దైవికమైన ప్రేమ ప్రసరించబడినప్పుడు

దైవికమైన ప్రేమ ప్రసరించబడినప్పుడు

VGR COUNT-204 స్నేహితులారా, శుభ సాయంకాలము. తిరిగి ఈ రాత్రి ప్రభువు యొక్క సన్నిధిలో నుండుట ఎంతో సంతోషకరముగా ఉన్నది. ప్రభువైన యేసు నామములో మనము ఇక్కడ కూడియుండుట ఎంతో గొప్ప భాగ్యమై ఉన్నదని నేను నమ్ముచున్నాను. దానికి నేను సంతోషించుచున్నాను, మరియు మీరు కూడా అని అనుకొనుచున్నాను.

మరియు రేపు ఉదయకాలమున స్పెన్సర్-విల్ బాప్టిస్ట్ సంఘమును దర్శించుట ఎంతో ఆనందాన్ని ఇచ్చుచున్నది. ఓహాయో నందు స్పెన్సర్-విల్ లో గల, మొదటి బాప్టిస్ట్ సంఘమునకు కాపరి అయిన మన ప్రియ సహోదరుడు డాక్టర్ లివైయల్ తో నేను కూడికలు కలిగియున్నాను. మరియు రేపు ఉదయము పది గంటలకు.... ప్రధాన ఆడిటోరియములో కూడిక కలిగియున్నాను, రేపు ఉదయము, ప్రసగించు కూడిక అని నేను అనుకొనుచున్నాను.

మరియు రేపు మధ్యాహ్నకాలమున రెండున్నరకు, ఇక్కడ సంఘములో మరొక ప్రసంగ కూడిక ఉన్నది. ప్రభువు చిత్తమైతే, రేపు మధ్యాహ్నము సంఘమునకు నేనొక వర్తమానమును కలిగియున్నాను. మరియు రేపు రాత్రి, ఈ కూడికల యొక్క చివరి రాత్రి అయివున్నది.

రేపు రాత్రి ఒక స్వస్థత కూడిక. లేదా, రోగుల కొరకైన ప్రార్థన. మరియు ఇప్పుడు మనము గొప్ప విషయముల కొరకు ఎదురుచూచుచున్నాము.

2

మరియు ఈ వారమంతా, వాక్యమును ప్రసంగించుట ద్వారాను మరియు వివేచనలో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారాను మనము ఈ కూడికలను కలిగియున్నాము, లేదా ప్రభువైన యేసు యొక్క ప్రవచనాత్మక వరము ద్వారాను, మరియు భూమి మీద ఉండగా ఆయన ఏమైతే కార్యములు చేసెనో, ఖచ్చితంగా వాటినే ఆయన మన దగరకు తిరిగి వచ్చి చేయుట చూసినప్పుడు మనమెంతో భాగ్యవంతులమైయున్నాము. మరియు ఆయన వాటిని చేయుటను చూచినప్పుడు, అవి మన హృదయములను ఆశ్చర్యచకితులను చేయునని నేను నిశ్చయత కలిగియున్నాను.

సాధారణముగా కూడికలలో మేము ఒక అత్యవసర గది అని పిలిచేటటువంటి దానిని కలిగియుండెదము. కానీ దానిని ఈ సారి కలిగిలేము, నిన్నటి సాయంత్రం, మేము దానిని నిర్ణయించాము, దేవుని చిత్తమైతే, ఈ రాత్రి మనము అత్యవసర వరుస అని పిలువబడే దానిని కలిగియుందుము. మరియు అది... సాధారణముగా ఎప్పుడైతే.... అక్కడ వివేచన జరుగుచున్నప్పుడు నెమ్మదిగా ఈ భవనమంతటిలో దర్శనము కలుగును, భవనమంతటిలో.

3

మరియు ఆయన సిలువ మరణానికి ముందు రుజువుగా, తప్పిపోనటువంటి రుజువుగా, ఆయన యొక్క పునరుత్థానమును ప్రభువు ఏ విధముగా అయితే చేసెనో, చూడండి. ఆయన మరణించలేదు, కానీ నిత్యము వరకూ జీవించియున్నాడు. ఆయనను మనమెవరైతే ప్రేమించామో, వారితో ఆయన ఉండుట ద్వారా మరియు రెండువేల సంవత్సరాల తరువాత తనకు తాను సజీవముగా చూపించుకొనుట ద్వారా మనలను ఆయన గౌరవించెను, మరియు దీనిని తెలుసుకొనుట మనకు ఎంతో గొప్ప ఆధరణ కనుక ఆయన అమర్త్యుడగు, అనంతమైన, విఫలము కాని, సర్వశక్తుడైన దేవుడు.

మరియు ఇప్పుడు, ఈ రాత్రి మనము ఒక క్రొత దానిని ప్రయత్నించబోవుచున్నాము. మరియు దీనిని గౌరవముతోను, ప్రేమతోను చెప్పుచున్నాను. విదేశాలలో ఉన్న వారి వలె ఈ అమెరికన్ ప్రజలు గ్రహించినట్లు కనిపించుట లేదు. ఇక్కడ జరిగిన అవే కార్యములు, ఒకసారి దక్షణాఫ్రికాలో జరిగినవి, మరియు ముప్పైవేల మంది మూఢ అన్యులు, ఒక్కసారే క్రీస్తులోనికి వచ్చిరి, చూశారా. దానిని గూర్చి ఆలోచించండి.

4

మూడవ వ్యక్తి దగ్గర ఆగి మరియు ఆ గొప్ప జన సమూహములో ప్రార్థన చేయుట ఆరంభించెను, ఒక్కసారే సుమారు ఇరవై-అయిదు వేల మంది స్వస్థత పొందిరి, దానిని గూర్చి ఆలోచించండి. ఏడు ట్రక్కులతో చేతికర్రలు మరియు చక్రాల కుర్చీలు ఆ మైదానముల నుండి తీసివేయబడునని మరియు సైన్యము వంటి జనముతో తీసివేయబడినవి. దాని వెనుక ఆఫ్రికనులు, “కేవలము నమ్ముము ” అనే పాట పాడుచూ కవాతు చేయుచున్నారు.

ఇండియా చాలా దూరమైననూ, వాటి కంటే ఎక్కువ అక్కడ జరిగెను. కానీ ఇక్కడ ఈ అమెరికన్ ప్రజలు చాలా రకములుగా బోధింపబడిననూ, గ్రహించుట వారికి కష్టముగా ఉండెను. మనోహరమైనది, కానీ దానిని గ్రహించుట చాలా కష్టము, విశ్వాసము ద్వారా మాత్రమే దానిని సమీపించగలము. అది అలా... మరియు కల్పితమైన వారికి అది ఒక గొప్ప గురిగా ఉన్నది, (చూశారా, చూశారా), కొంత మానవ మూల విధానము కొరకు.

దాని నుండి మానవ భాగమును (అనగా మనిషి పాత్రను - తర్జుమాదారుడు) తీసివేయవలెనని మేము కోరుచున్నాము. అది దేవుడైయున్నాడు. మానవుడు స్పర్శించుట కాదు; అది దేవుడు స్పర్శించుటయైయున్నది, చూశారా. అది ముగించబడిన కార్యము. అది క్రీస్తు మీ కొరకు అప్పటికే చేసిన కార్యముగా యున్నది. మరియు అది ప్రతీ విశ్వాసి యొక్క వ్యక్తిగత స్వాస్థ్యమై ఉన్నది. మరియు అది చూసి మరియు జీవించుట కొరకై యున్నది. ఆ ఇత్తడి సర్పము ఎవరికీ ప్రార్ధించలేదు, ఎవరినీ అది తాకనూ లేదు. కానీ వారు చూసి జీవించిరి. అది క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. మరియు ఒక మాదిరే అది ఏమి చేయాలో దానిని చేసినప్పుడు, చూసి మరియు జీవించుట ద్వారా ఒక నిజమైనది వచ్చినప్పుడు, మరి అది ఏమి చేయును?

5

మరియు ఇప్పుడు ఒక చిన్న సువార్త వర్తమానమును మీ కొరకు మాట్లాడాలని నేను ఆశించుచున్నాను. ప్రభువు చిత్తమైతే, మనము జనులను తీసుకొని వచ్చెదము అత్యవసరమగు వారికి నా కుమారుడు ఒక గుంపు ప్రార్ధనా కార్డులను ఇచ్చెనని చెప్పెను, దేవుడు చేయాలని మనము నమ్ముచుండగా, రేపటి రాత్రి అంతిమ కూడిక వరకూ ఎదురుచూడలేని గుంపు. మరియు ఆ జనులను మేము పైకి తీసుకొనివచ్చుటకు వెళ్ళుచున్నాము. మరియు వారి కొరకు దర్శనమును చూడకుండా వారికి ప్రార్ధన చేయుటకు నేను ప్రయత్నించుచున్నాను. అవి అత్యవసరమైనవి కనుక వాటిని వరుసలోనికి రప్పించి ప్రార్థన చేసెదము, మరియు ఎక్కువ వాటిని, మనము కలిగియుండలేము, తరువాత దానిని అది చేయలేదు.

లేఖనములోని కొంత భాగమును చదువవలెనని నేను ఆశించుచున్నాను. మరియు దానిని మనము చేయడానికి ముందుగా, మనము తలలు వంచినట్లయితే, ఆ రచయితతో మనము మాట్లాడుదము.

6

దయగల మా పరలోకపు తండ్రీ, జీవముగల దేవా, హృదయము యొక్క గొప్ప ఆరాధనలతో నీకు మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము, మాకు నీ ప్రియమైన కుమారుని పంపించుటలో నిత్యమూ ఎంతో ఆసక్తిని కలిగియున్నందుకు, తిరిగి నీతో సహవాసము చేయుటకు ఈ భూమి మీద అయోగ్యముగా ఉన్న మమ్ములను ఒక విమోచకునిగా విమోచించినందుకు, మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము.

మరియు ఈ రాత్రి ఆ వెనుకటి తరాలలో, ముందటి కాలములలో, ఆ చల్లని సాయంకాల వేళలో దేవుడు తన బిడ్డలను పిలిచి వారితో సహవాసము చేయుట అనునది ఎంత అందమైన సహవాసమైవున్నది. తరువాత వారిని ఆ విధముగా వారి బుగ్గల మీద ముద్దు పెట్టుకొనుచూ మరియు ఒక రాత్రి విశ్రాంతి కొరకై వారిని పరుండబెట్టి; మరియు ఆ పొలములోని అడవి మృగములను ఏ అలజడి గాని, ఏ హాని గాని లేకుండా క్రింద పరుండబెట్టి, ఏ హాని అక్కడ లేదు, చావు లేదు, రోగము లేదు, మరియు బాధ లేదు. మరియు ఏ భయము, రోగము లేకుండా తమ సృష్టికర్త యొక్క సన్నిధిలో ఒక క్రొత్త దినమున మేల్కొనుట. ఓ దేవా, మా యొక్క ఆత్మలు మరలా, ఆ సమమము కొరకై మూలుగుచున్నవి, ఎందుకంటే మేము దాని కొరకై తయారు చేయబడితిమి.

7

మరియు పరలోకపు తండ్రీ, ఈ రాత్రి మేము ప్రార్థించుచున్నాము. ఈ రాత్రిలో ఏ వ్యక్తినయినా మరణము కమ్మకున్నట్లయితే, అది, ఈ గొప్ప ఆశీర్వాదమునకు తిరిగి ప్రవేశించుటకు సిద్ధపరచబడలేదు, అది జగత్తుపునాది వేయబడక మునుపే మన కొరకు సిద్ధపరచబడినది. “అవును, నా ప్రభువా, ఇప్పుడు నేను నిన్ను నమ్ముచున్నాను మరియు నిన్ను నా రక్షకునిగా తీసుకొనుచున్నాను,” అని మీకు చెప్పుచూ, ఒక కడవరి, ఆ నిత్యమైన నిర్ణయమును వారు తీసుకొనే ఆ సమయము ఈ సాయంకాలమే అవును గాక. మరియు వారిని పరిశుదాత్మతో నీవు నింపి, మీ ప్రియమైన పరిశుద్ధుల శరీరములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచూ, మరియు వారిని సరైన స్థానములో ఉంచండి. ఈ భూమి మీద మీ యొక్క గొప్ప పనిలో వారు పనివారుగా ఉందురు గాక.

ఆ కల్వరిలో నీవు చెల్లించినట్లుగా, అనారోగ్యముతో ఉన్నవారినీ మరియు బాధింపబడుచున్నవారినీ స్వస్థపరుచుము మరియు కరుణ చూపుము. మరియు ఈ విమోచనాశీర్వాదము, విమోచింపబడిన ప్రతీ ఒక్కరి కారకూ నీవు ఇచ్చియున్నావు. మరియు అది మా వ్యక్తిగత స్వాస్థ్యముగా మేము అనుభూతి చెందుదుము గాక. మరియు జీవము గల దేవుని యొద్దకు వచ్చి ఆయనను ఈ ఆశీర్వాదములు అడుగు హక్కు ఉన్నదని మేము తలంచుచున్నాము, ఎందుకనగా, “నా నామమున తండ్రిని ఏమి అడిగిననూ, అది మీకు చేతును,” అని కృపతో వెల ద్వారా కొనబడిన మనలను అలా చేయుటకు ఆయన అనుమతించెను.

మరియు ఇప్పుడు, తండ్రీ, పరిశుద్ధాత్మ వాక్యమును తీసుకొని, గ్రంథమును తెరచి, మరియు వాక్యములో ఆత్మ యొక్క శక్తిని విడుదల చేసి, అది ప్రతీ ఒక్క హృదయములోనూ తన విశ్రాంతి స్థానము కనుగొనలాగున చేయును గాక. నీ యొక్క ప్రియ కుమారుడైన, ప్రభువైన యేసు నామములో మేమందరము దీనిని అడుగుచున్నాము. ఆమెన్.

8

ఈ రాత్రి, కొంచెము సమయమును మాత్రమే నేను తీసుకొనుచున్నాను, ఎందుకనగా ఈ రాత్రి ప్రార్ధించవలసినవారు కొ౦త మంది ఉన్నారు. మరియు ఈ రాత్రి ప్రతీ ఒక్కరూ ప్రార్థనా వరుసలో నాతో పాటు ప్రార్థించమని కోరుచున్నాను. కానీ ఈ సమయమున ప్రార్ధనా వరుస గురించి ఆలోచించకుడి, కానీ ప్రార్థనా వరుస కంటే గొప్పదగు దాని మీద మన తలంపులను ఉంచుదుము. మన ప్రభువైన యేసు మీద, మరియు ఆయన తిరిగి వచ్చుట మీద, మరియు మన మీద ఆయనకున్న ప్రేమ మీద పెట్టుదము.

మీ అందరికి తెలిసిన పాత అంశమును నేను చదువబోవుచున్నాను, అది బాగా తెలిసినది. బహుశా మీ యొక్క సంఘ కాపరులు మరియు ఇతరులు చాలాసార్లు దానిని చదివివు౦టారు. బహుశా - చాలా చిన్నవాడగు ఒక బాలుడు కూడా ఇక్కడ దానిని చెప్పగలడు. అది బైబిల్ అంతటిలో బంగారు మాట అయివున్నది, యోహను 3:16.

“దేవుడు లోకమును ఎంతో పేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”

9

చికాగో నుండి వచ్చిన నా ప్రియ మిత్రుడు పాస్టర్ బోజ్ తో కొంతసేపటి క్రితము నా గదిలో కూర్చొని ఈ సమయమున సహవాసము చేసిన తరువాత, “దేవా! ఈ రాత్రి నీ యొక్క రక్తము ద్వారా కొనబడిన దానికి నేను ఏమి చెప్పెదను?” అని నేను ఆలోచించుచున్నాను. సమూహము ముందుకు వచ్చి వారు చిన్నవారైనా లేదా గొప్పవారైనా, అది పట్టింపు కాదు.

క్రిందటి సాయంత్రము, దాని గురించే మాట్లాడుకొనియున్నాము, దేవుడు ఏ విధముగా పెద్ద గుంపుతోనూ లేదా చిన్న గుంపుతోనూ కలుసుకొనును? కేవలము, ఎక్కడైయితే ఆయనను ఆహ్వనించు హృదయములు ఉన్నవో, వాటిని మాత్రమే. మరియు ఈ రాత్రి మీ విశ్వాసమును తెలుపుటకు మరియు దేవుని యొక్క వాక్యమును వినుటకు మీ హృదయములను తెరుచుకునుటకు వచ్చి మరియు దానిని ఎరిగియుండి, మీరు....

10

అది ఏలా నాకు అనుభూతి కలిగించినది అని నేను చాలా సార్లు ఆశ్చర్యపడియున్నాను, యేసు యొక్క నిజమైన రక్తము యొక్క రెండు చుక్కలు నా చేతిలో లేదా ఒక గ్లాసులో నేను కలిగియుండు భాగ్యమున్నచో, అది నాకు ఎట్లుండును. యేసు యొక్క రెండు చుక్కల నిజమైన రక్తముతో నేనేమి చేతును? ఓ, నా హృదయము యొద్దకు దానిని తీసుకొని, నేను దానిని పట్టుకొనెదను. మరియు నేను ఏడ్చుదును, అని నేను నమ్ముచున్నాను. కానీ తన రక్తమును ఉచితముగా ధారబోసిన ఆయన దృష్టిలో, దాని కంటే గొప్ప దానిని ఈ రాత్రి నేను కలిగియున్నాను అని మీకు తెలియునా, అదేదనగా, ఆయన రక్తము ద్వారా కొనబడినదానితో మాట్లాడుటకు నాకు భాగ్యము ఇవ్వబడినది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”

కనుక ఆ చిన్న లేఖన భాగము, ఒక చిన్న ఒక అంగుళం వైశాల్యపు చతురస్త్రము, ఒక చిన్న కాగితము మీద, ఆ లేఖనము మీద సరైన ఉద్దేశ్యము కనుక తీసుకున్నట్లయితే, అది ప్రపంచపు నిత్యత్వపు గమ్యమును మార్చును. ఇది ఒక పరిమాణం కాదు; ఇది నాణ్యత అయి యున్నది.

11

కొంచెము సేపటి క్రిందట, నేను చదువుకొనుచుండగా పై అంతస్తులో ఒక బాలుడు ఉండెను. అక్కడ మిద్ద మీద ఒక అంగుళము వైశాల్యపు చతురస్త్రము కన్నా చిన్నదియైనా ఒక తపాలా బిళ్ళ కొరకు అతను పరుగెడుచుండెను. మరియు దానిని అతడు ఆ తపాలా బిళ్ళలను సేకరించువాని యొద్దకు తీసుకొని వెళ్ళెను. మరియు దానికి ఆ తపాలా బిళ్ళలను సేకరించువాడు ఒక డాలర్ ను ఆ బాలునికి ఇచ్చెను. తరువాత అది వంద డాలర్లకు అమ్ముడుపోయెను. మరియు అది ఒక సేకరించువాని యొద్ద నుండి ఇంకొక సేకరించువాని యొద్దకు వెళ్ళెను. మరియు ఆ తపాలా బిళ్ళయే ఇప్పుడు కొన్ని లక్షల డాలర్ల విలువగలదని నేను అర్ధము చేసుకున్నాను. ఒక చిన్న కాగితపు ముక్క, కానీ అది కాదు. దానిని విలువగలదిగా చేయునది ఒక కాగితము కాదు; ఆ కాగితము మీద ఉన్నది, దానిని అంత విలువగలదిగా చేయుచున్నది.

మరియు యోహను 3:16తో అదే విధముగా ఉన్నది. ఎంత లేఖనము వ్రాయబడినది అని కాదు; అది ఏమి కలిగి ఉన్నది అనునది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అను వర్తమానమును అది కలిగియున్నది.

12

మరియు ఇప్పుడు, ఒక అంశముగా తరువాత కొద్ది నిముషములు నేను తీసుకొనబోవు దానిని ఇలా పిలిచినట్లయితే, “దైవికమైన ప్రేమ ప్రసరించబడినప్పుడు, మహోన్నతమైన కృప దాని స్థానమును తీసుకొనును.” మరియు దేవుడు లోకమును ఎంతో ప్రేమించినప్పుడు, దానిని ఆయన ఎంతో ప్రేమించినప్పుడు, ఆదాము యొక్క సంతతికి దేవుని యొక్క దైవిక ప్రేమ.... క్రీస్తు వచ్చెను మరియు మహోన్నతమైన కృప దాని స్థానమును తీసుకొనెను. దేవుని యొక్క ప్రేమ మహోన్నతమైన కృపను కలుసుకొనెను. దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుని ఇచ్చెను. దానిని మీరు చూచారా?

ఇప్పుడు, దేవుడు నాపై ఎంతో కోపమును కలిగియున్నాడని నేను అనుకొనెడివాడను, కానీ క్రీస్తు నన్ను ప్రేమించెను. అయితే క్రీస్తే దేవుని యొక్క హృదయమని తెలుసుకున్నాను. మరియు ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చుట అను మాదిరిలో ఇది ఉన్నది, కొట్టబడిన బండగా క్రీస్తు ఎలా అయితే ఉన్నాడో, మరియు ఆ ప్రజలు నీళ్ళ కోసం ప్రతీచోట వెదుకుచున్నారు, వారు నశించిపోవుచున్నారు. మరియు దేవుని సేవకుడగు మోషే, తీర్పు దండమును తీసుకొనెను, అది తీర్పు కర్ర అయివున్నది. ఐగుప్తులోనున్న అవిశ్వాసి మీదకు అది తీర్పును తీసుకువచ్చెను: ఈగలు, పేలు, అన్ని రకముల వ్యాధులు, బాధలు. దేవుని యొక్క తీర్పుదండము - ఆయన యొక్క సేవకుని చేతిలో కదిలెను, బండను కొట్టెను, మరియు బండ తన యొక్క నీరును ఇచ్చెను, మరియు నశించుపోవు జనులు రక్షించబడిరి. యోహను 3:16 కు ఎటువంటి అందమైన మాదిరిగా నున్నదది.

