దేవుని కుమారుడైన గొర్రెపిల్లను నడిపించుచున్నదో గమనించుడి. ఆయన వధకు వెళ్లుచున్నాడని తెలిసిననూ ఆయన ఎంతో నమ్రతగా ఉన్నాడు. ఆయన తనకుతానుగా ఏదియు చేయుటకు ప్రయత్నించలేదు. తనకుతాను తృప్తిచెందక ఎంతో గంభీరముగా ఉన్నాడు. ''నా తండ్రి నాకు మొదట తెలుపనిదే నేనేదియూ చేయను, ఎందుకనగా నా తండ్రి నాలో నివాసము చేయుచున్నాడు,'' అని చెప్పెను.

33

ఇప్పుడు, మరొక కార్యమేదనగా ఆ గొర్రెపిల్ల తన హక్కులను సమర్పించుకొనుటకు ఇష్టపడుచున్నది. ఇప్పుడు, దేవుడు మనము ఒక గొర్రెపిల్ల వలె ఉండుటకు ఇష్టపడుచున్నాడు. అయితే మనము అనేకసార్లు, మన హక్కులను విడచిపెట్టుటకు ఇష్టపడుటలేదు, మన హక్కులను మనమే నిందించుకొనుచున్నాము. అందువలననే మీలో అనేకులు ''మంచిది, నాకు అన్ని హక్కులున్నవి. సహో. బ్రెన్హాం గారు'' అని చేప్పుచున్నారు. మంచిది అది నిజమే, అయితే మీ హక్కులను విడచిపెట్టుటకు ఇష్టపడుచున్నారా? దేవుడు మిమ్మును నడిపించునట్లు మీ హక్కులను ఆయనకు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారా? ఈనాడు మన సంఘములతో వచ్చిన విషయము అదియే, అధిక సంఖ్యాక ప్రజలు దేవుని గొర్రెపిల్ల యొక్క మంచితనమును... మనము గొర్రెపిల్లలుగా ఉండవలసియున్నది, గొర్రెపిల్ల కాక మరోదానిగా మనమున్నాము. ఆ కారణము చేతనే మనకు ఆ స్వభావము (వేరైన స్వభావము) వచ్చినతోడనే, పరిశుద్దాత్మ అను పావురము ఉన్నందున అది తన ప్రయాణమును మొదలుపెట్టి మనలను విడచిపోవును.

34

దేవుని గొర్రెపిల్ల తోడేలువలె మరి దేనినైనను చేసినయెడల లేక ఆ పావురము అనుమతించిన దానికి వ్యతిరేకముగా దేనినైనను చేసిన యెడల ఆ పావురము ఎగిరిపోవును. ఒక్క నిమిషములో అది విడచివెళ్లును.

ఆ కారణము చేతనే మనము ఈనాడు, పెంతెకోస్తు సంఘము యొక్క స్థితియేమని? ఆశ్చర్యపడుచున్నాము. ఎందుకనగా మనము వ్యత్యాసమైన మరొక స్వభావమునకు వెళ్లిపోయాము. ''మనహక్కులు మనకు కావలెను, మనకు మంచిదిగా తోచునదేమిటో దానిని చేయుదము,'' అనుచూ ఆ స్వభావమును పొందియున్నాము. మనము మూర్ఖులమైపోయాము. మనము వ్యతిరేకులము అయ్యాము. మనము వ్యత్యాసమైన వారిమయ్యాము. మనలోనికి ఆవేశమును అనుమతించాము. మనలోనికి స్వార్ధమును అనుమతించాము.

35

ఒక గొర్రెపిల్ల, తన కాలము వచ్చినప్పుడు... తన ఉన్నిని తానే కలిగి యుండును, అది దాని హక్కుగా (స్వభావముగా) యున్నది. తన ఉన్నిని తానే కలిగి యుండును. అయితే వారు ఆ గొర్రెను పట్టుకొని, ఆ పలకల పై వేసి దాని కాళ్లను కట్టుచున్నప్పుడు, అది ఎప్పుడును తన్నుకొనదు, అది ఎప్పుడునూ గందరగోళము చేయదు. మీరు దాని హక్కులను దానినుండి తీసుకొనుచున్నారు, ఎందుకనగా అది ఒక గొర్రెపిల్లగా ఉన్నది. అది ఇంకా ఏమియు చేయలేదు, ఎందుకనగా అది దాని స్వభావముగా ఉన్నది. అయితే ఒక క్రైస్తవుడు తన బాటను దాటు ఒక సమయమందు, అతడు ఒక గొర్రెపిల్లగా ఉన్నాడా లేక మేకగా ఉన్నాడా అని మీరు తెలిసికొనవచ్చును. అతనిని దాటి వెళ్లునప్పుడు, ఒక సమయములో మీరు అతనిని తెలుసుకొనవచ్చును. ఆ కారణము చేతనే ఈనాడు సంఘము స్థితి ఆ విధముగా ఉన్నది.

36

మనము మనలను దేవుని గొర్రెపిల్లలమని పిలచుకొన్నాము. స్త్రీలు మరియు పురుషులు కలిసి గొర్రెపిల్లలవలె ప్రతిదానిలోను నటించుటకు ప్రారంభింతురు. వారు వీధులలో వెళ్లుచుండగా మీరు చూచినట్లయిన, కత్తిరించబడి పొట్టిగా ఉన్న వెంట్రుకలతో, అన్నిరకముల విధానములలో తమ వెంట్రుకలను అలంకరించుకొని వెళ్లుచున్నారు. కొన్ని సంవత్సరములకు ముందు, అలా చేయువారిని కూలీకి పిలువరు. అట్లయిన సంఘము అదే స్థితిలో ఎందుకున్నదోనని ఆశ్చర్యపడుదుము, ఎందుకనగా అది సాధు స్వభావము కలిగియుండుటకు బదులుగా ఒక తోడేలు యొక్క స్థితిని, లేక ఒక మేక యొక్క స్థితిని కలిగియున్నది. ''బ్రెన్హాం సోదరుడా, అది నా ధన్యతే'' అని మీరు చెప్పవచ్చును. అది మీ ధన్యతేనని నాకు తెలియును. ''మంగలి వెంట్రుకలను కత్తిరించును. అతడు వెంట్రుకలను కత్తిరించునంత కాలము, నాకు ఆ అర్హత లేదా?'' అది నిజమే, అది మీ యొక్క ఆమెరికా దేశ ధన్యతగా ఉన్నది. అయితే ఒక గొర్రెపిల్లగా ఉండుటకూ దానిని విడచిపెట్టుటకు ఇష్టపడుదువా? నిన్ను నీవు సమర్పించుకొనుటకు ఇష్టపడెదవా?

37

కొద్ది కాలమునకు ముందు స్త్రీలుగా ఉన్న మీరు వీధులలో వెళ్లుదురు... అయితే ఈనాడు స్త్రీలు వస్త్రములు ధరించు విధానము చూచుటకు వికారముగా ఉండును. నేను ప్రెస్బిటేరియనులు లేక మెథడిస్టులను గురించి మాట్లాడుట లేదు, పరిశుద్ద స్త్రీలు అని చెప్పబడు మిమ్ములను గురించి మాట్లాడుచున్నాను. అలా వీధిలోని వెళ్లుము, మరియు అది ....

నా కారు లోపలముందు భాగములో చిన్న సిలువ వ్రేలాడుచుండును. కొందరు నాతో ఇలా చెప్పారు. ''బిల్లీ, నీకు తెలియునా, అది ఒక క్యాథలిక్ చిహ్నమని?''

అప్పుడు నేను, ''ఎప్పుడు క్యాథలిక్‌లు ఈ సిలువను పొందారు?'' అని నేను అడిగాను. లేదు! అది క్యాథలిక్ విశ్వాసపు చిహ్నము కాదు; అది క్రైస్తవ విశ్వాసపు చిహ్నము. ఒక క్యాథలిక్ విశ్వాసమేదనగా, మరణించిన చిన్న పరిశుద్ధుడే, మరియ యొక్క లేక వారు ఆరాధించునది మరణించిన ఎవరో ఒకరు, మనము మరణించిన వారిని ఆరాధించము. మనము పరిశుద్ద సెసిలియాను లేక ఇతరులైన ఆ వ్యత్యాసమైన పరిశుద్దలను ఆరాధించము. అది క్యాథలిజముగా ఉన్నది, అది ఆత్మీయ ఉన్నతా స్థితిగా ఉన్నది. అయితే ఆ సిలువ, ఎవరు మరణించి మరలా లేచారో ఆయనను సూచించునదిగా ఉన్నది.

అప్పుడు నేను, ''నేను చూచునట్లుగా నేను దానిని అక్కడ ముందు ఉంచాను. ఇరువై-ఐదు లేక ముప్పై సంవత్సరములకు పూర్వము నేను పూర్తి గ్రుడ్డివానిగా ఉండినప్పుడు, నేను దేవునితో వాగ్దానము చేసినదేమనగా, ఆయన నా కళ్లను బాగుచేసిన యెడల నేను చూడవలసిన సరియైనదానిని చూతును,'' మరియు ''మీరు ఎక్కడ చూచినను భక్తిహీనతయే కనిపించుచున్నది; స్త్రీలు సగము దుస్తులు ధరించియున్నారు, ముంగిలిలో కూర్చొనియున్న వివస్త్రలైన స్త్రీలు మరియు ఎక్కడ చూచినను పడియున్నారు. వీటినన్నింటిని చూచుటకు బదులుగా, నేను ఈ సిలువను చూతును. క్రీస్తు నా కొరకు చేసినదేమిటని జ్ఞాపకము చేసికొందును. మరియు దయ్యమునకు సంబంధించిన విషయముల నుండి నా తలను త్రిప్పుకొందును,'' అని చెప్పాను. హల్లెలూయ!

38

మరియు అక్కడి ప్రజలు, అది ప్రెస్బిటేరియన్‌లు, క్యాథలిక్‌లుకాదు, అది పెంతెకోస్తుగా ఉన్నది! ఆమేన్. నీవు, ''సహో. బ్రెన్హాం, ఆ విధముగా ఉండుటకు నాకు అధికారము ఉన్నది'' అని చెప్పెదవు. అది నిజమే. అయితే నీవు గొర్రెపిల్లవైన యెడల, నీ హక్కులను నీవు త్రోసివేయుదువు. అ విధముగా నడచుకొనుటకు ప్రారంభించిన యెడల, ఆ నమ్రత గల పావురమైన పరిశుద్దాత్మ తన మార్గమున తాను వెళ్లిపోవును. నీతో అయిష్టముగా ఉండదు. అలా ఉండనే ఉండదు. నీవు ఆ విధముగా నడచుకొనుచు, పరిశుద్దాత్మను కలిగియుందువని తలంచకుము. నీవు అలా చేయలేవు, బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది. నీవు నీ హక్కును పోగొట్టుకొనవలసియున్నది. నీవు ఇలా చెప్పవచ్చును'' మిగిలిన స్త్రీలు అలానే చేయుచున్నారు.''

39

పురుషుడవైన నీవు, బలహీనుడవై, ఎముకలు లేనివాడవై, కార్యములతో సతమతమగుచు, నీ భార్యను అటువంటి కార్యములను చేయుటకు అనుమతించుచున్నావు. అది నీవెవరివని చూపుచున్నది. అందువలననే నీవు పొందవలసిన విధముగా పరిశుద్దాత్మను పొందలేకపోయావు, లేక నిన్ను గురించి నీకు మరేదో భావన కలిగించుకొని నీతో ఆమె జీవించినంత కాలము ఏదో ఒక విధముగా ఆమెను ఒక మంచి స్త్రీగా నడచుకొనునట్లు చేయుచున్నావు. ఆమేన్. అది పాతకాలపు-తీరును తెలుపుచున్నది. అదియే ఈనాడు సంఘమునకు కావలసియున్నది. ఆ పురాతన విధముగా పరిశుద్దాత్మ చేత కడుగబడి ఆరనిచ్చి, ఎండిన తరువాత మడచి పెట్టునట్లే పరిశుద్దాత్మ ద్వారా జరుగుచున్నది. అది నిశ్చయము!

40

ఈ ప్రపంచము ప్రవేశించిన స్థితి ఏమిటి? ఏ విధముగా వారు వీధులలోకి వచ్చి తిరుగుచున్నారు. ఏ విధముగా బుధవారము రాత్రియందు మీ శీరస్సులను టి.వీలకు అతికించుకొని ఆలయమునకు వెళ్లకుండుట అనునది ఏ విధముగా ఉన్నది! నీవు ఎలాగు... ఎందుకు, ఈ దేశములో ఒక చిన్న పిల్లవాడు కూడ డేవిడ్ క్రాకెట్ట్ గురించి తెలుసుకొనియున్నాడు. మూడు సంవత్సరముల వయస్సులో అతడు ఒక ఎలుగుబంటిని చంపానని చెప్పుట ఒక పచ్చి అబద్దముగా ఉన్నది; అది ఒక అబద్దమని మీరెరిగియున్నారు. అయినను మీ పిల్లల తలంపులను అటువంటి కార్యములతో నింపుచున్నారు. మరియు అయితే నూటికి ఒక్క శాతము కూడ యేసును ఎరిగినవారు లేరు. ఎందుకనగా ఈ ప్రపంచము అంతగా కలుషితమైపోయినది! ఈ దేశము, పిచ్చిగా దేవుని నుండి ఎంతో దూరమగుచు, పరిశుద్దాత్మను నిరాకరించినది.

ఓ. నీవు ఇలా చెప్పవచ్చును, ''నేను సంఘమునకు వెళ్లి గట్టిగా అరచెదను.'' అలా నీవు చేయవచ్చును. అయితే ఆ సౌమ్యమైన దేవుని గొర్రెపిల్ల, నీ హృదయమందు స్థిరపడనంతవరకు, అనగా నీ జీవితమును, శుద్ది చేయునంతవరకు నీవు ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా జీవించువరకు, క్రైస్తవ్యమును నటించినంత మాత్రమున కలిగే మంచి ఏది లేదు. నీవు దానిని పొందవలసి యున్నావు. ఆమెన్.

41

ఇక్కడ కొంత కాలమునకు ముందు నేనొక గృహమును దర్శించుటకు వెళ్లాను. అక్కడ ఒక వ్యాధిగల మనుష్యుని చూడవలసియున్నది. అక్కడొక స్త్రీ కూర్చొనియున్నది. అప్పుడు ఒక చిన్న ఆస్వోల్డ్ లోపలకు వచ్చాడు, అతడు తన తలకు ప్రక్కగా టోపీని తీసి, ''అమ్మా భోజనము సిద్ధమైనదా?'' అని అడిగాడు.

అప్పుడామె, ''హనీ, మాకు సమయము లేకపోయినది. ఈ ఉదయము నేనేమి చేయాలేకపోయాను. ఒక ఫలహరము మాత్రము నీ కొరకు ఉంచాను. అక్కడ కొన్ని ఆరంజి పండ్లున్నవి'' అని చెప్పినది. అతడు అక్కడకు వెళ్లి ఒక ఆరంజి పండును తీసికొని, దానివైపు చూచి, దానిని నోటితో కొరికి గోడకు బలముగా దానిని విసరికొట్టాడు. అప్పుడు దాని రసమంతయు కారిపోయింది. ''ఇక్కడ అది మాత్రమే ఉన్నయెడల నేను వెలుపలకు వెళ్లిపోయెదను'' అని అతడు అరిచాడు.

అప్పుడు నేను, ''ఓ, దేవా ఒక్క ఐదు నిమిషములు అతడు నావాడుగా ఉండనిమ్ము'' బాలుడా! అతనికి తెలియకయే అతని ప్రక్కను అతని చర్మమును మెల్లగా చరిమెదను అనుకున్నాను. అయితే అక్కడ ఉన్నది, జాలి మరియు బిడ్డ. మనకు కావలసినది ఏమనగా, పాత-కాలపు చర్మము వలచుట. అదే మనకిప్పుడు కావలసినది, మరలా అలాంటి పాత-కాలపు గృహములు మనకు కావలసి యున్నది. మరియు బలిపీఠముల వెనుక నిలచి సత్యమును బోధించు బోధకులు ఈనాడు మనకు కావలసియున్నది. ఏది ఎక్కడ ఉండవలసి యున్నదో దానిని అక్కడే ఉంచవలసి యున్నది. ఆమేన్. అది సత్యము. ఓ, మై!

42

ఆ చిన్నదైన మేరి ఆమె చిన్న పాదములతో లోపలకు వచ్చి, తన ముక్కును ముడుచుకొని తన రంగు పూసిన పెదవులను విరచుకొనుట, తలను ప్రక్కకు త్రిప్పుకొని వెలుపలకు వెళ్లిపోయింది. ఎంతటి మర్యాదలేని కార్యమది! ఎంత లోబడని పిల్లలుగా వారున్నారు. వారలా ఉందురని బైబిలు చెప్పుచున్నది. లేఖనము కూడ వారు ఆ విధముగానే ఉందురని పలుకుచున్నది. వారు ఏ విధముగా నడుచుకొనుచున్నారు, ఏ విధముగా కార్యములను చేయుచున్నారు. ఈనాడు లోకములో జరుగు కార్యములు, ఇవన్నియు ఎందుకు జరుగుచున్నవనగా, వారు పరిశుద్దాత్మను అంతగా ‍‌దుఃఖపెట్టారు.

43

కొన్ని సంవత్సరముల క్రితము, ఇప్పుడు మనము కొన్ని దినములలో అమెరికా దేశమందు మొదటిగా పరిశుద్దాత్మ క్రుమ్మరించబడిన దినమును కొనియాడనై యున్నాము. ఇప్పటికి ఏబది సంవత్సరముల క్రితము ఇది జరిగినది. అక్కడ ఆ పురాతన అజూసా వీధిలో జరిగిన కూడికలో, లాస్ఏంజలస్‌లో జరిగిన పెంతెకొస్తు కూడికయందు, అక్కడ ప్రజలు ఏకముగా కూడినప్పుడు, ఆ మొదటి పరిశుద్దాత్మ క్రుమ్మరింపును వారు పొందారు. ఆ ప్రజల మధ్యగా క్రీస్తు వచ్చినప్పుడు, ఎంతో సౌమ్యముగాను, ఎంతో సమాధనముగా ఉండినది. వారు దైవభక్తి జీవితములను జీవించారు. వారు తమ్మును ఇతరులకు సమర్పించుకొని జీవించిరి. వారు పరిశుద్దాత్మ చేత నడిపించబడుటకు ఇష్టపడిరి. ప్రజలు ఏమి చెప్పుచున్నారని వారు పట్టించుకొలేదు. వారు ''పాట-కాలపు తీరును'' కలిగియుండిరి, ఇతరులు వారిని “పిచ్చివారు” అని పిలచిననూ వారు పట్టించుకోలేదు. వారు మరేదియు చూడక, పరిశుద్దాత్మ చేత నడిపించబడుటకు ఇష్టపడిరి.

