ఎర్రబారుచున్న ఒక ప్రవక్త

ఎర్రబారుచున్న ఒక ప్రవక్త

VGR COUNT -121 ఇప్పుడు మన ప్రభువు, ఎర్రబారుచున్న ఒక ప్రవక్త అను ఈ అంశమునకు తన దీవెనలను తోడు చేయును గాక! ఈ ఉదయ కాలమునందు వాడబడిన అంగీని ధరించికొనియున్న ఒక ప్రవక్తను గురించి మనము ధ్యానించబోవుచున్నాము. (ఏలీయా ప్రవక్త తన అంగీని ఎలీషాకు యిచ్చెను - తర్జమాదారుడు). అటువంటి వాక్యభాగమును గురించి ఈ రాత్రి మనమెరుగుదుము. అటువంటి అంగీని ఈ ఉదయకాలమున మనము కూడా ధరించవలసియున్నది. అది ఒక వాడబడిన అంగీయైయున్నందుకు నేనెంతగానో సంతోషించుచున్నాను. ఇప్పుడు మనము దరించుచున్న అంగీని బట్టి క్రీస్తు యేసు ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడియున్నాము.

ఏదో ఒక మానవ-కల్పిత సిద్ధాంతము వంటి చిమ్మట పురుగులు తినివేసే అంగీని మనము ధరించుకొనుటలేదు. అటువంటి దానిని చిమ్మెట పరుగులు, వేరే విధమైన పరుగులు మరియు మొదలగునవి వాటిని తినివేయును. వారు ఈ విధముగా చెప్పుచున్నారు, అద్భుతములు జరుగు దినములు గడచిపోయినవి, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడు మన మధ్యలేదు. కాని మనము ఆయన యొక్క నీతియను వస్త్రమును ధరించుకొనియున్నాము.

2

[టేపులో ఖాళీగా యున్నది.] ... మన యొక్క స్వకీయ బలము కాదు గాని, అది యేసుక్రీస్తు యొక్క బలమైయున్నది. నేను యోర్దాను గుండా వచ్చునప్పుడు, ఆయన యందు నమ్మికయుంచి, ఆయన యొక్క అంగీని ధరించవలెనని నేను ఆశించుచున్నాను. “మరణము” అనే ఆ భయంకర నీడవంటి ద్వారము మన అందరి ముందు ఉంచబడియున్నది. మన గుండె కొట్టుకొనే ప్రతి ఆ గొప్ప అగాధము యొద్దకు ఒక అడుగు ఇంకా దగ్గరగా మనము సమీపించుచున్నాము. ప్రతీ స్త్రీ, ప్రతీ పురుషుడు దాని గుండా వెళ్ళవలసినదే.

విశ్వాసులైన మీతో నేను కూడా ఆ అగాధము యొద్దకు వచ్చునప్పుడు నేను కలిగియున్న ఈ మనస్సుతోను మరియు హృదయముతోను నేను అచ్చటకు వెళ్ళననే దానిని ఎరిగినందున నేనెంతగానో సంతోషించుచున్నాను. నేను దేని నిమిత్తమై గొప్ప కార్యములను చేశానో, నేను దేనినైతే ఎరిగి, నేనొక పాపినని వాటిని ఒప్పుకొంటూ పశ్చాత్తాపము పడితినో, ఆ స్థలము యొద్దకు నేను వెళ్ళెదను, అచ్చట నేను ఈ సాక్ష్యముతో ఆయన యొక్క నీతి అనే వస్త్రములతో నేను చుట్టబడి ఉండాలని ఆశించుచున్నాను. “ఆయన యందు గల ఆయన యొక్క పునరుద్ధారణ శక్తిని నేను ఎరుగుదును.” ఆయన నన్ను మృతులలో నుండి పిలిచినప్పుడు, ఆ పునరుద్ధారణ శక్తితో బయటకు వచ్చుటకు నేను ఆశించుచున్నాను.

3

ఇప్పుడు, ఈ అంశమునకు తగినట్లుగా మన దృష్టిని మరియు సన్నివేశములు దానిపై యుంచి ఏలీయా కాలమునందు ఎన్నో వందల సంవత్సరముల క్రితము ఇశ్రాయేలీయులు జీవిత కాలమందు వారియొక్క హెచ్చుతగ్గుల యందు సంభవించిన కార్యములను గూర్చి నేటి రాత్రి యందు ఆ దృశ్యముల యొద్దకు మనము వెళ్ళబోవుచున్నాము.

మనము ఈ ఉదయ కాలమందు ఏ సన్నివేశమందు ఉన్నామంటే, ఎంతో మందిని ఐహికమైన వేషధారులుగా మార్చు మరియు నిజమైన ప్రవక్తలను ఏ విధముగా అనుకరణ చేయాలో తర్ఫీదు ద్వారా నకిలీ ప్రవక్తలను ఉత్పత్తి చేయు వేదాంత పాఠశాలల సమూహము మధ్య మన సన్నివేశము కలదు. అసలు దేవుని యొక్క శక్తిని కూడా అర్థము చేసుకోలేనంత మూర్ఖులుగా మీరుయున్నారు. ఏదో ఒక శక్తి ఏలీయాని పైకి ఎత్తి కొనుపోయి ఆ పర్వతము మీద ఏదో ఒక చోట విసిరివేసి యుండునని వారు తలంచి, ఆ ఏలీయా ప్రవక్తని వెదకుటకై వారు ఒక బృందమును ఏర్పరచి వెదుకుటకు వారిని పంపించిరి.

మహిమలోకి దేవుడు ఏలీయాని కొనిపోయెనని ఎలీషా ఎంతో బాగా ఎరిగియుండెను. అగ్నిమయమైన గుర్రములు గల రథము మీద మరణము నుండి ఏలీయా తప్పించుకొని దేవుని యొక్క గృహమునకు అతడు వెళ్ళిపోయెనని, దేవుడే అతడిని తీసుకొని వెళ్ళిపోయెనని, అతడు ఇచ్చట లేడని ఎలీషాకు బాగా తెలుసు. కాని వారి యొక్క సొంత వేదాంతము, వారి పాఠశాల బోధ, వేదాంత పాఠశాలల యొక్క క్రియలు ఇటువంటి కార్యములను వారు గ్రహించలేరని ఇచ్చట మనము చూడగలుగుచున్నాము. దేవుని యొక్క ఎన్నిక మరియు దేవుని యొక్క పిలుపు మాత్రమే ఒక వ్యక్తిని దేవుని యొక్క ప్రవక్తగా చేయగలదని కూడా ఇచ్చట మనము గ్రహించగలుగుచున్నాము.

4

ఈ రాత్రి మనము ఇశ్రాయేలు యొక్క దిగజారిపోయిన పరిస్థితులను గూర్చి వారి దయనీయ స్థితిని గూర్చియు కనుగొనబోవుచున్నాము. ఇది ఈ దినమందు కనబడుచున్న ఈనాటి సంఘమునకు మాదిరిగానున్నది. కొన్నిసార్లు వారు ఇళ్ళ పైకప్పులపై ఎంతో ఎత్తుగా ఉన్నట్లుగాను మరోసారి అట్టడగునయుండు లోయలో ఉన్నట్లుగాను ఉందురు.

దీనిని బట్టి వారిలోయున్న మంచిని గూర్చి కూడా మనము వారిని అభినందించక తప్పదు. దీనిని వారు అచ్చట చట్టము యొక్క భేదము అని పిలిచెదరు. డేవిడ్ లివింగ్స్టన్ను చూసేవరకు ఆఫ్రికాలోనున్న ఒక నల్ల వ్యక్తికి తన శరీరము నలుపు అని, తాను నల్లవాడినని ఎరుగడు. కాని ఎప్పుడైతే ఆ నల్లవ్యక్తి లివింగ్స్టన్ను చూచాడో, అప్పుడు అతడికి తెలిసింది. ఎందుకంటే లివింగ్స్టన్ చర్మము తెల్లగా యుండుటయు, అతడి చర్మము నల్లగా యుండుటయు అతడు గ్రహించగలిగాడు. అదియే భేదమును చూపించు కార్యమైయున్నది.

చీకటి అనే ఒక రాత్రియనునది లేనట్లైతే వెలుగు అనే పగలు గూర్చి నీవు ఎరుగలేవు. కావున చీకటిని గూర్చి తెలియకుండా ఆ వెలుగును నీవు ఎలాగు అభినందించగలవు. ఒక కారుమబ్బులు గల దినము లేనట్లేతే, ప్రకాశించుచున్న సూర్యుని గూర్చి నీవు ఎరుగవు. కావున మబ్బును గూర్చి తెలియకుండా, ఆ సూర్యని యొక్క వెలుగును నీవు ఎలాగు అభినందించగలవు. అవినీతి కార్యములు అనేవి లేనట్లైతే నీతియుక్తమైన దానిని ఏ విధంగా అభినందించాలో నీవు ఎన్నటికి ఎరుగవు. నీకు వ్యాధి కలగనియెడల, నీవు అనారోగ్యముతో బాధపడని యెడల మంచి ఆరోగ్యమును గూర్చి నీవు ఎలాగు అభినందించగలవు. చట్టము యొక్క బేధమును గూర్చి నేను ఆలోచించుచున్నాను...

ఈ రాత్రియందు మనము పరిశుద్ధాత్మను బట్టి ఎంతగానో సంతోషించుచూ మెచ్చుకొనుచున్నాము, ఎందుకనగా పరిశుద్ధాత్మ అనేది ఏదియూ లేదని మనతో చెప్పే సంఘములలో మనము ఎంతో కాలముగా ఉన్నాము. మనము భూమి మీద నివసించియున్నందువలననే మనము పరలోకమును ఎంతగానో మెచ్చుకొనుటకు గల కారణమైయున్నదని నేను తలంచుచున్నాను, ఎందుకనగా ఈ రాత్రి యందు మనము అటువంటి సంఘములకు వేరొక ప్రక్కన యున్నాము. ఆయన యొక్క జనులు ఈ విధమైన హెచ్చుతగ్గులతో కూడిన పరిస్థితులను కలిగి యుందురనే కారణముచేతనే ఆయన తాను ఉద్దేశించబడిన మార్గమును అందుకొరకై కలిగియుండెను. నీవు ఎప్పుడైనా లోయ ప్రాంతములో ఉంటే గాని ఎతైన ఆ శిఖరము యొక్క పై భాగమును నీవు మెచ్చుకొనలేవు. కలుషితమైన నీటిని నీవు ఎన్నడైనా త్రాగియుంటే గాని మంచి త్రాగునీటిని గూర్చి నీవు మెచ్చుకొనలేవు. ఈ కార్యములన్నీ చట్టము యొక్క బేధము గుండా వచ్చుచున్నవి. వారు దేనినైతే చేసియున్నారో అందునుబట్టి ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయులు దిగజారిపోయిన స్థితియందుగలరు.

5

ఇశ్రాయేలీయులు ఎన్నిక చేయబడిన, ఏర్పరచుకొనబడిన, నిర్ణయించబడిన ప్రజలు. దేవుడు ఇశ్రాయేలీయులను ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యము కొరకు ఎన్నుకొనెను. ఇశ్రాయేలీయుల యొక్క రక్తప్రవాహము శుభ్రమైన రక్తమైయుండి, మెస్సీయా ఆ వంశావళి గుండానే రావలసియున్నది.

పాత నిబంధన కాలములయంతటి గుండా దేవుడు మానవునిలో నుండి తన్నుతాను ప్రత్యక్షపరచుకొనెను. ఒక విశ్వాసము గల విశ్వాసిగా దేవుడు అబ్రాహాములో నుండి తనను ప్రత్యక్షపరచుకొనెను. ఒక రాజుగా దేవుడు దావీదులో నుండి ప్రత్యక్షపరచుకొనెను. ఒక నీతిమంతునిగా దేవుడు యోసేపులో నుండి ప్రత్యక్షపరచుకొనెను. ఒక ప్రవక్తగా, యాజకుడిగా, ధర్మశాస్త్రమును ఇచ్చినవానిగా దేవుడు మోషేలో నుండి ప్రత్యక్షమాయెను. కాలాకాలములుగా ఈ యుగముల గుండా దేవుడు ప్రవక్తలలో నుండి తనను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన ఎల్లప్పుడూ మానవులలో నుండి తన్నుతాను ప్రత్యక్షపరచుకొనుచున్నట్లుగా తెలుసుకొనునట్లు వారిలో నుండి ఆయన ఒక భాగముగా ప్రవక్త ద్వారా, రాజుగా, యాజకునిగా, ధర్మశాస్త్రమును యిచ్చిన వానిగా ఇంకా అనేక రకములుగా తన్నుతాను ప్రత్యక్షపరచుకొనెను.

కాని క్రీస్తులో, ఆయన క్రీస్తులో నివాసమై యుండెను. దైవత్వము యొక్క పరిపూర్ణతగా ఆయన ఆ శరీరములో జీవించెను. చివరిగా క్రీస్తులో ఈ ఆత్మ ఒక విశ్రాంతి స్థలమును కనుగొనినట్లు ఎరిగియుండెను. ఏలీయా, దేవుని యొక్క నీతిగా ప్రత్యక్షమాయెను, దేవుని యొక్క నీతిని గూర్చి అతడు గర్జించెను. మోషే ధర్మశాస్రమును యిచ్చినవానిగా యుండెను. కనుక నీవు ఆ ధర్మశాస్త్రమును వెంబడించవలెను లేదా త్రోసివేసి వెలుపల ఉండవలెను. ఈ కార్యములన్నింటిలోను దేవుడే తాను ఒక ప్రతినిధిగా యుండెను. కాని ఆయన క్రీస్తులో తనను ఎప్పుడైతే ప్రత్యక్షపరచుకొనెనో, ఆయన పరిపూర్ణుడాయెను. దైవత్వము యొక్క సమస్త సంపూర్ణత క్రీస్తు శరీరమునందు విశ్రాంతి నొందెను.

6

దైవత్వములో యుండు పరిపూర్ణతను ఇంతకుముందే దేవుడు తన్నుతాను ఒకరియందు ప్రత్యక్షపరచెను. అదేమనగా ఆదికాండములో మెల్మీసెదెకు క్రమములో ఆయన తన్నుతాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు, ఆరంభకాలములు లేవు, ముగింపు కాలములు లేవు.... లేదా, జీవమునకు ముగింపు లేదు. ఆయన ఒక యాజకుడు, షాలేము యొక్క రాజు, దేవునికి ఒక యాజకునిగా యుండెను, దేవుని యొక్క సర్వోన్నతుడు, ఆయనకు ఆదియు అంతము లేదు.

అది ఏమిటో కాదు గాని మరలా రాబోవుచున్న ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా అది యున్నది, ఎందుకనగా ఆయన షాలేము రాజు, అనగా సమాధానమునకు రాజైయుండెను, యెరూషలేముకు రాజైయున్నాడు. ఆయన రాబోవు దానికి సాదృశ్యమైన రూపమును కలిగి యుండెను. మూలపురుషుడగు అబ్రాహాము ఆయనకు దశమ-భాగమును చెల్లించెను. ఎందుకనగా ఆయన రాబోవుచున్న యేసు ప్రభువుకు ఒక సాదృశ్యమైన రూపముగా ఉండెను. సౌదొమ మరియు గొమొర్రా పట్టణములను నాశనము చేయుటకు ముందు మెల్కీసెదెకు చదునైన భూమి యందు అబ్రాహామును కలుసుకొనెను. అదే విధముగా అబ్రాహాము ఆ రాజులందరినీ సంహరించి వారియొద్ద దోచుకొని తిరిగి వచ్చుచున్నప్పుడు, అబ్రాహాము వాటన్నింటిలో నుండి దశమ-భాగమును ఆయనకు చెల్లించెను. ఈ కార్యములన్నియు సాదృశ్యములుగా యున్నవి, క్రీస్తుయందు ఉపమానములుగా యున్నవి.

