ప్రభువు యొక్క రెండవ రాకడ
VGR COUNT-102 పరలోకపు మా తండ్రీ! ప్రభువైన యేసు యొక్క ఆ ప్రియమైన నామములో నీ యొద్దకు మేము వచ్చుచుండగా, భువిలోని మహాఘనమైన సమయానికి యిదే ప్రాతినిద్యమై యుండెనని ఎరిగిన వారమై ఈ పరిశుద్ధ దినములను ఎంతో ఆనందంతో సమీపించుచున్నాము. నశించిన అభాగ్యులైన ఆ పాపులంతా విముక్తి పొందుటకు యిదే ఆ సర్వసమృద్ధికరమైన అర్పణ కాగలిగెను. మరియు ఒకానొక దినమున ఆయన తిరిగి వచ్చును యను ఈ గంభీరమైన నిరీక్షణను ఈ రాత్రి మా ఎదలలో మేము ఉంచుకొనియున్నాము. ఈ రాత్రి మేము“మాకు యింటికి వచ్చు గంభీరమైన వారము మాకున్నది;” అను పాట వినుచు ద్వారములోగుండా ఈ వేదికను మేము సమీపించుచున్నపుడు, మొదటి “వెయ్యి సంవత్సరాలు” గంభీరమైన ప్రపంచవ్యాప్త ఉజ్జీవ కూటములు జరుగక మునుపు, అనేక సంవత్సరాల క్రితం ఇక్కడ మందిరంలో మేము కలసికున్నప్పటి జ్ఞాపకాలు తిరిగి జ్ఞాపకమొస్తున్నవి. మరియు, తండ్రివైన దేవా! ఆ తలంపులను మేమిప్పుడే భావన చేసుకుంటున్నాము. ఎక్కడైతే పాపులు కరుణ కొరకై పిలువబడెదరో, మరియు ఎక్కడైతే పడిపోయినవారు తమ కార్యములను తిరిగి దేవునితో సరిచేసికొందురో, అట్టి పాత కాలపు తరహా ఉజ్జీవములలో మరొక దానిని ఈ రాత్రి ప్రారంభించుటకు తిరిగి వచ్చుట; మా ఆత్మలకు క్షేమమని అగుపిస్తున్నది. కూటములో ప్రాధాన్యతగల వ్యక్తి పరిశుద్ధాత్మయైయున్నాడు. ఆయనే తన వశములోను నియమ నిబంధనలోను ఉంచుకొని, వాక్యముద్వారా జీవపు రొట్టెను మాకు తెచ్చును. ఆయనే ఈ ఉజ్జీవ కూటములలో రాత్రి వెంబడిరాత్రి మాకు పరిచర్య చేసి, అక్కరలతోనున్న వారిని రోగులను స్వస్థపరచి, ప్రతియొక్క విశ్వాసిని శుద్ధిపరచి, మేము చేయుచున్న ఈ ప్రయత్నాల వలన మహిమ తెచ్చుకోమని, మేము ప్రార్ధిస్తున్నాము. ఎందుకనగా, తండ్రివైన దేవా, యిది కేవలం ఆయన నామ ఘనతా మహిమ కొరకే అది అడుగుచున్నాము ఆమేన్.
2
పదకొండు సంవత్సరాల క్రితం నేను చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు ఇది. అయితే ఒక ఉజ్జీవ కూటము కొరకు మందిరానికి తెచ్చుటకు చాలా కాలము దానిని ప్రచారము చేసుకొన్నాము మరియు, ఇప్పుడు మన చిన్న మందిరములోని స్థలము ఉజ్జీవ సభకు చాలినంతగా సరిపోదని మనకు తెలుసు గానీ, మనకిక్కడ యిరుకుగా యుంటుంది. తదుపరి కొద్ది రాత్రుల కొరకు దేవుని యొక్క మహిమార్థమై మనం చేయగల్గిన మేలు చేద్దాం.
ఆలయంలో కూటము జరిగించుటకు నేనిష్టపడతాను. అనేకమైన స్థలాలున్నవి. వాటిని మనం క్రీడారంగ స్థలములలో జరిగిస్తాము; అక్కడ బయట బహిరంగ స్థలములలో జరిగిస్తాం యింకా, వ్యాయామ ప్రదర్శన స్థలములలోను జరిగిస్తాము. అయితే ఆలయంలో జరిగించిన వాటికి ఒక విధమైన ప్రత్యేకతయుంటుంది. ఆలయంలో నీకది యున్నప్పుడు, అది యొక మాధుర్యముగాను, సమీప సహవాస సంబంధమున్నట్లుగాను అగుపిస్తుంది. అక్కడ బయట ఆ వ్యాయామ ప్రదర్శన స్థలాలు, లోకసంబంధమైన స్థలాలు అక్కడ మనకున్నందుకు మనం కృతజ్ఞులము. అయితే, ఒక వత్తిడియున్నట్లుగాను, ఒక దయ్యపు బలమున్నట్లుగాను అది అగుపించినట్లుగా యుంటుంది. నీవు ఉజ్జీవ సభ ప్రారంబించక ముందు, దానిని నీవు పగులగొట్టవలసి యున్నది. మరియు నీవు ఆలయానికి వచ్చినట్లయితే, అది దేవుడు నివాసముండు స్థలము. కూటము జరిగించుకొనుటకు, ఆయన యింటిలోనికి నీవు వచ్చుచున్నావు.
3
ఇక్కడే మందిరంలో, నా పరిచర్యయొక్క ముగింపులో, చాలాకాలం క్రితం నేను చూచినటువంటి పాత ముఖాలను ఈ రాత్రిలో నేను చూచుటకు మేమెంతో ఆనందంగా యున్నాము. సహోదరుడు గ్రహం లోపలయుండుట, సహోదరుడు కర్టిస్, మరియు సహోదరి ఏంజి, మరియు యిక్కడేయున్న సహోదరి గెటి, మరియు సహోదరుడు కాక్స్ మరియు సహోదరి కాక్స్, ఓ! అనేకులు మీలోయున్నారు. సహోదరి స్పెన్సర్, సహోదరుడు స్పెన్సర్ మరియు యిక్కడున్న విూరందరు, మేమెంతో ఆనందంగా యున్నాము. అమ్మ మరియు శ్రీమతి స్లాటర్ మరియు యిక్కడేయున్న సహోదరుడు, యింకా పెద్ద గుంపు యిక్కడున్నారు. వెనుక అప్పుడు మేము ప్రారంభించినపుడు, అంటె ఉజ్జీవాన్ని విడచి, నేను బయటకు వెళ్ళిపోయినపుడు యిక్కడున్నవారిలో ఎంతమంది ఉన్నారు? విూ హస్తాలు చూపించుడి? అలా, హస్తాలు చూస్తుంటె ఈ రాత్రి ఆలయమంతట ఉన్నారు. అది ఎంతో మంచిది.
ఇప్పుడు, మనము పరిశుద్ధాత్మ వలననే ఉజ్జీవములు జరుగునని మనకు తెలియును. ఆయనే ఉజ్జీవాన్నితీసికొనివచ్చువాడు. మనకు మనముగా అది చేయలేము. ఆ ప్రయత్నాన్ని మాత్రమే మనము చేయగలం, మరియు ఆ ప్రయాసను దేవుడే దీవించవలసియున్నది. మరియు ఆయన చేయునని మనం నమ్ముతున్నాము.
4
రహదారిపైన నా భార్యతో నేను చెప్తున్నాను. చివరకు రాత్రి భోజనము చేయుటకైనను నాకు తరుణం లేకపోయింది. అదెంతో తీవ్రమైన తొందరతోయున్నది. నిన్న ఉదయం నా యొక్కచొక్కా ధరించుకొనక ముందు, నేను లేచిన సమయం మొదలుకొని, నిన్న మధ్యాహ్నం రెండుగంటల సమయం అది. అది టెలిఫోను భాగానికి సంబంధించినది. లూయిస్విల్లోనున్న డాక్టర్ శాం అడైర్ కొరకైన ఒక అత్యవసరమైనది; అది ఖచ్చితంగా రెండు గంటల సమయం. మరియు అప్పుడు అనేకములైన విజ్ఞప్తులు మరియు మాజీ సైనికులకు సంబంధమైన విజ్ఞాపనలు (వచ్చినవి). ఒకరు ఆసుపత్రి నుండి తెలియజేస్తూ “మేము గంట గంటకు ఎదురుచూస్తున్నాము. ఈ హీనస్థితి ఏలాగున్నదో దానికంటె అక్కడకు చేరుకున్నప్పటికి నరకం యింకా ఘరోరంగా యండునేమో ఎదురుచూచుటవలన” అని ఒకరన్నాడు. వందలమంది దైవసేవకులు ప్రతియొక్క చోటనుండి అరుపులు కేకలు పెడుతున్నారు.
మరియు, ఈ లోకము ఏనాడు ఎరుగనటువంటి గంభీరమైన దినాలలో, ఒక మహోన్నతమైన సమయాలలో మనము జీవిస్తున్నామని నేను మీకు తెలియజేస్తున్నాను. మరియు, దేవుని గూర్చిమరెక్కువ తెలుసుకోవాలని ప్రజల హృదయాలలో ఆకలి యుండుటను బట్టి నేనెంతో ఆనందంగాయుంటున్నాను.
5
అది, దేవుని యొక్క చిత్తంలోయున్నదని ప్రార్ధిస్తూ నా యొక్క హృదయంలోకి నేను స్వీకరించాను. ఆ విధంగా, కొందరు బయట నిలబడి యున్నారు. నేనాశ్చర్యపడుతున్నాను. యిక్కడ మనకొక -స్థలమున్నది, చిన్న బల్లయున్నది. ఒక విధంగా మనము ఆ చిన్నబల్లను బిగించలేమోనని నేనాశపడుతున్నాను. కొందరు స్త్రీలు, లేక మరొకటి, వెనుక నిలబడియున్నవారు, మనం చేయగలమేమో.... యిక్కడే, యిక్కడే యున్నవారిలో కొందరు లేక ఎవరైనా, నడచివచ్చి, యిక్కడయున్న బల్లపైన, పైన యిక్కడ ముందుకురాగల్లినట్లయితే; బహుశా. సహోదరుడా బెన్, నీవు లోపలయుండుట మాకు ఆనందకరమైన విషయం. చివరిసారి, కొద్దివారాలక్రితం, నేను కాలిఫోర్నియాలోని ఫెర్నాండో వ్యాలీలోయున్నప్పుడు నేను నిన్ను చూశాను. మరియు మీరు జాగ్రత్తగా రాగల్గినట్లయితే, బలిపీఠము యొద్దకు తీసికొని రాబడతారు. మీరెంత సౌకర్యవంతముగా యుండాలో, ఆలాగుండాలని మా ఆశ.
6
దేవుని యొక్క సహాయాన్నిబట్టి, ప్రభువు చిత్తమైతే, ముప్పయి నిముషములే నేను మాట్లాడెదనని నాకై నేనే వాగ్దానం చేసుకున్నానని నా భార్యతో చెప్పాను. కూటములు ఎక్కువ సేపు ఉంచాలని నా అభిమతం కాదు. దానికదే అద్భుతమౌతుంది. ఎందుకనగా, నేను -చాలా త్వరగా ఆరంభించలేను. అయితే, నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకనగా. తరువాత మనకున్న రాబోతున్న సమయము, యిది కనుక రేపురాత్రి....
ఈ రాత్రి నా యొక్క పార్యాంశము :ప్రభువుయొక్క రెండవ రాకడ.
మరియు రేపు రాత్రి సంస్కారము (ప్రభురాత్రి భోజనము) యొక్క రాత్రి, మరియు పాత నిబంధన దృక్పదముతో సంస్కారమును గూర్చి నేను మాటలాడ ఆశపడుచున్నాను. మరియు మేము రేపు రాత్రి, సాధికారమైన సంస్కారపు రాత్రి. ఎందుకనగా మన ప్రభువును ద్రోహముగా అప్పచెప్పబడినది ఆ రాత్రి, మరియు అది అధికారికమైన సంస్కారపు రాత్రి, రేపు రాత్రి, కూటములైన తరువాత, అనగా నియమబద్దమైన బోధ అయిన తరువాత, మనకు సంస్కారము యుంటున్నది. మాతో కలసియుండుటకు ప్రతి యొక్కరు ఆహ్వానించబడుచున్నారు. మరియు - మరియు, మన ప్రభువైన యేసు, మనకొరకు విడిచిపెట్టిన ఈ మహిమగల విడిభాగములో పాలిభాగస్తులగుటకై పిలువబడుచున్నారు.
మరియు, తరువాత తదుపరి రాత్రి, శిలువ వేయబడిన రాత్రి గనుక, ప్రభువు చిత్తమైనట్లయితే, నేను ఆశపడుతున్నాను - క్రీస్తును శిలువ వేయుట అనునది ఆకాశవాణిలో మీరేది వింటున్నారో, దానిని మరొక వ్యత్యాసకరమైన కోణంలో నేను తీసికోవాలని ఆశిస్తున్నాను.
మరియు, ఆ తరువాత శనివారం రాత్రికి, సమాధి చేయబడుట
ఆదివారం ఉదయం ఆరుగంటలకు సూర్యోదయ ఆరాధన యుంటుంది. పదిగంటలకు బాప్తిస్మము తీసికొనువారు యున్నట్లయితే బాప్తిస్మముల పరిచర్య యుండును. మరియు, ఆ తరువాత ఈస్టరు ఉదయవేళ వర్తమానం.