44

అయితే ఈనాడు, ఓ మై, ముఖమునకు పౌడర్లు పూసికొనుచు. రంగులు వేసికొనుచు, రంగుల పెట్టెను చేత ఉంచుకొనుచు, బట్టలను రెంటిని తగిలించుకొని వీధులలోకి వెళ్లిపోవుచున్నారు, ఎందుకలా జరుగుచున్నది, అది అవమానకరమైన కార్యము! ఆ విధముగా చేయుచునే తమ్మునుతాము ''పరిశుద్దాత్మ కలిగియున్నామని'' పిలచుకొనుచున్నారు. ఓ ''నేను భాషలలో మాట్లాడుదును'' అని మీరు చెప్పవచ్చును.“ నిజమే, మరియు దయ్యము కూడ ఆ విధముగానే చేయును. ''ఓ, నేను పెద్దగా అరువగలనని లేక శబ్దము చేయగలనని'' నీవు చెప్పవచ్చును. ఆ కార్యములను దయ్యము కూడ చేయును. ప్రేమ ఒక్క దానిని తప్ప దేవుడు కలిగిన వాటినన్నిటిని దయ్యము అలాగే అనుకరించగలదు, అయితే ప్రేమను మాత్రము అనుకరించలేదు. అవునండి.

45

అంతట ఆ మొదటిగా ఏమి జరుగునో మీకు తెలియునా, ఆ కార్యములను మీరు చేయుటకు ఆరంభించినప్పుడు, మీరు ఆ అడ్డు గడియలను తీసివేసి, సర్దుబాటు చేసికొనుటకు ప్రారంభితురు. అప్పుడు సంఘములో చిన్నచిన్న భేదాభిప్రాయములు ఏర్పడును, అప్పుడు వారి మధ్య ఒకరు ఒక విధముగా మరొకరు మరొక విధముగా చెప్పుకొనుటకు ప్రారంభించెదరు. ఒకరేమో ''మీకు తెలియునా, ఆ కాపరి ఇలాంటివాడు - ఇలాంటివాడు, ఆడీకన్‌లు ఇలాంటి వారు - ఇలాంటివారు'' అని చెప్పుదురు. మొదటిగా మీరు దానిని వినుటకు అరంభించిరి! అందువలననే మీకు అన్ని ఇబ్బందులు వచ్చుచున్నవి, ఎందుకనగా మీరు దయ్యము చెప్పుదానిని వినుటకు ప్రారంభించితిరి, మరియు పరిశుద్దాత్మగా ఉన్న ఆ సౌమ్య పావురము, పరిశుద్ధాత్మ, చెప్పుదానిని వినుటకు బదులుగా చిక్కులో పడుచున్నారు; ఆ దేవుని పావురము మిమ్మును దారి నడుపుచు, మరియు మిమ్మును ప్రేమించి, ఆశీర్వదించును.

46

మొదటిగా మీరు అలాంటి చిన్న ఉద్రేకముతో కూడిన ఈడ్పులకు లోనైనప్పుడు, ఆ పావురము ఎరిగిపోవును. అది నిజమే. అది దానిని భరించలేదు, దాని స్వభావము వ్యత్యాసమైనది. ఓ, అది దానిని తట్టుకొనజాలదు. మరియు మీ పొరుగువాని గురించి మాట్లాడుట ప్రారంభించునప్పుడు, అది తీసుకొనలేదు. అది దానితో ఉండలేదు. ఆయన తన రెక్కలతో పైకి ఎగిరి వెళ్లిపోవును. ఆయన దానిని ఎంతకాలము ఓర్చుకొనలేడు. పావురము ఒక సున్నితమైనది. పావురము సాత్వికము గలది, మరియు పావురము తన స్వభావము అక్కడ ఉంటేనే గాని అక్కడ నిలువదు.

47

ఇప్పుడు, దేవుడు మిమ్మును ఒక ప్రత్యేక స్వభావమునకు మార్చగలడు. స్త్రీగాని, పురుషుడుగాని, వ్యత్యాసమైన స్వభావము నివ్వగలడు. ''మంచిది, సహో, బ్రెన్హాం దానిని గురించి మేమేమి చేయగలము'' అని మీరు చెప్పవచ్చును. కేవలము ఒక గొర్రెపిల్లగా మారవలసియున్నది. రెండు జంతువులు మాత్రమే, ఏకముగా జీవించగలవు; అవి పావురము మరియు గొర్రెపిల్ల మాత్రమే. ఆ పావురము గొర్రెపిల్లతో కాక మరొక జంతువుతో కలసియుండదు. నీవు ఒక మేకగా మారినయెడల, ఆ మేక స్వబావమును నీలో నుండి తీసివేయుము. అది మంచిది. నీవు మరేదైనప్పటికిని అది విడచి వెళ్లిపోవును. నీవొక వదరుబోతువగుచున్నప్పుడు....

48

ఇక్కడ ఒక సమయములో, ఒక పట్టణములో నేను ఉపదేశము చేయగలిగినంతగా ప్రసంగించాను, ఇక్కడ వేలకొలది ప్రజలు చేరారు. అక్కడ నేను బలిపిఠపు పిలుపునిచ్చాను. పాపపు పరిమాణమునంతటిని తెలిపానని నేను తలంచుచున్నాను. నేను తలంచిన ప్రతి దానిని పూర్తిగా తెలుపాను. ఆ రాత్రి ఆరాధన ముగించిన తరువాత, అటుగా ఒక స్త్రీ నడచుకొంటూ వెళ్ళెను, “మంచిది. సహో. బ్రెన్హాం, నన్ను తాకనందుకు నేను ఈ రాత్రి సంతోషించుచున్నాను'' అని చెప్పినది. ''ఆమె ఒక నిజక్రైస్తవురాలై యుండునని'' తలంచాను.

ఆమె ''నీవు ఈ రాత్రి నన్ను తాకలేదు'' అని అన్నది.

''అమ్మా దానిని వినుటలో నేనెంతో సంతోషించుచున్నాను. నీవు దేవుని రాజ్యమునకు అతి సమీపముగా ఉన్నావు'' అని నేను చెప్పుచుండగా, ఆమె వెళ్లిపోయింది.

అక్కడ మరొక స్త్రీ నిలచియుండగా, ''ఆమె నీకు తెలీయునా? చెప్పుమని'' ఆమెనడిగాను.

''అవును.''

''ఆమె ఒక నిజక్రైస్తవురాలై యుండవచ్చు,'' అని నేను చెప్పాను.

ఆమె చెప్పెను, “ఒక విషయము నీవు ఈ రాత్రి పట్టుకొనుట తప్పావు, సహోదరుడా బ్రెన్హం, అది ఓ పుకారు. ఆమె ఈ దేశపులో ఒక ప్రధాన పుకారుల చేయు వ్యక్తి.” అక్కడే మీరున్నారు, చూచారా.

49

అయితే వీటిలో ఒక దానికి మీరు వచ్చినప్పుడు, బోధకుడు ఆ కార్యమును బలిపీఠము వద్ద దానిని తెలిపినను లేకున్నను, ఈ ప్రపంచపు అక్రమ కార్యములను మీరు చూచినప్పుడు, వాటిని మీరు భరించి యున్నంతకాలము మీరు దేవునికి దూరముగా ఉన్నారు. పరిశుద్ధాత్మ మీకు దూరముగానే ఉండును. అందువలననే ఆ కూడికలు ముందున్నట్లుగా ఉండుటలేదు. ఆ కారణము చేతనే ఈ ఉదయకాలము ఈ ఆలయములో దాని అనుసరణ కలుగలేదు. ఆ కారణము చేతనే ఆ గొప్ప గుడార కూడికలు ఈ దేశమందు లేకున్నవి, ఎందుకనగా మనము దేవుని యొక్క ఆ సౌమ్యమైన పావురమును, దుఃఖపరచాము. అది నిజము. మనము వ్యత్యాసముగా ఉన్నంతకాలము ఆయన మనతో జీవించజాలడు. ''మనకు మన మార్గమే'' కావలసియున్నది అని మనము వెనుకకు తిరగనంతకాలము ఆయన మనకు దూరముగానే యుండును.

50

ఇప్పుడు, మీరు గమనించవలసినదిగా నేను కోరునదేమనగా, ఆ గొర్రెపిల్ల మౌనమైన గొర్రెపిల్లగా ఉన్నది. బైబిలు చెప్పునదేమనగా, ''ఆయన తన నోరు తెరువలేదు. వధకు తేబడిన గొర్రెవలె ఆయన మౌనముగా ఉండెను. ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు.'' ఆయన తన నోరు తెరువలేదు. ఆయన తన హక్కును కోరువాడు కాడు. లేదండి. తన హక్కులను ఆయన విడచిపెట్టాడు. ఆయన మౌనమైన గొర్రెపిల్లగా ఉన్నాడు.

అయితే ఈనాడు, ఓ, మై, మన బేధములను ఏ విధముగానో మనము కోరుచున్నాము. ఓ, మై, ''నాతో మరెవరైనను దేనినైనను చెప్పినయెడల, నేను అతని యొద్దకు వెళ్ళి, అతనితో బేదాభిప్రాయము పడెదను. నేను ఆ వేషదారిని చూచినప్పుడు ఆమెను అడుగుదును; నేను ఆమెను చూచువరకు మీరు వేచి యుండుడి. దేవుడు మిమ్మును దీవించు గాక, హల్లెలూయ! ఉహ్-హు!'' అని నీవు చెప్పినట్లయిన, ఆ పావురముగా ఉన్న ఆయన తన మార్గమున వెళ్లిపోవును. అది నిజము ఇకపై ఆ పరిశుద్దాత్మ నీతో ఉండడు. నీవు ఆ విధముగా తలంచుచూ ఉన్నంతకాలము, అది జరుగదు. దానిని మీ నోటు పుస్తకములందు గుర్తుంచుకొనుడి. అటువంటి ఆత్మ ఉన్నంతకాలము పరిశుద్దాత్మ మీ యొద్దకు రాదు. అక్కడ గొర్రెపిల్ల ఆత్మగా ఉండవలసియున్నది, ఒక సౌమ్యమైన ఆత్మగా ఉండవలసియున్నది, లేనియెడల అది అక్కడ నివసింపజాలదు. దానిని ఆ సౌమ్యమైన, వినయమైన స్థితిగలిగి పరిశుద్దాత్మచే నడిపించబడకున్న యెడల అది అక్కడ నిలచియుండదు. ఏదైనను వచ్చిన యెడల అసలు దానిని గమనించకనే విడచి వెళ్లిపోవును, చూశారా. మరియు ప్రక్కకు వెళ్లు ప్రతి నిమిషము, మీకు తెలిసినదా....

51

నీవు ప్రక్కకు తిరిగినప్పుడు.

ఆ మొదటి పాపము ఒక వ్యక్తి ఒక నిమిషము ప్రక్కకు తిరుగుట ద్వారా ప్రారంభమైనదని మీకు తెలియును. అది మీకు తెలియునా? బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది. హవ్వ ఒక క్షణము ప్రక్కకు మరలి సాతాను చెప్పు కార్యమును విన్నది. ఆమె దానిని సత్యమని నమ్మువరకు ఒక అందమైన చిత్రమును ఆమెకు వేసి చూపించాడు. అతడు చెప్పిన దానిని ఆమె నమ్మినది.

సాతాను మిమ్మును కోరు ఒకే ఒక కార్యమేదనగా, కొన్ని నిమిషములు ప్రక్కకు తిరిగి యుండుటయే. అప్పుడతడు ఒక అందమైన చిత్రమును వర్ణన చేయును. అప్పుడు అతడు, ''ఇప్పుడు ఇక్కడ చూడుము, సోదరా నీకిది తెలియునా, వారు నిజమైన ప్రజలైనయెడల వారు దానిని చేయరు. వారు దీనినే చేశారని మీకు తెలియును'' అని చెప్పును. అది మీకు ఒక నిజ సత్యమగునంతవరకు అతడు దానిని ఎంతో సత్యమైనదిగా చేయును. అది నిజము, అయితే జ్ఞాపకము ఉంచుకొనుడి, అది ఆ దయ్యమే.

వారు ఎంత హీనముగా ఉన్నను, పాపములో దిగిపోయినను పరవాలేదు, నీ చేతిని వారిపై నుంచి దేవుని ప్రేమతో వారిని పైకెత్తుటే నీవు చేయవలసిన కార్యముగా ఉన్నది. ఆ దేవుని పావురము నిన్ను ఆ బురద నుండి పైకి లేపునప్పుడు నీవెక్కడ ఉంటివి? నా స్నేహితుడా, అది నీవు చేయవలసిన కార్యముగా ఉన్నది. కొద్ది ప్రేమ కొరకు ఈ ప్రపంచము మరణించుచున్నది.

52

ఈ చిన్న జంతువును కూడ మీరు గమనించవలయునని నేను కోరుచున్నాను, ఇది ఒక చిన్న జంతువు, అది మౌనమైన గొర్రెపిల్లగా ఉన్నది, ఎందుకనగా దానికి ఏమియు తెలియదు... ఆయన దూషింపబడినప్పుడు, ఆయన మరలా తిరిగి దూషించలేదు. ఆయన ఆ విధముగానే గడబిడ చేయలేదు మరియు ఆలాగు చేయుచు ముందు వెళ్లలేదు. ఆయన ఆ విధముగా చేయలేదు. కొందరు ఆయనను... ఆయనను వారు దూషించినప్పుడు, ఆయన మరలా దూషించలేదు. ఆయన తన నోరు తెరువలేదు.

కాని, నీవు ఎవరో ఒకరు నీకు, లేదా నాకు ఏదో చేయునట్లు నీవు అనుమతించావు. ఓ, మై, తోక కప్ప వలె దేనినో తినుచు మనము ఆవేశపడి పోవుచున్నాము. ఆ ముసలి గూసు బాతువలె అతికిపోవుచున్నాము. ''అతడు నాతో పేచీ పడినట్లయిన నేను ఆ సంఘమునకు మరలా వెళ్లను.'' లేదు, అయ్యా! దీవించుము దేవా! హల్లెలూయ! ఆ నజరీనులు నన్ను చేర్చుకొందురు; అదే విధముగా ఆ పిలిగ్రిం హోలినేస్స్ వారు నన్ను చేర్చుకొందురు. హల్లెలూయ! ఇక నేను దానిని చేయవలసినది లేదు'' అని నీవు చెప్పవచ్చును. మంచిదే. అయితే ఆ పావురము నిన్ను విడిచి వెళ్లిపోవును.

53

''నీకేమి తెలియునా? ఆ పూర్వపు వేషదారి ఆ సంఘమునకు వెళ్లిన, అక్కడకు నేను మరెన్నడును వెళ్లను. దేవునికి స్తోత్రము, నేనక్కడకు ఎన్నడు వెళ్లను.'' ఆ విధముగా నీకు తోచినప్పుడు, అది ఆ పూర్వపు మోసగించు తోడేలుగా ఉన్నది. ఆ పావురము వెళ్లిపోవుటకు ఆరంభించును. అప్పుడు పరిశుద్దాత్మ నిన్ను విడచివెళ్ళిపోవును.

అప్పుడు నీకేమైనదోనని నీవు ఆశ్చర్యపడుదువు. సంఘమునకు ఏమైనదని నీవు ఆశ్చర్యపడుదువు. ఇప్పుడు నీకేమైనదని నీవు ఆశ్చర్యపడుదువు. ఎందుకు మునుపటి వలె ఇప్పుడు జయము కలుగుట లేదు? నీ స్వభావమును నీవు మార్చుకున్నావు. ఒక గొర్రెప్లిగా ఉండుటకు బదులుగా, ఒక మేకగా మారిపోయావు. ఒక గొర్రెపిల్లకు బదులుగా, నీవు మరేదో అయిపోయావు.

నీవు ఆ సాత్వికమైన ఆత్మను పొందవలసియున్నది. ''ఎక్కడికైనను, ఆ పరిశుద్దాత్మ నన్ను నడిపించనిమ్ము. దేవా, నేను ప్రతి పాపిని ప్రేమించుచున్నాను. వారెక్కడఏ స్థితిలో ఉన్ననూ పరవాలేదు.'' అటువంటి స్థానమును మానవ ఆత్మలో కలిగియుండవలసి యున్నది. అప్పుడు నీ ఆత్మలో ఏదో జరుగుట నీవు చూచెదవు.

''మంచిది. సహో. బ్రెన్హాం దానికేదైనను మార్గమున్నదా?'' అని నీవు అడుగవచ్చును. అవును, నీవు ఒక గొర్రెపిల్ల మారుము, అంతే. ''మంచిది, సహో. బ్రెన్హాం'' అని చెప్పెదవు.

54

గత రాత్రి నేనొక యౌవ్వన స్త్రీని ష్రీన్‌పోర్టు ప్రాంతములో సంధించాను. బిల్లీ మరియు నేను ఆరాధన ముగించిన వెంటనే ఒక రొట్టెను కొనుటకు వెలుపలకు వెళ్లాము. అక్కడకు ఒక చక్కని యౌవ్వన స్త్రీ లోపలకు వచ్చినది. బహుశా ఇరువది సంవత్సరముల యౌవ్వనురాలుగా ఉండినది, చక్కగా దుస్తులు ధరించినది. ఆమె అక్కడ కూర్చొన్నది. ఆమె అటుగా చూచుటకు గమనించాను. నేను తినుచూ ఉండిపోయాను. ఆమె లోపలకు వచ్చిన కొన్ని నిమిషములకు ఒక స్త్రీ లోనికి వచ్చి ''మీరెట్లున్నారు?'' అని అడిగినది. నాకు తెలియును, ఆ స్త్రీ అక్కడున్న సోదరి డేవీస్ అని నేనెరిగియున్నాను. ఆమెయు మరియు మరొక స్త్రీ లైఫ్ టాబెర్నికల్ నుండి వచ్చినవారు. నేను వారిని బాగుగా ఎరుగుదును. ఆమె నా దగ్గరకు వచ్చి మాట్లాడుచుండినది. అప్పుడు మా మధ్యా కూర్చొనియున్న ఆ స్త్రీ, ''సహో. బ్రెన్హాం ఈ రాత్రి వర్తమానము ఎంతో బాగుండినది'' అని చెప్పినది.

