హెబ్రీయులకు, నాలుగవ అధ్యాయము
1 …మన ధన్యకరమైన ప్రభువు గురించి మరి ఎక్కువ తెలుసుకోవడమైయున్నది. మరియు ఇక్కడ కూడుకొనుటలో మన—మన ఉద్దేశ్యము అదే, అది ఆ ఉద్దేశ్యం కొరకేయైయున్నది, మరియు, ఇప్పుడు, మరియు వ్యాధిగ్రస్థులైన దేవుని పిల్లల కొరకు ప్రార్థించడానికైయున్నది. మరియు ఈ ఉదయమున మనము—మనము లేఖనములనుండి అద్భుతమైన ఆశీర్వాదమును పొందుకున్నాము.
2 ప్రతియొక్క కూడిక సమయములో, ఒక భాగమును తీసుకొనుటకు, మనము ప్రయత్నిస్తున్నాము…హెబ్రీ పత్రికలో నేను బోధిస్తున్నాను, ఇప్పటికీ గత రెండు వారాలుగా, బోధిస్తూ ఉన్నాను. మరియు ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే, బుధవారం రాత్రి, పిదప ఆదివారం ఉదయము మరియు ఆదివారం రాత్రి, ఇంకా, ఈసారి నేనిక్కడ ఉండునంత కాలం మనం కొనసాగుతాము. ఒక ఉజ్జీవ కూటము కాదు, అయితే అది, మన సాధారణ రాత్రులలోని ఒక కూటములో ఉండు ఉజ్జీవమైయున్నది. మరియు కావున, ఈ పట్టణాలలో మరియు ఇక్కడ ఫాల్స్ పట్టణాలలోనున్న మా మంచి స్నేహితులను కలవడానికి, ఈ సమయమును కలిగియున్నందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాము. మరియు మనకు ఒకవేళ—ఒకవేళ రద్దు చేయబడటం లేదా అటువంటిదేదైనా జరిగితే, బహుశా ప్రభువు మనలను అతి త్వరలో నడిపించవచ్చును, దేనికంటే…మన ప్రజలను, ఒక దగ్గరకు చేర్చగలిగే చోటుకి, ప్రభువు ఆ విధంగా నడిపించినట్లైతే, కొంత సమయం తరువాత, బహుశా వ్యాయామశాలలోనైనా లేక మరిదేనిలోనైన, మనము కొన్ని రాత్రులు కలిగియుండగలము.
మరియు పైకి వస్తుండగా, “లోపలికి రావడానికి—రావడానికి సరిపడా స్థలము లేదు,” అని చెప్తూ, ప్రజలు తిరిగి వెళ్ళడాన్ని మేము చూశాము. వాస్తవమే, ఈ ఆలయము ఎంతో చిన్నగా ఉన్నది. దీనిలో చాలా, చాలా తక్కువమందికి సరిపడా సీట్లు మాత్రమే ఉన్నాయి, మరియు ప్రభువుయొక్క వాక్యమును వినడానికి, మీరు బయటకు వచ్చి మరియు వేడిలో కూర్చొనుటకు ఇష్టపడుచున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మరియు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా, అత్యధికముగా దీవించి మరియు మీకు సహాయము చేస్తాడని మేము ప్రార్థిస్తున్నాము.
3 మరియు ఇప్పుడు, ఈ రాత్రి, మనము, మనము 4వ అధ్యాయముపై ప్రారంభిస్తున్నాము-…ఈ ఉదయమున ఎంతమంది ఇక్కడున్నారు? మీ చేతులను చూద్దాం. ఓ, అది అద్భుతం, దాదాపు మీరందరూ ఉన్నారు. మరియు మనము, హెబ్రీ పత్రిక, 4వ అధ్యాయమును ప్రారంభిస్తున్నాము. ఓ, ఎటువంటి ఒక అద్భుతమైన పుస్తకము! మీరు దానిని ఆనందిస్తున్నారా? [సంఘము “ఆమేన్,” అని చెప్తున్నది—సంపా.] మరియు అది లేఖనమును లేఖనముతో సరిపోల్చుచున్నది.
4 మరియు పౌలు, తన అనుభవమునకు సాక్ష్యమివ్వడానికి ముందు, అతడు మొదట అరేబియాకు వెళ్ళి, మరియు అది సత్యమో కాదో అని వాక్యము ద్వారా కనుగొనవలసియుండెను. నేను దానిని ఇష్టపడుచున్నాను. మరియు, ఈ ఉదయకాలపు పాఠములో, ఈ ఉదయమున ఉపదేశములో, క్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని మనము కనుగొన్నాము. మరియు ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన అదే అగ్నిస్తంభము, దమస్కు మార్గములో తనను కలుసుకున్నదని పౌలు కనుగొన్నాడు. ఇశ్రాయేలీయులను అరణ్యములోనుండి బయటకు తీసుకువచ్చి, వాగ్దాన దేశమునకు నడిపించిన అదే అగ్నిస్తంభము, దమస్కు మార్గములో పౌలును కలుసుకొని, మరియు తననుతాను, “యేసు,” అని పిలుచుకున్నాడని మనము కనుగొన్నాము.
5 పిదప మనము యేసుక్రీస్తుయొక్క అసలైన సర్వాధికారము గల దైవత్వమును కనుగొంటాము. ఇక్కడ ఈ పుస్తకమంతా కేవలం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయైయున్నది. మరియు ఆయన వచ్చాడు, మనము ఇట్లు కనుగొంటాము, “పూర్వ కాలమందు నానా విధములుగా, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు; ఈ దినముల అంతమందు, తన కుమారుడైన, క్రీస్తుయేసు ద్వారా, ఆయన తననుతాను బయలుపరచుకున్నాడు.” మరియు ఆదికాండము నుండి ప్రకటన వరకునున్న ఈ గ్రంథము మరేదో కాదు గాని, ప్రభువైన యేసును గూర్చిన స్థిరమైన, యెడతెగని ప్రత్యక్షతయైయున్నది.
6 మరియు మండుచున్న పొదలో ఉన్నది ఆయనే అని మనము కనుగొన్నాము. జగత్తుకు పునాది వేయబడకముందు దేవునితో ఉన్నది ఆయనే అని మనము కనుగొన్నాము. మరియు క్రొత్త నిబంధనలో, ఆయన దేవుడు మరియు మానవుడు, ఏకమైయుండుటయని, మనము కనుగొన్నాము. మరియు పిదప పరలోకమునకు వెళ్ళడానికి, ఆయన క్రొత్త నిబంధనను విడిచిపెట్టినపుడు, ఆయన ఇట్లన్నాడు, “నేను దేవునియొద్ద నుండి వచ్చియున్నాను, మరియు నేను దేవునియొద్దకు తిరిగి వెళ్ళుచున్నాను.”
7 మరియు పిదప పౌలు ఆయనను కలుసుకున్నప్పుడు, ఆయన ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు ఉన్నట్టి అదే రూపములో, అనగా ఒక అగ్నిస్తంభముగా ఉన్నాడు. మరియు పౌలు మారుమనస్సు పొందనివాడైయ్యుండి, నేరుగా ఆయన ముఖములోనికి చూశాడు, మరియు అది అతని మిగతా దినములన్నిటిలో అతడికి కంటి సమస్యను కలిగించినది. అతడు గ్రుడ్డివాడయ్యాడు, మరియు చాలా దినముల వరకు అతడు అసలు ఏమీయు చూడలేకపోయాడు. అతడు తిన్ననిదనబడిన వీధికి నడిపించబడాల్సివచ్చినది.
8 మరియు దేవుడు తాను మాట్లాడినట్టి, అననియ అను పేరు గల ఒక ప్రవక్తను అక్కడ కలిగియున్నాడు, ఒక దర్శనము ద్వారా, అతడు వచ్చి, మరియు పౌలు మీద చేతులుంచి, మరియు ఇట్లన్నాడు, “సౌలు సహోదరుడా, నీ దృష్టిని పొందుకొనుము.”
9 మరియు పిదప, అదే పరిశుద్ధాత్మ, అదే ప్రభువైన యేసు, ఒక వెలుగు రూపములో పేతురుయొద్దకు వచ్చి మరియు అతడిని చెరసాలనుండి విడిపించాడని, మనము కనుగొన్నాము.
10 మరియు అదే ప్రభువైన యేసు, ఇంకనూ ఈ దినములలో, తన ప్రజలను (సంఘమును) నడిపిస్తున్న ఆ అగ్నిస్తంభములో (వెలుగులో) ఉన్నాడని మనము కనుగొన్నాము, అదే కార్యమును చేయుచూ, దర్శనములను ఇచ్చుచు; వచ్చి మరియు, ఒక దర్శనము ద్వారా ప్రజల మీద చేతులుంచుచున్నాడు. గత ఆదివారము ఉదయమున ప్రభువైన యేసు ఇంటివద్ద కలుసుకొని, నెరిసిపోతున్నట్టి నల్లని-జుట్టును కలిగియున్న ఒక వ్యక్తి వచ్చుచున్నాడని చెప్పాడు. అతడు ఒక గ్రీకు దేశస్థుడు. అతని భార్య మధ్య-వయస్కురాలైయుండి, మరియు బలిపీఠము వద్ద ఏడుస్తూ ఉంటుందని చెప్పాడు.
11 వారిలో కొందరు దానిని చెప్పారు, మరియు అది జరుగుచున్నదని ఎరిగియున్నారు. అతడు కుంటివాడై యున్నాడు, అతని తలలోని ఆ—ఆ సమతుల్యత నరము కూడా పాడైపోయినది. అతడు కనీసం తన పాదముల మీద లేదా తన కాళ్ళ మీద అదుపును కలిగిలేడు. మరియు అతడు గ్రుడ్డివాడు. మరియు దానిని రెండింతలుగా రుజువు చేయుటకు: మొదటిగా నా వద్దకు ప్రార్థన కొరకు వచ్చిన ఒక స్త్రీ ఉన్నది, తరువాత వెనుకకు తిరిగి మరియు సహోదరుడు థామ్‌ను ప్రార్థించమని చెప్పాను. మరియు మనము, ఇక్కడ కూర్చొని, అది పెరుగుటను చూస్తున్నాము. మరియు పిదప నేను క్రిందకు వెళ్ళి రోగుల కొరకు ప్రార్థించి, మరియు వెనుకకు నడిచాను. మరియు సరిగ్గా ఆ దర్శనము ప్రకారంగా, ఆమె వచ్చి, నా చేయి పట్టుకొని ఏడ్వటం మొదలుపెట్టింది, మరియు డాక్టర్. ఆకెర్‌మన్ వారిని ఇక్కడకు పంపాడని చెప్పినది. డాక్టర్. ఆకెర్‌మన్ నాకు ఒక మంచి స్నేహితుడు, క్యాథలిక్కువాడై యున్నాడు. అతని అబ్బాయి ఇండియానాలోని సెయింట్ మెయిన్రాడ్ వద్ద—ఆశ్రమంలో ఒక యాజకుడు. మరియు ఈ వ్యక్తి జాస్పర్ ప్రాంతము నుండి వచ్చినవాడు. మరియు ప్రభువు ఆ కుర్చీలో నుండి, అతడిని స్వస్థపరిచాడు. అతడు లేచి నడిచాడు. అతడు ఇంకెవరైనా చూడగలిగినట్లే చూడగలుగుచున్నాడు. మరియు బాగైపోయి సజావుగా, భవనం నుండి బయటకు నడిచి వెళ్ళిపోయాడు. అంతా ఒక దర్శనము ద్వారా జరిగినది!
12 “సౌలు సహోదరుడా, మార్గములో నీకు ప్రత్యక్షమైనట్టి ప్రభువైన యేసే, నీవు చూపు పొందుకొని మరియు పరిశుద్దాత్మతో నింపబడుటకు, నేను నీ మీద చేతులుంచునట్లు నన్ను పంపించాడు.” అద్భుతము.
13 “పిదప మనము, మనము ఈ గొప్ప రక్షణను కలిగియున్నామని చూస్తుండగా, మనము…ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లైతే, శిక్షను మరియు దేవుని ఉగ్రతను మనము తప్పించుకోలేమని మనము కనుగొన్నాము.”
14 ఇప్పుడు, ఈ రాత్రి, మనము చదవడం మొదలుపెట్టి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయమును ప్రారంభించబోవుచున్నాము. ఎవరైనా దానిని చూడగోరినయెడల, ఇక్కడ మా వద్ద కొన్ని బైబిళ్ళు ఉన్నాయి. ఎవరికైనా ఒకటి కావాలంటే, ఇంకేమీ, మీరు మీ చెయ్యి పైకెత్తుతే, ద్వారపాలకులలో ఒకరు దానిని మీ యొద్దకు తీసుకొనివస్తారు, ఈ—ఈ బైబిళ్ళున్నవి. ఇక్కడున్న సహోదరులలో ఒకరు తీసుకుంటే…అక్కడ రెండు బైబిళ్ళు ఉన్నవని, నేను నమ్ముతున్నాను.
15 మరియు ఇప్పుడు మనము త్వరపడుదాము, ఎందుకనగా కొద్ది సేపటి తరువాత మనకు ప్రభురాత్రి భోజనము ఉన్నది. మరియు ఈ రాత్రి మనము ఎక్కడ ముగించుకుంటామో, బుధవారము రాత్రి మరలా అక్కడే ప్రారంభిస్తాము. ఇప్పుడు, ఈ ఉదయమున మన పఠనములో, మనము 15వ వచనమును ప్రారంభించుకున్నామని, నేను నమ్ముచున్నాను.
16 చదవడానికి నేను కళ్ళద్దాలు పెట్టుకుంటున్న విషయం, కొంతమందికి తెలియకపోవచ్చును. నేను వృద్ధుడనగుచున్నాను. మరియు ప్రత్యేకించి నేను ఇక్కడ మంచి పఠనమును, మంచి ముద్రణను కలిగియుండగా, నేను ఇంకనూ చదవగలను, కాని నేను దానిని త్వరగా గుర్తుపట్టలేను.
17 మరియు నేను నిజంగా నా దృష్టిని కోల్పోతున్నానేమో అని చూడటానికి, నా కన్నులను పరీక్షించుకొనుటకు నేను వెళ్ళాను. నా దృష్టి పదికి-పది ఉన్నది. అతడు ఇట్లన్నాడు, “అయితే కుమారుడా, నీకు నలభై సంవత్సరాలు దాటినవి.” నేను చదవడానికి అతడు ఒకటి ఇచ్చాడు, ఇట్లన్నాడు, “దానిని చదవడం ప్రారంభించు.” నేను దానిని చదివాను. మరియు నేను దగ్గరనుండి చూస్తున్నా కొద్దీ, చదివే వేగము మెల్లగా మరియు మెల్లగా తగ్గిపోయినది. మరియు అది ఇంత దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఆగిపోయాను. పిదప అతడు పదికి-పది దృష్టికి సంబంధించినది అక్కడ ఉంచాడు, దానిలో ఎక్కడైనా నేను చదవగలిగాను. అయితే అతడు ఇట్లన్నాడు, “అది ఏమిటంటే, నీవు నలభై దాటినపుడు, నీ కనుగుడ్లు చదునుగా మారతాయి.”
18 ఇప్పుడు, నేను తీక్షణంగా దృష్టిపెట్టి, నాకు అంత దగ్గరగా ఉన్నదానిని కూడా చదవగలను, అయితే తీక్షణంగా చూడవలసియుంటుంది. కావున, అతడు నాకు ఒక జత కళ్ళద్దాలను తయారు చేశాడు. నాకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు కూడా, ఎక్కడైనా, నేను దానిని చూడగలుగుచున్నాను. ఇప్పుడు, అది నా నుండి దూరంగా ఉంటే, వీటితో ఏ మాత్రము చూడలేను. అయితే నేను వాటిని, ఈ కళ్ళద్దాలతో చదువుతాను.
19 ఇప్పుడు, ఈ ఉదయమున, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయముయొక్క చివరి భాగమును మనము చూశాము. మరియు, ఓ, ఎంతటి గొప్ప సారమును మనము కనుగొన్నాము కదా! ఇప్పుడు వినండి, నేను మరలా చదవగోరుచున్నాను, తద్వారా ఇప్పుడు మనము ఒక నేపథ్యాన్ని పొందుకుంటాము. దానిపై బోధించడం కాదు గాని, దానిని కొంచెము చెప్తూ వెళ్తాను.
నేడు, మీరు…ఆయన స్వరమును వినినయెడల, కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
ఏలయనగా కొందరు, వారు, వారు వాక్యమును విన్నారు, వారు వాక్యమును వినినప్పుడు, కోపము పుట్టించిరి: మోషేచేత విడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే కదా.
20 ఇప్పుడు, దానిలో, ఈ ఉదయమున, అతడు ఇట్లు చెప్పుటను మనము కనుగొన్నాము, “కోపము పుట్టించినప్పటి దినములో వలె, ఇప్పుడు మీ హృదయమును కఠినపరచుకొనకుడి.” అది వారు దేవునికి కోపము రేపినప్పటి విషయమైయున్నది, ఎందుకనగా ఆయన వారికి తన ప్రవక్తయైన మోషేను ఇచ్చాడు, మరియు మోషేతో ఉన్న ఒక సూచనను ఇచ్చాడు. ఆ సూచన ఏమిటన్నది, ఈ రాత్రి తరగతిలో, ఎంతమందికి తెలుసు? అగ్నిస్తంభమే, హెబ్రీ 13.
21 ఇప్పుడు, ఆ సమూహము ఆ సూచనను చూసినదో లేదో మనకు తెలియదు. అయితే మోషే దానిని చూశాడు, ఏలయనగా మొదటిగా ఒక మండుచున్న పొదలోనే మోషే ఆయనను కలుసుకొన్నాడు. ఆయన ఒక అగ్నియైయున్నాడు. మరియు ఇశ్రాయేలీయులు మోషేకు లోబడి, ఐగుప్తును విడిచిపెట్టారు. మరియు వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వెంటనే, దేవుడు, వారిని నేరుగా ఒక ఉచ్చులోనికి నడిపించాడని, మనము కనుగొన్నాము. అక్కడ, వారి వెనుక ఫరో సైన్యము ఉండగా, ఇరువైపులా ఎర్ర సముద్రము ఉండగా, మరి దేవుడు వారిని పరీక్షించాడు; మరియు వారు భయపడ్డారు. మరియు అది దేవునికి కోపము రేపినది. ఆయన ఇట్లన్నాడు, “నీవేల నాకు మొరపెట్టుచున్నావు?” ఇట్లన్నాడు, “కేవలం పలుకుము మరియు ముందుకు కొనసాగుము.” నేను దానిని ఇష్టపడుచున్నాను.
22 ఇప్పుడు, మోషే స్తంభమును మరియు మేఘమును వెంబడించుచుండగా, వారు మోషేను వెంబడించుచున్నారు, మరియు వారు వాగ్దాన దేశమునకు వారి మార్గములో ఉన్నారు. ఈ రాత్రి, సంఘమునకు అది అందమైన సాదృశ్యముగా ఉన్నది, అదే ఆత్మ ద్వారా నడిపించబడుచూ, వాగ్దాన దేశమునకు మన మార్గములో ఉన్నాము, దేవుడు చెప్పినట్లు అవే సూచనలు మరియు అద్భుతములు జరుగుచున్నవి.
23 ఇప్పుడు గమనించండి. పిదప, వారు పాపమనే అరణ్యమునకు వచ్చారు. ఆ—ఆ జలములు “చేదుగా” ఉన్నవి, మారా. దేవుడు ఎందుకని వారిని చేదు నీళ్ళ యొద్దకు నడిపించాడు? ఆయన వారిని మంచి నీళ్ళ యొద్దకు నడిపించియుండేవాడు అన్నట్లు అగుపించుచున్నది. కానీ ఆయన వారి విశ్వాసమును ఋజువు చేయగలుగునట్లు ఆయన వారిని చేదు నీళ్ళ యొద్దకు నడిపించాడు. ఆయన దానిని చేయుటకు ఇష్టపడతాడు. శ్రమలు మీ మీదికి వచ్చుటకు అనుమతించడానికి ఆయన ఇష్టపడతాడు, తద్వారా ఆయన తన ప్రేమను మరియు తన శక్తిని మీకు చూపించుటకైయున్నది. ఈనాడు, దేవునియొక్క అద్భుత-కార్యములను, నమ్మని ప్రజలు, శ్రమలు వచ్చినప్పుడు, వారు కేవలం ఆశలు వదిలేసుకొని మరియు ఎలా వెళ్ళిపోతారు కదా? కానీ “దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు” అని మనము నమ్ముతాము. ఆయన…దేవుడు…
24 దీనిని వినండి. అవే పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుడు అదే విధంగా పని చేయకపోతే, అప్పుడు దేవుడు తన ప్రజలపట్ల పక్షపాతిగా ఉన్నందుకు దోషియౌతాడు. దేవునియొక్క సార్వభౌమాధికారము, ఆయన మొదటి సందర్భములో పని చేసినట్లుగానే, ప్రతి సందర్భంలోనూ పనిచేయాలని ఆయనను కోరుచున్నది, లేదంటే ఆయన మొదటి సందర్భములో పనిచేసినప్పుడు ఆయన తప్పైయున్నాడు. దేవుడు మొదటి సందర్భములో పనిచేసిన అదే విధానములో పనిచేయకుండా, ఆయన రెండవ సందర్భములో భిన్నంగా పనిచేస్తే, అప్పుడు ఆయన మొదటి సందర్భములో పనిచేసినప్పుడే ఆయన తప్పుగా పనిచేసినట్లవుతుంది. పాత నిబంధనలో దేవుడు రోగులను స్వస్థపరచినట్లైతే, ఆయన దానిని క్రొత్త నిబంధనలోను మరియు ఈ దినములో కూడా దానిని చేయవలసియున్నాడు, లేదంటే ఆ వెనుక వారిని స్వస్థపరచినప్పుడు ఆయన తప్పు చేసినట్లే. ఆయన ప్రతిసారి, ఒకే విధంగా పని చేయవలసియున్నాడు. మరియు అదే విశ్వాసము ఆ పరిస్థితిని కలుసుకున్నప్పుడు, ఆయన దానిని చేస్తాడు. తప్పు మనలోనే ఉన్నది, దేవునిలో కాదు. ఎందుకనగా ఆయన కొందరి మీద, మరియు అనేకుల మీద, అద్భుతమైన మహత్కార్యములను చేయడాన్ని మనము చూస్తున్నాము. మనము దానిని ఎరిగియున్నాము. “అది ఆ విధంగా కాదు,” అని విమర్శకుడు చెప్పలేడు. ఎందుకనగా అది దానిని రుజువు చేయుటను మనము చూస్తున్నాము, మరియు అదిగో అది అక్కడే ఉన్నది.
25 వారు “నాకు ఒక అద్భుతమును చూపించుము,” అని అంటూ ఉండేవారు. ఇక మీదట వారు ఎంతమాత్రము అట్లనలేరు. విజ్ఞానశాస్త్రము ఇక మీదట అట్లనలేదు. మనము శాస్త్రీయ ప్రపంచానికి ఖచ్చితంగా నిరూపించగలము. మరియు ఒక సహజాతీతమైనది, ఒక అగ్నిస్తంభము రూపములో, మనతో ఉన్నాడని శాస్త్రీయ ప్రపంచము సాక్ష్యమిచ్చినది. ఇదిగో, సరిగ్గా ఇక్కడే ఆయనయొక్క చిత్రపఠమున్నది, మరియు ఈ రాత్రి, వాషింగ్టన్, డీసీలో ఒకటి వ్రేలాడుచున్నది. అది అదే క్రీస్తైయున్నాడు.
26 కావున, కొంతకాలం క్రితం, పరిచర్య చేసే నా సహోదరులు నాకు ఇట్లు చెప్తుండేవారు, “ఓ, సహోదరుడా బ్రెన్హామ్, అది దయ్యము. దానితో నీవు మోసపోవద్దు.” నన్ను భయపెట్టారు.
27 మరియు దేవుడు వచ్చి మరియు దానిని, అనగా, “ఆయన అదే యేసు, అది ఆయనే,” అని బయలుపరిచేవరకు నేను దానిని బోధించలేదు. ఓ, అప్పుడు దానిని నా నుండి కుదిపివేయుటకు ప్రయత్నించండి? దానిని చేయలేరు. ఏలయనగా, అది లేఖనమైయున్నది. అది దేవునియొక్క వాక్యమైయున్నది. అది కేవలం వదులుగానున్న ఒక అనుభవము కాదు. అది దేవునియొక్క వాక్యము ద్వారాను మరియు దేవునియొక్క నిత్యమైన ధన్యకరమైన వాగ్దానము ద్వారాను బలపరచబడిన ఒక అనుభవమైయున్నది.
28 ఇపుడు, పిదప, ఇక్కడ అతడు ఇట్లు చెప్పాడని, మనము గమనించాము.
ఏలయనగా కొందరు, విన్నప్పుడు, వారు కోపము పుట్టించిరి:…
నిశ్చయంగా. ఒక పరీక్ష జరిగే చోటుకు వారు వచ్చిన ప్రతీసారి, వారు విసుగుచెందారు. అప్పుడు వారు ఏమి చేస్తారు? వారు వదులుగా అయిపోతారు, మరియు విసుగుకుంటారు, మరియు వెనుకకు తిరగాలనుకుంటారు, మరియు ఇట్లంటారు, “ఇది నాకే ఎందుకు జరిగినది?”
29 వింతైన విషయమేమిటంటే, ఈ ఉదయమున, నేను బోధించగలిగినంత గట్టిగా నేను బోధించిన తరువాత, అనేకమంది బలిపీఠము నొద్దకు వచ్చి, “ఇది నాకే ఎందుకు సంభవించుచున్నది?” అని దానిని ప్రశ్నించారు. అది ఎలా వెళ్తుందో మీరు చూశారా? అది ప్రజలయొక్క తల మీదుగా వెళ్ళుచున్నది. ప్రజలారా, అది అదే విధంగా ఉన్నది.
30 యేసు ఇట్లన్నాడు, “మీకు కన్నులుండియు, మీరు చూడలేరు.” ఆయన దానిని శిష్యులతో అన్నాడు.
31 వారు ఇట్లన్నారు, “ఇదిగో, ఇప్పుడు నీవు స్పష్టముగా మాట్లాడుచున్నావు. ఇప్పుడు మేము నమ్ముచున్నాము. ఏ మనుష్యుడు నీకు ఏమియు బోధించనవసరం లేదు, ఎందుకనగా దేవుడు దానిని నీకు చూపించును.”
