హెబ్రీ పత్రిక, మూడవ అధ్యాయము
1స్నేహితులారా, శుభోదయం. ఈ ఉదయమున ప్రభువుయొక్క సేవలో ఇక్కడ ఉండటం ఒక భాగ్యమైయున్నది. మరియు మనము ఒక గొప్ప సమయము కొరకు నిరీక్షిస్తూ మరియు నమ్మికయుంచుచున్నాము.
2 నేను ఇందాకే…ఒకప్పుడు మనము సంఘపెద్దల కార్యాలయమని పిలిచే ఆ స్థలములో ఉన్నాను, ఇప్పుడు అక్కడ రికార్డర్లు ఉన్నవి, మరియు ఇలినాయిస్ లోని జోలియట్ వద్దనుండి వచ్చిన, ఒక యవ్వనస్థురాలితో, మరియు ఆమె తల్లితో అక్కడ మాట్లాడుచున్నాను. మరియు ఆ అమ్మాయి దేవునియొక్క కృప వలనైన ఎటువంటి ఒక ఉత్పత్తి కదా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉండే మనలో చాలామందికి ఆమె తెలుసు. ఆమె మద్యపానానికి ఒక—ఒక బానిసయైయున్నది, అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నది. మరియు ఈ ఉదయము వరకు కూడా ఆ కథ నాకు స్పష్టముగా తెలియజేయబడలేదు, ఆమె వేదిక మీదనుండి వెళ్ళినది. అప్పుడు తప్పిదమంతా ఏమిటో మరియు ఏమి జరుగబోవుచున్నదో ప్రభువు ఆమెకు బయలుపరిచాడు. మరియు ఒక—ఒక త్రాగుబోతు సమాధినుండి దేవుడు ఆమెను రక్షించినందుకు, ఆమె ఏడుస్తూ మరియు సంతోషిస్తూ, వేదిక మీదనుండి వెళ్ళిపోయినది. మరియు ఆమె…ఒక స్త్రీ ఆమె వద్దకు వెళ్ళి, మరియు మత్తుపదార్థాలకు బానిసయైయున్న తన కూతురు విషయమై, ఏడ్వడం మొదలుపెట్టిందని, నేను నమ్ముచున్నాను. మరియు మీకు తెలుసా, దేవుని కృప ద్వారా, ఆ అమ్మాయి పిలువబడినది (పిలవబడినది, ఆ మరుసటి రాత్రేయని నేను నమ్ముచున్నాను, అవునా రోసెల్లా?), మరియు ఆ అమ్మాయి, మత్తుపదార్థాల నుండి, స్వస్థపరచబడినది. ఆమె మరియు ఆమె భర్త సువార్తను ప్రకటిస్తున్నారు. మరియు—మరియు—మరియు రోసెల్లా వంటి ఒక ప్రియమైన చిన్న స్త్రీని చూడటం, మరి ఆమె పరిణితి చెందియున్నది! మరియు ఇప్పుడు ఆమె, ఎంతో గౌరవప్రదమైనది, ఆమె…తన హృదయములో ఒక పిలుపును అనుభూతి చెందుచున్నది. కానీ, స్త్రీ బోధకుల గురించి బైబిలు చెప్పుచున్నదానిని ఎరిగియుండి, చూడండి, అది మరేదో అయ్యున్నదని ఆమె ఎరిగియున్నది. మరియు దేవుడు ఆమెను, సాక్ష్యమిచ్చుటకు చెరసాలలకు మరియు అటువంటివాటిలోనికి నడిపిస్తున్నాడు.
3 దేవుని చిత్తమును తెలుసుకోవడం—అనేది—వెదకడమనేది, ఎంతో అద్భుతమైన విషయము. కొన్నిసార్లు మనము ఒక అనుభూతిని కలిగియుంటాము, అయితే మనము ఆ అనుభూతిని వేరే స్థలములలోనికి తీసుకెళ్ళగోరతాము; మీరు గమనించకపోతే, దయ్యము ఆ అనుభూతిని తీసుకొని మరియు దానిని ఏదో ఒక దానిలోనికి వంకర చేస్తాడు. కానీ మనము బైబిలులో నిలిచియున్నంతకాలం, అప్పుడు మనము సరిగ్గా ఉన్నట్లే, మీరు చూడండి, మనము సరిగ్గా ప్రభువుయొక్క చిత్తముతో నడుస్తున్నాము.
4 మరియు కావున రోసెల్లా చివరకు ఎక్కడో ఒక సువార్త రంగములలోనికి వెళ్తుందని—అని నేను నమ్ముచున్నాను, ఎందుకనగా అమెరికా సువార్తను కోరడంలేదు.
అది మీకు తెలుసు. ఈ ఆంగ్లో-సాక్సన్ ప్రజల పనైపోయింది, అని, మనమిక ఒప్పుకోవచ్చును. అంతే. అమెరికా పొందుకునే సువార్త ఇక ఎంతమాత్రమూ లేదు. ఓ, అప్పుడప్పుడు, కొంతమంది వస్తుంటారు. కానీ, కేవలం సువార్త విషయమైతే, అది ముగిసిపోయినది. మరియు మీరు వారికి కనీసం బోధించలేరు, వారితో మాట్లాడలేరు. వారు దేనిని నమ్మరు. చూశారా? వారు కేవలం మొండిగా తమ స్వంత ఆలోచనలను కలిగియున్నారు, మరియు వారు స్థిరపడియున్నారు.
మరియు ఈ దేశమునకు తరువాత వచ్చేది తీర్పే. ఇది కూడా, దానిని పొందుకోబోవుచున్నది. అది మానసిక ఒత్తిడి వలన కావచ్చును. అది ఒక అణు బాంబు ద్వారా కావచ్చును. అది ఒక గొప్ప తెగులు ద్వారా కావచ్చును, ఒక రోగము లేదా ఏదో ఒకదాని ద్వారా కావచ్చును, కానీ, అది సిద్ధంగా ఉన్నది. అది వచ్చుచున్నది. వేవేలమంది రాలిపోతారు.
5 మేము, నిన్న దాటివెళ్ళాము, సహోదరుడు జాబెల్ మరియు నేను, ఎక్కడికంటే…మరియు సహోదరుడు ఉడ్, కెంటకీ నుండి వస్తున్నాము, మేము మూడు దినములు అక్కడ ఉన్నాము, మరియు గవర్నమెంటు ఇండ్లస్థలము ప్రక్కగుండా వెళ్ళాము. సహోదరుడు జాబెల్ ఇట్లన్నాడు, “అక్కడ లేరు…” నేను మర్చిపోయాను. “ఆ ఇండ్లలో ఉన్న ప్రజలలో, కనీసం ఏ సంఘమునకైనా వెళ్ళేవారు, ఎవ్వరూ లేరు.”
6 దాని గురించి మీరు వారిని అడగవచ్చును. “మంచిది, మేము మా టీవీలను కలిగియున్నాము. ఆ విధంగా మేము ఆదరణను పొందుకుంటాము.” చూశారా? అది అమెరికాయొక్క వైఖరి. చూశారా? “మాకు టీవీ ఉన్నది. మా దగ్గర చాలా డబ్బు ఉన్నది. మాకు చక్కని కార్లు, చక్కని గృహాలు ఉన్నవి. మాకు ప్రభువుతో ఏమి అవసరం? అది మాకు అవసరం లేదు.” అదీ వారి వైఖరి.
7 మనము కలిగియున్న ఏకైక మతము మరియు రక్షణ, మరియు ప్రేమ గురించియైతే, అది నిజంగా దైవభక్తిగల ప్రజల మధ్యనే ఉన్నది. అది జరుగునని బైబిలు గ్రంథము చెప్పినదని, మీకు తెలుసా. [సంఘము, “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.] అహ-హ. బైబిలును చదువువారైన మీరు, మరియు అక్కడ వెనుకనున్న బోధకుడవైన నీవు, మీరు “ఆమేన్” అని కేక వేయడం నేను విన్నాను. అది, అది నిజము. చివరి దినములలో, ప్రేమ ఎంత దూరమైపోతుందంటే; ఇక మిగిలియుండే ప్రేమ, ఎన్నుకోబడిన దేవునియొక్క ప్రజల మధ్య మాత్రమే ఉంటుంది. “తండ్రి తల్లికి విరోధముగాను, తల్లి తండ్రికి విరోధముగాను, పిల్లలు తల్లిదండ్రులకు విరోధముగాను, మరియు ఇతరమైనవారు ఒకరికొకరు విరోధముగా ఉందురు.” మరియు మిగిలియుండే ప్రేమ, కేవలం ఆ ఎన్నికయైనవారిలో, ఆ ఎన్నుకోబడిన వారిలో మాత్రమే ఉంటుంది. అక్కడ “ఎన్నిక” అనే ఆ పదము “ఎన్నుకోబడినవారు” అనే పదమునుండి వచ్చినది, దేవునియొక్క ఎన్నుకోబడిన ప్రజలు.
8 మరియు కొద్దిసేపటి క్రితం, రోసెల్లా ఆ గదిలో నాకు ఆ కథను వినిపిస్తున్నప్పుడు, నేను కేవలం ఆలోచిస్తున్నాను, అదేమిటంటే, ఆ రాత్రి, ఏదో జరిగినదని ఆమె చెప్పినది. మరియు ఏ విధంగా, ఆమె, తన జీవితమంతా, కేవలం మగత కళ్ళుగల, ఒక మద్యపాన బానిసగా ఉన్నదో చెప్పినది, ఎటువంటి ఆల్కాహాలిక్ అనానిమస్ సంస్థలు, ఏమీ చేయలేకపోయినవి, నలుగురు వైద్యులు ఆమెను విడిచిపెట్టేశారు, ఏమియు చేయబడలేని పరిస్థితి ఉన్నది, మరియు ఏ విధంగా, ఆ క్షణమునుండే, ఏదో జరిగినదని చెప్పినది.
9 ఇప్పుడు ఆమె అటువంటి మగత-కళ్ళతో లేదు. ఆమె ముప్పై-మూడేండ్ల వయస్సు గల, ఒక అందమైన యవ్వనస్థురాలైయున్నది, మరియు పక్కనుండి వెళ్తే ఎవరైనాగాని ఇరవై-రెండు సంవత్సరాలని అనుకుంటారు; దేవుడు ఆమె కొరకు ఏదైతే చేసాడో దానిని ఏ విధంగా చేసాడు గదా, మరియు ఆమె ఎంతో భిన్నంగా కనబడుచున్నది. మరియు, అయితే నేను ఇట్లన్నాను, “రోసెల్లా, జగత్తు పునాదివేయబడకముందే, దేవుడు ఆ క్షణమును నిర్ణయించాడు.” అవును, అయ్యా. చూశారా? నిజము. మరియు ఆ వెనుక బిల్లీ పాల్, అతడున్న చోట, ఆ రాత్రి ప్రజలకు ప్రార్థనా కార్డులను ఇచ్చుచున్నాడు, అతడు ప్రార్థనా కార్డును ఎవరికి ఇస్తున్నాడన్నది అతడు ఎంతమాత్రము ఎరుగకయున్నాడు కదా.
రోసెల్లా, అది అద్భుతంగా లేదా?
[సహోదరి రోసెల్లా గ్రిఫిత్ ఇట్లు చెప్పుచున్నది, “బ్రెన్హామ్ సహోదరుడా, ఆయన ఎంతటి బలవంతుడో చూపిస్తూ దేవుడు మనల్ని నడిపించాలని సంఘము ప్రార్థన చేయగలదా అని, నేను ఆశ్చర్యపోతున్నాను.”—సంపా.]
ఆమేన్. రోసెల్లా, ప్రభువు నిన్ను దీవించును గాక. నిశ్చయంగా మేము దానిని చేస్తాము. దేవుడు ఆమెను నడిపించునట్లు సంఘము ప్రార్థించాలని ఆమె కోరుచున్నది. అదేమనగా, ఆయనయొక్క మారని హస్తమును వెంబడించుటకైయున్నది. ఓ, అది చాలా బాగున్నది.
10 ఈ ఉదయం, ఒక అతిపెద్ద ప్రతిపాదన నా ముందు ఉంచబడినది. అది, లక్షల-రెట్లు లక్షల-రెట్లుగా లక్షాధికారియైయున్న ఒక వ్యక్తి గురించియైయున్నది అతడిక్కడ కెంటకీ, లూయిస్ విల్ వద్ద సమర్పిస్తూ, నా కొరకు ఐదు-మిలియన్-డాలర్ల విలువైన ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుచున్నాడు. కానీ నా హృదయలోతులో ఏదో ఇట్లన్నది, “ఆగుము, నీవు ఒక సంఘకాపరివి కావు.” చూశారా? కావున, మరి, ఐదు మిలియన్ డాలర్ల డబ్బు కేటాయించబడవచ్చును. ఇప్పుడు విస్కీ కొరకు మరియు అటువంటి వాటి కొరకు చెల్లించుటకు, ప్రభుత్వానికి వెళ్ళవలసియున్నవి, కానీ ప్రభువు కొరకు ఒక ఆలయముపై వాటిని వెచ్చించగోరుచున్నాడు. అయితే అది దేవునియొక్క ఎవరో ఒక సేవకునికి…మరియు దేవునికియొక్క ఏదో ఒక పరిచర్యకు వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే, ఇప్పుడు అది సమర్పించబడిన ఐదు మిలియన్ల డాలర్లైయున్నవి. దాని గురించి ఆలోచించండి, అది ఎటువంటి ఒక ఆలయమును తయారు చేస్తుంది కదా.
అది ఎంత వైభవంగా కనబడుతుందో చూస్తున్నావా, రోసెల్లా? అయితే ఇక్కడ ఏదో భిన్నముగా చెప్పుచున్నది. చూశారా? చూశారా? ఇక్కడ ఏదో ఉన్నది.
11 మనము ఈ చిన్న, పాత ఆలయములోనికి వచ్చుచున్నాము, అపరిచితులైన మీకు చెప్పుచున్నాను. మంచిది, ఇక్కడ మూలన ఇది ఒక ఆకర్షణీయమైన స్థలముగా ఉండగలదు, మీకు అది అర్థం కాదు, అదేమిటంటే ప్రజలు ఈ స్థలమును నిర్మించి మరియు దానిని అట్లు చేయగోరారు. అయితే ఇది ఈ విధంగా ఉండటమే మాకు ఇష్టము. చూడండి, ఇది ఈ విధంగా ఉండటాన్నే మేము ఇష్టపడుచున్నాము. మేము అక్కడ కూర్చుంటున్న పాత కుర్చీలు, అవి ఇక్కడ ఆలయములోని ఆ—ఆ పాత మునుపటి కుర్చీలైయున్నవి, అవి వరదలగుండా వెళ్ళి మరియు పైకి తేలినవి.
12 నా బైబిలు ప్రసంగవేదిక మీద ఆ విధంగా తెరవబడియున్నది. అది పైకప్పు వరకు వెళ్ళి మరియు దానిలో ఒక వాక్యము తెరువబడి క్రిందకు వచ్చినది, “ప్రభువైన నేనే దానిని నాటియున్నాను. ఎవడును నా చేతిలోనుండి దానిని లాక్కొనకుండునట్లు, రాత్రింబగళ్ళు నేను దానికి నీరు కట్టుచున్నాను.” ఇక్కడ, ఒక పడవలో దాని మీదుగా మేము ఎలా తిరిగామో. మరియు అది సరిగ్గా క్రిందకు వచ్చినది, ఆ సీట్లు తిన్నగా వాటి స్థానములకు కదిలివెళ్ళాయి. వారు చేయవలసిందల్లా దానిని తుడిచివేసి మరియు కొనసాగడమే. చూశారా? చూశారా? కావున మేము దీనిని సరిగ్గా ఈ విధంగానే ఇష్టపడుచున్నాము, ఇది సామాన్య ప్రజలు, సాధారణ స్థలము, మరియు ఒక అద్భుతమైన ప్రభువు ఉన్నట్టి చోటుయైయున్నది. ఆమేన్.
13 ఇప్పుడు, ఈ రోజు, మనము కొంత కలిగియున్నాము, మీకు తెలుసా, మనము ఇప్పుడే మీగడలోనికి వెళ్ళుటను ప్రారంభిస్తున్నాము, పాలు అంతా—అంతా బయటకు తీయబడిన తరువాత, మీగడ ఉన్నది. మరియు గుర్తుంచుకోండి, మీకు తెలుసు కదా, మీగడను ఉత్పత్తి చేయుటకు పాలు అవసరమైయున్నది. ఆ—ఆ మీగడ పాలలోని పదార్థములైయున్నది.
14 కాబట్టి మనము 1వ, 2వ అధ్యాయములను చూసాము, మరియు మనము 3వ దానిని ముగించుకుంటున్నాము, మరియు మహిమకరమైన హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయమును ప్రారంభించబోవుచున్నాము. మరియు, ఓ, ఈ గ్రంథముయొక్క బోధనలు! ఒక్క వచనము మీద, మూడు నెలలు వరకు, మనము దానితో ఉండగలము, మరియు బైబిలులోని ప్రతి వచనముతో బైబిలు అంతయు ముడిపడియున్నదని చూపించగలము. దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పరిశుద్ధాత్మయొక్క కృప మరియు సహాయముతో, ఆదికాండము నుండి ప్రకటన వరకు, నేరుగా దానితో ముడివేయలేనటువంటి, ఒక్క వచనమునైనా మీరు వేలు పెట్టి చూపించలేరు.
15 దానిని చేయగల మరొక సాహిత్యము ఎక్కడా వ్రాయబడిలేదు. మరియు గణితశాస్త్ర ప్రకారంగా, భౌగోళికంగా, అన్ని విధాలుగా, బైబిలువలె వ్రాయబడిన ఒక్క పుస్తకము కూడా బైబిలులో లేదు…ప్రపంచములోనే ఒక్క పుస్తకము కూడా లేదు, నా భావమేదనగా, బైబిలువలె వ్రాయబడినది లేదు. ఏదియు లేదు. బైబిలుయొక్క సంఖ్యాశాస్త్రము సంపూర్ణముగా సమాధానముగా ఉన్నది; అధ్యాయములు, మరియు విరామ చిహ్నాలు, మరియు సమస్తము కూడా, పరిపూర్ణముగా ఉన్నవి. వేరే ఏ పుస్తకము ఆ విధంగా లేదు; దానినదే వ్యతిరేకించకుండా ఒక్క అధ్యాయమునైనా వాటిలోనుండి మీరు చదవలేరు. కానీ బైబిలు గ్రంథమంతటిలో క్రమములో-లేని ఒక్క విషయము కూడా లేదు. మరియు వందలకొలది, వందలకొలది, వందలకొలది సంవత్సరాల కాలవ్యవధితో; అనేకమంది, అనేకమంది, అనేకమంది ప్రజలచేత వ్రాయబడినది, ఒక్క విషయం కూడా ఎరుగకుండానే…ఒకరు దానిని ఇక్కడ వ్రాసారు, మరియు ఒకరు దానిని ఇక్కడ వ్రాసారు, మరియు ఒకరు దానిని ఇక్కడ వ్రాసారు. అదంతా కలిపి సమకూర్చబడినప్పుడు, అది దేవునియొక్క బైబిలు గ్రంథమైనది. మరియు ఒక్కటి కూడా మరొకదానితో విభేదించదు, మరియు, ఏ గణితశాస్త్రమైనా, భౌగోళిక శాస్త్రమైనా. బైబిలు గ్రంథములోని ఏదైనా, ప్రతీది, సంఖ్యా సంబంధమైనదేదైనా, సమస్తమూ సంపూర్ణముగా ఇమిడిపోతాయి. అది ప్రేరేపించబడినది కాదంటే, ఇక ప్రేరేపణ అని మీరు దేనిని అంటారో, నాకు తెలియదు? ధన్యకరమైన, పాత బైబిలు గ్రంథమును బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను.
16 వారిలో కొందరు ఇట్లన్నారు, “నీవు క్యాథలిక్కువా? ప్రొటస్టెంటువా?”
నేను ఇట్లు చెప్పాను, “ఏదీ కాదు. నేను బైబిలును నమ్ముతాను.” అది నిజము. నేను బైబిలును నమ్ముతాను, మరియు ఈ దేశములో దానిని బోధించుటకు ఇంకను మనము స్వేచ్ఛను కలిగియున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఓ, అది అద్భుతము.
17 ఇపుడు మనము దాని నుండి అధ్యయనం చేయబోవుచున్నాము. మరియు ఇప్పుడు మనము హెబ్రీ పత్రికను త్రిప్పి 3వ అధ్యాయముతో ప్రారంభిద్దాము. మరియు మనము 15వ వచనము వద్ద విడిచిపెట్టాము. మరియు ఇప్పుడు మీరందరూ…
18 కొద్దిసేపటి క్రితము, నేను నా రీడింగ్ కళ్ళజోళ్ళను తీసుకున్నప్పుడు, ఎవరో గమనించడాన్ని నేను చూశాను. నా కన్నులు పాడైనవని కాదు, కానీ నాకు నలభై సంవత్సరాలు దాటిపోయినవి. సరిగ్గా ఇక్కడ, నేను దానిని మామూలుగా చదవగలను, కానీ అద్దాలతో అయితే, నేను దానిని ఇంకా బాగా చదవగలను. మరియు నేను ఉపయోగించాలనుకునే ఒక జత రీడింగ్ కళ్ళజోళ్ళను వారు నా కొరకు తయారు చేశారు, తద్వారా నేను దానిని బాగా మరియు వేగంగా చదవగలను. అందుకొరకే నేను వాటిని తీసుకున్నాను. ఇప్పుడు…
19 మొదటిగా, మనకు ఒక చిన్న నేపథ్యం కావాలి, ఎందుకనగా హెబ్రీ పత్రికలోని మొదటి భాగమును వినని, కొందరు అపరిచితులు ఎవరైనా మన మధ్య ఉండవచ్చును.
