సమాధిలో పెట్టుట

సమాధిలో పెట్టుట

ధన్యుడవైన పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇదివరకే ఇక్కడయున్నది, మేము నీ యొక్క పరిశుద్ధ వాక్యమును సమీపించుచున్నాము. మరియు బాగుగా లేని ఒక స్వరమును వెనుకకు పట్టుకొనియుండుటకు నేను ప్రయత్నము చేస్తున్నప్పటికీ, నిమ్మళముగా మరియు చక్కగా నేను చేయగలుగునట్లుగా, నీ మాటలను మాట్లాడుము. నీ యొక్క దైవిక నడుపుదల కొరకు మరియు ఈ రాత్రి మా మధ్య పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కొరకు నేను అడుగుచున్నాను. మరియు సర్వాంతర్యామియైన ఆయన దేవుని యొక్క వాక్యమును తీసుకొని, మనకు అవసరమైయున్నట్లుగా, ప్రతి హృదయమునకు ఇచ్చునుగాక, ఈ రాత్రి దేవుని యొక్క మంచి కార్యములతో మనలను తృప్తిపరచునుగాక.

2 మరియు ఈ రాత్రి, మనము వాక్యము మీద మాట్లాడుచుండగా, మా హృదయములను ఎన్నో మైళ్ళు కల్వరిలోనికి వెళ్ళునుగాక, అక్కడ దేవుని యొక్క గొప్ప తీర్పుల కొరకు కావలసిన సర్వసమృద్ధియైన ఆ వెలను, ఏదెను తోట నుండి యేసు మన కొరకు చెల్లించాడు. మరియు ఈ దినమున ఆయన యొక్క పునరుత్థానము ద్వారా, మరియు ఆయన మరణము ద్వారా, సమాధి ద్వారా, మరియు పునరుత్థానము ద్వారా, మేము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడియున్నామని మేము గ్రహించుదుముగాక.

3 మరియు ఈ రాత్రి ఇక ఎంతమాత్రము లోకమునకు సంబంధించినవారము కాదు, కారణము మేము దేవుని కుమారుని యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా వెలతో కొనబడియున్నాము. మరియు మేము కృతజ్ఞత గల హృదయములతో మా మనస్సంతటితో మాలో యున్న మా బలమంతటితో, శుద్ధమైన మరియు కల్తీ లేని హృదయముతో నిన్ను సేవించుటకు మేము నీ వైపు తిరుగుదుముగాక.

4 తండ్రీ, ఈ రాత్రి దానిని దయచేయుము, ఇక్కడయున్న వారిలో వారి పాపములు క్షమించబడుటలో, ఎవరైనా కొందరు నిన్ను ఎరుగనివారు యున్నట్లైతే, నీతిమంతుడైన, క్షమించువాడైన దేవుని యొద్దకు వచ్చి, దీనముగా సిలువ నొద్దకు వచ్చి వారి పాపములను ఒప్పుకొందురుగాక. మరియు ఈ రాత్రి మా అందరికీ ఒక గొప్ప రాత్రిగా యుండాలని నేను ప్రార్థిస్తున్నాను. దీనిని నీ కుమారుడైన యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.

5 ఇప్పుడు, దేవుని వాక్యమును తీసుకొని దానిని బయలుపర్చుటకు, ఈ భూమి మీద సమర్థులైన వారు ఎవరూ లేరని మనము గ్రహిస్తాము, కారణము వాక్యము ప్రేరేపణ ద్వారా వ్రాయబడినది. పరిశుద్ధాత్మయే వాక్యము యొక్క గ్రంథకర్తయైయున్నాడు.

6 మరియు పరలోకములో, ఆ గ్రంథమును తీసుకొనుటకు మరియు దాని ముద్రలను విప్పుటకు, ఒకరి కొరకు వెదికినపుడు, అక్కడ పరలోకములో గానీ, భూమి మీద గానీ, భూమి క్రింద గానీ, ఆ ముద్రలు విప్పుటకు గానీ లేక కనీసము ఆ గ్రంథమును చూచుటకు గానీ యోగ్యుడైనవాడు ఎవడును లేడు. మరియు జగత్తు పునాదికి ముందే వధించబడిన గొర్రెపిల్ల అక్కడయున్నది, మరియు ఆయన వచ్చి, సింహాసనాసీనుడైనవాని యొద్ద నుండి ఆ గ్రంథమును తీసుకొని మరియు ముద్రలను విప్పి మరియు వాక్యమును తెరచెను.

7 మరియు ఇప్పుడు నేను అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయమును చదువుచుండగా, ఆయన మన కొరకు వాక్యమును తెరచునని నమ్ముచూ, మరియు ఆయన యందు నమ్మిక యుంచుచున్నాను.

8 నేను బయటకు ఇచ్చుచుండగా, మొదటి రాత్రి, ప్రభువైన యేసు యొక్క రెండవ రాకడయైయున్నది మరియు…ఇది బుధవారమై యున్నందున. మరియు గురువారము రాత్రి అన్నిటికి-చాలిన బలిఅర్పణ. శుక్రవారము రాత్రి అన్నిటికి-చాలిన ప్రాయశ్చిత్తము; పరిపూర్ణమైనది. నిన్న రాత్రి మీరు దానిని గ్రహించారా? పరిపూర్ణమైనది, ఎలా సంపూర్ణముగా మనము ఆయన యొక్క దృష్టిలో ఎలా పరిపూర్ణముగా యుండగలమో! మరియు ఈ రాత్రి సమాధిలో పూడ్చివేయబడుట, మరియు రేపు, పునరుత్థానము, సరిగ్గా రోజు రోజు ఒకదాని వెంబడి ఒకటి.

9 ఇప్పుడు ఈ రాత్రి నా లేఖనము యొక్క పఠనము కొరకు, ఈ రాత్రి నేను ఎన్నుకొన్నది, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, 25, 26 మరియు 27 వచనముల వరకు, మరియు అది ఈ విధముగా మాట్లాడుచున్నది, పేతురు మాట్లాడుచున్నాడు.

దావీదు, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను:

కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును:

నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు.

10 ఈ రాత్రికి ఇది ఎంత చక్కని అంశము, కారణము ఆయన సమాధిలో యుండుటను గూర్చి ఒక అంశమును పొందుటకు.

11 మొదటి కార్యమేమనగా, మీ యొక్క దృష్టి తప్పిపోని దేవుని యొక్క వాక్యమునకు మేము ఆకర్షించుచున్నాము. దేవుడు తన వాక్యమును అక్షరము ప్రకారము పాటించును. మరియు ఈ రాత్రి యొక్క తలంపులను దాని మీదకు బిగిద్దాము, అదేమనగా దేవుడు తన వాక్యమును నిలబెట్టుకొంటాడు, దేవుడు తన వాక్యములో చెప్పిన ఏదైనను, సత్యమైయున్నదని మనము నిశ్చయముగా దాని మీద విశ్రమించవచ్చును. మరియు విశ్వాసము మానవుని ఆలోచనలు చలించిపోయే ఇసుకల పైన లేక మానవ సిద్ధాంతములపై విశ్రమించలేదు, కాని దాని యొక్క చివరి విశ్రాంతి స్థానమును కదల్చబడని నిత్యమైన దేవుని యొక్క వాక్యముపై ఆనుకొంటుంది.

12 వాక్యము! దేవుడు దానిని చెప్పియున్నట్లైతే, అది శాశ్వతముగా సత్యమైయున్నది, “అది నా భావము కాదు,” అని చెప్పి దేవుడు ఎన్నడూ తన వాక్యమును వెనుకకు తీసుకొనడు. నేను కొన్ని విషయములను మాట్లాడగలను మరియు మీరు కొన్ని విషయములను మాట్లాడగలరు, తరువాత మనము తప్పక ఆ మాటలను వెనుకకు తీసుకొనే అవకాశమున్నది, కారణము, దానిని మనము మన యొక్క శ్రేష్ఠమైన జ్ఞానముతో మరియు మన యొక్క శ్రేష్ఠమైన సామర్ధ్యముతో చెప్పియున్నాము. కానీ అలాగైతే దేవుడు మనకంటే ఎంతో భిన్నముగాయున్నాడు. ఆయన అనంతుడు, అందుచేత, అది సంపూర్ణముగా పరిపూర్ణమైయున్న కార్యమైతేనే తప్ప ఒక్క విషయమును కూడా ఆయన చెప్పడు. ఆయన ఎన్నడూ దానిని వెనుకకు తీసుకొనవలసిన పనిలేదు, ఎన్నడూ ఆయన చెప్పిన దానికి క్షమాపణ చెప్పవలసిన పనిలేదు. అది ఎల్లప్పుడు సత్యముగానే నిలబడుతుంది.

13 మనము యేసు కొరకు పండుగగా ఆచరించుచున్న ఈ గొప్ప దినములలో, దేవుడు నిజముగా లోకపాపముల కొరకు, భూమికి పునాది వేయబడకముందే, వేల సంవత్సరములకు ముందు, ఆయనను వధించెను. దేవుడు మాటను పలికియున్నాడు, మరియు దేవుడు దానిని మాట్లాడినపుడు, అది పరలోకములో ఒక ముగించబడిన ఉత్పత్తియైయున్నది; అది ఇదివరకే ముగించబడియున్నది. ఓ, దాని భావము కేవలము ఏమైయున్నదో మనము గ్రహించినట్లైతే, ఎలాటి భిన్నమైన ప్రజలుగా మనము యుంటామో! అవిధేయుల కొరకు ఇక్కడ ఉంచబడిన తీర్పును ఈ గ్రంథములో చూచునప్పుడు, ఘడియ వెంబడి ఘడియ ఒక మనిషిని అది తన్నుతాను పరీక్షించుకొనునట్లు చేస్తుంది, మరియు నమ్మకమైన వారికి దేవుడు వాగ్దానము చేసిన దీవెనలను చదువుట, అది నీతిమంతుని ఘడియ వెంబడి ఘడియ ఆనందించునట్లు చేస్తుంది. మనము నిశ్చయముగా విశ్రమించినపుడు, ప్రతీ మాట నెరవేర్చబడుతుంది, కేవలము మీ ఆత్మను దానిమీద లంగరు వేయండి. అది ఎల్లప్పుడును ఆ మార్గములోనే యుండియున్నది.

14 దేవుడు నోవహుతో మాట్లాడినపుడు; వెనుక జల ప్రళయమునకు ముందున్న ప్రపంచములో; బహుశ కనీసము ఎన్నడైనా బైబిలు వ్రాయబడక ముందు, లేక బైబిలు, ఏదైనా, ఎన్నడూ వ్రాయబడకముందు; ఒక తుఫాను రాబోవుచున్నదని, మరియు నీళ్ళు భూమిని కప్పబోవుచున్నవని, దేవుడు నోవహుతో చెప్పెను మరియు ఒక అణువైనను అది సంభవిస్తుందని రుజువు లేనపుడు, సమస్తమును దానికి భిన్నముగాయున్నప్పుడు, నోవహు భయముతో కదిలించబడి, ఒక ఓడను నిర్మించెను, దానిని సిద్ధము చేసెను. అది అతని రక్షణ కొరకు మరియు అతని ఇంటివారి రక్షణ కొరకైయుండెను. దేవుడు ఆయనను ఎన్నడూ క్రిందకు పడిపోనియ్యలేదు, కారణము అది ఆయన యొక్క వాక్యమైయుండెను. అది దేవుడు జరుగుతుందని చెప్పినపుడు అది జరుగవలసియుండెను.