13

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన మన తీర్పుల కొరకైన బాధ అంతయూ కూడా క్రీస్తులోనికి కొట్టబడెను. మరియు ఆయనలో నుండి జీవజల నదులు పారెను. ఆత్మను గూర్చి మాట్లాడినచో, నశించుచున్న జనులు జీవించెదరు. ఆయనలో నుండి జీవజలములు వచ్చుచున్నవి, కొట్టబడిన ఒక బలి, అంగీకరించబడిన వాడు... మరియు ఎంత చిన్నదైనా గానీ... దాని కొరకు నేను దేవుని ప్రేమించెదను.

“మంచిది, నేను స్వీకరించినా, లేకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు” అని కొద్దిమంది జనులు చెప్పెదరు. తేడా ఉంటుంది.

“మంచిది, నేను ఒక చిన్న గృహణిని.”

“నేను చిన్న ఇరుకు వీధిలో నివసించుచున్న ఒక చిన్న నల్లరంగు స్త్రీని.” నీవు ఏమైనా గానీ, అది “ఎవరైతే ఆశపడెదరో, వారు వచ్చెదరు.” ఎంత చిన్న విషయమైనా, లేఖనమువలె ఎంత చిన్నదైనా గానీ.

తీవ్రముగా వీచెడి చల్ల గాలుల తరువాత వచ్చు వసంత ఋతువు కాలములో, నేను అడవులకు వెళ్ళినప్పుడు, చాలాసార్లు నేను ఆశ్చర్యపడెదను. మరియు ఒక అర అంగుళము కన్నా పెద్దవి కానటువంటి చిన్న చిన్న పువ్వులను నేను గమనించాను. మరియు వాటిని చూచుటకు కొన్నిసార్లు నేను క్రిందకి వంగాను. దాని ప్రక్కనే ఉన్న ఆ గొప్ప ఓక్ వృక్షమునకు ఇది ఎంత అల్పమైనదిగా ఉండును. కానీ దేవుడు ఎంత శ్రద్ధ వహించుచున్నాడనగా, ఆ చలి కాలంలో ఈ చిన్న చిన్న పువ్వులు జాగ్రత్త వహించబడి, తిరిగి పెంచబడి తన అందాన్ని అంతా విస్తరించును. మరియు కొన్ని సార్లు అక్కడ నీలము మరియు ఎరుపు రంగులున్నవి. దేవుడు ప్రతీ ఒక్కరినీ ఎరుగును. మనందరి గురించి దేవుడు శ్రద్ధ వహించును.

14

ఒక చిన్న బాలిక కొద్ది సేపటి క్రితము మనకొక పాఠము నేర్చినది, నాకు ప్రార్ధింప భాగ్యము కలిగిన ప్రఖ్యాత రాజగు జార్జి, అనేక స్కేలిరోసిస్ తో బాధపడుచున్న, అతనిని ప్రభువు స్వస్థపరచినప్పుడు. అతను ఒక కెనడా నగరమును సందర్శించుచుండెను, మరియు అన్నీ పాఠశాలలు ఆయనను చూచుటకు వెళ్ళెను. మరియు కెనడా జాతీయ జెండాలతో వారు వీధులలోనికి వెళ్ళిరి.

మరియు రాజు వెళ్ళుచుండగా... నా మేనేజరైన కెనడా వాసియగు ఎర్న్ బాక్సటర్ ముఖములోని భావములను నేను ఎప్పటికీ మరిచిపోలేను. మరియు ఆ సమయములో కడుపు నొప్పి మరియు అనేక స్కేలిరోసిస్ తో బాధపడుచున్ననూ, ఆయన నిలబడెను.... లేదా నీలము రంగు వస్త్రముతో ఉన్న అందమైన తన రాణి ప్రక్కన కూర్చుండెను. మరియు రెండు వందల నలభై పౌండ్ల బరువున్న ఈ మనుష్యుని నేను చూచినప్పుడు, ఆ రథము వీధి మలుపు తిరిగినప్పుడు, ఆ మనుష్యడు చేతులతో తన ముఖమును కప్పుకొని ఏడ్చుచుండెను. మరియు అతను చెప్పెను, “ఆలోచించు, రాజు వెళ్ళుచున్నాడు.” మరియు ఆ తరువాత, “ఓ, రాజాధిరాజు ఒక రోజు అలా వెళ్ళినప్పుడు ఎలాగు ఉండును,” అని అనుకొన్నాను.

15

వీధులన్నీ ఖాళీ చేయబడిన పిమ్మట ఒక చిన్న బాలిక దొరికెను. ఆమె తన చిన్న చేతులతో ఆ టెలిగ్రాఫ్ స్తంభాన్ని పట్టుకొని దాని ప్రక్కనే నిలబడి ఏడ్చుచుండెను, తన చిన్న హృదయముతో వెక్కి వెక్కి ఏడ్చుచుండెను. మరియు ఆ టీచర్ ఆ బాలికను కనుగొనుటకు ప్రయత్నించుచుండెను. తన కెనడా జెండా భుజము మీద ఉంచుకొని ఆమె ఏడ్చుచుండెను. మరియు ఆ స్త్రీ, టీచర్, అడిగెను, “ప్రియమైనదానా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు?” “నీవు దేశభక్తి కలిగి ఉన్నావని తెలియపరచబడునట్లు నీ జెండాను రాజునకు ఊపలేదా?”

“అవును, టీచర్, నేను నా జెండా ఊపాను,” అని ఆమె చెప్పినది.

“మరి నీవు రాజును చూడలేదా?” అని ఆమె అడిగినది.

“లేదు, టీచర్, నేను రాజును చూడకపోవడం కాదు, నేను రాజును చూచాను” అని ఆమె చెప్పినది.

“మరి ఎందుకు నీవు ఏడ్చుచున్నావు?” అని ఆమె అడిగినది.

ఆమె చెప్పెను, “రాజు నన్ను చూడలేదు” అని ఆమె చెప్పినది.

16

ఓ, రాజుల రాజునకు ఇది ఎంత వ్యత్యాసముగా నున్నది. నీవు మరీ చిన్నగా నుండలేవు. నీవు వేయు ప్రతీ అడుగును ఆయన చూచును. నీలో వున్న ప్రతీ దానిని ఆయన ఎరుగును. ఆయనకు తెలియకుండా ఒక పిచ్చుక కూడా నేలపడదు. ఒక చిన్న పువ్వు కూడా ఆయన ఎరుగకుండ పైకి రాదు.

కనుక ఆ పువ్వు కన్నా నీవు ఎంత గొప్ప వాడవు? మరియు రోగము లేదా బాధతో నీవు ఇక్కడ పడియుండగా, రాజులకు రాజు నిన్ను చూచుచున్నాడని నీకు తెలియదా? నీ యొక్క స్వస్థతా మరియు నీ అభివృద్ధి కొరకు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడని నీవు ఎరుగవా? నీవు చాలా పాపముతో నిండి యుండవచ్చు, కానీ నిన్ను ఆయనవానిగా చేసుకొనుటకు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడనీ నీకు తెలియునా? “నేను చాలా అల్పమైన వానినని,” నీవు చెప్పవచ్చును. కానీ దేవుని దృష్టిలో, నీవు కాదు. నీవు దేవునికి కావాలి. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు మరియు దేవుడు నిన్ను ఎంతో ప్రేమించెను, కాగా ఆయన ప్రేమ ప్రసరించబడినప్పుడు, మహోన్నతమైన కృప దాని స్థానమును తీసుకొని మరియు ఆయనలోనికి నిన్ను తిరిగి విమోచించుటకు ఒక రక్షకుని పంపించెను.

మరియు ఆ రక్షకునిలో మన యతిక్రమములను బట్టి ఆయన గాయపర్చబడెను, ఎందుకనగా దేవుడు నిన్ను ప్రేమించెను. మరియు దేవుడు తన ప్రజల యొక్క బాధలను చూచెను, మరియు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది; దేవుని యొక్క కృప మార్గము చూపుచున్నది, ఎందుకంటే ఆయన ప్రేమకు అది కావలసియున్నది.

17

మరియు ఆయన ప్రేమ, ఆయన యొక్క భావనను ప్రసరించినప్పుడు, క్రీస్తు తన స్థానమును తీసుకొనుటకు అడుగు వేసెను. దాని స్థానమును తీసుకొనుటకు ఏదో కావలిసియున్నది. ఆయన ప్రేమ ఒంటరిగా నీ కొరకు వెళ్ళెను. మరియు కృప నీ కొరకు ఒక బలిని ఏర్పరచెను. ఇప్పుడు, నీవు కేవలము దానిని నమ్ముటకు మాత్రమే అడుగబడియున్నావు. “ఆయన యందు విశ్వాసముంచు ప్రతీవాడు నశింపడు, కానీ నిత్యజీవము నొందును.” మీరు దర్శనమును పట్టుకొన్నారని విశ్వసించుచున్నాను.

ప్రేమ అనునది దేవుని అంబులపొదిలో ఉన్న గొప్ప పరికరములలో ఒకటై యున్నది. దేవుడు ప్రేమైయున్నాడు. ఆయన ప్రేమైయున్నాడని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. మరియు నీవు ఆయన బిడ్డలలో ఒకనివైతే, నీవు పేమలో భాగమైయ్యెదవు. దేవుని ఆస్తిలో నీవొక భాగము. ఆయన అధికారములో నీవొకనివి అగుదువు. మరియు నీవు అలాగు చేసినప్పుడు, నీవు దేవుని యొక్క కుమారుడు మరియు కుమార్తెవగుదువు. మరియు ఆయన నీకు నిత్యజీవమును ఇచ్చెదనని ఆయన చెప్పెను.

18

ఇప్పుడు, నేను తప్పుగా బోధించనట్లయితే, మరియు నేను సరిగా అర్థము చేసుకొనినట్లయితే. కేవలము నా గ్రామర్ స్కూల్ మాత్రమే తప్ప నాకు చదువు లేదు. కానీ, నేను పండితులతో భోదించబడితిని, వారు తెలుసుకోవలసినదేమనగా, “నిత్యజీవమిచ్చుట అను వాక్యము వాడబడినది,” గ్రీకు భాషలో అది “జో” (ZOE) అని పిలువబడుచున్నది. “దేవుని యొక్క జీవము” అని దాని అర్థము.

అప్పుడు నీకు దేవుని ప్రేమ ప్రసరించబడినప్పుడు నిన్ను తీసుకొని వచ్చి మరియు నూతన జన్మలో నిన్ను ఆయనలో భాగముగా చేయును. “జన్మించుట ద్వారా,” లేదా “వచ్చుట ద్వారా” నీవు బిడ్డవగుదువు. మరియు అది నిన్ను దేవునితో సంబంధము కలుగునట్లుగా చేయును, మరింతగా, అనగా ఇప్పుడు మీరు కుమారులు మరియు కుమార్తెలు.

మరియు సృష్టికర్తయైన దేవుడు, తన శక్తి ద్వారా, తన యొక్క పలుకబడిన మాట ద్వారా సమస్తాన్నీ సృష్టించెను. మరియు సమస్తము కూడా, దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడుటయే; మొత్తము ప్రపంచమంతా ఆ విధముగా చేయబడెను. మరియు దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యము చేయుటకు ప్రయత్నించుట లేదా దేవుని యొక్క శక్తిని మన ఊహ ద్వారా నియంత్రించుటకు ప్రయత్నించుట ద్వారా మనము ఏ విధముగా తప్పు చేయుదుము. కాగా ఈ రాత్రి నీవు కూర్చొనియున్న ఈ భూమి కూడా దేవుని యొక్క ప్రత్యక్షపరచబడిన మాటయే. దేవుడు ఈ లోకమును తన పలుకబడిన మాట ద్వారా చేసెను. ఓ, మై! ధూళి, ఖనిజములు, బంగారము, జలములన్నియూ, మరియు కలిగియున్నదంతయూ కూడా, దేవుని యొక్క పలుకబడిన మాటయే. కాకున్నచో అయన ఎక్కడ నుండి అది పొందెను? అది ఎక్కడ నుండి పొందెను? దేవుడు చెప్పాడు, “అలాగుండును గాక,” మరియు అది అలాగు జరిగినది. అప్పుడు ఆయనలో మరియు ఆయన వాక్యములో ఎటువంటి విశ్వాసము మనము కలిగియుండవలసియున్నది?

19

నీవు ఎప్పుడైతే దేవుని కుమారుడు మరియు కుమార్తెగా అగుదువో అప్పుడు, నీ యొక్క గుణము మారును; నీ యొక్క వైఖరి మారును; జీవితము వైపు మరియు ఇతరుల వైపు నీవు కలిగియున్న దృష్టి మారును. అది నీవు సంఘములో చేరావు అని అర్ధము కాదు గానీ; అదేమనగా నీవు పునరుద్ధరించబడి యున్నావు. యేసుక్రీస్తులో నీవు నూతన సృష్టివయ్యావు. నీవు కలిగియున్నవన్నియూ, పాతసంగతులన్నీ గతించిపోయెను, మరియు దేవుడు నీతో మాట్లాడియున్నాడు, మరియు నీవు నూతన సృష్టివయ్యావు. ఇది మరింత లోతుగా, సంఘసభ్యులలోనికి కూడా పంపించాలని నేను కోరుచున్నాను.

నీవు ఎప్పుడైతే క్రీస్తు యొక్క సన్నిధిలో ఉండుటను ప్రేమించుదువో, అప్పుడు నీవు క్రీస్తులో భాగమగుదువు, అప్పుడు జనులు నీ యొక్క సన్నిధిలో ఉండుటను ప్రేమించెదరు, ఎందుకనగా దేవుని యొక్క కుమారుడు మరియు కుమార్తేగా నీవు దేవునిలో భాగమగుదువు.

వారి యొక్క సన్నిధిలో ఉండుటను, నీవు ప్రేమించిన జనులను నీవు ఎప్పుడైనా చూశావా? వారిలో వ్యాపించుచున్నదేదో ఉన్నది, అది వారితో మాట్లాడుటను నువ్వు ప్రేమించునట్లుగా చేయుచున్నది. మరియు ఇతర జనులు మంచి జనులైయున్నారు (మనము దీనిని కనికరము లేనట్టుగా చెప్పుట లేదు), కానీ వారి చుట్టూ కష్టముగా నీవు ఉండలేవు. ఎందుకనగా అది నువ్వు సృష్టించుచున్న వాతావరణము. నువ్వు దేవుని యొక్క కుమారుడుగా ఒక చిన్న సృష్టికర్తవైయున్నావు, ఎందుకనగా నీవు దేవునిలో ఒక భాగము.

కనుక ఆ కారణము చేతనే నీవు పరిశుద్ద గ్రంధము ఏమి చెప్పిననూ అది నమ్మగలవు, ఏలయనగా లేఖనము దేవుని యొక్క వాక్యమైయున్నది. దేవునిలో భాగమైన నీవు, వాక్యమును అంగీకరించెదవు.

20

“ఇది ప్రేరేపించబడినది కాదు, మరియు అది ప్రేరేపించబడినది కాదు, మరియు ఇది వేరొక దినమునకు చెందినది” అని అప్పుడు ప్రజలు చెప్పచున్నదానికి కారణము నీవు అర్ధము చేసుకొన్నావా? అది ఎందుకంటే వారు ఎన్నడూ తాకుట లేరు. వారెన్ని డిగ్రీలు చూపించిననూ, దానితో చేయుటకు ఏమీ లేదు. కానీ వారు తిరిగి జన్మించుటకు ఎన్నడూ దేవునితో సంబంధము పెట్టుకొనలేదు. ఓ, వారు ఎగురుచూనుండ వచ్చును; మరియు వారు ఇది చేసియుండవచ్చును; వారు పి.హెచ్.డి చేసియుండవచ్చును. వారు భాషలతో మాట్లాడి ఉండవచ్చు; వారు ఆత్మలో నాట్యము చేసి ఉండవచ్చును; కానీ యేసు చెప్పెను, “వారి ఫలములను బట్టి, వారిని తెలుసుకొనవచ్చును.” ఏలయనగా దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, అక్కడ ప్రేమ ఉండును; అర్థము చేసికొనుట ఉండును; నువ్వు ఆ చుట్టుప్రక్కలలో ఉండుటకు ఏదో ఉండవచ్చును.

మరియు ఓ, మనము జీవించుచున్న ఈ ఘడియలో, సజీవ దేవుని యొక్క సంఘము ఇంకా దీనిని కలిగి లేకపోవుట ఎంత దౌర్భాగ్యము. ఏలయనగా మన హృదయములలో దేవుడు గనుక సమృద్ధిగా ఉండినట్లయితే, సంఘ శాఖ అవరోధములు మనలను వేరు చేయజాలవు; జాతి భేదములు (రంగును బట్టి) లేదా మరింకేదైన మనలను వేరు చేయజాలదు; ఎందుకనగా వర్తమానము లేదు, భవిష్యత్తు లేదు, కరువు లేదా మరింకేదో అనునది ఏది లేదు, యేసు క్రీస్తులో ఉన్న ఆ దేవుని ప్రేమ నుండి మనలను ఎవరూ ఎడబాపలేరు.

21

దేవుని యొక్క సంఘములో వెల ఇచ్చి కొనబడిన ప్రతీ గొప్పవారు, ముందర స్థానములో కలిసి నిలబడి, మహిమ వైపునకు ప్రయాణము చేయుచున్న మనకు, దేవుని యొక్క వాక్యము, ఒక నకలు (బ్లూ-ప్రింట్) లేదా ఒక పటము (మ్యాప్) వలె ఉండును గాక. మన యొక్క సంబంధమును బట్టి, యూదుడైనా లేదా అన్యుడైనా, స్వేచ్చగానున్న లేదా బంధింపబడినా, కేథలిక్ అయినా లేదా ప్రొటస్టంట్ అయినా, ఒక గొప్ప పెద్ద సైన్యములో కలిసి నిలబడవలెను, ఎందుకనగా మరియు మనము గనుక దేవుని పిల్లలమైతే, మనము సహోదరులము. ప్రతీ ఒక్కనితోనూ దేవుని యొక్క పుత్రత్వమును బట్టి కాదు గానీ, పునరుద్ధరించబడుట ద్వారా మనము దేవుని యొక్క కుమారులమైయున్నాము. స్వభావమును బట్టి మనము ఆదాము యొక్క కుమారులము, జన్మించినప్పటి నుండి దేవుని కుమారులమైయున్నాము.

అది చాలా గొప్పగా పని చేయును. మరియు నా జీవిత కాలములో దానిని నేను గమనించాను, నేను ముసలి వానిని అయిపోవుచుండగా, అది ఏ విధముగా పనిచేయునని గమనించుచున్నాను. ఇప్పుడు, ఒక అనుభవము ద్వారా నేను మీకు చెప్పుచున్నాను, మరియు అది ఖచ్చితముగా దేవుని యొక్క వాక్యముతో ఉన్నది.

22

మా యొక్క సొంత గృహములో మరియు మీ గృహములలో దీనిని ప్రయత్నించండి. మరియు మా యొక్క గృహము వంటిది ఎక్కడైనా ఉన్నచో అది చాలా సందిగ్ధముగా ఉండును. ప్రపంచమంతటి నుండి ప్రజలు, ప్రతీ సమయము లోనికి బయటకు లోపటికి వచ్చుచున్నారు, రాత్రి మరియు పగలు, అన్ని గంటలు... మరియు కొంత సేపటి క్రితము నేను ఇక్కడ గమనించాను, ముప్పై-ఏడు సంవత్సరములకే పూర్తిగా పాలిపోయిన నా యొక్క ప్రియమైన భార్య; ఆమెయే నాకునూ మరియు జనులకు మధ్య నిలిచెను. ఒక వేళ బ్రెన్హాం కుటుంబమునకు ఏదైన ఘనతను ఇవ్వాలంటే, అది ఆమెకు ఇవ్వండి. ఆ యొక్క టెలిఫోను భయంకరముగా రాత్రి మరియు పగలు మోగుతూ ఉండును.

రోజంతయూ గృహము నిండుగా ఉండును. మరియు నేను బయటకు వెళ్ళాను, నా యొక్క చిన్నపిల్లలైన శారా మరియు రిబ్కా కొన్ని ఆట వస్తువుల కొరకు కొట్టుకొనుచూ ఉన్నారు; చిన్నవాడైన జోసఫ్, బాలుడుగా, నేలపై కూర్చొని తన గొంతంతటితో పెద్దగా ఏడ్చుచున్నాడు; నా భార్య వంట గదిలో తన యొక్క చేతులలో తన ముఖమును పెట్టుకొని ఏడ్చుచుండెను. అప్పుడు నేను ఇల్లంతటినీ గాలించగా, ఈ గదిలో కొందరు, ఆ గదిలో కొందరు, క్రిందన కొందరు ఉన్నారు. మరియు నేను లోపలకి నడుస్తూ, నేను ఆలోచించాను, “ఓ, ఎంత గంథరగోళము.”

తన యొక్క చేతులు నా చుట్టూ వేసి, “బిల్లీ, నేను పిచ్చి దాన్ని అయిపోతున్నాను” అని ఆమె చెప్పెను. “నేను పిల్లలకు రాత్రి ఎటువంటి ఆహరమును పెట్టలేక పోవుచున్నాను,” అని చెప్పెను.

