కాలము ద్వారా పరీక్షించబడిన దేవుని యొక్క జ్ఞాపకార్థములు

కాలము ద్వారా పరీక్షించబడిన దేవుని యొక్క జ్ఞాపకార్థములు

VGR COUNT-162... మరియు మనము ఆదికాండము నిర్గమకాండము మరియు ప్రకటన గ్రంథమును తీసికొనినట్లే, పరిశుద్ధ గ్రంథము ద్వారా దానిని చుట్టెదము.

మరియు ఇప్పుడు ఉడతల వేటకు వెళ్ళుటకై నేను ఇంటికి వచ్చియున్నాను. అది వాస్తవమై యున్నది. వాస్తవముగా చెప్పాలంటే దానిలోని విషయం అదేయైయున్నది. మరియు, సహోదరుడా, రాయ్ నీవు ఎప్పుడు వెళ్ళుదువు? (రేపు అని సహోదరుడు రాయ్ చెప్పుచున్నాడు. సంపా.) అది సరియే. కావున సంవత్సరములో ఈ సమయమందు మేము ఇంటికి చేరుటను ప్రేమించుచున్నాము. కావున మేము విశ్రాంతికై వెళ్ళుదుము.

నేను మిమ్మును చూసినది మొదలుకొని ఇప్పటికి ఇరువది పౌండ్ల బరువు తగ్గియున్నాను. ఇక్కడ కూటము అయిపోయి వెళ్ళినప్పుడు కాలప్రమాణము ప్రకారము నేను నూట-అరవై-అయిదు పౌండ్ల బరువు ఉంటిని మరియు తిరిగి వచ్చినప్పుడు నూట-నలభై-అయిదు పౌండ్లు ఉంటిని. కావున నా బట్టలు వదులయినట్లు అనిపించుచున్నది. కావున, నేను చాలా బరువును కోల్పోయాను. మరియు ఎవరో స్త్రీ, ప్రియమైన సహోదరి ఈ రోజు, బయటకు వెళ్ళుచుండగా, “సహోదరుడా, బ్రెన్హాం నేను కూడా బరువు తగ్గునట్లు ప్రార్థించుము,” అని చెప్పినది. (సహోదరుడు బ్రెన్హాం నవ్వుతున్నారు - సంపా) ఆమె బాగా తగ్గాలని ఉన్నది. కావున నేను ఆమెతో, “కేవలం వచ్చి, ఎక్కువ శ్రమతో బోధించుచు వెళ్ళుము,” అని అన్నాను. కావున, నాకు తెలిసినదంతా అదేయైయున్నది. నిశ్చయముగా అదే దానిని తగ్గించును, అయితే మనము త్వరలోనే శ్రమలను మరియు పరీక్షలను ముగించెదము.

2

నేను వృద్దుడనగుటను గూర్చి తలంచుచున్నాను. ఇంకా రెండు సంవత్సరములు అయినచో నాకు యాబది ఏండ్లు అని మీకు తెలియును. వ్యూ! ఫ్రాకి వెబర్ వచ్చినప్పుడు... నేను జ్ఞాపకం ఉంచుకొనియున్నాను, అతను కేవలం నాకంటే రెండు సంవత్సరములు పెద్దవాడు. అతడి జన్మదిన కానుకను వేసెను, నేను నా కన్నులు తడుముకొని అనుకున్నాను, “మై, ఫ్రాకి వెబర్ ఇరవై-అయిదు సంవత్సరాలు, వందలో ముప్పావు.” అదిప్పుడు సగము. అది ఏ మాత్రము సమయమును తిసుకోదు, అవునా? నేరుగా గడచిపోవును.

3

మనము ఎంతో కాలము ఉండము. ఈ ఉదయము, మన ప్రియ సహోదరుడు అసాధారణమైన వర్తమానమును ఇచ్చుచున్నప్పుడు (మనందరము దానిని ఆనందించియున్నామని నేను అనుకొన్నాను), మరియు అతనక్కడ ప్రసంగించుచున్నప్పుడు నేను ఒక కార్యమును గూర్చి ఆలోచించుట జరిగినది. మరియు నేను ఇట్లు తలంచితిని, “బహుశా దాని కొరకైన ఒక లేఖనమును ప్రభువు నాకు ఇచ్చునేమో,” దేవుని యొక్క ఆశీర్వదించబడ్డ వాక్యముల నుండి ఈ రాత్రి కొంత చదవమని అతనికి నేను అప్పగించితిని మరియు ఇప్పుడు, కేవలం కొద్ది నిమిషములు మాట్లాడి, మరియు ఎప్పటిలాగే మనము రోగుల కొరకు ప్రార్థించెదము.

మరియు బుధవారము రాత్రి, ఈ రానున్ను బుధవారం రాత్రి ప్రభువు అనుమతించిన యెడల, అది సరియైనచో నేను హెబ్రీ పుస్తకము నుండి ప్రారంభించెదను, ఒక పాఠ్యము కొరకై హెబ్రీ పత్రిక తీసుకొనెదను. మరియు బహుశా ఆదివారం రాత్రి వరకు దానిని కొనసాగించెదను. తరువాత వచ్చే బుధవారం రాత్రి బహుశా మరలా దానిని నేను తీసుకొని, ఆ లేఖనముతో దానిని చుట్టుకొని వచ్చెదను. నేను వచ్చిపోవుచుండగా సంఘములో గమనించిన కొన్ని సంగతులు కలవు. వాటి విషయమై నేను కొద్దిగా బోధించవలెనని అనుకున్నాను, మీకు తెలియును, అవి కొద్దిగా నీరసపరిచేటట్లు కనపడే కార్యములై యున్నవి. మరియు వాటిని హెబ్రీ పత్రికలో తీసుకొనవచ్చునని నేను తలంచితిని; అది ఒక చక్కని అధ్యాయమై యుండి, చదువుటకు చాలా మంచి భాగమైయున్నది.

4

ఇప్పుడు, సహోదరుడు నెవిల్, నేను వెళ్ళుచుండగా... అది నా మనసునకు తట్టినది. మరియు నేను ఇచ్చట కొత్త నిబంధనను మాత్రమే కలిగియున్నాను. మరియు నేను మా బైబిల్ నుండి చదువుచుంటిని, దాని అచ్చు పెద్దదైయున్నది. దాదాపు యాభది ఏండ్లు వచ్చిన తర్వాత ఆ చక్కని అచ్చును చదువుటకు నేను దానిని నా యొద్ద నుండి దూరంగా జరపవలసి వచ్చుచున్నది, అయినను సరియైన వెలుతురు లేకుండెను. మరియు నేను బయటకు వెళ్ళి, ఇంకనూ వెలుతురులో దానిని చదువుచుందును, అయితే ఎప్పుడైతే వెలుతురు తగ్గిపోవునో నేను దాని దూరంగా జరపవలసివచ్చును.

మరియు త్వరలో నేను చదువుటకు కండ్లజోడు ఉపయోగించవలసి వచ్చునని డాక్టర్ చెప్పెను. మరియు “నా కండ్లలో లోపం ఉన్నదా?” అని నేను ఆయన్ను అడిగితిని. మరియు ఆయన వాటిని పరీక్షించియున్నాడు. “10-10, అది ఎంతో బాగుగా యున్నది. 20-20 సాధారణం. మరియు 15-15 ఫర్వాలేదు. మరియు 10-10, ఉండినచో చాలును అతను చదువగలడు. కావున కొంతదూరములో అతను కోరినచోటల్లా నేను చదవగలిగితిని. అతను దేనినో తీసేవాడు మరియు నేను దానిని చదువుటకు మొదలు పెట్టితిని. అతను దగ్గరగా వచ్చుచున్న కొలది నేను చదువుట తగ్గిపోవుచున్నది. అది ఇంత దగ్గరకు వచ్చేసరికి నేనిక ఆపుచేసితిని. అతనిట్లనెను, ”ఓ, నీవు నలభై దాటితివి.“

మరియు “అవునండి,” అని నేనన్నాను.

అతను చెప్పెను, “మంచిది, సహజంగా, నీ కనుదృష్టి క్షీణించును.” చెప్పెను, “ఇప్పుడు మీరు గనక ఎక్కువ కాలం బ్రతికినట్లయితే మరలా రెండవ దృష్టిని పొందెదరు. అప్పుడు మీరు మరలా తిరిగి చదివెదరని నేను ఆశిస్తున్నాను,” అని చెప్పెను.

5

కాని మీకు తెలియును, “మరియు నేను దానికి ఇంకా ఎంతో దూరంలో లేనని నేను తలంచుచున్నాను. ఇంకా కొద్దికాలమే.” సహోదరుడా టోనీ, అది విచారకరమే కదా? (కాదు, అని సహోదరు. టోనీ చెప్పెను - సంపా) కాదు, అట్లు కాదండి, అది ఒక ఆశీర్వాదకరమైన కార్యమైయున్నది. ఒక విధంగా నేను వృద్దుడగుచున్నాను. మరియు ఇంకో విధంగా యవ్వనస్తుడడుచున్నాను, ఏలయనగా సహోదరుడా, ఎక్కడైతే ఎన్నటికి ఏ తప్పిదము లేని, ఆ యవ్వవన అమర్తత్యపు ఆశీర్వాదకరమైన శరీరములోనికి నేను వెళ్ళుచున్నాను. మరియు నేను కేవలం ఆ ఘడియ కొరకు బ్రతికెదను. అది చాలా అద్భుతమైయున్నది.

ఇప్పుడు, నేను కడపటి పాఠ్యాంశమును చదువుటకు ముందు, మన శిరములు వంచియుండగా, ఆయనకు ప్రార్థంచెదము.

6

సర్వశక్తుడైన దేవా, నీ పిల్లలు సంతోషముగా ఉండవలెనని నీవు ఉద్దేశించియున్నావని మేము నమ్ముచున్నాము. నీ వాక్యమునందలి విశ్వాసులముగా, మేము వాక్యము చుట్టూ సహవాసము చేయుచున్నాము. దాని కొరకే మేము ఇచ్చటికి వచ్చియున్నాము. కేవలం ఒక వర్తమానము వినుటకు కాదు, కాని వాక్యము చదువుట ద్వారా మరియు వాక్యము యొక్క బోధన ద్వారా నిన్ను ఆరాధించుటకు మరియు నీతో సహవాసము చేయుటకు వచ్చియున్నాము. ఇప్పుడు, ప్రభువా, నీవు మమ్ములను నిరాశ చెందనీయవు. ఈ ఘడియలలో నీవు మమ్ములను ఆశీర్వదించెదవని నేను నిశ్చయత కలిగియున్నాను.

ప్రభువా, మా దివ్యమైన మరియు మంచి కాపరిని ఆశీర్వదించండి. మీరు ఆయనతో ఉండెదరని మేము ప్రార్థించుచున్నాము. మరియు ఈ దినమున ఆయన ప్రసంగములో నేను ఆయనను గమనించియుండగా, “నేను త్వరలోనే శ్రమలను శోధనలను దాటిపోదును,” అనే పాటను అతను చిరునవ్వుతో పాడుచున్నప్పుడు, అతనిని నేను చూచియుంటిని. మరియు ఆ సహోదరీలు గృహ కూటములలో మరియు గుడారముల కూటములలో వారేట్లు పాడియుంటిరి కదా. మరియ ఒకానొక ఈ దినములలో అది ముగియును, మరియు పిదప వారు ఆ మహిమకరమగు విశ్రాంతిలోనికి వెళ్ళెదరు.

ఇప్పుడు, తండ్రి, మేము నీ వాక్యము చదువుచుండగా, మరియు దానిని చదివిన పిమ్మట, మా మనస్సులు మరియు హృదయములు సేదదీరునట్లు మమ్మును ఆశీర్వదించుము. మరియు ఈ రాత్రి మాతో మాటలాడుము, మరియు కూటము ముగించబడిన తరువాత మేము మా గృహములకు బయలుదేరుచుండగా, “త్రోవలో మనతో ఆయన మాటలాడుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” అని మేము చెప్పుదుము గాక. యేసుక్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాను. ఆమేన్.

7

ఇప్పుడు, అటువంటి ఒక నిజమైన చక్కని సువార్తిక వర్తమానమును ఆ ఉదయమున మనము కలిగియుండగా, మీకు తెలియును. పిల్లలకు సమృద్ధియైన ఆహారమును పెట్టుట గురించి సహోదరుడు నెవిల్ మాటలాడిన దానిని నేను ఆలోచించుచుంటిని, మీరట్లు చేయగలరు. అయితే ఇప్పుడు, ఈ రాత్రి కేవలం సంఘము గురించి కొద్దిగా మాటలాడెదము. ఇది కేవలం సంఘము కొరకు మాటలాడుటయై యున్నది. మరియు నేను చదువుటకు ఇష్టపడుచున్నాను... క్రొత్త నిబంధనలోని మరొక లేఖన భాగమైయున్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనములో, యేసు మాట్లాడుచుండెను.

ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.

8

ఈ రాత్రి నా పొఠ్యాంశము - జ్ఞాపకార్ధములు... కాలము ద్వారా పరీక్షించబడి, నిలిచిన దేవుని యొక్క జ్ఞాపకార్ధములు. మరియు నేను కొన్ని ప్రకటనలు కలిగియున్నాను. నేను వాటిని చేసియున్నానని నమ్ముచున్నాను. మరియు ఇక్కడ కొన్ని కలవు అవి.... ప్రభువు చిత్తమైనయెడల, బుధవారం రాత్రి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం నుండి ప్రారంభించు కూటము గురించి అని నేను నమ్ముచున్నాను. నేను అలా అనడానికి కారణమేమనగా, నా కూటములు... నేను ఒక చోట ఉండెదను మరియు ఆయన నన్ను మరొకచోటికి పిలుచును. ఆయన పిలిచిన ప్రకారం నేను వెళ్ళవలసియున్నదని మీకు తెలియును. ఆ కారణము చేతనే నేను, సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ మరియు వారి వలే మరియు బలమైన విశ్వాసము గల ఆ మనుషుల వలె ఉండలేను. వారు రెండు మూడు సంవత్సరములకు ముందే కూటములను ఏర్పాటు చేసుకొని, మరియు “మేము అచ్చట యుండెదము,” అని చెప్పుదురు. తర్వాత వారి యొక్క వర్తమానమును కలిగియున్నారు. అయితే నా వర్తమానమును దేవుడు ఎక్కడికి పంపించునో అక్కడికై యున్నది. ఇక్కడికైన, అక్కడికైన, మరెక్కడికైన సరే, ఆయన పంపిన వెంటనే నేను వెళ్ళవలసియున్నది. మరియు అవి రెండు వేర్వేరు పరిచర్యలైయున్నది, ఒకే దేవుడు, అదే దేవుడు.

9

నిన్నటి దినమున మా పొరుగింటివారితో నేను మాట్లాడిన విషయము నేను ఆలోచించుచుంటిని, మరియు ఆయన చెప్పెను, “ఫలానా కాపరిగారు మీకు తెలియును.” “అతను ఒక అద్భుతమైన వ్యక్తియై యున్నాడు,” అని అతను చెప్పెను. నేను నా భార్య కూర్చొని యుండగా, దాదాపు పదకొండు గంటల రాత్రి ఇంటికి వచ్చి అతడు తలుపు తట్టెను. “నేను ఒక కప్పు కాఫీ మీతో త్రాగుటకు వచ్చితిని,” అని చెప్పెను. చూశారా, “అతను మరియొక పొరుగువాని ఇంటికి వెళ్ళెను, మరియు వారు నిద్రించుటకు సిద్ధమవుచుండగా, అక్కడ ఒక రొట్టె ముక్కను ఇతడు తినెను. మరియు కేవలం....” మరియు అతడిట్లు చెప్పెను, పిల్లల నిమిత్తము ఒక బైబిల్ పాఠశాలను అతను కలిగియున్నాడనియూ మరియు అతను చాలామంది పిల్లలను కలిగియున్నాడనియు, అతను అతని భార్యా పిల్లలకు వసతి కలిగించుటకు వారు తమ గుడారములు బయట వేసుకొనవలసి వచ్చెను,“ అని అతను చెప్పెను.

