హెబ్రీలకు మొదటి అధ్యాయము
1మరియు ఇవ్వడానికి ఒక—ఒక చిన్న…నాకైతే, కేవలం వాక్యము కన్నా, మిన్నయైనది మరేదీ లేదని నేను భావిస్తున్నాను. “వినుట వలన విశ్వాసము కలుగును, మరియు అది దేవునియొక్క వాక్యము వినుటవలనైయున్నది.”
2 బుధవారాల్లో, మరియు బహుశా ఆదివారాల్లో, ఆదివారపు ఆరాధనలలో ఏదో ఒక దానిలో, కాపరికి కొంచెం విశ్రాంతి ఇచ్చెదము, దానికి అతడు చాలా అర్హుడైయున్నాడు, మరియు మనం పరిశుద్ధ గ్రంథములోని ఒక పుస్తకాన్ని తీసుకుందామని అనుకున్నాను. మనం అలా చేసేవాళ్ళం, మరియు కొన్నిసార్లు దాని మీద ఒక సంవత్సరం వరకు ఉండేవాళ్ళము.
3 మనం ప్రకటన గ్రంథం మీద స్థిరంగా ఒక సంవత్సరంపాటు గడిపిన ఒక సమయము నాకు జ్ఞాపకమున్నది. అయితే, ఓ, మై, మనము నేర్చుకున్న ఆ విషయాలు, మరియు అది ఎంత అద్భుతంగా ఉన్నదో! అటు పిమ్మట మనము వెనుకకు వెళ్ళి మరియు దానియేలు గ్రంథాన్ని, లేదా ఆదికాండమును, లేదా నిర్గమకాండమును తీసుకున్నాము, మరియు కేవలం వాటిని, అధ్యాయాలవారీగా తీసుకున్నాము, మరియు అది సరిగ్గా బైబిలంతటిని కలిపి ముడివేస్తుంది. ఓ, నేను దానిని ప్రేమిస్తున్నాను!
4 కాసేపైన తరువాత, మనము పొందుకోవలసియున్నది…ప్రభువు మనల్ని ఆశీర్వదించుటను కొనసాగించి మరియు మనము ముందుకు వెళ్ళిన యెడల, మనం ఇక్కడ కొన్ని నిజమైన లోతైన విషయాలలోనికి ప్రవేశిస్తాము, నిజంగా లోతైన కార్యములు. మరియు మనం దానితో పాటు, లేఖనము గుండా ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్తాము.
5 మరియు నేను లేఖనాన్ని లేఖనముతో పోల్చుటకు ఇష్టపడతాను. అది ఆ విధంగా ఉండవలసియున్నది. అది కేవలం అందమైన ఒక్క గొప్ప చిత్రమైయున్నది. మరియు మనం అధ్యయనం చేయుచున్న ఈ పుస్తకంలో, మనం దానిలోనికి ప్రవేశించబోవుచున్నాము, ఓ, రక్షణ, మరియు దైవిక స్వస్థత, మరియు అద్భుతములు, మరియు కనికరములు. మరియు, ఓ, అన్నీ ఇందులో వస్తాయి.
6 మరియు బహుశా నేను కూటములకు వెళ్ళవలసిన పరిస్థితికి నేను వచ్చినప్పుడు…నేను ఎప్పుడు ఒక కూటమునకు వెళ్తానో, ఎప్పుడు ఒక కూటమునకు పిలవబడతానో నాకు అస్సలు తెలియదు, ఎందుకంటే ఒక నిర్దిష్ట పనిని చేయడానికి నేను నడిపించబడినట్లు అనిపించనంతవరకు నేను ముందుగా ఏదీ ఏర్పాటు చేసుకోను. మరియు బహుశా అది ఉదయానికి ముందే కావచ్చు, నేను కాలిఫోర్నియాకు వెళ్ళవచ్చును, మేయిన్ వరకు లేదా కేవలం ఆయన నన్ను ఎక్కడికి పిలుస్తాడో, అక్కడికి వెళ్ళవచ్చును. ఆ కారణము చేతనే నేను గొప్పగా, సుదీర్ఘ ప్రయాణ ప్రణాళికలను ఏర్పాటు చేసుకోను, ఎందుకనగా నేను దానిని చెయ్యలేను. నా పరిచర్య ఆ విధంగా రూపించబడలేదు, మరియు అది కేవలం భిన్నమైనది.
7 మరియు ఇప్పుడు నేను కొద్దిగా విశ్రాంతి కోసం ఇంటికి వచ్చాను. ఈ చివరి కూటములో, నేను ఇరవై పౌండ్లు తగ్గాను. సహోదరుడు మెర్సియర్ మరియు సహోదరుడు గోడ్, కొద్దిసేపటి క్రితం ఉన్నారు, మరియు ఇట్లన్నారు, “సహోదరుడా బ్రెన్‌హామ్, నీవు చేసేది నేను గమనించాను. నీవు నీ హృదయమంతటినీ దానిలో పెడతావు.”
8 నేను ఇట్లన్నాను, “ప్రభువు కొరకు మీరు ఒక సరైన పనిని చేయగల ఏకైక మార్గం అదేయైయున్నది, అదేదనగా మీకున్న ప్రతిదానిని మీ శక్తి అంతటిని మీ ప్రాణమంతటిని; మీ హృదయమంతటిని, మీ మనస్సంతటిని, మీకున్న ప్రతిదానిని, క్రీస్తు కొరకు ముందంజలో ఉంచుటయై యున్నది.” మీరు ఏదైనా చేస్తున్నప్పుడు, దానిని సరిగ్గా చేయండి లేదా దానిని అసలు చేయకండి, చూడండి, కేవలం దానిని వదిలేయండి. మీరు ఒక క్రైస్తవునిగా ఉండబోవుచున్నయెడల, మీరు కలిగియున్న ప్రతిదానిని క్రీస్తుకొరకు వెచ్చించండి, అనగా, మీ సమయం, మీ ప్రతిభ, మీకున్న ప్రతీది.
9 నేను ఈ యువకుడిని ఇప్పుడే గమనిస్తున్నాను. అక్కడ పాట పాడుతూ, వాయిద్యాన్ని వాయిస్తున్న, ఆమె నీ భార్య, కదా, సహోదరుడా బర్న్స్, ఆ యువ జంట. మరియు—మరియు అది ఒక పియానో కాదు, అది ఒక ఆర్గాన్ కూడా కాదు, కానీ అది ఏదో ఒక రకమైన వాయిద్యమైయున్నది, వారు దానిని పట్టుకుని వాయిస్తూ, మరియు ప్రభువు కొరకు ఏదో ఒకటి చేస్తుంటారు. బహుశా మీరు అలా చేస్తూ, మరియు పాడుచూ, అట్లు, ఆత్మలను గెలుచుదురు. అదేమైనాగానీ, ఏదో ఒకటి చేయండి. ఒకవేళ మీరు—మీరు ఈల వేయగలిగితే, సరి, ఈల వేయండి. ఏదో ఒకటి చేయండి. కేవలం సాక్ష్యమివ్వండి లేదా దేవుని రాజ్యము కొరకు ఏదైనా చెయ్యండి. మీరు ఏది కలిగియున్నా, దానిని దేవుని సేవలో ఉపయోగించండి.
10 ఇప్పుడు, మేము ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించడం లేదు, ఎందుకనగా మీరు పని చేస్తారని నాకు తెలుసు. మీరు పొద్దున్నే లేవవలసియున్నది. మరియు నేను ప్రతి ఉదయం ఉడుతల వేటకు వెళ్ళుచున్నాను. నేను మీకు నిజం మాత్రమే చెబుతాను. నేను చేస్తున్నది అదేయైయున్నది. అందు నిమిత్తమే నేను ఇంటికి వస్తాను, కొంచెం విశ్రాంతి తీసుకోవడం కోసమే. మరియు కావున, నేను దాదాపు నాలుగు గంటలకు లేచి, అడవికి వెళ్ళి, మరియు, సరి, కొద్దిగా వేటాడి మరియు పిమ్మట నిద్రపోవుచున్నాను. మరియు నేను ఆ బరువులో కొంత భాగాన్ని తిరిగి పొందుచున్నాను, తద్వారా నేను కొంత సమయం తర్వాత, విశ్రాంతి తీసుకుంటాను, మీరు గనుక…ప్రభువు చిత్తమైతే. మరియు ప్రతిదీ బాగానే ఉంది.
11 సరే, ఇప్పుడు, మేము, మీ పరిశుద్ధ గ్రంథములను ఇవ్వబోవుచున్నాము. మీరు ప్రతీ రాత్రి మీ బైబిలు గ్రంథములను తెచ్చుకోవాలని నేను కోరుచున్నాను, మీరు…మీరు అలా చేయగలరు. ఎవరికైనా కొన్ని లేనియెడల, చదువుచున్నప్పుడు ఎవరైనా అనుసరించాలనుకున్నయెడల, మేము ఇక్కడ కొన్నిటిని కలిగియున్నాము. మేము…ఆ ద్వారపాలకులలో కొందరు వాటిని అందజేస్తారు. ఎవరికైనా ఒకటి కావాలా? సరే, కేవలం మీ చేయి పైకెత్తండి.
12 సహోదరుడు…డాక్, ఇక్కడికి వచ్చి మరియు ఈ బైబిళ్ళను తీసుకుంటాడేమోనని ఆశ్చర్యపోవుచున్నాను. మీరు మరియు సహోదరుడు బర్న్స్, అక్కడ దగ్గరగా నిలబడియున్నారు. అది నిజమేనా, బర్న్స్? అతడు ఇట్లు చెప్పడం విన్నాను…[ఆ సహోదరుడు “కాన్రాడ్,” అని చెప్పుచున్నాడు.—సంపా.] ఏమిటి? [“కాన్రాడ్.”] కాన్రాడ్. నేను అతణ్ణి పిలిచాను…సహోదరుడు నెవిల్, బహుశా, నాకు వినికిడి తగ్గుతుంది కావచ్చు. బర్న్స్ అనే పేరును నేను ఎలా మొదట వినగలిగాను? ఆ మనిషి యొక్క ముఖం నాకు తెలుసు, మరియు కేవలం నేను, అతని పేరును పిలవలేకపోయాను.
13 మరియు మీకు తెలుసా, మీకు కొంచెం వయస్సు పెరుగుతున్నా కొద్దీ, నేను ఒక విషయం కనుగొన్నాను, ఈ బైబిలు చదవడం నాకు చాలా కష్టముగా ఉన్నది. మరియు బైబిలు చదవడానికి, కళ్ళద్దాలు ధరించవలసియుండుటను గురించి ఆలోచించడం అంటేనే నాకు అసహ్యం.
14 కానీ, ఈ మధ్యనే, నేను గ్రుడ్డివాడనౌచున్నానని నేను అనుకున్నాను. మరియు నేను స్యాంమ్‌ని చూడటానికి వెళ్ళాను. మరియు సామ్ ఇట్లన్నాడు, “నాకు తెలియదు, బిల్.” ఇట్లు చెప్పెను, “నేను నీ కొరకు ఎవరైనా వైద్య నిపుణుడితో సమయం తీసుకుంటాను.”
15 నేను లూయివిల్ కు వెళ్ళాను. అది ప్రభువు యొక్క చిత్తమైయుంటుంది. ఒక ప్రసిద్ధమైన నిపుణుడు; నేను ఇప్పుడు అతని పేరు మర్చిపోయాను. అయితే అతడు నా పుస్తకం చదివాడు. మరియు అతను ఇట్లు చెప్పాడు, “నీవు ఎప్పుడైనా తిరిగి ఆఫ్రికాకు వెళ్తే, నేను నీతో కూడా రావాలని కోరుచున్నాను.” అతను చెప్పాడు, “మరియు నీవు గనుక…ఆ ఆఫ్రికా ప్రజలు నిన్ను ప్రేమిస్తారు.” మరియు ఇట్లన్నాడు, “వారు చాలా మూఢనమ్మకస్తులు, ముఖ్యంగా ఒక కత్తితో, కోయబోవునప్పుడైయున్నది. కావున,” ఇట్లన్నాడు, “కంటిశుక్లాలు మరియు అట్టి విషయములయొక్క, శస్త్రచికిత్సల కోసం నా జీవితంలో ఆరు నెలలు ఇవ్వగోరుచున్నాను, ఆ…పరిచర్యలో.” మరియు అన్నాడు, “మనము కలిసి వెళ్ళగలిగితే, మరియు ఆ విధంగా, నీవు వారి అభిమానాన్ని పొందగలిగితే,” అన్నాడు, “పిదప వారికి కంటిశుక్లాలు మరియు కంటి సమస్యలు ఉంటే,” ఇంకా ఇట్లు చెప్పాడు, “నేను దానిని ఆరు నెలలు, ఉచితంగా ఇవ్వడానికి, ఇష్టపడుచున్నాను.” మరియు మీరు అతణ్ణి సంప్రదించడానికి అతని సమయం కొరకు ఎంతకాలం వేచియుండాలో నాకు గుర్తులేదు.
16 మరియు మేము ఒక చిన్న గదిలో కూర్చొనియున్నాము మరియు అక్కడ ఆ చీకటి గదిలో, ఒక చిన్న—చిన్న ఎర్రని కాంతి వచ్చియున్నది. అంతెందుకు, నేను ఆ అక్షరాలను చదవగలిగాను. అది ఇరవై-ఇరవై అని చెప్పుచున్నది. నేను దానిని ఎలాగైనా చదవగలిగాను. మరియు అతను దానిని పదిహేను-పదిహేనుపై ఉంచాడు, మరియు నేను దానిని చదవగలిగాను. మరియు పిమ్మట పది-పది పై ఉంచాడు, మరియు నేను దానిని చదవగలిగాను. అతను చెప్పాడు, “సరే, మీ కళ్ళలో పెద్దగా లోపమేమీ లేదండి.”
17 అయితే అతని వద్ద ఒక చిన్న టెలిస్కోప్ ఉన్నది. అతను అక్కడ వెనుక ఒక చిన్న పరికరమును ఉంచాడు, మీకు తెలుసా, ఒక చిన్న వస్తువు. ఆ పాత టెలిస్కోపులు, అవి ఎంతమందికి గుర్తున్నవి? మనం వాటి ద్వారా చూసేవాళ్ళం, కేవలం అలా, పటములను చూసేవాళ్ళం. మరియు అతడు ఇట్లన్నాడు, “మీరు దానిని చదవగలరా?”
నేను ఇట్లు చెప్పాను, “అవును, అయ్యా.”
అతను చెప్పాడు, “దానిని నా కొరకు చదవండి.”
18 దానిలో ఒక, ఓ, దానిలో దాదాపు, ఆ మాత్రం ఉన్న ఒక మొత్తం పేరా ఉన్నది. నేను, దానిని చదవడం ప్రారంభించాను; అతడు దానిని అలా, పైకి లాగడం ప్రారంభించాడు, అది నెమ్మదిగా మరియు నెమ్మదిగా వచ్చింది. అతను దానిని అలా తీసుకొచ్చాడు, నేను ఆగిపోయాను. అతను చెప్పాడు, “నేను నీకు ఒక విషయమును చెప్పగలను, నీకు నలభై ఏండ్లు దాటినవి.”
నేను చెప్పాను, “అవును, అది నిజమే, దానిని దాటి చాలా కాలం అవుతుంది.”
19 అతను చెప్పాడు, “నీవు దీన్ని ఎలా చేసావు?” అతడు ఇట్లన్నాడు, “సహజంగా, మానవ నేత్రము, మీకు నలభై ఏండ్లు వచ్చినప్పుడు, మీ జుట్టు నెరిసినట్లుగా, మరియు అటువంటి వాటి వలెనే, మీ కనుగుడ్లు కూడా మసకబారును.” ఇంకా ఇట్లు చెప్పెను, “ఇప్పుడు, మీరు చాలా కాలం జీవించినట్లయితే, అది మళ్ళీ తిరిగి వస్తుంది.” అతను చెప్పాడు, “దానిని రెండవ దృష్టి, అని వారు అంటారు, కానీ,” ఇట్లన్నాడు, “దాదాపు నలభై సంవత్సరాల వయస్సుగల, ఒక మానవుడు, అవి నిజానికి…” ఇట్లు చెప్పాడు, “వారి కళ్ళలో లోపమేమి లేదు.”
20 నేను—నేను నేల మీద పడియున్న ఒక వెంట్రుకను కూడా చూడగలను, దానిని నా నుండి తీసివేయగలను. కానీ నా దగ్గరకు…మరియు అతను చెప్పాడు, “ఇప్పుడు, నీవు నీ బైబిలు చదువుతావు,” ఇంకా ఇట్లన్నాడు, “నీవు దానిని నీ నుండి దూరంగా ఉంచుతావు.” అన్నాడు, “కొంతకాలం తర్వాత, మీ చేయి తగినంత పొడవు ఉండదు, దానిని పట్టుకొనుటకు చాలినంత దూరంగా నీవు దానిని చాపలేవు—చాపలేవు.”
21 అందువలన అతను నాకు ఒక జత కళ్ళద్దాలు చేసాడు, మరియు దానిలో దిగువ భాగం, అది చదువుట కొరకైయున్నది. అతను చెప్పాడు, “ఇప్పుడు, నీవు నీ యొక్క వేదికపై…” మీకు తెలుసా, ఇక్కడ ఉన్న గౌరవప్రదమైన బోధకులలో నేను ఒకడినని అతడు అనుకున్నాడు. మరియు కావున ఇలా అన్నాడు…నీవు…పై భాగం సాధారణ గాజు అద్దమైయున్నది, సాధారణ గాజు మాత్రమే. మరియు మీకు తెలుసా, దగ్గర నుండి నేను అలా చదవగలుగునట్లు, ఆ దిగువ భాగములో ఒక రకమైన వంపు ఉన్నది. కావున, నేను అసలు వాటిని ధరించుటకు అసహ్యించుకుంటాను; అవును.
22 మరియు ఇప్పుడు, బైబిలు బోధనలో, మరి నేను ఈ రాత్రికి క్రొత్త నిబంధనను కలిగియున్నాను. కావున అది…నాకు కాలిన్స్ క్రొత్త నిబంధనను కలిగియున్నాను మరియు అది మంచి-పరిమాణ ముద్రణను కలిగియున్నది. కానీ ఇప్పుడు, నేను మరొక దానిలోకి తిరిగి వచ్చినప్పుడు, బహుశా నేను—నేను ఆ పాత ప్రియమైన వాటి వద్దకు వెళ్ళి, మరియు—మరియు వాటిలో నుండి చదవవలసియుంటుంది. అయితే అది ఏమైనప్పటికీ, నేను—నేను ఇంకా చదవగలుగుటకు నాకు—నేను ఏదో ఒక దానిని కలిగియున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మరియు—మరియు—మరియు నేను దేనినీ కలిగియున్నాగానీ, దేవుని మహిమ కొరకు, నేను ఇవ్వగలిగిన దానంతటినీ ప్రతి ఒక్కరికీ ఇవ్వబోవుచున్నాను, అతను ఆ వయస్సు గుర్తును తీసివేస్తాడని ఆశిస్తున్నాను. నా వయస్సును దూరం చేయమని నేను ఆయనను అడగలేను. నేను…అవును, మనమందరం చేయవలసిన ఒక్క విషయము. మనము దాని గుండా వెళ్ళవలసియున్నది. మరియు నేను ఒకప్పటి వలె ఇక్కడ వేదిక పై నిలబడిన ఒక చిన్న పిల్లవాణ్ణి కాదని నాకు తెలుసు. నాకు నలభై-ఎనిమిది ఏండ్లు. మరియు కేవలం ఆలోచించండి, సహోదరుడా మైక్, మరో రెండు ఏండ్లలో, యాభై ఏండ్ల వాడనవుతాను.