7
మరియు, ప్రభువు చిత్తమైతే, ఆదివారం రాత్రికి పునరుత్థానము యొక్క నిదర్శనము అను దానిపైన చిన్న వర్తమానానికై మనం ఎదురుచూద్దాం. మరియు స్వస్థత కూడికయుండును. బయట మనకు క్రమంగా యుండే కూటములు ఏలాగో అలాగే క్రమముగా యుండు స్వస్థత కూటములు, ఈ రానున్న ఆదివారపు రాత్రికి యుండును. మరియు మీరెన్నడు చూడనట్లయితే, మరియు మీ యొక్క స్నేహితులు పునరుత్థానుడైన యేసు యొక్క కనబడెడి నిదర్శనం చూడనట్లయితే, గతించిన సంవత్సరాలలో ఏలాగు జరిగించాడో, నేరుగా యిక్కడే కూటములో కనిపించి, భూమి మీద ఆయన యుండినప్పుడు ఏలాటివి చేసెనో, వాటినే చేయుట మీరు చూచెదరని నేను నిరీక్షిస్తున్నాను. ఆ సమయంకై మేము ఎదురు చూచుచున్నాము. వచ్చుట... అది వచ్చుటకై ఎదురుచూస్తున్నాము.
8
అది మంచిది. విూరు నేరుగా వచ్చి మీకెంత అనుకూలతగా చూచుకోవాలో, అంత ప్రశాంతంగా యుండుడి. బహుశా రేపు రాత్రికి ఒకచోట నుండి కొన్ని కుర్చీలు తీసుకురాగల్గుతామేమో, అని అనుకుంటున్నాను. ఒకవేళ, అంత్యక్రియలు జరిగించు స్థలసంబంధమైన వసారా యొద్దనుండిగాని లేక మరొక చోటనుండి కొన్ని ఎక్కువగా తీసికొని వద్దాం. బహుశా చుట్టు ప్రక్కల నుండైనా తీసికొనివద్దాం. సాధ్యమైనంతవరకు ప్రతి యొక్కరు సానుకూలతగా యుండాలని మేము కోరుతున్నాము.
9
మీలో యున్నదానంతటితో మీలో ఎంతమంది ప్రభువును ప్రేమిస్తున్నారు? క్రీస్తు యెడలనే మన యొక్క ప్రేమలు యుంచి, ఇప్పుడు చూడుడి. సిద్దాంతముల కొరకు మనమిక్కడలేము. ప్రభువును ఆరాధించుట కొరకు యిక్కడ మనమున్నాము. మరియు ప్రతియొక్క మూఢ సిద్దాంతము గలవారు, ప్రతి రంగువారు, ప్రతి రకమైనవారిని, ప్రతియొక్కరిని ఆహ్వానించుటకు మేమిక్కడయున్నాము. అదేమి అభ్యంతరం లేదు, మనము కేవలం ప్రభువును ఆరాధన చేయుటకు వచ్చియున్నాము. మరియు కూటము ప్రారంభించక మునుపు ఒక అర్థగంట పాతకాలపు తరహా పాటలుండును. మరియు రేపు రాత్రికి, ఈ రోజు రాత్రివలె ఖచ్చితంగా నేను ప్రారంభించబోతున్నాను. సాధ్యమైతే ఎనిమిది గంటలకు, మరియు తద్వారా తరువాత రాత్రికి తిరిగి మనం రాగల్గుటకై ఎంత త్వరగా బయటకు వెళ్ళనీయవలెనో అంత త్వరగా చేద్దాం.
ఇప్పుడు, ప్రతియొక్కరికి సుస్వాగతం. మా యొక్క సందర్శకులు, మీరు సహవాసం చేయుటకు, ఎంతగానో ఆహ్వానించబడుచున్నారు. మరియు యిక్కడ మందిరానికి వచ్చుచున్నవారైన మీరు కూడిక ముగించబడిన వెంటనే, సాధ్యమైనంత వరకు ప్రతియొక్కరిని కరచాలనము చేయుడి. కేవలం. అభ్యంతరాలు వదలివేయండి. అద్భుతకరమైన సమయాన్ని కల్గియుండుడి. మన ప్రభువు ఏమి చేయునో మీకు తెలియదు. ఇది ఈస్టరు కాలం. మరియు మనము ఘనమైనవాటి కొరకు ఎదురుతెన్నులు చూద్దాం.
10
ఇప్పుడు, శుభప్రధమైన వాక్యములోనుండి, కేవలం ఒక్క వచనం లేదా ఒక్క వరుస లేక రెండు చదవాలని ఆశిస్తున్నాను. పరి. లూకా సువార్త 15వ అధ్యాయం, 8వ వచనం:
ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒకనాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా?
అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలచి - నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును గదా!
11
ఇప్పుడు, క్రీస్తుయొక్క రెండవ రాకడ కొరకు అది యొక బహు విడ్డూరమైన లేఖనముగా అగుపించవచ్చును. అయితే అది, క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి మాట్లాడుతుంది. మనముందున్నటువంటి ఈ గంభీరమైన అంశము, సంపూర్ణమైన పరిశుద్ధవ్రాతలో అతి ప్రాముఖ్యమైన అంశాలలో యిది ఒకటియైయుంటుంది. ప్రభువైన యేసు యొక్క రాకడతప్ప అతి ప్రాముఖ్యమైనది మరియొకటి లేదు. ఎందుకనగా, ఆయన రాకపోయినట్లయితే, మనం అబద్ద సాక్షులుగా కనుగొనబడతాము. సమాధిలోనున్నటువంటి మన వారైన మృతులు నశించిపోతారు. రెండవసారి కనిపించురీతిగా ప్రభువైన యేసు రానట్లయితే, మనకెలాంటి నిరీక్షణ యిక యుండదు. మరియు ప్రాముఖ్యమైన ఈ వెలుగు, రెండవ రాకడ యొక్క సాక్షాత్తు ఈ వెలుగు, అదెంతో ప్రాముఖ్యమైయుండెను. అదేదనగా, మనమిప్పుడు సమీపించుచున్న ఈ పరిశుద్ధవారము అనగా, యేసుమొట్ట మొదటిసారిగా శిలువ యొక్క ఛాయను సాక్షాత్తుగా ఆయన ఎదుర్కొనునప్పుడు, ఆయన, ఆయన యొక్క మరణమును, పాతిపెట్టుటను, మరియు పునరుత్థానములను గూర్చి ఆయన చాల కొద్దిగా మాట్లాడెను. ఆయన తనయొక్క మరణమునుగూర్చి, పాతిపెట్టబడుటను గూర్చి, పునురుద్ధానమునుగూర్చి మాటలాడిన దానికంటె ఎక్కువగా ఆయన రెండవరాకడనుగూర్చి మాట్లాడెను. కాబట్టి ఈ యొక్క వెలుగు కాంతిలో, అది చాల ప్రాముఖ్యమైన అంశమై యుండవలసియున్నది.
క్రీస్తుయొక్క మొదటి రాకడకు సంబంధించిన వాటికంటె, క్రీస్తుయొక్క రెండవ రాకడకు సంబంధించిన అనేకమైన లేఖనములు, అనేకమైన సార్లు పాత నిబంధనలో యున్నవి. ఇప్పుడు, ప్రాయశ్చిత్తము జరిగిన తరువాత, మానవజాతికి సంబంధించిన ప్రతిది కూడా, ప్రభువుయొక్క రెండవ రాకడపైనే ప్రాధాన్యత చేకూర్చుకొనెను.
12
మనకు పలురకములైన మతములున్నవి. మనకు పలు పలువిధములైన భావాలు, వివిధములైన వేదాంతములు యున్నవి. అయితే మన యొక్క క్రైస్తవ మతమైతే ప్రధానంగా మరణము, పాతిపెట్టబడుట, మరియు పునరుత్థానము, యి౦కా ప్రభువుయొక్క రెండవ రాకడపై ఆధారపడియున్నది. ఓ, అదొక ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు మనము సమీపించుచుండగా, విధేయతతో కూడిన నా యొక్క అతిప్రాముఖ్య అభిప్రాయాలకైతే, సాక్షాత్తు ఆయన రెండవ రాకడ ఛాయలలో మనము జీవించుచున్నాము. లేఖనము యొక్క వెలుగు కాంతి ద్వారా, నేను దానిని అక్కడ చూచు విధమునుబట్టి, ప్రభువు యొక్క రెండవ రాకడతప్ప సంఘమునకు మరొక ఏ ఒక్క నిరీక్షణ లేదు. లోకము, దాని యొక్కపిచ్చి పట్టిన అల్లరి స్థానములో లోకములోనున్న మానవ కల్పితమైన ప్రతి యొక్కసంస్థాపకమువలన సంపూర్తిగా దారి తప్పిపోయినది. రాజులు, వారి యొక్క ప్రజలను ఇక స్వాధీనమందుంచు కోలేరు. ఆలాగే, నియంతలు తమ యొక్క ప్రజలను యిక స్వాధీనపరుచుకోజాలరు. ప్రజా ప్రభుత్వము దాని యొక్క ప్రజలను స్వాధీనపరచుకోలేదు. ఇక ఎటువంటి నిరీక్షణ లేదు, ప్రభువు యొక్కరాకడ తప్ప.
13
పాపికి, అవిశ్వాసికి ఒక మహా భయంకర సమయములలో యిది ఒక సమయం. అది అతనికి ఏనాడు చెప్పబడనటువంటి సమయం. ఎందుకనగా నాశన కాలం సమీపంగా యన్నది. విశ్వాసికి మరి ఇది ఎంతో ఆశీర్వాదకరమైన సమయం. ఎందుకనగా అతని విమోచన సమీపమైయున్నది. ఈ రాత్రి భూమిలో రెండు బలమైన వర్గములున్నవి. విశ్వాసి, అవిశ్వాసి. ఒకటి ప్రభువు స్వీకరించుటకు రాబోతున్నాడు. ఒకదానికి శిక్షించుటకు ప్రభువు రాబోతున్నారు. ఆయన కన్పించునప్పుడు, ఆయన రాకడప్పుడు ఒకరిని దీవించును మరొకరిని శపించును.
14
ఇది అంతటి ప్రాముఖ్యమైన విషయమైనది కనుక, నేను కొద్దిగా ముందుగా తలస్తున్నాను. సాయంత్రం, లేదా మన యొక్క ఉజ్జీవ కూటమును గూర్చి తలస్తున్నాను. అంటె, గౌరవ ప్రదముగా లేఖనములను మనము చూడవలసియున్నది. మరియు మనమె౦త సమీపంగా యున్నావెూ మనం గమనించి గ్రహించవలసియున్నది. సమయము ఎంతయని నేను తెలుసుకొనగోరినట్లయితే, నేను నా గడియారం వైపు చూస్తాను. మనము జీవిస్తున్న రోజు, వారంలో ఏదో, అని నేను తెలుసుకొనగోరినట్లయితే, లేక సంవత్సరమందలి నెల ఏదో తెలుసుకొనగోరినట్లయితే, కాలెండరును నేను చూస్తాను. మరియు ఈ గంభీరమైన సంఘటన యొక్క సమయము సమీపించుట నేను ఎరుగాలంటె, నేను దేవుని యొక్క వాక్యమును చూస్తాను. అదెంత సమీపంగా యున్నది యను సమయమును అది తెల్పుతుంది. ఎందుకనగా బైబిల్ చెప్తుంది. “ఇది జరుగనారంభించినప్పుడు మీ తలలెత్తుకొనుడి. మీ విడుదల సమీపించుచున్నది” యని, కాలము సమీపమైయున్నది.
15
పత్మాసు ద్వీపమున యోహాను, ప్రభువుయొక్క రాకడ ముందు దర్శనమును అతడు చూచినప్పుడు, అదెంతటి గంభీరమైన విషయమాయెను. శాపములు, అవిశ్వాసిపైన దిగుట అతడు చూచినప్పుడు, మరియు ఆశీర్వాదములు విశ్వాసిపైన దిగుట అతడు చూచినప్పుడు, “ప్రభువైన యేసూ, రమ్ము” అని బిగ్గరగా అరిచాడు. ఆయన రాకడకు ముందుగా జరిగిన సంఘటనలను, అవన్ని చూచిన తరువాత, అతని యొక్క హృదయం ఎంతగానో దద్దరిల్లిపోయినది. “ప్రభువైన యేసూ రమ్ము” అని అతడు పెద్దగా కేకపెట్టాడు. సంఘకాలమంత కూడా అతని యొక్క దృష్టినుండి దాటిపోగా, అది ఏవిధముగా సంభవించునో అట్టి ప్రతిదీ పెద్దదిగా తాను చూచినప్పుడు అప్పుడు ఆ కేక “ప్రభువైన యేసూ, రమ్ము” అని చెప్పబడినది. ప్రభువు యొక్క రాకడ సమీపముగా వచ్చుటయనునది, అది మహిమగల సంగతియై యుండవలసియున్నది.