ఇప్పుడు, ఈ సమస్త సాదృశ్యములు పాత నిబంధన కాలములో యుండిన పరిశుద్దుల హెచ్చుతగ్గుల స్థితిని సూచించుచు ఇవి ఈ రోజు మనకు ఒక ఉదాహరణములుగా, ఒక ఛాయగా మరియు ఉపమానముగా యున్నవి.

7

ఇశ్రాయేలీయులు వివాహము చేసుకొనునప్పుడు వేరొక అన్యజనాంగములోనున్న వారిని వివాహము చేసుకొని వారితో కలిసి పోకూడదని మనము కనుగొంటిమి. వారి వివాహ సంబంధములు వారిలోనే, వారితోనే సంబంధమును కలిగియుండవలయును. ఏ ఇశ్రాయేలీయుడు ఎన్నడూ ఒక అన్యురాలుని వివాహము చేసుకోకూడదు. వారియొక్క రక్తసంబంధమగు వంశావళి పరిశుద్ధముగా ఉండాలి. నేటి దినము వరకు కూడా యూదుల రక్తసంబంధమైన వంశావళి పరిశుద్ధమైన రక్తపు వంశావళి అని నేను నమ్ముచున్నాను. నేడు భూమి మీదయుండు పవిత్రమైన రక్తము గల వంశావళి యూదులదై యున్నది. వారు ఇంకా మెస్సియా కొరకు ఎదురు చూచుచున్నారు. కాని ఆయన ఇదివరకే వచ్చెనని మనమెరుగుదుము, వారియొక్క కన్నులు గ్రుడ్డితనము కలిగియున్నవి. ఎందుకనగా మనము క్రీస్తుద్వారా పశ్చాత్తాపపడుటకు మనకొరకు ఒక అవకాశమును కల్పించుటకై ఇశ్రాయేలీయుల కన్నులు గ్రుడ్డితనము చేయబడినవి.

ఇప్పుడు, ఎజ్రా కాలమందున్న రాజ్య పరిపాలనలో ఇశ్రాయేలీయుల సంతతి భ్రష్టులైపోయిరి, మోయోబీయుల స్త్రీలతోను, అమోరీయుల స్త్రీలతోను, పెరిజ్జీయులతోను మరియు చుట్టుప్రక్కలయున్న అనేక అన్యజాతులతోను వారు మిశ్రమమైపోయి వారిని వివాహము చేసుకొనిరి. వారిని వివాహము చేసుకొనుటయే గాక, ఆ అన్యజాతుల స్త్రీలతో వ్యభిచరించిరి, వారి జీవపు వంశావళిని, అసలైన రక్తసంబంధమైన వంశావళిని వారు అపవిత్రపరిచిరి మరియు కలుషితము చేసిరి.

నేడు మన సంఘముల యొక్క చిత్రపఠము ఏలాగు వున్నదంటే లౌకిక విషయములను గూర్చి ఖండించుచూ బోధించే బోధనల నుండి మరియు దేవుడు సంఘం కొరకు నియమించిన క్రమము నుండి నేటి సంఘములు దారి తప్పి పతనమైపోయినవి. ఏ నీతి నియమములు ద్వారా మనము జీవించవలయునో వాటిని త్రోసివేసి ఈ లోక కార్యములతో సంఘము వ్యభిచరించుచున్నది. అది పూర్తిగా లోక కార్యములతో మునిగిపోయి, ఆ లోకముతోనే అది సరసములాడుటకు ప్రారంభించినది.

8

ప్రవక్త దేవుని ఎదుటకు వచ్చి నిలబడు సమయుము తటస్థించినప్పుడు, అతడి ముఖము ఎర్రబారునంతగా ఆ కార్యములు అతని ఎంతగానో కలవరపరచినవి. మొట్టమొదటగా అతడు ప్రజలు నీతి నియమముల విషయమందు క్రమముగా క్షీణించిపోవుటను విని మరియు అతడు వాటిని చూచి కలత చెందినవాడై, తన్నుతాను అభిషేకించుకొని, తన తల వెంట్రుకలను, గడ్డమును గీయించుకొని హృదయభారముతో ప్రభువు సన్నిధి యందు ప్రార్థించుచు కూర్చుండెను. ప్రజలు చేయుచున్న పాపముల నిమితము అతడు సాయంకాల సమయమందు దేవుని మందిరమునకు వెళ్ళి, ఎర్రబారిన ముఖముతో మోకాళ్ళపై యుండి దేవునికి బలియర్పణను సమర్పించుచుండెను.

రెడ్-లైట్ జిల్లాలో స్కార్లట్ వీధిలో యుండు వేశ్యల నిమిత్తము ఆ ప్రవక్త ముఖము ఎర్రబారలేదు. ఎంత నీచులుగా వు౦డాలో అంత నీచమైన జనులనిమిత్తము గాని లేదా మద్యముతో మత్తిల్లి నరకమందుండు జనుల నిమ్మితము గాని ఆ ప్రవక్త ముఖము ఎర్రబారలేదు. కాని దేవుడు ఎన్నుకొనిన జనుల పాపము నిమిత్తము అతడి ముఖము ఎర్రబారినది. వారు ఇష్టానుసారమైన కార్యములను చేయుచు, దేవుని యొక్క జనులుగా చెప్పుకొనుచున్న వారి నిమిత్తము, ఆ జనులు చేయుచున్న పాపముల నిమిత్తము ఎర్రబారిన ముఖముతో దేవుని సన్నిధిలో ఉండు మరియు హృదయభారముతో చాలినంత దేవుని ఆత్మను కలిగియున్న అనేక మంది ప్రవక్తలు నేడు మనకు కావలసియున్నారు.

9

ఈ అంశములను గూర్చి మాట్లాడుట అంత సులభము కాదు. సులభముగా మనము మాట్లాడే అనేక అంశములు గూర్చియు నేను ఆలోచించాను. కాని సహోదరుడా, మనము జీవించుచున్న ఈ దినమునందుండు ఈ పాపపు వ్యభిచారపు సాంగత్యము నుండి నీవు, నేను బయటకు రావలెనని, అట్లు రానియెడల ఏమి సంభవించునని ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలాగు? ఎవరో ఒకరు వీటిని గూర్చి చెప్పి తీరవలయును. ప్రజలకు ఈ విషయములను గూర్చి ఎవరో ఒకరు చెప్పి వారి ముందు వీటిని పెట్టాలి. బహుశా, ఎజ్రా దీనిని చెయ్యాలని అతడు ఆశించియుండడు, కాని అది అతడి హృదయమందుండెను.

ప్రజల యొక్క అతిక్రమమల నిమిత్తము తన చేతులను, ముఖమును పైకెత్తి, ఎర్రబారిన ముఖముతో, ఎంతో నిష్కపటమైన హృదయముతో దేవుని యొద్ద ప్రార్ధించు ఒక దేవుని యొక్క సేవకుడిని నీవు చూచినప్పుడు ఒక ఉజ్జీవము ప్రారంభమగుటను నీవు చూచెదవు. దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి తనను సమర్పించుకోకుండా, సంఘము దేవుని యొద్ద పశ్చాత్తాపము చెందకుండా, పరిశుద్ధాత్మ కొరకు వేచి యుండకపోతే, పరిశుద్ధాత్మ దిగివచ్చుటను, అభిషేకపు తైలమును కుమ్మరించబడుట మరియు బలమైన శక్తితో కూడిన దేవుని యొక్క కదలికను జనులు మధ్య చూడలేరు. కాని వాటినే మనము పొందుకోవలెను.

ప్రజల నిమిత్తము హృదయ భారమును కలిగి, వారి కొరకు చింతించుచూ సాష్టాంగపడి, ఏడ్చుచూ దేవుని యందు ప్రార్ధించే ఒక వ్యక్తిని నాకు చూపించండి. మరో కాల్వినీ వంటి వారిని, క్నాక్స్, ఫిన్నీ, సాన్కీ లేదా అటువంటివారిని ఎవరినైనను నాకు చూపించండి. మరలా బాప్టిస్తువాడైన జాన్-స్మిత్ ను మనకొరకు పంపించవలయును. జీవించుచున్న ప్రజల అతిక్రమముల నిమిత్తము అతడి కన్నులు వాచిపోయి కన్నీటితో మూసుకుపోయేంత వరకు రాత్రంతయు ఏడ్చుచూ ప్రార్థించెను. మరుసటి దినమందు ఏడ్చుచూ ఉండే ఆతనిని లేపి అతని భార్య బల్లయొద్దకు నడిపించి, ఒక చెంచా అల్పాహారమును తినిపించినది. అగ్ని నుండి ఉద్భవించిన అగ్నిఖణముగా రగిలిపోయిన ఒక జాన్ వెస్లీని మరలా నాకు చూపించండి. అప్పుడు నేను మీకు ఒక ఉజ్జీవమును చూపించెదను.

10

నేడు వారేమి చేయుచున్నారు? మనము వారి వీపును నిమురుచూ బుజ్జగించుచున్నాము. అసలు ఉజ్జీవము కాని దానిని అది మరియు ఇది యని పేర్లు పెట్టుచూ దానిని ఉజ్జీవము అని అంటున్నారు. అది నిజము. ఉద్రేకముతో ఊగిపోయేటువంటి మతానుభవము జనుల మధ్య గలదు. అది ఉద్రేకమే గాని అది ఉజ్జీవము కాదు. ఆ దినమందు వారు ఒక మత సంబంధమగు సమూహమును కలిగియుండిరి. ఆ దినమందు ఉద్రేకమును రేపు ఒక లాంటి పరిస్థితిని వారు కలిగియుండిరి. కాని వారికి కావలసినది ఒక నిజమైన ఉజ్జీవము.

కుక్క కూడా సిగ్గుపడునంతగా ఈ దేశముయొక్క నీతి నియమములు అట్టడుగుస్థితికి దిగజారిపోయినవి. నా సహోదరులారా, మరియు నా సహోదరీ అందుకు కారణమేమిటి? మన జనులయొక్క నీతి నియమములు బహుగా సిగ్గునొందునట్లుగాను, అవి మనలను ఎంతగానో క్రుంగిపోవునట్లు చేయుచున్నవి. మనము చేయుచున్న ఇటువంటి కార్యములవలన, ఈ దేశము యొక్క నీచమైన క్రియలవలన, ఈ జనులు అనుసరించుచున్న దుష్టక్రియలవలన ఎన్నో సంవత్సరముల క్రితమే నైతిక విలువలను దిగజార్చినవి. వాటంతటకీ కారణమేమనగా, ప్రార్ధన లేకపోవుటయే. జనులు సినిమాలను చూచుటను సంఘము అనుమతించి యుండకూడదు. వారి పిల్లలను సినిమాలు చూచుటకు వెళ్ళుట అనుమతించి యుండకూడదు. వారు కూడా సినిమాలను చూడకూడదు. కాని దానికి విరుద్ధముగా నేడు వారి గృహములోనే సినిమాను చూచే సదుపాయమును కలిగియున్నారు. ప్రతీ ఇంటిలోను టెలివిజన్ గలదు.

బీరు లేదా మధ్యమును త్రాగుట తప్పు అని ఎచ్చట వారు తలంచుచున్నారో, అక్కడే వారు తప్పిపోవుచున్నారు. జాన్ బార్లీకాన్ అనే ఒక గొప్ప శృంగార పురుషుడును మేము కలిగియున్నామని చెప్పుకుంటూ ఉబ్బిపోవుటనేది తప్పని వారికి తెలిసినా, దానినే వారు చేయుచున్నారు. కనీసము సంవత్సరమునకు ఒక్కసారైనా నేడు క్రైస్తవులమని పేరు చెప్పుకునేవారు ఈ సమాజపు అలవాటు ప్రకారముగా అరవైశాతం మంది సరదాగా మధ్యమును త్రాగుచున్నారు. క్రిస్మస్ పండగ దినమందు ఈ త్రాగుబోతులంతా ఒక చోట చేరి త్రాగుచూ, సరసాలాడుచూ గొప్ప విందు, వినోదములతో క్రిస్మస్ వేడుకలను జరుపుకొందురు, అందుకు గల కారణమేదనగా, రక్షణను అంగీకరించు స్థానమందు వారు విధ్యను దత్తతగా తీసుకొనిరి. అది ఎన్నటికీ క్రియ చేయదు. నేడు మనకు ఒక ఉజ్జీవము కావలసియున్నది.

11

మనము పాదాలకు కలిగే పుండు మీద (కార్న్ ప్లాస్టర్) పట్టీలను అంటించెదము, దానిని తీసివేసి మరలా వేరొక పట్టీని వేస్తాము. నొప్పి అచ్చట వున్నంతవరకు ఆ పట్టీలను మారుస్తునే ఉంటాము. మనకు కావలసినది లోకసంబంధమైన సాంఘిక పునరుద్ధరణ కాదు, తెలివితేటలతో కూడిన మాటలు కాదు; నేడు మనకు కావలసిదేమనగా, ఆ ప్రాచీన కాలపు భక్తి, పరలోకము నుండి దేవుడు పంపి౦చిన రక్తమార్పిడి కావలసియున్నది. పాదాలకు కలిగే పుండు మీద అంటించు పట్టీల వలన ఏ ప్రయోజనము లేదు. మనము రక్తహీనత గల వారిగా యున్నాము. మనకు రక్తమార్పిడి జరుగవలసియున్నది. నిజమైన పశ్చాత్తాపముతో దేవునికి ముందు నిన్ను తీసుకువచ్చే ఆ పూర్వకాలపు సువార్తను మరలా మనము కలిగి యుండ వలసియున్నది. అదే మనకు కావలసియున్నది. దేవుని ముందుకు వచ్చుట అనగా ఏదో కన్నీరు లేని కళ్ళతో వచ్చుట కాదు, చేతులు కలిపి కరచాలము చేయుట కాదు. దేవుడు పంపిన పరిశుద్ధాత్మతో ని౦డిన ఉజ్జీవమును కలిగినవారమై మనలను శుద్దీకరించు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమును ప్రతి మానవ హృదయమందు కలిగి యుండవలయును. దేశమంతా ఊడ్చివేయునటువంటి గొప్ప ఉజ్జీవము సంఘమునందు ప్రారంభమగుటయే మనకు అవసరమైయున్నది. అటువంటి ఒక ఉజ్జీవము మన మధ్య లేనియెడల మనము చనిపోవుదుము, మనము నశించిపోవుదుము, మనము భ్రష్టులైపోదుము.

