పరిపూర్ణత
VGR COUNT -117 ఇక్కడ మీతో కలసి ఆరాధించుటకు మరియు ఇప్పుడు వర్తమానమునకు ముందుగా, ఈ రాత్రి సమయంలో, వేదిక మీద నా యొక్క మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయన డాక్టర్ లీ-వైల్. ఈయన ఓహాయోలోని లీమా అనే ప్రాంతంలోని మొదటి బాప్టిస్టు సంఘమునకు చెందినవాడు, లీమా ప్రాంతంలోని కూటమునకు ఈయన నాకు ఒక స్పాన్సర్. నేను ఈ రాత్రి సమయంలో ఈ సంఘమునకు లీమా కూటమునకు సంబంధించిన విషయములు కొన్ని నిమిషములు మాట్లాడుటకు రమ్మని నేను ఆయనను అడిగాను. పరిశుద్ధాత్మను కలిగియున్న, మరియొక బాప్టిస్టు అయిన డాక్టర్ లీ-వైల్ ను ఈ రాత్రి సమయంలో మీకు పరిచయం చేయుటకు నేను ఆనందించుచున్నాను.
[సహోదరుడు లీ-వైల్ అనేక ప్రజలు స్వస్థత పొందుటను గూర్చి మాట్లాడాడు.] ఆమెన్. దేవుడు సహోదరుడు వైల్ ను కూడా దీవించును గాక.
2
అది ఒక బాప్తిస్టు సంఘమునకు కాపరియైన వారికి చాలా బలమైనది కాదా? మనతో కూడా సహోదరుడు వైల్ ను కలిగియుండుట మనకు చాలా ఆనంధముగా ఉన్నది. మరియు ఆయన రాగలిగినయెడల, ఏ సమయమందైనా, నిశ్చయంగా ఆయన వచ్చి దర్శించుటకు ఆయన కొరకు ఆలయ ద్వారములు తెరువబడి ఉండును. మరియు ఇప్పుడు ఈ రాత్రి సమయంలో... రేపు రాత్రికి “యేసుక్రీస్తును సమాధిలో పెట్టుట,” అను అంశం మీద మాట్లాడుకుందాము.
ఆదివారం ఉదయం ఆరు గంటలకే సూర్యోదయ ఆరాధన. మరియు ఈ కూటము తర్వాత జరుగబోవుదాని గూర్చి సహోదరుడు తెలియపరిచారని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు మనమందరము కేవలం ఒక నిమిషము ప్రార్ధించెదము.
దీవించబడిన దేవా, నీ వాక్యమే సత్యము, మరియు దానిని పట్టుకొని, భయములేకుండా, దానిని ప్రజలకు ఇచ్చుచున్నటువంటి మనిషి నిమిత్తమై మేము కృతజ్ఞులము. మరియు ఈ రాత్రి సమయంలో మేము గ్రంధమును తెరుచుచుండగా, దానియొక్క పేజీలను త్రిప్పుచుండగా, దీవించబడిన పరిశుద్ధాత్మ వచ్చి మాకు వాక్యము యొక్క అవగాహనను తెరచును గాక, యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము. ఆమెన్.
3
ఈ గొప్ప రాత్రి సమయంలో దీవింపబడిన మన ప్రభువు యొక్క సిలువను గూర్చి మనము ఉత్సవమును జరుపుకొనుచుండగా, నేను ఈ రాత్రి సమయంలో ఆయన నోట నుండి పలుకబడిన, ఆయన గ్రంథములో ఆయన చేత వ్రాయబడిన వాక్యమును చదవాలని ఆశించుచున్నాను. పరిశుద్ధు మత్తయి 5వ అధ్యాయం, 47వ వచనం మరియు 48వ వచనం, మనము ఇది చదువుకుందాము:
“మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.“
4
మనము ఈ రాత్రి సమయంలో, “పరిపూర్ణత” అనే విషయమును గూర్చి మాట్లాడుదునని చెప్పాను. ఇప్పుడు మన ప్రభువు యొక్క సిలువవేయబడిన రాత్రికి దీనిని ఒక పాఠముగా తీసుకొనుట చాలా విచిత్రముగా కనబడుచుండును. అయితే ఈ రోజున, మన ప్రభువు లోకము యొక్క పాపముల కొరకు చనిపోయిన ఆ భయంకరమైన దినమును గూర్చి బహుశా వివిధ వర్తమానములను, వివిధ వర్తమానికుల ద్వారా వారు ఇచ్చిన వర్తమానములను రేడియో ద్వారా విన్నారు. కావున ఈ రాత్రి సమయంలో మీకు కొద్దిగా నూతన ఉత్తేజము కలుగునట్లుగా, దీనిని మీరు పొందునట్లుగా వేరొక మార్గమును నేను ఎన్నుకొనియున్నాను. ఇప్పుడు దీనిని తెచ్చునట్లు ప్రయత్నము చేయుచుండగా, ఆ దీవింపబడిన పరిశుద్ధాత్మ వాక్యమును ప్రేరేపించును గాక!
దేవుడు పరిపూర్ణతను కోరుచున్నాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళుటకు కేవలం కొంత భాగము ఏదీ లేదని మన మనస్సులో ఉంచుకొనవలసి యున్నది. మన ఆరాధన ప్రతీది, కూడ అది తప్పక పరిపూర్ణమై ఉండవలసి ఉన్నది.
5
ఇప్పుడు, ఏదెను తోటలో, దేవుడు ఏదెను తోటలో ఆదామును, హవ్వను కలిగి ఉండెను. వారి అవిధేయత వలన, పాపము చేశారు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించారు. మరియు అపరాధము వచ్చినప్పుడు, ధర్మశాస్త్రమును అతిక్రమించుటయే అవిధేయతై ఉన్నది. ఆయన కేవలం స్వచ్ఛమైన పరిశుద్దుడు, ఆయన పరిశుద్దుడై ఉన్నాడు, కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రకారము, ఆయన సన్నిధిలో అపవిత్రమైన మచ్చ ఏదీ నిలువదు. కావున అతిక్రమించుట ద్వారా ఈ లోకములోనికి పాపము ప్రవేశించినది, దేవుని యొక్క సన్నిధిలో ఒక పాపి నిలువక మునుపు, పాపమనునది తప్పక వ్యవహరింపబడవలసి ఉన్నది.
6
ఇప్పుడు, చట్టము అనునది లేనప్పుడు అక్కడ న్యాయము అనునది ఉండదు. అయితే చట్టము లేక న్యాయము ఒక ఆజ్ఞను కోరును. మరియు చట్టము అనునది పిలువబడినప్పుడు (కోరినప్పుడు) అది న్యాయమును ప్రసరింపజేయును.
ఇప్పుడు, ధర్మశాస్త్రము వలన, ఏ శరీరియు రక్షింపబడడు. ఇప్పుడు, ధర్మశాస్త్రము మనలను రక్షించలేదు. ధర్మశాస్త్రము అనునది కేవలం మనలను కారాగారములో ఉంచును. కాని, అది విమోచించు శక్తి కలిగిలేదు. ధర్మశాస్త్రము కేవలం మనలను పాపులుగా (దోషులుగా నిర్ణయించును) చూపించి శిక్షించును. ధర్మశాస్త్రము చేయునది అదియే. అది శిక్షను తీసికొని వచ్చుటకు, లేక నీ యొక్క లోపము ఎక్కడ ఉన్నదో చూపుటకు అది ఉన్నది. కావున ధర్మశాస్త్రము, తనకు తానుగా రక్షింపలేదు. అది కేవలం వ్యాజ్యమాడును.
మరియు దేవుడు నీతిమంతుడును, పరిశుద్ధుడై యుండుట వలన, ఆయన ఒక వ్యాజ్యము కలిగియుండవలసియున్నది. ఆయన పాపి కొరకు వ్యాజ్యము చేయవలసియున్నది. ఎందుకనగా అతడు కృప యొక్క సరిహద్దులను దాటుట వలన, ధర్మశాస్త్రమును మీరినటువంటి పౌరుడు అగుట వలన ఆలాగు చేయవలసియున్నది. అప్పుడు అతడు దానితో తప్పక వ్యవహరింపబడవలసి ఉన్నది.
ప్రతీ చట్టము ఒక ప్రాయశ్చిత్తమును కలిగియున్నది. దేవుని ఆజ్ఞలను అతిక్రమించుటకు గల ప్రాయశ్చిత్తము ఏదనగా మరణము. మరియు అది మానవాళికి మరణమును ఇవ్వవలసి ఉన్నది. మరియు మానవజాతి అంతా ఈ చట్టము యొక్క ప్రాయశ్చిత్తము క్రింద ఉన్నది.
7
ఇప్పుడు, ఆదాము మరియు హవ్వ పాపము చేసినప్పుడు, తిరిగి దేవుని యొక్క సన్నిధిలో నిలబడటానికి, కేవలం పాపముతో వ్యవహరించుట తప్ప వారికి పరిహారము చేయు ఏ ఇతర మార్గమూలేదు. ఆ పాపమనునది ఎంత చిన్నదైనా సరే, ఎంత పెద్దదైనా గానీ, మనుష్యుడు చేయు ఎటువంటి పాపమైనప్పటికి, వ్యక్తిగతముగా వారు చేసిన పాపమనునది పరిశుద్దుడైన ఆ దేవుని సన్నిధిలో నిలబడటానికి ముందు, ఆ పాపము మొదటగా వ్యవహరింపబడవలసి యున్నది.
కావున, ఎప్పుడైతే ఆదాము మరియు హవ్వ పాపము చేసి ధర్మశాస్త్రమును అతిక్రమించారో, అప్పుడు వారు మరణమునకు పాత్రులైరి. ధర్మశాస్త్రము నెరవేర్చబడవలసియున్నది, కాబట్టి అది మానవజాతి అంతటిని మరణము యొక్క అపరాధము క్రింద ఉంచినది. మనము కొన్ని నిమిషములు మన ఆలోచనలలో నిలిచియున్నట్లైతే, మరియు ఈ గొప్ప చిత్రమువైపు చూచినట్లైతే, ప్రతి వ్యక్తి దీనిలో కలుపబడియున్నారని గుర్తుంచగలుగుతారు. మానవాళికి మొదటివాడైన ఆదాము వలన ప్రతి పురుషుడు, స్త్రీ మరియు పిల్లలు కూడా అతిక్రమము వలన మరణము యొక్క అపరాధము క్రింద ఉంచబడ్డారు. అతని యొక్క అతిక్రమము వలన మనలో ప్రతీ ఒక్కరూ పాపము చేత పడిపోయారు.
8
పాపము తప్పనిసరిగా వ్యవహరింపబడవలసియున్నది. అందువలన, దేవుడు, తన యొక్క గొప్ప, అనంతమైన మరియు ఆయన యొక్క గొప్ప ప్రేమ..... ధర్మశాస్త్రము లేక చట్టము పాపిని తన యొక్క సృష్టికర్త నుండి వేరుపరిచెను; అప్పుడు అతడు పూర్తిగా నశించిపోయాడు. పాపము వ్యవహరించబడు వరకు అతడు తిరిగి వెనుకకు వచ్చుటకు ఏ విధమైన మార్గమూ ఉండేది కాదు. అప్పుడు పాపి అంతమందు పూర్తిగా నాశనమగుట గూర్చి నమ్ముట చాలా సులువుగా ఉండేది, ఎందుకనగా అతడు పూర్తిగా, ఎల్లప్పుడూ దేవుని సన్నిధి నుండి వేరుచేయబడి ఉన్నాడు.
9
ఇప్పుడు ఈ పాపమును గమనించండి. మరియు దేవుడు న్యాయవంతుడై యుండి, నీతిమంతుడై యున్నాడు (ఆయన న్యాయవంతుడై యుండుట తప్ప వేరేమియు చేయలేడు, ఎందుకనగా పూర్తి న్యాయమునకు ఆయనే నిజస్వరూపం), ఈ అతిక్రమమునకు అపరాధ రుసుమును చెల్లించుట తప్ప ఆయన వేరేమియూ చేయలేడు మరియు ఆ రుసుము మరణమే. ఎందుకనగా “నీవు దానిని తిను దినమున, నీవు తప్పక మరణించెదవు,” అని ఆయనే చెప్పెను. ఇప్పుడు, మనము ఒక అంధకార సంబంధమైన చిత్రమును కలిగియున్నాము.
మనము కొద్దిగా ముందుకు వెళ్ళినట్లైతే, దేవుని యొక్క లక్షణములను కనుగొంటాము. బైబులు మనకు స్పష్టంగా చెప్పేదేమనగా, దేవుడు ప్రేమయై ఉన్నాడు. అయితే ఆయన ప్రేమామయుడుగా ఉన్నప్పటికీ ఆయన నీతిమంతుడై ఉండవలసియున్నది. కావున, ప్రేమ అనగా, అల్పమైనది మరియు ఆటలాడేటటువంటిది అని అర్ధము కాదు. ప్రేమ అనగా దేవుని యొక్క న్యాయము.
