గొర్రెల యొక్క మంచి కాపరి

గొర్రెల యొక్క మంచి కాపరి

VGR COUNT-195 కొన్ని క్షణములపాటు అలాగునే నిలబడియుండి ప్రార్ధన కొరకు మన తలలను మంచుదాము.

అత్యంత దయగల వూ పరలోకపు తండ్రి, మా పట్ల మీరు చూపిన మంచితనమంతటినిబట్టి, ఈ రాత్రి నీ సన్నిధిలోనికి వచ్చి నీకు కృతజ్ఞతలు చెల్లించుట మాకు ఒక భాగ్యమైయున్నది. మరియు మీరు మాకు ఇచ్చు దీవెనలన్నింటికి మేము అయోగ్యులము. అయితే మేము ఒక వాగ్దానము కలిగియున్నాము, అదేమనగా “దేవుని ప్రేమించువారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి.” వాక్యముపై మా ఆత్మలు విశ్రమించుచున్నవి.

ఈ రాత్రి నీ దీవెనలు మాపై క్రుమ్మరించుమని మేము ప్రార్థన చేయుచున్నాము. మాకు అవసరమైన దానిని నీ పరిశుద్దాత్మడు వచ్చి ప్రతి హృదయమునకు ఇచ్చును గాక. ఏలయనగా తెరువబడిన హృదయములతో మేము ఇక్కడ నిలబడి వేచియున్నాము; యేసు నామములో. ఆమెన్.

మీరు కూర్చొనవచ్చును.

2

ప్రభువు చిత్తమైన యెడల రేపు ఉదయమున.... (ఈ వస్తువు యొక్క ముందు మరియు వెనుక ఎటో నాకు తెలియదు. నా గొంతు బొంగురుపోయినందున, ఆ ఇంజనీరు దానిని తగినంతగా సరిగా తీసుకొనవచ్చును. నీకు వందనములు.)

ప్రభువు చిత్తమైన యెడల రేపు ఉదయమున మేము అల్పాహార విందును తీసుకొనవలసియున్నది, ఒక సేవకుల అల్పాహారవిందు మరియు ప్రభువు చిత్తమైన యెడల, ఫినిక్సులోని ప్రతి సేవకుడు అక్కడ యుంటాడని నేను నమ్ముచున్నాను. నేను కొంచెము వారితో మాట్లాడగోరుచున్నాను. కాబట్టి సహోదరులారా, మీకు సాధ్యమైన యెడల, అక్కడ యుండుటకు ప్రణాళిక వేయండి ఆ స్థలము ఎక్కడో నాకు తెలియదు. మిల్లర్స్ యొక్క కాఫీశాలలో మన యొక్క అల్పాహారవిందు కొరకు వారు స్థలమును ముందే సిద్ధపర్చియుంటారని నేను అనుకోనుచున్నాను. గ్రూమర్ సహోదరుడా, అది ఉదయము తొమ్మిది గంటలేనా? తొమ్మిది గంటలకే? తొమ్మిది గంటలకు.

3

ఈ స్థలము ఈ వేదిక స్థలము తమాషా చేసే స్థలము కాదు. అయితే కొన్ని క్షణముల క్రితము ఒక చిన్న విషయమును ఒక ఫోను పిలుపును నేను వినియున్నాను, అది నన్ను పలకరింపజేసినది, నేను ఒక చిన్న కుర్రవానిని కలిగియున్నాను. ఆ కుర్రవానికి 18 నెలలు వయసు, నా భార్య నాతో ఇక్కడ యుండగా ఆ బాలుని యొక్క నానమ్మ ఆ బిడ్డపట్ల శ్రద్ధ వహించుచున్నది. తల్లి ఎంతో బొంగురుపోయిన గొంతుతో ఉన్నది, ఆమె మాట్లాడలేదు. ఆ విషయము ఏమిటని ఆమె తెలుసుకొనగోరినది, ఆ చిన్న యోసేపు లోపల తాళం వేసుకొనినందున, ఆమెలోనికి రాలేకపోయినది. ఆమె ఏమాత్రం లోనికి రాలేకపోయినది. తాళపుచెవి లేదు, తాళపుచెవి లోపల ఉండిపోయినది. 18 నెలల బాలుడు చివరిగా ఆ బాలుడు ద్వారము నొద్దకు వచ్చి తనకై తాను ఆ తలుపును తెరిచి ఆమెను లోనికి తిరిగి రానిచ్చెను. హనీ, నీవు వెళ్ళిన తర్వాత దానిని అతడు తీసుకొన్నాడా? హ-హ-హ. నేను దానికొరకు ఈ రాత్రి వెల చెల్లిస్తాను.

ఓ, ఇక్కడ యుండుట ఎంతో మంచిది, నా గృహమునొద్ద అక్కడ ఎంతో మంచు ఉన్నట్లుగా వారు నాకు చెప్పారు. మార్గమంతయు చల్లగా యున్నది. సహోదరుడు సాత్మన్ గృహమునొద్ద యున్నాడు. అతడు నన్ను మొన్నటి దినమున ఫోన్లో పిలిచాడు, మరియు అక్కడ ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు తక్కువగా ఉన్నదని చెప్పాడు, కాబట్టి ఈ సంవత్సరములో ఈ ఋతువులో ఫీనిక్స్ చుట్టుప్రక్కల మీరున్నందుకు ఎంతో కృతజ్ఞత కలిగియుండాలి.

4

ఇప్పుడు ప్రభువు చిత్తమైన యెడల ఒక చిన్న అంశమును ఈ రాత్రికి మనము చదువగోరుచున్నాము, ప్రభువు ఆ అంశమునకు తగిన ఒక సందర్భమును ఇచ్చును గాక, యోహాను సువార్త 10వ అధ్యాయము నుండి యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుండి 7వ వచనం మరియు 14వ వచనం నేను చదువగోరుచున్నాను.

“కాబట్టి యేసు వారితో ఇట్లనెను. గొర్రెలు పోవు ద్వారమును నేనే.”

మరియు 14వ వచనం:

“నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెలను యెరుగుదును.”

ఇపుడు 7వ వచనం ఎలా చదువబడుచున్నదో మీరు గమనించినట్లైతే:

...కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. మరియు ఇక్కడ ఆయన మంచి కాపరి అని చెప్పుచున్నాడు.

5

ప్రభువైన యేసు కంటె మరి ఏ ఇతర గొప్ప సంగతి మనం మాట్లాడుటకు లేదని నేను నమ్ముచున్నాను. మనం మాట్లాడే అతి గొప్ప వ్యక్తి ఆయనేయైయున్నాడు. మరియు ఆయనను గూర్చి మాట్లాడుటకు, ఆయన్ను గూర్చి గొప్పలు చెప్పుటను నేను ప్రేమిస్తాను, ఏలయనగా ఎవరైననూ చెప్పే అన్ని కార్యములకు ఆయన యోగ్యుడైయున్నాడు. మరియు ఇంకను నా స్వరములో నేను దానినెన్నడూ కనుగొనియుండలేదు.... లేక, నా ఆలోచనలో, ఆయన నా కొరకు చేసిని వాటన్నింటి కొరకు నా కృతజ్ఞతను ఏ మాటలతో వ్యక్తపరచాలో ఆ మాటలను నేనెన్నడూ నా కొరకు ఇతరుల కొరకు ఇంకనూ కనుగొనలేదు.

మరియు ఈ రాత్రి ఆయన గొర్రెల యొక్క మంచికాపరిగా నేను ఆయన్ను గూర్చి మాట్లాడగోరుచున్నాను. మీకు తెలుసా, ఆ చిన్న జంతువైన గొర్రెను గూర్చి మనం ఎన్నో సంగతులు నేర్చుకుంటాం. బహుశా ప్రభువు చిత్తమైన యెడల రేపు రాత్రికి, అల్పాహారం తర్వాత రేపు దక్షిణ ఆరిజోనాకు వెళ్ళుటకు నేను విమానమును ఎక్కనవసరం లేనట్లైతే, నేను దాని మీద మాట్లాడగోరుచున్నాను. ఆ అంశము గొర్రెపిల్ల మరియు పావురము. మరియు ఈ రాత్రి గొర్రెపిల్లను గూర్చి మాట్లాడాలని నేను తలంచియున్నాను, ఆ విధంగా రేపు రాత్రికి బహుశా ఆ అంశమును నేను క్లుప్తపరచవచ్చును.

6

గొర్రె ద్వారా ఎన్నో విషయములను మనం నేర్చుకుంటాము, మీరు వాటిని గమనించినట్లైతే మరియు వాటి చర్యలను కనిపెట్టినట్లైతే, గొర్రె ఒక బలిఅర్పణ జంతువైయున్నది, చిన్న నిష్కపటమైన జీవి. అది తప్పిపోయినపుడు అది పరిపూర్ణముగా ఒక నిస్సహాయురాలుగా ఉంటుంది. ఆ కారణమును బట్టియే యేసు మనలను గొర్రెలుగా పోల్చి యున్నాడని నేను అనుకుంటాను, కారణము అవి తమ దారిని మరల కనుగొనలేనివానిగా కనబడతాయి. అవి వాటిని నడిపించుచున్న ఎవరి మీదనో అవి ఆధారపడవలసియున్నవి. మరియు అవి ఒకదానినొకటి నడిపించలేవు. అవి కేవలము దానిని చేయలేవు. మరియు అది ఒక సంగతిని నాకు చూపబోవుచున్నది: దేవుని స్వాస్ధ్యములోని గొర్రెలుగా మనం పోల్చబడి యున్నట్లైతే, అప్పుడు మనం ఒకరిని ఒకరము నడిపించలేము. మనం నిస్సహాయులమై యున్నాము. మరియు మనము ఆ గొప్ప గొర్రెలకాపరియైన ప్రభువైన యేసు మీద తప్పక ఆధారపడవలసి యున్నది.

ఒకసారి నేను గొర్రెల యొక్క వధశాలను గమనించియున్నాను... గొర్రెలను ఎలా వధిస్తారో ఒకరు నాకు చెప్పారు. గొర్రెలశాల నుండి వారు వాటిని బయటకు రానిస్తారు, ఒక మేక వాటిని వాటిముందుండి నడిపిస్తూ అతివేగముగా క్రిందకు దూకి పారిపోతుంది, అప్పుడు వారు గొర్రెను అక్కడ పట్టుకుని వధిస్తారు అవి ఒక మేకను వెంబడిస్తాయి. మరియు ఈ మేక వధించబడు ఆ స్థలమునకు గొర్రెను నడిపిస్తుంది, మరియు అప్పుడు వాటిని నడిపించిన మేక ప్రక్కకు తప్పించుకుంటుంది, అప్పుడు ఆ గొర్రెలు తిన్నగా వాటి మరణమునకు వెళ్ళిపోతాయి. అది సరిగ్గా మేక యొక్క స్వభావమై యున్నది.

7

ఒక వ్యక్తి తన గొర్రెలను గూర్చి నిజముగా ఎరుగకపోయినట్లైతే, ఒక గొర్రె మరియు ఒక మేక యొక్క అరుపు మధ్య బేధమును చెప్పుట చాలా కష్టము. అవి మొత్తానికి అంతా ఒకే రీతిగా ఉంటాయి. అయితే అవి ఏమై యున్నాయో వాటి యొక్క స్వభావం దాన్ని ఋజువు చేస్తుంది. మేము క్రైస్తవులము అని ఒప్పుకొనేవారు మరియు నిజమైన క్రైస్తవుల మధ్య కూడా అదే విధానముతో యున్నది. మేక లోకమును సూచిస్తుంది. అది నిన్ను తప్పు మార్గములోనికి తిన్నగా దేవుని నుండి నిత్యమైన యెడబాటుకు అవి నిన్ను నడిపిస్తాయి. అవి నిన్ను ఇబ్బందిలోనికి నడిపిస్తాయి. కాబట్టి మనము గొర్రెలము అయినట్లైతే ఎలాటి కాపరిని మనము కలిగియున్నామో గమనించుట మంచిది.

ఒక విధంగా గొర్రెలు ఒక చిన్న వింతైన జీవులుగా యున్నవి. ఈ రాత్రి గొర్రెను గూర్చి మరొక విషయాన్ని మనము నేర్చుకుంటాము, వాతావరణము బాగా వేడిగాయున్నప్పుడు, మీరెన్నడైనా గొర్రెలను గమనించారా? అవి ఒకటి ఒక స్థలములో, మరియు మరొకటి మరొక స్థలంలో ఉండి అలా తమ్మును-తాము వేరుచేసుకొనలేవు. అయితే ఆ దినము యొక్క వేడి వాతావరణము యొక్క మధ్యలోనే గొర్రెలన్నియూ ఏకముగా నిలబడి ఉంటాయి. అవి ఏమి చేయుచున్నవో మీకు తెలుసా? అవి ఒకదాని కొకటి నీడను ఏర్పరచుచున్నవి. అవి సహవాసమును కలిగియున్నవి.

8

వాతావరణం వేడిగా యున్నప్పుడు దేవుని గొర్రెలన్నియూ ఏకముగా కలసి నిలబడుట అది మంచి కార్యముగా యుండదా? శోధనలు ఎంతో కఠినముగా యున్నప్పుడు మరియు వాతావరణం వేడిగా కొనసాగుచున్నప్పుడు మరియు ప్రతీచోట ప్రతిదీ భిన్నముగా యున్నప్పుడు, దేవుని చిన్న గొర్రెలన్నియు సరిగ్గా ఏకముగా నిలబడినప్పుడు, ఒకదానినుండి ఒకదానికి చల్లదనము, నీడను మనము కలిగియుంటాము, అదే ఒకరిపై ఒకరు ఆనుకొనియుండుటలోని ఆదరణయై యున్నది.

ఇప్పుడు, ఎవరో అన్నారు “బ్రెన్హాం సోదరుడా అది అవసర మంటారా?” నిశ్చయముగా అది అవసరమై యున్నది. ఇబ్బందులు మంటలు వలె చెలరేగుతున్నప్పుడు, ఆ వేడి వాతావరణం కొనసాగుచున్నప్పుడు, ఒక నిజమైన స్నేహితునిపై ఆధారపడుటకంటే ఇంకా అక్కడ ఏమియూ లేదు. నీవు ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి కూర్చొని, వాటన్నిటిని చక్కగా నీవు వివరిస్తావు, వ్యక్తిగతమైన నమ్మకంతో నీవు దానిని వారితో మాట్లాడతావు, మరియు అప్పుడు ఇద్దరూ కలసి ఏకముగా మోకరించి ప్రార్ధిస్తారు. మరియు ఈ వ్యక్తి ఒక చక్కని దేవుడు రక్షించిన ఒక పురుషుడు గాని లేక స్త్రీ గాని అయి ఉండాలి అట్టివారి మీదనే నీ నమ్మకమును ఉంచగలవు. ఓ, దానిని చేయుట ఒక మంచి కార్యమైయున్నది. “రండి మన వివాదమును తీర్చుకొందుము” అని లేఖనములు చెప్పుచున్నవి. లేక, రండి మనమంతా ఏకముగా నిలబడదాము.

ఒక చలిగా ఉన్న దేశంలో గొర్రెలను గూర్చి మరొక విషయమును నేను గమనించియున్నాను. చీకటి కలిగించు మంచు గాలిని బ్రద్దలు చేస్తున్నప్పుడు, ఆ చిన్న గొర్రెలన్నియూ పొలములో నుండి ఈ వైపు నుండి ఆ వైపునకు వెళతాయి, మరియు అవన్నియూ ఏకముగా ఒకదానితో ఒకటి ఏకముగా కలసి ఉంటాయి. అది ఒకదానినొకటి వెచ్చగా చేస్తుంది. ఒక్కొక్క గొర్రె నుండి వచ్చే వేడి మరొక గొర్రెను వెచ్చగా ఉంచుతుంది.

9

సంఘము భిన్నముగా మరియు నిజమైన చల్లదనంగా మారినప్పుడు దేవుని గొర్రెలన్నియూ తప్పక ఏకముగా గుంపుగా కూడి ఒకరికొరకు ఒకరు ప్రార్ధన చేయవలసియున్నది. అదే నిజమైన మంచి క్రైస్తవ సహవాసం యొక్క వెచ్చదనమై యున్నది. ఓ, దాని భావము ఎంతోయై యున్నది. దావీదు తన మొదటి కీర్తనలో మాట్లాడియున్నాడు; “పాపుల మార్గమున నిలువక, అపహసకులు కూర్చుండు చోటను కూర్చొండక, యొహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ: దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినవాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉండును. అతడు చేయునదంతయూ సఫలమగును.”

10

మరియు మీకు తెలుసా, మీరు ఒక చిన్న విహార యాత్రకు వెళ్ళుచున్నట్లైతే, అది మరి విశేషంగా నా దేశములోనయితే, ఆ విహార యాత్ర కొరకు మనం ఒక చిన్న నీడను సరిగ్గా కలిగియుండవలసియున్నది. ఇప్పుడు, ఒక చెట్టు ఎవరో ఒకరి చేత గత సంవత్సరము నాటబడినదై యున్నట్లైతే, అక్కడ మనము ఆ నీడలో కలుసుకొనుటకు మనకు ఎక్కువ నమ్మకమును కలిగియుండలేము. అయితే నీవు ఒక పెద్ద పాత భవనముతో విస్తరించియున్న ఒక సింధూర వృక్షపు నీడ యొద్దకు వెళతావు. అక్కడ శోధనలు మరియు శ్రమలు ఆ చెట్టును ముందుకు వెనుకకు ఊయలవలె ఊపుచుండగా నేలలోని దాని వేర్లు కదలకుండా ఎప్పటికీ స్థిరముగా దాని వేర్ల లోపలికి చొచ్చుకొనిపోవు వరకు అవి వాటిని కదిలిస్తాయి. ఇప్పుడు, అది ఇంకనూ అక్కడ నిలబడియున్నది, ఆ చెట్టునే నీవు ఎంతో చక్కగా నమ్మగలవు.

ఆ రీతిగానే తుఫానులు, గాలి, వానలు మొదలగువాటి చేత దెబ్బతిన్న దేవుడు రక్షించిన ఒక వృద్ధ పరిశుద్దుని యొద్దకు నేను వెళ్ళగోరుచున్నాను, మరియు వారి వేర్లు దేవుని యొక్క ప్రేమలో లోతుగా వేరు పారియున్నది. ఒక చిన్న సహవాసపు కాలమును కలిగి, అదియే నాకు ఎంతో ఎక్కువ అని భావించు ఒక వ్యక్తి నొద్దకు నీవు చేరుకున్నట్లయితే దాని భావమేమిటి.

ఇప్పుడు, అది ఒక వింతైన విషయంగా ఉన్నది: యేసు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పియున్నాడు, “నేను ద్వారమునై యున్నాను.” ఆయన ఒక ద్వారముగా ఉండి మరియు ఒక మనిషిగా ఎలా ఉండగలడని నేను అనేకసార్లు ఆశ్చర్యపోయాను. అది నన్ను బాధిస్తూ ఉండేది. ఆయన ఎలా ఒక ద్వారముగా ఉండి ఇంకనూ మరియు ఒక మనిషిగా ఉండగలడు?