16
యేసు, ఆయన శిష్యులు ప్రకృతి సంబంధమైనవి, భూ-సంబంధమైనవియగు వస్తువులున్న ఒక స్థలానికి వారు వచ్చిరి. ఇప్పుడు యిక్కడ కొద్ది నిముషములు నిలుపుచేద్దాం. మనలను దూరముగా లాక్కొని వెళ్ళనవి, అన్ని సమయాలలో అవి ఐహికమైనటువంటివే కానవసరం లేదు. కొన్నిసార్లు మనలను ప్రకృతి సంబంధమైనవి దూరంగా తీసికొని వెళ్ళును. యేసు యొక్క సేవకులు, లేక ఆయన యొక్క శిష్యులు పట్టణమందలి యెరుషలేములోని దేవాలయమును గూర్చి చూపుచున్నారు. అతి పరిశుద్ధ స్థలములో, దేవుని యొక్క షెకెనా మహిమ ఎక్కడ అగుపించెనో, అట్టి ఘనమైన ఆలయం అది. ఎంత అందంగా అక్కడ రాళ్ళు అమర్చబడియున్నవి; ఏ విధముగా ఈ రాళ్ళు ప్రపంచములోని పలు స్థలాలలో చెక్కబడి ఒక స్థలానికి వచ్చుటకై దేవుని యొక్క ఘనమైన ఆలోచన నిర్ణయించినది, ఆయనకు వారు తెలియజేశారు. అనగా, అవి నిలబెట్టిన నలబై సంవత్సరాలలో, రంపపు కోతశబ్దంగాని లేక సుత్తెయొక్క ధ్వనిగాని అక్కడలేదు. అదెంత మహనీయంగా ఒకదానికొకటి తొడగబడినవి, మరియు ఏ విధముగా దేవుడు సెరూపులపైకి వచ్చినది, అది ఏవిధముగా ఆయన షెకెనా మహిమను కనుపరచినది, మరియు ఈ మహోన్నతమైన మందిరముపైన వారికెటువంటి గొప్ప నిరీక్షణ యున్నదో దానిని ఆయనకు వారు చెప్పారు.
“ఇవన్నియు చూడవద్దు” అని యేసు వారితో చెప్పాడు. అది పరిశుద్ధ స్థలమైనప్పటికి, అది మంచి స్థలమే. ప్రభువు నివాసముండు గృహమగు ఒక స్థలము అది. అయితే“ ఇవి చూడవద్దు. దీనికంటె ఎంతో ఘనమైనది నేను మీకు చెప్పవలసియున్నది. ఎందుకనగా ఒక సమయం రాబోతున్నది.” అని యేసు చెప్పాడు. “రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలచియుండకుండ యుండును” అని ఆయన చెప్పాడు.
17
మనయొక్క భౌతిక దేహము మనమెంతగా జాగ్రత్తగా కాపాడుకున్నప్పటికి, మనయొక్కసంస్థ కొరకు మనమెంతగా ప్రయాసపడినప్పటికి, మనయొక్క సంఘములోను, సంఘము యొక్క ఆజ్ఞ కొరకై మనమెంత భారముగా కృషి చేసినప్పటికి, అవన్నీ కూడా గతించిపోయి, అగుపడకుండపోయే ఒక సమయం రాబోతున్నది.
యేసు వారికి అవి తెల్పుటకు మొదలుబెట్టాడు. “లోకము యొక్క అంతమునకు యుగ సమాప్తికి సూచన ఏది?” యని వారడిగారు.
యేసు వారికి చెప్పుటకు ప్రారంభించాడు - “వాటిలో రాతిమీద రాయి యుండకుండ అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి. విూరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు; అక్కడక్కడ తెగుళ్ళను, అక్కడక్కడ భూకంపములను గూర్చిన సమాచారము విందురు.
18
గత దినము, అక్కడ కాలిఫోర్నియాలోని, ఓక్లాండ్లో, అక్కడ కూటములో నుండు తరుణం మాకు లభ్యమైనది. భూకంపం చూచుట, అదే నా భార్యకు ప్రప్రధమం. నేను తలవెంట్రుకలు కత్తిరించువాని కొట్టులోకూర్చున్నాను. మరియు నేను . గది కొద్దిగా కంపించిపోయినది. “భూకంపం వచ్చియున్నది” అని రేడియో వెంటనే ప్రకటన చేసినది. “షుమారు ఎనిమిది నిముషములలో మరొక దానికై వారు ఎదురుచూస్తున్నారు” అని చెప్పబడినది.
“ఓ ఇదే ఆఖరిదైతే ఏమౌతుంది”అని నేననుకున్నాను.
మా యొక్క చిన్నబిడ్డలకు పంపించుటకై కొన్ని చిన్న చిత్రపటములు తెచ్చుటకై మందుల కొట్టులోకి వెళ్ళియుండి వీధిలో ఎదురుచూస్తున్న నా భార్యను కలసికొనుటకై క్షారశాలలో నుండి, నేను త్వరపడుతూ, వెళ్ళిపోయాను. మరియు మేమక్కడే యుండినప్పుడు, మానవుడు ఎన్నడూ ఎరుగనటువంటి, ఒక మహా భయంకరమైన వింతైన భావన కల్గినది. భూమి యంతా కదలిపోతున్నది. బీరువాలలో నుండి బుడ్లు దొర్లిపోవనారంభించినవి. భవనాలు అటు యిటు ఊగుటకు మొదలైనవి. గోడలపైనుండి రంగుపూతలు రాలిపోతుండగా, ప్రజలు అరుపులు అరుస్తూ, కేకలు పెడుతూ నిలకడ లేకుండా వీధులలో పరుగెత్తుతున్నారు. ముప్పయి లేక నలబై అంతస్తుల పెద్ద భవనాలు, గోడలలోనుండి పెద్ద పుట్టగొడుగులా పైకి లేచిన దుమ్ము ధూళి వచ్చునంతగా ఊగుతూయున్నవి. ప్రజలు అరుపులు అరుస్తూ పరుగు తీస్తున్నారు. “గోడమిూద చేవ్రాత అనినట్లుగా అది సర్వశక్తిమంతుడైన దేవుని హస్తము” అని నేను అన్నాను.
“అక్కడక్కడ భూకంపములు జరుగుట మీరు వింటారు” అని యేసు చెప్పెను. రాజమార్గము చాలా దూరము వరకు షుమారు ఐదు అడుగులు భూమి పగిలినది. భూమి లోపల వందల అడుగులు లోపలకు వెళ్ళిపోయినది. ఒకచోట రాజమార్గమంతా కూరుకుపోయినది. ఆ పగుళ్ళు ఏర్పడినప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క వ్రేలు “అక్కడక్కడ భూకంపములు కలుగును” అని చెప్పినది నేను చూడగల్గితిని.
19
రోజు ముందుకు జరిగిన కొలది, ఎనిమిది విధాలైన భూకంపములు ఆ నగరాన్ని ఊపి వేసినది. మత్తు పానీయాలు కొట్లు తెరచుకొన్నవి. త్రాగుబోతులు వీధులలో గుమికూడారు. సగం వస్త్రాలతోనున్న స్త్రీలు వీధులలోకి నడుస్తు వెళ్తున్నారు. ఏమి జరుగలేదన్నట్లుగా ఆలాగే యుండిపోయినది. ఈ దేశాన్ని ఏది వణికింపజేయునో అది నాకు తెలియదన్నట్లుగా, ఈ దినమున ప్రజలు ఎంతగానో బందీలైపోయారు. లెక్కలేనట్లుగా యున్నట్లుగా వారు అగుపిస్తున్నారు. వారు గమనించనే గమనించరు.“నేనేమి చేశానో మీరు చూశారా? నా పిడికిలిని నేను కదిలించాను. నేనే అతీతమైన మానవుడను” అని ఒక మనిషి తాను వివరణ యివ్వడం నా కళ్ళతో నేనే విన్నాను.
“ఎంతటి దేవదూషణ”యది ! అని నేననుకున్నాను.
మన యొక్క స్వంత పట్టణములోనే, యిక్కడే, అటువంటి దేవదూషణయుండునని నేనెన్నడు ఆలోచించలేదు. జార్జిటౌను, గత సాయంత్రం నేను క్రొత్త రాజమార్గం గుండా వెళ్ళుచున్నప్పుడు కొంచెం ముందు ఆ విభాగాలను మీరు తాకునప్పుడు - అడ్డం దారి కూడలి దాటునప్పుడు అక్కడ క్రొత్త దారియున్నది. అక్కడ, పైన పెద్ద గురుతు యొకటి యున్నది.“ఆయన లేచియున్నాడు. జీవము కల్గియున్నాడు.” అని అది చెప్పబడియున్నది. ఆ రెండు విడివిడిగా యున్నవి. తరువాత గురుతు “ఎక్కడైతే బడ్వైజర్ బీరు యున్నదో, అక్కడ ప్రాణమున్నది” అని చెప్పబడుచున్నది.
“ఎంతటి దేవదూషణ అది!” అని నేననుకున్నాను. దానికున్నదంతా అదే. “క్రీస్తుయొక్క రెండవ రాకడకు ముందు, మనుష్యుడు దేవదూషకులు, తమ స్వకీయ దురాశల చొప్పున నడచువారు, అనురాగరహితులు, అపవాదకులు” గా నుందురు. ప్రపంచము ఎంతటి వంచనతో నిండియున్నదో గదా!
20
ఈ మధ్యనే ఇండియాలోని బొంబాయిలో, (మా అబ్బాయి) బిల్లీ, నేను అక్కడ యొక పెద్ద కూటములోయుంటిమి. వేల పదివేలమంది హిందువులు తమ జీవితములను అక్కడ క్రీస్తుకు సమర్పించుకున్నారు. అక్కడే యొక పెద్ద హెచ్చరిక వెల్లడైనది. మరియు, ప్రకృతియొక్క బుద్ధి సూక్ష్మత విూరు గమనించాలని నేను కోరుతున్నాను. మరియు, అకస్మాత్తుగా, ఒక తెలియబడని కారణంచేత, నగరంలోనున్న చిన్న పక్షులన్ని గ్రామ ప్రాంతంలలోకి వెళ్ళిపోవుటకు మొదలు పెట్టినవి. పక్షులు గుంపులు గుంపులుగా గ్రామంలోకి వెళ్ళిపోయినవి. అన్ని పశువులను, గొర్రెలను, ఎద్దులను గమనించుటకు ప్రారంభించినవి. అయితే, ఇండియాలోవారి యొక్క కంచెలు మనవంటి కంచెలు కావు. అవి కట్టెలతోనున్న కంచెలు కావు. వారివి పెద్దరాళ్ళతో ఎత్తుగా కట్టబడిన కంచెలు. పశువులన్ని గోడలు దాటి వెళ్ళుటకు మొదలుపెట్టినవి. భవనాలలోనుండి బయటకు వెళ్ళుటకు ప్రారంభించినవి. పొలముల మద్యలోకి వెళ్ళిపోయి, పొలము మద్యలో గిరగిరా తిరుగుతున్నవి. అటు తరువాత, అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చినది. గోడలను, చెట్లను, బండలను కదిలించి వేసినది. అవి ఎగిరిఎగిరి పడినవి. పక్షులు తిరిగిరాలేదు. పశువులు పొలములోనే యుండిపోయినవి. అది సరెయన్నట్లు మానవుడు ఆలోచనలో యుండిపోయాడు. మరి మరుసటిరోజు మరియొక భూకంపం కుదిపివేసినది. అనేకమైన భవనాలు కూలిపడినవి. విరిగి ఎగిరి పడినవి. మరి మూడవ రోజు పశువులు తిరిగి గోడలలోకి వెళ్ళిపోయినవి; పక్షులు తిరిగి నగరంలోకి తిరిగి వచ్చినవి.
21
ఓహో! ఎవరైతే పిచ్చుకలకు పోషణకర్తయైయున్నాడో, ఎవరైతే ఓడ లోపలకు, ఆయన యొక్క అల్పమైన ప్రాణులను తీసికొని వచ్చెనో, ఆయన ఇంకా జీవించుచున్నాడు, ఏలుబడి చేయుచున్నాడు. ఎవరినైతే దేవుడు తన స్వరూపమందు చేయగా, ఆ మానవుడు దేవదూషణ చేస్తుండగా అట్టి మానవుడు కల్గియున్నదానికంటె మరెక్కువ సూక్ష్మ బుద్ధి అవి కల్గినట్టుగా అగుపిస్తున్నవి. భూమిలోని చిన్న ప్రాణులు; వాటికి దేవుడు సిద్ధపరచియున్నాడు. పెద్ద గోడలకు ఆవల అవి తమ మార్గమును తయారు చేసికొనినవి. అవి చంపబడియుండెడివి. ఆ రాళ్ళు, అటు యిటూ దొర్లుతున్నప్పుడు, ఆ రాళ్ళ సందులలో ఆ పక్షులు గుజ్జు గుజ్జుగా నలిగిపోయి యుండెడివి.
ఆయన రాకడ యొక్క సూచనలు! మనము జీవిస్తున్న ఈ దినము, ఓ! అది గంభీరమైన దినము. అవి యిక్కడయుండునని యేసు పలికిన ఆ సమస్తమైన సంగతులు వివిధములైన స్థలములలో భూకంపములు, తెగుళ్ళు జరుగుచున్నవి. నా దృష్టికి అది, ప్రభువు యొక్క రాకడ తప్ప మరొకటేది మిగిలియుండలేదు. అది సమీపంగా యున్నది.
22
యేసు ఆయన యొక్క ప్రసంగములో కూడా ప్రజలకు తెలియజేయుచు,“అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీరు చెప్పుదురు. ఈ సంగతులన్నియూ జరుగుట మీరు చూచునప్పుడు, కాలము సమీపమైయున్నదని మీరు తెలుసుకొనుడి” అని ఆయన చెప్పెను.
అంజూరపు చెట్టు అనగా ఏమి; అది మీరు గమనించుడి. అంజూరపు చెట్టు ఎల్లప్పుడు కూడా యూదా దేశమై యుండును ఆయన “అంజూరపు చెట్టును” గూర్చి మాత్రమే కాదు గాని, మిగతా చెట్లను గూర్చియు చెప్పియుండెను. “అంజూరపు చెట్లను, మిగతా చెట్లును చిగిరించుట మీరు చూచునప్పుడు”. ఇప్పుడు, ఆయన అంజూరపు చెట్టును గూర్చి మాత్రమే కాదు గాని మిగతా చెట్లను గూర్చియు మాట్లాడెను.