నేను చూచుచున్న ఈ హాలీవుడ్ ఉజ్జీవములను బట్టి నేను విసిగిపోయి మరియు వేదన చెందుచున్నాను. మేము క్రైస్తవులమని పేరుకు చెప్పుకొనుచున్నవారు రోజుకు ఒకసారి, రెండు రోజులు కొకసారి లేదా వారమునకు ఒకసారి, లేదా రెండు వారముల కొకసారి వచ్చి, ఏదో కొన్ని గంటలు ఉద్రేకముతో ఊగిపోతూ ఏదేదో చేసూ ఇక చాలని వెళ్లిపోయి మరలా యధాప్రకారముగా జనులు వారియిష్టానుసారముగా జీవిస్తున్నారు. అది నీకు ఒక ఉజ్జీవముగా అనిపించవచ్చును. కాని, అది నీవు ఉద్రేకమును కలిగియుండుటయే. నీవు మంచి ఉద్దేశ్యములు కలిగి యుండవచ్చును, అవన్నీయు మంచివే. అయినాగాని నేడు అవన్నియు మనకు పనికిరావు. నేడు జనులు యొక్క జీవన విధానము మారాలంటే, వారి చెడు అలవాట్లు పోవాలంటే, వారియొక్క అంచనాలు మారాలంటే, వారియొక్క వ్యర్థమైన తెలివితేటలు పోవాలంటే, వారు ఉద్రేకము నుండి ఉజ్జీవములోనికి రావాలంటే - మనకు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము కావలసియున్నది. ఆ పరిశుద్ధాత్మ వారిని మరలా ఆనాటి పూర్వస్థితికి తీసుకొని వచ్చి వారిని నిజ మార్గమందు నిలుపును. కల్వరికి వెలుపల జరుగు రక్తమార్పిడి ద్వారా మనయొక్క సమస్త సంస్కరణలన్నియూ ఏదీయు నీకు పని చేయదు, ఏ మంచి నీకు చేయదు.

12

మనకు సంయుక్త రాష్టములు గలవు. ఆ సంయుక్త రాష్టములు మనకు అవసరము లేదు, దానితో వారు ఏమి చేయుదురు. వారెప్పుడూ దేవుని యొక్క నామమును స్మరించరు. దేవుని నామమును స్మరించుటకు వారు భయపడుదురు. ఒకసారి మతాధికారుల గుంపు వారిని చూచి, “వారెందుకు ప్రార్థనలు చేయరు?” అని అడిగిరి. అందుకు వారు, “ఎవరికైతే దేవుని యందు నమ్మకములేదో, ఎవరైతే నేరస్తులో వారికే ప్రార్థనలు అవసరం,” అని చెప్పిరి. ఓ, మనకు ఉజ్జీవము చాలా అవసరమైయున్నది. వారెంతటి నేరస్తులైనా గాని దానితో సంబంధము లేదు, వారియొద్దకు వెళ్ళి దేవుని సువార్తను చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపించుట మన కర్తవ్యమైయున్నది. అది నిజము. చేయవలసిన దేవుని యొక్క కర్తవ్యమును చేయకుండా, అది సంయుక్త రాష్ట్రముల యొక్క కార్యక్రమమైనను లేదా ఏదో గొప్ప కార్యక్రమమైనను, అది ఏదైనను గాని వాటిల్లో వుంటూ వాటిని చేయుటవలన నీకు ఏ ప్రయోజనము లేదు.

ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము లేనందువలన మనము చనిపోవుచున్నామనే దానిని ఈ దేశము మేల్కొని గుర్తించువరకు, మనము చనిపోవుచున్నామనే దానిని ప్రతి ఒక్కరు వ్యక్తిగతముగా గుర్తించి మేల్కొనేంత వరకు, మనము చనిపోవుటకు గల కారణమేమనగా, మూలమైనది లేనందువలన, ఆ మార్గమును, దానికి గల పరిష్కారమును, స్వస్థతను కల్వరిలో దేవుడు మనకు చెల్లించెనని ఎరుగనందువలన.

13

అందుకే ఒక నిజమైన మనిషి యొక్క ముఖము ఎర్రబారునట్లుగా మారినందుకు ఆశ్చర్యపడనవసరము లేదు. సంఘములోని ప్రజలు ఎరుగకుండా యున్నందువలన ఒక నిజమైన ప్రసంగీకుడు జనులను దేవుని సింహాసనము ఎదుటకు వారిని నడిపించుటకు ఎంత ప్రయత్నించినా గాని పరిస్థితులు మారనందువలన, ఆ నిజప్రసంగీకుని యొక్క ముఖము ఎర్రబారినందుకు ఆశ్చర్యమేమియు లేదు. “సంఘ కాపరులు” అని పేరుకు చెప్పుకునే వారు సంఘ సభ్యుల గృహములను దర్శించుచూ, వారితో కలిసి సిగరెట్లను పీల్చుచూ, ఒకరికొకరు అసహ్యమైన సరోక్తులు మాట్లాడుకుంటూ, బీరు సీసాలతో వారి యింటి వెనుక పెరట్లో మధ్యమును సేవించుచూ, విందులు వినోదములతో గడుపుచూ ఆ సంఘకాపరి, వారి యవ్వన స్త్రీలు, మధ్య వయస్సుగల స్త్రీ, పురుషులు మొదలగువారు తాగిన మైకముతో వీధులలో నడుచుకుంటూ వెళ్ళుట, ఒక అమ్మమ్మ వయస్సు గల వృద్ధురాలు కూడా పొట్టి వస్త్రములను ధరించుకొని వీధులలో తిరుగుచూ. తల్లిగా యుండు స్త్రీ చంటిబిడ్డలను తన భుజములపై వేసుకొని అర్థనగ్నంగా బహు అసహ్యంగా వీధులలో తిరగటము, పోకిరీ వాళ్ళను ఆకర్షించునట్లుగా వస్త్రములను ధరించుకొని వీధులలో శృంగారమును ఒలకపోస్తూ తిరిగే స్త్రీలుగా వుంటూ - ఈ విధమైన లౌకికముగా వేషాలు వేసుకుంటూ క్రైస్తవులమని చెప్పుకుని తిరిగే అటువంటి వారిని దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వచ్చుటకు నిజమైన ఒక దేవుని మనిషి యొక్క ముఖము ఎర్రగా మారక తప్పదు. అది నిజము.

14

మన మందరమూ ఒక ఉన్నత శ్రేణిని పొందుటకై అటువంటి సంఘములో చేరుటయనునది కేవలం అది అవివేకపు పనిగా నున్నది. అది గత కాలమందు ఎలా వున్నదో, ఇప్పుడునూ అలాగేయున్నది. తిరిగి మనము దేవుని చెంతకు రావలసియున్నది. అయితే అది విధ్యను సంఘములోకి చొప్పించుట ద్వారా కాదు, లేక మత సంస్కరణలను సంఘములోనికి చొప్పించుట ద్వారా కాదు, మనష్యుల ద్వారా తయారు చేయబడిన వేదాంతము ఎంత మాత్రమునూ కాదు. పూర్వకాలమందు యుండిన కణకణమని మండుచున్న భక్తిపూర్వకమైన అనుభవమును కలిగియుండుటకై పరలోకము నుండి క్రుమ్మరింపబడు దేవునిచే అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మతో మాత్రమే మనము మరల దేవుని చెంతకు వెళ్ళగలము. మరలా మన స్థానములో మనలను నిలుపుటకు, దేవుని యొక్క అభరణములుగాను, కుమారులుగా మరియు కుమార్తెలుగా మనము అచ్చట ఉండుటయే దేవుని యొక్క ఉ ద్దేశ్యమైయున్నది.

కాని ఇంకా లోక కార్యములను మనము చేయుచు, సహోదరి మరియు సహోదరులారా, స్త్రీలు మీరు జుట్టును - చెవులు లేదా మెడవరకు కురచగా కత్తిరించుకుంటూ, ముఖములకు రంగులను పూసుకుంటూ, లోక రీతిగా అలంకరించుకొనుచూ, అర్థనగ్నంగా, అసహ్యంగా కనబడునట్లు వస్త్రాలను ధరించుచూ, పురుషులగు మీరు మధ్యమును సేవించుచు, పొగత్రాగుచూ మేము క్రైస్తవులమని మీరు చెప్పుకుంటున్నారు. ఇటువంటి నీచమైనవే తప్ప వారికి ఇంతకంటే మంచి కార్యములు ఏమీ తెలియవు. మన హృదయము నిండా ఇటువంటి లోక సంబంధమైన కార్యములతో నిండిపోయి ఉన్నది. కావున వెనుక ఆ చివర నుండి ప్రసంగ వేదిక వరకు మనము సంఘమును శుద్దీకరించవలసియున్నది. ఆమేన్. అది నిజము.

నేడు మనకు కావలసియున్నదేమిటంటే, ఎర్రబారిన ముఖమును కలిగియున్న కొంత మంది ప్రవక్తలు కావలెను. కొంత మంది జనులు చూచుటకు వేశ్యా గృహమునకు వెళ్ళుచున్న వారివలె ఉంటూ ప్రార్ధన చేయించుకొనుటకు ప్రార్ధనా వరుసలోనికి వచ్చెదరు. అది నిజము. చూచుటకు యొజెబేలువలె వుంటూ ఎదో ఒకదానిని పొందుకోవాలంటూ దేవునియొద్ద అడుగుటకు వచ్చెదరు. నేడు మనకు కావలసినదేమనగా, మన గృహమును శుద్దీకరించబడవలసి యున్నది, మన హృదయములో దేవుని కొరకు మంటను కలిగియుండవలసియున్నది. పాపులు నేలపై సాష్టాంగపడి, పశ్చాత్తాపము చెంది, దేవుడు పరిశుద్ధాత్మను పంపి వారి జీవితములను శుద్దీకరించేంత వరకు ఏడ్చునట్లుగా దేనితోను రాజీపడకుంగా సువార్తను ప్రకటించుచూ, తప్పును తప్పని మరియు ఒప్పును ఒప్పుగా చెప్పే, నికృష్టపు కార్యముల నుండి జనులను బయటకు పిలుచుచూ, వేదిక మీద నిలబడి ఖండించుచూ ప్రసంగించే దేవుని యొక్క ప్రవక్తలు నేడు మనకు కావలసియున్నది. ఆమేన్, అది నిజమని మనమెరుగుదుము. అది నిజము.

15

ఈ పట్టణములో యుండు ప్రతి స్త్రీ వారి క్రియలవలనైనా గాని లేదా ఏదో ఒక రీతిగా వ్యభిచరించుచున్నందువలన సిగ్గు చెందవలసి యున్నదని నేను ఇంతకుముందు ఇచ్చట ప్రసంగించితిని. వారు అలాగు వున్నారు. స్త్రీలు బజారుకు వెళ్ళి ఎంతో డబ్బుతో ఖరీదైన వస్త్రములు కొంటున్నారు గాని, శరీరమంతా చక్కగా కప్పుకొనే వస్త్రములు కాకుండా, వారు ఆశించిన విధముగా అసభ్యమైన వాటినే కొనుచు ధరించుకొనుచున్నారు. అటువంటి వాటిని సమర్ధించుటకు నేనిచ్చటకు రాలేదు. ఇది నా స్వంత సంఘము. పరిశుద్ధాత్మ ఏది చెప్పమని నాకు చెప్పుచున్నదో దానినే చెప్పుటకు ఇచ్చట నాకు హక్కు కలదు. అది నిజము.

నన్ను చెప్పనివ్వండి, నా సహోదరీ, నేను నిన్ను విమర్శించుట లేదు. కాని పరిశుద్ధాత్మ నీవు చేయుచున్న కార్యముల నిమిత్తము నీ కొరకు త్యాసముగా ప్రసంగించదు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఎదో ఒక బేధము కలిగించనియెడల, నీ గురించి నేను భయపడుచున్నాను, ఎందుకనగా నీవు ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదు. అవును నిజము. పరిశుద్ధాత్మ కేకలు వేయదు. పరిశుద్ధాత్మ అనగా, “ఆత్మలో నాట్యమాడుట కాదు.” పరిశుద్ధాత్మ యనగా, “భాషలు మాట్లాడుట కాదు.” పరిశుద్ధాత్మయనగా, నీతియై యున్నది. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మ ఉజ్జీవమును, దేవుడు నీతిని పంపించి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండిన ఉజ్జీవమును దేవుడు మనకు అనుగ్రహించును.

16

వీధులలో నీవు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అనేక మంది పురుషులు నిన్ను చూచి ఆకర్షితులై, మోహించునట్లుగా అసభ్యముగా నీవు వస్త్రములను ధరించుకొని వెళ్ళుచున్నావే, అందునిమిత్తము నీకు భయము లేదా? ఆ తీర్పు దినమున.... నీ భర్త ముందు శుభ్రమైన ఒక లిల్లీ పుష్పమువలె నీవు వుండవచ్చును, కాని వీధిలో ఆ పురుషుని ముందు నీవు అసభ్యముగా వస్త్రధారణ చేసుకొని వెళ్ళినందువలన, అతడితో నీవు వ్యభిచరించినంతగా నిన్ను నీవు అతడి ఎదుట సమర్పించుకొన్నందు వలన న్యాయ తీర్పు దినమందు నీవు ఒక దోషిగా నిలబడెదవు.

ఈ కార్యము ఒక వ్యక్తిని సిగ్గుపడునట్లుగా చేయుటయందు ఏ ఆశ్చర్యము లేదు! ఏ ఆశ్చర్యము లేదు... అట్లయితే ఈ కార్యము దేవుడిని మరెంతగా వేదనపరచి యుండును. సృష్టి ఆరంభమునందు, “మానవుని సృజించినందుకు ఆయన దుఃఖి౦చెను,” అది దేవుని యొక్క హృదయమును నొప్పించెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. జలప్రళయమునకు ముందు దినముల యందు ఆయన ఆ జనులను చూచి మానవుని నేను సృజించి యుండకూడదని దేవుడు తన హృదయమందు దుఃఖపడెను.

ఏమి సంభవించినది? “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచిరి,” అది నిజ మార్గము నుండి తొలగి తారుమారుయగుటగా యున్నది. అది దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసిన ఒక తారుమారైన మిశ్రమ లైంగిక సంబంధము. ఈ తారుమారైన మిశ్రమ లైంగిక సంబంధమే అచ్చట ఏదేను తోటలోయున్న దేవుని పిల్లలను వెలుపలికి తరిమివేయునట్లు చేసినది. ఈ భూమి మీదకు సమాధానమును కలుగజేయుటకు ఈ అక్రమ కార్యమే దేవుని యొక్క న్యాయ తీర్పును తీసుకొని వచ్చినట్లుగా చేసినది. ఈ అక్రమ కార్యమే ఆనాటి జనులు నశించిపోవుటకు కారణమైనది. పురుషులకు మరియు స్త్రీలకు మధ్యలో ఉన్న అక్రమ మిశ్రమ లైంగిక సంబంధమే సొదమ మరియు గొమొర్రా పట్టణములు మృత సముద్రము యొక్క అట్టడుగు భాగమువరకు మునిగిపోవుటకు కారణమైనది. అది ప్రవక్తల ద్వారా తెలుపబడియున్నది. “అలాగుననే మనుష్యకుమారుని రాకడకు ముందు లోతు దినములలో యున్నట్లుగానే యుండునని” మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పియున్నారు.