32 ఆయన ఇట్లన్నాడు, “ఇంత కాలము తరువాత, మీరిప్పుడు నమ్ముచున్నారా?” చూశారా?
33 మీరు, దేవుడిని ఏదియు ప్రశ్నించకూడదు. “ఏలయనగా నీతిమంతుల అడుగుజాడలు యెహోవా చేతనే స్థిరపరచబడును.” మరియు మిమ్మల్ని ఋజువు చేయుటకే, ప్రతీ పరీక్ష మీ మీద పెట్టబడుచున్నది. మరియు బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, “అవి మీకు సువర్ణము కంటె ఎంతో ప్రశస్తమైనవి.” కాబట్టి దేవుడు మీకు కొన్ని స్వల్పమైన బాధలు కలుగుటకు అనుమతించినట్లైతే, గుర్తుంచుకోండి, అది మిమ్మల్ని సరిదిద్దుటకేయైయున్నది. “దేవునియొద్దకు వచ్చు ప్రతి కుమారుడు మొదటిగా దేవునిచేత శిక్షింపబడి, మరియు పరీక్షించబడి, మరియు బాల-శిక్షణ పొందవలసియున్నాడు.” ఎటువంటి మినహాయింపులు లేవు. “వచ్చు ప్రతి కుమారుడు.” మరియు మీరు ఎటువంటి వైఖరిని తీసుకొంటారో చూడటానికి ఈ బాధలు సంభవిస్తున్నవి, తీసుకొనిరాబడుచున్నవి. చూశారా? అది దేవుడు, ఈ ఋజువు చేయు-స్థలములో ఉండుటయైయున్నది. భూమి అంతయు అదేయైయున్నది, ఋజువు చేయు-స్థలమైయున్నది, మరియు ఆయన మిమ్మల్ని ఋజువు చేయుటకు ప్రయత్నిస్తున్న చోటుయైయున్నది.
34 ఇప్పుడు, మనం ముందుకు వెళ్తుండగా వినండి. మరియు నేను దానియొక్క చివరి భాగమును చెప్పగోరుచున్నాను.
మరియు ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశింపరని ఎవరిని గూర్చి ఆయన ప్రమాణము చేసెను,…
ఇపుడు, ఈ రాత్రి, మనము అక్కడికే రాబోవుచున్నాము.
…ఆయన విశ్రాంతిలో, విశ్వాసముంచని వారి గూర్చియే గదా?
కాగా అవిశ్వాసము చేతనే…వారు ప్రవేశించలేకపోయిరని మనము గ్రహించుచున్నాము.
35 ఇప్పుడు, పాపము అనగా ఏమిటి? అవిశ్వాసము. ఒక అగ్నిస్తంభములో, దేవుడు వారి యొద్దకు వచ్చాడు; తన ప్రవక్తను పంపి, అతడిని అభిషేకించి, ప్రజల ముందు చేయుటకు అతడికి సూచనలను ఇచ్చాడు. మరియు అప్పుడు అగ్నిస్తంభము, ప్రవక్త ద్వారా, వారిని బయటకు నడిపించినది. వారు ఎదుర్కున్న ప్రతి పరిస్థితిలో, వారు సణుగుతూ మరియు వారు మోషేలో కనుగొన్న ప్రతి చిన్న తప్పును చెప్పడం ప్రారంభించారు, వారు అతడిని గద్ధించడము మరియు అతనికి విరోధముగా గొణగడం ప్రారంభించారు. మరియు దేవునికి కోపము వచ్చినది, ఎందుకనగా వారు పాపము చేయుచున్నారని ఆయన చెప్పాడు.
36 వారు వినియుండవలసి యున్నది. కానీ, దానికి బదులుగా, వారు హేతువును విన్నారు, “అది ఎలా సంభవించగలదు? ఈ విషయాలు ఎలా జరుగగలవు?” ఆయన దేవుడైయున్నట్లైతే, సమస్తమూ సాధ్యమే. మరియు ఆయనను ప్రేమించువారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడు.
37 ఇపుడు మనమిక్కడ ఒక గొప్ప పఠనములోనికి వెళ్ళుచున్నాము, అది, ఏమిటనగా, “విశ్రాంతి,” సబ్బాతు. ఇప్పుడు, వారి ప్రయాణములో వారు యాత్రికులైయున్నారు. చూశారా? వారు దిగువున ఐగుప్తులో, నాలుగు వందల సంవత్సరములు ఉన్నారు, బానిసత్వములో ఉన్నారు. మరియు ఇప్పుడు ఆయన వాగ్దాన ప్రకారము, దేవునియొక్క అద్భుతముల ద్వారా వారు బయటకు తీసుకురాబడుచున్నారు. మరియు వారు వాగ్దాన దేశమునకు తమ మార్గములో ఉన్నారు. మరియు ఇక్కడ వారి మధ్యన, ఒక సహజాతీతమైన వెలుగు ప్రత్యక్షమై, మరియు వారిని నడిపించడం ప్రారంభించినది.
38 ఇప్పుడు, ఎవరో ఇట్లంటారు, “ఇప్పుడు, ఇక్కడ చూడండి, ఈ మోషే ఎవరు? నిన్ను మా మీద అధికారిగా ఎవరు నియమించారు? నీవు మాలో ఒకడివి కాదా? మాకు యజమానిగా ఉండుటకు నిన్ను ఇక్కడ ఎవరు పెట్టారు? మా సంఘకాపరి కంటే నీకు ఎక్కువ తెలుసని నీవు అనుకుంటున్నావా? యాజకుని కంటే నీకు ఎక్కువ తెలుసని నీవు అనుకుంటున్నావా? ఈ దినములోని, మన మతస్థుల కంటే నీవు—నీవు తెలివైనవాడవని నీవు అనుకుంటున్నావా?” దానితో ఎటువంటి సంబంధమూ లేదు.
ఆ కదలికలో ఆయన ఉన్నాడని నిర్థారించుచూ, ఆ అగ్నిస్తంభములో ఉన్నది, దేవుడే. ఎవరు తెలివైనవారు మరియు ఎవరు తెలివైనవారు కారు అనేది ఏ వ్యత్యాసమును కలిగించలేదు. అది దేవుడు వారి యెదుట ఉంచినదానిని వెంబడించాలనే ఆలోచనయైయున్నది.
39 అంతెందుకు, శరీరసంబంధంగా చూసినంతమట్టుకు, దేవుని వాక్యము ద్వారా ఆ పిల్లలను విడిపించుటకు ప్రయత్నిస్తూ, ఒక గుంపు ప్రజలను అరణ్యములోనికి తీసుకొనివెళ్ళినప్పుడు, మోషే ఒక వెఱ్ఱి కార్యమును చేసాడు. అతడు తనయొక్క…ఏమిటీ, వారు కలిగియున్నదానంతటికీ అతడు వారసుడైయున్నాడు. అతడు, ప్రపంచంలో ఉన్న సైన్యమునంతా, తన ఆధీనములో కలిగియున్నాడు. మరియు అదిగో అతడు అక్కడ, ఒక గొప్ప సైన్యాధిపతియైయున్నాడు. మరియు తరువాత జరగబోయేది ఏమిటంటే, అతడు రాజు కాబోవుచున్నాడు, ఐగుప్తునకు ఫరో కాబోవుచున్నాడు. ఇంకేమిటీ, అతడు కేవలం సింహాసనమునెక్కి, మరియు ఇట్లు చెప్పగలడు, “మంచిది, పిల్లలారా, తిరిగి మీ గృహమునకు వెళ్ళిపోండి.” అతడు ఒక ఫరో గనుక, అది దానిని పరిష్కరిస్తుంది. కానీ మోషే…
40 ఓ, ఇదిగో విషయం ఇక్కడున్నది. మోషే, విశ్వాసము ద్వారా, దేవుని వాగ్దానమును చూశాడు. మరియు ప్రభువుయొక్క దూత అతనియొద్దకు వచ్చాడు, మరియు అతడు, నలభై ఏండ్లు ఆ ఐగుప్తు బోధకుల ద్వారా నేర్చుకున్నదాని కంటే, ఐదు నిమిషాలు ఆ దూతయొక్క సన్నిధిలో దేవుని గురించి ఎంతో ఎక్కువ తెలుసుకున్నాడు. ఆయన ఉన్నవాడని అతడు తెలుసుకున్నాడు. సహజాతీతమైనది చేయబడుటను అతడు చూశాడు.
41 ఆయన ఇట్లు చెప్పాడు, “మోషే, నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు ముందుగా వెళ్తాను.” మరియు వారు గ్రహించారు. మరియు అతడు చేయుటకు ఆయన అతడికి సూచనలను ఇచ్చాడు.
42 ఇప్పుడు, వారు విశ్రాంతి దేశమునకు వారి మార్గములో ఉన్నారు. దేవుడు వారి కొరకు ఒక విశ్రాంతిని కలిగియున్నాడు, అది ఎక్కడైతే వారు…వారిని తరుముతూ మరియు వారితో పనులు చేపించుటకు, వారిపై అధికారులు ఉండరో, అటువంటి ఒక చోటుయైయున్నది.
43 ఈనాడు మనము సంఘమును చూచి, మరియు సంఘమును దానియొక్క స్థితిలో కనుగొనుచుండగా, అది ఎంతో చక్కని దృశ్యమైయున్నది. దేవుని ఆత్మ ద్వారా జన్మించిన ప్రతి మనిషి లోకమును తృణీకరిస్తాడు, “మరియు మీరు లోకమునైనను లోకపు సంగతులనైనను ప్రేమిస్తున్నయెడల, దేవుని ప్రేమ మీలో లేనే లేదు.” బైబిలు చెప్పినది అదేయైయున్నది. మరియు ఒక నిజమైన యాత్రికుడు, తన దారిలో ఎదురయ్యే, లోకపు సంగతులను ద్వేషిస్తాడు. పురుషులు త్రాగుటను చూడటం అతడు ఇష్టపడడు. పురుషులు ధూమపానం చేయడాన్ని చూడటం అతడు ఇష్టపడడు. ఆ పొట్టి చెత్త బట్టలను ధరించుకొని స్త్రీలు వీధుల్లో తిరగడాన్ని చూడటానికి అతడు అసహ్యించుకుంటాడు. జూదమాడుటకైనా మరియు పేకాట పార్టీలకైనా వెళ్ళడానికి అతడు అసహ్యించుకుంటాడు.
44 మరియు నిన్న, సహోదరుడు టోనీ…లేదా సహోదరుడు ఉడ్ మరియు నేను వీధిలోనుండి వచ్చుచుండగా, మరియు ఇంకొంతమంది, కొంతమంది పురుషులు…అక్కడ లూయివిల్‌లో ఒక చిన్న స్త్రీ, వీధిగుండా వచ్చుచున్నది, అందముగా కనబడుచున్న ఒక స్త్రీ, భయంకరమైన వస్త్రములను ధరించుకొనియున్నది; నడుముకి కొంచెం పైన, మరి ఆమె నడుముకి ఇరువైపులా, ఒక చిన్న రిబ్బను కట్టబడియున్నది, మరియు ఆమెకు ముందువైపున ఒక చిన్న గుండ్రటి వస్త్రపు ముక్క ఉన్నది, ఒక దారముతో వెనుకకు కట్టబడియున్నది. ఆ వీధిగుండా, భయంకరంగా నడుచుకుంటూ వస్తున్నది, మరియు వీధిలో ఉన్న ప్రతి పురుషుడు ఆమె వైపు చూస్తున్నాడు. నేను ఇట్లన్నాను, “ఆమెను ఆ విధంగా చూసిన ప్రతి పురుషునితో, ఆమె వ్యభిచరించినందున, ఆమె దేవుని దృష్టికి దోషిగా ఉన్నదని ఆమె గ్రహించడంలేదు. మరియు ఆ పురుషులతో వ్యభిచరించినందుకు తీర్పు దినమున ఆమె జవాబు చెప్తుంది.”
45 యేసు ఇట్లన్నాడు, “ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, ఇదివరకే ఆమెతో వ్యభిచారాము చేసినవాడగును.” అది నిజము.
46 కావున, మీరు చూడండి, సహోదరుడు ఉడ్ నాతో ఇట్లన్నాడు, “సహోదరుడా బ్రెన్హామ్, దానిని నీవు ఎలా పరిగణిస్తావు”
47 నేను ఇట్లన్నాను, “అది మానసిక లోపం కావచ్చును లేదా దయ్యము పట్టియుండవచ్చును.” దానిని చేయుటకు రెండే రెండు సంగతులు ఉన్నాయి. ఒక మర్యాదస్తురాలైన, శుభ్రమైన స్త్రీ తనకు దయ్యము పడితేనే తప్ప అటువంటివాటిని ధరించదు. అది ఖచ్చితముగా నిజము.
48 ఇప్పుడు, పరలోకమునకు తన మార్గములోనున్న ఒక యాత్రికుడు, అతడు ఒక భిన్నమైన వాతావరణంలో జీవిస్తాడు. అతడు ఆమె వైపు చూచుటను గూర్చి మీరు చింతించనక్కర్లేదు. అతడు తన హృదయములో దేవుడిని కలిగియున్నట్లైతే, అతడు తన తలను త్రిప్పివేసుకుంటాడు, ఏలయనగా అలాంటి సంగతులకు మిలియన్ మైళ్ళ దూరములో ఉన్నటువంటి ఒక వాతావరణంలో అతడు జీవిస్తున్నాడు. అది నిజము. తీర్పునొద్ద మీరు, ఆ విషయముల గురించి దోషిగా ఉండగోరరు. కావున అతడు తన తలను త్రిప్పుకొని, “దేవా, ఆ స్త్రీపై కనికరము చూపుము,” అని అంటాడు మరియు అతడు వెళ్ళిపోతాడు. మనము మన ప్రయాణములో ఉన్నాము. మనము కనాను దేశమునకు మన మార్గములో వెళ్ళుచున్నాము. దేవుడు మనకు అనుగ్రహించినట్టి నిత్యమైన మరియు ధన్యకరమైన విశ్రాంతికి మనము వెళ్ళుచున్నాము. మరియు ప్రయాణములో, మనము శోధించబడుచున్నాము. మనము అన్ని విధములైన సంగతుల ద్వారా శోధించబడచున్నాము, అయితే శోధించబడుచున్నను పాపము లేనివారిగా ఉన్నాము.
49 ఇప్పుడు గమనించండి, మనము 4వ అధ్యాయమునకు వెళ్ళుచుండగా, “కావున మనము భయము కలిగియుందము.”
ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తామను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మనము, భయము కలిగియుందము,…
50 మీరు దీనిని గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నాను, అదేమిటనగా, మనము కనుగొంటే తప్ప, దేవుడు దానిని మనకు బయలుపరిచితే తప్ప! మనము ఎంతగా సంఘమునకు వెళ్ళినప్పటికి, దానితో ఎటువంటి సంబంధమూ లేదు. దేవుడు ప్రత్యక్షత ద్వారా వచ్చి మరియు తననుతాను మనకు బయలుపరచుకోవలసి యున్నది, మరదే లోకపు కార్యములన్నిటిని బయటకు తీసివేస్తుంది. “ఇప్పుడు, ‘ఇట్లు చెప్పబడియుండగా, ‘నేడు మీరు…’”
51 ఇప్పుడు మనము ఈ—ఈ 4వ అధ్యాయమును ప్రారంభించుకుందాము.
ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తామను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మనము, భయము కలిగియుందము,…
52 ఇప్పుడు గుర్తుంచుకోండి, వారు విశ్రాంతినొద్దకు మార్గములో ఉన్నప్పుడు, అగ్నిస్తంభము వారిని నడిపించినది. ఇప్పుడు మనము దీనిని కనుగొనగోరుచున్నాము, “ఈ విశ్రాంతి అనగా ఏమిటి?”
మనము…ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాము అను వాగ్దానము, ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను, (గమనించండి), ఒకవేళ దానిని పొందకుండ తప్పిపోవునేమో అని మనము భయము కలిగియుందము.
53 ఇపుడు, ఇదిగో ఇదియే వాగ్దానము. మనము దేని గురించి భయపడాలంటే: మనకు ఒక వాగ్దానము నిలిచిలేదా అని కాదు. అయితే ఒక వాగ్దానము ఉన్నది! మరియు పిదప, తదుపరి విషయం ఏమిటంటే, దానిని పొందుకోకుండా తప్పిపోకూడదు.
54 ఇప్పుడు, ఆలోచన ఏమిటనగా, మనము విశ్రాంతినొద్దకు మన మార్గములో ఉన్నట్లైతే, ఆ విశ్రాంతి ఏమిటి? అది ఎక్కడ ఉన్నది? అది సంఘములో చేరడమైయున్నదా? అది ఒక ఫలానా విధానములో బాప్తిస్మము పొందడమైయున్నదా? అది పట్టణములోని అతి గొప్ప సంఘములో సభ్యునిగా చేరడమైయున్నదా? మెరుగైన బట్టలను ధరించడమైయున్నదా? అది విద్యయైయున్నదా? మనము దానిని చెప్పుకునే విధంగా, పనిని మానేసి మరియు కేవలం కూర్చొని, మన మిగిలిన జీవితమంతా విశ్రాంతి తీసుకొనునట్లు, అది డబ్బైయున్నదా? అది అది కాదు.
55 బైబిలు గ్రంథము అది ఏమిటని చెప్తుందో మరియు మనము దానిని ఎలా పొందుకుంటామని చెప్తుందో వినండి.
ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తామను వాగ్దానము, ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను, ఒకవేళ దానిని పొందకుండ తప్పిపోవునేమోనని మనము భయము కలిగియుందము.
వారికి ప్రకటింపబడినట్లు, మనకును (అనగా అప్పుడున్న ఆ దినమున) సువార్త ప్రకటింపబడినది:…
సువార్త అనగా ఏమిటి? శుభవార్తయైయున్నది. ఐగుప్తులో ఉన్నవారియొద్దకు శుభవార్త వచ్చినది, అదేమిటనగా, “దేవుడు ఒక విమోచకుడిని పంపించాడు, మరియు ఆయన మనలను బయటకు తీసుకెళ్ళి మరియు వాగ్దాన దేశమునకు తీసుకొని వెళ్ళబోవుచున్నాడు అనునదైయున్నది.”
56 ఇప్పుడు మనకు శుభవార్త, ఏమిటనగా, “దేవుడు ఒక విమోచకుడిని, అనగా పరిశుద్ధాత్మను పంపించాడు, మరియు మనము వాగ్దాన దేశమునకు మార్గములో ఉన్నాము అనునదైయున్నది.” ఇప్పుడు ప్రజలు దానిని సిద్ధాంతములుగాను సంఘశాఖలుగాను తయారు చేశారు, అయితే దేవుడు ఇంకనూ, మన విశ్రాంతిని, “పరిశుద్దాత్మగా ఉంచాడు.”
57 గమనించండి.
…వారికి ప్రకటింపబడినట్లే…సువార్త మనకును ప్రకటింపబడినది: గాని ప్రకటింపబడిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను, ఆ…
గుర్తుంచుకోండి:
…ప్రకటింపబడిన వాక్యము, దానిని వినిన వారియందు విశ్వాసముతో జతచేయబడలేదు గనుక అది వారికి నిష్ప్రయోజనమైనదాయెను.
58 ఓ, నా సహోదరులారా, నన్ను ఇక్కడ ఒక్క నిమిషం ఆగనివ్వండి. వాక్యము ఎంతగా ప్రకటింపబడినప్పటికినీ, అది ప్రకటింపబడిన విధానము మీకు ఎంతగా నచ్చినప్పటికినీ, స్వయంగా మీరే దానిలో పాలిభాగస్తులు అయ్యేంతవరకు అది మీకు రవ్వంతైనా మేలు చేయదు.
…వినిన వారి చేత విశ్వాసముతో జతచేయబడనందున.
59 వారు మోషేయొక్క అద్భుతములను చూశారు. వారిట్లన్నారు, “అవి చాలా బాగున్నవి.” మరియు వారు దాటి వెళ్ళిపోయారు. అతడు అద్భుతములు చేయుటను వారు—వారు చూశారు. మరియు వారు ఆ అగ్నిస్తంభమును చూశారు, లేదా, బహుశా వారు దాని గురించి మాట్లాడుటను విన్నారు. “ఓ, అది మంచిదే.”
60 కానీ అది వ్యక్తిగత విశ్వాసముతో జతచేయబడలేదు. ఎందుకనగా వారు అరణ్యమునకు వెళ్ళిన వెంటనే, వారు (ప్రతీ ఒక్కరు) సణగడం మొదలుపెట్టారు. మరియు దేవుడు ఇట్లన్నాడు, “వారు సందేహించినందున, అది పాపమైయున్నది.” దేనిని సందేహించకండి. నమ్మండి. సందేహించవద్దు, పరిస్థితి ఎంత కఠినమైనదై యున్నప్పటికి, దానిని నమ్మండి.
61 ఇప్పుడు వారు సణగడం మొదలుపెట్టారు, మరియు దేవుడు వారిని పడగొట్టాడు. మరియు పిదప ఆయన, తన ఉగ్రతలో, ఇట్లు ప్రమాణము చేశాడు, “వారెన్నడూ ఆయన విశ్రాంతిలో ప్రవేశింపరు.” మరియు ఇక్కడ బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, అది ఆ—ఆ 3వ అధ్యాయములో ఉన్నదని నేను నమ్ముచున్నాను, “అరణ్యములో వారి శవములు రాలిపోయినవి.”
62 3వ అధ్యాయము మరియు 17వ వచనము.
అయితే నలభై సంవత్సరాలు ఎవరివలన ఆయన దుఃఖపడెను? ఎవరి శవములైతే అరణ్యములో రాలిపోయినవో,అట్టి పాపము చేసినవారి వలనే కదా?
63 మరియు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారందరిలో, కేవలం ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశములోనికి వెళ్ళారు. గతించిపోయిన దినములలో, జలప్రళయపు ప్రపంచమంతటిలో ఉన్న, కోట్లాది మందిలో, ఎనిమిది ఆత్మలే రక్షించబడినవి. “ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, మరియు దాని కనుగొనువారు కొందరే.”
64 కొంతమంది ప్రజలు ఇట్లంటారు, “అలాగైతే, సహోదరుడా బ్రెన్హామ్, అక్కడ ప్రత్యక్షమవుతారని బైబిలు చెప్పినట్టి ఈ వేలకొలదిమంది సంగతేమిటి?”
కేవలం కాలముగుండా, క్రైస్తవులుగా ఉన్నవారు, ప్రతి తరములో ఎంతమంది చనిపోయారన్నది గుర్తుతెచ్చుకోండి. వారందరు పునరుత్థానము చెందుతారు. అది ఆ శరీరమును తయారు చేస్తుంది. ఈనాడు ఉన్న ఈ ప్రపంచములో, ఈ అమెరికా నుండైనా, లేదా వేరే ఏ చోట నుండైనా, ఒక వంద బిలియన్ మంది బయటకు వస్తారని మీరు అనుకుంటున్నారు. బయటకు వచ్చేవారు ఒక యాభై మంది కూడా ఉండకపోవచ్చును. అయితే ఆ గొప్ప విమోచించబడిన సంఘము ధూళిలో ఉండి, వేచియున్నది. వారు మట్టిలో విశ్రాంతి పొందుచున్న దేవునియొక్క ఆభరణములైయున్నారు. కానీ వారి ఆత్మలు దేవునియొక్క బలిపీఠము క్రింద ఉన్నవి. వారు వారియొక్క సరియైన స్థానములో లేరు. వారు ఒక శరీరములో ఉన్నారు, వాస్తవమే, అయితే ఒక థియోఫనీయైయున్నది. మరియు వారు దేవునికి ఇట్లు మొఱ్ఱపెట్టుచున్నారు, “ఎంత కాలము?” వారు ఒకరినొకరు చూసుకోగలరు, కాని వారు ఒకరితోనొకరు కరచాలనము చేసుకోలేరు, అటువంటి ఒక శరీరమైయున్నది.
65 ఒకవేళ మీరు వెళ్ళవలసివస్తే, ఈ రాత్రి మీరు మీ తల్లిని మహిమలో కలుస్తారు, మీరు ఆమెతో కరచాలనము చేయలేరు, ఎందుకనగా ఆమె అటువంటి చెయ్యిని కలిగిలేదు. ఇప్పుడు మీరు అనుభూతిచెందే విధంగా మీరు దానిని అనుభూతి చెందలేరు. ఎందుకనగా, ఈ శరీరములో, దీనిని నియంత్రించుటకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉంచబడ్డాయి. ఆమెయొక్క సన్నిధి ఒక భిన్నమైన వాతావరణంలో అనుభూతి చెందబడుతుంది.
66 అది ఒక భార్య మరియు భర్తవలె ఉన్నది. పరలోకములో పెండ్లి చేసుకోవడమనేది, లేదా, పెండ్లికియ్యబడటమనేది ఉండదు. ఎందుకు? ఎందుకనగా అక్కడ ఒక భిన్నమైన ప్రేమ ఉన్నది. ఎటువంటి లైంగికవాంఛయు లేదు. ఆ సంగతులన్నీ గతించిపోయినవి. మీరు శుద్ధి చేయబడి మరియు స్వచ్ఛముగా ఉన్నారు.
అయితే మీరు ఎన్నడూ ఆ స్థితిలో జీవించలేదు, అందునుబట్టియే మీరు ఆ స్థితి కొరకు సృష్టించబడలేదు. మీరు కేవలం అక్కడ వేచియుంటున్నారు. అయితే మీరు ఎక్కడైతే ఒక పురుషునిగా మరియు ఒక స్త్రీగా సృష్టించబడ్డారో అక్కడికి తిరిగి వచ్చుటకు పరితపించుచున్నారు, మరియు అక్కడ దేవుడు ఆ శరీరమును భూమియొక్క ధూళిలో నుండి పైకి లేపి మరియు దానిని మహిమపరుస్తాడు. అప్పుడు మీరు చూస్తారు, రుచి చూస్తారు, అనుభూతి చెందుతారు, వాసన చూస్తారు మరియు వింటారు, మరియు సహవాసము కలిగియుంటారు. మనకు ఎప్పటికీ తెలియదు…
ఒక దేవదూతయొక్క జీవితాన్ని మనము ఎన్నడూ ఆనందించలేము. మనము దేవదూతలుగా సృష్టించబడలేదు. దేవుడు దేవదూతలను సృష్టించాడు. అయితే ఆయన నిన్ను మరియు నన్ను, పురుషులుగాను మరియు స్త్రీలుగాను సృష్టించాడు. ఆయనయొక్క ధన్యకరమైన రాకడలో, ఎప్పటికీ, మనము ఆ స్థితిలోనే ఉంటాము.