10
ఇప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క పిల్లలు, ఆయన యొక్క చట్టమును అతిక్రమించారో, అప్పుడు ఆ మరణమునకు, మరణించవలసి యున్నదని చూచియున్నాడో, అప్పుడు శ్రేష్ఠమైన ప్రేమ ఒక మార్గమును ఏర్పరుచుటకు అడుగు వేసినది. ఎందుకనగా, ఆయన పిల్లలు నిశ్చయముగా ఆయన సన్నిధి నుండి పూర్తిగా నశించి పోయారని దేవుడు చూచాడు. అక్కడ చేయవలసిన ఏ ఇతరమైనదియులేదు, ఎందుకనగా వారు ఆయన చట్టమును అతిక్రమించారు, మరియు ఆయన చట్టము యొక్క అపరాధ రుసుము మరణమై ఉన్నది.
అప్పుడు దేవుని యొక్క ప్రేమ తనకు సంబంధించిన వారి కొరకు వెతుకుచూ వెళ్ళినది. మరియు ఎప్పుడైతే దైవికమైన ప్రేమ ప్రసరింపబడినదో, సార్వభౌమ కృప, ప్రేమను ఉత్పత్తి చేయును. మరియు దేవుని ముందు జ్ఞానము వలన, ఆయన తన వారిని ఎంతో ప్రేమించి; అపరాధ రుసుముతో పాటు, ఏదేను తోటలో ప్రత్యామ్నాయమైన మరణము జరుగులాగున ఆయన చేసాడు. ఆయన ఒక అమాయకమైన జీవిని ప్రత్యామ్నాయముగా ఉంచాడు. అది పాపము తెలియని ఒక చిన్న గొర్రెపిల్ల. మరియు అది ఒక ప్రత్యామ్నాయముగా పనిచేయుటకు, అపారధియైన పాపికి బదులుగా అది చనిపోవుటకు వెళ్ళెను. మరియు తనవారి యొక్క జీవమును పట్టుకొని ఉండేలాగున, అక్కడ ఒక గొర్రెపిల్ల వధింపబడినది.
11
పాత నిబంధన అంతటా వారు గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, ఎద్దుల యొక్కయు మరియు దూడల యొక్కయు, పొట్టేలు యొక్కయు రక్తమును ప్రత్యామ్నాయముగా, ఒక ప్రత్యామ్నాయ మరణముగా అర్పించిరి. కాని దేవుని యొక్క అనంతమైన ఏర్పాటు క్రమములో ఒక నిజమైనటువంటి నిజస్వరూపము వచ్చుచున్నదని ముందుగానే తన మనస్సులో ఆలోచన కలిగియున్నాడు. అవి అన్నియూ నిజమైన రాబోవుచున్నటువంటి దానికి ఛాయలు మాత్రమే. మరియు రాబోవుచున్నటువంటి నిజస్వరూపము ఏదనగా, ఆయన యొక్క అద్వితీయ కుమారుడై ఉండెను. చనిపోయిన గొర్రెపిల్లలు అన్ని కేవలము ఛాయయై ఉన్నాయి. మరియు ఒక నీడ అనునది కేవలము దాని యొక్క నెగిటివ్ అయి యున్నది. మరియు అవన్ని కేవలం కల్వరి యొక్క రాకను గూర్చి మాట్లాడినవి.
12
ఇప్పుడు, ఈ దృశ్యము కొరకు, మనము బైబులు గ్రంథములోని హెబ్రీయులకు వ్రాసిన పుస్తకమువైపు త్రిప్పుదాము. మరియు గొప్ప అపోస్తులుడైన పౌలు మాట్లాడుచున్న దానిని తీసుకొందము. అతడు మన కొరకు ఈ విషయములను వేరుపరుచుటకు ప్రయత్నించాడు. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో 10వ అధ్యాయములో, మనము దానిని చదువుకుందాము..
నేను కేవలము వాక్యమును ప్రేమించుదును. వాక్యమే సత్యము. మరియు వాక్యమును నా సంఘము ఎదుట చదువుటకు ఇష్టపడుచున్నాను, ఎందుకనగా నేను వారితో పాటు ఆ తీర్పులో నిలుచుందునని నాకు తెలియును. మరియు నేను దీనికి లెక్క అప్పజెప్పవలసియున్నది. కావున నేను దానిని వాక్యము నుండి తెచ్చినట్లైతే అప్పుడు నేను నేరము చేసినవానిగా ఉండను, ఎందుకనగా అది వాక్యము. మరియు దేవుడే తన వాక్యమునకు బాధ్యత వహించును.
13
ఈ దినమున సువార్తికులు, మొదలగువారు ఎక్కువగా వ్యక్తిత్వముల చుట్టూ చేరియుండట మనము చూచుచున్నాము. ఓ, అది ఒక అవమానకరమైన విషయము! మరియు మనము సంఘములలోనికి వెళ్ళి, ఒక ఫలానా కాపరిని కనుగొనినట్లైతే; ఒక వింతైన కార్యము అతని గూర్చి ఉండును, అది కొంత ఉద్రేకము. మీరు దానిని గమనించకపోతే, ఆ సంఘమంతా ఆ ఆత్మను పొందుతారు. అతడు కొంచెము ఉద్రేకపరుడై లేక అతడు తలను అటు ఇటు ఆడించుచూ, లేక ఏదో కొంత వింతైన విషయమును కలిగియున్నట్లైతే, మొత్తం సంఘమంతా దానినే పొందుతారు. మరియు ఈనాడు, ఈ ఆధునిక సంఘములలో కలిగియున్నదంతా అనుభూతులు మరియు ఆ విధమైన చిన్న విషయాలు మరియు అది అర్ధం కాని గందరగోళ పరిస్థితిని పొందియున్నది. కాని, ఓ, నా ప్రియమైన సహోదరులారా, వాక్యముపై ఉండవలసిన కాలము ఏదైనా ఉందంటే, అది ఈ రోజునే ఉండవలసి ఉన్నది.
నేను ప్రజలను తప్పు త్రోవలో నడిపించుచుండుట లేక ఒక రకమైన, ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతను పొందియున్నానని అనుకొని, తీర్పులో నిలబడుటను నేను అసహ్యించుకొనుచున్నాను. నా క్రియలు లేక నా ఆత్మను వారు కలిగి ఉండాలని, నేను కోరుకొనను. కాని సత్యమును ఉత్పత్తి చేయు, దేవుని వాక్యము ద్వారా వచ్చు దేవుని ఆత్మను కలిగియుండాలని ఆశించుచున్నాను.
14
కావున ఈ గొప్ప కార్యక్రమంలో ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క నిత్యమైన వాక్యము నుండి నేను చదువగోరుచున్నాను. ఇప్పుడు మనము గ్రహించినది ఏమనగా, ధర్మశాస్త్రము అనేక సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నప్పటికీ, అది పాపమును ఎన్నడూ తీసివేయలేదు. నేను గతంలో చెప్పిన విధంగా అది ఒక జైలు గృహము. అది ఒక గొప్ప గూఢచారిగా ఉండి నీవు ఏం చేసావో చెప్పును, కాని నిన్ను విడుదలచేయు పరిష్కారము కలిగి లేదు. అది నిన్ను ఒక తాకట్టు కొట్టులో ఉంచును, అయితే దానిలో నుండి నిన్ను బయటకు తెచ్చు విమోచకుడు లేడు. అది కేవలము నిన్ను ఖైదీగా చేసి నీవు ఒక పాపివని నీవు తెలుసుకునేలా చేయును. కాని ఇప్పుడు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయమును, చదువుచుండగా గమనించండి.
ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు....
గమనించండి, అది రాబోవుచున్నవాటి యొక్క ఒక ఛాయ మాత్రమే. ఆ ఛాయ చెప్పినదేమనగా, “అక్కడ ఒక స్వరూపము ఉండి నీడను చూపుచున్నది,” అని చెప్పుచున్నది.
రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు... [గమనించండి]. ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగచేయునేరవు.
15
ఇప్పుడు, దేవుడు, ఆదిలో పరిపూర్ణతను కోరియున్నాడు. యేసు, భూమి మీదకు వచ్చినప్పుడు, “మీ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు,” అని అన్నాడు. ధర్మశాస్త్రము రాబోవుచున్నటువంటి వాటి యొక్క ఛాయను కలిగియుండి, ఆరాధికుని ఎన్నడూ పరిపూర్ణుని చేయలేదు. మీరు ఆ దృశ్యమును పొందియున్నారా? ఇప్పుడు మీరు దానిని తప్పిపోలేదను నిశ్చయత కొరకు మరలా దానిలోనికి వెళ్ళుదము. దేవుడు పరిపూర్ణమైన పరిశుద్ధతను కోరుచున్నాడు. ఏ ఒక్కరూ కొద్దిపాటి లేక కొంత భాగం పాపమును కలిగియుండి ఆయన యొక్క రూపంలో నిలువలేరు. యేసు దానినే సాక్ష్యమిచ్చుచూ ఇలా చెప్పారు, “పరలోకములో దేవుడు పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు.”
బైబిలు చెప్పుచున్నదేమనగా, “ధర్మశాస్త్రము ఏనాడూ దాని యొక్క బలుల మూలముగా, వాటిని తెచ్చువారిని పరిపూర్ణులుగా చేయలేదు. అప్పుడు, ధర్మశాస్త్రము దేనినీ పరిపూర్ణము చేయలేదు. అది కేవలము (తప్పులను) ఎత్తిచూపినది. ప్రతి సంవత్సరమూ ఈ బలులు అర్పించి ఆరాధించువారిని ఇది ఏనాడూ పరిపూర్ణుని చేయలేదు. అందువలన, ధర్మశాస్త్రము క్రింద నుండు వారెవరూ, లేక ధర్మశాస్త్రము అనుసరించువారెవరూ లేక ఛాయల క్రింద నుండు వారెవరూ పరిపూర్ణులు కారు.
[రెండవ వచనము] గనుక వాటిని అర్పించుట మానుదురు గదా?
16
దేవుని సన్నిధిలో నేను పరిపూర్ణునిగా ఉండుటకు ఏదైనా ఒకటి చేయగలిగినయెడల, అప్పుడు నా కొరకు క్రీస్తు చనిపోనక్కరలేదు. దేవుని సన్నిధిలో సామర్ధ్యము ఎక్కువ చేసుకొనుటకు మనము చేయునది ఏమైనా ఉన్నయెడల, అప్పుడు క్రీస్తు చనిపోవుట వ్యర్ధమే. ధర్మశాస్త్రము అనుసరించుటగానీ, మీలో చట్టబద్ధమైన ఉద్దేశ్యముగానీ, మా సోంత పరిశుద్ధతగానీ, నీవు చేయకూడని కార్యములు మానివేసినప్పటికి, అబద్ధమాడుట మానివేసినప్పటికి, దొంగతనం చేయనప్పటికీ, పొగాకును త్రాగుట మానివేసినప్పటికి, సినిమాలు చూచుటను మానివేసినప్పటికీ; అయినప్పటికీ మీరు తప్పిపోయారు. ఏదియు దానిని చేయలేదు! సంఘములో చేరుట, సంఘ కార్యములు, సంఘ క్రమములు, ఉత్సవములు జరుపుట, బాప్తిస్మములు, మతవిశ్వాసములు చదువుట, ప్రార్ధనలు వల్లించుట; ఈ సంగతులన్నియు లెక్కలోనికి రావు. మీరు తప్పిపోయినవారే! నీయంతట నీవు ఏ ఒక్కటీ చేయలేవు, ఎందుకనగా తీర్పు ద్వారా నీవు ఒక పాపివై ఉన్నావు. అక్కడ నీలో నీవు చేయు ఏ మత విశ్వాసము లేక నీవు చేయు ఏ సంగతియు లేక, నీకు నీవే, ఆలోచించు, దేవుని సన్నిధిలో ప్రతిభ చూపించు ఏ ఒక్కటీ, ఏ మార్గము అక్కడ లేదు, ఎందుకనగా నీవు ప్రారంభములోనే ఒక పాపివై ఉన్నావు.
17
బైబిలు గ్రంథము తెలియజేయుచున్నదేమనగా, మనము పాపములో జన్మించి, అతిక్రమములో రూపుదిద్దుకుని, అబద్దములాడుచూ లోకములోనికి వచ్చాము. మరియు దేవుడు ఒక మనిషి కొరకు వేరొకరిని చనిపోవుటకు తీసుకోలేదు, ఎందుకనగా ఆ వ్యక్తి కూడా వేరొకని వలె దోషిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆర్చి-బిషప్ కూడా పట్టణములోని బార్లకు తిరుగుచుండేటటువంటి వానివలె ఈ లోకములో దోషివలె జన్మించాడు. ఒకరు వేరొకరి కొరకు ప్రాయశ్చిత్తము చేయలేరు.