''మీరెట్లున్నారు సోదరి?'' అని నేను అడిగాను. మీకు నా వందనములు, ''మీరు లైఫ్ టాబెర్నికల్ యొక్క సభ్యులా?'' అని అడిగాను.

“అవును,” అని ఆమె చెప్పినది. “బ్రెన్హాం సహోదరుడా మీకు తెలుసా, నేను పాటల బృందములో పాడగలను, కాని వారు నన్ను నిరాకరించారు.” అని ఆమె చెప్పినది. నేను చాలా సంవత్సరాలు గానము చేయుట అంతటిలో తర్ఫీదు పో౦దియున్నాను. నేను సోలోసాంగ్ లాంటివి పాడాను. కాని నేను పాడలేను, ఎందుకనగా వారు పాటల బృందంలో వున్నవారు ముఖమునకు రంగులు వేసికోనకూడదు అని నియమము పెట్టారు“ అని చెప్పినది.

“మంచిది, లైఫ్ టాబెర్నికల్ వారిని బట్టి దేవునికి స్తోత్రము!” అని నేను చెప్పాను.

ఆమె చెప్పెను, “మంచిది, నేను చెప్పుదును సాహో. బ్రెన్హాం, నేను క్రైస్తవరాలను.”

“అయితే, సహోదరి, ఇంటికి వెళ్లి మరియు మీ ముఖమును మరియు మీరు చేయునదంతయు కడుగుకొనుము” అని నేను చెప్పాను. నేను, అన్నాను ''నీ ముఖము పై ఆ చిన్న పాత దానిని వేసుకొనుటను బట్టి నీవు ఆలాగు చెప్పుచున్నావు అని నీ భావమా....“

55

అది దయ్యము నుండి వచ్చినది అని నేను మీకు నిరూపించగలను. ప్రారంభములో ఇలాంటిది ఏదియులేదని నేను మీకు నిరూపించగలను... దీని మూల స్థానము అన్యుల మధ్యనుండి ఏర్పడినది. మరియు నీవు దానిని ధరించి యున్నంత కాలము అది అన్యులకు గుర్తుగా యున్నది. ఇప్పుడేనేను ఆఫ్రికా నుండి వచ్చాను, హాటెల్‌టాట్ అడవులలో నేను ఉండినప్పుడు, వారి చెవులకు కమ్మలు మొదలగునవి ఎక్కడి నుండి వచ్చాయని తెలిసికొన్నాను. వారు అధికమైన ఆభరణాలను మెడచుట్టూను, చెవులలోను, చేతులలోను ధరించి యుండిరి. అది అక్కడ నుండియే వచ్చినది. అన్యులు ఆ కార్యములను చేయుదురు. అది అన్యులదే. మరియు బైబిలు ప్రకారము ఒక క్రైస్తవుడు అన్యునివలె ఉండుట తగదు. మరియు అది నీకక్కరలేదు... నీవు ఆ విధముగా చేయుచున్నందున, నీవు అన్యురాలివని నేను చెప్పుట లేదు; అయితే ఆ విధముగా కనబడుటకు నిన్నునీవు చేసుకొనుచున్నావు. ఎందుకనగా నీ బోధకుడు ఆ సత్యమును నీకు తెలియపరచలేదు. బైబిల్ ఆ విధముగా చెప్పుచున్నది.

56

''సహో. బ్రెన్హాం నాకు పొట్టి వెంట్రుకలున్న యెడల నాకు చల్లగా ఉండును'' అని నీవు చెప్పవచ్చును.“ అది మంచిదే. అయితే నీకు పొడుగాటి వెంట్రుకలున్న యెడల అది నీకు నిజముగా దాని కంటే చల్లదనమును కలుగజేయును. అది నీ మెడనంతటిని మూయుచు నిన్ను సరి చేయును.

ఎందుకో నీకు తెలుసా, బైబిలు చెప్పుచున్నదేమిటో నీకు తెలుసా, ఆమె తన తల వెంట్రుకలను కత్తిరించిన యెడల తన భార్యను ఆమె భర్త త్రోసివేసి విడాకులిచ్చు హక్కును కలిగియున్నాడు. ఆమె తన పురుషుడికి అసత్యముగా ఉన్నదని చూపుచున్నది. బైబిలు ఆ విధముగా చెప్పుచున్నది. I కొరింథి 12వ అధ్యాయమును చూచి అది నిజమేనా అని కనుగొనుము. ఆమె... తన తల వెంట్రుకలను కత్తిరించు స్త్రీ, తన శిరస్సును అవమానపరచునదిగా ఉన్నది. ఆ శిరస్సు ఆమె భర్తగా ఉన్నాడు. ఆమె అవమానపచునదైతే ఆమెకు విడాకులివ్వవలసి యున్నది. ఆ విధముగా ఆమె నుండి దూరపడవలెను. అది నిజము. అయితే, మీ బోధకుడు ఈ కార్యముల సత్యమును మీకెన్నడును చెప్పుటలేదు. అందువలననే మీరు ఎప్పుడు చేయునట్లే చేయుచున్నారు. మరియు పురుషుడు, బైబిలు చెప్పునదేమనగా...

57

ఇక్కడ ఎవరో ఒకరు ఉత్తరము వ్రాస్తూ ఇలా అడిగారు. ''బ్రెన్హాం సహోదరుడా, ఆ స్త్రీలు వేయు ఆ జాకెట్లు, ఇంత ఎందుకు, జాకెట్లు వేయుటయే కనబడుట లేదు. అలాంటి డెక్రాన్, నైలాన్ మరియు ఇతర దుస్తులకు దేహము కనబడు విధముగా క్రైస్తవ స్త్రీలు ధరించుటమంచిదేనా? ఎందుకు ఆ విధముగా జరుగుచున్నది?'' అని అడిగారు.

అప్పుడు నేను, ''సోదరీ ఇటు చూడుము, దానిని గురించి ఒక కార్యమున్నది. ఇక్కడ అది సత్యముగా ఉన్నది. మీరు దీనిని చేయవచ్చును: మీరు ఒకటి కొనలేకున్న యెడల, వారే ఆ కుట్టు మిషనులను అమ్ముచున్నారు, కావున ఒకదానిని తీసికొనవచ్చును, అప్పుడు చూచుటకు మంచిగా ఉండునట్లు మీరే కుట్టుకోవచ్చును. ''నేను నమ్మునదేమనగా, మీరు చూడండి. మీ హృదయములో ఉన్న దానినినే మీరు వ్యక్తపరచుచున్నారు,“ అని నేను చెప్పుచున్నాను. మీరు చేయు కార్యములు, మీరు నడుచుకొను విధానము మీలో ఉన్న దానిని చూపును.

58

ఇక్కడున్న ఈ మండిపడుట, తొందరపడుట, చాడీలు, వెన్నుపోటు పొడుచుట, వాటిని సంఘములో చేయుట, ఇవన్నియు సంఘమును విరుగగొట్టుచున్నవి. దయ్యము మీలో ప్రవేశించినదని అది చూపుచున్నది. పరిశుద్దాత్మ మిమ్మును విడచిపోయినదని అది చూపుచున్నది.

ఇప్పుడు నేను చెప్పుచున్నది మీలో కొందరికి తారును కాగబెట్టినట్లుండును, అయితే ఆ విధముగా చేయవలసియున్నది. అది దానిని చేయవలసియున్నది. అందుకొరకే అది చెప్పబడినది; అందముగా ఉండుటకును, వేషదారిగా నటించుటకు కాదు; అయితే ఎక్కడ ఆ చిక్కు ఏర్పడుచున్నదని తెలుపుటకే, ఒక దినమున నేను మీ తరపున నిలబడి మిమ్మును గురించి జవాబు చెప్పవలసియున్నది. నీవు నడచుకొను తీరు, నీవు చేయు కార్యములు, నీవేమైయున్నావో దానిని చూపుచున్నది. నీకు అలాంటి పూర్వపు ఆవేశమున్నయెడల, అది అదుపును దాటి వెళ్లునట్లయిన అలాగే కొనసాగుము. ఇక్కడ నుండి వెళ్లిపొమ్ము, లేక నిందించుట లేక అసభ్య దూషణ ఇలాంటివి ఉన్నయెడల అది ఎక్కడ ఉండినదని చూపుచున్నది. లేక ఎక్కడ నుండి వచ్చుచున్నదని చూపుచున్నది.

59

ఇప్పుడు మీరు చేయుటకు ఒక్క కార్యము మాత్రమే ఉన్నది: అదేదనగా దానిని నీలో నుండి తీసివేయుము, అప్పడు ఆ పావురము నీ హృదయములోకి మరలా వచ్చును. ఆ పావురము ఆ ఓడ నుండి వెడలిపోయినప్పుడు, అది వెలుపలకు వెళ్ళి తిరిగి వచ్చినది. నోవహు తలుపు తీయువరకు తలుపును తట్టుచుండినది. పరిశుద్దాత్మ ఇక్కడే ఉన్నది. ఆ పరిశుద్దాత్మలోపలకు వచ్చుటకు ఇష్టపడుచున్నది. ఈనాడు ఆ కారణము చేతనే పరిశుద్దాత్మ నిన్ను విడచి పూర్తిగా వెళ్లలేదు. అది అక్కడ ఆ కొమ్మలపై ఎక్కడో కూర్చొని నీలోకి ఎగిరి వచ్చుటకు సిద్దముగా ఉన్నది. ఆ పరిశుద్దాత్మ వచ్చుట ద్వారా మనకు సమాధానము, ప్రేమ, సంతోషమును నీవు పూర్వము కలిగియుండినట్లే ఇచ్చుచున్నాడు. అది వాస్తవము. అది అలా చేయుచున్నది. ఆయన దానిని చేయుటకు సిద్దముగా ఉన్నాడు. ఆయన దానిని చేయుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన దానిని చేయుటకు వేచియున్నాడు. అయితే నీవే ఆయనను దానిని చేయనివ్వకున్నావు.

60

ఇప్పుడు, నేను క్రొత్తగా వచ్చిన వారితోనే లేక ఎరుగనివారితో మాట్లాడుటలేదు. మీ కాపరి చెప్పునదేమిటో నేనెరుగను... నేను బ్రెన్హాం గుడారముతో మాత్రమే మాట్లాడుచున్నాను. వేర్వేరు సంఘముల నుండి వచ్చిన వారితో మాట్లాడుట లేదు. నేను బ్రెన్హాం గుడారముతో మాత్రమే మాట్లాడుచున్నాను. అదే ఇక్కడ కార్యమైయున్నది.

ఆ కార్యములు ఆ పావురము ఎగిరి పోవునట్లు చేయుచున్నది. ఎవరో ఒకరు తమ సంఘములో ఏదో కొంత ప్రారంభము చేయనియ్యుడి. అప్పుడు '' ఓ, అది అలాగా? ఓ, అదెట్లు? అది అలా కాదు గదా?'' అనునప్పుడే ఆ పరిశుద్దాత్మ తన దారినే వెళ్లిపోవును. అలాంటి ఆత్మను అది భరించజాలదు. ఆ గొర్రెపిల్ల స్వభావము నిన్ను విడిచిపెట్టియున్నంత కాలము పరిశుద్దాత్మ దూరముగా ఉండును. అది నిజము. ఈనాడు అదే మనలో ఉన్న చిక్కు. ఆ కారణము చేతనే ప్రజలు అదే స్థితిలో ఉన్నారు, ఎందుకనగా పొరపాటైన ఆత్మను వారి హృదయములోకి అనుమతించారు, వారి జీవితములలోకి అనుమతించారు. అదే కారణమును బట్టియే మనలో...

ఆ కారణము చేతనే మనలో అనేకులు వ్యాధిగ్రస్తులు మరియు వేదనమయులైయున్నారు, ఆ కార్యము చేతనే అలా జరుగుచున్నది. మనము సౌమ్యముగా ఉండవలసియున్నది. మనము సమాధానముతో ఉండవలసిన వారమైయున్నాము. మనము ఒక గొర్రెపిల్లగా ఉండవలసియున్నది, అప్పుడు ఆ పావురము మనతో కలిసియుండును.

61

ఇప్పుడు ఆ పావురము మరలి వచ్చునని జ్ఞాపకముంచుకొనుడి. '' ఓ, సహో. బ్రెన్హాం నేను ఎన్నడూ పరిశుద్దాత్మను పొందలేదని చెప్పకుము. హల్లెలూయ! అక్కడ ఒక రాత్రి, ఓ, అతడు నాలోకి వచ్చినప్పుడు. ఓ, నేనెంతో ఒక మంచి అనుభూతిని పొందాను. ఒక పక్షితన గూటిలో నుండి ఎగిరిపోవునట్లే అనుభూతిని పొందాను. నేను దానిని కౌగలించుకున్నాను, ప్రేమించాను. నాకు హాని చేసినవారిపై నా చేయివేసి వారిని కౌగలించుకున్నాను. ఓ, బ్రెన్హాం సోదరుడా ఎంతగా నేను ఆ అనుభూతిని పొందాను'' అని చెప్పవచ్చును, నిజమే, అది పరిశుద్దాత్మయే, కాదనట లేదు.

అయితే ఆయన ఎందుకు ఏకమై కలసియుండలేక పోవుచున్నాడనగా, అప్పుడు నీవొక గొర్రెపిల్లగా ఉంటివి; అయితే నీవొక తోడేలుగా మారినప్పుడు, ఆయన వెళ్లిపోవలసి వచ్చినది. ఆ పావురములో ఏ పొరపాటులేదు; అది నీవె, ఆ ఆత్మను నీవు నీలోకి వచ్చుటకు అనుమతించితివి. ''బ్రెన్హాం సోదరుడా, నేను దానిని అనుమతించితినా?'' అని నీవు అడుగవచ్చును. నిజమే, ఆ అబద్దమును విన్నప్పుడు ''మంచిది. నేను నా హక్కును కలిగియున్నానని!'' నీవు చెప్పినప్పుడు ఆ పావురము నిన్ను విడిచిపోయినది.

62

నీకు ఎలాంటి హక్కు లేదు! నీవు విలువ పెట్టి కొనబడితివి, ఆ విలువ దేవుని కుమారుని అమూల్యమైన రక్తముగా ఆ విలువున్నది. అధికార పూర్వకమైన హక్కు ఏదియు నీకు లేదు. హల్లెలూయ! నీవు కలిగియున్న ఒకే ఒక హక్కు ఏదనగా, ఇమ్మానుయేలు నాళముల నుండి తీయబడి నింపబడి యున్న కొలనుకు రమ్ము; పాపులు ఆ ఊట యొద్దకు వచ్చినప్పుడు, వారి సమస్త అక్రమము శుద్దిచేయబడుచున్నది. అవునండి. నిన్నునీవు దేవునికి సమర్పించుకొనే హక్కు మాత్రమే నీకున్నది, అప్పటి నుండి దేవుడు నీకు ముందు నిలచి నిన్ను నడిపించును.

అదే ఆకలయికకు కారణముగా ఉన్నది... అదే అనేక ఆశ్చర్య కార్యములకు కారణముగా ఉన్నది. అటువంటి స్థలమునకు పరిశుద్దాత్మ వెళ్లుచున్నాడు. అక్కడ పరిశుద్దాత్మ, ''ఇది సరికాదు, ఆ కూడికను నిలుపుము, ముందుకు వెళ్లిపొమ్ము'' అని పలుకును. నేను కూడా దానిని నిలిపివేయుదును, సోదరుడా, ముందుకు వెళ్లుము. అది మంచిది, ఎందుకనగా దేవుని ఆత్మతో నీవు నడుపబడవలెను. దేవుని ఆత్మ చేత నడిపించబడుటకు ఒకే ఒక మార్గము, నిన్నునీవు సౌమ్యముగా ఉంచుకొనుచుట; అతిగా తెలిసికొనుట అవసరము లేదు.

63

ఓ, ''నాకెంతో తెలియును'' అని నీవు తలంచవచ్చును. నిజమే, నీ పూర్తి మెదడు పని చేయునట్లు నీవు చేయవచ్చును గాని తనంతట తాను అది పని చేయదు. నీవు సమస్త పుస్తకములను, వాటి జవాబులను ఎరిగియుండవచ్చును. మరియు గ్రీకు భాషయు, హెబ్రీ భాషయు నీకు తెలిసి యుండవచ్చును, కాని ఆ పావురము నిద్రించుటకు నీలో స్థానము లేదు. అది నిజము. అయితే నీకంతయు బాగుగా తెలియును; ఆ పావురము నిన్ను నడిపించజాలదు, ఎందుకనగా నీకు అధికముగా తెలిసియున్నది.

ఆ గొర్రెపిల్ల నాకేమియు తెలియదని చెప్పును. దానిని మరెవరో నడిపించవలసియున్నది. దేవునికే మహిమ! అది అలా ఉన్నది. దానికేమియు తెలియదు! ఆమేన్. నాకు తెలిసినదంతయు ఒక్కటే, అది యేసుక్రీస్తు నన్ను రక్షించుటకై మరణించెను.

64

క్యాలిఫోర్నియోలో ఒక యువకుడు వచ్చాడు. అతడు ఒక వ్రాతపలకను తన ముందు ప్రక్కగా తగిలించుకొన్నాడు. అదేమనగా ''నేను క్రీస్తు కొరకు ఒక వెర్రివాడను'' అని వ్రాయబడియున్నది. వెనుక ప్రక్క ''నీవు ఎవరి కొరకు వెర్రివాడవుగా ఉన్నావు'' అని వ్రాయబడియున్నది. అది నిజమే. ఈ ప్రపంచమునకు నీవు వెర్రివాడగుట పరిశుద్దాత్మచే నడిపించబడుట కావచ్చు, ఎందుకనగా దేవుని కుమారులు, కుమార్తెలు, పరిశుద్దాత్మచే నడిపించబడుదురు. రోమా 8:1, ''కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసు నందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. వారు శరీరమును అనుసరింపక, ఆత్మననుసరించే నడచుకొందురు.'' తోడేలు వెనుక నడువకుము, అయితే పావురమును వెంటాడుము. ఆమేన్.

65

డాక్, సోదరునికి ఈ పాట పాడుట ఒక అలవాటు. ''నా మార్గమును ప్రతి దినము ప్రేమతో నింపుము. నేను ఆ పరలోక పావురముతో నడచుచుండగా, నా మార్గమంతటను చిరునవ్వుతో సంగీతముతో వెళ్లనిమ్ము, ప్రతి దినము ప్రేమతో నా మార్గమును నింపుము.'' ఇది ఎంత సమాధానకరమైన దినముగా ఈ బ్రెన్హాం గుడారమునకున్నది, లేక మరి ఏ సంఘమునకైనను, ఏ వ్యక్తికైనను వారు తమ హక్కులను విడచి ఒక గొర్రెగా మారినప్పుడు, అది సమాధాన దినముగా ఉన్నది.

