హెబ్రీ పత్రిక, ఆరవ అధ్యాయము #3

హెబ్రీ పత్రిక, ఆరవ అధ్యాయము #3

 స్నేహితులారా, శుభోదయం. ఇక్కడ ఉండటం ఒక భాగ్యమైయున్నది. మరియు—మరియు మన కాపరి ఇచ్చినటువంటి ఈ గొప్ప పరిచయమును నెరవేర్చడానికి, నిశ్చయంగా ఒక నిజమైన జీవితమే అవసరమౌతుంది, అవును కదా? కావున సంవత్సరాలుగా ఆయన మనకు ఇచ్చినటువంటి ఆయనయొక్క గొప్ప స్వస్థతా శక్తులన్నిటిని బట్టి మరియు ఆయన కనికరములను బట్టి మనము ప్రభువును స్తుతించుచున్నాము.

ఇప్పుడు నేను కొన్ని ప్రకటనలు చేయవలసియున్నాను. ఒకటి, మేము, మాయొక్క సురక్షితమైన ప్రయాణము కొరకు ప్రార్థించినందుకు, సహోదరుడు ఉడ్ మరియు సహోదరుడు రాబర్ సన్, మరియు మేము మీ అందరికి ధన్యవాదాలు చెప్పగోరుచున్నాము. ఒక అద్భుతమైన సమయాన్ని కలిగియున్నాము; సరిగ్గా నాలుగున్నర రోజులు ఇట్టే గడిచిపోయాయని, నేను నమ్ముతున్నాను, మరియు మరలా సురక్షితంగా తిరిగి వచ్చాము. ప్రభువు మమ్మల్ని దీవించాడు.

506 ఇప్పుడు, సహోదరుడు గ్రాహం స్నెల్లింగ్, అతని ఉజ్జీవము, కొనసాగుతున్నదని మేము ప్రకటించుచున్నాము, అది—అది బ్రిగ్హాం వీధి చివరన, ఇక్కడున్న…నగరంలోయై యున్నది. మరియు ఈ రానున్న బుధవారము రాత్రి…ఒకరి భూస్థాపిత కార్యక్రమం కొరకు, నేను రేపు వెళ్ళగోరుచున్నాను కొద్ది క్షణాలలో నేను దానిని ప్రకటిస్తాను. బుధవారం రాత్రి మేము మీకు తెలియజేస్తాము. సహోదరుడు గ్రాహమ్ అక్కడ తన కూటమును ముగించడానికిముందే అతణ్ణి దర్శించడానికి, మనమందరము, ఒక ప్రతినిధి బృందముగా వెళ్ళగోరుచున్నాము. మరియు సహోదరుడు గ్రాహమ్ యొక్క కూటములలోని ఒక కూడికలో అతణ్ణి కలవడానికి, అతనితో ఉండటానికి, మనకు సాధ్యమైతే మనము సంఘమంతటిని సమకూర్చడానికి ప్రయత్నించి, మరియు ఒక ప్రతినిధి బృందంగా కలవడానికి వెళ్దాము.

507 మరియు, ఇప్పుడు, ఈ మధ్యాహ్నము చార్లెస్‌టౌన్ లోని భూస్తాపిత—గృహములో, ఒక—ఒక శ్రీమతి కాల్విన్ ఉన్నది, ఆమె అనేక సంవత్సరాల క్రితం ఇక్కడ సంఘానికి వచ్చేది, డెబ్బై-నాలుగు ఏండ్ల వయస్సుగలది, నిన్నటి దినమున ఈ జీవితమును చాలించుకొని ప్రభువైన యేసుతో ఉండుటకు వెళ్ళిపోయినది. మరియు సోమవారమునాడు ఆమె భూస్థాపన ప్రసంగము రెవరెండ్ శ్రీ. మెక్ కిన్నీ చేత బోధించబడుతుంది, గతంలో, అనేక సంవత్సరములు, పోర్ట్ ఫుల్టన్ వద్ద—వద్దనున్న మెథడిస్టు సంఘానికి కాపరిగా ఉన్నాడు, మరి అతడు వారియొక్క వ్యక్తిగత స్నేహితుడైయున్నాడు. మరియు అది సోమవారమునాడు, ఇండియానా, చార్లెస్‌టౌన్ లోని, ప్రార్థనా మందిరం వద్ద—వద్ద, ఒకటి-న్నరకు అని నేను నమ్ముచున్నాను, నేను అతనికి సహాయపడవలసియున్నాను. మరియు కాల్విన్ కుటుంబానికి స్నేహితులైన మీరంతా ఇప్పుడు, కొద్దిగా ధైర్యమునిచ్చినా లేదా…అలా కరచాలనము చేసినా, మీరు అభినందిస్తారని నాకు తెలుసు. మనమందరము, స్వయంగా ఆ లోయలగుండా వెళ్ళిన మనము, అది ఎలాగుంటుందో, ఎరిగియున్నాము, మరియు ఒక స్నేహితుడిని కోల్పోవడమంటే ఏమిటో ఎరిగియున్నాము. మరియు కావున మనం…ఇప్పుడు ఆమె ఇండియానా, చార్లెస్ టౌన్ లోని, ఆ—ఆ ప్రార్థనా మందిరంలో పెట్టబడినది. ఈ మధ్యాహ్నం గనుక మీరక్కడికి వెళ్ళినట్లైతే, ఏంటీ, కాల్విన్ కుటుంబముచేత అది అభినందించబడుతుంది అని, నేను నిశ్చయంగా చెప్పగలను. ఇప్పటికీ వారి ప్రజలలో చాలామంది ఇక్కడ ఆలయమునకు వస్తుంటారు. నేను, వారి కుటుంబములో, దాదాపు చాలామందికి, వివాహములు చేశాను, సమాధి కార్యక్రమములు చేశాను, బాప్తిస్మములు ఇచ్చాను. మరియు అయితే, ఒకప్పుడు సరిగ్గా ఇక్కడే మాకు పోరుగువారిగానున్న శ్రీ. గ్రేసన్, ఇప్పుడు అక్కడ సమాధి కార్యక్రమము చేయువాడైయున్నాడు.

508 మరియు పిదప దీని విషయమైతే, మనమిప్పుడు ధ్యానిస్తున్న, ఈ గొప్ప అధ్యయనములో, ఈ ఉదయం మనము దీనిని ఎక్కడైతే విడిచిపెడతామో, ఈ రాత్రి, ప్రభువు చిత్తమైతే ఈ రాత్రి దానిని అక్కడనుండి తీసుకొనుటకు మనము ప్రయత్నిస్తాము. మరియు ఇప్పుడు నాకు—నాకు—తెలిసినంత వరకు, ఉన్న ప్రకటనలు అవేనని నేను అనుకుంటున్నాను. మరియు మనం సహోదరుడు గ్రాహమ్ తో ఉండబోవు రాత్రి ఏదని, ఇప్పుడు, ఈ వచ్చే బుధవారము రాత్రి మేము ప్రకటిస్తాము.

509 మరియు మా గుమ్మములలోనికి వచ్చిన అపరిచితులందరినీ మేము స్వాగతిస్తున్నాము. మరియు ఈ ఉదయం మిమ్మల్ని ఇక్కడ కలిగియున్నందుకు మేము సంతోషిస్తున్నాము, మరియు ఈ రోజు ఈ కూడిక నిమిత్తం దేవుడు మిమ్మల్ని ఎంతో, సమృద్ధిగా, ఆశీర్వదిస్తాడని ప్రార్థిస్తున్నాము.

510 ఈ బహిరంగ-సౌండు సిస్టమ్ ప్రస్తుతం అంత బాగా పనిచేయడంలేదని సహోదరుడు కాక్స్ ఇప్పుడే నాతో చెప్పాడు. అది బహుశా, వాతావరణము వలన, అక్కడ ఆ మైకులలో చాలా తేమ ఉన్నందుకై యుండవచ్చును. మరియు అవి ముందే, అంతగా బాగలేవు, కావున కారణము అదే కావచ్చును.

511 నాకు తెలిసిన ఒక సహోదరి ఇక్కడ కూర్చొని యుండుటను నేను చూస్తుండగా, సహోదరి ఆర్గాన్ బ్రైట్, నేను…దీనిని అడగటం బాగోదు, మరియు—మరియు సబబు కాదు, అయితే సహోదరుడు ఆర్గాన్ బ్రైట్ వెళ్ళిన తర్వాత అతనినుండి నీవేమైనా సమాచారం విన్నావా? వీలైనంత త్వరగా అతనినుండి సమాచారం వినడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. అతడు టామీ హిక్స్ మరియు పాల్ కెయిన్ సహోదరులతో కలిసి, స్విట్జర్లాండు మరియు జర్మనీలో జరుగుచున్న ఒక కూటములో ఉన్నాడు. సహోదరి రూతు, నీవు అతనినుండి సమాచారం వింటే మాత్రం, వెంటనే, నీకు వీలైనంత తొందరగా నాకు తెలియజేయగలవు.

512 ఇప్పుడు, ఈ చిన్న ఆలయము ఏ సభ్యత్వమును కలిగిలేదు, అయితే మేము సహవాసమును కలిగియున్నాము. మేము క్రీస్తును తప్ప ఏ సిద్ధాంతమును కలిగిలేము, ప్రేమను తప్ప ఏ చట్టమును కలిగిలేము, బైబిలును తప్ప వేరే ఏ గ్రంథమును కలిగిలేము. మేము కలిగియుండి, మాకు తెలిసిన ఒకే ఒక్క విషయం, మేము ఎరిగియున్న ఏకైక గ్రంథము అదేయైయున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము పాపములన్నిటి నుండి మమ్మల్ని శుద్ధి చేస్తుండగా, మేము, అందరమూ ఒకరితో ఒకరము సహవాసము కలిగియుంటాము.

513 ఈ ఉదయమున, నేను గమనిస్తున్నాను, ఆ సహోదరుడు ప్రార్థన చేయడాన్ని మీలో కొందరు వినేయుంటారు. అతడొక క్యాథలిక్కు, కావున, లేదా గతంలో ఒక క్యాథలిక్కు అయ్యున్నాడు. మరియు అన్ని విధములైన ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ఇందాకే, కొద్ది క్షణముల క్రితమే, ఇక్కడ కూర్చొనియున్న ఒక మెనోనైట్ సహోదరునితో కరచాలనము చేసే భాగ్యమును పొందుకున్నాను. మరియు మెనోనైటుల నుండి, మెథడిస్టుల నుండి, బాప్టిస్టుల నుండి, మరియు కాథలిక్కుల నుండి, లేదా ఎవరు వచ్చినా, వారిని రానిస్తాము. మరియు మేము దేవుని వాక్యముయొక్క ఆశీర్వాదముల చుట్టూ సహవాసము చేస్తాము. యెహోవా సాక్షులకు చెందినవారు ఇక్కడ కూర్చొనియున్నారు మరియు వివిధ రకాల ప్రజలు, అలాగే, వివిధ సంఘశాఖలవారు ఇక్కడున్నారు.

514 నేను పశ్చిమమును ప్రేమించేవాణ్ణి (మంచిది, నేను ఇంకను ప్రేమిస్తున్నాను). నేను గుఱ్ఱములను మరియు పశువులను ప్రేమిస్తాను. నేను పొలములో పెంచబడ్డాను, మరియు నాకు—నాకు అది ఇష్టం. మరియు మేము వాటిని అక్కడ తోలేవారము, మరియు నేను వాటితో వెళ్ళేవాణ్ణి. మరియు మేము ఒక అడ్డు కంచెను కలిగియున్నాము. తూర్పు ప్రజలైన మీకు అడ్డు కంచె అంటే ఏమిటో తెలుసో, లేదో నాకు తెలియదు. అదెప్పుడనగా మీరు పశువులను ఆ—ఆ అడవిలోనికి పంపినప్పుడు, వారు దానికి పేరు పెట్టిన విధంగా, అవి మార్గంలోనుండి ఎటో వెళ్ళిపోకుండా, తిరిగి గడ్డిబీడులలోనికి రాకుండా అడ్డుకొనుటకు వారు ఒక కంచెను కలిగియుంటారు. లేదంటే శీతాకాలపు ఆహారం కొరకు వారు గడ్డిని పెంచుతున్న ఆ చోట, అవి ఆ గడ్డిని తినివేస్తాయి. మరియు పిదప కొండపైన, వారు కూడా అడ్డు కంచెలను కలిగియుంటారు, అక్కడ వారు కొన్ని ఆడవాటిని మరియు మగవాటిని, మరియు మొదలగువాటిని విభాగిస్తారు. దానిని అడ్డుకంచె అంటారు. అయితే అసలైన పెద్ద అడ్డుకంచె, పశువులు వెళ్తుండగా ఆ కాపలాదారుడు నిలబడే చోట ఉంటుంది.

515 మరియు ఇప్పుడు నేను అక్కడ, అనేక రోజులు, నా జీను సీటులో కూర్చొని, ఆ పశువులు దానిలోనికి వెళ్తుండగా వాటిని గమనించాను. వివిధ రకాలైన బ్రాండ్లన్నీ లోపలికి వెళ్ళేవి. కొన్నిటికి “వజ్రము” అను పేరు కలదు. మరియు వాటిలో కొన్నిటికి “బారు X” అను పేరు కలదు. మరియు కొన్ని…మాదైతే “ట్రైపాడ్” అయ్యున్నది, బాయ్ స్కౌట్ గురుతు వంటిదైయున్నది. ఆ తర్వాత వారిది, గుఱ్ఱము మీద, ఒక “టర్కీ కోడి పాదముద్ర,” అయ్యున్నది. మరియు వారు వారి పశువులను తిరిగి బయటకు తీసుకెళ్ళునప్పుడు, వాటిని—వాటిని గుర్తెరుగుటకు అన్ని రకములైన బ్రాండులను కలిగియున్నారు.

516 ఇప్పుడు, వారు ఏ బ్రాండును కలిగియున్నారు అనేదానిలో ఆ కాపలాదారుడు అంతగా ఆసక్తి కలిగియుండేవాడు కాదు, అయితే ఆ కాపలాదారుడు దేనిని చూడటానికంటే, వాటి చెవిలో ఉన్న గురుతును చూడటానికే ఆసక్తి కలిగియుండేవాడు. దానిలోపలికి వెళ్ళిన ప్రతీది, అది ఏ బ్రాండుకు చెందినదైనప్పటికినీ, అది స్వచ్ఛమైన హియర్ ఫోర్డ్ జాతియై యుండవలసియున్నది. అది ఒక హియర్ ఫోర్డు జాతిది అయితేనే తప్ప అది లోపలికి వెళ్ళలేదు. అది రిజిష్టర్ చేయబడిన మందయై ఉండవలసియున్నది లేదంటే అది లోపలికి వెళ్ళలేదు.