23 మై, దానిని నేను నమ్మలేకపోతున్నాను! నేను కేవలం…రెండేళ్ళ క్రితం వరకు నాకు ఇరవై దాటినవన్న సంగతి నాకు అసలు తెలియదు. అది నిజము. అది నిజము. నేను అసలు…నేను దానిని నమ్మలేకపోయాను. ఇంకా నేను—నేను…అద్దంలో చూసే వరకు నమ్మడం నాకు కష్టముగా ఉండెను, మరియు అప్పుడు అది అట్లున్నదని నేను—నేను తెలుసుకున్నాను. కానీ—కానీ కేవలం చూడటానికైతే, నేను నా జీవితంలో ఎన్నడూ అనుభవించనంత మంచి అనుభూతిని పొందుచున్నాను, మరియు నేను, దానికి కూడా కృతజ్ఞుడనైయున్నాను. సకల స్తోత్రములు దేవునికే కలుగునుగాక.
24 ఇప్పుడు, మనము హెబ్రీయుల గ్రంథమును అధ్యయనం చేస్తున్నాము. ఇది…ఓ, ఇది బైబిల్‌లోని అత్యంత లోతైన, అత్యంత సంపన్నమైన గ్రంథములలో ఒకటి. నేను మీకు చెప్పుచున్నదేమనగా, ఇది నిజంగా ఎలాంటి పుస్తకం అంటే…దేవుడు అనుమతించి, మరియు మనం దీనిలోనికి వెళ్ళి చూసినయెడల, మనము అన్ని వేళలా దేవుని స్తుతిస్తూ కేకలు వేసేంతగా, దీనిలో బంగారు మాటలను మనం కనుగొంటాము. మరియు ఇప్పుడు నేను…
25 హెబ్రీ పత్రిక అనేది, ఇది నిజంగా ఏమిటనగా, ఇది పరిశుద్ధ పౌలు చేత వ్రాయబడినదని భావించబడుతుంది, అతడు, మన ప్రభువైన యేసుక్రీస్తుకు వెలుపల, ప్రపంచం కలిగియున్న, ఒక గొప్ప పరిశుద్ధ గ్రంథ విశదకర్తయైయున్నాడు. మరియు పౌలు వేరు చేస్తున్నాడు…ఇప్పుడు, పౌలు ఒక నిజమైన బైబిల్ బోధకుడు; అనగా, ఆ పాత నిబంధన. అప్పట్లో వ్రాయబడినదై, బైబిలు అని పిలువబడిన ఏకైక గ్రంథము అదేయైయున్నది. మరియు అతను హెబ్రీయులకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు, పాత నిబంధనను వేరు చేస్తూ మరియు పాత నిబంధన అనేది క్రొత్త దానికి ఛాయగా లేదా ఒక మాదిరిగా ఉన్నదని చూపిస్తున్నాడు.
26 అక్కడే మనము ఆ గురిని తాకి మరియు సరిగ్గా అక్కడే, ఆ ఒక్క ఆలోచన పైనే, అక్కడే మూడు నెలలు పాటు ఉండవచ్చు. వెంటనే వెనక్కి వెళ్ళాలంటే, మనం ఇప్పుడు మన బైబిళ్ళను తిరగేయగలిగితే, అవును మనము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయముపై ఉన్నాము. అయితే మనము ప్రకటన, 12వ అధ్యాయాన్ని త్రిప్పిన యెడల, ఆ ఛాయలను, మీరు దానిని మరలా పరిపూర్ణంగా చూసెదరు. ఒకవేళ…మీ పెన్సిళ్ళను కలిగియుండి మరియు లేఖనాలను వ్రాసుకొనబోవుచున్న మీరు. హెబ్రీలో-…
27 ప్రకటన 11లో, యోహాను, పత్మాసు ద్వీపంలో, ఆకాశంలో నిలబడి ఉన్న ఒక స్త్రీని చూడటం మనము కనుగొంటాము, మరియు ఆమె తన శిరస్సు మీద సూర్యుణ్ణి మరియు తన పాదాల క్రింద చంద్రుణ్ణి కలిగియున్నది. మరియు ఆ స్త్రీ గర్భిణియైయుండి, ప్రసవ వేదన పడుచున్నది. ఆమె ఒక మగశిశువును కన్నది. ఆ శిశువు పుట్టిన వెంటనే, దానిని మ్రింగివేయడానికి ఎర్రటి ఘట సర్పము నిలుచుండెను. మరియు ఆ—ఆ శిశువు పరలోకములోనికి కొనిపోబడెను, మరియు ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అక్కడ ఆమె ఒక కాలము, కాలములు, మరియు అర్థ కాలము లేదా ఒక ప్రత్యేక కాలము వరకు పోషించబడెను.
28 ఇప్పుడు, ఆ స్త్రీ సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది, మరియు ఆమె కన్న ఆ శిశువు క్రీస్తే. ఆమె పాదాల క్రిందనున్న చంద్రుడు ధర్మశాస్త్రము, ఆమె శిరస్సు మీదనున్న సూర్యుడు కృప. ఆమె కిరీటంలోనున్న పన్నెండు నక్షత్రాలు పన్నెండు మంది అపొస్తలులు. మరియు అక్కడే, అది ఉన్నది…ఆ పన్నెండుగురు అపొస్తలులు కొత్త నిబంధన యొక్క మహిమ లేదా కిరీటమైయున్నారు. చూశారా? “ఏలయనగా వేయబడినది తప్ప మరి ఏ ఇతర పునాదులు వేయబడజాలవు.” చూశారా? అది, ఆ పునాది, ఆ—ఆ క్రొత్త నిబంధన, ఆ అపొస్తులులు, అపొస్తులల యొక్క ఆ సిద్ధాంతం, మరియు మొదలైనవి, క్రొత్త నిబంధన యొక్క పునాది కిరీటమైయున్నవి. మరియు పిదప…
29 చంద్రుడు సూర్యుని యొక్క ఛాయయై యున్నాడు. సూర్యుడు భూమి వెనుక ఉన్నప్పుడు తన యొక్క కాంతిని ప్రతిబింబిస్తాడు. మరియు రాత్రిపూట నడవడానికి, చంద్రుడు, కాంతిని ఇస్తాడు. మరియు ఇక్కడ మనం ఎటువంటి ఒక అందమైన దృశ్యమును కలిగియున్నాము కదా, మరొక అందమైన దృశ్యము: సూర్యుడు క్రీస్తును సూచిస్తున్నాడు; ఆ—ఆ చంద్రుడు సంఘమును సూచిస్తున్నాడు. అవి సరిగ్గా భార్యాభర్తల వలె ఉన్నవి. మరియు క్రీస్తు లేనప్పుడు, సంఘము సువార్త అను, చిన్న వెలుగును ప్రతిబింబిస్తుంది. మరియు కుమారుడు మరలా ఉదయించే వరకు అది—అది దానిలో నడవవలసిన వెలుగైయున్నది, పిదప సంఘము మరియు కుమారుడు, చంద్రుడు మరియు సూర్యుడు, ఒకదానితో ఒకటి కలిసిపోతారు. చూశారా? చంద్రుడు సూర్యునిలో ఒక భాగం, మరియు సంఘము క్రీస్తులో ఒక భాగమైయున్నది. మరియు క్రీస్తు లేనప్పుడు, సంఘము ఆయన యొక్క వెలుగును ప్రతిబింబిస్తుంది. మరియు పిదప చంద్రుడు ప్రకాశించుటను మనం చూడగలిగినంత ఖచ్చితంగా, సూర్యుడు ఎక్కడో ప్రకాశిస్తున్నాడని అది చూపిస్తుంది. మరియు సంఘము క్రీస్తు యొక్క వెలుగును ప్రతిబింబిస్తున్నంత కాలం, క్రీస్తు ఎక్కడో సజీవంగా ఉండియున్నాడు. ఆమేన్. దానిని గూర్చి ఆలోచించండి.
30 ఇప్పుడు, ధర్మశాస్త్రం కృపకు మాదిరిగా ఉన్నది, కానీ ధర్మశాస్త్రము రక్షించే శక్తిని కలిగిలేదు. ధర్మశాస్త్రము కేవలం…ధర్మశాస్త్రము అనేది ఒక పోలీసు. పోలీసు మిమ్మల్ని జైలులో పెడతాడు, కానీ, మీరు చూడండి, జైలు నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి కృప అవసరమైనది. చూశారా?
31 కాబట్టి క్రీస్తు యొక్క రక్తము, సువార్త, పాపము నుండి మనలను విడిపించును. ధర్మశాస్త్రము కేవలం మనల్ని పాపులనుగా చేస్తుంది. ధర్మశాస్త్రము కేవలం ఇట్లు చెప్పినది, “నువ్వు ఒక పాపివి. నీవు దొంగిలించవద్దు. నీవు వ్యభిచరించవద్దు. నీవు అబద్ద సాక్ష్యం పలుకవద్దు.” చూశారా? అది నీవు తప్పు చేసావు మరియు నీవు దోషివి అని చెప్పే ఒక పోలీసుయైయున్నది. అయితే సువార్త ఒక శుభవార్తయైయున్నది. మన అపరాధముల నుండి, ధర్మశాస్త్ర అతిక్రమముల నుండి మనలను రక్షించడానికి క్రీస్తు మరణించెను. మనలను బయటకు తెచ్చుటకు క్రీస్తు మరణించెను.
32 ఇప్పుడు, పౌలు, అతడు మారిన వెంటనే, అతడు ఏ సెమినరీని సంప్రదించలేదు, లేదా ఏ సేవకులను కూడా అతడు సంప్రదించలేదు. అయితే మీరు గమనించారా? అతడు అరేబియాకు వెళ్ళి, మరియు మూడు సంవత్సరాలు, అక్కడ అరేబియాలో గడిపెను. ఇప్పుడు, ఇది, నా అభిప్రాయం ప్రకారం, అది…
33 ఇప్పుడు, మనము దీని నేపథ్యాన్ని పొందవలసియున్నది, తద్వారా అది ఎంత ముఖ్యమైనదో మనము తెలుసుకుంటాము. మరియు ఈ రాత్రి, మొదటి పాఠమేదనగా, మనము మన నేపథ్యాన్ని తీసుకుంటాము.
34 ఇప్పుడు, పౌలు అటువంటి ఒక బైబిల్ బోధకుడైయుండెను, ఎందుకనగా అతడు అన్ని-కాలములలో ప్రసిద్ది చెందిన, ఆ గొప్ప గమలీయేలు క్రింద బోధించబడ్డాడు. మరియు అతడు ఆనాటి అత్యంత సుప్రసిద్దమైనవారిలో ఒకడు, అతడు ఆ ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలను గూర్చిన గొప్ప బోధకుడు. కాబట్టి, పౌలు ఆ విషయాలలో బాగా తర్ఫీదు పొందాడు.
35 మరియు పిదప ఇట్లుండుటను బట్టి నేను అతణ్ణి ఇష్టపడుచున్నాను, ఈ గొప్ప ప్రత్యక్షత, అతని హృదయములో నిజాయితీగా ఉన్నాడు, ఒక నరహంతకుడు, స్తెఫను మరణానికి సమ్మతించాడు మరియు రాళ్లతో కొట్టబడి చంపబడుటవలన ఆ రాళ్ళు మరియు మట్టి దిబ్బల క్రింద స్తెఫను చనిపోవుటను చూశాడు. స్తెఫను తన చేతులను పరలోకము తట్టు ఎత్తి మరియు ఇట్లు చెప్పుటను పౌలు చూసినప్పుడు, అది అతణ్ణి తాకియుంటుందని నేను అనుకొనుచున్నాను, “ఆకాశము తెరవబడుటను నేను చూస్తున్నాను. మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు నేను చూచుచున్నాను.” మరియు అతడు ఇట్లన్నాడు, “తండ్రీ, వారి మీద ఈ పాపము మోపకుము.” మరియు అతడు నిద్రించెను.
36 మీరు దానిని గమనించారా? అతడు ఎన్నడూ మరణించలేదు. అతడు నిద్రించాడు. అలాగే…అతడు తరువాత ఎన్నడూ మరొక రాతి దెబ్బను అనుభవించాడని నేను నమ్మను. తల్లి రొమ్మున ఒక పసిబిడ్డ నిద్రపోవునట్లే, స్తెఫను దేవుని చేతుల్లో నిద్రించాడు.
37 పౌలు విషయంలో, ఏదో ఉన్నది, అది అతణ్ణి తాకినది. అప్పుడు అతడు, దానితో పోరాడటానికి ప్రయత్నిస్తూ, తన నమ్మకానికి కట్టుబడిన వ్యక్తి వలెనే, అతడు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి మరియు కొన్ని పత్రాలను తెచ్చుకున్నాడు. ఇట్లన్నాడు, “ఆ గోల చేస్తున్న ప్రజలందరినీ, మరియు ఆ మత విరోధులను నేను అరెస్టు చేస్తాను;” అది ఎట్లు పరిగణించబడుతుందంటే, ఈనాడు మనం, ఏదో “అధిక మూఢ భక్తిగల మతోన్మాదులు,” లేదా అటువంటిది ఏదో అని పిలుస్తాము, వారు ఎంతో గోల చేస్తూ గందరగోళాన్ని కలుగజేస్తున్నారు. “మేము అక్కడికి వెళ్ళి మరియు దాన్ని పరిష్కరిస్తాము.”
38 మరియు అతని మార్గములో, ఒక చిన్న…అది మనం ప్రయాణం చేయునటువంటి ఒక గొప్ప రహదారి కాదు. మరియు పాలస్తీనాలోని ఆ దారులు, కేవలం చిన్న త్రోవలు, ఎక్కడైతే ఆ పశువులు, మరియు గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు కొండల మీదుగా వెళ్ళునో, అట్టి అడవులలోని ఆవుల కాలిబాట వంటివి.
39 మరియు ఒక రోజు, పౌలు, దమస్కునకు వెళ్ళే దారిలో, దాదాపు మధ్యాహ్న వేళలో, ప్రకాశిస్తున్న ఒక గొప్ప వెలుగు అతణ్ణి నేల మీదికి పడద్రోసెను. పౌలు తప్ప మరెవరూ దానిని చూడలేదు. మీరు దానిని గమనించాలని నేను కోరుచున్నాను. మరియు సరిగ్గా ఇక్కడ, ఇప్పుడు ఇది వ్యక్తిగతమైనది కాదు, కానీ కేవలం మనం దీనియొక్క నేపథ్యంలోనికి వెళ్ళుటనుబట్టియై యున్నది. తద్వారా మీరు గ్రహిస్తారు అదే యేసు…
40 ఇప్పుడు, ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఇట్లు చెప్పెను, “నేను దేవునియొద్ద నుండి వచ్చియున్నాను, మరియు నేను తిరిగి దేవుని యొద్దకే వెళ్ళుదును.”
41 ఇప్పుడు, ఆయన ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు, ఆయన అగ్ని స్తంభముగా ఉండెను. మరియు ఆయన శరీరధారి ఆయెను, పిదప ఆయన అదే అగ్ని స్తంభమునకు తిరిగి వెళ్ళెను. మరియు ఆయన దమస్కు మార్గమున పౌలును కలిసినప్పుడు, ఆయనే ఆ అగ్ని స్తంభము, ఆ వెలుగైయ్యుండెను, చూడండి, ఒక గొప్ప వెలుగు. మరియు పౌలు ఇట్లన్నాడు, “నేను హింసించుచున్నది ఎవరిని?”
42 ఆయన ఇట్లు చెప్పెను, “నేను, నీవు హింసించుచున్న యేసును,” ఆ వెలుగు. ఓ, ఆయన అద్భుతమైనవాడు కాడా?
43 మరియు ఈ రాత్రి, ఆయన ఇక్కడున్నాడు, సరిగ్గా ఇక్కడ మనతో ఉన్నాడు. సరిగ్గా అక్కడే ఆయన ఫోటో తీయబడెను, అదే కార్యము, చూడండి, అగ్ని స్థంభము, వెలుగు, ఆయన ఎట్లు ఉండేనో సరిగ్గా అట్లే, “నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటేరీతిగా ఉన్నాడు.”
44 ఇప్పుడు అతనితో కూడా ఉన్న మనుష్యులు ఆ వెలుగును చూడలేదు, కానీ అది అదే విధంగా అక్కడ ఉన్నది. ఫలితాలు ఒకేరీతిగా వచ్చాయి.
45 ఇప్పుడు, ఈ—ఈ భవనంలో ఎవరైనా క్రీస్తును చూడగలిగి మరియు ఇంకెవ్వరూ ఆయనను చూడలేకపోవుటయన్నది సాధ్యమేనా? నిశ్చయంగా. అది అక్కడ జరిగినది.
46 ఒక రాత్రి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు కూడా అది జరిగినది. మరియు ఆ వెలుగు చెరసాలలోనికి వచ్చి, మరియు పేతురును తాకెను, మరియు లోపటి కావలిని, బయటి కావలిని, దాటుకొని, ఆ ద్వారము అనగా, ఆ ముఖద్వారమును దాటి, మరియు నగర ద్వారమును దాటి వెళ్ళెను. పేతురు, “నేను కల కంటున్నానేమో,” అని అన్నాడు. అయితే అతడు చుట్టూ చూశాడు, కానీ ఆ వెలుగు వెళ్ళిపోయెను; అది క్రీస్తు, ఆ నిత్యమైన, శాశ్వతమైన వెలుగు. ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు, ఆ దారిలో…
47 మరియు చూడండి, మరొక విషయం, మనం దీని గురించి మాట్లాడినట్లయితే, అది ఇప్పుడే నా మనస్సులోకి వచ్చినది. అయితే భారత దేశము నుండి, ఆ నక్షత్రమును వెంబడించిన, ఆ తూర్పు దేశపు జ్ఞానులు, నెలలు తరబడి, లోయలు మరియు ఎడారుల గుండా వచ్చుచుండిరి (నక్షత్ర పరిశోధన శాలలను దాటి వచ్చిరి; మరియు వారు రాత్రి వేళను నక్షత్రాల ద్వారా గమనించేవారు) మరియు ఆ జ్ఞానులు తప్ప ఏ చరిత్రకారుడైనా లేదా మరెవరైనా ఎన్నడైనా ఆ నక్షత్రాన్ని చూసినట్లు ప్రస్తావించలేదు. దానిని చూడటం వారి కొరకు మాత్రమే ఉద్దేశించబడినది.
48 కాబట్టి మరొకరు చూడలేని విషయాలను మీరు చూడవచ్చు. మీకైతే, అదొక వాస్తవమైయున్నది. అతనికైతే, వారు దానిని గ్రహించరు. సరిగ్గా ఒక మార్పు వలె ఉన్నది; నీవు మార్పునొంది మరియు దేవుని ఆశీర్వాదాలను ఆనందించుచూ, సరిగ్గా—సరిగ్గా దేవుని దీవెనలను త్రాగుచుండవచ్చును. మరియు నీ ప్రక్కన కూర్చున్న, తదుపరి వ్యక్తి ఇట్లనవచ్చును, “నాకు అస్సలు ఒక్క విషయం కూడా కనబడుటలేదు.” చూశారా? చూశారా? అది అంతే. “నాకు అసలు అది అర్థం కావడంలేదు. అదంతా దేని గూర్చియో నేను చూడటంలేదు.” సరి, అతడు అసలు దానిని గ్రహించుటలేదు. అదంతే. నీవు, ఎక్కడ ఉన్నావన్నదానిని.
