కొరింథీయులు, ఒక దిద్దుబాటు పుస్తకం
స్నేహితులారా, శుభోదయము! ఈ ఉదయమున నా గొంతు కొంచెం బొంగురుపోయి ఉన్నదని నేను సహోదరుడు నెవిల్ కు చెప్పాను, మరియు ఈ రానున్న ఉజ్జీవము, ఈ ఉదయమున మీకు బోధించుటకు నేను ప్రయత్నము చేయను, ఏలయనగా నా గొంతు ఎంతగానో బొంగురుపోయినది అయితే ఇక్కడ మనం ఒక చిన్న గుంపుగా యున్నందున, నేను ఒక చిన్న సండే స్కూల్ పాఠము వలే తీసుకుంటాను, తరువాత కొంచెం ఆయనను బోధించనియ్యండి. కాబట్టి మనం…ఒక చిన్న పాఠమును 15 లేక 20 నిమిషాలు నేను బైబిలు నుండి తీసుకుంటాను. బహుశా ప్రభువు దాని నుండి ఏదైనా మనకు కొంత ఇస్తాడు. ఇప్పుడు, ఆయన మనకు ఎంతో గొప్పగా, మంచివాడుగా ఉన్నాడు, ఎంతో గొప్ప మంచివాడై యున్నాడు.
2 కాబట్టి మనము అలసిపోయి యున్నాము. నేను గత రాత్రి కొంచెం ఆలస్యంగా వచ్చియున్నాను. నేను దాని తర్వాత…నేను లోపలకు వచ్చినప్పటి నుండి నాకెన్నో టెలిఫోన్ కాల్స్ వచ్చియున్నవి. మరియు—మరియు నేను దానిని గమనించియున్నాను. నా చిన్న బాలుడు ఒక గ్లాసులో నుండి తన చేతి నిండా గింజలను తీసుకుని, ఆ గింజలను చీకుతూ మరియు తినివేయుచున్నాడు. మరియు ఆ గ్లాసులో ఉన్నవాటిని అతడు మ్రింగివేయుచున్నాడు. కాబట్టి మేము అతనిని పట్టుకుని నోటిలో నుండి వాటినన్నిటినీ తొలగించి అతనిని శుభ్రపరచియున్నాము. ఆ తర్వాత మేము అతనితో ఇక్కడ రాత్రిలో అతి దీర్ఘకాలము అతనితో గడిపియున్నాము, అందుచేత ఒక విధంగా అలసిపోయి యున్నాము.
3 మరియు నేను తిన్నగా 12 గంటలకు లేచి కెంటకీ లోనికి వెళ్ళి అక్కడ ఒకరిని కలుసుకొనుటకు నేను వెళ్ళవలసి యున్నది. మరియు తర్వాత ఈ రానున్న వారము మన కూటములు వస్తాయి.
4 ఇప్పుడు నేను సాధ్యమైతే కొన్ని రాత్రులు మాట్లాడుటకు ప్రయత్నం చేస్తాను, మై…నాకు జలుబు చేయలేదు. కాబట్టి చివరకు నా స్వరమును కోల్పోవునంతగా నేను బోధించియున్నాను. చూడండి, తిన్నగా ఈ 4 నెలలు బోధించియున్నాను, మీరు చూడండి, ఆ కారణమును బట్టి, దాని తర్వాత నేను కెనడా దేశం వెళతాను. తర్వాత తిరిగి మన సాధారణ కూటములకు వస్తాను. మరియు విదేశాలకు వెళతాను.
5 ఇప్పుడు నేను అక్కడ కూర్చొనియుండగా కొన్ని క్షణముల క్రితము లియో, జెనేతో మాట్లాడుచున్నాను, ఒక లేఖనము గూర్చి నేను ఆలోచన చేయుచున్నాను. దానిని ఈ ఉదయమున మనము తీసుకుందాము. ఇప్పుడు మొదటిగా అలాగైతే…ఒక్క నిమిషంపాటు నేను కూర్చొనబోవుచున్నాను. ఎందుకంటే నేనెంతో అలసిపోయి ఉన్నాను. మరియు నేను ఇలా తలంచాను, “సంఘము బయట కూర్చొనియుండగా నేను గదిలో కూర్చుండుట అది మంచిగా ఉండదు, ఎందుచేత ప్రభువు ఇంకా అక్కడకు వచ్చియుండలేదు. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడకు నేను రాగోరుచున్నాను.”
6 కాబట్టి, ఈ ఉదయమున నేను ఇక్కడకు తేబడిన కారణములలో ఒక దానిని నేను చూస్తానని నేను నమ్ముచున్నాను, సహోదరుడు లిటిల్ ఫీల్డ్ ఇక్కడ ఉన్నాడు. అవును. కూటము ముగించబడిన తర్వాత ఒక క్షణం నన్ను అతడు చూడగోరుచున్నాడు. సహోదరుడు లిటిల్ ఫీల్డ్ టెన్నెస్సీ పట్టణం నుండి ఇక్కడకు వచ్చాడు. ఈ మధ్యనే ఒక హైస్కూల్ లోని జిమ్నాసియంలో అతడు పెద్ద కూటములను అక్కడ కలిగియున్నాడు. ఆ పట్టణం యొక్క పేరును నేను చెప్పలేకపోవుచున్నాను. లిటిల్ ఫీల్డ్ సోదరుడా నీవెక్కడ నుండి వచ్చియున్నావు? [సోదరుడు లిటిల్ ఫీల్డ్ “క్లీవ్ లాండ్” అని చెప్పుచున్నాడు.—ఎడి.] క్లీవ్ లాండ్ [“టెన్నెస్సీ.”] టెన్నెస్సీ రాష్ట్రంలోని క్లీవ్ లాండ్.
7 కాబట్టి అక్కడ మేము అద్భుతమైన సమయాన్ని గడిపియున్నాము. మరియు అతడు ఇక్కడకు వచ్చియున్నాడు…నాకు “హలో” చెప్పుటకు మార్గమంతటిగుండా వచ్చియున్నాడు, కాబట్టి నేను అతనితో ఈ ఉదయమున ఆ క్రింద వేచియుండమని చెప్పాను. ఈ ఉదయమున మనము మరొక స్థలమునకు వెళ్ళుచున్నాము. మరియు అక్కడ మరికొందరు స్నేహితులను మనము దర్శించగోరుచున్నాము. అక్కడ బోధించుట లేదు, కేవలము వారిని దర్శించుటకు, ఎందుచేతననగా నేను వారికి వాగ్దానం చేసియున్నాను. తర్వాత సోదరుడు లిటిల్ ఫీల్డ్, డాక్టర్ బీలాండ్ అనువారు ఇక్కడయున్నారు. కాబట్టి ఈ ఉదయమున నేను లోనికి వచ్చిన కారణమేమనగా వారి దగ్గరకు వచ్చి, వారిని చూచుటకొరకే.
8 కాబట్టి ఇప్పుడు కొరింథీయులకు వ్రాసిన పత్రికలో 10వ అధ్యాయము, మొదటి 4 లేక 5 వచనములు కొన్ని క్షణములపాటు మనము దానిని ధ్యానం చేద్దాము, అప్పుడు మన సోదరుడు బోధించుటకు సమయం కలిగియుంటాడు.
ఇప్పుడు మొదటిగా ఆయన సన్నిధిలో మన తలలను వంచుదాము.
9 ధన్యుడగు పరలోకపు తండ్రీ, ఈ రోజు నిజానికి కృతజ్ఞతగల హృదయములతో నీ ముందు మేము దీనముగా మా తలలు వంచి, మా జీవితములోని మంచి కార్యములన్నిటి కొరకు నీకు మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరియు జీవితమే దానికై అది ఒక పోరాటముగా యున్నదని మేము గ్రహించుచున్నాము. దానిని మేము ఒక మార్గములో కలిగి యుండకపోయినట్లైతే మేము ఆ పోరాటమును మరియొక మార్గంలో కలిగియున్నాము, అయితే ఒక మహిమకరమైన దినమున ఆ పోరాటం ముగిసిపోతుంది. మరియు మేము ఆయనను ప్రేమించినప్పటి నుండి ఎవరికొరకు ఎదురుచూస్తున్నామో, మాకు బంధువుగా మారి మాకు పరిచయమైన ఆ యేసును మేము చూస్తాము. ఒక దినమున మేము ఆయనను చూస్తామని ఎరిగియున్నందులకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.
10 ఇప్పుడు ఈ రోజు, మాకు అనువుగా యుండుటకు ఆ సింధూర వృక్షము క్రిందకు మమ్ములను లాగుకొనియుండగా, ఇదివరకు జరిగియున్నట్లుగా. అబ్రాహాము వలే, అతడు అక్కడ కూర్చొని వేచియుండగా, దేవుడు మరియు ఇద్దరు దేవదూతలు అతని యొద్దకు వచ్చి మాట్లాడియున్నారు. మరియు ఈ ఉదయమున నీవు మా యొద్దకు వచ్చుటకు మేము ఎదురుచూచుచున్నాము, ప్రభువా, మేము దాని చుట్టూ సహవాసము చేయుచుండగా, నీ వాక్యము ద్వారా మా హృదయములతో మాట్లాడండి.
11 మా ప్రియమైన, మాకు ప్రియుడైన మా సంఘకాపరిని దీవించండి. ప్రభువా, నీవు ఆయనకు బలమును మరియు ధైర్యమును దయచేయుమని మేము ప్రార్థన చేయుచున్నాము. ఈ చిన్న సంఘమును, దాని యొక్క పెద్దలను, ఇక్కడ దానికి సంబంధించిన వారందరినీ, ప్రభువా ఇక్కడకు వచ్చు వారందరినీ, ఇక్కడ మాత్రమే కాదు, ఇతర స్థలములలో యున్నవారిని, విశ్వవ్యాప్తమైన నీ సంఘమును దీవించండి.
12 ఈ ఉదయమున మమ్మును దర్శించుచూ మాతోయున్న సోదరులనందరినీ ఈ కూడికలో దీవించండి. మీరు వారితో యుండి వారిని బలపరచుమని మేము ప్రార్థన చేయుచున్నాము. మా పాపములను క్షమించండి మరియు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. క్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.
13 నేను పొరబడని యెడల, సహోదరుడు కోట్స్ ఈ ఉదయమున మనతో కూర్చొనియున్నాడు. అతడు…గతరాత్రి వెటరన్స్ హాస్పిటల్ లో ఉన్న కేన్సర్ రోగులకు ప్రార్థన చేయవలసియుండెను మరియు ఈ ఉదయమున బ్రదర్ కోట్స్ ను మరియు ఆయన భార్యను చూచుటకు మనము ఆనందించుచున్నాము.
14 ఇప్పుడు, కొరింథీయుల గ్రంథములో 10వ అధ్యాయము, ఈ కొరింథీయుల పత్రిక ఒక దిద్దుబాటు పత్రికయైయున్నది. క్రొత్త నిబంధన అంతటిలో, ఈ సంఘములోని నాయకులు మాత్రమే ఎంతో ఇబ్బందిలో యున్నట్లుగా కనబడుచున్నది. అయితే కొరింథీయులు ఎల్లప్పుడును ఇబ్బందిలో యున్నారు. మనము తప్పక కొరింథీయుల పత్రికను తీసుకొనవలసియున్నది. పౌలు, వారి యొద్దకు తిరిగి వచ్చినపుడు, ఒకడు భాషలు మాట్లాడవలెనని, ఒకడు కీర్తనను పాడవలెనని, మరొకడు ఒక అనుభూతిని లేక ఉద్రేకమును కలిగియుండవలెనని కోరియున్నాడు. మరియు వారిని తిన్నగా చేయుటలో, ఈ కొరింథీయులతో అతడు ఎల్లప్పుడును ఇబ్బందిని కలిగియున్నాడు.
15 మనము గమనించినట్లైతే, అతడు లోతైన సంగతులను బోధించలేకపోయాడు. వారు కేవలము ఒక—ఒక—ఒక చిన్న బిడ్డ తరహాలో యుండియున్నారు. వారు—వారు…అతడు ఎఫెసులో యున్నవారికి, మరియు రోములో యున్నవారికి లోతైన సంగతులను ఉపదేశించినట్లుగా, అతడు లోతైన, గొప్ప వర్తమానములతో అతడు కొరింథీయుల నొద్దకు వెళ్ళలేకపోయాడు. ఏలయనగా వారు వాటిని తీసుకొనే స్థితిలో లేరు. వారు—వారు చిన్న చిన్న ఉద్రేకములపై మరియు చిన్న కార్యములపై ఆ విధముగా ఆధారపడియుండిరి. కేవలము, “మంచిది, ప్రభువుకు స్తోత్రము, నేను దానిని కలిగియున్నాను, అని అన్నారు! నేను—నేను ఒక ప్రత్యక్షత కలిగియున్నాను. నేను ఒక కీర్తనను కలిగియున్నాను. నేను ఒక ప్రవచనమును కలిగియున్నాను.”
16 పౌలు అన్నాడు, “ఇవన్నియూ తప్పిపోతాయి.” చూడండి? వాటిలో ప్రతి దానిని మనము మితిమీరినట్లుగా నమ్మరాదు. అందుచేత, అతడు సంఘమునకు ఏమి ఇవ్వబోవుచున్నాడు? అది లంగరుయై యున్నది, అక్కడ మనము—మనము అక్కడ క్రీస్తులో లంగరు వేయబడతాము, అక్కడ మనము ఉద్రేకముల మీద నమ్మకమును ఉంచము. ప్రత్యక్షతల మీద మనము నమ్మకమును ఉంచము. ఈ సంగతులను మనము నమ్మము. కేవలము, క్రీస్తునే మనము నమ్ముతాము. అది విశ్వాసము ద్వారానే మనము అక్కడ బయటకు కదులుతాము. కేవలము…
17 మనము గమనిస్తాము, పౌలు ఎఫెసులోయున్నవారికి, వారు ఎలా జగత్తు పునాదికి ముందే దేవుని యొక్క కుమారులుగా స్వీకరించుటకు ఎలా స్వీకరించబడ్డారో, అతడు వారికి బోధించగలడు. ఇప్పుడు, అతడు…కొరింథీయులకు దానిని గూర్చి ఏమియూ తెలియదు. వారు కేవలము…ఒక చిన్న స్పర్శ లేక ఒక చిన్న ఉద్రేకము, లేక అలాటిది ఏదో, ఇది, అది, మరొకటి, వారు కలిగియుండవలసియున్నదని అనుకొన్నారు. మరియు వారు దాని మీద ఆధారపడ్డారు. అతడు వారికి లోతైన సంగతులను ఉపదేశించలేకపోయాడు.
18 కాబట్టి, అది ఒక గొప్ప సంగతి అని నేను అనుకొంటాను…లోతైన సంగతులను బోధించగలుగు ప్రజలను నీవు కలిగియున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఈ గొప్ప సత్యములను, ప్రజల హృదయములలోనికి వాటిని లంగరు వేసి చుట్టివేయగలడు, అప్పుడు వారు ఎక్కడ నిలబడియున్నారో వారు ఎరిగియుంటారు. అది ఉద్రేకమా లేక ఉద్రేకము కాదా, ప్రవచనమా లేక అది ప్రవచనము కాదా, అది ఏమైయున్నప్పటికీ అది ఏదైననూ అప్పుడు మనము దానిని చేయము…ఇప్పుడు గుర్తుంచుకోండి, మనము అది కాదు…దేవుడు ప్రవచనము ద్వారా మరియు అలాటి కార్యముల ద్వారా పనిచేయడని నేను చెప్పుటలేదు. అయితే మనము వాటి మీద ఆధారపడరాదు. దాని కంటే లోతైన పట్టును మనము కలిగియున్నాము, మీరు చూడండి. కారణము, అతడన్నాడు, “ప్రవచనములైనను నిరర్థకములగును. భాషలైనను అక్కడ నిలిచిపోతాయి. మరియు అక్కడ…”
19 ఆ క్రైస్తవులు కలిగియున్న ఆ ఉద్రేకములన్నియూ, వారు రక్షించబడియున్నారనుటకు వాటిలో ఒక్కటి కూడా రుజువు కాదు. వాటిలో ఒక్కటి కూడా వారు రక్షించబడియున్నారనుటకు రుజువు కాదు. కాదు…నీవు కేకలు వేయగలవు, నీవు ప్రవచించగలవు, నీవు రోగులను స్వస్థపరచగలవు, నీవు భాషలతో మాట్లాడవచ్చును, నీవు భాషలకు అర్థము చెప్పవచ్చును, నీవు జ్ఞానమును కలిగియుండవచ్చును, నీవు బుద్ధి వాక్యమును కలిగియుండవచ్చును వాటిలో ఒక్కటి కూడా, నీవు రక్షించబడియున్నావనుటకు భావము కాదు, వాటిలో ఒక్కటి కూడా కాదు, నీవు వాటన్నిటినీ కలిగియుండగలవు. 1వ కొరింథీ 13వ అధ్యాయములో పౌలు చెప్పియున్నాడు, నీవు నశించగలవు. “నేను వ్యర్థుడను,” చూడండి.
