హెబ్రీ, పత్రిక ఐదు మరియు ఆరవ అధ్యాయము #1

హెబ్రీ, పత్రిక ఐదు మరియు ఆరవ అధ్యాయము #1

1…హెబ్రీ పత్రికలో—యైయున్నది. పిదప మనము 7వ అధ్యాయములోనికి, మెల్కీసెదెకు యాజకత్వములోనికి వస్తాము. మరియు పిదప, మనము మెల్కీసెదెకు యాజకత్వము నుండి, ఆ గొప్ప ప్రాయశ్చిత్త దినములలోనికి, మరియు ప్రాయశ్చిత్తములను వేరుచేయుటలోనికి, విభజించుటలోనికి వస్తాము. తరువాత ఆ గొప్ప విశ్వాస అధ్యాయములోనికి, ఆ 11వ అధ్యాయములోనికి వస్తాము; మరియు 12వ అధ్యాయములోనికి వస్తాము, “ప్రతి భారమును ప్రక్కకు పెట్టుట.” మరియు 13వ అధ్యాయములోనికి వస్తాము, “మనుష్యుల చేతులతో కాక దేవుడు మాత్రమే నిర్మించిన; ఆ నిత్యమైన గృహము, మరి ఆయనే ఈ గొప్ప గృహమును నిర్మించాడు.” ఎంత అద్భుతము!

2 ఇప్పుడే కూటములోనికి ప్రవేశించిన, మన సహోదరిని ఆ వెనుక చూస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఆమెను మరియు ఆమె భర్తను చూస్తున్నాను. నిన్న, మేము మా మార్గములో ఉన్నాము, ఒక స్థలమును దాటి…ఇక్కడ ఇండియానాలో ఒక గేమ్ వార్డెన్ గా ఉండి, మరియు అనేక సంవత్సరాలు గస్తీ చేయుట ద్వారా, ప్రతి చిన్న చీలికను మరియు, ప్రతి చిన్న మూలను నేను ఎరిగియున్నానని నేను అనుకున్నాను. ప్రతీ స్థలమును నేను ఎరిగియున్నాను. కానీ నిన్న వారున్న ఆ స్థలములో, ఆ కొండల మీదుగానున్న, ఒక క్రొత్త రోడ్డు మీద, నేను దారి తప్పియుండేవాణ్ణి.

3 మరియు ఆ స్త్రీ ఊపిరితిత్తులలో క్యాన్సర్ వ్యాధిని కలిగియున్నది, మరియు ప్రభువు ఖచ్చితంగా ఆ స్త్రీని స్వస్థపరిచాడు. మేము…ఓ, అదంతయూ ఎలా వచ్చిందో, మేము అక్కడ కూర్చొనియున్నాము. సహోదరుడు రాబర్సన్, బహుశా ఈ రోజు, అతడిక్కడ ఉండవచ్చును. లోపలనున్న, అతనియొక్క భార్యను, మరియు సహోదరుడు ఉడ్ ను నేను చూస్తున్నాను. మరియు మేము, సహోదరుడు రాబర్సన్ మరియు నేను మరియు సహోదరుడు ఉడ్, అక్కడ ఒక పాత ట్రక్కులో ఉన్నాము. మరియు మేము ఈ ట్రక్కును తీసుకొని, అక్కడ, కొండపైకి వెళ్ళాము. మరియు అక్కడ ప్రభువు ఖచ్చితంగా క్యాన్సర్ ను చూపించాడు. మరియు పిదప మేము అక్కడ నిలబడి మరియు అది ఆ స్త్రీని విడిచిపెట్టడాన్ని చూశాము. మేము నిలబడి, మరియు అది ఆ స్త్రీని విడిచిపెట్టడాన్ని మా కన్నులారా చూశాము. మరియు ఆమె తిరిగి సహోదరుడు ఉడ్ యొక్క భార్యకు ఫోను చేసి; మరియు ఆమె ఆ నల్లటిదానిని ఉమ్మివేయుచున్నదని, నాతో చెప్పుచున్నది. మరియు ఈ ఉదయమున ఆమె ఇక్కడున్నది, ఆమె మరియు ఆమెయొక్క ప్రియమైన భర్త, తిరిగి సంఘములో కూర్చొనియున్నారు, ప్రభువులో ఒక అద్భుతమైన సమయమును కలిగియుంటున్నారు. ఆయన అద్భుతమైనవాడు కాడా?

4 మరియు నాకు తెలియదు…ఇక్కడ, చుట్టు ప్రక్కలనుండి వచ్చిన ప్రజలకు చెప్తున్నాను, సాధారణంగా, ఇక్కడ దర్శనాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. ఇది నా గృహమైయున్నది. మరియు, సంఘములో, అని నా భావమైయున్నది.

5 ఆదివారము, ఒక వారము, మనము…చక్రాల కుర్చీలోనున్న వ్యక్తిని చూచుటకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? గ్రుడ్డివాడు, కుంటివాడు, సమతుల్యత లేనివాడు, మరియు మానసిక సంబంధిత నరములు పాడైపోయినవి, మరియు మేయోవారు అతడిని విడిచిపెట్టేశారు. మరియు—మరియు వైద్యుడైన నాయొక్క ఒక క్యాథలిక్ స్నేహితుడు అతడిని ఇక్కడికి పంపించాడు. మరియు కూటమునకు రావడానికిముందే, ఆ వ్యక్తి గురించి ప్రభువు ఒక దర్శనమును ఇచ్చాడు. అది మీ అందరికి తెలుసు. మరియు అక్కడ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ద్వారా, ఆ వ్యక్తి స్వస్థపరచబడినాడు. చూశారా? మరియు పిదప లేచి, బయటకు నడిచివెళ్ళి, తన చక్రాల కుర్చీని తీసివేసాడు, మీరు లేదా నేను చూడగలిగినట్లే చూడగలుగుచున్నాడు. మరియు మామూలుగా నడుచుకుంటూ, తన కుర్చీని నెట్టుకుంటూ భవనంనుండి బయటకు వెళ్ళాడు. మరియు ఆ సమతుల్యత నాడి…మీకు తెలుసా, మిమ్మల్ని మీరు నిలబెట్టుకోలేరు, చూడండి, మీరు అసలు నిలబడలేరు. మరియు సంవత్సరాలుగా అలా కూర్చొనియున్నాడు.

6 మరియు నిన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు, సరిగ్గా రెండు గంటలకు, నేను లోపలికి వచ్చి, మరియు ఆమెకు “క్యాన్సర్ ఉన్నది” అని చెప్పి మరియు పిదప “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ‘ఆమె స్వస్థపరచబడినది,’” అని చెప్పుటను చూసినట్లు ఆమె కలగంటూ ఉన్నది. మరియు—మరియు ఆమె మేల్కొన్నది, మరియు అప్పుడు సరిగ్గా రెండు గంటలగుచున్నది. మరియు ప్రభువుయొక్క ఆత్మ దిగివచ్చినది, మరియు అక్కడ ఆమె కనిన ఆ—ఆ కలకు, ప్రభువు అనువాదమును ఇచ్చాడు. మరియు సరిగ్గా అక్కడికక్కడే, ఎక్కడైతే మేము గమనిస్తూ ఉన్నామో సరిగ్గా అక్కడే ఆమె స్వస్థపరచబడినది. ఎంత అద్భుతము!

7 ఆమె పేరు గుర్తురావడం లేదు. అది ఏమిటి? సహోదరీ, నీ పేరు ఏమిటి? వాల్టన్, సహోదరి వాల్టన్, ఆ వెనుక కూర్చొనియున్నది. సహోదరి వాల్టన్, నీవు లేచి నిలబడతావా? నీకు ఎలాగున్నదని నిన్ను అడగాలనుకుంటున్నాను. [సహోదరి వాల్టన్ ఇట్లు చెప్పినది, “చాలా అద్భుతంగా ఉన్నది.”—సంపా.] ఆమేన్. అది మంచిది, బాగుంది మరియు అద్భుతం. మనల్ని ఆ విధంగా దీవించడానికి, ఆయన ఎంతో మంచివాడైయున్నాడు. కావున దేవునియొక్క గొప్ప ఆశీర్వాదములు ఎంతో ఎక్కువగా, సమృద్ధిగా రావడం కొరకు మనము ఎదురుచూస్తున్నాము.

8 ఒక వైద్యుడు దీనిని ఆమెకు తెలియనివ్వకుండా ఉంచాడు. “ఆమె ఒక ప్రక్కనుండి మాత్రమే ఊపిరి పీల్చుకొనుచున్నది” అని అతడు ఆమెతో చెప్పాడు. అదేమిటనగా, కాన్సర్ అంతటా పెరిగిపోయి, ఆ ఊపిరితిత్తుయొక్క ఆ ప్రక్క నుండి శ్వాసను ఆపివేసినది, మీరు చూడండి. మీరు ఎక్స్-రే ద్వారా కాన్సర్ ను చూడలేరు, ఎందుకనగా క్యాన్సర్ అనేది, దానికదే ఒక కణమైయున్నది, మరియు అది—అది జీవకణమైయున్నది. మరియు మీరు—మీరు—మీరు కేవలం—మీరు—మీరు అసలు ఒక ఎక్స్-రే ద్వారా, నేరుగా క్యాన్సర్ ను చూడండి. మీకు అది కనిపించదు.

9 మరియు, అయితే ప్రభువు నిజంగా…మేము అక్కడ నిలబడి మరియు స్వయంగా మేమే, మా స్వంత కళ్ళతో, దానిని గమనించాము. అది కదులుటను గమనించాము, మరియు మా స్వంత కళ్ళతో, అది వెళ్ళిపోవుటను చూశాము. కావున, దానికై మేము ఎంతో కృతజ్ఞులమైయున్నాము.

10 మరియు ఇప్పుడు, ఈ వారము, మేము వెళ్తుండగా, మా కొరకు ప్రార్థించండి. మరియు బుధవారము రాత్రి కూటము కొరకు, బహుశా సహోదరుడు నెవిల్, నేను విడిచిపెట్టిన చోటునుండి తీసుకుంటాడు. ప్రకటన గ్రంథముయొక్క ఈ గొప్ప వరుసలో, ఇప్పుడు దానిని తప్పిపోకండి.

11 ఎంతో ప్రార్థన అర్పించబడియున్నదని నాకు తెలుసు, మరియు దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడని మనకు తెలుసు. అయితే మనము, ఈ ఉదయమున, గ్రంథ పఠనమునకు ముందు మనము కేవలం ఒక చిన్న ప్రార్థన చేయగోరుచున్నాము. ఇప్పుడు, సామర్థ్యముగల ఏ వ్యక్తియైనా, గ్రంథమును ఇటు నుండి చదువగలడు, లేదా దానిని ఈ విధంగా తెరువగలడు. అయితే గ్రహింపునిచ్చుటకు, దేవుడు మాత్రమే,అవసరమైయున్నాడు, ఏలయనగా దానిని చేయగల ఒకేఒక్కరు ఆయన మాత్రమే.

కావున ఒక్క క్షణము మన తలలు వంచుదాము.

12 ఇప్పుడు, తండ్రీ, నీవు మా ద్వారా మాట్లాడుదువని, నీ ప్రియ కుమారుడైనట్టి, ప్రభువైన యేసు నామములో, నీ సేవకులుగా, మమ్మల్ని మేము సమర్పించుకోడానికి, మేము అత్యంత దీనత్వముతో వచ్చుచున్నాము. వాక్యము దేవునిచేత పలుకబడి మరియు ప్రజలలోనున్న ఆత్మ ద్వారా ఆలకించబడునట్లు, మాట్లాడే పెదవులకు మరియు వినే చెవులకు సున్నతి దయచేయుము. తండ్రీ, దానిని అనుగ్రహించుము. ఆయన దేవుని వాక్యమును తీసుకొని మరియు సరిగ్గా మా అవసరత కొలది మాకు పరిచర్య చేయును గాక, ఏలయనగా ఆయన నామములో మరియు ఆయన మహిమ కొరకు మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

13 ఇప్పుడు, ఈ ఉదయము చదువుచుండగా, మనము అధ్యయనం చేయుచున్నాము. మనము బోధించుకోడం లేదు—లేదు; కేవలం ఈ హెబ్రీ పత్రికను అధ్యయనం చేయుచున్నాము. ఎంతమంది దానిని ఆనందిస్తున్నారు? ఓ, మనము ఒక అద్భుతమైన సమయాన్ని కలిగియుంటున్నాము! మరియు ఇప్పుడు లేఖనము వెంబడి లేఖనమును, జాగ్రత్తగా ధ్యానించుచున్నాము. అది తప్పక…మొత్తం, బైబిలు గ్రంథమంతయు కలిపి ముడివేయబడియున్నది. పరిశుద్ధాత్మ ద్వారా అది సమకూర్చబడినట్లైతే, ఒక్క వాక్యమైనా దాని స్థానమునకు వెలుపల ఉండదు.

14 ఇప్పుడు, “బైబిలు దానినదే వ్యతిరేకించుచున్నది,” అని మానవుడు అన్నాడు. నేను దానిని చూడగోరుచున్నాను. ఇరవై-ఐదు సంవత్సరాలుగా, నేను దాని కొరకు అడిగాను, మరి ఇప్పటివరకు, ఎవ్వరు కూడా దానిని చూపించలేదు. బైబిలు గ్రంథము వ్యతిరేకించుకోదు. అది ఆ విధంగా వ్యతిరేకించుకున్నట్లైతే, అది బైబిలు కాదు. ఆ గొప్ప, అనంతుడైన యెహోవా, తనను తానే వ్యతిరేకించుకోలేడు, కావున బైబిలులో ఎటువంటి వ్యతిరేకత లేదు. అవి కేవలం ప్రజలు అపార్థం చేసుకున్న విషయాలైయున్నవి.

15 ఇప్పుడు తిరిగి మనం కొనసాగించేముందు, కొంచెం నేపథ్యం కొరకు చెప్పుచున్నాను. ఇప్పుడు, హెబ్రీ పత్రిక పరిశుద్ధ పౌలుచేత, హెబ్రీయులకు వ్రాయబడినది. అతడు ఎఫెసీయులకు ఒకటి వ్రాశాడు, వారు ఎఫెసులోని ప్రజలైయున్న, క్రైస్తవ సంఘమైయున్నారు; రోములో ఉన్న రోమీయులకు ఒకటి; మరియు గలతీయులకు ఒకటి; మరియు హెబ్రీయులకు ఒకటి వ్రాసాడు.

16 ఇప్పుడు, పౌలు, ముందుగానే ఒక బైబిలు బోధకుడైయున్నాడని మనము గమనిస్తాము. మనము గ్రహించినది అదేయైయున్నది. అతడు గొప్ప బోధకుని వద్ద, అతని దినములలో ఉన్న అతి గొప్పవాడైన, గమలియేలు వద్ద కూర్చున్నాడని గ్రహించాము. అతడు పాత నిబంధనలో బాగా పాండిత్యము గలవాడు. అతడు దానిని బాగుగా ఎరిగియున్నాడు. అయితే అతడు క్రీస్తుయొక్క మార్గమును హింసించువాడయ్యాడు, ఎందుకనగా అతడు పాత నిబంధన గురించి ఉపదేశకుల క్రింద తర్ఫీదు పొందాడు. అయితే ఆ ఉపదేశకులు, సాధారణముగా శరీర సంబంధమైనవారిగా…నేనేది తప్పుగా అనకూడదని నేను ఆశిస్తున్నాను.

17 అయితే, సాధారణంగా, ఒక మనిషి కేవలం ఉపదేశమును మరియు పాఠశాలల విధానమును కలిగియున్నట్లైతే, అది సాధారణముగా మానవుని-చేత కలుగజేయబడినదై యుంటుంది. చూడండి, అది ప్రేరేపించబడినది కాదు, ఎందుకనగా అది ఒక పాఠశాలయొక్క సిద్ధాంతమౌతుంది. ఈనాడు మనము దానిని కలిగియున్నాము. ప్రెస్బిటేరియను, లూథరను, పెంతెకొస్తు, ఈ పాఠశాలలన్నీ వాటియొక్క సిద్ధాంతమును కలిగియున్నవి, మరియు వారు కేవలం లేఖనములను దీనిలోనికి జొప్పిస్తారు.

18 మరియు పాత నిబంధనలో కూడా అది అలాగే ఉన్నది. అయితే, పౌలు, బాగా తర్ఫీదు పొందినవాడై, లేఖనములను కంఠతగా ఎరిగియున్నాడు. అయితే, మీరు చూడండి, లేఖనములు, మీరు వాటిని ఎంత బాగా ఎరిగియున్నా లెక్కలేదు, ఆత్మ వాటిని పురిగొల్పకపోతే, అప్పుడు అక్షరము చంపుతుంది. ఆత్మ జీవమును ఇస్తుంది. చూడండి, అది ఆత్మ ద్వారా, తప్పక పురిగొల్పబడాలి, లేదా బ్రతికించబడాలి. ఆత్మ వాక్యమును బ్రతికించి మరియు దానిని మీకు వాస్తవం చేయనియెడల, అప్పుడు అక్షరము కేవలం మేధస్సంబంధమైనదే అవుతుంది. అందుచేతనే ఈనాడు అనేకమంది ఒప్పుకొనిన క్రైస్తవులను లేదా, క్రైస్తవులమని పైకి చెప్పుకునేవారిని మనము కలిగియున్నాము, అది క్రీస్తును గూర్చిన మేధస్సంబంధమైన అవగాహన వలనైయున్నది.

19 పిదప మనము, “సరి, అతడు ఏదో ఒకదానిని అనుభూతి చెందవలసియున్నది; మరియు నీవు ఏదో ఒకటి చేయవలసియున్నది,” అనేవాటిని మొదలుపెట్టాము. మరియు, ఓ, కొద్ది సేపటి తరువాత, మనము వాటన్నిటిలోనికి వెళ్తాము. ఒకరు కేకలు వేయాల్సియుంటుంది. మెథడిస్టులు దానిని పొందుకొనుటకు ముందు, కేకలు వేస్తుండేవారు. పెంతెకొస్తువారు దానిని పొందుకొనుటకు ముందు, భాషలతో మాట్లాడవలసియున్నది. మరియు, ఓ, వారిలో కొందరు, ఊగుడు ప్రజలు, ఊగవలసియుండేది. అవును. వృద్ధులు…వారు పైకి-మరియు-క్రిందికి నడుస్తారు, పురుషులు ఒక వైపు, స్త్రీలు మరోవైపు. చూశారా? ఊగుడు ప్రజలు. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి వారిని కుదిపివేస్తుంది. “వారు దానిని పొందున్నారు.” అయితే అవన్నీ కేవలం అసంబద్ధమైనవి. అందులో ఏ ఒక్కటీ వాస్తవం కాదు.

20 దేవుడు తన వాక్యములో జీవిస్తాడు. “వినుటవలన, వాక్యమును వినుటవలన విశ్వాసము కలుగుతుంది.” “మీరు విశ్వాసము ద్వారా, కృపచేతనే రక్షింపబడియున్నారు.” మీరు ఊగినా, లేదా భాషలతో మాట్లాడినా, లేదా ఏది జరిగినా, అటువంటి దేని ద్వారానైనా కాదు. దానిలో అస్సలు, దానికి ఎటువంటి సంబంధములేదు. యేసు ఇట్లన్నాడు, “నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు. నా మాట విని మరియు విశ్వాసముంచువాడు,” అనగా అతనికి పురిగొల్పబడినవాడు, “నిత్యజీవము గలవాడు.” విషయం అదే. మీరు చేసే ఆ చిన్న కార్యముతో ఎటువంటి సంబంధము లేదు.

21 ఇప్పుడు, ఊగుటకు, లేదా భాషలతో మాట్లాడుటకు, లేదా వణుకుటకు, ఓ, ఆ—ఆ కేకలు వేయుటకు నేను వ్యతిరేకిని కాదు. అది సరియే. అది మంచిదే. కానీ అవి కేవలం గుణలక్షణాలైయున్నవి. చూశారా? నేను మీకు ఒక చెట్టు మీదనుండి ఒక యాపిల్ పండును ఇవ్వగలను, మరియు మీరింకనూ ఆ చెట్టును కలిగియుండలేరు. చూశారా? మీరు…అది గుణలక్షణములైయున్నవి.

22 అబద్ధమాడటం, దొంగతనము, మద్యపానము, ధూమపానము, జూదము, వ్యభిచారము, అది పాపము కాదు, అవి అవిశ్వాసముయొక్క గుణలక్షణాలైయున్నవి. చూశారా? అది నీవు—నీవు…నీవు ఒక పాపివి గనుక నీవు దానిని చేస్తావు. చూశారా? అయితే మొదటిగా నీవొక పాపివైయున్నావు. నీవు నమ్మడంలేదు గనుక, మరదే నీవు దానిని చేయునట్లు చేస్తుంది. మరియు నీవు నమ్మినట్లైతే, అప్పుడు నీవు దానిని చేయవు. అప్పుడు నీవు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సాత్వికము, సహనమును కలిగియుంటావు. మరదే పరిశుద్ధాత్మయొక్క ఫలమైయున్నది. చూశారా?

23 కావున మనము చిన్న విషయములను, చిన్న ఉద్రేకములను కలిగియున్నాము, కారణమేమిటనగా మానవుడు, ఆ పాత స్థిరమైన వాక్యపు మార్గమును తప్పియున్నాడు. అది వాక్యమైయున్నది. “వినుటవలన విశ్వాసము కలుగును.”

24 కాబట్టి పౌలు…దేవుడు పౌలును ఎన్నుకున్నాడు. మనుష్యుడు మత్తీయను ఎన్నుకున్నాడు. అతడు…వారు చీట్లు వేసారు, అయితే అతడెన్నడూ ఏమియు చేయలేదు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి, వారి సంఘపెద్దలను ఎన్నుకొని, మరియు వారి బోధకులను వివిధ స్థలములకు పంపడానికి, సంఘము ఎటువంటి అధికారమును కలిగియున్నదని అది చూపిస్తుంది. అది చాలా సార్లు, శరీరసంబంధంగానే ఉన్నది.

25 ఒక వ్యక్తిని దేవుడు ఎక్కడికి వెళ్ళమని నడిపిస్తాడో, అతడిని అక్కడికే వెళ్ళనివ్వండి. నేను దానిని ఇష్టపడతాను. ఒక సమావేశములో ప్రజలు కేవలం ఇట్లు చెప్పినట్లైతే, “సరి, ఇక్కడ ఒక మంచి సంఘమున్నది. ఈ సహోదరుడు ఒక చక్కని సంఘమును నిర్మించాడు. మరియు మేము ఒక చిన్న ప్రియమైనవాణ్ణి కలిగియున్నాము.” వారు అతణ్ణి ఈ సంఘమునకు పంపుతారు. వారు తమను తామే చంపుకొనుచున్నారని వారు గ్రహించరు. చూశారా? మొదటి విషయమేమిటంటే, ఈ వ్యక్తి అక్కడకు వెళ్ళినట్లైతే, అతడు ఆ వ్యక్తియొక్క స్థానమును భర్తీ చేయలేడు. అప్పుడు వారు ఎవరో ఒక ప్రియమైనవానికి మద్దతునిచ్చుటకు ప్రయత్నిస్తూ, కేవలం సంఘమును బలహీనపరుస్తారు. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండినది.

