హెబ్రీయులకు రెండవ అధ్యాయము మూడవ భాగము

హెబ్రీయులకు రెండవ అధ్యాయము మూడవ భాగము

 7వ, 8వ, 9వ, 10వ అధ్యాయము, అక్కడ నుండి, ఓ, మై! మీ పెన్సిల్ ను మరియు కాగితమును, మరియు ప్రతీది, సిద్ధంగా ఉంచుకోండి, ఏలయనగా ప్రభువు మనకు గొప్ప సమయాన్ని ఇవ్వబోవుచున్నాడని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు మనము…

218 పౌలు, ప్రభువైన యేసును హెచ్చిస్తూ, మరియు తగిన స్థానములో ఉంచుచున్నాడు. ఇప్పుడు, ఈ రాత్రి మనము దీనిని ముగించుకుంటే, ఆదివారము ఉదయమున…మరి దీనిలో చాలా భాగం సరిగ్గా ఆదివారము ఉదయపు వర్తమానముతో కలుస్తుంది, ఎందుకనగా అది “విశ్రాంతి దినమును ప్రత్యేకపరుస్తుంది.” ఈనాడు విశ్రాంతి దినమును పాటించువారి మధ్య అది ఒక గొప్ప ప్రశ్నగా ఉన్నది. ఆరాధన కొరకు, ఏది సరైనది, శనివారమా లేక ఆదివారమా? దాని గురించి బైబిలు ఏమి చెప్పుచున్నది? అని తెలుసుకొనుటకు ఆదివారము ఉదయమున రమ్మని నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరియు కావున, ఆ…ఈ పుస్తకము ధర్మశాస్త్రమును మరియు కృపను వేరుచేస్తున్నది, మరియు అది వాటిని వాటి స్థానములో ఉంచుచున్నది. హెబ్రీయులు ధర్మశాస్త్రము ద్వారా పెంచబడ్డారు, మరియు ధర్మశాస్త్రముతో కృప ఎలా పనిచేసిందో, పౌలు వారికి చెప్తున్నాడు.

219 ఇప్పుడు, మనము ఒక చిన్న నేపథ్యమును తీసుకుందాము. మనము తిరిగి ప్రారంభించబోవుచున్నాము.

220 ఇంకొక విషయమేమిటంటే, నేను రీడింగ్ కళ్ళజోళ్ళు తీసుకున్నాను. బహుశా నేను…ఈ రాత్రి నేను ఏదైనా—ఏదైనా పొరపాటును చదువబోతే మాత్రం, నేను వాటిని కలిగియున్నాను. మీకు తెలుసా నేను…నేను యాభై ఏండ్లకు కేవలం రెండు సంవత్సరాలు తక్కువ వయస్సు గలవాడను, మరియు నేను మునుపటిలాగా, నాకు దగ్గరగా ఉన్నవాటిని చూడలేకపోవుచున్నాను. నా చూపు…పదాలు మసకబారుటను నేను గమనించడం ప్రారంభమైనప్పుడు, నేను గ్రుడ్డివాడనౌతున్నానని నేను అనుకున్నాను. నేను పరీక్ష కొరకు వెళ్ళాను. వైద్యుడు ఇట్లన్నాడు, “లేదు. కుమారుడా, నీకు కేవలం నలభై సంవత్సరాలు దాటాయంతే.” సరి, నేను వృద్ధాప్యం వరకు జీవించినట్లైతే, అది మరలా తిరిగి రావచ్చునని, ఆ దగ్గర చూపు తిరిగి మరలా రావచ్చునని, అతడన్నాడు. అతడు ఇట్లన్నాడు, “ఇప్పుడు, నీ బైబిలును నీ నుండి కొంచెం దూరంగా పెట్టుకుంటే నీవు చదువగలుగుతావా?”

221 నేను ఇట్లు చెప్పాను, “చదవగలను.”

222 ఇట్లన్నాడు, “కొంతకాలము తరువాత, నీ చేయి అంత పొడవు రాదు.”

223 కావున ఇప్పుడు నేను—నేను ఆశిస్తున్నాను, ఈ పఠనములో, నేను…ఈ చిన్న కాలిన్స్ బైబిల్ ఒక పెద్ద-అచ్చు ముద్రణను కలిగియున్నది. నేను దానిని చక్కగా చూడగలుగుచున్నాను. కానీ మనము పెద్ద, లోతైన విషయముల వద్దకు వచ్చినప్పుడు, అక్కడ మనము క్రొత్త నిబంధనను మరియు పాత నిబంధనను తీసుకొని ఒకదానితో ఒకటి కలపవలసియున్నది. అటువంటప్పుడు నేను ఒక చిన్న స్కోఫీల్డ్ ను కలిగియున్నాను. మరియు నేను స్కోఫీల్డ్ బైబిలుకు, దాని గుర్తులకు అలవాటుపడ్డాను. ఇప్పుడు స్కోఫీల్డ్ వివరణను నేను చదవను, ఎందుకనగా స్కోఫీల్డ్ యొక్క అనేక సిద్ధాంతాల విషయమై నేను అతనితో—అతనితో ఏకీభవించను. అయితే అది అమర్చబడిన విధానము నాకు—నాకు ఇష్టము, ఎందుకనగా అది…చాలా కాలంగా నేను దానిని కలిగియున్నాను, మరియు దానిని చదివియున్నాను, మరియు ఎంతగా అంటే, నా అంశమును ఎలా కనుగొనాలో నాకు తెలుసు.

224 బోధించుటకు, ఇదంతా నాకు క్రొత్తగా ఉన్నది, మరియు నేను అంతపెద్ద బోధకుడను కాదు. అయితే, మీరు కొద్దిసేపు నన్ను భరించండి, ఎలాగైనను, నాకు అది తెలిసినంతవరకు నేను మీకు సత్యమునే చెప్తాను.

225 ఇప్పుడు, ఈ గ్రంథము పౌలు, మీకు గుర్తున్నదా, అతడు…అతడెలా ఉండుటను మనము కనుగొన్నాము? ఆరంభము నుండి, అతడొక గొప్ప బోధకుడు, లేదా ఒక గొప్ప పండితుడైయున్నాడు. మరియు అతడు పాత నిబంధనలో తర్ఫీదు పొందాడు. అతనియొక్క బోధకుడు ఎవరని మనము కనుగొన్నామో ఎవరైనా నాకు ఇప్పుడు చెప్పగలరా? [సంఘము “గమలీయేలు,” అని చెప్పుచున్నది.—సంపా.] గమలీయేలు, ఆనాటి ప్రఖ్యాతిగాంచిన బోధకులలో ఒకడు.

226 మరియు పిదప పౌలు, మనము కనుగొన్నాము, ఒక దినమున…అతడు పౌలు అని పిలవబడకముందు, అతని పేరు ఏమిటో ఎవరైనా నాకు చెప్పగలరా? [సంఘము “సౌలు,” అని చెప్పుచున్నది.—సంపా.] సౌలు. మరియు అతడు యెరూషలేములో ఒక గొప్ప అధికారి, ఒక మతపరమైన అధికారియైయున్నాడు. మరియు అతడు ఒక—ఒక నిజమైన-శిక్షణ పొందిన, మతభక్తిగల వ్యక్తిగా ఎదిగాడు. అతడు నాలుగు లేదా ఐదు వేరువేరు భాషలు మాట్లాడగలడు, మరియు చాలా తెలివైన ఒక వ్యక్తియైయున్నాడు. మంచిది, అతనియొక్క విద్య మరియు తెలివి అతనికి సహాయపడ్డాయా? లేదు. క్రీస్తును నేర్చుకొనుటకు, తాను ఎరిగియున్నదంతా మరచిపోవలసివచ్చిందని అతడు చెప్పాడు.

227 కాబట్టి, అటువంటప్పుడు, దానికి ఒక తెలివైన వ్యక్తి లేదా ఒక చదువుకున్న వ్యక్తి అవసరములేదని మనము కనుగొన్నాము. ఎలాగైనను, దేవునియెదుట తన్నుతాను తగ్గించుకొనుటకు ఇష్టపడే ఒక—ఒక మనిషి దానికి అవసరమైయున్నాడు.

228 మీకు తెలుసా, డ్వైట్ మూడీ ఎంతగా విద్య లేనివాడంటే, వాస్తవంగా, అతని రచనలు ఎంత పేలవంగా ఉండేవో నేను చెప్పలేను. వారు ఎల్లప్పుడు, అతని వర్తమానాలను సరిచేయవలసియుండేది. అతడు—అతడు అంతగా వ్రాయలేనివాడు, అంతగా విద్యలేనివాడు.

229 బైబిలు గ్రంథములోని, పేతురు మరియు యోహాను, వారు తమ స్వంత పేరును కూడా వ్రాయలేనంతగా, విద్యలేనివారై, మరియు అది సరిగ్గా వారి యెదుటనే ఉంచబడినను దానిని ఎరుగకయుండేవారని మీకు తెలుసా? రాజ్యముయొక్క తాళపుచెవులను కలిగియున్న, అపొస్తలుడైన పేతురు, తనయెదుట సంతకము చేయబడియున్న తన పేరును కూడా గుర్తించేవాడు కాదు. దాని గురించి ఆలోచించండి. “అతడు అజ్ఞాని మరియు విద్యలేనివాడు,” అని, బైబిలు చెప్పినది. కాబట్టి, అది నాకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆమేన్. అవును, అయ్యా. దేవుడు ఒక మనిషికి దానిని చేయగలడని, దాని ద్వారా తెలుస్తుంది.