20 అయితే, నీవు ప్రేమను కలిగియున్నట్లైతే, ఒక లంగరు! ఈ ఉదయమున నా భార్య మేల్కొనుటకు ఒక గంట ముందుగానే నేను మేల్కొనియున్నాను. మరియు దేవుడు తన సంఘమును ఏకముగా, ఆ ప్రేమ బంధముల చేత ఎలా ముడి వేస్తాడో, మరియు అది తప్పక ఎలా యుండాలో, ప్రభువు దానిని నాకు వివరిస్తూ యున్నాడు. ఎన్నడైనా తిరిగి జన్మించకుండా ఒక మనిషి రక్షించబడే మరొక మార్గము అక్కడ లేదు. ప్రభువు చిత్తమైన యెడల రానున్న వారములో నేను దాని మీద బోధించగోరుచున్నాను. అది ఇప్పుడే నా హృదయములో వాస్తవ రూపమును దిద్దుకొనుచున్నది. బహుశా ప్రభువు దాని మీద నాకు ఒక వర్తమానమును ఇవ్వవచ్చు.
21 ఇప్పుడు, ఈ ఉదయమున ఈ వర్తమానము, అది నా హృదయములోనికి వచ్చియున్నట్లుగా, అది ఒక హెచ్చరికయై యున్నది. మరియు పౌలు ఈ కొరింథీయులను హెచ్చరించియున్నట్లుగా నేననుకొన్నాను. బహుశా మనము ఈ హెచ్చరికను ప్రజలకు తీసుకొని వెళ్ళుట మంచిది. ప్రజలకు మనము ఈ హెచ్చరికను తీసుకొని వెళ్ళినట్లైతే, ఇప్పుడు మనము ఒక ఉజ్జీవమును ఎదుర్కొనబోవుచున్నామని ఎరుగుచున్నాము, మరియు ఇది ఒక పరీక్షించుకొను సమయమైయున్నది, మనము తప్పక పరీక్షించబడవలెను. ఇప్పుడు, పౌలు అన్నాడు.
సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరు మేఘము క్రిందనుండిరి, వారందరును సముద్రములో నడచిపోయిరి;
అందరును…మోషేను బట్టి మేఘములోను, సముద్రములోను బాప్తిస్మము పొందిరి;
22 ఇప్పుడు, దేవుడు అరణ్యములో నుండి ఇశ్రాయేలీయులను బయటకు తెచ్చినపుడు, ఆయనను సేవించుటకు, మరియు వారిని వాగ్దాన భూమిలోనికి తెచ్చియున్నాడని అతడు వారికి ఒక గ్రహింపును ఇచ్చుచున్నాడు. వారు…మనము భౌతికమైన కార్యముల నుండి, విధుల నుండి, మరియు వారి క్రమములన్నిటి నుండి బయటకు తేబడినట్లుగానే వారును యున్నారు. అతడు వారికి అక్కడ ఒక మాదిరిని ఉంచుచున్నాడు. మరియు మనము మన పాఠములో కొంచెము ముందుకు వెళ్ళినట్లైతే, వారిలో అనేకమంది కూలిపోయారు. కారణము, వారు వారి విధుల నుండి, వారి క్రమములన్నిటి నుండి, దేవుడు కోరిన ప్రతిదాని నుండి బయటకు వచ్చి, వాటన్నింటిని చేసినప్పటికీ, ఇంకనూ వారి హృదయములు దేవునితో సరిగా లేవు.
23 ఇప్పుడు, మనము ఎన్నో కార్యములను చేయగలము, ప్రభురాత్రి భోజనమును తీసుకొనగలము, బాప్తిస్మం పొందగలము. మనము సంఘమునకు రాగలము. సంఘ పుస్తకంపై మన పేర్లను కలిగియుండగలము, లేక ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా, ఎంత సరిగా మనం ఉండగలమో అంత సరిగా ఉండగలము! మరియు ఇంకనూ మనము నశించిన వారమే. అది మనకు ఒక గంభీరమైన హెచ్చరికయైయున్నది. మనము అంత సరిగ్గా ఉండగలము…మరియు ఆత్మ కూటములో కుమ్మరించబడినప్పుడు, వాక్యము ప్రకటించబడినప్పుడు మనము ఆనందించగలము, మరియు వాక్యముతో మన ఆత్మలు ఆనందిస్తాయి, మరియు మనము ఇంకనూ నశించిన వారమే.
24 “నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదనూ వర్షము కురియుచున్నది.” ఏ వర్షమైతే గోధుమలను ఎదుగునట్లు చేసినదో అదే వర్షము కలుపు మొక్కలను కూడా ఎదుగునట్లు చేయుచున్నది. అది ఆ ఉత్పత్తి యొక్క స్వభావమై యున్నది, చూడండి. అది, దాని యొక్క స్వభావమే మనము ఏమైయున్నామో చెబుతుంది. అందుచేత, మనలో ఉన్న ఆ స్వభావమే మనము ఏమైయున్నామో అది చెబుతుంది. చూడండి? లేదు…
25 మనము ఒక్క చిన్న పని కూడా చేయకుండా ఆదివారపు దినమున మనము ఎంతో భక్తిగా చివరకు మన చేతులను కూడా కదపకుండా మనము ఉండవచ్చు. ఆదివారమున, కనీసము మనము సూదితో ఒక కుట్టు కూడా వేయకపోవచ్చును. ఆదివారమున మనము కనీసం ఆహారం కూడా కొనకుండా నీతిమంతులుగా తీర్పు తీర్చబడవచ్చును మరియు మనము ఎంతో భక్తిగా మరియు ఎంతో మత నిష్ఠ కలిగియుండవచ్చు! అయితే ఇంకనూ మనం దేవుని ఆత్మ చేత నిజముగా జన్మించకపోయినట్లయితే, మనము కేవలం వ్యర్థముగా ఆరాధన చేయుచూ ఉన్నాము.
26 కాబట్టి ఇప్పుడు ఇది ఎంతో కరుకుగా ఉన్నది మరియు మనము దానిని నిజముగా కనుగొని, దాని యొక్క సత్యమును తెలుసుకొనవలసి యున్నది. కారణము గుర్తుంచుకోండి, దీని విషయంలో మనము రెండవ అవకాశం పొందబోవుట లేదు. అది సరిగ్గా ఈ ఒక్కసారికే. కాబట్టి నీవు ఎంతో యథార్థంగా దానిపట్ల నిశ్చయతను కలిగియుండవలెను.
ఇప్పుడు గమనించండి, “సహోదరులారా! ఈ విషయములు మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు.”
27 ఇప్పుడు, ఈ కొరింథీయులు, మొదటి స్థానములో నేనేమి చెప్పియున్నానో, వారు వారి యొక్క నిత్యమైన నిరీక్షణలను ఏదో కొంత ఉద్రేకంపై నిర్శించుకొని యున్నారు. పౌలు అన్నాడు, సరిగ్గా…అక్కడ అతడు చెప్పియున్నాడు, “నేను మీ మధ్యకు వచ్చినపుడు, ఒకడు ఇది, మరొకడు అది కలిగియున్నాడు. మరియు ఒకడు-ఒకడు…” దానికి వ్యతిరేకంగా మాకు ఏమియూ లేదు. అయితే ఇంకనూ, మనము మాట్లాడుచున్నది దాని గురించి కాదు, అది, అది కాదు.
28 నేను మొదటిగా మార్పు చెందినపుడు నాకు గుర్తున్నది. మరియు దేవుని ఆత్మ తన పని చేయుటను నేను చూచుట ఆరంభించితిని. మరియు, నిజమైన, యథార్థమైన పరిశుద్ధాత్మను కొందరు ఎలా అనుకరణ చేయగలరో, మరియు అది అంతవరకు వెళ్ళియున్నది…ఎందుచేత? ఏది సరి అయినదో లేక ఏది సరి అయినది కాదో కనీసం దానిని చెప్పుట అది అసంభవముగా ఉన్నది.
29 నేను ఎరిగియున్న మనిషిని నేను చూచియున్నాను. మరియు నేను…ఒక వివేచనా వరము ద్వారా అతడు మరొకరి భార్యతో జీవించుచున్నాడని నేను తెలుసుకున్నాను. మరియు ఇక్కడ అతడు నిలబడి భాషలతో మాట్లాడుతూ మరియు భాషలకు అర్థము చెప్పుచూ వర్తమానములను ఇచ్చుచూ సమస్తమును చేయుచున్నాడు. మరియు అది…మరియు మరొక వ్యక్తిని కొన్ని క్షణముల క్రితము కలిసియున్నాను. మరియు, అతడు ఒక నిజమైన యథార్థమైన క్రైస్తవుడు.
30 మరియు, నేను ఇలా అనుకొన్నాను, “ఎలా ఆ ఆత్మ, అదే ఆత్మ అక్కడ…” అది నేను మొదటిగా పెంతెకొస్తు వారిని చూచినప్పుడు అది ఇండియానాలోని మిషావాకా అను స్థలములో యైయున్నది. నేను మీకు చెబుతాను, అది నిశ్చయముగా…నేననుకొన్నాను, కొన్ని గంటలపాటు అక్కడ నేను దేవదూతల మధ్య ఉన్నానని అనుకొన్నాను. మరియు తరువాత కొన్ని గంటలపాటు నేను దయ్యముల మధ్య ఉన్నానని తలంచాను, నేను దానిని చూచినప్పుడు ఈ ఇద్దరి మనుష్యులను చూచియున్నాను. ఒకరు వర్తమానమును ఇచ్చారు, ఒకరు తర్జుమా చేశారు.
31 ఇదివరకెన్నడూ భాషలతో మాట్లాడుటను, అలాంటి కార్యములను నేను వినియుండలేదు. అవి ఎలా కలిగియున్నవో ఆ ఆత్మలను నేను గమనించాను. “ఓ, మై! ఎందుకు, గొప్ప వెయ్యేండ్ల పాలన ప్రారంభమైయున్నది” అని నేను తలంచాను. మరియు అప్పుడు, బయట వారిలో ఒకరితో మాట్లాడే అవకాశం నాకు దొరికినప్పుడు, అతడు దేని నుండి తయారుకాబడ్డాడో నేను చెప్పాను, అక్కడ అతడు ఉండవలసినంత చెడ్డవాడుగా ఉన్నాడు.
32 మరియు—ఆ రాత్రి, నేను వారిని మరలా గమనించాను, మరియు నేను ఇలా తలంచాను, “ఓ, ఇక్కడ నుండి నేను దూరంగా వెళ్ళిపోవాలి. ఇది ఎలాగో నేను అర్థం చేసుకొనలేను.” మరియు ఆ కార్యములు బైబిలులో ఉన్నవని నేను చూశాను. అయితే ఇక్కడ ఒకరు దానిని చేయుచున్నారు, మరియు అతనికి దేవుని ఆత్మలేదు! మరియు మరొకరు దానిని చేయుచున్నారు, అతడు దేవుని ఆత్మను కలిగియున్నాడు. అప్పుడు నేనంతా గందరగోళమైపోయాను. మరియు, ఆ పూర్తి విషయాన్ని వెళ్ళిపోనిచ్చాను.
33 అనేక సంవత్సరముల తర్వాత, వరద అయిన తరువాత నేను వెళ్ళుచుంటిని, గ్రీన్స్ మిల్ కు వెళ్ళే దారిలో పైకి నేను నడుచుచున్నాను. శ్రీ ఐస్ లర్ ఇక్కడ సంఘమునకు వస్తాడు. ఆయన ఒక రాష్ట్ర శాసనసభలోని సభ్యుడు. అతడు నన్ను దారిలో కలుసుకున్నాడు, మరియు అతడు తన చేతులను నా మీద ఉంచి ఇలా అన్నాడు, “బిల్లీ, ఇప్పుడు క్రీస్తు మీకు ఏ భావమును ఇస్తాడు?” నా తండ్రి చనిపోయియున్నాడు, నా సోదరుడు చనిపోయియున్నాడు, నా భార్య చనిపోయినది మరియు నా కుమార్తె చనిపోయినది. మరియు నేను…
అతడన్నాడు, “ఆయన నీకు ఏ భావాన్ని ఇస్తాడు?”
34 నేనన్నాను, “శ్రీ ఐస్ లర్, ఆయన అనగా నా భావము జీవము కంటే ఎక్కువైయున్నాడు.” నేనన్నాను “కొన్ని సంవత్సరముల క్రితము నాలో ఏదో సంభవించియున్నది. క్రీస్తు నా హృదయంలోనికి వచ్చియున్నాడు. మరియు నేను—నేను…అది నా కంటే ఎక్కువుగా అది మారుచున్నది. అది ఒకటి సంభవించియున్నది. అది నేను భక్తిపరుడనైనందు వల్ల కాదు, అది దాని వల్ల కాదు, అది కృప ద్వారా దేవుడు నాకు చేసిన కార్యమైయున్నది.” మరియు నేనన్నాను, “ఆయన నన్ను చంపిననూ నేను ఒకేరీతిగా ఆయనను నమ్ముతాను మరియు నేను నరకములో ఉన్ననూ, అక్కడ ప్రేమ అనునది అక్కడ ఉన్నది. నేను ఇంకనూ ఆయనను ప్రేమిస్తాను.” అది అంతవరకే. అది ఏదో ఇక్కడ ఉన్నది. ఆయన సరియైయున్నాడు. నేను ఎన్నడైనా పొందిన ప్రతీ శిక్షకు నేను తగినవాడనై యున్నాను. నీవునూ అదే చేసియున్నావు. అయితే ఆ లంగరు, ఆ ఒకటి, ఆ దేవుని ప్రేమ అను లంగరు, అది మానవ హృదయములో పట్టుకొనియున్నది. మిగిలిన కార్యములన్నియూ ద్వితీయ శ్రేణిలో ఉన్నవి.
35 నేను ఇక్కడ ఒక మొద్దు మీద కూర్చొని ఒక విషయము కొరకు ప్రార్థన చేయుచుంటిని. మరియు నా బైబిల్ తెరువబడినది. మరియు నేను చదువుచున్నాను…అది హెబ్రీ 6వ అధ్యాయమై యున్నది. నేనక్కడ చదువుచూ ఉంటిని. అది ఎలా, “ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, తప్పిపోయిన వారు, తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు. గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా, భూమి తన మీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలును, గచ్చ తీగెలును దాని మీద పెరిగిన యెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును.”
36 మరియు పరిశుద్ధాత్ముడు దానిని గూర్చి నాతో మాట్లాడుచూనే యున్నాడు. “అది ఏమైయున్నది?” నేను మరలా దానిని తిరిగి చదువుతాను. మరియు అప్పుడు ఒక దర్శనము వస్తుంది. ప్రపంచము నా ముందు గుండ్రముగా తిరుగుటను నేను చూశాను అది అంతయూ దున్నబడి చదును చేయబడి నాటబడుటకు సిద్ధముగా యున్నది. మరియు ఒక మనిషి, తెల్లని వస్త్రములలో విత్తనములు నాటుచూ బయలువెళ్ళినాడు. అతడు గుండ్రని భూమి మీద విత్తనములు చల్లి వెళ్ళిపోయిన తరువాత, నల్లని వస్త్రములతో మరొక మనిషి అతని వెనుక విత్తనములు చల్లుచూ వెళ్ళాడు. ఒక మంచి మనిషి చల్లిన విత్తనములు పైకి మొలకెత్తియున్నవి, అవి గోధుమలు. మరియు నల్లని మనిషి నల్లని వస్త్రములు ధరించుకొన్న వ్యక్తి, చల్లిన విత్తనములును మొలకెత్తియున్నవి, అవి గురుగులు. ఓ, ఒకటి మరొక దానికి వ్యతిరేకముగా యున్నది.