26 అయితే స్థానిక సంఘముయొక్క ఆధిపత్యమును నేను నమ్ముతాను. అవును. ప్రతీ సంఘమును దాని స్వంత ఎన్నికను చేసుకోనివ్వండి, దానియొక్క సంఘకాపరులను, దానియొక్క సంఘపెద్దలను, దానియొక్క దేనినైనా గాని, ఎన్నుకోనివ్వండి. మరియు పిదప, ఆ విధంగా, అక్కడున్న వ్యక్తి అతనిపై ఏ బిషప్పును కలిగియుండడు. పరిశుద్ధాత్మ ఆ సంఘముతో ఏదైనా మాట్లాడగోరుచున్నయెడల, వారు దీనిని చేయవచ్చా లేదా దానిని చేయవచ్చా అని వారు ఎవరినీ అడగవలసిన అవసరం లేదు. అది పరిశుద్ధాత్మతో సంబంధములో ఉన్న ఒక వ్యక్తియైయున్నాడు. బైబిలు గ్రంథములో, ఒక స్థానిక సంఘమునకు ఒక స్థానిక సంఘపెద్ద కంటే గొప్పది ఏమున్నదో, బైబిలు ద్వారా నాకు చూపించండి? అది నిజము, అవును, అయ్యా, స్థానిక సంఘముయొక్క సార్వభౌమాధికారము, ప్రతి సంఘము దానికదే కలిగియున్నది. ఇప్పుడు, సహోదరత్వము, అది అద్భుతమైనదే. సంఘములన్నియూ అటువంటి సహోదరత్వములో, ఏకముగా ఉండవలసియున్నవి. అయితే స్థానిక సంఘముయొక్క సార్వభౌమాధికారము!

27 గమనించండి, పౌలు ఒక గొప్ప ఉపదేశకుడైన బోధకుడైయ్యుండి, బాగుగా తర్ఫీదు పొందినవాడై, ఒక దినమున, ఈ నూతన మార్గములోనున్న ప్రజలను బంధించుటకు, దమస్కునకు వెళ్ళు దారిలో ఉన్నాడు. ఇప్పుడు, అతడు యథార్థవంతునిగానే ఉన్నాడు. నీ యథార్థతను బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చడు. అన్యజనులకంటే యథార్థవంతులైన ప్రజలను నేను ఎన్నడూ చూడలేదు. వారిలో అనేకులు, ఒక విగ్రహమునకు బలి అర్పణ నిమిత్తము—నిమిత్తము, వ్యర్థముగా, వారి స్వంత పిల్లలనే చంపివేస్తారు. విషయం యథార్థత కాదు. ఒక మనిషి అతడు వేరే దేనినో త్రాగుతున్నాడని అనుకుంటూ, యథార్థంగానే ఫినాయిల్ ను త్రాగగలడు. యథార్థత నిన్ను రక్షించదు. “ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును.”

స్తెఫనును రాళ్ళతో కొట్టమని, తన స్వంత అధికారములో అతడు సాక్ష్యమిచ్చినప్పుడు, పౌలు యథార్థవంతునిగానే ఉన్నాడు. తరువాతి సంవత్సరాలలో, పౌలుయొక్క క్షమాపణను నేను ఇష్టపడతాను, అతడు ఇట్లు చెప్పాడు, “శిష్యుడుగా పిలువబడుటకు లేదా అపొస్తలుడని పిలువబడుటకు నేను యోగ్యుడను కాను, ఏలయనగా నేను సంఘమును మరణమగునంతగా హింసించాను.” యథార్థతతోనే!

28 మరియు అక్కడికి వెళ్తుండగా అతని మార్గములో, ఒక అనుభవమును అతడు ఎదుర్కున్నాడు. పరిశుద్ధాత్మ ఒక పెద్ద అగ్నిస్తంభములో వచ్చి, మరియు అది అతనికి గ్రుడ్డితనము కలుగజేసినది. ఇప్పుడు, మనము దానిగుండా వెళ్ళాము, ఆ అగ్నిస్తంభము క్రీస్తే. మరియు ఆయన అరణ్యముగుండా పిల్లలను నడిపించిన అదే అగ్నిస్తంభమైయున్నాడు. క్రీస్తు దేవుడైయున్నాడు, మరియు దేవుడు క్రీస్తైయున్నాడు. దేవుడు శరీరధారియై, ప్రభువైన యేసు యొక్క శరీరములో నివసించాడు. ఆయన ఏమైయున్నాడో చూపించుచు, “దేవుడు క్రీస్తులో ఉండి, లోకమును తనతో సమాధానపరచుకొనుచున్నాడు.”

29 ఇక్కడ వెనుక బైబిలు గ్రంథములో, మునుపటి వచనములలో, మనము ఇట్లు చదువుచున్నాము, “ఆయన దేవదూతల కంటె తననుతాను తక్కువవానిగా చేసుకున్నాడు. దేవదూతల రూపము ధరించుకోలేదు గాని, శరీరాకారమును ధరించియున్నాడు.” దేవదూతలు పడిపోలేదు, వారికి ఎటువంటి విమోచన అవసరము లేదు. శరీరము, అనగా మానవులు పడిపోయారు, మరియు వారికి విమోచన అవసరమైయున్నది. కావున, పాత చట్టాలలో, ఒక మనిషి, ఒక—ఒక విమోచకునిగా ఉండుటకు, మొదట అతడు సమీప బంధువుడై ఉండవలసియున్నది; ఆ గొప్ప రూతు గ్రంథము, ఇక్కడ కొంతకాలం క్రితం, మనము దానిగుండా వెళ్ళాము. మరియు ఆత్మయైయున్న దేవుడు, మనలను విమోచించి, మరియు మనకు నిత్య జీవమునిచ్చుటకు, మనలో ఒకనిగా మారుట ద్వారా, ఏ విధంగా మనకు సమీప బంధువుగా చేయబడ్డాడో చూశాము. కృప ద్వారా మనము ఆయనవలె మారునట్లు, ఆయన మనవలె మారవలసివచ్చినది.

30 మరియు అగ్నిస్తంభము ఇశ్రాయేలు పిల్లలను నడిపించినదని మనము కనుగొన్నాము. మరియు అది ఇక్కడ భూమి మీద శరీరధారియైనప్పుడు, ఒక దినమున ఆయన మాట్లాడుటను మనము విన్నాము, మరియు ఆయనే ఆ అగ్నిస్తంభమైయున్నాడని ఆయన చెప్పాడు. వారు ఇట్లన్నారు, “నీవు మా తండ్రియైన అబ్రాహాము కంటే గొప్పవాడవని చెప్పుచున్నావా?”

31 ఆయన ఇట్లు చెప్పాడు, “అబ్రాహాము పుట్టకమునుపే, నేను ఉన్నాను.” ఆ ఉన్నవాడు ఎవరు? మండుచున్న పొదలోనున్న ఆ అగ్నిస్తంభమే, అది ప్రతి తరముగుండా ఒక మారని జ్ఞాపకార్థమైయున్నది; ఆ తరములో మాత్రమే కాదు గాని, ఈ తరములో కూడా, అది అదే అగ్నిస్తంభమైయున్నది. మరియు ఆయన మారలేదని, మనము ఈ ఉదయం దానియొక్క చిత్రమును కూడా కలిగియున్నందుకు మనము కృతజ్ఞులమైయున్నాము. ఆయనే అమర్త్యుడు, నిత్యుడు, ధన్యుడునైయున్నాడు. ఆయన అప్పుడు చేసిన అవే కార్యములను ఇప్పుడును చేస్తాడు, మరియు అది మనకు ఎంత సంతోషాన్ని కలుగజేస్తుంది కదా!

32 అయితే పౌలు ఈ అనుభవమును అంగీకరించకముందు…ప్రభువుయొక్క దూత అగ్నిస్తంభమైయున్నాడని ఎరిగియుండగా, మరది క్రీస్తే, ఆ…మంచిది, ఆయనే ఆ నిబంధన దూతయైయున్నాడు, మరది క్రీస్తే. మోషే శ్రేష్ఠముగా ఆలోచించాడు, అదేమిటనగా, ఐగుప్తు ధనమంతటికంటే, క్రీస్తుయొక్క ప్రజలతో కూడ బాధలను అనుభవిస్తూ, క్రీస్తు ద్వారా నడిపించబడుటను ఎన్నుకున్నాడు. అగ్నిస్తంభము రూపములో ఉన్న క్రీస్తును, అతడు వెంబడించాడు.

33 పిదప తాను భూమి మీద ఉన్నప్పుడు, క్రీస్తు ఇట్లన్నాడు, “నేను దేవుని యొద్దనుండి వచ్చాను,” “నేను దేవుని యొద్దకు తిరిగి వెళ్ళుచున్నాను.” ఆయనయొక్క మరణము, సమాధి, పునరుత్థానము తరువాత, మధ్యవర్తిత్వము చేయుటకు, మహోన్నతుని కుడిపార్శ్వమున మహిమపరచబడిన శరీరముగా కూర్చొనియున్నాడు; మరలా, పౌలు ఆయనను అగ్నిస్తంభముగా చూశాడు: దాదాపుగా, అతని కన్నులను పోగొట్టి; అతడిని గ్రుడ్డితనముతో మొత్తిన ఒక వెలుగైయున్నది.

34 ఆయన ఒక వెలుగుగా చెరసాలలోనికి వచ్చుటను పేతురు చూశాడు, మరియు అతడు బయటకు వెళ్ళుచుండగా అతని యెదుట తలుపులు తెరుచుటను చూశాడు. ఆయనే ఆల్ఫా మరియు ఓమెగయైయున్నాడని, మొదటివాడును కడపటివాడునై యున్నాడని మనము కనుగొన్నాము.

35 మరియు అప్పుడు ఆయన చేసిన అవే కార్యములను చేయుచు, ఈనాడు, ఆయన ఇక్కడ మనతో ఉన్నాడు, తిరిగి తననుతాను మనకు కనబరచుకుంటూ, శాస్త్రీయ ప్రపంచానికి దానిని చూపించుచున్నాడు.

36 ఓ, భూమి మీద అంధకారము మరియు గందరగోళము ఉన్నటువంటి ఈ గొప్ప ఘడియలో, ఆనందిస్తునందుకు, ఎరిగియున్నందుకు, భూమియందంతటిలో మనమే అత్యంత సంతోషకరమైన ప్రజలుగా ఉండవలసియున్నాము. అన్నివేళలా, ప్రజలు గందరగోళమైపోయి ఉండగా, మరియు భూమి మీద అన్ని రకములైన ఇజములు ఉండగా, మరి అయినను, ఈ దినమున, అసలైన, సజీవుడైన దేవుడు, తన వాక్యము ద్వారా మరియు ఆయనయొక్క దృశ్యమైన ఋజువు ద్వారా, ఆయన ఇక్కడ మనతో ఉన్నాడని మనకు చూపించుచున్నాడు, సరిగ్గా ఆయన ఎప్పుడూ చేసినట్లే పనిచేయుచు, కదలాడుచు, జీవించుచు, ప్రవర్తించుచున్నాడు. దీనిని కలిగియుండుటకు, మనము ఎంతటి భాగ్యవంతులమైన ప్రజలమైయున్నాము కదా! మనము తప్పక…అటువంటప్పుడు, బైబిలు గ్రంథము, 2వ అధ్యాయములో, ఇట్లు చెప్పినది, “మనము ఈ సంగతులను గట్టిగా పట్టుకోవలెను. ఎందుకనగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినయెడల, మనమేలాగు తప్పించుకొందుము?”

37 ఇప్పుడు, మనము దీనిని కనుగొన్నాము, పౌలు ఆ అనుభవమును అంగీకరించుటకు ముందు…ఇప్పుడు, మనము మళ్ళీ మళ్ళీ చెప్పుకొనుచున్నాము. ఇప్పుడు, సంఘమా, మీరు ఎటువంటి అనుభవమును కలిగియున్నప్పటికినీ, నేను మిమ్మల్ని ఒకటి అడుగగోరుచున్నాను. అది ఎంత చక్కగా కనిపించినాగాని, అది ఎంత వాస్తవముగా అనిపించినాగాని, అది మొదటిగా తప్పకుండా బైబిలు ద్వారా పరీక్షించబడవలసియున్నది. ఎల్లప్పుడూ వాక్యములో ఉండవలసియున్నది! ఏ విధమైన అనుభవము కొరకైనాగాని, దానిని ఎన్నడూ విడిచిపెట్టకండి.

38 మరియు పౌలు, అతడు దానిని అంగీకరించుటకు ముందు, అతడు అరేబియాకు వెళ్ళి, మరియు మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, వాక్యముతో ఈ అనుభవమును పరీక్షించుచున్నాడు. మరియు అతడు తిరిగి వచ్చినప్పుడు, అతడు నిశ్చయతతో ఉన్నాడు. ఏదియు అతడిని కలవరపరచలేకపోయినది, ఎందుకనగా అతడు వాక్యముపై దృఢంగా, కదల్చబడలేకుండా ఉన్నాడు. మరియు పాత నిబంధనలో పలుకబడిన ఆ గొప్ప సంగతులు, యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచబడినవని, ఆ హెబ్రీయులకు చూపించుటకు, అతడు దీనిని తీస్తున్నాడు. ఎటువంటి మహిమ కదా!

39 ఇప్పుడు, గడిచిన ఆదివారము, లేదా గడిచిన బుధవారము, నెవిల్ సహోదరుడు ఇక్కడ, 5వ అధ్యాయములో, కొన్ని ఉన్నతమైన చోట్లు తాకాడు, ఎందుకనగా అది ఒక అద్భుతమైన అధ్యాయమైయున్నది. మరియు పోయిన ఆదివారము, అతడు 4వ అధ్యాయముపై, సబ్బాతుపై, సబ్బాతును ఆచరించడముపై వ్యవహరించుటను మనము కనుగొన్నాము. సబ్బాతును ఆచరించడం అనగా ఏమిటో మీకు తెలుసని, ఈ ఉదయం, మీరు నిశ్చయతను కలిగియున్నారా? మీరు కలిగియున్నట్లైతే, “ఆమేన్,” అని చెప్పండి. [సంఘము “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.]

40 సబ్బాతు అనగా మనము ప్రవేశించే “విశ్రాంతియైయున్నది”, దినముల ద్వారా కాదు, ధర్మశాస్త్రము ద్వారా కాదు, కానీ మన సబ్బాతు అయ్యున్న క్రీస్తులోనికి ప్రవేశించుట ద్వారాయైయున్నది. ఆయనే మన సబ్బాతు. మనము పాత నిబంధనంతటిలో జాగ్రత్తగా ధ్యానించి, మరియు వాక్యము “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము” వలె వచ్చునట్టి ఒక కాలము వస్తుందని చూపించాము. మరియు పెంతెకొస్తు దినమున మనము ఆయనయొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించామని ఆయన ఋజువు చేశాడు, “ఏలయనగా అలసినవానికి విశ్రాంతి కలుగజేయునది ఇదే, ముగించునది ఇదే.”

41 మనము ఇట్లు కనుగొన్నాము, అదేమిటనగా, “ఏడవ దినమును గూర్చి, దావీదులో దేవుడు ఒక దినమును నిర్ణయించాడు.” మరియు, “దేవుడు ఏడవ దినమున విశ్రాంతి పొందాడు.” అరణ్యములో ఆ—ఆ ఇశ్రాయేలు పిల్లలకు దానిని ఇచ్చాడు. “మరియు మరలా, ఆయన ఒక దినమును నిర్ణయించాడు.” అది ఏ దినము? వారములో ఒక ఫలానా దినమా? “మీరు ఆయన స్వరమును వినిన దినమున, మీ హృదయమును కఠినపరచుకొనకుడి.” మీకు ఒక నిత్యమైన విశ్రాంతిని, ఒక నిత్యమైన సబ్బాతును ఇచ్చుటకు, ఆయన ప్రవేశించుచున్న దినము అదేయైయున్నది.

42 అప్పుడు, మీరు భక్తిపరులుగా మారడానికి, ఆదివారమున సంఘమునకు వెళ్ళరు. మీరు దేవుని ఆత్మ ద్వారా జన్మించినప్పుడు, మీరు ఎప్పటికీ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు, సబ్బాతును- పాటించడం ఇక ఎంతమాత్రము ఉండదు. మీరు స్థిరముగా, ఎప్పటికీ, మరియు నిత్యమూ, సబ్బాతులో ఉన్నారు. “మీ యొక్క లోకసంబంధమైన కార్యములు ముగించబడినవి,” అని బైబిలు చెప్పుచున్నది “మరియు మీరు ఈ ధన్యకరమైన విశ్రాంతిలోనికి ప్రవేశించియున్నారు.”

43 ఈ మొదటి ఐదు అధ్యాయములు, యేసును ప్రధాన యాజకుని స్థానములో ఉంచుచున్నవి. “దేవుడు నానాసమయములలోను నానావిధములుగాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడియున్నాడు, కానీ ఈ అంత్య దినమున తన కుమారుడైన యేసు ద్వారా మాట్లాడుచున్నాడు,” 1వ అధ్యాయం, 1వ వచనము.

44 పిదప 5వ అధ్యాయముయొక్క ముగింపునకు వెళ్తుండగా ఆయన, జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేనివాడై నిరంతరము ఒక యాజకునిగా ఉండువాడైన, మెల్కీసెదెకుగా చూపించబడుటను, మనము కనుగొంటాము. దాని గురించి ఆలోచించండి. ఈ గొప్ప వ్యక్తి ఎవరు? మరొక రెండు అధ్యాయాలలో, మనము దానిని పొందుకుంటాము, ఆయనయొక్క పూర్తి జీవితమును, మనము అధ్యయనము చేయబోవుచున్నాము: అబ్రాహామును కలుసుకున్న ఈ గొప్ప వ్యక్తి, ఆయనకు ఎన్నడూ ఏ తండ్రియు లేడు, ఏ తల్లియు లేదు, ఆయన జీవితమును ప్రారంభించిన ఏ సమయమూ లేదు, లేదా ఆయన జీవితమును ముగించే ఒక సమయమును ఎన్నడూ కలిగియుండడు. మరియు రాజులను సంహారించి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఆయన కలుసుకున్నాడు.

45 గమనించండి, ఈ గొప్ప వ్యక్తి, ఆయన ఎవరైయున్నాగాని, ఆయన ఇంకనూ సజీవుడైయున్నాడు. ఆయన జీవమునకు అంతము లేదు. అతడు కలుసుకున్నది, క్రీస్తునే. కొద్ది దినములలో, మనము దాని గురించి లోతైన అధ్యయనం చేయబోతున్నాము.

46 ఇప్పుడు, మనమిప్పుడు ఇక్కడ 5వ అధ్యాయములో ప్రారంభించగోరుచున్నాము, మనము ఆ—ఆ 6వ దానిని చేరడానికి ముందు ఒక చిన్న నేపథ్యం కొరకైయున్నది, ఎందుకనగా అది నిజంగా ఒక అసాధారణమైన విషయమైయున్నది. జాగ్రత్తగా గమనించండి. ఈ అధ్యాయములో 7వ వచనము నుండి మనము ప్రారంభించబోవుచున్నాము. సరే, 6వ వచనము వద్ద మనం ప్రారంభించుదాము.

ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవైయున్నావు అని, మరియొకచోట ఆయన చెప్పుచున్నాడు.

ఆయన శరీరధారియైయున్న దినములలో, ఆయన…మహారోదనముతోను…కన్నీళ్ళతోను తన్ను రక్షింపగలవానికి…ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను;

ఆయన కుమారుడైయుండియు, తాను పొందిన…శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను;

47 ఇప్పుడు ఇక్కడే, ఈ 9వ వచనము వద్దకే నేను రాగోరుచున్నాను. వినండి. బుధవారము, సహోదరుడు నెవిల్ దీనిని ప్రస్తావించాడని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ లేను. మంచిది, వినండి.

మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడని;

దేవునిచేత పిలువబడి తనకు విధేయులైన వారందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.

ఈయన గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు కలవు,…

48 మనము దానిని అక్కడ వదిలేద్దాము, ఎందుకనగా కొన్ని రాత్రులలో మనము మెల్కీసెదెకును తీసుకొనబోవుచున్నాము.

49 ఇప్పుడు, మనము దీనిపై, మన సాధారణ అధ్యయనమును ప్రారంభించబోవుచున్నాము. నేను కోరుచున్నాను…ఒక్క క్షణము దీనిలో ఆ మిగతాదానిని, ఆ 11వ వచనమును నేను చదువుతాను.

ఆయన గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులున్నవి,…మీరు వినుటకు మందులైనందున, వాటిని విశదపరచుట కష్టము.

ఏలయనగా…కాలమునుబట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను; మీరు పాలుత్రాగవలసినవారే గాని, బలమైన ఆహారము తినగలవారు కారు.

ఏలయనగా పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక: నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.

ఓ, పరిశుద్ధాత్మ ఇప్పుడు దానిని నేరుగా మీ అంతరంగములోనికి తీసుకువెళ్ళాడని నేను ఆశిస్తున్నాను.

ఏలయనగా పాలుత్రాగువాడు—వాడు ఒక శిశువేగనుక: నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.

50 మీరు ఒక చిన్న బిడ్డకు బలమైన మాంసమును ఇస్తే, మీరు దానిని చంపుతారు. ఆ కారణముచేతనే అనేకమంది ప్రజలు, “ఆహ్, నేను—నేను దానిని నమ్మను,” అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకను చిన్న బిడ్డలుగానే ఉన్నారు! వారు అసలు అర్థం చేసుకోలేరు. వారు ఆ సత్యమును పట్టుకోలేరు. అది—అది వారిని చంపుతుంది. ఈనాడు సంఘము ఎరుగవలసిన గొప్ప, మహత్తరమైన సంగతులున్నవి, కానీ మీరు దానిని బోధించలేరు. వారు—వారు—వారు—వారు—వారు దాని విషయమై తొట్రిల్లుతారు. దానితో ఏమి చేయాలో వారికి తెలియదు.

51 పౌలు, ఈ హెబ్రీ గుంపుతో మాట్లాడుచున్నాడు…అయినను, ఇప్పుడు అతడు, పండితులతో, బాగా నేర్చుకున్నవారితో మాట్లాడుచున్నాడు. కొన్ని—కొన్ని క్షణములలో, మనము దానిని కనుగొంటాము, ఎంతగానో పాండిత్యము గలవారు. కానీ లోతైన ఆత్మీయ మర్మము విషయానికొస్తే, సంఘము ఇంకనూ దాని పట్ల గ్రుడ్డితనము కలిగియున్నది. అతడు ఇట్లన్నాడు, “మీరు ఇతరులకు ఉపదేశించవలసినవారిగా ఉండవలసియుండగా, మీరు ఇంకనూ ఒక శిశువుగా ఉన్నారు.”