23
అది ఎప్పుడు చిగిరించునో, అది కొద్దిగా మనం గమనించుదాము. గత కొద్ది సంత్సరముల నుండి బహు విచిత్రమైన కాలంలో మనం జీవించుచున్నాము. అన్యజనుల సంఘము, దానికెన్నడు లేనటువంటి . అపోస్తలుల కాలము మొదలుకొని, ఏనాడు లేనటువంటి మహోన్నతమైన ఉజ్జీవములను అది కల్గియుంటున్నది. ఓహో! అప్పుడు అన్యజనుల సంఘమునకు ఉజ్జీవము లేకుండెను. యూదుల సంఘమే ఉజ్జీవాన్ని కల్గియుండెను. అయితే, గత పది లేక పండ్రెండు సంత్సరముల నుండి అన్యజనుల సంఘము చరిత్రాత్మకమైన మహా గొప్ప ఉజ్జీవాన్ని కల్గియున్నది.
24
మనము మార్టిన్ లూథర్ యొక్క ఉజ్జీవాన్ని గూర్చి తలంచుకుందాము. ఔనండి! అదెంతో ఘనమైనదైయుండెను. అయితే అది జర్మనీలో మాత్రమే. ఇంగ్లండులోని వెస్లీ ఉజ్జీవాన్నిగూర్చి తలంచుకుందాము, అది యిక్కడ వరకు వ్యాపించెను. మరియు అది బ్రిటిష్ వారి కొన్ని ద్వీపములలో మాత్రమే అది యుండెను. అయితే మరెక్కువ క్రియాశీలకము కాలేదు. అయితే, ఈ దినాన, జరుగుచున్న ఈ ఉజ్జీవము; అతీతమైన ఈ ఉజ్జీవము నిర్దిష్టంగా సముద్రమునుండి హద్దులు లేని సముద్రము యొద్దకు ఆక్రమించెను. రేడియోల ద్వారా, పత్రికలద్వారా మరియు మానవజాతి ద్వారా పూచికత్తు లేకుండ పంపబడిన సువార్తికుల ద్వారా ప్రపంచమంతా వెళ్ళిపోయెను. పదివేల వేలసార్లు దేవుని రాజ్యములోకి వేల ఆత్మలు జన్మించినటువంటి ఉజ్జీవమును అది తీసికొని వచ్చెను.
ప్రభువు నాకు అనుగ్రహించిన అల్పమైన నా యొక్క స్వంత చిన్న పరిచర్యలో, ఒక మిలియన్ ఆత్మలు దేవుని రాజ్యములోకి వచ్చుట నేను నిండారుగా చూచితిని. అది ఆలోచించు! ఎవరైతే రేడియో ద్వారా, మొదలైన వాటి ద్వారా విరజిమ్మి యుండిరో, అట్టిమిగతావారు ఈ ఘనమైన పరిచర్య ద్వారా మిలియన్లకు చేరుకున్నారు. ప్రయోగాత్మకంగా అప్పటి. షుమారు పది సంవత్సరముల నుండి ఉజ్జీవాన్ని మనం ప్రారంభించినప్పటి నుండి ప్రపంచంలోని ప్రతి యొక్క పర్వతము పైన ఉజ్జీవ జ్వాలలు మండుచూనేయున్నవి. మనము అంత్యకాలములో యున్నాము.
25
ఇప్పుడు గమనించు! తరువాత, దానికి కొంచెం ముందు, ఆయన యిక్కడ ప్రవచించి, “అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రోక్కబడును” అని చెప్పియుండెను. మహమ్మదీయులు దానిని స్వీకరించియున్నారు. అది మనం గ్రహిస్తున్నాము. అది ఎక్కడైతే జరుగునని అది ముందుగా చెప్పబడినదో, సాక్షాత్తుగా అట్టి యెరూషలేములోనే, ఈ రాత్రి జరుగుచున్న గడ్డు పరిస్థితి మీరు చూడాలని నేను ఆశించుచున్నాను. మరియు కొన్ని సంవత్సరాల క్రితం యెరూషలేములో ఏ యూదులు యున్నట్టుగా లేదు.
26
ఇప్పుడు, “అంజూరపు కొమ్మ లేతదై చిగురించుట,”అది మీరు చూచునప్పుడు అని యేసు చెప్పియున్నాడు. యూదులు గొప్ప సంఖ్యలోజర్మనిలోకి, ఇటలీలోకి, సంయుక్త రాష్ట్రములలోకి, ప్రపంచమంతటికి చెదరి వెళ్ళిపోయారు. దేవుడు, పూర్వ దినాలలో ఏలాగు ఫరో హృదయమును కఠినపరచెనో, ఆలాగు ఆయన యూదులయెడల ముస్సోలిని యొక్క హృదయమును కఠినపరచి ఇటలీ నుండి యూదులను అతడు బహిష్కరించి వెళ్ళగొట్టునట్లుగా చేశాడు. హిట్లర్ హృదయాన్ని ఆయన కఠినపరచాడు. జర్మనీ నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. స్టాలిన్ యొక్క హృదయాన్ని ఆయన కఠినపరచాడు. రష్యా నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు.
సంయుక్త రాష్ట్రములు, మనం అరబ్బులతో చేతులు కలుపుట (పక్షమున యుండుట) మీరు పత్రికలో గమనించుచున్నారా? ఓహో! సహోదరుడా, గొడవిూద చేవ్రాత! ఎవరు ఇశ్రాయేలీయులను దీవించెదరో, వారు దీవించబడుదురు. ఇశ్రాయేలీయులను ఎవరైతే శపించెదరో వారు శపించబడెదరు.“ అని దేవుడు చెప్పాడు.
27
ఇంటియొద్ద, నా యొద్ద యొక చిత్రమున్నది. లేక అది ఆ సమయానికై బదులుగా తెచ్చుకున్నది. “అర్ధరాత్రికి ముందు మూడు నిముషములు” అని అది శాస్త్రవేత్తలచేత చెప్పబడినది. మద్యరాత్రికి ముందు అది మూడు నిముషములగు వరకు గడియారం వెళ్ళిపోయినదని, విజ్ఞానశాస్త్ర లోకము చెప్పినట్లయితే, మద్యరాత్రికి ముందు ఒక్క నిముషంగా యిప్పుడు దానిని తగ్గించారని నేననుకుంటున్నాను. హైడ్రోజను, ఆక్సిజన్ అణ్వస్త్ర సంబంధమైనవి, మరియు వారు తమకు కవచముగా చేసికోగల ఆ గొప్ప బలములను వారు కనుగొనినప్పుడు, ఐదు నిముషముల వ్యవధిలో సంపూర్తి వినాశనమునకు అది హేతువు కాగలదు. దక్షిణాది అంతటిలో ఒకడు బ్రతికియుండకుండ సంపూర్తిగా ఈ రాత్రి వారు చేయగల్గుతారు. అమెరిక భూభాగాన్నిముప్పయి నిముషములలో చేయగలరు. మనలను ఎవరైతే ద్వేషిస్తున్నారో అట్టి గుంపు నాస్తికుల హస్తాల్లోనే నేరుగా అది పెట్టబడియున్నది. దానికి పైగా మనకు సరకు పడవలు, ఓడలు చుట్టు పెట్టబడియున్నవి. యిరువైపుల... సైబీరియా గుండా, హంగెరీకి పైన వివిధ స్థలాల్లో ఆ విధమైన క్షిపణులచే నింపబడి మన పడవలు పెట్టబడియున్నవి.
28
ప్రియమైనవారలారా, మీరు అనుకున్నదానికంటే అది ముందున్నది. సోదొమ మరియు గొమెర్రాలవారికి వారు జీవించుచున్నది ఆఖరి గంటయని ఆనాటి రాత్రి కొంచెమే తెలుసు. వచ్చునని ముందుగా చెప్పబడిన ఆ మరణదూత ఆ రాత్రే వచ్చునని ఐగుపుకు కొద్దిగా మాత్రమే తెలియును. అక్కడ జరిగిన అక్రమ దాడిని పెరల్ హార్బర్ కొద్దిగానే గ్రహించినది. మనం త్రాసులో తూచబడితిమి తేలిపోయిన వారముగా కనుగొనబడితిమి! మనము అంత్యకాలమునకు సమీపంగా ఉన్నాము.
అదే జరిగితే ఏమగును. వారు, నేరుగా మాస్కోలోనే, వారు చేయాలనుకున్నట్లయితే, ఆ యొక్క క్షిపణులను నక్షత్రముల ద్వారా, రాడార్లు ద్వారా నడిపించి గురిచూయించి నేరుగా లూయిస్విల్లోని నాల్గవ వీధిలోకి ఖచ్చితంగా దింపగలరు. ఔనది నిజం! మనం చేయాలనుకుంటె మనయొక్క ఓడలలో అక్కడ సముద్రములో ఒక చోట నిలబడి నేరుగా మాస్కో (యొక్క) ముఖ్యపట్టణము వైపు ఒక దానిని గురిపెట్టి పంపగలము. సహోదరుడా! ఏం జరుగుతుంది? ఆ యొక్క క్షిపణి వెనుకకు తిరుగుట సంభవించితే, ఈ దేశము కదలిక దెబ్బను అనుభవిస్తుంది. అదే గడియలో ఆలాటిదే మనము వదులుకుంటాము. దానిని మరొక ప్రక్కగా కదలించి వేస్తాము. మనము అతి స్వల్పమైన, చిన్నది, రవ్వంతైన సన్నని పొరకప్పు విూద జీవిస్తున్నాము. భూకంపములు అన్ని వైపులతిని, ఏమిలేని ఒక కోడి గ్రుడ్డు బోలు యైనట్టుగా చుట్టు తినివేసినది. ఆమె ఒక్కసారి పెద్దగా పగిలినట్లయితే, ఈ ఎనిమిది వేల మైళ్ళ దళసరిగా యుండినలావా గాలిలోకి విరజిమ్ముతుంది. దేవుడు ఏమి జరుగునని చెప్పియున్నాడో ఖచ్చితంగా అది అదే చేస్తుంది.
మనం అంత్య కాలములో ఉన్నాము. మనమిక్కడ ఉన్నాము. అది నిలుపుచేయుటకు మరో మార్గంలేదు. ప్రారంభంనుండి అంతా. ప్రతియొక్క దేశంలో ఐజన్ఓవర్నుమనం పెట్టవచ్చును. మరి అది దానినెన్నడు నిలుపు చేయలేదు. ఈ కాలములు వచ్చునని యేసుక్రీస్తు చెప్పియుండెను. మనమిక్కడే యున్నాము. అంజూరపు కొమ్మ చిగురించుచున్నది.
29
ఈ యొక్క చిత్రంలో, అక్కడ ఇరాన్లో, ఏవిధముగా వారు పెద్ద విమానాలు తీసికొని అక్కడకు వెళ్ళినది, లుక్ పత్రికలో మీరు చదువగలరు. మరియు ఏవిధముగా ఈ యూదులు విమానముల నిండుగా యుండి యున్నది మీరు చదువగలరు. వారిలో వేలవేల మంది, అక్కడకు, బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని అక్కడయుండిన వారు మరియు ఇరువది-ఐదు వందల సంవత్సరములనుండి అక్కడ యుండినవారు, అక్కడనే విడిచిపెట్టబడినవారు అక్కడ యుండిరి. పురాతన కొయ్యసామాగ్రితో వారు దున్నుతున్నారు. భూమి మీద యేసు యుండియుండెనని వారికి ఏమి తెలియదు. వారియొక్క పురాతన యూదుల పారంపర్యాచారాలు, వారు జీవించుచున్నఆచార నియమ బద్ధతలు తప్ప, వారికి యింకొకటి వేరే ఏది తెలియదు. ఈ విమానాలను వారక్కడయుంచి, వారి స్వదేశమునకు తిరిగి వారిని తీసికొని వెళ్ళటకు ఈ యూదులను ఎక్కించుచుండిరి....
30
ఇరువై ఎనిమిది లేక ముప్పయ్ వందల సంవత్సరముల క్రితము, “ఆ చెరలోనుండి వారు వచ్చునప్పుడు, దేవుడు వారిని పక్షిరాజు రెక్కలపైన తీసికొని వచ్చును” అని ప్రవక్త ప్రవచించి చెప్పెను. విమానము వచ్చుట ప్రవక్త చూశాడు. వారు కూర్చుండుట ప్రవక్త చూచెను. మరియు వారిని పైకి తీసికొని తిరిగి స్వదేశానికి తీసికొని వెళ్ళుట అతడు చూశాడు. అదేమని పిలువవలెనో అతనికి తెలియలేదు. అతడు. అతనికది పక్షిరాజువలె అగుపించినది. కనుక, “పక్షిరాజు రెక్కలపైన వారు కొనిరాబడెదరు” అని అతడు చెప్పాడు.
మరియు విమానములో నుండి వారు బయటకు వచ్చునప్పుడు, యౌవనస్తులైనవారు వృద్ధులకు సహాయము చేయుచుండిరి. వారు, వారు ముఖాముఖిగా పర్యవేక్షణ చేయబడిరి. “చనిపోవుటకు తిరిగి స్వదేశానికి మీరు వచ్చితిరా?” అని అడిగారు.
“కాదు, మెస్సీయాను చూచుటకు మేము తిరిగివచ్చితిమి” అని వారు చెప్పిరి.
