హెబ్రీయులకు రెండవ అధ్యాయము రెండవ భాగము
…అతడు దానిని పోల్చి చూసి, మరియు అది సత్యమో కాదో అని చూడగలుగునట్లు, ముందుగా వచ్చి మరియు లేఖనములను అధ్యయనం చేసాడు. అతడు పాత నిబంధన ద్వారా, ఆ సత్యమును, తీసుకున్నాడు. ఇప్పుడు, పౌలు ఒక పాత నిబంధన పండితుడైయున్నాడు. అది ఎంతమందికి తెలుసు? అతడు తన దినములలోని అత్యుత్తమ పండితులలో ఒకడైన, సాటిలేని పండితుడైన, గమలీయేలు వద్ద బోధించబడ్డాడు. మరియు పౌలుకి పాత నిబంధన తెలుసు. మరియు నేను ఈ ఉదయం చెప్పినట్లు, అతడు మొట్టమొదట కుదుపబడినది, అతడు స్తెఫెనుయొక్క మరణాన్ని చూసినప్పుడేయని నేను అనుకుంటున్నాను. ఏదో విషయం పౌలును పట్టుకొని ఉండవచ్చును, ఎందుకనగా అతని పత్రికలన్నిటిలోను అతడు దానిని ప్రస్తావిస్తూనే ఉన్నాడు, “నేను అర్హుడను కాను, ఎందుకనగా నేను సంఘమును మరణమయ్యేంతగా హింసించాను. నేను వారిలో అత్యల్పుడను.”
95 ఓ, అయితే దేవుడు దాని విషయమై ఒక భిన్నమైన ఆలోచనను కలిగియున్నాడు. అతడు ఆ దినాలలోని ఘనులైన వ్యక్తులలో ఒకడైయుండెను.
అతనియొక్క ప్రకాశవంతమైన, తెల్లని వస్త్రముతో,
ఆ గొప్ప అపొస్తలుడైన పరిశుద్ధ పౌలును చూస్తాము, (ఆ కవి ఇట్లన్నాడు,)
ఓ, మనమందరము అక్కడ కలిసినప్పుడు
ఖచ్చితంగా కేకలు వినబడతాయి.
అతడు ఒక హతసాక్షి కిరీటమును, ఒక హతసాక్షి బహుమానమును పొందుకొనుటను నేను చూసే ఆ గొప్ప దినమున!
96 నేను ఈ మధ్యనే, అతడు ఎక్కడైతే ఈ పత్రికలను వ్రాసాడో, అట్టి ఆ పాత చెరసాల ప్రక్కన నిలబడ్డాను. మరియు పిదప వారు అతని తలను నరికివేశారు. మరియు ఆ మురికి కాలువ గొట్టంలో కొట్టుకొనిపోవునట్లు, అతణ్ణి ఆ కాలువ గొట్టంలో పడవేసారు. మరియు అక్కడ ఈ చిన్న యూదుడు, అతడు ఇట్లు చెప్పాడు, “నేను యేసుక్రీస్తుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను. నేను ఎఫెసులో మృగములతో పోరాడాను, అయితే నేను మంచి పోరాటమును పోరాడాను. నేను నా పరుగు తుదముట్టించాను. నేను విశ్వాసమును కాపాడుకున్నాను. మరియు మీదటికి, నా కొరకు నీతికిరీటము ఉంచబడినది, దానిని న్యాయ తీర్పరియైన, ప్రభువు, ఆ దినమున నాకు ఇస్తాడు. మరియు నాకు మాత్రమే కాదు గానీ, ఆయన ప్రత్యక్షమగుటను ఇష్టపడువారందరికి ఇస్తాడు.” నేను దానిని ఎంతగా ఇష్టపడుచున్నానో! ఓ, నేను వారితో లెక్కించబడగోరుచున్నాను! మనము ఒక పాటను పాడేవారము కదా:
ఓ, నీవు ఆయన మందలో ఒకరిగా లెక్కించబడుదువా?
నీవు ఆయన మందలో ఒకరిగా లెక్కించబడుదువా?
అంతరంగములో మచ్చలేనివానిగా ఉండి, ఆ దృశ్యమును చూచుటకు కనిపెడుతూ వేచియుందువా;
ఆయన మరలా వచ్చుచున్నాడు.
97 నేను వారిలో ఒక్కడినై ఉండగోరుచున్నాను. ఇప్పుడు ఆ రచయిత ఇంకా, ఇట్లు చెప్పుచున్నాడు:
కావున మనము వినిన సంగతులను…విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు, వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.
98 ఈ ఉదయం, మనము దానిపై బోధించినట్లు, 2వ వచనం చెప్పుచున్నది, “ఒకవేళ…”
ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడిన యెడల…
99 దూతలు ఎవరైయుంటారని మనము కనుగొన్నాము? ప్రవక్తలు. “నానా సమయములలో దేవుడు మాట్లాడినాడు…” ఇప్పుడు, మన స్వంత ఆలోచనను తయారు చేసుకోవడం కాదు గాని, మనము, బైబిలును తీసుకోవలసియున్నది. ఇప్పుడు 1వ అధ్యాయము, ఆ…1వ అధ్యాయము, 1వ వచనం.
నానా సమయములలో…నానా విధములుగా…ప్రవక్తల ద్వారా, పితరులతో మాట్లాడిన దేవుడు,
100 ఇప్పుడు అతడు వెళ్ళి, మరియు మరలా ఇట్లు చెప్పాడు.
ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున,…
మరియు ఒక దూత అనగా అర్థము ఏమిటి? “వర్తమానికుడు.” దేవుడు వర్తమానికుడిని అభిషేకించినయెడల…మరియు పిదప మనము అభిషేకించబడినయెడల, మనము దేవునియొక్క వర్తమానికులమైయున్నాము. మనము లోకమునకు వర్తమానికులమైయున్నాము, మనము యాత్రికులము మరియు పరదేశులము అని చెప్పుకొనుచున్న, పరలోకపు రాయబారులమైయున్నాము. మనము ఈ లోక సంబంధులము కాము. కానీ దేవుడు దేనికి నిర్మాణకుడు మరియు శిల్పియైయున్నాడో, అటువంటి ఒక పట్టణం కొరకు మనము ఎదురుచూస్తున్నాము. ఎక్కడైతే దొంగలు పడతారో, మరియు ఎక్కడైతే చిమ్మట పట్టి, తుప్పు పట్టి, మరియు కుళ్ళు పడుతుందో, అట్టి ఈ భూమి మీద మనము ధనము సమకూర్చుకోవడం లేదు. ఏలయనగా, ఎక్కడైతే యేసు మహోన్నతుని కుడిపార్శ్వమందున్నాడో, అట్టి పరలోకములో మన ధనము ఉన్నది. ఓ, దీనిని తెలుసుకోవడం, ఎటువంటి ఒక మహిమకరమైన మహత్తరమైన సంగతి కదా:
యేసుయొక్క రక్తము మరియు తనయొక్క నీతి మీద తప్ప
మన ఆశలు మరి దేనిమీదను కట్టబడలేదు;
నా ప్రాణము చుట్టూ ఉన్నదంతా విఫలమైపోయినప్పుడు,
అప్పుడు ఆయనే నా నిరీక్షణ మరియు ఆధారము.
క్రీస్తనే, ఆ స్థిరమైన బండ మీద, నేను నిలబడియున్నాను;
మిగతా నేలంతా మునిగిపోవుచున్న ఇసుక మాత్రమే,
మిగతా నేలంతా మునిగిపోవుచున్న ఇసుక మాత్రమే.
101 శ్రమల సమయాలలో, ఎడ్డీ పెరోనెట్ ఆ పాటను ఎలా వ్రాసాడో కదా!
ఇప్పుడు, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున,…(దేవునియొక్క వర్తమానికుడు వాక్యమును పలికినప్పుడు, అది నిలిచినది.)…మరియు ప్రతి ప్రతిఫలము ఒక న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా;
పరలోకమునుండి మాట్లాడుచున్న, క్రీస్తు మాటను మనము విననియెడల, ఇప్పుడు మనము ఎలా తప్పించుకొందుము?
ఇప్పుడు గమనించండి:
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల, మనము ఏలాగు తప్పించుకొందుము; …(దాని గురించి ఆలోచించండి.)…అట్టి రక్షణ మొదటిగా ప్రభువు బోధించుటచేత ఆరంభమై,…
102 క్రీస్తు తన పనిని ప్రారంభించాడు. ఆయన ఏమి చేసాడు? ఆయన, ఏ విధంగా…తగ్గించుకొని, దీనుడిగా ఉన్నాడో, ఆయన ఏ విధంగా ఒక గొప్ప వేదపండితునిగా గుర్తించబడకయుండెనో మనము చూస్తాము. అయితే ఆయన తగ్గించుకొని, దీనుడిగా, సాత్వీకునిగా ఉన్నాడు. ఆయన ఒక గొప్ప బోధకునిగా ఉండలేదు. ఆయన స్వరము వీధులలో వినబడలేదు.
అయితే యోహాను ఒక గర్జించు సింహమువలె ముందుకు వెళ్ళాడు. అతడొక బోధకుడైయుండెను.
103 యేసు, ఒక గర్జించు సింహమువలె రాలేదు, కానీ దేవుడు ఆయన ద్వారా పనిచేస్తూ, వాక్యమును నిర్ధారించుచుండెను. దేవుడు క్రీస్తుతో ఉన్నాడు. పెంతెకొస్తు దినమున, పేతురు ఇట్లు చెప్పాడు, “ఇశ్రాయేలు ప్రజలారా, మరియు యూదయలో నివసించువారలారా…దేవుడు నజరేయుడైన యేసుచేత అద్భుతాలను, సూచకక్రియలను, మరియు మహాత్కార్యములను, మీ మధ్యన చేయించి ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా, మీకు కనబరచెను, దానికి మీరంతా సాక్ష్యులు.” దానిని అతడు వారికి ఎలా నొక్కి చెప్పాడో గమనించండి. “మీరు ఆయనను ఎరిగియుండవలసియున్నది.”
104 యేసు ఇట్లన్నాడు, “వేషధారులారా.” ఇట్లన్నాడు, “మీరు బయటకి వెళ్ళి మరియు సూర్యుణ్ణి చూస్తారు, మరియు మీరు…అది ఎర్రగాను మబ్బుగాను ఉన్నది, ‘గాలి వాన వస్తుంది,’ అని మీరు అంటారు. మరియు అది ప్రకాశవంతంగాను ఎండగాను, లేదా ఆ విధంగా ఉంటే, ‘వర్షము కురవదు,’ అని మీరంటారు.” ఇట్లన్నాడు, “మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు, కానీ కాలములయొక్క సూచనలను, మీరు వివేచింపలేరు. ఏలయనగా మీరు నన్ను ఎరిగినయెడల, మీరు నా దినమును ఎరిగియుందురు.”
105 ఓ, ఈ రాత్రి ఆయన ఏమని కేకలు వేసేవాడో గదా. “ఘడియ వచ్చియున్నది!” అని తన సేవకుల ద్వారా ఆయనయొక్క ఆత్మ ఎట్లు కేక వేయుచున్నది గదా.
మనము వివేచిస్తాము. మనము అణుబాంబులను గమనిస్తాము. క్లార్క్ గేబుల్ యొక్క స్థానమును ఎవరు తీసుకుంటారని, మరియు దీనిని, దానిని, లేదా వేరే దేనినైనా ఎవరు చేయబోతున్నారని; లేదా ఎవరు వైస్-ప్రెసిడెంటు అవుతారని మనకు తెలుసు. మనము వాటియందు ఆసక్తి కలిగియున్నాము, కానీ మనము కాలముయొక్క సూచనలను వివేచింపలేకున్నాము. మనము అంతమున ఉన్నాము.
106 అది ఏమిటి? మనము వీటియందు ఆసక్తి కలిగియున్నాము, “టెలివిజన్ లో తర్వాతి శీర్షిక ఏమిటి? సుజీ ఏమి చేయబోతుంది?” లేదా ఆ స్త్రీ పేరు ఏమిటో అది. “మరియు ఆర్థర్ గాడ్ఫ్రే ఎక్కడికి వెళ్తున్నాడు? ఈసారి అతడు ఏమి జోకు చెప్పనైయున్నాడు?” మనము, క్రైస్తవులుగా, మనము జీవిస్తున్న కాలముయొక్క సూచనలను తెలుసుకోవడానికి, ఎక్కడో ప్రార్థనలో ఉండి, బైబిలును అధ్యయనం చేస్తూ ఉండటానికి బదులు, మన మనస్సులను పూర్తిగా అటువంటి బుద్ధిహీనపు వాటితో నింపివేసుకుంటాము.