52 ఓ, లేచి బయటకు వెళ్ళి మరియు, “ఓ, నేను ఇక ఎంత మాత్రము సంఘమునకు వెళ్ళనవసరం లేదు. దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ వచ్చియున్నాడు, ఆయనే ఉపదేశకుడు” అని చెప్తున్నవారు అనేకమంది ఉన్నారని నాకు తెలుసు. మీకు ఆ ఆలోచన వచ్చినప్పుడు, మీరు కేవలం తప్పైయున్నారు. ఏలయనగా పరిశుద్ధాత్మ తానే ఉపదేశకుడై యుండబోవుచున్నయెడల ఆయన ఎందుకని సంఘములో ఉపదేశకులను నియమించాడు? చూశారా? మొదట అపొస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు, మరియు కాపరులు ఉన్నారు. ఆయన ఆ ఉపదేశకుని ద్వారా బోధించగలుగుటకై, పరిశుద్ధాత్మ సంఘములో ఉపదేశకులను ఏర్పరిచాడు. మరియు అది—అది వాక్య ప్రకారముగా లేకపోతే, దేవుడు దానిని ధృవీకరించడు, అప్పుడు అది సరియైన బోధ కాదు. అది తప్పక బైబిలు గ్రంథమంతటితో సరితూగవలసియున్నది, మరియు సరిగ్గా అప్పుడున్నంత సజీవముగానే ఈనాడును ఉండవలసియున్నది. ప్రత్యక్షపరచబడిన అసలైన సంగతి అదేయైయున్నది.

53 ఇప్పుడు గమనించండి.

వయస్సు వచ్చినవారు…అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన, జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక…బలమైన ఆహారము వారికే తగును.

వివేచన ద్వారా, ఏది ఒప్పు మరియు ఏది తప్పు అని తెలుసుకోండి.

54 ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మన పాఠమును ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు ఈ గొప్ప నేపథ్యము, 1వ వచనమును మనము తీసుకుందాము.

కాబట్టి క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని,…

అతడు ఏమి చెప్పుచున్నాడు? ఈ మొదటి ఐదు అధ్యాయములన్నియూ, ఆయన ఎవరైయున్నాడో చూపించుటకు, క్రీస్తుపై కేంద్రీకృతము చేయబడినవి. ఇప్పుడు మనము క్రీస్తును గూర్చిన ఆ మూలోపదేశములను విడిచిపెట్టుచున్నాము.

55 ఆయన ఏమైయున్నాడని మనము కనుగొన్నాము? ఆయన శరీరములో ప్రత్యక్షపరచబడిన ఆ గొప్ప యెహోవా దేవుడని మనము కనుగొన్నాము. మనము ఆయనను ఒక—ఒక ప్రవక్తగా కాదు గాని, శరీరమందు దైవత్వముయొక్క సంపూర్ణతయై యున్నాడని కనుగొన్నాము. ఆయన శరీరధారియైన యెహోవాయై యున్నాడు. మరియు, యేసు అనే శరీరము, కేవలం ఆయనకు గుడారముగా ఉన్నది. దేవుడు మానవునిలో నివసించుట. దేవుడు తన స్వంత కుమారునియొక్క కన్యక జన్మ ద్వారా, మానవుని ద్వారా, మానవునితో సమాధానపరచుకొనుచున్నాడు. మరియు యెహోవా, ఆ ఆత్మ, ఆయనలో నివసించాడు.

56 ఇప్పుడు దైవత్వమును గూర్చిన ఉపదేశము ఎంతమందికి గుర్తున్నది, మనము వెనుకకు వెళ్ళి, మరియు దేవుడు భిన్నమైన ఆత్మయంతటితో ఆ గొప్ప వర్షధనస్సువలె ఉండుటను, ఏ విధంగా కనుగొన్నామన్నది ఎంతమందికి గుర్తున్నది? మరియు పిదప దేవుని నుండి లోగాస్ బయటకు వెళ్ళినది, మరదే థియోఫనీగా మారినది, మరియు అది ఒక మానవుని రూపములో ఉండియున్నది. మరియు మోషే బండసందులో ఉండి, అది దాటివెళ్ళుటను చూశాడు. మరియు పిదప ఆ థియోఫనీ సంపూర్ణముగా మానవ శరీరముగా చేయబడినది, క్రీస్తే.

మరియు ఆయన కృప ద్వారా, మనము నిత్యజీవమును కలిగియున్నామని, మనమెట్లు కనుగొన్నాము కదా. ఇప్పుడు, ఎప్పటికీ అనే పదము అనగా అర్థము “కొంత దూరము వరకు; కొంత సమయము వరకు.” బైబిలు గ్రంథములో, ఇట్లు చెప్పబడినది, “ఎప్పటికీ మరియు ఎప్పటికీ,” ఒక సంయోగము. అయితే ఎప్పటికీ అంటే అర్థం కేవలం “ఒక సమయం.” కానీ నిత్యము అనగా ఎన్నటెన్నటికీ అని అర్థం. మరియు ఆరంభమును కలిగియున్నది మాత్రమే అంతమును కలిగియుంటుంది, కానీ ఆరంభము లేనివాటికి అంతము లేదు. కావున దేవునికి ఆదియు లేదు మరియు ఆయనకు అంతమును లేదు.

57 మరియు కాబట్టి, అందుచేత, మెల్కీసెదెకు, ఒక మనిషి వలెనున్న, ఆ గొప్ప యాజకుడు, ఆయనకు ఆదియు లేదు మరియు ఆయనకు అంతమును లేదు. మరియు మనము, ఆ థియోఫని ద్వారా, మరి, ప్రపంచమనేది అసలు సృష్టించబడకముందే మనము దేవుని పోలిక చొప్పున చేయబడియున్నాము; ఆ థియోఫనీ శరీరధారియై మన మధ్య నివసించినప్పుడు, అప్పుడు, ఆయనయొక్క మరణము ద్వారా, స్వయంగా మనము ఆయనయొక్క ఆత్మను పొందుకుంటున్నాము, మరియు మనకు అంతము లేదు; నిత్యజీవము; దేవదూతలు కాదు, కానీ స్త్రీలు మరియు పురుషులు. ఓ, నేను…ఏదో ఒక విధంగా, నా—నా జనులు దానిని పట్టుకునే ఒక విధానంలో నేను దానిని చెప్పగలిగితే చాలును! మీరు ఎన్నడూ ఒక దేవదూత కాలేరు. దేవుడు దేవదూతలను చేశాడు, అయితే దేవుడు మనిషిని చేశాడు. మరియు దేవుడు చేసేది, దేవుని నుండి వచ్చినదైయున్నది, మరి దేవుడెంత నిత్యుడో అది కూడా అంతే నిత్యమైనదిగా ఉన్నది. మరియు మానవుడు తన సృష్టికర్త ఎంత నిత్యుడో అతడు కూడా అంతే నిత్యుడు, ఎందుకనగా అతడు నిత్యత్వము నుండి తయారు చేయబడ్డాడు.

58 అయితే పాపమునకు అంతమున్నది, బాధలకు అంతమున్నది. కావున, అక్కడ నిత్యమైన నరకము ఉండజాలదు. ఒక నరకమున్నది, అగ్నిగంథకమున్నది, అది మనకు తెలుసు, కాని నిత్యనరకము అనేది ఏదియు లేదు. ఒకే ఒక్క విధమైన నిత్యజీవమున్నది మరియు అది దేవునికి చెందియున్నది. మీరు ఎన్నటెన్నటికీ బాధను అనుభవించాల్సి యున్నట్లైతే, మీరు నిత్యజీవమును కలిగియున్నట్లే. నరకమునకు ఒక అంతమున్నది, అది కోట్లాది సంవత్సరాలు కావచ్చును, కానీ అది చివరకు ఒక అంతమునకు వస్తుంది.

59 బైబిలు గ్రంథము ఎక్కడా కూడా, వారు నిత్యము బాధననుభవించారు అని చెప్పలేదు, ఇట్లు చెప్పబడినది “ఎప్పటికీ మరియు ఎప్పటికీ.” [తెలుగు బైబిలులో యుగయుగములు అనే పదం వాడబడినది.—తర్జుమాదారుడు.] యోనా కూడా, తాను తిమింగళము కడుపులో “ఎప్పటికీ” ఉన్నాడని అనుకున్నాడు. [తెలుగు బైబిలులో ఎన్నటికీ అనే పదం వాడబడినది.—తర్జుమాదరుడు.] ఎప్పటికీ అనునది ఒక దూరమును లేదా ఒక కాల పరిమితిని కలిగియున్నది. అయితే నిత్యత్వము అనునది శాశ్వతమైనది, దానికి ఆదియైనా లేదా అంతమైనా లేదు. అది ఒక గుండ్రము వంటిది, ఒక వృత్తము వంటిది. మరియు మన కాలము గడుచుచున్నాకొద్దీ, మనము కేవలం దేవునియొక్క గొప్ప ఉద్దేశ్యముల చుట్టూ తిరుగుతున్నాము.

60 ఆయనతో సహవాసము కలిగియుండుటకు, మానవుడిని తన పోలికలో చేయాలన్నది దేవుని ఉద్దేశ్యమైయున్నది. మరియు ఆయన అతడిని ఒక స్పర్శనీయమైన జీవిగా చేశాడు. ఇప్పుడు, పాపము మనలను ఒక—ఒక—ఒక కుళ్ళిపోయిన స్థితికి తీసుకొనివచ్చింది, కానీ అది దేవునియొక్క కార్యక్రమమును ఎన్నడూ ఆపజాలదు. మరియు, పాపియైన స్నేహితుడా, ఈ రోజు, నీవు దేవునియొక్క ఆత్మ ద్వారా తిరిగి జన్మించనట్లైతే, నీవు ఎక్కడో ఒక చోట ఒక అంతమును కలిగియున్నావు. మరియు నీ అంతము ఏమిటనగా గందరగోళము, నాశనము, మరియు బాధ మరియు దుఃఖమే. కానీ ప్రభువైన యేసునందు విశ్వాసముంచి, మరియు ఆయననే మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించిన మీకు, దేవుడు ఎంత నిత్యుడో అది కూడా అంతే నిత్యమైనది. మీకు అంతము లేదు, “నేను వారికి నిత్యమైన జోయీను, దేవునియొక్క స్వంత జీవమును ఇచ్చుచున్నాను, మరియు వారు ఎన్నడూ నశించరు లేదా తీర్పులోనికి కూడా రారు, అయితే మరణము నుండి జీవములోనికి దాటియున్నారు.” ఆయన అదేయైయున్నాడు. దానికొరకే ఆయన వచ్చాడు.

61 ఇప్పుడు, యేసు, ఆయనయొక్క యాజకత్వమునకు సంబంధించిన, ఆయనయొక్క రాకడలో, కేవలం ఒక సానుభూతి కొరకు రాలేదు. ఆయన ఇట్లు చెప్తూ వచ్చాడని చాలా మంది దానిని ఈ విధంగా బోధిస్తారు, అదేమిటనగా, “మంచిది, బహుశా నేను బాధనొందుతే, నేను ఒక—ఒక—ఒక దయనీయమైన దృశ్యముగా ఉంటాను మరియు ప్రజలు నిశ్చయముగా నా యొద్దకు వస్తారు.” అది తప్పు. దానికి ఏ లేఖనము లేదు.

ఏలయనగా, రక్షింపబడే ప్రతి వ్యక్తి, లోకమనేది కలుగజేయబడకముందే, దేవుడు వారిని ఎరిగియున్నాడు. బైబిలు ఆలాగు చెప్పినది. ఇప్పుడు, ఎవరైనా నశించిపోవాలని, దేవుడు కోరడంలేదు. వారందరూ పశ్చాత్తాపపడాలని ఆయన కోరుచున్నాడు. కానీ, దేవుడైయుండి, ముందుజ్ఞానము ద్వారా ఆయన దానిని ఎరిగియున్నాడు.

62 రోమా పత్రిక, 8వ అధ్యాయములో చూడండి. పౌలు అక్కడ పట్టుకొని, దేవునియొక్క ఎన్నికను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు, ఏమిటనగా, “ఏశావు మరియు యాకోబు, ఏ బిడ్డయైనా జన్మించుటకు ముందే, లేదా ఏదైనా జరుకగముందే, ఆయన వారిని ఎరిగియున్నాడనియు మరియు ఆయన ఏశావును ద్వేషించి మరియు యాకోబును ప్రేమించాడనియు దేవుడు చెప్పాడు,” ఇరువురిలో ఏ బాలుడును తమ కృతజ్ఞతను వ్యక్తపరచుటకు ఒక—ఒక అవకాశమునైనా కలిగియుండుటకు ముందేయైయున్నది, ఎందుకనగా ఆయన దేవుడైయున్నాడు. ఆయనకు తెలుసు…ఆయన అనంతుడు. ఆయన అనంతుడైయున్నట్లైతే, ఆయన ప్రతి పేనును, ప్రతి ఈగను, ప్రతి దోమను, భూమి మీద ఉండబోవు ప్రతిదానిని ఆయన ఎరిగియున్నాడు, ఆయన దానిని ఎరిగియున్నాడు. ఆయన అనంతుడు, నిత్యుడు, అమర్త్యుడు, ధన్యుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వము వ్యాపించియున్నవాడు, సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏదియు లేదు. ఆ కారణమును బట్టియే అంతము ఏమైయున్నదో ఆయన చెప్పగలడు. ఆయన ఆది నుండి అంతమును ఎరిగియున్నాడు.

63 ప్రవచనాత్మకమైనది కేవలం ఆయనయొక్క జ్ఞానమే. ఆయనే ప్రధాన న్యాయవాది. ఆయన—ఆయన—ఆయనే న్యాయాధిపతియై యున్నాడు. మరియు ఆయన తన జ్ఞానములో కొంత ఆ—ఆ న్యాయవాదికి చెప్తాడు. మరియు ప్రవచనము అనగా అదియే, దానిని ముందుగా చెప్పగలదు, ఎందుకనగా ఏమి జరుగబోవుచున్నదో ఆయనకు తెలుసు. ఇప్పుడు, అదీ మనము సేవించే దేవుడు. ఏదో చరిత్రలోని దేవుడు కాడు, బౌద్ధులు మరియు మహమ్మదీయులు, మరియు మొదలగువారు సేవించునటువంటి దేవుడు కాడు. అయితే, సర్వాంతర్యామియైన దేవుడు, సరిగ్గా ఇప్పుడు ఇక్కడ, ఈ ఉదయము, ఇప్పుడే ఈ ఆలయములో ఉన్న దేవుడు; గొప్ప యెహోవా, ఉన్నవాడు, పాప శరీరాకారమును తీసుకొనుటకు, తననుతాను దీనత్వములో రూపించుకున్నాడు. ఇదిగో ఆయన ఇక్కడున్నాడు. నిన్ను విమోచించినది ఆయనే. ఏ ఇతరులు, ఎక్కడా కూడా, ఏ సమయంలో కూడా దానిని చేయలేరు.

64 దేవుడు అక్కడ పైన ముగ్గురు వ్యక్తులను కలిగియుండి, మరియు వారిలో ఒకరిని, అనగా తన కుమారుడిని పంపించడం కాదు. అది స్వయంగా దేవుడే, ఒక కుమారుని రూపములో వచ్చుటయైయున్నది. ఒక కుమారునికి ప్రారంభము ఉంటుంది, మరియు ఆ కుమారుడు ఒక ప్రారంభమును కలిగియున్నాడు. దాని గురించి, ప్రియమైన క్యాథలిక్ ప్రజలారా, మా విశ్వాసముయొక్క వాస్తవాలు అనే మీ పుస్తకాన్ని నేను కలిగియున్నాను, అది ఇట్లు చెప్పుచున్నది, “దేవునియొక్క నిత్యమైన కుమారత్వము.” మీరు ఆ మాటను ఎలా వ్యక్తపరచబోవుచున్నారు? మీరు దానిని ఎలా అర్థవంతముగా చేయబోవుచున్నారు? అది నిత్యమైనదిగా ఎలా ఉంటుంది? అది బైబిలు కాదు. అది మీ పుస్తకమైయున్నది, “నిత్యమైన కుమారత్వము.” వారు…ఆ మాట సరికాదు. ఏలయనగా, ఒక కుమారుడు అనబడే దేనికైనా గాని, ఒక ప్రారంభమున్నది, మరియు నిత్యమైనదానికి ఎటువంటి ప్రారంభము ఉండదు, కాబట్టి అది నిత్యమైన కుమారత్వము కాదు. క్రీస్తు శరీరధారియై మన మధ్య నివసించాడు. ఆయన ఒక ప్రారంభమును కలిగియున్నాడు. అది నిత్యమైన కుమారత్వము కాదు. అది నిత్యమైన దైవత్వమైయున్నది, కుమారత్వము కాదు. ఇప్పుడు, ఆయన మనల్ని విమోచించుటకు వచ్చాడు, మరియు ఆయన మనల్ని విమోచించాడు.

65 ఇప్పుడు, పౌలు, అక్కడికే వచ్చుచున్నాడు, మరి గత పాఠాల ద్వారా మీరు దానిని గ్రహించారని నేను నిశ్చయతను కలిగియున్నాను. ప్రభువు చిత్తమైతే, ఏదో ఒక సమయములో, వచనము వెంబడి వచనము చొప్పున, మనము మరలా దానిని చూద్దాము. ఇప్పుడు.

కాబట్టి…క్రీస్తును గూర్చిన ఆ—ఆ మూలోపదేశమును మాని, పరిపూర్ణులమగుటకు సాగిపోదము;…

66 అది వారిని తొట్రిల్లజేస్తుంది, అది అట్లు చేయదా? మనమేమి చేద్దాము?

…పునాదులు మరలా వేయక; పరిపూర్ణులమగుటకు మనము సాగిపోదము…

67 దీనిని గమనించండి. “పరిపూర్ణత” అనే ఈ మాటను మనము తీసుకుందాము. మీరు దేవుని సన్నిధిలో నిలబడుటకు ఒకే ఒక్క మార్గమున్నదని మీకు తెలుసా? అది, పరిపూర్ణతయై యున్నది. దేవుడు అపవిత్రమైన కార్యములను సహించలేడు.

68 మరియు క్రియల ద్వారా రక్షణ పొందగలరని నమ్మే మీరు: మిమ్మల్ని మీరు పరిపూర్ణులుగా చేసుకొనుటకు మీరు ఒక్క విషయమును కూడా కలిగిలేనప్పుడు, మిమ్మల్ని మీరు అసలు ఎలా పరిపూర్ణులుగా చేసుకోగలరు? మీరు పాపములో జన్మించారు. మిమ్మల్ని గర్భము ధరించడమే పాపములో జరిగినది. మీరు ఇక్కడ ఉండుటకుగల కోరికయే పాపమైయున్నది. “పాపములో పుట్టి, అతిక్రమములో రూపించబడి, అబద్ధములాడుచు లోకములోనికి వచ్చితిరి.” మరిప్పుడు మీరెక్కడ నిలబడబోవుచున్నారు?

69 “నేను ధూమపానం మానేస్తాను. నేను పరలోకమునకు వెళ్తాను,” అని—అని చెప్పిన పాపీ, నీవు ఎక్కడున్నావు? నులివెచ్చని స్థితి కలిగి, మూర్ఖుడవైన, నామకార్ధ-క్రైస్తవుడా, మాడ్చిన ముఖము పెట్టుకొని ఇక్కడ తిరుగుతూ మరియు, “మంచిది, నేను సంఘమునకు చెందినవాడను” అని చెప్పేవాడా నీవు ఎక్కడున్నావు? పాపివైన నీవు. అది నిజము. నీవు దేవునియొక్క ఆత్మ ద్వారా జన్మించనంతవరకు, నీవు నశించినట్లే. అది నిజము.

70 నీవు పరలోకమునకు ఎలా వెళ్ళబోవుచున్నావు? నీవు ఇట్లంటావు, “నేను నా జీవితములో ఎన్నడూ అబద్ధము చెప్పలేదు.” “ఓ, ఆ ప్రియమైన బిడ్డ. అది—అది ఆరంభము నుండే, ఒక దూతవంటిది.” అది అబద్ధము. నీవెంత మంచివాడవన్నది నేను లెక్కచేయను; నీవు ఒక పాపివే. మరియు నీవు ఒక్కదానిని కూడా కలిగిలేవు; నిన్ను రక్షించగల ఏ యాజకుడు, ఏ బిషప్పు, ఏ మతాధిపతి, ఏ పోపు, లేదా మరేదీయును లేదు, ఎందుకనగా అతడు కూడా సరిగ్గా నీవున్న అదే పడవలో ఉన్నాడు. కొన్ని నిమిషాలలో మనము దానిలోనికి వెళ్తున్నాము. సరిగ్గా అదే స్థితిలో ఉన్నాడు. అతడు…రోముయొక్క పోపు పాపములో జన్మించి, అతిక్రమములో రూపించబడ్డాడు, అబద్ధములాడుచు లోకములోనికి వచ్చాడు, ఒక స్త్రీ మరియు ఒక పురుషునియొక్క లైంగిక వాంఛ ద్వారా జన్మించాడు. దాని నుండి మీరెలా నీతిమంతులు అవ్వబోవుచున్నారు?

71 “మంచిది, అతని తల్లిదండ్రులు అదే విధంగా జన్మించారు, మరియు వారు అదే విధంగా జన్మించారు, మరియు అతని నానమ్మ మరియు తాతయ్య మరియు ఇంకా ఆ వెనుక వారందరు అంతే.” ఆరంభము నుండే, అది పాపమైయున్నది!

72 కాబట్టి ఇది పరిశుద్ధమైనది అని, అది పరిశుద్ధమైనది అని ఎవరు చెప్పగలరు? పరిశుద్ధమైనది ఒకే ఒక్కటి ఉన్నది, అది పరిపూర్ణుడిగా చేయబడిన, జీవముగల దేవుని కుమారుడైన, యేసుక్రీస్తే. మరియు పరిపూర్ణులుగా ఉండవలెనని మనము కోరబడినాము. ఇప్పుడు, మనము ఏ విధంగా అట్లు అవ్వబోవుచున్నాము? మీకు మీరుగా, దానిని ప్రయత్నించండి. “నేను ఐదు నిమిషముల క్రితమే జన్మించాను, మరియు ఇప్పుడే లోకమునుండి వెళ్ళిపోవుచున్నాను,” అనే యోగ్యతలపై పరలోకమునకు వెళ్ళుటకు ప్రయత్నించడానికి నేను అసహ్యించుకుంటాను. అలాగైతే నేను నశించిపోతాను. నా జీవితములో నేనెన్నడూ ఒక చెడు తలంపును కలిగియుండకపోయినా, నా జీవితంలో నేనెన్నడూ ఒక చెడ్డ మాట మాట్లాడకపోయినా, నేను ఎన్నడూ ఏ చెడును చూడకపోయినా, ఎన్నడూ చెడుగా ఆలోచించక, లేదా అటువంటిదేదియు చేయకపోయినాగాని, నేను సరిగ్గా పాతాళపు మురికి గోడలంత దరిద్రముగాను నల్లగాను ఉన్నాను. నేను ఒక పాపినైయున్నాను.

