హెబ్రీ పత్రిక, ఆరవ అధ్యాయము #2
…ఆయన యొక్క ప్రశస్తమైన వాక్యమును అధ్యయనం చేయుటకైయున్నది.
నేను కొద్దిసేపటి క్రితం లోపలికి వచ్చాను, మరియు నేను రెండు బైబిళ్ళను పట్టుకొని ఉన్నాను. మరియు వెనుక ఇక్కడ ఒక స్త్రీతో నేను ఒక చిన్న ఇంటర్వ్యూను కలిగియున్నాను, మరియు నేను ఆ రెండిటిలోనుండి బోధించినట్లైతే, ఒక మంచి పాఠ్యాంశమే వస్తుందని నేను ఆమెతో చెప్పాను. అయితే ఇది గ్రీకు పదజాలమైయున్నది, మరి ఈ రాత్రి, నేను దీని నుండి ఒకటి చదవగోరుచున్నాను. ఇది ఒక—ఇది ఒక…అది అసలైన గ్రీకు నుండి ఇంగ్లీషులోనికి చేయబడిన, పదము నుండి పదమునకైనట్టి అనువాదమైయున్నది. మరియు ఇది ఆ వరుసలో నాకు చాలా సహాయపడినది. మరియు మనమిప్పుడు ఈ హెబ్రీ పత్రికలో అధ్యయనం చేస్తూ, ఇప్పుడిప్పుడే మనము నిజమైన లోతైన అర్థములయొద్దకు వస్తున్నాము గనుక, నేను దాని నుండి ఒకటి చదువగోరుచున్నాను.
219 మరియు కొన్ని నిమిషాల క్రితమే, నేను సహోదరుడు నెవిల్ తో ఇట్లు చెప్పాను, “ప్రజలు తమ తలను గోక్కొని, ‘నేను దానిని నమ్మను’ అని చెప్పుకొనేలాంటి భాగములోనికి మనము ప్రవేశిస్తున్నాము.” చూశారా? అటువంటిదానిలోనికి మనము ప్రవేశిస్తాము. అక్కడే మనము దానిని ఇష్టపడుచున్నాము.
220 ఒక సేవకుడు నాతో ఇట్లు చెప్పాడు, అతడు ఇట్లన్నాడు, “సరి, అక్కడ చాలా తల-గోక్కోవడం ఉంటుందని నేను అనుకుంటున్నాను.”
221 నేను ఇట్లన్నాను, “దానినే మనము చేయగోరుచున్నాము.” చూశారా?
222 బైబిలు ఒకే ఒక్క అర్థమును కలిగియుండగలదు. అది రెండు అర్థాలను కలియుండజాలదు. మరియు బైబిలు గ్రంథములోని ఒక భాగము ఒకటి చెప్పి, మరియు బైబిలు గ్రంథములోని మరొక భాగము మరి దేనినో చెప్పినట్లైతే, అప్పుడు ఏదో తప్పిదమున్నది. చూశారా? అది దానంతటిగుండా, ఆ విషయమును చెప్పవలసియున్నది. కానీ, గుర్తుంచుకోండి, బైబిలుయొక్క అధ్యయనంలో, “అది జ్ఞానులకును వివేకులకును మరుగుచేయబడి, మరియు పసి పిల్లలకు బయలుపరచబడినది,” ఎందుకనగా అది ఒక ఆత్మ సంబంధమైన గ్రంథమైయున్నది.
223 మరియు అది పాశ్చాత్య పుస్తకము కాదు. అది ఒక తూర్పు గ్రంథమైయున్నది. మరియు దానిని అనువదించగల్గినది ఒకే ఒక్కటున్నది, మరియు అది పరిశుద్ధాత్మయేయైయున్నది. మనలో ప్రతీఒక్కరు ఇట్లు చెప్పుటకు ఇష్టపడతారని నాకు తెలుసు, అదేమిటనగా, “మనము ఏమి నమ్ముచున్నమో పరిశుద్ధాత్మ దానినే మనకు చెప్పుచున్నాడు.” సరి, ఇప్పుడు, ప్రతీ లేఖనము సరిగ్గా సరిపోయినట్లైతే, అప్పుడు అది పరిశుద్ధాత్మయైయున్నది. అది సరిపోకుండా, మరియు ఇక్కడ ఒక ఖాళీ ఉండి, మరియు ఇక్కడ ఒక ఖాళీ ఉన్నట్లైతే, అప్పుడు మన నమ్మకంలో ఏదో తప్పున్నది. మరియు, ఓ, ఇది ఒక అద్భుతమైన గ్రంథమైయున్నది.
224 ఇప్పుడు, మనము అధ్యయనం చేస్తుండగా మీరు దీనిని చేయాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే, మేము వ్యోమింగునకు తెల్లవారుఝామునే బయలుదేరాల్సియున్నది. మా కొరకు ప్రార్థించండి.
మరియు ఈ తరువాతి వారము, సహోదరుడు గ్రాహమ్ స్నెల్లింగ్, ఇక్కడ…అతడు ఇక్కడున్నాడు. కేవలం కొద్ది నిమిషాల క్రితమే, అతడు తన ప్రకటనను చేయడాన్ని, నేను విన్నాను. మరియు అతని ఉజ్జీవమునకు ఈ సంఘము పూర్తి సహకారాన్ని అందిస్తుంది. మరియు అతనికి ఒక ఉన్నతమైన, సమృద్ధియైన, గొప్ప ఉజ్జీవము దయచేయమని, మేము దేవునికి ప్రార్థిస్తున్నాము. సహోదరుడు గ్రాహమ్…ఇక్కడ చార్లెస్‌టౌన్ వద్ద, సహోదరుడు జూనియర్ క్యాష్ కొరకు ఒక ఉజ్జీవమును నిర్వహించాడు, మరియు అక్కడ నేరుగా ఒక వందమంది మారినారని, నేను నమ్ముచున్నాను. [ఒక సహోదరుడు, “ఎనభై-నాలుగు” అని చెప్పుచున్నాడు.—సంపా.] ఎనభై-నాలుగు మంది మారినవారు. కావున, దాని విషయమై, మేము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. మరియు ఇక్కడ ఈ స్థలములో, అది ఐదువందల ఎనభై-నాలుగు మందిని పొందుకుంటుందని మేము నమ్ముచున్నాము.
225 ఈ రోజు సహోదరుడు గ్రాహమ్ నన్ను కలిసి, మరియు అతడు ఇట్లన్నాడు, “ఇప్పుడు, సహోదరుడా బిల్, నేనును గుడారములో ఒక భాగమైయున్నాను గనుక గుడారమునకు వ్యతిరేకంగా వేరొక పనిని ప్రారంభించడానికి నేనిక్కడ లేనని, నీవు అర్థం చేసుకున్నావన్న నిశ్చయత నాకున్నది.” అతడు ఇక్కడున్నది ఎందుకంటే…తాను ఒక ఉజ్జీవమును నిర్వహించాలని తన హృదయములో అనుభూతిని కలిగియున్నాడు, మరియు దానిని చేయుటకు ప్రభువు అతణ్ణి నడిపిస్తున్నాడు. మరియు—మరియు అతడు మారినవారిని ఆహ్వానిస్తున్నాడు, మరియు వారిని పంపుటకు, ఒక సంఘమును కలిగియున్నాడు, “మీరు లోపలికి వచ్చి, మారినయెడల, ఇదిగో ఒక స్థానిక సంఘము ఇక్కడున్నది.”
226 మరియు మనకు సాధ్యమైన ప్రతీదానితో అతనికి మద్దతునివ్వడం, క్రైస్తవులుగా, మన బాధ్యతయై యున్నది. మరియు ప్రభువు సహోదరుడు గ్రాహమ్ ను దీవించును గాక. మరియు ఈ సంఘము నుండి పూర్తి అనుమతితో, మాకు సాధ్యమైన ఏ విధములోనైనా అతనికి సహాయము చేయుటకు పూర్తి సహకారముతో, తప్పిపోయిన ఆత్మల కొరకు మరియు దేవుని రాజ్యము కొరకు, ఇక్కడ నిర్వహించబడుచున్న సహోదరుడు గ్రాహమ్ యొక్క కూటమునకు మీరు, ప్రతియొక్కరు సాదరంగా ఆహ్వానించబడ్డారు.
227 సహోదరుడా గ్రాహమ్, ప్రభువు నిన్ను దీవించి, గొప్ప కూటములను నీకు అనుగ్రహించును గాక. అతడు ఎప్పుడు ముగించబోతున్నాడో అతనికి తెలియదు. అతడు కేవలం ప్రారంభిస్తున్నాడు. మరియు కావున, సహోదరుడు గ్రాహమ్ కూడా నావలెనే, ఎన్నో హెచ్చు తగ్గులు కలిగియున్నాడు. జీవితం ఆ విధంగానే నడుస్తుంది. మీరు తగ్గు పరిస్థితులగుండా వెళ్ళిన తర్వాత మీరు ఆ హెచ్చులను అభినందించేలా అది చేస్తుంది. ఒక మనిషి క్రింద పడి మరియు అక్కడే ఉండిపోతే, అతడు ఒక పిరికివాడు. ఒక మనిషి పైకి లేచి మరలా ప్రయత్నించినప్పుడు నాకు నమ్మకముంటుంది. అది నిజము. నా భావము ఏమిటన్నది మీరు అనువదించుకోగలరన్న నిశ్చయత నాకున్నది. ఇప్పుడు, ఈ రాబోవు వారము, దానిని మర్చిపోకండి.
228 ఇప్పుడు, ఈ హెబ్రీ పత్రికలో, ఈ రాత్రి మనము నేపథ్యమును తీసుకోము.
229 ఇప్పుడు, వచ్చే ఆదివారము, ప్రభువు చిత్తమైతే, సహోదరుడు నెవిల్ ప్రకటిస్తాడు. ఇక్కడున్న సహోదరుడు కాక్స్, లేదా వారిలో ఎవరైనా, వచ్చే ఆదివారము కూటమునకై మేము సమయానికి వస్తామో లేదో, అతనికి తెలియజేస్తారు. అతడు రేడియోలో దానిని ప్రకటిస్తాడు. మరియు మేము…ఇప్పుడు మీరందరూ అతని రేడియో ప్రసారమును వినండి, మరియు—మరియు—మరియు వినడానికి మీ పొరుగువారందరిని ఆహ్వానించండి. నెవిల్ బృందము, వారి ప్రసంగమును మరియు పాటలను వినడం ద్వారా నాకు నిజంగా ఆనందము కలుగుతుంది. అతడు ఇక్కడ కూర్చున్నాడు గనుక నేను దానిని చెప్పడంలేదు. నేను దానిని చెప్పి, మరియు నా హృదయములో ఆ భావమును కలిగిలేనట్లైతే, నేను ఒక వేషధారిని అవుతాను. అది నిజము. నేను పశ్చాత్తాపపడాల్సివస్తుంది. అయితే నా భావము అదేయైయున్నది. మరియు అతడు వెళ్ళిపోయిన తరువాత ఒక పూర్తి పుష్పగుచ్ఛమును ఇచ్చేకంటే ఇప్పుడే నేను అతనికి ఒక చిన్న గులాబీ మొగ్గను ఇస్తాను.
230 ఒకసారి నేను అక్కడ ద్వారము నుండి బయటికి వెళ్తున్నాను, మరి అటుగా ఒక స్త్రీ వచ్చి, మరియు ఆమె ఇట్లన్నది, “బ్రెన్హామ్ సహోదరుడా, ఓ, ఆ వర్తమానమును నేనెంతగానో ఆనందించాను!”
231 నేను ఇట్లన్నాను, “ధన్యవాదములు.” అది నాకు మంచి అనుభూతిని ఇచ్చినది.
232 మరొకరు వచ్చి, ఇట్లన్నారు, “బ్రెన్హామ్ సహోదరుడా, నేను ఆ వర్తమానమును ఆనందిస్తున్నాను.”
233 నేను ఇట్లన్నాను, “ధన్యవాదములు.”
234 అక్కడ ఒక చిన్న బోధకుడు ఉన్నాడు, ఇక్కడ పైన దేశములోని, రాష్ట్రములోని ఉత్తర భాగము నుండి వచ్చినవాడు, అతడు ఇట్లన్నాడు, “దేవునికి స్తోత్రం, ప్రజలు నా గురించి అలా గొప్పలు చెప్పడాన్ని నేను కోరను.”
235 నేను ఇలా చెప్పాను, “నేను కోరుకుంటాను.” ఇంకా నేనిట్లన్నాను, “నాకు నీకు మధ్య కేవలం ఒకే ఒక్క తేడా ఉన్నది. నేను దాని విషయమై యదార్థంగా ఉన్నాను.” అది నిజము. మనమందరము మన గురించి చక్కని మాటలు చెప్పబడుటను వినడానికి ఇష్టపడతాము. మరియు దాని విషయంలో మంచి మాటలు చెప్పడం మంచిదని నేను—నేను అనుకుంటున్నాను. మరియు ఎవరైనా మీ గురించి మంచి మాటలు చెప్పాలని మీరు కోరినట్లైతే, మీరు కూడా ఎవరి గురించియైనా కొన్ని మంచి మాటలు చెప్పండి. దానిని చేసే విధానం అదేయైయున్నది, అప్పుడు మీరు ఎల్లప్పుడు ప్రతి ఒక్కరి గురించి మీరు చెప్పగలిగినంత చక్కని విషయాలనే చెప్తుంటారు. మరదే విషయమును చక్కగా కొనసాగునట్లు చేస్తుంది.
236 ఇప్పుడు, ఈ, వచ్చే ఆదివారము, ప్రభువు చిత్తమైతే, నా అభిప్రాయం ప్రకారం, మనము దేవునియొక్క ఈ గొప్ప మర్మములలోనికి, ఇంకా ఇంకా లోతుగా వెళ్తాము. మనము మెల్కీసెదెకులోనికి వెళ్తున్నాము: ఆయన ఎవరైయున్నాడు, ఆయన ఎక్కడనుండి వచ్చాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయనకు ఏమి జరిగినది, మరియు మెల్కీసెదెకు గురించి అంతా చూస్తాము.
237 మరియు ఇప్పుడు, గత బుధవారము రాత్రి, మన ప్రభువైన యేసుయొక్క అత్యున్నతమైన దైవత్వము మరియు యాజకత్వము గూర్చియైన ముగింపు అధ్యాయమును సహోదరుడు నెవిల్ ప్రస్తావించాడు, మరది ఆదిలో ప్రారంభమౌతుంది, “పూర్వకాలము నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ అంత్య దినమున తన కుమారుడైన, క్రీస్తుయేసు ద్వారా మనతో మాట్లాడియున్నాడు.”
238 పిదప అతడింకా ముందుకు వెళ్ళి, మరియు ఆయన ఎవరైయున్నాడు అనేది చెప్తూ మరియు చూపిస్తూ, 5వ అధ్యాయములో, 5వ అధ్యాయము ముగింపులో ఆయనను తీసుకొనివచ్చాడు.
239 పిదప 6వ అధ్యాయం వద్ద ప్రారంభించుకొని, ఈ ఉదయం మన పాఠములో మనం దీనిని పొందుకున్నాము.
కాబట్టి క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని, పరిపూర్ణులమగుటకు సాగిపోదము;…
240 పరిపూర్ణతపై వర్తమానమును ఎంతమంది ఆనందించారు? [సంఘము, “ఆమేన్” చెప్పుచున్నది.—సంపా.] “మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” ఈ ఉదయమున, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో, మన వర్తమానము అదేయైయున్నది.
241 ఇప్పుడు మనం ఆ—ఆ అసలైన భాగమును పొందుకోవడం ప్రారంభమయ్యే చోటుకి మనమిప్పుడే వస్తున్నాము. ఓ, ఈ విషయములపై మనమందరమూ ఏకీభవించగలము: క్రీస్తుయొక్క దైవత్వముపై; మరియు ఆయన దేవుని కుమారుడైయుండుట అనేదానిపై; మరియు ఏ విధంగా ఆయన దేవునితో, దేవుడు ఆయనతో; మరియు ఆయన దేవునిలో, దేవుడు ఆయనలో ఉన్నారు అనేదానిపై, మరియు మొదలగువాటిపై ఏకీభవించగలము. వాటిపై మనమందరమూ ఏకీభవిస్తాము. కానీ, ఇప్పుడు, ఇక్కడినుండి, మనమెట్లు ఏకీభవించబోవుచున్నామో నాకు తెలియదు. కావున అది ఏమైనప్పటికినీ, ప్రతి కొన్ని రాత్రుల తరువాత, నాకొక చిన్న నోట్ వ్రాసి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పడానికి మేము మీకు ఒక అవకాశమును ఇవ్వబోవుచున్నాము.
242 అప్పుడు నేను ప్రశ్నలకు జవాబు చెప్పవలసియుంటుంది. మరియు నేను వాటిని చెప్పలేకపోతే, నేను ఇట్లంటాను, “సహోదరుడా నెవిల్, దాని గురించి నీవు ఏమనుకుంటున్నావు?” నేను ఇట్లంటాను, “అదిగో అతడు అక్కడున్నాడు. దానికి అతణ్ణి జవాబు చెప్పనివ్వండి.” [సహోదరుడు నెవిల్ ఇట్లంటున్నాడు, “నేను గ్రీకు చదివేది అప్పుడే.”—సంపా.] అప్పుడే అతడు నిఘంటువును చదువుతాడట, గ్రీకును బయటకు తీస్తాడు. నేను కూడా, దానిని చేయవలసిన సమయమైనదని నేను అనుకుంటున్నాను.
243 అయితే, ఇప్పుడు, మనమిక్కడికి వచ్చి చాలా యథార్థవంతులమై, మరియు నిజంగా ఒక్క ఉద్దేశ్యము కొరకే వస్తే చాలును, మరది, నేర్చుకొనుట కొరకైయున్నది. నేను కూడా, నేర్చుకొనగోరుచున్నాను. మరియు బైబిలులో వ్రాయబడినది, ఇట్లు చెప్పబడినది, “అది…లేఖనములకు ఎటువంటి వ్యక్తిగత అనువాదము లేదు.” దాని అర్థమేమిటనగా లేఖనము తప్పక లేఖనమును అనువదించవలసియున్నది. చూశారా? దానిని ఒక్క గొప్ప విషయముగా చేయునట్లు, బైబిలు గ్రంథమంతటిలోను, ప్రతి లేఖనము మరొకదానిని అనువదించవలసియున్నది. ఎందుకనగా, దేవుడు మారలేడు, ఎందుకనగా ఆయన మారలేని దేవుడైయున్నాడు.
244 ఇప్పుడు, “విడిచి…”
కాబట్టి క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని, పరిపూర్ణులమగుటకు సాగిపోదము;…
245 పౌలు ఆ విషయాలను చెప్పడం నాకు నచ్చినది. పౌలు ఎన్నడూ ఎక్కువసేపు ఒకే చోట ఉండుటకు ఇష్టపడిన వ్యక్తి కాదు. అతడు కదలి వెళ్ళుటకు, లోతుగా వెళ్ళుటకు ఇష్టపడ్డాడు. ఒకసారి, లేఖనములో, అతడు ఇట్లు చెప్పాడు, “నేను, గతములో ఉన్న సంగతులను మరచిపోయి, ఉన్నతమైన పిలుపునకైన గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను.” చూశారా? అతడు ముందుకు వెళ్తూనే ఉంటాడు.
246 ఇక్కడ అతడు ఇట్లన్నాడు:
ఇప్పుడు (ఆయన ఎవరైయున్నాడు, ఆయన ఏమైయున్నాడు) అనునటువంటి క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మర్చిపోయి, మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము;…
247 ఇప్పుడు మనము, మొదటిగా, “మనము అసలు పరిపూర్ణులమవ్వగలమా?” అనేది కనుగొనగోరాము. మరియు ఈ ఉదయం లేఖనములలో, మత్తయి 5:28 లో, మనము ఇట్లు కనుగొన్నాము, అదేమిటనగా “సరిగ్గా దేవునివలె మనము పరిపూర్ణులుగా ఉండవలసియున్నాము” అని యేసు చెప్పాడు, లేదా మనము లోపలికి ప్రవేశించలేము.
248 పిదప మనము, ప్రతీ ఒక్కరము, “పాపములో పుట్టి, అతిక్రమములో రూపించబడి, అబద్ధములాడుచూ లోకములోకి వచ్చియున్నామని” మనము కనుగొన్నాము. మరియు మన గురించి ఒక్క మంచి విషయం కూడా లేదు, కాబట్టి మనము ఎన్నడైనా ఎలా పరిపూర్ణులుగా చేయబడగలము?
249 ఇప్పుడు, లేఖనము వెంబడి లేఖనమును తీసుకొని, చదవడం ద్వారా, పిదప, మనము దీనిని కనుగొన్నాము, అదేమిటనగా, “యేసు, ఒక్క అర్పణ ద్వారా, తన సంఘమును, సదా, పరిపూర్ణముగా చేశాడు.” ఆయన…అటువంటప్పుడు మనము, క్రీస్తు ద్వారా పరిపూర్ణులమైయున్నాము. మరియు మనము, క్రీస్తు ద్వారా, తీర్పునుండి స్వతంత్రులమైయున్నాము. క్రీస్తు ద్వారా, మనము ఎన్నడూ మరణించము. మనము క్రీస్తు ద్వారా, మరణమును దాటివేసి మరియు జీవమును కనుగొన్నాము; ఏ సంఘము ద్వారా కాదు, ఏ సంఘశాఖ ద్వారా కాదు, ఏ అద్భుతము ద్వారా కాదు, భాషలతో మాట్లాడటం ద్వారా కాదు, కేకలు వేయడం ద్వారా కాదు, వణుకుట ద్వారా కాదు, ఆత్మలో నాట్యం చేయడం ద్వారా కాదు, కానీ కృప ద్వారానేయైయున్నది.
250 దేవుడు తాను కోరినవారిని పిలుస్తాడు. మరియు అదంతా ఎన్నిక ద్వారాయైయున్నదని, మనము కనుగొన్నాము. మనమిట్లు కనుగొన్నాము, అదేమిటనగా, “రక్షణ పొందాలని ఇచ్ఛయించువానివలన కాదు. పొందగోరువానివలన కాదు, లేదా ప్రయాసపడువానివలన కాదు; కరుణించు దేవునివలననే అగును.” “మరియు దేవుడు మొదట అతనిని ఆకర్షించితేనే గాని, ఎవడును యేసు యొద్దకు రాలేడు.” కాబట్టి ఎలాగైనను, మీరు దాని విషయంలో చేయడానికి ఏమున్నది? మీకు దానితో ఎటువంటి సంబంధమూ లేదు. మీరసలు మొత్తానికే, దృశ్యమునకు వెలుపటనున్నారు.
251 మనిషి ఎన్నడూ దేవుని కొరకు వెదకడని మనము కనుగొన్నాము. మనిషి కొరకు వెదకుచున్నది దేవుడే. మరియు పిదప, నిత్యజీవమునకు ఒకేఒక్క మార్గము దేవుడేనని మనము కనుగొన్నాము. నిత్యమైన ప్రతీదానికి ఆదియైనా అంతమైనా లేదని మనము కనుగొన్నాము. కావున, నరకమునకు ఒక ఆరంభమున్నదని, మరియు దానికి ఒక అంతమున్నదని మనము కనుగొన్నాము. మరియు…నరకం ఎప్పటికీ ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు; ఎప్పటికీ, అవును, ఎప్పటికీ ఉంటుంది, కానీ నిత్యమైనది కాదు.
252 ఎప్పటికీ అనేది “ఒక పరిమితిగల కాలమైయున్నది.” బైబిలు ఇట్లు చెప్తుంది, “ఎప్పటికీ మరియు ఎప్పటికీ.” [తెలుగు బైబిలులో యుగయుగములు అని వాడబడినది.—తర్జుమాదారుడు.] మరియు మీరు దానిని వెతికి ఎప్పటికీ అంటే అర్థం “పరిమితిగల కాలము” అని కాదేమో కనుగొనండి. యోనా తాను “ఎప్పటికీ” తిమింగళము కడుపులో ఉన్నాడని చెప్పాడు. [తెలుగు బైబిలులో ఎన్నటికీ అనే పదం వాడబడినది.—తర్జుమాదారుడు.] మరియు అనేక ఇతర లేఖనములలో, ఎప్పటికీ అనగా అర్థం కేవలం “కొంత సమయమే.”
253 కానీ, నిత్యమైనది, అది “ఎన్నటికీ”; అది ఎన్నటికీ మరియు ఎన్నటెన్నటికీ మరియు ఎన్నటెన్నటికీ ఉండునదైయున్నది. అది నిత్యమైనది. మరియు పాతాళము నిత్యమైనది కాదని, అది పరిమితిగల కాలమువరకు ఉండేదని మనము కనుగొన్నాము. మరియు కారణము, ఇపుడు, మీరు ఆ పదములను గమనించవలసియున్నది. మీరు గమనించనియెడల, మీరు గందరగోళమైపోతారు. ఇప్పుడు, గుర్తుంచుకోండి, ఆరంభమును కలిగిలేనివి మాత్రమే, అంతమును కలిగియుండవు. కావున, యేసు ఇట్లన్నాడు, “నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు, జీవము గలవాడు,” ఎప్పటికినా? అది సరియేనా? కాదు. “నిత్యజీవము గలవాడు.” మరియు నిత్యమైన అనే పదము “దేవుడే.” ఆ పదము, ఇక్కడే సరిగ్గా ఇక్కడ గ్రీకు పదజాలములో అది ఉన్నది: జోయే, “దేవుని జీవము” మీలో ఉండుట. మరియు దేవుడు ఎంత నిత్యుడైయున్నాడో, మీరు కూడా అంతే నిత్యులైయున్నారు, ఎందుకనగా మీరు మీలో దేవుడిని కలిగియున్నారు.
254 మీ పాత స్వభావము, అనగా లోక స్వభావము మరణించినది, మరియు మీరు ఒక నూతన సృష్టిగా మారియున్నారు. మరియు మీ కోరికలు, దేవుడు మీ నాసికా రంధ్రాలలోనికి శ్వాసను ఊదినప్పుడు, ప్రారంభమైన ఆ పాత జీవితము, మీరు పుట్టినప్పుడు వచ్చినటువంటి, ఆ శరీర సంబంధమైన స్వభావపు జీవము మరణించినది. మరియు అది ఒక ప్రారంభమును కలిగియున్నది మరియు అది ఒక అంతమును కలిగియున్నది, మరియు ఆ పాత స్వభావము, అది చనిపోయి మరియు ఇక ఎప్పటికీ తొలగిపోయినది. మరియు దేవుడు నూతన స్వభావముతో లోపలికి వచ్చాడు. అప్పుడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, సమాధానము, ఓర్పు, సాత్వికము, దయాళుత్వము, అవి ప్రవేశించాయి; మరియు దుష్టత్వము, కోపము, ద్వేషము, మరియు—మరియు అనుకరణ, కలహము మరియు ఆ కార్యములన్నిటి స్థానమును తీసుకున్నాయి. మీరు మరణమునుండి జీవములోనికి దాటినప్పుడు, అవి వాటి స్థానమును తీసుకున్నాయి. ఇప్పుడు మీకు, చాలా బాగా, అర్థమైనదా? [సంఘము, “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.]
