హెబ్రీ, రెండవ అధ్యాయము మొదటి భాగము

హెబ్రీ, రెండవ అధ్యాయము మొదటి భాగము

1 …?…ఇక్కడ తరగతిలో ఉండి ఆనందించాను…[టేపుపై ఖాళీగా ఉన్నది—సంపా.] మరియు ఇప్పుడు హెబ్రీ మొదటి పుస్తకం, పౌలు అని, మనము కనుగొన్నాము, లేదా మనము నమ్ముచున్నాము. వేదాంత పండితులు ముగింపునకు వచ్చారు; సరిగ్గా దానిని ఏది, లేదా ఎవరు వ్రాసారో వారికి తెలియదు. అయితే, కొద్దిగా ఆత్మీయ వివేచనగలవారు ఎవరైనాగానీ అది పౌలు అని చూడగలరని, నేను నమ్ముచున్నాను. అది—అది పౌలు అని, చాలా మంది రచయితల ద్వారా, నమ్మబడుచున్నది. మరియు అతడు ఎలా…

2 1వ అధ్యాయంలో, అది ప్రభువైన యేసును హెచ్చిస్తున్నట్లు మనము కనుగొన్నాము. ఓ, దమస్కు వెళ్ళే మార్గములో తాను కలిగియున్న ఆ—ఆ అనుభవం ద్వారా చూపించుటకు, అతడెట్లు తీసుకువచ్చెను కదా. ఇప్పుడు, పౌలు, ప్రారంభమునుండే, ఒక నిజమైన వేద పండితుడైయుండెను. ఆనాటి అత్యుత్తమ బోధకులలో ఒకడైన గమలీయేలు ఆధ్వర్యంలో, పౌలు బోధించబడ్డాడు. మరియు అతడు తెలివైనవాడు మరియు మేధావి, మరియు నిజంగా ఒక వివేకముగల బైబిలు పండితుడైయుండెను.

3 మరియు నేను దీనిని కనుగొన్నాను, అతడు తన జేబులో అధికారిక ఉత్తర్వులతో, ఆ ధన్యకరమైన ప్రాచీన సువార్త మార్గంలో ఉన్నవారందరినీ బంధించడానికి, అతడు దమస్కు మార్గంలో వెళ్ళుచున్నప్పుడు, అతడు యదార్థముగానే ఉండెను. కానీ, నేనెల్లప్పుడూ నమ్మునది ఏమిటనగా స్తెఫను చనిపోవడాన్ని పౌలు చూసాడు గనుక, అది నేరుగా అతణ్ణి తాకి ఉంటుందని నేను తలంచుచున్నాను. అతడు స్తెఫను మరణానికి సమ్మతించినప్పుడు, మరియు అతణ్ణి రాళ్లతో కొట్టినవారి వస్త్రాలను పట్టుకున్నప్పుడు, అప్పుడు స్తెఫను యొక్క రక్తము విషయములో పౌలు దోషి అయ్యాడు. మరియు అతడు ఒప్పుకొని, ఇట్లన్నాడు, “నేను అసలు అర్హుడను కాను,” ఇట్లు చెప్పెను, “ఎందుకనగా నేను ఆయన—ఆయనయొక్క, హతసాక్షియైన, స్తెఫను యొక్క రక్తాన్ని చిందించాను.” ఎందుకనగా, అతడు దానికి సాక్ష్యమిచ్చాడు.

4 మరియు మీరు దేనికైనా సాక్ష్యమిచ్చినయెడల, మీరు సరిగ్గా దానిలో పాలిభాగస్తులైనంత దోషి అవుతారు. కావున మనం సాక్ష్యమిచ్చి, “ఓ, అవును, వారు ఈ ఫలానా-మరియు-ఫలానా, విషయాన్ని చేసి ఉండాల్సింది కాదు,” అని చెప్పినయెడల, నీవు చెప్పుచున్న దాని గూర్చి జాగ్రత్త వహించుము, ఎందుకనగా నీ తీర్పు తీర్చు విధానాన్ని బట్టి నీవు దోషివి అవుతావు. నీవు నిర్ణయించలేకపోతే, ఏమీయు చెప్పవద్దు, కేవలం దానిని వదిలేయండి. పిదప నీవు క్రైస్తవుడవని సాక్ష్యమిచ్చినప్పుడు, అప్పుడు నీవు దోషివి అవుతావు. చూశారా? నీవు ఒక క్రైస్తవునిగా ఉన్నందుకు దోషివి అవుతావు, మరి నీవు దానికి తగినట్లు జీవించవలసియున్నది. మరియు పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక—ఒక వాగ్దానము చేసినప్పుడు…నేను ఇక్కడ చక్రాల కుర్చీలో ఉన్న ఒక వ్యక్తిని చూస్తున్నాను. దేవుడు ఒక వాగ్దానము చేసినప్పుడు, ఆయన దానిని నెరవేర్చువరకు ఆ వాగ్దాన విషయమై ఆయన దోషి అవుతాడు. ఆయన, దేవుడు వాగ్దానము చేసినప్పుడు ఆయన దోషి అవుతాడు. మరియు లేఖనాలు కూడా అవి నెరవేరేవరకూ దోషి అవుతాయి. చూశారా? దేవుడు పలికిన ఒక—ఒక మాటగా అవి—అవి సరిగ్గా అక్కడే ఉన్నవి. మరియు అది నెరవేర్చబడవలసియున్నది లేనిచో దేవుడు దోషి అవుతాడు. చూశారా?

5 మరియు కావున పౌలు, ఒక బోధకుడైయుండి, మరియు ఆ రోజు దమస్కునకు తన దారిలో వెళ్ళుచుండగా, దాదాపు, అది మధ్యాహ్న సమయమని, నేను ఊహిస్తున్నాను. ఆకాశము నుండి అక్కడ ఒక గొప్ప వెలుగు ప్రకాశించినది, మరియు అది అతనికి గ్రుడ్డితనము కలుగజేసినది, మరియు అతడు—అతడు భూమి మీద పడిపోయెను. మరియు అది ఎవరన్నది తాను తెలుసుకొనగోరాడని అతడు చెప్పెను. ఒక స్వరము మాటలాడి, మరియు ఇట్లు చెప్పెనని అతడు చెప్పెను, “సౌలా, సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు?” అది అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయమని నేను నమ్ముచున్నాను.

మరియు అతడిట్లన్నాడు, “నేనెవరిని హింసించుచున్నాను?”

6 మరియు ఆ స్వరము తిరిగి వచ్చి, మరియు ఇట్లు చెప్పెను, “నేను యేసును.” ఓ! “నేను యేసును, మరియు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము.” మరియు అప్పుడు యేసు ఏమైయుండెను? యేసు, ఆయన ఆ వెలుగైయుండెను, ప్రకాశించుచున్న ఒక గొప్ప వెలుగైయుండెను.

7 ఇప్పుడు మనల్ని ప్రోత్సహించి మరియు ఇక్కడ ఒక ఆధారాన్ని పొందడానికైయున్నది. ఆయన ఒక మానవుడైయున్నప్పుడు, ఆయన ఒక వెలుగు ఎలా అయ్యాడు? ఇప్పుడు, ఏ ఒక్కరూ…

అక్కడ ఆలయం యొక్క కాపలాదారులైనటువంటి, కొంతమంది సైనికులు పౌలుతో ఉన్నారు, నిర్బంధించడానికి పోవుచున్నారు. పౌలు ప్రధాన నాయకుడైయున్నాడు. మరియు వారి గుంపుల నిమిత్తం మరియు అటువంటివాటి నిమిత్తం, మరియు వారిలోనున్న వారి మతపరమైన నిరీక్షణ నిమిత్తం, వారు ఆ ప్రజలను బంధించడానికి వెళ్ళుచున్నారు.

8 అయితే, ఇప్పుడు, ఒక పెద్ద వెలుగుగా యేసు ఇక్కడ ఉండెను. ఇప్పుడు, మీకు జ్ఞాపకమున్నయెడల, ఆదిలో, యేసు ఒక వెలుగైయుండెను. యేసే దేవుని నుండి బయటకు వచ్చిన ఆ లోగాస్. మరియు ఆయన…ఇశ్రాయేలు పిల్లలను అరణ్యముగుండా నడిపించిన ఆ నిబంధన దూత ఆయనే. మరియు వారు చూసిన ఆ అగ్నిస్తంభము ఆయనే. మరియు ఆయన…మరియు ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఇట్లు చెప్పెను, “నేను దేవునియొద్ద నుండి వచ్చియున్నాను, మరియు నేను దేవునియొద్దకు తిరిగి వెళ్ళుచున్నాను.” కావున ఆయన ఒక అగ్నిస్తంభములో నుండి, ఒక మానవునిలోకి వచ్చినయెడల, పిదప ఆయన ఉన్న చోటికే తిరిగి వెళ్ళినయెడల, ఆయన మళ్ళీ ఒక వెలుగులోనికే వెళ్ళాడు. మరియు పౌలు ఆయనను చూసినప్పుడు, అదిగో ఆయన ఒక వెలుగుగా అక్కడ ఉండెను.

9 ఇప్పుడు, పౌలుతోనున్న సైనికులందరూ ఆ వెలుగును చూడలేదు. అటువంటప్పుడు ఒకరు చూడగలుగుట మరియు ఇతరులు చూడలేకపోవుటయన్నది సాధ్యమా? నిశ్చయంగా. అది సరియే. అతడు, పౌలు, దానిని చూశాడు, కానీ ఆ మిగతావారు ఆ వెలుగును చూడలేదు.