107 అనేకసార్లు, దానిని కలుగజేసేది ఏమిటంటే, శ్రద్ధ వహించి, సువార్త సత్యమును తీసుకురానటువంటి బలహీనమైన ప్రసంగ వేదికలే, అది వాస్తవము. రానున్న దినములలో మనం దానికి జవాబు ఇవ్వవలసియున్నాము. మనం దేనిని నిర్లక్ష్యం చేయకూడదు. మరియు మనము ఇక్కడ ఈ బ్రెన్హామ్ గుడారము వద్ద ఉన్నట్లుగా, ప్రజలు, సూచనలు మరియు అద్భుతములు, మరియు పునరుత్థానుడైన క్రీస్తుయొక్క శక్తిని చూసి; మరియు పిదప మనము మన—మన సమయాలను ఇతర విషయాలపై వెచ్చిస్తూ, మరియు ప్రభువైన యేసుయొక్క స్వరమును వినడానికి నిర్లక్ష్యం చేస్తున్నామని తెలుసుకొనుచుండగా, “ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినయెడల, మనమేలాగు తప్పించుకొందుము?”
108 3వ వచనం, లేదా 4వ వచనం. ఈ ఉదయం ఇక్కడే, ఆ 4వ వచనముపై, మనము ముగించుకున్నాము.
దేవుడు వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా,…(ఓ, మై!)
దేవుడు…వారితో సాక్ష్యమిచ్చుచుండగా,…
వాక్యమును వినండి.
…సూచక క్రియలచేతను…మహాత్కార్యములచేతను, మరియు నానావిధములైన అద్భుతములచేతను,…
నానావిధములైన అద్భుతములు అంటే ఏమిటి? నానావిధములు అంటే ఏమిటి? నానావిధములు అంటే “అనేకమైన.” “అనేకమైన అద్భుతాలతో, దేవుడు సాక్ష్యమిచ్చాడు.” ఓ దేవా! అది మీ హృదయాల్లో నాన్చబడుతుందని నేను నమ్ముచున్నాను. వినండి.
109 ఇక్కడున్న నెవిల్ సహోదరునితో పాటు, మీ సంఘ కాపరులలో నేను ఒకడినైయున్నాను. దీనిని మీరు వ్రాసుకోవలెనని నేను కోరుచున్నాను. బైబిలు ఇట్లు చెప్పినది, “మీలో ఎవరైనా ఒకరు లేచి, మరియు అతడు ఫలానా-మరియు-ఫలానా విషయాన్ని చెప్పినప్పుడు, మరియు అది జరగనియెడల, దానిని వినకండి, ఏలయనగా నేను దానిని పలుకలేదు. కానీ అతడు నా నామమున పలికి, మరియు అతడు చెప్పినది జరిగినయెడల, అప్పుడు దానిని వినండి.” ఆమేన్. “ఏలయనగా ఆ ప్రవక్తతో, లేదా ఆ బోధకునితో, అదెవరైనా గాని, అతనితో నేను ఉన్నాను. అతడు చెప్పినది జరిగినట్లైతే, అప్పుడతడు చెప్పేది వినండి.”
110 ఇప్పుడు స్నేహితులారా, నానావిధములైన అద్భుతాలను, సూచకక్రియలను, మహాత్కార్యములను చూపించుచు, పరిశుద్ధాత్మ మన మధ్యలో మాట్లాడుచుండగా, మనము, ఆయన మాట విందాము. ఏదో సాధారణమైన సంభవములు అన్నట్లు మనము వాటిని దాటిపోకుండా ఉందాము. అది నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న యేసుక్రీస్తు, తన వాక్యమును నిరూపించుటయై యున్నదని; మనము గుర్తు చేసుకుందాము. మనం దానిని చేయవలసియున్నది. ఓ, దయచేసి దానిని చేయండి. జాగ్రత్త. అది మీ కుటుంబమైనా, మీ భర్తయైనా, మీ భార్యయైనా, మీ పిల్లలైనాసరే, వేరే ప్రతీ విషయాన్ని రెండవ స్థానములో ఉంచండి. అది ఏమైనా గాని, దానిని రెండవ స్థానములో పెట్టండి. దేవుడిని మొదటి స్థానములో ఉంచండి. మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, నా పిల్లల కంటేనా?” దేనికంటే కూడా. దేవుడినే మొదటి స్థానములో ఉంచండి. ఆయననే మొదటివానిగా ఉండనియ్యండి.
111 ఒక దినమున, ఏలీయా ఆ పర్వతము దిగివచ్చాడు. అతడు ఒక దూత, ఒక వర్తమానికుడైయున్నాడు, దేవునియొక్క వర్తమానికుడు, అభిషేకించబడినవాడు. మరియు అతడు రెండు కట్టెలను ఏరుకుంటున్న ఒక విధవరాలిని చూసాడు. అతడు ఇట్లన్నాడు, “వెళ్ళి, నాకు ఒక చిన్న రొట్టెను కాల్చుము, మరియు నాకు కొద్దిగా నీళ్ళను తీసుకొనిరమ్ము.”
112 మరియు ఆమె ఇట్లన్నది, “నీ జీవము తోడు, నా వద్ద సరిగ్గా సరిపడా రొట్టెలు, లేదా ఒక చిన్న రొట్టెను చేయగలుగుటకు, సరిపడా గోధుమ పిండి మాత్రమే ఉన్నది. మరియు దానితో కలిపి, దానిని మెత్తగా పిసికి, ముద్ద చేయడానికి సరిగ్గా సరిపడా నూనె మాత్రమే నావద్దనున్నది. మరియు నేను రెండు కట్టెలను ఏరుకొనుచున్నాను.” పాత-కాలపు విధానం ఏమిటంటే, అది భారతీయ విధానమైయున్నది, రెండు కట్టెలను అడ్డంగా పెట్టి మరియు మధ్యనుండి మంట పెట్టడం, మరియు దానిని లోపలికి తోస్తూ ఉండటమైయున్నది. ఆ విధంగా అనేకసార్లు చలిమంటను వేసాను. ఇట్లన్నది, “మరియు నేను నా కొరకు మరియు నా పిల్లవాని కొరకు, నా బాబు కొరకు ఆ చిన్న రొట్టెను చేయబోవుచున్నాను. మరియు మేము దానిని తిని ఇక చనిపోతాము.” మూడున్నర సంవత్సరాలు అక్కడ కరువు ఉండియున్నది, ఎక్కడా నీరు లేదు.
113 ఆ కఠినమైన, వృద్ధ ప్రవక్త, ఆ స్త్రీ ముఖములోనికి చూసాడు. అతడు ఇట్లన్నాడు, “వెళ్ళి, మొదట నాకు ఒక రొట్టెను కాల్చుము.” ఆకలితో చనిపోవుచున్న ఒక విధవరాలితో, ఒక మనిషి, తనకు మొదటిగా ఆహారము తెమ్మని చెప్పడమనేది, ఎటువంటి ఒక ఆజ్ఞ గదా. అతడు ఏమి చెప్పాడు? “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, భూమి మీద దేవుడు వర్షమును కురిపించువరకు, తోట్టిలోని పిండి అయిపోదు, బుడ్డిలోని నూనె అయిపోదు.”
మొదట, దేవుడు. ఆమె లోపలికి వెళ్ళి మరియు ఆ చిన్న రొట్టెను కాల్చినది, మరియు వచ్చి దానిని ప్రవక్తకు ఇచ్చినది. నేరుగా తిరిగి వెళ్ళి మరొకదానిని, మరియు మరొకదానిని, మరియు మరొకదానిని, ఇంకా మరొకదానిని కాల్చినది. మరి భూమి మీద దేవుడు వర్షమును కురిపించేవరకు, ఆ తొట్టి ఎన్నడూ ఖాళీ అవ్వలేదు, లేదా ఆ బుడ్డియైనా ఎండిపోలేదు. ఆమె తన పిల్లల కంటెను దేవుడికే మొదటి స్థానం ఇచ్చినది. ఆమె దేనికంటెను దేవుడికే మొదటి స్థానం ఇచ్చినది. ఆమె మొదటిగా, దేవుని రాజ్యమును తీసుకున్నది.
114 మీ హృదయంలో దేవుడికే మొదటి స్థానం ఉండవలసియున్నది, మీ జీవితంలో మొదటి స్థానం, మీరు చేసే ప్రతీ దానిలో లేదా మీరు ఏమైయున్నారో దానంతటిలో మొదటి స్థానం ఉండవలసియున్నది. దేవుడే మొదటి స్థానంలో ఉండాలి. రెండవ స్థానమును ఆయన కోరడు. రెండవ స్థానము ఆయనకు తగదు. ఉత్తమమైనదానికి, మరియు మొదటిదానికి, మరియు మనం కలిగియున్నదానంతటికి ఆయన అర్హుడైయున్నాడు. ఆయన దానికి అర్హుడు. ఆయనయొక్క పరిశుద్ధ నామము దీవించబడును గాక!
ఎట్లనగా దేవుడు తన చిత్తానుసారంగా…సూచక క్రియలచేతను, మహాత్కార్యముల చేతను, నానా విధములైన,…అద్భుతముల చేతను, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, ఆయన సాక్ష్యమిచ్చెను?
115 మనుష్యులు చెప్పేది కాదు, సంఘము చెప్పినది కాదు, కానీ దేవుని చిత్తము ఏమిటన్నదైయున్నది. ఓ, మనం దేవుని చిత్తమును కనిపెట్టవలసియున్నాము, మీ పొరుగువారి దయను కాదు, లేదా మీ పిల్లల దయను కాదు, మీ భర్తయొక్క దయను లేదా మీ భార్యయొక్క దయను కాదు. అయితే, దేవునియొక్క చిత్తమును కనుగొని, మరియు మొదటిగా దానిని చేయండి. అప్పుడు ప్రతీది, భార్యయొక్క ఇష్టము మరియు పిల్లలయొక్క ఇష్టము, సరిగ్గా దానితో సరిపోవునట్లుగా మారుతాయి. అయితే, దేవుడికే మొదటి స్థానం ఇవ్వండి.
116 ఇప్పుడు, గమనించండి.
మనము మాటలాడుకొనుచున్న ఆ రాబోవు లోకమును, ఆయన దూతలకు లోపరచలేదు.
117 అనగా, పరలోకములో పరిచర్య చేయు ఆ గొప్ప దూతలు, గాబ్రియేలు, మిఖాయేలు, మాచిపత్రి, మరియు వేవేల కొలది పరలోకపు దూతలు; లేదా భూమిమీదనున్న వందల కొలది ప్రవక్తలు, వారిలో ప్రతీయొక్కరు; వారిలో ఏ ఒక్కరికీ మనం మాట్లాడుకునే ఆ రాబోవు లోకమును, ఆయన లోపరచలేదు. ఏ ఒక్కరికీ లోపరచలేదు! ఆయన, “యెషయా, నీవు ప్రపంచాన్ని నియంత్రిస్తావు” అని ఎన్నడూ చెప్పలేదు. ఆయన ప్రపంచాన్ని ఎన్నడూ ఏలీయాయొక్క అధీనంలో ఉంచలేదు. గాబ్రియేలుకైనా, లేదా ఏ దూతకైనా, ఏ పరిచర్య చేయు ఆత్మకైనా ఆయన దానిని లోపరచలేదు.
118 మనము ఎవరి గురించియైతే మాట్లాడుకొనుచున్నామో, అట్టి పౌలు, క్రీస్తును ఇంకను మహిమపరుస్తూ, అతడు ఏమి చెప్పాడో గమనించండి.
అయితే, ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు, వాడేపాటివాడు? లేదా నీవు నరపుత్రుని దర్శించుటకు, వాడేపాటివాడు?
నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి; నీవు మహిమా మరియు ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, మరియు నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి:
119 ఇప్పుడు, మీరు దానిని చదువగోరినయెడల, అది కీర్తనలు 8:4-6, దావీదు మాట్లాడుచున్నాడు. ఇప్పుడు దావీదును అతడిక్కడ ఏమని పిలిచాడు? ఈ ఉదయం, ప్రవక్త గురించి నేను చెప్పినది, సరియో కాదో అని, సరిగ్గా అక్కడే అది స్థిరపరుస్తుంది.