మరియు నేను తిరిగి వెళ్లి, ఆలోచించసాగితిని, “మీకు తెలియును, అది వాస్తవము. అది, అతనొక అద్భుతమైన పిల్లవాడు.” మరియు సహోదరుడు ఫ్లీమ్యాన్ ఇచ్చట ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అతని పిల్లవాడు ఇక్కడ ఉన్న ఫెయిత్ లూథరన్ సంఘమునకు వెళ్ళునని నేను నమ్ముచున్నాను. అతనొక అద్భుతమైన మనిషి మరియు అతని భార్య, వారిరువురు ప్రభువు కొరకు గొప్ప పనిని చేయుచున్నారు.

10

మరియు నేను ఆలోచించాను... నేను కారు కడుగుటకు వెళ్ళితిని, మరియు నేను నిరుత్సాహపడసాగితిని; “నేను ఎందువలన అట్లు చేయలేకపోవుచున్నాను?” అనుకుంటిని. నలుదిక్కులా వెళ్ళి, పిల్లల్ని పోగుచేసి నన్ను వెంబడించునట్లు నేను ఎందువలన చేయలేకపోవుచున్నాను? నేను పిల్లల్ని ప్రేమించుదును. మరియు నేను ఒక ఇంటి నుండి మరొక ఇంటికి, ఈ చివరి నుండి ఆ చివరకు ఎందుకు ఆ విధంగా వెళ్ళలేకపోవుచున్నాను? మరియు అంతలో ఏదో ఒకటి నాతో ఇట్లు చెప్పెను, “నీవు దాని కొరకు పిలువబడలేదు. అతనికి దేవుడ ఏమి చెప్పెనో దానినే అతడు చేయుచున్నాడు.” అయితే ఓరల్ రాబర్ట్స్ మరియు వారివలె, ఖడ్గము చేత పట్టుకొనిన ఒక యెహోషువా వలె విశ్వాసము మరియు విడుదల అను వర్తమానముతో నిలబడగల ఎవరో ఒకరని మనము కలిగియుండవలసియున్నది. మరియు చూడండి, అటువంటి దానిని కలిగియున్నవారిని మరియు ఇటువంటి దానిని కలిగియున్న వారిని మనము కలిగియుండవలసియున్నది. అయితే వారంతా ఒక పెద్ద బృందమగునట్లు కలిసిపోవుదురు, అదే దేవుని యొక్క సంఘమైయున్నది.

11

కొద్ది క్షణాల క్రితం నిరుత్సాహంతో మరియు హృదయము బ్రద్దలైయున్న ఒక యవ్వన స్త్రీతో మాటలాడుచుంటిని. మరియు నేను ఆమెతో ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు వేరు వేరు కాదనియు, వారిరువురు ఒకే వ్యక్తిగా యున్నారనియు చెప్పుటకు ప్రయత్నించుచుంటిని. దేవుడు పురుషుని గాను మరియు స్త్రీని గాను ఉండునట్లు మానవుని సృజించెను; అతనొక పురుషుడై యుండెను. అది నిజము. మరియు ఆయన వారిని శరీరమందు వేరు చేసి మరియు వారిలో వ్యత్యాసము కలుగచేసెను. కాని, వారిరువురు కలిసి పిల్లలను పెంచునట్లు ఒకటిగా ఉండుటకు వారిని ఏకముగా చేసెను. మరియు కావున పురుషుడు బలిష్ఠుడుగాను మరియు మొరటుగాను ఉండును మరియు స్త్రీ - పురుషుని యొక్క ప్రియమైన భాగముగా ఉండును. కావున వారిద్దరూ ఏకమైయున్నారు. దేవుడు వారిని వేరు చేసియుండెను, అయితే వారిరువురు ఒకే వ్యక్తియై యున్నారు. పు-రు-షు-డు. మరియు స్త్రీ, నారి అని పిలవబడును. అది నిజము, ఏలయనగా ఆమె పురుషుడి నుండి తీయబడియుండెను. ఆమె పురుషునితో భాగమై యుండెను. అయితే ఇక్కడ ఈ జీవితములో, శరీరమందు వారు వేరుచేయబడియున్నారు; ఆత్మలో, వారు ఒక్కటైయున్నారు.

12

మరియు తమకు ప్రియురాలిగా ఉన్నప్పుడు వారిని ప్రేమించినట్లు, ప్రేమించకుండా ఇప్పుడు తమ భార్య పట్ల అనురాగమును కోల్పోవుచున్న పురుషుల విషయమై మాటలాడుచుంటిని: మీకది సిగ్గుకరమైయున్నది. మీరు అట్లు చేయవలసియున్నది; ఆమె ఎల్లప్పుడు మీ ప్రియురాలేయై యున్నది. సంపూర్ణముగా, ఆమె ఉండవలసిన భాగము అదేయైయున్నది మరియు మీరు ఆమెను ఈ రీతిగా చూసుకోవలసియుండెను. ఓ, అటువంటి నూతన దాంపత్య జీవితమును (Honeymoon) విడిచిపోనియ్యకుడి. ఏలయనగా అటువంటిది పరలోకములో ఉండదు. అచ్చట కేవలము పరిపూర్ణమైనదొక్కటే ఉండును. అది వాస్తవమైయున్నది. కావున అందరు....

మంచిది, కొందరు స్త్రీలు దాని “ఆమేన్” అని చెప్పదలంచినట్లు కనిపించుచున్నది. “నీవు ఎల్లప్పుడు స్త్రీలపై కేకలు పెట్టుచూ మరియు ఆ రీతిగా మాట్లాడతావు,” అని ఇక మీదట ఎన్నడు నాకు వినపడనియ్యకుడి. సహోదరి, హిడర్సన్ నీవు ఏదైనా చెప్పవచ్చు కదా? ఆ వేనకాల ఎవరో దానిని చెప్పియున్నారు. నీవేనా? సహోదరి కాక్స్ నీకు కృతజ్ఞతలు. అది చాలా మంచిదైయున్నది. సహోదరుడా, కాక్స్ ఇప్పుడు నీవు ఎచ్చట ఉండినను అది నీ కొరకేయైయున్నది. అది సరియే. అవునండి. మరియు మనము ఒకరినొకరు ఘనపరచుకొనుట మరువకూడదు: ఎల్లప్పుడు ప్రేమగా నుండుడి, ఎన్నడు విడిచిపోనీయకుడి.

13

ఇటీవల కాలమున ఒక కథోలిక్ పిల్లవాడు నా యొద్దకు వచ్చెను. అతని భార్య విడిపోవుచుండెను. బిల్లీ, నేను ఒక కథోలిక్ ను మరియు నీవు ఒక ప్రొటెస్టెంట్ కనుక నీ యొద్దకు నేను రాదలుచుకోలేదు,“ అని అతను చెప్పెను. కొద్దిసేపటి క్రితం, ”ఫాదరుగారు, నా ఇంటి నుండి నన్ను తరిమివేసినాడు,“ అని అనెను.

“విషయం ఏమిటి హాని?” అని నేను అన్నాను.

అతను అనెను, “మంచిది,” అతను నాతో అన్నాడు. నేను “కొద్దిగా మద్యం సేవించెదను,” అని అన్నాడు. మరియు “నేను పగలంతా చాలా కష్టపడి పనిచేయుదును,” అని చెప్పెను. “ప్రతి రాత్రి నేను వచ్చి ఆమెను ముద్దు పెట్టుకొని మరియు ఆమెను కౌగలించుకొని, క్రొత్తగా పెండ్లి చేసుకొనబోవు జంట వలె ఉండునట్లు నా భార్య తలంచుచుండును,” అని అనెను. “మాకు వివాహము జరిగెను మరియు పిల్లలు కూడా ఉండిరి,” అనెను. మరియు “అంతా మంచిగానే ఉండెను,” అనెను.

“ఉఫ్, అబ్బాయి ఒక నిమిషము ఆగుము. నీవు పొరబడుచున్నావు. నీవు అట్లనరాదు, నీవు వివాహము చేసుకొనుటకు ముందు ఎట్లో అది ఇప్పుడూ అట్లే ఉండును, చూశారా. నీవు దానిని ఎల్లప్పుడు గుర్తుంచుకొనవలసి యున్నది,” అని నేను అన్నాను. “ఇప్పుడు ఆమెకు నలుబది సంవత్సరములు గనుక సరిగ్గా ఈ సమయములోనే నీవు ఆమె పట్ల శ్రద్ద చూపుట ఆమెకు అవసరము,” అని నేను అన్నాను.

14

కావున వారు విడాకుల నిమిత్తమై కోర్టుకు వెళ్ళిరి. మరియు అతను “నేనేమి చేయుదునో నాకు తెలియదు,” అని అనెను.

నేను ఇట్లు చెప్పాను, “వెళ్ళి, ఆమెను పిలువుము. నేను ఒక ప్రొటెస్టెంటుగా అక్కడికి వెళ్ళినచో, ఆమె నన్ను స్వీకరించదు, కాని నేను.....”

“ఓ, ఆమె నిన్ను ఇష్టపడును,” అని అతనన్నాడు.

మరియు నేను ఇట్లు చెప్పాను, “కేవలం వెళ్ళి ఆమెను పిలువుము, నీవు నీ మనస్సు మార్చుకున్నావని ఆమెతో చెప్పుము.”

మరియు కావున మరుసటి దినమున, నేను ఆ జడ్జిని పిలిచి మరియు అతనితో మాటలాడితిని మరియు నేను ఈ పిల్లవాడితో ఈలాగు చెప్పితిని, “ఎక్కడైతే జడ్జిగారు నీతో కేసు విషయము ప్రస్తావించునో, అక్కడ నేను క్రింద నేలపై కూర్చుండెదను. నేను నీ కొరకు ప్రార్థించెదను. దాని గూర్చి ఆమెతో చెప్పకుము.”

“అది సరియే.”

కావున నేను అక్కడ క్రింద ఉండి ప్రార్ధించుచుంటిని. కొద్దిసేపటి తరువాత మెట్ల దగ్గర నుండి ఏదో చిన్న చప్పుడు రావటం నేను వినియున్నాను, మరియు మీకు తెలియును, వారిరువురు నవ్వుకుంటూ ఒకరినొకరు కౌగలించుకొని చిరునవ్వుతో వచ్చుచుండిరి. అతను చెప్పెను... “మంచిది, హలో, మీరా,” అని నేను అన్నాను.

మరియు “సహోదరుడా బ్రెన్హాం, నేను కొద్దిసేపటి క్రితం నిన్ను చూసియున్నాను!” (అవును, ముప్పది నిమిషాల క్రితం చూశాను), కొద్దిసేపటి క్రితం చూశాను,“ అని అతను అన్నాడు.

మరియు, ఆమె ఇట్లు అనెను, “ఎందువలన, సహోదరుడా బ్రెన్హాం నేను

నిన్ను చూసి చాలా కాలమైయున్నది. మరలా నిన్ను చూసినందుకు ఆనందిస్తున్నాను.“

నేను ఇట్లన్నాను, “మీకు వందనములు, ఎందుకోగాని, మీరు నూతన దంపతుల వలె అగపడుచున్నారు,” అని నేను అన్నాను.

“ఓ,” “మేము బాగానే ఉన్నాము, అవును కదా ప్రియా?” అని అతనన్నాడు.

“అవును, ప్రియా మనము అట్లే యున్నాము,” అని ఆమె చెప్పినది. ఆమె ఇట్లన్నది, “పాస్టర్ గారు, ఎప్పుడైనా మమ్మల్ని చూచుటకు రండి.”

మరియు నేను ఇట్లన్నాను, “చాలా వందనములు. మీకు నా వీడ్కోలు.” వెళుతుండగా, ఆ పిల్లవాడు వెనుకకు తిరిగి మరియు ఆ విధంగా ఆడించెను. వారందరూ సంతోషముగా ఉండిరి.

15

అది నిజము, ప్రేమ ప్రతి దానిని జయించును: కేవలం ప్రేమ మాత్రమే.

మీరు సమస్త విధమైన సూచనలను మరియు ఆధారాలను కలిగియుండవచ్చును, కాని నాకు మాత్రం ప్రేమను ఇవ్వండి, నాకు అది చాలును. ఓ, మై!

ప్రియమైన మరణమగు గొర్రెపిల్ల, నీ ప్రశస్త రక్తము

దాని శక్తినెన్నడూ కోల్పోదు,

విడిపించబడ్డ దేవుని సంఘమంతయు

ఇక ఎన్నడు పాపము చేయునంతగా, రక్షించబడును. (చూశారా?)

నీ గాయముల నుండి ప్రవహించు ఆ ఊటను

నేను విశ్వాసముతో చూచినది మొదలు

నేను మరణించువరకు విమోచనా ప్రేమయే నా ధాతువు ఆయెను.

(అది నిజము. ఓ, అద్భుతము.)

16

ఇప్పుడు, కాలము ద్వారా పరీక్షించబడి, నిలిచిన జ్ఞాపకార్థములు! ఈ ఉదయం నాకు ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చినదనగా, ఆదివారపు బడిలోని వర్తమానము, నుండి, ఏలియాను గూర్చి మన సహోదరుడు సువార్తిక వర్తమానము ప్రసంగించుచుండగా వచ్చినదై యుండెను. ఎక్కడైతే అతను కోరెనో... ఈ పిల్లలు, ప్రవక్తల శిష్యులు, వారు ఎట్లు ఒక పెద్ద పాఠశాలను కట్టుటకు కోరుకొనిరి మరియు అది నా మనస్సుకు తట్టెను మరియు నేను జ్ఞాపకార్థములు అను మాటను గూర్చి ఆలోచించసాగితిని.

ఇప్పుడు, ఒక జ్ఞాపకార్థము అనునది ఒక గొప్ప సంగతి. జ్ఞాపకార్థములను మనము అభినందించెదము. మరియు చాలామంది ఈ జీవితములలో, వారి వెనుక ఒక విధమగు జ్ఞాపకార్థమును విడిచిపెట్టుటకు ప్రయత్నము చేసియున్నారు. దాదాపు మనుష్యులందరు దానిని చేయుటకు ఇష్టపడుదురు: వారి సమాధి వద్ద గొప్ప గుర్తును పెట్టుదురు. అది సరియే, నిశ్చయంగా. నేను అభినందించుచున్నాను. అది ఫరవాలేదు. మరియు ఒకదానిని చాలామంది గొప్ప పుణ్యస్థలములను కట్టుటకు ప్రయత్నము చేసియున్నారు.