15 ఇప్పుడు, యోబు గ్రంథము, బైబిలులోని అతి ప్రాచీనమైన గ్రంథమైయుండెను, బహుశ అది ఆదికాండము వ్రాయబడక మునుపు వ్రాయబడియుండెను, మరియు అది బైబిలులో కలపబడియుండెను. మరియు మోషే ఆదికాండమును వ్రాసియున్నాడు. యోబు, తన గ్రంథములో, దేవుడు ఆయన చేసిన వాగ్దానములపై గంభీరముగా అతడు ఆధారపడియుండెను. మరియు ఏ విధమైన భయము లేకుండా, అతడు అతని యొక్క దహనబలిపై ఆధారపడియుండెను; దేవుడు ఏమి చెప్పియున్నాడో, దానిని నెరవేర్చుటకు సమర్ధుడని అతడు ఎరిగియుండెను. మరియు సమస్తము వ్యతిరేకముగా వెళ్ళుచున్నట్లు కనబడినపుడు, యోబు స్థిరముగా నిలబడియుండెను, కారణము దేవుని యొక్క వాగ్దానములు స్థిరమైనవి. దేవుడు యోబుకు వాగ్దానము చేసియున్నాడు, మరియు యోబు ఆ వాగ్దానముపై విశ్రమించెను

16 ఓ, సంఘము ఎన్నడైనా దేవుని యొక్క నిత్యమైన వాక్యము సత్యమైయున్నదనే దానిపై విశ్రమించి మరియు ఆ స్థానమునకు వచ్చినట్లైతే! ఎలాటి భేదము అక్కడయుంటుంది, అది అక్కడ ఎలాటి దిద్దుబాటుగా యుంటుంది, ఎలా అది అక్కడ కత్తిరించివేయబడినట్లుగా యుంటుంది, ఎలాటి సంతోషము అక్కడయుంటుంది, ఎలాటి శక్తి అక్కడయుంటుంది, సత్యము ఏమైయున్నదో అది, స్త్రీలు మరియు పురుషులు దేవునిని అసలైన ముఖ విలువ నొద్ద తీసుకొన్నట్లైతే. పరిస్థితులు ఎలా కనబడినప్పటికి లెక్కకాదు, అది దానితో చేయునది ఏదియూ లేదు. దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు; అది దానిని సర్ది వేస్తుంది!

17 మరియు యోబు, తన అనుభవమంతటిలో అత్యంత పరీక్షా సమయములో యున్నప్పుడు; అతడు దేవుని సన్నిధిలో, ఒక నీతిమంతుడుగా కనుగొనబడినాడు. అతడు పరిపూర్ణుడని దేవుడు సహితము చెప్పియున్నాడు. అతనివంటివాడు భూమి మీద ఎవ్వరునూలేరు. మరియు అతనిని శోధించుటకు సాతానుకు అవకాశము ఇవ్వబడినది, “అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించేటట్లు చేస్తాను,” అని వాడన్నాడు.

18 దరిదాపుగా యోబు యొక్క జీవితమును వాడు తీసుకొన్నాడు, యోబు యొక్క ప్రాణము, వాడు దానిని చేసియుండేవాడు. అయితే దేవుడు ఒక హద్దు గీతను గీచి, అన్నాడు, “నీవు అతనిని ఏదైనా చేయవచ్చును, కాని అతని ప్రాణమును తీయరాదు.”

19 తరువాత యోబు, అతడి క్లిష్టమైన అతి శోధన సమయములో అతడు నిలబడినపుడు, అతడన్నాడు, “అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, శరీరములో నేను దేవుని చూచెదను.” అది ఎంత చీకటిగా కనబడినప్పటికి లెక్కకాదు, అది ఎంత అవాస్తవముగా కనబడినప్పటికీ లెక్కకాదు, యోబు అతని ఆత్మను అక్కడ ఒకదానితో లంగరు వేసియున్నాడు, అది దేవుని యొక్క నిత్యమైన వాగ్దానము. ఓ, మనము దానిని చేయగలిగినట్టైతే! గమనించండి, దేవుని యొక్క వాగ్దానముపై అతడు విశ్రమించియున్నాడు, “నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును.”

20 మరియు ఇక్కడ మీరు దీనిని గమనించాలి, కారణము భవిష్యత్తులోని మాటలు నేను చెప్పగోరుచున్నాను. యోబు తాను ఎక్కడ సమాధి చేయబడవలెనో అతడు సూచించియున్నాడు. మరియు యోబు చనిపోయినపుడు ఆ విధముగా అతడు సమాధిచేయబడ్డాడు.

21 అక్కడ అబ్రాహాము అను పేరు గల మరొక వ్యక్తియుండియున్నాడు, అతడు దేవునిని వాక్యము నొద్ద తీసుకొనియున్నాడు. మరియు అతడు దేవునిని నమ్మియున్నాడు. మరియు అతడు దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానమునకు వ్యతిరేకముగాయున్న కార్యములను, అవి లేవన్నట్లుగానే అతడు పిలిచియున్నాడు. అతడు దేవునిని ఆయన వాక్యము నొద్ద తీసుకొనియున్నాడు. మరియు దినములు గడిచినవి, వారములు గడచినవి, నెలలు గడచినవి, మరియు సంవత్సరములు గడచినవి అది అబ్రాహామును ఒక్క రవ్వంత కూడా ఎన్నడూ ముందుకు కొనసాగకుండా ఆపలేదు. బైబిలు చెప్పియున్నది, “అతడు అవిశ్వాసము ద్వారా దేవుని వాగ్దానమును సందేహింపక, విశ్వాసముగలవాడై, దేవునికి స్తుతి చెల్లించెను.”

22 ప్రతి రోజూ సమస్తమూ, ఎంతో కష్టముగా ఎదుగుతూ యున్నట్లుగా కనబడుచుండగా; అతడు బలహీనుడుగా మారుటకు బదులుగా, యోబు ప్రతిరోజు ఇంకా బలమును పొందుచుండెను. ఓ, ఎలాటి ధన్యమైన నిశ్చయతను మనము కలిగియున్నాము! తిరిగి లోకపు పిరికి తనముతో మునిగిపోవుటకు బదులుగా, ఇది వరకటి కంటె మరి ఎక్కువగా తప్పక మనము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, పైన నిలబడవలెను. దేవుడు దేనినైనా చెప్పినపుడు అది తప్పక పరిష్కరించబడవలెను.

23 మరియు అబ్రాహాము ఉన్నవాటిని లేనట్లుగానే పిలిచెను, కారణము అవి వాక్యమునకు వ్యతిరేకముగా యుండెను. మరియు వారు అనేక సంవత్సరములు కలిసి జీవించిన తరువాత, అబ్రాహాము అతని తియ్యని హృదయమైన తన భార్యయైన శారాను పోగొట్టుకొన్నప్పుడు, యోబు సమాధి చేయబడిన స్థలము దగ్గరలోనే అతడు ఒక భూభాగమును కొని, శారాను కూడా అక్కడే సమాధి చేసేను. ఎందుకు ఆశ్చర్యము? వారు ప్రవక్తలైయున్నారు! వారు చూసియున్నారు, వారు దేవునిని కలుసుకొనియున్నారు. మరియు ఇప్పుడు అబ్రాహాము చనిపోయినపుడు, అతడును శారాతో సమాధి చేయబడెను.

24 ఇప్పుడు వారు ఊరకనే ఆ భూభాగమును అతనికి ఇవ్వలేదు. అతడు సాక్షులముందు ఆ భూభాగమును కొనెను. బాప్తిస్మము యొక్క ఎలాటి చక్కని మాదిరి. సాక్షుల ముందు అతడు దానిని కొనెను, అది అతని యొక్క వాగ్దానమైయుండెను. ఓ, ఆ మార్గము గుండానే నిజమైన విశ్వాసులు తప్పక రావలసియున్నది, ఎక్కడో ఒక మూలన జారిపోవుట కాదు, కాని సాక్షుల ముందు నిలబడవలెను. “నేను ప్రభువైన యేసునకు, ఆయన పరిశుద్ధాత్మకు మరియు ఆయన గొప్ప కార్యములకు నేను ఒక సాక్షినైయున్నాను” మరి ఇంకా ఎక్కువగా ఈ చెడ్డ దినము సమీపించుచుండగా మరి ఎక్కువగా మనము దానిని చేయవలెను.

25 తరువాత అబ్రాహాము యొక్క కుమారుడైన ఇస్సాకు, అతనికి వాగ్దానము ఇవ్వబడినది. మరియు ఇస్సాకు చనిపోయినపుడు, అతడును అబ్రాహాముతో పాతిపెట్టబడెను, మరియు ఇస్సాకు యాకోబును కనెను.

26 యాకోబు ఐగుప్తులో ఆ దిగువలో చనిపోయెను, అతడు చనిపోకముందు ప్రవక్తయైన తన కుమారునితో ఇలా అన్నాడు, “ఇక్కడకు రమ్ము, కుమారుడా, మరియు నా యొక్క కుంటితొంటిపై, నీ చేతిని ఉంచుము.” కారణము అతడు ఎలా కుంటివాడైనాడో గుర్తున్నదా, ఏలయనగా ప్రభువు దూత అతని యొక్క తుంటెను ముట్టెను, మరియు ఆ దినము నుండి అతడు కుంటుచూ నడిచెను. అతడన్నాడు, “నా తుంటిపై నీ యొక్క చేతినియుంచి, నన్ను నీవు ఐగుప్తులో సమాధిచేయనని, మన పితరుల దేవుని పేరిట నాకు ప్రమాణము చేయుము.” ఎందుకు? ఓ, వారు వాక్యమును కలిగియుండిరి, వారు ప్రత్యక్షతను కలిగియుండిరి!

27 అదేమనగా సజీవ దేవుని యొక్క సంఘము దైవిక ప్రత్యక్షతపై నిర్మించబడియున్నదని చెప్పుటకు, నేను ఇక్కడ ఆగవచ్చునా; సంఘశాఖ మీద కాదు, సంస్థ మీద కాదు, ఆచారములు మరియు సిద్ధాంతముల మీద కాదు, కాని సజీవ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బయలుపర్చబడిన సత్యముపై అది కట్టబడియున్నది.

28 హేబెలు ఏదెను తోటలో సంఘము ఆరంభమైనపుడు అతడు దానిని కలిగియుండెను. ఒక గొర్రె పిల్లను తేవాలని అతడు ఎలా తెలుసుకోగలిగాడు? కయీను వలె అతడు ఎందుకు ఫలములను తేలేదు? అయితే అది అతనికి బయలుపర్చబడియున్నది!

29 యేసు ఒకసారి మాట్లాడుచూ అన్నాడు, “మనుష్యు కుమారుడెవడని ప్రజలు చెప్పుకొనుచున్నారు?”

“కొందరు నీవు ‘మోషేవు,’ మరియు ‘ఏలీయావు,’ ఆ విధముగా చెప్పారు.”

ఆయన అన్నాడు, “నేను ఎవరని మీరు చెబుతారు?”

30 మీరు చూడండి, అది ఎవరో ఆలోచించుచున్న దానిపై విశ్రమించదు, అది ఏమనగా నీవు ఎరిగిన సత్యము. “మీరు ఏమంటారు?” ఆ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరిని మన ముఖములో కలుసుకొంటుంది, “మీరు ఏమంటారు?”

31 మరియు పేతురు ఒక్క సంశయము లేకుండా త్వరగా చెప్పాడు, “నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తువు.”

32 యేసు అందరి హృదయ రహశ్యములను ఎరిగియున్నాడు, కారణము ఆయన శరీరములో ప్రత్యక్షపర్చబడిన యెహోవా తప్ప మరి ఎవరు కాదు, మరియు ఆయన అన్నాడు, “సీమోను బర్ యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెను గాని నరులు నీకు బయలుపర్చలేదు, మరియు ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.”

33 మనము ముందుకు వచ్చి, లూథరన్ వారమైన మనము విశ్వాసముతో నడువగోరుచున్నాము, మెథడిస్టువారమైన మనము దానిని పొందుటకు కేకలు వేయాలనుకొనుచున్నాము, పెంతెకొస్తు వారైన మీరు దానిని పొందుటకు భాషలతో మాట్లాడగోరుచున్నారు, అయితే అది దాని నుండి కోటి మైళ్ళ దూరములోయున్నది.