20 సరిగ్గా ఇక్కడ ఆ చివరిలో కూర్చున్న నీవు, శ్రీమతి. కాక్సువేనా? సరి, ఆమెను చూచుటకు నేను నిశ్చయంగా ఆనందిస్తున్నాను. నేను ప్రారంభించుటకు ముందు, దేవుని కృపకు ఒక సాక్ష్యంగా చెప్పుచున్నాను. క్యాన్సర్ వ్యాధి తన ముఖాన్ని తినివేస్తుండటంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఇక్కడ ఉన్నది. ఆమె సహోదరి ఉడ్ యొక్క తల్లి. మరియు నేను జీన్ మరియు లియో, మరియు వారితో, రికార్డింగులను తీసికొనుచు మిషిగన్ లో ఉన్నాను. మరియు ఇంటికి వెళ్ళే దారిలో, భార్య నాకు ఫోన్ చేసింది, లేదా నేనే ఆమెకు ఫోన్ చేశాను. ఆమె ఇట్లన్నది, “వెంటనే శ్రీమతి. ఉడ్ యొక్క తల్లియైన, శ్రీమతి. కాక్స్ కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళండి, ఎందుకనగా క్యాన్సర్ ఆమె ముఖాన్ని తినివేయుచున్నది.” కన్ను ప్రక్కలోనికి వెళ్ళి మరియు ఎముక వరకు వెళ్ళిపోయినది, ఆమె ముఖము ప్రక్కగా వెళ్ళి, మరియు పూర్తిగా వ్యాపించుచున్నది. ఒక వైద్యుడు దానికి ఏదో చేసి, దానిని మరింత పాడుచేసాడు, మరియు దానిని వ్యాపింపజేశాడు; దానిలో ఏదో ఒక రకమైన మందును పెట్టాడు.
21 మరియు వారు ఆమెను, కెంటకీలోని క్యాంప్‌బెల్స్‌విల్ నుండి, అది…లేదా, యాక్టన్, కెంటకీ అని నేను నమ్ముచున్నాను, అక్కడినుండి చికిత్స కొరకు, లూయివిల్ వద్దకు—వద్దకు, తీసుకొనివచ్చారు.
22 మరియు కావున శ్రీమతి. ఉడ్, ఆమె నలిగిపోవుటను నేను చూసిన మొదటిసారి అప్పుడేయైయున్నది. ఎందుకనగా, వాస్తవానికి, అది ఆమె—ఆమె—ఆమెయొక్క తల్లియైయున్నది, మరియు నిశ్చయంగా ఆమెకు బాధగానే ఉంటుంది. ప్రార్థనకు జవాబిస్తానని దేవుడు చెప్పాడన్న నమ్మకముతో గదిలోనికి వెళ్ళి, మరియు ఆమె కొరకు ప్రార్థించాను. మరియు కొన్ని రోజులకే, ఆమె బయటకు వచ్చింది. మరియు ఇప్పుడు ఆమె అక్కడ కూర్చొనియున్నది. కేవలం అద్భుతమైన కృపతో, ఆయన ఆమె కొరకు ఎలా చేశాడు గదా.
23 నీవు లేచి నిలబడతావా? నేను నిన్ను ఒక—ఒక—ఒక బహిరంగ ప్రదర్శన చేయాలనుకోవడం లేదు…ఎక్కడ, క్యాన్సర్ ఎక్కడ ఉండినది? ముఖమునకు ఆ—ఆ వైపున, అక్కడ చూడండి, ఆమె ముఖమునకు ఆ వైపున, ఆమె చెంప ఎముక వరకు, ఆమె కన్ను చుట్టూ, ఇక్కడ క్రింద అంతా ఉండినది. మరియు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆయన అద్భుతమైనవాడు కాడా?
24 ఒక దర్శనము ద్వారా ప్రభువు ఏమి చేశాడన్నదానిని చూడటానికి గత ఆదివారము ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కుంటివాడు మరియు గ్రుడ్డివాడైన ఒక వ్యక్తి, సరిగ్గా ఇక్కడ, చక్రాల కుర్చీలో కూర్చొనియున్నాడు. మరియు ఇక్కడ కూర్చొనియున్న ఆ వృద్ధుడు ఇలా అన్నపుడు, ఏదో నన్ను బాధించినది, “బ్రెన్హామ్ సహోదరుడా…” అది సరిగ్గా ఇక్కడున్న ఈ సహోదరుడే అని నేను నమ్ముతున్నాను. “నా భార్యకు కూడా ఆలాగే చేయుము,” అని చెప్పాడు. అతనికి ఇక్కడ ఒక కుంటిదైన భార్య ఉన్నది. నా హృదయము కరిగిపోయినది. నేను…నేను ఇవ్వగలిగినట్లైతే, ప్రపంచములో ఏదైనా నేను ఇస్తాను కానీ అది…నా శక్తిపై ఆధారపడియుండదు. అయితే దేవుడు దానిని చేస్తాడని ప్రార్థించుటలో, అది నా శక్తి మీద, మరియు మీ శక్తి మీద ఆధారపడియుంటుంది. అతనికి ఒక కుంటిదైన భార్య ఉన్నది, పక్షవాతముగల చెయ్యి, పక్షవాతముగల ఒక పాదమువలె కనబడుచున్నది. మరియు ఈ మనిషైతే ఆమె కంటే చాలా అధ్వాన్నంగా ఉన్నాడు, ఎందుకనగా ఆమె నిలబడి మరియు కొంచెం నడవగలదు, కానీ ఈ మనిషి మాత్రం అది కూడా చేయలేకపోయాడు. మరియు అతడికి…మెదడుయొక్క, ప్రాముఖ్యమైన సమతుల్యత నాడి పోయినది. మేయోవారు, ఇంకా చాలామంది ఇతరులు, అతడిని విడిచిపెట్టేశారు. మరియు ఒక క్యాథలిక్కు, ఒక క్యాథలిక్కు వైద్యుడు అతడిని ఇక్కడికి పంపించాడు; మరియు అతని అబ్బాయి ఇండియాన, జాస్పర్‌లోని సెయింట్ మెయిన్‌రాడ్‌లో ఒక యాజకుడు. అయితే అది, దిగువున అక్కడ రాబోవుచున్న ఆ ఉజ్జీవమునకు పునాదిని వేయుచున్నది.
25 మరియు అతడు పైకి లేచినప్పుడు, అతడిట్లన్నాడు, “కానీ నేను చూడలేక…” అతడు చూసి, ఇట్లన్నాడు, “అవును, నేను చూడగలుగుచున్నాను.” మీకు తెలుసా, అతడు చూడలేకపోవుచున్నాడని అతడు అనుకున్నాడు. మరియు అతడు పైకి చూశాడు, మరియు తన తలను పైకెత్తాడు, మరియు అక్కడ అతడు నడవగలిగాడు మరియు చూడగలిగాడు; తనంతట తాను, ఆ దారి నడవగుండా నడిచి వెళ్ళాడు. మరియు వారు ప్రెస్బిటేరియన్లు. అతడు సాంప్రదాయబద్దుడు. మరియు…కేవలం పెంతెకొస్తువారు లేదా హోలీనెస్ ప్రజలు మాత్రమే కేకలు వేయగలరని మీరు అనుకుంటే; మీరు పొరబడినట్లే. అటువంటి ఒక విషయం జరుగుటను వారు చూసినప్పుడు, వారు నిశ్చయంగా కేకలు వేయగలరు; ఒకరినొకరు కౌగిలించుకొని మరియు కేకలు వేయుచున్నారు. తన చక్రాల కుర్చీని నెట్టుకుంటూ, మెట్లు దిగుచు బయటకు నడిచాడు; అతని తలలో నుండి సమతుల్యత నరాలు పోయియుండగా, నడుస్తున్నాడు. దాని గురించి ఆలోచించండి. మీరు లేక నేను నడిచేటట్లే నడుస్తున్నాడు. ఓ, ఆయన అద్భుతమైనవాడు.
26 ఇప్పుడు, పౌలు హెబ్రీ పత్రికను వ్రాశాడు. మరియు ఈ హెబ్రీ పత్రిక వ్రాతలలో, అతడు దానిని వ్రాశాడు. మరియు అతడు ఈ పత్రికలను వ్రాయడానికి ముందు, మనము కనుగొంటాము…ఇప్పుడు, మనము…ఇది ఆదివారపు బడి పాఠమైయున్నది, మరియు నేను గమనించుకొని మరియు ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండుటకు ప్రయత్నిస్తాను. మరియు పిదప ప్రభువు చిత్తమైతే, ఈ రాత్రి వాటిని కొనసాగించుటకు, మనము కూటములను కలిగియుండబోవుచున్నాము. ఇప్పుడు, హెబ్రీ పత్రికలో మరియు పౌలుయొక్క మిగిలిన పత్రికలలో…
27 పౌలు ఎవరు? అతడు ఒక మొండి హెబ్రీయుడు, ఒక పండితుడు, మరియు పాత నిబంధనయొక్క గొప్ప బోధకుడు. మరియు అతడు తన దినములోని ఒక అత్యుత్తమమైన వ్యక్తిచేత బోధించబడ్డాడు. అతని పేరు ఏమిటో ఎవరైనా నాకు చెప్పండి. గమలీయేలు, అతని దినములోని అతిగొప్ప బోధకులలో ఒకడు. మరియు పౌలు గమలీయేలు పాదముల వద్ద కూర్చున్నాడు.
28 నీవు ఎక్కడకు వెళ్తావు, నీవు ఏ సంఘమునకు వెళ్తావు, ఏ బోధకుడు నీకు బోధిస్తాడు అన్నదానిలో…ఏదో విషయం ఉన్నది. మీకు అది తెలుసా? అది—దానిలో ఏదో విషయమున్నది. కావున మనము శ్రేష్ఠమైనదానిని పొందుకొనునట్లు; మనము కనుగొనగలిగే అతిశ్రేష్ఠమైనదానిని మనము వెదకవలసియున్నాము; అది కలుపుగోలుగానో లేదా ఆ విధంగా ఉన్నందుకో కాదు, కానీ నిజమైన బైబిలు బోధనను వెదకవలసియున్నాము.
29 చూడండి, ఒకసారి ఇశ్రాయేలీయులు తమ సైన్యములతో అరణ్యములోనికి వెళ్ళినప్పుడు, వారు ఏడు-దినముల ప్రయాణము చేసారు, మరియు వారివద్ద నీళ్ళు అయిపోయినవి. మరియు వారు నశించిపోబోవుచున్నారు, వారు ఇట్లన్నారు, “ఓ, దగ్గరలో ఒక ప్రవక్త ఉంటే బాగుండునే!”
30 మరియు వారిలో ఒకరు ఇట్లన్నారు, “మనకు దిగువున ఇక్కడ, ఎలీషా ఉన్నాడు. అతడు ఏలీయా చేతుల మీద నీళ్ళుపోసినాడు.” అతని సహచరులను చూశారా? ఇంకో మాటలో చెప్పాలంటే, “ఏలీయాతో సహవాసము కలిగియున్న ఎలీషా ఇక్కడున్నాడు. ప్రభువుయొక్క వాక్యము అతనితో ఉన్నది.” మీకు అది అర్థమైందా? అతడు సరిగ్గా బోధించబడ్డాడు. మరియు అతడిట్లన్నాడు, “అతడు ఇక్కడ ఉన్నాడు. మనము వెళ్ళి మరియు అతడిని సంప్రదించుదాము, ఎందుకనగా అతని బోధకుడు ఏలీయా, మరియు అతడు తనయందు ఏలీయాయొక్క ఉపదేశమును కలిగియున్నాడు.” అది ఎంత వ్యత్యాసాన్ని కలిగిస్తుందో చూశారా? ఖచ్చితంగా. మనము బోధించబడాలని కోరుచున్నాము.
31 కాబట్టి, పౌలు గమలీయేలుయొక్క బోధను కలిగియున్నాడు. మరియు ఆ నిర్ణయము చేసిన ఆ గొప్ప వ్యక్తి గమలీయేలే, అదేమనగా స్వయంగా తానే ఒక పండితుడైయుండి, ప్రారంభ సంఘములో ఇవన్నియు జరగడం మొదలైనప్పుడు, అతడు ఇట్లన్నాడు, “సహోదరులారా, దానిపై మన చేతులు ఉంచవద్దు. అది దేవునివలన కలిగినది కానియెడల, ఎలాగైనా, అది వ్యర్థమైపోతుంది. అయితే అది దేవునివలన కలిగినదైతే, మరియు మనము దానికి వ్యతిరేకముగా పోరాడినట్లైతే, మనము దేవునికి వ్యతిరేకముగా పోరాడుచున్న స్థితిలో మనల్ని మనము కనుగొంటాము.” చూడండి, అతడు కొంచెం మంచి బోధనే కలిగియున్నాడు.
32 పౌలు ఈ మనుష్యుడి క్రింద పెరిగాడు, మరియు పౌలు ఒక గొప్ప బోధకుడని అతనికి తెలుసు. కాబట్టి, ఒక దినమున, నిజాయితీగల హృదయముతో, సంఘమును హింసిస్తూ, వారిని బంధించుటకు వెళ్ళుచున్నాడు.
33 ఇప్పుడు మనం మన నేపథ్యమును తీసుకొనుచుండగా, పౌలుయొక్క వేరొక చిన్న భాగమును తీసుకుందాము.
34 అతిక్రమము చేయుటవలన, ధనముపై ఉన్న ప్రేమ మరియు జీవితములో ఉన్న గర్వమువలన, యూదా పడిపోయినప్పుడు, అతడు కృప నుండి పడిపోయి మరియు తన స్థానమునకు వెళ్ళిపోయాడు. మరియు శిష్యులు ఇట్లన్నారు, “పన్నెండుమంది ఉండవలసియున్నది.” మరియు సంఘము, దానియొక్క ఘనత అంతటితో, సంఘమంటే ఏమిటో మీకు చూపించడానికి చెప్పుచున్నాను; దానియొక్క ఘనత అంతటితో మరియు దాని శక్తి అంతటితో, దానియొక్క అత్యుత్తమమైన స్థితిలో ఉండి కూడా, అది ఇంకా మిలియన్ల మైళ్ళు కొరతలో ఉన్నది. వారు ఇట్లన్నారు, “మన మధ్యనుండి, ఆ స్థానమును తీసుకునే ఒకరిని, మనము కనుగొనవలసియున్నాము.” మరియు వారు, చీట్లు వేయడం ద్వారా, మత్తీయను ఎన్నుకున్నారు. మత్తయి, అని నేను నమ్ముచున్నాను, లేదా మత్తీయ. అది మత్తీయ, అని నేను నమ్ముచున్నాను. మరియు వారు అతడిని ఎన్నుకొని మరియు పన్నెండు మందితో, పదకొండు మందితో కలిపినప్పుడు, మరది పన్నెండుమందిగా చేసినది, అప్పటినుండి అతడు ఒక్క కార్యమును కూడా చేయలేదు. లేఖనాలలో అతడి పేరు ప్రస్తావించబడిన ఒకే ఒక్క సమయం అదేయైయున్నది. అది సంఘము దాని ఎన్నికను చేయుటయైయున్నది.
35 ఇప్పుడు, “అతడొక మర్యాదస్థుడు,” అని వారు అనుకున్నారు. దానిలో ఎటువంటి సందేహమూ లేదు. “అతడొక అద్భుతమైన వ్యక్తి. అతడొక పండితుడు. అతడు తెలివైనవాడు. అతడు విద్యావంతుడు. అతడు ఒక అద్భుతమైన వ్యక్తియైయున్నాడు. అతడు యూదా స్థానమును తీసుకొని మరియు మనలో ఒకనిగా ఉంటాడు.”
36 అయితే, మీకు తెలుసా, దేవుడు కొన్నిసార్లు…మన అభిప్రాయానికి, అత్యంత వెర్రితనంగా ఉండే కొన్ని ఎన్నికలను చేస్తాడు. ఇప్పుడు దేవుడు, వంగిపోయిన-ముక్కు కలిగి, ఎంతో కోపముతో, తన మూతి విరుచుకుంటూ, “నేను వెళ్ళి, వారిలో ప్రతి ఒక్కరినీ బంధిస్తాను. నేను—నేను వారిని చెరసాలలో పడవేస్తాను. నేను దీనిని చేస్తాను” అని అంటున్న ఒక చిన్న యూదుణ్ణి చూశాడు. అది దేవునియొక్క ఎన్నికయైయున్నది.
మిగిలినవారు ఒక పండితుడిని మరియు ఒక నిపుణుడిని తీసుకున్నారు. అది సంఘముయొక్క ఎన్నికయైయున్నది.
37 చూడండి, బలిపీఠము వద్దనున్న ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు. అది చెరసాలలో అయినా లేదా ఎక్కడైనా, మీరు సాక్ష్యమిస్తున్న ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు. అతడొక పోట్లాడేవానిగా కనబడవచ్చును, అతని చెవులు క్రిందకి వంగిపోయి, తీక్షణంగా చూచు కళ్ళను కలిగియుండవచ్చును, మరియు, కానీ అతడు ఎవరో మీకు తెలియదు. మీరు కేవలం చిట్టీని వేస్తారు, అంతే, అతనికి వాక్యమును ఇవ్వండి. దేవుడే ఎన్నిక చేస్తాడు.
38 మరియు దేవుడు కోప-స్వభావంగల ఈ చిన్న యూదుడిని ఎన్నుకుంటాడు, లేదా, అతడిని ఎన్నుకున్నాడు. అతడు వెళ్ళే దారిలో ఇట్లనుకున్నాడు, “నేను వెళ్ళి వారిని పట్టుకుంటాను. నేను—నేను ఆ విధంగా ఏమి చేయగలనో వారికి చూపిస్తాను,” మరియు దేవుడు అతడిని నేలకు పడగొట్టాడు.
దేవుడు ఇట్లన్నాడు, “అది, సరిగ్గా అదియే నా ఎన్నికయైయున్నది.”
39 సంఘమునకు, అది వెర్రితనముగా ఉండదా? “ఎందుకు, అతడు సంఘమును హింసిస్తాడు. అతడొక శరీర సంబంధమైన మనుష్యుడు.” అయితే మనుష్యునియొక్క అంతరంగములో ఏమియున్నదో దేవుడు ఎరిగియున్నాడు. నా భావమును గ్రహిస్తున్నారా?
40 కాబట్టి, పౌలు ఒక అనుభవమును పొందుకున్నాడు. మారుమనస్సు పొందుటవలన అనుభవము వస్తుందని ఎంతమంది నమ్ముచున్నారు? నిశ్చయంగా. అది రాలేదంటే, నేను ఆ మారుమనస్సును సందేహిస్తాను. ఒక మారుమనస్సు ఒక అనుభవాన్ని తీసుకువస్తుంది. మరియు ఇప్పుడు మీరు దేనితోనూ దానిని లెక్కించలేరు. కొన్నిసార్లు అది కేకలు వేయడమైయుండవచ్చును. కొన్నిసార్లు అది భాషలతో మాట్లాడటమైయుండవచ్చును. కొన్నిసార్లు అది ఏడ్వటమైయుండవచ్చును. కొన్నిసార్లు అది మూల్గడమైయుండవచ్చును. అది ఏమిటో మీకు తెలియదు, కావున దానిని తూకము వేయుటకు ప్రయత్నించకండి. ఎందుకనగా, దానివిషయమై మీలో ప్రతి ఒక్కరూ, మెథడిష్టువారైన మీరు, మరియు బాప్టిస్టువారైన మీరు, నాజరీనువారైన మీరు, పెంతెకొస్తువారైన మీరు తప్పని నిరూపించబడ్డారు.
41 వారు కేకలు వేయగలిగినంత గట్టిగా కేకలు వేసి, మరియు వారికి సాధ్యమైతే, మీ పళ్ళలోని బంగారమును దొంగిలించే ప్రజలను నేను చూశాను. అవును, అయ్యా. ఎండిపోయిన ఆవు చర్మము మీద శనగలు పోయుచున్నట్లు భాషలతో మాట్లాడుతూ, మరియు—మరియు నిజాయితీగా ఉంటూనే, ఒక దవడకి పొగాకు నములుతూ, మరియు వారికి సాధ్యమైతే మీ గొంతును కోసివేయునట్టి ప్రజలను నేను చూసాను. అది నిజము. కావున ఆ విషయాలు కావు…కేవలం ఆ వ్యక్తి జీవించే జీవితం ద్వారా తప్ప, మీరు దానిని ఋజువు చేయగల ఎటువంటి సాక్ష్యాధారము లేదు. “వారి ఫలములవలన, మీరు వారిని తెలుసుకొందురు.”
42 కాబట్టి, అదంతా దేవుని పనైయున్నది. ఆయనే ఒక ఎన్నికను చేస్తాడు. ఆయన కార్యములను సమకూర్చుతాడు, మరియు అది ఆ విధంగానే ఉన్నది. కావున మీ జీవితము బైబిలుయొక్క ఫలములతో సరితూగుచున్నట్లైతే, అప్పుడు మీరు ఒక మంచి తలంపుతోనే ఉన్నారు. మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలైయున్నారని, మీ ఆత్మ ఆయన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నట్లైతే, మీరు…ఆ పాత దుష్టత్వమంతయు తొలగిపోయి, మరియు సమస్తము నూతనముగా మారినది, మరియు మీరు ప్రేమలో జీవిస్తూ, మరియు మీరు సమాధానమును, మరియు కృపను, మరియు మొదలగువాటిని కలిగియున్నారు, అప్పుడు మీరు రాజ్యమునకు ఎంతో దగ్గరౌతున్నారు. ఎందుకనగా, మీలోనున్న జీవము అటువంటి ఒక జీవితమునే ఉత్పత్తి చేయుచున్నది. చూశారా?