517 ప్రభువు వచ్చిన ఆ దినమున, మనము ఏ బ్రాండు ధరించామన్నది ఆయన పట్టించుకోడు గాని, మనమందరమూ తిరిగి-జన్మించిన క్రైస్తవులమా కాదా అని చూస్తాడు. అది నిజము. అదియే క్రీస్తుయొక్క మందయైయున్నది. మనమంతా క్రైస్తవులమని, రక్త పరీక్షయే మనల్ని ఋజువు చేయబోవుచున్నది. మరి అక్కడ మనం ఆ విధంగా ఉండబోవుచున్నయెడల, ఇక్కడ కూడా మనం ఆ విధంగానే ఉండడం మంచిది. మీరు అలా అనుకోవడంలేదా? ఆ విధంగానే, భిన్నమైన సంఘములన్నిటి నుండి అందరి సహవాసమును మేము అభినందిస్తాము.

518 ఇప్పుడు మనము ఈ ధన్యకరమైన హెబ్రీ పత్రికలో అధ్యయనం చేస్తున్నాము. ఒక సహోదరుడు వీటియందు ఎంతగా ఆనందించాడంటే అతడు టేపులను తీసుకొని మరియు వీటిపై ఉపన్యాసముల పుస్తకమును తయారుచేస్తున్నాడు.

519 ఇప్పుడు మనం, అతి త్వరలో, 11వ అధ్యాయమునకు రాబోవుచున్నాము. శీతాకాలము దానిమీదనే, అనగా ఆ 11వ అధ్యాయం మీదనే గడపాలని మనం ఆశిస్తున్నాము. ఆ పాత్రలలో ప్రతి ఒక్కదాని కొరకు, మనము గ్రంథము గుండా వెనుకకు వెళ్ళి మరియు ఆ లేఖనమంతటిని ఒకదానితో ఒకటి ముడివేయాలని కోరుచున్నాము. నేను దానిని చేయబోతున్నాను. ఈ పూర్తి గ్రంథమును కలిపి ముడివేయడానికి, ఈ ముందున్న అధ్యాయాలలో, కొన్నిటిపై, నేను దానిని కొద్ది కొద్దిగా చేస్తున్నాను. ఏలయనగా, మీరు చూడండి, లేఖనము తప్పక లేఖనమును నిరూపించవలసియున్నది.

520 కావున, ఏదైనా వ్యతిరేకత ఉన్నదని, లేఖనాలు ఒకదానితో ఒకటి వ్యతిరేకిస్తాయని ఎవరైనా అనుకుంటున్నయెడల, అది పొరపాటే. ఒక లేఖనమునకు వ్యతిరకంగానున్న మరొక లేఖనము లేనేలేదు. వ్యతిరేకత ఉన్నదంటే బహుశా అది—అది మనం దానిని చూసే విధానమునకు వ్యతిరేకంగా ఉండవచ్చును, కానీ అది దానికదే వ్యతిరేకముగా ఉండదు. నేను పరిచర్యలో ఉండి, ఇప్పటికీ ఇరవై-ఆరు సంవత్సరాలుగా కొనసాగుచున్నాను, మరియు బైబిలులో వ్రాయబడిన దేనినైనా వ్యతిరేకిస్తున్న మరొకదానిని, నేనెన్నడూ, ఒక్కసారి కూడా కనుగొనలేదు. మరియు అది అసలు లేదని నాకు—నాకు తెలుసు.

521 మరియు ఈ రోజు మనము హెబ్రీ పత్రికలో అత్యంత ధన్యకరమైన అధ్యాయములలో ఒకటైన, 7వ అధ్యాయమును పఠిస్తున్నాము. మరియు బైబిలును కలిగిలేని ఎవరైనా, అవి చదవబడుతుండగా, మాతో కలిసి చూడాలనుకుంటే, మీరు కేవలం మీ చెయ్యిని పైకెత్తినయెడల, మీకు బైబిలును అందించడానికి మేము సంతోషిస్తాము. ఎవరైనా పెద్దలు రావాలని నేను కోరుతున్నాను, ఎవరైనా, ఇక్కడికి వచ్చి మరియు కొన్నిటిని తీసుకెళ్ళండి. ఆ వెనుక కొందరు తమ చేతులను పైకెత్తుచున్నారు. సహోదరుడా, నీకు దన్యవాదములు. మరియు మీకు ఒక బైబిలు కావాలంటే, కేవలం నీ చెయ్యిని పైకెత్తండి, మరియు వారు దానిని మీ దగ్గరకు తెస్తారు.

522 ఇప్పుడు, ఒక సంఘము కట్టబడే ఏకైక మార్గము, ఒక మనిషి విశ్వాసము కలిగియుండగల ఏకైక మార్గము, అది అతనియొక్క సంఘశాఖ ద్వారా కాదు, అతనియొక్క అనుబంధము ద్వారా కాదు. అయితే అతని విశ్వాసము ఎవరో ఒక వ్యక్తియొక్క ఆలోచనల ద్వారా వచ్చినట్టి వేదాంతముపై ఆధారపడదు, ఎందుకనగా, ఎక్కువో తక్కువో, అదంతా మానవునిదేయై యున్నది. అయితే విశ్వాసము దానియొక్క పరిశుద్ధమైన విశ్రాంతి స్థలమును కనుగొనగల ఒకే ఒక్క మార్గమేదనగా, దేవునియొక్క కదల్చబడని మార్పులేని వాక్యముపైనేయై యున్నది. “వినుటవలన విశ్వాసము కలుగును, అది వాక్యమును వినుటవలనైయున్నది.” దానికి అదే అవసరమౌతుంది. మరియు—మరియు విశ్వాసమును విని మరియు అంగీకరించినప్పుడు, ఇక అది ఎప్పటికీ స్థిరపడుతుంది. ఇక ఏది వచ్చినా లేదా ఏది వెళ్ళినా, దానిని ఏదియు కదల్చలేదు. ఆ విశ్వాసమును ఏదియు ఎన్నడూ మార్చలేదు. దాని గురించి ఆలోచించండి. మీరు లంగరు వేయబడియున్నారు, మరియు మీరు ఇక, ఎన్నటెన్నటికీ, మారనే మారరు. మీరు ఎప్పటికీ లంగరు వేయబడియున్నారు, “ఏలయనగా దేవుడు, ఒక్క అర్పణచేత, పరిశుద్ధపరచబడినవారిని, లేదా పిలువబడినవారిని సదాకాలము పరిపూర్ణులుగా చేసియున్నాడు.”

523 మరియు క్రైస్తవునిలో, విశ్వాసియొక్క జీవితములో విశ్వాసము ఎంత గొప్ప స్థానమును కలిగియున్నదంటే, ఒక ప్రశస్తమైన చిన్నబిడ్డ లేదా ఒక ప్రియురాలు ఈ జీవమును దాటి ఆవలకు వెళ్ళిపోయిన చోట, ఆ బురద సమాధి ప్రక్కన లేదా ఆ సమాధి పెట్టె ప్రక్కన అది నిలబడగలదు. మరియు “పునరుత్థానమును జీవమును నేనే,” అని చెప్పిన ఆయన వైపు, పక్షిరాజు కన్నుయొక్క తీక్షణమైన చూపుతో చూడగలదు. మరియు వారు గతములో జరిగిన సంగతులను మరచిపోతారు. వారు ఉన్నతమైన పిలుపుయొక్క గురియొద్దకే పరుగెత్తుతారు.

524 దేవుడు అటువంటిదానిని ఏర్పాటు చేసి, మరియు దానిని అందరికీ ఉచిత వరముగా చేసినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. సంఘములు ఆ విధంగానే ఉండవలసియున్నవి. సంఘములు అనగా సంఘశాఖలు లేదా సంఘసంస్థలు కావు; దాని భావమేమిటంటే, “వాక్యముయొక్క సహవాసము క్రింద కూడుకొనిన ప్రజలయొక్క, విశ్వాసులయొక్క గుంపులైయున్నవి.”

525 మరియు ఇక్కడ పరిశుద్ధ పౌలుయొక్క ఈ అద్భుతమైన బోధనలో, ముందటి అధ్యాయాలలో ఉన్న, నేపథ్యములలో, అతడు ప్రత్యేకించి ప్రభువైన యేసుయొక్క మహోన్నతమైన దైవత్వము గురించి మరియు ఆయన ఎవరు అనేదాని గురించి చెప్తున్నాడు. క్రీస్తు, మనుష్యులు ఆయనను అనుభూతి చెందుతూ మరియు ఆయనను తాకుతూ, మరియు—మరియు ఆయనతో సహవాసము చేయగలిగే విధములోనికి మార్చబడిన దేవుడైయున్నాడు. క్రీస్తు, ప్రభువైన యేసు, దేవుడు నివసించినట్టి శరీరమైయున్నాడు, “దేవుడు శరీరధారియై మనమధ్య నివసించాడు.” మొదటి తిమోతి 3:16, “నిరాక్షేపముగా దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదైయున్నది, ఏలయనగా దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యెను.”

526 ఆ గొప్ప యెహోవా క్రిందకు దిగివచ్చి మరియు తన స్వంత కుమారుని శరీరములో జీవించుట ద్వారా, స్పర్శించబడగలవానిగా మారాడు, ప్రకటించుచు మరియు లోకమును తనతో సమాధానపరచుకుంటూ ఉన్నాడు. దేవుడు మరెవరో కాదు…క్రీస్తు దేవుడు గాక మరెవరో కాదు, మరియు—మరియు దేవుడు క్రీస్తు గాక ఇంకెవరో కాదు. ఇరువురు కలిసి శరీరమందు దైవత్వముగా చేయబడెను, ఆయన బాధను అనుభవించగలుగునట్లు, దేవదూతలకంటె కొంచెం తక్కువవానిగా చేయబడ్డాడు. దేవదూతలు బాధననుభవించలేరు. యేసు, దేవుడు నివసించినట్టి ఆలయమైయున్నాడు.

527 అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయములో, బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, అదేమిటనగా, “ఆలయములను, దహన-…అర్పణలను, దహన-బలులను నీవు కోరలేదుగాని, నీవు నాకొక శరీరమును అమర్చితివి. మహోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు గాని, నీవు నాకొక శరీరమును అమర్చితివి,” గుడారములో ఉంటూ లేదా నివసించుచు మానవునితో సహవాసము కలిగియుండుటయైయున్నది.

528 దేవుడు అనుమతిస్తే, మనము ఇక్కడ ఈ అధ్యాయాన్ని ముగించుకున్న వెంటనే, లేదా ఈ పత్రికను ముగించుకున్న వెంటనే, మనం వెనుకకు వెళ్ళి రూతు గ్రంథమును తీసుకొని మరియు దేవుడు మనలో ఒకనిగా మారి సహవాసం కలియుండుటచేత, తప్పిపోయినవారిని తిరిగి ఆయనతో సమాధానపరచుకొనుటకై ఏ విధంగా మనకు రక్త సంబంధిగా మారాడో చూపించగోరుచున్నాము. విమోచకుడు తప్పకుండా రక్తసంబంధియై యుండవలసియున్నది, మరియు దేవుడు మనకు రక్తసంబంధిగా మారడానికి గల ఒకే ఒక్క మార్గమేదనగా, మనలో ఒకనిగా మారడమే. కావున, ఆయన ఒక దేవదూతగా మారి మరియు మనుష్యులకు రక్తసంబంధిగా ఉండలేడు.

529 ఈ మధ్యనే తన తల్లి మరణించడం వలన హృదయం-బ్రద్దలైన ఒక కుమారునితో, మరతడు నా సహచరుడైయున్నాడు, నిన్న సాయంత్రం నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు, అతడు ఇట్లన్నాడు, “ఓ, సహోదరుడా బిల్, ఈ రాత్రి ఆమె ఒక దేవదూతగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.”

530 నేను ఇట్లు చెప్పాను, “లేదు, ఎర్ల్. ఆమె ఎప్పటికీ ఒక దేవదూత అవ్వజాలదు. సరిగ్గా దేవుడు ఆమెను సృష్టించినట్లుగా, ఈ రాత్రి, ఆమె ఒక స్త్రీగానే ఉన్నది, మరియు ఎల్లప్పుడు ఆమె అలాగే ఉంటుంది.” దేవుడు దేవదూతలను కలుగజేసాడు. ఆయన ఎన్నడూ మనుషులను దేవదూతలుగా చేయలేదు. ఆయన దేవదూతలను మరియు మనుషులను కలుగజేశాడు. కావున మనుష్యులు ఎన్నడూ దేవదూతలు కారు, మరియు దేవదూతలు ఎన్నడూ మనుషులు కారు. దేవుడు వారిని వేరుగా చేశాడు.

531 ఇప్పుడు, మానవుడు ఎక్కడికైతే పడిపోయాడో ఆ గొప్ప ఆవలినుండి మరియు పాపము వలన ఆ అమర్త్యత ఎక్కడికైతే క్రిందకు వచ్చినదో, అక్కడనుండి విమోచించుటకు క్రీస్తు శరీరధారిగా మారుటలో విషయమేమిటంటే, దేవుడే దిగి వచ్చి మరియు మానవుని ఆకారపు రూపమును తీసుకున్నాడు, మరియు ఆయన మన పాపములను మన మరణమును భరించునట్లు, మనకు రక్తసంబంధిగా మారాడు.

532 మరియు ముందు జరిగిన పాఠములలో, మనము చెప్పుకుంటున్న ఒక ఉపమానములో, క్రొత్తగా వచ్చినవారికి అర్ధం అవ్వడం కోసం కేవలం కొద్దిగా నేపథ్యమునిస్తున్నాను. దేవుడు, ఆయన కల్వరికి వెళ్తుండగా, మరణపు ముళ్ళు ఆయన మీద ఉండినది, మరియు ఆయన చుట్టూ ఝుంకారము చేస్తున్నది, మరియు చివరకు ఆయన మరణమయ్యేంతగా అది ఆయనను కుట్టినది. సూర్యుడు ప్రకాశించడం ఆపివేసేంతగా ఆయన మరణమయ్యాడు. చంద్రుడు మరియు నక్షత్రములు వాటి వెలుగును ఇవ్వలేకపోయేంతగా ఆయన మరణమయ్యాడు.