17

ఇప్పుడు ఒక జ్ఞాపకార్ధమును గూర్చి నేను చెప్పుటకు ఇష్టపడుచున్నాను. అది ఓహాయోలో అయియున్నది. మరియు అక్కడ ఒక నాస్తికుండుండెను. (నేను అతని పేరు మరచిపోయాను. నా ఇంటిలో ఎక్కడో ఆ పటమును నేను కలిగియున్నాను.) అక్కడ అతడు క్రైస్తవ్యమునకు బద్ద విరోధియైయుండెను. అతను మరణించాక, అతని పాదము బైబిల్ మీద పెట్టి క్రిందకు చూపుతూ, “మత మూఢత్వానికి దూరం కండి మరియు ఆధునిక విజ్ఞానముతో పైకి ఎదగండి,” అను మాటతో ఒక జ్ఞాపికను అతను మరణించిన తరువాత తన కొరకు కట్టవలెనని కోరుకొనెను. మరియు అతను మరణమగుచున్నప్పుడు, అతను ఇట్లు చెప్పెను, “నేను తప్పైన యెడల, నా సమాధిపై సర్పములు ప్రాకులాడును.” మరియు అతను మరణించినప్పుడు వారు సమాధిని త్రవ్వుటకు పారతో మట్టి తీయుచుండగా, వారు రెండు లేదా మూడు రక్తపింజరి పాములను చంపిరి.

మరియు ఈ దినమున ఆ సమాధి తోటలో ఈ మధ్యే ఒక సేవకుడు ఒక చిత్ర పటమును (ఫోటోను) తీసి, మరియు నాకు చూపించుటకు దానిని తీసుకు వచ్చెను. మరియు అతని సమాధి చుట్టూ గొలుసులతో వ్రేలాడుతూ... ఆ సమాధి తోట ఒక అందమైన స్థలమైయున్నది. కాని అతని సమాధి కేవలం ఒక పాముల పుట్టవలె ఉన్నది. మరియు వర్షాకాలమైననూ, చలికాలమైననూ ఎటువంటి తేడా లేకుండా, అతని సమాధి నుండి సర్పములు ఇంకనూ ప్రాకుతూనేయున్నది: ఒక జ్ఞాపకార్థము. నాకైననూ లేక మీలో ఎవరికైననూ అటువంటి ఒక జ్ఞాపకార్ధము కలిగియుండుట దూరమగును గాక.

18

కావున జ్ఞాపకార్ధములున్నవి, అయితే గొప్ప జ్ఞాపకార్ధములు కూడా ఉన్నవి. నేను గొప్ప యోధుడైన యెహోషువా గురించి తలంచుచున్నాను. ఈ ఇరువది లక్షల మంది యూదులకు ఒక నాయకుడిగా, మోషే యొక్క ఆయుధమును తీసుకొనిన ఇతను ఎటువంటి ఒక గొప్ప వ్యక్తియై యున్నాడు. మోషే ఎన్నుకొనబడినవాడై, బయటకు పిలువబడి, ముందుగా నిర్ణయింబడినవాడు మరియు దేవుని చేత నిర్దారించబడినవాడైన ఈ ప్రవక్త యొక్క పరిచర్యను భర్తీ చేయుటకు ఆ మనుష్యుని యొక్క స్థానమును తీసుకొనుటకు యెహోషువా అడుగు పెట్టుట నిశ్చయముగా ఒకపెద్ద విషయమై యున్నది. అతడు వారిని దర్శించుననియూ మరియు అతడు వారిని విడిపించుననియూ, అతడు రావడానికి నాలుగువందల సంవత్సరముల క్రితమే దేవుడు చెప్పియున్నాడు. మరియు మోషే ఎటువంటి ఒక యోధుడైయుండెనో గదా! యేసుక్రీస్తు దానిని చేయునంత వరకు మోషే యొక్క పరిచర్యను భర్తీ చేయుటకు ఎన్నడూ ఏ మనుష్యుడు, అతని స్థానమును తీసుకొనలేకపోయెను. మరియు స్వయముగా అతడిట్లు చెప్పెను, “ప్రభువైన మీ దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి పుట్టించును మరియు ఇలాగు జరుగును. ఈ ప్రవక్త మాట మీరు విననియెడల, ఎవరైతే ఈ ప్రవక్త మాట వినకుందురో వారు కొట్టివేయబడుదురు.” అది సరియే.

19

ఇప్పుడు, ఈ గొప్ప జ్ఞాపకార్ధము. మరియు యెహోషువా నదియొద్దకు వచ్చియుండెను. మరియు మోషే మరణించిన తర్వాత, యెహోషువా అతని స్థానమును తీసుకొనెను. మరియు దేవుడు యెహోషువాకి తోడైయుండెను. మరియు అతడిట్లు చెప్పెను, “ఇప్పుడు, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి, మీ వస్త్రములు ఉతుకుకొనుడి. మరియు మిమ్మును ప్రత్యేక పరచుకొనుడి మరియు మీ భార్యలను చేరకుడి. మరియు మూడవ దినమున దేవుడు ఏదో కార్యమును చేయనైయున్నాడు.”

ఓ, ఒకానొక ఆదివారపు ఆరాధనలలో, రాత్రి కూటములో ఆ “మూడవ దినము,” అను దానిపై నేను ప్రసంగించగోరుచున్నాను, మరియు వాటిలో ఉన్న శక్తి ఏమిటాయని మీకు చూపించెదను. ఆ మూడు ఈ ఉదయము ప్రార్థనలో నేను దానిని తెలియజేసియున్నాను. ప్రతి ఒక్కరు మూడు కార్యములు కలిగియున్నారు. మరియు పరిశుద్ధ గ్రంథము సంఖ్యానుగుణంగా దానిని కలిగియున్నది.

ఇప్పుడు, “మూడవ దినమున మీరు దేవుని యొక్క మహిమను చూచెదరు.” ఇప్పుడు, “అది ఎప్పుడు జరగబోవునని అతడు ఖచ్చితమైన సమయమును తెలియజేసెను గనుక అతడు మాటలాడుచున్న దానియొక్క అసలైన విషయమును తాను ఎరిగియుండెనని అది చూపించుచున్నది. మరియు ఆ ఇశ్రాయేలీయులందరి ఎదుట అతడు నిలిచియున్నప్పుడు, యెహోషువా ఎట్లు భావించెనో నేను ఊహించగలను. ఇప్పుడు, అతని వాక్యము సత్యమైయుండవలసి యున్నది. మరియు అక్కడ యోర్దాను పొంగి పొర్లుచున్నది.

20

మీరు చూడండి, ఒక మనుష్యుని యొక్క గుణము అతని యొక్క క్రియల వలన తెలియపరచబడును. మీరు ఏమైయున్నప్పటికిని, మీ క్రియలే మీరెవరనునది రుజువు చేయును. మీరెంత సాక్ష్యమిచ్చినా కాని, మీరు ఏమి చెప్పినా గాని, సున్నయినా లేదా పొల్లెనా దానితో ఎటువంటి సంబంధము లేకుండెను. మీరు ఏమిటనియు, అంతరంగములో మీరు ఏమైయున్నారనియూ మీ క్రియలే తెలియజేయును. మీరు చేయు ప్రతి పనియు, మీరు ఏమైయున్నారనునది బయలుపరచును. మరియు వ్యాపారస్థులైన మీరు, మీరు ఏదైనా పనిని అతుకులుగా చేసిన యెడల, (నా భావము ఏమైయున్నదో గమనించండి: కేవలం సగం పనిని మాత్రమే చేసినచో.), దానిని మీరు చేయకండి. మీరు గనుక దానిని సరిగా చేయలేనియెడల, దానిని ఎంతమాత్రము చేయకండి. అది నిజము.

మీరు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మీరు సంపూర్ణముగా అమ్ముడుపోనియెడల, ఖచ్చితముగా త్యజించుకొని మీరు క్రీస్తు యొద్దకు రానియెడల, అసలు రాకుండుడి. అయితే మీరు ఒక నిజమైన క్రైస్తవునిగా ఉండగోరినయెడల వెలుపల నిలువుడి, దానిని వాస్తవము చేయుడి. మీరు అట్లుండవలెనని దేవుడు కోరుచున్నాడు. మరియు అది రుజువు చేయును. నీ గుణము ఏమైయుండెనని నీ క్రియలే రుజువు చేయును. నీవు చేయు క్రియల వలన నీ గుణము ఏమైయున్నదాయని తెలియపరచబడును.

21

మరియు యెహోషువా ఇప్పుడు, ఆయన మాట పణంగా పెట్టెను (అవునండి), ఆ పూర్వకాలపు నోవహు వలె అయియున్నది. అయితే యెహోషువా ఈ నది దాటవలసియున్నది. మరియు అతను ఒక దారుణమైన సమయమును ఎంచుకున్నట్లుండెను. ఏప్రిల్ మాసములోయైయుండెను. మరియు అది యూదయలోని మంచు కరుగు సమయమైయుండెను. మరియు పర్వతముల గుండా అది ప్రవహించుచుండెను. మరియు యోర్దాను బురదతో నిండియుండెను మరియు యోర్దాను యొక్క పొలములకు నీరు పెట్టుటకు... పొలాలకు నీరును వ్యాపింపజేసెను. మరియు అది గనుక గణితం ప్రకారంగా, లేదా విద్యాసంబంధంగా, లేదా శాస్త్రీయంగా చూసినయెడల, అతను యోర్దానును దాటుటకు సంవత్సరమంతటిలో దరిద్రపు సమయమును ఎన్నుకున్నట్లు కనిపించుచుండెను. కాని తాను దేవుడనని నిరూపించుకొనుటకు దేవుడు అటువంటి సమయములనే తీసుకొనుటకు ఇష్టపడును. మరియు దేవుడు దేనిని వాగ్దానము చేసెనో ఎరిగియుండి మరియు దేవుని నమ్మువారైన దేవుని యొక్క మనుష్యులు దానిని చేయుటకు భయపడరు, ఏలయనగా తాను దేవుడనునది ఎంత నిశ్చయమో అంతగా దేవుడు తన వాక్యముతో హత్తుకొనియుండును.

22

మరియు “మొదటగా మందసమును తీసుకొని ముందుకు వెళ్ళుడి” అని ఆయన చెప్పినప్పుడు, ఆ యాజకుల పాదములు యోర్దానును తాకినప్పుడు, అది ఎంత భయంకరంగా ఉన్ననూ, ఎంత పొంగి ప్రవహించుచున్ననూ, అది దేవుని యొక్క నిత్యమైన వాక్యమునకు దారి ఇచ్చెను. ఎట్లనగా మందసములో వాక్యముండెను. యేసు చెప్పెను, “ఇప్పుడు, ఆకాశమును భూమియు గతించును, కాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.”

కావున యెహోషువా తన మాట దేవుని యొక్క వాక్యముపై నిలిచియుండవలెనని ఎరిగియుండెను గనుక అతడు దేవుని వాక్యమునే ముందు ఉంచెను. ఈ రాత్రి ఇక్కడున్న వ్యాధిగ్రస్తులు దానిని చేయవలెనని నేను కోరుచున్నాను. మీ ఒప్పుకోలుతో దేవుని వాక్యమును జతపరుచుడి. మీ ఒప్పుకోలుని ఉంచి, మీరు దానిని నమ్మి మరియు దానిని అక్కడ స్థిరపరచి మరియు లేనివాటిని అవి అక్కడ ఉన్నట్లుగానే పిలువుడి; అప్పుడు మనం ముందుకి సాగిపోవుదుము. ఆ ప్రకారముగా చేయుడి, దేవుని వాక్యము నిన్ను దానిగుండా తీసుకు వెళ్ళును.

23

మరియు యాజకుల పాదములు యోర్దానును తాకగా, అది ఇరువైపులకు దొర్లిపోయెను మరియు నీరు నిలిచిపోయెను. మీరు గ్రహించియున్నారా? ఆ నది యొక్క ప్రవాహము ఇరువది నిముషముల సమయములో మనము కలిగియున్న ఈ గొప్ప ఆధునిక ఆనకట్ట (Dam) వలే, అక్కడ ఉన్న కొలరాడో బౌల్డర్ ఆనకట్ట వలె ఉండునటువంటి ఒక పెద్ద ఒడ్డును అక్కడికి తీసుకురాగలదు. అక్కడ యోర్దాను పరవళ్ళు తొక్కుతున్న విధానం ఎట్లున్నదనగా, పర్వతముల గుండా గోప్ప వేగముతో ప్రవహించుచూ, మరియు అది లోయల గుండా పారుచుండెను. మరియు ఇరువది లక్షల మంది పురుషులు, స్త్రీలు మరియు పిల్లలతో అంతమంది దానిని దాటుటకు బహుశా, నాలుగు లేదా అయిదు లేదా ఇంకా ఎక్కువ గంటలు పట్టి యుండవచ్చును, మరియు మీరేమి తలంచుచున్నారు? ఆ నది నిండిపోగలదు. కాని దేవుడు ఆ ప్రవాహమును నిలిపివేసెను. ఆమేన్. ఓ, నేను దానిని ప్రేమించుచున్నాను. ప్రవాహములను నిలిపివేసెను, మరియు వారు దానిని దాటునంతవరకు అది అక్కడే నిలకడగా నుండెను.

పిమ్మట దేవుడు యెహోషువాతో ఇట్లనెను, “మనము దీనికి ఒక జ్ఞాపకార్ధముగా చేయుదుము. అక్కడికి వెళ్ళి మరియు ఒక్కొక్క ఇశ్రాయేలీయుడి గోత్రమునకు ఒకరి చొప్పున, పంపి మరియు పన్నెండు రాళ్ళను తెచ్చి ఒక జ్ఞాపకార్ధమును చేయుము. మరియు ఈ జ్ఞాపకార్ధం ఎట్లుండవలెననగా, ఇక మీదట మీ కుమారులు ఈ దారి గుండా వెళ్ళునప్పుడు, ఈ రాళ్ళు ఇక్కడ ఉండుటకు కారణమేమిటి? అని అడిగినప్పుడు దేవుడు యోర్దానును ఎట్లు నిలిపివేసెనో, ఆ గాధను నీవు వారికి చెప్పవలయును.” అది ఒక అద్భుతమైన జ్ఞాపకార్థమైయున్నది. భవిష్యత్తులో ఏదో ఒక దినమున ఎక్కడయితే ఇంకనూ అవి జ్ఞాపకార్థముగా నిలిచియుండెనో ఆ రాళ్ళ వైపు నేను చూడగోరుచున్నాను.

24

అయితే నేను మరియొక జ్ఞాపకార్థము గురించి ఆలోచించితిని. అది ఎటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జ్ఞాపకార్ధమై యున్నది. పిమ్మట నేను మరియొక జ్ఞాపకార్థమును గూర్చి ఆలోచించితిని. ఒక దినమున, ఒక స్త్రీ తప్పుడు ఎన్నికను చేసుకొన్నది. నీళ్ళు పారెడి మైదానములలో, ఆమె ఉండాలని నిర్ణయించుకొనలేదు... లేదా సొదొమ గొమొర్రా యొక్క పచ్చని మైదానములలతో నివసించుటకు నిర్ణయించుకొనెను. మరియు కలివిడిగా ఉంటూ ఆ దినములలోనే స్త్రీల వలే జీవించుటకు ఇష్టపడియుండెను. ఎడారీ స్థలములలో నివసించిన శారా మంచి ఎంపిక చేసుకున్నట్లు, ఈమె చేసుకొనలేకపోయెను. ఆమె కేవలం దేవుని వాక్యమును తన హృదయమందుంచుకొనెను. మరియు ఆమె తన భర్తకు ప్రియురాలిగా ఉండి, అతనిని, “యజమానుడని” పిలుచునంతగా ఆమె తన భర్తకి విధేయురాలైయుండెను. మరియు సరిగ్గా అక్కడే గుడారములో దేవుడు ఇద్దరు దూతలతో దిగి వచ్చి, వారిని దర్శించెను.

