ఇశ్రాయేలు సంతానము
1.......?......వేల వేలకొద్దీ ప్రజలు హాజరవుతున్నారు. మరియు ప్రతి రాత్రి కొంతమందిని తిరిగి వెనుకకు పంపవలసి వస్తుంది. గుడారము మరియు భవనం... ఆరాధనా స్థలం నుంచి దాదాపు మూడు నుంచి ఐదు వేల మంది ప్రజలు వచ్చి వెళ్తూ ఉండేవారు ......మరియు కుంటి, మూగ, చెవిటి మరియు గ్రుడ్డివారి కన్నులను ప్రభువు తెరుస్తున్నారు. మరియు గతవారం నేను అక్కడ ఉన్నాను మరియు అది ఎంతో మహిమకరము..…ఇక్కడ ఫీనిక్స్ వద్దకు నేను ఒక రోజు ఆలస్యం అయ్యాను, ఇది ఒక విరామ వ్యవధి. ఇక్కడికి రాలేని పరిస్థితుల్లోఇక్కడికి ఈ వారం వచ్చుటకు సాధ్యమైనది. కాబట్టి నేను తిరిగి వెళ్లేంత వరకు మేము ఇక్కడే ఉంటాము.
నేను శుక్రవారం లేక శనివారము ఉదయము బయల్దేరాను. నేను గతరాత్రి ఇక్కడ ఉండవలసినది. మరియు నేను కొంచెంసేపటి క్రితమే వచ్చాను. మరియు ఇది పద్దెనిమిది గంటల విరామ వ్యవధి. మరియు కొన్ని క్షణముల ముందే ఇదంతా నాకు అర్థం అయింది . మరియు మొన్నటి రాత్రి నుండి నేను నిద్రపోలేదు. కనుక, నేను చాలా అలసి ఉన్నాను. మరియు చాలా మంది అలాగు ఉండవచ్చు. మరియు మొన్న రాత్రి, మూడు వేలమంది కొరకు నేను ప్రార్థన చేశాను, అది కేవలము ఒక్క రాత్రి లోనే. కనుక ఎంతగా అలసి ఉంటానో ఎవరైనా ఊహించగలరు.కానీ ఫీనిక్స్ కి రావడం ఎల్లవేళలా మంచిగా అనిపిస్తుంది. నేను ఈలాగు చెబుతాను, నేను నిజముగా ఇష్టపడేది ఈ స్థలములను గూర్చి ఏదో ఉంది. మరియొక దినమున, కొద్దిమంది సహోదరులతో పర్వతం పైకి వెళ్ళి క్రిందకు చూసే కొన్ని క్షణాలు కలిగి ఉన్నాను. మేము ఎక్కడ ఉన్నామో ఆ స్థలం నుండి మరియు అక్కడికి వెళ్ళి మరియు క్రిందకు చూశాను. “ఓహ్, ఎంత పరలోకములా ఉంది” అని నేను తలంచాను. ఇక్కడ మీరు అద్భుతమైన పట్టణముతో ఆశీర్వదించబడ్డారు. మరియు నేను ఎరిగిన వాటిలో ఇది ఒక చాలా సాధారణ స్థలము మరియు గొప్ప పరలోకమువలె కనిపించే స్థలము అని నేను అనుకుంటాను. సమస్య ఏమిటంటే, మనము దానిని ఎక్కువ అభినందించము. అది నిజము. దేవుడు మనకు ఇచ్చిన ఈ ప్రపంచము అద్భుతమైన స్థలము, మనము కనుక దాని గూర్చి జాగ్రత్త కలిగి ఉంటే. చూశారా? కానీ మనము ఆలాగు చేయము.
కనుక ఇప్పుడు, ఇది మన ....... ఇది మననాలుగవ ఆదివారము, అది కాదా? మనకు ఇంకా నాలుగు ఆదివారములు కలవు. మరియు ప్రభువు చిత్తమైతే నేను ఈ ఆదివారం ఏదో కాదు కానీ, అద్భుతముల కొరకు ప్రభువు చిత్తమైతే ఈ ఆదివారమును కేటాయిస్తాను. కేవలం జనసమూహము కొరకు కాదు కానీ, ఎవరైతే బాధితులు మరియు కుంటివారు ఉన్నారో వారు ఈ సభికులకు తెలిసే విధముగా వారిని తీసుకు వస్తున్నాము.అది చేయడం భయంకరమైన విషయం. అది మీకు తెలుసా? దానిని చెప్పి నేను పొరపాటు చేసానని అనుకున్నాను. కాదు, అది మొదటి స్థానంలో చేయడం సరైనది కాదు, కానీ కేవలం .....నా వరము అద్భుతములను చేయుట కాదు. నా వరము రోగులు మరియు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుటే. అది స్వస్థత మాత్రమే, అద్భుతములు కాదు. ఎన్నడైనా ఎవరి ఎదుట అయిననూ ఒక అద్భుతం చేయుటకు నేను నిశ్చయించినచో నన్ను క్షమించండి.
మరియు గత సమయమున ప్రభువుదూత నాతో మాట్లాడినప్పుడు మొదటి రాత్రి, మొదటిసారి గదిలో ఆరు నెలల తర్వాత నేను ఆయనను మరలా చూసాను. మరియు.......కానీ ఆయన నాతో మాట్లాడలేదు. ఆయన కేవలం తలుపు పక్కన నిల్చుని నేను తిరిగినప్పుడు నన్ను చూస్తున్నారు. వెను వెంటనే నేను సాగిల పడ్డాను. కానీ నేను లేచినప్పుడు, ఆయన వెళ్ళిపోయాడు…కానీ గతసారి ఆయన నాతో మాట్లాడెను. గత వారం నేను మీతో చెప్పినట్లుగా నేను ఏమై ఉన్నానో ఆయన నాతో మాట్లాడారు. వండాలియా ఇల్లినాయిస్ వద్ద, నేను అద్భుతములు అను పనికొరకు అధికముగా నిర్బంధింపబడతానని ఆయన నాతో చెప్పెను. మరియు ఇది నెరవేరినది, ఎలాగంటే అద్భుతములు చేస్తే తప్ప మరి ప్రజలు నన్ను విశ్వసించలేదు. మరియు అది సత్యము. అది ఆ విధముగానే ఉన్నది. ప్రజలు వారు ప్రార్ధించిన విధముగా విశ్వసించలేదు.
5
గత వారము, నేను విచిత్ర పరిస్థితి కలిగి ఉన్నాను......మీలో అనేకమంది అక్కడ ఓరేగాన్లో సహాయపడుటకు వచ్చారు. నేను కేవలం....మనమందరమూ క్రైస్తవులము, మరియు మనం మంచి నివేదికలను వినడానికి ఇష్టపడతాము కాదా? మరియు నేను అక్కడ రెవరెండ్ గార్డెన్ లిండ్సేతో ఉన్నాను. మరియు బాప్టిస్టులతో సహా అన్ని సంఘములు ప్రతివిషయములోనూ ఒకరికొకరు సహకరించుకున్నారు. మరియు రాష్ట్రంలోని పేరు పొందిన చాలామంది డాక్టర్లు మరియు గవర్నర్లు వచ్చారు. మరియు ప్రభువు ప్రజల ఎదుట నాకు కృపను ఇచ్చారు. మరియు మనము కలిగిన ఆ కూడిక చాలా అద్భుతమైనది మరియు మహిమకరమైనది. మరియు చాలా చాలా వేలకొద్దీ ప్రజలు.....
కెనడా నుండి అధికులు హాజరయ్యారని నేను విశ్వసిస్తున్నాను. కెనడా ప్రజలలో......కెనడా ఎన్నడైనను మనం కలిగియున్న మంచి కూడిక, మరియు వారిలో ప్రభువు ఏ విధంగాపని చేసారో కదా మరియు మనము...... ఒక కూడికకు సుమారుగా ముప్పై-ఐదు వేల మంది ప్రజలు ఆరాధనలో ఉన్నారు. వారు అందమైన మైదానములలో కూడా వారిని పట్టలేకపోయారు. మేము వారిని పెద్ద సమావేశ మందిరములోకి మరియు ఇతర వాటిలోకి వారి జాగ్రత్త కొరకు తీసుకు వెళ్ళాము. మరియు ప్రియ ప్రభువు అద్భుతముగా వారితో పనిచేసి మరియు శక్తివంతమైన అద్భుతములు చేసారు.
6
అయిననూ నేను కేవలం కొద్దిక్షణాలు మాట్లాడబోతున్నాను. అద్భుతములను తెలియచేయుట కొరకు నేను కేవలం మరి కొద్ది క్షణాలు తీసుకోవాలని నా కోరిక. ఒక అద్భుతం ........అది పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడియున్నది.
మరియు ఈ మధ్యాహ్నం నేను తీసుకోవాలని అనుకుంటున్న స్థానమును మీలో చాలామంది అర్థం చేసుకుంటారని నా నమ్మకం. నేను దీనిని చేయడానికి కారణం మీకు తెలుసా? ఈ మధ్యాహ్నం ఆరాధన గురించిన ఆలోచనలను గూర్చి నేను వణుకుట దేవునికి తెలుసు. అది నిజం. ఎందుకనగా నా ముందు ఇక్కడ కుంటివారు, గ్రుడ్డివారు, బాధపడువారు మరియు వంకర గలవారు మరియు బాధతో కూడిన వారు కూర్చుండుటను నేను చూసాను. మరియు నన్ను గూర్చి నేను చెప్పుటకు మీ వద్దకు వచ్చాను .
ఇప్పుడు, గుర్తుంచుకోండి, ఈ ఆదివారం మొదటిగా ఈ స్థలములో ఈ విధముగా నేను చెప్పాను. మరియు దేవుడు దానిని వ్యతిరేకించడని నేను నమ్ముతాను. మరియు నా చుట్టూ ఉన్న వేదికను మీరు గమనించారా, నేను ఎప్పటికీ వారిని కలిగి ఉన్నాను...... సభికుల ద్వారా. మరియు నా స్నేహితులారా, ఈ మధ్యాహ్నము మీ యొక్క ఏకాగ్రతను, మీ గౌరవమును ఇస్తారని నేను ఆశపడుతున్నాను [టేపుపై ఖాళీ ఉంది].
7
ఆయన తన శక్తి చూపించడానికిప్రజలను స్వస్థపరచలేదు. కానీ ఆయన దీనిని జనులకు చూపుట కొరకు అతడిని సాతాను పట్టుకొనుటకు ప్రయత్నించినందువల్లనే అలా చేశాడు. మీరు చూశారా, అది దయ్యం యొక్క శోధన. కానీ ఆయన అతనికి లేఖనములను ఇచ్చి “ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టు కొందురు ”అని వ్రాయబడియున్నది“ అనెను. చూశారా? కానీ యేసు.... [టేపుపై ఖాళీ ఉంది.] క్రీస్తు తన దగ్గరకు వచ్చిన అందరినీ స్వస్థపరచలేదు. ఆయన అనారోగ్యం, బాధ కలిగిన అందరినీ స్వస్థపరచలేదు. ఎవరిని స్వస్థపరచుటకు ఆయన నడిపింపు కలిగి ఉన్నాడో, వారినిమాత్రమే స్వస్థపరిచాడు. మరియు ఆవిధంగానే కూడికలు జరుగుతున్నాయి. అన్నికూడికలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇప్పుడు వాటిలో చాలా అక్కడ ఉన్న దేశంలో చాలా గొప్ప అద్భుతములుగా ఉన్నాయి.
8
వేరొక రాత్రి, వారు తీసుకుని... మూగ పాఠశాల వారు మూగపాఠశాల నుంచి ఒక చిన్న పిల్లవాడిని తీసుకువచ్చారు. మరియు తర్వాత ఒకేసారి, నేను ఎన్నడూ అంత ఎక్కువ మంది మూగ మరియు చెవిటి ప్రజలను నా పరిచర్య దినములలో చూడలేదు. వరుసలోని వారందరూ చెవిటి మరియు మూగవారు. మరియు నేను ఆగాను నేను వారి కొరకు ప్రార్ధించాను. మరియు నేను ఆగి ఎందుకు చాలామంది మూగవారు ఉన్నారు అని అడిగాను.
మరియు తర్వాత వారు ఒక పండ్రెండు సంవత్సరముల చిన్న బాలికను కలిగియుండెను. మరియు ఆత్మ ఆమె నుండి వెళ్ళిపోయెను. చాలా దయనీయముగా కనిపించే చిన్న విషయము ఏమిటంటే ఆత్మ ఆమె నుండి వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడుట మరియు వినుట ప్రారంభించెను.
తరువాత రాత్రి, వారు మరల ఆమెను తీసుకుని వచ్చెను. ఆమె మాట్లాడటం లేదు, వినడం లేదని చెప్పెను. ఆమె వైద్యుడు మరియు నర్సు ఆమెతో వచ్చెను. కనుక వారు వేదిక మీద ఆమె మాట్లాడటం, ఆమె మాటలను వేదిక నుంచి వారు విన్నారని చెప్పెను. వారు ఆమె వెనుక నుండి మరియు (బ్రదర్ బ్రాన్హాం ఆయన చేతులతో చప్పట్లు కొట్టెను). వారు ఆ విధముగా చప్పట్లు కొట్టెను. మరియు ఏమి వినబడటం లేదు వారి వ్రేళ్ళతో చిటికలు వేశారు. ఆమె ఏదైనా మాట్లాడుట కొరకు ప్రయత్నించారు, కానీ ఆమె వినలేదు. మరియు వారు (బ్రదర్ బ్రాన్హాం మరల చప్పట్లు కొట్టెను) ఆ విధంగా వారి చేతులతో చప్పట్లు కొట్టెను ఏమి వినబడలేదు. మరియు ఆ బాలిక ఇంతకు ముందు రాత్రి వేదిక పైనుంచి మాట్లాడెను. మరియు వినెను. గనుక ఆమెతో ఏమైనా చెప్పించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. “నాన్న” లేక “అమ్మ” ఏదోఒకటి ఆ విధంగా వారు అంటున్నారు. ఆమె వెళ్ళిపోయింది......... (బ్రదర్ బ్రాన్హాం వర్ణించెను. ) ఆ విధంగా మరియు ఆమె ఏమీ చెప్పలేదు.
9
ఆ బాలికను నేను జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత “మంచిది, ఆమెను మరల ఇక్కడకు తీసుకుని రండి” అని నేను అన్నాను. మరియు వారు ఆ చిన్న పాపను తీసుకుని వచ్చారు. మరియు ఆత్మ ఆమె నుండి వెళ్ళినప్పుడు, నేను కేవలం ఆమె పక్కనే నిల్చుని ఉన్నాను. మరియు నేను (బ్రదర్ బ్రాన్హాం తన వేళ్ళతో చిటిక వేసాడు. ) ఆ విధంగా, ఆమె తిరిగి మరియు దుమికెను, మరియు ఆ విధంగా చుట్టూ చూచెను. నేను వచ్చిన తరువాత అతడు అలా చప్పట్లు కొట్టాడు. మరియు ఆమె చుట్టూ తిరిగి ఆమె దానిని వినెను కనుక “అమ్మ” అని ఆమెతో చెప్పించాలని అన్నాను. మరియు ఆమె “అమ్మ” అనెను.
నేను నా నాలుకతో ఎలా పలుకుతున్నానో ఆ విధంగా “డాడీ” అని చెప్పు అన్నాను. ఆమె “డాడీ” అనెను.
ఇప్పుడు, వేదికపైన ఆమె మాట్లాడింది. మరియు విన్నది. మరియు నేను “ఇప్పుడు చెప్పినట్లు అది కేవలం మార్పు వంటిది. నీవు ఈ రాత్రి క్రైస్తవుడిగా ఉండవచ్చు మరియు రేపు పాపిగా ఉండవచ్చు. నీవు నమ్మి దేవుడిని పట్టుకొనుము మరియు నీ హృదయము అంతటితో దానిని నమ్ముము” అని చెప్పెను. ఇప్పుడు, ఎందుకు చాలామంది మూగ మరియు చెవిటి వారుగా ఉన్నారు అని అడిగాను.
10
మరియు ఏడు సంవత్సరముల వయస్సు గల ఒక చిన్న బాలికను వారు తీసుకుని వచ్చారు. మూగ మరియు చెవిటిగా జన్మించెను. మరియు ఆమె మాట్లాడినది మరియు విన్నది. మరియు ఒరెగాన్లో అక్కడ పెద్దమూగ మరియు చెవిటి సంస్థ ఉన్నది. దానిచేత నేను సరిగ్గా చెప్పాను. మరియు అదేమైయున్నదో అదే అయ్యున్నది . ఆ బాలికను బట్టి వారి చెవిటి మరియు మూగ వారిని తీసుకు వస్తున్నారు. మరియు ఈమె ఒక్కటే విఫలమయింది. మరియు వారు తిరిగి ఆమెను తీసుకుని వచ్చెను. కనుక ఏమైనప్పటికీ ఇరవై లేక ఇరవై-ఐదు చెవిటి మరియు మూగ వైకల్యములుగల ప్రజలు గతవారం స్వస్థత పడ్డారని నా అంచనా. వేదిక మీద ఖచ్చితముగా మాట్లాడుతున్నారు, మరియు వింటున్నారు.