255 కావున, వినండి. నిత్యజీవమునకు ఒకే ఒక రూపమున్నది. దానిని కనుగొనండి. అదేమిటనగా, దేవుడు మాత్రమే నిత్యజీవమును కలిగియున్నాడు. బైబిలు గ్రంథము దానిని చెప్పినది. దేవుడు మాత్రమే నిత్యజీవమును కలిగియున్నాడు. మరియు ఒక మనిషి నిత్యము, నరకములో బాధను అనుభవించబోవుచున్నట్లైతే, అతడు తప్పక, నిత్యుడైన దేవుడిని కలిగియుండవలసియున్నది. అయితే నేను అక్కడ చెప్పేది ఏమిటంటే…
256 ఇప్పుడు, గుర్తుంచుకోండి, మండుచుండే ఒక నరకం లేదని నేను చెప్పడంలేదు. అగ్ని గంధకముతో, మండుచున్న ఒక నరకమున్నది. “ఆ—ఆ పురుగు ఉన్నచోట…అగ్ని ఆరదు మరియు పురుగు చావదు,” అగ్ని గంధకముతోనున్న, ఒక శిక్షయైయున్నది. అది ఒక వంద కోట్ల సంవత్సరముల వరకు ఉండవచ్చును. అయితే దానికి ఒక అంతము ఉండవలసియున్నది, ఏలయనగా అపవాది కొరకు మరియు వాని దూతల కొరకు నరకము సృష్టించబడినది. మరియు ఆదిలో, స్వయంగా దేవుడు తానేమైయున్నాడో, అదంతయు, ప్రతీదియు దేవునినుండి వచ్చినది. స్వయంగా ఆత్మ…
257 కేవలం ప్రేమ అను ఆత్మను తీసుకోండి, అది దేవునియొక్క గొప్ప ఊటయైయున్నది, స్వచ్ఛమైనది, సంకరము లేనిది. అక్కడ నుండి, ఒక వంకర ప్రేమ లోపలికి వచ్చింది. పిదప అది మానవ ప్రేమలోనికి మారింది. పిదప అది లైంగిక ప్రేమలోనికి మారింది. తరువాత అది ఇంకా వేరు వేరు ప్రేమలలోనికి మారి, మరియు అది కేవలం చెత్తలాగా మారేవరకు వక్రీకరించబడుతూనే ఉంటుంది. అయితే అవన్నియు ఒక ఆరంభమును కలిగియున్నాయి. మరియు ఏదో ఒక రోజు అది నేరుగా ఆ అసలైన దానిలోనికి తిరిగి వెళ్తుంది; అది నిత్యమైనది; అక్కడ కామము, మానవ ప్రేమ, ఉద్రేకపూరితమైన ప్రేమ, ఆ ప్రేమలన్నీ ఆగిపోవలసియుంటుంది.
258 విశ్వాసముయొక్క ఈ అనుకరణ-లన్నియు ఆగిపోవలసియుంటుంది. ఒకే ఒక్క నిజమైన విశ్వాసమున్నది. మిగతావన్నీ ఆగిపోవలసియుంటుంది. అవి ఈ నిజమైన ఊటనుండి వచ్చిన వక్రీరణలైయున్నవి.
259 కావున, అందువలన, నరకము, బాధ, బాధ అనేది నిత్యమైనది కాదు. పాపము వలన బాధ తీసుకొనిరాబడినది, మరియు పాపమే బాధలను ప్రవేశపెట్టింది. మరియు పాపము ముగించబడినప్పుడు, బాధలు కూడా ముగించబడవలసియుంటుంది. మరియు ఒక సమయముంటుంది, క్రీస్తును ఎన్నడూ స్వీకరించని పాపులు, వారు బహుశా వంద కోట్ల సంవత్సరాలు శిక్షించబడిన తరువాత,…నాకు తెలియదు, బహుశా వంద ట్రిలియన్ కోట్ల సంవత్సరములు అయ్యుండవచ్చును. నేను చెప్పలేను. అయితే అది ఏదో ఒక సమయమున, అంతమునకు రావలసియున్నది, ఎందుకనగా అది నిత్యమైనది కాదు.
260 ఇప్పుడు, మనము పరిపూర్ణత వద్దకు, ముందుకు కొనసాగబోవుచున్నాము. ఇప్పుడు మనము వర్తమానములోనికి వెళ్తుండగా, వినండి.
…నిర్జీవ క్రియలను విడిచి మారుమనస్సు పొందుట, దేవునియందలి విశ్వాసము,
బాప్తిస్మము,…హస్తనిక్షేపణము,…మృతుల పునరుత్థానము, మరియు…నిత్యమైన తీర్పును గూర్చిన పునాదులు మరల వేయకుందుము.
261 ఇప్పుడు వినండి. మనకు రెండు…ఇప్పుడు, మనకు ఇక్కడ ఒక దృశ్యమున్నది. ఇప్పుడు సరిగ్గా ఇక్కడే మనము కొన్ని గొప్ప అభిప్రాయ భేదాలను పొందబోవుచున్నాము. ఇప్పుడు ఆ దృశ్యము ఎక్కడున్నదో మీరు చూడవలసియున్నది. పౌలు, ఇక్కడ, కృప నుండి ధర్మశాస్త్రమును వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మనము రెండు దృశ్యములను కలిగియున్నాము: ఒకటి, శరీర సంబంధమైనది; ఒకటి, ఆత్మ సంబంధమైనది. మరియు పౌలు యూదులకు చూపించడానికి, ఈ రెండిటి మధ్య—మధ్య వ్యత్యాసమును తెలియజేయుటకు ప్రయత్నిస్తున్నాడు. ఈ పత్రిక హెబ్రీయులకైయున్నది. మరియు హెబ్రీ పత్రిక అంతయు పాత నిబంధనయొక్క నమూన క్రొత్త నిబంధనకు మాదిరిగా ఉన్నదని చూపించుటకు ప్రయత్నిస్తున్నది. కాబట్టి, ఇక్కడ మీకు రెండు దృశ్యములు పరిగణలో ఉన్నాయి.
262 ఇప్పుడు మనము చదువుతుండగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అతడు ఇట్లు చెప్పాడు:
…క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని, మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము;…
263 ఇపుడు, ఈ ఉదయమున మనము దానిని, అనగా మనము ఎలా పరిపూర్ణులుగా చేయబడ్డాము అనేదానిని పొందుకున్నాము. ఖచ్చితంగా నిష్కళంకులుగాను మరియు నిందారహితులుగాను పరిపూర్ణులముగా చేయబడ్డాము, ఒక్క పాపమైనను మన మీద మోపబడిలేదు. మీరు శోధనలేనివారిగా ఉన్నారా? ఎన్నడూ కాదు. మీరు ప్రతీ రోజు పాపము చేస్తారా? అవును, అయ్యా. కానీ, అయినను, మనము ఆయనలో ఉన్నందున మనము పరిపూర్ణులమైయున్నాము. మరియు దేవుడు మనల్ని ఎంతమాత్రమూ తీర్పు తీర్చలేడు (అది నీతియైయుండజాలదు), ఆయన మనకు ఇదివరకే ఆయనలో తీర్పు తీర్చాడు. ఆయన క్రీస్తుకు తీర్పు తీర్చినప్పుడు, ఆయన నాకు తీర్పు తీర్చాడు, ఆయన నీకు తీర్పు తీర్చాడు. మరియు ఆయన మరలా నాకు తీర్పు తీర్చలేడు, ఎందుకనగా నేను విమోచించబడినట్లైతే ఆయన నాయొక్క తీర్పును తీసుకున్నాడు.
264 మరియు నేను నా గడియారాన్ని తాకట్టు దుకాణం నుండి విమోచించుకున్నానని చూపించడానికి నేను ఒక టికెట్టును కలిగియున్నాను, నేను ఒక టిక్కెట్టును కలిగియుండగా, ఎవరైనా దానిని తిరిగి తాకట్టు దుకాణముకు తీసుకెళ్ళడానికి ఒక్కసారి ప్రయత్నించనివ్వండి. నేను దానిని విమోచించుకున్నాను.
మరియు దయ్యము నన్ను శిక్ష క్రింద పెట్టుటకు ప్రయత్నించినట్లైతే, నేను విమోచించబడ్డానని చూపించే టిక్కెట్టును నేను కలిగియున్నాను. అవును, అయ్యా. తీర్పు ఇక ఎంతమాత్రమూ లేదు! “నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు, వాడు ఎన్నడూ తీర్పులోనికి రాక, మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు.” అదే నా టిక్కెట్టుయైయున్నది. ఆయన వాగ్దానమును ఇచ్చాడు.
265 ఇపుడు, ఇప్పుడు దృశ్యము, ఇక్కడున్నది.
…నిర్జీవ క్రియలను విడిచి మారుమనస్సు పొందుట, మరియు…దేవునియందలి విశ్వాసము,
…బాప్తిస్మమును గూర్చిన బోధయు,…హస్తనిక్షేపణము,…మృతుల పునరుత్థానము,…నిత్యమైన తీర్పును గూర్చిన పునాదులను మరల వేయకుందాము.
266 ఇప్పుడు, గుర్తుంచుకోండి. మరలా ఆ పదము వాడబడుటను మీరు గమనించారా? ఈ ఉదయం మనము దానిని ఉపయోగించాము, “నిత్యమైన తీర్పు.” దేవుడు ఒక్కసారి పలికినప్పుడు, అది నిత్యమైనదైయున్నది. అది కొంచెం కూడా, మార్చబడదు. కాబట్టి, తీర్పు నిత్యమైనది, అది ఎల్లప్పుడూ అదే తీర్పుయైయున్నది. మరియు మనము ఏ తరములో జీవిస్తున్నప్పటికినీ, ఒకే తరము జీవిస్తుంది, మరియు ఒకే నియమము పనిచేస్తుంది, మరియు అది కాలపరిమితి గలదైయున్నది, లేదా అది ఎంత కాలమైతే అప్పటివరకు ఉంటుంది, మరియు ఇది మరియు అది ఉంటుంది. కానీ దేవునియొక్క తీర్పు ఇంకనూ నిత్యమైనదే, ఆయన మాటను సెలవిచ్చాడు గనుక, దానిని తప్పక చేయవలసియున్నాడు. దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు, అది నిత్యమైనదిగా ఉండవలసియున్నది. అది నిజము.
267 ఇప్పుడు మీ కొరకు గ్రీకులోనుండి దానిని చదవనివ్వండి. అది ఎలా చెప్పబడుచున్నదో వినండి.
కాబట్టి ప్రాయశ్చిత్తము కలుగజేసినట్టి క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని—మాని, మనము—మనము, కొనసాగిపోవాలి…
ఇప్పుడు, నేను దానిని చదవలేను. అది మసకగా ఉన్నది. “మరియు మరలా…” ఇదిగో ఇక్కడే ఉన్నాము.
…నిర్జీవ క్రియల నుండి సంస్కరణ విధానమును మరల వేయక.
268 ఇప్పుడు, ఈ నిఘంటువు అస్సలు ఖచ్చితంగా, ఎటువంటి అనువాదము కాదు. అది కేవలం ఆంగ్లములో చెప్పబడుచున్నదానికి గ్రీకు పదమైయున్నది. మరియు అది ఇట్లు చెప్పినది, “ఇప్పుడు మనము కోరడంలేదు…” ఇక్కడ వినండి, చూడండి.
…నిర్జీవ క్రియల నుండి సంస్కరణ పునాదులను వేయకుందాము.
269 ఇప్పుడు మీరు దీనిని మీ మనస్సులో గ్రహిస్తే చాలు, అదేమిటనగా, అతడు ఇక్కడ ఇట్లు చెప్పుచున్నాడు, “సంస్కరణ విధానములు మరణమునకు కారణమగుచున్నవి.” పౌలు ఇట్లన్నాడు, “నిర్జీవ క్రియలను విడిచి మారుమనస్సు పొందుటయు, మరియు దేవునియందలి విశ్వాసము, బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్తనిక్షేపణము మృతుల పునరుత్థానము: నిత్యమైన తీర్పు, అను పునాదులను మరల వేయక, మూలోపదేశమును మాని, పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” “మరణమును కలిగించు సంస్కరణ విధానములు,” అన్నవి సరియైన పదములైయున్నవి. వాస్తవానికి పౌలు వ్రాసినది అదే. అతడేమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడో చూస్తున్నారా?
270 ఇప్పుడు, ఈ కార్యములన్నీ, ఎలాగంటే బాప్తిస్మములు: ఒకడు వెనుకకు బాప్తిస్మము పొందాడు, ఒకడు ముందుకు పొందాడు, ఒకడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పొందాడు, ఒకడు యేసు నామములో పొందాడు, ఒకడు ఈ విధంగా, ఆ విధంగా పొందాడు, మరియు బాప్తిస్మములో ఉన్న ఈ భిన్నమైన సంగతులన్నీ కలవు.
271 మరియు హస్తనిక్షేపణము కలదు: “దేవునికి స్తోత్రం, నేను హస్తనిక్షేపణం అనే వరమును పొందుకున్నాను. హల్లెలూయా! మీరు, ఈ విధంగా దానిని పొందుకోవచ్చును. హల్లెలూయా!”
272 వాటన్నిటినీ ప్రక్కన పెట్టుట, ఎందుకనగా అవి నిర్జీవ క్రియలైయున్నవి, ఈ సంస్కరణలు, సంస్కరణ చేయడం నిర్జీవ క్రియలైయున్నవి. చూశారా? అతడు మరొక తరగతి గురించి మాట్లాడుచున్నాడు. ఇప్పుడు అతడు ఇట్లన్నాడు, “మనము దానిని మానివేసి, పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” మీకు అది అర్థమైనదా? [సంఘము, “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.]
273 మరియు సంఘము ఇంకనూ ఆ విషయములలోనే తడవుచేయుచున్నది. వారు దానిని చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆదిమ హెబ్రీ సంఘము ఇట్లు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది, “మంచిది, నేను ముంచబడుట ద్వారా బాప్తిస్మము పొందుకున్నాను, మరియు—మరియు నేను దీనిని, మరియు దీనిని, మరియు వీటన్నిటిని పొందుకున్నాను.”
274 అతడు ఇట్లన్నాడు, “ఇప్పుడు, వాటన్నిటినీ ప్రక్కకు పెట్టండి, దానిని వెనుక విడిచిపెట్టేయండి.” అయితే, ఇప్పుడు, మనము వాటిని చేయకూడదని అతడు చెప్పాడా? ఇప్పుడు దాని గురించి అతడు ఏమి చెప్పాడో వినండి.
మరియు దేవుడు సెలవిచ్చినయెడల,…మనమాలాగు చేయుదము.
275 మరియు ఆ అసలైనది కూడా అదే విషయాన్ని చెప్పినది.
దేవుడు మనకు సెలవిచ్చినయెడల, మనమాలాగు చేయుదము, చూడండి.
దేవుడు మనకు సెలవిచ్చినయెడల, మనమాలగు చేయుదము.
276 బాప్తిస్మములు, హస్తనిక్షేపణము, మరియు ఆ కార్యములు ఉన్నాయి, అయితే అవి పరిపూర్ణమైనవి కావు. అది కేవలం శరీర సంబంధమైన సంస్కరణ మాత్రమే. మరియు ఈనాడు అక్కడే, అనగా ఆ శరీర సంబంధమైన సంస్కరణ వద్దనే సంఘములు ఆగిపోతున్నాయి. వారిలో ఒకరు ఇట్లన్నారు, “ఓ, మంచిది, నీరు, బాప్తిస్మము అను పదమునకు అర్థం ఇది మరియు దాని అర్థము అది.”
277 మరియు వారు సంఘసంస్థలు స్థాపించారు: మరియు ఒకరు చల్లుతారు, మరొకరు కుమ్మరిస్తారు, మరొకరు ముఖమును ముందుకు ముంచి బాప్తిస్మము ఇస్తారు, మరొకరు వెనుకకు ఇస్తారు, మరియు ఆ సంగతులన్నీ ఉన్నాయి; వారిలో కొందరు రోగులపై చేతులుంచుతారు, మరియు చేతులుంచుట ద్వారా మరియు మృతుల పునరుత్థానమును బోధించుట ద్వారా, మరది మంచిదే, మరియు క్రీస్తుయొక్క అత్యున్నతమైన దైవత్వమును బోధించుట ద్వారా; అది మంచిదేయైయున్నది, అయితే కొందరు దాని ద్వారా అపొస్తలులను తయారు చేస్తున్నారు; మరియు కొందరు ప్రవక్తలను, మరియు మొదలగువారిని తయారు చేస్తున్నారు. “కానీ,” అతడు ఇట్లన్నాడు, “ఇవన్నీ నామకార్థ సంస్కరణలైయున్నవి. మనము కేవలం సంస్కరణ చెందుతూ ఉన్నాము. ఇప్పుడు మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” మీకు దృశ్యం అర్థమైనదా? [సంఘము, “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.]
278 ఇపుడు గమనించండి. ఇప్పుడు ఇక్కడే ఆ లోతైన భాగము వస్తుంది.
ఏలయనగా ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై,
దేవుని దివ్యవాక్యమును,…రాబోవు యుగసంబంధమైన శక్తిని రుచిచూచిన తరువాత తప్పిపోయినవారు,
తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక; మారుమనస్సు పొందునట్లు, వారిని నూతనపరచుట అసాధ్యము.
279 ఇప్పుడు, క్రియల మూలంగా రక్షణ పొందుతామని నమ్మే మీరు సరిగ్గా ఇప్పుడు మీ మనస్సులో ఏమి కలిగియున్నారో నాకు తెలుసు, కానీ మీరు తప్పైయున్నారు. చూశారా? మంచిది. నేను దీని మీద నిలబడుచున్నాను, మరియు బైబిలు దానిని ధృవీకరిస్తున్నది, అదేమిటనగా, “దేవుడు ఎన్నడైనా ఒక మనిషిని రక్షించినట్లైతే, అతడు కాలమునకు మరియు నిత్యత్వమునకు రక్షించబడ్డాడు.” అది వేరే దేనినో చెప్పునట్లుగా మీరు చేయలేరు.
280 ఈ మధ్యనే, ఒక మౌలికవాది నా దగ్గరకు వచ్చి, మరియు ఇట్లన్నాడు, “బోధకుడా బ్రెన్హామ్, నేను నిన్ను ఒకదాని విషయంలో పట్టుకున్నాను. నీ విషయంలో ఒకటున్నది. ‘ఒక మనుష్యుడు రక్షించబడితే, అతడెన్నడూ నశించిపోజాలడు’ అని నీవు అన్నావుగా?”
281 నేనన్నాను, “దేవుడే దానిని చెప్పాడు.”
282 అతడు ఇట్లన్నాడు, “నేను నిన్ను ఒకటి అడుగగోరుచున్నాను. సౌలు ఒక ప్రవక్తయైయున్నాడు, మరియు అతడు ప్రవచించాడు. మరియు అతడు దేవునిచేత అభిషేకించబడినవాడని నీకు తెలుసు. అతడు అభిషేకించబడినవాడని బైబిలు చెప్పినది. మరియు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు, మరియు అతడు నశించిపోయాడు.”
283 నేను ఇట్లన్నాను, “అతడు నశించిపోయాడా?” నేను ఇట్లన్నాను, “అతడు ‘రక్షించబడ్డాడని’ బైబిలు గ్రంథము చెప్పుచున్నది. అతడు దేవునికి శత్రువుగా మారిన తర్వాత కూడా, అతడింకను రక్షించబడేయున్నాడు. అతడు రక్షించబడ్డాడని బైబిలు గ్రంథము చెప్పినది. మరియు, తుదకు, అతడు ఆత్మహత్య చేసుకోలేదు. ఒక ఫిలిష్తీయుడు అతణ్ణి చంపాడు, మరియు అతడిని చంపినందుకు దావీదు ఆ ఫిలిష్తీయుడిని చంపాడు. అతడు తన ఖడ్గముమీద, తన ఈటెమీద, ఖడ్గముమీద పడ్డాడు, కానీ, అతడు పడ్డాడు. కానీ దానివలన అతడు చనిపోలేదు. మరి ఒక ఫిలిష్తీయుడు అతణ్ణి చంపాడు. మరైతే సౌలు మంత్రగత్తె యొద్దకు వెళ్ళినపుడు, మరియు ఆమె సమూయేలు యొక్క ఆత్మను పిలిచినది, ఎందుకనగా అతడు మహిమలోనికి ప్రవేశించలేదు, పాపమును తీసివేయలేని ఎద్దులు మరియు మేకలయొక్క రక్తము క్రింద అతడు పరదైసులో ఉన్నాడు. అయితే అతడు లోపలికి ప్రవేశించేవరకు, అతడు వేచియుండటానికి ఒక స్థలము ఉండవలసియున్నది, మరదే పరదైసు అని పిలువబడినది.”
284 అక్కడే క్యాథలిక్ ప్రజలైన మీరు గందరగోళమయ్యారు. చూశారా? ఇప్పుడు, ఇప్పుడు ఇక ఎటువంటి పరదైసు లేదు. మనము నేరుగా దేవునియొక్క సన్నిధిలోనికి వెళ్తాము.
285 మరియు ఏన్దోరులోని మంత్రగత్తె సమూయేలుయొక్క ఆత్మను పిలిచినప్పుడు, అతడు అక్కడ నిలబడ్డాడు. మరియు ఆమె బోర్ల పడి, మరియు ఇట్లన్నది “నీవు నన్ను ఎందుకు మోసగించావు?”
286 మరియు సౌలు…నా భావము సమూయేలు, తన ప్రవక్త వస్త్రములలో అక్కడ నిలబడుట మాత్రమే కాదు గాని, అతడింకను ఒక ప్రవక్తయైయున్నాడు. అతడు ఇట్లు చెప్పాడు, “నీవు దేవునికి శత్రువుగా మారావని చూస్తుండగా,” ఇట్లన్నాడు, “నా విశ్రాంతిలో నుండి నీవు నన్ను ఎందుకు పిలిచావు?”
287 అతడు ఇట్లన్నాడు, “సరి, ఆ ఊరీము నాతో ఇక ఎంతమాత్రము మాట్లాడుటలేదు. ప్రవక్త నాకు ఇక ఎంతమాత్రము ప్రవచింపలేకున్నాడు. నేనైనా ఒక కలను పొందుకోలేకపోవుచున్నాను.”
288 “సరి,” సమూయేలు ఇట్లన్నాడు, “నీవు దేవునికి ఒక శత్రువైనావు. అయితే రేపు యుద్ధము మరొక విధంగా జరుగుతుంది, మరియు రేపు నీవు మరణిస్తావు. మరియు రేపు రాత్రి, ఈ సమయానికి, నీవు నాతో కూడా ఉంటావు.” సౌలు నశించిపోయినట్లైతే, అప్పుడు సమూయేలు కూడా నశించిపోయినట్లే, వారిద్దరూ ఒకే దగ్గరున్నారు. నిశ్చయంగా. బైబిలు దానిని చెప్పినది.
289 ఇప్పుడు, మీరు భాషలతో మాట్లాడడం, కేకలు వేయడం, ఊగిపోడం, వణికిపోడం, మధ్యదారిలో పైకి-క్రిందికి పరుగెత్తడం వలన మొత్తం ఉద్రేకపూరితము కావచ్చును. దానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. అయితే మీరు, మీరు రక్షింపబడకముందే మీరు రక్షింపబడ్డారని మిమ్మల్ని మీరు నమ్మించుకోగలరు. మీరు ఏమైయున్నారో మీ జీవితమే ఋజువు చేస్తుంది. అది ఋజువు చేస్తుందని యేసు చెప్పాడు, “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు.” మీరు మీ నోటిని ఎన్నడూ తెరువకపోయినా, మీరు రక్షింపబడ్డారో లేదో అన్నది మీ జీవితం ఋజువు చేస్తుంది. మీరు ఏమిటనేది అది ఋజువు చేస్తుంది.
290 అయితే ఈ సమస్త భావో-ద్వేగము మరియు ఈ ఉద్రేకము మరియు సంఘములో చేరుట, “మరియు నేను యేసు నామములో బాప్తిస్మము పొందాను, హల్లెలూయా, నేను దానిని పొందుకున్నానని నాకు తెలుసు” అని అనడము, అసలు అది ఏమియు కాదు.
291 “నేను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, ముఖము ముందుకుండి, మూడుసార్లు బాప్తిస్మము పొందాను. నేను దానిని పొందుకున్నాను.” అది ఏమియు కాదు.
292 పౌలు ఇట్లన్నాడు, “ఇప్పుడు మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” పరిపూర్ణులుగా చేయబడటం గురించి మనము మాట్లాడుతున్నాము. మరియు మనము దీనిని జాగ్రత్తగా పరిశీలించినట్లైతే, పరిపూర్ణులుగా చేయబడినవారు ఏర్పరచబడినవారని, మీరు కనుగొంటారు. కొద్ది నిమిషాలలో, బైబిలు గ్రంథము ద్వారా, నేను దానిని మీకు ఋజువు చేస్తాను. అది ఎన్నుకోబడినవారే, దేవుడు వారినే జగత్తుపునాది వేయబడకముందు, వారిలో ప్రతి ఒక్కరినీ చూసాడు. మరియు ఆ ప్రజలను విమోచించుటకే ఆయన యేసును పంపాడు, లోకమంతటినీ విమోచించుటకు కాదు. ఆయన విమోచించగోరాడు, అయితే ఆయన వారి కొరకు ఒక మార్గమును కలుగజేయవలసియున్నది. మరియు ఆయన ఏర్పాటుచేయగల ఒకేఒక్క మార్గమేదనగా, క్రీస్తును పంపడమే; తద్వారా ఆయన, మన పాపములకు ప్రాయశ్చిత్తముగా వచ్చి, ఎన్నుకోబడినవారిని మహిమలో, ఆయనయొద్దకు తీసుకొని రాగలుగుటకైయున్నది.
293 “సరి, ఎవరో ఒకరు నాపై జాలిపడి, బహుశా వారు వచ్చి మరియు రక్షించబడతారేమో,” అని చెప్పునట్లు, దేవుడు తన కార్యాలయమును అంత దయనీయంగా ఉంచడాన్ని మీరు ఊహించగలరా? ఏమి చేయడానికైనా దేవుడు నిన్ను అడుక్కోవలసిన అవసరం లేదు. ఏ అడుక్కోవడమైనా ఉంటే, నీవే అడుక్కోవలసియున్నది, దేవుడు కాదు.
294 మరియు పిదప, మచ్చైనను ముడతైనను లేకుండా ఆవలిన ఆయనను కలుసుకోవడానికి, ముందుజ్ఞానము ద్వారా దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, వారిని రక్షించడానికే క్రీస్తు మరణించాడు. జగత్తుపునాది వేయబడకముందే, మహిమలో ఆయన నిన్ను చూశాడు. బైబిలు దానినే చెప్పినది, ఎఫెసీ, 1వ అధ్యాయము. 5వ అధ్యాయము, 1వ వచనము. దేవుడు ముందుజ్ఞానము ద్వారా ముందుగా నిర్ణయించాడు.