25

అయితే, శ్రీమతి. లోతు, ఆమె చాలా లోక-సంబంధిగా మారెను. మరియు లోక-కార్యములతో పట్టబడెను. మరియు ఈ దినమున ఎంతగానో లోక-సంబంధమైన మనస్సు కలిగిన మనకు అది ఎటువంటి ఒక గుణపాఠమై యున్నదో కదా! మరియు ఈ దినమున, సంఘమంతయూ పూర్తిగా లోక-సంబంధమైన మనసుతో నిండి యున్నదని ఎంతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

ఇప్పుడు, బహుశా ఆమె అచ్చటికి వెళ్ళినప్పుడు, శ్రీమతి. లోతు అట్లు చేయదలంచుకొనలేదు. “నేను కేవలం కలివిడిగా ఉండేదను,” అని ఆమె తలంచెను. కలివిడిగా ఉండుట మంచిదే, కాని లోకపు అలవాట్లను తీసుకొనకుండుడి. మీరు వెళ్ళునప్పుడు, షడ్రకు, మేషాకు, అబేద్నెగో మరియు దానియేలు వలె వెళ్ళుడి. ఏమి సంభవించినాగాని, వారు తమను తాము అపవిత్రపరచుకొనకూడదని తమ హృదయమందు నిశ్చయించుకొనియుండిరి. మిగతా సంఘమంతా పడిపోయిననూ, ఏమి జరిగిననూ వారు మాత్రం వారి హృదయములో నిశ్చయించుకొనియున్నారు. ఈ దినమున వారు ఒక జ్ఞాపకార్ధముగా ఉన్నారు.

26

మరియు శ్రీమతి. లోతు ఒక జ్ఞాపకార్థమైయుండెను, మరియు దేవుడు చివరిసారిగా ఆమెకు ఆమె యొక్క కృపా వర్తమానమును ఇచ్చినప్పుడు, ఆయన తన దూతలను అచ్చటకు పంపినప్పుడు కొద్ది గంటలలోనే సొదొమ గొమొర్రా దహించబడబోవుచున్నదని వారితో చెప్పెను. అయిననూ, ఒక ఎడారిలోనికి వచ్చి, అక్కడ ఎడారిలో శారా జీవించినట్లు జీవించుటకు, మామూలు వస్త్రములు ధరించి సాధారణ స్త్రీ వలె సాధారణ వస్త్రములు ధరించి, ఆమె యొక్క సాంఘిక జీవితాన్ని విడిచిపెట్టవలెనన్న తలంపునైననూ ఆమె సహించుకొనలేకపోయెను. ఆమె విలాసవంతముగా ఉండుటకు ఇష్టపడెను. ఆమె భర్త పట్టణములో ఒక గొప్ప వ్యక్తి అయ్యెను. అతడు పట్టణము యొక్క మేయరు లేదా జడ్జి వలే గవిని వద్ద కూర్చుండియుండెను. మరియు ఆమె ఈ విలాసములను కోరుకొనెను మరియు ఆమె ఆ కార్యములను వదలిపెట్టు ఆలోచనైననూ కలిగియుండలేదు.

27

మరియు ఆమె తన భర్తతో పట్టణము నుండి బయటకు వెళ్ళుచుండగా, ఆమే ఏడ్చుచూ మరియు బాధపడుచూ వెనుకకు చూచుచునుండెను. ఏలయనగా ఆమె అటువంటి మరణము నుండి వేరగుటకు ఆమె దానిని వదులుకోవలసివచ్చెను. యేసు చెప్పేను, “నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచువాడెవడును దున్నుటకు అర్హుడు కాడు.” మనము ఎటువంటి ప్రజలమై ఉండవలసి యున్నది? నాగటి మీద చేయి పెట్టిన వాడు కనీసం వెనుకకు - వెనుకకు తిరుగుట మాత్రమే కాదు, కాని వెనుకకు చూచుటకు మరలిననూ, అతడు దున్నుటకు పాత్రుడు కాడు. ఓ, మన దృష్టి మరియు మన హృదయం ఏకమైయుండవలసియున్నది. ఇతరులు ఏమి చేసిననూ, సంఘము ఏమి చేసిననూ, పొరుగువారు ఏమి చేసిననూ, ఎవరు ఏమి చేసిననూ నీ హృదయము మాత్రము కల్వరిపైనే కేంద్రీకృతమై యుండవలెను. కనీసం వెనుకకు చూచుటకు ఆగవద్దు. మనకు వెనుకకు చూసే సమయమే లేదు.

మరియు ఈ స్త్రీ, ఆమె అలాగు చేసెను గనుక, క్రీస్తుని సొంతరక్షకుడిగా అంగీకరించిన తర్వాత వెనుకకు చూచుటకు తిరిగిన ప్రజలకు దేవుడు ఒక జ్ఞాపకార్థముగా ఇచ్చెను. ఆమె ఉప్పు స్తంభముగా మారెను. మరియు నేటికి అది అచ్చట నిలిచియున్నది. దానిని మైదానములలో చూడవచ్చును. ఆ స్త్రీ అచ్చట నిలబడి తలను త్రిప్పి వెనుకకు చూచుచుండెను మరియు ఆమె తన ఎడమ భుజము మీదుగా పొలముల వైపు చూచుచుండెను. ఆమె దీనిని చేయుటకు బలవంతము చేయబడినప్పటికి ఆమె హృదయం వాటి మీదే ఉండియున్నది. మరియు ఈనాడు చాలామంది ప్రజలు వారు లోకము నుండి బయటికు వచ్చియుండిరి గనుక క్రీస్తును ఆ విధముగానే తీసుకొనుచున్నారు. వారు దానిని చేయుటకు బలవంతపెట్టబడుచున్నట్లు భావించుచున్నారు. మరియు వారు కోరికతో మరియు వాంఛతో నుండిరి. మరియు వారు వెనుకకు మరలుటకు ఎంతో కాలం పట్టదు. మరియు వారికి చూపించబడిన ప్రకారము దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ప్రేమకు వారు దారుణమైన జ్ఞాపకార్ధములైయున్నారు.

28

ఇప్పుడు, జ్ఞాపకార్ధములు. ఇప్పుడు, యేసు భూమి మీద ఉన్న దినములలో యూదులు ఒక ఆలయమును జ్ఞాపకార్థముగా నిర్మించిరి. మరియు వారు ఆ ఆలయము ఎంత చక్కగా నిర్మించబడినదోయని యేసుకి చూపించిరి. మరియు ఆయన చెప్పెను... ఆ ఆలయమునకు కట్టుటకు నలుబది సంవత్సరములు పట్టెను. మొత్తము సుమారు ఎనభై సంవత్సరములు పట్టెను. వారు ప్రపంచములోని వివిధ ప్రాంతములలో రాళ్ళను చెక్కుచునుండిరి. దాని యొక్క నలుబది సంవత్సరముల నిర్మాణములో రంపము శబ్దమైనను లేదా సుత్తె యొక్క ధ్వనియైనను అచ్చట వినబడకుండెను.

అయితే మీకు తెలియును, యేసు కూడా అక్కడ ఇట్లు చెప్పెను, “దీని వైపు చూడకుడి, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచియుండకుండ పరద్రోయబడు ఒక కాలము వచ్చుచున్నదని మీతో చెప్పుచున్నాను. కొంచెం ముందు ఈ గొప్ప జ్ఞాపకార్థపు మాటను ఆయన చెప్పెను, ”భూమ్యాకాశములు గతించును (ఆలయములు గతించును, జ్ఞాపకార్థములు గతించును.), కాని నా మాట నిత్యమైన జ్ఞాపాకర్థమైయున్నది.“

29

సంవత్సరముల క్రితమే ఓడ బూజుపట్టినది. ప్రవక్తల యొక్క సమాధులు పడిపోయెను. కాలం గడుచుచున్న కొద్దీ, వివిధ జ్ఞాపకార్థములు శిధిలమైపోయినవి. శిలలు వాటి నవీనతను కోల్పోయినవి, కాని దేవుని వాక్యము ఎన్నటిన్నటికి అందముగా ఒకే రీతిగా, ఉండియున్నది. అది పలకబడినప్పటి దినములలో ఉన్నట్లుగానే ఈ రాత్రి కూడా ఈ దినపు విశ్వాసులకు అది ఎంతో తాజాగా మరియు సజీవముగా ఉన్నది.

ఎటువంటి ఆశ్చర్యము లేదు, ఈ ఉదయము ఏలియా, మన సహోదరుడు మనకిచ్చిన వర్తమానము, వారు ప్రవక్తలకు ఒక గొప్ప పాఠశాలను ఒక జ్ఞాపకార్థముగా కట్టవలెనని కోరినప్పుడు, ఎలీషా శ్రేష్టమైనదానిని కోరుకొనెను. ఒక పడిపోయిన పనిముట్టును పైకి లేపేను మరియు అది నీటిపై తేలునట్లుగా దేవుని యొక్క అద్భుతమును జరిగించెను. అది ప్రభువు యొక్క వాక్యమైయుండెను. మరియు ఈ రాత్రి ఏదో ఒక జ్ఞాపకార్థమును కట్టవలెనని ప్రయత్నము చేయువారికంటే, ప్రభువు యొక్క వాక్యమును తమ హృదయములలో ఒక జ్ఞాపకార్థముగా స్వీకరించువారే ఎంతో శ్రేష్టమైనవారై యున్నారు.

30

ఇటీవల కాలమున నేను ఇటలీలో ఉన్నప్పుడు, నేను ముస్సోలిని గురించి వింటిని. మరియు అతడు ఒక క్రీడాకారుడై యుండెను గనుక అతడు క్రీడాకారులకు ఒక జ్ఞాపకార్థముగా ఒక నలభై అడుగుల ఎత్తు గల ఒక గొప్ప విగ్రహమును కట్టించెను. మరియు నేను ఆ జ్ఞాపకార్థమును కనుగొనగోరాను మరియు మీకు తెలియునా, అది ఒక పెద్ద బాంబు వలన పేలిపోయి, పొడిగా మారిపోయెను.

రెండు, మూడు సంవత్సరాల క్రితం ఎక్కడయితే ఐగుప్తులోని ఫరోలు పుణ్యస్థలములను మరియు విగ్రహములను కట్టితిరో, ఆ స్థలములో నేను నిలబడియుంటిని. మరియు కనీసం ఆ జ్ఞాపకార్థములు నిలుచు స్థలములు కనుగొనుటకు భూమిలోపలికి ఇరువది అడుగుల లోతునకు నువ్వు త్రవ్వ వలసియున్నదని వారు నాతో చెప్పియున్నారు. ఎక్కడయితే సీజర్ అగస్టా, హేరోదులు మరియు రోము యొక్క గొప్ప వ్యక్తులు ఉంచబడిరో, ఆ చోట నేను నిలబడియుంటిని. మరియు అంతఃపురము నుండి ఏ వీధిలో నుండి అతడు వెళ్ళుచుండెడివాడో, ఆ వీధిగుండా నేను వెళ్ళియుంటిని మరియు అది భూమి క్రింద ఇరవై-అయిదు అడుగుల లోతున యున్నది. ఆ జ్ఞాపకార్థములన్నియు గతించిపోయెను. అయితే దేవుని యొక్క ఆ జీవ వాక్యము ఇంకనూ అదే రీతిగా మరియు అంతే విలువైనదిగా ఉండియున్నది. జ్ఞాపకార్థమంటే అదేయైయున్నది.

31

కావున ఈ దినమున నేను చెప్పుచున్నాను, సహోదరుడా, నీవు చేయు కార్యములు, నీవు మాటలాడు మాటలు, నీవు నీ పొరుగువానితో ప్రవర్తించే విధానం, మరియు క్రీస్తు విషయమై నీవు చేయుపని అదే ఒక నిత్యమైన జ్ఞాపకార్థముగా నుండును. నీవు నీ పిల్లలకు మంచి గృహమును మిగిల్చియుండవచ్చును. కాని నేనైతే వారికి దేనికన్ననూ దేవుని యొక్క వాక్యమునే మిగిల్చియున్నాను. ఆ ఇండ్లు అంతరించిపోవును. అది సంపూర్ణముగా సరియే, అది మంచిదే అయి యున్నది. నేను దానిని వ్యతిరేకిని కాను. అయితే ఆ అల్పమైన కార్యములు చేసి మరియు గొప్ప కార్యములు చేయకుండా విడిచి పెట్టకుడి, (మీరు చూడండి), ఎందుకనగా వాక్యము... ఇల్లు నశించిపోవును, మరియు దానితో పాటు ప్రజలు నశించెదరు, కాని చివరి దినములలో దేవుని యొక్క వాక్యము వారిని పైకి లేపును. మరియు వారికి నిత్యమైనదియు మరియు అమర్త్యమైనదియునైన జీవమును మరలా ఇచ్చును.

32

మరియు ఇప్పుడు, ఎటువంటి ఆస్థి కూడబెట్టవలెననిన, అది దేవుని యొక్క నిత్యమైన వాక్యము.... సంవత్సరముల క్రితం మనము ఇక్కడ పాడే ఈ పాట గూర్చి నేను తలంచుచున్నాను:

కాలము వేగముతో కూడిన రూపాంతరముతో నిండెను,

భూమి పైన స్థిరముగా నున్నది నిలుచును.

మీ ఆశలను నిత్యత్వపు సంగతులపై కట్టుకొనుడి,

దేవుని యొక్క మార్పులేని హస్తమును హత్తుకొనుడి.

మన ప్రయాణము పూర్తి అయిన పిదప,

మనము దేవుని పట్ల యదార్థముగా నున్న యెడల,

మన ఎత్తబడిన అంతరాత్మ,

సుందరముగా మరియు ప్రకాశముగా మహిమలో

నున్న మన గృహమును చూచును.

మీ దేహములో మీ నరములు చల్లబడుచున్నప్పుడు, బయటికి అస్తమించు సూర్యునివైపు చూచుచు, మీ పిల్లలు మీ చుట్టు నిలబడినప్పుడు “ప్రియమైన వారలారా, ఒక దినమున డాడీ మిమ్మల్ని అవతల గట్టు మీద కలుసుకొనును!” అను ఒక జ్ఞాపకార్ధము మీ కొరకు కట్టబడియున్నదని ఎరిగియుండుట ఎంత శ్రేష్టమో గదా! నేను అటువంటిది కలిగియుండిన చాలును. “బిల్లీ, ఇక నీకు ఇంతకన్నా ఎక్కువ ఏమియు చేయలేము,” అని వైద్యుడు చెప్పినప్పుడు. నేను నా పిల్లలను చూచి మరియు వారికి వీడ్కోలు ముద్దు పెట్టెదను. నేను ఇట్లు చెప్పుదును, “అయితే డాడీ మరణించుట లేదు, ఆయన విశ్రాంతి కొరకు ఒక స్థలమునకు వెళ్ళుచున్నాడు. ఏలయనగా భూమి మీదనున్న ఈ గుడారము శిధిలమైపోయినను, నిత్యమైనదియునైన నివాసము మనకున్నది.”