49 ఇప్పుడు గమనించండి, పౌలు తన దారిలో ఉన్నాడు. మరియు ఈ గొప్ప అనుభవం అతనికి జరిగిన వెంటనే…ఇప్పుడు, అతను సంతృప్తి చెందలేదు…పౌలును అంత మంచివానిగా చేసేది అదే.
50 ఇప్పుడు, ఈ రాత్రి మన పాఠం లోతైనదేమీ కాదు. ఇది లోతులేని పాఠం, కానీ, ఓ, మనము కొంత సమయం తర్వాత, లోతుగా వెళ్తాము. కానీ ఇది చాలా లోతులేని పాఠమైయున్నది, అయితే ఇది ప్రారంభము మాత్రమే. మరియు ఇది ఏమిటనగా, ఇది యేసుక్రీస్తును హెచ్చించుచున్న, ఒక విషయమైయున్నది. ప్రారంభించుటకు, పౌలు.
51 మరియు అతడు దీనిని చేయుటకు ముందు, పౌలు ఒక బైబిలు పండితుడైయున్నాడు. మరియు ఒక బైబిలు పండితుడు తన సిద్ధాంతాన్ని అనుభవాల మీద ఎన్నటికీ ఆధారపడనీయడు. లేదు, అయ్యా. వారు తమ సిద్ధాంతాన్ని ఎన్నడూ ఒక అనుభవం మీద ఆధారపడనీయరు. మీకు ఎలాంటి అనుభవమైనా ఉండవచ్చు. కానీ అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యుండవలసి యున్నది. అది నిజము.
52 ఇప్పుడు, పాత నిబంధనలో, వారు వర్తమానాన్ని తెలుసుకునేందుకు మూడు విభిన్న మార్గాలను వారు కలిగియున్నారు. మొదటిది, ధర్మశాస్త్రము, అది కేవలం ధర్మశాస్త్రము. పిదప, వారికి ఒక—ఒక ప్రవక్త ఉండెను; ఒక కలలు కనేవాడు; మరియు వారు ఊరీము తుమ్మీమును కలిగియున్నారు. ఇప్పుడు అది కొంచెం లోతుగా ఉండవచ్చును.
53 ఊరీము తుమ్మీము అనేది అహరోను తన రొమ్ముపై ధరించిన పతకమైయున్నది. దానిలో పన్నెండు రాళ్ళు ఉన్నవి: సూర్యకాంతము, నీలము, కెంపు, మొదలగునవి, కలవు. ఆ పన్నెండు పెద్ద రాళ్ళన్నిటినీ, వారు ఆ పతకములో కలిగియున్నారు, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలలో, ప్రతి గోత్రానికి అతడు ప్రధాన యాజకుడని అది చూపించుచున్నది. ఈ పతకము సంఘములో ఒక స్తంభానికి వ్రేలాడదీయబడి ఉంటుంది. మరియు ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు, అది సరైనదో, కాదో అన్న నిశ్చయతను వారు కలిగియుండగోరినప్పుడు, ఆ ప్రవక్తలు లేదా కలలు కనేవారు ఈ ఊరీము తుమ్మీము ముందు నిలబడి, మరియు అతడు తన కలను లేదా తన దర్శనాన్ని, తాను చూసిన దానిని చెప్తాడు. మరియు పవిత్రమైన ఆ వెలుగు…ఓ, మీరు దానిని చూస్తున్నారా? దేవుడు ఎల్లప్పుడూ సహజాతీతమైన పరిధిలో నివసిస్తాడు. ఈ స్వరం బయలువెళ్ళే వరకు, ఆ కాంతుల యొక్క మిశ్రమము, కేవలం సహజమైనవే. మరియు ఆ స్వరం ఆ రాళ్ళను తాకినప్పుడు, అది సహజాతీతమైనది కానిచో, అది నిశ్చలమైపోతుంది. అయితే అది సహజాతీతమైనది అయినచో, ఆ కాంతులు అన్నీ కలిసి వర్షధనస్సు రంగును ప్రతిబింబిస్తాయి. ఆమేన్. అప్పుడు, అది దేవుడు మాట్లాడుటయైయున్నది, “అతడు నా ప్రవక్త.” లేదా, “ఆ కల నా యొద్ద నుండి వచ్చినది.” ఆ ఊరీము తుమ్మీము ప్రకారం వారు తీర్పు తీరుస్తారు.
54 సౌలు పడిపోయినప్పుడు జ్ఞాపకమున్నదా? అతడు ఒక కలను కనలేకపోయాడని అతడు చెప్పాడు. మరియు ప్రవక్తయైన, సమూయేలు, మరణించెను, మరియు ఎటువంటి మార్గము లేకుండెను. అతడు ఇట్లన్నాడు, “ఊరీము కూడా నాతో మాట్లాడుటలేదు.” ఏమిలేదు. సౌలు ఊరీము ముందు నిలబడ్డాడు, మరియు అతని మాటలు చచ్చుబడిపోయాయి. చూశారా? దేవుడు అతణ్ణి తిరస్కరించాడు. మరియు ఆ ఊరీము తుమ్మీము, అది అహరోనుకు తన యాజకత్వము యొక్క నిర్థారణయైయున్నది. అహరోను వెళ్ళిన తర్వాత, మోషే, ఆ—ఆ పతకము స్తంభానికి వ్రేలాడదీయబడియున్నది.
55 ఇప్పుడు, యేసు మరణించినప్పుడు, అహరోను సంబంధమైన యాజకత్వము ఆగిపోయింది. మరియు ఇప్పుడు, కృప నుండి ధర్మశాస్త్రాన్ని వేరు చేస్తూ, మనం ఇంకనూ ఒక ఊరీము తుమ్మీమును కలిగియున్నాము. మరియు పౌలు దానిని ఉపయోగిస్తున్నాడు. చూశారా? దేవుని యొక్క అక్షయమైన, నిత్యమైన, శాశ్వతమైన వాక్యమే నేటి ఉరీము తుమ్మీము. చూశారా?
56 “ఎట్లనగా ఈ గ్రంథము నుండి ఎవరైనా దేనినైనా తీసివేసినా, లేదా దీనికి మరి దేనినైనా కలిపినా.” దీనికి వెలుపలనున్నదేదీ నాకు అవసరం లేదు, కానీ అది కలిగియున్నదంతా నాకు కావలెను. అలాంటి సంఘము మనకు కావలెను. మరియు అన్ని విషయాలు వాక్యము ద్వారానే నిరూపించబడాలి.
57 ఆ కారణం చేతనే నేను ఇటీవల కాలములో పెంతెకోస్తు ప్రజల మధ్య విఫలమయ్యాను, ఎందుకనగా, ఇట్లు చెప్పుచుండేవాణ్ణి, “మీ చేతుల నుండి నూనె కారుట, లేదా మీ ముఖం నుండి రక్తం కారుట అనేది, మీరు పరిశుద్ధాత్మను కలిగియున్నారనుటకు ఒక సూచనగా ఎక్కడ ఉన్నదో నేను గ్రహించలేకున్నాను.” అది లేఖనానుసారమైనది కాదు మరియు నేను—నేను దానిని తీసుకోలేకపోయాను. అది వాక్యము నుండి రావలసియున్నది.
58 మరియు ఇప్పుడు, పౌలు, అతడు కేవలం వాక్యాన్ని ప్రేమించాడు. కావున, తాను పొందుకున్న ఈ గొప్ప అనుభవమును గూర్చి ఎన్నడైనా అతడు సాక్ష్యమిచ్చుటకు ముందే, అతడు మూడు సంవత్సరాల వరకు ఐగుప్తునకు వెళ్ళెను. అది మూడు సంవత్సరాలు అని నేను నమ్ముచున్నాను, ఐగుప్తులో మూడు సంవత్సరాలు. మరియు అతడు ఏమి చేశాడని నేను నమ్ముచున్నానో మీకు తెలుసా? అతను పాత నిబంధనను తీసుకుని మరియు పాత నిబంధనను పరిశీలించి, మరియు అది నిజంగా సంపూర్ణంగా మెస్సీయా అని అతడు కనుగొనెనని నేను నమ్ముచున్నాను. అతడు తన అనుభవాన్ని బైబిలు ద్వారా నిరూపించవలసియుండెను. ఆమేన్. ఓ, మై!
59 అతడు చెరసాలలో ఉన్నప్పుడు అతణ్ణి చూడండి. మీరు గమనించండి, అతడు చాలా కాలం అక్కడ చెరసాలలో ఉన్నప్పటి కొంత—కొంత సమయం అతని జీవితంలో ఉన్నది. అతడు ఎఫెసీ పుస్తకాన్ని వ్రాసాడు. అతడు ఈ హెబ్రీ పత్రికను వ్రాసాడు. చూశారా? అతనికి సమయం దొరికినది. దేవుడు అతణ్ణి అక్కడ ఒక చెరసాలలో ఉంచెను, మరియు అతడు సంఘములకు ఈ పత్రికలను వ్రాసాడు. ఎఫెసీ సంఘమునకు ఒకటి వ్రాసాడు. అతడు పెంతెకోస్తు సంఘమునకు ఒకటి వ్రాసాడు, వారితో అనేక ఇబ్బందులు ఉండియుండెను. మిగతా ఎవరికంటెను ఎక్కువ ఇబ్బందులను అతడు పెంతెకోస్తు సంఘముతో ఎదుర్కొన్నాడు. ఇంకను అట్లేయున్నది. అయితే వారి నిమిత్తం అతడు కృతజ్ఞుడైయుండెను. అతడు వారికి బోధించగలిగే ఒకే ఒక్క విషయం…వారు లోపలికి వచ్చినప్పుడు: ఒకడు భాషతో మాట్లాడవలెనని యున్నాడు, ఒకడు కీర్తన పాడవలెనని యున్నాడు, ఒకడు భావోద్వేగముతో ఉన్నాడు, ఒకడు అనుభూతిని కలిగియున్నాడు. అతడు, “నిత్య భద్రత,” గూర్చి వారితో మాట్లాడలేకపోయాడు. “ముందు నిర్ణయం,” గూర్చి అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు వారితో మాట్లాడలేకపోయెను, వారు పసి పిల్లలవలె నుండిరి. వారంతా ఏదో ఒక—ఏదో ఒక అనుభూతిని పొందవలెననియున్నారు, లేదా దేనినో చూడవలెననియున్నారు, లేదా వింత అనుభూతులను, మరియు, లేదా వారి చుట్టూ ఏదైనా, కొన్ని ఆధారాలను కలిగియుండవలెనని యున్నారు.
60 కానీ నేను నమ్ముచున్నదేమనగా, అతడు ఎఫెసీయులతో మాట్లాడినప్పుడు, అతడిట్లు చెప్పగలిగెను, “దేవుడు మనలను కుమారులు మరియు కుమార్తెలుగా ముందుగా నిర్ణయించుకొనెను, మరియు జగత్తు పునాది వేయబడకమునుపే యేసుక్రీస్తులో మనలను తన పిల్లలుగా స్వీకరించెను.” దానిని చూడండి. మై!
61 రోమా పత్రిక, మరియు మొదలగు వాటిలో అతడు వచ్చుటను గమనించండి. వారు ఎదిగి-యున్నారు. ఓ, వారు భాషలతో మాట్లాడిరి, నిశ్చయంగా, మరియు వారు పరిశుద్ధాత్మ యొక్క ఇతర సూచనలను వారి మధ్యన కలిగియుండిరి. కానీ వారు సిద్ధాంతాలను, మరియు ఉద్రేకాలను, మరియు చిన్న వణుకులను, మరియు వింత అనుభూతులను తయారు చేయలేదు.
62 పౌలు ఇట్లు చెప్పాడు, “మీరు—మీరు—మీరు వాటితో మరీ విపరీతమైపోవుచున్నారు. మీరు బోధించవలసియుండగా, మీరు ఇంకనూ శిశువులుగా ఉండి మరియు పాలు త్రాగవలసినవారిగానే ఉన్నారు.”
63 ఇప్పుడు, నేను ఎల్లప్పుడూ ఈ ఆలయము, ఒక శిశువుల గుంపుగా ఉండకూడదని, దృఢంగా చెప్పుటకు ప్రయత్నించాను. మనము ఎదిగిన-వారిగా ఉందాము. మార్గములో నిలబడదాము. ఓ, మై! అక్కడే మీరు ఉన్నారు.
64 కాబట్టి, తన అనుభవము దేవుని యొక్క బైబిలుతో సరిపోయినదాయని చూచుటకు, మొదటిగా, పౌలు అక్కడికి వెళ్ళెను.
65 ఓ, ఈనాడు, ప్రజలు కేవలం దానిని మరలా చేసినయెడల, మనం మన అనుభవాన్ని దేవుని బైబిలు గ్రంథముతో సరిపోల్చగలిగినయెడల, అది అద్భుతముగా ఉండదా? అది సరిపోనియెడల, అప్పుడు మన అనుభవం తప్పైయున్నది; అది ఉరీము తుమ్మీములో ప్రకాశించదు. అది అక్కడ ప్రకాశించినయెడల, ఆమేన్, మీరు దానిని పొందుకున్నారని తెలుసుకోండి. కానీ అది ప్రకాశించనియెడల, ఏదో…అది ఎంత మంచిగా అనిపించినా, అది సరియైనదన్నట్లు ఎంత వాస్తవంగా కనిపించినాగానీ నేను లెక్కచేయను; ఆ ఊరీము తుమ్మీముపై ఆ వెలుగులు ప్రకాశించకపోతే, అది తప్పైయున్నది.
66 మరియు మీకు ఎంత అనుభవం ఉన్నా, అది ఎంత వాస్తవమైనదిగా కనిపిస్తున్నా, అది ఎంత సమ్మతంగా ఉన్నా, అది ఎంత విద్యాభ్యాసం కలిగించేదిగా ఉన్నా, అది ఆత్మలను సంపాదించుటకు ఎంత గొప్ప సాధనముగా ఉన్నా లెక్కలేదు; అది వాక్యములో ప్రకాశించకపోతే, అది తప్పైయున్నది. అవును. అది వాక్యంతో సరితూగవలసియున్నది.
67 ఇప్పుడు, దారికి మధ్య అనేది ఉన్నదని…నేను నమ్ముతాను. దారి, ఇప్పుడు, చాలా సార్లు…నేను ఒక నాజరీను సంఘానికి వెళ్ళేవాణ్ణి. ఆ ప్రియమైన ప్రజలను దేవుడు దీవించును గాక. వారు పాత-కాలపు, శుద్ధీకరించబడిన మెథడిస్టులైయున్నారు; చర్చ్ ఆఫ్ గాడ్, నాజరీను, పిల్‌గ్రిమ్ హోలినెస్, మరియు ఆ మంచి పాత హోలినెస్ సంఘములలో అనేకులు. మరియు వారు ఒక పాటను పాడేవారు:
నేను ఆ పాత ఉన్నత రహదారిలో నడుస్తున్నాను,
నేను వెళ్ళిన ప్రతిచోటా చెప్పుచున్నాను,
ప్రభువా, నాకు తెలిసిన దేని-కంటెను,
నేను ఒక పాత కాలపు క్రైస్తవునిగా ఉంటాను.
68 మంచిది. అద్భుతం. మరియు పిదప వారు పరిశుద్ధత యొక్క రాజమార్గం గురించి మాట్లాడేవారు. ఇప్పుడు, మీరు దానిని చదివినట్లైతే, వారు దానిని, యెషయా 35వ అధ్యాయం నుండి పొందియున్నారు. ఇప్పుడు, మీరు గమనించినచో, అతడు ఇలా అన్నాడు, “ఒక రాజమార్గము, మరియు ఒక మార్గం ఉండును.”
69 ఇప్పుడు, మరియు అనేది ఒక అనుసంధానము. చూశారా? ఒక రాజమార్గము, అది పరిశుద్ధత యొక్క రాజమార్గము కాదు. “ఒక రాజమార్గము, మరియు ఒక మార్గము ఉండును, మరియు అది, ‘పరిశుద్ధ మార్గము,’” అని పిలువబడును, పరిశుద్ధత యొక్క రాజమార్గము కాదు. “పరిశుద్ధ మార్గము!” మరియు ఆ దారి యొక్క మార్గము ఆ దారి మధ్యయైయున్నది. ఆ నీరు, ఇరువైపులకు చెత్తను కడిగివేసి, ఆ దారిని శుభ్రముగా ఉంచునట్లు, అది ఇలా నిర్మించబడినది. మీరు, అది సరిగ్గా నిర్మించబడకపోతే, మీ దారిలో, ఎల్లప్పుడూ నీటి కుంటలు ఉంటాయి. “ఆ మార్గం” దారి మధ్యయైయున్నది.
70 ఇప్పుడు, ఇటు వైపు, ప్రజలు మారినప్పుడు, వారి మనస్సులు సరిగ్గా క్రీస్తుపైనే ఉంచబడతాయి. మరియు వారు కొంచెం పండితులైయుండి, మరియు ప్రార్థనలో ఉండకపోతే, వారు నిజంగా చల్లబడిపోతారు, మరియు మొండిగా, మరియు నామకార్ధంగా, మరియు ఆసక్తి లేనివారిగా మారిపోతారు. మరియు పిదప వారు కొంచెం ఉద్రిక్తతకు లోనైతే, మీరు గమనించకపోయిన యెడల, వారు అటు వైపు, కేవలం అసాంఘికంగా మరియు పిచ్చివారిగా మారతారు, చూడండి, వారు ఉద్రేకాలలోనికి మరియు ప్రతిదానిలోకి వెళ్తారు.
71 అయితే, ఇప్పుడు, ఒక నిజమైన సంఘము అనేది, సరిగ్గా దారి మధ్యలోనున్న ఒక నిజమైన స్వస్థచిత్తముగల సువార్తయైయున్నది. అది చల్లబడి మరియు నామకార్ధముగా లేదు, లేదా అది మూఢభక్తి కూడా కాదు. అది ఒక నిజమైన మంచి, పాత, వెచ్చని సువార్తయైయున్నది, హృదయ-పూర్వకమైన దేవుని ప్రేమయైయున్నది, అది ఇరువైపుల నుండి పిలుచుచూ, నేరుగా ఆ దారి మధ్యన పోవుచున్నది. అది వాస్తవము. ఇప్పుడు అదియే…మరియు మీరు ఆ సంఘమును ఎలా కనుగొనబోవుచున్నారు? నేరుగా వాక్యము అనే, ఆ ఉరీము తుమ్మీము నుండి కనుగొనగలరు.
72 ఇప్పుడు, పౌలు ఈ సంఘమును సరిగ్గా ఆ దారి మధ్యకు తీసుకురాగోరాడు, కాబట్టి అతడు వెళ్ళి తనకు తెలిసిన లేఖనాలపై మూడు సంవత్సరాలు అధ్యయనం చేశాడు. కాబట్టి, ఈ క్రొత్త నిబంధనలో ఎక్కువ భాగాన్ని పౌలు వ్రాసాడు. అన్యజనుల కాలము వచ్చుచున్నది గనుక దేవుడు అతణ్ణి అలా చేయించెను. మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను, ఈ నాలుగు సువార్తలు, వారు యూదులు. అయితే పత్రికలలో చాలా వాటిని పౌలు వ్రాసాడు.
