అజూస ఉత్సవ సునాదము

అజూస ఉత్సవ సునాదము

VGR COUNT -71 చాలా వందనములు. దయతో మీకు వందనములు తెలుపుచున్నాను. ఈ అజూస అను వీధి యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బహిరంగముగా కుమ్మరించబడిన ఆ సునాద ఉత్సవమును ఈ అద్భుతమైన ఏంజెల్స్ ఆలయములో నుండి ఈ మధ్యాహ్న సమయమునందు జరుపుకొనుట వలన మనమెంతో భాగ్యవంతులమైయున్నాము. ఒకసారి పరిశుద్ధుల కొరకై ఇవ్వబడిన విశ్వాసముతో ఇంకా పోరాడుచూ ముందుకు కొనసాగిపోవుటకై ఇచ్చట అనేక మంది ప్రజలు కూడియుండుటను గమనించండి. రాబోవు ఈ వారములో గొప్ప సమయమునందు అభిషేకించబడిన అనేక మంది ప్రసంగికులు ప్రసంగించుచుండగా, సమృద్ధియైన గొప్ప కార్యములను దేవుడు మనకు చేయునని, ప్రతీ కూడికలో దేవునియొక్క సన్నిధి మనతో కూడయుండునని మనమెంతో నమ్మకమును కలిగియున్నాము. అంతే కాకుండా ఈ కూడిక నుండి ఒక ప్రాచీనకాలపు పెంతెకోస్తు కూడిక మాదిరిగా మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందుగా బయలు వెళ్ళి ఈ ప్రపంచమును ఇది తుడిచివేయినని మేము నమ్ముచున్నాము.

2

మరియు ఇప్పుడు ఇది వేడిగా ఉందని నాకు తెలుసు, మనము నేరుగా వాక్యము నొద్దకు వెళ్ళుచూ పరిశుద్ధ లూకా పుస్తకము 4వ అధ్యాయము 14వ వచనము నుండి ప్రారంభించి చదివెదము, నేను దీనిని చదివెదను:

“తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పన విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్ళి, చదువుటకై నిలుచుండగా ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా.

ప్రభువు ఆత్మనా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను.“

మరియు ప్రభువు చదువబడిన తన వాక్యమునకు ఆయన యొక్క ఆశీర్వాదము జతచేయును గాక.

3

ఈ రోజున లాస్ ఏంజెల్స్ పట్టణమందు ఉండటము ఎంత భాగ్యము, చాలా సంవత్సరముల క్రిందట, స్పెయిన్ దేశస్తులు పడమర తీరమున అటు-ఇటు సముద్ర ప్రయాణము చేసి ఈ గొప్ప ప్రదేశమును కనుగొనినప్పుడు ఒక రోజున ఈ పట్టణము ఇక్కడ ఉండునని వారికి తెలియునా.

ఏబది సంవత్సరముల క్రితము ఈ అజూస వీధిలో సంభవించిన పరిశుద్ధాత్మ బహిరంగముగా ఆత్మను కుమ్మరించబడిన గొప్ప ఉత్సవములో నేడు ఈ ఏంజెల్స్ ఆలయమునందు ఉండుట సంపూర్ణ సువార్త విశ్వాసము యొక్క ప్రత్యేకమైన జ్ఞాపకార్ధముగా ఇది యున్నది. నేను వార్తా పత్రికయందున్న ఈ ప్రాచీన అజూస వీధి మిషన్ వారియొక్క పటము చూచితిని. దానికి కొంచెము క్రిందనే ఈ అందమైన ఏంజెల్స్ ఆలయము యొక్క పటము కూడా యున్నది. ఆ ప్రాచీన మిషను నుండి సంఘము ఆ పూర్వ దినముల నుండి ఇంకా కూడా నేటి వరకు అనేక కాలములుగా ఏ విధముగా కొనసాగుచూ ముందుకు వచ్చినదనే దానిని అది చూపించుచున్నది.

4

ఈ విధముగా అనేకమందిని ఒక్కటిగా కూడునట్లుగా ఈ సంఘము వారు ఒక అద్భుతమైన స్థలమును ఎన్నిక చేసారని నేను అనుకొంటున్నాను. ఎందుకనగా యేసుక్రీస్తు ఇంకా జీవించుచూ ఏలుచున్నాడని. తన హృదయాంతరంగమందు భావించిన ఒక చిన్న తల్లి మెక్ ఫెర్సన్ కై ఈ ఆలయము ఈ రోజు ఒక జ్ఞాపకార్ధముగా నిలుచుచున్నది. ఆమె ఫారెస్టు లాన్ (Forest Lawn) నందు నిద్రించుచున్నది. కాని ధైర్యముగల ఆమె యొక్క ఆత్మ దేవుని యొద్ద విశ్రాంతినొందుచున్నది. ఆమె మనలను దాటి వెళ్ళిపోయినా ఆమె విడిచి వెళ్ళిన కార్యములు అవి కాలము యొక్క ఇసుకలో పాదముద్రలై ఉన్నవి.

సహోదరుడు మెక్ పెర్సన్ (Mc Pherson) తో ఈ ఆలయంలో ఉండటము, ఆమె కుమారుడు, మరియు సహోదరుడు టీ ఫెర్డ్ (Tee Fert) ఇంకా కార్యవర్గములోని చాలామంది పనివారు, ఈ గొప్పకూడికకు దేశములోని పలు ప్రాంతముల నుండి వచ్చిన ఈ గొప్ప సహవాసపు సభ్యులను చూచుటకు ఈ రెండు రాత్రులు లేక రెండుసార్లు మీకు ప్రసంగించుటకు నాకు కలిగిన అవకాశమునుబట్టి నేనెంతో కృతజ్ఞడనై యున్నాను.

మరో బహిరంగముగా పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరింపబడుటకై దేవునియందు విశ్వాసముతోను, నమ్మకముతోను మనమందరము మన హృదయములను ఏకము చేయవలెనని కోరుచున్నాము. దేవుడు కేవలము ఒకేరీతిగా ఉన్నాడు. ఆయన విఫలము చెందడు. ఇది కేవలము అజూస వీధి యొక్క ఉత్సవము కాదు, యేసుక్రీస్తు అనుగ్రహించిన సంవత్సరము యొక్క ఉత్సవ సునాదము ప్రకటించినప్పుడు, పెంతెకోస్తునాడు క్రిందికి తీసుకురాబడి అప్పటి నుండి ఉన్న ఉత్సవము ఇది. 1900 సంవత్సరాలకు ముందు పెంతెకోస్తు నాడు ప్రారంభించబడిన ఆ గొప్ప సునాద ఉత్సవమును మాత్రమే మనము ఇంకా కొనసాగించుచున్నాము.

5

పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును పొందుకొని, ప్రశస్తమైన విశ్వాసమునందు నేడు మీరందరూ నిలబడియున్న మిమ్ములవలె మీతో కూడ నేను ఆరాధించుచు మీతో యుండుటకు నేనెంతో సంతోషించుచున్నాను.

నేను జన్మించుటకు ముందుగానే సువార్తను ప్రసంగించిన అనేకులు ఇచ్చట యుండుట వలన వారిమధ్య నేను కాలము గతించిన తర్వాత వచ్చినవాడినిగా నేను భావించుచున్నాను. నేను పుట్టకముందు, చాలా సంవత్సరముల ముందు ఈ గొప్ప కుమ్మరింపు కాలిఫోర్నియాకు వచ్చినప్పుడు, అది 1906 వ సంవత్సరము అని నేను నమ్ముచున్నాను. ఆ దినమందు ఆరాధించిన అనేకమంది విశ్వాస యోధులు నేడు వృద్దులుగాను, తల వెంట్రుకలు నెరసి పోయినవారై నాడు సంభవించిన దానిని నెమరువేసుకుంటూ ఇచ్చట కూర్చొని యున్నారు. కాని నేను మీకు చెప్పుచున్నాను. నా సహోదరులారా, ఒక రోజున మనము దాటి అవతల దిక్కునకు వెళ్ళినప్పుడు మనము పొందుటకు ఒక గొప్ప ప్రతిఫలము మన కొరకు ఉంచబడియున్నది. నేను ఆ ప్రజలతో మాట్లాడినప్పుడు, ఈ గొప్ప సంఘము ఇంత చక్కగా వర్ధిల్లుటకై, వారు దినమంతా శ్రమించి చాలా ఆలస్యముగా రాత్రులలో నిద్రించుటకు వెళ్ళేవారు, రైలు పట్టాలు గుండా నడుచుకుంటూ వెళ్తూ, మొక్కజొన్నలను ఏరుకుంటూ, వాటిని తమ పిల్లలకు ఒలిచియిస్తూ ఎంతో శ్రమించి జీవించెడివారు. ఎందుకంటే ఈ విధముగా ఈ గొప్ప సంఘము వృద్ధి చెందుటను చూచుటకై వారు చెల్లించిన క్రయము అది.

ఏదో ఒక మహిమ దినమున ప్రత్యేక కాలములగుండా విమోచించబడిన వారందరూ భూమియొక్క అంచున నిలబడి విమోచన గీతములను పాడుచుండగా మనము దేనిని గూర్చి మాట్లాడుచున్నామో దానియొక్క భావమును కూడా ఎరుగని దూతలు ఏకముగా కూడి తమ తలలను వంచి భూమి చుట్టూ నిలబడియుండు మరియొక సునాద ఉత్సవమునందు మనము సంధించెదమని నేను నమ్ముచున్నాను. దూతలకు విమోచనా అనేది అసలు అవసరము లేదు. కాని పోగొట్టుకొనబడిన దీన పాపులమై మనము ఆయన యొక్క కృప ద్వారా విమోచించబడిన వారమైనందువలన ఆ విమోచనా గాధ యొక్క గానమును పాడుటను గూర్చియు, ఆ పాట యొక్క భావము ఏమైయున్నదనే దానిని గూర్చియు మనమెరుగుదుము. మనము రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును యగు ఆయనకు కిరీటము ధరింపచేయునప్పుడు అది ఎంత గొప్ప సమయము ఉండబోవుచున్నది.

