బైబిలులో ఉన్న అత్యంత గొప్ప వరము

బైబిలులో ఉన్న అత్యంత గొప్ప వరము

VGR COUNT-149 మీకు ధన్యవాదములు. మీరు కూర్చొనవచ్చును. ఈ మధ్యాహ్న సమయమున ఈ అద్భుతమైన జనుల గుంపును చూచుటకు నాకు చాలా ఆనందముగా ఉన్నది. ప్రతి రాత్రి మనం ఎంతమందినైతే కలిగి ఉంటామో, ఇప్పుడూ అంతమందినే కలిగి ఉన్నామని అనుకుంటున్నాను. సాధారణముగా ఆదివారము మధ్యాహ్నము కూడికలు అంత పెద్దగా ఉండవు, ఎందుకనగా ఆదివారము మధ్యాహ్నము ప్రజలు బయటకు వెళ్ళి వారికొరకు వారు ప్రశాంతంగా గడపాలి అన్నట్లుగా ఉంటారు. కాని ఇంకనూ ప్రభువును ప్రేమించు ప్రజల యొక్క ఆసక్తిని ఇది చూపించుచున్నది. కనుక దీని కొరకు నేను చాలా సంతోషముగా ఉన్నాను.

నేను ఇంతకు ముందే సహోదరుడు కారల్ మాట్లాడుచున్నాను. నేను వచ్చినపుడు నేను ఆస్వాదిస్తున్న చక్కని సంగీతమును మరియు గానమును గూర్చి మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. మరియు నేను ఆ తెర వెనుక నా స్నేహితుడు సహోదరుడు రాస్మసేన్ తో మాట్లాడుతూ ఉంటిని.

2

మరియు ఇప్పుడు, కూటములు ప్రారంభించబడి మంగళవారము రాత్రి వరకు కొనసాగుతాయి. సహోదరుడు కారల్ మరియు తన యొక్క సువార్త బృందం అలాగే కొనసాగుతారు. మరియు ఈ మంచి సంగీతము, గానము మరియు బోధ, రోగుల కొరకు ప్రార్ధించుట మరియు ఇంకా అనేక విషయములు కొనసాగించబడతాయి. సహోదరుడు కారల్, ఇది ఎక్కడుండ బోతుందో అన్న విషయాన్ని వాళ్ళు ప్రకటించారని నేను నిశ్చయిత కలిగియున్నాను. కనుక మంచి ఆశీర్వాదములను ఆస్వాదించుటను మీరు కొనసాగింపవచ్చును.

మరియు ఇప్పటికి కొంత సేపటి క్రితము అలస్కాలోని అంకరేజ్ నుండి వచ్చిన నా దీన స్నేహితుని నుండి నాకొక ఉత్తరము వచ్చింది. మరియు అతడు తన ఉత్తరము కంటే ముందే నా యొద్దకు చేరుకున్నాడు, దాదాపుగా దానిని ఓడించాడు. సహోదరుడు ఫాండ్లర్ కంటే పదిహేను నిమిషాల ముందుగా తన ఉత్తరము వచ్చింది. అతను ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. స్విట్జర్లాండ్ నుండి నాకు చాలా చాలా మంచి స్నేహితుడిగా వున్నాడు.

3

అతను ఏమైయున్నాడో మరియు ప్రభువు ఏ విధముగా తనను బయటకు పిలిచాడో మరియు తన మార్పు మాకు గుర్తున్నది. మరియు ఒకప్పుడు అతను చాలా మొరటు వ్యక్తి మరియు లేని దానిని ఉన్నట్లుగా నమ్మిస్తున్నారు, అనుకున్నాడు. మరియు తనకు తెలిసిన కొంతమందిని అతడు తీసుకుని వారిని ప్రార్థనా వరుసలో నిలబెట్టేవాడు. మరియు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి ఎవరో అన్న విషయాన్ని మాత్రమే కాకుండా, ఆ చిన్న వ్యక్తిని ఎవరు తీసుకొచ్చారో కూడా చెప్పెను. కనుక అది అతనిని సరిగా స్థిరపరచినది. అప్పటి నుండి మేము గొప్ప స్నేహితులుగా ఉన్నాము.

ఎర్నీ, నీవు ఎక్కడ ఉన్నావు? నీవు చెయ్యెత్తుట గాని నిలబడుట గాని లేదా ఏదైనా చేస్తావా? ఎర్నీ ఫాండ్లర్, అతను ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అతను కొద్దిగా సిగ్గుపడువాడు. అవును. ఓ, అక్కడ... ఓ మై! ఓ, అక్కడ ఉన్న నిన్ను ఎవరు చూడగలరు? సహోదరుడు ఎర్నీ మరియు తన ప్రియమైన భార్య మరియు ఇద్దరు ప్రియమైన చిన్న బాలురు, వారు “విస్కాన్సిన్, షవానోలో” ఉన్నప్పుడు వారి గృహము నందు నేనున్నాను. మరియు వారు అలస్కా, అంకరేజ్ నుండి తిరుగు ప్రయాణములో ఉన్నారు. తాను ఇక్కడికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నానని అతడు చెప్పాడు, కాని మట్టితో, రాళ్ళతో కూడిన రెండు వేల మైళ్ళ మార్గాన్ని ఎలా ప్రయాణించాడో. కూటమును ఆనందించుటకు ఇక్కడికి వచ్చు ప్రయత్నములో తన కారును మీరు చూసి ఉండాల్సింది. నమ్మకత్వం అంటే అది, కాదా? నిజముగా నమ్మకత్వం అంటే అదే.

4

మరియు ఇప్పుడు ఈ రాత్రి మరలా స్వస్థతా కూడిక ఉండబోతుంది. ఈ రాత్రి క్రీస్తు అత్యధికముగా పని చేయాలని మేము ఎదురుచూస్తున్నాము. మరియు ఈ మధ్యాహ్నము సువార్త కూడిక కొరకు కేటాయించబడినది. మరియు అప్పుడు నేను మాట్లాడగలను మరియు అప్పుడు మనం ఇళ్ళకు వెళ్ళి మధ్యాహ్న భోజనము తిని, మరలా వచ్చుటకు సమయము ఉంటుంది. ఈ ఉదయం చాలా రద్దీగా గడిచింది; ఈ ఉదయం నేను కలిసిన ప్రతి వ్యక్తితో ప్రభువు అద్భుతంగా వ్యవహరిస్తున్నాడు. మేము దర్శనములు చూశాము మరియు జీవితములు సరిచేయబడినాయి మరియు ఆ విధముగా, ఆయన అద్భుతముగా ఉన్నాడు. నేను ఖచ్చితముగా చెప్పుచున్నాను, మనము అందరము ఆయనను ప్రేమించుచున్నాము.

మరియు కల్గరీ నుండి ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే, మాకు ఆ ఆహ్వానములు మరియు అవన్నియు ఉన్నాయి. మరియు అవన్ని అభినందించదగినవి, కాని నేను.... నేను చిన్న కూటము కొరకు, బహుశా బుధవారము నుండి ఆదివారము లాంటి కూటము కొరకు తిరిగి కల్గరీకి వెళ్ళులాగున శీతాకాలము ప్రారంభం కాకముందే నేను అక్కడ ఉండవచ్చును. చలి పెరగక ముందే “స్టాంపేడ్ గ్రౌండ్స్ అను స్థలమును మేము తీసుకుంటామని వారు చెప్పారు. చలి కాలములో ఇది వెచ్చగా ఉంటుందని నేను నమ్మను. కనుక మేము తిరిగి రావచ్చు, ఈ ఆకులు రాలు కాలములో ఇడాహోకు నేను రావలసియున్నది. మరియు బహుశా అక్కడే ఆగిపోయి ఆ వారాంతమును కల్గరీ ప్రజలతో గడపవచ్చును. అక్కడ కొంత సహవాసాన్ని కలిగి ఉండవచ్చును.

5

ఎటువంటి ఆహ్వానము లేకుండానే ఈ సేవకులతో సహకారము ఖచ్చితముగా అభినందించదగినదే. నేనెంతగానో నేర్పించబడ్డానో ప్రేమించే ప్రియ సహోదరుడు ఫ్రెడ్-సాత్మన్ ఇక్కడికి వస్తూ ఉంటాడు.... సహోదరుడు ఫ్రెడ్ ఒక సేవకుడు కాదు, కాని తన హృదయమంతటితో ప్రభువును ప్రేమిస్తాడు. మరియు ఫ్రెడ్-సాత్మన్ కంటే మంచి మనిషిని మీరు కనుగొనలేరని నేను చెప్పుచున్నాను. అతను నీతిమంతుడు....... అతను ఇప్పుడు ఇక్కడ లేడు. మరియు అందుకోసమే నేను దానిని చెప్పగలుగుచున్నాను, చూశారా. మరియు అతను ఒక మంచి మనిషి.

నన్ను క్షమించండి. నేను... బిల్లీ, నిన్ను గది వెనుకకు తీసుకువెళ్ళలేదా? ఫ్రెడ్, బిల్లీ..... నిన్ను తెర వెనుక చూడాలనుకుంటున్నాడు. నేను దానిని అతనికే చెప్పినట్టు ఉన్నాను. మరియు అతను వేదిక నుండి వెళ్ళిపోయాడనుకున్నాను. నన్ను క్షమించు..... మీ పాపములే నిన్ను పట్టిస్తాయి, కాదా? నేను నిజంగా అతను వెనుక ఉన్నాడని అనుకున్నాను. బిల్లీ టేప్స్ కు సంబంధించి వేదిక వెనుక అతనిని చూడాలని కోరుకున్నాడు. లియో ఎవరో కూడిక అంతటిని టేప్స్ మీద కలిగి ఉండాలని కోరుకున్నారు.

6

ఇప్పుడు, అతను వెళుతూ ఉండగా నేను మాట్లాడతాను. అతను ఖచ్చితముగా నాకు మంచి సహోదరుడుగా వుంటున్నాడు. మరియు అతను చేయు మంచిపని, అతను వచ్చి సేవకులను కలుసుకొని మరి మేము వస్తున్నాము అని చెప్పేవాడు. మేము దానిని చేయుటకు కారణం ఏమిటంటే, మీరు ఆర్థిక సహకారం కలిగియున్నట్లయితే, మంచిది అప్పుడు, ఒక సంఘ శాఖ దీనికి సహకరిస్తున్నట్లయితే, ఇంకొక సంఘ శాఖ - మేము దానిలో చేయగలిగింది ఏమియు లేదని భావిస్తుంది. కాని మీరు కేవలం వచ్చినట్లయితే.....

నా ఉద్దేశ్యము ఇలా వుంది. దేవుని చిత్తమైనట్లయితే, ఒక గొప్ప పెద్ద కదలికను రాబోయే వేసవిలో అమెరికాలో మరియు కెనడాలో తీసుకురావాలని ప్రణాళిక వేస్తున్నాను. ఎక్కడో ఒక స్థలములో ఎనిమిది నుండి పదివేల మంది కూర్చొనగలిగే అంత పెద్ద టెంటుకు ఆర్డరు ఇస్తున్నాను, మరియు ఈ టెంటును వేయుట కొరకు స్థలములను కనుగొనాలని కోరుకుంటున్నాము, మరియు పునాది చాలా దగ్గరగా వేయుట కొరకు, మధ్యాహ్న సమయములు కలిగియుండునట్లు, కేవలం ఏదో నాలుగు లేక ఐదు రోజులు లేక ఒక వారముండుట కాదు, నాలుగు లేక ఐదు వారములు బోధించుట కొరకు ఉండాలని మేము కోరుకుంటున్నాము.

7

మరియు కొన్నిసార్లు అపవిత్రాత్మలు ఒక వ్యక్తిని విడిచి వెళ్ళినపుడు, చాలాసార్లు అది వారికి తెలియదు. ఏమి చేయాలో వారికి తెలియదు. మంచిది, “ఓ, నేనింకాస్త రోగిని అయ్యాను,” అని వారిలో కొంతమంది అంటారు. మంచిది, నువ్వు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రోగివి కావాలి. అది వారికి తెలియదు. అది నీ లోపల వున్న పెరుగుదల వంటిది... ఇప్పుడు, మనము ఆ పెరుగుదలతో వ్యవహరించుటలేదు. వైద్యుడు దానిని కత్తిరించుట ద్వారా దానితో వ్యవహరిస్తాడు. కాని మనం ఆ పెరుగుదలలో వున్న జీవముతో వ్యవహరిస్తాము. అది జీవము.

ఇప్పుడు, ప్రస్తుతానికి, క్యాన్సర్ లాగా, క్యాన్సర్ అనేది గొప్ప చంపు వాటిలో ఒకటిగా వున్నది. మంచిది ఇప్పుడు, క్యాన్సర్ ఒక జీవాన్ని కలిగివుంది. మరి ఇది నీ జీవమునకు వేరుగావున్న మరొక జీవముగా వుంటుంది. మరియు ఇది పెరుగుతూ, విస్తరిస్తూ వుంటుంది. ఇప్పుడు, బైబిలు దీనిని దయ్యం అని పిలుస్తుంది. కాళ్ళు కలిగి మరియు విస్తరించు అను అర్థం వచ్చు “క్రాబ్” అను మాట నుండి, వైద్య పరిభాషలో, క్యాన్సర్ పిలువబడుతుంది. కాని నిజమునకు ఇది ఒక దయ్యం, మరియు దయ్యం ఒక బాధ పెట్టునదిగా వుంటుంది.

8

సాధారణంగా, నలుగ గొట్టబడిన ఒక చిన్న కణము ద్వారా వచ్చువాడు నీ శరీరములో తిష్టవేస్తాడు, మరియు ఆ చిన్న కణము గతి తప్పి మరి కొన్నిసార్లు నీ ప్రాణమును తీస్తుంది. “తప్పిపోవుట” అను మాట ఒక బాప్టిస్టుకు ఒక పెద్ద మాటగా వుంటుంది. కదా? కాని ఆ విధముగా, దయ్యం ఆ చిన్న కణములోనికి ప్రవేశించినట్లయితే, ఆ కణము గతితప్పి, అది నీ శరీరములో వున్న ప్రతి కణమును ఆటంక పరుస్తుంది.

ఇప్పుడు, దయ్యము సృష్టి చేయలేదు. ఒక్క దానిని కూడా వాడు సృష్టించలేడు. దేవుడు ఇది వరకే సృష్టించిన దానిని వాడు కేవలం వంకర మాత్రం చేయగలడు, చూశారా. పాపమంటే నీతిని వక్రీకరించేది, చూశారా. పాపము అనగా ఏమీ లేదు... దయ్యం పాపాన్ని కూడా సృష్టించలేదు. వాడు కేవలం నీతిని వక్రీకరిస్తాడు, చూశారా. ఎందుకనగా అక్కడ ఒకే ఒక సృష్టికర్త వున్నాడు: ఆయనే దేవుడు మరియు దేవుడు మాత్రమే సృష్టిని చేయగలడు. కాని దేవుడు సృష్టించిన దానిని దయ్యం తీసుకొని దానిని వంకర చేస్తాడు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండుటకు దేవుడు మిమ్మును సృష్టించాడు. దయ్యం మీలో చొరబడి తన మార్గమునకు మిమ్మును వంకర చేస్తాడు. అదే సమస్యను సృష్టిస్తూ వున్నది.