73 ఇప్పుడు గమనించండి, ఇప్పుడు, మనమిప్పుడు ఈ నేపథ్యాన్ని పొందడం ప్రారంభించబోవుచున్నాము, అతడు ఎక్కడ ఉన్నాడంటే, చెరసాల నుండి, దీనిని వ్రాయుచున్నాడు. మరియు అతడు ఈ అనుభవమంతటినీ కలిగియున్నాడు. అయితే, మొదట, ఈ అనుభవము ముందుగా నిరూపించబడినది, మరియు ఇది దానికి అతని యొక్క ముఖ్యమైన పత్రికయైయున్నది. ఇది అతనియొక్క కీలకమైన పత్రిక. రోమీయులకు మరియు ఎఫెసీయులకు, మరియు మొదలగు పత్రికలు, వాటి స్థానమును కలిగియున్నవి, అయితే ఇది మూలమైన పత్రికయైయున్నది.
74 ఇప్పుడు, 1వ అధ్యాయం మొత్తం యేసును హెచ్చిస్తూ, మరియు ఆయనను ప్రవక్తగా ఉండుట నుండి వేరుచేయుటయై ఉన్నది. ఇప్పుడు ఆ మొత్తం సారాంశము అదేయైయున్నది. ఇప్పుడు నేను వీలైనంత త్వరగా దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను, తద్వారా మనం ఎక్కువసేపు ఉండము. మొత్తం సారాంశము ఏమిటనగా, వేరుచేయుట-…నూతన అధ్యాయ…1వ అధ్యాయం అనేది ఏ ఇతర ప్రవక్త నుండియైనా యేసును వేరుచేయుచున్నది, లేదా ధర్మశాస్త్రము నుండైనా, లేదా అటువంటి వాటి నుండైనా వేరుచేసి, మరియు యేసు ఎవరని చూపిస్తున్నది. ఇప్పుడు చూడండి, “దేవుడు.” ఈ మొట్ట మొదటి పదంతో, మనం ప్రారంభించుదాము, “దేవుడు.”
దేవుడు, నానా-…పూర్వకాలమందు నానా సమయములలోను…
పూర్వకాలమందు అంటే “గతములో,” గడిచిన కాలం అని అర్థం.
…నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ఆ పూర్వ కాలమందు మన పితరులతో మాటలాడెను,
75 ఇప్పుడు, చూడండి, “దేవుడు, పూర్వము, నానా సమయములలో, ఆయన ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడెను.” ఆ విధంగా ఆయన తన ప్రవక్త ద్వారా, తన వర్తమానాన్ని ఇవ్వవలసియుండెను.
76 ఏలీయా, యిర్మీయా, యెషయాల వలె దేవుడు తన ప్రవక్తను పంపును. మరియు మీరు గమనించినచో, ప్రపంచ చరిత్రంతటిలో ఎన్నడూ, సంఘము ఒక ప్రవక్తను ఉత్పత్తి చేయలేదు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, లేదా ఈ దినమున, ఈ అంత్య దినములో కూడా పరిశోధించండి. ఈ అంత్య దినమున ఏ ప్రవక్తయైనా సంఘము నుండి లేచాడేమో నాకు చూపించండి. ఒక్కరైనా బయటకు వచ్చారేమో నాకు చూపించండి. మరియు ఒక ప్రవక్తను, ఒక నిజమైన దేవుని సేవకుడిని ఈ ప్రపంచంలోని మతపరమైన వ్యవస్థ, అతణ్ణి ఖండించనటువంటి, ఒక్క సమయమును నాకు చూపించండి.
77 దానిగూర్చి ఆలోచించండి. యిర్మీయా, యెషయా, ఆ పాత నిబంధనగుండా వచ్చిన వారందరినీ, వారు ఖండించారు. యేసు చెప్పాడు, “మీరు ప్రవక్తల సమాధులను అలంకరించి, వాటిని తెల్లగా చేసి, మరియు వాటిని అక్కడ ఉంచారు.” అది నిజము.
78 సంఘము దానిని కొనసాగిస్తూనే ఉన్నది. పరిశుద్ధ పాట్రిక్ ని చూడండి. అతడు మీవాడని క్యాథలిక్ ప్రజలైన మీరు చెప్పుకుంటారు. అతడు కూడా నాలాగే అసలు క్యాథలిక్ కానే కాదు. అది నిజం. కానీ మీరు అతణ్ణి మీవాడని చెప్పుకొనుచున్నారు.
79 అస్సిసియొక్క పరిశుద్ధ ఫ్రాన్సిస్ ని చూడండి. అతడు మీవాడే అని చెప్పారు. అతడు కూడా నాలాగే అసలు క్యాథలిక్ కానే కాదు.
80 జోన్ ఆఫ్ ఆర్కుని చూడండి. ఆమె దర్శనాలను చూసేది మరియు ఆత్మసంబంధి గనుక మీరు ఆమెను ఒక మంత్రగత్తెయని, ఒక కట్టెకు కట్టి కాల్చివేశారు. ఆమెను ఒక కొయ్యకు దహనం చేశారు. మరియు ఆ స్త్రీ దయ కోసం కేకలు వేయుచుండగా, వారు ఆమెను ఒక కొయ్యకు కట్టి కాల్చివేసారు. దాదాపు ఒక వంద సంవత్సరాల తరువాత, ఆమె ఒక ప్రవక్తిని అని వారు కనుగొన్నారు. ఆమె ఒక దేవుని సేవకురాలు. ఓ, అవును, మీరు ఒక పెద్ద ప్రాయశ్చిత్తాన్ని చేసారు: మీరు యాజకుల దేహాన్ని తవ్వి మరియు వాటిని నదిలో విసిరేశారు.
81 “మీరు ప్రవక్తల సమాధులను అలంకరించి, మరియు వాటిని అందులో ఉంచుచున్నారు.” నిజంగా. మతపరమైన వ్యవస్థ ఎన్నడూ ఒక్క దైవజనుని కూడా ఉత్పత్తి చేయలేదు; ఎప్పుడూ చేయలేదు, ఈ దినము కూడా లేదు, మరియు ఎన్నటికీ చేయదు. సంస్థాగతమైన మతము అనేది ఎన్నడూ దేవుని యొక్క ఉద్దేశములో లేదు.
82 ప్రపంచంలోని అతి పురాతన సంస్థాగత సంఘము క్యాథలిక్ సంఘము; రెండవది లూథరను సంఘము; ఆ తర్వాత జ్వింగ్లీ వచ్చెను; జ్వింగ్లీ తర్వాత, కాల్విన్ వచ్చెను; కాల్విన్, తర్వాత, ఆంగ్లికన్ వచ్చెను, ఆంగ్లో-సాక్సన్లు వచ్చిరి, పిమ్మట ఆంగ్లికన్ సంఘము వచ్చెను; మరియు ఎనిమిదవ హెన్రీ రాజు, అతడు తిరుగుబాటు చేసి, మరియు అట్లు చేసిన తర్వాత; వెస్లీ యొక్క మెథడిస్టువారు, మరియు నాజరీనువారు, పిలిగ్రిం హోలీనెస్ వరకు; మరియు చివరకు, పెంతెకోస్తువారు వచ్చిరి, వారంతా శాఖలుగా మారిపోయిరు. మరియు పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా బోధిస్తున్నదేమనగా క్యాథలిక్ సంఘము అది ఒక—ఒక చెడ్డ-స్త్రీయైయున్నది, మరియు ప్రొటెస్టంటు సంఘములు మరియు వారి సంస్థలు దాని కుమార్తెలైయున్నారు, ప్రకటన 17. అది ఖచ్చితంగా సరియే. కాబట్టి వారు…
83 ఇప్పుడు, ప్రజలు కాదు. ఆ సంఘాలన్నిటిలో మంచి; పరిశుద్ధమైన, రక్షించబడిన ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు తన ప్రజలను ఒక సంస్థ ద్వారా పిలువడు. ఆయన వారిని వ్యక్తిగతంగా పిలుస్తాడు. మీరు మెథడిస్ట్ అయినా, బాప్టిస్ట్ అయినా, ప్రొటెస్టంట్ అయినా, మరియు క్యాథలిక్ అయినా, లేదా మీరు ఇంకా ఎలాంటి వారైనా, దేవుడు వ్యక్తులతో వ్యవహరిస్తాడు. దేవుడు, జగత్తు పునాది వేయబడకముందే, నిన్ను ఎరిగియున్నాడు, మరియు నిన్ను నిత్య జీవమునకై ముందుగానే నిర్ణయించాడు, లేదా నీవు నిత్య నాశనానికి ముందుగానే నిర్ణయించబడియున్నావు. అది…
84 నీవు నశించిపోవాలని, నీవు నశించాలని ఆయన సంకల్పము కాదు. అయితే, ఆయన అనంతుడు గనుక, ఆయన ఆదిలోనే అంతమును ఎరిగియుండవలసి యున్నది, అలా కాకుంటే ఆయన దేవుడు కాడు. కావున యేసు ఎన్నడూ ఇట్లు చెప్పుటకు భూమి మీదకు వచ్చియుండలేదు, “సరే, ఎవరైనా కనికరముగలవారు ఉంటారేమో నేను చూస్తాను…నేను ఒక కఠినమైన విధానంలో, క్రియ చేసి మరియు మరణించినయెడల, బహుశా వారిట్లు తలంచవచ్చు, ‘మంచిది, నేను…’ అది—అది వారి హృదయాలను ఒప్పింపజేయవచ్చు, మరియు వారు…” దేవుడు తన పనిని అలా నిర్వహించడు.
85 యేసు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం నిమిత్తము వచ్చెను, అది, జగత్తు పునాదికి ముందే ఎవరు రక్షించబడతారని దేవుడు ఎరిగియున్నాడో, వారిని రక్షించుటకైయున్నది. ఆయన అట్లు చెప్పెను. అది నిజము. కాబట్టి మీరు…“పొందగోరువాని వలననైనను, ప్రయాసపడువాని వలననైననూ కాదు గాని, కరుణించు దేవునివలననే అగును.” పౌలు దానిని చెప్పెను. అదే మనిషి ఇక్కడ చెప్పుచున్నాడు.
86 అతడు ఇట్లు చెప్పెను, “ఏశావు లేదా యాకోబు పుట్టకముందే, అని దేవుడు చెప్పగలుగుటకు కారణం అదేయైయున్నది, ఆయన ఇట్లు చెప్పెను, ‘నేను ఒకరిని ప్రేమించితిని మరియు మరొకరిని ద్వేషించితిని.’” ఆ అబ్బాయిలలో ఒక్కరైనా పుట్టకమునుపే, ఏశావు ఒక నిజాయితీ లేని వ్యక్తి అని దేవునికి తెలుసు, మరియు యాకోబు…అతడు తన జన్మహక్కును ప్రేమించెను అని ఆయన ఎరిగియున్నాడు. కావున, అసలు ప్రపంచము నిర్మించబడక ముందే, దాని గూర్చి ఆయనకు తెలుసు. ఇప్పుడు, దానిని గూర్చి ఎరిగియున్న వ్యక్తి ఎవరో అని ఒక నిమిషంలో మనము కనుగొనబోవుచున్నాము. ఈ అధ్యాయం దానిని కలిగియున్నది.
పూర్వము,…నానా సమయములలోను మరియు నానా విధములుగాను ప్రవక్తలద్వారా…మన పితరులతో మాట్లాడిన దేవుడు,
ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను,…
ఏమి చేసెను? “ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను.”
87 ఇప్పుడు, అటువంటప్పుడు, ఒక ప్రవక్త ఎట్లుండునని, మీరు అనుకొనుచున్నారు? అలాగైతే ఈ దినము యొక్క ఒక ప్రవక్త మనకు ఉండునా? ఖచ్చితంగా. ఆయన మన ద్వారా మాట్లాడతాడా? నిశ్చయంగా. కానీ అతడు…పూర్వమందున్న ఆ ప్రవక్తలు యేసుక్రీస్తు యొక్క ఆత్మయైయున్నారు.
88 ఇప్పుడు, దానిని మనము సరిగ్గా అర్థం చేసుకుందాము, ఎందుకనగా అది సరిగ్గా నానుచున్నదని నేను అనుకోవడంలేదు. ఇప్పుడు, ఇది ఆదివారపు బడి లాగానే ఉన్నది, కాబట్టి మనము దీనిని స్పష్టంగా తెలుసుకొనగోరుచున్నాము. చూశారా?
89 గమనించండి. మోషేలో ఉన్న దేవుని ఆత్మను తీసుకుందాము, పరిపూర్ణముగా…అది యేసుక్రీస్తుకు ముంగుర్తైయున్నది. పాత నిబంధనలోని పాత్రలన్నియు, సిలువను సూచిస్తున్నారు. మోషే, సుందరునిగా జన్మించాడు, జమ్ము పెట్టెలో దాచబడి, అతని తల్లిదండ్రుల నుండి దూరంగా తీసుకొనిపోబడ్డాడు, మరి ఆ విధంగా జరిగెను, మరియు అతడు…అతను ఒక రాజు, లేదా ఒక—ఒక నాయకుడు, ధర్మశాస్త్రాన్ని-తెచ్చినవాడు, మధ్యవర్తి, యాజకుడు. అతడు ఏమైయ్యుండెనో అదంతయూ క్రీస్తును చూపించెను.
90 యోసేపును చూడండి, తన తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడు, తన సహూదరుల ద్వారా ద్వేషించబడ్డాడు, మరియు దాదాపు ముప్పై వెండి నాణాలకు అమ్మివేయబడ్డాడు. ఒక గోతిలోనికి విసిరివేయబడ్డాడు, చనిపోయినవానిగా ఎంచబడ్డాడు, బయటకు తీయబడ్డాడు. అతని శ్రమలో, పానదాయకుడు రక్షించబడ్డాడు, మరియు భక్ష్యకారుడు నశించిపోయాడు; సిలువ వద్ద ఇద్దరు దొంగల వలె ఉన్నది. ఆపై అతను బయటకు వచ్చినప్పుడు, అతను ఆ గోతిలోనుండి లేచి, మరియు ఫరో యొక్క కుడి వైపున ఉంచబడ్డాడు, అతిపెద్ద వాణిజ్య…ఆ—ఆ—ఆ దేశం ప్రపంచం మొత్తం మీద కొరడా ఝులిపించిన దేశం. మరియు వారు యోసేపు ద్వారా వస్తేనే తప్ప ఏ మనుష్యుడును ఫరో వద్దకు రాలేడు; యేసు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, మరియు క్రీస్తు ద్వారా తప్ప ఏ మనుష్యుడును దేవుని వద్దకు రాలేడు. మరియు యోసేపు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి బయలుదేరినప్పుడు, మనుష్యులు కేకలు వేస్తూ, మరియు బూరలు ఊదుచూ అతనికి ముందు వెళ్ళేవారు, ఇట్లు చెప్పుచూ, బూరను ఊదేవారు, “మోకరించండి! యోసేపు వస్తున్నాడు.”
91 మరియు యేసు వచ్చినప్పుడు, ఒక బూర మ్రోగును, మరియు ప్రతి మోకాలు వంగును, మరియు ప్రతి నాలుకయూ ఒప్పుకొనును. అవును, అయ్యా. అక్కడే ఆయన ఉన్నాడు.
92 మరియు యోసేపు మరణించినప్పుడు, విడుదల కోసం ఎదురుచూస్తున్న వారికి అతడు ఒక జ్ఞాపకార్థమును విడిచిపెట్టాడు.
93 ఇక్కడ కొద్ది కాలం క్రితం, నేను ఆ పాత శవపేటికపై నా చేతిని ఉంచాను, అది సీసంతో తయారు చేయబడినది. మరియు అతని శరీరం అలాగే ఉండవలసి యున్నది…అతని ఎముకలు…ఇట్లు చెప్పెను, “మీరు నన్ను ఇక్కడ పాతిపెట్టకండి, ఎందుకనగా ఏదో ఒక దినమున, దేవుడు మిమ్మును దర్శించబోవుచున్నాడు.” అతను ఒక ప్రవక్తయైయుండెను. “దేవుడు మిమ్మును దర్శించబోవుచున్నాడు.” మరియు ఇట్లు చెప్పెను, “మీరు వాగ్దాన దేశమునకు వెళ్ళునప్పుడు, నా ఎముకలను తీసుకొని వెళ్ళండి.”
94 కొట్టబడిన వీపు మరియు రక్తముతోనున్న, ప్రతీ హెబ్రీయుడు కూడా, ఆ పేటికలోనికి చూసి ఇలా చెప్పగలడు, “ఏదో ఒక దినమున, మనము బయటకు వెళ్తాము.”
95 యేసు ఒక జ్ఞాపకార్థమును విడిచి పెట్టెను, ఒక ఖాళీ సమాధి. ఏదో ఒక రోజు మనము, మరియు మన ప్రియమైన వారు, సమాధి వద్దకు వెళ్ళినప్పుడు, మరియు ఆ తెలివి తక్కువ వారు, ఇట్లు చెప్పడం వింటాము, “బూడిదకు బూడిద, మరియు ధూళికి ధూళి, మరియు మట్టికి మట్టి.” కానీ, సహూదరుడా, మనము ఆ సముద్రమునకు ఆవలిన, ఒక ఖాళీ సమాధి వైపుకు చూడగలము. ఏదో ఒక రోజు, మనము ఇక్కడ నుండి బయటకు వెళ్ళుచున్నాము. మనము ఇంటికి వెళ్ళుచున్నాము. ఆయన వచ్చుచున్నాడు. ప్రతిదీ మాదిరిగా చూపించబడినది.
96 దావీదును చూడండి, తన స్వంత ప్రజల చేత తిరస్కరించబడ్డాడు, తన స్వంత ప్రజల చేత సింహాసనం నుండి తొలగించబడ్డాడు. యెరూషలేముకు రాజైయ్యుండి, తన స్వంత ప్రజల చేత యెరూషలేము నుండి తరిమివేయబడ్డాడు. మరియు అతడు ఒలీవ కొండ పైకి వెళ్ళినప్పుడు, అతడు వెనక్కి తిరిగి చూసి ఏడ్చాడు. అతడు తిరస్కరించబడ్డాడు.
97 అప్పటి నుండి ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత, దావీదు కుమారుడు, యెరూషలేము రాజు, ఒక కొండపై కూర్చొని మరియు ఏడ్చాడు, ఎందుకనగా ఆయన తిరస్కరించబడ్డాడు.
98 అది దావీదులోనున్న క్రీస్తు యొక్క ఆత్మ. అంతయూ సిలువను ముందుగా సూచించెను. అక్కడ ఆ వెనుకటి ప్రవక్తలు ఆయన నామములో మాట్లాడారు. ఆయన నామములో జీవించారు. ఆయన నామములో క్రియ చేసారు. నిశ్చయంగా. “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, అయితే ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాటలాడెను.”
99 కాబట్టి ఈనాటి, ప్రవక్తలు మరియు ఆత్మ సంబంధమైన వ్యక్తులు, సరిగ్గా క్రీస్తు యొక్క ప్రతిబింబమైయున్నారు. అక్కడ, వారు ధర్మశాస్త్రం ద్వారా నిలబడ్డారు, చూశారు. ఇక్కడ, వారు కృప ద్వారా నిలబడి, వెనుకకు చూస్తున్నారు.