120 అతడు ఇట్లన్నాడు, “అయితే దూతలలో ఒకడు ఒక చోట ఇట్లన్నాడు.” దావీదు, దేవునియొక్క వర్తమానికుడు, అతడు దేవునియొక్క వర్తమానికుడైయున్నాడు గనుక, అతడు దేవునియొక్క దూతయైయున్నాడు. దూత చెప్పాడు, అనగా కీర్తనలలో దావీదు, ఇట్లు చెప్పాడు, “నీవు పరలోకపు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి.” దేవుడు ఆయనను దేవదూతకంటే తక్కువవానిగా చేసాడని ఒక దూత చెప్పాడు, అది ఆయన అతనికి కిరీటము ధరింపజేయుటకైయున్నది; మరియు మరలా హెచ్చింపబడునట్లు, ఆయన శ్రమను అనుభవించి మరణమును రుచి చూడగలుగుటకైయున్నది. తద్వారా ఆయన అతడిని…లోకముయొక్క సమస్త కార్యములను స్వతంత్రించుకొనునట్లు చేయుటకైయున్నది. [టేపుపై ఖాళీ ఉన్నది—సంపా.]
121 ఇప్పుడు, మత్తయి 28:18 లో—లో, మనము వీటిని చదువుతాము. ఆయన సిలువ వేయబడి మరియు మూడవ దినమున తిరిగి లేచిన తర్వాత, ఆయన తన శిష్యులను కలిసి మరియు సర్వలోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఇట్లు చెప్పాడు, “పరలోకమందు మరియు భూమి మీదను సర్వాధికారము నా చేతులకు అప్పగించబడినది. పరలోకమందు సర్వాధికారము, భూమి మీదను సర్వాధికారము, నాకు ఇవ్వబడినది.” అదేమిటి? మానవుడు మరియు దేవుడు ఐక్యమైయ్యారు. లోగాస్ శరీరధారిగా మార్చబడినాడు మరియు చంపబడ్డాడు, మరియు మనల్ని నీతిమంతులుగా చేయుటకు తిరిగి లేచాడు, మరియు పిదప ఎన్నటెన్నటికీ అభిషేకించబడిన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. దేవుడు తన నివాస స్థలమును, ఆవలిన అంతరిక్షములలో ఉన్నట్టి ఒక సింహాసనము నుండి, ఆయన కుమారుడైన, యేసుక్రీస్తు యొక్క హృదయములోనికి మార్చాడు, ఎన్నటెన్నటికీ జీవించుచు మరియు పరిపాలించునట్లు చేసాడు. “దేవుడు క్రీస్తులో ఉండియున్నాడు.” ఆయనే ఆత్మయొక్క చివరి నివాస స్థలమైయున్నాడు.
122 ఒకానొక దినమున, డేరా క్రింద, ఆత్మ ఒక గుడారములో నివసించాడు, అది మీకు తెలిసేయున్నది. “మరియు సొలొమోను ఆయనకు ఒక మందిరమును కట్టాడు. మరి, అయినప్పటికీ, సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు.” “అయితే నీవు నాకొక శరీరమును అమర్చితివి.”
123 అపొస్తలుల కార్యముల గ్రంథములో, 7వ అధ్యాయములో, అతడు మాట్లడుచున్నప్పుడు, అతడు ఇట్లు చెప్పాడు, “వారందరూ ముందుగానే దానిని చూశారు. వారు ఆయన కొరకు గుడారమును కట్టారు, మోషే అట్లు చేసాడు, గుడారమును కట్టి, మరియు దానిలో మందసమును పెట్టాడు, ఏలయనగా దేవుడు కరుణా పీఠం మీదనున్నాడు. ఆయన అక్కడ నివసించలేదు.” సరి.
124 పిదప, “నీవు నాకొక శరీరమును అమర్చితివి,” ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, మరణమును రుచిచూచునట్లు దేవదూతలకంటె తక్కువవానిగా చేయబడ్డాడు; మరియు ఆయన ఎవరోకాదుగాని మహోన్నతుడైన, క్రీస్తే; సమాధాన అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, విశ్వములోని ప్రతీ నక్షత్రమును సృష్టించినట్టి సృష్టికర్తయే.
125 ఓ దేవా! మానవుడిని (గృహములేని, సహాయములేని మానవుడిని), విమోచించి మరియు పరలోకమందు అతనికి గృహమునిచ్చుటకు, ఆయన తన సృష్టికంటె తక్కువవానిగా మారాడు. ఆయన పరలోకపు మహిమలను విడిచిపెట్టాడు. పిలువబడగల అత్యంత ఉన్నతమైన నామమును ఆయన విడిచిపెట్టాడు. మరియు ఆయన భూమి మీద ఉన్నప్పుడు, వారు ఆయనకు పెట్టగలిగినట్టి అత్యంత నీచమైన పేరును మానవులు ఆయనకు పెట్టారు, ఇట్లన్నారు, “అసలు ముందుగానే, అతడు అక్రమంగా పుట్టిన బిడ్డయైయున్నాడు.” ఒక పశువుల తొట్టిలో పుట్టి, ఒక ఎద్దుయొక్క నాగలి మీదనుండి తీయబడినట్టి చినిగిపోయిన గుడ్డలతో చుట్టబడియున్నాడు. వెళ్ళుటకు ఏ చోటు లేకుండెను, వెళ్ళుటకు ఏ గృహమును లేకుండెను. మరియు దయ్యములకు అధిపతియైన, “బయల్జెబూబు,” అని పిలువబడ్డాడు. ఆయనను బాధించారు. ఆయనపై ఉమ్మివేసారు. ఆయనను ఎగతాళి చేసారు. ఆయన తృణీకరించబడ్డాడు, మరియు అత్యంత అల్పమైన గోతులలోనికి వెళ్ళి, మరియు “అత్యంత నీచమైన వేశ్యలవరకు,” వంగాడు. మానవుడు ఆయనకు చేసింది అదే.
126 అయితే దేవుడు ఆయనను ఎంతో పైకి లేపాడు ఎంతగా అంటే ఆకాశమును చూచుటకు ఆయన క్రిందకు చూడవలసియున్నది. మనుష్యుడు ఆయనకు అతి తక్కువైన స్థానమును ఇచ్చాడు, అత్యంత నీచమైన స్థలమును, అత్యంత నీచమైన నామమును ఇచ్చాడు. దేవుడు ఆయనను లేపి మరియు ఆయనకు అత్యంత ఉన్నతమైన స్థానమును, మరియు అత్యంత ఉన్నతమైన నామమును ఇచ్చాడు. మనుష్యుడు దేవుని కుమారినితో చేసినదానికి, మరియు దేవుడు దేవుని కుమారునితో చేసినదానికి వ్యత్యాసము అదే.
127 మనము హెచ్చింపబడునట్లు, ఆయన క్రిందకు వంగాడు. ఆయనయొక్క కృప ద్వారా మనము ఆయనవలె మారునట్లు, ఆయన మనవలె మారాడు. మనము ఒక గృహమును కలిగియుండునట్లు, ఆయన గృహములేనివారి యొద్దకు వచ్చి, మరియు స్వయంగా ఆయనే గృహము లేనివాడిగా మారాడు. మనము స్వస్థపరచబడునట్లు, ఆయన రోగుల యొద్దకు వచ్చి మరియు స్వయంగా తానే వ్యాధిగ్రస్తునిగా చేయబడ్డాడు. మనము రక్షించబడునట్లు, ఆయన పాపియొద్దకు వచ్చి, “మరియు స్వయంగా తానే, పాపముగా చేయబడ్డాడు.”
128 ఆయన హెచ్చించబడుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఈ రాత్రి ఆయన ఏమైయున్నాడో ఆయన అదేయైయ్యుండుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. దేవుడు ఆయనను హెచ్చించాడు, మరియు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనకు ఇవ్వబడినది.
129 ఇక్కడ భూమి మీద, ఆయనయొక్క భూసంబంధమైన పని ముగించబడినప్పుడు…ఆయన భూమి మీదకు వచ్చాడు, మరి ఆయన వచ్చిన వెంటనే, ఆయన దేవుని కుమారుడని ఉదయ నక్షత్రము ప్రకటించినది. ఆయనకు ఎదురుపడిన ప్రతి దయ్యమును ఆయన కుదిపివేశాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక! ఆయన సన్నిధిలో, దయ్యములు భయపడి వణుకుచు, దయ కొరకు వేడుకున్నవి. అవును, అయ్యా. ఆయన ఎవరో పాతాలమంతయు ఎరిగియున్నది.
130 దీనముగా నడిచాడు, వర్షము కురియుచున్న ఒక రాత్రివేళ, తన తలను వాల్చుకొనుటకైనా ఆయనకు చోటు లేకుండెను. ఆయన సృష్టించిన జంతువులకే, “ఆకాశపక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, కానీ మనుష్యకుమారునికి ఆశీర్వాదకరమైన తన తలను వాల్చుకొనుటకు స్థలము లేదు.” నిశ్చయముగా, ఆయన అదేయైయున్నాడు.
131 ఆయన పాపముగా మారాడు, తక్కువవానిగా మరియు విడిచిపెట్టబడినవానిగా మారాడు. అయితే దయ్యములు మాత్రం ఆయన ఎవరో ఎరిగియున్నవి. అవి కనికరము కొరకు ప్రాధేయపడినవి. అవి ఇట్లన్నవి, “మా కాలము రాకమునుపే మమ్మల్ని బాధించుటకు నీవెందుకు వచ్చితివి?” మరియు ఆ బోధకులు ఆయనను “బయల్జెబూబు, సోదె చెప్పువాడు,” అని పిలచుచుండగా, దయ్యములు ఆయనను, “జీవముగల దేవుని కుమారుడు,” అని పిలచుచు మరియు కనికరము కొరకు వేడుకొనుచున్నవి.
132 ఓ, మనమక్కడ ఏ విధంగా ఒక్క క్షణం ఆగవచ్చునో! అసలు, నీవు ఎవరవు? నీవు కలిగియున్న ఆ ఉద్యోగము ఏపాటిది? లేదా మనము కలిగియున్న ఆ చిన్న ఇల్లు ఏపాటిది? మనము కలిగియున్న కారు ఏపాటిది?
133 అందమైన చిన్న అమ్మాయి, పొగరుగల చిన్నదానా, ఇప్పుడు నీవు కలిగియున్న ఆ రూపము ఏపాటిది? మెరయుచున్న, మృదువైన జుట్టుతో, నిటారైనా భుజములతోనున్న యవ్వన పురుషులారా, ఏదో ఒక రోజు వయస్సుతో మీరు వంచబడినప్పుడు, మీరు క్రిందకు వంగిపోతారు.
134 అయితే, ప్రభువు స్తుతించబడును గాక! తిరిగి జన్మించిన ఒక అంతరాత్మను మీరు కలిగియున్నారు. మీరు ఎన్నటెన్నటికి జీవిస్తారు, ఎందుకనగా ఆయన కృప ద్వారా మీరు ఆయన వలె మారునట్లు, ఆయన మీవలె మారాడు, మరియు మీకు ఒక స్థానమును కల్పించాడు.
135 ఓ, ఒక జత బట్టలను కలిగియున్నామని, మరియు గృహములో కొన్ని సరుకులను కలిగియున్నామని అనుకునే మనము, మనము ఏపాటివారము? ఒక్క క్షణములో దేవుడు దానిని తీసుకోగలడు. మీ శ్వాసనే ఆయన చేతుల్లో ఉన్నది. మరియు రోగులను స్వస్థపరచుటకు, ప్రకటించి మరియు తెలియజెప్పుటకు, మరియు జరుగబోవువాటిని చెప్పుటకు ఆయన మన మధ్యన ఉన్నాడు, మరియు అవి ప్రతీసారి పరిపూర్ణముగానున్నవి. మరియు మన మధ్యన, చనిపోయిన ఒక చిన్న చేపకు, తిరిగి దానికి దాని జీవమునిచ్చేంత శ్రద్ధ కలిగియున్నాడు. యెహోవా మన చుట్టూ ఉన్నాడు, యెహోవా మనలో ఉన్నాడు, ఆ గొప్ప బలిష్టుడైన ఉన్నవాడు.