230 ఇప్పుడు, మనము దీనిని కనుగొన్నాము, పౌలు ఒక గొప్ప అనుభవమును పొందుకున్న వెంటనే…నేను మిమ్మల్ని అడుగగోరుచున్నాను. క్రీస్తు నొద్దకు రావడానికి ఒక అనుభవము అవసరమా? ప్రతి ఒక్కరూ ఒక అనుభవమును పొందుకుంటారా? అవును, అయ్యా. అవును, అయ్యా. అది ఒక జన్మయైయున్నది. అది ఒక అనుభవమైయున్నది. మరియు కావున ఈ మధ్యనే, మేము ఒక లూథరన్ కళాశాలలో ఉన్నాము…

231 నేను ఈ మధ్యాహ్నము, టామ్ హెయిర్ తో కలిసి—కలిసి భోజనము చేసే భాగ్యమును కలిగియున్నాను, ఆలస్యం అయ్యింది, పన్నెండు గంటలకు నేనక్కడ ఉండవలసియున్నది. ఐరిష్ వాడైనట్టి, ప్రఖ్యాతిగాంచిన, ప్రార్థనా యోధుడు, అతని గురించి ఎంతమంది విన్నారు? మరియు అతడు ఈ సహోదరుడు ఎప్ తో, అతని కార్యక్రమములో ఉన్నాడు, మరియు ఇక్కడ అమెరికాలో అనేక చోట్లకు వచ్చాడు. మరియు ఈ రోజు నేను అతనితో కలిసి భోజనము చేశాను. మరియు మేము…నేను మూడు గంటలు ఆలస్యముగా వెళ్ళాను. మేము భోజనము చేస్తున్నప్పుడు, దాదాపు మూడు-న్నర, పావు తక్కువ నాలుగు అగుచున్నది. అయితే అంతా బాగానే జరిగినది. మరియు ఈ విషయాల గురించి, యేసుక్రీస్తు ఏ విధంగా సమస్తమునకు శిరస్సైయున్నాడు అనేదాని గురించి మేము చర్చించుకుంటున్నాము.

232 ఇప్పుడు, పౌలు దీనిని కనుగొన్నప్పుడు, అతడు ఈ అనుభవమును పొందుకున్నాడు. మరియు పిదప అతడు ఈ అనుభవమును అంగీకరించుటకు ముందు, అది తప్పక తిరిగి బైబిలుతో సరిపోవలసియున్నది. మరియు అతడు—అతడు బయలుదేరి వేరొక దేశమునకు వెళ్ళాడని మనము కనుగొన్నాము, మరియు అతని అనుభవము సరియైనదా కాదా అని చూచుటకు, లేఖనమును పరిశోధించుచు, అతడు మూడు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు.

233 ఇప్పుడు, అతడు ఎదుర్కొనవలసిన ఒక గొప్ప కార్యమున్నదని మనము గ్రహిస్తున్నాము. అతడు తిరిగి వచ్చి మరియు అతని సంఘమునకు, ప్రజలందరికినీ, అతడు దేనినైతే హింసించాడో అదే సత్యము అని చెప్పవలసియున్నాడు.

234 మీరు అటువంటిదేదైనా చేయవలసివచ్చిందా? నిశ్చయంగా, దాదాపు అందరూ చేయవలసివచ్చింది, తిరిగి వెళ్ళి మరియు ఇట్లు చెప్పవలసివచ్చింది, “మనము ‘పరిశుద్ధ గుండ్రాళ్ళు’ అని పిలిచిన ఆ ప్రజలు, మరి వారు చెప్పేదే సత్యమని, కనుగొన్నాము.” చూశారా? అంతే. మనము కేవలం వెనుకకు తిరగవలసియున్నాము. మరియు ఒకప్పుడు మనము ద్వేషించిన వాటిని, ఇప్పుడు మనము ప్రేమిస్తున్నాము. అది ఒక మార్పుయైయున్నది, ఒక వింతైన విషయమైయున్నది, వింతైనది.

235 ఇప్పుడు, “పరిశుద్ధ-గుండ్రాయి” గురించి నేను ఆ విషయమును చెప్పాను. అటువంటిదేదియు లేనే లేదు. అసలు అటువంటిదేదియు లేదు. అయితే, ప్రజలను, హోలీనెస్ ప్రజలను, వారు అలా పిలుస్తారు. అయితే పరిశుద్ధ-గుండ్రాళ్ళు అనువారు ఎవ్వరూ లేరు. అటువంటిదేదియు లేదు. నేను చూడగలిగినంతవరకు, తొమ్మిది వందల అరవై-ఎన్నో భిన్నమైన సంఘశాఖలలో, ఏ సంఘమైనా ఆ విధంగా నమోదు చేయబడినట్లు ఏ దాఖలాలు లేవు. పరిశుద్ధ-గుండ్రాయి అన్నటువంటి ఏ సంఘశాఖ లేదు. అది కేవలం సంఘమునకు దయ్యము అతికించిన ఒక—ఒక పేరు మాత్రమే.

236 అయితే ఆ దినములలో, వారు వారిని పిలిచినది…పౌలు దినములో వారు వారిని ఏమని పిలిచారో ఎంతమందికి తెలుసు? మతభ్రష్టులు. మతభ్రష్టుడు అంటే ఏమిటో మీకు తెలుసా? “వెఱ్ఱివాడు.” వెఱ్ఱి ప్రజలు. కావున, ఒక “వెఱ్ఱివాడు,” అనుదాని వలెనే త్వరలో ఒక “పరిశుద్ధ-గుండ్రాయి” అని నేను పిలువబడతాను. మీరు పిలువబడరా? కావున వారు—వారు అలా పిలువబడి, మరియు సంతోషించినట్లైతే!

మరియు దాని విషయమై యేసు మనకు ఏమి చేయమని చెప్పాడు? ఆయన ఇట్లన్నాడు, “సంతోషించి, మరియు మిక్కిలి ఆనందించుడి; ఏలయనగా పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” వారు దానిని చేశారు.

237 “మిక్కిలి ఆనందించుడి,” అని చెప్పాడు. ఏదైనా మిక్కిలిగా అంటే “ఎంతో అధికమైనది” అని అర్థం, చాలా ఎక్కువ సంతోషం. మరియు శిష్యులు, యేసు నామము నిమిత్తము నిందను భరించుటకు యోగ్యులుగా కనుగొనబడినప్పుడు, వారు ఆయన నామము కొరకు నిందను భరించగలిగినందుకు వారు మిక్కిలిగా సంతోషించారు.

238 మరియు ఈనాడు, అనేకమంది ప్రజలు ఈనాడు, తమని ఒక పరిశుద్ధ-గుండ్రాయి అని పిలిస్తే, వారు భయపడి-పోతారు, “మై! బహుశా ఆరంభమునుండే నేను తప్పైయుండవచ్చును.”

కానీ వారైతే దాని విషయమై సంతోషించారు, “ఓ, మై, ఆ నామమును భరించుటకు!”

239 మరియు ఇప్పుడు, రెండవ శతాబ్దములో, వారు వారిని సిలువ వీపులు అని పిలిచారు. మరి ఆ సమయములోనే క్రైస్తవులు, తాము క్రీస్తుతోపాటు సిలువ వేయబడియున్నారని చూపించుటకు తమ వీపుపై సిలువను మోసుకొని వెళ్తుండేవారు. వారు వారిని సిలువ వీపులు అని పిలిచారు. ఇప్పుడు క్యాథలిక్కులు తమను తాము అలా పిలుచుకుంటారని నాకు తెలుసు, కానీ అది క్యాథలిక్కు సంఘము కాదు. అది ప్రొటెస్టెంటు సంఘమైయున్నది అది ప్రొటెస్టెంటు సంఘమని దానికి పేరు పెట్టబడకముందైయున్నది. అది పాపమునే వ్యతిరేకించినది. ఈనాడు అది ప్రొటెస్టెంటు సంఘమని పిలువబడుటకు కారణమేదనగా, అది ఆ—ఆ క్యాథలిక్కు సిద్ధాంతమును వ్యతిరేకించినది. అయితే అది ఒక…వారు సిలువ వీపు అని పిలువబడుచున్న ఆ సమయములో, అది, అప్పటికింకా, మత-శాఖగా మారలేదు.

240 జోసఫస్ మరియు ఇతర రచయితల చరిత్రను, మరియు హిస్లోపుయొక్క రెండు బబులోనులు, మరియు మొదలగువాటిని తీసుకోండి, మరియు అది నిజమనియు, వారు ఎటువంటి సంఘముగా లేరనియు మీరు కనుగొంటారు. మొట్టమొదటిగా, సంస్థాగతమైన సంఘము, క్యాథలిక్కు సంఘమే, ఆ—ఆ చివరి అపొస్తలులు వెళ్ళిపోయిన తరువాత, మూడు వందల సంవత్సరాలకు జరిగినది. దాదాపు మూడు వందల సంవత్సరాల తరువాత, క్యాథలిక్కు సంఘము సంస్థాగతం చేయబడినది. మరియు ఒక హింస చెలరేగి, ప్రజలను బలవంతంగా క్యాథలిక్కు సంఘములోనికి నెట్టివేసింది, మరియు వారు సంఘమును మరియు రాజ్యమును, ఐక్యము చేశారు.