37 ఆ దర్శనములో ఒక గొప్ప వర్షాభావపరిస్థితులు వచ్చినవి. మరియు చిన్న గోధుమలు తమ తలలను వంచియున్నవి, అవి నీటి కొరకు ఎంతో దాహముతో యున్నవి. గురుగులు కూడా తమ తలలను వంచి యున్నవి, అవి కూడా నీటి కొరకు ఎంతో దాహముతో యున్నవి. అప్పుడు ఒక గొప్ప మేఘము వాటిపైకి వచ్చియున్నది, మరియు వర్షములు క్రిందికి వచ్చినవి. ఆ చిన్న గోధుమలు తమ తలలు పైకెత్తి “ప్రభువుకు స్తోత్రము! ప్రభువుకు స్తోత్రము!” అని కేకలు వేసినవి. ఆ చిన్న గురుగులు కూడా తమ తలలు పైకి లేపినవి, “ప్రభువుకు స్తోత్రము! ప్రభువుకు స్తోత్రము!” అని అదే నీటిని బట్టి కేకలు వేసినవి.
38 అప్పుడు నేను అర్థము చేసికొన్నాను. చూడండి? అది అక్కడయున్నది. పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడుతుంది, అయితే, “వారి ఫలముల వలన వారు తెలియపరచబడతారు,” అని ప్రభువైన యేసు చెప్పియున్నాడు. చూడండి? చూడండి? ఆత్మ యొక్క ప్రతిస్పందనను బట్టి, వారు చేయు కార్యముల ద్వారా కాదు, వారు రోగులను స్వస్థపరచినా, లేక వారు భాషలతో మాట్లాడినా, లేక వారు ఆత్మలో నాట్యము చేసినా, లేక వారు ఈ విధంగా లేక ఆ విధంగా ఆనందించినా, అదికాదు వారు ఆ కార్యములన్నిటినీ చేసి ఇంకనూ తప్పిపోవచ్చును. అది నీలోయున్న నీ జీవమైయున్నది, ఒక తిరిగి జన్మించిన అనుభవము.
39 ఇప్పుడు, పౌలు దీనిని కొరింథీయులకు చెప్పుటకు ప్రయత్నము చేయుచున్నాడు. “నేను…”
సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరు మేఘము క్రిందనుండిరి, వారందరును…సముద్రములో నడచిపోయిరి;
అందరును…మోషేను బట్టి మేఘములోను, సముద్రములోను బాప్తిస్మము పొందిరి.
40 ప్రతి ఒక్కరూ అరణ్యములోనికి వెళ్ళిరి. యేసు అన్నాడు, “‘ప్రభువా, ప్రభువా,’ అని పిలుచు ప్రతివాడు పరలోకములో ప్రవేశించడు గానీ, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును.” అది నీవు చెప్పేది కాదు. నీవు సువార్తను బోధించి మరియు ఇంకనూ నశించిపోగలవు. నిశ్చయముగా.
41 ఇది కేవలము చిన్న పిల్లల సరుకు కాదు. ఇది పరిపూర్ణముగా…అది లోతైనదై యున్నది. మరియు క్రైస్తవ్యము ఏదో ఒక చిన్న తేలికైన, కల్పనాకథ వంటిది కాదు, “మంచిది, నేను సంఘమునకు వెళతాను, మరియు వెళ్ళుట నా కర్తవ్యమై యున్నది,” వంటిది కాదు. అది క్రైస్తవ్యము కాదు. సోదరుడా, క్రైస్తవ్యము అది కాదు…
42 అది దేవుడు చేసిన ఒక కార్యమైయున్నది. క్రీస్తులో దేవుడు నిన్ను ఎన్నుకొనియున్నాడు, మరియు క్రీస్తుకు ఒక ప్రేమ కానుకగా నిన్ను హాజరుపరిచియున్నాడు. మరియు అలాగైతే…దేవుడు పిలుచుచున్నాడు, ఎన్నిక! మరియు మనము అలాటి ఒక వ్యక్తిగా యుండు అవకాశమును కలిగియున్నప్పుడు, మరియు లోకసంబంధమైన చిన్న పాత సంగతులకు దానిని మనము త్రోసివేస్తే? ఇప్పుడు మనము ముందుకు వెళ్ళుచుండగా వినండి.
మరియు వారందరూ ఒకే ఆత్మసంబంధమైన ఆహారమును భుజించిరి.
43 నీవు దానిని విన్నావా? 3వ వచనము.
మరియు వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;
44 అతడు దేనిని గూర్చి మాట్లాడుచున్నాడు. సంఘము యొక్క కర్మకాండలను గూర్చి. ప్రజలు సంఘములోనికి వచ్చి, మరియు వారు మారుమనస్సు పొందియున్నామని చెబుతారు, ప్రభువైన యేసు నామమును తీసుకొనుచూ, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుతారు. “మరియు వారు దానిని అరణ్యములో కూడా చేసియున్నారు,” అని పౌలు అన్నాడు. కొరింథీయులు కూడా చేసినది అదియే. వారు వచ్చి క్రీస్తులోనికి బాప్తిస్మము పొందియున్నారు. బాహ్యముగా క్రీస్తును తీసుకొనియున్నారు. ఆయనను స్వీకరించినట్లుగా వారి నమ్మకమును ప్రకటించియున్నారు. జ్ఞానయుక్తముగా వారు ఆయనను అంగీకరించియున్నారు.
45 అయితే సోదరుడా, అది తెలివి కంటే మరి ఎంతో ఎక్కువగా యున్నది. అది దానికి పైగా వెళుతుంది. అది యథార్థమైన పుట్టుకకు వెళుతుంది, ఏదో ఒక ఉద్రేకభరితమైన మానసిక ఆలోచన కాదు. అయితే అది ఒక జన్మయై యున్నది, ఒక అనుభవము, అది ఏదో తిన్నగా నీ హృదయాంతరంగములోనికి వెళ్ళి, అది అంతరంగములోని అంతరంగ జీవిని మార్చివేస్తుంది, మరొక మాటలో అది నీవు ఇది వరకు చేయని కార్యములను చేస్తుంది. అది నీవు ప్రేమించలేని వారిని ప్రేమించేటట్లు చేస్తుంది. అది నీవు ఎన్నడూ తలంచని, నీవు ఎన్నడూ ప్రవర్తించని రీతిలో నీవు ప్రవర్తించునట్లు అది చేస్తుంది.
46 పరిస్థితులు విషమించినపుడు, అది నీ యొక్క లంగరై యున్నది. నీవు తిరుగులాడవలసిన పనిలేదు. “నేను దానిని చేస్తానా?” ఓ, కాదు. నేను దానిని చేస్తానా? అన్నది కాదు. అది ఇదివరకే నా కొరకు తయారు చేయబడియున్నది. నాలో యున్న క్రీస్తు, తానే స్వయముగా దానిని చేసియున్నాడు, మరియు ఆయన యొక్క లంగరునందు నేను కేవలము నమ్మిక కలిగియుంటాను. ఎలాటి అద్భుతమైన సంగతి!
47 గమనించండి. వారందరూ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకున్నారు. దానిలోయున్న వెలుగు…మనకు తెలుసు, అది ఒక సహజమైన ప్రక్రియయై యున్నది, ఏలయనగా అది ఒక చిన్న పొగమంచు వలే ఆకాశము నుండి కురిసియున్నది, దాని మీద తేనెను కలిగియున్న చిన్న అప్పములు…అప్పము అనగా అది ఒక చిన్న పెళుసుగాయున్న బిళ్ళ, ఒక చిన్న కరిగిపోయే అప్పము లాంటిది, దానిపైన తేనె ఉంటుంది. వారందరూ దానిలో పాలుపొందిరి. ప్రతిఒక్కరూ సముద్రమును దాటిరి, మోషే ద్వారా ప్రతిఒక్కరూ సముద్రము గుండా మేఘమును బట్టి బాప్తిస్మము పొందిరి. వారందరూ, మనము ఈ దినమున యుండినట్లుగా, వారందరూ వెంబడించిన వారైరి, క్రైస్తవ సంఘము యొక్క గొప్ప సూచనలిచ్చువాని ద్వారా, నీటి బాప్తిస్మము నొద్దకు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిరి.
అతడన్నాడు, “వారందరూ అదే మన్నాలో పాలు పొందిరి.” అదే…
48 అది ఏమి చేసినది? ఆ మన్నా మోషే, కాలేబు మరియు యెహోషువాలకు పడిన రీతిగానే, అదే మన్నా కోరహు మరియు అతని గుంపు వారందరికీ పడినది. వారందరూ ఏకముగా కలగలుపుగా యున్నారు, అందరూ బాప్తిస్మములో పాలుపొందారు, అందరూ సభ్యత్వములో పాలుపొందారు, అందరూ అదే ఒప్పుకోలులో పాలుపొందారు.
49 ఇప్పుడు, అందరూ ప్రభురాత్రి భోజనములో పాలుపొందారు. మీకు అది అర్థమైనదా? ఆ గంభీరమైన హెచ్చరికవైపు చూడండి. ఈ గుడారమునకు చెందినవారలారా, అది లోతుగా క్రిందకు నాటనివ్వండి. గుర్తుంచుకో, నీ నిత్యత్వపు గమ్యము, అక్కడే తిన్నగా వ్రేలాడుచున్నది. ఒక చిన్న వరద వలే లేక మరేదోగా దానిని కేవలము అది నిన్ను దాటిపోనియ్యవద్దు. దీనికి మనము తప్పక గౌరవమును ఇయ్యవలెను. అది ఇక ముందు నీవు జీవించుటయా లేదా అని దాని భావమైయున్నది.
50 వారందరూ మోషేను బట్టి ఎర్ర సముద్రము గుండా బాప్తిస్మము పొందియుండిరి. వారందరూ ఒకే ఆత్మసంబంధమైన వ్యక్తిని వెంబడించిరి. వారందరూ ఒకే దూత ద్వారా నడిపించబడిరి. వారందరూ సముద్రములో బాప్తిస్మము పొందిరి. వారందరూ ఒకే ఆత్మసంబంధమైన మన్నాను భుజించిరి. ఆ మన్నా క్రీస్తుయైయున్నాడు. క్రీస్తు క్రిందికి దిగివచ్చుచున్నాడు, ప్రతీ రాత్రి మన్నా పరలోకము నుండి క్రిందికి దిగియున్నది, వారి ప్రయాణములో వారిని పోషించుటకు, అయినను వారు నశించిపోయిరి.
51 క్రీస్తు పరము నుండి దిగివచ్చి తన ప్రాణమును ఇచ్చియున్నాడు. అది, “ఎవడైతే ఆయన యందు విశ్వాసముంచుతాడో, వాడు నశించక నిత్యజీవమును పొందును.” క్రీస్తు క్రిందికి దిగివచ్చి మన మన్నాగా మారాడు, ఒకే ఆత్మసంబంధమైన దీవెనలను భుజించుటకు.
52 అందుచేత, పరిశుద్ధాత్మ తిన్నగా మన మధ్య క్రుమ్మరించబడవచ్చును, రెండింటి మీద, క్రైస్తవులు మీద, నులివెచ్చని క్రైస్తవుల మీద, అర్ధ విశ్వాసుల మీద మరియు సరిహద్దు విశ్వాసుల మీద పడవచ్చును, వారందరూ ఒకే ఆహారమును తింటారు. అయితే అది ఇంకనూ అది దాని భావము కాదు. ఓ, నాకు తగినన్ని మాటలు ఉంటే బాగుంటుంది, ఇక్కడ యున్న ప్రతీ వ్యక్తి హృదయములో దానిని నేను లోతుగా నాటవలెనని కోరుచున్నాను. ఇది ఎంత లోతైన విషయమో చూడండి, అది ఏదో దానితో నీవు ఆటలాడునది కాదు. ఇది సంఘమునకు మాత్రమే వెళ్ళుట లేదు.
53 ఇప్పుడు, వినండి. వారందరూ ఒకే ఆత్మసంబంధమైన మన్నాను భుజించిరి. దానిని గూర్చి ఆలోచించండి, ఆత్మసంబంధమైన మన్నా!
54 “ఓ,” నీవంటావు, “నేను రక్షించబడియున్నానని నాకు తెలుసు. హల్లెలూయా! నేను ఆత్మలో కేకలు వేసియున్నాను. నేను దీనిని స్పృశించి యున్నాను.” అది దానితో చేయునది ఒక్కటి కూడా లేదు. మీరు చూడండి, మన నిత్యత్వపు గమ్యమును మనము ఎలాటి అనుభూతి మీద ఆధారము చేసికొన్నామో? మనము జీవించుచున్న ఈ దినమున, నీవు దానిని చూడగలవా, ప్రజలు ఎలా వారి యొక్క గమ్యమును ఒక చిన్న అనుభూతి మీద ఆధారము చేసికొన్నారో? “ఓ,” “నేను దానిని పొందియున్నాను, ఏలయనగా నేను—నేను శక్తి నా గుండా ప్రవహించుటను నేను స్పృశించాను, నేను దీనిని చేశాను,” అని నీవంటావు. అది ఖచ్చితముగా సత్యమైయున్నది మరియు నీవు ఇంకనూ తప్పిపోయినవాడవే.
55 ఓ, ఒక్క క్షణము మనకుంటే బాగుంటుంది. 1వ కొరింథీ 13వ అధ్యాయమును మనము ఇక్కడ చూద్దాము, ఒక్క క్షణము, మరియు పౌలు ఇక్కడ తప్పక ఏమి చెప్పవలసియున్నాడో మనము విందాము, ఇక్కడే.
మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. (అది ప్రేమయై యున్నది).
…ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
56 ఉద్రేకముపై వారి యొక్క నిరీక్షణలను ఆధారము చేసికొన్న, ఈ ఉద్రేకపూరితమైన సంఘములోనికి, ఈ వృద్ధ అపొస్తలుడు దానిని ఎంత దృఢముగా దిగగొట్టుచున్నాడో వినండి. ఇప్పుడు, అది సండే స్కూలుపై యున్నది. ఇది ఒక దిద్దుబాటు స్థలమై యున్నది. ఇది ఒక ఉపదేశపు స్థలమై యున్నది. మరియు వేదిక మీద నిలబడి తప్పుగా నడిపించు మనిషికి శ్రమ. సోదరుడా, ఇది లేఖనమును లేఖనముతో పోల్చవలసిన సమయమై యున్నది. అది నిజము.
బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.
57 నీ మంచి కార్యములన్నియూ, నీ మంచి పనులన్నియూ, చూడండి, నీవు కలిగియున్న ఆత్మసంబంధమైన కార్యములన్నియూ, నీవు కలిగియున్న వరములన్నియూ, నీవు కలిగియున్న ఉద్రేకములన్నియూ, నీవు కలిగియున్న సమాధానమంతయూ, దానితో చేయునది ఏమియూ లేదు, ప్రారంభము నుండియే. [టేపు మీద ఖాళీ యున్నది—సంపా.]
58 ఒక్క క్షణము దానిని ఆలోచించండి. మరియు ఈ దినమున యున్న సంఘములను గూర్చి ఆలోచించండి, మన గొప్ప సంఘములు, ప్రెస్బిటేరియన్ లు, మెథడిస్టు, బాప్టిస్ట్ మరియు సంఘశాఖలు, “నేను నమ్ముచున్నాను,” అని వారు చెప్పి లోనికి వచ్చియున్నందున, వారి పేర్లు సంఘ పుస్తకము మీద వ్రాయబడినందున, అది సర్దివేయుచున్నదని వారు తలంచుచున్నారు. వారు ఎంత దూరముగా వెళ్ళిపోయారు.