533 ఏలయనగా, మరణముయొక్క ముల్లును లంగరు వేసుకొనునట్లు, ఆయన దానిని ఎలా చేయవలసివచ్చినదో కదా! ఆయన ఒక అమర్త్యమైన వ్యక్తిగా ఉన్నట్లైతే, ఆయన థియోఫనీలో ఉన్నట్లైతే, లేదా ఆత్మలో ఉన్నట్లైతే, మరణమునకు దానిపైన ఎటువంటి నియంత్రణ లేదు. ఆయన మరణముయొక్క ముల్లును తీసుకొనగలుగుటకు, శరీరముగా మారవలసివచ్చినది. అయితే ఒక కందిరీగయైనా లేదా కుట్టునట్టి ఏ పురుగైనా, ఒక్కసారి లోతుగా కుట్టిందంటే, అది మరలా ఎన్నడూ కుట్టదు. అది దాని ముల్లును శరీరములో విడిచిపెడుతుంది. మరందుకే క్రీస్తు…లేదా దేవుడు అట్లు మారాడు. మరణమనే ముల్లును తన స్వంత శరీరములో లంగరు వేసుకొనగలుగునట్లు, క్రీస్తు శరీరములో నివసించాడు. మరియు సిలువ వద్ద మరణము ఆయననుండి వెళ్ళిపోయినప్పుడు, అది దాని ముల్లును విడిచిపెట్టింది, ఒక విశ్వాసిని అది ఇక ఎంతమాత్రము కుట్టలేదు. అది ఒక ఝుంకారపు శబ్దమును చేయగలదు, అది బజ్ అనవచ్చును మరియు ఒక బెదిరింపును చేయవచ్చును, కానీ అది కుట్టలేదు. దానికి ఎటువంటి ముల్లు లేదు.

534 ఆ గొప్ప పరిశుద్ధ పౌలు, అతనియొక్క మరణపు దారిలో, కేకలు వేసి ఇట్లన్నాడు, “ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరియు సమాధీ, నీ విజయమెక్కడా? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక, ఏలయనగా మరణము మరియు సమాధి రెండును వాటి శక్తిని కోల్పోయినవి.”

535 ఇప్పుడు, పిదప, పోయిన ఆదివారము “క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని,” అనుదానిని మనము తీసుకున్నాము, 6వ అధ్యాయంలో, మనము దీనిని చదివాము, “మనము పరిపూర్ణులమగుటకు సాగిపోదము.” మరియు ఈనాడు అనేక సంఘములలో ప్రజలు, బ్రెన్హామ్ ఆలయములోను మరియు వివిధమైనవాటిల్లో, మనము క్రీస్తుయొక్క మూలోపదేశముల గురించి పఠించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటామని మనము కనుగొన్నాము: ఆయన అబ్రాహాము కుమారుడు, ఆయన ఫలానా-మరియు-ఫలానా వారి కుమారుడు, మరియు ఇంకా వెనుకకు, ఆ వంశావళియొద్దకు వెళ్తాము. అయితే బైబిలు ఇట్లు చెప్పినది, “మనము ఆ సంగతులను ప్రక్కన పెట్టి, పరిపూర్ణులమగుటకు సాగిపోదము.”

536 మొదట మీరు సిద్ధాంతమును ఎరిగియుండాలి, మరియు పిదప మీరు ఈ విషయములన్నిటినీ ఎరిగియుండాలి; పిదప మనము వాటిని ప్రక్కన పెట్టి, అతడు ఇట్లన్నాడు, మృతుల పునరుత్థానము, హస్తనిక్షేపణము, బాప్తిస్మములు, మరియు దేవుని గూర్చిన ఆ నిర్జీవమైనవాటన్నిటినీ ప్రక్కన పెడదాము. అవి—వాటిలో, జీవమును కలిగిలేవు. అయితే ఈనాడు సంఘము కేవలం ఆ విషయముల యొద్దకే వెళ్తుంది, “ఓ, మేము క్రీస్తుయొక్క దైవత్వమును నమ్ముతాము.” అవును. ఖచ్చితంగా. “మేము నీటి బాప్తిస్మమును నమ్ముతాము.” అవును. ఖచ్చితంగా. “హస్తనిక్షేపణము.”

537 పౌలు ఇట్లన్నాడు, “దేవుడు అనుమతిస్తే మనము దీనంతటినీ చేస్తాము. అయితే అవన్నియు ఉండగా, ఇప్పుడు మనము వాటిని ప్రక్కన పెట్టి, పరిపూర్ణులమగుటకు సాగిపోదము.”

538 ఇప్పుడు, సంఘసంస్థల ద్వారా సంఘము పరిపూర్ణము చేయబడజాలదు. అది అన్నివేళలా దేవునినుండి దూరంగా వెళ్ళిపోతుంది, లేదా ఒకదానినుండి ఒకటి దూరముగా వెళ్ళిపోతుంది. విశ్వాసమును కలిగిలేకుండా, మనము కంచెలను కడతాము, మనము మనల్ని మనం వేరుపరచుకుంటాము. అయితే పిదప మనము ఆ మూలోపదేశములను విడిచిపెట్టినప్పుడు, మనము పరిపూర్ణతలోనికి సాగిపోయినట్లైతే, అప్పుడు ఆ చిన్న విషయాలు అంతగా ఉపయోగపడవు.

539 మనము ఒక సంబంధములోనికి వెళతాము, మరియు మనము పరిపూర్ణులుగా చేయబడగల ఒకే ఒక్క మార్గము క్రీస్తులో ఉండుట ద్వారానే అని మనము కనుగొన్నాము. మరియు పిదప, మనము క్రీస్తులోనికి ఎలా ప్రవేశిస్తామన్నది, బైబిలు ఉపదేశముల ద్వారా, మనం కనుగొన్నాము; నీటి బాప్తిస్మము ద్వారా కాదు, హస్తనిక్షేపణము ద్వారా కాదు, ఉపదేశము ద్వారా కాదు. “అయితే ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొంది మరియు ఆయన అనుభవించిన శ్రమల ద్వారా పరిపూర్ణులమైయున్నాము.” అప్పుడు, మనము భిన్నంగా చూస్తాము. మనము భిన్నంగా ఆలోచిస్తాము. మనము భిన్నంగా ప్రవర్తిస్తాము. మనము భిన్నముగా జీవిస్తాము. అది ఒక విధియనో లేదా మనము సంఘమునకు చెందియున్నందుకో కాదు, కానీ “పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలోనికి కుమ్మరింపబడిన దేవుని ప్రేమవలనైయున్నది,” అదియే మనల్ని దేవుని రాజ్యములో సహపౌరులుగా చేస్తుంది, అప్పుడు దానిలో ఏ సంఘశాఖయైనా లేదా ఏ కంచెలైనా ఉండవు. మనమందరము ఒక్క గొప్ప శరీరమైయున్నాము.

540 ఇప్పుడు మనము కొద్ది క్షణములలో, ఉదయకాల పాఠములోనికి ప్రవేశించుటకు సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ నేను చెప్పగోరుచున్న మరొక విషయం, అదేమిటంటే, పౌలు, 7వ అధ్యాయ పత్రికలో, లేదా, 6వ అధ్యాయములో మాట్లాడుతున్నాడు, క్రీస్తులో మనము పరిపూర్ణులుగా చేయబడ్డామని ఇక్కడ మనము కనుగొన్నాము. పిదప 6వ అధ్యాయం 13వ వచనంలో, కేవలం ఒక చిన్న నేపథ్యమునిస్తున్నాను.

ఏలయనగా దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు, తనకంటె ఏ గొప్పవాని తోడని ఆయన ప్రమాణము చేయలేకపోయెను గనుక, తనతోడు అని ప్రమాణము చేసెను,

ఆయన తనకంటె ఏ గొప్పవాని మీద అని ప్రమాణము చేయలేడు గనుక, దేవుడు తన మీద తానే ప్రమాణము చేసాడు.

541 ఇప్పుడు మనము వెనుకకు వెళ్ళగోరుచున్నాము. కేవలం కొద్ది క్షణాలు మనం గలతీ పత్రిక వద్దకు వెళ్దాము. వెనుక గలతీ పత్రికను తీసి, మరియు గలతీ 3:16 ను తీద్దాము. మరియు ఆయన ఎవరికి వాగ్దానము చేసాడు అనేదాని గురించి, మనమిక్కడ కేవలం ఒక్క క్షణం చదువుదాము.

ఇప్పుడు అబ్రాహామునకు మరియు అతని సంతానమునకు వాగ్దానము చేయబడినది. ఆయన, అనేకులను గూర్చి అన్నట్లు, నీ సంతానములకును అని చెప్పక; ఒకని గూర్చి అన్నట్టే,…సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తే.

542 ఇప్పుడు మీరు దానిని చదువుతుండగా, మీరు దానిని జాగ్రత్తగా చదువుతుండగా, దానిని గమనిస్తే.

…అబ్రాహామునకు మరియు అతని సంతానమునకు (ఏకవచనము) వాగ్దానములు (బహువచనము) చేయబడినవి.

543 “అబ్రాహాము మరియు అతని సంతానము.” ఇప్పుడు, అబ్రాహాము సంతానము ఒక్కడేయైయున్నాడు, అది క్రీస్తే; ముంగుర్తులో, అది ఇస్సాకుయైయున్నాడు.

అయితే అబ్రాహామునకు చాలామంది పిల్లలు ఉన్నారు. అతడు ఇస్సాకును పొందుకోడానికి ముందు ఒకరిని పొందుకున్నాడు, అది శారాయొక్క అవిశ్వాసము వలనైన పొరపాటును చూపిస్తున్నది, ఆమె తాను చాలా వృద్ధురాలని తలంచుచు హన్నాయే బిడ్డను కనాలని, మరియు దేవుడు ఆయన దానిని జరిగిస్తానని వాగ్దానము చేసిన ఆ మార్గముగుండా కాకుండా వేరే ఒక మార్గమును కలుగజేయాలని కోరినది.

544 అయితే దేవుడు తన వాగ్దానమును నిలబెట్టుకుంటాడు. అది ఎంత అవివేకముగా కనిపించినా గాని, దేవుడు తన వాగ్దానమునకు బద్ధుడైయున్నాడు. మరియు శారా బహుశా హన్నాను లేదా, తన దాసియైన, హాగరును, అబ్రాహాము ద్వారా, ఒక బిడ్డను కననిచ్చి, మరియు ఆమె దానిని తీసుకుంటుందని, అనుకున్నది. మరియు అదియే ఇష్మాయేలయ్యాడు, మరి అతడు అప్పటినుండి ఇప్పటివరకు శరీరంలో ముల్లుగా ఉన్నాడు. ఇప్పటికీ శరీరములో ఒక ముల్లుగా ఉన్నాడు, ఎందుకనగా అక్కడినుండే అరబ్బులు వచ్చారు, మరియు వారు ఎల్లప్పుడు ఆ విధంగానే ఉన్నారు.

545 ఇప్పుడు, మీరు దేవునియొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా నమ్మకుండా ఇంకేదో మార్గమును అవలంబించిన ప్రతీ సారి, అప్పటినుండి అది మీ శరీరములో ఒక ముల్లుగా ఉంటుంది. మీరు సరిగ్గా దేవుడు చెప్పినదానిని తీసుకోండి. ఆయన దానిని చెప్పినట్లైతే, ఆయనయొక్క భావము సరిగ్గా అదేయైయున్నది. ఓ, ఆయన నామము స్తుతింపబడును గాక! కేవలం ఆయనయొక్క వాక్యమును తీసుకోండి.

546 “సరే, దాని అర్థము నిజంగా అది కాదు,” అని చెప్తూ, ఏది ప్రక్కనుండి వెళ్ళుటకు ప్రయత్నించినా లెక్కలేదు. దేవుడు ఒక వాగ్దానము చేసినప్పుడు, అది ఏమి చెప్తున్నదో దాని భావము సరిగ్గా అదేయైయున్నది.

547 ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించినట్లైతే.

…అబ్రాహామునకు మరియు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను…

ఒకటేమో సంతానము, ఏకవచనము, మరియు మరొకటి వాగ్దానములు. ఒకటి కంటే ఎక్కువ వాగ్దానములు ఉన్నాయి, మరియు అబ్రాహాముయొక్క సంతానములో లెక్కించబడినవారు ఒక్క వ్యక్తి కంటే ఎక్కువమంది ఉన్నారు. చూశారా? ఒక్క సంతానమున్నది, కానీ ఈ సంతానములో అనేకమంది ప్రజలు ఉన్నారు. చూశారా? అవి కేవలం అబ్రాహామునకు మాత్రమే, లేదా ఇస్సాకునకు మాత్రమే కాదు. అయితే…అవి అబ్రాహాముయొక్క సంతానమంతటికీ అయ్యున్నవి. ఆ వాగ్దానములు ఆ సంతానములోని ప్రతి ఒక్క విత్తనానికి చేయబడ్డాయి. మీకు అర్థమైందా?

548 కావున, మనము, క్రీస్తునందు మృతిపొందినవారమై, లేఖనముల ప్రకారంగా, మనము అబ్రాహాము సంతానముగా మారుచున్నాము మరియు వాగ్దాన ప్రకారము వారసులమైయున్నాము. సంఘములో చేరడం ద్వారా, లేదా నిర్జీవమైన వ్యాసములను తయారుచేయడం ద్వారా, లేదా—లేదా మొదలగువాటి ద్వారా కాదు. కానీ క్రీస్తు ఆత్మ మూలంగా జన్మించడం ద్వారా, మనము అబ్రాహాము సంతానమైయున్నాము, మరియు రాజ్యములో ఆయనతో కూడ వారసులమైయున్నాము.

549 పిదప మనము ఇంకా ముందుకెళ్ళి, చదువుదాము, పిదప, ఇప్పుడు కొంచెం ముందుకు చదువుదాము, “దేవుడు ప్రమాణము చేయుట.” ఇప్పుడు 6వ అధ్యాయంలో 17వ వచనము.

ఈ విధముగా దేవుడు, ఎంతో ఎక్కువగా ఇష్టపడినవాడై…

…దేవుడు, తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి, కనుపరచవలెనని ఎంతో ఎక్కువగా ఇష్టపడినవాడై, ప్రమాణము చేసి దృఢపరచెను:

550 ఓ, మనమిప్పుడు కొద్ది నిమిషాలు ఆగుదాము. “దేవుడు ఎంతో ఎక్కువగా కోరడం.” ఆయన తప్పక చేయవలసియున్నదని కాదు, కానీ దీనిని ఒక నిశ్చయమైన కార్యముగా చేయుటకైయున్నది.

551 ఇప్పుడు, దేవుడు శరీరధారియైనాడని మన మధ్య నివసించాడని, లోకమునకు ఆయన తననుతాను ఎలా ప్రత్యక్షపరచుకున్నాడని, మనము ఇదివరకే కనుగొన్నాము. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఆయన కనుగొనినప్పుడు, ఇట్లన్నాడు, “నేను—నేను నీకు శిక్ష విధింపను. వెళ్ళి, ఇక పాపము చేయకుము.” ఆయన రోగులను కనుగొనినప్పుడు, సరిగ్గా ఆయన ప్రవర్తించవలసిన విధంగానే ఆయన ప్రవర్తించాడు, ఏలయనగా ఆయన దేవుడైయున్నాడు, మరియు ఆయన—ఆయన రోగులను స్వస్థపరిచాడు. ఆయన మృతులను లేపాడు. ఆయన పాపములను క్షమించాడు. అవి ఎలాగున్నను, మరియు ఎన్ని ఉన్నను, మరియు ఎంతగా భక్తి విడిచిన స్థితి ఉన్నను, వచ్చి అడుగడానికి వారు ఇష్టపడుచున్నట్లైతే, ఎలాగైనా, ఆయన వారిని క్షమించాడు.