34 అది ప్రభువైన యేసు యొక్క ఒక దైవిక ప్రత్యక్షతయైయున్నది, హృదయములో ఆయన ఒక ఉనికి గల వ్యక్తిగా, ప్రత్యక్షపర్చబడటం, “ఈ బండమీద నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువజాలవు.” అది మత్తయిలో పరిపూర్ణముగా పనిచేసియున్నది…:24, 5:24, లేక యోహాను 5:24, “నా మాటలు విని మరియు నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; అతడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.” నీవు ఏదో కదలికను లేక ఉద్రేకమును కలిగియున్నందు వల్ల కాదు; కాని పరలోకము నుండి క్రీస్తు బయలుపర్చబడిన ఆధిక్యతను నీవు కలిగియున్న కారణముననే, “ఈ బండ మీద నా సంఘమును కట్టుదును.”

35 యాకోబు, అతడు చనిపోయినపుడు, అతని యొక్క కుమారుడు అతని దేహమును చుట్టి, అతడు పాలస్తీనాలోని పరిశుద్ధ భూమిలో, అబ్రాహాము, ఇస్సాకు, శారా, మరియు యోబులతో పాతిపెట్టబడెను.

36 తరువాత యోసేపు, ఒక ప్రవక్తయైయుండి, అతడు ఐగుప్తులో వృద్ధిచెందెను. అతడు దేవునిని ఎరిగియుండెను. దేవుడు అతనికి తన్నుతాను బయలుపర్చుకొనెను. మరియు అతడు చనిపోయినపుడు ఇలా అన్నాడు, “నా ఎముకలను మీరు ఇక్కడ పాతిపెట్టవద్దు, కాని అక్కడ…ఒక దినమున నిశ్చయముగా దేవుడు మిమ్ములను దర్శిస్తాడు!” ఎందుచేత? మోషేకు దేవుడిచ్చిన మాటపై అతడు గంభీరముగా నిలబడియుండెను, “నాలుగు వందల యేళ్ళు వారు ఆ దేశమునకు సేవ చేస్తారు, కాని నేను వారిని బయటకు తెస్తాను.” అతడు దేవుని యొక్క వాక్యముపై గంభీరముగా విశ్రమించెను.

37 అక్కడ అది ఎలాటి ఒక చక్కని ఉదాహరణగాయున్నది, మీరు గమనించినట్లైతే, దాటి వెళ్ళుచున్న ప్రతి హెబ్రీయుని వీపు, బానిసలను నడిపించే వారి ద్వారా వారి వీపులు గుజ్జు గుజ్జుగా కొట్టబడియున్నవి. మరియు అతని ప్రవక్తయైన యోసేపు ఎముకలను అతడు చూసినపుడు, ఒక దినమున వారు బయటకు వెళ్ళిపోతారని అతడు ఎరిగియుండెను. కారణము, ఒక దినమున వారు బయటకు వెళ్ళిపోతారని, ఆ ఎముకలు అక్కడ ఒక జ్ఞాపక చిహ్నముగా అక్కడ విడువబడవలెను.

38 అది 15 లేక 18 సంవత్సరముల క్రితము, అప్పుడు బిల్లీపాల్ కు 5 సంవత్సరముల వయస్సు, కనీసము అంతయుండవచ్చు తెల్లవారుచుండగా ఒక ఈష్టర్ ఉదయమున, మేము ఒక పుష్పమును అతని తల్లి యొక్క సమాధి నొద్దకు తీసుకొని వెళ్ళుచుంటిమి, అప్పుడే సూర్యుడు పైకి వచ్చుచుండెను; లేక సూర్యోదయమునకు ముందుకావచ్చు. అప్పుడు మేము కూడికకు వెళ్ళుచుండగా, మరియు ఆ సమాధి యొద్దకు వెళ్ళుచుండగా, ఆ చిన్నవాడు తన టోపీని తీసివేశాడు, అతని చిన్న చెల్లి మరియు తల్లి సమాధి చేయబడిన స్థలము నొద్దకు మేము వెళ్ళితిమి. అతడు బెదిరిపోయి ఏడ్చుట ప్రారంభించెను, మరియు అతడన్నాడు, “నాన్న అక్కడ ఆ గుంటలో క్రింద అమ్మయున్నదా?”

39 నేనన్నాను, “లేదు, కుమారుడా. ఆ గుంటలో అక్కడ అమ్మలేదు. నీకంటె మరియు నాకంటె ఒక పదిలక్షల సార్లు చాలా మంచి స్థితిలోయున్నది.”

అతడన్నాడు, “నేను అమ్మను మరలా చూస్తానా?”

40 నేనన్నాను, “దేవుని కృపను బట్టి, నీవు దానిని కోరినట్లైతే, నీవు మరలా ఆమెను చూస్తావు.”

అతడన్నాడు, “ఆమె శరీరము ఎన్నడైనా ఈ సమాధిలో నుండి పైకి వస్తుందా?”

41 నేనన్నాను, “హనీ నీ కన్నులు మూసుకొనుము, నేను ఒక చిన్న కథ చెపుతాను. ఎన్నో వందల సంవత్సరముల క్రితము, ఈ ఉదయము అక్కడ ఒక సమాధి ఖాళీగా విడువబడినది.” నేనన్నాను, “అది ఒక జ్ఞాపక చిహ్నమైయున్నది. ‘దేవునిలో నిద్రించినవారిని, క్రీస్తు తిరిగి వచ్చునపుడు ఆయన వారిని తనతో కూడా తీసుకొనివస్తాడు.’” ఒక అనుమానపు ఛాయ లేకుండా. నేను దేవుని యొక్క గంభీరమైన నిత్యమైన వాగ్దానముపై విశ్రమిస్తాను.

42 ఆ ప్రాచీన కాలములోని యోబు చెప్పియున్నట్లుగా, దానిని మనము వింటాము, “ధూళిని ధూళికి, మట్టిని మట్టికి,” అప్పగించుచున్నాము. అది లాంగ్ ఫెలో వ్రాసిన పద్యమును నాకు జ్ఞాపకం చేస్తుంది.

దుఃఖపు సంఖ్యలలో నాకు చెప్పవద్దు,

జీవితము కేవలము ఒక ఖాళీ కథ!

ఆత్మ చనిపోయినది, అది కునుకుచున్నది,

మరియు కనబడునట్లుగా కార్యములుండవు.

అతడన్నాడు:

అవును, జీవితము నిజమైనది! జీవితము పోరాటమైయున్నది!

మరియు సమాధి దాని యొక్క గురికాదు;

ఏలయనగా నీవు మన్నే గనుక, మంటికి తిరిగి వెళతావు,

అది ఆత్మను గూర్చి అలా మాట్లాడలేదు.

43 వారు దానిని ఒక వాక్య శరీరముగా పిలుస్తారు, మనము ఈ స్థలమును విడిచినపుడు, మనము మరొక స్థలానికి వెళతాము. అది ఏమైయున్నప్పటికి, నేను అపొస్తలుల మాటను తీసుకొంటాను, అతడన్నాడు, “ఈ భూసంబంధమైన గుడారము శిధిలమైపోయినను, మరొకటి ఇది వరకే మన కొరకు కనిపెట్టుచున్నది, దీని నుండి మనము దానిలోనికి వెళ్ళిపోతాము.”

44 అబ్రాహాము ఇస్సాకు, యాకోబు, యోబు, ప్రవక్తలందరూ, ఒక పునరుత్థానము అక్కడ రాబోవుచున్నదని, విమోచకుడు వచ్చుచున్నాడని వారు నమ్మి మరియు విశ్వసించిరి. వారు ఆయనను గూర్చి ప్రవచించిరి. హనోకు ఆయనను గూర్చి ప్రవచించాడు; గంభీరముగా విశ్రమించినవాడై, దానితో ఒక సాక్ష్యమును ముద్రించెను. ఇస్సాకు, యాకోబు, దానియేలు, యిర్మీయా, యెహెజ్కేలు, వారి కాలములో మెస్సీయా వస్తాడని వారు గంభీరముగా విశ్రమించిరి.

45 వారు చనిపోయారు మరియు వారి యొక్క ఆత్మలు పరదైసులోనికి వెళ్ళినవి. వారు దేవుని సముఖమునకు వెళ్ళలేకపోయారు. కారణము (గతరాత్రి మనము చెప్పుకొన్నాము) ఎడ్ల యొక్కయు మరియు మేకల యొక్కయు రక్తము పాపములను క్షమించలేకపోయినది; అది కేవలము పాపములను కప్పియున్నది, ఒక దినమున ఈ పరిపూర్ణమైన బలి అర్పణ రాబోవుచున్నదని అది మాట్లాడుచున్నది. ఏలయనగా జంతువులోని రక్తము ఆరాధికునిలోనికి తిరిగి రాలేకపోయినది, ఆ కారణమును బట్టియే ఆ విధమైన బలి అర్పణలను ఆయన నిలపవలసియుండెను.

46 కాని దేవుని కుమారుడు చనిపోయినపుడు, ఆయనలోయున్న జీవము, దేవుడు తప్ప మరేమి కాదు, అది తిరిగివచ్చి మనలను దేవుని యొక్క కుటుంబములోనికి దత్తత చేసుకొనుచున్నది.

47 ఇప్పుడు, మనము ముందుకు వెళుతూయుండగా త్వరగా గమనించండి. పాత నిబంధనలో ఆ వెనుకవారు ఆయనను నమ్మి మరియు ఆరాధించిరి, మరియు విశ్వాసముతో చనిపోయిరి, ఆ సమయము కొరకు కనిపెట్టుచుండిరి. ఆ ప్రవక్తలు దానిని చేసిన కారణము ఏమనగా, ఎందుకు పాలస్తీనాలో వారు పాతిపెట్టబడగోరిరనగా, పునరుత్థానము ఐగుప్తులో జరుగబోవుట లేదని వారు ఎరిగియుండిరి. అది పాలస్తీనాలోనే జరుగబోవుచున్నది.

48 దానినే నేను ఈ రాత్రి చెప్పుచున్నాను. అన్ని రకములైన పేర్లను నేను కలిగియున్నాను, ప్రజలు నన్ను ఏమని పిలిచినా నాకు లెక్కకాదు, అది నాకు ఒక్క రవ్వంత భావమును ఇవ్వదు. నేను చేయగోరు ఒక కార్యమేమనగా, దీనిని ఎరుగుటయే: నేను మృతిచెందియున్నాను, మరియు నా జీవము, దేవుని ద్వారా క్రీస్తునందు దాచబడియున్నది. అదేమనగా ఆయన మృతుల మధ్యలోనుండి పిలచినపుడు, ఆ దినమున నేను ఆయనకు జవాబిస్తాను. క్రీస్తులో నన్ను సమాధి చెయ్యండి, కారణము క్రీస్తులోయున్నవారిని ఆయనతో దేవుడు ఆ దినమున తెస్తాడు.

49 మనము క్రీస్తులోనికి ఎలా వెళ్ళగలము? 1 కొరింథీ 12:13, “ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము, మరియు దేవుని రాజ్యములో సహ పౌరులమైనాము.” మనము పరదేశులమని మరియు యాత్రికులమని చెప్పుకొనుచున్నాము, ఇక ఎంత మాత్రము ఈ లోక సంబంధమైన వాటిని మనము వెదుకుట లేదు, కాని ధన్యుడైన రాజు యొక్క రాక కొరకు, ఈ సముద్రము నుండి హద్దులులేని ఆ సముద్రము వరకు, ఆయన మహిమలో వచ్చునపుడు, ఆయన రాజ్యమును తీసుకొనుట కొరకు మనము ఎదురు చూస్తున్నాము. నిశ్చయముగా, మనము ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్నాము.

50 అలాగైతే నా మనస్సులో సందేహము లేదు, అయితే యేసు భూమి మీద యున్నప్పుడు ఆయన దానినే మనస్సులో కలిగియున్నాడు, అదే తప్పిపోని నిత్యమైన దేవుని యొక్క వాక్యమైయున్నది. ఏలయనగా, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు శరీరాకారముగా నివశించెనని మనము ఎరుగుదుము. పూర్తి దైవత్వము ఆయనలో యుండెను. ఆయన రెండూ, తండ్రీ, కుమార, పరిశుద్ధాత్మయైయున్నాడు, అయితే ఒక మానవ రూపములో జీవించాడు. దేవుని యొక్క వాక్య శరీరము, దేవుని యొక్క గొప్ప పోలికలో మనిషిని చేసి, తరువాత అతనిని భూమిమీద యుంచెను. ఆయన ఒక దేహమును కలిగియుండెను. దేవుడు శరీరము లేకుండా లేడు. దేవుడు శరీరమును కలిగియుండెను, మరియు అది మనిషి వలె కనబడినది.