59 మన పెంతెకొస్తు ప్రజలు ఇలా అనుకొనుచున్నారు, సరే, ఒక చిన్న ఉద్రేకమును వారు కలిగియున్నందున, వారు మంచి అనుభూతిని కలిగియున్నందున, వారు భాషలతో మాట్లాడియున్నందున, వారు చేతులలో రక్తమును కలిగియున్నందున, ముఖము మీద కొంచెము నూనెను కలిగియున్నందున, లేక అలాటిది ఏదో కలిగియున్నందున, “మేము దానిని కలిగియున్నామని,” తలంచుచున్నారు, ఓ, మీరు 100 లక్షల మైళ్ళు దూరముగా వెళ్ళిపోయారు! మీకు అర్థమైనదా? చూడండి, దయ్యము, ఈ లోక దేవత ఎలా వారికి గ్రుడ్డితనమును కలుగజేసినదో, మరియు వారు తిన్నగా అలాగే ముందుకు జీవిస్తూ సాగిపోతారు. వినండి.
బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను…ప్రేమ లేనివాడనైతే… నాకు ప్రయోజనమేమియు లేదు.
60 ఆ మంచి వరములన్నిటిని, ఆ మంచి కార్యములన్నిటి వైపు చూడండి. “నేను పేదవారిని పోషిస్తాను. నాకు మంచి హృదయమున్నది. నేను ఇది చేస్తాను. నేను అది చేస్తాను. నేను సంఘమునకు వెళతాను. నేను భాషలతో మాట్లాడతాను. నేను ప్రవచిస్తాను. నేను రోగులను స్వస్థపర్చుతాను. నేను సువార్తను బోధిస్తాను. ఈ కార్యములన్నియూ నేను చేస్తాను.” పౌలు అన్నాడు, “ఇంకనూ నేను వ్యర్థుడనే.” ఆ కార్యములన్నియూ శరీరానుసారముగా అనుకరించబడవచ్చును. ఇప్పుడు అది ఏమి చెబుతుంది?
ప్రేమ దీర్ఘకాలము సహించును…దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; అది స్వప్రయోజనమును విచారించుకొనదు…డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు,
ప్రేమ త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, త్వరగా కోపపడదు… (దానిని ఆలోచించండి!)
61 దయ, ప్రేమ. ప్రేమ అనగా ఏమిటి? దేవుడైయున్నాడు. దేవుడు నీ యొద్దకు ఎలా వస్తాడు? ఒక పుట్టుక ద్వారా. చూడండి?
62 ఇప్పుడు వారందరూ మోషేను బట్టి బాప్తిస్మము పొందిరి. వారందరు ప్రభురాత్రి భోజనమును భుజించిరి. దేవుని నుండి వచ్చిన ఒకే మన్నాను వారందరూ భుజించిరి. వారిలో ప్రతిఒక్కరూ ఒకే దానిని భుజించారు.
63 ఈ దినమున, మనము చుట్టూ నిలబడి వాక్యమును వింటాము, మరియు దానిపట్ల ఆనందిస్తాము, మరియు మన్నాను తీసుకొని భుజించి, “ఓ హల్లెలూయా, అని అంటాము. అది మంచిది. ఓ, నేను దానిని మెచ్చుకొంటాను. అవును, నేను సంఘములో బాప్తిస్మమును పొందియున్నాను. నేను నా వృత్తిని చేస్తాను. సంఘ పుస్తకములో నేను నా యొక్క పేరును ఉంచాను, నేను ఒక చార్టర్ సభ్యుడనైయున్నాను.” దేవుడు నీకు ఏదైనా చేయకపోయినట్లైతే, అవన్నియూ పరిపూర్ణముగా వ్యర్థమే. అది అలా యున్ననూ…అవన్నియూ నీవు చేసిన చిన్న కార్యక్రమములు. అది నీ విశ్వాసము ఉత్పత్తి చేసిన కార్యములు.
64 అయితే, దేవుడు నీకు ఏదైనా చేయనంత వరకు క్రొత్త జన్మకు! ఇప్పుడు ఒక్క క్షణము. ఇప్పుడు 4వ వచనము.
అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి; మరియు ఆ బండ క్రీస్తే.
65 వారందరూ ఒకే ఊటలోనిది త్రాగిరి, వారు ఆనందించిరి. అప్పుడు దాని భావమేమిటి? ఆ ఆత్మసంబంధమైన నీటిని పొందుటలో గోధుమలు మరియు గురుగులు ఆనందించినవి. మేము సంఘమునకు వెళతాము. మిగిలిన వారందరితో కలిసి మేము చప్పట్లు కొడతాము. [బ్రదర్ బ్రెన్హాం మూడు సార్లు తన చేతులతో చప్పట్లు కొట్టుచున్నాడు—ఎడి.] మేము మిగిలిన వారందరితో కలసి నేల మీద పైకి క్రిందికి గంతులు వేశాము. మేము మిగిలిన వారందరితో కలిసి ప్రవచించాము. మిగిలిన వారందరితో కలిసి మేము భాషలతో మాట్లాడాము. మిగిలిన వారందరి వలే మేము రోగుల కొరకు ప్రార్థన చేసియున్నాము. అయితే అతడన్నాడు…ఇప్పుడు వినండి, మనము ఇంకా కొంచెము ముందుకు వెళ్ళుచుండగా.
66 ఇప్పుడు, ఒక్క నిమిషము నేను ఆగగోరుచున్నాను, ఓ, ముందుకు, “ఆ బండ క్రీస్తుయై యున్నాడు.” ఆ బండ క్రీస్తు, అది నిజముగా అక్కడ యుండియున్నది, ఈ దినమున ఆత్మసంబంధముగా యున్నట్లుగా మన్నా, ఆహారము, పరలోకములో దేవుని యొద్ద నుండి దిగివచ్చిన వాక్యమే. క్రీస్తు దేవుని యొక్క వాక్యమైయున్నాడు, మరియు మనము వాక్యమును తినుచున్నాము, చూడండి? ఈ ఉదయమున మనము వర్తమానములో కూర్చొని యున్నట్లుగా. మనము వినుచున్నాము. మన ఆత్మలు వెళ్ళి ఆ వాక్యమును పట్టుకొనుచున్నవి. మనము వాక్యము ద్వారా జీవిస్తాము. అతడు అన్నాడు, “వారందరూ ఒకే ఆత్మసంబంధమైన మన్నాను భుజించిరి, మరియు వారందరూ పానము చేసిరి. ఒకే ఆత్మసంబంధమైన బండ నుండి వారందరూ త్రాగిరి, మరియు ఆ బండ క్రీస్తై యున్నాడు.” దానిని గూర్చి ఆలోచించండి.
67 ఇప్పుడు అతడు దేని యొద్దకు వెళ్ళుచున్నాడు? దానికి ఒక ముగింపును ఇచ్చుచున్నాను. అతడు ఆ కొరింథీయులకు హెచ్చరికను ఇచ్చుచున్నాడు. “నేను మీ మధ్యకు వచ్చినపుడు, మీరు ఏమి చేయుచున్నారో జాగ్రత్తపడండి, ఒకడు కీర్తన పాడవలెనని యున్నాడు, ఒకడు భాషలతో మాట్లాడవలెనని యున్నాడు, ఒకడు ఇది, మరొకడు అది, కలిగియున్నాడు, ఒకడు ప్రవచించవలెనని కోరుచున్నాడు, ఒకడు ఒక ప్రత్యక్షత కలిగియున్నాడు, ఒకడు ఇది మరియు మరొకడు అది చేయుచున్నాడు.” జాగ్రత్తగా యుండండి. మీ యొక్క విశ్వాసమును దాని మీద ఆధారము చేసికొనవద్దు, అవన్నియూ మంచిదే. అవి వాటి స్థానమును కలిగియున్నవి, మరియు సంఘములో, అయితే ఎన్నడూ మీ యొక్క రక్షణను వాటి మీద ఆధారము చేసికొనవద్దు. మీ జీవితము దేవుని వాక్యముతో సరితూగనట్లైతే, అప్పుడు దేవునితో సరియగుటకు అది సమయమైయున్నది.
68 ఇప్పుడు గమనించండి. మరియు ఈ బండ, అరణ్యములో వారితో యుండిన బండయైయున్నది.
69 దేవుడు మోషేను పిలిచినపుడు, మీరు గమనించాలని నేను కోరుచున్నాను, ఫరో యొక్క కాడి క్రింద నుండి ఇశ్రాయేలీయులను విడిపించుకొనుటకు ఐగుప్తుకు అతనిని పంపియున్నాడు. ఆయన, “నీ చేతిలో యున్నది ఏమిటి?” అని అన్నాడు.
“అది ఒక కర్ర,” అని అతడన్నాడు.
70 అతడు ఆ కర్రను తీసుకొని నేల మీద పడవేసెను, అది సర్పముగా మారెను. మోషే పారిపోయాడు. తరువాత అతడు దానిని పైకెత్తినపుడు, అది అతని చేతిలో కర్రగా మారెను.
71 ఆ కర్ర, అతడు ఐగుప్తులోనికి వెళ్ళినపుడు, అతడు దానిని ఐగుప్తుపై చాపియున్నాడు, అప్పుడు ఈగలు పైకి వచ్చాయి. అతడు మరలా దానిని చాపినపుడు తెగుళ్ళు క్రుమ్మరించబడియున్నవి. అది దేవుని యొక్క తీర్పుయైయున్నది. కర్రను ముందుకు చాపుట దేవుని యొక్క తీర్పుయైయున్నది.
72 మరియు అప్పుడు, గమనించండి, ఆ కర్రను అతడు చేపట్టుటకు ముందు, మోషే తన చేతిని తన రొమ్ముపై యుంచెను, అది కుష్ఠు రోగము గలదాయెను.
73 ప్రతి మనిషి, ఆరంభము నుండియే, అతని స్వభావరీత్యా ఒక పాపియైయున్నాడు. దాని చుట్టూ అక్కడ ఏ మార్గము లేదు. నీవు పాపములో పుట్టి, అతిక్రమములో రూపుదిద్దబడి, అబద్ధములాడుచూ లోకములోనికి వచ్చావు. నీ తల్లి యొక్క సంఘములో నీవు వేదిక మీద ప్రతిష్ఠించబడినవాడవై యుండియున్నావు. నీవు చిలకరించబడియున్నావు. నీవు ఇది, అదియై యున్నావు. అయితే ఆరంభము నుండియే నీవు ఒక పాపివై యున్నావు.
74 తరువాత, అక్కడ మరొకటి యున్నది. దేవుడు అన్నాడు, “నీ చేతిని తిరిగి నీ రొమ్ము మీద ఉంచుము.” అతని హృదయము మీద, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, అతడు మరలా తన రొమ్ము మీద చేతులను ఉంచాడు, మనము ఎక్కడ నుండి ముందుకు తేబడ్డామో, అక్కడ మొదటిగా, అతని చేయి కుష్ఠు రోగము గలదిగా మారినది. మొదటిగా, నీవు దేవుని చేత ఇక్కడకు తేబడ్డావు, ఒక పాపిగా, ఎంపిక ద్వారా కాదు, కానీ స్వభావరీత్యా, తరువాత నీవు మరలా వెనుకకు వెళ్ళిపోయావు. మరియు అతడు బయటకు వచ్చినపుడు, ఆ చెయ్యి శుద్ధముగా మరియు పరిపూర్ణముగా యున్నది. అది ఏమి చూపుచున్నదనగా, ఈ హస్తము తీర్పు యొక్క కర్రను ఆడించుటకు ముందు, అది శుద్ధమైన హస్తముగా యుండవలసియున్నది, అది ఆడించబడుటకు ముందు. మరియు ఏ సేవకుడైనా, ఏ ఉపదేశకుడైనా.
75 నేను ఇక్కడకు రాకముందు, నా రేడియో త్రిప్పినపుడు, నేను ఒక సంగతిని ఈ ఉదయమున నేను విన్నప్పుడు, అది నా రక్తమును నిజముగా కుతకుత లాడించింది. అగౌరముగా కాదు, మరియు ఇక్కడ ఎవరైనా ఆ వ్యక్తికి సంబంధించిన వారు ఎవరైనా యున్నట్లైతే మిమ్మును గాయపరచాలని నా భావము కాదు. అయితే ఇది ఆ సమయమై యున్నది…నేను ఎల్లప్పుడు తగినంత క్రైస్తవుడిగా యుండి, నలుపును నలుపని పిలుచుటకు, తెలుపును తెలుపు అని పిలుచుటలో యథార్థముగా యుండుటకు దేవుడు నాకు సహాయము చేయునుగాక.
76 ఎవరో పాట పాడుటను విన్నాను, అతడిలా అన్నాడు, “నేను నా సాక్ష్యమును చెబుతాను,” అన్నాడు, అలాగే ఒక లేఖనమును త్రిప్పి, చదివి, 1వ కీర్తన నుండి బోధించాడు, “పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చొండనివాడు ధన్యుడు.” అతను ఎవరో మీకు తెలుసా? ఆ రాక్ అండ్ రోల్ నాట్యమాడువాడు, అతడే జిమ్మీ ఆస్ బర్న్ రేడియోలో సువార్తను బోధించుచున్నాడు.
77 ఓ, సోదరుడా, ఎన్నడైనా అది ఒక అపకీర్తిగా యున్నట్లైతే! అది ఇదే. అలాంటి వ్యక్తి సజీవ దేవుని యొక్క వాక్యములోనికి కదిలివెళ్ళే ఏ పనియు తప్పక అతనికి లేదు. మరియు ఈ వ్యక్తిని మీరు తీసుకొన్నట్లయితే, రెన్ ఫ్రో వాలీ బార్న్ డాన్స్ నొద్ద అతడు రాత్రంతయూ చప్పట్లు కొడుతూ, పైకి క్రిందికి ఎగురుతూ కదిలించుకొంటూ పార్టీలో గడిపి మరియు తరువాత రోజు ఉదయమున, ఈ చుట్టూ వచ్చి తన స్వరమును మార్చి ఒక క్రైస్తవుని వలే మాట్లాడుచున్నాడు. ఎందుచేత? అది దేవుని దృష్టిలో అసహ్యమైనదై బహు మురికిదై యున్నది.
78 దేవుని యొక్క ఆ తీర్పు కర్రను ఆడించు హస్తము తప్పక దేవుని యొక్క వ్యక్తి చేత మరియు క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి చేత తప్పక శుద్ధి చేయవలెను. తప్పక దేవుని వాక్యమును చేపట్టే ఏ పనియు అతనికి లేదు. అనేకమంది బోధకులు సహితము ఎల్విస్ ప్రెస్లీని సమర్థించుచున్నారు, అతడు ఒక అధునాతనమైన యూదా ఇస్కరియోతు తప్ప లోకములో అతడు ఏమియూ కాదు. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలను పొందియున్నాడు! ఎల్విస్ ప్రెస్లీ ఒక పది లక్షల డాలర్లను మరియు ఒక కాడిలాక్ కార్ల సమూహమును కలిగియున్నాడు. అయితే అతడు అమ్మివేయబడ్డాడు. అతడు ఒక పెంతెకొస్తు విశ్వాసియైయుండెను, మరియు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొని, ఒక రాక్ అండ్ రోల్ గా మారియున్నాడు, మరియు అతడు దయ్యము చేత ప్రేరేపించబడియున్న దాని మీద నేను రంధ్రములు చేయుట లేదు. లేదండి అతడు ఒక అధునాతన యూదా ఇస్కరియోతు.
79 అలాంటప్పుడు సేవకులు సహితము అలాంటి దానిని పైకి నిర్మించుటకు ప్రయత్నించుచున్నారు. మరియు ఎల్విస్ ప్రెస్లీ ఇలా అనుచున్నాడు, “అవును, నా విజయం అంతటి కొరకు నేను దేవుని యందు నమ్మికయుంచాను.” సజీవుడైన పరిశుద్ధుడైన దేవుడు ఎన్నడైనా అలాంటి అస్తవ్యస్తమైన ఒక దయ్యమునకు, ఒక దయ్యము పట్టిన అలాంటి వాడికి ఎలా విజయము నియ్యగలడు?
