దేవుని దూత

దేవుని దూత

1

కెనడా, మరియు గొప్ప యునైటెడ్ స్టేట్స్ వారలారా. ఈ మధ్యాహ్నం నేను ఉండుటకు ప్రస్తుతం నేను ఉన్న ఫీనిక్స్ అరిజోనా తప్ప నాకు ఇంకొక మంచి స్థలం తెలియదు. మరియు అనారోగ్యంతో ఉన్నవారి కోసం ప్రార్థించటానికి, ఈ రాబోయే ఎనిమిది ఆదివారాలలో చాలా గొప్ప అద్భుతాలు జరుగుతాయని నేను నమ్ముచున్నానని చెప్పడానికి నేను ప్రభువు నామములో వచ్చాను. ఫీనిక్స్ పట్టణానికి పాత కాలపు ఉజ్జీవాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చే గొప్ప కూడికలలో ఇది ఒకటిగా ఉంటుందని, మరియు బోధకుడు స్వయంగా రంగం పైన కనిపించే వరకు అది ముగిసిపోదు అని నేను నమ్ముచున్నాను.

ఈ ఉదయం నేను మేల్కొని నా మంచం మీద నుండి లేచి, కిటికీ దగ్గరకు వెళ్లి, కిటికీపై ఉన్న తెరను పైకి లేపి, కామెల్‌బ్యాక్ పర్వతం వైపు తిరిగి చూశాను, ఇక్కడకి పర్వతానికి మధ్య ఉన్న ఆకుపచ్చని ఈత చెట్లు, మరియు సూర్యుడు అలా ఆ పర్వతం పైకి వచ్చి ప్రకాశించడం చూసినప్పుడు, ఆరిజోన, ఫీనిక్స్ ప్రజలు అలాంటి ప్రదేశంలో నివసించడానికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అని నేను అనుకున్నాను. వారు అరిజోనాలోని ఫీనిక్స్ లో ఉండుటను బట్టి పరలోకానికి దగ్గరగా ఉన్నారు. అలాంటి ఒక పరలోకపు వాతావరణం ఇక్కడ ఉన్నది. నేను దానిని ప్రేమిస్తున్నాను. నేను ఈ ఎనిమిది వారాలు లేదా ఎనిమిది ఆదివారాలు మీతో ఉండటానికి వచ్చిన అవకాశమును బట్టి నేను కృతజ్ఞుడను.

2

ఈ ఆదివారం, బహుశా నేనిదివరకు ఎప్పుడూ కలవని చాలా మంది ఇక్కడ ఉన్నారు మరియు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నేను మీలో ప్రతి ఒక్కరితో సమయం గడపాలని, మరియు మీతో కరచాలనము చేసి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. బహుశా నేను తరువాత చేయగలను.

ఈ కూడికలు ముగిసిన వెంటనే, నేను కాలిఫోర్నియాకు, అక్కడి నుండి ఫ్రిస్కో, ఆపై మంగళవారానికి బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్ కు వెళ్ళాలి. వాంకోవర్ వద్ద గొప్ప సమూహం ఉండబోతుందని ఆశిస్తున్నాను, ఎందుకంటే కాల్గరీ సమావేశం ...

అది గడచిన నా చివరి కూడిక. కాల్గరీ పట్టణములో జరిగిన కూడిక, నా జీవితములో మునుపెన్నడూ చూడని అత్యంత శక్తివంతమైన రీతిలో ప్రభువైన యేసు క్రీస్తు వచ్చియున్నాడు. ఇది కెనడా అంతటా శక్తివంతమైనది. ఈ కెనడియన్ ప్రజలు ... బహుశా వారిలో కొందరు ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటారు. కూడిక ముగించే సమయానికి అనేకమంది ఇక్కడికి వస్తారు కాని, ప్రార్ధన వరుసలోనికి రాలేని వందలాది మంది ఉంటారు.

3

కానీ కెనడియన్ ప్రజలు అమెరికా కంటే ముప్పై నుండి యాభై సంవత్సరాలు వెనుక ఉన్నారు. మనము ఇప్పుడు జీవిస్తున్న వేగవంతమైన జీవితాన్ని వారు పొందలేదు. వారు ఎప్పుడూ ఆతురతలో ఉండరు. వారు సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి కోసం ఎదురు చూసే వినయపూర్వకమైన మరియు మధురమైన ప్రజలు. మరియు ఆయన ఖచ్చితంగా కెనడియన్ ప్రజలలో తన గొప్ప శక్తిని ప్రత్యక్షపరిచాడు. చెవిటి, మూగ, గుడ్డి, క్యాన్సర్, వికలాంగులు, చక్రాల కుర్చీల్లో ఉన్నవారు, ఓహ్, అన్ని స్వస్థతలూ చోటు చేసుకున్నాయి. అక్కడ ప్రార్థన వరుసలోకి రాలేక పోయినవారు వేల మంది ఉన్నారు, వారు ఇప్పటికే వాంకోవర్ వద్ద సమకూడారని సమాచారం వచ్చింది.

ఈ సమయంలో నేను ఆలోచించగలిగే అత్యుత్తమమైన విషయాలలో ఒకటి ఏమిటంటే, నేను చెప్పినట్టుగా చక్రాల కుర్చీలో ఉన్న ఒక చిన్న పిల్లవాడు, నేను ఇక్కడ నిలబడి చెప్పగలను అది నిజం... ఆయన నాకు వాగ్దానం చేశాడు, ఈ దూత, నేను యదార్ధంగా ఉండి ప్రజలు నమ్మునట్లుగా చేయగలిగితే ఏదియు కూడా ఎదురుగ నిలబడలేదని...

కాబట్టి కుంటువారు తప్ప మరెవరు లేని ప్రార్థన వరుసలో ఏమి జరుగుతుందో చూడాలని వారు కోరారు. మరియు వారు ప్రార్థన వరుస ఉండబోతుందని, ఒక అద్భుతముల వరుస, అది కేవలం కుంటివారికే అని ప్రకటించి ప్రార్ధన కార్డులను ఇచ్చారు. మరియు స్వస్థత వరము ద్వారా ఏమి జరుగుతుందో చూడటానికి వారు కొందరు ప్రజలను తీసుకువచ్చారు. ఇది అద్భుతముల యొక్క వరము కాదు; ఇది స్వస్థతా వరము. ఆ రకమైన ఒక వరుసలో ఏమి జరుగుతుందో చూడాలని వారు కోరారు.

4

ముప్పై ఏళ్ల వయసులో ఉన్నఒక యువకుడు ఉన్నాడు, అతను సాస్కాటూన్ నుండి ఎడ్మొంటన్ వరకు, ఇంకా కాల్గరీ వరకు కూడా నా కూడికలను వెంబడించాడు. అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. అతని తల్లి తన వస్తువులలో కొన్నింటిని అమ్మింది, మరియు ఇంటికి తిరిగి వెళ్ళడానికి కావలసిన డబ్బు తప్ప అతని వద్ద ఇంకేమియు లేదు. మరియు కుంటివారి కోసం ఒక అద్భుతముల వరుస ఉండబోతుందని అతని తల్లి విన్నప్పుడు, ఆ బాలున్ని అద్భుతముల వరుస జరిగేవరకు అక్కడ ఉంచడం కోసం ఆమె తన వివాహ ఉంగరాన్ని తాకట్టు పెట్టింది. ఆ బాలుడిని అక్కడ ఉంచడానికి తల్లి తన వివాహ ఉంగరాన్ని తాకట్టు పెట్టిందని నా చెవిన పడింది.

ఆ తల్లి వివాహ ఉంగరం నా తల్లికి, లేదా నా భార్యకి, లేదా మీ భార్యకి ఎంత విలువైనదిగా వుంటుందో అంతే విలువైనదిగా ఆమెకు ఉన్నది. అది ఆమెకు ఎంతో విలువైనది. బహుశా నాకు తెలిసినంత వరకు ఆమె భర్త చనిపోయి ఉండవచ్చు. మంచిది, ఆమె ఆ డబ్బు చెల్లించే మార్గాన్ని ఏర్పాటు చేసి, ఆమె ఉంగరాన్ని తిరిగి పొందేలా మేము చేసాము.

5

అయితే ఆ రాత్రి, నా చిన్న సోదరుడు ఈ బాలున్ని వరుసలోకి తీసుకువచ్చాడు. నేను ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ చూడని అత్యంత ఘోరమైన కుంటివాడతడు. అతని చేతులు అతని కాళ్ళ వరకు క్రిందికి లాగబడ్డాయి. అతడు చూడలేని ఒక దృశ్యంగా ఉన్నాడు. దానికి ముందు ఒక చిన్న... [టేపు. లో. ఖాళీ.]

... దేవుని తీర్పులో, నేను చెప్పే ప్రతి మాటకు ఒక లెక్క అప్పచెప్పవలసి ఉన్నది ... నేను మాట్లాడిన ప్రతి మాటకు నేను సమాధానం చెప్పాలి. అయితే అకస్మాత్తుగా నా చేయి, దేని ద్వారా అయితే వరము వస్తున్నదో, ఆ కంపనాలు వస్తున్నాయో, ఆ నా చేయి చాలా వేడిగా అయింది... ఆ చిన్నారి బహుశా ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది, లేదా అంత పెద్దది కాక పోవచ్చు. మరియు నేను ఆమె తొడ మీద నా చేయి ఉంచాను, అప్పుడు ఏదో క్రిందికి కదిలింది. మరియు మిత్రులారా, నేను ఎవరి ముందు నిలబడ్డానో ఆ దేవుడే నా తీర్పరి; నాలుగు అంగుళాలు తక్కువ ఉన్న ఆ చిన్నారి కాలు పూర్తిగా పరిపూర్ణమైంది. ఆమె ఈ బైబిలు తన తలపై పెట్టుకుని, ప్రజల ముందు పైకి క్రిందికి నడిచింది, ఎవరైనా ఎంత పరిపూర్ణముగా నడవగలరో అంతే పరిపూర్ణముగా ఆమె నడిచింది. ఆమె కోసం ఒక గంటకు పైబడిన ప్రార్థన చేసిన తర్వాత ఆమె స్వస్థత పొందింది.

6

దాని తరువాత ఈ ఊచకాళ్ళు కలిగిన బాలుడు ఉన్నాడు. అతని కోసం ముప్పై ఐదులేదా నలభై నిమిషాలు ప్రార్థన చేసిన తరువాత కూడా, ఏ తేడాను నేను భావించలేకపోయాను. ఆ అనుభూతి అంటే ఏమిటో, దానిని మీకు తరువాత వివరిస్తాను. మరియు కొంతసేపటి తర్వాత - విడుదల పొందుకున్నాడు. అతన్ని బంధించి ఉంచిన ఆ శక్తి వీడిపోయింది.

మరుసటి రోజు ఉదయం ఆ అబ్బాయి గడ్డమును తీసేసుకున్నాడు. అతని చేతులు క్రిందికి వ్రేలాడుతున్నాయి; తనకు తానుగా తినలేక, తనకు తానుగా గడ్డము తీసుకోలేక ఉండే అతను, ముప్పై సంవత్సరాలలో మొదటిసారిగా భవనంలోకి నడిఛి వచ్చి తన చక్రాల కుర్చీని నేల పైన అటు ఇటు నెత్తుతూ తిరిగాడు. అతడు నన్ను కలవవలసి ఉన్నాడు. అతనికి ఒక ఉత్తరం వచ్చింది. మరియు రేపు, అతను నన్ను వాంకోవర్ వద్ద కలుసుకుని, శుభ వచనాలు పలికి మరియు నాతో కరచాలనం చేసే మొదటి వ్యక్తిగా ఉండబోతున్నాడు, ఇన్ని సంవత్సరాల నుండి ఆ చక్రాల కుర్చీలో ఉన్న అతడు ఆ విధంగా నడుస్తూ నన్ను విమానంవద్ద కలుసుకోవటానికి వస్తున్నప్పుడు ఫోటో తీసుకోనైయున్నారు.

ఓహ్, దేవుడు ఇప్పటికి దేవుడు అయిఉన్నాడు. నేను మీకు విషయాలు చెప్పడానికి సమయం ఉంటే ... అయితే సాక్ష్యములు ద్వారా మరియు అనేక విధములుగా దేవుడు మీకు బయలుపరుస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

7

ఇక్కడ కెనడియన్ స్నేహితులు ఎవరైనా ఉన్నారా అని నేను అనుకుంటున్నాను? ఇక్కడ కెనడా నుండి ఎవరైనా ఉన్నారా? కెనడా నుండి ఎవరైనా ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తగలరా? అవును, నేను ఒకరిని చూస్తున్నాను. కెనడాలోని ఏ భాగంనుండి, సహోదరి? క్యూబెక్ నుండా? విన్నిపెగ్. మీరు విన్నిపెగ్ కూడికలో ఉన్నారా? మీరు అక్కడ లేరు.

విన్నిపెగ్ వద్ద ఒక కాలు మరొక దాని కంటే మూడు లేదా రెండు అంగుళాలు చిన్నదిగా ఉన్న మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, అతను ప్రత్యేకముగా తయారు చేయబడిన ఎతైన బూటును కురుచ కాలుకు ధరించాడు. మరియు వెళ్ళేటప్పుడు ధరించటానికి అతను తన కోసం ఒక కొత్త జత బూట్లు కొనుక్కుని వచ్చాడు. మరియు దేవుడు-ఆ విధమైన విశ్వాసంతో ఉన్నవారిని ఎవరినీ నిరాశపరచడు. అతను తన పాత వాటిని వేదిక మీద వదిలేసి తన కొత్త బూట్లు వేసుకుని వెళ్ళిపోయాడు. అతను బాగుపరచబడ్డాడు.

అయన అద్భుతమైనవాడు, అవునా? ఇప్పుడు, ప్రతి సాయంత్రం మనకు ఎక్కువ సమయం లేదు, కానీ మనకు చాలా సాయంత్రాలు— లేదా మధ్యాహ్నాలు రోగుల కొరకు ప్రార్థన చేయడానికి ఉన్నాయి. మరియు యేసును మీ రక్షకుడిగా లేదా స్వస్థపరిచేవాడిగా ఎరిగియున్న ప్రియమైన ప్రజలు మీరందరు, ఈ రాబోయే వారంలో మీరు వెళ్లి మీ హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను.