17

మనము ఇప్పుడు చూచుచున్న ప్రకారము పరిశుద్ధ గ్రంథములోని మాదిరిని గాని — నయోమి మరియు రూతు, శారా యొక్క మాదిరిని గాని సంఘము తీసుకొనుట లేదు — కాని సంఘములో యుండు స్త్రీలే హాలీవుడ్ ను మరియు దెయ్యపు ఆకర్షణలకు సబంధించినటువంటి మాదిరిని వెంబడించుచున్నారు. క్రైస్తవులమని చెప్పుకొనే మన జనులు ఏ విధముగా ఈ దుష్ట మనుష్యుల యొక్క మార్గములను వెంబడించుచున్నారు? ఎల్వీస్ ప్రేస్లి అనే భయంకరమైన నయవంచుకుడు దెయ్యపు ఆత్మతో నిండినవాడై, తన పాటల ద్వారా జనులను ఉర్రూతలూగించి, ప్రసిద్ధిగాంచిన పేరుగలవాడై, నా జీవితంలో నేను ఎన్నడూ విననంతటి దుష్టుడై జనులను ఆకర్షించి వారిని దెయ్యపు ఆత్మతో నింపివేశాడు. ఆర్తర్ గాడ్ఫ్రే అనే అతడి యొక్క వ్యర్థమైన బుద్ధి లేనటువంటి మాటలను మీ రేడియోలలో వింటున్నారే గాని, పరిశుద్ధ గ్రంథములోని మాటలను మరియు సువార్త యొక్క ప్రసంగములను వినుటకు మీరు నిరాకరించుచున్నారు. దేవుడు మీ మీద కనికరమును కలిగియుండును గాక! మన మధ్య ఎటువంటి నీచమైన ఆత్మను కలిగియున్నామో గుర్తించండి. అది నిజము.

ఇటువంటి కార్యములను బట్టి ఎర్రబారిన ముఖముతో ప్రవక్త దేవుని ముందు నిలబడియుండుటలో ఏ ఆశ్చర్యము లేదు. అది అన్యాయము లేదా అవినీతియని అతడికి తెలుసు. “మేము అవినీతిపరులమని,” అతడు దేవుని ముందు నిలబడి బ్రతిమాలుకొనుచు వారి నిమిత్తము వాజ్యమాడుచున్నాడు.

18

మనము, స్నేహితులు, మనమందరము రక్తమార్పిడి జరుగు ఆ స్థలము యొద్దకు రావసియున్నది. పాదాలకు కలిగే పుండు మీద పట్టీలను అంటించుటను మానివేయుటకు ప్రయత్నించండి, పనికిరాని ఏదో మందును పూయుటకు ప్రయత్నించుట మానివేయండి. రక్త ప్రవాహము సరిగ్గా అచ్చట ప్రవాహించనంత వరకు స్వస్థత కలుగదు.

అందువలననే జనులకు మధుమేహ వ్యాధి వచ్చుచున్నది. ఆ కుళ్ళిపోయిన భాగము వరకు అతడు కోసి తీయనంత వరకు ఆ స్థలము ఎన్నటికీ స్వస్థతను పొందుకొనదు. ఎందుచేత? ఎందుకనగా అచ్చట యుండు నిజమైన ఎర్రని రక్త కణములను అది తిని వేసినది. అందువలననే సంఘమంతటికి మధుమేహ వ్యాధి వ్యాపించి యున్నది. ఏర్పడే ప్రతీ చిన్నగాయము కొరకు తీసుకొనవలసిన జాగ్రత్తను తీసుకోకుండా, అలాగే కొనసాగుచూ ఉంటే ఆ గాయము మానదు. స్వార్థము, పక్షపాతము, దుర్నీతి, సమస్త నీచమైన కార్యములను దేవుని యొక్క క్యాలెండర్లో “తప్పుడు క్రియలుగా” పరిగణింపబడుచున్నది. సంఘము అటువంటి తప్పుడు అలవాట్లనే తీసుకొనుచున్నది. జనుల ఎదుట సంఘములో యుండు పురుషులు త్రాగుబోతులుగా, పొగ పీల్చువారుగా, అసహ్యమైన మాటలతో సరసోక్తులు చెప్పుకొనుట, స్త్రీలు తల వెంట్రుకలను కత్తిరించుకొనుచు, ముఖములకు రంగులు పూసుకొనుచూ, ఇటువంటి వస్త్రములను ధరించుకొనుచూ ఇటువంటి నీచమైన కార్యములన్నీ చేయుచున్నారు. ఈ నీచమైన దుర్నీతి కార్యములన్నింటి నుండి వారు ప్రభువైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడకుండా యుండుటయే వారావిధముగా ప్రవర్తించుటకు కారణమైయున్నది. ఆమేన్.

ఈ మాటలు వారికి కఠినముగా యుండవచ్చును. ఖచ్చితముగా, ఇది కఠినముగానే యుండును, కాని ఇది నిజము. మనము సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క తీర్పులో నుండి తప్పించుకొనలేనియెడల రానైయున్న దినములలో ఒకనాడు నీవు అణుబాంబు యొక్క ప్రేలుడుకు బలైపోవుదువు. అది ప్రతీ ఆత్మను నిత్యత్వమునకు వెలుపల ఉంచును, యేసుక్రీస్తు అనే ఆయన కుమారుని యొక్క రక్తమును ఎవరైతే కలిగియున్నారో - వారు మాత్రమే గుర్తించబడి, దేవుని సంధించెదరు. మీరు ఆ రక్తము క్రిందకు వచ్చి యుండుటను నేను చూడాలని ఆశించుచున్నాను. అది నేను మీకు యిచ్చు సలహాగా తీసుకోండి. దేవుని యొద్ద మిమ్ములను మీరు చక్కదిద్దుకోండి. ఇది నేను మీకు ఇచ్చు సలహాగా తీసుకొండి.

19

మంచిది, ఎందుకు మనము విశ్వాసము లేకుండా ఉన్నాము? మనము కలిగియుండవలసిన గొప్ప స్వస్థతలను ఎందుకు కలిగియుండుట లేదు? ఎందుకు మనము ఉండవలసినంత గట్టి కట్టడమువలె ఉండలేక పోవుచున్నాము? ఎందుకనగా పాదాలకు కలిగే పుండు మీద మనము పట్టీలను వేయుచున్నాము. అచ్చట రక్త మార్పిడి జరగవలసి యుండగా దానికి బదులుగా ఆ స్థలమందు అతుకులను అంటించుకొనుచున్నాము. ఆ స్థలమందు అటువంటి దానితో చుట్టుకొనుచున్నాము. దానిని మనకు తోచిన విధముగా మూసుకొనుటకు ప్రయత్నించుచున్నాము. మనము రక్తము లేనివారముగా యున్నాము. మనము క్రీస్తు లేనివారముగా యున్నాము. కాబట్టి నిన్ను నీవు మోసపరచుకోకు. “ఆ, ఏమీ పరవాలేదులే, నేను సంఘమునకు వెళ్ళుచున్నాను” అని అంటూ దెయ్యము నీ భుజమును తట్టుటకు నీవు అవకాశమివ్వవద్దు. దెయ్యము కూడా సంఘమునకు వెళ్ళును. అవును, నిజము అతడు నిజముగా వెళ్ళును.

పైనవున్న దేవుని సింహాసనము ముందుకు వెళ్ళెను, దేవుని యొక్క కుమారులతోను, జనులతో కలిసి దేవుని సింహాసనము ఎదుటకు వచ్చి కూర్చుండును. వారందరితో కలిసి దేవుని ముందు వచ్చి కూర్చొనియుండగా, “నీవెచ్చట నుండి వచ్చావు” అని దేవుడు వాడిని అడిగెను.

“అటూ, ఇటూ తిరుగుచూ, పైకి మరియు క్రిందకు తిరుగుచూ, భూమియందంటూ సంచారము చేసి వచ్చితిని” అని వాడు చెప్పెను. వాడు తిరుగుచూ చేసే పని అదియే!

కాబట్టి, దెయ్యము సంఘమునకు వెళ్ళును, దెయ్యము సంఘమునకు చెందినవాడుగా యుండును. ఒక క్రైస్తవునివలె దెయ్యము నటించును. వాడు ఒక వంచకుడు. వాడు ఒక క్రైస్తవునివలె నటించనియెడల, సంఘమునకు చెందినవాడుగా నటించనియెడల, వాడు ఒక వంచకుడుగా ఉండనియెడల, ఏ మనిషిని వాడు వంచించలేడు. నలుపు మరియు తెలుపు అనేటువంటి వ్యత్యాసము మాత్రమే అది కలిగియుండును. అది ఒకరికొకరికి విరుద్దముగా యుండును. ఆ ఆత్మ, ఈ చివరి దినములలో ఏ విధముగా యుండునో పరిశుద్ద గ్రంథము ఈలాగు చెప్పుచున్నది. “సాధ్యమైతే ఏర్పరచిన వారిని సహితము మోసపుచ్చేంత అతి సమీపముగా అది యుండును.” స్నేహితుల్లారా, మనము దానియందే జాగ్రత్త వహించవలయును.

20

ఇది, దేవుని యొక్క ప్రవక్తల సమయమై యున్నది. ఓ, సహోదరుడా, ఓ, ప్రసంగీకులారా! దేశమంతటా ఈ కార్యములను గూర్చి ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పినయెడల, వారు హృదయాలలో గుచ్చబడినవారై, నేలపై సాష్టా౦గపడెదరు. పంతొమ్మిది మిలియనుల బాస్టిస్టు సంఘములు లేక పంతొమ్మిది మిలియన్లు బాప్టిస్టులు, అమెరికా కంటే ఎక్కుమంది, పదమూడు మిలియన్లు మెథడిస్తు వారు, పదకొండు మిలియనుల లూథరన్లు, పది మలియనులు ప్రెస్బిటేరియన్స్ గలరు.

బంతి ఆట క్రీడలయందు, వినోద ఉల్లాసముల యందు గడుపుచూ, బుధవారపు రాత్రులయందు మరియు కొన్ని సమయములలో ఆదివారము రాత్రి యందు ఇళ్ళల్లో వుంటూ టెలివిజన్ చూస్తూ మరియు రేడియోలోని పనికిమాలిన కట్టుకథలు, అసహ్యమైన సరోక్తులను వినుచూ, హలీవుడ్లో నుండి దిగుమతి చేయబడిన వాటియందు ఆకర్షితులై, దానికి బానిసలైపోయి, మీ ఆత్మ అటువంటి నీచమైన వాటిచుట్టూ తిరుగులాడుచూ బంధింపబడిరి. దేవుడు కనికరము చూపును గాక! దానిని గూర్చి ఆలోచించండి. నీ దేశము యొక్క పాపముల నిమిత్తము దేవుని యెదుట నీవు మోకాళ్ళూని ప్రార్ధించవలెనని పరిశుద్ధ గ్రంథములో ఎచ్చటో ఒక చోట చెప్పబడియున్నది. మీతో పాటు నేను సిగ్గుపడుచున్నాను.

ఏది ఏమైనా గాని నేను నా మనస్సులో ఈ విధముగానే కొనసాగాలని నిర్ణయించుకొన్నాను. దేవుని యొక్క సహాయము మరియు కృప ద్వారా దీనిని చేయుటకు దేవుడు నాకు బలమును యిచ్చిన యెడల, నాకు ప్రాణమున్నంత వరకు యేసుక్రీస్తు యందున్న ఆ ఉన్నత పిలుపు యొక్క గురుతు వైపుకు బలవంతముతో ముందుకు కొనసాగిపోవాలని నేను నిర్ణయించుకొ న్నాను. దీనిని నేను చేయునట్లుగా దేవుడే నాకు సహాయకుడిగా యుండి, సహాయము చేయును. వెనుకంజ వేయుచూ దిగజారిపోయే స్థితులను మరియు ఆత్మీయ రక్తహీనతగా మారిపోవుచున్న స్థితి, నేను చూచుచున్న కార్యములు, మీరు చూచుచున్న కార్యములు మరియు కంటికి కనబడే పరిస్థితులను బట్టి, “ప్రభువా, నాకు సహాయము చేయుము” అని అనుటయే నా ప్రార్దనైయున్నది.

21

మరియు ప్రపంచమంతటా ఈ టాబెర్నికల్ మందిరము గూర్చి ఎరుగునట్లుగాను, ఈ దేశమందు ఎక్కడో ఒక మూలన కాంక్రీట్ తో కట్టబడియున్న ఈ చిన్న ప్రార్ధనా మందిరమును దేవుడు పైకి హెచ్చించెను. అది నిజము!

దావీదు ఆలోచించిన దానిని గూర్చి నేను తలంచుచున్నాను, ఒకానొక దినమున దావీదు ఇలా తన మనస్సులో అనుకొనెను, “దేవదారు మానులతో కట్టబడిన గృహములో నేను నివసించుచున్నాను, కాని దేవుని యొక్క మందిరము ఒక గుడారములో తెరల చాటున ఉన్నది, నేను దేవుని కొరకు ఒక నివాసమును కట్టెదను” అని దావీదు అనెను.

“నీ హృదయములో ఉన్నదంతటినీ చేయుము, ఎందుకనగా దేవుడు నీతో ఉన్నాడు” అని నాతాను ప్రవక్త దావీదుతో చెప్పెను.

ఆ రాత్రి దేవుడు నాతానునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, “నీవు వెళ్ళి దావీదుతో ఈలాగు చెప్పుము, దావీదు, నీవెవరవు? గొర్రెల దొడ్డి నుండి నేను నిన్ను బయటకు తెచ్చియున్నాను. నీకు గొప్ప పేరు కలుగజేసియున్నాను. లోకములో గొప్పవారు కలిగియున్న పేరు నీకు కలుగజేసి యుంటిని కాదా?”

ఈ చిన్న గుడారమునందు ఇచ్చట కూర్చొనియున్నవారు ఎవరు? దీనులైన పాత చాకలివారు, వెలివేయబడినవారు. ఎచ్చటో మూలనవున్న నెం. 8, పెన్ వీధిలో ఈ గుడారమునందున్న వారిలో ప్రత్యేకమైనదేదో ఒకటి కలిగియున్నవారు ఇచ్చట కూర్చొనియున్నారు. ఈ గుడారము ఎచ్చట ఉన్నది? జెఫర్సన్-విల్ లో యున్న వారికి సహితం తెలియకపోయినా గాని, పలుప్రాంతముల నుండి ప్రజలు ఇచ్చటకు వచ్చుచున్నారు. ఈ చిన్న గుడారమును ప్రసిద్ధి చేసి, దేవుని కనికరము ద్వారా ఇచ్చటయున్న జనులను దేవుడు గొప్ప జనులుగా చేసెను.

ఇండియా దేశములోనున్న ముంబాయి పట్టణము వారికి ఈ గుడారము ఎచ్చట యున్నదో ఎరుగుదురు. డర్బన్లో యున్న వారికి మిమ్మల్ని గూర్చి తెలుసు. ఇంకా అనేకనేక దేశములోని వారికి మిమ్మల్ని గూర్చి తెలుసు. ఆఫ్రికాలోయున్న వారికి ఈ స్థలము ఎచ్చట యున్నదో తెలుసు. ఇండియా, జర్మని, ఇంగ్లాండు, ఫిన్లాండ్, స్విడన్, యూరప్, ఆసియా, థాయ్లాండ్ చుట్టు ప్రక్కలవున్న ద్వీప కల్పములకు అనేక పరిసర ప్రాంతములలోయున్న వారికి, అందరికీ ఈ స్థలమును గూర్చి సమస్తము వారెగుదురు. వీరందరికి దేవుడు మనలను ఒక మంచి మాదిరిగా యుండునట్లుగా చూపియున్నాడు. లోకములోని జనులు లోక కార్యముల యందు మునిగిపోయి సమయాన్ని వృధా చేయుచూ మరెంతగానో ఆత్మీయ రక్తహీనతతో దిగజారి పోవుచుండగా, దేవుడు మనమధ్య చేయుచున్న కార్యములనుబట్టి మనము వాటిని నెమరు వేసుకొనుచూ, లోకము నుండి దేవుని వైపుకు తిరిగి మనము ముందుకు కొనసాగిపోవలయును. ఆ విధముగానే మనము తర్పీదు చేయబడుచూ, కొండమీద ఉన్న దీప స్తంభముగా మనలను ఆయన ఉంచెను. దీపపు వెలుగును ఎవరు మరుగు చేయలేరు.