241 అది, అన్యత్వమునుండి క్యాథలిక్కులోనికి కాన్స్టాంటైనుయొక్క మార్పు, అని-చెప్పబడే, ఆ విషయము జరిగిన తరువాతైయున్నది. అయితే, ఎవరైనా ఎన్నడైనా అతని చరిత్రను చదివియుంటే, అతడు చేసిన కార్యములను బట్టి, అతడు మారుమనస్సు పొందలేదని తెలుస్తుంది. ఓ, మై! మతభక్తికి సంబంధించి అతడు చేసిన ఒకే ఒక్కటి ఏదనగా సెయింట్ సోఫియా సంఘము మీద సిలువను పెట్టడమే. అతడు చేసిన ఏకైక పని అదియే, ఎంతో మతభక్తి కలిగియున్నట్లు నటించాడు. అతడు ఒక—ఒక భ్రష్టుడు. కానీ వారు దానిని అతని—అతనియొక్క మార్పు అని అంటారు. ఈనాడు మతమార్పిడి అని-చెప్పబడే కొన్నిటితో అది సరిగ్గా సరిపోతుంది.

242 అయితే, ఇప్పుడు, పౌలు మార్పునొంది, మరియు ఈ నిజమైన అనుభవమును పొందుకున్నప్పుడు మాత్రం, అతడు పరిపూర్ణముగా త్రిప్పివేయబడ్డాడని మనము కనుగొన్నాము.

మరియు, మీకు తెలుసా, మార్పునొందుట అంటే “త్రిప్పివేయబడుట.” మీరు ఇటువైపుగా వెళ్ళుచున్నారు, మరియు మీరు వెనుకకు తిరిగి ఇటువైపుకు వెళ్ళడం ప్రారంభిస్తారు. అవును, అయ్యా. అది వెనుకకు-తిరుగుటయైయున్నది, పూర్తిగా వెనుకకు-తిరుగుటయైయున్నది.

243 మరియు పౌలు, అతడు మార్పునొందిన వెంటనే, అతడు ఎన్నడైనా తన అనుభవమును…ఇప్పుడు, అతడు ఒక అద్భుతమైన అనుభవమును పొందుకున్నాడు.

ఇప్పుడు, మీరు క్రీస్తును, మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినప్పుడే, అది ఒక అనుభవమైయున్నదని, నేను నమ్ముతాను. మీ పాపము క్షమించబడినదని తెలుసుకొనుటలోని ఆనందము, మీ హృదయమును, ఎంతగానో పులకింపజేస్తుందని, నేను నమ్ముతాను.

244 కానీ పిదప ధన్యకరమైన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, అది మీరెన్నడూ మర్చిపోలేని, ఒక అనుభవమైయున్నది, ఆ నూతన జన్మయైయున్నది. మీరొక దేవుని బిడ్డ అవుతారు. మరియు దానిని చేసేది ఏమిటంటే…

“సహోదరుడా బ్రెన్హామ్, అది నీకెలా తెలుస్తుంది?”

245 ఇప్పుడు, ఇవి బోధనా పాఠములైయున్నవి. అనేకమంది ప్రజలు, ఆ మెథడిస్టులు, “వారు దానిని పొందుకున్నప్పుడు వారు కేకలు వేసారు,” అని చెప్పుటకు ప్రయత్నిస్తారు. సరి, అది మంచిదే. మీరు దానిని పొందుకొని, మరియు కేకలు వేసినట్లైతే, మంచిదే. మీరు కేకలు వేసారు గనుక, మీరు దానిని కలిగియున్నారనుటకు గురుతు కాదు, ఎందుకనగా ఎంతోమంది కేకలు వేసారు కానీ దానిని కలిగిలేరు.

246 “వారు భాషలలో మాట్లాడారు. వారు దానిని పొందుకున్నారు,” అని పెంతెకొస్తులు అన్నారు. అది మంచిదే. మీరు భాషలలో మాట్లాడి, దానిని పొందినట్లైతే, మంచిదే. కానీ మీరు భాషలలో మాట్లాడి కూడా ఇంకనూ దానిని కలిగిలేకుండా ఉండవచ్చును. అప్పుడేమిటి?

247 కాబట్టి, మీరు చూడండి, తుదకు, అది మరణమును దాటి జీవములోనికి ప్రవేశించే అనుభవమైయున్నది; పాతవన్నియు చచ్చిపోయి, మరియు సమస్తము క్రొత్తగా మారినప్పుడు. క్రీస్తు వాస్తవమౌతాడు. పాత సంగతులు, శరీరసంబంధమైన పాత వేర్లు రాలిపోతాయి. ఒక వేరును ఎలా బయటకు త్రవ్వాలో మీకు తెలుసా? మేము ఒక పారను తీసుకొని మరియు దాని వద్దకు దిగి, మరియు దానిలో ఒక్క అణువు కూడా మిగలకుండునట్లు దానిని త్రవ్వేవారము. మరియు వారిట్లన్నారు, “చేదైన వేరు ఏదైనా మీలో మొలకెత్తినట్లైతే, దానిని పెల్లగించుము.” అది నిజము. మరియు పరిశుద్ధాత్మ చేసేది అదేయైయున్నది, వేర్లన్నిటిని పెల్లగిస్తుంది. వాటిని త్రవ్వుతుంది. వాటిని కట్టకట్టి; వాటిని కాల్చివేస్తుంది. వాటిని వదిలించుకోండి. మనము దానిని చేసినట్లైతే, అప్పుడు మనము మంచి పంటను పొందుతాము.

248 ఇప్పుడు, ఏదో జరిగిందని పౌలు గ్రహించాడు, కాబట్టి అతడు తిరిగి అరేబియాకు వెళ్ళి, మరియు అక్కడ అతడు పాత నిబంధన ప్రవక్తలందరి గురించి, వారెలా ప్రవచించారు అన్నదాని గురించి మూడు సంవత్సరాలు అధ్యయనం చేసాడు. మరియు అది సంపూర్ణముగా సత్యమైయున్నదని అతడు కనుగొన్నాడు.

249 ఇప్పుడు, చూడండి, ఈ దినముతో, ఈ చిన్న సంఘము వద్ద మనము కలిగియున్న ఈ అనుభవముతో దానిని పోల్చండి: అది ఆవలిన ఉదయనక్షత్రము ప్రత్యక్షమై, క్రిందకు దిగివచ్చి, జరుగబోవువాటిని ముందుగా చెప్పుచూ మరియు వాటిని చూపించే ఆ గొప్ప వెలుగును గూర్చియైయున్నది. మీకు తెలుసా, అది ఎంతో అద్భుతమైనది. అయితే పరిచర్య చేస్తున్న నా సహోదరుడు అది దయ్యపు సంబంధమైనదని నాతో చెప్పాడు. మరియు నేను—నేను దానిని అర్థం చేసుకోలేకపోయాను.

250 కావున ఒక రాత్రి, ఆవలిన ఇండియానాలోని గ్రీన్స్ మిల్ వద్ద ఒక అనుభవము జరిగేవరకు, నేను దాని గురించి, ఏమియు మాట్లాడలేదు, అప్పుడు ప్రభువుయొక్క దూత నడుచుకుంటూ వచ్చి మరియు అక్కడ నిలబడి, మరియు లేఖనము ద్వారా దానిని నిరూపించాడు. అప్పుడు అది మంటను రగిలించినది. అప్పుడు అది వెళ్ళడం ప్రారంభించినది.

251 మరియు పోయిన ఆదివారమే, తన సమతుల్యత నాడి పనిచేయకయుండగా, మరి…మేయోవారు మరియు అత్యుత్తమమైన వైద్యులు, “ఇక ఇది ముగిసిపోయినది” అని చెప్పియుండగా, ఆ నడవనటువంటి ఒక మనిషిని తీసుకున్న, యేసుక్రీస్తు యొక్క విఫలమవ్వలేని గురుతులను, మనము చూశాము. మరియు గ్రుడ్డివానిగా కూర్చొనియున్నాడు; పైకి లేచి మరియు మెట్ల మీదనుండి తన చక్రాల కుర్చీని క్రిందకు నెడుతూ, భవనంనుండి బయటకు నడిచివెళ్ళాడు, మిగతావారి వలెనే నడుస్తూ మరియు చూడగలిగాడు. అది పునరుత్థానుడైన ప్రభువైన యేసుయొక్క శక్తియని అది చూపిస్తుంది. విషయం అదేయైయున్నది. ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు.

252 కాబట్టి మనము కలిగియున్న ఈ గొప్ప అనుభవము, తనయొక్క బైబిలు గ్రంథముతో మరియు వాగ్దానములతో సరిపోల్చబడినదని, దేవుడు నిర్థారించాడని తెలుసుకొనుటకు ఈ రాత్రి మనము సంతోషిస్తున్న ఒక గుంపుగా లేమా? కావున మనము మిక్కిలి ఆనందముగా ఉండవలసియున్నాము. మరియు పిదప మనము గ్రహిస్తాము, అదేమిటనగా 2వ అధ్యాయములో, మనము దీనిని కనుగొంటాము, “మనము ఈ సంగతులను…మనము ఈ సంగతులను నిర్లక్ష్యం చేయకూడదు.” మనము వాటిని గట్టిగా పట్టుకోవాలి.

మరియు అటువంటి గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినయెడల, మనము ఏలాగు తప్పించుకొందుము;…

253 మనము న్యాయతీర్పు నొద్ద నిలబడిప్పుడు, దేవునియొక్క వాక్యపు వెలుగులో, మనము ఏమి చేస్తాము? “నాకు ఇంతకంటే వేరే ఏదియు ఎన్నడూ తెలియలేదు,” అని మీరు చెప్పలేరు. ఓ, అవును, మీకు తెలుసు. “మంచిది, ఇప్పుడు, సహోదరుడు బ్రెన్హామ్ చెప్పినది తప్పైయుండవచ్చును.” అది నిజము. కానీ దేవుడు చెప్పినది తప్పు కాదు. ఆయన వాక్యము తప్పు కాదు. మరియు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి, అదే విషయము, ఒకప్పుడు, అపొస్తలులలో జీవించిన బైబిలు, మరలా జీవిస్తున్నది. ఓ, ప్రభువు నామము స్తుతింపబడును గాక!