10 ఇప్పుడు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, ఈ వెలుగు చెరసాలలోనికి వచ్చి, తలుపులు తెరిచినట్లు మనము కనుగొంటాము. మరియు అతడు…పేతురు వెళ్ళుచునప్పుడు, వారు బయటకు వెళ్ళగా, ఆ వెలుగు మిగతా కాపలాదారులను గ్రుడ్డివారిగా చేసినది. మరియు అతడు తలుపునొద్దకు వచ్చినప్పుడు, అది స్వయంగా దానికదే నిశ్శబ్దంగా, తెరచుకొని, అతని వెనుక మూసుకున్నది. లోపలి చెరసాల నుండి, అతను బయటి తలుపు వరకు వెళ్ళాడు. అది దానంతట అదే స్వయంగా తెరచుకున్నది, అలాగే నిశ్శబ్దంగా మూసుకున్నది. ఆపై అతడు ఒక సందు నొద్దకు వెళ్ళి, నగర వీధిలోనికి వెళ్ళిపోయాడు. మరియు, “నేను కల కంటున్నానా?” అన్నట్లు, అతడు తన కళ్ళను రుద్దుకున్నాడు. ఏమి జరిగినదో అతనికి తెలియదు. కానీ, ప్రభువు యొక్క దూత, మోషేను సముద్రము వద్దకు నడిపించి మరియు దానిని పాయలు చేసిన అగ్నిస్తంభముగా ఉన్న అదే దూత, ఓ, ఆ మృత సముద్రము…ఎర్ర సముద్రము ఇరువైపులా గోడవలె నిలచినది, దానిగుండా ఇశ్రాయేలీయులు నడచి వెళ్ళిరి.

11 మరియు వారు పొంగుచున్న యోర్దాను వద్దకు వచ్చినప్పుడు, ఆయన అక్కడ తనను తాను కనబరచుకోలేదు. కానీ ఆయన అక్కడ ఉన్నాడు, ఎందుకంటే ఆయనే దానిని పాయలు చేసాడు. మరియు ఆ మైదానాలన్నీ నీటితో నిండియున్నట్టి, ఏప్రిల్ మాసంలో వారు దాటి వెళ్ళారు. మరియు ఆయన వసంత ఋతువును నిలిపెను, మరియు ఆయన మంచును కరగకుండా చేసెను, ఎందుకంటే అది ఎత్తుగా మరియు మరి ఎత్తుగా గోడ కట్టలేదు; అది కేవలం నిలిచినది. అదీ మన యెహోవా. అదీ మన ప్రభువైన యేసు. కేవలం నిలిపివేసెను; మరియు వారు పొడి నేల మీద నడిచి వెళ్ళారు.

12 ఇప్పుడు, ఆయన వారిని గూర్చి జాగ్రత్త వహిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు, కాబట్టి ఆయన తన వాగ్దానానికి బద్దుడైయున్నాడు. ఇప్పుడు, పౌలు, ఈ విషయాల గూర్చి ఎరిగినవాడై, మరియు వాటిని తెలుసుకొన్నవాడై, అతడు భాగ్యవంతుడైనాడు, ఎందుకనగా దేవుడు నేరుగా పౌలుతో మాట్లాడుచుండెను. ఆయన అతనితో ఉన్న సైనికులతో మాట్లాడుటలేదు. ఆయన పౌలుతో మాత్రమే మాట్లాడుచున్నాడు.

13 ఇప్పుడు, ప్రభువు యొక్క దూత ఒక నక్షత్రం రూపంలో, దిగి వచ్చినప్పుడు; మరియు ఆ నక్షత్ర-పరిశోధకులు, భారతదేశపు ఆ జ్ఞానులు, వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, వందల మైళ్ళ వరకు దానిని వెంబడించారు. మరియు అది ప్రతి నక్షత్ర పరిశోధనా శాలను దాటి వెళ్ళినది, ఎందుకంటే వారు నక్షత్రాల ద్వారా కాలాన్ని అధ్యయనము చేస్తారు. మరియు ఆ నక్షత్రాన్ని జ్ఞానులు తప్ప మరెవ్వరూ చూడలేదు. ఓ, మై! అది మిమ్మల్ని ఉత్సాహపరచుటలేదా?

14 అప్పుడు, మీరు చూడండి, దేవుడు సంస్థలతో వ్యవహరించడు. ఆయన వ్యక్తుల గుంపులతో వ్యవహరించడు. ఆయన ఒక్కొక్కరితో వ్యవహరిస్తాడు. ఆయన వ్యక్తిగతంగా తనను తాను బయలుపరచుకుంటాడు. మరియు ఇప్పుడు—ఇప్పుడు దీనిని చెప్పాలంటే, దీనిని చెప్పుటకు కాదు…దేవుడు నా హృదయమును ఎరిగియున్నాడు. మరియు ఇది వ్యక్తిగతముగా, స్వంత ప్రశంసల కొరకు చెప్పుటలేదు; ఇప్పుడు, కేవలం అక్కడ ఉండుటకైయున్నది. అయితే, అదే దేవుడు, అదే యేసు, ఈ ఉదయం మనతో ఉన్నాడని, మీకు తెలియునా? మీలో ప్రతి ఒక్కరూ, ఆయన ఇక్కడ ఉన్నాడన్నదానికి సంబంధించిన ఒక చిన్న, వ్యక్తిగత సాక్ష్యమును కలిగియున్నారని, మీకు తెలియునా? మరియు…ఆయన వేరే దినములలో చేయని ఒక కార్యమును ఈ దినమున మన కొరకు చేసియున్నాడు; ఈ దినమున ఆయన తన ఫోటోను తీయబడనిచ్చెను. మనము దానిని సరిగ్గా అక్కడ వ్రేలాడదీసుకున్నాము. చూసారా? ఆ అగ్ని స్తంభము, అది అదే ప్రభువైన యేసు.

15 ఆయన ఇప్పుడు ఎలా పని చేస్తున్నాడో చూడండి. ఆయన అదే ప్రభువైన యేసు అయినట్లైతే, ఆయన అవే క్రియలు చేస్తాడు, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, “ఆయన నిన్నా, నేడు మరియు నిరంతరం ఒక్కటేరీతిగా ఉన్నాడు.”

16 ఇప్పుడు, ఇది సరియైనదా లేక తప్పా, అని పౌలు ఏదైనా చెప్పుటకు ముందే, మొదట అతడు ఐగుప్తునకు వెళ్ళి మరియు అది లేఖనానుసారమైనదా కాదాయని కనుగొనుటకు, అక్కడ మూడు సంవత్సరాలు గడిపెను. మీకు అసలు అది తెలుసా? పౌలు మారిన తర్వాత, అతను మూడు సంవత్సరాలు ఐగుప్తునకు వెళ్ళాడు. అక్కడ అతడు నివసించాడు, మరియు అక్కడే అతడు ఈ గొప్ప జ్ఞానాన్ని నేర్చుకున్నాడు.

17 ఇప్పుడు, ఏ పోలికనూ చెప్పటం కాదు గానీ, కేవలం పరిశుద్ధాత్మ ఎలా ఇంకను అదే విధంగా ఉన్నాడన్నది నేను మీకు చెప్పుచున్నాను. ఇప్పుడు, సంవత్సరాల క్రితం, ఈ దూత ప్రత్యక్షమై మరియు సంగతులను చూపించే విషయము, ఇక్కడున్న నా సంఘమునకు జ్ఞాపకముండును. నేను దాని గూర్చి కొంచం సందేహమును కలిగియుంటిని. పాత-కాలపు వారలారా, అది మీ అందరికీ తెలియును. ఒకవేళ మీరు…అది సరియైతే, మీరు వినినప్పుడు, మీ చేతిని పైకి ఎత్తండి. అవును. చూడండి, ఆ పాత-కాలపు వాళ్ళనాటి నుండి, కూడా, సంఘాన్ని చూడండి. చూశారా? నేను సందేహంతో ఉన్నాను, ఎందుకనగా అది దయ్యపు సంబంధమైనదని బోధకులు నాకు చెప్పారు. మరియు నేను ఒక విధంగా దానిని విశ్వసించాను, కానీ నేను వేచియున్నాను. నేను దాని గురించి ఏమీ చెప్పకుండేవాడిని.

18 కానీ, ఓ, ప్రభువు నామము స్తుతింపబడును గాక! ఒక రాత్రి, అక్కడ, ఆయన దిగి వచ్చెను, ఒక దేవదూత, మరియు ఆయనే అని, దానిని లేఖనాలలో బయలుపరచెను. మరియు నేను లేఖనాలలో దానిని చూసినప్పుడు, అప్పుడు దానితో ప్రపంచవ్యాప్తంగా బ్రద్దలు చేయడానికై, ఆ వర్తమానము వున్నది.

19 అక్కడ నుండి ఓరల్ రాబర్ట్స్, ఎ.ఎ. అలెన్, టామీ ఆస్బార్న్, టామీ హిక్స్ మరియు ఇంకేమిటి, వారు బయలువెళ్ళినారు. చూశారా? అది ప్రజలకు ఒక వర్తమానమైయున్నది.