31
ఓ! గత కొద్ది సంవత్సరముల నుండి ప్రపంచము చుట్టునుండి విశిష్టరీతిలో వస్త్రధారణలైన వృద్ధులు, యౌవనస్తులగు యూదులను, పెద్దలను అట్టివారితో తూర్పునుండి పడమటనుండి పొగ ఆవిరి విరజిమ్ముకుంటు గొప్ప స్టీమరులు యెరూషలేముకు వచ్చుచున్నవి. ప్రపంచములోనే అతి పురాతనమైనదై, ఆరు మొనలుగల పురాతనమైన దావీదు జండా ఇరువది యైదు వందల సంవత్సరములు అవి ఎగరవేయబడలేదు. యెరూషలేము ప్రధాన పట్టణముపైన వ్రేలాడుచు ఈ రాత్రి ఒక దేశముగా ప్రకటించబడియున్నది. అంజూరపుచెట్టు దాని మొగ్గవేయుచున్నది (చిగురించుచున్నది).
యెరుషలేము వృద్ధి పొందుచున్నది, పూర్వపుస్థితికి ప్రభువు తెచ్చుచున్నాడు.
ప్రవక్తలు ముందుగా చెప్పిన గురుతులు అవి;
అన్యజనుల దినములు భయబ్రాంతులతోను
భారములతోను లెక్కించబడినవి;
ఓ! చెదరినవారలారా, మీ స్వదేశమునకు మరలుడి.
ఏలయనగా విమోచన దినము సమీపమైయున్నది
మనుష్య హృదయాలు భయంతో కృంగిపోతున్నవి
దేవుని ఆత్మతో నింపబడుడి,
మీ దీపములు చక్కగా వెలుగుచుండనీయుడి.
మీ విమోచన సమీపమైయున్నది. మీ తలలుపైకెత్తుడి.
32
మనమది అనుకున్న దానికంటె చివరి దశలోయున్నది. ఒక ఆసనమును ఆక్రమించుకొనుటకు మనం ఆలయానికి రాలేదు. ఒక మంచి ప్రసంగమును వినుటకు మనం ఆలయానికి రాలేదు. లేదా మంచి సంగీతాన్ని ఆలకించుటకు ఆలయానికి రాలేదు. వాటి యొక్క స్థలాలు వాటికున్నవి. అయితే, దేవునికి మరియు (మన ఆత్మల రక్షణను గూర్చి పరీక్ష చేసికొనుటకు ఆలయానికి వచ్చుట మంచిది.)ఏలయనగా రక్షణ దినము సమీపంగా యున్నది.
దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు (ఆయన చెప్పియుండెను). దీనిని ఒక స్త్రీతో పోల్చియున్నాడు. ఈ రాత్రిలో మన యొక్కపార్యాంశము. ఈ స్త్రీ, ఆమె యొక్క భర్త బయటకు వెళ్ళిపోయినట్లుగా మనం కనుగొంటున్నాము. మరియు ఆమె తన యొక్క పలకల కట్టులో నుండి ఒక నాణెమును పోగొట్టుకొన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు, దానిని నేను వివరించుటకు ప్రయత్నిస్తాను.
33
ఈ రోజు, ఒక స్త్రీ వివాహము చేసికున్నట్లయితే, ఆమె వివాహితురాలు అను సూచనగా ఆమె వివాహపు ఉంగరము ధరించవలసియున్నది. మరొక పురుషుడు ఆమెతో ఏమి చేయకుండునట్లుగా అది అతనిని దూరపరచును. వారు చూస్తారు, ఆమె వివాహితురాలని వారు గ్రహిస్తారు.
ఆ యొక్క దినాలలో, వారికి వివాహపు ఉంగరాలు లేవు. పలకల కట్లు వారు ధరించెడి వారు. (వారు దానిని పలకల కట్లు అని పిలచిరి). వారి తలపైన ధరించిరి. అది పది నాణములు కల్గియుండి వారి తల చుట్టూ అదియుండెడిది. వారు వివాహితులైన స్త్రీలని అదియొక సూచనగా యుండెను. ఏ పురుషుడు వారితో బుద్ధిహీనతగా ప్రవర్తించడు, ఏ అబ్బాయిలుతో సరసాలాడరు. వారు వివాహము చేసికున్నవారు.
ఆ యొక్క ప్రతి నాణెముకూడా... మనకు సమయమున్నట్లయితే, (అయితే నాకు సమయం లేదు. ఎంత త్వరగా ముగించాలో అంత త్వరగా నా యొక్క మాటను నేను నిలబెట్టుకోవలసియున్నది) ఒక్కొక్క నాణెము యొక్క అర్థమేంటో నేను మీకు చెప్తాను. అది అక్కడ పెట్టబడియుండును. ఆ స్త్రీ యొక్క ఒక ప్రత్యేక పవిత్ర గుణమునకు ఆ ఒక్కొక్క నాణెము భావార్ధం తెల్పుతుంది. మొదటిగా ఆమె భర్తయెడల ఆమె ప్రేమ యొక్క అర్థం. రెండవది, అతని కొరకై పవిత్రంగా ఆమె జీవించు గుణము యొక్క ప్రమాణము. మరియు మూడవది, నాల్గవది మరియు ఐదవది, ఆలాగు తొమ్మిది, పది.
34
విూరు అది చూడాలనుకుంటె, గలతీ 5లో అది చూడుడి !ఆ స్త్రీ సంఘమునకు పోలికయని మీరు తెలిసికుంటారు. సంఘము క్రీస్తుకు ప్రధానము చేయబడిన భార్య సంఘము ధరించవలసిన పలకల కట్టు గలతీ 5 లో కనుగొనబడుచున్నది. ఆవేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, దీర్షశాంతము. సంఘములో ధరించవలసిన పలకలకట్టు అది సహోదర ప్రేమ, దయాళుత్వము, సహవాసము.
ఈ యొక్క స్త్రీ, అది. ఆ నాణెములలో ఆమె ఒకటి పోగొట్టుకున్నదని గ్రహించుటకు అది చీకటిపడిన వేళయై యుండవలసియున్నది.
35
ఓ ! నాణెములన్ని నీ యొద్దనెనున్నవని నీవు జాబితాను కనుగొనుటకు, సంఘము స్వీకరించ వలసిన సమయమున్నట్లయితే అది యిదే కావలసియున్నది. అది చీకటిపడుతుంది. అది తరచుగా సంభవించు వినాశనకరమైన మేఘముల నాగరికత భూమిపైన వ్రేలాడుతున్నది. పాపము. వ్యభిచారము ప్రతి కోణానయున్నది. ఎక్కడైతే భక్తిహీనత ప్రబలినదో, అట్టి భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాము. ఆలయాలకు వెళ్ళువారు కేవలం నటనకోసం వెళ్ళుచున్నారు; ఆలయాలకు వెళ్ళువారు వారి నీచత్వాన్నికప్పిపెట్టుటకు వెళ్ళుచున్నారు; ఆలయాలకు వెళ్ళువారు క్రైస్తవులుగా పిలచుకొనుటకు వెళ్ళుచున్నారు, మత్తుపానియాలు సేవిస్తు, పొగ త్రాగుతూ, జూదమాడుతూ మిగతా లోకం వలె జీవిస్తున్నారు. స్త్రీలు అవినీతికరమైన వస్త్రాలు ధరిస్తున్నారు. స్త్రీలు అసభ్యకరమైన వస్త్రాలు ధరిస్తున్నారు. ధరించకూడనటువంటి వస్త్రాలు ధరిస్తున్నారు. బట్టలు మార్చుకొను గదిలో ధరించెడి బట్టలు బహిరంగ స్థలాలలో, వీధులలో ప్రజల యెదుట ధరిస్తున్నారు. మరియు సహోదర ప్రేమయనునది యించుమించు దాటిపోవు వస్తువై పోయినది. ఒక్క నాణెమును మనం పోగొటుకోలేదు గానీ, వాటిలో ప్రతి యొక్క దానిని ప్రయోగాత్మకంగా పోగొట్టుకున్నాము.
36
జ్ఞాపకముంచుకొనుము! రాత్రియైపోయినది. ఆమె భర్త తిరిగివచ్చును. అందులో ఒక్క నాణెము ఊడిపోయినట్లుగా అతడు తెలిసికొన్నట్లయితే, ఆమె వేశ్యగా గుర్తించబడిన దానిగా అది చూపిస్తుంది.
ఆమె అపవిత్రత చెందినట్లయితే, లేక ఏదో విధముగా ఆమె అపవిత్రురాలైనట్లయితే, అది ప్రజలకంటబడినట్లయితే, వారు ఆమెను యాజకుని యొద్దకు తీసికొని వస్తారు. ఆమె ఆ విధంగా పట్టుబడెనని సాక్షిని తీసికొని వస్తారు. మరియు ఆమె వివాహితురాలని యాజకుడు చూస్తాడు. ఆమె తప్పు చేసినందులకై ఆమె యొక్క పలకల కట్టులోనుండి నాణెమును తీస్తాడు. ఆమె-ఆమె తన యొక్క సుగుణమును చెడగొట్టుకున్నట్లయితే, వారు దానిని బయటకు తీస్తారు. ఆమె సరసాలాడినట్లయితే, ఆమె భర్తయెడల ఆమె నమ్మకంగా లేదు అని అది చూపుతుంది. ఆ ఒక్కదానిని వారు బయటకు తీస్తారు. అదేమైయున్నప్పటికి దానిని వారు బయటకు తీస్తారు. ఆమె భర్త తిరిగి వచ్చినప్పుడు, ఆమె ముద్రవేయబడినదని అతడు తెలిసికుంటాడు. వెంటనే ఆమెకు అతడు విడాకులిస్తాడు. అటువంటి స్త్రీతో అతనికి ఇక ఏమి పనిలేదు. అలాంటి స్త్రీని అతడు యిష్టపడడు.
కాబట్టి ఆమె ఒకటి పోగొట్టుకున్నదని, ఆమెభర్త వచ్చు సమయమైనదని, అది ఆలస్యమైపోతుందని ఆమె గ్రహించునప్పటికి అది ప్రొద్దుక్రుంకి పోయినది.
37
సంఘము, మన యొక్క పవిత్రత, మన నిజాయితిని, మన భక్తిని దేవుని యొక్క వాక్యమును బట్టివారికి వారే పరీక్షించుకొనుట మంచిది. మనము వదరుబోతులము గాను, చాడీలుచెప్పువారుగాను, సిగరెట్టు త్రాగేవారముగాను, పరోక్షంగా నిందలు వేయువారము గాను, యొజెబెలు వలె రంగులు పూసుకొనే వారలముగాను, మిగతా లోకస్తులు దినచర్యలో ఏమిచేయుదురో అదే చేయువారముగాను తయారైపోయాము. ఒకరు ఒకరు ఎవరైనది చెప్పలేనట్లుగా ఈ దినమున క్రైస్తవ సంఘము ఆలాగు కలసిపోయినది. మనము జాబితాను చూచుకొనవలసిన సమయం యిదే. అది ఆలస్యమైపోయినది.
ఇప్పుడు, అందుకొరకై... క్రొవ్వొత్తిని ఆమె వెలిగించవలసిన సమయం ఎంతో ఆలస్యమైపోయినది. ఆమె యొద్ద క్రొవ్వొత్తియున్నది. ఆమె క్రొవ్వొత్తిని తీసికొనుట మాత్రమే కాదు గాని, ఆమె చీపురును కూడా కలిగియున్నది; ఇల్లు ఊడ్చుటకు వెళ్ళిపోయినది.
ఓ! సహోదరుడా! క్రొవ్వొత్తిని వెలిగించు సమయము యొక్క అవసరత ఏదైనయున్నట్లయితే, సువార్త వెలుగును పంపుట, తిరిగి పరిశుద్ధాత్మ సంఘములో యుండుట. ఎంతో ఎక్కువ ఉద్రేకమునకు కాదు. ఒకలాటి మూఢభక్తికి కాదు, ఒక ఉద్రేకపూరితమైన పనికై కాదు, ఆనందంతో గంతులు వేయుటకు కాదు. అయితే పురుషులు స్త్రీలు దేవునితో సరిచేసికొను హృదయ - పరిశోధనా అనుభవం కొరకు. ఔను! మనం అంత్యకాలంలో ఉన్నాము.
38
ఆమె తన వెలుగు నిచ్చుటకై ఒక క్రొవ్వొత్తిని వెలిగించినది. ఓ! సహోదరుడా, యిక్కడయున్న ప్రతి యొక్క చిన్న క్రొవ్వొత్తి ఈ రాత్రి వెలిగించబడవలసియున్నది. అది మాత్రమే కాడు, ఆమె యొద్ద చీపురు కూడా ఉన్నది. ఇరుగుపొరుగు వారు ధూళి దులుపుట చూచుచున్నారు. ఆమె యొక్క భర్త రాబోతున్నాడు కనుక యింటిని శుభ్రపరచు సమయమును ఆమె నిజంగా కల్గియుండెను. ఒక్క నాణెము పోగొట్టుకొనుటతో అతడామెను పట్టుకున్నట్లయితే, ఆమె “వేశ్య” యౌతుంది.