చెప్పుటకు ఎంతటి జ్ఞాపకార్ధము. “నేను నా వద్ద బ్యాంకులో లక్షల డాలర్లు ఉన్నవి, మరియు ఇక్కడ ఇందులో ఇన్ని లక్షలు నీ కొరకు ఉంచితిని,” అని చెప్పుటకంటే, నేను నా పిల్లల ఎదుట సాక్ష్యమును మిగిల్చిపోయినచో చాలును.

వీడ్కోలులను, మన వెనుక విడిచి

కాలమనే ఇసుక తెన్నుల మీద అడుగులజాడలు

బహుశా మరియొక అడుగు జాడలు,

సహోదరుడా, ఓడ బ్రద్దలయి మరియు నిరాధారమగుట వలన

జీవితము యొక్క గంభీరమైన దారిలో సాగుచూ

చూచుచు, మరల గుండె నిబ్బరం చేసుకొనెదము.

(ఖచ్చితముగా, మీ సాక్ష్యమును

ఒక జ్ఞాపకార్థముగా విడిచిపెట్టుటయైయున్నది.)

33

ఈ జీవితములో తన ఆఖరి ఘడియలలో ఒక వృద్ధుడు పడియుండుటను ఈ రాత్రి నేను ఎంతగానో ఆలోచించుచున్నాను. పాల్ రాడర్స్ ఆలయము నందు గడిచిన దినమున నన్ను పిలిచి, మరియు భూస్థాపనకై ప్రసంగించమని కోరియున్నారు. అతడు ఒక మంచి పరిశుద్దుడు తన సృష్టికర్తను కలుసుకొనుటకు వెళ్ళుచున్న, నా మంచి స్నేహితుడు ఎఫ్.ఎఫ్. బోస్వర్త్ అయియున్నాడు. మరియు అతడిట్లు చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, నా జీవితములో ఇదే సంతోషకరమైన సమయమై యున్నది.” నేను ఆయనని కలుసుకొనుటకు వెళ్ళుచున్నానని తెలుసుకొనుటను బట్టి నేను ఎంతగానో ఆనందించుచున్నాను. నేను రాత్రి చాలా కష్టంగా నిద్రపోయాను,“ అని అతను చెప్పెను.

నేను శ్రీమతి. ఐమీ మెక్ ఫెర్సన్ గూర్చి వినియున్నాను (ఆమె విషయమై ఎటువంటి అగౌరవము లేదు). ఒక అద్భుతమైన స్త్రీ, నేను ఇందులో మరియు అందులో లోపాలను చూశాను. నేను స్మిత వీగిల్స్ వర్త్ మరియు డాక్టర్ ప్రైస్ మరియు ఎందరో గొప్ప వ్యక్తులలో లోపాలను నేను చూశాను. కాని ఎఫ్.ఎఫ్. బోస్ వర్త్ విషయమై ఎవ్వరూ ఒక్క లోపాన్నెనననూ చెప్పుటకు నేను వినియుండలేదు. దేవా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపకు ఒక జ్ఞాపకార్థముగా, నా అంతము కూడా అట్లుండును గాక.

34

ఈ మధ్యనే నేను ఇ. హోవార్డ్ గూర్చి తలంచితిని. ఒక త్రాగుబోతు జాబితాలో నేలపై అతడు పరుండబెట్టియున్నప్పుడు, ఈగలు అతని నోటిపై వాలుచుండెను, మరియు అతని ప్రియమైన తల్లి ఆమె యొక్క తాగుబోతు బిడ్డకై ప్రార్థించి మరియు నమ్మకముతో దేవుని పై ఆనుకొనెను. అక్కడ, అతను లోకమును విడిచిపెట్టినప్పుడు, అతను ఒక సాక్ష్యమును మరియు సర్వశక్తుడైన దేవుని యొక్క కృప చాలును అనే జ్ఞాపకార్థమును విడిచిపెట్టెను. ప్రార్థనలో దేవుని వాక్యము అతనికి ఆనబెట్టినప్పుడు, దేవుడు దానికి జవాబును ఇవ్వవలసి యుండెను.

35

దేవుడు ఒక సంఘమును, ఒక జ్ఞాపకార్థముగా, తన త్యాగమునకు ఒక జ్ఞాపకార్థముగా కట్టుచున్నాడు. క్రీస్తు వ్యర్థముగా చనిపోవుటకు భూమిపైకి వచ్చియుండలేదు. ఆయన మరణము వృధా కానేరదు. “దేవుడు, ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లల్ని పుట్టించగలడు.” ప్రజలు దాని ప్రకారము జీవించని యెడల, వారు దానిని స్వీకరించని యెడల మరియు వారు విచారించి, దేవుడు ఎటువంటి ఒక గొప్ప కానుకను వారికి ఇచ్చియున్నాడని గ్రహించినయెడల, దేవుడు రాళ్ళ వలన అబ్రహామునకు సంతానమును ఇచ్చుటకు సమర్ధుడై యున్నాడు. నిజముగా ఆయన దానిని చేయును.

మరియు నేను దాని గూర్చి ఆలోచించినప్పుడు, మరియు ఆయన చెల్లించవలసిన గొప్ప వెలను గూర్చి నేను తలంచగా... ఇప్పుడు, ప్రతి యొక్కరు ప్రతి దానిని ఉచితముగా పొందగోరెదరు. ప్రతిదానిని... ఈ దినమున అమెరికా యొక్క జీవనశైలి అట్లేయున్నది. ఏమీ చెల్లించకుండానే ప్రతీది పొందగోరెదరు. సహోదరుడా, ఏదైనా విలువైన దానిని నీవు ఉచితముగా పొందలేవు. నీవు ఏమి పొందేదవో దానికి చెల్లించుదువు. అది నిజము నీవు దానికి చెల్లించవలెను మరియు అది నీకు ప్రియమగును. మరియు నీ రక్షణ దేవునికి ప్రియమగునది అయ్యెను. అది ప్రతీ మనుష్యునికి నిత్యజీవమునిచ్చి మరియు అతనిని ఆనందింపజేసి మరియు ఈ రాత్రి బ్రతుకడానికి అర్హత గల విషయముల కొరకు జీవింపచేయుటకు ఆయన తన ఆద్వితీయ కుమారుని చెల్లించవలసివచ్చెను. మన పిల్లలకి ఏదైనా ఇచ్చుటకు మన ప్రభువైన యేసు యొక్క రక్షణ కన్నా గొప్ప వారసత్వమేదియు లేదు. నిశ్చయంగా, అది కాదు.

36

ఇప్పుడు, గొప్ప వెల చెల్లించబడియున్నది. పరీక్షించు కాలము రావలసియుండెను. ఇది కాలము ద్వారా పరీక్షించబడి, నిలిచిన జ్ఞాపకార్థములు మరియు సరిగ్గా పరీక్షకు నిలిచిన ఒకే ఒక జ్ఞాపకార్థము దేవుని యొక్క వాక్యమైయున్నది. ఓ, అన్యజనులు దీనిని ఆర్పివేయుటకు ప్రయత్నించిరి. వారు చేయగలిగిన ప్రతీది చేసియున్నారు, కాని అది గతించిపోదు. అది ఎన్నడూ తప్పిపోనిదైయున్నది.

“అబ్రహామా, శారా వలన నీవు ఒక బిడ్డను పొందుకొనబోవుచున్నావు,” అని దేవుని యొద్ద నుండి ఆ జ్ఞాపకార్థమును అతను పొందుకున్నప్పుడు. పాతిక సంవత్సరములు దానిని అతను తన హృదయమంతటితో నమ్మెను, మరియు దానిని వ్యతిరేకమైన ప్రతిదానిని నిరాకరించెను, ఏలయనగా దేవుడు తన మాట నిలబెట్టుకొనునని అతడు ఎరిగియుండెను.

ఈనాడు, అన్యజనులు లేచి బైబిలను భంగపరచుటకు ప్రయత్నించుచున్నారు. మీరు బైబిల్ ని నిలిపివేయవలెననిన, దానికన్నా ముందు మీరు కాలమును నిలిపివేయవలెను. ప్రతి నాస్తిక ప్రపంచము నాస్తిక ప్రజలందరూ, కమ్యూనిస్టు ప్రజలందరూ, మరియు వారేమైయున్నప్పటికిని, ప్రతి బౌద్ధుడు, ప్రతి జైనుడు, ప్రతి మహామ్మదీయుడు, ప్రతి దినము యేసుక్రీస్తు యొక్క జన్మకు సాక్ష్యమివ్వవలసియున్నది. మీరు ఉత్తరముపై సంతకాలు పెట్టే ప్రతీసారి, (ఆమేన్), మీరు తేది (date) వ్రాయు ప్రతీసారీ 1957 సంవత్సరముల క్రితమే దేవుడు తన కుమారుని పంపెనని మీరు సాక్ష్యమిచ్చుచున్నారు. సహోదరుడా నీవట్లు చేయలేవు, అది జరగనేరదు. “ఆకాశమును భూమియు గతించును, కాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.”

37

కొంతకాలం క్రితం, నేను న్యూయార్క్ లో ఉన్నాను. చిన్న ద్వీపమునకు,

వెళ్ళియుంటిని. అనేక సంవత్సరముల క్రితం ఫ్రెంచీ ప్రభుత్వము చేత అమెరికా వారికి ఇవ్వబడియుండిన లిబర్టీ విగ్రహము యొద్దకు వెళ్ళియుంటిని. మరియు దాని చేతిలో ఒక టార్చిలైట్ ఉండెను. మేము ఆ చేతి దాక వెళ్ళియుంటిమి. అక్కడ ఒక కిటికీ ఉండెను, మరియు ఎక్కడైతే ఈ గొప్ప వెలుగు ప్రకాశించుచుండెనో, అక్కడ ఆ ప్రక్కకు పడియున్న చాలా పక్షులను నేను గమనించి యుంటిని. మరియు అవన్నియూ చనిపోయియున్నవి. మరియు నేను ఆ మార్గదర్శి (Guide) తో ఇట్లన్నాను, “ఆ పక్షుల విషయం ఏమిటి?” అవి విద్యుత్ షాకు వలన చనిపోయెనా?“

“లేదండీ, ఈ ఉదయము మేము వాటిని తొలగించనే లేదు” అని అతను చెప్పెను. “గత రాత్రి ఒక తుఫాను వచ్చెను. ఇక్కడున్న సముద్రము నుండి ఒక గొప్ప తుఫాను కలిగెను,” అని అతను చెప్పెను.

అవునండీ, ఆ సంగతి నాకు తెలియును,“ అని నేను అన్నాను.

“ఆ చిన్ని పక్షులు ఆ తుఫానులో పట్టబడియుండెను,” అని అనెను. మరియు, ఇట్లనెను, “అవి కాంతిలోకి ప్రవేశించినప్పుడు, అవి ఆ వెలుతురును దాటుకొని వెళ్ళుటకు ప్రయత్నము చేసినవి. చూశారా, అవి ఈ అద్దమునకు తగులుట వలన దెబ్బ తగిలి పడిపోయినవి.” మరియు, “వెలుతురును వాడుకొని, సురక్షితముగా వెళ్ళుటకు బదులు, అవి వెలుతురును కొట్టుటకు ప్రయత్నము చేసినవి,” అని అతను అన్నాడు.

38

అప్పుడు ప్రేరేపణ నన్ను తాకెను: అది నిజము; స్త్రీలు మరియు పురుషులు ఎవరైతే దేవుని యొక్క వెలుగును కొట్టుటకు ప్రయత్నించెదరో - వారు కేవలం వారి యొక్క బుర్రలు బద్దలు కొట్టుకొనుచున్నారు, మరియు వారు... సురక్షితమైన వైపునకు వెళ్ళుటకు ఆ వెలుగును ఉపయోగించుకొనరు? ఎందువలన దానిని తిరస్కరించుటకు ప్రయత్నము చేసి వారి యొక్క బుర్రలు బ్రద్దలు కొట్టుకొనుచున్నారు, మరియు “అద్భుతములు జరుగు కాలము గతించిపోయినది. దైవిక స్వస్థత అనునదియు, హృదయపూర్వకమైన రక్షణయనునదియు ఇటువంటి కార్యములేవియూ లేవని అందురు.” వారు కేవలం అసలైన దానికి విరుద్దముగా పోవుచున్నారు. వారు దానిని చేయునంత కాలము, దేవుని యొక్క గొప్ప సంఘము కదులుచూ మరియు ఎంత కష్టమైననూ అది ముందుకు పోవుచూనే యున్నది.

జనులు లేచి మేము ఇది అనియూ మరియు అది అనియూ, చెప్పుదురు. మరియు అటువంటిది చెప్పి విఫలమయ్యెదరు. అయినను దేవుని యొక్క సంఘము కొనసాగుతూనే యుండును. మరియు దేవుని యొక్క వాక్యము కొనసాగుచూనే ఉండును. ఆమె సరియైనటువంటి పదార్థము చేత నిర్మించబడినదై యున్నది.

39

ఇటీవల కాలమున, ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా వలే బ్రిటీష్ యొక్క అధికారము క్రిందనున్న గొప్ప ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాకు వెళ్ళు దారిలో. సిడ్నీ పట్టణము వద్ద, ఆ నది చుట్టి వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద పట్టణము కలదు. బహుశా నాకంటే ఎక్కువగా దాని గూర్చి సహోదరుడు బీలర్ కు తెలియును. వారు ఉత్తర సిడ్నీ నుండి దక్షిణము వరకు ఎలాగయినా ఒక వంతెనను నిర్మించగోరియున్నారు. ఈ వంతెనను నిర్మించువారు దేశమంతటా భవన నిర్మాణ వేత్తల కొరకై, వంతెన నిర్మాణకుల కొరకై పిలుపునిచ్చిరి. ఎవరును దానిని అంగీకరించలేకపోయిరి. దానిని అంగీకరించుటకు ఎవరు సాహసించలేకపోయిరి.

వారు అచ్చటికి వచ్చిన వెంటనే, ఆ నది అడుగున చంచలమైన ఇసుక ఉండుటను వారు కనుగొనిరి. అది జారుడు ఇసుకైయున్నది మరియు అచ్చట ఏదియును నిలబడదు. మరియు వారు దానిని పరీక్షించి మరియు పరిశోధించి వెళ్ళిపోయారు. “లేదు, మేము అటువంటి వంతెనను నిర్మించే బాధ్యతను చేపట్టుటకైనను ప్రయత్నము చేయము. అది కట్టబడదు,” అని వారు చెప్పిరి.

40

కొద్దిసేపటి తర్వాత ఇంగ్లాండు దేశము నుండి ఒక యవ్వన నిర్మాణవేత్త వచ్చెను. ప్రఖ్యాతి గాంచిన, గౌరవనీయమైన వ్యక్తియై ఒక మంచి కీర్తి కలిగియున్న వాడైయుండెను. ఓ, నేను దానిని ఇష్టపడుచున్నాను. అటువంటి ఒక కీర్తి కలిగిన వ్యక్తిని నేను ఇష్టపడుచున్నాను. ఓ, నీవు ఒక గొప్ప వ్యక్తివై యుండనవసరం లేదు, నీవు ఒక వీధిలో నివసించు దరిద్రుడవైయుండియు, ఒక అధికారి కంటే శ్రేష్టమైన గౌరవమును కలిగియుండవచ్చును. ఖచ్చితముగా. నీవు ధనవంతుడవై యుండనవసరంలేదు; నీవు కేవలం కీర్తిని కలిగియుండవచ్చును. నీ కీర్తియే నీవేమైయున్నావనియు మరియు నీవు ఏమిటని వెల్లడి చేయును. అది నీకు నీ యొక్క కీర్తిని గడింపచేయును. మరియు నీకున్న కీర్తిని బట్టియే నీవు గుర్తింపబడతావు.