254 నేను నలభై-ఎనిమిదేండ్లు గలవాడనై, యాభై సంవత్సరాలకు దగ్గరపడుచున్నానని, మరియు నా యవ్వన దినములు గతించిపోయినవని, మరియు మొదలగువాటి గురించి నేను ఆలోచించినప్పుడు; నేను ఒక చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటినుండి ఈ ధన్యకరమైన వాగ్దానమును కలిగియున్నానని, మరియు దానిని నా సహోదరులు మరియు సహోదరీలకు ప్రకటించానని ఎరిగియుండుటకు; మరియు అక్షరాలా వేలకొలదిగా చీకటినుండి బయటకు వచ్చినవారిని చూచుటకు, ఆశీర్వదించబడినవారి యొద్దకు, మన నిత్యమైన గృహమునకు మనము వెళ్ళుచున్నామని తెలుసుకొనుటకు అద్భుతముగానున్నది. “మరియు ఈ భూసంబంధమైన గుడారము శిధిలమైపోయినను,” నేను బోధించడం ముగించకముందే, “ఆవలిన మన కొరకు ఒకటి వేచియున్నది.” హల్లెలూయా! ఇక్కడ డజన్లకొలది ప్రజలు కూర్చొనియున్నారని, వారు, సరిగ్గా ఇప్పుడే ఈ జీవితమును విడిచిపెట్టాల్సివచ్చినా గాని, మనము వారి శరీరమును అంత్యక్రియలు చేసేవాడి దగ్గరకు తీసుకెళ్ళకముందే, వారు ఆవలిన ఆ మహిమకరమైన శరీరములో ఉంటారని, దేవుని పరిశుద్ధులతో కలిసి ఆనందిస్తూ, శాశ్వతముగా జీవించుటకు, అప్పటికే దేవుని సన్నిధిలో ఉంటారని తెలుసుకొనుటకు అద్భుతముగానున్నది. అది ఆలాగున్నదని పరిపూర్ణమైన, సంపూర్ణమైన నిర్థారణతో ఉన్నాము! ఆమేన్.

255 ఓ, అది ప్రెస్బిటేరియన్ను కూడా కేకలు వేసేటట్లు చేస్తుంది! ఆదివారము అట్లు చేసినది, అవునా? ఆ ప్రజలు ప్రెస్బిటేరియన్లైయున్నారు. నిశ్చయముగా అట్లు చేస్తుంది, ఆలోచిస్తేనే. ఓ, ప్రజలు భావోద్వేగానికి లోనవడంలో ఆశ్చర్యమేమి లేదు! అంతెందుకు, ఒక బంతిని బ్యాటుతో కొట్టడం వలనో లేదా ఒక బంతిని ఒక బుట్టలో వేయడంవలనో మీరు భావోద్వేగానికి గురైతే, మీరు మరణములోనుండి జీవములోనికి దాటియున్నారని, క్రీస్తులో మీరొక నూతన సృష్టియైయున్నారని తెలుసుకొనుటకు, అది మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా భావోద్వేగానికి గురి చేస్తుంది కదా! దుష్టత్వము, మోసము, శతృత్వము, మరియు లోకసంబంధమైన వాటన్నిటినుండి, మీ ఆత్మ మిమ్మల్ని దూరముగా నడిపించుటనుబట్టి, మీకు అది తెలుస్తుంది. మరియు మీ హృదయము క్రీస్తుపై కేంద్రీకృతమై యుంటుంది. అదే మీ ఉద్దేశ్యమైయుంటుంది. పగలంతయు మరియు రాత్రంతయు, మీ మనస్సులో, మీ హృదయములో, మీరు దాని గురించే ఆలోచిస్తారు. మీరు రాత్రి పడుకునేటప్పుడు, మీ చేతులను ఈ విధంగా వెనుకకు పెట్టుకొని, మరియు కేవలం అక్కడ పడుకొనియుండి మరియు మీరు నిద్రపోయేవరకు ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఉదయమున, మేల్కొని, ఇంకనూ ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఆమేన్. ఓ, మై!

256 నేను ఆయనను స్తుతించుటకు ప్రయత్నించాను. ఒక ఉదయమున, మేము, సహోదరుడు ఉడ్ మరియు నేను, నాలుగు గంటలకు మేల్కొన్నాము, ఉడుతల వేటకు వెళ్ళడానికి, తెల్లవారుజామున బయటకు వెళ్తున్నాము. నేను చేరుకున్న, ప్రతీ చెట్టు క్రింద నేను ఆయనను స్తుతించానని, నేను నమ్ముచున్నాను. నేను ఆయనను స్తుతించకుండా, ఒక చెట్టును కూడా చూడలేను. ఆలోచించండి, ఆయనే ఆ చెట్టును పెంచాడు. ఒక చిన్న మిడత పైకి ఎగరడం చూడండి; ఆ మిడతను ఆయన ఎరిగియున్నాడు. “ఓ,” మీరిట్లంటారు, “సహోదరుడా బిల్, అది బుద్ధిహీనత.” ఓ, లేదండి, అది కాదు. ప్రతీ ఉడుత ఎక్కడున్నదో ఆయనకు తెలుసు. ప్రతీ సీతాకోకచిలుక ఎక్కడున్నదో ఆయనకు తెలుసు.

257 అంతెందుకు, ఒక సమయములో, ఆయనకు కొంత డబ్బు అవసరమైనది, మరియు ఆయన ఇట్లన్నాడు, “పేతురు, కొద్దిసేపటి క్రితం, ఒక చేప, ఒక నాణెమును మ్రింగినది, సరిగ్గా మన అవసరానికి సరిపోతుంది. వెళ్ళి కొక్కెమును లోపలికి వేయుము. నేను దానిని అక్కడకు పంపిస్తాను. ఆ నాణెమును దాని నోటిలోనుండి తీసుకొనుము, ఎందుకనగా అది స్వయంగా దానికొరకు, దానిని ఉపయోగించుకోలేదు. వెళ్ళి అతనికి మన దశమభాగమును మరియు కప్పమును చెల్లించుము.” ఆమేన్.

258 మరియు కొన్ని వారాల క్రితం, ఒక చిన్న చేప చంపబడి, నీళ్ళ మీద పడియుండుటను నేను చూశాను. మీరందరూ దానిని గూర్చిన కథను విన్నారు. దాని గురించి సాక్ష్యమిచ్చుటకు సహోదరుడు ఉడ్, మరియు అతని సహోదరుడు మరియు వారు ఇక్కడున్నారు. ఆ చిన్న చేప ఒక అరగంట పాటు, నీళ్ళ మీద, చనిపోయి పడియున్నది, దాని నోటిలోనుండి దాని ఆంతర్యములు బయటకు లాగబడియున్నవి. మరియు ఆ ముందురోజు, “ఒక చిన్న జంతువుయొక్క పునరుత్థానమును నీవు చూడబోవుచున్నావు,” అని ఆయన చెప్పిన పిదప, గొప్ప పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. మరియు మరుసటి రోజు ఉదయమున, సూర్యోదయం తరువాత కొద్దిసేపటికి, అంత పొడవు కూడా లేని ఆ చిన్న చేపను మేము చూశాము. ప్రభువుయొక్క ఆత్మ దిగివచ్చినప్పుడు, మరియు ఇట్లు చెప్పాను, “చిన్న చేపా, యేసుక్రీస్తు నిన్ను బాగుచేస్తాడు.” మరియు వాస్తవంగా ఒక అర్థగంటపాటు నీళ్ళ మీద తేలుతున్నట్టి, ఆ చనిపోయిన చేప, జీవము పొందుకొని మరియు అది ఈదగలిగినంత వేగంగా ఈదుకుంటూ వెళ్ళిపోయినది. ఓ, ప్రభువు నామము స్తుతింపబడును గాక. ఆయన ఎంత అద్భుతమైనవాడు కదా!

259 “ఆయన మెల్కీసెదెకు క్రమములో యున్నాడని,” పౌలు చెప్పుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఆయన మెల్కీసెదెకు యైయున్నాడు. “మెల్కీసెదెకు జీవితకాలమునకు ఆరంభమును కలిగిలేడు. ఆయన సంవత్సరములకు అంతమును కలిగిలేడు. ఆయన జీవితానికి ఆదియైనను లేదా జీవమునకు అంతమైనను కలిగిలేడు. ఆయనకు తండ్రియైనను తల్లియైనను లేరు.” కాబట్టి, ఆయన ఇంకెవరోయైయుండడు. ఆయన ఎవరైయున్నాడో, ఆయన ఈ రాత్రి ఇంకనూ సజీవుడైయున్నాడు. కావున, ఒకే ఒక్క విధమైన నిత్యజీవము ఉన్నది, మరియు అది దేవునికి చెందియున్నది.

260 గడిచిన సాయంత్రము మనము చర్చించుచుండగా దేవునియొక్క త్రిత్వము గురించి, మరి దాని గురించి మనము మాట్లాడే విధానాన్ని, ఒక సహోదరుడు గ్రహించలేకపోయాడు. యేసు దాదాపు ముప్పై ఏండ్ల వయస్సుగల ఒక మనిషిగా, అక్కడ ఎలా నిలబడ్డాడు కదా. మరియు ఆయన ఇట్లన్నాడు…

వారు ఇట్లన్నారు, “ఓ, మా పితరులు అరణ్యములో మన్నాను భుజించారు.”