9

ఇప్పుడు, ఒక క్యాన్సర్: క్యాన్సర్ నుండి జీవము బయటికి వెళ్ళినపుడు, అది మరణిస్తుంది. కాని ఒక అద్భుతం జరగకపోతే, ఆ పెరుగుదల ఇంకా అక్కడే వుంటుంది. మంచిది, ఆ పెరుగుదల అక్కడ వేలాడుతూ వుంటుంది, దానిలో జీవము లేదు. అది మరణించింది. సాధారణ పాత దక్షిణ విధానములో దానిని చెప్పాలంటే, కుళ్ళిపోయిన అంత పెద్ద మాంసపు ముక్క నీ శరీరములో ఉంటే ఏమిటి? మంచిది, అప్పుడు నీ గుండె కొట్టుకుంటుంది, మరియు అది కొట్టుకున్న ప్రతిసారి, నీ రక్తం గుండె ద్వారా వెళుతుంది మరియు రక్త ప్రవాహాన్ని శుద్ధిచేస్తుంది మరియు అది క్యాన్సర్ యొక్క చనిపోయిన శరీరమును పట్టుకుంటుంది, మరియు అది జ్వరములో బయటపడుతుంది. ఇంతకు ముందుకంటే ఎక్కవగా నీవు జబ్బుపడతావు. మరియు అది బహుశా మొదటి డెబ్బది-రెండు గంటలు నీవు మంచి అనుభూతిని కలిగివుంటావు, ఎందుకనగా ఒక శరీరము కుళ్ళుటకు దాదాపు డెబ్బది-రెండు గంటలు పడుతుంది.

10

నీవు ఒక దుప్పిని లేదా ఒక జంతువును ఈ రోజు కాల్చి చంపినట్లయితే, నీవు దానిని తూనిక మీద వేసి దానిని తూసావు మరియు నీవు అబ్బాయిలూ, “ఆ దుప్పి ఇంత మరియు ఇంత బరువు వుంది,” అని చెబుతావు. జాగ్రత్తగా వుండు, ఉదయానికి అది కొన్ని పౌండ్ల బరువు తేడా తూగుతుంది, చూశారా.

ఎవరైనా ఒకరు చనిపోయినట్లయితే, వెట్టివాడు నకిలీ దంతాలను గాని, కృత్రిమ నేత్రాలను లేదా దేనినైనా తీసివేస్తాడు, ఎందుకనగా అది కుచించుకు పోయినపుడు అవి బయటకు వచ్చేస్తాయి. కాని ఆ శరీరమును కొద్ది దినములు నీవు అక్కడే ఉండనివ్వు, అది అంతకు ముందున్న దానికంటే పెద్దదిగా అవుతుంది.

ఒక చిన్న కుక్క లేదా ఏదైనా, వీధిలో చంపబడిన ఒక చిన్న జంతువును గమనించండి, కొద్ది దినములలో ఎంత పెద్దగా ఉబ్బుతుందో నీ లోపల వున్న ఆ క్యాన్సర్ గడ్డకు లేదా ఆ పెరుగుదలకు అదే జరుగుతుంది. నువ్వు ఇంకా ఎక్కువ జబ్బుపడతావు. మరియు విశ్వాసమును ఎలా పట్టుకోవాలో తెలుసుకొనుటకు వారు శిక్షణ ఇవ్వబడక పోయినట్లయితే, ఆ వ్యక్తి అంటాడు, “ఓ, నేను నా స్వస్థతను పోగొట్టుకున్నాను,” అని...

11

ఇప్పుడు, చూడండి దేవుడు సమస్తమును ఆదియందు ఎరిగియున్నాడు, మరియు అక్కడ ఏమియు లేనపుడు, కనీసం వెలుగు గాని మరి ఏదియు అక్కడ లేనప్పుడు, దేవుడు “కలుగును గాక,” అన్నాడు. మరియు ఆయన తన మాటను సరిగా పట్టుకొనగా, ఆయన సొంత మాట భూమ్యాకాశములను సృష్టించింది కేవలం ఆయనకు కలిగిన ఒక ఆలోచన ద్వారా..... ఆయన దానిని కలిగి ఉండబోతున్నాడు మరియు ఆయన “కలుగును గాక,” అన్నాడు. మరియు ఆయన సొంత వాక్యము సృష్టియాయెను. మరియు నీవు ఈ రోజు నిలుచున్న నేల రూపుదాల్చిన దేవుని మాట తప్ప మరేమియు కాదు. అది నిజం. దేవుడు పలికినదేదయినా, ఖచ్చితముగా దానిని ఉత్పత్తి చేయవలసిందే, అలా కాకుండా వుండలేదు.

ఆయన కొండ దిగివచ్చినపుడు, యేసు వైపు చూడండి. ఆయన ఆకలిగా వున్నాడు, తినుట కొరకు పొద వైపు చూశాడు, మరియు అక్కడ ఏమియు లేదు. ఆయన అన్నాడు, “ఇప్పటి నుండి ఏ మనుష్యుడు నీ నుండి తినడు.” మరియు ఆయన వెళ్ళిపోయాడు, ఎప్పుడూ దానిమీద అరవలేదు, ఆయన కేవలం అన్నాడు, “నీ నుండి ఏ మనుష్యుడు తినడు.” అపోస్తలులలో ఒకరు దానిని విన్నారు. మరియు మరుసటి రోజు వారు దాటి పోయినపుడు, ఆ చెట్టు ఎండిపోయి వున్నది, చూశారా. ఆయన తన మాటను పలికాడు మరియు ఆ విధముగా జరుగుతుంది అనుటలో ఏ మాత్రము కూడా అనుమానం లేదు, మరియు ఆ చెట్టనుండి జీవము బయటకు వెళ్ళింది. అది ఆ విధముగానే వుండాలి. దేవుడు అలా చెప్పాడు.

12

గత రాత్రి అబ్రాహమును గూర్చి నేను మాట్లాడుతూ వున్నది అదే. దేవుని ద్వారా ఒక మాట పలుకబడినప్పుడు, దానిని పట్టుకొనండి, మరియు అది(వాక్యము) ఏమి చెప్పినదో దానిని అది సృష్టిస్తుంది. కాని అనుమానించుట ద్వారా మరియు పైకి, క్రిందకు ఎగురుట ద్వారా, మీరు దానిని చేయలేరు. నీవు దానిని పట్టుకొని ఉండవలసియున్నది దానితోనే ఉండండి. దేవుడు దానిని రూపుదాల్చేలాగున చేస్తాడు.

మరియు నేను అనుకుంటున్నాను, ఒక నెల రోజులు పాటు ఈ నగరమంత పరిమాణమున్న నగరములో ఉండగలిగితే, మరియు అందరు సేవకులను, అన్ని సంఘములను, ప్రతి ఒక్కరిని రప్పించి, వారి సహకారముతో ప్రార్థనా కూటమును కలిగి వుండి, మరియు ప్రజలను రప్పించి మరియు వారు ప్రార్ధింపబడక ముందే, రెండు లేక మూడు కూటముల పాటు సూచనలను వినిపించి, అప్పుడు వారు వేదిక యొద్దకు వచ్చినప్పుడు, వారి స్వస్థతను పొందుకొనుటకు వారు సిద్ధముగా వుంటారు, చూశారా.

మరియు నేను నమ్ముచున్నాను, ఈ నగరములోనే ఇక్కడే మనము ఒక నిజమైన ఉజ్జీవమును కలిగియుండ వచ్చునని, ఎందుకనగా ఇక్కడికి వస్తూ నేను చూస్తున్నాను, ఒకేసారి అందరికీ చెప్పుచూ, మరియు పరిశుద్ధాత్మ ఇక్కడ ఇప్పుడు ఏ విధముగా వెళ్ళాలనుకుంటుందో చెప్పుటకు చూచునప్పుడు, అది ఏదో అర్ధమును కలిగి వుంటుంది.

కనుక మేము వెళ్ళిన తరువాత, నేను చెప్పుచున్నాను, ఈ కూటము ఇక్కడున్న మన సహోదరుడు కారల్ తో కొనసాగుతుంది. ఇప్పటివరకు అతను కలిగియున్న గొప్ప కూటములలో ఒక కూటముగా ఇది ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకనగా సహకరించుటకు ఒక నిజమైన సహోదరుడుగా అతను ఉంటున్నాడు, కూటము కొనసాగుటకు అతను చేయగలిగిన ప్రతీది అతను చేస్తాడు.

13

ఇప్పుడు, మనము ప్రార్థన చేద్దాము. ధన్యుడైన ప్రభువా, మా హృదయములలో ఆనందము కలిగి ఈ మధ్యాహ్నము వేళ మేము నీ యొక్క దైవికమైన సన్నిధిలోనికి వచ్చుచున్నాము, ఎందుకనగా యేసుక్రీస్తు దేవుని కుమారుడనియు మరియు లేఖనముల ప్రకారము ఆయనను మృతులలో నుండి ఆయన లేపెననియు మేము పరిపూర్ణముగా ఒప్పింపబడినాము మరియు ఈ వారం మా సమక్షములో ఆయన యొక్క నిత్యజీవము నిరూపించబడినది. రెండు వేల సంవత్సరముల క్రితము తరములలో ఆయన ఉన్న విధముగానే, ఆయన తన గొప్ప పనిని చేయుట మేము ఇప్పుడు చూశాము.

14

ఓ, బైబిలు సత్యమని మరియు దేవుడు ఇంకా తన ప్రజలను ప్రేమిస్తున్నాడని తెలుసుకొనుటకు మా హృదయములు ఎంతగా సంతోషిస్తున్నాయో, అయోగ్యులైన అన్యజనుల నుండి తన నామము కొరకు ఒక సంఘమును, ఒక జనమును పిలుచుటకు ఈ కడవరి దినములలో ఆయన మనలను దర్శించెను.

ఈ దినమున, జరగబోవు ఈ బోధనా పరిచర్య ఘడియలో, మా హృదయములు లోతుగా కదిలింపబడులాగున మరియు మునుపటి కంటే ఎక్కువగా మీ ప్రేమయందు మరియు విశ్వాసమునందు నాటబడునంతగా, అద్భుత రీతిలో మమ్ములను అభిషేకించమని నేను ప్రార్ధిస్తున్నాను తండ్రి. మరియు ఈ మధ్యాహ్నము మేము ఈ ప్రదర్శన స్థలమును విడిచి వెళ్ళునప్పుడు, మా జీవితములలో కృత నిశ్చయత మాలో ప్రతి ఒక్కరము కలిగియుందుము గాక.

15

ఆలస్యమగుచున్నది. ఈ దినములలో ఏదో ఒక దినమున మనుష్యకుమారుడు వచ్చును మరియు పనిచేయుట కొరకు వెలుగు ఉండగానే మేము పనిచేయవలసి యున్నది. విశ్వాసమునకు కర్తయు మరియు దానిని ముగించువాడైన ప్రభువైన యేసుక్రీస్తును చూస్తూ, మా ముందుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తునట్లు, మమ్మును సులువుగా చిక్కుల బెట్టు ప్రతి పాపమును, ప్రతి భారమును ప్రక్కకు పెట్టుటకు, మాకు సహాయము చేయుము, ప్రభువా.

ఈ దినమున మాకు వాక్యమును బయలుపరచండి మరియు మాట్లాడు పెదవులను పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచును గాక. ఆయన దేవుని యొక్క వాక్యమును తీసుకొని, మా అవసరత ప్రకారము, ఆకలిగొనియున్న ప్రతి హృదయమునకు దానిని ఇచ్చును గాక. మేము ఆయన నామములో మరియు ఆయన మహిమార్ధమై దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

16

“మీరు అనుకున్నదానికంటే ఆలస్యమైనది” అను నినాదము కొంతకాలం క్రితము బయటకు వచ్చింది. నా వద్ద ఒక రీలు ఉన్నది. నేను దానిని తీసుకుని వచ్చి వుండాల్సింది. “అర్దరాత్రికి ఇక మూడు నిమిషములు,” అను దానిని చూపుటకు ఇది చక్కని ప్రదేశమైయుండేది. మీరెవరైనా ఎప్పుడైనా దానిని చూశారా? నా వద్ద అది వున్నది. నేను దానిని చూసినప్పుడు, దాదాపు పూర్తిగా మార్పుచెందాను, పూర్తిగా మార్పుచెందాను, అంటే నా ఉద్దేశ్యము ఆ విధముగా అని కాదు. ఆ విధముగా అది నా ఆత్మను కలచివేసింది.

మీకు తెలుసు, నెలలో ఇది ఏ రోజు తెలుసుకోవాలంటే, మీరు క్యాలెండర్ చూడండి. కాని కాల చక్రముల ప్రకారము ఏ దినములో మీరు జీవిస్తున్నారో తెలుసుకోవాలంటే, యూదులను గమనించండి. అది కాలము యొక్క దేవుని క్యాలెండరు అయి ఉన్నది.

మరియు యూదులు వచ్చి ఇరాన్ లో దిగుతూ ఉండడంతో చిత్రం ప్రారంభమవుతుంది మరియు “లుక్ మాసపత్రిక” దాని గూర్చి పెద్ద వ్యాసములు ప్రచురించింది. ఆ యూదులు స్టీలుతో చేయబడిన నాగలిని కూడా ఎన్నడూ చూసి ఉండనంత పాతకాలపు మనుష్యులుగా వుండేవారు. రెండువేల సంవత్సరముల క్రితము దున్నినట్లుగానే వారు పాత చెక్క పుల్లలతో దున్నేవారు. ఆ పెద్ద విమానములు క్రిందికి వచ్చి, తిరిగి పాలస్తీనాకు తీసుకు వెళ్ళుటకు ఎక్కించుకున్నపుడు, వారు తిరిగి వచ్చునపుడు వారు పక్షిరాజు రెక్కల మీద మోసుకొని రాబడుదురు అని ప్రవక్తలు పలికిన మాటలు నెరవేర్చబడినవి.

17

మరియు వారు వారిని ఓడల నుండి మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతముల నుండి, తూర్పు నుండి మరియు పడమర నుండి మరియు ఉత్తరం నుండి, మరియు దక్షిణం నుండి దించుతూ వుండగా, వారు వచ్చునపుడు, వారు వారి వృద్ధులను వీపుల మీద మోసుకొస్తున్నారు, వారి వృద్ద తల్లులు మరియు నాయనమ్మలు మరియు తండ్రులు, ఒక భేటీ (ఇంటర్యూ) లో పైకి వచ్చి అన్నారు “మీరు మీ స్వదేశమునకు ఎందుకు తిరిగి వస్తున్నారు, మీరు ఇక్కడే చనిపోయి మరియు ఇక్కడే పాతిపెట్టబడుటకా?” అని, వారన్నారు, “కాదు, మేము మెస్సియ్యను చూచుట కొరకు వచ్చాము” అని.