67 ఇప్పుడు, వారు ఎలా తప్పిపోయారో చూడండి, ఎందుకనగా వారు పాపము చేసి మరియు మహిమను పొందలేకపోయారు. దేవుడు వారికి అగ్నిస్తంభమును చూపించాడు. ఆయన వారికి సూచనలను మరియు అద్భుతాలను చూపించాడు. ఆయన వారిని బయటకు నడిపించాడు. వారిని పరీక్షించి మరియు వారిని నిరూపించుటకు, ఆయన వారిని శోధనలోనికి తెచ్చాడు.
68 ఇప్పుడు, మీరు అనేకమైన శోధనలను పొందుకోలేదా? వాటి గురించి సణగకండి. సంతోషించండి. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీ విశ్వాసమును నిరూపించుటకు ప్రయత్నిస్తున్నాడు. పాత నిబంధనలో యోబును చూడండి, ఆయన ఇట్లు చెప్పాడు, “నీతిమంతుడును, దోషములేనివాడునుయైన, యోబు అను నా సేవకుని సంగతి నీవు ఆలోచించితివా? భూమి మీద అతనివంటి వాడెవడును లేడు.”
69 “ఓ,” వాడు ఇట్లన్నాడు, “నిశ్చయంగా, నీవు అతని చుట్టూ కంచె వేసితివి కదా: అతనికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏ చింతలు లేవు. అతనికి ఎటువంటి ఆర్థిక భారములు లేవు, అంతా బాగుగా ఉన్నది. అతనికి ఎటువంటి వ్యాధి, ఎటువంటి బాధ లేదు. అతడిని నాకు అప్పగించుము. అతడు నీ ముఖము ఎదుటనే, నిన్ను దూషించునట్లు నేను చేస్తాను.”
70 ఆయన ఇట్లు చెప్పాడు, “అతడు నీ చేతిలో ఉన్నాడు, కానీ నీవు అతని ప్రాణమును మాత్రం తీసుకొనవద్దు.”
71 ఓ! వాడు అతని ప్రాణమును తీసుకోవడం తప్ప ప్రతిదానిని చేశాడు, కానీ వాడు యోబును కదిలించలేకపోయాడు. తాను స్థిరంగా వాక్యము మీద నిలబడియున్నాడని యోబు ఎరిగియున్నాడు. అది నిజము. మరియు పాతాళమునుండి బయటకు వచ్చిన దయ్యములన్నీ కూడా అతడిని కదిలించలేకపోయినవి, ఏలయనగా అతడు ఆ బలిని అర్పించాడని అతడు ఎరిగియున్నాడు. అతడు నీతిమంతుడు. మరియు వారు అతణ్ణి నిందించారు, ఇట్లన్నారు, “యోబు, నీవు పాపము చేసావు, మరియు దేవుడు నిన్ను శిక్షించుచున్నాడు.” అతడు దేవుడు…అతడు దేవుని ఎదుట పాపము చేయలేదని అతడు ఎరిగియున్నాడు. అతడు నీతిమంతుడని అతనికి తెలుసు. అతడు ఒక మంచి వ్యక్తియైనందున కాదు గాని, అతడు తన స్థానములో దహన-బలిని అంగీకరించుచున్నాడు.
72 మరియు, ఈ రాత్రి, అతడు నీతిమంతుడని అతని జీవితము ఋజువు చేసినదని మనకు తెలుసు. మరియు మీరు…మీ పొరుగువారికి సహాయము చేయుటకు ప్రయత్నించడం వలన మీరు మహిమా గృహమునకు వెళ్ళుటకు ప్రయత్నించడం కాదు, అది మంచిదే. మీరు సంఘములో చేరడంవలన కాదు; అది మంచిదే. కానీ మీకు మీరుగా చేసుకున్న దేనినిబట్టి కాకుండా, మీరు యేసుక్రీస్తుయొక్క నీతిని అంగీకరించుటనుబట్టి మహిమా గృహమునకు వెళ్తారు.
73 ఇప్పుడు, మనము ఇంకా చదువుచుండగా.
వారికి ప్రకటింపబడినట్లు,…(2వ వచనము)…మనకును సువార్త ప్రకటింపబడెను: గాని ప్రకటింపబడిన వాక్యము, దానిని వినిన వారియందు విశ్వాసముతో జతచేయబడలేదు గనుక అది వారికి నిష్ప్రయోజనమైనదాయెను.
వాక్యమును విన్నవారిలో విశ్వాసము లేదు.
74 ఒక్కసారి ఆలోచించండి, ఈనాడు, ప్రభువు నాకు ఇచ్చినటువంటి చిన్న, దీనమైన పరిచర్యలో, ఈ రాత్రి, నలభై మిలియన్ల అమెరికన్లు రక్షించబడియుండాలి. వారు ఏమంటారో మీకు తెలుసా? “ఏమిటి, అది మనస్సులు చదువుటయైయున్నది. అతడు మనస్సులను చదివేవాడు. అటువంటిదేది లేదు! ఏమిటి, అతడు మా సంఘమునకు చెందినవాడు కాదు.” చూశారా? అది కాదు…మీరు ఎంతగా దానిని వాక్యముపై ఉంచి మరియు అది దేవుని వాక్యమని, అది దేవుని వాగ్దానమని నిరూపించినప్పటికినీ, అది సత్యమని విజ్ఞాన శాస్త్రం ఎంతగా ఋజువు చేసినప్పటికినీ, ఇంకనూ వారు నమ్మలేరు. వారు నమ్మలేరని బైబిలు గ్రంథము చెప్పినది.
75 ఇట్లనవచ్చును, “అటువంటప్పుడు దానిని ప్రకటించుటవలన ప్రయోజనమేమిటి?” ఆ దినమున, వారిని ఖండించుటకు, దేవుడు ఒక సాక్షిని కలిగియుండవలసియున్నాడు. వాక్యము వారి మధ్య ప్రకటింపబడి మరియు ఋజువు చేయబడినది, మరి అయినను వారు అజ్ఞానముతో వెళ్ళిపోయారు. తీర్పు తప్ప ఇంకేదియు మిగిలిలేదు. ఒక దేశము తీర్పు తీర్చబడుటకుముందు దానికి—దానికి కనికరము ఇవ్వబడకుండా దేవుడు దానిని న్యాయంగా తీర్పు తీర్చలేడు. ఆయన దేవుడైయున్నాడు. ఆయన దానిని చేయలేడు.
76 ఇప్పుడు మనము ఏమంటాము?
కాగా…జగత్పునాది వేయబడినప్పుడే కార్యములన్నియు సంపూర్ణమైయున్నను, నేను కోపముతో ప్రమాణము చేసినట్టు, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు, అని ఆయన చెప్పిన మాటననుసరించి: విశ్వసించినవారమైన మనము కూడా విశ్రాంతిలో ప్రవేశించియున్నాము.
ఏలయనగా ఏడవ దినమును గూర్చి—గూర్చి ఆయన ఒకచోట ఇట్లు చెప్పియున్నాడు,…
77 ఇప్పుడు, వారి మతమునకు వ్యతిరేకముగా, నేను ప్రజల మనోభావాలను గాయపరచాలనుకోవడం లేదు. అది నా ఉద్దేశ్యం కాదు. బయట సువార్త రంగములలో, నేను కేవలం సాధారణమైన, గొప్ప సువార్తపరమైన, ప్రాథమిక సిద్ధాంతములను బోధిస్తాను. అయితే మందిరములో, ఇక్కడ నా పిల్లల మధ్య, నేను దేనిని సిద్ధాంతము మరియు సత్యము అని అనుకుంటున్నానో దానిని బోధించే హక్కు నాకున్నదని నేను భావిస్తున్నాను. చూశారా? అది సరియేనని నేను అనుకుంటున్నాను.
78 ఇప్పుడు, నేను వేలమంది సబ్బాతును ఆచరించే స్నేహితులను కలిగియున్నాను, వారు సెవెంత్-డే అడ్వెంటిస్టులైయున్నారు. నాకున్న అతి ప్రియమైన స్నేహితులలో కొందరు, వారిలో కొందరు సెవెంత్-డే అడ్వెంటిస్టులైయున్నారు.
ప్రవచనముయొక్క స్వరము, అని పిలువబడే, ఆ—ఆ గొప్ప కదలిక జరిగినది, అయినను, వారు నాకు స్థిరముగా వ్యతిరేకంగా ఉన్నారు. వేదిక మీద నేను ఈ ప్రకటనను చేసి, మరియు, “నేను దేవుడను. మరియు ఆ—మరియు వెంబడించిన ఈ వెలుగు ఒక దూతయైయున్నది, మరియు నేను దేవుడనైయున్నాను. మరియు నేను దేవుడనని ప్రజలకు నిరూపించుటకు గొప్ప కార్యములు చేయడానికి నేను లోకమునకు వచ్చాను,” అని చెప్పానని వారన్నారు. ఇప్పుడు అది, అక్కడ కాలిఫోర్నియాలో, ప్రవచనముయొక్క స్వరము నా గురించి చెప్పిన విషయమైయున్నది. మరి దానిని ఎవరు చెప్పారో గాని, ఆ విధంగా లేని విషయాన్ని చెప్పారని, మీకు తెలుసు.
79 అయితే మొదటి విషయమేమిటంటే, సెవెంత్-డే అడ్వెంటిస్టు సంఘమునకో లేదా ఏ ఇతర సబ్బాతు సంఘమునకో వ్యతిరేకముగా ఆలోచన చేయుట కాదు గాని, కేవలం సువార్త నిమిత్తమే చెప్పుచున్నాను. కొద్ది నిమిషములలో, పెంతెకొస్తు వద్దకు కూడా, మనము, రాబోవుచున్నాము. అవును. నిజము. బాప్టిస్టు, మనము దాని వద్దకు వచ్చి మరియు దేవుడు ఏ సంఘశాఖకు పక్షపాతం వహించడని చూపించబోవుచున్నాము. అది నిజము. ఆయన కేవలం వ్యక్తిగతంగా మాత్రమే దయ చూపిస్తాడు. మరియు ఆయన ఏ సంఘశాఖతోనూ వ్యవహరించడు, తన వాక్య ప్రకారము, ఆయన ఎన్నడూ దానిని చేయలేదు మరియు ఎన్నడూ చేయడు. అయితే ప్రతీ సంఘశాఖలోను వ్యక్తులతో ఆయన వ్యవహరిస్తాడు. అవును, దేవుడు వ్యవహరించేది వ్యక్తులతోనేయై యున్నది.
80 ఇప్పుడు దీనిని చాలా జాగ్రత్తగా వినండి, మరియు ఎన్నడైనా, ఏ సమయములోనైనా, మీకు ఆ ప్రశ్న వచ్చిందంటే, అది పరిష్కరించబడుతుంది. ఇప్పుడు, ప్రభువు మనకు సహాయము చేయును గాక.
81 ఇప్పుడు, జాగ్రత్తగా, “ఏలయనగా…” 4వ వచనము.
ఏలయనగా ఏడవ దినమును గూర్చి ఆయన ఒకచోట ఇట్లు చెప్పియున్నాడు,…
82 ఇపుడు గమనించండి. అతడు సబ్బాతు గురించి మాట్లాడుచున్నాడు. స-బ్బా-తు అనే పదము హె-…“వి-శ్రాం-తి-” అను అర్ధమునిచ్చు హెబ్రీ పదమైయున్నదని ఎంతమందికి తెలుసు? ఇంగ్లీషులో, అది ఎంతమందికి తెలుసు? నిశ్చయంగా. సబ్బాతు అనే పదము వినడానికి హాస్యాస్పదంగా లేదా? అది ఆ విధంగా ఉన్నది.
83 పవిత్రపరచుట అనే పదము వినడానికి హాస్యాస్పదంగా లేదా? పవిత్రపరచుట అనేది ఒక గ్రీకు పదమైయున్నది. పవిత్రపరచుట అనగా “పరిశుద్ధపరచబడుట.” హెబ్రీలో, అర్థము “పరిశుద్ధపరచుట.” గ్రీకులో, అర్థము “పవిత్రపరచుట.” ఇంగ్లీషులో, అర్థము “శుభ్రపరచుటయైయున్నది.”
84 సబ్బాతు అనగా “ఒక విశ్రాంతి దినము” అని అర్థము. పాత సబ్బాతు అదేయైయున్నది, ఒక విశ్రాంతి దినము. మీరు విశ్రాంతి అను పదమును వెదకినప్పుడు, దాని అర్థము “సబ్బాతుయైయున్నది.” మీరు ఒక గ్రీకు బైబిలును కలిగియున్నట్లైతే, మీయొక్క అసలైన వ్రాతప్రతిలో దానిని వెదకండి, మరియు ఆ పదము…మీరు ఒక స్కోఫీల్డ్ బైబిలును కలిగియున్నయెడల, “విశ్రాంతి” పై మీయొక్క ఉపాంత పఠనమును చూసి, మరియు అది మిమ్మల్ని తిరిగి సబ్బాతు వద్దకు తీసుకొనిరాదేమో చూడండి. సబ్బాతు అనగా “విశ్రాంతి” అని అర్థము. మంచిది.
85 ఇపుడు గమనించండి.
ఆయనయొక్క సబ్బాతులో, విశ్రాంతిలో, ప్రవేశిస్తామను వాగ్దానము మనకు ఇంక నిలిచియుండగా, మనము భయము కలిగియుందము,…
86 ఇప్పుడు, అనేకమంది ప్రజలు దినములను పాటిస్తారు, ఎలాగంటే శనివారమును సబ్బాతు దినముగా పాటిస్తారు. మరికొందరు ఆదివారమును ఒక విగ్రహముగా, ఒక ఆరాధనా దినముగా చేస్తారు. మరియు దేవుని కృపను వలన, మరియు దేవుని వాక్యము ద్వారా, ఈ రాత్రి దేవుడు నాకు సహాయము చేస్తే, వారిరువురూ తప్పేనని నేను మీకు ఋజువు చేయగలను. ఆదివారపు ఆరాధికుడు మరియు సబ్బాతును-ఆచరించువాడు, వాక్యప్రకారంగా వారిరువురూ ఖచ్చితంగా తప్పైయున్నారు. మరియు చివరకు, మనము వాక్య ప్రకారమే నడుచుకోవలసియున్నాము, అడ్వెంటిస్టులు చెప్పేదాని ప్రకారము కాదు, లేదా ప్రొటస్టెంటువారు చెప్పేదాని ప్రకారము కాదు, లేదా క్యాథలిక్కులు చెప్పేదాని ప్రకారము కాదు. బైబిలు ఏమి చెప్తుంది అన్నదే ముఖ్యమైయున్నది.
87 ఇపుడు, ఇపుడు గమనించండి.
ఏలయనగా ఏడవ దినము గురించి ఆయన ఒకచోట ఇట్లు చెప్పియున్నాడు,…
ఇప్పుడు మనము ఇలాంటి ఒకదానిని ఉంచి, మరియు దీనిని—దీనిని, “దేవునియొక్క విశ్రాంతి” అని పిలువబోవుచున్నాము, ఏడవ దినము.
88 ఇపుడు గమనించండి. “మరియు దేవుడు…” ఇప్పుడు ఈ లేఖనమును వినండి.
…దేవుడు ఏడవ దినమందు తన కార్యమంతటిని ముగించి విశ్రమించెను.
దేవుడు ఒక సబ్బాతును కలిగియున్నాడు, మరియు ఆ ఏడవ దినము వెయ్యేండ్ల సమయమైయున్నది, వెయ్యేండ్ల పాలనకు ఒక సాదృశ్యమైయున్నది.
ఏలయనగా దేవుడు…తన—తన కార్యమంతటిని ముగించి విశ్రమించెను అని, ఏడవ దినమును గూర్చి…ఆయన చెప్పియున్నాడు.
వ్యక్తిగత సర్వనామము, “తన కార్యములన్నిటిని.” ఆయన ఏడవ దినమున విశ్రమించాడు. అది దేవుడు.
ఇదియునుగాక ఈ చోటుననే (ధర్మశాస్త్రము క్రింద), వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.
89 దేవుడు భౌతికముగా, విశ్రమించాడు, ఎందుకనగా ఆయన ఆరు దినములలో ఆకాశమును మరియు భూమిని చేశాడు, మరియు ఏడవ దినమున ఆయన తన పనియంతటి నుండి విశ్రమించాడు. ఆయన వెయ్యి సంవత్సరాలు విశ్రాంతి తీసుకున్నాడు. ఏలయనగా బైబిలు గ్రంథము, ఇట్లు చెప్పినది, “భూమి మీద ఒక్క దినము పరలోకమందు వెయ్యి సంవత్సరములై యున్నవి; పరలోకమందు వెయ్యి సంవత్సరములు భూమి మీద ఒక్క దినమైయున్నది.” రెండవ పేతురులో లేఖనము దానిని చెప్పుచున్నదని ఎంతమందికి తెలుసు? మంచిది. “దేవుడు ఏడవ దినమున విశ్రమించాడు. మరియు ఒక ఫలానా చోట ఆయన ఈ విధంగా మాట్లాడియున్నాడు.”
90 ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
ఏలయనగా దేవుడు…తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని, ఏడవ దినమును గూర్చి ఒక చోట ఆయన చెప్పియున్నాడు.
ఇదియునుగాక ఈ చోటననే, (ధర్మశాస్త్రము), వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.
వాగ్దాన దేశము నుండి, లేదా, ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు వారు తమ మార్గములో ఉండగా, దేవుడు యూదులకు, ఈ ఏడవ-దినపు సబ్బాతును ఇచ్చాడు.
91 ఇప్పుడు వినండి.
కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయమని చూచుచున్నాము గనుకను, మరియు మొదటిగా సువార్త ఎవరికి ప్రకటింపబడినదో వారు…
ఆ విశ్రాంతి! దేవుడు వారికి ధర్మశాస్త్రమును ఇచ్చాడు, మరియు సబ్బాతు నాలుగవ ఆజ్ఞయైయున్నది.
…అవిశ్వాసము వలన ప్రవేశించలేదు గనుకను:…
92 ఇపుడు గమనించండి. అతడు ధర్మశాస్త్రము గురించి మాట్లాడుచున్నాడు, వారు ఎలా ప్రవేశించారు, ఎలా విశ్వాసముతో జతచేయబడలేదు అన్నదాని గురించి మాట్లాడుచున్నాడు. వారు దానిని కాపాడుకోలేదు. వారు ఇకమీదట పనులలో తమను కష్టపెట్టువారు లేకుండా, విశ్రాంతిలేని రాత్రులు లేకుండా వారి శ్రమలన్నిటి నుండియు మరియు వారి చింతలన్నిటి నుండియు, శాశ్వతమైన విశ్రాంతిని కలిగియుండుటకు, ఒక సబ్బాతు దేశమునకు వెళ్ళబోవుచున్నారనుటకు జ్ఞాపకార్థంగా, సబ్బాతును ఆచరించారు. వారు వాగ్దానము చేయబడిన విశ్రాంతి దేశమునకు వెళ్ళే మార్గములో ఉన్నారు. అది పాలు తేనెలతో ప్రవహించుచున్నది. ద్రాక్షపండ్లు ఎంత పెద్దవిగా ఉన్నాయంటే, ఒక్క గెలను ఇద్దరు వ్యక్తులు తమ భుజములపై మోసుకొని వెళ్ళారు. ఓ, ఎటువంటి ధన్యకరమైన విశ్రాంతి దేశము! కాని వారు అక్కడికి చేరుకున్నప్పుడు, వారియొక్క అవిశ్వాసము వలన వారు దానిని పొందలేకపోయారు. వారు ఎక్కడినుండైతే బయలుదేరారో, ఆ ఐగుప్తునుండి వాగ్దాన దేశమునకు కేవలం నలభై మైళ్ళ దూరమున్నది, అయిననూ వారు ప్రక్కకు త్రిప్పబడ్డారు. మరియు వారియొక్క అవిశ్వాసము వలన, వారు అక్కడికి చేరుకొనుటకు నలభై ఏండ్లు పట్టింది. దేవుడు వారికి వారి ప్రవక్తను ఇచ్చాడు, అతనికి ఆయనయొక్క సూచనను ఇచ్చాడు, అతనికి అగ్నిస్తంభమును ఇచ్చాడు, సూచనలు మరియు అద్భుతాలు చూపించాడు, మరియు వారికి సువార్తను ప్రకటించాడు. మరి వారేమో ఆ చేపలు మరియు ఆ రొట్టెల వెంబడిపడి, అరణ్యములో రాలిపోయారు. “మరియు వారి శవములు అరణ్యములోనే నశించిపోయినవి.”
93 యేసు, ఆ ఊట దగ్గర, ఆయన ఇట్లు చెప్పాడు.
ఇట్లన్నారు, “మా పితరులు, నలభై సంవత్సరములు అరణ్యములో మన్నాను తిన్నారు.”
94 ఆయన ఇట్లన్నాడు, “పరలోకమందున్న దేవునియొద్ద నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. జీవాహారమును నేనే. మోషే మీకు ఆ ఆహారమును ఇవ్వలేదు. నా తండ్రి ఆ ఆహారమును ఇస్తాడు. మరియు పరలోకమందున్న దేవునియొద్ద నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే, వాడెన్నటికీ మరణించడు.” వ్యత్యాసము అదేయైయున్నది.
95 ఇపుడు గమనించండి. వారు ఇట్లన్నారు…“వారు అనేక-సంవత్సరములు అరణ్యములో ఉన్న ఆ బండ నుండి త్రాగారు.”
96 ఆయన ఇట్లన్నాడు, “నేనే ఆ బండను.” ఆయనయొక్క పరిశుద్ధ నామము స్తుతించబడును గాక! “నేనే ఆ బండను.”
ఆయన ఎలా ఆ బండ అయ్యుండగలడు? ఆ బండ ఒక ఆత్మ సంబంధమైన బండయైయున్నది. అది ఇశ్రాయేలు ప్రజలను వెంబడించినది. మరియు మోషే తన చేతిలో ఒక కర్రను కలిగియున్నాడు, అది దేవునియొక్క తీర్పు దండమైయున్నది. మరియు బండను కొట్టమని దేవుడు అతనికి చెప్పాడు, మరియు అతడు ఆ బండను కొట్టాడు. మరియు అతడు అట్లు చేసినప్పుడు, బండ నుండి నీళ్ళు వచ్చాయి. మరియు క్రీస్తే ఆ బండయైయున్నాడు, మరియు పాపమునకు శిక్షగా దేవుడు విధించిన తీర్పు ఆయనపై కొట్టబడినది. “దేవుడు మనందరి దోషమును ఆయన మీద మోపియున్నాడు,” మరియు ఆ దోషము ఆయన హృదయమును బ్రద్దలు చేసినది. మరియు నశించిపోతూ, మరణించుచున్న ప్రజలకు, నీటి కాలువల వలె, ఆయన హృదయము నుండి పరిశుద్ధాత్మ కుమ్మరించబడినాడు.
“అరణ్యములో ఉన్న ఆ బండను నేనే.”
“ఎందుకు,” ఇట్లన్నారు, “నీ ఉద్దేశ్యము…”
97 ఆయన ఇట్లన్నాడు, “మీరు చెప్పినట్టి, ఆ మోషే, నా దినమును చూడాలని ఆశపడ్డాడు. మరియు అతడు దానిని భాగముగా చూశాడు.”
98 అతడిట్లన్నాడు, “ఇప్పుడు, నీవు మోషే కంటే గొప్పవాడవని మాతో చెప్పాలనుకుంటున్నావా? నీవు మోషేను చూశావని చెప్పాలనుకుంటున్నావా? మరి మోషే చనిపోయి ఎనిమిది వందల సంవత్సరాలు గడిచాయి.” ఇట్లన్నారు, “నీవు ఒక దయ్యము పట్టినవాడవని ఇప్పుడు మేము ఎరిగియున్నాము,” మరో మాటలో చెప్పాలంటే, వెర్రివాడవని. “నీవు వెర్రివాడవని మేము ఎరిగియున్నాము.”
99 ఆయన ఇట్లన్నాడు, “అబ్రాహాము పుట్టకమునుపే, నేను ఉన్నాను. మండుచున్న పొదలో ఉన్న ఆ గొప్ప ఉన్నవాడను నేనే. మండుచున్న పొదలో ఉన్న ఆ అగ్నిని నేనే. వారికి ముందుగా వెళ్ళిన ఆ దూతను నేనే.” మరియు ఆయన ఇట్లు చెప్పాడు, “నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను, మరియు నేను తిరిగి దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను.” మరియు ఆయన దేవుని యొద్ద నుండి వచ్చి, శరీరధారియై మరియు మన మధ్య నివసించాడు; తిరిగి అదే అగ్నిస్తంభములోనికి వెళ్ళిపోయాడు.
మరియు రెండు వేల సంవత్సరాల తరువాత, ఈ రాత్రి, ఆయన ఇక్కడ ఉన్నాడు, “నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడు,” అదే కార్యమును చేయుచున్నాడు, తనయొక్క ఆశీర్వదించబడిన పిల్లలను నడిపించుచున్నాడు.
100 మరియు అవిశ్వాసము వలన…అనేకులు వచ్చుచున్నారు. ఇప్పుడు, అతడు ఇట్లన్నాడు, “ఆయన ఒక దినమును నిర్ణయించుకున్నాడు,” దేవుడు తన కార్యమును ముగించిన ఒక దినము. పిదప, “ఆయన ఈ విధముగా, ‘మరియొక దినమును ఏర్పరచుకున్నాడు,’ ఏలయనగా, సబ్బాతులను పాటించేవారు, అమావాస్యలను మరియు అటువంటివాటిని పాటించేవారు వినినయెడల, వారు రావడానికైయున్నది.” అక్కడే అడ్వెంటు సహోదరులు మిమ్మల్ని వెనుకకు తీసుకెళ్ళుటకు ప్రయత్నిస్తారు.
101 ఇప్పుడు మనము చదువుదాము. గమనించండి.
కాగా…ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయమని చూచుచున్నాము, మరియు మొదటిగా సువార్త ఎవరికి ప్రకటింపబడినదో వారు అవిశ్వాసము వలన ప్రవేశించలేదు.
102 ఇప్పుడు, ఈ 7వ వచనము. ఓ, మై! నేను చెప్పుచున్నాను, లేఖనము గణితశాస్త్ర ప్రకారంగా ప్రేరేపించబడినది. నేను చెప్పునదేమనగా, లేఖనము, ప్రతీ విధానములోను ప్రేరేపించబడినదైయున్నది. బైబిలుయొక్క గణితము పరిపూర్ణముగా ఉన్నది.