20 మరియు యేసు నిన్నా, నేడు మరియు నిరంతరం ఒక్కటేరీతిగా ఉన్నాడు. లేఖనాల ప్రకారం, ఆయన ఒక్కటేరీతిగా ఉన్నాడు. ఆయన ఒక్కటే విధంగా చేస్తాడు. ఆయన ఒక్కటేరీతిగా ఉన్నాడు. మరియు ఆయన ఒక్కటే విధంగా పని చేస్తాడు. ఆయన తనను తాను ఒక్కటే రీతిగా ప్రత్యక్షపరచుకుంటాడు. మరియు ఈ ఉదయమున, ఆయన ఇక్కడ, ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయనను చూడవచ్చు; మనము చూడకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ, సరిగ్గా ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడన్న ఒక సాక్షాన్ని మనము కలిగియున్నాము.

21 ఇప్పుడు, మనం ఇప్పుడు కనుగొనునది ఏమిటనగా, పౌలు, ఈ అనుభవముపై ఆధారపడి, మరియు ఈ ఉత్తరాలను వ్రాస్తూ, వాటిలో చాలా వరకు చెరసాల నుండి వ్రాసాడు, అతడు పాత నిబంధనను, కొత్త నిబంధనతో సరిపోల్చాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క చివరి రచయిత, ప్రేరేపణతో, దేవుడు దిగివచ్చి మరియు అతనితో ఇట్లు చెప్పెను, “ఎవడైనను దీనితో మరి ఏదైనను కలిపినయెడల లేదా ఎవడైనను దీని నుండి ఏదైనను తీసివేసినయెడల, వాడు, జీవగ్రంథములో తన భాగము నుండి బయటకు తీసివేయబడతాడు.” కాబట్టి మనము దీనికి ఏదైనా ఒక్క విషయమునైనా కలుపుటకు ధైర్యం చేయరాదు. ఓ, అది ఉన్నట్లుగానే అది ఉండవలసియున్నది, దానికి ఏదీ కలపకూడదు. మరియు దీనిలోనున్న ప్రతీదాని కోసం మనం పోరాడాలి. నాకు ఇంకా ఎక్కువ ఏదియు అవసరం లేదు, మరియు తక్కువ ఏమీ అక్కర్లేదు. నాకు అది ఏమి చెప్పుచున్నదో అది మాత్రమే కావాలి.

22 ఇప్పుడు, ఈ హెబ్రీ పుస్తకాన్ని, నేను ఎన్నుకొనుటకుగల కారణం; ఒక ఉద్దేశ్యం, ఒక విషయం; ఈ ఉత్తరమైయున్నది, “ప్రియమైన బ్రెన్హామ్ సహోదరుడా,” మరియు ఆ రీతిగానున్నది. మరియు, నేను—నేను, మనం వాక్యముతో ఉండగోరుచున్నాము.

23 ఇప్పుడు, 1వ అధ్యాయం, యేసును హెచ్చించుటయైయున్నది, కావున ఆయనే ప్రధానుడు. మరియు గత రాత్రి, ఆయన ఆ గొప్ప ఆరంభములో ఉండెనని, పౌలు మనకు తెలియజేసెను. మరియు ఆయన 7వ అధ్యాయంలోని గొప్పవాడైన “ఆ షాలేము రాజైన, మెల్కీసెదెకేనని,” మనము కనుగొన్నాము.

24 మరియు ఇప్పుడు, ఈ ఉదయం, 2వ అధ్యాయములో, మనం ఆయనను వేరే—వేరే కోణము నుండి సమీపించెదము. ఇప్పుడు, పౌలు యేసును హెచ్చించుచుటను గూర్చిన ఈ గొప్ప, మహత్తరమైన వర్తమానమును మనకిచ్చిన తర్వాత, అదేదనగా, “దేవదూతలు కూడా ఆయనను ఆరాధించునట్లు చేసెను.” మరియు ఇక్కడున్న, ఈ భూమి, అది ఎంత పురాతనమైనదో, అని నేను ఆలోచిస్తున్నాను: “మరియు ఆయన ఉత్తరీయమువలె దానిని మడిచివేయును, అయితే అవన్నియూ నశించును, కానీ నీవు నిలచియుందువు.”

25 మరియు 2వ అధ్యాయంలో లేదా, 2వ వచనంలో, అది ఇట్లున్నదని నేను నమ్ముచున్నాను, “ఈ దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను.” మరియు, చూడండి, “ఆయన పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములుగాను ప్రవక్తలద్వారా మాట్లాడెను.” మనము దాని గుండా వెళ్ళి, ప్రవక్తలు అంటే ఏమిటి, మరియు దేవుడు ప్రవక్తల ద్వారా తన వర్తమానమును ఎలా తీసుకువచ్చాడన్నది కనుగొన్నాము. “అయితే ఈ అంత్య దినమున ఆయన తన కుమారుడైన, యేసు ద్వారా, అనగా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడెను. అప్పుడైతే, ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు.” పిదప మనము వెనుకకు వెళ్ళి, ఆ ప్రవక్తలందరూ క్రీస్తు యొక్క ఆత్మను తమలో కలిగియున్నారని కనుగొన్నాము.

26 మనం యోసేపు వద్దకు వెళ్ళి మరియు అతను క్రీస్తుకు పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నాడని కనుగొన్నాము. మోషే వద్దకు వెళ్ళి, మరియు అతను క్రీస్తుకు పరిపూర్ణమైన మాదిరి అని కనుగొన్నాము. పిదప మనము దావీదు వద్దకు కూడా వచ్చాము. మరియు ఎందుకో తెలియదు కానీ, యెరూషలేములో దావీదు త్రోసివేయబడినప్పుడు, ఆ కొండపైకి వెళ్ళి, మరియు ఆ ఒలీవల కొండపైనుండి వెనుకకు చూసి, అతను తిరస్కరించబడినందుకు యెరూషలేమును గూర్చి ఏడ్చాడు. అప్పటి నుండి ఎనిమిది వందల సంవత్సరాల తరువాత, దావీదు కుమారుడు యెరూషలేములో, రాజుగా తిరస్కరించబడ్డాడు, మరియు అదే కొండపై నుండి ఏడ్చాడు. ఓ, క్రీస్తు యొక్క ఆత్మ, వ్యక్తులతో వ్యవహరించుచున్నది!

27 ఇప్పుడు, పౌలు ఇలా చెప్పడం, ప్రారంభించాడు:

కావున మనము వినిన సంగతుల విషయమై మనము మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను,…

28 2వ అధ్యాయం, ఇప్పుడు, మనము ప్రారంభిస్తున్నాము.

కావున మనము వినిన సంగతుల విషయమై మనము మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను, ఏ సమయంలోనైనా…మనము వినిన సంగతులను విడిచిపెట్టకుండవలెను.

29 ఓ, ఈ ఉదయం ఈ ఆలయంలో దేవుడు దానిని ఇంటివరకు నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దానిని మీ హృదయాలలో చాలా లోతుగా నానబెట్టాలని నేను ప్రార్థిస్తున్నాను. “మనము వినిన సంగతులను విడిచిపెట్టకుండునట్లు మనము మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.” ఆ గొప్ప యెహోవా దిగివచ్చి, మరియు ఆయన చేయునటువంటి క్రియలను చేయుటను మరియు లేఖనము వెంబడి లేఖనముతో, అవి సత్యమని, సరిపోల్చబడుటను మనము చూసినప్పుడు, మనం ఎటువంటి ప్రజలుగా ఉండవలసియున్నది కదా? మరియు మనము కొన్నిసార్లు దుంగలపైనున్న బొడిపెల వలె కూర్చుంటాము, మరియు అసలు పట్టింపే లేకుండ ఉంటాము. మనము ప్రతీ నిమిషం, ప్రజలను క్రీస్తు దగ్గరకు చేర్చే ప్రయత్నంలో, తీరికలేకుండా ఉండవలసియున్నది. మనము సజీవమైన రాళ్లుగా ఉండవలసియున్నది. మనం ఇప్పుడున్నట్లు ఎన్నడూ బద్ధకంగా ఉండకూడదు. మనము సంఘానికి వెళ్తాము, మరియు ప్రభువైన యేసు ఏదో ఒకటి చేయడాన్ని మనం చూస్తాము, లేదా—లేదా మనల్ని ఎంతగానో దీవించటం చూస్తాము, మరియు పిదప, మనం—మనం తిరిగి బయటకు వెళ్ళి మరియు ఇట్లు చెప్తాము, “చాలా మంచి కూటము.”

30 ఇప్పుడు, వాక్యము ప్రసంగించబడుట, మనము దానిని ఆనందిస్తాము, కానీ ముఖ్యమైన విషయం అది కాదు. అది కాదు. మనం సాధారణంగా ప్రభువును ఆరాధించినట్లు, వాక్యాన్ని బోధించబడటం ముగిసిన తర్వాత, మనం ఆయనను ఆరాధించడం కాదండి. అది అద్భుతమే. కానీ మన జీవితంలో ప్రతి ఘడియ మనం ఆయనను ఆరాధించాలి. మనం పనిలో ఉన్నప్పుడు, మనం ఆయనను ఆరాధించాలి. అవకాశం వచ్చిన ప్రతిసారీ, ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుట ద్వారా ప్రభువును ఆరాధించాలి.

మీరు చూసినచో, మీలో కొందరు స్త్రీలు, తప్పిదములో ఉన్న ఒక స్త్రీని చూసిన యెడల, ఆమెను పట్టుకుని మరియు ఇట్లు చెప్పుట ద్వారా ప్రభువును ఆరాధించండి, “సహోదరి, ఇంతకంటే శ్రేష్ఠమైన ఒక జీవితం ఉన్నది.”