552 ఇప్పుడు గమనించండి. దేవుడు ఒక సమయములో ఒక ఫలానా పరిస్థితిలో వ్యవహరించినట్లైతే, మరియు అదే పరిస్థితి మరలా తలెత్తినయెడల, ఆయన మొదటిసారి వ్యవహరించిన విధంగానే, రెండవసారి కూడా వ్యవహరించవలసియున్నది లేదంటే ఆయన అన్యాయస్థుడే. చూశారా? నీవు ఎంత దారుణంగా పాపములో ఉన్నప్పటికినీ, నీవు ఎంత దిగజారిపోయినప్పటికినీ, ఆ పడిపోయిన స్త్రీతో ఆయన వ్యవరించినట్లుగానే ఆయన నీతో కూడా వ్యవహరించవలసియున్నది లేదంటే ఆ సమయంలో ఆయన తప్పుగా వ్యవహరించినట్లే. దేవుని ప్రవర్తన ఆయనయొక్క వ్యక్తిత్వమైయున్నది, మరియు ఆయనయొక్క ప్రవర్తనలో ఆయన ఏమైయున్నాడో అదియే ఆయనయొక్క వ్యక్తిత్వమును తెలియజేస్తుంది.

553 మరియు మీరును ఆ విధంగానే ఉన్నారు, జీవితములో మీ ప్రవర్తనయే, మీరేమిటన్నది చెప్తుంది. ఒకటి లేదా రెండు పాఠముల క్రితం, మనం దానిని చూసిన విధంగా, మెథడిస్టు ప్రజలు ఇలా ప్రకటించగోరారు, “నీవు కేకలు వేసినప్పుడు, నీవు దానిని పొందుకున్నావు.” పెంతెకొస్తువారు ఇట్లంటారు, “నీవు భాషలతో మాట్లాడినప్పుడు, నీవు దానిని పొందుకున్నావు.” ఆ ఊగేవారు ఇట్లన్నారు, “నీవు ఊగినప్పుడు, నీవు దానిని పొందుకున్నావు,” పెన్సిల్వేనియాలోని ఆ ఊగేవారు అట్లన్నారు. మరియు వారందరూ తప్పేనని మనము కనుగొన్నాము. నీ జీవితము దానిని తెలియజేస్తుంది. నీవు ఏమైయున్నది నీ వ్యక్తిత్వము తెలియజేస్తుంది. ఒక మనుష్యుడు తన క్రియలను బట్టి గుర్తించబడతాడు, మరియు నీ జీవితం ఏమైయున్నదో దానిని బట్టి గుర్తించబడతావు.

554 “నాకు నీ మాటలు వినబడలేనంత బిగ్గరగా, నీ జీవితము మాట్లాడుచున్నది,” అనే ఆ పాత కథను మీరు విన్నారు. కావున నీవు ఏమైయున్నావో, నీవు అదేయైయున్నావు. నీవు జీవిస్తున్న జీవితమే నీలో ఏ రకమైన ఆత్మ ఉన్నదో చూపిస్తుంది.

555 మరియు పిదప మీరు ఒక తప్పుడుదానిని, లేదా, నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మీరు సరియైనదానిని అనుకరించవచ్చును. మీరు ఒక క్రైస్తవుడిని అనుకరించవచ్చును. కానీ, కాలం-గడుస్తున్నా-కొద్దీ, ఒత్తిడి పెట్టబడే ఒక సమయం వస్తుంది, అప్పుడు మీరు ఏమైయున్నారో అది చూపిస్తుంది. ఒక గొలుసుయొక్క బలము దానియొక్క బలహీనమైన లింకు వద్దనే తెలుస్తుంది.

556 దేవుని కుమారుడైన క్రీస్తు పరీక్షకు పెట్టబడినప్పుడు, అది ఆయన ఏమైయున్నాడో చూపించినది. నిశ్చయంగా. నీవు పరీక్షకు పెట్టబడినప్పుడు, అది నీవు ఏమైయున్నావో రుజువు చేస్తుంది. నీ జీవితము ఎల్లప్పుడు నీ అంతరంగములో ఉన్నదానిని ప్రతిబింబిస్తుంది. కాలము-గడుస్తున్నా-కొద్దీ, మీ పాపము మిమ్మల్ని పట్టుకునే పరిస్థితిని తెచ్చుకోకండి. మరియు మనము దానిని చెప్పడానికే ప్రయత్నిస్తున్నాము.

557 పరిశుద్ధ యోహాను 5:24లో, యేసు ఇట్లన్నాడు, “వినువాడు,” ఊగేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, వాడు…“నా మాట విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు, మరియు వాడు ఎన్నడూ తీర్పులోనికి రాక; మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.”

558 అది నీ విశ్వాసమైయున్నది. మరియు నీ పెదవులతో ఒప్పుకొనబడిన, నీ విశ్వాసము, వినే ప్రజలకే తెలియజేస్తుంది, కానీ నీ జీవితము అందరియెదుట తెరవబడియున్నది. కావున, నీవు దీని వలె మరియు దీని వలె నటించుటకు ఎంతగా ప్రయత్నించినా, అది ఎన్నడూ పనిచేయదు. అది నీలో ఉండవలసియున్నది. కథ అంతటిలో అదే ప్రధాన భాగమైయున్నది. నీవు క్రింద ఇక్కడ ఆయన స్థానములో, ఒక సాక్షిగా పనిచేస్తుండగా; ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉండి, ఈ ఉదయము నీ స్థానములో పనిచేస్తున్నాడని, పునరుత్థానుడైన క్రీస్తును నీ రక్షకునిగా స్వీకరించుటలోగల నీ వ్యక్తిగత విశ్వాసమైయున్నది. ఒక సాక్షి అనగా ఒకరికి బదులుగా పనిచేయుట, నీ కొరకు ఒక సాక్షిగా నిలబడుటయైయున్నది. మరియు క్రీస్తులో నీ సాక్ష్యము ఏమైయున్నదో నీ జీవితము ఇక్కడ ప్రతిబింబిస్తుండగా, అది అక్కడను ప్రతిబింబించబడుతుంది మరియు అది ఇక్కడను ప్రతిబింబించబడుతుంది. మరియు ఆయన పైన అక్కడ ఉన్నాడు, నీకు ఆయన ఏమైయున్నాడనేది, అక్కడను మరియు ఇక్కడను ప్రతిబింబించబడుతుంది. కావున నీవు…నీ విశ్వాసమును బట్టియే, మరియు దానిని బట్టి మాత్రమే, నీవు రక్షించబడతావు. కావున, భావోద్వేగములకు, ఉద్రేకములకు, అనుభూతులకు, ఇంకా వేటికైనను, దానిలో ఎటువంటి స్థానము లేదు. ఇప్పుడు, ఆ…

559 ఇప్పుడు, నేను ఈ ఉద్రేకములను నమ్మను అని అనుకుంటూ, తప్పుగా ఆలోచించకండి. నిశ్చయంగా. అయితే ఇప్పుడు మనము, ఈ దినపు ప్రజలలో బలంగా నాటుటకు ప్రయత్నిస్తున్నది, ఉద్రేకములను కాదు. దయ్యము వాటిని తీసుకొని ప్రజలతో మరీ విపరీతం చేసాడు, వారియొక్క నిత్యమైన గమ్యమును ఒక ఉద్రేకముపై ఆధారము చేసుకొనునట్లు చేసాడు. కేకలు వేయడం, భాషలతో మాట్లాడడం, ప్రతి ఆదివారము సంఘమునకు వెళ్ళడం, ఒక క్రైస్తవుని వలె నటించడం, ఆ దినమున అది అంతయు నిష్ఫలమౌతుంది. “ఒక మనుష్యుడు తిరిగి జన్మించితేనే గాని.” మరియు నీ ఉద్రేకములు కాదు గాని, నీ జీవితమే నీవు అంతరంగములో ఏమైయున్నావన్నది ప్రతిబింబిస్తుంది.

560 నీ చేతులు రక్తమయము కావచ్చును, నీవు భాషలతో మాట్లాడవచ్చును, నీవు రోగులను స్వస్థపరచవచ్చును, నీ విశ్వాసముతో నీవు కొండలను కదిలించవచ్చును, మరి అయినను నీవు ఏమియు కానట్లే. మొదటి కొరింథీ 13. చూశారా? అది దేవుని యొద్దనుండి వచ్చే ఒక జన్మ ద్వారా సంభవించిన ఒక కార్యమైయుండవలసియున్నది, మరియు దేవుడే ఆ నూతన జన్మను నీలోనికి తెచ్చి, మరియు ఆయనలో ఒక భాగమును నీకు ఇస్తాడు. అప్పుడు ఆ కార్యములు ఉత్తమమైనవి. నీవు ఒక నూతన సృష్టివి. “నేను వారికి నిత్యజీవమును ఇచ్చెదను.”

561 మనము “నిత్యము” అనే పదమును చూసాము. ఎప్పటికీ అనేది “ఒక పరిమితి గల కాలము.” నిత్యత్వము అనేది సదా, సదా, మరియు సదా ఉంటుంది, అయితే కేవలం ఒకే ఒక్క నిత్యత్వమున్నది. మరియు మీరు నిత్యజీవమును పొందుకుంటారని మనము కనుగొన్నాము, మరియు గ్రీకు భాషలో ఆ పదము జోయీ అయ్యున్నది, దాని అర్థము “దేవునియొక్క జీవము.” మరియు మీరు దేవుని జీవముయొక్క భాగమును పొందుకుంటారు, అది మిమ్మల్ని ఒక ఆత్మ సంబంధమైన దేవుని కుమారునిగా చేస్తుంది, మరియు దేవుడు నిత్యుడైయున్నలాగున మీరును నిత్యులైయుంటారు. మీకు అంతము లేదు, ఎక్కడా ఆగవలసినది లేదు, ఎందుకనగా మీరెక్కడా ప్రారంభించబడలేదు. ఆది ఉన్న ప్రతిదానికి అంతము ఉంటుంది, మరియు ఆది లేనిదానికి అంతము ఉండదు.

562 ఆ ప్రశస్తమైన వాక్యమును మనమెంతగా ప్రేమిస్తున్నాము కదా! ఒక క్రైస్తవుడు స్థలము నుండి స్థలమునకు కొట్టుకొనిపోకుండా మరియు వివిధమైన సంఘములలో చేరకుండా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఆ విశ్వాసములో ఏ విధంగా స్థిరపడియుండాలి కదా. నీవు ఒక క్రైస్తవుడవైయున్నంతవరకు, నీవు ఏ సంఘమునకు చెందాలనుకున్నా ఫర్వాలేదు. అయితే మొదటి కార్యమును ముందు ఉంచండి, మరదే దేవుడు నీకు రక్త సంబంధియైనట్లుగా, నిన్ను దేవునితో రక్తసంబంధిగా చేసే ఆ జన్మయైయున్నది.

563 నిన్ను పైకి లేపగలుగునట్లు, ఆయన రక్తసంబంధిగా మారాడు. ఆయన నిన్ను పైకి లేపుటకు ముందు, ఆయన నీకు నిత్యజీవమును ఇవ్వవలసియున్నది. పిదప నిన్ను లేపడానికి, మరణమును తీసుకొనుటకు, దేవుడు రక్త సంబంధిగా మారవలసివచ్చినది. అప్పుడు నీవు పునరుత్థానములోనికి వెళ్ళడానికి, నీవు ఆయనకు సమీప బంధువునిగా మారవలసియున్నది. అది ఏమిటో మీరు చూశారా? అది కేవలం ఒక మార్పిడియైయున్నది. నీవు దేవుడి వలె మారుటకు, దేవుడు నీ వలె మారాడు. చూశారా? నీవు ఆయన కృపద్వారా, ఆయనలో భాగమౌనట్లు, నిత్యజీవమును కలిగియుండునట్లు, ఆయన నీలో భాగమయ్యాడు, శరీరధారి అయ్యాడు, అంతే.

564 కేవలం ఒక అద్భుతమైన దృశ్యమైయున్నది, మరియు, ఓ, మేము దానిని ప్రేమిస్తున్నాము.

ఇప్పుడు, దేవుడు, ఎంతో ఎక్కువగా ఇష్టపడినవాడై…

565 చేయవలసిన అవసరం లేదు, కానీ దానిని చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. దాని గురించి, అనగా మన దేవుడు ఇష్టపడుతున్నాడు అనేదాని గురించి, నేను ఎంతో ఆనందిస్తున్నాను, మీకు ఆనందంగా లేదా? చూడండి. ఒకవేళ—ఒకవేళ ఆయన దీర్ఘశాంతముతో లేనియెడల ఏమిటి? ఆత్మ ఫలమనగా ఏమిటి? ప్రేమ, సంతోషము, విశ్వాసము, సమాధానము, దీర్ఘశాంతము. అది నీలోనున్న దేవునియొక్క భాగమైయున్నది. మరియు భరించుట, ఒకరి భారములను ఒకరు భరించుట. క్రీస్తు నిమిత్తము దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే, ఒకరినొకరు క్షమించుకొనుట. మీలోనున్న దేవుని ఆత్మయే మిమ్మల్ని ఆ విధంగా చేస్తుంది. మరియు పిదప దేవుడు ఇక్కడ భూమి మీద ఉండి మరియు నీవలె మారినప్పుడు, పాపముగా మారినప్పుడు, ఆయన నీ పాపమును తీసుకొని, నీ కొరకు దానిని భరించి, మరియు దాని నిమిత్తము నీ అపరాధ రుసుమును చెల్లించాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు, మన భారములను భరించువాడైయున్నాడు.

566 మరియు పిదప ఆయన ఒక మంచి దేవుడైయున్నాడు. మీరు ఒక ఫలానా కార్యము, మీకిష్టమైన రీతిగా జరుగవలెనని మీరు కోరినయెడల, మీకు తెలుసా, ఆయన దానిని చేసేంత మంచివాడైయున్నాడు. మిమ్మల్ని సంతోషపరచుటకు—ఆయన ఇష్టపడతాడు. ఆయన కోరుచున్నాడు…ఆయన—ఆయన ప్రేమయైయున్నాడు, మరియు మీరు కోరినవాటిని మీరు కలిగియుండునట్లు అనుమతించడానికి, కొన్నిసార్లు ఆయనయొక్క గొప్ప ప్రేమ ఆయనను క్రిందకు దిగేలాగా బలవంతపెడుతుంది.