23

కొన్నిసార్లు ఎడిపించే పిచ్చివారిగా (గౌరవముతోనే నేను చెప్పుచున్నాను), కొన్ని సార్లు మూఢభక్తి గల ఒక గుంపు, ఇంటిలో ఆ వైపు, ఈ వైపు పరిగెడుచూ, “ప్రభువు ఇలా చెప్పెను, మరియు ప్రభువు చెప్పెను, ఒక వేళ నేను నీ మేనేజర్ కాకపోతే... ప్రభువు దీనిని చెప్పెను” అని చెప్పుచుండెను. ఇప్పుడు, ప్రభువు దానిని గూర్చి నాతో మాట్లాడనిచో, దానిని గూర్చి ఆయన నాతో ఎదైనా మాట్లాడనట్లయితే. అయితే మీరెవరూ సహయము చేయలేరు; అది మానవ ధోరణిలో ఉన్నది.

మరియు ఆమె చెప్పెను, “పిల్లలు తినుటకు ఏమియూ లేదు, మరియు ఏమి చేయాలో నేను ఎరుగకయున్నాను.”

మంచిది, నేను తలంచాను, “ఇప్పుడు, చేయుటకు ఒకే విషయమున్నది. ఇప్పుడు, నేను అలసియున్నాను, కానీ నేను దానిని చేయగోరుచున్నాను. ఇప్పుడు, పరలోకపు తండ్రీ, నా హృదయములో, రంగము మీద నేను ఏ విధముగా అయితే నీవు ఉండగోరుచున్నావో, ఆ విధముగా నాకు సహయము చేయుము.” మరియు నేను తలంచాను, “ఇప్పుడు, నేను గనుక తనకు నెమ్మది కలుగునట్లు చేసినట్లయితే.” కనుక నేను చెప్పాను, “ప్రియతమా, నీవు నాతో రాత్రి భోజనమునకు వచ్చెదవా?”

“ఓ, నేను పిల్లలను శుభ్రపరచవలెను,” మరియు ఇది, మరియు అది. మరియు నీకు నీవు చాలా కష్టముగా ఆలోచించుట వినగలవు — మరియు చిన్న జోసఫ్ తన బలమంతటితో ఆ నేలను కొట్టుచున్నాడు.

24

కనుక నేను జారుకొని, మరియు ఒక వంట గౌను తీసుకొని, దానిని నా చుట్టూ తొడుగుకొని, ఆమెకు సహయము చేయుట ప్రారంభించాను. మరియు నేను చెప్పాను, “హనీ, నీకు తెలుసునా? నేను నిన్నటి రోజున ఒక అందమైన డ్రస్సును చూచాను. అది నీ కొరకు తీసుకుని రావాలని నేను అనుకొనుచున్నాను. మరియు అది ఇక్కడకు దగ్గరగా ఉన్న ఒక నగరములో ఉన్నది, మనము వెళ్ళి దానిని తెచ్చెదము.” మరియు ఆ సమయమంతా నా హృదయములో నేను ప్రార్థించుచున్నాను, “పరలోకపు తండ్రి, ఈమెను సమాధానపరచుము, ఒక చిన్న స్త్రీ.” మరియు నా చేతిని ఆమె మీద వేసి, నేను ఏమి చేయుచున్నానో ఆమెకు తెలియకుండా నేను చెప్పాను, “అవును, హనీ, ఓ! అది చాలా అందముగా ఉన్నది.” “ఓ ప్రభువా! ఈ చిన్న స్త్రీనీ సమాధానపరచుము.” మరియు ఆ విధముగా ఆమెపై చేయి వేసి, ఆమెకు తెలియకుండా... నేను ఏమి చేయుచున్నాను? ఒక విభిన్నమైన వాతావరణమును సృష్టించుచున్నాను, ప్రసరించుచున్నాను. దేవుని యొక్క ప్రేమలో నడువుము; సహవాసము కలిగియుండుము.

మరియు కొద్ది నిముషములలో ఆమె నిమ్మళించెను. మరియు ఆమె నెమ్మదించినప్పుడు, శారా మరియు బెక్కీ ఆట వస్తువులను వేరుపరుచుకొనెను; జోసఫ్ తను ఆడుకొనుటకు దేనినో తీసుకొనెను; మరియు గృహములో సమాధానము కలిగెను.

అది ఏమిటి? ప్రేమను ప్రసరించుట. వారు నా వారు, నా పిల్లలు, నా భార్య మరియు నేను దేవునివాడిని. మరియు అప్పుడు దేవుడు తన ఆత్మను ఇచ్చుచున్నాడు, మరియు ఆ ఆత్మ ద్వారా, నా కుటుంబమునకు ప్రేమ, మహోన్నతమైన కృప వచ్చి కుటుంబమును నెమ్మదిపరచెను. అది దానిని చేయును. అది అలా ఉండును అని నాకు తెలియును.

25

ఇక్కడ కొంతకాలము క్రిందట, ఒక గొప్ప సంగతిని గూర్చి నేను ఆసక్తి చూపుచున్నాను, ఫుల్-గాస్పల్ క్రిస్టియన్ బిజినెస్-మెన్ కు చెందిన సహో, క్రూస్ (ఆయన మీలో చాలా మందికి తెలియును), ఆయన మన ప్రియమైన మరియు గౌరవనీయుడెన సహో, ఓరల్ రాబర్ట్స్ కు చాలా మంచి స్నేహితుడు. మరియు అప్పుడు సహో, క్రూస్ ఓరల్ రాబర్ట్స్ కు మంచి స్నేహితుడై యుండగా, “ఓ, నా వలన ఎమైనా తప్పు జరిగినట్లయితే, నేను ఓరల్ రాబర్ట్స్ కు స్నేహితుడను,” అని ఆయన చెప్పెను.

చివరకు ఒక రోజు, సహో క్రూస్ కు కిడ్ని సమస్య వచ్చినది. కనుక ఆయన సహో,రాబర్ట్స్ తో విందు చేయుటకు వెళ్ళెను. మరియు సహో, రాబర్ట్స్ చెప్పెను, “ఓ, సహో క్రూస్, దేవుని ధృష్టికి అది చాలా అల్పమైనది.” తన చేతులను పెట్టి.... మరియు సహో, ఓరల్ ఆ యొక్క నిజమైన (అభిప్రాయమును మన్నించండి, కానీ) జాతి కుక్క విశ్వాసముతో, తన చేతులను ఆయన మీద వేసి, “దానిని నేను గద్దిస్తున్నాను” అని చెప్పెను. “సాహో క్రూస్, విచారించకు. నీవు బాగవబోవుచున్నావు” అని చెప్పెను.

26

మరియు సాహో క్రూస్ చెప్పెను, “నాకు నిజముగా బాగుగా అనిపించుచున్నది.” కానీ కొన్ని దినముల తరువాత, అది మరలా వచ్చినది. చెప్పెను, “నేను తిరిగి సహో, రాబర్ట్స్ వద్దకు వెళ్ళితిని.” “మళ్ళి అదే జరిగినదని చెప్పెను,” “అప్పుడు నేను అనుకొన్నాను నాకు సహో, విలియం బ్రెన్హాం తెలియును, కనుక నేను ఆయన యొద్దకు వెళ్ళుదును.” “ఆయన దర్శనములను చూచును, కనుక నేను విలియం బ్రెన్హాం ముందు నిలుచుందును, ఆయన నాకు మంచి స్నేహితుడు, మరియు అప్పుడు విలియం బ్రెన్హం నాకు సహయము చేయును,” అని చెప్పెను.

కనుక ఆయన అందరికి ఫోన్ చేసి నేను శ్రీవ్-పోర్ట్, లూసియానాలో ఉన్నానని కనుగొనెను. సహో, క్రూస్ మరియు అతని భార్య ప్రీప్పోర్ట్ కు వచ్చెను, మరియు వారు కూడికలకు వచ్చెను. మరియు అతను చెప్పెను, “సహో, బ్రెన్హాం, నాకు కొంచెము సమయమే ఉన్నది. మనము ఒక ప్రక్కకు వెళ్ళెదము, మరియు నా కొరకు దేవుడు ఏమి చెప్పునా, అని నేను చూడగోరుచున్నాను.”

నేను చెప్పాను, “సరే, మంచిది, సహో క్రూస్, మనము ఒక ప్రక్కకు వెళ్ళెదము.” నేను అక్కడ నలభై-అయిదు నిముషములు నిలువబడ్డాను, కానీ దేవుడు నాకు ఏమియూ చెప్పలేదు. “సాహో క్రూస్, నేను ప్రార్థించెదను” అని చెప్పాను.

అతను చెప్పెను, “ఒకవేళ దేవుడు నీకు ఏమైనా చూపించినట్లయితే, నాకు ఫోన్ చేయుము.” నేను అతని కొరకు ప్రార్ధించాను. “నీకు తెలుసా, నాకు కొంచెము మంచిగా ఉన్నది. ప్రభువు నా కొరకు ఏ సమస్య చూపించకుండా ఇప్పుడే ఆయన నన్ను స్వస్థపరచెను అని నేను నమ్ముచున్నాను,” అని అతను చెప్పెను.

నేను చెప్పాను, “మంచిది, మనము దేవునికి కృతజ్ఞులమైయున్నాము.”

27

కనుక, నేను ఆ రాత్రి, సహో క్రూస్ కు ప్రియమైన స్నేహితుడుగా, అతని కొరకు నేను ప్రార్ధించాను, ప్రార్ధిస్తూనే ఉన్నాను. మరియు కొద్ది వారములలో, అతడు తిరిగి మరలా వచ్చెను. అతడు చెప్పెను, “మనము తిరిగి దేవుని యొద్ద నిలువబడి మరియు ఆయన ఏమి చెప్పునో చూచెదము. నేను చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాను.” నేను ఒక గంట లేదా పైగా అక్కడ నిలువబడ్డాను, మరియు దేవుడు నాకు ఏమి చెప్పలేదు.

కనుక అతను వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళెను. “అది నాకు చాలా కఠినమైన పని; నీవు మాయోస్ దగ్గరకు వెళ్ళుట మంచిది,” అని ఆ డాక్టర్ చెప్పెను.

అతను మాయోస్ దగ్గరకు వెళ్ళెను. మాయోస్ అతని వైపు చూచి, అతను చెప్పెను, “అయ్యా, నీవు జీవించుటకు వెయ్యి వంతులలో ఒక వంతు మాత్రమే అవకాశము ఉన్నది, అది వెంటనే ఆపరేషన్ చేయవలెను.”

మంచిది, అతను చెప్పెను, “నేను దానిని తీసివేసెదను.”

మరియు ఆయన బయటకు వెళ్ళి, ఆ విధముగా చెప్పెను, “ఒక వేళ నేను మరణమునకు అంత దగ్గరగా ఉంటే, నేను దేవునితో సరిచూచుకొనుట మంచిది అని నేననుకొన్నాను.” కనుక ఆయన చెప్పెను, “ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు తెలియును, మరియు మంచిది అను దానిని సమర్థించుటకు నా హృదయమంతటితోనూ నేను ప్రయత్నించాను.” అతను ఒక ధనవంతుడు. మరియు అతను చెప్పెను... అతడు నాగళ్ళు (plows) తయారు చేయును. మీరు అతనిని ఎరిగి యుండవచ్చును; అతడు కాన్సాస్ వాసి.

28

మరియు అతను చెప్పెను, “నేను సరిగ్గా జీవించుటకు ప్రయత్నించాను, మరియు నీకు తెలియును, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు, గృహమునకు రావలెనని, నా కొరకు నీవు సిద్ధముగా యున్నచో నేను ఇష్టపడుచున్నాను. నేను చాలా దినములు మంచిగా జీవించాను మరియు నేను వచ్చుటకు ఇష్టపడుచున్నాను. కానీ ప్రభువా, నీవు గనుక నన్ను ఉపయోగించుకొనినట్లయితే, మంచిది, నేను చేయుటకు ఇష్టపడుచున్నాను.” అతడు చెప్పెను, “నేను నీ సేవకుడైన ఓరల్ రాబర్ట్స్ మరియు విలియం బ్రెన్హాం ముందు నిలువబడితిని, మరియు వారి యొక్క ప్రార్థనలు నన్ను స్వస్థపరచుటకు ఎటువంటి ప్రభావమును చూపలేకపోయెను అని అనుకొనుచున్నాను.” మరియు చెప్పెను, “బహుశా, అది నేను చేసినదేదో అయివుండును, కానీ ఖచ్చితముగా, నేను వివేచన ముందు నిలువబడినప్పుడు దానిని బయలుపరచి యుందువు.” అతడు చెప్పెను, “కానీ ఇది నేను వచ్చుటకు సమయమైతే, నేను వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను ఆపరేషన్ గదికి వెళ్ళుచున్నాను, నేను కలిగియున్న ఒకే ఒక అవకాశమది.”

డాక్టర్లు మరియొకసారి అతనిని పరీక్షించి, మరియు అడిగెను, “మిస్టర్ క్రూస్ నీవు దానిని తీసివేయాలని నిశ్చయము కదా?”

అతడు చెప్పెను, “నేను ప్రార్థించాను, మరియు నేను దానిని తీసివేయాలని నిశ్చయించాను.”

29

ఆ రీతిగా వారు ఆపరేషన్ గదికి వెళ్ళిరి, మరియు అతడు చెప్పినట్టుగా అతడు గుర్తించుకొనిన చివరి విషయము, “ప్రభువా, నీవు గనుక నా కొరకు సిద్దముగా ఉన్నట్లయితే, నేను నిన్ను ప్రేమించుచున్నాను, ప్రభువా. నేను నిన్ను ప్రేమించుచున్నాను, ప్రభువా.” అప్పుడు వారు అతనిని మత్తులో పెట్టిరి. మరియు అతడు వచ్చినప్పుడు, గది అంతయూ కూడా వెలుగు ప్రసరించుట ప్రారంభించెను, మరియు వైద్యులందరూ చుట్టూ నిలుచునియుండుట అతడు చూచెను. మరియు అతని యొద్దకు పరుగెత్తికొని వచ్చి, వారు అతనితో చెప్పెను, “మిస్టర్ క్రూస్, ఏదో జరిగినది. ఇంత పరిపూర్ణముగా జరిగిన ఆపరేషన్ ను మేము ఎప్పుడు చూచియుండలేదు. మరియు నీవు చనిపోవుచున్నావని మేము అనుకొన్నాము, కానీ అకస్మాత్తుగా నీవు సాధారణముగా అయిపోయావు.”

అది ఏమిటి? దైవికమైన ప్రేమ ప్రసరించబడినప్పుడు, మహోన్నతమైన కృప వచ్చి దాని స్థానము తీసుకొనును. అది తీసుకొనవలసియున్నది. అది అలాగు చేయవలసియున్నది.

30

కొన్ని మాసముల క్రిందట, పాత మెక్సికో నందు, నేను ఒక కూడికను కలిగియున్నాను. ఒక రోజు.... ఇది నిజమని నేను చెప్పలేను. నేను ఎదైతే చెప్పబోవుచున్నానో, దానిని మాత్రమే నేను ఎరిగియున్నాను. ముందు రోజు ఆమె మరణించును అని డాక్టర్ల ద్వారా తిరస్కరించబడిన ఒక చిన్న పాప కలదు.

వర్షము కురుయుచున్నది. వారు మీ వలె సీట్లలో కూర్చొనలేదు. వారందరూ మేత మేయుటకు పొలములో నిలువబడు గొర్రెల వలె, ఒకరికి ఆనుకొని మరియొకరు నిలువబడినారు, రాత్రి తొమ్మిది గంటలకు నా ప్రసంగము వినుటకు, ఉదయము తొమ్మిది గంటలకే వచ్చియున్నారు. ఆ యొక్క ఎండలో నిలబడియున్నారు, కుంటివారు, బాధపడుచున్న వారు... మరియు నేను లోనికి నడిచి రాగా.... క్రిందటి రాత్రి ప్రభువు ఒక గొప్ప అద్భుతమును చేసెను, నేను ప్రార్థన చేయుటకు ఆ యొక్క మైదానములోని వేదిక మీద పాత మురికి బట్టల పోగు వేసెను, పాత టోపీలు, శాలువాలు, చాలా ఎత్తుగా పోగువేసెను. నా హృదయము మండుచున్నది. మరియు బయట వర్షము కురియుచున్నది. మేమందరమూ అక్కడ ఆరుబయట ఉన్నాము.

31

అప్పుడు, నేను ప్రార్థన వరుసను పిలువగా, ఒక చిన్న తల్లి గట్టిగా కేకలు వేయుచుండెను. అప్పుడు బిల్లీ నా దగ్గరకు వచ్చి చెప్పెను, “డాడీ, నీవు ఏదో ఒకటి చేయవలసియున్నది.” “ఒక తల్లి యొక్క బిడ్డ ఈ మధ్యాహ్నము మూడు గంటలకు చనిపోయెను. ఆమె ఒక కేథలిక్ స్త్రీ మరియు ఆమె యొక్క బిడ్డ చనిపోయినది, మరియు దానిని ఆమె కప్పి వంచినది.” మరియు చెప్పెను, “సహో, ఎస్పినోజాస్ ప్రార్ధనా కార్డులను ఇచ్చినపుడు, ఆమెకు ఒకటీ దొరకలేదు. కానీ వేదికనొద్దకు వచ్చుటను, ఆపుటకు కావలసిన ద్వారపాలకులు లేరు. ఆమె ఆ బిడ్డను పట్టుకొని, తన యొక్క స్వరమంతటితో ఆమె అరచుచుండెను, ”పాద్రే, పాద్రే“ (అనగా ”తండ్రీ“ అని.)

మరియు నేను క్రింద ఒక పెద్ద పొడవైన కాంతుల యొక్క పరంపరను చూచాను, మరియు ఆ చిన్న స్త్రీ, వెర్రిగా, అందమైన ఒక చిన్న స్త్రీ, ఆమె బుగ్గలపై నుండి కన్నీరు కారుచుండగా, తన చేతులతో చుట్టియున్న బిడ్డను పట్టుకొని, తన యొక్క స్వరమంతటితో ఆమె అరచుచుండెను. మరియు నేను సహో, మూర్ తో చెప్పాను - మేనేజర్లలో ఒకడైన అతను వేదిక మీద నిలువబడి యుండెను - నేను చెప్పాను, “వెళ్ళి ఆ బిడ్డకు ప్రార్థన చేయుము, మరియు అది ఆమెను ఓదార్చును.” మరియు ఆ బిడ్డ కొరకైన ఆ చిన్న తల్లి యొక్క ప్రేమ...

32

మరియు నేను మరలా ప్రసంగించుటకు జనుల వైపునకు తిరుగగా, ఆ జనులలో నుండి నేను ఒక చిన్న స్పానిష్ బిడ్డను చూచితిని, కూర్చొని ఏడ్చుచున్నది. సహో, మూర్ ఆమెను సమాధానపరుచుటకు ప్రయత్నించుచుండెను, కానీ అది ఆమె చిన్న హృదయాన్ని సంతృప్తిపరచలేదు. ఒక తల్లి యొక్క ప్రేమ దేవుని వైపు ప్రసరింపబడినది.

మరియు నేను చెప్పాను, “ఒక్క నిముషము, సహో మూర్.” నేను క్రిందకు వెళ్ళాను. మరియు ఆ బిడ్డ కొన్ని దుప్పట్లతో చుట్టబడియున్నది. నేను స్పానిష్ మాట్లాడలేను లేక అర్ధము కూడ చేసుకొనలేను. అయితే తడిగానున్న ఆ చిన్ని దుప్పటి మీద చేతులుంచాను.

ఇప్పుడు, మూడు గంటల సమయము నుండి ఆ బిడ్డ మరణించియున్నదని వారు చెప్పిరి. నాకు తెలియదు. నేను చెప్పలేను. మరణించిన వారి గురించి నేను వ్రాసుకున్న పుస్తకము నిజమైనది, వారు లేపబడియున్నారు... ప్రభువు వలన లేపబడియున్నారు. వైద్యులు ఆలాగు చెప్పియుండవచ్చు.

కానీ ఆ బిడ్డ మీద చేతులుంచగా, ఆ ముసుగు క్రింద ఏదో కదలిక వచ్చినది, మరియు మీ జీవితములో అటువంటి కేక ఎన్నడూ విని యుండరు.

అది ఏమిటి? దేవుని ప్రేమ యొక్క హృదయమునకు, దైవీకమైన ప్రేమ ప్రసరించబడినప్పుడు, మరియు మహోన్నతమైన కృప ఆ యొక్క బిడ్డ స్వస్థత కొరకు ఒక దర్శనమును పంపెను. ఖచ్చితముగా.

33

దానికి ఒక గంట తర్వాత నేను గుర్తుంచుకొనియున్నాను, గంట తర్వాత, వేదిక మీదకు ఒక పేద ముసలి మెక్సికన్ పురుషుడు వచ్చియుండెను. అతని పాదములు వంకరపోయినవి; అతనికి పాదరక్షలు లేవు, అతని ముఖము మీద నెరసిపోయిన మీసాలు ఉన్నవి, అతని తల వెంట్రుకలు నెరిసిపోయినవి; మరియు అతనికి కంటి చూపు లేదు. మరియు అతను నా యొద్దకు వచ్చినప్పుడు, (అతనిని వారు తోడుకొని వచ్చిరి.) నేను చూచాను, మరియు నేను తలంచాను, “ఒక వేళ నా తండ్రి గనుక జీవించి ఉన్నట్లయితే, అతను ఆ వయస్సులో ఉండెడివాడు.” మరియు అతడు ఏదో అస్పష్టంగా మాట్లాడుచున్నాడు, మరియు అతడు నాకు సమీపముగా వచ్చియున్నప్పుడు, అతడు కొన్ని... లేదా జపమాల తీసెను.