దేవా! మిగిలినవారందరికంటే నేను ఎక్కువగా సిగ్గుపడుచున్నాను. నా భావమేమనగా, ఆ పాత కాలపు భక్తిని నేను కోరుచున్నాను. దేవుడు వారికి పశ్చాత్తాపమును కలిగించి, వారిని తన యొద్దకు పిలుచుచున్నాడు. అటువంటి పశ్చాత్తాపము మీరు కలిగి యున్నప్పుడు - చంక కట్టల సహాయముతో ఏ పురుషుడైనా గాని, ఏ స్త్రీ యైనా గాని నడిచి ఆ ద్వారము యొద్దకు వచ్చినప్పుడు, ఇక వారికి ఆ చంక కట్టెలు అవసరము లేకుండానే వారు మామూలుగా నడుచుచు వెళ్ళెదరు. ఒక గ్రుడ్డి వానిని ఆ ద్వారము యొద్దకు నడిపించినప్పుడు, వారు చూపు కలిగి వెళ్ళెదరు. చెవిటి వారు లోపలికి ప్రవేశించినప్పుడు, వారు చక్కని వినికిడి కలిగిన చెవులతో వెళ్ళెదరు. అంధకారపు పాపములతో మరియు భయంకరమైన మలినముతో కూడిన పాపులు లోపలికి ప్రవేశించినప్పుడు, గొర్రెపిల్ల యొక్క రక్తమునందు శుభ్రముగా కడుగబడి వెళ్ళెదరు. దీనిని మనము చేయలేమా?

22

దేవుడు ఇశ్రాయేలీయులను పిలిచి వారిని ఒక మాదిరిగా యుంచెను. దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఒక మాదిరిగా యుండుటకై ఇచ్చటకు తీసుకొని వచ్చెను. కాని దేవునియొద్ద నుండి మనము దిగజారిపోయినవారమై, దేవుని సన్నిధియందు మన కార్యములు మనలను సిగ్గునొందునట్లుగా చేయుచున్నవి. ఆయన మన కొరకు మనమధ్య చేసిన కార్యములను గూర్చి ఆలోచించిన యెడల, గొర్రెల దొడ్డిలో నుండి మనలను ఎంతగా హెచ్చించెనో దానిని తలంచినప్పుడు, ఈ ప్రపంచమంతటాయున్న జనులు మనలను ఎరుగునట్లుగా ఆయన మనలను ప్రసిద్ధి చేసి, ఆయన మన కొరకు ఎంతో గొప్ప కార్యములను చేసెను. అయినాగాని వాటిని మరచిపోయి లోకములోని కార్యములతో మనము మునిగిపోయి, లోక జనులతో కలిసిపోయి, ఇటు అటు తిరుగుచూ కాలమును వ్యర్ధముగా వృధా చేసికొనుచూ, దేవునిపట్ల మనము వుండవలసిన యదార్థవంతులుగా మనము లేము. మనకు ప్రార్థన జీవితము అసలు లేదు. చేయవలసిన మంచి కార్యములను మనము చేయుటకు ఇష్టపడుట లేదు. వ్యర్థమైన స్వల్ప కార్యక్రమములయందు ఆసక్తి చూపుచూ వాటిని చేయుటకు ప్రయత్నించుచున్నాము. నొప్పి కలిగినప్పుడు ఉపశమునకు ఎందుకు పనికిరాని లేపనములతో కట్టు కట్టుకొనుచున్నాము. నీ నొప్పిని స్వస్థపరచుటకు అచ్చట అమూల్యమైన రక్తము యుండగా, దానికి బదులుగా ఆ నొప్పిని పోగొట్టుకొనుటకు పనికిరాని వాటిని అచ్చట నీవు ఉపయోగించినను, అందువలన నీకు ఏ ప్రయోజనము లేదు. నిజము.

ఆ పాత పుండును కోసి నీవు తీసినట్లయితే, మధుమేహ వ్యాధిని నీకు నీవే వచ్చునట్లుగా చేసుకొంటావు. మధుమేహ వ్యాధితో నీకు ఆ గాయము ఉన్న స్థలము క్రుళ్ళిపోయి, ముదిరిపోయిన నీ కాలుని లేదా పాదమును అంతవరకు కోసి తీసివేయవలెను. నేను చెప్పే మాటలు నీవు త్రోసివేయవద్దు, ఈ మాటలను నాకు కాదని నిన్ను దాటి పోనీయకు, దీనితో పుండును పట్టీలను కట్టుకొనకుము. నీవు చేయవలసిన కార్యమేదనగా, దేవుని ఎదుట ముఖాముఖిగా వచ్చి నిలబడి “దేవా, నేను రక్తహీనతతో బలహీనమైనవాడను, నా పాపములన్నింటిని కడుగటకు నాకు ఆ రక్తము కావలసియున్నది” అని నీవు అడుగవలయును. నేను చేయు ప్రార్థన కూడా అదియే, నీవు చేయవలసిన ప్రార్ధన కూడా అలాగే ఉండాలని నమ్మండి. ఈ విషయములను ఆలోచించండి స్నేహితులారా.

23

రాబోవు ఒకకానొక దినములయందు, ఉదయకాలము తెల్లవారుటకు ముందు, తగిన సమయమునందు సంభవించకూడనిది సంభవింపవచ్చును లేదా నేటి నుండి ఇంకో ఏబది సంవత్సరముల తర్వాతైనా అది సంభవింపవచ్చును. ఒక రాకెట్ బాంబు, ఒక విధమైన లోహముతో చేయబడిన బాంబులాంటిది, లేదా హైడ్రోజన్ బాంబు వంటిది కాని పేల్చబడవచ్చును. అప్పుడు దేశము యావత్తు అప్రమత్తతతో యుండును. పెంటాగన్లోయున్న విచారణ కేంద్రం నందు ఎరిగే పళ్ళెములు గూర్చి విషయమేమిటని వివరణను కోరటమును ఒకనాటి వార్తా పత్రికలయందు మనము చూచితిమి. అది ఏదో ఒక కల్పిత కథ కాదు, అవి ఏదో ఊహించే ఊహవంటివి కావు; ఆ ఎగిరే పళ్ళెములు నిజముగానే యున్నవి. అవి రహస్య సమాచారమును సేకరించు సాధనములు. అవి యుద్ధ రంగమునందు ఎగురుచూ వెళ్ళే సాధనములు. అవి ఎదుట వారికి కనబడకుండా తప్పించుకొని వెళ్ళగలవు. అవి కనిపెట్టలేని వాటిని సహితము కనిపెట్టగలవు. అవి ఒక చోట ఆగ గలవు. సేకరించిన సమాచారమును గూర్చి చెప్పగలవు. అవి రహస్యమైన సమాచారమును బహు తెలివిగా సేకరించగలవు. వాటిని ఏ విధముగా సేకరించవలెనో వాటికి తెలుసు. కాని జనులు వాటిని గూర్చి చెప్పినప్పుడు నవ్వుచూ “ఎగిరి పళ్ళెములా?” అంటూ హేళన చేస్తూ పరిహాసము చేసెదరు.

కాని నేనేమి ఆలోచించుచున్నానో మీకు తెలుసా? ఆయన రాకడకు ముందు ఇటువంటి సూచనలు ఆకాశమునందు కనబడునని యేసు చెప్పెను. దానిని మీరు గమనించగలరా? ఆయన రాకడకు ముందు సొదొమ మరియు గొమొర్రాలోని జనులు కామముతో కామాంధులై, వారి మధ్యయున్న అసహ్యమైన లైంగిక సంబంధముల నిమిత్తము ఆయన ఆ పట్టణములను నాశనము చేసెను. దానికి ముందు అచ్చట జరుగుచున్న కార్యములను పరిశీలించుటకు, ఆయన దేవదూతలను అచ్చటకు పంపించెను. దేవదూతలు కొద్ది సంవత్సరములకు ముందు భూమి మీదకు దిగి వచ్చిరి. అచ్చటయున్న జనులు మధ్యయున్న కార్యములను వారు చూచిరి. నేనేమి చెప్పుచున్నానో, నిజమైన రక్తముతో కడుగబడిన జనులెవరో వారు దానిని గ్రహించెదరు. వారు భూమి మీద సంచరించుచున్నప్పుడు, వారు నిలబడియున్నట్లుగా తీసిన ఫొటోలు కూడా గలవు. అది నిజము. నక్షత్రములు ప్రకాశించలేక వెలవెలబోవునంతగా ఆ పాపము పండిపోగా, ఆ సమాచారమును తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళుటకు, దైవ స్వరూపులు (దేవదూత) ఈ భూమిని దర్శించెదరు. ఆ చంద్రుడు, త్రాగిన మత్తులోయున్న ఒక వ్యక్తి రాత్రి సమయమునందు ఏ విధముగా తూలుచూ నడుచుకుంటూ వస్తాడో అలా ప్రపంచమంతా, సమస్తము తూలుతూ యుండును. అవును.

24

క్రైస్తవుల మధ్య పాపము ప్రవేశించింది, ఎన్నుకొనబడిన వారి మధ్య పాపము ప్రవేశించింది. వారు తమయొక్క జ్యేష్టత్వపు హక్కును పేరు ప్రఖ్యాతుల కొరకు అమ్మివేసుకొనుచున్నారు. సేవకుడు సమాజములో జరుగు విందు - విలాసాల కొరకు దేవుని సువార్తను మార్చి వేయుచున్నాడు. రక్తముతో కడుగబడిన సువార్తను కలిగియున్న ఆ పూర్వపు భక్తిని ఎంతో తెలివితేటలతో కూడిన జనుల కొరకు అతడు మార్చివేయుచున్నాడు, బుద్ధిపూర్వకమైన తెలితేటలు గల సమాజము కొరకు, జనుల కొరకు అతడు సువార్తను దుర్వినియోగం చేయుచున్నాడు. స్వార్ధపూరితమైన స్వలాభం కొరకు, డబ్బును సంపాదించుట కొరకు, అనేకులు సేవ చేస్తున్నామంటూ బయలుదేరి ఆ సువార్తను ప్రసంగించుచున్నారు. అది కేవలము వారి స్వలాభము కోసమే చేయుచున్నారు. ఆ విధముగా అనేకులు గొప్ప భవనములను కలిగి, ఖరీదైన కార్లలో తిరుగుచూ, ఇంతకు ముందెన్నడూ లేని విధముగా అనేకమైన వాటిని వారి కొరకు సమకూర్చుకొనుచూ, ధనాపేక్షతో, స్వలాభం కొరకు సేవ చేయుచున్నారు. అందరూ కాదు. దేవుని కోసము యధార్ధతతో సేవ చేయువారు కొందరిని ఇంకా కలిగియున్నందులకు దేవనికి నేను కృతజ్ఞలు చెల్లించుచున్నాను.

ఎజ్రా దినములలో అచ్చటయున్న జనుల పాపముల నిమిత్తము, ఎజ్రా ఏడ్చుటకు ప్రారంభించినప్పుడు, పాపమును ఖండించుచూ, పాపములను విడిచిపెట్టి దేవుని వైపునకు తిరగమని జనులను పిలిచినప్పుడు ఏమి జరిగినదో మీకు తెలుసా? దేవునిచే ఎన్నుకొనబడిన వారందరూ, దేవుని యందు నమ్మకముగలవారు అందరూ అతని యొద్దకు ఏకముగా కూడి వచ్చిరి. నేడుయున్న మనకు కావలిసినది అటువంటి పురుషులకు మరియు స్త్రీ.... అటువంటి సంఘములకు ప్రసంగించుచున్న ప్రసంగీకులగు మీరు, పాపమును పాపమని ఖండించుచూ, గద్దించి చెప్పి, దానిని విడిచిపెట్టి రమ్మని నీవు జనులను పిలిచినప్పుడు, నిజమైన దేవుని యొక్క ప్రజలు అప్పటికప్పుడే దానిని విడిచి నీ యొద్దకు వచ్చి చేరెదరు. మరియు నీతో వారు నిలిచియుందురు. అది నిజము. పాపమును పాపమని ఖండించుచు చెప్పి, ఆ పాపకార్యముల నుండి వారిని ప్రత్యేకపరచుకొని, సరియైన దానియందు వారిని నిలువమని నీవు వారిని పిలిచే సమయము ఇదియే. దీనిని చేయుటకు మనకు కావలసినంత ధైర్యమును దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఏమి జరుగనైయున్నదో దానిని గూర్చి కొంచెం ఆలోచించి చూడండి.

25

నేను మీకు చెప్పినరీతిగా, ఈ ఉదయ కాలమందు ఎవరో దీనిని చెప్పారని నేను నమ్ముచున్నాను. ఈ ప్రపంచపు పరిస్థితిని గమనించుచున్న ఎవరో ఒకరు ఇలా చెప్పారు. దానిని మీరు ఏమని చెపుతారో నేను దానిని మర్చిపోయాను. బాంబు లేదా ఆ బాంబులతో నిండిన విమానము వచ్చుట అని దానిని ఎదో చెప్పెదరు. ఎంతో కాలము క్రితము కాదు, అటువంటి ఒక విమానము ఎచ్చటో ఒకచోట నుండి అది వచ్చినది. దానిని వారు గొప్ప యుద్ధనౌక అని పిలిచెదరు. వేగముగా సాగిపోయే ఆ యుద్ధ నౌకలపై మూడు వందల “జెట్ బాంబుర్స్” అనే వాటితో అణుబాంబులు మరియు హైడ్రోజన్ బాంబులతో నింపబడియుండు విమానములు ఎగురుచూ వారిపై వ్రేలాడుచున్నవి.

ఇటువంటి అణుబాంబులతో నింపబడిన యుద్ధ విమానములను నడిపే వారిలో ఒకరు మొన్న జరిగిన సహోదరుడు జాక్ కూటములలో అతడు మారుమనస్సు పొందాడు. ఎంతో కాలము క్రితము కాదు. అతడు శ్రివ్-పోర్ట్ నందు గల పెద్ద విమానాశ్రయమునందు ఉద్యోగం చేయుచున్నాడని అతడు చెప్పాడు. “అణు బాంబులతో నింపబడియున్న యుద్ధ విమానాలు ఇప్పుడే మన తలపై వ్రేలాడుచున్నవి.”

“నీవు చెప్పేది నిజమేనా” అని నేను అడిగాను.

“అటువంటి విమానాలలోనే మేము ప్రతి దినము తర్పీదు పొందుచున్నాము” అని అతడు అన్నాడు.

“నీకు భయము వుండదా?” అని నేను అడిగాను.

“వాటిని పేల్చుటకు బటన్ మా ఆధీనంలో ఉండదు. అయితే మేము ఎంతో సిద్ధముగా వుంటాము. ఆ విధముగా వాటిని పేల్చేటువంటి బటన్ ఒక నిమిషము — అరువది సెకండ్లలో — అది అమర్చబడును, ముందుగానే ఇంధనమును నింపుకొని యున్న యుద్ధ విమానము సిద్ధము చేసికొని వెంటనే ఆ అణుబాంబులతో ఇంగ్లాండు దేశమునకు అవి వెళ్లిపోతాయి,” అని అతడు అన్నాడు.