136 ఆయన మరణించినప్పుడు, వారు ఆయనను పట్టుకున్నారని అనుకున్నారు. ఆయన పాతాళమునకు దిగి వెళ్ళాడు. ఆయన సిలువవేయబడిన ఆ దినమున ఆయన భూమిని విడిచిపెట్టినప్పుడు, నశించిపోవువారుండు చోటుకు ఆయన వెళ్ళాడు. బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, “దీర్ఘశాంతపు సమయములో నోవహు దినములలో పశ్చాత్తాపపడనివారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మలయొద్దకు, ఆయన వెళ్ళి ప్రకటించాడు.” ఆయన మరణించి, మరియు తన ఆత్మ తనను విడిచిపెట్టినప్పుడు, ఆయన మరలా లోగాస్ అయ్యాడు. నేను చూస్తున్నాను, ఆయన, ఇట్లన్నాడు, “నేను దేవునియొద్దనుండి వచ్చితిని. నేను తిరిగి దేవునియొద్దకు వెళ్ళుదును.”
137 మరియు దేవుడు అరణ్యములో పిల్లలను నడిపించినట్టి ఆ అగ్నిస్తంభమైయున్నాడు. మరియు ఆయన ఇక్కడ భూమిమీద ఉండి…మరియు ఆయన మరణించినప్పుడు, ఆయన మరలా తిరిగి ఆ వెలుగుగా మారాడు. పౌలు ఆయనను చూసాడు, మరియు ఆయన ఒక వెలుగుగా ఉన్నాడు. ఆ మిగతావారెవ్వరూ ఆయనను చూడలేదు. పౌలు పడిపోవడాన్ని వారు చూశారు. ఏదో అతడిని తాకినది, మరియు అది ఒక వెలుగైయున్నది. పౌలు ఇట్లన్నాడు, “నేను హింసించుచున్నది ఎవరిని?”
138 ఆయన ఇట్లన్నాడు, “సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావు?”
అందుకు ఇట్లన్నాడు, “అది ఎవరు?”
139 ఆయన ఇట్లు చెప్పాడు, “నేను, నీవు హింసించుచున్న యేసును, మరియు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము.”
140 అప్పుడు అతడు వెళ్ళి మరియు ఆ వెలుగును గూర్చి ధ్యానించాడు. పౌలు ఆ వెలుగేమిటో కనుగొనుటకు, బైబిలు గ్రంథములో గతములోనికి వెళ్ళాడు. మరియు అతడు ఈ పత్రికను వ్రాసాడు. ఆయన అదే యెహోవా యైయున్నాడు. అదే వెలుగు అరణ్యములో ఇశ్రాయేలు పిల్లలతో ఉండియున్నది. మరియు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, లోపలికి వచ్చి మరియు ద్వారములను తెరిచిన ఆ వెలుగు ఆయనే.
141 మరియు ఆయన కృప ద్వారా, ఎవరును ఎటువంటి సాకు కలిగియుండకుండునట్లు చేసాడు…ఓ, వారు ఆ చదువులేని వర్తమానికులను మర్చిపోయి, మరియు: విషయం వర్తమానికుడు కాదు గాని, అది వర్తమానమైయున్నదని గుర్తుంచుకొనియుంటే చాలు. ఒక అగ్నిస్తంభము రూపంలో, ఆయన మన వద్దకు, మరలా దిగి వచ్చాడు. మరియు ఆయన తనయొక్క అవే ఆశ్చర్యకార్యాలు మరియు సూచనలతో కదలాడుచున్నాడు, బైబిలు గ్రంథమునకు వెలుపటనున్న వేటితో కాక; సరిగ్గా బైబిలు వరుసలో ఉంటూ, దానిని నియంత్రణలోనికి తీసుకొని, తన మహిమను బయటకు తెచ్చుచు, తన శక్తిని చూపించుచున్నాడు. ఆయనయొక్క పరిశుద్ధ నామము స్తుతింపబడును గాక!
142 నేను వెఱ్ఱివాడనని మీరు అనుకుంటారని నాకు తెలుసు; కానీ, ఓ, నా అంతరాత్మలో ఉన్న ఆ ధన్యకరమైన నిత్యమైన విశ్రాంతి, తుఫాను అలలు రావచ్చును, అయితే తెరలోపల నా లంగరు పట్టుకొనియున్నది.
143 మరియు ఆయన మరణించినప్పుడు, ఆయనను చూడటానికి, చంద్రుడినే కుప్పకూలిపోయేలా చేసినది. మిట్టమధ్యాహాన్నమే సూర్యుడు క్రిందకు వెళ్ళిపోయాడు. మరియు ఆయన నశించువారుండు చోటుకు వెళ్ళినప్పుడు, [సహోదరుడు బ్రెన్హామ్ గారు ప్రసంగ వేదికపై తట్టుచున్నాడు—సంపా.] తలుపు తట్టాడు, మరియు ద్వారము తెరచుకున్నది. బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, “నోవహు దినములలో దీర్ఘశాంతపు సమయములో, పశ్చాత్తాపపడనివారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళి ప్రకటించెను,” అది ఆయన ఈ భూమిపై మరణమైన తరువాతయైయున్నది. నా సహోదరుడా, నా సహోదరి, ఆయన మరణించినప్పుడు, భూమిపై ఆయనయొక్క పని ముగించబడినది, అయితే ఆయన ఇంకనూ పని చేయుచున్నాడు. మరియు ఈ రాత్రి ఆయన ఇంకను పని మీద ఉన్నాడు. ఆమేన్.
144 నశించినవారి ద్వారములను ఆయన తట్టాడు. ఆయన అట్లు చేసాడని బైబిలు గ్రంథము చెప్పినది. మరియు ఆయన ఈ విధంగా సాక్ష్యమిచ్చాడు, “నేనే ఆ స్త్రీ సంతానమును. ఆదాము మాట్లాడినది నా గూర్చియే. తన పదివేలమంది పరిశుద్ధులతో వస్తాడని హానోకు చెప్పినది నా గూర్చియే. నేనే జీవముగల దేవుని కుమారుడను, మరియు మీరు పాపము చేసి మీ కృపా దినమును దాటివేసారు. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథములోని ప్రతీ మాటను నెరవేర్చుటకు, నేను రావలసియున్నానని, దూతల ద్వారా, హానోకు, నోవహు ద్వారా మీకు ప్రవచించబడినది. ఇప్పుడు ఈ ‘నశించువారి ప్రదేశములో’ నేను ఇక్కడ ఒక సాక్షిగా ఉన్నాను.” మరియు ఆయన వారికి బోధించాడు.
ఆయన పాతాళములోనికి వెళ్ళాడు, నేరుగా పాతాళపు ద్వారమునొద్దకు వెళ్ళి, ద్వారమును తట్టాడు. దయ్యము తలుపును తీసి, ఇట్లన్నాడు, “ఇప్పుడు నీవు నాకు దొరికావు.”
145 వాని ప్రక్కనుండి ఆ తాళమును లాక్కొని, ఇట్లన్నాడు, “ఓ దయ్యమా, నీవు ఎంతో కాలముగా మోసము చేయుచున్నావు.” అది ఇక్కడ ఉంది, సరిగ్గా ఇక్కడ బైబిలు గ్రంథములో ఉన్నది. ఒక నిమిషములో నేను దాని వద్దకు వస్తాను. “నీవు చాలా కాలముగా మోసగించుచున్నావు, అయితే నేను స్వాదీనపరచుకొనుటకు వచ్చియున్నాను.” ఆ తాళమును తీసుకొని మరియు వానిని తిరిగి లోపలికి తన్ని, మరియు ద్వారమును మూసివేసాడు.
వచ్చి అబ్రాహామును, ఇస్సాకును, మరియు యాకోబును తీసుకున్నాడు. మూడవ దినమున ఆయన లేచాడు, మరియు సమాధిలో నిద్రించినవారు ఆయనతో లేచారు. ఓ, హల్లెలూయా! ఆ కవి ఇట్లనడంలో ఆశ్చర్యమేమియు లేదు:
జీవించుచు, ఆయన నన్ను ప్రేమించాడు; మరణించుచు, ఆయన నన్ను రక్షించాడు;
సమాధి చేయబడి, ఆయన నా పాపములను దూరముగా మోసుకొనిపోయాడు;
తిరిగి లేచి, ఉచితముగా ఎప్పటికీ నన్ను నీతిమంతునిగా తీర్చాడు:
ఒకానొక దినమున ఆయన వచ్చుచున్నాడు—ఓ, మహిమకరమైన దినము.
146 దేవుని ప్రేమతో, క్రైస్తవ సహవాసముతో మన హృదయాలను కట్టియుంచే ఆ బంధము ఆశీర్వదించబడును గాక. ఆయన లేచినప్పుడు, ఆయనయొక్క పని, అప్పుడే ముగిసిపోలేదు. ఆయన చేయవలసిన ఇంకా కొంచెం పనిని కలిగియున్నాడు.
147 బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, “ఆయన ఆరోహణమై మరియు మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను.” అంధకారము, చీకటి, మరణము, అలసటతో కూడిన ఒక వాతావరణము, భూమి మీద కమ్మియున్నది. ప్రాయశ్చిత్తము ఇంకను చేయబడలేదు గనుక, ప్రార్థనలు పైకి చేరలేకున్నవి. కాని, ఆయన ఆ తెరను చీల్చుకొని వెళ్ళాడు. ఆయన పైకి మార్గమును కలుగజేశాడు. వ్యాధి అనే తెరను ఆయన చీల్చివేశాడు. పాపము అనే తెరను ఆయన చీల్చివేశాడు. అలసట అనే తెరను ఆయన చీల్చివేశాడు. క్రుంగిపోవుట అనే తెరను ఆయన చీల్చివేశాడు. రాజమార్గమున వెళ్ళుచు, ఆయన ప్రతీ తెరను చీల్చివేసి, మరియు దారిలోపోవు ప్రతివానికి రాజమార్గమును కలుగజేశాడు. ఓ, మై, ఆయన ఆ చంద్రుడిని మరియు నక్షత్రాలను, మరియు ఇంకా ఇంకా వాటిని దాటి వెళ్ళాడు!
148 వెంబడించుచు, ఆయన వెనుక, ఆ పాత నిబంధన పరిశుద్ధులు వెళ్ళారు, అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబు. వారు నేరుగా ఆకాశమహాకాశములలోనికి వెళ్ళారు. వారు ఆ పట్టణమునకు దూరాన్న ఉన్నప్పుడు, వారు వారి కన్నులనెత్తడం నేను చూడగలుగుచున్నాను. అబ్రాహాము ఇట్లన్నాడు, “ఆ పట్టణమును చూచుటకే నేను పరితపించాను. ఓ, ఇస్సాకు, ఇక్కడికి రమ్ము. యాకోబు, ఇక్కడికి రమ్ము. ఓ, మనము భూమిపై పరదేశులుగా అన్యులుగా ఉన్నాము, కానీ అదిగో ఆ పట్టణము అక్కడున్నది. మనము వేచియున్నది దానికొరకే.”
149 మరియు వారు ఇట్లు కేకవేసారని బైబిలు గ్రంథము చెప్పినది, “పురాతనమైన గుమ్మములారా, పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించునట్లు, మిమ్మును లేవనెత్తుకొనుడి.”
150 మరియు ఆ గుమ్మముల వెనుకనున్న దూతలు ఇక్కడున్న ఈ దూతలకు కేక వేసి, మరియు ఇట్లన్నారు, “మహిమగల ఈ రాజు ఎవరు?”
151 మరియు ఇక్కడున్న దూతలు, ఆ ప్రవక్తలు, ఇట్లన్నారు, “బలశౌర్యముగల యెహోవాయే, యుద్ధశూరుడైన యెహోవాయే.”
152 మరియు వారు ఆ మీటలను నొక్కగా మరియు ఆ పెద్ద గుమ్మము తెరవబడినది. నేరుగా ఆ వీధుల మధ్య దారిన ఆయన ఆ జయశీలుడు వచ్చుచుండెను, ఆయన వెనుక పాత నిబంధన భక్తులు నడిచి వచ్చుచుండగా, విజయోత్సవముతో, వచ్చుచున్నాడు. సింహాసనముపై కూర్చుని, ఇట్లు చెప్పాడు, “తండ్రీ, ఇదిగో వారిక్కడనున్నారు. వారు నీవారైయున్నారు.”
153 ఆయన ఇట్లన్నాడు, “నేను నీ శత్రువులనందరినీ నీ పాదపీఠముగా చేయువరకు, ఇక్కడికి ఎక్కివచ్చి కూర్చొనుము.” మనము చదువుచుండగా, మనము ఇక్కడ లేఖనములో దానిని కనుగొంటాము. అది సరియే.