295 ఇప్పుడు, దేవుడు దానిని చేసినయెడల, జగత్తుపునాది వేయబడకముందే మనల్ని ముందుగా నిర్ణయించుకున్నయెడల, మరియు జగత్తుపునాది వేయబడకముందే, మనలో ప్రతి ఒక్కరినీ పేరుతో ఎరిగియుండి, మరియు నిత్యజీవమునకై మనల్ని ఎన్నుకొని, మరియు ఆరు వేల సంవత్సరాల క్రితం, ఆయన మనల్ని చూసిన విధంగా, ఆయనయొక్క స్తోత్రార్థమై, మనము మహిమలో కనబడునట్లు, మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తును పంపినయెడల, మీరు ఎన్నడైనా ఎలా నశించిపోగలరు?
296 ఇప్పుడు, నీవు రక్షించబడ్డావంటే, నీవు రక్షించబడ్డావు అంతే. ఈ రోజునుండి పది సంవత్సరాల తర్వాత ఆయన నిన్ను కోల్పోతాడని ఎరిగియుండి, దేవుడు ఈ రాత్రి నిన్ను రక్షించినట్లైతే, ఆయన తన స్వంత ఉద్దేశ్యమును విఫలపరుస్తున్నట్లే; అటువంటప్పుడు అనంతుడైన, సర్వశక్తిమంతుడైన, నిత్యుడైన, అనంతజ్ఞానముగల, దేవునికి, నీవు చివరిదాకా కొనసాగుతావా లేదా కొనసాగవా అని ఎరిగియుండుటకు చాలినంత జ్ఞానము లేనట్లే. పిదప, ఆయన నిన్ను రక్షించి, మరియు “మంచిది, నేను అతనికి ఒక పరీక్ష పెట్టి, మరియు అతడేమి చేస్తాడో చూస్తాను,” అని చెప్పినప్పుడు, అప్పుడు ఆయన ఆదిలోనే అంతమును ఎరిగినవాడు కాదు. దేవుడు తానేమి చేస్తున్నాడో ఎరిగియున్నాడు, దాని గురించి నీవెన్నడూ చింతించకు. దారిలో తడబడేది నువ్వు నేనే. దేవుడు తానేమి చేస్తున్నాడో ఎరిగియున్నాడు. మరియు మనము చివరిదాకా కొనసాగుతామా, లేదా మనము ఏమి చేస్తామన్నది…ఆయనకు తెలుసు.
297 ఇప్పుడు, ఏశావు మరియు యాకోబు, ఆ ఇద్దరిలో ఏ బిడ్డయైనా పుట్టకముందే, దేవుడు ఇట్లు చెప్పాడని, బైబిలు గ్రంథము చెప్పినది, “నేను ఒకరిని ప్రేమించితిని, మరొకరిని ద్వేశించితిని,” ఆయనయొక్క ఎన్నికయే సత్యముగా నిలుచునట్లు, వారు తమ మొదటి శ్వాసనైనా పీల్చకముందే అలా చెప్పాడు.
298 అబ్రాహాము ఎవరు (కొన్ని నిమిషాలలో, క్రింద ఇక్కడ మనము అతని యొద్దకు వస్తాము.), దేవుడు అతడిని పిలిచి, ఏమియు లేకుండానే అతడిని రక్షించడానికి, అతడెవరు? దేవుడు మనిషితో ఒక నిబంధనను చేస్తాడు, మనిషి తన నిబంధనను బ్రద్దలు చేస్తాడు. అయితే దేవుడు ఈ నిబంధనను స్వయంగా తనతోనే చేసుకున్నాడు, మరియు దానిని స్వయంగా తనతోడు అని ప్రమాణము చేసాడు, మానవునికి దానితో ఎటువంటి సంబంధము లేదు. అది దేవునియొక్క స్వంత ముందుజ్ఞానమైయున్నది, ఎలాగైనా, ఆయన దానిని చేశాడు.
299 ఇప్పుడు, మీరు ఇట్లంటారు, “మంచిది, సహోదరుడా బ్రెన్హామ్, అలాగైతే నేను ఒక క్రైస్తవుడిగా మారినయెడల, నేను కోరిన దేనినైనా నేను చేయవచ్చా?” ఖచ్చితంగా. నీవు ఒక క్రైస్తవుడవైతే, నీవు కోరిన దేనినైనా నీవు చేయుము. మరైతే తప్పు చేయుటకు నీవు ఎటువంటి కోరికను కలిగియుండవని, నేను హామీ ఇస్తాను. మీరు ఏదైనా చేయండి. నేనెల్లప్పుడూ సరిగ్గా నేను కోరినదానినే చేసాను. మరియు నేను నరకమునకు వెళ్తానని భయపడుతున్నాను గనుక నేను ప్రభువును సేవించినట్లైతే, నేను ఆయనను సరిగ్గా సేవించనట్లే. నా భార్య నాకు విడాకులిస్తుందేమో అని భయపడుతున్నాను గనుక నేను నా భార్యకు నమ్మకంగా జీవించినట్లైతే, నేను ఎంతో మంచి భర్తను కాను. అయితే నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనుక, నేను దేనికొరకును ఆమెను బాధపెట్టను.
300 ఒక మనిషి దేవుని ఆత్మ ద్వారా జన్మించినప్పుడు, క్రీస్తు విషయంలోనూ అది ఆ విధంగానే ఉంటుంది. అతడు కేకలు వేసినందుకో, భాషలతో మాట్లాడినందుకో, లేదా ఏదో ఒక ఉద్రేకమువలనో కాదు గానీ; అతని హృదయములోనికి, ప్రేమ వచ్చి లోకముయొక్క స్థానమును తీసుకున్నందుకైయున్నది. నేను మీకు చెప్తున్నా గదా, అతడు ఆయనను ప్రేమిస్తాడు. ప్రతిరోజు, అతడు ఆయనతో నడుస్తాడు. “ఇది, లేదా అది, లేదా ఆ మరొకటి చేయడం తప్పు,” అని మీరు అతనికి చెప్పనవసరం లేదు. అది తప్పని అతనికి తెలుసు. మరియు, అతడు నడుస్తాడు, అతడు దేవుని సార్వభౌమాధికార కృపయొక్క నిర్ణయించబడిన ఉత్పత్తియైయున్నాడు. ఖచ్చితంగా.
ఏలయనగా ఒకసారి వెలిగించబడి,…పరలోకసంబంధమైన పిలుపులో పాలిభాగస్థులైనవారికి…అసాధ్యము…
ఇప్పుడు, అది వెలిగింపబడి మరియు మరలా తప్పిపోయిన ఒక వ్యక్తి గురించియని మనము ఒకప్పుడు నమ్మాము, కానీ బైబిలు గ్రంథము దానిని ఆ విధంగా చెప్పడంలేదు. అతడిక్కడ ఇట్లు చెప్తున్నాడు, “పరిశుద్ధాత్మను పొందిన ఒక మనుష్యుడు,” “ఎన్నడైనా తప్పిపోవడం అనేది ఖచ్చితంగా అసాధ్యము.” ఇప్పుడు దానిని చదివి మరియు అది సరికాదేమో కనుగొనండి. ఇక్కడ గమనించండి, వచనమును, ఆ పూర్తి వచనమును, మరియు ఆ విషయములను, లేదా, ఆ సందర్భమును తీసుకోండి.
301 ఇప్పుడు అతడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు, అది దేని గురించి? “మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” ఇప్పుడు, అతడు ఇట్లన్నాడు, “సిద్ధాంతములు, బాప్తిస్మము మరియు సంస్కరణలు అనే, శరీరసంబంధమైన పునాదులు వేయకుందుము. మనము దానిని చేయకుందుము. మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” అంశము పరిపూర్ణత అయ్యున్నది, మరియు పరిపూర్ణత క్రీస్తు ద్వారా వస్తుంది. మరియు మనము క్రీస్తులోనికి ఎలా ప్రవేశించాము? సంఘములో చేరుట ద్వారానా? “ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.” ఈ విధంగా: ఒకడు, భాషలతో-మాట్లాడుట ద్వారా లోపలికి వచ్చాడు; ఒకడు, కర-చాలనం ద్వారా లోపలికి వచ్చాడు; ఒకడు, నీటి-బాప్తిస్మము ద్వారా లోపలికి వచ్చాడు కాదు. “అయితే ఒక్క ఆత్మ ద్వారా మనము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.” మీకు అది అర్థమైనదా? అదియే పరిపూర్ణతయైయున్నది.
302 మరియు మీరు దానిలోనికి ప్రవేశించినప్పుడు, మీరు క్రీస్తులో ఉన్నారు, మరియు లోకము మీకు మృతమైనదిగా ఉంటుంది. మరియు మీరు ప్రతీ రోజు గొఱ్ఱెపిల్లతో నడుస్తారు, మరియు ఏమి చేయాలని, మీ అడుగులు దేవుని చేత నిర్దేషించబడతాయి. ఓ, మనము ఎదుర్కొనే ఆ కష్టాలు మరియు పరీక్షలు! మీరు ఇట్లంటారు, “మీకు పరీక్షలు వస్తాయా?” అవును, అయ్యా. ఏమిటి…
303 దేవుడు నా కొరకు చేసినది కృప, నేను దేవుని కొరకు చేసేది క్రియలు. ఇప్పుడు, వారు దానినుండి ఒక సిద్ధాంతమును తయారు చేస్తారు, మీకు యోగ్యతను సంపాదించేది ఆ క్రియలేనని వారు అనుకుంటారు. అది అలాగైనయెడల, అప్పుడది ఒక ఉచితమైన బహుమానము కాదు. కృప అనేది దేవుడు నీ కొరకు చేసిన విషయమైయున్నది, “కృప ద్వారా నీవు రక్షించబడియున్నావు.” మరియు ఆయన నీపై చూపించిన కృపకు కృతజ్ఞతగా నీవు చేసేది క్రియలైయున్నవి. మరియు మీరు ఆయనను ప్రేమిస్తున్నట్లైతే, మీరు ప్రభువుయొక్క క్రియలను చేయడానికి ఇష్టపడతారు. నిశ్చయంగా, ఎందుకనగా, అప్పుడు, మీరు—మీరు ఆయనను ప్రేమిస్తున్నందుకైయున్నది.
304 మేడా బ్రాయ్ ని, నా భార్యగా అంగీకరించడమనేది, ప్రేమ ఆమె కొరకు చేసిన విషయమైయున్నది. దానిని ప్రశంసిస్తూ, ఆమె ఏమి చేస్తుంది: ఆమె ఒక మంచి స్త్రీయైయున్నది, ఇంట్లోనే ఉండి, పిల్లలను చూసుకుంటుంది, మరియు ఒక మంచి నమ్మకమైన జీవితమును జీవిస్తుంది. అది మాకు వివాహము అవ్వనందుకు కాదు; మాకు వివాహమైనది. అయితే ప్రశంసగా ఆమె దానిని చేస్తుంది. ప్రతి రోజు, ఆమె నగరములోనికి వెళ్ళి, మరియు ప్రతీ పది -సెంట్ల దుకాణంలోకి వెళ్ళి, మరియు వీధుల్లో పైకి-క్రిందికి తిరుగుతూ ఉండి, మరియు ఎన్నడూ గిన్నెలు కడుగకుండా, లేదా అటువంటిదేదీ చేయకపోయినా, మేమింకను వివాహితులమే. ఖచ్చితంగా. నేను నా ప్రమాణం చేసినప్పుడు, అదే దానిని స్థిరపరచినది. ఆమె నా భార్యయైయున్నది. మాలో జీవమున్నంతవరకు, ఆమె నా భార్యగానే ఉంటుంది. అది ఆమెయొక్క ప్రమాణమైయున్నది. అయితే దానికి ప్రశంసగా ఆమె ఏమి చేస్తుంది: ఆమె ఇంట్లోనే ఉండి, పిల్లలని శ్రద్ధగా చూసుకుంటూ, మరియు ఒక నిజమైన భార్యగా ఉండుటకు ప్రయత్నిస్తుంది.
305 నేను బయటకు వెళ్ళి మరియు ఎల్లవేళలా బయటనే ఉండి, దేశములో కేవలం అలా తిరుగుతూ ఉండి, మరియు ఆమెను పస్తులు ఉండనిచ్చి, లేదా అటువంటిదేదైనా చేసి, పిల్లలకు తినడానికి ఏమీ లేకుండా వదిలేసినా; మేమింకను వివాహితులమే. చివరికి ఆమె నాకు విడాకులిచ్చినా గాని, నా శరీరములో జీవమున్నంతవరకు నేను, నేను వివాహితుడనే. “మరణము మనల్ని వేరు చేసేవరకు,” అనే ఆ ప్రమాణము నేను చేశాను. అది నిజము. మేమింకను వివాహితులమే. మరి, అయినను, ఒక భర్త అనడానికి నేను ఒక దయనీయమైన మాదిరిగా ఉంటాను. ఒక భార్య అనడానికి ఆమె ఒక దయనీయమైన మాదిరిగా ఉంటుంది. కావున మేము ఒకరినొకరము ప్రేమించుకొనుచున్నయెడల, మేము కలిసికట్టుగా ఉండి మరియు ఇద్దరము కలిసి, ఆ భారమును లాగుతాము.
306 దేవుడు మరియు ఆయన సంఘము ఆ విధంగానే ఉన్నారు. నీవు దేవుని రాజ్యములో జన్మించినప్పుడు, నీవు నీయొక్క హెచ్చు తగ్గులను కలిగియుంటావు, నిజమే, కానీ నీవు ఇంకనూ ఒక క్రైస్తవుడవే, నీవు ఇంకనూ దేవునియొక్క ఆత్మ ద్వారా జన్మించినవాడవే. బహుశా దేవుడు నిన్ను భూమి మీదనుండి త్వరగా తీసుకోవాల్సివస్తుంది.
…ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును…రుచిచూసిన వారు,…
…మారుమనస్సు పొందునట్లు వారిని నూతనపరచడానికి, అసలు వారు తప్పిపోవడము అసాధ్యము;…
307 ఇప్పుడు, సంఘమా, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీకు కేవలం కొద్దిగా బలమైనదానిని ఇవ్వనివ్వండి, తద్వారా ఆ—ఆ క్రియల మూలంగా రక్షణ పొందుతామనే పక్షము పూర్తిగా మూసివేయబడుటకైయున్నది. మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయమునకు వెళ్ళి, మరియు కేవలం కొద్దిసేపు దీనిని చూద్దాము.
308 10వ అధ్యాయము, 26వ వచనము.
మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత…బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల, పాపమునకు బలి యికను ఉండదు గాని,
న్యాయపు తీర్పునకు…భయముతో ఎదురు చూచుటయు, విరోధిని దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండును.
ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు:
ఇట్లుండగా, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి…తాను…పరిశుద్ధపరచబడుటకు సాధనమైన,…నిబంధన రక్తమును…అపవిత్రమైనదిగా ఎంచి, కృపవలనైన కార్యములను తిరస్కరించినవాడు, ఎంత ఎక్కువైన దండనకు, పాత్రుడుగా ఎంచబడునని…మీకు తోచును?
309 ఇప్పుడు మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, దాని సంగతేమిటి? అది ఎలాగుంది?”
ఇప్పుడు, చదవడానికి, “ఆ లేఖనము దానిని చెప్పడంలేదని,” నేను అనుకుంటున్నాను. అది ఒక క్రైస్తవుని గురించి మాట్లాడటం లేదు. అది వాక్యమును విని దానిని తిరస్కరించిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుచున్నది. చూశారా?
ఏలయనగా మనము పాపము చేసినట్లైతే…(పాపము అనగా ఏమిటి? అవిశ్వాసము.)…మనకు సువార్త ప్రకటించబడిన తరువాత మనము బుద్ధిపూర్వకముగా అవిశ్వాసముంచినయెడల, పాపమునకు బలి యికను ఉండదు,
310 పాపము అనగా ఏమిటి? అవిశ్వాసమే. పరిశుద్ధ యోహాను, 4వ అధ్యాయమును చదవండి. యేసు ఇట్లన్నాడు, “విశ్వసించనివాడు ఇదివరకే తీర్పు తీర్చబడెను.” పాపము అనగా ధూమపానము, మద్యపానము, వ్యభిచరించడము కాదు. నీవొక అవిశ్వాసివి గనుక నీవు వాటిని చేస్తావు. అవి కేవలం గుణలక్షణములైయున్నవి. నీవొక అవిశ్వాసివి గనుక నీవు వాటిని చేస్తావు. కేవలం ధూమపానం మానేయడం, మద్యపానం మానేయడం, మరియు మొదలగువాటిని మానేయడం వలన, దాని అర్థం నీవు—నీవు ఒక క్రైస్తవుడవని కాదు. అవి కేవలం నీ మార్పుయొక్క గుణలక్షణములైయున్నవి. అయితే, నీవు—నీవు రెండు విధములుగా చేసి కూడా, అలా అయ్యుండకపోవచ్చును.
311 ఇప్పుడు గమనించండి.
…తరువాత బుద్ధిపూర్వకముగా అవిశ్వాసము ఉంచువాడు…
312 “క్రీస్తును తన హృదయములో స్వీకరించిన తర్వాత,” కాదు—కాదు. బైబిలు అలా చెప్పడంలేదు. ఇట్లు చెప్పుచున్నది, “అతడు…”
…మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత…బుద్ధిపూర్వకముగా పాపము, (బుద్ధిపూర్వకముగా అవిశ్వాసముంచిన) యెడల…
దానిని గ్రహించారా? మాట్లాడుచున్నది, అసలు ఒక క్రైస్తవునితో కానే కాదు.
313 ఈ మధ్యనే, ఎవరో ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి, మరియు ఇట్లన్నది, “సహోదరుడా బ్రెన్హామ్, నేను ఒక క్రైస్తవురాలిని, కానీ నేను పరిశుద్ధాత్మను దూషించాను.”
314 “అది అసాధ్యము,” అని నేను చెప్పాను. ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మను దూషించలేడు. మీరు దానిని చేయలేరు. ఒక క్రైస్తవ ఆత్మ క్రీస్తుయొక్క ఆత్మతో సాక్ష్యమిస్తుంది. చూశారా? మరియు మీరు, దేవునికి చెందిన ప్రతిదానిని, “దేవునిది” అని అంటారు.
315 అయితే మీరు శరీరసంబంధమైన-మనస్సు గలవారైతే, మీరు పరిశుద్ధాత్మను చూసి ఎగతాళి చేస్తారు మరియు అపహాసము చేస్తారు; మీరెంతగా సంఘమునకు వెళ్తారన్నది నేను లెక్కచేయను, మీరింకను ఒక పాపియే, మరియు మీరు పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. యేసు వారి తలంపులను వివేచించుటను వారు చూసినప్పుడు, ఆయన ఒక “సోదె-చెప్పువాడు” అని వారన్నారు.
316 యేసు ఇట్లన్నాడు, “మీరు…దానిని బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, దానికి విరోధముగా మీరు ఒక్క మాట మాట్లాడినా, అది ఎన్నడూ క్షమించబడదు.”
ఎందుకనగా, “అతడొక అపవిత్రాత్మను కలిగియున్నాడు,” అని వారన్నారు, దేవుని ఆత్మను, “అపవిత్రమైనది,” అని పిలచుచున్నారు.
ఒక క్రైస్తవుడు అట్లు చేయలేడు. ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ దేవుని ఆత్మను, “నీతిగలది” అని పిలుస్తాడు. చూశారా? ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మను దూషించలేడు. దూషించేది బయటివాడే.
317 అక్కడ నిలబడియున్నది క్రైస్తవులు కారు. వారు మత సంబంధమైన ప్రజలు, వారు సనాతన యూదులు, దైవజ్ఞాన పండితులు, మరియు మొదలగువారైయున్నారు, మరియు వారు ఆయనను మరియు ఆయన క్రియలను ఎగతాళి చేస్తూ ఉన్నారు, దేవుని క్రియలను, వాటిని, “వాటిని చేస్తున్నది ఒక అపవిత్రాత్మ” అని అన్నారు.
318 మరియు ఈనాడు తమ పేరు ప్రక్కన D.D.D లను, Ph.D లను కలిగియున్న ఎంతమంది, పరిశుద్ధాత్మను దూషిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఎంతమంది మూర్ఖమైన, గొప్ప సాంప్రదాయవాదులు, క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు, మెరుగులు దిద్దబడిన పండితులుగాను, బాగా తెలివిగలవారునైయుండి, వీధులలో నడుస్తూ మరియు పరిశుద్ధాత్మ క్రియలను ఎగతాళి చేస్తున్నారు? నిజము. అయితే వారు పరిశుద్ధాత్మను ఎగతాళి చేస్తున్నారు, మరియు తద్వారా వారు దానిని దూషిస్తున్నారు.
కానీ ఒక తిరిగి-జన్మించిన క్రైస్తవుడు దానిని చేయలేడు. అతడు ఇట్లంటాడు, “అతడు నా సహోదరుడైయున్నాడు. అది జీవముగల దేవునియొక్క ఆత్మయైయున్నది.” అది నిజము. ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మను దూషించలేడు.
319 పరిశుద్ధాత్మను దూషించేది పాపియే; అవిశ్వాసియే, పాపియే, అనగా ఒక “అవిశ్వాసియే.” రెండు విషయాలు మాత్రమే ఉన్నాయి: అయితేనా నీవు ఒక విశ్వాసివైయున్నావు, లేదా ఒక అవిశ్వాసివైయున్నావు.
320 ఇప్పుడు, ఇక్కడ గమనించండి, ఇప్పుడు దీనిని బాగుగా పూర్తి చేయడానికి చెప్తున్నాను. నన్ను ఎల్లప్పుడూ కలవరపెట్టిన ఒక దర్శనమును నేను పొందుకున్నాను. సంవత్సరాల క్రితం నేను దానిని చూస్తుండేవాణ్ణి. నేను ఇట్లన్నాను, “ఓ, అలాగైతే ఒక మనుష్యుడు ఒక్కసారి పరిశుద్ధాత్మను పొందుకొని, మరియు తర్వాత పడిపోయినట్లైతే, అతడు ఎప్పటికీ నశించిపోతాడు.” దానితో ఈ మరొకటి నాకు అర్ధవంతముగా అనిపించలేదు.
321 నేను ఇట్లన్నాను, “అలాగైతే బైబిలు గ్రంథము ఎందుకు ఇలా చెప్పినది, అదేమిటనగా, ‘నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, నిత్యమైనది, మరియు ఎన్నడూ తీర్పులోనికి రాక, మరణమునుండి జీవములోనికి దాటియున్నాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, మరియు వారిలో ఎవ్వరూ నశించిపోరు, అంత్య దినములలో నేను వారిని లేపుదును. నా చేతిలో నుండి ఏ మనుష్యుడు వారిని పెరికివేయలేడు’? అది దీనితో ఎలా సరిపోతుంది? నేను దానిని అసలు అర్థం చేసుకోలేకపోయాను. ‘ఒకసారి వెలిగింపబడినవారికి తర్వాత అసాధ్యము.’” నేను ఇట్లనుకున్నాను, “ఏదో తప్పున్నది. నాకు అది అసలు అర్థం కావడంలేదు.”
మరియు సంవత్సరాల క్రితం, నేను ఒక చిన్న పెంతెకొస్తు కూటానికి వెళ్ళాను.
322 ఈ రాత్రి, సంఘములో, అది గుర్తున్నవారు, ఒక్కరు కూడా లేరని నేను అనుకుంటున్నాను. సంవత్సరాల క్రితం, ఇది సరిగ్గా ఆలయము నిర్మించబడిన సమయమప్పుడైయున్నది. ఆ వెనుకనున్న సహోదరుడు గ్రాహమ్, లేదా ఇంకెవరో తప్ప మరెవరును లేరు. సహోదరులారా, మొదట మీరు ఇక్కడున్నారో, లేదో, నాకు తెలియదు. సహోదరుడు మహోనే, ఉన్నాడని, నేను అనుకుంటున్నాను. అవును. సరిగ్గా నాకు వివాహమవ్వడానికిముందు జరిగినది.
323 ఆ వరము పనిచేయుచున్నది, నేను భయపడ్డాను. అది దయ్యపు సంబంధమైనదని వారు నాతో చెప్పారు. ప్రభువుయొక్క దూత నాతో చెప్పేవరకు నాకు తెలియలేదు.
324 నేను మిషవాకకు వెళ్ళాను, మరియు నేను ఆ కూటములో కూర్చున్నాను, అంతగా కేకలు వేయడాన్ని మరియు ఏడ్పును మరియు దేవుని స్తుతించడాన్ని నేను ఎన్నడూ వినలేదు. నేను ఇట్లనుకున్నాను, “సహోదరుడా, ఇదే పరలోకము.” మరియు, ఓ, వారు పైకి-మరియు-క్రిందికి ఎలా వెళ్ళేవారో.
325 విభజన కారణంగా, వారు దానిని ఉత్తరాన్న కలిగియుండాల్సి వచ్చింది. నల్లజాతివారు మరియు తెల్లజాతివారు కలిసియున్నారు. W. యొక్క P.A. మరియు J.C. యొక్క P.A. నిజముగా విలీనమైపోయి, మరియు యునైటెడ్ పెంటెకోస్టల్ గా మారిపోయారు. అయితే మిషవాకలోని సహోదరుడు రో యొక్క మందిరము వద్ద, వారు ఎటువంటి ఒక ఉజ్జీవమును కలిగియుంటున్నారో. మరియు ఒక చిన్న, ఆసక్తిగల వ్యక్తినైన నేను, వెనుక సీటులో కూర్చొని, దీనంతటినీ గమనిస్తున్నాను. ఈ సంగతులను నేను ముందెన్నడూ చూడలేదు.
326 అక్కడ ఒక మనిషి కూర్చొనియున్నాడు…ముందెన్నడూ నేను దీనిని బహిరంగముగా చెప్పలేదు. ఒక ప్రక్కన ఒక వ్యక్తి కూర్చొనియున్నాడు, మరొక ప్రక్కన మరొక వ్యక్తి ఉన్నాడు, మరియు ఒకడు భాషలతో మాట్లాడాడు, ఆ మరొకడు దానిని అనువదించాడు. మరియు వివిధ కార్యములు జరుగబోతున్నవని వారు చెప్పేవారు. పిదప, ఇతడు భాషలతో మాట్లాడేవాడు, మరియు అతడు అనువాదమిచ్చేవాడు. నేను ఇట్లనుకున్నాను, “మై, అది అద్భుతంగా లేదా!” నేను ఇట్లనుకున్నాను, “ఎంత మహిమకరమైనది! వారు మనుష్యుల రూపములో దిగివచ్చిన, దేవదూతలైయుంటారు.”
327 మంచిది, ఇంటికి తిరిగి రావడానికి, నా దగ్గర కేవలం ఒక డాలరు డెబ్బై-ఐదు సెంట్లు మాత్రమే ఉన్నాయి, మరియు నేను—నేను—నేను కేవలం ఒక ట్యాంకు నిండా గ్యాసును మాత్రమే కొనుక్కోగలను. ఆ రాత్రి నేను ఒక మొక్కజొన్న పొలములో పడుకున్నాను. నేను దానిలోని కొంత భాగాన్ని ఒక పుస్తకంలో చెప్పాను, అయితే మొత్తం కాదు, ఎందుకనగా నేను వారి మనోభావాలను గాయపరచాలనుకోలేదు. మరియు కావున, ఆ రాత్రి, “బోధకులందరూ వేదిక మీదకు రావాలి,” అని వారన్నారు. నేను వేదిక మీద ఉన్నాను. అప్పుడు అక్కడ నేను అత్యంత యవ్వనస్థుడైన బోధకుణ్ణి.