80 ఈ దేశము ఎన్నడైనా చూసిన ఒక అతి పెద్ద ఆటంకం పరిపూర్ణముగా ఈ ఎల్విస్ ప్రెస్లీ యైయున్నాడు. వీడు వాడి యొక్క మురికి అసహ్యమైన రాక్ అండ్ రోల్ సరుకు ద్వారా కోట్ల ఆత్మలను నరకమునకు పంపియున్నాడు నిశ్చయముగా. దీనికి ఏ మాత్రము నేను క్షమాపణ చెప్పను, దేవుని ప్రవక్తగా మీరు నన్ను నమ్మియున్నట్లయితే, గుర్తుంచుకోండి, అది ఒక మానవ రూపమును ధరించిన దయ్యమై యున్నది. సంపూర్ణముగా.
81 ఆ జిమ్మీ ఆస్ బార్న్ అలాటి వారికి దేవుని యొక్క వాక్యముతో ఏ పనియూ లేదు. మరియు డాన్సులు చేస్తూ, పైకి క్రిందికి ఎగురుచూ, పార్టీలో రాక్ అండ్ రోల్ వేసే ఏ ఒక్కరికైనా, ప్రభువు యొక్క నామమును వ్యర్థముగా తీసుకొనే ఏ పనియు లేదు, అలాటి మురికి పనులు చేస్తూ దేవుని వాక్యమును పట్టుకొని వేదిక మీదకు వచ్చు పనిలేదు.
82 ఈ దినమున ఈ అనేకమైన సంఘములతో వచ్చిన చిక్కు అదే, ఆ పాత లోకసంబంధమైన ఊగీ—బూగీ స్థలములలో నుండి కొందరిని ఇక్కడకు తెచ్చుచున్నారు. ఒక పాత చిన్న బాలిక పైకి క్రిందికి పార్టీలలో ఎగురుచూ, ఒక రాత్రి రాక్ అండ్ రోల్ వేస్తుంది, మరుసటి రోజు రాత్రి ఆమె ఇక్కడ వేదిక మీదకు వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతుంది. మీలో కొందరు, అదిగో ఆ రాత్రి క్లబ్బులలో పాత గిటారు వాయించే వారున్నారు, మరియు అలాటి వారిని తీసుకొని 2 వారాల పాటు బోధ చేయటానికి వేదిక మీద ఉంచుచున్నారు.
83 సోదరుడా, నేను నీకు చెబుతాను, అతడు ఎన్నడూ ఆ పనిని ఇక్కడ చేయకూడదు. లేదు, నిజముగా, అతడు తప్పక పఠనము చేయవలెను. ఒక దైవజనుడిగా అతడు తనకు తాను రుజువుకాబడతాడేమో, అతడు కనుగొనబడాలి. రాత్రులు బయట అలా గంతులు వేయుటను మనము నమ్మము. ఈ దినమున సంఘము అదే స్థితిలో యుండియున్నది.
84 మనకు సత్యము కావలెను. ఈ వాక్యము సత్యమైయున్నది. అది నిజము. ఆ తీర్పు కర్రను ఊపు హస్తము తప్పక ఒక శుద్ధమైన హస్తముగా యుండాలి. పరిపూర్ణముగా.
85 ఆ మోషే యొక్క తీర్పు చేయు హస్తము శుద్ధి చేయబడినది, మరియు అప్పుడు ఆ కర్ర ఆ హస్తములో యుంచబడినది. ఆ కర్ర క్రిందికి వెళ్ళి ఇశ్రాయేలు మీదకు తీర్పులను తెచ్చినది.
86 మరియు అప్పుడు, అరణ్యములో, ఆ చక్కని మాదిరి. నేను తప్పక ముగించాలి. అక్కడ బండయున్న చక్కని మాదిరి. “మరియు ఆ బండ క్రీస్తుయైయున్నాడు.”
87 నీళ్ళ కొరకు, ఆ క్షీణించుచున్న ప్రజలు చనిపోవుచున్నారు, మరియు వారు దానికి తగినవారు. వారు చనిపోవుటకు తగినవారు, ఏలయనగా వారు సణిగియున్నారు. వారు ఫిర్యాదు చేసి యున్నారు. ప్రారంభము నుండియే వారు విశ్వాసులు కారు. వారు తెలివితో కూడిన విశ్వాసులు తప్ప, వారు మరేమియు కాదు. వారు…సహజాతీతమైనది జరిగించబడియున్నది, మరియు ఒక మిశ్రమ జనాంగము బయలుదేరినది. వారు వారి హృదయములలో మార్పు చెందినవారు కాదు.
88 మనము ఎరిగియున్న ముగ్గురు మాత్రమే ఆ గుంపులో యున్నారు, మోషే అహరోను, మరియు కాలేబు, మిర్యాము.
89 మిర్యాము, ఈ నీగ్రో బాలికను మోషే, వివాహము చేసికొనుటను బట్టి, ఆమె కూడా నవ్వినది, మరియు ఆమె యొక్క నమ్మక ద్రోహమును చూపించినది. ఆమె అన్నది, “పెళ్ళి చేసుకొనుటకు ఇతర బాలికలు లేరా? అతడు దానిని చేసియున్నాడు.” మరియు దేవుడు దానితో సంతోషపడలేదు, ఆయన ఆమెను కుష్ఠు వ్యాధితో మొత్తాడు.
90 ఆమె యొక్క సొంత కుమారుడు కేకలు వేసి ఇలా అన్నాడు, “నీవు ఆ స్థితిలోనే నీ సహోదరిని చనిపోనిస్తావా?”
91 దేవుడు మోషేతో తన ముందుకు రమ్మని అన్నాడు. మరియు అతడు వెళ్ళి ఆమె పక్షమున దేవునికి విజ్ఞాపన చేసెను, మిర్యాము. అటు తరువాత ఆమె ఎక్కువ కాలము జీవించలేదు.
92 లేదు, సోదరుడా. దేవుడు చేయునది పరిపూర్ణమైనది. మన మనస్సులలోయున్న దేనితోనూ, దానికి కలిపే పని మనకు తప్పక లేదు. అది యున్న రీతిగానే దానిని విడిచిపెట్టండి. దేవుడు దానిని చేసియున్నాడు, దేవుడు దానిని చెప్పియున్నాడు, అది దానిని ముగించేస్తుంది. కేవలము దానిని తీసుకొనుము. అది ఎలాగో నాకు తెలియదు…నేను దానిని వివరించగలిగినట్లైతే, అప్పుడు నేను దేవునితో సమానమవుతాను. నేను దానిని వివరించలేను. నేను కేవలము దానిని నమ్ముతాను. అంతమట్టుకే. అంతవరకే నేను చేయుటకు అడగబడ్డాను. ఎవరునూ దానిని వివరించుటకు అడగబడలేదు, ఏలయనగా అది మన తెలివికి దూరములో యున్నది. అది మన జ్ఞానమునకు అందదు. అది చేయునది దేవుడు, అందుచేత అది వివరించబడదు. నేను కేవలము దానిని విశ్వాసము ద్వారా అంగీకరిస్తాను, మరియు ఇలా అంటాను, “అది నా యొక్క సొంత ఆస్తి, మరియు నేను దానిని నమ్ముతాను.” నేను దానిని వివరించలేను.
93 ఈ బండ ఎలా అక్కడ యుంచబడియున్నదో. దేవుడు ఒక బండను కలిగియున్నాడు, దాని నిండా పూర్తిగా నీళ్ళతో కలిగియున్నాడు, అది కేవలము ఒక చిన్న బండ. ఈ బల్ల కంటే పెద్దది కాదు. అయితే మోషే ఈ బండను కొట్టినపుడు, అక్కడ 20 లక్షల మంది ప్రజలకు సరిపోయే నీరు దానిలో నుండి బయటకు వచ్చియున్నది. మరియు అంతవరకే కాదు కానీ వారితో పశువులు, గొర్రెలు తదితరములైనవి ఉన్నవి.
94 ఓ, ఈ చిత్రకారులలో కొందరిని నేను చూసినపుడు, ఒక చిన్న—ఒక చిన్న నీరు బండలో నుండి పడుతున్నట్లు వారు చిత్రించుచున్నారు మరియు ఒక చిన్న బకెట్ తో ఒక చిన్న పిల్లవాడు, తన చేతిలో దానితో అక్కడ నిలబడియుండుట! ఓ, అది ఎన్నడూ అలా రాలేదు.
95 ఆ నీరు సమృద్ధిగా వరద వలే బయటకు ప్రవహించియున్నది. వారితోయున్న ఒంటెలు మరియు వారి జంతువులు కాక 20 లక్షల మందికి పైగా ఆ నీరు వారి దాహమును తీర్చినది. “మరియు ఆ బండ ప్రభువైన క్రీస్తుయైయున్నాడు.” యోహాను 3:16 కు అది ఒక చక్కని సమాంతరముగా యున్నది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
96 గమనించండి, ఏమి సంభవించినది. ఆ దేవుని యొక్క తీర్పు కర్ర ఆ బండను కొట్టుట ద్వారా మాత్రమే, వారు బండ నుండి నీళ్ళను పొందారు. మరియు మోషే ఆ బండను కొట్టియున్నాడు. దేవుని యొక్క తీర్పు బండను కొట్టినది. అది జరిగినపుడు అది నీళ్ళను ఇచ్చినది.
97 ప్రజలు పరిపూర్ణముగా…వారు ఆయనను నమ్మనందున, దేవుడు వారిని చనిపోనిచ్చాడు. వారు అగౌరముగా ప్రవర్తించారు. వారు భ్రష్టులై యున్నారు. వారు జీవించుటకు తగినవారు కారు. అయినను…మోషే వారిని, “తిరుగుబాటుదారులుగా,” పిలిచాడు. దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేశారు. వారు చనిపోవుటకు తగినవారు.
98 మనమందరము దేవుని మీద తిరుగుబాటు చేయుటను బట్టి మరణమునకు తగినవారము. ఎన్నిక…గమనించండి, మనమందరము చనిపోవుటకు తగినవారము. అయితే, దేవుడు ఎంతో దయగలవాడుగా యున్నాడు! ఆయన మన గురించి ఎన్నడూ తప్పక తలంచరాదు. అయితే, ఆయన ఎంతో దయగలవాడుగా యున్నాడు, చివరకు ఆయన మన అందరి పాపములను, తన సొంత ప్రియకుమారుని మీద వేసియున్నాడు, అట్లు మనము నశింపకుండా, నిత్య జీవమును కలిగియుండుటకు. మనము ఆ బండ నుండి నీళ్ళు త్రాగి మరియు ఇంకనూ ఎలా మన హృదయములో సరిగా యుండము?
99 అయితే, సోదరుడా, అక్కడ కోట్ల మంది ఈ ఉదయమున దానిని చేయుచున్నారు. అది ఖచ్చితముగా సత్యము. వారు నమ్ముచున్నారు, కారణమేమనగా వారు బాప్టిస్టు యైనందున, లేక మెథడిస్టు యైనందున, లేక పెంతెకొస్తు యైనందున వారు నమ్ముచున్నారు. ఎందుకంటే, వారు ఒక వింతైన అనుభూతిని పొందియున్నందున, కారణము వారు భాషలతో మాట్లాడియున్నందున, కారణము వారు కేకలు వేసియున్నందున, కారణము వారు ఆత్మలో నాట్యమాడినందున, కారణము వారు ఒక స్వస్థతా కూటమును జరిగించినందున, దేవుడు రోగులను బాగుచేసినందున, లేక వారు నమ్మినది దేవుడు చేసియున్నందున, కారణము వారు ఒక బయలుపాటును (అది సత్యమైయున్నది) పొందినందున, కారణము వారు దానిని చేసినందున, ఆ కార్యములన్నియూ మంచిదే, నేను ఏమియూ దానికి వ్యతిరేకముగా మాట్లాడుటలేదు, అయితే అది నీ నిరీక్షణతో చేయునది ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. అది లీటర్లు లీటర్లుగా వెళ్ళు వరకు నీ చేతుల మీదుగా నూనెను పోయవచ్చును, లేక రక్తము నీ ముఖము నుండి కారవచ్చును, మరియు ఇంకనూ దాని భావము శూన్యము. అది నిజము.
100 పౌలు అన్నాడు, “నేను మనుషుల భాషలతోను, దేవదూతల భాషలతోనూ మాట్లాడినను, ఇంకనూ నేను తప్పిపోయినవాడనే.” నేను జ్ఞానమును మరియు తెలివిని కలిగియున్ననూ, మరియు అది సరిగ్గా కనబడునట్లు నేను బైబిలును వివరించగలిగినను…[బ్రదర్ బ్రెన్హాం త్వరగా తన వ్రేలిని చాలాసార్లు కొరుకుచున్నాడు—ఎడి.] దానిని ఏకముగా ముడివేసినను అది ఇంకనూ దానితో చేయునది ఏమియూ లేదు.
101 సోదరుడా, వారందరూ ఒకే బండలోని నీళ్ళు త్రాగియుండిరి. “ఆ బండ క్రీస్తుయై యున్నాడు.”
102 నీవు నీళ్ళు త్రాగు ఆధిక్యతను పొందుటకు తీర్పులు క్రీస్తు మీద పడినవి. నీవు తప్పక వచ్చి త్రాగుటకు, అది నీపట్ల క్రీస్తు యొక్క మంచితనమై యున్నది. నీవు వాక్యము నుండి తప్పక భుజించుటకు, అది నీ కొరకు దేవుని యొక్క మంచితనమై యున్నది. అది నీవు బాప్తిస్మము పొందునట్లు ఆయన అనుమతించియున్నాడు, అది నీపట్ల దేవుని యొక్క మంచితనమైయున్నది. ఈ ఉదయమున ఆలయములో కూర్చొండుటకు, నీకు ఆరోగ్యమును ఇచ్చుట, నిన్ను దేవుని రాజ్యములో ఒక పౌరునిగా చేయుట, అది నీపట్ల దేవుని యొక్క మంచితనమై యున్నది. అది దేవుని యొక్క మంచితనము. అది అంతయూ దేవుని యొక్క మంచితనము.
103 అయితే దేవునిపట్ల తిరిగి నీ మంచితనము ఏమిటి? ప్రతీ తలంపును, ప్రతీ చర్యను, నీ సమస్తమును నీవు ఆయనకు అప్పగించుకొనుటకు, సమస్తము ఆయనకు అప్పగించుకొనుటకు నీవు ఇష్టపడుచున్నావా? అదే—అదే దేవుడు నీ కొరకు చేసియున్నది. నీవు ఆయన కొరకు ఏమి చేస్తావు?
104 గమనించండి, మరికొన్ని వచనములను మనము కొంచెము చదువుదాము. తరువాత నేను—నేను ముగిస్తాను, ఆ విధముగా సంఘకాపరి తన వాక్యమునొద్దకు వెళ్ళగలడు. ఇప్పుడు చూడండి, “మరియు ఆ బండ క్రీస్తే.” ఇప్పుడు 5వ వచనము.
అయితే వారిలో ఎక్కువమంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక:…
105 చూడండి? వారు బాప్తిస్మము పొందుటకు ఆయన అనుమతించాడు. వాక్యమును భుజించి మరియు దానిని నమ్మునట్లు ఆయన వారిని అనుమతించాడు. వారు ఆత్మసంబంధమైన దీవెనలను పొందునట్లు ఆయన వారిని అనుమతించాడు. ఆత్మసంబంధమైన బండ నుండి వారు త్రాగునట్లు ఆయన వారిని అనుమతించాడు. కృప ద్వారా అంతయూ దేవుడు చేసియున్నాడు, అయితే, ఇంకనూ దేవుడు వారితో సంతోషించలేదు. చూడండి.
…వారు అరణ్యములో కూలిపోయిరి.
106 ఈ అనుభవములన్నిటి తరువాత, మనము చూసియున్న ఆ గొప్ప స్వస్థతా కూటములన్నిటి తరువాత, గొప్ప సూచక క్రియలన్నియూ జరిగించబడుట చూచిన తరువాత, ఈ గొప్ప అనుభూతులన్నిటినీ మనము పొందిన తరువాత, కేకలు వేయుట మరియు దేవునిని స్తుతించుట, బండ నుండి త్రాగుట, మంచి ప్రసంగములన్నిటిని మనము అనుభవించిన తరువాత, మరియు ఇంకనూ వారు కూలిపోయిరి. అందరూ కూలిపోయిరి! [బ్రదర్ బ్రెన్హాం గారు వేదిక మీద ఒకసారి కొట్టుచున్నారు—ఎడి.] “అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను.”