''బ్రెన్హాం సోదరుడా, ఆ ప్రశ్న ఏమిటి?''

ఒక గొర్రెపిల్లగా తిరిగి రమ్ము, సౌమ్యముగా ఉండుటకు తిరిగి రమ్ము; మరేది ఎరుగకుండుటకు తిరిగి రమ్ము; క్రీస్తుకు నిన్ను సమర్పించుకొనుటకు తిరిగి రమ్ము; ప్రయత్నించకు, మరి దేనినో తెలిసికొనుటకు ప్రయత్నించకు, సాత్వికుడవై నడచి వెళ్లుము, మౌనముగా, వినయముగా, సౌమ్యముగా, ఆ పావురము నిన్ను నడిపించును. అయితే నీవు అబద్దమును వినుటకు వెళ్లినప్పుడెల్లా, నీవు ఆ ఆవేశమును పొందుటకు తలంచెదవో అప్పుడు ఆ పావురము ఎగిరి తన దారిన వెళ్లి పోవును. అప్పుడు నీవు ఎంతమాత్రమూ దానిని కలిగి లేవు. ఇప్పుడు, అది ఈ ఉదయాన, సంఘమా, నీకెంతో దూరముగా లేదు. అక్కడ సమాధన కొమ్మపై అది కూర్చొనియున్నది. నీ స్వభావము మారుట కొరకు అది వేచియున్నది. ఆమేన్.

66

ఈ దినమున మనకు కావలసినదేదనగా మన హక్కులన్నింటిని దేవుని యొద్ద సమర్పించుచుండగా ఆయన మన హక్కులన్నిటిని తీసివేయవలసియున్నది. ఆమేన్. ఆ చిన్న గొర్రెపిల్ల అక్కడ ఏ విధముగా వాలియున్నదో ఊహించగలరా? దాని హక్కును అది కలిగియున్నది. అవును. “హు, హు, హు,” అక్కడ అది దాని ఉన్నిని కత్తిరించు బల్లపై పడియున్నది. దానికి ఏది మంచిదో వారికి బాగుగా తెలియును. దాని నుండి దాని హక్కులన్నింటిని తీసివేసి మరియు దానిని కత్తరించినప్పుడు, అది ఎంతో హాయిగా మరియు తేలికగా అది పరిగెత్తును. మై, మై, అది ఎంతో సంతోషముతో ఉండును. ఎంతో సమయము ఎగురుచు, గంతులు వేయును. అవునండి. నీ హక్కులను నీవు వదులుకొనినప్పుడే నీవు పొందగలిగిన దానిని పొందగలవు. అయితే నీవు నీ హక్కులను విడచి, నీలో ఉన్న సమస్త లోక స్థితిని కత్తరించుటకు దేవుని వాక్యమును అనుమతినిమ్ము, ఈ లోకపు అలవాట్లు అన్నింటిని తీసివేయుము, అప్పుడు నీవు క్రీస్తులో నూతన సృష్టిగా మారుదువు.

67

ఇక్కడ కొంత కాలము క్రితము ఆఫ్రికాలో, నేను ఒక పాత-కాలపు పరిశుద్దునితో మాట్లాడుచుంటిని. అతడు ''బ్రెన్హాం సోదరుడా, నీవు సహజాతీతమైనదానియందు విశ్వాసము కలిగియున్నావని నాకు తెలియును'' అని చెప్పెను.

నేను చెప్పాను, “కచ్చితముగా, నా సహోదరుడా.”

అందుకతడు, ''కొన్ని సంవత్సరముల క్రితము నేను ఎవరినోనని తలంచుచుండెడి వాడను, నేను నిజముగా ఒక క్రైస్తవుడనని తలంచినాను'' అని చెప్పాడు. మరియు అతడు, ''ఆ కొండపైన మా సంఘములో నా చిన్న కారుని ఒక చోట ఆపి, ఆ కొండను ఎక్కవలసియుండేది, సుమారు మూడు లేక నాలుగు వందల గజాలు ఎక్కవలసి యుండేది, ఆ పొదలు, మరియు కొన్నిటిని దాటి ఎక్కవలసియుండేది. మాకు అక్కడ ప్రార్థన కూటము జరుగుచుండును.'' మరియు అతడు, ''నేను ఒక నిజమైన క్రైస్తవుడనని తలంచినాను'' అని చెప్పాడు. మరియు అతడు, ''నాకు బైబిలు అంతా తెలియును. ఆ హెబ్రీ అంతయూ చదివియున్నాను. వాక్యమునకు సరియైన ఉచ్ఛారణ గురించి పూర్తిగా చదివియున్నాను.'' మరియు అతడు, ''ఎవరైనను నా దగ్గరకు వచ్చిన యెడల, నేను [సహోదరుడు బ్రెన్హాం చిటికలు వేయుచున్నారు.] బైబిలు గురించి మాట్లాడగలను, నేను మాట్లాడునది నాకు తెలియును.''

మరియు ''ఒక రాత్రి నేను సంఘమునకు పోవుచున్నాను. మా సంఘములో చాలా భేదాభిప్రాయములు ఉన్నవి'' అని చెప్పెను. మరియు చెప్పెను, ''ఒకరిపై ఒకరు చిన్న చిన్న పార్టీలు కలిగియుండిరి. అవి ఏ విధముగా ఏర్పడునో మీకు తెలియునా.''

చెప్పెను, “అవునండి.”

అతడు చెప్పెను, ''నా దారిన ఆ కొండ పైకి నేను నడచి వెళ్లుచుండగా, అనుకొనని విధముగా ఎవరో నన్ను వెంబడించునట్లు తలంపునకు వచ్చినది. అందువలన వారెవరోనని కొంతసేపు అక్కడ నిలచి వారిని కలిసికొనవలయునని తలంచాను. మేము ఆ కొండపైకి వెళ్లుచుండగా అలా మాట్లాడుచు వెళ్లవచ్చుననియు తలంచాను.''

అది మంచి కార్యమని మీకు తెలియును: కొంతసేపు మీరు వేచియుండి చూడుడి. అంతట అతడు చాలా చెప్పసాగెను, “ఆ విధముగా ఆ కొండ పైకి నడచి వెళ్లాను. అక్కడ ఆ కొండపైకి ఒక వ్యక్తి నడచి వచ్చాడు. అతడు తన వీపుపై ఒక మనిషికంటెను బరువైన ఒక మూటను మోసికొని వచ్చుచుండెను. అతడు శ్రమతో, ఆయాసపడుచూ మెల్లగా అడుగులు వేయుచూ కొండ ఎక్కుటకు ప్రయత్నించుచుండెను. అప్పుడు నేను ''స్నేహితుడా, నేను నీకు సహాయపడవచ్చునా?'' అని అడిగాను. అందుకతడు ''లేదు, నేను ఆ బరువును తీసుకు వెళ్లవలసియున్నది.'' అప్పుడు నేను ఆయన చేతులవైపు చూచాను. అది ఒక దర్శనమని తెలుసుకున్నాను. చేతులలో ఆయన గాయములను కలిగియుండెను. అంతట నేను సాష్టాంగపడి, ''ప్రభువా, నీవు ఈ లోక పాపములను ఆ మూటలో మోయుచున్నావా?'' అని అడిగితిని, లేదు ''అవి నీ పాపములు మాత్రమే. నేను నిన్ను ఆ కొండపైకి తీసికొని వెళ్లుట ద్వారా నీవు పైకి వెళ్లగలవు'' అని చెప్పెను.

ఇది ఆ విధముగానే ఉండును. మనము మన చుట్టూరు చూచినట్లైతే, ఆయన మన పాపములను మోయుచున్నాడు అని మనము కనుగొందుము. ఆ సంభవము మిమ్ములను కొద్దిగానైనను చింతింప చేయుట లేదా? మన బుద్దిహీన, కఠినమైన హృదయము వాటిని చేయుచున్నది.

68

కొంత కాలము క్రితము నేను వేటాడుచుండగా. నేను వేటాడుటను ప్రేమింతునని మీరెరిగియున్నారు. ఆ దేశములో ఒక బుద్దిహీనుడుండెను; అతడు చాలా చెడ్డవాడు. నేను ఆడ జింకలను, జింక పిల్లలను వేటాడను అని నన్ను పరిహాసము చేయుచుండును. అప్పుడు నేను, “అది క్రూరము.” ''ఎందుకు నీవు ఒక మంచి వేటగాడివలె పెద్దవాటిని, మరియు చావనైయున్నవాటిని చంపకూడదు. దేవుడు వాటిని మనకు దయచేశాడు. అవి లేత తల్లులుగాను మరి చిన్నవిగాను ఉండవలసియున్నది...“

అప్పుడతడు, ''నీవు పిరికి హృదయము కలిగియున్న సేవకుడవు'' అని నాతో చెప్పుచుండెను.

అప్పుడు నేను ''ఇటు చూడుము, నేను ఆకలిగొనియున్నప్పుడు, ఆ జింకలలో ఒక దానిని కోరుదును. నేను దానిని పొందునట్లు దేవుడే అనుమతించునని నేను నమ్ముచున్నాను. అయితే కేవలము తెలివి ప్రదర్శించుటకు వాటిని కాల్చుట. అతడేమో తన వాగెన్ నిండుగా ఆ జంతువులను (కాల్చిన వాటిని ) నింపుకొనెను. అతడు బయలుదేరుచు మరియొక జింకను పిలిచాడు. అతడు ఆ జింకపిల్ల అరచునట్లే ఈల వేశాడు. ఒక దినము మేమిరువురము ఒక్కటిగా ఒక అడవిలో ఉండగా, అతనిని నేను సిగ్గుపరచాను. ''నన్ను గురించి నేను సిగ్గు పడుచున్నానని'' చెప్పాను, ఎందుకనగా ఒక్కసారిగా ఎనిమిది జింకలను వేటాడి, వాటి వెనక భాగములను కత్తరించి, అతడు ఇష్టపడిన దానిని మాత్రమే తీసుకోని మిగిలిన దానిని విడచిపెట్టాడు, కేవలము తెలివిని ప్రదర్శించుటకు. అప్పుడు నేను, ''నీవలా చేసియుండకూడదు'' అని చెప్పాను.

''ఆ, అలాగా, సేవకులైన మీరు పిరికివారు!'' అని అతడు బదులు ఇచ్చెను.

69

ఒక దినము అతడు ఆ అడవిలో నిలచియుండగా, అతడు యధావిధిగా ఈల వేశాడు. ఆ శబ్దము ఒక జింకపిల్ల అరచినట్లే ఉండినది. అతడు ఆ విధముగా చేసినప్పుడు, ఒక అందమైన లేడి, పొదలో నుండి తన తలను వెలుపలకు చాపినది. అది తన కపిల వర్ణపు కండ్లతో చూచుటను మీరు చూచి యుండవచ్చును. అది ఒక విధముగా వెలుపలకు వచ్చి చుట్టూరు చూచినది. అప్పుడు ఆ వేటగాడు లేచి తన తుపాకీని గురి పెట్టెను. ఆ జింక వానిని చూచినది, అయితే ఆ జింక తన పిల్ల ఆక్రందన చేయు స్వరమును విననందున ఆ తుపాకీని చూడలేదు. అది తన పిల్ల కొరకు చూచుచూ నిలచిపోయినది. ఆ విధముగా అదిచిక్కులో పడినది.

ఆ స్థితి మాతృత్వమును, మాతృ ప్రేమను ఎత్తి చూపుచున్నది. అది ఆ విధముగా ఆ తుపాకీ ఎదుటనే మరణమును ఎదుర్కొన నిలచినది. ఆ తుపాకీని చూస్తూ నిలచి పోయినది. అప్పుడేమి జరిగినదో తెలుసా, అక్కడ ఎంత గొప్ప క్రియ జరిగినదనగా, అది అతనిని ఎంతో ఆకర్షించినది. అప్పుడతడు ఆ తుపాకీని క్రింద పడవేసి, పరుగెత్తుకొనుచు వచ్చి, నన్ను గట్టిగా కౌగలించుకొనుచు, ''బిల్లీ, నా కొరకు ప్రార్థించుము. ఈలాగున ఎన్నోసార్లు చేశాను'' అని ఆక్రందన చేశాడు. అతడు ఆ మాతృత్వమును చూచినప్పుడు కలత చెందాడు.

ఓ, ఈ లోకము దేవుని ప్రేమ వెలువడుట చూచినప్పుడు, మన మానవ హృదయములో ఉన్న సాహసము, అది ఎంతో వ్యత్యాసముగా ఉన్నది. ఆ దేవుని పావురమును మనము మన హృదయములోనికి ఆహ్వానించుచునప్పుడు, మనలను సౌమ్యముగాను, సాత్వికముగాను చేయుచున్నది.

అక్కడ ఆ అడవిలో నేను అతని కొరకు ప్రార్థించి, ప్రభువైన యేసు యొద్దకు నడిపించాను. అప్పటి నుండి అతడు మంచి వేటగాడుగా మారెను.

నిజమే, అతనికి ఆ హక్కు ఉన్నదని అతడు తలంచాడు, అతడు కోరిన దానినంతటిని చేయవచ్చును. “అవి నా స్థలములో ఉన్నవి, అవి నా యొక్క గడ్డిని తినుచున్నవి.”

“అది నిజమే, అయితే అది మానవత్వము కాదు,'' అని నేను చెప్పాను. నీ హక్కులను నీవు విడచిపెట్టవలసియున్నది. ఓ, దేవా, దయచూపుము. అప్పుడే మేము ఆ విధముగా చేయగలము.

70

ఇక్కడ కొంత కాలము క్రితము ఓ, సుమారు నూరు సంవత్సరముల క్రితము, అమెరికా ఐక్య రాష్ట్రముల పడమటి, దక్షిణములో ఒక గొప్ప క్రైస్తవుడు జీవించాడు. అతని పేరు డానియేల్ క్యూరి. ఆయన ఒక అద్బుతమైన వ్యక్తిగాను, పరిశుద్ధునిగాను, ఒక నిజక్రైస్తవునిగాను, ప్రతి ఒక్కరు తలంచురీతిలో జీవించిన వ్యక్తిగాను ఉండెను. ఆ చరిత్ర ఇలా చెప్పుచున్నది, అతడు మరణించుచున్నప్పుడు ఇలా చెప్పాడట, అతడు మరణించిన తరువాత పరలోకము దగ్గరకు వెళ్లాడట. ఆయన మరణించి అక్కడకు వెళ్లినప్పుడు, అక్కడ రత్నముల ద్వారము యొద్దకు వచ్చాడట. అక్కడ కావలి ఉన్నవాడు ''నీవు ఎవరివి?'' అని అడిగాడట.

అతడు, “నేను సువార్తికుడను, డానియేల్ క్యూరి. నేను క్రీస్తు కొరకు వేల కొలదిగా మనుష్యులను నడిపించాను. నేను ఈ ఉదయ కాలము ఇక్కడకు వచ్చాను. భూమిపై నా యాత్ర ముగిసిపోయినది. అక్కడకు వెళ్లుటకు నాకు స్థలము లేదు,'' అని చెప్పాడట.

71

పాపివైన నీకును ఆ విధముగానే ఒక ఉదయ కాలమున సంభవించును. వెనుకపడినవాడా, ఒక విధముగా నీకును అలాగే జరుగును. అదే విధముగా పరిశుద్దాత్మను దుఃఖపరచిన వారి మార్గముండును, వారు ఇకపై, సౌమ్యముగానో లేక సున్నితముగానో ఉండరు. సంవత్సరముల తరబడి మీరు ఆక్రందన చేయుట లేదు. మీరు సిగ్గుపడుట లేదు. నేనెరుగను, మీలో నుండి సమస్త మర్యాద వెడలిపోయినది. నిజము. అయితే ఆ దినములలో ఒక ఉదయము అది మీ ద్వారము నొద్దకు రానైయున్నది. ఆ విధముగా ఆ సౌమ్యమైన పరిశుద్దాత్మ మీ ద్వారమును తట్టుచున్నప్పుడు, మీరెందుకు ఆయనను లోపలకు అనుమతించకూడదు?

72

ఆ విధముగా డానియేల్ క్యూరి ఆ ద్వారము నొద్దకు వచ్చినప్పుడు, వారు ''నీ పేరు ఇక్కడ ఉన్నదా లేదా చూచెదము'' అని చెప్పారు. వారు అంతా చూడగా, అక్కడ పేరు కనిపించలేదు. వారు ''ఇక్కడ డానియేల్ క్యూరి అను పేరు లేదు'' అని చెప్పిరి.

''ఓ, నిజముగా నేనొక సువార్త సేవకునిగా ఉన్నానని,'' ఆయన చెప్పెను. ''నేను క్రీస్తు కొరకు ఎన్నో ఆత్మలను జయించాను. నేను సరైన కార్యమునే చేయుటకు ప్రయత్నించాను'' అని చెప్పాడు.

అప్పుడు ఆకావలివాడు, ''అయ్యా, ఇక్కడ డానియేల్ క్యూరి అను పేరు లేదు. నన్ను క్షమించండి. నీవు ఏమి చేయవలెనో నేను చెప్పెదను. నీ దావాను తీసికోనుటకు మాకు ఏలాంటి అధికారము లేదు, నీ దావాను విన్నవించు కొనుటకు ఇష్టపడుచున్నావా? ధవళ సింహాసనపు తీర్పులో నీ దావాను విన్నవించుకొనవచ్చును. ఇక్కడ నీ కొరకు ఏ విధమైన కృప దొరకదు, ఎందుకనగా ఇక్కడ పేరు లేదు. నీకు కృప అనునది లేదు. నీవు దావాను విన్నవించుకోదలచావా?''

అందుకతడు, “అయ్యా విన్నవించుకొనుట తప్ప మరొక మార్గము నాకు లేదు'' అని చెప్పెను.

''అప్పుడు నీవు ఆ ధవళ సింహాసన తీర్పుకు వెళ్లి అక్కడ నీ దావాను విన్నవించుకొనుము'' అని ఆ కావలివాడు బదులు చెప్పాడు.