మరియు కొంత మంది అతనితో చెప్పియున్నారు - సాహో, ఎస్పినోజా... అతను తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొనగోరుచున్నాడు, మరియు ఇక్కడ అతను నా యొక్క ముఖమును స్పర్శించగోరుచున్నాడు. మరియు వెంటనే నేను లేచి నిలబడ్డాను. మరియు అతని ముసలి, బలహీనమైన, వణుకుచున్న చేతులు, మరియు గుంటలు పడియున్న అతని బుగ్గలు, అతని బుగ్గల వెంబడి కారుచున్న కన్నీరు. మరియు నేను తలంచాను, “అతను ఎవరికో తండ్రి; ఎవరో ఒక తల్లి యొక్క బిడ్డ.”

34

మరియు అతను మాలతో జపించుట ప్రారంభించెను, మరియు నేను చెప్పాను, “డాడి, అది అవసరము లేదు.” అతను ఏడ్వడం ప్రారంభించెను, మరియు అతను నా ముఖమును కనుగొనెను, అతను నన్ను తట్టుచూ, మోకరించుటకు ప్రారంభించెను. నేను మరలా అతనిని పైకి లేపితిని. నేను తలంచాను, “అక్కడ చూడుము.”

స్నేహితులారా, మీరు చూడండి, మీరు గనుక సహవాసములోనికి ప్రవేశించనట్లయితే, మీలో ఉన్నదేదో ఒకరి కోసం మరొకరు పరితపించడం ప్రారంభించనట్లయితే, ఏదైనా గాని ప్రేమను ప్రసరించలేకపోయిన ఎడల... మీకు తెలుసు, ప్రజలు అంత అమాయకులు కారు, నీవు కలిగియున్నదీ లేనిది వారు అర్థము చేసుకొనెదరు. వారు అర్థము చేసుకొనెదరు. జంతుజాలము దానిని అర్థము చేసుకొనును. కాబ్దటి నీవు ఆ యొక్క సహవాసము లోనికి ప్రవేశింపవలెను.

35

మరియు ఆ ముసలివాడు అక్కడ నిలబడియుండగా, నేను అతనిని చూచాను, మరియు నా హృదయము భారముతో కొట్టుకోవటం ప్రారంభించినది, నేను తలంచాను, “బీదయైన ముసలివాడా, ప్రకృతి నీయందు చాలా క్రూరముగా ఉన్నది. నీ జీవితమంతటిలో ఒక మంచి భోజనము కొరకు నీవు కూర్చొనియుండి యుండవు. నీ జీవితమంతటిలో కొన్ని మంచి బట్టలు కూడా కలిగియుండి ఉండవు.”

అతని ప్రక్కనే నా పాదములు పైకి పెట్టి, నా యొక్క బూట్లు తీసివేసి మరియు అతని యొక్క పాత, మురికైన, వంకరలు తిరిగిన పాదములకు వేయుటకు పెట్టాను. కానీ అవి సరిపోవని నేను చూచాను. అతని యొక్క భుజములు నా వాటి కంటే చాలా విశాలముగా ఉండెను, అలాగే నా యొక్క కోటు కూడా అతనికి సరిపోలేదు. కనుక నేను ఏడ్చాను; నేను తలంచాను, “ఓ, వీటన్నిటి తరువాత, నీవు ఒక అంధకారమైన ప్రపంచములో కూర్చొనియున్నావు. నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావో నీవు చూడలేవు. నీకెన్నడూ ఒక మంచి బట్ట కూడా లేదు. నీవు ఎన్నడూ ఒక మంచి మంచము మీద పండుకొని ఉండవు. నీవెన్నడు? ఒక మంచి భోజనము చేసివుండవు, మరియు నీ జీవితమంతా ఒక మంచి జత బూట్లు కూడా వేసుకొనియుండవు. మరియు ఇప్పుడు, నీవు అంధకారములో ఉన్నావు.” ఓ, దెయ్యము ఎంత క్రూరమైనదిగా యున్నది.

36

దానిలో, ఆ ముసలి వానికి ప్రేమ ప్రసరింపబడుచున్నది. మరియు అతని చుట్టూ నా చేతులు వేసి, అతనిని నా హృదయమునకు హత్తుకొన్నాను, ఎటువంటి దర్శనము కొరకు నేను ఎదురు చూచుటలేదు, కేవలము అతనిని నా హృదయమునకు హత్తుకొన్నాను, నేను చెప్పాను, “ఓ తండ్రివైన దేవా, ఈ పేద ముసలివానియందు కనికరముంచుము, ఎవరో ఒకరి తండ్రి.”

మరియు అతను అరుచుట నేను విన్నాను, “గ్లోరియో డైయోస్!” మరియు అతను నా నుండి వెనుకకు దుమికి; అతని కన్నులను నలుపుకొని; నేలపై పడెను; నా చేతిని ముద్దు పెట్టుకొనెను; అతను గంతులు వేయుచుండెను, “గ్లోరియో డైయోస్!” దాని అర్థము “దేవునికి మహిమ.” మరియు ప్రేక్షకులలో ఎవరూ చూడలేనంత మంచిగా చూచుచూ వేదికపై పరుగెడుచుండెను.

అది ఏమిటి? దైవీకమైన ప్రేమ ప్రసరింపబడుట, ఫలితము మహోన్నతమైన కృప దాని స్థానము తీసుకొనెను. కేవలము దైవీకమైన ప్రేమ మాత్రమే అంత దూరము వెళ్ళగలదు. కానీ అంతము వరకూ అది నిజమైనచో, మహోన్నతమైన కృప దాని స్థానము తీసుకొని మరియు ప్రేమ తీసుకొని రాలేని దానిని అది ఉత్పత్తి చేయును.

ఓ, స్నేహితులారా, సంఘమునకు కావలసినది అదే. ఇది ఒక క్రొత్త సంస్థ కాదు, ఒక అధ్బుతమైన గుంపు కాదు, ఒక వాదన కాదు, ఒక తర్కము కాదు; దానికి ప్రేమ యొక్క బాప్తిస్మము కావాలి, ఒకరునొకరు ప్రేమించుకొనుట. దానికి క్రొత్త వరములు అవసరము లేదు; దానికి కలిగియున్న వరములను ఉపయోగించుటకు కావలిసిన ప్రేమ అవసరమైయున్నది. దానికి అవసరమైనది అదే.

37

ఇది చాలా వింతగా కనిపించవచ్చును, మరియు అలాగున్నచో, మంచిది, ఒక రోజు తిరిగి మనము కలుసుకోనైయున్నాము. జంతు జీవితమునకు ప్రేమంటే తెలుసు. నేను దానిని చూచాను. వేటగాడిని మరియు బయట తిరిగే వ్యక్తినైన నేను, ఎలా దేవుడు ఏర్పాటు చేసెనో దానిని నేను చూచాను. నోటిలో గాలము కలిగిన ఒక చేపను నేను చూచాను. దానిని గూర్చి చింతించకండి. దాని శరీరములో ఉన్న ఆమ్లము దానిని కొంత తినివేసెను. నేను ఒక కుక్క ఎముకను మ్రి౦గివేయడం చూచాను. దానిని గూర్చి విచారించకండి. దాని శరీరములో నున్న ఆమ్లము దానిని గూర్చి జాగ్రత్త తీసుకొనును. దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేసెను.

కొంత కాలము క్రితము నా గృహములో, నాకు... నేను ఇక్కడ గడ్డిని కోయు యంత్రమును కలిగియున్నాను. మరియు నాకు ఇవ్వబడిన, నా గృహము దగ్గర నేను గడ్డిని కోయుచున్నాను. మరియు నేను రెండు మార్లు తిరుగగా ఎవరో ఒకరు వచ్చుచుండిరి; నేను వెళ్ళి, నా బట్టలను మార్చుకొని, లోనికి వెళ్ళి, అనారోగ్యముగా ఉన్న వారికి ప్రార్థించుచుంటిని; మరియు ఆ విధముగా; బయటకు వెళ్ళి ఒకసారి యంత్రమును త్రిప్పి, మరియు ఎవరో వచ్చియుండిరి. మరియు మీకు తెలుసు, ఆ ఇంటి వెనుక స్థలములో కోయునంతలో ఇంటి ముందు స్థలములో గడ్డి పెరుగుచుండెను. అది చాలా కష్టము.

38

ఒక ఆగస్టు కాలం వేడియైన మధ్యాహ్న సమయమున నేను ఆ వెనుకటి స్థలమునకు వెళ్ళుట జరిగినది. ఆ విధముగా నేను అక్కడ తిరుగుచున్నాను, నన్ను ఎవరూ చూడనట్టుగా, మరియు నా యొక్క చొక్కాను తీసివేసి, నా పై శరీరమునందు ఏమియు కలిగిలేను. అక్కడ చాలా వేడిగా ఉండెను, మరియు ఆ వేడియైన గడ్డి కోయు యంత్రము. మరియు నేను అలా గడ్డిని కోయుచూ, పాడుచుంటిని, “ఓ, నేను యేసును ఏ విధముగా ప్రేమించితిని,” పైనున్న సృష్టికర్త యొక్క గొప్పతనమును గూర్చి ఆలోచించుచున్నాను. మరియు ప్రభువును గూర్చి నేను ఏమి ఆలోచించుచున్నానో ఆ విధముగా ఆత్మలో పట్టబడితిని, మరియు నేను మరిచాను, ఆ యొక్క కంచె మూలన ఒక గొప్ప పెద్ద కందిరీగల గూడు ఉన్నది. మరియు ఆ యంత్రమును గెంటుకొనుచూ, మరియు కళ్ళు మూసుకొని పాటలు పాడుకొనుచూ, ప్రార్థించుచూ, తిన్నగా ఆ కందిరీగల గూడు యొద్దకు బలముతో వెళ్ళితిని, ఆకస్మాతుగా ఆలోచించకుండా... నేను పూర్తిగా కందిరీగలతో చుట్టబడ్డాను, అవి నా యొక్క జీవమును తీసివేయగలవు. అవి చాలా పెద్దవి. వాటిలో ఒకటి నిన్ను నేలపై పడవేయగలదు.

ఇప్పుడు, ఇది మీకు కొంచెము కల్పితముగా ఉండవచ్చును, కానీ మీకు ఎప్పుడైనా తెలుసా, సత్యము కల్పితము కన్నా బలమైనదని? కానీ ఏదో జరిగినది. అవి ఆ విధముగానే నిలిచి ఉండుటను నేను కోరుకున్నాను.

39

వాషింగ్టన్ లోని ఆ ఉన్మాది గురించి నా పుస్తకములో ఎప్పుడైనా చదివారా? మీరు చదివారా? రెండు వందల-అరవై పౌండ్ల బరువు గల ఆ ఉన్మాది వేదిక యొద్దకు పరిగెత్తుకొని వచ్చి మరియు చెప్పెను, “నీ శరీరములోని ప్రతి ఎముకను నేను విరుగగొట్టెదను.” మరియు పోలీసులు మరియు సేవకులు ప్రతీవారు దారిలోనుండి పారిపోయిరి, మరియు నేను ఆ ఉన్నాదితో వేదిక మీద వదిలివేయబడితిని. ఏదో జరిగినది.

నేను ఆ సమయమున నూట-ఇరవై-ఎనిమిది పౌండ్ల బరువు తూగితిని. ఆ ఉన్మాది ఆ విధముగా నిలువబడి, తన పళ్ళను బిగించి, అతని కళ్ళు..... అతను చెప్పెను, “గడ్డిలోని సర్పమైన నీవు, ఇక్కడ దేవుని యొక్క మనుష్యునిగా నటించుచున్నావా” అని చెప్పెను, “నీవు ఎంత దేవుని మనుష్యునివో నేను చూపించెదను. నీ యొక్క శరీరములోని ప్రతి ఎముకను నేను విరుగగొట్టెదను.” మరియు తన యొక్క పిడికిలి వెనుకకు తీసుకొని, మరియు అతడు శారీరకముగా తన యొక్క భయమును చూపుటకు మంచి సమర్దుడైయున్నాడు.

ఏదో జరిగినది. ఆ మనుష్యుని నిర్లక్ష్యము చేయుటకు బదులుగా, నేను అతని యందు విచారించాను. నేను తలంచాను, “దీనమైన మనుష్యుడా, నీవు నన్ను ఆ విధముగా వ్యవహరించెడివాడవు కావు. ఎందుకు, నీవు నావంటి ఒక మనుష్యుడవు. నీవు ఆ విధముగా చేయుటకు తయారు కాబడలేదు. నీవు ప్రేమించుటకు చేయబడావు, మరియు నీ బిడ్డలకు తండ్రిగా ఉండుటకు, మరియు వారిని ప్రేమించుటకు, మరియు అందరినీ ప్రేమించుటకు, నీవు దేవుని కుమారుడవగుటకు చేయబడావు, దయ్యము నిన్ను స్వాధీనపరచుకొన్నది.” నేను ఆ మనుష్యునియందు విచారించాను.

మరియు అతడు చెప్పెను... నాకు దగ్గరగా నడచి వచ్చి నా ముఖము మీద ఉమ్మివేసెను, [సహో, బ్రెన్హాం ఉమ్మివేయు శబ్దమును చేయుచున్నారు.] నేను అతని వైపు చూచాను. ఓ, ఆ మంత్రగాళ్ళు మరియు అలాంటి వారి వలన నాకు ఇటువంటివి జరిగినవి. చింతించకు. దేవుడు నీ పక్షమున ఉండగా, నీకు వ్యతిరేకముగా ఎవరు నిలువగలరు?

40

కనుక నేను ఆ మనుష్యుని చూచాను, మరియు, “దీనమైనవాడా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, తప్పిపోయిన నా దీన సహోదరుడా” అని నేను తలంచాను. ఒక్క మాట కూడా పలుకలేదు. మరియు అతడు నా దగ్గరకు వచ్చి తన యొక్క పెద్ద పిడికిలిని పైకి లేపి వెనుకకు తీసుకున్నాడు. మరియు జనులందరూ కూడా ఉపిరి బిగబట్టి చూస్తున్నారు, లోపల ఆరువేల మంది ఉన్నారు, మరియు దానికి దగ్గరలో చాలా మంది వర్షములో నిలబడియున్నారు. అతడు తన యొక్క పెద్ద పిడికిలిని వెనుకకు తీసుకొన్నాడు.

అతను ఒక ప్రసంగీకుడిని కొట్టియున్నాడు. అతడు ఒక పిచ్చాసుపత్రి నుండి వచ్చియున్నాడు. మీరు అక్కడ పోలీసువారిని అడగవచ్చును; ఇప్పటి వరకూ అది అక్కడ రికార్డులలో ఉన్నది. అతడు ఒక సేవకుడిని కొట్టి, అతని యొక్క దవడను మరియు మెడ ఎముకను విరుగగొట్టియుండెను.

అతడు అక్కడ ఇక్కడ పరుగెడుచూ, వేదిక యొద్దకు వచ్చి మరియు అతడు చెప్పెను, “ఈ రాత్రి, నీ యొక్క శరీరములోని ప్రతీ ఎముకను నేను విరుగగొట్టెదను.” మరియు నేను అతనిని చూచాను - ద్వేషముతో కాదు, కానీ ప్రేమతో. మరియు అతడు ఆ విధముగా చేసి, నా యొద్దకు రానారంభించెను, నాలో ఏదో చెప్పెను, “అయితే ఈ రాత్రి నీవు నా పాదములపై పడెదవు.”

“నీ పాదముల మీద పడెదనా,” అతడు చెప్పెను. “గడ్డిలోని సర్పమైన నీకు, నేను ఎవరి పాదముల మీద పడుదునో నేను చూపిస్తాను.” మరియు అతడు నా యొద్దకు పరుగెత్తికొని వచ్చి అతని యొక్క పెద్ద పిడికిలిని బిగించి, నన్ను కొట్టుటకు విసిరెను. నేను చెప్పాను, “సాతానా, ఆ మనుష్యునిలో నుండి బయటకు రా.” మరియు అతని కన్నులు సరిచేయబడినవి, అతని తల వెనుకకు వెళ్ళినది, మరియు అతను పడిపోయి, నేలమీద నా కాళ్ళకు చుట్టుకొనెను. పోలీసువారు వచ్చి అతనిని ఈడ్చుకుపోయిరి. ఓ, అదియే: ప్రేమ.

41

ఆ కందిరీగలు నన్ను చుట్టుముట్టినప్పుడు, మరియు కొద్ది నిముషములలో నేను మరణమునకు కుట్టబడెదనని తెలియును, పారిపోవుట లేదా భయపడుటకు బదులుగా...

నీవు నియంత్రించబడుటకు కేవలము రెండు మూల వస్తువులు ఉన్నవి, అవి విశ్వాసము లేదా సందేహము, మరియు అది... సందేహమును అనుసరించును... భయము సందేహమును అనుసరించును. కనుక నీవు... యేసు చెప్పెను, “భయపడకుడి.” భయపడవద్దు. దేవుడు తన వాక్యమును నిలబెట్టుకొనును. నీవు ఈ రాత్రి ఎటువంటి పరిస్థితిలో ఉన్ననూ, దేవుడు తన మాట నిలబెట్టుకొనును.

ముగించుటకు ముందుగా, మరికొద్ది నిముషములు, జాగ్రత్తగా వినండి. ఏమి జరిగినది? నేను వాటిని ప్రేమించాను. అది చాలా ఆశ్చర్యముగా ఉండవచ్చును, కానీ నేను అది చేశాను. మరియు ఇక్కడ ఎందుకు... నేను వాటితో మాట్లాడాను. ఇప్పుడు, అవి నన్ను అర్థము చేసుకొన్నవని నేను చెప్పుటలేదు, కానీ ఎవరో నన్ను అర్ధము చేసుకొన్నారు, ఏలయనగా నేను చెప్పాను, “దేవుని యొక్క చిన్న జీవులారా, నేను మిమ్మును ఆటంకపరచాను. మీరు నిద్రపోవుచుండగా, నేను మిమ్ము ఆటంకపరిచాను. కానీ నేను మీ సృష్టికర్త యొక్క సేవకుడను, మరియు అతని యొక్క అస్వస్థతగా ఉన్న పిల్లలు ప్రార్ధన కొరకు నా గృహములో ఉన్నారు. మరియు నేను గడ్డిని కోయుచున్నాను, మరియు దేవుని యొక్క చిన్న జీవులైన మిమ్ములను ఆటంకపరచినందుకు నేను విచారిస్తున్నాను. ఇప్పుడు, మీ సృష్టికర్త, నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో, త్వరగా మీ ఇంటిలోనికి వెళ్ళుడి, మరియు నేను ఇంకెన్నడూ మిమ్ములను బాధించను.”

మరియు నేను తీర్పులో మిమ్ములను కలుసుకొనినప్పుడు... నన్ను ముసురుకొనియున్న ఆ కందిరీగలు నన్ను ఎన్నడూ ముట్టుకొనలేదు, మరియు అవన్నియూ ఒక వరుసలో తిన్నగా వాటి గూటిలోనికి వెళ్ళిపోయెను. ప్రేమ ప్రసరించబడినది, మహోన్నతమైన కృప దాని స్థానము తీసుకొన్నది.

42

ఏడు సంవత్సరములు నేను ఇండియానాలో గేమ్ వార్డెనుగా ఉన్నాను. ఒక రోజు నేను నీటిలో కొన్ని చేపలను వేయుచుండగా.... నేను ఈ విషయములను ఎందుకు చెప్పుచున్నానో నాకు తెలియదు. కానీ పొలమును దాటుచూ ఒక గొప్ప దున్న ఒక నల్ల మనుష్యుని చంపివేసినది, మరియు అతడు ఇండియానాలోని, సెల్లర్స-బర్గ్ కు చెందిన మిస్టర్. గర్న్సే పొలమును చేసెడివాడు. నేను ఆ దున్న అక్కడున్నదని మరచితిని, అయినా అక్కడ చుట్టూ, “ప్రవేశించవద్దు” అనే చిహ్నములు పెట్టబడినవి. కాని నేను కలిగియుండవలసిన ఒక చిన్న తుపాకీని నేను తీసుకున్నాను, మరియు దానిని కారులో విసిరివేశాను. మరియు నేను పొలము వెంబడి వెళ్ళుచూ, నాకు తెలిసిన ఒక అనారోగ్యముతో బాధపడుచున్న వ్యక్తికి ప్రార్ధన చేయుటకు కొండ మీదకు వెళ్ళాను.

మరియు నేను పొలములో నడుచుచుండగా, గమనించలేదు, మరియు ఆకస్మాత్తుగా ఆ యొక్క గుబురుగా ఉన్న పొదలలో నుండి ఈ పెద్ద చంపెడిది ముందుకు దుమికినది. మరియు అది నా వైపు చూచినది; అది పెద్దగా అరిచినది; దాని తలను క్రిందికు దించి మరియు దాని కొమ్మలను దుమ్ములోనికి పొడిచి వెనుకకు విసిరెను. వెంటనే నేను నా తుపాకీ కొరకు చూచాను, అది కారులో ఉన్నది. అక్కడ నేను ఒంటరిగా నిలుచుని ఉన్నాను. ఆ కంచె రెండు వందల-ఏభై గజాల దూరములో ఉన్నది, ఆ దున్న ముఫ్పై గజాల దూరములో ఉన్నది, చెట్లు లేవు, ఏమి లేవు. నేను చెప్పాను, “మంచిది, ఇక్కడే ముగింపు అయివున్నది” అని నేను చెప్పాను. “నేను ఒక పిరికివానిగా చనిపోవుటను కోరుకొనుటలేదు, కానీ ఒక క్రైస్తవుడు ఏ విధముగా చనిపోవలసియున్నదో ఆ విధముగా నిలబడి చనిపోవుదును” అని నేను చెప్పాను. మరియు నాకు నేనుగా ఎంచుచుండగా, మరియు ఆ పెద్దది చుట్టూ తిరిగినది, అది మరణము అని నాకు తెలుసు, కొద్ది నిమిషములలో నెత్తురు కారుచుండగా మరణమవుదును. ఓ, అది నా యొక్క శక్తికి చాలా ఎక్కువైన జోడి.