6

మరియు ఈ రోజు నా వాక్యపఠనము క్రీస్తు యొద్దనుండి వచ్చుచున్నది, ఆయన ఆలయంలో ప్రవేశించి అంగీకరింపదగిన సంవత్సరము ఉపదేశించాలి అని చెప్పిన దగ్గర నుండి వచ్చినది. మరియు ప్రభువుయొక్క అభిషేకము ఆయనపై ఉండెను. ఆయన పుస్తకము చదివి కూర్చుండెను. అది ఆయన పెదవుల నుండి ప్రశస్తమైన వాక్యమును పలికినది.

పాత నిబంధన గ్రంథములో సునాదము లేదా విడుదల సంవత్సరము అను ఒక సంవత్సరము ఉండెను. అది దాసులందరు, బానిసలైనవారు విడుదల పొందుకోవలసిన సంవత్సరమై యుండెను. బానిసగా ఉన్న ప్రతి మనుష్యుడు స్వతంత్రుడుగా వెళ్ళవచ్చును. అది గొప్ప అర్ధము కలిగి నేటికి కూడా ఒక మాదిరిగా నిలుచుచున్నది.

ఇప్పుడు, నేడు అది ఒకవేళ [టేపు మీద ఖాలీ ఉన్నది...] నేనెల్లప్పుడూ ఈ యాజమానుడు దగ్గరేయుండి పనిచేసెదనని సమ్మతించినయెడల ఒక కదురు తీసుకొని ఆ పనివాని చెవికి రంధ్రము వేయవలెను. ఆ క్రియనేడు ఎంతో ఒక చక్కటి మాదిరిగా యున్నది. అంతేకాకుండా ఏబది వత్సరముల క్రితము మొదటగా పరిశుద్ధాత్మ ఇచ్చట కుమ్మరించ బడినది. అది ఒక పశువుల పాకయని నాకు చెప్పబడియున్నది. ఆ కార్యము ఎంతో ఒక చక్కటి మాదిరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా శరీరరూపియై మొదటసారి భూమి మీదకు వచ్చినప్పుడు దేవుడగు ఆయన ఒక పశువుల పాకయందు జన్మించెను. ఆయన ఈ లాస్ ఏంజల్స్ కు వచ్చునప్పుడు ఇప్పుడు కూడా ఒక పశువుల పాక యొద్దకే ఆయన వచ్చును. అది మిమ్మల్ని మీరు తగ్గించుకొనునట్లుగా చేసి మన పాపముల నుండి విమోచించు క్రమములోనికి తీసుకొనివచ్చే దేవుని యొక్క తగ్గింపుగా అది యున్నది.

7

స్వేచ్చగా వెళ్ళని ఈ వ్యక్తి ముద్రించబడవలసి ఉండెను. అది ఏమిటి? వాదనగా మారిన దేవుని ముద్రకు మరియు మృగము యొక్క గురుతుకు ఒక అందమైన మాదిరిగా ఉన్నది. వినుట వలన విశ్వాసము వచ్చును, దేవుని వాక్యము వినుట వలన వచ్చును. మనము స్వతంత్రులము అని ఎప్పుడైతే విని మనకు ఇవ్వబడిన స్వతంత్రమును నాకు వద్దని నిరాకరించినప్పుడు అప్పుడు మనము ముద్రింపబడవలయును. నా ఉద్దేశ్యము ప్రకారము దేవుని నుండి దూరముగా ముద్ర వేయబడ్డామంటే, మనము మృగము యొక్క గురుతును పొందుకున్నట్లే. ఎందుకంటే వినడమే పొందుకోవడము, మరియు ఎప్పుడైతే మనము స్వతంత్రులము అని వింటామో, మనము దానిని అంగీకరించి స్వతంత్రులుగా ఉండవచ్చును.

ఇప్పుడు, ఎప్పుడైతే వినువాడు ఉత్సవ సునాద శబ్దమును వింటాడో, మరియు అతడు స్వేచ్చగా ఉండాలని అనుకోకపోతే, మరి అతడు ముద్ర వేయబడవలసి ఉన్నాడు, మరియు అది ఈ రోజు ఎప్పుడైతే పురుషులు, స్త్రీలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన సువార్త మరియు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము గురించి వింటారో, మీరు ఒక విషయమును ఎన్నుకోవలసిన ప్రదేశములో ఉన్నారు. మీరు ఎప్పుడూ వినకపోతే మీరు అలాగే ఉండవచ్చును. కాని మీరు దానిని అంగీకరిస్తే, నీవు క్రీస్తును పొందుకుంటావు. కాని నీవు దానిని నిరాకరిస్తే నీవు క్రీస్తు నుండి దూరముగా ముద్రవేయబడి యున్నావు. అది వాక్యము వినుటను గురించిన మీ వైఖరికి బేధము కలుగజేస్తుంది.

8

దేవుడు తన సంఘము స్వేచ్చగా ఉండాలని కోరుకుంటున్నాడు, అనే అంశము మీద ఈ ఉదయము ఈ పట్టణములో ఒక అందమైన ప్రదేశమునందు ఆలయములో మాటలాడుచుంటిని. ఈ 50 సంవత్సరాలు ఎన్నో విషయాలు జరిగాయి. ఎందరో ప్రజలు, విశ్వాసులు లోకము ద్వారా చెరపట్టబడ్డారు. ఎందరో ప్రజలు, సంఘశాఖలు, కొన్నిసార్లు సహవాసమును దూరము చేసి అడుకట్టలు వేశాయి.

నేను కొంతకాలము క్రితము ఇక్కడ ఆలోచించుచుంటిని. ఎవరో నన్ను అడిగారు, “బ్రన్హం సహోదరుడా, నీవు ఏ సంఘమునకు చెందినవాడవు?”

నేను అన్నాను “అక్కడ నిజముగా ఒకే సంఘము ఉన్నది.” సంఘము అనగా అర్థము “బయటకు పిలువబడినది.”

అతను అన్నాడు “కాని, నా అర్థము మీరు ఏ సంఘ శాఖకు చెందిన వారు అని?”

నేను అన్నాను. “ప్రస్తుతానికి ఏది కాదు, అయినాగాని వాటన్నింటికి చెందినవాడిని?”

9

సహోదరుడు శకరియన్ (Shakarian) మరొక ఉదయము ఒక కథనము సమకూర్చాడు. “పెంతెకొస్తు అనేది ఒక సంఘ శాఖ కాదు. అది ఒక సంస్థ కాదు, అది పురుషులు, స్త్రీలు దేవునితో పొందుకునే ఒక అనుభవమై ఉన్నది.” మెతడిస్తులు, బాప్టిస్తులు, ప్రెస్బిటేరియన్లు, అందరూ వాక్యమును విని దాని ప్రకారం నడుచుకోవలెనని నిర్ణయించుకొనినప్పుడు, వారు దేవునితో ఆ అనుభవమును పొందుకోవచ్చును. పరిశుద్ధాత్మడు ఇంచుమించు రెండువేల సంవత్సరముల నుండి భూమిపైనున్నాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలని కోరుకొన్నవారు వచ్చి దానిలో పాలిభాగస్తులుగా యుండవచ్చును. మరియు బానిసలుగాయున్న ప్రతి ఒక్కొక్కరు ఆ వాక్యమును వినినప్పుడు వారు విడుదల పొందుకోవచ్చును. కాని ఇప్పుడు మీరు దానిని నిరాకరించిన యెడల అప్పుడు అది మూయబడును.

10

ఇక్కడ కొంతకాలము ముందు, కొలరాడోలో పశులు పెంపకము చేసేవాడిని. మేము అరపాజో అడవులలో మందలను మేపెడివారము. ఈ లోయలో పశువుల దొడ్డిగల ప్రతి వ్యక్తి ఒక టన్ను గడ్డిని పెంచగలిగితే, ఎండాకాలము ఆవులను ఆ పచ్చికపై ఉంచవచ్చును. వన పాలకుడు మందలు దాటి వెళ్ళునప్పుడు వాటిని లెక్కపెడతాడు. చాలాసార్లు చిన్న పశువుల మందను సంవత్సరము పాటు ఆ అడవిలో ఉంచడానికి నేను అక్కడకి వెళతాను.

మరియు అవి వచ్చినప్పుడు నేను వాటిని గమనించాను. అవి కొన్ని ప్రత్యేకమై యున్నవి. ఎలాగంటే లేజి-కే (Lazy-K), డైమండ్టీ (Diamond-T) అనేక రకమైన వ్యత్యాసమైన జాతులు గలవి యుండును. అవి ద్వారముల గుండా వెళ్ళినప్పుడు విభిన్నమైన ముద్రలను ధరించుకొని యుండును. కాని ముద్రించబడి నమోదు చేయబడిన హర్ఫోర్డ్ (hereford) అనే జాతి రకము తప్ప వేరేదియు దాని గుండా వెళ్ళలేదు.

మార్గము యొక్క అంతములో అలాగే ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. దేవుడు మనము ఏ రకపు జాతితో ముద్రించబడితిమనే దానిని గూర్చి గమనించడు. కాని లోపలకి ప్రవేశించే ప్రతి వ్యక్తి దేవుని యొక్క ఆత్మతో తిరిగి జన్మించెనా లేదా అనే దానిని ఆయన గమనించును. మీరు ఏ రకపు జాతి ముద్రను ధరించియున్నారనేది ఇచ్చట విషయము కాదు గాని మీరు ఒకే ఆత్మతో మరలా జన్మించిన దేవుని యొక్క పరిశుద్ధుడవై యుండి, ఒక నిజమైన విశ్వాసివైన యెడల, ఈ లోకము వుండుట ఎంత నిజమో అట్లే అంత నిశ్చయముగా ఆ దినమందు ఆ మార్గము గుండా మీరు దాటిలో పలికి ప్రవేశించగలరు. ఓ ఎంత అందమైన చిత్రమది!