103 ఈ అమెరికా అది చేసే ప్రతీదానిలో పదమూడవ సంఖ్యను కలిగియున్నదని మీరు గమనించారా? అది పదమూడు కాలనీలుగా స్థాపించబడినదని మీకు తెలుసా? మొదటిగా జెండాలో పదమూడు నక్షత్రములు ఉన్నవని మీకు తెలుసా? అమెరికా చేసే ప్రతీది పదమూడవ సంఖ్యలో ఉన్నదని మీకు తెలుసా? అది బైబిలు గ్రంథములో ప్రకటన 13 లో కనబడుతుందని మీకు తెలుసా? నిశ్చయంగా కనబడుతుంది. ఆ చిన్న మృగము, నీళ్ళలో నుండి పైకి వచ్చిన ఆ గొర్రెపిల్ల, అధికమైన మరియు విస్తారమైన జనసమూహము కాదు,…నీళ్ళలో నుండి వచ్చినది కాదు, కానీ అచ్చట ఎవ్వరూ లేని, భూమిలో నుండి వచ్చినదైయున్నది. అది రెండు చిన్న కొమ్ములను కలిగియున్నది: ప్రభుత్వపరమైన మరియు మతపరమైన అధికారములు. మరియు అది ఒక గొర్రెపిల్లయైయున్నది: మత స్వేచ్ఛ. మరియు కొద్ది సేపటి తరువాత, వారు కలసి వెళ్ళారు మరియు అది ఘటసర్పమువలె మాట్లాడినది, మరియు రోమ్ చేసిన అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేసినది. అది మన దేశమునకు రాబోవుచున్నది. మీరు దానిని వ్రాసుకోండి. సంఘముల సమైఖ్య మరియు క్యాథలిక్ సంఘము ఏకమగుటను మీరు గమనించండి, మరియు ఏమి జరుగుతుందో చూడండి.
104 అగ్నిస్తంభమును వెంబడించే ప్రజలు, నిశ్చయంగా ఒక కఠినమైన సమయమును కలిగియుంటారు, కానీ ఆ సమయములో రూపాంతరమునకు వారు సిద్ధముగా ఉంటారు, అది నిజము, కేవలం వెళ్ళుటకు సిద్ధముగా ఉంటారు. “ఏలయనగా గొఱ్ఱెపిల్ల వారిని జయించును,” అని బైబిలు చెప్పినది, “ఆయనను వెంబడించువారిని, ఏలయనగా వారు ఎన్నుకోబడినవారని, నమ్మకమైనవారని, దేవుని చేత ఏర్పరచబడినవారని పిలువబడినారు.” మనము దీనిని కొనసాగించునట్లు, నేను ఇప్పుడు ఆ ప్రవచనములోనికి వెళ్ళడంలేదు.
105 జాగ్రత్తగా వినండి, 7వ అధ్యాయము…నా భావము 4వ అధ్యాయము, 7వ వచనము. ఏడు అనునది సంపూర్ణతయొక్క సంఖ్యయైయున్నది. మూడు జీవముయొక్క సంఖ్యయైయున్నది. ఏడు అనేది సంపూర్ణతయొక్క సంఖ్యయైయున్నది, మరియు ఇది సంపూర్ణమైన సబ్బాతును ఇస్తుంది.
“మరియు మరలా,” గుర్తుంచుకోండి, ఆయన, “దేవుడు,” ఈ విధంగా మాట్లాడాడు. పిదప ఆయన “ధర్మశాస్త్రము” గురించి ఈ విధంగా మాట్లాడాడు. మరియు పిదప, మరలా, “ఆయన ఒక దినమును నిర్ణయించుకున్నాడు,” మూడవసారి, మూడవ దినము.
మరలా, ఆయన ఒక దినమును, దావీదులో చెప్పుచు, ఒక నిర్దిష్ట దినమును నిర్ణయించుకున్నాడు, ఇంత కాలమైన తరువాత, నేడు;…ఇంత కాలమైన తరువాత, నేడు; నేడు మీరాయన మాట వినినయెడల మీ హృదయమును కఠినపరచుకొనకుడి అని చెప్పబడిన విధంగా ఉన్నది. (గమనించండి.)
…యేసు వారికి విశ్రాంతి (ఒక సబ్బాతును) కలుగజేసినయెడల,…ఆ తరువాత మరొక దినమును గూర్చి ఆయన మాట్లాడియుండడు.
యేసుక్రీస్తుతో కాలములు మారతాయి: ధర్మశాస్త్రము నుండి కృపలోనికి, క్రియలనుండి కృపనొద్దకు, మీరు చేసే ఒకదానినుండి దేవుడు చేసిన కార్యమునొద్దకు, మీ స్వంత యోగ్యతల నొద్దకు లేదా ఆయన యోగ్యత వద్దకు మారినది. అది మారిపోయింది.
106 మోషే ధర్మశాస్త్రముతో, అరణ్యములో నుండి బయటకు వచ్చినప్పుడు, అతడు ఇట్లన్నాడు, “మీరు వ్యభిచారము చేయరాదు. మీరు దొంగిలించరాదు. మీరు నరహత్య చేయరాదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము.” యేసు అరణ్యములో నుండి వచ్చినపుడు…మోషే వచ్చినపుడు, అపవాది అతడిని శోధించినది. మరియు అపవాది అతణ్ణి శోధించిన వెంటనే, అతడు దానికి చెవియొగ్గాడు. మోషే ఒక బలహీనతను కలిగియున్నాడు. అది ఏమిటో ఎంతమందికి తెలుసు? కోపము. మరియు వారు ఆ బంగారు దూడను ఆరాధించుటను అతడు చూసిన వెంటనే, అతడు ఆజ్ఞలను క్రిందపడవేసి మరియు వాటిని విరుగగొట్టాడు, యాజకత్వము బ్రద్దలుచేయబడునని మీకు చూపించుచున్నది. మరియు దేవుడు మరలా వాటిని అతనికి ఇచ్చాడు.
107 అయితే నలభై దినముల ఉపవాసము తర్వాత, యేసు అరణ్యములో నుండి బయటకు వచ్చినప్పుడు, ఆయన ఆకలిగొన్నాడు, ఆయన కలిగియున్న ఒకే ఒక్క బలహీనత అదే. మరియు అపవాది ఆయన యొద్దకు వచ్చి ఇట్లన్నాడు, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము. ఇక్కడ ఒక అద్భుతము చేయుము. నీవు దానిని చేయుటను నన్ను చూడనిమ్ము, మరియు నేను నిన్ను నమ్ముతాను.”
108 యేసు ఇట్లన్నాడు, “‘మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును’ అని వ్రాయబడియున్నది.” వాడు అక్కడ మోషేను కలుసుకోలేదని వాడికి అర్థమైనది, ఏలయనగా ఆయన వాక్యము నొద్దకు వెళ్ళాడు.
109 ఆయనను శిఖరముపైకి, దేవాలయ శిఖరముపైకి, తీసుకెళ్ళి, ఇట్లన్నాడు, “నీవు దేవుని కుమారుడవైతే, క్రిందకు దుముకుము.” మరియు పూతపూసాడు, ఉటంకించలేదు గానీ, లేఖనమును పూతపూసాడు. ఇట్లన్నాడు, “‘నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ, నిన్ను గూర్చి ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించును. ఆయన నిన్ను ఎత్తిపట్టుకొనును,’ అని వ్యాయబడియున్నది.”
110 మరియు యేసు నేరుగా వాక్యము నొద్దకు వెళ్ళి, మరియు వాడిని గద్దించాడు.
111 ఆయనను పర్వతము పైకి తీసుకెళ్ళి మరియు ఆయనకు అమెరికాను మరియు జర్మనీని మరియు స్విట్జర్లాండ్ ను, మరియు ప్రపంచములో ఉండునట్టి, సమస్త దేశములను ఆయనకు చూపించి, “అవన్నియు నావే. నేను వాటితో నాకిష్టమొచ్చినట్లు చేస్తాను,” అని అన్నాడు. మనము యుద్ధములను మరియు ఇబ్బందులను కలిగియుండుటలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. ఇట్లన్నాడు, “నేను వాటితో…” స్త్రీలు ఆ విధంగా వస్త్రధారణ చేసుకొని…మరియు చట్టమునుండి ఎటువంటి ఇబ్బంది లేకుండ కొనసాగుచుండటంలో, ఎటువంటి ఆశ్చర్యము లేదు. వారందరూ దయ్యము చేత పాలించబడుచున్నారు. బైబిలు దానినే చెప్పినది. అపవాది ఇట్లన్నాడు, “అవి నావే. నేను వాటితో నాకిష్టమొచ్చినట్లు చేస్తాను.” ఇట్లన్నాడు, “నీవు నన్ను ఆరాధించినయెడల, నేను అయ్యున్నట్లే నిన్ను కూడా రాజును చేస్తాను.”
112 యేసు ఇట్లన్నాడు, “ప్రభువైన నీ దేవుడిని ఆరాధించి, ఆయనను మాత్రమే సేవింపవలెను.’ అని వ్రాయబడియున్నది, సాతానా పొమ్ము.”
ఎందుకు? ఆయన రాజ్యము వచ్చునప్పుడు, ఈ గొప్ప వెయ్యేండ్ల పాలనలో ఆయన వాటన్నిటికీ వారసుడవుతాడని యేసుకు తెలుసు. “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక.” పొట్టి బట్టలు ఇక ఎంతమాత్రము ధరించబడవు. మద్యపానం ఇక ఎంతమాత్రము ఉండదు. దురాశ ఇక ఎంతమాత్రము ఉండదు. వ్యభిచారము ఇక ఎంతమాత్రము ఉండదు. మరణము ఇక ఎంతమాత్రము ఉండదు. దుఃఖము ఇక ఎంతమాత్రము ఉండదు. ప్రతి దేశమునకు ఆయన వారసుడవుతాడు. అవన్నియు ఆయనవే. అది నిజము. అవి ఆయనవే, మరియు ఆయన వారసుడవుతాడు. అయితే సాతానుడు వాటిని కొంత కాలము వరకు కలిగియుంటాడు, అది, మనము జీవించుచున్నట్టి ఈనాడైయున్నది.
113 “అయితే, ‘నేడు, ఇంత కాలమైన తరువాత,’ అని ఆయన ఒక దినమును పరిమితం చేశాడు. మీ హృదయమును కఠినపరచుకొనకుడి అని చెప్పెను.”
ఏలయనగా యేసు వారికి విశ్రాంతినిచ్చినట్లైతే…ఆ తరువాత మరొక దినమును గూర్చి ఆయన మాట్లాడియుండడు.
114 నా అడ్వెంటిస్టు సహోదరుడా, దానిని చూడు. పౌలు ఇక్కడ, చెప్పాడు. మరియు పౌలు, గలతీ 1:8 లో ఇట్లన్నాడు, మీరు లేఖనములను వ్రాసుకుంటున్నట్లైతే, గలతీ 1:8 అయ్యున్నది, “పరలోకము నుండి ఒక దూత వచ్చి మరియు నేను ప్రకటించిన ఈ సువార్తగాక మరే ఇతర సువార్తనైనా ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవును గాక.” పౌలు ఇట్లన్నాడు, “యేసు వారికి ఒక విశ్రాంతి దినమును ఇచ్చియుంటే…”
115 ఆయన కొండ మీదనుండి దిగి వచ్చినప్పుడు, చూడండి. అప్పుడు ఆయన క్రిందకు దిగి వచ్చాడు. ఆయన అపవాదిని జయించాడు. ఆయన అభిషేకించబడి, తన పరిచర్య కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇట్లన్నాడు, “ఆ పాతకాలపు వారు, వారు, ‘మీరు నరహత్య చేయకూడదు,’ అని చెప్పుటను మీరు వినియున్నారు, అయితే నేను మీతో చెప్పునదేమనగా, కారణము లేకుండా తన సహోదరుని మీద కోపగించువాడు ఇదివరకే నరహత్య చేసియున్నాడు. ఆ పాతకాలపువారు, వారు ఇట్లు చెప్పుటను మీరు వినియున్నారు,” ఈ దినమున, సబ్బాతును-పాటించువారు. “ఆ వెనుక ఆ పాతకాలపువారు, వారు ధర్మశాస్త్రము క్రింద, ‘మీరు వ్యభిచారము చేయరాదు,’ అని చెప్పుటను మీరు వినియున్నారు.” దోషియగుటకు, ఆ క్రియలో ఉండవలసియుండినది. “అయితే నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసియున్నాడు.” భిన్నమైనది! ఆ నాలుగవ ఆజ్ఞను దాటిపోయాడు. అయితే ఆయన వారికి విశ్రాంతిని ఇచ్చాడా?
116 అతడేమి చెప్పాడో మనం చూద్దాము. “దావీదు ఇట్లన్నాడు, ‘ఇంతకాలమైన తరువాత, ఒక పరిపూర్ణమైన విశ్రాంతి ఉండబోతుంది.’” ఏడవ దినమున, దేవుడు తన క్రియలను ముగించి విశ్రమించాడు. ఈ ప్రకారము, దేవుడు సబ్బాతు దినమును దీవించి, మరియు దానిని అరణ్యములో యూదులకు ఇచ్చాడు. వారు ప్రవేశించారు…అవిశ్వాసము వలన, ఎందుకనగా వాక్యము విశ్వాసముతో కలుపబడలేదు. “‘ఇంత కాలమైన తరువాత,’ అని చెప్పుచు దావీదు గ్రంథములో, ఆయన మరలా, ఒక దినమును నిర్ణయించాడు.”
దావీదు మరణించి కొన్ని వందల సంవత్సరాల తరువాత, దావీదు కుమారుడైన, యేసు లేస్తాడు, “మరియు వారు నా స్వరమును వినినయెడల, మీ హృదయమును కఠినపరచుకొనకుడి.” దేవుడు హృదయముతో మాట్లాడబోవుచున్నాడు.
117 ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చదువుచున్న మీ కొరకు, 9వ వచనము. “యేసు వారికి విశ్రాంతిని ఇచ్చియుంటే,” 8వ వచనము, “ఆయన…మరొక దినమును గూర్చి చెప్పకపోవును.”
118 ఒక సబ్బాతు ఉండబోవుచున్నయెడల, ఆదివారమును-ఆచరించుట అనేది ఉండబోవుచున్నయెడల, అప్పుడు ఆయన దాని గురించి చెప్పియుండేవాడు. “ఇప్పుడు ఇక ఏ సబ్బాతు లేదు, ఇక మీదట ఏడవ దినమును ఆచరించుట అనేది లేదు, మీరు ఆదివారమును ఆచరించవలెనని నేను కోరుచున్నాను,” అని ఆయన చెప్పియుంటే, ఆయన దానిని చెప్పియుండేవాడు. పౌలు అట్లు దానిని చెప్పాడు. ఆయన ఇట్లు చెప్పియుండేవాడు, “మీరందరు ఆదివారమున ఆరాధించండి. అది విశ్రాంతియై ఉంటుంది.” సరి, వారు సబ్బాతును ఆచరించవలెనని ఆయన కోరినట్లైతే, ఆయన ఇట్లు చెప్పియుండేవాడు, “కేవలం ఏడవ దినమును ఆచరిస్తూ ఉండండి. అయితే ఇప్పుడు మీరు ఆదివారమును, ఎనిమిదవ దినమును ఆచరించవలెనని నేను కోరుచున్నాను.” లేదు. ఆయన దానిని ఎన్నడూ చెప్పలేదు.
119 అతడు ఇట్లన్నాడు, “యేసు వారికి ఒక దినమును ఇచ్చియుంటే, దానిని గూర్చి ఆయన చెప్పియుండేవాడు కాదా?”
120 ఇప్పుడు 9వ వచనము. సిద్ధపడండి.
కాబట్టి దేవుని ప్రజలకు ఒక విశ్రాంతి నిలిచియున్నది, దేవుని ప్రజలకు ఒక సబ్బాతు-ఆచరించుట ఉన్నది.
ఏలయనగా సబ్బాతున, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క (క్రీస్తు యొక్క) విశ్రాంతిలోనికి ప్రవేశించినవాడు కూడ, తన స్వంత కార్యములను ముగించి, విశ్రమించును.
121 దానిని చూశారా? ఇప్పుడు మనము కొంత లేఖనమును తీసుకొని మరియు దీనిని సమర్ధించుదాము. మంచిది. దేవుడు ఆరు దినములలో లోకమును కలుగజేసినప్పుడు, ఆయన ఏడవ దినమున విశ్రమించాడు, మరియు ఇక ఎన్నడూ పనిచేయలేదు. ప్రభువు నామము స్తుతింపబడును గాక. ఆయన లోకమును నిర్మించాడు, దాని మీద సృష్టిని ఉంచాడు, మరియు విశ్రాంతిలోనికి వెళ్ళాడు; మరియు ఇక ఏ ప్రపంచమును నిర్మించడానికి, మరలా తిరిగి రాలేదు. ఆయన కార్యములను ముగించి, మరియు విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు,…తరువాత, ఆ వెయ్యేండ్ల తరువాత, అప్పుడు పాపము ప్రవేశించినది; అప్పుడు క్రీస్తు ప్రాతినిధ్యము వహించాడు, గొర్రెపిల్ల ప్రాతినిధ్యము వహించాడు. ఇప్పుడు, ఇది ఏడవ-దినపు విశ్రాంతికి సాదృశ్యముగా యూదులకు ఇవ్వబడినది.
ఇప్పుడు, ఆయన మరొక దినమును నిర్ణయించి, దావీదులో చెప్పాడు,…ఇంత కాలమైన తరువాత, మరొక విశ్రాంతి వచ్చుచున్నది.
122 ఇప్పుడు ఆ విశ్రాంతి ఏమిటి? నాతో కలిసి మత్తయి 11వ అధ్యాయమునకు, మరియు పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయము యొక్క చివరి భాగమునకు త్రిప్పండి. అప్పుడే యేసు కొండ మీద తన ప్రసంగమును ముగించాడు, మరియు ఆయన ఏమి చెప్పాడో మీరు చూస్తారు.
123 ఆయన ఇట్లన్నాడు, “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు, తన హృదయమందు, ఇదివరకే ఆమెతో వ్యభిచారము చేసియున్నాడు. కారణం లేకుండా, తన సహోదరుని మీద కోపగించు ప్రతివాడు, ఆ సహోదరుడిని చంపినట్లే.” ఈ విషయములన్నియు చెప్పాడు, మరియు ఆ నాలుగవ ఆజ్ఞను, ఆ సబ్బాతును ఆయన ఎన్నడూ ప్రస్తావించలేదు.
124 ఇప్పుడు ఆయన ముగించుచున్నాడు. మరియు సబ్బాతు దేవునియొక్క గొప్ప వాగ్దానమైయున్నది. అది ఒక విశ్రాంతియైయున్నది. ఇప్పుడు, ఆయన ధన్యతలను ముగించినప్పుడు, ఇప్పుడు ఇక్కడ గమనించండి. పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయములోని 27వ వచనములో, ఆయన ఇట్లు చెప్పుచున్నాడు. అక్కడ, 5వ అధ్యాయములో ఆయన ధన్యతలను బోధించుచున్నాడు.
సమస్త కార్యములు నా చేతికి, నా తండ్రి చేత నాకు అప్పగించబడినవి: నా తండ్రి తప్ప, ఎవరును కుమారుడిని ఎరుగరు;…
చూడండి, ఒకరిని ఎరుగకుండా మీరు మరొకరిని ఎరుగలేరు, ఎందుకనగా ఆయన శరీరములో ప్రత్యక్షపరచబడిన తండ్రియైయున్నాడు.
…కుమారుడు తప్ప, ఎవడును తండ్రిని ఎరుగడు,…
125 ప్రజలు దానిని చూడగలిగితే వాదించకుండా ఉంటారు అన్నట్లు అగుపిస్తున్నది. నిశ్చయంగా. దేవుడు ముగ్గురు వ్యక్తులు కాదు. ఆయన ముగ్గురు దేవుళ్ళైతే, అప్పుడు మనము అన్యజనులమే. వారిలో దేవుడు ఎవరు? వారు, ముగ్గురూ, ఒక్కటే దేవుడైయున్నారు, ఒకే దేవునియొక్క మూడు కార్యాలయములైయున్నారు. అరణ్యములోనున్న ఆ అగ్నిస్తంభములో, పరిశుద్ధాత్మ రూపములో, ఆయన తండ్రియైయున్నాడు. ఆయన కుమారత్వపు కార్యాలయమును ఉపయోగించినప్పుడు, ఆయన కుమారుడైయున్నాడు. “కొంతకాలమైన తరువాత లోకము నన్ను ఇక ఎంతమాత్రము చూడదు; నేను వెళ్ళిపోతాను. నేను మరలా వచ్చి మీతోను, మీలోను, యుగసమాప్తి వరకు సదా ఉంటాను.” చూశారా? ఆయన పితృత్వము, కుమారత్వము, మరియు పరిశుద్ధాత్మ కూడాయైయున్నాడు. పితృత్వము, కుమారత్వము, పరిశుద్ధాత్మ: అనే మూడు వేరు వేరు కార్యాలయములలో పనిచేయుచున్నది ఒకే దేవుడైయున్నాడు. ఎన్నడూ…
మొదటి యోహాను 5:7 లో ఇట్లు చెప్పబడినది, “పరలోకమందు సాక్ష్యమిచ్చువారు ముగ్గురున్నారు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక్కటే.”
126 తోమా ఆయనతో ఇట్లన్నాడు, “ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము.” అది అతడిని తృప్తిపరుస్తుంది.
127 ఆయన ఇట్లన్నాడు, “నేను ఇంతకాలము మీతో ఉన్ననూ, మీరు నన్ను ఎరుగరా?” ఇట్లన్నాడు, “మీరు నన్ను చూసినప్పుడు, మీరు తండ్రిని చూశారు. మరియు, ‘తండ్రిని మాకు కనబరచుము’ అని ఏల చెప్పుచున్నారు?”
128 ఇప్పుడు, ఏకత్వమువారు, ఏకత్వపు ప్రజల గుంపువారు దానిని తీసుకొని, మీ యొక్క ఒక్క చేతి వ్రేలులాగా, తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మను, కేవలం ఒక్కటే కార్యాలయముగా, మరియు ఒక్కటే స్థానముగా చేయుటకు ప్రయత్నించారు. అది తప్పైయున్నది. దేవుడు…యేసే తన స్వంత తండ్రియై ఉండలేడు. ఆయన అయ్యుంటే, అప్పుడు ఆయన ఒక…సరి, ఆయన తన స్వంత తండ్రి ఎలా కాగలడు?
129 మరియు పరిశుద్ధాత్మకు వేరుగా, దేవుడు ఒక మనిషియైనట్లైతే, అప్పుడు ఆయనకు ఇద్దరు తండ్రులు ఉన్నట్లు అవుతుంది. ఏలయనగా బైబిలు, ఇట్లు చెప్పినది, “పరిశుద్ధాత్మ మరియను కమ్మెను మరియు ఆమె గర్భము ధరించెను.” మరియు మత్తయి 1:18లో, అది, “ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది,” అని బైబిలు చెప్పింది. అప్పుడు ఆయన తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మనా లేక దేవుడా? ఇరువురూ, ఒకే ఆత్మయైయున్నారు, లేనియెడల ఆయన రెండు ఆత్మల ద్వారా అక్రమంగా పుట్టినట్లు అవుతుంది.
అది ఒక క్యాథలిక్ సిద్ధాంతమైయున్నది, అది ఎన్నడూ ఒక బైబిలు బోధ కాదు. లూథరన్ సంఘములో ఉన్న అనేక ఇతరమైన కథోలిజం యొక్క సంగతులతో, మార్టిన్ లూథర్ దానిని బయటకు తెచ్చాడు. వెస్లీ దానిని అనుసరించాడు. మరియు అది ఇంకనూ కొనసాగుచున్నది, అయితే అది తప్పైయున్నది. అది సత్యము కాదు. అది ఎన్నడూ కాదు, అది ఎన్నడూ బైబిలు సిద్ధాంతము కాదు. ముగ్గురు దేవుళ్ళను బోధించుటయనేది, ఎన్నడూ బైబిలులోని ఆజ్ఞ కాదు.
ఒక్కడే దేవుడు ఉన్నాడు. యేసు ఇట్లు చెప్పాడు, “ఓ ఇశ్రాయేలువారలారా, వినుడి, నేను ప్రభువైన మీ దేవుడనైయున్నాను, ఒక్క దేవుడను,” ముగ్గురు దేవుళ్ళు కాదు.
130 ఆఫ్రికాలో, వారు తండ్రి కొరకు ఒకసారి, కుమారుని కొరకు ఒకసారి, మరియు పరిశుద్ధాత్మ కొరకు ఒకసారి బాప్తిస్మము ఇస్తారు. మరియు అప్పుడు ఆ యూదుడు వచ్చి, ఇట్లంటాడు, “వారిలో మీ దేవుడు ఎవరు? తండ్రియా, కుమారుడా, లేక పరిశుద్ధాత్మనా, ఎవరు?” వారు, ముగ్గురూ ఒక్కటే. వారు ఒక్కటేనని బైబిలు చెప్పినది.
131 యేసు, దేవుడు నివసించినట్టి ఒక గృహమైయున్నాడు. బైబిలు దానిని—దానిని చెప్పినది మొదటి తిమోతి 3:16, “ఏ వివాదము లేకుండా,” (అనగా, “వాదన” లేకుండా) “దైవత్వమును గూర్చిన మర్మము గొప్పది. ఏలయనగా దేవుడు శరీరములో ప్రత్యక్షమాయెను, దేవదూతలకు కనబడెను, స్వీకరించబడెను…ప్రకటించబడెను, నమ్మబడెను, మరియు మహిమలోనికి చేర్చుకొనబడెను.” దేవుడు అట్లుండెను. బైబిలు ఇట్లు చెప్పినది, “అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును, దానికి అనువాదము ఏమిటనగా, ‘దేవుడు మనతో ఉన్నాడు.’” బైబిలు గ్రంథము, ఇట్లు చెప్పినది, “యేసు, ఆయన శరీరమందు దైవత్వముయొక్క సంపూర్ణత నివసించెను.”