8

మరియు అనేక వేల మైళ్ల ప్రయాణం నా ముందు ఉన్నది. నేను ...వాంకోవర్ నుండి మొదలుకుని, కాలిఫోర్నియా తీరం గుండా,రేపటి దినమున వెళ్ళవలసిన ఫ్రెస్నో పట్టణం వరకు, అర్మేనియన్ ప్రజల వద్దకు చేరేవరకు ప్రయాణము చేయవలసి యున్నది. వారు జబ్బుపడినవారి కోసం ప్రార్థించే అబాయిక్ అనే బాలుడిని విమానములో రప్పించారు. ఆర్కెలియన్ అనే వ్యక్తి కోసం ప్రార్థన చేయటానికి వారు కైరో నుండి ఆ బాలుడిని తీసుకు వచ్చారు.

వారు అతని కోసం పంపిన అదే సమయంలో, ఇండియానాలో ఉన్న నాకు, క్యాన్సర్తో ఉన్న ఒక మహిళ వద్దకు రావాలని కబురు పంపారు. మరియు ఆమెకు రెండు రొమ్ములు తీసివేయబడ్డాయి, మరియు క్యాన్సర్ ఆమెలోకి-ఆమె ఊపిరితిత్తుల లోకి వెళ్లిపోయింది. మరియు ఆ మహిళ కోసం ప్రార్థించిన మూడు రోజుల తరువాత, ఆమె వీధిలో షాపింగ్ చేస్తోంది. మరియు ఇప్పుడు క్యాన్సర్ యొక్క సంకేతాలు ఆమెలో ఏ మాత్రం లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంది.

9

మరియు ప్రభువైన యేసు ఇంత గొప్ప స్వస్థపరిచేవాడని చూడాలని అక్కడున్న అర్మేనియన్ ప్రజలు పట్టబడ్డారు. నేను ... ఆ ప్రజలే ఇప్పుడు పిలుస్తున్నారు. ఆ స్త్రీ యొక్క స్నేహితురాలైన మరొక క్యాన్సర్ కేసు అక్కడ ఉంది. ఇంకొక విషయం, సెయింట్ లూయిస్ అనే వైద్యశాల ప్రసిద్ధ నిపుణులు కొందరు ఆ స్త్రీ మరికొన్ని గంటలు మాత్రమే జీవిస్తుందని చెప్పారు, అక్కడే విమానంలో తీసుకెళ్లి ఆమెకు ఆపరేషన్ చేసారు. కానీ ఇప్పుడు, ఆమె స్వతపడింది.

అది “ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన స్వరం” అనే పాటను గురించి ఆలోచించులాగున చేస్తుంది, ఆ కృపయే నా వంటి పాపిని రక్షించెను లేదా నా వంటి పాపిని స్వస్థపరిచెను.

ఇప్పుడు, ఈ మధ్యాహ్నాన సమయంలో, నేను....

ప్రజల నుండి బయటికి వచ్చేటటువంటి దయ్యాలు. ఇది చూడకుండ ప్రజల ఆలోచనలను చీకటి కలుగచేస్తాయి. కాని మీరు మర్యాదతో ఉంటే, మీరు ఇక్కడ ఫీనిక్స్ లో దేవుని మహిమను చూస్తారు.

ఇప్పుడు, మీరు తలలు వంచినట్లయితే ప్రార్ధన చేద్దాము, ప్రతిచోటా. ఇక్కడ పిల్లలు మరియు అందరూ, మీరు ఎంత మర్యాదతో ఉండగలరో అంత మర్యాదతో తలలు వంచుదాం ...?

10

యేసు, మా పరలోకపు తండ్రీ, ఈ ఆరిజోనాలోని ఫీనిక్స్ కి మరలా రమ్మని మేము నిన్ను హృదయపూర్వకంగా అడుగుతున్నాము, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వస్తున్నాము, వారు ఏ సందేహం లేకుండా, సర్వశక్తిమంతుడైన దేవుని మహిమ ప్రత్యక్ష పరచబడుట చూచునట్లు, అనగా క్రీస్తు యొక్క శక్తి , సాతాను శక్తులచేత పట్టబడి బంధించబడి వారిని విడిపించడానికి కిందకి దిగి వచ్చి చెవిటి, మూగ మరియు గ్రుడ్డి ఆత్మలు ప్రజలను విడిచిపోవుట, కుంటివారు విడిపించబడుటను చూచునట్లు సహాయం చేయండి.

ఓ దేవా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను [టేపు. లో. ఖాళీ.] ...ప్తతి ఒక్కరు [టేపు. లో. ఖాళీ.] ఈ కుడికలలో [టేపు. లో. ఖాళీ.] ... పరిచారకులు [టేపు. లో. ఖాళీ.]... మరియు ఫీనిక్స్ నగరం కోసం ఈ కూడికకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. లోకపు మనసు కలిగిన చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఆత్మీయముగా ఉండేవారు మరియు జ్ఞానము కలిగిన వారు దీని అర్ధం గ్రహిస్తారు, ఇది ఒక సూచన.

11

తండ్రీ, నీ శక్తిని ప్రత్యక్షపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సభామందిరము (ఆడిటోరియం) లో మాకు అనుమతి ఇచ్చిన వారిని ఆశీర్వదించండి. తండ్రీ, మీరు ప్రతి ఒక్కరితో ఉండమని నేను ప్రార్థిస్తున్నాను. వారిలో ఎవరైనా రక్షింపబడనివారు ఉన్నట్లయితే , వారిని రక్షించండి, తండ్రీ. మరియు ఇతరమైన ప్రసంగముల కోసం ఉపయోగించబడుతున్న ఈ సభామందిరమును (ఆడిటోరియం), తండ్రీ, యేసుక్రీస్తు యొక్క కూడికల నిమిత్తము ఈ భవనాన్ని ఇప్పుడే పరిశుద్ధపరచమని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ భవనంలోనే పాపులు ఏడ్చుచూ కల్వరి యొద్దకు వచ్చుదురు గాక. రోగులు విడుదల పొందుదురు గాక, దయ్యములు కేకలు వేయుచూ బయటికి వచ్చును గాక. మరియు ఇది ఈ చక్కని చిన్న పట్టణానికి గొప్ప కదిలింపు ఇచ్చును గాక.

తండ్రీ, మీరు ఇక్కడ అనేక మందిని కలిగి ఉన్నారని, వారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ ఆరోగ్యకేంద్రములో సమకూర్చబడ్డారని నేను నమ్ముతున్నాను. తండ్రీ, మీరు వారిని స్వస్థపరచండి, ఆ ఇమ్మానుయేలు రక్త నాళములనుండి తీయబడిన రక్తపు ఊట ఉందని వారు ఎరుగుదురు గాక. దేవా, దానిని దయచేయండి.

12

తండ్రీ, ఈ మధ్యాహ్న సమయంలో వారి యొక్క సమాజములను ఇక్కడికి నడిపించిన ప్రతి పరిచారకుడిని ఆశీర్వదించుమని మరొక్క సారి అడుగుచున్నాను. మీరు మా అందరితోను ఉండుమని నేను ప్రార్థిస్తున్నాను.

మరియు ఇప్పుడు, ప్రియమైన దేవా, నీవు నాకు పర్వతాలలో ఇచ్చిన విశ్రాంతినిబట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, మరియు ఇప్పుడు నూతన బలముతో వస్తున్నాను. ఓ క్రీస్తు, సాతాను మా ముందు ఉంచిగలిగిన దేనికైనా మించి దానిని జయించేదానిగా మీ వరము ఉండనివ్వండి. దేవుని గొప్ప కదిలించే శక్తులు, దేవుడు కాని ప్రతిదాన్ని, చల్లని మరియు కఠినమైన పాపపు పురుషులు మరియు స్త్రీలు, బాలురు మరియు బాలికల హృదయాలు విడుదల చేయును గాక.

13

తండ్రీ, విమానాలు పర్వతాల మీదుగా గర్జిస్తుండగా, వచ్చే ఆదివారం మీరు నన్ను సురక్షితంగా ఫీనిక్స్కు తిరిగి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. తండ్రీ, నీవే మా రక్షణ కర్తవు. మీరు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను.

ఇప్పుడు, ఈ మధ్యాహ్న కూడికను ఆశీర్వదించండి. మరియు ఇక్కడ ఉన్న ప్రతి హృదయం సున్నతి చేయబడును గాక. దేవుని వాక్యాన్ని వినడానికి చెవులు సున్నతి చేయబడును గాక, మరియు సరైనది మాట్లాడటానికి నీ సేవకుడి పెదాలను సున్నతి చేయండి. ప్రజలకు విముక్తి లో ఈ మధ్యాహ్నం గొప్ప శక్తులు తీసుకురాబడును గాక. మరియు వేదిక మీదకు వచ్చే ప్రతి ఒక్కరూ “ఇది నా సమయం, నేను విడుదల పొందుతాను. ఇతరులు విడుదలను పొందగలిగితే, నేను కూడా విడుదలను పొందగలను” అనే ఏక మనస్సు కలిగి వచ్చును గాక. మరియు వారు నిశ్శబ్దంగా ఉండక, నగర వీధుల్లో నడుస్తూ, ఈ రాబోవు వారమంతా దేవునికి స్తుతులు మరియు మహిమ చెల్లించుచూ సాక్ష్యమిచ్చుదురుగాక. ఇది ఇక్కడ వ్యాపారస్తులను, మరియు అందరిని కదిలించి తండ్రీ, అది ఇక్కడ గొప్ప మేల్కొలుపు కలిగించును గాక. దేవుని ఆత్మకు ఎక్కడైనా ఇంకా ప్రాముఖ్యత ఉందని వారు తెలుసుకొనును గాక. నీవు అత్యంత చీకటి ప్రదేశాలలోకి చొచ్చుకు వెళ్లి రోదిస్తున్నవారిని బయటకు తీసుకు రాగలవాడవు. [టేపు. లో. ఖాళీ.]

14

ఒక అంచనా కొరకు ఈ విశ్లేషణ చేయుచున్నాను, నేను ఫీనిక్స్ లో ఉన్నప్పటి నుండి, కనీసం ఆరుగురు.. [టేపు. లో. ఖాళీ.].. సరే, నేను సుమారుగా ఇరవై ఐదు లేదా ముప్పైఐదు వేల మంది కొరకు, ప్రార్థన చేసాను, బహుశా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. మరియు వారిలో కనీసం పదివేల మంది స్వస్థత పొందారు. మీరు దాని గురించి ఆలోచించగలరా? క్యాన్సర్ వంటి వ్యాధితో వారి చివరి క్షణాల్లో ఉన్నటువంటివారు, గడిచిన కూడిక నుండి బాగుచేయబడ్డారు. కేవలం కెనడా పరిది లోనే, మెల్ల కన్నుతో ఉంది సరిచేయబడిన కేసులు కనీసం రెండు వందల యాభై లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని నేననుకుంటున్నాను. మరియు మూగవారి కేసులైతే , అవి లెక్కింపలేనంతగా ఉన్నాయి, అలాంటివారు చాలా మంది వచ్చారు, వారిలో కొందరు చెవిటి, మూగ, వినికిడి కష్టతరమైనవారు, మరియు ప్రతి ఒక్కరు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. ఇప్పుడు, అది దూత యొక్క సందర్శన ద్వారా మాత్రమే జరిగింది.

15

కొన్ని రాత్రుల క్రితం, నేను కెనడా నుండి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటి దగ్గర నిలబడి ఉండగా, ఐదు రోజుల వరకు నా ఇంట్లోకి వెళ్ళలేకపోయాను. చాలామంది ప్రజలు ఇంటి ఎదుట పడిఉన్నారు, అయిదు రోజుల పాటు నేను వారి కొరకు ప్రార్దిస్తూ బయటే ఉండవలసి వచ్చింది. కొన్ని రోజుల క్రితము, దేశంలోని అన్ని ప్రాంతాలనుండి వచ్చిన ప్రజలను ఎవరో ఒకరు ఉండి పంపేవారు...

రాత్రి... గత ఆదివారం ఉదయం, నేను వచ్చి ప్రకటన పుస్తకంలోనుండి వారికి బోధించమని నా చిన్న సంఘం అడిగారు. నేను ప్రసంగించాను. అప్పుడు, కూడిక చివరలో, సహకాపరి ఇలా అన్నాడు,“ఇప్పుడు, సహోదరుడు బ్రాన్హాం రోగుల కొరకు ప్రార్థించడం లేదు, ఆయన ఫీనిక్స్ వెళ్ళటానికి ఎదురుచూస్తు ఆయన తన బలాన్ని నిలుపుకుంటున్నాడు.” మరియు అయన, “దయచేసి ఎవరూ ప్రార్థన అడగవద్దు” అని అన్నాడు. కానీ నేను పదకొండు గంటలకు అందరితో కరచాలనం చేయడానికి నిలబడ్డాను. మరియు రెండు గంటలకు వారు నన్ను స్థలం నుండి తీసుకువెళ్ళారు.

16

నేను ఒక గడియారాన్ని పెట్టుకున్నాను, నేను మొదట అక్కడ కణితి ఉన్న ఒక మహిళను పట్టుకున్నాను, ఆ కణితి ఆగిపోయింది...ఆ కంపనాలు నా గడియారాన్ని ఆపివేసాయి. నేను గడియారం పెట్టుకుని ప్రజల కోసం ప్రార్థించలేను. నేను ఈ మధ్యాహ్నం మీకు దానిని చూపించగలను. ప్రతిసారి అవి ఆపివేస్తాయి, దానిపై వచ్చే కంపనాలు సరికొత్త లాంగిన్స్ గడియారమైన ఆపివేస్తాయి. అది ఆగిపోతుంది; కంపనం దానిని ఆపివేస్తాయి. మరియు నేను ఒక సువార్తికునికి చూపించాను...? ... ఆయన ఈ మధ్యాహ్నం ఇక్కడ ప్రజలలో ఎక్కడో ఉన్నారు. మరియు అది ఆగిపోయింది. కంపనం దానిని ఆపేసాయి.

అప్పుడు ఆదివారం రాత్రి, నేను వారికి ఒక వాక్యోపదేశము చేయటానికి అక్కడ యుండగా, కొంతమంది ప్రజలు అక్కడ ప్రార్థన వరుసగా నిలబడ్డారు. మరియు నేను నిలబడి వారు నమ్మినట్లయితే వారికోసం కోసం గుంపుగా ప్రార్థిస్తానని వారిని అడిగాను, మరియు వారు నమ్ముతాము అని చెప్పారు. వారి హృదయాలు ఆశీర్వదించబడును గాక, వారు - వారు ఏదో విధముగా నాకు సమీపముగా రావడానికి నాతో కరచాలనం చేయాలని ఆశపడ్డారు. మరియు వారు అందరూ నాతో కరచాలనం చేస్తూ నా దగ్గరనుండి వెళ్ళారు.