107 పరీక్షించుకోండి! ఒక ఉజ్జీవము మనకు రానైయున్నది. ఇది కఠినముగా యున్నదని నాకు తెలుసు. అయితే, సోదరుడా, తన పిల్లలను దిద్దని ఏ తండ్రియైనను, మంచి తండ్రి కాడు. అది నిజము. “కూలిపోయిరి.”
ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా యున్నవి,…
108 పౌలు మాట్లాడుచున్నాడు. మీరు దానిని నమ్ముతారా? [సమాజము, “ఆమేన్,” చెప్పియున్నది.—ఎడి.] అది ఒక దృష్టాంతమైయున్నది. మంచిది.
…వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు.
109 ఒక మనిషి నిలబడి, తమాషా చేయుచూ, ఒక ప్రఖ్యాత బంతి ఆటగాడు, ఆ పాత మురికి రాక్ అండ్ రోల్ ఆడుచున్నాడు, మరియు, ఆ ఎల్విస్ ప్రెస్లీ మరియు ఈ ఆటలాడువారు ఈ మురికి పాటలు పాడువారి పాటలు విన్నప్పుడు, “నాకు ఏదో సంభవించినది, నేను అంతా చిన్నాభిన్నమైపోయాను,” మరియు వాళ్ళు తిరిగి వచ్చి సువార్తను ప్రకటిస్తూ అనుకరణ చేయుచున్నారు? దానిని ఆలోచించండి! [బ్రదర్ బ్రెన్హాం గారు వేదిక మీద 10 సార్లు తట్టియున్నారు—ఎడి.]
110 మీరు ఊహించండి, ఒక స్త్రీ లేక పురుషుడు బయట కూర్చొని, మరియు స్త్రీలు ఇంటి వెనుక కూర్చొని, పాత మురికిగా కనబడు సగము బట్టలను వేసుకొని పురుషుల ముందు తమ్మును తాము విసురుకొనుచున్నారు, మరలా తిరిగి వెనుకకు వచ్చి, ఆత్మసంబంధమైన బండలో నుండి త్రాగుచున్నారు, మరియు కేకలు వేయుచూ, ముందుకు కొనసాగుచున్నారు?
111 స్త్రీల యొక్క స్వేచ్ఛను గూర్చి, పెంతెకొస్తు ప్రజల మధ్యలో అక్కడ ఒక గొప్ప సిద్ధాంతమున్నది. ఆ స్త్రీలు గొప్ప పొడవైన చెవి పోగులను ధరించుచున్నారు, మరియు నానా విధములైన బట్టలు ధరించుచున్నారు.
112 కొన్ని దినముల క్రితము, ఒక యవ్వనస్థుడు నా ఇంటి ముందు, ఒక ట్రక్కులో కూర్చొని, ఏడ్చుచున్నాడు, అతని భార్య…ఒక పెంతెకొస్తు స్త్రీ, ఆమె భాషలతో మాట్లాడుతుంది, ప్రవచనము చెబుతుంది నిశ్చయముగా. మరియు ఇలా అంటుంది. “సంఘములోని వారందరు పొట్టి బట్టలు ధరించుచున్నారు.” మరియు అతడు…“ఆమె వీధులలోనికి వెళ్ళి, 8 లేక 9 గంటల రాత్రి సమయములో, ఇతరులు కాల్చి పడవేసిన సిగరెట్టు పీకలను ఆమె ఏరుకొని పొగ త్రాగుచున్నది. మరియు ఇంకనూ ఆమె కేకలు వేయుచున్నది, దేవునిని స్తుతించుచున్నది, మరియు ప్రవచనము ఇచ్చుచున్నది.”
113 మొన్నటి దినమున నేను ఒక సంఘములో నిలబడియున్నాను, అక్కడ ఒక గొప్ప దైవజనుడు, అతనిపట్ల నాకు గొప్ప గౌరవమున్నది. మరియు ఇతడు దీనిని బహిర్గతము చేయుచున్నాడు, వారిలో ఒకరు, వారి యొక్క పై అధికారి, బయటకు వెళ్ళిపోయిన తరువాత. మరియు—మరియు అతడు వారందరు వారి చేతులలో నుండి రక్తము ప్రవహించుచున్నది, అలాటి కార్యమును వారు కలిగియున్నారు. బైబిలు యొక్క ఆధారములపై, నేను దానిని తూర్పు నుండి పడమర వరకు దానిని తప్పు అని గద్దించి, నా గొంతు బొంగురు పోయినది. అది దేవునికి సంబంధించినది కానప్పుడు.
114 ఏ రకమైనా క్రీస్తు నుండి వస్తే అది ఆయన శరీరము నుండి వచ్చినదై యుంటుంది, అప్పుడు ఆయన నిజమైన దేహము ఇక్కడ యుండియున్నది. అప్పుడు రెండవ రాకడ గతించినట్లే. యేసు అన్నాడు, “‘ఇదిగో, ఆయన అరణ్యములో యున్నాడు,’ ‘ఆయన ఇక్కడ యున్నాడు,’ అని వారు చెప్పినపుడు, మీరు నమ్మవద్దు. అబద్ధపు క్రీస్తులును, అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై, గొప్ప సూచక క్రియలను, మహాత్కార్యములను కనబరచెదరు.” మరియు నేను తూర్పు నుండి పడమర వరకు, నేను దాని మీద కేకలు వేసియున్నాను.
115 మరియు చివరగా, పశ్చిమ తీరమున, నా ప్రాణ స్నేహితుడైన ఒకరు, వృద్ధుడైన డాక్టర్ కెనడా గారు నా కొరకు నిలబడ్డాడు. మరొకరు, ఈ ఉద్యమములను ప్రారంభించిన వారి యొక్క ఒక మేనేజరు కూడా నిలబడ్డాడు, వారు పైకి వచ్చి ఒక గొప్ప దానిని ఇచ్చారు. వారన్నారు, “శుద్ధమైన నూనె మరియు రక్తము. ఈ దినమున మా రక్తము చూపించబడుతుంది.” మరియు అందరూ ఆ స్థలములో కిక్కిరిసిపోయారు. మరియు అది ఏలాగు సాధ్యమో అతడు దానిని చూపించాడు. అతని బెల్టు క్రింద 2 సూదులను క్రిందకు గ్రుచ్చి యుంచాడు.
116 మీలో ఎవరికైనను తెలుసు, మీరు దానిని పిండి, చేదితే తప్ప, ఈ వ్రేలిని లాగినట్లైతే, అది రక్తము కారదు. నీవు దానిలో ఒక రంధ్రమును చేసినట్లైతే, అది రక్తము కారదు, కారణము రక్తనాళములు దానికి దూరముగా ఉంటాయి. అతడు దానిని చేసినపుడు, అతడు దానిని ఎలా చేశాడో దానిని చూపించాడు.
117 అతడు నూనెను ఇక్కడ తన వీపున కలిగియున్నాడు, దాని మీద తన చేతులనుంచియున్నాడు. అప్పుడు అతడు పైకి వచ్చి ఇలా అన్నాడు, “నా చేతులను చూడండి, అవి పరిపూర్ణంగా మామూలుగా ఉన్నాయి.” తరువాత అతడన్నాడు, “దేవునికి మహిమ! హల్లెలూయా!” అతడు తన చేతులను ఈ రీతిగా పాలు తీసినట్లుగా లాగాడు. నిశ్చయముగా, అతని వ్రేళ్ళ నుండి రక్తము పిండబడుచుండెను అప్పుడు అందరూ కేకలు వేయుచుండగా అతడు తన తలను తుడుచుకొనెను. మరియు ఇక్కడ ఒక సిలువ ఉన్నది. ఆ మనిషి ఆ పనిచేసినప్పుడు అక్కడే అతనితో ఉన్న ఒక మనిషి అది అక్కడే ఉన్నదని ప్రజలందరి ముందు తిన్నగా దానిని బహిర్గతం చేశాడు. మరియు అతడు తన జేబులో చెయ్యి పెట్టి ఆ నూనెను తదితర వస్తువులను బయటపెట్టెను.
118 ఒకతను గోడ మీద హృదయము యొక్క చిత్రమును గీసి ఇలా అన్నాడు, “ఈ గోడ క్రీస్తు యొక్క రక్తమును పీల్చుచున్నదని, అది క్రీస్తు యొక్క హృదయము అని.” ఒక పెద్ద వృద్ధుడైన టెక్సాన్ నివాసి భయపడకుండా అక్కడకు నడుచుకుంటూ వెళ్ళాడు, ఇలా అన్నాడు, “ఎవరైననూ దానిని తాకినట్లైతే వారు చనిపోతారు.” వారు తాళ్ళను కలిగియుండిరి. వారందరూ దాని యొక్క చిత్రములను సమస్తమును కలిగియుండిరి ఆ గోడ రక్తం కారుచున్నదనీ, క్రీస్తు హృదయంలో నుండి రక్తమును పీల్చుచున్నదని వారు అన్నారు. ఈ వ్యక్తి ఆలయంలోనికి నడుచుకుంటూ వెళ్ళి అతడు, అతని భార్య ఆ గోడ మీద ఉన్న రంగును కడిగివేసి, వెనక్కు వచ్చి కూర్చొని కనిపెట్టుచూనుండిరి. వారు లోనికి వచ్చారు. సంఘకాపరి ఇలా అన్నాడు, “సరే, మీకు తెలుసా, యేసు అక్కడ ఉండి యున్నాడు. మరియు మీరు దానిని తొలగించియున్నారు.”
119 అప్పుడు అతడన్నాడు, “యేసు దానితో చేయునది ఏమియూ లేదు. నేను దానిని స్వయంగా చేసియున్నాను.” అది సత్యము.
120 ఏమి సంభవించియున్నది? దానికి కారణము సజీవుడైన దేవుని వాక్యం మీద ప్రజలు అస్థిరులుగా యున్నారు, బైబిలు దానిని చెప్పుట లేదా, “వారు తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరము నుండి దక్షిణము వరకు సంచరిస్తారు, అక్కడ ఒక కరువు ఉండబోవుచున్నది, అది నీళ్ళ కొరకు మరియు రొట్టె కొరకైన కరువు కాదు, అయితే దేవుని వాక్యమును వినకపోవుట అను కరువైయున్నది”? మనము జీవించుచున్న దినము ఎలాటి దినము.
121 ఈ గొప్ప సంఘశాఖల సంఘములన్నియు తమ్మును తాము ఏకముగా ఒక కట్టుగా చేసుకొనుచున్నారు, మరియు అది ఎలాటి స్థానమునకు వచ్చియున్నదంటే కనీసం నీవు ఒక రేడియో కార్యక్రమమును ప్రసారం చేయాలంటే నీవు తప్పక ఈ సంఘ సమాఖ్యకు చెందినవాడవై యుండాలి. లేనియెడల రేడియో ప్రసారం నుండి నీవు తీసివేయబడతావు. కుర్రవాడా, నీవు ఎన్నడూ దానిని గురించి చింతపడవద్దు. మిగిలినవారందరూ కూడా ఆ టెలివిజన్ కార్యక్రమాలను కలిగియుంటారు. అయితే నీవు అలాటి కార్యమును చేయుటకు ముందు నీవు ఆ సమాఖ్యకు తప్పక చెందినవాడవై యుండాలి. నీవు ఆ కార్యమును చేసినప్పుడు బైబిలులో వ్రాయబడినట్లుగా నీవు మృగము యొక్క ముద్రను తప్ప మరి దేనినీ ఏర్పరచుట లేదు. నీవు అక్కడే ఉన్నావు. చూడండి వారందరూ ఎలా ఒక సమాఖ్యగా మారియున్నారో.
122 ఓ, దేవునికి వందనములు, అక్కడ నిజమైన సజీవుడైన దేవుడున్నాడు. నిజముగా ఒక నిజమైన వాక్యము ఉన్నది. నిజముగా అక్కడ ఒక నిజమైన స్వస్థత ఉన్నది. నిజానికి ఈ కార్యములన్నియూ అక్కడయున్నవి. అయితే సోదరుడా నీవు ఎన్నడూ నీ విశ్వాసమును ఒక చిన్న ఉద్రేకంపై ఆధారం చేసుకోవద్దు, ఒక సంఘ క్రమముపై, ప్రభురాత్రి భోజనమును తీసుకొనుటపై, ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగుటపై ఆధారపడవద్దు.
123 నీవంటావు, “సోదరుడా, నాకు ఇది తెలుసు, నేను దేవునిని రుచి చూచియున్నాను.” అది ఖచ్చితంగా సత్యమై యుండవచ్చు. అయితే అది ఏ విధమైన స్థలములో పడియున్నది? అది తర్వాత విషయము అది ఏ విధమైన బకెట్ లోనికి వచ్చియున్నది? “న్యాయమైనదా లేక అన్యాయమైనదా.” ఇప్పుడు వినండి.
ఇప్పుడు ఇవి…దృష్టాంతములై యున్నవి, వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవారిని ఆశించకుండా యుందుముగాక.
124 వారు వేటిని ఆశించారు? ఇప్పుడు వినండి, మీరు నన్ను మన్నించినట్లైతే నేను కొంచెం ముందుకు వెళతాను.
మీరును వారివలే విగ్రహారాధికులై యుండకుడి,…
125 ఓ నీవంటావు, “నేను దేవునికి వందనములు చెల్లిస్తాను. నేను ఒక విగ్రహారాధికుడను కాను అని అంటావు.” నీవు సరిగ్గా ఒక్క నిమిషం ఆగు, దేవుని వాక్యము ద్వారా దానిని మనము పరిశీలిద్దాము. నీవంటావు, “నేను ఒక విగ్రహాన్ని ఆరాధించుటలేదని.” దాని మొత్తానికి భావము నీవు ఒక విగ్రహాన్ని ఆరాధించుటలేదని. నీవు ఏమి చేయకుండా కేవలము సోమరిగా యున్నట్లైతే, కేవలం సంఘమునకు వెళుతూ, “అవును అదంతా బాగున్నది.” అది మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని గూర్చి ఏమియూ చేయకపోయినట్లైతే.
126 సోదరుడా నిజముగా తిరిగి జన్మించిన ఒక స్త్రీ గానీ, లేక ఒక పురుషుడు గానీ వారు నిమ్మళంగా యుండలేరు. వారిలో ఏదో ఉండియున్నది. వారు తప్పక సాక్ష్యమియ్యవలసియున్నది వారు తప్పక ఏదో చేయవలసియున్నది, వారు తప్పక ఏదో చేయుటకు నిర్ణయించబడియున్నారు. వారు నిమ్మళంగా యుండలేరు, వినండి.
అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలే మీరు విగ్రహారాధికులై యుండకుడి, జనులు తినుటకును, త్రాగుటకును కూర్చొండి ఆడుటకు లేచిరి.
127 పౌలు దేని గూర్చి మాట్లాడుచున్నాడు? దృష్టాంతములను గూర్చి. వారు సంఘములోకి బాప్తిస్మం పొందియున్నారు. వారు పరిపూర్ణంగా ఒక సరియైన బాప్తిస్మమును కలిగియున్నారు. ఒక్కసారి, తండ్రీ, కుమార, పరిశుద్ధాత్మ అనే నామంలో మూడుసార్లు ముందుకు, మూడుసార్లు వెనుకకు లేక యేసు మాత్రమే, అది ఏమైయుండినప్పటికీ వారు ఒక ఖచ్చితమైన బాప్తిస్మమును కలిగియుండిరి. వారు సరిగా బాప్తిస్మం పొందియున్నారు, మనము సద్దుచేయుచూ వాదిస్తూ, ఈ చిన్న చిన్న విషయముల మీద తగాదా పడుచున్నాము. అది ఏ మంచిని చేస్తుంది? నీవు నిజమైన నియమమునకు దూరంగా జీవించుచున్నావు, బాప్తిస్మం అను అంశం మీద మా సంఘములు వేరైయున్నవి. నిశ్చయముగా.