73 నేను జీవమునకు వచ్చి మరియు ఒక గదిలో తాళము వేసుకొనియుండి, మరియు కొంతమంది కర్మెలీయ సహోదరీలు లేదా అటువంటివారి వలె ఉండి, మరియు లోకమును ఎన్నడూ చూడకుండా, ఆ లోపలే ఉండిపోయి మరియు నా జీవితమంతా ప్రార్థిస్తూ ఉన్నాగాని, మంచి చేస్తూ ఉన్నా గాని, ఒక కోటీశ్వరునిగా పుట్టి మరియు నేను కలిగియున్నదంతా పేదలకు ఇచ్చినా గాని, మరి నేనింకనూ ఒక పాపినేయై యున్నాను మరియు పాతాళమునకు వెళ్తాను. అవును, అయ్యా.

74 నేను సంఘమునకు చెందిన చిన్న పిల్లల పేర్ల పట్టికలో ఉన్నప్పుడే, లూథరన్ సంఘములో, బాప్టిస్టు, పెంతెకొస్తు, ప్రెస్బిటేరియన్ సంఘములో చేరియుండవచ్చును, మరియు ఒక వంద సంవత్సరముల వరకు ఆ సంఘమునకు నమ్మకముగా జీవించియుండవచ్చును, మరియు నా ప్రాణము తీసికొనబడి, మరియు ఏ మనుష్యుడు నా వైపు తమ వేలెత్తి చూపించలేకుండా మరియు “అతడు ఎన్నడైనా కనీసం ఒక చెడు తలంపునైనా కలిగిలేడు” అని చెప్పినా గాని, నేను నిలబడియున్నంత నిశ్చయముగా నేను పాతాళమునకు వెళ్తాను.

75 నేను ఒక పాపిని. అది నిజము. నా దగ్గర ఏమీ లేదు. ఏ—ఏ వెలయైనా చెల్లించబడుటకు, నేను కనుగొనగలిగే, ఏ మార్గము లేదు. దేవుడు మరణమును కోరాడు. మరియు నేను నా స్వంత ప్రాణమును ఇచ్చివేస్తే, నేను నా ప్రాణమును ఇస్తే, అప్పుడు నేను ఎలా పశ్చాత్తాప పడగలను? ఎందుకంటే, నీవు…మొదటిగా, వెల చెల్లించబడవలసియున్నది. మరియు దేవుడు మాత్రమే తన ప్రాణమును పెట్టి మరియు మరలా దానిని పైకి తీసుకోగలవాడైయున్నాడు. కావున ఆయన పాపముగా మారి, తన ప్రాణమును పెట్టి మరియు దానిని పైకి తీసుకోగలిగాడు, మరియు దానిని “నీతి,” అని పిలిచాడు మరియు వెల చెల్లించబడినది. విషయం అదేయైయున్నది.

76 ఇప్పుడు మనము, మత్తయి 8వ అధ్యాయము వైపుకు త్రిప్పుదాము, అది 7వ లేదా 8వ అధ్యాయమని నేను నమ్ముచున్నాను. ఇక్కడ యేసు ఏమి చెప్పుచున్నాడో మనము చూస్తాము. మంచిది. అది మత్తయి, 5వ అధ్యాయమైయున్నది. మరియు…యేసు, ధన్యతలను గూర్చి బోధిస్తూ, ప్రకటిస్తున్నాడు, 47వ వచనము.

మరియు మీరు మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల, ఇతరులకంటె మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా…? (గమనించండి.)

అయితే మీరు పరిపూర్ణులుగా ఉండండి,…(ఏమిటి?)

మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, మీరును పరిపూర్ణులుగా ఉండుడి.

అది యేసుయొక్క ఆజ్ఞయైయున్నది, “మీరును ఆలాగున ఉండుడి.”

77 వారు ఇట్లంటారు, “ఎవ్వరూ పరిపూర్ణులుగా ఉండలేరు, ‘ఎవరును పరిపూర్ణులు కారు,’ అని బైబిలు గ్రంథము చెప్పినది. అక్కడే వ్యతిరేకత ఉన్నది.” అవునా? మంచిది.

78 మీలో మీరు పరిపూర్ణులుగా ఉండలేరు. మీరు చేసిన దానిని మీరు నమ్ముకొనుచున్నయెడల, మీరు నశించినట్లే. “దేవుడు పరిపూర్ణుడైయున్నట్లే, మీరును పరిపూర్ణులుగా ఉండుడి.” ఇప్పుడు:

కావున, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైయున్నట్లే…మీరును పరిపూర్ణులుగా ఉండుడి.

79 “కావున…” ఇప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, 6వ అధ్యాయము.

కావున క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని, మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము;…

80 ఇప్పుడు, బ్రెన్హామ్ ఆలయపువారైన, మీరు. ఓ, “మనకు స్వస్థతలు ఉన్నవని,” నాకు తెలుసు. అది అద్భుతం. “మనకు దర్శనములున్నవి.” ఓ, అది—అది మంచిది. మరియు మీరు ఆత్మసంబంధమైన కలలను కలిగియుంటారు, అయితే కొన్నిసార్లు అవి ఆత్మసంబంధమైన కలలు కావు. మరియు—మరియు కొన్నిసార్లు మీరు…“మేము, మేము పేదలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము. మేము చేయగలిగినదానిని మేము చేస్తాము.” ఓ, అది సరియే, కానీ మనమిప్పుడు మాట్లాడుచున్నది దాని గురించి కాదు. మనము వేరొక దశలోనికి ప్రవేశించుచున్నాము.

…మూలోపదేశమును…మాని…

81 “ఓ, అవును, మేము క్రీస్తును గూర్చిన మూలోపదేశమును కలిగియున్నాము. ఆయన దేవుని కుమారుడని, కన్యక-ద్వారా జన్మించాడని మేము నమ్ముచున్నాము. ఈ విషయములన్నిటితో పాటు, మేము దానిని నమ్ముచున్నాము.” అది ఎంతో అద్భుతము.

82 అయితే, “దానిని విడిచిపెట్టి, మనము పరిపూర్ణతలోనికి కొనసాగుదము.” ఓ, మై! మీరు చూడగలిగే ఒక చోటుకు దీనిని తీసుకొనిరాడానికి, ఇప్పుడు నేను ఒక ప్రధాన దూత స్వరమును కలిగియుంటే బాగుండును అని కోరుచున్నాను. ఇప్పుడు అతడు ఇట్లు చెప్పుచున్నాడు, “క్రీస్తును గూర్చిన ఉపదేశమంతటినీ విడిచిపెట్టి,” అనగా క్రీస్తుయొక్క దైవత్వమును గూర్చి, ఏ—ఏ విధంగా ఆయన శరీరధారిగా చేయబడిన దేవుడైయున్నాడు అనుదాని గురించి, ఈ ఇతర కార్యములన్నిటిని గూర్చి, మనకు తెలిసిన వేదపాండిత్యమంతటిని, మరియు ఆ వేద పండితులందరినీ విడిచిపెట్టుటయై యున్నది.

83 పౌలు ఇక్కడ దానంతటినీ ఇంకా వివరిస్తున్నాడు, కేవలం కొద్ది నిమిషములలో చూస్తాము. మనము దానియొద్దకు వెళ్ళే ముందు, దానిని కొంచెము, చదువుదాము.

…నిర్జీవ క్రియలను విడిచి పశ్చాత్తాపము అను పునాదులు మరలా…

ఇప్పుడు, మనము దానిని నమ్ముతాము.

…మరియు దేవునియందలి విశ్వాసమును,

మనము దానిని నమ్ముతాము.

మరియు బాప్తిస్మములను గూర్చిన బోధయు,…

మీరు ఎలా బాప్తిస్మము పొందాలి అను దాని గురించియైయున్నది, మనము దానిని నమ్ముతాము.

…మరియు హస్తనిక్షేపణమును,…

హస్తనిక్షేపణమును మనము నమ్ముతాము, కాదా? చూడండి, దానంతటినీ, నిశ్చయంగా.

…మరియు మృతుల పునరుత్థానమును,…

84 మనము దానిని నమ్ముతాము. ఇప్పుడు గమనించండి. మీరిక్కడ చూడండి, “తీర్పు,” కు “నిత్యమైనది” అని వాడబడినది. అది ఎన్నటెన్నటికీ యైయున్నది. దేవుడు తీర్పును పలికినప్పుడు, అది ఎన్నటెన్నటికీయైయున్నది. అలాగైతే, తీర్పు తీర్చబడిన తరువాత ఇక సమాధానపరచడమనేది ఏదీ ఉండదు. దేవుడు తన స్వంత—తన స్వంత, మనము దానిని పిలిచే విధంగా, తన స్వంత ఔషధమును ఎందుకు తీసుకోవలసి వచ్చిందో ఇప్పుడు మీరు గ్రహించగలరు. పాపము చేయుటనుబట్టి ఆయన మానవుణ్ణి ఖండించినప్పుడు, ఆయన సమాధానపరచగలిగే ఒకే ఒక్క మార్గమేదనగా, స్వయంగా ఆయనే ఆ మనిషియొక్క స్థానమును తీసుకోవడమైయున్నది. మన స్థానమును తీసుకొని మరియు ఒక పాపిగా మారుటయే, ఆయన సమాధానపరచబడుటకు, లేదా మనలను సమాధానపరచుటకు గల ఏకైక మార్గమైయున్నది. దేవుడైన, యెహోవా, ఒక పాపిగా మారాడు, మరియు ఆయన తన ప్రాణమును అర్పించాడు.

85 ఇప్పుడు, మంచి కారణం కొరకు చనిపోవడానికి, ఒక పాపిగా, మీరు మీ ప్రాణాన్ని పెట్టవచ్చును. పౌలు ఇట్లు చెప్పాడు, “దహనబలిగా నా శరీరమును అప్పగించినను, నేను ఇంకను వ్యర్థుడనే,” ఎందుకనగా అది పనిచేయదు. చూడండి, మీరు చనిపోయినప్పుడు, మీరిక వెళ్ళిపోతారు. మీరు ఒక పాపిగా చనిపోతే, మీరు నశించిపోయినట్లే.

86 “అయితే దేవుడు శరీరములో దిగివచ్చి, పాపపు శరీరముగా మార్చబడియుండి, మరియు శరీరములోనే పాపమును ఖండించాడు.” ఎందుకనగా, ఆయన నిత్యుడైన దేవుడైయున్నాడు, మరియు తన స్వంత శరీరమును పైకి లేపాడు, కావున ఆయనే నీతిమంతులుగా చేయువాడైయున్నాడు.

87 ఇప్పుడు, ఇవన్నియూ ఉండగా, “మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము,” అని పౌలు చెప్పాడు. ఇప్పుడు ఏమిటి?

…నిత్యమైన తీర్పు.

…దేవుడు సెలవిచ్చినయెడల,…మనమాలాగు చేయుదుము. (3వ వచనము.)

88 ఇప్పుడు, “పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” యేసు ఇట్లు చెప్పాడు, “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైయున్నట్లు, మీరును పరిపూర్ణులుగా ఉండుడి.”

మరియు మనము, ప్రతి ఒక్కరమూ, ఖండించబడ్డాము. మనము ఏమి చేసినా లెక్క లేదు, మనము ఖండించబడ్డాము. శిక్షావిధికి పాత్రులుగానే, మనము జన్మించాము. మీ అమ్మ మరియు నాన్న, శిక్షావిధికి పాత్రులుగానే జన్మించారు. మీయొక్క, మీ పూర్వీకులందరూ పాపములో జన్మించి, అతిక్రమములో రూపించబడ్డారు. కాబట్టి మీరు అసలు దానిని ఎలా పొందుకోబోవుచున్నారు? మీరు ఎలా పరిపూర్ణులవ్వబోవుచున్నారు? మీరెన్నడూ ఏ కార్యమును చేయకపోయినా, ఎన్నడూ దొంగతనం చేయకపోయినా, ఎన్నడూ అబద్ధము చెప్పకపోయినా, మీ జీవితములో ఎన్నడూ ఏమీ చేయకపోయినా, మీరింకను ఖండించబడియున్నారు. మీరు మీ మొదటి శ్వాసను పీల్చుకొనుటకు ముందే ఖండించబడ్డారు. మీరు ఖండించబడ్డారు. అది వాస్తవము. మరియు మీరు మీ మొదటి శ్వాసను తీసుకోకముందే దేవుని చేత తీర్పు తీర్చబడియున్నారు. ఏలయనగా, మీ తల్లితండ్రులయొక్క లైంగిక కోరికను బట్టి మీరు తీర్పు తీర్చబడ్డారు, వారు వారియొక్క క్రియ ద్వారా, మిమ్మల్ని ఇక్కడ భూమి మీదకు తీసుకొనివచ్చారు. మరియు ఆదిలోనే, దేవుడు దానిని ఖండించాడు. ఆరంభము నుండే, మీరు ఖండించబడ్డారు. కావున మీరు…మరియు మీతో పాటు భూమి మీదనున్న ప్రతి వ్యక్తి ఖండించబడ్డాడు. ఇప్పుడు మీరు పరిపూర్ణతను ఎక్కడనుండి పొందుకొనబోవుచున్నారు?

89 గమనించండి. మనం ఒక్క క్షణము హెబ్రీ పత్రిక, 10వ అధ్యాయమునకు త్రిప్పుదాము. జాగ్రత్తగా వినండి. నేను మొదట, 9వ అధ్యాయము నుండి కొద్దిగా చదవాలనుకుంటున్నాను, 11వ వచనము.

అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా వచ్చి, మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, తనయొక్క స్వంత గుడారము, తన శరీరము ద్వారా,…

90 చూడండి, పాత గుడారము…మీరు గమనించారా? పాత గుడారము, దేవుడు నివసించినటువంటి మందసమును దాచిపెట్టిన ఒక తెరను కలిగియున్నది. అది ఎంతమందికి తెలుసు? నిశ్చయంగా. మంచిది, ఇక్కడున్న ఆ పాత మానవ-నిర్మిత గుడారము, రంగులు పూసిన మేక చర్మపు తెరలతో, మరియు మొదలగువాటితో ఉన్నది, దేవునియొక్క సన్నిధిని మరుగుచేయుటకు ఒక గుడారముగా చేయబడినది. సంవత్సరానికి ఒక్కసారి ఒక్క మనిషి మాత్రమే అక్కడకు వెళ్ళగలడని ఎంతమందికి తెలుసు? నిశ్చయంగా. అది అహరోనుయైయున్నాడు, సంవత్సరమునకు ఒకసారి లోపలికి వెళ్తాడు. మరియు అతడు తప్పక అభిషేకించబడియుండాలి. మరియు—మరియు, ఓ, ఆ అవసరత! మరియు అతడు తన చేతిలో అగ్నిని కలిగియుండాలి; మరి అది లేకుండా అతడు వెళ్ళినట్లైతే, అతడు ఆ తెరను వెనుకకు జరిపిన వెంటనే అతడు చనిపోతాడు. అతడు చనిపోయి కూలిపోతాడు. అతడు ఆ లోపలికి వెళ్ళి మరియు ఈ దీపస్తంభములను వెలిగించి, మరియు ఆ కరుణాపీఠముపై చల్లవలసియున్నది, దానిని నెరవేర్చుటకు క్రీస్తు వచ్చువరకు, ఆ ప్రత్యామ్నయము కలిగియున్న, ఆ మరణపు రక్తమును చల్లవలసియున్నది.

91 ఇప్పుడు, అయితే, పిదప దేవుడు మరొక విధమైన గుడారముగా మారాడు. మరియు ఆ గుడారము ఎవరు? యేసు. మరియు దేవుడు యేసు లోపల ఉన్నాడు, మరియు ఆయన మరుగుచేయబడ్డాడు, అయితే ఆయన అతని భావవ్యక్తీకరణల ద్వారా, లోకమును తనతో సమాధానపరచుకొనుచున్నాడు. క్రీస్తు దేవుడిని బయలుపరచాడు. ఆయన ఇట్లన్నాడు, “కార్యములు చేయునది నేను కాదు. అది నాలో నివసించు నా తండ్రియే. తండ్రి ఏమి చేయుటను నేను చూతునో దానిని తప్ప నా అంతట నేను ఏమియు చేయను. నాలో ఉన్న తండ్రి, ఈ దర్శనములను నాకు చూపించుచున్నాడు, మరియు పిదప తండ్రి ఏమి చేయమని నాకు చెప్పాడో నేను వెళ్ళి దానినే చేస్తాను.” మీకు అది అర్థమైందా? రంగులు పూసిన మేక చర్మముల వెనుక కాదు కానీ, దేవుడు ఒక మానవ శరీరములోపల ఉన్నాడు, జీవించుచూ, కదులుచున్నాడు. దేవుడు చేతులను కలిగియున్నాడు; దేవుడు పాదములను కలిగియున్నాడు; దేవుడు నాలుకను కలిగియున్నాడు; దేవుడు కళ్ళను కలిగియున్నాడు; మరియు అది క్రీస్తే. అదిగో ఆయన అక్కడ ఉండియున్నాడు.

92 ఇప్పుడు, ఆయన వెళ్ళిపోయాడు, మరియు ఆయన తన మరణము ద్వారా సంఘమును పరిపూర్ణము చేసి, మరియు సంఘమును లోబడునట్లు చేయుటకు ఆత్మ దానిలోనికి వచ్చినది. మరప్పుడు క్రీస్తులో ఉన్న అదే ఆత్మ సంఘములో ఉన్నది, క్రీస్తు చేసిన అవే కార్యములను చేయుచున్నది. “కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయినను మీరు నన్ను చూతురు, ఏలయనగా నేను మీతోను, మీలోను, యుగసమాప్తి వరకు ఉందును.”

93 ఇప్పుడు దీనిని వినండి.

అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా మారి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా;

ఆయన హస్తములతో చేయబడలేదు. ఆయన ఎలా జన్మించాడు? కన్యక జన్మ ద్వారా జన్మించాడు.

మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో, ఈ శరీరము ఎన్నడూ అర్పించబడలేదు లేదా పరిశుద్ధపరచబడలేదు, కానీ తన స్వరక్తముతో…

94 రక్తము పురుషుని నుండి వస్తుందని మీకు తెలుసు. మరియు అప్పుడు ఎవరో ఇట్లన్నారు, “ఓ, యేసు ఒక యూదుడు.” ఆయన ఒక యూదుడు కాడు. “ఓ, యూదుల రక్తము ద్వారా మనము రక్షించబడ్డామన్నారు.” కాదు, మనము అట్లు రక్షించబడలేదు. యూదుల రక్తము ద్వారా మనము రక్షించబడినట్లైతే, మనము ఇంకనూ నశించిపోయినవారమే.

యేసు యూదుడు కాడు, ఆయన అన్యుడును కాడు. ఆయన దేవుడైయున్నాడు: తండ్రియైన దేవుడు, ఆత్మ, అదృశ్యుడు. “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, కానీ తండ్రియొక్క అద్వితీయ కుమారుడు మాత్రమే ఆయనను బయలుపరచెను.” ఆయన దేవుడిని, దేవుడు ఏమైయున్నాడు అనేదానిని, ప్రత్యక్షపరిచాడు.

95 ఇప్పుడు దేవుడు ఏమైయున్నాడో చూపించుటకు, ఆయనయొక్క సంఘము దేవుడిని ప్రత్యక్షపరచవలసియున్నది. చూశారా?

మనము ఏమి చేస్తాము? మనల్ని మనము సంస్థగా చేసుకొని, మరియు ఇట్లంటాము, “వారితో నాకు ఏ సంబంధము లేదు. వారు మెథడిస్టువారు. వారు ప్రెస్బిటేరియనువారు. వారితో నాకు ఏ సంబంధము వద్దు. నేను బాప్టిస్టువాడను. నేను పెంతెకొస్తువాడను.” హ! అటువంటి ఉద్దేశాలతో ఉంటే, మీరు నశించినట్లే. నిజము.

96 ఎవరు గొప్పలు చెప్పుకోగలరు? ఎవరైనా ఏం చెప్పగలరు? ప్రెస్బిటేరియన్లు తెచ్చిన అవమానమును చూడండి. బాప్టిస్టులు తెచ్చిన, అవమానమును చూడండి. క్యాథలిక్కులు తెచ్చిన, అవమానమును చూడండి. పెంతెకొస్తువారు, నాజరీనులు, పిలిగ్రిమ్ హోలీనెస్ వారు తెచ్చిన, అవమానమును చూడండి. ఆ మిగతావారి వైపు చూడండి.

కానీ, దానివైపు, అవమానకరంగా, ఒక్క చెయ్యి చూపమని నేను మీకు సవాలు చేస్తున్నాను. అవును. సర్వశక్తిమంతుడైన దేవుడే, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నివసించుటకు నేను ఇష్టపడుచున్నాను. ఈయన మాట వినుడి” అని చెప్పియుండగా ఒక్క వ్రేలును చూపించండి. అదిగో ఆయన అక్కడ ఉన్నాడు. ఆయనే ఆ పరిపూర్ణమైనవాడు.

97 ఇప్పుడు, మనము ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం ముందుకు చదువుదాము.

మేకలయొక్కయు…కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను, నిత్యమైన విమోచన సంపాదించినవాడై…(మీరు దానిని గ్రహిస్తున్నారా?)…మన కొరకు నిత్యమైన విమోచన.

98 ఈ రోజు విమోచించబడి, మరియు తరువాత, వచ్చే వారం ఉజ్జీవము ప్రారంభమైనప్పుడు, మరలా విమోచించబడి, మరియు పిదప, ఓ, మనము పడిపోయి మరియు మరలా విమోచించబడుటకు కాదు. మీరు ఒక్కసారే, ఎన్నటెన్నటికీ విమోచించబడియున్నారు. అది వాస్తవము. ఇక విమోచించబడుట, విమోచించబడుట, విమోచించబడుట కాదు. “నిత్యమైన విమోచన!” “నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక, మరణము నుండి జీవములోనికి” భూతకాలము, “దాటియున్నాడు.” అతడు ఊగినందుకా? అతడు ఒక ఫలానా విధానములో బాప్తిస్మము పొందినందుకా? అతడు తన చేతిలో రక్తమును కలిగియున్నందుకా? “అతడు దేవునియొక్క అద్వితీయ కుమారునియందు విశ్వాసము ఉంచినందుకైయున్నది.” ఆ విధంగానే మనము నిత్యమైన విమోచనను కలిగియుంటాము.

99 ఇప్పుడు వినండి.

ఏలయనగా…మేకలయొక్కయు ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆ—ఆ ఆవుదూడల బూడిదె చల్లుటయు…చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినయెడల:

నిత్యుడగు ఆత్మ ద్వారా, తననుతాను దేవునికి నిష్కళంకముగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఇంకెంతగా శుద్ధిచేసెను కదా?