కానీ ఇప్పుడు, అందరిలో నుండి నేను వారిని ఎంపిక చేయలేదు. కేవలం వారు వస్తుండగా నేను విశ్వాసం యొక్క ఒత్తిడిని అనుభవించాను. ఇప్పుడు నా విశ్వాసం దేనిని చేరుకున్నదనగా…
11
ఇప్పుడు,స్నేహితులారా మీరు స్వస్థపరచబడడానికి ప్రపంచములో ఒకే ఒక మార్గము కలదు, మరియు అది దేవునియందు విశ్వాసం ఉంచుట మాత్రమే. ఇప్పుడు, నా సొంత విశ్వాసం చేత నీ నుండి దురాత్మను పారద్రోలడానికి దేవుడు నన్ను ఎంతవరకు అనుమతిస్తారు. అనేది తర్వాత విషయమైతే మీరు వెళ్లి దేవునిపై విశ్వాసముంచి మరియు దేవుణ్ణి నమ్మేంత వరకు అది మీ వద్దకు తిరిగి మరల వచ్చును. “వెళ్లి ఇకమీదట పాపము చేయకుము లేనియెడల దానికంటే మరి చెడ్డస్థితి నీ మీదికి వచ్చును” అని యేసు చెప్పలేదా?
మీరు మీ మిగిలిన దినములలో దేవుడిని సేవించుటకు సిద్ధపడేంతవరకూ ప్రార్ధన వరుసలోనికి ఎన్నడూ రావద్దు. అది సరియే. ఎన్నడూ, పాపపు జీవితం జీవించవద్దు. ఎందుకనగా మీరు మునుపటి కంటే ఇంకా అద్వాన్నమవుతారు. మీ మొదటిస్థితి కంటే కడపటిస్థితి మరి చెడ్డదగునని దేవుడు వాగ్దానం చేశారు. ఎన్నడూ రావడానికి ప్రయత్నించకండి. మరి విశేషముగా ఈ మధ్యాహ్నమున ఈ అద్భుతముల వరుసలోనికి రావాలనుకునే మీరు మీ పూర్ణ హృదయముతో మీ మిగిలిన దినములలో దేవుడిని సేవిస్తామని ఆయనకు వాగ్దానం చేసేంతవరకు ఈ వరసలోనికి రావడానికి ధైర్యం చేయవద్దు.
12
ఇప్పుడు, యేసు అక్కడ సాతానుతో “నీవు నీ దేవుడిని శోధింపవలదు అని వ్రాయబడియున్నది” అనెను. లేక కొందరు గ్రంథకర్తలు దీనికి విభిన్నంగా దేవుని శక్తిని చూపిస్తారు.
ఇప్పుడు, జ్ఞాపక ముంచుకొనండి, బైబిల్ లో యేసు అనేక మంది ప్రజలను దాటుకుంటూ వెళ్ళెను. ఆయన వారి మీద కనికరపడలేదు. ఒకవేళ ఆయన కలిగియున్నా, దానిని చూపించలేదు. అది ఎక్కడ అయితే ఆయన ఆగడానికి నడిపించబడ్డాడో అక్కడ వరకూ. అది సరియేనా?
ఉదాహరణకు, ఐదు మంటపములుగల కోనేటి దగ్గర ఉన్న మనుష్యులు గుంపులు గుంపులుగా రోగులు అక్కడ పడి ఉన్నప్పటికీ, మరియు యేసు దాని గుండా నడుస్తున్నాడు. మరియు ఒక మనుష్యుడు అనేక సంవత్సరముల నుండి అక్కడ పడి ఉండెను. ఆయన ఆ మనుష్యుని లేవనెత్తి తన పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళమని అతనితో చెప్పెను. మరియు మిగిలిన గుంపుతో ఏమీ చెప్పలేదు అది సరియేనా?
ఒక మనుష్యుని, ఆయన అతడిని చేతితో పైకిలేపి ఆ గుంపు నుండి తీసుకువచ్చి, పట్టణములో నుండి తీసుకువచ్చి, అతని కొరకు ప్రార్ధించెను. అతడు మనుషులు చెట్లవలె ఉండటాన్నిచూడటం మొదలు పెట్టాడు. ఒకగంట లేక రెండు గంటలు ఆయన కొరకు దీర్ఘంగా ప్రార్థించి ఉండవచ్చు నాకు తెలిసినంత వరకూ కానీ, ఏది ఏమైనా, ఆయన ప్రార్థన గుండా వెళ్లినప్పుడు అతడు చూపు పొందెను. చూడండి, అతడు నడిపించబడినప్పుడల్లా.......
13
శృంగారమనబడు ద్వారము వద్ద పేతురు మరియు యోహాను ద్వారం గుండా వెళ్లి స్వస్థపరచిన మనుష్యుని చూడండి. యేసు యెరూషలేములో ఉన్నప్పుడు ప్రతి నెల ఆ ద్వారం యొద్దకు వెళుతుండెను. ఎందుకు, ఆయన ఆ మనుష్యుని స్వస్థపరచలేదు? అతడు అక్కడ నలాభై సంవత్సరములుగా పడియుండెను.
గమనించండి.లేక అతను..... ఆ ద్వారం యొద్ద భిక్షాటన చేస్తుండెనని నేను అనుకుంటున్నాను. అక్కడ నలాభై సంవత్సరములుగా అతడు పడి ఉండెను.
ఇప్పుడు, గమనించండి. దేవుడు కేవలం స్వస్థపరచేది ఆయన శక్తిని చూపించడానికి మాత్రమే కాదు. ఆయన స్వస్థపరచేది క్రైస్తవ్యం అనే గొప్పతనాన్ని బట్టి కాదు. నీవు క్రైస్తవుడవు అని ఆయన స్వస్థపరచడు. ఆయన అలా చేయడు ..... కానీ నిన్ను స్వస్థపరచినప్పుడు, ఆ సమయం నుండి నీవు క్రైస్తవుడిగా ఉండాలని ఆయన కోరతాడు. కానీ నీవు బాగుపడ్డాక, “నేను అక్కడికి వెళ్తాను, నేను స్వస్థత పొందుతాను, ఎందుకనగా నేను క్రైస్తవుడను” అని కాదు. కాదు, దేవుడు నీ విశ్వాసమును బట్టే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమును బట్టి మాత్రమే. ఒకవేళ నీవు.......... ఒకవేళ నీవు పాపివైతే మరియు దేవుని గూర్చి ఏమీ తెలియనట్లైతే మరియు మునుపెన్నడూ క్రైస్తవుడవు కానట్లయితే, ఒకవేళ నీవు ఆయనకు క్రైస్తవుడిగా ఉంటానని వాగ్దానం చేసి వచ్చినట్లయితే, మరియు అది చేయడానికి నీకున్న విశ్వాసం చాలు, అది అలా గుజరుగును. అప్పుడే జరుగును.కానీ…?... [టేపు పై ఖాళీ ఉంది.]
14
మనసులో ఏ ఉద్దేశమును నేను కలిగి ఉండలేదు. ఆ ....మరియు మీరు అక్కడికి వెళితే అది మిమ్మల్ని ఉద్రిక్తతకు గురిచేస్తుంది. వీధులలో తల్లులు వారి చేతులలో చిన్న పిల్లలతో నడవడం మీరు చూడండి. మరియు కుంటివారు చుట్టూ అక్కడ పడి ఉండటం చూడండి. ఆగి మరియు ప్రార్థన చేయాలని అనుకుంటాము. అత్యవసర పరిస్థితి.
నేను మనిషిని, నాకు హృదయం ఉంది. మరియు నేను ప్రజల కొరకు బాధపడతాను. ఒకవేళ నా అంతట నేను వెళితే, వారము గడవక ముందే నేను బలహీనున్నిఅయిపోతాను . నేను కేవలం నా కళ్ళు మూసుకుని మరియు పైకి చూచి మరియు “ఓ దేవా కరుణించండి” అని చెప్పి మరియు ముందుకు వెళ్తాను. చూసారా? మరియు నేను వెళ్లే స్థలము నన్ను ఒత్తిడికి గురి చేస్తుంది.
కొద్ది క్షణాల క్రితం, నాచిన్న కుమార్తె పంతొమ్మిది నెలల వయస్సు. ఇప్పుడు అమ్మ ఫోన్ చేసింది. మరియు నా ప్రయాణము అంతా సరిగా జరిగిందా అని తెలుసుకోవాలని. నా చిన్నకుమార్తె ఇప్పుడే మాట్లాడింది. ఆమె అన్నది “నా డాడీ” మరియు“ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంటికి రా డాడీ” అని ఆ విధంగా ఆమె అన్నది. మరియు వారు ఆమెను ఫోన్ నుంచి దూరంగా తీసుకు వెళతారు. మరియు అరవడం మొదలుపెట్టి, తిరిగి ఫోన్ దగ్గరకు రావాలని అనుకుంటుంది. అది నన్ను చంపినంతగా ఉంటుంది. అది అలాగే వుండును. మరియు ఆమె పుట్టినప్పటి నుండి ఆమెను కేవలం నేను ఐదు సార్లు మాత్రమే చూసాను [టేపుపై ఖాళీ ఉంది.]
15
ఎందుకు, చాలా మంది తండ్రులు వారి చిన్నపిల్లలతో ఉంటారు. అది నేను బాధపడేలా .......ఓహ్ ఆ దీన చిన్న అనారోగ్య మరియు బాధపడే సంగతిని చూసి నేను భయపడతాను. కానీ, నేను చేసే ఒకే ఒక సంగతి ఆప్రజలతో నిజాయితీగా ఉండటం మరియు అది ఇదియే. మీరు వరుసలోనికి వచ్చినప్పుడు.... అది ఈరోజు తర్వాత మీరు వరుసగుండా వచ్చినప్పుడు, ప్రార్థన వరసలోనికి దేవునితో మీరు నిబంధన చేస్తారా? వేదిక మీదకి ఎవరిని తీసుకువచ్చినా, ఒకవేళ దేవుడు ఇక్కడ ఈ అద్భుతములను మీ కొరకు ఈ రోజు చేసి, వారిని దేవుడు స్వస్థపరచినట్లయితే…
మరియు అది దేవుడు ఎరుగును.....ఓహ్ నేను ఆయన శక్తిని చూపించేందుకు ప్రయత్నించకుండా దేవుడు నాకు అనుగ్రహించును. గాక. లేదు నేను దానిని చేయడం లేదు. కానీ మీరు ప్రోత్సహించబడే విధముగా......
నేను ఎప్పుడూ ఆరిజోనాలో, ఫీనిక్స్ను ప్రేమిస్తాను. ఇప్పటికీ నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. ఫీనిక్స్ లో ఉన్న గుంపు ఎక్కడా ఉండదు. ఇక్కడ ఉన్న ఈ గుంపును వేరే ఇతర స్థలములలో వారు కలిగి ఉండరు. ఇప్పుడు ఎందుకు, నాకు తెలియదు. కానీ నేను ఎల్లప్పుడూ ఫీనిక్స్ను ప్రేమిస్తాను, మరియు నేను ఆశ్చర్యపడతాను…ఇక్కడ ఏదో ఒకరోజు నేను నివసించాలని కోరుతున్నాను. మరియు ఇక్కడ ఒక గొప్ప సంగతి నన్ను ఇక్కడికి ఆకర్షిస్తోంది. అది నన్ను ఏదో ఒక సమయమున అక్కడికి నడిపించేటట్లుగా.
16
మరియు ఈ దినమును నేను అద్భుతముల కొరకు పక్కకుపెట్టాను . నా మాటలు వినుచున్న దేవుడు దీనిని అనుగ్రహించినట్లయితే అంటే ఎవరినైతే ఇక్కడికి తీసుకుని వస్తారో, వారికి స్వస్థత వచ్చునట్లుగా ఆయన చేసినట్లయితే తప్పక మీరు ఆయనను విశ్వసించుదురు. మీరుఈ ప్రార్థన వరుస గుండా వెళ్లి మరియు దేవుడు ఈ స్వస్థత వరమును నిజముగా పంపాడని విశ్వసించుము. మీరు దానిని విశ్వసించుట లేదా? మిగిలిన కూడికలలో మరియొక అద్భుతము కలిగి ఉండాలని మీరు అనుకోవడం లేదా? మీరు దాని కొరకు ప్రార్థించినప్పుడు మీరు విశ్వసిస్తారు.
మరియు జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడనా ముందు పరిశుద్ధ గ్రంథం ఉండగా చెప్పుచున్నాను , ఈ శక్తి ఇవ్వబడినది కేవలం స్వస్థత కొరకే. నేను ప్రజల కొరకు ప్రార్థిస్తాను; వారు వెళ్లిపోతారు. మరియు వారు విశ్వసిస్తే, వారు బాగవుతారు. ఆ వ్యక్తి కొరకు చెప్పబడిన ఆ అనుభూతి, ఆ విశ్వాసం, ఆ ప్రార్ధన మరియు వారు దానిని విశ్వసించినట్లయితే, దేవుని దూతలు ఆ వ్యక్తిని గమనిస్తాయి. వారు బాగుపడతారు. ఒకవేళ ఆ గడియలో కాకపోవచ్చు, ఆ వారము కాకపోవచ్చు, ఆ నెల కాకపోవచ్చు, వారు బాగవడానికి ముందు ఆరు వారములు కావచ్చు. కానీ వారు బాగు అవుతారు. వారు స్వస్థత కార్యమును పొందుకుంటారు.
17
మరియు స్నేహితులారా, నా కూడికలన్నిటిలో ప్రార్థనా కార్డులను లెక్కపెట్టినప్పుడు అతి తక్కువగా చూచుకున్నట్లయితే నేను ప్రార్థించిన వారిలో డబ్భై శాతం వరకు స్వస్థత పొంది ఉన్నారు. ఎక్కువశాతం విన్నిపెగ్,కెనడా నుండి ప్రార్ధన చేయగా, తొంభై-ఎనిమిది శాతం మంది స్వస్థపడ్డారు. అది ఇప్పుడు కాదు ఐదు నెలల క్రితం నాలుగు నెలల క్రితం. వారు ఇప్పుడు స్వస్థపరచబడ్డారు.
వారు.... కొద్దిమంది తాము బాగున్నామని వారి సాక్ష్యములో పంపి ఉన్నారు. మరియు వాంకోవర్ కూడికయొద్ధ, నేను పోర్ట్ లాండ్ లేక అష్లాండ్యొద్ధ ఉండగా, నా సెక్రెటరీ నన్ను పిలిచి “బ్రాన్హాం సహోదరుడా, మనం ఉంచిన ప్రార్థన అట్టలకు వంద శాతం సాక్ష్యములు రాబోతున్నాయని, నేను విశ్వసిస్తున్నాను అని అతడు చెప్పాడు. వంద శాతం అలాగు జరుగుతుందని నేను ఆశపడుతున్నాను.
18
మంచిది, ఒకవేళ దేవుడు కెనడాలో ఉన్న ప్రజలను వారి విశ్వాసం నందు స్వస్థపరచిన యెడల, దేవుడు కెనడియన్ ను ప్రేమించిన విధముగానే ఆయన అమెరికన్లను కూడా ప్రేమిస్తాడు. అది సరియేనా?. ఆయన వ్యక్తులకు గౌరవం ఇచ్చేవాడు కాదు. మరియు కేవలం నీవు విశ్వసించినట్లయితే, ఆయన నిన్ను స్వస్థపరచుతాడు. కానీ నీకు విశ్వాసం లేకుంటే ఆయన నిన్ను స్వస్థపరచడు. ఆయన స్వస్థపరుస్తాడు అని నీవు విశ్వసించాలి.
ఇప్పుడు, ఇక్కడ సమయం మూడు నిమిషములు తక్కువ రెండు లేక మూడు నిమిషములు తక్కువ మూడు అనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఐదు గంటలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరియు మన పాఠం మీద ఇంకొంచెం మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మరియు తర్వాత మనం ప్రార్ధన వరుస లేక విశ్వాసపు వరుసను ప్రారంభిద్దాము.
19
ఇప్పుడు, ప్రతిఒక్కరూ జాగ్రత్తగా దీనిని వింటున్నారా? జాగ్రత్తగా?స్నేహితులారా, దయచేసి ఎవరైతే నేను చెప్పేదివింటున్నారో, వారు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మధ్యాహ్నం నేను ప్రదర్శించుకోవడానికి మీముందుకు రావడం లేదు. మరియు ఒకవేళ నేను తప్పిదం చేసినట్లయితే, దేవుడి దయ నా పట్ల ఉండును గాక. నేను ఏ తప్పు చేయాలని కోరుకోవడంలేదు .
కానీ “నీవు యదార్ధంగా ఉండి మరియు ప్రజలు నిన్ను నమ్మునట్లు చేసినట్లయితే, నీప్రార్ధనముందు ఏదీ నిలువలేదు” అని ఆ దూత ద్వారా ఆయన నాతో అనెను. మరియు ఆ వ్యక్తితో చాలా సమయం తీసుకుని మరియు దానితో ఉంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు వారు నా ముందు ఉన్నప్పుడే వారిని స్వస్థపరిచాడు. నేను దానికి వ్యతిరేకముగా ఒక్క విషయాన్ని కూడా చూడలేదు. ప్రతి ఒక్కరికీ మీకు అర్థమైందా?మరియు అది సత్యం.
20
ఇది మరియొక సారి, ఫీనిక్స్ వద్ద దీనిని ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. అది సరి. ఒకరోజు నేను ఉండాలనుకునే స్థలము మరియు దేవుడు ప్రజలను స్వస్థపరిచే ఈ దినము మరియు ఒకవేళ ఆయన దానిని నాకు అనుగ్రహించితే, మరియు ఈ విధమైనది ఏది వచ్చినా చెవిటి, మూగ, కుంటి, గ్రుడ్డి, పిచ్చితనము అది ఏదైనా, మిగిలిన ఈ సమయములో ఇక్కడే ప్రజల కన్నుల ముందు విడుదల పొందుతారు. తరువాత మిగిలిన సమయము కొరకు, నేను ఆయన నడిపింపు కోరుతాను. ఒకవేళ ఆయన నా మాట విని మరియు నా ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లయితే.