41

ఈ వ్యక్తి అక్కడికి ఒక అద్భుతమైన కీర్తితో వెళ్ళియుండెను. అతను

అక్కడున్న పరిస్థితిని పరీక్షించెను. అతను ఆ ఒడ్డు వెంబడి కొద్ది దీనములు నడిచెను. అతడు దానిని అధ్యయనము చేసెను, అతను పరీక్షించెను, అతడు మంచి వివేకము గలవాడు, అతడు చుట్టూ పరీక్షించెను. కొద్దిసేపటి తర్వాత అతను మేయరు వద్దకు వెళ్ళి, “నేను ఈ పనిని చేయుదను,” అని చెప్పెను.

“ఎందువలన” అతడిట్లనెను, “అయ్యా, నీవేమి మాటలాడుచున్నావో నీకు తెలియునా?”

“నేను పూర్తిగా అర్ధం చేసుకున్నాను,” అని అతడు చెప్పెను.

అతను ఇట్లనెను, “మంచిది, ఈ గొప్ప నిర్మాణకుడు చెప్పుచున్నాడు. అమెరికా యొక్క నిర్మాణకులు మరియు ప్రపంచమంతటి నుండి వచ్చిన నిర్మాణకులు, వంతెన నిర్మాణకులు, ఇచ్చటికి వచ్చియున్నారు. మరియు వారందరూ ఈ పని విషయమై భయపడియున్నారు.”

“కాని, అయ్యా, నేను ఈ పని విషయమై భయపడుట లేదు. నేను దానిని తీసికొనుచున్నాను,” అని అతను చెప్పెను. “నాకు ప్రపంచ వ్యాప్తముగా ఒక వంతెన నిర్మాణకుడిగా కీర్తియున్నదని నేను గ్రహించితిని, కాని నేను నా కీర్తినంతటిని పణంగా పెట్టుదును, ఏలయనగా నేను దానిని నిర్మించగలను” అని చెప్పెను.

42

ఓ, అతను ఒక దర్శనమును కలిగియుండెను. ఒక వ్యక్తి కీర్తిని సంపాదించుటకు ముందు, అతను ఏమి చేయబోవుచున్నాడో, దాని గూర్చి అతను ఒక దర్శనము కలిగియుండవలసియున్నది. ఓ, ప్రభువు నామము ఆశీర్వదించబడును గాక. ఆ కారణము చేతనే వెళ్ళుటకు ఒక పరలోకము ఉన్నది. ఆ కారణము చేతనే ఒక క్రైస్తవునిగా మనకు గౌరవము ఉండియున్నది. ఈ నిర్మాణములో ఏమి పదార్ధము ఉన్నదో మనకు తెలియును. అది నిజము. ఈ కట్టడములో ఉన్నది యేసుక్రీస్తు యొక్క రక్తమైయున్నది; అది వాస్తవము. ఆయన యొక్క కారుచున్న రక్తము పాపములన్నింటిని కడిగివేసెను. ఆయన నన్ను నరకము యొక్క వీధులలో నుండి విడిపించి మరియు నిన్ను ఆయన యొక్క సేవకునిగా మార్చెను. పిదప, నేను ఆయన యందు నమ్మిక యుంచాను. కావున, నేను మరణము నుండి జీవమునకు దాటియున్నాను. ఈ గొప్ప శిల్పి మరియు ఈ గోప్ప నిర్మాణకుడిపై వారికి నమ్మకము మరియు వారికి ధైర్యము వచ్చెను గనుక ప్రతీ విశ్వాసి దానిని చేసియున్నారు.

43

ఇప్పుడు, ఆ వ్యక్తి దానిని చేసిన తర్వాత, అతను చేసిన మొదటి కార్యమేదనగా, అతను అక్కడికి వెళ్ళుట సరియేనని నిశ్చయత కలిగియుండుటయై యున్నది. మరియు, “ఇప్పుడు, ఈ వంతెనను మనము ఆరంభించుటకు ముందు, మనము స్థిరమైన పునాది వెయవలసియున్నది. మరియు మనము చేయవలసియున్నది,” అని అతను చెప్పెను. ఆ ఇసుక యొక్క అడుగు-భాగమున, భూగర్భమునందు గట్టి రాతినేల ఉండియున్నదని అతడు ఎరిగియుండెను. అతడు అతిపెద్ద గొట్టములను తెప్పించుట కన్నా మరి ఏమి చేయగలడు? మరియు అచ్చటికి చేరుకొని, ఆ పెద్ద గోట్టములను అమర్చెను, మరియు అతడు తరచి చూచి గట్టి రాతినేల తగులునంతవరకు ఈ గొట్టముల ద్వారా ఆ జారుడు ఇసుకను పంపులతో నెట్టివేసెను. రాతినేల అతనికి తగిలిన తర్వాత, ఈ అతి పెద్ద బోల్టులను అక్కడ అమర్చెను మరియు దానిని సిద్ధము చేసెను. మరియు అతడు ఒక్కొక్కదాని దగ్గర ఇసుకను నెట్టివేసెను.

44

మరియు పిమ్మట అతడు ఇంకనూ వెళ్ళి, ఉత్తమ నిర్మాణకులను, ఉత్తమ శాస్త్రవేత్తలను, ఉత్తమ పరికరములను కనుగొని, తన వద్దకు రప్పించెను. అతడు పంపించి మరియు తన వంతెన కొరకై స్టీలును తెప్పించుకొనెను. అతడు దానిని చేసిన తర్వాత, వాటికి ఏదైనా చొట్ట పడినదాయని చూచుటకు, కర్మాగారములో వారు దానిని మలిచి మరియు దానిని తయారు చేయునప్పుడు ఏమైనా చిన్న రంధ్రములు ఉండునేమోనని స్టీలును కొలిమి వేడితో అతికించెను. శాస్త్రీయముగా పరీక్షించకుండా అతడు ఒక్క స్టీలు ముక్కనైననూ, ఒక్క బోల్టునైననూ అమర్చలేదు. ఓ, ఒక వంతెన నిర్మాణకునిగా పేరుగాంచిన అతనికి అది ఎటువంటి ఒక జ్ఞాపకార్ధముగా ఉండియుండును.

45

ఆ వంతెన సురక్షితముగా ఉండుటకు అతను అంత శ్రమ పడినయెడల, ఈ సంఘము సురక్షితముగా ఉండుట కొరకు దేవుడు ఎంతటి శ్రమపడెనో మీరు ఆలోచించితిరా? అవునండీ, క్రీస్తు యొక్క మరణమునకు ఒక జ్ఞాపకార్ధము అక్కడైయున్నది. అది ఆయన యొక్క సంఘమైయున్నది. కొందరు దానిని జీవించదలచుగలేదు, మరికొందరు జీవించెదరు, అయితే అది ఒక పరీక్షకాలమైయున్నది. ఈనాడు దేవుడు తన జ్ఞాపకార్థముల కొరకు, ప్రజలను పరీక్షించుచున్నాడు.

చాలా సార్లు, ప్రజలు ఇట్లు చెప్పుదురు, “ఓ, నేను చాలా శోధించబడినాను.” శోధనల నిమిత్తము, ప్రభువు యొక్క నామము ఆశీర్వదించబడును గాక. “నేను ఎప్పుడు బలహీనుడనో, అప్పుడే నేను బలవంతుడను,” అని పౌలు చెప్పెను. “దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు, మొదట శోధింపబడి మరియు పరీక్షించబడవలసియున్నది.” మరియు ఈ పరీక్షలు మీకు సువర్ణము కంటేను మాధుర్యముగాను మరియు ప్రియముగాను ఉండును. ఇది ఒక పరీక్ష కాలమైయున్నది.

46

చాలా సంవత్సరముల క్రితం, ఖనిజాలను కరిగించే యంత్రాలు లేకమునుపు, వారు బంగారమును తీసికొనేవారు మరియు అది సరియైనదో కాదోయని వారు ఎట్లు తెలుసుకొనేదనరనగా - దానిలోకి చెత్తంతటిని బయటికి తీయుదురు. రాగినంతటిని (బంగారము వలె కన్పించు) బయటికి తీయుదురు. దానిలోకి పనికిరాని దానినంతటిని తీయుదురు. మరియు కొట్టువారు దానిని కొట్టుదురు. దానిని కొట్టుచు మరియు త్రిప్పుదురు, దానిని కొట్టుచూ మరియు దానిని తిప్పుదురు. తయారు చేయువాడు తన ప్రతిబింబము బంగారములో కనబడునంతవరకు దానిని కొట్టుచూ ఉండును.

దేవుడు తన సంఘమును ఆ విధముగానే చేయును. క్రీస్తు యొక్క జీవము మీ జీవితములో ప్రతిబింబించునంత వరకు, మీరు నెమ్మదస్తులుగా, స్థిరబుద్ది గలవారిగా, దీనులుగా, సహనముగలవారిగా, సిద్ధహస్తులుగా, లోబడువారిగా, ఇష్టులుగా, లోకపు కార్యాలలో నుండి మీ తలను త్రిప్పుకోనువారిగా, శోధించు పనిని చేయు వానివైపు అనగా కల్వరివైపు మీరు తిన్నగా చూచువారిగా మిమ్మును చేయునంతవరకు ఆయన శ్రమ వెంబడి శ్రమను, పరీక్ష వెంబడి పరీక్షను, శ్రమ వెంబడి శ్రమను, పరీక్ష వెంబడి పరీక్షను మీకు ఇచ్చును; తీవ్రమైన శ్రమలను బట్టి, వ్యాధిని బట్టి మరియు హింసను బట్టి చాలా సార్లు మీకు వింతగా అనిపించును. అది కేవలం మిమ్మును పరీక్షించుట కొరకే అలాగు జరుగును. మీలో నుండి మురికినంతటిని బయటకు తొలగించుటకు, మీలో అభ్యంతరకరమైన వాటిని బయటికి తొలగించుటకు, మీలోనున్న మాంద్యమును బయటికి తొలగించుటకు, మీరు ప్రతిబింబమును చూచుటకై మిమ్మును మేల్కొల్పుటకు, లేదా ఒక వ్యక్తి మీలో క్రీస్తు యొక్క ప్రతిబింబమును మీయందున్న మహిమ నిరీక్షణయై యున్న క్రీస్తును మీలో చూచుట కొరకు అట్లు జరుగును.

47

అతను ప్రతి భాగమును పరీక్షించెను. చివరిగా, అతను ఒక బోల్టునైనా పెట్టుటకు ముందు దానిని పరీక్షించేవాడు. అతను ప్రతీదానిని పరీక్షించెను. పిదప దానంతటిని అతడు ముగించిన తర్వాత, ఇప్పుడు ఎగతాళి చేయువారు ప్రక్కన నిలబడి, మరియు, “అది నిలబడదు. అది దానిని చేయలేకపోవును,” అనిరి.

ఈ దినమున కూడా వారు అదే చెప్పుచున్నారు. “నీవు మాటలాడుచున్న, ఇక్కడున్న ఈ పరిశుద్దాత్మ మతము ఎంతో కాలము నిలువదు, ఆ వృక్షము దహించబడును,” అని అనుచున్నారు, కాని అది దహించబడదు. ఓ, ఆ అగ్ని కేవలం దానికి ప్రాణం పోయును. అది మనకు నూతన నిరీక్షణను ఇచ్చును. అది కేవలం దానిని బలపరచును; ప్రతి శ్రమ, పరీక్ష, ప్రతీసారీ గాలి వీచి ఒక చెట్టును తాకినప్పుడు దానిని ముందుకు, వెనుకకు కుదుపివేయును మరలా ముందుకూ వెనుకకూ కుదుపును. అది కేవలం వేరును వదులుచేసి అది ఇంకనూ లోతునకు ప్రాకి గట్టిపడునట్లు చేయును. నీ గృహమును వ్యాధి తాకిన ప్రతీసారీ, నీ ఇంటిని వ్యాధి తాకిన ప్రతీసారీ, నీ పొరుగువాడు నీ గురించి చెడుగా మాటలాడిన ప్రతీసారీ, అది కేవలం మిమ్మును కుదుపును, మిమ్మల్ని వదులు చేసి మరియు దేవుని యొక్క కదల్చబడని వాక్యము యొక్క నిత్యమైన బండపై మీకు గట్టి పట్టు దొరకునట్లు చేయును. దేవుడు చేయు విధానము అదేయైయున్నది. మిమ్మును పరీక్షించి మరియు మిమ్మల్ని రుజువు చేయుటకు మిమ్మల్ని కుదిపి మరియు మీకు ఒక నూతన పట్టును ఇచ్చుటకు ఆయన ఆ శ్రమలను పంపించును.

48

పిమ్మట మనము కనుగొనెదము, అతడు దానంతటిని చేసినప్పుడును, విమర్శకులు ప్రక్కన నిలబడి మరియు, పేరుగాంచిన అతనికి అది ఎటువంటి ఒక జ్ఞాపకార్ధముగా ఉండియుండును. “అది పనిచేయదు,” అని అనిరి. అయితే తన వంతెన నిలబడునని ఆ నిర్మాణకునికి తెలియును. అది నిలబడునని అతనికి తెలియును, ఏలయనగా అది పరీక్షించబడియుండెను.

ఆ కారణము చేతనే దేవుడిట్లు చెప్పెను, “ఒక మచ్చ అయినను లేక ముడతయైననూ లేని సంఘమును నేను కలిగియుందును.” ఆమేన్. ఆమె పరీక్షగుండా వెళ్ళియున్నది. మరియు దేవుని యొద్దకు వచ్చు ప్రతి బిడ్డయు పరీక్షించబడవలసియుండెను.

49

ఆ గొప్ప జ్ఞాపకార్థ దినమున వారు వెళ్ళినప్పుడు రెండు వైపులా.. వారు ఇరుప్రక్కల నుండి బయలుదేరిరి. వారు సముద్ర తీరము మధ్యన కలిసినప్పుడు, దానిని నిర్మించిన ఆ వ్యక్తి, ఇట్లనెను, “నేను ఏ మనుష్యుని అడగను...” చుట్టూ నిలబడియున్న నిర్మాణకులు ఇట్లనిరి, “ఆ వంతెన ప్రకంపనలు తాకిన వెంటనే, అది నేరుగా క్రిందికి పడిపోవును. అది ఎంతో ప్రమాదకరము.” ఏ భీమా సంస్థ దానిపై అతనికి భీమాను ఇవ్వకుండును. అతనికి ఎటువంటి భీమాతో అవసరము లేకుండెను.“ అతను ఇట్లు అనెను, ”నా వంతెన నిలబడును.“ అతనికి నమ్మకము ఉండెను, ఇప్పుడు అతడు దానిని పరీక్షించవలెను, ఏలయనగా అతనికున్న గౌరవము పణంగా పెట్టెను. నిశ్చయంగా, అట్లున్నది. మరియు అది గనుక నిలబడినట్లైతే, అది ఒక జ్ఞాపకార్ధమగును.