31 పురుషులారా మీ పని వద్ద, ప్రభువు యొక్క నామమును ఒక వ్యక్తి వ్యర్ధంగా ఉపయోగించడాన్ని మీరు వినినప్పుడు, మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మరియు అక్కడికి వెళ్ళి, అతని చెయ్యి పట్టుకుని, మరియు ఇట్లు చెప్పండి, “అయ్యా, దీని కంటే శ్రేష్ఠమైన జీవితం ఉన్నది. నీవు అట్టి మాటలను ఉపయోగించకూడదు.” మరియు అతనికి సాత్వీకమైన, సున్నితమైన విధానంలో చెప్పండి. ఆ విషయములన్నియు ఆరాధనే.

మరియు ఎవరైనా అనారోగ్యంతో ఉండుటను మనం చూసినప్పుడు, ఇక చేసేదేమీ లేదని వైద్యుడు చెప్పినప్పుడు, “ప్రార్థనకు సమాధానమిచ్చే ఒక పరలోకపు దేవుడు ఉన్నాడు,” అని వారికి చెప్పుట ద్వారా, మనము దేవుణ్ణి ఆరాధించవలసియున్నది.

32 మరియు అవి జరుగుతూ మరియు చేయబడుటను మనము చూస్తున్నట్టి, ఆ కార్యములు జరుగుటను మనము చూసినప్పుడు, మనము ఈ విషయాలను ఎన్నడూ జారిపోనివ్వకూడదు. మనము వాటిని మన వ్రేళ్ళ సందుల నుండి వెళ్ళిపోనిస్తుంటాము. ఈ రోజు గొప్ప పెంతెకోస్తు సంఘముతో ఉన్న విషయం అదే. అది వారి చేతులలో ఉండగా, వారు ఆ పంట యొక్క పూతనే వారి వేళ్ల నుండి జారిపోనిచ్చారు. అయితే, వారు ఏమి చేసారో చూడండి, వారు ఆ మిగతా సంఘాల వలెనే చేసారు. “వారు తిరస్కారము-…కోరహు బాటలో పరుగెత్తి, మరియు నశించారు; మరియు కయీను మార్గములో వెళ్ళి, మరియు కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి.”

33 వారు సంస్థాగతమైపోయారు. మనమందరం ఒకటిగా ఉండగలిగే సహోదరత్వాన్ని కలిగియుండటానికి బదులు, వారు తమను తాము సంస్థగా ఏర్పాటు చేసుకున్నారు. చిన్న సంస్థలను మరియు చిన్న ఇజమ్‌లను తయారు చేసి, అక్కడ నుండి మొలకెత్తి మరియు సహోదరభావాన్ని బ్రద్దలు చేసిరి. మరియు మీరు చూడలేనిచో, బాప్టిస్టు మరియు ప్రెస్బిటేరియన్లు దానిని పట్టుకొనబోవుచున్నారు, ఎందుకనగా, “దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టించగలడు.” మరియు మనము—మనము ఐక్యమత్యముగా లేకపోవుట ద్వారా దానిని మన చేతుల నుండి జారిపోనిచ్చాము.

34 తెల్లవాడి చేతిలో భారతీయులు ఈ దేశాన్ని ఎలా పోగొట్టుకున్నారు? ఎందుకంటే వారిలో ఐక్యత లేకుండా విడదీయబడుటవలెనే. వారు ఒక్క పెద్ద ముందంజను వేసియుంటే చాలును…అయితే వారు వారిలోనే ఒకరితోనొకరు పోట్లాడుచుండిరి. వారు అందరూ కలిసికట్టుగా ఉన్నచో, వారు తమ రాజ్యాలను నిలబెట్టుకొనియుందురు.

35 మనము దానిని ఎలా పోగొట్టుకొనబోవుచున్నాము? ఎందుకంటే మనము విడదీయబడియున్నాము. దేవునితో మనకున్న అనుభవాన్ని మనం ఎలా కోల్పోతామంటే, మనము విడదీస్తాము. మనము ఒక దానిని స్థాపించి, మరియు దీనిని మెథడిస్టు అని—అని, మరియు దీనిని బాప్టిస్టు అని, మరియు దీనిని అసెంబ్లీస్ అని, మరియు ఇది వన్నెస్ అని, మరియు ఇది మరొకటి-అని, మరియు చర్చ్ ఆఫ్ గాడ్ అని, మరియు నాజరీన్ అని, పిలిగ్రిం హోలినెస్ అని పిలుస్తాము. మనము క్రీస్తు యొక్క శరీరాన్ని విడదీస్తాము. మనము ఎన్నడూ విడదీయబడకూడదు. మన ఆలోచనల్లో బేధమును కలిగియుండవచ్చును, కానీ మనము హృదయపూర్వకంగా సహోదరులుగా ఉందాము. మనము అట్లుండాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన దేవుని సంఘంమంతటి కొరకు మరణించాడు. మరియు మనము ఐక్యమత్యము లేకుండా ఉండగోరుటలేదు.

ఇప్పుడు ఏ సమయంలోనైనా మనము వాటిని విడిచిపెట్టకుండునట్లు…మనము విశేష జాగ్రత్త కలిగియుండవలెను.

ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున,…

36 మీరు దీనిని విన్నారా? “దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము…” ఇప్పుడు, దూత అనగా ఒక “వర్తమానికుడు.” దూత అనే పదానికి అర్థం “ఒక వర్తమానికుడు.” మరియు ఇక్కడ మొదటి పుస్తకంలో, ఇప్పుడే చూశాను, “దేవుడు, పూర్వకాలమందు నానా సమయములలోను, నానా విధములుగాను ప్రవక్తలద్వారా పితరులతో మాటలాడెను.” వారు దేవుని వర్తమానికులు. మరియు వారు, వారు దేవుని వర్తమానికులైన యెడల, వారు దేవుని దూతలైయున్నారు. ఒక వర్తమానికుడు అనగా ఒక దూత; లేదా ఒక దూత అనగా, ఒక వర్తమానికుడు.

37 ఒక వర్తమానికుడు! ఈ ఉదయం, మీరు ఒక వర్తమానికుడైయున్నారు. మీరు…మీరు శుభవార్తలకైనా లేదా చెడు వార్తలకైనా ఒక వర్తమానికుడైయున్నారు. ఓ, మనం రాయబారులమని, మనం దూతలమని, పునరుత్థానము యొక్క వర్తమానికులమని తెలుసుకొనుటకు, అందముగా ఉన్నది కదా? మరియు క్రీస్తు జీవించుచున్నాడనుటకు, మనము ఈ పాపపు ప్రపంచానికి దేవుని యొక్క వర్తమానికులమైయున్నాము. ఆయన మన హృదయాలలో, జీవిస్తున్నాడు. ఆయన మన ఆత్మలలో, జీవిస్తున్నాడు. మరియు ఆయన మనలను నీచమైన పాపపు జీవితం నుండి తీసుకువచ్చి, మరియు మనలను హెచ్చిస్తాడు, మరియు మన అంతరాత్మలో ఒక “హల్లెలూయా” ను ఇచ్చును, మరియు మనలను నూతన జీవులనుగా చేయును. మనము వర్తమానికులము, నిబంధన దూతలమైయున్నాము. ఎంత అద్భుతం!

38 మరియు ఇప్పుడు, పాత నిబంధనలో, “దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినట్లైతే—అట్లయితే,” ఆ విధంగా అది సరిగ్గానే ఉండాలి. పాత నిబంధనలో, ఒక ప్రవక్త యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడే ముందు, అది పరీక్షించబడి మరియు నిరూపించబడాలి. ఈనాడు మనలాగ, వారు దాని విషయంలో వదులుగా లేరు.

39 ఊరకే బయటకు వెళ్ళి, మరియు “ఓ, దేవునికి మహిమ, అది అంతే!” అని ఏదైనా ఒక ఉద్వేగాన్ని లేదా మరి దేనినైనా కలిగియుంటున్నారు, మీరు పొరబడుచున్నారు.

బైబిలు చెప్పినది, ఏమిటనగా, “అంత్య దినములలో, దయ్యము క్రైస్తవ్యాన్ని చాలా దగ్గరగా అనుకరిస్తుంది, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితం మోసము చేస్తుంది.” అది నిజం. కావున, మనం దానిని పరీక్షించాలి.

40 మరియు వారు వారి కాలంలో దానిని ఎట్లు పరీక్షించారు? ఊరీము తుమ్మీము వద్ద. దానిలో ఆ రాళ్ళను కలిగియున్నట్టి, అహరోను యొక్క ఎఫోదు: సూర్యకాంతం, కెంపు, వజ్రము, మాణిక్యం, నీలము. ఈ పన్నెండుగురు గోత్రకర్తల జన్మను సూచించే, ఆ రాళ్ళన్నియు, అహరోను యొక్క ఎఫోదులో ఉండెను. మరియు ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు, మరియు ఆ పవిత్రమైన వెలుగు దాని మీద మెరిసినప్పుడు, దేవుడు ఇట్లు చెప్పెను, “అది సత్యమైయున్నది.” కానీ, అది ఎంత వాస్తవంగా కనిపించినప్పటికీ, అది దాని మీద ప్రకాశించనియెడల, అది సత్యము కాదు. కావున, ఆ ఊరీము తుమ్మీము ఆ యాజకత్వంతో పాటే వెళ్ళిపోయినది.

41 అయితే ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథమే దేవునియొక్క ఊరీము తుమ్మీము. మరియు ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు, అది ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథముతో మెరవవలసియున్నది. అప్పుడు, దేవుడు చెప్పును, అప్పుడు ఆయన దిగివచ్చి మరియు దానిని రుజువు చేయును.