51 అది ఒక ముద్రయైయున్నది, అది ఏమైయుండెనో, ఇది అదేయైయున్నది. మరియు భూమి మీదయున్న సమస్తము, సౌందర్యము, మాధుర్యత, భూమి యొక్క సౌందర్యము, మనము ఈ భూమిని విడిచిపెట్టునపుడు, మన కొరకు ఎదురు చూస్తున్నటువంటిది, దానికంటె ఎంతో గొప్పగాయున్నది, ఈ లోకములో దానివంటిది ఏదియు లేదు. ఏలయనగా, భూమి మీదయున్న సమస్తము, పరలోకములోయున్న దానికి ఒక నమూనాగాయున్నది. మంచిగాయున్న సమస్తమూ, నీతిగాయున్న సమస్తము, సౌందర్యముగాయున్న సమస్తమూ, చెట్లు, పక్షులు, సమస్తము, పరలోకములోయున్న దానికి ఒక నమూనాగాయున్నది.

52 మన సొంత జీవితమే సరిగ్గా ఒక నమూనాగాయున్నది. అది సరిగ్గా ఒక నీడయైయున్నది, మరియు అసలైనది కాదు, అది నెగిటివ్ వైపుయైయున్నది. ఆ చిత్రమును వృద్ధి చేయుటకు మనము వచ్చిన వాక్య శరీరము నుండి మనలను తిరిగి ఉంచుటకు, అది మరణమును తీసుకొంటుంది. అప్పుడు పునరుత్థానములో మనము ఆయన స్వారూప్యములోనికి, ఒక పునరుత్థానము చెందిన శరీరములోనికి వస్తాము. ఎలాటి ఒక రమ్యమైన; అది రమ్యమైనదే కాకుండా, అది యథార్థతయైయున్నది, గంభీరమైన నిత్యమైన దేవుని వాక్యము యొక్క సత్యమైయున్నది, అదే మనము ఆయనవలె యుంటాము.

53 ఇప్పుడు గమనించండి, యేసు దేవుని యొక్క శక్తులన్నిటితో ఆయన నింపబడినప్పటికి, ఆయన సాతానును సంధించినపుడు, ఆయన ఎన్నడూ ఆయన యొక్క శక్తులను వాడలేదు. ఆయన కేవలము వాక్యమును మాత్రమే ఎత్తిచూపెను! ఆయన దానిని చేశాడు. ఆయన అన్నాడు, “ఇలా వ్రాయబడియున్నది, ‘మనిషి రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును.’”

54 అలాగైతే నీవు సంఘములో యుండకుండా, ఇంటి దగ్గరేయుండి నేను ఒక మంచి క్రైస్తవుడనని నీవు ఎలా చెప్పుకొనగలవు? నీవు దానిని చేయలేవు. వాక్యమును చదువుము! పరిశుద్ధాత్ముడు వాక్యమునందు పోషిస్తాడు. బైబిలు ఆయన సంఘము కొరకు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆహారమైయున్నది. మరియు పరిశుద్ధాత్ముడే దానిని నీ యొద్దకు తెస్తాడు మరియు దానిని నీ హృదయములో ఉంచుతాడు, మరియు కృతజ్ఞతా స్తుతులతో నీవు దానికి నీరు కడతావు. మరియు ప్రతి దైవిక వాగ్దానము అది ఏమి చేస్తుందని దేవుడు చెప్పాడో ఖచ్చితముగా అది దానినే ఉత్పత్తి చేస్తుంది. అది తప్పక ఆలాగు చేయవలెను. అది ఆయన యొక్క వాక్యమైయున్నది, మరియు అది జీవమైయున్నది.

55 ఇప్పుడు, నేను తప్పక ఒక అరగంటను తీసుకొనవలసియున్నదని నేను మర్చిపోయియున్నాను. నేను చెప్పగోరే విషయమును తెచ్చుటకు అది ఎంతో దీర్ఘ సమయము పట్టినది.

56 అయితే గమనించండి, యేసు చివరి ఘడియలో లేక చివరి రెండు గంటలలో, ఆయన యొక్క జీవితములో ఎన్నో, ఎన్నో ప్రవచనములు నెరవేరియున్నవి.

57 ఒకరు నాతో అన్నారు, “బ్రెన్హాం సోదరుడా, ఇది సంభవించవలసియున్నది, మరియు అది సంభవించవలసియున్నది.”

నేనన్నాను, “అది ఒక ఘడియలో సంభవించగలదు.”

58 మీరు 22వ కీర్తనను చదివియున్నట్లైతే, మరియు అప్పుడు సిలువనొద్ద ఆయన చనిపోవుచున్న ఘడియను గమనించండి, ఆ చివరి రెండు లేక మూడు గంటలలో ఎన్ని విశిష్టమైన ప్రవచనములు ఆయన యొక్క జీవితములో ఎన్ని అతి విశేషమైన ప్రవచనములు నెరవేరియున్నవో మీలో ఎంతమందికి అర్థమైనది, నేను మర్చిపోయాను! నిశ్చయముగా, “వారు నా పాదములను మరియు నా చేతులను పొడిచియున్నారు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి?” మరియు ఆ విధముగా, దావీదు దానిని గూర్చి మొర్ర పెట్టినట్లుగా.

59 మరియు మరొక విషయాన్ని మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను, సత్యము, తప్పిపోని దేవుని వాక్యములోని భాగము. బైబిలు చెప్పియున్నది, “ఆయన అతని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటియు విరువబడదు.” ఏలయనగా ఒక మాదిరిలో, పస్కా బలి పశువు దానికి మాదిరిగాయున్నది. ఆ గొర్రె పిల్ల మచ్చలేనిదైయుండాలి, మరియు దాని యొక్క ఎముకలలో ఒకటియు తప్పక విరువబడియుండరాదు. మరియు ఆ ఘడియలో, ఆయన అక్కడయున్నప్పుడు…ఆయన చనిపోయియున్నాడు, వారు సుత్తితో ఆయన యొక్క ఎముకలను విరుగగొట్టుటకు వెళ్ళియున్నారు. మరియు దానికిముందే…ఆ క్లిష్టమైన ఆ ఘడియ వైపు చూడండి! సుత్తి పట్టుకొన్న మనిషి, ఆయన కాళ్ళను విరుగగొట్టుటకు సిద్ధమయ్యాడు, అయితే దేవుని వాక్యము చెప్పినది, “ఆయన దేహములో ఒక్క ఎముకయూ విరుగదు.”

“అది ఎలా సంభవించబోవుచున్నది!” మనము త్వరపడాలి.

60 దేవుని వాక్యము నిత్యమైయున్నది. దేవుని వాక్యము అంత పరిపూర్ణముగా యున్నట్లైతే, క్రీస్తులోయున్నవారు పునరుత్థానమున్నంత నిశ్చయముగా లేపబడతారు. ఆయన నిన్ను రక్షించినట్లుగానే నిన్ను స్వస్థపర్చుటకు, దేవుడు తన వాక్యమునకు బద్దుడైయున్నాడు. కారణము, ఆయన, అది వాగ్దానము చేయబడిన ఆయన వాక్యమైయున్నది. అది దేవుని యొక్క వాక్యమైయున్నది, మరియు దాని నుండి ఏదియు తీసివేయుటకు మనకు అధికారము లేదు. అయితే కేవలము చెప్పండి, “అది సత్యమైయున్నదని.” దానిని నమ్మండి! ఏది సంభవించినప్పటికి లెక్కకాదు, దానిని నమ్మండి, ఎలాగైనా, ఆ మార్గములోనే మిగిలినదంతయూ నమ్మవలసియున్నది, మరియు మనము దాని నుండి తీసివేయబడలేదు, దేవుడు ఇశ్రాయేలుకు పాలస్తీనాను ఇచ్చియున్నాడు, అయితే వారు కలిగియున్న ప్రతి అంగుళము భూభాగము కొరకు వారు పోరాడవలసియుండెను. వాగ్దానము నీదైయున్నది, అయితే అది నీదని చెప్పుకొను ప్రతి అంగుళము కొరకు నీవు పోరాడవలసియున్నది. దయ్యము దాని సంగతిని చూచుకుంటుంది. నిశ్చయముగా వాడు చూచుకుంటాడు.

61 అయితే గమనించండి, వారు మన ప్రభువైన యేసు యొక్క కాళ్ళను విరుగగొట్టుటకు సిద్ధపడియుండగా, బహుశ ఆ సుత్తి ఆయన కాళ్ళను కొట్టినట్లైతే, దేవుడు అబద్ధికుడిగా కనబడేవాడు. కాని ఆ చీకటి వేదనలోయున్న దయ్యములన్నియూ కలిసి, ఆ ప్రశస్తమైన దేహమును సుత్తితో కొట్టలేకపోయినవి. ఏలయనగా దావీదు దానికి ముందు 800 సంవత్సరముల క్రితము అన్నాడు, “ఆయన ఎముకలలో ఒక్కటియూ విరువబడదు.” దేవుని యొక్క వాక్యము సత్యముగా నిలబడవలసియున్నది.

62 అయితే అప్పుడు వారు ఏమి చేశారు? వారు ఒక ఈటెను తీసుకొని ఆయన ప్రక్క గుండా అదిమియున్నారు, మరియు రక్తము, నీరు బయటకు వచ్చియున్నవి, బైబిలు ఏమి చెప్పియున్నదో దానిని నెరవేర్చుటకు, “వారు నా చేతులను మరియు నా ప్రక్కను పొడిచియున్నారు.” వాక్యము నెరవేరియున్నది.

63 ఇప్పుడు ఆయన చనిపోతున్నప్పుడు, ఓ, ఎలాటి ఒక మరణకరమైన ఘడియ! నేను ఆ పాటను గూర్చి ఆలోచించినపుడు, యథార్థముగా అది నన్ను వణికిపోవునట్లుగా చేస్తుంది, ఎన్నో సంవత్సరముల క్రితము ఆ కవి వ్రాసిన పాటను గూర్చి నేను తలంచుచున్నప్పుడు.

మధ్యకు బండలు బ్రద్దలగుచుండగా మరియు ఆకాశములు చీకటి కమ్ముచుండగా,

నా రక్షకుడు తలవాల్చి చనిపోయెను;

తెరవబడిన తెర మార్గమును తెరచినది

పరలోకమునకు ఆనందములకు మరియు అంతములేని దినమునకు.

64 ఆయన అక్కడ వ్రేలాడుచుండగా, రక్తము కారుచూ చనిపోవుచుండగా, ఆయన తలను వంచెను. ఆయన రూపములో దేవుడు చేసిన జీవులను క్రిందికి చూచుటకు, సూర్యుడు తన్ను గూర్చి తాను ఎంతో సిగ్గుపడెను; అలాటి ఒక వెలను ఆయన చెల్లించవలసివచ్చెను, దానిని విమోచించుటకు; సూర్యుడు ఆ ఘడియలో భూమిని చూచుటకు తిరస్కరించెను. చంద్రుడు ఎంతో ఇబ్బంది పడ్డాడు, చివరకు అతని స్థానము నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు. మరియు నక్షత్రములు భూమికి వాటి యొక్క వీపును చూపించెను. పాపము తప్పక ఎంత నాశనకరముగా యుండియున్నదో, దేవుడు దానితో ఎలా ప్రవర్తించవలసివచ్చెనో చూడండి!

65 మరియు ఆయనను ఎగతాళి చేయుచున్న ఆ యాజకులను చూస్తున్నప్పుడు, ఆయన ముఖము మీద ఉమ్మి వ్రేలాడుచున్నది. ఒక మనిషి ఆయన తలమీద రెల్లుతో కొట్టి, ఇలా అన్నాడు, “నీవు ప్రవక్తవైయున్నట్లైతే నిన్ను ఎవరు కొట్టారో చెప్పు.” వారిలో ఒకడు ఆయన గడ్డమును ఆయన ముఖము మీద నుండి పెరికి వేసెను, మరియు ఆయననే దానిని పైకి తీసుకొనమని చెప్పెను.