కావున ఆయన ఒక అమాయకమైన చిన్న గొర్రెపిల్ల యొక్క జీవమును తీసుకున్నాడు. మరియు పాత నిబంధనలోని చట్టము ఏదనగా, ఒక మనుష్యుడు పాపము చేసినప్పుడు, అతడు గొర్రెపిల్లను బలిపీఠము నొద్దకు తెచ్చును. అతడు ఏ ఆజ్ఞలనైనా అతిక్రమించెనని చెప్పినప్పుడు, అతడు గొర్రెపిల్లను తెచ్చి, మరియు దానిని బలిపీఠంపై నుంచును, అతడు గొర్రెపిల్ల తలపై తన చేతులనుంచును, మరియు అతడు తన పాపములను ఒప్పుకొనును, అది ఏమనగా తాను తప్పులో నున్నానని, తాను దోషినని తెలుసుకొని యున్నాడు మరియు చట్టము మరణమును కోరును. మరియు అతడు ఆ గొర్రెపిల్లను తనకు బదులుగా తెచ్చెను. ఆ చిన్న జంతువు యొక్క గొంతు కోయుబడును, అప్పుడు అది తన చిన్ని పాదములతో నేలను తన్నుచూ గిలగిల కొట్టుకొనుచూ రక్తమును స్రవించును. మీరు ఎప్పుడైనా గొర్రెపిల్ల చంపబడుచుండగా చూచినట్లైతే, అది ఎంతటి దయనీయమైన కేకలు వేయునో, ఆ చిన్న అమాయకమైన ప్రాణి గిలగిల కొట్టుకొనుచుండును. దానియొక్క చిన్న మెడలో నున్న పెద్ద నెత్తుటి నాళము కోయబడినప్పుడు, అది తన్నుకొనుచూ కష్టదశలో వణుకుచు కొట్టుకొనుచుండును. మరియు రక్తము బయటకు తన్నుకొని ప్రవహించును. ఆ రక్తము వేగముగా ధారవలె, ఝల్లున బయటకు వచ్చి దాని యొక్క ఉన్నిని మరియు ఆరాధికుని యొక్క చేతులను తడుపును.
18
ఆరాధకుడు తాను వ్యభిచారము చేసినందుకు, అబద్దమాడినందుకు, దొంగిలించినందుకు, తన దోషము ఏదైనా సరే, లేక చెడుగా ఆలోచించుటయైనా సరే, అది ఎంతటి చిన్న ఛాయగా ఉన్నప్పటికి, అతడు దోషియై యుండెను, ఎందుకనగా అది అతడి స్వాభావమైయున్నది. అతడు ఒక దోషముతో నిండిన వ్యక్తి, బహుశా అతడు తన యొక్క కోరికలలో కాదు కాని, అతడు అతని స్వభావము ద్వారా దోషి, మరియు అతడు ఈ అమాయకమైన చిన్న గొర్రెపిల్ల తన స్థానములో మరణించినదని గ్రహించి, అతడు ఈ చిన్న ప్రాణి కొరకు దుఃఖపడును.
కాని ఆ మనుష్యుడు, గొర్రెపిల్ల తుదకు చనిపోయిన వెంటనే, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ మనుష్యుని చేతులపై ఉండగానే, తనకు ఆదిలో ఉన్నటువంటి అదే కోరికతో అతడు భవనము వెలుపటకు నడచి వెళ్ళును. ఎందుకు? ఎందుకనగా ఆ చిన్న గొర్రెపిల్ల లోని జీవము... రక్తములో జీవము నిలిచియుండును. మీ యొక్క జీవము రక్తములో ఉన్నది. అది మనకు తెలియును. మరియు గొర్రెపిల్ల యొక్క రక్తములోని జీవము, జంతుజీవము. కావున దాని యొక్క చిన్న రక్త కణములు చీల్చబడినప్పుడు, ఆ జంతువులోని జీవము బయటకు వెళ్ళినప్పుడు, అది ఆరాధికుని యొద్దకు తిరిగిరాదు, ఎందుకనగా ఆ ఆరాధికుడు ఒక మనిషి.
19
రక్తము కప్పి ఉంచును, అయితే అది అన్నీ పరిపూర్ణంగా ప్రాయశ్చిత్తము చేయలేదు. అతడు మొదట ఏ పాపము యొక్క కోరికను కలిగియున్నాడో, అదే కోరికను కలియుండి భవనము విడిచి బయటకు వెళ్ళును. కాని, ఇది చేయుచుండగా, ఒక పరిపూర్ణమైన గొర్రెపిల్ల వచ్చి ఒక సమయము కొరకు ముందుకు చూచుచుండెను. అతడు దీనిని దహనబలిగా చేయుచుండెను, ఎందుకనగా అతనికి తెలిసిన మార్గము అది ఒక్కటే.
కావున, మీరు చూచినట్లైతే, ఆ రక్తము ధారగా బయటకు పోయబడినప్పుడు మరియు జంతువులో నుండి జీవము పోయినప్పుడు, అది మనుష్యుని యొద్దకు తిరిగి రాదు; ఎందుకనగా ఒకటి జంతువు, మరొకరు మనిషి; ఒక నేరస్తుడైన మనిషి కొరకు ఒక అమాయక జంతువు బలైపోతుంది.
20
కాని, ఓ, రెండువేల సంవత్సరాల క్రితం ఒక దినమున, దేవుని యొక్క గొర్రెపిల్ల బెత్లహేములోని ఒక చిన్న పశువులు కుడితి త్రాగు తొట్టిలో జన్మించినది. మరియు వధించువాని యొద్దకు నడిపించబడిన ఒక గొర్రెవలె ఉండెను. సుమారు 1900 సంవత్సరముల క్రితం, మధ్యాహ్న కాలము 3 గంటలకు ఆయన చనిపోయాడు. మచ్చలేని, ఏ దోషము లేనటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల కల్వరిలోని సిలువపై వ్రేలాడి ప్రతి ఒక్క పాపి కొరకు చనిపోయినది. ఇప్పుడు, విశ్వాసము ద్వారా ఆరాధికుడు ఈ గొర్రెపిల్ల నొద్దకు వచ్చినప్పుడు... మరియు ఇది ఒక వ్యత్యాసమైన గొర్రెపిల్ల, ఇది సాధారణమైన గొర్రెపిల్ల కాదు.
మొదట దేవుడు ఆకర్షించితేనే గాని ఏ మనుష్యుడు ఈ గొర్రెపిల్ల నొద్దకు రాలేడు. మీరు దేవుని సార్వభౌమ కృపను చూశారా? ఓ, ఇప్పుడు, ఇది లోతునకు వెళ్ళి గట్టిగా పట్టుకొని వుండవలెనని ఆశించుచున్నాను. చూడండి, దేవుడు ఈ లోకములో తన గొర్రెపిల్లను కలిగి ఉన్నాడని ఆయనకు తెలుసు. రక్షించవలసిన తన ప్రజలను తాను కలిగియున్నాడని ఆయనకు తెలుసు. మరియు ఆయన ప్రేమ క్రిందికి చూచి రక్షింపబడువారిని చూచెను. అందువలన, ముందు జ్ఞానము ద్వారా, మచ్చ, ముడత లేనటువంటి ఒక సంఘమును సుదూరములో ఆయన కలుసుకొనుటకు ఆయన ముందుగా నిర్ణయించాడు. మరియు ఆయన మచ్చగాని, ముడతగాని లేని సంఘముగా చేయుటకు దేవుడు కోరినట్లైతే, అలా దానిని చేయుటకు ఒక మార్గమును ఆయన కలిగియుండవలసియున్నది. అలాంటి దానిని చేయు మార్గము లేనియెడల, ఆయన తీర్పులు, ఆయన యొక్క న్యాయము, అటువంటి ఒక దానిని అడిగేలా చేయలేవు.
21
మరియు మనిషి తనకు తాను దానిని చేయలేడు. అతడు పూర్తిగా విఫలమైనాడు. దేవుడు దానిని మనిషికి చట్టము ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, మరియు పాత నిబంధన అంతటా చూసేలా చేశాడు. ఆయన నీతిమంతుడైన మనుష్యులను పంపాడు. మరియు వారందరూ విఫలమైనారని వారందరూ కనుగొన్నారు.
అందువలన దేవుడు, తన యొక్క సార్వభౌమ కృప ద్వారా మహిమ యొక్క చిన్న ద్వారముల ద్వారా ఆయన కనిన అద్వితీయ కుమారుని మన స్థానమును తీసుకొనుటకు పంపాడు.
22
జ్ఞాపకముంచుకోండి, ఆయన రోమ్ లోని పోప్ ను, దానిని స్వీకరించమనిన, అతడు అలా చేసియుండెడివాడు కాదు. ఆయన కాంటర్బరీలోని ప్రధాన గురువును లేక తండ్రిని దానిని చేయమని చెప్పిన ఎడల ఆయన అలా చేసి యుండెడి వాడు కాదు. ఆయన అతి పరిశుద్దుడైన, గౌరవనీయులైన పాదిరిగారిని లేక ఈ లోకములోని మతగురువును దానిని చేయుటకు పిలిచిన ఎడల, అతడు అలా చేసియుండెడివాడు కాదు. యూదా ఇస్కరియోతును ఏ విధముగా ఆయన తిరస్కరించాడో, అదే విధముగా వీరినీ తిరస్కరించెను. అతడు అలా చేయలేడు, ఎందుకనగా అతడూ కూడా పాపములో పుట్టి, అతిక్రమములో రూపుదిద్దుకొని, అబద్ధములాడుచూ లోకములోనికి వచ్చి, తన కొరకు ప్రాయశ్చిత్తము అవసరమై ఉండెనని గ్రహించెను.
హల్లెలూయ! ఒకాయన మహిమ యొక్క ద్వారముల గుండా వచ్చాడు. ఎవరో ఒకరు కాదు, ఒక మనిషి కాదు, ఒక మంచి మనిషి కాదు, ఒక అన్యుడు లేక యూదుడు కాదు. ఆయన మానవ శరీరంలో దాగియున్న సర్వశక్తిమంతుడు, దేవుని కంటే తక్కువవాడు కాదు (దేవుడే). ఆయన తన స్వంత రక్తమును తనంతట తానే అర్పించుకొనుటకు వచ్చాడు, ఎందుకనగా అది లైంగిక కార్యము మూలముగా రాలేదు. లైంగిక కార్యము అనునది దానితో ఏమియూ చేయలేదు. కాని ఆయన ఒక కన్యను ఆవరించి, తనకు తానుగా సృజించుకున్నాడు, ఏ విధమైన దోషములేని, అమాయకమైన ప్రాణిగా ఒక రక్త కణము ద్వారా తీసుకొని వచ్చాడు.
23
అప్పుడు, నా యొక్క మరియు మీ యొక్క రక్షణ ఈ రాత్రి సమయంలో మన స్వంత కార్యముల యొక్క యోగ్యతల మీద ఆధారపడియుండలేదు. అది మనలను తనలో ఎన్నుకున్న సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సార్వభౌమ కృపపై ఆధారపడియున్నది. ఖచ్చితముగా పరిపూర్ణునిగా నేను ఎన్నడూ కాలేను, లేక మీరు ఎన్నడూ పరిపూర్ణులు కాలేరు. మరియు మనము పరిపూర్ణులమని హక్కు కలిగి ఉన్నమని చెప్పలేము. కాని మనము ఈ ఓదార్పును కలిగియుండగలము, అదేమనగా ఇంతకు ముందే స్వీకరించబడిన పరిపూర్ణమైన అర్పణపై మన విశ్వాసమును నిలిపియుంచగలము.
24
అప్పుడు మనము దానిని పొందియున్నామని ఎలా తెలుసుకొనగలము? ఆ విశ్వాసి తన యొక్క చేతులను ప్రభువైన యేసు యొక్క శరీరము మీద విశ్వాసము ద్వారా ఉంచి, మరియు పాపము యొక్క కన్నీటిని అనుభవించుచూ, ఆయన స్వంత ముఖము మీద తృణీకరణతో కూడిన ఉమ్మును (ఎగతాలి, వెక్కిరింపు) అనుభవించుచూ, గెత్సెమెనే లోని దుఃఖముతో కూడిన మూల్గులను అనుభవించుచూ, కల్వరిలోని వేదనలను అనుభవించెను, మరియు అతడు దోషినని తెలుసుకున్నవాడై, సరియైన విధంగా తన దోషములను ఒప్పుకొనవలెను. మరియు ఇలా చెప్పవలెను, “ఓ పరిశుద్దుడైన ప్రభువా, నేను దోషిని. మరియు నేను వేరొక మార్గమును కలిగి లేను, కాని మీరు నాకు సహాయము చేశారు మరియు విశ్వాసము ద్వారా... మీరు ఆజ్ఞాపించుచున్నారు, మరియు పరిశుద్ధాత్మ వచ్చి నన్ను రమ్మని అడిగినది మరియు నేను ఇప్పుడు విశ్వాసము ద్వారా యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నాను,” అని చెప్పవలెను. కల్వరిలోని ఆయన నుండి వచ్చిన ఆ జీవము పరిశుద్ధాత్మగా పిలువబడినది. ప్రభువైన యేసు యొక్క రక్త కణములో - దాచబడిన పరిశుద్ధాత్మ అని పిలువబడు ఆ జీవకణము ఆరాధికుని యొద్దకు తిరిగి వచ్చి, క్రీస్తు యొక్క శరీరములోనికి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మమిచ్చును.
25
మరియు ఆయన ఇంతకు ముందే తీర్పు తీర్చబడ్డాడు. మరియు మీరు తీర్పును గూర్చి కలత చెందనక్కరలేదు. ఆ చిన్నదైన మ్రానుపై పెట్టి మేకులు కొట్టబడిన క్రీస్తు ప్రతిమను నేను వెనుకకు తిరిగి చూచినప్పుడు, అది ఆయన యొక్క శరీరమును తెలియజేయుచున్నదని గ్రహించుదును. ఇప్పుడు, ఆ శరీరము ఇంతకు ముందే తీర్పు తీర్చబడినది. దేవుడు న్యాయబద్దముగా దానిని మరల తీర్పుతీర్చలేడు, ఎందుకనగా అది ఇదివరకే తీర్పు తీర్చబడినది. దేవుడు ఆ శరీరము మీద మరణము యొక్క తీర్పులు మోపియున్నాడు. (ఆయన) శరీరంలో దాగియుండు మార్గము నేను కనుగొనేంత వరకూ ఆయన తీర్పు నీ కొరకు మరియు నా కొరకు కొట్టబడి ఉన్నది. కావున మనము స్వతంత్రులము. రోమీయులు 8:1 చెప్పునదేమనగా, కావున క్రీస్తు యేసునందున్నవారికి ఏ శిక్షావిధియూ లేదు. శరీరానుసారముగా నడువక, ఆత్మానుసారముగా నడుచు మనకు ఏ శిక్షావిధియూ లేదు. మీరు అక్కడే ఉన్నారు. ఏ శిక్షావిధియూ లేదు. ఏమి వచ్చిననూ, ఏమి పోయిననూ నేను పట్టించుకొనను. మీరు రక్తము క్రింద దాచబడియున్నారు.