ఆ కారణము చేతనే ఆ పూర్వకాలపు హృదయపూర్వక దేవుని యొక్క రక్షణ నిలబడును అని నేనెరుగుదును. దాని క్రీస్తు యొక్క కీర్తి ఉండియున్నది. ఆయన మనకు మానవ కల్పిత సిద్ధాంతము ద్వారా, ఏదో ఒక పాఠశాల అనుభవము ద్వారా లేదా, వారు కోరుకున్న వంటి ఏదో ఒక సదస్సు ద్వారా, బోధకులకు తర్ఫీదు ఇచ్చుటకై ఒక సంఘమును నిర్మించుటకు ఆయన మనకు దేనిని ఇచ్చియుండడు. నిజమైన బోధకులు దేవుని యొక్క కృప అనే సెమినరీ నుండి, దేవుని యొక్క పిలుపు నుండి వచ్చెదరు. మరియు వారు కాలము చేత పరీక్షించబడిన వారైయుందురు. అది నిజము. అది నిలుచును, దేవునికి మీ యందు నమ్మకము కలిగెను. మనకు ఆయన యందు నమ్మకము కలిగెను. వంతెన నిలుచును...

ప్రాచీన కవి ఇట్లు చెప్పెను, “తెర లోపల నా యొక్క లంగరు పట్టుకొనియున్నది. ప్రతి ఎత్తైన మరియు తుఫాను గాలికి నా యొక్క లంగరు తెర లోపల పటు కలిగియున్నది. ఏది పట్టుకొనియున్నదో మనకు తెలియదు, కాని ఏదో పట్టుకొనియున్నది. అది నిజము. ఆమె ఆవల సురక్షితమైన చోటున లంగరు వేయబడియున్నది. మరియు తిరిగి-జన్మించిన వ్యక్తి మరణమును దాటి, జీవములోనికి ప్రవేశించునట్లు మానవ హృదయమును పట్టుకొను ఒక రక్షణా పగ్గము అచ్చటనున్నది. పాతాళములోని దయ్యములన్నియూ, అతడు దానిని సందేహించునట్లు చేయలేవు. అక్కడ ఏదో పట్టుకొనియున్నది. ఆమెను ఊపినా సరే! ఆమెను కుదిపినా సరే! ఆమేన్. ఆమె ఎప్పుడూ కదల్చబడదు, ఎందుకనగా అది క్రీస్తు యేసులో ఉండియున్నది.

50

పిదప ఈ వ్యక్తి చెప్పెను, “ఎవరిని నేను అడగను.” అయితే “స్వయంగా, నేనే వెళ్ళుదును,” అనెను.

పట్టణము యొక్క మేయరు వచ్చి మరియు ఇట్లన్నాడు, “అయ్యా, నీ వంతెనపై నాకు నిశ్చయముగా నమ్మకము ఉన్నది.”

అతనన్నాడు, “నీకు నా వంతెనపై నమ్మకమున్నయెడల, నన్ను వెంబడించుము.” అది సరియే. దానిని పరీక్షించుడి.

మేయరు అన్నాడు, “ఫలాన ఉదయాన నా కారు అచ్చట నిలుపుదును; నేను నీతో పాటు వచ్చెదను.”

రైలు రోడ్డు సంస్థ వారు పిలుపు నిచ్చి మరియు ఇట్లనిరి, “అయ్యా, మాకు నీ వంతెనపై నమ్మకమున్నది; మేము....”

అతనన్నాడు, “మీకు నా వంతెనపై నమ్మకమున్నయెడల, నాలుగు పెద్ద ఇంజనులను తీసుకు రండి. వాటిని వంతెనపై నిలుపుడి. మీకు నా మీద నమ్మకమున్నయెడల నన్ను వెంబడించుడి, అది పరీక్షించబడి మరియు పరీక్షకు నిలచునని మీరు నమ్మినయెడల, మీరు దానిని నమ్మినయెడల, నాతో రండి.”

51

మరియు చాలామంది జనులు ఆయన యొక్క ధైర్యమును చూచుటకై ఆయనకు ఉత్తరములు వ్రాసియున్నారు. ఏదో పటుత్వము లేని వారి కొరకు కాదు కాని, ధైర్యం కలిగియున్న పురుషుల కొరకే మనుష్యులు ఎదురు చూచుచున్నారు. మీరు సంఘమునకు వెళ్ళుట ద్వారా, అప్పుడప్పుడు “ఆమేన్” అని చెప్పుచూ మరియు కొద్దిగా కేకలే వేయుచూ, సంఘ పుస్తకములో నీ పేరు నమోదు చేసికొని మరియు వెనకకు వెళ్ళి, దయ్యము వలె జీవించినయెడల, నీ స్వంత క్రియలే మీరు ఏమైయున్నారని రుజువు చేయును. మీ గుణలక్షణమే దానిని రుజువు చేయును. కాని ధైర్యము గలవారైయుండి, యేసుక్రీస్తు యొక్క రక్షణా కృపకు జ్ఞాపకార్థముగా నిలుచువారెవరా అని, అట్టి ధైర్యము కలిగియున్న వ్యక్తుల కోసం లోకము ఎదురు చూచుచున్నది. అది నిజము.

52

వంతెన ప్రారంభమైన దినమున, మిగతావారు వెనుకకు వచ్చి, పత్రికా వాళ్ళందరితో ఇట్లనిరి, “ఆ వంతెన పడిపోవును గనుక, సిద్దపడండీ, మీ కెమెరాలను, సిద్ధపరచుకొనుడి.”

ఆ యవ్వనస్తుడు ఆ వంతెనపై నడుచుకుంటూ వెళ్ళెను. అతని కారు ప్రక్కన పెట్టి వెనుకకు చూచెను. అక్కడ ఇంజనులన్నీ వరుసలో పెట్టియుండుటను చూచెను. అక్కడ మేయరు నిలుచుని తనకు చేయి ఊపుటను చూచెను. అక్కడ తనతో కాలినడకన నడుచుటకు పదివేలమంది అచ్చట నిలబడియున్నారు. వారు ఆయనతో నడుచుటకు సిద్ధముగా ఉన్నారు, “బ్యాండ్ ను వాయించండి,” అనెను. సహోదరుడా, బ్యాండ్ లు వాయించుచుండగా, ఈలలు మ్రోగుట మొదలయ్యెను, బూరలు మ్రోగసాగెను, నా భావము, అక్కడ భయంకరమైన ప్రకంపనలు మొదలయ్యెను, కాని అతడు నేరుగా వంతెన పైన నడుచుకుంటూ వెళ్ళెను మరియు అది స్థిరముగా నుండెను. ఎందువలన? అతను ముందడుగు వేసెను, ఎందుకనగా అది పడనైయున్నయెడల, దానితో పాటు తాను కూడా పడిపోవును.

53

మరియు యేసుక్రీస్తు పరలోకము నుండి మహిమ నుండి వచ్చెను, మహిమ నుండి ఇచ్చటకు ఒక సంఘమును కట్టుటకు వచ్చెను. మరియు దానికి ఆయన వాడే పదార్ధము ఏదనగా, కాలములో పరీక్షించబడిన పదార్ధమై యుండెను. నీవు వేదిక యొద్దకు వచ్చి మరియు ఒక ఒప్పుకోలు చేసికొనియుండవచ్చును, కాని ఆయన లోపములను మరియు అటువంటివి కనుగొనినయెడల, చూడండి, లోకము మీ లోపలికి పిచ్చి తలంపులను మరి అటువంటివి చొప్పించినయెడల, మీరు నిలబడలేరు; ఆయన మిమ్మును ఒక ప్రక్కకు విసిరివేయును. ఈ రోజు క్రైస్తవుడై యుండి రేపు పడిపోవువాడు, లోపలికి మరియు బయటికి, పైకి మరియు క్రిందికి అగునట్టి వారు కాదు గాని, దేవునికి కాలము చేత పరీక్షించబడి, నిలిచిన ఒక సంఘము కావలెయును.

అయితే శ్రమలగుండా, నష్టాల గుండా, వ్యాధి గుండా, దుఃఖము గుండా, మరణము గుండా వెళ్లియుండిననూ, అయిననూ ఒక సాక్ష్యముతో నిలబడియున్న, పరీక్షించబడియున్న ఒక సంఘమును ఆయన కలిగియున్నాడు. అటువంటి వ్యక్తి కొరకు, అవును, అటువుంటి వ్యక్తి కొరకే ఆయన ఎదురు చూచున్నాడు. నీవు దరిద్రుడవైయుండిననూ నేను లెక్క చేయను. నీవు భిక్షగాడివైనా నేను లెక్క చేయను. నీవు చింపిరి దుస్తులు ఏరుకోను వాడవైననూ నేను లెక్క చేయను. నీవు భిక్షగాడివైనా నేను లెక్క చేయను. నీవు చింపిరి దుస్తులు ఏరుకొనువాడవైననూ నేను లెక్క చేయను. నీవేమై యున్నప్పటికిని, దేవుడు నీకు పరీక్షను పెట్టును. ఆయన కాలము చేత పరీక్షించబడి, నిలిచిన పదార్థము కొరకు చూచుచుండెను.

54

నేను నమ్ముదును, ఒకానొక ఈ దినములలో ఆ గొప్ప సంఘము... “అది నిన్ను ఎట్లు విడచిపెట్టగలదు? భూమ్యాకర్షణ శక్తి నిన్ను పట్టియుంచును...” అని విజ్ఞాన శాస్త్రము చెప్పుచున్నది. ఇప్పుడు, నేను భక్తి పరవశము నొందుచున్నాను. నన్ను చెప్పనివ్వండి. ఏదో ఒక దినమున ఆ కాలములో పరీక్షించబడిన సంఘము ఉనికిలోనికి వచ్చును. బహుశా, అక్కడ సగము మంది భూమి యొక్క ధూళిలో నిద్రించుచుండవచ్చును. వారెచ్చట ఉన్నారో నాకు తెలియదు, కాని దేవుడు పూర్తిగా పరీక్షించబడిన తన పదార్దమును కలిగియుండెను. ఒక దినమున ఆయన ముందు వరుసలో వచ్చును. చివరిగా వాతావరణము గుండా మరియు వాతావరణములో రెండవ పొర గుండా మరియు పొరల గుండా, ఆయన కృపకు జ్ఞాపకార్థమైన కాలములో పరీక్షించబడిన సంఘముతో సర్వశక్తుడైన దేవుని సన్నిధికి ఆయన వెళ్ళును. దేవుడు ఆయనకు ఇచ్చు ఒక జ్ఞాపకార్థము అదేయైయున్నది.

55

“మొదట నా తండ్రి ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” మరియు క్రీస్తు యొద్దకు వచ్చు ప్రతీ వ్యక్తియూ, దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక ప్రేమ కానుక అయి యున్నాడు. మరియు క్రీస్తు అతనిని పరీక్షకు పెట్టును. మరియు అతను పరీక్షకు నిలిచియున్నయెడల, అతడు మార్గాంతము వరకు నిలిచి యుండునని ఎరిగియుండి, ఆయన అతనిని వంతెనపై నిలబెట్టును, అతనిని బిగించును, అతనికి ఒక స్థానమును ఇచ్చును, మరియు అతనిని అక్కడ అమర్చును. ఆమెన్. కాలము ద్వారా పరీక్షించబడి, నిలిచిన పదార్ధము! “ఈ బండ పైన” — ఏదో ఒక మూఢభక్తి పైన కాదు, ఏదో ఒక ఉద్రేకపు గుంపు పైన కాదు, ఏదో ఒక సంఘ వేదాంతము పైన కాదు, ఏదో ఒక సంఘ శాఖ పైన కాదు, అయితే — “ఈ స్థిరమైన బండ మీద,” క్రీస్తు యొక్క వాక్యము మీద, “నేను నా సంఘమును కట్టుదును; మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు.” అదే స్థిరముగా నుండును, అది దూతల యొక్క సమక్షములో ఆయన కృపకు ఒక జ్ఞాపకార్ధముగా ఉండును.

56

“నీవెందుకు భూమిపైకి వెళ్ళుచున్నావు” అని ఒక దినమున దూతలు ఆయనను ప్రశ్నించినప్పుడు, ఆయన తిరిగి వచ్చి లోపము లేనట్టిదియు మచ్చయైననూ, ముడతయైననూ లేనటువంటి ఆ సంఘమును బహుకరించును. అదే ఆ పదార్ధమైయున్నది. అదే అసలు విషయమైయున్నది: ఆయన యొక్క కీర్తియైయున్నది. ఆయన దానిని చేయవలసియున్నది. ఆ వంతెన నిర్మాణకుడు వంతెనను నిర్మించ వలసియున్నది. ఆయన దానిని తప్పక చేయవలసియుండెను లేదా తన కీర్తిని పోగొట్టుకొనును.

క్రీస్తు ఒక సంఘమును పొందుకొనును, మరియు ఆయన దానిని చేయవలసియుండెను. అందుకొరకే ఆయన భూమి మీదకు వచ్చి మరియు శరీరధారియై, మన మధ్య నివసించెను; మరియు మనము నీతిమంతులమగునట్లు ఆయన పాపముగా మారెను. ఆయన కృపచేత మనము ఆయన వలే అగుటకు, ఆయన మనవలె అయ్యెను. ఆయన సన్నిధి యొక్క మహాత్యములో, దేవుని యొక్క కుమారులుగా మరియు కుమార్తెలుగా, మనము తన స్థానమును పొందునట్లు ఆయన మన స్థానమును తీసికొనుటకు ఒక పాపిగా వచ్చెను. ఎటువంటి దైవ కృప. ఆ మాటలు నిజము కాదని మనమెట్లు చెప్పగలము. “ఆకాశమును భూమియు గతించును, కాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.”

మూడు, నాలుగు వారముల రోజులంత వయస్సు నుండి అంధుడిగానున్న ఒక చిన్న ఇండియన్ బాలుడు, కొన్ని రాత్రులు క్రితం, తన చూపు పొందుకొని మరియు సాధారణంగానే, వేదిక పైనుండి నడుచుకుంటూ వెళ్ళిపోయెను. అది ఏమైయున్నది? అది యేసుక్రీస్తు యొక్క శక్తికి మరియు కృపకి కాలము ద్వారా పరీక్షించబడిన ఒక జ్ఞాపకార్ధమైయున్నది. ఆయన యొక్క పరిశుద్ధ నామము ఆశీర్వదించబడును గాక! కాలము చేత పరీక్షించబడుట! శోధనలు, శ్రమలు, కుదుపులు, మరియు ఈడ్పు ఇవన్నియూ మీలో ఏమైనా లోపములు కలవేమోయని కనుగొనుటకైయున్నది. మిమ్మును కుదిపివేయుచూ మరియు పరీక్షించునది దేవుడై యున్నాడు.

57

కొద్ది కాలము క్రితం గొప్పవాడైన సీజర్ అగష్ణా ఒక భీకరమైన పోరాటము తర్వాత ఒక గొప్ప విజయమును పొందెను. రోమ్ లో వారు అతనికి గొప్ప ఉత్సవమును జరపనైయున్నారు, మరియు ఆయన వారితో ఇట్లనెను, “ఎవరైనా అర్హుడైనవాడు నాతో పాటు ఊరేగింపులో పాల్గొనవలసిందిగా నేను కోరుచున్నాను.” ఇంకా ఇట్లన్నాడు, “అర్హుడైన వాడు, నాతో పాటు ఈ దీవెనలను పంచుకోవలసిందిగా నేను కోరుచున్నాను.”

మరియు అంతట... ఈ వార్త శిబిరములన్నింటికి వ్యాపించెను. అధికారులందరూ వారియొక్క శిరస్త్రాణములను సవరించుకొని, ఖడ్గములను మొరుగుపెట్టుకొని మరియు ఆయుధములన్నింటిని ఎంతో కాంతివంతముగా చేసుకొని, మరియు ప్రతీది చేసిరి, మరియు తిన్నగా నిలబడుటను మరియు ఫలాన విధముగా రాజుకు వందనము చేయుటను మరియు అటువంటివి సాధన చేసుకొనిరి.