100 అది హెబ్రీ పత్రిక 11లో, చివరి అధ్యాయము, నేను దాని విషయమై చాలా సార్లు ఆశ్చర్యపోయాను. చివరి అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము యొక్క చివరి భాగంలో, అతడు అబ్రాహామును గూర్చి మాట్లాడినప్పుడైయున్నది. అది గొప్ప విశ్వాసపు అధ్యాయము, మరియు దాని ముగింపులో, అతడిట్లు చెప్పెను, “వారు గొఱ్ఱె చర్మములను మేక చర్మములను ధరించుకొని, దరిద్రులుగా చేయబడి, రంపముతో కోయబడిరి. వెళ్ళుటకు ఏ చోటు లేక, వారు తిరుగులాడుచు సంచరించిరి, ద్వేశించబడిరి, తృణీకరించబడిరి మరియు హింసించబడిరి. అట్టి వారికి, ఈ లోకము యోగ్యమైనది కాదు.”
101 పిదప పౌలు నిలబడి మరియు ఇట్లు చెప్పెను, “కానీ మనము లేకుండ వారు సంపూర్ణులు కాలేరు.” ఎందుకంటే వారు సిలువ వైపునకు మాత్రమే చూశారు, మరియు మనమైతే సిలువ ద్వారా చూస్తున్నాము. అది మానవ శరీరంగా మారి, మరియు మన మధ్య నివసించిన తర్వాత క్రీస్తు యొక్క ఆత్మను మనము కలిగియున్నాము. మనము పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడికి వచ్చియున్నాము, అది ఎంతో మెరుగైన ప్రణాళికయైయున్నది.
102 మరియు ఈనాడు క్రైస్తవ్యము ఏమి ఆశిస్తుందో అని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతుంటాను. ఒక పట్టణములోనికి…లేదా ఒక నూతన సంఘములోనికి లేదా ఒక నూతన అధికారములోనికి వెళ్ళే ఒక బోధకుడు, తనను తాను ఒక ప్రవక్తగా పిలుచుకుంటాడు, అక్కడికి నడిచివెళ్ళి, ఇట్లంటాడు, “సరే, వారు నాకు ఇంత డబ్బు ఇస్తే చాలు. నేనొక మంచి కారును కలిగియుండగలిగితే చాలు. వారు ఒకవేళ…ప్రతీ ఆరు నెలలకోసారి నా జీతం పెంచినచో చాలు.”
103 మనము శ్రేష్ఠమైన వాటిని కలిగియుండాలి. మనకు ఉత్తమమైన గృహాలు ఉండాలి. మనకు మంచి బట్టలు ఉండాలి. మేకతోలు, గొర్రె చర్మాలతో సంచరించి, వారికి తల వాల్చుటకైనా స్థలము లేక ఎడారులలో సంచరించిన, వారి సమక్షంలో మనం నిలబడినప్పుడు, మనము ఏమి చేసెదము? మరియు ఎవరైనా మనల్ని ఎగతాళి చేసినచో మనము సంఘాన్ని విడిచిపెట్టి మరియు ఇక ఎన్నడూ తిరిగి వెళ్ళకుండుటకు సిద్ధంగా ఉంటాము. నేడు క్రైస్తవ్యానికి ఏమి కావాలి. మన విషయమై మనం సిగ్గుపడవలసి యున్నది.
ఓ దేవా, మమ్మల్ని కనికరించుము.
104 ఆ దినమున, ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కానీ ఈ దినమున తన కుమారుని ద్వారా మాట్లాడాడు. అక్కడ, అది ఒక ప్రవక్త యొక్క మాట. ఈనాడు, ఇది కుమారుని యొక్క మాటయైయున్నది. ఓ, ప్రభువు నామము స్తుతింపబడును గాక!
105 మరో మాటలో చెప్పాలంటే, మీరు ఆ నీడవైపు, ఆ ఛాయవైపు చూస్తున్నట్లయితే, మీరు పొరపాటు చేయవచ్చు. కానీ ఇది మెరుగుపరచబడినది, చిత్రము స్పష్టంగా ఉన్నది. అది ప్రవక్త ద్వారాయైయున్నది; ఇది ఆయన కుమారుని ద్వారాయైయున్నది. అది ఛాయ ద్వారాయైయున్నది; ఇది నిజరూపము ద్వారాయైయున్నది. ఆమేన్. మీరు దానిని చూశారా? తప్పిపోయే అవకాశమే లేదు. ఈ దినమున ఆయన కుమారుని ద్వారా, అది ఒక నిజరూపమైయున్నది. ఓ, అది ఎంత అద్భుతం!
…ఆయన ఆ కుమారుని వారసునిగా నియమించెను…(ఓ, మై!)…సమస్తమునకు వారసునిగా,…
106 అది ఏమిటి? అది ఒక నియామకము. ఓ, వినండి. ఆయన, అనగా క్రీస్తు, సమస్తమునకు వారసునిగా నియమించబడ్డాడు. ఓ, ఏదేను తోట నుండియే, అపవాది దానిని ఎరిగియున్నాడు, మీరు చూడండి, ఆ ప్రజల యొక్క తీర్పులో, ఆ దినమున అక్కడ ఆ మాటను, అపవాది వినినప్పుడైయున్నది. ఇట్లు చెప్పెను, “మంటినుండి నీవు తీయబడితివి, గనుక నీవు తిరిగి మన్నైపోదువు; మరియు స్త్రీ సంతానం సర్పము యొక్క తలను చిదగగొట్టును.” వాగ్దానం చేయబడిన ఒక విత్తనము.
107 ఆ సంతానం కోసం సాతాను నిరంతరమూ గమనించెను. హేబెలు జన్మించినప్పుడు, వాడు ఇట్లన్నాడు, “అదిగ్గో నీవక్కడ ఉన్నావు, అదియే ఆ విత్తనము.” మరియు వాడు హేబెలును చంపెను. వాని కుమారుడు, కయీను, హేబెలును చంపెను. మరియు హేబెలు చనిపోయిన వెంటనే, వాడు ఇట్లన్నాడు, “నేను ఆ విత్తనమును పట్టుకున్నాను.” వాడు దానిని చంపాడు. వాడు ఇట్లన్నాడు, “నేను దానిని పట్టుకున్నాను.” అయితే, హేబెలు మరణమునకు, షేతు యొక్క జననం తిరిగి పునరుత్థానమై యున్నది. వారు ఎలా క్రిందకు వచ్చిరో గమనించండి.
108 షేతు యొక్క వంశావళి, దీనులైన, నీతిమంతులగు వ్యక్తులు, వచ్చిరి; హనోకు నుండి; నోవహు నుండి, జలప్రళయం ముగింపు వరకు వచ్చినది.
109 కయీను యొక్క వంశావళిని చూడండి, తెలివైన వ్యక్తులు, విద్యావంతులు, విజ్ఞాన శాస్త్రమెరిగిన వారైరి. పరిశుద్ధ గ్రంథము చెప్పుటలేదా…యేసు చెప్పలేదా, అదేమనగా, “రాజ్యము యొక్క కుమారులకంటె ఈ లోకము యొక్క కుమారులు యుక్తిపరులై యున్నారు”? నేడు కూడా కయీను వైపు వారిని చూడండి: తెలివైనవారు, విద్యావంతులు, సంశయవాదులు, చాలా మతపరమైనవారు; చూడండి, చాలా మతపరమైనవారు, కానీ శాస్త్రవేత్తలు, భవన నిర్మాణుకులు, గొప్ప వ్యక్తులు.
110 అలాంటి గొప్ప వ్యక్తులను తీసుకోండి. థామస్ ఎడిసన్ ను చూడండి, చాలా మంది గొప్ప వ్యక్తులు. ఐన్‌స్టీన్‌ను చూడండి, ఈ లోకము యొక్క మెదడులు, వారు ఈనాడు, అట్లు-పిలవబడుచున్నారు, ప్రపంచము యొక్క మెదడులు. కానీ మనము మెదడును ఉపయోగించుటకు ప్రయత్నించము. మనము క్రీస్తులో ఉన్న మనస్సును మనలో ఉండనిస్తాము, మరియు ఈ వాక్యము వైపుకు చూసి, మరియు దానిని అట్లే చెప్తాము.
111 వైద్యశాస్త్రపు వైద్యులు, మనము కలిగియున్న వేటితోనైనా మనము వారికి ప్రణామము చేసినప్పటికీ, అయిననూ వారిలో అనేకులు సంశయవాదులు, హేతువాదులై యున్నారు. ఈనాడు తెలివైన మరియు మేధావులైన ప్రజలను చూడండి. వారు అక్కడ ఆ వైపున, కయీను వైపున ఉన్నారు.
112 అయితే దీనులు మరియు సాత్వీకులైనవారిని చూడండి. అక్కడే మళ్ళీ మీ పునరుత్థానము ఉన్నది. ఓ, ప్రభువు యొక్క నామము స్తుతింపబడును గాక! అక్కడే మీరు ఉన్నారు. గమనించండి.
…ఆయన అతణ్ణి సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను;
ప్రపంచములను ఎవరు నిర్మించారు? క్రీస్తు. “క్రీస్తు ప్రపంచములను సృష్టించాడా?” అవును, అయ్యా. మనము మరి కొంచెం ముందుకు వెళ్దాము.
ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, మరియు ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునైయుండి,…
ఎవరి మహిమయొక్క తేజస్సు? దేవుని యొక్క మహిమ. ఎవరి తత్వము యొక్క మూర్తి మంతము? దేవుని తత్వము. ఓ, నేను దీన్ని ప్రేమిస్తున్నాను!
…లేక ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునైయుండి, తన మాటచేత సమస్తమును నిర్వహించుచు…
అక్కడే మీరు ఉన్నారు. సమస్తమును నిర్వహించే, వాక్యము. మత్తయి 24లో, యేసు ఇట్లు చెప్పెను, “ఆకాశమును భూమియు గతించును గాని, నా మాటలు ఏ మాత్రమును గతింపవు.” ఆయన అన్నింటిని నిర్వహిస్తాడు.
113 విజ్ఞాన శాస్త్రము దానిని అనగద్రొక్కటానికి ప్రయత్నించుచూ, మరియు ఇట్లు చెప్పుచున్నది, “ఇది ఒక పాత పుస్తకము. ఇది అనువదించబడినది.”
114 రోమన్ క్యాథలిక్ సంఘము, బిషప్ షీన్ కూడా ఇట్లన్నాడు, “అది నాలుగు లేదా ఐదు వేర్వేరు సార్లు అనువదించబడినది, మరియు దానితో అంత విషయమేమీ లేదు. మీరు దాని ద్వారా జీవించవలసినయెడల మీరు జీవించలేరు.” కానీ ఆయన తన వాక్యం ద్వారా అన్నిటినీ నిర్వహిస్తాడు. ఆమేన్. దాని విషయమై నేను అదే అనుకుంటాను. నేను బైబిలు గ్రంథాన్ని నమ్ముచున్నాను.
…తన మహత్తుగల మాటచేత, (ఆయన మాటలో శక్తి ఉన్నది), మన పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి,…(ఇక్కడ చూడండి)…శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను;
115 పౌలు ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నాడు? దేవుడు క్రీస్తులో సమస్తమును సంకల్పించాడని, మరియు క్రీస్తు దేవుని యొక్క మూర్తిమంతమైయున్నాడని చూపించుటకు అతడు ప్రయత్నిస్తున్నాడు. ఆ మిగతా అధ్యాయమంతా ఆయన ఏ విధంగా దేవదూతల కంటెను, సమస్త అధికారముల కంటెను గొప్పవాడు అన్న దానితో వ్యవహరించును. దేవదూతలు ఆయనను ఆరాధించారు. పౌలు ఆయనను ఘనపరచడానికి ప్రయత్నిస్తున్నాడు.
116 ఇప్పుడు, నేను ప్రయత్నించగోరుచున్నాను…నేను ఇంతకంటే ముందుకు వెళ్ళలేకపోయినచో, ఆ మిగతాదంతా కేవలం క్రీస్తును ఘనపరచడమేయైయున్నది. పౌలు ఇక్కడ ఏమి చెప్పుచున్నాడంటే, 11వ అధ్యాయంలో వలెనే, మరియు అంతా ప్రపంచము గురించి మాట్లాడెను. అతడు ఇట్లు చెప్పెను, “‘నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను’ అని ఆయన ఏ—ఏ దూతతో చెప్పెను?” చూశారా?
117 “ప్రపంచము యొక్క అంతమందు, అవి నశించిపోవును. లోకము నశించును. కానీ ఆ…మరియు లోకపు సంగతులన్నియు గతించును. ఆయన ఉత్తరీయమువలె వాటిని మడిచివేయును. అవి పాతగిల్లి, మార్చబడి, మరియు గతించిపోవును. ‘కానీ నీవు నిలిచియుందువు. నీవు ఎప్పటికీ నిలిచియుందువు. నీవు నా కుమారుడవు. నేను నేడు నిన్ను కనియున్నాను, మరియు ఎన్నటికి నశించవు, మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చునియున్నావు.”’
కుడి పార్శ్వము అనగా ఏమిటి? దేవునికి ఒక కుడి చెయ్యి ఉండి, దానిపై ఎవరో కూర్చునియున్నారని కాదు. కుడి చేయి అనగా “శక్తి మరియు అధికారము,” భూమి మీదను మరియు పరలోకములోను ఉన్న ప్రతిదానిపై అధికారాన్ని కలిగియున్నాడు. మరియు సమస్త ఆకాశములు మరియు భూమియు ఆయనచే సృష్టించబడినవి.
118 ఇప్పుడు, ఈ గొప్ప పురుషుడు, ఈ గొప్ప వ్యక్తి ఎవరు, క్రీస్తా? ఇక్కడ, తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మలో ఉన్న దేవుడు, అది…ఇది ఒక త్రిత్వము, కానీ ఇది వ్యక్తుల యొక్క త్రిత్వము కాదు. ఇది ఒక్క దేవుని యొక్క, కార్యాలయపు త్రిత్వము.
119 ఆయన ఇశ్రాయేలు పిల్లలను నడిపించుచూ తండ్రిగా ఉండెను. ఆ గొప్ప యెహోవా తండ్రి, అది ఆయన యొక్క కార్యాలయమైయున్నది. మరియు ఆయన భూమిపై నివసించాడు, కుమారుడిగా పిలువబడ్డాడు. మరియు ఇప్పుడు ఆయన తన సంఘములో జీవిస్తున్నాడు, పరిశుద్ధాత్మగా పిలువబడుచున్నాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు; మూడు కార్యాలయాలలోనున్న ఒక్క దేవుడు: తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ.
తండ్రి అయిన దేవుడు అని, ప్రజలు దేవుడిని ముగ్గురు వేర్వేరు దేవుళ్ళుగా చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ కారణముచేతనే, యూదులు, మీరు ఎన్నడూ, మీరు ఎన్నడూ దీనిని ఒక యూదుని వద్దకు తీసుకురాలేరు, లేదు, దానినక్కడకు తీసుకెళ్ళలేరు. అతడు అలా చేయలేడు. అతనికి ఒక ఆజ్ఞ ఇవ్వబడినది, అదేమనగా, “నేను ఒక్క దేవుడను.” ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు.
120 ఆఫ్రికాలో వారు మూడు రకాలుగా బాప్తీస్మము ఇస్తారు: వారు తండ్రి కొరకు ఒకసారి, కుమారుని కొరకు ఒకసారి, మరియు పరిశుద్ధాత్మ కొరకు ఒకసారి బాప్తీస్మము ఇస్తారు. అపోస్టోలిక్ ఫెయిత్ మిషనువారు, ఆయన మరణాన్ని సూచిస్తూ, ముఖము ముందుకి ఉంచి, మూడుసార్లు బాప్తీస్మము ఇస్తారు. పశ్చిమ కోస్తా, లేదా తూర్పు కోస్తాలో, సంపూర్ణ సువార్త అని పిలువబడువారు, మూడు సార్లు వెనుకకు బాప్తీస్మము ఇస్తారు, ఆయన…అది ఆయన సమాధిని సూచిస్తుంది అని చెప్తారు.
మరియు అతడిట్లన్నాడు, “ఆయన మరణించినప్పుడు, ఆయన ముందుకు పడిపోయెను.”
121 మరొక వ్యక్తి ఇలా చెప్పెను, “ఆగండి. మీరు ఒక వ్యక్తిని తన వీపు పై పాతిపెట్టాలి.” అవి కేవలం చిన్న ప్రాచీన సాంకేతిక విషయాలు, మరి, వారిద్దరూ తప్పై యున్నారు; లేఖనానుసారముగా, వారిరువురూ తప్పైయున్నారు.
ఇది ఉరీము తుమ్మీము, ఇది దానిని స్థిరపరుస్తుంది.
122 ఇప్పుడు, ఇక్కడ, దానిని మనము చిత్రీకరిద్దాము మరియు ఈ రాత్రి, అది ఎలా—ఎలా కనిపిస్తున్నదో మనము చూద్దాము. మీరు దానిని చూడాలనుకుంటే, ఇదిగో అది ఇక్కడ ఉన్నది. మొత్తం మీద దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నేను సేవకునిగా ఉన్నాను, నేను దానిని అధ్యయనం చేసాను. మరియు సంఘములోని వరములను గురించి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. ఆ వరములు ఏమిటి? ప్రవచనము, భాషలతో మాట్లాడడం, భాషలకు అనువాదము చెప్పటం, దైవిక ప్రత్యక్షత, మొదలగునవి, అవన్నియూ క్రీస్తు ద్వారానే వచ్చును.
123 ఇప్పుడు చూడండి. క్రీస్తు సమస్త కార్యములకు శిరస్సైయున్నాడు. మరియు ఆయన సంఘమునకు శిరస్సైయున్నాడు. మరియు మీరు ఎన్నడైనా ఒక పెద్ద వజ్రాన్ని చూశారా? సరిగ్గా కత్తిరించబడిన ఒక పెద్ద గొప్ప వజ్రము, దాని నుండి విడగొట్టబడినట్టి, దాని నుండి కత్తిరించబడినట్టి, చిన్న చిన్న ముక్కలను అది కలిగియుంటుంది. అదియే సరైన వజ్రమును తయారు చేస్తుంది. ఆ ముక్కలు దేనికొరకు? ఒక నిజమైన వజ్రము, అది బయటకు వచ్చే మార్గమేదనగా, ఒక నిజమైన వజ్రము; అది కనుగొనబడినప్పుడు, అది కొట్టబడుతుంది.
నేను కింబర్లీలో ఉన్నాను. ఆ వీధిలో వజ్రాలను ఏరుకొనవచ్చని, మీరు, మీలో చాలా మంది, వినియున్నారు, అది నిజమే. బిల్లీ మరియు నేను, మరియు మిస్టర్ బోస్వర్త్ ఉన్నాము. కింబర్లీ వజ్రాల గని యొక్క అధ్యక్షుడు, తీసుకొని వెళ్ళెను…అక్కడ జరిగిన కూటములో అతడు నా ద్వారపాలకుడు. మరియు వారు మమ్మల్ని అచ్చటకు తీసుకొనివెళ్ళారు. మరియు కేవలం…వారు వాటిని దాదాపు, ఓ, దాదాపు భూమి క్రింద పదిహేడు వందల అడుగుల వరకు త్రవ్వుతారు. అవి బయటకు వచ్చెను, ఒక నీలిరంగు రాయి, ఇక్కడ మీకు దొరికే నీలిరంగు రాయివంటి, పెద్ద నీలిరంగు రాయి. మరియు ఆ స్థానికులు, వాటి ధరను పెంచడానికి, వారు త్రవ్వి, భూమిలో పదిహేడు వందల అడుగుల లోతున వాటిని పెడతారు. మీరు అక్కడ నది వద్దకు వెళ్ళినచో, వందల మైళ్ళ వరకు వారు దానికి కాపలాను ఉంచుతారు. పది-గ్యాలన్ల బకెట్లు, రెండు తీసుకొని, మరియు పూర్తిగా—ఇసుకతో నింపి, దానిని తీసుకొనండి, మరియు మీరు దానితో ఇంటికి చేరుకోగలిగితే చాలు, మీరు ఒక కోటీశ్వరుడు అవుతారు, అందులో అనేక వజ్రాలు ఉంటాయి అని అతడు చెప్పాడు. కానీ వాటి ధరను అలాగే అధికముగా ఉంచుటకు, వారు పనిచేసి మరియు వాటిని త్రవ్వి పెట్టవలసియున్నది.