43

మరియు ఏదో ఒకటి సంభవించుటకు నేను తుపాకీని కలిగిలేనందుకు కృతజ్ఞుడనైయున్నాను. ఓ, నా భావనను క్షమించండి, కానీ ఏదో జరిగినది. ప్రేమ క్రిందకు దిగినది. ఇప్పుడు, ఇది వింతగా అనిపించును, కానీ ఇది నిజము. నేను ఆ దున్నతో మాట్లాడాను. నేను చెప్పాను, “నేను నిన్ను భంగపరిచాను, కానీ నేను నీ సృష్టికర్త యొక్క సేవకుడను. నేను అస్వస్థతతో ఉన్న నా యొక్క సహోదరునికి ప్రార్థించుటకు వెళ్ళు దారిలో ఉన్నాను. నిన్ను నేను కలతపెట్టినందులకు పశ్చాత్తాపపడుచున్నాను. ఇప్పుడు, నీవు నన్ను బాధించవు, ఎందుకనగా నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరియు నేను నిన్ను ప్రేమించుచున్నప్పుడు, నీవు నన్నెలా బాధించగలవు?”

44

మరియు అది వచ్చియున్నది. ఇక్కడ కూర్చొనియున్న నా సహోదరులందరివలె, ఆ జంతువును చూచి ఏ మాత్రము భయపడలేదు. అది వచ్చియున్నది మరియు నేను అక్కడనే నిలబడియున్నాను. మరియు నేను చెప్పాను, “నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎందుకనగా దేవుడు నిన్ను సృజించెను. నిన్ను నేను భంగపరచాను, మరియు నేను పశ్చాత్తాపపడుచున్నాను.” మరియు అది నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను కదలక నిలబడియున్నాను, మరియు అది పది అడుగుల దూరమునకు వచ్చియున్నది. తన పాదములను విసిరి ఆగియున్నది, మరియు అది చాలా క్షీణించినట్లుగా కనిపించుచున్నది. అది ఈ ప్రక్కకు, ఆ ప్రక్కకు చూచియున్నది. నేను చెప్పాను, “ప్రభువైన యేసు నామములో, దేవుని యొక్క సృష్టిలో సృజింపబడిన నీవు, వెనుకకు వెళ్ళి, క్రింద పరుండుము.” మరియు దేవుడే నాకు సాక్షి, ఆ దున్న వెనుకకు తిరిగి మరియు క్రింద కూర్చొండెను, మరియు దానికి నేను అయిదు అడుగుల దూరమున నడిచితిని.

అది ఏమిటి? మరణము చెంతనే ఉన్నది. ప్రేమ ప్రసరించబడినది, మరియు మహోన్నతమైన కృప ఆ దున్నను ఆపివేసినది.

45

అ పోజమ్ కథను ఎవరు వినలేదు? నేను ముగించుచుండగా... అది ప్రపంచమంతా వెళ్ళినది. క్రితము వేసవిలో... లియో మరియు జీన్ ఇక్కడ కూర్చొనియున్నారు, టేపులను తీసుకొన్న నా యొక్క ఇద్దరు కుమారులు... సహో, మరియు సాహోదరి. వుడ్ అక్కడే కూర్చొనియున్నారు. లియో మరియు జీన్ అను ఇద్దరు బాలురు నాతో కూడికలకు వచ్చెడివారు, ఒకరు కేథలిక్ కుటుంబానికి చెందినవారు మరియు ఇంకొకరు వ్యక్తిగతముగా ఒక చిన్న ఎఫ్.బి.ఐ ను (నేరస్తులను విచారించెడి సంస్థ) ఏర్పాటు చేసికొనెను. వారు నన్ను విచారించనైయున్నారు. మరియు వారు చేశారు. మరియు అప్పటి నుండి వారు టేపు రికార్డర్లు తీసుకొని నాతో వెళ్ళడం ప్రారంభించారు. మరియు వారు మంచి క్రైస్తవ బాలురు, మరియు ఆ విధముగా చేసినప్పటి నుండి, వారు వరండాలో కూర్చొనుచుండిరి, మరియు నేను వారిని నా విద్యార్ధులని పిలిచెడివాడను. మరియు వారికి నేను దేవుని యొక్క ప్రేమను బోధించెడివాడను.

శ్రీ. వుడ్ మరియు శ్రీమతి వుడ్ - శ్రీమతి. వుడ్ దేవుని యొక్క సంఘమునకు చెందినవారు, మరియు శ్రీ. వుడ్ యోహోవా-సాక్షులు అనే సంఘ శాఖకు చెందిన వారు. మరియు వారు తన కాలును ఈడ్చెడి కుంటివాడైన ఒక బాలుడను కలిగియున్నారు. మరియు వారు లూయిస్-విల్ కూడికకు వచ్చారు, మరియు వారు దేవుడు పనిచేయడం చూచారు. శ్రీ. వుడ్, ఉత్తర కెంటకీ ప్రాంతమంతా తెలిసిన ఒక పేరొందిన కాంట్రాక్టరు, ఆయన చెప్పెను, “నేను ఒక యోహోవా-సాక్షిని అయివుండవచ్చును, కాని అది దేవునిది,” కనుక అతడు టెక్సాస్ లోని హూస్టన్ ను తరువాత కూడిక కొరకు వెళ్ళెను, మరియు అక్కడే ప్రభువు యొక్క దూత దిగి వచ్చి తన యొక్క ఛాయాచిత్రమును తీయించుకొనెను. శ్రీ. వుడ్ మరియు శ్రీమతి. వుడ్ దానిని చూచుటకు అక్కడ ఉండిరి.

46

నేను విదేశాలకు, స్వీడన్ వెళ్ళితిని. నా తిరుగు ప్రయాణములో, ఓహాయో క్లీవ్-ల్యాండ్ లో నా కూడికను ప్రారంభించాను. ఆ రాత్రి, వారు ఆ కూడికకు వచ్చారు, దూరముగా కూర్చొనియున్నారు, మరియు వారు కూర్చొని ప్రార్థించుచుండిరి. మరియు నేను వేదిక మీదనుండగా, పరిశుద్ధాత్మ వారి యొక్క విశ్వాసము వైపునకు నన్ను త్రిప్పెను, మరియు ఏదో చెప్పెను, బహుశా ఈ పదాలు కాకపోవచ్చును, కానీ ఈ విషయము మీద, “ఆ స్త్రీ మరియు పురుషుడు మరియు ఒక చిన్న బాలుడు అక్కడ చివరన కూర్చొనియున్నారు, అతడు కెంటకీకి చెందిన ఒక కాంట్రాక్టరు; మరియు వారు పక్షవాతముతో కుంటివాడైన ఒక బాలుడను కలిగియున్నారు, అతడు తన కాళ్ళను ఈడ్చుచుండెను. అయితే 'యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' అతడు స్వస్థత పొందెను.” ఏమి చెప్పాలో వారికి తెలియలేదు. కొద్ది నిముషములలో వారు చెప్పారు, “దేవిడ్, పైకి లే.” మరియు మిగతా బాలురవలె దేవిడ్ కూడా సాధరణముగానే ఉండెను. ప్రేమ ప్రసరింపబడెను.

అతడు కాంట్రాక్టులను చేయుటను వదిలివేసెను, అమ్మివేసెను, నా ఇంటి ప్రక్కన చిన్న స్థలమును తీసుకొనెను, మరియు అతడు నా ఇంటి ప్రక్కవాడు. శ్రీమతి. వుడ్ ఒక రకమగు పశువైద్యుము ఎరుగును. ఆమె జంతువులను మరియు బాహ్యప్రదేశములను ప్రేమించును, ఒక చాలా మంచి స్త్రీ. మరియు వారి యొక్క జనులు మెథడిస్టులు అని నేను అనుకొనుచున్నాను.

47

ఆ ఉదయమున నేను ఆ బాలురకు ప్రేమ మీద బోధించుచున్నాను. ఇప్పుడు, సమీపముగా, ముగించే ముందు... నేను రోడ్డు మీద నుండి క్రిందకు వచ్చుట చూచాను, మరియు ఒక చిన్న వస్తువు దొర్లుకుంటూ, పడుతూ లేస్తు, రోడ్డుపై నుండి క్రిందకు వచ్చుచున్నది. మరియు నేను చూచాను, అప్పుడు, బాలురు, ఉదయము పదిగంటల సమయమాయెను. మరియు అది ఏమిటి, అది ఒక అపోజమ్ (Opposum) (అడవి పిల్లి వంటి జంతువు) అక్కడ ఉండుట ఎమిటి? మీకు తెలియునా, ఇప్పుడు, ఎవరికైనా జంతు ప్రపంచము తెలిసివుండిన ఎడల, వారికి అపోజమ్లు రాత్రిపూట ప్రయాణించునని తెలియును. అవి పగలు గ్రుడ్డివి.

కనుక ఇక్కడ ఈ అపోజమ్ పగటిపూట ప్రయాణము చేయుచున్నది. మరియు అది అక్కడ కంచెలు లేని చోటుకు క్రిందకు వచ్చుచున్నది, రెండు లేదా మూడు ఇళ్ళు, అడవిలో నుండి, రహదారికి అడ్డముగా ఐదువందల గజాలు నుండి వచ్చుచున్నది. ఇక్కడ అది సందులోనికి వచ్చినది. మరియు నా యొక్క గృహమునకు ఒక రాయి ద్వారము కంచెగా వేయబడినది. మరియు నా యొక్క గృహమును గుర్తించగానే, అది లోనికి తిరిగినది. మరియు నేను చూచి, మరియు నేను చెప్పాను, “ఒక అపోజమ్ ఉన్నది, మరియు దానికి ఏదో అయినది. దానికి బహుశా రేబిస్ వచ్చియుండును. మరియు అది ఏ విధముగా చేయుచున్నదో చూడండి, దొర్లుచున్నది, పడుతూ లేస్తున్నది, దెబ్బలాడుచున్నది, లోనికి రావడానికి ప్రయత్నిస్తున్నది.”

48

మరియు శ్రీ. వుడ్ పొలములో అంతా ఒక చోట పోగుపెట్టిన పోగు అక్కడ ఉన్నది. మరియు నేను, “కొద్ది క్షణములు ఇక్కడకు రండి” అని ఆ బాలురతో చెప్పాను. మరియు నేను పరుగెత్తి, పండ్లకోల తీసుకొని, అది అపోజమ్ పైకి విసిరాను. అదే సమయములో పాలవాడైన శ్రీ. గిల్ మోర్ వచ్చియున్నాడు. మేము అపోజమ్నే చూస్తున్నాము, మరియు నేను చెప్పాను, “బహుశా దానికి రేబీస్ అయివుండవచ్చును. ఓ,” నేను చెప్పాను, “లేదు, చూడుము.” ఓ, దీనిని క్షమించండి, కానీ దాని కాలు నిండా పురుగులు పట్టియున్నవి, రసి కారుచున్నది, కుక్కలు దానిని నమిలివేసినవి, లేదా ఒక కారు దాని మీద నుండి వెళ్ళిపోయి యుండవచ్చును మరియు దానిని ముక్కలుగా నలుగగొట్టినది.

“ఓ,” నేను చెప్పాను, “అది ఎలా వాచినదో చూడుము, చాలా పెద్దదిగా ఆ కాలు చాలా పెద్దగా మరియు దాని యొక్క మరియొకటి.” నేను చెప్పాను, “అది చనిపోవుచున్నది.” మరియు అపోజమ్ మీదకు నేను ఆ పండ్లకోల విసురుచున్నప్పుడు, నా ఆశ్చర్యమునకు... ఒక అపోజమ్ మరియు కంగారూ (జంతువు) అనేది మాత్రమే ఒక జేబులాంటి దానిలో తమ పిల్లలను దాచెడి జంతువులైయున్నవి. మరియు దాని జేబు క్రిందకు పెట్టినప్పుడు, మరియు ఆమె దానిలో తొమ్మిది చిన్న కూనలైన, స్వచ్ఛమైన పిల్లలను కలిగియున్నది. మరియు నేను చెప్పాను, “బాలులారా, ఇక్కడకు రండి, బైబిల్లో నుండి ఇంకా ఎక్కువగా మీకు బోధించెదను.” నేను చెప్పాను, “బహుశా ఈ అపోజమ్ లోపలికి వచ్చియున్నది....”

49

దానికి ముందు రోజు మన యొక్క నగరమునకు చెందిన ఒక అందమైన, చాలా మంచిదైన, యవ్వనురాలైన నల్లజాతి స్త్రీ ఒక అక్రమముగా పుట్టిన కుమారుని కలిగియున్నది, మరియు వాడిని ఒక దుప్పటిలో చుట్టబెట్టి, ఊపిరాడనీయక చంపివేసెను, మరియు నది యొద్దకు ఒక అద్దె కారులో తీసుకొనిపోయి, మరియు దానిని నదిలో పారవేసినది.

మరియు దానిని గూర్చి మనము మాట్లాడుకొనుచున్నాము. కనుక నేను చెప్పాను, “ఆ యొక్క ప్రియమైన యవ్వన స్త్రీ, ఈ అపోజమ్ వంటి ఒక తల్లి కాదు.” ఆమె నల్లజాతీయురాలు కాబట్టి అలా కాదు గానీ, కాదు; తెల్లని బాలికలు, గోధుమ రంగు వర్ణపు బాలికలు, పసుపు రంగు బాలికలు, క్రీస్తు లేకుంటే వారందరూ ఆ విధముగానే చేతురు. అయితే నేను చెప్పాను, “ఈ అపోజమ్ యొక్క నైతిక విలువలు ఆ స్త్రీ యొక్క నైతిక విలువల కన్నా చక్కనైనవి, ఎందుకంటే ఆ స్త్రీకి తన యొక్క బిడ్డ అక్కరలేదు, మరియు దాని ప్రాణమును తీసివేసెను.” పోలీసులు ఆమెను చెరసాలలో వేసిరి. కానీ నేను చెప్పాను, “ఈ తల్లియైన ముసలి అపోజమ్ జీవించుటకు ముప్పై నిముషములు కూడా లేవు.” మరియు అది ఆ పండ్లకోలను కొరకుచూ తాను చేయగలిగిన దంతయూ చేయుచుండెను.

సాదారణముగా మీరు వాటిని ముట్టుకున్నచో (మీరు వాటిని ఆడుకొను అపోజమ్ అని పిలుచుదురు) అవి పడిపోవును. కానీ అది తన యొక్క మార్గమును ఎక్కడికో వేయుచున్నది. మరియు నేను చెప్పాను, “అది ఈ పండ్లకోలను కొరుకుచున్నది, మరియు అది చాలా మైమరచినదాని వలె యున్నది; కానీ అది ఒక నిజమైన తల్లి, అది తన యొక్క జీవితములోని చివరి ముప్పై నిముషములు, తన యొక్క బిడ్డల కొరకు పోరాడుటకు ఇచ్చును.” నేను చెప్పాను, “అది తల్లి యొక్క ప్రేమ.” అది తన పిల్లలను ప్రేమించెను.

50

నేను ఆ పండ్లకోలను తీసివేశాను; ఆ అపోజమ్ దొర్లుకుంటూ, మరియు తిన్నగా మా గృహ ద్వారము నొద్దకు వెళ్ళినది, మరియు అక్కడ అది పడిపోయినది, మరియు నీరసించినది. నేను, “అది చనిపోయినది” అని చెప్పాను. మరియు నేను అక్కడకు వెళ్ళి, ఆ పండ్లకోలతో దానిని తట్టాను. కానీ అది చనిపోకుండుటను నేను చూచాను. అది ఇంకా... ప్రక్కన తన పళ్ళను బయటపెట్టుచున్నది. మరియు నేను ఆ కాలును చూచాను, అన్నీ చాపుకొని పడియుండెను, మరియు ఆ చిన్న పిల్లలు చనిపోవుచున్న ఆ తల్లి నుండి పాలు త్రాగుచున్నవి.

మరియు అప్పుడు శ్రీ. మరియు శ్రీమతి. వుడ్ వచ్చారు, మరియు శ్రీమతి. వుడ్, ఒక ప్రియమైన, మధురమైన క్రైస్తవురాలైన స్త్రీ, కానీ ఆమె యొక్క తెలివి తేటలయందు, ఒక పశువైద్యుము ఎరిగినదై; ఆమె, “సహో, బ్రెనాం, ఆ అపోజమ్ను చంపివేసి మరియు దానిని బాధ నుండి విముక్తిరాలిని చేయుము” అని చెప్పెను. మరియు చెప్పెను, “ఆ యొక్క చిన్నవి బుంగమూతితో ఉన్నవి. (అనగా గుండ్రని మూతి) అవి సీసాతో కూడా పాలను తీసుకొనలేవు, అయినా అవి చాలా చిన్నవి. వాటి వయస్సు కొన్ని గంటలు మాత్రమే. కాబట్టి నీవు ఆ చిన్న పిల్లలను కూడా తీసుకొని చంపివేయవలెను.

ఓ, “నేను అది చేయలేను” అని నేను అనుకొన్నాను. “నేను చేయలేను” అని నేను చెప్పాను.

ఓ, ఆమె చెప్పెను, “సహో, బ్రెన్హాం పాపము నీవు ఆ చిన్న దానిని ఆ విధముగా అక్కడ వదిలివేయకూడదు, మరియు ఆ చిన్న అపోజమ్లు ఆ యొక్క మృత తల్లి నుండి ఆ విధముగా పాలు తీసుకొనుచూనుండును. అవి ఒక భయంకరమైన చావును పొందును.”

51

ఇప్పుడు, ఆ స్త్రీ సరిగానే చెప్పినది. అయితే నాలో ఏదో అది జరుగనివ్వలేదు. ఆమె చెప్పెను, “ఎందుకు, నీవు ఒక వేటగాడివి. వెళ్ళి, నీ తుపాకీని తెచ్చుకొని, దానిని కాల్చుము.”

నేను చెప్పాను, “నేను వేటగాడినే, కానీ నేను ఒక హంతకుడిని కాను.” నేను చెప్పాను, “కానీ నేను దానిని చేయలేను.”

ఆమె చెప్పెను, “అయితే బ్యాంక్స్....” అతడు ఆమె ప్రియమైన భర్త, నా యొక్క స్నేహితుడు. “దానిని అతడు చంపనిమ్ము” అని చెప్పెను.

నేను చెప్పాను, “నా వల్ల కాదు.”

చెప్పెను, “అంటే, నీవు ఆ బలహీనమైన జంతువును మండుటెండలో ఉండనిచ్చుదువా, మరియు సూర్యుని నుండి సూటిగా వచ్చుచున్న కిరణాల వలన నేడు ఆ చిన్నపిల్లల దిగంబర శరీరములు కమలును. మరియు అది అక్కడ పడియుండి మూల్గుచూ, గట్టిగా శ్వాస తీసుకొనుచూ, చనిపోవుచున్నది?”

52

చూచుటకు అది చేయవలసిన ఒక మానవీయమైన సంగతి అయివున్నది, కానీ నేను దానిని చేయలేను. నేను లియో మరియు జీన్ తో మాట్లాడియున్నాను. తరువాత వారు వెళ్ళిపోయారు. రోజంతయూ కూడా అది అక్కడే ఉన్నది. నేను వెళ్ళాను; ఆ చిన్న అపోజమ్లు ఇంకనూ పాలు త్రాగుచున్నవి...

ఆ రాత్రి సహో, వుడ్ వచ్చి మరియు అతడు చెప్పాడు, “ఇప్పుడు, సహో బ్రెన్హం నీవు రోజంతా కూడా పని ఒత్తిడిలోనే ఉన్నావు. నీవు వాటన్నిటిని విడిచి రమ్ము, నేను నిన్ను చిన్న స్వారీకి తీసుకోని వెళ్ళుదును.” మా భార్యలను తీసుకొని మేము అలా బయటకు వెళ్ళితిమి, మరియు రోడ్డు ప్రక్కన గజ్ఞపట్టి, తినివేసిన, పురుగులు పట్టిన ఒక చిన్న ముసలి కుక్క పడియున్నది. మరియు దానిని పైకి లేపి పట్టుకున్న పిదప ఆ పురుగులు నా చేతుల మీద ప్రాకుచుండెను. మరియు నా భార్య చెప్పెను, “బిల్లీ, నీవు దానిని తీసుకొనకుము.”

నేను చెప్పాను, “కానీ హనీ, అది ఒక చిన్నపిల్ల. ఎవరో దానిని వదిలివేశారు, ఎందుకంటే అది గజ్జిపట్టి వున్నది.” నేను చెప్పాను, “అది జీవించు హక్కును కలిగివున్నది.” మరియు దానిని నేను ఇంటికి తీసుకొని వెళ్ళాను, దానిని కడిగివేశాను, దానికి మందులు వేశాను, దాని కొరకు ప్రార్ధించాను. అది ఒక అందమైన కొల్లీ జాతి కుక్క.

53

నేను పదకొండు గంటల సమయములో ఇంటిలోనికి వెళ్ళుచున్నాను, అక్కడ ఆ అపోజమ్ కాళ్ళు చాచి పడుకొనియున్నది. సహో వుడ్ చెప్పాడు, “మంచిది, ఇప్పుడు అది చనిపోయియున్నది.” మరియు ఆ చిన్ని పిల్లలు ఇంకా పాలు త్రాగుచూనే వున్నవి. నేను చెప్పాను, “మంచిది, బహుశా అయివుండవచ్చు.”