43 “ఓ, హల్లెలూయా, నేను భాషలతో మాట్లాడాను. హల్లెలూయా!” అని మీరు చెప్పినట్లైతే, విషయం అది కానే కాదు. మీరు బయట ఇక్కడికి వచ్చి మరియు గిటార్ మీద లేదా అటువంటి దేనిమీదనో, ఒక రాగము వాయించుట కంటె అది పెద్ద విషయమేమి కాదు. దానిలో విషయమేమి లేదు. మీరు భాషలతో మాట్లాడినప్పటికి, మీరు కేకలు వేసినప్పటికి, మరియు మధ్యదారి గుండా పైకి-మరియు-క్రిందకు పరుగెత్తుకుంటూ, మరియు మీరు ఉల్లిపాయలు తరిగినట్లు కన్నీళ్లు కార్చినా గాని, దానిలో విషయమేమి లేదు, ఆ అనుదిన జీవితం దానితో సరితూగుచు, దానితో ఉండేంతవరకు, అది అసలు విషయం కానే కాదు.
44 ఇప్పుడు, మీరు ఆ కార్యములను చేస్తూ, మరియు ఆ జీవితమును కలిగియుంటే, “ఆమేన్,” అది, అది మంచిది. అది బాగుంటుంది. అయితే ఆ జీవితమును కలిగిలేకుండానే మీరు ఆ కార్యములను చేయగలరు.
45 కాబట్టి అటువంటప్పుడు, ఆ కేకలు వేయడమనేది, అటువంటిదేదీ ఋజువు కానే కాదు. యేసు ఇట్లు చెప్పాడు, “వారి ఫలములవలన, మీరు వారిని తెలుసుకొందురు.” మరియు భాషలతో మాట్లాడటం ఆత్మయొక్క ఫలము కాదు. అది ఆత్మయొక్క ఫలము కాదు. కేకలు వేయడం ఆత్మయొక్క ఫలము కాదు. ఏడవటం ఈ ఆత్మయొక్క ఫలము కాదు. అయితే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, అనునవి ఆత్మయొక్క ఫలములైయున్నవి. చూశారా? ఆత్మయొక్క ఫలములు అవే. మంచిది.
46 ఇపుడు, మనము ఈ సంగతులను కలిగియుండటానికి కారణమేదనగా, వారు సంఘసంస్థలను తయారు చేయగోరుతున్నారు, మీరు చూడండి. “సరి, మేము దానిని కలిగియుంటాము. దేవునికి స్తోత్రం, మేము నమ్మినట్లే అందరూ నమ్ముచున్నారు, మేము ఈ మార్గములో వెళ్తాము. మేము నమ్ముచున్నట్లే అందరూ నమ్ముచున్నారు, మేము ఈ మార్గమున వెళ్తాము.” కానీ అందరూ ఈ మార్గములో, నేరుగా పైకి వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు.
47 ఇప్పుడు, పౌలు, ఈ అనుభవమును పొందిన తరువాత, అది ఒక అద్భుతమైన అనుభవమని అతడు తలంచాడు. ఇపుడు, ఎలా…మనము—మనము—ఆ అనుభవము గురించి కొంచెము చెప్పుకుందాము. అక్కడ దమస్కు మార్గములో కొంతమందిని బంధించడానికి, పౌలు తన మార్గములో ఉన్నాడు, ఎందుకనగా సువార్త అక్కడికి వ్యాపించినది. సువార్త అనగా “మంచి వార్త.” కావున వారు అక్కడికి విస్తరించారు, మరియు అనేకమంది ప్రజలు లేపబడుచున్నారు, ప్రేమ, మరియు సంతోషముతో నిండి, మరియు ప్రభువైన యేసును ప్రేమిస్తూ ఉన్నారు. మరియు అది ఆ విధంగా అక్కడకు వ్యాపించినది. కావున, పౌలు ప్రధాన యాజకుని వద్దనుండి కొన్ని పత్రికలను పొందాడు. అతడిట్లన్నాడు, “నేను అక్కడికి వెళ్ళి, మరియు వారిని, ప్రతి ఒక్కరిని బంధిస్తాను.”
48 కావున అతడు తాను వెళ్ళిన మార్గమందు, కొందరు కాపలాదారులను, ఆలయముయొక్క కాపలాదారులను, సైనికులను తీసుకొని వెళ్ళాడు. వారు మరియు అతడు ఆ దారి గుండా కవాతు చేస్తుండగా, అతడేమి చేయబోతున్నాడో అందరూ ఎరిగియున్నారు, ఉన్నట్టుండీ, ఏదో జరిగినది. అకస్మాత్తుగా, అతని యెదుట ఒక గొప్ప వెలుగు, గొప్ప వెలుగు వచ్చినది. ఇప్పుడు, అది సూర్యుని వలె ప్రకాశించినది. అటువంటిది జరగడం ఒక వింతైన విషయమైయున్నది. ఆ వెలుగు ఎంతగా ప్రకాశించిందంటే అతడు, దాదాపు, అతడి కళ్ళు పోయినవి. మరియు అతడు నేల మీద పడిపోయాడు. మరియు అతడు—అతడు నేల మీద పడియున్నాడు, మరియు అతడు పైకి చూశాడు.
49 అతనితో దాదాపు పది లేక పదిహేను మంది పురుషులు ఉండవచ్చును. ఆ పురుషులలో ఎవరైనా ఆ వెలుగును చూశారా? లేదు, అయ్యా. పౌలు దానిని చూశాడు. ఆ పురుషులు దానిని చూచుటకు అది నియమించబడలేదు. కావున, ఇతరులు చూడలేని సంగతులను, కొందరు చూడగలరు. చూశారా? కావున, పౌలు ఆ వెలుగును చూశాడు, ఎంతగా అంటే అది అతనికి గ్రుడ్డితనమును కలుగజేసినది. అనేక దినముల వరకు, అతడు చూడలేకపోయాడు, అది అతనికి అంతటి ఒక వాస్తవికతయైయున్నది. మరియు అతడు ఎంతో కాలం వరకు చూడలేకపోయాడు…
తరువాత, అతడు పత్రికలను వ్రాసినప్పుడు, దానివలన అతని కన్నులు అతడిని ఎంతగా ఇబ్బందిపెట్టాయంటే, అతడు పెద్ద పెద్ద అక్షరాలను వ్రాసాడు. అతడు ఇట్లన్నాడు, “నేను మీకు పెద్ద అక్షరాలతో వ్రాశాను.” అతడు అసలు సరిగా చూడలేకపోయేవాడు.
50 అతడు చెరసాలలో ఉన్నాడు, మరియు దాని నుండి తనను స్వస్థపరచమని అతడు ప్రభువును కోరాడు. మరియు అతడు మూడుసార్లు ఆయనను వేడుకున్నాడు. కానీ ప్రభువు ఏమి చెప్పాడు? “పౌలా, నా కృప చాలును.”
51 పౌలు ఇట్లన్నాడు, “అలాగైతే నా బలహీనతలయందే నేను అతిశయపడుదును.” ఎందుకనగా, అతడు ఇట్లన్నాడు, “నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందుకు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నా శరీరములో ఒక ముల్లు, నన్ను స్థిరముగా నలగగొట్టుటకు, సాతానుయొక్క దూతగా ఉంచబడెను.” అతడు కొంతకాలం వరకు బాగుండేవాడు, మరియు పిదప అది మరలా తిరిగి వచ్చేది.
బఫెట్ అనే ఆంగ్ల పదానికి “దెబ్బ మీద దెబ్బ” అని అర్థం. సముద్రము మీదనున్న ఓడవలె ఉన్నది, మీకు తెలుసు కదా, అలలు దానిని స్థిరంగా కొడుతూ ఉంటాయి, చూడండి, దెబ్బ మీద దెబ్బ.
మరియు అతడు, అతడు బాగవుతాడు, మరియు అది తరువాత మరలా వచ్చేది; పిదప బాగయ్యి, మరలా దానిని కలిగియుండేవాడు. అతడు ఇట్లన్నాడు, “ప్రభువా, ఎందుకని, నీవు దీనిని నా నుండి తీసివేయడంలేదు?”
52 ఆయన ఇట్లన్నాడు, “పౌలా, నా కృప చాలును. కేవలం కొనసాగిపో.” అది…
53 అతడు ఇట్లన్నాడు, “ఇప్పుడు, ఒకవేళ—ఒకవేళ నేను పరిపూర్ణుడనై, మరియు సమస్తము పరిపూర్ణముగా ఉన్నట్లైతే,” ఇట్లన్నాడు, “అప్పుడు నేను కొనసాగుచుండగా, ఓ, నేను గర్వాంధుడనై మరియు ఇట్లు చెప్తానేమో, ‘మీరు చూడండి, నాతో ఏ సమస్య లేదు. సహోదరుడా, ప్రభువు నా గురించి శ్రద్ధ వహిస్తాడు. హల్లెలూయా!’” అప్పుడు మీరు స్వ-నీతిపరులు అవుతున్నారు.
54 మీకు తెలుసా, మిమ్మల్ని కొంచెం దీనులుగా చేయడానికి, అప్పుడప్పుడు, దేవుడు మీకు ఏదో ఒక చిన్నదానిని ఇవ్వవలసియున్నది. అది నిజము. ఆయనే బాస్ అని మీరు గ్రహించేటట్లు చేస్తాడు. ఓ, ఆయన అద్భుతమైనవాడు కాడా? అవును, అయ్యా, కేవలం మహిమ!
55 కాబట్టి అతడు, పౌలు, అప్పుడు, ఏమిటి, ఈ గొప్ప అనుభవమును కలిగియున్న తరువాత…
56 ఇప్పుడు, అది ఈనాడు ఉన్నట్టి ఎవరో ఒకరు అయినట్లైతే, వారు ఇట్లనేవారు, “ఓ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బాయ్, ప్రభువు నా కొరకు ఒకటి చేశాడు! దేవునికి మహిమ!” అయితే పౌలు అలా కాదు; అతడు ఒక బైబిలు పండితుడైయున్నాడు.
57 ఆ అనుభవము తప్పకుండా దేవుని వాక్యముతో సరితూగవలసియున్నది. అవును, అయ్యా. అది పూర్తిగా బైబిలు గ్రంథముతో ముడిపడియుండనట్లైతే…కేవలం ఇక్కడ చూసి, “ఓ, అవును, అది సరిగ్గా ఇక్కడే ఉన్నది. దేవుని స్తుతించండి, నేను దానిని పొందుకున్నాను” అని చెప్పడం కాదు. ఆ-హా. దేవుడు దానిని ఇచ్చే విధానము అది కాదు.
58 అది, సంపూర్ణ బైబిలు గ్రంథమైయ్యుండవలసి యున్నది, అదంతా అయ్యుండవలసియున్నది. ఎందుకనగా, మీరు…అవిశ్వాసులు తర్కించుటకు ఈ బైబిలు గ్రంథమును తమకు ఆధారాలుగా ఉపయోగిస్తారు. కానీ వారు ఇక్కడ ఒక చిన్న లేఖనమును తీసుకొని, ఇక్కడకు త్రిప్పి మరియు ఇక్కడ మరొక చిన్నదానిని తీసుకొని, వాటిని ఒకదానితో ఒకటి ముడివేయుటకు ప్రయత్నిస్తారు, మరియు అవి రెండు మొత్తానికి, భిన్నమైన అంశములైయుంటాయి. కావున, మీరు లేఖనమును లేఖనముతో సరిపోల్చవలసియున్నారు.
59 28వ అధ్యాయములో, యెషయా చెప్పినట్లుగా, “అది సూత్రమువెంబడి సూత్రము, సూత్రమువెంబడి సూత్రము; కొంత ఇచ్చట, కొంత అచ్చట ఉండవలసియున్నది.” “మేలైనదానిని చేపట్టుడి.” చూడండి, అది ఆ విధంగానే వచ్చును: సూత్రమువెంబడి సూత్రము, వాక్యమువెంబడి వాక్యము, లేఖనమువెంబడి లేఖనము. అదంతా సమకూర్పు చేయబడవలసియున్నది. అందుకే, ఇప్పుడు మనము కలిగియుంటున్న ఈ పాఠములు, అది సంఘమునకు ఒక గొప్ప విషయమైయున్నదని నేను తలంచుతాను, ఎందుకంటే లేఖనములన్నియు ముడివేయబడే ఒక చోటుకు అది వారిని తీసుకొనివస్తుంది. మరియు మన అనుభవము తప్పక ఆ లేఖనముతో ముడివేయబడవలసి యున్నది. ఓ, ఇదిగో అది ఇక్కడున్నది! అది అట్లు కాకపోతే, అప్పుడది తప్పు.
60 మరియు పౌలును క్రిందకు పడవేసిన ఆ వెలుగు ఏమిటో తెలియకుండా, కొన్ని సంవత్సరాలు వరకు నేను ఎలా నడిచానో. బయటి ప్రపంచము, లేఖన…ప్రజలు, బోధకులు నాకు ఇట్లు చెప్పడానికి ప్రయత్నించారు, “అది దయ్యపు సంబంధమైనది. ఏమిటీ, నీవు ఒక సోదె-చెప్పువాడివౌతావు. నీవు ఒక మంత్రగాడివౌతావు. బిల్లీ, నీవు దానితో మోసపోవద్దు. దానిలో ఏదో తప్పు ఉన్నది. అబ్బాయ్, నీవు దానిని చేయవద్దు. అది తప్పు. అది దయ్యము. సరే, కుర్రవాడా, నీవు ఒక సాధారణ మాధ్యమముగా ఉంటావు. నీవు దానిని చేసినట్లైతే నీవు ఒక మంత్రగాడివౌతావు. ఓ, అదంతా కూడా దయ్యమువలన కలిగినది. అది—అది సరియైనది కాదు.” అయితే…నేను దానిని బోధించగోరలేదు.
61 అయితే దమస్కుకు వెళ్ళే మార్గములో ఉండగా, అతడు అది సరియైనదో కాదో అని కనుగొనేంతవరకు, పౌలు దానిని బోధించగోరలేదు. కావున అతడు మూడు సంవత్సరములు అరేబియాకు వెళ్ళి, మరియు లేఖనమును ధ్యానిస్తాడు. ఆహ్! అతడు బయటకు వచ్చినప్పుడు, అతడిట్లన్నాడు, “ఇప్పుడు నా నుండి దానిని కుదిపివేయండి.”
62 అతడు పరిసయ్యులను ఎదుర్కోవలసియున్నదని అతనికి తెలుసు. అతడు సద్దూకయ్యులను ఎదుర్కోవలసియున్నది. అతడు లోకమును, మరియు అన్య ప్రపంచమును ఎదుర్కోవలసియున్నది. మరియు కావున ఆ ఉద్దేశము కొరకే, పౌలు, ఈ బైబిలును, ఈ హెబ్రీ పత్రికను వ్రాసాడు. అతడు ఆ హెబ్రీయులను కుదిపివేస్తున్నాడు, మరియు ఆ పాత నిబంధనను తీసుకొని మరియు దానిని ఇక్కడ క్రొత్త నిబంధనలో చూపించుచున్నాడు. “ఈయన దేవుడైయున్నాడు,” అతడు ఇట్లన్నాడు, “ఇదిగో అది ఇక్కడ, ప్రవక్తలందరు చెప్పిన దానిలో—దానిలో మరియు ప్రతీదానిలో ఉన్నది.” మనము చూసిన ఆ 1వ అధ్యాయములో, వెనుక ఆ ప్రారంభములో మొదలుపెడతాడు, “ఏలయనగా ఆ వెనుక పూర్వకాలమందు, నానా సమయములలోను, నానా విధములుగాను, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు.” ఊరీము తుమ్మీముచేత పరీక్షించబడుట ద్వారా, దేవుడు ఆ విధంగా తన వర్తమానమును తీసుకొనివచ్చాడు. “అయితే ఈ దినమున ఆయన తన కుమారుడైన, క్రీస్తుయేసు ద్వారా మనతో మాట్లాడియున్నాడు,” ఆయన యొక్క బైబిలు ద్వారా పరీక్షించబడ్డాడు. విషయం అదే.
63 కావున ఈ అనుభవాలను లోకము ఇట్లంటుంది, “ఓ, అది మానసిక సంబంధమైనది. ఎందుకు, ఎవరూ…” ఇక్కడ ఆ నది మీద ఆ దూత, ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు, ఇక్కడ ఆ మూలన నా మొదటి ఉజ్జీవమును నేను బోధించినపుడు, మేము ఆ ప్రజలందరికి బాప్తిస్మము ఇచ్చాము…సహోదరుడా ఫ్లీమన్, అప్పుడు నీవు ఉన్నావని, నేను నమ్ముతాను…అప్పుడు నీవు ఇక్కడ ఉన్నావో లేదో నాకు తెలియదు. ఆ—ఆ నది మీద ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆ పాత-కాలపువారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అవును, వారిలో కొందరు ఉన్నారు. అది, దిగువున ఇక్కడ నది మీద ప్రత్యక్షమైనది.
64 మరియు వారు ఇట్లన్నారు, “అది కేవలం ఒక దృష్టి భ్రాంతి మాత్రమే.” మనలో చాలామంది నిలబడి, దాని వైపు చూస్తున్నాము, మరియు ఇదిగో అది వచ్చినది. మరియు పిదప సంవత్సరాల తరువాత, ఒక కెమెరాయొక్క యాంత్రిక కన్ను ద్వారా దేవుడు దానిని నిరూపించాడు. అది సత్యము.
65 “సరే, అది—అది ఏదో కల్పితమా, అది అటువంటిదేదో—ఏదో అయ్యున్నదా…?” కాదు, అయ్యా. మేము దానిని సరిగ్గా ఇక్కడ బైబిలులో తీసుకొని మీకు చూపిస్తున్నాము. అది అదే ప్రభువైన యేసుయైయున్నాడు. ఆయన అదే కార్యమును చేస్తాడు. ఆయన క్రియ అదే విధంగా ఉన్నది. ఆయన శక్తి అదే రీతిగా ఉన్నది.
66 ఇక్కడ, గడిచిన ఆదివారపు విషయమును, చూడండి. అక్కడ, నా మంచం మీద పడుకొనియున్నాను, ఆ పురుషుడిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. బయటకు వచ్చి ఇట్లన్నాను, “ఆలయము వద్ద ఒక పురుషుడు ఉన్నాడు, మరియు అతడు నెరసినవాడు, నల్లని-జుట్టు గలవాడు, అవి తెల్లబడుచున్నవి. అతడు గ్రుడ్డివాడు, మరియు అతడు నడవలేడు. అతడు ఒక చక్రాల కుర్చీలో ఉన్నాడు. నల్లని-వెంట్రుకలు గల ఒక వ్యక్తి అతడిని పంపించాడు; ఒక వైద్యుడు, డాక్టర్. అకెర్మాన్ అయ్యున్నాడు, నల్లని-వెంట్రుకలు గల వ్యక్తి, క్యాథలిక్కు వ్యక్తి. ఒక మనిషిని పంపాడు, సరిగ్గా అక్కడ కూర్చొనియున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” పైకిలేచి, తన చూపును మరియు సమస్తమును పొందుకొని బయటకు నడిచివెళ్ళాడు. దానిని చేసినది ఏమిటి? అదే దూత ఇక్కడ ఉన్నాడు. దమస్కుకు వెళ్ళే మార్గములో, పౌలును తాకిన ఆయనే, ఈనాడు తన సంఘములో మరియు తన ప్రజలలో జీవించుచున్నాడు. అది లేఖనము లేఖనముతో సరితూగడమైయున్నది. అది ఆ విధంగానే ఉండవలసియున్నది.
ఓ, మనము నులివెచ్చని స్థితిలో ఉన్నవారిని కలిగియున్నాము. కొద్దిసేపటి తరువాత, మనము దానిలోనికి వెళ్ళబోవుచున్నాము.
67 ఓ, ఈ రోజు మరియు ఈ రాత్రి, మనము దానిలోనికి వెళ్ళగలిగినట్లైతే, మన యెదుట ఒక లోతైన విషయమును మనము కలిగియున్నాము. అది కేవలం ఇప్పుడే లోతైన నీళ్ళలోనికి వెళ్ళడం ప్రారంభించినది. ఎక్కడైతే మీరు…
68 మీకు తెలుసా, నేను ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, బయట ఆ స్థలము వెనుక మాకు ఒక చిన్న చెరువు ఉండేది, మరియు నేను అక్కడికి వెళ్ళేవాడిని. మరియు చిన్న పిల్లలమైన మేమందరమూ, బట్టలు లేకుండా దానిలోనికి వెళ్ళేవారము; చిన్నపిల్లలము, దాదాపు ఆరు, ఏడు సంవత్సరాల వయస్సు గలవారము. మరియు మేము…ఆ నీరు దాదాపు అంత లోతుగా ఉంటుంది. అది ఒక పందులు దొర్లే గుంటకంటే పెద్దదేమీ కాదు. మరియు నేను అక్కడ ఒక సబ్బు పెట్టెను కలిగియున్నాను. నేను దూకగలనని చూపించేవాణ్ణి; నా ముక్కును పట్టుకొని, మరియు చిందిస్తుండేవాణ్ణి, ఆ విధంగా చేస్తుండేవాణ్ణి. మరియు నా చిన్న పొట్ట బురదను తాకుతూ ఉండేది, మీకు తెలుసు కదా, మరియు అది ప్రతి వైపునకు ఎగిసిపడుతుండేది. నేను ఈత కొట్టగలనని మా నాన్నకు చెప్పాను.
69 ఆయన ఒక రోజు నన్ను అక్కడికి తీసుకొనివెళ్ళాడు. ఆయన ఇట్లన్నాడు, “నీవు ఈత కొట్టడాన్ని నేను చూడాలనుకుంటున్నాను.” నేను అక్కడనుండి దూకి, మీకు తెలుసా; నా బట్టలు తీసివేసాను, అది మిడతలుండే ఒక చిన్న అరణ్యమై యున్నది; మరియు పరుగెత్తుకొనివెళ్ళి, నీళ్ళలో దూకాను. నేను చిందించడం ప్రారంభించాను, బురద అన్ని వైపులకు ఎగిరిపడుతూ ఉన్నది. మరియు నాన్న ఒక కాలువగట్టు మీద కూర్చొనియున్నాడు. మరియు ఆయన అక్కడ కూర్చొని కొన్ని నిమిషాలపాటు నన్ను గమనించాడు. “ఆ నీటి గుంటలో నుండి బయటకు వచ్చి, మరియు స్నానము చేసి, ఇంటికి వెళ్ళు,” అని అన్నాడు. చూశారా?