124 ఇప్పుడు, వజ్రము, అది బయటకు వచ్చినప్పుడు, అది కేవలం ఒక పెద్ద, నున్నటి, గుండ్రని, గాజు ముక్క వంటిది. ఒక నీలపు వజ్రము ఉంటుంది, నల్లని వజ్రము, పచ్చనిది, మరియు ఒక స్పటికమైన వజ్రము, తెల్లని వజ్రము ఉంటుంది. కానీ అది బయటకు వచ్చినప్పుడు…పిదప అది తయారు చేయబడి మరియు ఉపయోగించబడునప్పుడు, ఆ వజ్రము ఒక భాగమును కోల్పోవలసియున్నది. మరియు అది దానిలోనుండి ఆ—ఆ ముక్కలను కోల్పోవలసియున్నది. చిన్న ముక్కలను కొట్టివేయుదురు, ఎందుకనగా, అది నేరుగా కాంతిలోనికి, అలా, వచ్చినప్పుడు, అది మెరుస్తుంది. ఆ ముక్క, ఆ మెరుపును తెచ్చేది ఏమిటనగా, అది కత్తిరించబడిన విధానమే. అది కత్తిరించబడినది, ముక్కలు చేయబడినది, మరియు పిదప, అట్లు చేయబడినప్పుడు, అది ఒక కాంతిని ప్రకాశింపజేస్తుంది. మరియు ఒకటి పచ్చని కాంతిని, మరొకటి నీలపు కాంతిని, మరియు బహుశా మరొకటి, పసుపు పచ్చని కాంతిని, మరియు ఎర్రని కాంతిని ఇస్తుంది. మరియు ఒక వర్షధనస్సు వలె, దాని నుండి వివిధ రకమైన వెలుగులు విరజిల్లుతాయి. “వజ్రములో అగ్ని,” అని వారు దానిని అంటారు.
125 ఇప్పుడు, ఆ కాంతులలో ప్రతి ఒక్కటి వరములను సూచిస్తుంది. అయితే, అది, క్రీస్తు మాత్రమే ఆ వజ్రమైయున్నాడు. మరియు లోకానికి ఒక వెలుగు వలె తనను తాను తిరిగి ప్రతిబింబించుకొనునట్లు, వచ్చి, మరియు నలుగగొట్టబడి, మరియు గాయపరచబడి, మరియు ముక్కలు చేయబడినది ఆయనే. ఆయనే ఆ మాస్టర్ వజ్రమైయున్నాడు.
126 మీరు ఊహించగలరా, భూమి అనేది ఒకటి లేకముందే, వెలుగు అనేది లేకముందే, నక్షత్రం అనేది ఒకటి లేకముందే, ఏదీ లేకముందే? ఆత్మ యొక్క ఒక గొప్ప ఊట, ప్రవహించుచుండెను, మరియు ఈ ఊట నుండి అత్యంత స్వచ్ఛమైన ప్రేమ వచ్చినది, ఎందుకనగా దాని నుండి రావడానికి ప్రేమ తప్ప మరేమియు లేదు. ఇప్పుడు, మనము, ఈ దినమున, మనము ప్రేమ అని దేనినైతే పిలుస్తున్నామో, అది వంకర చేయబడిన ప్రేమ. అయితే మనము కేవలం దానియొక్క సారాన్ని పొందుకున్నచో, లేదా ఆ ప్రేమలో కొద్ది భాగాన్ని పొందుకున్నచో, అది మన మొత్తం అభిప్రాయాన్నే మార్చేస్తుంది.
127 అప్పుడు ఈ ప్రధాన ఊటనుండి, ఈ వజ్రమునుండి, అక్కడ నుండి మరొక కాలువ వచ్చినది, మరియు అది నీతి అని పిలువబడినది, సంపూర్ణముగా నీతియే. ఇప్పుడు, అందునిమిత్తమే మనము ధర్మశాస్త్రాన్ని కలిగియుండవలసి యుండెను. ఆ కారణం చేతనే ధర్మశాస్త్రం తీర్పును కలిగియుండవలసి యున్నది. ఏ తీర్పు అయినా ధర్మశాస్త్రమును అనుసరించనిచో, అప్పుడు ధర్మశాస్త్రము ఏ మంచి చేయదు. మరియు ధర్మశాస్త్రము ద్వారా తీర్పు తీర్చబడినప్పుడు, అది మరణాన్ని తీసుకు వస్తుంది, మరియు స్వయంగా దేవుడే తప్ప ఆ అపరాధ రుసుమును చెల్లించువారెవరూ లేరు. మరియు ఆయన మన మరణముకు అపరాధ రుసుమును చెల్లించాడు, మరియు మనము ఆయన ద్వారా దేవుని నీతి అగునట్లు, మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు.
128 ఇప్పుడు, ఈ గొప్ప వెలుగులు బయటకు వెళ్ళినప్పుడు, లేదా ఆత్మ యొక్క గొప్ప కిరణాలు: ప్రేమ, శాంతి, అక్కడున్నవన్నియూ, అవే. అక్కడ బాధ అనేది లేదు. ఏ—ఏ ద్వేషము లేనే లేదు, ఏ కక్ష లేదు; ఈ ఊట నుండి అవి రాలేవు. అది యెహోవా. అది యెహోవా దేవుడు. మరియు ఇప్పుడు, వేదపండితులు దీనిని పిలుస్తున్నట్లుగా, దానిలోనుండి ఒక థియోఫనీ బయటకు వెళ్ళెను, మరది, లేఖనములో, ఆ “లోగోస్,” అని పిలువబడినది, దేవుని నుండి బయటకు వెళ్ళిన లోగోస్. దీనిని వివరించటం కష్టం, కానీ అది దేవుని యొక్క ఒక భాగము.
129 ఇప్పుడు, ఏమి జరిగినదంటే. ఓ! మన్నించండి. నేను—నేను—నేను దీనిలోనికి వచ్చాను, నేను దేనినైతే ప్రేమిస్తానో సరిగ్గా అక్కడికి ఇది నన్ను తీసుకొనివచ్చును. చూశారా? ఆ లోగోస్, మరియు ఈ గొప్ప ఊట, ఆదియు లేదా అంతమును లేని ఈ గొప్ప ఆత్మ యొక్క ఊట; ఈ గొప్ప ఆత్మ, సృష్టిలో ఏర్పడటం ప్రారంభించినది, మరియు దాని నుండి బయటకు వెళ్ళిన లోగోస్ దేవుని యొక్క కుమారుడు. ఆ ఆత్మ కలిగియున్న ఏకైక దృశ్యరూపం అదే. మరియు అది ఒక థియోఫని, అనగా ఒక శరీరము, మరియు ఆ శరీరము ఒక మానవునిలా ఉండెను.
130 అది ఆ బండ ప్రక్కగా—ప్రక్కగా వెళ్ళినప్పుడు…మోషే దానిని చూశాడు. మరియు అతడు దానివైపు చూసి, ఇట్లన్నాడు, “అది ఒక మనిషి యొక్క వెనుక భాగం వలె కనిపించినది.”
అది మనం ఇక్కడ చనిపోయినప్పుడు మనం పొందుకునే శరీరం వంటిదేయై యున్నది. “భూసబంధమైన ఈ గుడారము శిథిలమైపోయినను, ఇదివరకే మన కొరకు ఒకటి వేచియున్నది.” అదియే అది. మరియు అది దేవుని యొక్క కుమారుడైన థియోఫనీయై యున్నది. మనము శరీరములో ఉంచబడ్డాము గనుక, ఆ కుమారుడు, ఆ లోగోస్, శరీరధారిగా మారెను. మరియు ఆ థియోఫని, ఆ లోగోస్, ఇక్కడ మన మధ్య, శరీరముగా మారెను, మరియు అది నివాస స్థలమే గానీ మరొకటి కాదు, ఎందుకనగా ఆ ఊట మొత్తం ఆయనలో నివసించెను. ఓ, మీరు దానిని చూస్తున్నారా? అది అక్కడ ఉన్నది. ఆయనే ఆ వ్యక్తి, ఆ, యొక్క…
131 ఇక్కడ చూడండి. ఇప్పుడు వెంటనే హెబ్రీ పత్రిక, 7వ అధ్యాయానికి త్రిప్పుదాము, దేవుని చిత్తమైయ్యుండగా, కేవలం ఒక్క—ఒక్క క్షణము కృప నిమిత్తమైయున్నది. ఇక్కడ అది ఎలా ఉన్నదో మనం చూద్దాం. అబ్రాహాము!
మనకు ఎంత సమయం ఉన్నది? మనకు పది నిమిషాలు ఉన్నాయి. సరే. మనము దీనిని చూద్దాము, పిదప తర్వాత, తర్వాత, లేదా ప్రభువు చిత్తమైతే ఆదివారము దానిని ముగించుదాము.
132 అబ్రాహాము రాజులను సంహరించి తిరిగి వచ్చుచుండెను.
ఏలయనగా ఈ మెల్కీసెదెకు, షాలేము రాజు,…
షాలేము అనగా ఎక్కడ, ఎవరు, ఏమిటి అన్నది ఎంతమందికి తెలుసు? యెరూషలేము.
…షాలేమురాజును, మహోన్నతుడగు దేవుని యొక్క రాజకుమారుడు, రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో;
వినండి.
యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో; అతని పేరుకు మొదట నీతికి రాజనియు,…తరువాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము;
అతడు తండ్రిలేనివాడును, తల్లిలేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి;…
133 షాలేము నుండి ఒక రాజు వచ్చి, మరియు రాజులను సంహరించి వచ్చుచున్న అబ్రాహామును కలుసుకొనెను. మరియు ఈ రాజునకు తండ్రి లేడు, తల్లి లేదు, జీవితకాలమునకు ఆదియైనను లేదా జీవమునకు అంతమైనను లేదు. అబ్రాహాము ఎవరిని కలుసుకొనెను? ఇప్పుడు ఆలోచించండి. ఆయనకి ఏ తండ్రి లేడు; ఆయనకి ఏ తల్లి లేదు. ఆయన ప్రారంభమైన ఒక కాలము లేదు, మరియు ఆయన అంతమయ్యే ఒక సమయము లేదు, కావున అదే షాలేము రాజు నేడునూ జీవించుచుండవలసి యున్నది. ఆమేన్. మీరు దానిని చూశారా? అది ఆ దేవుని కుమారుడైయున్న ఆ థియోఫనీయైయుండెను. ఏ షాలేము? అది పైనున్న ఆ యెరూషలేము, అది అబ్రాహాము, ఆశీర్వదించబడినవాడై, దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడైయున్నాడో, ఆ పట్టణము కొరకు ఎదురుచూసినదై యున్నది. అతడు గొర్రె చర్మములను మరియు మేక చర్మములను వేసుకొని, ప్రతిచోటా సంచరించాడు, నిరాశ్రయుడై, సంచరిస్తూ, దేవుడు దేనికి శిల్పియూ నిర్మాణకుడైయున్నాడో ఆ పట్టణం కొరకు ఎదురుచూశాడు. మరియు అతడు తిరిగి వచ్చుచుండగా, ఆ షాలేము యొక్క రాజును కలుసుకొనెను, మరియు అతని మొత్తంలో పదియవ భాగమును చెల్లించాడు. ఆమేన్. అది ఆయనే. ఓ, గ్రాహం సహోదరుడా, అది ఆయనే. అది ఆయనే.
అబ్రాహాము మరలా ఆయనను చూశాడు. ఒక రోజు అతడు గుడారంలో కూర్చొనియున్నాడు. అక్కడికి రావడాన్ని, అతడు చూశాడు, మరియు ముగ్గురు వ్యక్తులు రావడాన్ని అతడు చూశాడు.
134 మీకు తెలుసా, ఒక క్రైస్తవుని విషయమై ఏదో ఉన్నది, అతడు దానిని చూసినప్పుడు ఆ ఆత్మ గురించి అతనికి తెలుస్తుంది. అతడు…అతనికి అది తెలుస్తుంది అంతే. దాని విషయమై ఏదో ఆత్మ సంబంధమైన సంగతి ఉన్నది. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధంగానే వివేచించబడతాయి. మీకు తెలుసు కదా. అతను నిజంగా జన్మించినట్లయితే, అతడు దానిని చెప్పగలడు. “నా గొర్రెలు నా స్వరము వినును.”
135 మరియు ఏదో ఉన్నదని అతడు ఎరిగియున్నాడు. అతడు బయటకు పరుగెత్తి ఇట్లు చెప్పెను, “నా ప్రభువా, లోపలికి రమ్ము. కూర్చొనుము. కొంతసేపు ఆగుము. నేను వెళ్ళి రొట్టెను తెచ్చి నీ చేతిలో ఉంచెదను. నేను నీ పాదములు కడిగెదను. నీవు—నీవు నన్ను దర్శించడానికి వచ్చితివి గనుక, విశ్రాంతి తీసుకొనుము, పిదప నీ ప్రయాణమును కొనసాగించుము.” ఫలించని భూమిలో, ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్దిమందితో, ఆ మార్గాన్ని, ఆ కష్టమైన మార్గాన్ని తీసుకొనుచున్నాడు.
అయితే, లోతు అక్కడ ఐశ్వర్యములలో జీవించుచున్నాడు. సహోదరుని కొడుకు, కానీ అతడు అక్కడ పాపంలో జీవిస్తున్నాడు. అనేక ఐశ్వర్యము-లు దానినే అనగా పాపమునే ఉత్పత్తి చేయును.
136 కావున అబ్రాహాము వారిని అక్కడికి తీసుకొని వచ్చెను, కొన్ని నీళ్ళు తెచ్చి మరియు వారి పాదములు కడిగెను. అతడు పశువుల మందకు పరుగెత్తి, ఒక క్రొవ్విన దూడను మందలోనుండి తెచ్చి, దానిని చంపాడు; సిద్ధపరచుటకు, దానిని ఒక పనివానికి అప్పగించెను. మరియు ఇట్లు చెప్పాడు, “శారా, నీవు మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయుము.”
మెత్తగా పిసికి చేయడం, అంటే, ఏమిటో మీకు తెలుసు కదా. మీకు తెలుసా, అమ్మ ఒక పాత, ఒక చీలిక వంటిదానిని, ఆ—ఆ భోజనపు తొట్టిలో కలిగియుండేది. వాటిలో జల్లెడ కలిగియున్న ఒక దానిని మీరు ఎప్పుడైనా చూశారా? మరియు మీరు దానిలో ఒక చీలికను కలిగియుంటారు, మీరు పిండిని మెత్తగా చేస్తారు, మీకు తెలుసా; మరియు అలా బరువు ముద్దను కలిపి, అలా మెత్తగా చేస్తారు. అమ్మ అలా చేయడం నేను చాలా సార్లు చూశాను, ఆ చీలిక, దానికి చిన్న తీగల పొర వంటిది ఉంటుంది. ఆమె ఆ పిండిని తీసుకొని, దానిని అలా జల్లెడ పడుతుంది, మీకు తెలుసా, మరియు దానిని ముందుకు వెనుకు అలా తడుతుంది. అప్పుడు ఆ చీలికను తీసుకుని అదంతా క్రిందకు పడడానికి, దానిని అలా చుట్టూ తడుతుంది. మరియు అప్పుడే అక్కడకు వెళ్ళి ఆ పెద్దతిరుగలి మిల్లు వద్ద మేము పిండి పట్టించుకోవలసియున్నది; మరియు మీకు తెలుసా, బరువైన, పెద్ద మిల్లు రాళ్ళు, అసలైన జొన్నరొట్టెను అవి తయారు చేయును. దానిపై మీరు రోజంతా, మొద్దులను కోయవచ్చును.
137 కావున అప్పుడు, ఇట్లు చెప్పాడు, “పిండిని మెత్తగా పిసుకుము, త్వరగా చేయుము. మరియు ఇక్కడ పొయ్యి మీదనే కొన్ని మొక్కజొన్న రొట్టెలు చేయుము, వెంటనే చేయుము.” మరియు వారు ఆవును పాలు పితికి మరియు కొన్ని పాలు తెచ్చారు. మరియు వారు, దానిని చిలికి, కొంచెం వెన్నను చేశారు. మరియు పిదప వారు వెళ్ళి దూడను చంపి మాంసం తెచ్చారు, మరియు వారు ఆ మాంసమును వేయించారు. మజ్జిగ, జొన్నరొట్టె, మరియు వేడి మొక్కకొన్న రొట్టెల మీద పూయడానికి కొంచెం వెన్నను చేశారు. ఓ, అది చాల బాగుంది. మరియు వారు అక్కడ అన్నింటినీ పరిచారు. మరియు అతడు దానిని తీసి ఈ ముగ్గురు వ్యక్తులకి వడ్డించాడు.
138 మరియు వారు తినుచుండగా, వారు సొదొమ వైపు చూస్తూ ఉండిరి. మరియు కొద్దిసేపటి తర్వాత, వారు లేచి వెళ్ళడం ప్రారంభించారు. మరియు ఆయన ఇట్లు చెప్పాడు, “అబ్రాహామా…” ఇట్లు చెప్పెను, “నీవు దానిని నా నుండి దాచియుంచవు.”
139 “నేను చేయబోవుదానిని, నీకు దాచియుంచలేను. నేను అక్కడికి వెళ్ళుచున్నాను. సొదొమ యొక్క పాపములు నా చెవినపడ్డాయి.”
ఆ మనిషి ఎవరు? తన వస్త్రములపై అంతా దుమ్ము ధూళితో, ఒక దూడ మాంసాన్ని తినుచూ, మరియు ఆవు పాలు త్రాగుచూ, మరియు కొన్ని మొక్కజొన్న రొట్టెలును, మరియు వెన్నను తినుచూ అక్కడ కూర్చున్న ఆయన ఎవరు. ఈ వింత వ్యక్తి ఎవరు? ఇద్దరు, లేదా ముగ్గురు, అక్కడ కూర్చొని యున్నారు. ఆయన వస్త్రముల మీద అంతా దుమ్ము ఉన్నది. ఓ, అవును, “మేము ఒక దూర దేశము నుండి వచ్చాము.” అవును, చాలా దూరము. మరియు కావున ఆయన చెప్పెను…మంచిది, వారెవరు?
140 ఆయన ఇట్లు చెప్పెను, “అతడు భూమికి వారసుడైయున్నాడని చూచుటను బట్టి, అబ్రాహాముకు దీనిని నేను దాచలేను.” ఆమేన్. “నేను నా రహస్యాలను బయలుపరుస్తాను,” మరో మాటలో చెప్పాలంటే, “భూమికి వారసులైన వారికి తెలియజేస్తాను.” ఈనాడు సంఘము అచ్చటనే ఉండవలసియున్నది. అది నిజము. దేవుని యొక్క రహస్యాలను పొందండి, మీరు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, మరియు ఏమి చెయ్యాలో, ఎలా నడవాలో, మరియు ఎలా జీవించాలో తెలుసుకోండి. మనము భూమికి వారసులమైయున్నాము. నిజము. ఆయన వాటిని మీకు బయలుపరచును, ఎందుకనగా ఆయన దేనిని దాచియుంచడు. అందువలనే ఈ విషయాలు జరగడం మనం చూస్తున్నాము.