128 అప్పుడు నీవంటావు, “ఓ, హల్లెలూయా! మేము కలిగియున్న ఆత్మసంబంధమైన దీవెన వారు కలిగిలేరు, వారెంతో చల్లగా నామకార్ధముగా యున్నారు. దేవునికి మహిమ. నేను దేవుని యొక్క నిజమైన మన్నాను భుజించుచున్నాను. అది సత్యమని నాకు తెలుసు.” అది ఖచ్చితంగా సత్యమైయున్నది, అయితే అది ఏ భేదమును చేస్తుంది? నీవంటావు, “సోదరుడా, నేను…పరిశుద్ధాత్మ నిజముగా మా సంఘము మీద క్రుమ్మరించబడుచున్నది.” అది మంచిదే, అయితే అది ఏ భేదమును నీకు చేయుచున్నది, అది సరైన పాత్రలో క్రుమ్మరించబడనపుడు, నీవు సరైన పాత్రవు కానప్పుడు? గుర్తుంచుకోండి.
129 ఓ, నీవంటావు, “నేను యథార్థమంతుడను.” అలాగే వారును యథార్థవంతులైయున్నారు. వారు వారి గృహములను విడిచిపెట్టి బయటకు వచ్చియున్నారు. వారు మెడలను మరణం వెంబడించునట్లు బయటకు చూచియున్నారు. మనము చేయవలసినదానికంటే వారు మరెంతో ఎక్కువగా చేసియున్నారు. అది దానితో చేయునది ఒక్క కార్యము కూడా లేదు. కొంచెం ఆలోచించండి.
130 బైబిలు చెప్పియున్నది, “వారు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.” పరిపూర్ణంగా నిజమైన ఆరాధన, అయితే వ్యర్థము. అది ఎక్కడ ఆరంభమైయున్నది? ఏదెను తోట నుండి, కయీను నుండి తిన్నగా క్రిందకు ఆరంభమైనది, హేబెలు ఆరాధించినట్లే, కయీను కూడా దేవునిని ఆరాధించాడు, అయితే అతడు వ్యర్థముగా ఆయనను ఆరాధించాడు. అవునండి. “ఒకని దృష్టికి మంచిగా కనబడు మార్గము కలదు.”
131 నీవంటావు, “సరే అది ఎందుకు? ఇప్పుడు నేను మారుమనస్సు పొందియున్నాను, మరి ఎందుకు నేను సరిగ్గా లేను? నేను మారుమనస్సు పొందియున్నాను. నేను మిగిలిన వారివలే ఒక మంచివాడను, నేను సంఘమునకు వెళతాను. నేను బాప్తిస్మం పొందియున్నాను. దేవుని యొక్క దీవెనలను నేను పొందుతాను. ఒక మంచి ప్రసంగం అంటే నాకు ఇష్టం. నేను దేవుని వాక్యమును ప్రేమిస్తాను. దేవుని వాక్యం చదువుట నాకిష్టం, మరియు నేను ఆత్మసంబంధమైన దీవెనలను కూడా పొందుతాను, మరియు, హల్లెలూయా, నేను ప్రవచించగలను, నేను భాషలతో మాట్లాడగలను. నేను ఈ కార్యములన్నియు చేసియున్నాను. మరియు నీ భావము ‘ఇదంతా వ్యర్థమేననా’?”
132 ఇప్పుడు, అది వ్యర్థమని నేను చెప్పుట లేదు. అయితే అది వ్యర్థం కావచ్చు. అది సాధ్యము. అది నిజము. అది అక్కడ నీవు ఏమైయున్నావో దానిపై ఆధారపడియున్నది, అది నిజము, అయితే నీవు స్వీకరించుచున్నది ఏమిటి? నీవు తిరిగి జన్మించినట్లైతే, నిజంగా నీలో ఏదో లేనట్లైతే, అప్పుడు అది వ్యర్థమై యున్నది. దీవెనలన్నియూ, నేను చేయవలసినవి కావు, ఇప్పుడు మరొకసారి.
మరియు వారి వలే మనము వ్యభిచరించలేక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరువది మూడువేల మంది కూలిరి.
133 “వ్యభిచరించినందున,” అది ఆత్మసంబంధమైన వ్యభిచారములు మనకు సమయం ఉన్నట్లైతే…సండే స్కూలు సమాప్తమైనది. ఆత్మసంబంధమైన వ్యభిచారము.
మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి.
మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.
134 సణుగుట, ఆశించుట, నీ మతముతో లోకమును కలుపుట, బయటకు వెళ్ళిపోవుట…దేవునికి శుద్ధమైనది ఇష్టము. నిజముగా శుద్ధమైనది.
135 ఈ ఉదయమున నేను మాట్లాడుచుంటిని. నేను అనుకొన్నాను. “ఏమిటి…” ఇప్పుడు ముగింపులో దీన్ని నేను తలంచియున్నాను. ఒక మనిషి యొక్క జీవితములో అతి మాధుర్యమైనది ఏదైనా ఉన్నదా? ఇంటికి వచ్చుట కంటే ఏదైనా మాధుర్యమైనది. అతడు అలసిపోయినప్పుడు మరియు తన చేతిలోని చిన్న బకెట్ తో దినమంతయూ పనిచేస్తూ లేక దుక్కిదున్నుచూ లేక అది ఏదియైనప్పటికీ అతడు అలసిపోయి ఇంటికి వచ్చి ద్వారము నొద్ద తన ప్రియమైన భార్యను కలుసుకొన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆమె అతని యొక్క ఒడిలో కూర్చొని అతని కనుబొమ్మలను కొంచెం నిమిరి మరియు అతని బుగ్గపై ముద్దు పెట్టుకొని తనచేతులతో అతనిని కౌగిలించుకొని ఇలా చెబితే “నా ప్రియమైన వాడా, నేను—నేను నీవు అలసిపోయావని నాకు తెలుసు, నీవెంతో కఠినముగా పనిచేసియున్నావు.” అది ఎంతో ఆదరణనిస్తుంది.
136 తన చుట్టూ కౌగిలించబడిన చేతులు, పరిపూర్ణముగా అతని పని అతడు ఎలా ఎరుగునో, అవి అతని చేతులైయున్నవి. ఆ చేతులు ఎన్నడూ ఏ ఇతర మనిషిపై యుంచబడలేదు, లేక ఏ ఇతర కోరికపై యుండలేదు. అతని చెంపపై పెట్టబడిన నిజమైన, శుద్ధమైన, శుద్ధ హృదయం నుండి వచ్చిన ఆ ముద్దు, అది అతనిని మాత్రమే, అతనినే ప్రేమించుచున్నది. అది ఎలా అనుభూతినిస్తుందో…నాకు తెలుసు అది నిన్ను నీ రొమ్ము ముందుకు చాచి, “ఓ, నేను ఏ మాత్రము అలసిపోలేదని” చెబుతుంది. చూడండి అది అంతే అది నీకు ఏదో చేస్తుంది.
137 నేను మీకు ఒక విషయమును చెప్పగోరుచున్నాను, అయితే ఆ ముద్దు అతని బుగ్గలపై ఉంచబడినపుడు అతనికి దాని మీద నమ్మకం లేనపుడు? అది మరొక మనిషి యొక్క బుగ్గలను ముద్దుపెట్టుకొనియున్న ముద్దు అయితే అతని చుట్టూ వేసి కౌగిలించిన ఆ చేతులు ప్రతీ ఒక్కరినీ కౌగిలించుకుంటే, ఇంకనూ ఆమె అదే కార్యమును చేయుటకు ఇష్టపడితే దాని వలన అర్థము లేదు. అక్కడ పట్టుకొనియున్నది ఏమియూ లేదు. ఎందుచేత?
138 ఇప్పుడు ఆదియందు వారు ఒక్కటిగా యుండి యున్నారు. దేవుడు, మనిషిని చేసినపుడు, ఆయన అతనిని ఒక జంట వ్యక్తిగా చేసియున్నాడు, రెండు, ఆడ మరియు మగ. ఆయన అతనిని శరీరము లో వేరుచేసి; మరియు శరీరముతో అతనిని భూమి మీద ఉంచాడు, మరియు స్త్రీ భాగము ఇంకను అతని ఆత్మలో యున్నది.
139 చూడు స్నేహితుడా దేవుడు ఎంతో శ్రద్ధగలవాడైయున్నాడు. ఓ, ఎలా ఇది…అలా నిన్ను విడిచిపోనీయవద్దు. దేవుడు ఎన్నడూ చేతినిండా మట్టిని తీసుకొని, ఒక హవ్వను తయారుచేయలేదు, ఆమె ఒక వేరయిన సృష్టిగా యుండియున్నది, ఆమె ఒక సృష్టిగా లేదు, అయితే ఆమె ఒక ఉప ఉత్పత్తిగా యున్నది, మరియు దేవుడు ఆదాము యొక్క హృదయము నొద్దకు వెళ్ళి, తిన్నగా ఆ హృదయం క్రింద నుండి ఈ ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముక నుండి ఒక స్త్రీని చేసెను. మరియు ఆదాము యొక్క ఆత్మలోని భాగమే స్త్రీలోనూ ఉండియున్నది, మరియు వారిద్దరూ ఒక్కటిగా యున్నారు, ఆత్మ, శరీరం, ప్రాణము, వారు ఒక్కటైయున్నారు. వారు పరిపూర్ణమైన ఏకత్వంగా ఉన్నారు. ఒక నిజమైన స్త్రీ…ఒక నిజమైన భర్త, ఒక నిజమైన భార్య, వారు ఒక్కటిగా యున్నారు, ఏకముగా.
140 ఇది దేనికి మాదిరిగా యున్నది క్రీస్తు తన యొక్క రొమ్ములో నుండి! ఒక ఉప ఉత్పత్తి కాదు, ఒక మెథడిస్టు కాదు, లేక ఒక బాప్టిస్టు కాదు, ఒక పెంతెకొస్తు ద్వారా పొదగబడినది కాదు, లేదండి. అయితే ఆయన తన సొంత హృదయములో నుండి, ఒక తియ్యని హృదయమును తీసెను. ఆమె ఉండవలసినంత శుద్ధముగా మరియు నమ్మకముగా యున్నది.
141 ఆ వెనుక సొలొమోను మాట్లాడుచున్నది చూడండి, “నా ప్రియురాలా రమ్ము, మనము దాడిమ చెట్లలో సంచరింతుము. మన ప్రేమను నింపుకొందము.” ఒక నిజమైన విశ్వాసి తన శుద్ధమైన హృదయంతో తన చేతులను తెరచినపుడు దానిని అతడు క్రీస్తు యెదుట పట్టుకొన్నప్పుడు క్రీస్తు ప్రేమికుని యొక్క ఆ ప్రేమ ఆ రొమ్ములోనికి వెళుతుంది. అది ఆయన భార్యయైయున్నది, ఒక నిజమైన భర్త తన నిజమైన భార్యకు చేసినట్లుగానే.
142 మనము తప్పక ఎలాటి వ్యక్తులుగా ఉండాలి. మనము క్రీస్తుతో వేశ్యల వలే ఆటలాడుచున్నామా? మనము మరిదేనిమీదైనా ఆధారపడుచున్నామా? లోకము వైపు మరియు లోకములోని కార్యముల వైపు పరుగెత్తుచున్నామా, మనము తప్పక కలిగియుండవలసిన ప్రేమను మరియు భక్తిని కలిగియుండకుండా, లోకసంబంధమైన మనస్సును కలిగియున్నామా? మీరు ఊహించగలరా? మై!
143 సోదరుడా నీవు ఊహించగలవా, నీ భార్య తన చిన్న పొట్టి బట్టలతో, కత్తిరించబడిన వెంట్రుకలతో, విపరీతమైన చేష్టలతో కూడిన కుచ్చిళ్ళతో, నగిషీ కుట్టుపనుల వస్త్రములతో, అలాటి కార్యములన్నిటితో, ముళ్ళవలె పైకి గ్రుచ్చుకొను వస్త్రములతో నీ ఒడిలో ఆమె కూర్చుండతగునా? అట్లు నీ చుట్టూ చేతులు వేసి “ఓ జాన్ నేను నిన్ను ప్రేమించుచున్నాను” అంటే. [సహోదరుడు బ్రెన్హాం వివిధములైన ముద్దుల శబ్దములను చూపుచున్నాడు—ఎడి.] “నేను నిన్ను ప్రేమిస్తాను.” అప్పుడు నీకు తెలుసు అక్కడ తిన్నగా ఏదో తప్పున్నది. ఆమె ఎంత చక్కగా కనబడిననూ మరియు ఆమె ఎంత బాగా తనను తాను ముడివేసుకున్ననూ అది లెక్క కాదు. నీకు ఆమె యందు ఎంత మాత్రము ఇక నమ్మకం లేదు. నీవు, ఆమె యందు నీకు పరిపూర్ణమైన నమ్మకం లేకపోతే అక్కడ ఏదో తప్పున్నది. అది దానిని చేయలేదు—అది ఒక మనిషి తన భార్య కొరకు ఎదురుచూచుచున్న ఆశను అది సంతోషపరచలేదు.
144 లోకములో నిన్ను నీవు వెర్రివానిగా చేసుకొనే స్థితిని గూర్చి మరియు లోకముతో నీ యొక్క చిక్కు పరిస్థితిని గూర్చి నీకై నీవు ఆలోచించుకొనుము, ఇలా చెప్పు, “ఓ ప్రభువైన యేసు, నేను నిన్ను ప్రేమించుచున్నాను.” అది మండుచున్నది, యూదా యొక్క వేషధారణ ముద్దు. అది నిజము. కార్యములను గూర్చి ఆలోచించుము. అక్కడ ఒక ఉజ్జీవము పైకి రాబోవుచున్నది. చూడండి?
145 ఓ, నీవు నీ వివాహపు ఉంగరాన్ని నీవు కలిగియుండవచ్చు, అది నిజమే, కానీ నీవు ఒక భార్యవు కాదు. ఓ, నీవు ఒక స్త్రీవై యుండవచ్చు నీవు ఇంటిలో ఒక మర్యాద గల స్త్రీవై యుండవచ్చు, అయితే నీవు అలా ప్రవర్తించినట్లైతే నీవు ఒక భార్యవు కాదు.
146 నీవు ఒక నిజమైన క్రైస్తవుడవు కావు. నీవు ఒక అసలైన నిజమైన క్రీస్తు యొక్క ఉత్పత్తివి కావు, నీ అంతరంగములోనున్న సమస్తముతో నీవు ఆయనను ప్రేమించకపోయినట్లైతే.
147 నీవు చక్కగా కనబడినా, చక్కగా కనబడకపోయినా నాకు లెక్కకాదు, నీవు ఆయనను ప్రేమించుము. మరియు నిన్ను నీవు ఆయనకు వ్యక్తపరచుకొనుము. అప్పుడే ఇద్దరూ ఒక్కటిగా మారతారు, అప్పుడే క్రీస్తు మరియు ఆయన సంఘము ఒక్కటవుతారు. సంఘశాఖ ద్వారా కాదు, బాప్తిస్మం ద్వారా కాదు. ఉద్రేకముల ద్వారా కాదు, దేని ద్వారానూ కాదు, అయితే నిజమైన ప్రేమ ద్వారా, అక్కడ ఆయన గాయపరచబడినపుడు ఆయన నిన్ను కొన్నాడు, నీవు ఆయన రొమ్ము నుండి తేబడ్డావు, నీ ప్రేమ, నీ యథార్థత, మరియు నీ యొక్క నమ్మకత్వం నీవు ఏమైయున్నావో రుజువు చేస్తుంది. నా భావాన్ని మీరు చూడండి. నీవు అంతయూ మచ్చలతో ఉన్నావో లేక నీవు…
148 నా భార్య ఆమె తలదువ్వుకున్నా, లేకున్నా నేనెప్పుడూ అది లెక్కచేయను లేక ఆమె చక్కని దుస్తులు ధరించినా ధరించకపోయినా నాకు లెక్కకాదు. అక్కడ ఆమె నాకు తియ్యని హృదయంగా ఉంటుంది. నేను ఆమెను మెచ్చుకుంటాను కారణము ఆమె యొక్క యథార్థతను బట్టి, ఆమె యొక్క సద్గుణాన్ని బట్టి. ఆమె ఏమైయున్నదో ఆమె అదేయై యుంటుంది.