70 మంచిది, క్రైస్తవులమని చెప్పుకునే మనలో కొందరి విషయం, సరిగ్గా అలాగే ఉన్నది. మనము బురదలో-ప్రాకుతాము. అది నిజము. “నేను ఒక మెథడిస్టువాడను, నేనొక పెంతెకొస్తువాడను. నేనొక ప్రెస్బిటేరియన్ వాడను. నేనొక సాక్ష్యాధారమును కలిగియున్నాను; నేను దానిని పొందుకున్నాను.” అనువాటికి మీరు లంగరువేయబడి యున్నంతకాలం మీరు బురదలో ప్రాకుతున్నారు.
71 ఒక రోజు నేను మా మేనమామతో ఉన్నాను. నేను అతనికి చెప్తూ ఉన్నాను…అతడు దాదాపు పదిహేను, పదహారు సంవత్సరముల వయస్సు గలవాడు. మేము నది వద్దనున్నాము. నేను ఇట్లన్నాను, “లార్క్ మామయ్యా, నేను ఈత కొట్టగలను.” మరియు నేను పడవ వెనుకభాగంలో కూర్చొనియున్నాను, మీకు తెలుసా, అక్కడ చాలా మంచిగా మరియు సురక్షితంగా అనిపించినది. అతడు ఉన్నట్టుండి ఆ తెడ్డును తీసివేసి, సుమారు పది-అడుగుల లోతుగల ఆ నీళ్ళలోనికి నన్ను నెట్టివేశాడు. అప్పుడు అది భిన్నంగా ఉంది; మీ జీవితంలో మీరెన్నడూ విననట్టి, పెద్ద పెద్ద కేకలతో, నీళ్ళు పైకి చిందించడం జరిగినది.
72 ఏదో ఒక రోజు మీరు కూడా నెట్టివేయబడతారు, మీరెక్కడ నిలబడియున్నారో మీరు తెలుసుకోవడం మంచిది. అవును, అయ్యా. మీరు ఆయనను ఎరిగియున్నట్లైతే, మీరు…మీరు ఆయనను సరిగ్గా ఎరిగియుండటం మంచిది. అది నిజము.
అయితే ఇప్పుడు మనము లోతైన నీళ్ళలోనికి, లోతైన నీళ్ళలోనికి వెళ్ళుచున్నాము, నీవు—నీవు ఒక మంచి, క్రొవ్విన-క్రైస్తవుడవు కానట్లైతే, అది నిన్ను ముంచివేస్తుంది.
73 వాక్యమును గమనించండి. పౌలు, మొదట దానిని కనుగొన్నాడు. అతడు పాత నిబంధనలోనికి వెళ్ళి, మరియు అతడు దీనిని కనుగొన్నాడు. అతడు ఖచ్చితంగా తనయొక్క ఆ అనుభవమును, చూశాడు. “ఇప్పుడు నన్ను క్రిందకు పడవేసినట్టిది ఏమిటి?”
74 అది ఒక వెలుగైయున్నది, ఒక పెద్ద వెలుగు అక్కడ నిలబడి, సూర్యునివలె ప్రకాశిస్తూ, అతని ముఖము యెదుట నిలబడియున్నది. ఆయన ఇట్లన్నాడు, “సౌలా, సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు?”
75 అందుకతడు ఇట్లన్నాడు, “ప్రభువా, నేను హింసించుచున్న నీవు ఎవరవు?”
76 ఆయన ఇట్లు చెప్పాడు, “నేను యేసును.”
77 “అతడు గాయపడిన చేతులు కలిగిన, ఒక—ఒక మనుషి అని నేననుకున్నాను, అతని తలలో మరియు అతని చేతులలో మేకులవలనైన గాయపు మచ్చలతో, ఇప్పుడు కూడికలలో ప్రత్యక్షమౌతున్నాడని వారు చెప్పుచున్నారు.” లేదు, లేదు; ఆ శరీరము కాదు, ఆ శరీరములో కాదు. చూశారా? ఇప్పుడు ఆయన ఒక వెలుగైయున్నాడు. సౌలా…
78 ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఇట్లన్నాడు, “నేను దేవునియొద్ద నుండి వచ్చియున్నాను. నేను తిరిగి దేవునియొద్దకే వెళ్ళుచున్నాను.”
79 ఈ వెలుగులో ఉండి, అరణ్యముగుండా ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన దూత ఆయనే. ఆయన తిరిగి అదే వెలుగులోనికి వెళ్ళిపోయాడు. మరియు పౌలు దానిని, పాత నిబంధనలోనుండి చూశాడు. ఆయన ఇట్లన్నాడు, “నేను యేసును, నిబంధన దూతను.”
80 మరియు మనలను విమోచించడానికి, ఆయన శరీరధారిగా మారాడు. మనము అధ్యయనం చేసినట్టి, మునుపటి అధ్యాయాలలో, “దేవదూతల రూపము ధరించుకొనలేదు,” అని మనము కనుగొన్నాము. “ఆయన దేవదూతల స్వభావమును ఎన్నడూ ధరించుకొనలేదు కానీ, అబ్రాహాము సంతానముగా మారాడు,” తద్వారా ఆయన తెలియబడుటకు, మనుష్యులు దేవుడిని చూచుట కొరకైయున్నది. ఆమేన్.
ఇప్పుడు ఆయన ఇట్లన్నాడు, “నేను తిరిగి దానియొద్దకు వెళ్తాను.”
81 మరియు పౌలు దానిని చూసినప్పుడు, అతడు ఇట్లన్నాడు, “నిశ్చయంగా, అది ఆయనే. అది ఆయనే.”
82 పేతురు ఒక రాత్రి తాను ప్రార్థించుకొంటుండగా ఒక అనుభవము పొందుకున్నాడు. అదే వెలుగు భవనంలోనికి వచ్చి, అతని యెదుట ద్వారములను తెరువగా, వీధులలోనికి వెళ్ళాడు. మరియు పేతురు తాను కలగంటున్నాడని అనుకున్నాడు; అతడు అంతగా అభిషేకించబడ్డాడు. ఏమి జరిగినదో అతనికి తెలియలేదు. అతడు ఇట్లన్నాడు, “నేను ఇప్పుడే మేల్కొన్నానా? మరి నేను ఇక్కడ వీధిలో ఉన్నాను కదా.”
83 మరియు అతడు జాన్ మార్కు ఇంటికి వెళ్ళాడు. మరియు ఒక చిన్న అమ్మాయి, అక్కడ ఆ ప్రార్థనా కూటములో ఉన్న, ఎవరో ఒక యువతి, తలుపు తీసినది. ఎవరో తలుపు తట్టుచున్నారు. తలుపు తెరిచినది. “ఓ,” ఆమె ఇట్లన్నది, “ఇదిగో సరిగ్గా ఇప్పుడే పేతురు వచ్చాడు. అతడు చెరసాల నుండి బయటకు రావాలని మీరు ప్రార్థిస్తున్నారు. ప్రభువు అతడిని విడిపించాడు.”
84 “ఓ,” వారు ఇట్లన్నారు, “వెళ్ళమ్మా.”
“ఓ ప్రభువా, అతడిని విడిపించుము!”
85 “ఎందుకు,” ఆమె ఇట్లన్నది, “అతడు తలుపునొద్ద నిలబడి, తట్టుచున్నాడు.”
పేతురు, “నన్ను లోపలికి రానివ్వండి” అంటూ గట్టిగా తట్టుచూనే ఉన్నాడు.
86 “ఓ,” ఆమె ఇట్లన్నది, “అది పేతురే.” ఆ దినములలో, అప్పుడు కూడా వారు దానిని, ఆ చిన్న కిటికీ వంటిదానిని కలిగియున్నారు. ఇక్కడున్న చిన్న మూతవంటిది, మీరు పైకెత్తి బయటకు చూచునటువంటిదై యున్నది, చూడండి. మీ అతిథిని లోపలికి అనుమతించడానికి ముందు, మీ తలుపును ఎవరు తట్టుచున్నారో మీరు తెలుసుకోవలసియున్నది. ఎందుకనగా, వారు దోపిడీదారులను కలిగియున్నారు; మీరు తలుపు తెరిస్తే, వారు మిమ్మల్ని చంపుతారు.
87 కావున, వారు తలుపు తెరిచారు. ఆమె ఇట్లు చెప్పినది, “అది పేతురు.”
88 వారిట్లన్నారు, “ఓ! ఓ, మై, అతడు చనిపోయాడు. అక్కడ నిలబడియున్నది అతని దూత. చూశారా? అతనియొక్క మహిమ శరీరములోనికి, మీకు తెలుసు కదా, ఆ థియోఫనీలోనికి వెళ్ళిపోయాడు.”
89 మనము దానిని ఎలా తీసుకున్నామో గుర్తున్నదా, ఆ పెద్ద వజ్రము, అది ఎలా వెలుగును ప్రతిబింబించినదో, అది ఎలా తిరిగి అక్కడికి వెళ్ళినదో గుర్తున్నదా? ఆ…“భూమి మీదనున్న ఈ గుడారము శిధిలమైపోయినను, ఇదివరకే మనకొరకు కనిపెట్టుచున్నది ఒకటి ఉన్నది.”
మరియు వారు పేతురు చనిపోయాడని, ఈ పాత శరీరము విడువబడినదని, మరియు కొద్ది రోజులలో వారు దానిని పాతిపెడతారని అనుకున్నారు, అతడు తన దూతలోనికి ప్రవేశించాడు, లేదా తన మహిమ-…మహిమపరచబడిన శరీరము కాదు, కాని అతని థియోఫనీలోనికి, అనగా ఇదివరకే సిద్ధపరచబడిన శరీరములోనికి ప్రవేశించాడని అనుకున్నారు. అది మీతో కరచాలనము చేయలేదు. కరచాలనము చేయుటకు, దానికి ఆ విధమైన చేతులు లేవు, కానీ అది ఒక మానవుని పోలికలో ఉన్నది. “వచ్చి, తలుపును తట్టుచున్నాడు.”
90 ఆమె ఇట్లన్నది, “కాదు. అది పేతురే. అతడు అక్కడ నిలబడియున్నాడు.” అతడు తలుపు తెరచి లోపలికి వచ్చాడు. అదిగో అతడు అక్కడున్నాడు. ఇప్పుడు, పేతురు ఈ వెలుగుచేత విడిపించబడ్డాడు.
91 ఇప్పుడు, అదే విధానములో…పౌలు, ప్రారంభ సంఘములో, పౌలు మీద ప్రకాశించిన దేవునియొక్క వెలుగును చూసినట్లే, అదే కార్యము క్రిందకు దిగివచ్చినది. ఇప్పుడు, ప్రజలు దేనినైనా చెప్పగలరు, అది దానిని సరైనదిగా చేయదు. కానీ దేవుడు దేనినైనా రుజువు చేసినప్పుడు, దానియొక్క క్రియ దానిని రుజువు చేస్తుంది. అప్పుడు, కెమెరా దానిని రుజువు చేస్తుంది. మరియు మనము కలిగియున్న ప్రతీది…ప్రభువు చేసిన ప్రతీది, అది దేవుడని సంపూర్ణముగా, తప్పిపోకుండా ఋజువు చేయబడినది, లేఖనముల ద్వారా, దానియొక్క క్రియ ద్వారా, అనుభవము ద్వారా ఋజువు చేయబడినది. కానీ వారు వినరు.
92 ఇక్కడ ఈ ఆలయములో చూడండి. ఇప్పుడు, గుర్తుంచుకోండి, ఇది మీకు తెలుసు. మనము గుంపుల కొరకు పరితపించము. ఎలాగైనా, వారిని ఉంచడానికి మనకు ఏ చోటు లేదు. కానీ, చూడండి. ఎక్కడైతే మనము దీని కొరకు కూడి వస్తున్నామో, అట్టి ఈ విధమైన ఒక కూడిక, ఫాల్స్ పట్టణాలను ఆకర్షించవలసియున్నది. కాని వారు చనిపోయారు. వారు ఖచ్చితంగా మృతమైపోయారు. వారికి కన్నులున్నవి కానీ వారు చూడలేరు.
మీరు, మీరు ఇట్లంటారు, “ఎందుకు, సహోదరుడా బ్రెన్హామ్, వారు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి మరియు వారి కన్నులను బాగుచేపించుకోరా?” ఆ విధమైన దృష్టిని అతడు బాగుచేయలేడు.
93 యేసు ఇట్లన్నాడు, “మీరు నన్ను ఎరిగియుంటే, మీరు నా దినమును ఎరుగియుండేవారు.” ఆయన ఇట్లన్నాడు, “గ్రుడ్డివారైన పరిసయ్యులారా. మీరు ఆకాశ వైఖరి వివేచింపగలరు, కానీ కాలముయొక్క సూచనలను, మీరు వివేచింపలేరు.”
94 అది మీ తల మీదుగా వెళ్ళిపోవుచున్నదా? వినండి. ఇక్కడ మనము జీవిస్తున్నట్టి సూచనలను చూడండి. ఇప్పుడు, అది కేవలం ఏదో ఒక…నేను, నాకు నేను, నేను కేవలం ఒక మనిషిని, నా గురించి మాట్లాడుటకు, కనీసం ఒక బోధకుడినైనా కాదు. లోకము ఎటువంటిదానిని బట్టి, “ఒక బోధకుడు” అని పిలుస్తుందో, అటువంటి ఏ విద్య నాకు లేదు. మరియు మనము కేవలం పేద ప్రజలమైయున్నాము. మనమున్న భవనమును చూడండి. ఈ ఉదయమున, ఆ ఆలయములను చూడండి. అయితే దేవుడు ఎక్కడున్నాడో చూడండి. అసలు విషయం అదే.
95 అలాగే మోయాబు తన వైభవమంతటితో మరియు తన అందమంతటితో అక్కడ నిలబడియున్నాడు, కానీ గుడారాలలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? తప్పైయున్న ప్రతిదానిని చేయుచూ, ఒక చిన్న పరిశుద్ధ-గుండ్రాళ్ళ గుంపు ఆ దిగువున ఉండియున్నది. అయితే, వారి—వారి బిషప్పుయైన బిలాము, ఆ కొట్టబడిన బండను, ఆ ఇత్తడి సర్పమును, ఆ అగ్నిస్తంభమును చూడటంలో విఫలమయ్యాడు. అతడి కన్నులు గ్రుడ్డివైనవి. అతడు దానిని చూడలేకపోయాడు. “వారు కేవలం దానిని ఊహించుకుంటున్నారు,” అని అతడన్నాడు. కానీ ఆయన అక్కడ ఉన్నాడు.
96 దేవుని స్తుతించండి, ఓ, ఆయన ఇక్కడ ఉన్నాడు! దేవుడు ఇక్కడ ఉన్నాడు, మరియు ఆయన ఇదివరకు చేసిన అదే కార్యమును ఆయన చేస్తున్నాడు. మరియు ఆయన-…మనము లేఖనమును లేఖనముతో పోలుస్తాము. దేవుడు భూమి మీద ఎన్నడూ తననుతాను ఒక గొప్పవానిగా చిత్రీకరించుకోలేదు, కానీ ఆయన ఎల్లప్పుడు సామాన్యమైన మరియు దీనమైన ప్రజల మధ్యనే నివసించాడు. మరియు అదే కార్యము చేస్తూ, ఈ ఉదయమున ఆయన ఇక్కడ ఉన్నాడు. లేఖనము దానిని నిర్ధారించుచున్నది. కెమెరా దానిని రుజువు చేస్తుంది. ఇప్పుడు, నేను ఆ చిత్రమును చూపించుటకు గల కారణము, నేను అక్కడ ఉన్నందుకు కాదు. నేను—నేను మీ వలెనే, కేవలం కృప ద్వారా రక్షించబడిన, ఒక పాపిని. అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, అది మనతో ఉన్న ఆయనయొక్క సన్నిధియైయున్నది. అదే ముఖ్యమైన విషయమైయున్నది. సరి, ఆయన నన్ను ఎలీషాయొక్క—ఒక అవతారముగా చేసినయెడల, దానిని నమ్మడానికి మీరు విశ్వాసమును కలిగిలేనట్లైతే, అది మీకు ఎన్నడూ ఏ మేలును చేయదు.
“ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు.”
97 ఆ కారణమునుచేతనే, ఈనాడు ఇక్కడ పట్టణములో. ఏమిటీ, నేను ఇక్కడ ఏదో ఒక పెద్ద భవనంలో లేదా దేనిలోనైనా, ఒక ఉజ్జీవమును ప్రారంభించవచ్చును, అయితే అనేకమంది దానిని నమ్మునట్లు మీరెన్నడూ చేయలేరు. వారు అసలు నమ్మరు. వారు నమ్మలేరు. వారి దినము ముగిసినది.
98 సరిగ్గా ఇదే పాఠము, ఈ ఉదయమున, ఆఫ్రికాలో, దాదాపు పదివేలమందిని, క్రీస్తుకు, కనీసం పదివేల ఆత్మలను ఉత్పత్తి చేసేది; అదే ఇక్కడైతే ఈ ఉదయమున ఒక్క పాపి, లేదా అటువంటి ఒకరు, ఎవరో ఒక పడిపోయిన వ్యక్తి మాత్రమే కూర్చొనియుండవచ్చును. వీరిలో చాలామంది దీనిని అనేకసార్లు విన్నారు, ఎంతగా అంటే వారిక స్పందించడంలేదు. అంతే.
99 అయితే, మేము ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నామంటే, లేఖనము లేఖనముతో సరితూగుతుంది. ఇప్పుడు, అనుభవము ఎంత గొప్పగా ఉన్నా లెక్కలేదు, అది లేఖనముతో సరితూగనంతవరకు, అది తప్పైయున్నది.
ఆ ఊరీము తుమ్మీము, ప్రవక్త ఎంత మంచివాడైనప్పటికినీ, అతడు మాట్లాడినప్పుడు ఊరీము తుమ్మీము మీద ఆ వెలుగులు ప్రకాశించనియెడల, అది తప్పైయున్నది. ఆ కల ఎంత చక్కగా అనిపించినప్పటికినీ, అది ఊరీము తుమ్మీము మీద ప్రకాశించకపోతే, అది తప్పైయున్నది.
ఆ యాజకత్వము ముగిసినప్పుడు, దేవుడు తన బైబిలు గ్రంథమును ముందుకు తెచ్చాడు. పౌలు ఇట్లన్నాడు, “పరలోకము నుండి ఒక దూత వచ్చి,” గలతీ 1:8, “మరియు ఇదివరకే మీకు ప్రకటించబడిన సువార్తగాక మరియొక సువార్తను ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవును గాక.”
100 పరలోకము నుండి వచ్చిన దూత ప్రకటనకర్తయైన యోహానుతో ఇట్లన్నాడు, మరది స్వయంగా దేవుడేయైయున్నాడు, “ఈ సంగతులను నిర్ధారించుటకు, లేక చూపించుటకు యేసు అనే నేను నా దూతను పంపాను.” ఆయన ఇట్లన్నాడు, “ఎవడైనను దానికి ఒక్క మాటనైనా కలిపినయెడల, లేదా దానినుండి ఒక్క మాటనైనా తీసివేసినయెడల, జీవ గ్రంథములో, అతనికి పాలు లేకుండా చేయబడుతుంది.” అది ఇదే, బైబిలు గ్రంథము.
101 కావున, మనకు ఇక్కడ సంభవిస్తున్న ఈ అనుభవాలు మరియు ఈ కార్యములు, అది దేవుని వాక్యముద్వారా నిర్ధారించబడకపోతే, అది తప్పౌతుంది; ఏమి జరుగుతుందో నేను లెక్కచేయను, అది తప్పౌతుంది. కావున అది లేఖనానుసారముగా, సంపూర్ణముగా సత్యమైయున్నది. ఓ, క్రీస్తుయొక్క గొప్ప శరీరములో నేను ఒక అవయవమునై యున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
102 ఇపుడు, మనమిప్పుడు వెళ్దాము, మనము పాఠమునొద్దకు వచ్చుచున్నాము. ఇప్పుడు, “మనలను ఆవరించియున్నందున…” అని అతడు ఎక్కడైతే చెప్పాడో మనము అక్కడ ముగించుకున్నాము, కాదు…నన్ను మన్నించండి. అది, నేను 12వ అధ్యాయమును ఉటంకించుచున్నాను. నేను దానిని చదువుతూ ఉన్నాను, కానీ నేను దానిని అధ్యయనం చేయలేదు. నేను…
103 సహోదరుడు నార్మన్, అక్కడ నా ఇంటిలో బస చేయుచున్నాడు, మరియు నేను నిన్ననే వచ్చానని అతనికి తెలుసు, మరియు అక్కడున్న, సహోదరులకు, నేను ఇప్పుడే లోపలికి వచ్చానని తెలుసు. లేఖనము చదవుకోవడానికి నాకు దొరికిన ఒకేఒక్క సమయమేదనగా, కొద్ది నిముషాల క్రితం, సరిగ్గా ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడైయున్నది. అది నిజం. దానిని అధ్యయనం చేయను, కేవలం ఆయన కోరినట్లుగానే పరిశుద్ధాత్మడు దానిని ఇవ్వడానికి నేను వేచియుంటాను. దానిని పొందుకోవలసిన ఆ వ్యక్తి, ఎక్కడ—ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలుసు. కాబట్టి నేను చెప్పబోవుచున్న దేనినైనా నేను నా మనస్సులో కలిగియుంటే, అప్పుడది తప్పౌతుంది. కానీ నేను కేవలం ఆయనను దానిని చేయనిచ్చినట్లైతే, ఆయన దానిని నేరుగా అది చెందియున్న స్థలమునకు తీసుకొనివెళ్తాడు. చూశారా? “మీరు ఏమి చెప్పుదుమా అని చింతపడకుడి, ఏలయనగా మాట్లాడేది, మీలో నివసించుచున్న మీ తండ్రియే గాని మీరు కాదు. ఆయనే మాట్లాడుతాడు.”