మరియు క్యాన్సర్, మరియు క్షయవ్యాధి మరియు తదితర వ్యాధులనుండి స్వస్థత పొందిన కొంతమంది ప్రజలు, వారిని చూడాలని అక్కడ నిలబడి ఉన్నారు. నేను మీకు చెప్పిన స్వస్థపడిన గుంపులో కొంతమంది ప్రజలు అక్కడ నిలబడి ఉన్నారు.

17

మరియు నేను ... అక్కడ నిలబడి ఉన్నప్పుడు, ఈ దేవదూత యొక్క సన్నిధి దగ్గరకు వచ్చుటను నేను అనుభవించాను. సభికులను చూస్తుండగా, ఆయన పిలుస్తున్న స్త్రీని నేను కనుగొన్నాను. ఆమె ప్రార్థన వరుసలో ఉందని నేను చూశాను. ఆ స్త్రీకి ఏ సమస్య ఉందో నాకు తెలియదు, దేవునికి తెలుసు. మరియు నేను, “మీరు ఇక్కడకు రండి” అని అన్నాను. మరియు ఆమె నిలబడి నా వైపు చూసింది.

నేను, “మీరే” అని అన్నాను.

మరియు అక్కడ వేరొక మహిళ, “మీరు ఇక్కడ ఈ స్త్రీని పిలుస్తున్నారా?” అని అడిగింది.

మరియు నేను, “అవును” అని అన్నాను.

“ఆమె చెవిటిది” అని ఆమె చెప్పింది.

మరియు నేను, “సరే, ఆమెను ఇక్కడికి తీసుకురండి; ఆమె స్వస్థత పొందే సమయం ఇదే.” అన్నాను. ఇప్పుడు, చూడండి, అది దేవుని నుండి రావాలి. నేను, “ఆమె ఎంతకాలం నుండి చెవిటిది?” అని అడిగాను.

“ఆమె సోదరి భవనంలో ఎక్కడో ఉంది” అని అన్నారు. ఈ మద్యలో వేసిన దారిలో ఎంత మంది ఉన్నారో భవనంలో అంత మంది అక్కడ ఉన్నారని అనుకుంటున్నాను. బయట నుండి లోపలికి ఎంత మంది రాగలరో అంత మంది వచ్చారు. మరియు ఆ స్త్రీ పైకి వచ్చింది. మరియు ఆమె సోదరి,“ఆమె తన జీవితమంతా చెవిటి దానిగా ఉన్నది, వాస్తవముగా, ఆమె చిన్నప్పటినుండి, పన్నెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటినుండి చెవిటిగా ఉంది.” అని చెప్పింది.

సరే, నేను ఆమె చేతిని పట్టుకున్న వెంటనే, అక్కడ... నేను వారి కోసం ప్రార్థిస్తున్నప్పుడు, నా కుడి చేతిని ఉపయోగిస్తాను. అప్పుడు ఎడమ చేతిలో కంపనాలు కనిపించాయి. మరియు కొన్ని క్షణాలలో, చెవిటి ఆత్మ ఆ స్త్రీ నుండి వెళ్ళగొట్టబడింది, మరియు ఆమె చూస్తూ ఉంది, మరియు నేను [బ్రదర్ బ్రాన్హాం చిటికె వేస్తున్నారు.] చిటికె వేసాను. ఆమె తిరిగి చూసింది. నేను, “మీకు నా మాటలు వినిపిస్తున్నాయా, లేదా?” అని అడిగాను. మరియు ఆమె వినికిడి పరిపూర్ణంగా ఉంది. మరియు ఆమె ఏడవడం ప్రారంభించింది. చాలా చక్కని దుస్తులు ధరించిన స్త్రీ, ఆమె తన చేతులను పైకెత్తి ఏడుస్తూ ఉన్నది. మరియు ప్రజలు పరుగెత్తడం ప్రారంభించారు. అప్పుడు వారు నన్ను వెనుక మార్గం ద్వారా బయటకు తీసుకు వచ్చారు.

18

ఎందుకంటే, చూడండి, మిత్రులారా, నేను కేవలం మానవుడిని. నేను కేవలం మనిషిని. కానీ అది సర్వశక్తిమంతుడైన దేవుని నుండి రావాలి. చూసారా?

మీరు భోధకుడిని గమనించారా? ఆయన ఒక నగరంలోకి వెళ్లి, ఒక అద్భుతం చేసి, ఆ నగరాన్ని విడిచి పెడతాడు. మీరు గమనించారా? చాలా సార్లు అలా జరిగింది. ఎలీషా కాలంలో చాలా మంది కుష్ఠురోగులు ఉన్నారు, కాని ఒకరు మాత్రమే ఆయన వద్దకు పంపబడ్డారు; అది నయమాను. అది నిజమేనా? ఇంకా ఎంత మంది కుష్ఠురోగులు వచ్చారో చెప్పండి, కాని ఒకరు మాత్రమే ఆయన యొద్దకు పంపబడ్డాడు, మరియు ఆ ఒక్కరినే ప్రభువు ఉద్దేశించాడు.

ఈ అతీతమైనశక్తిని పొందేటట్టు చేసే వ్యక్తి నుండి ఏదో ఒకటి నేను అనుభవించినప్పుడు మాత్రమే నేను చెప్పగలను. అదే మార్గం. అది నాది కాదు; అది ఆయన శక్తి. అప్పుడు అది ఎంత పెద్ద రోగమైన మరి ఏదైన సరే, ఇక అది ఉండదు...నేను దానిని ప్రభువు నామంలో చెప్పుచున్నాను. [టేపు. లో. ఖాళీ.]

19

ఇప్పుడు, ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? మోషేతో. మీ ఆదివారపు బడిలో మీలో చాలా మంది ఈ గొప్ప బైబిల్ పాత్ర అయిన మోషే గురించి చదివి ఉంటారు. నేను ఆయనను ఇష్టపడుతున్నాను, ఎందుకంటే ఆయన క్రీస్తు రాకడయొక్క నీడగా ఉన్నాడు. ఆయన కేవలం క్రీస్తు రాకడకు ఛాయ మాత్రమే.

గమనించండి. ఇప్పుడు, అబ్రహాముకు ముందే చెప్పబడిన రీతిగా... ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి వెళ్లి, నాలుగు వందల ఇరవై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు... వాగ్దాన సమయం దగ్గర పడినప్పుడు, మీరు దీనిని గమనించాలి అని నేను కోరుతున్నాను... ఇప్పుడు గమనించండి. వాగ్దాన సమయం దగ్గర పడినప్పుడు, ప్రజలు ఆ సమయంలో, వారికి ఎదో సంభవించుట చూడటం ప్రారంభించారు, కొన్ని సమస్యలు రావటం చూసారు, ఎల్లప్పుడూ అదే విధంగా ఉంది, ప్రజలను ఐక్యపరచటానికి దేవుడు ఎల్లప్పుడూ సమస్యలు కలగజేస్తాడు. మీకు అది తెలుసా?

ప్రజలలో ఇంకెంతమాత్రం “నేను ఈ చర్చికి చెందినవాడిని, నేను ఆ చర్చికి చెందినవాడిని” అనే విభజనలు లేని సమయం ఒకటి రాబోవుచున్నదని నేను నమ్ముచున్నాను. శ్రమలే వెల పెట్టి కొనబడిన దేవుని యొక్క పెద్ద సంఘమంతటిని ఐక్యపరుస్తుందని నేను నమ్ముచున్నాను. అప్పుడు మనందరమూ క్రీస్తు యేసునందు ఒక్కటవుతాము. మరియు ఆయన ఆమెను గృహానికి తీసుకువెళతాడు. అప్పుడు, ఈ సిద్ధాంతం సరైనదా లేదా అది సరైనదా అని మనము ఇక ఎంతమాత్రమును వాదించము.

20

ఇప్పుడు, గమనించండి. వాగ్దానం నెరవేరే సమయం వచ్చినప్పుడు, యోసేపుని ఎరుగని ఒక ఫరో లేచాడు, వారు ప్రజలపై భారాలను పెట్టారు. వారు ఇటుకలు తయారు చేయలేనంతగా మరియు చేయవలసిన పనులు చేయలేనంతగా భారాన్నివారిపై పెట్టారు. ఆవిధంగా, దేవుడు తన ప్రజలను బాధపెడతాడని మీరు అనుకుంటున్నారా? అవును. దేవుని వాక్యం నిత్యమైన సత్యం. అది నిజమేనా? మరియు ఆయన వారిని విడిపిస్తానని వాగ్దానం చేశాడు, దానిని ఆ విధంగా తప్ప ఇంకొక విధంగా అయన చేయడు.

కాబట్టి, ఇశ్రాయేలేయుల హింస సమయంలో, భూమిమీదికి పంపటానికి దేవుడు ఒక దూతను కలిగి ఉన్నాడు. కాని అయన దూతను పంపటానికి ముందు, మోషే అనే పేరుతో అక్కడ జన్మించిన ఒక చిన్న బాలున్ని కలిగి ఉన్నాడు. అది నిజమేనా? మరియు ఈ చిన్న బాలుడైన మోషే ఒక ప్రత్యేకమైన పుట్టుకతో జన్మించాడు. తరువాత, పరిపక్వ వయస్సులో, ఇశ్రాయేలీయులను బానిసత్వము నుండి విడిపించడానికి పంపబడ్డాడు. అతడు వెళ్ళటానికి ముందు, “నేను నీకు ముందుగా దూతను పంపుతాను” అని దేవుడు అతనితో చెప్పాడు.

ఇప్పుడు, దేవుడు దూతను కిందకు పంపగలిగి ఉండేవాడే. పంపలేడా? ఆయన దూతను స్వయంగా పంపగలిగి ఉండేవాడు, కానీ దానికి బదులుగా, ఒక మనిషి యొక్క స్వరం ద్వారా మాట్లాడటానికి దూతను పంపాడు. దేవుడు ఎల్లప్పుడూ తన పని కొరకు మానవుడిని ఉపయోగించాడు. అది సరియేనా? ఆయన సంస్థలను, లేదా యాంత్రిక పరికరాలను, లేదా ఇతరమైన వాటిని ఉపయోగించడు, కాని ఆయన మనుష్యులను ఉపయోగిస్తాడు. పరిశుద్ధాత్మ మనుష్యులపైకి దిగి వచ్చింది. అదే ఇక్కడ భూమిపై దేవుని యొక్క పనిముట్టు.

21

మొట్టమొదట భూమిపై ఉన్న ప్రతిదానిపై, అన్ని జంతువులపై అధికార పరిధిని కలిగి ఉన్న వాడు మానవుడే (అది సరియేనా?). మరియు అతడు తన అధికారాన్ని కోల్పోయాడు. మొదటి ఆదాము కోల్పోయినది, చివరి ఆదాము అయిన, క్రీస్తు మానవ జాతికి తిరిగి పునరుద్ధరించాడని మనకు బైబిల్ భోదిస్తుంది.

అయితే, మిత్రులారా, అది అలాగైతే, సేవకులారా, ఈ రోజు సంఘముతో జరుగుతున్నదేమిటి? అదే నేను తెలుసుకొనగోరుచున్నాను. క్రీస్తే దేవునికి మరియు మానవునికి మధ్య తప్పిపోయిన గొలుసు అయితే, మరియు ఆయన దేవున్ని మరియు మానవుడిని మరల కలపడానికి వచ్చినట్లయితే, ఈ రోజు జరిగేదేమిటి? దీనికి కారణం అవిశ్వాసమే. మరియు మీరు ఏదో ప్రారంభిస్తారు, మరియు ఏదో ఒకటి చూసి, “ఓహ్, మంచిది, ఇది దేవుని నుండి కాదు, దానిని వదిలేయండి” అని వెంటనే అంటారు. దేవున్ని ప్రేమించువారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవని ఎరుగుదుము.

మీరు ఒక ఇంటిని నిర్మిస్తున్నట్లయితే, మీరు అంటారు “సరే, ఈ వ్యక్తి ఇక్కడ సరిపోడు, ఈ భాగాన్ని చూడుము, దానివల్ల ఇక్కడ పెద్ద ఖాళీ కనిపిస్తుంది”. అయినప్పటికీ... అది అలా కనబడుతున్నప్పటికీ... ముందుకు సాగిపొండి. ఇల్లు కడుతూ ఉండండి. దేవుని దగ్గర ఆ ఖాళీలో సరిపోయే మరొక భాగం ఉంది, అది దానిని నింపుతుంది. ఇల్లు అలా నిర్మించలేము. కాబట్టి ఈరోజు, దేవుడు కదలాడుతుండగా, దాని గురించి మరచిపోయి, సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మలో కొనసాగుదాము, ఆవిధంగా మళ్ళీ పునరుద్ధరించబడిన దేవుని గృహమును చూస్తాము.

22

గమనించండి. దేవుడు తన ప్రజలను ఒక చోట చేర్చు దినమున ప్రజలమీద పెద్ద హి౦స మొదలైంది, మోషే విమోచకుడుగా ప౦పి౦చబడ్డాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుచేసాడు; ఈ అద్భుతాలన్నీ చేశాడు...[టేపు. లో. ఖాళీ.]

ఐగుప్తు శూరుడు గురించి హాటెంటాట్(దక్షిణ ఆఫ్రికాలో నివసించే సంచార వేటగాళ్ళు) లకు తెలిసిన దాని కంటే ఎక్కువ వారికి దానిగురించి ఎంతమాత్రం తెలియదు. అది నిజం. మరియు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్పుకునేవారు దానిని గుర్తించకముందే నక్షత్రశాస్త్రంలో ఉన్న జ్ఞానులు గుర్తించారు. అది నిజం. ఏ మనిషి అయినా ఆ విషయాలు చెప్పగలడు. కాని దేవుడు దాని గురించి సాక్షమివ్వనట్లయితే అది తప్పు. అది సరియేనా? కానీ దేవుడు దానికి సాక్షమిచ్చినట్లయితే, అవి దేవుని క్రియలు. అది నిజమేనా?