నేను తూర్పు దేశాలలో ఉన్నప్పుడు ఆయన అక్కడ చెప్పిన ఆ లేఖనం యొక్క భావమేమిటో నేను అక్కడ కనుగొనియున్నాను. “ద్వారమును నేనే. మరియు నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలై ఉన్నారు.” మరియు అప్పుడు ఎలా అలాగై ఉంటుందని నేను ఆశ్చర్యపడ్డాను.

11

మరియు తూర్పు దేశాలలో వారు ఎలా వారి గొర్రెలపట్ల శ్రద్ధ వహిస్తారో, గొర్రెలకాపరి రాత్రివేళ వాటిని దొడ్డిలోనికి తోలుకొనివచ్చి, వాటిలో ఏదైనా తప్పిపోయినదేమోనని ప్రతి ఒక్క గొర్రెను లెక్కిస్తాడు. ఒక వేళ వాటిలో ఒకటి తప్పిపోయినట్లైతే, ఆయన ఆ బయట ఎడారులలోనికి, ఆ పగలంతయూ, ఎక్కడెక్కడ ఆ మందను మేపి యున్నాడో, ఆ స్థలములకు వెళ్ళి, ఆ తప్పిపోయిన దానిని కనుగొనువరకు అతడు విశ్రమించడు. అది దొరికినప్పుడు దాన్ని తీసుకొని తన భుజములపై పెట్టుకుని దాన్ని దొడ్డిలోనికి వేస్తాడు. అప్పుడు ఆ గొర్రెలన్నియూ గొర్రెలదొడ్డిలో యున్నవి. అప్పుడు ఆ గొర్రెలకాపరి ఆ ఖాళీ నొద్ద తన్నుతాను ఉంచుకొంటాడు. గొర్రెలదొడ్డికి ఆయనే ద్వారమునై యున్నాడు. అక్కడ మరొక మార్గము లేదు, అది ఒక గొర్రెల శాలయైయున్నది, దానికి పైన ఒక శిఖరాన్ని అది కలిగియున్నది. మరియు మొదటిగా ఏదైనా ఆ కాపరిని దాటి వస్తేనేగాని ఏదియూ ఆ గొర్రెలలోనికి రాలేదు.

ఎలాటి నమ్మకము, దానినెరుగుట ఎలాటి ప్రియమైన కార్యము మనము ఆయన యొక్క ధన్యమైన కాపుదలలోనికి బద్రపరబడియున్నప్పుడు, ఆయన నీకు ద్వారముగా మారతాడు. మరియు అక్కడ నీకు ఏ హానియూ కలుగదు. అది ఏమైయున్నప్పటికీ లెక్క కాదు, అది అంతయూ కాపరి ద్వారానే లోనికి రావలసియున్నది. ఒకవేళ అది వ్యాధియై యున్నట్లైతే, అది నీ దిద్దుబాటుకొరకై ఉంటుంది, బహుశా అది నీ శతృవుపై నీకు ఒక సాక్ష్యమై యుంటుంది. అయితే అది క్రీస్తు యొక్క నామము హెచ్చించుటకై ఉంటుంది. అయితే ఆయన అది లోనికి వచ్చుటకు అనుమతించువరకు నీ యొద్దకు ఏదియూ రాలేదు. గొర్రెలదొడ్డికి ఆయన ద్వారమై యున్నాడు.

12

“వారందరూ దొంగలని ఆయన అన్నాడు.” ఎన్నడైనా ఆయనొద్దకు వచ్చినవారు, ఆయన దొడ్డిలో నుండి నిన్ను బయటకు తీసుకొని వెళ్ళుటకు ప్రయత్నించేవారు, నిన్ను బయటకు లాగుటకు ప్రయత్నించేవారు దొంగలైయున్నారు, దుష్టులైయున్నారు, నిన్ను ఆయన దొడ్డిలో నుండి బయటకు లాగుటకు ప్రయత్నించుచున్నారు. అయితే వారు నిన్ను పట్టుకొనలేరు. ఆ సమయంలో నేను బిగ్గరగా అరచుటకు ప్రయత్నం చేస్తాను. ఆ సమయంలో నేను బిగ్గరగా అరచుటకు ప్రేమించుదును. నీవు దేవుని యొక్క గొర్రెలదొడ్డిలో ఉన్నంతవరకూ నిన్ను ఏదియూ బాధించదు. కారణము ఆయనే స్వయముగా ద్వారమునై యున్నాడు, మరియు అక్కడ మరొక మార్గములేదు. ప్రతిదీ ఆయన ద్వారా అనుమతించబడవలసి యున్నది.

కొన్నిసార్లు నీవంటావు, “నేనెందుకు రోగిని అవుతాను?” బహుశా అది ఆయన మహిమ కొరకు.

ఒకసారి వారు ఒక గ్రుడ్డివారిని మార్గమున దాటిపోవుచున్నారు, అప్పుడు శిష్యులు ఇలా అన్నారు, “ఎవరు పాపం చేశారు ఇతడా, లేక ఇతని తల్లిదండ్రులా?”

అప్పుడు యేసు అన్నాడు, “ఈ సందర్భంలో అతడు పాపం చేయలేదు, లేక అతడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, అయితే దేవుని క్రియలు ప్రత్యక్తపరచబడుటకే అతడు గ్రుడ్డివానిగా చేయబడ్డాడు.”

13

దాన్ని గూర్చి అతనికి కొంచెమే తెలుసు. అతడు తన యవ్వన దినములగుండా (అతడు గ్రుడ్డివానిగానే పుట్టాడు.) మరియు అతని యావ్వన దినములన్నింటిగుండా దానిని అతడు గ్రహించుటకు కష్టమైయుండెను. అయితే కొద్దికాలం తర్వాత అతడు దానిని కనుగొన్నాడు, అదేమనగా, అది ప్రభువైన యేసుకొరకు ఒక సాక్ష్యమైయుండెను. ఇప్పుడు దేవుడు ఆ విధముగా కార్యములు చేయును.

ఈ గొర్రెలను గూర్చి మరొక సంగతియున్నది: ఒక గొర్రెల కాపరిని, ఒక మనిషిని వారు కనుగొనవలసి వచ్చినప్పుడు, ఆ గొర్రెల యొక్క యజమాని ఒక కాపరిని కనుగొనుటకు బయటకు వెళతాడు, అతడు బయటకు వెళ్ళి ఒక శ్రేష్టమైన గొర్రెలకాపరిని కనుగొనువరకు వెదుకుతాడు, కారణము ఆ యజమాని తన గొర్రెలను ప్రేమిస్తాడు. మరియు ఈ మనిషి, అనగా గొర్రెలకాపరి గొర్రెలను ఏలాగు కాయవలెనో దాని విషయంలో ఒక ప్రత్యేకమైన తర్ఫీదును తప్పక పొందినవాడై యుండాలి. అవి ఎలాటి ఆహారమును తింటాయో అతడు తప్పక ఎరిగినవాడై యుండాలి.

మీకు తెలుసా, అక్కడ గొర్రెల ఆహారం ఎంతో ఉన్నది. అయితే అక్కడ నీవు గొర్రెలకు ఇచ్చు ఆహారములో కొన్ని వాటిని చంపివేస్తాయి. మరియు నేనెంతో ఆనందంగా ఉన్నాను, దేవుడు తన గొర్రెలపట్ల ఎంతో శ్రద్ధగలవాడై, ప్రభువైన యేసు అను నిజమైన సరియైన గొర్రెలకాపరిని ఆయన తన గొర్రెల కొరకు ఇచ్చియున్నాడు. గొర్రెల ఆహారం ఏమైయున్నదో ఆయన యెరుగును మరియు మీకు తెలుసా, గొర్రెల ఆహారం ఏమిటో? అది దేవుని వాక్యమై ఉన్నది, “మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు....” (నేను దానిని కొంచెం మార్చవచ్చునా?) “గొర్రెలు రొట్టెల వలన మాత్రం కాదు గానీ, దేవుని నోట నుండి వచ్చు ప్రతీమాట వలన జీవించును.” దేవుని యొక్క గొర్రెలు దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే పోషించబడతాయి, నీలో ఉన్న పరిశుద్దాత్మ (నిన్ను ఏది గొర్రెగా చేస్తుంది) పవిత్రమైన వాక్యము మీదనే భుజిస్తుంది. అతడు కేవలం వాక్యము మీదనే భుజిస్తాడు. వాక్యము కాక దేనినైనా నీవు ఆ దొడ్డిలోనికి విసిరినట్లైతే, అతడు దానిని ఈ ప్రక్కనుండి ఆ ప్రక్కకు వేర్లతో దానిని పెల్లిగించి అక్కడ ఉంచుతాడు, వాక్యం కాని దానిని బయటకు విసిరివేస్తాడు, బహు బలముగా అదియున్నది నేను దేన్ని గూర్చి మాట్లాడుతున్నానో అది నీకు తెలుసో లేదో నాకు తెలియదు.

14

అయితే అతడు కేవలం గొర్రెల ఆహారమును మాత్రమే తీసుకొనును. దేవుడు ఆయన మందకు కాపరిగా యుండుటకు, గొప్ప కాపరియైన ప్రభువైన యేసును ఎన్నుకొని ఆయనకు అధికారమంతయూ ఇచ్చియున్నాడు.

ఇప్పుడు, మరొక సంగతి, ఆయన తన గొర్రెలను నడిపించుటకు ముందు, గొర్రెలు, గొర్రెలకాపరి యొక్క స్వరమును ఎరుగవలసియున్నది. మరొక కాపరి పిలిచినప్పుడు ఆ గొర్రెలు ఎన్నడూ అతని మాట వినవు. అతడు ఆ ఒక్క గొర్రెలకాపరికి తప్ప మరో ఇతర ఏ ఇతర గొర్రెలకాపరిని ఎన్నడూ అతడు లక్ష్యపెట్టడు.

మరియు సహజమైన పరిధిలో, ఒకవేళ గొర్రెలకాపరికి ఏదైనా సంభవించినట్లైతే, అతడు కాల్చివేయబడితే, లేక వెళ్ళగొట్టబడితే, ఓ, మరలా ఈ గొర్రెలను కాయుటకు, మరొకరిని వాటిపట్ల శ్రద్ధవహించువానిని కనుగొనుట, ఆ గొర్రెలు పెంచువానికి అది ఎలాటి సమయముగా యుంటుంది. అతడు తప్పక మృదువైవాడుగా ఉండాలి, అతడు తప్పక ప్రేమించువాడిగా యుండాలి. అతడు తప్పక ఒక నిర్ణీతమైన స్వరమును కలిగియుండాలి. యేసు చెప్పెను, “నా గొర్రెలు నా స్వరము వినుము.” మరొకమాటలో చెప్పాలంటే, “నా గొర్రెలు నా వాక్యమును వింటాయి, దానికి బయట దేనినైనా అవి అవి వెంబడించవు.”

15

మంచికాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడని ఆయన చెప్పియున్నాడు. జీతగాడైన కాపరి మాట వినడు. అతడు గొర్రెలను విడిచి పారిపోతాడు. అయితే నిజమైన గొర్రెలకాపరి గొర్రెలతో నిలిచియుంటాడు. మరియు ఆయన ఈ మాటలు చెప్పినందుకు నేను ఎంతో సంతోషించుచున్నాను.“ ఇదిగో, యుగసమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను,”దేవుడు గొర్రెలను కలిగియున్నంతకాలము, ఆ గొర్రెలను నడిపించుటకు దేవుడు ఒక గొర్రెలకాపరిని కలిగియున్నాడు. మనము తప్పక ఎంత సంతోషముగా యుండాలి. దేవుని యొక్క గొర్రెలు, దేవుని యొక్క కాపరి ద్వారా నడిపించబడతాయి.

అది ఎంతకాలమై యుంటుంది? “కొంచెము కాలము లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు, ఏలయనగా నేను మీతో యుంటాను - మిమ్మును నడిపిస్తూ యుంటాను, మిమ్ములను పోషిస్తూ యుంటాను, లోకము అంతమగువరకు, మీకు కాపరిగా కాయుచూ యుంటాను.” దేవుని యొక్క కాపరి. ఆయన ఒక గొర్రెను క్రిందపెట్టి మరొక గొర్రెను పైన పెట్టవలసిన పనిలేదు. ఏలయనగా మనుష్యులు ఆ ధోరణిలో దేవుని యొక్క కాపరులు కాలేరు. ఒకరు చనిపోతారు, మరొకరు ఆ స్థానమును తీసుకుంటారు. అయితే ఈ ఒక కాపరి, మందమీద ఉన్న ఈ గొప్పకాపరి, ఒకేసారి తన ప్రాణమును పెట్టుటవలన అది అమర్త్యముగా మారినది. మరియు ఆయన ఆత్మ ఇప్పుడు అది ఎన్నడూ చంపబడదు. మరియు ఆయన యొక్క భౌతిక శరీరం మహిమ నుండి దిగి వచ్చి మరియు ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొను వరకు ఆయనే మందకు యెడతెగని, శాశ్వత నాయకుడును మరియు గొర్రెలను మేపువాడైయున్నాడు, మరియు గొర్రెపిల్లలన్నియూ ఆయన చుట్టూ ఉంటాయి. ఓ, ప్రభువు యొక్క నామము సన్నుతించబడును గాక. దాన్ని గూర్చి నేనెంతో సంతోషిస్తాను. ఆ మంద యొక్క గొప్పకాపరి మన కొరకు తన ప్రాణమును ఇచ్చాడు. మనము అయోగ్యులమైన గొర్రెలమై యున్నాము....

16

మీరందరూ ఒక గొర్రెలకాపరి తన గొర్రె యొక్క కాలును విరుగగొట్టిన కథను మీరు విన్నారని నేను ఊహిస్తాను. అనేకమైన చిన్న-చిన్న కథలు అతని గూర్చి చెప్పబడి ఉన్నాయి. మరియు ఈ కాపరి ఒకరిచేత ఈ రీతిగా ప్రశ్నించబడ్డాడు, “ఈ గొర్రె కొండ మీద నుండి పడి, తన కాలును విరుగగొట్టుకొని యున్నదా?

అతడన్నాడు, “లేదు.”

“ఏమి సంభవించినది,” అని అతడన్నాడు.

కాపరి అన్నాడు “నేనే దాని కాలును విరగొట్టాను.”

“నీవెందుకు దాని కాలును విరగొట్టావు? అయితే నీవు ఒక క్రూరమైన కాపరివా?” అని అతడన్నాడు.

అతడన్నాడు, “లేదు, నేను ఆ గొర్రెను ప్రేమించుచున్నాను. అయితే ఆ గొర్రె నా నుండి దూరముగా పారిపోవుచున్నది. మరియు అది దానికై అది దూరముగా వెళ్ళుట కొనసాగించుచున్నది. మరియు గొర్రె యొక్క స్వభావము నాకు తెలుసు, అది బహు దూరముగా నా నుండి వెళ్ళి పోయినట్లైతే, తోడేలు దాన్ని పట్టుకుంటుంది. కాబట్టి ఆ గొర్రె యొక్క కాలును నేను విరగొట్టి దాన్ని నాతో ఉంచుకొన్నాను, దానిని నా రొమ్ము మీదకు చేర్చుకున్నాను, ఎందుకంటే దానికి కొంత ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడానికి, మరియు నేను దానిపట్ల ఎంతో దయగా ఉంటాను, తరువాత దాని కాలు బాగయినప్పుడు, అది నన్నిక ఎంతమాత్రము విడిచిపెట్టదు.”

17

కొన్నిసార్లు ఆయన మనలను వ్యాధితో, రోగములతో, మరియు ఇబ్బందులతో మొత్తి మనలను తన రొమ్ముపై యుంచుకొని మనతో ప్రియముగా మాట్లాడి, తన దైవిక పునరుద్దాన శక్తి యొక్క ఒక ప్రత్యేకమైన స్పర్శను నీకిస్తాడు, ఎందుకంటే ఆయన ఇంకనూ అదే యేసుయై యున్నాడు. మరియు ఒక మనిషి దేవునిచేత స్వస్థతనొందినప్పుడు, దేవుడు ఏమైయున్నాడో అతడు తెలుసుకుంటాడు, ఇక అతడు తప్పిపోవుటకు ఇష్టపడడు. యాకోబు దానిని తేటపరచాడు. అతడన్నాడు, “విశ్వాససహితమైన ప్రార్ధన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపములు చేసినవాడయితే పాపక్షమాపణ పొందును.” గొర్రెలను గూర్చి ఎలా శ్రద్ధ తీసుకోవాలో దేవుని యొక్క కాపరికి తెలుసు.

కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోతారు, ఒక తల్లి తన చేతులలో నుండి తన చిన్న బిడ్డ మరణం ద్వారా తటాలున లాగివేయబడినప్పుడు. ఆ చిన్న గొర్రెపిల్లను గూర్చి ఒక చిన్న కథ ఉన్నది. అక్కడ ఒక చిత్రకారుని ద్వారా ప్రభువైన యేసు యొక్క చిత్రం గీయబడియున్నది. (ఆ చిత్రకారుని యొక్క పేరు నాకు తెలియదు). అయితే ఆ చిత్రంలో ఆయన ఆ చిన్న గొర్రెపిల్లను తన చేతులతో పట్టుకొని హత్తుకొనుచున్నాడు. మరియు దాని తల్లి పైకి చూస్తూ ఆయన వెంబడి వెళ్ళుచున్నది, తన నేత్రములను ఆయనపై ఉంచియున్నది. మరియు ఈ నిర్ణీతమైన సమయములో కనబడు కాపరి, ఆ చిన్న గొర్రెపిల్లను మోసికొనిపోవుచుండగా ఆ మనిషితో, ఈ చిత్రకారుడు ఇలా ప్రశ్నించాడు, “నీవు ఎందుకు ఆ గొర్రెపిల్లను నీ చంకన మోయుచున్నావు? అది కుంటిదైనదా?”

“లేదు.”

“అయితే గొర్రెపిల్లతో యున్న ఇబ్బంది ఏమిటి?” అని అతడన్నాడు.

18

కాపరి ఇలా అన్నాడు, “ఆ చిన్న గొర్రెపిల్లతో ఏమియూ ఇబ్బంది లేదు, అయితే ఇబ్బంది దాని తల్లియైన ఆడ గొర్రెతోనే యున్నది,” ఇంకా అతడన్నాడు “ఆమె ఎంతమాత్రమూ (తల్లి గొర్రె) నా మాటలను పట్టించుకొనుట లేదు. నా మాటలను ఏ మాత్రము వినుట లేదు. కాబట్టి నేను నా చేయి క్రిందికి చాపి ఆ చిన్న గొర్రెపిల్లను పైకి ఎత్తిపట్టుకొన్నాను, మరియు ఇప్పుడు ఆమె దినమంతయూ నా వైపు చూస్తున్నది.”