104 ఇప్పుడు, చివరి అధ్యాయము, మునుపటి అధ్యాయములో, మనము దీనిని విన్నాము, అదేమనగా, “ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినయెడల, మనము ఏలాగు తప్పించుకొందుము; అట్టి రక్షణ మొదటిగా ప్రభువైన యేసు చేత, మరియు ఆయనతో పాటు ఆయననుండి వినినవారి చేత బోధించబడినది?” చూపించడానికి, యేసు చేసిన కార్యములు, సరిగ్గా అవే కార్యములు ఇక్కడ జరుగుచున్నవి: అదే దేవుని దూత, అవే క్రియలు, అదే సాక్ష్యాధారము, అదే విధంగా, జరుగుచున్న ప్రతీది, అదే సువార్త, సరిగ్గా వాక్యముతో ఉన్నది. “అది ప్రభువుచేత బోధించబడి, పిదప మనము వినినట్టి ఆయన శిష్యుల ద్వారా ధృవీకరించబడినట్లైతే,” మరి పౌలు కూడా అదేయైయున్నాడు, “ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినయెడల, మనము ఏలాగు తప్పించుకొందుము?”
105 ఇప్పుడు, పౌలు తన హెబ్రీ సమూహముతో దానిని చెప్పుచున్నాడు. ఇప్పుడు, ఈనాడు, మనమిక్కడ కలిగియున్నట్లు, వారు టేపు రికార్డర్లను కలిగిలేరు. అయితే సరిగ్గా పౌలు బోధించుచుండగనే దానిని వ్రాస్తూ, అక్కడ కూర్చొనియున్న లేఖకులను వారు కలిగియున్నారు.
మరియు ఇక్కడ ఉన్నది సరిగ్గా అదేయైయున్నది. మనము దానిని టేపు రికార్డర్ల ద్వారా చేస్తున్నాము, మరియు, ఇది సత్యమని చూపించుటకు, చూడండి, ఈ టేపులు ప్రపంచమంతటికీ వెళ్తున్నాయి. మన విశ్వాసము వృధా కాలేదు, అది సంపూర్ణంగా పునరుత్థానుడైన యేసుక్రీస్తే, అదే కార్యము. ఇప్పుడు మనము దానిని నిర్లక్ష్యం చేయకూడదు.
106 ఇప్పుడు, ఈ రోజు, సంఘమునుండి వెళ్ళి, మరియు ఇట్లు చెప్పకండి, “మంచిది, నేను అక్కడకు వెళ్ళడాన్ని ఆనందిస్తాను. ఆ పాటలంటే నాకు ఇష్టము, మరియు ఆ చిన్న పాత సంఘము వద్దనున్న ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు.” దానిని చేయకండి.
107 సహోదరుడా, మీ హృదయాన్ని మండనీయండి, ఇట్లు చెప్పండి, “ఇదిగో, దీని విషయమై నేను ఏదో ఒకటి చేయవలసియున్నాను. నేను బయటకు వెళ్ళి మరియు ఎవరినైనా రక్షించబడునట్లు చేయగలనో లేదో చూడవలసియున్నాను.”
108 మరియు, “దేవునికి స్తుతి కలుగునుగాక, నీవు పశ్చాత్తాపపడనియెడల, నీవు నశించిపోతావు,” అని చెప్తూ వెళ్ళకండి. వద్దు.
దానిని మృదువుగా చెప్పండి. “పామువలె వివేకులును, పావురమువలె నిష్కపటులునై యుండుడి.” చూడండి, ఆ విధానములో వెళ్ళవలసియున్నాము. ఒక వ్యక్తిని సమీపించేటప్పుడు, ఒకవేళ అతడు కోళ్ళను పెంచుచున్నయెడల, అతనితో కాసేపు, కోళ్ళ గురించి మాట్లాడండి. చూశారా? మరియు పిదప, జరిగే మొదటి విషయము మీకు తెలుసా, మీరు ప్రభువు గురించి మాట్లాడుతుంటారు. అతడు ఒక రైతు అయితే, అతని పొలం గురించి మాట్లాడండి.
109 అతడు మోటరు వాహనాలను అమ్ముతున్నట్లైతే, కొద్దిసేపు, అతడి వాహనాల గురించి మాట్లాడండి, “నీ వద్ద ఎటువంటి మంచి కారులు ఉన్నాయి,” అని మరియు ఆ విధంగా మాట్లాడండి. చూశారా?
110 మీరు ఆత్మను పట్టుకునే వరకు, “అతడి అంతరాత్మ గురించి మాట్లాడుటకు ఇదే సమయము,” అని తండ్రి చెప్పేవరకు అట్లు చేయండి.
111 మీరు అసలు విషయం మాట్లాడవచ్చును, చూడండి, “అది ఒక చక్కని వాహనమైయున్నది. నీకు తెలుసు కదా, ఈనాడు, రవాణా గొప్పగా మారిపోయినది. ఓ, దేశములు ఏ విధముగా దగ్గరకు తీసుకురాబడినవి కదా; మరియు మన దేశములలోని పట్టణములు, దగ్గరగా తీసుకురాబడినవి. స్నేహితులు మరియు తల్లులు ఒకరినొకరు సందర్శించుకోవచ్చు. నీకు తెలుసు కదా, నీవు అమ్ముతున్నటువంటి వాహనాలను కలిగియుండటం ఒక అద్భుతమైన విషయము.”
112 “అవును, అయ్యా. అది ఖచ్చితంగా అద్భుతమైనదే. అ-హహ్.” మీకు తెలుసా, అతడు తన చుట్టను లేదా అదేదైతే అది, దానిని మెల్లగా పీలుస్తూ ఉంటాడు. “అవును, అవి, అవి మంచి కారులే.”
113 “ఆ పాత-కాలపువారు అలాంటి ఒక దానిని చూసినట్లైతే, వారు ఏమనుకుంటారో నీవెప్పుడైనా ఆలోచించావా?” మీకు తెలుసా, కేవలం ఆ విధంగా మాట్లాడుతూ ఉండండి.
కొద్దిసేపటి తరువాత, ఇట్లనండి, “అవును, అవును, నిశ్చయముగా.”
114 “నీకు తెలుసా, అది చేసే మరొక కార్యమేమిటంటే, మేము కలిగియుంటున్న, ఉజ్జీవముల వంటివాటిలో, అది తీసుకొనివస్తుంది. ఒక ఉజ్జీవము కొరకు, ప్రజలు త్వరగా, దేశమును దాటి రాగలరు.” చూడండి, మీకు తెలుసా, మీరు ఆ సమయమంతా, మార్గమును తెరచుచున్నారు.
115 ఆ సంభాషణలో ఏదైనా అడ్డుకుంటున్నట్లు మీరు అనుభూతి చెందినయెడల, సరిగ్గా అక్కడే ఆగి, ఇటువైపుగా వెళ్ళిపోండి. ఫినిక్సులో ఒక వైద్యుడు చెప్పినట్లే, అది ఉన్నది, ఇట్లన్నాడు, “ప్రభువా, నా నోటిని మంచి మాటలతో నింపుము, మరియు పిదప నేను తగినంత మాట్లాడిన తరువాత నన్ను తట్టుము.” మీరు చూశారా? అవును. “నేను తగినంత మాట్లాడిన తరువాత నన్ను తట్టుము.”
116 ఇపుడు, ఇప్పుడు గమనించండి, మనము 15వ అధ్యాయము, లేదా 3వ అధ్యాయములోని 15వ వచనము నుండి ప్రారంభించబోవుచున్నాము, ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
ఇట్లు చెప్పబడెను గనుక, నేడు మీరాయన స్వరమును వినినయెడల, కోపము పుట్టించినప్పటివలె, మీరు…మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
117 ఇప్పుడు పౌలు ఇక్కడ మాట్లాడుటను గమనించండి. ఇప్పుడు అది ఇట్లు చెప్పబడినది, “ఈ రోజు, చాలా కాలం తరువాత.” ఆ, “ఈ రోజు, చాలా కాలం తరువాత,” అనేదానిలోనికి మనము కొద్దిసేపటి తరువాత వెళ్ళబోవుచున్నాము. తరువాతి అధ్యాయంలో వస్తుంది, “చాలా కాలం తరువాత.”
…ఇట్లు చెప్పబడెను గనుక, నేడు మీరు…ఆయన స్వరమును వినినయెడల, కోపము పుట్టించినప్పటి దినములో వలె, మీ హృదయములను కఠినపరచుకొనకుడి, వారు దేవునికి కోపము పుట్టించినప్పటి విషయమైయున్నది.
118 ఇప్పుడు మనము ఆ తరువాతి వచనము చదువుదాము.
ఏలయనగా కొందరు, వినినప్పుడు, కోపముపుట్టించిరి:…
ఇప్పుడు అతడు దేని గురించి మాట్లాడుచున్నాడు? సువార్త.
…వారు మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారే.
అయితే ఆయన ఎవరి వలన నలబది ఏండ్లు దుఃఖపడెను? ఎవరి శవములైతే అరణ్యములో రాలిపోయినవో, అట్టి పాపము చేసినవారి వలనే కదా?
119 ఒక్క నిమిషము మనమిక్కడ ఆగుదాము. “వారు కోపము రేపినప్పుడు,” కోపము పుట్టించుట. ఇప్పుడు దేవుడు ఏమి చేశాడు? ఇప్పుడు పౌలు మాట్లాడుటకు ప్రయత్నిస్తున్నాడు. ఐగుప్తు నుండి వారిని బయటకు నడిపించినది ఏమిటి? అది మోషేనా? కాదు. మోషే శరీర సాధనమైయున్నాడు.
120 ఇప్పుడు ఇక్కడ మనము ఒక నేపథ్యమును కలిగియున్నాము. మనము ఇప్పుడు సరిచేయబడగోరుచున్నాము. మనము కొద్ది నిమిషాలలో, ఇక్కడ ఈ చోటును తాకినప్పుడు, మీరు—మీరు దానిని చూస్తారు.
121 ఇప్పుడు, దేవుడు తన ప్రజలను స్థిరమైన విశ్రాంతి లేనివారిగా ఉంచాడు. వారు ఐగుప్తులో ఉన్నారు. వారు వారియొక్క సరియైన స్థానములో లేరు. వారు తమ స్వదేశమునకు వెలుపల ఉన్నారు. వారు పరదేశులుగా మరియు యాత్రికులుగా ఉన్నారు, మరియు ఐగుప్తులో—లో బంధించబడిన-ఆ చోటునుండి, దేవుడు వారిని, తమ స్వదేశమునకు తీసుకొని రాబోవుచున్నాడు.
122 ఈ దినమునకు ఒక సాదృశ్యమైయున్నది; మనము సుస్థిరముగా లేము. ఇక్కడ ఎంతో సమయం పట్టదు. చిన్న అబ్బాయిలు బొద్దు-చేతులతో గోళీలు ఆడుకుంటూ ఉంటారు, చిన్నారులు, బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు; తరువాత మొదటి విషయం మీకు తెలుసా, నెరిసిన వెంట్రుకలతో, మరియు ముడతలుపడిన శరీరముతో ఉంటారు. ఇక్కడ ఏదో తప్పు ఉన్నది. ఇది గృహము కాదు. మనము తప్పుడు స్థలములో ఉన్నాము. అందుచేతనే మనము యాత్రికులము మరియు పరదేశులము అని చెప్తుంటాము. ఏదో జరిగినది.
123 ఈ ఉదయమున గదిలో, ఒక చిన్న స్త్రీ, అప్పుడప్పుడు, ప్రజలు తనను చూసి ఎలా నవ్వుతుంటారో చెప్పినది. నేను ఇట్లు చెప్పాను, “కానీ, ప్రియమైన, సహోదరీ, నీవు వారిలో ఒకదానివి కాదు.” మనము భిన్నమైన ప్రజలము.
124 నా చిన్న అమ్మాయి ఇట్లన్నది, “డాడీ, ఫలానా-ఫలానా అమ్మాయిలు వారు చేసినట్టి ఫలానా-ఫలానా కార్యములను చేశారు.”
125 నేను ఇట్లు చెప్పాను, “కానీ, చూడు, హనీ,” వారు ఎల్విస్ ప్రెస్లీ యొక్క ఈ రికార్డులను కలిగియున్నారు, నేను ఇట్లు చెప్పాను, “అవి నా గృహములో ఉండటాన్ని నేను ఇష్టపడను.”
126 ఆమె ఇట్లన్నది, “కానీ, డాడీ, వారు చక్కని అమ్మాయిలు.”
127 నేను ఇట్లన్నాను, “వారు అయ్యుండవచ్చును. దానికి వ్యతిరేకంగా చెప్పడానికి నా వద్ద ఏమియు లేదు. కానీ ఒక్క విషయము, మనము భిన్నమైనవారము. మనము భిన్నమైనవారము. మనమేదో భిన్నముగా ఉండాలని కోరుకుంటున్నామని కాదు, కానీ మనలో ఉన్న ఆత్మ దానినుండి బయటకు వచ్చినది. నీవు వేరొక ప్రపంచానికి చెందినదానవు.”
128 నేను ఆఫ్రికాకు వెళ్ళినపుడు, వారియొక్క—వారి—వారియొక్క జీవన విధానాలకు నేను సర్దుకోలేకపోయేవాణ్ణి. వారు ఎటువంటి బట్టలను ధరించుకోరు. వారు నగ్నముగా ఉంటారు. మరియు వారు కుళ్ళిపోయి, పురుగులు పట్టిన దేనినైనా తీసుకొని, ఎలాగైనా, దానిని తినేస్తారు, వారికి ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. చూశారా?
129 మరియు ఇది భిన్నమైనది. మీకు తెలుసా, ఒకప్పుడు, మనమందరము ఆ విధంగానే ఉన్నాము, కానీ నాగరికత మనల్ని ఈ స్థితికి తీసుకొనివచ్చి మరియు మనల్ని భిన్నముగా మార్చినది.
మరియు మారుమనస్సు దానిని మిలియన్ రెట్లు అధికంగా చేసినది. మనకు లోకముయొక్క కుళ్ళిపోయిన సంగతులు ఇక ఎంతమాత్రము అక్కర్లేదు. నాగరికత మనల్ని శుభ్రంగా ఉండులాగున చేసినట్లే, క్రీస్తు మనల్ని క్రైస్తవులుగా ఉండేట్లు చేసాడు. మరియు గమనించండి, అది మాత్రమే కాదు గానీ, మనము యాత్రికులము మరియు పరదేశులము అని మనము ఒప్పుకొనుచున్నాము. మనము లోకసంబంధులము కాము. అప్పుడు, లోకముతో మీకు ఇక ఏ పని ఉండదు. మరియు ఆ సంగతులు గతించిపోయినవి.
130 ఇప్పుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. వారు ఐగుప్తీయులు కారు. ఐగుప్తీయులు, ఒక ఐగుప్తీయుడు గొఱ్ఱెపై తన చేతులను ఉంచుట హేయము. మరియు ఇశ్రాయేలీయులు గొఱ్ఱెల కాపరులైయున్నారు. పశులను పెంచువారైనట్టి, ఐగుప్తీయునిగా ఉండటంవలనైన ఆ అవమానమంతటి తరువాత, అది మోషేకు ఎలా అనిపించియుండవచ్చును కదా.
యోసేపు మరియు మొదలగువారితో ఫరో ఏమన్నాడో మీరు గమనించారా? “అది హేయమైనది.” ఇట్లన్నాడు, “నీ ప్రజలు గొర్రెల కాపరులు.” మరియు ఒక ఐగుప్తీయుడు కనీసం ఒక గొఱ్ఱెల కాపరి మీద కూడా తన చేతులను ఉంచలేడు. అతడు ఒక భిన్నమైన ప్రజయైయున్నాడు.
131 మరియు ఈనాడు, అతడు తిరిగి జన్మించినప్పుడు, ఒక క్రైస్తవుని విషయం ఆ విధంగానే ఉన్నది. అది…ప్రజలు మద్యం త్రాగుతూ అసహ్యమైన జోకులు చెప్పుకుంటూ, మరియు స్త్రీలు దిగంబరిగా ఉన్నచోట సహవాసము చేయడం అతనికి అపవిత్రము. మరియు ప్రతీ…అది, అది—అది అపవిత్రత యైయున్నది. ఓ, ప్రభువు స్తుతించబడును గాక! మనము ఇక్కడ యాత్రికులమైయున్నాము. మనము ఇక్కడ పరదేశులమైయున్నాము. ఆత్మ మార్పుచెందియున్నది, మరియు ఎక్కడైతే స్త్రీలు పొట్టి దుస్తులు ధరించరో అట్టి ఒక పట్టణము కొరకు మనము ఎదురుచూస్తున్నాము. ఎక్కడైతే మద్యపానశాలలు ఉండవో అట్టి పట్టణము కొరకు మనము ఎదురుచూస్తున్నాము. నీతి నివసించునట్టి ఒక పట్టణము కొరకు మనము ఎదురుచూస్తున్నాము. కావున, మనము యాత్రికులమైయున్నాము.
132 కావున, దేవుడు ఒక పెద్ద అగ్నికుప్పలో, ఒక వలయమువలె క్రిందకు దిగివచ్చాడు, ఒక పొదలోనికి దిగివచ్చి మరియు మొదటిగా, తననుతాను మోషేకు బయలుపరచుకున్నాడు. మోషే…
మొన్నటి రాత్రి మనము ఆ పాఠమును ఎలా కలిగియున్నామో మీకు తెలుసు కదా, యేసు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఇట్లనడాన్ని చూశాము, “మంచిది, మోషే పుట్టకముందే, నేను ఉన్నాను.” మండుచున్న పొదలో, ఆ అగ్నిస్తంభములో ఉన్నది యేసే. ఈనాడు, అది యేసే, ఆయనే.
మరియు ఆయన తననుతాను ఒక అగ్నిస్తంభములో బయలుపరచుకున్నాడు, మరియు మోషే ఆ అనుభవమును పొందుకున్నాడు. అతడు ఐగుప్తునకు వెళ్తాడు. అతడు సువార్తను, ఆ మంచి వార్తను ప్రకటిస్తాడు, మరియు సూచనలు మరియు మహత్కార్యములు అతడిని వెంబడించాయి. మీకు అది అర్థమైందా? ఈనాడు అదే విషయం.
133 అంతే కాదు గాని, ఆ హెబ్రీయులు బయటకు వచ్చినప్పుడు, వెలుగులో నడిచినప్పుడు, వారు అదే అగ్నిస్తంభముచేత నడిపించబడ్డారు. మరియు బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, “దేవుని శోధింపవద్దు.”
134 దీనిని గమనించండి. నన్ను దీనిని చదవనివ్వండి.
ఇట్లు చెప్పబడెను గనుక, నేడు మీరు…ఆయన స్వరమును వినినయెడల, కోపము పుట్టించినప్పటివలె, (ఆయన స్వరము మీ హృదయముతో మాట్లాడుచుండగా.) మీ హృదయమును కఠినపరచుకొనకుడి. (వారు ఆయనకు కోపమురేపినప్పుటి విషయమైయున్నది.)
వినండి.
ఏలయనగా కొందరు, వినినప్పుడు, కోపము పుట్టించిరి:…
135 ఇశ్రాయేలీయులు వారియొక్క అవిశ్వాసముచేత దేవునికి కోపముపుట్టించారని ఎంతమందికి తెలుసు? వారు, పూర్తిగా, వారు గొణిగిసణిగారు. దేవుడు నేరుగా అక్కడకు నడిచి వెళ్ళాడు. మరియు వారు…మొదటి విషయమేమిటంటే, వారు సమస్యలో పడ్డారు.
ఇదిగో ఈ అగ్నిస్తంభము వారి పైన ఉన్నది. వారందరూ దానిని చూశారో లేదో, నాకు తెలియదు. అయితే, మోషే మాత్రం దానిని చూశాడు. మరియు అది వారికి పైన ఉన్నది, మరియు వారు దానిని గమనించారు. మరియు వారు వచ్చినప్పుడు…వారు దానిని చూడలేదని అనుకున్నయెడల, వారు చూశారో లేదో నాకు తెలియదు. అది వారికి ముందుగా వెళ్ళినది. అది అక్కడున్నదని బైబిలు గ్రంథము చెప్పినది.
136 అది ఇట్లు చెప్పినది, “ఆ నక్షత్రము జ్ఞానులకు ముందుగా వెళ్ళినది.” జ్ఞానులు తప్ప మరెవరూ దానిని చూడలేదు. అది ప్రతి పరిశీలనశాల మీదుగా వెళ్ళినది. వారు నక్షత్రముల ప్రకారము కాలమును పాటించేవారు. జ్ఞానులు తప్ప మరెవరునూ దానిని చూడలేదు. అది వారు మాత్రమే చూచుటకైయున్నది, మరియు ఆ జ్ఞానుల కొరకే ఆ నక్షత్రము పంపబడినది.
137 మరియు అగ్నిస్తంభము మోషే యొద్దకు పంపబడినది, మరియు మోషే ఇశ్రాయేలీయుల యొద్దకు పంపబడ్డాడు. మరియు వారు మోషేను వెంబడించవలసియున్నారు. వారు మోషేను చూడగలిగారు, మరియు మోషే ఆ వెలుగును చూశాడు.