సహోదరుడా, యిప్పుడు మనం జీవిస్తున్నగంభీరమైన గడియలలో జీవముగల దేవుని సంఘమైన మనము, దేవుని యెదుటకు వెళ్ళి పరీక్ష చేసికొనుటకు అది మనలను తీసికొని వస్తుంది. సువార్త యొక్క వాక్యమగు క్రొవ్వొత్తిని వెలిగించి, మనలను మనం పరీక్షించుకొనునట్లుగా చేసి, మనం కురచయయ్యామో లేదో తెలుసుకొనునట్లు చేస్తుంది. ప్రత్యేకించి ఇవన్ని వచ్చుచున్నప్పుడు అది మనకు బాధ్యతను కల్గిస్తుంది. మనం కడవరికాలంలో యున్నాము. క్రీస్తుయొక్క రాకడ సమీపంగా ఉన్నది. సంఘమునకు యింకొక నిరీక్షణమరి లేదు.
39
మరియు, చూడూ! సంఘము ఏ విధముగా నిర్లక్షంగా కూర్చొని ఉన్నదో సంఘానికి యిక చైతన్యమే లేదు. వారిని నీవు కష్టం మీద మేల్కొలప వస్తుంది. ఆ స్థితిలోకి వారు వస్తారని బైబిల్ చెప్తుంది.“ఓ! మన ప్రభువు ఆయన రాకడను ఆలస్యము చేయును” అని వారు చెప్పుదురు. మరియు వారు ఒకరి నొకరు మ్రింగుచు, కరుచుకొంటూ, పోట్లాడుకుంటూ మొదలగునవి చేయుచు ఉందురు“.ఆ గడియే ఇది యౌతుంది. ప్రతీది సంసిద్ధమైనది. అది ఏలాగున్నదో ఆలాగుననే, పుటలు తిరగవేయబడినవి. ప్రభువు యొక్క రాకడ అది సంసిద్ధం.
40
లూధరన్ సంఘము దానియొక్క వెలుతురును పోగొట్టుకున్నది. మెతడిస్టు సంఘము దాని యొక్క వెలుతురును పోగొట్టుకున్నది. బాప్టిస్తు సంఘము దాని యొక్క వెలుతురు పోగొట్టుకున్నది. పెంతెకొస్తు సంఘము దాని యొక్క వెలుతురు పోగొట్టుకున్నది. ప్రతియొక్క దీపము ఆరిపోయినట్లుగా అగుపిస్తుంది.
పెంతెకొస్తవారు, హోలినెస్ వారు, మెతడిస్టువారు ఏలాగు ప్రవర్తిస్తున్నారో, ఖచ్చితంగా ఆలాగే ప్రవర్తిస్తున్నారు. మెతడిస్టువారు బాప్టిస్టు వారివలె ప్రవర్తిస్తున్నారు. బాప్టిస్తువారు లూధరన్ వారివలె ప్రవర్తిస్తున్నారు. లూధరన్ వారు కాథలిక్ వారివలె ప్రవర్తిస్తున్నారు. అదంతా కూడా, ఒక పెద్దపాపపు ఉండ లోనికి తిరిగి వెళ్ళిపోయినది. ఔనది నిజం! మనం కడవరి కాలంలో ఉన్నాము, ప్రభువు యొక్క రాకడ.
ఇప్పుడు ఇంటిని శుభ్రపరచుకొను సమయం ఆమెకున్నది. ఆమె నేల బండలను రుద్దినది; ఆమె గోడలను ఊడ్చినది; ఆమె సాలె గూడులన్నిటిని తొలగించివేసినది. ఆమె ఏది పోగొట్టుకున్నదో అది కనుగొనే వరకు రుద్దుతూనే యున్నది. ఆమె అది చేసి, యిప్పుడు రమ్మని తన యొక్క చిన్న సోదరీ బాంధవ్యముగల సంఘములను పిలచినది.
నీవు మెతడిస్టువైనా, బాప్టిస్టువైనా, పెంతెకొస్తువైనా, ప్రెస్బిటేరియన్వైనా నాకు చింతలేదు, రా! మనం కలసి ఆనందిద్దాము. ఆ సమయము వచ్చినప్పుడు, సంఘము సహోదర ప్రేమను తెలుసుకున్నప్పుడు; సంఘము దాని పరిశుద్ధమైన చక్కని ఔనత్యమును తెలుసుకున్నప్పుడు; సంఘము, దాని యొక్క స్థానము క్రీస్తులో ఎరిగినప్పుడు; అది- “రండి! మాతో కలసి సంతోషించుడి” అని శరీరములోని మిగతా సభ్యులను పిలచును. సంఘము దేవుని ప్రేమించాలని ఆయన కోరుకుంటాడు.
41
స్త్రీ యొక్క సుగుణాలను గూర్చినేను మాట్లాడినది ఆదివారం ఉదయంయని అనుకుంటాను. అదెంత ధన్యత, పురుషుడు అలసిపోయి యింటికి వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఒక భార్యకంటె మధురమైన వస్తువును ఎవరు కనుగొనగలరు. ఒక్క స్త్రీ, ఒక పురుషుడు ఎడబాటు చేయబడనివారు. వారు ఒక్కటే. సృష్టిలో, మొదటిగా వారిరువురును ఒక్కటిగా చేశాడు. మరియు వారు ఒక్క హృదయంగా, ఆత్మగా, ఒక్క మనస్సుగా మరియు ప్రతి యొక్క దానిలో ఒక్కటిగా యుండిరి. మట్టిలో నుండి మనుష్యుని ఆయన చేసినప్పుడు అతని భార్యనుండి అతనిని దేవుడు వేరుచేసెను. ఆయన అవ్వను చేసినప్పుడు, ఆయన ఒక - ఒక స్త్రీని చేయలేదు. మరికొంచెం మట్టి తీసుకొని ఒక - ఒక స్త్రీని చేయలేదు. అయితే ఆదాము ప్రక్కలో నుండి ఒక ప్రక్కటెముకను తీసుకొని అతనికు భార్యను చేశాడు. అతడు “నా ఎముకలో ఎముక నా మాంసములోమాంసము” యని అన్నాడు. హృదయము, ప్రాణము, శరీరములోవారు ఒక్కటే.
అది క్రీస్తు యొక్క పోలికయైయున్నది. దేవుడు ఒక మూఢ భక్తిలో నుండి క్రీస్తు యొక్క సంఘమును ఆయన తీసికోలెదు. లేదా ఒక సంఘ శాఖ నుండి దానిని ఆయన తీసికోలేదు. ఆయన ప్రక్కలోని ఈటెద్వారా వచ్చిని రక్తము ద్వారా, క్రీస్తు యొక్క గుండెలోనుండి ఆయన దానిని తీసెను.
42
నా సహోదరుడా! సహోదరీ, నీవెంత భక్తిగా యున్నది నాకు లెక్కలేదు. రక్తము వలన నీవు కప్పివేయబడినట్లయితే, నీవు నశించిపోతావు. అదెంతటి ప్రాణాధారమైనదో చూయించుటకు రేపు గాక తరువాత రాత్రికి అందులోనికి మనం వెళ్ళనైయున్నాము. అయితే రక్తం లేకుంటె నీవు నశించిపోతావు.
తరువాత, ఆయన, ఆ భార్యను చేసినప్పుడు ఆమె సహచరిణియై యుండెను. ప్రేమించుటకు అతనికి అది ఒకటై యుండెను. అతని యొక్క భాగము అది.
ఇప్పుడు, ఆలకించుము. ఒక పురుషుడు గాని లేక ఒక స్త్రీ గాని, వారు తిరిగి జన్మించకుండ పరలోకమునకు వెళ్ళరు. నీవు భాషలతో మాట్లాడితివియని కాదు నా యొక్క అర్ధం. నీవు కేకలు పెట్టితివియని కాదు నా అర్థం. నీవు నాట్యమాడితివి యని కాదు నా యొక్క భావం. నీవు ఆలయానికి వెళ్లితివి, క్రమముగా వెళ్ళుచుంటివి, నీ నమ్మకం కొరకై గుండీలు పెట్టుకొంటివియని కాదు నా యొక్క భావం. అవి మంచివే, కానీ అది అది కాదు. నీవు ఒక్కటగు వరకు, నీకును, క్రీస్తుకును ఐక్యత బంధం తప్పనిసరిగా యుండవలసియున్నది. మీరు ఒక్కటే. ఆలాగు నీవు కానట్లయితే, ఏలాగు....
43
ఆలసిపోయి, నీరసపడిపోయి, విసిగిపోయి రాత్రిపూట తిరిగి వచ్చుచున్న దృశ్యాన్ని నీవు ఊహిస్తావా. నీవు యొక వ్యవసాయదారుడవైనట్లయితే, ఒక యంత్రకారుడవో, బోధకుడవో, ఎవరివైనప్పటికి, లోపలకు వచ్చునప్పుడు నీ చిన్నగృహము లోపలకి నీవు వెళ్ళునవుడు, అక్కడకు చేరునప్పుడు నీవు తృష్ణతో యుంటావు. నీవు తలుపు తెరుస్తావు. నీ ప్రియమైన చిన్నారి భార్య అక్కడ నిలబడియుంటుంది. ఆమె ఆదరణతో నిన్ను ఆహ్వానిస్తుంది. ఆమె అంతా అందంగాను పరిశుభ్రంగాయున్నది. ఆమె నడుస్తు వచ్చి బుగ్గ మీద నీకు ముద్దు పెడుతుంది, నానా, నీవు అలసిపోయావు అని ఆమె చెప్తుంది. నిన్నుఆమె కుర్చీలో కూర్చుండబెడుతుంది. ఆమె తానే నీ ఒడిలో కూర్చుంటుంది. ఆమె చేతులు నీ చుట్టుచుట్టి నిన్ను లాలనగా తడుతుంది. అప్పుడది, నీవు అలసిపోయినట్లుగా అగుపించదు. ఒకటి నిన్ను పైకెత్తును. ఆ ఉద్దేశ్యము కొరకు దేవుడు ఒకటి నీకు యిచ్చినదియది. ఆమె నిజమైన భార్యయైతే, ఆది నీ యొక్క భాగము.
44
అయితే ఆ యొక్క పెదవులే ఆదే దినాన, లేక మరొక దినాన మరొక పురుషుని ముద్దు పెట్టుకున్నట్లయితే, అదేమౌతుంది? అది నీవు ఎరిగినట్లయితే ఏమౌతుంది? ఆ యొక్క హస్తాలు మరొక పురుషుని కౌగిలించుకున్నట్లయితే, ఏమౌతుంది? నీ యొక్క ఒడిలోకి వచ్చుటకు ఆమె ఖచ్చితంగా హేయురాలౌతుంది. ఆ యొక్క ముద్దు, యూదా యొక్క ముద్దు వలె కాల్చుతుంది. ఆ యొక్క హస్తాలు, నీ చుట్టు అవి యుండుట సమంజసము కాదు. ఓ! ఆమె అందంగా ఉండవచ్చు. ఆమె కురులు ఉంగరాల జట్టు కావచ్చు, ఆమె యొక్క కళ్లు గోధుమ వర్ణముగా యుండవచ్చు. ఆమె బుగ్గలు అందంగా గులాబి రంగులో యుండవచ్చు.ఆమె చిన్న పొట్టి చొక్కా యిస్త్రీ చేసియుండవచ్చు. ఆమె అందంగా యుండవచ్చు. అయితే, అసలైన, నిజమైన దైవికమైన భక్తి, ప్రేమ, నమ్మకము అక్కడ లేనట్లయితే, నీ యొక్క ఒడిలో నుండి దూరముగా వెళ్లిపోవుట మంచిది. ఆమెతో నీ కెటువంటి పనిలేదు. ఆమె అమె నీకు ఒక వినాశకరమైనది యౌతుంది. ఆమె తనకు తాను ఎంత అందంగా తయారైన నాకు చింత లేదు. ఆమె, ఒక అసలైన నిజమైన ప్రియురాలుగాను, నిన్ను తప్ప వేరొకరిని ప్రేమించనిదానిగాను, నీ పెదవులకు తప్ప మరొకరి పెదవులకు ముద్దు పెట్టని దానిగాను, నీ హస్తాలు తప్ప మరొకహస్తాలు ఆమెను పట్టుకొనని దానిగాను, నిన్నే ఎరిగినదానిగాను ఆమె ఋజువు చేయబడువరకు ఆమె యింకా తప్పిదస్తురాలే. ఎటువంటి భావన! ఎంతటి ఆదరణ అది!
45
అదీ, భార్య భర్త అంటె క్రీస్తుకు ఆయన సంఘానికి అది పోలిక. నీవు ఆలయానికి వెళ్ళునప్పుడు, నగరంలో నిశ్రేష్టమైన ఆసనాలుగల దానిగా అది నీకు యుండవచ్చు. నగరంలో ఎత్తైన స్థలమునున్న ఆలయ శిఖరం నీకు యుండవచ్చు, నీకు మంచి పైప్ ఆర్గాన్ యుండవచ్చు; మంచి వస్త్రాలు నీవు ధరించి యుండవచ్చు; ఇతర పక్షుల కూతలను అనుసరించి పాడె అమెరికా పక్షివలె నీవు పాడవచ్చు. కానీ, వాటన్నిటిలో కూడా, లోకంతో నీవు ముద్దు లాడుతే, సరసాలాడుతూ యుండినట్లయితే, క్రీస్తు బుగ్గలమీద ముద్దాడిన ఆ ముద్దు -యూదా సంబంధమైన ముద్దు. నీతో ఆయనకేమి పనిలేదు. నీ యొక్క ప్రధానపు పెళ్ళి ఉంగరం వైపు ఆయన చూస్తాడు. పలకల కట్టు తొలగించబడుట ఆయన చూస్తాడు. ప్రేమ తొలగిపోవుట ఆయన కనుగొంటాడు. అది పైకి కన్పించునది; నమ్మకత్వం వెడలిపోవుట ఆయన కనుగొంటాడు. లోకంతో నీవు వ్యభిచారము చేశావు. నీవు నాట్యాలకు వెళ్ళుచున్నావు; ఊగి జోగి కార్యక్రమాలకు హాజరౌతున్నావు. మురికి టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్నావు. క్రీస్తును నీ భర్తగా పిలచుకుంటూ, ఆయనతో, ఆయన మీద వ్యభిచారము చేస్తున్నావు. “నేను ధనవంతుడను, నాకు కొదవలేదు అని నీవనుకొనుచున్నావని” బైబిల్ చెప్తుంది. అయితే “నీవు దిగంబరివని, దిక్కుమాలినవాడవని, గ్రుడ్డివాడవని, దరిద్రుడవని, అది ఎరుగనివాడవని” ఆయన చెప్పుచున్నాడు. దీపము వెలిగించి, యింటిని ఊడ్చు సమయం యిదే ప్రభువు రాకడ సమీపంగా యున్నది.