కొన్నిసార్లు దేవుడు దాన్ని చేయవలసియున్నది. ఈ చిన్న దయనీయమైన దూరముగా పారిపోవుచున్న తల్లలు, మిశ్రమ మత్తు పానీయాల విందుకు పరుగెత్తడం, అటూ, ఇటూ ఇష్టానుసారంగా తిరగడం, తమ చిన్న బిడ్డలను తప్పు మార్గములలో పెంచుటవల్ల, కొన్నిసార్లు యేసు నీవు ఆయన వైపు పైకి చూచునట్లుగా ఆ చిన్న గొర్రెపిల్లను పైకి తీసుకుంటాడు మరియు తరువాత దానిని కూడా విననియెడల అప్పుడు తోడేలు నిన్ను పట్టుకుంటుంది. అప్పుడు నీ పని అయిపోయినది. ఓ, గొర్రెను గూర్చి మనమెంతో నేర్చుకుంటాము.

గొర్రెలకాపరిని గూర్చి మరొక విషయమున్నది: గొర్రెలకాపరి ఎల్లప్పుడు తన విధినిర్వహణలో ఉంటాడు. మీకు తెలుసా, గొర్రెలకాపరి వాటితో రాత్రింబవళ్ళు ఉంటాడు.

19

కొద్దికాలం క్రింతం నేను వేటాడుచున్న కొలరెడో కొండలలో గొర్రెల పర్వతము అని పిలువడు స్థలములో అవతలి భాగమున వారు గొర్రెలను మేపుకొనుటకు అనుమతించియున్నారు. మరియు నేను ఆ గొర్రెలకాపరులను గమనించియున్నాను, ఆ గొర్రెలను మేపువారిలో కొందరు, పొడవైన గెడ్డములను కలిగిన యావ్వనసులైయున్నారు. వారు ఆ గొర్రెలతో రాత్రింబవళ్ళు నిలిచియున్నారు! వారు ఎల్లప్పుడు విధినిర్వహణలోనే యున్నారు.

యేసు జన్మించినప్పుడు నీకు తెలుసా ఆ గొర్రెలకాపరులు రాత్రివేళ పొలములో ఉండి తమ మందను కాయుచున్నారు, ఒక గొర్రెపిల్ల జన్మించియున్నందున ఆ గొర్రెలకాపరులు తిన్నగా దానిని కనుగొనుటకు బయలు వెళ్ళారు? నా భావమేమిటో మీకు తెలుసా? ఈ గొర్రెలకాపరులు గొర్రెపిల్లలను వెదుకుచున్నారు. బహుశా ఇక్కడ గొర్రెలను కలిగిన మనుష్యులు కూర్చొనియుండవచ్చు. మరియు మీకు తెలుసు, ఆ ఆడుగొర్రెలు గొర్రెపిల్లలను ఈనుచున్నప్పుడు, ఇదివరకు కంటే ఎన్నడైనా అది ఎక్కువ ప్రత్యేకమైన కాలమైయున్నది. ఆ సమయంలో గొర్రెలకాపరి తన గొర్రెలను విడిచి వెళ్ళుట అనునది బహు అరుదైన సంగతిగా ఉంటుంది. అతడు తన సంచిని తీసుకుని అవి తమ పిల్లలను పెట్టుచుండగా అతడు తిన్నగా వాటి మధ్యలోనే ఉంటాడు; ఏలయనగా వాటికి ఆ సమయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమై యున్నది.

20

దాని భావమేమిటి? మనము ఆ పాతకాలపు ఉజ్జీవమును కలిగి యున్నప్పుడు, ప్రతీ కొన్ని నిమిషాలకు గొర్రెపిల్లలు జన్మిస్తూ ఉంటాయి, అప్పుడు గొర్రెలకాపరి వాటి మధ్యలోనే తిన్నగా ఉండి అవి సరియైన మార్గంలో తన రాజ్యమునకు జన్మించుచున్నవా అని ఆ చిన్నపిల్లలను చూస్తూ అతడు గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా! అతడు రాత్రింబవళ్ళు తన విధినిర్వహణలో ఉన్నందునుబట్టి నేనెంతో సంతోషిస్తాను. ఆయన అన్నాడు, “నేను ఎన్నడూ నిన్ను విడువను, ఎడబాయను. యుగసమాప్తిపర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉంటాను.” దావీదు కీర్తనలలో ఇలా అన్నాడు, “నేను పాతాళములో పడుకొనినను ఆయన అక్కడ యుంటాడు.”

ఓ నీవెక్కడ యున్నప్పటికీ లెక్క లేదు. ఆ శవములను పాతిపెట్టువాడు నిన్ను పాతిపెట్టి నీ మీద పారలతో ఆరు అడుగుల మట్టిని ఎత్తుగా పేర్చినప్పటికీ, అతడు ఆ గొర్రెను కాపరి నుండి ఎన్నడూ దాయలేడు. ఖచ్చితంగా నీవెక్కడ ఉంచబడియున్నావో ఆయనకు తెలుసు, నీ మీద ముద్ర వేయబదియున్నది. ఒకానొక మహిమకరమైన దినమున ఆయన నిన్ను పిలుస్తాడు మరియు నేనాయనకు జవాబిస్తాను. ఓ, ఎంత అద్భుతము. గొర్రె ఆయన యొక్క తన స్వరమును యెరుగును, ఒక పొరుగువానిని అవి వెంబడించవు.

21

ఎందుకు అన్నివేళలా కాపరి తన విధినిర్వహణలో ఉండాలి. తన గొర్రెలలో ఏ ఒక్కటియు తప్పిపోకూడదని అతడు నిశ్చయతను కలిగి యుండుటకే దాన్ని గూర్చి నీవు సంతోషించుట లేదా? గొర్రెలకాపరి ఒక గొర్రెను పోగొట్టుకున్నట్లయితే, అది కాపరి మీద ఒక నిందగా యుంటుంది. “నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు మరియు అతడు తీర్పులోనికి రాక, మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు.” కాపరి తన గొర్రెలను పోగొట్టుకొనడు. ఇప్పుడు నీవొక గొర్రెవై యున్నట్లయితే, మంచిది.

“తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. మరియు నా యొద్దకు వచ్చువారిని నేనెంతమాత్రము త్రోసివేయను. నేను అతనికి నిత్యజీవమును ఇస్తాను.” ఆ సమాధి చేయువాడు అతనిని భూమిలో ఉంచినప్పటికీ, అతడు, నా గొర్రె, నా స్వరమును వింటాడు. మరియు అంత్యదినమున నేను వాటిని లేపుతాను. సజీవ దేవునికి స్తుతి కలుగును గాక. “నా గొర్రెలు నా స్వరమును వినును.” యేసు చెప్పెను, “ఆ దినమున సమాధులలో ఉన్నవారందరూ ఆ గొప్ప కాపరి యొక్క స్వరమును వింటారు, మరియు వారు సమాధులలో నుండి బయటకు వస్తారు.” హల్లెలూయ! “నిత్యజీవము పొందుటకు వారు ముందుకు వస్తారు.” ఓ, ఆ గొర్రెల యొక్క కాపరి వచ్చు ఆ గొప్ప దినము.

22

కన్నీటి శ్రమలు ఎన్నడు కాపరిని దూరంగా ఉంచవు. క్రుళ్ళిపోవుట... లాజరు యొక్క సమాధినొద్ద ఆయన దానిని ఋజువు చేశాడు, లాజరు ఆయన యొక్క చిన్న గొర్రెపిల్లలలో ఒకడైయున్నాడు. అతని దేహము ఒక గుంటలో ఉంచబడియుండెను, ఒక రాయి దానిపైన దొర్లించబడియున్నది. అతని యొక్క దేహము చెడిపోయియున్నది, అతని ముక్కు రాలిపోయినది, చర్మపు పురుగులు అతనిని తినివేయుచున్నవి, అయితే ఆ ప్రధానకాపరి సమాధినొద్దకు వచ్చాడు. ఆయన తన గొర్రెను దాని పేరును బట్టి యొరుగును. ఇప్పుడు, ఆయన నీ పేరును పిలిచినట్లైతే, నీవు ఆయనకు జవాబిస్తావు. ఏలయనగా అక్కడ ఒక సమయము ఉండబోవుచున్నది, అప్పుడు ఆయన నన్ను పిలుస్తాడు, మరియు నేను ఆయనకు జవాబిస్తానని ప్రవక్త చెప్పియున్నాడు.

లాజరు చనిపోయి నాలుగు దినములై యుండెను. అతని దేహము క్రుళ్ళిపోయినది. అయితే గొర్రెలకాపరి మాట్లాడగానే క్రుళ్ళు దాని యొక్క యజమానిని గుర్తించినది, మరియు నాలుగు దినములు ప్రయాణంలో ఉన్న అతని ఆత్మ ఆ దేహంలోనికి తిరిగి వచ్చినది. ఆ దేహము శవములను భద్రపరచు ఒక ప్రత్యేకమైన తైలముతో సిద్ధపరచబడినది, దానిలో రక్తము లేదు, కణములన్నియూ విచ్ఛిన్నమైపోయినవి. అతడు సమాధిలో క్రుళ్ళిపోయియుండెను. అయితే జీవమిచ్చు కాపరి ఆ గొర్రెపిల్లను పేరుతో పిలిచినప్పుడు, ఆ గొర్రెపిల్ల బయటకు వచ్చి ఒకసారి అరచి “ఇదిగో నేను ఇక్కడయున్నాను,” అని చెప్పింది.

23

ఓ, ఆయన అద్భుతమైన కాపరి. ఆయనే నిన్ను పోషించనిమ్ము. ఆయన నిన్ను దేవుని వాక్యము మీద పోషిస్తాడు. పరిశుద్దాత్మ దేవుని వాక్యము చేత జీవిస్తుంది. మంద యొక్క ఆ గొప్ప గొర్రెలకాపరి! నిశ్చయముగా, ఆయన ఒక గొర్రెను కూడా నష్టపోడు. అది ఆయనకు అవమానముగా యుంటుంది. నీవంటావు, “బ్రెన్హాం సోదరుడా, నీ భావము అదేనా?” బైబిలు చెప్పుచున్నది అదియే.

చూడండి, వారు ఐగుప్తులోయుండగా దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు, “నేను మీకు పాలస్తీనాను ఇచ్చియున్నాను.” ఇప్పుడు, ఆయన అక్కడకు వెళ్ళి వారందరిని బహిష్కరించి, ఒక తెగులుతో వారిని అక్కడ నుండి తరిమివేసి మరియు వారందరిని చంపి, సమస్తమునూ చేసియుండేవాడు. ఆయన అక్కడకు వెళ్ళి, వారి మధ్యకు భయమును పంపి ఆ దేశము నుండి వారిని వెళ్ళగొట్టేవాడే. అయితే ఆయన అన్నాడు, “ఇశ్రాయేలు, అది నీదై యున్నది, నీవు వెళ్ళి దానిని తీసుకొనుము.” వారు నిలబడియున్న ప్రతియొక్క అంగుళము కొరకు వారు పోరాడవలసియుండెను.

ఆ గొప్పకాపరి యొక్క గ్రంధములోని ప్రతి వాగ్దానము ఆయన గొర్రెలకు చెందినదే. అయితే సోదరుడా, ఆయన ఎన్నడూ నీ యొద్దకు వచ్చి దానిని నీ నుండి తరిమివేయడు, ఆ వాగ్దానములోని ప్రతి అంగుళము కొరకు నీవు తప్పక పోరాడవలసియున్నది, అయితే అది నీదైయున్నది! అది నీకు చెందియున్నది.

24

మోషే, ఆ పరిపూర్ణమైన గొప్పకాపరికి మాదిరిగా యున్నాడు. మరియు యోర్దాను నొద్ద వారు మరణమునకు వచ్చినప్పుడు, ఆ అలలు దొర్లుచున్నవి, ఆ మరణము యొక్క నదియొద్దకు వారు వచ్చినప్పుడు, వారు ఏమి చేసియున్నారు? దేవుడు ఒక మార్గమును సిద్ధము చేసెను. మరియు మోషే, ఆ గొప్ప కాపరి, ప్రతినిజమైన గొర్రెపిల్లను మార్గమంతటిగుండా, ఐగుప్తు నుండి పాలస్తీనాకు నడిపించెను. వాటిలో ఒక్క దానిని కూడా ఆయన నష్టపోలేదు. వారు ఆకలిగొనరు, లేక కనీసము బట్టలదారము మాసిపోదు. మోషే, గొర్రెలకాపరి, వారిని నడిపించాడు. నిశ్చయముగా, అతడు క్రీస్తుకు పరిపూర్ణమైన మాదిరిగా యున్నాడు. నిశ్చయముగా, ఆయనను వెంబడించు వారు ఎన్నడూ తప్పిపోరు. కాపరిని వెంబడించండి.

ఇప్పుడు, అక్కడ ఒక మిశ్రమ జనాంగమున్నదని మనము చెప్పుకొంటూ యున్నాము. మీరంటారు, “అరణ్యములో కూలిపోయినవారు వారే.” ఖచ్చితముగా, అయితే నిజమైన గొర్రెలు తిన్నగా వాగ్దానభూమికి వెళ్ళారు — అనగా గొర్రెలు. మరియు ఏ విధమైన ఆహారమును తినాలో వారు ఎరిగియున్నారు. ఆ (పదిమంది) గుంపు తిరిగి వచ్చి ఇలా అన్నారు, “మనము దానిని తీసుకొనలేము, మనము దానిని తీసుకొనలేము.” ఆటంకములు ఏమైయున్నాయో, వాటివైపు వారు చూశారు. వారు పరిస్థితులను చూచుచుండిరి.

25

అయితే అక్కడ యొహోషువ మరియు కాలేబు అను రెండు గొర్రెపిల్లలు నిలబడియున్నాయి, వారి వారి స్వరమంతటిలో ఇలా అరచారు, “దేవుడు ఆ రీతిగా చెప్పియున్నందున, మనము దానిని చేయగలము.” నిశ్చయముగా, మనము చేయగలము. వారు గొర్రెలకాపరిని వెంబడించుచుండిరి. దేవుడు తన గొర్రెలను నడిపిస్తాడు. “నేను గొర్రెలదొడ్డికి కాపరినై యున్నాను.” ప్రభువు నామము స్తుతించబడును గాక.

నేను గొర్రెలను ఎంతో గమనించియున్నాను. ఒకసారి నేను మరొక దేశములో యున్నాను. నేను మరొకరితో బ్రిటిష్ వారి జీపులో ప్రయాణము చేయుచుంటిని. నేను ఒక పట్టణముగుండా వెళ్ళుచున్నాను, అది దిగువున దక్షిణ ప్రాంతములలో మరియు అకస్మాత్తుగా ట్రాఫిక్ పోలీసులు ఒక చిన్న ఈల వేశారు, అంతే ప్రతి కారు మృతమైనదిగా నిమ్మళమైనది. నేననుకొన్నాను బహుశ ఆ పట్టణము యొక్క మేయరు తప్పక వస్తూ యుండాలి అని నేను తలంచాను, లేనిచో ఇది ఏమై యుంటుంది, అన్నియూ ఆగిపోయినవి? నేను ఆ మనిషితో ఇలా అన్నాను, “ఏమి జరుగుచున్నది?”

అతడన్నాడు, “మనము జీపు యొక్క దిండుమీద నిలబడదాము.”

26

అది ఏమైయుండెనో మీకు తెలుసా? ఒక గొర్రెలకాపరి తన గొర్రెలతో ఆ పట్టణంగుండా వచ్చుచున్నాడు. ప్రతిదీ వాటికి సరియైన దారిని ఇచ్చుచుండెను. సోదరుడా, నేను నీకు చెప్పుచున్నాను, అది ఒక చక్కని దృశ్యము మరియు నేను ఇలా తలంచాను, “ఈ దినాలలో ఒక దినమున పరిశుద్ధ గుండ్రాళ్ళు అని తిరస్కరించబడిన గుంపు, వారు అన్ని సందులలోనికి ప్రజలచేత తన్నివేయబడినవారు. అయితే ఒక దినమున ప్రపంచము ఒక వైపున నిలబడియుండగా, ఆ మంద యొక్క గొప్పకాపరి ఆ పాలస్తీనా వీధులగుండా తన మందను నడిపిస్తాడు, అదిగో ఆ మంచితనము.” నేనన్నాను, “నా జీవితంలో నేనెన్నడూ అలాటి దృశ్యమును చూచియుండలేదు.”

అతడన్నాడు “ఆయన ఒక కాపరియై ఉన్నాడు. అయన ఆ మార్గము యొక్క అధికారము కలిగియున్నాడు.”

మిష్టర్ బాక్స్టర్ నా మేనేజరుగా ఉండేవాడు (ఇప్పుడు అతడు బ్రిటిష్ కొలంబియా అనే స్థలములో ఒక సంఘమును గొప్పగా నడిపించుచున్నాడు). ఆ సమయమంలోనే జార్జి చక్రవర్తి ఆ దేశమును దర్శించి యున్నాడు, కీర్తిశేషుడైన జార్జి చక్రవర్తి ఒక ధైర్యసాహసంగల వ్యక్తి, ఒక చక్కని వ్యక్తి, మరియు ఆయనను చూచుటకు వారందరూ ఒక మూలన నిలబడియున్నారు... జార్జి చక్రవర్తి కడుపు జబ్బును కలిగియుండెను, మరియు తన కంటిలో తెల్లని పొర వంటిది పెరిగే వ్యాధిని కలిగియున్నాడు. ఆయన కొరకు ప్రార్ధించుటకు ఆయన నా యొద్దకు ఒక వ్యక్తిని పంపియున్నాడు; మరియు ప్రభువు ఆ వ్యాధి నుండి ఆయనను స్వస్థపరిచియున్నాడు

27

అప్పుడు ఆయన ఆ వీధిగుండా ప్రయాణం చేయుచున్నాడు, ఆ రోజు ఎంతో వ్యాధిగ్రస్తుడుగా యుండెను. ఆయన రాజకత్వపు రక్తంను కలిగి ఉన్నట్లు ఆయన చూపించాడు. ఆయన తన కారులో కూర్చొని యున్నాడు, ఎందుకో, నీ వెన్నడు గ్రహించలేవు? ఆయన రాజుయై ఉన్నాడు. ఆయన యొక్క అందమైన రాణి చక్కని నీలపు వస్త్రములతో ఆయన ప్రక్కన కూర్చొని యుండెను. ఒక నిర్ణీతమైన మూలగుండా వారు దాటిపోవుచుండగా, నా కెనడా స్నేహితుడైన ఈ పెద్ద గొప్ప వ్యక్తి తనలో తాను బహుగా దుఃఖించుచుండెను. తన చేతులను ఈ రీతిగా పైకి ఎత్తి అతడు ఏడ్చెను. నేను అతనిని గమనించాను. నేనన్నాను, “ఏమిటి నీ సమస్య.”

అతడన్నాడు, “ఇక్కడ నా రాజు వెళ్ళుచున్నాడు. 'దేవుడు రాజును కాపాడును గాక' అని వారు పాడుచుండగా నా హృదయం గంతులు వేయుచున్నది.”