దానిని తేలికగా తీసుకొనవద్దు. గుర్తుంచుకొనండి, యూదా ప్రజలు 1946 ఏప్రిల్ లేదా మే ఆరున ఒక దేశముగా ప్రకటింపబడినారు, మరియు ప్రభువు దూత 1946 ఏప్రిల్, మే ఏడున నాకు కనపడెను. ప్రపంచములోనే అత్యంత పురాతనమైన జెండా, రెండు వేల సంవత్సరములుగా క్రిందకు దించబడియున్న దావీదు యొక్క ఆరు కోణముల జెండా తిరిగి, యెరూషలేము మీద ఎగురుచున్నది. మనము అంత్యకాలములో వున్నాము.

18

ఆ యూదులు లోనికి వచ్చినపుడు, యేసు అనునటువంటి దానిని వారు ఎన్నడు వినియుండలేదు. మరియు ఇక్కడ మీలో చాలా మంది నార్వే మరియు స్వీడన్ ప్రజలు వున్నారు, స్టాక్హోమ్, స్వీడన్ కు చెందిన ఫిలడెల్ఫియా సంఘము, వేల బైబిళ్ళు, క్రొత్త నిబంధనలు, ఆ చిన్న యూదులకు పంపింది. మరియు యూదులు ఈ బైబిలును చదువుతూ, వారి ప్రక్కన నిలబడి వున్నవారితో, “ఈయనే మెస్సీయా అయితే, ఈ యేసే మెస్సియ్య అయితే, ప్రవక్త యొక్క సూచక క్రియ ఆయన చేయుట మమ్ములను చూడనీయండి, మరియు మేము ఆయనను నమ్ముతాము,” అని అన్నారు. యూదులు సూచనలు వెదకుదురు; గ్రీకులు, జ్ఞానమును వెదకుదురు.

ప్రభువు నాకు ఇచ్చిన పరిచర్య కొరకు ఎంత అందమైన వేదికో, ఈ మధ్య కాలములో నేను పాలస్తీనాకు రెండు వందల మైళ్ళ దూరంలో ఉండియున్నాను. వెళ్ళుటకు నేను టిక్కెట్టును కలిగియున్నాను, నేను “ఇదే సమయం,” అని అనుకున్నాను.

మరియు ఐగుప్తు, కైరో వద్ద విమానంలో వున్నపుడు పరిశుద్ధాత్మ నన్ను పిలిచెను. నేను బయటకు వెళ్ళి ఆ స్థలము యొక్క వెనుక భాగమునకు వెళ్ళాను. మరియు ప్రార్ధించాను మరియు “ఇప్పుడు వెళ్ళవద్దు,” అని ఆయన చెప్పాడు.

19

మనము లోనికి వెళ్ళి మరియు వేల మంది యూదులను తీసుకొని మరియు, “ఇప్పుడు ఇది నిజమా, పునరుత్థానము అను ప్రవక్త యొక్క సూచనను ఆయన చేసినట్లయితే, ఆయనను మీరు అంగీకరిస్తారా? వెళ్ళి, మీయంతట మీరే కొంతమంది మనుష్యులను చూసి మరియు ఇక్కడికి లోనికి తీసుకొని రండి. నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా వున్న మెస్సియ్యా ఈయనేనేమో మనం చూద్దాం.” అని చెప్పు దినమును చూచుటకు నేను ఇష్టపడుచున్నాను. మరియు ఎప్పుడైతే ఆయన ఇక్కడ చేయుచున్నట్లుగా ప్రభువు చేస్తాడో, నేను అనుకుంటున్నాను ఒకేసారి పదుల వేల కొలది యూదులు క్రీస్తు యొద్దకు వచ్చుట నేను చూస్తానని.

మరియు ఎప్పుడైతే దేవుడు యూదుల వైపు తిరుగుతాడో, అన్యుల దినము ముగుస్తుంది. అది నిజం. మనం అంత్యకాలములో ఉన్నాము. ఆ యూదులు, “పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, వారు ప్రపంచమును మరలా ఉజ్జీవింపజేస్తారు, ఎందుకనగా వారు నిజమైన పంపబడిన వారు (మిషనరీస్), మరియు వారికి ఇంకా మూడున్నర సంవత్సరములు మిగిలి ఉన్నాయని దేవుడు వాగ్దానము చేశాడు. మరియు నేను నమ్ముచున్నాను, మనం ఆ సమయంలో ఉన్నాము. కనుక మనము విశ్వాసములో క్రీస్తు వైపు కదులుచుండగా, ప్రార్ధించండి.

20

ఈ మధ్యాహ్నము వాక్యము యొక్క పఠనము.... నేను ఇంకొంచెము మాట్లాడుచున్నాను, దానికి కారణం ఏమిటంటే, ప్రజలు ద్వారముల గుండా వస్తూవున్నారు మరియు సీట్లలో కూర్చొనుచున్నారు. వారు స్థిరముగా కూర్చొనేవరకు నేను వేచి యుంటున్నాను.

కీర్తనలు 63:1-3:

దేవా, నా దేవుడవు నీవే; వేకువనే నిన్ను వెదకుదును.

నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్ళు లేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.

నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.

మరియు ఈ మధ్యాహ్నము లేదా ఈ మధ్యాహ్నము కొరకు “బైబిలులో ఉన్న అత్యంత గొప్ప వరము,” అనుదాని మీద మాట్లాడాలని ఆశపడ్డానని నేను చెప్పాను. మరియు దేవుడు మానవునికి ఇవ్వగలిగిన వరములలో నిత్యజీవము కంటే గొప్పదైన ఏదైనా వరమును గూర్చి ఈ మధ్యాహ్నము ఇక్కడ వున్న శ్రోతలైన మీలో ఎంతమంది ఆలోచించగలరు. జీవము కంటే ఇవ్వగలిగిన గొప్ప వరము ఒక్కటి కూడా లేదు. జీవము అనునది ఉన్నతమైన వరము. ఎక్కడ జీవముండునో, అక్కడ ఆనందముండును గనుక ఇది వరములన్నింటిలో, అత్యంత గొప్ప వరము. మరియు దేవుడు ఒక్కడే నిత్యజీవమును కలిగియున్నాడు.

21

మరియు మనము ఈ మధ్యాహ్నము లేఖనముల అమరికను తీసుకున్నపుడు, దావీదు, ప్రవక్త మరియు ప్రియుడైన కీర్తనకారుడు, పాడుటను అతను ఎంతగా ప్రేమించేవాడు; ప్రేరణ అతని మీదకు వస్తుంది, మరియు అతను కీర్తనలు వ్రాసేవాడు. మరియు తరచూ నేను ఆలోచించేవాడిని, యేసు, ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నపుడు, ఆయన దావీదువైపు చూపాడు, “కీర్తనల గ్రంథములో దావీదు అనలేదా....?” మంచిది, అప్పుడు అయితే కీర్తనలు కూడా ప్రవచనాత్మకమైనవే.

22

మరియు విమోచన కథల గూర్చి మరియు ప్రభువు రాకడను గూర్చి మనము పాడే ఈ గొప్ప అద్భుతమైన పాట, ఆయన వచ్చినపుడు ఎలా ఉండబోతుందో అని నేను ఆశ్చర్యపడుచున్నాను. వారు ఒకప్పుడు ఆ పాటను పాడుట మరియు సంగీతం మీద దానిని వాయించుటను గూర్చి నేను ఆలోచిస్తున్నాను, కొంత ఈ విధముగా ఉంటుంది:

జమ్ములో ఉన్న చిన్న మోషేను గూర్చి మీరు విన్నారు,

భయము లేని దావీదును గూర్చి,

అతడి వడిశలను గూర్చి మీరు విన్నారు,

కలలు కనే యోసేపును గూర్చి చెప్పే కధను మీరు విన్నారు.

మరియు దానియేలును గూర్చి,

సింహములను గూర్చి మేము తరుచుగా పాడుతుంటాం.

మరియు, ఇంకా అనేక మంది, బైబిలులో వున్నారు,

వారినందరిని కలుసుకోవాలని నేను ఆశతో వున్నాను

నేను ఖచ్చితంగా కలుసుకుంటానని ప్రకటిస్తున్నాను.

మధ్యాకాశంలో ఆ కూటమునకు దేవుని యొక్క స్వంత కుమారుడే నడిపించేవాడుగా ఉండబోతున్నాడు.

23

ఓ, వాస్తవంలో నేను దానిని చూడాలని ఆశపడుచున్నాను. మరియు మనం దానిని చూస్తాము అని నేను నమ్ముచున్నాను మరియు ఆ కీర్తనలు ప్రేరేపణ ద్వారా వ్రాయబడ్డాయని నేను నమ్ముచున్నాను. మరియు ఇక్కడ దావీదు అరణ్యములో తిరిగేవాడిగా వుంటూ మరియు ప్రకృతి ద్వారా అతను దేవుని చూచెను. నీవు కేవలం దేవునినే చూడగలవు. నా మొదటి బైబిలు ప్రకృతే. గొప్ప ఆకాశ పక్షులను మరియు సూర్యాస్తమయములను నేనెంత తరుచుగా గమనిస్తూ వుండేవాడినో.

కొంత కాలము క్రితము ఇక్కడ నేను పర్వతాలలో వున్నాను. మరియు నేను కణుజు వేటలో వున్నాను. మరియు అది ఆకురాలు కాలము యొక్క ప్రారంభము మరియు కణుజు మందను క్రిందికి తరిమేంత లోతుగా మంచు రాలేదు. బహుశా నేను, జీవించియున్నవాటికి, నలభై, యాభై మైళ్ళ దూరంలో ఒంటరిగా వున్నాను.

మేము ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళము:

నా ప్రభువైన క్రీస్తుతో,

ఒంటరిగా గడపడానికి ఇష్టపడు సమయములు వున్నాయి,

నా బాధలు అన్ని ఆయనతో ఏకాంతముగా చెప్పగలను.

24

మరియు పర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళటం, మనుష్యులకు మంచిది, జంతువులను చంపుట కొరకు కాదు, గాని కేవలం ఏకాంతముగా ఉండుట కొరకే. మరియు అక్కడ తుఫానులు ఆకురాలు కాలములో వస్తాయి మరియు కొద్దిసేపు వర్షం పడుతుంది, కొద్దిసేపు మంచు కురుస్తుంది, మరియు సూర్యుడు ప్రకాశిస్తాడు: అంత ఎత్తులో ఆ పర్వతాలలో అస్థిరమైన వాతావరణం వుంటుంది.

మరియు నేను బరువులు మోయు నా గుర్రమును పర్వతము క్రిందనే విడిచి పెట్టి మరియు పర్వతము మీద మొక్కలు పెరగలేని ప్రాంతపు హద్దుకు (టెంబర్ లైన్) వెళ్ళితిని. కణుజుల యొక్క కాలిబాటలు మరియు గుర్తుల కోసం గమనిస్తూ, నేను అక్కడ నడుస్తూవున్నాను. మరియు ఒక్కసారిగా ఒక గర్జన నేను విన్నాను, మరియు అక్కడొక నల్లని మేఘం ఒకటి వస్తూ ఉండుట చూసాను, మరియు అప్పుడు నేను తెలుసుకున్నాను ఒక తుఫాను రాబోవుచున్నదని. నేను పెను గాలిలోనికి ప్రవేశించాను, కనుక చెట్లవైపుగా కొద్దిగా క్రిందికి దిగాను, తుఫాను వెళ్ళిపోయేంత వరకు నేను కొన్ని చెట్ల వెనుక చేరియున్నాను.

25

మరియు ఆ గొప్ప గాలులు సుడులు తిరిగినపుడు, మరియు చెట్లు మూలుగుచూ, పెద్ద శబ్దం చేశాయి, “ఆ చెట్లు దేనిని గూర్చి సంతోషముతో మూలుగుతూ, శబ్దం చేస్తూ, తుళ్ళుతున్నాయి,” అని ఆలోచించుట నేను ప్రారంభించాను. దేవుడు గాలిని ఒక ఉద్దేశ్యము కొరకు పంపుతాడు, మరియు లోతుకు చొచ్చుకొని పోవుటకు వీలుగా ఖాళీ ఏర్పడులాగున అది ఆ వేర్లను వదులు చేస్తుంది.

ఆయన సంఘములో ఉజ్జీవము ద్వారా దేవుడు ఆ విధముగానే చేస్తాడు. లోతుగా ఎదిగి, మనకు గట్టి పట్టు చిక్కునట్లుగా ఆయన మనలను కుదిపి, వదులు చేస్తాడు. కనుక ఆత్మ యొక్క కుదుపు మరియు కదిలింపు మనలను వదులు చేయును.

మరియు ఒక చిన్న పుష్పమును గమనిస్తూ, అక్కడ చలికాలములో అది ఏ విధముగా చనిపోతుందో, మరియు అక్కడ బహుశా సున్నాకు డెబ్బది డిగ్రీలు తక్కువగా ఉండొచ్చు, అని దానిని గూర్చి ఆలోచిస్తూ, నేను ఆశ్చర్యపోయాను. ఆ రేకులు పోయాయి, పుష్పము పోయింది, చిన్న నల్లని విత్తనాలు దానినుండి బయటపడి పోయాయి, అది నశించింది, మరియు గుజ్జు పోయింది, కాని ఆ మట్టిలో ఎక్కడో ఒక చోట, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ ఎన్నడూ కనుగొనలేనంతగా, ఒక జీవపు అంకురము పడియున్నది.

కాని ఆ వెచ్చని వసంతకాలపు సూర్యుడు ఆ భూమి మీద ప్రకాశించుట మొదలుపెట్టగానే, ఆ చిన్న పుష్పము తలను పైకి పొడిచి మరియు ప్రభువును స్తుతిస్తుంది. మరియు ఒక పుష్పానికే తిరిగి బ్రతుకుటకు దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేసినట్లయితే, ఇంక ఎంత ఎక్కువగా ఒక మనిషి తిరిగి బ్రతుకుటకు ఆయన మార్గమును ఏర్పాటు చేయును.

26

అక్కడ నిలబడియుండగా నా స్నేహితుడైన ఒక మెథడిస్టు బోధకుని గూర్చి ఆలోచిస్తూ ఉండియున్నాను. ఒక రోజు మేము ఇండియానాలోని, హోన్రీవిల్ నందు ఒక ఐస్క్రీమ్ వంటకం చుట్టూ చేరి సహవాసము కలిగియున్నాము మరియు కెంటకీలోని, లూయిస్విల్ నుండి వచ్చిన చిన్న వ్యవసాయ కార్యక్రమము జరుగుతూ వుంది.

మీరు పొలములో పండించగలిగిన మొక్కజొన్న విత్తనమును పోలిన విత్తనమును అచ్చం అలానే తయారు చేయగలిగే యంత్రమును 4-హెచ్ క్లబ్ వారు కనిపెట్టియున్నారు. పొలములో పండించిన వాటిని ఒక గుప్పెడు తీసుకొని, యంత్రము తయారు చేసినవాటిని ఒక గుప్పెడు తీసుకొని వాటిని కలపండి, మరలా మీరు వాటిని వేరుచేయలేరు. ఒకటి తయారు చేసినట్లుగానే ఇంకొకటి మొక్కజొన్న అటుకులు తయారు చేస్తుంది, ఒకటి మొక్కజొన్న రొట్టె చేసినట్లుగానే, ఇంకొకటి మొక్కజొన్న రొట్టెను చేస్తుంది. కాల్షియమ్, తేమ పరిమాణం ఒకే విధముగా ఉంటుంది, దాని వెలుపలి వైపు తొక్క మధ్యలో కేంద్రస్థానము ఉంటుంది.