132 మొన్నటి రాత్రి మనము దానిని పొందుకున్నట్లుగా: ఆదియందు, దేవుడు, ఆత్మయైయున్నాడు. మరియు పిదప, దేవుని నుండి, లోగోస్, లేదా థియోఫనీ బయటకు వెళ్ళినది, అది ఒక మనుష్యుని రూపమైయున్నది, దేవుని కుమారుడు అని పిలువబడి, ముంగుర్తుగా ఉన్నది. ఆయన యేసుక్రీస్తులో రావడానికిముందే, ఆయన ఒక శరీరములో, భూమి మీదకు వచ్చాడు. సహోదరుడా, ఇపుడు దానిని ఒక్కసారి దిగమింగుకోండి. నేను దానిని మీకు నిరూపిస్తాను.
133 మోషే ఆయనను చూసినప్పుడు—చూసినప్పుడు. అతడు ఇట్లన్నాడు, “ప్రభువా, నన్ను నీ రూపమును చూడనిమ్ము.” మరియు దేవుడు అతడిని బండలో దాచాడు. మరియు ఆయన దాటి వెళ్ళినపుడు, “అది ఒక మనుష్యునియొక్క వీపు భాగము,” అని అతడు చెప్పాడు. అది ఆ థియోఫనీయైయున్నది. అది ఖచ్చితముగా అదే.
పిదప, ఆ థియోఫనీ శరీరధారిగా చేయబడవలసివచ్చినది. మరొక వ్యక్తి కాదు కానీ, అదే వ్యక్తి, మరణము నుండి ముల్లును బయటకు తీయుటకు, శరీరధారిగా మారవలసివచ్చినది.
ఒక కందిరీగవలెనున్నది, అది కుట్టినప్పుడు అది ముల్లును విడిచిపెడుతుంది. మరియు అది ఎన్నడూ దానిని విడిచిపెట్టలేదు…అది పాపము గనుక అది మానవ శరీరములో ఒక ముల్లును ఉంచగలదు. కానీ, సహోదరుడా, అది ఆ ఇమ్మానుయేలు శరీరాన్ని కుట్టినప్పుడు, అది దాని ముల్లును కోల్పోయినది. అవును, అయ్యా. అది ఝుంకారము చేయగలదు కానీ అది ఇక ఎటువంటి ముల్లును కలిగిలేదు.
134 వారు, అతని తలను నరికివేస్తున్నప్పుడు, పౌలు ఇట్లనుటలో, ఎటువంటి ఆశ్చర్యమూ లేదు, “ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీవు నీకు కావలసినంత శబ్ధము చేయుచూ మరియు ఝుంకారము చేయవచ్చును. సమాధీ, నీ విజయమెక్కడా? అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము అనుగ్రహించు దేవునికి వందనములు.” విషయం అదే.
దానిని చేయుటకు స్వయంగా దేవుడే అవసరమయ్యాడు. ఆయన వచ్చి మరియు శరీరములో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ఆత్మలో తిరిగి వెళ్ళాడు.
135 మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, దేవుడు క్రీస్తులో రాకముందు, ఆయన ఎప్పుడు శరీరధారి అయ్యాడన్నది నీవు మాకు, ఇంకా చెప్పనేలేదు.”
ఒక దినమున, అబ్రాహాము తన గుడారము క్రింద కూర్చొనియున్నప్పుడు, ఇద్దరు దూతలు మరియు దేవుడు, మానవ శరీరములో, నడుచుకుంటూ అతనియొద్దకు వచ్చారు. వారి బట్టలపై ధూళి ఉన్నది మరియు వారు అలసిపోయి ఉన్నారు, మరియు వారు కూర్చున్నారు. మరియు అబ్రాహాము బయటకు వెళ్ళి మరియు ఒక ఆవు వద్దనుండి దూడను దూరంగా తీసుకెళ్ళి, మరియు దానిని చంపాడు. మరియు కొన్ని మాంసపు ముక్కలను చేశాడు. బయటకు వెళ్ళి…శారాతో మొక్కజొన్న పిండిని తీసుకొని దానిని జల్లెడ పట్టించి, మరియు కొన్ని రొట్టెలు తయారు చేపించాడు. మరియు ఆ ఆవు నుండి కొంత వెన్న తీసుకొని, మరియు కొంచెం మజ్జిగను తీసుకొన్నాడు. మరియు దానిని బయటకు తీసుకెళ్ళి అక్కడ ఉంచాడు, మరియు దేవుడు దానిని తిన్నాడు.
136 హల్లెలూయా! ఆ కారణమును చేతనే, “కల్వరి గొఱ్ఱెపిల్లా, నా విశ్వాసము నీ తట్టు చూచుచున్నది.”
137 దేవునికి అది ఒక పెద్ద విషయమని మీరు అనుకుంటున్నారా? పొటాషియంను, కాల్షియంను, మరియు ప్రపంచములోని సమస్తమును కలుగజేసిన దేవుడు, ఆయన అబ్రాహామును దర్శించుటకు క్రిందకు దిగి వచ్చాడు. ఆయన ఇట్లన్నాడు, “నీవు లోకమునకు వారసుడవని చూస్తుండగా, నేను దానిని నీకు తెలియకుండా దాచుతానని నీవు అనుకుంటున్నావా?” ఆమేన్. “నేను దానిని నీకు తెలియకుండా దాచను.” దేవుడు ఒక…
138 మనము పదహారు మూలకాలతో తయారు చేయబడ్డాము. ఆయన కేవలం కొంచెం పొటాష్ ను, మరియు కొంత కాల్షియంను, కొంత పెట్రోలియంను, కాస్మిక్ వెలుగును తీసుకొని, ఇట్లన్నాడు “వ్యూ!” “గాబ్రియేలు, దానిలో ప్రవేశించుము,” ఒక శరీరము!
139 “వ్యూ!” “మాచిపత్రి, దానిలో ప్రవేశించుము.” అతడు దానిలో ప్రవేశించాడు.
ఇద్దరు దూతలు, పరలోకము నుండి వచ్చారు!
140 దేవుడు వాటిని అందుకొని మరియు దానిని ఒక పిడికెడు తీసుకొని, “వ్యూ,” అని స్వయంగా ఆయనే, దానిలో ప్రవేశించాడు. క్రిందకు దిగి వచ్చాడు, మరియు ఆకలిగొన్నాడు. ధన్యులు…మాంసమును తినని అడ్వెంటిస్టు సహోదరులారా, మరి దాని సంగతి ఏమిటి? కొద్ది సేపటి తరువాత, మనము దానిలోనికి వెళ్ళబోవుచున్నాము. సర్వశక్తిమంతుడైన దేవుడు, యెహోవా, మండుచున్న పొద వద్ద అదే పేరు ఆయనకే అనువదించబడిందో లేదో కనుగొనండి! హల్లెలూయా!
మరియు ఆయన భూమి మీద నిలబడినప్పుడు, ఆయన ఇట్లు చెప్పాడు, “అబ్రాహాము పుట్టకమునుపే, నేను ఉన్నాను, ఆ మండుచున్న పొద వద్దనున్న ఆయనేయైయున్నాడు.” అది నిజము, ఎలోహీం, అది అదేనో కాదో చూడండి. మండుచున్న పొద వద్ద ఉన్నది ఆయనే.
141 ఇక్కడ అబ్రాహాము దగ్గర, ఒక మాంసపు శరీరములో ఉండి, దూడను తిని, మరియు ఆవు పాలు త్రాగి, మరియు వెన్నెతో మొక్కజొన్న రొట్టెలను తిన్నది ఆయనే. దేవునియొక్క పరిశుద్ధ నామము స్తుతింపబడును గాక! తిన్నగా అక్కడకు నడిచివెళ్ళి మరియు ఇట్లన్నాడు, “నేను విడిచిపెట్టను…”
మరియు ఆయన తన వీపును త్రిప్పుకొనియున్నాడు. ఆయన ఇట్లన్నాడు, “అబ్రాహామా, నేను నిన్ను దర్శించబోవుచున్నాను, మరియు నీవు ఆ బిడ్డను కనబోవుచున్నావు. ఇప్పుడు నీకు వంద సంవత్సరములు, మరియు శారాకు తొంభై సంవత్సరములు ఉన్నవి.” మరియు శారా, గుడారములో, “హా!” అని నవ్వినది. ఆయన ఇట్లన్నాడు, “శారాకు నవ్వు కలిగించినది ఏమిటి?” ఆయన వెనుక నవ్వినది; వారికి మధ్యలో గుడారము ఉన్నది.
142 అబ్రాహాము ఇట్లన్నాడు, “శారా, నీవు నవ్వావా?”
143 “లేదు, నేను అసలు నవ్వలేదు.”
144 ఇట్లన్నాడు, “అవును, నీవు నవ్వావు.” అది ఎటువంటి టెలిపతి? అది ఏ విధమైన మనస్సును-చదువుటయైయున్నది?
ఈనాడు ఆయన దానినే చేస్తాడు. ఆయన యెహోవా-యీరే, యెహోవా-రాఫా, నిన్నా, నేడు, నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నవాడైయున్నాడు. ఆయన ఎన్నడూ విఫలమవ్వడు.
145 ఆయనను చూడండి. అక్కడ ఆయన నిలబడియున్నాడు. నేరుగా బయటకు వెళ్ళి అబ్రాహాముతో మాట్లాడి; మరియు అతనికి, కనుమరుగయ్యాడు. మరియు గొప్ప మూలపురుషుడైన అబ్రాహాము, తాను “ఎలోహీంతో, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు” అని చెప్పాడు, అదే దేవుడు. దానిని గ్రహించారా? సహోదరుడా, ముగ్గురు వ్యక్తులు కాదు. ఒకే వ్యక్తియొక్క మూడు కార్యాలయాలు!
146 ఆదియందు ఆయనే ఉన్నాడు, ఆయన ఆ గొప్ప ఆత్మయైయున్నాడు, ఊటయైయున్నాడు సమస్త సత్యము, సమస్త ప్రేమ, సమస్త సమాధానము కలిగియున్నవాడు. స్వచ్చమైన ప్రతీది ఈ ఊటలో ఉండియున్నది. అది ఒక శరీరముగా, ఒక థియోఫనీగా రూపొందడం ప్రారంభమైనది, అది మనము ప్రవేశించబోవునటువంటి శరీరమైయున్నది. ఒక మహిమపరచబడిన శరీరము కాదు, కానీ ఒక దూతవంటి శరీరము, అటువంటి ఆకారము, రూపమైయున్నది.
147 నేను ఒక చెట్టును చూసిన ప్రతిసారి, నేను ఇట్లు అనుకుంటాను, “ఆ చెట్టు ఛాయయైయున్నది. నిజస్వరూపము ఎక్కడో ఉండియున్నది.” ఆ చెట్టు దేనినుండో తయారు చేయబడినది, ఒక మేధస్సు దానిని కలుగజేసినది. మరియు ఈ భూమి చేసేదంతా ఏమిటంటే పరలోక సంబంధమైనదానిని ప్రతిబింబించుటయే. బైబిలు అట్లు చెప్పినది. మరియు నశించిపోయే ఒక చెట్టు ఇక్కడ ఉన్నదంటే, నశించిపోనటువంటిది ఒకటి మహిమలో ఉన్నది.
148 నేను ఒక పురుషుడిని, ఒక చక్కని చిన్న యవ్వన జంటను, ఒక పురుషుడు మరియు అతని భార్య, అన్యోన్యముగా కలిసి, వీధిలో నడుచుకుంటూ వెళ్ళుటను నేను చూసినట్లైతే, అది దేనిని ప్రతిబింబిస్తుంది? ప్రభువు నామము స్తుతించబడును గాక! ఎన్నడూ నశించిపోనటువంటి ఒక జంట పరలోకములో ఉన్నదని చూపిస్తుంది. “భూమి మీదనున్న ఈ గుడారము శిధిలమైపోయినను, ఇదివరకే మన కొరకు ఒకటి వేచియున్నది,” ఆ థియోఫనీయైయున్నది.
149 అప్పుడు మీకు త్రిత్వము అర్థమౌతుంది: ఆ గొప్ప ఆత్మ, కుమారునిలో, అనగా యేసులో నివసించుట; యేసు సంఘములో నివసించుట. “నేను తండ్రియందును, తండ్రి నాయందును, నేను మీయందును ఉన్నామని, ఆ దినమున, మీరు ఎరుగుదురు.” [టేపులో ఖాళీ ఉన్నది—సంపా.] దేవుడు అయ్యునదంతా, ఆయన యేసులోనికి కుమ్మరించాడు; యేసు అయ్యునదంతా, ఆయన సంఘములో కుమ్మరించాడు. విషయం అదేయైయున్నది. “నేను తండ్రియందును, తండ్రి నాయందును; నేను మీయందును, మరియు మీరు నాయందును ఉన్నాము.” అక్కడే—అక్కడే శరీరమున్నది.
150 సంఘముతో ఉన్న విషయము అదే. వారికి ఒక విధమైన చిన్న పసలేని, ఆడంగివంటి, బలహీనమైన పొడిపొడి సిద్ధాంతము బోధించబడినది, అటు ఇటు పరుగెత్తుచూ, సూప్ విందులను మరియు కార్డు పార్టీలను కలిగియుంటున్నారు. మనము కలిగియున్నట్టి ఇంతటి గందరగోళము ఉండుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. మనకు పిల్లల కార్యక్రమాలు మరియు చిన్న సూప్ విందులు అవసరం లేదు. మనకు ఒక కఠినమైన పాత సువార్త అవసరమైయున్నది, మరియు ఖడ్గమును కలిగియుండి, సవాలు చేయుచున్న విశ్వాసముగల వ్యక్తులు అవసరమైయున్నారు. ఈనాడు మనకు అవసరమైనది, ఏదో చిన్న పసలేని వేదపాండిత్యము మరియు ఏదో మానవ-కల్పితమైన సిద్ధాంతము కాదు. పరిశుద్ధాత్మయొక్క వెలుగులో మరియు శక్తిలో మరియు దృష్టాంతములతో బోధించబడే కఠినమైన సువార్త మనకు అవసరమైయున్నది.
151 ఇప్పుడు ఇక్కడ గమనించండి.
ఆయన చెప్పినట్లుగా, అయన దావీదులో, మరొక దినమును నిర్ణయించాడు,…
…యేసు వారికి విశ్రాంతి కలుగజేసియుంటే,…ఆయన…మరియొక దినమును గూర్చి చెప్పకపోవును.
అయితే దేవుని ప్రజలకు…విశ్రాంతి నిలిచియున్నది.
ఏలయనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము,…ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ, తన కార్యములను ముగించి విశ్రమించును.
152 ఇప్పుడు మనము ఎక్కడ చదవబోవుచున్నాము? మత్తయి, ఇరువది-…11వ అధ్యాయము, 27వ వచనము.
తండ్రి నాకు అప్పగించిన సమస్తమును, లేదా, సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగించబడియున్నది: తండ్రిగాక ఎవడును, కుమారుడిని ఎరుగడు; (మంచిది.) కుమారుడు, మరియు కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో అతడుగాక, మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
153 చూడండి, అది మీరెంత నేర్చుకొనుచున్నారన్నది కాదు, మీరు తెలుసుకోవాలని బిషప్పు ఎంతగా కోరుచున్నాడన్నది కాదు. అది మీరు తెలుసుకోవాలని దేవుడు ఎంతగా కోరుచున్నడన్న విషయమైయున్నది. మీరు ఈ ప్రత్యక్షతను చూడలేకున్నయెడల, బిషప్పును అడగకండి. దేవుడిని అడగండి. మీ సంఘకాపరిని అడగకండి. దేవుడిని అడగండి. “కుమారుడు ఆయనను బయలుపరచును,” అతడు, వ్యక్తిగత సర్వనామము.
154 వినండి. ఇది మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇదిగో ఆ ఆజ్ఞ ఇదియే. పౌలు ఇట్లన్నాడు, “ఆయన మరొక దినమును ఉంచియుంటే, ఆయన దాని గురించి చెప్పియుండేవాడు.” అయితే ఆయన చెప్పిన విషయం ఇక్కడున్నది.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు సబ్బాతును, విశ్రాంతిని కలుగజేతును.
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక, మీ మీద నా కాడి ఎత్తికొని; నాయొద్ద నేర్చుకొనుడి: అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును.
ఏలయనగా నా కాడి సుళువుగాను, నా భారములు తేలికగాను ఉన్నవి.
155 పౌలు ఏమి చెప్పాడో గమనించండి.
…యేసు వారికి విశ్రాంతి కలుగజేసియుంటే,…మరియొక దినము గురించి ఆయన చెప్పియుండేవాడు.
అయితే దావీదులో చెప్పబడినట్లు ఆయన ఒక…దినమును నిర్ణయించాడు, ఇంత కాలమైన తరువాత;…మీరు ఆయన మాట వినినప్పుడు, మీ హృదయమును కఠినపరచుకొనకుడి.
“మరియు నిలిచియున్నది…” ఇప్పుడు వినండి, 9వ వచనము.
కాబట్టి దేవుని ప్రజలకు ఒక విశ్రాంతి, ఒక సబ్బాతు, నిలిచియున్నది.
ఏలయనగా, ఆ పురుషుడు గాని స్త్రీ గాని, ఎవడైతే, ఆయనయొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాడో అతడు…
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”
…దేవుడు తన కార్యములను ముగించినట్లే, అతడును…అతని కార్యములను ముగించును.
156 నీకు ఇరవై సంవత్సరాలు ఉండవచ్చును. నీకు ముప్పై సంవత్సరాలు ఉండవచ్చును. నీకు యాభై సంవత్సరాలు ఉండవచ్చును. అయితే దేవునియొక్క స్వరము నీ హృదయాన్ని తట్టుటను నీవు విన్న ఆ నిమిషము మాత్రం, దానిని కఠినపరచుకొనవద్దు. అప్పుడు ప్రవేశించు…“నా మాటలు విని, నన్ను పంపిన వానియందు, విశ్వాసము ఉంచువాడు, నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు.”
157 “ఇట్లంటారు, సహోదరుడా బ్రెన్హామ్, ఏమి జరుగుతుంది?” మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. క్రీస్తు మీ లోపలికి వస్తాడు. అది నిజమేనా?
158 నాతో కలిసి, యెషయా 28వ అధ్యాయమునకు త్రిప్పండి, మరియు మనము చదువుదాము. యెషయా, 28వ అధ్యాయము, దాని గురించి ఆ ప్రవక్త ఏమి చెప్పాడో చూడండి. మత్తయి…28, 8వ వచనము నుండి ప్రారంభించుదాము. చివరి దినములయొక్క దురవస్థ ఇక్కడ ఉన్నది. మనము ఒక నిమిషంలో ముగించాలి.
ఏలయనగా బల్లలన్నియు వాంతులతో నిండియున్నవి మరియు…శుద్ధమైన స్థలము లేనేలేదు.
159 నన్ను ఒక్క నిమిషం ఆగనివ్వండి. మొన్నటి రాత్రి ఎర్నీ చెప్పినట్లుగా, అతడు ఎవరితోనో మాట్లాడుచున్నాడు. ఎర్నీ ఫాండ్లర్, స్విట్జర్లాండ్ నుండి వచ్చిన ఈ సహోదరుడు, అతడు ఇట్లన్నాడు, “నేను ఆపి, మరియు దానిని నాన్చబడనిచ్చాను.”
160 ఇది నాన్చబడాలని నేను కోరుచున్నాను.
…శుద్ధమైన స్థలము లేనేలేదు.
ఏలయనగా ఆ బల్లలన్నియు వాంతులతో నిండియున్నవి…
మరియు కుక్క తన వాంతికి తిరిగినట్టు…మరియు ఒక పంది…దాని బురదలోనికి మళ్లినట్టు, ఆ ప్రకారమే ప్రజలు వెనుకకు మళ్ళుదురు.
161 మెథడిస్టులైన మీతో వచ్చిన సమస్య ఏమిటి? ఒకప్పుడు మీరు వెలుగును కలిగియుండేవారు. ఏమి జరిగినది? దేవుడు దానిని మీ చేతిలో నుండి తీసివేశాడు, ఆయన దానిని నాజరీనులకు ఇచ్చాడు.
నాజరీనులైన మీకు ఏమి జరిగినది? మీరు ఒకప్పుడు వెలుగును కలిగియున్నారు. దేవుడు దానిని మీ చేతులలో నుండి తీసివేసి, దానిని పెంతెకొస్తువారికి ఇచ్చాడు. నిజమే. చర్చి ఆఫ్ గాడ్ మరియు మిగతా హోలీనెస్ ప్రజలైన మీరు, మీరు ఆ వెలుగును త్రోసివేసారు గనుక, మీరు మిమ్మల్ని మీరు సంఘశాఖగా చేసుకొని మరియు ఇట్లన్నారు, “మేము ఇంతకు మించి ఏదియు నమ్మము,” దేవుడు తిన్నగా బయటకు కదిలిపోయి మరియు ఆయనను వెంబడించే ప్రజలను ఆయన కలిగియున్నాడని మీకు చూపించాడు.
162 పెంతెకొస్తువారైన మీకు ఏమి జరిగినది? మీరు వెలుగును కలిగియున్నారు. దేవుడు దానిని మీయొద్ద నుండి తీసివేసాడు.
అగ్నిస్తంభము కదిలిపోతుంది. అగ్నిస్తంభము కదిలిన ప్రతిసారి, సంఘము దానితోపాటు కదిలినది.
మరియు తన స్వంత సంఘమైయున్న, క్యాథలిక్ సంఘము నుండి బయటకు వచ్చి, లూథర్ సంస్థగా మారినప్పుడు, అగ్నిస్తంభము కదిలిపోయింది మరియు వెస్లీ దానితోపాటు వెళ్ళాడు.
వెస్లీ సంస్థగా మారి, తన సంఘశాఖను స్థాపించాడు, మరియు అగ్నిస్తంభము కదిలిపోయింది మరియు నాజరీనులు దానితోపాటు వెళ్ళారు.
నాజరీనులు సంస్థగా మారారు, మరియు చర్చి ఆఫ్ గాడ్ దానితోపాటు వెళ్ళింది; మరియు వారు ఒక సంఘశాఖ కాదని చెప్పారు, కానీ వారు సంఘశాఖయే.
163 పిదప ఏమి జరిగినది? పిదప జరిగిన విషయం ఏమిటంటే, పెంతెకొస్తువారు అగ్నిని చూశారు, మరియు వారు వెళ్ళిపోయారు. మరియు మీరు ఏమి చేశారు? భాషలనుండి ఒక సిద్ధాంతమును తయారుచేసారు, మరియు దానిని సంస్థగా చేసి ఇట్లన్నారు, “పరిశుద్ధాత్మను పొందుకోడానికి ముందు ప్రతియొక్కరూ భాషలలో మాట్లాడవలసియున్నది,” అప్పుడు దేవుడు వెంటనే కదిలిపోయి, మరియు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మిమ్మల్ని విడిచిపెట్టాడు.
164 ఏకత్వమువారైన మీకు ఏమి జరిగినది? మీరు యేసు నామమున, బాప్తిస్మమును కనుగొన్నారు. దాని నుండి మీరు ఒక సిద్ధాంతమును తయారుచేసారు, మరియు ఆ మిగిలిన దాని నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకున్నారు, మరియు దేవుడు వెంటనే కదిలి వెళ్ళిపోయాడు మరియు మీరున్నచోటే మిమ్మల్ని వదిలేసాడు. నిజము.
165 అసెంబ్లీ ఆఫ్ గాడ్ వారైన మీకు, పాత జనరల్ సభవారైన మీకు ఏమి జరిగినది? మీదాని నుండి మీరు ఒక సంస్థను తయారుచేశారు, మరియు దేవుడు వెంటనే కదిలివెళ్ళిపోయాడు మరియు మిమ్మల్ని అక్కడే ఉండనిచ్చి వదిలివేసాడు. మరియు ఇప్పుడు మీరు ఆ మిగతావారి వలెనే, ఒక చలనము లేని, నామకార్థ గుంపు కాక మరొకటి కాదు.
మరియు ఆ అగ్నిస్తంభము కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా!
…బల్లలన్నియు వాంతితో నిండియున్నవి…
166 ప్రభువు రాత్రి భోజనమువైపు చూడండి. ఎందుకు, వారు…నేను ఒక చోటకు వెళ్ళాను వారు పాత రొట్టెముక్కను తీసుకున్నారు. మరియు ఆ రొట్టె పులియని రొట్టెతో తయారు చేయబడవలసియున్నది. మరియు పుస్తకములో వారి పేరు ఉన్నంతకాలం, వారు దానిని పాపులకు, సిగరెట్లు త్రాగేవారికి, వ్యభిచారులకు, వేశ్యలకు అందిస్తూ ఉంటారు.
167 మరియు బాప్టిస్టులైన మీరు దానిని “సన్నిహిత” సహవాసము అని కూడా అంటారు. ఇప్పుడు, బాప్టిస్టులైన మీరు కొద్దిగా కూత కూస్తారు, దేవుడు మీ కొమ్మును విరుస్తాడు. అది ఖచ్చితముగా నిజము, మీరు దాని గురించి కూతలు కూయలేరు. “సన్నిహిత” సహవాసము, మిమ్మల్ని మీరు వేరుచేసుకొని, మీరు అయ్యున్నదానికంటే ఎక్కువ పరిశుద్ధులన్నట్లుగా కనబరచుకుంటారు.
గుర్తుంచుకోండి, ఇది ఒక బాప్టిస్టు మందిరమైయున్నది. మీరు దానినే పొందుకుంటారు, మీరు మీ దానిని సంస్థగా చేస్తారు. “ఓ,” మీరు ఇట్లంటారు, “మేము ఒక సంస్థ కాదు.” అవును, మీరు అదేయైయున్నారు. నిశ్చయముగా, మీరు అదేయైయున్నారు. “మేము ఒక సహవాసము,” అని మీరంటారు. అవును, ద్వారములోనికి వచ్చి మరియు సరిగ్గా మీరు దానిని నమ్ముచున్న విధంగానే బోధించే ఎవరిపట్ల అయిననూ, బాగానే ఉంటుంది. అయితే, ఒకరిని, మీరు అతణ్ణి బయటకు విసిరివేయరు కానీ, మీ సహోదరత్వం నుండి అతణ్ణి వెలివేస్తారు. అది ఖచ్చితముగా వాస్తవము. ఓ, దానిని చేయుటకు మీరు ఒక మార్గమును కలిగియున్నారు. అలాగే దేవుడు కూడా దానిని చేయుటకు ఒక మార్గమును కలిగియున్నాడు. అయితే దేవుని సంఘము ముందుకు కొనసాగిపోతుంది. అగ్ని స్తంభము దాని కొరకు ఆగదు.