328 కావున, ఆ మరుసటి ఉదయము, వచ్చి బోధించమని వారు నన్ను అడిగారు. నేను దాక్కున్నాను. మీకు తెలుసా, ఒక నల్లజాతీయుడు, “ఇదిగో అతడు ఇక్కడున్నాడు” అని చెప్పాడు. నేను అక్కడ కూర్చొనియున్నానని, అతడు బయటపెట్టినప్పటి ఆ కథ మీకు గుర్తున్నది కదా.
329 మరియు కావున ఆ రోజు బోధించిన తరువాత, అక్కడ నడుస్తూ, నేను ఇట్లనుకున్నాను, “నేను ఆ ఇద్దరు మనుష్యుల వద్దకు వెళ్ళగలిగితే చాలు.” వారు ఆ కూటమును నడిపించారు. ఒక వ్యక్తి లేచేవాడు మరియు అతని ముఖం తెల్లబారుతుంది; అతడు భాషతో మాట్లాడేవాడు. మరియు మరొక వ్యక్తి దానిని అనువదించి, మరియు ఈ మాటలను చెప్పేవాడు, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ‘ఇక్కడ ఒక ఫలానా-ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఫలానా-ఫలానా పేరు గలవాడు, అతడు దీనిని మరియు ఈ ఫలానా-ఫలానా దానిని చేయవలసియున్నది.’” సహోదరుడా, మరది సత్యమేయైయుండేది. మరియు ఆ మరొకడు లేచి భాషలతో మాట్లాడేవాడు, మరియు ఇతడు అనువదించేవాడు.
330 నేను ఇట్లనుకున్నాను, “ఓ, మై, ఇది అద్భుతంగా లేదా!” కావున, ఆ రోజు, నేను ఆలోచించాను, నేను బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. నేను ఇట్లనుకున్నాను, “ప్రభువా, నీవు నా కొరకు దానిని మరలా చేయవా.” దానిని ఏమని పిలువాలో నాకు తెలియదు, దర్శనములైయున్నవి.
331 నేను బయటకు వెళ్ళి ప్రార్థించాను, మరియు నాకు సహాయము చేయమని ప్రభువును కోరాను. నేను భవనము చుట్టూ తిరిగాను, మరియు వారిలో ఒకరు నాకు ఎదురయ్యారు. ఇప్పుడు, విషయాలను తెలుసుకునే ఒక మార్గము ప్రభువు నాకు ఇచ్చాడు. నేను అతనితో కరచాలనము చేసాను. నేను ఇట్లన్నాను, “నీవు ఎలా ఉన్నావు?”
అతడు ఇట్లన్నాడు, “నీవు ఎలా ఉన్నావు? నీ పేరు ఏమిటి?”
మరియు నేను ఇట్లు చెప్పాను, “బ్రెన్హామ్.”
“ఓ,” అతడు ఇట్లన్నాడు, “ఈ ఉదయము బోధించిన ఆ యవ్వనస్థుడవు నీవేనా.”
“అవును, అయ్యా,” అని నేను చెప్పాను.
332 నేను అతనితో మాట్లాడుచుండగా, నేను అతని ఆత్మను కనుగొన్నాను. మరియు అతడు ఒక నిజమైన క్రైస్తవుడైయున్నాడు, సహోదరుడా, అసలు ఒక స్వచ్ఛమైన క్రైస్తవుడైయున్నాడు. నా భావమేమిటంటే, అతడు ఒక విశ్వాసియైయున్నాడు. నేను ఇట్లనుకున్నాను, “ఓ, ఇది అద్భుతంగా లేదా!”
333 మరియు అప్పటినుండి దాదాపు ఒక గంట తరువాత, అక్కడ బయట కారు దగ్గర, మరి ఆ పెద్ద కారుపైన, దాని వెనుక “యేసు మాత్రమే” అని వ్రాయబడియున్నది, మరియు బయట అక్కడ ఆ మరొక వ్యక్తి నిలబడియున్నాడు. మరియు నేను బయటకు వెళ్ళి మరియు నేను ఇట్లన్నాను, “అయ్యా, నీవు ఎలా ఉన్నావు?”
334 అతడు ఇట్లన్నాడు, “నీవు ఎలా ఉన్నావు?” ఇట్లన్నాడు, “నీవు ఈ ఉదయమున మాట్లాడిన, సహోదరుడు బ్రాన్హామే కదా.”
335 నేను ఇట్లన్నాను, “అవును, అయ్యా. నేను బ్రెన్హామునే.” నేను ఇట్లన్నాను, “ఇదిగో, మీ ఇద్దరి సహోదరులలో పనిచేసే దేవునియొక్క ఆ గొప్ప వరమును నేను ఆనందిస్తున్నాను.”
336 అందుకతడు ఇట్లన్నాడు, “మిస్టర్. బ్రెన్హామ్, నీకు వందనములు.” మరియు నేను అతని ఆత్మను అనుభూతి చెందడం ప్రారంభించాను. ఒక దర్శనము వచ్చింది. మరియు నేను ఎన్నడైనా ఒక వేషధారితో మాట్లాడానంటే, అదిగో వారిలో ఒకరు అక్కడే ఉన్నాడు. అతని భార్య నల్లని-వెంట్రుకలు గల స్త్రీయైయున్నది. అతడు ఒక గోధుమ రంగు-వెంట్రుకలు గల స్త్రీతో జీవిస్తున్నాడు, ఆమె ద్వారా ఇద్దరు పిల్లలను కన్నాడు. అతడు అసలు ఒక క్రైస్తవుడు కానే కాడు.
337 అప్పుడు నేను ఇట్లన్నాను, “నేను ఎవరిని కలుసుకున్నాను? నేను దేవదూతల మధ్యన ఉన్నానని అనుకున్నాను, మరిప్పుడు నేను దయ్యముల మధ్య ఉన్నట్లున్నది. ఏదో జరిగినది. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక నిజమైన క్రైస్తవుడు ఉన్నాడు; మరియు ఈ వ్యక్తి మీద కుమ్మరించబడుచున్న అదే ఆత్మ, ఈ వ్యక్తి మీద కూడా కుమ్మరించబడుచున్నది.” నేనిట్లన్నాను, “ఇప్పుడు నాకంతా గందరగోళమైపోయినది.” ఏమి చేయాలో నాకు తెలియలేదు. నేను ఏడ్చి, మరియు ప్రభువును వేడుకున్నాను. దేనిని అంగీకరించాలో నాకు తెలియలేదు.
338 వారు నన్ను…నేను పరిశుద్ధాత్మను పొందానా అని నన్ను అడిగారు, ఈ వ్యక్తి అడిగాడు, మరియు నేను ఇట్లన్నాను, “లేదు, అయ్యా, మీరు పొందిన విధంగా పొందుకోలేదు.”
ఇట్లన్నాడు, “నీవు ఎన్నడైనా భాషలతో మాట్లాడావా?”
నేను ఇట్లు చెప్పాను, “లేదు, అయ్యా.”
ఇట్లన్నాడు, “అలాగైతే నీవు దానిని పొందుకోలేదు.”
339 కావున నేనిట్లన్నాను, “నా సహోదరుడా, బహుశా నీవు చెప్పింది నిజమేనేమో. బహుశా నేను పొందలేదేమో, ఎందుకనగా నీవు కలిగియున్నదానిని నేను కలిగిలేను.” మరియు కొంతసేపైన తరువాత, నేను దానిని కలిగిలేనందుకు నేను సంతోషించాను.
340 కావున పిదప నేను దానిని గమనించాను, మరియు అది కొనసాగుచున్న విధానమును నేను చూశాను.
341 అయితే, చాలా కాలం క్రితం, ఒక రోజు, నేను బయట ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాను. అది ఎందుకన్నది, నేను ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాను అన్నది మీకు చెప్తాను, అది రాయ్ డేవిస్ కొరకైయున్నది. మరియు నేను బయట ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాను, ఎందుకనగా అతడు నన్ను “ఒక కీలుబొమ్మ” అని పిలిచాడు, మరియు దానికై అతణ్ణి క్షమించమని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మరియు అతడక్కడ ఒక ముద్రణశాలను కలిగియున్నాడు, ఒక పత్రికను వ్రాసాడు. మరియు అది జరిగిన రెండు రాత్రుల తరువాత, వారు దానిని నడుపుతుండగా, ఆ ముద్రణశాల మంటలు అంటుకొని ధ్వంసమైపోయినది.
342 మరియు కావున నేను గ్రీన్స్ మిల్లు వెనుక ఒక పాత గుహలో నిలబడ్డాను. నేను బయటకు నడిచాను. మరియు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, రెండు రోజులు, అక్కడే ఉన్నాను. నేను నా బైబిలును ఒక పాత దుంగ మీద ఉంచాను, అదెక్కడన్నది, ఈ మధ్యనే, నేను సహోదరుడు ఉడ్ కి చూపించాను, నా బైబిలును పెట్టాను. నేను ఆ దుంగకు అటు ఇటు కాళ్ళు వేసి కూర్చున్నాను. మరియు గాలి వీచినది. నేను ఇట్లనుకున్నాను, “చాలా సేపు, వెనుక ఆ గుహలో ఉన్నాను, నేను కొద్దిగా చదువుతాను.” కావున నేను బైబిలును తీసుకొని చదవడం ప్రారంభించాను, మరియు అది ఈ అధ్యాయమునకు తెరువబడియున్నది. మంచిది, నేను చదవడం ప్రారంభించాను, మరియు అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. చూశారా?
ఏలయనగా ఒకసారి వెలిగించబడి,…పరిశుద్ధాత్మలో పాలుపొంది,
…దేవునియొక్క దివ్యవాక్యమును, రాబోవు యుగసంబంధమైన…రుచి చూసి,
తప్పిపోయినవారు, తమ విషయములో…దేవుని కుమారుని మరలా సిలువవేయుచు; బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక, మారుమనస్సు పొందునట్లు అట్టివారిని నూతనపరచుట అసాధ్యము.
343 నేను ఇట్లనుకున్నాను, “అదిగో ఆ లేఖనము.” కానీ నాలో ఏదో భారంగా ఉండియున్నది. అప్పుడు నేను ఆలోచించడం ప్రారంభించాను, “ఆరంభములో, అతడు వెనుక ఇక్కడ ఈ విధంగా మాట్లాడినాడు, ‘ఆరంభములో, మారుమనస్సు పొందుటయనే నిర్జీవమైన పునాదిని వేయకుందాము. మారుమనస్సు పొందుట అనే పునాది వేయకుందాము,’ మరియు ఇక్కడేమో అతడు ఇట్లు చెప్తున్నాడు, ‘మారుమనస్సు పొందునట్లు వారిని నూతనపరచుట. కానీ ఈ విషయాలను వెనుక వదిలిపెట్టి, మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.’” అప్పుడు నేను చదవడం ప్రారంభించాను. పిదప నేను ఆ తరువాతి వచనమును చదివాను.
ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, అది ఎవరిచేత వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు, దేవుని ఆశీర్వాదములను పొందును:
అయితే ముండ్లతుప్పలును గచ్చ తీగెలును దానిమీద పెరిగినయెడల అది విసర్జింపబడి, మరియు శాపము పొందదగినదగును; తుదకది కాల్చివేయబడును.
344 నేను దానిని చదివినప్పుడు, ఏదో నన్ను కుదిపివేసినది. మరియు నేను ఇట్లనుకున్నాను, “ప్రభువా, అది రాయ్ డేవిస్ కు సంబంధించినది కాదు. నీవెందుకని అలా చేస్తావు?”
345 నేను ప్రారంభించాను, మరొక పేజీని త్రిప్పాను. నేను మరలా, దానియొద్దకు వెళ్ళాల్సివచ్చింది, “ఒకసారి వెలిగించబడినవారికి తరువాత అది అసాధ్యము,” మరలా దానిని చదవాల్సివచ్చినది.
346 పిదప నేను ఇట్లనుకున్నాను, “ప్రభువా, ఇది ఏమిటి? ప్రభువా, నీ భావము ఏమిటి?”
347 మరియు నేను వెనుకకు తిరిగి దాని గురించి ప్రార్థించడానికి, నా గుహలోనికి వెళ్ళాను. మరియు నేను అలా చేసినప్పుడు, ఒక ప్రపంచము తిరగడాన్ని నేను చూశాను. మరియు అదంతయూ, ఆ ప్రపంచమంతయు, చక్కగా దున్నబడియున్నది. మరియు తెల్లని వస్త్రములలో ఉన్న ఒక వ్యక్తి, అంతటా తిరుగుతూ వెళ్ళడాన్ని నేను చూశాను, అతని చేతిలో ఒక సంచి ఉన్నది. అతడు వెళ్తుండగా అతడు విత్తనములను విత్తుచున్నాడు. అతడు భూమి చుట్టూరా తిరిగాడు. మరియు అతడు చుట్టూ తిరిగి వెళ్ళగానే, చాలా నల్లని బట్టలు ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు, కుయుక్తి-గల ఒక వ్యక్తి, ఈ విధంగా జారుకుంటూ వచ్చి, చూస్తున్నాడు. మరియు అతడు విత్తనమును కలిగియున్నాడు. మరియు అతడు భూమి చుట్టూ తిరుగుతూ, వాటి వెనుక ఏదో విసిరేస్తున్నాడు; ప్రతి ఒక్కరినీ గమనిస్తూ మరియు విసిరేస్తున్నాడు. నేను నిలబడి మరియు ఆ దర్శనమును గమనించాను.
348 అతడు వెళ్ళిపోయిన తరువాత, ప్రపంచము చుట్టూ తిరిగినది, మరియు అక్కడ గొప్ప, అధిక పంట ఉన్నది, మరియు అది గోధుమ పంటయైయున్నది. మరియు ఆ గోధుమలో గురుగులు, కలుపు మొక్కలు మరియు మొదలగునవి ఉన్నాయి.
349 కరువు వచ్చినది. మరియు, ఓ, ఆ చిన్న గోధుమ దాని చిన్న తలను పైకెత్తుకొని, మరియు నీళ్ళ కొరకు ఏ విధంగా దప్పిగొనుచున్నదో. ఆ చిన్న గురుగు దాని తలను పైకెత్తుకొని, మరియు అది కూడా నీళ్ళ కొరకు దప్పిగొంటున్నది. అందరూ వర్షం కొరకు ప్రార్థిస్తున్నారు. మరియు కొద్దిసేపటి తరువాత, ఒక పెద్ద మేఘము అలుముకొని మరియు భూమినంతటిని తడిపివేసినది. మరియు ఆ చిన్న గురుగు పైకి ఎగిరి, ఈ విధంగా కేకలు వేయడం ప్రారంభించినది, “దేవునికి మహిమ! హల్లెలూయా! ప్రభువునకు స్తోత్రము!”
350 మరియు ఆ చిన్న గోధుమ, అది పైకి ఎగిరి, ఈ విధంగా కేకలు వేయడం ప్రారంభించినది, “దేవునికి మహిమ! ప్రభువునకు స్తోత్రము!”
351 మరియు అప్పుడు లేఖనము నాకు గుర్తుకొచ్చింది, అది మత్తయి గ్రంథములో కనుగొనబడుతుంది, 5వ అధ్యాయము మరియు 45వ వచనము. మరియు మత్తయి 5:45 లో, యేసు ఏమి చెప్పాడో వినండి. ఇప్పుడు మనము చదువుచుండగా జాగ్రత్తగా వినండి. మత్తయి, 5వ అధ్యాయము మరియు 45, 46వ వచనములు; ప్రారంభించుటకు, 44వది తీసుకుందాం.
అయితే నేను మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మరియు మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, మిమ్మును క్రూరముగా వాడుకొనువారి కొరకును, మిమ్మును హింసించువారి కొరకును ప్రార్థన చేయుడి;
మీరు పిలువబడునట్లు…మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైయుండునట్లు…ఈలాగున చేయుడి: ఆయన చెడ్డవారిమీదను…మంచివారిమీదను…తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను…అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
352 కావున, మీరు చూడండి, గోధుమను ఎదిగింపజేసే అదే వర్షము, ఒక గురుగును కూడా ఎదిగింపజేస్తుంది. మరియు, కావున, నాకు విషయం అర్థమైనది. అక్కడే శరీరసంబంధమైన ఒప్పుకోలు చేయువాడు ఉన్నాడు, సరిగ్గా సంఘములోనే ఉన్నాడు. కాని అతని ఫలములు…అతడు కేకలు వేయవచ్చు, గెంతవచ్చు, నాట్యమాడవచ్చు, భాషలతో మాట్లాడవచ్చు; కానీ అతని ఫలముల విషయానికి వస్తే: అతడు ఒక గురుగైయున్నాడు. మరియు అదే ఆత్మను కలిగియున్న మరొకడు, అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నేరుగా ఒక ప్రజల గుంపులో కుమ్మరించుకోగలడు, మరియు కుమ్మరించబడిన వర్షము ద్వారా, సరిగ్గా ఒక గురుగు జీవించగలిగినట్లే, ఒక వేషధారి కూడా పరిశుద్ధాత్మ ద్వారా కేకలు వేయగలడు. ఇక్కడ పౌలు దాని గురించే మాట్లాడుచున్నాడు. అయితే ఒక గురుగు ఒక గోధుమగా మారడం, లేదా ఒక గోధుమ ఒక గురుగుగా మారడం అనేది అసాధ్యం. మీకు అది అర్థమైందా? [సంఘము, “ఆమేన్” అని చెప్పుచున్నది.—సంపా.]
ఒకసారి వెలిగించబడి, మరియు…పరిశుద్ధాత్మ అను వరములో పాలుపొంది,
మరియు…దేవుని దివ్యవాక్యమును, మరియు రాబోవు యుగ సంబంధమైన శక్తిని రుచిచూసిన తరువాత,
…వారిని తిరిగి నూతనపరచడానికి, వారు తప్పిపోవడం అసాధ్యం…
అతడు ఏమి చెప్పాడో వినండి.
…ఎట్లనగా భూమిని తడుపుటకు మరియు ఇక్కడ దానిని సేద్యపరచుటకు, మరియు దానిని సిద్ధపరచుటకు, వర్షము…తరచుగా భూమి మీద కురుస్తుంది;
అయితే…ముండ్లతుప్పలును గచ్చ తీగెలను దానిమీద పెరిగినయెడల అది విసర్జింపబడును;…
ఇపుడు, కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు…మరియు దేవునియందలి విశ్వాసము; మరియు మొదలగునవి…బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణము, మరియు అట్టి పునాదులు,
…మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును, సిద్ధాంతాలను మాని,…పరిపూర్ణులమగుటకు సాగిపోదము;…
353 చూడండి, శరీరసంబంధమైన విశ్వాసి, సరిగ్గా ఈనాడు ఉన్నట్లే, ఆ రోజుల్లో కూడా, ఇలా చెప్పడానికి ఇష్టపడుచున్నాడు, “సరి, నేను సంఘమునకు చెందినవాడను. నేను మారుమనస్సు పొందాను. నేను—నేను వచ్చి, ఒక ఒప్పుకోలును చేశాను. నేను బాప్తిస్మము పొందాను.” చూడండి, వారు ఆ శరీరసంబంధమైన సంస్కరణలకే అంటుబెట్టుకొనియున్నారు. మరది ఏమి చేస్తుంది? అది గురుగులను ఉత్పత్తి చేస్తుంది.
354 పరిపూర్ణత ఏమి చేస్తుంది? అది గోధుమలను ఉత్పత్తి చేస్తుంది. గోధుమ దేవునియొక్క వాక్యమైయున్నది. ఆయన దానిని తన వాక్యముగా ఉపయోగిస్తాడు. అది ఆయనయొక్క విత్తనమైయున్నది. అది ఉత్పత్తి చేస్తుంది.
355 నీ హృదయములో ఏ విత్తనం నాటబడినది అనేదానిపై అది ఆధారపడియుంటుంది. నీవు కేవలం నరకమునకు భయపడి సంఘముకు వస్తే, నీవు—నీవు నరకానికి వెళ్ళగోరడంలేదు గనుక నీవు సంఘములో చేరితే, నీవింకను ఒక గురుగువే. నీవు—నీవు పేరుప్రఖ్యాతుల కొరకు మాత్రమే సంఘములో చేరినట్లైతే, నీవింకను ఒక గురుగువే. చేయవలసిన ఈ నామకార్ద కార్యాలన్నీ నీవు చేసియుండి, మరియు నీవు కలిగియున్నదంతా అదేయైనయెడల, నీవింకను ఒక గురుగువే.
356 కానీ ఒక నిజమైన అసలైన క్రైస్తవుడు, లోక సంగతులకు మరణించి మరియు క్రీస్తుయేసులో ఒక నూతన సృష్టిగా మారేంతవరకు పరిపూర్ణతలోనికి సాగిపోతాడు. అప్పుడు, ఆ మనిషి ఎన్నడైనా తప్పిపోవడమనేది అసాధ్యము. బైబిల్ చెప్పినది అదే! ఆ మిగతా లేఖనమంతటితో అది ఎలా సరిపోతుందో చూస్తున్నారా? అది ఏ విధంగా దానిని సరిగ్గా దాని స్థానములో ఉంచుతున్నదో చూస్తున్నారా?
357 “ఒకసారి రక్షింపబడిన మనిషి ఎన్నటికీ నశించిపోడు” అని అది ఇక్కడ చెప్తూ, మరియు ఇక్కడ, “అయితే, మీరు తప్పిపోయినా, లేక దూషించినా, అది అసాధ్యము” అని ఎలా చెప్పగలదు? నిశ్చయంగా, నీవు ఒక దూషకుడవైతే, నీవు ఒక క్రైస్తవుడవు కావు.
358 “దేవుని ఆత్మ ద్వారా మాట్లాడే, ఏ మనుష్యుడును, యేసును శాపగ్రస్తుడని అనడు.” పరిశుద్ధ యోహాను 4…లేదా మొదటి యోహాను 4. క్రీస్తుయొక్క ఆత్మ ద్వారా మాట్లాడే ఏ మనుష్యుడును, యేసును “శాపగ్రస్తుడు” అని పిలువడు. క్రైస్తవ సంఘములోనున్న, దేవుని సంబంధమైన, ప్రతీ ఆత్మ, దేవుడు చెప్పిన ప్రతిదానితో ఏకీభవిస్తుంది.
359 మనమిక్కడ చదివి, ఈ విధంగా చెప్తాము, “మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.”
360 ఆ పాత శరీరసంబంధమైన మనస్సు ఇట్లు చెప్తుంది, “అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి. నేను డాక్టర్ జోన్స్ ను.” చూశారా? “దైవిక స్వస్థత అనేది ఏదియు లేదు. హృదయ-పూర్వకమైన భక్తి అనేది ఏదియు లేదు. మీరు కేవలం భావో-ద్వేగమునకు గురైన ఒక గుంపైయున్నారు. మీరు ఉద్రేకపూరితులు. చూడండి, దానిలోని విషయమంతా అదే. దానిలో ఇంకేమి లేదు. మేము ప్రెస్బిటేరియన్లము. మేము లూథరన్లము,” లేదా అది ఏమైనా కావచ్చును. “మేము ఎక్కడ నిలబడ్డామో మాకు తెలుసు.”
361 అయితే దేవుని ఆత్మ ఏమి చెప్తుంది? యేసుక్రీస్తు, అదేరీతిగా ఇక్కడున్నాడు! “ఆమేన్,” అని దేవునియొక్క ఆత్మ చెప్తుంది. అది త్వరగా వాక్యముతో ఏకీభవిస్తుంది. అవును, అయ్యా. అది అక్కడే ఉన్నది. నా భావము ఏమిటో ఇప్పుడు చూస్తున్నారా?
362 “ఈ శరీరసంబంధమైన సంస్కరణలు మరణమును కలుగజేస్తాయి,” అని పౌలు చెప్పాడు.
363 అయితే జీవము వచ్చినప్పుడు, ఈ పరిపూర్ణత వచ్చినప్పుడు, “నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు, వాడు ఎన్నడూ తీర్పులోనికి రాక, మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు. నేను అతనికి నిత్యజీవమునిచ్చెదను, అంత్య దినములలో అతనిని లేపుదును. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నాయొద్దకు వత్తురు, మరియు వారిలో ఎవరును నశింపరు.” నశించలేరు.
364 కావున, అది ఏమి చేస్తుందో—ఏమి చేస్తుందో వినండి. ప్రజలు దానిని అలుసుగా తీసుకునేటట్లు అది చేస్తుందని ప్రజలు అనుకుంటారు. సహోదరుడా, సర్పముయొక్క బుస క్రింద నీవు దేవుడిని సేవించవు. దేవుడు, ఈ నల్ల కొరడాలు కలిగియుండి మీ వెనుక తరుముతుండే వీరిలో ఒకడు కాడు, ఆయన ఒక తండ్రియైయున్నాడు, ఆయన ప్రేమయైయున్నాడు. దేవుడు ప్రేమయైయున్నాడు. మరియు పరిశుద్ధ యోహానులో, బైబిలు ఇట్లు చెప్పినది, “ప్రేమించువాడు దేవుని సంబంధియైయున్నాడు.”
365 నీవు దేవుణ్ణి ప్రేమిస్తావు. నేను, ఈ రాత్రి నేను బయటకు వెళ్ళి మరియు—మరియు త్రాగాను అనుకోండి. నా జీవితంలో, నేను ఎన్నడూ త్రాగలేదు. కాని ఒకవేళ నేను బయటకు వెళ్ళి త్రాగినట్లైతే, కొరడా దెబ్బ పడుతుందేమోనని నేను భయపడను. నేను వెళ్ళి—వెళ్ళి, దానిని చేయకపోడానికి కారణం అది కాదు. నేను దానిని చేయకపోడానికి కారణమేమిటనగా, నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అవి ధర్మశాస్త్రపు క్రియలు కావు. అది నేను తప్పక చేయవలసిన ఏదో విషయం కాదు. దానికి కారణమేదనగా, ఆయన ఇదివరకే నా కొరకు ఒకదానిని చేసియున్నాడు, మరియు దాని కొరకు నేను ఆయనను ప్రేమిస్తున్నాను. విషయం అదే.
366 కావున, ఆ ఆత్మను కలిగియుండి, ఇట్లు వాగ్దానము చేసాడు, “నేను అతనికి నిత్యజీవము నిచ్చుచున్నాను, మరియు వారు ఎన్నటికినీ నశింపరు.” ఆయన అబద్ధము చెప్పాడా లేదా ఆయన సత్యము చెప్పాడా? ఆయన సత్యమే చెప్పాడు. కావున, ఇది ఎలా అనువదించబడుతుందో మీరు చూస్తున్నారా? అసాధ్యమనేది దేని గురించంటే ఒకసారి కృపలోనికి వచ్చిన తరువాత ఆ వ్యక్తి పడిపోవుట గూర్చియైయున్నది. అతడు పడిపోలేడు. అతడు పడిపోగలడు, నిశ్చయంగా, కానీ మారుమనస్సు పొందవలసినట్లును, వెనుకటి స్థితికి వెళ్ళి మరియు మరలా ఆ పాత క్రియలను చేయునట్లుగా కాదు.