27

అప్పుడు ఈ వక్త మాట్లాడుతూ, “వాటి మధ్య తేడాను చెప్పుటకు వున్న ఏకైక మార్గము వాటిని పూడ్చి పెట్టడమే మరియు యంత్రము తయారు చేసినది కుళ్ళిపోయి మరి ఇక ఎప్పటికీ వుండదు, కాని పొలములో దేవుడు పెంచింది మాత్రం దానిలో ఒక జీవపు అంకురమును కలిగియుంటుంది, అది మరలా బ్రతుకుతుంది,” అని అన్నాడు.

నేను అనుకొన్నాను, “ఎంత చక్కని కథ. అక్కడ సంఘములో ఒకే ఆసనము మీద ఇద్దరు మనుష్యులు, కూర్చొని వుంటారు. వారివురు సంఘ పెద్దలు కావచ్చు లేదా సంఘ కాపరులు కావచ్చు, లేదా వారెవరైనా కావచ్చు లేదా, సంఘ సభ్యులలో ఇద్దరు కావచ్చు, వారిద్దరూ సంఘమునకు వెళుతూ వుంటారు. ఇరువురూ ఒకే వర్తమానమును వింటూ వుంటారు; కాని ఒకరు జీవమును కలిగివున్నారు, మరొకరు కలిగియుండరు.” మానవుని కొరకు ఏదో ఒకటి చేయుటకు దేవుని హస్తము కావలసియున్నది. నీవు తిరిగి జన్మించిన వాడవైతే, దేవుని ఆత్మను నీవు కలిగియున్నట్లయితే, నీవు మరలా బ్రతుకుతావు. నీవు ఎంత మంచి వాడవైనా సరే, నీవు ఎంత నిష్టగలవాడవైనా సరే, ఆ జీవపు ఆత్మ నీలో లేనట్లయితే, నీవు నశించిపోతావు. మరియు అక్కడ ఒకే ఒక్క నిత్యజీవమున్నది మరియు దేవుడు దానిని కలిగియున్నాడు.

28

నా తుపాకిని చెట్టుకు ఆనించి, అక్కడ నిలబడి, ఆశ్చర్యచకితుడనై నేను గమనిస్తూ వుండగా, నేను చూశాను. ఒక చిక్కిపోయిన ఉడుత శబ్దమును నేను విన్నాను. అవి మాకు ఇక్కడ కెనాడాలో ఉంటాయని నేననుకుంటున్నాను, చిన్నగా వుంటుంది, ఐర్లాండ్ వారి గుడ్లగూబలాగ, కంగారు కంగారుగా మరియు అంతా వెంట్రుకలతో వుంటుంది. ఓ, ఏమి గొడవ చేస్తుందో అది, చెట్లలో నుండి అన్నింటిని తరిమేసేలాగా, చాటర్, చాటర్ చాటర్ చాటర్. “మంచిది, చిన్నవాడా, నేను నిన్ను ఆందోళనకు గురిచేసినట్టున్నాను,” అని నేననుకున్నాను.

మరియు నేను దారి మీదుగా అవతలికి చూశాను, మరియు పర్వతములో వున్న పెద్ద సందు వెనుక నుండి సూర్యుడు బయటకు వస్తున్నాడు, మరియు సూర్యుడు పచ్చిక బయలులో నిలబడిన నీటికి ఎదురుగా ప్రకాశిస్తూ వున్నాడు, అంత ఎత్తులో అది లోయ యొక్క ఆ ప్రక్కనుండి ఈ ప్రక్కవరకు వర్షధనుస్సు ఏర్పడులాగున చేసింది. అప్పుడు, “ఓ దేవా, నీవిక్కడున్నావు. నీవు వర్షధనుస్సులో వున్నావు,” అని నేనన్నాను.

29

తుఫానులో తప్పిపోయిన ఒక మగ కణుజు, కొండ ప్రక్కన అరవడం నేను విన్నాను. మరియు అక్కడ దానిగూర్చి ఏదో వుంది. అది నా ఆత్మను వెలిగించింది. మరియు ఒక తోడేలు కొండ మీద ఒక ప్రక్కన కూత వేసింది, మరియు క్రింద నుండి దాని జత దానికి సమాధానమిచ్చింది.

నా తల్లి ఒక సగం ఇండియను. నేను ప్రేమించునది చాలినంతగా అక్కడ బయట ఉన్నది. “ఓ, ఉండుటకు ఎంత అద్భుతమైన స్థలమో, కణుజు మందలో దేవుని వింటున్నాను, తోడేలు పిలుపులో దేవునిని వింటున్నాను, పుష్పములో, గాలిలో, చెట్లల్లో దేవున్ని చూస్తున్నాను,” అని నేననుకున్నాను. దేవుడు ప్రతిచోట ఉన్నాడు. చుట్టూ చూడండి. మీరు ఆయనను లోపల ఇక్కడికి రానివ్వండి, మీరు ఆయనను అక్కడ వెలుపల చూడగలరు.

మరియు ఆ చిన్న నిలువు గీతలు గల ఉడుత వైపు చూశాను మరియు “గోలచేస్తున్న చిన్నదానా, నేను నిన్ను ఆందోళనకు గురిచేశానా?” అని నేను అనుకున్నాను. మరియు మిగిలిన కథ అంతా నేను మీకు బాగా చెప్పగలను. నేను ఎంతగానో దైవిక ప్రేరణ పొందాను... లేక (ఓ, నేను అలా అనను), నా తుపాకిని చెట్టుకు ఆనించి పెట్టి, నా గొంతంతటిని ఉపయోగించి అరుస్తూ నేను ఎంత గట్టిగా తిరగగలనో అంత గట్టిగా ఆ చెట్టు చుట్టూ, చుట్టూ, చుట్టూ తిరిగేటంతగా, ప్రేరణ పొందాను, ఎందుకు, ఒకవేళ అడవిలోనికి ఎవరైనా వచ్చి వుంటే, పిచ్చాసుపత్రి నుండి వచ్చిన ఒకడు అక్కడ వున్నాడనుకుంటారు.

30

కాని అది ఏమిటి? దేవుడు సమీపముగా ఉండియున్నాడు. ఆ వర్షధనుస్సులో ఆయన ఉన్నాడు గనుక, అడవి గుండా ఆయన గుసగుసలాడుచున్నాడు, గనుక ఆ తోడేలు ద్వారా ఆయన అక్కడ నన్ను పిలిచాడు గనుక, మరియు దూరముగా వున్న కణుజులో వుండి సమాధానము ఇచ్చాడు, గనుక నాలో వున్న సమస్తముతో నేనాయనను స్తుతిస్తూ వుండియున్నాను. ఎందుకు, అటువంటి ప్రదేశములో మీరు ఊరక ఉండలేరు. కనుక ఆ ఉడుత కంటే నేను ఎక్కువ గొడవ చేశాను. నేను పట్టించుకోలేదు. ఎక్కడో ఆ రాతి పర్వతము యొక్క శిఖరాన నేను ప్రభువును ఆరాధిస్తూ వున్నాను.

మరియు నేను అక్కడ నిలబడియుండగా, ఆ చిన్నది పైకి క్రిందికి ఎగురుతూ, ఇంకా, ఇంకా ఎక్కువ గొడవచేస్తూ వుంది, “ఓ, చిన్నదానా, నిన్ను ఆందోళన పరచాలని నేను కోరుకోలేదు,” అని నేననుకున్నాను. మరియు అది తన తలను ప్రక్కలకు ఆడిస్తూ మరియు ఆ విధముగా క్రిందికి చూస్తూ వుండటం నేను గమనించాను. “బహుశా, అది నా వైపు చూడట్లేదేమో” అని నేననుకున్నాను.

31

మరియు తుఫాను వచ్చు సమయంలో, ఆ తుఫాను ఒక పెద్ద పక్షిరాజును గాలిలో క్రిందికి బలముగా నెట్టబడులాగున చేసింది. ఆ పక్షిరాజును గూర్చి అది భయపడింది. ఆ పెద్ద పక్షిరాజు మొద్దు మీదకి దూకి మరియు ప్రశాంతమైన ఆ కళ్ళతో నా వైపు మరియు ఆ చిన్న ఉడుత వైపు చూసింది.

“ఇది వింతగా వుంది. ఎప్పుడు, నేను అంతటా దేనిని వింటున్నానో అప్పుడు ఇది నన్ను ఆటంకపరచినది. నా పవిత్రమైన ఆరాధన ఎందుకు ఆటంకపరచబడినది? దీనిని ఎందుకు నీవు జరగనిచ్చావు ప్రభువా?” అని నేను అనుకున్నాను. మరియు నేను ఆ పెద్ద పక్షిరాజును గమనించడం మొదలుపెట్టాను “ఇప్పుడు, దేవా, నీవు ఆ పక్షిరాజులో ఉండగలవా?”

మరియు అది భయపడలేదని నేను గమనించాను. పిరికి వారిని దేవుడు ఇష్టపడడు. దేవుడు దానికి రెండు రెక్కలు ఇచ్చాడు. మరియు దేవుడిచ్చిన తన తలాంతులో అది నమ్మకము కలిగి వుంది. నేను నా తుపాకీని లాగేలోపే, తను ఆ చెట్లలో వుండగలదని దానికి తెలుసు. కాని అది ఎందుకు భయపడలేదా అని నేను ఆశ్చర్యపోయాను. మీకు తెలుసు, తన ఈకలతో అది అనుభూతి చెందుతూ వుంది. రెక్కలన్ని పనిచేయు క్రమములో ఉన్నట్లయితే, వాటి రెక్కలతో అవి ఎలా చేయగలవో మీకు తెలుసు.

ఆ సంఘము దగ్గరగా కూడివచ్చి మరియు వారి ఆత్మ సంబంధమైన రెక్కలన్ని పనిచేయు క్రమములో కలిగివుంటే అని నేనాలోచిస్తున్నాను.

32

మరియు అది నన్ను గమనిస్తూ వుంది. మరియు కొద్దిసేపటి తరువాత, అది నన్ను గూర్చి భయపడలేదు, కాని ఆ గొడవను (చాటర్, చాటర్) అది ఇష్టపడలేదు. కనుక అది ఒక్క ఉదుటున ఎగిరింది, మరియు తన రెక్కలను రెండు లేదా మూడు సార్లు అడించింది. అది అడవికి ఆవల ఉంది.

మరియు అప్పుడు దేవుడు నాకు దేనిని అయితే చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడో, దానిని నేను చూడటం జరిగింది. ఈ గొప్ప భారీ ఆకాశ నిపుణుడు, తన పెద్ద రెక్కలను ఆ విధముగా ముందుకు చాచిపెట్టి వుంచింది అంతే; తను ఇంక ఒక్క సారి కూడా తన రెక్కను ఆడించలేదు. తన రెక్కలను ఆ గాలి తరంగాలలో ఎలా పెట్టి వుంచాలో తనకు తెలుసు, మరియు తను ఒక చిన్న చుక్కలాగా అయ్యేంత వరకూ, తను పైకి, పైకి, పైకి ఎత్తబడినది.

“ఓ దేవా, మరలా నేనొక తరుణమును కలిగియుండబోవుచున్నాను; అది నిజం. అది మెథడిస్టు నందు చేరి, మరియు అప్పుడు వారిని విడిచి మరియు బాప్టిస్టుకు వెళ్ళి, అక్కడ నుండి నాజరీనుకు వెళ్ళుట కాదు. అది కేవలం మీ యొక్క విశ్వాసమును పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో ఎలా ఉంచాలో తెలుసుకొని మరియు పైకి ఎత్తబడుట అయివున్నది. ఆ నీడ కంటే పైన ఆ తరంగముల మీద స్వారీ చేయండి. ఊటను మరియు నన్ను శుద్ధిచేయు రక్తమును వెలుగులో చూచుటకు, మీతో సహవాసమును నాకిమ్ము,” అని నేనన్నాను.

“అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి. పరిశుద్ధాత్మ అనేటు వంటిది ఏదీ లేదు. నీవు కలిగి యున్నయెడల బాగుపడలేవు.....” ఆ విధముగా ఇవన్నీ చెప్పుచున్న అక్కడ ఉన్న భూసంబంధమైన. అ చిన్న ఉడుతను వదిలి అది వెళ్ళి పోయింది. అది కేవలం తన రెక్కలను అలా ఉంచి, మరియు దాని నుండి దూరంగా ఎగిరిపోయింది. దేవా, పక్షిరాజు వంటి రెక్కలను మాకు దయచేయుము. “అద్భుతములు జరుగు దినములు గతించిపోయెను. దైవిక స్వస్థత అనునటువంటిది ఏదీ లేదు. కేవలం పరిశుద్ద గుండ్రాళ్లు తప్ప మరేమి కాదు.” ఇక్కడ, గొడవ గొడవ, మరియు అక్కడ గొడవ, గొడవ, వారు ఎంతగా భూసంబంధులుగా ఉండగలరో అంతగా భూసంబంధులుగా ఉన్నారు.

33

అది ఎన్నడూ దానిని లెక్క చేయలేదు, అప్పుడు దాని వలన అది విసిగి వేసారి పోయింది.

ఈ సంఘము దానినే చేస్తుందని నేను నిరీక్షిస్తున్నాను. కేవలం మీ యొక్క గొప్ప రెక్కలను దేవుని వాగ్దానములో పెట్టి ఉంచండి; అది మ్రోగెడు కంచును మరియు గణగణలాడు తాళమును అగునంతగా, పరిశుద్ధాత్మ మిమ్మును దాని కను దృష్టికి అందనంతగా తీసుకెళ్ళనివ్వండి.

ప్రకృతిలో, దేవుడు ప్రకృతిలో నివసించును. దావీదు ఒక గొప్ప ప్రకృతి మనిషిగా ఉండివున్నాడు. అతడు దానిని పరిశీలన చేశాడు. అతడక్కడ దేవునిని కనుగొన్నాడు. తన ఒడిశలతో ఒక ఎలుగుబంటిని, ఒక సింహమును చంపుటకు తనకు దేవుడు ఎలా సహాయం చేయగలడో అతడు ఎరిగియుండెను. అందువలననే అతడు ఈ కీర్తనలు వ్రాయగలిగియుండెను.

కాని కీర్తనలో వింతైన భాగమిదే: “నీ కృప జీవము కంటే ఉత్తమము.” లేఖనముల అమరికను మీరు గమనించారా? “నీ కృప నాకు జీవము కంటే ఉత్తమము, కనుక నేను నిన్ను స్తుతించెదను. మరియు నీరు లేక ఎండిన భూమిలో నా ఆత్మ నీ కొరకు తృష్ణగొనుచున్నది.”