దేవుడు నాకు సహాయము చేయునట్లు మీరు నా కొరకు ప్రార్థిస్తారా? పని ఆరంభదశలోనే ఉందని నేను గ్రహించాను. అది చాలా గొప్ప శ్రమ. స్నేహితులారా, నేను ఎల్లప్పుడూ ఏమి కలిగి ఉన్నానో, దానిలో ఫలములను చూస్తాను. నేను ఎల్లవేళలా ఆయనకు నమ్మకముగా ఉండుటకు ప్రయత్నిస్తాను..... మరియు రానైయున్నది నెరవేర్చబడుచున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
21
గొప్ప ఉజ్జీవములు దేశం అంతటినీ ఊడ్చి వేస్తున్నాయి. ప్రజలు ఏక హృదయం మరియు ఏకమనస్సుతో ఉన్నారు. వారు ఒకరిని వేరొక సంఘమునకు పంపుతున్నారు. మరియు ఎవరికి ఇష్టం ఉన్న సంఘానికి వారు వెళుతున్నారు. ప్రజలు ఏ సంఘమునకు అయినా వెళ్ళవచ్చు. వారు ఒకరి సంఘమునకు ఒకరిని పంపుతున్నారు. వారి సొంత ప్రాధాన్యతను వారు కలిగి ఉన్నారు. మరియు ఒక వ్యక్తి ఏదైనా నమ్మితే, అది నమ్మి ముందుకు వెళ్లవచ్చు కానీ ఇతర మనిషిని విమర్శించ వద్దు. అది... అది....ఒకరితో ఒకరు కలిసి ఉండి దేవుడిని ఆరాధించవలెను.
ఓహ్, దేవుడు దానిని ఇంకా చేయుచున్నాడని నేను నమ్ముతున్నాను. మరియు ఈ మధ్యాహ్నం ఆయన నన్ను ప్రేమించి మరియు ఈ ప్రజలను మీ ముందే స్వస్థపరిస్తే, స్నేహితులారా నా వాక్యమును మీరు వినవచ్చు. ఎవరికిగానీ లేక ఎవరి సంఘమునకు గానీ వ్యతిరేకముగా దేనినీ పట్టుకోవద్దు. సోదరులు మరియు సోదరీమణుల వలె అందరము కలిసి వెళ్ళాలి. మరియు అప్పుడు బయట ఉన్న పాపి మనం నిజంగా యేసును ప్రేమించుచున్నామని తెలుసుకుంటాడు.అది సరియే. చూశారా?
22
యేసు చెప్పెను: “దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఎందుకనగా మీరు.... ”ఒకరి చేతులు ఒకరు కరచాలనం చేసుకొనుట వలననా? ఎందుకనగా మీరు ఈ సంఘమునకు చెందిన వారనా? “ఎందుకనగా మీరు ఒకరినొకరుప్రేమించుకొనుట వలననే”. అది సరియేనా? ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగియుండుట ద్వారా మీరు తెలుసుకొందురు..... “మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు”. మరియు మనం ఒకరి యెడల ఒకరము ప్రేమను కలిగి లేనియెడల, మనము ఆయన శిష్యులము కాము. మరియు అదియే పాపులను వెనుకకు ఉంచుతుంది. అదియే రాకడను పట్టి ఉంచుతుంది. (టేపుపై ఖాళీ ఉంది.) ఈ ప్రేమపూర్వకమైన చిన్న పట్టణం కొరకు ఈ మధ్యాహ్నము ఆయన శక్తిని మరియు అధికారమును రుజువు చేయడానికి దేవుడు నన్ను అనుమతిస్తారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఆయన అలా చేస్తే, ఒకవేళ మీరు ఆయనను అంగీకరించక మరియు నా మాటలు విననట్లయితే నేను చేయగలిగినంత నేను చేస్తాను. అదిసరియే. మరియు దీనికొరకు నేను ఆఖరి కూడిక వరకూ ఎదురు చూసాను అని నేను అనుకుంటున్నాను. కానీ, ఇప్పుడు నేను అది చేస్తే ప్రజలు కలిసి వచ్చి మాట్లాడటానికి నాకు ఇంకా ఎక్కువ సమయం ఉంటుందని నేను చూసాను.
స్నేహితులారా, జ్ఞాపకముంచుకొనండి. మీరు నలుపు, తెలుపు, పసుపు, ఎరుపు, అమెరికన్, స్పానిష్,మెక్సికన్, ఎక్కడ నుంచి వచ్చినా మనం అందరము క్రీస్తుయేసులో ఒక్కరము, మనం అందరమూ కూడా. దేవుడు ఒకరికంటే మరి యొకరిని ఎక్కువ ప్రేమించరు. మిమ్ములను ప్రేమించిన అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించరు. ఆయన నన్ను ప్రేమించిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్ములను ప్రేమించడు. కనుక అక్కడే మనం ఉన్నాము. మనం అందరమూ క్రీస్తుయేసులో ఒక్కటే.
23
మరియు మనం ఆలాగు జీవిద్దాం. ప్రతిదినము లోకమందు వారు చూసే విధముగా మనం ఆలాగున జీవిద్దాం. ఆ విధముగా మనం యేసును లోకమునకు పైకెత్తుదాము. మీలో ఇతరులు యేసును చూడనివ్వండి. మీరు అందరూ మనుషులచే చదవబడు వ్రాయబడిన పత్రికలు.
మీరు దానిని నాకు అనుగ్రహిస్తారా?..మరియు... ఒకవేళ మిగిలిన దానిని దేవుడు నాకు అనుగ్రహిస్తే, ఈ దినమున పాత ఉజ్జీవ స్థితి ఫీనిక్స్ ద్వారా అది ముందుకు దూసుకుపోతుందని నేను నమ్ముతున్నాను. ఫీనిక్స్ లోని ప్రతి సంఘములో గొప్ప పెద్ద ఉజ్జీవమును చూడటానికి మీరు ఇష్టపడటం లేదా? ఆత్మలు రాజ్యములో జన్మించాలి....
24
కొన్ని నిమిషములు మన తలలు వంచుదాము. మా పరలోకపు తండ్రీ, ఈ దినమున అలసిన గుంపు ప్రజలు ముందు అలసిన మరియు నా కాళ్ళు నొప్పితో, మరియు బాధతో, మరియు ముందుకి మరియు వెనుకకు లాగుతూ నిల్చున్నాను. ఓ క్రీస్తూ ఒక దినమున, నీ సేవకుడిని సమాధానముతో వెళ్ళనిమ్ము. కనుక మనం ఆ నదిని దాటుతాము. నీవు నాకు ఆవలి గట్టున విశ్రాంతిని కలుగ చేస్తావని నేను నమ్ముతున్నాను.
తండ్రీ, నేను ఈ దినమున దేనిని అనుభూతి చెందుచున్నానో నీవెరుగుదువు . అయ్యో ఇంటిలో ఉండి నేను, నా భార్య మరియు కుటుంబముతో కలిసి నిన్ను స్తుతించుటను నేను ప్రేమించుదునని కూడా నీవెరుగుదువు. కానీ ఓ దేవా, పోర్ట్లాండ్ లోని ఓరిగాన్ రాష్ట్రముల మీదుగా ఆ కేక మరియు ఈడ్పు మరియు స్వస్థత కొరకు వివిధ దేశములు, వివిధ ప్రజలు ఇక్కడ ఉన్న ఫీనిక్స్ కు వచ్చుచున్నారు.
25
మరియు తండ్రీ, ఒక దినమున, రాజులకు రాజు ప్రభువుల ప్రభువుకు కిరీటం ధరింపచేయగా మేము ఒకరికొకరం కృతజ్ఞతలు చెల్లించుకుందుముగాక! ఆ గొప్ప కృతజ్ఞతా దినము, పరిశుద్ధులు అందరూ ఒకరితోనొకరు కూడుకున్నప్పుడు, దేవా మేము భూమి మీద ఉండగానే ఆ దినము కొరకు పనిచేయుటకు మాకు సహాయం చేయుము. మరియు మాకు దైవిక బలము అనుగ్రహించుము.
మరియు తండ్రీ, కొద్దినిమిషములు మేము నీ వాక్యమును తెరచుచుండగా పరిశుద్ధాత్మ వచ్చి మరియు దేవుని సంగతులు తీసుకుని మరియు ప్రేమ పూర్వకమైన గుంపు ప్రజలలోకి తీసుకువెళ్లి, మరియు ప్రేమ మరియు సహవాసము అను విత్తనములు ఈ సమాజపు ప్రజలలో ప్రతి సంఘం ఆశీర్వదించబడు వరకూ విత్తి, వారిలో ఒక ఉజ్జీవం ప్రారంభించుము. ప్రభువా మరియు రాబోయే ఈ తర్వాత మూడు కూటములలో వెనుకకు జారిన ఆత్మలను తీసుకు రండి. తండ్రీ, దీనిని అనుగ్రహించండి, మరియు దాని కొరకు మేము నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము , ఆయన నామములో మేము దీనిని అడుగుతున్నాము ఆమెన్.
26
ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే తర్వాత మూడు కూడికలలో మనం వేదిక పిలుపు కలిగి ఉండబోతున్నాము. మరియు కొంతమంది ప్రజలు, పాపులను కలిగి ఉంటాము. కనుక మీ పాపులైన స్నేహితులను తీసుకు వచ్చినట్లయితే దేవుడు ఇక్కడ మనల్ని కలిసి మరియు రక్షించి మరియు ప్రజలను వారి అన్ని వ్యాధులనుండి స్వస్థపరుస్తాడని ఆశిద్దాం.
గత ఆదివారం, లేఖనపుపాఠంలో సంఖ్యాకాండం 21 వ అధ్యాయములోని ఇత్తడి సర్పంగూర్చి మాట్లాడానని నేను నమ్ముతున్నాను. ఆదివారమునకు మునుపు మనం బండను కొట్టుటను కలిగి ఉంటిమి. గత ఆదివారం దేవుడు తన ప్రజలను ఐగుప్తు లో నుంచి తీసుకువచ్చి ఏ విధంగా తన ప్రజలతో పని చేసాడు. మరియు ఆ మార్గం అంతటా వారి కొరకు ఒక మార్గమును అందించడాన్ని మనం తీసుకున్నాం.
27
మరియు గత ఆదివారం, ఏ విధంగా ఆ సంఘము అంతా మాదిరిని చూపించినదీ, లేక నేడు మనం కలిగియున్న సంఘమునకు ఛాయగా మనం చూసియున్నాము. పిలువబడిన, ఈ చీకటి నుండి గొప్పవెలుగు లోనికి తీసుకు వచ్చుట, దేవుని సూచక క్రియలు మరియు అద్భుతములచే నడిపింపబడుట, ఐగుప్తునుండి వారిని తీసుకువచ్చి, వాగ్దాన భూమిలోనికి తీసుకువెళ్ళటం ......మరియు నేడు సంఘం చీకట్లోనుండి క్రీస్తు వెలుగులోనికి నడిపించబడుతూ ఉన్న ఒక పరిపూర్ణ మాదిరి, మరియు ఏ విధంగా ఆయన తన ప్రజలను తీసుకు వచ్చాడో, ఏవిధంగా ఆ ఐగుప్తీయుల క్రింద వారు ఉన్నారో చూడండి. వారు అన్యజనుల వలే ఉండిరి.
దేవుడు వారిని బయటకు తీసుకు వచ్చి మరియు వారికి ధర్మశాస్త్రములు మరియు అద్భుతములు ఇచ్చెను. వారు దేవునితో నడిచిరి. మరియు దేవుడు వారి నుండి అనారోగ్యమును దూరంగా ఉంచెను. తినడానికివారికి ఆయన ఆహారం ఇచ్చెను [టేపుపై ఖాళీ ఉంది.]
28
ఇక్కడ ఉన్న పాపం చేసిన ప్రతిపాపికి ఒక మార్గం ఉంది ఇక్కడే అది ఉంది. రక్తముతో నిండిన ఒక ఊట రక్తనాళముల నుండి వచ్చిన ఊట , పాపులు ఆ వరదలో మునిగినప్పుడు [టేపు పై ఖాళీ ఉంది.] వారి అన్ని దోషపు మరకలు పోవును. అప్పుడు నీవు ఈ అరణ్య ప్రయాణం గుండా వాగ్దాన భూమిలోనికి దేవుని సంఘమును వెంబడించు వ్యక్తివి అవుతావు. మరియు మన వాగ్దాన భూమి యోహాను 14 లో కనుగొంటారు. “మీ హృదయములను కలవరపడనియ్యకుడి. దేవుని యందు విశ్వాసముంచున్నారు. నా యందునూ విశ్వాసముంచుడి. నా తండ్రియొద్ధ అనేక నివాస స్థలములు కలవు. లేనియెడల మీతో చెప్పుదును. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచుదును, నేను ఉండే స్థలంలో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును”. నేను ఆయన ప్రేమ మరియు ఆదరణ గూర్చి ఆలోచించినప్పుడు, అది ఎంతో అద్భుతమైనదికాదా? “నేను వచ్చి నాయొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును”. అది ఆయన కలిగియున్న ప్రేమ.
29
కొన్నిసార్లు నేను పరిగెత్తే బానిసవలె అనుభూతి కలిగివుంటాను. పౌలు ఆయనను కనుగొన్నప్పుడు అతని యజమానికి ఆయన తిరిగి వ్రాస్తూ, మరియు ఆయన ఈలాగు చెప్పెను, “అతడు నీకు ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. నేను వచ్చినప్పుడు అది నేనే తీర్తును”. నేను దానిగూర్చి ఆలోచించినప్పుడు, అక్కడ పౌలు అనే గొప్ప క్రైస్తవుని గూర్చి నేను ఆలోచించినప్పుడు, అక్కడ ఒక గొప్ప ఆరోపణ అతని మీద ఉన్నప్పుడు, క్రీస్తు తన స్వరక్తముతో శిలువ యొద్ద అతని పాపమును తుడిచివేసి అతని స్థానమును తీసుకొనెను అని ఎట్లు అతని హృదయం ఎరిగి ఉందో, మరియు ఇతర ప్రజలను గూర్చి బాధ చెందాలి అన్న విషయం ఆయన ఎరిగి ఉండెను. ఈ మధ్యాహ్నం మనమందరం అట్టి అనుభూతిని కలిగియుండుట ఆశ్చర్యకరం కాదా?. కేవలం వారి తప్పిదమును తీసుకుని నా పైన వేయుము ....మనం ఒకరినొకరం ఆ విధమైన భారములు భరించుట వలన ఇప్పుడు ఆ విధమైన మార్గమునే దేవుడు కోరుచుండెను...[టేపుపై ఖాళీ ఉంది.]
30
వారు ఆ స్థలమునకు వచ్చాక దేవునికి వ్యతిరేకముగా మరియు మోషేకు వ్యతిరేకముగా, సణగడం మొదలుపెట్టెను. మరియు దేవుడు మోషేతో బండను కొట్టమనెను. మరియు దేనితో అతడు కొట్టెను?. తీర్పు కర్రతో, మనము గ్రహించవలసియున్నది ఏమనగా అది తీర్పు, దేవుని తీర్పు కర్ర. అదియే ఈగలను, పేళ్ళను తెచ్చింది మరియు నీళ్లను మార్చినది..... లేక నీళ్ల నుండి కప్పలు బయటకు వచ్చెను. మరియు ఐగుప్తులో ఆలాగు జరిగెను. ఎందుకనగా అవిశ్వాసులైన ప్రజలపై దేవుని తీర్పు.
మరియు గమనించండి, దేవుడు తన ప్రజలను బయటకు నడిపించడానికి ఒకే ఒక మార్గము ప్రాయశ్చిత్తము. మరియు నేడు మనల్ని దేవుడు బయటకు నడిపించిన మార్గం ప్రాయశ్చిత్తం. మరియు ప్రాయశ్చిత్తము అప్పటికే కలువరి యొద్ధ జరిగింది.
31
గమనించండి, వారు అక్కడికి వెళ్ళుచున్నారు, లేఖనములతో అది ఎంతో ఖచ్చితంగా నెరవేర్చబడింది. యవ్వన కుమారుడైన యోసేపు తన సహోదరులచే ఏ విధంగా తిరస్కరించబడ్డాడు. అదే విధంగా క్రీస్తు తన సహోదరులచే తిరస్కరించబడెను. ఆయన ఏడురంగులు గల కోటును ధరించెను. యోసేపు కూడా ఏడు రంగులది ధరించెను. వర్ష ధనస్సులోని ఏడు రంగులు నిబంధనను సూచిస్తున్నవి.
మరియు దేవుడు ఎల్లవేళలా అతని నిబంధనా ప్రజలను కలిగి ఉండును. మరియు అప్పుడు ఈ చిన్న యవ్వన యోసేపు చంపబడెనని తమ సహోదరులు తలంచి అతని అంగీని అతని తండ్రి యొద్దకు తిరిగి తెచ్చిరి.