73

డానియేల్ క్యూరి, గగనములో ఒక గంటసేపు వెళ్లుచున్నట్లు అనుభూతిని పొందానని చెప్పాడు. ఆ విధముగా అతడు ఒక స్థలమునకు వచ్చాడు. అక్కడ అధికంగా తేలికగా, తేలికగా, తేలికగా, ఇంకనూ తేలికగా ఉన్నది. అది నూరు రెట్లుగా, సూర్యుని కంటెను అధికముగా ప్రకాశించుచున్నది. అప్పుడతడు వణికిపోవుచూ ఆ వెలుగులోకి వెళ్లినప్పుడు, ఒక శబ్దమును విన్నాడు. ''నీవు భూమిపై పరిపూర్ణుడిగా ఉంటివా?'' ఆ మాట ఆ వెలుగులో నుండి వచ్చినది.

అందుకతడు ''లేదు, నేను పరిపూర్ణుడిగా జీవించలేదు'' అని చెప్పుచూ వణికిపోయాడు.

''నీవు ప్రతి ఒక్కరితో నిజాయితీగా నడచుకొన్నావా?'' అని అడిగినప్పుడు.

''లేదు'' అని చెప్పుచుండగా, (కొన్ని సందర్భాలు అతనికి జ్ఞాపకమునకు వచ్చాయి), ''లేదు, నేను నిజాయితీగా లేను'' అని అతడు చెప్పాడు.

''నీ జీవితములో ప్రతి విషయములో సత్యమే చెప్పావా?'' అని అడుగబడినప్పుడు.

అతడు ''లేదు, నేను చెప్పిన కొన్ని కార్యములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, అవి మసకగా ఉన్నవి. నేను, నేను, నేను ఖచ్చితముగా సత్యమును చెప్పలేదు'' అని జవాబిచ్చాడు.

''నీవు ఎప్పుడైనను నీది కాని దానిని తీసుకున్నావా? డబ్బునైనను, మరి ఏదైనను నీది కాని దానిని తీసుకున్నావా?“ అని అడిగినప్పడు.

అతడు భూమిమీద ఉన్నప్పుడు చాలా మంచివాడని తలంచాడు. అయితే ఇక్కడ నిరాకరించబడుచున్నాడు. ''లేదు, లేదు, నావి కాని వాటిని అన్నింటిని నేను తీసికొన్నాను'' అని అతడు బదులిచ్చాడు.

అందుకాయన, ''అయితే నీవు పరిపూర్ణుడవు కావు'' అని చెప్పాడు.

అందుకతడు ''నిజమే, నేను పరిపూర్ణుడను కాను'' అని బదులిచ్చాడు.

అప్పుడతడు చెప్పినదేమనగా, ఆ పావురము విశ్రమించు ఆ స్థలము నుండి ఎప్పుడైనా ఆపద ఒక్క క్షణములో రావచ్చునని చెప్పెను. ''నీవు నిరాకరించబడితివి'' అని చెప్పినప్పుడు, ఆ వెనుక ఒక స్వరమును విన్నాడు. అది తల్లి స్వరము కంటెను మధరమైన స్వరముగా ఉన్నది. అతడలాంటి స్వరమును ఎన్నడూ వినలేదు. అతడు ఆ స్వరమేమిటోనని తిరిగి చూచాడు, అప్పుడు అక్కడ నిలబడియుండు స్వరూపము తల్లి ముఖము కన్నను ఎంతో మధరమైన ముఖముగా ఉన్నది. అంతట ఆ స్వరము పలికినదేమనగా ''తండ్రి, డానియేల్ క్యూరి, భూమిపై నా కొరకు నిలచాడు కాబట్టి, పరలోకమందు అతని కొరకు నేను నిలచుచున్నాను. అతడు భూమిపై పరిపూర్ణుడే, అది నిజము, అతని పాపలన్నింటిని తీసివేసి నా లెక్కలో చేర్చుము'' అని పలికెను.

సోదరా, ఈ దినము నీవు ఆయనను దూరపరచి దుఃఖపరచినయెడల, ఆ దినమున నీ కొరకు నిలువబోవునది ఎవ్వరు? నేనికపై ప్రసంగించలేను. మన తలలను వంచుదము.

74

ప్రియమైనదేవా, మరణించుచున్న ప్రియమైన గొర్రెపిల్లా, వినయముతో, సాత్వికముతో, ప్రియముగా నీవున్నావు. ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి, నక్కలను బొరియలున్నాయి, కాని నీకు తలవాల్చుకొనుటకు స్థలము లేకపోయినది. అయినను నీవు దేవుని మహిమగా ఉన్నావు! నీవు జన్మించినప్పుడు, నీపై వేయుటకు వారికి ఏ బట్టలు లేకపోయినవి. ఓ దేవా, అట్లయిన నా దుస్తులు నాకు ఏ మేలు చేయగలవు? నా కార్లు నాకు ఏ మేలు చేయగలవు? ఒక చక్కని అందమైన ఇల్లు నాకేమి చేయగలదు? ఈ దినమున ఇవి చేయగల మేలు ఏలాంటిది? నీకు సహావాసమనునది లేదు. ఎవ్వరూ నీతో సహవాసము చేయలేదు. ఎవ్వరూ నీకు సహాయమునకు తన చేతిని చాపలేదు.

ఆ దినమున నీవు చెప్పునదేమనగా, ''నేను ఆకలిగొంటిని, నాకు ఆహారమియ్యలేదు. నేను దిగంబరినైయుంటిని, నాకు బట్టలివ్వలేదు.'' ఆ దినమున మాతో కూడ వచ్చు మేలేది? ప్రభువా, నీ కొరకు నిలువబడనిమ్ము, అప్పుడు ఆ ఘడియ వచ్చినప్పుడు మేము ఆయన సన్నిధికి నడచి రాగలము. ఆయన నిత్యుడుగాను, సర్వాంతర్యామిగాను ఉన్నాడు. ఓ దేవా, ఆ పావురము తన రెక్కలను చాపి వచ్చుటకు మేము విన్నప్పుడు, ఆ గొప్ప వెలుగులో నుండి వచ్చుచుండగా, నీవు ఆ వెలుగులో నివాసము చేయుచున్నావు. కావున ఆ వెలుగు నిత్యత్వమంతయు ప్రకాశించుచున్నది.

75

''నేను అక్కడ నిలువబడవలసి వచ్చినప్పుడు, నా సహోదరుడు వెళ్లిపోయాడు, నా కాపరి వెళ్లిపోయాడు, నా తల్లి వెళ్లిపోయినది, నా తండ్రి వెళ్లి పోయాడు, నా భార్య వెళ్లిపోయినది, నా పిల్లలు వెళ్లిపోయారు. ఓ దేవా, అప్పుడు నేనేమి చేయగలను ప్రభువా? అప్పుడు నేనేమి చేయాలి? నేనేమి చేయగలను?

ఓ క్రీస్తు, ఇప్పుడు నేను నీ కొరకు నిలచెదను, ఈ దినమే నేను ఎన్నుకోవలసిన దానిని ఎన్నుకొనెదను. ఇతరుల గురించి మాట్లాడు నా స్వభావమును విడిచిపెట్టుదును. నా ఉద్రేకము నంతంటిని విడిచిపెట్టుదును. నాలోనున్న సమస్త బేదాభిప్రాయములను విడిచిపెట్టుదును. ప్రతిదానిని విడిచి పెట్టుదును. ప్రభువా, నాలోనున్న సమస్తమును నా నుండి కత్తిరించి వేయుము. ప్రభువా, నన్ను అంగీకరించుము. నేను, నీ స్థలములో నివసించుటకు ఇష్టపడుచున్నాను. నేను పూర్తిగా కత్తిరించివేయబడ వలసియున్నది. నాలో ఉన్న స్వార్థము నంతటిని, నాలోని గర్వము, నాలోని బేధాభిప్రాయమంతటిని, నాలో నుండి తీసివేయుము, అప్పుడే నీ కొరకు నేను నిలువగలను. బొచ్చు కత్తిరించబడిన గొర్రెపిల్లవలె, నాలో ఉన్న సమస్త, జీవిత సంతోషములని పిలువబడు సంతోషములన్నిటిని విడిచిపెట్టుటకు ఇష్టపడుచున్నాను. నేను వెళ్లు నాట్యములను గాని, పార్టీలను గాని, ఆ పూర్వపు విభిన్న దుస్తులను, రంగులు పూసుకొనుటయు, పెదవులకు రంగు దిద్దుకొనుటను, వ్రేళ్ల గోళ్లకు రంగులు వేసికొనుటగాని, లోకములో కనబడు వీటినన్నిటిని, విడిచిపెట్టుచున్నాను. ''ఈ లోక మర్యాదను అనుసరింపక, దాని వలె జీవించక, వారి నుండి వెలుపలకు రమ్మని'' నీవు చెప్పియున్నావు.

ఓ దేవా! నాకు సహాయపడుము, ప్రభువా నన్ను ఈ దినముననే పూర్తిగా కత్తిరించుము. గొర్రెవలె నన్ను పైకి తీయుము. అప్పుడు నేను మూగవానివలె మౌనముగా ఉందును. దానిని గురించి మరేమి పలుకక, కేవలము మౌనముగా నిలచి సమస్తమును కత్తిరించుకొందును.

76

ఓ దేవా! అదెంత వ్యత్యాసముగా ఉన్నది. అది నాకు జ్ఞాపకమున్నది ఏమనగా: నీవు నా భార్యను, నా బిడ్డను, నా తండ్రిని, నా సహోదరుని తీసివేసి నన్ను ఆ విధముగా కత్తిరించి శుభ్రపరచావు. అయినను నా హృదయమందు నేను నిన్ను ప్రేమించుచున్నానని నాకు తెలియును. నన్ను ఎంతగానో ఆశీర్వదించావు. నాకు ఎంతో మంచిగా ఉన్నావు, నేను ఉండు ఈ స్థితి, నేను ఉండగలిగినది, ఇకపై ఉండబోవునది సమస్తము నీదిగా ఉన్నది. దేవా నీదైయున్నది. నా పొరపాట్లన్నిటిని ఒప్పుకొనుచున్నాను. నేను తలంచిన దానిని, నేను చేసిన దానిని సమస్తమును ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, పూర్తిగా కత్తిరించుము. నేను నీ గొర్రెపిల్లగా ఉండుటకు ఇష్టపడుచున్నాను.

ప్రభువా, అంత మాత్రమే కాదు. ఈ ఉదయ కాలమందు ఇక్కడున్న ప్రతి వ్యక్తిని నీవు అంగీకరించుము, ప్రతి గొర్రెపిల్లను, అదియు గాక నీ గొర్రెగా ఉండుటకు ఇష్టపడువారిని శుభ్రపరచుము. ప్రభువా, వారి చిన్న పాదములను సువార్త పచ్చికలో నడిపించుము. పరిశుద్దాత్మ ఇప్పుడే వారిని మారు మనస్సునకు నడిపించనిమ్ము. వారు దేవుని నుండి దూరముగా ఉన్నారని గ్రహింపనిమ్ము. ఆ బేధాభిప్రాయములన్నిటిని కత్తరించివేయుము. ప్రభువా, ఈ ఉదయకాలము నీవు మమ్ములను శుభ్రము చేయుట ద్వారా, మేము చల్లగా మరియు నెమ్మదిగా ఉండగలము. నీ యెదుట క్రొత్తగా జన్మించిన క్రైస్తవులవలె నెమ్మదిగా ఉండునట్లు దయ చూపుము, ప్రభువా.

నేను నిన్ను ప్రేమించుచున్నాను. వాతావరణము వేడిగా ఉండినను నేను వెళ్లుటకు ఇష్టపడుచున్నాను. నేను వెళ్లుటకు ఇష్టపడుచున్నాను. నేను నీ కొరకు నిలచుటకు ఇష్టపడుచున్నాను, ఎందుకనగా ఆ దినములో నా నిమిత్తము నీవు వాదించుటకు ఇష్టపడుచున్నాను. ''మంచిది, అతడు నా కొరకు నిలచాడు, అందువలన ఇప్పుడు నేను అతని కొరకు నిలచెదను'' అని నీవు చెప్పెదవు. ఓ దేవా, ఈ దినమే సహాయము చేయుము.

77

ఇప్పుడు ప్రతి శిరస్సు వంగియుండగా, ప్రతియొక్క హృదయము వంగియుండగా, ఇక్కడ ఈ ఉదయ కాలము మరి ఎవ్వరైనను మీ స్వంత మార్గములను ప్రయత్నించిన వారున్నయెడల నేను ఆశ్చర్యపడుదును. నీవు చేయకూడని ఈ కార్యములనన్నిటిని చేశావు. ఈ ఉదయ కాలము ప్రభువు నిన్ను శుద్దిచేయ ఇష్టపడినయెడల, ''నన్ను ఒ నిజమైన గొర్రెపిల్లగా చేయుము'' అని చెప్పుచు, నీ చేతిని పైకెత్తుము. దేవుడు నిన్ను దీవించుగాక సోదరీ, దేవుడు నిన్ను దీవించుగాక సోదరుడా. ఎవరో ఒక్కరు ''ప్రభువా, నన్ను శుభ్రము చేయుము. ఇదిగో నేను నిలచియున్నాను. నేను ఒక గొర్రెను. నా నోరు తెరచుటకు నేను ఇష్టపడుట లేదు. నాలో నుండి ఈ ప్రపంచమును దూర పర్చుము. ''సోదరుడా, దేవుడు నిన్ను దీవించు గాక. సోదరీ దేవుడు నిన్ను దీవించు గాక. సన్నీ బాలుడా, దేవుడు నిన్ను దీవించు గాక, సోదరీ, దేవుడు నిన్ను దీవించు గాక. ప్రభువా, నన్ను శుద్దిచేయుము'' అని ప్రార్థించుము.

ఓ స్త్రీ, దేవుడు నిన్ను దీవించు గాక. సోదరీ, దేవుడు నిన్ను దీవించు గాక. ''ప్రభువా, ఇప్పుడు నన్ను శుద్ది చేయుము. నేను, ఈ ప్రపంచములోని సమస్త కార్యములను ఇష్టపడితిని... అయితే ఈ ఉదయ కాలము నీ కొరకు నిలచుటకు ఇష్టపడుచున్నాను. ఉన్ని కత్తిరించబడిన గొర్రె నిలచు రీతిగా నిలచియున్నాను. నాలోని సమస్త లోక కార్యములు నన్ను విడిచిపోవలయునని కోరుచున్నాను. నేను నీ వాడనై యుండగోరుచున్నాను. నీవు నా వాడవైయుండవలెనని కోరుచున్నాను. ప్రభువా, నన్ను అంగీకరింతువా? నా చేతిని నీ వైపునకు చాపుచున్నాను. ఓ స్త్రీ, దేవుడు నిన్ను దీవించు గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. ఓ స్త్రీ, దేవుడు నిన్ను దీవించును. అమ్మా, దేవుడు నిన్ను దీవించును. మిమ్మును నేను చూస్తున్నాను. నా సోదరుడా, దేవుడు నిన్ను దీవించు గాక. సోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.

అది మంచిది. నమ్మకముగా ఉండుము. ''ఆయనలో లేనివి దేవుడు నాలో నుండి తీసివేయుటకు నేనిష్టపడుచున్నాను. నేను కలిగియుండు ఎటువంటి స్వార్థపు తలంపునైనను, ఏ విధమైన బేధాభిప్రాయమునైనను నాకున్న మరేదైనను ఈ ఉదయకాలమున ఆయన నన్ను శుభ్రము చేయవలెనని కోరుచున్నాను. ఆయనవలె నేనుండుటకు ఇష్టపడుచున్నాను. అవి హక్కులో, కాదో అది నాకు అక్కర లేదు; వాటిపై నాకు ఎలాంటి హక్కు లేదు. నాకు ఒకే ఒక హక్కున్నది, అది ఆయన యొద్దకు వచ్చుటయే. మిగిలినది ఆయన చూచుకొనును.

78

క్రీస్తును అంగీకరించని పాపి ఎవ్వరైనను ఇక్కడ ఉండినయెడల రక్షింపబడకుండినయెడల, ఈ ఉదయ కాలపు ప్రార్థనలో మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని ఇష్టపడచున్నవారు, పాపివైన స్నేహితుడా నీ చేతులను పైకెత్తదవా? దేవుడు నిన్ను దీవించుగాక మరొకరు చేతులెత్తి, బ్రెన్హాం సోదరుడా, నేను క్రైస్తవుడను కాను. దేవుని ఎప్పుడు కలసి కొనవలసియున్నదో నేనెరుగను. నన్ను జ్ఞాపకము చేసికొనుము. నేను ఇప్పుడే మీరు ముగించుచుండగా, మీ ప్రార్థనలో జ్ఞాపకము చేయబడుటకు ఇష్టపడుచున్నాను'' అని చెప్పుచున్నారు. మంచిది. నేను మీ కొరకు ప్రార్థించుటకై మీ చేతులను పైకెత్తగలరా, అతడు చూపుచున్నాడు. దేవుడు నిన్ను దీవించుగాక. చిన్నమ్మాయి, అమ్మా, దేవుడు నిన్ను దీవించు గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించు గాక. ఎవరో ఇలా చెప్పారు. ''నేను ప్రార్థన చేయబడుటకు ఇష్టపడుచున్నాను...''

79

ఇక్కడ ఎందరు వెనుకబడిపోయిన వారున్నారు? ''ఓ,“ ”దానిని నేను ఒప్పుకొనను బ్రెన్హాం సోదరుడా'' అని నీవు చెప్పవచ్చును. అయితే ఇటు చూడుము, ఆ సాత్వీకమైన పావురము నీ నుండి వెడలిపోయినయెడల సోదరా, నీలో ఏదో లోపమున్నది. మీ హృదయాంతరంగము నుండి ఒక వ్యక్తిని నీవు మన్నించలేక పోయినప్పుడు, వారేమి చేసినను, వారేమి చెప్పినను దానిని గురించి ఏదియులేదు. మీ అంతరంగము నుండి క్షమించలేకపోయిన అది వ్యర్థము. ''నీవు ప్రతి వ్వక్తి నేరముల క్షమించక పోయిన యెడల మీ హృదయము నుండి ఆ కార్యము జరుగకపోయినయెడల, నీ పరలోకపు తండ్రి నిన్ను మన్నించడు'' అని యేసు చెప్పెను.