567 పునరుత్థానము తరువాత, తోమాను చూడండి. తోమా నమ్మలేదు. ఓ, ఈనాడు అతనికి చాలామంది పిల్లలున్నారు. అయితే తోమా ఇట్లన్నాడు, “లేదు. లేదు. నాకు ఏదో ఒక సాక్ష్యం కావలసియున్నది. నేను నా చేతులను ఆయన ప్రక్కలో పెట్టవలసియున్నది, మరియు ఆయన…నేను దానిని నమ్మడానికి ముందు, నా వ్రేళ్ళను ఆయన చేతులలో పెట్టవలసియున్నది. నేను, నీవు ఏమి చెప్పినా నేను లెక్కచేయను.” చూడండి, సరిగ్గా అప్పుడే, అతడు లేఖనముయొక్క క్రమమునకు, పూర్తిగా వెలుపలికి వెళ్ళిపోయాడు. మీరు దానిని నమ్మవలసియున్నారు. కావున అతడు ఇట్లన్నాడు, “దానిని రుజువు చేయుటకు, నాకు ఏదో ఒక విధమైన సాక్ష్యం కావాలి.”

568 మరియు యేసు ప్రత్యక్షమయ్యాడు, ఆయన మంచివాడు, “రమ్ము, తోమా, నీకు కావలసినది అదేయైతే, మంచిది, ఇదిగో. నీవు దానిని చేయవచ్చును.”

569 మనము ఆ విధంగానే ఉన్నాము. మనము ఇట్లంటాము, “ప్రభువా, నేను భాషలతో మాట్లాడవలసియున్నది. నేను—నేను కేకలు వేయవలసియున్నది. నేను…”

570 “ఓ, అలాగే, నేను దానిని నీకు చేస్తాను.” ఆయన మంచివాడు.

571 కావున అతడు తన చేతులను ఆయన ప్రక్కలో ఉంచి, అప్పుడు అతడు ఇట్లన్నాడు, “ఓ, ఇది నా ప్రభువే నా దేవుడే.”

572 ఆయన ఇట్లన్నాడు, “ఇప్పుడు, తోమా, నీవు చూసావు గనుక నీవు నమ్ముచున్నావు. అయితే ఎటువంటి సాక్ష్యాధారము లేకున్నను, దానిని నమ్మువారి బహుమానము ఇంకెంత గొప్పది!” విషయం అదేయైయున్నది. అటువంటి చోటుకే మనము రావలసియున్నాము. “ఏదియు చూడకున్నను దానిని నమ్మువారి బహుమానము ఇంకెంత గొప్పది కదా.” మనము దానిని అంగీకరించడమనేది, అది ఒక విశ్వాసపు క్రియయైయున్నది.

573 ఇప్పుడు, సూచనలు విశ్వాసులను వెంబడిస్తాయి అనేదానిని నేను నమ్ముతాను, అయితే మనం మొదటి కార్యములను మొదట పెడదాము. దీనిని కలిగిలేకుండా, మీరు సూచనలను కలిగియుండవచ్చును. మీరు అలా కలిగియుండగలరని పౌలు చెప్పాడు. అతడిట్లన్నాడు, “మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడగలిగినను; నేను వట్టివాడనే. నా విశ్వాసము ద్వారా నేను కొండలను కదిలించగలిగినను; నేను వట్టివాడనే. దేవునియొక్క మర్మములన్నిటిని నేను ఎరిగియుండే విధానములో, నేను బైబిలు గ్రంథమును అర్థం చేసుకోగలిగినను; నేను వట్టివాడనే.” చూడండి, అవి పరిశుద్ధాత్మను కలిగిలేకున్నను ఉండునట్టి, పరిశుద్ధాత్మయొక్క వరములైయున్నవి.

574 పరిశుద్ధాత్మ దేవుడైయున్నాడు. దేవుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, సహనమైయున్నాడు. అది దేవునియొక్క ఆత్మ. దేవుడు చివరి దినములలో దానినే లేపుతాడు, ఆ ఆత్మ ద్వారా లేపుతాడు.

575 ఇప్పుడు, “ఇష్టపడ…”

…దేవుడు, ఆ వాగ్దానమునకు వారసులైనవారికి చూపించవలెనని ఎంతో ఎక్కువగా ఇష్టపడినవాడై…

…దేవుడు,…వారసులకు చూపించడానికి…ఎంతగానో ఇష్టపడినవాడై…

వారసులెవరు? “మనము క్రీస్తునందు మృతిపొందినవారమై, అబ్రాహాముయొక్క సంతానముగా మారి, వారసులమైయున్నాము.” ఓ, అది మనస్సులో నాటబడుతుందా? ప్రమాణము చేయబడిన వాగ్దానము ద్వారా, మనము దేవుని రాజ్యమునకు వారసులమైయున్నాము. దేవుడు ప్రమాణము చేయవలసిన అవసరంలేదు. ఆయనయొక్క వాక్యము పరిపూర్ణమైనది. కానీ, ఆయన, గొప్పవారెవరును లేనందున, తనతోడని ప్రమాణము కూడా చేసాడు.

576 ఒక క్షణము, మనము ఇంకా చదువుతుండగా, వినండి.

…తన సంకల్పము నిశ్చలమైనదని, ప్రమాణము చేసి దృఢపరచెను:

577 “నిశ్చలమైనది,” మార్పులేనిది. దేవుడు మారలేడు. ఆయన ఒకే విధంగా ఉండవలసియున్నాడు. మరియు దేవుడు ఒక్క వ్యాధిగ్రస్థుని స్వస్థపరచినా గాని, ఆయన తన వైఖరిని ఎన్నడూ మార్చుకోలేడు. దేవుడు ఒక్క పాపిని, ఒక్క వేశ్యను క్షమించినా, ఆయన తన వైఖరిని ఎన్నడూ మార్చుకోలేడు. దేవుని వాక్యముయొక్క నిశ్చలమైన తత్వము, మారలేని తత్వము. ఒక చోట, దేవుడు ఇట్లన్నాడు, “నీ రోగములన్నిటిని స్వస్థపరచు యెహోవాను నేనే.” ఆయన దానితో నిలిచియుండవలసియున్నది, ఎందుకనగా ఆయన అనంతుడైయున్నాడు. ఆయన ఆది నుండే అంతమును ఎరిగియున్నాడు.

578 ఇప్పుడు, “నేను దీనిని చేస్తాను,” అని నేను చెప్పవచ్చును. మరి మనము “ప్రభువు చిత్తమైతే,” అని చెప్పవలసియున్నదని, బైబిలు గ్రంథము చెప్పినది. ఎందుకనగా, నేను ఒక మర్త్యుడనైయున్నాను. నాకు తెలియదు. కొన్నిసార్లు నేను నా మాటను వెనక్కి తీసుకోవలసియుంటుంది, కానీ దేవుడు ఆయన మాటను వెనుకకు తీసుకోలేడు. ఆయన దేవుడు.

579 మరియు ఆయన కేవలం ఒకే ఒక్కదానిని కోరాడు, “నమ్ముట నీవలనైతే.” ఓ, మై! “నమ్ముట నీవలనైతే, సమస్తమును సాధ్యమే.” “నమ్ముట నీవలనైతే,” అంతే. “నీవు, నీవు నమ్మగలిగితే,” ప్రశ్న అదేయైయున్నది. అయితే ప్రశ్న దేవునియొక్క వాక్యము గురించి కాదు, ఎందుకనగా, ఆయన నిశ్చలమైన తత్వమును గలవాడు, ఆయన మారలేడు. ఎంత అద్భుతము!

580 ఇప్పుడు మనమింకా చదువుతుండగా, వినండి.

నిశ్చలమైన రెండు సంగతులను బట్టి, మరి వాటిలో దేవుడు అబద్ధమాడుట అసాధ్యము,…

అసాధ్యము! అసాధ్యము మరియు నిశ్చలము అనేవి దాదాపు ఒకే పదమైయున్నవి; మారలేనిది, కదలలేనిది. అది ఎప్పటికీ ఒకే విధంగా ఉండవలసియున్నది. మార్పుచెందజాలదు, నిశ్చలమైనది మరియు అసాధ్యమైనది.

మరియు రెండు, నిశ్చలమైన రెండు సంగతులను బట్టి, మరి వాటిలో దేవుడు అబద్ధమాడుట అసాధ్యము,…

“మనకు రెండు సంగతులున్నాయా?” అవును. మొదటిది, ఆయన దానిని చేస్తానని చెప్పినట్టి ఆయనయొక్క వాక్యమున్నది. రెండవది, దానిని చేస్తానని దానికి పైగా, ఆయన ప్రమాణము చేసిన వాగ్దానమున్నది. ఓ, మై!

581 మనం ఏ విధమైన ప్రజలుగా ఉండవలసియున్నాము? మనం అటు ఇటు కొట్టుకొనిపోతూ మరియు తిరుగులాడుతూ, మరియు లోక సంగతులను తీసుకొని మరియు ఈ 1957 వ తరపు ఆధునీకృతమైన-తరహా గల క్రైస్తవ్యము వలె ఎందుకు ప్రవర్తించాలి? మనము దేవుడిని ఆయనయొక్క వాక్యము వద్ద తీసుకొని, మరియు లేనివాటిని ఉన్నట్లుగా పిలిచే పాత-కాలపుదానివలె ఉండగోరుచున్నాము. “దేవుడు అలా చెప్పినట్లైతే, అదే దానిని స్థిరపరుస్తుంది.”

582 అతనికి మరియు అతని సంతానమునకు అని, ఎవరికైతే వాగ్దానము ఇవ్వబడినదో, అట్టి అబ్రాహాము, అతడు లేనివాటిని, ఉన్నట్లుగా పిలిచాడు. ఏలయనగా, అది దేవునియొక్క వాగ్దానమైయున్నది, దేవుడు అబద్ధమాడలేడని ఎరిగియున్నాడు. ఆయన అతనికి దానిని వాగ్దానము చేశాడు, మరియు అతడు దానిని నమ్మాడు. మరియు సంవత్సరాలు గడిచినా కొలది, ప్రకృతి సంబంధమైన కంటికి, ఆ వాగ్దానము దూరమగుచున్నట్లు కనబడినను, అబ్రాహామునకు అది దగ్గరగా మారింది.

583 బలహీనముగా ఉండి, మరియు ఇట్లు చెప్పలేదు, “సరి, బహుశా దైవిక స్వస్థత అనేది ఏదియు లేదేమో. బహుశా నేను కేవలం-…బహుశా అటువంటిది ఏదియు లేదేమో. బహుశా నా తలంపులన్నిటిలో నేను తప్పైయున్నానేమో.” అప్పుడు, అది ఒక్క విషయాన్ని చూపిస్తుంది, నీవు తిరిగి జన్మించలేదని చూపిస్తుంది. “ఏలయనగా అది…”

584 పోయిన ఆదివారము మనం దానిని చూసాము, అధ్యాయములో కేవలం కొంచెం ముందున్నది. “ఒకసారి పరలోకపు వరములను మరియు అట్టివాటిని రుచి చూసిన మనుష్యుడు, మరలా పశ్చాత్తాప పడునట్లు తననుతాను నూతనపరచుకోడానికి, తప్పిపోవడం అసాధ్యము.” ఖచ్చితంగా, పూర్తిగా అసాధ్యము!

ఏలయనగా దేవుని మూలముగా పుట్టినవాడు; దేవుని బీజము అతనిలో నిలుచును గనుక పాపము చేయడు మరియు పాపము చేయలేడు; మరియు అతడు పాపము చేయజాలడు,…

దేవునియొక్క బీజము దేవునియొక్క వాక్యమైయున్నది. “వినుటవలన, వాక్యమును వినుటవలన విశ్వాసము కలుగుతుంది, ‘బలి అర్పించబడినది. అంతా అయిపోయినది.’”

585 ఇప్పుడు, నీవు తప్పు చేసినట్లైతే, దాని కొరకు దేవుడు నిన్ను మూల్యం చెల్లించేలా చేస్తాడు. కానీ నీవు చేసినట్లైతే, నీవు తప్పే, అయితే నీవు దానిని బుద్ధిపూర్వకంగా చేయవు. 10వ అధ్యాయము, 47వ వచనము, అని నేను నమ్ముతున్నాను, “మనము సత్యమును గూర్చిన అనుభవజ్ఞానమును పొందిన తరువాత మనము బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లైతే.” అయితే నీవు ఒక్కసారి జన్మించిన తర్వాత, నీవు సత్యమును కలిగియుంటావు; దానిని గూర్చిన జ్ఞానమును కాదు గాని, నీవు సత్యమును అంగీకరించావు మరియు అది ఒక వాస్తవముగా మారినది. మరియు నీవు సదా, దేవునియొక్క బిడ్డవైయున్నావు. తాను దానిని చేస్తానని దేవుడు ప్రమాణము చేశాడు.

586 యేసు ఇట్లన్నాడు, “నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. వాడు ఎన్నడూ తీర్పులోనికి రాడు. వాడు మరణమునుండి జీవములోనికి దాటియున్నాడు.” ఇప్పుడు అటువంటి ఒక వాగ్దానముండగా, “మనము దానిని పొందుకోవాలని దేవుడు ఇష్టపడుచున్నాడు.”

587 ఇపుడు పౌలు ఆ—ఆ సంఘముతో మాట్లాడుతూ, అతడు ఇక్కడ ఏమి చెప్తున్నాడో గమనించండి.

…దేవుడు అబద్ధమాడజాలడు, మనకు బలమైన ధైర్యము కలుగునట్లు,…

“మంచిది, బాప్టిస్టులు నాతో సరిగ్గా వ్యవహరించకపొతే, నేను మెథడిస్టుల దగ్గరకు వెళ్తాను,” కాదు. చూశారా?

…మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు, బలమైన ధైర్యము కలుగునట్లు:

588 ఇప్పుడు చివరివి చదువుచున్నాను.

ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు వలెనుండి,…

ఈ నిరీక్షణ, అనగా ప్రమాణము చేయబడిన దేవునియొక్క వాగ్దానము, నిశ్చలమును స్థిరమునైయుండి, మన ఆత్మలకు లంగరు వలెనుండి, తెరలోపల ప్రవేశించుచున్నది;

589 ఒక్క క్షణము మనం “తెర” అనుదానిపై మాట్లాడుకుందాము. పోయిన ఆదివారము రాత్రి మనం అంత బాగుగా చూడలేదు.

590 “తెరలోపల.” తెర అనగా శరీరమైయున్నది. ఈ సంఘములో, దేవుడిని ముఖాముఖిగా చూడకుండా మనల్ని అడ్డుకునేది, ఆ తెరయేయైయున్నది. ఈ ఉదయం ఆ కుర్చీల ప్రక్కన, దేవదూతలు వారి స్థానములలో నిలబడటాన్ని చూడకుండా మనల్ని అడ్డుకునేది ఆ తెరయేయైయున్నది. ఆయనను చూడకుండా మనలని అడ్డుకునేది ఆ తెరయే. మనము తెర వెనుక దాచబడ్డాము, మరియు ఆ తెర శరీరమేయైయున్నది. మనము దేవునియొక్క కుమారులము కుమార్తెలమైయున్నాము, మనము దేవుని సన్నిధిలో ఉన్నాము, “దేవునియందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలియుందురు.” మనము ఎల్లవేళలా, దేవుని సన్నిధిలో ఉన్నాము. “నేను నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. యుగ సమాప్తివరకు, నేను సదా మీతో కూడా ఉందును.” అయితే ఆ తెర శరీరమేయైయున్నది, ఆయన సన్నిధి నుండి మనల్ని అడ్డుకునేది అదేయైయున్నది. అయితే ఆయన మనల్ని గమనిస్తున్నాడని అంతరాత్మలోనుండి, ఆత్మలోనుండి, మన విశ్వాసము ద్వారా మనం ఎరిగియున్నాము. ఆయన మన ప్రక్కన నిలబడియున్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు.