34

అప్పుడు, దావీదు దేనిని గూర్చి మాట్లాడుతున్నాడో నేను అర్థం చేసుకొనలేకపోయాను. మొట్టమొదటిసారి దానిని నేను చదివినపుడు, “నీ కృప జీవము కంటే ఉత్తమము.” అంటే ప్రవక్త యొక్క ఉద్దేశము ఏమిటి? అని నేననుకున్నాను. జీవము కంటే ఉత్తమముగా ఏది వుండగలదు? ఏదీ వుండదు. కనుక నేను ఈ గ్రహింపునకు వచ్చాను. అది, ఖచ్చితంగా అక్కడ రెండు రకముల జీవములు ఉండవచ్చు. జీవమునకు ఒక సంయుక్తార్ధమున్నది. అనగా ఒకటి కంటే ఎక్కువ అని.

ఇప్పుడు, చాలామంది ప్రజలు త్రాగుట, పొగత్రాగుట, జూదమాడుట, తిరుగుట, నాట్యమాడుటయే జీవితమనుకుంటారు. కాని అది వక్రీకరించబడిన జీవితం. అది మరణం, అది ఖచ్చితముగా అదే. దయ్యము ఆ జీవితమును వక్రీకరించింది, మరియు ఇదే జీవితమని నువ్వు అనుకుంటున్నావు, కాని అది మరణం. ఆ జీవితం చాలా దుర్భరమవుతుంది. ప్రజలు ఈ దినమున దేనినైతే జీవితముగా పిలుస్తున్నారో, అది ఒక తుపాకీ తీసుకొని తమ మెదడును పేల్చివేసు కొనేంతగా దుర్భరమవుతుంది. దేవుడు మాట్లాడుచున్నది, జీవితమును గూర్చి అయి యుండదు.

35

చాలా మంది యవ్వన స్త్రీలు అనుకుంటారు. వారు నగరమునకు వెళ్ళి అందముగా ముస్తాబు అయి, వీధిలో నడుచుటకు లైంగిక పరమైన ఆకర్షణ పుట్టించు ఒక రకమైన చిన్న దుస్తులను కొనుటకు చాలినంత డబ్బులు, వారు పొందుకొనగలిగితే మరియు అబ్బాయిలు ఆమెవైపు పొగుడుతున్నట్లుగా ఈల వేస్తే లేదా ఆమె నోటిలో నమిలే చూయింగ్ గమ్ ఉంటే, “ఇది జీవితము” అని ఆమె అంటుంది. నా సహోదరి, నీవు తప్పు. అది మరణం. “సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు, చచ్చినదైయుండును,” అని బైబిలు చెప్పుచున్నది.

మరియు తన జీతములో పెరుగుదల వచ్చింది కనుక తను ఒక మంచి కారు కొనగలడు, ఒక మంచి సూటు ధరించగలడు, అను దానిని బట్టి, “అబ్బాయి, ఇప్పుడు నేను జీవిస్తున్నాను,” అని పురుషుడు అనుకొంటాడు. నీవు క్రీస్తును కలిగి లేనట్లయితే, నీవు చచ్చినవాడవు. అది వక్రీకరింపబడిన జీవితం.

36

ఇక్కడ కొంతకాలం క్రితము, ఈ దేవుడిచ్చిన, అందమైన, అద్భుతమైన కెనడాలోని ఒక గొప్ప పట్టణములో నేను వున్నాను. నేను దీనిని చెప్పవలసిన అవసరం లేదు, కాని నేను చాలా సార్లు దీనిని చెప్పాను. నేను యవ్వనస్తుడనైతే, నేను కెనడా దేశపు పౌరునిగా అవ్వాలని కోరుకొని వుండేవాడిని. ఇవ్వటానికి దీనికి చాలా వుంది. కెనడాను నేను ఇష్టపడతాను. నా ప్రపంచపు ప్రయాణాలన్నిటిలో, భాన్పు మరియు జాస్పర్ కంటె అందమైన ప్రదేశాన్ని నా జీవితములో నేనెప్పుడూ చూసి యుండలేదు. నేను జంగ్-ప్రావు, ఐగెరాయి, మరియు మొంక్బూడ్ పర్వతమునకు, స్విస్ ఆల్స్ అంతటి గుండా, మరియు జర్మనీకి, మరియు ప్రపంచమంతటినీ తిరిగి వచ్చాను, కాని ప్రపంచం ఇవ్వగల దేనినైనా సరే అధిగమించ గలిగింది, భాన్పు మరియు జాస్పర్ కలిగియున్నది.

వెయ్యేండ్ల పాలనలో ప్రభువు నన్ను అక్కడే నివసింప చేస్తాడేమో, ఆయన చేస్తాడని నేను ఆశిస్తున్నాను. మీరంతా ఎక్కడైతే ఇప్పుడు ఆనందిస్తున్నారో అక్కడ, మరియు నేను, ఆశిస్తున్నాను అప్పుడు మనందరం కలిసి ఆనందిస్తామని. ఓ, ఇది అందమైనది.

37

మరియు నేను మీ గొప్ప నగరములలో ఒకటైన నగరంలో ఉండియున్నాను, ఒక దయగల సహోదరుడు నన్ను ఉంచెను గనుక నేను గొప్పవైన పెద్దవైన హోటళ్ళలో ఒక దానిలో ఉండియున్నాను. ఒక రాత్రి నేను కూటము నుండి గృహమునకు వెళుతూ వున్నాను, మరియు నేను పైకి నాలుగు లేదా ఐదవ అంతస్తు దగ్గరగా వెళ్ళాను. అక్కడ సంయుక్త రాష్ట్రాల నుండి వచ్చిన ఒక అమెరికా గుంపు ఒక వసతి గృహములో వుంటున్నారు, ఆ పేరు నేను చెప్పలేను.

కాని ఒక వసతి గృహము, ఒకానొక వసతి గృహము వారు వారి ఉత్సవమును లేదా కూడికను అక్కడ కలిగి ఉంటున్నారు. చర్చికి వెళ్ళక మునుపు ఆ మధ్యాహ్నము, ఆ ప్రజలలో కొన్ని వింత కార్యములు నేను గమనించాను. కాని ఆ రాత్రి నేను తిరిగి వచ్చినపుడు, పై అంతస్తు మీద లిఫ్ట్ లో నుండి బయటకు వచ్చాను, ఓ, నేను చూసిన వాటిలో కెల్లా భయంకరమైన త్రాగుడు కూడికను వారు కలిగి ఉన్నారు. మరియు ఇక్కడ చూడటానికి చక్కగావున్న ఇద్దరు స్త్రీలు వస్తూవున్నారు, బహుశా వారి ఇరవై-అయిదు లేదా ముప్పై తరువాత కొన్ని సంవత్సరాలలో ఉండి ఉంటారు. వారి లోదుస్తులు తప్ప మరేమి లేకుండా ఆ ప్రాంగణములోకి వస్తున్నారు. ఒకొక్కరి వద్ద ఒక్కో విస్కీ సీసా వున్నది, మరియు పురుషులు వారిని ఒక గది నుండి మరొక గదికి లాగుతూవున్నారు.

38

నేను వెనక్కి నీడలోకి వంగాను, మరియు వారిద్దరికి పెళ్ళి ఉంగరములు ఉన్నాయి. ఇప్పుడు, దానిని వారు స్వచ్ఛమైన సరదా అని పిలుస్తారు. అది మురికి పాపము. అవును. అతడి భార్య ఒక చక్కని గుంపుతో కలసి సాయంకాలము భోజనం చేయుటకు మరియు ఒక స్నేహపూర్వకమైన కూడికకు ఎక్కడికో బయటకు వెళ్ళింది అనుకుంటూ ఒక భర్త గృహము వద్ద ఆ బిడ్డను చూసుకుంటూ ఉండి ఉండవచ్చును మరియు ఇది ఒక త్రాగుడుగా మారిపోయినది. ఎంత భయంకరమైన విషయం. అటువంటి జీవనము గురించి దేవుడు ఏమని ఆలోచిస్తాడు?

మరియు ఒక వృద్దుడు, ఆ యవ్వన స్త్రీలలో ఒకామె కంటే ఇరవై సంవత్సరాలు పెద్దవాడై వుండవచ్చు, ఆమె శరీరం మీద పట్టుకొనరాని ప్రదేశములో ఆమెను పట్టుకుని, మరియు ఒక్క ఉదుటున ఆమెను గదిలోనికి లాగుటను నేను గమనించాను, మరియు ఆ విధముగా వారంతా కొనసాగిస్తూ వున్నారు. నేనక్కడ నిలబడి మరియు ప్రార్థించడం ప్రారంభించాను. కొద్ది నిమిషాలలో ఇక్కడ వారు బయటకు వచ్చారు, ఆ వృద్ధుడు ఆమెను కనీసం పట్టుకుని వుండ లేనంతగా త్రాగాడు. మరియు వారు తిరిగి బయటకు వచ్చినపుడు, అక్కడ వారిలో ఒకామె నిలబడి మరియు ఆమె మీద మిగిలియున్న బట్టలు తీసివేసి మరియు ఒక గుక్క విస్కీ త్రాగి మరియు ఆమె కాలిని పైకి విసిరి, “వూపీ! అబ్బాయి, ఇది జీవితము” అని అన్నది.

39

నేను ఎంతమాత్రం ఊరక ఉండలేకపోయాను. నేను పరుగున బయటకి వచ్చి మరియు ఆ స్త్రీ చేతిని పట్టుకొని లాగి “స్త్రీ, ఇది జీవితము కాదు, ఇది మరణము,” అని నేనన్నాను. వారు విస్కీ సీసాలు పడవేసి మరియు దూరంగా వెళ్ళిపోయారు. కాని మేము ఒక మంచి సమయాన్ని కలిగి ఉంటున్నాము, అని వారు అనుకున్నారు, కాని వారు చచ్చినవారు.

ఇప్పుడు, దావీదు ఇక్కడ అన్నాడు, “ నీరు లేక ఎండిన స్థలములో వలె, నా ఆత్మ నీ కొరకు తృష్ణగొనుచున్నది.” ఇప్పుడు, ఒక మనిషిని దేవుడు దాహము కలిగి యుండుటకు సృష్టించాడు. నీ యొక్క నిర్మాణం, నీవు దాహము గొనుటకు తయారు చేయబడ్డావు. దేవుడు ఆ విధముగా నిన్ను చేశాడు. కాని దేవుడు తన కొరకు నీవు దాహము గొనులాగున నిన్ను చేసాడు. ఆ దాహము నీలో పెట్టబడింది, దయ్యము యొక్క స్థలములకు వెళ్ళుటకు కాదు. హాలీవుడ్ లేదా లోకము యొక్క పోకడ కొరకు దాహము గొనుటకు కాదు, కాని ఆ దాహము దేవుని కొరకు దాహము గొనుటకు నీకు ఇవ్వబడినది.

40

యేసు అన్నాడు, “నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.” దాహము గొనుటయే ఒక ధన్యత. కాని దయ్యము నువ్వు వేరొక దాని గూర్చి ఆలోచించులాగున చేయుటకు ప్రయత్నించాడు. కాని ఆ దాహం దేవుని వలన నీకు ఇవ్వబడింది. వినండి.

అయన కొరకు దాహము కలిగియుండుటకు దేవుడు నీకిచ్చిన ఆ ధన్యమైన, పరిశుద్దమైన దాహమును నీవు తీసుకొని, మరియు లోకము యొక్క సంగతులతో, టెలివిజను కార్యక్రమములతో, త్రాగుడుతో, పెద్ద ఉల్లాసములతో దానిని తృప్తిపరచ ప్రయత్నించుటకు నీకు ఎంత ధైర్యం, దయ్యము వక్రీకరింపబడిన తన స్వంత సాధనములు కలిగియుండి, మరియు ఆయన కొరకు దాహము కలిగియుండుటకు దేవుడు నీ కిచ్చిన దాహమును తీసుకొని మరియు లోకసంగతుల కొరకు దాహము గొనునట్లుగా నిన్ను చేయుచున్నాడు. మరియు నీవు కలిగియున్న ప్రతి దాహము ఆయన కొరకే కలిగియుండాలి. ఖచ్చితముగా. అదీ జీవితం.

41

“ఇప్పుడు, సహోదరుడా బ్రెన్హాం, నీ కంటే బైబిలు నాకు ఎక్కువ తెలుసు” అని నువ్వు అంటావు. బైబిలును తెలుసు కొనుటవలన నీవు జీవమును కలిగియుండవు. సంఘములో చేరుట ద్వారా నీవు జీవమును కలిగియుండవు. బాప్తిస్మము పొందుట ద్వారా నీవు జీవమును కలిగియుండవు. మతపరమైన ప్రశ్నోత్తరాల పుస్తకమును తెలుసుకొనుట ద్వారా నీవు జీవమును కలిగియుండవు. సేవకునిగా ఉండుట ద్వారా నీవు జీవమును కలిగియుండవు. ఆయనను ఎరుగుటయే జీవము, మతపరమైన ప్రశ్నోత్తరాల పుస్తకమును లేదా, నీ యొక్క సంఘ నియమములను ఎరుగుట కాదు, కాని ఆయనను ఎరుగుటయే జీవము.

మరియు దేవుడు నీకిచ్చిన ఆ దాహమును, సంఘము కొరకు ఉపయోగించుట కూడా కాదు. దయ్యము నిన్ను నృత్యములకు వెళ్ళనట్లుగా మరియు త్రాగునట్లుగా, మరియు అపవిత్రమైన జీవితమును జీవించునట్లుగా, మరియు ఆ పనులు చేయునట్లుగా చేయలేక పోయినట్లయితే, నీవు సంఘములో చేరునట్లుగా వాడు దీనిని వక్రీకరిస్తాడు. మరియు అది ఇంకనూ వక్రీకరింపబడినదే, ఎందుకనగా సంఘములో చేరుట నీకు జీవమును ఇవ్వదు.

42

కాని నీవు జీవమును కలిగియుండుటకు వున్న ఏకైక మార్గం, ఆ దాహమును తీసుకొని పరలోకమందున్న దేవుని యొద్ద నుండి వర్షించు అందమైన పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పటికీ ఎండిపోని ఊట యొద్ద త్రాగుట ద్వారా దానిని తృప్తిపరచుటయే. నీవు జీవమును కనుగొను మార్గం ఆయనను ఎరుగుటయే, ఆయన గ్రంథమును తెలుసుకొనుట కాదు, కాని ఆయనను తెలుసుకొనుటయే; నీ సంఘమును తెలుసుకొనుట కాదు గాని, ఆయనను తెలుసుకొనుటయే; సంఘ కాపరిని తృప్తిపరచుటకు దాహముగొని యుండుట కాదు, కాని ప్రభువును తృప్తిపరచుటయే. అదియే పరిశుద్దమైన దాహం. అందుకొరకే అది నీలో వున్నది. లోకపు సంగతులతో నీవు దానిని తృప్తిపరుస్తావా? ఇది మరణం. ఇది వక్రీకరించబడినది.