100 “మరణమునుండి జీవములోనికి దాటియున్నాడు.” లోకము ఏమి అనుకుంటుంది అనేదాని గురించి నీవెందుకు పట్టించుకోవాలి? నీ పొరుగువాడు ఏమనుకుంటాడు అనేదాని గురించి, నీవెందుకు పట్టించుకోవాలి? మన మనస్సాక్షి చనిపోయినది, మరియు మనము నిజమైన జీవముగల దేవుడిని సేవించుటకై, నూతన జీవము పొందుకొని మరియు దేవునియొక్క ఆత్మ ద్వారా తిరిగి జన్మించాము. అక్కడే మీరున్నారు.

101 ఇప్పుడు సరిగ్గా ఆ పేజీ ప్రక్కనే ఉన్న 10వ వచనమునకు, లేదా, 10వ అధ్యాయమునకు వెళ్దాము.

…ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక, వారు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువానికి ఎన్నడును సం-పూ-ర్ణ-సి-ద్ధి కలుగజేయనేరవు.

సం-పూ-ర్ణ-ము, అది అక్కడున్నది, “పరిపూర్ణత.”

…క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని, పరిపూర్ణులమగుటకు సాగిపోదము;…

కావున మీ పరలోకపు…తండ్రి పరిపూర్ణుడు గనుక, మీరును పరిపూర్ణులుగా ఉండండి.

102 “ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలది,” వారు కలిగియున్న నియమములు మరియు బాప్తిస్మములు మరియు…ఆ ఇతర కార్యములన్నీ కూడా, “ఆరాధికుడిని ఎన్నడూ పరిపూర్ణుడిగా చేయలేవు.” మరి అయినను, దేవుడు “పరిపూర్ణతను” కోరుచున్నాడు.

103 మీరు నాజరీను సంఘములో చేరితే, అది మిమ్మల్ని ఎన్నడూ పరిపూర్ణులుగా చేయదు. మీరు బాప్టిస్టు సంఘములో, పెంతెకొస్తులో, మరి దేనిలో చేరినా గాని, అది మిమ్మల్ని ఎన్నడూ పరిపూర్ణులుగా చేయదు. నీవు ఒక మంచి, నమ్మకమైన వ్యక్తిగా ఉండటమనేది, నిన్ను ఎన్నడూ పరిపూర్ణుడిగా చేయదు. నీవు ఒక్క విషయమును కూడా యోగ్యముగా చూపించలేవు. యోగ్యతగా చూపించుటకు, నీ గురించి ఏమీ లేదు. నీవు నశించియున్నావు. మీరు ఇట్లనవచ్చు, “మంచిది, నేను ధర్మశాస్త్రమును పాటించాను. నేను సబ్బాతును పాటిస్తాను. నేను దీనిని పాటిస్తాను, దేవునియొక్క నియమములన్నిటినీ పాటిస్తాను. నేను దీనిని చేస్తాను.”

104 పౌలు ఇట్లు చెప్పాడు, “మనము ఇప్పుడు వాటన్నిటిని ప్రక్కన పెడదాము.”

105 “అది మంచిదే, అయితే మేము దీనిని చేస్తాము. మేము ప్రజలకు బాప్తిస్మము ఇస్తాము, మరియు మేము వారి స్వస్థత కొరకు మరియు మొదలగువాటి కొరకు వారి మీద చేతులుంచుతాము.”

106 మనము ఆ విషయములలో ప్రతిదానిని, వచనము వెంబడి వచనము, తీసుకోవచ్చును. బాప్తిస్మము, మనము దానిని నమ్ముతాము. “నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే.” ఒక బాప్తిస్మము ఉన్నదని మనము నమ్ముచున్నాము. మృతుల పునరుత్థానమును మనము నమ్ముచున్నాము. ఖచ్చితంగా. యేసు చనిపోయి మరలా తిరిగి లేచాడని మనము నమ్ముతాము. మనము దానిని నమ్ముతాము. “రోగుల కొరకు, చేతులుంచుటను” నమ్ముతాము, అదియే చెప్పబడినది. “నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు.” మనము దానిని నమ్ముతాము.

అయితే అది ఏమిటి? “అవన్నియు నిర్జీవమైన క్రియలని,” పౌలు చెప్పాడు. అది మీరు చేసే ఒక విషయమైయున్నది.

107 “ఇప్పుడు మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” ఓ, మై! మనము ఆలయములోనికి వచ్చుచున్నాము, పునాది వద్దకు కాదు; ఆలయము, స్వయంగా ఆలయములోనికే వచ్చుచున్నాము. అది పునాదియైయున్నది: ధర్మశాస్త్రము, మరియు నీతి, మరియు—మరియు—మరియు—మరియు సంఘములో చేరుట, మరియు బాప్తిస్మము పొందుట, మరియు—మరియు హస్తనిక్షేపణము. అవన్నియూ సంఘముయొక్క క్రమములైయున్నవి.

“కానీ ఇప్పుడు మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” మరియు పరిపూర్ణుడు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన యేసే.

108 మనము ఆయనలోనికి ఎలా వెళ్తాము? “మెథడిస్టుల ద్వారానా?” కాదు. “పెంతెకొస్తుల ద్వారానా?” కాదు. “బాప్టిస్టుల ద్వారానా?” కాదు. “ఏదైనా సంఘము ద్వారానా?” కాదు. “రోమన్ క్యాథలిక్ ద్వారానా?” కాదు.

109 మనము దానిలోనికి ఎలా ప్రవేశించగలము? రోమా పత్రిక 8:1.

కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్నవారికి…అనగా లోకము చెప్పుచున్నదానిని ఏ మాత్రము పట్టించుకోకుండా ఈ లోకసంబంధమైన కార్యములను అనగా, శరీరమును అనుసరింపక, ఆత్మ సంబంధమైన కార్యములను అనుసరించి నడుచుకొనువారికి, ఏ శిక్షావిధియు లేదు.

110 నీవు అనారోగ్యముతో ఉన్నప్పటికినీ, “నీవు చనిపోవబోతున్నావు,” అని వైద్యుడు చెప్పినప్పటికినీ, నీవు దానిని ఎంతమాత్రమూ పట్టించుకోవు, అది నిన్ను కొంచెం కూడా ఇబ్బంది పెట్టదు.

111 “నీవు రక్షించబడుటకు ముందు, ఒక క్యాథలిక్కుగా మారాలి, లేదా ఒక ప్రెస్బిటేరియన్ గా మారాలి, లేదా దీనిని చేయాలి,” అని వారు నీతో చెప్పినా గాని నీవు దానిని ఏ మాత్రము పట్టించుకోవు.

“కాబట్టి, క్రీస్తు యేసునందున్నవారికి, అనగా శరీరమును అనుసరింపక, అనగా వారు చూచువాటిని అనుసరింపక నడుచువారికి ఎటువంటి శిక్షావిధియు లేదు.” మీ కన్నులతో మీరు చూసే ప్రతీది భూసంబంధమైనదే.

112 అయితే వాక్యము ద్వారా, మీ ఆత్మలో మీరు చూసే కార్యములే అసలైన కార్యములైయున్నవి! వాక్యమనేది ఆయన ఏమైయున్నాడనేదానిని మరియు నీవు ఏమైయున్నావనేదానిని ప్రతిబింబించే దేవునియొక్క చూపుటద్దమైయున్నది. హల్లెలూయా! ఓ, మై! అది మీకు చెప్తుంది. ఈ లోకములో, నీవు ఎక్కడ నుండి వచ్చావు, నీవు ఎవరివి మరియు నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు అనేదానిని నీకు చెప్పే ఏకైక గ్రంథము ఇది మాత్రమేయైయున్నది. సాహిత్యంలోని ఏ పేజీనైనా, ఎక్కడైనా, విజ్ఞానశాస్త్రము లేదా మరిదేనిలోనైనా, వ్రాయబడిన ప్రతి మంచి పుస్తకములోనైనా నాకు చూపించండి, వాటిలో ఏదియు మీకు చెప్పలేదు. ఇది దేవునియొక్క చూపుటద్దమైయున్నది, అది ఆయన ఏమైయున్నాడో మరియు నీవు ఏమైయున్నావో నీకు చూపిస్తుంది. పిదప, ఆ మధ్యలోనే ఆ రక్త-ధార ఉన్నది, నీవు ఎన్నుకోగోరినట్లైతే నీవు ఏమైయ్యుండగలవో అది చూపిస్తుంది. విషయం అదేయైయున్నది.

113 “ఒక్క ఆత్మ ద్వారా,” ఇప్పుడు, మొదటి కొరింథీ 12. మనము ఆ శరీరములోనికి ఎలా ప్రవేశిస్తాము?

“కరచాలనము చేయుట ద్వారానా?” కాదు, అయ్యా. “సంఘములో చేరుట ద్వారానా?” కాదు, అయ్యా. “వెనుకకు, ముందుకు బాప్తిస్మము పొందుట ద్వారానా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పొందుట ద్వారానా? యేసుక్రీస్తు నామములో పొందుట ద్వారానా? షారోను పుష్పము, లోయలోని పద్మము, ఉదయ నక్షత్రపు నామములో పొందుట ద్వారానా? మీకు కావలసిన దేనిలోనైనా పొందుట ద్వారానా?”

దానితో ఎటువంటి సంబంధమూ లేదు. “అది దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షితో ఇచ్చే ప్రత్యుత్తరం మాత్రమే.” మరి అయినను మనము గొడవ చేస్తాము, మరియు మధనపడతాము, వాదించుకుంటాము, విడిపోతాము, మరియు విభేదాలు కలుగజేసుకుంటాము. అది నిజము. “అయితే అవన్నియు నిర్జీవ క్రియలైయున్నవి.” మనము పరిపూర్ణులమగుటకు సాగిపోవుచున్నాము.

114 నేను చేసిన పనులు అవియే. ఒక సేవకుడు మీకు బాప్తిస్మము ఇచ్చాడు. అతడు మీకు ముందు వైపునకు బాప్తిస్మము ఇచ్చినా, వెనుకకు ఇచ్చినా, మూడుసార్లు, నాలుగుసార్లు, లేదా ఒక్కసారే ఇచ్చినా, లేదా అతడు దానిని ఎలా చేసినా, దానితో ఎటువంటి సంబంధము లేదు. ఎలాగైనా మీరు కేవలం ఆ సంఘముయొక్క సహవాసములోనికి బాప్తిస్మము పొందారంతే, మీరు క్రీస్తుయొక్క మరణమును, సమాధిని మరియు పునరుత్థానమును: నమ్ముచున్నారని ఆ సంఘమునకు, ఋజువు చేయుచున్నారు. రోగులను స్వస్థపరచుటకు, హస్తనిక్షేపణము చేయుట, అది అద్భుతమే, అయితే, అవన్నియు శరీరసంబంధమైనవే, మరియు మీరిప్పుడు జీవిస్తున్నంత వాస్తవంగానే ఆ శరీరము మరలా మరణిస్తుంది. అది మరలా చనిపోతుంది. “ఇప్పుడు మనము వాటన్నిటినీ ప్రక్కన పెట్టి, మరియు పరిపూర్ణులమగుటకు సాగిపోదము.”

115 మనము పరిపూర్ణతలోనికి ఎలా వెళ్తాము? దానినే మనము తెలుసుకొనగోరుచున్నాము.

…క్రీస్తు పరిపూర్ణులనుగా చేసియున్నాడు…

“దేవుడు మనందరి దోషములను ఆయన మీద మోపాడు. మన అతిక్రమక్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడినది, ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.” ఆ శరీరములోనికే మనము వెళ్ళగోరుచున్నాము. ఆ శరీరమే. ఎందుకు? మీరు ఆ శరీరములో ఉన్నట్లైతే, మీరు తీర్పును ఎన్నడూ చూడరు, మీరు మరణమును ఎన్నడూ రుచి చూడరు. మీరు ఆ శరీరములో ఉన్నప్పుడు, మరణము, తీర్పు, పాపము, మరియు మిగతాదానంతటి నుండి విడుదల పొందియున్నారు.

116 “బోధకుడా, దానిలోనికి ఎలా ప్రవేశిస్తారు? ఈ ఆలయములో చేరుట ద్వారానా?” ఇంకనూ, నీవు నశించినట్లే. ఎలాగైనను దీనిలో చేరలేరు; మనము ఎటువంటి పుస్తకమును కలిగిలేము. “దానిలోనికి మనము ఎలా ప్రవేశించగలము? ఏదో ఒక సంఘములో చేరుట ద్వారానా?” కాదు, అయ్యా. “నీవు దానిలోనికి ఎలా ప్రవేశిస్తావు?” నీవు దానిలో జన్మిస్తావు.

117 మొదటి కొరింథీ 12.

ఏలయనగా ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము,…

118 పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా, మనము ఆ శరీరములోనికి బాప్తిస్మము పొంది, మరియు పాపము నుండి విడుదల పొందియున్నాము. దేవుడు ఇకమీదట నిన్ను చూడడు; ఆయన క్రీస్తును మాత్రమే చూస్తాడు. మరియు మీరు ఆ శరీరములో ఉన్నప్పుడు, దేవుడు ఆ శరీరమునకు తీర్పు తీర్చలేడు. ఆయన ఇదివరకే దానికి తీర్పు తీర్చాడు. ఆయన మన తీర్పులను తీసుకొని మరియు మనల్ని లోపలికి ఆహ్వానించాడు. మరియు విశ్వాసము వలన, కృప ద్వారా, మనము నడుస్తూ మరియు మన క్షమాపణను అంగీకరిస్తాము. మరియు పరిశుద్ధాత్మ మనలను ఆయనతో ఈ సహవాసములోనికి తీసుకొనివస్తాడు. “మరియు మనము ఇక ఎంతమాత్రము లోక కార్యములను అనుసరించి నడవము కానీ, మనము ఆత్మలో నడుస్తాము.”

వాక్యము మన యొద్దకు వచ్చి, పురిగొల్పబడ్డాము. నాకు బదులుగా ఆయన మరణించాడు. నేను బ్రతికించబడ్డాను. ఇదిగో నేను ఇక్కడున్నాను, ఒకప్పుడు పాపములో మరియు అపరాధములలో చచ్చియున్న నేను, బ్రతికించబడ్డాను. ఆయనను సేవించవలెనన్నదే నా సమస్త కోరికయైయున్నది. నా ప్రేమ అంతయూ ఆయన కొరకేయైయున్నది. నేను ఎక్కడకు వెళ్ళినా, ఏమి చేసినా, నేను ఆయనను మహిమపరచునట్లు, నా నడకలన్నియు ఆయన నామములో ఉండాలని కోరుచున్నాను. నేను వేటాడుతున్నా గాని, నేను చేపలుపడుతున్నా గాని నేను బంతిని ఆడుచున్నా గాని, ఒకవేళ—ఒకవేళ నేను…నేను ఏమి చేస్తున్నా గాని, “క్రీస్తును నాలో కలిగియున్నవానిగా” నేను ఉండాలి, ఎటువంటి ఒక జీవితముగా ఉండాలంటే, ప్రజలు ఆ విధంగా ఉండాలని పరితపించాలి; మీ సంఘముల గురించి కబుర్లు చెప్పడము, వెక్కిరించడం, మరియు గొడవపడటం కాదు. మీకు అర్థమవుతున్నదా?

“ఒక్క ఆత్మ ద్వారా మనము ఆ శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.” “మరియు నేను రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటి వెళ్ళుదును.”

119 వినండి. దయచేసి, ఇక్కడ కేవలం ఇంకొంచెం ముందుకు చదువుదాము.

…వాటిని తెచ్చువారికి అది ఎన్నడూ సంపూర్ణసిద్ధి కలుగజేయనేరదు.

“ఆలాగు…” 2వ వచనము, 10వ అధ్యాయము.

ఆలాగు చేయగలిగినయెడల వారు వాటిని అర్పించుట మానుదురు గదా?

120 అది ఆ వ్యక్తిని పరిపూర్ణుడిగా చేయగలిగితే…మరి దేవుడు పరిపూర్ణతను కోరుచున్నాడు. ధర్మశాస్త్రములను పాటించుట, ఆజ్ఞలన్నిటినీ పాటించుట, మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసినయెడల, అప్పుడు ఇక—ఇక వేరే దేనినీ కలిగియుండవలసిన అవసరము లేదు; మీరు ఇదివరకే పరిపూర్ణులుగా చేయబడ్డారు. ఎందుకనగా, మీరు పరిపూర్ణులుగా ఉన్నప్పుడు, మీరు నిత్యులైయున్నారు. ఎందుకనగా, దేవుడు ఒక్కడే నిత్యుడైనవాడు, మరియు దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు. మరియు మీరు నిత్యులుగా ఉండుటకుగల ఒకే ఒక్క మార్గమేదనగా, దేవునిలో భాగమైపోవుటయే. [టేపులో ఖాళీగా ఉన్నది—సంపా.]

…ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత…వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఉండదు.

ఏమిటి? “ఒక్కసారే శుద్ధపరచబడిన ఆరాధికునికి, ఇక జ్ఞప్తి ఉండకపోవుటకైయున్నది…” మీరు దాని యొక్క తర్జుమాను వ్రాసినట్లైతే, అది “కోరికయైయున్నది.”

…ఒక్కసారే శుద్ధపరచబడిన ఆరాధికుడు…పాపము కొరకు కోరికను ఇక ఎంత మాత్రము కలిగియుండడు.

…ఆరాధికుడు ఒక్కసారే శుద్ధపరచబడినట్లైతే…

121 ఇప్పుడు నీవు పైకి వెళ్ళి మరియు ఇట్లు చెప్తావు, “ఓ, హల్లెలూయా, గత రాత్రి నేను రక్షించబడ్డాను. అయితే, సరి, దేవా దీవించుము, ఆమె నన్ను పడిపోవునట్లు చేసినది. హల్లెలూయా, ఏదో ఒక రోజు నేను మరలా రక్షించబడతాను.” శిక్షణ లేని ఓ దయనీయమైన అజ్ఞానీ. అది ఆ విధంగా కాదు.

122 “ఆరాధికుడు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత అతని మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు,” అని బైబిలు గ్రంథము చెప్పినది. మనము చదువుచుండగా, ఒక్క నిమిషము, వినండి.

అయితే ఆ బలులు అర్పించుటచేత…ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి.

123 ఇప్పుడు మనము సమయాన్ని ఆదా చేయడానికి, 8వ వచనమును తీసుకొని, మరియు నేను చెప్పగోరుచున్నదాని వద్దకు వెళ్ళడానికి, క్రిందకు వెళ్ళబోవుచున్నాము.

ధర్మశాస్త్ర ప్రకారముగా అర్పించబడే బలులు మరియు అర్పణలు మరియు దహన-బలులు…పాపపరిహారార్థ బలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్టమైనవి కావనియు; పైని చెప్పిన తరువాత;

124 9వ వచనము.

ఆయన, ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు, ఇదిగో నేను వచ్చియున్నాను అని చెప్పుచున్నాడు. ఆ రెండవదానిని స్థిరపరచుటకు…ఆయన…ఆ మొదటి దానిని, అనగా ధర్మశాస్త్రమును, కొట్టివేయుచున్నాడు.

125 దానిపైనే ఉండుటకు మనకు సమయముంటే బాగుండునని కోరుచున్నాను. నీవు ఒక ప్రెస్బిటేరియనుగా, లేదా ఒక పెంతెకొస్తుగా, లేదా బాప్టిస్టుగా, లేదా మెథడిస్టుగా ఉన్నంత కాలము, ఆయన నీతో ఎన్నడూ ఏదియు చేయలేడు. ఆ రెండవదానిని స్థిరపరచుటకు, చూడండి, ఆయన మొదటిగా, దానంతటినీ తీసివేయవలసియున్నది. “మంచిది, నేను ఒక మెథడిస్టును,” అని నీవు చెప్పుచున్నంత కాలం అది కుదరదు. ఆహ్, మెథడిస్టులకు, బాప్టిస్టులకు, పెంతెకొస్తువారికి వ్యతిరేకంగా ఏమీ లేదు. కానీ, సహోదరుడా, అది—అది సరిపోదు. నీవు పరిపూర్ణతలోనికి సాగిపోవలసియున్నది, మరది క్రీస్తులోనికేయై యున్నది.

126 ఇప్పుడు కేవలం ఒక్క నిమిషము, దీనిని గమనించండి.

యేసుక్రీస్తు శరీరము…ఒక్కసారియే అర్పించబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి యున్నాము.

127 హా? మనము కేవలం ఇంక కొంచెం ముందుకు చదివి, దానిని పట్టుకుందాము. మనము చదువుచుండగా దానిని నాననివ్వండి, “ఒక్కసారియే.”

మరియు ప్రతి యాజకుడు అనుదినము నిలబడి సేవచేయుచు, పాపమును ఎన్నటికినీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచుండెను:

ఈయనైతే,…

మీరు సిద్ధంగా ఉన్నారా? అది తప్పిపోకుండా, తిన్నగా హృదయములోనికి వెళ్ళునట్లు, ఇప్పుడు మీరు మీ చొక్కాను తెరచియుంచారా? “కానీ ఈ వ్యక్తి.” ఏ వ్యక్తి? రోముయొక్క పోపు కాదు, మెథడిస్టు సంఘముయొక్క బిషప్పు కాదు, లేదా మరే ఇతర సంఘముయొక్క బిషప్పు కాదు.

కానీ ఈయనైతే, అనగా క్రీస్తు, పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు;

తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను.

గమనించండి. ఇక్కడ అది వస్తుంది.

ఏలయనగా ఒక్క అర్పణచేత ఈయన ప-రి-పూ-ర్ణు-లు-గా చేసాడు, ఈయన పరిపూర్ణులుగా చేసియున్నాడు…

“తరువాతి ఉజ్జీవము వరకా”? అది ఏమి చెప్పినది?

…ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు పరిపూర్ణులుగా చేసియున్నాడు.

మీకు అది అర్థమైనదా? “మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.”

128 ఇప్పుడు హోలీనెస్ ప్రజలైన మీరు ఇట్లంటారు, “ఓ, అవును, మేము పరిశుద్ధతను నమ్ముచున్నాము. హల్లెలూయా! మేము శుద్ధీకరణను నమ్ముతాము.” కానీ మీరు మీ స్వంతదానిని తీసుకొనుచున్నారు. మీరు కేవలం దీనిని ఆపివేస్తారు మరియు దానిని ఆపివేస్తారు. మీకు తెలుసా మీరు దానిని చేయకూడదు.

క్రీస్తు ద్వారమును తెరచి మరియు మీ హృదయమునకు దానిని పురిగొల్పినప్పుడు, మరి మీరు, పాపము మరియు కోరికయు చచ్చి, అదంతయు తొలగిపోయిన ఒక స్థితికి వస్తారు. అప్పుడు, ఆయన తననుతాను మీలో స్థాపించుకొనుటకు, మీ స్వ-నీతిని తీసివేస్తాడు. “మరియు అది మహిమా నిరీక్షణయైనట్టి, దేవుని కుమారుడైన క్రీస్తు, మీలో ఉండుటయైయున్నది.”

…మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము;

129 మనము ఎలా పరిపూర్ణులమవ్వగలము? క్రీస్తుయొక్క మరణము ద్వారా. సంఘములో చేరుట ద్వారా కాదు. మనము చేసే, మంచి క్రియల ద్వారా కాదు. అది మంచిదే. మనము ఈ విధంగా లేదా ఆ విధంగా బాప్తిస్మము పొందుటను బట్టి కాదు. చేతులుంచుట ద్వారా, మనము స్వస్థపరచబడినందుకు కాదు. “మేము మరణము, సమాధి, మరియు పునరుత్థానమును నమ్ముచున్నాము,” అనేటటువంటి ఈ ఇతర కార్యములలో దేనిని బట్టి కాదు.

130 పౌలు ఇట్లన్నాడు, “మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను,” అనగా అర్థమయ్యే భాషలు మరియు గ్రహించబడలేక అనువదించబడవలసియున్న భాషలు, రెండిటిలో మాటలాడినను, “నేను వ్యర్థుడనే. నేను జ్ఞానవరమును కలిగియుండి మరియు దేవునియొక్క జ్ఞానమంతటిని గ్రహించినను,” బైబిలు గ్రంథమును వివరించగలిగి, దానినుండి…దానంతటినీ ముడివేయగలిగినను, “నేను వ్యర్థుడనే.” అలాగైతే బైబిలు గ్రంథమును నేర్చుకొనుటకై, పాఠశాలకు వెళ్ళుటవలన, అంత మేలుయేమీ జరుగదు, కదూ? “కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను…” అటువంటప్పుడు స్వస్థతా సభలు అంత పెద్ద విషయమేమీ కాదు, అవునా? “నేను వ్యర్థుడనే. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను.”

131 “ఓ,” వారు ఇట్లంటారు, “ఆ మనిషి భక్తిగలవాడు.”

132 “కానీ అతడు వ్యర్థుడు,” అని పౌలు అన్నాడు, “ఎన్నడూ ఏమియు కాలేదు.”

133 “ఏలయనగా భాషలున్నను, అవి ఆగిపోవును; ప్రవచనములున్నను, అవి తప్పిపోవచ్చును; ఈ ఇతర కార్యములన్నియు ఉన్నాగాని, అవి విఫలమగును. అయితే ఆ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణము కానిది నిరర్థకమగును.” చూడండి, ఆ “పరిపూర్ణమైనది.” పరిపూర్ణమైనది ఏమిటి? ప్రేమ. ప్రేమ అనగా ఏమిటి? దేవుడు. “ఈ చిన్న నిర్జీవమైన క్రియలను మరియు నియమములన్నిటినీ ప్రక్కకు పెట్టి, మరియు పరిపూర్ణతలోనికి సాగిపోదము.” మీరు దానిని చూశారా? క్రీస్తు ద్వారా మనము పరిపూర్ణులుగా చేయబడుచున్నాము. మనము దానిలోనికి ఎలా ప్రవేశించగలము? పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా.

134 “మంచిది, ఏమి జరుగుతుంది?” మీరు మరణము నుండి జీవములోనికి దాటియున్నారు.

135 “మంచిది, నేను వణకవలెనా, దూకవలెనా, దానిని చేయవలెనా?” నీవు—నీవు ఏమీ చేయనవసరము లేదు. నీవు ఇదివరకే దానిని చేసియున్నావు, దేవుడు నిన్ను మరణము నుండి జీవములోనికి తీసుకొనివచ్చాడు, మరియు నీవు సజీవముగా ఉన్నావు. పిదప నీ జీవితముయొక్క ఫలములు దానిని చూపిస్తాయి.

136 మెథడిస్టులు మరియు నాజరీనులైన మీలో చాలా మంది, మీకు సాధ్యమైనంత గట్టిగా కేకలు వేశారు, మరి ఒక వ్యక్తి పొలములోనుండి మొక్కజొన్నను దొంగిలించారు, అది నిజము, సాధ్యమైన ప్రతిదానిని చేస్తారు.

137 పెంతెకొస్తువారైన మీలో చాలామంది, ఎండిపోయిన ఆవుపేడ మీద పల్లీలు వేస్తున్నట్లుగా, భాషలతో మాట్లాడారు, నిశ్చయంగా, తిన్నగా బయటకు వెళ్ళి మరియు వేరొకరి భార్యతో పారిపోయి, అన్ని రకములైన కార్యములను చేశారు. సహోదరుడా, అది అది కాదు.

138 పరిశుద్ధాత్మ యొక్క స్థానమును తీసుకొనుటకు ఏ ఉద్రేకమునైనా లేదా మరిదేనినైనా కలిగియుండుటకు ప్రయత్నించకండి. నూతన జన్మ వచ్చినప్పుడు, మీరు మార్చివేయబడ్డారు. దానిని నిరూపించుటకు మీరు ఏమియు చేయనక్కర్లేదు. మీరు నడుస్తుండగా, మీ జీవితమే దానిని ఋజువు చేస్తుంది. మీ ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాళుత్వము, సహనము ఋజువు చేస్తాయి. మీరు అదేయైయుంటారు, మరియు లోకము మీలో యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమును చూస్తుంది.

139 ఇప్పుడు, భాషలతో మాట్లాడుట, కేకలు వేయుట, అవి కేవలం ఇటువంటి ఒక జీవితమును వెంబడించే గుణలక్షణములై యున్నవి.

మరియు మీరు తీసుకొని, ఆ గుణలక్షణములను అనుకరించవచ్చు గాని, మరి ఆ జీవితమును ఎన్నడూ కలిగియుండరు. మనము దానిని చూస్తున్నాము. అది నిజమని ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగా, మీకు తెలుసు. నిశ్చయంగా మీకు తెలుసు. మై! మీ చుట్టూ మీరు దానిని చూస్తుంటారు.

140 కావున, మీరు జీవించే మీ జీవితము కాకుండా, పరిశుద్ధాత్మకు ఋజువు అని మీరు చెప్పగలిగేది ఏదియు లేదు. ఇప్పుడు, మీరు భాషలతో మాట్లాడగోరినయెడల, దానిని బలపరచుటకు మీరు ఆ జీవితమును కలిగియున్నట్లైతే అది పరిపూర్ణముగా మంచిదే. అది నిజము. మరియు మీరు కేకలు వేయాలనుకుంటే, మంచిది, అది మంచిదే. నేను కూడా కేకలు వేస్తాను, కొన్నిసార్లు నేను ఎంతగా ఆనందముతో నిండిపోతానంటే ఒక జత బూట్లను కూడా ధరించియుండలేను; నేను వాటి నుండి బయటకు దూకడానికి ఇష్టపడతాను. మరియు అది అద్భుతమైనది. నేను దానిని నమ్ముతాను.

141 నేను దర్శనములు చూశాను, మరియు రోగులు స్వస్థపరచబడుటను, మృతులు లేపబడుటను చూశాను. వారు అక్కడ పడియుండగా వైద్యులు వెళ్ళిపోతూ, “వారి పనైపోయినది మరియు వారు మరణించారు,” అని చెప్పినప్పుడు, కొన్ని గంటలు అక్కడ పడియుండగా; మరియు పరిశుద్ధాత్మ నేరుగా క్రిందకు దిగివచ్చి మరియు ఒక దర్శనమును చూపించి, అక్కడకు వెళ్ళి మరియు ఆ వ్యక్తిని పైకి లేపుటను చూశాను. చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు బాగవుటను, మరియు కుంటివారు నడుచుట నేను చూశాను. అవి…అవి కేవలం గుణలక్షణములైయున్నవి.

142 సహోదరుడా, చాలా కాలము క్రితము, ప్రపంచమనేది అసలు ఒక పునాదిని కలిగియుండుటకు ముందు, దేవుడు తనయొక్క నిత్యమైన కృప ద్వారా, ఆయన క్రిందకి చూశాడు, మరియు ముందుజ్ఞానము ద్వారా ఆయన నిన్ను మరియు నన్ను చూశాడు. మనము ఏ కాలములో జీవిస్తామో ఆయనకు తెలుసు. మనము ఏమైయుంటామో ఆయనకు తెలుసు. కావున, ఎన్నిక ద్వారా, మనము ఆయనతో కూడ మచ్చ లేకుండా ఉండటానికి, జగత్పునాది వేయబడకమునుపే ఆయన మనలను ఎన్నుకున్నాడు.

143 ఇప్పుడు, మచ్చ అనేది లేకుండా ఆయనతో ఉండుటకై జగత్పునాది వేయబడకముందే ఆయన మనలను ఎన్నుకున్నట్లైతే, మరి మనమందరమూ మచ్చతో పుట్టినవారమై, మరియు ఏదియు…ఏదియు మనలను శుద్ధి చేయలేకున్నయెడల, ఏ విధంగా—ఏ విధంగా మనము మచ్చ లేనివారిగా ఉండబోవుచున్నాము? “ఆయన తన అద్వితీయ కుమారుని పంపించాడు, తద్వారా అతనియందు నమ్మికయుంచు ప్రతివాడును జీవమునకు అంతమును కలిగియుండక, నిత్యజీవమును కలిగియుండుటకై యున్నది; ఎన్నడూ నశింపక, నిత్యజీవమును కలిగియుండుటకై యున్నది.” పిదప మనము ఆయనలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనలను పిలుచుటను బట్టి, విశ్వాసము ద్వారా, కృపచేతనే మనము రక్షించబడియున్నాము.

144 ఈ భూమి మీద ఒక శరీరమనేది ఉండుటకుముందే, మీ శరీరములు ఇక్కడ పడియున్నవి. అది కాల్షియంనుండి, పొటాషియంనుండి, తేమనుండి, కాస్మిక్—కాస్మిక్ వెలుగునుండి, పెట్రోలియంలు, మరియు మొదలగు పదహారు మూలకముల నుండి చేయబడినది. మరియు పరిశుద్ధాత్మ భూమి మీద పొదుగుట ప్రారంభించెను, “అల్లాడుచుండెను.” మరియు అది అట్లు చేసినప్పుడు, మొదటి విషయము ఏమిటో మీకు తెలుసా, ఒక చిన్న ఈస్టరు పుష్పము పైకి వచ్చినది. పిదప ఆయన కొంత గడ్డిని, కొన్ని పక్షులను కలుగజేశాడు, మరియు కొంతసేపటి తరువాత, ఒక మానవుడు ముందుకు వచ్చాడు.

145 ఇప్పుడు, ఆయన భూమియొక్క ధూళినుండి ఒక స్త్రీని ఎన్నడూ తయారు చేయలేదు. ఆరంభము నుండి; ఆమె అదివరకే ఒక పురుషుడై యున్నది, పురుషుడు మరియు స్త్రీ ఒక్కటైయున్నారు. కావున ఆయన ఆదాము ప్రక్క నుండి, ఒక ప్రక్కటెముకను తీసుకొని, మరియు ఒక స్త్రీని, అతని కొరకు ఒక సాటియైన సహాయమును కలుగచేశాడు. మరియు అప్పుడు పాపము లోపలికి ప్రవేశించినది. పిదప పాపము లోపలికి ప్రవేశించిన తరువాత…

146 ఏమి జరిగినా గాని, దేవుడు ఓడించబడడు. ఆయన ఎన్నడూ ఓడించబడడు. పిదప, స్త్రీలు మనుష్యులను భూమి మీదకు తీసుకొనిరావడం ప్రారంభించారు. మరియు దేవుడు, నిత్యమైన కృప ద్వారా, ఎవరు రక్షింపబడతారో చూశాడు, మరియు ఆయన నిన్ను పిలిచాడు. “మొదటిగా, నా తండ్రి వానిని పిలిస్తేనే గాని, ఎవడును నా యొద్దకు రాలేడు.” “పొందగోరువాని వలనైనను, ప్రయాసపడువాని వలనైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును.”

147 నీవు ఇట్లంటావు, “మంచిది, నేను దేవుడిని వెదికాను. నేను దేవుడిని వెదికాను.” లేదు, నీవు ఎన్నడూ వెదకలేదు. దేవుడే నిన్ను వెదికాడు. ఆరంభములో అది ఆ విధంగానే ఉండినది.

148 “ఓ తండ్రీ, తండ్రీ, నేను పాపము చేసియున్నాను. నీవు ఎక్కడ ఉన్నావు?” అని ఆదాము చెప్పుచుండలేదు.

149 “ఓ ఆదామా, ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు?” అని తండ్రియే అడుగుచున్నాడు. అదియే మనుష్యునియొక్క స్వభావమైయున్నది. అదియే మనుష్యునియొక్క వైఖరియైయున్నది. దానితోనే అతడు తయారు చేయబడ్డాడు.

150 “నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. మరియు నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ…” హల్లెలూయా! “వచ్చువారందరికీ, నేను వారికి నిత్యజీవమునిచ్చెదను, మరియు అంత్యదినమున నేను వానిని లేపుదును.” పరలోకపు దేవుడు చేసిన, ఎటువంటి ధన్యకరమైన, ఎటువంటి ఒక ధన్యకరమైన వాగ్దానము కదా! ఈ రాత్రి మనము అక్కడికి వస్తాము, అక్కడ, “ఆయన తనతోడని ప్రమాణము చేసియున్నాడు.” అంతకంటే గొప్పవారెవరునూ లేరు. మీరు మీకంటే ఎవరైనా గొప్పవారి మీద ప్రమాణము చేస్తారు. గొప్పవారెవరునూ లేరు, కావున దేవుడు తనపైతానే ప్రమాణము చేసాడు. మనము దానిలోనికి వెళ్ళుచున్నాము, ఆయన దానిని ఎలా చేశాడు మరియు ఆయన దానిని ఎప్పుడు చేశాడు చూస్తాము; మరియు ఆయన మనలను లేపి మరియు మనలను తన స్వంత స్వాస్థ్యముగా చేస్తాడని, ఆయన తనపైతానే ఒట్టుపెట్టుకున్నాడు.

151 ఓ, ఈ ఉదయమున, మనము ఎంత పరిపూర్ణముగా మరియు దృఢముగా నిలబడగలము కదా! మీరు ఏ విధంగా చూడగలరు కదా, మరణము నేరుగా మీ ముఖములోనికి తేరి చూస్తున్నట్లైతే, మీరును పౌలు వలె చెప్పగలరు, “మరణమా, నీ ముల్లు ఎక్కడ? సమాధీ, నీ విజయమెక్కడ? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మనకు విజయమును అనుగ్రహించు దేవునికి కృతఙ్ఞతలు చెల్లునుగాక.” అక్కడే నీవున్నావు. ఎందుకు?

152 “ఓ, నీవు ఫలానా-మరియు-ఫలానా దానిని చేశావు.”

153 “నాకు అది తెలుసు, కానీ నేను ఆయనయొక్క రక్తము చేత కప్పబడియున్నాను.” హల్లెలూయా!

154 “ఒక్క ఆత్మ ద్వారా, మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.” మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియనులైన మీరు, మీరు ఎవరైనప్పటికీ, మనము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. మనము సహవాసమును కలిగియున్నాము, మరియు మనము దేవుని రాజ్యపు పౌరులమైయ్యుండి, “మేము ఈ లోక సంబంధులము కాము,” అని చెప్పుకొనుచున్నాము.

155 ఒక రోజున, నా చిన్న అమ్మాయి వచ్చి, ఇట్లన్నది, “డాడీ, ఈ చిన్న అమ్మాయి ఫలానా-మరియు-ఫలానాదానిని చేసినది. మరియు వారు ఫలానా-మరియు-ఫలానాదానిని చేశారు. మేము ఆ ఇంటికి వెళ్ళాము. వారు ఫలానా-మరియు-ఫలానాదానిని చేశారు.” నేనన్నాను…ఇట్లన్నది, “మనము ఎందుకని దానిని చేయము?”

156 నేను ఇట్లు చెప్పాను, “ప్రియా, మనము ఆ లోకసంబంధులము కాము. వారు తమమట్టుకు తాము ఒక ప్రపంచములో జీవిస్తారు.”

157 ఇట్లన్నది, “మనమందరము ఒకే నేల మీద నడవటం లేదా?”

158 నేను ఇట్లు చెప్పాను, “ప్రియా, లోకసంబంధులు. మనము ఆ ప్రజలకు సంబంధించినవారము కాము.”

159 బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, “వారిలోనుండి బయటకు వచ్చి, మీరు వేరుపరచుకొని యుండండి, అని దేవుడు చెప్పుచున్నాడు.” చూడండి, మీరు దానికి చెందినవారు కారు. మరియు ఆ నూతన స్వభావము మీలోపలికి వచ్చినప్పుడు, మీరు బయటకు లాగబడవలసిన అవసరములేదు. లోతు భార్యవలె, మీరు వెనుకకు వెళ్ళగోరరు. మీరు, దానికి వెలుపల జన్మించారు. మరియు మీరు వేరొక పరిమాణములో ఉన్నారు. మరియు అది మీకు చెత్తలాగా కనబడుతుంది.

మరియు మనము జీవించుచున్న, ఈ గొప్ప, అద్భుతమైన అమెరికా, దానితో నిండిన ఒక పెద్ద గందరగోళముగా మారియున్నది. విషయమంతా కామము మరియు స్త్రీలే. మరియు స్త్రీలు, వారు వస్త్రధారణ చేసుకునే విధానము, పురుషులు వారు ప్రవర్తించే విధానము, మరియు—మరియు వారు చేస్తున్న కార్యములు ఉండగా, మరియు పిదప తమను తాము “క్రైస్తవులు,” అని పిలుచుకుంటున్నారు.

160 ఉదాహరణకు, ఈ ఎల్విస్ ప్రెస్లీ, ఇప్పుడు వెళ్ళి పెంతెకొస్తు సంఘములో చేరాడు. అవును, యూదాకు…ముప్పై వెండి నాణెములు లభించినది అక్కడేయైయున్నది. ఎల్విస్ తన జన్మహక్కులను అమ్ముకున్నందుకు, కుప్పలు కుప్పలుగా కాడిలాక్స్ కార్లను, మరియు ఒక—కొన్ని మిలియన్ డాలర్లను పొందుకున్నాడు. ఆర్థర్ గాడ్ ఫ్రే. దానివైపు చూడండి.

161 ఇక్కడ లూయిస్విల్ లో జిమ్మీ ఆస్బార్న్ ను చూడండి, అక్కడ ఆ పాత బూగీ-వూగీ, రాక్-అండ్-రోల్ సంగీతముతో, పాత బుద్ధిహీనమైనదానితో మరియు ఆ మురికితో ఉన్నాడు. మరియు ఆదివారము ఉదయమున, బైబిలు గ్రంథమును తీసుకొని వేదిక మీద నిలబడి మరియు బోధిస్తాడు. ఎంత అవమానకరము!

“ప్రతీ బల్లయు వాంతులతో నిండియున్నది,” అని బైబిలు గ్రంథము చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఎందుకు, మనము ఒక భయంకరమైన దినములో జీవించుచున్నాము!

162 మరియు “ఓ, వారు చాలా భక్తిపరులు,” అని ప్రజలు అంటుంటారు, ఓ! దయ్యము కూడా భక్తిపూర్వకమైనదని మీకు తెలియదా? కయీను కూడా సరిగ్గా హేబెలు వలెనే భక్తిపరుడని మీకు తెలియదా? కానీ, అతనికి ప్రత్యక్షత లేదు. అదంతే. అతనికి ప్రత్యక్షత లేదు.

అవునండీ, మనమందరమూ సంఘానికి వెళ్తాము, కానీ కొందరే జీవమును కలిగియున్నారు, వారు మాత్రమే తమ హృదయములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను కలిగియున్నారు. వణుకుట ద్వారా, గెంతుట ద్వారా కాదు, సంఘములో చేరుట ద్వారా కాదు. కానీ, దేవుడు అతనికి బయలుపరచుకున్న, ప్రత్యక్షతద్వారాయై యున్నది.

163 ఏమి చెప్పబడినదో చూడండి, “మనుష్యకుమారుడనైన నేను, ఎవనినని, జనులు చెప్పుకొనుచున్నారు?”

164 “కొందరు నీవు ‘ఒక ప్రవక్తవని’ చెప్పుచున్నారు. మరియు కొందరు నీవు ‘ఏలీయావని’ చెప్పుచున్నారు. మరికొందరు…”

ఇట్లు అడిగాడు, “మీరైతే ఎవడినని చెప్పుకొనుచున్నారు?”

165 పేతురు ఇట్లన్నాడు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన, క్రీస్తువు.” అది అతని పెదవుల నుండి వచ్చినది కాదు.

166 అందుకాయన ఇట్లన్నాడు, “యోనా కుమారుడవైన, సీమోనూ, నీవు ధన్యుడవు, ఏలయనగా రక్తమాంసములు ఎన్నడూ దీనిని బయలుపరచలేదు. బైబిలులోని కొన్ని—కొన్ని నీతి శాస్త్రములలో, లేదా ఏదో ఒక వేదాంత సెమినరీలో నీవు ఎన్నడూ దీనిని నేర్చుకోలేదు. నీవు ధన్యుడవు, ఏలయనగా రక్తమాంసాలు దీనిని నీకు బయలుపరచలేదు. కానీ పరలోకమందున్న నా తండ్రియే దీనిని బయలుపరిచాడు. మరియు ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.”

167 ఈ ఉదయమున, నీవు ఒక సంఘమునకు చెందినందుకు, నీవు ఒక క్రైస్తవుడవైతే, నీవు నశించినట్లే. నీవు మరణము నుండి జీవములోనికి దాటినందుకు, నీవు ఒక క్రైస్తవుడవైతే, నీవు తీర్పునుండి విడుదల పొందియున్నావు; నీవు క్రీస్తులోనికి, అన్నివేళలా పరిపూర్ణుడవగుచున్నావు. దేవుడు ఒక్క విషయాన్ని కూడా చూడలేడు. నీవు ఇట్లంటావు, “సరే, నేను ఎన్నడైనా పొరపాటును చేస్తానా?” నిశ్చయంగా, అయితే నీవు దానిని బుద్ధిపూర్వకంగా చేయవు.

168 ఇప్పుడు కేవలం కొన్ని నిమిషములలో, మనము దానిలోనికి వెళ్ళుచున్నాము, “ఏలయనగా సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేయువానికి, పాపములకు బలి ఇకను ఉండదు.” ఈ రాత్రి మనము దానిలోనికి వెళ్తాము, ఎందుకనగా ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆలస్యమైయున్నది.

169 దీనిలో కేవలం మరికొన్ని వచనములను మనము చదువుదాము, తద్వారా మనము మరికొంచెం పొందుకొనుటవలన మంచి అనుభూతిని పొందగలము. మంచిది. సరే, ఈ రాత్రే మనము దానిని ప్రారంభించుదాము, 4వ వచనము. దీనిని వినండి.