23

నేను ఫీనిక్స్ కు ఒక ప్రవక్త నామములో వచ్చి, ప్రవక్త చేసే కార్యములు చేయకపోతే, అప్పుడు నన్ను నమ్మవద్దు. కాని నేను ప్రభువైన యేసు నామములో, ఆయన ప్రవచనము తో, అయన సేవకుడిగా వచ్చి, నేను ఆయన సేవకుడి గురించి వ్రాయబడిన కార్యములు చేసినట్లయితే, అప్పుడు మీరు నన్ను నమ్ముడి. మీరు నమ్ముతారా? ఒకవేళ చెవిటివారు వినకపోతే, మూగవారు మాట్లాడకపోతే, గ్రుడ్డివారు చూడకపోతే, కుంటివారు నడవకపోతే, పాపం యొక్క ప్రవచనాలు ప్రజలకు ముందే చెప్పబడకపోతే మరియు మీ చిన్నప్పటి నుండి ఉన్న మీపాపాలను గురించి చెప్పకపోతే, అప్పుడు నా దగ్గరకు వచ్చిన ఈ దేవదూత అబద్ధమని మరియు దానితో పాటు నేను కూడా అబద్ధమని నమ్ముడి. కానీ ఇక్కడ వేదికపై మీ ముందు అది ప్రత్యక్ష పరుచుకున్నట్లైతే, మీరు దానిని నమ్మి, మీ పాపాలు మరియు అవిశ్వాసాన్ని బట్టి పశ్చాత్తాపపడండి, ఎందుకంటే ఆయన సందర్శించే ఘడియ దగ్గర పడుతుంది. అది నిజం. ఆయన తన వాక్యాన్ని ఋజువు పరచటానికి ఆయనే ఆ కార్యాలను చేస్తాడు.

చూడండి, ఏ తీర్పు అయినా భూమి మీదికి పంపబడటానికి ముందు, దేవుడు ప్రజలను హెచ్చరిస్తాడు. అది నిజం. మరియు మిత్రులారా, నా మాట దేవుడితో సరిపడినట్లయితే దానిని మీరు వినండి. లోకమంతటిని తాకిన అత్యంత గొప్ప తీర్పులవంటి ఒక తీర్పు రాబోతుంది. ఇప్పుడు, అది గుర్తుంచుకోండి. ఏదో ఒక రోజు నేను వెళ్లిపోతాను, కానీ మీరు - మీరు గుర్తుంచుకోండి. మీలో చాలా మంది యవ్వనస్తులు, మరియు పెద్దవారు, నేను మీకు నిజం చెప్పానని గ్రహిస్తారు. అది నిజం.

24

ఇప్పుడు, ఈ వరం వస్తుంది ... మీరు ప్రార్థన చేసి, వరమును పంపమని దేవుడిని అడిగినట్లయితే, ఆయన దానిని పంపించాడు. కొన్ని నెలల క్రితం నేను ఈ ఫీనిక్స్ లో ఉన్నప్పుడు, ఇది క్రొత్తగా విన్నారు. కానీ ఇప్పుడు నిస్సందేహంగా, మీ ప్రముఖ వార్తాపత్రికలు, లేదా మీ లైఫ్, టైమ్స్అనే పత్రికలు ... [టేపు. లో. ఖాళీ.] ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినిపించబడింది.

నేను ఇక్కడకు రావడానికి రెండు రాత్రులు ముందు, ఐదు వేర్వేరు దేశాలు నన్ను పిలిచాయి. మరియు టర్కీ దేశ రాజధాని పిలిచి, “సర్వశక్తిమంతుడైన దేవుడు అమెరికాలో స్వస్థత దయచేయడానికి తన చేతులను చాచి ఉన్నాడని మేము విన్నాము.” “మేము కొన్ని చిన్న ముక్కలను పొందటానికి ఏదైనా మార్గం ఉందా?” అని అన్నారు. ఆకలి కలిగిన, అన్యజనులు ...

ఓ ప్రజలారా, మీ ప్రభువు నామములో లేవండి. మీరు స్వస్థత పొందే ఘడియ ఇక్కడున్నది కాబట్టి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను పొందుకోండి. అది నిజం, దేవుడిని మహిమపరచి, ఆయన ఆత్మను మరియు ఆయన ఆశీర్వాదాలను పొందుకునే గడియ ఇక్కడున్నది. అన్ని సంప్రదాయాలను కత్తిరించండి. ఈ ఆచార బద్దమైన మతమును వదిలేసి, మానవ ప్రాణాన్ని మేల్కొలిపి, మిమ్మును నీతిలోనికి నడిపించి, ఆత్మతోను సత్యముతోను ఆరాధించే సజీవ దేవుని రాజ్యంలోనికి రండి. దేవుడు తన హెచ్చరికను పంపిన ఘడియ వఛ్చి ఉన్నది గనుక.

25

చేతి నుండి కంపనాల ద్వారా వస్తుంది. మోషేకి ముందుగా తన దూతను పంపిన అదే దేవుడు ... [టేపు. లో. ఖాళీ.]...ఈ దూతను (పంపుతున్నాడు). అది సరైనది. [టేపు. లో. ఖాళీ.]

నేను యధార్దంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు, మీరు ఈ విషయం తెలుసుకోవాలని నేను కోరుతున్నాను, నేను బయలుదేరులాగున...?... ఆ ఉదయానికి ముందు. నాకు తెలియదు. కానీ ఆ రాత్రి గదిలోకి ఆయన వచ్చినప్పుడు (మీ యొద్దకు) ... ఇది నాకు చాలా సార్లు ఒక నక్షత్రం యొక్క రూపంలో కనిపించింది. నేను చాలాసార్లు దానిని చూశాను. కానీ అది కనిపించినప్పుడు, అది రెండు వందల పౌండ్ల బరువు ఉండే ఒక మనిషి.

రెండేళ్ల క్రితం నేను గదిలో కూర్చుని ఉన్నాను. నేను నా చిన్న స్కోఫీల్డ్ బైబిల్ చదువుతున్నాను, అప్పుడు నేను ఏదో విన్నాను. మొదట, నేను ఒక వెలుగు చూశాను. మరియు అది ఒక వాహనం అటు మూల తిరిగినప్పుడు వచ్చిన వెలుగుని అనుకున్నాను. కానీ అది తిరిగి, ప్రకాశవంతంగా మారింది. మరియు నేను ద్వారము నుండి బయటకి చూసాను అక్కడ ఏ వాహనము లేదు. అప్పుడు ఎదో ఒకటి ఈ విధంగా నడుస్తూ వచ్చుట విన్నాను...[బ్రదర్ బ్రాన్హాం నాలుగుసార్లు వేదిక బల్లను తట్టాడు.]. నేను చూసినప్పుడు, ఆ వెలుగు ఎక్కువైంది. మరియు నాపైన ఒక గొప్ప నక్షత్రం వ్రేలాడి ఉంది. మరియు ఆ వెలుగు ఒక రకమైన ఆకుపచ్చగా, ఆకుపచ్చ మరియు పసుపు రంగుల మధ్యలో నేలపై మెరుస్తూఉంది. మరియు ఆ వెలుగు మధ్యలో నుంచి ఒక మనిషి, నేను ముందు చెప్పినట్లుగా, సుమారుగా రెండు వందలపౌండ్లు బరువు కలిగిన, ఒక భారీ మనిషి నడుస్తూ వచ్చాడు. క్రీస్తు చిత్రం వలె ఆయన ముఖం మీద గడ్డం లేదు. ఆయన ఎవరో, నాకు తెలియదు. కానీ ఆయన ...[టేపు. లో. ఖాళీ.]....భుజం. అతను ఒలీవ ఛాయ కలిగి ఉన్నాడు; అతనికి నల్లని కళ్ళు ఉన్నాయి. ఈ మైకు ఎంత దగ్గరగా ఉందో ఆయన నాకు అంత దగ్గరగా నడిచి వచ్చాడు.

26

అవును, ఇది నిజం స్నేహితులారా. నేను మాట్లాడలేకపోయాను. మరియు ఆయన నాతో ... నేను అక్కడే కూర్చుని ఉన్నాను. మరియు ఆయన, “భయపడకుము. నీ యొక్క ఈ అసాధారణమైన జీవితం, అసాధారణమైన పుట్టుక గురించి... [టేపు. లో. ఖాళీ.]... లోక ప్రజల కోసం ఇవ్వబడిన దైవిక స్వస్థత వరం గురించి నీకు చెప్పడానికి నేను దేవుని సన్నిధి నుండి పంపబడ్డాను.” మరియు “నీవు యధార్ధముగా ఉండి, ప్రజలు నిన్ను నమ్ములాగున చేయగలిగినట్లయితే, నీ ప్రార్థన ముందు ఎటువంటి వ్యాధి అయినను, క్యాన్సర్‌ కూడా నిలువలేదు.” అని నాతో చెప్పాడు. మరియు అతను ఇలా అన్నాడు, “నీవు నీ చేతుల మీద వచ్చే కంపనాలద్వారా ప్రజలకు వారి వ్యాధులను చెబుతావు. నీవు ఇంకా గౌరవం కలిగి ఉంటే, నీవు ప్రజలకు వారి జీవితంలో చేసిన పాపాలను మరియు విషయాలను చెబుతావు.”

ప్రియమైన మిత్రులారా, ఈ మధ్యాహ్నం నా ఎదుట ఉన్న బైబిలు సాక్షిగా, అది నెరవేరింది. నేను ముందుకు సాగి వెళ్ళాను. [టేపు. లో. ఖాళీ.]

27

ఇప్పుడు, నేను అదే ప్రశ్నించాను. మరియు నేను మిమ్మల్ని బహిరంగంగా అడగాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మీలో చాలామంది మీ చేతులు లేపి మాకు అర్థం కాలేదని చెప్పవచ్చు. అయితే మీలో కొంతమంది ఇక్కడ ఉన్నారని నేను నమ్ముచున్నాను, ఇది ఆత్మ ద్వారా నాకు తెలుసు... ఈ మధ్యాహ్నం నన్ను నేను పక్కన పెట్టి, నేను మాట్లాడగలిగినంత స్పష్టముగా మాట్లాడాను.

గమనించండి, ఆత్మలో ఇప్పుడు చాలా విషయాలు ఇక్కడ జరుగబోతున్నాయి అని నేను భావిస్తున్నాను...? ... గుర్తుంచుకోండి ... (చూశారా?), ఎందుకంటే ఇక్కడ విశ్వాసం ఉంది.

ఈ భవనంలో ఇప్పుడే బాధపడుతున్నట్లు ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడని నాకు తెలుసు. నేను ఆ వ్యక్తిని ఈ వేదిక మీదకు పిలిచినట్లైతే; ఇప్పుడే ఆయన స్వస్థపరచబడతాడు. అది నిజం. ఆయన ఈ భవనంలో ఉన్నాడని నాకు తెలుసు. ఆయన ఆత్మ ఇక్కడ నా ఎడమ వైపు నుండి వస్తోందని నేను భావిస్తున్నాను. అది నిజం.

28

ఆ రాత్రి అక్కడ ఆ భవనంలో ఉన్న సాక్రమెంటోకు చెందిన ఒక చిన్న స్పానిష్ అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నాను. మరియు ఆమె భవనంలో చాలా వెనుక కూర్చుని ఉంది, మరియు ఆమె తన హృదయంలో ఇలా అనుకుంది... ఆమె ఒక కాథలిక్. ఆమె అనుకుంది, “బ్రదర్ బ్రాన్హాం ఉన్న చోటికి నేను వెళ్ళలేను. ఆయన నా వైపు నా కళ్ళలోకి మాత్రం చూస్తే చాలు, నేను స్వస్థత పొందుతాను.” ఆ అమ్మాయి గురించి నాకు ఏమీ తెలియదు. ఆమె అక్కడికి వచ్చి కూర్చుంది... అక్కడ పొడవైన బీచ్ కంటే దూరంగా, లేదా ఎక్కడో దూరంగా, సమావేశంలో కూర్చుంది.

నేను ఆ రాత్రి కూడికకు వచ్చాను. నేను ప్రసంగిస్తూ ఉన్నాను. మరియు నేను ప్రసంగించేటప్పుడు, నా కుడి వైపు నుండి విశ్వాసపు ఈడ్పును అనుభవించాను. నేను ఆ వైపు తిరిగి భవనం గుండా సుదూరంలో చూశాను, నేను “అక్కడ దూరంలో కూర్చున్న ఆ యవ్వన స్త్రీని ఇక్కడికి రమ్మని చెప్పండి.” అని చెప్పాను. నేను, “ఓ యవ్వన యువతీ, ఇక్కడకు రమ్ము” అని అన్నాను.

ఆమె సాక్ష్యం కూడా ఇచ్చింది. ఆమె దాదాపుగా మూర్ఛపోయింది. ఆమె, “నేనా?” అని అడిగింది.

నేను, “ఆ చిన్న గుండ్రటి టోపీ ధరించావు కదా, ఇక్కడకు రండి” అని అన్నాను. ఆమె వినయంగా పైకి నడిచి వచ్చింది. ఆమెకు క్షయవ్యాధి (టి.బి.) ఉంది. నేను ఆమె చేతిని పట్టుకుని చెప్పాను, “మీకు క్షయవ్యాధి ఉంది. అయితే ”ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు.“అని అన్నాను. అంతే. అది జరిగింది. మరుసటి రోజు ఉదయం ఆమె తన హృదయాన్ని క్రీస్తుకు ఇచ్చింది. ఆమె బాప్తిస్మం పొంది తన కుటుంబాన్ని తీసుకువచ్చింది.

మరియు ఆమె నన్ను ఇక్కడ ఫీనిక్స్ లో కలువనైవుంది. ఆ అమ్మాయి ఎక్కడ ఉందో నాకు తెలియదు. సహోదరీ, నీవు భవనంలో ఉన్నావా? శాక్రమెంటో, కాలిఫోర్నియాకి చెందిన సహోదరి ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా? ఈసారి ఫీనిక్స్ కూడికలో ఆమె ఇక్కడకు రానుంది. మీరు ఉంటే, పైకి లేచి నిలబడండి, మీరు ఉంటే, నేను మీ చేతిని చూడలేకపోవచ్చు, మీరు భవనంలో ఉంటే, ఒక చిన్న స్పానిష్ అమ్మాయి, పద్దెనిమిది, ఇరవై సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. ఆమె ఇక్కడికి రావలసి ఉంది. ఆమె ఈ వారం మీకు సాక్ష్యమిస్తుంది. జరిగిన వందల కార్యాలలో ఇది ఒకటి.