బైబిలు చెప్పలేదా, “లోకమునైనను అందులో ఉన్నవాటినైనను మీరు ప్రేమించినయెడల, దేవుని ప్రేమ మీలో ఉండదు.” ఆ గొప్ప పరిశుద్ద దాహమును, నీవు దానిని సంఘములో చేరుట ద్వారా తృప్తిపరచలేవు. సంఘములో చేరుటలో తృప్తి అనేది అక్కడ లేనే లేదు. నీ మనస్సాక్షికి వాత వెయ్యాలని మరియు నీ హృదయమును కోరికతో నింపుకోవాలని నీవు ప్రయత్నించుచున్నావు. బహిర్గతము కమ్ము, నీ పాపములు ఒప్పుకొని, మరియు దేవుని నీతి కొరకు దాహము గొనుము. “ఎందుకనగా నీ కృప జీవము కంటే ఉత్తమము; నా పెదవులు నిన్ను స్తుతించును.” దీని గురించి ఆలోచించు.

43

దావీదు, 47వ కీర్తనలో కూడా వ్రాశాడని నేను నమ్ముచున్నాను, ఒక అరణ్యవాసిగా, అతడన్నాడు, “ఓ దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించునట్లు, నా ప్రాణము నీ కొరకు దప్పిగొనుచున్నది.” ఆ దుప్పి, ఆ జింక నీటివాగుల కొరకు ఆశపడినట్లు, నా ప్రాణము నీ కొరకు దప్పిగొనుచున్నది.

ఇప్పుడు, ఆఫ్రికాలో, మరియు అడవులలో, బయట వాతావరణంతో బాగా పరిచయమున్న వ్యక్తిగా మరియు ఈ బైబిలు గ్రంథము ఎక్కడయితే వ్రాయబడిందో, ఆ తూర్పు దేశముల వారు అక్కడ గొప్ప అడవి కుక్కలు, తోడేళ్ళ మందలను కలిగి యుంటారు. మరియు దావీదు ఈ జంతువుల గూర్చి బాగా ఎరిగియున్నాడు.

మరియు ఈ క్రూరమైన, అడవి కుక్కలు దుప్పి యొక్క మందలోనికి పరుగెత్తినప్పుడు, ఒక చిన్న దుప్పి.... అవి పొడవైన కోరలు కలిగివుంటాయి. మరియు అవి... దుప్పిని పట్టుకొనుటకు ఎన్నిక చేయబడిన ప్రాంతాలలో ఒకటైన, చెవి వెనుక భాగములో, ఆ కోరలను గుచ్చి మరియు అప్పుడు దాని బరువును వేలాడజేస్తుంది. అది దానిని చేసినప్పుడు, అది దుప్పి మెడను చీల్చుతుంది. అంతే ఆ దుప్పి అక్కడికక్కడే నేలకొరుగుతుంది.

44

మరియు మనం మెడ నరముగా పిలిచే ఇక్కడ ఉండే ఆ నరము వద్ద దానిని పట్టుకొనలేకపోతే, దానికి ఎన్నిక చేయబడిన మరొక ప్రాంతం వుంది. డొక్కలో అది దానిని పట్టుకుంటుంది. మరియు అది తన పళ్ళతో ఆ విధముగా పట్టుకుని మరియు తన బరువును వేలాడజేసినప్పుడు, అది, దుప్పిని తన కాళ్ళ మీద నుండి పడద్రోస్తుంది. మరియు కుక్కలు ఒక్క క్షణంలో చుట్టూమూగి దానిని ముక్కలుగా చీల్చివేస్తాయి.

ఇప్పుడు, అనేకసార్లు దుప్పి, ఆ కుక్క దానిని డొక్కలో లేదా ఇక్కడ పట్టుకున్నపుడు, అది బాగా గట్టిగా పట్టుకున్నట్లయితే, మంచిది, కొన్నిసార్లు దుప్పి యొక్క అలజడి, మాంసపు ముద్దను ఊడి వచ్చులాగున చేస్తుంది. అప్పుడు ఆ జంతువు నోటిలో మాంసము వుంటుంది మరియు ఒకవేళ దానిని అడ్డగించుటకు వేరే కుక్కలు అక్కడ నిలబడి లేనట్లయితే, ఇది కొన్నిసార్లు తప్పించుకోగలుగుతుంది. కాని ఇది రక్తమును కారుస్తూ ఉంటుంది. రక్తము ఆ చిన్నదాని నుండి ధారగా కారుతూ ఉంటుంది.

ఇప్పుడు, వేట గురించి ఏమైనా తెలిసిన వేటగాడు ఇక్కడ వున్నట్లయితే, ఒక దుప్పి నీటియొద్దకు చేరగలిగితే, అది బ్రతుకగలుగుతుంది. ఆ దుప్పి నీటి యొద్దకు చేరలేకపోతే, అది మరణిస్తుంది. మరియు దావీదుకు అది తెలుసు. మరియు అతను అన్నాడు, “దుప్పి, నీటివాగుల కొరకు ఆశించునట్లు, నా ప్రాణము నీ కొరకు దప్పిగొనుచున్నది.”

45

మీరు ఊహించగలరా, వేట కుక్కలు పట్టుకొని మరియు దాని ప్రక్క నుండి ఒక పెద్ద మాంసపు ముద్దను లాగివేశాయి, దాని రక్తము యొక్క జీవము కారుతూ వుంది. చిన్న దుప్పి నిలబడి నీటి కొరకు వాసన చూస్తుంది, వేట కుక్కలు దాని వెనుకే వున్నాయి. అది ఖచ్చితంగా నీటిని కనుగొని తీరాల్సిందే, లేనియెడల అది చనిపోతుంది.

దావీదు అన్నాడు, “ఆ విధముగానే నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది.” ఓ ప్రభువా, నేను తప్పక నిన్ను కలిగియుండాల్సిందే, లేనియెడల నేను నశించిపోతాను.“ పాపివైన స్నేహితుడా, పాపము చేత గాయపరచబడి మరియు కుంటివాడిగా చేయబడినావని, నరకపు వేట కుక్కలు నీ వెనుకే ఉన్నాయని, నీవు క్రీస్తును తప్పక కనుగొనవలసిందేనని లేనియెడల, నశించిపోతావని నీవు కేవలం తెలుసుకున్నట్లయితే, నీవు ఆ పరిస్థితులలోకి వచ్చినపుడు ఆ రకమైన కోరిక ఒక మనిషి హృదయములోకి వచ్చినపుడు, అతను క్రీస్తును కనుగొంటాడు.

46

“దుప్పి నీటివాగుల కొరకు ఆశించునట్లు, నేను ఖచ్చితముగా దానిని కలిగియుండాలి. నేను గాయపరచబడినాను. నేను దానిని కలిగియుండ లేదా, నేను నశించినట్లే.” మరియు నీవు క్రీస్తును ఎంతో తీవ్రముగా కోరుకొను స్థానమునకు నీవు వచ్చినపుడు, నీవు ఖచ్చితంగా ఆయనను కలిగియుండాలి, లేనియెడల నశించిపోతావు, రాత్రిపూట నీవు నిద్రపోలేవు; నీవు తినలేవు; నీవు ఖచ్చితముగా ఆయనను కనుగొని తీరవలసిందే; నీతికొరకు ఆకలిదప్పులు గలిగియున్నపుడు మీరు ధన్యులు, మీరు నిత్యజీవమును కనుగొంటారు.

అక్కడ నిత్యము నిలుచు ఒకే ఒక్క జీవమున్నది గనుక మీరు ఆ జీవము కొరకు ఆకలిగొనుటకు ఈ మధ్యహ్నము దేవుడు మీకు సహాయము చేయును గాక. అదియే నిత్యజీవము మరియు మీ యొక్క పాపక్షమాపణలో, యేసుక్రీస్తును ఎరుగుట ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. “నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, తీర్పులోనికి రాక, మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు.” నీవు మరణము నుండి జీవములోనికి దాటియున్నావు: దాని అర్థమేమిటి.

47

ఎడారిలో తప్పిపోయిన ఒక ఇండియన్ మార్గదర్శితో కొంతకాలము క్రితము నేను మాట్లాడుతూవున్నాను. అతని పేరు టిమ్ కాయ్, చాలా ప్రసిద్ది చెందిన మార్గదర్శి. అరిజోనా ఎడారిలో అతడు తప్పిపోయి మరియు తిరిగివచ్చు మార్గమును కనుగొనలేకయుండెను. మరియు అతని గుర్రం....

మీరు ఎప్పుడైనా తప్పిపోయినట్లయితే... నేను తప్పిపోయాను. ఇసుక ఎక్కడ మరుగుతూ వుంటుందో అక్కడ ముక్కు ఎండిపోయి మరియు రక్తము కారుతుంది. నీ నాలుక నీవు మాట్లాడలేనంత మందముగా అవుతుంది, నీ పెదవులు తిరగబడి, లోపలిది బయటకు వచ్చి మరియు అంతా పగుళ్ళు వస్తాయి. అప్పుడు దయ్యము నీకొక ఎండమావిని చూపుతుంది.

అది కొంత.... మీరు రోడ్డు వెంబడి వెళ్ళండి మరియు మీరు నీటిని చూస్తున్నట్లుగా మీకు కనబడుతుంది. మీరు అక్కడికి చేరినపుడు, అది నీరు కాదు. దయ్యము, సంఘ సభ్యులకు మరియు పాపులకు చేసే విధానం అదే. ఆహ్లాదకరమైన ఒక దానిని మీకు చూపుటకు వాడు ప్రయత్నిస్తాడు.

48

మరియు అనేకసార్లు ఆ విహార యాత్రికులు కొన్నిపూలు కోయడానికి రోడ్డు నుండి ప్రక్కకు వెళ్ళి మరియు ఎడారిలోకి వెళ్ళిపోతారు, అప్పుడు అదంతా ఒకే విధముగా కనబడుతుంది మరియు వారు తిరిగి వచ్చు మార్గమును వారు కనుగొనలేరు మరియు వారు చనిపోక మునుపు, ఆ ఎండమావులను వారు చూస్తారు. మరియు వారు దానియొద్దకు పరుగెత్తుతారు, దానిలోకి దూకుతారు, మరియు నీటిని వారి మీద చల్లుకుంటున్నామని వారనుకుంటారు, కాని కేవలం వేడి ఇసుకనే వారి తలమీద చల్లుకుంటున్నామని వారు గ్రహిస్తారు. మరియు చావుకు చాలా సమయం ముందు, పెద్ద రాబందులు ఆకాశము నుండి వచ్చి మరియు వారు ఎడారి మీద పడియుండగానే, వారి కన్నులు పీకేస్తాయి.

ఎంత తరచుగా ప్రజలు, పాపులు, మరియు సంఘ సభ్యులు మరియు నటించువారు, ఎక్కడ నీవు ప్రసిద్ది చెందగలవో, ఎక్కడ ఫలానా - ఫలానా బట్టలు ధరించగలవో, మరియు ఎక్కడ గుంపుతో వెళ్ళగలవో మరియు ఆ విధముగా, దయ్యము నీకు ఒక ఎండమావిని చూసినపుడు, భౌతిక మరణము నిన్ను కొట్టుటకు చాలా సమయము ముందే పాతాళపు రాబందులు సువార్తకు నీ కన్నులను పీకివేస్తాయి. “దానిని నేను నమ్మను” అని నీవు ఒక కూటమునకు వెళ్ళి అంటావు. ఎందుకు, పాతాళపు రాబందులు నీ కన్నులను పీకివేశాయి. అది నీ ఆత్మ సంబంధమైన చూపు.

49

టిమ్ తాను క్రిందికి వచ్చానని చెప్పాడు. అతనొక క్రైస్తవుడు, చాలా ప్రసిద్ధిచెందిన క్రైస్తవుడు, అతను చెప్పాడు, “నా గుర్రం మీద నుండి నేను క్రిందికి దిగాను; నేను నీటి కొరకు ప్రార్ధించాను మరియు ప్రార్ధించాను,” అని చెప్పాడు. “నేను దారి తప్పిపోయాను మరియు నేను దానినెక్కడా కనుగొనలేకపోయాను,” అని చెప్పాడు. “కొద్దిసేపటి తర్వాత గేదె గాని మరేదో నడచినదిగా కనపడు మార్గము మీదకి నేను వచ్చాను,” అని చెప్పాడు.

మరియు “నా పాత గుర్రం, దాని పేరు బెస్” అని చెప్పాడు. మరియు అన్నాడు, “అది మూలగడం ప్రారంభించింది, మరియు నేను దానిమీదకి ఎక్కి మరలా తోలుటకు ప్రయత్నించాను, నన్ను మోయుటకు అది చాలా బలహీనంగా ఉండియున్నది,” మరియు “దీనిని వెంబడిస్తూ కొద్దిదూరం నేను నడిచాను,” అని చెప్పాడు. “కొన్నిసార్లు ఆ మార్గములు నీటి గుంత యొద్దకు నడిపిస్తాయని నేను విన్నాను,” అని చెప్పాడు.

50

“నేను దానిని నడిపించుటకు ప్రారంభించాను, అది చాలా బలహీనముగా ఉన్నదని” చెప్పాడు. మరియు “నేను చాలా ఉత్సాహపడి, ఆ మార్గములోనికి వెళ్ళుటకు ప్రయత్నించాను.” మరియు “మీరు తెలుసుకోవలసిన మొదట విషయము ఏమనగా, నేను తడబడుచూ, పడిపోవుటను నాకు నేను కనుగొన్నాను. నేను చాలా బలహీనముగా ఉన్నాను, నేను నశించిపోయాను.” “నేను మరలా గుర్రపు జీను పైకి ఎక్కి మరలా ప్రారంభించాను,” అని చెప్పాడు.

మరియు “నా కుడి ప్రక్కన, అక్కడొక చిన్న అస్పష్టమైన కుడివైపుకు దారితీసే కాలిబాట వున్నది,” అని చెప్పాడు. “నా యొక్క గుర్రం బెస్ ఆ కాలిబాటను తీసుకొనుటకు ప్రయత్నించినది,” అని చెప్పాడు. “ బెస్ దాని నుండి బయటకు రా నీవు ఆ కాలిబాటను తీసుకొనకూడదు. ఇది మార్గం. ఇది వెడల్పుగా వుంది. ఇది మంచిది. వారిలో ఎక్కువ మంది ఈ మార్గం గుండా వెళ్ళారు. ఇది నీటి యొద్దకు వెళుతుంది అని నేనన్నాను,” అని చెప్పాడు. మరియు “అది మూలుగుటకు ప్రారంభించి మరియు ఇంకొక మార్గమును తీసుకొనుటకు ప్రయత్నిస్తూవుంది,” అని చెప్పాడు.

51

“నేను ఒక జత కాలిముళ్ళను ధరించియున్నాను. నేను గ్రహించే లోపు, ఆ విశాలమైన మార్గములో వెళ్ళులాగున దానిని చేయాలని ప్రయత్నిస్తూ, నా కాలిముళ్ళతో దానిని ముక్కలుగా తెంచుతూ వున్నాను,” అని చెప్పాడు. మరియు “అప్పుడు అది తడబడి మోకాళ్ళ మీద కూర్చున్నది,” అని చెప్పాడు. మరియు “దాని మీద నుండి క్రిందికి దూకి, దాని వైపు చూశాను. చనిపోవుటకు సిద్దముగా అది అక్కడ నిలిచియున్నది. ఆ చిన్న కాలిబాట వైపు చూస్తున్నది, మరియు మూలుగుచున్నది, మరియు ఆ కాలిముళ్ళతో నేను తెంచిన చోట, దాని ప్రక్కల నుండి రక్తము కారుతూ వున్నది,” అని చెప్పాడు.