28

నేను ఇలా తలంచాను, “బ్రిటిష్ జెండా యొక్క పరిపాలనా కిరీటం క్రింద జీవించుచున్న ఒక మనిషి, ఒక భూసంబంధమైన రాజు దాటిపోవుచుండగా ఒక మనిషిని అది అలాటి భావనకు గురిచేసినట్లైతే, ఈ దినములలో ఒక దినమున మన రాజులకు రాజు, తన యొక్క చక్కగా తనకైతాను అలంకరించబడిన తన వధువుతో మన ముందు సాగిపోతున్నప్పుడు, అది మనకు ఎలా ఉంటుంది? ఆయన తన చేతులలో గాయములు మరియు దెబ్బలు కలిగియున్నప్పటికీ, ఆయన ఒక రాజుగా నిలబడతాడు. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు. నేను ఆ దినమును చూడగోరుచున్నాను.”

నేను తరచుగా ఆశ్చర్యపోవుదును, ఆ దూతలు యేసు భౌతికమైన శరీరంతో తిరిగి వస్తున్నప్పుడు, ఈ గొప్ప ప్రారంభోత్సవమును జరుగుట వారు చూస్తారు.

రెండు సంవత్సరముల క్రితము మిష్టర్ మూర్, మిష్టర్ బ్రౌన్ మరియు నేను - రూజ్వెల్డ్ డామ్ నుండి తిరిగి వచ్చుచున్నాము, మేము అక్కడ ప్రకృతిని తిలకిస్తూ, సహవాసం చేస్తూ మేము అక్కడ యున్నాము. అక్కడ మేము విమోచనా రక్తమును గూర్చిన ఆ పాతకాలపు పాటలను మేము పాడగలిగినంత శ్రేష్టమైన రీతిలో పాడుటను ప్రారంభించాము. ఆ ఎడారి కొండల గుండా మేము దిగువకు ముందుకు, ఇంకా ముందుకు వెళుతూ కొనసాగాము.

29

నేనన్నాను, “బ్రదర్ మూర్, ఒక నిజమైన దర్శనం కాదు, అయితే ఒక దినమున యేసు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ దర్శనాన్ని నేను చూస్తాను, అప్పుడు యుగములన్నింటిగుండా విమోచించబడినవారందరూ భూమిమీద నిలబడి పాటలు పాడుతారు. కృప ద్వారా తాము రక్షించబడ్డామని ఆ కథను చెబుతూ ఆ విమోచనా గీతములను వారు పాడతారు. అప్పుడు దేవుని దూతలు భూమికిపైగా నిలబడి తమ తలలు వంచి మనము దేనిని గూర్చి మాట్లాడుతున్నామో వారు తెలియనివారుగా వారుంటారు.” వారికి ఎన్నడు విమోచన అవసరం లేదు. నశించిన మనకే అది అవసరమైయున్నది. ఆయన చేత విమోచించబడినవారు మనమే, వారందరూ ఆయన చేత సృజింపబడినవారై యున్నారు, అయితే మనము నశించినవారమై ఇప్పుడు కనుగొనబడ్డాము. విమోచనను గూర్చి మనం పాడగలము. అది ఎలాటి దినముగా ఉంటుంది.

ఈ కాపరి యొక్క ప్రత్యేకమైన విషయములో బహుశా మనకు ఇంకా కొన్ని క్షణములే మిగిలియుండగా నేను మీతో ముందుకు వెళతాను, నేను ఆ గొర్రెలకాపరి ఒక వీధిగుండా వచ్చుటను నేను గమనించాను. మరియు వీధిలో, తూర్పు దేశాలలో ప్రతీచోట పాలస్తీనాలో మనము ఆహార పదార్ధములను చక్కని గ్లాసు అలమరాలో పెట్టినట్లు వారు అలా పెట్టరు. అయితే వారు ఆ చిన్న కొమ్మలు లేక ఆ ఫలముల గుత్తులను, గెలలను తిన్నగా వీధులలోనే వ్రేలాడదీస్తారు.

30

ఇప్పుడు ఇక్కడ ఆ గొర్రెలకాపరి తిన్నగా అలాటి స్థలములలో ఒక స్థలంగుండా తన మందకు ముందు వచ్చుచున్నాడు. నేను ఇలా తలంచాను. ఇప్పుడు, “ఎంతో నిశ్చయంగా అక్కడ ఒక అల్లరి వాటి ద్వారా జరుగబోవుచున్నది.”

మేము దగ్గరగా కారు నడుపుకుంటూ వెళ్ళి ఆ వింతైన కార్యాన్ని గమనించాము, ఆ కాపరి తిన్నగా ఇరువైపులా గొప్ప గోడలవలె యున్న ఫలముల మధ్యగా, రుచికరమైన పదార్ధముల మధ్యగా అనగా, కూరగాయలు, బేరిపండ్ల మధ్యగా నడిపించుకుంటూ వచ్చుచున్నాడు, ఆ గొర్రెలకు అవంటే ఎంతో ఇష్టం, నిశ్చయంగా ఆ గొర్రెలు ఈ వైపు నుండి ఆ వైపుకు ఒక్కసారిగా దుమికినట్లుగా కనబడుచున్నది. అయితే అవి కుడికి గానీ, ఎడమకు గానీ ఏ మాత్రం చూడకుండా తమ కాపరిని ఎంతో దగ్గరగా వెంబడిస్తూ ముందుకు సాగాయి, అవి తిన్నగా ప్రతీ శోధనగుండా తమ కాపరిని వెంబడిస్తూ నడిచి వెళ్ళినవి. నేననుకున్నాను, “ఓ దేవా, ఒక నిజమైన మందలోని తిరిగి జన్మించిన గొర్రె తిన్నగా శోధనలన్నిటిగుండా తమ కాపరిని వెంబడిస్తూ వెళతాయి.” “నా గొర్రెలు నా స్వరమును వినును.” అతడు కేవలము వాటితో మాట్లాడియున్నాడు.

మరియు నేను గమనించియున్నాను, ఆ గొప్ప ఇబ్బంది సమయములలో ఆ గొప్ప శోధనల మధ్యలో, ఆ చిన్న గొర్రెపిల్లలు ఈ వైపు నుండి ఆ వైపునకు చూస్తూ ఉంటాయి. మరియు ఒకసారి ఒక చిన్న గొర్రెపిల్ల ఏదో చేయుటకు ప్రయత్నించినప్పుడు, దాని తల్లి అది చేయవద్దు అన్నట్లుగా కొంచెం నెట్టినది. ఈ రాత్రి మనకు కూడా మన పిల్లలతో మరి కొందరు పిల్లలను నెట్టే పాతకాలపు తల్లులు మరికొందరు మనకు అవసరం, పిల్లలు తప్పుచేస్తున్నప్పుడు.

31

ఆ రీతిగా కాపరి అడుగులు వేస్తూ నడచుటను నేను గమనించాను. అతడు ఒక విధంగా అడుగువేసి మరియు వెనుకకు వచ్చినప్పుడు ప్రతీ గొర్రె తిన్నగా ఆయనను అదే రీతిగా ముందుకు వెంబడిస్తూ ఆయన అడుగులో అడుగు వేయుచున్నవి. అవి తిన్నగా పైకి వచ్చి లోనికి వెళ్ళుచున్నవి మరియు బయటకి వచ్చుచున్నవి, ప్రతీ గొర్రె ఒకదాని వెంబడి ఒకటి తిన్నగా వెంబ డించుచున్నవి.

ఓ, సోదరుడా, క్రమము తప్పి బయటకు వెళ్ళేది గొర్రె కాదు, శోధనలను బట్టి బయటకు వెళ్ళునది మేకయైయున్నది. బయటకు వెళ్ళి ఒక బేరిపండును, మరియు దానికిష్టమైన దేనినైనా గుంజుకుని లాక్కొనునది అది మేకయై యున్నది, అలా చేసేది గొర్రె కాదు — అది మేకయై యున్నది. కేవలము క్రిందపడిపోయేవారు ఎవరనగా అటూ, ఇటూ తిరుగులాడు వారు మరియు ఊగులాడువారు.

అప్పుడు ఒక రోజు నేను ఆ దేశమును విడువకమునుపు, నేను మార్గం వెంబడి గమనిస్తూ యున్నాను, అక్కడ ఒక మనిషి బయట నిలబడియున్నాడు, అతడు ఒక పెద్ద పశువులమందను కాయుచున్నాడు. మరియు నేను గమనించుచుండగా అక్కడ పశువులు, కంచర గాడిదలు, మేకలు మరియు గొర్రెలు కూడా యున్నవి, అప్పుడు నేనన్నాను, “ఆ మనిషి ఎవరై యుంటారని మీరు నిర్ణయిస్తారు?”

అప్పుడు నాతో ఉన్న మనిషి ఇలా అన్నాడు, “అతడు ఒక గొర్రెల కాపరి.”

నేనన్నాను, “ఓ, ఒక గొర్రెలకాపరా?”

“అవును.”

“సరే,” నేనన్నాను, “అలాగైతే గొర్రెలను కాయువాడు మాత్రమే గదా గొర్రెలకాపరి?”

అతడన్నాడు, “లేదు, గొర్రెలకాపరి అనగా భావము, ఒక పోషకుడు.”

నేనన్నాను, “సరే, నీవు గమనించావా, గొర్రెలు, మేకలు, కంచర గాడిదలు, మరియు అన్నియూ అదే పచ్చిక బయళ్ళను మేయుచున్నవి.”

అతడన్నాడు, “అది సత్యము.”

“సరే,” నేనన్నాను, “అప్పుడు గొర్రెలకాపరి మంచి హృదయంగలవాడై యున్నాడు.”

32

“అవును. అయితే,” అతడన్నాడు, “అది చీకటి పడినప్పుడు, రాత్రి యైనప్పుడు, ఏది అతనిది అని ఎలా చెప్పేది,” అతడన్నాడు, “గొర్రెలకాపరి వాటిని పిలుస్తాడు, మరియు పొలములోని ప్రతి గొర్రె అతని యొద్దకు వస్తుంది, మరియు ఆ గొర్రెలను అతడు గొర్రెల శాలలోనికి లేక దొడ్డిలోనికి తీసుకొంటాడు, మరియు వాటి ముందు అతడు పడుకొంటాడు. అయితే కంచర గాడిదలు, పశువులు మరియు మేకలు పొలములోనే యుండిపోతాయి.

నేనన్నాను, “సోదరుడా, నన్ను మన్నించండి, ఇప్పుడే నా గొర్రెలకాపరికి తిన్నగా నేను ఒక మాటను చెప్పగోరుచున్నాను.”

ఏ వేదాంతమును, ఏ గొప్ప డిగ్రీని లేక ఏ గొప్ప వ్యక్తిని నేను లెక్క చేయను. నేను కోరేదంతయూ ఒక దీనమైన గొర్రెగా యుండుటయే, అది, రాత్రివేళ కనుబొమ్మలను తాకునప్పుడు, ఆయన నన్ను లోనికి పిలవాలని నేను కోరుచున్నాను, అవి కంచర గాడిదలు కావచ్చు మరియు గొర్రెలు కావచ్చు మరియు అక్కడ యున్న ప్రతిదీ ఒకే ఆహారమును తింటాయి, అయితే రాత్రి సమయములో గొర్రెలను మాత్రమే కాపరి లోనికి తీసుకొంటాడు.

సోదరుడా, నీవు క్రైస్తవ్వమును అనుకరణ చేస్తున్నట్లైతే, కంచర గాడిద వంటి ఆత్మను నీవు కలిగియున్నట్లైతే, లేక మేక వలె లోకములో ఇటు-అటు తిరుగు ఆత్మను నీవు కలిగియున్నట్లైతే; ఈ దినములలో ఒక దినమున అది రాత్రి వచ్చుచున్నది, మరియు అప్పుడు నీకు గొర్రెలకాపరి యొక్క స్వరము నీకు తెలియదు. నీవు ఎందుకు ఈ రాత్రి దానితో సంబంధమును కలిగియుండకూడదు, మరియు గొర్రె అనగా దాని భావము ఏమిటో నీవు తెలుసుకొనుము. మనము తీవ్రముగా దాని మీద ఆలోచించుచుండగా ప్రార్ధన కొరకు మనము మన తలలను వంచుదాము.

33

దీనిని మీరు ఆలోచించాలని నేను కోరుచున్నాను: నీవంటావు, “ఓ బ్రెన్హాం సోదరుడా నేను దేవుని వాక్యమును అనుభవించియున్నాను.” అవును, సోదరుడా, వర్షము నీతిమంతుల మీదను మరియు అవినీతిమంతుల మీదను కురియుచున్నది. పరలోకం నుండి పడే వర్షము ద్వారా ఆ బయట ఉండే కలుపు మొక్కలు ఎంత ఆనందించుచున్నవో, దానితో పాటు నీ ప్రత్తి గింజలు, నీ తోట కూడా అది ఆనందించినట్లుగా అది ఆనందించుచున్నది. అయితే వాటిని తడిపినది ఒకే నీరుయైయున్నది. అయితే అంత్యకాలములో ఏమి సంభవిస్తుంది? ఆయన తన దూతలను ముందుగా పంపి, ముళ్ళ చెట్లన్నింటిని, ఆ చెట్ల కలుపు మొక్కలన్నింటిని, ఆ మురికి వాటన్నింటిని పోగుచేయిస్తాడు, మరియు అవన్నియూ అగ్నిలో పడవేయబడతాయి.

అయితే గోధుమలకు మరియు ధాన్యమునకు ఏమి సంభవిస్తుంది? అయితే అవి కొట్లలోనికి తీసుకొని పోబడతాయి. కంచర గాడిదలు, గాడిదలు, ఒంటెలు, మిగిలిన ఇతర జంతువులన్నియూ అదే నేల మీద మేత మేసియున్నవి, నిశ్చయంగా సంఘమునకు వెళ్ళు ప్రతి మనిషి భుజించు అదే రకమైన ఆహారమును అవియు తినియున్నవి. అయితే సూర్యుడు అస్తమించుచున్నప్పుడు గొర్రెలు మాత్రమే లోనికి పిలువబడతాయి. సోదరుడా, ఈ రాత్రి నీవు గొర్రెవేనా?

ప్రియమైన సహోదరి, నీవును దేవుని యొక్క చిన్న గొర్రెపిల్లలలో ఒకదానివా? దానిపట్ల నీకు నిశ్చయతలేనట్లైతే, ఇప్పుడే దాన్ని మనం నిశ్చయత చేసుకుందాం. నీవు నీ చేతిని క్రీస్తు కొరకు ఎత్తి ఇలా చెప్పగలవా, “దీని ద్వారా క్రీస్తు, ఇప్పుడు నా స్వరక్షకునిగా నేను నిన్ను అంగీకరించుచున్నాను, నా పట్ల కనికరం చూపుము.”

34

అక్కడ కూర్చొనియున్న ఓ స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక, ఆమె ప్రక్కగా కూర్చొనియున్న ఓ అయ్యా, ప్రభువు నిన్ను దీవించును గాక. క్రింద అంతస్తులో ఉన్నవారు ఎవరైనా, ఎవరైనా మీ చేతిని ఎత్తి ఇలా చెప్పగలరా, “క్రీస్తు,” (అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక.) ఇప్పుడు నేను గొర్రెగా మారగోరుచున్నాను. నేను సంఘమునకు చెంది ఉండినవాడనైనప్పటికీ, ఇప్పుడు నాలో నున్న ఈ ఆత్మ మిక్కిలి కోపము, అలక్ష్యం, మరియు చెడుగైయున్నది.“ ఓ, యవ్వనస్తుడా, ప్రభువు నిన్ను దీవించును గాక. ”నేను సంఘమునకు చెందియున్నప్పటికీ... “ఆ వెనుక ఉన్న ఓ స్త్రీ, ప్రభువు నిన్ను దీవించును గాక, ”నేను సంఘమునకు చెందినవాడనైప్పటికీ మరియు నా పేరు సంఘ పుస్తకంలో వ్రాయబడినప్పటికీ, నాలో ఉన్న ఆత్మ సరియైనది కాదని నేను యెరిగియున్నాను.“ ఆ పైన ఉన్న ఓ స్పానిష్ స్త్రీ, ప్రభువు నిన్ను దీవించును గాక.

నా కుడివైపు అంతస్తులలో ఉన్నవారు ఎవరైనా మీ చేతిని ఎత్తి ఇలా చెప్పుతారా, “ప్రభువైన యేసు, నీవు నన్ను మార్చమని కోరుచున్నాను.” ఓ యవ్వనస్తుడా, ప్రభువు నిన్ను దీవించును గాక. “నేను ఎక్కడ ఉన్నానో అక్కడే నన్ను మార్చుము.” ఆ పైన ఉన్న నిన్ను ప్రభువు దీవించు గాక. “నేను ఇక్కడ కూర్చొనియుండగా నన్ను మార్చుము,” మరియు ఈ పాత ఆత్మను నా నుండి తీసివేసి నీ గొర్రెలలో ఒక గొర్రెగా నన్ను తయారు చేయుము. ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరియు ఆ సూర్యుడు అస్తమించుచున్నప్పుడు, దేవుని పావురం యొక్క ఆ మృదువైన స్వరమును, యోర్దాను మీదుగా కూయుటను నేను వినగోరుచున్నాను. వర్తమానం ముగించబడిన తరువాత ఈ గంభీర సమయంలో నేను నా చేతిని ఎత్తుచున్నాను. నీవు నా కాపరిగా ఉండాలని నేను కోరుచున్నాను. ప్రభువా, నేను నిన్ను వెంబడించ గోరుచున్నాను.“

“గాఢా౦ధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు.” కాపరి మనలను నడుపుచున్నంతవరకు, సమస్తమూ చక్కగా యుంటుంది. మనము ముగించి ప్రార్ధన చేయక ముందు అక్కడ మరొకరెవరైనా యున్నారా? గుర్తుంచుకో, అది నీ ఆత్మయైయున్నది. నేను నీకు ఈ వర్తమానమునిస్తాను. నీవు దేవుని యొక్క గొర్రెవు కానియెడల, అప్పుడు నీవు గొర్రెలకాపరి యొక్క స్వరమును ఎరుగవు. అప్పుడు కేవలము ఏ చిన్న కార్యమైనను నిన్ను తల్లక్రిందులు చేస్తుంది.

35

అయితే నీవు గొర్రెవై యున్నట్లైతే గొర్రెలకాపరి యొక్క స్వరమును నీవు వింటావు. భర్త కేకవేయుటను నీవు వింటావు, భార్య కేకవేయుటను నీవు వింటావు, మరియు ఒక దినమున ఈ భూసంబంధమైన స్వరం ఆగిపోవుచున్నప్పుడు, తల్లి కేకవేయుటను నీవు వింటావు, తండ్రి కేకవేయుటను నీవు వింటావు, సహోదరుడు కేకవేయుట; ఆ స్వరములన్నియు అతి త్వరగా అదృశ్యమైపోతాయి. కానీ అప్పుడు ఆ నది ఈ వైపు నుండి ఆ వైపునకు ఆ గొప్ప కాపరి యొక్క కేకను నీవు ఇలా వింటావు, “నా తండ్రిచేత ఆశీర్వదించబడినవారలారా రండి?” నీకు ఆయన కావాలా? ఆయన నీ హృదయాన్ని తట్టినప్పుడు నీవు ఆయన కొరకు అడిగినట్లైతే ఆయన నీవాడుగా వుంటాడు, దేవుడు నిన్ను దీవించును, మరొకరు చేతిని పైకెత్తియున్నారు? అవును, నా సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. ఆత్మ దాని భావము ఏమైయున్నదో నీకు తెలియదు.