29

ఇప్పుడు, అది ఇక్కడ కూడా అదే కార్యం చేయవచ్చు. ఈ వ్యక్తి వరుసలోకి వస్తే నేను మీ దృష్టికి తీసుకువస్తాను; నేను ఇప్పుడు అతన్ని పిలవడానికి వెనుకాడుతున్నాను, ఎందుకంటే అది అప్పుడు మరింత స్పష్టముగా ఉంటుంది. ఈ సమయంలో అతన్ని పిలవడానికి ప్రేరేపణ లేదు, కానీ అతను ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. నాకు అస్సలు పరిచయం లేని ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, నా జీవితంలో ఇంతకు ముందెన్నడూ అతనిని చూడలేదు, అతను ఒక చెవిటివాడు. అదినిజం. కానీ అతను ఇక్కడ ఉన్నాడు.

ఒకవేళ ఆ వ్యక్తి ఈ భవనంలో ఉంటే... ఆ వ్యక్తి ఈ మధ్యాహ్నం ఈ ప్రార్థన వరుసలోకి వస్తే, మరియు నేను ఇప్పుడు కలిగి ఉన్న ఈ అభిషేకం క్రింద అతన్ని తాకినట్లయితే, ఆ వ్యక్తి చెవులు ఖచ్చితంగా తెరవబడతాయి. ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అది సరైనది కాకపోతే, నన్ను అబద్ద ప్రవక్త అని పిలవండి. నేను అతన్ని వేదిక మీదకు పిలవగలను. కానీ అయన నాకు ఇంకొకటి ఇవ్వటానికి ఎదురు చూస్తున్నాను.. దాని గురించి ఆయన ఏమి చెబుతాడో చూడటానికి నేను ఒక్క సెకండు వేచి ఉంటున్నాను. ఇప్పుడు, నేను మీకు చెప్పేదాన్ని గమనించి చూడండి.

30

ఇప్పుడు, మేము కొద్ది క్షణాల్లో ప్రార్థన వరుసను ఏర్పాటు చేయబోతున్నాము. మీరు దీన్ని చేయాలని నేను కోరుతున్నాను: భవనంలో ఒక ఆధునిక విమర్శకుడు ఉన్నట్లయితే, ప్రభువైన యేసు నామంలో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఈ సమయంలో భవనంలో ఉండవద్దు, ఎందుకంటే క్యాన్సర్, చెవిటితనం, మూర్ఛ రోగం, ఇవన్నీ ఒకరి నుండి మరొకరికి వస్తాయి. నేను తరువాత దాన్ని వివరిస్తాను. మీ అందరికీ అర్థమైందా?

వ్యాధులు భీజకణము, మరియు భీజకణము ఒక జీవం అయి ఉన్నాయని నేను వివరించడం ఎంత మంది విన్నారు. మీకు మీరే ఒక భీజకణము; మీరు ఒక జీవకణము నుండి వచ్చారు. అది నిజమేనా? సరే, మీరు మీ తండ్రి మరియు తల్లిద్వారా వచ్చినట్లయితే, ఒక జీవకణం ద్వారా వస్తున్నారు... క్యాన్సర్ ఒక భీజకణము; కంటి పొర ఒక భీజకణము; కణితి ఒక భీజకణము; క్షయవ్యాధి ఒక భీజకణము. అది సరియేనా? అవి ఎక్కడ నుండి వచ్చాయి? అవి ఎలాంటి జీవులు? వైద్యులు ... వైద్య రంగములోని పేర్లతో , “క్యాన్సర్, నేత్రవ్యాది, అలా మొదలైనవి” అని పిలుస్తారు. యేసు వాటిని దయ్యం అని పిలిచాడు. అది సరియేనా? మరియు అవి అదే అయిఉన్నాయి. “దయ్యం” అంటే “హింసించేవాడు” అని ఎవరికైనా తెలుసు. మరియు అది మీ శరీరాన్ని హింసించేది.

31

ఇప్పుడు, దేవుడు తన స్వస్థతా వరమును పంపించాడని ఎంతమంది నమ్ముతున్నారని నేను తెలుసుకొన కోరుతున్నాను...? ఇప్పుడు చూద్దాం. దేవుడు మిమ్మును దీవించును గాక. ఓహ్, మై, ఈ గుంపులోని ఎనభై ఐదు శాతం మంది నమ్ముతున్నారు. అయితే, దీనిని బట్టి, సర్వశక్తిమంతుడైన దేవుని మహిమను చూస్తారని నేను మీకు హామీ ఇస్తున్నాను.

ఇప్పుడు, గుర్తుంచుకోండి, నేను ప్రార్ది౦చుటకు ప్రక్కకు వెళ్ళినప్పుడు, ..మీతో ఇక్కడ ప్రార్థన చేసిన తరువాత, ... నన్ను మీకు ఒక సలహా ఇవ్వనివ్వండి. మీ నిమిత్తము మరియు నా నిమిత్తము, అది ఒక నిందను కలుగచేసేదై ఉన్నది.

ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. ఇది అద్భుతాలు చేయటానికి ఇవ్వబడిన వరము కాదు. ఆయన... నాతో గడిచినసారి ఆయన ఇల్లినాయిస్ లోని వండాలియాలో మాట్లాడాడు. వండాలియా కూడికకు వచ్చినవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఇల్లినాయిస్ లోని వండాలియా కి వచ్చినవారు? ఇక్కడ భవనంలో ఉన్న ఒక వ్యక్తి ప్రభువు దూత దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు, మరియు ఆయన ఇలా అన్నాడు “మీరు పరిమితమై ఉన్నారు. ఇది జరుగుతుంది... [టేపు. లో. ఖాళీ.]

32

నేను యేసు యొక్క సేవకుడిని అని మీరు నమ్ముచున్నారా...? ... తండ్రీ ...? ... మీ దగ్గర నిలబడి ఉన్నది...? ... క్యాన్సర్. నా చేతి మీద ప్రకంపనం(మొదలైంది). ఆమెకు ఈ భూమిపై ఎక్కువ కాలం లేదని గుర్తిస్తూ ఉన్నాము, ఈ భూమిపై నివసించిన ఈ ఆత్మ వేరొక నివాసమునకు వెళ్ళుటకు ఎంతో దూరము లేదు. మరియు జీవితం ప్రజలందరికీ ప్రియమైనది. ఈ మధ్యాహ్నం మీరు ఆమెను స్వస్థపరచాలని మేము కోరుతున్నాము. ఆమె మిమ్మల్ని కోరుకుంటున్నట్లు ఆమెను బ్రతికించండి... తండ్రీ, మీరు చేయరా? మీ గొప్ప ఆత్మ ఈ కార్యాలను తీసుకురావడం నాకు గుర్తుంది. ఆ రాత్రి నన్ను గదిలో కలుసుకున్న దేవదూత, ఇప్పుడు వచ్చి, ఈ దయ్యం మీద అధికారం యిచ్చి సహాయం చేయటానికి వచ్చాడు.

క్యాన్సర్ అని పిలువబడే దెయ్యమా, సజీవ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్త్రీని విడిచిపెట్టమని గద్దిస్తున్నాను. క్యాన్సర్ దెయ్యమా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్త్రీ నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను.(...? ...)

పరలోకపు తండ్రి, నీ స్వస్థత యొక్క శక్తిని బట్టి మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే నీవు ఇప్పుడు ప్రార్థనకు సమాధానం ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తండ్రీ, ఈ స్త్రీ తన జీవిత కాలమంతయు మీకు సేవ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో సమస్త మహిమ మరియు స్తుతి నీకు చెల్లిస్తున్నాము. ఆమెన్. సరే ...? ... ప్రతి కంపనం ...?...పేరు.

ఇప్పుడు, గుర్తుంచుకోండి, మీరు కొన్ని గంటల్లో భయంకరమైన అనారోగ్యానికి గురవుతారు, ఆ క్యాన్సర్ మరణం ఫలితంగా భయంకరమైన అనారోగ్యంతో ఉంటారు. మీరు ఇంతకు ముందు నా కూడికలలో ఉన్నారా? మంచిది. మీ క్యాన్సర్ ఇప్పుడు చనిపోయింది. నేను మీకు చెప్పేది మీరు గమనించండి. నేను ఎనిమిది వారాలు ఇక్కడే ఉంటాను. నేను మీకు చెప్పింది మీరు కనుగొంటారు. ఆ సమయంలో మీరు వేదిక మీదకు వచ్చి మీ పరిస్థితి గురించి సాక్ష్యమివ్వాలని నేను కోరుతున్నాను. మీ క్యాన్సర్ మిమ్మల్ని వదిలివేస్తోంది.

33

అయ్యా...? ... చూడండి, మీ ప్రాణము ఆయనకు విలువైనది. మీరు భయానికి లోనవుతున్నారు, చాల ఎక్కువ భయానికి లోనవుతున్నారు. అదే మీ కడుపు ఇబ్బందికి కారణమైంది, ఎలా అంటే “మీ కడుపులో ఆమ్లము వంటిది పెరుగుతుంది, మరియు అదే మీ కడుపు మంటకు కారణం అవుతుంది మరియు అది ఒక అస్వస్థతని తెస్తుంది ...? ... అది చెడు వాసన వలె అనిపిస్తుంది. అది నిజమేనా? నాకు ఎలా తెలుసని మీరు అనుకుంటున్నారు? అయ్యా, అది నిజమే. నాకు తెలిసి నేను జీవితంలో ఇంతకు ముందెన్నడూ నిన్ను చూడలేదు, కానీ ఇక్కడ అది తెలుస్తుంది. ఈ గడ్డల క్రింద మీరు ఇక్కడ గమనించాలని నేను కోరుకుంటున్నాను ...? ... వాటిని చూడండి ...? ... గమనించండి. అవి ఎలా ఉన్నాయో చూడండి ...?... ఒక కంపనం ద్వారా దాని యొక్క పరిస్థితి ...? ... ప్రారంభమైంది ...?... అల్సరు (పుండ్లు) అంతటా ఉన్నాయి...? ... ఇప్పుడు ...?... మరియు అది ఆగాలంటే, నేను ఎంచెప్తున్నానో చూడండి? అవి, తెల్లటి గీతలాగా మారుతాయి? వాటిని చూడండి చిన్న తెల్లని మచ్చలు, అవి వచ్చి వెళ్లడం చూడండి. ఇప్పుడు, అది ...? ... సరే. ఇప్పుడు, నేను నా చేతిని అలా వదిలేస్తే, అవి ఆగిపోయి ఇలా తెల్లగా మారుతే, అప్పుడు మీకు స్వస్థత కలిగినట్టు. లేదంటే, అది అక్కడే ఉంటుంది. మీరు జీవించగలిగితే ... దేవునికి సేవచేస్తారా?

మా పరలోకపు తండ్రి, గుండీలు కలిగిన కోటు ధరించియున్న ఈ వ్యక్తి ఒక సేవకునిగా గ్రహిస్తున్నాను, ప్రభువా, మరియు మా అందరికీ ప్రియమైన దాని కోసం పోరాడుతున్నాడు. మరియు అతని దైర్యం గల ప్రాణము కొరకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము, ఎందుకంటే ... తిరిగి తెస్తుంది ... ఇప్పుడు, ప్రియమైన దేవా, ఏ హక్కుల కోసం అయితే అతను పోరాడుతున్నాడో, ఆ మతస్వేచ్చ, మా మనసాక్షి నిర్దేశి౦చినట్లుగా ఆరాదించే ఒక ఆరాదనా స్థలమును ఈ రోజు ఇతనికి చూపించండి, ఇతన్ని స్వస్థపరచుట ద్వారా ఈ స్థలములో నీవు ఏలుదువు గాక. [టేపు. లో. ఖాళీ.]

34

దానిని ఉంచండి ...? ... ఇప్పుడు, మీరు దీనిని నిరూపించారు ...? ... ఇప్పుడు, విశ్వాసం కలుగుతున్నది ...? ... ప్రియమైన దేవా, నీవు నిజంగా దేవుని కుమారుడవని ఈ మనుష్యుడు తెలుసుకొనును గాక...?... అతని జీవితం, నేను నీ సేవకుడిని. అతన్ని బంధింఛి ఉంచిన ఈ దయ్యమును కలవడానికి ముందుకు వెళ్ళే శక్తి తో నాకు సహాయం చేయండి ...? ... ఓ దెయ్యమా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ బాలుడిని వదిలి వేయమని నేను ఆజ్ఞాపిస్తున్నాను, అతని నుండి బయటకు రా. ఇదిగో వెళ్ళిపోయింది. ఇప్పుడు, యవ్వనుడా ...?... ఇప్పుడు, అది లేదు ...? ... యవ్వనుడా, నీకు అర్థమైందా? నేను కాదు ...?... సరే, ఇప్పుడు ...? ... ఇప్పుడు, ప్రేక్షకులైన మీరు, ఒక్క క్షణం తల పైకెత్తండి. కొన్ని క్షణాల్లో నేను మీ దృష్టికి ఒక గొప్ప ...? ...

ఇప్పుడు, నా చేయి ఆమె చేతిలో ఉంచాను, అది కొంచెం ఎర్రగా ఉంది ...? ... మరియు నా చేతినుండి వచ్చే చిన్న తెల్ల మొటిమల వంటివి అది స్వస్థ పడినప్పుడు ఆగిపోతాయి. అయ్యా, అది నిజమేనా? మరియు నా మరో చేయి సాధారణముగా ఉన్నది. నేను నా చేతిని కదల్చలేదు. స్థితుల మధ్యలో, నా పొట్టకి ఎదురుగా, ఈ విధంగా ఉంచాను. దాన్ని పైకి లేదా క్రిందికి కదిలించలేదు, అది ఉన్న చోటే ఉంది. మరియు నా చేయి ఖచ్చితంగా తెల్లగా ఉంది. ఇప్పుడు, దాని నుండి కనిపించేది జరిగింది, మీరు మీ కళ్ళతో చూడగలిగేది.

35

నీవు క్రైస్తవుడివా? ఇప్పుడు, మీరు ఎప్పుడు రక్షించబడ్డారో మీకు గుర్తుందా? మీరు ముందుకు కొనసాగి దేవుణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించారా? ఎందుకంటే మీకు ఏదో జరిగింది, అవునా. అప్పటినుండి మీరు దాని గురించి సాక్ష్యమిచ్చారు. సాతాను మీతో మాట్లాడాడు, మీరు సందేహించేలా చేసి దాని నుండి దూరం సాడు. కానీ మీరు దానిని గట్టిగా పట్టుకున్నారు. అదే పని చేయండి. మీరు అలా చేస్తే మీ కడుపు ఇబ్బందిపోతుంది ...? ... ఆ కడుపులోని పుండు(అల్సరు) మరియు అన్నీ స్వస్థపడతాయి. మీరు బాగవుతారు ...? ... మీకు? న్యూ మెక్సికో నుండి వచ్చిన ఆంథోనీ. మీరు ఈ ప్రాంతానికి తిరిగి వస్తే, మీరు వేదిక మీదకు వచ్చి రాబోయే కొద్ది వారాల్లో ప్రజలకు ఏమి జరిగిందో వారు తెలుసుకునేలా సాక్ష్యమిస్తారా? మీ పేరు ఏమిటి? బార్నెట్? బ్రదర్ బార్నెట్, దేవుడు నిన్ను దీవించును గాక.