26
మరల మనం ఆ శరీరంలోనికి ఎలా ప్రవేశించగలము? I కొరింథీ 12:13 చెప్పుచున్నదేమనగా, “ఒకే ఆత్మ ద్వారా!” ఆత్మ ఏ విధముగా వచ్చింది? బలి ద్వారా వచ్చినది. ఆత్మ ఎక్కడ నిలచియున్నది? రక్తములోపల నిలచియున్నది. జంతుజీవము ఎందుకు వెనుకకు రాలేదు? అది ఒక జంతువై ఉండెను. ఆ జంతువు యొక్క ప్రాణము మానవ ఆత్మ దగ్గరకు వచ్చి ఉండలేదు, మరియు అది ఏమియు చేయలేదు, ఎందుకనగా మానవ ఆత్మ జంతువుకంటే ఎక్కువైన ఒక జీవితపు వరుసై ఉన్నది. అయితే ఏ మనుష్యుని ఆత్మ వెనుకకు వచ్చి ఉండలేదు. నీవు ఎవరో పూర్వీకుని యొక్క ఆత్మను పొందినయెడల, అది ప్రేతాత్మలు - బ్రతికున్న వారితో సంభాషించుట. అయితే దేవుడే తనకు తానే వచ్చి, అక్కడ ఉన్న ఆత్మ యొక్క అత్యున్నతమైన జీవపు వరుసలో ఉన్న, ఆయన సొంత ఆత్మ, క్రీస్తు యొక్క రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మపు రూపములో, ఆరాధికుని యొద్దకు వెనుకకు వచ్చి, మరియు అతనిని శరీరములోనికి తీసుకొని వచ్చును. అతడు క్షేమముగా ఉండును.
27
గమనించండి. ఎద్దుల యొక్కయు మరియు మేకల యొక్కయు రక్తము చూస్తుండగా, అది బలహీనముగా ఉండి పనిచేయలేదు. ఇప్పుడు, 12వ వచనం చదువుటకు ప్రారంబించెదము. అంతా బాగానే ఉంది. ఎద్దుల యొక్కయు మరియు మేకల యొక్కయు రక్తము పనిచేయలేదు. అది ప్రాయశ్చిత్తము చేయలేదు. గమనించండి.
ఈయనయైతే, [ఏ మనిషి? ఆ బిషప్పా? కాదు. ఆ పోపా? కాదు.] ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను;
నీవు సిద్ధముగా ఉన్నావా? వాక్యము కొరకు నీవు సిద్ధముగా ఉన్నావా? దీనిని వినండి, అప్పుడు అది లోపలకు వెళ్ళి బాగా క్రిందకు మునగవలెనని నేను కోరుచున్నాను, శ్రద్ధగా వినండి.
ఒక్క అర్పణచేత [సంవత్సరం తర్వాత సంవత్సరం కాదు, ఉజ్జీవము తర్వాత ఉజ్జీవము కాదు, కూడిక తర్వాత కూడిక కాదు, రోజు తర్వాత రోజు కాదు.]... అయితే ఒక్క అర్పణచేత, ఈయనను పరిపూర్ణుణిగా చేసెను. [వారు కలిగి ఉన్నారా? ఆయన కలిగి ఉండెను!] ... ఒక్క అర్పణచేత ఈయనను పరిపూర్ణుణిగా చేసెను.[అలా అది దేవుడు కోరినది.] పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.
28
అక్కడే మీరు ఉన్నారు. క్రీస్తు యొక్క మరణమునకు అదియే జవాబు. కల్వరికి అదియే జవాబు. ఆయన నిశ్చయముగా, తన సొంత రక్తముతో మన పాపములను కొనెను, మరియు తన విశ్వాసులను, సదాకాలము పరిపూర్ణులుగా చేసెను. కాబట్టి, మనము క్రీస్తునందు నిందారహితులుగ నిలబడి, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో పరిపూర్ణులుగా ఉన్నాము. మన సొంత సిద్ధాంతములతో చాలా తక్కువ సౌకర్యాలు, అవకాశములు, హక్కులు చాలా తక్కువ కలిగి ఉన్నాము; మనము ఒక ప్రత్యేక స్థానానికి వెళ్ళవలెననియు, మనం ఫలాని ఒక సంగతి చేయవలెనని మనమందరము బోధించబడ్డాము. లేదు, నా సహోదరుడా, నీవు చేసినది ఏదియూ కాదు; అది దేవుడు నీ కొరకు చేసినది! ఇప్పుడు మనము, మనము విశ్వాసము ద్వారా నీతీకరణము పోందినయెడల, మనము దేవుని సన్నిధిలో సదాకాలము పరిపూర్ణులుగా చేయబడ్డాము.
29
“పరిపూర్ణులుగా ఉండెదరు,” అని యేసు చెప్పెను. అప్పుడు అది సదాకాలము పరిపూర్ణము చేయబడెను. దేవుడు, క్రీస్తు యొక్క మరణము ద్వారా 1900 సంవత్సరముల క్రితము, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు తాను. ముందుగా ఎవరిని చూసెనో, ఆ విశ్వాసిని ఈనాడు సదాకాలము పరిపూర్ణునిగా చేసియున్నాడు. మరియు ఆయన ఎందరిని పిలిచెనో, వారినందరినీ నీతిమంతులుగా చేసెను. “ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో, వారిని పిలిచెను; ఆయన ఎందరిని పిలిచెనో, వారిని అందరిని నీతిమంతులుగా చేసెను; ఆయన ఎంతమందిని నీతిమంతులుగా చేసెనో, వారినందరిని ఇదివరకే ఆయన మహిమపరిచెను.” ఆయన తన యొక్క విశ్వాసులను పరిపూర్ణులుగా చేసియున్నాడు.
30
ఇప్పుడు గమనించు, ఇప్పుడు మరలా వెనుకకు మొదటి వచనము యొద్దకు వెళదాము.
ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు.
గమనించండి, “పరిపూర్ణత” అను దాని గూర్చి మనము మాట్లాడుకొనుచున్నాము.
ఆలాగు చేయగలిగిన యెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా?
మీ భావము ఏమిటి? “మనస్సాక్షి” అను పదమునకు సరియైన తర్జుమా ఏమనగా “కోరిక.” మరియు ఆరాధికుడైన మనుష్యుడు క్రీస్తు యొద్దకు వచ్చి, ఆయన యొక్క బాధను చూచి, మరియు తనను తాను క్రీస్తుకు సమర్పించుకొని, “ఓ ప్రభువా, దేవా, నాలో ప్రాయశ్చిత్తము చేయుటకు ఏమియూ లేదు. నేను పూర్తిగా మీ మీద ఆధారపడుచున్నాను,” అని చెప్పిన ఎడల, అప్పుడు పరిశుద్ధాత్మ ఆ మనుష్యుని యొక్క హృదయములోనికి వచ్చును. పాపము యొక్క ప్రశ్న శాశ్వతముగా పరిష్కరింపబడినది. మరియు పాపము యొక్క ప్రతీ కోరిక నీలో నుండి తీసివేయబడినది. ధర్మశాస్త్రము దానిని చేయగలిగిన ఎడల ఆ అర్పణలు నిలుపు చేయవలసిన పనిలేదు; కాని అది దానిని చేయలేకపోవుట వలన, మనలను పరిపూర్ణులుగా చేయుటకు క్రీస్తు చనిపోయెను.
31
స్నేహితులారా, పరిపూర్ణతను గూర్చి మనము ఈ రాత్రి సమయములో అనేక విషయములు చెప్పుకొనవచ్చును. మనము ఎల్లప్పుడూ ఎవరో ఒకనిపై మన దృష్టిని నిలిపి, మనము వారికంటే కొద్దిగా పరిశుద్దులుగా చేసుకొనుచున్నాము. కాని మనము కేవలము చిత్రమువైపు చూచినట్లైతే, మనమేమై యున్నాము అది కేవలము దేవుని యొక్క కృప.
32
ఇక్కడ కొంత కాలము క్రితము ఓహాయోలో, కఠినమైన మార్గము ద్వారా నేను ఒక పాఠమును నేర్చుకొంటిని. నేను ఓహాయో దిగువన ఒక సమావేశమును కలిగి ఉంటిని. నేను ఆ దేశము వెలుపల ఉంటిని. అక్కడ ఉన్నటువంటి వాతావరణము వలన ఆ పట్టణములో నిలిచియుండలేదు.
మేము ఒక చిన్న రెస్టారెంట్ లో తినుచున్నాము. మరియు అక్కడ బాగుగా దుస్తులు ధరించుకొని, ఆమె ఎంత పరిశుభ్రముగా ఉండగలదో అంత పరిశుభ్రత కలిగి, మర్యాద కలిగిన స్త్రీలా ఉండేటువంటి ఆహారమును అందించు ఒక ప్రియమైన స్త్రీ మా కొరకు వేచి యున్నది. ఆ స్థలము తినుటకుగాను, పరలోకములోని ఒక చిన్న ప్రదేశముగా ఉన్నది. వారియొక్క వంటగది నిరాడంబరంగా మరియు శుభ్రంగా ఉన్నది. మరియు వారు దానిని ఆదివారమునాడు మూసివేసి, సంఘమునకు వెళ్ళుదురు. నాకు కొద్దిగా ఆకలి వేసినది; నేను ఆదివారము మధ్యాహ్నము ప్రసంగించుటకు వెళ్ళుచున్నాను.
నేను సామాన్యమైన చిన్న దాని దగ్గరకు వెళ్ళాను... ఏదైనా తినుటకు, కేవలం అందరికి చెందిన ఒక చిన్న అమెరికన్ భోజనశాలకు వెళ్ళాను. మరియు నేను తలుపు నొద్దకు నడచి వెళ్ళాను, నేను ఏమి వింటిననగా ఒక స్లాట్ మెషిన్ (జూదమాడు యంత్రం)తో ఆడుటను వింటిని! అక్కడ నా అంత వయస్సు కలిగిన ఒక మనిషి, బహుశా పెండ్లి అయిన ఒక పురుషుడు, ఒక స్త్రీ నడుము చుట్టూ తన చేతినుంచి, ఒక స్లాట్ మెషిన్ తో ఆడుచుండెను. మన మంచి కార్యములను, మన నీతిని కాపాడవలసిన, మన చట్టము, బద్రంగా ఉంచవలసిన ఒక సంగతిని అక్కడ నిలబడి చట్టమును మీరుచున్నారు, ఎందుకనగా ఓహాయోలో, ఒక స్లాట్ మెషిన్తో ఆడుట, జూదమాడుట చట్టబద్దము కాదు.
33
మరియు నేను భవనం వెనుకకు తిరిగి చూశాను. అక్కడ గుంపుగా యుక్తవయస్సులో ఉన్న యవ్వనస్తులు యంత్రాలుపై రాక్-అండ్-రోల్ రికార్డులు ఆ మెషిన్ పై వేసి ఆడుచున్నారు. పద్దెనిమిది సంవత్సరాల ఒక యవ్వన స్త్రీ, ఆమె శరీర అవయవ నిర్మాణము క్రింద చాలా శుభ్రమైన స్త్రీగా ఉన్నది. అక్కడ ఆమె కురచగా ఉన్న డ్రెస్ ముందు కిందకు వేలాడుచున్నది. ఆమె నిలబడి ఉండెను, మరియు ఆ బాలురిలో ఒకడు ఆ బాలికపై వాని చేతులు ఉంచి, వారు ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్నారు. వారు పొగత్రాగుచూ మరియు మధ్యమును సేవించుచున్నారు, మరియు నేను తలంచాను, “ఓ దేవా, దానిని నీవెలా సహించగలుగుచున్నావు?”
34
ఎవరో మూలుగుచు ఒక పెద్ద శబ్దము చేయగా, నేను నాకుడి వైపుకు చూశాను. అక్కడ బహుశా అరవై, లేదా డెబ్బై సంవత్సరాల వయసుగల స్త్రీ కూర్చుని ఉన్నది, ఆమె అసభ్యకరమైన దుస్తులు ధరించి, కేవలం ఆమె అవయవాలు సగం వరకు కప్పి ఉన్నవి, ఆమె శరీరము ముడతలుపడి, బలహీనమై ఎంత మృదువుగా ఉండాలో అంత మృదువుగా ఉన్నది. ఇక్కడ ఆమె పెదవులకు మరియు ముఖమునకు ఊదారంగు వేసుకొన్నది; ఒక చిన్న జతబూట్లు కాళ్ళకు జోడుగా వేసుకొన్నది, పాదముల గోళ్ళకు ఊదారంగు వేసుకొన్నది, చేతివేళ్ళ గోరులకు ఊదారంగు వేసుకొన్నది, ఆమె జుట్టు సరిగ్గా కురచగా కత్తిరించుకొని ఉంగరాల జుట్టు కలిగి, అద్దకము చేసిన నీలిరంగుతో ఉన్నది. మరియు నేను ఆమెవైపు చూశాను.