46
మనం తలలువంచుచుండగా కొద్ది నిముషాలు దానిని మనము ఆలోచన చేద్దాం. మీరు చేస్తారా? పియోనును త్రిప్పుతారా, సహోదరి?
సంఘమా ! నీవేమి చేస్తున్నావు? ఈ రాత్రిలో నీ యొక్క స్థితిగతులేంటి? నీవు భయభక్తులతో యుండి, నీ చేతులు నీవు పైకెత్తినప్పుడు ఒకటి నిన్ను పరీక్షించియుండెనా? నీవు లోకములో అటుయిటు కొట్టుకుంటూ యిండినట్లయితే, తప్పుడు కార్యాలును నీవు చేస్తూయున్నట్లయితే, నీ యొక్క ముద్దులు....
మానవుడా! అది ఆలోచించు. అయ్యగారూ, నేనొకటి నిన్నడగబోతున్నాను. ఇది కుమారికి మరియు శ్రీమతికి కూడా చెందుతుంది. యౌవన స్త్రీ! నీ యొక్క అబ్బాయి స్నేహితుడు బయట యితర అమ్మాయిలతో ముద్దులాడుతూ యండియుండుట నీవు చూచి అది నీవు ఎరిగినట్లయితే, అతనిని గూర్చి నీవేమని తలస్తావ్? నీవతనికి ప్రధానము చేయబడ్డావ్ అతడు నీ యొద్దకువచ్చి “ప్రియా! నిన్ను మాత్రమే నేను ప్రేమించాను” అని నీ చేయితడుతూ నీతో చెప్పినట్లయితే?
“అధముడైన వేషదారీ ! నాకు కనబడవద్దు” అని నీవు చెప్తావ్.
47
ఏమౌతుంది. అయ్యగారూ, అది ఆలోచించు! మనం ప్రధానం చేయబడుట మాత్రమే కాదు, గానీ, మనము వివాహము చేయబడినవారము. సంఘము క్రీస్తుతో పెండ్లిచేసుకున్నది. బిడ్డలు కనుటకై, మనము క్రీస్తు యొక్క భార్యయై యున్నాము. నీ భార్యయెడల నీ గౌరవము కొరకై, రాత్రివేళ నీ యింటికి నీవు ఎలాగు రావాలనుకుంటున్నావు? ఆమెకు చాలామంది చిన్న బిడ్డలున్నారు. ఆ దినాన నీవు చూస్తావు. ఆమె లోపలకు వచ్చినప్పుడు, ఓ! ఆమె వ్రేళ్ళకు రంగులు పూసుకున్నదేమో (అనగా, నీవు లోకానికి సంబంధించి యుండినట్లయితే), ఒకవేళ నీవు. ఆమె ఎన్నడు లేనంతగా అందంగా కన్పించవచ్చునేమో, అయితే చూడూ! సహోదరుడా! అది ఆలోచన చేయ్! ఆ యొక్క స్త్రీ మరొక పురుషుని ముద్దు పెట్టుకున్నట్లయితే, ఆమె, నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పుచూ, నీ నడుము చుట్టూ పెట్టిన ఆ హస్తాలు, అవి...తెలుసా, అవి పరాయివారిని కూడా ప్రేమించినవి. ఆమె ప్రేమ నిజమైనది కాదు. ఆమె ప్రేమ నిజమైనది కాదు. అది నీకు సంబంధించినది కాదు. అది యితరులకు కూడా సంబంధించినది. నీ చుట్టుపట్ల ఎవరైనా యున్నట్లయితే, నీ కౌగిటలో నుండి నీవు ఆమెను నెట్టివేస్తావు, అటువంటి భావన ఏలాగుంటుందో ఆలోచించు! అమ్మా! అది అలోచించాలి. నీ భర్త నీ యింటికి వచ్చినట్లయితే అది మాత్రమే కాదు. నీచకరమైన క్రియల వలన కలుగు వ్యాధులను మూటగట్టుకొనుట.
48
మరియు ఓ! నీ హృదయం దీవించబడును గాక! ఆత్మ సంబంధితమైన సుఖవ్యాధులసంబంధమైన వాటిని సంఘము భుజించుచున్నది. అన్ని విధాలైన మూఢ విశ్వాసాలను, తదితరమైనవాటిని సంఘము భుజిస్తున్నది. అది తప్పు! దేవా! కనికరము చూపుము. స్నేహితులారా! యేసు వచ్చుచున్నాడు. ఈ యొకానొక రాత్రులలో లేక ఈ ఏదో యొక దినాలలో మీకు సమయం లేకపోవచ్చును. అప్పుడే మీరు పరీక్షించుకొనుట మంచిది.
ప్రార్ధించుకుందాము:
మీరు తలలువంచి మీ చేతులు పైకెత్తి “సహోదరుడా, బ్రెన్హాం”“మీ ప్రార్ధనలో నన్ను జ్ఞాపకం చేసుకొనుడి, సహోదరుడా, బ్రెన్హాం! అని మీలో ఎంతమంది చెప్పగలరు ? నేనీరాత్రి వచ్చాను. విషయాలు మాట్లాడుటకు నేనిచ్చటకు రాలేదు”. అని చెప్తారా? దేవుడు మిమ్మలను దీవించును గాక, చేతులవైపు చూడండి. “నేను కనపరచుకొనుటకు యిక్కడకు రాలేదు. ఒకటి నేను తెలుసుకొనుటకై యిక్కడకు వచ్చితిని. నీవు బోధించుచుండగా, దేవుడు నీతో మాట్లాడెనని నేను నమ్ముతున్నాను. మరియు నేను తప్పు, అని నేను గ్రహించియుంటిని. నేను - నేను నిజమైన యదార్ధమైన క్రైస్తవునిగా యుండాలని నేను ఆశిస్తున్నాను. నేను నా ప్రభువు నొద్దకు వెళ్ళి, నా మోకాళ్ళ పై మోకరించినప్పుడు ఆయన కౌగిటిలో, నన్నుఆయన హత్తుకొనే వానిగా యుండి నేను నిజమైన ప్రేమికునిగా యుండాలని ఆశించుచున్నాను. 'ఓ, నా ప్రియురాలు' అని ఆయన చెప్పాలని నేను ఆశిస్తున్నాను.”
49
దానినిగూర్చి సొలోమోను ఏ విధంగా అది పలికియుండెనో మీకు జ్ఞాపకముందా ? అతడన్నాడు. “నా ప్రియురాలా, రమ్ము. మనము దాడిమ వనములోనికి వేంచేయుదము; సభా సకలపరిమళ ద్రవ్యముల ఉద్యానవనములో నడిచెదము.” అని అతడనుచున్నాడు. ఆమె యొక్క పెదవులు గులాబి మొగ్గలవలె యున్నవి. అని అతడు పలుకుచున్నాడు. “మనము వెళ్ళి తనివితీర వలపుతీర్చుకొందము” అని ఎంతగా తన చిన్నారి భార్యను ప్రేమించుచు అతడు చెప్పుచున్నాడు.
నీ యొక్క వేదిక ముందుకు, ప్రార్ధించుటకు నీవు వచ్చునప్పుడు,“ప్రభువైన దేవా! మా ప్రేమను స్వీకరించు; అని నీవు చెప్పునప్పుడు, నీ యొక్క హృదయం ఎంతో నమ్మకముగాను, నీ ఆత్మ ఎంతో నిష్కలంకముగాను యున్నదా? ”ఔను! నా ప్రాణేశ్వరుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను“ అని చెప్తావా ? లేదా, నీవు జారత్వము జరిగించుచున్నావా? లోకంతో నీవు సరసాలాడుతున్నావా?
50
ఈ యొక్క అద్భుతాలు సూచకక్రియలు జరుగుతూ, వాటితోపాటు మిగతా వేల పదివేలక్రియలు సంభవించి, ప్రతి యొక్క గురుతు గురిని చూపుచుండగా ప్రభువు యొక్క సమయం సమీపంగా యున్నది. అది చీకటిపడిపోయినది. సంఘములో చల్లని స్థితియుండియున్నది. ఉజ్జీవము అయిపోయినట్లుగా అగుపించుచున్నది. ఆఖరి కొంచెము సమాప్తము కానైయున్నది. మరియు యిక్కడ, మనము వ్యభిచారములో యున్నట్లుగా కనుగొనుచున్నాము. ఆయన ఏమి చేయును? ఆయన ఒడిలో నుండి మనలనుగెంటివేసి “అక్రమము చేయువారలారా! నా యొద్ద నుండి తొలగిపొండి” అని చెప్పును.
తిరిగి, యిక్కడ ఎవరైనా జ్ఞాపకం చేసికోవాలని ఆశించినట్లయితే, ఈ నిముషములో- దేవుని వైపు మీ చేతులెత్తి “ఇప్పుడు నేను సమర్పణ చేసికుంటున్నాను. దేవుని కృపను బట్టి ఈ రాత్రి నుండి దేవుని సహాయమువలన నిజ జీవితాన్ని నేను జీవిస్తాను” అని మీరు చెప్పాలని నేనడుగుచున్నాను. దేవుడు మిమ్ము దీవించును. దేవుడు మిమ్మను దీవించును. నీవు సహోదరుడా, నీవు సహోదరి, నీవు యౌవనస్త్రీ ! నీవండి. నీవు సహోదరుడా, అక్కడున్న నీవు, యిక్కడేయున్న నీవు, మరియు నీవే యౌవనస్తుడా!
51
రక్షించబడని ఎవరైనా యిక్కడ యుండియు “సహోదరుడా ! బ్రెన్హాం, నన్ను జ్ఞాపకముంచుకో, నేనింకా తిరిగి జన్మించలేదు. అది కాలేదని నాకు తెలుసు”అని చెప్పగలరా? వినుడి! మీరు తిరిగి జన్మించువరకు మీరు రక్షింపబడలేదు. కేవలం మీరు, ఒక దానివైపు మీరు ముఖములు త్రిప్పుకున్నారు. అయితే, మీరు క్రీస్తును అంగీకరించినట్లయితే, మీరు తిరిగి జన్మించారు. “సహోదరుడా బ్రెన్హాం! అది నేనెన్నడు అంగీకరించలేదు. నేను తప్పు చేశానని నాకు తెలుసు. నీవు నన్ను కూడా జ్ఞాపకముంచుకోమని ఇప్పుడు నేను చేతులు పైకెత్తి చెప్తున్నాను. అని మీరు చెప్తారా? నేనెన్నడు రక్షించబడలేదు. నేనెన్నడు - నేనెన్నడు క్రీస్తును సేవించుటకు కూడా ప్రయత్నించలేదు. అయితే దానిని నేను ప్రయత్నించుటకు ఆశిస్తున్నాను. ”సహోదరుడా బ్రెన్హాం! నాకై ప్రార్ధించుడి“ అని చెప్పండి. ఇప్పుడు యిక్కడున్న ఒకరు మీ చేయి పైకెత్తుతారా? ఎన్నడు కూడా క్రైస్తవుడు కాని ఎవరైనా ఒకరున్నట్లయితే, నీ చేయి నీవు పైకెత్తి ”సహోదరుడా, ప్రార్థనలో నన్ను జ్ఞాపకముంచుకో“ అని చెప్పగలవా? కుమారుడా, దేవుడు నిన్ను దీవించును. ”సహోదరుడా, నన్ను జ్ఞాపకముంచుకో, అని మరొకరు చెప్పగలరా ? అమ్మా దేవుడు నిన్ను దీవించును. “సహోదరుడా, నన్ను జ్ఞాపకముంచుకో. నేను ప్రభువైన యేసును యిప్పుడే నమ్మి ఆయనను నా రక్షకునిగా అంగీకరించగోరుచున్నాను” అని మరొకరు చెప్తారా? సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. అది మంచిది.