367 కావున ఉజ్జీవము నుండి ఉజ్జీవమునకు, ఒక చోట నుండి మరొక చోటునకు ఉరకలు వేస్తున్న మీరంతా, మీరు స్థిరపరచబడలేదని, మీరు స్థాపించబడలేదని మీరు చూడటంలేదా? ఇప్పుడు, నిశ్చయంగా, మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, నాకు తెలియదు…” నిశ్చయంగా దేవుడు తాను నాకనుగ్రహించిన పరిచర్యను నాకిచ్చి, మరియు నన్ను తప్పిదములో ఉండనివ్వడు. మరియు అది లేఖనము ద్వారా ఋజువు చేయబడకపోతే, అప్పుడు అది తప్పవుతుంది, కానీ దానిని బలపరచుటకు ఇక్కడే లేఖనమున్నది. సంఘము ఎన్నడూ ఒక్క చోటును కూడా తప్పిపోలేదు.
368 ప్రజలు వెళ్ళి, సంఘములో చేరి, గొడవలుపడి, కొట్టుకొని, మధనపడి, మరియు—మరియు సమస్తమును చేస్తారు, మరియు కేవలం ఎటువంటి శరీరసంబంధమైన జీవితమునైనా జీవిస్తారు, “ఓ, అవును, నేను ఒక క్రైస్తవుడను.”
369 తన భర్త ఒక పురుషునితో కలిసి తిరుగుతున్నాడని నాతో చెప్పిన ఒక చిన్న స్త్రీయొక్క ఒప్పుకోలును నేను ఈ రోజు విన్నాను. తరచుగా ప్రతి స్థలములో, ఆమె వారిని కనుగొన్నది. మరియు ఆ స్త్రీ ఇట్లు చెప్పినది, “‘నేను ఒక క్రైస్తవురాలిని,’ అని నేను మీకు తెలియజేస్తున్నాను.” ఉ-మ్.
370 ఇక్కడ జిమ్మీ ఆస్బర్న్ ను చూడండి, ఆదివారము ఉదయమున ఇక్కడ బోధిస్తున్నాడు; మరి వారమంతా బూగీ-వూగీ, రాక్-అండ్-రోల్ మరియు ఆ సమస్తమును కలిగియుంటాడు.
371 ఎల్విస్ ప్రెస్లీని చూడండి, 1947 లోని ఇస్కరియోతు యూదాయైయున్నాడు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ లో చేరాడు, పెంతెకొస్తువాడైయుండి, పరిశుద్ధాత్మ కొరకు భాషలతో మాట్లాడుచున్నాడు, మరియు గత యాభై సంవత్సరాలలో ఉన్నట్టి దొంగసారా దుకాణములన్నీ పంపినవాటి కంటే ఎక్కువ ఆత్మలను బాధింపబడుటకు పంపాడు. ప్రపంచమంతటా యుక్త-వయస్సు గల చిన్న అమ్మాయిల మనస్సులను వక్రీకరించాడు, ఎంతగా అంటే చిన్న అమ్మాయిలు తమ లోదుస్తులను తీసివేసి అతడు సంతకం చేయడానికని, వేదిక మీదకు విసిరివేస్తున్నారు. అతని శరీరము ఎంత అసభ్యముగా ఉంటుందంటే, అతని నడుమునుండి క్రిందకు, వారసలు టెలివిజనులో చూపించరు. పరిశుద్ధాత్మను కలిగియున్నారనుటకు, భాషలతో మాట్లాడటం, ఋజువా? ఓ, సహోదరుడా, పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నట్లైతే, అది ఆ విధంగా ప్రవర్తించదు. మీకు దానికంటే బాగుగా తెలుసు. ఖచ్చితంగా కాదు. దేవుడు శుభ్రతను మరియు స్వచ్ఛతను మరియు పరిశుద్ధతను ప్రేమిస్తాడు.
372 నన్ను నేను ఒక క్రైస్తవునిగా చేసుకోడానికి నేను శుభ్రముగా మరియు స్వచ్ఛముగా మరియు పరిశుద్ధముగా ప్రవర్తించను. అయితే, నాలో ఉన్న క్రీస్తు, దానిని నాలో జీవిస్తాడు. మరియు నేను ఆయనను ప్రేమిస్తున్నాను. మరియు నేనేదైనా తప్పు చేస్తే, అది నన్ను ఖండిస్తుంది. సరిగ్గా అక్కడే నేను ఇట్లు చెప్తాను, “దేవా, నన్ను క్షమించు.” ప్రతీ రోజు, నేను క్షమాపణ అడుగవలసియున్నాను, ప్రతీ రోజు. మరియు మీరు కూడా, అడుగుతారు. నిశ్చయంగా, మీరు అడుగుతారు.
373 అయితే ఇప్పుడు మీరు—మీరు శరీర సంబంధులైతే, మీరు కేవలం వెనుకకు ఉండి, ఇట్లంటారు, “ఆహ్, మంచిది, అది ఏం పర్వాలేదు, నేను సంఘానికి చెందియున్నాను.” చూశారా? మరియు పిదప మీరు దూషించేది ఎప్పుడంటే, ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగించబడిన విశ్వాసమును మీరు కలిగిలేనప్పుడే. అప్పుడు మీరు దానిని ఎగతాళి చేసి, మరియు దానిని, “ఒక దురాత్మ,” అని అంటారు. ఇట్లంటారు, “అది ఒక పరిశుద్ధ-గుండ్రాళ్ళ గుంపైయున్నది.” అప్పుడు, కృపకు మరియు తీర్పుకు మధ్య మిమ్మల్ని మీరు వేరుచేసుకుంటారు, అప్పుడిక ఎప్పటికీ మీ పనైపోయినట్లే.
374 యేసు ఇట్లు చెప్పాడు, “దానికి విరోధముగా ఒక్క మాటయైనా, ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను ఎన్నడూ క్షమించబడదు.” మరియు ఆత్మమూలముగా జన్మించిన, ఒక క్రైస్తవుడు, దాని గురించి చెడుగా మాట్లాడలేడు, ఎందుకనగా అది అలా చేయలేదు. అది దానితో ఏకీభవిస్తుంది. అది నిజము.
375 ఆ కారణంచేతనే ప్రజలు నాతో ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తారు, మనకిక్కడ అగుపించే, ఆ అగ్నిస్తంభము, “అది దయ్యము,” అని, “అది కేవలం కల్పితము,” అని ఇదంతయు అటువంటిదేనని చెప్పడానికి వారు ప్రయత్నిస్తారు. అయితే అది కాదని కెమెరా ఋజువు చేసినది. మరియు ఆ క్రియలు ఖచ్చితంగా బైబిలులో ఉన్నాయి, పౌలు దమస్కునకు వెళ్తున్నప్పుడు అతణ్ణి కలుసుకున్న అదే అగ్నిస్తంభమైయున్నది. ఆ వెనుక ఆయన చేసిన ఈ కార్యములన్నిటినీ, బైబిలు ప్రకారంగా, సరిగ్గా అదే విధంగా వాటిని ఇప్పుడు చేస్తున్నాడు. అది క్రీస్తేయైయున్నాడు, దేవుని కుమారుడైయున్నాడు.
376 మరియు మనము తిరిగి జన్మించినప్పుడు, మనము నిత్యజీవమును కలిగియున్నాము, మరియు నశించలేము. ఒక మనిషి పడిపోవుట అసాధ్యము. బైబిలు చెప్పినది అదేయైయున్నది.
377 ఇప్పుడు, వినండి, పౌలు ఏమంటాడో గమనించండి. నేను ఆ మిగతా భాగాన్ని చదివి, మరియు ఇప్పుడు, అది సరిగ్గా అనిపిస్తుందో లేదో చూస్తాను. ఒక్క నిమిషం, మనం కొనసాగించుదాము. 8వ వచనము.
అయితే ముండ్లతుప్పలును గచ్చతీగెలును దానిమీద పెరిగినయెడల అది విసర్జింపబడి, మరియు శాపము పొందతగినదగును; తుదకది కాల్చివేయబడును. (అది అవిశ్వాసి.)
378 ఇప్పుడు పౌలును గమనించండి. “అయితే, ప్రియులారా,…” ఇప్పుడతడు తిరిగి ధర్మశాస్త్రం క్రిందకు వెళ్ళుడానికి ప్రయత్నిస్తున్నవారి గురించి మాట్లాడుచున్నాడు, మీకు తెలుసు కదా, ధర్మశాస్త్ర క్రియలన్నిటినీ చేయడానికి ప్రయత్నిస్తున్నవారు, అయితే వారు ఎంతో పద్దతి గలవారైయున్నారు. వారు బాప్తిస్మములను మరియు హస్తనిక్షేపణములను, మరియు ఈ కార్యములన్నిటినీ కలిగియున్నారు.
అయితే, ప్రియులారా, దీనిద్వారా మేమీలాగు చెప్పినను మీరింతకంటె మంచిదియు,…
ఇదిగో విషయమిదే. ఇప్పుడు అతడు చెప్పేది వినండి.
…రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని, మేము—మేము రూఢిగా నమ్ముచున్నాము.
ఏలయనగా మీరు చేసిన కార్యములను మరియు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, ఇంకను ఉపచారము చేయుచుండుటచేత, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.
379 అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో చూస్తున్నారా? క్రైస్తవులు పడిపోయి, తిరిగి రాలేకపోవడం అసాధ్యము అనేదాని గురించి అతడు మాట్లాడడం లేదు. సంస్కరణ విధానముగుండా వెళ్ళే శరీరసంబంధమైన విశ్వాసులను గురించి అతడు మాట్లాడుచున్నాడు. “అయితే,” అతడు ఇట్లన్నాడు, “తిరిగి జన్మించినట్టి మీరు, క్రైస్తవులైన మీరు, ప్రియులారా, మీరింతకంటె మంచి స్థితిలోనే ఉన్నారని మేము రూఢిగా నమ్ముచున్నాము. మీరు ఆ విధంగా మాట్లాడరు. మీరు అటువంటి జీవితమును జీవించరు. మీరు క్రీస్తుతో భద్రపరచబడియున్నారు.”
అతడు ఇక్కడ వెనుక ఏమన్నాడు? ఈ ఉదయం మనం హెబ్రీ పత్రిక 10 లో ఎక్కడున్నామో, మరలా, ఇప్పుడు అక్కడికి వెళ్దాము. [టేపులో ఖాళీగా ఉన్నది—సంపా.]
380 ఇప్పుడు పిదప మనము, మరలా, ఎఫెసీ 4:30 ని తీద్దాము. మరియు దీనిని దృఢపరచుటకు, లేఖనముతో లేఖనమును సరిపోల్చుటకు, మనము ఒక్క నిమిషం, దీనిని తీసి, మరియు ఇది ఏమి చెప్తుందో చూద్దాము. ఎఫెసీ 4, మనం చూద్దాము. ఎఫెసీయులు 4:30. మనము చదివి మరియు అది ఏమి చెప్తుందో చూద్దాము. వినండి.
…దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి,…
మనము ఆ శరీరములోనికి ఎలా—ఎలా బాప్తిస్మము పొందాము? ఒక్క ఆత్మద్వారా.
…దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దాని ద్వారా మీ విమోచన దినము వరకు మీరు ముద్రించబడియున్నారు.
అది నిజమేనా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా, మీరు క్రీస్తుయొక్క శరీరములోనికి ముద్రించబడియున్నారు, ఒక ఉజ్జీవమునుండి మరొక ఉజ్జీవము వరకు కాదు గాని, శరీర విమోచనా దినము వరకైయున్నది. మీరు అదేయైయున్నారు. కావున, మీరు అసలు నశించిపోయే మార్గమే లేదు.
381 మీరు భయపడతారు. మరియు ఆ కారణముచేతనే భయము, ఒక భయము, భయమనేది సందేహముతో కూడియుంటుంది.
ప్రేమ విశ్వాసముతో కూడియుంటుంది. నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను. నేనాయనను ప్రేమిస్తున్నాను గనుక, నేనాయనకు భయపడను. ఆయన నన్ను గాయపరచడు. ఆయన నాకు మేలు చేస్తాడు. నేనాయనకు భయపడితే, “ఓ, ఆయన దానిని చేస్తాడో, లేదో నాకు తెలియదు,” అని అనుకుంటాను. చూశారా?
382 కానీ నేను ఆయనను ప్రేమిస్తున్నయెడల, “అవును, తండ్రీ, నేను—నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరియు నీవు నా తండ్రివని, మరియు నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, మరియు నీవు నీ మాటను నిలబెట్టుకోవేమోనని నాకు భయము లేదు. అది నీవు నాకు చేసిన వాగ్దానమైయున్నది.” దేవునియొక్క ఆత్మ ఆ విధంగా చేస్తుంది.
383 “కానీ, ఓ, నేను దీనిని చేస్తే, నేను దానిని చేస్తే.” చూశారా, ఆ విధంగా మీరు మరలా, క్రియల మూలంగా రక్షణ పొందుతామని నమ్మే వైపునకు వస్తారు. క్రియల మూలంగా రక్షణ పొందుతామని నమ్మే వైపునకు ఎన్నడూ వెళ్ళకండి. అది ప్రతికూలమైనది.
384 సానుకూలమైనదే మనకు కావలసియున్నది. అది ఇదివరకే పూర్తిచేయబడిన కార్యమైయున్నది. క్రీస్తు మరణించాడు, మరియు ఆయన మరణించినప్పుడు పాపము చంపబడినది. మరియు దేవుడు నిన్ను నిత్యజీవమునకై ముందుగా నిర్ణయించినట్లైతే, “తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు.” విషయం అదేయైయున్నది, నశించిపోలేరు. నీవు ఎన్నటెన్నటికీ రక్షించబడియున్నావు. “ఏలయనగా ఒక్క ఆత్మ ద్వారా మనమందరమూ ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము, మరియు ఒక్క అర్పణ ద్వారా ఆయన నిరంతరము పరిపూర్ణులుగా చేసియున్నాడు.” విషయం అదే. మనము తప్పిపోవడానికి ఏ దారీ లేదు. నిజముగా. ఇప్పుడు, అది మీకు మంచి అనుభూతిని కలిగించడంలేదా?
385 ఇప్పుడు, నీవు ఒక క్రైస్తవుడవని నీకెలా తెలుస్తుంది? నీ ఆత్మ ఆయన ఆత్మతో సాక్ష్యమిచ్చినప్పుడు తెలుస్తుంది, దేవునియొక్క ప్రేమ నీ హృదయములో ఉన్నప్పుడు, నీవు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సహనము, మంచితనము, సాత్వికమును కలిగియున్నప్పుడు తెలుస్తుంది. అప్పుడే నీవు…ఆత్మ ఫలములు నీ జీవితమును వెంబడిస్తున్నట్లైయున్నది.
386 ఓ, ఈ ఆధునిక తాళమునకు, పియానో మీద పాడుతూ, ఇక్కడ అనేకమంది ఆత్మలో నాట్యం చేస్తున్నవారితో, మీరు ఆత్మలో నాట్యమాడగలిగినందుకు కాదు. ఆ సంగతులు సరియైనవే. అయితే వారు ఆ సమస్తమును క్రియల మూలంగా రక్షణ పొందుతామని నమ్మే వైపునకు తీసుకెళ్ళారు, చూడండి, కావున, వారు దేవుని ఆత్మను వెనుకనే విడిచిపెట్టారు.
387 ఆ కారణముచేతనే, దేవుడు తననుతాను ప్రత్యక్షపరచుకొనుట ప్రారంభించినప్పుడు, వారిట్లన్నారు, “బుద్ధిహీనత. దానితో మాకు ఏ సంబంధమూ లేదు.” వారు దేవుడిని ఎరుగరు. వారు దానిని ఎన్నడూ చూడలేదు. వారు దానిని గ్రహించలేరు, ఎందుకనగా ఆ లోపల ఒక భిన్నమైన జీవమున్నది. అతనికి తెలియదు, గోధుమలు ఏమి చేస్తున్నాయో గురుగుకి తెలియదు. దానిది భిన్నమైన జీవమైయున్నది.
388 ఒక క్రైస్తవుని విషయం ఆ విధంగానే ఉన్నది, శరీర సంబంధమైన విశ్వాసికి, ఒప్పుకొనువాడికి, బయటకు వెళ్ళి, “ఓ, అవును, నేను ఒక క్రైస్తవుడను” అని ఒప్పుకునేవారికి అది అలాగే ఉన్నది. అతని నోటిలో ఒక పెద్ద చుట్టతో, టెక్సాస్ లోని కొమ్ములు కత్తిరించబడిన ఎద్దువలె ఉంటాడు.
389 నిక్కర్లు వేసుకొన్న ఒక స్త్రీ, ఇట్లంటుంది, “ఓ, అవును, నేను సంఘ సభ్యురాలిని. నిశ్చయంగా, నేను సంఘ సభ్యురాలిని.” నీవు శరీరసంబంధివి తప్ప మరేమియు కాదని నీ ఫలములు ఋజువు చేస్తున్నాయి. అది నిజము. నిశ్చయంగా, అది అంతే. దానిని అనుమతించే ఒకే ఒక్క విషయమున్నది: అది మానసిక లోపమైనా అయ్యున్నది, లేదా నీ మీదనున్న మోహపు ఆత్మయైయున్నది. అది నిజము.
390 నీవు లోకము వలె ప్రవర్తించగోరినట్లైతే, బైబిలు ఇట్లు చెప్పినది, “మీరు లోకమునైనా లేదా లోకపు సంగతులనైనా ప్రేమించినట్లైతే, దేవుని ప్రేమ మీలో లేనే లేదు.” కాబట్టి విషయం అదేయైయున్నది.
391 ఇప్పుడు, మీరు ఇట్లంటారు, “ఓ, బైబిలు చెప్పినది, అలాగైతే నేను తప్పక దానిని చేయవలసియున్నది.” కాదు, అది కాదు. దానిని నీలోనుండి బయటకు తీసివేసే ఒక కార్యమును క్రీస్తు నీ కొరకు చేసేవరకు ఇక్కడే వేచియుండుము. అప్పుడు నీవు దేవుని ఆత్మ ద్వారా జన్మించినవాడవు అవుతావు. నీవు ఏమి చేస్తున్నావన్నది కాదు, అది ఆయన నీ కొరకు ఏమి చేసాడన్నదై యున్నది. ఎంతగా అంటే నీవు మరణమునుండి జీవములోనికి దాటియున్నావనే ఒక ప్రేమను పొందుకుంటావు. మరియు పిదప అది—అది జాగుచేస్తున్నయెడల, నీ జీవితమును గమనించుకొనుము. నీవు నీ జీవితమును తయారు చేసుకోడానికి ప్రయత్నిస్తున్నందుకు కాదు గాని, దేవుడు నిన్ను తన ఆత్మకు లోబడునట్లు చేస్తున్నందుకైయున్నది. అది నిన్ను నీవు దేవుని మార్గములో నడిపించుకోవడం కాదు. అది దేవుడే నిన్ను తన స్వంత మార్గములో నడిపించడమైయున్నది. నీవు నడిపించడం కాదు గాని, దేవుడే నడిపించడమైయున్నది.
392 ఇప్పుడు, మనము ముగింపునకు వెళ్తుండగా, ఇపుడు దీనిని గమనించండి. 11వ వచనము.
మరియు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొనువారిని పోలి నడుచుకొనునట్లుగా:
మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు చూపించవలెనని అపేక్షించుచున్నాను.
393 ఇప్పుడు, ఇక్కడ కేవలం మరొక్క వ్యాఖ్యానము.
దేవుడు, అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు, తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక, తనతోడని ప్రమాణము చేసి,
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును, అని చెప్పెను.
394 దేవుడు అబ్రాహామును కలిసినప్పుడు! ఇప్పుడు, అబ్రాహాము అసలు ఎటువంటి అర్హతలు లేకుండానే, నిబంధనను పొందుకొన్నాడు. నిబంధన అబ్రాహాముతో చేయబడినది. అది ఖచ్చితంగా, సంపూర్ణముగా కృపయేయైయున్నది. అబ్రాహాము ఒక మెరుగైన వ్యక్తి కాదు. అతడు ఒక పరిశుద్ధుడైన వ్యక్తి కాదు. అతడు కేవలం ఒక సాధారణమైన మనిషియైయున్నాడు. మరియు దేవుడతణ్ణి ఎన్నుకున్నాడు గనుక, ఎన్నిక ద్వారా, దేవుడు అబ్రాహామును ఏర్పరచుకున్నాడు; అబ్రాహాము దానిని కోరుకున్నందుకో, అబ్రాహాము దీనిని చేసినందుకో, అతడొక మంచి వ్యక్తియైనందుకో; అతడు ఏదైనా యోగ్యతను కలిగియున్నందుకో కానే కాదు. అయితే అది దేవునియొక్క ఎన్నికయైయున్నది. దేవుడు అబ్రాహామును తీసుకున్నాడు.
395 నేనిట్లు నమ్ముతాను, నేను చెప్పినట్లుగా, ఈనాడు, “మనము మన బోధకులను ఎన్నుకుంటాము.” మనము చుట్టూ వెళ్ళి, ఇట్లంటాము, “సరి, సంఘపెద్దలలో ఒకరు నిష్క్రమించారు. అతని స్థానమును తీసుకొనుటకు, భవనంలో అతి శ్రేష్ఠమైన వ్యక్తిని మనము కనుగొందాము. మంచిది, సంఘకాపరి నిష్క్రమించాడు; మనము కనుగొందాము, మనము ఉత్తమమైనవారిని తీసుకుందాము.” కొన్నిసార్లు అది సరికాదు.
396 యూదా స్థానమును తీసుకోడానికి వారు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు, వారొక తప్పుడు వ్యక్తిని తీసుకున్నారు. వారు ఒక పద్దతిగల వ్యక్తిని, ఒక గొప్ప లేఖకుడు, ఒక పండితుడు, ఒక దౌత్యవేత్తయైన మత్తీయను తీసుకున్నారు. వారు ఇట్లన్నారు, “అతడు ఆ అసలైన స్థానమును తీసుకుంటాడు. అబ్బాయ్, అతడు ఒక అసలైన పురుషునిగా కనిపిస్తున్నాడు.” కానీ అది దేవుని ఎంపిక కాదు. మరియు అతడు ఈ వ్యక్తిని తీసుకొన్నాడు, మరియు అతడు దేవుని కొరకు ఎన్నడూ ఏమీయు చేయలేదు.
397 అయితే దేవుడు, వంకర-ముక్కు కలిగి, కోపిష్టి-యైన, ఒక చిన్న యూదుణ్ణి ఎన్నుకున్నాడు, అతడు అక్కడికి వచ్చి అతని ముఖం ఆ విధంగా ఉండగా ఇట్లన్నాడు, “నేను వెళ్తాను. నేను వారిని బంధిస్తాను.”
398 దేవుడు ఇట్లన్నాడు, “నాకు అతనిలో ఏదో కనబడుచున్నది. నేను అతణ్ణి ఉపయోగించుకుంటాను.”
399 మరియు దేవుడు అక్కడ ఆ పెద్ద వెలుగులో అతని యెదుట ప్రత్యక్షమయ్యాడు. మరియు అతడు ఇట్లన్నాడు, “ప్రభువా, నీవెవరవు?”
400 అందుకాయన ఇట్లన్నాడు, “నేను యేసును. ఏంటీ, మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టము. నీవు నన్నెందుకు హింసించుచున్నావు?” ఆ విధంగా, మరియు దేవుడు ఆ వ్యక్తిని తీసుకొని మరియు అతణ్ణి యేసుక్రీస్తు తర్వాత భూమిని తాకిన అత్యంత గొప్ప వ్యక్తులలో ఒకనిగా చేసాడు. అదీ దేవుని ఎంపిక.
401 ఈనాడు, మనము ఒక ఎంపికను చేయడానికి ప్రయత్నిస్తాము. సంఘములారా, మీరు ఈ వ్యక్తిని ఇక్కడికి పంపుతారు, ఆ వ్యక్తిని ఇక్కడికి పంపుతారు. అది ఆ విధంగా చేయబడకూడదు. దేవుడే నడిపిస్తాడు. అది అన్నిటిలో, అన్నిటి గుండా, అన్నిటికి పైన దేవుడేయైయున్నాడు; ఏదో ఒక సంఘముయొక్క పత్రము కాదు. దాని గురించి దేవుడు ఏమి చెప్పాడన్నదే, వ్యత్యాసమును కలుగజేస్తుంది.
402 గమనించండి. దేవుడు అబ్రాహామునకు, షరతులు లేని ఒక వాగ్దానము చేశాడు. మరియు ఇప్పుడు, ఆగండి, అబ్రాహాము ఒక్క పని కూడా చేయనవసరము లేదు. దేవుడిట్లు చెప్పాడు, “నేను ఇదివరకే దానిని చేశాను.”
403 దేవుడు ఆదామునకు ఒక వాగ్దానము చేసి, ఇట్లన్నాడు, “ఆదామా, నీవు దీనిని ముట్టనియెడల, నీవు ఎన్నటెన్నటికీ బ్రతుకుతావు. అయితే నీవు దానిని తిను దినమున, నీవు నిశ్చయముగా చచ్చెదవు.”
404 ఆదాము ఇట్లన్నాడు, “ఏమైనప్పటికీ, అదంతా ఏమిటోయని నేను ఆశ్చర్యపోతున్నాను?” అతడు వెళ్ళి కలుగజేసుకొని, దానిని తిన్నాడు.
405 దేవుడు…ఒక మనిషి దేవునితో, లేదా దేవుడు ఒక మనిషితో నిబంధన చేసిన ప్రతీసారి, మనిషి తన భాగమును ఉల్లంఘిస్తాడు. కాబట్టి దేవుడు ఏదో ఒకటి చేయవలసివచ్చింది, ఎందుకనగా మనిషి ఏమైయున్నాడో ఆయన చూశాడు. మరియు వారు ముందుగా నిర్ణయించబడ్డారు, వారు ఎన్నుకోబడ్డారు, మరియు దేవుడు ఏదో ఒకటి చేయవలసియుండినది. కావున దేవుడు దిగివచ్చి, షరతులు లేకుండా, అబ్రాహాముతో తన నిబంధనను చేశాడు. అది గనుక షరతులు లేనిదైయ్యుండకపొతే, అబ్రాహాము ఎప్పుడో, నశించిపొయ్యుండేవాడు.
406 అతడు అక్కడ గెరారు వద్ద కూర్చొనియుండుటను చూడండి, పడిపోయాడు, అబద్ధము చెప్తున్నాడు. మరియు తన స్వంత శరీరమును కాపాడుకోడానికి, తన భార్యను మరొక పురుషునికి అప్పగించాడు. ఎటువంటి ఒక మనిషి! బయట అక్కడ కూర్చొనియున్నాడు, పడిపోయాడు. దేవుడు అతనితో, ఇట్లు చెప్పాడు, “నీవు ఇక్కడ నుండి వెళ్ళవద్దు. ఇక్కడే ఉండుము.” కరువు అతడిని బయటకు తరిమినది. ఎక్కడైతే సులువుగా సాగుతుందో అతడు ఆ చోటుకి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి తేలికైన మార్గమును ఎంచుకున్నపుడు అతనికి ఏమి జరుగుతుందో మీకు తెలుసు కదా.