35
త్రాగి ఉన్న ఇద్దరు మనుష్యులు అక్కడ బల్ల చుట్టూ కూర్చుని ఉన్నారు. వారిలో ఒకరు (అది వేసవికాలమై ఉండెను) ఒక పెద్ద పురాతన ఆర్మీ ఓవర్ కోటుతో ఉండెను, ఒక బూడిదరంగు తువాలు అతని మెడకు చుట్టబడి ఉండెను మరియు అతని ముఖము నుండి మీసములు పడియున్నవి, మరియు శబ్దంతో నోటిలోని గాలిని ఊదుచున్నాడు. వారు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని, ఆ మనిషి, ఆమె వద్ద నుండి, ఈ విధముగా నడుచుటకు ప్రారంభంచి, విశ్రాంతి గదిలోనికి వెళ్ళెను.
నేను అక్కడే నిలబడ్డాను. మరియు నేనన్నాను, “దేవా, ఈ మొత్తం అంతటిని ఎందుచేత నాశనము చేయలేదు? కేవలం ఎందుచేత ఇది భూమిక్రిందకు మునుగిపోయినట్లు చేయలేదు?” నేను అన్నాను, “నా చిన్న శారా మరియు రిబ్కా, అలా ఆ విధమైన దాని క్రింద పెరగవలసి ఉన్నదా?” నేను అన్నాను, “దేవా, ఎలా మీరు, మీ గొప్ప పరిశుద్ధతలో ఉండి, భూకంపమును పంపి దానిని ముంచివేయకుండ, అలాంటి ఆ విధమైన ఒక సంఘటన చూచుటకు నిలబడి ఉన్నారా?”
నేను అక్కడ అలా నిలబడి ఉండగా, ఆ స్త్రీని ఖండించుచు, నేను ఆ తలుపు వెనుకకు వెళ్ళితిని. దేవుని ఆత్మ నా మీదకు రాగా నేను ఆ భావన పొందాను, మరియు ఆ తలుపు వెనుకకు వెళ్ళాను.
36
సుడిగాలివలె తిరుగుచున్న ఏదో దానిని నేను చూశాను. అది అలా ఉండగా, దర్శనములో, ఆ ప్రపంచము గిరగిరా చుట్టూ తిరుగుచుండెను. నేను గమనించగా, లోకము చుట్టూ రక్తవర్ణముతో సన్నని పొడుగాటి ఎర్రటి రేఖలు, ఆ లోకము చుట్టూ ఉన్నవి. మరియు నేను లోకంలో ఉన్నపుడు, ఒక చిన్నబాలునిగా ఉండి, చేయకూడని కార్యములు చేయుటను, నా అంతట నేనే చూశాను; అలాంటి దానివలె కాకపోవచ్చును, కాని అది పాపమై ఉండెను. మరియు నేను ఏదైనా పాపము చేసిన ప్రతి సమయములో, ఆ గొప్ప నల్లని నీడ పరలోకము వైపుగా వెళ్ళుట నేను చూశాను. ఏదనగా, ఆ నిమిషంలోనే దేవుడు నన్ను చంపి ఉండవలసి ఉన్నది.
అప్పుడు ఆ పరిపూర్ణమైన అర్పణ నాకు, దేవునికి మధ్య నిలచియుండుట నేను చూశాను. ఆయన తలపై ముళ్ళు ఉండుట, ఆయన ముఖంపై ఉమ్మి ఉండుట, ఆయన నిలచియుండుటను నేను చూశాను. నా పాపములు దేవుని వైపుకు వెళ్ళు ప్రతి సమయంలో, ఆయన నన్ను సమీపించి మరియు దానిని కారుకి ఉండు బంపరు వలె పట్టుకొనును. ఆయన నన్ను మరణము నుండి రక్షించెను. నేను ఏదైనా పొరపాటు చేయుచున్న ప్రతి సమయంలో, దేవుడు నన్ను చంపియుండవలసి ఉన్నది. నిశ్చయముగా, ఆయన పరిశుద్ధత దానిని కోరును. ఆయన చట్టము దానిని కోరును. మరియు నేను చేయు ఏ పొరపాటైనను, నీవు చేయు ఏదైనను, చేయు ప్రతి సమయములో, యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక బంపరు వలే పనిచేయును. మరియు అప్పుడు, అలా ఆ రక్తవర్ణముతో ఉన్న ఆ రేఖల అర్ధం నేను గ్రహించాను, అలా ఆ రక్తము ఇంకా భూమిని పట్టుకొని ఉన్నది.
37
మరియు నేను నిలచి చూచుచుండగా, నేను ఆయనకు కొంచెం దగ్గరగా వెళ్ళి నేను ఆయనను గమనించాను. ఆయన ఇలా చెప్పుట నేను విన్నాను, “తండ్రీ, వానిని క్షమించుము, అతడు ఏమి చేయుచున్నాడో అతనికి తెలియదు.” నేను క్రిందకు చూశాను, అక్కడ ఒక గ్రంథము ఉన్నది. అక్కడ ఆయన ప్రక్కగా ఒక దూత నిలబడి, ఆ గ్రంథములో నమోదు చేయుచుండెను. నేను పాపము చేస్తున్న ప్రతి సమయంలో, అది ఆ గ్రంథములో క్రింద ఉండెను. మరియు నా పేరు దానిమీద ఉండెను. మరియు ఏదో రోజున అలా ఉండునని నేను ఎరిగి ఉంటిని, ఆ రక్తవర్ణముతో ఉన్న ఆ చారలు తీసివేయబడెను. మరియు నా పాప జీవితంతో, దేవుని సన్నిధిలో నేను నిలబడవలసి ఉన్నది. అయితే, ఆయన కరుణ ద్వారా ఆయన నా యొక్క తీర్పును చాలా గట్టిగా పట్టుకొనెను.
నేను తగ్గించుకొని, ఆయన దగ్గరకు వెళ్ళాను. నేను నా మోకాళ్ళు వేశాను, మరియు నేను చెప్పాను, “ఓ యేసూ, నీవు దేవుని కుమారుడవు, నేను నీ సన్నిధిలోనికి వచ్చుటకు అయోగ్యుడను. అయితే నేను ఏమి చేశానో దానికొరకు మీరు దయచేసి క్షమించగలరా?”
ఆయన తన చేతితో ఆయన ప్రక్కను ముట్టెను, ఆ పురాతన గ్రంథమును తీసుకొని దానిపై “క్షమించబడెను,” అని వ్రాసెను, దానిని ఆయన వెనుక వైపుకు విసరెను, మరియు నా పాపములు పోయినవి! విధేయతను కోరునట్లు చూచుచు, ఆయన నన్ను చూచెను. ఆయన చెప్పెను, “ఇప్పుడు నేను నిన్ను క్షమించియున్నాను, కాని నీవు ఆమెను ఖండించగోరుచున్నావు.” అప్పుడు ఆయన ఉద్దేశ్యము ఏమిటో నేను గ్రహించాను.
38
నేను ఆ దర్శనములో నుండి బయటకు వచ్చినప్పుడు, నేను ఆమె యొద్దకు వెళ్ళాను. “ఎలా ఉన్నారు?” అని ఆమెను అడిగాను.
ఆమె మధ్యమును సేవించుచున్నది. ఆమె నా వైపు చూచి, “ఓ, హల్లో,” అని ఆమె అన్నది.
“నేను ఇక్కడ కూర్చోవచ్చునా?” అని నేనన్నాను.
“నేను వేరొకరితో ఉన్నానండి,” అని ఆమె అన్నది.
“అమ్మా, నేను ఆ ఉద్దేశ్యముతో అనలేదు. నేను కేవలము ఒక నిమిషము, మీతో మాట్లాడాలని కోరుచున్నాను,” అని అన్నాను.
“కూర్చోండి,” అని ఆమె అన్నది.
నేను చెప్పాను. “అమ్మా.. కొన్ని నిమిషముల క్రితం, ఆ తలుపు వెనుక దూరంగా నిలబడినప్పుడు...” నేను ఆమెకు చెప్పటం ప్రారంభించాను. మరియు నేను ఆమెను చూచినప్పుడు, ఆమె బుగ్గల మీదగా కన్నీళ్ళు ప్రవహించుచున్నవి. ఆమె నాతో చెప్పింది... నేను చెప్పాను, “అమ్మా, నీవు ఈ విధమైన కార్యములు చేయకూడదు. యేసు చనిపోయెను, మరియు దేవుని యొక్క తీర్పులు ఆయన యొక్క రక్తము ద్వారా చాలా గట్టిగా పట్టుకొనబడి ఉన్నవి. మీరు ఆ విధంగా చేయుకూడదు,” అని చెప్పాను.
ఆమె అన్నది, “లేదండి.” ఆమె చెప్పినది, “నా తండ్రి ఒక పెద్ద అయి ఉండెను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పెంచబడ్డాను. నేను నా భర్త సంఘ సభ్యులము మరియు క్రైస్తవ జీవితం జీవించాము. ఆమె చెప్పుటకు ప్రారంభించెను, అతని మరణం తర్వాత... ఆమె ఇద్దరు యవ్వన కుమార్తెలను కలిగి ఉన్నది, మరియు ఆమె సరియైన మార్గము నుండి తప్పిపోయెను. ఆ పిల్లలు ఆమెను ఎలా విడిచిపెట్టారో చెప్పెను, మరియు తన జీవితమును ఆమె దూరంగా విసిరేసుకొనెను. ఆమె కొరకు అక్కడ ఏ నిరీక్షణ లేదని అనుకొన్నది.
అయితే నేను అన్నాను, “దేవా, కరుణించుము! ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో, వారిని పిలిచెను.”
ఆమె అన్నది, “మీరు అక్కడ దిగువన ఉన్న గౌరవనీయులైన బ్రెన్హాం గారు కదా?”
నేను అన్నాను, “నేనే.”
ఆమె అన్నది, “నేను ఈ విధంగా ఇక్కడ కూర్చుని ఉండుటకు నాకు నేనే సిగ్గుపడుచున్నాను. అక్కడ నాకు మరొక అవకాశమున్నదని మీరు అనుకొనుచున్నారా?”
నేను చెప్పాను, “అమ్మా, యేసు తన చేతులు చాపి, నీవు వస్తావని కనిపెట్టుచున్నాడు.” మరియు మిగిలిన ప్రజలు బాధ్యత తీసికొనుటకు ప్రారంభించిరి. మరియు నేను చెప్పాను, “ఇక్కడకు మీరు నాతో పాటు ఈ నేలపై నడచి వచ్చెదరా?”
ఆమె చెప్పినది, “అయ్యా, నేను రాగలను.”
నేను ఆమెను చేతితో పట్టుకొని, నేను చెప్పాను, “మీరు నా తల్లి అంతటి వయస్సులో ఉన్నారు. ఇక్కడ నేల మీద నాతో పాటు మోకాళ్ళు మీద ఉందురా?” మరియు ఆ మధ్యాహ్నవేళ మేము అక్కడ నేల మీద కూర్చొని ఉండి, ఆ స్థలమును, పురాతన-కాలపు పద్ధతిలో వ్యధతో కుమిలిన కూటముగా చేసితిమి. ఆయన కృప ద్వారా, ఆ స్త్రీని దేవుడు రక్షించెను. ఆమె తనకు తానే దుస్తులు ధరించుకొని సమావేశమునకు వచ్చినది, నాకు తెలిసినంత వరకు, ఆమె ఈ రాత్రి ఒక క్రైస్తవురాలుగానే జీవించుచున్నది.
39
అది ఏమై ఉన్నది? ఓ, దేవుడు పరిపూర్ణతను కోరును. ఆయన నీ మారుమనస్సును కోరును. మీరు ఆయనకు విశ్వాసపాత్రులుగ ఉండవలెనని ఆయన కోరుచున్నాడు. అయితే ఈ రాత్రి ఆయన చూచుచున్నాడు. నీవు ఎంత ఎక్కువగా పాపము చేసియున్నను ఏమియు కాదు. ఎంత చిన్నదైనను, లేక ఎంత ఎక్కువగా ఉన్నప్పటికి, నీవు ఇంకా ఒక పాపివై ఉన్నావు, మరియు దేవుని యొక్క సమస్తమునకు చాలిన బలి అయిన, యేసుక్రీస్తు ద్వారా తప్ప లోనికి ప్రవేశించు మరొక మార్గములేదు. మరియు ఆయనయందు మీరు సదాకాలమునకు పరిపూర్ణులుగ ఉన్నారు. దానిని గూర్చి ఆలోచించండి! అది నీవు చేసినటువంటిది ఏమియు కాదు. అది నీవు కొత్త పేజీలు తిరగేయుట కాదు. అది నీవు ఒక క్రొత్త జీవితము ప్రారంభించుట కాదు. అది నీ పొరపాటు యొక్క ఒప్పుకోలై ఉన్నది, మరియు నీకు దేవుని యొక్క కృప అయి ఉన్నది. అది నిన్ను పరిపూర్ణతకు తీసుకొని వెళ్ళును, మరియు అప్పుడు నీవు యేసుక్రీస్తునందు పరిపూర్ణుడవుగా ఉంటావు.