42 ఓ, నేను ఈ రోజు దేవుణ్ణి ఎంతగా మహిమపరచగలను! నేను ఆలయమును విడిచి వెళ్తునప్పుడు, ఇటువంటి, మరొక ఆదివారం ఉదయమును గూర్చి నేను ఆలోచిస్తున్నాను. మరియు మీరు ఏడుస్తూ మరియు నన్ను వెళ్ళవద్దని అడుగుచుండిరి. కానీ, నేను, దావీదు మరియు గొల్యాతుపై బోధించినప్పుడు, మరి అద్భుతాలు జరిగే రోజులు గతించిపోయినవని చెప్పే ఆ చల్లబారిన, భిన్నమైన ప్రపంచాన్ని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు.

43 నేను చెప్పాను, “ఒక పెద్ద దిగ్గజం ఉన్నాడు, మరియు మనం అతణ్ణి చంపగలిగిన వెంటనే, మిగిలిన వారు ధైర్యం తెచ్చుకుంటారు.” మరియు ప్రభువు దానిని అనుగ్రహించాడు. మరియు పిదప ఒక ఓరల్ రాబర్ట్స్ మరియు ఒక జాగర్స్, మరియు మొదలగువారు ఉన్నారు, ఖడ్గాన్ని లాగి, మరియు మేము శత్రువులతో పోరాడి, వారి నోళ్లు మూయించి, దేశము నుండి వెళ్ళగొట్టాము. అద్భుతాలు జరగవని వారు చెప్పలేరు, ఎందుకనగా అవి ఇక్కడ ఉన్నాయి. నిశ్చయంగా. దేవుని వాక్యము నిత్యమైనది. అది ఊరీము మీద మెరిసింది. వాక్యము మీద మెరిసింది, అదే ఆయన యొక్క ఊరీము తుమ్మీము. మరియు అది దానిపై ప్రకాశించినప్పుడు, అది సానుకూలంగా ఉంది.

మరియు అవసరతలో ఉన్న ఎవరికైనా, నీవొక పాపివైయ్యుండి, ఎలా రక్షించబడాలని నీవు తెలుసుకొనగోరుచున్నయెడల, “ప్రభువైన యేసుక్రీస్తు నందు నమ్మికయుంచుము.”

44 ఈనాడు, మీరు చేయవలసిన అనేక కార్యములు మనకు ఉన్నవి. “క్రొత్త పేజీలను తిరగేయాలి. రక్షింపబడుటకు మీరు దీనిని చేయాలి మరియు దానిని, చేయాలి.”

నేను ఫిలిప్పీ చెరసాల అధికారి గురించి ఆలోచిస్తున్నాను, ఈ అధికారి పౌలును ఇట్లు అడిగెను, “రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను?”

అది మీరు లేదా నేను అయితే, అతను చేయకూడని కార్యములను మనము అతనికి చెప్పియుండేవారము. “నీవు మద్యపానం మానేయాలి. నీవు నీ—నీ జూదమాడుటను ఆపివేయాలి. నీవు దీనిని మానేయాలి. నీవు దానిని మానేయాలి.”

పౌలు ఎన్నడూ అతనికి అట్లు చెప్పలేదు. ఆయన కేవలం అతడు చేయవలసిన కార్యములనే అతనికి చెప్పెను. “ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, మరియు నీవు రక్షింపబడుదువు.”

45 ఇప్పుడు, “నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు.” అదే ఊరీము తుమ్మీము ప్రకాశించుటయైయున్నది, పరిశుద్ధ యోహాను 5:24. “నీ వ్యాధులన్నింటినీ స్వస్థపరచు యెహోవాను నేనే.” యాకోబు 5:14, “పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున నూనె రాసి వారిని అభిషేకించవలెను, విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును.” ఊరీము మెరుస్తుంది. చూసారా? అది దేవుని యొక్క నిత్యమైన వాక్యము.

46 ఎంతమంది నాస్తిక, అవిశ్వాస, అజ్ఞేయవాదులు, సంశయవాదులు లేచినా నేను లెక్కచేయను. దేవుడు తన వాక్య పక్షమున నిలబడును. ఆయన దానిని చేస్తాడని ఆయన వాగ్దానం చేశాడు.

47 “మరియు ఏ సమయంలోనైనా మనం వాటిని విడిచిపెట్టకుండునట్లు, మనం విన్న ఈ విషయాల పట్ల మనము విశేష జాగ్రత్త కలిగియుండవలెను. ఏలయనగా దేవదూతలు (ప్రవక్తలు) చెప్పిన మాట స్థిరపరచబడినచో…” అవి స్థిరపరచబడెనా? మనము దీని మీద ఒక వారం మాట్లాడవచ్చును.

48 మోషే మాట్లాడినప్పుడు అది స్థిరపరచబడినదా? అది నిశ్చయముగా స్థిరపరచబడెను.

ఏలియా, ఆ పర్వతము మీదనున్నప్పుడు సంగతేమిటి? ప్రభువు అతనితో ఇట్లు చెప్పెను, “ఏలియా, అక్కడికి వెళ్ళుము. నేను నీతో అక్కడ ఉంటాను; కొంత సహవాసం కావలయును.” దేవుడు తన ప్రజలతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. కానీ ఆయన మనతో సహవాసం చేయడానికి చాలింత ఎక్కువ సమయము మనము నిలబడము. మనము ఒక స్థలం నుండి మరొక స్థలమునకు పరిగెత్తుచూ, మరియు వాటితో, అసలు తీరిక లేకుండ ఉన్నాము. “ఏలియా, ఊరకుండుము.” ఆయన మూడు సంవత్సరాలు మరియు ఆరు నెలల సహవాసమును కోరుకున్నాడు. మనమైతే అతి కష్టంగా ఆయనకు మూడు నిమిషాల సమయము కూడా ఇవ్వలేము. మూడు సంవత్సరాలు మరియు ఆరు మాసముల నిరంతర సహవాసం. ఓ, నేను దానిని ప్రేమిస్తున్నాను! ఇట్లు చెప్పెను, “వంట గురించి చింతించకు; మేము దానిని ఇదివరకే పరిష్కరించాము. కాకులు నీకు ఆహారం ఇవ్వబోవుచున్నవి. మరియు అంతా బాగానే ఉండబోవుచున్నది. నాకు కేవలం కొంత సహవాసము కావలెను.” ఈ వృద్ధ ప్రవక్త, ఏలియా, అక్కడ ఆ పర్వతం మీద కూర్చునియున్నాడు, అతడు దేవునితో సహవాసం కలిగియుంటున్నప్పుడు, ఎందుకు, ఆ కెప్టెన్ ఇట్లన్నాడు, “నేను పైకి వెళ్ళి మరియు అతణ్ణి తీసుకువస్తానని నేను నమ్ముచున్నాను.” ఇప్పుడు, ఆ సహవాసాన్ని బ్రద్దలు చేయడానికి మీరు ఎన్నడూ ప్రయత్నించకండి.

49 అయితే, ఆ కెప్టెన్, యాభై మంది ఉన్న, తన గొప్ప సైన్యంతో పైకి వచ్చాడు. మరియు అతను ఇట్లన్నాడు, “ఏలియా, నేను—నేను—నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను.”

50 మరియు ఏలియా లేచి నిలబడ్డాడు. గమనించండి, ఇదిగో ప్రభువు యొక్క ప్రవక్త ఇక్కడ ఉన్నాడు! అతడు అన్నాడు, “నేను ప్రభువు యొక్క సేవకుడినైన యెడల, ఆకాశం నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించును గాక.” మరియు అగ్ని క్రిందికి దిగి వచ్చినది. ఆ కెప్టెన్ ఇట్లన్నాడు…

51 “ఓ, మీకు తెలుసా?” లేదా, రాజు, ఇట్లన్నాడు, “అది బహుశా ఒక—ఒక పిడుగు కావచ్చు, కేవలం అటుగా వెళ్ళుచున్న ఒక మెరుపు, మరియు అది వారిని తాకియుండవచ్చును. నేను మరో యాభై మందిని పంపుతాను.”

52 ఏలీయా లేచి నిలబడ్డాడు, అతడు దూతలలో ఒకడు, అతని మాట స్థిరమైనది. తప్పుగా చేయబడిన ప్రతిదానికీ అతడు తిరిగి చెల్లింపజేయవలసి యుండెను. అతను చెప్పాడు, “నేను ప్రభువు యొక్క సేవకుడనైతే, అగ్ని వచ్చును గాక.” మరియు రెండవ యాభై మందీ కాలిపోయారు. అది సరే. ప్రతిదానికీ ప్రతిఫలం!

ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, మరియు ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా…

53 ఇప్పుడు, ఇక్కడ గొప్ప విషయం ఉన్నది, తదుపరి వచనము.

మనము ఏలాగు తప్పించుకొందుము,…

54 “మనము ఏలాగు తప్పించుకొందుము?” అతడు ప్రభువు యొక్క దూతయైనందున, ఏలీయా యొక్క స్వరము నాశనాన్ని తీసుకొస్తే, క్రీస్తు యొక్క స్వరము మాట్లాడుచుండగా మనం ఎలా తప్పించుకుంటాము? లేదా, అది క్రీస్తు యొక్క స్వరం అయిన యెడల, మీకు ప్రార్థన చేయబడినప్పుడు మనము ఎలా విఫలమవ్వగలము? రోగుల కొరకు ప్రార్థించమని క్రీస్తు తన సంఘమును అభిషేకించినయెడల, మరియు ఆయన వారికి…ఏమి చేయమని చెప్పెనో సంఘము దానిని చేయుచున్న యెడల, మరి అప్పుడు అది ఎన్నడైనా ఎలా విఫలమవ్వగలదు? అది కుదరదు. మీరు విఫలమవ్వచ్చు, కానీ అది విఫలమవ్వలేదు. మరియు మీరు దానిని గైకొనినంతకాలం, అది మిమ్మల్ని తీసుకొనివెళ్ళును.