వారు అక్కడికి వెళ్ళారు. అప్పుడు వారు వెళ్ళుచున్నారు. మరియు వారు బయటకు వెళ్ళగా, వారు ఎర్ర సముద్రమునొద్దకు వచ్చారు. మరియు, ఓ, ఆ పాత ఐగుప్తు దేశములో ఉన్నప్పుడే ఆ—ఆ మహాత్కార్యములయొక్క సూచనలన్నిటిని మరియు అటువంటి కార్యములు జరగడాన్ని వారు—వారు చూశారు, కాని వారి ప్రయాణములో వారు అక్కడికి వెళ్ళినప్పుడు, కేవలం అప్పుడే మార్పుచెంది మరియు బయటకు తీసుకొనిరాబడ్డారు. అప్పుడు, మొదటి విషయం మీకు తెలుసా, వారు సమస్యలో పడ్డారు.
138 దేవుడు మిమ్మల్ని ఇబ్బందులలోనికి తీసుకురాడానికి ఇష్టపడతాడు. ఇబ్బందిని తీసుకొనివచ్చి మరియు దాని విషయమై మీరేమి చేస్తారో చూడటానికి ఆయన ఇష్టపడతాడు. కావున ఆయన ఎర్రసముద్రమును ఆపివేశాడు, మరియు మొదటి విషయమేమీటో మీకు తెలుసా, వారిని నేరుగా ఈ స్థలములోనికి నడిపించాడు, పిదప ఫరోను వారి వెనుక పంపించాడు. దేవుడు దానిని చేయడానికి ఎలా ఇష్టపడతాడో చూశారా? ఆయన తన శక్తిని మరియు ప్రేమను ప్రదర్శించుటకు ఇష్టపడతాడు. ఆయన దేవుడైయున్నాడు, మరియు ఆయన ఎవరో మీకు చూపించుటకు ఆయన ఇష్టపడతాడు. ఆమేన్.
మరియు దానిలో సమస్యేమిటంటే, ఈనాడు, ప్రజలు ఇట్లంటారు, “ఓ, ఆ దినములు గతించిపోయినవి.” లేదు. అటువంటి విషయాలు మీకు బోధించబడుచున్నప్పుడు, దేవుడు తననుతాను ఎలా కనబరచుకోగలడు? అయితే దేవుడు తననుతాను ప్రత్యక్షపరచుకొనుటకు ఇష్టపడతాడు.
139 వెలుగులో నడుస్తూ, ఇశ్రాయేలీయులు వెళ్ళుచున్నారు. మోషే, వారికి ముందుగా వెళ్ళుచున్నాడు. వారు అక్కడున్నారు. “రండి. ఇదే మార్గము. దేవుడు పిలచుచున్నాడు. మనము బయటకు వెళ్ళుచున్నాము. మనము వాగ్దాన దేశమునకు వెళ్ళుచున్నాము.”
“ఓ, హల్లెలూయా!” మీకు తెలుసా, ఇక్కడ వారందరు కేకలు వేస్తూ, గంతులేస్తూ, మంచి సమయాన్ని కలిగియుంటున్నారు. మరియు మొదటి విషయం ఏమిటంటే, వారు వెనుకకు చూసి మరియు ఇట్లన్నారు, “ఓ, ఆ ధూళి ఏమిటి?”
140 వారిలో ఒకరు ఒక కొండ పైకి ఎక్కి, ఇట్లన్నాడు, “ఓ, ఓ! అయ్యో, అయ్యో! అది ఫరోయొక్క సైన్యము.”
141 దేవుడు ఇట్లన్నాడు, “దేని గురించి మీరు అంతగా భయపడుచున్నారు? నేను అక్కడ దిగువున చేసినదానిని మీరు నమ్మలేదా? దేని గురించి మీరు అంతగా చింతిస్తున్నారు? మీరు ఎందుకని నాకు కోపము పుట్టించుచున్నారు?”
142 వారు అక్కడకు వెళ్ళినప్పుడు, మోషే బయటకు వెళ్ళి మరియు దేవునికి విజ్ఞాపన చేశాడు. దేవుడు ఎర్రసముద్రమును తెరిచాడు మరియు వారు దానిని దాటి వెళ్ళారు; శత్రువును లోపల మూసివేసాడు. దేవుడు దానిని చేసే విధానము అదేయైయున్నది. భయపడకండి. ఉబ్బితబ్బిబ్బు అవ్వకండి. కలవరపడకండి. మీరు దేవునికి కోపము రేపుతారు.
143 పిదప ఆయన ఏమి చేశాడు? చూడటానికి ఇట్లున్నది, “మంచిది, మనము ఒక పెద్ద పరీక్షను పొందుకున్నాము; దేవునికి స్తోత్రం, మనము దానిని అధిగమించాము. మనకు ఇకమీదట ఏమియు రావు. మనము వాగ్దాన దేశమునకు మార్గములో ఉన్నాము.” మరియు ఆయన, నేరుగా నీరు లేని ఎడారిలోనికి వారిని నడిపించాడు. మీరు ఊహించగలరా? దేవుడు, ఆయనయొక్క—ఆయనయొక్క శుద్ధిచేయబడిన, పరిశుద్ధ ప్రజలను, వారిని నేరుగా ఈ ఉచ్చులోనికి నడిపించాడు; పిదప ఆ ఉచ్చులోనుండి వారిని బయటకు తెచ్చి, మరియు నేరుగా నీరు లేని ఈ చోటికి వారిని నడిపించాడు. నీళ్ళున్న ఏదైనా మార్గములోనికి ఆయన వారిని తీసుకొని వెళ్ళగలిగియుండగా అట్లు చేసాడు. అంతెందుకు, ఆయన కోరినట్లైతే, దారి పొడవునా, ఆయన ఒక నదిని తయారు చేయగలడు. ఆయన కోరినట్లైతే, ఆయన ప్రతి కొండను పగలగొట్టి గాలిలో యాభై అడుగుల ఎత్తునకు నీళ్ళు చిందించే, ఆనందముగా మార్చగలడు. నిశ్చయముగా, ఆయన చేయగలడు. కానీ ఆయన దానిని చేసినట్లైతే, అది చాలా తేలికైపోతుంది. ఓ, దానిని నేను ఇష్టపడుచున్నాను! ప్రభువు నామము స్తుతింపబడును గాక.
144 “సహోదరుడా బ్రెన్హామ్, ఇది జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు ఎందుకు…?”
దేవుడు దానిని చేస్తున్నాడు. ఆయనను చేయనివ్వండి. కేవలం కొనసాగిపోండి. అది దేవుని పనియైయున్నది. “నీతిమంతుల అడుగుజాడలు యెహోవా చేతనే స్థిరపరచబడును.” అవును, అయ్యా. అది ఎటువంటి వ్యత్యాసమును కలిగిస్తుంది?
145 “బ్రెన్హామ్ సహోదరుడా, నా డబ్బంతయూ పోయినది.” మంచిది, ఎలాగైనా, దేవుని స్తుతించుము.
146 “ఓ, నేను దీనిని చేశాను, మరియు ఇది సంభవించినది, తుఫానులో నా ఇల్లు కొట్టుకొనిపోయినది.”
147 అయినా గాని, దేవుని స్తుతించుము. “ప్రభువు ఇచ్చెను, ప్రభువు తీసుకొనిపోయెను, ప్రభువు నామమునకే స్తుతి కలుగును గాక.” కేవలం నడుస్తూనే ఉండండి. అదంతా దేవునియొక్క మహిమయైయున్నది. దేవుడు తానేమి చేయుచున్నాడో ఎరిగియున్నాడు.
కొందరు నీటిలో నుండి, కొందరు జలప్రళయంలో నుండి,
కొందరు లోతైన పరీక్షలోనుండి, కానీ అందరూ రక్తములో నుండి.
148 ఆ విధంగానే ఆయన వారిని నడిపిస్తాడు. అది వాస్తవము. ఓ, మై! నేను కేవలం ఆగిపోయి కేకలు వేయగలను అన్నట్లుగా నాకు అనిపించుచున్నది. ఆయనయొక్క ప్రియమైన పిల్లలను ఆయన ఆ విధంగానే నడిపిస్తాడు. ఓ, మీరు అనుభూతి చెందగలుగుతున్నారా…? ఇప్పుడు, నేను ఒక మనస్తత్వవేత్తను కాను, కానీ ఆ ప్రియమైన ఆత్మ ఇప్పుడు భవనమును తడిపివేయడాన్ని మీరు అనుభూతి చెందగలుగుచున్నారా? ఇప్పుడే మన కన్నులు తెరచుకొని, మరియు ఈ గోడల ప్రక్కగా, ఈ నడవలలో పైన-మరియు-క్రింద ఏమి నిలబడియున్నదో చూసినయెడల ఏమౌతుంది?
149 వృద్ధ ఎలీషా, ఒక ఉదయమున, ఆ అబ్బాయి ఎంతగానో గ్రుడ్డివాడైయుండగా, అతడు ఇట్లన్నాడు, “అక్కడున్న సిరియన్లను చూడు.”
ఇతడు ఇట్లన్నాడు, “కానీ మనతో ఇంకా ఎక్కువమంది ఉన్నారు.”
అతడిట్లన్నాడు, “నాకు ఎవ్వరూ కనబడటంలేదు.”
ఇతడు ఇట్లన్నాడు, “ప్రభువా, ఆ అబ్బాయి కన్నులు తెరువుము.”
150 అతడు ఆ వృద్ధ ప్రవక్త చుట్టూ చూశాడు, ఆ చుట్టూ అంతా, పర్వతములు మండుచున్నవి, మరియు అగ్నిగుఱ్ఱాలు, మరియు అగ్నిరథములున్నవి. అప్పుడు అతడు ఒప్పించబడ్డాడు.
151 ఇతడు ఇట్లన్నాడు, “మనము బయటకు వెళ్ళి మరియు వారిని గ్రుడ్డితనముతో మొత్తుదాము.” వారు ఎప్పుడూ కలిగియున్నట్లుగానే వారియొక్క చూపును సంపూర్ణముగా కలిగియున్నారు, కానీ వారు అతడి పట్ల గ్రుడ్డివారయ్యారు. అతడు ఇట్లడిగాడు, “మీరందరూ ఏలీయాను వెదకుచున్నారా?”
ఇట్లు చెప్పారు, “అవును.”
152 “రండి, అతడు ఎక్కడున్నాడో నేను మీకు చూపిస్తాను,” అని అతడన్నాడు. మరియు వారిని నడిపించుచున్నది, అతడే. కానీ వారు దానిని ఎరుగకయున్నారు.
153 ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడు చేసిన అవే కార్యములను చేస్తూ, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు, మరియు లోకము దానిపట్ల గ్రుడ్డితనము కలిగియున్నది. వారు దానిని ఎరుగకయున్నారు. “ఓ, దాని గురించి నాకు—నాకు తెలియదు. నా సంఘకాపరి…” ఓ, దయనీయమైన దుర్భలమైన ప్రజలారా! నా భావమును గ్రహిస్తున్నారా? వారు దానిపట్ల గ్రుడ్డివారిగా ఉన్నారు. వారికి అది తెలియదు. దేవుడు నడిపించుచున్నాడు.
154 ఇప్పుడు, వారు, పాపపు అరణ్యముగుండా వచ్చారు, అక్కడ ఎటువంటి నీరు లేదు. దేవుడు దానంతటినీ సమకూర్చాడు. ఓ, మరియు వారు ఒక నీటి కుంటను కనుగొన్నారు, వారు ఇట్లన్నారు, “ఇదే.” మరియు వారు దానిని కనీసం రుచి చూడలేకపోయారు. ఓ, అది భయంకరముగా ఉన్నది. మై, అది—అది నూరు శాతం సల్ఫర్ కంటే హీనంగా ఉన్నది. చూడండి, మీకు తెలుసా, సరిగ్గా కుళ్ళిపోయిన గుడ్లవలెనున్నది. “ఓ, మై! అది భయంకరముగా ఉన్నది.” అది విషమైయున్నది. ఇప్పుడు, పాపపు అరణ్యము అని పిలువబడుచున్నది. అనేక తాటి చెట్లు అక్కడ పెరుగుతాయి, మరియు అది ఆ తాటి చెట్లు పెరిగినట్టి ఊటయైయున్నది. అప్పుడు మోషే ఇట్లన్నాడు, “వద్దు…”
155 దేవుడు ఇట్లన్నాడు, “వారెందుకు అట్లు చేస్తారు? వారెందుకు అట్లు చేస్తున్నారు? వారెందుకని నాకు కోపము పుట్టిస్తున్నారు? సరి, నేను ఆ వెనుక దానిని చేసినట్లైతే, ఈ పరిస్థితి విషయములో నేను ఏదైనా చేయలేనా?”
156 ఆయన మిమ్మల్ని ఒక రోగము భారీనుండి విడిపించినట్లైతే, ఆయన మరొక దానినుండి మిమ్మల్ని విడిపించలేడా? ఆయన ఒక సమస్యనుండి మిమ్మల్ని విడిపిస్తే, ఆయన మరొక దానినుండి మిమ్మల్ని విడిపించలేడా? దేవునికి స్తుతికలుగును గాక! ఆయన నన్ను పాపమునుండి బయటకు లాగితే, ఆయన నన్ను సమాధినుండి కూడా బయటకు తీయగలడు. ఆయన దేవుడైయున్నాడు. అది ఏమి వ్యత్యాసమును కలిగిస్తుంది? కేవలం ముందుకు కొనసాగిపోండి, మీ దృష్టిని ఆయనపై ఉంచండి.
157 ఇట్లన్నాడు, “నేను వెనుక ఎర్ర సముద్రమును మూసివేసి, మరియు ఆ ఐగుప్తీయులను ముంచివేసినట్లైతే, ఈ నీటి విషయమై నేను ఏదైనా చేయలేనా? దేని గురించి మీరు నాకు కోపము రేపుతున్నారు? ఓ, మీ అవిశ్వాసము! అవిశ్వాసముచేత, మీరు నాకు కోపము రేపుతున్నారు.”
158 ఇప్పుడు ఇక్కడ “పాపము,” అనే పదము వాడబడినది, కోపము రేపినారు. చేశారు…వారు దానిని చేయుటకు కారణమేదనగా, వారు అవిశ్వాసము ఉంచడమే. ఇప్పుడు, వారెన్నడూ బయటకు వెళ్ళి మరియు జూదమాడలేదు, మరియు అటువంటి కార్యములు చేయలేదు. వారెన్నడూ వేరొకరి భార్యతో వెళ్ళలేదు, మరియు బయటకు వెళ్ళి అబద్ధాలు చెప్పలేదు. వారు చేస్తున్నది అది కాదు. కానీ, మొదట, అసలు పాపము అనగా అది కాదు.
159 వ్యభిచారములో జీవించుట పాపము కాదు. ధూమపానం, పొగాకు నమలడం, మద్యపానం, జూదమాడటం, శపించడం, బూతులు మాట్లాడటం, మరియు మొదలగునవి, అవి పాపము కాదు. అవి అవిశ్వాసముయొక్క గుణలక్షణములైయున్నవి. మీరొక అవిశ్వాసివి గనుక మీరు వాటిని చేస్తారు. మీరొక విశ్వాసియైతే, మీరు వాటిని చేయరు. ఆ కారణముచేతనే యేసు ఇట్లన్నాడు, “నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు.” తాను విశ్వాసము ఉంచుతున్నానని చెప్పేవాడు కాదు, కానీ నిజంగా విశ్వాసముంచేవాడు! అదీ విషయం. అది మీయొక్క ప్రారంభ సాక్ష్యమంతటిని తీసివేస్తుంది. చూశారా? ఇప్పుడు, అక్కడే మీరున్నారు.
“నా మాటలు విని కేకలు వేయువాడు,” కాదు. “నా మాటలు విని భాషలతో మాట్లాడేవాడు,” కాదు. “నా మాటలు విని, తన చేతిలో, లేదా ముఖములో రక్తము కలిగియున్నవాడు,” లేదా ఇంకేదో కాదు. అది కాదు.
“నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు, మరియు వాడు తీర్పులోనికి రాక, మరణమునుండి జీవములోనికి దాటియున్నాడు.”
160 పాపము అనగా ఏమిటి? అవిశ్వాసమే. నేరుగా లేఖనము యొద్దకు వెళ్ళి, అది సత్యమో కాదో అని కనుగొనుటకు బదులుగా, ఏదో ఒక చిన్న విషయం లేవగలదు, “ఓ,” మీరు ఇట్లంటారు, “నేను…లేదు! చూడండి, అదిగో, మీరు వెళ్ళండి. నేనైతే కేవలం నేను ఉన్నరీతిగానే ప్రెస్బిటేరియనుగా కొనసాగుతాను, చూడండి.” గ్రుడ్డివారిగా, కొనసాగిపోండి, అయితే మీరు దేవునికి కోపము రేపుతారు.
161 దేవుడు ఏదైనా చేసినప్పుడు, దేశము దానిని పట్టుకోవాలని ఆయన ఆశిస్తాడు. కానీ, దానికి బదులుగా, “మీకు తెలుసా, మంచిది, దాని గురించి నాకు తెలియదు.” చూశారా? ప్రజలు దానిని పొందాలని ఆయన ఆశిస్తాడు. మీరు తగినంతగా శ్రద్ధ కలిగియున్నట్లైతే, లేఖనమును తీసుకొని కూర్చొండి. దానిని చదవండి, మరియు దానిని మొత్తం వెదకండి, మరియు అది జరిగినదో లేదో చూడండి, అది జరుగుతుందని ముందుగా చెప్పబడినదో లేదో అని, మరియు అటువంటివాటిని చూడండి. అప్పుడు మీరు దానిని పొందుకుంటారు. ఆమేన్.
162 ఇప్పుడు గమనించండి.
ఇట్లు…ఈ దినమున మీరు…ఆయన స్వరమును వినినయెడల, కోపముపుట్టించినప్పటివలె, మీ హృదయమును కఠినపరచుకొనకుడి, దేవునికి వారివలన కోపము రేగినప్పటి విషయమైయున్నది, మీరు చూడండి.
ఏలయనగా కొందరు, వారు, మోషే బోధించిన సువార్త వినినప్పుడు, కోపము రేపారు: వారు మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారే.
163 బయటకు వచ్చిన ఆ అసలైన గుంపులోనుండి ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమందికి తెలుసు? ఎంతమంది? [ఎవరో ఇట్లు చెప్పుచున్నారు, “ఇద్దరు.”—సంపా.] ఇద్దరు, అది సరియే. వారి పేర్లు ఎంతమందికి తెలుసు? [“కాలేబు మరియు యెహోషువా.”] అది నిజము. ఇరువది లక్షల మందిలోనుండి, కేవలం కాలేబు మరియు యెహోషువ, ఇద్దరు మాత్రమే.
164 దీనిని వినండి. “అయితే ఆయన…” ఇప్పుడు 17వ వచనము.
అయితే అవిశ్వాసము కారణంగా, ఎవరి వలన నలువది ఏండ్లు ఆయన దుఃఖపడెను. పాపము చేసినవారు, అనగా అవిశ్వాసముంచినవారి వలనే కదా…?
165 నిఘంటువును తీసుకొని పాపము అంటే ఏమిటో కనుగొనండి. బైబిలు నిఘంటువును తీసుకోండి. అది అవిశ్వాసమైయున్నది. అవిశ్వాసమే “పాపము.” “విశ్వసింపని వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను,” పరిశుద్ధ యోహాను 4, చూడండి, “ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.”
…ఎవరి శవములు అరణ్యములో రాలిపోయెను?
మరియు తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను,…
166 మీ అవిశ్వాసమే! ఓ, నేను ఎన్నడూ నా అధ్యాయమునకు రాలేను. అయితే, చూడండి, ఈనాడు, ఈ దేశముతో సమస్య అదే. సూచనలు మరియు అద్భుతాలు ఈ దేశముగుండా జరిగినవి. వారు ఏమి చేస్తారు? స్థిరముగా వారు దానిని త్రోసిపుచ్చారు. మరియు ఆయన ఇట్లన్నాడు, “వారు ఎక్కడికైతే ప్రయాణమును ప్రారంభించారో ఆ దేశములోనికి వారిని ప్రవేశింపనివ్వనని నేను ప్రమాణము చేస్తాను.”
167 ఈనాడు ఈ పెద్ద సంఘములతో సమస్య ఏమిటి? వారి అవిశ్వాసము దేవునికి కోపము రేపినది. హల్లెలూయా! ఆయన ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టించగల సమర్థుడు. ఆయన వారికి సువార్తను ఇవ్వడానికి ప్రయత్నించాడు, మరియు వారు వారి హృదయాలను కఠినపరచుకున్నారు. వారు తమనుతాము మతసంబంధమైన సంస్థలుగా చేసుకొని, మరియు వారు చిన్న చిన్న సంఘశాఖలను ఏర్పరచుకున్నారు, “మరియు మేము దీనిని తప్ప మరిదేనిని నమ్మము,” అనుకున్నారు మరియు దేవుడు లోపలికి వెళ్ళలేకపోయాడు. ఈ రోజున వారు ఎక్కడయున్నారు? ఒక ప్రక్కకు కూర్చొనియున్నారు.
168 దేవునియొక్క చిన్న, విశ్వాసనీయమైన గుంపు సూచక క్రియలు మరియు అద్భుతములతో, నేరుగా కొనసాగిపోవుచున్నది. ఆయన వారిని పరీక్షించుచున్నాడు. “దేవునియొద్దకు వచ్చు ప్రతి కుమారుడు మొదటిగా పరీక్షించబడి మరియు పరిశోధింపబడతాడు,” బాల-శిక్షణ ఇవ్వబడవలసియున్నది.
169 మొదట జరిగిన చిన్న విషయానికే, “ఓ, సరి, ఏలాగైనా, దాని విషయమై ఏమియు లేకపోవచ్చును.” మీరు అక్రమసంతానమైయున్నారే గాని, దేవుని కుమారుడు కాదు.