407 ఎక్కడైతే గడ్డి ఎక్కువ పచ్చగా ఉన్నదో, అతడు అక్కడికి వెళ్ళాడు. మరియు అతడు అక్కడికి వెళ్ళినప్పుడు, తన స్వంత శరీరమును కాపాడుకోడానికి, తన భార్యను తన సహోదరి అని ఆ రాజుతో చెప్పాడు. ఇప్పుడు, అది ఒక అబద్ధము. మరియు ఏ పురుషుడైనా, తన శరీరమును కాపాడుకోడానికి, తన భార్యను తీసుకొని మరొక పురుషునికి అప్పగిస్తాడు! అతడు అక్కడున్నాడు, అక్కడ ఒక చిన్న గుడారములో కూర్చున్నాడు, పడిపోయినవాడు, అబద్ధము చెప్పాడు, మరియు పూర్తిగా…మొత్తానికే వాగ్దానమునుండి మరియు సమస్తమునుండి దూరమైయున్నాడు, కానీ అతడింకను దేవుని ప్రవక్తయేయై యున్నాడు.
408 మరియు అక్కడ అబీమెలెకు ఉన్నాడు, అతడు ఒక మంచి, పరిశుద్ధుడు. నిశ్చయంగా, ప్రతి రాత్రి తన ప్రార్థనలను చేసేవాడు. వంద సంవత్సరాలు గల, ఈ బామ్మను కనుగొన్నాడు, మరలా యవ్వనస్థురాలిగాను అందముగాను మారి, అక్కడికి వచ్చింది. అతడు ఇట్లన్నాడు, “నేను ఎదురుచూసింది ఆ అమ్మాయి కోసమే, కావున నేను ఆమెను పెండ్లి చేసుకోబోవుచున్నాను.”
409 అబ్రాహాము ఇట్లన్నాడు, “నీవు ఆమెను తీసుకోవచ్చు. ఆమె నా సహోదరియైయున్నది.”
ఆమె ఇట్లన్నది, “అతడు నా సహోదరుడైయున్నాడు.”
410 కావున అతడు ఆమెను అక్కడికి తీసుకెళ్ళి మరియు ఆ స్త్రీలచేత ఆమెను శుభ్రము చేపించి మరియు—మరియు మంచి బట్టలు ధరింపజేసాడు, మరియు ఒక—ఒక యువరాణి వలె ఆమెను సిద్ధము చేపించాడు. మరియు అతడు తన ప్రార్థనలు చేసుకొని, మంచం మీద, వెల్లకిలా పడుకొని, మరియు ఇట్లన్నాడు, “రేపు, నేను ఆ అందమైన హెబ్రీ అమ్మాయిని, అక్కడున్న ఆ—ఆ అబ్బాయియొక్క సహోదరిని పెండ్లి చేసుకుంటాను. ఓ, అది అద్భుతముగా ఉంటుంది. ఓ ప్రభువా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు! అవును, అయ్యా. అద్భుతం!”
411 మరియు దేవుడు ఇట్లన్నాడు, “నీవు చచ్చినవాడవే సుమా.” అ-అహ!
412 [సహోదరుడు బ్రెన్హామ్ దగ్గినారు—సంపా.] (నన్ను మన్నించండి.) అబ్రా-…ఏంటీ, అబ్రాహాము అక్కడ కూర్చొనియున్నాడు, అబద్ధమాడుచు, పడిపోయాడు కదా. మరిక్కడ ఈ వ్యక్తి ఉన్నాడు, ఒక నిజాయితీపరుడు మరియు నీతిమంతుడు, మరియు యథార్థవంతుడు. “ఎందుకు,” అతడు ఇట్లన్నాడు, “ప్రభువా, నా హృదయము యొక్క యథార్థతను నీవు ఎరిగియున్నావు. ఆమె అతని ‘సహోదరి’ అని, అతడు నాకు చెప్పలేదా?”
413 ఇట్లన్నాడు, “నీ హృదయ యథార్థతను నేను ఎరిగియున్నాను. ఆ కారణముచేతనే నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను ఆపుచున్నాను. అది నిజము. నీ హృదయ యథార్థత నాకు తెలుసు. కానీ ఆమె భర్త నా ప్రవక్తయైయున్నాడు.” హల్లెలూయా! ఓ, అది కృప కాకపొతే, ఇంకేమిటి? “పడిపోయి, అబద్ధమాడుతూ, అక్కడ కూర్చొనియున్నాడు, కానీ అతడింకను నా ప్రవక్తయైయున్నాడు. నీవు ఒక అర్పణను తీసుకొని, మరియు అతని యొద్దకు వెళ్ళి, మరియు అతని భార్యను తిరిగి అప్పగించుము, లేదా నీవు చచ్చినవాడవే. నేను ఇక ఎంతమాత్రము నీ ప్రార్థనలను వినను. అతడిని నీ కొరకు ప్రార్థించనిమ్ము.” ఆమేన్. విషయం అదే. “అతడు నా ప్రవక్త.”
ఇప్పుడు, “ఓ, నేను అబ్రాహామైయ్యుంటే బాగుండును,” అని మీరంటారు.
414 “మనము క్రీస్తునందు మృతులమైతే, మనము అబ్రాహాముయొక్క సంతానమైయున్నాము, మరియు వాగ్దాన ప్రకారము వారసులమైయున్నాము.” నిజము. బైబిలు దానినే చెప్పినది. మీరు దానిని చదవగోరుతున్నారా? ఏంటీ, వాగ్దానము అబ్రాహామునకు మరియు అతని సంతానములకు అని—అని బైబిలు చెప్పలేదు. మీవలె…అబ్రాహాముకు అనేకమంది సంతానములు ఉన్నారు, నిశ్చయంగా, అనేకమంది పిల్లలున్నారు. ఇష్మాయేలు అతని కుమారుడే. శారా చనిపోయిన తర్వాత, అతడు కెతూరా అను మరొకామే ద్వారా, ఏడు లేదా ఎనిమిదిమంది పిల్లలను కన్నాడు. కానీ, చూడండి, వాగ్దానము చేయబడినవాడే సంతానము, మరది ఇస్సాకు అయ్యున్నాడు, మరియు ఇస్సాకు ద్వారా క్రీస్తు వచ్చాడు, క్రీస్తు ద్వారా మనం వచ్చాము. వాగ్దానము షరతులులేనిదై యున్నది.
415 ఇప్పుడు, అబ్రాహాము సంగతేమిటి? ఏంటీ, అతని సంగతి ముగిసిపోయి ఉండేది, అతడు మరలా ఎన్నడైనా తిరిగి రావడం అసాధ్యమైయ్యుండేది. ఖచ్చితంగా. అలాగైతే, మీరు లేఖనాన్ని ఆ విధంగా చదవవలసియుంటే, సౌలు మరలా ఎన్నడైనా తిరిగి రావడం అసాధ్యమైయ్యుండేది. చూశారా? కాని అది ఆ విధంగా లేదు. దేవునియొక్క వాగ్దానము నిరంతరము ఉంటుంది.
416 మనమిక్కడ కేవలం ఒక్క నిమిషం చదువుదాము. మీరు దానిని చదవాలని నేను కోరుతున్నాను. మీరు గలతీ 3:16 ను తీసి, దీనిని చదివి, మరియు ఇప్పుడు వాగ్దానము ఏమైయున్నదో చూడాలని, మరియు మనము ఆయనయొక్క వాగ్దానమైయున్నామో—లేదో చూడాలని కోరుతున్నాను, 3:16. ఇక్కడ వినండి. మంచిది. నేను 15వ వచనము కూడా చదవబోతున్నాను.
సహోదరులారా, మనుష్యురీతిగా మాట్లాడుచున్నాను; మనుష్యుడు చేసిన ఒడంబడికయైనను, స్థిరపడిన తరువాత, ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.
ఇప్పుడు అబ్రాహామునకును మరియు అతని సంతానమునకు (సంతానము, సం-తా-న-ము.), అతని సంతానమునకు వాగ్దానము చేయబడెను.
“అబ్రాహామునకు మరియు అతని సంతానమునకు.” ఇప్పుడు గమనించండి.
ఆయన, అనేకులను గూర్చి అన్నట్లు, నీ సంతానములకును (బహువచనము) అని చెప్పలేదు; కానీ…ఒకని గూర్చి అన్నట్టే, నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తే.
417 అలాగైతే, క్రీస్తు అబ్రాహాముయొక్క సంతానమైయున్నాడు. “మరియు మనము క్రీస్తునందు మృతులమై, ఆయన శరీరములోనికి బాప్తిస్మము పొందియుండి, మనము అబ్రాహాముయొక్క సంతానమైయున్నాము, మరియు వాగ్దానమునకు వారసులమైయున్నాము.” అటువంటప్పుడు అది ఎలా సాధ్యము, దేవుడు నీకు వాగ్దానం చేసినట్లైతే, నీవు ఎన్నడైనా ఎలా తప్పిపోతావు? నీవు ఎన్నడైనా పడిపోయి, మరియు దూరంగా వెళ్ళిపోయి మరియు దాని కొరకు నరకానికి ఎలా వెళ్తావు?
418 ఇప్పుడు, మీరు ఇట్లంటారు, “మంచిది, మేము పడిపోమా?” ఖచ్చితంగా. మరియు మీరు పడిపోయినప్పుడు, మీరు దాని ప్రతిఫలం పొందుతారు, మీరేం కంగారుపడకండి. అబ్రాహాము దానిని పొందుకున్నాడు, ఆ మిగతావారు దానిని పొందుకున్నారు, మరియు మీరు కూడా దానిని పొందుకుంటారు. అది మీకు పాపము చేయడానికి హక్కును ఇస్తుందని మీరు అస్సలు అనుకోకండి. అది ఇవ్వదు. మీరు చేసే ప్రతిదానికి మీరు మూల్యం చెల్లిస్తారు. మీరేమి విత్తుతారో దానిని మీరు కోస్తారు. మీరు ఒక్క చిన్న పాపము చేస్తే ఒక స్నానపు తొట్టినిండా కోస్తారు. అది నిజము. అయితే, సహోదరుడా, దాని అర్థం నీవు నశించిపోయావని కాదు. అది ఖచ్చితంగా నిజము. అబ్రాహాము సరిగ్గా తాను విత్తినదానినే కోసాడు. అది నిజము. మరి అయినను అతడు రక్షించబడ్డాడు.
419 దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన: వారు తమ స్వా-స్థ్యమును కోల్పోయారు, వారు వాగ్దాన దేశమును కోల్పోయి ఐగుప్తులోనికి వెళ్ళారు, కానీ వారు తమ నిబంధనను కోల్పోలేదు. దేవుడు ఇట్లు చెప్పాడు, “నేను అబ్రాహామునకు చేసిన నా వాగ్దానము నాకు జ్ఞాపకమున్నది. నాకు జ్ఞాపకమున్నది, మరియు నా ప్రజలను విడిపించడానికి నేను దిగివచ్చాను. మోషే, అక్కడికి వెళ్ళుము, మరియు, ‘నా ప్రజలను వెళ్ళనిమ్ము’ అని నేను చెప్పానని, ఫరోతో చెప్పుము. అబ్రాహామునకు మరియు అతని సంతానమునకు నేను ఒక వాగ్దానము చేసానని నాకు గుర్తున్నది.”
420 మన విషయంలో కూడా అది అట్లే ఉన్నది. కావున మీరు చచ్చినవారైయుండి, మరియు మీ జీవము, క్రీస్తు ద్వారా దేవునిలో దాచబడినట్లైతే, ఈ లోకములో మిమ్మల్ని తాకగలిగేది ఏదియు లేదు. ఇప్పుడు, నీవు వెళ్ళి తప్పు చేయవచ్చును, కానీ నీవు నిజంగా, వాస్తవంగా, ఒక దేవుని కుమారుడవైతే, మరియు నీవు ఒక పొరపాటు చేసావని నీవు చూస్తున్నట్లైతే, నీవు లేచి మరలా ప్రయత్నిస్తావు. అది నిజము, మరియు నీవు అక్కడే పడియుండవు.
421 కానీ నీవు పిరికివాడవైతే, నీవు ఒక గురుగువైతే, “పైకి లెమ్ము” అనేది నీలోపల లేనట్లైతే, నీవు ఇట్లంటావు, “ఆహ్, సరే, ఏలాగైనా, అది పెద్ద విషయమేమీ కాదు.”
422 దేవుని రాజ్యము, ఒక మనిషి ఒక వలను తీసుకొని సముద్రము వద్దకు వెళ్ళి, దానిని లోపలికి విసిరినట్లుగా ఉన్నది. అతడు తిరిగి వచ్చినప్పుడు, తాబేళ్ళు, కప్పలు, పాములు, బల్లులు, సాలెపురుగులు, మరియు చేపలు అతని వద్ద ఉన్నాయి. అది సువార్త బోధించబడినప్పుడైయున్నది.
423 ఎలాగంటే, దేవుడు సహోదరుడు గ్రాహమ్ వంటి ఒక సేవకుడికి చెప్తాడు, “ఇక్కడికి వెళ్ళుము. సహోదరుడా గ్రాహామ్, ఈ మూలకు వెళ్ళి కొద్దిసేపు చేపలు పట్టుము.” మంచిది, అతడు తన వలను తీసుకొని అక్కడికి వెళ్ళి మరియు వలవేయడం ప్రారంభిస్తాడు.
“సహోదరుడా బిల్, నీవు ఎక్కడికి వెళ్తున్నావు?”
“నేను వేరొక స్థలమునకు వెళ్ళి, మరియు ఈ మూలన వలవేయుచున్నాను.”
424 నేను లాగుచున్నాను, “ఇదిగో అవి ఇక్కడున్నవి, ప్రభువా, అవి ఏమైయున్నవో నీకు తెలుసు.” నేను మరలా వలను లాగుతాను, “మంచిది, ఇదిగో ప్రభువా, అవి ఇక్కడున్నాయి.”
425 ఇపుడు, ఒక తాబేలు, ప్రారంభము నుండియే ఒక తాబేలైయున్నది. నీవు కేవలం వలలో చిక్కుకున్నావంతే. అది నిజము. మరియు ప్రజలు ఉద్రేకములో చిక్కికునేది ఆ విధంగానేయై యున్నది, “ఓ, హల్లెలూయా! హల్లెలూయా! ప్రభువుకు స్తోత్రము! దేవునికి మహిమ! హల్లెలూయా!” వారు కేవలం వలలో చిక్కుకున్నారు, అంతే.
426 ఆ తాబేలు ఆత్మ వారిలో ఉన్నట్లైతే, ఎంతో కాలం పట్టదు, వారు ఇట్లంటారు, “మంచిది, నేను మీతో చెప్తున్నాను,…” ఇదిగో అతడు ప్రాకుతూ, నేరుగా వెనుకకు వెళ్తాడు.
427 మరియు ఒక ఆడ రొయ్య ఇలా అంటుంది, “కానీ నాకు అది అసలు అర్థం కావడంలేదు.” చూశారా?
428 కుమారి సాలె పురుగు కొద్దిసేపటివరకు అక్కడ కూర్చొని, ఆమె “ప్లాప్, ప్లాప్, ప్లాప్ అని,” తిన్నగా వెనుకకు వెళ్ళి ఇట్లంటుంది, “సరే, ఏలాగైనా, దానిలో ఏమీ లేదు.”
429 కుమారి పాము ఇట్లంటుంది, “ఓ, వారు ఒక పరిశుద్ధ-గుండ్రాళ్ళ గుంపైయున్నారు. దానిలోని విషయమంతా అదే. అంతకంటే మంచి ఆలోచనను కలిగియున్న ఒక చోటికి నేను వెళ్తాను.” ఎందుకూ, ఆరంభమునుండియే, నీవు ఒక పామువైయున్నావు. కేవలం సువార్త వల నిన్ను పట్టుకున్నది, అంతే.
430 అయితే చేపలు యజమానుని బల్ల యొద్దకు తీసుకురాబడతాయి. ఆరంభమునుండియే, అది ఒక చేప. దాని విత్తనము ఒక చేపయైయున్నది. అది ఒక చేపగానే ఆరంభమైనది, మరియు దేవుడు జగత్తుపునాది నుండే తన చేపలను ఎరిగియున్నాడు. హల్లెలూయా!
431 గుర్తుంచుకోండి, అవన్నియూ అక్కడున్న అవే బురద నీళ్ళను పీల్చుకుంటున్నాయి. అవన్నియు ఒకే వాగునుండి పీల్చుకుంటున్నాయి. అది వాస్తవము. “మనమందరము…ఒకే ఆత్మసంబంధమైన బండనుండి త్రాగాము. అరణ్యములో అందరూ మన్నాను తిన్నారు.” ఆ—ఆ మిగతావారు తిన్న అదే మన్నాను, కాలేబు మరియు యెహోషువా తిన్నారు. మరియు వారందరూ అరణ్యములో రాలిపోయారు. అయితే అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించబడినవారు ఇద్దరున్నారు, మరియు వారు వెళ్ళారు. అది నిజము.
432 “మనమందరము ఒక్క ఊటనుండి పానము చేసినవారమైతిమి.” కానీ పానము చేసినవారందరూ రక్షించబడరు. మనమందరము కలసి కేకలు వేసాము. మనమందరము కలిసి ఆనందింపజేయబడ్డాము. కానీ ఏర్పరచబడినవారే రక్షించబడతారు. మీరు గమనించారా? ఇట్లు చెప్పబడినది, “సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపరిచేంతగా, అంత్య దినములలో, ఆ రెండు ఆత్మలు, అంత దగ్గరగా ఉంటాయి,” సాధ్యము అయితే. చూశారా? అదే నిత్యజీవమునకు ఎన్నుకోబడిన, దేవునియొక్క నిజమైన ఆత్మయైయున్నది.
433 ఇప్పుడు మనము ముగించుచున్నాము. పిదప నేను ఇక్కడ విడిచిపెట్టిన చోట నుండి సహోదరుడు నెవిల్ తీసుకుంటాడు. మంచిది.
మరియు, నేను చెప్పునదేమనగా, నాలుగువందల, నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును, నిరర్థకము చేయునంతగా, పూర్వమందు దేవుని యెదుట క్రీస్తునందు స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.
ధర్మశాస్త్రము అసలు ఉనికిలోనికైనా రాకముందే, అది దేవుడు అబ్రాహామునకు చేసిన వాగ్దానమైయున్నది.
ఏలయనగా ఆ—ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగినయెడల, ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు: అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను.
నీవు చేసే దేనివలనో కాదు, ఏ ధర్మశాస్త్రముల వలనో, నీ సంఘముయొక్క ఏ చట్టముల వలనో, సంఘములో చేరడంవలనో, లేదా మరే ఇతర చట్టమువలనో కాదు. అది పూర్తిగా దేవుడు నీ కొరకు చేసిన, కృపా కార్యమైయున్నది. విషయం అదేయైయున్నది.
434 గమనించండి.
అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు, అది అతిక్రమమునుబట్టి ఇయ్యబడెను;…
అది నా ముఖము మీద ఉన్నట్టి ముక్కు వలె తేటగా లేదా? “ఎవరికి వాగ్దానము చేయబడినదో, ఆ సంతానము వచ్చువరకు, మరది క్రీస్తేయైయున్నాడు, అప్పటివరకు పనిచేయుటకై అది జతచేయబడినది.”
…అది మధ్యవర్తి చేతులలో దేవదూతల ద్వారా నియమింపబడెను.
ఇప్పుడు మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడొక్కడే.
435 ఇపుడు, ఈ రాబోవు బుధవారమునకై, సహోదరుడు నెవిల్ కొరకు నేను ఇక్కడనుండే, సరిగ్గా ఇక్కడే విడిచిపెడుతున్నాను.
436 ఇప్పుడు మనమేమి చెప్పుకున్నామో మీకు అర్థమైందా? [సంఘము “ఆమేన్” అని చెప్పింది.—సంపా.] ఒక తిరిగి-జన్మించిన క్రైస్తవునికి అది ఖచ్చితంగా అసాధ్యము…ఇప్పుడు, తనను తాను, “తిరిగి-జన్మించినవాడని” చెప్పుకునేడు అని, నా భావం కాదు. నా భావమేదనగా, ఒక నిజమైన, తిరిగి-జన్మించిన క్రైస్తవుడు, ఎన్నడైనా కృపనుండి పడిపోవడం అసాధ్యము, అతడు దానిని చేయలేడు. అతడు పడిపోగలడు, అది నిజము, కానీ అతడు, ఎన్నడూ, ఆ కృపనుండి బయటకు తొలగిపోలేడు.
అబ్రాహాము కృపనుండి పడిపోయాడు. నిశ్చయంగా, అతడు పడిపోయాడు. “అక్కడే ఉండుము,” అని దేవుడు అతనితో చెప్పాడు. అతడు దానినుండి బయటకు వెళ్ళాడు, అయితే అతడు తన నిబంధనను ఎన్నడూ కోల్పోలేదు. అతడింకనూ దేవునియొక్క ఎన్నుకోబడినవాడే. అతడు అక్కడ కూర్చొనియున్న ఒక ప్రవక్తైయున్నాడు. అతడు ఎల్లప్పుడూ అదేయైయున్నాడు. అతడు ఎల్లప్పుడూ దేవునికి చెందినవాడేయై యుంటాడు.
437 ఇప్పుడు గమనించండి. “ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు,” అని, బైబిలు గ్రంథము చెప్పినది. అది ఎంతమందికి తెలుసు? బైబిలు ఇట్లు చెప్పినది, “ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు.” ఇప్పుడు, “ఇశ్రాయేలు అనగా శరీరసంబంధమైన ఇశ్రాయేలు కాదు గాని, ఆత్మసంబంధమైన ఇశ్రాయేలైయున్నది, ఏలయనగా వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకున్నను కలుగును.” సరిగ్గా ఆ తరువాతి వచనములోనే బైబిలు చెప్పినది అదేనా? గలతీ. మంచిది. “ఇశ్రాయేలు జనులందరును రక్షించబడతారు. వారిలో ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారు.” మనము ఇశ్రాయేలుగా ఎలా మారతాము? “క్రీస్తునందు చనిపోయినవారమై, అబ్రాహాము సంతానముగా మారి, మరియు మనము వాగ్దాన ప్రకారము వారసులమైయున్నాము.”
438 పౌలు ఇట్లన్నాడు, “బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు, కానీ అంతరంగమున అయినవాడే, యూదుడు, ఆ వాగ్దానము కలిగియున్నవారే.” మరియు వాగ్దానము వలన, క్రీస్తు ద్వారా, ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించుట ద్వారా మనము అబ్రాహాముయొక్క సంతానమైయున్నాము.
439 ఓ, మీరు దానిని చూస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు దానిని పొందుకుంటారని నేను ఆశిస్తున్నాను, మీరు కొద్దిసేపు దానితో ఉండగలిగినట్లైతే చాలు. ఇపుడు ఇక్కడ మనము దీనిని ముగించి, పిదప మనము మెల్కీసెదెకు మీద ప్రారంభించుకుంటాము, మరది తిరిగి నేరుగా దీనిలోనికి తెస్తుంది. మనము సరిగ్గా ప్రారంభిస్తాము…ఓ, అది అసలు, ఆ విషయమంతయు అద్భుతంగా ఉన్నది. అయితే మనము ఆ వెన్నలోనికి వెళ్తూనే ఉంటాము.
440 ఇప్పుడు, చూడండి, మీరు దీనిని ఇక్కడ తీసుకున్నట్లైతే, కేవలం పరిశీలన ద్వారా మీరు దానిని అర్థం చేసుకున్నట్లైతే, అది ఎలా కనబడుతుందంటే, ముగ్గురు దేవుళ్ళున్నారని నమ్మే, ఒక నిజమైన కఠినమైన త్రిత్వవాది, ఒకసారి నాతో ఇట్లు చెప్పాడు, అదేమిటనగా, “దైవత్వములో ముగ్గురు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారని మత్తయి 3 ఖచ్చితంగా ప్రకటించినది.”
441 నేను ఇట్లన్నాను, “నేను దానిని చూడవలసియున్నది.”
442 అతడు ఇట్లన్నాడు, “గమనించుము.” సరిగ్గా ఈ వేదిక మీద నిలబడి, అతడు ఇట్లన్నాడు, “ఇక్కడ చూడండి, మత్తయి 3,” ఇట్లన్నాడు, “‘యేసు నీళ్ళలోనుండి బయటకు వచ్చిన వెంటనే, ఇదిగో, ఆకాశము ఆయన కొరకు తెరవబడినది, మరియు దేవుని ఆత్మ పావురమువలె ఉండుటను ఆయన చూశాడు. మరియు “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను,” అని ఒక స్వరము ఆకాశమునుండి వచ్చినది.’ మరియు అక్కడ ముగ్గురున్నారు: కుమారుడు ఒడ్డున ఉన్నాడు; పరిశుద్ధాత్మ మధ్యలో ఉన్నాడు; మరియు తండ్రి పైన ఉన్నాడు.”
నేను ఇట్లన్నాను, “సహోదరుడా, లేఖనము ఆ విధంగా చెప్పడంలేదు.”
“ఓ, అవును అది అలాగే చెప్పుచున్నది!”
నేను ఇట్లన్నాను, “ఇప్పుడు మరలా దానిని చదవండి, అది అలాగుందో లేదో కనుగొనండి.”
443 ఇప్పుడు, ఇదిగో అతడు చెప్పిన దృశ్యము ఇది. ఇక్కడ, కుమారుడైన దేవుడు ఉన్నాడు; అక్కడ, తండ్రియైన దేవుడున్నాడు; ఇక్కడ, ఒక పావురమువలె పరిశుద్ధాత్మయైన దేవుడున్నాడు. ఇపుడు గమనించండి. బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, యేసు బాప్తిస్మము పొందినప్పుడు, “వెంటనే కుమారుడు నీళ్ళలోనుండి బయటకు వచ్చెను, ఇదిగో, ఆయన పైనున్న ఆకాశము తెరవబడెను. మరియు ఒక స్వరము…” ఆయన దేవుని ఆత్మను చూసాడు, దేవుని ఆత్మ, ఒక పావురము వలె ఉండుటను చూసాడు. పైన అక్కడ మరొక వ్యక్తి కాదు, కానీ ఈ దేవునియొక్క ఆత్మయే ఆయన పైన ఉన్నట్టి పావురమైయున్నది, మరియు ఒక స్వరము వచ్చి, ఇట్లు పలికినది, “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నివసించుటకు నేను ఆనందించుచున్నాను.” ఇప్పుడు మత్తయి 3 చదివి మరియు అది ఆ విధంగా చెప్పడంలేదేమో చూడండి. చూశారా? ముగ్గురు వ్యక్తులు కాదు, అసలు కానే కాదు.