154 వినండి. ఇప్పుడు మనము ఈ 8వ వచనములో ఉన్నాము:
పిదప ఆయన సమస్త కార్యములను వాని పాదముల క్రింద ఉంచెను. ఏలయనగా…ఆయన సమస్త కార్యములను అతని పాదముల క్రింద ఉంచెను, అతనికి లోపరచకుండ దేనిని ఆయన విడిచిపెట్టలేదు. అయితే ప్రస్తుతం సమస్తమును అతనికి లోపరచబడుటను…మనము చూచుటలేదు.
అది, మరణమైయున్నది. మరణము లోపరచబడుటను మనము ఇంకా చూడలేదు, ఎందుకనగా మనమింకనూ మరణించుచున్నాము. మనము మరణమును చూస్తున్నాము.
అయితే, 9వ వచనం, “కానీ మనము యేసును చూస్తున్నాము!” ఆమేన్. వినండి.
…దేవుని కృపవలన, ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున; మహిమా ప్రభావములతో కిరీటము ధరించినవానిగా ఆయనను చూచుచున్నాము.
ఆయన ఎందుకని దూతలకంటే తక్కువవానిగా చేయబడ్డాడు? తద్వారా ఆయన మరణమును రుచి చూచుటకైయున్నది. ఆయన మరణించవలసి యున్నాడు. ఆయన మరణించుటకు, రావలసివచ్చినది.
155 స్నేహితుడా, ఇటు చూడు. దీనిని ఎన్నడూ, మర్చిపోకు. యేసు నడుచుకుంటూ, ఆ కొండను ఎక్కుచున్నప్పుడు, మరణము ఆయన తల చుట్టూ ఝుంకారము చేయుచున్నది.
156 మనము మన దృశ్యాన్ని యెరూషలేమునకు, రెండు వేల సంవత్సరాల క్రితమునకు తీసుకువెళ్దాము. మరియు మీరు దానిని ఎలా త్రోసివేయగలరు? వీధిలోనుండి ఒక శబ్ధం రావడాన్ని నేను వింటున్నాను. అదేమిటి? అది ఏదో తగులుకుంటూ వెళ్తున్న శబ్ధం. అది దమస్కు గుమ్మముల నుండి, పదునైన రాళ్ళకు తగులుకుంటూ, ఆ కరుకైన సిలువ వచ్చుటయైయున్నది. ఆ పెద్ద పదునైన రాళ్ళు ఇంకను అక్కడ ఉన్నాయి. ఆ పెద్ద పదునైన రాళ్ళ మీద తగులుకుంటూ వెళ్ళుచున్నది, దబ్-దబ్ మని వెళ్ళుచున్నది. ఆ రక్తము వీధిలో చిమ్మిపడుటను నేను చూస్తున్నాను. అది ఏమిటి? అది ఏ కీడు చేయనటువంటి ఒక మనుష్యుడైయున్నాడు; మేలు తప్ప మరేదియు చేయనివాడు. ప్రజలు గ్రుడ్డివారైయున్నారు. వారు ఆయనను ఎరిగియుండలేదు. వారు ఆయనను గుర్తించలేదు.
మీరు ఇట్లనవచ్చు, “గ్రుడ్డివారా? వారు వారి దృష్టిని కలిగియుండగలరా?”
157 మీరు దృష్టిని కలిగియుండి కూడా గ్రుడ్డివారు అవ్వగలరు. మీరు దానిని నమ్ముతారా? బైబిలు ఆ విధంగా చెప్పినది. దోతాను వద్ద ఎలీషా గుర్తున్నాడా? అతడు అక్కడికి వెళ్ళి మరియు ప్రజలను గ్రుడ్డితనముతో మొత్తి, ఇట్లన్నాడు, “ఇప్పుడు నన్ను వెంబడించండి.” వారు అతని పట్ల గ్రుడ్డివారయ్యారు.
158 మరియు ఈ రాత్రి ప్రజలు గ్రుడ్డివారైయున్నారు. దైవిక స్వస్థతను నమ్మని ఒక ఫలాన సంఘపువాడు, ఒకసారి నా వద్దకు వచ్చి, మరియు ఇట్లన్నాడు, “నన్ను గ్రుడ్డివానిగా మొత్తు. నన్ను గ్రుడ్డివానిగా మొత్తు.” అది సహోదరుడు రైట్ యొక్క ఇంటివద్ద జరిగినది. ఇట్లన్నాడు, “నన్ను గ్రుడ్డివానిగా మొత్తు.” ఇట్లన్నాడు, “ఒకసారి, పౌలు ఒకడిని గ్రుడ్డివానిగా మొత్తాడు కదా.” ఇట్లన్నాడు, “నన్ను కూడా గ్రుడ్డివానిగా మొత్తు.”
159 నేను ఇట్లన్నాను, “స్నేహితుడా, దయ్యము ఇదివరకే దానిని చేసినది. నీవు ఇదివరకే గ్రుడ్డివానిగా ఉన్నావు. నిశ్చయంగా, నీవు గ్రుడ్డివాడవై యున్నావు.”
160 అతడు ఇట్లన్నాడు, “ఈ చిన్న అమ్మాయిని స్వస్థపరచు అప్పుడు నేను నిన్ను నమ్ముతాను.”
161 నేను ఇట్లన్నాను, “ఆ పాపిని రక్షించు మరప్పుడు నేను నిన్ను నమ్ముతాను.” నిశ్చయంగా.
162 “ఓ,” అతడిట్లన్నాడు, “అతడు దానిని నమ్మవలసియున్నది.”
163 నేను ఇట్లన్నాను, “ఇక్కడ కూడా అదే విషయం, అది దేవునియొక్క దివ్యమైన కృప ద్వారా రావలసియున్నది.”
164 దయ్యము, ఈ—ఈ లోకపు దేవుడు, ప్రజలయొక్క నేత్రములకు గ్రుడ్డితనం కలుగజేశాడు. “వారికి కన్నులు ఉన్నవి కానీ వారు కానలేరు,” అని బైబిలు చెప్పినది.
165 ఇక్కడ ఆయన, దారి పొడుగునా రక్తసిక్తపు అడుగుజాడలు ఈడ్వబడుచుండగా, ఆ వీధిగుండా వెళ్ళుచున్నాడు. మరణమనే ఆ కందిరీగ ఆయనను కుట్టుచున్నది, “కేవలం ఇంకొంచెము సమయమైతే ఇక నేను నిన్ను పట్టుకుంటాను,” అని ఝుంకారము చేయుచున్నది. ఆయన బలహీనమగుచు, నీళ్ళ కొరకు దప్పిగొనుచున్నాడు.
166 ఒకసారి నేను తుపాకీతో పేల్చబడ్డాను, ఇక్కడే పొలములో పడియున్నాను, నానుండి రక్తము స్రవిస్తూ ఉన్నది. నేను నీళ్ళ కోసం కేకలు వేసాను. మరియు నా స్నేహితుడు పరుగెత్తి, తన టోపీని తీసి నీళ్ళలో ముంచాడు; పురుగులు పట్టిన, మురికి నీళ్ళైయున్నవి. తిరిగి వచ్చాడు, మరియు నా నోరు తెరిచేయుంచాను; అతడు దానిని పిండాడు. ఎందుకనగా, ఒక తుపాకీతో నేను ఎక్కడైతే ముక్కలుగా పేల్చబడ్డానో, అక్కడనుండి రక్తము ఒక ఊటలాగా చిమ్ముచున్నది. దప్పిగొనుచున్నాను!
167 ఆ పగలంతా రక్తము చిందిన తర్వాత, నా ప్రభువు ఎటువంటి పరిస్థితిగుండా వెళ్ళాడో అప్పుడు నాకు అర్ధమైంది, తొమ్మిది గంటలనుండి సాయంత్రము మూడు గంటల వరకు, ఆ రక్తమంతటినీ కోల్పోవుచున్నాడు. నేను ఆయన వస్త్రాన్ని చూస్తున్నాను, మొదటిగా, దానిపై చిన్న చిన్న మరకలుగా పడినవి. మరియు ఆ మరకలన్నియూ పెద్దవిగా అవ్వడం మొదలై మరియు కలిసిపోయి, ఒక పెద్ద రక్తపు మచ్చగా తయారైనది, ఆయన నడుస్తుండగా ఆయన కాలు మీద కొట్టుచున్నారు. అది ఇమ్మానియేలు రక్తమైయున్నది. ఓ, భూమి దానికి యోగ్యమైనది కాదు.
168 అయితే ఆయన పైకి వెళ్ళుచుండగా, ఈ కందిరీగ చుట్టూ తిరుగుతూ ఆయనను కుట్టుచున్నది. అది ఏమి చేసినది? అది చివరికి ఆయనను కుట్టినది.
కానీ, సహోదరుడా, ఒక పురుగు లేదా ఒక కందిరీగ, అది మిమ్మల్ని ఒక్కసారి కుట్టిందంటే, ఇక ఆ కుట్టడం అనేది ఉండదని, ఎవరికైనా తెలుసు. అది ఇక ఎంతమాత్రము కుట్టలేదు. ఎందుకనగా, అది వెళ్ళేటప్పుడు, దాని ముల్లు బయటకు లాగబడుతుంది.
ఆ కారణముచేతనే దేవుడు శరీరము దాల్చవలసివచ్చినది. ఆయన ఆ మరణపు ముల్లును తన శరీరములోనికి తీసుకున్నాడు, మరియు మరణము నుండి ఆ ముల్లును బయటకు లాగాడు. ప్రభువు నామము స్తుతింపబడును గాక! మరణము రాగాలు తీస్తూ మరియు కుట్టవచ్చు, కానీ అది మిమ్మల్ని బాధించలేదు.
169 తన చుట్టూ ఆ కందిరీగ ఝుంకారం చేయుటను, పౌలు అనుభూతి చెందినప్పుడు, మరణము నేరుగా మీదికి వచ్చుచున్నది. అతడు ఇట్లన్నాడు, “ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” అది ఎక్కడైతే ఇమ్మానియేలుయొక్క శరీరంలో విడిచిపెట్టబడినదో ఆ కల్వరి వైపు అతను చూపించగలిగాడు. “నీ విజయమెక్కడ? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.” అవునండి.
170 మనము సమస్తమును చూచుటలేదు.
అయితే దూతల కంటే కొంచెము, తక్కువవాడుగా చేయబడిన యేసు…మరణము పొందినందున,…
ఎవని నిమిత్తము, సమస్తమును—సమస్తమును ఉన్నవో, ఎవనివలన మనకు సమస్తమును కలుగుచున్నవో, ఆదిలో…అనేకులైన కుమారులను…మరియు మన రక్షణ కర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా…చేయుట ఆయనకు తగును.
ఆయన మన రక్షణకర్త అగుటకు ఒకే ఒక్క మార్గమేదనగా, ఆయన శ్రమపడవలసియుండెను.
171 ఇప్పుడు ఇక్కడ ఈ అద్భుతమైన మాటలను వినండి. ఇప్పుడు వినండి.
పరిశుద్ధపరచువారికిని మరియు పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే…మూలము:…
ఓ, ద్రాక్షావళ్ళిని మరియు ఆ తీగెలను మీరు అక్కడ చూడటంలేదా? అంతా ఒక్కటే.
…ఈ హేతువు చేతను సహోదరుడని పిలువబడుటకు ఆయన సిగ్గుపడలేదు,
చూశారా? ఎందువలన? ఆ తరువాతి వచనమును, వినండి.
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును, అనెను.
మరియు మరలా, నేనాయనను నమ్ముకొనియుందును. మరియు, ఇదిగో నేనును నీవు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఆ ప్రకారమే మరణముయొక్క బలము గలవానిని; అనగా, అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకును ఆ మరణ భయముచేత;
ఎల్లప్పుడూ దాస్యమునకు లోబడినవారిని…ఆ…విడిపించుటకును…ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను.
172 మనుష్యుడు ఎల్లప్పుడూ మరణమునకు భయపడుతుంటాడు. మరణమును తన మీదకు తీసుకొనుటకు, క్రీస్తు పాపముగా మారి, తక్కువవాడుగా చేయబడినాడు. మరియు మన “సహోదరుడు,” అని పిలువబడుటకు ఆయన సిగ్గుపడలేదు ఏలయనగా సరిగ్గా మనము శోధించబడినట్లే ఆయన కూడా శోధించబడెను. మరియు ఆయన…ఒక సరియైన విజ్ఞాపనకర్తగా ఉండగలడు, ఎందుకనగా మీరు ఎదుర్కునే అదే రకమైన శోధనను ఆయన ఎదుర్కున్నాడు. మరియు మీయంతట మీరు దానిని తీసుకోలేరని ఎరిగియుండి, ఆయన మీ స్థానమును తీసుకున్నాడు.