…బల్లలన్నియు వాంతితో నిండియున్నవి…
168 ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇది ఒక్క నిమిషము మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేయబోవుచున్నది. వినండి. నేను వాక్యమును చదువుతాను. ఈయన ఎవరు? ప్రవక్తయైన, యెషయా.
…బల్లలన్నియు వాంతితో నిండియున్నవి…కావున శుభ్రమైనదేదియు లేదు, కేవలం కల్మషము-తో నిండియున్నవి.
169 సంఘమునకు వస్తారు: స్త్రీలు తమ వెంట్రుకలను, చిన్నవిగా, కత్తిరించుకొనియుంటారు, నిక్కర్లను వేసుకొని, బయటకు వచ్చి మరియు వీధిలో పురుషులు వచ్చుటను చూసి; పెరట్లో-గడ్డిని కత్తిరిస్తుంటారు, అమ్మాయిలు ఎవరో ఒకరు ఆ కుక్కవలె లేదా నక్కవలె ఈల వేయుటను వినగోరతారు, లేదా అది ఏదైతే అది, మీకు తెలుసు కదా, “ఫ్యు-వ్యూ!” ఓ, నీవు అందముగా ఉన్నావని నీవు అనుకుంటున్నావు, కదూ?
170 మరియు పురుషులైన మీరు, నోటిలో చుట్టను పెట్టుకొని వీధిలో నడుచుకుంటూ వెళ్తారు, మరియు కమిటీలో ఒక సంఘపెద్దగా ఉంటారు. మీరు చూడటానికి టెక్సాస్ ప్రాంతములోని కొమ్ములు కత్తిరించబడిన ఒక ఆడంగి ఎద్దులవలె ఉన్నారు. మరియు పిదప మీరేదో గొప్పవారని అనుకుంటారు. అది ఖచ్చితంగా వాస్తవము. ఎటువంటి ఆశ్చర్యము లేదు బల్లలన్నీ అట్లున్నవి…నడిచివెళ్ళి మరియు ప్రభురాత్రి భోజనమును తీసుకొని మరియు మీరు ఏదో గొప్పవారన్నట్లు ప్రవర్తిస్తారు, మరియు వారమంతా, మోసము చేస్తూ మరియు దొంగతనము చేస్తూ మరియు అబద్ధములాడుతూ ఉంటారు. మీ విషయమేమిటీ?
…బల్లలన్నియు వాంతితో నిండియున్నవి…
171 “ఓ, నేను ప్రభురాత్రి భోజనమును తీసుకుంటాను. నిశ్చయంగా, మా సంఘములో మేము దానిని చేస్తాము. మనము ప్రభువురాత్రి భోజనమును తీసుకున్నట్లైతే చివరి దినములలో తాను మనల్ని లేపుతాడని యేసు చెప్పాడు.”
172 కానీ, “ప్రభువు శరీరమని వివేచింపక, అయోగ్యముగా తిని త్రాగువాడు, తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, ఇందువలననే మీలో అనేకులు రోగులును బలహీనులునైయున్నారు, మరియు చాలామంది చనిపోయారు,” పాత, మృతమైన, నామకార్థ సంఘములు. దేవుని ఆత్మ మీలోనుండి వెళ్ళిపోయినది. అగ్నిస్తంభము ఇక అక్కడ ఎంతమాత్రమూ లేదు. మీరు దైవిక స్వస్థతను నిరాకరిస్తారు. మీరు పునరుత్థానమును నిరాకరిస్తారు.
173 “ఓ,” మీరు ఇట్లంటారు, “ఓ, ఆయన మృతులలో నుండి లేచినది, చరిత్రలోయైయున్నది.” సరే, ఆయన మృతులలో నుండి లేచినట్లైతే, మరి ఈనాడు ఆయన అదే రీతిగా ఉన్నాడన్నదాని విషయం ఏమిటి? మీరు ఇట్లంటారు, “ఓ, అది అలా కాదు.” ఇప్పుడు, విషయం అదే. మీరు కోరిన విధానములో మీరు పునరుత్థానమును కలిగియున్నారు, మరియు దేవుడు ఆయన కోరిన విధానములో దానిని కలిగియున్నాడు.
174 అయితే, దాని విషయమేమిటనగా, మనము ఎరిగియున్నది సత్యమని, ఆయన వాక్యమును నిర్థారిస్తాడని, బైబిలు గ్రంథము చెప్పినది. “నేను చేయు క్రియలు మీరును చేయుదురు. మరియు నేను ఎల్లపుడూ, యుగ సమాప్తి వరకును మీతో ఉంటాను.” “యేసు క్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు.” వాక్యము దానినే చెప్పినది.
175 ఇప్పుడు సబ్బాతు అనగా ఏమిటి?
…బల్లలన్నియు వాంతితో నిండియున్నవి…ఒక్కటి కూడా శుభ్రముగా లేదు.
వాడు ఎవరికి జ్ఞానము నేర్పును?
లోక సంబంధమైన జ్ఞానము కాదు; ఆత్మ సంబంధమైన జ్ఞానము!
వాడు ఎవరికి జ్ఞానము నేర్పును?…వాడు ఎవరికి…వర్తమానమును గ్రహింపజేయును?
176 “ఓ, దేవునికి స్తోత్రం, మా సంస్థ దీనిని నమ్మదు. వారు దీనిని సహించరు.” …మీ సంస్థ దేనిని నమ్మితే ఏమిటి. దాని గురించి దేవుని వాక్యము ఏమి చెప్పుచున్నది? “ఓ, మంచిది, మీకు తెలుసు కదా, మా సంఘకాపరులు, విద్యావంతులు.” ఓ, ఖచ్చితంగా. నిశ్చయంగా, విద్యను ఎంతగా పొందుకున్నారంటే, వారు దానివలన దేవుడిని విడిచిపెట్టారు. నిజము, ఎందుకంటే మీరు వారికి వాక్యమును చెప్పవచ్చు మరి వారు చుట్టూ తిరిగి ఇట్లంటారు, “సరి, నేను దానిని కేవలం ఆ విధంగానే నమ్మను.” ఓ, ఆడంగి! నన్ను నీకు చెప్పనివ్వు.
177 ఇక్కడ చూడండి.
…వాడు ఎవరికి…సిద్ధాంతమును తెలియజేయును? చన్ను విడిచినవారికా, మరియు…తల్లి పాలు విడిచినవారికా, మరియు చన్ను విడిచినవారికా.
178 మొన్నటి దినమున, నా పొరుగువారు ఒకరు వచ్చారు. అతడు ఇట్లన్నాడు, “బిల్లీ, ఇక్కడ పట్టణములో ఒక ఫలానా సంఘకాపరి, నీవు ఎన్నడూ చూడనట్టి అత్యంత ప్రియమైన వ్యక్తి…” ఇట్లన్నాడు, “నేను మరియు భార్య పడుకునేటప్పుడు వేసుకునే దుస్తులు ధరించుకొని కూర్చొనియున్నాము, దాదాపు అర్థరాత్రి అగుచున్నది, మరియు ఆ చిన్న సంఘకాపరి వచ్చి మరియు అతడు—అతడు—అతడు మాతో కలిసి కాఫీ త్రాగాడు మరియు అతడు మరొక పొరుగువారి ఇంటికి వెళ్ళి, మరియు అతడు వారితో కరచాలనము చేశాడు. వారు పేకాటను ఆడుతున్నారు, మరియు అతడు కూర్చుని వారితో కలిసి పేకాట ఆడాడు.” ఇట్లన్నాడు, “ఓ, నీవు ఎన్నడూ చూడనటువంటి అత్యంత స్నేహశీలియైన వ్యక్తి అతడు.” ఇట్లన్నాడు, “ఓ, మేము అతణ్ణి ప్రేమిస్తున్నాము. దేనిని బట్టి కూడా మేము అతణ్ణి వదులుకోము.”
179 నేను కొంచెము సేపు అక్కడ నిలబడి, నేను ఇట్లనుకున్నాను, “సరి?”
180 ఇంకా ఇట్లన్నాడు, “ఓ, ప్రతి సంఘమునకు అటువంటి ఒక వ్యక్తి అవసరమని నీవు అనుకోవడంలేదా?” హ! నేను దానికి జవాబు చెప్పలేకపోయాను. అతడు ఇట్లన్నాడు, “మరొక చిన్న స్థలములో,” ఇట్లన్నాడు, “వారు ఎంతో అందమైన ఒక చోటును కలిగియున్నారు. ఈ సేవకుడు మరియు అతని భార్య, ప్రియమైన వ్యక్తులు, బయటకు వెళ్ళి మరియు పిల్లలతో ఎంతగా వ్యవహిరించారంటే వారు ఒక—ఒక బైబిలు పాఠశాలను పెట్టారు.” మరియు ఇట్లన్నాడు, “వారు చాలా మందిని కలిగియున్నారు, అది చిన్న పిల్లలతో నిండిపోయినది.” ఇట్లన్నాడు, “మై, అతడు చిన్న పిల్లలకు అన్ని రకములైన చిన్న కథలు చెప్పగలడు.”
181 నేను ఇట్లన్నాను, “అది బాగుంది. అది చాలా బాగుంది.”
182 నేను వెనుకకు వెళ్ళాను. నేనప్పుడే కెనడా నుండి వచ్చాను. నేను ఇట్లనుకున్నాను, “నేను ఇక్కడున్నాను. మై! ప్రజలారా…మరి నాతో సమస్య ఏమిటి? నేను అలా చేయను.” నేను నా కారును కడగడానికి వెళ్ళాను. నేను ఇట్లనుకున్నాను, “దేవా, నేను వృద్ధుడనౌతున్నాను, మరియు నేను ఇక్కడ ఉన్నాను. నేను పోరాడాను. నేను ఏడ్చాను. నేను వేడుకున్నాను. మరియు నేను పొందుకునేది ఏదైనా ఉందంటే అది పెద్ద దూషణ మాటలే.”
183 ఏదైనా, ఎవరైనా మీ గురించి ఏదైనా చెడుగా మాట్లాడితే, “ఓ, పరిశుద్ధ-గుండ్రాయి,” అని అటువంటిదేదైనా అంటారు.
184 నేను దాని గురించి ఆలోచించాను. మరియు ఒక స్వరము నాకు వినబడి, ఇట్లు చెప్పినది, “ఆ మనుష్యులు దానిని చేస్తున్నట్లైతే మంచిది, కానీ దానిని చేయడానికి నేను నిన్ను పిలువలేదు. సహోదరుడా, ఖడ్గము తీసుకొని, యెహోషువా వలె అక్కడ నిలబడి మరియు సవాలు చేయుటకు నేను నిన్ను పిలిచాను. ఏదో ఒక సమాజముతో లేదా ఏదో సంఘసంస్థతో సమయము వృధా చేయుటకు కాదు గాని, దయ్యమును సవాలు చేయుటకు పిలిచాను. ముందంజలో నిలబడి, ఒప్పును ఒప్పని, మరియు తప్పును తప్పని చెప్పుటకు పిలిచాను. వాక్యమును బోధించి మరియు దానిని నమ్ముటకు ఎవరు విశ్వాసమును కలిగియున్నారో కనుగొనుటకు పిలిచాను. దానిని అక్కడ బయట పెట్టుటకు పిలిచాను.”
185 నేను ఆ సమయమంతా, ఆ కారును, వేగంగా కడుగుతూపోయాను. నేను ఇట్లన్నాను, “ప్రభువా, నీకు కృతఙ్ఞతలు. ప్రభువా, నీకు కృతఙ్ఞతలు.” అప్పుడు బాగా అనిపించినది. “అది ఫర్వాలేదు, ప్రభువా, నేను దానిని ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటాను, మరియు దానిని నా చేతిలో కలిగియుండి నేను చనిపోవాలనుకుంటున్నాను.”
…నేను ఎవరికి వర్తమానమును తెలియజేయగలను? (వినండి.)
…బల్లలన్నియు వాంతితో నిండియున్నవి…
…తల్లిపాలు విడిచినవారికా, చన్ను విడిచినవారికా.
ఇపుడు గమనించండి.
ఏలయనగా ఆ విధముగా ఆజ్ఞ వెంబడి—వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ;…సూత్రము వెంబడి సూత్రము; కొంత ఇచ్చట, కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు:
ఏలయనగా నత్తివారి పెదవుల చేతను ఇతర భాషలతోను నేను ఈ జనులతో మాటలాడుదును.
అలసినవారికి నెమ్మది కలుగజేయుడి ఇదే సబ్బాతు అని వారికి చెప్పబడినది;…ఇదే తాజాదనమైయున్నది: అయినను వారు విననొల్లరైరి.
ఏలయనగా యెహోవా వాక్యము వారియొద్దకు వచ్చెను (ఎవరో దానిని బోధించారు.) వారు వెళ్ళి, వెనుకకు మొగ్గి, విరుగబడి, చిక్కుబడి, పట్టబడునట్లు; ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ,…వెంబడి ఆజ్ఞ; సూత్రము వెంబడి సూత్రము,…వెంబడి సూత్రము; కొంత ఇచ్చట, కొంత అచ్చట వచ్చెను.
186 విశ్రాంతి అనగా ఏమిటి? విశ్రాంతి ఎప్పుడు వచ్చినది? ప్రజలు ఇతర భాషలతో మాట్లాడి మరియు నత్తి పెదవులు కలిగియున్నప్పుడై యున్నది. నత్తి పెదవులు; వారు ఏమీ మాట్లాడలేదు. వారు తడబడ్డారు. అది ఎప్పుడు జరిగినది? పెంతెకొస్తు దినమున, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జరిగినది. అదే విశ్రాంతి: పరిశుద్ధాత్మయే. యేసు ఇట్లు చెప్పాడు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను మీకు జీవమును, నిత్యజీవమును ఇస్తాను,” జోయి, దేవునియొక్క స్వంత జీవము. దేవుడు నీలోనికి వచ్చి మరియు నీలో ఒక భాగమవుతాడు. ఆయన నీకు ఒక జన్మనిచ్చి మరియు నిన్ను ఒక కుమారుడిగా మరియు ఒక కుమార్తెగా చేస్తాడు.
187 ఇపుడు గమనించండి. అది ఆయన ఇచ్చిన మూడవ విశ్రాంతియైయున్నది. మొదటిది: దేవుడు తన పనినుండి విశ్రమించి, దానిని పొందుకున్నాడు. రెండవది: ధర్మశాస్త్రములో, ఇశ్రాయేలీయులు దానిని పొందుకున్నారు. మూడవది: దేవునిలో ఒక భాగముగా, సంఘము దానిని పొందుకున్నది.
188 మూడు జీవముయొక్క సంఖ్యయైయున్నది. అది ఎంతమందికి తెలుసు? మీరు మూడును చూసిన ప్రతిసారి, అది జీవమైయున్నది. గమనించండి, దేవుడు భూమిని సృష్టించినపుడు, మూడవ దినమున జీవము కలిగినది. అది ఎంతమందికి తెలుసు? మూడవ దినము. సృష్టియొక్క మూడవ దినమున జీవము వచ్చినది.
త్రిత్వము: తండ్రి ఒక అగ్నిస్తంభములో, ప్రజలకు పైన ఉన్నాడు; కుమారుడు ఒక మానవుడైయున్నాడు, ఆయన ప్రజలతో మాట్లాడి మరియు వారిని సిద్ధపరిచాడు; మూడవ మెట్టు పరిశుద్ధాత్మయైయున్నాడు, అది పరిశుద్ధాత్మ, దేవుడు ప్రజలలో ఉండుటయైయున్నది. జీవము! తండ్రి, కుమారుడు…
దేవునియొక్క, విశ్రాంతి; ఇశ్రాయేలుయొక్క, విశ్రాంతి; మరియు సంఘముయొక్క, విశ్రాంతి, సబ్బాతును-పాటించుట.
189 కాబట్టి, మీరు ఇప్పటివరకు, ఎన్నడూ పరిశుద్ధాత్మను పొందుకోనట్లైతే, మీరు ఎన్నడూ దేవునియొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. మీరు ఇట్లు చెప్పనవసరం లేదు, “ఓ, నేను చేయలేను. నాకు ధూమపానం చేయాలని ఉంది. నేను—నేను కేవలం దానిని చేయలేను; నేను ఒక క్రైస్తవుడను. నాకు నిజంగా త్రాగాలని లేదు, అయితే నేను ఒక క్రైస్తవుడను. నేను చేయలేను, త్రాగాలాని లేదు, మరి అయిననూ నేను త్రాగుటకు ఇష్టపడుతున్నాను.”
190 మీరు స్త్రీలను మోహించినట్లైతే, మీరు ఈ భక్తిహీన కార్యములన్నిటినీ చేస్తున్నట్లైతే, మీరు ఇంకనూ ఎన్నడూ ఆ విశ్రాంతి కాలమును తాకలేదు. మీరు ఎన్నడూ మీ విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు.
191 మరియు మీరు ఈ విశ్రాంతిలోనికి ప్రవేశించినప్పుడు, దేవుడు తనవాటినుండి విశ్రమించినట్లే, మీరు మీ స్వంత లోక సంబంధమైన పనులనుండి విశ్రమిస్తారు. ఎందుకు? మీరు దేవునిలో ఒక భాగమైయున్నారు. మీరు నిత్యమూ, విశ్రాంతి పొందుతారు. విషయం అదే. సబ్బాతు అనగా అదే. “ప్రయాసపడు సమస్త జనులారా, నా యొద్దకు రండి.”
మీరు ఆయన స్వరము వినినప్పుడు, మీ హృదయములను కఠినపరచుకొనకుడని,…ఇంత కాలమైన తరువాత, దావీదులో;…నేడు అని ఒక దినమున ఆయన నిర్ణయించాడు.
192 ఇప్పుడు ఇక్కడ కేవలం ఇంకా ఒకటి లేదా రెండు మాటలు, మనము ముగించుకుంటాము.
ఎందుకనగా క్రీస్తుయొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించినవాడు,…
ప్రయాసపడి…భారము మోసికొనుచున్న సమస్త జనులారా, మీరు నాయొద్దకు రండి…
…ఏడవ దినమున, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, మీరును మీ స్వంత కార్యములను ముగించి విశ్రమించియున్నారు.
మీది ముప్పైయవ సంవత్సరము కావచ్చును, నలభైయ్యవ సంవత్సరము కావచ్చును, అయిదవ సంవత్సరము కావచ్చును, అది ఏమైనప్పటికి. నిత్యముగా, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించినట్లే, మీరు మీ కార్యములను ముగించి విశ్రమించుచున్నారు. మీరు ఇక ఎంతమాత్రము లోకపు కార్యములను కోరుకోరు. మీ దృష్టికి లోకము చనిపోయినది.
193 ఇపుడు, ఇప్పుడు 11వ వచనము, జాగ్రత్తగా వినండి.
కావున అవిశ్వాసమువలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు, (ఇది కాదు, ఇది కాదు, కానీ ఇది), మనము ప్రయాసపడదాము.
194 అది ఏమిటి? అగ్నిస్తంభము ఇక్కడున్నది. ప్రభువుయొక్క దూత మనతో ఉన్నాడు. ఆయన తాను చేస్తానని చెప్పిన అవే కార్యములను చేయుచున్నాడు. మరియు ప్రజలు త్రొట్టిల్లుతూ, ఇట్లంటారు, “ఓ, మంచిది, అది పర్వాలేదని నేను అనుకుంటున్నాను. అది చాలా బాగుంది. ఓ, అది పర్వాలేదని నేను అనుకుంటున్నాను.” అదే అవిశ్వాసపు ఉచ్చులో మీరును పడకుండా జాగ్రత్తపడండి. మీరు దానిని మీ హృదయమంతటితో తీసుకోండి.
195 గమనించండి.
ఎందుకనగా దేవుని వాక్యము (సంఘముయొక్క సిద్ధాంతము కాదు), దేవుని వాక్యము వేగవంతమైనదై, అధిక బలముగలదై,…రెండంచులుగల ఒక ఖడ్గముకంటెను వాడిగా ఉండి, (వినండి), ప్రాణము, ఆత్మ,…కీళ్ళను మూలుగలను విభజించునంతగా…దూరుచు, మరియు…(వినండి), హృదయముయొక్క తలంపులను మరియు ఆ ఆలోచనలను వివేచించుచున్నది.
అది ఏమిటి? పరిశుద్ధాత్మ వచ్చి ఇట్లు చెప్పగలడు, “నీవు ఒక ఫలానా-ఫలానా కార్యమును చేశావు. మరియు నీవు దీనిని చేశావు మరియు దానిని చేశావు. నీవు ఈ విధమైన వ్యాధిని కలిగియున్నావు, మరియు దానిని కలిగియున్నావు. నీవు దీనిని సరిచేసుకున్నట్లైతే, నీవు దానిని చేస్తావు.” చూశారా? తలంపులను వివేచించునది.
196 మరియు ప్రజలు ఇట్లంటారు, “అది ఏమిటి? అంతెందుకు, అది మానసిక టెలిపతియైయున్నది. అంతెందుకు, అది ఒక…అతడు సోది-చెప్పువాడు.” నా భావమును గ్రహిస్తున్నారా? ఇది దేవుని ఎరుగని ఒక దుష్టమైన, పాత వ్యభిచార లోకమైయున్నది.
197 “అది వేగవంతమైనదై, ఆలోచించు-నదై, రెండంచులు-గల ఒక ఖడ్గముకంటెను అధిక బలముగలదై, మరియు హృదయముయొక్క తలంపులను మరియు ఆలోచనలను వివేచించుచున్నది.”
ఇప్పుడు, హృదయముయొక్క ఉద్దేశములను ఎరుగునది ఏమిటి? దేవుడు. “మంచిది, ‘దేవునియొక్క వాక్యము’ అని బైబిలు చెప్పినది,” అని మీరు అన్నారు. దేవునియొక్క వాక్యమే దేవుడు.
ఆదియందు వాక్యముండెను,…వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడైయుండెను.
మరియు ఆ వాక్యము శరీరధారియై, మన మధ్య నివసించెను,…
198 దేవుడు తలంపులను వివేచిస్తాడు. అబ్రాహాము తన వీపును త్రిప్పుకొనియున్నాడు, మరియు—మరియు దేవుడు కూడా అలాగే తన వీపును గుడారము వైపునకు త్రిప్పుకొనియున్నాడు. మరియు శారా నవ్వినది. మరియు దేవుడు వెనుకకు తిరిగి, ఇట్లన్నాడు, “శారాకు నవ్వు కలుగజేసినది ఏమిటి?” హృదయము యొక్క తలంపులను వివేచించువాడు! అది కొంచెము నానాలని నేను కోరుచున్నాను.
199 పిదప అంత్య దినములో దేవుడు వాగ్దానము చేసినట్టి, ఆ రకమైన పరిచర్య లేచినప్పుడు, ఏమి జరిగినది? “మెంటల్ టెలిపతి.”
200 వారు ఏకంగా, ప్రభువునే, “బయెల్జెబూబు” అని పిలవలేదా? ఆయన ఇట్లు చెప్పాడు, “వారు ఇంటి యజమానినే ‘బయెల్జెబూబు’ అని పిలిచినయెడల, ఆయనయొక్క శిష్యులను ఇంకెంతగా పిలుస్తారు?”
201 నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సువార్తను వినడానికి, చల్లనిగాలి-సౌకర్యం ఉన్నటువంటి భవనమునకు రావలసిన అవసరం లేనంతగా మీరు ఆసక్తి కలిగియున్నారని అది చూపిస్తున్నది. ఇటువంటి ఒక చోటునకు కూడా వచ్చేంతగా మీరు ఆకలిని కలిగియున్నారు. దేవుడు మనలను దీనిని తప్ప మరి దేనిని నిర్మించనివ్వలేదు. మనము దీనిని ఈ విధంగానే ఇష్టపడుచున్నాము. కేవలం ఒక చిన్న పాత కుటీరము, అయితే ఆ విధంగానే మనము దీనిని ఇష్టపడుచున్నాము. దేవుడు సౌందర్యములో నివసించడు. దేవుడు దీనత్వములో నివసిస్తాడు. మనము దీనిని ఈ విధంగానే ఇష్టపడుచున్నాము. మేము వచ్చుటకు సంతోషిస్తున్నాము, మరియు ఇటువంటి ఒక—ఒక స్థలములో కూర్చొనుటకు, మీరు కూడా సంతోషిస్తున్నారు. ఎంత వేడిగా ఉన్ననూ, మీ క్రొత్త సూటు మీద, మీ క్రొత్త గౌను మీద మీరెంతగా చెమట కార్చినను, అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు.
మీ హృదయముయొక్క తలంపులను ఎరిగియున్న దేవుని వాక్యమునకు, నిత్యజీవమునకు మీరు చెవియొగ్గి యున్నారు. ఇశ్రాయేలీయుల మీద వ్రేలాడియున్న ఆ అగ్నిస్తంభము, ఈ రాత్రి ఇక్కడ వ్రేలాడుచున్నది. నేను ఇట్లు సవాలు చేయగలను: పరిశుద్ధాత్మయొక్క శక్తి క్రింద ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి దేవుడు అతడి గురించి బయలుపరుస్తూ మరియు అతడేమిటన్నది అతడికి చెప్పకపోవడమనేది జరుగదు. అది వాస్తవము. విషయం అదేయైయున్నది.
202 అది ఏమిటి? అది ఏమిటి? ఇశ్రాయేలు పిల్లలను వారి విశ్రాంతిలోనికి నడిపించినది అదే ఆత్మయైయున్నది, మరియు వారు అవిశ్వాసము వలన పడిపోయారు. మీరు పడిపోకండి. ఇదే చివరి అవకాశము. తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ, జీవము అక్కడ నుండి వచ్చినది.
203 నీతికరణ, మార్టిన్ లూథర్, ఇంకనూ ఒక మత విధానమేయైయున్నది. శుద్ధీకరణ…మార్టిన్ లూథర్; జాన్ వెస్లీ; పరిశుద్ధాత్మ బాప్తిస్మము, జీవము. నీతీకరణము, నమ్ముటయైయున్నది; శుద్ధీకరణము, శుభ్రపరచుటయైయున్నది; పరిశుద్ధాత్మ, నింపుటయైయున్నది, జీవమైయున్నది. లూథరన్ కాలములో కాదు; వారు దానిని ఒక ఛాయలో కలిగియున్నారు. వెస్లీ కాలములో కాదు; వారు దానిని ఒక ఛాయలో కలిగియున్నారు. అయితే పరిశుద్ధాత్మ, స్వయంగా తానే వచ్చు కాలము ఇదేయైయున్నది.