11

ఆ మందలు కాయువారిని గమనించినట్లైన వారు అడవులలో మందలను మేపుటకు వెళ్ళినప్పుడు వారు కంచెలను కలిగి ఉండెదరు. కొంతమంది పలానా లోయలోనికి మందలను మేపడానికి వెళ్ళాలని ఇష్టపడతారు. ఆ మందలు తాత్కాలికముగా కంచెయందు బంధించి యుండుట వలన వారు ఎన్నిక చేసికొనిన ఆ స్థలమునుండి ఆ మందలు బయటకు వెళ్ళలేవు. కాని ఋతువు కాలముయొక్క ఆఖరిలో ఈ తాత్కాలికమైన కంచెలన్నింటిని తీసివేయుదురు. అప్పుడు ఆ మందలన్నియు ఏకముగా ఒకచోట కూడుకొని ఒక గొప్ప సునాద ఉత్సవమును జరుపుకొనును. అవన్నియు హేర్ఫోర్డ్ జాతికిచెందినవి.

ఈ రాబోవు వారములో సంఘశాఖల కంచెలన్నియూ కూలిపోవునట్లుగా మరియు తిరిగి జన్మించిన దేవుని బిడ్డలందరూ తిరిగి గొప్ప పెద్ద పరిశుద్ధాత్మ సునాద ఉత్సవములోనికి తీసుకొని రాబడునట్లుగా, అక్కడ వారందరు మళ్ళీ కలుసుకొనునట్లుగా నేను దేవునికి ప్రార్థన చేస్తాను.

12

సంఘ కాలముగుండా, గడిచిన 50 సంవత్సరాలుగా సంఘాలలో ఎన్నో విషయాలు జరిగాయి. ఎంతోమంది పడిపోయారు. ఇది చెప్పడానికి చింతిస్తున్నాను. కాని ఈ రోజు ఈ గొప్ప కుత్రిమమైన ఆలయం ఎంత అందముగా ఉండెనో అలాగు ఉన్నది, దానికొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కాని నేడు సహోదరుడుతో వున్న ప్రతి ఒక్కొక్క విశ్వాసియు. [టేపు మీద ఖాళీగా యున్నది-సంపా] మరియు అందరూ ఆరంభమునయున్న ప్రకారముగా ప్రాచీన కాలపు పరిశుద్ధాత్మ బహిరంగముగా కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ కొరకు దేవుని బలపీఠము నందు మేము కలిగియున్న వాటితోను, ఇచ్చట పెట్టిన వాటన్నింటితోను మీరు కూడా పాలిభాగస్తులై యున్నారని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. నా క్రైస్తవ స్నేహితుడా ! మనకు నేడు అవసరమైనది ఏమనగా ఒక సునాద ఉత్సవ సమయము నేడు మన అవసరం అదియె.

ఇప్పుడు, ఈ మధ్య కాలమునందు దయ్యము ఎంతోమంది విశ్వాసులను చెరగా పట్టుకొనినది, ఒక ఉదాహరణగా: చల్లదనము, లోకమాలిన్యము సంఘములోనికి ప్రవేశించినవి.

ఇప్పుడు నేను వేరే అంశమును గురించి మాట్లాడవచ్చును, కాని నేను మీలో ఒకనిగా వుండి ఆలోచించునదేమనగా, మనము సాధారణముగా పొందుకొనియున్న ప్రాచీన కాలపు పరిశుద్ధాత్మయొక్క ఉజ్జీవపు ఉత్సవములో మనము పాల్గొని ఇచ్చట కూడి యుండుట దాని గురించియే. దేవుని దూతలు క్రిందికి దిగివచ్చి కూడికలలో ఏ విధముగా పాటలను పాడితిరనియు, దేవునియొక్క శక్తి ఏ విధముగా ఆ కార్యములను తన ఆధీనములోనికి తీసుకొనిన దానిని గూర్చియు పరిశుద్ధులు ఏ విధముగా మరలా జన్మించిన అనుభవమును గూర్చియు, మహాగొప్ప కార్యములు సంభవించిన వాటిని గూర్చియు మన తండ్రులు చెప్పుకొనిన వాటిని నేను వింటిని మరియు అది ప్రాచీన కాలపు, అరణ్యమున వెనుక ప్రాంతమున, నీలి ఆకాశము వంటి స్పష్టమైన పాపకార్యములను సమూలముగా నిర్మూలించి లేదా చంపివేసే ప్రసంగములలో నుండి వచ్చుచున్నది. ప్రాచీన కాలపు శుద్దీకరణ పద్ధతియందు ఒకవేళ పురుషులకు అ, ఆ, ఇ, ఈ, లు తెలియకపోయినను క్రీస్తును ఎరిగినవారై యుండి మరియు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందినవారై యుండిరి.

13

చాలాసార్లు మనము లోకమును లోనికి రానిచ్చాము. ఈనాడు మన సంఘములో కూడా అదే విషయము కలిగి ఉన్నాము. కొంత ఇచ్చట కొద్దిగ అచ్చట దానిని లోనికి రానిచ్చాము. దయ్యము ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు, కొద్దికొద్దిగా ఆక్రమించుకొంటూ, ఇక్కడ లోనికి వచ్చి, ఇక్కడ ఈ కొద్ది స్థలము తీసుకుంటూ, అక్కడ ఆ కొద్ది స్థలము తీసుకుంటూ లోనికి వచ్చింది. మరియు మొదట ఒక విషయము మీకు తెలియునా, అది గందరగోళము ద్వారా మొత్తమును ఆక్రమించుకొని యున్నది.

ఆ పురాతన కాలపు కూడికకు మాదిరిగానున్న ఈ కూడిక సమయంలో, ఇక్కడ మనము కలిగి ఉన్న ఈ కూడిక యందు పురుషులు వారి సాంప్రదాయములను మరచిపోయి, ఆటంకపరచు ప్రతి దానిని మరిచి, ప్రతి విధమైన భారమును ప్రక్కనపెట్టి, మరియు పురాతన పద్ధతిగానున్న కూడిక యందు ఎక్కడైతే ప్రజలు తిరిగి జన్మించే అజూస ఉత్సవ సునాదము అనుభవమును పొందుకొంటారో అక్కడకు తిరిగి రావాలని నేను దేవుని ప్రార్ధిస్తున్నాను. ఈ కూడికలో జరుగు విషయములను గురించి, పాపుల కొరకు బలిపీఠమునొద్ద నుండి దేవునికి ప్రార్ధన చేయు వందలమంది ఆత్మతో నింపబడిన పురుషులను దేవుడు మనకు ఇస్తాడని నేను ప్రార్ధిస్తున్నాను, ఎంత బేధము కలిగి ఉన్నది.

ఇప్పుడు, ప్రజలారా నేను మిమ్మలను అందరిని ప్రేమిస్తున్నాను. కాలము గతించిన తరువాత నేను జన్మించినను మీరు నన్ను మీ సహోదరునిగా కౌగిలించుకొటిరి, కాని నేను బాధ్యత కలిగి ఉన్నాను. మరియు మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ప్రవేశించుచున్నాము అని నేను నమ్ముచున్నాను. మనము అంత్యకాలములో ఉన్నామని నేను నమ్ముచున్నాను.

14

మీకు తెలుసా యేసుక్రీస్తు అంగీకరించు సంవత్సరమును ప్రసంగించాడు, ఆయన ప్రసంగించిన తరువాతనే సునాదము వచ్చినది. ఈ చివరి దినములలో మనము గొప్ప ఆత్మ కుమ్మరింపును ఇక్కడ కలిగి ఉన్నాము. దేవుడు పూర్వ పద్ధతియైన కూడికల ద్వారా దేశమంతట మనలను కలుసుకొని ఉన్నాడు. ఇప్పుడు మనము దానియొక్క అంతమందు ఉన్నామని నేను నమ్ముచున్నాను. మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తూ మార్గము యొక్క చివరి భాగములో ఉన్నాము. మనము వేచియుండు తదుపరి కార్యమేదనగా దారితప్పిపోయిన వారును, వేర్వేరు కార్యముల ద్వారా బంధింపబడిన వారును మరియు దేవుని యొక్క జనులందరునూ ఏకముగా చేర్చి తీసుకొని వచ్చుటయేయని నేను తలంచుచున్నాను.

కొంచెము మన సంఘాలలోని కొన్ని నీతియుక్తమైన కార్యములను గురించి చూద్దాము. అనేక సంవత్సరములకు క్రితము శ్రీమతి మెక్పెర్సన్ ఈ ప్రసంగ పీఠమునందు నిలబడియుండగా మరియు ఇంకా కొందరు ఇచ్చట యుండిరి. ఒక్క కన్ను చూపును కలిగిన నల్ల జాతి మనుష్యుడు ఈ అజూస వీధిలో పురాతన కాలపు సువార్తను ప్రసంగించుచుండెను. స్త్రీలు, పురుషులు దైవభక్తిని కలిగిన వారుగా జీవించుచుండెడి వారు. అచ్చట ఎన్నో గొప్ప కార్యములు సంభవించినవి. కాని నేడు వాటికి మనము అడ్డంకులును పెట్టుకున్నాము.

ఒక విషయమును లోతుగా నాటుటకై సుత్తిని తీసుకొని కొట్టునట్లుగా కాదు. అందులో నాకు నమ్మికలేదు. కాని సహోదరుడా, నేడు ఇచ్చట కూడి కూర్చొనియున్న ప్రశస్తమైన ఐదు వేల మంది ప్రజల మధ్య పరిశుద్ధాత్మ వున్నాడని నేను నమ్ముచున్నాను. మరియు మనముయున్న ఈ కూడిక యందు ప్రతీ హృదయములలో మనము దేవుడు తన చిత్తానుసారముగా చేయునట్లుగా మనలను సమర్పించుకొనినయెడల అది సముద్రము నుండి సముద్రమునకు మరియు తీరము నుండి తీరమునకు పత్రికలు మోసుకొని పోవునట్లుగా ఒక గొప్ప ఉజ్జీవము ఆరంభమగునని నేను నమ్ముచున్నాను. పురాతన కట్టుబడి క్రమమునకు తిరిగి వెళ్ళెదము.