173 కావున, సహోదరుడా, సహోదరీ, మీరు దానిని చూడటంలేదా? విషయమంతా కృపయే. అదంతయు కృపయే అయ్యున్నది. ఎలాగైనా, అది మీరు చేసేది కాదు. అది ఆయన ఇదివరకే మీ కొరకు చేసినదైయున్నది. ఇప్పుడు, మీరు మీ రక్షణకు అర్హులగునట్లు ఒక్క కార్యమును కూడా చేయలేరు. మీ రక్షణ ఒక వరమైయున్నది. మీరు నీతిమంతులగునట్లు, క్రీస్తు పాపముగా మారాడు. మరియు ఆయన మన రక్షణకు సరియైన నాయకుడైయున్నాడు, ఎందుకనగా సరిగ్గా మనము శ్రమనొందినట్లే ఆయన శ్రమనొందాడు. సరిగ్గా మనము శోధింపబడినట్లే ఆయన శోధించబడ్డాడు. మరియు ఆయన “మన సహోదరుడు,” అని పిలువబడుటకు సిగ్గుపడలేదు ఎందుకనగా మనము ఎంటువంటి పరిస్థితిగుండా వెళ్తామో ఆయనకు తెలుసు. ఓ, ఆయన నామము స్తుతింపబడును గాక!
ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక; అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.
174 ఓ. మై! ఆయన ఒక దేవదూతలాగ మారలేదు. ఆయన అబ్రాహాముయొక్క సంతానముగా మారాడు. “మరియు మనము, క్రీస్తులో మృతినొందినవారమై, అబ్రాహాముయొక్క సంతానముగా మారి, మరియు వాగ్దానప్రకారంగా వారసులమైయున్నాము.” చూశారా? ఆయన ఒక దేవదూత రూపమును ఎన్నడూ తీసుకోలేదు. ఆయన ఎన్నడూ ఒక దేవదూతలాగ మారలేదు. ఆయన ఒక మానవునిగా మారాడు. ఆయన అబ్రాహాముయొక్క సంతానముగా మారి, మరియు మనలను తిరిగి దేవునితో సమాధానపరచుటకు, మరణపు ముల్లును తన స్వంత శరీరములోనికి తీసుకున్నాడు, మరియు ఇప్పుడు ఒక విజ్ఞాపనకర్తగా అక్కడ కూర్చొనియున్నాడు. ఓ, స్నేహితుడా, మనం దానిని ఎలా త్రోసివేయగలము?
175 వినండి.
కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో…ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.
176 తద్వారా ఆయన సమాధానపరచువానిగా ఉండుటకైయున్నది! చూడండి, దేవుడికి మరియు మానవుడికి శతృత్వము ఉండియున్నది. మరియు ఏ మనుష్యుడును…
వారు దూతలను, అనగా ప్రవక్తలను పంపారు. వారు మీ స్థానమును తీసుకోలేకపోయారు, ఎందుకనగా వారు తమకొరకు తామే ప్రార్ధించుకోవలసియున్నది. వారు ఆ స్థానమును తీసుకోలేకపోయారు.
177 పిదప, ఆయన ధర్మశాస్త్రమును పంపాడు. ధర్మశాస్త్రము మనలను చెరసాలలో వేసే ఒక పోలీసైయున్నది. అది మనలను బయటకు తీసుకురాలేకపోయినది. ఆయన ధర్మశాస్త్రమును పంపాడు.
ఆయన ప్రవక్తలను పంపాడు, ఆయన నీతిమంతులను పంపాడు, మరియు అదంతయు, ప్రాయశ్చిత్తమును కలుగజేయలేకపోయెను. అయితే ఆయనే దిగివచ్చి మరియు మనలో ఒకనిగా మారాడు. ఓ, మై!
178 సరిగ్గా ఇప్పుడు మనకు ఇంకా సమయముంటే బాగుండునని నేను కోరుచున్నాను, నేను మిమ్మల్ని ఆ విమోచనా చట్టము వద్దకు తీసుకువెళ్ళగోరుచున్నాను; కానీ మనకు లేదు, అయితే కేవలం ఒక క్షణము చూద్దాం. ఆ అందమైన చిత్రము రూతు మరియు నయోమిలో ఉన్నది. మీరు అక్కడ చూసినట్లైతే, ఆ సమాధానపరచుట, ఆ గృహనిర్వాహకుడు, పోగొట్టుకోబడిన మరియు పడిపోయిన స్వాస్థ్యమును విమోచించే ఆ మనుష్యుడు, ఆ స్వాస్థ్యమును పోగొట్టుకున్న వ్యక్తికి రక్తసంబంధియైయుండవలెను. ఆ కారణముచేతనే బోయాజు ఆ…రూతును పొందుకొనునట్లు, నయోమికి ఒక రక్తసంబంధియైయుండెను. మరియు పిదప, అతడు అర్హుడై ఉండవలెను. తప్పిపోయినదానిని విమోచించుటకు, దానిని చేయుటకు అతడు సమర్థుడైయుండవలెను. మరియు బోయాజు, గవిని వద్ద, తన చెప్పును తన్నుట ద్వారా, అతడు నయోమిని మరియు ఆమె స్వాస్థ్యమును, విడిపించాడని ఒక బహిరంగ సాక్ష్యమును ఇచ్చాడు. మరియు అతడు రక్తసంబంధియై ఉండవలసియున్నది.
179 మరియు ఆ కారణముచేతనే క్రీస్తు, అనగా దేవుడు, మనకు రక్తసంబంధిగా మారవలసివచ్చింది. మరియు ఆయన క్రిందకు దిగివచ్చి మరియు ఒక మానవుడిగా ఉన్నాడు. మరియు ఆయన శోధనను సహించాడు. మరియు ఆయన ఎగతాళి చేయబడ్డాడు, పరిహాసము చేయబడ్డాడు, మరియు హింసించబడ్డాడు, మరియు ఉపేక్షించబడ్డాడు, మరియు “బయెల్జెబూబు,” అని పిలువబడ్డాడు, మరియు—మరియు అపహసించబడ్డాడు, మరియు సిలువ మరణముతో మరణించాడు. చూశారా? ఆయన మనకు రక్తసంబంధియై ఉండవలసివచ్చినది. మీరు తప్పుగా ఆరోపపించబడ్డారు గనుక, ఆయన తప్పుగా ఆరోపించబడవలసివచ్చింది. మీరు వ్యాధిగ్రస్తులైయున్నారు గనుక, ఆయన వ్యాధిని భరించాల్సివచ్చింది. అవి మీ పాపములు గనుక, ఆయన పాపములను భరించవలసి వచ్చింది. మరియు ఆయన రక్తసంబంధిగా మారవలసి వచ్చింది. ఆయన మనల్ని విమోచించగల ఒకే ఒక్క మార్గమేదనగా ఆయన మనకు రక్తసంబంధిగా ఉండుటయే. మరియు పాపపు శరీర రూపమును తీసుకొని మనలో ఒకనిగా మారుటవలన, ఆయన రక్తసంబంధిగా మారాడు. మరియు దానిలో, ఆయన వెల చెల్లించి మరియు తిరిగి మనలను తండ్రితో సహవాసములోనికి విమోచించాడు. ఓ, ఎటువంటి ఒక రక్షకుడు! మాటలు దానిని వ్యక్తపరచలేవు.
తాను శోధింపబడి శ్రమ పొందెను,…గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.
180 ఆంగ్లములో సకర్ అనే మాటకు అర్థము “దయచూపించుట.” ఆయన ఇలా మారడానికి, కారణమేదనగా, అది, మీ పట్ల…హెచ్చు తగ్గులు, లోటు పాట్లు, మరియు తట్టుకోలేనంతగా శోధనలను కలిగియుండే మీ పట్ల ఆయన దయకలిగియుండుటకై యున్నది. మీ పట్ల ఎలా దయ చూపించాలో ఆయనకు తెలుసు. విజ్ఞాపన చేయడానికి, ఆయన అక్కడ కూర్చొనియున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించడానికి, అక్కడ కూర్చొనియున్నాడు. మరియు మీరు దారి తప్పినప్పటికీ, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన ఇంకనూ మీ వెంబడి వచ్చి మరియు మీ హృదయమును తట్టుతాడు. తన హృదయము వద్ద అనుదినము దేవుడు తట్టుచున్నాడు అని ఎరుగని ఒక్క పడిపోయిన వ్యక్తి కూడా ఈ భవనములో లేడు. మరియు ఒక మర్త్యునిగా నీవు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన దానిని చేస్తూనే ఉంటాడు, ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను విమోచించాడు.
181 “ప్రేమ” అనే ఆ సంగతిని వ్యక్తపరచడానికి కవులు ప్రయత్నించారు, రచయితలు ప్రయత్నిస్తున్నారు, మానవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు, కానీ అది మానవ భావవ్యక్తీకరణల్లో కనుగొనబడలేకున్నది. ఒకరు ఇట్లన్నారు:
ఓ, దేవుని ప్రేమ, ఎంత ఘనమైన్నది మరియు స్వచ్చమైనది!
ఎంత లోతైనది మరియు బలమైనది!
అది ఎప్పటికీ నిలచియుండును,
అది పరిశుద్ధులు మరియు దూతలయొక్క పాటయైయున్నది.
మనము సముద్రమునంతా సిరాతో నింపియుంచినా,
మరియు ఆకాశమంతటినీ తోలుకాగితములా పరచి;
భూమి మీదనున్న ప్రతీ గడ్డిపూచను ఒక కలముగా చేసి,
మరియు ప్రతి మనిషిని ఒక లేఖికుడిగా చేసినా;
పైన ఉన్న దేవుని ప్రేమను రాయడానికి
అది సముద్రమును ఇంకిపోజేస్తుంది;
ఆకాశము నుండి ఆకాశము వరకు పరచినా,
ఆ కాగితము మొత్తం చాలదు.
182 మీరు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. ఆయన చేసిన, ఆ గొప్ప త్యాగమును మనం అర్థము చేసుకొనుటకు మార్గమే లేదు, క్రిందకు దిగి వచ్చి మరియు మనల్ని తిరిగి దేవునితో సమాధానపరిచాడు. పిదప ఆయన తిరిగి వెళ్ళి మరియు ఇట్లు చెప్పాడు, “ఇప్పుడు, నేను మిమ్మల్ని ఆదరణలేని వారిగా విడిచిపెట్టను. నేను మరలా వత్తును మరియు మీతోను, మీలోనూ, యుగసమాప్తి వరకు ఉండెదను.”
183 మరియు ఈనాడు మనమిక్కడ ఉన్నాము, అదే యేసుతో, అవే కార్యములతో, అంత్యకాలములో జీవిస్తున్నాము, అవే అద్భుతాలు, అవే సూచక క్రియలు, అదే రక్షణ, అదే ఆత్మ అదే కార్యములను చేయుటను కలిగియున్నాము, అదే సువార్త, అదే వాక్యము, అవే దృష్టాంతములను, అదే నేరవేర్పును, ప్రతీది కలిగియున్నాము. మనము ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండుట మంచిది, ఏలయనగా దేవుని కుమారునితో మనము ఏమి చేసామన్న విషయమై, ఏదో ఒక దినమున, మనము జవాబు చెప్పవలసియుంటుంది.
184 పాపీ, పడిపోయిన వ్యక్తీ, ఈ రాత్రి ఆయన నీ చేతిలో ఉన్నాడు. నీవు ఆయనతో ఏమి చేయబోవుచున్నావు? నీవు ఇట్లనవచ్చును, “సరి, నేను దానిని వదిలివేస్తాను.” కానీ, గుర్తుంచుకో, నీవు దానిని చేయకుము. మీరు ఒక పాపియైనయెడల, మీరు ఈ భవనమును విడిచివెళ్ళి మరియు అదే విధంగా ఉండుటకు, అసలు, మార్గమే లేదు. మీరు దానిని చేయలేరు.