“కొద్దిసేపు నేనక్కడ నిలబడి మరియు అనుకున్నాను, 'ఓ, మనం ఏం చేస్తాం, మన పరిస్థితి బాగలేదు.'” నేను దాని ముఖము మీద రుద్ది, “బెస్, జంతువులు స్వభావసిద్దమైన గుణము కలిగియుంటాయని నేను చాలాసార్లు విన్నాను, మరియు బహుశా ఆ పెద్ద విశాలమైన మార్గము ఊట యొద్దకు తీసుకెళ్ళదేమో, అని అన్నాను,” అని చెప్పాడు.

52

సహోదరుడా, ఇప్పుడు నేను నీకు చెబుతాను, “నాశనమునకు పోవు మార్గము విశాలము, అందులో ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును. ఆ దారి సంకుచితమును, మరియు అస్పష్టమును అయివున్నది, కాని దానిని కనుగొను వారు కొందరే.” గుంపుతో వెళ్ళవద్దు. క్రీస్తుతో వెళ్ళండి.

అతడు చెప్పాడు, “బెస్, ఈ ఎడారి గుండా నీవు నన్ను మోసుకొని వచ్చావు, మరియు మనం కలసి మంచి స్నేహితులుగా వుండియున్నాము. మరియు నీవు నన్ను ఇంత దూరం క్షేమముగా మోసుకొని వచ్చావు. ఇంక మిగిలిన మార్గమంతా నేను నిన్ను నమ్ముతాను, అని అతడు చెప్పాడు.

పరిశుద్ధాత్మను ఒక గుర్రముతో పోల్చడం కాదు, కాని సహోదరుడా, ధన్యమైన పరిశుద్ధాత్మ ఈ సంవత్సరములన్నిటిలో నన్ను క్షేమముగా ఉంచియున్నాడు, మరణపు ఛాయల లోయలో, నేను ఆయనను నమ్ముతాను. నేను కలిగియున్న ఈ గొప్ప అనుభవమును బాగుగా పోరాడుటకు ఉపయోగిస్తాను.

53

అది కాలిబాటలో నడుచుట ప్రారంభించింది. అది ఐదు వందల గజాల దూరం కూడా వెళ్ళలేదు, అంతలోనే ఒక గొప్ప నీటి ప్రవాహములోకి దూకి, అక్కడే నీటి యొక్క ఆశీర్వాదములను ఆస్వాదిస్తూ ఉండిపోయింది అని చెప్పాడు. తాను నీటిలోకి దూకానని, తాను మరియు గుర్రము ఇద్దరు, వారి తల మీద నీటిని చల్లుకుంటూ మరియు తన స్వరమంతటితో అరుస్తూ ఉన్నానని చెప్పాడు. అతని యొక్క జీవము కాపాడబడినది. తాను ఆ గుర్రమును తీసుకొని తన ముక్కును మరియు అంతటిని కడిగివేశానని చెప్పాడు. అది అంతటి ఆశీర్వాదముగా వున్నది. అది అతనిని నీటి యొద్దకు క్షేమముగా తీసుకొని వచ్చినది.

ఈ మార్గము అస్పష్టముగా ఉన్నట్లు కనబడవచ్చు, కాని దాని చివర ఇమ్మానుయేలు నరముల నుండి తీయబడిన రక్తముతో నిండిన ఊట యున్నది, అక్కడ పాపులు ప్రవాహము లోనికి దూకి, వారి పాపపు మరకలన్నిటినీ పోగొట్టుకుంటారు.

అతను మరియు అతని గుర్రం దీనిని ఆస్వాదిస్తూ, సేదదీరుతూ వున్నపుడు, ఒకరు మాట్లాడుట నేను విన్నానని చెప్పాడు. మరియు అతను చుట్టూ చూశాడు, మరియు తప్పతాగిన ఒక మనిషి అక్కడ నిలబడియున్నాడు, మరియు అక్కడ కొంత పొగ పైకి రావడం అతను చూశాడు. “నీవు ఎవరు?” అని ఇతడన్నాడు.

మరియు “నీళ్ళలో నుండి బయటకు రా?” అని అతడు అన్నాడు. మరియు ఇతను బయటకు వచ్చాడు. ఇతనిని శిబిరం వద్దకు తీసుకొని వెళ్ళాడు; వండిన దుప్పి మాంసం కొంత వారి యొద్ద వున్నది.

మరియు ఇతడన్నాడు, “రెడ్ ఇండియన్ మార్గదర్శిని అయిన టిమ్ కాయ్ ని ఇక్కడ కొద్దిరోజుల పాటు తప్పిపోయితిని. నా గుర్రమే నన్ను నీటియొద్దకు నడిపించింది.”

54

ఇతను దుప్పి మాంసమును తిన్నాడు, దానిని ఆస్వాదించాడు. వారు నలుగురు, వారంతా త్రాగియున్నారు. మంచిది, “మేము దీనిని స్వాతంత్ర్య దినముగా భావించి, మేము ఉత్సవం చేసుకుంటూ వున్నాము,” అని వారన్నారు. “సియరా నెవాడా పర్వతముల నుండి వచ్చి మేము ఇక్కడ ఉన్నాము. మేమొక బంగారు నిధిని కొల్లగొట్టాం. మరియు మా వద్ద ఇక్కడ చాలా బంగారం వున్నది. ధనవంతులుగా ఉండటానికి మేము తిరిగి వెళుతున్నాము,” అని అన్నారు.

55

“మాతో కలసి సంతోషించు, టిమ్, సీసా అందుకో చిన్నోడా,” అని అతనన్నాడు. మరియు వారి వద్ద విస్కీ సీసా వుంది, ఆ బిరడా లాగేసి త్రాగు, టిమ్,“ అని అన్నారు.

“లేదు, నేను త్రాగనయ్యా,” అని ఇతడన్నాడు.

మరియు, “ఓ, నువ్వు త్రాగవా?” అని అతడన్నాడు.

“అయ్యా, నా జీవితములో నేనెన్నడూ త్రాగలేదు. దుప్పి మాంసం కొరకు మీకు కృతజ్ఞతలు, కాని నేను వెళ్ళాలి.”

మరియు అన్నాడు, “ఇది ఎలాగూ స్వాతంత్ర్య దినము కూడా కాదు.”

మరియు “నీవెప్పుడూ త్రాగలేదు అన్నది నీ ఉద్దేశమా?” అని అతడన్నాడు.

“నా జీవితములో నేనెన్నడూ త్రాగలేదు,” అని అతడన్నాడు.

“అబ్బాయిలూ, మీరేమంటారు? మనతో కలసి ఈ భారతీయ మార్గదర్శి తన మొదటి గుక్కను త్రాగేలాగా చేద్దామా?” అని అతడన్నాడు. ఆ విధముగానే, వారు జీవితమును కలిగియున్నారని వారు అనుకుంటారు.

56

కనుక ఒకడు, వంపు తిరిగిన కాలు గల చిన్న మొరటు వ్యక్తి, ఒక ముప్పై-ముప్పై తుపాకీని తీసుకొని, మరియు దానిలోకి గుండును నెట్టి, తన చేతిలోకి సీసాను తీసుకున్నాడు; “టీమ్, మా దుప్పి మాంసం తినుటకు చాలినంత మంచిది, అయితే అప్పుడు మా విస్కీ కూడా త్రాగుటకు చాలినంత మంచిదే,” అని అతను అన్నాడు. “నీవు విస్కీ అయినా త్రాగు, లేదా ఈ ముప్పై-ముప్పై తూటా చివర ఉన్న విషాన్నయినా తీసుకో,” అని అతడన్నాడు.

ఇప్పుడు, వారు ఆటపట్టించడంలేదు. ఒక త్రాగుబోతు ఎలా వుంటాడో మీకు తెలుసు. “అబ్బాయిలు, మీ విస్కీ నాకొద్దు, కాని నీవు ట్రిగ్గర్ నొక్కే ముందు నా కథను మీకు చెప్పనివ్వండి,” అని టిమ్ అన్నాడు.

అతను “నేను కెంటకీలోని బ్లూ-గ్రాస్ అను గ్రామము నుండి వచ్చాను,” అని చెప్పాడు, “చాలా ఏళ్ళ క్రితము ఒక చిన్న చెక్క ఇంటిలో, కంచెగా ఉపయోగించు ఇనుప కడ్డీలతో చేయబడిన (అటువంటి దానిమీదే నేను జన్మించాను), ఒక చిన్న మంచం ఇంటిలో మూలన పడివున్నది, మరియు పొట్టుతో తయారు చేయబడిన పరుపు.” “ఆ చిన్న గది యొక్క వట్టి నేల మీదగా ఉదయ కాలపు కాంతి ప్రసరిస్తూ వుండగా, ఒక తల్లి చనిపోతూ పడియున్నది,” అని చెప్పాడు.

మరియు “కేవలం ఐదు సంవత్సరాల వయసున్న చిన్న బాలుడు వట్టికాళ్ళతో వచ్చీరాని నడకతో ఇంటిలో చుట్టూ తిరిగాడు, దైవికమైన ఒక క్రైస్తవ తల్లి, తన సృష్టికర్తను కలుసుకోవటానికి వెళుతున్నపుడు, అక్కడున్న ఏకైక వ్యక్తి అతనే,” అని చెప్పాడు.

57

మరియు “నా తల్లి నన్ను మంచము వద్దకు పిలిచి, ఆమె చేతులు నా చుట్టూ వేసి, టిమ్ దేవుడిక్కడికి నీ యొద్దకు త్వరగానైనా లేదా తర్వాతైనా ఎవరో ఒకరిని పంపుతాడు. అమ్మ ఇంటికి వెళుతూ వున్నది. నువ్వు నాకొకటి వాగ్దానము చెయ్యాలని నేను కోరుకొంటున్నాను. నీ యొక్క తండ్రి బూట్ల తొడిగియుండగానే చనిపోయాడు. ఒక త్రాగుబోతుగా అతను చనిపోయాడు. మనం పేదరికంలో వుండటానికి కారణము అదే. కాని, నీవు బ్రతికినంత కాలం నీవు ఎప్పుడూ తాగనని, నీ తల్లిగా నాకు ప్రమాణము చెయ్యి, టిమ్” అని అన్నదని చెప్పాడు.

మరియు “ఊపిరి ఆమె యొక్క శరీరమును విడిచిపోయినపుడు, మరియు నేను నా యొక్క చిన్న పసి చేతులను గట్టిగా బిగుసుకున్న ఆమె చేతులలో నుండి లాగాను.” “అయ్యలారా, అప్పటి నుండి ఇప్పటి వరకు నేనెప్పుడూ విస్కీ రుచి చూడలేదు. కాని శుద్ద హృదయముతో నేను ప్రభువును సేవించాను,” అని చెప్పాడు. “ఇప్పుడు, మీరు కాల్చాలనుకుంటే, అలాగే కానివ్వండి,” అని చెప్పాడు.

58

మరియు ఆ సమయానికి, ఒక తుపాకి గర్జించింది, అది గర్జించినపుడు, ఆ మనిషి చేతిలో వున్న సీసా పగిలిపోయింది. వెనుకనే ఉన్న లోయలో నుంచి, ఒక చిన్న వ్యక్తి వచ్చాడు, బాగా కొట్టబడిన మచ్చలున్నాయి, తన చెంపలు కన్నీళ్ళు కారుతూ వున్నాయి, రెండు తుపాకులు బయటకు పొడుచుకొని వున్నాయి.

“టిమ్, నేను నీకు తెలియదు, కాని నువ్వు నాకు తెలుసు,” అని అతడన్నాడు. “మీ కెవరికీ నేను తెలియదు,” అని అన్నాడు. “నా తల మీద వెల వున్నది. నేనొక తప్పించుకు తిరుగుతున్న నేరగాడిని,” అని అన్నాడు. “సియరా నెవాడా పర్వత శ్రేణి నుండి దారిపొడవునా నేను మిమ్మల్ని వెంబడించాను మరియు ఇక్కడ ఆ బంగారముతో వున్న మిమ్మల్ని నేను గమనించాను. మరియు మీకు చాలినంత మీరు త్రాగినప్పుడు, మీ లోపలికి బుల్లెట్టును దించుటకు బదులు, క్రిందకు వెళ్ళి మరియు మీలో ప్రతి ఒక్కరిని తల మీద కొట్టి, మరియు బంగారమును తీసుకుందాం, అని నేననుకున్నాను. మీరు త్రాగి, సృహ తప్పి పడిపోయేంత వరకు వుందాం, అని నేను వేచిచూస్తూ వున్నాను, కాని, టీమ్, నేను కూడా కెంటకీలోని బ్లూ-గ్రాస్ గ్రామము నుండే వచ్చాను,” అని అన్నాడు.

59

“చనిపోతున్న ఒక తల్లికి నేను కూడా అదే విషయమును ప్రమాణము చేశాను, కాని, నన్ను మన్నించు, ఆ ప్రమాణాన్ని నేను మారిపోయాను,” అని అన్నాడు. కాని “ఆ పరలోకపు పెద్ద లోయల గుండా నా తుపాకీ ప్రతిధ్వనించగా, ఆమె విన్నదని నేను నిశ్చయతతో వున్నాను. ఒక ప్రమాణం మీద నేను సంతకం చేశాను. ఈ ఘడియ నుండి నేనెప్పుడు త్రాగను, టిమ్,” అని అన్నాడు. మరియు ఆ నేరగాళ్ళ గుంపుతో పాటు, నిధుల వేటగాళ్ళను కూడా, జీవపు ఊట యొద్దకు టిమ్ నడిపించాడు.

సహోదరుడా, ఎప్పుడైనా, దేనినైన ఇవ్వగల మనుష్యులు ఆ జీవపు ఊటను అంగీకరించారు. మనము మన తలలను వంచియుండగా, కొద్ది నిమిషములు... పాపివైన స్నేహితుడా, నీవు కూడా ప్రమాణములు చేసియుండవచ్చు. నేను బాగా జీవిస్తున్నానని నీవు అనుకొని వుండవచ్చు, కాని “పాపమునకు జీతం మరణం, కాని యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా ఎరుగుట ద్వారా నిత్యజీవము, దేవుని యొక్క బహుమతి అయివున్నది.”

60

మనం ప్రార్ధించుటకు ముందు, ఈ మధ్యాహ్నము వేళ ఈ పెద్ద ప్రజల గుంపు యొక్క గొప్ప సభికులలో, పాపులైన మీరు దేవునికి మీ యొక్క చేతులను ఎత్తి మరియు “దేవా, దీని ద్వారా... ఏదో ఒక రోజు మహిమలో వారిని కలుస్తానని, నా తల్లికి, నా తండ్రికి, నా సహోదరికి, నా భార్యకి నేను ప్రమాణం చేశాను. పరలోకములో ఉన్న జీవగ్రంథములో నీవు నా పేరు పెట్టుచుండగా, నేను నా చేతిని ఎత్తాలని కోరుచున్నాను. మరియు దానిని నా చేతిని ఎత్తుట ద్వారా నేను చేస్తాను. ఆ జీవపు ఊటలోనిది త్రాగాలని నేను కోరుకుంటున్నాను.”