15

మనలో చాలామందిని దయ్యము చెరగా పట్టుకొనినది. ఆ పురాతన కాలములో స్త్రీలైన మీరు వెంట్రుకలు కత్తిరించుట పాపముగా భావించెడి వారు. కాని నేడు పెంతెకోస్తు స్త్రీలు వీధులలో విచ్చలవిడిగా తిరిగే స్త్రీలవలె కనపడుచున్నారు. మీరు వారికి, వీరికి భేదము చెప్పలేరు. అది సరియే. ముఖమునకు రంగులు వేసుకొనుట అనునది పూర్వ కాలపు స్త్రీలు పాపముగా భావించెడివారు. కాని ఈ రోజు మీరు పరిశుద్ధులకు, పాపులకు తేడా తెలుసుకోలేరు. విషయము ఏమిటి? పనికిరాని వాటినన్నింటిని చెక్కుకుంటూ మళ్ళీ ఆ పురాతనమైన ఖండించి బోధించు క్రమమునకు తిరిగి వెళ్ళేదము, నిజ పెంతెకోస్తునకు, పూర్వపు అజూస అనుభవమునకు తిరిగి వెళ్ళేదము అవును అది నిజము.

మరియు ప్రసంగీకులలో మీరు కొందరు మరియు పురుషులు మీలో కొందరు ముందుకు కొనసాగి పోకుండునట్లు అడ్డుకట్టలను పెట్టితిరి, అదెందుకో మీరెరుగుదురు. అందునిబట్టి మీ గురించి నేను సిగ్గుపడుచున్నాను. ఏ పురుషుడైనా తాను తిరిగి జన్మించిన దేవుని కుమారుడనని చెప్పుకుంటూ ఈ కాలపు పెంతెకోస్తు జనులలో తమ స్త్రీలు వీధులలో విచ్చలవిడిగా తిరిగే స్త్రీలవలెయుండునట్లుగా అనుమతించు ఏ పురుషుడైనా సరే అతడిలో అసలు మగతనమే లేనట్లుగా అది చూపించుచున్నది. అది ఖచ్చితముగా నిజము. నేడు మనకు కావలసినది ఏదనగా, సహోదరుడా ఆ పురాతన ఆరాధనా క్రమము వలె పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మము కొరకై ప్రసంగ పీఠపు పిలుపుయు జనులు ఆ ఆరాధనా స్థితికి తిరిగి వెళ్ళుటయే కావలసియున్నది ఆమేన్. సహోదరుడా, అది నిజము. ఇది కొంచెము మంటకి కందిపోయినట్లుగా అనిపించినను నేను పూర్తిగా గొప్ప అగ్నికి బలైపోవుటకంటే కందిపోయినట్లుగా కొంచెము మంట ఉండుట మంచిదేయగును.

ఒకవేళ దయ్యము నిన్ను చెరగా పట్టుకొని ఉంటే, ఇది ఉత్సవ సమయము, ఇది తిరిగి పూర్వ అనుభవమునకు రావలసిన సమయము. మరలా పూర్వమున్న బైబిలునకు తిరిగి దేవుని యొక్క శక్తి మనలో నుండి ఉప్పొంగే అనుభవము పొందు స్థలమునకు మనము తిరిగి రావలసిన సమయమిది. అది పురుషులను, స్త్రీలను, దేవుని బలపీఠమునకు పిలుచును. అది ఈ అనుభవమే వారియొక్క విడుదల కొరకు దేవుని ఎదుట సాష్టాంగపడి రాత్రంతయు ప్రార్థించునట్లుగా చేయును.

16

నేను మీకు చెప్పుచున్నాను. శ్రీమతి మెక్ పెర్సన్ గారు వెళ్ళిపోయారు, చాలామంది పూర్వకాలపు వారు వెళ్ళిపోయారు, కాని నేడు వారందరు, మహిమ అనే పైనవున్న వసారనుండి దీనిని తొంగిచూచినయెడల నేను ఇచ్చట నిలబడియుండుట ఎంత నిజమైయున్నదో అంత నిశ్చయముగా వారు దానికి “ఆమేన్”అని గట్టిగా కేకలు వేయుదురు. అది నిజము.

పలుకబడిన వాక్యము పూర్వకాలపు సాదృశ్యముగా యుండు ఖండించి చెప్పు వాక్యానుసారమైన క్రమమునకు, పూర్వకాలపు పెంతెకోస్తునకు తిరిగి వెళ్ళెదము. ఈ రోజు మనలోఎక్కువగా ఉన్నటువంటి విచిత్రమైన నాట్యములను, లైంగికముగా ఆకర్షించు నాట్యమునుండి విముక్తి పొంది తిరిగి బైబిలు నొద్దకు రావలసిన అవసరము ఉన్నది, తిరిగి పూర్వవిధానమైన పరిశుద్ధాత్మ యొద్దకు, ఎక్కడైతే పురుషులు, స్త్రీలు తమ చూపులలోను, ప్రవర్తనలోను, జీవించు విధానములోను క్రైస్తవులుగా కనపరుచుకొను స్థితికి తిరిగిరావలసిన అవసరం మనకున్నది. ఆమేన్. నేను కొద్దిగా ఉద్రేకుడనై ఉన్నాను అని మీరు తలంచవచ్చును. నేను కొద్దిగా వెర్రివానిగా ఉన్నాను, కాని నేను మీతో చెప్పుచున్నాను. నేను ఈ విధముగా ఉండటమే నాకు ఇష్టము.

కొంతకాలము క్రిందట లాస్ ఏంజెల్స్ వీధులగుండా వెళ్ళుచుండగా, ఒక మనుష్యుడు తన ముందు భాగమున ఒక పలక మీద “నేను క్రీస్తు కొరకు ఒక వెర్రి వాడిని” అని వ్రాసి తగిలించుకొని వెళ్ళుచుండగా నేను చూచితిని మరియు అతని వెనుక వీపుమీద “నీవు ఎవరి కొరకు వెర్రి వాడివిగా యున్నావు?” అని వ్రాసి తగిలించుకొనియున్న ఇంకొక పలకను కూడా నేను చూచితిని. కాబట్టి దయ్యము కొరకు వెర్రివానిగా ఉండుటకంటే, ఏ సమయములోనైన నేను క్రీస్తు కొరకు వెర్రి వానిగా ఉంటాను.

17

ఈరోజు మనకు ఏమి అవసరము? సేవకులారా! మనకు ఈ రోజు ఏమి కావాలి? సహోదరులారా, సహోదరిలారా, కేవలము ఒకే ఒక విషయము, దయ్యము మన సంఘములోనికి ప్రవేశించి, మనలను పారంపర్య అచారముల వెంబడించు వారుగాను, దేవుని విషయములో నిర్లక్ష్యమైన వారిగాను చేసి పట్టుకున్నాడు. ఒక నిజమైన మన అవసరము ఏదైయున్నదనగా మనలను పూర్వస్థితికి వెనుకకు పిలిచే పిలుపై యున్నది. మన అవసరము ఏదైయున్నదనగా ఒక ప్రాచీన కాలపు ఆరాధనా క్రమమునకు సాదృశ్యమైన దానికొరకై ఏకముగా కూడుకొన్న ఒక కూడికయు, సునాద ఉత్సవపు ధ్వనియు, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపుయు, బహిరంగ అత్మ యొక్క కుమ్మరింపుయు అవసరమైయున్నది. ఆమేన్. నిశ్చయముగా,

అదియే మనల్ని ప్రార్థనా కూటమునకు తిరిగి వచ్చునట్లుగా చేయుటకు కారణమైయున్నది.

ఇది నిజము, మనము ఇప్పుడే ప్రపంచము వలెనే సొగసును, సాంప్రదాయమును (Fashion) పొందుకోవటము ఆరంభించాము, లోకము చేయుచున్నలాగుననే మనము చేయుచున్నాము. ఇది ఎందుకిలా జరిగిందంటే హాలివుడ్ సువార్త ఎంతో ఎక్కువైపోయినది. చాలా ఎక్కువగా టెలివిజన్ కార్యక్రమములు నిండిపోయినవి. ప్రార్ధనా కూటమునకు వెళ్ళుటకు బదులుగా ఇంటిలో ఉండిపోయి రాత్రులలో టెలివిజన్లోని కార్యక్రమములను చూడటము, దేవుని వాక్యము యొద్దకు మరియు సంఘమునకు వచ్చుటకు బదులుగా వీటికి దూరముగా తొలగిపోయి “లూసీని ఎవరు ప్రేమించుచున్నారు” అనే దానిని మరియు ఇంకా అనేక వ్యర్ధమైనవాటిని దానిలో చూస్తూ టెలివిజన్కు దగ్గరైపోయిరి మరియు సహోదరుడా నేను చెప్పుచున్నాను, అదే కారణమైయున్నది. అదే సత్యము. అది మీకు తెలుసా? ఈ రోజు ఆ పాత పద్ధతిగానున్న పెంతెకోస్తు పరిశుద్ధాత్మ బాప్తీస్మము అనుభవమునకు తిరిగి రావడానికి నేడు దేవుడు మనకు సహాయము చేయును గాక!

18

ఆ విధమైన అనేక కార్యములకు కారణమేదనగా సంఘ కాపరి కూడా ఆ పూర్వపు స్థితికి వెళ్ళకుండునట్లు అడ్డుకట్టలను వేసెను. అవునండీ, జనులారా, అది ఖచ్చితము నిజము. ఎన్నుకొనుట, బయటకు ఒక పిలుపు, బయటకు తీసువచ్చే ఒక సునాద ఉత్సవము, పూర్వకాలపు నాటి ఒక ఉజ్జీవము ఇవియే మనకు అవసరమైయున్నవి. అది వాస్తవము. పాపులు తమ పాపముల నిమిత్తము కల్వరి యొద్దకు వెళ్ళుటకు కన్నీళ్ళను కార్చుకుంటూ ఆ మార్గముగుండా ముందుకు...