185 పిలాతు, ఒక రాత్రి, దానిని చేయుటకు ప్రయత్నించాడు. అతడు కొన్ని నీళ్ళను తెప్పించి మరియు అతడు తన చేతులను కడుగుకున్నాడు. ఇట్లన్నాడు, “నాకు దానితో ఎటువంటి సంబంధమూ లేదు. నేను దానిని అసలు ఎన్నడూ చూడనట్లే ఉన్నాను. సువార్తను నేను ఎన్నడూ వినలేదు. దానితో నేను ఏమియు చేయగోరడంలేదు.” అతడు తన చేతులపైనుండి దానిని కడిగివేయగలిగాడా? అతడు కడిగివేయలేకపోయాడు.
186 ఆఖరికి, పిలాతుకు ఏమి జరిగినదో మీకు తెలుసా? అతడు తన మతి కోల్పోయాడు. మరియు పోయిన సంవత్సరము, మేము ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నామో, అట్టి స్విట్జర్లాండులో, ఇప్పుడు, అక్కడ ఒక నీటి కొలను ఉన్నదని, ప్రతీ సంవత్సరము సిలువ మరణము సమయములో, దానిని చూడటానికి, ప్రపంచమంతటినుండి జనులు వస్తుంటారని చెప్పిన, ఒక ప్రాచీన కథ కలదు. పిలాతు, అతడు మరణమగునట్లుగా దూకేసాడు, ఈ నీటిలోనికి దూకి మరియు తనకు తానుగా మునిగిపోవుట ద్వారా, ఆత్మహత్య చేసుకున్నాడు. మరియు దేవుడు ఆ నీటిని తృణీకరించాడని చూపించుటకు, ప్రతీ సంవత్సరము, సరిగ్గా అదే దినమున, నీలం రంగులో ఉన్న నీళ్ళు మరుగుచు ఆ కొలనునుండి ఎగిసిపడుతుంటాయి. మీ చేతులమీదనుండి గాని లేదా మీ అంతరాత్మలోనుండి గాని యేసుయొక్క రక్తమును నీరు ఎన్నడూ కడుగనేరదు. దానిని చేయుటకు ఒకే ఒక్క మార్గమున్నది, అదేమిటనగా దానిని మీ వ్యక్తిగత క్షమాపణగా స్వీకరించి మరియు దేవునితో తిరిగి సమాధానపరచబడటమే.
మనము ప్రార్థించుకుందాం.
187 పరలోకపు తండ్రీ, వాక్యము కొరకై ఈ రాత్రి మేము నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాము. “ఏలయనగా వినుటవల విశ్వాసము కలుగును, మరియు వాక్యమును వినుటవలనైయున్నది.” యేసు కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరియు మేము నివసిస్తున్న ఈ గొప్ప దినమును, ఆ సూచనలు మరియు అద్భుతాలు జరగడాన్ని మేము చూస్తుండగా, ఈ కార్యములను మేము ఏ విధంగా దాటిపోనిస్తున్నామో. దేవా, మేము చివరి గడియల్లో ఉన్నామని, వీరు చూసి మరియు గ్రహించునట్లు, ఈ రాత్రి ఈ గుడారములో ఉన్న ప్రజల కన్నులను తెరువుము. కాలము గతించిపోవుచున్నది. మేము ఇక్కడ ఉండటానికి ఎంతో సమయమును కలిగిలేము, మరియు మేము యేసును చూడవలసియున్నాము. మరియు ఏ మినహాయింపు లేదు గనుక, మేము ద్రోహులుగా ఎంచబడతాము. ఈ ఉదయము, ఆ మనుష్యుడు, దేశములో ఆవలినుండి ఇక్కడకు వచ్చుటను గూర్చి, ఆ గొప్ప శక్తివంతమైన దర్శనమును, నీవు ఇచ్చియున్నావు; మరియు, ఒక్క సందేహపు ఛాయయైనా లేకుండా, అతడు ఆ చక్రాల కుర్చీనుండి లేచి, తన దృష్టిని పొందుకోవాడాన్ని చూడటం. అతడు కాళ్ళలో బలముపొందుకొని, భవనములో, సంతోషిస్తూ మరియు దేవుని స్తుతించుచు క్రిందకు వెళ్ళుటను చూడటం. దేవుడు ఇంకనూ ఈ రాళ్ళవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టించగల సమర్ధుడని అది చూపించుచున్నది. ఈ దర్శనాలను చూడటం, యేసు చెప్పినట్లున్నది, “తండ్రి నాకు చూపించేవరకు నేనేదియు చేయలేను. నేను ఏదియు చేయలేను.”
188 గ్రుడ్డివారు ఆయనను వెంబడించి, మరియు “మా మీద కనికరము చూపుము,” అని అన్నారు.
189 ఆయన వారి కన్నులను తాకి, మరియు ఇట్లన్నాడు, “మీ విశ్వాసము చొప్పున, మీకు కలుగునుగాక.”
190 ఇప్పుడు, ప్రభువా, మేము యేసును చూస్తున్నాము. మేము సమస్త విషయాలను చూడటంలేదు. మేమింకనూ మాలోని పరిశుద్ధులను సమాధివద్దకు తీసుకొనివెళ్ళి, మరియు ఒకరి సమాధి మీదుగా మరొకరు నడుచుకుంటూ వెళ్ళుటను చూస్తున్నాము. కానీ మేము, వాగ్దానము చేసినట్టి యేసువైపు చూస్తున్నాము. ఆయన మాతో ఉండటాన్ని మేము చూస్తున్నాము. సమాధిలో ఉండిన యేసును కాదు, రెండువేల సంవత్సరాల క్రితము ఉండిన యేసును కాదు కానీ; ఈ రాత్రి, మాతో ఉన్న యేసును చూస్తున్నాము. ఆయనయొక్క శక్తియంతటిలో, మరియు సూచనలలో, మరియు అద్భుతాలలో ఆయన ప్రత్యక్షపరబడుటను మేము చూస్తున్నాము.
191 దేవా, ఈ గొప్ప రక్షణను మేము ఎన్నడూ నిర్లక్ష్యము చేయకుందుము గాక. అయితే మేము దానిని హత్తుకొని, మరియు దానిని అంగీకరించి, మరియు గౌరవప్రదంగా ఉండి, మరియు మమ్మల్ని గృహమునకు తీసుకొనివెళ్ళుటకు యేసు వచ్చేంతవరకు దానివలన జీవించెదము గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము.
192 మరియు మనము మన తలలు వంచియుండగా, ఈ రాత్రి భవనములో పరిశుద్ధాత్మయొక్క దైవీకమైన సన్నిధిలో, ఎవరైన ఒకరు, ఇట్లు చెప్తారేమోనని నేను ఆలోచిస్తున్నాను, “సహోదరుడా బ్రెన్హామ్, నేను తప్పైయున్నానని నేను ఒప్పింబడ్డాను. నేను తప్పైయున్నానని నేను ఒప్పించబడ్డాను. దేవుడు నా పాపములను నాకు బయలుపరిచాడు. మరియు నేను తప్పైయున్నానని నేను ఎరిగియున్నాను. నేను ఆయన తట్టు నా చేతులు ఎత్తి మరియు కనికరము కొరకు అడుగుతాను. దేవా, నాపై కనికరము చూపుము. నేను తప్పైయున్నాను.” మీరు దానిని చేస్తారా?
193 మనము ఒక్క నిమిషము వేచియుండగా, అట్లు చేయగోరిన ఎవరైనా ఉన్నయెడల, కేవలం ఒక క్షణములో ఒక బాప్తిస్మపు కార్యక్రమము జరుగబోవుచున్నది. మరియు మీరొక పాపియైనయెడల, పాశ్చాత్తాప పడవలెనని నేను కోరతాను. మరణించిన ఆయనయొక్క అంతటి పోల్చలేని ప్రేమను మీరెలా తృణీకరించగలరు? పరిశుద్ధమైన పరలోకపు దేవుడు పాపపు మానవునిగా మారాడు; ఆయన పాపము చేసాడని కాదు గాని, ఆయన మీ పాపములను తీసుకొని, మరియు వాటిని అక్కడ కల్వరియొద్దకు మోసుకొని వెళ్ళినందుకైయున్నది. మరియు మీరు ఆ క్షమాపణను అంగీకరించరా? ఈ రాత్రి మీరు అట్లు చేయరా? మనము మన తలలు వంచియుండగా, ఎవరైనా ఇట్లు చెప్పండి, “సహోదరుడా బ్రెన్హామ్, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నేను క్రీస్తు వైపుకు నా చేతులను ఎత్తి, మరియు ఇట్లు అడుగుచున్నాను, ‘నాకు కనికరము చూపుము. నేను—నేను తప్పైయున్నాను, మరియు నేను దేవునితో సమాధానపరచబడాలని కోరుచున్నాను.’” మీరు మీ చెయ్యిని ఎత్తుతారా?
మంచిది, అటువంటప్పుడు, అందరూ క్రైస్తవులైనయెడల, మనము ప్రార్థించుకుందాము.
194 తండ్రీ, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతీ ఒక్కరూ, క్రైస్తవులైనందుకు మేము నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాము, మౌనముగా ఉండుట ద్వారా వారు దానినే సాక్ష్యమిచ్చారు, వారి పాపములన్నియు రక్తము క్రిందనున్నవని వారు సాక్ష్యమిచ్చారు. మరియు దాని కొరకై నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను. ప్రభువా, వారిని ఆశీర్వదించుము. ఓ, రక్తము అర్పించుట ద్వారా, వాక్యము వినుట ద్వారా వారు తిరిగి సమాధానపరచబడ్డారని నేను సంతోషిస్తున్నాను. వాక్యముతో, ఉదకస్నానము, అది మమ్మల్ని పరిశుద్ధపరచుతుంది. ఎక్కడైతే—ఎక్కడైతే తనయొక్క నీచమైన అంధకారముతోనున్న ఒక పాపి, పావురమంత తెల్లగా చేయబడునో, అటువంటి గొప్ప స్థలమునకు, అది మమ్మల్ని తీసుకొనివస్తుంది. పాపముయొక్క ఎర్రని మరకలు కడిగివేయబడి, మరియు మేము క్రీస్తులో నూతన సృష్టియైయున్నాము. దీని కొరకై, మేము, నీకు ఎంతగానో కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాము.
ఇప్పుడు బాప్తిస్మపు కార్యక్రమము ప్రారంభమౌతుంది. ఈ రాత్రి, ఈ యౌవనస్తురాలు, తన ప్రభువు నామములో, బాప్టిస్మము పొందుకోబోవుచున్నదని నేను గ్రహిస్తున్నాను.
195 ఓ పరలోకపు తండ్రీ, ఈ యౌవన స్త్రీని నీవు ఆశీర్వదించవలెనని మేము ప్రార్థించుచున్నాము. నా మనస్సు కేవలం కొద్ది రోజుల క్రితమునకు ఎలా వెళ్ళుచున్నదో, హెన్రీవిల్ కు వచ్చినప్పుడు ప్రియమైన ఆ చిన్న అమ్మాయి అక్కడ వీధిలో నడుస్తుండటాన్ని చూసాను. మరి ఈ రాత్రి, ఆమె ఒక తల్లియైయున్నది, ఒక గౌరవనీయమైన స్త్రీగా ఉన్నది. తనయొక్క వ్యక్తిగత రక్షకునిగా ఆమె నిన్ను అంగీకరించినది. ప్రభువా, జీవితము ఆమెకు కఠినముగా ఉండినది, ఓ దేవా, అయితే పరలోకము ఆమెకు నిశ్చయము. మరియు అందుకై మేము నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, నీవు ఇప్పుడు ఈ యౌవ్వన స్త్రీని ఆశీర్వదించాలని, మేము ప్రార్థిస్తున్నాము. నీటితో బాప్తిస్మము పొందుటకు ఆమె వస్తుండగా, దేవునియొక్క పరిశుద్ధాత్మతో నీవు ఆమెను నింపుదువు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఆమెయొక్క అంతరాత్మ పరలోకపు ఎత్తునకు, ఉత్సాహపరచబడును గాక! నీ మహిమకొరకై దానిని అనుగ్రహించుము. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్
196 [టేపులో ఖాళీ ఉన్నది—సంపా.] నేను అపొస్తలుల కార్యాలు, 2వ అధ్యాయమునుండి చదువగోరుచున్నాను; పెంతెకొస్తు దినమున, పేతురు మాట్లాడుచున్నాడు, అది క్రైస్తవ సంఘములో ఇవ్వబడిన మొట్టమొదటి బాప్తిస్మమైయున్నది. దేవుని కుమారుడిని గుర్తుపట్టనందుకు, పేతురు, పరిసయ్యులను, మరియు గ్రుడ్డి ప్రజలను గద్దిస్తున్నాడు; ఏ విధంగా దేవుడు ఆయనను లేపి, మరియు గొప్ప సూచనలలో మరియు అద్భుతాలలో, ఆయనయొక్క క్రియలను ఏ విధంగా ఋజువు చేసాడన్నదాని గురించి మాట్లాడుచున్నాడు. దీనిని వినండి, అతడు మాట్లాడుచుండగా. అతడు యేసును హెచ్చించుచున్నాడు.