మనం సువార్తను బోధించియున్నాము, రోగుల కొరకు ప్రార్ధన చేస్తాము, అయితే ఆత్మలను దాటి వెళ్ళిపోనిచ్చినట్లైతే అది ఎలాటి అవమానము, ఈ రాత్రే ఆయనను అంగీకరించుము, నీవు దానిని చేయవా? క్రీస్తు నామములో, క్రీస్తుకు బదులుగా, క్రీస్తు ద్వారా దేవునితో నూతనపరచబడుట ద్వారా సమాధానపడుడి అని నేను మిమ్మును ఒప్పించుచున్నాను. సోదరుడా, ప్రభువు నిన్ను దీవించును గాక. వాక్య జలముల ద్వారా, శుద్ధి చేయబడుట ద్వారా నీ ఆత్మలో నూతనపరచబడుట ద్వారా ఇప్పుడు నీవు మాధుర్యముగా, దీనముగా, ఆయనను అంగీకరిస్తూ క్రీస్తులోనికి ఇప్పుడు రావా?

సహోదరీ, నీ సంగీతంతో నీవు తిన్నగా ముందుకు వెళ్ళుము. నేను కొంచెం కనిపెట్టుచున్నాను. బహుశా మరొకరి కొరకు, ఆ దినమున అది ఇలా చెప్పబడుతుంది, “బ్రెన్హాం సోదరుడా, నీవు ఒక్క క్షణం కనిపెట్టియున్నావు, మరియు ఏదో నాతో మాట్లాడియున్నది మరియు నా చేతిని నేను ఎత్తియున్నాను, బ్రెన్హాం సోదరుడా, అది పూర్తి సమస్యను పరిష్కరించినది. ఇక్కడ ఉండుట నాకెంతో సంతోషంగా యున్నది.” దాని భావము ఏమై యున్నది? దాని భావం ఏమై యున్నది?

నీవంటావు, “నేను ఇదివరకు దాన్ని వినియున్నాను.” అయితే సోదరుడా, మరొకసారి చివరిసారిగా దానిని నీవు వినబోవుచున్నావు. దాని తర్వాత ఇంకెంతమాత్రమూ ఎన్నడూ నీవు దాన్ని వినలేవు. నీవు ఏ మార్గమునకు దారి తీసియున్నావో ఆ మార్గములోనికే నీవు వెళ్ళిపోతావు.

36

మా దయగల పరలోకపు తండ్రీ, నీ యొద్దకు వచ్చిన వారిని, ఇప్పుడు తమ చేతులను పైకెత్తినవారిని నేను మీకు ఇచ్చుచున్నాను, మరియు నీ చేతులలో నుండి ఎవరూ వారిని లాక్కొనలేరు. నీవు గొప్ప కాపరివై యున్నావు. అక్కడ ఎవరూ, ఏ దెయ్యము, ఏ శక్తి, ఏదియూ ఎంత మాత్రమూ ఎన్నడూ వారిని నీ చేతిలో నుండి వారిని లాగలేదు. “తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు.” లేఖనములు నెరవేరునట్లు వారిలో ఎవరునూ తప్పిపోరు, ధర్మవిరోధి తప్ప. నీవు ఇంకనూ పిలుచుచూనే యున్నావు, పురుషులు మరియు స్త్రీలు ఇంకనూ తమ్మును తాము లోపరచు కొనుచున్నారు, ఇంకనూ వచ్చుచున్నారు, మరియు ఈ రాత్రి వారిని నీ రాజ్యము లోనికి స్వీకరించమని నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను. వారితో కరచాలనం చేయు అద్భుతమైన ఆధిక్యతను నేనెప్పుడూ ఇక కలిగియుండకపోవచ్చు. కూటము తీక్షణమైనదిగా ఉన్నది మరియు ఈ సమయంలోనే అనేకమంది వ్యాధిగ్రస్తులు వేచియున్నారు. అయితే, ఓ, క్రీస్తు ఈ ఫలములు నా ముందు వెళ్ళునని యెరిగియున్నాడు, నేను వారిని నీ చేతులకు అప్పగించుచున్నాను. ప్రభువా, దాన్ని చేయుము. నీ వాక్యప్రకటన ద్వారా వారు నమ్మియున్నారు మరియు నీ యొద్దకు వచ్చియున్నారు.

ప్రభువా, ఇక్కడ ఎవరైనా వచ్చి తప్పక వారి మీద కనికరం పొందనట్లైతే వారును వచ్పుదురు గాక, ఏలయనగా అది ముగించబడు సమయమునకు వారు ఒక ధౌర్భాగ్యమైన జీవితమును జీవిస్తారు. ప్రభువా, దాన్ని దయ చేయుము. యేసు నామములో మా ప్రార్థనను వినమని మేము ప్రార్ధన చేయుచున్నాము. ఆమేన్.

37

భూమ్యాకాశముల యొక్క ప్రభువైన దేవుడు మీలో ప్రతి ఒక్కరిని దీవించును గాక. నీ హృదయ వాంఛను దేవుడు అనుగ్రహించునని నీవు ఎరుగుదువా? ఆ విధంగా పరిశుద్ధాత్మ మీ మీద కదులుచున్నందున మీలో ఎంతమంది చక్కని నిజమైన అనుభూతిని కలిగియున్నారు? ఎంతో కాలము నుండి ఎదురుచూస్తూ మరియు వారు నమ్మిన దాన్ని ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చునని నేను నమ్ముచున్నాను. నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నట్లైతే, “ఆమెన్” అని చెప్పుము. వాక్యము ఏదో కార్యమును నీకు చేసియుండలేదా? అది ఏమైయున్నదో నీకు తెలుసా? అది ఆహారమైయున్నది. అది గొర్రెలకు దేవుని యొక్క ఆహారమై యున్నది. మరియు బైబిల్ దేవుని గొర్రెల యొక్క ఆహారమై యున్నది. అది చక్కగా లేదా? బైబిల్ చెప్పియున్నది... దావీదు చెప్పాడని నేను నమ్ముతాను. “అది బండలోని తేనె వలె రుచిగాయన్నది.” అవును. దేవుని వాక్యం ఎంతో తియ్యగా ఉంటుంది. అది ప్రజల యొక్క హృదయములలోనికి శుద్ధిచేయబడిన పాతకాలపు వాక్య ప్రకటన ద్వారా అది వచ్చుటను నేను చూడగలను. అక్కడ అది ఎంతో నిజముగా, వారు నిజానికి దేనినైనా రుచి చూచినట్లుగా అది వారి పెదవులకు తాకినది. అది చక్కగా యున్నది — ప్రభువు యొక్క దీవెనలు ఎంతో దగ్గరగా, ఎంతో ప్రియముగా, ఎంతో దయగా ఉంటాయి.

38

మరియు నాకు తెలుసు, నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా ఈ రాత్రి దేవుని యొక్క ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు మీలో ప్రతి ఒక్కరిని ఆయన ఎంతగా ప్రేమించుచున్నాడంటే, ఆయన లేకుండా నీవు పరలోకమునకు చేరుకునే ఆధిక్యతలేదు. మొన్నటి దినమున ఎవరో నాతో ఇలా అన్నారు, అది ఒక చిన్న పోటీయైయున్నది, “బ్రెన్హాం సోదరుడా, ఒక వ్యక్తి నిజంగా దేవుని బిడ్డయై యున్నట్లైతే, అతడు నిజముగా తాను ఒక దేవుని కుమారుడైయున్నాడని అతడు ఎరిగియుంటాడని నీ భావమా?”

నేనన్నాను, “పరిపూర్ణంగా మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలై యున్నారని మీలో ఉన్న దేవుని ఆత్మ ఆయన యొక్క వాక్యంతో మరియు ఆయన యొక్క ఆత్మతో ఏకీభవించి సాక్ష్యమిస్తుంది. దేవుని యొక్క బైబిల్ లోనికి నీ అనుభవము వచ్చినప్పుడు, మరియు దేవుడు కోరిన ప్రతీదానిని నీవు కలిగియున్నప్పుడు, దేవుడు దాన్ని నీకు ఋజువుచేసి యున్నాడు, మరియు లోకమంతయూ నీ నుండి వెళ్ళి పోయియున్నది, అప్పుడు నీవు ఒక నూతన సృష్టిగా మారతావు, తర్వాత నీవు మరణంలో నుండి జీవములోనికి దాటియున్నావు.” దేవుడు దానిని చేసియున్నాడు.

39

ఇప్పుడు, మేము ఒక్క క్షణములో రోగులు కొరకు ప్రార్ధన చేయుట ప్రారంభిస్తాము. వేచి యుండండి... బిల్లీ నీవు ఈ రాత్రి మరలా నీవు ప్రార్ధనా కార్డులను బయటకు ఇచ్చియున్నావా? ప్రభువు చిత్తమైన యెడల రేపు రాత్రి ఎంతమంది ప్రార్ధన వరుసలో ఉండగోరుచున్నారు, ప్రభువు చిత్తమైన యెడల, రేపు రాత్రి లేక ఆదివారం రాత్రి, ఒక్కటి, అక్కడ ప్రతీ ఒక్కరు వేదిక నొద్దకు వచ్చి ప్రార్ధించబడవచ్చును. ఆ రాత్రులలో ఒక రాత్రి అలా వుండాలని మీరు ఇష్టపడుచున్నారా? బహుశా, రేపు రాత్రికి దాన్ని మనం అలా చేద్దాము. మరొక గొప్ప ప్రార్థనా కార్డుల కట్టను బయటకు ఇచ్చుటకు నేను కుర్రవానిని పంపుతాను, మరియు దరిదాపుగా వారందర్నీ ప్రార్ధనా వరుసగుండా తీసుకునివద్దాము.

గతించిన కాలం వలె కాదు, అయితే వారిని వేదిక నొద్దకు తోడుకు రండి, ఈ మధ్యకాలంలోనే నేను చేసియున్నట్లుగా, ప్రభువు ఏమిచేసి యున్నాడో అది ఒక అద్భుతమైన కార్యమైయున్నది. అమెరికా వాసులు వారిపై చేతులుంచవలసినదిగా నేర్పించబడ్డారు. దానినే చేయాలని నేను అనుకుంటాను, నాకు తెలిసినదంతయూ అంతవరకే ఉన్నతమైన క్రమములో మీరు దాన్ని నమ్మగలుగునట్లు నేను మిమ్ములను తెచ్చునట్లు ప్రయత్నం చేయుచున్నాను. మీ మీద చేతులుంచకుండానే మీరు దాన్ని అంగీకరించండి — కేవలం దాన్ని నమ్మండీ, నడిచివెళ్ళిపోండి. ఏమైనప్పటికీ, అక్కడ ఒక లేఖనం ఉన్నది, యాయిరు ఒక యూదుడైయున్నాడు. అతడన్నాడు, “నీవు వచ్చినా చిన్న కుమార్తెపై చేతులుంచుము మరియు ఆమె స్వస్థపడుతుంది.... లేక జీవిస్తుంది.” అతడు ఒక యూదుడై యుండెను. ఆ పట్టణంగుండా వెళ్ళి యేసు ఆమెపై చేతులుంచవలసియుండెను, ఏలయనగా అతడు నమ్మియున్నది అదే.

40

అయితే రోమియుడైన అన్యుడు ఇలా అన్నాడు, “యజమానుడా, ఆ విధంగా చేయవలసిన పనిలేదు. నేనును ఒక అధికారం క్రింద వున్నవాడను, నేను ఈ మనిషితో 'వెళ్ళు' అంటే అతడు వెళతాడు. మరియు 'రా' అంటే అతడు వస్తాడు.” అతడన్నాడు, నీవు కేవలం మాట మాత్రం సెలవిమ్ము, కేవలం నీవు మాటను పలుకుము, నా దాసుడు జీవిస్తాడు. అతడన్నాడు, “నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను.”

యేసు చుట్టూ చూసి ఆ యూదులతో ఇలా అన్నాడు, “అలాటి విశ్వాసమును నేను ఇశ్రాయేలులో ఎన్నడూ చూడలేదు.” అది నిజము. ప్రజలను ఆ స్థానమునకు తెచ్చుటకే నేను ప్రయత్నిస్తున్నాను. అమెరికాలో అటువంటి విశ్వాసము ఎక్కువగా నీవు చూడలేవు. జూలియస్ సోదరుడా, అటువంటి విశ్వాసమును ఆఫ్రికాలో, ఇండియా వంటి అలాటి స్థలములలో మీరు దాన్ని కనుగొంటారు, అమెరికాలో కాదు. కేవలము... మీరు ఎంతో ఎక్కువ వేదాంతమును అమెరికాలో కలిగియున్నారు. మీరు ఎంతో ఆత్మ సంబంధమైన రోగభ్రమలతో యున్నారు. మీకు అవసరమైనది ఏమనగా, నొప్పిని తొలగించు ఒక నిజమెన ఓపియం. నొప్పి నుండి విడిపించు ఆత్మ సంబంధమైన మందు ఆయన లోయలలోని పద్మం (లిల్లీ పుష్పం) మీరు ఎక్కడ నుండి ఆ ఓపియాన్ని పొందగలరు? లిల్లీ చెట్టు నుండి. మరియు ఆ లిల్లీ చెట్టు కల్వరిలో నలిగిపోయినది, నీకు కావలసిన ఆత్మసంబంధమైన ఓపియం అంతయూ ఆయన కలిగియున్నాడు. అది నిజము. ఆయన ప్రతి నొప్పిని తొలగించును.

41

ఆ ఓపియం విచారమును మరియు నొప్పిని తీసివేస్తుంది. నీవు అప్పుడు ఆ ఓపియంతో ఆత్మసంబంధంగా మత్తుడవై ఉంటావు. ఈ దినమున ఉన్న నిద్ర కలుగజేయు ఒక ఔషధంవలె అది యున్నది. ఓపియం పనిచేయగానే, నీకు తలనొప్పి వస్తుంది మరియు ఇదివరకు నీవు వున్నదాని కంటే బహు అధ్వాన్నంగా ఉంటావు. అయితే నేను మాట్లాడుచున్న ఈ ఓపియం యేసు నుండి వచ్చినది. అది నన్ను పరిగెత్తించదు. ఆయనలో... “నా యందు విశ్వాసముంచువాడు నిత్యజీవమును కలిగియున్నాడు. నీతో మాట్లాడుచున్నది ఎవరో నీవు యెరిగియున్నట్లైతే, నీవు ఇక్కడకు వచ్చి త్రాగకుండా నేను నీకు నీళ్ళిస్తాను,” అని ప్రభువు చెప్పెను. జీవజల నదులు నీ ఆత్మలో పొంగి ప్రవహిస్తాయి. ఆ విధమైన నీళ్ళు మనకవసరమై యున్నాయి.

ఇప్పుడు, ఈ రాత్రి మనం ప్రార్ధనా వరుసను పిలువగోరుచున్నాము. 1 నుండి 100, 1 నుండి 100, 'జెడ్' అని మీరు చెబుతారా? 'పి', మంచిది. ఫీనిక్స్ లో వలె ప్రార్థనా కార్డు 'పి' మరియు వారెక్కడున్నారో లేచి నిలబడుట ప్రారంభించండి. ప్రార్థనా కార్డు, సరే, ఒకటో నంబరు నుండి మనం ప్రారంభిద్దాము, అతడు ఒకటితో ప్రారంభించినట్లైతే మనమును ఒకటో నంబరుతో ప్రారంభిద్దాము. ఆ నంబరుగలవారిని తీసుకు రండి... 1 నంబరు ఎవరు కలిగి ఉన్నారు. ఫీనిక్స్ లో వలె ప్రార్థనా కార్డు, ప్రార్థనా కార్డు, పి నంబరు 1? నీ చేతిని ఎత్తగలవా, ఆ బయట జనసమూహంలో చూడలేను. స్త్రీ మంచిది. ఒక్క నిమిషం ఇక్కడకు రమ్ము.

42

నెంబరు 2, నీ చేతిని ఎత్తగలవా, నెంబరు 3, నీ చేతిని ఎత్తగలవా? నంబర్ 4, నీ చేతిని ఎత్తగలవా దాన్ని గమనించండి, ఎవరో అక్కడ తమ చేతిని ఎత్తలేని వారుండవచ్చును. బహుశా అక్కడ ఎవరో వినపడనివారు ఉండవచ్చు. 1,2,3,4 అది వారేనని నేననుకుంటాను. నెంబరు 5, మంచిది ఓ స్త్రీ, నెంబరు 6, 6వ నెంబరు కలవారు నీ చేతిని ఎత్తగలవా, నెంబరు 7,8,9,10. మంచిది. ఇప్పుడు, వారిని మనం ముందుకు రానిద్దాం.

మంచిది, వీరి కొరకు ప్రార్ధించుటకు ముందు దేవుని యొక్క అభిషేకమును నేను పొందువరకు నేను కొంచెం ప్రయత్నం చేయుచున్నాను. మీ యొక్క చేతిరుమాళ్ళ ఇక్కడ ఉంచబడినవి. ఆయన ఇక్కడకు వచ్చు వరకు నేను కేవలం వేచియుండవలసియున్నది. వాటి కొరకు నేను ప్రార్ధించకముందు అభిషేకం వస్తుంది, చూడండి, ఈ చేతిరుమాళ్ళ రోగులుగా నున్నవారికి ప్రాతినిధ్యం వహించుచున్నవి. ఒకవేళ నా బిడ్డే రోగిగాయున్నట్లైతే ఏమిటి? చూడండి, నా బిడ్డ కొరకు నాలోని ప్రతీ యదార్ధతను కలిగియుండండి. నా బిడ్డ, నా భార్య, నేను ప్రేమించినవారు, నా స్నేహితుడు, దేవుడు ఆశించే ప్రతీ చిన్న దానిని ఆ సేవకుడు లేక ఎవరైనా వారి కొరకు ప్రార్ధించే వారిని వారు కలిగియుండాలని నేను కోరుచున్నాను. మీరును దాన్ని చేయండి. మీరు దాన్ని చేయరా? కాబట్టి దానినే మనం చేయగోరుచున్నాం. అదే మన హృదయాంతరంగంలోని యదార్థత అంతటితో దానిని నమ్ముట.