ఇక్కడ కొంతకాలము ముందు, ఒక పెద్ద సంఘము యొక్క సభ్యుడు, ఒక పెంతెకోస్తు సంఘశాఖ, అతడు సంఘము యొక్క సహవాసము లోనికి రావాలని తలంచాడు, అతడు దానిని బహిరంగముగా జనుల ముందు చేయదలచలేదు. డీకన్లు, అతడిని తెరవెనుకగా రహస్యంగా వారి సహవాసము లోనికి చేర్చుకొంటిరి. రహస్యంగా వెళ్ళి సహవాసములోనికి చేరే విషయాన్ని అతడు ఒక్క తన్నుతన్ని బహిరంగముగా అందరి యెదుట బలిపీఠము నొద్దకు వచ్చి యుండవలయును. ఆ విధముగానే నిజమైన పెంతెకోస్తు అనుభవం మనకు తిరిగి వెనుకకు పిలువవలసిన అవసరమున్నది. అది మనకు మళ్ళీ అవసరమై ఉన్నది. మనకు మరొక నూతన ఏంజెల్స్ ఆలయము అవసరం లేదు. మనకు నూతన సంఘములు అవసరం లేదు. ఈ రోజు నేలమీద నిలబడినటువంటి ఉత్తమమైన సంఘములలో మనము కొన్ని కలిగి ఉన్నాము. మనకు నూతన ఏంజెలస్ ఆలయము అవసరములేదు. కాని ఏంజెల్స్ ఆలయంలో మనకు ఉజ్జీవము అవసరమై ఉన్నది. ఈ రోజు పెంతెకోస్తులో ఉజ్జీవము మనకు అవసరమై ఉన్నది.

19

మనకు నూతనమైన పెంతెకోస్తు సంఘశాఖ అవసరంలేదు. వద్దండీ దేవుడు దానిని నివారించును గాక. మనకు నూతన సంఘశాఖ అవసరం లేదు. కానీ ముందే మనకు స్థాపించబడియున్నదానియందు మనకు ఒక ఉజ్జీవము అవసరమైయున్నది. ఖచ్చితముగా అదే మనకు అవసరమై ఉన్నది. ఒకపూర్వ విధానపు ఉజ్జీవము, ఇది నిజము అని దేవునికి తెలుసు.

అప్పుడు మరియొకసారి దేవుని యొక్క శక్తులు క్రిందికి కదలి రావడము మీరు చూస్తారు. ఆత్మ నింపుదల కలిగిన ప్రజలు ఆత్మ నింపుదల కలిగి వర్తమానములతో సువార్తను చాటడానికి లోకములోనికి వెళ్ళుచుండగా, ముందు దేవుని ఆత్మ కదలాడినట్లుగా ఇక్కడ కంబళి చెట్లపొదల శబ్దము ఉంటుంది. నిజానికి ఆయన చేసిన కార్యములకు మనము కృతజ్ఞులమై ఉన్నాము. ఈ అన్ని విషయముల గురించి మనము కృతజ్ఞులమై ఉన్నాము.

కాని, సహోదరుడా, సహోదరి నా భావము ఏమనగా, నేడు మరలా మనల్ని మనము ఆయన కొరకై ప్రతిష్టించుకోవలసి యున్నది. మరలా ఆత్మ కుమ్మరింపుతో మన ఆత్మలను మనము నింపుకోవలసిన అవసరమున్నది. వేలాది మంది ప్రజలు ఈ అందమైన ఆలయంలో కూడియుండగా ఇది ఈ మధ్యాహ్న కాలమున ఎంత అందమైన సమయముగా ఉండును. మనము ఇంటికి వెళ్ళుచుండగా మన హృదయములో దేవుని కొరకై తీర్మానించుకొని, మన జీవితములను మరలా మరోసారి ప్రతిష్టించుకొని, మన ముఖము కడుగుకొని, శుభ్రము చేసుకొని మరియు కేవలము మన ముఖము కాదు. మన ఆత్మను కూడా, ఈ లాస్ ఏంజెల్స్ నీళ్ళతో కాదు, కాని ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మరియు దేవునియొక్క శక్తితో కడుగుకొని మనము నూతన జీవితమును మళ్ళీ ప్రారంభించిన యెడల అది ఎలా ఉండును. గొర్రెపిల్ల రక్తములో కడుగబడి ఉండటము, అది ఈ రోజు మనకు అవసరమై ఉన్నది. అయ్యలారా, అవును.

20

ఎంత మంచి చిత్రము, ఎలాంటి సమయం, నేను మిమ్ములను ఎక్కువ సమయం ఉంచదలచడము లేదు. కాని స్నేహితులారా నేను చెప్పుచున్నాను. ఈ రోజు మనకు ఎక్కువ సమయం ఉండే మంచి పాతకాలపు కూడికలు అవసరమై ఉన్నది. ఎందుకు? వెనుక వెనుక నేను అది పెంతెకోస్తు పుస్తకములను చదివినప్పుడు వెనుక ఆరంభ దినములలో వారు రాత్రంతయు ప్రసంగము చేసిరి, రాత్రంతయు ప్రార్ధన చేసిరి. అది ఎలాంటి సమయము అయి ఉండెను. మరియు మనము అటువంటి పూర్వస్థితి నుండి వైదొలగిపోయినను ప్రారంభపు కాలములన్నింటిలో దేవుడు తనయొక్క పరిశుద్దాత్మ శక్తిని అనుగ్రహించుటకై ఎంత ప్రీతిగలవాడై యుండెనో ఆ విధముగానే నేడు కూడా సంఘమునకు ఆయన యొక్క పరిశుద్ధాత్మను మీపై కుమ్మరించుటకు ఆయన అంత ప్రీతి గలవాడైయున్నాడు. నీవు దానిని అంగీకరించే హృదయము నీకు యుండిన యెడల అదే ఆత్మను కుమ్మరించుటకు ప్రతీ వర్షపు ఊటను పూర్తిగా నింపివేయగల దానిని దేవుడు కలిగియున్నాడు. అది నిజము. ఆమేన్.

మనము సూచనలను, అద్భుతములను చూచాము. పరిశుద్ధాత్మ యొక్క అన్ని ప్రత్యక్షతలనుబట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. భాషలతో మాట్లాడు ప్రతివ్యక్తి గురించి దేవునికి వందనాలు. భాషలకు అర్ధము చెప్పు ప్రతివ్యక్తి గురించి దేవునికి వందనాలు, ప్రతి విధమైన స్వస్థతను బట్టి, ప్రతివిధమైన ప్రవచనమును బట్టి, దేవుడు చేసిన ప్రతి దానిని బట్టి ఆయనకు వందనాలు. ప్రతి సంఘకాపరికి, సువార్తికుడికి ఆయన శరీరము యొక్క ప్రతి సభ్యుడిని బట్టి దేవునికి వందనాలు నేను చెల్లించుచున్నాను.

కాని నేడు మరొకసారి మనలను దేవుని కొరకై ప్రతిష్టించుకొనుటయు, ఆయనను ఆరాధించుటకై ఏకముగా కూడి వచ్చుటయు, మరలా పూర్వకాలపు స్థితికి తిరిగి వెళ్ళుటయే మనకు కావలసియున్నది. అంతేకాకుండా సహోదరుడా మనము దానిని చేయకపోయిన యెడల ఇంకో ఏబది సంవత్సరములు లేదా.. ఆయన అంత ఆలస్యంచేస్తూ వేచి యుండడు. ఇంకొక పది సంవత్సరములు ఆలస్యం చేస్తూ మనము ఇచ్చట వుంటూ ఇంకా కూడా మనము త్వరపడి ఏకముగా ఆరాధించుటకు కూడుకొనకుండా, పూర్వకాలపు ఖండించి సరిదిద్దు ప్రసంగపు వాక్య క్రమములలోకి మరలా తిరిగి రానియెడల అది ఏమగును? పూర్వకాలపు అజూస వీధియొక్క పెంతెకోస్తు ఉజ్జీవమునకు మరలా తిరిగి రండి. దానిని మనము పొందే తీరవలయును.

యేసుక్రీస్తు మన కొరకు ఎంత మహిమకరమైనవాడో ఒకవేళ ఆలోచించిన యెడల, ఆయన మనకొరకు ఏమి చేసాడో ఆలోచించినట్లయిన ఏ విధముగా ఆయన ఎవరునూ నశించుట ఉద్దేశించక, అందరూ మారు మనస్సు పొందవలెనని ఆయన ఎంత దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడనే దానిని గూర్చి గ్రహించగలరు.

21

కొంతకాలము ముందు నేను ఉన్నటువంటి చిన్న పట్టణములో మేము ఒక కూడిక నిర్వహించుచుంటిమి. ఒక మంచి చిన్న స్థలమందు నేను భుజించుచుంటిని. మరియు నేను గమనించగా,అది ఒక ఆదివారమైనందున వారు దుకాణమును మూసివేసి ఆలయమునకు వెళ్ళిరి. వారి సహోదర (Church of the Brothern) సంఘం అనే సంఘమునకు చెందినవారు. మరియు ఆ మధ్యాహ్న సమయమునందు లేదా మధ్యాహ్నాభోజన సమయమునకు తర్వాత నాకు ఆకలి వేస్తున్నట్లుగా అనిపించి ఒక రొట్టేలో పెట్టిన మాంసము(Sandwich)ను భుజించాలని నేను తలంచితిని. ఒక చిన్న మామూలు భోజనశాలకు వెళ్ళాలని నేను వీధి గుండా వెళ్ళుచుంటిని. అచ్చటికి వెళ్ళటము నాకెంతో అవమానకరముగా యుండినది. అచ్చటయుండే జూదమాడే యంత్రము ద్వారా చట్టమే జూదమాడుచున్నది. (చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే జూదమాడు చుంటిరి, తర్జుమాదారుడు) ఆ రాష్ట్రమందు జూదమాడటము చట్టరీత్యా నేరమగును. కాని చట్టమే ఆ జూద మాడుచుండగా.

ఇప్పుడు, అది మనదేశ చట్టమును ఎంత దిగజార్చెనో మీరు చూడ వచ్చును. దానిని చూచుటకు నా కళ్ళకు ఏలాగు ఉన్నదంటే, దానిని మీరు అర్థం చేసుకోగలరు. మన చట్టం అంటే మనము ఎంతో మర్యాద నిచ్చుచున్నాము, ఆ చట్టమును చక్కగా కాపాడవలసిన ఆ చట్టమే చుట్టూ తిరిగి కళ్ళముందే ఆ జూదమాడే యంత్రమునందు జూదమాడుచున్నది. అట్లే ఒక క్రైస్తవుడు లోక పోకడలను అనుసరిస్తూ జీవించుచుండిన యెడల ఒక అవిశ్వాసి, కూడా అదే విధముగానే దానిని చూచును.