“బిల్లీ, నీవు దానిని ఎందుకు చంపివేయలేదు?” అని అడిగాడు

“నేను చేయలేను” అని నేను చెప్పాను.

నా బాలుడు చేపల వేటకు నది యొద్దకు వెళ్ళి అర్థరాత్రి వచ్చియున్నాడు, మరియు ఆ అపోజమ్ అక్కడే ఉండియున్నది. ఇంకా అక్కడనే యున్నది. రాత్రంతయూ కూడా నేను ఆ అపోజమ్ గూర్చే ఆలోచిస్తూ ఉన్నాను. నేను దానిని నా మదిలో నుండి తీసివేయలేకపోయాను. మరియు ఆ తరువాత రోజు ఉదయము, ప్రొద్దుటే, నేను లేచి, బయటకు వెళ్ళాను. మరియు నేను అలా బయటకు వెళ్ళినప్పుడు, ఆ అపోజమ్ అక్కడే ఉండియున్నది. ఆ రాత్రి నాకు శ్రీ. వుడ్ చెప్పాడు, “నీకు తెలుసా, సహో, బ్రెన్హాం, ఒకవేళ ఆ అపోజమ్ ఎలా అయినా కదలాలన్నచో, అది సూర్యుడు అస్తమించిన తరువాత మాత్రమే కదలును” అని చెప్పాడు. “నీవు దీనిని తెలుసుకొనుటకు చాలినంతగా వలపన్ని మరియు వేటాడియున్నావు” అని చెప్పెను.

“అది నిజము” అని నేను చెప్పాను.

54

మరియు మరుసటి రోజు ఉదయము నేను బయటకు వెళ్ళాను. మరియు ఈ మధ్యనే తన మొదటి దర్శనము చూచిన ఒక చిన్న బాలికను నేను కలిగియున్నాను, పదకొండు సంవత్సరముల వయస్సు గల ఒక చిన్న బాలిక. ఆమె అలా వరండా బయటకు వచ్చియున్నది, చిన్న రిబ్కా మరియు ఆమె దాని వైపు చూచి, ఏడ్వడం ప్రారంభించినది. ఆమె చెప్పినది, “ఆమె ఒక నిజమైన తల్లి, ఆమె కాదా?”

“అవును” అని నేను చెప్పాను. నేను నా కాలితో దానిని తన్నాను. ఆమె మీదంతా మంచు ఉండియున్నది మరియు ఎగిరే ఈగల వంటివి ఇంకనూ ఆమె మీద ఉన్నవి. ఆమె చెప్పెను, “డాడీ, ఆ తల్లి అపోజమ్ తో నీవేమి చేయబోవుచున్నావు?”

నేను చెప్పాను, “హనీ, డాడీకి తెలియదు.”

ఆమె అడిగినది, “నీవు దానిని చంపబోవుచున్నావా, డాడీ?”

మరియు “డాడీ దానిని చేయలేరు, హనీ” అని నేను చెప్పాను. “ప్రియా, నీవు చాలా తొందరగా లేచియున్నావు” అని నేను చెప్పాను. ఆమె యొక్క చిన్న పైజామాను ధరించియున్నది. నేను చెప్పాను, “నీవు లోపలికి వెళ్ళి మరియు మమ్మీ ప్రక్కన పండుకొనుము.” కనుక నేను ఆమెను వెంటనే గదిలోనికి పంపివేశాను. మరియు నేను క్రిందనున్న గదిలోనికి వెళ్ళి, కూర్చొనియున్నాను. మరియు నేను తలంచాను, “ఓ, దేవా, దీనమైన ఆ తల్లి అపోజమ్ ఏ విధముగా బాధపడియున్నది. ఆమె ఆ పిల్లలను ఎలా ప్రేమించుచుండవచ్చును.” మరియు నేను అక్కడ కూర్చొనియుండగా, “మంచిది, ఆమె చనిపోవుటను నేను చూడాలనుకోవటం లేదు,” అని నేను తలంచాను.

55

మరియు నేను అక్కడ కూర్చొనియుండగా, ఏదో నాకు చెప్పినది, “నిన్నటి దినమున ఆమె కొరకు నీవు ప్రసంగించియున్నావు. నీ యొక్క అంశమునకు ఆమెను ఉపయోగించుకొన్నావు.”

“అది నిజము” అని నేను చెప్పాను.

“ఆమె ఒక నిజమైన తల్లి, అని నీవు చెప్పియున్నావు.”

“అది నిజము” అని నేను చెప్పాను.

“నేను దానిని నీ గృహము యొద్దకు పంపాను, మరియు ఒక స్త్రీ వలె అది నీ ద్వారము నొద్ద ఇరవై-నాలుగు గంటలు పడియున్నది, ప్రార్ధింపబడుటకు తన యొక్క తరుణము కొరకు ఎదురుచూచుచున్నది, మరియు నీవు ఒక్క మాట కూడా చెప్పలేదు” అని చెప్పెను.

నేను చెప్పాను, “అవును, నేను చెప్పలేదు....” నేను చెప్పాను, “నేను ఎవరితో మాట్లాడుచున్నాను? నేను నాతోనే మాట్లాడుచుంటినా?” నేను గంతులేశాను. “ఓ, దేవా, అది నీవేనా?” అని నేను తలంచాను.

56

మరియు నేను బయటకు వరండాలోనికి నడిచాను, మరియు చిన్న రిబ్కా అక్కడే నిలుచుని ఇంకా తల్లి అపోజమ్ ను చూచుచున్నది. ఆమె తిన్నగా ఇంటిలో నుండి వచ్చియున్నది. నేను అపోజమ్ యొద్దకు బయటకు వెళ్ళియున్నాను. నేను చెప్పాను, “దేవా! నీవు ప్రతీ పువ్వును ఎరిగియున్నావని నాకు తెలియును. నీవు ప్రతీ పిచ్చుకను ఎరిగియున్నావు. మరియు ఇటువంటి గొప్ప భయంకరమైన సంగతి స్త్రీ జాతికి జరిగియున్నది, ఈ అందమైన యవ్వన స్త్రీ, తన యొక్క బిడ్డను చంపుకొన్నది. మరియు నీవు జంతువులను కూడా నడిపించగలవని నీవు చూపించుచున్నావు. మరియు ఆమె వచ్చి, నా ద్వారము నొద్ద పడియుండి, ప్రార్ధింపబడుటకు తన యొక్క తరుణము కొరకు ఎదురు చూచుచున్నది.” “అలా చేసినందుకు, నన్ను క్షమించుము, ప్రభువా,” అని నేను చెప్పాను. “దేవా, అది నాకు తెలియదు, లేనిచో అది నేను చేసెడివాడను” అని నేను చెప్పాను. కానీ “ఒకవేళ అది నీ దైవికమైన ముందు జాగ్రత్త అయినచో, అది, నీవు దీనిని కోరినచో, మరియు అపోజమ్ కొరకు నేను ప్రార్థించాలని నీవు కోరినచో, నేను దానిని క్రీస్తు నామమున చేస్తాను, అని నేను చెప్పాను. తండ్రీ, ఆమెకు సహయము చేయుము. తన యొక్క బిడ్డల కొరకైన ఆమె ప్రేమ చాలా గొప్పది...” నేను తలంచాను, “ఓ, దేవా! నీవు దానిని చేసెదవా?” మరియు నేను దానిని చెప్పియుండగా...

57

ఓ, ఇప్పుడు, ఇది చాలా ఆశ్చర్యముగా అగుపించును. ఇది నేరుగా... నాకు దానిని గురించి ఆఫ్రికా నుండి, ఇండియా నుండి, ప్రపంచమంతటి నుండి ఉత్తరములు వచ్చియున్నవి. అసోసియేటడ్ ప్రెస్, నేను అనుకొనుచున్నాను, దానిని గ్రహించినది. మరియు ఆ తల్లి అపోజమ్ పైకి లేచి, తన యొక్క జేబులోనికి తన యొక్క పిల్లలను పట్టుకొని, మరొక అపోజమ్ నడుచునట్లు సామాన్యముగా ఆ వీధిలో నడిచిపోయెను. వెనుక తోక నిలబెట్టెను; గేటు యొద్దకు వెళ్ళి, వెనుకకు తిరిగి, “అయ్యా, ధన్యవాదములు” అని చెప్పినట్లుగా నాకు అనిపించినది. మరియు రోడ్డు దాటుకుంటూ ఆమె అలా పొదలలోనికి వెళ్ళినది. మరియు నాకు తెలిసినంత వరకూ, ఈ రాత్రి తన యొక్క పిల్లలతో సంతోషముగా ఉన్నది.

దేవుడు ఆ అపోజమ్ గురించే అంతగా ఆలోచించినట్లయితే, మరి ఇంకెంత ఎక్కవగా నీ గురించి ఆలోచించును, సజీవ దేవుని హృదయములోనికి నీ యొక్క ప్రేమ ఉత్పత్తి చేయబడి మరియు ప్రసరించబడినప్పుడు? ఒకవేళ దేవుడు.... సహజ జ్ఞానము ద్వారా, ఆ యొక్క అపోజమ్ ఆత్మను కలిగిలేదు. అది ఒక మూగ జంతువు. మరియు తన సహజ జ్ఞానము ద్వారా అది ఆ విధముగా చేయగలిగినట్లయితే, మరియు పరిశుద్ధాత్మ ఒక తల్లి అపోజమును అక్కడకు నడిపించగలిగిన ఎడల, ఆయన ఆ అపోజమ్కు నేను ప్రార్థన చేయలాగున చేయుట తెలిసియుండి మరియు ఆమె యొక్క జీవమును ఇచ్చిన యెడల, మరి నీవు ఆ అపోజమ్ కంటే ఎంత ఎక్కువవాడవు?

58

నీవు ఈ రాత్రి ఇక్కడకు ఎందుకు ప్రార్ధింపబడుట కొరకు వచ్చియున్నావు? దేవునితో నీ హృదయము ఎక్కడ నిలిచి ఉన్నది, అన్నదే నా ప్రశ్న? మనందరము కొద్ది నిముషములు మన తలలు వంచెదము. నేను చాలా సేపు మాట్లాడియున్నాను, ఎందులకో నాకు తెలియదు. మీరు చాలా ప్రియమైనవారు. మరియు నాకు తెలుసు రేపటి తరువాత, ఒక దినమున బహుశా కొన్ని మైళ్ళ దూరము మనము వేరుచేయబడవలసిన వారమైయున్నాము.

మన తలలు వంచుకొని కూర్చొనియుండగా, నేను మిమ్ములను అడుగుటకు ఆశ్చర్యపడుచున్నాను, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను,” నేను ఆశ్చర్యపడుదును; నిత్యజీవము కొరకై నీకివ్వబడిన ఆయన బహుమానమును నీవు అంగీకరించి ఎంత ఎక్కువగా దానిని ఘనపరిచావు?

ఇప్పుడు, నిజాయితీగా, ప్రతీ తల వంచబడియున్నది, ప్రతీ కన్ను మూయబడియున్నది. మీరు దేని కొరకైనా తిక్షణముగా ఆలోచించుచున్నారా? “ఓ, నేను ఒక సంఘ సభ్యుడిని మాత్రమే; నా జీవితము ఏ విధముగా ఉండాలో ఆ విధముగా చేయుటకు, నేను ఎన్నడునూ ఆయన ప్రేమను పొందియుండలేదు. నేను దానిని పొందగోరుటకు ఇష్టపడుచున్నాను. దేవుడు ఈ రాత్రి, నా యొద్దకు రావాలని కోరుచున్నాను, మరియు ఆయన తన ఆత్మతో నన్ను నింపి, మరియు నా యొక్క పాపములను క్షమించవలెనని కోరుచున్నాను.” ప్రతీ ఒక్క తల వంచియుండగా, నీవు దేవుని వైపు నీ చేయి ఎత్తుదువా? నేను ఎత్తుదును. దేవుడు నిన్ను దీవించును గాక. స్త్రీ, దేవుడు దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును, నిన్ను, నిన్ను, నిన్ను, అయ్యా, మరియు నిన్ను, నిన్ను. ఓ, మై! దేవుడు నిన్ను దీవించును, నిన్ను, స్త్రీ, నిన్ను నిన్ను, మరియు నిన్ను సహోదరుడా, మరియు నిన్ను, మరియు నిన్ను సహోదరుడా, మరియు సహోదరి, నిన్ను సహోదరుడా నిన్ను నిన్ను.

59

ఓ, వారు భవనమంతా ఉన్నారు. దేవుడు నిన్ను దీవించును గాక, నా సహోదరుడా, అక్కడ ఉన్న సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు పైనున్న బాల్కనీలో ఉన్న వారందరూ, “సహోదరుడా బ్రెన్హాం, నేను దేవునితో నిజాయితీగా ఉండగోరుచున్నాను. నేను ఇక్కడ కూర్చొని యుండగా, నా హృదయముతో ఏదో మాట్లాడినది. వాస్తవముగా, నేను ఉండగలిగినట్లుగా నేను లేను,” అని అక్కడ ఉన్న ఎంత మంది చెప్పగలరు?

దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరుడా. “ఇప్పుడు నేను నా చేయి ఎత్తాను...” స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక, కుమారుడా. ఓ, మై! చిన్న బాలిక, దేవుడు నిన్ను దీవించును గాక. స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. అక్కడ పైనున్న మిమ్ములను దేవుడు దీవించును గాక. నేను.... సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక.

60

“ఎలాగైనా, సహోదరుడా బ్రెన్హాం, నా హృదయములో....” దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరీ. “నేను చాలా ఎక్కువగా వెచ్చదనాన్ని కలిగిన అనుభూతి పొందుచున్నాను, కానీ నాలో ఏదో ఒక కొరత ఉన్నది. ఇప్పుడే దేవుడు తన యొక్క ప్రేమతో దాని నింపమని నేను కోరుచున్నాను.” సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక, మరియు నిన్ను, మరియు నిన్ను మరియు నిన్ను. ఓ, మై! ప్రతీచోటా,

“ఇప్పుడు ఆయన యొక్క దయలో దేవుడు నాకు కావాలి, ఎందుకనగా నేను ఆయనతో ప్రేమలో ఉన్నాను. నాకు అటువంటి ఒక దైవికమైన ప్రేమను ఇవ్వమని నేను ఆయనను కోరుచున్నాను, ఆ మహోన్నతమైన కృప నాపై పరిశుద్ధాత్మ బాప్తిస్మమును తిరిగి పంపి, నన్నొక ప్రత్యేక వ్యక్తిగా తయారుచేయును గాక.”

ఇక్కడ ఇప్పటికే క్రీస్తును అంగీకరించి, మరి ఎప్పుడూ పరిశుద్ధాత్మతో నిండియుండని వారు ఎంత మంది ఉన్నారు, మరియు ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపునట్లుగా - నీవు దేవునిని మరింత ఎక్కువగా ప్రేమింపగోరినచో, నీ చేయిని పైకి ఎత్తుదువా? ఓ, భవనమంతయూ, ప్రతీ చోటా, ఎలా అయిన కనీసము రెండు వందలు లేదా ఒక వందా-యాభైకి పైగా పాపులు తమ చేతులను పైకి ఎత్తియున్నారు. కొంత రెండు లేదా మూడు వందలు, లేదా ఇంకా ఎక్కువ జనులు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు వెదకుచున్నారు.

61

దేవుడు ఒక దీనమైన తల్లి అపోజమ్ గూర్చి అంతగా ఆలోచించిన ఎడల, ఆయన నిన్ను మరి ఎంత ఎక్కువగా ప్రేమించును? “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించెను...” నీవు చెప్పెదవు, “సహో, బ్రెన్హాం, నేను నా చేయి గనుక ఎత్తినట్లయితే, దాని భావము ఏమిటి?” అది నీకు జీవము మరియు మరణమునకు మధ్య ఉన్న వ్యత్యాసము. “ఓ, అది చాలా చిన్న విషయము.” నాకు తెలుసు. యోహాను 3:16 అదే. కానీ అది జీవము మరియు మరణమునకు మధ్య ఉన్న వ్యత్యాసము. దాని అర్థము అదే.

యేసు, పరిశుద్ధ యోహను 5:24లో చెప్పెను, “నా మాట విని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

క్రీస్తు బయట ఉన్నవారెవరైనా, మీ చేయి ఎప్పుడూ ఎత్తి యుండనిచో, ఇప్పుడు దానిని ఎత్తి మరియు చెప్పుము, “నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను.” పైన బాల్కనీలో ఉన్నవారు? దేవుడు మిమ్మును దీవించును గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక, నిన్ను. అది మంచిది. క్రీస్తు బయట ఉన్నవారు ఎవరైనా, ఖచ్చితంగా వేరెక్కడైనా? అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నీ చేతిని చూచును. చిన్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక

ఓ, నీకు నీవుగా చేసుకోలేని వాటిని నీ కొరకు చేయుటకు, జీవముగల దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని గుర్తించుట చాలా వాస్తవమైన సంగతైయున్నది. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. దానర్థం, నీకు అది జీవము మరియు మరణమునకు మద్య ఉన్న వ్యత్యాసమంత.

62

ఎవరో మరలా ఆ క్రింద, చెప్పుచున్నారు, “దేవా, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నేను నా చేయిని ఎత్తుచున్నాను, ఎంతో కాదు.... బ్రదర్ బ్రెన్హాం చూచుట కొరకు కాదు, కానీ దేవా! నీవు నన్ను చూడాలని కోరుచున్నాను.” దేవుడు నిన్ను దీవించును, అక్కడ ఆ గోడ దగ్గర ఉన్న నిన్ను - దేవుడు దీవించును గాక. దేవుడు నల్లజాతి స్త్రీని దీవించును గాక; నేను నిన్ను చూచాను. దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక.

హలులో ఆ క్రింద, బయట మరియు ఆ కారిడార్లలో, లోపలికి రాలేకుండినవారు, మీరు చేయి ఎత్తి చెప్పగలరా “నన్ను జ్ఞాపకము చేసుకొనుము.” అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను చూచును. దేవుడు నిన్ను చూచును [స్పష్టతలేని మాటలు].

ఈ క్రింద మరియొక కారిడార్లో మరియు ఈ వైపు మార్గములో, మీరు చెప్పగలరా, “దేవా! నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ప్రభువా, నన్ను జ్ఞాపకముంచుకొనవలెనని కోరుచున్నాను. మరియు ఈ రాత్రి దానికి గుర్తుగా నా చేయిని ఎత్తుచున్నాను, అది ఇప్పుడు నేను దేవుని యొక్క ప్రేమను నమ్మి మరియు ఒప్పుకొనుచున్నాను.”

నీవు ఒక సంఘమునకు చెందినవాడవైతే, నీవు ఒక సంఘ సభ్యునివి; అది సరియే. కానీ నేను నిన్ను క్రైస్తవునిగా ఉండుటతో పాటు ఒక సంఘ సభ్యునిగా ఉండాలని కోరుచున్నాను.

63

అది సరే, మనము ప్రార్థించుటకు ముందు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కూర్చొనియున్న ఈ చిన్న బాలుని దేవుడు దీవించును గాక, అక్కడనున్న ఆ చిన్న [స్పష్టతలేని మాటలు]. దేవుడు దీవించును గాక. అక్కడ ఓ, ఖచ్చితముగా, మరియొక్కరు మారుమనస్సు పొందుదురు. బాలుడా, దేవుడు నిన్ను దీవించును గాక, అక్కడ నిలబడియున్న సుమారు పది సంవత్సరముల బాలుడు. బైబిల్ చెప్పుచున్నది, “చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారినాటంకపరచవద్దు.” అక్కడ నిలబడియున్న నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. నిశ్చయముగా.

64

“సహోదరుడా, బ్రెన్హం, నేను నా హృదయములో చాలా బలముగా కదిలించబడ్డాను. ఏదో నా యొద్దకు వచ్చి మరియు చెప్పినది, ”ఇప్పుడే దానిని సరి చేసుకొనుము. నేను దేవుని యొక్క ప్రేమను - నీ హృదయమును తట్టుచున్నాను. ఈ రాత్రి నేను లోనికి రావలెనని కోరుచున్నాను. నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమించాను, కనుకనే నాకున్న దానిలో ప్రధమమైనది ఇచ్చియున్నాను. ఇప్పుడు, నీ జీవితమును నాకిచ్చెదవా?“

దానితో ఆయన ఏమి [స్పష్టతలేని మాటలు] చేయగోరుచున్నాడు? దానిని నాశనము చేయుటకా?“

“లేదు, దానిని తిరిగి లేపుటకు.”

65

ఆ చల్లని శీతాకాలము ముగిసినచో, మీరు తిన్నగా ఇక్కడకే వచ్చెదరు [స్పష్టతలేని మాటలు]. మీరు తిరిగి ఒక క్రొత్త వ్యక్తిగా, యవ్వన పురుషుడిగా, యవ్వన స్త్రీగా, మరియు ఎప్పటికీ ఆ విధముగా వచ్చెదరు. ముసలితనము లేదు, ముడుతలు లేవు, తెల్లని జుట్టు, వంగిపోయిన శరీరములు, లేదా వ్యాధులు నిన్ను పునరుత్థానము యొద్ద ఇబ్బందిపెట్టవు. నీవు ఆయన స్వరూపములో చేయబడిన అమర్త్యుడుగా ఉందువు. ఈ రాత్రి నీ యొక్క ఎన్నికను నీవు కలిగియున్నావు. అది సరియే. మన తలలు మనము వంచియుండగా, మరియు ఆ పియానో వాయించుచున్న ఆ సహోదరి....