43

ఎంతమందియున్నారు? ప్రార్థనా కార్డు పి నెంబరు 4 బయటకు వచ్చారా, వారు ఇంకనూ పైకివచ్చి యుండలేదని బిల్లీ చెప్పియున్నాడు. మీ పొరుగువాని యొక్క ప్రార్థనా కార్డును మీరు చూసారా? బహుశ ఎవరో దానిని పోగొట్టుకొనియుండవచ్చు. బహుశా, అది చుడలేనివావడుగా యున్న ఒక గ్రుడ్డివాడు కావచ్చు. ప్రార్థనా కార్డులను కలిగిన ప్రతి ఒక్కరూ దానివైపు చూడండి, లేక మరొకరి యొక్క కార్డువైపు చూడండి. నంబర్ 4 ప్రార్ధనా కార్డు యొక్క వెనుక భాగము మీద, అది ఒక చిన్న కార్యముగా యుంటుంది, అది దానిని కలిగియుంటుంది. ఈ వైపున దానిమీద నా చిత్రము యుంటుంది. ఆ కార్డు వెనుక భాగమున అది పి అని చిత్రము ఉంటుంది. ఆ కార్డు వెనుక భాగమున అది పి అని దాని నెంబరును అది కలిగి యుంటుంది. ప్రజలను వరుసగా నిలబెట్టుట కొరకు మేము దానిని చేస్తాము.

మరియు నేను వారిని ఈ పైకి ఇక్కడకు తెచ్చుటకు కారణము ఏమనగా... నీవు దానిని. నీవు దానిని చేయవలసినపనిలేదు. గత రెండు లేక మూడు రాత్రుల క్రితము, ఎక్కడయున్నవారినైనా, ఎలాగైనా పిలిచి యున్నాము, అది లెక్క కాదు, అది మీలో ఎంతమందికి తెలుసు, అది వారి మీద ఎవరైనా చేతులను ఉంచవలెననునదియే వారి ఉద్దేశ్యము, చూడండి. అది ఆ విషయము మాత్రమై యున్నది. అలా చేయవలసినపనిలేదు. అయితే కొందరిని వేదిక మీదకు తెచ్చినప్పుడు, అప్పుడు అది వారికి అర్థమవుతుంది.

44

మంచిది, 10, వారందర్నీ ఇప్పుడు మీరు కలిగియున్నారా? నెంబరు 4 తప్ప అందరూ మంచిది, పి నెంబర్ 11, 12, 13, 14, 15 ఫీనిక్స్ లో వలె మీరు రాగోరినట్లైతే, వచ్చి, మీ స్థలమును తీసుకోండి, మంచిది. మీరు వచ్చుటకు ఇష్టపడినట్లైతే, ఇప్పుడు మీరంటారు, “బ్రెన్హాం సోదరుడా ప్రార్ధనా వరుస కొంచెం పొడవుగా వున్నది, నీవు వారందరి యొద్దకు వెళ్ళలేవు.” నేను వెళ్ళలేక పోవచ్చు. అక్కడ బయట నమ్మువారెంతమంది యున్నారో దానిపై అది ఆధారపడియున్నది. రాత్రివేళలో మీరు గమనించారా, సోదరుడు మూర్ ఒకవైపున, సోదరుడు బ్రౌన్ మరొక వైపు మరియు బిల్లీ నిలబడియుండి వారు నన్ను గమనించుచున్నారు. నేను కోరుకున్నంతమందిని కలిగియున్నప్పుడు వారు నన్ను తీసుకెళతారు.

అది ఎలాటి ప్రభావమును కలిగియుంటుందో మీరూహించగలరా? మొన్నటి రాత్రి నేను మేల్కొన్న తర్వాత, నేను ఎప్పుడు ఆ స్థలమును విడిచానో నేను యెరుగకుండానే దారి వెంబడి తర్వాత వెళ్ళుచున్నాను. వీధి గుండా వెళ్ళుచున్నాను. నేను పూర్తిగా విఫలమయియున్నానని నా మీద నేను ఫిర్యాదు చేసుకొనుచున్నాను. ఎందుకు ప్రభువు ఇంకా ఎక్కువ సమయము ఎందుకు అక్కడ ఎన్నడైనా నిలిపి ఉంచలేదు నేను చూడలేదు. నన్ను నేను తలపోస్తూ, ఏడుస్తూ మరియు సమస్తమూ చేసి యున్నాను. అక్కడ నుండి బయటకు వచ్చుట, అనగా ఏమిటో మీరు దాన్ని గ్రహించలేదు. నేను మిమ్మును ఎరుగుదును. నేను అది గ్రహించలేదు, నేను దాన్ని వివరించలేను. అయితే నేను దానిని బైబిల్లో చూపగలను.

45

ఏలియా సంగతి ఏమిటి అతడు అభిషేకం క్రింద ఉండి యుండగా, ఆకాశం నుండి అగ్నిని దించాడు మరియు ఆకాశం నుండి వర్షాన్ని దించాడు. మరియు 400 మంది యాజకులను చంపి అతడేమి చేయాలో చేశాడు. మరియు ఆ అభిషేకం ఆయనను విడిచిపెట్టినప్పుడు, ఒక స్త్రీ నుండి అతడు పారిపోయాడు, యొజెబెలు, మరియు అతడు 40 రాత్రింబవళ్ళు ఎక్కడ ఉండి యున్నాడో ఎరుగక ఉండెను మరియు అరణ్యంలో అతడు దాక్కొనియుండెను. దేవుడు ఆయనను తిన్నగా ఆ వెనుక ఒక గుహలో కనుగొనియున్నాడు. అది నిజమేనా? అది అతడు అక్కడ నిలబడి వుండినప్పుడు కాదు, కాదండి, అది అభిషేకం ఆయనను విడిచిపెట్టినప్పటిదై యున్నది. అది సత్యము.

యోనా సంగతి ఏమిటి? అతడు దేవుని యొక్క ప్రేరేపణ కలిగియున్నాడు. మరియు 4 రాత్రింబవళ్ళు తిమింగలం యొక్క కడుపులో సజీవంగా అతడు భద్రపరచబడ్డాడు. లేక, 8 రాత్రింబవళ్ళు మరియు బయటికి వచ్చి దరిదాపుగా అక్కడొక 10 లక్షలమంది నివసించుచున్న పట్టణమునకు అతడు ప్రవచించాడు. వారు పశ్చాత్తాపం సహితం పొంది, జంతువులపై సహితం గోనే బట్టలను కప్పియున్నారు. మరియు అతనిని అభిషేకం విడిచిపెట్టినప్పుడు, అతడు కొండపైకి వెళ్ళాడు, తన ప్రాణమును తీసుకోమని ప్రార్థన చేశాడు. అది నిజము.

46

ఓ, ఈ దినమున పెంతెకోస్తునకు అవసరమైనదేమనగా, ఒక గొప్ప బైబిల్ పాఠము, మంచి ఉపదేశము, అప్పుడు ఎంతో ముందుకు వెళ్ళుట అనునది నీకు అవసరం లేదు, చూడండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడైయున్నాడు. కొలతలేని ఆత్మను ఆయన తనలో కలిగియున్నాడు. నీవు దాన్ని నమ్ముతావా? దేవునిలో ఒక భాగము ఆయనలో ఎన్నడూ నివసించియుండలేదు, అయితే దేవునిలో ఉన్నదంతయూ ఆయన కుమారుడైన క్రీస్తు యేసులో ఉండెను. శరీరములో ఉన్న దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఆయనయే యై ఉండెను. దేవునిలో ఉన్నదంతయూ క్రీస్తులో క్రుమ్మరించబడెను. దేవునిలో వున్నదంతయూ క్రీస్తులో వుండెను. మరియు క్రీస్తులో వున్నదంతయూ ఆయన తన సంఘములో కుమ్మరించియున్నాడు. అయితే ఎడతెగకుండా నీవు దానిని త్రోసివేయుచున్నావు, చూడండి. ఆ కార్యములు. “నేను నా తండ్రి కార్యములను చేయని యెడల, నన్ను నమ్మకుడి,” మరియు, “తండ్రి నన్ను పంపియున్న ప్రకారము, (తండ్రి ఆయనను ఎలా పంపియున్నాడు? ఆయనను పంపిన తండ్రి ఆయనతో వెళ్ళియున్నాడు మరియు ఆయనలో ఉన్నాడు.), నేనును మిమ్మును పంపి యున్నాను.”

47

దేవుడు ఆయనను పంపిన అదే విధానంలో ఆయన సంఘమునూ పంపుచున్నాడు. ఆయన్ను పంపిన దేవుడు ఆయనతో వెళ్ళియున్నాడు. సంఘమును పంపిన క్రీస్తు సంఘముతో వెళ్ళెను, మరియు అవే కార్యములు. దేవుడు క్రీస్తులో ఉండి ఉన్నాడు, ఆయన ఏమి చేయుచున్నాడు? లోకమునకు తన్ను తాను వ్యక్తపరచుకొనుచున్నాడు. ఏ మనిషి ఎన్నడు తండ్రిని ఏ సమయంలో చూసియుండలేదు, తండ్రి ఆత్మయై యున్నాడు. అయితే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచియున్నాడు. ఆయన ఇక్కడ యున్నాడు. దేవుడు తన యొక్క ఉద్దేశ్యము ఏమైయున్నదో, లోకమును గూర్చి ఆయన ఏమి తలంచియున్నాడో, ఆయన లోకమును ఎంత ప్రేమించియున్నాడో, దేవుడు క్రీస్తులో ఉండి లోకమునకు తన్నుతాను వ్యక్తపరచుకొనుచున్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. చివరకు ఆయన తన ప్రాణమును దానికొరకు పెట్టియున్నాడు. ఆయన చనిపోగలిగే ఒకే ఒక మార్గము ఆయన ఒక మర్త్యుడుగా మారుటయే. ఆయన ఒక మర్త్యునిగా మారవలసియుండెను. దేవుడు క్రీస్తులో వున్నాడు.

క్రీస్తు ఏమియైయున్నాడో ఆయన దానిని సంఘములో తిన్నగా వుంచియున్నాడు. మరియు తన రక్తము ద్వారా మనలను విమోచించి యున్నాడు. “మరియు నేను చేయు అవే క్రియలను మీరును చేస్తారు. ఒకసారి ఒక స్త్రీ దానిని నమ్మియున్నది. అయన వస్త్రపు చెంగును తాకినది, ఆమె జనసమూహంలోకి వెళ్ళి, బయట నిలబడియున్నది. యేసు అన్నాడు, ”నన్ను ముట్టినది ఎవరు?“ అది సువార్తయై యున్నదని మీలో ఎంతమందికి తెలుసు? నిశ్చయంగా అది సువార్తయై యున్నది.

48

ఎందుచేత, పేతురు ఆయనను గద్దించియున్నాడు, ప్రతిఒక్కరు. “ఓ, హలో, యజమానుడా. నీవు గొప్ప ప్రవక్తవైయున్నావా? నేను నిన్ను చూడగోరుచున్నాను. నేను నీతో కరచాలనం చేయవచ్చునా? మీరు నాతో భోజనమునకు వస్తారా, నీవు నాతో నా ఇంటిలో వుండవలెనని నేను కోరుచున్నాను. నా సంఘకాపరి నీయందు విశ్వాసం ఉంచలేదు. అయితే నేను నీయందు విశ్వాసముంచియున్నాను, అని అన్నది.” చూడండి. అయితే ఒక చిన్న స్త్రీ కనీసం ఆయనకు దగ్గరగా వెళ్ళలేకపోయినది, చివరకు ఆమె వారి పాదములగుండా ప్రాకుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టి మరియు తిరిగి బయటకు పరుగెత్తినది. ఆమె చేయగోరినదంతయూ అదియే.

యేసు ఆగి ఇలా అన్నాడు, “నన్ను ఎవరు ముట్టారు?”

ఎవరో ఆయనను ముట్టియున్నట్లు ఆయనకు ఎలా తెలుసు, పేతురు అన్నాడు... అతడు కూడా భూసంబంధమైనవాడై యున్నాడు. అతడు అన్నాడు, “సరే, జనసమూహమంతయూ నిన్ను తాకుచున్నారు.” అతడిని ఆయన గద్దించాడు.

ఆయనన్నాడు, “నేను బలహీనుడనయ్యాను, ప్రభావం నాలో నుండి బయలు వెడలిపోయినది.”

49

ప్రభావం అనగా ఏమిటి? బలము. “నేను బలహీనుడనయ్యాను, నా నుండి బలము వెడలిపోయినది.” దేవుని యొక్క పరిపూర్ణత అంతటితో ఉన్న దేవుని కుమారునిని ఒక చిన్న స్త్రీ ముట్టినప్పుడు. నేను దీన్ని ఇలా కొలవగలను, భూమి మీద ఉన్న నీరంతయూ (ఐదు-వంతుల భూమిమీద, నీరు నాలుగవ-వంతు నీరైయున్నది)... భూమ్మీదనున్న నీరంతయూ క్రీస్తులో వున్న ఆత్మగా ప్రాతినిధ్యం వహిస్తే — క్రీస్తులో ఉన్నదంతయూ — మరియు ఈ చిన్న వరం దానియంతటిలో నుండి ఒక చెంచాడైయున్నది. నీవు దానినెన్నడూ తప్పిపోవద్దు. దేవునికి నన్ను కలిగియుండవలసిన అవసరంలేదు, అయితే నేను ఆయనను కలిగియుండవలసినది. అయితే నేనే ఆ చిన్న చెంచా నీరుయై యున్నాను.

అయితే, ఇప్పుడు దాన్ని మీకు నన్ను బాగా చూపనివ్వండి: పూర్తి సముద్రంలో నున్న అవే రసాయనములు, ఈ చిన్న చెంచాలో వున్నవి. అదే రకమైన రసాయనములు, వాటికంటే ఎక్కువ కాదు. కాబట్టి క్రీస్తు చేసిన అవే కార్యములు ఆయన సేవకుడు కూడా చేస్తాడు, ఏలయనగా, క్రీస్తు యొక్క జీవము ఆయన సేవకునిలో యున్నది. “నేను మీతో ఉంటాను, యుగసమాప్తి పర్యంతం నేను మీలో ఉంటాను.” అదే నిన్ను బలహీనునిగా చేస్తుంది.

50

ఇప్పుడు క్రీస్తు, దేవుని యొక్క పరిపూర్ణత అంతయూ తనలో కలిగిన, ఒక కన్యకకు జన్మించిన దేవుని కుమారుడైయున్నట్లైతే, ఒక చిన్న స్త్రీ ఆయనను ముట్టుట ద్వారా ఆయన బలహీనుడయ్యాడు. అయితే కృప ద్వారా రక్షింపబడిన ఒక పాపినైన నాకు అది ఎలా ఉంటుంది. ఆయన నిలబడి నన్ను పట్టుకొనియెడల, ఒక్కరి కొరకు కూడా నేను ఆ విధంగా చేయలేను.

ఆ గొప్ప ప్రవక్తయైన దానియేలు ఒక్క దర్శనాన్ని చూసిన తరువాత ఎన్నో దినములు తల బాధతో ఇబ్బందిపడ్డాడు. ఇప్పుడు నీవు దాన్ని గ్రహించుట ఆరంభమగుచున్నది? అదే నిన్ను బలహీనునిగా చేస్తుంది. “బ్రెన్హాం సోదరుడా, ఈ దర్శనములు ఏమి చేస్తాయి?” అది నీవే; అది నేను కాదు. దేవుని దర్శనములు... ఇది ఒక దేవుని వరమైయున్నది, అది నేను కాదు, అది దేవుని వరమైయున్నది.

51

మొన్నటి దినమున నా భార్య నాతో ఇలా అన్నది, “బిల్లీ నీవు ఎన్నడూ ఇంటి దగ్గర వుండవు. మనకు వివాహమై దరిదాపుగా 15 సంవత్సరములు కావస్తున్నది. మరియు కనీసం నీ పిల్లలకే నీవు బాగుగా తెలియదు.” నీవు వెళ్ళిపోయిన వెంటనే... ఫోను వస్తుంది, బహుశా ఒక రోజులో 40 లేక 30 ఫోన్లు వస్తాయి, “బ్రెన్హాం సోదరుడా ఇక్కడకు రండి. ఈ స్థలానికి రండి, ఈ స్థలానికి రండి.” సరే, నీవు కొంచెం క్రూరంగా మారతావు.

నేనన్నాను, “అయితే హనీ, చూడు; నా జీవితం నాది కాదు లేక, అది నీది కాదు. దేవుడు దానిని నాకు ప్రజలకు ఒక వరంగా ఇచ్చాడు; నేను ప్రజలకు చెందియున్నాను.”

ఇప్పుడు, నీవు దానితో ఏమి చేస్తావో అది నీకు మరియు దేవునికీ మధ్యయై యున్నది. అది నేను కాదు, నేనొక మనిషినై యున్నాను. అయితే ఇక్కడ నాలో ఉన్న ఆత్మ ప్రజలైన మీకు ఒక ప్రజలకు ఒక సేవ చేయుటయై యున్నది. నీవు దాన్ని స్వీకరించవచ్చు లేక త్రోసివేయవచ్చు, దానితో నీవేమి చేస్తావో అది నీ వంతుయై యున్నది. దాని విషయంలో నీవు తప్పక ఒక కనికట్టులో ఉన్నావని తలంచవచ్చు, అయితే యోహానును గూర్చి మనం ఆలోచించినప్పుడు, అతడును కనికట్టులో ఉన్నాడని మనం తలంచవచ్చు, అయితే అతడు యోర్దాను నదిలో దరిదాపుగా మోకాళ్ళ లోతు బురద నీళ్ళలో నిలబడి సువార్త బోధించుచున్నాడు.

52

ప్రవక్తలందరూ అది ఎలాటి గొప్ప సమయంగా ఉంటుందోనని మాట్లాడియున్నారు. భూమి మీద ఈ చివరి నుండి ఆ చివరకు ఒక ఇంధ్ర ధనస్సు దిగి వచ్చి మరియు ఒక గొప్పరాజు ఒక గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వస్తాడని వారు తలంచియున్నారు. అది ఏమైయుండెను? ఒక చిన్న సాధారణమైన సాధారణ వ్యక్తి ఒక మనిషిచేత బాప్తిస్మం పొందుటకు యోర్దాను నది ఒడ్డున నిలబడియున్నాడు. కనీసం అతడు సరియైన బట్టలు ధరించలేదు, ఒక ఒంటి రోమపు వస్త్రం చుట్టూ చుట్టుకునియున్నాడు, బైబిల్ ఆ సమయంలో చెప్పినదేమనగా, ప్రతి పల్లం ఎత్తు చేయబడుతుంది మరియు ప్రతి ఎత్తైన స్థలములు పల్లం చేయబడతాయి. పర్వతములన్నియు చిన్న పొట్టేళ్ళ వలె గంతులేస్తాయి. మరియు కొండలన్నియు చప్పట్లు కొడతాయి.

అది ఏమై యున్నది? ఒక బోధకుడు ఒక పరిశుద్ధమైన గుండ్రాయి అని పిలువబడ్డాడు, అతడు ఆ నది యొద్ద ఒక అక్రమమైన పేరును కలిగియున్న బాలునికి బాప్తీస్మం ఇచ్చుటకు అక్కడ నిలబడియున్నాడు. అప్పుడే అది సంభవించియున్నది. ఏది లోకము “గొప్ప” అని పిలుస్తుందో, దేవుడు దానిని “వెర్రితనము” అని పిలుస్తాడు. లోకము దేన్ని వెర్రితనము అని పిలుస్తుందో, దేవుడు దాన్ని గొప్పది అని పిలుస్తాడు. నీవు దేని వైపు చూచుచున్నావో, నీ మనస్సు ఎక్కడ ఉన్నదో దానిమీద అది ఆధారపడుతుంది. ఇప్పుడు, మన హృదయమంతటితో మన మనస్సంతటితో దేవుని యందు నమ్మికను కలిగియుందాము.