మరియు మరియొక సంగతిని మీరు చూడాలని నేను కోరుతున్నాను. అతడు గోతిలోనికి త్రోయబడెను. మరియు చనిపోయాడని భావించారు, కానీ అతడు ఆ గోతిలో నుండి తీయబడి ప్రపంచంలో గొప్పదైన వాణిజ్య నగరములోనికి తీసుకునిపోబడెను. మరియు యోసేపు ద్వారా తప్ప మరి ఏ మనిషి ఆ ద్వారము లోనికి ప్రవేశించలేనంతగా లేక న్యాయస్థానములోనికి రానంతగా అతడు కుడిచేయి మనిషిగా చేయబడెను. క్రీస్తునకు పరిపూర్ణ మాదిరి.
వారు అతన్ని చంపి మరియు సమాధిలోనికి అతడిని పడవేసాము అని అనుకున్నారు, కానీ దేవుడు అతడిని లేపెను. మరియు నేడు ఆయన తన ఘనుడైన వాని కుడిచేతి ప్రక్కన ఆసీనుడాయెను. మరియు క్రీస్తు ద్వారా తప్ప మరి ఏ మనిషి దేవుని యొద్దకు రాలేడు. అది సరియేనా?
32
గమనించండి పాన దాయకుడు మరియు భక్ష్య కారుని విషయములో, ఒకరు తిరస్కరించబడెను. మరియు మరియొకరు అంగీకరించబడెను. సిలువ యొద్ధ ఇద్దరు దొంగలవలే: ఒక పరిపూర్ణ మాదిరి. మరియు యోసేపు మరణించినప్పుడు, అతని ఎముకలు తీసుకుపోబడెను. వారు బయటకు వెళ్ళినప్పుడు అతడు ఆ విధమైన సూచనను ఐగుప్తీయులకు విడిచిపెట్టెను. మరియు చాలామంది ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు వారిని దాటుతుండగా, ఐగుప్తులో ఆ ఎముకలను చూసిరి. ఏదో ఒకరోజు తాము వెళ్లేముందు లేక వారితో కదిలేటప్పుడు ఆ ఎముకలు పూర్తిగా కుళ్ళి పోతాయని, వారికి తెలుసు.
క్రీస్తు, అతని ఎముకలను నేను నమ్మినట్లు కాదు, కానీ నేడు మనలో ఎవరమయితే క్రైస్తవుల మయ్యామో ఆయన ఖాళీ సమాధిని, మనకు వదిలెను.
కొంతమంది అన్నారు “సహోదరుడా బ్రాన్హాం క్రైస్తవుడు అనునది ఒక హెబ్రీ వ్రాత అని నీవు తెలుసుకోవలసిన ఒకే ఒక సంగతి”అని.
“నేను క్రైస్తవుడను అని దానికంటే బాగుగా ఎరిగి ఉన్నాను” అని నేను అన్నాను. తప్పకుండా అంతే మీరు కూడా మీరు ఒకవేళ తిరిగి జన్మించినట్లయితే. గమనించుము, కానీ మనం ఖాళీ సమాధిని కలిగి ఉన్నాము.
33
నేడు ప్రపంచములోని మహమ్మదీయ భక్తి గొప్పది. మిగతా వాటి కన్నా మహమ్మదీయులు ఎక్కువ కలరు. సమాధి వద్ద వారు ఒక తెల్లని గుర్రమును ఉంచుతారు. రెండు వేల సంవత్సరముల నుండి అది అక్కడ ఉంది. ఒక తెల్లని గుర్రం మహమ్మద్ తిరిగి లేచి సవారీ చేయుటకు నిరంతరము అక్కడ ఉంచబడుతుంది .
నేడు మనం గంగానది వద్దకు వెళితే, అక్కడ వారి చిన్న బిడ్డలను మొసళ్ళకు వేస్తూ త్యాగం చేస్తున్న తల్లులను కనుగొంటాము. ఆ మొసళ్ళు ఆ చిన్న నల్లని వారిని నములుతూ వారి రక్తమును తమ నోటి గుండా కారుచూ ఉంటాయి. నైలు దేవునికి బలి ఇస్తున్నారు.
ఇప్పుడు కొంతమంది అంటారు, “కానీ నేను యదార్ధపరుడను. వ్యత్యాసం అంతా అక్కడే ఉంది” అని అది యదార్థత కన్నా ఎక్కువ. వారు కూడా యదార్ధపరులే.
34
నేడు భారతదేశం, అంతటిలో బుద్ధుని ఆరాధన క్రింద సహోదరుడు ఎతిప్ గాడ్సే మోసర్వన్ వంటి ప్రజలు. అతను అన్నాడు, సహోదరుడా బ్రాన్హాం, నేను చూశాను “మీకందరికీ గాడ్సే తెలుసు” అని నేను ఊహిస్తున్నాను. అంతర్జాతీయముగా ప్రతి ఒక్కరికి అతను తెలుసు. మెథడిస్ట్ సంఘము. అతడు అన్నాడు, చేతి గోళ్ళు వారి చేతుల నుండి పెరిగినప్పటినుండి వారు అక్కడ నిల్చోవడం నేను చూశాను. “ఓ గొప్ప బుద్ధా, నీవు నా ప్రాణమునకు విశ్రాంతి ఇస్తే గనుక నేను నా చేతిని ఎన్నటికీ కిందకు దించను” అని అంటారు దానిని అలా వదిలి వేసి, వారిలో అనేకమంది సంవత్సరముల తరబడి విశ్రాంతి తీసుకోకుండా మరియు ప్రార్థిస్తూ గోడకు తలక్రిందులుగా ఉండి అక్కడే నిద్రించేవారు.
చైనాదేశపు ప్రజలు వారి అరికాళ్ళను పగలగొట్టుకునేవారు. వారు కేవలం వంటగదికి సంబంధించిన దేవతలనే నాలుగు వందల దేవతలను పైగా అన్యారాధన చేసి వారి ప్రాణముల నెమ్మది కొరకు మొర పెట్టేవారు.
35
మరియు అమెరికా వారైన మీరు ఇపుడు కలిగియున్న దానిని తిరస్కరించారు. ఎందుకనగా, ఆ అన్యులు తీర్పు దినమున లేచి ఖండించెదరు....... (టేపుపై ఖాళీ ఉంది.) అది సరియే...... (టేపుపై ఖాళీ ఉంది.) మీ విగ్రహములకు ....... (టేపుపై ఖాళీ ఉంది.) అందరూ చనిపోయి మరియు వెళ్ళిపోయారు (టేపు పై ఖాళీ ఉంది)..., కానీ తిరిగి లేచెను; ఇది ఒక ఖాళీ సమాధి. “వారు సమాధిని ఖాళీ చేశారు”, అని మీరు అంటారు. అతడు దాని కన్నా ఉన్నతమైన దానిని చేసెను! నేను తండ్రిని ప్రార్ధించెదను. ఆయన మీకు వేరొక ఆదరణకర్తను పంపును. అదియే పరిశుద్ధాత్మ. ఆయన “మీతో ఎప్పటికీ ఉండును” అని ఆయన అనెను. మరియు నేడు ఆయన ఈ భవనములో ఉన్నాడు, ఏ విధమైన హృదయములోనైనా వచ్చుటకు సిద్ధంగా .......లోకమును ఖాళీ చేసి, పరిశుద్ధాత్మ రూపములో క్రీస్తు వచ్చును. మరియు మీరు రక్షింపబడుదురు. మరియు సమాధానముతో ఉందురు. అది సరియే.
36
ఓహ్, మై, గొప్ప సంఘం దేవుడు దానిని నడిపిస్తున్నాడు. అది మన హృదయమును పులకింప చేస్తుందనడములో ఎటువంటి ఆశ్చర్యం లేదు. వారు ఆ స్థలమునకు వచ్చాక కాదేషునకు, మనము దాని గుండా గత ఆదివారం వచ్చాము. కాదేషులో తీర్పు సింహాసనం ఉంది.
మరియు మార్టిన్ లూథర్ ద్వారా సంఘము వచ్చెను.... ప్రయాణములోని మూడవ దశ. చీకటి నుండి పిలువబడిన మార్టిన్ లూథర్ ప్రయాణములోని మొదటి దశ. జాన్ వెస్లీ రెండవ దశ, తరువాత పెంతెకొస్తు వచ్చెను. మరియు పెంతెకొస్తు తీర్పును తీసుకు వచ్చెను. మరియు ప్రజలు వరముల వెంట వెళ్ళెను ......(టేపుపై ఖాళీ ఉంది) అది సరి. నేను చెప్పవలెనని దేవుడు కోరుతున్నాడని నేను నమ్ముతున్నాను.
స్నేహితులారా, మీ హృదయములలో దేవుని ప్రేమ తప్పిపోయినట్లైతే, మీరు సమస్తమును తప్పిపోయినట్లే. మీరు ఏమి చేసారు అన్నదానితో సంబంధం లేదు. భాషలు మాట్లాడుట అది నిలిచిపోవును. ప్రవచనము అది అదృశ్యమగును, కానీ ఎక్కడ ప్రేమ ఉండునో అది ఎప్పటికీ నిలిచిపోవును. నా భార్య నాకు భయపడిన దానికన్నా ఎక్కువ ప్రేమించడానినే నేను ఇష్టపడతాను. మీరు కూడా అంతేకాదా? నిశ్చయముగా, మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమ మీ హృదయములలో.....
37
ఇప్పుడు, గమనించండి వారు తీర్పును కలుసుకున్నప్పుడు, వారందరూ వెనుదిరిగిరి. వెంటనే జబ్బు శిబిరములోనికి ప్రవేశించెను, అగ్నివంటి సర్పములు వచ్చెను. మరియు దేవుడు ఇశ్రాయేలు జనాంగం కొరకు ఇత్తడి సర్పము అను స్వస్థతా వరమును క్రిందకు పంపెను. ఆయన నమ్మకమును పెట్టడానికి ఆయనకు మనిషి కనబడకపోవచ్చు, అందుకే ఇత్తడి స్తంభమైన సర్పముపై ఆయన నమ్మకమును పెట్టెను.
మరియు అదే విధముగా వేరొక రూపములో దురదృష్టం మొదలయ్యాక మీరు, వందల కొలది వివిధ సంఘముల లోనికి వెళ్ళాక, శాఖలలోకి, మరియు సంస్థలలోకి, మరియు ఒకరినొకరు వాదించుకోవడం, జబ్బు మునుపటికంటే ఎక్కువగా ఈ భూమి మీద ఎక్కువ జబ్బు ఉంది. గొప్ప తెగులయిన క్యాన్సర్ దేశములను ఊడ్చి వేస్తుంది. మరియు వేలాది మంది క్రైస్తవులు దానివల్ల చనిపోవుచున్నారు. మరియు ఆ గడియలో ఆలోచిస్తే దేవునిదూత క్రిందకు వచ్చి క్యాన్సర్ ను ఎదుర్కొనెను.
38
కొంచెం అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఉన్న చిన్న బిడ్డ చనిపోబోయెను. పద్నాలుగు మంది వైద్యులు ఆమె క్యాన్సర్ తో వెళ్ళిపోతుందని వారు చెప్పెను. ఓహో దేవుడు అక్కడ నన్ను కలుసుకొనును గాక. అది ఫీనిక్స్ కు సాక్ష్యం కాబోవుతున్నది .
అక్కడ నిల్చున్న ఆ దూత క్యాన్సర్ వంటిది ఏదీ లేదని రుజువు పరిచెను. “నీ ప్రార్ధన ముందు ఏది నిలువలేదు. అది కేన్సర్ అయినా కూడా” అని ఆయన చెప్పెను.
కానీ ఆ హెబ్రీయులందరూ ఆ ఇత్తడి సర్పమును విశ్వసించారు అని మీరు అనుకుంటున్నారా? కానేకాదు. మరియు నేడు వేలకొలది అన్యులు, మరియు మీరు వారితో దైవిక స్వస్థత అను వరమును గూర్చి మాట్లాడితే, వారు దానిని మూఢభక్తి అంటారు. స్వస్థపడతావని నీవు ఎలా ఆశిస్తావు?మొదటిగా అది నీ కొరకు కాదు, అది విశ్వాసుల కొరకు. ఎవరైతే నమ్ముతారో వారికి.
39
కనుక ఇప్పుడు, గత ఆదివారం మనం విడిచిపెట్టిన తర్వాత మనం దాని మీద 22వ అధ్యాయములోనికి ప్రయాణిస్తున్నాము. మరియు దాని గూర్చి చదవడానికి సమయం లేదు . కానీ ఇక్కడ ఒకటి లేదా రెండు వచనములు నేను చదువుతాను. ఇప్పుడు శ్రద్ధగా వినవలెను.
ఇశ్రాయేలు జనాంగము ముందుకు వెళ్తూ యోర్దాను పక్కన యెరికో వద్ద మోయాబు మైదానములలో ఆగెను.
గమనించుము, వారు ప్రయాణిస్తున్నారు. మరియు వారు అలా వెళుతుండగా, ఆ సమయములో ఆహరోను చనిపోయెను. మరియు వారు అలా ముందుకు కదులుతూ వెళుతుండగా మోషే ఇశ్రాయేలు జనాంగముతో పాటు ఆ భూభాగము గుండా వెళ్లి దానిని స్వాధీనపరచుకునే వారు. రాజు వారితో వద్దు ఇక్కడ దీని గుండా మీరు వెళ్ళకూడదు అని చెప్పెను.
కానీ అతను వచ్చి వారికి వ్యతిరేకముగా పోరాడి మరియు జనుల యొద్ద నుండి తీసుకున్నప్పుడు, దేవుడు అతనితో అనెను. ఇశ్రాయేలుతో అనెను, లేక ఇశ్రాయేలు దేవునితో ఇలా నిబంధన చేసెను. ఆయన రాజును అతని చేతులకు అప్పగించినట్లయితే, అతడు ఆ భూమిని పూర్తిగా నాశనం చేస్తాడు. అది నేడు ఒక మాదిరి. దేవుడు నీకు ఆత్మను, పరిశుద్ధాత్మను గనుక ఇచ్చినట్లయితే, మీ జీవితం నుండి పాపమును పూర్తిగా నాశనం చేయుము. ముందుకు కదులుము. ఏదీ సంఘమును ఆపలేదు.
వారు నిన్ను మూఢభక్తి అనవచ్చు. పరిశుద్ధ గ్రంథము తీసుకువెళ్ళే వారని ఎగతాళి చేయవచ్చు. నీవు పరిశుద్ధ దొర్లు వానివి అని వారు అనవచ్చు, లేక ఏదైనా చేయవచ్చు. దేవుని సంఘములో ఏది నిలువలేదు. ఆమె కనాను వైపునకు వెళుతూ ఉంది. ఒకవేళ నీవు.... ఒకవేళ నీవు వెళ్లకపోతే, వెళ్లేవారిని దేవుడు తీసుకు వెళ్ళును. అది నిజము. ఆ సంఘము ఏదీకాదు అది ప్రతిఘటించని శక్తి అది సరియే. మరియు దేవుడు ప్రతీ దాన్ని కదిలించును.
40
ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం, వారు నిన్ను బయటకు పంపబోవుచున్నారు. వారు నిన్ను తిరిగి కూర్చుండబెట్టును. వారు నీ నోటిని మూయించబోవుచున్నారు అని వారు అనెను. కానీ సంఘము ముందుకు కదులుతూ ఉంది. అది సరియే. మరియు సంఘము కదులును. దానిని ఏదీ ఆపజాలదు. మీరు తప్పక నోరు తెరచి మాట్లాడవలసిన ఆ గొప్ప సమయము త్వరలోనే రాబోవుచున్నది.
ఇప్పుడు, ఆమె కదులుతూ ఉంది మరియు ఆఖరికి వారు మోయాబు భూమికి అక్కడికి వచ్చెను మరియు రాజైన బాలాకు అతడు తుడిచి పెట్టుకుపోతాడు, అని అతను అనుకొని అతడు అన్నాడు, “ఓహ్ ఇక్కడ ఉన్న ఈ పెద్ద మంద పొలములోని ఎద్దు గడ్డినంతటిని నాకి తిని వేసిన విధముగా, మమ్ములను తిని వేయుదురు”. ప్రసంగించువాడైన బిలాము, అను పేరుగల ప్రవక్త యొద్దకు అతడు పంపెను. అతడు అన్నాడు “వచ్చి ఇశ్రాయేలు వారైన ఈ జనమును నా కొరకు శపించుము”, మరియు నీవు ఎవరిని శపించుదువో వారు శపించబడును. ఎవరిని దీవించుదువో వారు దీవిoచబడును. అని నేనర్థం చేసుకుంటాను.
41
ఇప్పుడు, మీరు దీనిని గమనించాలని నేను కోరుతున్నాను. ఇక్కడే అది ఉంది ఆయన దేనినైనా శపించితే, శపించబడును. మరియు దేనినైనా దీవించితే, అది దీవించబడును అను శక్తి ఆ ప్రవక్తలో ఉందని, ఆ ప్రజలు ఎరుగుదురు. పరిశుద్ధ గ్రంధం చదివే పాఠకులైన మీరు, లేఖనముల ప్రకారము అదే సరియేనా? ఇప్పుడు దీనిని చదువుటకు మనకు సమయం ఉండినట్లయిన .... [టేపుపై ఖాళీ ఉంది.]
నేను కాదు, దేవుడు నా నోటిలో ఉంచెను. అది సరియేనా?నేను చెప్పలేను, ప్రవక్త కాదు, మనిషి కాదు, స్వస్థపరిచేవాడు కాదు, ఎవరూ కాదు. ప్రవక్తను మీరు చాలా ఎక్కువగా అడిగెదరు. ఖచ్చితంగా మీరు చేయుదురు.