26

ప్రతీచోట సముద్రములో అటువంటి గొప్ప అణు బాంబులతో సిద్దముగా యుండు విమానములు సిద్ధపరచబడియున్నవి. నీకు ధైర్యము ఉంటే ఒక్క బాంబును మాపై వేసిచూడు, ఐక్య సంయుక్త రాష్టాలలో ఎచ్చటైన ఒక్కచోట లేదా ఏదైనా చుట్టు ప్రక్కల ఒక్కచోట వేసి చూడు, ఆ తర్వాత ఏమి జరుగుతుందో నీవు చూస్తావు“ అని వారు రష్యాకి సవాలు చేస్తున్నారు. అది దేనిని సూచించుచున్నది? అది రష్యాపై జరుగనైయన్న ఘోరమైన దాడి అని చెప్పవచ్చును. ఒక వేళ వారు దానిని చేసినట్లయితే అటువంటి అణు బాంబులను మరియు హైడ్రోజన్ బాంబులను వారు వేయుట ప్రారంభించిన యెడల అది గొలసువంటి ప్రక్రియతో ప్రేలుడు సంభవించి భూమినంతా కాల్చివేయును.

లేఖనములలో చెప్పబడిన మాటలలో ఒక్కరవ్వంత కూడా తప్పిపోకుండా అది అట్లే జరుగునని మీరెరుగుదురా? “భూమ్యాకాశములు రగులుకొని మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును.” అణుబాంబులు ఈ భూమిని కాల్చి బూడిద చేయును. మనము బహు ప్రమాదకరమగు దిములయందు జీవించుచున్నాము. భూమి మీదయుండు మనుష్యులు మరణ భీతితో కలవరపడుచున్న దినమందు మనము జీవించుచున్నాము — గొప్పవారు అనబడిన మనుష్యులు. మొట్టమొదట బాంబు ఎప్పుడు పేలుతుందో అనే భయముతో గొప్ప మనుష్యులు సహితము భయపడుచున్నారు. మొట్టమొదటి బాంబు ఎప్పుడు పేలుతుందో, అప్పుడు ఈ సమస్తము సర్వనాశనమగును.

27

ఆ సమయమున ఈ లోకములో ఒక నిజక్రైస్తవుడు సంతోషముగా ఉండే యుక్తమైన సమయముగా అది వుండును. కాలములు మారిపోవును. పాతదైన ప్రతీదీ నూతన యవ్వనముగా మారిపోవును. ఓ, మై! మరణము దూరముగా కనబడని చోటుకు పారిపోవును. రోగమనునది ఇక ఉండదు. రోగుల కొరకు ఇక ప్రార్ధనా కూటములు ఉండవు. తప్పిపోయిన ఆత్మల కొరకు ఇక ప్రార్థనా కూటములు అవసరము లేదు. దేవుడు దిగి వచ్చి, భూమిపై నలుదిశలలోయున్న ఎన్నుకొనబడిన వారిని తీసుకొని వెళ్ళుటకు ఆయన యొక్క స్వకీయ రెక్కల క్రింద వారినందరిని ఏకముగా చేర్చి ఆయన యొక్క రాజ్యములో ఆయనతో కూడా రాజ్యపరిపాలన చేయుచూ మనమందరము నిత్యము ఆయనతో పరలోకములో యుండెదము.

ఓ, సహోదరుడా, సహోదరీ, నా యొక్క స్నేహితుడా, ఈ రాత్రి యందు నీవు సిద్ధముగా లేనట్లైతే, ఈ ఘడియయందే నీవు సిద్ధపడుదువు గాక! యేసుక్రీస్తును నీవు స్వీకరించమని ఆయన యొద్దకు నిన్ను రమ్మంటూ నేను నిన్ను ఆహ్వానించుచున్నాను. అది నిన్ను ఒక భిన్నమైన వానిగా చేయును. నీవు దేవుని యొద్ద లేకుండా ఎచ్చట వుండకూడదో, అచ్చట నీవు వున్నావనే దానిని నీవు తెలుసుకొనెదవు, నాయంతట నేను నిన్ను ఈ వేదికయొద్దకు ఆహ్వానించుచున్నాను.

ఇచ్చట వున్న ప్రతీ ఒక్కరిని ఈ వేదిక యొద్దకు రమ్మని నేను ఆహ్వానించుచున్నాను. మిమ్మల్ని ఈ వేదిక యొద్దకు పిలుచుట మాత్రమే కాక, నీలో ఉన్న నచ్చని కార్యములన్నింటిని, నీ ఆత్మను, దేవుడు నిన్ను శుద్దీకరించు వరకు నీవిచ్చట వేచియుండుము ఒక నూతన వ్యక్తిగా ఇచ్చట నుండి నీవు వెలుపలకు వెళ్ళు వరకు నీవిచ్చటనే వేచియుండుము. పనికిరాని పట్టీ వేసుకొని కట్టు కట్టుకొనుట కాదు గాని, అచ్చట రక్తమార్పిడి చేయించుకున్న వ్యక్తిగా వెలుపలకి వెళ్ళుము. అది మీ రక్తమును శుద్దీకరించి, మీకు నూతన జీవమును మరియు నూతన నిరీక్షణను యిచ్చును. ఇచ్చట నుండి పరిశుదాత్మ బాప్తిస్మమును పొందుకొన్నవాడివై వెలుపలికి వెళ్ళుము. కేకలు వేయుచూ, నాట్యమాడుచూ, ఏదో చేస్తూ వెలుపలికి వెళ్ళటము కాదు. అవన్నియు మంచిదే, అవన్నీయు సంఘమునకు చెందినవే అవన్నీయు పరిశుద్ధ గ్రంథములోని కార్యములే. కాని పరిశుద్ధాత్మను గూర్చి నేనేమి చెప్పుచున్నానంటే, అది దేవుని యొక్క ప్రేమైయున్నది.

28

ఒకానొక దినమున ఒక యవ్వనస్తుడు నాతో మాట్లాడుచుండెను. అతడి తల్లి మంచి ప్రేమగల స్త్రీ, ఆ స్త్రీని నేనెరుగుదును, ఆమె ఒకటి లేదా రెండు సార్లు నాతో కలిసి మాట్లాడినది. “ఓ, ప్రియమైన నా కుమారుడా, ఇచ్చటకు రమ్ము నీతో పని ఉన్నది. నా చేతిలో నుండి నూనె వచ్చుచున్నది,” అని ఆమె తన కుమారుడితో చెప్పినది. మంచిది, నాకు కూడా ఆ విధముగా జరుగును. నాకు కూడా చేతిలో నుండి నూనె చెమటలా వచ్చును. “దానిని గురించి నీవేమి తలంచుచున్నావు” అని ఆమె తన కుమారుడిని అడిగింది.

దేవునికి ఇంకా సమీపముగా తాను జీవించాలని ఆమె ఆశించుచూ, తన కుమారుడు తన కొరకు ప్రార్థించాలని ఆమె ఆశించినది. ఆ బాలుడు తన తల్లివైపు చూచి, “అమ్మా, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను.” “నీ చేతిలోనుండి నూనె కారుచున్నంత మాత్రమున అది నీ దోషములన్నింటిని పరిహరించగలదా? అది దేవునితో నీకు మధురమైన అనుభవమును ఇవ్వగలదా?”

“లేదు.”

“అట్లైయితే నేను దానిని గురించి ఆలోచించకుండా అలాగే విడిచిపెట్టుము, అని చెప్పెను.

నీవు చెయ్యాల్సిన కార్యము అదే. ఓ, దానిని అలాగే వదిలివేయుము.

ఓ, ప్రపంచము, మత సంబంధమైన ప్రపంచము, పెంతెకొస్తు ప్రజలు కల్పనలతో కూడిన విపరీతమైన కార్యముల కొరకు ఎదురుచూచుచున్నారు. ప్రపంచము, విధ్యావేత్తలతో నిండిన ప్రపంచమని పేరుకు చెప్పుకునేవారు, సంఘసంస్థల ప్రపంచము, వీరంతా ఏమి ఆశించుచున్నారంటే ఇంకా తమ సంస్థను మెరగుపరచుకొని, ఇంకో పది లక్షల మంది కంటే ఎక్కువ మంది జనులను తమ సంస్థలోకి వచ్చి చేరాలని ఆశించుచూ, అందుకొరకు ఏమి చేస్తే జనులు వారి పట్ల ఆకర్షితులవుతారో అటువంటి గొప్ప కార్యములు చేయుటకు వారు ఎదురుచూచుచున్నారు. వారి సంస్థలో సభ్యులుగా “ఇంకో పది లక్షల కంటే ఎక్కువ మందిని” చేర్చుకోవాలంట, అది మీకు తెలుసా?

దేశములు ఒక విధమైన బలమైన పోలీసు బలగముతో ప్రపంచములో గల మిగతా దేశములన్నింటిని తమ క్రింద లోపరుచుకొని, నీతిని తీసుకురావాలని ఆశించుచూ ఎదురుచూచుచున్నారు.

సహోదరుడా! అది పెంతెకొస్తు ఆశించు రీతిగా కల్పనతో కూడిన అద్భుత కార్యముల ద్వారా రాదు, లేదా ఏదో పెంతెకొస్తు సంస్థల ద్వారా, లేదా కాథలిక్ ఆచారాధిపత్యముద్వారా రాదు, లేదా పెంటగన్లో యున్నవారిద్వారా అది రాదు, లేదా ఏదో క్రొత్త పుటలను త్రిప్పుట ద్వారా రాదు. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా, యేసుక్రీస్తుకు మీ జీవితములను సంపూర్ణముగా సమర్పించుకొనుట ద్వారానే వచ్చును. అట్లు కాకుండా నీవు ఏ అడ్డదారులలో వెళ్ళి, అందుకొరకు ప్రయత్నించినను అది తప్పిదమగును.

మనము ప్రార్థించుకొనెదము. సహోదరీ, ఈ సమయమునందు నీవు పియానో దగ్గరకు రావాలని నేను కోరుచున్నాను.

29

ఈ సమయమందు నాకు ఆశ్చర్యమును కలిగించుచున్నది. ఒక వేళ దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధముగా నీ ఆత్మ వున్నాదాయని నీవు పరీక్షించుకొనుము. నీవు యధార్థముగా వున్నావా? చావు బ్రతుకుల మధ్యయున్న నా అత్తగారు అచ్చట ఉన్నదని నేను మీతో చెప్పిన ప్రకారముగా, నేను వెళ్ళి ఆమెను చూడవలయును. ఆమె మరణమునకు సమీపముగా యున్నది.

ఆ విధముగా మరణపు అంచుల దగ్గరకు వెళ్ళిన నా స్నేహితులను, ఆ సమయమున మరణము నుండి తప్పించుకొని వచ్చి, ఇచ్చట కూర్చున్న వారిని నేనెరుగదును, ఆ విధమైన అనుభవములోనికి వెళ్ళి వచ్చిన జనులు, నేను వెళ్ళి చూచినటువంటి వారు ఈ సంఘమునందు ఇప్పుడు ఇచ్చట కూర్చొనియున్నారు. ఓ సహోదరుడా, సహోదరీ, నీవు కూడా ఆ అనుభవము యొద్దకు రావలసివచ్చును. మీరు కూడా ఆ మరణమనే ఘడియల యొద్దకు రావలసినవారై యున్నారు. “సహోదరుడు బ్రెన్హాం, అది నాకు తెలుసు, రాబోయే ఏదో ఒక దినములలో దేవునికి నన్ను సమర్పించుకోవాలనే తీర్మానమును తీసుకుంటాను” అని నీవు చెప్పవచ్చు. రాబోయే దినములలో ఏదో ఒక రోజు నీ జీవితములో రాకుండానే వుండవచ్చు. ఈ దినము మాత్రమే నీవు నిర్ణయమును తీసుకొనే దినముగా యున్నది. వేరే ఇంకొక దినము నీకు రాకపోవచ్చు.

ఒకానొక దినమున ఒక వ్యక్తి తన భార్యను తీసుకొని కాలిఫోర్నియా నుండి మిచిగన్ కు కారును నడుపుకుంటూ తన నూతన గృహమునకు వెళ్ళుచుండగా, ఆ తర్వాత క్షణాల్లో ఏమి సంభమించునో అతడికేలాగు తెలియును. అతడు నౌకాదళములో ఉద్యోగము చేసి పదవీ విరమణ చెందినవాడు. టూరిస్ట్ పోర్ట్ అనే స్థలము నుండి ఆ రోజు ఉదయమున అతడు తన భార్య మరియు తన చిన్న పాపతో బయలు దేరి వెళ్ళుచుండగా, ఇంకా కొద్ది నిమిషములలో తన భార్య తన చిన్న పాప ప్రమాదములో చిక్కుకొని మృతి చెందుతారని అతడికి ఎలాగు తెలియును? హెన్రీవిల్లీ అనే స్థలమందు కొద్ది సేపటికే వాళ్ళ ప్రయాణించే కారు ఒక బస్సుతో ఢీకొనినది. ఆ బస్సు నడిపేవాడు తప్పుగా నడిపినందువలన, అతని కారు బాగా ధ్వంసమై పోయినందు వలన అతని భార్య మరియు కుమార్తె ప్రమాదములో చనిపోయిరి. వారి ఆత్మలు దేవునితో సరిగానే యున్నవని నేను నమ్ముచున్నాను.

30

కొద్ది వారముల క్రితము నేను మరియు సహోదరుడు ఉడ్స్ పైకి ఎక్కుచూ వెళ్ళుచుండగా ఇక్కడి స్థలములో ఒక విమానము ప్రమాదమునకు గురై అచ్చట పడిపోయినది. మేము ఆ ప్రాంతాన్ని గమనించుచుండగా, ఎనిమిది మంది శరీరములు ముక్కలైపోయి చెల్లాచెదురుగా పడియున్నవి. వారి తలలు, కాళ్ళు మరియు చేతులు అన్నిచోట్లా విసిరేసినట్లు యున్నవి. వారి శరీరములను వెలికి తీయుచుండగా, ఒక వ్యక్తి శరీరమును తీయుచుండగా అతడి కడుపులోని ప్రేగులు క్రిందపడినవి. అతడు ఒక మంచి వ్యక్తిగా వుండవచ్చును, లేదా ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా యుండవచ్చును. ఆ దినమున ఆ వ్యక్తి ఆ ఉదయమున విమానము ఎక్కుచుండగా, ముందు రాత్రి సంఘమునకు అతడు వెళ్ళియుండవచ్చునని నేను ఆశ్చర్యపోతున్నాను. ఆ రాత్రియందు మంచి అభిప్రాయములను అతడు తీర్మానించుకొని యుండవచ్చును. అతడి సంఘ కాపరి అతడికి వేదిక పిలుపును కూడా యిచ్చి యుండవచ్చును. సంఘకాపరి పాపమును గురించి గద్దించి దేవునియొద్దకు పిలిచి యుండవచ్చును. ఆ అవకాశమును అతడు సద్వినియోగము చేసుకొనెనా లేదా నిరాకరించి ఒక మృగమువలె ప్రవర్తించుచూ వెలుపలికి వెళ్ళిపోయెనా? ఆ వ్యక్తి దేవుని దృష్టిలో దేవుని కుమారుడుగా యుండగలడా?