66 ఆయన అన్నాడు, “నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే, నేను తిన్నగా నా తండ్రిని పిలుస్తాను, ఆయన 12 వ్యూహముల దేవదూతల సైన్యమును నా కొరకు పంపిస్తాడు.”

67 అది మారిపోయియుండేది, కాని దానిని ఆయన ఎలా చేయగలడు? ఆయన దానిని చేయలేడు, కారణము ఆయన యొక్క సొంత పిల్లలు ఆయన రక్తము కొరకు మొర్రపెట్టుచున్నారు. తన సొంత పిల్లలతోయున్న ఒక తండ్రిని గూర్చి, ఒక డాడీని గూర్చి ఊహించండి, (చీకటిలో) వారు వారి సొంత తండ్రి యొక్క రక్తము కొరకు మొర్రపెట్టుచున్నారు? ఆ కారణము చేతనే ఆయన ఏమియూ చేయలేకపోయాడు, చనిపోవుట తప్ప. ఆయన దానిని చేయలేకపోతే, అది ఆయన పిల్లలకు అంతము, అది జీవరాసులన్నిటికి అంతము. అందుచేతనే తన ప్రజలను రక్షించుటకు ఆయన చనిపోవలసియుండెను.

68 ఆయన తలవంచినపుడు, ఆయన అది చేసినపుడు, ఈ పాత భూమి, దాని వీపుపై వణుకులు పరిగెత్తాయి. అది తప్పక నరములు తటస్థమైన ఆగిపోయిన ఒక మనిషివలె ఆగిపోయినది. ఏలయనగా బైబిలు దానిని చెప్పియున్నది, “మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతయూ చీకటి కమ్మెను.” భూమి వణికెను మరియు బండలు బ్రద్దలాయెను, మరియు దేవాలయపు తెర పై నుండి క్రిందికి రెండుగా చినిగిపోయెను, బలి అర్పణ పీటలు తలక్రిందులైనవి. సజీవుడైన దేవుని కుమారుడు చనిపోయాడు. ఆయన ఎంతగా చనిపోయాడంటే చివరకు సూర్యుడు దానిని గుర్తించాడు. ఆయన ఎంతగా చనిపోయాడంటే చివరకు చంద్రుడు దానిని గుర్తించాడు. ఆయన ఎంతగా చనిపోయాడంటే చివరకు నక్షత్రములు దానిని గుర్తించినవి. ఆయన ఎంతగా చనిపోయాడంటే చివరకు భూమి దానిని గుర్తించినది. ఆయన ఎంతగా చనిపోయాడంటే చివరకు మూల పదార్థములు దానిని గుర్తించాయి, వాతావరణము దానిని గుర్తించినది. ఆయన దేవుని యొక్క కుమారుడై యున్నాడని సమస్తమునూ ఎరుగవలసియుండెను! ఏలయనగా, దేవుని వాక్యము తప్పిపోదు. ఏదెను తోట మొదలుకొని ఆయన వాగ్దానము చేయబడియుండెను. “సర్పము యొక్క తలను ఆయన చితుకగొడతాడు.”

69 ఇప్పుడు ఆయనకు ఏమి సంభవించినది? ఆయన సిలువను విడిచిన తరువాత ఎక్కడకు వెళ్ళాడు, ఆయన అరిమతయియ అగు యోసేపు సమాధికి వెళ్ళాడు?

70 ఆయన ఎంత పేదవాడుగా యుండియున్నాడనగా, ఆయన తలవాల్చుటకు ఒక స్థలము కూడా లేదు. ఆయన పశువుల పాకలో పుట్టియున్నాడు, ఒక నల్లని పేరు ఆయన వెనుకయున్నది, ఒక “అక్రమముగా పుట్టిన పిల్లవాడు.” ఆయనను చూసి నవ్వారు, ఆయన ఎగతాళి చేయబడ్డాడు, వెక్కిరించబడ్డాడు, భూమి మీద, ఆయన గేలి చేయబడ్డాడు, తిరస్కరించబడినాడు. మరియు ఆయన చనిపోయినపుడు, ఆయన మరణదండన ద్వారా చనిపోయినాడు, ఇద్దరు దొంగల మధ్య. మరియు ఆయనను సమాధి చేయుటకు ఒక స్థలము కూడా లేదు, ఆయన మరొకరి సమాధిలో సమాధి చేయబడ్డాడు. పరలోకములోని దేవుడే భూమి మీదకు వచ్చుచున్నాడు! చిన్న శ్రమ గుండా వెళ్ళుటకు, మనము ఏ పాటివారమని మనము తలంచుచున్నాము? ఆయన మన కొరకు ఏమి చేసియున్నాడు! స్నేహితుడా, దానిని గూర్చి ఆలోచించుము, దానిని చదువుము.

71 రోమా సైనికుడు అన్నాడు, “నిజముగా, ఆయన దేవుని కుమారుడు.” ఆ పాపి దానిని గుర్తించవలసియుండెను. యూదా అన్నాడు, “నిర్దోషి యొక్క రక్తమును నేను వంచించాను.” అతడు దానిని గుర్తించవలసియుండెను. సర్వ భూమి దానిని గుర్తించినది.

72 తరువాత ఆయన ఎక్కడకు వెళ్ళాడు? ఒక మనిషి చనిపోయినపుడు, అది దాని ముగింపా? లేదండి. ఆ విధముగా ఆయన చనిపోతాడని బైబిలు చెప్పియున్నది, ఆ కారణము చేతనే ఆ విధముగా ఆయన చనిపోవలసియుండెను, మరియు ఆయన దేవుని యొక్క మాటను నమ్మియుండెను. ఆ కారణమును బట్టియే ఆయన, తన జీవితములో ఇలా చెప్పగలిగెను, “ఈ దేవాలయమును పడగొట్టండి, మరియు మూడు దినములలో దానిని లేపుదును.”

73 దావీదు ఒక చోట, ప్రేరేపణలో, బైబిలులోనే ఒక చోట చెప్పియున్నాడు. దావీదు, ఒక దైవజనుడు, వాక్యముతో అభిషేకించబడిన ప్రవక్త, అన్నాడు, “నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు, అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు.”

74 యేసు అన్నాడు, “ఈ దేహమును మీరు నాశనము చెయ్యండి, మూడు దినములలో దానిని తిరిగి లేపుతాను.” దేవుని వాక్యము తప్పిపోదని ఆయన ఎరిగియుండెను. ఓ, మై!

75 దేవుని వాక్యము తప్పిపోదని నమ్ముచూ, ఆయన గంభీరముగా దాని మీద విశ్రమించినట్లైతే, మరి ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన మనము దానిపై విశ్రమించాలి, మరియు అది ఒక సాక్ష్యముగా మన హృదయములో ఇప్పుడే తిన్నగాయున్నది, అదే మన విమోచకుడు సజీవుడనియు, మరియు ఒక దినమున ఆయన తిరిగి వస్తాడని మనము ఎరుగుదుము. నిశ్చయముగా విశ్రమించండి, అదే క్రీస్తులో యున్నవారిని దేవుడు ఆయనతో వెంటబెట్టుకొని వస్తాడు. ఇప్పుడు గమనించండి.

76 అక్కడే ఆయన యున్నాడు. ఆ శరీరములోని ఒక్క కణము కూడా కుళ్ళిపోదని ఆయన ఎరిగియుండెను. 72 గంటలలో కుళ్ళిపోవుట లోనికి వస్తుంది. ఆయన ఎన్నడూ మూడు రోజులు అక్కడయుండలేదు. ఆయన శుక్రవారము మధ్యాహ్నము చనిపోయాడు, మరియు ఆదివారము ఉదయమున ఆయన పైకి లేచాడు. అయితే, అది ఆ మూడు రోజులలోపే. ఆ మూడు రోజులలోపే ఆయన తిరిగి లేవలసియుండెను, కారణము ఆయన దేవుని వాక్యము నమ్మియుండెను.

77 ఆయన ఇటు వెళ్ళుచున్నాడు. ఆయన దేహమును విడిచినపుడు ఆయన ఎక్కడకు వెళ్ళాడు? బైబిలు చెప్పియున్నది, “ఆయన ఆరోహణమైనాడు, ఆయన వెళ్ళి అక్కడ చెరసాలలోయున్న ఆత్మలకు బోధించెను. వారే దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచుండగా, నోవహు దినములలో మార్పుచెందనివారు,” ఆయన ఆత్మ, ఆయన ప్రాణము, ఆయన యొక్క వాక్య శరీరము, ఆయన సొంతజీవము, క్రిందికి వెళ్ళినది. ఆయనను మనము వెంబడిద్దాము. కొన్ని నిమిషములపాటు, ఈ రాత్రి, ఆయనను వెంబడించుటకు మీరు ఇష్టపడతారా? ఆయన ఎక్కడకు వెళ్ళాడో మనము చూద్దాము.

78 సరిగ్గా మర్త్యులైన జీవులుయుండు ప్రాంతము క్రింద దయ్యపు శక్తుల ప్రాంతమున్నది; దాని క్రింద…దానికిపైగా అనీతిమంతుల ఆత్మలుయుంటాయి; దాని క్రింద సాతాను ప్రదేశమున్నది, పాతాళము. తరువాత సరిగ్గా మనకు పైగా పరిశుద్ధాత్ముడున్నాడు; తరువాత బలిపీఠము క్రింద నీతిమంతుల ఆత్మలున్నవి; ఇక తరువాత వున్నది దేవుడే స్వయముగా. ఒకరు క్రిందికి దిగిపోవుచున్నారు, మరొకరు పైకి వెళ్ళుచున్నారు; ఆ రెండు ఆత్మలు ఇక్కడ ప్రభావితము చేయుచున్నవి.

79 మరియు యేసు చనిపోయినపుడు, ఆయన పైకి వెళ్ళాడు, అక్కడ దిగువన. శుక్రవారము మధ్యాహ్నము, ఆయన మరణము తరువాత నేను ఆయనను చూడగలను [బ్రదర్ బ్రెన్హాం తట్టుచున్నాడు—ఎడి.] నశించిన వారి ప్రాంతములోని తలుపును తట్టుచున్నాడు. ఒక్క నిమిషము మనము ఆయనను వెంబడిద్దాము. తలుపు తీయబడినది. అక్కడ స్త్రీలు, పురుషులు, అక్కడయున్న స్త్రీలు, వృద్ధులు అందరూ ఏకముగా, ఆ భీతిగొలుపు స్థలములో, నశించిన ఆత్మలు అను పిలువబడు చెరసాలలోయున్నారు.

80 నాకు సమయమున్నట్లైతే, నేను మీకు చెప్పగోరుచున్నాను. మరియు అది తప్పక ఒక దర్శనముగా యున్నది. అయితే ఒకసారి ఆ స్థలమును నేను దర్శించియున్నాను, మరియు కనికరము కొరకు నేను కేకలు వేశాను, ఆ సమయములోనే నేను ఒక పాపిని, ఒక ఆపరేషన్ క్రింద వెళ్ళుచున్నాను. నేను బయటకు వచ్చినపుడు, నేను పశ్చిమాన నిలబడియున్నాను, నేను పరలోకము వైపు నా చేతులను ఎత్తి నిలబడియున్నాను, మరియు ఒక సిలువ నాపై ప్రకాశించుచుండెను.

81 అయితే ఆ విలపించుచున్న స్థలములో, యేసు తలుపునొద్దకు నడిచివచ్చెను. ఆయన దేవుని యొక్క కుమారుడైయున్నాడని సమస్తమును సాక్ష్యమీయవలసియుండెను, కారణము నోవహు దినములలోని దీర్ఘశాంతములో వారికి బోధించబడియున్నది. ఆయన తలుపు తట్టియున్నాడు, అన్నాడు, “నేను ఆయనను హనోకు మాట్లాడినది నన్ను గూర్చే. నేను స్త్రీ యొక్క సంతానమైయున్నాను, సర్పము యొక్క తలను చితకగొట్టవలసినవాడను నేనే. ప్రతి దేవుని మాట నెరవేరియున్నది; అదిగో ఇప్పుడే నేను కల్వరినొద్ద చనిపోయాను, మరియు నేను నా సంఘమును కొనియున్నాను. మరియు హనోకు మాట్లాడిన వ్యక్తిని, నేను ఆయనను.” మరియు వారికి కనికరము లేకుండెను, వారికి నిరీక్షణ లేదు, ఏలయనగా వారు అతిక్రమించిరి. మరియు వారి ముఖము ఎదుటనే తలుపు మూయబడినది.