261 “మరి అయిననూ వారు, ప్రతీ ఒక్కరూ, మరణించారు,” అని ఆయన అన్నాడు. అయితే ఆయన ఇంకా ఇట్లన్నాడు, “ఒక మనుష్యుడు దీనిని తిని మరియు చావకుండునట్లు, పరలోకముయొక్క దేవునినుండి దిగివచ్చిన జీవాహారమును నేనే.”

262 “ఓ,” వారు ఇట్లన్నారు, “మా పితరులు అరణ్యములో బండనుండి త్రాగియున్నారు.”

263 ఆయన ఇట్లన్నాడు, “నేనే ఆ బండను.” ముప్పై సంవత్సరాల వయస్సుగల ఒక మనిషి. ఇట్లన్నాడు, “అబ్రాహాము నా దినమును చూచి సంతోషించాడు.”

264 “ఏంటి,” ఇట్లన్నారు, “ఇప్పుడు నీవు అబ్రాహామంత వయస్సుగలవాడవని నాకు చెప్తున్నావా, మరియు నీకు కనీసం యాభై ఏండ్లు అయినా లేవు, మరి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చనిపోయిన అబ్రాహామును నీవు చూశావని చెప్తున్నావా? ఇప్పుడు నీవు దయ్యము పట్టినవాడవని మేము ఎరుగుదుము. నీవు పిచ్చివాడవు.” అదియే…దయ్యము అంటే అర్థం అదియే, “పిచ్చివాడు.” “నీవు ఒక దయ్యము పట్టినవాడవు, మరియు నీవు పిచ్చివాడవు,” అని అన్నారు.

265 ఆయన ఇట్లు చెప్పాడు, “అబ్రాహాము పుట్టకమునుపే, నేను ఉన్నవాడను.”

266 ఆయన అదేయైయున్నాడు. ఆయన కేవలం ఒక మానవ మాత్రుడు కాడు, లేదా ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాడు. ఆయన దేవుడైయున్నాడు, “యేసు” అని పిలువబడే శరీరములో దేవుడు భూమి మీద నివసించుచున్నాడు, ఆ—ఆ శరీరధారియైన దేవుని కుమారుడు. ఖచ్చితముగా ఆయన అదేయైయున్నాడు.

267 ఇప్పుడు, 2వ అధ్యాయముయొక్క ముగింపులో, ఇప్పుడు, చివరి భాగములో మనము ఆయనను ఇక్కడ కనుగొంటాము, మరి 16వ వచనము, లేదా 15వ వచనము వద్ద మొదలుపెట్టి, నేను అక్కడికి రావాలనుకుంటున్నాను.

జీవిత కాలమంతయు మరణ—మరణ భయముచేత దాస్యమునకు లోబడినవారిని…విడిపించెను.

యేసు దానినే చేశాడని అతడు చెప్పాడు, జీవిత కాలమంతయు మరణ భయముతోనున్నవారిని, దాస్యత్వమునుండి విడిపించుటకు ఆయన వచ్చాడని చెప్పాడు.

268 ఇప్పుడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు, వాస్తవానికి, మనము భయపడతాము; మనము, మరణమని పిలిచేదానిని, మనలో ఎవ్వరమూ, పొందగోరము. అయితే ఒక వ్యక్తి తిరిగి జన్మించినట్లైతే, అతడు మరణించలేడని మీకు తెలుసా? అతడు నిత్యజీవమును కలిగియుండి మరియు పిదప ఎలా మరణించగలడు? అతడు అట్లు చేయలేడు. మరణమనగా ఒకే ఒక్కటి, మరణము అను పదమునకు, అర్థము “ఎడబాటు.” ఇప్పుడు అతడు మన కన్నుల యెదుటనుండి వేరైపోతాడు. అయితే అతడు ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, మరియు ఎల్లప్పుడు ఉంటాడు. కాబట్టి, మరణము ఒక కఠినమైన విషయము కాదు. మరణము ఒక మహిమకరమైన విషయమైయున్నది. మరణము మనల్ని దేవునియొక్క సన్నిధిలోనికి తీసుకెళ్తుంది.

269 అయితే ఇప్పుడు, వాస్తవానికి, మనము, మానవులమైయ్యుండి, ఇక్కడ ఈ చీకటి విషయాలలో నడుస్తాము, మనము—మనము దానిని గ్రహించవలసిన విధంగా మనము దానిని అర్థం చేసుకోము. మరియు, వాస్తవానికి, ఉక్కిరిబిక్కిరి చేసే ఆ మరణపు వేదనలు వచ్చినప్పుడు, అది మనలోని అత్యంత-పరిశుద్ధులను సైతం భయపడి వెనుకకు జరిగేలా చేస్తుంది. అది, దేవుని కుమారుడిని “ఈ గిన్నె నా నుండి తొలగించుట సాధ్యమా?” అని అనేటట్లు చేసినది. అదొక భయంకరమైన విషయమైయున్నది. దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకనగా మనము…అది, అనగా మరణము పాపమునకు శిక్షయైయున్నది, మరియు అది భయంకరమైనదిగా ఉండవలసియున్నది.

అయితే మనము కేవలం తెరను దాటి చూడగలిగితే చాలు, ఆ ఆవలిన, విషయం అక్కడే ఉన్నది. ప్రభువు స్తుతించబడును గాక! సరిగ్గా ఆ తెరకు ఆవలిన, అక్కడ చూడాలనే ఈ రాత్రి మానవుడు కోరుచున్నాడు. చిన్న అన్నా మే స్నెల్లింగ్ మరియు వారు ఇక్కడ ఒక పాటను పాడేవారు, “ప్రభువా, కాలమనే తెరను దాటి నన్ను చూడనిమ్ము.” ప్రతి ఒక్కరూ దానిని చూడాలని కోరుచున్నారు.

270 ఇప్పుడు, మనము ఇక్కడ, 16వ వచనములో ఉన్నాము. “నిశ్చయముగా ఆయన తీసుకున్నాడు…”

ఏలయనగా, ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక; అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.

271 ఓ, ఇప్పుడు మరలా మనము దానిని పట్టుకొనగోరుచున్నాము. ఇప్పుడు మనము నేరుగా క్రిందికి వచ్చుచున్నాము…ఎందుకనగా, ఈ 3వ అధ్యాయములో మొదటి భాగము, దాని చివరి భాగము, ఈ రాబోవు ఆదివారము కొరకు, “ఆ విశ్రాంతి దినము” మీద చెప్పబోవుదానితో కలిసిపోతుంది.

272 ఇప్పుడు గమనించండి.

…ఆయన…దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు;…

ఇప్పుడు, “ఆయన,” అని అతడు మాట్లాడుచున్నది ఎవరి గురించి? క్రీస్తు గురించి. క్రీస్తు ఎవరు? దేవుడు, దేవునియొక్క లోగాస్.

273 ఇప్పుడు మీరు నిశ్చయత కలిగియుండునట్లు, నన్ను మరలా దీనిని వివరించనివ్వండి. దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు. దేవునియొక్క త్రిత్వము ఒక్కడే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, అనగా ముగ్గురు వేరువేరు దేవుళ్ళు ఉన్నారని కాదు. అది అట్లైనయెడల, మనము అన్యజనులమౌతాము. ఆ కారణముచేతనే యూదులు గ్రహించలేరు. అది బైబిలు గ్రంథములో ఎన్నడూ బోధించబడలేదు. ఇప్పుడు, అది క్యాథలిక్ సంఘములో బోధించబడినది, ఖచ్చితంగా, త్రిత్వ బాప్తిస్మము అక్కడినుండే వచ్చినది.

274 ఆఫ్రికాలో వారు మీకు ముఖము వైపుగా మూడుసార్లు ముంచి బాప్తిస్మము ఇస్తారు: ఒకసారి తండ్రియైన దేవుని కొరకు; ఒకసారి కుమారుడైన దేవుని కొరకు; ఒకసారి పరిశుద్ధాత్మయైన దేవుని కొరకు. ఇప్పుడు, అది తప్పైయున్నది. దాని గురించి బైబిలులో అటువంటి బోధనలు లేనేలేవు. చూశారా?

275 మరియు ఇప్పుడు, అది—అది వారు బోధించిన విషయమైయున్నది. అది లూథరుగుండా వచ్చినది; లూథర్ నుండి వెస్లీలోనికి; కాలములు గడుస్తున్నాకొద్దీ అది వాటిలోనికి వచ్చినది. కానీ అది ఎన్నడూ ఒక బైబిలు బోధన కాదు. అది ప్రారంభమైనప్పటి నుండి, అది ఎల్లప్పుడు ఒక తప్పిదమేయైయున్నది.

276 ఇప్పుడు, కాబట్టి, ఆదియందు దేవుడు ఉన్నాడు. ఎటువంటి వెలుగు లేకముందే, ఒక్క అణువైనా లేకముందే, ఒక్క నక్షత్రమైనా లేకముందే, దృశ్యమైనది ఒక్కటైనా లేకముందే, దేవుడు శూన్యమంతయు వ్యాపించియున్నాడు. మరియు ఆయనలో స్వచ్ఛత తప్ప మరేదియు లేదు: స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన పరిశుద్ధత, స్వచ్ఛమైన నీతి. ఆయన ఆత్మయైయున్నాడు. ఆయన నిత్యత్వమునుండి శూన్యమంతటినీ కప్పియున్నాడు, దానిని మనము గ్రహించలేము. అది మనము ఊహించగలిగే దేనినైనా మించిపోతుంది.