వారికి కుష్ఠరోగమును బాగు చేసుకొనుటకై ఎలీషా యొద్దకు అనేకమంది ప్రజలు వచ్చెను. ఎలీషా దినములలో అనేకమంది కుష్ట రోగులు ఉండెనని పరిశుద్ధ గ్రంధం చెప్పెను. కానీ, వారిలో ఒకే ఒక్కరు స్వస్థత పొందెను. అది నయమాను. అది సరియేనా? ఖచ్చితముగా ఎంతమంది వచ్చెనని, మీరు అనుకుంటున్నారు? వందల మంది కుష్ట రోగులు వచ్చెను. ఎందుకనగా ఎలీషా దినములలో అనేకమంది ఉండెను, కానీ వారిలో ఒకే ఒక్కడు స్వస్థత పొందెను. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథములో దానిని నమోదు చేసెను. వెళ్లి చూడుము.
42
నమోదైన సమాచారమును నేడు నేను పొంది ఉన్నాను . చాలా నెలల క్రితం ముప్పై-ఐదువేల కేసుల యొక్క వైద్యులు ధృవీకరించిన ఖచ్చితమైన స్వస్థతలను గూర్చిన ప్రకటన. సహోదరుడా, నేను ఉత్తేజితమయ్యానని నీవు ఊహించవచ్చు, కానీ నేను అవ్వలేదు. నేను ఉత్తేజితమవ్వలేదు. నేను ఎక్కడ నిల్చుని ఉన్నానో నేను ఎరుగుదును. కానీ చూడండి.
యేసు అనెను, నేను చేసిన ఈ కార్యములన్నిటి కన్నా గొప్ప కార్యములు మీరు చేయుదురు“. ఎందుకనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్లెదను. ఎవరో ఒకరు ఆ వాక్యమును నెరవేర్చవలసియున్నది. అది సరియే. అబ్రహామునకు సంతానముగా ఈ రాళ్లను దేవుడు లేపగలడు.
43
మరియు గమనించుము. ఇప్పుడు గొప్ప స్వస్థతల యొద్ద ఇవి అంత్యదినములై ఉన్నవి ఒకవేళ ఈ సంగతిని నేను గ్రహించకుంటే ఆ “అద్భుతముల వరుసను” గూర్చి చెప్పుటకు భయపడతాను. నేను చేయుచున్నది కేవలం దేవుడు చేయమన్నదే. నేను చెప్పినది కేవలం దేవుడు చెప్పమన్నదే. నేను స్వస్థపరచునది కేవలం దేవుడు స్వస్థపరచమని చెప్పినదే. నేను మీతో ప్రకంపనలు పోయెను అని చెప్పినది కేవలం దేవుడు ప్రకంపనలను ఆపినప్పుడే. ఇప్పుడు నేను వాటిని ఆపలేను. నేను స్వస్థ పరిచేవాడిని కాను. ఆయనే స్వస్థపరిచేవాడు. కానీ నేను వాటిని ఆగిపోవుట చూసినప్పుడు, అవి నా ద్వారా ఆగిపోలేదు. అవి దేవుని ద్వారా ఆగిపోయెను. మరియు ఒకవేళ నేను నీతో చెప్పినది మీరు గనక సందేహిస్తే, మరల మీరు తిరిగి జబ్బు పడతారు. మీరు గనక దానిని విశ్వసిస్తే, మీరు బాగుపడతారు. అది సరియే. బాగుపడడాన్ని ఏదీ ఆపలేదు.
నేను ఒక చెవిటి మనిషిని వినగలిగేలా చేయలేను. నేను ఒక మూగవానిని మాట్లాడేలా చేయలేను. ప్రజల చెవులలో ఉన్న మిషన్ లను నేను బయటికి పోయేలా చేయలేను. దేవుడే దానిని చేయును. మరియు ఒకవేళ ఆయన వేదికపై దానిని చేసినట్లయితే వెళ్లి ఆనందించి ఆయనను సేవించుము. లేకపోతే దానికన్నా గొప్ప సంగతి........
44
బిలాము అనెను, “దేవుడు నన్ను పంపితే తప్ప నేను దానిని చేయలేను.” తర్వాత అతడు దేవునికి ప్రార్థన చేసెను.
కానీ ఆ రాత్రి ఆత్మ వచ్చి, అతనితో మాట్లాడెను. మరియు ఆయన చెప్పెను. “నీవు వెళ్ళవద్దు.” అది సరిపోయే విధంగా ఉన్నదని అనిపిస్తుంది మీకు అనిపించటం లేదా?
ఇప్పుడు, నాకు నేనుగా నమ్మకముగా మధ్యాహ్నం వేళ ఇక్కడ ప్రసంగిస్తున్నాను. ఆయన నాతో ఎప్పటిలాగే చెప్పెను. “అద్భుతములకై, నీవు స్వస్థతా వరానికి మాత్రమే ఎక్కువగా పరిమితమై ఉంటున్నావు” మరియు ఇదియే ముగింపు అని నేను కోరుతున్నాను.
మరియు గమనించుము. “దేవుడు మాట్లాడితేనే నేను మాట్లాడుతాను” అని ఆయన అనుకొనెను. దేవుడు అతని నోటిలో ఉంచితే తప్ప, ఏ ప్రవక్త ఏదీ మాట్లాడడు. ఒకవేళ అతడు ప్రవక్త అయినట్లయితే, ఒకవేళ అతడు అబద్ధపు ప్రవక్త అయితే ఒకవేళ అతడు కిరాయివాడు అయితే ఎందుకని అతడు ఏదైనా చెప్పగలడు కానీ మీరు ఏదైనా చెప్పితే, దేవుడు దానిని నెరవేరుస్తాడు. ఒకవేళ దేవుడు చెప్పితే అది ఆలాగున ఆ మార్గములో ఉండును.
45
గమనించుము, దేవుడు ఏది ఆయన నోటిలో ఉంచితే అదే ఆయన మాట్లాడతానని ఆయన చెప్పెను. మరియు దేవుడు వారిని తిరిగి పంపి వేయమని అతడితో చెప్పెను. మరియు అతడు .....గమనించుము. బిలాము చాలామంది ఇప్పటి కిరాయి ప్రవక్తల వలె డబ్బు కొరకు, అన్యాయమైన వడ్డీ కొరకు అతడు రెండవ సారి తిరిగి వచ్చి ఆయనను అడిగెను. మరియు అతడు దేవుని దగ్గరకు మరలా వెళ్లెను.
ఇప్పుడు చూడండి. దేవుని యొక్క సంపూర్ణ చిత్తము ఉంది. మరియు దేవుని యొక్క అనుమతించబడిన చిత్తము ఉంది. మరియు దేవుడు అతని ప్రవక్తను వెళ్ళటానికి అనుమతించెను. అది ఆయన సంపూర్ణ చిత్తము కానప్పటికీ, అది ఆయన యొక్క అనుమతించబడిన చిత్తము.
మరియు ఆలాగుననే నేను కూడా ఈ అద్భుత వరుసను గూర్చిఈ మధ్యాహ్నమున ఆలోచిస్తున్నాను. అది దేవుని అనుమతించబడిన చిత్తము అయి ఉండవచ్చు. కానీ అది దేవుని సంపూర్ణ చిత్తము కాదు. మీరు నా వాక్యము తీసుకొనుము. మరియు.....
46
చూడండి,స్నేహితులారా, ఇది చెప్పడానికి చాలా కష్టం. దానిని చూడటానికి ప్రజలకు కఠినము. కానీ నేను...... ఎవరో కొంత మంది ఉన్నారు. దేవుడు కొంతమందిని అనుగ్రహిస్తారు. నేను కొంత మందిని కలిగి ఉన్నట్లు ఆయన నా యొద్దకు కొంతమందిని పంపిస్తారు. నా కొరకు ఒకరు మాట్లాడునట్లుగా మరియు దానిని నేను చేయను, ఎందుకనగా అది మీ మీదకు మీరే ఒకటి విసిరుకున్నట్టుగా ఉంటుంది. పరలోకములోఉన్న దేవుడు ఎరుగును. నేను ఆయన ప్రజల ముందు ఇక్కడ వేషధారి వలె నిలబడను. అది సరియే. కానీ అది సత్యము. తీర్పు దినమున నేను దానికొరకై తీర్పు పొందుతాను. ఆయన దానిని చెప్పెను.
మరియు గమనించుము ఇప్పుడు అది ఆయన సంపూర్ణ చిత్తము కాకపోవచ్చు, కానీ ఆయన అనుమతించబడిన చిత్తం అని నేను విశ్వసిస్తాను. నేను ఏది సత్యమో అను దానిని మీకు చెప్పియున్నాను. దానిని మీరు చూచునట్లుగా ఇక్కడ నేడు ఫీనిక్స్ ప్రయోజనార్థమై ఆయనను నేను అడిగాను. మరియు ఆ రాత్రి గదిలో నన్ను కలుసుకున్న దేవదూత ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడకు తీసుకురాబడుతున్న దాని అంతటి పైన ఆయన ఎదుర్కొని నిలవాలని నేను ప్రార్ధించితిని. ఇప్పుడు నేను చెప్పే దానిని నేను చేయలేను. ఎందుకనగా నేను కేవలం చెప్పేది, “కొందరిని తీసుకురండి.”
47
ఇప్పుడు, నన్ను గుంపులోకి వెళ్లనిచ్చినట్లయితే ఇక్కడ నా ముందు కూర్చున్న వారిలో నలుగురిని నేను ఇదివరకే ఎన్నుకొన్నాను. ఇప్పుడే ఆయన అద్భుతం ద్వారా స్వస్థపడునట్లుగా, ఎందుకనగా దానిని నేను అనుభూతి చెందుతున్నాను. వారిలో ఒకరు నెరసిన జుట్టుగల పెద్ద వయసు మనిషి, మరొకరు యవ్వనస్తురాలు, ఇంకొకరు చిన్న పాప. ఇప్పుడే అద్భుతం ద్వారా స్వస్థతపడినట్లుగా, ఇప్పుడు నా ముందు వారు కూర్చుని ఉన్నారు.
కానీ ఒకవేళ నేను అక్కడికి వెళ్లి మిమ్ములను ఎన్నుకుంటే, మీరు నాలోని తప్పిదమును కనుగొనాలని కోరుకుంటారు. చూశారా? ఈ విధమైన సమూహముల సమావేశములు నిర్వహించడానికి ఈ వరమును నాకిచ్చెనని నేను విశ్వసించుటలేదు. నేను దానిని ఆ విధముగా విశ్వసించుట లేదు. స్థలము నుండి స్థలమునకు ఎక్కడికైనా ఆయన నన్ను నడిపించుచూ సర్వశక్తిమంతునిచే నేను నడిపించబడటాన్ని విశ్వసిస్తున్నాను. మరియు ఆ విధముగా ఆయన నన్ను నడిపించగల ప్రజల కొరకు ప్రార్థిస్తాను.
నాకు తెలియదు కానీ, ఏదైనప్పటికీ ఈ సంగతులను స్థిరపరచాలని నేను ప్రయత్నిస్తూ, ఆయన యొక్క సంపూర్ణ దైవిక చిత్తమును, నడవడానికి ఆయన పద్ధతిని కనుగొని మరియు దాని గూర్చి ఎవరు ఏమి చెప్పినా అక్కడే ఉంటాను. అదిసరియే.
48
ఇప్పుడు, అక్కడికి దిగి వెళ్ళమని ఆయన బిలాముతో చెప్పెను. అయితే మనము ఎరుగుదుము, మార్గములో ప్రభువు దూత అతడిని కలిసెను . మరియు దూత అతని ముందు నిల్చుని ఉన్నా కనుగొనలేనంత గుడ్డివాడుగా, డబ్బు పిచ్చి కలవాడిగా అతడు ఉండెను. మరియు అతడు స్వారీ చేస్తున్న కంచర గాడిద పొలములో ప్రక్కకు తిరిగెను. మనిషి దేవుని నుండి తన మనస్సు తిప్పి వేసుకొన్న దానికంటే కూడా ఆ కంచర గాడిద ఎక్కువ ఆత్మీయ వివేచన కలిగి ఉంది. [ఓ, మై]
వేరొక రాత్రి, సమయములో ఎవరో మాట్లాడుచుండెను. మరియు నేను చెప్పుచున్నాను…[టేపుపై ఖాళీ ఉంది.]... “ప్రజలమార్గములో అడ్డు బండ పెట్టడం”.
“ఏది సత్యమో అదే సత్యమని” నేను అన్నాను .
క్రైస్తవులు.... క్రైస్తవులు దానిని చూచెదరు. ఈ సంగతిని చూచుట భిన్నమైనదిగా ఉండును.“
“అవునుగానీ, కొన్నిసార్లు ఆ క్రైస్తవులు గ్రుడ్డివారై దానిని చూడలేరు” అని నేను అన్నాను. అది యేసు రాకడ దినములలో ఉండును. ముగ్గురు జ్ఞానులైన ఆ జ్యోతిష్కులు అక్కడికి వెళ్లి ఆయనను ఆరాధించారు. మరియు దేవాలయములో ఉన్న యాజకుడు ఇది సత్యమా లేక అది సత్యమా అని వాదించాడు. అది సత్యం మరియు ఒక చిన్న మంత్రగత్తె.....
49
జ్ఞాపకముంచుకొనండి, అది దయ్యపు పని అని నేను చెపుతాను. ఆత్మను నమ్మువారు మరియు జ్యోతిష్యం మొదలగునవన్నీ దయ్యం యొక్క పనులు. మరియు మెక్సికోలో అక్కడ నలుపు మంత్రజాలం మరియు ప్రతీదీ ఉందని నేను గ్రహించి ఇప్పుడు శీర్షిక భాగముగా చెప్పుచున్నాను. కానీ నేను ఎవరిని విశ్వసించుచున్నానో నేను ఎరుగుదును. దేవుడు నా గూర్చి శ్రద్ధకలిగి ఉంటారని నేను ఎరుగుదును. వేరొక రాత్రి ఓరెగాన్ లో ఆయన చేసినట్లుగా, ఆయన సంగతిని తీసుకువచ్చి చూపించును. అది సరియే. అది సత్యము. కానీ ప్రజలను తీసుకొని చాలాసమయం కూర్చుండబెట్టి దానిని చూపించడం అనేదే విషయం.
ఇప్పుడు ఈ సంగతులు అతడు చెప్పాక, మరియు..... (టేపుపై ఖాళీ ఉంది.) అతడు దూతను చూడలేదు, మరియు (టేపుపై ఖాళీ ఉంది.)... ప్రక్కకి తిరిగెను. తర్వాత దూత వెళ్లి మరియొక స్థలమున నిలిచెను. ఆయనను గమనించుము, మూడు స్థలములకు వెళ్లెను.. మూడు దశల యాత్రను, అప్పటి మూడు దశల యాత్రను, ఇశ్రాయేలు జనాంగములో మూడు దశల యాత్రను, బిలాము యాత్రలో మూడు దశలను సూచిస్తుంది.
50
మనము, మన మూడవ మరియు ఆఖరి దశలో ఉన్నాము. మరియు జ్ఞాపకముంచుకొనుము. పెంతెకొస్తు కాలం తిరస్కరించబడిన కాలము దీనిని చెప్పుట నాకు ఇష్టము లేదు, ఎందుకనగాపెంతెకొస్తు సంఘము వంటి విశ్వాసము నేను ఏ సంఘములోనూ కనుగొనలేదు. కానీ అది తిరస్కరించబడినది. ఎందుకనగా అది లవొదికయ ఆఖరి సంఘకాలము, నులివెచ్చనిది. అది క్రీస్తు నోటి నుండి ఉమ్మి వేయబడును. కానీ దేవుడు అక్కడ ఆయన ప్రజలను ఆ పెంతెకొస్తు కాలము నుండి బయటకు తెచ్చును.
“మంచిది, నేను గొప్ప కాలము కొరకు చూస్తున్నాను” అని నీవు అనవచ్చు. నేను ఎరుగుదును మీలో చాలామంది ప్రజలు… ప్రవక్తల యొక్క పాఠశాలలో ఒక విధమైన బోధన.... మరియు ఒక గొప్ప సంఘ కాలమువస్తున్నది అని వారు అనవచ్చు. దానిని నమ్మవద్దు. తర్వాత రాబోయేది క్రీస్తు ఆయన సంఘము కొరకు. అదిసరియే. కనుక జ్ఞాపకముంచుకొనుము. ఆఖరి సంఘ కాలమైన లవొదికయ సంఘ కాలము, వచ్చినది. దేవుని నోటి నుండి ఉమ్మి వేయబడినది. అది సత్యము. మరియు దానిని మీరు ఎరుగుదురు.
51
ఓహ్, మీరు అందరు “సహోదరుడా బ్రాన్హాం మీరు ఒక్కరే ఒంటరిగా వెళ్ళుము”, మంచిది, మొత్తం సమాఖ్య సంగతి ఏమిటి? ఆ విధముగానే పురుషుల సమాఖ్యతో క్యాథలిక్ సంఘం ప్రారంభించబడినది. దేవుడు పురుషుల సమాఖ్యలలో కదలాడడు. ఆయన వ్యక్తులతో పని చేయును.
అక్కడ ఆహాబుతో సమాధానముగా వెళ్ళుము అని చెపుతున్నఆ ప్రవక్తల గుంపును చూడుము. మరియు “ఇంకొకరు అక్కడ లేరా”? అనెను. “అవును చిన్న దీన మికాయా”. అని యెహోషాపాతు అనెను. కాని మికాయా ఎరుగును ఎక్కడ అతడు నిలబడెనో, అతడు ఆయన దేవుని ఎరిగెను.