82 దయ్యములుండు ప్రదేశములకు క్రిందకు, క్రిందకు పాతాళపు ద్వారముల నొద్దకే ఆయన వెళ్ళియున్నాడు! ఆయన తలుపును తట్టాడు. [బ్రదర్ బ్రెన్హాం తట్టుచున్నారు—ఎడి.]

83 ఇది ఆయన సమాధిలోయుండగాయైయున్నది. ఆయన దేహము పునరుత్థానము కొరకు అక్కడ కనిపెట్టుచున్నది. ఇప్పుడు ఆయన నీతిమంతులు మరియు అనీతిమంతులు ఉండు స్థలమును దర్శించాడు; ఈ దినములలో ఒక దినమున, నీవు ఆ రెండు స్థలములలో, ఒక స్థలమునకు వెళ్ళుచున్నావు.

84 మరియు ఆయన [బ్రదర్ బ్రెన్హాం తట్టుచున్నారు—ఎడి.] పాతాళము యొక్క తలుపును తట్టుచున్నాడు. మరియు, ఆయన తట్టినపుడు, దయ్యము బయటకు వచ్చినది. వాడు ఇలా చెప్పుటను నేను వినగలను, “ఓ, కాబట్టి ఆఖరుగా నీవు వచ్చియున్నావా. నేను హేబెలును చంపినపుడే నిశ్చయముగా నిన్ను పొందానని అనుకొన్నాను.”

85 మీరు చూడండి, ఏదెను తోటలో ఆ సంతానము వాగ్దానము చేయబడినపుడు, దయ్యము ఎడతెగకుండా ఆ సంతానాన్ని నాశనము చేయుటకు ప్రయత్నించియున్నది. మరియు హేబెలు మరణము తరువాత షేతు వచ్చుట, అది సరిగ్గా క్రీస్తు యొక్క మరణము, సమాధి, మరియు పునరుత్థానమైయున్నది. ఆ సంతానము తప్పక కొనసాగాలి. వాడు దానిని నాశనము చేయుటకు ప్రయత్నించాడు.

86 వాడన్నాడు, “నేను హేబెలును నాశనము చేసినపుడు నేను నిన్ను పొందాననుకొన్నాను. ప్రవక్తలను చంపినపుడు నేను నిన్ను పొందానని నేననుకొన్నాను, నేను నేను సరియైయున్నాను. యోహాను తల శిరచ్ఛేదనము చేయబడినపుడు నేను నిన్ను కలిగియున్నాననుకొంటిని. అయితే ఇప్పుడు, అందరి తరువాత, నీవు వచ్చియున్నావు. ఇప్పుడు నీవు నా చేతిలోయున్నావు.” ఓ, మై!

87 ఆయన ఇలా చెప్పుట నేను వినగలను, “సాతానా ఇక్కడకురా!” ఇప్పుడు ఆయన యజమానుడైయున్నాడు. దగ్గరకు వెళ్ళి వాడి ప్రక్కనయున్న మరణము యొక్కయు మరియు పాతాళము యొక్కయు తాళపు చెవిని గుంజుకొని, ఆయన ప్రక్కన వ్రేలాడదీసుకొన్నాడు, “నేను నీకు నోటీసు జారీ చేస్తున్నాను, నీవు దీర్ఘకాలము నుండి ఒక అబద్ధికుడవైయున్నావు. నేను సజీవుడైన దేవుని యొక్క జీవించుచున్న కుమారుడను. నా రక్తము ఇంకనూ సిలువమీద తడిగానేయున్నది, మరియు పూర్తి బాకీ చెల్లించబడినది! ఇక నీకు ఎంతమాత్రము హక్కులు లేవు-నీవు వలిచివేయబడ్డావు. ఆ తాళపు చెవులు ఇమ్ము!” అది సత్యము. చుట్టూ తిరిగి వాడికి బలమైన ఒక తన్ను ఇచ్చి, తలుపును విసిరికొట్టి, ఇలా అన్నాడు, “అక్కడేయుండు! ఇప్పటి నుండి నేను యజమానుడనైయున్నాను.”

88 ఇప్పుడు, దేవుని రాజ్యము యొక్క తాళపు చెవులు ఆయన యొద్ద లేవు, ఏలయనగా ఆయన వాటిని పేతురుకు ఇచ్చియున్నాడు; అవన్నియు మనము ఉదయమున పొందుతాము, నీటి బాప్తిస్మములో, అయితే ఆయన మరణము యొక్కయు మరియు పాతాళము యొక్కయు తాళపు చెవులను కలిగియున్నాడు, ఆయన వాటిని తీసుకొన్నాడు; ఆయన పునరుత్థానము తరువాత, ఆయన అన్నాడు, “నేను మరణము యొక్కయు మరియు పాతాళము యొక్క తాళపు చెవులను కలిగియున్నాను.” పేతురు దేవుని రాజ్యపు తాళపు చెవులను కలిగియున్నాడు. సాతాను మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులను కలిగియున్నాడు; అయితే ఇప్పుడు యేసు వాటిని కలిగియున్నాడు. ఆయన యజమాని.

89 ఇక్కడ ఆయన పైకి బయలుదేరాడు. అది ఈష్టరగుచున్నది; సమయము త్వరగా గడిచిపోవుచున్నది. అయితే అక్కడ మరొక గుంపుయున్నది, యోబు ఎక్కడయున్నాడు? అబ్రాహాము ఎక్కడయున్నాడు? వారు ఎక్కడయున్నారు? దేవుని యొక్క వాక్యమును నమ్మిన వీరు ఎక్కడయున్నారు? ఆయన వారిని మర్చిపోయియున్నాడా? మరణము వారిని నామ రూపములు లేకుండా చేసినదా? దాని యొక్క అంతము అదేనా? ఎన్నడూ కాదు, ఎన్నడూ కాదు; దేవుడు తన వాక్యమును నిలబెట్టుకొనవలసియున్నది.

90 నేను ఆయనను చూడగలను. మనము కొంచెము పరదైసులోనికి పొడుచుకొంటూ తీసుకొందాము, మరియు ఆ పైన చూద్దాము. శారా మరియు అబ్రాహాము అక్కడకు నడిచి వచ్చారు, కొద్ది సమయమునకు [బ్రదర్ బ్రెన్హాం తట్టుచున్నారు—ఎడి.] తలుపు దగ్గర శబ్దము వినబడినది. అబ్రాహాము వెళ్ళి తలుపు తీసియున్నాడు, “హనీ, ఇక్కడకురా, అన్నాడు, ఇక్కడ చూడు! ఆ దినమున సింధూర వృక్షము క్రింద నాతో నిలబడినది ఆయనే.” ఆయన అబ్రాహాము యొక్క దేవుడు.

91 తరువాత వెంటనే నేను దానియేలును చూడగలను అతని భుజముల మీదగా చూసి, ఇలా అన్నాడు, “అదే రాయియైయున్నది, పర్వతము నుండి తీయబడినది, నేను ఎంత ఖచ్చితముగా నిలబడియున్నానో అంత ఖచ్చితముగా.”

92 యోబు లేచి ఇలా చెప్పుట నేను చూస్తాను, “అది నా విమోచకుడు, ఒక దినమున ఆయన భూమి మీద నిలబడతాడు, ఆయన జీవించియున్నాడని, నేను ఎరుగుదును. నా శరీరము ఒక చిన్న చెంచాడు బూడిదగా కూడా ఉండకపోవచ్చు, అయితే ఇప్పటి నుండి 15 నిమిషములలో నేను దానిలో తిరిగియుంటాను. అది ఆయనయైయున్నాడు.”

93 యెహేజ్కేలు పైకి చూసి ఇలా అన్నాడు, “ఇదే వ్యక్తిని నేను చక్రము మధ్యలో తిరుగుచున్న ఒక చక్రముగా, గాలిలో పైన ఎగురుటను, అదే వ్యక్తిని నేను చూశాను.” ఓ, మై!

94 తరువాత హనోకు పైకి వచ్చుట నేను చూస్తాను. హనోకు అన్నాడు, “మేము వేవేలకొలది పరిశుద్ధులతో తీర్పుతీర్చుటకు ఆయన వచ్చుటను నేను చూస్తాను.”

95 అక్కడ పాతనిబంధనలోని పరిశుద్ధులు, కనిపెట్టుచున్నారు, నిశ్చయముగా వారు, చిందించబడిన రక్తము క్రింద వారు వేచియున్నారు. వారు దేవుని యొక్క సముఖములోనికి, పరలోకపు దేవుని యొద్దకు వెళ్ళలేకపోయారు, ఏలయనగా గొర్రెల యొక్కయు మరియు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయలేకపోయినది.

96 అయితే ఆయన అన్నాడు, “నా సోదరులారా, మీరు తలంచుచున్న నేనే ఆయనను. నేను స్త్రీ యొక్క సంతానమైయున్నాను. నేను దావీదు కుమారుడనైయున్నాను. నేను దేవుని యొక్క కుమారుడనైయున్నాను. నేను కన్యకకు పుట్టినవాడను. నా రక్తము దాని కొరకు చిందించబడినది. మీరు గొర్రెల మరియు మేకల రక్తము క్రింద కనిపెట్టియున్నారు, అయితే ఇప్పుడు నా రక్తము ప్రాయశ్చిత్తమైనది, ఇప్పుడు మీరు స్వతంత్రులు. మనము పైకి వెళదాము, అది దరిదాపుగా ఈష్టర్ కాబోవుచున్నది.” ఈ రాత్రి కొంచెము ఆలోచించండి, అది 1900 సంవత్సరముల క్రితము ఆ పైగా యున్నది.

97 అబ్రాహాము ఇలా చెప్పుటను నేను వినగలను “ప్రభువా, మనము మన శరీరములతో తిరిగి లేచినపుడు; శారా మరియు నేను ఎంతో దానిని ప్రేమించియున్నాము; మీ మార్గము గుండా వెళ్ళేటప్పుడు చిన్న ఈల ఊది కొంచెము ఆగినచో మీరు ఏమి అనుకోరుగా?”

98 మంచిది, ఆయన ఇలా చెప్పుటను నేను వినగలను, “ఎందుకు, లేదు, నిశ్చయముగా లేదు. నేను నా యొక్క శిష్యులతో 40 రోజులు గడపబోవుచున్నాను. చుట్టూ చూడండి మరియు సమస్తమూ ఎలా కనబడుచున్నదో చూడండి!”

99 మహిమకరమైన ఆ ఈష్టరు ఉదయమున (ప్రభువు చిత్తమైన యెడల, దానిని మనము అక్కడ ఈష్టరు ఉదయమున తీసుకొందాము) ఆయన మరణము నుండి తిరిగి లేచినపుడు. బైబిలు చెప్పియున్నది, మత్తయి 27 వ అధ్యాయము ప్రకారము, అదే, “అనేకమంది భూమిలో నిద్రించిన పరిశుద్ధులు, సమాధులలో నుండి పైకి లేచారు.” ఎవరువారు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోబు, ఆత్మసంబంధముగా ప్రత్యక్షత తెలియచేయబడినవారే, ఒక దినమున వారి విమోచకుడు భూమి మీద నిలబడతాడని ఎరిగినవారు. వారే నిద్రించిన వారిలో ప్రథమ ఫలమైయున్నారు. అక్కడ వారు పట్టణములోనికి నడిచి వెళ్ళారు. నేను అబ్రాహామును మరియు శారాను చూడగలను, వారు సంపూర్ణముగా యవ్వనస్థులైనారు…మరియు బలముగాయున్నారు, మరియు-మరియు సంపూర్ణమైన జీవముతోయున్నారు, ఇక ఎన్నడూ తిరిగి వృద్ధులు కారు, ఇక ఎన్నడూ రోగులు కారు, ఎన్నడూ ఇక ఆకలిగొనరు, వారి దేహము చుట్టూ నడుస్తూయున్నారు.