40
ఈ రాత్రి ఇప్పుడు ఇక్కడ నా యొక్క స్నేహితుడా, మనం ఈ కథ విన్న తర్వాత తీర్మానములు తప్పకుండా చేయవలెను. నీవు దీనిని ముందు ఎన్నడూ వినియుండకపోవచ్చును. అయితే లోనికి వచ్చిన అదే వ్యక్తిగా ఆ ద్వారాలలో ఒక దానిలో నుండి నీవు బయటకు వెళ్ళలేవు, నీవు తప్పకుండా చాలా మంచివానిగా లేక చాలా చెడ్డవానిగా బయటకు వెళ్ళవలెను.
మనము ఒక్క క్షణము మన తలలు వంచుచుండగా, మీరు దీనిని గూర్చి ఎంతో ఎక్కువగా ఆలోచించాలని నేను కోరుచున్నాను. ఈ రాత్రి సమయంలో మీ ఆత్మను గూర్చి ఏమిటి? యేసుక్రీస్తు మీ కొరకు చనిపోయాడు.
41
“సహోదరుడా, బ్రెన్హాం , నేను ఎప్పుడు ఈ సిగరెట్లను మానివేస్తానో, నేను ఎప్పుడైతే మద్యమును తీసికొనుట మానివేస్తానో, నేను ఎప్పుడైతే ఈ సంగతిని సరిచేసుకొనగలనో, అప్పుడు నేను చేయగలను.” ఓ, అది ఎన్నడూ సరిచేయబడదు. వారు దానిని ఏనాడు దానిని చేయలేరు. మీరు ఉన్నపాటుననే ఎందుకు ప్రవేశించకూడదు? విశ్వాసము ద్వారా, ఆ మార్గములోనికి ఆ ప్రవాహము నొద్దకు వెళ్ళుము, ఆయన నుండి ప్రవహించుచున్న గాయములే మీకు స్వస్థతను సరఫరా చేయును. అప్పుడు విమోచన ప్రేమయే నీకు ఇతివృత్తమగును. మరియు నీవు మరణించువరకు అది అలాగే ఉండగలదు.
ఒక ప్రత్యామ్నాయమును ఎందుకు తీసుకొందురు? మీ సంఘం ద్వారా మీరు లోపలకు ప్రవేశించుటకు ఎందుకు ప్రయత్నించుచున్నారు? మీరు త్రాగుడును మానివేసి, లేక అబద్దమాడుట మానివేసి, మీరు లోపలకు వచ్చుటకు ఎందుకు ప్రయత్నించుచున్నారు? పరిపూర్ణమైన మార్గము ద్వారా లోపలకు రండి! “పరిశుద్ధ పరచబడిన వారిని ఒక్క అర్పణ ద్వారా, ఆయన సదాకాలము పరిపూర్ణులుగా చేసియున్నాడు.”
“నేను ఏ విధంగా శుద్ధీకరింపబడగలను?”
42
యేసు రక్తము యొక్క సన్నిధిలో మీ యొక్క పాపములు ఒప్పుకొనుడి; ఆ రక్తము ద్వారా వచ్చిన జీవము, ఆరాధికుని యొద్దకు తిరిగి వచ్చి అతనిని లోక సంగతుల యొక్క కోరికల నుండి శుద్ధీకరించును. సరిపోయినంత అర్పణ ద్వారా ఆయన మనలను శుద్ధీకరించియున్నాడు. ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికి మనమందరము బాప్తిస్మము పొందియున్నాము. ఇప్పుడు, “క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. శరీరానుసారముగ నడువక, ఆత్మానుసారముగ
నడచువారికి ఏ శిక్షావిధియులేదు.“ మీరు ఆత్మ ద్వారా నడచుటకు ప్రయత్నించుచు, ఇప్పటికీ శరీర కోరికలతో ఉన్నట్లైతే, ఆ అర్పణ చాలినంతగా మీకు అన్వయించబడదు. కాని ఆరాధికుడు ఒక్కసారి శుద్ధీకరింపబడుట ద్వారా పాపము యొక్క కోరిక ఇక ఉండదు.
43
అదియే కల్వరి. అది పూలు అమ్మే స్థలము కాదు, అది లేక ఇది చేయుటకు ఒక చిన్న స్థలము కాదు. అది దేవుడు మరియు మానవుడు తిరిగి సమాధానపరచుకొనే ఒక స్థలము. అది మానవాళికి శాంతి మరియు పరిపూర్ణమైన భద్రతను తెచ్చినటువంటి స్థలము. పాపివైన నా స్నేహితుడా, ఈ రాత్రి సమయములో, నాతో పాటు కల్వరి యొద్దకు రాగలవా? విశ్వాసము ద్వారా ఈ రక్తమును నీ యొక్క సొంత ఆత్మకు అన్వయించుకొనుము, మరియు ఆయన యొక్క గొప్ప అర్పణ ద్వారా, పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను శుద్ధీకరించుటకు నీవు అనుమతించెదవా?
మనం ప్రార్ధించుకొనుటకు ముందుగా, దేవునివైపు మీ చేతులెత్తి, ఇలా చెప్పండి, దేవా నన్ను కరుణించుము, ఈ మంచి శుక్రవారం రాత్రి సమయంలో, ఇప్పుడు నేను నా సమస్త పాపములు ఒప్పుకొనుచున్నాను. క్రీస్తు నా కొరకు పొందిన ఆ గొప్ప బాధను నేను ప్రశంసించుచున్నాను. నేను ఇప్పుడు నా సొంత చిత్తమును, నా సొంత ఉద్దేశ్యములను మరియు ప్రతి సంగతియు, ఈ రోజు నుండి, ఈ సమయము నుండి నిన్ను వెంబడించుటకు, స్వాధీనంచేసి అప్పగించుకొనుచున్నాను. మీ చేయిని పైకెత్తగలిగితే, ఇలా చెప్పండి, “బ్రెన్హాం సోదరుడా, ప్రార్ధనలో, నన్ను జ్ఞాపకముంచుకొనండి. అది నా హృదయము యొక్క తీర్మానమై ఉన్నది.” ఈ గొప్ప రాత్రి సమయంలో కేవలం ఒక క్షణము కనిపెట్టుచుండగా, అక్కడ ఏదైనా కలదా? నిశ్చయముగా, ఇక్కడే నా కుడిభాగమువైపు ఒకాయన ఉన్నాడు. మీ పాపముల గూర్చి మీరు సిగ్గుపడుతున్నారా? మీరు ఏం చేస్తున్నారో దానికొరకు మీరు సిగ్గుపడుచున్నారా?
44
ఈ రాత్రి ప్రపంచం కధానాయకుల కొరకు చూస్తుంది. భౌతికంగా మాట్లాడుకొన్నట్లైతే, అది కధానాయకులను కలిగి ఉన్నది.
ఒక రోజున దూరాన స్విట్జర్లాండ్ లో, స్విట్జర్లాండ్ కష్టాల్లో ఉండగా, రక్షణకు వారి ఆర్ధిక పొదుపు సంరక్షణకు, ఆ చిన్న స్విస్ పార్టీ బయట పొలాలలో సమావేశమయిరి. వారిని ఎదిరించుటకు ఆ రానున్న గొప్ప సైన్యము చాలా పెద్దదిగా ఉండెను; వారందరు శిక్షణ పొందినవారు, పెద్ద బరిసెలు మరియు డాలును కలిగి ఉన్నారు. ఆ స్విస్ వారు ఏమియు చేయలేకపోయారు, ఆశను వదిలేశారు. వారు ఒక పర్వతము వెనుకకు వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక కధానాయకుడు బయటకు అడుగుపెట్టెను. ఎవరో ఒకరు చనిపోవలసి ఉన్నది. మరియు వారు పోరాటమును కోల్పోయినట్లైనయెడల.....
45
వారికేమియు లేవు, అయితే పురాతనకాలపు కొడవళ్ళు మరియు రాళ్ళు, కర్రలు పోరాడుటకు ఉన్నవి. అప్పుడు, ఆ వచ్చుచున్న సైన్యము ఒక ఇటుకలతో కట్టబడిన గోడవలె కనిపించెను. వారు తీసుకొనిపోబడినయెడల, వారు ప్రేమించిన వారి చిన్నభార్యలను, పట్టుకొని లాక్కొని పోవుదురు, వారి యవ్వన బాలికలను పట్టుకొని లాక్కొని పోవుదురు, వారి బిడ్డలు చంపబడి ఉందురు, వారి తలలు బద్దలై ఉండును. వారి గృహములను పోగొట్టుకుందురు, ప్రతిదీ పోగొట్టుకొనెదరు.
అప్పుడు సులువుగా మరిచిపోయే, ఆర్నోల్డ్-వన్-వింకిల్-రీడ్ అను పేరు గల ఒక మనిషి అక్కడ ఉండెను. అతడు బయటకు అడుగుపెట్టి, ఇలా చెప్పెను, “స్విట్జర్లాండ్ మనుష్యులారా, ఈ రోజు స్విట్జర్లాండ్ కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.” అతడు మరలా ఇలా చెప్పాడు, “ఈ పర్వతం పైన దూరాన ఒక చిన్న తెల్లని గృహము కలదు. నాకు ఒక భార్య మరియు ముగ్గురు పిల్లలు నా కొరకు ఎదురుచూస్తున్నారు. అయితే వారు నన్ను మరలా ఎన్నడూ చూడరు, ఎందుకనగా ఈనాడు నేను స్విట్జర్లాండ్ కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.”
వారు చెప్పారు, “ఆర్నోల్డ్-వన్-వింకిల్-రీడ్, నీవు ఏమి చేయగలవు?”
అతడు చెప్పాడు, “నన్ను వెంబడించండి, మరియు మీరు చేయుటకు ఏమి కలిగి ఉన్నారో, మీరు చేయగల అత్యుత్తమమైనది చేయండి.”
46
అతడు గుబురుగా ఉన్న చెట్ల సముదాయములో బరిసెలు కనుగొను వరకు అతడు సైన్యమును చూచెను. అప్పుడు అతడు అతని చేతులను గర్వముగా గాలిలోనికి ఎత్తెను. అతడు ఆ పెద్ద ఇటుకల గోడవలె ఉన్న బరిసెలు వైపుగా పరుగెత్తి, బిగ్గరగా కేకవేయుచుండెను, “స్వేచ్ఛ కొరకు మార్గము ఏర్పరచుడి! స్వేచ్ఛ కొరకు మార్గము ఏర్పరచుడి!” అతనిని స్వాధీనము చేసికొనుటకు ఒక వంద బరిసెలు త్రిప్పబడెను; అతడు అతని చేతులను బయటకు విసరి, అతని సొంత రొమ్ములో వాటిని గుంపుగా పట్టుకొని, వానిని క్రిందకు గుచ్చగా, అతడు ఆ బరిసల కొనమీద చనిపోయెను. ఆ స్విస్ వారు అతనిని దుడ్డు కర్రలు మరియు కర్రలతో వెంబడించెను. ఆ గొప్ప కధానాయకుని యొక్క ప్రదర్శన ఆ స్విస్ వారు వారిని ఆ స్థలంలో నుండి తరిమికొట్టేవరకు, ఆ సైన్యమును దారి పట్టించెను. మరియు అప్పటి నుండి, వారికి ఎన్నడూ ఒక యుద్ధము కూడా లేకుండెను.
47
స్విట్జర్లాండ్లో నిలబడి ఆర్నోల్డ్-వన్-వింకిల్-రీడ్ పేరు చెప్పగానే, వారి బుగ్గల మీద నుండి కన్నీళ్ళు క్రిందపడుట మీరు చూడగలరు. ఎందుచేత? అతడు వారి దేశమును రక్షించెను. అది ఒక ఘనమైన కధానాయకుని యొక్క కార్యము. అది తరచుగా ఒక పోలికగా చూసినయెడల, ఎన్నడూ ఈ భూమి మీద దానిని మించినది లేదు.
అది ఒక రోజున జరిగిన ఒక చిన్న సంగతి అయి ఉండెను! ఆదాము జాతి నిలబడి ఉండగా, ప్రతివైపు నుండి దయ్యాలు కవాతు చేయుచుండెను. ప్రవక్తలు ఓడిపోయెను. ధర్మశాస్త్రం విఫలమాయెను. ఎద్దులు, గొర్రెల యొక్క బలులు విఫలమాయెను, మానవ స్వభావం విఫలమాయెను, ప్రతీది విఫలమాయెను. మరియు ఆదాము యొక్క చిన్న జాతి నిలబడి, ఓడిపోయెను; దయ్యాలు చాలా ఎక్కువ సంఖ్యలో భూతవైద్యులు ద్వారా వ్యాధులు, రోగాలతో ఉండెను. అక్కడ పరలోకములో నుండి ఒకాయన అడుగుపెట్టెను, మరియు ఆయన చెప్పెను, “ఈ రోజు ఆదాము సంతతి కొరకు నేను చనిపోవుదును.” ఆయన భూమి మీదకు వచ్చెను మరియు ఆయన శరీరధారి ఆయెను. బరిసెలతో అంధకారమైన వాటి మధ్య ఆయన క్రిందకు చూచెను. గాడాంధకారమైన సమస్త మానవాళి భయము, మరణమై ఉండెను, ఆయన మరణమును ఆయన రొమ్ములోనికి తీసికొనెను. మరియు ఆయన కల్వరి మీద బలిని చెల్లించెను, మరియు ఆయన కేకవేసెను, “స్వాతంత్య్రము కొరకు ఒక మార్గము ఏర్పరచుడి!”