80

ఈ దినమున ఈ ఉష్ణ వాతావరణమున్నను, దేవుడు ఈ దినము నిన్ను పిలచినయెడల ఏమున్నది? అక్కడొక ఊట నీ కొరకు తెరచియున్నది, ఒక సంఘము సిద్దముగా ఉన్నది, ఈ కట్టడములో ఆ చివరగా పరిశుద్దాత్మ కూర్చొనియున్నాడు. దిగి వచ్చుటకు సిద్దముగా ఉన్నాడు. నీ హృదయములోనికి మరలి వచ్చి నిన్ను సౌమ్యముగాను, సమాధానముగాను చేయుటకు సిద్దముగా ఉన్నాడు. ''బ్రెన్హాం సోదరుడా, నేనేమి చేయవలెను'' అని నీవు అడిగిన యెడల. కేవలము ఒక గొర్రెపిల్లగా మారిపొమ్ము. నీవు ఒక గొర్రెపిల్లగా మారినప్పుడు, ఆ పరిశుద్దాత్మ నీలోకి దిగివచ్చును. అయితే నీలో పొరపాటున్న యెడల, పొరపాటైన క్రియలు, తప్పైన తలంపులున్న యెడల, నీ స్వంత మార్గమందు నీవు ఉండదలంచిన, దానిని విడచి పెట్టుటకు నీకు ఇష్టము లేకున్నయెడల, పరిశుద్దాత్మ మరెన్నడూ నీ యొద్దకు రాడు.

81

ఎప్పుడూ, మనము తలలు వంచియుండగా, ఇంకెవ్వరైనను తమ చేతులను పైకెత్తినట్లయిన నేనెంతో ఆశ్చర్యపడుదును... ఇప్పుడు, యేసు చెప్పినదేమనగా, ''నా మాటలు విని నన్ను పంపివానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.'' పరిశుద్ధ యోహాను 5:24. అయితే నీవు ఈ బలి పీఠమునొద్దకు వచ్చి మోకరించిన యెడల, మనము ఇరువురము ప్రార్థించినప్పుడు, ఒకప్పుడు నీవు కలిగియుండిన సమాధానము లేక నీకు కావలసిన సమాధానము మరలా నీకు వచ్చును. మనము మన తలలు వంచియుండగా, మనము ఈ పాటను పాడుచుండగా, ''అక్కడ ఒక ఊట రక్తముతో నిండియున్నది'' నేను వచ్చి మోకరించి ప్రార్థింతును. రాదలచినవారు వచ్చి మోకరించిన యెడల ఇక్కడ బలిపీఠము దగ్గర వరుసలో ఉండి కొంతసేపు ప్రార్థించుము.

అక్కడొక ఊట రక్తముతో నిండియున్నది.

ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి వచ్చుచున్నది.

పాపులు దాని క్రిందికి వచ్చుచు...

(అమ్మా, దేవుడు నిన్ను దీవించు గాక,

ఇక్కడకు వచ్చిమోకరించుము)

పోగొట్టుకొని........

మీ తలలు వంచియుండగా, మీ హృదయముల యందు దానిని కలిగి యున్నారని నమ్ముచున్నాను. ఈ ఉదయ కాలము ఆ ప్రక్కను ఎవ్వరు విరుగ గొట్టినారో మీరెరిగియున్నారు. మీ కొరకు మీరు సిగ్గుపడుట లేదా? ఒక నల్లటి స్త్రీ, పేదదై, తన మోకాలు వాచి యుండగా, ఆమె తల వెంట్రుకలు నెరసిన స్థితిలో ఈ బలిపీఠమునొద్దకు నడచినది.

82

ఇక్కడ కొంత కాలము క్రితము ఒక వృద్ధుడైన నల్లని వ్యక్తి రక్షింపబడెను. అది బానిసల కాలమైయుండినది. అతడు రక్షణపొంది వెళ్లుచు, తన యజమానుని యొద్దకు వచ్చి, నేను విడుదల పొందానని చెప్పాడు. అందుకతడు ''నీవు ఏమిటి?'' అని అడిగాడు.

''నేను విడుదల పొందినాను,'' అని చెప్పినప్పుడు అతడు విడుదల దయచేశాడు.

ఇక్కడ మరొక గుంపు ప్రజలు తమ రక్షణ కొరకు ఈ ఉదయకాలము వచ్చుచున్నారు. (అతడు విడుదల పొందెనని చెప్పుచున్నాడు.) ప్రతి ఒక్కరు ప్రార్థించుచు, పరిశుద్దాత్మ ఈ ప్రజలను తమ నిర్ణయములను తీసికొనునట్లు చేయుచుండగా, అధికముగా ప్రార్థించుచుండిరి.

''మోస్, నీవు విడుదల పొందానని చెప్పుచున్నావా?'' అని అతడడిగినప్పుడు,

''అవునయ్యా, యజమానుడా, నేను విడుదల పొందాను'' అని జవాబిచ్చాడు. ''నీవు విడుదల పొందినట్లయిన నేను కూడా నిన్ను విడుదల చేయుచున్నాను, వెళ్లి సువార్తను ప్రకటించుము'' అని చెప్పెను.

83

అతడు మరణించుటకు సిద్దపడినప్పుడు, అనేకులైన తెల్లజాతి సోదరులు ఆయనను చూడవచ్చారు. వారు వచ్చినప్పుడు, అతడు మైకపు స్థితిలో ఉండెను. అతడు మేల్కొనియుండినప్పుడు, అతడు ''నేను వెళ్లిపోయానని తలంచాను'' అని చెప్పాడు. (దేవుడు నిన్ను దీవించు గాక! సోదరుడా మోకరించుము) ''నేను ఇంతకు ముందే వెళ్లిపోయానని తలంచాను'' అని చెప్పాడు.

''మోస్, నీవేమి చూచావు?'' అని అడిగెను.

అతడు చెప్పెను, ''నేను ఆ ద్వారమునొద్దకు నడచినప్పుడు, ఆయనను చూచాను. నేను అక్కడ నిలచి, ఆయనవైపు చూచుచుంటిని. అక్కడకు ఒక దూత వచ్చి ''మోస్'' పైకి రమ్ము. అనేక సంవత్సరములు నీవు సువార్త ప్రకటించితివి. ఒక వస్త్రమును, ఒక కిరీటమును నీ కోరకు వేచియున్నవి.'' అప్పుడు అతడు, ''ఆ వస్త్రము గురించి గాని, ఆ కిరీటము గురించి గాని మాట్లాడకండి, నేను ఆయనను చూడాలి, నాకు ఆ వస్త్రము గాని, ఆ కిరీటము గాని అక్కర లేదు. కేవలము నేను ఆయనను చూడాలి,“ అని చెప్పాడు. అలాంటి స్వభావము ఏ క్రైస్తవుడు అయినా కలిగి యుండవలసియున్నది.

84

ఇక్కడ కొంత కాలము క్రితము చికాగో ప్రాంతమునకు వెళ్లు మార్గములో, నేనక్కడ ఒక జంతుశాలను చూచుచుండగా, అక్కడ చుట్టూ చూస్తూ ఉండిపోయాను. అక్కడ ఒక పురాతన నీగ్రో మనిషిని చూచాను. అతను తల నిండుగా వంకీలు తిరిగిన జుట్టుతో, తన టోపీని చేత పట్టి తిరుగుచుండెను. నేను అతని వైపు చూచాను. అతడేమో అక్కడొక చిన్న స్థలమును చూస్తూ ఉన్నాడు. ఆ తరువాత అతడు వెనుకకు తిరిగి నిలచినప్పుడు, కన్నీరు అతని నల్లని దవడలపై దొర్లినవి. అతడు ప్రార్థించుటకు మొదలు పెట్టాడు. నేనతనిని కొంతసేపు గమనిస్తూ ఉండిపోయాను. అతడు మరలా అటువైపు చూచి, మరలా ఏడ్చుటకు ప్రారంభించాడు. నేను అతని దగ్గరకు నడచి వెళ్లి ''అయ్యా'' అని పలికాను.

అందుకతడు '' ఏమిటి తెల్లని స్నేహితుడా?'' అని అడిగెను.

నేను ''మీరు బాగా ఏడ్చుచున్నట్లు నేను చూచాను. అంతగా ఏడ్చుటకు గల కారణమేమి?'' అని అడిగాను.

అప్పుడతడు ''మీరు నన్ను గురించి చింతించుచున్నట్లయిన, నా శరీరమంతయు కణితలున్నవి. నేను ఒకప్పుడు బానిసగా ఉంటిని. అక్కడున్న ఈ చిన్న అద్దపు గదిలో (అద్దపు పెట్టెలో ) ఒక జత దుస్తులున్నవి.''

అది ఎవరో వేసికొన్న దుస్తులుగా నేను చూస్తున్నాను, దానిలో అంత అతిశయమేమున్నది?'' అని నేను అడిగాను.

అప్పుడతడు ''అదిగో, అక్కడున్న ఆ మరక అబ్రాహాము లింకన్‌ యొక్క రక్తపు మరక. ఆ రక్తము నా పైన ఉండిన బానిస కట్టును తీసివేసినది. అందువలన ఓ, తెల్లటి మనిషి, అది ఆశ్చర్యమైనది కాదా?'' అని అతడు చెప్పాడు.

అతని వృద్ద మెడపై నా చేతులుంచి, ''దేవుడు నిన్ను దీవించు గాక, నన్ను ఆశ్చర్యపరచిన వేరొక రక్తమును నేను ఎరిగియున్నాను'' అని చెప్పాను.

అతడు, “ఆ రక్తము గురించి నాకు కూడా తెలియును, మిస్టర్, అనెను.

అప్పుడు నేను, ''ఆయన నా బానిస కట్టు తీసివేశాడు'' అని చెప్పాను. ఒకప్పుడు ఒక ఆదివారములో నేను రేసులకు, పనికిమాలిన కథల వైపుకు, తమాషాలకు వెళ్లేవాడిని. ఓ, దేవా, దానిని ఎట్లు చేశాను? వాటిని చేసిన గాయపు గుర్తులు ఇంకనూ నా హృదయములో ఉన్నాయి. అయితే ఆయన ఆ కట్టును తీసివేశాడని నేను సంతోషించుచున్నాను. అదంతయు ఇప్పుడు పోయినది; ఆయన నా స్థానములో నిలిచాడు.

85

ఇక్కడ కొంత కాలము క్రితము, ఒక స్త్రీని చూచినప్పుడు, ఆమె ఎంత అవమానకరముగా ఉండినదనగా ఆమెను ఖ౦డించుకు కోరితిని. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనము ఇచ్చాడు. అప్పుడు నేను ఆమె కొరకు ప్రార్థించాను, నా పాపములు ఆమె పాపముల కంటెను అధికముగా ఉండినవి. నేను ఆమె ప్రక్కకు నడచి వెళ్లి, ఆమె స్థితిని ఆమెకు ఎత్తి చెప్పి, నేనొక సేవకుడనని ఆమెతో చెప్పాను. ఆమెకు ఇరువురు మగ స్నేహితులు... ఆమెకు అరువది-ఐదు లేక డెబ్బది సంవత్సరములుండును. అప్పుడు ఆ ఇద్దరు మగ స్నేహితులు మోకాళ్లపై వంగి, మరియు వారందరు క్రీస్తుకు తమ హృదయములను ఇచ్చారు. ఓ, మై, ఏమి ఆ వ్యత్యాసము!

మీరు అలా చేయలేరా? ఈ ఉదయ కాలము నీవెంతో పాపము చేసియున్నావు. నీ హృదయమెంతో చీకటైపోయినది. పరిశుద్దాత్మ నీ హృదయమును తాకలేనంత కఠినమైపోయినదా? ఆ పావురము తన నిత్యత్వపు ప్రయాణమును కొనసాగించి, శాశ్వతముగా వెడలిపోయి ఉంది.

86

దేవుడు నిన్ను దీవించు గాక, హనీ. ఒక చిన్న బాలిక పైకి నడచి వచ్చుచున్నది. దేవుడు నిన్ను దీవించు గాక, మాధుర్య హృదయమా. ''ఆ బాలికకు ఏమి తెలియదు'' అని నీవు చెప్పవచ్చును. ఓ, నిజమే, ఆమెకు ఏమియు తెలియదు. ఆమె వారపత్రికలను చదువలేదు, మీరు చదువునట్లు ప్రేమ పురాణాలను చదువలేదు. ఆమె లేతగా ఉండుటకు అదే కారణము. ''చిన్న పిల్లలను నాయొద్దకు రానియ్యుడి,'' అని యేసు చెప్పెను.

ఇంకెవరైనా ఇక్కడ కలసి వచ్చుటకు ఇష్టపడుచున్నారా? బలిపీఠము తెరచియున్నది మనము పాడుచుండగా, మరొకక్షణము చూచెదము. మారుమనస్సు పొందిన పాపులు ప్రార్థించుచుండగా, మన ప్రార్థనలను సమర్పించుదము.

ఆ మరణించుచున్న పాపి దానిని చూచుటలో సంతోషించెను.

అక్కడున్న ఊట అది... (నిజమే, ప్రతీది

విడచిపోయినది, ఆ పేదవాడు అంతటితో ముగించబడ్డాడు)

అక్కడ నేనుందును, అతనివలె నిలచి...

87

ఇప్పుడు మీరు రాలేరా? బాగుగా ఎరిగినవారు ఎవ్వరు? వారు రాలేరా? ''మీరు మంచి చేయుటకు ఎరిగియు, చేయకున్నయెడల, అది మీకు పాపమగును,'' అని బైబిలు చెప్పుచున్నది. మీరు రాలేరా? మీరు అపరాధములో ఉన్నారని మీకు తెలియును. మీరు మీ మార్గమును సిద్దపరచుకొని బలిపీఠము చుట్టూ మోకరించుడి, మీరు ఆయనను చూచిన విధానము కొరకు క్షమాపణను కోరుడి. మరలా ఆ పరిశుదాత్మ తిరిగి వచ్చి మిమ్మును సాత్వీకులుగా చేయునట్టును, సౌమ్యముగా చేయునట్లు ప్రార్థించండి. మీరు అలా చేయలేరా? జ్ఞాపకముంచుకొనండి, మీరు మరణించినట్లయిన, అతడు వెళ్లిపోయిన యెడల, మీ కొరకు విజ్ఞాపన చేయుటకు ఎవ్వరూ లేరు. ఆయన కొరకు నిలచుటకు ఈ ఉదయ కాలము ఆయన నిన్ను ఇష్టపడచున్నాడు సోదరుడా, దేవుడు నిన్ను దీవించు గాక.

88

వేచియున్నది. అదేనా, ఒక్క పదిహేను మంది మాత్రమే తాము కొట్టివేయబడిన వారమని గ్రహించారా? మీరు ఎప్పుడైనను, సాత్వీకమైన, సమాధానమైన, సౌమ్యమైన జీవితమును జీవిస్తున్నారా? ఇప్పుడు, ఇది పరిశుద్దాత్మనే నడిపించబడుచున్నది. మీరు ఇతరులను క్షమించుట ద్వారా శత్రువలు అనువారు లేరు గదా? పాపులు త్రోసివేయబడుటకు గత జీవితము చాలును కదా? అన్యులవలె జీవించక, వ్యత్యాసమైన జీవితమును జీవించుచున్నావా? నీ జీవితమంతయు వేరే విధముగా రూపొందినదా? ఆ సౌమ్యమైన పరిశుద్దాత్మ, నీ హృదయ సింహాసనముపై కూర్చొనియున్నాడు. నీవు నెమ్మదిగాను, ప్రేమగాను, సమాధానముగాను ప్రజల మధ్య జీవించునట్లు చేయుచున్నాడా? నీ ఇరుగు పొరుగు వారు నిన్ను సౌమ్యమైన వ్యక్తిగాను, సాత్వీకునిగాను, నెమ్మదైన క్రైస్తవునిగాను చూచుచున్నారా? నీతో ఆ దేవుని పావురమున్నదా? నీకు ఆ నమ్మకమున్నదా? ఇదే నీ చివరి తరుణము కావచ్చును. మంచిది.

89

ఇప్పుడిక్కడ బలిపీఠము దగ్గరన్నువారిని దేవుడు దీవించు గాక, మీరు ఇప్పుడు తీర్పు తీర్చబడరు. పరిశుద్దాత్మ మీకు తీర్పును తెచ్చును. మీ హక్కులను చేపట్టియుండుటకు మీరు ప్రయత్నించలేదు. '' ఓ, నేను చాలా కాలము నుండి క్రైస్తవునిగా ఉన్నాను. నేను అక్కడకు వెళ్లవలసినది లేదని'' నీవు చెప్పవచ్చును. మీలో కొందరు ఈ బలిపీఠము దగ్గరకు వచ్చుట ఇదే మొదటిసారి కావచ్చు. ''నేను ఇష్టపడినయెడల నేను పాపిగా మిగిలిపోవచ్చు, అది నా హక్కై యున్నది.'' నిజమే, అది మంచిది. నీవు స్వేచ్ఛా ఇష్టమును కలిగియుండు జీవిగా ఉన్నావు. నీకు ఇష్టము వచ్చినట్లు నీవు జీవించవచ్చును. అయితే ఇప్పుడు మీ హక్కులను విడచి పెట్టారు.

''నేను క్రైస్తవునిగా ఉండి, ఆ బలిపీఠము దగ్గరకు వెళ్లితే ఇతరులేమి చెప్పుదురు?'' అని నీవు అనుకొనవచ్చును. అయితే దేవుడేమి సెలవిచ్చుచున్నాడు? ఆయన నిన్ను రమ్మనుచున్నాడు. మీరు ఆ విధముగానే చేశారు. ఇప్పుడు మీరు మీ హక్కులను విడచిపెట్టారు, ఈ దినమున ఆ సౌమ్యమైన పరిశుద్దాత్మ మీ హృదయాలలోకి వచ్చి ఆ స్థానమును గైకొనునట్లు మీరు మీ హక్కులను త్రోసి వేశారు. ఆయన అలా చేస్తాడని నేను ఎరిగియున్నాను. ఆయన ఖచ్చితముగా దానిని చేయునని నాకు తెలియును. ఆయన చేసెదనని వాగ్దానము చేశాడు. ఆయన అర్థించుచూ, ఆక్రందన చేయుచూ, మరణించి, ప్రతి కార్యమును చేసి, ఆయన వచ్చుటకు ఒక స్థలమును కోరెను. నీ యొద్దకు వచ్చుటకు ఆయన వేచియున్నాడు.