55 మీరు విఫలమైన యెడల, మీకు మీరుగానే మీరు విఫలమయ్యారు. మీరు వాక్యము నుండి దూరంగా వెళ్ళిపోయారు. అయితే మీరు వాక్యముతో ఉన్నంత కాలం, అది విఫలమవ్వజాలదు. ప్రవక్తల వాక్యము ఫలానా-మరియు-ఫలానా విషయాన్ని చేసినప్పుడు, క్రీస్తుయొక్క వాక్యము ఇంకెంతగా ఉంటుంది?

ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినయెడల, మనము ఏలాగు తప్పించుకొందుము; అట్టి రక్షణ ప్రభువు బోధించుటచేత ఆరంభమై, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను;

56 దానిని గూర్చి ఆలోచించండి, అది ప్రభువు చేత పలుకబడినది. మనం ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళగలము? సరిగ్గా ఇక్కడే, మనం ఒక గంట పాటు ఎక్కడ ఆగగలం? యేసు వచ్చినప్పుడు, ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడు.

57 ఇప్పుడు, గుర్తుంచుకొనుడి, మొదట స్వయంగా యేసు ద్వారానే, పలుకబడటం ప్రారంభించబడినది, మరియు పిదప ఆయనను విన్న వారిచే ధృవీకరించబడింది. ఇప్పుడు ఆయన చెప్పేది వినండి.

58 ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, తాను ఒక స్వస్థపరచువాడనని చెప్పుకొనలేదు. ఆయన ఇట్లు చెప్పెను, “ఈ క్రియలు చేయునది నేను కాను; అది నాయందు నివసించు నా తండ్రియైయున్నాడు. ఆయనే ఈ క్రియలను చేయుచున్నాడు. తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో, అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు,” పరిశుద్ధ యోహాను 5:19.

59 ఫిలిప్పు ఆయన వద్దకు వచ్చినప్పుడు గమనించండి. నతనయేలు…ఫిలిప్పు మారిన తర్వాత, అతను వెళ్ళి నతనయేలును తీసుకువచ్చెను. ఇట్లు చెప్పెను, “వచ్చి, మేము ఎవరిని కనుగొన్నామో చూడుము: యోసేపు కుమారుడైన, నజరేయుడగు యేసును.”

60 మరియు అతను అన్నాడు, “నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా?”

61 ఇట్లు చెప్పెను, “వచ్చి, చూడుము.” ఒప్పించబడవలసిన మార్గం అదే: దానిని నిరూపించండి. వచ్చి మరియు చూడుము. ఓ, అది నేను విన్న అత్యుత్తమమైన విషయమైయున్నది. వచ్చి మరియు మీ కొరకు మీరే కనుక్కోండి. ప్రక్క దోవలో నిలబడి మరియు విమర్శించకండి, కానీ, “అన్ని విషయాలను నిరూపించి, మరియు మేలైన దానిని గట్టిగా పట్టుకోండి.” వచ్చి మరియు చూడుము.

62 దారి పొడవునా మాట్లాడుకుంటూ, వారు వెళ్ళారు. అతను ప్రభువైన యేసు యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన ఇట్లన్నాడు, “ఇదిగో ఇతడు ఏ కపటమునూ లేని ఇశ్రాయేలీయుడు.”

63 అది దాదాపు, అతని చర్మమునంతా ఒలిచివేసినది. అతను చుట్టూ చూసి, ఇట్లన్నాడు, “సరే, బోధకుడా, నీవు నన్ను అసలు ఎప్పుడు తెలుసుకున్నావు? నీవు నన్ను ఎప్పుడూ చూడలేదు. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువు?” ఫిలిప్పు అన్నాడు…

64 “అతడు పిలవడానికి, ముందే…” ఇట్లు చెప్పెను, “నిన్నటి దినమున ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే, నేను నిన్ను చూచితిని.” ఆమేన్.

65 అతను ఇట్లు చెప్పెను, “నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలు రాజువు.”

66 ఒక స్త్రీ ఆయన సన్నిధికిలోనికి నడుచుకుంటూ వచ్చినది, మరియు ఆయన ఇట్లన్నాడు, “నీవు వెళ్ళి, నీ భర్తను తీసుకురా.”

ఆమె ఇట్లు చెప్పెను, “నాకు పెనిమిటి లేడు.”

67 ఆయన అన్నాడు, “నీవు చెప్పినది సరియే. నీకు అయిదుగురు ఉండిరి, మరియు ఇప్పుడు నీవు జీవిస్తున్నవాడు నీ పెనిమిటి కాడు. నీవు నిజమే చెప్పితివి.” దానిని గూర్చి ఆలోచించండి.

68 ఆమె ఇట్లన్నది, “అయ్యా, నీవొక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. అంటే, మెస్సీయా వచ్చినప్పుడు ఆయన మాకు సమస్తమును తెలియజేయునని మేము ఎరిగియున్నాము.”

69 ఆయన చెప్పెను, “నీతో మాటలాడుచున్న, నేనే ఆయనను.”

70 మరియు ఆమె పరుగెత్తుకొనిపోయి మరియు ఆ ఊరిలోని మనుష్యులతో ఇట్లు చెప్పెను, “వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయన మెస్సీయా కాడా?” అది ప్రభువు ద్వారా పలుకబడినది.

71 ఏమి జరిగినది? యేసు, తాను వెళ్ళే ముందు ఇట్లు చెప్పెను, “నేను చేయు క్రియలు, మీరునూ చేయుదురు.” అది నిజమేనా? “నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను గనుక, నేను చేయు క్రియలు మీరును చేయుదురు, వాటికంటె మరి గొప్పవియు చేయుదురు.” ఓ, వారు వెళ్ళుచుండగా, నేను వాటిని ప్రతిచోటా చూడగలుగుచున్నాను. మార్కు 16, “వారు బయలుదేరి వాక్యమును అంతటా, ప్రకటించిరి; ప్రభువు వారికి సహకారుడైయుండి, వాక్యమును స్థిరపరచుచుండెను.”

మరియు ఇక్కడ, పౌలు, అదే విషయాన్ని చెప్పుచున్నాడు. అతడు చెప్పినది ఏమిటనగా ఆ—ఆ సువార్త యేసు ద్వారా బోధించడం ప్రారంభించబడి, మరియు ఆయనను విన్నవారి ద్వారా మనకు ధృవీకరించబడింది. అదే పునాది రాయి. ఓ, ప్రభువు నామము స్తుతింపబడును గాక! అదియే పునాది రాయి.

72 మరియు ఆలోచిస్తే, రెండు వేల సంవత్సరాలు గడిచినవి. నాస్తికులు, అవిశ్వాసులు, మరియు సంశయవాదులు, మరియు అజ్ఞేయతావాదులు లేచారు. కానీ, ఈనాడు, అదే యేసు తనను వినే వారి ద్వారా తన వాక్యమును అదే విధానములో ధృవీకరిస్తున్నాడు. “ఈయన మాట వినుడి,” అంటే కేవలం ఒక ప్రసంగం వినమని కాదు. అంటే, ఆయన చెప్పేది వినమని అర్థం. అవును.

73 మనం ఎలా తప్పించుకొందుము? మనకు తప్పించుకునే దారి ఏది? ఓ, మీరు ఇట్లనవచ్చు, “దేవునికి స్తోత్రం, నేను మెథడిస్టు సంఘానికి చెందినవాడను. నేను ఒక ప్రెస్బిటేరియనువాడను. నేను ఒక పెంతెకోస్తువాడను.” దానికి దీనితో ఎటువంటి సంబంధము లేదు. మరియు మీరు ప్రక్క-దోవ పట్టి, దీనిని ఒక “ఆత్మలతో మాట్లాడుటయని, లేక ఏదో మనస్సును చదువుటయని, లేక ఏదో ఒక దయ్యమని,” లేదా మరేదోయని మీరు పిలువగోరతారు. వారికి సిగ్గుచేటు!

74 “దేవదూతల యొక్క ప్రతీ వాక్యము స్థిరపరచబడినయెడల…” యేసు ఇట్లు చెప్పెను, “అది కాదు…కొంత కాలమైన తర్వాత, లోకము నన్ను ఎంతమాత్రము చూడదు. అయిననూ, మీరు నన్ను చూతురు, ఏలయనగా నేను యుగసమాప్తి వరకు మీతోను, మీలోను ఉందును.” మరియు ఆయన తన వాక్యాన్ని ధృవీకరించుటను కొనసాగించడానికి, క్రిందికి వచ్చుటను మనం చూసినప్పుడు, మనం వేరొక సంఘమునకు లేదా ఏదైనా మత సంస్థకు, లేదా సంఘ శాఖకు, లేదా ఏదైనా మన స్వంత చిన్న పెంపుడు సిద్ధాంతమునకు మనము సహకారంగా ఉంటే, మనం ఏలాగు తప్పించుకొందుము? మీరు విడిచిపెట్టడం మంచిది. “ఎట్లనగా దేవదూతల క్రింద ప్రతి పాపము న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా, తన వాక్యమును ప్రత్యక్షపరచుటకు, దేవుని కుమారుడు పరలోకము నుండి మాట్లాడుచున్నప్పుడు అది ఇంకెంతగా ఉండును గదా! ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల, మనము ఏలాగు తప్పించుకొందుము?” ఓ, మై! “దేవుడు కూడా…”

4వ వచనం:

దేవుడు వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా,…

75 దీనిని గమనించండి. ప్రభువు సాక్ష్యములిచ్చెను. ఓ, నేను దాని విషయమై చాలా సంతోషంగా ఉన్నాను! ప్రభువే సాక్ష్యమిచ్చెను.