లోకము ఇట్లంటుంది, “ఓ, అది ఒక మూఢ భక్తుల గుంపు.” వారిని అలా అననివ్వండి. అయితే భూమికి వారసులైన వారికి ఈ విషయాలు తెలుసు. [టేపుపై ఖాళి ఉన్నది—సంపా.]
…ఎందుకనగా వారు దేవుని కుమారులు అని పిలువబడెదరు.
సాత్వికులు అయిన వారు ధన్యులు: ఏలయనగా వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
ఆయన తన రహస్యాలను వారికి తెలియజేస్తాడు, వాటిని వారికి బయలుపరుస్తాడు, ఏమి చేయాలో మరియు ఎలా జీవించాలో వారికి చూపిస్తాడు, ఈ లోకపు విషయాలను విడిచిపెట్టి; దైవభక్తితో నడుచుకుంటూ మరియు దైవభక్తితో జీవిస్తూ, ఈ ప్రస్తుత ప్రపంచంలో, ఆయనతో పాటు నడుచుటను చూపిస్తాడు. లోకము ఏమి అనాలనుకుంటుందో వారిని అననివ్వండి.
141 కావున ఆయన చెప్పెను, “నేను అబ్రాహాముకు ఈ రహస్యాన్ని దాచలేను, ఎందుకనగా, అతడు భూమికి వారసుడని చూచుటను బట్టియైయున్నది. కానీ,” ఆయన చెప్పెను, “నేను సొదొమను నాశనం చేయడానికి వెళ్ళుచున్నాను. నేను అక్కడకు వెళ్ళుచున్నాను.”
142 “అయ్యా, నీవు ఏమి చేయబోవుచున్నావు? నీవు ఎక్కడ నుండి వచ్చావు? ఇదంతా దేని గురించి?”
143 దీనిని కనుగొన్నాడు, ఆయన ఇట్లు చెప్పెను, “మరియు అబ్రాహామా, మరొక విషయం, నేను నీకు ఇచ్చిన ఈ వాగ్దానము కొరకు నీవు ఇరవై-ఐదు సంవత్సరాలు వేచియున్నావు. నీవు ఇరవై-ఐదు సంవత్సరాల క్రితం నుండే, ఈ శిశువు కోసం, ఆ దుస్తులను, ఆ—ఆ పిన్నులను మరియు సమస్తమును సిద్ధపరచావు. నీవు ఇంకనూ నాపై వేచియున్నావు. ఇప్పుడు, సరిగ్గా జీవ కాలమున, నేను నిన్ను దర్శించబోవుచున్నాను, జీవకాలమున, వచ్చే నెల నేను నీతో ఉంటాను.”
144 మరియు శారా, ఆ వెనుక గుడారములో ఉన్నది. మరియు ఈ వ్యక్తి, తన వీపు గుడారము వైపుకు తిరిగియుండి ఇలా, అబ్రాహాముతో మాట్లాడుచుండెను. మరియు శారా ఇట్లన్నది, “హహ్!”
145 ఆయన అడిగాడు, “శారా ఎందుకు నవ్వినది?” హో-హో-హో! దాని సంగతి ఏమిటి? అది ఒక మనసును చదువుటయే, అది కాదా? “శారా నవ్వుటకు గల కారణము ఏమిటి?”
శారా ఇట్లన్నది, “లేదు. నేనసలు నవ్వలేదు.”
146 ఇట్లన్నాడు, “ఓ, అవును, నీవు నవ్వితివి.” ఆమె భయపడినది. ఆమె వణుకుచున్నది. ఆమె ఆ వెనుక గుడారములో ఏమి చేయుచున్నదో ఎరుగగలిగినట్టి, ఆయన ఎవరు? అది ఈనాడు మనతో ఉన్నట్టి అదే దేవుడు. అదే వ్యక్తి. ఆయనకు దాని గురించి అంతయు తెలియును. చూశారా? మీకు అవసరమైన కొలది ఆయన దానిని బయలుపరచును. చూశారా?
147 “నీవు దేని గురించి నవ్వుచున్నావు?” చూడండి, ఆయన వీపు దానివైపు ఉన్నది. పరిశుద్ధ గ్రంథము అలా పేర్కొన్నది, అదేమనగా, “ఆయన వీపు డేరా వైపు ఉండెను.” కానీ, ఆయనకు అది తెలియును. “అక్కడ వెనుక, దీనిని చేయుచున్న, ఆమె ఎవరన్నది తెలియును?” మీరు చూశారా? కావున, ఆయన ఇట్లు చెప్పెను, “నేను నిన్ను దర్శించబోవుచున్నాను.”
148 ఈ వింత వ్యక్తి ఎవరు? ఏమి జరిగినదో మీకు తెలుసా? ఆయన నేరుగా బయటకు నడిచివెళ్ళి మరియు అదృశ్యమైపోయెను. మరియు అది సర్వశక్తిమంతుడైన దేవుడు, యెహోవా, ఆ గొప్ప ఊట, ఆ థియోఫనీ, ఆ లోగోస్ అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను.
149 కొంతకాలం క్రితం, ఎవరో బోధకుడు నాతో ఇలా అన్నాడు, “బ్రెన్‌హామ్ సహోదరుడా, వాస్తవానికి అది దేవుడని మీరు అనుకొనరు, కదా?”
150 నేను ఇట్లు చెప్పాను, “అది దేవుడని, ఎలోహిం అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను.” అనగా, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ ఎల్షద్దాయి, అది నిజం, బలమును-ఇచ్చేవాడు, సంతృప్తిపరచువాడు. ఆమేన్.
151 ఓ, నేను భక్తి పార్వశము నొందుచున్నాను! దానిని గూర్చి ఆలోచించండి. ఇదిగో, ఇక్కడ ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఎవరో నేను మీకు చూపించబోవుచున్నాను, అప్పుడు కుమారుడు ఎవరో మీరు చూస్తారు. అది, తాను “యేసు” అనే మానవ పేరును పొందకమునుపు, యేసుయైయున్నాడు.
152 ఆ రోజు ఆ ఊట వద్ద నిలబడ్డారు. మరియు వారందరూ త్రాగుచుండిరి, మీకు తెలుసా, మరియు, “అరణ్యంలో నీళ్ళు కలిగియుండుట,” మరియు అటువంటి కార్యములైయున్నవి. ఆయన చెప్పెను…వారు ఆ మన్నాను మరియు వాటిని తినుచున్నారు. వారిట్లన్నారు, “మా పితరులు, అరణ్యంలో నలభై సంవత్సరాలు మన్నాను తిన్నారు.”
153 ఆయన ఇట్లు చెప్పెను, “మరి అయిననూ వారందరూ, చనిపోయిరి.” ఇట్లన్నాడు, “పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఈ ఆహారమును తినువాడు ఎన్నటికి మరణించడు.”
154 ఇట్లన్నారు, “మంచిది, మా పితరులు ఆత్మ నుండి పానము చేసియున్నారు, అరణ్యములో వారిని వెంబడించిన, ఒక ఆత్మీయ బండ నుండి త్రాగియున్నారు.”
155 ఆయన ఇట్లు చెప్పాడు, “నేనే ఆ బండను.” మహిమ! యోహాను సువార్త, 6వ అధ్యాయం.
“ఎందుకు,” వారు ఇట్లన్నారు, “ఏమిటి?”
“అవును. అది నిజము.”
156 “ఎందుకు,” అతడిట్లన్నాడు, “నీకు…నీకు యాభై ఏండ్లు అయినా లేవు.” అవును, ఆయన యొక్క పని ఆయనను కొద్దిగా వృద్ధుని వలె కనపడునట్లు చేసినది కానీ, ఆయనకు ముప్పై ఏండ్లు మాత్రమే. ఇట్లన్నాడు, “నీకు యాభై ఏళ్ళు కూడా లేవు, ఎనిమిది లేదా తొమ్మిది వందల సంవత్సరాలు క్రితమే చనిపోయిన, అబ్రాహామును నువ్వు చూశావని చెప్పుచున్నావా? నీవు ఒక దయ్యమని ఇప్పుడు మేము ఎరిగియున్నాము.”
157 ఆయన ఇట్లు చెప్పెను, “అబ్రాహాము ఉండక మునుపే నేను ఉన్నాను.” అదిగో ఆయన అక్కడున్నాడు. ఆ ఉన్నవాడు ఎవరు? అన్ని తరాలకు ఒక నిత్యమైన నామము. అది ఆ…ఆ మండుచున్న పొదలో ఉన్న ఆ అగ్నిస్తంభము, “నేను ఉన్నవాడును అనువాడనై యున్నాను.” అదిగో ఆయన అక్కడున్నాడు, ఇక్కడ దేవుని కుమారునిగా పిలువబడినట్టి, ఆయన కలుగజేసిన ఆ థియోఫని, ఆ ఉన్నవాడు, ఆ యెహోవా.
158 తోమా ఇట్లన్నాడు, “ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము మరియు అది మమ్ములను తృప్తి పరచును.”
159 ఇలా అన్నాడు, “నేనింతకాలము మీతో ఉండినను, నీవు నన్ను ఎరుగవా?” ఇట్లు చెప్పెను, “నీవు నన్ను చూసినప్పుడు, నీవు తండ్రిని చూసెదవు. ‘నీవు తండ్రిని మాకు కనుపరచుము’ అని యేల చెప్పుచున్నావు? తండ్రి మరియు నేను ఒక్కటైయున్నాము. నా తండ్రి నా యందు నివసించుచున్నాడు. నేను కుమారుడు అని పిలువబడే గుడారాన్ని మాత్రమే. తండ్రి నాలో నివసించును. ఆ క్రియలు చేయునది నేను కాదు కానీ, నా యందు నివసించుచున్న నా తండ్రియే. ఆ క్రియలు చేయునది ఆయనే, నేను కాదు.”
160 ఇప్పుడు, అక్కడ వెనుక నిలబడి, మరలా, మోషే ఆయనను చూసెను, ఆయన యొక్క వెనుక భాగమును చూశాడు, ఇట్లు చెప్పాడు, “మనిషి యొక్క వీపు వలె కనిపించెను,” అది దేవుని నుండి బయటకు వెళ్ళిన లోగాస్.
161 అప్పుడు ఏమి జరిగినది? ఇది దేవుడే. మరియు ఆయన లోగాస్ నుండి శరీరముగా మారడానికి కారణం…ఏమిటి…? మీరెలా…? దానికి ఏమైనది? దానికి ఐదు నిమిషాల ముందు, ఆయన ఒక…ఆయన లోగాస్ యైయున్నాడు. అయితే ఆయన ఏమి చేశాడు? ఆయన అచ్చటకు చేరుకున్నాడు…
162 ఇప్పుడు, మన శరీరాలు ప్రపంచంలోని పదహారు విభిన్న మూలకాలతో తయారు చేయబడ్డాయి. మనము దానిని ఎరిగియున్నాము. అది పొటాషియం, మరియు—మరియు—మరియు కొద్దిగా కాల్షియం, మరియు—మరియు పెట్రోలియం, మరియు విశ్వకాంతి, మరియు అణువులు, మరియు మొదలైన వాటితో తయారుచేయబడినది. అవన్నియూ కలపబడి, ఈ శరీరాన్ని తయారు చేస్తాయి, భూమి యొక్క ధూళి నుండి అవి వచ్చును. మీరు ఆహారం తింటారు. మీరు ఆహారం తింటుండగా, అది మారిపోవును…ధూళి నుండి, మరియు అది ధూళి నుండి వచ్చినది, మరియు అది కేవలం—కేవలం అట్లే కొనసాగును. మీ శరీరము, మీ శరీరము ఒక గుఱ్ఱము యొక్క శరీరము, లేదా ఒక ఆవు యొక్క శరీరము, లేదా మిగతా దేనికంటెను, భిన్నమైనదేమీ కాదు. అది కేవలం మాంసం మాత్రమే.
163 మరియు, అబ్బాయీ, నీవు శరీరాన్ని మహిమపరుస్తున్నావు; కానీ నా సహూదరుడా, ఆ ఆత్మ లోపల ఒక అంతరాత్మను కలిగియున్నది. అది నిజం. అయితే ఒక జంతువు లాగానే, మీ శరీరము భూమి యొక్క ధూళి మాత్రమే. మీ శరీరము ఒక జంతువు కంటె ఎక్కువేమీ కాదు. మరియు మీరు శరీరముపై మరియు మీరు చూసేవాటిపై కోరికను కలిగియుండి, స్త్రీలపై మోహాన్ని కలిగియుండి, ఈ విభిన్న విషయాలపై మోహాన్ని కలిగియున్నయెడల, అదింకనూ ఒక జంతువే. అది నిజము. అది నిజము. మీరు దానిని చేయకూడదు. దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించి మరియు మిమ్మల్ని దానికంటే ఉన్నతమైన స్థలములో పెడుతుంది. అది ఖచ్చితంగా నిజం.
164 ఇప్పుడు, మరియు ఇక్కడ, ఈ గొప్ప థియోఫనీ అక్కడ నిలబడియున్నది. ఏమిటి…ఆ గొప్ప యెహోవా దేవుడు, ఆయన ఏమి చెప్పాడో మీకు తెలుసా? ఆయన అక్కడకు చేరి మరియు ఒక పిడికెడు అణువులను తీసుకుని, కొద్దిగా వెలుగును తీసుకుని, మరియు దానిని, ఇలా పోశాడు, “ఫు,” అని అన్నాడు, ఒక శరీరము వచ్చినది, మరియు నేరుగా దానిలోనికి వెళ్ళాడు. అంతే.
165 ఇట్లన్నాడు, “గాబ్రియేలూ, ఇక్కడకు రమ్ము,” ఆ గొప్ప ప్రధాన దూత వచ్చెను. ఇంకా ఇట్లన్నాడు, “వూవ్.” “దానిలోనికి వెళ్ళుము.”
166 “మిఖాయేలూ, ఇక్కడకు రమ్ము,” ఆయన కుడి వైపున ఆ దూత వచ్చెను. “వూవ్.” ఆ…“నీవు దానిలోనికి వెళ్ళుము.”
167 దేవుడు, మరియు ఇద్దరు దూతలు, మానవ శరీరములో ఇక్కడకు నడిచి వచ్చి, మరియు ఒక ఆవు యొక్క పాలు తాగారు, పాల నుండి చేయబడిన వెన్న తిని, కొన్ని మొక్కజొన్న రొట్టెలు తిని, మరియు దూడ మాంసాన్ని తిన్నారు. ఇద్దరు దేవదూతలు మరియు దేవుడు. పరిశుద్ధ గ్రంథము అట్లు చెప్పెను. అది రాజులను సంహరించి వచ్చుచున్నప్పుడు, అబ్రాహాము కలిసిన మేల్కీసెదెకైయున్నాడు. అది దేవుని యొక్క కుమారుడు.
168 ముందుకు కొనసాగుదము, ఇక్కడ హెబ్రీలో, 7లో, ఇలా చెప్పెను, “అయితే ఈయన దేవుని కుమారుని పోలికలో చేయబడినాడు.” అక్కడే ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా సమస్తమును ఆయన సృష్టించెను. మరియు ఆయన అక్కడ బయటకు వెళ్ళి, మరియు ఆ ధూళిని మరలా ధూళిగా మార్చివేసి, మరియు తిరిగి నేరుగా మహిమలోనికి అడుగుపెట్టెను.
169 మరియు ఆ దూతలు, లోతును మరియు శ్రీమతి లోతును విడిపించిన వెంటనే, మరియు ఆమె వెనక్కి తిరిగి చూస్తూ ఉండినది. మరలా దానిని చేయవద్దని, ఆయన వారికి చెప్పెను. మరియు వారు తిరిగి నేరుగా అందులోనికి—దేవుని సన్నిధిలోనికి ప్రవేశించారు.
170 ఇప్పుడు, మనం ఈ రాత్రి సేవించుచున్న ఈ గొప్ప విశ్వాసంలో మనకు ఎంత గొప్ప నిరీక్షణ ఉన్నది కదా! సజీవమైన దేవుడు, ఆ యెహోవా, ఆ అగ్ని స్తంభము, మనతో ఉన్నాడు. శక్తిలోను, మరియు క్రియలోను తనను తాను చూపించుకొనుచూ, మహిమపరచుకొనుచున్నాడు…వారిని తన ఫోటోను తీయుటకు అనుమతించెను, అదే యెహోవా. దేవుని యొద్ద నుండి వచ్చి, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళి, మరియు తన సంఘములో ఎన్నటికి జీవించునట్టి దేవుని కుమారుడు. ఆయన అక్కడ ఉన్నాడు.
171 ఆయన ప్రమాణం చేయుటకు గొప్పవారెవరూ లేనందున, స్వయంగా తన పైనే చేసిన ప్రమాణముతో, ఆయన తన గ్రంథములో మన పేర్లను కలిగియున్నాడు. అదేమనగా ఈ అంత్య దినమున ఆయన మనలను లేపుతాడు అనునదైయున్నది. “నా శరీరమును తిని, నా రక్తమును త్రాగువాడే, నిత్య జీవము గలవాడు, మరియు అంత్యదినమున నేను వానిని లేపుదును. నా యొద్దకు వచ్చువానిని, నేనెంత మాత్రమును త్రోసివేయను. నా మాట విని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు, వాడు ఎన్నటికి తీర్పులోనికి రాక, మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు.”
172 అదే వ్యక్తి అక్కడకు వెళ్ళి మరియు ఒక పిడికెడు క్యాల్షియం మరియు పొటాషియంను తీసుకొని, “వూవ్,” అని చెప్పగలడు, మరలా నీవక్కడ ఉండెదవు. మరియు నా పేరు ఆయన గ్రంథములో ఉన్నది. హో-హో! హో-హో-హో-హో! నా భుజములు ఎంత వంగిపోతున్నాయో, నేనెంత వృద్ధుడను అగుచున్నానో నేను ఎందుకు పట్టించుకుంటాను? ససేమిరా. రవ్వంతైనా చింత లేదు.
173 సహోదరుడా మైక్, నీ హృదయము ఆశీర్వదించబడును గాక, సహూదరుడా, ఈ దినములలో ఎదో ఒక రోజు, ఆ గొప్ప బూర వచ్చినప్పుడు, అది మ్రోగునప్పుడు, మరియు ఆ యోసేపు అడుగు పెడతాడు. హల్లెలూయా! ఆయన ఇట్లంటాడు, “పిల్లలారా!” “వూవ్.” అక్కడ మనము, ఆయన పోలిక చొప్పున చేయబడతాము; నిత్య యవ్వనము, వృద్ధాప్యం గతించిపోయినది; వ్యాధి, బాధలు, దుఃఖము అదృశ్యమైపోయినవి. జీవముగల దేవునికి మహిమ కలుగును గాక!