66

ఓ దేవా! ఇదే సమయము; ఇదే ఆ సమయము, ఎక్కడైతే చాలా చేతులు పైకి లేచినవో... ప్రభువా వారు యధార్థవంతులు. మరియు నేను నీ యొక్క సేవకునిగా, వారి కొరకు మధ్యవర్తిగా బ్రతిమాలుకొనుచున్నాను. కృప కొరకు నేను వేడుకొనుచున్నాను. దేవా, అనుగ్రహించుము. మరియు వారందరూ రక్షింపబడి మరియు పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక, మరియు పరిశుద్ధాత్మ చేత అంతటా దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడి ప్రతీ ఒక్క హృదయాన్ని నింపును గాక. మరియు తమ యొక్క విభేదములు మరియు తమ యొక్క పగలను ప్రక్కన పెట్టి, ఈ భవనములో నుండి బయటకు వెళ్ళుదురు గాక.

పాపమనునది చీకటి మరియు నల్లనిది అని మనకు తెలుసు, కానీ పాపముల యొక్క అంచులు అనునవి కేవలము ఒకే ఒక చుక్క అయియున్నది, బ్లీచ్ యొక్క ఒక పెద్ద గొప్పదైయిన పాత్రలో సిరా బుడ్డిలో నుండి సిరా చుక్కలు పడినట్లయితే, దానిని మరలా కనుగొనుటకు ఒక్కసారి ప్రయత్నించండి. ఓ, దానిని కనుగొనలేము. బ్లీచ్లో ఇంకును వేసినప్పుడు, ఆ ఇంకు, ఇంకు బ్లీచ్ గా మారును. మరియు ఒక పశ్చాత్తాపము పొందిన పాపి యొక్క అవినీతి, నీతిమంతుని యొక్క రక్తములో పడినప్పుడు, అవి దేవుని యొక్క నీతియగును. యేసూ, దాని కొరకు నీ వాక్యమును మేము తీసుకొనెదము. నీ వాక్యము ఎల్లప్పుడును సత్యము.

“నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు...” అని నీవు చెప్పినప్పుడు. మరియు ఒక సేవకుడు మాత్రమే చేయునట్లుగా, పైకి లేపబడిన ప్రతీ చేయి నిమిత్తము నేను ప్రార్థించెదను. నీవు వారి హృదయమును తెలుసుకొని, వారు కలిగియున్న ప్రతీ అవసరత యొక్క సంతృప్తిని వారికి ఇచ్చెదవు.

67

బహుశా ఈ భూమి మీద వారి యొక్క చేతులను నేను ఎన్నడూ, తాకజాలను, కానీ జీవితమంతా ముగిసినప్పుడు, మరియు ఒకానొక రోజు, అంత్యదినమున మనమందరము కూడకొనినప్పుడు, మరియు ఆ గొప్ప పెండ్లి విందు ఏర్పాటు చేయబడినది, మరియు ఆ బల్ల యొద్ద ప్రతీ కాలములో విమోచింపబడినవారిని మనము చూసినప్పుడు. మరియు ఆ బల్ల యొద్ద మనము ఒకరినొకరము చూచుకొనినప్పుడు, మన యొక్క స్నేహితులు క్షేమముగా దాటినందులకు, మన యొక్క బుగ్గలపై నుండి ఒక చిన్న కన్నీటి చుక్క రాలును. అప్పుడు రాజు వచ్చి మన యొక్క కన్నుల నుండి ప్రతీ బాష్పబిందువును తుడిచివేసి, “ఏడ్వకుడి. అంతా ముగిసినది. జగత్తు పునాది వేయబడక ముందు నుండి మీ కొరకు సిద్ధపరచిన, ప్రభువు యొక్క ఆనందములోనికి ప్రవేశించుడి” అని చెప్పును.

దేవా, ఈ రాత్రి ప్రతీ ఒక్కరకి దైవికమైన సన్నిధిని అనుగ్రహించుము, అప్పుడు దైవీకమైన సన్నిధిలో ఉండెదరు. ఒకవేళ నీ దృష్టిలో మేము గనుక కృపను పొందినట్లయితే, నీకు వారి తరుపున మేము ఈ ప్రార్థనను అర్పించుచున్నాము, నీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసు నామములో. ఆమెన్.

68

నేను ఎడ్చుటకు ఒక చంటి బిడ్డను కాను. కానీ పరిశుద్ధాత్మకు సంబంధించినది ఏదో నిన్ను నీ యొక్క బాధల కొరకు కాదు కానీ, ఆనందము కొరకు కన్నీరు కార్చులాగున చేయుచున్నది. కేవలము ఏదో ఫలియించుచున్నది. దేవదూతలు సరిగా ఇప్పుడే ఏ విధముగా ఆనందించును అను దానిని గూర్చి ఆలోచించుము.

ఎంతమంది నిజముగా, నిజముగా మంచి అనుభూతి మీ ఆత్మలో పొందుచున్నారో, వారు ఇప్పుడు మీ చేతులను దేవుని వైపు ఎత్తైదరా? ఓ, మై! క్రితము రాత్రి మనము చేసినట్లుగా తిరిగి మరియొకసారి మనము, “నేను ఆయనను ఘనపరిచెదను!” అని పాడినచో, నేను అతిశయించెదను. నీవు ఇవ్వగలిగినట్లయితే, ఆ స్వరమును మాకు ఇవ్వగలవా, సహోదరీ? అందరము కలిసి, ఇప్పుడు.

ఎవరైనా ఒకరు ఇక్కడ నాకు సహయము చేయండి. నేను గాయకుడను కాదు. మరియు ఎవరో ఒకరు పాటను నడిపించుటకు నాకు సహయము చేసినచో, లేదా డాక్టర్ వైల్, లేదా నీవు చేయుదువా? మనము పాడుచుండగా. “నేను ఆయనను ఘనపరిచెదను, పాపల కొరకు వధించబడిన గొర్రెపిల్లకు స్తోత్రము; జనులందరూ ఆయనను మహిమపరచుడి, ఏలయనగా ఆయన రక్తము ప్రతీ ఒక్క మచ్చను తుడిచివేయును.” మనము పాడుచుండగా, మన చేతులను పైకి ఎత్తుదము. ఇప్పుడు ప్రతీ ఒక్కరు.

నేను ఆయనను ఘనపరిచెదను, నేను ఆయనను ఘనపరిచెదను,

పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లకు స్తోత్రము;

జనులందరూ ఆయనను మహిమపరచుడి

ఏలయనగా ఆయన రక్తము ప్రతీ ఒక్క మరకను తుడిచివేసెను.

ఓ, అది ప్రియముగా లేదా? తిరిగి మరియొకసారి దానిని చేద్దాము. ప్రతీ ఒక్కరూ.

నేను ఆయనను ఘనపరిచెదను, నేను ఆయనను ఘనపరిచెదను,

పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లకు స్తోత్రము;

జనులందరూ ఆయనను మహిమపరచుడి,

ఏలయనగా ఆయన రక్తము ప్రతీ ఒక్క మరకను తుడిచివేసెను.

69

ఓ, వెళ్ళి నీ ప్రక్కన ఉన్నవారితో కరచాలనము చేసి, మరియు “దేవునికి స్తోత్రము” అని చెప్పండి. మెథడిస్ట్ మరియు బాప్టిస్ట్, మరియు పుల్-గాస్పల్ వారు అందరూ, మరియు అందరూ కలిసి, కరచాలనము చేయండి. ఓ, అది చేయుట అద్భుతము కాదా? క్రైస్తవునిగా ఉండుట ఎంత గొప్పగా ఉన్నది. ఓ, ఆయన ఆశ్చర్యకరుడు కాదా?

ఇప్పుడు, స్నేహితులారా, కొంచెము ఆలస్యమైనది, మరియు మేము అడుగబోవుచున్నాము, అది మీలో, కొందరు వెళ్ళవలసియున్నది గనుక, మరియు మేము ప్రార్థన వరుసను పిలువుటకు ముందే వారు వెళ్ళిపోవుటను అనుమతించెదము. మరియు ఇప్పుడు, ఈ రాత్రి మనము ఒక క్రొత్త దానిని ప్రయత్నించనైయున్నాము, అది నేను చేయక చాలా కాలము అయినది. డాక్టర్ వైల్ మైక్రోఫోన్ ను తీసుకొని, మరియు ఒక మూలకు వెళ్ళి జనులను కలుసుకొని, మరియు వారు ఏమైయున్నారో అని పిలుచును. మరియు పరిశుద్ధాత్మ నన్ను అనుమతించినట్లయితే, వెనుకకు వెళ్ళిపోవువారి గూర్చి ప్రార్ధించుటకు మరియు వారి మీద చేతులుంచుటకు, నేను వివేచన లేకుండా ప్రయత్నించబోవుచున్నాను.

70

ఇప్పుడు, రేపు ఉదయము మీరు మీ యొక్క సంఘమునకు వెళ్ళండి. మరియు మీరు ఇక్కడ దర్శించిన ఎడల, ఇక్కడనున్న కొన్ని మంచి సంఘములకు వెళ్ళండి. సంఘ కాపరి మిమ్మును చూచుటకు ఎంతో ఆనందించును. లేచి వెళ్ళి మరియు ఆయనతో కరచాలనము చేయండి. మీరు ఇక్కడ కూడికకు వెళ్ళియున్నారని చెప్పండి, రేపు మధ్యాహ్నము జరుగనైయున్న కూడికకు హృదయపూర్వకమైన ఆహ్వనమును ఆయనకు ఇవ్వండి.

మీరు గనుక స్పెన్సర్-విల్ దగ్గర ఉండినట్లయితే, అక్కడ ఒక మెతడిస్ట్ సంఘము ఉన్నది; ఒక నల్ల జాతీయుడు అక్కడ మెథడిస్ట్ సంఘమును కలిగియున్నాడు. మరియు మిమ్ములను చూచి ఆయన ఖచ్చితముగా ఆనందించును. ఇక్కడ కూర్చొనుచున్న ఆ మనుష్యుడు, చాలా మంచివాడు. ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడని నేననుకోవట్లేదు, కానీ అతను ప్రతీ రాత్రి ఉన్నాడు.

మరియు చుట్టుప్రక్కల ఇతర సంఘములు ఉన్నవి. మరియు రేపటి ఉదయము మీరు గనుక మొదటి బాప్టిస్ట్ సంఘమునకు వచ్చినట్లయితే, నేను పది గంటల నుండి పదకొండు గంటల వరకు మాట్లాడెదను. మరియు తిరిగి ఆ భవనములో రేపటి మధ్యాహ్నము రెండున్నర గంటలకు, మరలా వర్తమానము కూడికకై కూడుకొనెదము, మరియు యథా ప్రకారముగా రేపటి రాత్రి, ఒక స్వస్థత కూడిక ఉండును. మరియు ఈ రాత్రి, అత్యవసరమైన వారి గురించి ప్రార్థన ద్వారాను మరియు వారి మీద చేతులుంచుట ద్వారానూ ప్రయత్నించెదము.

71

ఇప్పుడు, బిల్లీ, ఎక్కడ ఉన్నాడు? ఆ అత్యవసరము ఏమిటి? Yలు? అత్యవసరము కొరకు Y ఉన్నది. Y అనే అక్షరము ఉన్న కార్డును మీరు కలిగియున్నారు. ఎంత మంది? 1 నుండి 50 వరకు. మంచిది, 1 నుండి ప్రారంభించెదము, మరియు మొదటి Y సంఖ్యను 1 ఎవరు కలిగియున్నారు, మీ చేతిని పైకి ఎత్తగలరా? అక్కడనున్న స్త్రీ, నెంబర్ 1, నెంబర్ 2? నెంబర్ 3? 4? 5? 6,7,8,9,10, అది Y-1 నుండి 10 మీరు ఉండగలిగినట్లయితే, ఇక్కడ నిలబడండి.

అది సరియే. మరియు ఇప్పుడు, మనము ప్రార్ధించనైయున్నాము. మరియు నేను మిమ్ములను ఒక సంగతి అడిగెదను. క్రీస్తు నొద్దకు ఇప్పుడే వచ్చిన జనులారా, మీరు ఇది చేయగలరా? చేయండి. రేపటి ఉదయము, మీరు ఇక్కడకు దగ్గరగా నివసించినట్లయితే, ఒక మంచి సంఘమునకు వెళ్ళండి, మరియు చెప్పండి, “సంఘ కాపరి, నేను ఈ సంఘములో చేరెదను. నేను బాప్తిస్మము పొందగోరుచున్నాను. నేను నా సభ్యత్వమును ఇక్కడ ఉంచగోరుచున్నాను.”

ఇప్పుడు, ఇక్కడ ఒక సంఘము మాకు సహకరించుచున్నది. అది ఫోర్-స్క్వేర్ అను సంఘము. మరియొకటి పుల్... దేవుని యొక్క సంఘము. సహో, వైల్ [స్పష్టతలేని మాటలు]. నీవు దానిని ప్రకటించావా? అది సరియే. మీ యొక్క స్థానములను కనుగొని మరియు తీసుకొనండి... [టేపులో ఖాళీ స్థలమున్నది.]

ఒక రోజు ఆరిజోనాలోని, ఇండియన్ రిజర్వేషన్ దగ్గర... [టేపులో ఖాళీ స్థలమున్నది.] [స్పష్టతలేని మాటలు] మన సహోదరి, క్రీస్తు నామములో వెళ్ళెను.

72

ఇప్పుడు, ఒక్క క్షణము మీ తలలు వంచియుండగా... సహోదరీ, నీ యొక్క స్థితి ఏమిటి? ఓ, గొంతు [స్పష్టతలేని మాటలు]. నేను నిజాయితీగా, నేను ఎటువంటి మార్పు చూడలేదు. ఇక్కడనే ఆమె యొక్క గొంతులో చిన్న రక్తనాళములో, ఇక్కడే ఒక చిన్న గడ్డను, దాని ఎదుగుదలను మీరు గమనించాలని నేను కోరుచున్నాను. ప్రభువైన యేసు ద్వారా ఇప్పుడే అది తీసివేయబడెను. ఆమె యొక్క గొంతు మీద అతుకబడియున్న అటువంటి ఒక చిన్న గడ్డ, మన ప్రభువు ద్వారా తీసివేయబడెను. ఆయనకు స్తుతి చెల్లించి మరియు “కృతజ్ఞతలు, ప్రభువా,” అని చెప్పెదము. దేవునికి స్తోత్రము కలుగును గాక.

[సాహో, వైల్ చెప్పుచున్నారు, “సహోదరుడా. బ్రెన్హాం, పోటు (stroke) పరిస్థితి.”] ఓ, పక్షవాతము [స్పష్టతలేని మాటలు]. ఇప్పుడు, అయ్యా, దీనిని దేవుడు మాత్రమే చేయగలడు అని మనకు తెలియును. మరియు ఆ అవసరము కొరకే ఆయన చనిపోయెను అని నాకు తెలుసు. మరియు ఇప్పుడు, నేను.... ప్రభువు యొక్క దూత అస్వస్థతతో ఉన్నవారి కొరకు ప్రార్థించుటకు నన్ను పంపెను. అది నాకు తెలుసు. మరియు నాకు చెప్పెను, నేను గనుక జనులను నమ్మునట్లుగా చేయగలిగిన యెడల, మరియు నిజాయితీగా ఉన్నయెడల ఆయన అస్వస్థతతో ఉన్నవారిని స్వస్థపరచును. నేను ప్రార్థించుట వలన కాదు, ఎందుచేతననగా ఆయన యొక్క వాక్యము నెరవేర్చబడవలసి యున్నది.

ఇప్పుడు, ఆయన నిన్ను స్వస్థపరచినట్లయితే, నీవు ఆయనను స్తుతింపగలవా, దాని కొరకు ఆయనకు సమస్త మహిమను ఇమ్ము. అనుగ్రహించినట్లుగా నేను ప్రార్థించెదను... ఇప్పుడు, అది [స్పష్టతలేని మాటలు]. మీరు ఇంతకు ముందు రాత్రులు ఇక్కడ ఉన్నారా? ఇది మీరు ఉన్న మొదటి రాత్రి కూడిక, మీరు ప్రభువు యొక్క దర్శనములు పనిచేయటం ఇంతకు ముందెన్నడూ చూడలేదు.

73

ఇప్పుడు, రక్తప్రసరణ నిలచిపోవటము చేత పక్షవాతము పొందిన ఈ మనుష్యుని కొరకు తలలు వంచమని ప్రతీ ఒక్కరినీ నేను అడుగబోవుచున్నాను, నాతోపాటుగా మీ హృదయమంతటితో మీరు ప్రార్థన చేసియున్నచో, అవి, మన యొక్క ప్రార్థనలు కలిసి దీనమైన ఈ ప్రియ సహోదరునికి సహయము చేయును. నీవు క్రైస్తవునివి.

ఇప్పుడు, దయగల పరలోకపు తండ్రీ, మేము నీ యందు చాలా ప్రేమ కలిగి ఉన్నాము, మరియు నీవు పరలోకమందునూ మరియు భూమి మీదనూ సర్వాధికారము కలిగి ఉన్నావని మేము ఎరిగియున్నాము. మరియు ఈ ప్రియ సహోదరుని గూర్చి నేను ఆలోచించుచున్నాను, ఈ యొక్క కాలును ఈడ్చుకుంటూ మరియు ఈ చేయి క్రిందకు వ్రేలాడుచూ ఇక్కడ నిలబడియుండి, తన వైపు ఊగుచున్నాడు. సాతాను అతనిని బాధించి మరియు అతనిని ఆపుటకు నిశ్చయించుకొనెను. మరియు మేమందరము మా యొక్క హృదయములతో ప్రార్థించుచున్నాము, మా హృదయములలో అతని మీద ఉన్న ప్రేమ నీ యొక్క సింహసనము పైకి ప్రసరించబడులాగున అడుగుచున్నాము, మరియు క్రీస్తు యొక్క మహోన్నతమైన కృప తిరిగి వచ్చి మరియు అతని యొక్క శరీరమును తాకి, మరియు ఈ పక్షవాతమును తీసివేయును గాక. ఓ దివ్యమైన రక్షకుడా, మా విశ్వాసము బలముగానుండును గాక. మరియు మా సహోదరుడు బాగునొందును గాక, అని యేసు నామములో మేము అడుగుచున్నాము.

74

మరియు ఇప్పుడు, ఒక్క క్షణము పాటు తమ తలలు వంచులాగున నేను ప్రేక్షకులను అడుగగోరుచున్నాను. దయచేసి చూడవద్దు, ఎందుకంటే అలాగు చేసిన యెడల, మీరు కొంత గందరగోళము చెందెదరు. దయచేసి మీరు మీ తలలు వంచెదరా? దేవుడు ఆ మనుష్యుని తాకునో లేదో నాకు తెలియదు. నాకు తెలియదు. కేవలము నేను ఆయనను అడుగుచున్నాను. మరియు ఇప్పుడు దయచేసి, మీరు గనుక నా స్వరము వినినట్లయితే, మీ తలలు వంచే యుండుడి.

ఇప్పుడు, నేను మిమ్ములను అడుగుచున్నాను [స్పష్టతలేని మాటలు] నేను మిమ్ములను ఎత్తమని అడుగుచున్నాను [స్పష్టతలేని మాటలు]. మీ చేతులను పైకి ఎత్తండి. మీరు దానిని చేసెదరా [స్పష్టతలేని మాటలు]. అంతయూ సరే, మీ తలలు పైకి ఎత్తవచ్చును. అతడు తన టోపిని క్రింద పడవేసెను; అతను చేతులను పైకి ఎత్తెను; అతడి కాళ్ళు విడువబడెను; మరియు దేవుడు అతడిని స్వస్థపరచెను. ఈ మార్గము గుండా నడిచి వెళ్ళుము. నీవు వేదిక నుండి ఆనందముగా వెళ్ళుము. యవ్వనస్తుడివలె నడువుము [స్పష్టతలేని మాటలు]. “దేవునికి స్తోత్రము” అని అందరము చెప్పెదము.

ఇక్కడ కట్లు (braces) ధరించిన ఒక స్త్రీ ఉన్నది, ఇప్పుడే వాటిని తీసివేసినది. దేవునికి కృతజ్ఞతలు. ఆమెన్.

మనందరము ఒక ప్రార్థన చెప్పెదము, దేవునికి కృతజ్ఞతలు చెప్పుచూ ఒక ప్రార్థనను ప్రార్థించెదము. పరలోకపు తండ్రీ, యేసుక్రీస్తు నామములో నీకు స్తోత్రము చెల్లించెదము, నీవు చేసిన దాని అంతటికి నీకు కృతజ్ఞతలు. నీవు జీవించుచున్న క్రీస్తువు, మరియు ఎదురుచూచుచున్న వారి కొరకు నీ యొక్క నిత్య దీవెనలను అడుగుచున్నాము. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమెన్.

75

[సాహో, వైల్ చెప్పుచున్నారు, “ఈ సహోదరి [స్పష్టతలేని మాటలు] మూత్రపిండముల యొక్క రోగముతో గ్రుడ్డిదగుచున్నది.”] సహోదరి, రాగలవా? ఇప్పుడు, దయచేసి ప్రార్ధించండి; దర్శనమును కలిగియుండుట చాలా కష్టము, చూడండి. కానీ నేను.... దర్శనములు అనునవి ప్రవక్త యొక్క వరము, అవి ప్రేక్షకుల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని పంపును, మరియు మీరు దానిని పొందుకొనుడి. ఇది స్వస్థత వరమైయున్నది. ప్రభువు యొక్క దూత... నా పుస్తకమును మీరు చదివితిరా? అతడు చెప్పెను.... మరియు కొంత కాలము వరకూ నేను దీనిని అమలుపరచలేదు. కానీ ఆయన చెప్పెను,“ నీవు గనుక జనులను నమ్మినట్లుగా చేసుకొనిన యెడల....”