ఏలయనగా ఒకసారి వెలిగింపబడి, మరియు…మరియు…శక్తిని, పరలోకసంబంధమైన వరములను రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై,

మరియు…దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగసంబంధమైన శక్తిని అనుభవించిన తరువాత,

తప్పిపోయినయెడల, మారుమనస్సు పొందునట్లు…తమనుతాము మరలా నూతనపరచుట అసాధ్యము;…

చూశారా? మరియు ఇది ఏమిటో చూపించుటకు, మనము దానిని హెబ్రీ 10 లోనికి తీసుకెళ్తాము, మరియు ముందుకు వెళ్ళి వెనుకకు వస్తూ ఉంటాము.

170 స్నేహితులారా, “మనము పరిపూర్ణతలోనికి సాగిపోదము.” మనము…మనము లేదు…ఈ రోజు మనము ఎటువంటి మినహాయింపు లేకుండా ఉన్నాము. మనకు, అసలు ఎటువంటి మినహాయింపు లేదు. ఈ చివరి దినమున పరలోకపు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మరియు ఇదివరకు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆయన భూమి మీదనున్నప్పుడు చేసిన అవే క్రియలను, ఇప్పుడు చేయుచున్నాడు. మనము ఈ బైబిలు గ్రంథముగుండ వచ్చుచుండగా, ఆయన నిరూపించాడు. మరియు మీరు—మీరు, తరగతిలోని వారలారా, ఈ విషయమును ఎరిగియుండండి, అదేమిటనగా, ఆయన అరణ్యములో పిల్లలతో చేసినట్టి ఆశ్చర్యకార్యము వెంబడి ఆశ్చర్యకార్యమును, సూచన వెంబడి సూచనను, మరియు అద్భుతము వెంబడి అద్భుతమును, ఆయన చేసిన కార్యములను మరియు సూచనలను; ఆయన ఇక్కడ భూమి మీద ఉండి, శరీరములో ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆయన చేసిన కార్యములను మనము తీసుకున్నాము; మరియు సరిగ్గా అవే కార్యములు ఈనాడు సరిగ్గా మన మధ్య జరుగుచున్నవి. దానిని నిర్ధారించుటకు ఇదిగో వాక్యము ఇక్కడున్నది. అది సరియైనదని చెప్పుటకు, దానిని సరియైనదిగా చేయుటకు విషయం ఇక్కడున్నది. అదే కార్యమును చేయుటకు దేవుని ఆత్మ ఇక్కడున్నది, కాబట్టి మనము ఎటువంటి మినహాయింపు లేకుండా ఉన్నాము.

మనము ప్రార్థించుకుందాము.

171 పరలోకపు తండ్రీ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మమ్మల్ని ఆవరించియుండుటను చూస్తుండగా, మేము ప్రతీ మాటను, ప్రతిదానిని, ప్రతి తప్పిదమును, ప్రతీ చెడ్డమాటను, చెడుగా-పలుకబడిన ప్రతి మాటను, ప్రతీ తలంపును ప్రక్కకు పెట్టి, “మరియు మా విశ్వాసమునకు కర్తయు దానిని ముగించువాడునైన ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుచు, మా యెదుట ఉంచబడిన పందెములో, ఓపికతో పరుగెత్తనిమ్ము.” ఓ, ఆయనయొక్క అత్యంత సాటిలేని పరిశుద్ధమైన నామము స్తుతింపబడును గాక! పడిపోయిన మానవుడిని విమోచించి, మరియు వారిని తిరిగి ప్రభువైన దేవునితో సహవాసములోనికి తెచ్చుటకు ఆయన ఏ విధంగా భూమి మీదకు వచ్చాడో కదా. మరియు దీనిని బట్టి మేము నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాము. మరియు ఇప్పుడు ఆయన కృప ద్వారా…మేము ఎన్నడూ ఆయనను ఎన్నుకోలేదు గాని, ఆయనే మమ్మల్ని ఎన్నుకున్నాడు. “మీరు నన్ను ఎన్నుకోలేదు గాని, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను,” అని ఆయన చెప్పాడు. ఎప్పుడు? “జగత్తుకు పునాది వేయబడకమునుపేయై యున్నది.”

172 మరియు, ప్రియమైన దేవా, సంవత్సరముల తరబడి దీనిని వాయిదా వేస్తుండగా, మరి అయినను వారి హృదయము వద్ద స్థిరముగా ఒక చిన్న తట్టుటను కలిగియున్నవారు, ఈ ఉదయమున ఇక్కడ కూర్చొనియుండవచ్చును. “మంచిది, అంతా బాగౌతుంది,” అని అనుకుంటూ బహుశా వారు సంఘములో చేరియుండవచ్చును. తండ్రీ, నిశ్చయంగా, ఈ ఉదయము లేఖనములు దానిని వివరించినవి: మేము సంఘము వెనుక దాగుకొని, నీతిమంతులుగా ఉండలేమని; మంచివారమైయుండి, అబద్ధమాడక మరియు దొంగిలించక, మరియు ఏ చెడు చేయకున్ననూ, ఇంకనూ నీతిమంతులుగా ఉండలేమని వివరించినవి.

173 మాకు ఒకే ఒక్క నీతి ఉన్నది, అది మా స్వనీతి కాదు గాని, ఆయనయొక్క నీతియేయైయున్నది. ఆయన మా రక్షణను పరిపూర్ణము చేశాడు. అందువలన, ఆయనలో ఉండుటనుబట్టి, దేవుడు మా పొరపాట్లను చూడడు. మేము ఏదైనా తప్పు చేసినప్పుడు, “ఓ తండ్రీ, నన్ను క్షమించుము!” అని కేక వేసే ఒక ఆత్మ, మాలో ఉన్నది. అప్పుడు దేవుడు దానిని చూడడు. మరియు అది ఏమిటనగా, మేము ఆయనతో సహవాసములోనికి మరియు కృపలోనికి తీసుకొనిరాబడ్డాము. ప్రభువా, మేము ఈ కూటమును ముగించుచుండగా, క్రీస్తు నామములో, దానిని అనుగ్రహించుము. ఆమేన్.

174 ఒక్క క్షణము, నేను మిమ్మల్ని అడుగగోరుచున్నాను. మీరు ఏమి చేసినా గాని, మీరు నశించినవారే. దీనిని వినండి. కొంత కాలము క్రితం…నేను దీనిని ఇంతకుమునుపు చెప్పియుండవచ్చును. ఇదిగో నాకు జరిగిన ఒక చిన్న అనుభవమును చెప్పుచున్నాను.

175 నేను ఓహియోలోని, టొలీడో వద్ద—వద్దనున్నాను. నేను ఒక ఉజ్జీవములో ఉన్నాను మరియు—మరియు అక్కడ ఒక కూటమును కలిగియుంటున్నాను మరియు అనేకమంది ప్రజలు ఉన్నారు. నేను ఉన్న హోటళ్ళను వారు ఎరిగియున్నారు; కాబట్టి వారు నన్ను ఆ ఊరిలోనికి తీసుకొనివెళ్ళారు. నేను అక్కడ ఒక చిన్న హోటల్ లో ఉన్నాను.

176 మేము ఒక చిన్న డంకర్డ్ అను రెస్టారెంటులో భోజనం చేస్తూ ఉన్నాము. అది ఒక అద్భుతమైన స్థలమైయున్నది, అక్కడున్న చిన్న స్త్రీలు, సరిగ్గా క్రైస్తవులుగా మరియు ఎంతో పరిశుద్ధులుగా అగుపించుచున్నారు, శుభ్రంగా మరియు చక్కగా ఉన్నారు. ఆదివారము వచ్చినది, నాకు ఆకలి వేసింది. నేను కొద్దిగా ఉపవాసముండియున్నాను. మరియు నేను వీధిని దాటి మరొక వీధికి వెళ్ళి, కొద్దిగా ఆర్డర్ చేయగోరాను. అక్కడ మూలన ఉన్న ఒక చిన్న దారి ఉన్నది, మరియు తినడానికి, ఒక సాధారణమైన, మామూలు, అమెరికా స్థలము అక్కడున్నది. చిన్నది, రాత్రంతా తెరవబడియుండే, ఒక చిన్న స్థలము, ఒక చిన్న భోజనశాల ఉన్నది. ఆ ఆదివారమున మధ్యాహ్నము దాదాపు రెండు గంటల సమయంలో, నేను అక్కడికి నడిచి వెళ్ళినప్పుడు, ఆ మధ్యాహ్నము బోధించుటకు వెళ్ళడానికి ముందు, నేను ఎంతో అలసిపోయాను, ఏమి చేయాలో నాకు తెలియలేదు.

177 నేను లోపలికి వెళ్ళాను, మరియు మొట్టమొదట నేను గమనించిన విషయమేదనగా పదహారు, పద్దెనిమిది సంవత్సరాల వయస్సుగల ఒక యవ్వనస్థురాలు, ఎవరో ఒక తండ్రియొక్క ప్రియమైన బిడ్డ, ఎవరో ఒక తల్లియొక్క ప్రియమైన బిడ్డ, తన చేతులను తన నడుము మీద పెట్టుకొని, ఒక అబ్బాయితో ఆ వెనుక నిలబడియున్నది. ఆ—ఆ కౌంటరు వద్ద యవ్వన-స్థుల గుంపు కూర్చొనియున్నారు.

178 ఒక స్లాట్ మెషీన్ చప్పుడు నాకు వినిపించినది. ఇటువైపు చూశాను, మరియు అక్కడ ఒక పోలీసు ఒక స్త్రీపై, ఇక్కడ, ఆమె నడుముపై చేయివేసి నిలబడియున్నాడు, మరియు, ఒక స్లాట్ మెషీన్ ఆడుచున్నాడు. ఇప్పుడు, ఇక్కడున్న బకై ప్రజలైన మీకు, ఓహియోలో జూదమాడుట మరియు స్లాట్ మెషిన్ ఆడుట చట్ట విరుద్ధమని మీకు తెలుసు. మరియు అది చట్టవిరుద్ధమని మీకు తెలుసు. మరియు ఇదిగో ఇక్కడ చట్టమే, ఆ స్లాట్ మెషీన్ను ఆడుచున్నది; మరి నా వయస్సుగల ఒక పురుషుడు, బహుశా వివాహితుడైయ్యుండి, గుంపు పిల్లలను కలిగియుంటాడు, బహుశా ఒక తాతయై యుండవచ్చును. ఒక పోలీసు, రోడ్డు గస్తీచేయువాడైయుండి, స్లాట్ మెషీన్ను ఆడుచున్నాడు. అక్కడ ఆ యవ్వనస్థు…ఒక యౌవ-నస్థుడు చేసినది ఏమిటి? ఇది చేసినది ఏమిటి?

179 నేను అక్కడ నిలబడ్డాను. నేను లోపలికి రావడం ఎవరూ గమనించలేదు, వారు చాలా బిజీగా ఉన్నారు, వారిలో సగంమంది త్రాగి ఉన్నారు. అయితే, నేను గమనించాను. “మంచిది, వర్షము రుబార్బు మొక్కకు సమస్య కలిగిస్తుందని, మీరు అనుకుంటున్నారా?” అని ఎవరో అనడం నేను విన్నాను. మరియు ఇటువైపు తిరిగి చూశాను, మరియు అక్కడ ఒక స్త్రీ కూర్చొనియున్నది, ఒక వృద్ధురాలు, చాలా…ఆమె అరవై-ఐదు, డెబ్బైకి, దగ్గరగా ఉంటుంది. మరియు ఆ స్త్రీ…ఎవరైనా మంచిగా కనబడుచున్నందుకు నేను వారిని నిందించను. కానీ ఎప్పుడైతే ఆమె…ఆమె తననుతాను సిద్ధపరచుకొని, తన తలవెంట్రుకలను నీలిరంగుగా చేసుకొని, ఎంతో-నీలముగా కనబడునట్లు చేసుకున్నది. మరియు దానినంతా, పైవరకు కత్తిరించుకొని, మరియు దానిని చాలా నీలి రంగుగా చేసుకున్నది. మరియు ఆమె తన ముఖము మీద చాలా దట్టమైన మ్యానిక్యూర్ ను, లేదా మీరు దానిని ఏమని పిలుస్తారో దానిని కలిగియున్నది, మరియు పెద్ద మచ్చలున్నవి. మరియు ఆమె చిన్న పొట్టి లాగులను వేసుకొనియున్నది, మరియు ఆ వృద్ధురాలు ఎంతగా ముడతలు పడియుందంటే, ఆ చర్మము, మాంసము, ఆ చర్మము ఆమె కాళ్ళ మీదుగా అలా వ్రేలాడుచున్నది. మరియు ఆమె త్రాగియున్నది. ఆమె అక్కడ ఒక వృద్ధునితో కూర్చొనియున్నది, మరియు అది వేసవి కాలమైయున్నది, అతడు ఈ పాత, బూడిద రంగు, లేదా ఆకుపచ్చరంగు సైనికుల కోటులలో ఒకదానిని ధరించియున్నాడు. అది ఆ విధంగా క్రిందికి వ్రేలాడుచున్నది, మరియు అతని మెడచుట్టూ ఒక పెద్ద స్కార్ఫు ఉన్నది. వారిద్దరూ, త్రాగేసియున్నారు, మరియు వారు ఈ దయనీయమైన వృద్ధ స్త్రీతో ఉన్నారు.

180 నేను అక్కడ నిలబడి చుట్టూ చూశాను. నేను ఇట్లన్నాను, “దేవా, నీవు దానిని ఎలా తట్టుకోగలుగుచున్నావు? ఏమిటి—ఏమిటి…అటువంటి ఒకదాని వైపు నీవు ఎలా చూస్తున్నావు? కృప ద్వారా రక్షించబడినట్టి ఒక పాపినైన నన్ను, అది ఆ విధంగా ఆలోచింపజేస్తే, నీవు ఎలా—దానివైపు చూడగలుగుచున్నావు? ఏమిటీ, నీవు దానిని పేల్చివేయుదువు అన్నట్లుగా కనబడుచున్నది. నా చిన్న రిబ్కా మరియు శారా అటువంటి ఒక ప్రభావము క్రింద పెరగవలసియుంటుందా? ఎక్కడైతే ప్రజలు ఆ—ఆ విధంగా ప్రవర్తిస్తారో, ఈనాటివలె, ప్రాఖ్యాతిగాంచినది అని తెలియబడుచున్న అటువంటి ప్రపంచమును నా ఇద్దరు చిన్నారులు ఎదుర్కోవలసి యుంటుందా? దేవా, నేను ఎన్నడైనా ఎలా…నేను ఏమి చేయగలను?”

అవును, అది ఆయన కృపయే. వారు నిత్యజీవమునకు నిర్ణయించబడియున్నట్లైతే, వారు దానియొద్దకు వస్తారు. వారు నిర్ణయించబడకపోతే, వారు రారు. నాకు తెలియదు. అది దేవుని ఇష్టము. నా వంతు నేను చేస్తాను.

181 నేను ఇట్లనుకున్నాను, “దేవా, నీవు దానిని ఎలా తట్టుకోగలుగుచున్నావు? నీవు ఎంతో పరిశుద్ధుడవు గనుక నీవు దానిని అసలు భూమి మీదనుండి తుడిచివేస్తావన్నట్లు కనబడుచున్నది.” నేను ఇట్లన్నాను, “అక్కడ కూర్చొనియున్న ఆ దయనీయమైన అమ్మమ్మను చూడుము. ఆ వెనుక అక్కడున్న ఆ యవ్వనస్థురాలిని చూడుము. మరియు ఇదిగో ఇక్కడ ఒక స్త్రీ నిలబడియున్నది, దాదాపు ఇరవై-ఐదు సంవత్సరముల వయస్సు కలిగియుంటుంది. మరియు ఆ పోలీసు ఆమె నడుము మీద అతని చేతులు వేసి, స్లాట్ మెషీన్ను ఆడుచున్నాడు. మరియు అక్కడే చట్టమున్నది; దేశం పనైపోయినది. అక్కడ మాతృత్వం పనైపోయినది. ఇక్కడ పెద్దవారి పనైపోయినది. మరియు అక్కడ ఆ వెనుక ఒక యవ్వనస్థురాలు కూర్చొనియున్నది, మరియు ఆమె పనైపోయినది. వారు సంఘములోనో లేదా ఇంకెక్కడో ఉండవలసియుండగా, ఆ అబ్బాయిలను చూడుము.”

182 నేను ఇట్లన్నాను, “ఓ దేవా, నేను ఏమి చేయగలను? మరియు నేనేమో ఇక్కడ ఈ పట్టణములో ఉన్నాను, నా హృదయమంతటితో కేకవేయుచున్నాను, మరి వారు దానిని పట్టించుకోకుండా వెళ్ళిపోవుచున్నారు…” నేను ఇట్లనుకున్నాను, “సరే, దేవా?”

183 సరి, అప్పుడు ఒక ఆలోచన వచ్చినది, “నేను వారిని పిలువనియెడల, వారు ఎలా రాగలరు? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వచ్చెదరు. ‘మీకు కన్నులున్నవి కానీ మీరు కానలేరు, చెవులున్నవి కానీ మీరు వినలేరు.’”

184 నేను ఇట్లనుకున్నాను, “మంచిది, ఉజ్జీవమునకు బదులు అధ్యక్షుడు పట్టణమునకు వస్తే, ప్రతి ఒక్కరూ బయటకు వస్తారు. ఓ, నిశ్చయంగా, అది లోకసంబంధమైనది.”

185 అప్పుడు, నేను ఇలా ఆలోచించడం ప్రారంభించాను, “సరి, దేవా, నీవు ఎందుకుని, వచ్చి, యేసును పంపి, మరియు దానిని ముగించకూడదు? కేవలం—కేవలం వెళ్ళి మరియు దానినంతా పూర్తిచేసి, మరియు దానిని ముగించవచ్చు కదా?”

186 అప్పుడు ఏదో నా ముందు కదలాడుటను నేను చూసాను. అది ఒక చిన్న సుడిగాలి ఈ విధంగా వెళ్ళుచున్నట్లు కనిపించినది. నేను దానిని గమనిస్తూనే ఉన్నాను. ఒక ప్రపంచము తిరుగుతూ ఉండటాన్ని నేను చూశాను. నేను దానిని గమనించాను, మరియు దానిపై ఏదో చిమ్మిపడుతూ ఉన్నది. నేను చూశాను, మరియు అది, కెంపువలెనున్న, ఎర్రని రక్తమైయున్నది, ప్రపంచమంతటా చిమ్మిపడుతూ ఉన్నది; ఒక తోకచుక్కవలె, ఒక సుడిగాలి చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉన్నది, మరియు చుట్టూ అది ఈ విధంగా ఒక సుడిగాలిని కలిగియున్నది. మరియు నేను ఈ సుడిగాలి వైపు చూశాను. మరియు సరిగ్గా దానికి పైగా, నేను దర్శనములో యేసును చూశాను. ఆయన క్రిందకు చూచుచున్నాడు. మరియు నేను ఇక్కడ భూమి మీద నిలబడి, నేను చేయకూడని కార్యములను చేయుటను నేను చూశాను. మరియు నేను పాపము చేసిన ప్రతిసారి, దేవుడు నన్ను చంపియుండేవాడే, “ఎందుకనగా, నీవు దానిని తిను దినమున, నీవు చచ్చెదవు.” మరియు దేవునియొక్క పరిశుద్ధత మరియు న్యాయము దానిని కోరుచున్నది, మరియు నీవు చనిపోవలసియున్నది. మరియు అప్పుడు నేను అక్కడ చూశాను. నేను నా కళ్ళను రుద్దుకుంటూ ఉన్నాను. నేను ఇట్లన్నాను, “నేను…నేనెన్నడూ నిద్రపోలేదు. నేను…ఇది ఒక దర్శనమైయున్నది. ఇది నిశ్చయంగా ఒక దర్శనమే.”

187 నేను ఆ తలుపు వెనుక నిలబడియుండగా, నేను గమనిస్తూనే ఉన్నాను. మరియు నా స్వంత పాపములు పైకి రావడాన్ని నేను చూశాను. మరియు అవి సింహాసనమును తాకడం ప్రారంభించిన ప్రతీసారి, ఆయన రక్తము ఒక కారుకు ఉన్న బంపరువలె పని చేయుచున్నది. అది దానిని పట్టుకొని, మరియు అది కుదిపివేయబడుటను నేను చూశాను, మరియు రక్తము ఆయన ముఖము మీదుగా కారుచుండినది. మరియు ఆయన తన చేతులను పైకెత్తి, మరియు “తండ్రీ, అతడిని క్షమించుము, అతడేమి చేయుచున్నాడో అతనికి తెలియదు,” అని చెప్పడాన్ని నేను చూశాను.

188 నేను మరొకదానిని చేయడం నేను చూశాను, బంప్ అంటూ, అది ఆయనను మరలా కుదిపివేసినది. అది, సరిగ్గా అప్పుడే దేవుడు నన్ను చంపియుండేవాడు, కానీ ఆయన రక్తము నన్ను పట్టుకొనుచున్నది. అది నా పాపములను పట్టుకొనుచున్నది. “ఓ దేవా, నేను దానిని చేశానా? నిశ్చయంగా అది నేను కాదు,” అని నేను అనుకున్నాను. కానీ అది నేనే.

189 పిదప నేను ఆ గదిలోనుండి వెళ్తున్నట్లు, నేను ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాను, మరియు నేను ఆయనకు దగ్గరగా నడిచివెళ్ళాను. అక్కడ ఒక పుస్తకము ఉండటాన్ని నేను చూశాను, దాని మీద నా పేరు ఉన్నది, మరియు దానికి అడ్డంగా అన్ని రకాల నల్లని అక్షరాలు వ్రాయబడియున్నవి. నేను ఇట్లన్నాను, “ప్రభువా, నేను దీనిని చేసినందుకు నన్ను క్షమించుము. నీవు దానిని చేయుటకు నా పాపములే కారణమైనవా? నేనే ప్రపంచమంతటా నీ రక్తమును చిమ్మునట్లు చేశానా? ప్రభువా, నేను—నేను నీకు దీనిని చేశానా? నేను దీనిని చేసినందుకు నన్ను క్షమించుము.” మరియు ఆయన దగ్గరకు వచ్చాడు. నేను ఇట్లన్నాను, “నీవు నన్ను క్షమిస్తావా? నేను కావాలని చేయలేదు. నేను…నీవు, కేవలం నీవు నాకు సహాయము చేస్తే, నీ కృపను బట్టి, నేను ఒక మంచి అబ్బాయిగా ఉండుటకు ప్రయత్నిస్తాను.”

190 ఆయన తన చెయ్యితో తన ప్రక్కను స్పర్శించి, తన వ్రేలితో నా పుస్తకముపై “క్షమించబడినది” అని వ్రాసి; దానిని తన వెనుకకు, మరచిపోవుట అనే సముద్రములోనికి విసిరివేసాడు. నేను దానిని కొద్దిసేపు గమనించాను. మరియు ఆయన ఇట్లన్నాడు, “ఇప్పుడు, నేను నిన్ను క్షమించాను, కానీ నీవేమో ఆమెను ఖండించాలని కోరుచున్నావు.” చూశారా? ఇట్లన్నాడు, “నీవు క్షమించబడ్డావు, కానీ ఆమె సంగతేమిటి? నీవు ఆమెను పేల్చివేయగోరావు. ఆమె బ్రతకాలని నీవు కోరలేదు.”