277 ఎలాగంటే ఆ కటకముగుండా, మనము ఒక—ఒక వంద లేదా ఎన్నో మిలియన్ సంవత్సరాల కాంతి కాలమును చూడగలము. దాని గురించి ఆలోచించండి. ఒక వంద మిలియన్ సంవత్సరముల కాంతి కాలము. మరి కాంతి—కాంతి ఒక క్షణమునకు సుమారు ఎనిమిదివేల మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. మరి ఒక వంద మిలియన్ సంవత్సరాల కాంతి కాలము…అది అసలు ఎన్ని మిలియన్ మైళ్ళు అవుతుందో ఆలోచించండి. మీరు కనీసం దానిని లెక్కించలేరు. మీరు తొమ్మిది అంకె వరుసను తీసుకొని మరియు దానితో జెఫర్సన్ విల్ చుట్టూ చుట్టినా గాని, మరియు అయిననూ మీరు దానిని మైళ్ళలో చెప్పలేరు. దాని గురించి ఆలోచించండి. మరి దానికి ఆవలిన ఇంకా నక్షత్రములు మరియు గ్రహములు ఉన్నవి. మరియు దేవుడు, వాటిలో ఒక్కటైనా లేకముందే, ఆయన ఉన్నాడు. చూశారా?

278 మరియు ఇప్పుడు దేవునినుండి బయలువెళ్ళిన లోగాస్, మరది—అది లోగాస్ అయ్యుండెను, ఇదంతయూ ఒక—ఒక శరీర ఆకారములోనికి రూపుదాల్చడం ప్రారంభమైనది. మరియు ఈ శరీర ఆకారము, పండితుల బోధనలో, లోగాస్ అని పిలువబడినది, దేవునినుండి బయలు వెళ్ళిన లోగాస్ అయ్యున్నది. ఇంకో మాటలో చెప్పాలంటే, దానికి ఒక—ఒక శ్రేష్ఠమైన పదము ఏదనగా, మనము థియోఫనీ అని పిలిచేదైయున్నది. (థియోఫనీ అనేది మహిమపరచబడిన ఒక మానవ శరీరమైయున్నది.) అది ఖచ్చితముగా దానియొక్క మహిమకరమైన దశలో రక్తమాంసముతో ఉండునటువంటిది కాదు, కానీ అది తినకుండా, త్రాగకుండా ఉండునట్టి ఒక మానవ శరీరముయొక్క రూపము వంటిదైయున్నది, అయితే అది—అది ఒక శరీరమైయున్నది, మనము దీనిని విడిచిపెట్టిన వెంటనే మనము ప్రవేశించుటకు మన కొరకు వేచియున్న ఒక శరీరమైయున్నది. ఇప్పుడు, అక్కడ, మనము ఆ శరీరములోనికి ప్రవేశిస్తాము. మరియు దేవుడు ఆ విధమైన శరీరమును కలిగియున్నాడు, ఏలయనగా ఆయన ఇట్లు చెప్పాడు, “మన స్వరూపమందు, మన పోలికచొప్పున నరుని చేయుదము.”

279 ఇప్పుడు, మానవుడు ఆ శరీరములోనికి చేయబడినప్పుడు, అతడు చేపలను మరియు, పక్షులను, మరియు—మరియు భూమిమీదనున్న మృగములన్నిటినీ నియంత్రించుండెను. “అయితే భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు,” ఆదికాండము 2. ఆయన పురుషునిగాను స్త్రీనిగాను చేసెను, కానీ నేలను సేద్యపరచుటకు నరుడు లేడు.

అప్పుడు దేవుడు నేలమంటినుండి నరుని నిర్మించాడు. ఆయన ఒక—ఒక చింపాంజీలాగా అతనికి చేతిని ఇచ్చాడు. ఆయన ఎలుగుబంటులాగా అతనికి కాలును ఇచ్చాడు. ఆయన అతనికి ఇచ్చాడు, ఆయన అతడిని, రూపమందు చేశాడు. మరియు ఈ భూసంబంధమైన శరీరము జంతు జీవముయొక్క రూపములో ఉన్నది, మరియు అది అదే రకమైన పదార్థముతో చేయబడినది. ఒక గుఱ్ఱము, లేదా ఒక కుక్క, లేదా అటువంటిదేదైనా చేయబడిన అదే రకమైన పదార్థముతో మీ శరీరము తయారు చేయబడింది. అది క్యాల్షియం, పొటాషియం, పెట్రోలియం, కాస్మిక్ వెలుగునుండి తయారు చేయబడింది. మీరు కేవలం…అన్నిటియొక్క మాంసము ఒకే విధమైన మాంసము కాదు; అది భిన్నమైన మాంసమైయున్నది, కానీ అది ఎక్కడనుండైతే వచ్చినదో, అట్టి నేలమంటినుండి చేయబడినది.

అయితే, ఒక జంతువుకు మరియు ఒక మానవుడికి వ్యత్యాసమేమిటంటే, దేవుడు ఒక మానవుడిలో అంతరాత్మను పెట్టాడు, మరియు జంతువులో ఆయన దానిని పెట్టలేదు. ఎందుకనగా, మానవుడిలో ఉన్న ఆ అంతరాత్మయే ఆ థియోఫనీయైయున్నది.

ఓ, నేను—నేను, నేను అసలు…ఈ పాఠము వద్దకు రాలేను, కానీ నేను దీనిని చెప్పవలసియున్నది.

280 చూడండి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, ప్రభువుయొక్క దూత వచ్చి ద్వారములు తెరవడం మీకు గుర్తులేదా?

281 ఒక రోజున, మేము ఇక్కడున్న సూపర్ మార్కెట్ కు వెళ్ళుచున్నాము, మరియు మా యెదుట ఆ ద్వారము దానికదే తెరుచుకున్నది. “మీకు తెలుసా, బైబిలు మొదటిగా దానిని కలిగియున్నది,” అని నేను అన్నాను. చూశారా? ఇప్పుడు, ఆటోమేటిక్ తలుపు అనేది, దానికదే, తెరుచుకుంటుంది.

282 మరియు పేతురు ఈ కాపలాదారుల ప్రక్కనుండి నడుచుకుంటూ, బయటకు వచ్చినప్పుడు, వారు అతని పట్ల గ్రుడ్డివారిగా చేయబడ్డారు. అతడు లోపలి కావలివాడిని, బయటి కావలివాడిని దాటి, గోడ ప్రక్కనుండి ఆవరణలోనికి, అక్కడనుండి వీధిలోనికి వెళ్ళిపోయాడు. మరియు అతడు ఎవరన్నది వారిలో ఎవరికీ తెలియకపోయెను. మరియు ఎటువంటి…అతడు మరొక కాపలాదారుడో లేదా ఇంకెవరో అని వారనుకున్నారు. వారు…అతడు ప్రక్కనుండి దాటి వెళ్ళాడు, మరియు ద్వారము దానికదే తెరుచుకున్నది, అతడు బయటకు వెళ్ళగా, అతని వెనుక మూసుకున్నది. మరియు అతడు బయటకు వెళ్ళినప్పుడు, అది ఒక కల అని అతడు అనుకున్నాడు. మరియు అతడు జాన్ మార్కు ఇంటికి వెళ్ళాడు, అక్కడ వారు ఒక ప్రార్థనా కూటమును కలిగియున్నారు. మరియు అతడు తట్టాడు…[సహోదరుడు బ్రెన్హామ్ గారు ప్రసంగ వేదికను తట్టుచున్నాడు. టేపుపై ఖాళీయున్నది—సంపా.]…మీ మధ్య ఉండుటకు.

283 ఓ, ఆయన మహిమగలవాడు. ఆయన అద్భుతమైనవాడు.

ఇప్పుడు, ఓ, ఆయన ఒక దూత యొక్క రూపములో చేయబడలేదు; కానీ ఆయన…అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. దేవుడు అబ్రాహాము సంతానముగా మారాడు.

284 ఇప్పుడు, వెనుకకు వెళ్ళి మరియు నిబంధన విషయంలో ఆయన దానిని ఎట్లు చేసాడో చూపించుటకు మనకు సమయముంటే బాగుండును! అనేకసార్లు నేను దానిపై ప్రసంగించుటను మీరు విన్నారు, ఏ విధంగా అతడు ఆ జంతువులను తీసుకొని మరియు వాటిని నడుమకు ఖండించి, మరియు ఆ గువ్వను మరియు పావురమును అందులోకి విసిరివేసాడన్నదాని గురించి చెప్పాను. పిదప అతడు చూశాడు, మరియు ఒక చిన్న పొగను, భయంకరమైన చీకటిని, అనగా మరణమును అతడు గమనించాడు. పిదప, ఒక రాజుచున్న పొయ్యి, అనగా నరకమును చూసాడు. కానీ, దానిని దాటి, ఒక చిన్న తెల్లని వెలుగు వెళ్ళినది. మరియు ఆయన ఏమి చేస్తాడన్నది చూపించుచు, ఆ చిన్న తెల్లని వెలుగు నరకబడిన ఆ బల్యర్పణయొక్క ఖండముల మధ్యనుండి వెళ్ళినది. మరియు ఆయన దానిని చేసినప్పుడు, ఆయన ఒక ప్రమాణము చేశాడు, మరియు ఆయన ఏమి చేస్తాడన్నది చూపిస్తూ, ఆయన ఒక నిబంధనను వ్రాశాడు.

285 మరియు ఆయన, యేసుక్రీస్తు, భూమి మీదకు వచ్చాడు; దేవుడు, ఇమ్మానుయేలుగా, “దేవుడు శరీరములో వచ్చాడు.” మరియు కల్వరి వద్ద, ఆయన చీల్చివేయబడ్డాడు. మరియు ఆయన ఆత్మ తిరిగి సంఘము మీదకు వచ్చినది. మరియు ఆయన శరీరము పైకి కొనిపోబడి మరియు దేవునియొక్క సింహాసనము మీద కూర్చొనియున్నది.