90

నీ మరణ సమయములో ఆ మరణ దూత నీ పాదములయొద్దకు వచ్చి పడకపై కూర్చొనియుండగా, అక్కడ ఆ భయంకర కార్యమును చూచుటకు బదులుగా, ఒకప్పుడు నీవు ఆయనలోకి వచ్చుటకు నిరాకరించావని తెలిసికొందువు. ఆ విధముగా నీ ఆత్మ కటికచీకటిగా మారి, మసికొట్టిపోవును. నీవు ఎంతగా ఆక్రందన చేసిననూ ఇక సమయము లేదు. ఏశావు తనకు అనుగ్రహింపబడిన కృప దినములలో పాపము చేశాడు, లేక ఆ తరువాత మరొక తరుణము దొరుక లేదు. అతడు ఎంతగానో ఏడ్చాడు, దానిని సరి చేసుకొనుటకు ఎంతో ప్రయత్నించాడు, అయినను చేయలేక పోయాడు. ఆ చివరి ఘడియలో దేవుడు అతనిని పిలిచాడు.

91

అయితే నీవు స్నేహితులందరిని, ఈ ఉదయకాలము నీకున్న హక్కులను అన్నిటిని విడిచావు. ఇక్కడకు వచ్చుటకు నీకున్న ప్రతి దానిని విడిచావు. ఇక్కడ మోకరించి, దేవునితో మాట్లాడుటకు గాను మీరు మీ హక్కులను విడచి పెట్టారు. ప్రభువు మాటను బట్టి నేను మీతో చెప్పునదేమనగా, ''నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రము త్రోసివేయనని'' క్రీస్తు చెప్పెను. ఇప్పుడు మీరు మారుమనస్సు పొంది ఈ బలిపీఠము దగ్గర చేరియుండగా, ఆయనతో మీరు చేసిన ప్రతి కార్యమునకు క్షమాపణ కోరుకొనుడి.

92

అందువలననే ప్రజలు బాప్తిస్మము పొందినప్పుడు, పరిశుద్దాత్మను పొందలేకున్నారు; వారు పూర్తిగా మారుమనస్సు పొందలేదు. దేవుడు వారకి తన పరిశుద్దాత్మను ఇచ్చుటకు ప్రయత్నించుచున్నాడు. ఆయన మనలను సౌమ్యముగాను, సాత్వికముగాను, దీనత్వమందును ఉండునట్లు కోరుచున్నాడు. కాని నీవు, 'నేను' అనే స్వార్థముతో నీ హృదయమందు పైకివచ్చుచున్నావు. ఓ, నీవు భాషలలో అరచుచూ మాట్లాడుటకు పైకి రావచ్చు. అది నీలో పరిశుద్దాత్మ ఉండునట్లు చేయదు. అక్కడ నుండి నీవు ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా రావలసియున్నది. నీవు అక్కడ నుండి సౌమ్యముగాను, సాత్యికముగాను, దీనుడిగాను రావలసియున్నది, అప్పుడు దేవుని ఆత్మ నీలో నివాసము చేయును.

మరుసటి సంవత్సరము, నీవు తిరిగి చూచినట్లయిన నీవు ఎంత దూరము వచ్చావో చూడగలవు, అన్నివేళల నీవు పైకి వచ్చుటకు చూడగలవు. అదియే పరిశుద్దాత్మ. పరిశుద్దాత్మ అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహముగా ఉన్నది. ఇప్పుడు, మారుమనస్సు పొంది అది నీకు కావలెనని దేవునితో చెప్పుము. నిజమైన మంచితనమును కలిగి యుండుము.

ఇదిగో అక్కడున్న మృదువైన ఓ చిన్న బాలికా, ఆ కార్యమునే నీవు చేయుము. దేవుడు నిన్ను దీవించు గాక. నీ తల్లి చేతులను నీపైయుంచి నిలబడియున్నది.

93

ఈ ప్రియమైన నల్లరంగు సోదరి, బలిపీఠము దగ్గర మోకరించియున్నది. నీవు తినుటకు అటుకులను, గొరికల నూకలను, కలిగి ఒక చిన్న వీధిలో జీవించవచ్చు. సోదరీ, నాకు తెలిసినదంతయు, దేవుడు నీ హృదయమును దీవించు గాక. ఈ ఉదయ కాలము మహిమలో నీ కొరకు ఒక అంతఃపురము సిద్దపరచబడి యున్నది. అది నిజము.

అక్కడ ఆ బలిపీఠము దగ్గర ఒక స్త్రీ రంగు తిరిగినదై ఆమెతో ఒక యౌవ్వన స్త్రీ తలవంచియున్నది. ఆ వృద్ద స్త్రీ నెరసిన వెంట్రుకలు కలిగియున్నది. ఓ దేవా! పురుషులు మోకరించుట చూడుము. అక్కడ అనేకులు ఉన్నారు. కృప ద్వారా, మీ బేధాభిప్రాయములను విడచిపెట్టుడి. కేవలము మారుమనస్సు పొందుడి. క్షమాపణ కోరుచున్నానని (దేవునితో) చెప్పుడి. దానిని ఇకపై చేయనని ఆయనతో చెప్పుడి. నీవు సాత్వీకముగాను, నెమ్మదిగాను ఉండవలసి యున్నది. నీవు వినయముగలవాడవై, ఆయన ఎక్కడకు నడిపించునో అక్కడకు వెళ్లవలసినవాడవుగా ఉన్నావు.

ప్రజలు దేనినైనను చెప్పునప్పుడు, అది ఎంత వాస్తవముగా కనబడిననూ, నీ పొరుగువాని గురించి మాట్లాడుటకు హక్కును కోల్పోయి యున్నావు. నీవు మాట్లాడబోవునది...... నీవు యేసు గురించి మాట్లాడబోవుచున్నావు. ఏది మంచిదో దానిని మాత్రమే చేయబోవుచున్నావు. ఒక నరహత్య చేయువానిగా నీవు వెళ్లవు. ఒక అమాయకునిపై పోట్లాడుటకు వెళ్లవు. అయితే నిజక్రైస్తవుని వీరత్వమందు పోరాడు పౌరునిగా కనబడుదువు, మరియు నీవు ఆ నిజక్రైస్తవుని పోలియుండుటకు ఆశించెదవు. నీవు ఒక క్రైస్తవుడవని ఇతరులతో చెప్పవలసినది లేదు, నీవు ఒకడివై యుండిన; వారు నిన్ను చూచి నీవు మాట్లాడు దానిని బట్టి తెలిసికొందురు. నీవు వెలుపలను, లోపలను ముద్రించబడియున్నావు.

94

ఇప్పుడు నీ హృదయమున నీవు తగ్గించుకొనుచుండగా, మారుమనస్సు పొందుము. ప్రభువా, ఇకపై నేను దానిని చేయనని దేవునితో చెప్పుము, దేవా ఇంతవరకు చేసిన దానికి క్షమాపణ కోరుచున్నానని చెప్పుము, నీవు జీవించిన మార్గమును బట్టి నీవు సిగ్గుపడుచున్నావు. మరియు నేను మీ కొరకు ప్రార్థించబోవుచున్నాను. నేను విశ్వసించునదేమనగా, అప్పటి నుండి నీ హృదయములో సమాధానము చోటుచేసికొనును (స్థిరపడును), ఆ సమాధానము నదివలె నీ హృదయములోకి పారును. నీవు అధికముగా కేకలు వేయక పోవచ్చును, నీవు భాషలో మాట్లాడకపోవచ్చును; నీవు పైకి, క్రిందికి ఎగురక పోవచ్చును; అయితే ఈ బలిపీఠము నుండి వెళ్లునప్పుడు దేనితోనో నింపబడిన వాడవై వెళ్లుదువు. నీవు జీవించినంత కాలము ఆ పూర్వపు సిలువకు లంగరు వేయబడినవాడవై ఉందువు. నేను ప్రార్థన చేయునట్లుగా నీవునూ చేయుము. ఒప్పుకొనుము.

95

మా పరలోకపు తండ్రీ. పనికిరాని పురుగులమై యున్నాము; ఈ ఉదయ కాలము చెమటలు కారు ఈ ఉష్ణగదిలో, ఒక చెమట పెట్టెగా ఉన్నాము; అయితే దేవా, దానిని మాలో నుండి చెమటగా నీవు తీసివేయుచున్నావు. పరిశుద్దాత్మ దిగి వచ్చి ప్రజలు తమ పాపములను ఒప్పుకొనునట్లు సమాధాన పరచినది. వారు పాపము చేసియున్నారు, వారి ఆత్మలు మూర్ఖముగా యుండినవి. వారు వ్యతిరేకించు వారుగాను, నీచమైన వారుగాను, తెలివైన వారుగాను, మారుమనస్సు పొందుటకు ఇష్టపడని వారుగాను ఉన్నారు. వారికి వ్యతిరేకముగా క్రియ చేసిన ప్రజలను మన్నించలేకున్నారు. వారు దేనిని చేయుటకైనను ఇష్టపడున్నారు, అయితే ఈ దినము పరిశుద్దాత్మ దేవుని వాక్యమును తీసికొనివారి సౌమ్యమైన హృదయాలలో ఉంచుచున్నాడు. ''ఇప్పుడు వారు ఈ బలిపీఠము దగ్గరకు వచ్చుటకు ఆశించుచున్నారు. ప్రతి ఒక్కరు వచ్చు ఈ స్థలమునకు వచ్చుచున్నారు. వారు ప్రతి ఒక్కరిని ప్రేమించుచున్నారు. ఆయనను నిజమైన ప్రేమతో ప్రేమించుచున్నావా? అట్లయిన లేచి బలిపీఠము దగ్గరకు రమ్ము.'' ఇదిగో ప్రభువా, వారు వచ్చిచున్నారు.

ఇప్పుడు వారి తలంపులను శుద్ధి చేయుము, పభువా, వారి హృదయమును శుద్ధి చేయుము. వారిని సౌమ్యముగాను, సమాదానముగాను చేయుము, వారు మారుమనస్సు పొంది ఇక్కడ భలిపీఠము నుండి లేచి వెళ్ళుచుండగా, వారి జీవితములు నీకు ఇచ్చుచు వారి గృహాలకు వెళ్ళుచున్నారు. ఏమి జరిగినను పరవాలేదు. బర్త కలతచెందినను లేక భార్య కలతచెందినను లేక ఇరుగు పొరుగు కలతచెందినను, లేక మీరు పనిచేయు స్థలమందుగాని, మీతో కలిసివుండు వారు గాని, “నేను వారితో ఒక పావురము వలే సౌమ్యముగా ఉందును” అని చెప్పునట్లు కృపను వారికి దయచేయుము.

96

తుదకు నీ యొక్క పగ నీకు చెందియుండును: ''నేను దానిని మరలా చెల్లింతును అని ప్రభువారు చెప్పుచున్నాడు.“ ప్రభువా, అది ఆ విధముగా ఉన్నదని మేము ఏలాగు కనుగొందుము. కేవలము స్థిరముగా నిలువుము, నమ్రతగా ఉండుము, అప్పుడు దేవుడు ఆయనయొక్క గొర్రెపిల్ల యొద్దకు వచ్చుటను చూచెదరు. నిశ్చయముగా, ఖచ్చితముగా వచ్చును. ఈ మంచి కాపరి వారి కొరకై తన జీవమును పెట్టెను. ఆయన తన గొర్రెలయొద్దకు వచ్చుచున్నాడు. ఆయనే వారిని నడిపించును. వారిని దాటిపోవు దాని కొరకు దుఃఖపడును. వారికి వ్యతిరేకముగా ఒక్క మాట చెప్పువారిని గురించి చింతించును. ''మీ మెడకు ఒక రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట మంచిది,'' అని చెప్పును. ''పరలోకమందు నా తండ్రియెదుట దేవదూతలు వారిని ఎత్తిపట్టుకొందురు,'' అని చెప్పెను. ఓ దేవా, ”వారికి చేసినట్లయిన, మీరు నాకు చేసినట్లే,'' అని చెప్పెను.

97

కాబట్టి దేవా, అందువలన, నేను నమ్రతతో ఉండుటకు ఇష్టపడుచున్నాను. నన్నునేను ఆ బలిపీఠము వద్ద ఉంచుచున్నాను; ఈ ఉదయ కాలము మాత్రమే కాదు, ప్రతి ఉదయకాలమందును, ప్రతి దినమందును. నేను నెమ్మదిగా, సౌమ్యముగా ఉండదలిచాను, యేసువలె ఉందును. దయచేయుము తండ్రీ, ఇప్పుడు ఆ విధముగా ఉండుటకు సహాయపడుము. మన ఆత్మలపై మితిలేని ప్రేమ పొంగి పొర్లనిమ్ము.

సమాధానము! సమాధానము! ఆశ్చర్యకరమైన సమాధానము,

పైనున్న తండ్రి నుండి దిగి వచ్చుచున్నది;

(మీరు ఆ అనుభూతిని మీ హృదయములతో స్పర్శించుటలేదా?)

...... నా ఆత్మపై నిరంతరము,....

(హల్లెలూయ! హల్లెలూయ!)

సమాధానము! సమాధానము! ఆశ్చర్యకరమైన సమాధానము!

98

సోదరి గెర్టి తాను కూడ త్రోసివేయబడినదని సంఘముతో చెప్పినది, అయితే ''పియానో'' వాయిద్యమునే తన బలిపీఠముగా చేసికొన్నది. ఆ బలిపీఠము ఆ పియానోగా ఉన్నందున, ''నా కొరకు ప్రార్థన చేయమని సంఘమునకు చెప్పుము,'' అని చెప్పెను, ఆమె అక్కడ కూర్చొనియుండగా కన్నీరు ఆమె చెక్కిళ్లు ద్వారా కంటి అద్దాలపై కారుచుండెను. ఈ ప్రసంగ వేదిక నా బలిపీఠముగా ఉన్నది. నేను కూడా మారుమనస్సు పొందుచున్నందున నా బైబిలు తడిచిపోయినది. ఓ, దేవా!

............ సమాధానము, దేవుని సమాధానము

ఉన్నతమున తండ్రి యొద్ద నుండి దిగి వచ్చుచున్నాడు

(ఓ, హల్లెలూయ!)

.......నిరంతరముగా నా ఆత్మపై ఆసీనుడగుటుకు.

దేవా, నేను ఎవరికైనను విరోధముగా పాపము చేసినను, నీకు విరోధముగా చేసినను వాటిని తీసివేయుము. ప్రభువా, ఈ ఉదయ కాలము నా చిన్న సంఘములోని పాపమును తీసివేయుము.

99

దేవుడు నిన్ను క్షమించెనని మీలో ఎందరు అనుభూతిని పొందుచున్నారు, ఆ సమాధాన పావురము మీ హృదయముపై ఆశీనుడైయున్నాడని విశ్వాసించుచున్నారా? ఇప్పుడే అది వెనుకకు ఎగిరిపోయి తన స్థానమును తీసికొన్నది. ఆ పరిశుద్దాత్మ వెనుకకు కదలి వచ్చి ''నా కుమారుడా, కాలమంతయు నిన్ను ప్రేమించుటకు నేను ఇష్టపడచున్నాను, అయితే నీవు నన్ను అలా చేయనివ్వలేదు. నేను ఈ పూర్వపు స్వార్థపూరిత ఆత్మతో నివాసము చేయలేకుంటిని, అయితే ఇప్పుడు నిన్నునీవు సమర్పించుకున్నావు. ఈ ఉదయకాలము నీ హృదయములో నివసించుటకు తిరిగి వచ్చాను,'' అని చెప్పుచున్నాడు. ఎందరు ఆ విధముగా అనుభూతిని పొందుచున్నారో మీ చేతులెత్తుడి? ఈ బలిపీఠము యొద్దనున్న అందరు మీ చేతులను పైకెత్తుడి, అది సరి. ఓ, అది మంచిది. ఇక్కడ ఉన్న సభికులలో ఎందరు ఆ విధమైన అనుభూతిని పొందుచున్నారు? మీచేతులెత్తుడి. ఓ! (యేసువలె ఉండుటకు).

100

మా పరలోకపు తండ్రీ, మరొకసారి ఈ నెమ్మదైన సమర్పణ కొరకు మేము నీకు వందనములు తెలుపుచున్నాము. అదెలా ఉన్నదనగా ఒక మంచి ఆపిల్ పండును చేత తీసికొని అది మాధుర్యమగునంత వరకు నలిపినట్లున్నది. అది ఎంత మధురముగా ఉన్నదనగా, ఒక చిన్న బిడ్డ కూర్చొని దానిని నెమ్మదిగా తినగలుగుచున్నట్లుండును. ఆ విధముగానే మా హృదయాలు ఉండగోరుచున్నాము, ప్రభువా.

నీ గాయపడిన హస్తమును దానిని తీసికొని, దానిని నలుగగొట్టుము, ''కుమారుడా, నీవు నన్ను గాయపరచావని చూడలేకున్నావా? నీవు నా చేతి నుండి దూరమైనప్పుడు, నన్నెంతో బాధించావు; గాయపరచావు. నీవు నన్ను గాయ పరస్తూనే ఉన్నావు; ఓ, నా హృదయము నీ కొరకు ఎంతగానో రక్తము కార్చినది. కుమారుడా, నీవు ఆయా కార్యములను చేయునప్పుడు నా హృదయము రక్తము కార్చినది. అయితే ఇప్పుడు నీ హృదయము నా చేతితో ఉన్నది. దానిని నిజముగా సాత్వికము చేయుటకు ఇష్టపడుచున్నాను. నేను దానిని ఉపయోగించుకొనునట్లు, దానిలో నివసించునట్లు చేయుటకు ఇష్టపడుచున్నాను. ఈ ఉదయ కాలము నేను వెనుకకు ఎగిరి వచ్చి అక్కడ నివాసము చేయుటకు ఇష్టపడుచున్నాను. నన్ను నీతో కలుపుకొనుచున్నాను,'' అని ఆయన చెప్పుచున్నాడు. దేవా, దానిని దయచేయుము. మేము నిన్ను ప్రేమించుచున్నాము. నీ మహిమ కొరకు దయచేయుము. యేసు నామమున అడుగుచున్నాము.

యేసువలె ఉండుటకు ...

ఆ విధముగా ఆరాధించుటకు మీరు ఇష్టపడరా? ఓ, నా ఆత్మ దానిలో కడుగబడుచున్నది.

నేను భూమిపై......

ఆరాధించువారు ఈ విధముగా వచ్చుచుండుటను చూచునప్పుడు, మీ హృదయము సౌమ్య అనుభూతిని పొందుట లేదా? నా ఆత్మ వేగముగా కొట్టుకొనుచున్నది.

.... భూమి నుండి మహిమకు పయనించుచున్నది.

ఆయనవలె ఉండుటకు మాత్రమే నేను అడుగుచున్నాను.

ఆ పాటను పాడుచుండగా మీరు చేతులు ఎత్తెదరా?

యేసువలె ఉండుటకు......