591 దోతాను వద్ద, ఒక ఉదయమున, ఒక వృద్ధ ప్రవక్త సైన్యముతో చుట్టుముట్టబడ్డాడు మరియు అతని దాసుడు బయటకు వెళ్ళి ఇట్లన్నాడు, “ఓ తండ్రీ, దేశమంతయూ పరదేశులచేత చుట్టుముట్టబడియున్నది.”

592 మరియు ఏలీయా లేచి, మరియు ఇట్లన్నాడు, “ఏంటీ, కుమారుడా, వారితోనున్న వారికంటే మనతో ఎక్కువమంది ఉన్నారు.”

593 సరి, అతడు రెప్పలార్పి మరియు చుట్టూ చూశాడు. అతనికి ఏమియు కనబడలేదు.

594 అతడిట్లన్నాడు, “దేవా, నీవు అతని కన్నులు తెరవాలని, ఆ తెరను తీసివేయాలని నేను కోరుచున్నాను.” మరియు అతని కన్నుల మీదనుండి ఆ తెర రాలిపోయినప్పుడు, ఆ వృద్ధ ప్రవక్త చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి, దేవదూతలతోను రథాలతోను ఆ పర్వతములు అగ్నిమయమైయున్నవి. విషయం అదే.

595 ఓ, అప్పుడు గేహజీ ఇట్లు చెప్పగలిగాడు, “ఇప్పుడు నాకు—నాకు అర్థమగుచున్నది.” చూడండి, తెర రాలిపోయినది. అభ్యంతరపరిచేది అదేయైయున్నది.

596 విషయం అదే. దీనిని గట్టిగా పట్టుకోండి. మనము జీవించవలసిన విధంగా జీవించకుండా మనల్ని అడ్డుకునేది ఆ తెరయేయైయున్నది. మనము నిజంగా చేయగోరుచున్న కార్యములను చేయకుండా మనల్ని అడ్డుకునేది ఆ తెరయేయైయున్నది. మరియు దేవుడు శరీరమనే తెరతో ముసుగు వేయబడ్డాడు, మరియు ఆ తెర రెండుగా చీల్చివేయబడినది. మరియు దేవుడు మరలా దేవుడయ్యాడు, మరియు ఆయన తననుతాను ఏ తెరలో దాచుకున్నాడో ఆయన దానిని పైకి లేపాడు. అది ప్రభువైన యేసుయొక్క పునరుత్థానమైయున్నది. అది మనకు ఏమని ఋజువు చేస్తుందంటే, ఇప్పుడు మనం దాచబడియున్న ఈ తెరలో, విశ్వాసము ద్వారా మనం దానిని నమ్మి మరియు దానిని అంగీకరిస్తున్నాము. మరియు ఈ తెర రెండుగా చీల్చబడినప్పుడు, “ఆయనయొక్క పునరుత్థానపు శక్తిలో నేను ఆయనను తెలుసుకున్నాను,” అని ఎరిగినవాడనై, ఈ నిశ్చయతతో నేను ఆయన సన్నిధిలోనికి వెళ్తానని ఋజువు చేస్తుంది. ప్రభువైన యేసుయొక్క రాకడలో, ఒక పరిపూర్ణమైన విధానములో ఈ తెర మరలా లేపబడుతుంది, ఎంతగా అంటే, ఆయన దావీదు సింహాసనమును తీసుకున్నప్పుడు, నేను నడచివెళ్ళి నా రక్షకుడు మరియు నా దేవుడునైన ఆయనతో మాట్లాడుతాను. మరియు ఇది పరిపూర్ణము చేయబడిన తర్వాత మనము ఈ తెరలో సదా జీవిస్తాము, అయితే ఈ తెర పాపమును కలిగియున్నది. అది ఎంత…ఈ భూమి మీద ఆ మహిమపరచబడిన శరీరం ఉండటాన్ని గూర్చి మీరెన్నడూ తలంచకండి. తిరిగి జన్మించుటకు, మీ అంతరాత్మ మరణించవలసియున్న విధంగానే, ఇది కూడా మరణించవలసియున్నది.

597 పరిపూర్ణత విషయమైతే, మాంసాహారము తినకపోవడం ద్వారా, మరియు దీనిని చేయడం ద్వారా, మరియు శరీరమును పరిపూర్ణము చేసుకోవడం ద్వారా, మీరు ఎన్నడూ దానిని పొందలేరు. మరియు మీరు దీనిని మానేసి, దీనిని చేయాలి, మరియు దీనిని చేయాలి, మరియు దీనిని చేయాలి, అనేది ధర్మశాస్త్రమైయున్నది. వారు క్రియల ద్వారా రక్షణ కలుగుతుందని నమ్మేవారు. క్రియలవలన రక్షణ అనువాటిని మేము నమ్మము. కృప ద్వారానే మనము రక్షించబడ్డామని మేము నమ్ముతాము. మరియు అది నీవు కాదు. దానిలో నీవు చేయవలసినది ఏమియు లేదు. దానిని చేసేది దేవునియొక్క ఎన్నికయే. “నా తండ్రి ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు.” అది నిజము. మరియు ఆయన…దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా ఉండుటకు; తండ్రి ముందుగా ఎరిగియుండి జగత్తుపునాదికి ముందే ఏర్పరచుకొనిన వీరిని పట్టుకోడానికే యేసు వచ్చాడు. ఆమేన్. “ప్రయాసపడువాని వలనైనను, పొందగోరువాని వలనైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే అగును.” దానిని చేసేది దేవుడే. నీవు అస్సలు, గొప్పలు చెప్పుకోలేవు. నీవు చేసిన ఒక్క కార్యము కూడా లేదు. దేవుడు, కృప ద్వారా, నిన్ను రక్షించాడు; నిన్ను నీవు, రక్షించుకోలేదు. నీవు రక్షించుకున్నట్లైతే, నీవు గొప్పలు చెప్పుకోడానికి ఏదో ఒకటి ఉండాలి. కానీ గొప్పలు చెప్పుకోడానికి నీవు దేనిని కలిగిలేవు. స్తుతులన్నియు ఆయనకే చెల్లుతాయి. అది ఆయనే. పిదప ఆయన నీకు నిశ్చయమైన నిరీక్షణను ఇచ్చాడు, “ఆయన పిల్లలు ఎన్నడైనా నశించిపోవడమనేది అసాధ్యమని, ప్రమాణము చేసి వాగ్దానము చేసాడు.”

598 ఇప్పుడు, తప్పు చేసినందుకు వారికి దెబ్బలు పడతాయి. నీవు ఏమి విత్తుతావో దానినే నీవు కోస్తావు. మీకు అది అర్థమైందా. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి పాపము చేస్తూ, దానిని తప్పించుకుంటారని అనుకోకండి. మీరు అలా తలంచుతూ, మరియు ఆ వైఖరిని కలిగియున్నట్లైతే, మీరు అసలెన్నడూ తిరిగి జన్మించలేదని అది చూపిస్తుంది. మీకు అర్థమైందా? తప్పు చేయాలనే కోరికను, మీరింకను మీలో కలిగియున్నట్లైతే, మీరింకనూ తప్పేయైయున్నారు. చూశారా? “ఏలయనగా ఆయన ఎవరినైతే…వారిని, సదా పరిపూర్ణులుగా చేసాడు, మరియు పాత నిబంధనలో, ధర్మశాస్త్ర ప్రకారమైన దినములలో, ఏటేటా, నిరంతరము, అర్పించబడినట్టి ఆ పశువులు, పాపమును ఎన్నడూ తీసివేయలేకుండెను.” కానీ మనము ఆయన తలపై మన చేతులనుంచి, మన పాపములను ఒప్పుకొని మరియు దేవుని ఆత్మ మూలంగా తిరిగి జన్మించినప్పుడు, పాపమును గూర్చిన కోరిక మనకిక ఎంత మాత్రమూ ఉండదు. పాపము మీ నుండి తొలగిపోయినది. అది సదా తొలగిపోయినది.

599 నీవు పొరపాట్లు చేస్తావు. నీవు పడిపోతావు. నీవు ఉద్దేశపూర్వకముగా తప్పు చేస్తావు. నీవు ఎప్పుడైనా బయటకు వెళ్ళి మరియు కార్యములను చేస్తావు. దాని అర్థం నీవు నశించిపోయావని కాదు. నీవు దిద్దుబాటు పొందబోవుచున్నావని దాని అర్థమైయున్నది.

600 నా చిన్న బాబు, చాలాసార్లు, నా పిల్లలు, కార్యములు చేస్తారు. మీ పిల్లలు కూడా చేస్తారు. అది…అది మీ—మీ నియమాలకు విరుద్ధమైనదని వారికి తెలుసు. మరియు వారు దానిని చేసినప్పుడు ఏమి జరుగుతుందో కూడా వారికి తెలుసు. దానివలన వారికి ఒక దెబ్బ పడుతుంది, కొన్నిసార్లు ఒక గట్టి దెబ్బే పడుతుంది. అయితే వారింకను మీ బిడ్డయే. నిశ్చయంగా.

601 ఒకసారి నిత్యజీవముతో పుట్టిన ఆ మనుష్యుడు, మరలా నశించిపోవడమనేది అసాధ్యము. దేవుడు ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవాడు కాడు. “నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వాడు ఎన్నడూ తీర్పులోనికి రాక, మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు. అంత్య దినములలో నేను వానిని లేపుదును.” అది దేవునియొక్క వాగ్దానమైయున్నది.

602 ఇప్పుడు మీరు, ఇట్లనవచ్చును, “ఓ, మంచిది, అలాగైతే నేను చేయవచ్చును కేవలం…” నేను ఎల్లప్పుడూ నేను కోరినదానినే చేస్తాను. అయితే నీవు ఒక క్రైస్తవుడవైనయెడల, నీవు తప్పైనదానిని చేయగోరవు, ఎందుకనగా నీలోని జీవమే, ఆ పునాదియే అటువంటిదైయున్నది. నీవు తప్పును చేయగోరుతున్నయెడల, తప్పుడు విషయం ఇక్కడ ఉన్నదని అది చూపిస్తుంది. “ఒకే ఊటనుండి చేదు నీళ్ళు మరియు తియ్యని నీళ్ళు ఎలా రాగలవు?”

603 కావున నీవు ఏదో ఒక విధమైన ఉద్రేకముతో లేదా ఒక అద్భుతమైన మరి-ఏదో అనుభూతితో కలగలుపు చేయబడ్డావు: దానిని మర్చిపో! తిరిగి బలిపీఠము నొద్దకు వెళ్ళి మరియు ఇట్లు చెప్పు, “దేవా, నా పాత పాపపు జీవితమును తీసివేయుము, మరియు నన్ను ఎటువంటి ఒక స్థితిలో ఉంచుతావంటే…”

“దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు.” అది నిజము. దానిని చేయడానికి అతనికి ఎటువంటి కోరిక ఉండదు.

604 నిశ్చయంగా, అపవాది అతనికి ఇక్కడ మరియు అక్కడ ఉచ్చు వేస్తాడు, కానీ అతడు బుద్ధిపూర్వకంగా వెళ్ళడు. బైబిలు ఆ విధంగా చెప్పినది. అప్పుడప్పుడు, దయ్యము అతనికి ఉచ్చు వేస్తుంటాడు. నిశ్చయంగా, వాడు అట్లు చేస్తాడు. వాడు మన ప్రభువైన యేసుకు ఉచ్చులు వేయడానికి ప్రయత్నించాడు. వాడు మోషేకు ఉచ్చు వేసి, అతణ్ణి పట్టుకున్నాడు. వాడు పేతురుకు ఉచ్చు వేసి, మరియు అతణ్ణి పట్టుకున్నాడు. వాడు అనేకులకు ఉచ్చు వేసాడు, అయితే…చివరికి పేతురు ఆయనను నిరాకరించాడు, కానీ తర్వాత అతడు వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. అతనిలో ఏదో ఉన్నది.

605 ఓడలో నుండి పావురము బయటకు పంపబడినప్పుడు…కాకి బయటకు వెళ్ళి, అది కూతలు కూస్తూ ఎగిరిపోయినది. అది ఓడలో బాగానే ఉన్నది, కానీ అది బయటకు వెళ్ళినప్పుడు, దాని స్వభావము భిన్నముగా ఉండినది. అది దానికి నచ్చిన ఆ శవాలన్నిటినీ తిని, తృప్తి చెందగలిగినది. ఎందుకు? ఆరంభము నుండియే, అది ఒక కాకియైయున్నది. అది కుళ్ళిపోయినవాటిని తినే పక్షియైయున్నది. అది ఎంతమాత్రము మంచిది కాదు. అది పావురము ఎంత పెద్దగా ఉన్నదో అంతే పెద్దగా ఉండి, పావురముతో కలిసి ఆ గూడులో కూర్చున్న ఒక వేషధారియైయున్నది. పావురము ఎగరగలిగిన ఏ చోటుకైనా అది కూడా ఎగరగలదు. అయితే సరిగ్గా పావురము తినునట్లే అది కూడా మంచి ఆహారమును తినగలదు. మరియు పిదప అది, పావురము తినలేనట్టి కుళ్ళిపోయిన ఆహారమును కూడా తినగలదు. ఏలయనగా, పావురము భిన్నంగా చేయబడినదై-యున్నది. అది ఒక భిన్నమైన తయారియైయున్నది. అది ఒక పావురమైయున్నది. మరియు పావురము కుళ్ళిపోయిన ఆహారమును జీర్ణించుకోలేదు, ఎందుకనగా అది దానిలో అసలు ఎటువంటి చేదును కలిగిలేదు.