దేవుని సింహాసనము! సింహాసనము మీద ఉన్నవాడు న్యాయాధిపతియైయున్నాడు. మనకు అది తెలుసు. సరే, న్యాయతీర్పు ఎక్కడ ఉన్నది? తండ్రి అనుగ్రహించాడు…ఆయన ఏ మనుష్యునికీ తీర్పు తీర్చడు. అయితే తండ్రి తీర్పునంతటినీ కుమారునికి అప్పగించాడు. కావున అది ఆయనే. మరియు మన ఒప్పుకోలు నిమిత్తము విజ్ఞాపన చేయుటకు, ఆయనయొక్క జీవము, తన స్వంత శరీరముతో, ఒక బల్యర్పణగా అక్కడ కూర్చొనియున్నట్టి ప్రధానయాజకుడిగా ఉన్నది. ఆమేన్. సహోదరుడా, అది నీలో దేనినో ఉంచుతుంది.

286 గమనించండి, “ఆయన అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు.” ఆయన ఒక మానవునిగా మారాడు. మనలను విమోచించుటకు, దేవుడు, మన మధ్య శరీరధారి అయ్యాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, పాపులమైన మనము ఆయనలో పాలిభాగస్తులమగునట్లు, దేవుడు పాపముగా మారాడు. మరియు మనము ఆయనలో పాలిభాగస్తులమైనప్పుడు, మనము ఆయనయొక్క…మనము డెబ్బై ఏండ్లు బ్రతికే, కాల-బద్దులమైన ప్రజలమైయున్నాము. మరియు ఆయనయొక్క నిత్యజీవములో మనము పాలిభాగస్తులమగునట్లు, దేవుడు దిగివచ్చి, ఆయనకు నియమించబడిన కాలము వరకు, ఈ డెబ్బై ఏండ్ల కాలపరిమితిగల మనలో ఒకనిగా మారాడు. మరియు మనము తిరిగి జన్మించినప్పుడు, మనము దేవుని కుమారులము కుమార్తెలమైయున్నాము, మరియు నిత్యజీవమును కలిగియుండి, మరియు ఎన్నడూ నశింపకయుంటాము.

ఓ, ఎటువంటి—ఎటువంటి ఒక ధన్యకరమైన రక్షకుడు! ఓ, దానిని వ్రాయుటకు ఏ మార్గము లేదు. దానిని వివరించే మార్గమే లేదు. అది వివరణకు మించినదైయున్నది. అది ఎంత గొప్పదో ఎవ్వరూ వివరించలేరు. “నీవు ఎంత గొప్పవాడవు! నీవు ఎంత గొప్పవాడవు!” అన్నది వాస్తవము.

కావున,…(దీనిని వినండి.)… ప్రజల పాపమునకు పరిహారము కలుగజేయుటకై దేవునిసంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము,…(దీని గురించి ఆలోచించండి.)…అన్నివిషయములలో ఆయన…తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

సమాధానపరచడానికి, ఇప్పుడు, దేవుడు, న్యాయమును ఎరిగియుండి, ఒక పాపిగా ఉండుట అనేది ఎలా ఉంటుందో అనుభూతిచెందుటకు, అన్యాయముగా మారవలసియుండెను, తద్వారా “సమాధానమును కలుగజేయుట” ద్వారా, తిరిగి వెళ్ళి సమాధానపరచుటకు, మరియు ప్రజలపై కనికరము చూపించుటకైయున్నది.

287 తరువాత వచనము, ఇక్కడ దానిని వినండి.

తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక…

288 దేవుడు ఆత్మలో శ్రమపొందలేడు. వ్యాధియొక్క నొప్పిని అనుభవించుటకు, దురాశయొక్క శోధనను అనుభవించుటకు, కొరతయొక్క శోధనను అనుభవించుటకు, ఆకలియొక్క శోధనను అనుభవించుటకు, మరణముయొక్క శక్తిని అనుభూతిచెందుటకు, ఆయన శరీరధారిగా మారవలసివచ్చినది. తద్వారా ఈ జీవితమునకు మధ్యవర్తిత్వము చేయుటకు, మనుష్యునియొక్క సన్నిధిలో కాదు గాని, ఆత్మయొక్క సన్నిధిలో; ఆ గొప్ప ఆత్మయైన యెహోవాయొక్క సన్నిధిలో నిలబడే బాధ్యతను, ఆయన తీసుకొనుటకైయున్నది. మరియు మన కొరకు విజ్ఞాపన చేయుటకై, యేసు దానిని తీసుకున్నాడు, ఏలయనగా అది ఎట్లుంటుందో ఆయనకు తెలుసు. మీకు వ్యాధి వచ్చినప్పుడు, మీకెలా అనిపిస్తుందో ఆయనకు తెలుసు. మీరు శోధించబడినప్పుడు, మీకేలా అనిపిస్తుందో ఆయనకు తెలుసు.

289 ఇప్పుడు, మనము ఒక అధ్యక్షునికి ఓటు వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా, ప్రతి ఒక్క రైతు కూడా గతంలో రైతుగా ఉండిన ఒక అధ్యక్షునికే ఓటు వేస్తాడు, ఏలయనగా రైతు జీవితంలోని కష్టతరమైన భాగమును అతడు ఎరిగియుంటాడు. చూశారా? అర్థంచేసుకొనే ఒక వ్యక్తి అతనికి కావాలి.

290 మరియు దేవుడు అర్థంచేసుకొనుటకు ముందే (మరి ఆయన ఆ గొప్ప పరిశుద్ధుతయైయ్యుండగా, ఆయన మానవుడిని దోషులుగా తీర్పు తీర్చిన తరువాత ఆయన ఎట్లు అర్థం చేసుకోగలడు? తనయొక్క పరిశుద్ధత ద్వారా, ఆయన మానవుడిని ఖండించాడు.), మరియు ఏ విధంగా మానవుడిని నీతిమంతునిగా తీర్చాలి అనేది ఆయనకు తెలియుటకు గల ఒకే ఒక్క మార్గమేదనగా ఆయన మానవుడిగా మారటమే.

291 మరియు దేవుడు కన్యకను కమ్మినప్పుడు మరియు ఆమె ఒక శరీరమును కన్నది, యూదుల రక్తము కాదు, అన్యజనుల రక్తము కాదు, కానీ అది ఆయన స్వంత రక్తమైయున్నది. దేవునియొక్క సృష్టించబడిన రక్తము, దానిలో, అసలు లైంగిక సంబంధమైనదేదియు లేదు, ఎటువంటి లైంగిక కోరిక లేదు. మరియు ఈ స్త్రీయొక్క గర్భములో, సృష్టించబడిన ఈ రక్తకణము, కుమారుడిని తీసుకొనివచ్చినది. మరియు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానుచేత బాప్తిస్మము పొందినప్పుడు, యోహాను ఇట్లు చెప్పాడు, “దేవుని ఆత్మ (పావురము వలె) దిగివచ్చి ఆయన మీద నిలిచియుండుట చూచి, నేను సాక్ష్యమిచ్చుచున్నాను.”

292 “పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు నా చేతికి ఇవ్వబడినవి,” అని యేసు చెప్పుగలుగుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. దేవుడు మరియు మానవుడు ఒక్కటయ్యారు. ఆకాశము మరియు భూమి ఒకదానినొకటి కౌగిలించుకున్నవి, మరియు మన పాపములు పరిహరించి సమాధానపరచగలిగినది ఆయనే. ఆ కారణముచేతనే, ఆయన నామములో, స్వస్థత కలుగుచున్నది. మీ బాధ ఆయనకు తెలుసు.

293 ఈ చిన్న పాత పాటను మీరు ఎప్పుడైనా విన్నారా?

నీవు అనుభవించే బాధ యేసుకు తెలుసు, ఆయన రక్షించగలడు మరియు ఆయన స్వస్థపరచగలడు;

నీ భారమును ప్రభువుయొద్దకు తీసుకొనివెళ్ళి మరియు దానిని అక్కడ విడిచిపెట్టుము.

అది వాస్తవము. ఆయనకు తెలుసు.

మన శరీరము నొప్పితో క్రుంగిపోయినప్పుడు, మరియు మన ఆరోగ్యమును మనము తిరిగి పొందలేకున్నప్పుడు,

కేవలం గుర్తుంచుకో, పరలోకమందున్న దేవుడు ప్రార్థనకు జవాబునిస్తాడు,

నీవు అనుభవించే బాధ యేసుకు తెలుసు, ఆయన రక్షించగలడు మరియు ఆయన స్వస్థపరచగలడు;

కేవలం నీ భారమును ప్రభువుయొద్దకు తీసుకొనివెళ్ళి మరియు దానిని అక్కడ విడిచిపెట్టుము.

294 ఆయన అడిగేదంతా అదియే, “కేవలం దానిని అక్కడ విడిచిపెట్టుము” ఏమిటి? ఆయన ఇక్కడ నిలబడియుండి, మీరెట్లు అనుభూతి చెందుచున్నారో ఎరిగియున్న మన ప్రధాన యాజకుడైయున్నాడు, మరియు మిమ్మల్ని తిరిగి కృపవద్దకు ఎలా సమాధానపరచాలో, మరియు మిమ్మల్ని తిరిగి మీ ఆరోగ్యములోనికి ఎలా తీసుకొనిరావాలో ఆయనకు తెలుసు. దాని గూర్చి అంతా ఆయనకు తెలుసు, ఆయన శ్రమనొందాడు. మీ తలవాల్చుకొనుటకైనా మీకు స్థలము లేనప్పుడు, ఆయన కూడా అదే పరిస్థితిని కలిగియున్నాడు. మీరు ఒక జత బట్టలనే కలిగియుంటే, ఆయన కూడా అదే విధంగా కలిగియున్నాడు. మీరు ఎగతాళి చేయబడి, హింసించబడినప్పుడు, ఆయన కూడా అదే పరిస్థితిని కలిగియున్నాడు.