197 ప్రతీ క్రైస్తవుని ఆత్మ క్రీస్తుని హెచ్చిస్తుంది, కేవలం మీయొక్క పెదవులతో మాత్రమే కాదు గాని, మీ జీవితముల ద్వారాయైయున్నది. మీ పెదవులు ఒకదానిని పలికి, మరియు మీ జీవితము మరొకటి చేయవచ్చును. మీరలా చేసినయెడల, అదేమిటో మీకు తెలుసా? అది వేశధారణయైయున్నది. మరియు నేనైతే పరలోకమును ఒక వేషధారిగా ఎదుర్కోవడం కంటే ఒక నాస్తికునిగా ఎదుర్కొనగోరతాను. అది ఏమైనప్పటికినీ, పరలోకములో, ఒక వేషధారిగా ఉండుటకంటే, ఒక—ఒక అవిశ్వాసిగానే ఉండగోరతానని, నేను నమ్ముచున్నాను. నేను నిశ్చయంగా…మీరు యేసు కొరకు సాక్ష్యమిచ్చి మరియు “ఆయనే రక్షకుడు” అని చెప్పినయెడల, మీరు ఆ విధంగా జీవించండి, ఎందుకనగా ప్రజలు మీవద్ద నుండి దానిని ఆశిస్తారు. అది నిజము. ఒక క్రైస్తవుడు జీవించవలసిన విధంగా మీరు జీవించండి. ఈ ఉదయం మనము దానిని చూసాము.
198 ఇప్పుడు, ప్రభు చిత్తమైతే, రేపు రాత్రి, లేదా…బుధవారం రాత్రి, మనము ఈ మూడవ అధ్యాయమును తీసుకుంటాము, మరది అద్భుతమైన అధ్యాయమైయున్నది. మరియు ఇప్పుడు, బుధవారము రాత్రి రావడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఈ ఆదివారపు బడి బోధనలో, ఈ గ్రంథమును ఎంతమంది ఆనందిస్తున్నారు? [సంఘము ఇట్లు చెప్పుచున్నది, “ఆమేన్.”—సంపా.] ఓ, మీకు ధన్యవాదములు. అది బాగున్నది.
199 ఇప్పుడు, నేను అపొస్తలుల కార్యములు, 2వ అధ్యాయము 32వ వచనము వద్ద మొదలుపెట్టి, చదువగోరుచున్నాను.
ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరమూ…సాక్షులము. (వారు దానిని ఎరిగియున్నారు.)
కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచున్న, దీనిని కుమ్మరించియున్నాడు.
200 ఇప్పుడు అతడు, దూతలలో ఒకడైన దావీదు గురించి మాట్లాడటాన్ని వినండి.
దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు: అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచువరకు, నీవు నా కుడిపార్శ్వమున,
కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
దావీదు పైకి వెళ్ళలేకపోయాడు; అతడు పెయ్యలు, మేకలు, మరియు గొర్రెల రక్తము క్రిందనున్నాడు. అయితే ఇప్పుడు అతడు లేవగలిగాడు; అతడు ప్రభువైన యేసుయొక్క రక్తము క్రిందనున్నాడు. ఎందుకనగా ఆ రక్తము అమలులోనికి వచ్చినప్పుడు మాత్రమే వారు దానికి జవాబునివ్వగలరు. క్రీస్తుయొక్క రక్తము అమలులోనికి వచ్చినప్పుడు, మంచి స్థితిలో మరణించిన వారందరూ, లేచారు, అది వాస్తవము, మరియు మహిమలోనికి ఆరోహణమయ్యారు.
201 ఇప్పుడు వినండి.
కావున ఇశ్రాయేలు వంశమంతయు రూఢీగా తెలుసుకోవలసినది ఏమిటనగా…(దీనిని వినండి.)…మీరు…సిలువవేసిన ఈ యేసునే, దేవుడు, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.
దాని విషయమేమిటి? త్రిత్వములో ఆయన ఒక మూడవ వ్యక్తియా, లేదా ఆయనే పూర్తి త్రిత్వమైయున్నాడా? దైవత్వముయొక్క సర్వసంపూర్ణత, శరీరమందు ఆయనేయై యున్నాడు.
202 తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, మరియు పరిశుద్ధాత్ముడైన దేవుడు: అన్నటువంటి ముగ్గురు దేవుళ్ళు అనేదేదియు లేదు. అది అసలు లేఖనములో, ఎక్కడా లేనేలేదు. అది ఎక్కడా లేదు. ఎక్కడ కూడా “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో” బాప్తిస్మము ఇవ్వమని మనకు ఆజ్ఞాపించబడలేదు, లేఖనములలో ఎక్కడా ఆజ్ఞాపించబడలేదు. అది ఒక క్యాథలిక్ ఆచారమైయున్నది, మరియు అది ప్రొటెస్టెంటు సంఘమునకు కాదు. ఏ వ్యక్తికైనా గాని యేసుక్రీస్తు నామములో కాక వేరే ఏ విధంగానైనా బాప్తిస్మము ఇవ్వబడినట్లున్న ఒక్క లేఖనమును చూపించమని నేను ఎవరినైనాసరే అగుడుతాను. వచ్చి, నాకు దానిని చూపించండి, మరియు నేను నా వీపు మీద, “ఒక వేషధారి, ఒక అబద్ధ ప్రవక్త, ఒక అబద్ధ బోధకుడు,” అని ఒక గురుతు పెట్టుకొని వీధుల గుండా వెళ్తాను. అటువంటి ఒక విషయమే లేదు. ఎవరును ఎన్నడూ ఆ విధంగా బాప్తిస్మము పొందలేదు. అది ఒక క్యాథలిక్ ఆచారమే గాని, ప్రొటెస్టెంటు సిద్ధాంతము కాదు
203 “మత్తయి 28:19,” మీరు ఇట్లంటారు, “యేసు ఇట్లు చెప్పాడు, ‘కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి, సమస్త జనులకు బోధించుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి.’” అది సరియే.
అయితే “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో,” కాదు. తండ్రియొక్క నామము, తండ్రియొక్క (నామములు కాదు), నామము…
తండ్రి అనేది ఒక పేరు కాదు. అది ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎంతమంది తండ్రులు ఉన్నారు? మీ చేతులను పైకెత్తండి. ఇక్కడ ఎంతమంది కుమారులున్నారు? మీ చేతులను పైకెత్తండి. ఇక్కడ ఎంతమంది మానవులున్నారు? మీ చేతులను పైకెత్తండి. మంచిది. ఇప్పుడు, మీ పేరు ఏమిటి? తండ్రి, కుమారుడు, లేదా మానవుడు కాదు.
204 ఒకసారి ఒక స్త్రీ నాతో ఇట్లన్నది, ఆమె ఒక మొండి త్రిత్వవాది, ఆమె ఇట్లన్నది, “కానీ సహోదరుడా బ్రెన్హామ్, పరిశుద్ధాత్మ అనేది ఒక పేరుయైయున్నది.”
205 నేను ఇట్లన్నాను, “పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది అదేమిటో అదేయైయున్నది. అది పరిశుద్ధాత్మయైయున్నది, ఒక పేరు కాదు, అది అదేమైయున్నదో అదేయైయున్నది. నేను ఒక మానవుడను, కానీ నా పేరు మానవుడు కాదు, నా పేరు విలియమ్ బ్రెన్హామ్.”
206 కావున, ఆయన, “కాబట్టి మీరు వెళ్ళి, సమస్త జనులకు బోధించుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి,” అని చెప్పినయెడల, పిదప పేతురు పది రోజుల తర్వాత, “పశ్చాత్తాపపడుడి” అని చెప్పాడు, ఇప్పుడు, ఇక్కడ, దీనిని వినండి:
మరియు వారు ఈ మాట విని, వారి హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుము? అని పేతురును…కడమ అపొస్తలులను అడుగగా,
పేతురు, మీలో ప్రతివాడును, మారుమనస్సు పొంది, మరియు పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని వారితో చెప్పెను.
207 అట్లైనయెడల పేతురు యేసు అతనికి చేయవద్దని చెప్పినదానిని చేసాడా? అతడు గందరగోళమవ్వలేదు, గందరగోళములో ఉన్నది మనమే.
208 అపొస్తలుల కార్యములు 2:38 లో, ముంచబడుట ద్వారా, యూదులు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందారు.
అపొస్తలుల కార్యములు, 8వ అధ్యాయములో, ఫిలిప్పు వెళ్ళి సమరేయులకు బోధించి, మరియు వారికి, ఆ సమరేయులకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చాడని మనము కనుగొంటాము.
అపొస్తలుల కార్యములు 10:49 లో, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని పేతురు అన్యజనులకు ఆజ్ఞాపించాడు.
209 పౌలు, అపొస్తలుల కార్యములు 10:5, “అతడు ఎఫెసు పైప్రదేశములో సంచరించి, కొందరు శిష్యులను చూస్తాడు.” వారు, బ్యాప్టిస్టు శిష్యులైయున్నారు; అందరూ, బ్యాప్టిస్టులైయున్నారు. వారు, చూడండి, అపొల్లో అనే—అనే పేరుగల ఒక బ్యాప్టిస్టు బోధకుని ద్వారా మారుమనస్సు పొందారు. మరియు అతడొక బ్యాప్టిస్టు బోధకుడు, “మరియు యేసే క్రీస్తు అని బైబిలు ద్వారా ఋజువు చేయుచున్నాడు.”
పౌలు ఇట్లన్నాడు, “మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా?”
210 వారు ఇట్లన్నారు, “పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు.”
211 ఇట్లన్నాడు, “ఆలాగైతే మీరెలా బాప్తిస్మము పొందారు?”
212 వారు ఇట్లు చెప్పారు, “అక్కడున్న నీటిగుంటలో యేసుకు బాప్తిస్మము ఇచ్చిన, అదే మనుష్యుని ద్వారా మేము బాప్తిస్మము పొందాము. అది సరిపోతుంది.”
213 పౌలు ఇట్లు చెప్పాడు, “అది ఇప్పుడు పని చేయదు. మీరు, మరలా బాప్తిస్మము పొందవలసియున్నది.” మరియు మరలా, వారు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని పౌలు ఆజ్ఞాపించాడు. వారిపై అతని చేతులను ఉంచాడు, మరియు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. సరి. అవును, అయ్యా.
అస్తమయకాలమున వెలుగు కలుగును,
మహిమకు మార్గమును మీరు నిశ్చయంగా కనుగొందురు;
నీటి మార్గములో, అదే ఈనాడు వెలుగైయున్నది,
ప్రశస్తమైన యేసు నామములో పాతిపెట్టబడుట.
యౌవ్వనస్థులారా మరియు వృద్ధులారా, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడండి,
పరిశుద్ధాత్మ నిశ్చయముగా లోనికి వస్తాడు;
సాయంకాల వెలుగు వచ్చియున్నది,
క్రీస్తు మరియు దేవుడు ఒక్కటే అన్నది ఒక వాస్తవమైయున్నది.
214 బైబిలు గ్రంథము చెప్పినది అదేయైయున్నది. అది నిజము. ఇదే ఘడియయైయున్నది, ఇది మనము పశ్చాత్తాప పడవలసిన సమయమైయున్నది.
215 చెప్పండి, నీటితొట్టిలో, మీరు సిద్ధమయ్యాక, కేకవేయండి. మరియు మేము…[ఒక సహోదరుడు ఇట్లు చెప్పుచున్నాడు, “మేము సిద్ధంగా ఉన్నాము.”—సంపా.] మీరు సిద్ధంగా ఉన్నారా? మంచిది, తెరలు తీయడానికి సిద్ధం.
216 ఇప్పుడు, ఆ సహోదరుడు బాప్తిస్మపు సేవ చేయుచుండగా, ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ మీరంతా చూడగలుగుచున్నారా?