మరియు ఇప్పుడు నేను చెప్పినదానిని చాలామంది తిరస్కరిస్తారని నేను ఎరుగుదును. కానీ జ్ఞాపకం ఉంచుకొనుము, నేను నా హృదయము అంతటితో విశ్వసిస్తున్నాను, నేను దేవుని ఎరుగుదును. మరియు ఇక్కడ కాలమును నేను విశ్వసిస్తున్నాను. ఈ సంఘము మరియు ఆ సంఘము అని మనము పట్టుకుని ఉన్నాము. మరియు దేవుడు దానితో సంతోషపడడు. మనము దాని నుండి బయటకు రావలసి యున్నది. మనము ఒకరికొకరం కలుసుకుని మన హృదయాలు కలవాలి. అది సరియే.
52
మరియు గమనించుము. మరియు అతడు అక్కడికి వచ్చాక ఈ కంచర గాడిద నిల్చోవడం చూసి మొదట స్థలము, అతడు ఆయనను ద్వారం యొద్ద చూసెను. తర్వాత స్థలము, ఇరుకు ప్రాంతములో మరియు తర్వాత స్థలము, ఒక సన్నని మార్గములో నిల్చున్న ఆయనను చూసెను. మరియు చివరికి కంచర గాడిద మానవ స్వరముతో మాట్లాడెను.
చూడుము. ఒక మూగ కంచర గాడిద. ఒక మూగ జంతువు. దేవుడు ఒకవేళ, దేవుని దూత ఒక మూగ జంతువు ద్వారా మాట్లాడితే ఆయన మనిషి ద్వారా మాట్లాడడా? ఆయనను చూడడానికి ప్రజలు చాలా గ్రుడ్డివారుగా ఉన్నారు. “ఈ రాళ్ల ద్వారా అబ్రహామునకు పిల్లలు కలుగునట్లు దేవుడు చేయగలడని” ఆయన అనెను.
ఓహ్, మై, ఇశ్రాయేలు జనాంగముపై శాపము పెట్టడానికి బిలాము దిగిపోయెను. మనం తొందరగా వెళ్లాల్సి యుండెను. ఏది ఏమైనా దీనిని నేను ప్రేమిస్తున్నాను. అతడు మోచేయి అంత గదిని అక్కడ పొందెను.
53
చూడుము, కంచర గాడిద అతనితో మాట్లాడిన తర్వాత కూడా అతడు ప్రయాణిస్తూ ఉండెను. మరియు దేవుని దూత మార్గములో నిలబడెను . ఇప్పుడు ఈ నులివెచ్చని స్థితిలో ఉన్న ప్రజలు, దేవుడు ప్రజలు చేస్తున్న మార్గముతో సంతోషపడడు. వేడిగా లేక చల్లగా ఉండుము. లోపలకు రమ్ము లేక బయటికి పొమ్ము. క్రైస్తవులు దేనిని వారు నమ్ముదురో ఆలాగున ఉన్నారు. పాపులది కూడా అదే పరిస్థితి. దేవుడు ఆ దినమును కలిగి ఉన్నాడు. ఓహ్, ఒకవేళ నేను క్రీస్తు కొరకు జీవించనట్లయితే, నేను ఆయనకు వ్యతిరేకముగా ఉందును. నేను ఇక్కడ నిలబడి ఆయనకు వ్యతిరేకముగా మాట్లాడుదును. నేను ఆయన కొరకు ఉపయోగకరముగా లేకపోవుదును. ఆయనకు ఏదియూ లేకపోవును. ఒకవేళ నేను ఆయన కొరకు జీవించనట్లయితే నేను ఆయనకు వ్యతిరేకిని అగుదును.
కానీ స్నేహితులారా, ఆయన దేవుని కుమారుడని నేను నిజముగా విశ్వసిస్తున్నాను, ఆయనే అని పరిశుద్ధ గ్రంధం చెప్పినట్లుగానే. పరిశుద్ధగ్రంధం ఆయన చేసి ఉన్నాడు అని చెప్పినట్లుగా ఆయన పైకి ఆరోహణమాయెనని నేను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ గ్రంధం చెప్పినట్లుగా ఆయన మరల రానై యున్నాడని నేను విశ్వసిస్తున్నాను. మరియు ఆయన వరములను తిరిగి మనుష్యులకు ఇచ్చుచున్నాడని నేను విశ్వాసం కలిగి ఉన్నాను. అందువల్ల నేడు దానిని నేను ప్రణాళిక చేస్తున్నాను. ఎందుకనగా దానిని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ నేను వేరే విధముగా జీవించుచున్నట్లయితే మీరు నాకు తెలుపవచ్చు. ఎందుకనగా నేను పడిపోయాను కాబట్టి ఒకవేళ నేను ఏదైనా విభిన్నముగా చేసి మరియు ఆ విధమైన జీవితమును జీవిస్తే ఈ దయ్యములు మరియు శక్తుల ముందు నడవడానికి నేను భయపడదును.
54
అది కఠినమైనదని నేను ఎరుగుదును. అది నన్ను ముక్కలుగా చేస్తుంది. మరియు నేను ప్రజలకు ఏదైనా చెప్పడాన్ని నేను ద్వేషిస్తున్నాను. కానీ,స్నేహితులారా ఒక రోజున ప్రజలైన మీ ముందు తీర్పు దినమున నిలబడి నేను సమాధానం చెప్పవలసియున్నది. అది సరియే. మరియు మీ రక్తము నా చేతులపై ఉండును. మీరు దేవుడిని హృదయమంతటితో, స్వచ్ఛముగా, పరిశుద్ధముగా సేవిస్తూ ఆయనను ప్రేమిస్తున్నారు. అన్నివేళలా ప్రేమ గలిగిన ఆ మనసుతో ప్రతిదినమూ నడవాలి. ఇతరులకు మంచి చేయండి. మరియు మంచి దానధర్మ కార్యములు చేయండి. మరియు దేవుని ప్రేమించండి మరియు ఆయనను ఆరాధించుము. మరియు మీరు జీవించగలిగేది ఆ విధముగానే, మరియు మీ పొరుగువారిని మిమ్ములను వలె చూడుము. అది నిజము.
ఇప్పుడు, దీనిని ఇప్పుడు గమనించుము. అతడు అక్కడికి దిగి వచ్చాక.......లేక, అతడు అక్కడికి దిగి వచ్చి నప్పుడు, తప్పనిసరిగా అతడు అనుకొనెను,.....ఇక్కడ ఇంకొక తప్పిదం. నేను ముగించడానికి ముందుగా ఈ భాగమును నేను తీసుకుంటాను. మనము ముగింపునకు వస్తుండగా మీ యొక్క పూర్తి ఏకాగ్రతను నాకు ఇవ్వాలని కోరుతున్నాను. ఓహ్, మై, ఆయన ఇక్కడ ఉన్నాడని నేను అనుభూతి చెందుతున్నాను. నేను అనుభవిస్తున్నాను. ఆయనకు నా ధన్యవాదములు.
55
చూడుము, అతడు అక్కడికి దిగి వచ్చినప్పుడు, బిలాము ఈ పథకముతో వెళ్లెను. ఇప్పుడు నేను నీతో గట్టిగా చెప్పుచున్నాను. హోలీనెస్ ప్రజలారా, సంపూర్ణసువార్త ప్రజలారా, నజరీనులు, పెంతెకొస్తు, చర్చ్ ఆఫ్ గాడ్, మరియు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారలారా, మరియు ఓహ్, మీలో మిగిలిన వారందరూ, మరియు మెథడిస్ట్ లైన మీరు, మరియు బాప్టిస్ట్ లైన మీరు, మరియు దేవుని ప్రేమించుచున్న మీరందరూ, దీనిని గమనించండి.
కానీ, చూడండి బిలాము దానిని… తిరిగి సంఘమునకు తీసుకురావడానికి; అది కదులుతూ ఉంది. బిలాము అక్కడికి దిగి వెళ్ళినప్పుడు అతడు ఆ ప్రజలను చూసెను. పాపపు మార్గములో దగ్గరగా ఇశ్రాయేలు కాల పట్టికలో ఉన్నదానిని అంతా చేసెను. దేవుని మీద వారు వెనుకకు జారిరి. వారు దానిని.......సంఘము.... ఒకచిన్న సంఘ పద్ధతిని, వారు పురుషుల ఇళ్లను పగులగొట్టిరి. మరియు ఆ మార్గమునకు ఈ మార్గమునకు పరుగులెత్తిరి. చేయగలిగినదంతా చేసెను . అది సరియే. కానీ ఆ ఒక్క దానిని బట్టి వారిని తీర్పు తీర్చ వద్దు. చూడండి.? మనము అంతా దానిని కలిగి ఉన్నాము. అదిసరియే. కానీ వారు అనెను.“ఓహ్, ఆ పరిశుద్ధాత్మ సంఘము వారు అందరూ అరిచెడి వారు, మరియు ఆ విధంగా ముందుకు వెళ్లేవారు, చూడండి ఇది చేసిన వారి కాపరులను నేను ఎరుగుదును.
అవును మరియు సహోదరుడా, ఒకవేళ దాని వెనుక కొంచెం డబ్బులేనట్లయితే ఈ ఇతరులను గూర్చి కూడా ఎక్కువ మొత్తంగా చెప్పును. కానీ వారు ఆ తప్పును కప్పిపుచ్చుటకు వారికి ఎక్కువ డబ్బును ఇచ్చినట్లయితే వారు దానిని తుడిచిపెట్టును. అంతా అదియే. కానీ జ్ఞాపకము చేసుకొనుము. మంచిని మరియు చెడును రెండింటిలో మనము కలిగి ఉన్నాము.
56
మరియు బిలాము ఆ ప్రజలను చూసెను. మరియు అతడు అనుకొనెను, ఇక్కడ చూడుము. ఇప్పుడు, వినండి అతడు అనుకున్నాడు, తప్పకుండా పరిశుద్ధ న్యాయ దేవుడు ఆ సంగతులను చేసిన విధముగా ప్రజలను ఆ విధముగా శపిస్తాడు అని. కానీ వారిని చూసినప్పుడు, అతను చూసెను. వారు అది చేసెను. వారు ఇది చేసెను. తప్పకుండా వారివైపు చూసే పరిశుద్ధ దేవుడు పరలోకములో లేడు, మరియు ఆ సంఘమునకు ఏ విధమైన ఆశీర్వాదం కూడా. ఎందుకనగా, వారిని చూడుము. వారు ఇది చేసెను, నిశ్చయముగా పరలోకమందున్న పరిశుద్ధ దేవుడు అటువంటి వారిని చూచి ఆ సంఘమునకు ఎటువంటి ఆశీర్వాదములు పంపించడు. ఎందుకనగా వారిని చూచినట్లయితే, వారు దీనిని చేసారు దానిని చేసారు. అతడు దానిని చూచి న్యాయవంతమైన దృష్టిలోనూ, తన దృష్టిలోనూ దేవుని ద్వారా వారిని విమర్శించాలని ప్రయత్నించాడు, కానీ అతడు వారి ముందున్నకొట్టబడిన బండను చూడలేకపోయాడు మరియు ఇత్తడి సర్పమును వారి పాపములను క్షమించిన ప్రాయశ్చితార్థమును గుర్తించలేకపోయాడు.
మరియు నేడు అదే మాదిరి, ప్రజలు నవ్వుతూ “ఆ దైవిక స్వస్థపరిచేవారు, ఆ పరిశుద్ధ బండరాళ్లు, వారు ఇది మరియు అది చేసెను” అని అందురు. నేను దానిని ఒప్పుకుంటాను. కానీ దేవుని కుమారుడు సంఘం ముందు కదలాడటాన్ని, యేసుక్రీస్తు రక్తమును చూచుటలో వారు విఫలమయ్యారు. అది సరియే. అది ప్రాయశ్చిత్తం చేసెను. సంఘము కొరకు పాపమునకు ఒక ప్రాయశ్చిత్తం చేయబడెను. మరియు దేవుని ఎరిగిన ప్రజలైన మీరు కదులుతూ ఉండండి. మీ కొరకు దేవుడు ఉన్నాడు. వారు శాపమును పెట్టడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ పరవాలేదు. అది జరగదు. క్రీస్తు అనగా దేవుడే దానిని వేరు పరచెను. వారి సొంత న్యాయవిధులను బట్టి దేవుడు ఏ ప్రజలను చూడడు. ఆయన చూసేది కేవలం అతని సొంత కుమారుడైన యేసుక్రీస్తు రక్తమును బట్టియే. మరియు ఆ రక్తం క్రింద ఉన్న ఏ వ్యక్తులైనా సురక్షితంగా భద్రపరచబడతారు. ఆమెన్.
57
ఓహ్, మై, రక్తము క్రింద.....మీరు ఎంత అరచినా లేక గట్టిగా అరచినా నేను లెక్క చేయను. ఉదయము వచ్చేంత వరకు అక్కడే ఉండుము. అది సరియే. వారు రక్తం క్రింద, గొర్రెపిల్ల రక్తం క్రింద, కొట్టబడిన బండ, ఇత్తడి సర్పం క్రింద ఉండిరి. చూడుము, రక్తము ద్వారం మీద వేయుటను ద్వారబంధముపై వేయుటను గతవారం మనం తీసుకున్నట్లుగా, వారుగొర్రె పిల్ల రక్తము క్రింద ఉండిరి. వారు రక్తం క్రిందుగా వెళ్ళిరి. మరియు వారు అక్కడికి వెళ్లిరి. మరియు ఆకలి గొనెను. దేవుడు పరలోకము నుండి మన్నాతో వారిని పోషించెను. వారు దప్పిగొనెను. ఆయన బండనుండి నీటిని వారికి ఇచ్చెను. వారు జబ్బుపడెను. ఆయన స్వస్థపరచుటకు వారికి శక్తిని ఇచ్చెను.
మరియు బిలాము దానిని చూచుటలో విఫలమయయ్యెను. ఎందుకనగా వారు ఆ విషయములో, ఈ విషయములో చాలా ప్రాథమికమైనవారని అతడు అనుకొనెను. దేవుడు వారిని గూర్చి ఏ విధమైన గౌరవం కలిగి లేడు. ఆయన వారిని గూర్చి గౌరవాన్ని కలిగిలేడు, కానీ అతని ప్రాయశ్చిత్తం కొరకు ఆయన చేసెను. ఆమెన్. నేడు దేవుడు సంఘము ఏమి చేసినప్పటికీ దానితో సంబంధం ఏమీ లేదు. ప్రాయశ్చిత్తం, యేసుక్రీస్తు యొక్క రక్తం ఇప్పటికీ పాపములకు ప్రాయశ్చిత్తం. ఆమెన్.
58
మై, మై, ఇక్కడ ప్రత్యక్షముగా మనం అరచుటకు సిద్ధపడ్డాము. తప్పకుండా, మనము కాదా? నేను దాని గూర్చి ఆలోచించినప్పుడు, రక్తము... రక్తము క్రింద వారు ఒప్పుకొనినంత సేపు అది ఆయనకు కుమారులు మరియు కుమార్తెలుగా అంతా అది చూచును, కనుక, నీవు ఒకవేళ తప్పు చేసినట్లయితే, నేడే రక్తం క్రిందకు వచ్చి నీ పాపములను ఒప్పుకొనుము. మనం కృప నుండి ఒకవేళ పడిపోయినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఒక ఉత్తరవాదిని కలిగి ఉన్నాము.
ఓహ్, ఆ ఉత్తరవాది లేనట్లయితే మనం అందరం పోయేవారం. మనం కాదా? కానీ అక్కడ మనం దేవుని కుమారుని ధనిక, రాచరిక రక్తం క్రిందకు తీసుకురాబడ్డాము. మరియు దేవుని ముందు మనం నిర్మలులము మరియు పరిశుద్ధులము. హల్లెలూయ.
59
ఫీనిక్స్ లో చెప్పినట్లు ఇది ధర్మశాస్త్రమునకు వ్యతిరేకం కాదని నేను ఊహిస్తున్నాను. హల్లెలూయ. నా అర్థం “మన దేవునికి స్తోత్రము”. మరియు మనం ఈ మర్త్యమైన పెదవుల గుండా పలుకుచున్న ప్రతి స్తోత్రం మరియు హల్లెలూయకు ఆయనే అర్హుడని నేను అనుకుంటున్నాను. మీరు రాజులైన యాజక సమూహములు, అసాధారణ ప్రజలు, ఆత్మీయ బలియాగములు దేవునికి అర్పిస్తూ మీయొక్క జిహ్వ ఫలములతో ఆయనకు స్తుతియాగము చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంధము చెప్పెను. ఓహ్,మై, మీయొక్క జిహ్వ ఫలములు ప్రజలముందు ప్రతి దినము స్తోత్రం చెల్లించుచుండెను.
ఎంత గొప్ప ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నాము. ఎంత గొప్ప యాజకత్వములో మనం ఉన్నాము. శరీర సంబంధమైన సున్నతిగల యాజకత్వం కాదు గాని, హృదయం యొక్క సున్నతి (ఆమెన్.), పరిశుద్ధాత్మ ద్వారా హృదయం సున్నతి పొందును. అదిసరియే. తర్వాత మీరు దేవునికి స్తోత్రము మరియు ఆరాధనలు అర్పించవచ్చు. ఆత్మీయ బలియాగము ఆయనకు మీ పెదవుల నుండి చెల్లించవచ్చు.