మరియు ఆయన తన సింహాసనముపై కూర్చుండి, గమనించుచుండగా, ప్రతీ ఒక్కరు వారియొక్క పెద్ద ఆయుధమును తీసుకొని ఆయన ఎదుట నడుచుకొని వచ్చిరి. మరియు అక్కడికి అధికారులు వారి శిరస్త్రాణముతో, ఆయుధముతో నిలబడి ఆయనకు వందనము చేసిరి. సీజర్ తన తలను ఊపెడివాడు, అతను నడుచుకుంటూ వెళ్ళేవాడు. మరియొకడు వచ్చి తన వందనమును చేసేవాడు. సీజర్ తన తలను ఉపి మరియు నడుచుకుంటూ వెళ్ళేవాడు. సమయం వెంబడి సమయము, సైనికుని వెండి సైనికుడు.

58

చివరగా ఆ దారి గుండా ఒక చిన్న సిపాయి వచ్చెను. మొరుగుచేసుకొనుటకు అతనికి ఏ డాలు లేకుండెను, శుభ్రపచుచుటకు ఎటువంటి శిరస్త్రాణము లేకుండెను. అయితే అతడు సీజర్ ఎదుటకి సడుచుకుంటూ వచ్చెను. అతనికి కనీసం సరియైన వందనము చేయుట కూడ తెలియకుండెను, కాని అతడు తన తలను వంచి మరియు నడుచుకుంటూ వెళ్ళిపోయెను. సీజర్ ఇట్లన్నాడు, “ఒక నిముషం ఆగుము. నీవెవరవు? తిరిగి ఇచ్చటికి రమ్ము.” అతను అచ్చటికి నడుచుకొని వచ్చెను. ఆయన అతని వైపు చూచెను, అతని ముఖముపై మచ్చులుండెను మరియు కోయబడి అంద వికారముగా మరియు కుంటుచూ ఉండెను. “ఈ మచ్చలు నీకు ఎక్కడ కలిగెను?” అని ఆయన అడిగెను.

అతను చెప్పెను, “అయ్యా, నా సీజర్ ప్రభువు కొరకు నేను యుద్ధము చేయుచుండగా కలిగెను.”

ఆయన అన్నాడు, “రధము ఎక్కి మరియు నా ప్రక్కన కూర్చొనుము. నీవు పరీక్షించబడి మరియు రుజువు చేయబడిన వాడవైయున్నావు.”

59

సహోదరుడా, ఇది శిరస్త్రాణము శుభ్రం చేసుకొనే సమయం కాదు, ఇవి విద్యాసంబంధమైన దినములు కావు. ఇది కాలము ద్వారా పరీక్షించబడు సమయమైయున్నది. ఇది, ఆ యుద్ధపు మరకలను మరియు కఠిన శ్రమలను మరియు పోరాటములను మరియు యుద్దములను కనుగొనుటకు దేవుడు తన సంఘమును పరీక్షించు సమయమైయున్నది. వారే ఆయన ప్రక్కన స్వారీ చేయుదురు.

తాను ప్రవక్త యొక్క వస్త్రమును ధరించుటకు ముందు ఎలీషా ఏ విధముగా పరీక్షించబడి మరియు రూజువు చేయబడెను కదా! ఎలీషా ఆ వస్త్రమును తన భుజముపై వేసుకొనెను, అతను ఎంతగా ఒక సరియైన వ్యక్తియై యుండెను! ఎలీషా పొలములో ఉండి దున్నుచున్నప్పుడు ఆయనను గమనించెను. దేవుడు చెప్పెను, “ఆ వ్యక్తియే ఆ వస్త్రములను ధరించుకొనుటకు ఈ వ్యక్తియే సరియైనవాడు. ఆ వస్త్రమును ధరించుకొను వ్యక్తి అతడే. ఆయన నీ స్థానమును తీసుకొనగలడు.” ప్రభువు నామము ఆశీర్వదించబడును గాక.

60

సమస్తమును చూడగల ఆయన కన్ను భూమియంతట తిరుగుచూ ఆయన మాటలాడుచున్న ఆ వస్త్రమును ధరించుకొను వ్యక్తి ఎవరని కనుగొనుటకు ఎంతగానో ప్రయత్నించుచెండెను. “నేను త్రాగుచున్న గిన్నలోనిది మీరు త్రాగెదరా? నేను పొందియున్న బాప్తిస్మమును మీరు పొందగలరా? మీరు చేయగలరా,” అని చెప్పెను. కావున, మనము ఈ దినమున సంఘముగా యేసుక్రీస్తు యొక్క వస్త్రమును మీరు ధరించవలసియున్నది. ఆ దినమున మనము నిందారహితులుగా నిలబడునట్లు, క్రీస్తు యొక్క కవచమునంతటిని, డాలు మరియు కేడెము మరియు ఆయుధమును మనము ధరించవలసియున్నది. “ఇదిగో నా సేవకుడు. నేను అతనిని పరీక్షించాను నేను అతనిని పరిశోధించాను. నేను అతనిని యోబు వలె నడిపించాను. అయిననూ అతను నూటికి నూరు శాతముగా - రుజువు చేసుకొనెను,” అని ఆయన చెప్పగలిగినట్లు కాలము ద్వారా పరీక్షించబడ్డ జ్ఞాపకార్ధముల కొరకు ఆయన ఎదురుచూచుచున్నాడు. దేవుడిని ఆయన వాక్యము యొద్దనే తీసుకొని మరియు కాలము ద్వారా పరీక్షించబడి, నిలిచిన జ్ఞాపకార్ధములుగా మేము ఉండునట్లు, దేవా, మా యెడల దయ చూపుము. మనము ప్రార్ధించెదము.

61

ఆశీర్వాదకరమైన తండ్రి, అతి పరిశుద్ధమైన దేవా, మేము మా హృదయపులోతుల నుండి, కాలము చేత పరీక్షించబడిన ప్రతీ పరీక్ష కొరకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, వాటి విషయమై మేము బాధపడుటలేదు కాని, ఈ గొప్ప పరీక్షా సమయములలో మాకు సహాయము చేయుటకై నీ కృప మాకు చాలునని మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆ వ్యక్తి, ఈ రాత్రి “అద్భుతమైన కృప” అను దానిని ప్రస్తావించినప్పుడు.

మరియు ఫలానా వచనము వద్దకు వచ్చినప్పుడు, అది జనులను ఎంతగా పులకరింపచేసెనో, గదా. ప్రమాద, శ్రమలు, మరియు ఉచ్చుల ద్వారా నేను ఇదివరకే వచ్చియున్నాను. ఇంతవరకు నన్ను సురక్షితముగా తీసుకొని వచ్చినది కృపయే, అదియే కృప నన్ను ముందుకు తీసుకొని వెళ్ళును. ఓ, అది ప్రజల యొక్క హృదయమును పులకరింపజేసెను! అది ఈ రాత్రి మన వర్తమానముతో సరిపోయినదని నేను నమ్ముచున్నాను, ఎట్లనగా అది ప్రమాద శ్రమల ద్వారా కాలముచేత పరీక్షించబడుటయైయున్నది. ఇప్పుడు తనను తాను పరీక్షించుకొని, తాను దేవుని కృప వలన విశ్వసనీయముగా నిలబడియున్నానని తెలుసుకోను ఒక క్రైస్తవునికి అది సహాయము చేయును. అది పడిపోవుచూ, హెచ్చు తగ్గులతో నిర్లక్ష్యముగా జీవించువారికి అవమానమును తీసుకొనివచ్చును. ఓ దేవా, యుద్ధము గురించి చూపించుటకు కనీసం ఒక యుద్ధపు గురుతైననూ లేదు.

ప్రభువా, ఈ రాత్రి నీవు లోపములను మరియు మచ్చలను, తప్పిదములను సవరించి, నీ గొప్ప పవిత్రమైన రక్తము చేత సంఘమును పవిత్రపరిచెదవని మేము ప్రార్ధించుచున్నాము. దేవా, మరలా వాటిని యంత్రం గుండా పంపించి, మరియు వాటిని సరిచేసి మరియు వాటిని పదార్ధముగా చేయుము. ఓ నిత్యుడవైన మరియు ఆశీర్వాదకరమైన తండ్రీ, నీ సేవకుని యొక్క ప్రార్ధనను వినుము.

62

ఈ రాత్రి మీ యొక్క పరీక్ష కాలములో మీరు దేవునికి విశ్వసనీయముగా లేరని కనుగొనిన వ్యక్తి ఇక్కడ ఉండినయెడల వివాదములు వచ్చినప్పుడు నువ్వు యెగిరి దుమికి అందులో పాలిభాగస్తుడవు అగుచున్నావా? తగాదాలు వచ్చినప్పుడు, భేదాభిప్రాయములు సంఘములోనికి వచ్చినప్పుడు, మీరు సిద్ధాంతము మరియు ఆచారములు మరియు అటువంటి వాటి వైపు మీరు మొగ్గుచున్నారా? మీరు వీధిలలోని మరియు ఆయా స్థలముల గూర్చి ముచ్చట్లు వినుచున్నారా? మీరు వాటి విషయమై దోషియైన యెడల దయ్యము యొక్క పిడిగుద్దులతో మీరు కొట్టబడినట్లే. ఈ రాత్రి మనం కొలిమి యొద్దకు వెళ్ళి మరలా కరిగించబడి మరియు మనలో అటువంటివి లేకుండా బయటికి వచ్చెదము. ఈ గొప్ప వంతెన ఎత్తబడుటకై మనలను దేవుడే క్రమపరిచి మరియు మనలను సిద్దపరుచును గాక. అటువంటి వ్యక్తి ఇచ్చట యుండి మరియు గుర్తించుకొనమని కోరిన యెడల....

63

“సహోదరుడా బ్రెన్హాం, ఈ అమర్త్యపు, నిత్యమైన జ్ఞాపకార్ధము నిలుచునని నేనెట్లు తెలుసుకొనగలను?” అని మీరు చెప్పుదురు. యోహాను సువార్త 5:24 ప్రకారము నేను ఈ వాక్యమును నీతో చెప్పుదను. “నా మాట వినువాడు,” (“నా పాఠశాలకు వెళ్ళువాడు,” కాదు.) నా మాటలు విని మరియు నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక; మరణమును దాటి జీవము లోనికి ప్రవేశించియున్నాడు.“

ఈ రాత్రి ఆయన వాక్యము మిమ్మును పిలుచుటను మీరు వినుచున్నారా? మీరు వినగలిగినయెడల మరియు ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకొనమని కోరినయెడల మీ చేయి పైకెత్తుడి, ఇట్లు చెప్పు, “సహోదరుడా బ్రెన్హాం నా కొరకు ప్రార్ధించుము. క్రీస్తు తన సంఘమును బయటకు తీసుకువచ్చినప్పుడు, నేను సరియైన పదార్ధముగా ఉండగోరుచున్నాను, నేను...” అయ్యా, ప్రభువు మిమ్మును ఆశీర్వదించును. “నేను దాని విషయమై చెంచల మనస్కుడను కాను, ఆయన నన్ను నేరుగా సంఘములో పెట్టును.” ఆ వెనుకనున్న చిన్న వారిని ప్రభువు ఆశీర్వదించును గాక. ఇక్కడున్న నా ప్రియ సహోదరుడా, ప్రభువు నిన్ను దీవించును. “నేను ఒక నిజమగు పదార్దముగా ఉండగోరుచున్నాను. నేను నాయందు ఎట్టి నిరీక్షణను కలిగియున్నానను సాక్ష్యమును ఇవ్వగోరుచున్నాను, నిరీక్షణ.” సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును, అది మంచిది, అది సరియే.

64

“సహోదరుడా బ్రెన్హాం, చేతులు పైకెత్తుట వలన ఏమి జరుగును? నీవు మరణములో నుండి జీవములోనికి దాటేదవు. నీవు చేయునది అదేమైయున్నది. సరిగ్గా ఇక్కడే నీవు భూమ్యాకర్షణ శక్తిని బ్రద్ధలు కొట్టెదవు. నీవు ఒక మైనం బొమ్మ వలె ఇచ్చట కూర్చుండినయెడల నీవు ఎన్నడూ నీ చేయి పైకెత్తలేవు. నీవు అట్లు చేయలేవు. అయితే నీ లోపల ఒక ఆత్మయున్నదనియూ మరియు ఆ ఆత్మ దేవుని యొక్క ఆత్మ నీతో మాటలాడుటను వినియున్నదనియూ అది చూపించుచున్నది, మరియు నీలో ఉన్న ఆత్మ ఒక నిర్ణయమును తీసుకొనును. కావున అది విజ్ఞాన శాస్త్రమును వ్యతిరేకించును, అది భూమ్యాకర్షణ శక్తిని ధిక్కరించును. నీలో ఒక ఆత్మ ఉండి, నీ చేయి పైకెత్తునట్లు చేసినదని అది చూపించుచున్నది. నీవు మృతుడవైనయెడల నీవు అట్లు చేయలేవు.

కాని నీవు జీవమును పొందియున్నావు. ఏదో జరిగెను. నీవు పాపములో మరియు అతిక్రమములో మరణించినయెడల, దేవుడు ఎంతమాత్రము నీతో మాటలాడడు, నీ చేయి క్రిందికే వ్రేలాడును. మీరు పాపములో మరియు అతిక్రమములో మరణించనియెడల దేవుడు మీతో మాట్లాడును మరియు మీరు జీవమును పొందెదరు, చేయి పైకెత్తుదురు. చూడండీ, జీవము ఒక నిర్ణయమును తీసుకొనెననియు, మీరు క్రీస్తును అంగీకరించియున్నరనియూ అది చూపించుచున్నది. మీరు దానిని చెప్పదలచినయెడల, మీరు మరణమును దాటి జీవములోనికి ప్రవేశించియున్నారు.

65

ఇప్పుడు మీ చేయి పైకెత్తగా ఆ భావమునే కలియుండుడి, “దేవా, నా పట్ల దయగలిగియుండుము, నేను ఏమైయుండవలెనో అట్లు చేయుము మరియు నా జీవితకాలమంతయూ నిన్ను నేను సేవించెదను. ఆ దినమున నేను సిద్దముగా ఉండుటను కోరుచున్నాను.” అక్కడ ఆ వెనుకనున్న సహోదరుడా, నీపై ఆశీర్వాదము వచ్చును గాక, యవ్వనస్తుడా ప్రభువు నిన్ను దీవించును సహోదరుడా... ప్రభువు నిన్ను దీవించును. దేవుడు నీకు తోడైయుండును గాక. ప్రియా, ప్రభువు నిన్ను దీవించును గాక. అది సరియే. సహోదరుడా రాయ్, ప్రభువు నిన్ను దీవించును గాక, మరియు ప్రభువు నీకు తోడైయుండును గాక. అవును “ప్రభువా, నన్ను అర్హునిగా చేయుము. నన్ను అర్హునిగా కనుగొనుము.” ఆ వెనుకనున్న సహోదరుడా, ప్రభువు నిన్ను దీవించును. నిశ్చయముగా, ప్రభువు నిన్ను చూచుచున్నాడు. ఆనందించుడి. ఎవరో ఇప్పుడే ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకొనమని కోరిరి? .....నన్ను చేయుము. అది సరియే. మనము...

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...