100 కయప అక్కడ నిలబడియున్నాడు, ఇలా అంటున్నాడు, “అదేమిటో నీకు తెలుసా? మొన్నటి దినమున ఒక కార్యము జరిగియున్నది, ఆ ఆలయములో గందరగోళమునంతా చూడండి! అక్కడయున్నది…ఆ బలి అర్పణ పెట్టెను చూడండి, ఆ తెరను కుట్టుటకు మరలా మేము ఎవరినైనా కనుగొనాలని చూచుచున్నాము. ఏమి జరిగినది? ఆ మనిషి ఒక జాతకము చూసేవాడా? అతను ఒక మాంత్రికుడా? లేక, ఏమి సంభవించినది? చెప్పండి! ఇక్కడకు రండి. జోసెఫస్, ఇక్కడ నిలబడియున్న యవ్వన దంపతులు ఎవరు?”

అబ్రాహాము అన్నాడు, “శారా మనము గుర్తించబడ్డాము. మనము బయటకు వెళ్ళిపోవుట మంచిది.”

101 “అనేకమందికి కనబడ్డారు!” దాని యొక్క సమస్తము అంతే కాదు, గమనించండి. ఒక దినమున యేసు ఆరోహణమైనపుడు, ఆయన దర్శించిన తరువాత, వారు దర్శించిరి; అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు వారందరూ జన్మ భూమిని దర్శించియుండిరి. యేసు ఆరోహణమైనపుడు…

102 “బ్రెన్హాం, సోదరుడా, అది కట్టు కథ అని నీవంటావా?” లేదండి! ఒక్క నిమిషములో లేఖనములో నేను దానిని చూపించబోవుచున్నాను.

103 ఆయన పైకి వెళ్ళుట ఆరంభమైనపుడు, వారు కేవలము ఆయనను చూసియున్నారు, అయితే పాత నిబంధన పరిశుద్ధులు ఆయనతో వెళ్ళియుండిరి, కారణము అది బైబిలు చెప్పియున్నది, “ఆయన చెరను చెరగా పట్టి, మనుషులకు ఈవులను అనుగ్రహించెను.” మరియు ఆయన పైకి వెళ్ళుచుండగా నేను చూడగలను, ఆయన తన సంఘముతో చేరియున్నాడు.

104 సంగీతమును వాయించుచున్న ఆ దండులోని ఇద్దరు దేవదూతలు, అక్కడకు తిరిగి వచ్చి ఇలా అన్నారు, “గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకము వెళ్ళుట మీరు చూసితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.” నిశ్చయముగా. వారు ఆ కవాతును తిరిగి కలుసుకొనుటకు త్వరపడ్డారు.

105 మరియు ఆకాశముల గుండా యేసు మరియు పాతనిబంధన పరిశుద్ధులు వెళ్ళియుండిరి. వారు చంద్రుని దాటిరి, వారు సూర్యుని దాటిరి, వారు నక్షత్రములను దాటిరి, మరియు వారు రమ్యమైన ఆ తెల్లని పరలోకముల దృశ్యమునకు వారు వెళ్ళినపుడు, పాత నిబంధన పరిశుద్ధులు లేఖనమును ఉదహరిస్తూ కేకలు వేశారు, “శాశ్వతమైన గుమ్మములారా, మీ తలలు పైకెత్తండి, శాశ్వతమైన గుమ్మములారా, మీ తలలు పైకెత్తండి, మీ తలలు పైకెత్తండి! మహిమగల ఈ రాజును లోనికి రానియ్యండి!”

106 దేవుని యొక్క దూతలందరూ పరలోకపు మెట్లపై నిలబడి, వారన్నారు, “ఈ మహిమగల రాజు ఎవరు?”

107 పాత నిబంధన పరిశుద్ధులు చెప్పారు, “సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధములో బలశూరుడు, ఆయన ఒక జయశాలి!”

108 మరియు దేవునిదూత పెద్ద బటన్ నొక్కినపుడు, ముత్యపు గుమ్మములు ఊగుతూ తెరచుకొన్నవి.

109 తిన్నగా యెరూషలేము పట్టణము గుండా, బలిష్ఠుడైన జయశాలి, పాత నిబంధన పరిశుద్ధులను తీసుకొని వస్తున్నాడు. దూత గణములు వాయించుచున్నారు, దూతలు కేకలు వేయుచున్నారు, ఆయన బలిష్ఠుడైన జయశాలి! ఆయన మరణము యొక్కయు మరియు పాతాళము యొక్కయు తాళపు చెవులను తన ప్రక్కన, వ్రేలాడ దీసుకొన్నాడు, ఆ మహిమ సౌధములను దాటుకొంటూ చివరకు సింహాసనము నొద్దకు చేరుకొన్నాడు. మరియు ఆయన అన్నాడు, “తండ్రీ, ఇదిగో వారిక్కడయున్నారు, నేను ఒక దినమున వస్తానని విశ్వాసముతో వారు నీ వాక్యమును నమ్మియున్నారు. నేను మరణమును మరియు సమాధిని జయించియున్నాను.” సోదరుడా, అది ఏమిటి? ఆయన యుద్ధములో యుండియున్నాడని చూపుటకు ఆయన తన చేతులలో గాయములను కలిగియున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ! ఆయనే ఆ బలిష్ఠుడైన జయశాలి! “తండ్రీ, వారు ఇక్కడయున్నారు; అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు.”

110 ఆయన ఇలా చెప్పుటను నేను వినగలను, “కుమారుడా, ఇక్కడకు నా ప్రక్కకు ఎక్కి రమ్ము, నీ యొక్క శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు ఇక్కడ కూర్చొనుము.” సోదరుడా, ఒక దినము ఆయన తిరిగి రానైయున్నాడు, మరియు అది ఎలాటి దినముగా యుంటుందో!

111 ఆయన సమాధిలోయుండగా ఆయన ఏమీ చేయకుండా లేడు. ఆయన కేవలము అక్కడ చనిపోయియుండియున్నాడని మనము తలుస్తాము. అయితే ఆయన ఇంకనూ క్రింద జయిస్తూనేయున్నాడు. ఆయన క్రిందకు వెళ్ళి సాతాను నుండి తాళపు చెవులను తీసుకొనియున్నాడు, ఈ రాత్రి, ఆయన మరణము యొక్కయు మరియు పాతాళము యొక్కయు రెండు తాళపు చెవులను తీసుకొనియున్నాడు, ఆయన అన్నాడు, “నేను జీవించుచున్నందున, మీరు కూడా జీవిస్తారు.”

112 ఈ రాత్రి నా ప్రియమైన సోదరుడా, సోదరీ, దానిని యథార్థముగా నీవు ఆలోచించావా అని నేను ఆశ్చర్యపోవుచున్నాను? ఆయన జీవించుచున్నందున మాత్రమే నీవును జీవిస్తావని నీవు గ్రహించావా. తగినంతగా నీవు ఆయనను మెచ్చుకొని, నిన్ను నీవు దేవునికి అప్పగించుకొంటూ ఇలా చెప్పగలవా, “దేవా, ఇక్కడ నేనున్నాను, ఒక పాపిని, నా పట్ల కనికరము చూపుము”? నీవు ఎన్నడైనా ఆ సమృద్ధియైన బలి అర్పణను అంగీకరించియున్నావా? నీవు తప్పు చేసినపుడు నీ భావనలను అది గాయపర్చదా? నీవు ఇప్పుడు ఎన్నడూ ఆ అనుభవమునకు రానట్లైతే, ఈ యొక్క సమాధిలో పూడ్చివేయు సమయమున! మన సమయము గతించిపోవుచున్నది, మంచి అనుభూతిని కలిగియుండండి! అయితే, నేను ఆశ్చర్యపోవుచున్నాను, నీవు ఎన్నడైనా క్రీస్తును నీ యొక్క స్వరక్షకునిగా అంగీకరించకపోయినట్లైతే, ఒక్క క్షణము మనము ప్రార్థనలో తలలు వంచియుండగా, నీవు దానిని చేయగోరుచున్నావా అని నేను ఆశ్చర్యపడుచున్నాను.

113 దానిని వాయించండి. సహోదరి, గెర్టీ నీవు కోరినట్లైతే, బండలు బ్రద్దలగుచున్న మధ్యలో, నీవు దానిని కలిగియున్నావా. మంచిది. ఏదైనా పరవాలేదు.

114 మీ తలలు వంచియుండగా, నేను మిమ్ములను ఒక నిజమైన యథార్థమైన ప్రశ్నను అడుగబోవుచున్నాను. గుర్తుంచుకోండి స్నేహితులారా, పాపివైనా లేక పరిశుద్ధుడవైనా, మేము నిన్ను సమాధిచేయునపుడు, నీవు ఉనికిలో ఉంచకుండాయుండవు. నీ ఆత్మ ఎక్కడోయున్నది. ఇప్పుడు లేఖనముల ప్రకారము రెండు స్థలములను యేసు దర్శించియున్నాడు. ఈ రాత్రి నీవు వెళ్ళిపోయినట్లైతే, ఆయన నిన్ను ఎక్కడ కనుగొంటాడు? కనికరమునకు ద్వారము నీ ముఖము ముందు మూసివేయబడుతుంది, ఏలయనగా నీవు త్రోసివేశావు? గుర్తుంచుకో, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన న్యాయాధిపతి కూడా. ఇప్పుడు నీవు తీర్పరియైయున్నావు, ఆయనకు ఎలా తీర్పుతీర్చుతావు? ఇప్పుడు ఆయనను నీకు రక్షకుడిగాయుండనిమ్ము.

115 ఒక చిన్న కథ నా మనస్సులోనికి వచ్చుచున్నది. కొంతకాలము క్రితము ఒక చిన్న బాలుడు ఒక గుర్రపు బండిపై కూర్చొనియున్నాడు. ఆ వీధిగుండా ఒక తుపాకీ ప్రేలినది, మరియు గుర్రములు పారిపోతూ నిట్రముగాయున్న ఎత్తైన కొండ పైకి వెళ్ళుచుండెను. ఒక యవ్వనస్థుడైన కౌబాయ్ పరిగెత్తుకొంటూ వెళ్ళి, ఆ ఎత్తైన శిఖరము మీదికి గుర్రములు వెళ్ళకముందే అతడు బండిని ఆపివేసెను, ఏలయనగా దానిలో ఒక చిన్న బాలుడుండెను, అతడు ఆ చిన్న బాలుని ప్రాణమును కాపాడెను.

116 దాని తరువాత, అనేక సంవత్సరములకు, కోర్టు హాలులో ఒక నేరము చేసినందుకు ఆ బాలుడు నిలబడియుండెను, అతడు తప్పుదారి గుండా వెళ్ళాడు, అతడు దోషిగాయున్నాడు. అతడు త్రాగుచూ, పేకాట ఆడుచూ, ఒక మనిషిని చంపెను; మరియు అతడు దోషిగాయుండెను, దోషిగా తేల్చబడ్డాడు. న్యాయాధిపతి లేచి ఇలా అన్నాడు, “నీ మర్త్యమైన జీవము ముగించబడు వరకు నీ మెడ ఉరి త్రాడుతో ఉరివేయవలసినదిగా నేను నీకు ఉరి శిక్షను వేయుచున్నాను.”

117 ఆ యవ్వనస్థుడు ఇలా అన్నాడు, “న్యాయాధిపతీ!” అని ఆ కోర్టు కటకటాలు తెంచుకొని ఎగిరిదూకి, కోపముగా, ఫిర్యాదు చేయుటకు కనికరము కొరకు, న్యాయాధిపతి పాదాల మీద పడ్డాడు, అతడన్నాడు, “న్యాయాధిపతీ, నా ముఖము చూడుము! నీవు నన్ను ఎరుగవా?”

అతడన్నాడు, “లేదు, కుమారుడా, నాకు తెలియదు.”