ఈ అబ్బాయి సాక్ష్యం వినండి. ఇది ఖచ్చితంగా స్పష్టంగా ఉంది. నేను అతన్ని నా చేతితో పట్టుకున్నంత సేపు, అది ఎంత తెల్లగా మారిందో మీరు గమనించారా? అయ్యా, మీరు స్వస్థపడ్డారు. దేవుడు నిన్నుదీవించును గాక.

అందరూ “ప్రభువుకు స్తోత్రం” అని చెపుదామా. అందరూ. ఇప్పుడు తలలు వంచి స్తుతించండి ...? ...

36

మీరు మీ చేతిని నా చేయి మీద ఉంచండి. అది ఏమిటి? ఏమిటి? అది ఏమిటో నా చేతితో అనుభూతి చెందండి. ఇప్పుడు, చూడండి. మీ కడుపులో రక్తం కారుచున్న పుండు ఉంది. మీరు బాధపడుతున్నారు...? ... ఇప్పుడు, చూడండి. ఎలా ...? ... ఇప్పుడు నా చేతిపై, చూడండి...? ... ఇక్కడ ఇది ఎలా ఉందో చూడండి....? ... ఇప్పుడు, జాగ్రత్తగా - మర్యాదతో ఉండండి. యేసు స్వస్థపరచగలడని మీరు నమ్ముతున్నారా...? ... ?

మా పరలోకపు తండ్రీ, సమస్తమును మీకు తెలుసు, కల్వరీలో నీ మరణము ద్వారా ఇచ్చిన స్వస్థతా ప్రభావములు మీకు తెలుసు, అది నీ శక్తిని తీసుకుని వచ్చింది. ఏలీయా ఎత్తబడటం చూసిన తర్వాత, “ఏలీయా యొక్క దేవుడు మాట్లాడును గాక” అని ఎలీషా అన్నాడు. క్రీస్తు యొక్క దేవుడు ఇప్పుడు మాట్లాడును గాక.

ఓ దయ్యమా, ఆ స్త్రీని విడిచిపెట్టమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెలో నుండి బయటకు రా.

సహోదరి మీరు మీ తలను పైకి ఎత్తండి. వెలుగును చూశారా? ఇప్పుడు, మీరు మీ కళ్ళతో చూడగలుగుతున్నారు, అవునా? ఇక్కడ ఉన్న ఈ ఎరుపు మచ్చలు పోతాయి...? ... అది సరియైనదేనా? ఇప్పుడు, ఇంటికి వెళ్ళండి, మీరు బాగవబోతున్నారు. వెళ్లి మీ జీవిత కాలమంతా దేవుణ్ణి స్తుతి౦చ౦డి, దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ప్రతిరోజూ ప్రభువును స్తుతి౦చ౦డి. నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఆయన కోసం సాక్ష్యమివ్వండి. దేవుడు నిన్ను దీవించును గాక.

37

సహోదరి, నీవు నరముల బలహీనతను ఎదుర్కొంటున్నావు. చాలా బలహీనురాలిగా ఉన్నావు, నిజంగా ఆందోళన చెందుతున్నావు. మీరు ఆందోళన చెందుతున్న భావాలను పొందుతున్నావు. మంచిది, ఏమి చేయాలో మీకు తెలియదు. అది సరియేనా? అయితే సరే. మీరు ప్రార్థన చేయించుకోవడానికి రావాలని చాలా సార్లు భావించారు, అవునా? అయితే సరే. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లి ఆరోగ్యాంగా ఉండవచ్చు. నేను అడిగినట్లయితే...? ... జీవము కొరకు, ఆయన కోస౦ ఇది చేయండి.

సర్వశక్తిమంతుడవైన దేవా, మృతులలో నుండి తిరిగి లేపిన... ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, [టేపు. లో. ఖాళీ.]

దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములలో ఆమెను వదిలిపెట్టి బయటకు రా.

38

ఇప్పుడు, నేను ...? ... వాటిని బయటకు... ఇప్పుడు- ఇప్పుడు, అది కంపనాల ద్వారా రాదు. చేతిలో ఎలాంటి కంపనాలు లేవు. కేవలం, ఆమె కొద్దిగా స్త్రీవ్యాదితో ఉన్నది, ఆమె కడుపులో ఒక చిన్న సంచి వంటిది ఉంది. ఆమెకు కొద్దిగా కడుపు సమస్య ఉంది...? ... కడుపులో గ్యాస్ వంటిది ఎదో ఉంది. అమ్మా, అది సరియేనా? ఇప్పుడు, నాకు ఎలా తెలుసు? [ఆ స్త్రీ “కంపనాలు” అని జవాబిస్తో౦ది..] అవును. చూశారా?

మంచిది, ఇప్పుడు, ఇక్కడ ఏం జరుగుతుందంటే. ఆమెకు నరాల బలహీనత ఉన్నది. కానీ ప్రధానంగా, మానసిక, మనోవైకల్య పరిస్థితి. ఆమె ఆందోళన చెందుతుంది, మొదట ఇది ఒక పాత ముక్కలాగ...? ... మరియు మీకు మతి భ్రమిస్తుందన్నట్లు అనిపిస్తుంది. మీకు అదే విధంగా అనిపిస్తుందా?

39

ఇప్పుడు, అది ఏమిటి? ఇప్పుడు, ఇది అసాధారణమైనది. ఒకవేళ వైద్యుడు దగ్గరగా ఉన్నట్లయితే. మనిషి ఆ విదంగా ఉండటం సాధారణం కాదని వైద్యులకు తెలుసు. అది ఏమిటి? ఇది ఖచ్చితంగా శరీరానికి సంబంధించిన వ్యాధి కాదు. కానీ నేను ఆమె చుట్టూ ఎదో మబ్బులాంటి ఒక చీకటిని అనుభవిస్తున్నాను. మీరు ఎప్పుడైనా చీకటి ప్రదేశంలోకి, మూయబడిన దానిలోనికి, లేదా అలంటి ప్రదేశంలోకి ప్రవేశించి, ఒక్కసారిగా భయపడ్డారా? లేదా వీధుల్లో నడుస్తున్నప్పుడు, లేదా ఎక్కడైనా నడుస్తున్నప్పుడు భయపడిన అనుభవం ఎంతమందికి ఉంది? మిమ్మల్ని భయపెడుతున్నది అక్కడ ఏదో ఉంది. అది సరియేనా? మిమ్మల్ని ఆందోళనపరిచేది అక్కడ ఏదో ఉంది. ఈ మహిళను వెంటాడేది ఏదో ఉంది, అది ఆమెను అలా భావించేలా చేస్తుంది. కానీ ఇప్పుడు, అది తీసివేయబడింది. అది పోయింది. ఇప్పుడు, ఈ మహిళ ఇంటికి వెళ్లి మామూలుగా ఉండవచ్చు.

ఇప్పుడు, సహోదరి, మీరు న్యూ మెక్సికోకు దగ్గరగా నివసిస్తున్నారా?. సరే, రాబోయే నాలుగైదు వారాల్లో మీరు ఇక్కడ ఉంటే, ఇక్కడికి వచ్చి ఏమి జరిగిందో చూడండి. ఇప్పుడు, మీరు ఇప్పుడు సంతోషంగా వెళ్ళండి. దేవుణ్ణి స్తుతి౦చడ౦ ప్రార౦భి౦చ౦డి, “ప్రియమైన దేవా, ధన్యవాదాలు” అని చెప్పండి. ఇప్పుడు, ఆ మబ్బులాంటి చీకటి అనుభవం అంతా పోతుంది, మరియు మీరు ఇక పై అది కలిగి ఉండరు. అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

40

ఇప్పుడు, ఒక్క క్షణం మీ తలలు వంచండి...? ... ఇప్పుడు, ఇక్కడ ఒక పేద...? ... ఇది నిజంగా ఒక తీవ్రమైన పరిస్థితి. మీ అందరూ తల ఎత్తాలని నేను కోరుతున్నాను. మీరు నా చేతిని చూడాలని నేను కోరుతున్నాను. మీరు ఇక్కడ ఈ చేతిని చూడాలని నేను కోరుతున్నాను, మీరు అక్కడ నుండి చూస్తున్నారా... నేను ఈ వెలుగు కిందకి వస్తాను. ఇప్పుడు, నా చేతిని చూడండి..[టేపు. లో. ఖాళీ.] ... శరీరం. అతనిలో కణితి ఉంది. ఈ చేయి ఇక్కడ ఎంత తెల్లగా ఉందో చూడండి. మీరు చూడండి, నా చేయిపై అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఉన్నది. చూడండి? నా చేతిలో తెల్లగా కనిపించే ఎరుపు మచ్చలు ఉన్నాయి చూడండి...? ...

దీనమైనవాడు. వైద్యుడు మీ సమస్య గురించి ఏమి చెప్పారు? కణితియా? గ్రంధిలోని కణితి. అయితే సరే. ఇప్పుడు, 'దానికి ఆపరేషన్ కూడా చేయలేము. మరియు ఈ చిన్న పిల్లవాడిని దేవుడు బాగుచేస్తాడు అని నమ్మే విశ్వాస౦ మీకు ఉ౦దా? అది మీ ఒకే ఒక్క నిరీక్షణ, అవునా, మీకున్న ఏకైక నిరీక్షణ?

అయితే సరే. స్నేహితులారా, ఇప్పుడు మీ తలలు వంచండి. మీరు గమనించాలని నేను కోరుతున్నాను. నేను ఇది ఉన్న రీతిగా ఈ విధంగా నా చేతిని పట్టుకోబోతున్నాను. ఇప్పుడు, మీ తలలు వంచండి. అది వెళ్లిపోతుందని నేను చెప్పను. నేను దేవుడిని మాత్రం అడగగలను.

41

ప్రియ పరలోకపు తండ్రీ, ఒకవేళ ఇది నా చిన్న పిల్లవాడైన బిల్లీపాల్ అయితే అని నేను అనుకు౦టున్నాను. మరియు ఈ చిన్నవాడు ఇప్పుడు మీ ద్వారా తప్ప ఈ జీవితంలో జీవించడానికి వేరే మార్గమే లేకుండా ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ప్రపంచాన్ని నిర్మించిన విశ్వాసం ద్వారా... “మీరు నమ్మితే, నేను చేయగలను”, అని మీరు చెప్పారు. ప్రియమైన దేవా, మీతో ఇంతకంటే యధార్థంగా ఎలా ఉండాలో నాకు తెలియదు. తండ్రీ ఈ పేద చిన్నవాడు చనిపోబోతున్నాడు. వైద్యులు ఇక ఏమి చేయలేరు. కేవలం కృప కోసం మాత్రమే ఈ తల్లి ఇక్కడ నిలబడి ఉంది, ఎందుకంటే ఇది ఆమె చివరి అవకాశం అని ఆమెకు తెలుసు. చిన్నపిల్లవాడిని ప్రార్థన చేయించడానికి ఇక్కడకు తీసుకురావడమే ఆమె చేయగలిగిన చివరి పని. దేవా, కనికరము చూపించండి, తండ్రీ, చుపిస్తావా?

ఈ చిన్నపిల్లవాడిని వేధిస్తున్న ఈ దెయ్యం యొక్క కంపనాన్ని నేను ప్రజలకు చూపించాను. దేవా, అతని తండ్రి లేదా తల్లి, లేదా తన వంశావళిలో ఎవరైనా పాపం చేసినట్లయితే, ఏదో విధంగా క్షమించండి, ఓ క్రీస్తు, నన్ను నమ్మండి, క్షమించండి. మరియు మీరు ఈ దెయ్యం పై అధికారం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను.

కణితి అని పిలువబడే దయ్యమా, నేను యేసుక్రీస్తు నామమున నిన్ను కలవడానికి వస్తున్నాను. ఈ దినమున నీవు అతనిని విడిచి పొమ్ము. అతనిలో నుండి బయటకు రా. సర్వశక్తిమంతుడవైన మరియు అన్ని వరములు గల దేవా, ప్రియమైన దేవా, నాకు సహాయం చేయండి. [టేపు. లో. ఖాళీ.]

42

నీవు దేవుడవని, నేను నీ దాసుడనై యున్నానని నీ దేశము ద్వారా తెలియబడును గాక.

ఓ దయ్యమా, నిన్ను కలవడానికి వస్తున్నాను. యేసుక్రీస్తు నామమున నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఆ చిన్నబిడ్డను౦డి బయటకు రా.

మంచిది. సభికులారా, మీరు మీ తలలను ఎత్తవచ్చు. ఇప్పుడు, మీరు చూడండి, నా చేతి మీది అది లేదు ... ఇక్కడ ఉన్న ఎరుపు భాగం... ఇప్పుడు, అది తెల్లగా మారడం గమనించండి. అది వెళ్లిపోవడాన్ని మీరు చూడగలుగుతున్నారా? సభికులలో ఎవరైనా అది వెళ్లిపోవడాన్ని చూశారా? అక్కడ, ఖచ్చితంగా తెలుపు మరియు సాధారణంగా మారింది, కంపనం లేదా అసాధారణమైనది ఏమి లేదు. అమ్మా, మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఇక్కడ ఫీనిక్స్ లోనా? వచ్చే వారం అతన్ని తిరిగి తీసుకురండి. అతనికి ఏమి జరిగిందో నేను చూడాలనుకుంటున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక.

43

“ప్రభువుకు కృతజ్ఞతలు, తెలిపే వారముగా ఉన్నాము, అవునా?”. ఇవి కాదు... స్నేహితులారా, ఇవి మీరు గమనించని విషయాలు. కానీ అవి అదే విధముగా ఇక్కడ ఉన్నాయి. అవి జరుగుతున్నాయి. ఇప్పుడు, నమ్మకముతో, ప్రతి ఒక్కరూ. మీ తలలు వంచండి.