444 మరియు ఆ విధంగానే…ఒక మనిషి పడిపోయినప్పుడు అతడు ఎన్నడైనా తిరిగి రావడం, అసాధ్యమని, ఇది చెప్పడంలేదు. ఇది దానిని చెప్పడంలేదు. ఇది అలా చెప్పడంలేదు. అది ఇట్లు చెప్పుచున్నది, “ఒక మనిషి ఒకసారి అక్కడ ఉండిన తర్వాత, తననుతాను నూతనపరచుకోవలసిన స్థితికి తిరిగి రావడం అసాధ్యము.” అతడు దానిని చేయలేడు.
445 బైబిలు ఇట్లు చెప్పినది, “దేవుని మూలముగా పుట్టినవాడు, పాపము చేయడు, ఎందుకనగా వాడు పాపము చేయలేడు. దేవుని బీజము వానిలో నిలుచును గనుక, మరి వాడు పాపము చేయలేడు.” నా స్థానమును తీసుకోడానికి ఒక బలి అక్కడ ఉండగా, నేను ఒక పాపి అని ఎలా పిలువబడగలను? నా కొరకు మరణము చెల్లించబడినప్పుడు, నేను ఎలా మరణించగలను? నేను నిత్యజీవమును కలిగియున్నప్పుడు, నేను ఎలా చనిపోగలను? నేను దానిని ఎలా చేయగలను? మీరు దానిని చేయలేరు.
446 గంటకు అరవై మైళ్ళ వేగంతో ఈ పట్టణము గుండా వెళ్ళవచ్చని, ఈ పట్టణముయొక్క మేయరు నుండి ఒక వ్రాత పూర్వకమైన అనుమతి నా దగ్గర ఉండగా, గంటకు అరవై మైళ్ళ వేగంతో వెళ్ళినందుకు ఏ అధికారియైనా నన్ను అరెస్టు చేయడమనేది ఎలా జరుగుతుంది? మీరు దానిని ఎలా చేయగలరు? నేను దానిని చేయగలను అని చెప్తున్నట్టి ఒక అనుమతి పత్రమును మేయరు వద్దనుండి నేను పొందుకున్నాను. అతడు నన్ను అరెస్టు చేయలేడు. అతడు—అతడు అరెస్టు చేయడానికి, అతడు ఈలలు ఊది మరియు అంతా చేయగలడు, మరి నేను దానిని అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చును. అది అసలు విషయమే కాదు; నేను ఒక అనుమతి పత్రాన్ని కలిగియున్నాను.
447 అలాగైతే, క్రీస్తు నా కొరకు మరణించి మరియు నా పట్ల ఆయనకున్న కృప మరియు ప్రేమ ద్వారా నేను ఆయనయొక్క నీతిగా మారినప్పుడు నేను ఎలా చేయగలను? నాకు మరియు దేవునికి మధ్య ఒకటి ఉన్నప్పుడు, ఒక అర్పణ ఉన్నప్పుడు నేను ఎలా పాపము చేయగలను? నేను పాపము చేయలేను. దానిని చేయలేను. దేవుడు నన్ను ఎన్నడూ చూడడు; ఆయన క్రీస్తును చూస్తాడు. ఆయన నా స్థానములో నిలబడతాడు. మరియు నేను ఏదైనా తప్పు చేసినప్పుడు, క్రీస్తు నా స్థానమును తీసుకుంటాడు. నేను నా ఒప్పుకోలును చేశాను, “నేను తప్పైయున్నాను. ఆయన సరియైయున్నాడు. ప్రభువా, నీకు నా హృదయము తెలుసు. నా భావము అదో కాదో నీకు తెలుసు. మరియు నేను తప్పైయున్నాను. నన్ను క్షమించుము.” దేవుడు దానిని ఎన్నడూ చూడడు. అన్నివేళలా, యేసుయొక్క రక్తము నన్ను కప్పియుంచుతుంది. అలాగైతే దేవుడు నన్ను ఎన్నడైనా ఎలా చూడగలడు? ఆయన దానిని చేయలేనప్పుడు, పాపము నా మీద ఎలా మోపబడుతుంది? నేను దానిని చేసినవెంటనే, అది క్షమించబడుతుంది. [సహోదరుడు బ్రెన్హామ్ చిటిక వేసారు—సంపా.] అది నిజము.
448 సరిగ్గా ఎలాగంటే ఇటువంటి ఒక—ఒక చిన్న, ఒక చిన్న కంట్లో-ఔషదము వేసే పరికరమును తీసుకొని, మరియు దాని నిండా నల్లని సిరాను తీసుకొని దానిని పూర్తిగా బ్లీచ్ తో ఉన్న ఒక టబ్బు పైగా పెట్టి, మరియు కేవలం దానిని అందులో వేసేయండి, మరియు మరలా దానిని కనుగొనుటకు ప్రయత్నించండి. అది బ్లీచ్ గా మారిపోతుంది. ఆ సిరా బ్లీచ్ గా మారిపోతుంది. మరియు మీరు క్రీస్తులో ఉన్నట్లైతే, మీ ఒప్పుకోబడిన పాపములు, అలాగే అవుతాయి. మీకు మరియు దేవునికి మధ్య పూర్తిగా బ్లీచ్ తో నిండిన టబ్బు ఉన్నది, మరియు ఒక నీతిగల బలి అర్పణ మీ కొరకు అక్కడ వేచియున్నది గనుక మీ పాపము నీతిగా మారుతుంది.
దినముయొక్క ముగింపులో నేను ఆ నదియొద్దకు వచ్చినప్పుడు,
మరియు ఆఖరి దుఃఖపు గాలులు వీచిన తర్వాత;
నన్ను ఉత్తేజపరచి మరియు నా హృదయమును సంతోషపరిచే ఒకే ఒక్క తలంపు ఉన్నది,
నేను యోర్దానును ఒంటరిగా దాటవలసిన అవసరంలేదు.
449 అది ఒక్క మంచి విషయము. అది ఒక్క మంచి విషయమైయున్నది. నేను దానిని దాటవలసిన అవసరంలేదు. ఈ దినములలో ఏదో ఒక రోజు, మనము మార్గాంతమునకు వస్తున్నాము. సూర్యుడు ప్రకాశించుటకు నిరాకరిస్తాడు, అప్పుడు దేవుడు పిలుస్తాడు.
450 ఆదాము ముందుకు జరిగి మరియు హవ్వను లేపుతాడు, మరియు ఇట్లంటాడు, “ప్రియా, ఇదిగో అది వచ్చేసినది. మేల్కొనవలసిన సమయమైనది.”
451 హవ్వ ముందుకు జరిగి హేబెలును పట్టుకొని, ఇట్లంటుంది, “ప్రియమైనవాడా, ముందుకు రమ్ము. మేల్కొనవలసిన సమయమైనది.” హేబెలు షేతును పట్టుకుంటాడు. మరియు షేతు నోవహును పట్టుకుంటాడు. నోవహు పట్టుకుంటాడు…ఓ, ఇంకా, అలాగే అబ్రాహాము వరకు, అలాగే వారు ఒకరినొకరు పట్టుకొని చెప్తారు. దేవుని కుమారుడు వచ్చినప్పుడు అక్కడ ఒక గొప్ప కుదుపు మరియు మేల్కొలుపు ఉంటుంది. ఆ దినమున మనము ఆయన పోలికలో నిలబడతాము.
452 ఇప్పుడు, మీరు ఇక్కడ పాపము చేసినట్లైతే, దానికి మీరు మూల్యం చెల్లిస్తారు. నేను…
453 నా మనస్సులోకి వస్తూనే ఉన్నది, నేను దీనిని తప్పక చెప్పవలసియున్నది. నాలుగు లేక ఐదు సార్లు, నేను దీనిని చల్లార్చుటకు ప్రయత్నించాను. నేను దీనిని చెప్పవలసియున్నది. ఇక్కడ చర్చ్ ఆఫ్ గాడ్ సంఘము వద్ద ఇంతకుముందు ఉన్నట్టి ఈ సహోదరుడు, సంఘకాపరి ఎంతమందికి గుర్తున్నాడు? సహోదరుడు, సరిగ్గా ఇక్కడే ఉండేవాడు, అతని పేరు ఏమిటి? ఆ దిగువున వోరగెంగ్ కొరకు పనిచేశాడు. ఓ, మీరంతా…సరిగ్గా ఇక్కడే మూలన ఉన్నట్టి, మొదటి చర్చ్ ఆఫ్ గాడ్ సంఘము. లేదా, ఆ—ఆ ఆర్ధికమాంద్యము సమయములో రాలీవారివి అమ్మేవాడు. ఒక నిజమైన దైవభక్తిగల, పరిశుద్ధుడైన వ్యక్తి. సహోదరుడు స్మిత్ అక్కడ అతని స్థానమును తీసుకున్నాడు. కొన్ని నిమిషాలలో నేను అతని పేరును చెప్తాను. అతడు దేవునిచేత-రక్షింపబడిన మనిషి.
454 గుర్తుంచుకోండి, మీరు దిద్దుబాటు వైపునకు నడవకుండా, మరియు ఒక క్రైస్తవునిగా మీరు ఏదైనా తప్పు చేసినట్లైతే, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు. మరియు పిదప మీరు ఆ హెచ్చరికను తీసుకోనియెడల, ఆయన మిమ్మల్ని భూమి మీదనుండి తీసివేస్తాడు. ఆయన చేసినది అదే.
455 బైబిలులో, మీకు గుర్తున్నదా? ఆ కొరింథీ సంఘమును చూడండి. క్రీస్తులో, వారియొక్క స్థానము ఏమైయున్నదో, అతడు వారికి చెప్పాడు. కానీ జరగబోయేదాని గురించి అతడు వారిని హెచ్చరించాడు. మరియు వారు, తమను తాము సరిదిద్దుకొని, దేవునితో సరిచేసుకున్నారు.
456 మరియు ఈ చిన్న సహోదరుడు, అతడొక అద్భుతమైన చిన్న సహోదరుడైయున్నాడు, దేవునిచేత-రక్షింపబడిన వ్యక్తి అని, నేను నమ్ముతాను. మరియు అతడు ఇక్కడ…వోరగెంగ్ వద్ద తనకొక ఉద్యోగమును సంపాదించుకున్నాడు. అతని ప్రజలలో ఎవరైనా ఇక్కడ కూర్చున్నట్లైతే, మీరు ఇక్కడ కూర్చున్న విషయం నాకు తెలియదేమోనని…మీరు అనుకోవద్దని నేను ఆశపడుచున్నాను. అయితే, రామ్సే, సహోదరుడు రామ్సే, ఇక్కడ చర్చ్ ఆఫ్ గాడ్ సంఘము వద్దనున్న సహోదరుడు రామ్సే ఎంతమందికి గుర్తున్నాడు? నిశ్చయంగా, మీకు గుర్తున్నాడు, అద్భుతమైన చిన్న వ్యక్తి. మరియు అతడు నా ఇంటికి వచ్చేవాడు మరియు మేము కలసి మాట్లాడుకునేవారము, మరియు మేమక్కడ కూర్చొని ఏడుస్తూ ఒకరి చేతులు ఒకరు పట్టుకునేవారము; ఒక నిజమైన క్రైస్తవుడు.
457 ఒక రోజు నేను అక్కడికి వెళ్ళాను, అప్పుడే ఒక కూటమైపోయి విదేశాలనుండి వచ్చాను, నా కారును పరిశీలన చేపించాను, సహోదరుడు రామ్సే ఇట్లన్నాడు, “బిల్లీ, నేను నీ కొరకు ఏమి చేయగలను?”
458 నేను ఇట్లన్నాను, “సహోదరుడా రామ్సే, దానిని పరిశీలించండి. ఆయిల్ ను మార్చండి.”
459 “సరే,” అతడు ఇట్లన్నాడు, “బాగుంది, చక్కగా ఉంది.” ఇట్లన్నాడు, “నీవు ఒక చక్కని కూటమును కలిగియున్నావా?”
460 నేను ఇట్లు చెప్పాను, “ఓ, సహోదరుడా రామ్సే, అది అద్భుతంగా జరిగింది.” నేను ఇట్లన్నాను, “నీవు ఎప్పుడైనా నాతోకూడ వస్తే బాగుండునని నేను కోరుచున్నాను. నీవెందుకని నాతో రాకూడదు?”
అతడు ఇట్లన్నాడు, “బిల్లీ, నేను ఇక ఎంతమాత్రము ప్రభువును సేవించడంలేదు.”
నేను వెనుకకు తిరిగి చూసాను, నేను ఇట్లన్నాను, “నీవు ఏమన్నావు?”
461 అందుకతడు, “నేను ఇక ఎంతమాత్రము ఆయనను సేవించడంలేదు,” అని చెప్పి వెళ్ళిపోయాడు.
462 “ఓ, అతడేదో అట్లు చెప్తున్నాడు,” అని నేననుకున్నాను. నేను కూడా, ఎక్కడికో వెళ్ళాను.
463 తిరిగి వచ్చి నా కారులో ఎక్కాను. నేను ఇంటికి వచ్చాను, మరియు “నేను ఇక ఎంతమాత్రము ప్రభువును సేవించడంలేదు,” అనే దాని గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను.
464 వెనుకకు వెళ్ళి, మరలా అతణ్ణి అడగాలని ప్రభువు నా హృదయములో పెట్టాడు. కావున, నేను ఇట్లన్నాను, “మేడా, ఇక్కడ పనులు చూసుకో.”
465 మరియు నేను వెళ్ళి, నా కారులోనికెక్కి, తిరిగి వెనక్కి వెళ్ళాను, వోరగెంగ్ వద్దకు వెళ్ళి మరలా ఆగాను. నేను ఇట్లన్నాను, “సహోదరుడా రామ్సే, నేను నిన్ను ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను.”
ఇట్లన్నాడు, “సరే, బిల్లీ, అది ఏమిటి?”
నేను ఇట్లన్నాను, “కొద్దిసేపటి క్రితం, నీవు ఇక ఎంతమాత్రము ప్రభువును సేవించడంలేదు, అని చెప్పావు. నీవు కేవలం నన్ను ఆటపట్టిస్తున్నావు, కదా?”
అతడు ఇట్లన్నాడు, “కాదు.”
నేను ఇట్లన్నాను, “సహోదరుడా రామ్సే, నీ—నీ భావము అది కాదు.”
అతడు ఇట్లన్నాడు, “అదే.”
నేను ఇట్లడిగాను, “నీవు ఆయనను ప్రేమించడంలేదా?”
అందుకతడు, “నేను ఆయనను ప్రేమిస్తే, నేను ఆయనను సేవిస్తాను కదా, బిల్లీ, నేను సేవించనా?” అని చెప్పి వెళ్ళిపోయాడు.
నేను ఇట్లనుకున్నాను. “చెప్పు, సహోదరుడా రామ్సే!”
ఇట్లన్నాడు, “దాని గురించి నేను ఇక ఎంతమాత్రము మాట్లాడగోరడంలేదు.”
466 నేను ఇంటికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి, తలుపు వేసుకున్నాను. మరియు, ఓ, మీకు తెలుసు కదా మీరు ఏదో ఒకదానినుండి లేదా ఒక చిన్నబిడ్డ వద్దనుండి బిస్కెట్లను తీసివేసినట్లు, అది ఎంత భారంగా అనిపిస్తుందో, మీకు తెలుసు కదా. నేను—నేను ఇట్లనుకున్నాను, “ఏంటీ? అది అసాధ్యము. నిశ్చయంగా సహోదరుడు రామ్సేకు ఏదో జరిగినది.”
467 మరియు జిమ్మీ అను పేరుగల, ఒక చిన్న నల్లజాతి కుర్రవాడు అక్కడున్నాడు, అతడు ఇక్కడ సంఘమునకు వస్తాడు. ఒక్క కాలును కలిగియున్నాడు, మీకు తెలుసు కదా; అతడు కొద్దిగా, కుంటుతాడు. నేను అతని పేరు మర్చిపోయాను, అక్కడ వోరగెంగ్ వద్ద పని చేస్తాడు, క్రేన్ ను నడుపుతాడు. అతడు నన్ను కలిసి, మరియు అతడు ఇట్లన్నాడు, “మీకు తెలుసా, రెవరెండ్. బ్రెన్హామ్,” అతడు ఇట్లన్నాడు, “ఇక్కడ ఈ డాక్టర్ రామ్సే గురించి నాకు తెలియడంలేదు.” అతడు ఇట్లన్నాడు, “మొన్నటి దినమున నేను అతనితో ఇలా చెప్పాను, ‘ఇక్కడ కనీసం నోరు తెరవడానికైనా మేమంతా భయపడ్డాము.’ ‘నీవు ఒక దైవభక్తిగల మనిషివి,’ అని చెప్పాను. కానీ,” ఇట్లన్నాడు, “అతడు తన బోధకుని లైసెన్సును తీసుకొని బుట్ట దగ్గరకు వెళ్ళి మరియు దానిని చింపేసాడు, మరియు దానిని ఆ బుట్టలో పడవేసి, ‘నాకు దానితో ఇక ఏ సంబంధమూ లేదు,’ అని అన్నాడు.”
అతడు ఇట్లన్నాడు, “హే, మిస్టర్!” ఇట్లన్నాడు, “నీవు దానిని చేయకూడదు.”
అందుకతడు ఇట్లన్నాడు, “ఓ, జిమ్, నేను ప్రభువును సేవించడం ఆపివేసాను.”
కావున అతడింకా ఇట్లన్నాడు, “నీవు ఉద్దేశపూర్వకంగా దానిని చెప్పడంలేదు.”
468 మరియు ఇట్లన్నాడు, “అప్పుడతడు, తన ఇంజెన్ ను శుభ్రము చేసుకోడానికి వస్తున్నాడని నాతో చెప్పాడు, అది శ్రామిక దినమున,” అని నేను నమ్ముతున్నాను. “మరియు అతడిట్లన్నాడు, ‘ఇప్పుడు, జిమ్, నీవు వచ్చి నాకు సహాయము చేయాలని నేను కోరుతున్నాను.’”
469 అందుకతడు ఇట్లన్నాడు, “నేను చర్చి నుండి వచ్చిన తర్వాత నీకు సహాయము చేస్తాను, కాని మొదట నేను చర్చికి వెళ్తాను.”
470 అతడు తిరిగి వెళ్ళాడని చెప్పాడు, “మరియు మిస్టర్. రామ్సే తన కారు ఇంజెన్ను శుభ్రము చేస్కుంటున్నాడు. అతడిట్లన్నాడు, ‘జిమ్మీ, నదిని దాటివెళ్ళు. ఇక్కడ బారు దుకాణములు మూసివేయబడియున్నవి. నదిని దాటివెళ్ళి మరియు నాకొక కేసు బీర్లను తీసుకొనిరా.’”
471 అతడు ఇట్లన్నాడు, “మిస్టర్. రామ్సే, నేను అనేక విషయాలలో దోషినయ్యాను, కానీ ప్రభువుయొక్క సేవకునికి ఒక కేసు బీర్లను తెచ్చే విషయంలో మాత్రం నేను ఎన్నడూ దోషిని కాను.” అతడిట్లు చెప్పాడు, “లేదు, అయ్యా. నేను ఎన్నడూ దానిని చేయను.”
472 మరియు అతడు ఇట్లన్నాడట, “సరి, వెళ్ళు. దానిని తీసుకొనిరా, జిమ్.”
473 అతడిట్లు జవాబునిచ్చాడు, “మిస్టర్. రామ్సే, నేను మీ ఇంజెన్ను శుభ్రం చేస్తాను. కానీ మీకు బీరు కావాలంటే మాత్రం, మీరే వెళ్ళి దానిని తెచ్చుకోవాలి.” ఇంకా అతడిట్లన్నాడు, “ప్రభువుయొక్క సేవకునికి అటువంటి దేనినైనను నేను ఎన్నడూ తీసుకొనిరాను.”
474 కావున రామ్సే జిమ్మీ కారులోకి దూకి, ఆ నదిని దాటి వెళ్ళాడు; సగం మత్తిల్లిపోయి, దానిని త్రాగుతూ, ఒక బీర్ల కేసుతో, తిరిగి వచ్చాడు.
475 అతని ఆర్గోగ్యం పాడవ్వడం మొదలై, వ్యాధిన పడ్డాడు. చూశారా? దేవుడు అతనితో మాట్లాడలేకపోయాడు. నేను అతణ్ణి హెచ్చరించాను, నేను చేయగలిగిన ప్రతిదానిని నేను చేశాను. సహోదరుడు స్మిత్ అతని దగ్గరికి వెళ్ళి మరియు అతణ్ణి హెచ్చరించాడు. ప్రతి ఒక్కరూ అతని కొరకు తాము చేయగలిగిన ప్రతిదానిని చేయుటకు ప్రయత్నించారు. అయినప్పటికీ, అతడు వినలేదు. ఏమి జరిగినది? అతడు వ్యాధినపడి మరియు మరణించాడు. అతడు ఒక రక్షించబడిన వ్యక్తి అని అది చూపించినది. దేవుడు అతడిని…విధేయుడగునట్లు చేయలేనియెడల, ఆయన అతణ్ణి భూమి మీదనుండి తీసివేసి మరియు అతణ్ణి గృహమునకు తీసుకొని వెళ్ళవలసియుంటుంది. బైబిలు గ్రంథము చెప్పినది సరిగ్గా అదేయైయున్నది. బైబిలు గ్రంథము దానినే వాగ్దానము చేస్తున్నది. నీవు దిద్దుబాటునకు నిలబడనియెడల, నీవు గృహమునకు వెళ్ళవలసియుంటుంది.
476 కావున దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ఆయన నిన్ను పోగొట్టుకోలేడు, కానీ ఆయన ఇక్కడ నీ దినములను తగ్గించి, మరియు నీవు చేసిన ప్రతి పాపమునకు నీవు మూల్యము చెల్లించేలాగా చేయగలడు. కావున, నీవు పాపము చేసినట్లైతే, నీవు చేసినదానికి నీవు మూల్యం చెల్లించబోవుచున్నావు. కేవలం దానిని గుర్తుంచుకోండి.
477 ఇప్పుడు, ప్రభువు మీకు తోడైయుండును గాక. సహోదరుడు రామ్సే రక్షించబడ్డాడని, ఈ రాత్రి, నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా, నేను దానిని నమ్ముతాను. అయితే అతడు దేవునికి లోబడలేదు, మరతడు దేవునికి లోబడనప్పుడు, దేవుడతణ్ణి గృహమునకు తీసుకోవాల్సివచ్చింది. చేయవలసినది అదొక్కటే, ఎందుకనగా, అది ఏమిటి? “అతడు ఏ రక్తముతో శుద్ధి చేయబడ్డాడో అదే రక్తమునకు అతడు నిందను మరియు అవమానమును తీసుకొనివస్తాడు.” అది నిజమేనా? “మరియు నిబంధనను అపవిత్రమైనదిగా ఎంచుతాడు,” ఈ హెబ్రీ పత్రిక సరిగ్గా దానినే చెప్పలేదా. చూశారా? అతడు నశించిపోవడం అసాధ్యము, కానీ అతడు సిగ్గును మరియు అవమానమును తీసుకొనివస్తాడు, కావున దేవుడు అతణ్ణి భూమి మీదనుండి తీసివేసి మరియు అతణ్ణి గృహమునకు తీసుకొని వెళ్ళాల్సియుంటుంది. సరిగ్గా అదే జరిగింది.
ఇప్పుడు ఒక్క క్షణము ప్రార్థన కొరకు మనము తలలు వంచుతుండగా, ప్రభువు దీవించును గాక.
478 ఇప్పుడు, అతిపరిశుద్ధుడవైన కృపగల తండ్రీ, నీవు మమ్మల్ని ఎన్నడూ విడువవు మరియు ఎడబాయవని, మేము కలిగియున్న ఈ వాగ్దానమును బట్టి మేము నీకు నిశ్చయంగా కృతజ్ఞులమైయున్నాము. జీవితమంతా నీవు మాతోకూడ వస్తావని, మరణములో నీవు మాకు సమీపంగా ఉంటావని నీవు వాగ్దానము చేసావు. మేము నిత్యజీవమును కలిగియున్నామని నీవు మాకు వాగ్దానం చేశావు. నీవు దానిని మాకు ఉచితంగా ఇచ్చావు. మేము దానిని ఎన్నడూ కోల్పోలేము. “నా యొద్దకు వచ్చువారందరూ, నిత్యజీవమును పొందుకుంటారు.” మరియు అది నిత్యజీవమైనట్లైతే, దానికి అంతమే లేదు, మరియు అంత్య దినమున మమ్మల్ని లేపుతానని నీవు వాగ్దానము చేసావు. దీనికై మేమెంతో కృతజ్ఞులమైయున్నాము. నీ వాక్యము మాకు దీనిని బోధిస్తున్నందుకు మేము కృతజ్ఞులమైయున్నాము. అది మాకు ఒక నిశ్చయమైన నిరీక్షణను ఇస్తుంది. మా తండ్రి ప్రేమయైయున్నాడని అది మాకు తెలియజేస్తుంది. ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మరియు ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు. “మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని,” అని నీవు చెప్పావు. మరియు తండ్రీ, నీవు ఆలాగు చేసినందుకు, నేను నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను. మరియు నిత్యజీవమునకు నిర్ణయించబడిన అనేకులు, ఈ రాత్రి, ఇక్కడ కూర్చొనియున్నారు, మరియు యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించియున్నారు. మరియు ఆత్మ ఫలములు వారి జీవితమును వెంబడిస్తున్నాయి: దయాళుత్వము, సాత్వికము, దీనత్వము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము. వారి కొరకు మేము కృతజ్ఞులమైయున్నాము.
479 మరియు తండ్రీ, మేము ప్రార్థిస్తున్నాము, అదేమిటనగా, ఈ రాత్రి, వారితో ఆ ఫలములను కలిగిలేకుండా, ఏదో ఒక అద్భుతముపై ఆధారపడుతున్నవారు ఇక్కడుండవచ్చును, వారు భావోద్వేగానికి గురైనందున, ఏదో ఒక రోజు ఉద్రేకభరితులైనందున, వారికి మంచిగా అనిపించియుండవచ్చును, వారు కేకలు వేసియుండవచ్చును, వారు అనేక కార్యములు చేసియుండవచ్చును. కానీ తండ్రీ, అనుదినము వారిని స్థిరమైన ప్రేమలో ఉంచుతూ, వారి శత్రువులను క్షమింపజేసి, వారి తప్పులను సరిచేసుకుంటూ, సమాధానముతో ప్రియముగా, మాధూర్యముగా మరియు ఒకరి యెడల ఒకరు దయాళుత్వముతో ఉండునట్లు చేసే ఆ ఆత్మ ఫలమును వారు కలిగిలేనియెడల, మరియు సంఘము కొరకు ఒక మంటను, క్రీస్తు కొరకు మరియు ఆయన పిల్లల కొరకు ప్రేమను వారు కలిగిలేని యెడల, ఓ నిత్యుడవగు దేవా, వారిని క్షమించుము. వారు సంఘములో సభ్యులైనను, భూసంబంధమైన శరీరములో సభ్యులైనప్పటికినీ, వారు ఇప్పుడు వెళ్ళి మరియు ఆ శరీరసంబంధమైన, నిర్జీవ క్రియలను పక్కన పెట్టి మరియు పరిపూర్ణులగుటకు సాగిపోదురు గాక. ప్రభువా, దానిని దయచేయుము. వారు పరిపూర్ణుని యొద్దకు వచ్చి మరియు ఆయనను వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా స్వీకరించుదురు గాక, తద్వారా ఆయన ఒక దోషియైన పురుషుని నిమిత్తము మరియు ఒక దోషియైన స్త్రీ నిమిత్తము ఒక పరిపూర్ణమైన బలిగా నిలబడుటకైయున్నది. మరియు వారు ఎన్నటెన్నటికీ జీవించేందుకు దేవుని సన్నిధిలోనికి వచ్చేదాకా, ప్రేమ మరియు సమాధానమునిచ్చు తన కృపను ఆయన వారికి అనుగ్రహించడానికైయున్నది. తండ్రీ, దానిని దయచేయుము.