118 అతడన్నాడు, “నీకు గుర్తున్నదా, ఒక పలానా చిన్నబాలుని ప్రాణమును నీవు కాపాడియున్నావు పారిపోవుచున్న గుర్రముల నుండి ఎన్నో సంవత్సరముల క్రితము?”

అతడన్నాడు, “అవును, నాకు గుర్తున్నది.”

119 ఈ కుర్రవాడన్నాడు, “నేను ఆ బాలుడను,” అని అతడన్నాడు, “న్యాయాధిపతీ, అప్పుడు నీవు నన్ను రక్షించావు, ఇప్పుడును రక్షించు!”

120 న్యాయాధిపతి అతని వైపు చూసి అన్నాడు, “కుమారుడా, ఆ దినమున నేను నీ యొక్క రక్షకుడను. ఈ దినము నేను నీకు న్యాయాధిపతిని.”

121 ఈ రోజు ఆయన నీ యొక్క రక్షకుడు. పాపి, రేపు ఆయన నీ యొక్క న్యాయాధిపతి, సంగీతము వాయించబడుచుండగా, ఇప్పుడు దానిని మనము ఆలోచిద్దాము. మరియు ప్రతి ఒక్కరూ ప్రార్థించుచున్నారు, దేవునితో ప్రార్థనా షరతులపైయున్నవారు.

122 ఇప్పుడు, ఈ రాత్రి, వేగిరముగా, క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించువారు ఎవరైనాయున్నారా అని నేను ఆశ్చర్యపోతాను, “దేవా, పాపినైన నన్ను కనికరించుము, అని చెప్పండి. చిందించబడిన రక్తము నొద్దకు నేను రాగోరుచున్నాను, సంఘములలో చేరి, ఒక స్థలమునుండి మరొక స్థలమునకు పరుగెత్తి నేను విసిగిపోయాను. నేను తిరిగి జన్మించగోరుచున్నాను. బ్రెన్హాం సోదరుడా, నీవు ఇప్పుడే చెప్పిన ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ద్వారా, క్రీస్తు తన్ను తాను నాకు బయలుపర్చబడియున్నాడనే, అనుభవమును నేను నా హృదయములో కోరుకొనుచున్నాను. నాకు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత కావాలి, నా హృదయములో పరిశుద్ధాత్మ కావాలి, నన్ను సజీవునిగా చేయాలి, నాకై నేను తేటగాయున్న దానికంటె ఎక్కువగా క్రీస్తును నాకు యథార్థముగా చేయాలి, బ్రెన్హాం సోదరుడా ఆ అనుభవము నాకు కావాలి, నా చేతిని ఎత్తియుండగా నీవు నా కొరకు ప్రార్థన చేస్తావా?” జ్ఞాపకముంచుకొనబడవలెనని కోరువారు, మీ చేతిని పైకి ఎత్తుతారా? ఓ స్త్రీ, ప్రభువు నిన్ను దీవించును. ఓ స్త్రీ ఆ వెనుక ప్రభువు నిన్ను దీవించును. అది మంచిది. అయ్యా, ప్రభువు నిన్ను దీవించును. అది మంచిది. మీ చేతులను ఎత్తండి, ఇప్పుడు మీ చేతులను ఎత్తియుంచండి.

123 నీవు ఎలా సిగ్గుపడతావు? స్నేహితుడా, అలాటి దానిని తిరస్కరించగలవా? గుర్తుంచుకో.

124 “ఓ,” “బ్రెన్హాం సోదరుడా, బోధకులు సంవత్సరముల తరబడి బోధించియున్నారు,” అని అంటావా. నాకు తెలుసు, ఈ దినములలో ఒక దినమున, వారు బోధించుట ఆపివేయబోవుచున్నారు. మరియు కార్యములు కనబడుచున్నట్లుగా, అది తప్పక ఇప్పుడేయుండాలి. నిజముగా, నీవు నీ యొక్క చివరి ప్రసంగమును వినబోవుచున్నావు, ఇదే నీ యొక్క చివరి ప్రసంగము కావచ్చు.

125 “ఓ,” “నేను యవ్వన ప్రాయములో యున్నాను,” అని అంటావా, అది లెక్కకాదు, మరణమునకు పక్షపాతము లేదు, లేక వయస్సునకు లేక సామర్ధ్యమునకు.

126 నీ చేతిని ఎత్తుట ద్వారా, నీ సొంత రక్షకునిగా నీవు ఆయనను ఇప్పుడు అంగీకరిస్తావా, “దేవా, నన్ను కనికరించుము,” అని చెపుతావా? మిగిలిన వారితో నీ చేతులను ఎత్తుము, మరియు చెప్పు, “ఇప్పుడు నేను క్రీస్తును అంగీకరించగోరుచున్నాను.” మీరు మీ యొక్క చేతిని ఎత్తుతారా?

127 ఎవరో వెనుకకు జారినవారు, “దేవా నన్ను కనికరించుము, అని చెపుతారా, ఈ రాత్రే నేను క్రీస్తునొద్దకు రాగోరుచున్నాను, ఇప్పుడు రేపు నాకు ఒక క్రొత్త పునరుత్థాన దినముగా యుంటుంది.” మీ చేతులను ఎత్తుతారా? మీ చేతులను పైకెత్తండి, “దేవా, నన్ను కనికరించుము, ఇప్పుడు నేను రాగోరుచున్నాను,” అని చెప్పండి. దానిని మీరు చేస్తారా? మీ చేతులను ఎత్తండి, చెప్పండి, “నేను ఒక వెనుకకు జారిన వ్యక్తినైయున్నాను, కాని ఈ రాత్రి…” ఓ స్త్రీ, ప్రభువు నిన్ను దీవించును. అది మంచిది. “నేను క్రీస్తును నా వ్యక్తిగత రక్షకునిగా అంగీకరిస్తాను. ఈ రాత్రే నేను ఆయనను అంగీకరిస్తాను. ఈ రాత్రే నేను ఆయనను అంగీకరిస్తాను, ఎన్నో సంవత్సరముల నుండి నేను దేవునికి దూరముగా తిరుగులాడాను. అయితే ఇప్పుడు ఇంటికి వచ్చుచున్నాను.” ఈ రాత్రి మీరు ఆయనను అంగీకరిస్తారా, అట్లు ఇది ఒక క్రొత్త పునరుత్థానముగా మీకుంటుంది, మీ పాత జీవితము తప్పక ముగించబడుతుంది.

128 తన ఒప్పుకోలును చేయుటకు ఈ స్త్రీ నిలబడి వేదికపైకి వచ్చుచున్నది. అక్కడ ఎవరో వారి స్థానమును తీసుకొనుటకు ఇష్టపడగోరుచున్నారు, ఆమెతో కలిసి ఇక్కడకు రండి, వారి యొక్క ఒప్పుకోలుతో? మీరు కూడా నిలబడి వేదిక యొద్దకు వస్తారా. వేదిక తెరువబడియున్నది. నిశ్చయముగా. ఇప్పుడే తిన్నగా పైకి రండి. మీరు ఇక్కడ నిలబడి ప్రార్థన చేయగోరినట్లైతే, అది మంచిదే. ముందుకు రండి. మీరు వస్తారా? మీ విశ్వాసపు ఒప్పుకోలు మీద, దేవుని కుమారునియందలి మీ విశ్వాసమును బట్టి, మీరు ఇప్పుడు వస్తారా? మంచిది.

129 నీవు గుర్తుంచుకో, అది నీ యిష్టమైయున్నది. నీవు ఒక పాపివా? నీవు ఒక వెనుకకు జారిన వ్యక్తివా? నీవు చల్లబడి క్రీస్తునుండి దూరముగా వెళ్ళిపోయావా? ఇప్పుడు నీవు ఒక క్రొత్త వ్యక్తిగా ఆయనతో లేపబడగోరుచున్నావా? ఒక క్రొత్త జీవితమును ప్రారంభించుము? భార్య మరియు భర్తలారా, ఎంతో దీర్ఘకాలముగా మీ గృహములలో ఒకరితో ఒకరు తగువులాడుచున్న మీ సంగతి ఏమిటి? మీరు వచ్చి ఒకరితో ఒకరు మరియు దేవునితో దానిని మీరు తిన్నగా చేసికోరా? ఈష్టర్ ను నిజముగా మీరు ఒక ఈష్టరుగా చేసుకోండి, ఒక క్రొత్త గృహమును ఆరంభించండి.

130 గృహములో ఎన్నడూ ప్రార్థన చేయనివారైన మీ సంగతి ఏమిటి సంఘము నుండి మీరు ఇంటికి వెళ్ళి, మీరు సామర్ధ్యము కొలది చక్కగా జీవించాలని అనుకొనుచున్నారు, ఎన్నడూ మీ కుటుంబములను ఏకముగా తీసుకొని రావటము లేదు మరియు ప్రార్థించుటలేదు? ఆ కారణమును బట్టియే మనము, మనము కలిగియున్న వాటిని బట్టి మనము బాల్య నేరములను కలిగియున్నాము. ఆ కారణమును బట్టియే అమెరికా గృహములు బ్రద్దలైపోయియున్నవి. మీరు రారా, వచ్చి దానిని ఒక క్రొత్తగా ప్రారంభించండి? మీరు రారా? మీరు ఆహ్వానించబడియున్నారు, గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను మీ సేవకుడనైయున్నాను; ఆ దినమున నేను ఒక సాక్షిగాయుంటాను.

మనము తలలు వంచియుండగా, తరువాత, ఇప్పుడు ప్రార్థన చేద్దాము.

131 మా ధన్యుడైన పరలోకపు తండ్రీ, ఈ రాత్రి ఈ శ్రోతలను మీ యొద్దకు తెచ్చుచున్నాము, ఎలా మేము చేయాలో, అత్యున్నతమైన రీతిలో పవిత్రమైన, దీనమైన, గంభీరమైన రీతిలో, వారిని నీ యొద్దకు తెచ్చుచున్నాము. మేము దీనముగా నీ సింహాసనమును సమీపించుచున్నాము. మరియు ఈ రాత్రి వర్తమానము తరువాత, అది, ఆ గొప్ప సమాధిలో పూడ్చివేయబడుటతో, ఆయన ఎన్నడూ నిశ్శబ్దముగా లేడు. ఆయన ఆత్మ తిన్నగా ఆ ప్రాంతములోనికి వెళ్ళి, దేవుని పనిని పూర్తి చేసినది, ఆయన చేయుటకు నిర్దేశించబడిన పని. మరియు రేపు ఉదయమున మేము పై కూటములలో ఆయన ఎక్కడకు వెళ్ళియున్నాడో మేము కనుగొంటాము, ఆయన పునరుత్థానములో, సమస్తమును జయిస్తూ, అయితే ఈష్టరు ఉదయమున మన నీతీకరణము కొరకు ఆయన బయటకు వచ్చియున్నాడు. మరియు పాపములో యున్న మనుషులను ఒప్పించుటకు, ఆయన తిరిగి పరిశుద్ధాత్మను పంపియున్నాడు.

132 మరియు ప్రభువా ఈ రాత్రి మేము ప్రార్థన చేయుచున్నాము, అదేమనగా, నీ ముందు చేతులను లేపిన వారిని జ్ఞాపకము చేసికొనండి. వారు నిన్ను స్వీకరించియున్నారని, మరియు నిన్ను నమ్మియున్నారని, వారు వారి యొక్క హృదయముల నుండి తీర్మానము చేయుదురు గాక, మరియు వారు వాగ్దానపు ముద్రతో వారు ముద్రించబడుదురు గాక. తండ్రీ, దానిని దయచేయుము. ఏలయనగా, మేము వారిని నీకు అప్పగించుచున్నాము, ఈ రాత్రి వర్తమానముతో. విన్నవారిని అది దీవించునుగాక, ప్రభువా దానిని ఎవరు గృహములకు తీసుకొని వెళతారో, అది వారి హృదయములలో లోతుగా నానునుగాక. వారు దేవుని వాక్యము మీద జీవించుదురు గాక, తండ్రీ, కారణము క్రీస్తు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్. 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...