చెప్పిన విషయములను గూర్చి స్నేహితులారా ఆలోచించండి. చెప్పబడిన మాటలు ప్రాముఖ్యమైనవి. అవి చాలా ప్రాముఖ్యమైనవి మాత్రమే కాదు, ఈ ఘడియయందు నీకు ఆ కార్యములన్నియు చాలా ప్రాముఖ్యమైనవి. నీ మనస్సునందు నిన్ను సమర్పించుకొనుటకు సిద్ధపడు సమయ ము ఇదే అగును. ఈ జీవితమందు గాని, ఇక మీదట జీవించబోవు జీవిత మందు గాని నిన్ను సమర్పించుకొనుటకు నీవు నిర్ణయమును తీసుకోవలసిన సమయము ఇదియే. మనము ప్రార్థించుచుండగా, నీవు అటువంటి మంచి నిర్ణయమును తీసుకొందువు గాక!

31

పరలోకపు తండ్రి, పాపమును గూర్చి పరిశుద్ద గ్రంథములో చెప్పబడిన దానిని మేము చదివిన రీతిగా, ఆ పాపమును ఎవరైతే చేసి దానిని ఒప్పుకొనరో వారు దేవుని ఎరుగకుండా మరణించెదరనే భావమును మేము గ్రహించియున్నాము. కొంత మంది జీవితములలో జరిగిన అటువంటి అనుభవమును మేము ఎరిగితిమి మరియు వాటిని మేము చూచితిమి. ఎవరైతే ఆ ఒప్పుకోలును చేయాలని ఉద్దేశించబడియున్నారో వారు దానిని ఎంతో కాలముగా చేయకుండానే త్రోసివేయుచున్నారు. దేవా! ఎవరైతే బహిరంగముగా వారి పాపములను ఒప్పుకున్నారో, మేము దానిని ఒప్పుకున్నామని వారు చెప్పినా గాని వారు పొందుకోవలసిన దానిని ఇంకా పొందుకోలేదు. ఎవరైతే క్రైస్తవులుగా నటించుచున్నారో అసలు వారెన్నటికిని క్రైస్తవులు కాలేరు. వారు జీవితములే దానిని ఋజువు చేయుచున్నవి. మరియు వారు మరణించిన మరణ విధానము దానిని బయలుపరచుచున్నది.

తండ్రి, ఈ రాత్రి సమయమందు ఇప్పుడు, నీవు ప్రతీ ఒక్కరి హృదయముతో నీవు మాట్లాడమని నేను ప్రార్థించుచున్నాను. ప్రభువా, నీ సేవ విషయములో నేను చేయవలసిన కార్యములలో అనేకమైన కార్యములు త్వరితముగా చేయకుండా ఎంతో ఆలస్యముగా చేసినందున మరియు ఏది చెయ్యకూడదో , చేసిన ఆ కార్యముల నిమిత్తము నా తప్పులను నీ యెదుట నేను ఒప్పుకొనుచున్నాను. ఈ దేశము చేసిన తప్పులను నీ యెదుట నేను ఒప్పుకొనుచున్నాను. ప్రభువా! నా కొరకు నీ కనికరమును వేడుకొనుచున్నాను. పెంచి పెద్దవారిగా చేయవలసిన ముగ్గురు చిన్న పిల్లలు నాకు గలరు. భయంకరమైన వేడిగాయుండు పరిస్థితులయందు మేము ఇచ్చట జీవించుచున్నాము. దేవా, అందుకని వాటి నుండి పరిగెత్తిపోవలసిన అవసరత మాకు లేదు, ఎందుకనగా వాటన్నింటిని గూర్చి నీవు ఎరుగుదువు. దేవా, నేను నీయందు యుండవలెనని ఆశించుచున్నాను. ఏదో ఒక దినమున అణుబాంబు పేలుట వలన సమస్థము ధ్వంసమై నాశనమగును. ఒక వేళ మేము ఆ ధ్వంసమందు తప్పించుకొన్నను ఏదో వ్యాధి మమ్మల్ని నాశనము చేయును. ఏదో ఒకటి మమ్మల్ని నాశనము చేయును.

కాని వాటి నుండి తప్పించుకొనుటకు ఒక మార్గమును మేము కలిగి యున్నందుకు ఎంతగానో సంతోషించుచున్నాము. “ప్రభువు యొక్క నామము ఒక దుర్గమైయున్నది. నీతిమంతులు దానియందు ప్రవేశించి సురక్షితముగా యు౦దురు.” దేవా, పాపియగు స్నేహితుడైనను, బాలుడైనను, బాలికైనను, పురుషుడైనను లేదా స్త్రీ అయినను తెరవబడియున్న ద్వారమును చూచుదురు గాక! ఈ అవకాశమును జారవిడుచుకోకుండా పరిగెత్తుకొని క్రీస్తు యొద్దకు ఈ ఘడియయందు వచ్పుదురు గాక!

32

ఇప్పుడు, మనము మన తలలను వంచుకొనియుండగా, ఇచ్చట కొంత మంది, లేదా... ఇచ్చట కొంతమందియున్నారని నేనెరుగుదును. వారి కొరకు ఈ విధముగా చెప్పుటకు ఇష్టపడుచున్నాను, మీ చేతులను దేవునివైపు పైకి ఎత్తి, “నా జీవితము పట్ల నేను సిగ్గుపడుచున్నాను. నేను నా పాపములను దేవుని యొద్ద ఒప్పుకొనుచున్నాను. దేవుని కనికరమును కోరుచున్నాను” అని చెప్పండి. దేవుని వైపు మీ చేతులను పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, అచ్చట అనేక మంది, ఇంకా అనేక మంది గలరు. అవును, ఇచ్చట అనేక మంది గలరు. ఇచ్చట ఇంకా కొంత మంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ఇక్కడ ఉన్న మీలో అనేకులు, క్రైస్తవ్యమును గూర్చి చాలా కాలము క్రిందట బహిరంగముగా మీరు ఒప్పుకొన్నను దేవునితో ఏకీభవిస్తూ ముందుకు సాగిపోవుట యందు మీరు విఫలమైతిరనేది మీరెరుగవలయును, ఇప్పుడు మీరు చేయుచున్న కార్యములు చేయవలసిన రీతిలో యుక్తమైనవిగా మీరు చేయుట లేదనేది మీరెరుగవలయును. నీవు ఒప్పుకోవాలని అనుకుంటున్నావే గాని వాటిని నీవు ఒప్పుకోవటము లేదు, ఏలయనగా నీ ఒప్పుకోలు కేవలము అలలకు తేలిగ్గా తేలిపోతూ కొట్టుకొనిపోయే దానివలె వున్నది. చూడకూడని వంటి అసహ్యమైన కార్యక్రమములను మీరు చూచుచున్నారు. లోకసంబంధమగు పుస్తకములను చూచుచున్నారు. చదవకూడని చెత్తను చదువుచున్నారు. అవన్నీ నిన్ను ఒక క్రైస్తవునిగా మార్చజాలదు. వినకూడని నీచమైన, అసహ్యమైన దుష్టపరిహాసపు మాటలను వినుచున్నారు. పురుషుడు మరియు స్త్రీలగు మీరు వాటిని ఆలకించకూడదని మీకు తెలుసా! మాట్లాడకూడని మాటలు నీవు నీ నోటి ద్వారా మాట్లాడకూడదని నీవు ఎరుగవలయును, అందునిమిత్తము నీవు సిగ్గుపడవలయును. అవి మిమ్మల్ని ఒక పాపిగా చేయుచున్నవి, వాటిని మీరు విడిచిపెట్టవలయును. అవి చేయకూడని పాపములై యున్నవి.

మీరు క్రీస్తు కొరకు మీ చేతిని పైకి ఎత్తినయెడల, ఆయన కనికరము మీపై యుండును మరియు మీరు క్షమించబడుదురు. నీ చేతిని పైకి ఎత్తుము. యవ్వన స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక!

33

తన తప్పులను ఒప్పుకొనుటకై, ఆ స్త్రీ వేదిక యొద్దకు వచ్చినట్లుగా నీవు యిచ్చటకు రమ్ము. దేవుని వైపు నీవు నీ చేతిని పైకి ఎత్తుము. దేవుడు నిన్ను దీవించును. అది నిజము. ఓ సహోదరుడా, అది నిజము. దేవుడు నిన్ను దీవించును! నీ చేతిని పైకెత్తుము. నీవు తప్పు చేశావని నీకు తెలుసు. నీకు ధైర్యము యుండినయెడల, ఈ రాత్రి యందు ఈ వేదిక యొద్దకు వచ్చి ఇచ్చట నన్ను సంధించుము. అందునుబట్టి నేను ఆశ్చర్యపడుదును. ఇచ్చటకు వచ్చి మోకాళ్ళూని “దేవా, మా అందరి పట్ల నీవు దయను కలిగియుండుము. మా అవసరత నీవే” అని చెప్పుము. యవ్వన బాలికా, దేవుడు నిన్ను దీవించును.

ఏడ్చుకుంటూ మందుకు వచ్చుచున్న ఈ యవ్వన స్త్రీని గమనించండి, దీనికి ముందు వారి జీవితములలో పరిస్థితుల యొక్క భయంకరమైన ప్రభావములతో వారి జీవిత మార్గమందు అనేక కూడళ్ళను దాటుకుంటూ వారిచ్చటకు వచ్చిరి. ఎందుకని? ఓ వృద్ధుడా, మనము యవ్వన బాలురుగా ఉన్నప్పుడు ఆ కాలమందు లోకముచేత ఆకర్షింపబడుటకు మనము ఎదుర్కొనిన శోధనల కంటే ఈ కాలమందున్న మన బాలురు ఇంకా పదిరెట్లు ఎక్కువగా అటువంటి ఆకర్షింపబడు శోధనలను ఎదుర్కొనుచున్నారని నీవు గ్రహించగలుగుచున్నావా? ఓ సహోదరీ, నీ యవ్వనమున నిన్ను తొట్రిల్ల చేయుటకు నీవు ఎదుర్కొన్న శోధనల కంటే నీ కుమార్తె ఇంకా పదిరెట్లు ఎక్కువగా అటువంటి శోధనలను ఎదుర్కొనుచున్నదని నీవు గుర్తించగలుగుచున్నావా? ఇప్పటి లోకకార్యములను గమనించు, ముఖమునకు రంగులు పూసియున్న ఆ దెయ్యపు చిత్రములను గమనించుము. నీ కుమార్తె దేనిని కలిగియున్నదో గమనించి చూడుము.

మనము ప్రార్ధించవలసినవారమై యున్నాము! మళ్ళీ మనము ఆ పాత భక్తిని చేయవలసియున్నది. సహోదరుడా, మన తండ్రులు ప్రార్ధన కొరకై గడిపిన సమయము కంటే మనము అందులో కొంత సమయమైనను ప్రార్థన కొరకు సమయము వెచ్చించుట లేదనేది నీవు గుర్తించగలవా? సంఘ కాపరి, మనకు ముందు కాలములో ఉన్న సంఘకాపరుల వలె మనము మన మోకాళ్ళని ఎక్కువగా ప్రార్థించుటకు సమయము కేటాయించుటలేదని నీవెరుగుదువా? స్త్రీ, నీ తల్లి నిన్ను పెంచిన విధముగా, నీవు నీ కుమార్తెను ప్రార్ధి౦చమని చెప్పుచున్నావా? లేదా, నీ కుమార్తెతో కలిసి రాత్రులయందు నీవు ప్రార్థించుట లేదు అనే విషయమును నీవు గుర్తించగలుగుచున్నావా? మరి వాటిని గూర్చి ఏమందువు? దీనికి దోషులు ఎవరైయున్నారు? మనమే ఇందుకు దోషులమైయున్నాము. దీనిని దాటుకొని వెళ్ళుటకు మరో మార్గము లేదు. మనమే ఇందుకు దోషులమై యున్నాము. నేను కూడా దోషినే, దేవుని యొక్క సేవను నేను చేయవలసినంతగా చేయలేదు, అందుబట్టి నేను దోషిని. అది ఘోరమైన తప్పిదము, దానిని నేను ఒప్పుకొనుచున్నాను. దేవుడు నాయందు దయగలిగి యుండవలెనని నేను దేవునిని కోరుచున్నాను.

34

నేను సంగతులను తరచి చూడగా, దేవుని సేవలో నేను చేయవలసిన కార్యములు చేయవలసియుండియు, ఆ అవకాశములను నేను జారవిడిచాను, ఎందుకు పనికిరాని వాటియందు, ముఖ్యము కాని పనులయందు, అల్పమైన వాటియందు, వ్యర్థమైన వాటియందు నా సమయమును వ్యర్ధము చేసుకున్నాను. అందుకొరకు నన్ను గూర్చి నేను ఎంతగానో సిగ్గుపడుచున్నాను. ఒక సువార్త సేవకునిగా నేను మీముందు సిగ్గుపడుచున్నాను. దేవుని పనియందు త్వరితముగా నేను చేయవలసిన పనిని చాలా ఆలస్యముగా చేసినందుకు దేవుని యెదుట నేను పశ్చాత్తాపపడుచున్నాను; నన్ను క్షమించమని దేవుని అడుగుచున్నాను. సంఘమా నన్ను క్షమించమని అడుగుచున్నాను. దేవుని యొక్క కృప ద్వారా మరియు దేవుని యొక్క సహాయము ద్వారా ఎవరేమి చెప్పినా గాని వాటిని గూర్చి నేను ఆలకించను. ప్రతీ ఒక్కరు ఏదో ఒకటి చేయాలని నీతో చెప్పుటకు ప్రయత్నించుదురు. వారు స్వలాభము కొరకు ఒక కార్యక్రమమును కలిగియున్నారు. స్వార్ధపూరితమైన వారి కార్యములను నీ ద్వారా చేయించాలని, నీవు చేయుటకు వారు ఏదో ఒక ప్రణాళికను కలిగియున్నారు. అది బుద్ధిలేని కార్యము. నేను దేవుని యొక్క ప్రణాళికను మాత్రమే ఎరుగుదును; అది ఈ పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడియున్నది. సువార్త సేవకుడిగా నా గురించి నేను సిగ్గుపడుచున్నాను. పది మిలియనుల ఆత్మలను నేను సంపాదించినచో యుక్తమైనదిగా యుండును, కాని నేను ఒక మిలియన్ ఆత్మలను మాత్రమే సంపాదించితిని. నా మార్గమందు నేను వెనుకబడియున్నాను.

నీ గూర్చి ఏమిటి? నీవు క్రీస్తులోకి వచ్చినప్పటి నుండి నీవు ఎన్ని ఆత్మలను సంపాదించగలిగితివి? క్రైస్తవ్యము ఒకరి నుండి ఇంకొకరి యొద్దకు వెళ్ళుచుండును. నీవు క్రైస్తవుడిగా మారినప్పటి నుండి ఎన్ని ఆత్మలను నీవు సంపాదించితివి? నీవు ఆత్మలను సంపాదించనియెడల, నీవు దోషివి, ఫలింపని నేలవి. సంఘమునకు మరియు సువార్తకు నీవు అవమానము కలిగించువాడుగాయున్నావు. బుధవారము రాత్రి ఆరాధనకు రాకుండా ఎంత మంది జనులు మీలో బయట తిరుగుచున్నారు? నీవు బుధవారము రాత్రి ఆరాధనకు రానియెడల క్రీస్తు ఎదుట నీ కొరకు నీవు సిగ్గు పడవలసినవాడవై యున్నావు. నీవు దోషివి, నీవు వేదిక యొద్దకు వచ్చి నీ తప్పులను ఒప్పుకొనవలసినవాడవైయున్నావు. పశ్చాత్తాపపడుట కొరకు నిన్ను నాతో రమ్మని నేను నిన్ను ఆహ్వానించుచున్నాను. ప్రార్ధన కొరకు మీ తలలను వంచుదురా, ఒక్క క్షణము అందుకొరకు తలను వంచుము. నేను దోషినని ఒప్పుకుంటూ, పశ్చాత్తాపపడుటకు ఆశించుచున్న సమయము వరకు ఒక్క క్షణము మీ తలలను వంచుము.