204 మరియు మీరు దానిని పొందుకోనియెడల, మీరు, మీరు అద్భుతములను ఎలా నమ్మగలరు? నమ్ముటకు, మీలో ఉన్న దేవుడు, కావలసియున్నది. మీరు దేవునివలె ప్రవర్తిస్తారు. మీరు దేవునివలె ఎరిగియుంటారు. మీరు దేవునివలె ఆలోచిస్తారు. మీరు, చిన్న “దేవుళ్ళు” అని బైబిలు చెప్పినది. యేసు అట్లు చెప్పాడు. ఏలయనగా, మీరు దేవునిలో ఒక భాగమైయున్నారు.
నేను ఒక బ్రెన్హామ్‌ను అయ్యున్నట్లే, మరియు మీరు మీరు-ఏమై-యున్నారో అది అయ్యున్నట్లే ఉన్నది, మరి ఎందుకనగా అది మీ తల్లితండ్రుల పేరుయైయున్నది. మీరేమైయున్నారో అట్టి స్వభావము ఎందుకున్నదంటే మీ తల్లిదండ్రులు ఆ విధంగా ఉన్నారు, ఎందుకంటే మీరు వారికి పుట్టియున్నారు.
మరియు మీరు దేవుడిని నమ్ముటకు, మరియు ఆశ్చర్య కార్యములను, మరియు సూచక క్రియలను మరియు అద్భుతాలను నమ్ముటకు కారణమేదనగా, మీరు దేవునియొక్క కుమారులు మరియు కుమార్తెలైయున్నారు. మీరు జీవమును పొందుకుంటారు. జీవము మూడవదానిపై వస్తుంది. మంచిది.
205 యేసు కొండ మీదకు వెళ్ళినప్పుడు, ఆయన వెళ్ళిన ప్రతిచోటికి కూడా, ఆయన పేతురు, యాకోబు, యోహానులను తీసుకొనివెళ్ళాడు, ముగ్గురు సాక్షులు. మూడు జీవముయొక్క సంఖ్యయైయున్నది. అది అర్థమైనదా? ప్రేమ, సంతోషము, సమాధానము.
206 ఇపుడు, మనము చదువుచుండగా, మనము త్వరగా, అధ్యాయముయొక్క ముగింపుకు వెళ్దాము.
ఎందుకనగా దేవుని వాక్యము వేగవంతమైనదై, రెండంచులు గల ఖడ్గము కంటెను…అధిక బలముగలదై,…మరియు హృదయముయొక్క ఆలోచనలను సైతం వివేచించుచున్నది.
ఆయన దృష్టికి ప్రత్యక్షపరచబడని సృష్టము ఏదియు లేదు: కానీ మనమెవరికి లెక్క అప్పచెప్పవలసియున్నదో ఆయన కన్నులకు సమస్తమును…తేటగా ఉన్నది.
207 సహోదరుడా, ఆయనకు తెలియకుండా, అక్కడ ఒక స్తంభము మీద ఒక్క ఈగ కూడా వాలలేదు. “సమస్తమును తేటగా ఉన్నది.” సహోదరుడా, నీవు చేసిన ప్రతి విషయము, నీవు తలంచిన ప్రతి తలంపు ఆయనకు తెలుసు. ఆయన అదేయైయున్నాడు. ఆయనను ఆ విధంగానే మనము నమ్ముతాము.
మరియు దేవుడు మనలోనికి వచ్చి, మరియు మనలను సంఘములో ఉంచినప్పుడు, ఆయనయొక్క ఉనికిని చాటుటకు, ఆయన సంఘములో వరములను మరియు అట్టి కార్యములను పెడతాడు. దేవుడు అదే అనంతుడైన దేవుడైనయెడల, అప్పుడు ఆయన రోగులను స్వస్థపరచుతాడు. ఆయన మృతులను లేపగలడు. ఆయన కుష్ఠు రోగులను శుద్ధి చేయగలడు, గ్రుడ్డివారికి చూపునివ్వగలడు. ఆయన దర్శనములను ఇవ్వగలడు. ఆయన తన సంఘము ద్వారా పనిచేయు, ఈ విధమైన కార్యములన్నిటినీ చేయగలడు, ఎందుకనగా అది మీలో ఉన్న దేవుడైయున్నాడు. మరదియే సంఘము.
208 ఆ సంఘము ఒక సంఘముగా ఎలా అవుతుంది, దానిలో చేరుట ద్వారానా? లేదు, అయ్యా. కరచాలనం చేయుట ద్వారానా? లేదు, అయ్యా. నీటి బాప్తిస్మము ద్వారానా? లేదు, అయ్యా. సభ్యత్వం ద్వారానా? లేదు, అయ్యా. మీరు దానిని ఎలా పొందుకుంటారు? “ఏలయనగా ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.” విషయం అదేయైయున్నది.
209 రోమీయులు 8:1.
కాబట్టి ఇప్పుడు ఏ శిక్షావిధియు లేదు…
“లోక సంబంధమైన ఏ శిక్షావిధియు లేదు.” వారు దేని గూర్చియు మీ మీద నేరారోపణ చేయలేరు.
క్రీస్తుయేసునందున్నవారికి…అనగా శరీరము ననుసరింపక ఆత్మననుసరించి నడుచువారికి, ఏ శిక్షావిధియు లేదు.
210 విషయం అదే. మీ క్రైస్తవ్యమును తీర్పు తీర్చే విధానము అదేయైయున్నది. మీరు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించారని తెలుసుకునే విధానము అదేయైయున్నది, లోకమును గూర్చి మీరిక ఎంతమాత్రము చింతించరు. నిశ్చయంగా. మీరు దానిని చూస్తారు, దాని నుండి దూరంగా వెళ్ళిపోతారు. మీరు ఆలోచించుటకు ఒక శ్రేష్ఠమైనదానిని కలిగియున్నారు. విషయం అదే, “ఏ శిక్షావిధియు లేదు.” మనము శరీరములోనికి ప్రవేశించే విధానము అదేయైయున్నది.
211 మరియు మీరు “సదాకాలమునకు,” భద్రపరచబడియున్నారు. బైబిలు ఆలాగు చెప్పినది. ఇక్కడ హెబ్రీ పత్రిక, 10వ అధ్యాయములో చూడండి. అతడు ఇట్లన్నాడు:
ఏలయనగా ఎడ్లయొక్క బలులు మరియు అర్పణలను అర్పించుటచేత, ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నవి.
కానీ ఈయనయైతే,…ఒక్క అర్పణ ద్వారా…
ఆయన పరిశుద్ధ నామము స్తుతించబడును గాక!
ఏలయనగా ఒక్క అర్పణచేత ఈయన సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు…
212 హల్లెలూయా! తదుపరి ఉజ్జీవము వరకు కాదు, కానీ సదాకాలమునకై యున్నది. “పాతవి గతించెను; మరియు సమస్తమును క్రొత్తవాయెను.” మనము వెలుగులో నడుచుచున్నాము, ఆ అందమైన వెలుగులో నడుచుచున్నాము. పక్షులు భిన్నముగా పాడుచున్నాయి.
213 ఇక్కడ కూర్చొనియున్న, ఈ చిన్న మద్యపాన బానిసను చూస్తున్నాను, అది దాదాపు ఐదు సంవత్సరముల క్రితము, అని నేను అనుకుంటున్నాను. రోసెల్లా, తీవ్రమైన మత్తువలన స్థిరత్వం లేనిదై, చికాగో వీధుల్లో నడుస్తూ, త్రాగి, మెలికలు తిరుగుతూ, ప్రతి విధమైన పాపములోనికి వెళ్ళుచూ, త్రాగుబోతుయై మరియు ఆమె అవ్వగలిగిన ప్రతీది అయ్యున్నది. మరియు ఒక రాత్రి, రెండంచులుగల ఒక ఖడ్గము కంటెను వేగవంతమైనవాడై మరియు అధిక బలముగలవాడైన పరిశుద్ధాత్మ, ఇట్లన్నాడు, “స్త్రీ, నీవు ఒక మద్యపాన బానిసవు.” హల్లెలూయా! అది, ఆ కాలమందు తన వీపు వెనుక శారా నవ్వినదని ఎరిగినటువంటి అదే దేవుడు కానియెడల, ఆయన మరి ఇంకెవరో నాకు తెలియదు.
214 ఆమె జనసమూహములో మరొక స్త్రీ వద్దకు వెళ్ళి, మరియు ఆమెను అక్కడకు తీసుకొనివచ్చినది, ఇట్లు చెప్పబడినది, “నీవు మత్తుకు బానిసవు.” ఆయన మనస్సులోని ఆలోచనలను ఎలా వివేచిస్తాడో గదా!
215 మరియు గొప్ప సంపన్నులైన సేవకులు అక్కడ కూర్చొనియున్నారు, వారు ప్రపంచ-వ్యాప్త సువార్త పరిచర్యను కలిగియున్నవారు, వారి చేతులను వెనుకకు కట్టుకొని, టీ-షర్టులను ధరించియున్నారు, మేము వారిని ఎరుగమని అనుకున్నారు, అటువంటి ఒక కూడికలో వారు కూర్చొనియుండగా మరి దేవుడు వారు ఎవరన్నది బయలుపరచడన్నట్లు అనుకున్నారు. అక్కడ కూర్చొనియున్నారు, వారెవరో అన్నట్లుగా, భిన్నముగా కనబడుచున్నారు. వారెవరన్నది పరిశుద్ధాత్మ ఎరిగియున్నాడు. మరియు వారు అక్కడ కూర్చొని, వారి హృదయములలో, అది మనస్సులను చదువుట అని అనుకున్నారు. ఒక ఐగుప్తు రాత్రి గురించి దక్షిణాఫ్రికాలోని అనాగరికునికి ఎంత తెలుసో వీరికీ దేవుని గురించి అంతే తెలుసు. అది నిజము. వారు దానిని ఆత్మానుసారంగా కాదు గాని, అక్షరానుసారముగా ఎరిగియున్నారు. “అక్షరము చంపును, కాని ఆత్మ జీవింపజేయును.” అంతే. ఆలోచన అదేయైయున్నది. “వేగముగలదై, రెండంచులు-గల ఖడ్గము కంటెను అధిక బలముగలదై, హృదయముయొక్క తలంపులను వివేచించుచున్నది.”
216 వినండి. గమనించండి.
ఆయన దృష్టికి ప్రత్యక్షపరచబడని సృష్టము లేదు: మనమెవరికి లెక్క అప్పచెప్పవలసియున్నదో…ఆయన కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు…(ఇప్పుడు వినండి; వ్యాధితోనున్నవారి కొరకు చెప్పుచున్నాను.)…మనకు ఉన్నాడని చూస్తున్నాము గనుక, మనము మన ఒప్పుకోలును గట్టిగా చేపట్టుదము.
217 “గట్టిగా చేపట్టుదము,” దాని అర్థం కేవలం సాక్ష్యమిస్తూ ఉండటం కాదు. మీరు ఆ జీవితమును జీవించనియెడల, మీరు దానిని గట్టిగా చేపట్టడంలేదు; మీరు ఒక వేషధారిగా జీవించుచున్నారు. మీరు…మీరు ఇక బయటకు వెళ్ళిపోయి, మీరు ఒక పాపియని చెప్పి మరియు దానిని మరచిపోవడం మంచిది. ఒక క్రైస్తవుడని చెప్పుకొని, మరేదో విధంగా జీవించకండి; ప్రపంచము ఎన్నడూ కలిగిలేనటువంటి అతిపెద్ద అడ్డుబండ మీరేయైయున్నారు. నీవు ఒక పాపివైనట్లైతే, దానిని ఒప్పుకో, మరియు వెళ్ళి, దేవునితో సరి చేసుకో. నీవు ఒక క్రైస్తవుడవైతే, నీ ఒప్పుకోలును గట్టిగా చేపట్టు, అక్కడే నిలిచియుండు.
218 ఇపుడు దీనిని గమనించండి. మనము వెళ్ళడానికి ముందు నేను దీనిని చెప్పగోరుచున్నాను.
మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని; సమస్త విషయములలోను…మనవలెనే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను.
వినండి.
గనుక మనము కనికరింపబడి మరియు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు, ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
దేవుని నామము స్తుతింపబడును గాక!
219 వినండి, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, లూథరనులారా. మీరు నన్ను ఈ ప్రశ్నను అడుగబోవుచున్నారు, “అబ్రాహాము దేవుని నమ్మెను, మరియు అది అతనికి నీతిగా ఎంచబడెను.” నాకు తెలుసు. మీరు ఎల్లప్పుడు అక్కడికే వెళ్తారు. అది నిజము. “దేవుడిని నమ్ముట కంటే ఒక మనుష్యుడు ఇంకేమి చేయగలడు?” అది ఖచ్చితముగా నిజము. అతడు చేయగలిగేదంతా అదియే. కాని దేవుడు ఆ విశ్వాసమును గుర్తించినప్పుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మను ఇస్తాడు.
220 “బ్రెన్హామ్ సహోదరుడా, ఇప్పుడు నేను ఏమి చేయాలి? నేను కేకలు వేయలా?” అవసరం లేదు. “నేను భాషలతో మాట్లాడాలా?” అవసరం లేదు. మీరు కేకలు వేసి మరియు భాషలతో మాట్లాడి, మరియు రెండిటినీ చేయవచ్చును, మరి అయినను ఒక—ఒక అన్యుడి వలె జీవిస్తూ, మరియు అయినను స్త్రీలను మోహిస్తూ ఉంటారు. మీరు ఇంకనూ ధూమపానము, మద్యపానము చేస్తూ, సమస్తమును చేస్తూ ఉంటారు. ప్రజలు భాషలతో మాట్లాడి, మరియు నేరుగా బయటకు వెళ్ళి మరియు నేను ఎన్నడూ చూడనటువంటి అత్యంత నీచమైన, వంకర ఒప్పందమును చేయుటను నేను చూశాను. వారు కేకలు వేసి, మరియు మొసలి కన్నీళ్ళు కార్చి, మరియు వారికి దొరికిన దేనినైనా దొంగిలించుటను నేను చూశాను. వారు బయటకు వెళ్ళి, మరియు వీధిలో వెళ్ళే ప్రతి అమ్మాయి వైపు, తిరగుటను నేను చూశాను. అహ-హ. మీరు దానిని పొందుకోలేదనుటకు అది ఒక మంచి గురుతైయున్నది. అది నిజము.
221 అయితే, సహోదరుడా, నీవు మరణములోనుండి జీవములోనికి దాటినప్పుడు, ఆ సంగతులన్నియు మృతమైపోతాయి, మరియు నీవు క్రీస్తుయేసులో ఒక నూతన సృష్టియైయున్నావు. మీరు ఏదైనా తప్పును చూసినట్లైతే, “దేవా కనికరము చూపుము,” అని మీరు దానికొరకు ప్రార్థిస్తారు. మరియు మీరు ఇబ్బందులను చూసినట్లైతే, మీరు వెళ్ళి చాడీలు చెప్తూ, మరియు దానిని ఇంకా అధ్వాన్నంగా చేయుటకు ప్రయత్నించడానికి బదులు, మీరు ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి మరియు దానిని సరిచేసుకొని, మరియు వెంటనే దానిని శాంతపరచుటకు ప్రయత్నిస్తారు. అది మీలోనున్న దేవునియొక్క ఆత్మయైయున్నది.
222 మీరు ఒక పొరపాటు చేసినయెడల ఏమిటి? మీరు వాటికి బద్ధులైయున్నారు. మీరు ఒక పొరపాటు చేస్తే, మీరు వెంటనే దానిని సరి చేసుకుంటారు. “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.” ఆ విధంగా మీరు మరణములోనుండి జీవములోనికి దాటియున్నారు, మీరు ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సహనమును కలిగియుంటారు. మన ఒప్పుకోలు నిమిత్తము విజ్ఞాపన చేయుటకు సిద్ధముగా ఉండి, పరలోకమందు కూర్చొనియున్న ఒక ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అది ఏమిటి? ఇశ్రాయేలీయులను నడిపించిన అదే అగ్నిస్తంభమునకు, అదే లోగాస్ యొద్దకు యేసు తిరిగి వెళ్ళినపుడైయున్నది, ఊటయు, ప్రకాశించుచున్న వెలుగుయొక్క వర్షధనుస్సు, అనే ఆ గొప్పవాటి సన్నిధిలో కూర్చొనియున్నాడు, ఏడు పరిపూర్ణమైన ఆత్మలు, ఒక పరిపూర్ణమైన ప్రేమగల ఆత్మ.
223 ఇపుడు గమనించండి. మొదటిది పరిపూర్ణమైన ప్రేమ, అది దేవుని ప్రేమయైయున్నది, స్వచ్ఛమైనది మరియు కల్తీలేనిదైయున్నది. తరువాత, అక్కడకు వచ్చేది, ఫిలియో ప్రేమ, అది మీరు మీ భార్య పట్ల మరియు మీ పిల్లల పట్ల కలిగియుండే ప్రేమయైయున్నది. దాని తరువాత, వచ్చేది, కామముతో కూడిన ప్రేమయైయున్నది. ఆ తరువాతది అపవిత్రమైన ప్రేమయైయున్నది. మరియు అది చెత్తగా మారేంతవరకు అలాగే సాగుతుంది, ఇంకా, ఇంకా వక్రీకరించబడుతుంది.
224 మరియు ఆరంభమును కలిగియున్న ప్రతీది, అంతమును కలిగియుంటుంది. మరియు అదంతయు తీసివేయబడుతుంది, మరియు దాని గురించి అసలు ఎటువంటి జ్ఞాపకము లేకుండాపోతుంది, మరియు ఏదో ఒక రోజు, సరిగ్గా ఆ పరిపూర్ణమైనదాని వద్దకే తిరిగి వస్తారు. మరియు ఒకే ఒక్క మార్గము…మీరు ఇక్కడ దిగువున, దారి మధ్యలో ఆగి, మరియు పైన ఇక్కడికి రాలేరు. మీరు విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు మీకు అనుగ్రహించిన రక్షణలో పూర్తిగా విశ్రాంతి పొందుచూ, నమ్మికయుంచుచు, సంపూర్ణముగా రావలసియున్నారు.
225 దేవునియొద్ద నుండి వచ్చు ఒక్క నమ్మకమైన ఆత్మ కలదు. అది ఊటయైయున్నది, దేవునియొక్క ఊట. అది నిజాయితీయైయున్నది. తరువాతది ఒక మానవుడు తన పొరుగువారికి “ఒక మంచి కార్యము” చేస్తాడు. ఆ తరువాత ఒక వ్యక్తి, “మీరు అతణ్ణి గమనించవలసియున్నది.” తరువాత వ్యక్తి, “ఒక దొంగ.” ఆ తరువాతివాడు, “ఒక హంతకుడు”, అయిపోయినది. అది రానురాను, ఎలా వంకరగా మారుతుందో చూశారా? అయితే అవన్నియు ఒక వాస్తవమైనదాని గురించి మాట్లాడుతున్నాయి.
226 నేను చెప్పేది అదే. మీరు ఒక వ్యక్తిని చూసిన ప్రతిసారి…ప్రేమికులైన, ఒక జంట వీధిలో నడుచుకుంటూ వెళ్ళుటను మీరు చూసిన ప్రతీసారీ, బహుశా వారు ఎనభై సంవత్సరాల వయస్సు గలవారై యుండవచ్చును. పరలోకములో వారికి ప్రాతినిధ్యము వహించే ఒక యవ్వన జంట ఉన్నదని మాత్రమే అది మాట్లాడుతుంది, పరలోకములో. “ఈ భూసంబంధమైన గుడారము శిధిలమైపోయినట్లైతే, అక్కడ మనకు ఒకటి ఉన్నది.”
227 ఒక మనిషి మోసగించుటను, దొంగిలించుటను, అబద్ధము చెప్పుటను మీరు చూసినట్లైతే, కేవలం గుర్తుంచుకోండి, అతని భాగము నరకములో, అతని కొరకు వేచియున్నది, అతడు దేవునియొక్క మరియు పరిశుద్ధ దూతలయొక్క సమక్షంలో, అగ్నిగంధకములతో హింసించబడే అతని స్థానము వేచియున్నది. అతడు అక్కడ హింసించబడతాడు. ఎప్పటికీ కాదు, అతడు సదాకాలము హింసించబడలేడు, ఎప్పటికీ అనగా, అన్నివేళలా సదాకాలము అను అర్థము రాదు. నిత్యత్వము సదాకాలమైయున్నది, నిత్యత్వమునకు…ఆది లేదా అంతము లేదు. అయితే ఎప్పటికీ అనేది “ఒక పరిమితి గల కాలము.” బైబిలు ఇట్లు చెప్పినది, “ఎప్పటికీ మరియు,” సంయోజకము, “ఎప్పటికీ.” [ఈ సందర్భములో తెలుగు బైబిలులో యుగయుగములు అని వాడబడినది.—తర్జుమాదారుడు.] తాను తిమింగలము కడుపులో “ఎప్పటికీ” ఉన్నాడని యోనా చెప్పాడు. [ఈ సందర్భములో తెలుగు బైబిలులో ఎన్నటికీ అని వాడబడినది.—తర్జుమాదారుడు.] అది ఒక పరిమితిగల కాలము.
228 కాని, చూడండి, ఒకే ఒక్క నిత్యజీవమున్నది, మరది దేవుడైయున్నాడు. మరియు మీరు సదాకాలము హింసించబడుతూ, మరియు ఎన్నడూ మరణించలేరంటే, అప్పుడు మీరు నిత్యజీవమును కలిగియున్నట్లే. మీరు సదాకాలము హింసించబడలేరు…మీరు బహుశా ఒక వంద మిలియన్ సంవత్సరాలు, దేవునియొక్క మరియు పరిశుద్ధ దూతలయొక్క సమక్షంలో, అగ్నిగంధకాలతో హింసించబడవచ్చును. అది ఎంతకాలం నియమించబడిందో నాకు తెలియదు. అయితే దానికి ఒక ఆరంభమున్నది గనుక అది చివరకు తప్పకుండా ఒక అంతమునకు రావలసియున్నది. మరియు దేవుడు మాత్రమే నిత్యజీవమును కలిగియున్నాడు. “నా మాటలు విని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు,” ఎప్పటికీ ఉండు జీవమును కలిగియున్నాడు కాదు, “అతడు నిత్యజీవమును కలిగియున్నాడు.” ప్రారంభమైన ఆ జీవము, ఇక్కడ ఉన్నదేదియు కాదు. కాని అక్కడ పైన, నిత్యజీవము, జోయి, దేవునియొక్క స్వంత జీవము క్రిందికి వచ్చి మరియు మానవునిలో నివసిస్తుంది, మరియు అతడు దేవునితో నిత్యుడైయుండి, మరియు మరణించలేడు. వాక్యము చెప్పినది అదేయైయున్నది.
229 కేవలం దాని గురించి ఆలోచించండి. రెండు నిత్యజీవములు ఉన్నాయా? మీరు దానికి జవాబు చెప్పలేరు, మీరు చెప్పగలరా? ఒకే ఒక్క నిత్యజీవము కలదు, మరదే దేవునియొక్క జీవమైయున్నది. ఈ వేరొక రకమైన జీవము, అది ఏమైయున్నాగాని, అది ఒక అంతమును కలిగియున్నది. మరియు ఒక ఆరంభమును కలిగియున్న దేనికైనా ఒక అంతము ఉంటుంది. అయితే ఆరంభము లేని దేనికైనా అంతము ఉండదు. మరియు ఆరంభమే లేనటువంటి, నిత్యజీవమును మనకు ఇస్తానని దేవుడు చెప్పాడు, మనము కేవలం ఆయనలో ఒక భాగముగా చేయబడ్డాము. మరియు వాస్తవానికి మనలో ఉన్న జీవము, మానవ స్వభావము ద్వారా ఇక్కడికి తీసుకురాబడలేదు. ప్రకృతి మనకు ఒక ఆత్మను ఇచ్చినది, కానీ ఆ ఆత్మ మరణించినది, మరియు మనము దేవునియుక్క ఆత్మను పొందుకున్నాము. దేవునికి మహిమ!
230 దేవుడు ఒక మానవుడా? నిశ్చయముగా. “మనము మన స్వంత పోలికలో మానవుడిని చేద్దాము.” దేవుడు ఏమైయున్నాడు? ఒక థియోఫనీ, ఒక శరీరమైయున్నాడు. మరియు అక్కడ మానవుడు ఆ విధంగా తయారు చేయబడి, మరియు ఆ తోటలో ఉంచబడ్డాడు. అయితే నేలను సేద్యపరచుటకు, ఇంద్రియములు కలిగియున్నట్టి నరుడు లేడు. అప్పుడు ఆయన జంతు జీవములో, నేల మంటితో మనిషిని సృష్టించాడు, మరియు ఆ మనిషి నేలను సాగు చేశాడు. మరియు ఆ మనుష్యుడు, అతిక్రమము వలన పడిపోయాడు. సరిగ్గా అంతే. మరియు దేవుడు, ఆ థియోఫనీ, మానవుడిని విమోచించుటకు, క్రిందికి దిగివచ్చి మరియు శరీరధారియై, మన మధ్య నివసించాడు.
231 కావున అది మీరు చేయగలిగే ఏదో విషయము కాదు. ప్రారంభములోనే, మీరు ఒక పాపియైయున్నారు. మీరు అతిక్రమములో రూపించబడ్డారు. మీరు పాపములో జన్మించి, అబద్ధములాడుతూ లోకములోనికి వచ్చారు. మీరు మీ తల్లిదండ్రులయొక్క లైంగిక వాంఛ వలన ఈ లోకములో జన్మించారు. మరియు మీరు ఏమి చేస్తారన్నది నేను లెక్కచేయను, మీరు ఎంతగానో నరకమునకు-బద్ధులైయున్నారు. బహుశా మీరు ఎన్నడూ అబద్ధమాడకపోవచ్చు, దొంగిలించకపోవచ్చు; ప్రతి ఆజ్ఞను మరియు ప్రతీదానిని పాటించియుండవచ్చు; మరియు మార్టిన్ పక్షి దాని డబ్బాగూటిలోనికి వెళ్ళునట్లే, మీరు నరకమునకు వెళ్తారు. అయితే మీరు మరలా జీవించుటకు ఒకే ఒక్క మార్గము ఏదనగా, దేవునియొక్క నిత్యజీవమైయున్న, పరిశుద్ధాత్మను అంగీకరించుటయే.