(జో సోదరా, ఇక్కడకు వచ్చి ప్రార్థించుకొనుటకు ఇష్టపడెదవా? దేవుడు నిన్ను దీవించు గాక. ఇక్కడ బలిపీఠమువద్ద నీ కొరకు ఒక స్థలమును కనుగొనుము. సోదరా జో, దేవుడు నిన్ను దీవించు గాక, నా సోదరుడా.) ........ భూమి నుండి మహిమకు పయనింతును.

ఆయనవలె ఉండుటకు మాత్రము నేనడుగుదును.

101

స్నేహితుడా, ఇక్కడ అధిక వేడిగా ఉన్నదని నేనెరుగుదును. అది అట్లున్నదని నేనెరుగుదును. అయితే నేను ఎలాంటి అనుభూతిని కలిగియున్నానో మీరును అలాంటి అనుభవమును కలిగియుందురని నమ్ముచున్నాను. ఓ, నేను కేవలము ఎగిరిపోవునట్లుగా అనుభూతిని పొందుచున్నాను. ఆయన ఎంతగానో ప్రేమించునంతగా ఉన్నాడు. నేనేమి చేయగలను? నేనెక్కడకు వెళ్లెదను? ఓ, దేవా, నేనేమగుదును? నేనెక్కడకు ముందుకు వెళ్లగలను? అది ఏమవనున్నది? నేనెక్కడకు వెళ్లుచున్నాను, నూరు సంవత్సరముల పూర్వమునకా? నేను ఆయనను కలిగియుండని యెడల ఏమగును? ఎక్కడ, వేరొక ఆశ్రయ దుర్గము ఎక్కడున్నది?

బెత్లెహేము పాక నుండి ఎరుగని వాడొచ్చాడు,

భూమిపై ఆయనను పోలియుందును;

భూమి నుండి ఆ మహిమకు ఈ జీవిత యాత్ర అంతయు

ఆయనవలె ఉండుటకు మాత్రము నేను కోరుదును.

మనమందరము కలిసి పాడుదము.

యేసువలె ఉండుటకు (దేవునికి స్తోత్రము! అవును ప్రభువా!

అవును, ప్రభువా! లోకమువలె కాదు; గాని నీ వలె ఉండుటకు)

......... ఆయనవలె ఉండుటకు;

ఈ జీవితము భూమి నుండి మహిమకు పయనించుచుండగా.

నేను అడుగునది మాత్రము.....

102

మీరు అలా తలలు వంచియుండగా, నేను మిమ్మును ఒకటి అడుగబోవుచున్నాను. ఇక్కడ ఎవరో పరిశుద్దాత్మను దుఃఖపెట్టుచున్నారు. మరెవరో పిలువబడుచున్నారు. ఆయన యొక్క ప్రవక్తగా నేను ప్రభువైన యేసు నామమున మాట్లాడుచున్నాను. ఆయన హృదయము గాయపడుట నేనెరుగగలను. అక్కడెవరో ఆయనకు అవిధేయులుగా యున్నారు, వారు రావలసియున్నది. నీవు ఇప్పుడు రాలేవా?

ఈ జీవితములో పయనించుచున్నను...

(అవును, సహోదరి, అయితే అక్కడ నీకన్నను అధికమున్నది)

................ మహిమ

ఆయనవలె ఉండుటకు మాత్రమే అడుగుచున్నాను.

కేవలము యేసువలె ఉండుటకు......

అది మాత్రమే నా కోరికగా ఉన్నది. సాత్వీకముగా, తగ్గింపుగా, వినయముగా ఆయనవలె ఉండుటకు ఇష్టపడుచున్నాను.

నేను ఈ భూమిపై......

ఇప్పుడు నీవు పైకి రాలేవా? నీవు కదలి వచ్చుటకు దేవుడు చూచుటకు ఇష్టపడచున్నాడు. మీలో అనేకులు కదలి రావలెనని కోరుచున్నాడు. అయినను.......

103

మీరు వచ్చుచున్నారని నేనెరుగుదును. దేవుడు మిమ్ము దీవించు గాక. దేవుడు మిమ్ము దీవించు గాక. దేవుడు మిమ్ము ఆశీర్వదించు గాక. అదియే ఇది. అదియే ఇది. ఈ ప్రేక్షకులవైపు నేను చూచినప్పుడు, నేను చూచు ఆ నల్లని నీడ అక్కడ వ్రేలాడున్నది. ఇక్కడ పరిశుద్దాత్మ ఉన్నాడు. అది ఇప్పుడు నాపై ఉన్నది. ''పరిశుద్దాత్మను దుఃఖపెట్టుటయా?'' యేసువలె ఉండుట....

ఆయన ఏమి చేసెను? తండ్రి ఎక్కడకు నడిపించునో అక్కడకు వెళ్లెను. దేవుడు మిమ్మును దీవించు గాక, సోదరడా. నా సోదరులారా. దేవుడు నిన్ను దీవించు గాక. అది సరి, ముందుకు వచ్చి మోకరించుము.

భూమిపై నేనున్నంత వరకు...

ఇది ఆ పూర్వకాలపు ఒప్పుదలకు, సరాళము చేసికొనుటకు చక్కదిద్దికొనుటకు సమయముగా ఉన్నది రండి. అక్కడ ఇంకనూ అధికముగా ఉన్నదని తలంచండి. ఓ, స్త్రీ, దేవుడు మిమ్ము దీవించు గాక. దేవుడు మిమ్ము దీవించు గాక. దేవుడు నిన్ను దీవించు గాక. అది మంచిది. పరిశుద్దాత్మ ఎల్లప్పుడు సత్యమైయున్నాడు. రండి. కదలి రండి.

...............ఆయనవలె,

యేసువలె ఉండుటకు, ఆయనవలె ఉండుటకు

భూమిపై నేను.......

ఓ, మై, అది మంచిది! అదియే మార్గము, ఆ కూర్చొను మార్గములను నింపుడి, వెలుపలకు వచ్చి ప్రార్థించుడి.

...జీవిత ప్రయాణములో భూమి నుండి మహిమకు,

(మారుమనస్సు పొందుడి, క్షమించుమని దేవుని అడుగుడి;

మీరు చేయవలసినది అదియే)

.... ఆయనను పోలియుండుటకు.

104

మీరు ఇప్పుడు కదలిరారా. (''బలిపీఠము నొద్దకు'') అది మంచిది, కన్నీరు కార్చుడి. పైకి రండి. ''ఆయనను పోలి.......''

మీరేమి చేయబోవుచున్నారు? ఈ రాత్రి మీ కొరకు ఎవ్వరు నిలువనైయున్నారు? నీ భుజముల పైకి మరణము వచ్చినప్పుడు, నీ కొరకు ఎవ్వరు నిలువబోవుచున్నారు? నీవు ఏమి చేశావని కాదు, పరిశుద్దాత్మ నీకు సమీపముగా కూర్చొనియున్నాడు. ఆయనే నీవు రావలెనని ఇష్టపడుచున్నాడు.

ఈ జీవిత ప్రయాణములో భూమి నుండి మహిమకు.

కేవలము మారుమనస్సును పొంది, చెప్పుము, ''దేవా, నన్ను క్షమించుము. నేను దానిని చేయుటకు ఇష్టపడుట లేదు. నేను నీ కొరకు నిలవనియెడల నీవు నా కొరకు నిలువవు. నీవు నా కొరకు నిలువ వలెనని ఇష్టపడుచున్నాడు, ఈ దినము నుండి నేను నీ కొరకు నిలచెదను. ఒక క్రైస్తవుడు జీవించునట్లు నేను ఇకపై జీవించెదను. నేను నా మార్గములను మార్చు కొందును. నేను మర్యాదగాను, నెమ్మదిగాను ఉందును. ఇకపై వారి మాటలు వారికే విడచిపెట్టుదును, నేను నీ ముందు సాత్వీకముగాను, నెమ్మదిగాను జీవింతును'' అని చెప్పుము. నీవు ఎంత కాలము క్రైస్తవునిగా ఉంటివని కాదు, ఏ సంఘమునకు చెందినవాడవని కాదు, దానికి దీనితో ఏలాంటి సంబంధము లేదు. ఇప్పుడే పైకి రమ్ము. దేవుడు మిమ్మును దీవించు గాక. వెలుపలకు కదలి రమ్ము కుమారుడా.

105

ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. నేను ఆయన సేవకునిగా మీరు నమ్మినయెడల, ఈ ఉదయ కాలము పరిశుద్దాత్మ నాతో మాట్లాడినదేమనగా, ''ఆ పిలుపును ఇవ్వుము, అక్కడ అనేకులున్నారు.'' ఇదే ఆ దినము, ఇదే ఆ సమయము. అక్కడ ఇంకనూ ఐదుగురు లేక ఆరుగురున్నారు. వారు నిజముగా ఇప్పుడు రావలయును. జ్ఞాపకముంచుకొనుడి, సోదరీ, సోదరుడా, నేను మిమ్మును సూటిగా చూచుచున్నాను, ఆ చీకటి నీడలు మీపై నిలచియుండుటకు చూచుచున్నాను. ఇప్పుడే వచ్చుట మంచిది.

యేసును పోలియుండుటకు! ఆయనను పోలియుండుటకు నీవు ఇష్టపడుట లేదా? సౌమ్యముగా, నెమ్మదిగా, సాత్వీకముగా, వినయముగా ఉండుటకు ఇష్టపడుట లేదా? దేవుడు మిమ్మును దీవించు గాక. ఓ, యౌవ్వనుస్తుడా, ఆ తండ్రితో ఉన్న చిన్నబిడ్డను దేవుడు దీవించు గాక. సోదరీ, దేవుడు నిన్ను దీవించు గాక. పాపివైన స్నేహితుడా, దేవుడు నిన్ను దీవించు గాక. అది మంచిది. పైకి కదలి రండి. సోదరీ, వెలుపలకు రమ్ము. మీ కొరకు ఒక స్థలమును కనుగొనుడి. దేవుడు మిమ్మును దీవించు గాక.

ప్రియసోదరీ, నీవెంతో వందనస్తురాలివై ఉండవలసియున్నది. మరణ పడకలో పరుండిన నీవు బలిపీఠము దగ్గరకు నడచివచ్చుచున్నావు. నీ మృదువైన హృదయమును దేవుడు దీవించు గాక.

106

ఇప్పుడు మరలా పరిశుద్దాత్మ మాట్లాడుచున్నాడు, మారు మనస్సుపొంది, దేవునికి ఇప్పుడే ఆక్రందన చేయుడి. మీ స్వంత ప్రార్థనలో ప్రార్థించుడి. నీవే పాపము చేసినది, కావున నీవు ప్రార్థింప వలసియున్నది. నీవు చేసినదానికి దేవునికి క్షమాపణ చెప్పుకొనుము. ఇతరులు ఏమనుకొందురో అని నీ శ్రద్దను ప్రక్కకు త్రిప్పకుము. ''దేవా, క్షమించుము; ఆ విధముగా ఉండదలంచుట లేదు. నేను సౌమ్యముగా ఉండదలంచాను. నేను ఇకపై దానిని మీరుచూ ఇకపై తప్పిపోను'' అని చెప్పుము. ఓ, దేవా, ఓ, నేను దానిని ఎంతగా ప్రేమించుచున్నాను.

పరలోకపు తండ్రి, ఇక్కడ బలిపీఠము దగ్గరున్న ప్రతివారి కొరకు, మోకరించియున్న వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఓ దేవా, తల్లులు, తండ్రులు, చిన్న బిడ్డలు, తండ్రులు, తల్లులు ఇంకెవరైనను, పొరుగువారైనను, సంఘ సభ్యులైనను, డీకన్లు అయినను, ట్రస్టీలైనను, ఓ దేవా, ఇక్కడ పూర్వకాలపువలె, ఈ ఉదయ కాలము ఈ గదిలో ఎంతో వేడితో కూర్చొనియుండగా, ఆ పరిశుద్దాత్మ దిగి వచ్చుచున్నాడు, ఆయన సమాధానమును మాట్లాడుచున్నాడు.

107

ఓ దేవా, ఆ దినము నీవు ఇలా చెప్పుచున్నప్పుడు అక్కడ నిలువ ఇష్టపడుచున్నాను, సౌమ్యము, ''అవును, నీవు వచ్చి నా కొరకు నిలచావు. ఇప్పుడు నేను నీ కొరకు నిలచెదను.'' ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ సమాధానమును నీవు ఉంచుమని నేను ఇష్టపడచున్నాను. దేవా, నెమ్మదిగా, సౌమ్యముగా, నేను దానిని చేయుటకు ఇష్టపడుచున్నాను. ఇకపై అది వారిని ఎన్నటికి విడచిపోదని ఈదినము మొదలుకొని నిరంతరము నీవు వారిలో ఉందువను అనుభూతిని వారికి కలిగించుమని నేను ఇష్టపడుచున్నాను. వారి గృహములను నూతన పరచుము. ప్రజలు నూతన వ్యక్తులౌదురు గాక. ఈ దినము సమస్తము నూతనమగును గాక, ఎందుకనగా ఈ ప్రజలు తమ్మునుతాము తగ్గించుకొనిరి. ''నా నామమందు ప్రజల వినయముతో ప్రార్థించియెడల, పరలోకము నుండి నేను వారి ప్రార్థనలను ఆలకింతును,'' అని నీవు చెప్పియున్నావు. దేవా, ఈ ఉదయము కూడ నీవు అలాగే చేయుచున్నావని నేను ఎరిగియున్నాను.

వారి యొక్క స్థలములలో కూర్చొనియున్న వారి కొరకు క్షమాపణ కోరుచున్నాను. వారు నీ యొద్దకు రానైయున్నారు. దేవా, నీవు వారితో మాట్లాడుము. వారు ఆ తీర్మానమును గైకొను వరకు ఈ భూమియందు సమాధానమును కనుగొనరు. వారు నీ యొద్దకు వచ్చి, నీతో సరి చేసుకొను తీర్మానమును తీసుకొనవలసి యున్నది. దయచేయుము ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించుము. నీ దయ, నీ కృప వారి ఆత్మలతో ఎల్లప్పుడు ఐక్యపడి, పెనవేసికొని ఈ ఉదయ కాలము ఈ సంఘమందు తలలు వంచియుండగా వారిలో ఉండును గాక.

108

తండ్రి,, దేవా, నీతో ఐక్యపడి దీనిని చేయుచూ, ప్రజలను పిలచుచున్నాను; వారు నిలచియున్నారు. ''మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొను వానిని, నా తండ్రి ఎదుటను, పరిశుద్ద దూతల ఎదుటను వారిని నేను ఒప్పుకొందును,'' అని నీవు సెలవిచ్చావు. ఇక్కడ అనేకులు ఎంతో కాలముగా క్రైస్తవులుగా ఉన్నారు, అయినను ఈ ఉదయ కాలమందు వారి అపరాధములను ఒప్పుకొనుచు నిలచియున్నారు. వారు ప్రేమి౦పబడలేనివారిగా మారియున్నారు. పరిశుద్దాత్మ వారిని విడచి వెళ్లిపోయెను. అనేక పర్యాయములు వారు ఆ సాత్వీకమైన, మధురమైన, సౌమ్యముగా ఉండవలసిన స్థితిని ఎరుగకపోయారు. అనేకులు పాపులుగా ఉండి మొదటిసారిగా వచ్చియున్నారు.

అయితే తండ్రీ, వారు ఆ అనుభూతిని కోరుచున్నారు, గ్రహించునట్లు సమస్తములో వారిని నడిపించు సమాధానమును కోరుచున్నారు. ప్రభువైన దేవా, ఈ దినమున దానిని వారికిమ్ము, వారందరు ప్రేమయందు ఐక్యపడి ఆత్మతో పరిపూర్ణముగా నింపబడునట్లు వారు ఈ స్థలమును విడచిపోవుచుండగా వారికి అనుగ్రహించుము. క్రీస్తు నామమున మేము దీనిని అడుగుచున్నాము.

109

''ఊట యొద్ద నివాసము.'' మంచిది. బలిపీఠము దగ్గర ఉన్న మీరు, దేవుడైన ప్రభువు వైపు చూడుడి; మీరు వెనుకకు తిరిగి ఒకరి చేతులు ఒకరు కరచాలనము చేయుడి. ఓ, మనము ఇప్పుడు పాడనైయున్నాము, మనలో ప్రతి ఒక్కరు, ఈ స్వస్థత ఆరాధనకు ముందు మనము నిలచియుండగా పాడుదుము.

నివాసము, నివాసము నిజమే అక్కడ నివాసమున్నది.

ఆ ఊట దగ్గర నీ కొరకు ఒక నివాసమున్నది;

నివాసము, నివాసము నిజమే అక్కడ నివాసమున్నది

ప్రతి ఒక్కరికి!

నివాసము, నివాసము నిజమే అక్కడ నివాసమున్నది

అక్కడ ఆ ఊట దగ్గర నీ కొరకు ఒక నివాసమున్నది

నివాసము, నివాసము నిజమే అక్కడ నివాసమున్నది

అక్కడ ఆ ఊట దగ్గర నీ కొరకు ఒక నివాసమున్నది

నివాసము, నివాసము నిజమే అక్కడ నివాసమున్నది.

[టేపునందు ఖాళీ ఉన్నది.]

110

ఒక విశ్వాసము! సోదరుడా గత దినములో జరిగినది నీవెరుగుదువు గదా? నీ కొరకు ప్రార్థించుటకు గాను నీ భార్య పిలువబడినది. అక్కడ గదిలోకి వెళ్లినవెంటనే అక్కడ పరిశుద్దాత్మ ''భయపడకుము,'' అని చెప్పెను. ఆమేన్. ఆయన నిజమైనవాడు కాదా? ఎంత ఆశ్చర్యము! మంచిది, దేవునికి స్తోత్రము! ఆ జయమునందు కేకలు వేయునట్లు భావన కలుగుచున్నది! మంచిది.

మరియు ఆయన రక్తము శుద్ది చేయును.

(ఆయన చెప్పినది అదే)

.......... యేసు రక్షించును!

మంచిది, ఇప్పుడు సహోదరుడు నెవిల్ మరియు సహోదరుడు స్లాటర్ మనతో మాట్లాడెదరు.

[సహోదరుడు స్లాటర్ మాట్లాడుచున్నాడు.]

దేవునికి స్తోత్రము!

[సహో. నెవిల్ మాట్లాడుచున్నారు.]

ఈ రాత్రి కూడా నేను ఇక్కడ ఉండెదను. అవును, నాకు తెలిసినంత వరకు, ఎవరూ నన్ను పిలువనట్లయితే, నేను ఇక్కడ ఉండెదను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...