ఇప్పుడు ప్రార్ధనా వరుస అంతయూ సిద్ధముగా యున్నదా? నంబరు 4 మరియు నంబరు 14 కార్డులు కలిగియున్నవారు హాజరుకాలేదు. మంచిది, మనము తగినంత సమయమును ఇద్దాము. కాబట్టి, ఇప్పుడు బహు మర్యాదగా ప్రార్ధనలో యుండండి.

53

అమ్మా, ఎలా ఉన్నావు? ఈ సమయములోనే దేవుడు తప్పక మాట్లాడవలసియున్నది. యేసు తానే స్వయముగా మాట్లాడని యెడల నేను చెప్పినదంతయూ తప్ప, అందరికీ అది అర్థమగుచున్నదా? నేను ఒక స్థానములో నన్ను నేను ఉంచుకొంటాను. ఎందుకనగా బైబిలు తప్పక సరియైనదిగా ఉండవలసియున్నది, లేనియెడల అది తప్పుయైయున్నది. ఇది ముద్రించు సమయమైయున్నది.

ఇప్పుడు, అక్కడ ఒక స్త్రీ నిలబడియున్నది? నాకు తెలిసినంత వరకు, నేను ఆమెను ఎన్నడూ నా జీవితములో చూసియుండలేదు. మనము పరిచయములేనివారము కాదా? మనము ఒకరికి ఒకరము దరిదాపుగా ఎన్నో మైళ్ళు దూరములో, ఎన్నో సంవత్సరముల తేడాతో పుట్టియున్నాము, మరియు ఎన్నడైనా ఇదే మనము మొదటిసారిగా కలుసుకొనుట. ఇప్పుడు మరలా యోహాను సువార్త 4వ అధ్యాయములోని ఖచ్చితమైన చిత్రముగా నేను యున్నట్లైతే, అక్కడ ఒక స్త్రీ మరియు పురుషుడు యున్నారు. ఇప్పుడు ఈ స్త్రీ స్వస్థతను కోరియున్నట్లైతే ఏమిటి? నేను ఆమెను స్వస్థపర్చగలనా? లేదండి. స్వస్థత కొరకు నేను ఆమెకు ఏదైనా చేయగలనా? లేదండి. సమస్తమునూ జరుగగలదు...

54

ఇప్పుడు, ఆమె కలిగియున్నది... ఆమె ఏదైనా మరొకటైనా కలిగియున్నట్లైతే వారు చేస్తారు. వైద్యుడు ఆమెకు సహాయము చేస్తాడు, లేక ఏదైనా ఆమెకు ఇస్తాడు. ఇప్పుడు, ఒక వైద్యుడు ఆమెను స్వస్థపర్చలేడు, లేదు, లేదు. వైద్యులు స్వస్థపరచరు. తప్పుగా యున్నవాటిని, అనగా ఎముకలను వారు సరిగా చేస్తారు లేక అనవసరమైనవాటిని, అభ్యంతరముగా యున్నవాటిని వారు కోసివేస్తారు, అలాటిది ఏదైనా వారు చేస్తారు, అలాటి దానిని దేనినో వారు బయటకు తీసివేస్తారు, అయితే స్వస్థపర్చువాడు దేవుడే. (మొన్నటి దినమున నేను చెప్పియున్నట్లుగా) లేక ఎలుకలకు విషము పెట్టబడినప్పుడు, అది ఎలాగో నీలోనికి వెళ్ళినది, ఆ క్రిములను చంపుటకు అతడు నీకు ఏదో మందును ఇస్తాడు. అయితే అతడు తిరిగి నీలోని (రక్తము లోని పీచును) అతడు నిర్మించలేడు. దేవుడు మాత్రమే సృజించుటలో ఏకైకవాడుగా నిలబడియున్నాడు. అతడు నీ ప్రక్కను కోసి, నీ నుండి ఆ కణితిని బయటకు తీస్తాడు, అయితే ఆ ప్రక్కను ఎవరు బాగుచేయబోవుచున్నారు? దేవుడు నిన్ను స్వస్థపర్చనియెడల, నీవు ఏ మాత్రము తిరిగి లేవలేవు. వైద్యుడు కోయగలడు, దానిని బయటకు తీయగలడు, అయితే దానిని అతడు స్వస్థపర్చలేడు. నా భావమును మీరు గ్రహించియున్నారా?

ఇప్పుడు, ఆమె ఆర్థిక ఇబ్బందిని కలిగియున్నట్లైతే ఏమిటి? ఒకవేళ ఆమె ఫలానా... ఇంటి సమస్యను కలిగియుండవచ్చు. ఒకవేళ అది... అది పాపమైయున్నట్లైతే? ఆమెకు అవసరమైనదంతయూ క్రీస్తులోయున్నది. ఇప్పుడు, ఈ స్త్రీ ఇక్కడ దేనికొరకు నిలబడియున్నదో, దానిని క్రీస్తు నాకు బయలుపర్చినట్లైతే, ప్రతిఒక్కరూ మీ హృదయమంతటితో ఆయనను నమ్ముతారా? ఆ చిన్న స్త్రీయే చెపుతుంది...

55

ప్రమాణము చేయుట యందు మనము నమ్మికను ఉంచము, బైబిలు దానిని చెప్పుటలేదు. నీవు ప్రజల యొక్క మాటను దాని కొరకు తీసుకొనక పోయినట్లైతే, ఎందుకు కేవలము... అది సరిగ్గా అంతే. బైబిలు చెప్పియున్నది, “ఆకాశము తోడు, భూమి తోడు అని నీవు ప్రమాణము చేయవద్దు.” కాబట్టి ఏ మాత్రము ప్రమాణము చేయవద్దు.

నేను ఎరిగియున్నంతవరకు, నా జీవితములో నేను ఎన్నడూ ఆమెను చూసియుండలేదు. మరియు నన్ను ఎరుగనని ఆమె చెప్పియున్నది. ఆమెకు నేను తెలియదు, ఎక్కడో జనసమూహములో కూర్చొని నన్ను గమనిస్తే తప్ప అయితే ఆమెను గూర్చి అంతయూ దేవునికి తెలుసు. మరియు ఇక్కడేయున్న ఈ చిన్న స్త్రీని గూర్చి పరిశుద్దాత్మడు వచ్చి సమరయలోని ఆ బావి దగ్గర ఆ స్త్రీకు చేసినట్టే ఆయన చేసినట్లైతే, ఆమె దేనికొరకు అక్కడయున్నదో, మరియు ఆమె ఇబ్బంది ఏమైయున్నదో, మరియు ఆమె యొక్క అవసరత ఏమైయున్నదో, దానిని ఆయన ఆమెకు బయలుపర్చినట్లైతే, ఆ సమరయ స్త్రీ ఏమి చెప్పియున్నదో నీకు తెలుసా? “మెస్సీయా వచ్చినప్పుడు, ఆయన ఈ కార్యములను చేస్తాడని మాకు తెలుసు.”

అది మన దేవుని యొక్క సూచన. క్రైస్తవులైన మీరు, ఇప్పుడే తిరిగి జన్మించిన క్రైస్తవులైన మీరు, ఆయన చనిపోలేదని మరియు ఈ రాత్రి ఆయన సజీవుడుగా మనతో యున్నాడని అంగీకరించినవారు, ఇప్పుడు ఈ స్థలములో ప్రార్థనా కార్డులు లేనివారు మరియు దేవుడు మిమ్ములను స్వస్థపర్చవలెనని కోరువారు, మీ చేతులను పైకెత్తండి. మంచిది. దరిదాపుగా వారు ప్రతిచోట యున్నారు. ఇప్పుడు, విశ్వాసమును కలిగియుండండి.

56

ఇప్పుడు, ఓ స్త్రీ, నేను నీతో కొంచెము మాట్లాడగోరుచున్నాను, కొంచెము దగ్గరగా... అలా బోధించిన తరువాత, నేను వేదిక పిలుపును ఇచ్చుచున్నాను, నేను ఒక్క నిమిషము మీతో మాట్లాడగోరుచున్నాను. సరే, నీవంటావు, “బ్రెన్హాం సోదరుడా, దేనిని గూర్చి నీవు నాతో మాట్లాడగోరుచున్నావు? నీ ఆత్మను పట్టుకొనుట కొరకు. కేవలము... ఆ బావి దగ్గర స్త్రీతో ఎందుకు యేసు మాట్లాడగోరియున్నాడు? ఆమె యొక్క ఆత్మను పట్టుకొనుట కొరకు, ”నాకు దాహమున కిమ్మని,“ ఆయన అన్నాడు.

ఆమె అన్నది, “నీవు నన్ను అలా అడుగుట ఆచారము కాదు.”

వారు అలా మాట్లాడుకొంటూ దీర్ఘముగా కొంచెము ముందుకు వెళ్ళారు. చివరగా ఆమె యొక్క ఇబ్బంది ఏమిటో యేసు కనుగొన్నాడు. మరియు ఆమె తిరిగి ఎన్నడూ ఆయనకు జవాబు చెప్పలేదు (అనగా నీవు నాకు జవాబు చెప్పవలసిన పనిలేదు అని అనలేదు.), దేవుడు ఆయనకు దానిని బయలుపర్చినట్లైతే, ఎలాగైనా ఆయన ఆమె యొక్క ఇబ్బంది ఏమిటో ఎరిగియుండెను. నీవు దానిని నమ్ముతావా?

ఓ స్త్రీ, నేను నీకు సహాయపడగలిగినట్లైతే, మరియు నేను దానిని చేయకపోయినట్లైతే, నేను ఒక కర్కశుడునైయుంటాను. అయితే నేను... నేను దానిని చేసే ఒకే మార్గము, దేవుని వాక్యమును బోధించుట ద్వారా లేక ఒక దైవిక వరము ద్వారా, అది నిజమేనా? అప్పుడు నీవు దానిని అంగీకరిస్తావు.

నీ యొక్క వెన్ను నొప్పిని బట్టి నీవు ఇక్కడయున్నావు. మరియు ఆ బాధ ఒక పగిలిపోవుటయైయున్నది. అది నీ వెన్నులోని పగిలిపోయిన ఒక పళ్ళెమైయున్నది. అది నిజము. ఇప్పుడు నీవు నమ్ముతావా? ఆ స్త్రీయే దానికి తీర్పరి, చూడండి.

57

ఇప్పుడు, తప్పక ఏమి జరగాలి, పూర్తి గుంపు ప్రజలు ఇలా చెప్పాలి, “ప్రభువైన యేసు, నేను నీయందు విశ్వాసముంచుచున్నాను.” నీవు సజీవుడవైయున్నావు. నీవు దానిని చేస్తావని, నీ వాక్యము చెప్పినది. ఇది నీవు వచ్చే సమయమని, మీ తలలు పైకెత్తమని, నీవు చెప్పియున్నావు, మేము చివరి దినములలో జీవించుచున్నాము. ఇది అణుయుగము. నీవు అన్నావు, “ఆ సమయములో ఈ సంగతులన్నియూ జరుగుతాయి.” మరియు ఇక్కడ నీ వాక్యము ద్వారా నేను దానిని చూస్తాను, నీవు ఇక్కడ యున్నావని నేను నమ్ముచున్నాను. నన్ను స్వస్థపర్చువాడవుగా నేను నిన్ను అంగీకరించుచున్నాను, అది దానిని సర్దివేస్తుంది.“ అది దానిని తప్పక చేయవలసియున్నది.

“నీవు వెళ్ళి ఈ సూచనను చేయుము,” అని దేవుడు మోషేతో చెప్పాడు, మరియు అన్నాడు, “వారు నిన్ను నమ్ముతారు. అతడు సూచనను చేయగా వారు అతనిని నమ్మియున్నారు. మరియు వారు దారివెంబడి బయలుదేరారు. అయితే మన గొర్రెలకాపరి, ప్రభువైన యేసు, వచ్చి ఆ సూచనను చేయగలడు, మరియు అన్యులమైన మనము వెనుక కూర్చొని ఇలా అంటాము, ”ఇప్పుడు, అది ఆయనో లేక కాదో నాకు తెలియదు.“ ఆ కారణమును బట్టియే మనము దీవెనను పోగొట్టుకొనుచున్నాము.

ఇప్పుడు ఇక్కడ, ఈ స్త్రీతో మాట్లాడుచున్నట్లుగా, ఇప్పుడు, ఆమెకు నేను ఏమి చెప్పానో నాకు తెలియదు. నేను మీకు చెప్పలేను. అయితే ఒక్క క్షణములో నేను దానిని కనుగొంటాను; అక్కడ టేపు చేయు నా మనిషి యున్నాడు, నేను ఉచ్చరించిన ప్రతిమాటను, వారు కలిగి యుంటారు.

58

అయితే ఇప్పుడు, కూర్చొని కొన్ని క్షణములు ఈ స్త్రీతో మాట్లాడుతాను, అది నీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది, నేను కొంచెము... ఆయన ఏమియూ చెప్పడు. అయితే ఆయన చెప్పినట్లైతే, అది నీ విశ్వాసమును హెచ్చిస్తుందా? ఓ స్త్రీ, అది నీ విశ్వాసమును హెచ్చిస్తుందా? ఆయన చెప్పినట్లైతే. మంచిది, మీ విశ్వాసమును అది హెచ్చిస్తుందని మీలో ఎంత మంది చెప్పగలరు? మీ చేతులను చూడనివ్వండి. అప్పుడు మీరు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుతారు.

ఇప్పుడు, ఓ స్త్రీ, కేవలము ఒక్కరిని నేను తీసుకొంటాను. ప్రభువు దానిని అనుగ్రహించును గాక, అది నా ప్రార్థనయై యున్నది. అయితే మరొకసారి, నీవు ఇటు చూడవలెనని నేను కోరుచున్నాను, ఆయన ఏమి చేస్తానని వాగ్దానము చేసియున్నాడో, పరిశుద్దాత్మడు దానిని చేస్తాడేమో మీరు చూడండి. ఆయన నాకు అనుమతి ఇచ్చినట్లైతే, దానిని ఆయన చేస్తాడు. ఇది ఒక వరమైయున్నది. నేను వరమును ప్రయోగించను, అయితే వరమే నన్ను ప్రయోగిస్తుంది, దానిని చేయుచున్నది నీవేయై యున్నావు, నీవు విశ్వాసమును కలిగియున్నట్లైతే, అది నీ విశ్వాసమైయున్నది, ఆయన వస్త్రపు చెంగును తాకిన ఆ స్త్రీ వలె.

ఇప్పుడు, శ్రోతలు ఇంకనూ నా మాటలను వినుచున్నారా, ఓ స్త్రీ, అవును, అది ఆమె వెన్నులో బాధయైయున్నది. అది ఆమె యొక్క వెన్నులోని బాధ. దానిని మరలా నేను చూస్తాను. మరియు అది బ్రద్దలైన పళ్ళెము అని వైద్యుడు అన్నాడు. అది వెన్నులోని ఒక పళ్ళెము, అది బ్రద్దలైయున్నది. మరియు నీతో మరొకరు ఇక్కడయున్నారు. ఆ స్త్రీ నరముల బలహీనతతో బాధపడుచున్నది. అది నిజము. నీవు నివసి౦చే చోటనే ఆమెయూ నివసి౦చుచున్నది. ఆమె పేరు బిడ్వెల్, అది నిజము. నీవు 1315 నెంబరు పియర్సులో జీవిస్తావు. నిజము. నీ పేరు ఎడ్నా ఏండర్సన్, నిజము. ఇప్పుడు మీరు నమ్ముతారా?

ఓ, కనికరము గలిగిన పరలోకపు తండ్రీ, మా మీద కనికరమును చూపుము. నీ దీన ప్రజలము, ఈ స్త్రీ యొక్క అవసరము ఏమైయున్నప్పటికీ దీవించుము. క్రీస్తు నామములో నేను ప్రార్ధన చేయుచున్నాను. ఓ స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక.

59

నీవు ఎలా యున్నావు? నేను నీకు ఒక పరిచయములేనివాడనై యున్నాను. నీవు ఒక ఇండియా దేశవాసివైయున్నావని నేననుకొంటాను (అనగా అమెరికా దేశములో నివశించు ఒక తెగవారు). నీ యొక్క పౌరసత్వము పట్ల నాకు గొప్ప గౌరవమున్నది. ఎంతైనా సరే, నీవు ఒక నిజమైన అమెరికా వాసివి. దేవుడు ఈ భూమిని మీకు ఇచ్చియున్నాడు. ఇప్పుడు, నేను అనేక లక్షల మందిలో ఒకడినైయున్నాను, అయితే నీవు దాని నుండి ఒక కరుకైన సంబంధమును నీవు కలిగియున్నట్లుగా నీవు భావిస్తావు (మరియు నేను కూడా). దేవుడు ఈ భూమిని మీకు ఇచ్చి యున్నాడు, అయితే తెల్లవాడు వచ్చి ఆ భూమిని మీ నుండి లాగివేసుకొన్నాడు. అయితే నాకు ఒక సంగతి తెలుసు, ఆయన నీకు తప్పు దానిని యియ్యడు; అదే ప్రభువైన యేసుయై యున్నాడు.

నీవు అత్యధికమైన నరముల బాధతో బాధపడుచున్నావు. మరియు తరువాత, నీవు ఒక వైద్యుని దగ్గరకు వెళ్ళావు. మరియు నీకు ఆపరేషన్ జరుగవలసియున్నదని వైద్యుడు నీతో చెప్పాడు. అది నీ యొక్క మూత్రపిండములను బట్టి, అది నీ వెన్నులో యున్నది. మరియు అది నీ యొక్క ఎడమవైపు మూత్రపిండమును వారు తీసివేయగోరినది.

ఓ పరలోకపు దేవా, నీ దీవెనను ఈ స్త్రీ పైకి పంపుము మరియు ఆమెను దీవించుము, నేను యేసు నామములో అడుగుచున్నాను. ఆమెన్. ఓ, స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. నీవు అడుగుచున్న దానిని ఆయన నీకు ఇచ్చును గాక.