నేను చెప్పాను, “వారు నన్ను నమ్మరు, ఎందుకనగా నేను విద్యలేనివాడను.”

ఆయన చెప్పాడు, “జనుల ముందు చేయుటకు నీకు రెండు సూచనలు ఇవ్వబడినవి, మరియు వాటిని బట్టి వారు నిన్ను నమ్మెదరు.”

76

మరియు డాక్టర్ వైల్, ఈ రోజు కూర్చోనియుండి, ఏ విధముగా నన్ను ఓర్ నందు పోర్ట్-ల్యాండ్ లో గమనించాడో చెప్పుచుండెను... లేదా, వాషింగ్టన్, పెద్ద ఐస్ ప్రాంగణములో, మరియు వాంకోవార్ లో, ఏ విధముగా జనులు స్వస్థపడియున్నారో, అతడు చెప్పాడు, “సహో, బ్రెన్హాం, ఏమైనది?”

నేను చెప్పాను, “జనులు దర్శనముల కొరకు పరుగిడుచున్నారు.”

అతడు చెప్పాడు, “నీవు చేయగలిగిన మరియొక మార్గమేదైనా [స్పష్టతలేని మాటలు], కేవలము కొంత వరకూ మరియు దేవుడు నీకు ఇచ్చియున్న వరమును అమలుపరచుము?”

నేను చెప్పాను, “నీవు నిజాయితీగా యుండినయేడల, నీ ప్రార్థన ముందు ఏదియూ నిలువలేదు,” అని ఆయన చెప్పెను. మరియు బహుశా నేను చాలా విషయములను దాటిపోయానని నేను నమ్ముచున్నాను. ఆమెరికన్ ప్రజలు వారి మీద చేతులుంచాలని కోరెదరు. అది వారి మార్గము.

77

ఇప్పుడు, సహోదరి, గ్రుడ్డితనము అనునది చాలా భయంకరమైన సంగతి, మరియు నేను ఖచ్చితముగా నిన్ను గ్రుడ్డిదానిగా చూడాలని కోరుకొనుట లేదు. కానీ నజరేయుడగు యేసు యెరికో గవిని యొద్ద గ్రుడ్డివాడిని తాకెను, మరియు అతడు తన చూపును పొందెను. ఈ రాత్రి నిన్ను దేవుడు స్వస్థపరచునని నీవు నమ్మెదవా? ఇప్పుడు, ఒక్క క్షణము మన తలలు వంచెదము.

ఓ కరుణగల తండ్రివైన దేవా, ఎవరి యందు మేము ప్రేమ మరియు నమ్మిక కలిగియున్నామో, ఆయనకు మేము స్తోత్రము మరియు మహిమ చెల్లించెదము. ఈ ప్రేక్షకుల యొక్క సమక్షములో నీ యొక్క కుమారుడైన యేసునకు మేము కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. మనకై ఆయన యొక్క ప్రాయశ్చితమైన కృపను బట్టి ఆయనకు స్తోత్రము చెల్లించెదము. మరియు అనారోగ్యముతో ఉన్నవారిని, స్వస్థపరచుటకు మరియు బాధింపబడుచున్న వారిని బాగుపరచుటకు నీ యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నచో, మరియు ఇప్పుడు, మా ప్రియమైన సహోదరి తన యొక్క విశ్వాస ఒప్పుకోలుతో వచ్చియుండగా, తను గ్రుడ్డిదానిగా అయ్యెను అని తెలుసుకొనెను. కానీ ఆమె నీ యొద్దకు వచ్చినది, మరియు నీ యొక్క సేవకునిగా నేను ఆమెను క్రీస్తు యొద్దకు నడిపించాను, మరియు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నా యొక్క చేతులు ఆమె పై ఉంచి, తన యొక్క కన్నుల నుండి గ్రుడ్డితనము పోవులాగున నేను అడుగుచున్నాను, మరియు తన యొక్క శరీరము నుండి రోగము విడుచులాగున, మరియు ఆమె తన యొక్క మిగిలిన జీవితమంతా మంచి కనుదృష్టితో ఉండును గాక. యేసు నామములో ఇది జరుగును గాక.

78

ఇప్పుడు, మీ తలలు వంచియుండగా, ఒక్క క్షణము మీ కన్నులు మూసికొనియుండగా. ఇప్పుడు, [స్పష్టతలేని మాటలు] సహోదరి, నీ యొక్క కన్నులు ఎంత మంచిగా ఉన్నవో తెలియకున్ననూ, నీవు నా వైపు చూడాలని కోరుచున్నాను. ఇప్పుడు, నీవు సరిగా చూడగలుగుచున్నావా? నీవు నన్ను సరిగా చూడగలుగుచున్నావా? మంచిగా నీవు చూచుచున్నావా, నీవు వేదిక యొద్దకు వచ్చినప్పటి కన్నా వ్యత్యాసమున్నదా? ఈ సమయములో నేను ఎన్ని వ్రేళ్ళను ఎత్తియున్నానో నీవు నాకు చెప్పగలవా? ఏమిటి చెప్పు? నీ యొక్క గ్రుడ్డితనము ఆగిపోయినదని నీవు నమ్మగలవా? దానిని నీవు ఇప్పుడు చదువగలవా?

అది సరియే, మీ తలలు మీరు ఎత్తవచ్చును. స్త్రీ చదువలేకున్నది; తన యొక్క కళ్ళద్దాలు లేకుండా, ఆమె గ్రుడ్డిదైనది. మరియు ఇప్పుడు ఆమె ఇక్కడ తన బైబిల్ చదువగలుగుచున్నది. మరియు ఆమె చేయలేకయున్నది. ఇప్పుడు నీవు అంతా సరిగా చూడగలుగుచున్నావా? అలా అయినచో, నీ చేతిని ఎత్తుము. ఇప్పుడు, ఆ స్త్రీని స్వస్థపరచినందుకు, ఆయన యొక్క మంచితనమునకు మనందరము దేవునికి స్తోత్రము మరియు కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము.

ఓ, మా హృదయములు ఆనందముగా ఉన్నవి, తండ్రీ, నీ యొక్క స్వస్థతా కృప కొరకై [స్పష్టతలేని మాటలు] మరియు ఈ రాత్రి నుండి మా యొక్క ప్రియమైన సహోదరి పూర్తిగా బాగవును గాక. అది తిరిగి ఆమెను ఎన్నడూ బాధింపకుండును గాక. ఆమె యొక్క శరీరము నుండి రోగము ఏ విధముగా వదిలి వెళ్ళినది అని ఆమె యొక్క వైద్యుడు అతని యొక్క సాక్ష్యమిచ్చును గాక. మేము క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము మరియు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెన్. దేవుడు నిన్ను దీవించును, సహోదరి, మరియు నీవు బాగవుదువని నేను నమ్ముచున్నాను.

79

[సహోదరుడు వైల్ చెప్పుచున్నాడు, “ఇది ఆడ్రియాన్, మిచిగాన్ కు చెందిన శ్రీమతి. బ్రౌన్, ఆమెకు ఉదర సంబంధిత వ్యాధి ఉన్నది.”] ఉదరసంబంధమైన వ్యాధి, ఇది భయంకరమైన సంగతి, సహోదరీ. తినుచున్నప్పుడు, ఉదరములో ఆ నాడీ మండల వ్యవస్థ ఉండును, మరియు కడుపు పుల్లనైనప్పుడు, ఆహరము సరిగా జీర్ణమవ్వదు, మరియు అది చాలా సంకట స్థితి. నేను యవ్వనుడిగా ఉన్నప్పుడు నేను దానితో చాలా బాధపడ్డాను, కానీ అప్పుడు దేవుడు నన్ను స్వస్థపరచెను. మరియు నీకునూ ఆయన అది చేయనని ఖచ్చితముగా చెప్పగలను.

నీవు ఒక క్రైస్తవునివి, మరియు ప్రభువు నిన్ను బాగుచేయునని నీవు నమ్మిక కలిగియుండుము. మరియు నేను నీ యొక్క సహోదరుడినని ఎరిగియుండుము, కానీ యేసే క్రీసైయున్నాడు; ఆయన నిన్ను స్వస్థపరచుటకు ఇక్కడయున్నాడు. ఇప్పుడు ప్రేక్షకులందరూ తమ తలలు వంచి మరియు నాతో ప్రార్థించగలరా.

ఇప్పుడు, దయగల పరలోకపు తండ్రీ, తన యొక్క తలను వంచుకొని ఈ యొక్క చిన్న బలహీనమైన స్త్రీ ఇక్కడ కొచ్చియుండగా... మరియు నీవు గొప్ప వైద్యుడవని ఆమెకు తెలుసు. మరియు ఆమె యొక్క ప్రేమ బయటకు వచ్చుచున్నది [స్పష్టతలేని మాటలు] అది వచ్చును. కనుకనే ఆమె ఇక్కడ నిలువబడియున్నది. ఆమె యొక్క ప్రేమ బయలు వెళ్ళుచున్నది. మరియు నీ ప్రేమ క్రిందకి వచ్చుచున్నది. మరియు ప్రేమ ఈ విధముగా ప్రసరించబడినప్పుడు, ఖచ్చితముగా మహోన్నతమైన కృప దాని స్థానము తీసుకొని, ఆమెను స్వస్థపరచును. ప్రభువా, అనుగ్రహించుము. యేసు నామములో మరియు ఆయన నిమిత్తము మరియు ఈ స్త్రీ కొరకు నేను అడుగుచున్నాను. ఆమెన్.

ఇప్పుడు, సహోదరీ, అయితే, ఇప్పుడే నీవు తినదగిన వాటిని కంటికి కనిపించునటుగా మేము చూపించలేము, నీ యొక్క కడుపు భాగము స్వస్థపరచబడినట్లుగా, కానీ అది స్వస్థపరచబడినదని నీవు నమ్మగలవా [స్పష్టతలేని మాటలు] హృదయమంతటితో? అది సరే. ఇప్పుడు, దేవునికి స్తుతి చెల్లిస్తూ, నీవు ప్రతీ సారీ చేస్తునట్లుగా, నీవు భయము లేకుండా తినుము. మరియు మాకు నీ సాక్ష్యమును ఇవ్వము. నీవు అది చేయగలవా? నిన్ను స్వస్థపరచినందులకు దేవునికి కృతజ్ఞతలు. దేవుడు నిన్ను దీవించును గాక.

80

[సహో, వైల్ చెప్పుచున్నాడు, [స్పష్టతలేని మాటలు] వెబస్టర్ నరాల బలహీనతతో బాధపడుచున్నాడు.“] అది భయంకరమైన సంగతి. ఇది తీవ్రమైన సంగతి [స్పష్టతలేని మాటలు]. ఇది ఒక ఘోరమైన సంగతి, చీకటి యొక్క ఛాయ వంటిది, మరియు ఇది ప్రతీ సారి నిన్ను చాలా దిగులు పడునట్లుగా చేయును. కానీ నీకు తెలుసు, ప్రతీ ఒక్కరూ చెప్పుచుందురు. ”ఓ, నీ జీవితమును కొనసాగించుము.“ ఎలా? ఒకటి నిన్ను బాధపెట్టుచుండగా నీవు దానిని ఎలా చేయగలవు? కానీ నీవు చెప్పెదవు, ”ఒక వేళ నీవు కనికరము లేనివాడవు కావచ్చు.“ కానీ [స్పష్టతలేని మాటలు] అది అంతయూ నిజము. కానీ యేసు నిన్ను స్వస్థపరచునని నీకు తెలియును. సహోదరీ, కాదా? అవును, దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు, ఈ చిన్న నరాల బలహీనతతో ఉన్న సహోదరి కొరకు ఒక్క క్షణము మన తలలు వంచెదము.

మరియు తండ్రీ, ఇది ఒక తల్లి యొక్క ముద్దుల బిడ్డ, ఒక సహోదరుడి యొక్క భార్య కావచ్చు, ఒక పిల్లవాని యొక్క తల్లి కావచ్చు. ఒక చీకటి దానితో ఆమె ఇక్కడ నిలువబడియున్నది. సాతాను ఆమెను బలహీనురాలిని చేస్తుంది. ఓ, ఆమె ఆత్మహత్య చేసుకొనునట్లుగా అతడు చేసియుండెడివాడు. ఆతడు ఆమెను మానసిక వైద్యశాలకు పంపియుండెడివాడు, గోడకు ఆనుకొని ఉన్న ఒక బందీ-గృహములో కూర్చొండబెట్టెవాడు. కానీ తన యొక్క ప్రేమను ఒప్పుకొనుటకు ఆమె ముందుకు వచ్చెను. మరియు దానిలోనికి ప్రవేశించుటకు కేవలము ఇపుడే. ఓ దేవా, మహోన్నతమైన కృపను క్రిందికి పంపుము మరియు పరిశుద్ధాత్మ ఈ యొక్క శత్రువును ఆమె యొద్ద నుండి దూరముగా పారద్రోలును గాక, మరియు ఇప్పుడే అది ఆమెను వదిలి పెట్టును గాక. మరియు తిరిగి మరెన్నడునూ రాకుండును గాక, మరియు తన శేష జీవితమంతయూ ఆమె ఆనందముగా ఉండును గాక, మరియు ఈ వ్యాధి మరియు బాధల నుండి స్వతంత్రురాలిగా ఉండును గాక. యేసు నామములో.

ఇప్పుడు, ఒక్క క్షణము మీ తలలు వంచియుండగా, ఇప్పుడు, సహోదరీ, దీనిని ఒక మార్గముగా చూచెదవా, అది మిమ్ములను వదిలివేసినదా? అంతా సరిగానే ఉన్నదని నీవు అనుభవించుచున్నావా? అంతయూ పోయినది? ఆమెన్. ఇప్పుడు, మీ తలలు పైకి ఎత్తవచ్చును. ఇప్పుడు, నీవు వేదికను విడిచి ఆనందముతో, ఆట పాటలతో, దేవుని మహిమపరచుచూ బయటకి వెళ్ళవచ్చును, పరచుటకు నీ నుండి వినగోరుచున్నాము. దేవుడు నిన్ను దీవించును గాక.

81

[సహోదరుడు వైల్ చెప్పుచున్నాడు, “చిన్న డేవిడ్ [స్పష్టతలేని మాటలు] చేతిగుత్తిపై ఒక గడ్డ.”] చిన్న బాలుడు ప్రార్థన చేయించుకొనుటకై వచ్చుచున్నాడు. అది సరే [స్పష్టతలేని మాటలు]. చిన్న బాలుని యొక్క చేతిగుత్తిపై ఒక గడ్డ. మన తలలు వంచుదమా?

నీవు అతని తండ్రివా? నీవు క్రైస్తవునివా? దేవుడు ఈ గడ్డను తీసివేయునని నీవు నమ్మెదవా? నీవు ఆయనను ప్రేమించెదవా, మరియు ఆయనను ఘనపరిచెదవా, ఒక వేళ ఈ యొక్క పెరుగుదల (గడ్డ) అతని యొక్క శరీరము నుండి వెళ్ళిపోయినట్లయితే, ఆయనకు సేవ చేయునట్లుగా ఆ బాలుని లేపెదవా?

ప్రియ పరలోకపు తండ్రీ, ఈ యొక్క మెరిసెడి జట్టు, నీలిరంగు కళ్ళ బాలుడు నిలబడియుండగా, ఇంటి దగ్గర నున్న నా యొక్క చిన్న జోసఫ్ ను గూర్చి నేను ఆలోచించుచున్నాను, “డాడీ ఎక్కడా?” అని ఈ రాత్రి బహుశా అతడు ఏడుస్తూ ఉండవచ్చు, కానీ ప్రభువు యొక్క సేవకునిగా నేను ఇక్కడ ఉన్నాను, ఈ మనుష్యుని యొక్క ప్రియని గూర్చి ప్రార్ధన చేయుటకు, అదేమనగా, నా బిడ్డ నాకు ఎలాగో అతనికిని అలాగే. మరియు దేవా, మమ్ములను మరియు మా పిల్లలను నీవు చాలా ఎక్కువగా ప్రేమించావు, ఎంత అనగా, నీ యొక్క అద్వితీయ కుమారుని మాకు ఇచ్చియున్నావు, ఆయన యొక్క అర్పణ ద్వారా [స్పష్టతలేని మాటలు] అది మమ్ములను రక్షించి మరియు మా శరీరములను స్వస్థపరచును.

మరియు ఈ బిడ్డ యొక్క చేతి గుత్తి మీద ఉన్న ఈ గడ్డ, దేవుని యొక్క సేవకునిగా నేను ఎరుగుదును, వచ్చుచున్న ఈ మనుష్యుని యొక్క ఒప్పుకోలుల ద్వారా దండన విధించుచున్నాను, ప్రార్థించుటకు నాకు అప్పగించిన ఆ బిడ్డ కొరకు, మరియు దానిని దేవుని ప్రియ కుమారుడైన యేసు నామములో అడుగుచున్నాము, దేవుని ప్రియ కూమారుడు, దేవుని యొక్క మహిమ కొరకు మరియు క్రీస్తు యొక్క సాక్ష్యము కొరకు ఆ బిడ్డ యొక్క చేతిగుత్తి మీద ఉన్న ఆ గడ్డను ఆయన తీసివేయును. ఏలయనగా దానిని మేము యేసు నామములో అడుగుచున్నాము, మా యొక్క ప్రేమ, ఆ చిన్నవాడు అర్థము చేసుకోలేకున్ననూ, మేము [స్పష్టతలేని మాటలు] దాని బలము యొక్క అంచులవరకూ, మరియు ఇప్పుడు, మహోన్నతమైన కృప మనము దేనినైతే అడిగామో దానిని అనుగ్రహించును గాక.

ప్రతీ ఒక్క తల వంచియుండగా, ప్రార్థనలో ప్రతీ కన్ను మూసియుండగా. ఆ బాలుని చేతి గుత్తిపై నుండి ఆ గడ్డ తీసివేయబడినది [స్పష్టతలేని మాటలు].

అతని యొక్క స్వస్థత కొరకు మనము దేవునికి స్తోత్రములు మరియు కృతజ్ఞతలు తెలుపుచున్నాము [స్పష్టతలేని మాటలు]. దయగల తండ్రీ, మరియు ఇప్పుడు అది సరియగును. మరియు, అవును, ఇప్పుడు నీ హృదయమును దీవించును. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక.

మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి? నీవు ఎంత గొప్పవాడవు. నీవు ఎంత గొప్పవాడవు. ఇప్పుడు, ఆయన యొక్క మంచితనము కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలిపెదము. అది సరే. సహోదరుడా, వైల్...

82

[సహో, వైల్ చెప్పుచున్నాడు, “కొలంబస్ నుండి శ్రీమతి. హాల్ స్లామ్, ఆమెకు కాళ్ళ వాపు ఉన్నది.”] శ్రీమతి. హాల్స్లామ్, నేను.... మేము... నీవు క్రైస్తవురాలవా [స్పష్టతలేని మాటలు]. ఈ కూడికలలో నీ యొక్క శైలి నీవు క్రైస్తవురాలవని మాకు తెలియపరచినది. మరియు ఇప్పుడు నీవు క్రీస్తుతో ప్రేమలో ఉన్నట్లుగా నీవు వచ్చియున్నావు. ఈ యొక్క వాపు, దెయ్యమని తెలుసుకొనుటకు మరియు నీవు ప్రభువును ప్రేమించుచున్నావు. మరియు ఇప్పుడు నీ యొక్క ప్రేమను ఆయన వైపు ప్రసరించుటకు నీవు వచ్చియున్నావు. మరియు నీతో పాటు నా అర్పణను కూడా ఇచ్చుటకు నేను వచ్చితిని. మరియు మహోన్నతమైన కృప క్రిందకి దిగి వచ్చి మరియు నిన్ను స్వస్థపరచును గాక, మరియు ఇక మీదట ఎన్నడూ అటువంటి వాపును నీవు కలిగియుండకుందువు గాక. నీవు నమ్మెదవు, నమ్మవా? నేను నీ యొక్క చేతిని నిన్ను తాకడం కొరకు తీసుకొనవచ్చునా?

ప్రియ పరలోకపు తండ్రీ, ఈ భవనములో నున్న వందలాది మంది జనులు, నమ్ముచున్న క్రైస్తవులు, తిరిగి జన్మించిన పురుషులు మరియు స్త్రీలు, బాలురు మరియు బాలికలు, తన యొక్క శరీరములో వాపును కలిగియున్న ఈ యొక్క సహోదరితో పాటుగా నీ వైపు ఇప్పుడు తమ ప్రేమను ప్రసరిస్తున్న వీరు. మరియు అంగీకరించుటకు ఆయనకై ఆమె ప్రేమను పంపుటకు, మరియు ఆమె యొక్క ప్రేమను నీ దగ్గరకు పంపించుటకు, ఈ రాత్రి ఈ జనుల ముందు నడుచుటకు, ఆమె కొరకు ప్రార్థించుచున్న జనుల ముందు, నీవు ఆమె యొక్క శరీరములో ఉన్న వ్యాధిని తీసివేసి, ఆమెకు మంచి ఆరోగ్యమును ఇచ్చెదవని నమ్ముటకు, ఆమె ఇక్కడ యున్నది. ఓ దేవా, నా హృదయమంతటితో ఆ యొక్క ఆశీర్వాదమును ఆమెకు అనుగ్రహించెదవని నేను ప్రార్థించుచున్నాను. ప్రియమైన యేసు నామములో దానిని నేను అడుగుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...