60
వేరొక రాత్రి ప్రజలు అక్కడ నిల్చొని యుండగా, ఒక చిన్న గ్రుడ్డి బాబు తల్లిచేతులలో ఉండగా, అతని చిన్న కన్నులు గుడ్డివై ఉన్నవి కానీ, నేను ఆ చిన్న బాబును నా చేతులలో ఉంచుకుని ఆ విధంగా ప్రార్థించిన తర్వాత మరియు దానిని చూసాను. నేను దానిని చూసి మరియు నేను అన్నాను “అమ్మా, వెలుగును అది చూసెను”. ఆమె అది చూసెను మరియు ఆ బిడ్డ ముందు ఆమె చేతులను పెట్టెను. వాడు తన చిన్న కళ్ళను రెప్ప వేసెను. మరియు నేను నా చేతిని తీసుకున్నాను. నా చేతి గమనమును ఆ బిడ్డచూపు అనుసరించెను. ఎందుకు, ప్రజలు అప్పుడే లేచెను. ఆ పైకప్పు దూలములు స్తోత్రములతో మ్రోగెను. ఒకరు అక్కడ నిల్చుని “వారు పెద్ద శబ్దం చేయుచున్నారు” అనెను.
నేను అన్నాను, ఒకవేళ వారు గనుక నిశ్శబ్దంగా ఉండినట్లైతే, ఆ దూలములు దేవుడిని స్తుతించును. అని నేను విశ్వసిస్తున్నాను. ఏదోఒకటి జరుగుటకు సిద్ధంగా ఉన్నది ఆమెన్. ఓహ్, మై, కవి పాడుటలో ఆశ్చర్యం లేదు.
ఎంత అద్భుతమైన కృప! ఎంతోమధురమైన స్వరం,
నావంటి నీచుని రక్షించెను!
ఒకప్పుడు నేను తప్పిపోతిని, కానీ ఇప్పుడు నేను దొరికితిని.
నేను గుడ్డివాడనైతిని కానీ, ఇప్పుడు నేను చూచుచున్నాను.
ఓహ్, హృదయమునకు, భయం నేర్పునది కృపయే,
నా కలవరములన్నిటినీ తొలగించినది ఆయన కృపయే,
కనిపించే ఆ కృప ఎంత విలువైనది.
మొదటినుంచి నేను విశ్వసించిన ఆ గడియ (ఓహ్, మై,)
పదివేల సంవత్సరములు మనం అక్కడ ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు....ఆయన స్తుతిపాడుటకు మనకు సమయము లేదు,
మనం మొదట ప్రారంభించిన ఘడియ వరకు.
61
ఎంత అద్భుతం. ఎడ్డి పెర్రోనేట్ అతని మరణపు ఘడియలలో తన చేతులను సిలువ వైపు చాస్తూ అరిచెను. ఆయన అరచుటలో ఆశ్చర్యపడవలసిన పనిలేదు:
యేసు నామము యొక్క శక్తికి అంతా శుభము!
దూతలు సాగిలపడుదురు గాక;
రాజ కిరీటము తీసుకు వచ్చెను.
అందరికీ ప్రభువైన ఆయనకు కిరీటం ధరింపచేసెను,
మై! వృద్ధగుడ్డి ఆమె అయిన, ఫెన్ని క్రాస్ బై ఆమె జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఆమె అరచెను.
ఓ సాత్వికమైన రక్షకుడా, నన్నుదాటి వెళ్ళకు,
నా వినయమైన మొర్రను ఆలకించుము;
ఇతరులు నిన్ను పిలుస్తుండగా,
నన్ను దాటి వెళ్ళకు.
నీవు నాకు ఏమి సమర్పిస్తావు ప్రభువా? తన జీవితం అంతటిలో గుడ్డి ఆమె అయిన ఫెన్ని క్రాస్ బై కు నీవు ఏమి సమర్పిస్తావు ప్రభువా? ప్రవాహం అంతటిలో ఆమెకు దొరికెను.
(టేపుపై ఖాళీ ఉంది.) నేను ఏమి చెప్పానో మీరు చూడండి.
జీవం కన్నా నాకు ఎక్కువ....... (టేపుపైఖాళీ ఉంది.)
ముఖాముఖిగా, ఆయనను చూచుట (టేపుపై ఖాళీ ఉంది.) నిత్యత్వము… (టేపుపై ఖాళీ ఉంది.)
62
రచయిత..... (టేపుపై ఖాళీ ఉంది.) తండ్రీ, ఈ మధ్యాహ్న కాలమున నాకు సహాయము చేయుము. మరియు మీ శక్తి ఒక ప్రదర్శనను చేయుటకు తీసుకువచ్చే విధంగా ఉండకపోవును గాక. కానీ ఓ దేవా, ఇశ్రాయేలు జనాంగము ఆత్మీయముగా మాట్లాడుతూ వారి రక్షణ శక్తిలో ఆనందించిన విధముగా ఈ మధ్యాహ్న సమయమున బలిపీఠం మీద పడిన ప్రతిఒక్కటి నీ దైవిక శక్తిచే స్వస్థపరచబడును గాక. మరియు వారిలో అవిశ్వాసులైన వారు సిగ్గుపరచబడుదురు గాక. ప్రియదేవా, దానిని అనుగ్రహించుము. మరియు తర్వాత ఆదివారము సిలువ పాదముల యొద్ద, వారు వినయ విధేయతలతో వంగుదురుగాక. మరియు ఈ వారము ఏదో ఒక ఆ సమయమున “ప్రభువా, నేను తప్పిదముగా ఉంటిని. ఎవరైతే దైవిక స్వస్థతను విశ్వసించారో వారిని నేను హింసించాను. వారిని పరిశుద్ధ దొర్లువారని అన్నాను. వారిని ప్రతీది నేను అన్నాను. కానీ, వారి ముందు వెళుతున్న క్రీస్తు యొక్క రక్తము మరియు శక్తిని చూచుటలో నేను విఫలమయ్యాను” అని అందురు.
ఓ క్రీస్తు, మీ ప్రజలను ప్రోత్సాహపరచుము. “ఓ యాకోబు, నీ గుడారములు ఎంత దైవికములు”. ఓహ్, వారు ఏ పక్క నుండి చూసినా, పరవాలేదు. అది దైవికం. అక్కడ ఒక సంతోషము. అక్కడ పాపము నుండి స్వతంత్రము. అక్కడ స్వస్థతా శక్తి; ఆ గుడారములో ప్రతిదీ ఉండును. ఓ దేవా, ఈ మధ్యాహ్నమున గ్రుడ్డి బిలాము దీనిని చూసి పరలోక దేవుని మహిమపరచును గాక. ఆయన మహిమార్థమై ఆయన నామమున దీనిని నేను అడుగుతున్నాను. ఆమెన్.
63
ఒక్క క్షణం ఇక్కడ ఉన్న వారిలో వేరొకరిని ఇప్పుడు ముందుకు రమ్మని నేను అడుగుతున్నాను. ప్రతిఒక్కరు మీ కుర్చీలలోనే ఉండండి. సోదరులలో ఒకరిని ఇక్కడ బలిపీఠము నొద్దకు అడుగు పెట్టుటను మనం కలిగి ఉండబోతున్నాము.
ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకొనండి. ప్రియ స్నేహితులారా, దేవుని శక్తి ప్రదర్శన చేయుటకు కాదు, మీరు దానిని వినుచున్నారా? మరియు ఒకవేళ యెహోవా దేవుడు, నా రక్షకుడు,యేసుక్రీస్తు ఈ మధ్యాహ్నమున నా ప్రార్థన విని ఇక్కడికి తీసుకురాబడిన ఈ ప్రజలను అద్భుతమైన మార్గములో స్వస్థపరచినట్లయితే, అప్పుడు ఫీనిక్స్, మీరు అప్పటికి క్రీస్తును అంగీకరించకపోయినట్లయితే నేను చేయగలిగినదంతా నేను చేసాను. నేను చేయగలిగిందంతా చేసితిని.
మీకు దీనిని చెప్పుటకు ప్రయత్నిస్తున్నాను. నీకు దీనిని ప్రసంగించుటకు నేను ప్రయత్నిస్తున్నాను. దీనిని వాక్యము చేత మీకు చూపించుటకు నేను ప్రయత్నిస్తున్నాను. మరియు తర్వాత దేవుడు తనంతట తానే శక్తిని ప్రత్యక్షపరచినట్లయితే నాకు తెలిసి చేయగలిగినదంతయు అదొక్కటే. తర్వాత ఇక్కడ ఒక ఉజ్జీవముద్వారా ఊడ్చి, మనము పాత పద్ధతి వేదిక పిలుపును ఇక్కడ చేసి, పాపులు వారి మార్గమున ఏడుస్తూ మరియు క్రైస్తవులు తిరిగి వెళ్ళి ఒకరినొకరు చేతులను కలుపుతూ ఉన్నప్పుడు, దేవుడు దానిని చేస్తాడని నేను నమ్ముతాను.
64
ఇప్పుడు రెండు లేక మూడు ఉజ్జీవములు ప్రారంభించబడెనని నేను విన్నాను. సహో. జేమ్స్ఔట్ లా, ఉజ్జీవము ప్రారంభించెనని నేను విశ్వసిస్తున్నాను. మరియు నగరములో ఇక్కడ ఉన్న మరి కొంతమంది సహోదరులు ప్రతీ సంఘములో, ప్రతిచోటా ఒక ఉజ్జీవము ప్రారంభించబడునని మరియు ప్రజలు క్రీస్తు వద్దకు వచ్చెదరని నేను నమ్ముతున్నాను.
ఓహ్, మై, ఇప్పుడు మనము ప్రయాణ దశలో ఉన్నామని మీరు విశ్వసిస్తున్నారా? దానిని మీరు చేయుచున్నారా? మీ చేతులను పైకెత్తుము. ఇప్పుడు ఇంకొక విషయమును మిమ్ములను అడగాలని నేను కోరుచున్నాను. (సహోదరుడా హోపెర్, కొద్ది క్షణాలు వేదికపైకి వచ్చుటకు మీరు సిద్ధపడినట్లయితే) ఇప్పుడు ఇది నాకు ఆశ్చర్యము. నేడు ఇక్కడ ఉన్న ఎవరైనా, మీ హృదయమంతటితో దీనిని విశ్వసించకపోతే.... ఇప్పుడు స్నేహితులారా, మీరు విశ్వసించకపోతే.....
65
ఇక్కడ గత వారం మన కూడికలో ఒక సంగతి జరిగినది, ఆ ప్రేమ పూర్వక కూడిక అంతటిలో. కానీ చాంద్ర రోగమును వెళ్ళగొడుగుతున్నప్పుడు, ఇద్దరు ద్వార పాలకులు నాప్రక్కన కుడివైపున నిల్చుని ఉండెను. మరియు ఆ ఇద్దరు ద్వారపాలకులు ఒక వైపు వెళ్లి మరియు వారిలో ఒకరు ముందుకు పడెను. మరి ఒకరు ఆ విధముగా వెనుకకు పరిగెత్తెను. కొద్దిగంటల తర్వాత వారు ఒక స్త్రీని లోపలకు తీసుకురావడానికి ప్రయత్నించెను. అది చేయలేకపోయెను. మంచి స్త్రీ, అక్కడ నగరములో ఒక దుకాణం కలిగియుండెను. అక్కడ స్త్రీల దుస్తులు అన్నీ అమ్మే వ్యాపారం గల స్త్రీ. చాలా మంచి స్త్రీ. మరియు రెండు రోజుల తర్వాత ఆమె నురుగు కార్చు పిచ్చికుక్క వలె హోటల్ ముందు అక్కడ వారు ఆమెను కలిగియుండెను. చూశారా? వారు చేయలేరు. అది నరకపు శక్తులు విడుదల ఆయెను. మరియు దయ్యములు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళుచుండును.
ఇప్పుడు, మరి ఒకసారి దానిని నన్ను చెప్పనివ్వండి....…వినండి. గుర్తుంచుకొనుము. ఇది సాతానును వెళ్ళగొట్టుట.స్నేహితులారా, నా హృదయం మీద పరిశుద్ధ గ్రంధమును ఉంచి చెప్పుచున్నాను. అది ఆ ప్రజలను బంధించి ఉంచిన శక్తులను బయటకు పంపేది. మరియు ఆ శక్తి బయటకు పోయినప్పుడు, ఆ దయ్యం ఒకవేళ దానికి ఏదో ఒక చోటు దొరికినట్లయితే అది ఏదో ఒక చోటుకు వెళ్ళును. మీకు జ్ఞాపకం ఉన్నదా? యేసు దయ్యముల గుంపును వెల్లగొడుతున్నప్పుడు “మమ్ములను ఈ పందుల మందలోనికి వెళ్ళుటకు అనుమతించు” అని అవి అనెను. అది సరియేనా? మరియు వాటికి ఆయన వెళ్ళుటకు అనుమతించెను. మరియు అవి అక్కడ ఉన్న పందుల మందలోనికి వెళ్ళెను. వేల కొలది ఉన్న ఆ మంద పరిగెత్తుకొని వెళ్లి ప్రపాతంలో మునిగిపోయెను. అది సరియేనా?
66
మరియు ఇప్పుడు నా హృదయము అంతటితో, ప్రియ స్నేహితులారా, జ్ఞాపకం ఉంచుకొనుము, దీనిని ఒక హెచ్చరికగా తీసుకొనుము. మీకు ఒకవేళ ఒక సంశయ ఆలోచన కలిగియున్నట్లయితే ఇప్పుడు దయచేసి ఈ భవంతిలో ఉండవద్దు. ఎందుకనగా ఇక్కడికి మతిస్థిమితం లేని వారు, గుడ్డి, చెవిటి, ప్రతివారు తీసుకురాబడ్డారు. ఇప్పుడు మీరు తప్పక నిశ్శబ్దంగా ఉండవలెను. మరియు మీరు మీ తల వంచుకుని కూర్చోవాలని అనుకొననట్లైతే, ఇక్కడ ఉండవద్దు.
ఇప్పుడు ఒకవేళ ప్రభువు ఒక అద్భుతం చేయునట్లయితే ప్రతి పదిహేను నిమిషములకు ఒకసారి విరామం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. ఇప్పుడు అది ఉంటుందని నేను చెప్పను, కానీ ఒక్కటి అది కాకపోవచ్చుకానీ ఆ ఒక్కటి కూడా పొందలేకపోవచ్చు. నేను చెప్పలేను. నన్ను నేను పరిపూర్ణముగా మలినం లేని వానిగా చేసుకోవాలి. ముందు మరియు వెనుక దానిని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాలి. అప్పుడు మీరు ఎరుగుదురు.
67
జ్ఞాపకముంచుకొనుము, ఇది స్వస్థతావరం అని నేను చెబుతున్నాను. మీరు చేయగలిగినట్లయితే ప్రతిఒక్కరూ నాకు ఒక సాక్ష్యం “ఆమెన్” చెప్పుము. (సమాజము “ఆమెన్” చెప్పెను.) ఒక అద్భుతం అయినా చేయమని నాకు దూత ఎన్నడూ చెప్పలేదు. విన్నప్రతి ఒక్కరూ “ఆమెన్” చెప్పవలెను. నన్ను విశ్వసించే విధంగా వారిని చేసి వారు స్వస్థపడునట్లు నేను ప్రార్థించాలి, అని ఆయన నాకు చెప్పెను. మీరు వింటే “ఆమెన్” చెప్పాలని గుర్తుంచుకోవలెను . కానీ విశ్వాసము, ఇక్కడ ఈ మధ్యాహ్నమున అదృశ్యుడిగా ఉన్న వానియందు విశ్వాసముంచుట ద్వారా, సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా పూర్తి గ్రుడ్డి వారి నేత్రములు తెరుచుకొనునట్లు, మూగ మరియు చెవిటి వారిగా జన్మించిన వారి చెవులు తెరుచుకుని, వారు మాట్లాడి మరియు వినునట్లుగా నేను అనుమతి పొంది ఉన్నాను. కుంటివారు శారీరకముగా భయంకరంగా ఉన్నవారు కనిపించని ఆయన శక్తి చేత ఇక్కడి ప్రజలు కళ్ళముందు వారు సరి చేయబడి నడిచెదరు.
68
కానీ గుర్తుంచుకోండి, అది ఏది నా సొంత శక్తి కాదు. అది ఆయనశక్తి . ఈ విధమైన అద్భుతములు చేయుటకు నాకు ఏ మార్గము లేదు. నేను కేవలం మీ వలే , మీ భర్త వలే, మీ సహోదరుడి వలే ఒక మనిషిని. నేను ఒక మనిషిని. కానీ ఆయన దేవుడు. మరియు దేవుని సింహాసనం యొద్దనుండి పంపబడిన ఈ దూత దైవికం. నేను ఏమి చెప్తున్నానో మీకు అర్థమైందా? అది.......(టేపుపై ఖాళీ ఉంది.) దూత మరియు దేవుని వాక్యము .....(టేపుపై ఖాళీ ఉంది.).... ఇక్కడ అద్భుతములు. (టేపుపై ఖాళీ ఉంది.) అది సరియేనా?
ఇప్పుడు, ఎంత మంది నాతోపాటు విశ్వసిస్తున్నారు? మనము చూసెదము.....(టేపుపైఖాళీ ఉంది.) నేను పొందానా?.... ధన్యవాదములు.