295 ఇప్పుడు చివరి వచనము వినండి. మంచిది.

…శోధింపబడువారికి ఆయన సహాయము చేయగలవాడైయున్నాడు.

లేదా, ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన వారిని భద్రపరచుటకు, వారికి సహాయము చేయుటకు, వారిని…వారిపట్ల దయచూపించుటకు సమర్ధుడైయున్నాడు. ఎందుకనగా, దానిని అనుభూతి చెందుటకు, దేవుడు తానే మానవుడయ్యాడు.

296 మీకు గుర్తున్నదా, ఈ మధ్యనే ఒక రాత్రి, మనము దానిపై బోధించుకోలేదా? ఏ విధంగా దేవుడు…మరణము దానిలో ఒక ముల్లును, దానిలో ఒక భయమును కలిగియుండెను. “ఈ మరణమును గూర్చి వారు తమ జీవితకాలమంతయు దాస్యములో ఉన్నారు.” మరియు అప్పుడు యేసు, తాను మరణమునుండి ఆ ముల్లును బయటకు తీసివేయుటకు వచ్చాడు.

మరియు ఆయన పర్వతము మీదకు ఎక్కుచున్నప్పుడు, మనము దానిని ఎలా వివరించుకున్నామో గుర్తున్నదా? ఆయన వస్త్రము మీద ఆ చిన్న ఎర్రని చుక్కలు, కొంతసేపైన తరువాత ఒకే పెద్ద మచ్చగా మారి, మరియు ఆయన చుట్టూ రక్తము చిందుచున్నది. ఆయనయొక్క చిన్న, బలహీనమైన శరీరముతో, ఆయన ఇక ఎంతమాత్రము ముందుకు వెళ్ళలేకపోయాడు, మరియు ఆయన కుప్పకూలిపోయాడు. కురేనీయుడైన సీమోను, ఆ నల్లజాతీయుడు, కొండపైకి సిలువను మోసేందుకు ఆయనకు సహాయము చేశాడు.

మరియు వారు ఆయనను సిలువకుపెట్టి మేకులు కొట్టినప్పుడు, ఆయన నీళ్ళ కొరకు అరిచాడు. రక్తము స్రవిస్తున్న ఏ మనిషికైనా నీరు అవసరమైయున్నది.

297 ఈ మధ్యనే ఒక రోజు రాత్రి “జింక, ఆ దుప్పి నీటివాగుల కొరకు దప్పిగొనునట్లు, ఓ దేవా, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది” అనుదానిపై నేను బోధించినది జ్ఞాపకమున్నదా? ఒక దుప్పి గాయపరచబడి మరియు ప్రాణముతో ఉండి, రక్తము కోల్పోవుచున్నట్లైతే, అది తప్పక నీళ్ళు త్రాగవలసియున్నది లేదంటే అది చనిపోతుంది.

298 నాకు పద్నాలుగు సంవత్సరాలున్నప్పుడు, నేను మైదానంలో, కాల్చబడ్డాను. మరియు నేను అక్కడ పడిపోయి ఉన్నాను. 12 గేజ్ షాట్ గన్ తో పెల్చబడిన, దుప్పి మాంసంవలె, నా కాళ్ళు చీలిపోయాయి. మరియు నేను నీళ్ళ కొరకు ఇట్లు అరిచాను, “ఓ, నాకు త్రాగుటకు ఇవ్వండి!” నాకు తిమ్మిరి పట్టినది; నా పెదవులు మొద్దుబారిపోయినవి.

299 నా స్నేహితుడు, ఒక కొలను వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు, దానిలో అన్ని రకాలైన చిన్న పురుగులున్నవి, చిత్తడి నేలయైయున్నది. అది ఏమిటన్నది నేను లెక్కచేయలేదు. మరియు అతడు నీటిని అటు ఇటు కుదిపాడు, మరియు నేను నా నోరు తెరిచియుంచాను, మరియు అతడు తన టోపీని నా నోటిలో, ఆ విధంగా పిండాడు. మరి అవును, నేను తప్పక నీటిని త్రాగవలసియున్నది.

300 ఆయననుండి రక్తము స్రవించుచున్నది. ఆయన ఇట్లన్నాడు, “నాకు దాహమునకియ్యుడి.” మరియు వారు ఆయనకు ఒక స్పంజితో చిరకను ఇచ్చారు, మరియు ఆయన దానిని నిరాకరించాడు మరియు దానిని తిరస్కరించాడు. మానవునికి సమాధానమును తెచ్చుటకు, ఆయన మనకు బదులుగా చనిపోవుచున్న దేవుని గొర్రెపిల్లయైయున్నాడు. అది ఏమిటి? పరలోకపు దేవుడు.

301 బిల్లీ సండే ఒకసారి ఇట్లు చెప్పాడు, “ప్రతి పొదలో దేవదూతలు కూర్చొనియుండి, ‘కేవలం నీ చేతిని వదిలించుకొని మరియు నీ వేలితో చూపించుము, మేము పరిస్థితిని మార్చివేస్తాము,’ అని చెప్పుచున్నారు.”

302 డీ.డీ, పిహెచ్‌.డీలు గల గొప్ప విద్యావంతులైన పండితులు అని పిలువబడే, ఆ మతమూఢుల పొగరుబోతు గుంపు, నడుచుకుంటూ ఆయన ప్రక్కకు వచ్చి మరియు ఇట్లన్నారు, “నీవు ఇతరులను రక్షించావు, నిన్ను నీవు రక్షించుకోలేకపోవుచున్నావు, ఇప్పుడు, నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీదనుండి దిగి రమ్ము, మరప్పుడు మేము నిన్ను నమ్ముతాము.”

303 వారు ఆయనను ప్రశంసిస్తున్నారని వారికి తెలియదు. ఆయన తనను తాను రక్షించుకొనియుండేవాడే. కానీ ఆయన తననుతాను రక్షించుకుంటే, ఇతరులను ఆయన రక్షించలేడు. కాబట్టి, ఆయన తననుతాను అర్పించుకున్నాడు. ఆయన నామము స్తుతింపబడును గాక. నేను రక్షింపబడునట్లు మరియు మీరు రక్షింపబడునట్లు, ఆయన తననుతాను అర్పించుకున్నాడు. ఓ, ఎటువంటి సాటిలేని ప్రేమ!

304 ఆయన వ్యాధిగ్రస్తునిగా ఉండవలసిన అవసరంలేదు. ఆ ప్రశస్తమైన కన్యక-జన్మ శరీరము వ్యాధిగ్రస్తమైనదిగా ఉండనక్కరలేదు. అయితే నేను వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు, నా కొరకు ఎలా విజ్ఞాపన చేయాలో ఆయన ఎరుగునట్లు, ఆయన వ్యాధిగ్రస్తునిగా మారాడు.

305 ఆయన అలసిపోవవలసిన అవసరంలేదు, కానీ ఆయన అలసిపోయాడు. దాని గురించి నేను ఒకసారి ఈ ఒక చిన్న చరిత్రను చదివాను, అది ఖచ్చితమైనదో కాదో నాకు తెలియదు. “ఆయన అక్కడ నాయీను గ్రామములో, మృతులలో నుండి ఆ పిల్లవాణ్ణి లేపినప్పుడు, ఆయన ఒక బండ మీద కూర్చొని, తలనొప్పితో మూలిగాడు,” ఎందుకనగా ఆయన మన వ్యాధిని భరించాల్సివచ్చినది.

306 ఆయన మన పాపమును భరించవలసియున్నాడు, మరియు ఆయన అక్కడ మరణించాడు, మరియు కల్వరిలో ఆ పాత కందిరీగ మరియు మరణము ఒక్కసారి దాని ముల్లును గ్రుచ్చినది. ఒక కందిరీగ దాని ముల్లును గుచ్చినప్పుడు, అది ఇక మరెంతమాత్రమూ కుట్టలేదని, ఎవరికైనా తెలుసు. ఆ కందిరీగ ఎగిరిపోయినపుడు లేదా కుట్టగల ఏ పురుగైనా, అది దాని ముల్లును గుచ్చినప్పుడు, అది ఆ ముల్లును వదిలేస్తుంది. అది ఇంకను ఒక కందిరీగే కానీ అది ముల్లును కలిగియుండదు. ఇక అది చేయగల ఒకే ఒక్క పని ఏమిటంటే ఝుంకారము చేస్తూ మరియు ఎక్కువ గోల చేయడమే.

307 మరణము ఒక విశ్వాసికి చేయగలిగేది అదొక్కటి మాత్రమే, అదేమనగా ఎక్కువ గోల చేయడమే. అయితే, హల్లెలూయా, ప్రభువు నామము స్తుతింపబడును గాక, ఆయన మరణముయొక్క ముల్లును తన స్వంత శరీరములోనికి తీసుకున్నాడు. ఇమ్మానుయేలు దానిని చేశాడు. మూడవ దినమున, మరలా తిరిగి లేచి, ఆ ముల్లును అక్కడనుండి దులిపివేసాడు, మరియు ఈ రాత్రి అమర్త్యుడైయున్నాడు. మరియు ఆయనయొక్క ఆత్మ ఈ భవనంలో ఉన్నది, మరియు ఆయన మన మధ్య సజీవుడిగా ఋజువు చేసుకొనుచున్నాడు. అదీ మన మెస్సీయా అంటే. అదీ మన ధన్యకరమైన రక్షకుడంటే. 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...