191 నేను ఇట్లనుకున్నాను, “ఓ దేవా, నన్ను క్షమించుము. అలా ఆలోచించాలని నా భావము కాదు. నేను దానిని చేయాలనుకోలేదు. నేను—నేను—నేను దానిని చేయాలనుకోలేదు.”

192 “నీవు క్షమించబడ్డావు. నీకు బాగుగానే అనిపించుచున్నది. కానీ ఆమె సంగతేమిటి? ఆమెకు కూడా, అది అవసరము. ఆమెకు అది అవసరము.”

193 “సరి,” నేను ఇట్లనుకున్నాను, “దేవా, నీవు ఎవరిని పిలిచావో, మరియు నీవు ఎవరిని పిలువలేదో నాకు ఎలా తెలుస్తుంది?” ప్రతి ఒక్కరితో మాట్లాడుట నా పనియైయున్నది.

194 కావున, ఆ దర్శనము నన్ను విడిచిపెట్టినప్పుడు, నేను ఆమెయొద్దకు నడిచివెళ్ళాను. నేను ఇట్లన్నాను, “స్త్రీ, నీవు ఎలా ఉన్నావు?” మరియు ఆ ఇద్దరు పురుషులు స్నానాల గదిలోనికి వెళ్ళారు. మరియు వారు…ఆమె అక్కడ కూర్చొని, మీకు తెలుసు కదా, ఎక్కిళ్ళు పడుతూ, నవ్వుతూ ఉన్నది. బల్ల మీద విస్కీ సీసా ఉన్నది, లేదా బీరుయై యుండవచ్చును, వారు త్రాగుచుండిన ఆ చోట, అది, అక్కడ మద్యము ఉండినది. నేను నడిచివెళ్ళాను. నేను ఇట్లన్నాను, “నీవు ఎలా ఉన్నావు?”

మరియు ఆమె ఇట్లన్నది, “ఓ, హలో.”

మరియు నేను ఇట్లన్నాను, “నేను కూర్చోవచ్చా?”

ఆమె ఇట్లన్నది, “ఓ, నాతో కొందరున్నారు.”

నేను ఇట్లన్నాను, “సహోదరీ, నా ఉద్దేశ్యం అది కాదు.”

నేను ఆమెను “సహోదరీ” అని పిలిచినప్పుడు ఆమె నా వైపు చూసినది. ఆమె ఇట్లన్నది, “నీకు ఏమి కావాలి?”

నేను ఇట్లన్నాను, “కేవలం ఒక్క నిమిషం నేను కూర్చోవచ్చా?”

“అలాగే కూర్చోండి,” అని ఆమె అన్నది. మరియు నేను కూర్చున్నాను.

ఏమి జరిగినదో నేను ఆమెకు చెప్పాను. ఆమె ఇట్లన్నది, “నీ పేరు ఏమిటి?”

మరియు నేను ఇట్లన్నాను, “బ్రెన్హామ్.”

ఆమె ఇట్లన్నది, “ఇక్కడ ఈ కార్యక్షేత్రంలో ఉన్న వ్యక్తి మీరేనా?”

నేను ఇట్లన్నాను, “అవును, అమ్మా.”

195 ఆమె ఇట్లు చెప్పినది, “నేను అక్కడికి రావాలని కోరుచున్నాను.” ఆమె ఇట్లన్నది, “మిస్టర్. బ్రెన్హామ్, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పెరిగాను.” ఆమె ఇట్లు చెప్పినది, “క్రైస్తవులైన ఇద్దరు యవ్వన బాలికలు నాకున్నారు. కాని ఫలానా, ఫలానా సంగతులు జరిగినవి,” మరియు ఆమె తప్పుడు దారిలోనికి మళ్ళినది, లేదా తప్పుడు దారిలో వెళ్ళడం ప్రారంభించినది.

196 నేను ఇట్లన్నాను, “కానీ, సహోదరీ, నేను లెక్కచేయను, రక్తము ఇంకనూ నీ చుట్టూ ఉన్నది. ఈ ప్రపంచము రక్తముతో కప్పబడియున్నది.” అది కప్పియుండకపోతే, దేవుడు మనలను, ప్రతి ఒక్కరినీ చంపివేసేవాడు. ఆయన…ఆ రక్తము తీసివేయబడినప్పుడు, తీర్పు కొరకు ఎదురుచూడటమే. కానీ ఇప్పుడు, ఆ రక్తము లేకుండా నీవు చనిపోతే, నీవు ఆ స్థితిని దాటి వెళ్ళిపోతావు, అప్పుడు నీ కొరకు పనిచేయుటకు ఏమియు ఉండదు. ఈ రోజు రక్తము నీ స్థానములో పనిచేస్తుంది. నేను ఇట్లన్నాను, “స్త్రీ, నిశ్చయంగా, రక్తము ఇంకనూ నిన్ను కప్పియున్నది. నీ శరీరములో ఊపిరి ఉన్నంతకాలం, రక్తము నిన్ను కప్పియుంటుంది. కానీ ఏదో ఒక రోజున ఆ ఊపిరి ఇక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు, ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది, నీవు ఆ రక్తమును దాటి వెళ్ళిపోతావు, మరియు తీర్పు తప్ప ఇక ఏమియు ఉండదు. క్షమాపణ పొందుటకు నీవు ఒక అవకాశమును కలిగియున్నప్పుడే…” మరియు నేను ఆమె చెయ్యి పట్టుకున్నాను.

197 ఆమె ఏడ్చుచున్నది, ఇట్లన్నది “మిస్టర్. బ్రెన్హామ్, నేను త్రాగుచున్నాను.”

198 నేను ఇట్లన్నాను, “దానివలన ఇబ్బంది లేదు. వచ్చి నీతో చెప్పమని ఏదో-ఒకటి నన్ను హెచ్చరించినది.” నేను ఇట్లన్నాను, “సహోదరీ, జగత్తుకు పునాది వేయబడకముందే, దేవుడు నిన్ను పిలిచాడు. మరియు నీవు తప్పు చేయుచున్నావు, మరియు నీవు కేవలం దానిని మరింత దిగజార్చుచున్నావు.”

199 ఆమె ఇట్లన్నది, “ఆయన నన్ను తీసుకుంటాడని మీరు అనుకుంటున్నారా?”

200 నేను ఇట్లన్నాను, “ఖచ్చితంగా, ఆయన నిన్ను తీసుకుంటాడు.”

201 అక్కడ ఆమె మోకాళ్ళు వేసినది, మేము ఆ గది మధ్యలో మోకాళ్ళు వేసాము, మరియు ఒక పాత-కాలపు ప్రార్థనా కూటమును కలిగియున్నాము. ఆ పోలీసు తన టోపీని తీసివేసి ఒక మోకాలిపై వంగియున్నాడు. ఆ స్థలములో, మేము అక్కడే ఒక ప్రార్థనా కూటమును కలిగియున్నాము. ఎందుకు? దేవుడు సర్వాధికారము గలవాడు.

“ఈ నిర్జీవ క్రియలను ప్రక్కనపెట్టి, మనము సంపూర్ణులమగుటకు సాగిపోదము.”

202 “నేను సంఘమునకు చెందియున్నాను; నేను దానికి చెందియున్నాను” అనునటువంటివి అన్నియు ముగించబడినట్టి, ఆ పరిధిలోనికి, మనము వెళదాము. మరియు మనము పరిపూర్ణతలోనికి సాగిపోదాము.

203 పాపియైన నా స్నేహితుడా, ఈ రోజు నీవు రక్తము లేకుండా, రక్షణ లేకుండా, కృప లేకుండా ఉన్నయెడల, యేసుక్రీస్తు రక్తము నిన్ను పట్టుకొనియున్నది. “మంచిది, ఈ సమయమంతా నేను బాగానే దాటివెళ్ళాను కదా,” అని నీవు అనవచ్చును. కానీ ఎక్కడైతే నీ కొరకు ఏదియు పనిచేయదో అటువంటి ఒక చోటుకి ఒక దినమున నీవు వెళ్తావు.

మనము తలలు వంచియుండగా, ఇప్పుడు మనము ప్రార్థించుకుందాము.

204 “దేవా నన్ను కనికరించుము, నేను తప్పు చేశానని నేను గ్రహిస్తున్నాను,” అని చెప్పుటకు ఇష్టపడేవారు, ఎవరైనా ఒకరు ఈ రోజు, ఇక్కడ ఉన్నారా? బహుశా మీరు సంఘములో చేరియుండవచ్చును. అది మంచిదే. కానీ, మీరు క్రీస్తుయొక్క కృపను పొందుకొననియెడల, మీరు మీ చేతిని పైకెత్తి, “సహోదరుడా బ్రెన్హామ్, నా కొరకు ప్రార్థించుము” అని చెప్తారా? మిస్టర్, దేవుడు నిన్ను దీవించును గాక. స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. అది నిజము. ఏ…ఆ వెనుకనున్న, అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను, మరియు నిన్ను దీవించును గాక. ఆ వెనుకాల, అవును, దేవుడు నిన్ను దీవించును గాక. మీ చేతిని పైకెత్తండి. అది నిజము. కేవలం మీ చేతిని పైకెత్తి, “దేవా, నన్ను కనికరించుము,” అని చెప్పండి.

205 మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, నేను సంఘమునకు చెందియున్నాను. అవును, నేను—నేను మంచిగా ఉండుటకు ప్రయత్నించాను, కానీ నాకు తెలియదు, నేను అసలు, దానిని చేయలేను, అన్నట్లు అగుపించుచున్నది.” ఓ, దయనీయమైన యాత్రికుడా, దయనీయమైన బలహీనమైన స్నేహితుడా, నీవు ఇంకనూ నిజముగా దర్శనమును ఎన్నడూ చూడలేదు.

206 మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, నేను కేకలు వేసాను. నేను భాషలతో మాట్లాడాను. నేను ఇదంతా చేశాను.” అది కూడా, నిజమే కావచ్చు. అది మంచిదే, దానికి వ్యతిరేకముగా చెప్పడానికి ఏమియు లేదు.

కానీ, నా ప్రియమైన, తప్పిపోయిన స్నేహితుడా, అయితే, భాషలతో మాట్లాడుట, లేదా ఊగుట, లేదా కరచాలనము చేయుట, లేదా బాప్తిస్మము పొందుట, అది, అదంతా మంచిదే. కానీ, ఆయనను ఎరుగుట అనగా, ఒక వ్యక్తిని ఎరుగుటయై యున్నది. “ఆయనను ఎరుగుటయే జీవమైయున్నది.”

207 మీరు ఇట్లంటారు, “నాకు బైబిలు, చాలా బాగా తెలుసు.” సరి, బైబిలు గ్రంథమును ఎరుగుట, జీవము కాదు. “ఆయనను ఎరుగుటయే,” వ్యక్తిగత సర్వనామము, “ఆయనను ఎరుగుట, క్రీస్తును ఎరుగుట,” ఆయన నిన్ను క్షమించాడని నీవు ఎరుగుటయైయున్నది.

మరలా, ఇంకెవరైనా, మీ చేతులను పైకెత్తుతారా? స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇక్కడున్న, సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఆ వెనుకనున్న యవ్వనస్థుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇక్కడున్న సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. అక్కడ, ఆ వెనుకనున్న నిన్ను, దేవుడు దీవించును గాక. అది నిజము. “ఆయనను ఎరుగుటయే, జీవమైయున్నది.”

“సహోదరుడా బ్రెన్హామ్, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నేను ఇప్పుడు, సరిగ్గా ఇక్కడ నా కుర్చీలో ఉండగనే, క్రీస్తును అంగీకరించబోవుచున్నాను.”

208 ఇట్లు చెప్పండి, “ప్రభువైన యేసూ, నా హృదయములోనికి రమ్ము, మరియు ఆ సమాధానమును, ఆ మాధుర్యమును నాకు దయచేయుము.” సంఘమునకు వెళ్ళి, మీకు సాధ్యమైనంత గట్టిగా సంగీతమును వాయించి, పైకి-మరియు-క్రిందికి నాట్యమాడుతూ, ఆ మధ్యదారిగుండ పరుగెత్తి; ఇంటికి వెళ్ళి, కలవరపడుతూ, మరియు అటు ఇటు తిరుగుతూ, గొడవలు చేయడం, అది క్రీస్తు కాదు. మీరు సంఘమునకు వెళ్ళి, కూర్చొని మరియు ఆ వంతెనకు ఎలా రంగులు వేయబడబోవుచున్నది అని, లేదా అటువంటి-ఏదో ఒకదాని గురించి ఒక చిన్న ప్రసంగమును వింటారు, వాక్యమును ఎన్నడూ వినరు. వాక్యము జీవమును తీసుకువస్తుంది. అది విత్తనమైయున్నది. మీకు నెమ్మది వద్దా?

209 మరణమును గూర్చి మీరు చింతించుచున్నారా? ఈ రోజు మీకు గుండెపోటు వస్తే, అది మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుందా? లేదా, “ఈ మార్గాంతమున నేను ప్రభువైన యేసుతో ఉండబోవుచున్నాను” అని చెప్పుటకు, మీరు సంతోషిస్తారా? మీరు ఆయనను ఎరిగియున్నారా? మీరు ఎరుగనియెడల, కేవలం మీ చేతిని పైకెత్తండి. మేము మీ కొరకు ప్రార్థన చేయబోవుచున్నాము. అవును, సహోదరుడా, నీవు, కూడా.

210 మంచిది, ఇప్పుడు మీ హృదయములో.

ఎటువంటి మనవి లేకుండా, సరిగ్గా నేను ఉన్నట్టుగానే వచ్చుచున్నాను,

నీ రక్తము (ఎవరి కొరకు?) నా కొరకు చిందించబడినది గనుక,

నేను నమ్ముతానని, నేను వాగ్దానం చేశాను గనుక,

ఓ గొర్రెపిల్లా, ఓ దేవుని గొర్రెపిల్లా, నేను వచ్చుచున్నాను. నేను దీనముగా, సాత్వికముగా, వచ్చుచున్నాను.

ఉన్నట్టుగానే…

విశ్వాసము ద్వారా, నేరుగా ఆయన వద్దకు నడిచిరండి. ఆయన సరిగ్గా అక్కడే మీ ప్రక్కన నిలబడియున్నాడని నమ్మండి. ఆయన నిలబడియున్నాడు.

…-అది కాదు

నా ఆత్మను (ఇప్పుడు ఎంతటిదానినుండి?) ఒక…(కోపము, ద్వేషము) నుండి విడుదల చేయడానికి,

ఎవరి రక్తమైతే ప్రతి మచ్చను శుద్ధి చేయగలదో ఆయనకు,

ఓ గొర్రెపిల్లా…

211 “ఈ ఉదయమున, విశ్వాసము ద్వారా నేను సిలువ వద్దకు నడుస్తాను. నా భారములను నేను క్రింద పెట్టుచున్నాను. నేను వచ్చుచున్నాను.” ఆ వెనుకనున్న నిన్ను దేవుడు దీవించును గాక. అది మంచిది. [సహోదరుడు బ్రెన్హామ్ గారు సరిగ్గా నేను ఉన్నట్టుగానే అనుదానిని రాగం తీస్తున్నారు—సంపా.] ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఆప్యాయంగా, మాధూర్యముగా, నేరుగా సిలువ వద్దకు నడిచిరండి.

212 పాత నిబంధనలో, వారు ఒక గొర్రెపిల్లను తెచ్చారు. వారు పాపము చేసారని వారు ఎరిగియున్నారు, ఆజ్ఞల ద్వారా వారు అప్పుడు దానిని ఎరిగియున్నారు. ఇప్పుడేమో దేవుడు మీ హృదయముతో మాట్లాడినందున, మీరు దానిని ఎరుగుచున్నారు. వారు ఆజ్ఞలను ఒకసారి చూశారు, “నీవు వ్యభిచరింపవద్దు. నీవు ఫలానా-మరియు-ఫలానా దానిని చేయకూడదు.” మరియు వారు ఒక గొఱ్ఱెపిల్లను తీసుకొనివెళ్ళి, మరియు ఆ గొర్రెపిల్ల మీద తమ చేతులుంచగా, యాజకుడు దాని గొంతును కోసివేస్తాడు. ఆ చిన్నది తన్నుకులాడుతూ, రక్తము చిందిస్తూ, మరియు గిలగిలా కొట్టుకుంటూ మరణించుచుండేది. అతని చేతులు మొత్తం రక్తమయమైపోయినవి. అతని స్థానములో గొర్రెపిల్ల చనిపోయినది, కానీ మరలా దానిని చేయాలన్న అదే కోరికతో అతడు బయటకు వెళ్ళాడు.

213 కానీ ఈ స్థలములో మాత్రం, విశ్వాసము ద్వారా, కృప చేతనే మనము వచ్చుచున్నాము. దేవుడు మనలను పిలిచాడు. మనము దేవుని గొర్రెపిల్లయొక్క తలపైన మన చేతులను ఉంచుచున్నాము. ఆ ఊగుచున్న సుత్తె చప్పుడును మనము వింటున్నాము. “నేను దప్పిగొనుచున్నాను; నాకు దాహనమునకియ్యుడి. తండ్రీ, ఈ పాపమును వారి మీద మోపవద్దు; వారు ఏమి చేయుచున్నారో వారెరుగరు” అనే ఆ స్వరమును మనము వింటున్నాము. చూశారా? విశ్వాసము ద్వారా, మనకు బదులుగా ఆయనయొక్క మరణమును మనము అనుభూతి చెందుతున్నాము. “ఇప్పుడు నీవు క్షమించబడ్డావు. వెళ్ళి ఇకను పాపము చేయకుము,” అని ఒక స్వరము చెప్పినప్పుడు, మన హృదయాంతరంగములోనికి ఒక లోతైన, స్థిరమైన సమాధానము ప్రవేశిస్తుంది. అప్పుడు, కృపచేత, మనము అదే కోరికతో కాదు గాని, ఇక మరెన్నడూ పాపము చేయకూడదని లేదా తప్పైనది ఏదియు చేయకూడదనే కోరికతో ఏ విధంగా బయటికి వెళ్ళుచున్నాము కదా. సమస్త గ్రహింపునకు మించిన సమాధానము, మన హృదయములోనికి ప్రవేశించినది.

ఇప్పుడు, మనమందరము కలసి, ప్రార్థించుచుండగా, మీరు దానిని పొందుకొందురు గాక.

214 పరలోకపు తండ్రీ, విశ్వాసము ద్వారా, కృప చేతనే వారు వచ్చుచున్నారు. దాదాపు ఒక డజను చేతులు పైకి లేచాయి. అవి వర్తమానము యొక్క ఫలములైయున్నవి. వారు నీ యొద్దకు వచ్చుచున్నారు. వారు నమ్ముచున్నారు. ప్రభువా, నేను కూడా, వారిని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ, నిజంగా, వారితో మాట్లాడియున్నాడని నేను నమ్ముచున్నాను. మరియు విశ్వాసము ద్వారా వారు ఇప్పుడు నేరుగా యాకోబు నిచ్చెనను ఎక్కుచున్నారు, సరిగ్గా సిలువయొక్క అంచునకు వచ్చుచున్నారు, అక్కడ వారి పాపములన్నిటిని మోపి, మరియు ఇట్లు చెప్పుచున్నారు, “ప్రభువా, అది నాకు చాలా ఎక్కువైయున్నది. నేను దానిని ఇక ఎంతమాత్రము భరించలేను. మరియు నీవు నా పాప భారమును తీసివేసి, మరియు అలా చేయాలనే కోరికను నా హృదయములో నుండి తీసివేయుదువా? మరియు విశ్వాసము ద్వారా, ఈ దినమున, నా వ్యక్తిగత రక్షకునిగా నిన్ను స్వీకరించనిమ్ము. మరియు ఇప్పటినుండి, ప్రయాణముయొక్క ముగింపు వరకు, దారిలో ప్రతి మైలు నేను నిన్ను వెంబడిస్తాను. ‘పరిపూర్ణతలోనికి సాగిపోవుట’ అంటే ఏమిటని నేను ఒక దృశ్యమును పట్టుకున్నాను, సంఘములోనికి వెళ్ళడం కాదు, మరియు నిర్జీవ క్రియలైనట్టి బాప్తిస్మములు మొదలగునవి కావు. అయితే నేను అనేవాడను ఇక ఉండకుండా, క్రీస్తే నాలో జీవించగలిగేంత వరకు, సాగపోవాలని నేను కోరుచున్నాను.”

215 ఓ యేసూ, ఈ ఉదయమున, పశ్చాత్తాపపడిన ప్రతీ ఆత్మకు దీనిని దయచేయుము. నీవు దానిని వాగ్దానము చేసియున్నావు గనుక, తమ చేతులను పైకెత్తిన ప్రతి ఒక్కరూ నిత్యజీవమును పొందుకుందురు గాక. వారు బహిరంగముగా అంగీకరించారు. వారు వారి చేతులను పైకెత్తారు. వారు గురుత్వాకర్షణ శక్తియొక్క నియమములన్నిటినీ బ్రద్దలు చేసారు. వారు విజ్ఞానశాస్త్రమును దానికదే సిగ్గుపడేలా చేశారు, ఎందుకనగా, “మీ చేతులు క్రిందికి వ్రేలాడియుండాలి” అని విజ్ఞానశాస్త్రము చెప్పుచున్నది. విజ్ఞానశాస్త్రం ప్రకారంగా, గురుత్వాకర్షణ శక్తి దానిని క్రిందకి లాగుతుంది గనుక, అది భూమికి కట్టుబడియుండాలని ఏదైనా ఋజువు చేస్తుంది. కానీ ఒక నిర్ణయమును తీసుకున్న ఒక ఆత్మ వారిలో ఉన్నది, మరియు వారు గురుత్వాకర్షణ నియమాలను ధిక్కరించి వారి చేతులను పైకెత్తారు. ప్రభువా, నీవు దానిని చూశావు. నీవు వారి పేరును గ్రంథములో ఉంచావు. “క్షమించబడినది.” మరెన్నడూ జ్ఞాపకము చేసుకొనబడకుండునట్లు, ఆ పాత పుస్తకము ఇప్పుడు మరచిపోవుట అనే సముద్రములో ఉన్నది. ప్రేమగల, మాధూర్యమైన క్రైస్తవులుగా, నిన్ను సేవించుటకు, ఈ రోజు వారిని ముందుకు సాగనిమ్ము. మరియు బహుశా తమ చెయ్యిని పైకెత్తని అనేకమంది ఉండవచ్చును, వారికి కూడా దానిని అనుగ్రహించుము.

216 ప్రభువా, పరిశుద్ధులను నీకు మరికొంచెము దగ్గరగా నడవనిమ్ము, ఏలయనగా నిన్న మేము ఉన్నదానికంటే ఇప్పుడు మేము గృహమునకు ఒక దినము దగ్గరయ్యాము. ప్రభువా, నీవు మాతో ఉండుము, ఏలయనగా క్రీస్తు నామములో ఆయన మహిమ కొరకు మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్. 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...