మనము మన తలలు వంచియుండగా:
480 ఆచారములతో కూడిన ఒక శరీరసంబంధమైన జీవితమును బాప్తిస్మములను ఉద్రేకములను మరియు, అట్టి చిన్న శరీరసంబంధమైనవాటిని, గుండెనిండా ఒక నిజమైన ప్రేమ కొరకు మార్చుకోడానికి, ఇష్టపడే ఎవరైనా ఇక్కడున్నయెడల, మరది—మరది మీరు మీ బద్ద శత్రువునొద్దకు కూడా నడిచివెళ్ళి, అతని హత్తుకొని ఇట్లు చెప్పగలుగుటకై యున్నది, “సహోదరుడా, నేను నీ కొరకు ప్రార్థిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” మీరు శరీరసంబంధమైన విషయములయొక్క ఆ అనుభవమును నిజమైన ప్రేమయొక్క అనుభవము కొరకు మార్చుకోవాలనుకుంటే, దేవునికి మీ చేతినెత్తి, మరియు, “దేవా, ఈ రాత్రి నన్ను తీసుకొని, నేను ఎలా ఉండవలసియున్నానో నన్ను అలా చేయుము,” అని చెప్తారా? సరిగా ఇక్కడ వేదిక మీదనుండే, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు ప్రార్థనను కోరుతున్నారా? మీ చేతులను ఎత్తండి.
481 అక్కడ వెనుక, అయ్యా దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. “సంవత్సరాలుగా నేను సంఘములో ఉన్నాను.” అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇక్కడ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. అక్కడున్న చిన్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. “నన్ను సమాధానపరచమని నేను దేవుణ్ణి అడుగుతాను.” మీరు…మీరు నిజంగా కసితో ఉన్నారా? మీకు ఏదో సరిగా లేదన్నట్లు ఉన్నదా. మీరు సందేహపడుతున్నారా? మీరు అటు ఇటు తిరుగుతున్నారా? అది నిజంగా సరియైనదా కాదా అని మీరు ఆలోచిస్తున్నారా? మీరు క్రీస్తునొద్దకు వచ్చినప్పుడు, మీరు ఒక సంపూర్ణమైన నిశ్చయతతో, ప్రేమతో నిండిన హృదయముతో వస్తారా? ఒక్క భయము కూడా లేకుండా, “ఆయన నా తండ్రియని నేనెరుగుదును” అని చెప్తూ, మీరు ఆయన వద్దకు నడిచి వెళ్తారా?
482 మరియు ఇక తీర్పు లేదు, మీరు మరణమునుండి జీవములోనికి దాటియున్నారు. అది మీకు తెలుసు. మరియు మీరు మీ జీవితమును గమనించండి: మీరు ప్రేమిస్తున్నారు, మీరు క్షమిస్తున్నారు, మీరు దయాళుత్వము కలిగియున్నారు, మీరు సమాధానపరులై యున్నారు, మీరు సాత్వికులుగా ఉన్నారు. దినదినము, ఈ ఆత్మ ఫలములన్నియు మీ జీవితమును వెంబడిస్తున్నాయి. మరియు మీరు ఏదైనా తప్పు చేసిన వెంటనే, ఓ, మై, మీరు తప్పు చేసారని మీ మనస్సుకు తెలిసిన వెంటనే, త్వరగా, సరిగ్గా అప్పుడే దానిని సరి చేసుకోండి. మరొక్క నిమిషము కూడా వేచియుండవద్దు, సరిగ్గా అప్పుడే వెళ్ళి దానిని సరిచేసుకోండి. మీరు అలా చేయకపోతే, సరి, మీరు క్రీస్తు ఆత్మను కలిగిలేరు. నీవు ఒక మంచి స్త్రీవి కావచ్చు, నీవు ఒక మంచి పురుషుడివి కావచ్చు, నీకు సంఘములో మంచి పేరు ఉండవచ్చును, పొరుగువారి మధ్య నీకు మంచి పేరు ఉండవచ్చును, కానీ ఆ పరిపూర్ణతకు, ఎక్కడైతే నీవు పూర్తిగా క్రీస్తునే నమ్ముతున్నావో ఆ చోటుకు నీవు వెళ్ళినావా? మరియు దీని ద్వారా, మీకు ముద్రను ఇస్తాడు. “అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అప్పుడు దేవుడు ఒక నిర్ధారణగా, అతనికి సున్నతి అను ముద్రను ఇచ్చాడు.”
483 ఇప్పుడు నీవు ఇట్లంటావు, “నేను దేవుడిని నమ్ముతున్నాను. నేను ఒప్పుకోలు చేసాను.” కానీ, నీవు రక్షించబడ్డావని ఋజువు చేయడానికి, ప్రేమ, సంతోషము, ఆత్మ ఫలములతో నిండిన పరిశుద్ధాత్మ అను ముద్రను, దేవుడు తిరిగి నీ జీవితం మీదికి పంపి దానిని నీకిచ్చాడా? ఆయన దానిని చేయనట్లైతే, అప్పుడు ఆయన ఇంకా నీ విశ్వాసమును గుర్తించలేదు. నీవు కేవలం ఒక ఒప్పుకోలును చేసావు. ఆయన దానిని స్వీకరించలేదు, ఏదో తప్పున్నది. అలాగైతే, మీరు ఆయనను స్వీకరించగోరుచున్నారా? మనము ప్రార్థించడానికిముందు, ఇంకెవరైనా ఉంటే, మీ చేయిని ఎత్తండి.
484 యవ్వనస్థురాలా, దేవుడు నిన్ను దీవించును గాక. అక్కడ ఆ వెనుక, నిన్ను కూడా దేవుడు దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. మంచిది. మనం ప్రార్థించడానికిముందు, ఇంకెవరైనా ఉన్నారా? మంచిది. ఆ వెనుక, సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. అది నిజము. ఒక పది, పదిహేను చేతులు పైకెత్తబడ్డాయి.
ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము.
485 ధన్యకరమైన ప్రభువా, వారి కుర్చీ వద్దనే, వారు ఒక బలిపీఠమును కనుగొనుచున్నారు. వారు “తప్పైయున్నారని,” వారు ఇప్పుడు కూర్చున్న స్థలములో, ఆ కుర్చీ వద్దనే, నీవు వారి హృదయములతో మాట్లాడినావు. వారి కుర్చీల వద్దనుండగనే, వారు “మరింతగా యేసువలె ఉండాలని కోరునట్లు,” ఒక కోరికను నీవు వారి హృదయములో పెట్టావు.
486 వారి జీవితము మారాలని వారు కోరుచున్నారు. వారు సాత్వీకముగా, దీనముగా ఉండాలని కోరుచున్నారు. వారు దయాళుత్వముతోను మరియు పూర్తిగా సహనముతోను ఉండాలని కోరుచున్నారు. వారు దీర్ఘశాంతముతో, ఒర్పుతోను ఉండాలని కోరుచున్నారు. వారు ఎంతగానో క్రైస్తవుని-వలె, ఎంతగానో క్రీస్తు-వలె ఉండగోరుచున్నారు, ఎంతగా అంటే వారు వీధిలో వెళ్తుండగా లోకము ఇట్లు చెప్పునంతగా యైయున్నది, “ఆ మనిషి నిజంగా ఒక క్రైస్తవుడు. ఆ స్త్రీ నిజంగా ఒక క్రైస్తవురాలు. ఓ, వారు అత్యంత దయాళుత్వము గల, సాత్వీకమైన, మాధూర్యమైన ప్రజలైయున్నారు!”
487 ప్రభువా, ఈ రాత్రి, వారు ఆ అనుభవమును పొందుకొనునట్లు, దానిని దయచేయుము. మరియు వారు తమ సంఘముయొక్క సామర్ధ్యము పైన గానీ, ఏ సంఘముతోనైనా, ఏ సంఘశాఖతోనైనా వారికున్న అనుబంధము పైన గాని ఆనుకోకయుందురు గాక; లేదా వారి ఉద్రేకముల పైన గాని, ఏదైనా ఒక అద్భుతము పైన గాని, జరిగినటువంటి ఏదో ఒక ఉద్రేకమైన విషయము పైన గాని ఆనుకోకయుందురు గాక, వారు కేకలు వేసియుండవచ్చును, భాషలతో మాట్లాడియుండవచ్చును, లేక మరేదైనా చేసియుండవచ్చును.
488 ఓ నిత్యుడవగు దేవా, దాని ఆధారంగా వారు పరలోకమునకు వెళ్తారని నమ్ముటకు వారు ప్రయత్నించకుందురు గాక, ఏలయనగా అది దయనీయంగా విఫలమవ్వడాన్ని మేము అనేకసార్లు చూశాము. మరియు అవి తప్పిపోవునని నీవన్నావు, “భాషలైనను, అవి ఆగిపోవును! ప్రవచనములైనను, అవి మాయమైపోవును. జ్ఞానమైనను, అది మాయమైపోవును. ఓ, ఈ విషయములన్నియు, వరములు, స్వస్థతా అద్భుతములు సైతం, అవన్నియు తొలగిపోతాయి. ఆ దైవిక ప్రేమ మాత్రమే నిలిచియుంటుంది.”
489 దేవా, దానిని వారి హృదయములో సృష్టించుము, మరియు ఆ ఫలములను తీసుకొనివచ్చేది ఆ ఆత్మయేనని వారికి తెలియజేయుము. ప్రభువా, మేము నీ కొరకు వేచియుండగా, సరిగ్గా ఇప్పుడే దానిని చేయుము, ఏలయనగా యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్.
490 [టేపులో ఖాళీ ఉన్నది—సంపా.]…అగ్ని గోళములు ఎగురుతూ, మరియు ఆ భవనముగుండా తెల్ల గువ్వలు అటు ఇటు తిరగడాన్ని చూడటం, క్రీస్తు తన చేతులలో ముళ్ళతో వచ్చుటను చూడటం, మరియు ఆయనయొక్క…ఓ, అది క్రీస్తు విరోధియొక్క పన్నాగమని మీకు తెలుసా? ఆయన ఇట్లు చెప్పాడు, “ఈ సంగతులు జరగడం ప్రారంభమైనప్పుడు, అప్పుడు పైకి చూడండి, మీ విమోచన సమీపించుచున్నది.” ఆ కారణముచేతనే నేను రాగలిగిన ప్రతీ నిమిషము సంఘమునకు వచ్చి, మరియు మిమ్మల్ని దృఢపరచుటకు ఇష్టపడతాను. సహోదరుడు నెవిల్ ఎల్లప్పుడూ మనతో ఉండకపోవచ్చును. సహోదరుడు నెవిల్ ఒక మంచి, ధీటైన సువార్త బోధకుడని నేను నమ్ముతున్నాను. ఈ ప్రసంగ వేదిక మీదికి ఏమి వస్తుందో మనకు తెలియదు, మరియు, అది వచ్చినప్పుడు, “నా గొఱ్ఱెలు నా స్వరమును ఎరుగును.” ఆ వాక్యముతో నిలిచియుండండి. మీరు ఎన్నడూ ఆ వాక్యమును విడిచిపెట్టకండి. మీరు సరిగ్గా దానితోనే నిలిచియుండండి. క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన స్వేచ్ఛలో మీరు స్థిరముగా నిలబడండి. ఆ బానిసత్వపు కాడిల క్రింద మరియు అట్టివాటి క్రింద చిక్కుకోకండి. స్థిరముగా నిలిచియుండండి, మరియు స్వతంత్రులుగా నిలిచియుండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లోకములో మనము దేని గురించి కూడా భయపడవలసిన అవసరము లేదు.
491 మీరు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలు ప్రార్థన చేపించుకోడానికి వచ్చుటను నేను గమనిస్తుంటాను, వారు వరుసలోనికి దూరుతారు. మరొకసారి వారు ఒక స్వస్థతా సభను చూసినప్పుడు, వారు ఈ వరుసలోనికి వెళ్తారు, వారు ఈ వరుసలోనికి వెళ్తారు. నేను వారిని ఖండించడంలేదు. వారు ఉపశమనమును కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు, కానీ వారు తప్పుడు విధానంలో వెళ్తున్నారు. దేవుడు ఏమి చేయకూడదని చెప్పాడో, మీరు దానినే చేస్తున్నారు. చూశారా? మీరు ధైర్యముగా కృపా సింహాసనమునొద్దకు నడిచి వెళ్ళి, మరియు “మీరు అడిగారు, మీరు పొందుకుంటారు,” అని నమ్మినప్పుడు, దానితో నిలిచియుండండి. అది ఆ విధంగా చేయబడవలసియున్నది; కేవలం ఒక సభనుండి మరొక సభకు, సంఘమునుండి సంఘమునకు, ప్రచార సభనుండి ప్రచార సభకు వెళ్ళడం కాదు.
492 ఏంటీ, వారు ఈ స్వస్థతా సభలను ఒక బుద్ధిహీనతగా మార్చివేసారు. నిశ్చయంగా, వారట్లు చేసారు. అది ఎటువంటి స్థితికి వచ్చిందంటే, జ్ఞానముగల ప్రజలు, వారు చుట్టూ చూసి మరియు అదంతా ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. అక్కడ, దేవుడు ఆ విషయాలను కోరడంలేదు. స్వస్థత ప్రచార సభలలోనే జరుగవలసిన అవసరము లేదు. స్వస్థత ప్రతి స్థానిక సంఘములోను జరుగవలసియున్నది, ఈ వరములన్నియూ పనిచేస్తున్నాయి. కానీ ఆ వరముల మీదనే నాటబడుటకు ప్రయత్నించకండి. వరముల పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపించకండి. దేవుడు మిమ్మల్ని దేనికొరకైనా వాడుకోవాలనుకుంటే, ఆయన వాడుకుంటాడు. అయితే, ఆ దాతవైపు చూడండి.
493 మార్టిన్ లూథరు, ఒకసారి భాషలతో మాట్లాడిన తరువాత, అతడు దానిని ఎందుకు బోధించలేదని ప్రశ్నించబడ్డాడు, అతడిట్లు చెప్పాడు, “నేను దానిని బోధించినట్లైతే, నా ప్రజలు వరమునిచ్చినవానికి బదులు ఆ వరము వెంబడి పడతారు.” అది నిజము.
494 మూడీ, ఒకసారి, మాట్లాడుచున్నాడు, మరియు, అతడెంతగా ప్రేరేపణ క్రింద ప్రసంగిస్తున్నాడంటే, అతడు భాషలలో మాట్లాడాడు. అయితే అతడు ఇట్లన్నాడు, “దేవా, బుద్ధిహీనపు మాటలను గొణుగుచున్నందుకు నన్ను క్షమించుము.” నిశ్చయంగా. చూశారా? మరియు వారు ఆ విషయాలను కలిగియున్నారు. మనము ఆ సంగతులను నమ్ముతాము, కానీ అవి వాటి స్థానములోనే ఉంచబడవలసియున్నది. మరియు అవి ఋజువులుగా ఉంచబడకూడదు.
495 బైబిలు గ్రంథములో, “పరిశుద్ధాత్మకు ఋజువుగా” ఆత్మ ఫలములు తప్ప, ఒక్క కార్యము కూడా ఇవ్వబడలేదు. యేసు ఆ విధంగా చెప్పిన ఏ చోటునైనా కనుగొనండి. అవును, అయ్యా. మీ ఆత్మయొక్క ఫలమే పరిశుద్ధాత్మకు ఋజువైయున్నది. యేసు అట్లు చెప్పాడు, “వారి ఫలములవలన మీరు వారిని తెలుసుకొందురు.” “మరియు ఆత్మ ఫలమేదనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సమాధానము, దయాళుత్వము, సాత్వికత్వము. మరియు శత్రువుయొక్క ఫలమేదనగా శత్రుత్వము, ద్వేషము, దుర్బుద్ధి, కలహము, మరియు మొదలగునవి; అది శత్రువుయొక్క ఫలమైయున్నది.” కావున, నీవు జీవిస్తున్న విధానాన్ని బట్టి, నీవు దేవునితో ఎక్కడ నిలబడియున్నావన్నది తీర్పు తీర్చవచ్చును. నీ హృదయమంతయు ఆయనతో ప్రేమలో ఉండి, మరియు నీవు ఆయనను ప్రేమిస్తూ దయాళుత్వము కలిగియుండి, మరియు ప్రతిదినము ఆయనతో జీవిస్తున్నయెడల, నీవు మరణమునుండి జీవములోనికి దాటియున్నావని నీకు తెలుసు. అది ఆ విధంగా లేకుండా, మరియు నీవు మరో విధంగా ఉన్నట్లైతే, నీవు కేవలం ఒక క్రైస్తవుడిని అనుకరిస్తున్నావంతే. అది నిజము. మరి, శరీరానుసారమైన అనుకరణలన్నీ ఖచ్చితంగా బట్టబయలు చేయబడతాయి. అది మనకు తెలుసు.
496 కావున, ఆ విధమైన జీవితమును జీవించకండి, మీరు ఆ విధంగా జీవించనవసరము లేదు. పైనున్న ఆకాశమంతయు మంచివియు మరియు నిజమైనవియునైన సంగతులతో నిండియుండగా, మీరు ఒక ప్రత్యామ్నాయమును ఎందుకు స్వీకరించాలి? నిశ్చయంగా. నన్ను దేవుడిని తీసుకోనివ్వండి, నాకు కావలసింది అదే. ఆమేన్.
497 ఇప్పుడు, ప్రార్థన చేపించుకోడానికి ఎవరైనా వచ్చారా? మీరందుకు వచ్చినట్లైతే, మీ చెయ్యినెత్తండి. ఈ ఉదయమున మేము స్వస్థత కూడికను కలిగియున్నాము. అలాగైతే…ఇక్కడున్న ఈ స్త్రీయేనా? మంచిది, సహోదరీ, అలాగైతే నీవు ముందుకు జరుగుతావా? మరియు ఇక్కడ, పెద్దయైన, మా సహోదరుడా, ఇప్పుడు అభిషేకించుటకు రమ్ము. [టేపులో ఖాళీగా ఉన్నది—సంపా.]
…నా మీద ప్రకాశించుము;
ఓ, నా మీద ప్రకాశించుము, ప్రభువా, నా మీద ప్రకాశించుము,
దీపస్థంభం నుండి ఆ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
498 ఆయన అద్భుతమైనవాడు కాడా? ఇప్పుడు మనం మన తలలు వంచుకుందాం, చాలా నిశ్శబ్దంగా ఉందాము. నా మీద ప్రకాశించుము, అనుదానిని, మరలా పాడుకుందాము. ఇప్పుడు, ప్రతి ఒక్కరూ, దానిని, పాడండి, “ప్రకాశించుము…” ఇప్పుడు మీ అంతరాత్మలో ఆయనను ఆరాధించండి, చూడండి, నెమ్మదిగా ఉండండి. స్వస్థత కూటము వచ్చుచున్నది. వర్తమానము ముగిసినది. మనము ఆరాధించుదాము.
దీపస్తంభము నుండి వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము;
ఓ, నా మీద ప్రకాశించుము, ప్రభువా, నా మీద ప్రకాశించుము.
దీపస్తంభము నుండి వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
యేసువలె ఉండాలని, యేసువలె ఉండాలని, (ఓ!)
భూమి మీద నేను ఆయనవలె ఉండాలని పరితపించుచున్నాను;
భూమి నుండి మహిమలోనికి జీవిత మార్గమంతా,
ఆయనవలె ఉంచమని మాత్రమే నేను అడుగుచున్నాను.
మేము వెలుగులో నడుస్తాము, అంతటి ఒక అందమైన వెలుగు,
కనికరపు మంచు బిందువులు ప్రకాశవంతముగా ఉన్న చోటుకు వస్తాము;
లోకమునకు వెలుగైయున్న, యేసూ,
రాత్రింబగళ్ళు, మా చుట్టూ ప్రకాశించుము.
వెలుగుయొక్క పరిశుద్ధులైన మీరంతా,
లోకమునకు వెలుగైయున్న యేసును, ప్రకటించండి,
అప్పుడు పరలోకపు గంటలు మ్రోగుతాయి,
యేసు, వెలుగు…
ప్రభువా, మేము నిన్ను ఆరాధిస్తుండగా, మమ్మల్ని స్వీకరించుము.
మేము వెలుగులో నడుస్తాము, అందమైన వెలుగైయున్నది,
కనికరపు మంచు బిందువులు ప్రకాశవంతముగా ఉన్న చోటుకు వస్తాము;
లోకమునకు వెలుగైయున్న యేసూ,
రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రకాశించుము.
499 ఆ శుభ్రపరచుట మీకు నచ్చడంలేదా? మీకు మంచిగా అనిపిస్తున్నదా? మీ చెయ్యిని పైకెత్తి, చెప్పండి. ఆ పాత-కాలపు పాటలలో, ఆ పాత-కాలపు గీతాలలో, ఏదో ఉన్నది. క్రైస్తవ సంఘాలలో చేర్చబడిన, ఈ క్రొత్త లోక సంబంధమైన పాటలన్నిటికంటె నేను వాటిని కలిగియుంటాను. నాకు ఆ పాత కాలపువి ఇష్టము, నాకు ఇష్టము.
యేసు, నన్ను సిలువ దగ్గర ఉంచుము, (నా!)
అక్కడ ఒక ప్రశస్తమైన ఊట కలదు,
అందరికీ ఉచితమైన, ఒక స్వస్థతా కాలువ,
కల్వరి ఊటనుండి ప్రవహిస్తుంది.
ఎత్తబడిన, నా అంతరాత్మ,
ఆ నదికి ఆవలిన, విశ్రాంతిని కనుగొనే వరకు;
సిల్వలో సిల్వలో
ఓ సదాకాలము నా మహిమ ఉండును గాక.
500 అది పాడబడుచున్నప్పుడు, నేను చాలా తేలికగా లోకమును వదిలి వెళ్ళగలను, మీరును వెళ్ళగలరు కదా? ఎంత అద్భుతము! అదంతా పరిష్కరించబడినదా? మీకు తెలుసా, నా విషయమంతా పరిష్కరించబడినందుకు నేను సంతోషిస్తున్నాను, మీరును సంతోషంగా లేరా? చాలా కాలం క్రితమే, ఆ పాత లెక్క పూర్తిగా పరిష్కరించబడింది. నేను ఆయనతో ఇట్లు చెప్పాను, “ప్రభువా, ఆ నది వద్ద నాకు ఎటువంటి సమస్య వద్దు. నేను—నేను ఇప్పుడే నిశ్చయత కలిగియుండగోరుచున్నాను.” నేను ఆయనను తెలుసుకోవాలని కోరుచున్నాను. నేను ఆయనను తెలుసుకోవాలని కోరుచున్నాను.
501 మనలో ప్రతి ఒక్కరి యెదుట, ఒక పెద్ద చీకటి గొయ్యి ఉన్నది. మనము అటువైపునకు వెళ్ళుచున్నాము. మన గుండె కొట్టుకుంటున్న ప్రతీసారి, మనము ఇంకా ఇంకా దగ్గరవుతున్నాము. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు, నేను ఒక పిరికివాడివలె వణికిపోగోరడంలేదు, “నేను ఆయనయొక్క పునరుత్థానపు శక్తిలో ఆయనను తెలుసుకున్నాను,” అని ఎరిగియుండి, ఆయనయొక్క నీతి, అనెడి వస్త్రములలో నన్ను నేను చుట్టుకొని, దానిలోనికి ప్రవేశించగోరుచున్నాను. తద్వారా, ఆయన పిలిచినప్పుడు, నేను మృతులలోనుండి లేచి వస్తాను.
నా…
502 నా విశ్వాసము నీ వైపు చూస్తున్నది, ఇప్పుడు మనం దానిని పాడుదాము.
నా విశ్వాసము నీ వైపు చూస్తున్నది,
కల్వరి గొర్రెపిల్లా,
ఓ దైవిక రక్షకుడా;
నేను ప్రార్థిస్తుండగా ఇప్పుడు నన్ను ఆలకించుము,
నా పాపములన్నిటిని తీసివేయుము,
మరియు నీ వద్దనుండి
నన్ను ఎన్నడూ ప్రక్కకు తొలగిపోనీయకుము.
503 ఇప్పుడు, గొప్ప బోధకుడా, నీ అత్యద్భుతమైన వాక్యములో నీవు మాకు బోధించినట్లుగా, మేము మరణమునుండి జీవములోనికి దాటియున్నాము అని ఎరుగుటకై, ఎత్తబడు కృపతో, మా హృదయములు వణుకుచున్నవి. మమ్మల్ని పిలిచి, మరియు ఆయన రక్తములో మమ్మల్ని కడిగి, మరియు ఆయన మా పాపములను తీసుకొనుటను బట్టి దేవునియొక్క సింహాసనము యెదుట, మచ్చలేనివారిగా, నిందారహితులుగా మమ్మల్ని ప్రదర్శించినట్టి ప్రభువైన యేసుయొక్క మంచితనము ద్వారానే ఇదంతా జరిగినది. మాపై ఏ పాపము లేదు. “దేవుడు మనందరి దోషమును ఆయన మీద మోపాడు, మరియు మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు.” ఓ, మేము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో, దేవునియొక్క గొప్ప గొర్రెపిల్ల!
504 మరియు తండ్రీ, మేము ఇతరులకు చెప్పునట్లు, నీవు మాకు వాక్శక్తిని, భావవ్యక్తీకరణను ఇస్తావని మేము ప్రార్థిస్తున్నాము, తద్వారా వారు కూడా, ఆయనను తెలుసుకొని, మరియు ఆయన వారిని ప్రేమిస్తున్నాడు గనుక, వారును ఆయనను ప్రేమించుటకైయున్నది. ఈ కృపను మాకు దయచేయుము.
మరియు తండ్రీ, ఇప్పుడే దేవుని రాజ్యములోనికి వచ్చిన ఆ క్రొత్తగా జన్మించిన బిడ్డలకై నీకు కృతఙ్ఞతలు. వారు ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి స్థానిక సంఘమును కనుగొని, మరియు నొప్పులు మరియు బాధలు గల ఈ పాత శరీరమునుండి మరణము వారిని విడిపించి, మరియు రాబోవు యుగములో, నిత్యజీవముతో, ఆయన యెదుట నిష్కళంకముగా, నిర్దోషులుగా ప్రదర్శించేవరకు, అక్కడ నిన్ను సేవింతురు గాక. ఏలయనగా ఆయన నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.