48
ఆయన తన సంఘము కొరకు బిగ్గరగా కేకవేసెను, “నేను మీ కొరకు ఏది విడిచిపెట్టానో, దానిని చేపట్టుడి, నా రక్తము మరియు నా ఆత్మ మీరు పొందేదాని కొరకు పోరాడును.” స్నేహితుడా దానిద్వారా, ఈ రాత్రి సమయంలో మనము గెలవగలము. మీరు దయ్యమును మీ యొద్ద నుండి పారద్రోలగలరు. అలా నీ జీవితంలో ఉన్న ప్రతీ పాత శతృవును, క్రీస్తు యొక్క రక్తము మరియు క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా పారద్రోలగలము. మరియు మీరు ఆయన సన్నిధిలో పరిపూర్ణులుగా నిలువగలరు. క్రీస్తు మార్గమును ఏర్పరచెను!
మీరు మీ చేతులను ఎంతవరకు ఎత్తగలరో అంతవరకు ఆయనవైపు ఎత్తి, “నన్ను క్షమించండి,” అని చెప్పండి, సహోదరుడా, దేవుడు మిమ్మును దీవించును. మరొకరు ఎవరో, “నాపై కనికరము చూపుము, దేవా, ఇప్పుడు నేను నా యొక్క పొరపాట్లు ఒప్పుకొనుచున్నాను,” అని చెప్పుచున్నాడు.
ప్రతీ దినము సంఘానికి వెళ్ళుచున్న కొందరు నులివెచ్చని సంఘ సభ్యులు ఎవరైనా ఉన్నట్లైతే, వారు ఎంత భక్తిగా ఉండాలో అంత భక్తిగా ఉండుటకు ప్రయత్నించి ఉండవచ్చును. అయితే ఇంకా కోపము, విభేదములు మరియు స్వార్ధమువంటి అలవాట్లు నిన్ను అంటిపెట్టుకుని, నీవు విజయం పొందలేనంతగా ఉన్నాయని నీకు తెలియునా? ఈ రాత్రి, ఆ సమస్త పాపమంతటి నుండి, రక్తము ద్వారా కడగబడాలని నీవు కోరుకొంటున్నావా? “ఎందుకనగా ఒక్కసారి శుద్దీకరించబడిన తరువాత ఆరాధికునికి పాపజ్ఞప్తి ఇక ఉండదు...” సంఘ సభ్యుడవైన నీవు, నీ చేయిని ఎత్తుటకు ఇష్టపడుదువా? అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. మీ చేతులు పైకెత్తి ఇలా చెప్పండి, “బ్రెన్హాం సహోదరుడా, ప్రార్ధనలో నన్ను జ్ఞాపకము చేసుకోండి.” అమ్మా, దేవుడు నిన్ను దీవించును. అది సరియైనదే. అది ఒక నిజమైన... అది చేయుటకు ఒక మంచి కార్యమై ఉన్నది. అయ్యా, అక్కడ వెనుక ఉన్న నిన్ను దేవుడు దీవించును గాక.
49
వేరొకరు ఎవరైనా మీ చేతిని ఎత్తి, ఇలా చెప్పండి, “దేవా, నాపై కనికరము చూపండి. నేను క్రైస్తవుడనని నాకు తెలియునని ఒప్పుకొనుచున్నాను, అయితే దాని ప్రకారము జీవించుటలేదు. నేను అలా చేయుటలేదని నాకు తెలుసు. మరియు నా హృదయములో, నేను నిజముగా మీతో యధార్ధంగా లేను. నేను దేవుని ఎన్నికలో ఒకనిగా ఉండగోరుచున్నాను. నేను నా హృదయంలో అలా ఉన్నానని భావించాను, కాని నేను ఏనాడూ నన్ను సుళువుగా చిక్కులు పెట్టుచున్న భారములను ప్రక్కకు పెట్టలేదు. మరియు ఈ రాత్రి నేను వాటిని ప్రక్కకు పెట్టగోరుచున్నాను. నేను దేవుని కృప ద్వారా అది చేయగలను. నా కొరకు ప్రార్ధించండి.” మీరు మీ చేయి ఎత్తుదురా? అమ్మా, దేవుడు నిన్ను దీవించును. మరొకరు ఎవరో కొంచెం సమయం, మేము కనిపెట్టుచున్నాము.
మనం ప్రశాంతంగా కనిపెట్టుచుండగా, ఇప్పుడు ప్రతిఒక్కరూ ప్రార్ధనలో మీ తలలను వంచి ఉండగా, ఇప్పుడు దీనిని మృదువుగా ఆలాపన చేయండి.
రక్తముతో నిండిన ఊట అక్కడ ఉన్నది,
ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి ప్రవహించుచున్నది,
మరియు పాపులు ఆయన క్రింద మునుగుదురు...
వారి సమస్త పాపములతో కూడిన
మచ్చలను పోగొట్టుకుందురు...
మీరు కేవలం ఇప్పుడే దానిని గూర్చి ఆలోచించరా? దానిని కడుగుకొనుటకు ప్రయత్నించరా? క్రీస్తు మీ చేతులపై ఉన్నాడు.
ఈ ఉదయ౦ వేళ, ఆరు గంటలకు పిలాతు దానిని (కడుగుకొనుటకు) ప్రయత్నించెను; అయితే అతని యొక్క చేతులు ఇంకా రక్తముతో నిండినవై, దోషసహితమైన రక్తముతోనే ఉన్నవి; అతనికి ఏమి సంభవించిందో నీకు తెలుసు. అనేక సంవత్సరాల తర్వాత అతడు స్విట్జర్లాండ్ కు వెళ్ళాడు. అతడు తన మనస్సును కోల్పోయి, ఒక నీటి మడుగులోనికి దూకి మరణించాడు. ఈ ఉదయవేళ, స్విట్జర్లాండ్ లో, వందలకొంది ప్రజలు ఆ దృశ్యమును గమనించుటకు వెళ్ళెదరు, ఆ నీటి అడుగున ఉన్న పెద్ద రంద్రము నుండి నీలం రంగు నీటిపైకి వచ్చి మరుగుచుండును. ప్రతీ సంవత్సరం వారు అలా చేయుదురు. అది పురాతనమైన ఇతిహాసము, అతడు చేతులు కడుగుకొనుటకు దేవుడు ఆ నీటిని తిరస్కరించాడు, అని అలా వారు చెప్పుదురు.
50
సహోదరుడా, ఎన్నిసార్లు నీవు బాప్తిస్మము పొందినను ఏమి కాదు, నీవు ఏమి చేయప్రయత్నించినను, యేసుక్రీస్తు యొక్క రక్తము తప్ప మరేదియు నీ చేతులను శుభ్రము చేయలేదు. దేవుడు దానిని తిరస్కరించాడు. మరియు ఆ నీలపు నీరు రెండువేల సంవత్సరాల తర్వాత కూడా, దాదాపుగా, ఇంకా మరుగుచునే ఉన్నది. దేవుడు దానిని తిరస్కరించాడు. నీ యొక్క సొంత-నీతి నీ పాపములను శుభ్రము చేయలేదు. ఏదియు లేదు, అయితే యేసు రక్తమే! ఇప్పుడే దానిని గూర్చి ఆలోచించుము. కేవలం ఒక క్షణము, మనం ప్రార్ధించుకుందాము.
నేను ఒక దానిని గూర్చి ఈ రాత్రి సమయంలో అడుగుటకు ఆశ్చర్యపోవుచున్నాను. ఈ ఉదయవేళ అక్కడ ఆయన పిలాతు యొక్క తీర్పు హాలులో నిలబడి ఉన్నప్పుడు, ఆయన ఇలా చెప్పుచున్నాడు, “నా యొక్క రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే, నా తండ్రితో మాట్లాడుదును. ఆయన స్వయంగా పన్నెండు వ్యూహముల దూతలను పంపును.” అప్పుడు వాటిలో ఒక దూత లోకమును నాశనము చేయుగలదు. “నా తండ్రితో మాట్లాడినట్లయితే, ఆయన పన్నెండు వ్యూహముల దూతలు నా కొరకు పంపును.” ఆయన అలా చేసియుండును. కాని ఆయన అక్కడ సాత్వీకునిగా తన్నుతాను తగ్గించుకొని, నీ యొక్క పాపములను మరియు నీ యొక్క మరణమును తీసుకొనుటకు నిలచియున్నాడు.
51
మీరు ఈ రాత్రి సమయంలో, ఆ అర్పణ నిమిత్తమై చాలినంతగా కృతజ్ఞతను కలిగి ఉన్నారా? మీరు దాని అవసరతను పొందవలసి ఉన్నది, మరియు మీకు దేవుని యొక్క దీవెనలు అవసరమై ఉన్నాయి, ప్రార్ధన కొరకై మీ పాదములపై నిలబడగలరా? ఈ ప్రార్ధనలో (మమ్ములను) జ్ఞాపకము చేసుకోవాలని కోరుకునే మీరు కేవలం మీ పాదాలపై నిలబడండి, ఇలా చెప్పండి, “దేవా, నేను అపరాధిని. దేవా, నాపై కనికరముంచండి.” నేను పొరపాట్లు చేశాను. మరియు ఇప్పుడు నేను నా యొక్క క్షమాపణను క్రీస్తు యేసు ద్వారా అంగీకరించుచున్నాను. ఈ సమయంలో కేవలం మీరు మీ పాదములపై నిలచి ఉండి ఇక్కడకు రాగలరా? యవ్వనస్తురాలైన స్త్రీ, దేవుడు నిన్ను దీవించును. అదియే ధైర్యము. అక్కడ అలా నిలచి ఉండండి.
52
మీరు మీ చేతిని ఎత్తి మీ పాదములపై నిలువబడుటకు చాలినంత యధార్ధతను కలిగిలేరని నాకు చెప్పుట మీ ఉద్దేశ్యమా? నీకు ఈ సువార్త ఏ మంచి చేసినది? ఓ, ఆ విధముగా సంఘముతో ఆటలాడుట మరియు దేవునితో ఆటలాడుట! ఆ సమయము సమీపముగా ఉన్నది, ఈ దినములలో ఏదో ఒక దినమున ఈ గొప్ప పవర్ ప్లాంటులలో ఒకటి ఇక్కడ ఎక్కడో ఒక ప్రాంతమును ఒక అణుబాంబు తాకును. అది మీరు ఆలోచించుటకు ముందే ఒక ఘడియలోనే జరుగవచ్చును. అప్పుడు అది అప్పటికే ఆలస్యమగును. మరియు అది తర్వాత ఈస్టరుకు ముందు కావచ్చును లేక ఈ ఈస్టరు కావచ్చును. ఇప్పుడు, నీవు నిలబడి చెప్పవా, “దేవా! నేనొక పాపిని, నన్ను కరుణించండి. నేను క్రీస్తును, నా యొక్క పాపములకు పరిహారముగా ఆయనను నేను అర్పించుచు ఇప్పుడే అంగీకరించుచున్నాను. మరియు ఆయన కృప వలన, మరియు ఆయన కృప మాత్రమే, నేను దేవుని సన్నిధిలో దాగియుందును.” మీరు మీ పొరపాట్లను ఒప్పుకొనరా? తన పాపములను దాచుకొనువాడు వర్ధిల్లడు. తన పాపములను ఒప్పుకొనువాడు, కనికరము పొందును. అది మీకు సంబందించినది, ఆయన గమనించుచున్నాడు.
53
ఇప్పుడు, దీవించబడిన మా దేవా, ఈ రాత్రి సమయంలో వరుస సంఖ్యలో ప్రశంసించబడిన, పశ్చాత్తాపము కలిగి మూడు ఆత్మలు నిలువబడి ఉన్నవి, ఒక పురుషుడు మరియు ఇద్దరు స్త్రీలు.
నేను ఆలోచిస్తున్నాను, కల్వరి యొక్క ప్రభువా, ఒక వైపున ఉన్న ఒకడు చెప్పెను, “నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము.” మరొకడు చెప్పెను, “అది నీవే అయితే, మేము ఒక అద్భుతమును చూడనివ్వండి, మమ్మును సిలువ నుండి దించి, మిమ్మును మీరు రక్షించుకొనండి.” మరియు మరొకడు చెప్పెను, “దేవా, నన్ను కరుణించుము.” మీరు మీ తలను కుడివైపుకు త్రిప్పి ఇలా చెప్పారు, “నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు.” కాని మీరు ఇంకొకనితో మౌనంగా ఉండిపోయారు, ఎందుకనగా అక్కడ మారుమనస్సు లేదు.