149 క్రైస్తవ స్త్రీలు మరియు పురుషులుగా యుండుట ద్వారా దేవుని దృష్టిలో కూడా మనము అదేయైయున్నాము. మనము ఏదో ఒక శ్రేష్ఠమైన సంఘమునకు వెళ్ళుటకాదు. లేక మనము శ్రేష్ఠమైన బట్టలను ధరించినంత మాత్రమున కాదు లేక ఈ పరాయి వారి మధ్యలో మనమున్నంత మాత్రమున కాదు లేక మనము ఇది చేయగలము, అది చేయగలమని లేక మనము దీన్ని నడుపుతామని కాదు, అది. అది దానితో చేయునది ఒక్కటి కూడా లేదు. అది క్రీస్తు పట్ల మన యొక్క ప్రేమ. మరియు మన నమ్మకత్వం యొక్క సద్గుణమై యున్నది. అదే జన్మయై యున్నది. వచ్చునది అదియే.
150 “నేను మనుషుల భాషలతోనూ, దేవదూతల భాషలతోనూ మాట్లాడిననూ, నేను వ్యర్థుడనే. బీదల పోషణ కొరకు నా ఆస్థినంత ఇచ్చినను నేను ఇది చేసినా, అది చేసినా మరియు అది చేసినా; నేను వ్యర్థుడనే.” ఆ నిజమైన యథార్థమైన ప్రేమ మరియు నమ్మకత్వము, నీవు ఎంత చేసినా మరియు అలాటి కార్యములు నీవు ఎన్ని చేసినా క్రీస్తుకు నీవు లెక్కకాదు. దాన్ని గూర్చి ఆలోచించు, నీవు ఆలోచిస్తావా?
151 ఇది సండే స్కూలై యున్నది, మరియు గుర్తుంచుకోండి. అది నీకొక పాఠమై యున్నది. ఒక నిజమైన స్త్రీ తన భర్తకు చేసిన రీతిగా క్రీస్తును నీ హృదయంలో మొదటి స్థానంలో ఉంచుము. అప్పుడు ఏ ఇతర చేతులు ఎక్కడా ఆమెను తాకలేవు, ఏ ఇతర ముద్దు, అది ఎంత ఆకర్షణీయంగా యున్నప్పటికీ లెక్క కాదు. ఆమె తన తలను త్రిప్పివేయును. ఆమె ఒకే ఒక ప్రేమను కలిగియున్నది మరియు ఆ ప్రేమ తన భర్త కొరకే యైయున్నది. అది నిజము. ఆ పురుషుడు ఎంత నచ్చినవాడుగా యున్నప్పటికీ లెక్కకాదు. మరియు ఎంత నునుపుగా, చక్కగా అతని వెంట్రుకలు కనబడిననూ లెక్కకాదు. మరియు అతడు తన్ను తాను ఎంత చక్కగా చూపుకున్ననూ లెక్కకాదు. లేదండి ఒక్క విషయం కూడా లేదు. ఆమె తన భర్తను మాత్రమే ప్రేమిస్తుంది. అతనిని మాత్రమే, అతనినే ప్రేమిస్తుంది. ఆమె తన యొక్క సద్గుణములన్నిటిని, తన యొక్క ప్రేమనంతయూ, తన ప్రేమంతయూ, ఆమె సర్వస్వమూ తన భర్త కొరకే, అతనికి మాత్రమే. నా భావమును చూడండి?
152 లోకసంబంధమైన ప్రతీదానిని అది ఎంత చక్కగా కనబడిననూ, అది ఎంత రమ్యముగా కనబడినా అది ఎంత ఆకర్షణీయంగా కనబడినా లెక్కకాదు, లోకములోని సమస్తమూ నీవు తాకట్టుపెడతావు, నీవు లెక్కించబడేది నీ యొక్క సద్గుణము చేత.
153 అప్పుడు నీవంటావు, “ఓ, హల్లెలూయా! నేను—దానిని పొందియున్నానని నాకు తెలుసు, ఏలయనగా నేను దీన్ని చేశాను, హల్లెలూయా!” ఇంకా ఒక శబ్దం చేసే రంపముతో పోరాడే తగినంత కోపము నీకున్నది.
సోదరుడా నన్ను నీకు చెప్పనివ్వు. క్రీస్తు గౌరవించుటకు అది సద్గుణమును తీసుకుంటుంది.
154 “నేను మనుషుల భాషలతోను, దేవదూతల భాషలతోనూ మాట్లాడినా, నా రెండు చేతుల నుండి నేను రక్తమును కుమ్మరించినా, నేను ఆత్మలో కేకలు వేసి, నాట్యమాడినా, నేను దేవుని వాక్యమును భుజించిననూ, మరియు దానిని ప్రేమించిననూ, మిగిలిన వారందరి వలే అదే ఆత్మసంబంధమైన బండ నుండి నేను త్రాగిననూ, నేను మిగిలిన వారందరి వలే గట్టిగా నేను చప్పట్లు కొట్టినను నేను వ్యర్థుడనే.” [సహోదరుడు బ్రెన్హాం గారు రెండు సార్లు తన చేతులతో చప్పట్లు కొట్టియున్నారు—ఎడి.] “నేను మొసలి వలే కన్నీరు కారుస్తూ ఏడ్చిననూ; నేను ఇదంతయూ చేసిననూ! అయితే క్రీస్తుకు అక్కడ నాలో నిజమైన యథార్థమైన, నిజమైన క్రైస్తవ సద్గుణం లేనట్లైతే, నీవు మ్రోగెడుకంచును గణగణలాడు తాళమువై యుందువు.” పౌలు తన సంఘమై యున్న ఈ కొరింథీ సంఘమును హెచ్చరిస్తున్నాడు, అన్ని రకముల మూఢ విశ్వాసాలతో ఆ సంఘము కలగలుపైనది.
155 స్నేహితులారా నేను మిమ్మును హెచ్చరించుచున్నాను. గుర్తుంచుకోండి తీర్పు దినమున నేను మీ కొరకు జవాబు చెప్పవలసియున్నది మరియు మీ రక్తము నా మీద ఉండదు, నీవు దేనికైనా అంత నమ్మకంగా యున్నప్పటికీ అది లెక్కకాదు, క్రీస్తుకు నమ్మకంగా ఉండుము. మనం ప్రార్థన చేయుచుండగా దాన్ని గుర్తుంచుకోండి.
156 ధన్యుడవైన పరలోకపు తండ్రీ, ఈ ప్రస్తుతమున్న స్థితిలో మా తప్పులన్నీ ఒప్పకొనుచూ మేము మీ యొద్దకు వచ్చుచున్నాము. ఓ, మాకు కనికరం చూపండి. కనికరంగల దేవా, నీవు మాకు కనికరం చూపండి. కనికరంగల దేవా, నీవు మా హృదయములలోనికి చూడమని మేము నీకు ప్రార్థన చేయుచున్నాము. ధూళి వైపు మా తలలు వంచి, ఈ ఘడియలో మేము కనిపెడుతూ ఉండగా, వృద్ధులైన పురుషుల హృదయములలోనికి, వృద్ధులైన స్త్రీల హృదయములలోనికి, మధ్య వయస్కుల హృదయములలోనికి, యవ్వనస్థుల హృదయములలోనికి, చిన్న బిడ్డల హృదయములలోనికి సైతం చూడండి మరియు మమ్మును మేము పరీక్షించుకొందుము గాక.
157 మేము జరుపుకొను గుడ్ ఫ్రైడే, ఈష్టర్, పునరుత్థానమును జరుపుకొను వారములోనికి మేము వచ్చుచున్నాము, ఈ సంవత్సరం మేము సంఘమునకు నమ్మకముగా యున్నప్పటికీ, మేము ప్రభురాత్రి భోజనమును తీసుకొన్నప్పటికీ, మేము కేకలు వేసియున్నప్పటికీ, మేము ఎన్నో కార్యములను చేసియున్నప్పటికీ, ఇంకనూ ఓ దేవా నా హృదయాంతరంగములోనికి చూడుము. నాకు నేనుగా మాట్లాడుచున్నాను. నా హృదయములోనికి మరియు ఈ ఉదయమున ఇక్కడయున్న ప్రజల హృదయములలోనికి చూడుము, మరియు ప్రభువా మమ్మును పరీక్షించుము. అక్కడ క్రీస్తు యొక్క స్థానమును ఏదైనా తీసుకున్నట్లైతే, ఓ దేవా, దాన్ని దూరంగా తీసివేయుము. అది సోమరితనమైనా, అది కేవలం చేతకాని తనమైనా అది ఏమైయున్నప్పటికీ నాకు తెలియదు. అయితే దేవా దానిని మా నుండి తీసివేయుము. యుద్ధ సమయములో తిన్నగా కూల్చివేయబడుట, దేవుని చేత కూల్చబడి ఆయనకు ఒక శతృవుగా ఉండుట మాకు ఇష్టం లేదు.
158 ఓ దేవా మా హృదయములలోనికి చూడుము. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును పరీక్షించుము, ఏదైనా చెడు మాలో ఉన్నట్లైతే ఈ ఉదయమున మేము చూచుకొందుము గాక, ఒకవేళ చెడు ఉన్నట్లైతే దాన్ని దూరంగా తీసివేయుము, తండ్రీ, ఇప్పుడు దానిని మేము నీ బలిపీఠంపై ఉంచుచున్నాము. దాని నుండి దూరంగా నడిచివెళ్ళుటకు దానిని అక్కడ ఉంచుచున్నాము, అది సోమరితనమైనా, అది కోపమైనా, అది భిన్నముగా ఉండుటయైనా, అది అలక్ష్యమైనా, అది ఏమైయున్నప్పటికీ అది ద్వేషమైనా, అది కలహమైనా, అది అసూయయైనా, అది ఏమైయున్నప్పటికీ ఓ దేవా ఈ దినము దానిని మా నుండి తీసివేయుము.
159 మరియు వచ్చుచున్న ఈ ఉజ్జీవములో మేము నీ యొక్క మనోహరత్వంతో సంపూర్ణంగా నింపబడుదుముగాక, చివరలో అనేకులు వచ్చి రక్షించబడుదురుగాక, ఇక్కడ ఉన్న చిన్న సమాజము, ఇక్కడ మేమెంతో కఠినంగా ప్రయాసపడియున్నాము. ఇది పది సంవత్సరములలో నేను కలిగియున్న మొదటి ఉజ్జీవమైయున్నది. ఇప్పుడు మాకు ఆ నిజమైన, ఆ నిజమైన ఆత్మను మా హృదయములకు ఇమ్మని ప్రార్థన చేయుచున్నాను.
160 అది అక్కడ నిత్యత్వముతో లంగరు వేయబడునుగాక. ప్రభువా దాన్ని చేయుము. మమ్ములను మేము పరీక్షించుకొనునట్లు చేయుము, మేము వివాహమైన ప్రజలము, మేము మా భార్యలపట్ల మేము ఎలా ప్రవర్తించుచున్నామో, మేము ఎంత నమ్మకముగా ఉన్నామో, లేక మా భార్యలు మాకు ఎంత నమ్మకముగా యున్నారో మమ్ములను మేము పరీక్షించుకొననిమ్ము. ఈ ఉదయమున అలాటిది మా గృహాలలో సంభవించినట్లైతే మేము ఎలా ఆలోచిస్తామో, దానిని మా హృదయములలోనికి తెమ్ము, మరియు మా యొక్క అనురాగములను మీ వైపు త్రిప్పుదుముగాక. మరియు “ఓ దేవా నా మీద కనికరం చూపుము” అని మేము చెప్పుదుము గాక.
161 ఓ, ఒకవేళ నీ భార్య నెలలో ఒకసారి నీ యొద్దకు వచ్చి నీపై తన చేతులను ఉంచి, “ప్రియా నేను నిన్ను ప్రేమించుచున్నాను,” అని చెప్పి నడిచివెళ్ళిపోయినట్లైతే, ఓ అది నన్ను ఆమె నిర్లక్ష్యము చేసినట్లుగా కనబడుతుంది, అది ఎలా అనిపిస్తున్నదనగా ఆమెలో ఏదో తప్పున్నట్లు కనబడుచున్నది. మరియు దేవా, మేమును బహుశా నెలకొకసారి సంఘమునకు వెళ్ళి, ఒక చిన్న ప్రార్థన చేసినట్లైతే. ఓ, మా ప్రేమ నీకు కావాలి, మా—మా—మా సంభాషణ, ఎల్లప్పుడు మా తలంపులన్నియూ, మా హృదయంలోని ఆలోచనలన్నియూ, ఎల్లప్పుడూ నీ మీదే నిలచియుండునుగాక. ప్రభువా దాన్ని దయచేయుము.
162 ఓ లోకములోని కార్యములన్నియు మాకు ఎంతో భిన్నముగా మారు వరకు మా హృదయములను నీపై ఎంతగానో నిలుపుము. ప్రభువా దానిని దయచేయండి. ఇప్పుడు మా ప్రార్థనను వినుము, మరియు ముందున్న ఈ పరిచర్యలోని భాగమును దీవించుము, క్రీస్తు నామంలో మేము అడుగుచున్నాము. ఆమేన్.
163 ఇప్పుడు ప్రభువు మిమ్ములను ఎంతో చక్కగా దీవించునుగాక, నేను…మీ యొక్క ఎక్కువ నిమిషములను, సండే స్కూలు ముగించబడిన తర్వాత తీసుకున్నాను, క్షమించండి. దేవుడు మిమ్ములను దీవించునని నా ప్రార్థన. నేను ఈ సంగతులను చెప్పలేదు; ఇది దేవుని వాక్యము నుండియే చెప్పియున్నాను అవి మనకు దృష్టాంతములై యున్నవి. అవి దృష్టాంతములు. మరియు ఇప్పుడే చూడు, స్నేహితుడా.
164 నిన్ను ముద్దాడుచున్న నీ భార్య ఒక వంచకురాలని నీవు ఎరిగియున్నట్లైతే నీవు ఎలా భావిస్తావు? దానిని ఆలోచించుము. కొంచెం ఆగి దాన్ని చదువుము. నీవు ఎలా ఆలోచిస్తావు?
165 ఇప్పుడు నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఒక వంచకునిగా యుంటావా? దాన్ని చేయవద్దు. మనం యథార్థంగా ఉందాము, మనం ఒక ఉద్రేకమును తీసుకొనవలసిన పనిలేదు. పూర్తి అవకాశములన్నియూ సంపూర్ణంగా నిజమైన దేవుని యథార్థమైన ప్రేమతో యున్నప్పుడు, నీవు భిన్నమైన దానిని తీసుకొనవలసిన పనిలేదు, నిజమైన దానిని. నిజమైనది నీకు దొరుకుతున్నప్పుడు నీవు ఎందుకు ఒక ప్రత్యామ్నాయమును తీసుకొంటావు? అది నీ కొరకై యున్నది. మన సంఘకాపరికి నేను ఈ కూటమును అప్పగించుచుండగా, ఇప్పుడు ప్రభువు మిమ్ములను దీవించును గాక.
166 ఇప్పుడు ఈ వారమును మరచిపోవద్దు ఈ చిన్న ఉజ్జీవము ఈ సమాజము వారికై యున్నది మరియు ఇక్కడ ఈ చిన్న టౌనుల చుట్టూ ఉన్నవారికి, మీరు మీ ఫోను తీసుకొని ఎవ్వరినైనా పిలవండి వారిని బయటకు రమ్మని పిలవండి. మనము వేదిక పిలుపులను కలిగియుంటాము, మరియు ఈ వారం ప్రభువుతో ఒక మంచి సమయం కొరకు ఎదురుచూద్దాము.
167 మరలా వచ్చే బుధవారం రాత్రి నేను మిమ్ములను చూచు వరకు ప్రభువు మిమ్ములను దీవించునుగాక.