174 నేడు, ఆయన మాట్లాడేది ఆయన ద్వారనే, తన కుమారుని ద్వారానేయై యున్నది. “పూర్వకాలమందు నానాసమయములలోను, నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాట్లాడెను, కానీ ఈ దినముల అంతమందు తన కుమారుడైన, యేసుక్రీస్తు ద్వారా మనతో మాటలాడెను.” ఆయన పిలిచిన ప్రతి వ్యక్తి యొక్క హృదయంతో ఆయన మాట్లాడతాడు. మీరు ఎప్పుడైనా ఆయన స్వరాన్ని అనుభవించినట్లయితే లేదా ఆయన మీ హృదయాన్ని తట్టుటను విన్నట్లయితే, దయచేసి దానిని త్రోసివేయవద్దు.
మనము ప్రార్థన చేసుకొందాము.
175 పరలోకపు తండ్రీ, ఈ రాత్రి, ఈ హెబ్రీ పత్రిక యొక్క ప్రారంభములో, ఏవిధంగా పౌలు నేరుగా ఆ సువార్తలలోనికి వెళ్ళియున్నాడో తెలుసుకొనుటకు, మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అతడు ఎవరో-చెప్పిన మాటలనో లేదా ఏదో ఒక అనుభవమునో ఆధారం చేసుకొని దానిని తీసుకొనలేదు. సత్యం ఏమిటో మేము తెలుసుకోవాలని అతడు కోరియున్నాడు. మరియు అతడు తిరిగి నేరుగా సువార్తలలోనికి వెళ్ళాడు, మరియు అతడు…ఆ పాత నిబంధనలోనికి, వారికి బోధించబడిన ఆ సువార్తలోనికి వెళ్ళెను. మరియు అతడు, అక్కడ ఆ పాత నిబంధన గుండా, ఆ ఛాయలన్నిటిని మరియు మాదిరులన్నిటిని చూశాడు. అందుచేతనే ఈ రాత్రి మేము ఈ గొప్ప హెబ్రీ గ్రంథమును కలిగియున్నాము. మరియు దీనిని మేము చూస్తున్నాము, ప్రభువా, దీనిని మేము ప్రేమిస్తున్నాము. మరియు యుగాలుగా, ఇది కాల్చివేయబడినది, ఇది చెల్లాచెదురు చేయబడినది, దీనిని తొలగించడానికి ప్రయత్నం చేయబడినది, కానీ అది అలాగే అల్లాడుచున్నది. ఎందుకనగా నీవిట్లు చెప్పియున్నావు, “ఆకాశము భూమి గతించును గాని, నా మాటలు గతించవు.”
176 అప్పుడు ఆ సంశయవాది ఇలా అంటాడు, “మంచిది, ‘దీనిని పౌలు వ్రాసాడు,’ అని నీవు చెప్పావు.” పౌలు కాదు, పౌలులో ఉన్న దేవుడు; పౌలు లోపలున్న ఆ సృష్టికర్త.
177 సరిగ్గా దావీదు ఇట్లు చెప్పినప్పుడు, అతనిలో ఉన్నట్లుగానే యైయున్నది, అదేమనగా “నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు, ఆయన ఆత్మను నీవు పాతాళములో విడిచిపెట్టవు.” మరియు దేవుని కుమారుడు ఆ ప్రవక్త నుండి ఆ మాటలను తీసుకొని, మరియు నేరుగా పాతాళపు అడుగునకు వెళ్ళెను. మరియు ఇట్లు చెప్పెను, “ఈ దేవాలయమును పడగొట్టుడి, మరియు మూడు దినములలో నేను దీనిని లేపుదును.” మరియు ఆయన దానిని చేశాడు, ఎందుకనగా దేవుని వాక్యము విఫలము కానేరదు; ఒక్క పొల్లు కూడా విఫలమవ్వలేదు. దీనికై, ఈ గొప్ప ఊరీము తుమ్మీముకై, మరియు ప్రభువా ఈ రాత్రి మా అనుభవాలు, సరిగ్గా ఇక్కడ ఈ బైబిలు పై, ప్రకాశించుచున్నవని తెలుసుకొనుటకు, మేమెంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము! మేము తిరిగి జన్మించాము, పరిశుద్ధాత్మను కలిగియున్నాము.
178 ప్రియమైన దేవా, దీనిని ఎన్నడూ చూడని ఒక పురుషుడు లేదా స్త్రీ, ఒక అబ్బాయి లేదా అమ్మాయి, ఈ రాత్రి ఇక్కడ ఉన్నట్లయితే, అక్కడ అసలు జీవమే లేనప్పుడు వారు పైకి ఎలా లేవగలరు? ఓ, వారిట్లు చెప్తారు, “నేను జీవాన్ని కలిగియున్నాను.”
179 అయితే పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నదేమనగా, “సుఖభోగములందు ప్రవర్తించునది బ్రదుకుచుండియు చచ్చినదైయుండును. మీలో జీవమున్నదని మీరు చెప్పుచున్నారు, కానీ మీరు మృతులు. జీవించుచున్నాను అని నీవు చెప్పుకొందువు,” పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, “కానీ నీవు మృతుడవే. నీవు ధనవంతుడవని, నీకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు; కానీ నీవు దిగంబరుడవని, మరియు దౌర్భాగ్యుడవని, దరిద్రుడవని మరియు గ్రుడ్డివాడవని, ఎరుగకయున్నావు.” మరియు ప్రభువా, ఈ రాత్రి సంఘముల పరిస్థితి అట్లేయున్నది.వారు ఈ గొప్ప, విలువైన విషయాలను ఎలా కోల్పోవుచున్నారో.
ఆ గొప్ప యెహోవా దేవునిని ఎరుగుట, ఆయన మాత్రమే దానిని ఉత్పత్తి చేయగలడు…ఆయన ఇట్లు చెప్పెను, “ఆ చిన్న చేపలను నాయొద్దకు తీసుకురండి.” వాటితో దేనినో చేయడానికి—ఆయన చేపలను తీసుకొనవలసివచ్చెను. పునరుత్థానము అనేది, దానితో దేనినో చేయుటకైయున్నదని, చూపించుచున్నాడు. ఆయన చేపలను మాత్రమే చేయలేదు గానీ, వండిన చేపలను మరియు వండిన రొట్టెలను చేశాడు. మరియు ఆయన ఐదు చిన్న చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు…చిన్న రొట్టెలు మరియు రెండు చేపలు. ఓ ప్రభువా, అది ఆయన చేతుల్లో ఉన్నది, మరియు ఆయన సృష్టికర్తయైయున్నాడు. కానీ ఆయన తన చేతిలో ఏదో ఒకటి కలిగియుండవలసి ఉన్నది.
దేవా, ఈ రాత్రి మమ్మల్ని మేము ఆయన చేతులకు అప్పగించుకొని మరియు ఇట్లు చెప్పుదుము గాక, “ఓ దేవా, నేను ఎలా ఉన్నానో అలాగే తీసుకొనుము. మరియు నా జీవితము యొక్క ముగింపు వచ్చినప్పుడు, నేను తిరిగి జన్మించాననియు, మరియు నేను నీ కుమారుడను, లేదా నీ కుమార్తెననియు, నీ ఆత్మ, నాతో మరియు నా ఆత్మతో కూడా సాక్షమిచ్చెనన్న ఈ నిరీక్షణతో, నన్ను వెళ్ళనిమ్ము.” మరియు ఆ అంత్య దినమున, నీవు వారిని లేపుదువు. తండ్రీ, దీనిని అనుగ్రహించుము.
180 మరియు మనము మన తలలు వంచియుండగా, మీ చేతిని పైకి లేపి ఇట్లు చెప్పేవారు, ఎవరైనా ఉన్నారా, “బ్రెన్‌హామ్ సోదరుడా, నన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ భూమిని విడిచి వెళ్ళుటకు ముందు…దేవుడు నన్ను ఎరుగవలెనని నేను కోరుచున్నాను, ఎంతగా అంటే ఆయన నా పేరును పిలుస్తాడు. నేను బదులిస్తాను.” కుమారుడా ప్రభువు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును, మరియు నిన్ను; మరియు స్త్రీ నిన్ను దీవించును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? కేవలం మీ చెయ్యి పైకెత్తండి. ఇట్లు చెప్పండి, “బ్రెన్‌హామ్ సహోదరుడా, నా కొరకు ప్రార్థించుము.” మేము చేయునది అదేయైయున్నది. యవ్వనస్తురాలా, దేవుడు నిన్ను దీవించును. అది మంచిది.
181 ఇప్పుడు, ప్రార్థనలో, మీ తలలు వంచియుండగా, నేను ఈ పాటలోని ఒక వచనమును పాడబోవుచున్నాను:
వ్యర్థమైన ఈ లోక సంపదలను ఆశించవద్దు,
అవి ఎంతో త్వరగా కుళ్ళిపోవును,
నిత్యమైన సంగతులపై మీ నిరీక్షణను నిర్మించుకొనుము,
అవి ఎన్నటికీ గతించవు!
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
నిత్యమైన సంగతులపై మీ నిరీక్షణను నిర్మించుకొనుము,
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
182 ఆమె ఇప్పుడు వాయించుచుండగా, మరియు మీ తలలు అలాగే వంచియుండగా, మీరు మీ చేయిని పైకెత్తి, ఇలా చెప్పెదరా, “అవును, ప్రభువా, ఇదిగో నా చేయి”? అది ఏమి చేస్తుంది? నీలో ఉన్న, నీ ఆత్మ, ఒక నిర్ణయం తీసుకుందని అది చూపిస్తుంది. “ప్రభువా, నాకు నీ చేయి కావాలి.” చిన్నారి, దేవుడు నిన్ను దీవించును గాక. “నేను నా చేయిని పైకెత్తుతాను.” ఇక్కడున్న, చిన్న అమ్మాయి, దేవుడు నిన్ను దీవించును గాక. ప్రియా, అది మంచిది. నీకు తెలుసా, నువ్వు అల చేయడాన్ని చూచుటకు, దేవుడు సంతోషిస్తున్నాడు. “చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి.”
183 “దేవా, నీవు నా చేయి పట్టుకోవడం, నాకు కావాలి. మరియు ఆ దినమున, నీవు పిలచినప్పుడు, నేను వచ్చులాగున, నేను నీ హస్తములో ఉండగోరుచున్నాను.” అవును, లాజరు వలెనేయైయున్నది. సహూదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.
మన యాత్ర ముగించబడినపుడు,
నీవు దేవునికి నమ్మకంగా ఉన్నయెడల,
మహిమలో అందముగా మరియు ప్రకాశవంతముగా ఉన్న నీ గృహమును,
పరవశించిన నీ ఆత్మ చూస్తుంది.
అలగైతే, ఇప్పుడు మీరు ఏమి చేస్తారు?
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
నిత్యమైన సంగతులపై మీ నిరీక్షణను నిర్మించుకొనుము,
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
184 పరలోకపు తండ్రి, వారు, ఈ రాత్రి, నీ యొక్క మార్పులేని, నిత్యమైన హస్తమును పట్టుకొనగోరుచున్నారని, ఈ రాత్రి, ఈ చిన్న కూటములో, అనేక చేతులు పైకి లేచాయి. నీకు అప్పగించబడినదాని విషయము ఎరిగియుండి…నీవు ఇట్లు చెప్పితివి, “నేను…తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నాయొద్దకు వచ్చెదరు, మరియు వారిలో ఎవడునూ నశించడు. మరియు అంత్య దినమున నేను వారిని లేపుదును. ఎన్నటికీ నశించలేరు, ఎన్నటికి తీర్పులోనికి రాలేరు గానీ నిత్యమైన, నిత్యమైన జీవాన్ని కలిగియుందురు.” మరియు కేవలం ఒక్కటే నిత్యజీవం కలదు. అది, దేవుని యొద్ద నుండి మాత్రమే వచ్చును. అది దేవుడు. మరియు మనము దేవుని కుమారులు మరియు కుమార్తెలమై ఉండేంతగా, మనము దేవునిలో భాగమవుతాము. మనం దేవుని ఆత్మను మనలో కలిగియున్నప్పుడు, మనం దేవునిలాగానే ఆలోచిస్తాము. మనము నీతి మరియు పరిశుద్ధత గురించి ఆలోచిస్తాము, మరియు మనం ఆయనను సంతోషపరచునట్లు జీవించడానికి ప్రయత్నిస్తాము.
185 ప్రభువా, తమ చేతిని ఎత్తిన ప్రతి ఒక్క వ్యక్తిలోనికి అటువంటి జీవితం ప్రవేశించునట్లు, అనుగ్రహించండి. మరియు తమ చేతులను ఎత్తవలసియుండి కూడా, ఎత్తనివారు, నీవు వారితో కూడా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. దానిని అనుగ్రహించండి, తండ్రీ. మరియు యాత్ర ముగిసినప్పుడు, జీవితం ముగిసినప్పుడు, ఆ దినమున, మేము ఆయనతో కూడా విశ్రాంతిలోనికి ప్రవేశించుదుము గాక, అక్కడ మేము ఎప్పటికీ వృద్ధులము కాము, ఎన్నడూ వ్యాధిగ్రస్తులము కాము, ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు. అప్పటి వరకు, ఆయనను స్తుతిస్తూ, మేము ఆనందంగా మరియు సంతోషంగా ఉండునట్లు చేయుము, ఏలయనగా మేము ఆయన నామములో అడుగుచున్నాము. ఆమేన్.
186 విశ్వాసులైన మీరంతా, ఇప్పుడు మనం మన చేతులు పైకెత్తి మరియు ఆ పల్లవిని పాడుదాము.
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
నిత్యమైన సంగతులపై మీ నిరీక్షణను నిర్మించుకొనుము.
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
187 ఇప్పుడు మనం దానిని రాగము తీద్దాము. మీరు అలా చేయుచుండగా, మీ ప్రక్కనున్నవారితో, మీరు ఇట్లు చెప్పండి, “పొరుగువాడా, దేవుడు నిన్ను దీవించును.” మీ పక్కన ఉన్న వారితో ఇట్లు కరచాలనం చేయండి. “దేవుడు నిన్ను దీవించును గాక.” ఇప్పుడు ఇరువైపులా చేయండి. ఇరువైపులా ఉన్నవారితో, కరచాలనం చేయండి. “పోరుగువాడా, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నీతో ఉండును గాక.” “నిత్యమైన సంగతులపై మీ నిరీక్షణను నిర్మించుకొనుము.”
డాక్, అది అక్కడుందని నాకు తెలుసు, సహోదరుడా. నెవిల్ సహోదరుడా, నీవు చాలా కాలంగా అక్కడ ఉండియున్నావని నాకు తెలుసు.
ఈ యాత్ర ముగిసినప్పుడు,
ఈ దినములలో ఏదో ఒక రోజు, అది జరగబోతుంది.
మనము దేవునికి నమ్మకముగా యున్నట్లైతే,
అక్కడ మనము సివార్డ్ సహోదరుణ్ణి చూస్తాము.
మహిమలో ప్రకాశవంతంగా మరియు ఎంతో ప్రకాశవంతంగా, ఉన్న నీ గృహమును,
పరవశించిన నీ ఆత్మ చూస్తుంది.
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
వర్తమానము అయిపోయిన తర్వాత, ఆ ఆరాధనను నేను ఇష్టపడతాను.
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
నిత్యమైన సంగతులపై మీ నిరీక్షణను నిర్మించుకొనుము,
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
కాలము వేగమైన మార్పుతో నిండియున్నది,
భూమి మీద స్థిరముగా ఉన్నది ఏదియు నిలబడదు,
నిత్యమైన సంగతులపై మీ నిరీక్షణను నిర్మించుకొనుము,
పట్టుకొనుము…
మనం ఇప్పుడు మన మధ్యలో కనిపించని ఆయనను వీక్షిద్దాం, మరియు ఇప్పుడు మనం పాడేటప్పుడు ఆయనను ఆరాధించుదాము.
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
నిత్యమైన సంగతులపై మీ నిరీక్షణను నిర్మించుకొనుము,
దేవుని యొక్క మారని హస్తమును పట్టుకొనుము!
శాంతి! శాంతి! అద్భుతమైన శాంతి,
ఇప్పుడు కేవలం ఆయనను ఆరాధించండి.
క్రిందకు వస్తున్నది…
వర్తమానము అయిపోయింది. ఇది ఆరాధనైయున్నది.
అంతులేని ప్రేమ కెరటాలలో, ఎప్పటికీ,
మా ఆత్మపై అల్లాడుమని నేను ప్రార్థిస్తున్నాను.
కేవలం ఆయనలో మునుగిపోవుడి.
శాంతి! శాంతి! అద్భుతమైన శాంతి,
అక్కడ నుండి క్రిందకు వచ్చుచున్నది…
ఆ గొప్ప ఊట నుండి, అది తెరుచుకొనుచున్నది.
…పైన;
అంతులేని ప్రేమ కెరటాలలో, ఎప్పటికీ,
మా ఆత్మ పై అల్లాడమని నేను ప్రార్థిస్తున్నాను.
అది దేనినో చేయుటలేదా?
…అద్భుతమైన శాంతి,
పైనున్న మన తండ్రి నుండి దిగి వచ్చుచున్నది;
అంతులేని ప్రేమ కెరటాలలో, ఎప్పటికీ,
మా ఆత్మపై అల్లాడుమని నేను ప్రార్థిస్తున్నాను.
దాని గూర్చి ఏదో విషయము లేదా, కేవలం ఘనమైనది మరియు మాధుర్యమైనది?
188 అభిషేకించబడి మరియు ప్రార్థించబడాలని కోరుచున్న ఒక రోగి ఉన్నాడేమోనని ఆశ్చర్యపోవుచున్నాను. ఉన్న యెడల, కేవలం మీ స్థలమును కనుగొనండి. అక్కడ చక్రాల కుర్చీలో ఉన్నది మహిళయేనా? ఆమెను కేవలం అలాగే ఉండనివ్వండి. నేను వచ్చి, ఆమె కొరకు ప్రార్థిస్తాను. ఆమె కుర్చీలో నుండి లేవవలసిన అవసరం లేదు. మరెవరైనా ఉన్నారా?
ఓ, కూటములో ఈ భాగాన్ని మీరు ఇష్టపడుటలేదా? దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నదని ఎంతమంది అనుభూతి చెందుతున్నారు, ఎంతమందికి తెలుసు? దాని గురించే నేను మాట్లాడుచున్నాను. అదే…మీరు అలా అనుభూతి చెందుతారు…మీరు కేకలు వేయాలన్నట్లు ఎంతమందికి అనిపించుచున్నది? ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. మీలో ఏదో కేకలు వేయగోరుచున్నట్లు అనిపించుచున్నది. చూశారా?
ఇది శాంతి! శాంతి! అద్భుతమైన శాంతి,
పైనున్న తండ్రి నుండి క్రిందికి వచ్చుచున్నది;
అంతులేని ప్రేమ కెరటాలలో, ఎప్పటికీ,
నా ఆత్మపై అల్లాడుమని నేను ప్రార్థిస్తున్నాను.
నా మీద ప్రకాశించుము,
189 మనం ఆరాధనలో ఉండగా, ఇప్పుడు రోగులను అభిషేకించి, మరియు వారి కొరకు ప్రార్థించబోవుచున్నాము. స్త్రీ, నేరుగా ఈ మార్గము గుండా నీవు రాగలవా?
190 దీని అర్థం ఏమిటి? “విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును.” ఇప్పుడు అందరూ ప్రార్థనలో ఉండగా, ఆ పాటను రాగం తీయండి. యేసు రోగులను స్వస్థపరచుటను గూర్చి ఆలోచించండి.
ఆమెను నూనెతో అభిషేకించండి…?…