232 మీరు ఇప్పుడున్నట్లు, మిమ్మల్ని తయారు చేసింది ఏది? ఆదిలో, పరిశుద్ధాత్మ భూమి మీద పొదిగినప్పుడు, అక్కడ అగ్నిపర్వత విస్ఫోటనం తప్ప మరేమియు లేదు. ఒక చిన్న ఈస్టరు పుష్పము పైకి వచ్చింది. దేవుడు ఇట్లన్నాడు, “అది అందముగా కనబడుచున్నది. పొదుగుతూనే ఉండుము.” పువ్వులు పైకి వచ్చాయి. గడ్డి పైకి వచ్చినది. చెట్లు పైకి వచ్చినవి. దుమ్ములో నుండి పక్షులు ఎగిరినవి. జంతువులు పైకి వచ్చినవి. ఒక మానవుడు పైకి వచ్చాడు.
233 ఇప్పుడు, అది ఎలా చేయబడినది? పరిశుద్ధాత్మ పొదుగుటవలనై యున్నది, పొటాషియంను, కాల్షియంను, అటువంటి ఈ పదార్థాలను సమకూర్చుతూ; పువ్వులను, జంతువులను, మరియు నిన్ను తయారు చేయుటయైయున్నది.
234 మరియు ఇప్పుడు, నీవు ఒక ఉచిత ఎంపికను కలిగియున్నావు. దేవుడు నిన్ను పొదుగుతూ, ఇట్లంటాడు, “నా స్వరము విన్నావా? కోపముపుట్టించు దినములలో వలె నీ హృదయమును కఠినపరచుకొనవద్దు.” ఇక్కడ ఆయన క్రిందికి దిగి వచ్చి, వాక్యమును బోధించుచున్నాడు.
“వారికి ప్రకటించబడిన సువార్త…వారు దానియందు విశ్వాసమును కలిగిలేరు, కాబట్టి అది వారికి ఏ మేలు చేయలేదు.” వారు దానిని విన్నారు, కానీ వారు దానిని నమ్మలేదు.
235 దేవుడు క్రిందికి దిగివచ్చాడు. ఆయన వారికి ఒక అగ్నిస్తంభమును చూపించాడు. ఆయనయొక్క ప్రవక్త ద్వారా, సూచక క్రియలను మరియు అద్భుతాలను చూపించాడు, ఆయన అతనితో ఉన్నాడు. వారు దానిని నమ్మలేదు. ఓ, వారు అద్భుతాలను చూచుటకు ఇష్టపడ్డారు. వారు ప్రవక్త మాటలు వినుటకు ఇష్టపడ్డారు. అయితే దానిని నమ్మే విషయానికి వస్తే, వారు నమ్మలేదు. వారు నమ్మలేదని వారి జీవితాలు ఋజువు చేస్తున్నాయి.
236 “ఇప్పుడు,” ఆయన ఇట్లన్నాడు, “అదే అవిశ్వాసపు మాదిరి ప్రకారంగా మీరును పడిపోకండి.” ఏలయనగా ఈ చివరి దినములో, అన్య సంఘమునకు, దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు; అదే సూచన, అదే అద్భుతము, అదే అగ్నిస్తంభము, నిర్ధారించబడి, నిరూపించబడినది. మనము మన హృదయములను కఠినపరచుకొనక ఆ వెనుకటి అవిశ్వాసపు శోధనలో పడకయుందాము, ఏలయనగా మనము భూమి మీద కుళ్ళిపోతాము, మరియు ఇక అంతటితో అయిపోతుంది.
237 మరియు పరిశుద్ధాత్మ మీ హృదయములను తట్టి, [సహోదరుడు బ్రెన్హామ్ గారు ప్రసంగ వేదికను తట్టుచున్నాడు—సంపా.] “ఇంత కాలమైన తరువాత, నీవు నా స్వరమును వినినప్పుడు, నీ హృదయమును కఠినపరచుకొనకుము.” అంటూ, “నా బిడ్డ, ఇది సత్యము” అని చెప్పినప్పుడు. వర్తమానికుడి వైపు చూడకండి. కానీ వర్తమానమును వినండి. దానిని నమ్మండి. “కోపము పుట్టించు దినములలో వలె మీ హృదయమును కఠినపరచుకోకండి.”
238 మీరు ఆయన స్వరమును వినినప్పుడు, “మీ హృదయమును కఠినపరచుకొనవద్దు.” అప్పుడు మీరు ఇట్లు చెప్పండి, “అవును, ప్రభువా, నేను నమ్ముచున్నాను.” అప్పుడు మీరు జీవములోనికి ప్రవేశిస్తారు, పరిశుద్ధాత్మ మీలోనికి వస్తాడు. మీరు దురాశపడునట్లు, మరియు ద్వేషించునట్లు చేసే మీ పాత ఆత్మ చనిపోతుంది, మరియు అసూయ మరియు శత్రుత్వము, మరియు—మరియు ద్వేషము మరియు అటువంటివన్నీ, చనిపోతాయి. మరియు మీరు ప్రేమతో, ఆనందముతో, సమాధానముతో, విశ్రాంతితో నిండిపోతారు. గాలులు ఎంతగా వీచినప్పటికినీ, ఫర్వాలేదు.
నా లంగరు తెరలోపల పట్టియుంచుతుంది;
ప్రతి ఎత్తైన పెను తుఫానులోను,
నా లంగరు తెరలోపల పట్టియుంచుతుంది.
ఏలయనగా, క్రీస్తనే ఆ స్థిరమైన బండ మీద, నేను నిలబడియున్నాను;
మిగతా నేలంతా మునిగిపోవుచున్న ఇసుక మాత్రమే.
239 విషయం అదేయైయున్నది. ఎడ్డీ పెర్రోనెట్, ఆ ప్రసిద్ధిగాంచిన పాటను వ్రాసాడు. మిగతా నేలంతా, సంఘశాఖలన్నీ, మతాచారములన్నీ, సిద్ధాంతములన్నీ, గతించిపోతాయి. క్రీస్తు మాత్రమే!
“మంచిది, నాకు బైబిలు గ్రంథము తెలుసు,” అని మీరు అనవచ్చును. బైబిలును తెలుసుకోవడం ద్వారా మీరు జీవమును పొందుకోరు.
“నా క్యాథలిక్ ఉపదేశ గ్రంథము నాకు తెలుసు.” మీ క్యాథలిక్ ఉపదేశ గ్రంథమును తెలుసుకొనుటద్వారా మీరు జీవమును పొందుకోరు.
“మంచిది, నేను ఒక క్రైస్తవుడను.” క్రైస్తవ్యమును ఒప్పుకొనుట ద్వారా మీరు జీవమును పొందుకోరు.
240 మీరు ఆయనను ఎరుగుట ద్వారా జీవమును పొందుకుంటారు. ఆయనను ఎరుగుట ద్వారా, మీరు జీవమును పొందుకుంటారు. “అప్పుడు మీరు ఆయనయొక్క విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. దేవుడు తన కార్యములను ముగించినట్లే, మీరును మీ కార్యములను ముగిస్తారు.” నీవు ఒక దేవుని కుమారునిగా, దేవునిలో పాలుపొందుకొనువాడిగా చేయబడ్డావు. మరియు అది—ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆకర్షించితే, మరియు మీరును తిరిగి ఆకర్షించి మరియు ఇట్లంటారు, “అవును, ప్రభువా,” లేదా అట్లు కూస్తారు.
241 కూ, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిచ్చెదను.”
242 మరియు మీరు “ఓ, నేను యవ్వనస్థుడను. నేను…ఓ, నా సంఘకాపరి ఒప్పుకోడు…నేను చేయవలసిందంతా…” అని అన్నారనుకోండి, చూశారా? మీరు దానిని ఎన్నడూ కనుగొనలేరు.
243 కానీ మీరు ఇట్లు చెప్పినపుడు, “అవును, నా ప్రభువా. నేను నీ స్వరమును వినుచున్నాను. నేను నా హృదయమును కఠినపరచుకోవడంలేదు. ఏది ఏమైనా నేను లెక్కచేయను, ప్రభువా, అది నీ వాక్యమైయున్నది మరియు నేను నిన్ను నమ్ముచున్నాను. యేసూ, నన్ను తీసుకొనుము, ‘నేను ఉన్నలాగునే తీసుకొనుము, ఒక్క మనవి కూడా లేకుండా ఉన్నాను, అయితే నీ రక్తము నా కొరకు చిందించబడినది. మరియు అక్కడ “నేను నమ్ముతాను,” అని నేను వాగ్దానము చేస్తాను. ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వచ్చుచున్నాను.’” మరణమగుచున్న ఆయన శిరస్సుపై మీ చేతులను ఉంచి, ఇట్లు చెప్పండి, “ప్రభువా, నేను ఒక పాపిని, మరియు నీవు నన్ను పిలిచావు.”
244 “తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు, మరియు అంత్య దినములందు నేను వానిని లేపుదును.”
245 “అవును, ప్రభువా, నేను వచ్చుచున్నాను. కోపము పుట్టించినప్పుడు వారు చేసినట్లు, నేను నా హృదయమును కఠినపరచుకోను, నేను నిజముగా నమ్ముచున్నాను.”
246 అప్పుడు ఆయన ఏమి చేస్తాడు? ఆయన మీకు తన జీవమును, జోయిను, నిత్యజీవమును ఇస్తాడు. మరియు మనము ఎక్కడ నుండైతే వచ్చామో, అటువంటి మట్టిలోనుండి దేవుడు మనలను లేపగలిగినయెడల…మనము మట్టిలోనుండి వచ్చామా? మీరు చూసే ప్రతీది, మట్టిలోనుండి వచ్చినది. మరియు కేవలం నన్ను కలుగజేసి, మరియు నేను కల్వరిని ఎదుర్కొని మరియు నా నిర్ణయమును తీసుకొనుటకు నాకు ఒక అవకాశమును ఇవ్వాలన్నదే ఆయనయొక్క కోరికయైనందుకు; ఏ ఎంపిక లేకుండా, ఈ రోజున నేను ఏమైయున్నానో దేవుడు నన్ను ఆ విధంగా తయారు చేయగలిగినట్లైతే; మరి నేను నా నిర్ణయమును తీసుకొని మరియు ఆయనయందు విశ్వాసముంచాను; ఆయన నన్ను ఇంకెంతగా లేపుతాడు కదా! ఒక ఎంపిక లేకుండా, నేను ఏమైయున్నానో ఆయన నన్ను ఆ విధంగా చేసినట్లైతే, పిదప ఆయన తనపై తన చేతినుంచుకొని; మరియు అంత్య దినమున ఆయన నన్ను లేపుతాడని తనపై తాను ఒట్టుపెట్టుకున్నప్పుడు, నేను ఒక ఎంపికను చేసుకొని మరియు ఆయనను లోపలికి తీసుకున్నాను. నేను నిశ్చింతగా ఉంటాను.
247 నేను విశ్రాంతిని కలిగియున్నాను, నేను ఆదివారము ఆరాధిస్తాను అన్నందుకు కాదు, నేను విశ్రాంతి దినమున ఆరాధిస్తాను అన్నందుకు కాదు. దానితో ఎటువంటి సంబంధము లేదు. నేను ఆయనయొక్క సమాధానములోనికి మరియు ఆయనయొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాను గనుక నేను ఆరాధిస్తాను: సమాధానము, విశ్రాంతి, ప్రేమ, సంతోషము. తుఫానులు రేగనివ్వండి; నా లంగరు పట్టియుంచుతుంది.
248 ఈ రాత్రి, ఉడకగానున్న ఈ ఆలయములో కూర్చొనియున్న నా స్నేహితుడా, నీవు ఆ అనుభవమును కలిగియున్నావా? నీవు నా మాటలు వినుటకు రాలేదు. లేదు. నీవు వాక్యమును వినుటకు వచ్చావు. నా స్నేహితుడా, వినుము.
249 ఇప్పుడు నీవు ఆ విశ్రాంతిని కలిగిలేనట్లైతే, సరిగ్గా ఇప్పుడే నీవు దానిని కనుగొనగలవు. నీవు ఇక్కడ బలిపీఠము నొద్దకు రావలసిన అవసరంలేదు. సరిగ్గా నీవు ఉన్న చోటనే ఉండుము. యధార్థముగా ఉండి, మరియు ఇట్లు చెప్పుము, “క్రీస్తు, నా హృదయముతో మాట్లాడుము. వేడిగా ఉన్నదని నాకు తెలుసు. నేను—నేను మొత్తం తడిగా, చెమటలు పట్టియున్నాను. నేను భయంకరంగా ఉన్నాను. కానీ, ప్రభువా, నిజముగా, ఉదయముకల్లా, ఇంతకంటే ఘోరముగా, నేను నొప్పితో చెమటలు కక్కుతూ ఉండవచ్చును.”
మరియు వైద్యుడు తన తలను ఊపి, “అది గుండెపోటు. అతడు చనిపోయాడు,” అని చెప్పవచ్చును. మరప్పుడు ఏమిటి?
250 అప్పుడేమిటి? గొప్ప గ్రంథము తెరవబడినప్పుడు, అప్పుడు ఏమిటి? మీరు ఆ పాట విన్నారు, అప్పుడు ఏమిటి? “వర్తమానమును తృణీకరించినవారు, ఒక కారణము చెప్పమని అడుగబడునప్పుడు, అప్పుడు ఏమిటి?” అప్పుడు ఏమిటి? ఇప్పుడు దాని గురించి, తీవ్రముగా ఆలోచించండి.
251 మనము తలలు వంచియుండగా, దానిని గూర్చి ఆలోచించండి.
ఈ రాత్రి ఈ వర్తమానమును నిరాకరిస్తున్నవారు,
కారణము చెప్పమని ప్రశ్నించబడినప్పుడు—అప్పుడు ఏమిటి?
అప్పుడు ఏమిటి? అప్పుడు ఏమిటి?
ఆ గొప్ప గ్రంథము తెరవబడినపుడు, అప్పుడు ఏమిటి?
ఈ రాత్రి ఈ వర్తమానమును నిరాకరిస్తున్నవారు,
కారణము చెప్పమని మీరు ప్రశ్నించబడబోవుచున్నారు—అప్పుడు ఏమిటి?
252 పరలోకపు తండ్రీ, ఇప్పుడు ఇదంతయు నీ చేతులలో ఉన్నది. ఇక్కడ ప్రజల ముందు నిజమైన సబ్బాతు ఉంచబడియున్నది. గత కొన్ని సంవత్సరాలుగా, ఇక్కడ దేవునియొక్క దూత ఉన్నాడు, ప్రపంచమంతటినీ కుదిపివేసాడు. విమర్శకులు మరియు సమస్తమూ, దానిని ఖండించుటకు ప్రయత్నించారు. కానీ, ప్రతీసారి, నిన్ను నీవు దేవుడిగా నిరూపించుకొనుచున్నావు.
253 శాస్త్రీయ ప్రపంచము, సంఘ ప్రపంచము; ప్రభువా, వారు గ్రుడ్డివారా? బహుశా ఈ రాత్రి ఇక్కడ ఒకరు వారి దృష్టిని పొందగోరుచుండవచ్చును, కోపము పుట్టించిన దినములలో వలె, దేవునిని శోధించినట్లు కాకుండా, నడవాలని అనుకోవచ్చును; ఆదివారము మంచిగా ఉండుట ద్వారా, లేదా ఒక ఫలానా రోజును ఆచరించుట ద్వారా, లేదా ఒక ఫలానా మతాచారమునకు, లేదా ఒక ఫలానా సంఘమునకు చెందుటద్వారా ఆయనను శోధించుటకు ప్రయత్నించకూడదని అనుకొనుచుండవచ్చును. అయితే బయటకు వచ్చి, హృదయపు సున్నతిని పొంది, మరియు పరిశుద్ధాత్మను పొందుకొనగోరుచున్నారు. మరియు వారికి ఆయన కావాలి. ఇప్పుడు విశ్వాసము ద్వారా, వారు ఆయనను వారి హృదయములోనికి అంగీకరించుటకు ప్రయత్నిస్తున్నారు. ప్రభువా, వారు నీ కృపను కనుగొనుటకు ప్రయత్నించుచున్నారు.
254 ఓ, వారు భాషలలో మాట్లాడియుండవచ్చును. వారు కేకలు వేసియుండవచ్చును. వారు ఇంకనూ అదే పాత కోపమును కలిగియున్నారు. వారు ఇంకనూ అదే పాత అసూయను కలిగియున్నారు. వారింకనూ వదరుబోతు మాటలు మాట్లాడుచూ, మరియు వారు చేయకూడని కార్యములు చేయుచున్నారు. ప్రభువా, వారు దానిని కోరడంలేదు. అలాగైతే, “అటువంటివారు రాజ్యములో ప్రవేశించరు” అని చెప్పినట్టి, ఆ గొప్ప గ్రంథము తెరవబడినప్పుడు ఏమిటి? “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి.” ఏ కొంచెం తక్కువైనా లోపలికి వెళ్ళరు. ఈ రాత్రి, సిలువ వేయబడిన ఆయనయందు వారు పూర్తిగా నమ్మికయుంచుచున్నారా? లేనియెడల, ప్రభువా, ఇప్పుడే వారు ఆ ఒక్క నిత్యమైన “అవును” ను చేయుదురు గాక.
255 ఇట్లు చెప్పండి, “ప్రభువా, నేను…ఎటువంటి ఉద్రేకము లేదు, కానీ నేను నా హృదయంలో ఏదో అనుభూతి చెందుచున్నాను, ఏదో నాకు చెప్పుచున్నది, ‘నీ కృప ద్వారా, సరిగ్గా ఇప్పుడే నేను దానిని చేయగలను.’ మరియు ఇప్పుడు నేను నిన్ను నా వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించుచున్నాను. నేను—నేను లోక కార్యములన్నిటిని త్రోసివేయుచున్నాను, మరియు నేను నీ విశ్రాంతిలో ప్రవేశించగోరుచున్నాను. మరియు ఇప్పుడే నేను దానిని చేయుచున్నానని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నన్ను తిన్నగా ఆ స్థలములోనికి తీసుకొని వచ్చుచున్నదని నేను నమ్ముచున్నాను.”
256 ప్రతి తల వంచియుండగా. ఎవరైనా ఇప్పుడు ఆ విధంగా భావిస్తున్నారా? మీ చేయి పైకెత్తండి, “ఇప్పుడు నేను ఇక ఎంత మాత్రము వదరుబోతు మాటలు పలుకనటువంటి ఒక చోటుకి పరిశుద్ధాత్ముడు నన్ను తీసుకొని వస్తున్నాడు.” దేవుడు నిన్ను దీవించును గాక. “నేను ఆ పనులు చేయను. నా కోపము పోయినది. సరిగ్గా ఇప్పటి నుండి నేను సమాధానము, సంతోషము మరియు దీర్ఘశాంతముతో జీవించగలను. ఆయన కృప ద్వారా, ఈ ఘడియ నుండి నేను దానిని చేయగలనని, ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడుచున్నాడని నేను నమ్ముచున్నాను.” మీరు మీ చేతులను ఎత్తుతారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఆ యువతిని దీవించును గాక. ఇంకా ఎవరైనా? “నేను ఇప్పుడు నమ్ముచున్నాను.”
257 కోపము పుట్టించిన దినమువలె, ఆయనను శోధించకండి. మనము ఆదివారము సంఘమునకు వెళతాము లేక సబ్బాతును పాటిస్తాము, ఏమి ఫర్వాలేదు అని అనుకోకండి. పౌలు ఇట్లు చెప్పాడు, “దినములు లేక అమావాస్యలు లేక అటువంటివి ఆచరించువారలారా, నేను మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ధర్మశాస్త్రము రాబోవు మేలులయొక్క ఛాయను కలిగియుండి, మరియు ఆ విషయముయొక్క నిజ స్వరూపము కానిదై, ఆరాధకుడిని ఎన్నడూ పరిపూర్ణుడిగా చేయలేదు.” అయితే క్రీస్తు మిమ్మల్ని పరిపూర్ణులుగా, దేవుని దృష్టిలో పరిపూర్ణులుగా చేస్తాడు. ఆయన మీ పాపమును తీసివేస్తాడు, మీపై నుండి దోషారోపణను తీసివేస్తాడు, తన ప్రేమను మరియు సంతోషమును మీకు ఇస్తాడు.
258 ఇప్పుడు మీరు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారా? ఇంకెవరైనా తమ చేతిని పైకెత్తి, ఇట్లు చెప్పండి, “నేను దానిని చేశాను.” ఇక్కడ నాకు ఎడమ వైపున ఉన్న, యవ్వనస్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. నా కుడి ప్రక్కన కూర్చొనియున్న పురుషుడిని దేవుడు దీవించును గాక. ఆయనయొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుట, ఇప్పుడే దాని గురించి ఆలోచించండి.
259 ఇట్లు ప్రార్థించండి, “ప్రభువా, ఏ సాకూ లేకుండా, నేను ఉన్నట్లుగానే వచ్చుచున్నాను; నాలో ఏ మంచియు లేదు. కేవలం నా పాత, నలిగిపోయిన, పాపభరితమైన జీవితము తప్ప, నేను నీకు అర్పించుటకు ఏమియు లేదు. నీవు నన్ను స్వీకరిస్తావా? శుద్ధి చేస్తావా? సేదదీర్చుతావా? ఎందుకనగా, నేను నమ్ముతానని వాగ్దానము చేశాను. ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వచ్చుచున్నాను. ఇప్పుడు నేను మరణము నుండి జీవములోనికి దాటియున్నానని నమ్ముతూ, నేను ఇపుడు వచ్చాను. ఎందుకనగా, సరిగ్గా ఇక్కడ నా కుర్చీలోయుండగానే, నేను నిన్ను నా రక్షకునిగా స్వీకరించాను మరియు నా హృదయములో నేను సమాధానమును అనుభూతి చెందుతున్నాను.”
260 ఐదుగురు తమ చేతులను పైకెత్తారు. ఆ విధంగా భావిస్తున్నవారు, ఇంకెవరైనా, మీ చెయ్యి పైకెత్తుతారా? నీవు ఒక క్రైస్తవుడవు కానట్లైతే, సరిగ్గా ఇప్పుడే ఆయనను స్వీకరించుము.
261 నీవు ఒక క్రైస్తవుడవని చెప్పుకుంటూ మరియు ఆ విధంగా లేనట్లైతే, నీవు ఏ విధంగా జీవించినప్పటికినీ, లేదా నిన్ను—నిన్ను నీవు ఏ విధంగా చేసుకొనుటకు ప్రయత్నించినప్పటికినీ లెక్క లేదు, నీవు ఇంకనూ ఒక పాపివే. నీవు చేసేది అంగీకరించబడలేదు. అది ఆయన చేసిన విషయమైయున్నది. నీ స్వంత నీతి అంగీకరించబడదు. “సరి, నేను క్రైస్తవ్యమును ప్రకటించుచున్నాను గనుక, నేను పొగత్రాగుటను మానివేయడం మంచిది,” అని నీవు అనుకొనుటను బట్టి నీవు పొగ త్రాగడం మానేస్తే, దేవుడు దానిని అంగీకరించడు. కేవలం నిన్ను నీవు ఆ విధంగా ఉండునట్లు చేసుకొనుచున్నావు గనుక, నీవు స్త్రీలపై మోహించుటను ఆపివేస్తే, దేవుడు దానిని అంగీకరించడు. అది నీవు చేసే కార్యమైయున్నది. అవి క్రియలైయున్నవి. అయితే నిన్ను రక్షించేది కృపయే. దేవుడు నీ యొద్దకు వచ్చి, ఆ విషయమంతటినీ నీ నుండి తీసివేసాడా? అది తదుపరి విషయం.
262 నీవు ఇట్లంటావు, “నేను సంఘములో చేరాను, మరియు కావున నేను ఈ కార్యములను విడిచిపెట్టవలసి వచ్చింది.” దేవుడు దానిని అంగీకరించలేదు, నీవు సమర్పించగలిగేది ఏదియు లేదు. క్రీస్తు ఇచ్చినదానిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. ఆయన నీకు నిత్యజీవమును ఇచ్చి, మరియు వాటిని నీ నుండి తీసివేస్తాడు. నీవు దానిని స్వీకరిస్తావా?
…తుఫాను రేగుచున్న, భయంకరమైన సముద్రముపై ఉండగా,
వచ్చి, విశ్రాంతి అనే తీరమున మీ ఆత్మను లంగరు వేసుకోండి,
మరియు ఇట్లు చెప్పండి, “నా ప్రియుడు నా వాడు.”
నా ఆత్మను నేను లంగరు వేసుకొనియున్నాను…
మంచిది, మీరు మీ తలను పైకెత్తవచ్చు. ఇప్పుడు వర్తమానము ముగిసినది. ఇప్పుడు మనము ఆరాధించుదాము.
ఇక మీదట నేను ఆ భయంకరమైన సముద్రములో ప్రయాణము చేయను;
ఆ భయకరమైనదానిపై, గాలి తుఫాను రేగవచ్చును,
అయితే నేను యేసులో ఎన్నటెన్నటికీ సురక్షితంగా ఉన్నాను.
263 ఆరాధనలో, ఇప్పుడు ప్రతి ఒక్కరూ.
విశ్రాంతి అనే తీరమున నేను నా ఆత్మను లంగరు వేసుకొనియున్నాను, (సబ్బాతు.)
ఇక మీదట నేను ఆ భయంకరమైన సముద్రములో ప్రయాణము చేయను;
ఆ భయకరమైనదానిపై, గాలి తుఫాను రేగవచ్చును,
అయితే నేను యేసులో సదాకాలము సురక్షితంగా ఉన్నాను.
నా మీద ప్రకాశించుము…
కేవలం నిశ్చింతగా ఉండండి. మీ కన్నులు మూసుకోండి. ఆ మాధూర్యమైన ఆత్మను అనుభూతి చెందుతున్నారా? అది ఆరాధనయైయున్నది. వర్తమానము ముగిసింది. ఇది ఆరాధనయైయున్నది.
దీపస్తంభము నుండి వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము;
ఓ, నా మీద ప్రకాశించుము, ఓ ప్రభువా, నా మీద ప్రకాశించుము,
ఓ, దీపస్తంభము నుండి వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
264 ఎంతమందికి మంచి అనుభూతి కలుగుతుంది? మీ చేతిని పైకెత్తండి. ఆ మాధూర్యమైన, దీనమైన ఆత్మ, అదియే.
యేసు వలె ఉండుటకే, కేవలం యేసు వలె ఉండుటకే,
భూమి మీద నేను ఆయనవలె ఉండుటకే ఆశపడుచున్నాను;
భూమి నుండి మహిమలోనికి జీవితపు ప్రయాణమంతటిలో,
అలా ఉండాలని మాత్రమే నేను కోరుచున్నాను…
కేవలం ఆరాధించండి.