తండ్రియైన దేవా, నేను వీరి కొరకు ప్రార్ధించుచున్నాను... ఈ భవనంలో కేవలం ముగ్గురు మాత్రమే తమ పాపములను ఒప్పుకొనవలెనని, వారు అవసరతలు కలిగి ఉన్నారని, అలా భావించుచున్నారని నేను నమ్మగలను. అయితే వారు అన్నిటికీ చాలినంత మార్గము వైపు, కల్వరి మార్గమునకు వచ్చారు. ప్రభువా, వారిని క్షమించండి, మరియు వారిని దీవించండి. వారు ఈ రాత్రి ఇక్కడ నిలబడ్డారు; మీరు పిలాతు తీర్పు హాలులో, వారి కొరకు నిలబడ్డారు; వారి కొరకు భూమ్యాకాశములకు మధ్య మీరు నిలబడి ఉండగా, సూర్యుడు అదృశ్యుడాయెను, చంద్రుడు తన కాంతిని ఇయ్యలేదు, దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగెను. దేవా, మీరు వారిని దీవించండి, వారికి మీ యొక్క కనికరమును అనుగ్రహించండి, వారిని మీ రక్తముతో కడుగవలెనని, నేను ప్రార్ధించుచున్నాను. యేసుక్రీస్తు అను మీ సొంత కుమారుని శరీరములో నుండి, శుద్ధీకరించు మీ శక్తి ద్వారా వారికి బాప్తిస్మము ఇవ్వండి, అప్పుడు వారు కాలము మరియు నిత్యత్వము కొరకు ఎటువంటి అపాయం లేకుండా జాగ్రతగా ఉంచబడి ఉందురు, వారు సరిగ్గా ఉన్నామని భావించు మిగతా వారిని దీవించండి, అలా వారు ఇదివరకే దీనిని పొంది అలా చేశారు. నేను యేసుక్రీస్తు నామములో, వారికి ఈ ఆశీర్వాదము కొరకు ప్రార్ధించుచున్నాను. ఆమెన్.
54
దేవుడు నిన్ను దీవించును గాక. నిలబడి ఉన్నవారికి సమీపముగా నిలచి ఉన్న మీరు, వారిని సమీపించి వారి చేతులతో కరచాలనము చేసి, ఎవరైనా ఒకరికి ఇలా చెప్పండి, “ప్రభువు మిమ్మును దీవించును గాక,” చేయిని ఇవ్వండి, అదే సహవాసము అదే సరియైనది.
ఇప్పుడు మనం మన ఆరాధనలో కొద్దిగా ఆలస్యం చేశాము. ఎంత మంది ప్రభువైన యేసును ప్రేమించుచున్నారో, మీ చేయి పైకెత్తండి? ఇప్పుడు ఈ నిశ్శబ్దములో, లేక సర్వవ్యాపి అయిన ఆయనను గూర్చిన ఉత్సవములో, కేవలం మనము నెమ్మదిగా ఉండగలము, ఇక్కడ ఈ రాత్రి, మనం మృదువుగా పాడుచున్న యెడల, నేను ఆశ్చర్యపోవుచున్నాను:
సిలువ చెంత ఎక్కడైతే నా రక్షకుడు మరణించెనో,
అక్కడ పాపముల నుండి కడుగు చోట నేను ప్రలాపించితిని;
నా హృదయము నొద్ద (మీ ఆ అవసరతను తీర్చినప్పుడు,
నీ చేతులు దానిపై పెట్టి), నా హృదయమునకు
రక్తము ఆపాదించబడెను;
ఓ, ఆయన నామమునకు మహిమ!
ఇప్పుడు, నెమ్మదిగా, మీరు తలలు వంచండి.
సిలువ చెంత ఎక్కడైతే నా రక్షకుడు మరణించెనో,
అక్కడ పాపముల నుండి కడుగు చోట నేను ప్రలాపించితిని;
నా హృదయము నొద్ద (మీ ఆ అవసరతను తీర్చినప్పుడు,
నీ చేతులు దానిపై పెట్టి), నా హృదయమునకు
రక్తము ఆపాదించబడెను;
ఆయన నామమునకు మహిమ!
ప్రశస్తమైన ఆయన నామమునకు మహిమ!
ప్రశస్తమైన ఆయన నామమునకు మహిమ!
అక్కడే నా హృదయమునకు రక్తము ఆపాదించబడెను;
ఆయన నామమునకు మహిమ!
55
ఇప్పుడు, నెమ్మదిగా, మీరు తలలు వంచండి. రక్షించబడిన మీరు, చెప్పండి, “ఓ...” ఇప్పుడు మీ చేయి పైకి ఎత్తండి.
ఓహ్, అలా పాపము నుండి రక్షించు ప్రశస్తమైన ఊట!
నేను దానిలోనికి ప్రవేశించినందుకై నేను ఎంతో సంతోషించి యున్నాను;
అక్కడ యేసు నన్ను రక్షించును మరియు నన్ను శుద్ధునిగా ఉంచును;
ఆయన నామమునకే మహిమ!
ప్రశస్తమైన ఆయన నామమునకు మహిమ!
ప్రశస్తమైన ఆయన నామమునకు మహిమ!
అక్కడే నా హృదయమునకు రక్తము ఆపాదించబడెను;
ఆయన నామమునకు మహిమ!
ఇప్పుడు మీ చేతులను క్రిందకు ఉంచి, మీ తలలు వంచండి. నేను ఇప్పుడే ఆలోచించాను: ఎవరో ఒక వ్యక్తి కొన్ని క్షణముల క్రితము, ఎవరో, వారి శరీరము కొరకు, ఈ రాత్రి ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకోమని చెప్పారు. ఆ గొప్ప స్వస్థత కూటమునకు, ఆదివారం రాత్రి కూటమునకు వెనుకకు తిరిగి రాలేదు. ఇప్పుడే ఆ ప్రార్ధనలో జ్ఞాపకముంచుకొనవలెనని కోరు మీరు, మీ పాదములపై నిలబడి ఉందురా?
.... నా హృదయమునకు రక్తము ఆపాదించబడెను;
ఆయన నామమునకే మహిమ!
మహిమ..................
56
ఇప్పుడు మీ తలలు వంచండి. “మీ అపరాధముల నిమిత్తమై ఆయన గాయపరచబడెను, మీ యొక్క దోషముల నిమిత్తము నలుగగొట్టబడెను. మీ యొక్క సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగినది.” ఆయన నామమునకే మహిమ!
ఇప్పుడు దీవించబడిన తండ్రీ, ఇప్పుడు మేము దీనత్వముతో సిలువను సమీపించుచుండగా, నన్ను ఏ చోట కృప మరియు కరుణ కనుగొనెనో, అక్కడ ప్రకాశించుచున్న ఉదయ నక్షత్రము దాని కాంతి కిరణాలు నా చుట్టూ ప్రకాశించినవి. ఈ వ్యాధిగ్రస్తులు నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు. వారు ఇప్పుడే అలా విశ్వాసము చేత నమ్ముచున్నారు, వారు దూరమున ఆ వెనుక ఉన్న ఆ కొట్టబడిన రాయివైపు చూస్తున్నారు. “మరియు ఆయన పొందిన దెబ్బలవలన మనము స్వస్థత పొందాము.” అత్యంత పరిశుద్ధుడువైయున్న తండ్రి, మేము మా విశ్వాసమును ఒప్పుకొనుచూ వచ్చుచున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు ఇతరుల కోసం ఆయన అనుభవించిన ఆ గొప్ప బాధల ద్వారా, అలా వ్యాధిగ్రస్తమైన మా శరీరములను మీరు స్వస్థపరచుదురని నమ్ముచున్నాము. విశ్వాస సహితమైన ప్రార్ధన ద్వారా, వ్యాధిగ్రస్తులను రక్షించునని మీరు వాగ్దానం చేశారు. ఈ నిలబడి ఉన్న ప్రజల కొరకు మేము సమర్పణ చేసుకొనుచున్నాము. ఈ రాత్రి మేము, మీతో కలిసి విశ్వాసము యొక్క ఒక భాగముగా ఉన్నాము. మీరు చెప్పారు, “ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉందురో, వారి మధ్య నేను ఉందును.” అలా ఏదో అంతరంగం అడుగున లంగరు వేయగలదు, ఇప్పుడు వారి అంతరంగంలో ఉన్న కృప వారిని తాకేటట్లు, మేము వారి కనికరము కొరకు అడుగుచున్నాము. వారు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడని, వారితో ఆయన మాట్లాడెనని ఎరుగుదురు, ఆయన ఇలా చెప్పుచున్నాడు, “నా బిడ్డా, నేను దూరాన కల్వరి యొద్ద నీ వ్యాధిని తీసివేశాను. ఇప్పుడు కేవలం నీ సమస్త చింతలు నా మీద వేయుము, ఎందుకనగా నేను మీ కొరకు చింతించుచున్నాను.” మరియు ప్రతి అనువు స్వస్థపరచబడును గాక, ఎందుకనగా మేము యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
57
ఇప్పుడు వారు కూర్చుని ఉండగా, వారికి దగ్గరగా ఉన్న ఎవరైనా ఒకరు, ఎవరో అలా వారి కొరకు ప్రార్ధించుచుండగా, మీ చేతులు వారి మీద ఉంచండి. బైబిలు చెప్పెను, “వారు వ్యాధిగ్రస్తుల మీద చేతులుంచుదురు; అప్పుడు వారు బాగుపడుదురు.” ఆ ప్రభువే దీవించును.
58
నేను పొరబడకపోయినట్లైతే, రెండు రోజుల క్రితం, లేక రెండు ఆదివారాల క్రితం అనుకొంటా, చెవిటివాడైన లేక చెవిలో ఏదో ఉండి స్వస్థత పొందిన ఆ మనుష్యుని నేను ఇప్పుడు చూచుటలేదా? ఈ రాత్రి కూటములో ఆనందించుచున్న మిమ్మును చూచుచున్నాను. ఇప్పుడు మీరు సరిగా వినగలుగుచున్నారా? అది మంచిది. అద్భుతమైనది! కేవలం ఒక్క క్షణం పాదాలపై నిలబడండి. ఇక్కడ అతడు ఉండుటను ఎంత మంది జ్ఞాపకము చేసుకున్నారు? అతడు ప్రార్ధనా వరుసగుండా వెళ్ళియున్నాడు, అతనిని వేదిక వెనుకకు తిరిగి తీసుకు వచ్చారు. ప్రభువు వానిని స్వస్థపరచెను మరియు వానిని బాగుచేశాడు. ప్రభువు నిన్ను దీవించును గాక! సహోదరుడా, మీ యొక్క సాక్ష్యము నిమిత్తమై మీకు వందనములు. అది డజనుల మంది ద్వారా కావచ్చును! అయితే ఆయన ఆశ్చర్యకరుడుకాడా?
59
ఇప్పుడు, మేము మిమ్మును, రేపు రాత్రికి ముందుగా చూడవలెనని కోరుచున్నాము. ఆదివారము ఉదయానే, ఆదివారము మధ్యాహ్నము, మరియు ఆదివారము రాత్రికి స్వస్థతా ఆరాధన కొరకు మీరు తిరిగి రాగలిగినయెడల చూడగలము. మనము కలుసుకొను వరకు, మనం నిలచి మనలను బయటకు పంపివేయు పాటను (వీడ్కోలు పాట) పాడెదము. “యేసు నామమును నీతో తీసుకొని వెళ్ళుము.”
యేసు నామమును నీతో తీసుకొని వెళ్ళుము,
వేదన మరియు దుఃఖములతో నిండిన బిడ్డా,
అది నీకు సంతోషమును మరియు ఆదరణ....
(ఇప్పుడు కుడివైపుకు తిరిగి
ప్రతి ఒక్కరితో కరచాలనము చేయండి.)
నీవు వెళ్ళు ప్రతి చోటుకు దానిని తీసుకొని పొమ్ము.
ప్రశస్తమైన నామము, (కుడివైపుకు తిరిగి
కరచాలనం చేయండి), ఓ, ఎంత మధురము!
భూలోకపు నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము;
ప్రశస్తమైన నామము, ప్రశస్తమైన నామము.
ఓ, ఎంత మధురము! ఎంత మధురము!
భూలోకము యొక్క నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.
ఇప్పుడు ఈ వైపుగా చూడుము.
యేసు నామమునకు వంగుచూ,
ఆయన పాదముల యొద్ద సాగిలపడుచు,
పరలోకంలో రాజుల రాజైన
ఆయనకు మనం కిరీటము ధరింపజేసెదము,
మన ప్రయాణము సంపూర్తి అయినప్పుడు మాత్రమే.
ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురము!
ఓ, ఎంత మధురము! భూలోకము యొక్క నిరీక్షణ
మరియు పరలోకపు ఆనందము;
ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురము! ఎంత మధురము!
భూలోకము యొక్క నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.
60
ఇప్పుడు నెవిల్ పాటలు పాడు బృందమును జ్ఞాపకము చేసికొనుడి, ఉదయవేళలో, తొమ్మిది గంటలకు (quartet) క్వార్టట్ ఆకాశవాణి (రేడియో) ద్వార ప్రసారం చేయుదురు. మరియు సహోదరుడు స్టికర్స్ ఆదివారం ఉదయం, తొమ్మిది నలభై-ఐదు గంటలకు వచ్చును. ఈ మధ్యాహ్నము పునరుత్థానము మీద, అతని కొరకు ఒక టేపును తయారు చేయును.
ఇప్పుడు, మనం తిరిగి కలుసుకొనేవరకు, మనం మన తలలు వంచుచుండగా, ప్రభువు యొక్క దీవెనలు మీతో ఉండును. జార్జియాలో మేకన్ నుండి వచ్చిన, నా మంచి స్నేహితుడైన సహోదరుడు పామర్, సహోదరుడను మనం ప్రార్ధించుచుండగా, ఒక మాట ద్వారా ప్రార్ధించి, అతడు ఈ సమావేశమును ముగించి, సభికులను బయటకు పంపివేయగలడని, నేను చెప్పబోవుచున్నాను. సహోదరుడా పామర్.