ఇప్పుడు, నెమ్మదిగా వారికి విశ్రాంతి కోసం చిన్న అవకాశం ఇచ్చెదము. ప్రతిఒక్కరూ మర్యాదపూర్వకముగా “కేవలం నమ్ముము” మనం పాడుతుండగా నిలువుము. ఇప్పుడు, ప్రతి ఒక్కరూ మంచిది. దేవుని దూత ఇష్టపడేది ఆ పాట. ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా మరియు ప్రేమతో ఉండుము. మీరు యేసును ప్రేమిస్తున్నారా “ఆమెన్” చెప్పండి.
69
ఇప్పుడు పూర్తి నిశ్శబ్దంగానన్ను నేను ఉంచుకుంటాను. మరియు ఇప్పుడు, మనం పాడుతూ ఉండగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు, నెమ్మదిగా వెళుతూ ఉండండి.
కేవలము నమ్మువారికి సమస్తము సాధ్యం.
కేవలం నమ్ముము, కేవలం నమ్ముము,
నమ్మువారికి సమస్తమూ సాధ్యమే,
కేవలం నమ్ముము, కేవలం నమ్ముము
నమ్మువారికి సమస్తమూ సాధ్యమే.
మనం అందరమూ తలవంచి ఆ పాటను నెమ్మదిగా పాడుదాం. (సహోదరుడు బ్రాన్హాం పాడుటకు మొదలు పెట్టెను). ఓ దేవా, వందనములు. మీరు దానిని పాడుతుండగా నా కోరిక....?.....
70
ఇప్పుడు మనం మన ప్రభువైనయేసు వైపునకు అత్యంత మర్యాద పూర్వకముగా చూసెదము. ఓ దేవా, ఎంతో తగ్గింపులో నేను ఇక్కడ నిల్చుని ఉన్నాను. ఈ సంగతులు జరుగుతాయని ప్రజలకు చెప్పుతూ ఆరాధనలోని ఈ భాగమును నేను దీనిని తీసుకువచ్చాను. తండ్రీ, ఓ దేవా నేను దానిని ప్రసంగించాను ...?... నేడు, కిరాయి వాడైన ప్రవక్త బిలాము పై, మరియు ప్రియ యేసూ, “నీవు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు” అని నీవు సాతానుకు చెప్పితివి.
సాతాను చెప్పెను, “అవును గాని లేఖనములలో అది రాయబడెను”. అవును, తండ్రీ. మరియు సాతాను నేడు శోధించుటకు ఇష్టపడుతున్నాడు.
ప్రియ దేవా, సమస్తము మీ చేతిలో ఉంది. నా అంతట నేనుగా ఈ గదిలోనే మైక్రోఫోన్ ద్వారా యధావిధిగా నేడు ఇక్కడ నా హృదయ పూర్వకముగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను. కానీ తండ్రి నా హృదయం నీవు ఎరిగి ఉన్నావు. మరియు మీ పరిచర్య చాలా నిర్లక్ష్యం చేయబడిందని నేను నమ్ముతున్నాను. నీ ప్రజలు క్రిందకు తోసి వేయబడ్డారు. నీవు నీ సంఘమును తీసుకువెళ్ళు గడియ వచ్చెను.
71
నాకు సహాయం చేయుము, ప్రియ తండ్రీ. చాలా పేదవారు మరియు అర్హులైన వారు గౌరవపడునట్లు నేడు మీ సేవకుడైన నా మాటలను నీవు గౌరవించెదవా? ఆ రాత్రి గదిలో దూత నన్ను కలుసుకుని, చెప్పెను, “నీ ప్రార్ధన ముందు ఏది నిలువలేదు” అని నేను చెప్పితిని. ప్రియ దేవా, ఒకవేళ అది నీదైవిక చిత్తము కానట్లయితే దయచేసి దానిని ఆపివేయుము.
కానీ తండ్రి, సమస్తము మీకు తెలుసు ఈ ప్రజలు నా మాట వినకపోయినా మీరు నా మాట విన్నారు. ఈ నగరములో ఉజ్జీవము చూడాలని నేను కోరుతున్నాను. ఓ దేవా, నేను ఫీనిక్స్ కు వెళ్ళినప్పటి నుండి ఏదో ఒకటి నా హృదయమును తోసివేస్తుంది ప్రియ దేవా, సహాయం చేయుము. మరియు అది పాత ఉజ్జీవం వలె మొదలవును గాక. ఒకరోజున, ఈ చిన్న ప్రేమపూర్వక నగరంలో నీ దాసుడు ఇక్కడ నివసించునుగాక.
ఇప్పుడు, మమ్ములను కలిపి దీవించుము. ప్రభువా, దయచేసి నన్ను అభిషేకించుము. మీ దూత......మరియు తండ్రీ సమస్త ఘనత మరియు మహిమ మీకు ఇచ్చెదనని మీరు ఎరుగుదురు. నేను స్వస్థపరచు వాడను కానని అన్ని వార్తాపత్రికలకు మరియు మాస పత్రికలకు చెప్పుటను మీరు ఎరుగుదురు. స్వస్థపరచువాడవు నీవే తండ్రీ. వినయపూర్వకముగా, నేను ఏమీ కాను, కానీ మట్టిని నిన్ను ఘనపరుస్తున్నాను. తండ్రీ, ఈ పేద అనారోగ్య, బాధపడుతున్న గుడ్డి, కుంటి ప్రజలకు సహాయం చేయుటకు నన్ను అనుమతించుము. తండ్రీ ఆలాగు మీరు చేసెదరా? మరియు తండ్రి, రానున్న వారము మీరు చెప్పిన ప్రకారం మేము చేసెదము. నేడు దానిని అనుమతించుము. మరియు మీ దాసునికి లేక ప్రజలకు వ్యతిరేకముగా దానిని పట్టి ఉంచవద్దు. ఇప్పుడు దైవిక శక్తిని ఇవ్వమని యేసుక్రీస్తు నామమున నేను మీకు ప్రార్థిస్తున్నాను తండ్రీ ఆమెన్. మర్యాదపూర్వకముగా ఇప్పుడు మీరు కూర్చోండి.
72
ఇప్పుడు, ద్వారపాలకులైన మీకు నేను చెప్పేది, చిన్నపిల్లలు కొంతమంది చిరాకుగా మరియు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. స్నేహితులారా, అది పూర్తి నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి తల్లులు మీ చిన్నపిల్లలను చుట్టూ తిరగనీయకండి. మరియు ఒకవేళ చిన్న పిల్లలు ఏడ్చినట్లయితే, ఇక్కడ కూర్చోవడానికి మీకు స్థలం లేనట్లయితే, ఈ భవనములో ఎంతమంది ద్వారపాలకులు ఉన్నారు? మీ చేతులను చూపించండి. ద్వారపాలకులారా? మీరు మీ విధుల్లో ఉన్నారా? మంచిది, గమనించి మరియు తల్లులకు సహాయం చేయము. నేల మీద ఏ ఒక్కరూ పరిగెత్తుటకు అనుమతించవద్దు. ఎందుకనగా ఇది చాలా చాలా పవిత్రమైన సమయం.
స్వస్థతా ఆరాధనలను గమనించండి.... జబ్బుల ప్రకంపనలు? మంచిది సరే, ఇప్పుడు మీలో కొంతమంది ఆ ప్రకంపనలు పంపిస్తున్నారు. ప్రతిఒక్కరూ నా చేతిని చూడాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు, కేవలం ఇంకొంచెం సమయం చూడండి. ఎంత తెల్లగాఇది ఉన్నదో? ఎంతమంది నా చేతి మీద ప్రకంపనలు చూసి మరియు చూసి మరియు అర్థం చేసుకుంటున్నారు, మీ చేతులను చూసుకోండి? కూడికలో ఉన్న ప్రజలందరూ? దాదాపుగా ఇక్కడ క్రొత్త గుంపు ఉంది. దానిని విశ్వసించడం కఠినము కాదా?…
73
స్నేహితులారా, అది ప్రకంపనల ద్వారా వచ్చును. మీరు దానిని నా చేతి మీద చూడవచ్చును. నా చేయి అచ్చమైన ఎరుపు రక్తవర్ణములోకి మారెను. మరియు వ్యాధిని బట్టి తెలుపు బొడిపెలు దానిపైన అటు ఇటు తిరుగును. ప్రజలు ఎట్టి వ్యాధిని వారు కలిగి ఉన్నారో నాకు చెప్పరు. ఆ ఆత్మ దిగి వెళ్లి ఏ విధమైన వ్యాధిని వారు కలిగియున్నారో వారికి చెప్పును. గతవారం నేను వైద్యులచే పరీక్షంపబడ్డాను. ఒక్కొక్కరూ ఆసుపత్రి నుండి కేసులను వారు బయటకు తెచ్చారు.
(టేపుపై ఖాళీ ఉంది.) ఇప్పుడు, అది సరియే. ఇప్పుడు, నేను.... నేను ఈ వ్యక్తి ఎవరో ఒక వ్యక్తినా వెనుక నిల్చొనెను. ఇప్పుడు కొద్ది క్షణాలు...? ఇప్పుడు వారు ఏమిటి అనేది నేను చూసాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూర్చొనవలెను. ఎవరూ చేయవద్దు.....నిశ్శబ్దంగా ఉండవలెను. ప్రతి ఒక్కరూ ఇప్పుడు కూర్చోండి. ఎవరూ అటూ ఇటూ తిరగవద్దు. ఎందుకనగా యేసుక్రీస్తు నామమున నేను మిమ్మును హెచ్చరిస్తున్నాను. జ్ఞాపకం ఉంచుకోవలెను. మీరు... ? ఆయన ముందు మీరు లోబడకపోతే నేను కాను ...దానికి, అది ఏమిటి అన్నది నేను కొనుగొనేంతవరకూ.
వ్యక్తిని ఇక్కడకు తీసుకురండి. అవును అమ్మా, నీకు గడ్డ వచ్చి అది క్యాన్సర్గా మారింది. అది సరియేనా? దాని కన్నా ఎక్కువగా నీకు మరొకటి ఉంది అది సరియా? ఏది నిజమో నేను నీకు చెప్పనా? క్యాన్సర్? మీ ఆడవారిలోనికి వచ్చెను. మరియు నీవు ఆడవారి సమస్యలను కలిగి ఉన్నావు. మరియు నీవు నీకు ఒక విధమైన ఆపరేషన్ చేయబడింది. మరియు అయినా ఇన్ఫెక్షన్ ఉండెను. మరియు నీకు కడుపు సమస్య అది...?...
ఇప్పుడు, ఇక్కడ చూడుము. ఇక్కడ ఉన్న వారిని అడుగుము. మీరు క్యాన్సర్ ను కలిగి ఉన్నారా? (టేపుపైఖాళీ ఉంది.) మీరు బాధ పడుతున్నారా? ఆ సూక్ష్మజీవి అదియే .....మరియు నేను చూసాను. నేను వివేచించుటకు...
ఇప్పుడు మీరు ఎవరైతే నా ప్రక్కన నిల్చున్నారో నా చేతిని చూడమని నేను మిమ్ములను కోరుతున్నాను. ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే, మీరు తిరిగి ఇక్కడ చూడగలరు. చూశారా ఇప్పుడు ప్రేక్షకులైన మీరు మీ తలను పైకి ఎత్తుము. నన్ను ఇక్కడ నడువనీయండి. నా చేతిని చూడాలని నేను మిమ్ములను కోరుతున్నాను. ఎంత తెల్లగా నా చేయి ఉన్నదో చూడండి. మీరు దానిని చూస్తున్నారా?చూడండి ఎంత .....? ఇప్పుడు నేను నా చేతిని తీసి అక్కడ పెట్టాను. ఇప్పుడు దీనిని గమనించండి, నేను నా చేతిని అక్కడి నుంచి తీసాను.....చేతిని అక్కడి నుంచి, ఇక్కడ మీరు గమనించారా? నేను నా స్వంతముగా దానిమీద పెట్టాను. చూసారా? ఎంత తెల్లగా ఉందో అది చూడండి. ఇప్పుడు, స్త్రీ ఆమె చేతిని పెట్టెను. అక్కడే అది ఉంది. ముదురు మరియు ఎరుపు. ఇప్పుడు నా చేయి అగ్ని మీద ఉంచినట్లుగా అనుభూతి కలుగుతుంది అది చూడండి.....
(సహోదారుడు బ్రాన్హాం ప్రార్థన కొనసాగిస్తూ మరియు మరియొక 75 సెకండ్లు ప్రజలతో మాట్లాడుతూఉండెను. ఆ పదములు అర్థం చేసుకోవడానికి కష్టముగా ఉండెను.)
74
ఇప్పుడు, అన్ని వైపులా ప్రేక్షకులు తమ తలలు వంచుకోవాలని నేను కోరుతున్నాను. మరియు నేను చేయబోవుచున్నాను....? నేను కోరుతున్నాను .......? నా చేతులను గమనించాలని నేను రోగిని కోరుతున్నాను. ఇప్పుడు నా చేతులను నీవు గమనించుము. మిగిలిన వారు మీ తలలు వంచండి. ఎందుకనగా క్యాన్సర్ను కలిగినది ఆమెయే. ఎందుకనగా అది వచ్చాక జ్ఞాపకం ఉంచుకోండి నీకు నీవుగా కనుగొంటివి. క్యాన్సర్తో చనిపోవుచున్నావు.....?
75
ఇప్పుడు...?.... ఇప్పుడు, అది ఏమిటి అన్నది ఇక్కడ ఉన్నది. స్త్రీ యొక్క క్యాన్సర్ చనిపోయినది. దానినుండి సూక్ష్మజీవి పారిపోయినది. దానినుండి జీవం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగిందో ఇప్పుడు ఇక్కడ మీలో చాలామంది, తీసుకునే వారుగా లేక ....? ఎంతమంది ఇక్కడ.....? కృప ....? అతను ప్రార్థనా అట్టను కలిగియుండెనా? ప్రార్థనా అట్టను కలిగియున్న ప్రజలైన మీరు ఇప్పుడు, చూడుము, ఇప్పుడు ఇది జ్ఞాపకముంచుకోండి. ఎక్కడో ఒకచోట డబ్భై-రెండు గంటలలో తీవ్ర అనారోగ్యానికి మీరు గురి కాబోతున్నారు. మరియు తీవ్రమైన వాంతులు అవ్వబోతాయి. ఇప్పుడు, ఇది జ్ఞాపకముంచుకోండి. చూశారా? ఎందుకనగా క్యాన్సర్ చనిపోయినందున (చూశారా?) ఎందుకనగా దాని నుండి జీవం వెళ్లి పోయినది. మరియు దానినుండి జీవం వెళ్లిపోయాక .... మీరు ఆనారోగ్యానికి గురి అవుతారు. స్నేహితులారా, మీరు దాని నుండి తప్పించుకోవచ్చు. ఒకవేళ మీరు దానిని సీసాలో వుంచితే...?...
76
ఓ నిత్య దేవా, నీ దాసుని యొక్క ఈ ప్రార్ధన వినుము. వారు.....?.... ఈ రాత్రి ఇక్కడ నిల్చుని మరియు అంతటా పరిచర్య చేస్తున్న....?.....
క్యాన్సర్ అని పిలువబడుతున్న దెయ్యమా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున, నిన్ను కలవడానికి నేను వచ్చాను. ఆమెను విడిచిపెట్టుము. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఓ, క్యాన్సర్ ఆత్మ యేసుక్రీస్తు నామమున ఆ స్త్రీనుండి బయటకు రా....?...
ఒకవేళ అది మీ చిత్తమయినట్లయితే నాకు...వాటిని తీసుకోను...... కానీ వాటిని రానీయవలెను. మరియు విశ్వాసము కలిగిన వారు, ఆ చెవిటి మరియు మూగ మరియు రానివ్వండి....? అప్పుడు తండ్రీ, మీరు ఉన్నారని నేను ఎరుగుతాను. అది మీ....?....మరియు ఇప్పుడు, ఒకవేళ వదానిని తెలుసుకొందురు......?.... ఏదీ లేకుండా. అప్పుడు తండ్రీ, మీరు ఉన్నారని నేను తెలుసుకుంటాను. కానీ ఎవరూ స్వస్థత పొందకుండా నేను ఈ ప్రజలను దాటి ఈ వరుస గుండా వెళ్ళుట నీ చిత్తమని నేను ఎరిగితే....?.... చెవిటి, మరియు మూగ లేక గుడ్డివారు, మరియు వరుసలో నిలుచుండగా, మరియు మీ శక్తి ఒక ప్రదర్శనగా ఉంచినట్లయితే, తండ్రీ, ఓ, తండ్రీ, మీ దాసుడిని మరియు ప్రజలను క్షమించుము.... ఇప్పుడు, మీ దాసుని ప్రార్థనకు జవాబు నిమ్ము...?
77
ఓ చెవిటి ఆత్మ, యేసుక్రీస్తు నామమున నేను నీ ముందుకు వచ్చాను. పురుషుడిలో నుండి బయటకు రా. వదిలి పొమ్మని నేను నిన్నుఅజ్ఞాపిస్తున్నాను.
(సహోదరుడు బ్రాన్హాం అతని వేళ్ళతో చిటికె వేసి మరియు చప్పట్లు కొట్టెను.) నా మాట వినబడుతుందా? ఆమెన్ చెప్పుము. (ఆ వ్యక్తి “ఆమెన్” అని సమాధానమిచ్చెను). దేవునికి స్తోత్రము “ఆమెన్” అనుము. “ఆమెన్” నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అనుము. (నేను దేవుడిని ప్రేమిస్తున్నాను) ప్రభువా, నేను నిన్ను సేవించెదను అనుము.
ఇప్పుడు, మీ పేరు ఏమిటి మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఇక్కడ ఫీనిక్స్ లోన.....?...