22

దాని యొక్క ప్రభావము వారిపై చూపిస్తూ ఆ ప్రభావమునకు వారు గురియగుదురు. నేను ఇంకొక వైపుకు తిరిగి చూచినప్పుడు, చాలా నీచముగా వస్త్రములను ధరించుకొనియున్న ఒక యవ్వన స్త్రీని గమనించితిని. మరియు ఆమె ఆ బల్లయెద్దకు వచ్చి వేచి యున్నప్పుడు, అచ్చటయున్న బాలురు ఆమె యొద్ద నీచముగా ప్రవర్తించే విధానము ఏ విధముగాయున్నదంటే...

నా కుడి ప్రక్కన ఒక వృద్ధురాలు కూర్చునియుండెను. ఆమెకు నా అమ్మమ్మ వయస్సు యుండును. ఆమె చాలా నీచమైన వస్త్రములను ధరించుకొని, చాలా అసభ్యముగా ప్రవర్తించుచూ, పెదవులపై ఒకరకమైన నీలి రంగులోయుండు రంగును పూసుకొని కూర్చొనియుండెను. ఒక మామూలు స్త్రీ ఎవరూ పెదవులకు రంగుపూసుకొనరు అనేది అందరూ ఎరుగుదురు. కాని ఆ పెదవులు నీలిరంగులో కనబడవలెనని తన పెదవులపై రంగులను పూసుకొని మరియు తన కనురెప్పలపై ఆమె రంగును పూసుకొనినది. ఆమె ఇద్దరు వృద్దులతో అచ్చట కూర్చొనియున్నది. “నా దేవా ఏ విధముగా ఇటువంటి కార్యములను చూస్తూ ఉండగలుగుచున్నావు” అని నేను తలంచితిని.

మరియు ప్రభువు నన్ను తలుపు వెనుకకు పిలిచెను. నేను ఒక దర్శనము చూచితిని. లోకము గుండ్రముగా తిరగడమును నేను చూసాను. నా పాపములు, ఇతరుల పాపములు ఒక్కొక్కటిగా కనబడుచూ పోవడము నేను చూసాను. “దేవా, ఆ స్థలమును తుడిచివేసి అచ్చట దానిని లేకుండా ఎందుకు చేయకూడదు? ఏ విధముగా వీటన్నింటిని చూస్తూ సహించగలుగుచున్నావు” అని తలంచితిని.

23

అంతట, వెంటనే లోకము చుట్టూ రక్తవర్ణమైన ప్రవాహము ప్రవహించటము చూచితిని. ప్రభువైన యేసు అక్కడ నిలబడి ఎంతో కనికరముతో ఈ భూమి వైపు క్రిందికి తొంగి చూడడము నేను చూచితిని, నా పాపములు ఆయన వద్దకు వెళ్ళుచుండగా ఆయన రక్తము దేవుని ముందు ఒక రక్షణ కవచములా వాటిని అడ్డుకోవడము నేను చూసాను. అవి ఆయన యొద్దకు రాలేకపోయెను. నేను పాపము చేసిన ప్రతిసారి ఆయన రక్తము దేవుని తీర్పులకు మరియు నాకు మధ్యన నిలుచుచుండటము నేను చూచితిని. నేను ఆయన వద్దకు వెళ్ళి ఈలాగు చెప్పితిని, “ప్రభువా నా పాపములు దానిని చేయుచున్నవా?” “అయితే నన్ను క్షమించుము దేవా, వాటిని చేయవలెననే ఉద్దేశ్యముతో నేను వాటిని చేయలేదు” అని దర్శనములో ఆయనతో చెప్పితిని.

ఆయన తన చేతిని ప్రక్కకు చాచి నా పేరు వ్రాయబడిన ఒక చిన్న పుస్తకమును తీసెను. అందులో పూర్తిగా పాపములను గురించి వ్రాయబడి యున్నది. మరియు దానిపైన “క్షమించబడినది” అని పుస్తకము మీద అడ్డముగా వ్రాయబడి ఆయనకు వెనుకయున్న మైమరుపు అనే సముద్రములో దానిని విసిరివేసెను. “ఇప్పుడు నీ పాపములు నేను క్షమించియున్నాను. కాని ఆ స్త్రీ గురించి నీవు ఏమి చెప్పుచున్నావు” అని ఆయన నాతో అనెను.

నేను దర్శనములోనుండి బయటికి వచ్చినప్పుడు, నేను ఆమె వద్దకు వెళ్ళి, కూర్చొని “ఓ స్త్రీ, నీవు ఎప్పుడైనా క్రైస్తవురాలుగా ఉంటివా? అని అడిగాను,

“దానిని ఎందుకోసము అడుగుచున్నావు?” అని ఆమె అన్నది.

24

నేను ఆమెతో మాట్లాడడము ప్రారంభించాను. సంఘములోనికి ప్రవేశించిన కొన్నిహృదయములను కలిచివేసే కథనములను ఆమె నాతో చెప్పినది. అందువలన ఆమె సంఘమును వదలి వెలుపలికి వచ్చినది. ఆమె ఒక తప్పుడు మార్గమును ఎన్నుకొని వెళ్ళటము ప్రారంభించినది. ఆమెకు ఇద్దరు కుమార్తెలుండిరి. వారు మంచి స్త్రీలై ఉండిరి. ఆమె ఏవిధముగా ఆ మధ్యాహ్నమున ఆ ఇద్దరు త్రాగుపోతు పురుషుల వద్ద కూర్చుండినది, ప్రభువు నాకు చూపించినది, ఆయన ఆమెను ఇంకా ఎంతగా ప్రేమించుచున్నాడనునది ఆమెకు నేను చెప్పాను. నేను ఆ బల్లయొద్దకు వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని, “స్త్రీ, నీవు ఏమి చేస్తావో నేను పట్టించుకోను. క్రీస్తు ఇంకా నిన్ను ప్రేమించుచున్నాడు”అని ఆమెతో చెప్పెను.

వెంటనే ఆ స్త్రీ ఆ బల్లయొద్దనుండి ఆ ప్రదేశము మధ్యలోనికి వెళ్ళినది. రక్షక భటులు మరియు అందరు వారి టోపీలను తీసివేసారు, మరియు మేము పూర్వకాలమున ఏ విధముగా దేవునిని ఆరాధించెడి వారమో ఆ విధముగా అచ్చట అందరము ప్రార్ధనా కూటమును జరుపు కొంటిమి ఆమె ఆ నీచ జీవితము నుండి విడుదలను పొందుకొనెను. స్నేహితులారా అది ఒక విడుదల. ఉత్సవ సునాదము కొనసాగుచున్నది. పురుషులు, స్త్రీలు, క్రీస్తు నొద్దకు తిరిగి రావడానికి ఇదే సమయము.

25

ఇక్కడ, కొద్దికాలం క్రితం, స్విట్జర్లాండ్ పట్టణంలో ఆర్నాల్డ్ వోన్ వింకిల్ రీడ్ గురించి ఆలోచిస్తూ ఎతైన పెద్ద పర్వతములలో నేను నిలిచియుంటిని, మీలో చాలా మందికి ఆ కథ తెలియును. చాలా సంవత్సరముల క్రితం స్విట్జర్లాండ్లో అతను ఎంత సాహసముగల వీరుడై యుండెను. మరియు ఆ స్విస్ దేశముపైకి ఏ విధముగా గొప్ప సైన్యము ద్వారా దండెత్తింపబడెను మరియు అనేక పట్టణములు పట్టబడగా ఆ స్విస్ ప్రజలు ధైర్యముతో వారిలోయున్న రక్తము ఉప్పొంగుచూయుండగా వారు తమను కాపాడుకొనుటకై వారియొద్ద కలిగియున్న అతి అల్పమైన ఆయుధములతోనే ఆ గొప్ప సైన్యమును ఎదురించుటకై ఆ పర్వతములో నుండి లోయవరకు ఏ విధముగా ఏకముగా కూడునట్లు చేసినది.

వారు ఆ మైదానములో నిలబడి తమ శత్రుసైన్యము దగ్గరకు రావడము చూచినప్పుడు, వారు ఆ గొప్ప సైన్యమునకు దగ్గరగా వెళ్ళినప్పుడు వారిలో ఒక్కడు ఏబది మందికి సమానముగా ఉండటము గమనించిరి మరియు వారు సైనికులు కాదు, వారు తర్పీదు పొందలేదు. ఏమి చేయాలో వారికి అర్థమవ్వలేదు. కాని దండెత్తుతున్న ఆ సైన్యము బాగుగా తర్ఫీదు పొందియుండిరి. ప్రతి మనుష్యుడు ఇటుక గోడలవలె వచ్చుచుండెను.

26

మరియు వారు వారి బల్లెములతో నిలువబడినప్పుడు, వారిలోనుండి ఆర్నాల్డ్ వోన్ వింకిల్ రీడ్ అనే ఒక గొప్ప వ్యక్తి రెండడుగులు ముందుకేసి బయటకు వచ్చెను. అతడు ఆ విధముగా వారి మధ్యనుండి రెండడుగులు ముందుకేసి బయటకు వచ్చిన సమయమున, వారు ఇక తాము సమస్తమును కోల్పోతాము అనే భావనతో వారిలో ఏ నమ్మకము లేనివారుగా కనబడిరి. చాలా సులభముగా తాము ఓడిపోతామనియు, తమ గృహములను కోల్పోతామనియు, కుటుంబములోని వారు చంపబడతారనియు, వారియొక్క పిత్రార్జిత ఆస్తిపాస్తులు నాశనమగుననియు, వారు ఎరిగినా వారు చేయగలిగినదేమియు ఇక వారి చేతిలో ఏమీ లేదనియు వారు నమ్మకమును కోల్పోయిన వారుగా అచ్చట నిలబడియుండిరి.

ఆర్నాల్డ్ వోన్ వింకిల్ రీడ్ బయటికివచ్చి ఈలాగు చెప్పెను “స్విస్ సహోదరులారా, ఈ రోజు స్విట్జర్లాండ్ కొరకును, స్వదేశము కొరకును నా జీవితమును ఇచ్చుచున్నాను.”

వారు అన్నారు “నీవు ఏమి చేస్తావు.”

“లోయలోని క్రింది భాగములో నాకొక ప్రియమైన చిన్న ఇల్లు ఉన్నది, నేను తిరిగి వస్తానని నా భార్య, నా చిన్న పిల్లలు నా క్రొరకు ఎదురు చూస్తున్నారు. కాని వారు నన్ను మళ్ళీ ఎప్పటికీ చూడరు. ఎందుకంటే ఈ రోజు నా ప్రాణమును నా దేశము కొరకు సమర్పిస్తాను.”