52
“సహోదరుడా బ్రెన్హాం! నీ చేయి పైకెత్తు అని నీవెందుకు చెప్పాన్” అని నిన్ను ఒకరు విమర్శ చేశారు. విను! నేను చేస్తున్నట్లుగా ఎవరు కూడా బలిపీఠపు పిలుపును నమ్మరు. బలిపీఠము దగ్గరకు పిలచుటయనునది అది మంచిదని నేను నమ్ముతాను. అయితే, అది నిన్ను రక్షించదు. అది నీ యొక్క అభిప్రాయం. క్రీస్తు యెడల నీ యొక్క తీర్మానము. “సరె, నేను బలిపీఠము నొద్దకు నేను వచ్చినట్లయితే అని నీవంటావు. అది మంచిదే ప్రియులారా” అయితే, నీవు నీ చేయెత్తినప్పుడు, అక్కడున్న శాస్త్రసంబంధమైన ప్రతి నియమాన్ని నీవు పగులగొట్టావని నీకు తెలుసా? ప్రకృతి ప్రకారంగా భూమ్యాకర్శన శక్తి ప్రకారంగా, నీ చేయి క్రిందకే వ్రేలాడవలసియున్నది. నీ చేయి, నీవు పైకెత్తినట్లయితే, నీ సృష్టికర్త వైపునకు నీ చేయి నీవు ఎత్తుటను అక్కడ నీలోనున్న ఒక అతీతమైన ఉనికి, ప్రకృతి నియమమును ప్రతిఘటించుటకు నీకు శక్తియిచ్చియున్నదని చూపించుచున్నది. ఒకటి నీ హృదయంలో తీర్మానం చేసినది. దేవుడు నిన్నుబలిపీఠము యొద్ద ఏలాగు చూచుచున్నాడో ఆయన నీ చేయిని నీవు పైకి ఎత్తుట చూచుచున్నాడు. అది ఖచ్చితంగా నిజం! అది నీవు గ్రహించితివా? దేవుడు కూడా, అది గ్రహించాడు. అయితే, స్నేహితుడా! చూడు!నీవు మధ్యస్తంగా నీవుండలేదు. నీవు అర్థమెరిగినవానిగా యుండవలసియున్నది.
53
ఇప్పుడు ప్రార్ధించుకుందాం.
శుభప్రదుడవైన పరలోకపుతండ్రీ! ఈ ఉజ్జీవ కూటము యొక్క-ప్రారంభ రాత్రితో, మా యొక్క సమయం త్వరిత గతిని గతించుచుండగా మరియు కొంచెం త్వరగా అయిపోతుండగా, ఈ ప్రజల యెడల కనికరం చూపమని నిన్ను ప్రార్ధిస్తున్నాను. సర్వశక్తిమంతుడవైన దేవా! అనుగ్రహం చూపండి. ఇక్కడ, భవనంలోనున్న వారికి నేటిరాత్రి క్రీస్తు కావాలని, షుమారు ఇరువై హస్తాలు పైకెత్తియున్నారు. ఓ దేవా! అవి, వారి ఆత్మలు. ఆత్మయగు నూనె అయిపోనైయున్నది. అక్కడ యిక ఎక్కువలేదు. బొక్కెనలో నుండి లేక పాత్రలోనుండి ఆఖరి బొట్టు అయిపోగానే, దివిటీలలో నూనె పోయుటకు యిక ఏమి ఉండదు. కడవరి దినమున వారున్నారని వారు గ్రహించారు. క్రీస్తుకు బయటయున్న మాకు యింక భూమిపైన నిరీక్షణయుండదు. ప్రభువా! ఈ క్షణం యొక్క పవిత్రతలో, గంభీరతలో వారిహస్తాలను పైకెత్తునట్లు చేసిన పరిశుద్ధాత్మను నీవు పంపుము. మరియు పాపపు జీవితం నుండి వారిని రక్షించుము. తండ్రి, అనుగ్రహము చూపుము.
54
ఈ యొక్క కూటము ముగించకముందు వారిలో అక్షరార్థకంగా డజన్లమంది అనేకులు పరిశాద్ధాత్మతో కేకలు వేయుదురు గాక! ఈ యొక్క బాప్తిస్మపు తొట్టి, జీవము యొక్క నూతనత్వము కొరకై ఈస్టరు ఉదయాన తిరిగి లేచుటకై ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామములోబాప్తిస్మము పొందు తదుపరి వారికి, అదే అది యగును గాక. ఓ!నిత్యుడగు శుభప్రదుడవగు తండ్రి, నీవు వారిని ఆశీర్వదించమని నేను ప్రార్ధిస్తున్నాను. ప్రభువా! అనుగ్రహము చూపుము. ఇప్పుడే, సాక్షాత్తు యిదే క్షణమందు వారియొక్క తీర్మానం నిజమైనదై, ఎక్కడైతే వారు కూర్చొనియున్నారో అక్కడే, వారు నిన్నుఅంగీకరించెదరు గాక! మా యొక్క బలిపీఠము చుట్టు ప్రక్కల ప్రజలతో నిండియున్నది. ఈప్రజలు, ఈ రాత్రిలో నీ దాసులగునట్లు నీవు అనుమతి అనుగ్రహించమని ప్రార్ధిస్తున్నాము. క్రీస్తు నామములో.
55
మనము తలలు వంచియుండగానే, ఒక గంభీరమైన ప్రశ్న మిమ్ములను నేను అడగాలనుకుంటున్నాను. ఎవరైతే మీ చేయి పైకెత్తియున్నారో మీరు; మరియు ఎవరైతే ప్రార్ధిస్తున్నారో మీరు; అట్టి మిమ్మలను అడుగుచున్నాను. ఒకటి మీకు చెప్పియుండెను. కాబట్టి మీరది పైకెత్తితిరి, మరియు“సహోదరుడా బ్రెన్హాం, దేవుని యెదుటను, ఈ సభయెదుటను, నేను నమ్ముతున్నాను. ఈ రాత్రినుండి నేను నూతన మైన వ్యక్తి కాబోతున్నానని నా హృదయంలో ఒకటి జరిగినదని నేను నమ్ముతున్నాను” అని చెప్పండి. ఎవరైతే చేయెత్తి “నేను నమ్ముతున్నాను” అని చెప్పినవారు, మీ చేయి పైకెత్తుతారా? అమ్మా దేవుడు నిన్నుదీవించును. దేవుడు నిన్ను దీవించును. నీవు ! నీవు ! నీవు ! అదెంతో ఆశ్చర్యం. వెనుక, అక్కడ వెనుక, ఔను ! ప్రభువు నిన్ను దీవించును.
56
మరొకరు కూడా, మీ చేయి పైకెత్తియున్నాడు, “ఇప్పుడే నేను నమ్ముతున్నాను” అని చెప్పు, సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక “ప్రభువు ఈ రాత్రి నాతో చెప్పియున్నాడు.” అక్కడ వెనుకనున్నవారు, అమ్మా! దేవుడు నిన్ను దీవించును గాక, ఇక్కడేయున్న యౌవన స్త్రీ! దేవుడు నిన్ను దీవించును. “నాయొక్క హృదయంలో యిప్పుడే ఒకటి జరిగినదని ప్రభువు నాకు చెప్పుచున్నాడు. నా యొక్క జీవితంలో ఏనాడు లేనటువంటి అమితమైన ఆనందమును నేను పొందుకోబోతున్నానని నేను నమ్ముతున్నాను”. దేవుడు మిమ్మలను దీవించును. సరే మంచిది. యిక్కడే కూర్చున్న స్త్రీ ప్రభువు నిన్ను దీవించునుగాక. “సహోదరుడా బ్రెన్హాం ! నేను ఒక విధంగా భావన కల్గియున్నాను. త్వరగా రాబోతున్న క్రీస్తును గూర్చిన ఎరుక గల్గినవాడనై ఈ రాత్రి ఈ ఆలయంలో నుండి బయటకు వెళతానని నేను నమ్ముతున్నాను” అని చెప్పువారు మరొకరున్నారా? ఒక ప్రత్యేక జీవితం జీవించుటకు యిక్కడ నుండి నేను బయటకు వెళ్ళుచున్నాను. దేవుని యొక్క కృపనుబట్టి నేను క్రైస్తవుడను కానైయున్నాను. దేవుడు, నన్ను పిలచాడని నేను నమ్ముతున్నాను“ అని చెప్పువారున్నారా?
ఆయన నిన్ను పిలచినట్లయితే, నీవు ఆయన వాడవు. సరసాలాడుట విడిచిపెట్టు. లోకంతో సరసాలాడుట విడిచిపెట్టు. ముందుకురా ! ఇప్పుడు ఆయన కొరకు జీవించు. “నా యొక్క పాపమంతటి కొరకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఇప్పుడు, క్రీస్తును నా రక్షకునిగా స్వీకరిస్తున్నాను” అని చెప్పుము. ముగించక ముందు మరొకరు అక్కడ యున్నారా? అక్కడెవరైనా ఉన్నారా? సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక ! అదెంతో మంచిది. మీరది చేయుట చూస్తుండగా ఎంతో సంతోషము. సరె.
57
ఇది రాత్రి ప్రారంభం కాబట్టి, యిది కొంచెమే. దానికి మేము మరింత వత్తిడి పెట్టుటకు ఆశించుటలేదు. రేపు రాత్రి మీరు వచ్చుటకై మిమ్ములను పెందలకడ వదలి పెడతాము.
ముగించుటకు కొంచెము ముందుగా, అక్కడ ఒక వ్యాధితోనున్న ఒక వ్యక్తి చేయెత్తి, “సహోదరుడా బ్రెన్హాం, నా కొరకు ప్రార్ధించు” అని చెప్పగలరా ?సరె. అది, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది హస్తాలు, పదకొండు, పండ్రెండు, మంచిది. ఇప్పుడు పదమూడు, పదనాలుగు, మంచిది. పదిహేను.
ఇప్పుడు మనము తలలు వంచుకుందాము:
58
శుభప్రదుడవైన పరలోకపు తండ్రి, నీవు, ఆ హస్తాలను చూశావు. ఓ! ఒక ఉద్దేశ్యమునకై అవి యిక్కడున్నవి. బహుశా, వారు క్రైస్తవులు కావచ్చు. అయితే నీ యొక్క మహోన్నతమైన సహాయము వారికి కావలసియున్నది.“మా అతిక్రమములన్ని ఎవరైతే క్షమించగలరో, మా సంకటములన్నిటిని ఎవరు కుదర్చగలరో” యని దావీదు ద్వారా నీవు పలికియుంటివి. ప్రభువా, దానిని మేము గ్రహిస్తున్నాము. క్రీస్తు యొక్క రక్తము, విలువగలదిగా వారిపైకి వచ్చి, రాబోతున్న కూటములలో ఆనందించుటకై వారు స్వస్థత పొందుకొందురు గాక! ప్రభువా, అనుగ్రహము చూపుము. క్రీస్తు నామములో, మేమది అడుగుచున్నాము. ఆమేన్.
59
ఇప్పుడు మనము నిలబడదాం, “యేసునామము నీతో తీసికొని పొమ్ము”
ఓ ! యేసు నామము నీతో నుండును, బిడ్డా. (మనము ప్రక్కకు తిరిగి నీ ప్రక్కనున్న
వారిని కరస్పర్శచేయ్. ప్రక్కకు తిరుగు కరస్పర్శచేయ్).
అది నీకు ఆనందమిచ్చి ఆదరణ యిచ్చును,
నీవెక్కడకు వెళ్ళినా, అదినీతోనే తీసికొనుము.
ప్రశస్త నామము (ప్రశస్త నామము), ఎంత మధురమో!
భువిలోని నిరీక్షణ, పరమందలి ఆనందము;
ప్రశస్త నామము (ప్రశస్తనామము), ఎంత మధురమో!
భువిలో నిరీక్షణ; పరమందలి ఆనందము:
ప్రశస్త నామము (ప్రశస్తనామము),
ఎంత మధురమో ! భువిలో నిరీక్షణ; పరమందలి ఆనందం.
ఇప్పుడు నెమ్మదిగా, యీ వైపు దృష్టియుంచి, మెల్లగా పాడుదాము:
యేసు నామమున తలలు వంచి
ఆయన పాదముల యొద్ద సాగిలపడదాం
పరలోకమందలి రారాజు, ఆయనను కిరీటదారునిగా చేయదము,
ఓ ! మనయాత్ర ముగియునప్పుడు,
ప్రశస్తమై నామము (అది శుభప్రదమైనది)
అదెంత మధురమో! భువిలోని నిరీక్షణ;
పరమందలి ఆనందం; ప్రశస్తనామము (ప్రశస్త నామము),
ఓ! అదెంత మధురమో ! భువిలోని నిరీక్షణ; పరమందలి ఆనందం;
60
ఇపుడిది తొమ్మిది తరువాత కొంచెం దాటినది. తొమ్మిది తరువాత షుమారు ఏడు లేక ఎనిమిది నిముషాలు. మీరు పెందలకడ యింటికి చేరుకొని రేపు రాత్రికి తిరిగి రాగలరు. దేవునియొక్క దీవెనలకై మరియు మీరు వచ్చుటనుబట్టి మేము ఆనందిస్తాము. మరియు, ఈ రాత్రిలో పండ్రెండు, పదనాలుగు హస్తాలు స్వస్థతకొరకై పైకెత్తుట నేనిప్పుడు గమనించాను. చాలామంది వ్యాధిగ్రస్తులు యుండుట కొనసాగితే, ఒక్కరాత్రి స్వస్తత కూటముకొరకై పిలుపు యిస్తాము. ఒకవేళ శనివారం రాత్రి మరియు ఆదివారం కూడా. ఆదివారం వారందరిని తీసికొనుటకు వీలులేనట్లయితే, శనివారం రాత్రి తీసుకుందాం. ఎలాగుంటుందో చూద్దాం.
ఇప్పుడు, నేను -దేవుని యొక్క ఆశీర్వాదములు మీలో ఒక్కొక్కరిపైన సమృద్ధిగా దిగిరావాలని, ఆయన మీతో యుండి, తిరిగి రేపు రాత్రి మనము కలసికొనువరకు మిమ్ములను ఆశీర్వదించాలని నేను ప్రార్ధిస్తున్నాను.
ఇక్కడకు పైకి వచ్చి ప్రార్థనా మాటతో వీడ్కొలు యివ్వాలని సంఘకాపరిని నేనడుగుచుండగా కొద్ది ప్రార్థనా సమయ సందర్భంలో మనం తలలు వంచుకుందాం.