606 మరియు దేవుని ఆత్మ మూలముగా జన్మించిన ఒక మనిషి, దేవుని పావురముగా మారతాడు, అతని స్వభావం, అతని మార్పు, అతని తయారీ అలా మారిపోతుంది. అవును, అయ్యా. మీరు పావురము యొక్క—యొక్క ఆత్మను ఒక కాకిలో పెట్టండి, అది ఎన్నడూ ఒక చచ్చిన కళేబరము మీద కూర్చోదు. అది పొరపాటున కూర్చున్నా, అది నిశ్చయంగా వెంటనే దూరంగా ఎగిరిపోతుంది. అది దానిని సహించలేదు. మరియు దేవుని ఆత్మ మూలముగా జన్మించిన ఒక మనిషి కూడా, సహించడు. అతడు ఎప్పుడైనా ఒక సారా దుకాణములోనికి వెళ్తాడేమో, కానీ అతడు వెంటనే అక్కడ నుండి బయటకు వస్తాడు. ఒక స్త్రీ అతడిని ప్రలోభపెట్టి, అతడు అటు తిరిగేలాగ చేయవచ్చును, కానీ అతడు మరలా అతని తలను త్రిప్పేసుకుంటాడు. అతడు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎందుకు? అతడు ఒక పావురమైయున్నాడు. అది నిజము. మీరు అతణ్ణి మోసం చేయలేరు, ఎందుకనగా అతనికి తెలుసు. “నా గొఱ్ఱెలు నా స్వరమును ఎరుగును, మరియు వేరొకడిని అవి వెంబడించవు.” ఆరంభము నుండే, అతడు ఒక పావురమైయున్నాడు. దాని గురించే నేను మాట్లాడుచున్నాను, ఆ లోపల లంగరు వేసియుంచే ఒక వాస్తవమైన సంగతి.

607 ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. “దేవుడు ప్రమాణము చేసాడు.” ఓ, అది…

ఈ నిరీక్షణ…నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మలకు లంగరువలెనుండి, ఆ—ఆ తెరలోపల ప్రవేశించుచున్నది;

608 “తెర.” శరీరమనే తెరతో ముసుగు వేయబడి, దేవుడు క్రిందకు దిగి వచ్చాడు. ఏమి చేయడానికి? తనను తాను చూపించుకొనుటకై యున్నది. మనము ఆయనను చూడలేము గనుక, ఆయన దాగవలసివచ్చినది. మరియు ఆయన తెర వెనుక దాగియున్నాడు. మరియు ఆ తెర ఎవరు? యేసే. “క్రియలు చేయువాడను నేను కాదు గాని, నా తండ్రియే,” అని యేసు చెప్పాడు. “నా తండ్రి నాయందు నివసించుచున్నాడు. నేను పని చేయుచున్నాను. తండ్రి పనిచేయుచున్నాడు, నేను పనిచేయుచున్నాను.” ఇదిగో తెరవేయబడిన వ్యక్తిగా ఆయన ఇక్కడున్నాడు, శరీరములో నడుచుచున్నాడు, దేవుడు, ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉండుటయైయున్నది. “దేవుడు క్రీస్తులో ఉండి, లోకమును తనతో సమాధాన పరుచుకొనుచున్నాడు.” ఇదిగో ఆయన ఇక్కడ, నడుచుచున్నాడు.

609 ఇప్పుడు, ఆయన క్రిందకు వచ్చి ఒక శుద్ధీకరణను, లేదా సిద్ధపాటును, లేదా ప్రాయశ్చిత్తమును కలుగజేసాడు, తద్వారా ఆయనయొక్క మరణము అర్పించబడుటచేత, పాపముయొక్క వెల చెల్లించబడి, ఆయన తిరిగి వచ్చి మనలో నివసించుటకైయున్నది. అలాగైతే మనము కలిగియున్న విశ్వాసము ఒక—ఒక తెరవేయబడిన విశ్వాసము, లేదా ఒక తెరవేయబడిన వ్యక్తియైయున్నది. కావున ఈ తెరలో మనకు కనబడే సంగతులను మనము చూడము. ఈ తెర విద్యలను కలిగియున్నది, మరియు అది కార్యములను చేస్తుంది మరియు విషయాలను చెప్తుంది. అది ఒక శాస్త్రసంబంధమైన విషయము. అయితే ఈ లోపల నివసించున్నట్టి సజీవుడైన దేవుని ఆత్మ, దేవుడు దానిని చెప్పినట్లైతే, లేనివాటిని, ఉన్నట్లుగా పలుకుతుంది. అదియే మీ తెరయైయున్నది. మనము తెరలో ఉన్నాము.

610 ఇప్పుడు, ఏదో ఒక రోజు ఆయన ఈ తెరను పైకి లేపుతాడు, స్త్రీ పురుషులయొక్క లైంగిక కోరిక వలన స్త్రీ ద్వారా పుట్టినది కాదు, అయితే దేవుని చిత్తమువలన ఆయన పలుకుతాడు మరియు అది కలుగుతుంది. అప్పుడు మనము ఆయనయొక్క స్వంత మహిమకరమైన శరీరమువంటి ఒక శరీరమును కలిగియుంటాము. ఒకరితో ఒకరము మాట్లాడుకొనునట్లు, ఒకరితో ఒకరము కరచాలనము చేసుకొనునట్లు, మనము తెర వేయబడియుంటాము.

611 ఇపుడు, మనమిక్కడ నుండి వెళ్ళినపుడు, ఒక గుడారమున్నది, ఒక థియోఫని ఉన్నది, కేవలం మానవునియొక్క రూపమైయున్నది, అది తినదు, త్రాగదు, నిద్రపోదు, సదా మేల్కొనియుంటుంది. దానిలోనికే మనము వెళ్తాము. అయితే వారు బలిపీఠము క్రింద వేచియున్నారు. తిరిగి క్రిందకు రావడానికి, “ప్రభువా, ఎంత కాలము? ఎంత కాలము?” అని కేకలు వేయుచున్నారు. ఎందుకనగా, వారు ఒకరితో ఒకరు కరచాలనము చేయగోరుచున్నారు. వారు కూర్చొని భోజనము చేస్తూ, ఒకరితో ఒకరు మాట్లాడుకొనగోరుచున్నారు. వారు మనుష్యులైయున్నారు. ప్రభువు నామము స్తుతించబడును గాక!

612 ఆదిలో దేవుడు మానవుడిని తన స్వంత పోలికలో చేసినప్పుడు, ఆయన అతడిని ఆ విధంగా చేసాడు. మనము ఒకరినొకరము ఎరిగియున్నట్లే, ఆయన వారితో సహవాసము కలిగియున్నాడు. దేవుడు మనల్ని దేనిగా కలుగజేసాడో మనము దానిని ఇష్టపడతాము, ఎందుకనగా మనము ఆ విధంగా తయారు చేయబడ్డాము. ఆయనయొక్క గొప్ప రాకడలో, సిద్ధంగా ఉన్నవారు ఎప్పటికీ ఆ విధంగానే ఉంటారు. అమర్త్యులుగా, మనము ఆయన పోలికలో నిలబడతాము. ఓ, ఆ క్రీస్తు నామము స్తుతింపబడును గాక!

613 మరియు ఇపుడు మనము ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా, మనల్ని స్వస్థపరచువానిగా అంగీకరిస్తుండగా, మన రక్షణయొక్క భయానాను మనం కలిగియున్నాము. ఇవన్నియూ భీమా పాలసీలో అందించబడే పారితోషికాలు, లేదా, లాభాలు అయ్యున్నవి. ఆమేన్. ఒక భీమా పాలసీ అంటే ఏమిటో మీకు తెలుసు. రావలసిన మొత్తం విలువ వచ్చేవరకు మీరు లాభాలను తీసుకోవచ్చును. నిశ్చయంగా. మీరు లాభాలను తీసుకోవచ్చును. మరియు ఇప్పుడు మనము లాభాలను తీసుకుంటున్నాము. ఒకటే, విషయమేమిటంటే, మనము లాభాలను తీసుకున్నవెంటనే, పారితోషకం మరలా తయారవుతుంది.

614 ఒకసారి, ఒక భీమా ఏజెంటు, నాతో ఇట్లన్నాడు, “బిల్లీ, నేను నీకు ఒక భీమాను అమ్మగోరుచున్నాను.”

నేను ఇట్లన్నాను, “నేను ఒక దానిని కలిగియున్నాను.” నా భార్య వెనక్కి తిరిగి నా వైపు చూసింది.

615 ఇప్పుడు, భీమాకు వ్యతిరేకంగా ఏమీ లేదు. కానీ కొంతమంది “అధిక భీమాలను కట్టి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటారు.” అయితే, వారు ఇటు తిరిగారు. అతడు ఇట్లన్నాడు…

616 నా భార్య నా వైపు, వింతగా చూసి ఇట్లన్నది, “నీకు భీమా ఉందా?”

617 “నిశ్చయంగా,” అని నేను అన్నాను. ఆమెకు దాని గురించి ఏమియు తెలియదు.

618 అతడు ఇట్లన్నాడు, “మంచిది, బిల్లీ, నీవు ఎలాంటి భీమాను కలిగియున్నావు?”

619 నేను ఇట్లన్నాను:

యేసు నావాడనే, ధన్యకరమైన నిశ్చయత!

ఓ, ఆ దివ్య మహిమను ముందుగా అనుభవించుట!

దేవునిచేత కొనబడి, రక్షణకు వారసుడనైయున్నాను,

ఆయన రక్తములో కడుగబడి, ఆయన ఆత్మ మూలంగా జన్మించియున్నాను.

620 అతడు ఇట్లన్నాడు, “అది చాలా మంచిది, బిల్లీ,” అతడింకా ఇట్లన్నాడు, “కానీ అది నిన్ను ఇక్కడ సమాధిలో పెట్టదు.”

621 నేను ఇట్లన్నాను, “కానీ అది నన్ను బయటకు తీస్తుంది. అదే ముఖ్యమైన విషయం.” నేను అందులోనికి వెళ్ళడం గురించి చింతించడంలేదు; నేను బయటకు రావడం గురించి చింతిస్తున్నాను.

622 మరియు ప్రమాణము చేసిన నిత్యుడైన దేవుని వలన, అంత్య దినమున, ఆయన తన కుమారుని పోలికలో నన్ను పైకి లేపుతాడన్న నిశ్చయత నాకున్నది గనుక, నేను ధైర్యముగా నడుస్తాను, మరియు నేను ఈ తెరలో ఉండగా ఏదో ఒక అదృశ్యమైనది, ఆ యుగముల బండకు నన్ను లంగరు వేసియున్నదనే ఆదరణను మరియు ఆత్మయొక్క లంగరును కలిగియుంటాను. నీళ్ళు ఎగసిపడి మరియు తుఫాను రేగినను, అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. మరణము, ఆపదలు, లేదా ఏదైనా, దేవుని ప్రేమనుండి మనలను యెడబాపనేరవు. నాయొక్క లంగరు ఆ తెరలోపల పట్టుకొనియున్నది. ఆ వరదలను ఉప్పొంగనిమ్ము. అది ఢీ కొట్టనిమ్ము. అవిశ్వాసులను రానిమ్ము. తిరిగి-జన్మించిన విశ్వాసి ఒక లంగరును కలిగియున్నాడు. మీరు ఇప్పుడే ఈ తెరలోనుండి చూడలేరు. కానీ ఆ యుగముల బండకు నా లంగరు పట్టుకొనియున్నదని నాకు తెలుసు, అది అంత్య దినమున ఆయన నన్ను పైకి లేపుతాడని ప్రమాణము చేసిన వాగ్దానమైయున్నది.

623 మీరు నేరుగా మరణము వైపు చూసి, మరియు ఇట్లు చెప్పగలరు “మరణమా నీ ముల్లు ఎక్కడ? సమాధీ, నీ విజయమెక్కడ? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగును గాక.”

అందులోనికి ముందుగా వెళ్ళువాడు…

ఓ, మై! మనము పాఠములోనికి వెళ్ళలేము.

అందులోనికి మనకంటే ముందుగా వెళ్ళువాడు…మన పక్షమున

624 ముందుగా వెళ్ళువాడు. మీరు ఎప్పుడైనా గమనించారా, పాత పశ్చిమ దినములలో (అనేకసార్లు నేను ఆ పాత దారులగుండా వెళ్ళాను.), ఒక ముందుగా వెళ్ళువాడు, లేదా మార్గదర్శకుడు? గుర్రపు బండి నీటి కొరకు దాహంతో నశించిపోతున్నప్పుడు, ఆ మార్గదర్శకుడు, ముందుగా పరుగెత్తుతాడు. మరియు అతడు ఇండియన్ల తెగలను చూసాడు; అతడు వారిని దాటి వెళ్ళాడు. మరియు ఒక నీటి ఊట ఉన్న చోటును అతడు చూసాడు. ఆ గుర్రపు బండియొక్క యజమానితో ఇట్లు చెప్పడానికి అతడు పరుగెత్తుకుంటూ వెనుకకు వెళ్ళాడు, “గుఱ్ఱములను సిద్ధపరచండి, ప్రతి ఒక్కరూ ధైర్యము తెచ్చుకోండి, ఎందుకనగా కేవలం ఆ కొండకు ఆవలినే ఒక పెద్ద నీటి ఊట ఉన్నది.” అతడు ముందుగా వెళ్ళువాడైయున్నాడు.

625 మరియు ఇక్కడ, ముందుగా వెళ్ళువాడు. ఒకసారి మనుష్యుడు, దూసుకుపోతున్న కాల్పుల క్రింద, అపవాదిచేత అణచివేయబడ్డాడు, కానీ ఒకరు ఆ మర-తుపాకీ స్థావరమును స్వాధీనపరచుకున్నాడు. అది యేసేయైయున్నాడు. ముందుగా వెళ్ళు ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. మరియు సాతానుడు ఒక మర తుపాకీ తో అక్కడ నిలబడి, ఎల్లప్పుడూ బంధకములలో మరియు మరణమనే భయములో, మనల్ని అణచివేయుచున్నాడు. ఆయన అప్పుడు ఆ ఊటకు కావలి కాయుచున్నాడు. నిశ్చయముగా, ఆయన కాయుచున్నాడు. ఆయనకు ఆ ఆజ్ఞ ఇవ్వబడినది, ఎందుకనగా మనము పాపము చేసి మరియు దానినుండి తరిమివేయబడ్డాము. అయితే ముందు వెళ్ళువాడైన, క్రీస్తు, లోనికి వచ్చి మరియు ఆ స్థావరమును స్వాధీనపరచుకున్నాడు.

626 “నేను వచ్చుచున్నాను గనుక, స్థావరమును కాచుకొనియుండండి” అనే ఆ పాత పాటను మీరు విన్నారా? స్థావరమును కాచుకొనియుండేదేమీ లేదు; మనము, దానిని స్వాధీనపరచుకుందాం. మనము దానిని ఇక ఎంతమాత్రము కాచుకొనియుండవలసిన అవసరం లేదు. క్రీస్తు స్థావరమును స్వాధీనపరచుకున్నాడు. హల్లెలూయా! ద్వారము తెరువబడియున్నది. “దేవుని గృహమందు, దావీదు పట్టణమందు, శుభ్రపరచుటకు, అపవిత్రులయొక్క శుద్ధీకరణ కొరకు, తెరువబడిన ఒక ఊట ఉన్నది.” మనయొక్క ముందుగా వెళ్ళువాడు మన కొరకు ఇదివరకే ప్రవేశించియున్నాడు.