76 చూడండి. ఏలీయా ఆ కొండపైన ఉన్నప్పుడు, అతను ఇలా అన్నాడు, “నేను ఒక దైవజనుడనైతే, అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి మిమ్మును దహించునుగాక.” అతను ఒక దైవజనుడై ఉండెనని దేవుడే సాక్ష్యమిచ్చాడు.

దేవుడు ఎల్లప్పుడూ సాక్ష్యమిస్తాడు. మీ జీవితం సాక్ష్యమిస్తుంది. మీ సాక్ష్యం ఏమిటో నాకు తెలియదు, కానీ మీ స్వరము వినబడలేనంతగా, మీ జీవితమే చాలా బిగ్గరగా మాట్లాడుతుంది. కానీ, మీ—మీ జీవితం, మీ అనుదిన-జీవితం మీరు ఏమిటో సాక్ష్యమిస్తుంది. దేవుడే సాక్ష్యమిస్తాడు. అవును. పరిశుద్ధాత్మ ఒక ముద్రయైయున్నది, మరియు ఒక ముద్ర కాగితం యొక్క రెండు వైపులకు వర్తిస్తుంది. మీరు ఇక్కడ నిలబడటం వారు చూస్తారు మరియు మీరు వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని చూస్తారు. సంఘములో మాత్రమే కాదు గానీ రోజు-వారీ పనిలో కూడా మిమ్మల్ని గమనిస్తారు. మీరు లోపల మరియు బయట, ఇరువైపులా ముద్రించబడ్డారు. మీరు కలిగియున్న ఆనందమును బట్టి, మరియు మీరు జీవించే జీవితమును బట్టి, మీరు, లోపల మరియు వెలుపట ముద్రించబడియున్నారు, తద్వారా మీరు రక్షించబడ్డారని మీకు తెలియును మరియు మీరు జీవించే జీవితం ద్వారా, మీరు రక్షించబడ్డారని ప్రపంచానికి తెలియును, ఏలయనగా దేవుడు సాక్ష్యమిచ్చును. ఆయన పరిశుద్ధ నామము స్తుతింపబడును గాక! మై, నేను ఆత్మీయ అనుభూతిని పొందుచున్నాను!

77 సహోదరులారా, అక్కడ, దానిని గూర్చి ఆలోచించండి. ఓ! “నా గొర్రెలు నా స్వరము వినును, మరియు అవి వేరొకనిని వెంబడించవు.” ఓ, మన పేర్లు ఎట్లు ఆయన అరచేతులపైన ఉన్నాయి కదా! రాత్రింబగళ్ళు, అది ఆయన ముందు ఉన్నది. ఆయన వాక్యము, ఆయన వాగ్దానము ఎల్లప్పుడూ ఆయన ఎదుట ఉన్నది. ఆయన దానిని మరచిపోలేడు. మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.

78 ఇప్పుడు, తన స్వంతవారిని గూర్చి ఆయన సాక్ష్యమిచ్చును. మీరు మీ నోరు తెరిచి ఒక్క మాట కూడా పలుకరు, మీకు ఏదో సంభవించినదని ఈ లోకానికి తెలుస్తుంది.

…సూచకక్రియలచేతను, మరియు మహత్కార్యములచేతను, మరియు నానావిధము లైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, తన చిత్తానుసారముగా ధృడపరచెను?

79 ఇప్పుడు ముగించుటకు ముందుగా మనం కేవలం ఒక లేఖనాన్ని తీసుకుందాం; పెంతెకోస్తు దినమున, వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు. దాదాపు నాలుగు రోజుల తర్వాత, పేతురు శృంగారమనే ద్వారం గుండా వెళ్ళాడు, అతడు మరియు యోహాను. వారు ఒక వ్యక్తితో, “మా వైపు చూడుము,” అని చెప్పారు. మరియు ఇట్లు చెప్పాడు, “వెండి మరియు బంగారములు నాయొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చెదను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, లేచి నడువుము.” మరియు ఆ మనిషి పైకి చూసి మరియు దాని గురించి ఏమీ ప్రశ్నించలేదు. అతడు దిగ్గున లేచి నడుచుకుంటూ వెళ్ళెను. వారు అజ్ఞానులు మరియు విద్యలేని పామరులు. అయితే పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పెను, “వారి విషయమై వీరు జాగ్రత్తపడవలెను, ఏలయనగా వారు యేసుతో కూడ ఉండియున్నారని వీరు ఎరిగియున్నారు.”

80 సహోదరుడా, నీవు యేసుతో ఉండియున్నావని ప్రపంచానికి తెలిసినప్పుడు, నీవు యేసుతో ఉన్నావని ప్రపంచము గ్రహించి మరియు చూడగలుగునట్లు, ఈ ప్రస్తుత ప్రపంచంలో మరియు ఈ అంధకారములో అటువంటి ఒక సంకరములేని జీవితాన్ని నీవు జీవించగలిగినప్పుడు, వీధిలోని ఒక కరుకైన, నీచమైన వేశ్య కూడా గొర్రెపిల్ల రక్తంలో కడుగబడి, ఒక స్త్రీగా మారినప్పుడు, తాను జీవిస్తున్నాడని దేవుడు సాక్ష్యమిచ్చుచున్నాడు.

81 ఒక తాగుబోతును తీసుకోండి, అతడు తన భార్య మీదకు ఉరకలు వేస్తాడు, అతడు తన పిల్లలతో చెడుగా వ్యవహరిస్తాడు, మరియు ఒక వేశ్యకొరకు ఖర్చు చేయడానికి, భోజనపు బల్ల మీద నుండి ఆహారాన్ని తీసుకొంటాడు. అతడిని ఒక్కసారి యేసుతో ఉండనివ్వండి, అతడు, ఆ సేన అను దయ్యములు పట్టినవాడు, స్వస్థచిత్తుడై మరియు బట్టలు ధరించుకొన్నలాగున, తన బిడ్డల వద్దకు మరియు తన భార్య వద్దకు మరియు తన ప్రియమైనవారి వద్దకు తిరిగి వచ్చుటను మీరు చూస్తారు. ఖచ్చితంగా.

82 కొంతకాలం క్రితం, సుమారు నలభై సంవత్సరాల క్రితం, ప్రపంచంలోని మతాలన్నీ కలిసినప్పుడు, మరియు వేర్వేరు వ్యక్తులు లేచి మాట్లాడారు. మరియు మహమ్మదీయుడు మహమ్మదీయ మతం కొరకు మాట్లాడాడు. జైనులు జైనుల కొరకు మాట్లాడారు; బౌద్ధుడు బుద్ధుని కొరకు మాట్లాడాడు. మరియు ఒక చిన్న వైద్యుడు, అతని ఇంటిపేరు ఏమిటో, ఈ సమయంలో నేను మర్చిపోయాను, అతని పేరు నాకు తెలుసు, కానీ నేను దానిని మర్చిపోయాను, అతడు క్రైస్తవ్యానికి ప్రతినిధిగా మాట్లాడాడు, మరియు అతడు అమెరికాలోని, ఓక్లహోమాకు చెందిన లేడీ మాక్కబీ యొక్క కథను చెప్పాడు.

ఆమె ఎంతో కురూపి, మరియు చాలా దిగజారిన-వ్యక్తి, ఎంతగా అంటే వారు ఆమెను చంపడానికి వెళ్ళినప్పుడు, వారు ఆమెపై చేతులు కూడా పెట్టలేదు, ఆమె అంత అసభ్యంగా మరియు నీచంగా ఉంది. ఆమె నాలుగు గుఱ్ఱముల జట్కా బండిని నడుపుతూ: వీధి గుండా వెళ్ళినప్పుడు; సిగరెట్టు త్రాగుచూ; జట్కా బండి నడుపుతూ, మరియు ఆ—ఆ—ఓక్లహోమాలోని చట్టాలను, రికార్డులను ఉల్లంఘించిన ఒక అభియోగంపై, వారు ఆమెను అరెస్టు చేశారు. మరియు ఆమె ఎంత నీచంగా మరియు మురికిగా ఉండెనంటే ఆమె ఉన్న చోటుకి సమాజము అస్సలు వెళ్ళేవారు కారు; ఎంతగా అంటే, మరణదండన అమలు చేయువారు ఆమెను చంపబోవునప్పుడు, వారు ఆమెను ఉరి తీయలేదు. వారు ఆమెను చంపడానికి, కేవలం ఆమెపై తారు మరియు ఈకలను వేశారు.