ఇప్పుడు, ప్రభువైన యేసుకు తప్పక అన్ని సంగతులు తెలియును, ఆయనకు తెలియవా? ఆయనకు నీవు తెలుసు మరియు నేను తెలుసు. నీవు ఇక్కడ దేనికొరకు యున్నావో ఆయనకు తెలుసు. నీ భర్త కూడా స్వస్థతను పొందగోరుచున్నాడు, కాదా? ప్రతి బోధకుడు అతని హృదయమంతటిలో దేవుని వాక్యమును తప్పక నమ్మవలెను. అయితే నీవు నరముల బలహీనతతో బాధపడుచున్నావు. తరువాత, నీ రొమ్ములో నెప్పులను కూడా నీవు కలిగియున్నావు. అది నిజము, మరియు నేను చూస్తాను, కొంచెము వెనుకకు వెళ్ళుము. అక్కడ ఒక వైద్యుడు ఏదో పరీక్షించుచున్నాడు, అది నీ పిత్తాశయములోని రోగమైయున్నది. మరియు దానికి ఆపరేషన్ చేయవలసియున్నదని ఒకసారి అతడు చెప్పాడు, దానిలోని రాళ్ళను తీసివేయుటకు అది దరిదాపుగా 3 లేక 4 సంవత్సరముల నుండియై యున్నది. అది నిజము. [ఆ స్త్రీ చెప్పుచున్నది, “అది 3 సంవత్సరముల 9 మాసముల నుండి.”] ఇప్పుడు నీవు నమ్ముతావా? ఇక్కడకు రమ్ము.

ఓ, ధన్యుడైన యేసు, నీతిగల దేవుని కుమారుడా, ఇక్కడ నిలబడియున్న ఈ ప్రియమైన స్త్రీని స్వస్థపర్చుము, నీ స్వస్థతా శక్తి కొరకు ఆమె ఎంతో దీర్ఘముగా కనిపెట్టుచున్నది. ఆమె స్వస్థత కొరకు యేసు నామములో నేను ఆమెను దీవించుచున్నాను. ఆమెన్. ఓ స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక.

60

నీవు నమ్మినట్లయితే. ఇప్పుడు, మీరు ఎంతో దయగా యున్నారు, మీరు సహాయపడినయెడల, పడకపోయిననూ ఎటూ కదలవద్దు. ఇక్కడ ఒకరు కొన్ని క్షణముల క్రితము స్వస్థతనొందియున్నారు. నేను దానిని దానిని తీసుకొనలేదు కారణము ఎవరో కదలుచున్నారు, మరియు అది. నీవంటావు “బ్రెన్హాం సోదరుడా, దానిని గూర్చి ఏమిటి? మీరు కేవలము బైబిలును బోధించియున్నారని నేను తలంచాను. అది బైబిలుయై యున్నది, యేసు, యాయీరు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె స్వస్థపడియున్నది, ఆయన అన్నాడు, ”ఆమె కేవలము నిద్రించుచున్నది.“

వారన్నారు, “ఆమె చనిపోయినదని మాకు తెలుసు.”

మరియు ఆయన వారరందరిని ఇంటిలో నుండి బయటకు పంపివేశాడు.

ఒకసారి ఆయన ఒక మనిషిని జనసమూహములో నుండి బయటకు తోడుకొని వెళ్ళి పట్టణము బయటకు వెళ్ళి అతనిని స్వస్థపరిచాడు. నీవు నమ్మినట్లైతే.

అక్కడే తిన్నగా కూర్చొనియున్న ఓ స్త్రీ నీవు కేవలం నమ్ముము. నాకు తెలియదు. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? ప్రభువైన యేసు నీకు సహాయపడుటకు నన్ను ఇక్కడకు పంపియున్నాడని నీవు నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో నీవు నమ్మినట్లైతే, దేవుడు నీ కొరకు దానిని నీకు చేస్తాడు. నేను నిన్ను స్వస్థపర్చలేను, అది నీకు తెలుసు. కారణము స్వస్థపరచే ఏ శక్తియూ నాకు లేదు. అయితే యేసుక్రీస్తు మాత్రమే స్వస్థపర్చు శక్తి కలిగియున్నాడు. నీవు దాన్ని నమ్ముతావా? మంచిది. నీ లోపం ఏమైయున్నదో దేవుడు నాకు వివరించినట్లైతే, నీవు దాన్ని నమ్ముతావా? అది నీ ప్రక్కలో యున్నది. అది నీ కుడివైపున వున్న ఒక కణితి పెరుగుటయై యున్నది. అది నిజము. అది నిజమేనా? నీ హృదయమంతటితో దాన్ని నమ్ముతావా? నీవు ఒక రకమైన దీవెనను కలిగియున్నావు, నీవు కలిగిలేవా? అది నీ భర్తయై యున్నాడు. ఆయన రోగిగా యుండి ఇప్పుడు స్వస్థపడియున్నాడు. అది నిజము. ఆయన ఒక మధుమేహ వ్యాధి గలవాడై యున్నాడు. అది నిజమేనా? అది ఖచ్చితంగా సత్యం. ఇప్పుడు, నీవు నీ హృదయమంతటితో నమ్ముతావా? అలాగైతే, ఇక్కడకు రమ్ము.

పరలోకపు తండ్రీ నీవు ఈ స్త్రీ పట్ల కనికరం చూపి మరియు నీ ఆత్మ ఆమె పై కదిలి ఆమె యొక్క హృదయ వాంఛను దయచేయవలసినదిగా ఈ దీవెన కొరకు నేను దీనముగా, బలహీనంగా నిన్ను అడుగుచున్నాను, యేసు నామములో. ఆమెన్. ఓ స్త్రీ ప్రభువు నిన్ను దీవించును గాక.

61

“నీవు నమ్మినట్లైతే సమస్తమూ సాధ్యమే.” విశ్వాసమును కలిగి యుండుము, సందేహించవద్దు.

ఈ పైన ఉన్న స్త్రీ నీవేనా? నీవేమైయున్నావు... నీ ప్రక్కలో ఏదో ఇబ్బంది యున్నది, అది కాదా? అక్కడే ఆ మనుష్యునికి దగ్గరగా కూర్చొనియున్న ఆ రెండవ స్త్రీ ఇక్కడయున్నది, ఆ వెనుక అక్కడే వుండి తిన్నగా నా వైపు చూచుచున్నది, ఓ స్త్రీ నీ ప్రక్కతో ఏదో ఇబ్బందియున్నది, అవును అక్కడే ఉన్న స్త్రీ, అది నిజమేనా? ఒక చిన్న గుండ్రటి టోపీని ఆమె ధరించి యున్నదా? అది నిజము. ఇప్పుడు మీరిద్దరూ స్వస్థపడియున్నారు. ఆమెన్.

ఓ స్త్రీ కొన్ని నిమషాల క్రితం అది నీవైయున్నావు. సరే, అది ఏమైయున్నది వరుసలో, అదే కార్యమును ఈ మార్గం గుండా నేను పిలుచున్నాను. మరియు నేను కలిగియున్నానని. అది ఏ మార్గం నుండి వచ్చుచున్నదో నేను చెప్పలేను, చూడండి.

ఓ ఆయన మంచివాడు కాడా? ఆయన ఎంతో అద్భుతమైన వాడు, “నీవు నమ్మినట్లైతే, నమ్మువానికి సమస్తమూ సాధ్యమే.” అయితే అది నీవు నమ్ముచున్నావా లేదా అనుదానిపై అది ఆధారపడియున్నది.

62

ఓ స్త్రీ నీవెలా ఉన్నావు? నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? నీవు సంపూర్ణంగా దుఃఖంలోయున్నావు, నీవు లేవా, నీవు నిజంగా నరముల ఉద్రికత్తలో యున్నావు, బ్రద్దలైపోయి యున్నావు. నీవు ఎవరినో కోల్పోయియున్నావు. నీ భర్తయైయున్నాడు. అది నిజము. కలతపడవద్దు; దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు బలమునిచ్చువాడుగా ఆయన వాగ్దానం చేసియున్నాడు. ఉద్రిక్తురాలవు కావద్దు. ప్రియమైన సహోదరి, ఆయన సమస్తమును ఆయన తన చేతిలో పట్టుకొనియున్నాడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు మరియు ఆయన నిన్ను ఆశీర్వదించును. నాకు నిశ్చయత ఉన్నది. మనం ప్రార్ధన చేద్దాం.

మా దయగల పరలోపు తండ్రీ, నీ ప్రియ కుమారుడైన ప్రభు యేసు నామములో ఇక్కడ నిలబడియున్న ఈ చిన్న స్త్రీని నేను ఆశీర్వదించుచున్నాను. ఆమె స్వస్థత కొరకు నేను అడుగుచున్నాను. ఆమేన్. ఓ ప్రభువు నిన్ను దీవించును గాక, కేవలం విశ్వాసమును కలిగియుండుము, సందేహించవద్దు.

చీకటి: దేవుడు కేన్సర్ వ్యాధులను బాగుచేయగలడు, మరియు వారిని స్వస్థపర్చగలడు. నీవు దాన్ని నమ్ముతావా? ఓ స్త్రీ, ఒక్క క్షణము. అది ఇక్కడయున్నది. నీలపురంగు వస్త్రమును ధరించినది. దేవుడు కేన్సర్ వ్యాధులను బాగు చేస్తాడని నీవు నమ్ముచున్నావా? సాతాను దాని ద్వారా నిన్ను తీసుకెళ్ళాలని తలంచినది, అయితే వాడు దాన్ని చేయలేకపోయాడు. ఓ, స్త్రీ నీవు దాన్ని అంగీకరిస్తావా? నీ హృదయమంతటితో నీవు దాన్ని నమ్ముతావా? మంచిది, మీరు దాన్ని పొందండి, మీరిద్దరూ వెళ్ళండి, ఇప్పుడు స్వస్థత నొందండి; ప్రభువైన యేసు నామములో దేవుని యందు విశ్వాసమును కలిగియుండండి.

నీవు నమ్మినట్లైతే.

63

ఆ చివరి వరుసలో కూర్చొనియున్న వారు, అయ్యా ఆ వెనుక తిన్నగా, అక్కడ నీవు అధిక రక్తపోటును కలిగియున్నావు. ప్రభువైన యేసు నిన్ను స్వస్థపర్చునని నీవు నమ్ముతావా? నీవు అప్పుడు ఆ స్త్రీ యొక్క వరుసలో వుండియున్నావు. అది నిన్ను విడిచిపెట్టినదని, నేను తలంచాను, అయితే అది తిన్నగా నీ వెనుకకు వచ్చియున్నది. నీవు అక్కడ నిలబడి ప్రార్ధన కూడా చేయుచున్నావు, ప్రార్ధన చేయుటలేదా? అది నిజము. మంచిది, నీవు నీ హృదయ మంతటితో నమ్మినట్లైతే, నీవు అడిగినదాన్ని నీవు పొందగలవు. ప్రభువు దాన్ని నీకు దయచేయును గాక. సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తి ద్వారా ఇప్పుడే నీవు తిన్నగా స్వస్థపడియున్నావని నీవు నమ్ముతావా?

ఓ దేవా, ఈ మనిషిపై నా చేతులుంచి అతని స్వస్థత కొరకై నేను ప్రార్ధన చేయుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఇతడు స్వస్థపడును గాక. ఆమేన్.

ఓ స్త్రీ, ఎలా ఉన్నావు? ఆ ఉబ్బసం వ్యాధి నిన్ను విడిచి నీవు స్వస్థపడి, దగ్గుటను ఆపివేస్తావని నీవు నమ్ముచున్నావా? నీవు దాన్ని నమ్ముతావా? ఓ ప్రియమైన యేసూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థత కొరకు ఈ దీన స్త్రీని నేను దీవించుచున్నాను. అది నీకు అనుగ్రహింపబడును గాక, యేసు నామములో. ఆమెన్. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. ఆయన యొక్క దీవెనలు నీ మీద వుండును గాక.

దేవుడు కేన్సర్ వ్యాధిని బాగుచేస్తాడు, ఏ బేధమును చేయదు, ఆయన దేనినైనా బాగుచేస్తాడు, నీవు దాన్ని నమ్మగలిగినట్లైతే. ఆయన నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముతావా? ఓ యేసూ, సజీవుడైన దేవుని యొక్క కుమారుడా, సాతాను ఈమె యొక్క జీవితాన్ని తీసుకోవాలని నిశ్చయించినది. అయితే నేనామెను దీవించుచున్నాను. నీవు ఆమెను కాపాడుతావని యేసుక్రీస్తు నామములో శతృవును ఖండించుచున్నాను. ఆమేన్. ఓ స్త్రీ, ప్రభువు నిన్ను దీవించును గాక. నమ్ముతూ వెళ్ళుము.

64

దేవుడు నివసి౦చు స్థలము హృదయమే. మరియు నీవెక్కడ జీవిస్తావో అక్కడ నిన్ను ఆయన బాగుచేయగలడు. నీవు దాన్ని నమ్ముతావా? ఆయన నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముతావా? ఓ నిత్యుడైన దేవా, ఈ మనిషి పైకి నీ దీవెనలను పంపుము, క్రీస్తు నామములో నేనాయనను దీవించుచున్నాను, దేవుని యొక్క మహిమ కొరకు ఆయన స్వస్థపడును గాక. ఆమేన్. ప్రభువు నిన్ను దీవించును. ఆమెన్. దేవుడు నిన్ను దీవించును గాక, సోదరుడా. ఇప్పుడు నీ హృదయమంతటితో నమ్ముతూ వెళ్ళుము.

హృదయమంతటితో నీవు అక్కడ నమ్ముతున్నావా? విశ్వాసము కలిగియుండుము.

కీళ్ళవాతం వ్యాధి కూడా దేవుడు స్వస్థపరచును. నీవు ఆ వరుస వెనుక కూర్చొని నీ కీళ్ళవాతం వ్యాధి కొరకు ప్రార్థన చేస్తున్నావు. అది నిజము. దేవుని యొక్క దూత అటు వెళ్ళుట నేను చూచియుండకపోతే నేనెన్నడూ దాన్ని పట్టుకొనగలిగియుండేవాడిని కాను, అయ్యా. ఇప్పుడు నీవు అడిగిన దానిని పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచినది.

దేవునికి మహిమ కలుగును గాక! నమ్ముటకు మరియు దాన్ని అంగీకరించుటకు ఒక అవిశ్వాసికి అది ఎలాటి సవాలుయై యున్నది.

అక్కడే కూర్చొనియున్న నీవు ఓ స్త్రీ: కళ్ళజోడు పెట్టుకుని సన్నగా యున్నావు. నీవు సైనస్ వ్యాధిని కలిగియున్నావు. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయగలడని నీవు నమ్ముచున్నావా? నీవు అడిగిన దాన్ని పొందవచ్చును. ఆమెన్. ప్రభువు నిన్ను దీవించును గాక.

65

ఇప్పుడు, నీ ప్రక్కన కూర్చొనియున్న స్త్రీ ఆమె తన తలను వంచియున్నది, ఆమె దేనికొరకో ప్రార్ధన చేయుచున్నది. అది ఆమె యొక్క చిన్న మనుమడు. అది నిజము. నేను దేవుని యొక్క ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముతావా? నీ చిన్న మనుమడు నరముల బలహీనతతో బాధపడుచున్నాడు. ఆ బలహీనతతో ఎంతగానో బాధపడుచూ, కనీసం పాఠశాలకు కూడా వెళ్ళలేకపోవుచున్నాడు. అది సత్యము. అయితే నీ హృదయమంతటితో నీవు నమ్మినట్లైతే, నీవు అడిగిన దాన్ని పొందవచ్చును. మరియు నీవతనిని చూచినప్పుడు, అతనిని భిన్నంగా ఉండుటను నీవు కనుగొంటావు.

ప్రభువు యొక్క నామము సన్నుతించబడును గాక.

ఈ చేతిగుడ్డల కొరకు మనము ప్రార్ధన చేద్దాం.

66

ఓ యేసూ, దేవుని కుమారుడా, ఈ చేతిగుడ్డలకు ప్రాతినిధ్యం వహించుచున్న వారందర్నీ అవసరతలో ఉన్నవారందరిపట్ల కనికరం చూపి, ప్రతి ఒక్కరిని బాగుచేయుము. ప్రభువా, దాన్ని అనుగ్రహించుము. యేసు నామములో మరియు ఇక్కడ ఉన్న ఈ స్త్రీకి నేను ప్రార్ధన చేయుచున్నాను. ఆమెను బాగుచేసి, ఆమె ప్రతి చిన్న లోపము నుండి బాగుచేయుము. అమె దేవుని యొక్క సమాధానముతో స్వస్థపడి బయలువెళ్ళును గాక.

ఇప్పుడు ఇక్కడ ఎంతమంది నమ్ముచున్నారు? వారిలో ఒకరు నా కుర్రవాడు, నా కోటును పట్టుకునియున్నాడు, కాబట్టి తప్పక ఇది సమాప్తమగుచున్నది మరియు తప్పక నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు నిజంగా మర్యాదగా ఒక్క క్షణం ఉండండి. నీ హృదయమంతటితో ప్రభువైన యేసును యధార్ధముగా నీవు నమ్మినట్లైతే, దేవుని యొక్క కుమారుడు, దేవుని మంద యొక్క గొప్ప కాపరి నీలో నున్న అవిశ్వాసమంతటిని, ఆ పాత భిన్నత్వ మంతటిని నీ హృదయంలో నుండి తీసివేసి, తన శ్రేష్టమైన మార్గమును ఇక్కడ నీలో చుట్టుటకు ఆయన ప్రయత్నించుచున్నాడు.

పాపమనగా ఏమిటి? పాపము అనగా ఏమిటి? అవిశ్వాసము! ఒక పురుషుడు గానీ, లేక ఒక స్త్రీ గాని, బాలుడు లేక బాలిక ఇలాటి కూటములో కూర్చుని మరియు అవిశ్వాసంతో బయటకు నడిచి వెళ్ళిపోయినట్లైతే, నీవు నీ నిరీక్షణను దాటిపోయియున్నావని నేను నమ్ముతాను. ఇప్పుడే నీవు దాన్ని ఎందుకు నమ్మకూడదు, నీవు దాన్ని చేస్తావా? నీ చేతులను ఆయనకు ఎత్తుము.

ఓ స్త్రీ, ఇక్కడకు రమ్ము. క్రీస్తు నామములో, ప్రభువా ఈ స్త్రీని స్వస్థపరచి, ఆమెను బాగుచేయుము.

67

పరలోకపు తండ్రి, ఈ శ్రోతల పట్ల కనికరం చూపుమని నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను. మరియు దేవా, పరిశుద్దాత్మ ఎలాగైనా, (నీవు దాన్ని ఎలా చేస్తావో నాకు తెలియదు). అయితే నీవు దాన్ని చేయుమని నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను, ఆ అవిశ్వాసపు శక్తిని, ఆ చీకటి శక్తిని విరుగగొట్టము. ఈ శ్రోతలపైకి నీ ఆత్మను కుమ్మరించుము, వారెక్కడ కూర్చున్నారో అక్కడే వారిని కదలించుము. మరియు దేవుని యొక్క శక్తి రోగులను, బాధింపబడుచున్నవారిని లేపి వారందర్ని ప్రతి చిన్న బలహీనత నుండి శుద్దులుగా చేయును గాక. ఓ గొప్ప పరిశుద్దాత్మడా, నీ చేతులకు నేను వారిని అప్పగించుచున్నాను. అది ఎలా చేయాలో నేనెరిగియున్నదంతయూ నేను చేసియున్నాను. మరియు యేసు నామములో వారిని నీకు ఇచ్చుచున్నాను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...