ప్రియమైన తండ్రీ, ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్న సోదరుడు, చేతి కర్రలపై ఉన్నాడు, ఒక కాలు తీసివేయబడినది, మరియు సాతాను తన గత పరిస్థితితో అతనిని ఇబ్బందిపెడుతున్నాడు. కానీ మీరు స్వస్థపరచడానికి ఇక్కడ ఉన్నారు. మీరు అతనిని బాగుచేయడానికి ఇక్కడ ఉన్నారు. దేవా, అతను తన చేతి కర్రలపై ఇక్కడ వికలాంగుడుగా ఉన్నాడు. తండ్రీ, బహుశా మీరు మరొక అవయవాన్ని నిర్మించగలరా...? ... అతనికి సరైనది లేకపోవచ్చు. కానీ మీరు ఇలా అన్నారు, “ నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.” ఓ తండ్రీ, ఇప్పుడు నీ సేవకుడిగా మారాడు, విన్నాడు...? ... సాతానా, యేసుక్రీస్తు నామమున ఈ మనుష్యుని విడిచిపెట్టుము. [బ్లాంక్.స్పాట్.ఆన్.టేప్.]...? ... దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, మీరు ఇక్కడ ఫీనిక్స్ లో నివసిస్తున్నారా. కంపనాలు ఆగిపోయాయి. మీరు తిరిగి వస్తారు కదా, మీరు రావచ్చు- వేదిక వద్దకు వచ్చి సాక్ష్యం చెప్పవచ్చు, తద్వారా ప్రజలు చూడగలుగుతారు.

44

ఓహ్, మీ కుమారుడా? నా చేతిని చూశారా? మీరు గమనించారా...? ... బాబూ, నేను యేసును అడిగితే, ఆయన నిన్ను స్వస్థపరిచి బాగుచేస్తాడని నీవు నమ్ముతున్నావా. నీవు...? ... దీనిని నమ్ముతున్నావా? నీవు కుంటివాడవు. నీవు స్వస్థపడినప్పుడు వెళ్లి యేసు నిన్ను స్వస్థపరిచాడని చిన్న పిల్లల౦దరికి చెప్తావా? మానవ రీతిగా చెయ్యవలసిన ప్రతి ప్రయత్నం చేసావు, అవునా? దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు వచ్చాడు...? ... నేను దీనిలో మాట్లాడుతున్నాను...? ... అమ్మా, నువ్వు దీనిని చూడాలని నేను కోరుతున్నాను. ఇది శారీరకంగా నల్లగా ఉంది. ఇప్పుడు, నా చేయి ఎక్కడ ఉందో చూడండి...? ...

సర్వశక్తిమంతుడవైన దేవా, నిత్యజీమునకు కర్త, ప్రతి మంచి వరమును ఇచ్చేవాడా, ఈ చిన్న పిల్లవాడిపై నీ ఆశీర్వాదాలను పంపుము. ఎప్పటికీ బాగుపడి సాధారణమయ్యే అవకాశం లేదని మేము గ్రహిస్తున్నాము. అతని తల్లి అతన్ని తీసుకు వచ్చింది. ఓ క్రీస్తు, కనికరము చూపుము. ఇది దాని చివరి నిరీక్షణకు దగ్గరగా ఉంది. దయచూపండి, చూపించవా, తండ్రీ? తండ్రీ, విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది అని మేము గ్రహిస్తున్నాము. ఈ చిన్న పిల్లవాడు తన వైద్యుడి వద్దకు తిరిగి వెళ్లినప్పుడు; “ఓహ్, అతనికి ఏమి జరిగింది? అతను స్వస్థపడుతున్నాడు.” అని వైద్యుడు చెప్పును గాక. దేవా, మరణం నుండి జీవమును మీరు అనుగ్రహించండి.

సాతానా, బిడ్డను విడిచిపెట్టుము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున సాతానా, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. అతను వెళ్ళిపోయాడు...? ... ఇప్పుడు, నా చేతికి ఏమి జరిగిందో మీరు చూశారా? మిన్నియాపోలిస్, మిన్నెసోటా అనే ప్రాంతము నుండి.

సభికులారా, మీ తలలు ఎత్తండి. ఇది మాయో వైద్యులేనా? అది మిన్నెసోటా యూనివర్సిటీ లోని వైద్యులు ఇది ధ్రువీకరించారు. ఇతడు బాగవ్వలేడని. అతనిపై ఎలాంటి ఆశలు లేవు. మరియు ఆమె అతనికి నయం అవ్వడానికి ఇక్కడికి ఫీనిక్స్ కు తీసుకు వచ్చింది. నేను ఈ వేదిక మీద నిలబడ్డాను అనేది ఎంత నిశ్చయమో, అంతే నిశ్చయంగా సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ పిల్లవాడి శరీరాన్ని తాకాడు..? ...

సహోదరి, ఇప్పుడు చూడండి. నా చేయి మీద కొన్ని క్షణాల క్రితం అక్కడక్కడ ఎరుపు రంగులో మచ్చలు ఏర్పడ్డాయి. అది సరియేనా? అమ్మా, నా చేయి ఇంకా అలాగే ఉందా? అది ఎరుపు మచ్చల నుండి తెలుపుకు మారడాన్ని మీరు గమనించారా? మీరు చూశారా? అయితే సరే...? ... బాబు, నీవు మిన్నెసోటాకు తిరిగి వెళ్ళవచ్చు, నీవు సాధారణ వ్యక్తిగా జీవిస్తావని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం...? ...

ఒకవేళ నీ సేవకుడు... ప్రియమైన దేవా, ఈ మధ్యాహ్నం ఇది మీ దైవసంకల్పం అని మీరు నాకు చూపించినందుకు నేను కృతజ్ఞుడిని. ఒక సంవత్సరం పాటు ప్రజలు వచ్చి “నా భార్యను స్వస్థపరచండి”, “నా కుమార్తెను స్వస్థపరచండి” అని అడిగినప్పుడు నేను నీ చిత్తమునకు బయట ఉన్నానేమో అనుకుని దానిని చేయలేదు... దేవా ఇప్పటినుండి, నేను మీ సహాయంతో మీరు ఏమి చెబితే అది నేను అనుసరిస్తాను, దయచేయండి ప్రభువా. మరియు మానవులను వారు ఉత్తమంగా భావించిన దానిని చేయనివ్వండి, తండ్రీ, నేను నీ నడిపింపును అనుసరిస్తాను.

ఇప్పుడు, ఈ స్త్రీ వద్దకు వెళ్ళడానికి నాకు సహాయం చేయండి, తండ్రీ, సాత్వికముతో కూడిన ఆత్మతో ఆమెలో ఉన్న ఈ శక్తిని గద్దించటానికి చేయండి. దుర్మార్గపు దయ్యమా, యేసుక్రీస్తు నామమున స్త్రీ నుండి బయటకు రా.

45

ఓహ్, దేవునికి స్తోత్రం, ఆయనను ప్రేమిస్తున్నారా...? ... సరే, మీ తలలను క్రిందికి ఉంచండి. మీరు ఎక్కడ నుండి వచ్చారు?...? ... కాలిఫోర్నియా నుండా...? ... నా మాటలు వినిపిస్తున్నాయా?...? ... ఇప్పుడు నేను చెప్పేది వినండి?...?... ఎలాగైన లోపలికి వెళ్ళాలని నిశ్చయించుకున్న ఆ స్త్రీ వలె, అవునా?...? ... మీరు స్పానిష్, మీరు నమ్ముతున్నారు అనటంలో ఏ ఆశ్చర్యం లేదు...? ... ఒక్కటి కూడా ఓడిపోవటం నేను ఎప్పుడూ చూడలేదు. అవును. చాలా మంచిది, ఇప్పుడు ఇంటికి సంతోషముగా వెళ్ళండి. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక...? ... దేవుడు నిన్ను దీవించును గాక, సహోదరి, ఇప్పుడు మీరు “దేవునికి స్తోత్రం” అని చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, మనిషి కార్యాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు మరియు దేవుడు చేసినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు తేడాను గమనించండి.

ఇప్పుడు మీ తలలు వంచండి...? ... ఈ స్త్రీ చెవిటిది, పూర్తిగా చెవిటిది...? ... సర్వశక్తిమంతుడవైన దేవా, కరుణి౦చమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను...? ... స్వస్థత పొందటానికి ఈ స్త్రీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ...? ... ఇక్కడ చెవిటి దానిగా నిలబడి ఉంది. మరియు తండ్రీ ఇప్పుడు మీరు సమీపముగా ఉన్నారని మీ ఆశీర్వాదాలు నాపై కుమ్మరించారని మరియు ఇప్పుడు ఈ మా సహోదరి స్వస్థపరచబడుతుంది అని నేను భావిస్తున్నాను. ఓ నిత్యమైన దేవా, ఇప్పుడు కనికరించండి మరియు మీ శక్తిని చాలా మంది అవిశ్వాసులకు ఒక అపహాస్యముగా మార్చినందుకు మా తప్పును క్షమింఛి మరచిపొమ్మని ప్రార్థిస్తున్నాము. మరియు మీరు ప్రజల ఎదుట శక్తిని ప్రదర్శించు కోవటానికి ఎప్పుడూ స్వస్థపరచలేదు కాని...? ... వారు నమ్ముట ద్వారా మాత్రమే స్వస్థపడగలరు... కాబట్టి మీరు ఇంకొక విదంగా ప్రజలను రక్షించరు ...కాని? ....కాబట్టి మీరు ప్రజలను రక్షిస్తున్నారు. వారు మిమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి వారిని రక్షిస్తున్నారు. ఓ క్రీస్తు, ఇప్పుడు మీరు బలం ఇచ్చి ఈ స్త్రీని స్వస్థపరుచుమని నేను ప్రార్థిస్తున్నాను. ఓ చెవిటి ఆత్మా, ఈ స్త్రీని విడిచిపెట్టుము. యేసుక్రీస్తు నామమున ఆమెనుండి బయటకు రా. నా మాట వినగలుగుతున్నారా? [సహోదరుడు బ్రాన్హాం చప్పట్లు కొడుతున్నాడు.] నేను చెప్పేది వినిపిస్తోందా? వినిపిస్తోందా?...? ...

46

ఇప్పుడు, సరే, మనము ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి కోసం ప్రార్థిద్దాము...? ... తండ్రీ, నేను ఈ చిన్న పిల్లవాడిపై చేతులు ఉంచాను, నీ కుమారుడు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సహోదరి, మీరు ఇప్పుడు నమ్ముతారా...? ...

తండ్రీ, నీ సేవకుడు ప్రార్థించడానికి వారు తీసుకుని వచ్చిన ఈ చిన్న అమ్మాయి కోసం నేను ప్రార్థిస్తున్నాను. నీవు బోధించిన విధ౦గా తండ్రీ, నేను ఆమెపై చేతులు ఉంచాను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగులను రక్షించును, మరియు దేవుడు వారిని లేపును అని మీరు చెప్పారు. మరియు యేసుక్రీస్తు నామమున మీరు స్వస్థపరచవలెనని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

సహోదరి , మీరు నమ్ముతున్నారా? దేవుడు నిన్ను దీవించును గాక. దేవా, కాలిఫోర్నియా నుండి వచ్చిన నా సోదరి కోసం నేను ప్రార్థిస్తున్నాను, ఆమె బలహీన స్థితిలో ఉంది. తండ్రీ, ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను...? ... నేను ప్రార్థిస్తున్నాను...? ... నేను చేతులు ఉంచాను...? ... ఓ తండ్రివైన దేవా, ఆమె కలిగి ఉన్న ఈ ఇబ్బంది నుండి మీరు ఆమెను స్వస్థపరుచుమని నేను ప్రార్థిస్తున్నాను...? ... మరియు నేను ఆమెపై చేతులు ఉంచాను...? ... యేసుక్రీస్తు నామమున మీరు ఆమెను స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రీ, మీరు ఈ వ్యక్తి కలిగినయున్న ఇబ్బంది నుండి స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను...? .... మీరు అతనిని బాగుచేస్తారని మేము ప్రార్థిస్తున్నాము...? ... నేను నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఆశీర్వాదమును అడుగుతున్నాను. ఆమేన్. అయ్యా, మీరు నమ్ముతున్నారా? అయితే సరే. దేవుని కుమారుడైన ఓ యేసు, మీరు ఈ చిన్నపిల్లవాడిని స్వస్థపరుచి అతనిని బాగు చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రీ. అతనికి ఒక అంటు వ్యాధి సోకిందని వారు చెప్పారు, మరియు మీరు యేసు క్రీస్తు నామములో అతనిని స్వస్థపరుచుమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. బాబు, దేవుడు నిన్ను దీవించును గాక.

తండ్రీ, ఈ మధ్యాహ్నం ఇక్కడికి తీసుకురాబడిన ఈ చిన్న పిల్లవాడిని మీరు స్వస్థపరుచుమని నేను ప్రార్థిస్తున్నాను. దేవా, నేను చేతులు ఉంచగా నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున నీవు ఇతన్ని స్వస్థపరచి బాగుచేయుమనియు నేను అడుగుతున్నాను. ఆమేన్...?...

47

త౦డ్రి, మీరు నా సహోదరుడుని స్వస్థపరిచి, ఆయనను బాగుచేయమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున నేను దానిని అడుగుచున్నాను. ఆమేన్. ఓ దేవా, మీరు ఈ వ్యక్తిని స్వస్థపరుచుమని నేను ప్రార్థిస్తున్నాను...[టేపు. లో. ఖాళీ.] మరియు యేసుక్రీస్తు నామములో ఆయనను బాగుచేయమని, నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఓ దేవా, మీరు ఈ అబ్బాయిని స్వస్థపరిచి, యేసుక్రీస్తు నామములో అతనిని బాగుచేయుమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవా, మీరు ఈ స్త్రీని స్వస్థపరచాలని, యేసుక్రీస్తు నామమున ఆమెను బాగుచేయుమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రీ. ఓ దేవా, మీరు నా సోదరిని స్వస్థపరిచి, తండ్రీ, ఆమెను బాగుచేయుమని నేను ప్రార్థిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో నేను అడుగుతున్నాను. ఆమేన్. దేవుడు దేవించును గాక...? ...

మీ సమస్య ఏమిటి?...? ... లేదు, మీరు నా చేతిని చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ భక్తి గౌరవంతో ఉండండి, నేను మీతో కొన్ని క్షణాలు మాట్లాడాలనుకుంటున్నాను. విడిచిపెట్టవద్దు, ఇది చాలా ముఖ్యమైనది, ఇప్పుడు విడిచిపెట్టవద్దు. మరో రెండునిమిషాలు...? ...