మరియు ఈ చిన్న బోధకుడు ఆమె కథను చెప్పినప్పుడు, ఏ విధంగా చెప్పాడంటే, ఆ ప్రజలు తమ కుర్చీలలో కూర్చొని, తరువాత ఏమి జరగబోవునో అని ఆత్రుతతో వినుచుండిరి. అతడు ఈ విషయానికి వచ్చినప్పుడు: చాలా నీచంగా, మురికిగా, దిగ-జారి ఉన్నది, ఎట్లనగా చట్టం కూడా ఆమెతో వ్యవహరించగోరలేదు, ఆమె అంతగా దిగజారిపోయింది. అతడు ఆ కథను చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే, పాతాళములోనున్న దయ్యం కూడా అటువంటి ఒక వ్యక్తిని తృణీకరిస్తుంది. పిదప అతడు ఇట్లు చెప్పెను, “ప్రపంచంలోని మత పెద్దలారా, లేడీ మాక్కబీ చేతులను శుభ్రం చేసే దేనినైనా మీ మతం కలిగియున్నదా?”

83 అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు అతడు తన చేతులతో చప్పట్లు కొట్టి, మరియు గాలిలో పైకి గెంతాడు. అతడు చెప్పాడు, “దేవునికే మహిమ! యేసుక్రీస్తు రక్తము ఆమె చేతులను మాత్రమే శుభ్రపరచడం కాదు గానీ, అది ఆమె హృదయాన్ని కూడా శుభ్రపరుస్తుంది మరియు ఆమెను ఆయన వధువుగా చేస్తుంది.” మీకు చెప్పెదను:

ఎంత అధ్బుతమైన కృప! ఎంతో మధురమైన స్వరం,

నావంటి ఒక నీచుని రక్షించెను!

నేను ఒకనాడు తప్పిపోయాను, కానీ నేడు కనుగొనబడ్డాను,

నేను అంధుడనై యుంటిని, కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను.

నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే,

నా భయములన్నింటినీ పారద్రోలినది కృపయే;

నేను మొదటగా నమ్మిన ఆ ఘడియలో

ఆ కృప ఎంత ప్రశస్తముగా ప్రత్యక్షమైనదో!

84 నిశ్చయంగా. “అటువంటి దానిని మనం నిర్లక్ష్యం చేసినయెడల మనమేలాగు తప్పించుకొందుము?” మీరు తినడం నిర్లక్ష్యం చేస్తే మీరు చనిపోతారు. మీరు ఒక మలుపు త్రిప్పేటప్పుడు నిర్లక్ష్యం చేస్తే, మీరు దేనికో గ్రుద్దుకుంటారు. మీరు ఆవును పాలు పితకడంలో నిర్లక్ష్యం చేస్తే, అది ఎండిపోతుంది. మీరు మీ దంతాలను నిర్లక్ష్యం చేస్తే, మీరు వాటన్నింటినీ పీకివేయవలసి ఉంటుంది. నిశ్చయంగా. మీ నిర్లక్ష్యానికి మీరు వెల చెల్లిస్తారు.

85 ఓ బ్రెన్‌హామ్ గుడారమా మరియు సందర్శకులారా, ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. మీరు దేవుని మహిమను గూర్చి సాక్ష్యమివ్వడాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవునికి స్తుతి మరియు మహిమను ఇవ్వడంలో మీరు నిర్లక్ష్యం చేస్తే, ఒకానొక ఈ దినాల్లో మీరు చల్లబడి, నామకార్థంగా, మరియు దిగజారిన వారిగా, మిమ్మల్ని మీరు కనుగొంటారు. మీరు దేవుణ్ణి స్తుతించండి. “ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినయెడల, మనము ఎలాగు తప్పించుకొందుము?”

86 ఆలస్యం అవుతుంది. ఆ వెనుక లోపలికి వచ్చిన, సహోదరుడు థామ్‌ని నేను ఇప్పుడే గమనించాను. ప్రభువు చిత్తమైన యెడల మనము ముగించి, మరియు ఈ రాత్రి దీనిని కొనసాగిద్దాము.

ఒక్క క్షణం మనము ప్రార్థించెదము.

87 మా పరలోకపు తండ్రీ, ఆశీర్వాదములు, స్తుతులు, మహిమయు, ఘనతయు మరియు జ్ఞానమును, మరియు శక్తియు, మరియు బలమును, ఎన్నటికీ నీకే చెల్లును గాక. ఓ, సింహాసనాసీనుడైన ఆ గొర్రెపిల్లకు, అధికారమును మరియు రాజ్యములు మరియు సమస్తమునూ ఆయన చేతికి ఇవ్వబడెను. మన నీతి నిమిత్తము, ఆయన మృతులలో నుండి లేచినప్పుడు, ఆయన లోకానికి ఇలా కేక వేసి చెప్పాడు, “పరలోకములోనూ భూమి మీదనూ నాకు సర్వాధికారము ఇవ్వబడినది. కావున, మీరు సర్వ లోకమునకు వెళ్ళి, సర్వసృష్టికీ సువార్తను ప్రకటించుడి.”

మరణమగుచున్న ఓ ప్రియమైన గొర్రెపిల్లా, నీ అమూల్యమైన రక్తం

ఎన్నటికీ దాని శక్తిని కోల్పోదు,

విడుదల పొందిన దేవుని సంఘమంతయూ

ఇక మీదట పాపము చేయకుండునట్లు, రక్షించడునంతవరకై యున్నది.

88 సేవకులుగా, మేము ఎంతో కోరుచున్నామని చూచుటకు, మాకు సహాయము చేయుము; మేము ఒక సంఘమును ఎట్లు కలిగియుండవలెననియు, మేము దీనిని, మేము ప్రతిదానిని కలిగియుండవలెనని కోరుచున్నాము.

89 మా స్త్రీలు, ఇంకా సంఘానికి వెళ్ళక ముందే, తమను తాము క్రైస్తవులు అని పిలుచుకొనుచు, ఒక నిర్దిష్ట రకమైన దుస్తులు కలిగియుండాలని, లేదా చాలా అందముగా వస్త్రధారణ చేసుకోవాలనియున్నారు.

మరియు బోధకులు వారు రావడానికి ముందు చాలా డబ్బును కలిగియుండవలెననియు, మరియు ప్రతీది ఫలానా-మరియు-ఫలానా విధంగా ఉండవలెననియున్నారు.

90 ఓ క్రీస్తూ, దేవదూతల పరిచర్య క్రింద, “వారెట్లు గొర్రె చర్మములను, మరియు మేక చర్మములను వేసుకొని సంచరించారని, భూమి యొక్క గుహలలోనూ మరియు సొరంగములలోను నివసించారని, వారు, కఠినమైన హింసల క్రింద సంచరించి, మరి అయినప్పటికినీ, విశ్వాసమును విడిచిపెట్టలేదు,” అని నేను ఇక్కడ చదివినప్పుడు, మేము ఎట్లు తప్పించుకొందుము, మాకు ప్రభువైన యేసు, మంచి గృహాలను, కార్లను, బట్టలను, మరియు ఆహారాన్ని ఇచ్చియుండగా, మరియు మేము గొణుగుచూ, కూర్చొని, సోమరులుగా ఉన్నాము, మేము బయటకు వెళ్ళి మరియు దాని విషయమై ఏదైనా చేయుటకు ఎన్నడూ ప్రయత్నించము, దేవా, మేమెట్లు తప్పించుకొందుము?

91 ఓ, ప్రభువా, ఈ ఉదయం నీవు ప్రతీ హృదయంలోనూ, ఆ పాత-కాలపు మారు మనస్సును రగిలించాలని నేను ప్రార్థిస్తున్నాను, తద్వారా ప్రజలు దానికొరకు ఏమైనా చేయుదురు. పగటి వెలుగు ప్రకాశిస్తుండగానే మనం పని చేద్దాం, ఎందుకంటే సూర్యుడు వేగంగా అస్తమించుచున్నాడు. మరియు నాగరికత వెళ్ళిపోవుచున్నది, మరియు ఇక సమయము ఉండదు. అది నిత్యత్వములోనికి కలిసిపోవును.

92 ఓ దేవా, ఈ రోజు మేము తాజా దర్శనముతో వెళ్ళులాగున అనుగ్రహించుము, పాపులను ఎట్లు సంప్రదించి మరియు వారిని క్రీస్తు వద్దకు ఎట్లు నడిపించాలో తెలుసుకొనుటకు, జ్ఞానమును, అవగాహనను అనుగ్రహించుము. ప్రభువా, నీ సేవకుని ప్రార్థనను ఆలకించుము.

93 క్రీస్తును తమ రక్షకునిగా ఎరుగనివారు ఎవరైనా ఇక్కడ ఉన్నయెడల, మీ చెయ్యి పైకెత్తి మరియు ఇట్లు చెప్పుదురా అని నేను అడుగుచున్నాను, “బ్రెన్హామ్ సహోదరుడా, నన్ను జ్ఞాపకము చేసుకొనుము”? మీరు కేవలం మీ చెయ్యి పైకెత్తి, ఇట్లు చెప్పుదురా, “నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నేను ఒక క్రైస్తవుడిగా ఉండగోరుచున్నాను. ఇకపై దానిని ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదనుకుంటున్నాను”? ఆ వెనుక, అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకా ఎవరైనా? ఇట్లు చెప్పుదురా, “బ్రెన్హామ్ సహోదరుడా, నేను నా చెయ్యి పైకెత్తగోరుచున్నాను. మరియు నేను క్రీస్తును, నా రక్షకునిగా అంగీకరించగోరుచున్నాను, నేను ఇంతకాలం నిర్లక్ష్యం చేసాను. ఓ, నిశ్చయంగా, నేను సంఘానికి వెళ్తాను, నేను సంఘానికి చెందినవాడిని.” 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...