170 ఏలయనగా ఒక దేవుని కుమారుడు అబ్రాహాముయొక్క సంతానమైయున్నాడు, అతడు లేనివాటిని ఉన్నట్టుగా పలుకుతాడు, “దేవుడు అట్లు చెప్పాడు” అంటూ, మరియు ముందుకు కొనసాగుతూనే ఉంటాడు. ఆమేన్. ఎవరేమి చెప్పినప్పటికినీ, లేదా ఏది భిన్నముగా ఉన్నప్పటికినీ, ఎలాగైనా వారు కొనసాగుతూనే ఉంటారు. “దేవుడు అట్లు చెప్పాడు.”
171 అది ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికినీ, అతడు ఆ బిడ్డ కొరకు ఇరవై-ఐదు సంవత్సరాలు ఎదురుచూశాడు. మరియు అతడు నమ్మగలుగునట్లు, ఆ అవిశ్వాసులనుండి అతడు తననుతాను వేరుచేసుకున్నాడు, ఆమేన్. ఓ, మై! నేను భక్తిపరవశుడనగుచున్నాను.
దాని గురించి ఆలోచించండి. లోకముయొక్క ఆ సిద్ధాంతమునుండి మిమ్మల్ని మీరు వేరుచేసుకోవలసియున్నది, “ఆహ్, అద్భుతములు జరుగే ఆ దినములు గతించిపోయినవి. అటువంటిదేదియు లేదు. అది మూఢ భక్తియైయున్నది.” మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి.
172 బైబిలు ఇట్లు చెప్పినది, “వారి మధ్యనుండి బయటకు వచ్చి, మరియు మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి, మరియు నేను మిమ్ములను స్వీకరించెదను, అని ప్రభువు చెప్పుచున్నాడు.” ఎంత అద్భుతము! మిమ్మల్ని మీరు వేరు చేసుకున్న తరువాత, “నేను మిమ్మల్ని స్వీకరిస్తాను.” “మీరు నా పిల్లలైయుందురు, నేను మీ దేవుడనైయుంటాను.” మిమ్మల్ని మీరు వేరుచేసుకోండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. అది నిజము.
173 వివాహము కానున్న ఒక యవ్వనస్థుడు, ఒక అవిశ్వాసియైన అమ్మాయిని వివాహం చేసుకొనుట; లేదా అవిశ్వాసియైన ఒక అబ్బాయిని ఒక యవ్వనస్థురాలు వివాహం చేసుకొనుట. మీరు దానిని చేయకండి. అతడెంత ముద్దుగా ఉన్నాడో, మరియు—మరియు, లేదా ఆమె ఎంత ముద్దుగా ఉన్నదో, మరియు ఆమె ఎటువంటి పెద్ద కళ్ళను కలిగియున్నదో నేను లెక్కచేయను; కొద్ది దినములలో అవన్నియు వాడిపోతాయి. కానీ, సహోదరుడా, నీ అంతరాత్మ నిత్యమూ జీవించబోవుచున్నది. నీవు ఏమి చేయుచున్నావో దాని విషయమై నీవు జాగ్రత్త వహించుము. ఆమె ఒక నిజమైన విశ్వాసి కానియెడల, లేదా అతడు ఒక నిజమైన విశ్వాసి కానియెడల, ఆ విధముగా నీవు జోడుగా ఉండకు. అటువంటిదాని నుండి దూరంగా ఉండండి. అది దారిలో మీకు సమస్యను కలుగజేస్తుంది.
174 ఇప్పుడు వినండి, 17వ వచనము.
అయితే…ఎవరి వలన ఆయన…నలువది ఏండ్లు దుఃఖపడెను? ఎవరి శవములైతే రాలిపోయినవో, అట్టి పాపము చేసినవారి వలనే కదా?
…ఆ విశ్రాంతిలోనికి ప్రవేశింపరని ఆయన ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను,…
175 వారు ప్రయాణమును ప్రారంభించారు, అయితే, వారు అద్భుతాలను చూశారు, కానీ వారు వాగ్దాన భూమిలోనికి ఎన్నడూ చేరుకోలేదు. కేవలం, ఎన్నుకోబడిన ఇద్దరు మాత్రమే, వాగ్దాన దేశములోనికి ప్రవేశిస్తారు.
176 ఇప్పుడు పౌలు ఏమి చేస్తున్నాడు? ఇప్పుడు అతడు క్రైస్తవులతో మాట్లాడుచున్నాడు, “అగ్నిస్తంభము వారిని నడిపించుచుండగా, సూచనలు మరియు అద్భుతాలతో, ఆ వెనుక బోధించబడిన ఇదే సువార్త, ఈ కార్యములు మరలా సంభవించుచునప్పుడు, మీరు సందేహపడుతూ, అవిశ్వాసము వలన, దారిప్రక్కనే రాలిపోకండి, ఏలయనగా వారి శవములు అరణ్యములో రాలిపోయినవి.”
177 ఇప్పుడు మనము లోపలికి ప్రవేశిస్తున్నాము, ఇప్పుడు త్వరగా. జాగ్రత్తగా గమనించండి.
…జీవించని వారిని గూర్చియేగదా?
కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని మనము గ్రంహించుచున్నాము.
ఒకసారి అతడు దానిని పాపము అని అంటాడు, తరువాత సారి అతడు దానిని అవిశ్వాసము అని అంటాడు. అవిశ్వాసమే “పాపము.” “వారియొక్క అవిశ్వాసము చేతనే, వారు ప్రవేశించలేదు.”
178 ఆ ప్రవక్తయైన, మోషేను వారు చూశారు. అతడు ఏమి చేశాడో వారు చూశారు, అతడు ఏమి చెప్పాడో వారు చూశారు. ప్రతీసారి, అది సత్యమైయున్నది, ఆ సత్యము, నేరుగా కొనసాగిపోయినది. ఈ అగ్నిస్తంభము వారి యెదుట ప్రత్యక్షమయ్యేది. వారు దానిని గమనించారు. వారు దానిని చూశారు.
179 పౌలు, అతడు పొందుకున్న అనుభవమును, తరువాత, ఇక్కడ చెప్పుటకు ప్రయత్నిస్తున్నాడు. చూశారా? ఆ అనుభవమును ముడివేయుటకు ప్రయత్నిస్తూ, అతడు దానిని పాత నిబంధనతో పోల్చాడు. అతడు ఇట్లన్నాడు, “ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా, మనము ఒక నూతన కార్యములోనికి, ఈ నూతన యుగములోనికి ప్రవేశించియున్నాము. పాత కాలములలో, ప్రభువు ప్రవక్తల ద్వారా వారికి ప్రత్యక్షమయ్యాడు, కానీ ఇప్పుడైతే ఆయన తన కుమారుడైన, యేసు ద్వారా వ్యక్తపరచుకుంటున్నాడు.” చూశారా? మరియు అతడు ఆ అనుభవాలను పోల్చుతూ ఏమి జరుగుచున్నదో వారికి చూపించడం ప్రారంభించాడు, ఆ సూచనలు మరియు అద్భుతములు, మరియు సమస్తమును, మరియు ఏమి వ్రాయబడియున్నదో చూపించడం ప్రారంభించాడు.
180 ఇప్పుడు అతడు ఇట్లన్నాడు, “వారియొక్క అవిశ్వాసము చేతనే, వారు ప్రవేశింపలేదు.” వారు నమ్మలేదు.
181 “కానీ ఇప్పుడు, మనము, మనము ఒక యుగములోనికి వెళ్ళుచున్నాము, మరియు మీరు మీ హృదయమును కఠినపరచుకోకండి. వారు దేవునికి కోపము రేపినప్పుడు, కోపము పుట్టించిన దినములలో, వారు చేసినట్లే మీరు ప్రవర్తించకండి.” వారు దానిని ఎలా చేశారు? అనైతికముగా జీవించుట ద్వారా కాదు. దీనిని మీకు నూరిపోయనివ్వండి.
182 మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, నేను సంఘముకు వెళ్తాను.” అది మంచిదే. “నేను నా జీవితములో ఎన్నడూ అబద్ధమాడలేదు.” అది మంచిదే. “నేను ఎన్నడూ దొంగతనం చేయలేదు. నేనెన్నడూ దీనిని, దానిని, లేదా ఆ మరొకదానిని చేయలేదు.” అది చాలా మంచిదే. అదంతా మంచిదే. కానీ, అయినను పాపమనగా అది కాదు.
183 దేవుడు తననుతాను చూపించుకున్నప్పుడు మరి మీరు దానియందు అవిశ్వాసముంచి, మీరు దానిని విననప్పుడు, అది పాపమైయున్నది.
184 “ఓ,” మీరు ఇట్లంటారు, “నా సంఘము దానిని బోధించదు.” బైబిలు దానిని బోధించుచున్నంతకాలం, మరియు దేవుడు దానిని రుజువు చేస్తున్నంతకాలం, అదే ముఖ్యమైన విషయము.
ఇపుడు ఒక్క క్షణము గమనించండి. ఇప్పుడు మనము నిజంగా, నిజమైన లోతైన ఒక దానిపై ప్రారంభించబోవుచున్నాము. ఇప్పుడు, మీరు బయటకు వెళ్ళేవరకు మీ మనస్సాక్షిని మీ కోటు జేబులో పెట్టుకోండి.
185 ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి.
కావున, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాము అను వాగ్దానము, ఇంక నిలిచియుండగా…
ఆయనయొక్క, ఆమెయొక్క, ఇప్పుడు వ్యక్తిగత సర్వనామములైయున్నవి. ఏమిటి?
…మీలో ఎవడైనను దానిని పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
186 ఇప్పుడు, పౌలు ఈ విషయములన్నిటి గురించి, ముందున్న అధ్యాయములో, వారికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పుడు అదేమిటో వారికి చెప్పడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు.
ఓ, మనకు సమయమున్నదా? నేను…బహుశా మనము ఈ రాత్రి వరకు వేచియుండుట మంచిది. ఆలస్యమగుచున్నది, మరియు మనము ప్రార్థనా కూడికను కలిగియుండబోవుచున్నాము. బహుశా ఈ రాత్రి మనం దానిని పట్టుకోవడం మంచిది, ఎందుకనగా ఇది నిజంగా విటమిన్లతో, ఆత్మ సంబంధమైన విటమిన్లతో నిండియున్నది. చేయవలసినవి చాలా ఉన్నాయి, మరియు ఈ మధ్యాహ్నము నేను ఖాళీ లేకుండా ఉంటాను. “మనము…”
కావున మనము, వాగ్దానము పొందకుండ తప్పిపోవుదుమేమో అని, భయము కలిగియుందము…
187 ఇప్పుడు, ఐగుప్తులో ఉండగా, వారు వాగ్దాన దేశము కొరకు ఒక వాగ్దానమును కలిగియున్నారా? మరియు, ఈ వాగ్దానమును, వాస్తవము చేయడానికి, దేవుడు దిగివచ్చాడు. ఏమిటి, ఆయన దానిని చేయబోవుచున్నాడని, కొన్ని వందల సంవత్సరాల క్రితమే, దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. అది లేఖనానుసారముగా ఉన్నది.
188 యోసేపు ఇట్లన్నాడు, “నీవు ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళి, మరియు అక్కడ నా పితరులతో నన్ను పాతిపెట్టే వరకు నీవు నా ఎముకలను ఇక్కడనుండి కదపవద్దు.” ఎందుకనగా, యేసు మృతులలోనుండి లేచినప్పుడు, పునరుత్థానము జరుగబోవుచున్నదని అతడు ఎరిగియున్నాడు, ఎందుకనగా యోబు ఏమి చెప్పాడో అతడికి తెలుసు. చూశారా?
189 ఆ ప్రవక్తలలో ప్రతీ ఒక్కరూ సరిగ్గా ఆ వేరొక ప్రవక్త ఏమి చెప్పాడో ఎరిగియున్నారు, మరియు వారి ఆత్మ ఒక్కటేనని ఎరిగియున్నారు. మరియు వారు గమనించుచున్నారు. ఓ, సహోదరుడా! ఓ, అది మనయొక్క లోకపు స్థితినుండి మనల్ని కుదిపివేయవలసియున్నది. ప్రజలు ఏమి చెప్పుచున్నారనేదానిపై కాదు గాని, ఆ ప్రవక్తలు ఏమి చెప్పారన్నదానిపై, వారు తమ దృష్టిని నిలిపారు. వారిలో ప్రతీ ఒక్కరు గమనిస్తూ ఉన్నారు.
190 అబ్రాహాము ఇట్లు చెప్పాడు, “యోబు సమాధి చేయబడిన ఈ చోటనే నన్ను సమాధి చేయండి.” ఇంకా ఇట్లన్నాడు, “శారా, నేను కొంత భూభాగమును కొనబోవుచున్నాను. మనము సరిగ్గా ఇక్కడే సమాధి చేయబడబోవుచున్నాము.”
191 అతని తండ్రి తరువాత, ఇస్సాకు ఒక ప్రవక్తయైయున్నాడు. ఇట్లన్నాడు, “వినండి. నన్ను ఇక్కడ ఐగుప్తులోనైనా, ఇంకెక్కడైనా పాతిపెట్టకండి, కాని మీరు నన్ను తిరిగి నేరుగా వాగ్దాన దేశమునకు తీసుకొని వెళ్ళండి. మీరు నన్ను సరిగ్గా అక్కడే పాతిపెట్టండి.”
192 యాకోబు వాగ్దాన దేశమునకు వెలుపల మరణించాడు, కానీ ప్రవక్తయైన, తన కుమారునితో, ఇట్లు చెప్పాడు, “నీకు తెలుసా, ఒక రాత్రి దూత నా ప్రక్కలో తాకాడు. అప్పటినుండి నేను కుంటుతున్నాను. వచ్చి, నీ చెయ్యి పెట్టు…” ఓ, కనికరము! “ప్రవక్తయైన నా కుమారుడా, నేను వృద్ధుడను మరియు నేను గ్రుడ్డివాడను. అయితే స్వయంగా నీవే ఒక ప్రవక్తవైయుండగా, దూత తన హస్తమును పెట్టినచోట, నీ పరిశుద్ధ చేతిని పెట్టుము, మరియు నీవు నన్ను ఇక్కడ పాతిపెట్టవని పరలోకపు దేవునికి ప్రమాణము చేయుము.”
193 దీవించబడును గాక…వాక్యముయొక్క ఆత్మీయ ప్రత్యక్షతను మీరు చూస్తున్నారా? ఎందుకు, వారిలో సగానికి సగం, దాదాపు తొంభై శాతం మందికి, అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో అతనికి తెలుసు. “దూత తన చెయ్యిని ఉంచిన ఈ చోటులో నీ ప్రవక్త చేతులను పెట్టుము. నేను ఒకప్పుడు ఒక పెద్ద, ధృడమైన వ్యక్తిని, ఎంతో పిరికివాడిని. కాని, ఆయన నన్ను తాకాడు, అప్పటినుండి నేను కుంటివాడినయ్యాను. అయితే కుంటినప్పటినుండి నేను ఒక రాకుమారుడనయ్యాను. నేను నా నడకను మార్చుకున్నప్పటినుండి, నేను ఒక రాకుమారునిగా ఉన్నాను.” అవును. “నీ చెయ్యి ఇక్కడ పెట్టు. నీవు నన్ను ఇక్కడ పాతిపెట్టవని, పరలోకపు దేవుని మీద ఒట్టుపెట్టుము.” ఎందుకు? అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో ఎవరికీ తెలియదు. యోసేపుకి తెలుసు. అతడు ఇట్లన్నాడు, “ఆ ఆవలికి నన్ను తీసుకొనివెళ్ళి మరియు ఆ వాగ్దాన దేశములో నన్ను పాతిపెట్టుము.” విషయం అక్కడే ఉన్నది. నిశ్చయంగా.
194 కొన్ని సంవత్సరాల తరువాత, యోసేపు చనిపోయినప్పుడు, అతడు ఇట్లన్నాడు, “మీరు నన్ను ఇక్కడ పాతిపెట్టవద్దు. అయితే మీరు ప్రక్కనుండి దాటి వెళ్ళునప్పుడు మీరు నా ఎముకల వైపు చూడండి, ఎందుకనగా ఏదో ఒక రోజు మీరు ఇక్కడనుండి బయటకు వెళ్ళబోవుచున్నారు. మరియు మీరు వెళ్ళేటప్పుడు, నా ఎముకలను మీతో తీసుకొని వెళ్ళండి.”
195 విషయం అదే. లోకము వారికిష్టమొచ్చినదానిని చెప్పనివ్వండి మరియు వారు చేయాలనుకున్నది చేయనివ్వండి. ప్రభువు నామము స్తుతింపబడును గాక. నన్ను క్రీస్తులో ఉంచుము, నేను ఏమని పిలువబడినా, ఒక వెఱ్ఱివానిగా, లేదా పరిశుద్ధ-గుండ్రాయిగా పిలువబడినా పర్వాలేదు. ఏదో ఒక దినమున ఆయన వచ్చుచున్నాడు, మరియు ఆయన వచ్చినప్పుడు, క్రీస్తులో ఉన్నవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వస్తాడు. అదంతయూ ఒక ఆత్మసంబంధమైన, బయలుపరచబడిన సత్యమైయ్యుండి అక్కడే ఉన్నది, మరియు దానిని గ్రహించుటకు ఒక ఆత్మసంబంధమైన మనస్సు అవసరమైయున్నది. దినమెల్ల, దానిపై విశ్రాంతి పొందండి. దాని గురించి ఆలోచించండి. మీకు రాత్రివేళ భోజనము లేకపోయినా గాని, దాని గురించి ఆలోచించండి.
196 మరియు ఈ రోజు రాత్రి, మనము ఆ మిగిలియున్న, ఆయనయొక్క విశ్రాంతిలోనికి వెళ్ళి, మరియు ఈనాడు ఈ వాగ్దానము ఏమిటో చూస్తాము. ఈ రోజు ఈ విషయం ఏమిటి? దేవుడు దానిని ఇక్కడ బైబిలులో కలిగియుండి, ఇప్పుడు అది సరిగ్గా ఇక్కడ ఉన్నదని, దానిని నిరూపించకపోతే, అప్పుడు నేను ఒక అబద్ధ ప్రవక్తనౌతాను. అది ఖచ్చితముగా సరియే. అయితే అది ఇక్కడ ఉన్నది. ఈ విశ్రాంతి ఏమిటి?
197 అతడు ఇట్లన్నాడు:
ఇప్పుడు, మనము…లోపలికి ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, సరిగ్గా వారు చేసినట్లే, తప్పిపోవుదుమేమోనని భయము కలిగియుందము,…
198 మరియు అది అదే వాగ్దానమైయుండవలసి యున్నది. అది అదే విశ్రాంతియై ఉండవలసియున్నది. అది అదే దేవుడైయుండవలసి యున్నాడు. అది అవే సూచనలైయుండాలి. అది అదే కార్యమైయుండవలసి యున్నది. అయితే మనము విశ్రాంతి పొందుదాము. ఇప్పుడు అది ఏమైయున్నది? ఈ రాత్రి, ప్రభువు దానిని మనకు అనుగ్రహించును గాక.
మనము మన తలలు వంచియుండగా.
199 ధన్యకరమైన ప్రభువా, ఇప్పుడు మేము కలిసి పంచుకుంటున్న గొప్ప కార్యములను నిత్యత్వము మాత్రమే బయలుపరచుతుంది. చిన్న…
తీర్పుపొందుటకై నిర్ణయించబడినవారు అనేకులు. యూదా పత్రికలో నీవు చెప్పినట్లుగా ఉన్నది, అదేమనగా, “తీర్పుపొందుటకు పూర్వమందే నిర్ణయించబడిన కొందరు మనుష్యులు, మన దేవుని కృపను తీసుకొని, దానిని కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తారు.” మరియు ఈనాడు అనేకులు సువార్తను, దేవుని కృపను ప్రకటించుచున్నారు, దానిని డబ్బు-సంపాదించే పథకంగా మారుస్తున్నారు, గొప్ప పెద్ద సంఘములను కలిగియుండి మరియు ఆదివారపు బడిలో ఎక్కువమందిని కలిగియుండి, దేవుని కృపను తీసుకొని మరియు దానిని కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తున్నారు. మరియు లోకము గ్రుడ్డిదైయ్యుండి, గ్రుడ్డి పందులవలె పోవుచున్నది. వారు అర్థం చేసుకోలేరు.
200 ఓ దేవా, మాకు గ్రహింపును దయచేయుము. ఈ లోకసంబంధమైన పిల్లలవలె మా గ్రహింపును ఉండనీయకుము. ఏలయనగా, నీవు నీ వాక్యములో ఇట్లు చెప్పియున్నావు, “వెలుగు కుమారుల కంటె ఈ లోకసంబంధులు యుక్తిపరులైయున్నారు.” ఆదిలో అది అట్లేయున్నది, “కయీను కుమారులు” గొప్ప నిపుణులైన శాస్త్రవేత్తలయ్యారు. వారు గొప్ప శిక్షకులయ్యారు. వారు వస్తుపరమైన పనివారయ్యారు. వారు మెరుగౌతూ వెళ్ళారు, ఎంతో భక్తిపరులయ్యారు, కానీ శిక్షావిధినొంది తీర్పులో మునిగిపోయారు. మరియు వారి శవములు నీళ్ళ మీద తేలినవి, మరియు వారి ఆత్మలు పాతాళమునకు వెళ్ళినవి.
201 మరియు యేసు తాను మరణించినప్పుడు, వెళ్ళి వారికి ప్రకటించాడు. “మరియు పాతాళమునకు వెళ్ళి మరియు చెరలోనున్న ఆత్మలకు బోధించాడు, అనగా నోవహు దినములలో, దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండగా పశ్చాత్తాపపడనివారికి ప్రకటించాడు,” అని లేఖనము చెప్పుచున్నది. మరియు దేవా, ఆయన భూమి మీద నిలబడియుండగా, ఆయన ఇట్లు చెప్పాడు, “నోవహు దినములలో జరిగినట్లుగా, మనుష్యకుమారుని రాకడలో జరుగును.”