35

నా పరలోకపు తండ్రీ, నా పాపము నిమిత్తము క్షమాపణను కోరుచు ఈ వేదిక మీద నా తలను వంచియున్నాను. ఈ వేదిక చుట్టూ వచ్చి కూడియున్న వారందరి పాపముల నిమిత్తము నేను నిన్ను క్షమించమని కోరుచున్నాను. శరీరమనే ఈ సంఘము యొక్క పాపములను క్షమించమని, జాతీయముగా మరియు అంతర్జాతీయమందున్న శరీరమనే సంఘముల యొక్క పాపములను క్షమించమని నేను కోరుచున్నాను. దేవుని రాజ్యము నిమిత్తము మేము త్వరితముగా చేయవలసిన కార్యములను బహు ఆలస్యముగా చేసినందులకు మా కొరకు నీ యొద్ద కనికరమును నేను వేడుకొనుచున్నాను. మా పాపములన్నింటిని మన్నించి మరియు మా అతిక్రమములన్నింటిని తీసివేయమని నేను నిన్నుకోరుచున్నాను. మా యొక్క మందబుద్ధిని బట్టియు మరియు జనుల అజ్ఞానముతో కూడిన మంద బుద్దిని క్షమించమని కోరుచున్నాను. మేమెంతగానో మా సమయమును వృధా చేశాము. శరీరసంబంధమైన కార్యములతో మేమెంతగానో తలమునకలై పోయాము. మేము చేయకూడని కార్యములను మేమెంతగానో, అటువంటి కార్యములను చేసితిమి. నీముందు మేమంతగానో పాపమును చేసితిమి.

తండ్రి, ఈ ఆదివారపు రాత్రి ఆరాధన కూటమునందు పరిశుద్ధ గ్రంథములోయున్న ఎర్రబారుచున్న ప్రవక్త ఆనాడు వారి పాపముల విషయమై సిగ్గుపడినట్లు ఈ రాత్రియందు మా గురించి మేము సిగ్గుపడుచున్నాము. ప్రజల యొక్క పాపములను బట్టి నీ ఎదుట నా ముఖము ఎర్రబారుచున్నది. ఈ ప్రజల కొరకు, నా దేశము నిమిత్తము, నా ప్రజల కొరకు ప్రభువా నేను సిగ్గుపడుచున్నాను. మా యొక్క యవ్వన స్త్రీలు వీధులలో వయ్యారముగా నడుచుకుంటూ, వారు ప్రవర్తించు ప్రవర్తనను చూచి, వారు చేయుచున్న వ్యభిచారపు క్రియలను చూచి, యవ్వన పురషులు చెయ్యకూడని అనేక కార్యములు చేస్తూ, వారి ఇష్టానుసారముగా జీవించుచున్న వారి జీవితమును చూస్తూ నేను సిగ్గుపడుచున్నాను. ఏ నీచమైన పుస్తకములను వారు చదువకూడదో అటువంటి నీచమైన పుస్తకములను చదువుచూ అందుకొరకు సంఘమునకు రాకుండా వారి గృహములలో వుంటూ అటువంటి క్రియలు వారు చేయుచున్నారు. హాలివుడ్ యొక్క అసహ్యమైన పరిహాసపు మాటలను వింటున్నారు, అసహ్యమైన నీలి చిత్రములను చూచుచున్నారు. దెయ్యపు ఆత్మను కలిగి ఊగిపోతూ పనికిరాని సంగీతమును ఆలకించుచున్నారు. నీచమైన ప్రవర్తన నుండి ఉత్పత్తి చేయబడి వచ్చిన పురుషులువలె వారు వుంటూ, పాపిష్టపు మనసాక్షి గలవారై, దెయ్యముల యొక్క ప్రభావమును కలిగినవారై, దెయ్యపు ఆత్మతో ప్రేరేపింపబడినవారై, అట్టి క్రియలు చేయువారుగా యున్నారు.

36

ఓ దేవా! ఆ పాపములను గూర్చి నేను ఏ విధమైన రీతిలో వారిని గద్దించాలో ఇప్పుడు నేను ఆ విధముగా గద్ధించలేకపోవుచున్నందుకు నా పట్ల నేను సిగ్గుపడుచున్నాను. ఓ దేవా, నా దోషమును నా నుండి తొలగించుము. దానిని నీవు చేయమని నేను నిన్ను అడుగుచున్నాను. మా అందరినీ, మొదట ఇక్కడున్న ఈ జనులను క్షమించమని నేను అడుగుచున్నాను. ఈ బలిపీరపు వేదిక నుండి నూతనముగా మారిన పురుషునివలె మరియు స్త్రీ వలె లేచి వెళ్ళుటకు వారికి సహాయము చేయుము. మంచి క్రైస్తవులుగా మారి ఇచ్చట నుండి వెళ్ళుటకు దేవా, నీవు మాకు సహాయము చేయము.

“మా ప్రతీ భారమును ప్రక్కన పెట్టి మరియు పాపము మమ్మల్ని బంధించుటకు చాలా సులువుగా మమ్మల్ని అన్ని ప్రక్కలు చుట్టుముట్టినను, మా యందు మా కొరకు ఉంచబడిన పరుగు పందెమును ఎంతో ఓర్పుతో పరిగెడుతూ మేము ముందుకు కొనసాగిపోవుదము గాక! దూరదర్శిని చూడకుండా, ఈ ప్రపంచమందు వున్న హాస్యపు నటుల హాస్యమును చూడకుండా, విశ్వాసమునకు కర్తయు మరియు దానిని ముగించువాడగు ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తూ, శిలువను మోయుట అవమానమైనను మరియు నీచమైనదైనను మన కొరకు ఆయన వాటిని సహించి, శిలువను మోసి, ఆ భాధలను అనుభవించిన ప్రభువగు యేసుక్రీస్తు తన రక్తముతో తన ప్రజలను శుద్దీకరించును గాక! అవినీతియైన ప్రతికార్యము నుండి ఆయన మనలను శుద్దీకరించి, ఈ రాత్రియందు ఆయన మనలను తన స్వకీయ జనులుగా అంగీకరించి, పశ్చాత్తాపముతో కూడిన ఈ ప్రార్థనను ఆయన మన కొరకు స్వీకరించును గాక! ప్రభువా, మాకు సమాధానమును మరియు సంతోషమును అనుగ్రహించుము.

37

రోగముతో మంచముల మీద ఉన్న వారందరిని ఈ రాత్రి కూటములనందున్న వారిని గూర్చి ఆలోచించుచూ వారి కొరకు మేము మా విశ్వాసమును ఉంచుచున్నాము. ఇప్పుడు పరిశుద్ధ గ్రంధము బయలుపరచిన రీతిగా మేము ఈ ప్రపంచము యొక్క పరిస్థితిని గూర్చి ఆలోచించుచున్నాము. అటువంటి భయంకరమైన స్థితిని గూర్చి మేము ఆలోచించుచుండగా, మా ముఖములు సిగ్గుతో మొద్దుబారినవై, అవమానముతో మేము కృంగిపోవుచుండగా, ప్రతీ హృయమునందు సంతోషముతో మరియు సమాధానముతో నింపుము. ఈ వేదిక యందు ప్రభువా, మేము మీ ముందు పశ్చాత్తాపము చెందుతున్నాము. దేవా! విరిగిన హృదయముతో, విశ్వాసము ద్వారా ఇప్పుడు నేను ముందుకు కొనసాగిపోవుటకు నాకు సహాయము చేయుము! అనేక మందిని, ఇంకా అనేక వందలకొలది జనులను నీ కొరకు సంపాదించునట్లుగా, నీ చిత్తమునందు నేనుండునట్లుగా నేను ప్రార్థించుచున్నాను. నా దృష్టి దేనియందు కేంద్రీకరించకుండా విశ్వాసమునకు కర్తయు మరియు ముగించువాడవునైన నిన్ను మాత్రమే చూస్తూ, విశ్వాసముతోను మరియు ధైర్యముతోను నేను ముందుకు కొనసాగిపోవునట్లుగా నాకు సహాయము చేయుము. దేవా! దానిని నాకు అనుగ్రహించుము.

38

ఈ సంఘము యొక్క ప్రతీ సంఘ పెద్దను క్షమించుము, సంఘ కాపరిని క్షమించుము, సామాన్య సభ్యులను క్షమించుము, ప్రభువా! ద్వారమునందు యున్న మేమేరుగని వారిని క్షమించుము, ప్రభువా! మా ప్రతీ ఒక్కరి పాపములన్నింటిని క్షమించుము. మా జీవితములో పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మేము అనుభూతిని చెందుదుము గాక! ఎందుకనగా, ఈ రాత్రి హృదయమంతటితో మేము పశ్చాత్తాపము చెందుచున్నాము. మీయందు మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాము. మమ్మల్ని తగ్గింపు గలవారిగాను, వినయము గలవారిగాను, శుద్దీకరించబడిన వారుగాను, మీ సేవ కొరకు తగ్గింపుతో మీకు సమర్పించుకున్న జనులుగా నీవు మమ్మల్ని స్వీకరించుము. ప్రభువా, ఈ బలిపీఠపు వేదికయందు మేముండగా ఈ ఆశీర్వాదములు మాకు అనుగ్రహించుము. మా తలంపులను మరియు మా హృదయములను మీముందు వాల్చియుండగా మాకు అనుగ్రహించుము. దీనిని నీ కుమారుని యొక్క నామమగు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్ మరియు ఆమేన్!

ఓ, ప్రభువా! నేను నీ వాడను, నీ స్వరమును నేను వినియున్నాను.

అది నీ యొక్క ప్రేమను గూర్చి చెప్పుచున్నది.

విశ్వాసమనే హస్తములలో నేనెంతగానో ఎదిగితిని.

నన్ను నీ చెంతకు సమీపముగా చేర్చుకొనుము.

ధన్యుడవగు ప్రభువా, సన్నిహితముగా,

అత్యంత సన్నిహితముగా నన్ను నీ చెంతకు చేర్చుకొనుము.

ప్రశస్తమగు నీ రక్తపు ధారలు కార్చుచూ,

ఆ కల్వరి సిలువపై నీవు నా కొరకు మరణించావు;

ధన్యుడవగు ప్రభువా, సన్నిహితముగా, అత్యంత సన్నిహితముగా

ఇంకా సన్నిహితముగా నన్ను నీ చెంతకు చేర్చుకొనుము.

39

ఈ రాత్రియందు ఈ వేదిక యొద్ద నా సహోదరుల మధ్య మరియు అనేక మంది పురుషులు మరియు స్త్రీలు బలిపీఠపు వేదిక యొద్దకు నాతో కూడా వచ్చియుండుటను, ఈ రాత్రి సమయమున నేను వారిని చూచి ఎంతో ఆనందించుచున్నాను. సాధారణముగా స్త్రీలు సులభముగానే తమ హృదయమునందు కరిగిపోవుదురు. వారు హృదయమందు దేనినో కలిగియుండుట చేత, స్త్రీ యొక్క తత్వమును బట్టి చాలా సులభముగా వారు హృదయము నందు తాకబడి కరిగిపోవుదురు, ఏలయనగా వారు స్త్రీలు, కొన్నిసార్లు వారి హృదయములను మీరు స్పర్శించవచ్చును. పరిశుద్ధాత్మ పురుషులను సహితము తాకి వారిని వేదికయొద్దకు తీసుకొని వచ్చినందుకు, వారు ఇచ్చట యుండుటను చూచి నేను ఎంతగానో సంతోషించుచున్నాను.

దేవునియందు మిమ్మల్ని మీరు సమర్పించుకొనునట్లు మీరు అనుభూతి చెందుచూ, ఆ విధమైన సమర్పణతో ఈ రాత్రి మీరు బయటకు వెళ్ళుచు, దేవుని యొక్క కృప ద్వారా ఒక శ్రేష్టమైన జీవితమును మీరు జీవించుచుందురు. ఆయనకొరకు మరియు దేవుని యొక్క రాజ్యము కొరకు ఎక్కువగా సేవ చేయుదురు గాక! ఈ ప్రసంగ వేదిక చుట్టూ మీరు వు౦డిన యెడల క్రీస్తు వైపు మీ చేతులను పైకెత్తి, “నేను పశ్చాత్తాపమును చెందియున్నాను దానిని ఇప్పుడు నేను నమ్ముచున్నాను” అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ఆ వెనుక కూర్చున్న వారిలో మీరెంత మంది పశ్చాత్తాపమును మీ హృదయమందు కలిగియున్నారని మీరు అనుభూతి చెందుచున్నారు? దేవుని కొరకు ఇంకా శ్రేష్టమైన దానిని చేయాలని ఆశించుచూ ఎంత మంది నిర్ణయమును కలిగియున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక! ఇచ్చట వేదిక మీదయున్న వారు, మీరు మీ ముఖములను ఈ రీతిగా త్రిప్పియుండగా, మీరు చూసినట్లైతే, వేదిక యొద్దయున్న మీరు మీ చేతులను పైకెత్తి, మీ హృదయములో దేనినైతే వాంఛించితిరో దాని కొరకు ప్రార్ధించండి. వారి కొరకు కూడా మీరు ప్రార్ధచేస్తూ కొనసాగించండి. జనులలోయున్న మీరు మీ చేతులను పైకి ఎత్తగలరా? వెనుకయున్న వారు ఇప్పుడు మీ చేతులను పైకి ఎత్తండి, ఇచ్చట వేదిక యొద్దయున్న మీరు, వారి హృదయ వాంఛలు ఏదైయున్నదో దానిని గూర్చి మీరు ప్రార్ధించండి. మీరు కూడా దానిని చేయుటకు దేవుడు మనకు సహాయము చేయును. ప్రభువగు యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించును గాక!

40

ఆదివారము రాత్రి జరుగనైయున్న ఆరాధనను గురించి మరచిపోకండి. సహోదరుడా నెవిల్ ! మీరేదైనా చెప్పగోరుచున్నారా? [సహోదరుడు నెవిల్, సహో, బ్రెన్హాం గారితో ఏదో మాట్లాడుచున్నారు.] జరుగనైయున్న కూడిక ఎక్కడ నిర్ణయించబడింది? 1628, వెస్ట్ మార్కెట్, రానైయున్న మంగళవారము మరియు బుధవారము. మరియు శని, ఆదివారము కెంటకీలోయున్న మాడెసన్విల్ ఆడిటోరియం నందు నేనుందును. ఆ తరువాత మేము న్యూయార్క్ వెళ్ళుదము.

మనము చాలా త్వరగా వెడలి పోవలసియున్నది, ఎందుకనగా నా అత్తగారికి చాలా జబ్బుచేసియున్నది. గనుక ఆమెను చూచుటకు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు మనము.. నెవిల్ సోదరుడా! నీవేమైనా చెప్పవలసినది వున్నదా? ఏమిలేదు. ఒక్క క్షణం మనం తలలు వంచుదము, మనం ప్రార్ధిచుచుండగా మంచిది నెమ్మదిగా.

మళ్ళీ మనము ఒకరినొకరము కలుసుకునేంత వరకు దేవుడు మీతో వుండును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...