అయ్యా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నిన్ను ఆశీర్వదించును గాక. వెనుకవున్న నిన్ను దీవించును గాక, ఇక్కడ, ప్రధాన అంతస్తులో ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా, అక్కడున్న మిమ్ములను దేవుడు దీవించును గాక. “నా చేతిని నేను ఎత్తుతాను. ఊట యొద్దకు రావాలని నేను కోరుకుంటున్నాను.” [టేపు మీద ఖాళీ వున్నది.]

ఇమ్మానుయేలు నరముల నుండి లాగబడిన,

రక్తముతో నిండిన ఊట యొకటి అచ్చట వున్నది.

మరియు ఆ ప్రవాహములోనికి దూకి పాపులు

వారి పాపపు మరకలన్నీ పోగొట్టుకొందురు,

వారి పాపపు మరకలన్నీ పోగొట్టుకొందురు,

పోగొట్టుకొందురు.....

(రావాలని కోరు ప్రతి ఒక్కరు,

ఇపుడు ముందుకు రండి)..... మరకలు;

మరియు ఆ ప్రవాహములోనికి దూకి పాపులు,

వారి పాపపు మరకలన్నీ పోగొట్టుకొందురు,

ఇప్పుడు ఈ వచనము వినండి..

ఆ చనిపోవుచున్న దొంగ

ఆ ఊటను తన దినములలో

చూచుటకు సంతోషించెను;

మరియు అక్కడ నేను;

అతని వలె నీచుడనైనను,

నా పాపములన్నియు కడిగివేసుకొందును.

నా పాపములన్నియు కడిగివేసుకొందును.

నా పాపములన్నియు కడిగివేసుకొందును;

మరియు అక్కడ నేను;

అతని వలె నీచుడనైనను,

నా పాపములన్నియు కడిగివేసుకొందును.

61

[టేపు మీద ఖాళీ వున్నది-సంపా.] నీవు నమ్ముచున్నావా? [టేపు మీద ఖాళీ వున్నది-సంపా.].... నేను పొరబడుటలేదు, కాని ఆ ప్రార్ధనా కార్డును కలిగియున్నది నీవు కాదా? పది సంవత్సరాల క్రితము ఇక్కడే నీవు దానిని పొందుకున్నావు. నిజానికి నీవు దానిని ఎప్పుడూ పొందుకోలేదు. నీ భార్య దానిని పొందుకొన్నది. నిన్ను గాని ప్రార్థనా కార్డును గాని నేనెప్పుడూ చూడలేదు. కాని ఆ ప్రార్థనా కార్డు నీ తలపై వుండడం నేనిప్పుడే చూశాను.

ఇప్పుడు, నీవు ఆ కడుపు సమస్య మరియు కొన్నిటి స్వస్థత కొరకు, మరియు నీవు బాధపడుచున్న ఆ ఆందోళన స్థితి స్వస్థత కొరకు నీవు వచ్చావు. ఇప్పుడు నీవు దానిని పొందుకున్నావు. నీవు ప్రార్ధన చేయించుకున్నావు, కాని ఇప్పుడు, నీవు వచ్చావు మరియు క్రీస్తుకు లోబడుట ద్వారా ఇప్పుడు నీవు దానిని పొందుకున్నావు; అదే అంతకు ముందు కొరవడియున్నది. అది నిజం.

62

ప్రభువు యొక్క నామము దీవించబడును గాక. గత రాత్రి ఆ ప్రార్ధనా కార్డును నేనెందుకు తీసుకురాలేకపోయాను? ఎందుకనగా అది సరికాదు. అక్కడొక ప్రార్థనా కార్డు వున్నది. పది సంవత్సరముల క్రితము ఈ వారం, దానిని ఎరుగకుండా, నేనిక్కడ ఉండియున్నాను. 1947, ఆగస్టు ఏడవ దినమున, ఈ ప్రార్ధనా కార్డు ఇక్కడే, ఈ గదిలో ఇవ్వబడింది మరియు కొన్ని రాత్రుల క్రితము వరకు వుంచబడింది.

మరియు ఇప్పుడు దాని హక్కుదారుడు దానిని మరొక రాత్రి ప్రార్ధనా వరుసలో వున్న కొందరికి, ఆ ద్వారపాలకులకో లేక ఎవరో ఒకరికి ఇచ్చెను, అది తిరిగి బిల్లీపాల్ యొద్దకు వచ్చింది, బిల్లీపాల్ దానిని నాకు ఇచ్చాడు, నేను ఇక్కడికి వచ్చునపుడు, ఆ మనిషిని నేనెప్పుడూ ఎరుగను, నా జీవితంలో నేనెప్పుడు అతనిని చూడలేదు, అక్కడ ఆ ప్రార్ధనా కార్డు అక్కడే కనబడియున్నది.

63

మంచిది, సహోదరుడా. నీవు అడిగినదానిని ఇప్పుడు నీవు పొందుకొనియున్నావు. క్రీస్తే నీరక్షకుడు. ఆయనను నీవు రక్షకుడుగా అంగీకరించినపుడే, ఆయన నిన్ను స్వస్థపరిచాడు కూడా. అక్కడే నీవున్నావు. నీ కడుపు సమస్యకు, గుండెమంటకు, మరియు నోటిపూతకు కారణమైన నీ యొక్క ఆందోళన స్థితి. అది నిజం. ఇప్పుడు అదంతా ముగిసిపోయింది. నీవు బాగుపడబోచున్నావు.

అది కృప కాదా. మా కొక పాట వాయించండి: “అద్భుతమైన కృప.” అందరూ ఆ గొప్ప పాట ఎంతమందికి తెలుసు? సేవకులు వచ్చి పాపులైన ఈ స్నేహితుల ప్రక్కన నిలబడాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు పాపులు కాదు, వారు పాపులు కారు. వారు ఒప్పుకొనుచూ వచ్చియున్నారు. ఇప్పుడు వారి సంఘములకు వీరిని తీసుకెళ్లునట్లుగా, ఈ నగర సేవకులను వీరి చూట్టూ చేరనివ్వండి. రండి, సేవకులారా, మీరెవరైనా సరే, ఈ పురుషులను మరియు స్త్రీలను, అబ్బాయిలను మరియు అమ్మాయిలను, ఇక్కడ మీ సంఘమునకు ఆహ్వానించండి. మంచిది. అందరం కలసి

అక్కడ...... అద్భుతమైన కృప, ఎంత మధురమైన స్వరం,

నా వంటి ఒక నీచుని రక్షించెను!

ఒకప్పుడు నేను తప్పిపోయియుంటిని,

కాని ఇప్పుడు కనుగొనబడితిని,

గ్రుడ్డివాడనైయుంటిని,

కాని ఇప్పుడు చూచుచుంటిని.

వినండి,

కృపయే (మనందరం) నా హృదయమునకు భయమును నేర్పినది,

కృపయే నా భయములన్నిటిని తొలగించెను;

ఎంత ప్రశస్తముగా ఆ కృప కనబడెను.

ఆ మొదటి ఘడియలో నేను నమ్మినపుడు!

64

ఇప్పుడు, తర్వాత వచనమును ఈ సభికులను పాడనిద్దాం, అందరూ కలసి, మీ ఊపిరితిత్తులను తెరచి, దేవునికి పాడండి.

అనేకమైన ప్రమాదాల గుండా, శ్రమల గుండా, ఉచ్చుల గుండా, నేను ఇదివరకే వచ్చియుంటిని; కృపయే నన్నింత దూరము క్షేమంగా తీసుకొని వచ్చింది, కృపయే నన్నులోనికి తీసుకు వెళుతుంది. ఇక్కడున్నవారు ఎంతమంది క్రైస్తవులు దానిని నమ్ముతారు? మీ చేతులు పైకెత్తి, మంచిది. మంచిది. మీ చేతులు పైకెత్తి మనం దీనిని పాడదాం. మంచిది, అందరం కలసి.

అనేకమైన ప్రమాదాల గుండా,

శ్రమల గుండా, ఉచ్చుల గుండా,

నేను ఇదివరకే వచ్చియుంటిని;

కృపయే నన్నింత దూరం క్షేమముగా తీసుకొని వచ్చింది,

కృపయే నన్నులోనికి తీసుకువెళుతుంది.

ఇప్పుడు, అక్కడ మీ ప్రక్కన నిలబడియున్న మీ పొరుగువారితో కరచాలనం చేసి, చెప్పండి “పొరుగువాడా, నిన్ను దేవుడు దీవించు గాక.” మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బెటేరియనులు...

65

ఇప్పుడు, బలిపీఠము యొద్ద పశ్చాత్తాప పడుచున్న మీరు, మీరు నిజముగా యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? మీ చేతులను ఎత్తండి. బలిపీఠము నొద్ద నున్న ప్రతివారు క్రీస్తును వారి సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ఇక్కడున్న సభికుల వైపు మరియు సేవకుల వైపు మీరు తిరగాలని నేను ఆశిస్తున్నాను. మీరు బలిపీఠము నొద్ద ఉన్నారు, ఈ వైపుగా ప్రజలవైపు తిరుగండి. ఇప్పుడు, మీరు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా, మీ చేతులను సభికులకు ఎత్తండి.

యేసు చెప్పెను, “నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు.” నేను మాట్లాడుచున్నది ఆ జీవము గురించే. మీరు ఇప్పుడే దానిని పొందియున్నారు. “మీరు ఎంత మాత్రము తీర్పులోనికి రాక, మరణము నుండి జీవములోనికి దాటియున్నారు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో, వానిని నేను నా తండ్రి ఎదుట మరియు పరిశుద్ద దూతల ఎదుటను ఒప్పుకొందును.” అది నిజం, కాదా?

66

ఇప్పుడు, సేవకులు మరియు క్రైస్తవులందరూ, రాజ్యము యొక్క మీ సహపౌరులుగా, వారిని క్రీస్తు శరీరములోనికి స్వాగతించండి, స్వాగతించినట్లుగా వారికి మా చేతులను ఎత్తండి. ప్రభువు నామము ఆశీర్వదింపబడును గాక. నేను ఇక్కడున్న వీరి కొరకు ప్రార్ధించుచుండగా, మన తలలు వంచుదాం.

తండ్రీ, ఈ రోజు మేము చాలా సంతోషంగా వున్నాము, వర్తమాన ఫలము ద్వారా, పాపులను బలిపీఠము యొద్దకు తీసుకొని వచ్చినందుకు మరియు వారు మిమ్మును తమ సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు. ఇప్పుడు, మీ వాక్య ప్రకారము, వారి పేరు జీవగ్రంథమందు వున్నది. మరియు దానిని తుడిచివేయునది ఏదీ లేదు. “నేనెంత మాత్రమును వానిని త్రోసివేయను. అతను నిత్యజీవము కలిగియున్నాడు, ఎన్నడూ తీర్పునకు లేదా గద్దింపునకు రాడు; కాని మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు.”

67

మరియు ఈ గొప్ప క్రీస్తు యొక్క సహవాసములో వారు వారి చేతులను మా వైపు, రాజ్యపౌరులైన ఇతరులకు ఎత్తుట ద్వారా మిమ్మును ఒప్పుకున్నారు, వారు కూడా ఈ మధ్యాహ్నము, లోక విషయములలో యాత్రికులుగాను మరియు పరవాసులుగాను అయినారు. వారు మరణము నుండి జీవమునకు దాటియున్నారు. ఇప్పుడు, “ఎవడైతే మనుష్యుల ముందు నన్ను ఒప్పుకుంటాడో, వానిని నా తండ్రి ఎదుట మరియు పరిశుద్ద దూతల ఎదుట నేను ఒప్పుకొందును,” అని ఆయన చెప్పాడు.

మీరు ఇక్కడ ఈ అద్భుత కార్యమును వారి ముందు ఇప్పుడు జరిగించుట చూచుటకు నేను సంతోషిస్తున్నాను, ఆ ప్రార్ధన కార్డును ఆ మనిషి మీద అక్కడ చూచుటను. ఓ ధన్యుడైన మరియు నిత్యడగు దేవా, ఈ ఘడియ కొరకు నీవు వేచియున్నావు, అతడు సంతోషించే ఘడియ ఇదియే. ఈ వరుసలో ఇంకా ఎవరైనా రోగులు వున్నట్లయితే, వారి శరీరముల నుండి సమస్త వ్యాధులను తీసివేయాలని మేము ప్రార్ధిస్తున్నాము. వారి ఆత్మలను రక్షించగలిగిన నీవు, ఖచ్చితంగా వారి శరీరములను స్వస్థపరచగలవు. మరియు వారు దాని కొరకు ఆకలితో వున్నారు. మరియు నీవు దానిని దయచేయవలెనని నేను ప్రార్ధిస్తున్నాను.

68

ఈ సంఘమును ఏకముగా దీవించండి. వారిని మీ ప్రేమ గల హస్తములలోకి తీసుకొని మరియు మేమందరము ఏకముగా కూడుకొను దినము వరకు వారిని భద్రపరచండి. మరియు మేము ఆ సాయంకాలము ఆ గొప్ప బల్ల యొద్ద ప్రభురాత్రి భోజనము కొరకు కూర్చొనియుండగా, మీరు చెప్పారు, “మీతో కలసి ద్రాక్షారసమును నా తండ్రి రాజ్యములో నూతనముగా త్రాగువరకు, తినువరకు, నేను ద్రాక్షఫలమును తినను.”

మరియు ఆ గొప్ప దినమున, ఆ గొప్ప బల్ల వేయబడినపుడు, మరియు అన్ని కాలములలో విమోచించబడిన వారు, బల్ల యొద్ద ఒకరికొకరు కూర్చొని, మేము ఒకరికొకరు కరచాలనము చేసెదము, ఓ, ప్రభువా, నేను నీ యొద్దకు నడిపించినవారిని, పదిలక్షల కొలదిగా అక్కడ చూడాలని, “సహోదరుడా బ్రెన్హాం, నీవు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను,” అని వారు చెప్పుటను నేను వినాలని ఆశపడుచున్నాను.

అప్పుడు మేము సంతోషముతో కన్నీరు కార్చుచుండగా, ఆయన సౌందర్యమంతటితో రాజు బయటకు వచ్చి, మేకుల గురుతు కలిగిన తన చేతితో మా కన్నుల నుండి కన్నీరంతటిని తుడిచి, అంటాడు “పిల్లలారా, ఏడ్వవద్దు; సమస్తము ముగిసిపోయెను. ప్రభువు సంతోషములోనికి ప్రవేశించండి.”

ఇక్కడున్న కోత పొలములోనికి వారిని పంపుము, ప్రభువా. వారు ఇతరులను గెలుచుదురు గాక క్రీస్తు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...