ఆయన అలా చెప్పినప్పుడు “నీవు ఏమి చేసెదవు” అని వారు అడిగిరి.

అతడు అన్నాడు “ఇప్పుడు, మీలో ఆయుధములు కలిగిన ప్రతి ఒక్కరూ రండి, నన్ను వెంబడించి మీరు చేయగలినంత శ్రేష్టమైన దానిని మీరు చేయుడి, మీరు కలిగియున్నదానితో పోరాడుడి. మీరు కలిగియున్న దానితోనే మీరు ఏమి చేయగలరో దానినంతా చేయుడి.

27

అతడు తన ఆయుధమును పైకి లేవనెత్తి, “స్వేచ్చ కొరకు మార్గము సరాళము చేయుడి” అని బిగ్గరగా కేకలు వేసుకొంటూ ఆ సైన్యము వైపునకు వెళ్ళెను. బళ్ళెములు ఎక్కువగా ఉన్నచోటికి అతడు వెళ్ళెను. అతడు వారి యొద్దకు వెళ్ళినప్పుడు వందలకొలది తలుక్కుమని మెరయు బళ్ళెములు అతడిని పట్టుకొనుటకు వచ్చెను. అతడు తన హస్తములు పైకి ఎత్తి “స్వాతంత్ర్యము కొరకు మార్గమును సరాళము చేయుడి” అని నినాదము చేస్తూ ముందుకు దూసుకుపోయెను. అతడు వారి చేతులనిండా ఉన్న బళ్ళెములను లాగుకొని తన రొమ్ములోనికి వాటిని దించుకొనును. మరియు అతడి వెనుక ఆ స్విస్ సైనికులు అతడిని వెంబడించిరి. అతడు శత్రువు యొక్క ఉన్నత శ్రేణిని విరుగగొట్టెను. మరియు ముందెన్నడూ పొందలేని విజయమును వారు పొందియు౦డిరి.

మరియు ఈ రోజు అతడి పేరును నీవు స్విట్జర్లాండ్లో ప్రస్తావించిన యెడల, వారి కన్నులు కన్నీరుతో రంగు మారును, వారి బుగ్గలు. వారి వీరుని కొరకు ఉప్పొంగును. నా అభిప్రాయము ప్రకారము సైనికుల జీవిత చరిత్రలోనే అతడొక గొప్ప యోధుడుగా గుర్తించబడ్డాడు. కాని అది కేవలము ఒక చిన్న విషయము, కేవలము చిన్నది. ఒకరోజు ఆదాము యొక్క కుమారులు ఓడిపోయి నిలిచియుండిరి. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, ప్రతి ఒక్కటి తప్పిపోయెను. మనము చేసిన ప్రతి విధానము తప్పిపోయెను. మహిమాంతరములో దేవుని కుమారుడు అనబడెడు ఒకాయన బయటికి వచ్చెను. దేవదూతలు “నీవు ఏమి చేస్తావు” అని అన్నారు.

ఆయన అన్నాడు “నేను క్రిందికి వెళ్ళి నా ప్రాణమును అర్పిస్తాను. మరియు ఈ రోజు పడిపోయిన ఆదాము కుమారులను విమోచిస్తాను.”

28

మరియు ఆయన కల్వరికి వచ్చెను. బళ్ళెములు అధికముగా ఉన్న వాటి యొద్దకు వెళ్ళెను. మరణకరమైన లోయలో నుండి ప్రయాణించి ప్రతి విధమైన దయ్యపు బళ్ళెములను లాగుకొని తానే తన స్వంత రొమ్ముల లోనికి వాటితో పొడుచుకొనెను. సంఘమువైపు చూస్తూ మీరు మీ యొద్ద కలిగియున్న దానితో మీ వలన చేయగలిగిన శ్రేష్టమైన దానిని మీరు చేయండి అని అనెను. దేవునికి స్తోత్రము, పెంతెకోస్తు దినము నాడు పరలోకము నుండి ఒక గొప్ప బలమైన గాలి ప్రతి మనుష్యుడిపై కుమ్మరి౦పబడి వారిని ఒక ఆయుధమును ధరించుకొనునట్లు సిద్ధము చేసెను.

మరియు సహోదరులారా ఈ రోజు నేను చెప్పుచున్నాను, ప్రతిమనుష్యుడు, మీ యొద్ద ఏమేమి ఉన్నవో ఆ ఉన్నదానితోనే మీరు కలిగియున్న వాటితోనే శ్రేష్టమైన దానినిచేయండి. చివరి వ్యక్తి వరకు పోరాడుదము, ఎందుకంటే శత్రువు యొక్క వరుసలు విరుగగొట్టబడి యున్నాయి. క్రీస్తు సాతానుని ఓడించెను. అంత వరకు వాడి వద్ద ఉన్నవాటినన్నింటిని ఆయన పనికిమాలినవిగా చేసెను, ఈ రోజు అతడు కేవలము వ్యర్ధుడై వాడి దగ్గర అసలు ఏమిలేని ఒట్టి చేతులతో వుండే వాడుగాయున్నాడు. అతడు అబద్ధికుడుగా వున్నాడు. వాడు మీ యొద్దకు వచ్చి ఆ పూర్వకాలపు పరిశుద్ధాత్మ యొక్క బహిరంగ ఆత్మ కుమ్మరింపు అనేది ఇక మీదట కుమ్మరింపబడదు అని అబద్దమాడతాడు. కాని మనము నేడే దానిని కలిగియున్నాము. ఎందుకంటే శత్రువు యొక్క తాడులు విరుగగొట్టబడ్డాయి. మరియు దేవుడు ఈ రోజు పాలించుచూ పరిపాలిస్తున్నాడు. హల్లేలూయ ! సజీవుడైన దేవుని యొక్క పూర్వకాలపు పరిశుద్ధాత్మ అనుభవము కొరకై నేను ఆనందముగా ఉన్నాను.

29

ఈ గొప్ప యోధుడు అనే క్రీస్తు శత్రువుయొక్క మార్గమును ఏ విధముగా నాశనము చేసివాడు చిత్తుగా ఓడిపోయి పారిపోవునట్లు చేసెను. మరియు ఆ పెంతెకోస్తు దినమున ఆ సహోదరులు ఆ 50 మందిగా ఉన్నప్పుడు . అచ్చట ఏబదియవ సంఖ్యలో ఏదో ఒక ప్రత్యేకతను కలిగియున్నది, అది ఒక సునాద ఉత్సవమును తెచ్చునదై యున్నది. అచ్చట వారు శత్రువు యొక్క మార్గమును నాశనము చేయుట వలన నేను మరియు మీరు మళ్ళీ ఆ పూర్వకాలపు పెంతెకోస్తు ఉత్సవమును పొందుకోగలమనే దానిని స్పష్టమైన ఒక సాదృశ్యమును వారు మనకొరకై ఉంచి వెళ్ళిరి.

సహోదరులారా, మరియు సహోదరిలారా ఆలస్యమగుచున్నది. మీరు తలంచుకొన్నదానికంటే ఆలస్యమగుచున్నది. ఫిన్లాండ్లో సహోదరులు మూర్ చెప్పినట్లుగా, యుద్ధము ముగిసిన వెంటనే మేము అక్కడ ఉంటిమి. వారు రాత్రింబవళ్ళు పని చేయుచుండిరి. స్త్రీలు నేలను దున్ని నునుపు చేయు సాధనములు (నాగలి) తీసుకొని పొలమునకు పోవుచుండిరి. వారు నేలను దున్నటకు ఎక్కువ సమయమును వృధా చేయకుండా వారు నాగలి తీసుకొని దానిని లాగుకుంటూ నేలను దున్నుచూ పోవుచుండిరి. చలికాలము వచ్చుచుండెను. చిన్నపిల్లలు రాత్రింబగళ్ళు పనిచేసిరి. వారి తల్లిదండ్రులు రాత్రి సమయమునందు నేలను దున్నుచున్నప్పుడు వెలుగు కొరకు వారి ముందుగా లాంతరు దీపము పట్టుకొని ముందుగా నడుచుచుండెడివారు. సాధ్యమగునంతవరకు ఆ విత్తనము చాలా లోతుగా పెట్టి నాటుటకు వారు నేలను బాగా దున్నెడివారు. ఒకవేళ విత్తనమును సరిగ్గా లోపలికి నాటక పోయిన యెడల మంచుకాలమందు మంచు ఆ విత్తనముపై పడి చలివలన చల్లదనము ఆ విత్తనమును పట్టుకొని నాశనమైపోతే వారందరూ రాబోవు సంవత్సరమునందు ఆకలితో అలమటిస్తూ నాశనమైపోవలసినదే. కాబట్టి వారు నేలను దున్ని లోతుగా విత్తనమును నాటవలసియుండెను.

30

సహోదరుడా మరియు సహోదరీ మనము త్వరితముగా నేలను దున్ని దేవుని యొక్క విత్తనమును నేలయందు నాటనియెడల అది ఎలాంటి కోతకాలంగా ఉండబోతుంది? మనము మరియొక పాత పద్ధతిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ముందుకు పోవాలి. పురుషులు, స్త్రీలు తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలి. మనము తిరిగి పూర్వపు ఉజ్జీవమునకు, దేవుని వాక్యము నొద్దకు, విత్తనము వద్దకు వెళ్ళినట్లైతే ఆ దేశము, ఈ సంఘము, పెంతెకోస్తు మరియు సమస్తమును మనము కోల్పోము. ఈ రోజు నీవు దానిని నమ్ముచున్నావా? దేవుడు దానిని కుమ్మరిస్తాడని నీవు నమ్ముచున్నావా?