దేవా, మీరు స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను...? ... ప్రభువా, ఆమెను బాగుచేయండి...? ... క్రీస్తు నామమున నేను ప్రార్థిస్తున్నాను...? ... దేవా, మీరు స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను...?... నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. దేవా, మీరు నా సహోదరుడిని స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను...? ... దేవా, నా సహోదరిని స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామమున మీరు ఆమెను బాగుచేయమని నేను ప్రార్థిస్తున్నాను. దేవా, యేసుక్రీస్తు నామమున మీరు నా సహోదరుడుని స్వస్థపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవా, నా సోదరుడిని స్వస్థపరచుమని, యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను...? ... దేవా, నా సహోదరుడిని స్వస్థపరచండి...?... దేవా, నా సహోదరిని స్వస్థపరచుము, యేసు నామములో...? ...

మీరు ఎన్నడూ...? ... ఎప్పుడైనా ఒక...? ... అనారోగ్యంతో, కనీసం అరడజను లేదా రెండు డజన్లు లేదా అంతకంటే ఎక్కువ అయిన గొప్ప అసాధారణ స్వస్థతలు ఇక్కడ జరిగాయి, అవునా? అది సరైనది అయితే, మీ చేతులు ఎత్తండి. అవును. ఇప్పుడు వాటిని ఎవరు చేశారు? నేను మీకు మొదట్లో చెప్పాను... సహోదరుడు కిడ్సన్ సాధారణ౦గా అనారోగ్య౦తో బాధపడుతున్న వారిని తీసుకొని వచ్చి, వారిని ము౦దు వరుసలో ఉంచుతాడు. ఆ విధంగా ఇక్కడ అద్భుతాలు జరుగుతుండడాన్ని చూసి ప్రజలు విశ్వసించులాగున అవి చేస్తాయి. అవునా? మీరందరూ కూడికలలో దానిని చూశారు. ఆ విధముగానే ప్రజలు పరుగెత్తి ముందు వరుసకు రావటానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ సుమారు రెండు వేల మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను, లేదా దానికి దగ్గరగా లేదా పదిహేను, పద్దెనిమిది వందల మంది ఉంటారని నేను అనుకుంటున్నాను, ఇక్కడ మీ అందరి ముందు, నేను దేవునికి వాగ్దానం చేశాను.

48

ఇప్పుడు, చూడండి, నేను దేవునికి వాగ్దానము చేశాను, ఇది అయన చిత్తమైతే ఈ మధ్యాహ్న౦ నా ము౦దుకు వచ్చే ప్రతి ఒక్కరిపట్ల ఈ అద్భుతాలను ప్రదర్శించమని నేను కోరాను. అవునా? నేను దీనిని చెప్పడం ఎంతమందికి గుర్తుంది, “ఆమేన్” అని చెప్పండి. అది ఆయన చిత్తం కాకపోతే, నేను ఇక నుండి తెలుసుకుంటాను, మరియు ఇక నుండి నా ముందు అద్భుతాల వరుసను అనుమతించనని నేను ఆయనకు చెప్పాను.... అవునా? నేను దీనిని చెప్పడం ఎంతమందికి గుర్తుంది, “ఆమేన్” అని చెప్పండి. కాని ఈ మధ్యాహ్నం ఇక్కడ ఒక చెవిటి వ్యక్తి తప్ప, అది కూడా ఆయన స్వస్థత పొందిన కారణాన్ని బట్టి ఆయన అద్భుత వరుస నుంచి ఎవరో ఆయనను బయటకు లాగివేసారు. అవునా? నేను నా జీవితంలో ఇంతకు ముందెన్నడూ దీనిని చూడలేదు.

ఇప్పుడు సర్వశక్తిమ౦తుడైన దేవుని సహాయ౦తో, ఎవ్వరూ కూడా “ఈ వ్యక్తిని స్వస్థపరచుము” అని చెబుతూ నా దగ్గరకి తీసుకురాకుడనేదే నా కోరిక. దేవుడు ఆ విధంగా అందరిని స్వస్థపరిచి దానిని ఈరోజు వరకు నిలిపి ఉంచాడు. ఇల్లినాయిస్ లోని వా౦డిలియాలో దేవదూత నన్ను కలుసుకున్నాడని నేను చెప్పడం ఇక్కడ ఎ౦తమ౦ది విన్నారు, ఆ ఉదయ౦ ప్రజల ము౦దు నేను సాక్ష్యమిచ్చాను. గదిలో ఒక పెద్ద వర్షధనస్సులో పొగమంచువలె ఆ ప్రజల ముందు నిలబడి, నేను ఈ అద్భుతాలు చేయుటకు మాత్రమే ఆ స్వస్థతా వరమును పరిమితం చేస్తున్నానని నాకు చెప్పాడు. నేను అలా చెప్పడం ఎంతమందికి గుర్తు ఉంది?

సరే, నేను సరిగ్గా అలాగే ముందుకు వెళ్ళాను ఎందుకంటే ప్రజలు దీనిని నా ముందుకు తీసుకువచ్చి, “మీరు దాని గురించి దీని గురించి జాగ్రత్తలు తీసుకోండి” అని చెప్పారు. ఈ మధ్యాహ్నం వరకు నేను నాజీవితంలో ఎన్నడూ ఈ స్వస్థత వరం ఎదుటికి వచ్చి స్వస్థపరచబడకుండా ఉండేది నేను చూడలేదు. అయితే నేను దేవుని చిత్తాన్ని చేయుటకు మాత్రమే నిశ్చయించుకున్నాను. ఈ రోజు అది అలా జరిగింది, నేనే దానిని చెప్పి, నాకు నేనుగా ఇక్కడికి వచ్చి అనారోగ్యంతో ఉన్న వారికి ప్రసంగించే వేషదారిని కాదని దేవునికి తెలుసు.

కాని బిలాముతో, మనుషులు, “ఏదేమైనా మీరు రండి. ఈ ప్రజలను శపించండి. ఈ ప్రజలను శపించండి” అని చెప్పింది విన్నాడు. నిన్న రాత్రి నేను మీకు చెప్పాను... మొన్నటి రాత్రి నేనున్న గదిలో దేవుని దూత నిలబడి ఉన్నాడని మీతో చెప్పాను; అది గుర్తుందా? ప్రజలారా నాకు ఆ సాక్ష్యం చాలు. ఎవరూ పైకి వచ్చి“వీరిని స్వస్థపరచండి, వారిని స్వస్థపరచండి.” అని చెప్పడం నాకు ఇష్టం లేదు. దేవుడిని సాక్ష్యమివ్వనివ్వండి...? ... సరే. ఇప్పుడు అది నిజం.

49

ఇప్పుడు, వచ్చే ఆదివారం, మనము ఎల్లప్పుడూ చేస్తున్న ప్రకారమే ప్రార్ధనావరుసను పెట్టబోతున్నాము. ఇప్పుడు చూడండి, ఈ రోజు ఈ మొత్తం కూడిక నుండి, చాలా మంది చెవిటి వారు ఇక్కడకు వచ్చారు, మరియు నేను దానిని పిలిచినప్పుడు, ఆ కంపనాలు నా చేతిని వదిలి వెళ్ళలేదు, అది సత్యం. అయితే అది వెళ్లిపోతుంది, తరువాత వారిని తీసుకుని మరలా రండి. అది కేవలం ఒక సాక్షం మాత్రమే.

ఇప్పుడు, ఈ రోజు ఇక్కడ ఉన్న అదే చెవిటి మరియు మూగ ప్రజలు వచ్చే ఆదివారం కూడా రావాలని కోరుచున్నాను, కేవలం ఒక సాధారణ వరుసలోకి రావాలని నేను కోరుచున్నాను. మామూలుగా వరుసలోకి రండి. జ్ఞాపకం ఉంచుకోండి, ఎవ్వరు కూడా నా వద్దకు వచ్చి, ఇకపై ఏవైనా అద్భుతాలు చేయమని నన్ను అడగవద్దు, చూడండి. ఇప్పుడు, దేవుడు ఇంత వరకు దానిని అనుమతించాడు, మరియు మీలో ప్రతి ఒక్కరూ దానికి సాక్షులు. అవునా? “ఆమేన్” అని చెప్పండి.

ఆయన అద్భుతాలు చేస్తూనే ఉంటాడు, కానీ అద్భుతాన్ని తీసుకువచ్చేది వారు కాదు. నేను ఇక నుండి ఏమి చేసినా దేవుని ఆత్మచేత నడిపింపబడాలని కోరుతున్నాను; దాని గురించి సహోదరుడు కిడ్సన్ లేదా మరెవరైనా ఏమి చెప్పినా దానితో స౦భందం లేదు. ఇది నాకు మరియు సర్వశక్తిమంతుడైన దేవునికి చాలిన సాక్ష్యం. నేను చెప్పింది సరియేనని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే మీ చేతిని పైకి ఎత్తండి...? ... నేను ఇప్పుడు వీటన్నిటిని సరిచేయు క్రమములోనికి వస్తున్నాను అనుకుంటున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశీర్వదించి, కనికరము చూపునుగాక.

50

ఇప్పుడు, వచ్చే వారం స్వస్థపరచబడుటకు తిరిగి ఇదే ప్రజలను వరుసలోకి లేదా ఇతర వరుస ద్వారా వారిని తీసుకురండి. కానీ ఎవరూ నన్ను “ఇక్కడకు వచ్చి ఈ వ్యక్తిని స్వస్థపరచండి, వారిని స్వస్థపరచండి” అని అడగవద్దు. ఎవరిని ఆపాలి, ఎవరిని ఆపకూడదు అని పరిశుద్ధాఆత్మే నాకు చెప్పాలని కోరుతున్నాను, అది సరియేనా? ఆమేన్, ఇప్పుడు మీరు చేయగలిగి నట్లయితే ఒక్క క్షణం నేను ఆయనతో మాట్లాడుతుండగా తలలు వంచుదాం. స్నేహితుడా భక్తి గౌరవంతో ఉండండి, అగౌరవముగా ఉండవద్దు...? ...

తండ్రీ, మీ గొప్ప హస్తమును నేను నమ్మగలుగు నట్లు చేసినందుకు, నేను ఈ రోజు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొన్న రాత్రి మీ దూత ఎందుకు గదిలోకి వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన సాక్షిగా ఉన్నాడు. దేవా, నేను తప్పుగా అనుకున్నాను. ఆ ఘడియ నుండి నేను తప్పుగా అనుకున్నాను...? ... ఇప్పుడు తండ్రీ, మీరు మీసేవకుడిని క్షమించండి...? ... మరియు ఈ రోజు నుండి, నాకు తెలిసినంత వరకు, నేను చేస్తాను...? ...

అయితే ఈ రోజు...? ... నేను అందరిని ప్రార్థన వరుసలో లేదా అద్బుతముల వరుసలో ఉంచాలో లేదో అని చూసాను. మరియు మేము చెప్పాము, లేదా మిమ్మల్ని అడిగాము, ఒకవేళ మీరు ప్రతీ ఒక్కరిని ఇక్కడికి తీసుకువచ్చి స్వస్థపరచినట్లైతే, మరియు నేను ఆ విధంగా కొనసాగితే అప్పుడు అద్భుతముల వరుస తప్ప మరొక్కటి ఉండదని గ్రహిస్తాను. కానీ మీరు అద్బుతముల వరుసలో ప్రజలను స్వస్థపరచకపోతే, అప్పుడు వారు ఈ వరుసలో వచ్చి నమ్ముట ద్వారా నీవు వారిని స్వస్థపరచబోతున్నావని అది ఒక సూచనగా ఉండును...? ... అయితే ఒక అద్భుతం జరిగితేనే తప్ప వారు నమ్మరని దేవదూత నాతో చెప్పాడు. మరియు మీ మాటలు రుజువు పరచబడ్డాయి. సర్వశక్తిమంతుడైన దేవా, నా అజ్ఞానాన్ని క్షమించండి. మరియు మీరు ఇప్పుడు నాతో ఉండాలని మరియు ఇకనుండి నాకు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమయం నుండి తండ్రీ, నేను మీ ఆత్మ నడిపింపు ప్రకారమే వెళతాను. దేవా, నన్ను క్షమించండి, ఇక్కడ వేలాది మంది సాక్షుల ముందు, లేదా వందలాది మంది ముందు, మీరు ఇక్కడ ఉన్నారనియు మరియు ఈ రోజు మీ వాక్యమును దృఢపరిచారనియు తెలుసుకుని ఈ మధ్యాహ్నం ఈ భవనం నుండి ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేయండి.

తండ్రీ, దానిని అనుగ్రహించండి, వచ్చే ఆదివారం గతంలో జరిగిన గొప్ప కూడికగా ఉండును గాక. అప్పుడు తండ్రీ, మీ గొప్ప నామము మహిమ పరచబడుతుంది, యేసు నామములో మేము అడుగుతున్నాము. ఆమేన్.

51

కూడికలోని ఎంతమంది సభికులు నేను చేస్తున్నది సరియైనదని అనుకుంటున్నారని నేను తెలుసుకోవాలని కోరుచున్నాను? ఇక్కడ ఎం జరిగిందంటే. ఆ ముందు వరుసకు వెళ్లడానికి ఒక గందరగోళం మరియు తోపులాట జరిగింది, అవునా? ఒక తోపులాట మరియు గందరగోళం, ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయత్నించారు...? ... ఈ సమయం నుండి, దేవుడు నా సహాయకారిగా, నేను ఒక్కటే ప్రార్ధనా వరుసలో క్రమముగా పిలుస్తాను. నిలబడి ప్రజల కోసం కేవలం ప్రార్థిస్తాను, మరియు వారు నన్ను నమ్మవలెను; వారు నమ్మని వారుగా ఉన్నారు. స్త్రీలు వరుసలో వెళ్లినప్పటికి ఇక్కడికి తిరిగి వచ్చి, “నేను ప్రార్థించబడలేదు” అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే అక్కడ ఏ అద్భుతం జరగలేదు. నా కార్యదర్శికి వందలాది ఉత్తరాలు వచ్చాయి, వాటిలో “నేను ఆ వరులో వెళ్లినప్పటికీ, వారు నా కోసం ప్రార్ధించను కూడా ప్రార్ధించలేదు” అని రాసారు. స్నేహితులారా, మీరు నమ్మవలసి ఉన్నది, మరియు మీరు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే నమ్మాలి.

ఇప్పుడు, మీరు ఈ వారమంతా వచ్చే ఆదివారం కోసం నా కోసం ప్రార్థిస్తారా, మనము తిరిగి వచ్చి ప్రభువు తన ప్రజలను పరచడాన్ని చూద్దాము. దేవుడు మిమ్మును దీవించును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...