202 అయితే మేము’, “అప్పటి షేతు వంశావళిని,” దీనులుగా, నిజమైన దేవుని మనుషులుగా, లోకసంగతుల గురించి ఎక్కువగా తెలియనివారిగా, లోకసంబంధమైన సంగతుల గురించి ఏ మాత్రము శ్రద్ధ వహించక, ప్రతి బరువును ప్రక్కనపెట్టి మరియు దేవుని నమ్మి, మరియు రాజ్యములో ప్రవక్తలుగా మరియు గొప్ప వ్యక్తులుగా మారుటను గమనిస్తున్నాము. ఇతరులు, ఇతర మత ప్రపంచము, వారిని చూసి నవ్వుతూ, వారిని ఎగతాళి చేశారు. అయితే వరదలు మరియు తీర్పు తాకిన ఘడియ వచ్చినది.
203 యేసుక్రీస్తు యొక్క రాకడలో కూడా అది ఆ విధంగానే జరిగినది. వారు వారి స్వంత మతములను మరియు వారి గొప్ప సంఘములను కలిగియుండగా, వారు ఏ విధంగా ఆయనను ఎగతాళి చేసి నవ్వారు కదా. అయితే వారు ఉదయ నక్షత్రమును ఎగతాళి చేశారు, మరియు వారు ఆయనను చూసి నవ్వారు. మరైతే వారు తీర్పులోనికి ప్రవేశించారు. మరియు వారు పారిపోయి మరియు యెరూషలేమునకు వెళ్ళినపుడు, అక్కడ వారు ఆకలితో అలమటించడం వలన, వారి స్వంత పిల్లలను తిన్నారు, మరియు వారు ఆ పట్టణమును మరియు ఆలయమును తగలబెట్టినప్పుడు వారి రక్తము వీధులగుండా ప్రవహించినది, మరియు వారి ఆత్మలు పాతాళమునకు వెళ్ళినవి.
204 ప్రభువా, మూడవదానిలో, మరలా మేము ఇక్కడున్నాము. ఇది జీవ కాలమైయున్నది. మూడు అనేది జీవపు సంఖ్యయైయున్నది. మరియు మేమిక్కడ, ఎత్తబడుటకు సిద్ధంగా ఉన్నాము.
సంఘము ముందుకు కొనసాగుచున్నది; గొప్ప శాస్త్రీయ ప్రపంచము; ఈనాడు సంఘములు పూర్తిగా సంశయవాద-విశ్వాసులతో నిండియున్నవి. వేలకొలదిమంది, అవును, మిలియన్లమంది పుస్తకములో వారి పేర్లను కలిగియున్నారు, మరియు సువార్తను ఎగతాళి చేస్తారు, మరియు ఇట్లంటారు, అదేమనగా, “వారు విద్యలేనివారు. వారికి తెలియదు.”
ప్రభువా, బహుశా అది అట్లుండవచ్చును, కానీ విద్యలో మాకు ఏదైతే కొదువగా ఉన్నదో, దానిని నీవు కృపలో దయచేసినావు నీ వెలుగుయొక్క దూతను పంపుట ద్వారా, ఆయన శక్తిని ప్రత్యక్షపరచుట ద్వారా, మావంటి నిరక్షరాస్యులైన పేదవారికి వాక్యములను ధృవీకరించుట ద్వారా అట్లు చేసావు. అయితే దీనికై మేము నిన్ను ప్రేమిస్తున్నాము, ఎందుకనగా దీనిని చేసినది దేవుని కృపయే, మరియు మేము జన్మించామని మాకు తెలుసు. మరియు మేము ఏ మాత్రము, ప్రియమైనవారము కాదు. మేము ఎంతో ప్రేమించబడలేనివారిగా ఉన్నాము. అయితే నీవు, కృప ద్వారా, నీ దయగల హస్తమును చాపి, యేసు మా కొరకు ప్రార్థించుటను బట్టి, మా కన్నులు తెరిచావు; అతనిచుట్టూ చూడటానికి అతడు తిరిగినప్పుడు, గేహజీ కొరకు ఏలీయా చేసినట్లే ఉన్నది. మరియు ఈనాడు మా కన్నులు తెరవబడియున్నవి, మరియు మేము దేవుని కార్యములను చూస్తున్నాము, మరియు మేము అంత్యకాలములో కొనసాగుచున్నామని మేము ఎరిగియున్నాము; అన్యజనుల దినములు సమాప్తమైనప్పుడు, మరియు ఆయన తన నామము కొరకు ఒక ప్రజలను తీసుకుంటాడు. ప్రభువా, మేము అక్కడ లెక్కించబడుదుము గాక, దీనముగా మేము వేడుకొనుచున్నాము. నీవు దానిని అనుగ్రహిస్తావని మేము ప్రార్థిస్తున్నాము.
205 మమ్మల్ని దీవించుము. ఈ ఉదయం ఈ చిన్న జనసమూహమును దీవించుము. వారు వివిధ రకాలైన మతాలు మరియు నమ్మకాలతో నిర్మితమైయున్నారు, కానీ దేవా, ఈ రోజు వాటిని ప్రక్కన పెట్టుము. మరియు వారు నేరుగా కల్వరి వైపు చూసి, ఇట్లు చెప్పుదురు గాక, “దేవా, నన్ను మలచుము మరియు నన్ను నిర్మించుము. నేను…” ప్రవక్త తాను విరవబడి మరియు మరలా మలచబడుటకు, కుమ్మరి ఇంటికి వెళ్ళాడని చెప్పాడు. దేవుడు మమ్మల్ని కోరిన రూపములోనికి మమ్మల్ని మలచుము మరియు నిర్మించుము. ప్రభువుయొక్క మందిరములో మేము ద్వారమునొద్ద బస్తావలె ఉండవలసియున్నా పర్వాలేదు. భక్తిహీనులతో వారి గుడారాలలో నివసించుట కంటే, నేను ద్వారమునొద్ద ఒక బస్తావలె ఉండగోరతాను. మరియు ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించి, మరియు మమ్మల్ని దీనులుగా ఉంచుము. దేవుని సంగతులకు మా హృదయములు తెరువబడి, మా మనస్సులను తేటగా ఉంచుము, ఏలయనగా క్రీస్తు నామములో మేము దీనిని అడుగుచున్నాము.
206 మన తలలు వంచియుండగా, ఎవరైనా మీ ఆత్మయొక్క రక్షణ కొరకు ప్రార్థనలో జ్ఞాపకము చేసికొనబడాలని, కోరతారేమోనని నేను ఆశ్చర్యపోతున్నాను? కేవలం ఒక పాపియైయుండగా, మీరు మీ చెయ్యిని పైకెత్తుతారా? యవ్వనస్థుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా? ఆ వెనుక, అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడే, మీ ఆత్మ కొరకు, ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనబడుటకు ఇంకెవరైనా ఇష్టపడుచున్నారా? అయ్యా, చెయ్యి పైకెత్తిన నీవు, దేవుడు నిన్ను దీవించును గాక. మరియు దేవుడు నిన్ను దీవించును గాక, మరియు ఇక్కడున్న మిమ్మల్ని కూడా. అద్భుతము. ముగించడానికి ముందు, ఇంకెవరైనా ఉంటారా? ఎవరో ఉంటారని నాకు అనిపించుచున్నది. అయ్యా, వెనుక, ఆ వెనుకనున్న నీవు, దేవుడు నిన్ను దీవించును గాక.
207 ఇట్లనండి, ఇపుడు చూడండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగగోరుచున్నాను. అది ఈ చిన్న మందిరము వలనైయున్నదని, మీరు అనుకోవాలని నేను అస్సలు కోరడంలేదు. అది ఈ ప్రజలవలనైయున్నదని మీరు అనుకోవాలని నేను కోరడంలేదు. మరియు ఓ కనికరముగల దేవా, ప్రభువుయొక్క దూత నాతో తన ఫోటో తీయించుకున్నందువలనై యున్నదని అనుకోకండి, మరియు నేను…మరియు—మరియు అటువంటిదేదో అని అనుకోకండి, అటువంటిది చేయుట. ఓ దేవా! నేను ఆ విధంగా భావించినట్లైతే, సహోదరుడా, మిమ్మల్ని అడగటానికి బదులు నేను బలిపీఠమునొద్ద ఉండవలసియుంటుంది. అయితే నేను కేవలం దీనిని చెప్పుచున్నాను, ఇది సత్యమని మీరు చూచునట్లు, లేఖనము ద్వారా మాత్రమే నేను దీనిని చెప్పుచున్నాను. నేను దానిని చెప్పి, మరియు ఇక విషయమంతా అదేయైయుండి, ఏ ఇతర బోధకునిలాగానో లేక ఇంకెవరిలాగానో, లేదా మరిదేనిలాగానో వెళ్ళిపోతే, సరి, అప్పుడు, అది భిన్నంగా ఉండేది. కానీ మీరు విషయమును చూడండి, దేవుడు నేరుగా తిరిగి వచ్చి మరియు అది సత్యమని రుజువు చేస్తున్నాడు. చూశారా? దేవుడు దానిని రుజువు చేయడమే, దానిని నిజమైనదిగా చేస్తుంది. మరియు అప్పుడు, అది మాత్రమే కాదు గాని, ఆయన దానిని చేస్తాడని ఆయన వాక్యము చెప్పుచున్నది. ఇదిగో ఆయన ఇక్కడ దానిని చేయుచున్నాడు.
208 ఇప్పుడు మీరు సరియైన స్థితిలో లేనట్లైతే, మీ హృదయము దేవునితో సరిగా లేనట్లైతే, మీరు కేవలం మీ చెయ్యి పైకెత్తుతారా? ఇట్లు చెప్పండి, “నా కొరకు ప్రార్థించుము.” మంచిది, సరిగ్గా మీరున్న చోటనే ఉండండి. వారి ఆత్మకై కనికరము కోరుతూ, దాదాపు ఎనిమిది లేదా పది చేతులు పైకెత్తబడినవి. మీరు మీ తలలు వంచియుండగా, ఇప్పుడు మీరు ప్రార్థించండి. గుర్తుంచుకోండి, పశ్చాతాప్పపడాల్సింది మీరే. దేవుడు కనికరము చూపాలని, నేను కేవలం మీ పక్షమున అడుగుచున్నానంతే. అయితే అది బలిపీఠము, దేవుడు మీ మనస్సులో మిమ్మల్ని ఒక స్థానమునకు తీసుకొనివచ్చాడు; మరదే బలిపీఠమైయున్నది. బలిపీఠమునొద్దకు వచ్చుటను మనము నమ్ముతాము, నిశ్చయంగా, కాని అది—అది కాదు…అది మంచిదే. కానీ దేవుడు మిమ్మల్ని కలుసుకున్న స్థలమే మీయొక్క నిజమైన బలిపీఠమైయున్నది. మరియు సరిగ్గా మీరు కూర్చున్న చోటనే ఆయన మిమ్మల్ని కలుసుకున్నాడు. అదే మీ బలిపీఠమైయున్నది.
209 ఇప్పుడు ఇట్లు చెప్పండి, “దేవా, ఒక పాపినైన నాకు కనికరము చూపుము. మరియు ఈ రోజునుండి, నీవు నాకు సహాయము చేసినట్లైతే, నేను నీ కొరకు జీవిస్తాను. నేను—నేను నిన్ను సేవిస్తాను. ఎవరు ఏమి చెప్పినా నేను లెక్కచేయను, ఈ ఉదయమున, నేను బయటకు అడుగువేయుచున్నాను. సరిగ్గా ఇక్కడే నేను ప్రార్థించుచున్నాను, మరియు నీవు ఈ పాత పొగరుబోతు ఆత్మను నా నుండి తీసివేయుము. నీవు ఈ కోపమును నా నుండి తీసివేయుము. నేను అలా ప్రవర్తిస్తూ, దేవునితో సరిగ్గా ఉండలేనని నాకు తెలుసు. మరియు నేను నా హృదయములో ద్వేషమును కలిగియున్నాను. నేను ఈర్షపడుచున్నాను. నేను దురుద్దేశమును కలిగియున్నాను. నేను దీనిని, దానిని కలిగియున్నాను. దేవా, దానిని బయటకు తీసివేయుము. నేను ఆ విధంగా ఉండగోరడంలేదు. నన్ను మాధూర్యముగా, దీనముగా, మరియు సాత్వీకునిగా మార్చుము. నన్ను మృదువుగా ఉండునట్లు మార్చుము. ఇతరులను నీ కొరకు గెలుచుకోగలిగే ఒక వ్యక్తిగా నన్ను మార్చుము. నా జీవితములో అభినందనలు చూపించుటకు నన్ను నీ కొరకు ఏదైనా చేయనిమ్ము.” మనము కలిసి ప్రార్థించుచుండగా, ఇప్పుడు మీరు చేయవలసిన ప్రార్థన అదేయైయున్నది.
210 పరలోకపు తండ్రీ, వారు నీవారు. వారు ఈ ఉదయకాల వర్తమానముయొక్క ప్రతిఫలములైయున్నారు. వారు తమ చేయిని పైకెత్తారు. ఏదో వారిని ఆ విధంగా చేయించినది. వారు—తమ చేతులను పైకెత్తినప్పుడు గురుత్వాకర్షణ నియమాలను ధిక్కరించారు. వారిలో నిర్ణయము తీసుకున్న ఒక ఆత్మ ఉన్నది. వారిని కలుగజేసిన సృష్టికర్తను వారు అంగీకరించారని, వారు తమ చేతులను పైకెత్తారు.
211 ఇప్పుడు, పరలోకపు తండ్రీ, సరిగ్గా ఇప్పుడే, నీవు వారిని దీవించి, మరియు వారికి నిత్యజీవమును అనుగ్రహిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. వారిని బలిపీఠమునొద్దకు పిలవడము, ఒక అదనపు గదిలో వారిని ఉంచడము, ఆ పనినంతా చేయడం తప్ప; నేను చేయగలిగినది ఏదియు లేదు. ప్రభువా, దానిని—దానిని చేయుటకు నీవే అవసరమైయున్నావు. మేము వాక్యమును బోధించుటకంటే ఎక్కువేమీ చేయలేము. నీవు ఇట్లన్నావు, “వినుటవలన, వాక్యము వినుటవలన, దేవుని వాక్యమును వినుటవలన విశ్వాసము కలుగును.” ఇప్పుడు, మేము వాక్యమును బోధించియున్నాము, మరియు వారు దానిని నమ్మారని, వారు తమ చేతులను పైకెత్తారు. ఇప్పుడు వారికి నిత్యజీవమును అనుగ్రహించుము, ఎందుకనగా నీవు దానిని చేస్తావని నీవు వాగ్దానము చేశావు. వారు తమ చేతులను యథార్థముగా పైకెత్తినట్లైతే, ఈ ఉదయమున వారు ఈ భవనంనుండి, ఒక మాధూర్యమైన, సాత్వికమైన, దీనమైన క్రైస్తవులుగా బయటకు వెళ్తారు, ఎందుకనగా నీవు దానిని వాగ్దానము చేశావు. మరియు నీ మాటలు తప్పిపోజాలవు. యేసుక్రీస్తు నామములో నేను దానిని అడుగుచున్నాను. ఆమేన్.
ఇప్పుడు నేను దానికొరకు వేచియున్నాను, ఎదురుచూస్తున్నాను మరియు పరితపించుచున్నాను,
యోహాను ఆ ప్రకాశమానమైన పట్టణము క్రిందకు దిగివచ్చుటను చూశాడు.
ఆ ప్రకాశమానమైన పట్టణములో…
ఇప్పుడు ఆరాధించండి.
…ముత్యమంత తెల్లని పట్టణము,
నాకు ఒక నివాసము, ఒక వీణ మరియు ఒక కిరీటము ఉన్నది;
ఇప్పుడు నేను దాని కొరకు వేచియున్నాను, ఎదురుచూస్తూ మరియు పరితపించుచున్నాము,
యోహాను ఆ ప్రకాశమానమైన పట్టణము క్రిందకు దిగివచ్చుటను చూశాడు.
212 మీరు ఆయనను ప్రేమించడంలేదా? ఇప్పుడు, వర్తమానము ముగిసింది. ఇది ఆరాధనయైయున్నది. కేవలం వర్తమానమును వినడానికే మనము సంఘమునకు రాము. మనము ఆరాధించడానికి వస్తాము. మీ ప్రక్కనున్న వ్యక్తిని మర్చిపోండి. కేవలం ఆయనను ఆరాధించండి. ఓ, ఎంత అధ్బుతం! ఎంత అద్భుతము! కేవలం మీయొక్క…మీరు ఆయనకు బిగ్గరగా చెప్పనవసరంలేదు. కేవలం మీ హృదయములో ఆయనకు ఇట్లు చెప్పండి, “ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా పాపమునకై నన్ను క్షమించుము.” ఓ, మై!
…ముత్యమంత తెల్లని పట్టణము,
నాకు ఒక నివాసము, ఒక వీణ మరియు ఒక కిరీటము ఉన్నది;
ఇప్పుడు నేను దానికొరకు వేచియున్నాను, ఎదురుచూస్తున్నాను మరియు పరితపించుచున్నాను,
ఆ తెల్లని పట్టణము క్రిందకు దిగి వచ్చుటను యోహాను చూశాడు.
213 మా తండ్రియైన దేవా, మమ్మల్ని స్వీకరించుము. మేము వాక్యమును వినుచుండగా, మేము వేచిచూస్తున్నాము, పరితపించుచున్నాము. “దుప్పి నీటి వాగులకై దప్పిగొనునట్లుగా, మా హృదయములు నీ కొరకు దప్పిగొనుచున్నవి. ఓ దేవా, మా అంతరాత్మ నీ కొరకు తృష్ణగొనుచున్నది.” పరితపించుచు మరియు వేచిచూస్తున్నవి, యేసు వచ్చే ఆ ఘడియకొరకు ఎదురుచూస్తున్నవి, మేము ఆకాశమునకు పిలువబడు సమయము కొరకు వేచియున్నాము. తీర్పులో న్యాయాధిపతియెదుట నిలబడుటకు కాదు; అది ఇదివరకే జరిగిపోయినది. మేము లోకకార్యములకు చనిపోయి, మరియు క్రీస్తులోనికి ప్రవేశించియున్నాము, మరియు ఆయన మా తీర్పును తీసుకున్నాడు. ఇప్పుడు న్యాయపీఠము వద్ద, ఆయన మాకు న్యాయవాదియైయున్నాడు. మేము యోగ్యులము కాదని మేము ఎరిగియున్నాము గనుక, మా ధన్యకరమైన న్యాయవాది, మా ఒప్పుకోలునుబట్టి, ఆయన మా కేసును వాదిస్తాడు. ఒక ప్రియమైన వృద్ధ సహోదరి ఈ ఉదయము, తన నాణెములను వేయుచు, మరియు తన సాక్ష్యములో చెప్పినట్లుగా ఉన్నది, “నేను ఇక్కడకు వచ్చినప్పటినుండి, అది నా పరిశుద్ధత కాదు గాని, అది దేవునియొక్క పరిశుద్ధతయే అని నేను తెలుసుకున్నాను.”
214 నిజమే, ప్రభువా, మనిషిలో ఎటువంటి మంచీ లేదని, ఏ ఒక్కటీ లేదని, మేము ప్రజలకు బోధిస్తుంటాము. “నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?” అయితే మాకు ప్రత్యక్షమైనది దేవునియొక్క కృపయైయున్నది. మరియు మేము మా స్వంత యోగ్యతలపై కాదు గాని, కేవలం ఆయన యోగ్యతలపై మాత్రమే నమ్మికయుంచుచున్నాము. మరియు అతి పరిశుద్ధుడైన దేవా, నీ గొప్ప రాజ్యములో, నీ గొప్ప ప్రణాళికలలో మమ్మల్ని భాగస్తులుగా చేయుటకు, నీ మంచితనమును బట్టి, మేము నిన్ను ఆరాధించుచున్నాము. విశ్వాసము ద్వారా, మేము నిన్ను మా హృదయాలలోనికి స్వీకరించుచున్నాము. మరియు కృప ద్వారా, దేవుని మహిమ నిమిత్తము, దేవుని సేవ కొరకు నీవు దానిని మాకు అనుగ్రహించావని మేము నమ్ముచున్నాము.
215 ఇప్పుడు, ప్రభువా, ఈ ఉదయమున, ప్రార్థించబడుటకు రోగులు వచ్చుచుండగా వారిని స్వస్థపరచుము. వారు బాగవ్వాలని వారు కోరుచున్న ఆ ఆనందాన్ని, వారికి దయచేయుము. వారిపైన పెట్టబడిన ఈ చిన్న, తేలికైన బాధ, ఒక చిన్న పరీక్షా సమయమని వారికి తెలియజేయుము. దేవునికి దాని గురించి అంతా తెలుసు. దాని విషయంలో మనము ఏమి చేస్తామని చూడటానికి ఆయన దానిని చేశాడు. దేవా…వారు నేరుగా అక్కడకు వచ్చి మరియు ఆ ముగించబడిన కార్యమును పొందుకొందురు గాక! నీవు…“సరి, నాకు ఇది తెలియదు అది తెలియదు” అంటూ ఇక్కడికి మరియు అక్కడికి, లోపలికి, మరియు బయటికి, పరిగెత్తుట ద్వారా, వారు నీకు కోపము రేపకుందురు గాక.
216 ప్రభువా, వారు స్థిరముగా నిలబడి, ఇట్లు చెప్పుదురు గాక, “ప్రభువా, నన్ను రక్షించినది నీవే. నా కొరకు ఈ కార్యములు చేసినది నీవే. నేను నిన్ను నమ్ముచున్నాను, మరియు ఈ రోజు, నేను నీయందు పూర్తిగా నమ్ముచున్నాను.” మరియు నీవు దీనిని ఈ ప్రజలకు అనుగ్రహిస్తావని క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.