ఓ, మై! నేడు ఈ ప్రజల ఎదుట దీనిని నేను వ్యక్తపరచినందుకు నా ఆత్మలో నేను చక్కటి అనుభూతిని పొందుచున్నాను. ఇక్కడ ఈ భవంతిలో ఉన్న ప్రతి ఒక్కరు మన జీవితములను తిరిగి దేవునికి సమర్పణ చేసుకొన్నట్లయితే, దేవుని ముందు కనపడడానికి తనను, తన ప్రజలను శుద్ధి పరుచుకొమ్మని ప్రభువు యాకోబుకు చెప్పినట్లుగా మనము మన చెడు ఆలోచనల నుండి శుద్ధి చేసుకొన్నట్లయితే, మన ప్రతి స్వార్థము నుండి, మన ప్రతి చాడీలు చెప్పుట నుండి, మన ఈ జీవితము యొక్క ప్రతి క్రియల నుండి మనలను మనము శుద్ధిచేసుకొన్నట్లైతే మనము ధైర్యముగా దేవుని సింహాసనము ఎదుటకు వచ్చినయెడల, ఈ దివ్యమైన ఏంజెల్స్ ఆలయమునందు పూర్వకాలపు ఆత్మ కుమ్మరింపు ఉజ్జీవము ఇప్పుడే ఇక్కడే ఆరంభమగునని, అది ఒక వారము రోజులు ఎడతెగక కొనసాగునని నేను నమ్ముచున్నాను. అది సత్యము. అది అలా కొనసాగుతూనే యుండును. నీవు దీనిని నమ్ముచున్నావా?

31

మనము మన పాదముల మీద కొద్దిసేపు నిలబడుదము. ఏ విధమైన ప్రదేశములో మీరు ఎప్పుడు బలిపీఠపు పిలుపు చేయలేదు. దానికి కావలసినంత స్థలము ఇక్కడ లేదు. కానీ మీ హృదయమే మీ బలిపీఠము. మీ హృదయమే దేవుని నివాస స్థలము. పరిశుద్ధాత్మను పొందనివారు ఇంకా ఇక్కడ ఉన్నారంటే నేను ఆశ్చర్యపడుతాను. ఈ గొప్ప విషయములన్నియు జరగటము మీరు చూచి, ఇంకా మీరు పొందుకోకపోతే, మీరు మీ చేతులెత్తి “దేవా నేను పరిశుద్ధాత్మ బాప్తీస్మము పొందాలని అనుకుంటున్నాను” అని చెపుతారా. మీరు మీ చేతులను ఎత్తుతారా. ఇక్కడ అంతయు, వసారలో ఉన్నవారు ప్రతిచోట ఉన్నవారు. దేవుడు మిమ్మును దీవించును గాక.

క్రీస్తును మీ యొక్క వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించని వారు ఇంకా ఎంతమంది ఇచ్చట వున్నారు? మీ చేతులను పైకి ఎత్తగలరా? మీరు మీ యొక్క నిత్య జీవపు గమ్యమునకు చేరుటకొరకై దేవుని ఎదుట మీ చేతులను ఎత్తుటకు తగునంత శ్రద్ధను కలిగియున్నారా? మీరు దానిని చేయుదురా? దేవుడు మిమ్మలను దీవించును గాక?

32

ఇచ్చట వున్నవారిలో ఇంతకుముందే పరిశుద్ధాత్మను పొందుకొనియుండి, ఈ రోజు మరలా నూతనముగా మీ యొక్క జీవితములను క్రీస్తు కొరకు ప్రతిష్టించుకొనుటకు ఇష్టపడుచున్నారా? మీరు మీ చేతులను పైకి ఎత్తుతారా? ప్రభువైన దేవుడు మిమ్మలను దీవిస్తాడు. నేను నమ్ముచున్నాను. ప్రభువు అంగీకరించు సంవత్సరము ప్రకటించబడిన తరువాత ఆలయంలో వారు పెంతెకోస్తునాడు సమకూడినప్పుడు, వారు విశ్వాసులై ఉండిరి. వారు ఏక మనస్సును కలిగి దేశములోని పలుప్రాంతములలోని వారు ఏక మనస్సుతో ఈ ప్రదేశములో మధ్యాహ్న సమయమునందు ఒక కూటముగా ఈ ఆలయము నందు కూడియుండుట ఎంత ఖచ్చితము దానికి ఇది పోలికగా యున్నది. అందరూ ఏకమనస్సుతో కలిసి ఒకే స్థలము యొద్దకు వచ్చి సమకూడుకొనిరి. కొద్దిసేపటికి ముందుగా ప్రసంగించబడిన వర్తమానమును విని ఈ మధ్యాహ్నసమయమునందు బహిరంగముగా పరిశుద్ధాత్మ మనమధ్య దిగి ఆత్మను కుమ్మరింపబడుట ఎంత అద్భుతమైన సమయముగా ఇది యున్నది.

ఒకవేళ దేవుడు భాషలతో మాట్లాడు వరమును నీకు ఇచ్చినట్లయితే దానిని చేయుము. భాషలకు అర్థము చెప్పు పనిని ప్రభువు నీలో ఉంచినట్లయితే దానిని చేయుము. సాక్ష్యమిచ్చు పనిని నీకు అప్పగించిన యెడల దానిని చేయుము. ప్రసంగించు పరిచర్య మీ హస్తములో ఉంచినట్లయితే ప్రసంగించుము. నీ యొద్ద నీవేమి కలిగియున్నావో, దానితో ముందుకు కొనసాగిపొమ్మ క్రీస్తు అడ్డు గోడలను విరుగగొట్టి యున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు సంపాదించి ఇచ్చిన ఆ విజయమును పొందుకొనుటకు ముందుగా వెళ్ళిదానిని పొందుకొందాము. మనము మన చేతులను దేవునివైపు ఎత్తి దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిద్దాము.

33

పరలోకమందున్న మా తండ్రీ, పరిశుద్ధాత్మయొక్క కుమ్మరింపుకై ఈ రోజు మీకు వందనాలు. ప్రజలమధ్య ఒక గొప్ప కూడిక కొరకు, ఒక గొప్ప కదలిక కొరకు ప్రభువా మేము మిమ్మల్ని నమ్ముచున్నాము. ఈ రోజు ఈ ఆశీర్వాదములు దయచేయుమని నిన్నుఅడుగుచున్నాము. దేవా, యేసు నామములో వారు గొప్ప సహవాసపు సమయమును చూచుదురుగాక.

రేడియో ద్వారా వినుచున్న ప్రజలగు మీరు, ఇచ్చటయున్న ఐదువేల మంది కంటే ఎక్కువగాయున్న జనులు తమ చేతులను పైకెత్తి ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించు దానిని మీరు చూడవలయుననిన యెడల మీరు ఇచ్చట ఉండవలయును. మేము ఇచ్చట పూర్వకాలపు సునాద ఉత్సవమును కలిగి యున్నాము. సంఘ శాఖలను వదిలి బయటకు రండి, వచ్చి మాతో కలుసుకోండి. ప్రతీ ఒక్కొక్కరు ప్రభువును స్తుతించుచున్నారు. మరలా ఆ పూర్వకాలపు దైవభక్తితో దేవునికి స్తుతులను అర్పించుచున్నారు. మనము జీవించుచున్న ఈ అధునాతన లోకములో పురుషుల క్రియలు నీచముగాను, వారియొక్క మనస్సులు చెడు తలంపులతో నిండిపోయి వంకరగా వుంటూ, ఎక్కడ చూచిన లైంగికపరమైన బలాత్కారపు నేరములతో నిండిపోయి తారుమారైపోయిన ఈ సమస్త వాటి మధ్య అధునాతన లోకములో యున్నను దినదినము, రాత్రి తరువాతి రాత్రి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించుచునే యున్నాడు. అంతేకాకుండా సరిగ్గా ఇచ్చట ఇప్పుడు కూడా ఈ ఏంజలస్ ఆలయము వరకు మన మధ్యన పరిశుద్ధాత్మగలదు. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించుటకై ఎంత అద్భుతముగా ఆయన ఇచ్చట యున్నాడు.

34

రేడియో ద్వారా వినుచున్న మీరు (నేను మట్లాడుచున్న ఈ ప్రసంగము ఇంకా రేడియోలో ప్రసారము అగుచున్నదో లేదో నాకు తెలియదు) కాని, రేడియో ద్వారా ఆలకించుచున్న మీరు, దేవుని ప్రజల యొక్క ఇటువంటి ఒక గొప్ప కూడికను, ఇటువంటి ఒక ఆత్మ యొక్క ఐక్యతను మరియు ఇచ్చట ఏమి జరుగుచున్నదనే దానిని మీరు వచ్చి చూడవలయును. పలురకముల సంఘశాఖల యొక్క అడ్డుగోడలన్నియు తునాతునకలై పోయినవి. ఏక హృదయముతో మరియు ఏకాత్మతో ప్రతీ ఒక్కొక్కరు యేసుక్రీస్తును స్వీకరించుచున్నారు. ఓ! ఎంతటి అద్భుతమైన సమయమిది. మనము మన హృదయములను తెరచెదము. మన చేతులను, మన స్వరములను పైకెత్తెదము. మన హృదయములను క్రీస్తుకు సమర్పించుకొని పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకొని మరియు ఆత్మ కుమ్మరింపుతో మనము నింపబడెదము.

మీరు దీనిని పొందుకోవాలని నిర్ణయింపబడి ఉంటే, మీకు నిజముగా ఇది కావలసి ఉంటే, మీరు దానిని పొందక ముందు దానికొరకు, ఆకలి, దప్పికగలవారై ఉండాలి. ఎందుకంటే బైబిలు అంటున్నది, “నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు.”

35

[రేడియో కె.ఎస్.ఎఫ్.జి. ప్రకటన ప్రకటించువారి ద్వారా ఇవ్వబడినది -సంపాదకులు].... నీ దేశము, పరలోకమందున్న మా తండ్రి, మేము రేడియోలను ఆపివేయుచుండగా పరిశుద్ధాత్మడు ఈ పట్టణములో అగ్నిని మండించి, దేశమంతటనూ మమ్ములను తిరిగి పూర్వపు పరిశుద్ధాత్మ ఉజ్జీవమునకు తెచ్చునని, కూడికలలో దేవుని ఆత్మ దిగివచ్చునని ప్రార్ధించుచున్నాము. ప్రతిచోట రోగులను, బాధపరచబడిన వారిని స్వస్థపరచుము. ప్రభువా, పరిచర్యలనుండి మహిమ పొందుము. యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్....

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...