627 ముందుగా వెళ్ళు ఆయన, ఆయన మనతో ఇట్లు చెప్తున్నాడు, “కేవలం కొద్దిగా ఆవల, సుదూరాన్న ఒక స్థలమున్నది, అక్కడ మీరెన్నడూ వృద్ధులు కారు.” అక్కడ ముడతలు ఉండవు, అక్కడ నిన్ను నీవు నీ భర్తకు చక్కగా కనపరచుకొనుటకు మాక్స్ ఫ్యాక్టర్ మేకప్ లను వాడనవసరం లేదు. ముందుగా వెళ్ళు ఆయన వెళ్ళాడు. మీరు వృద్ధులైపోయి, అలసిపోయి, వణుకుతూ ఉండే ఒక స్థలము అక్కడ ఎన్నడూ ఉండదు. మీరెన్నడూ జబ్బుపడని ఒక స్థలము అక్కడున్నది. అక్కడ ఒక బిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడ్వడమనేది ఎన్నడూ జరుగదు. అక్కడ మీరెన్నడూ ఒక నకిలీ పన్నును, లేదా, ఒక నకిలీ పన్ను పెట్టించుకోడానికి, ఒక అసలైన పన్నును కోల్పోరు. హల్లెలూయా! ఓ, ఆయన నామము స్తుతింపబడును గాక! ఆయన లోనికి ప్రవేశించాడు, మరియు ఏదో ఒక దినమున, మనము అమర్త్యులముగా ఆయన పోలికలో నిలబడతాము. నక్షత్రములు మరియు సూర్యుడు కంటే ఎక్కువగా వారు ప్రకాశిస్తారు. నిశ్చయంగా. ముందుగా వెళ్ళు ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు.

…ముందుగా వెళ్ళువాడైయుండి, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున, ప్రధానయాజకుడైన యేసు, అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

628 ముందుగా వెళ్ళు ఈ గొప్ప ఈయన, మార్గమును కలుగజేస్తూ మనకంటే ముందుగా వెళ్ళాడు. దేవుని వర్షధనస్సుయొక్క ఆ గొప్ప ఊట, ఆదియును అంతమును లేని ఆయన, ఆయన ఆత్మగా ఉండుట నుండి మారాడు. ఆయన సదా, దేవుడైయున్నాడు.

ఈ వెలుగు కిరణము బయలువెళ్ళినది. అది ప్రేమ కిరణమైయున్నది, ఎర్రనిది, అది ప్రాముఖ్యమైనది. ఆ తదుపరి రంగు, నీలం రంగైయున్నది; నీలం, సత్యమునకు సాదృశ్యం. తర్వాత, దాని తర్వాత ఇతర రంగులు వచ్చాయి, ఆ ఏడు పరిపూర్ణ రంగులు, అవి దేవునియొక్క ఏడు ఆత్మలైయున్నవి, అవి ఆ గొప్ప ఊటనుండి లేదా యేసు చెప్పినట్టి ఆ గొప్ప వజ్రం నుండి బయలువెళ్ళినవి. ఈ రంగులను ప్రతిబింబించడానికి, ఆ గొప్ప వజ్రం తొలచబడినది. వరములు మరియు సూచనలు మరియు అద్భుతముల ద్వారా, ఆయనయొక్క మంచితనమును మరియు కనికరమును మన మధ్య ప్రతిబింబించడానికి, దేవుడు శరీరధారియై మన మధ్య నివసించాడు. ఆ పెద్ద వర్షధనస్సు మొత్తం ఒక థియోఫనీలాగా మారినది, మానవుని రూపములోనికి చేయబడినది, అప్పటికీ ఆయన ఒక మానవుడు కాడు, ఆయన అప్పటికీ శరీరమును కలిగిలేడు, ఆయన ఒక థియోఫనీయైయున్నాడు.

629 “నేను నిన్ను చూడగోరుచున్నాను,” అని మోషే అన్నాడు. దేవుడు అతడిని బండలో దాచాడు.

630 మరియు ఆయన దానిని దాటి వెళ్ళినప్పుడు, ఆయన తన వీపును త్రిప్పుకున్నాడు. మోషే ఇట్లు చెప్పాడు, “అది ఒక మనిషి వీపువలె కనబడినది.”

631 పిదప ఏమి జరిగినది? ఒక దినమున ఆ దిగువున, అబ్రాహాము తన గుడారములో కూర్చొనియున్నాడు. ఈ రాత్రి, మనము దాని వద్దకు వస్తాము. అబ్రాహాము తన గుడారములో కూర్చొనియున్నప్పుడు, దేవుడు మాంసయుక్తమైన శరీరములో, అతని యొద్దకు వచ్చాడు.

“ఓ,” మీరు ఇట్లంటారు, “బ్రెన్హామ్ సహోదరుడా, అతడు…”

632 దానికి ముందు సరిగ్గా ఇక్కడే ఆయన అబ్రాహామును కలుసుకొనుటను మనము కనుగొంటాము, మెల్కీసెదెకు క్రమములో, ఒక మాంసయుక్తమైన శరీరములో కలుసుకున్నాడు, మరది దేవుడే. నిశ్చయంగా, అది ఆయనే. ఆయన శరీరధారియైన దేవుడైయున్నాడు.

633 మీరు ఇట్లంటారు, “అలాగైతే, సహోదరుడా బ్రెన్హామ్, ఎందుకని ఆయన తిరిగి వచ్చి మరియు జన్మించవలసివచ్చినది?”

634 అప్పుడు ఆయన పుట్టలేదు. ఆయన కేవలం, తాను నివసించినట్టి ఒక శరీరమును సృష్టించాడు. మెల్కీసెదెకు షాలేము రాజు, అనగా యెరూషలేమునకు రాజైయున్నాడు, అనగా సమాధాన అధిపతియైయున్నాడు; ఆయన తల్లియైనను తండ్రియైనను లేనివాడైయున్నాడు, జీవితకాలమునకు ఆదియైనను జీవితమునకు అంతమైనను లేనివాడైయున్నాడు.

యేసుకు తల్లి మరియు తండ్రి ఇద్దరూ ఉన్నారు, మరియు జీవితకాలమునకు ఆదిని మరియు జీవితమునకు అంతమును కలిగియున్నాడు. అయితే ఆయన జీవితకాలమునకు ఆదియును జీవితమునకు అంతమును లేని, మెల్కీసెదెకు “క్రమము చొప్పున” చేయబడ్డాడు.

635 మెల్కీసెదెకు స్వయంగా దేవుడేయైయున్నాడు. మెల్కీసెదెకు యెహోవా దేవుడైయున్నాడు, సంవత్సరాల తర్వాత, అబ్రాహామును, అతని గుడారము యెదుట కలుసుకున్నది ఆయనేయైయున్నాడు. ఆయన తన వీపును త్రిప్పుకొనియున్నాడు; ఆయన ఇట్లన్నాడు, “శారా ఎందుకని నవ్వినది?” అది నిజము. సొదొమ వైపు చూస్తూ, అక్కడ నిలబడియున్నది ఆయనే. అబ్రాహాము ఆయనను గుర్తించాడు, ఎందుకనగా ఆ వాగ్దానమును పట్టుకొనియున్న ఒక లంగరు అతని తెర లోపల ఉన్నది. అతడు ఏదో ఉద్రేకమును కలిగియున్నందుకు కాదు, కానీ దేవుడు అతనికి వాగ్దానము చేసినందుకైయున్నది. మరియు అతడు ఆ గొప్ప అయస్కాంతమును స్పర్శించినప్పుడు, అది ఆ శరీరములో ఉన్నదని అతడు ఎరిగియున్నాడు.

636 ఒక చిన్న ముక్కయైయున్న అబ్రాహాముతో, బయటకు నడిచాడు. ఆయన అబ్రాహాముతో చెప్పాడు. ఇట్లన్నాడు, “దీనిని చూస్తుండగా, అతడు ప్రపంచమునకు వారసుడని చూస్తూ, నేను ఈ సంగతులను అబ్రాహమునకు తెలియకుండా దాచెదనా? నేను దానిని అసలు చేయను.” కావున, “అబ్రాహామా, నేను ఏమి చేయడానికి బయలుదేరానో నీకు చెప్తాను” ఈ రాత్రి మనము దానిని తీసుకొంటాము, “అక్కడ దిగువున సొదొమలో,” వారంతా ఏమి చేయబోతున్నారో చూస్తాము. మరియు ఆయన అబ్రాహామును దీవించిన వెంటనే, ఆయన మరలా అంతరిక్షములోనికి వెళ్ళిపోయాడు. అక్కడ నిలబడి మరియు తన బట్టలపై దుమ్మును కలిగియున్న ఒక మనిషియైయున్నాడు, ఒక మానవుడైయున్నాడు. మరియు అది మాత్రమే కాదు గాని, ఆయన అబ్రాహాము చంపినట్టి ఒక దూడ మాంసమును తిన్నాడు, మరియు ఆ ఆవు పాలను త్రాగుచు, మరియు వాటిపై కొంచెం నెయ్యి రాసుకొని, కొన్ని రొట్టెలను (కొన్ని మొక్కజొన్న రొట్టెలను) తిన్నాడు. అది ఖచ్చితముగా నిజము. మరియు పిదప మరలా ఒక థియోఫనీగా మారిపోయాడు.

637 అది ఏమిటి? అప్పుడే ఆయన దానిని ఎందుకని తీసుకోలేదు? ఆయన నీ వలె మరియు నా వలె జన్మించలేదు. అయితే ఆయన ఆ ముల్లును పట్టియుంచగలుగుటకు, ఆయన తప్పక శరీరములో జన్మించవలసియున్నది. అది సృష్టించబడిన శరీరమైయున్నది. అది ఆయన భూమి నుండి కాల్షియంను మరియు పొటాష్ ను బయటకు తీసి, మరియు, “ఫ్యూ,” అని మరియు దానిలోనికి అడుగుపెట్టిన శరీరమైయున్నది. మెల్కీసెదెకు కూడా అదే అయ్యున్నాడు. ఆయన తన స్వంత సృష్టివలనైన ఒక తెరలో, ఆ తెర క్రింద అతని యెదుట నడవగలుగునట్లు ఆయన అతనిలోనికి, అనగా ఒక శరీరములోనికి ప్రవేశించాడు; ఒక స్త్రీద్వారా, ఒక స్త్రీయొక్క గర్భము ద్వారా, ఒక—ఒక కణము ద్వారా కలిగినటువంటి ఒక తెర కాదు, కానే కాదు. అయితే ఆయన దీనిని సృష్టించి మరియు దీనిలోనికి ప్రవేశించి, మరియు, మెల్కీసెదెకు క్రమములో మాట్లాడాడు.

638 ఈ మెల్కీసెదెకు ఎవరు?

రాజులను సంహారము చేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును, ఎవడు కలుసుకొని, అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును (అనగా యెరూషలేము);

మహోన్నతుడగు దేవుని రాజకుమారుడునైన (నిశ్చయంగా) ఈ మెల్కీసెదెకు; మొదట అతని పేరునకు నీతికి రాజనియు, (ఆ గొప్ప ప్రేమ, ఆదియందున్న ఆ గొప్ప ఆత్మయైయున్నాడు)…నీతికి రాజనియు,…ఆ తరువాత…సమాధానపు రాజనియు, అర్థమునిచ్చునట్టి, షాలేము రాజని అర్థము;

అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను, లేదా జీవమునకు అంతమైనను లేనివాడైయున్నాడు;…

639 అది ఎవరు? ఆయన ఎన్నడూ పుట్టలేదు, ఆయన ఎన్నడూ మరణించడు. అది ఎవరు? అది దేవుడే, నిశ్చయంగా, అది ఆయనే, ప్రభువైన యేసునకు సాదృశ్యముగా ఉన్నాడు. నిశ్చయంగా ఆయనే. అయితే మీరు ఒక స్త్రీద్వారా వచ్చిన క్రమంలోనే, ఆయన ఒక స్త్రీ ద్వారా రావలసియున్నది. మరియు మిమ్మల్ని తిరిగి ఆయనయొద్దకు తెచ్చుటకు, ఆయన మీరు వచ్చిన విధానములో రావలసివచ్చినది. హల్లెలూయా!

అద్భుతమైన కృప! అది వినుటకు ఎంతో మాధూర్యముగా ఉన్నది,

అది నావంటి ఒక దయనీయమైన, గ్రుడ్డివానిని రక్షించినది!

ఒకప్పుడు నేను తప్పిపోయియున్నాను, అయితే ఇప్పుడు నేను, ఆయన కృప ద్వారా కనుగొనబడ్డాను,

నేను గ్రుడ్డివాడనైయున్నాను, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను.

640 ఆయన ఏమి చేయవలసివచ్చినదో నాకు అర్థమైనది. నేను కృప ద్వారా ఆయనగా మారునట్లు, దేవుడు నా వలె మారాడు. ఆయన నీతి ద్వారా నేను నిత్యజీవమును పొందునట్లు, ఆయన నా పాపములను తీసుకున్నాడు. నేను నన్ను నేను ఎన్నుకోలేను. నా స్వభావము ఒక పాపి స్వభావమైయున్నది. దానిలో నేను చేసేది ఏమియు లేదు. నేను “లోకములో జన్మించాను, అతిక్రమములో రూపించబడ్డాను, అబద్ధములాడుచు లోకములోనికి వచ్చాను.” కనీసం ఒక్క అవకాశము కూడా, లేదు; ఏదియు లేదు, కనీసం ఒక కోరికయైనా లేదు.

641 ఒక పందికి అది “బురదను తినుచు, తప్పు చేస్తున్నదని” చెప్పండి, మీరు చెప్తారా? అది మీ మాటను ఎంతగనం వింటుందో చూడండి. ఒక కాకికి అది “చచ్చిన శవాలను తింటూ, తప్పు చేస్తున్నదని” చెప్పండి, మరియు అది మీతో ఏమంటుందో చూడండి. అది గనుక మాట్లాడగలిగితే, “నీవు నీ పని చూసుకో,” అని అంటుంది. నిశ్చయంగా.

642 ఓ, అయితే ఈ స్వభావమును మార్చి మరియు, “ఓ దేవా, జీవముకంటె నీ కృప-యే నాకు ఉత్తమమైనది. నా హృదయము నీ కొరకు పరితపించుచున్నది,” అని ఆశపడుటకు మరియు తీవ్రముగా కోరుకొనుటకు మరియు దప్పిగొనుటకు నాకు అవకాశమును ఇచ్చినట్టి దేవుని కృప.

643 దావీదు ఇట్లన్నాడు, “దుప్పి నీటివాగుల కొరకు దప్పిగొనునట్లు, ఓ దేవా, నా ప్రాణము నీ కొరకు దప్పిగొనుచున్నది.”

644 ఆయనను ఆరాధించడానికి, ప్రేమించడానికి, ఆయనను వెదకడానికి, దేవుడు మనిషికి ఆ దాహమును పెట్టాడు. కానీ మనిషి దయ్యము యొక్క పిలుపు ద్వారా దానిని వంకర చేస్తాడు, మరియు అతడు వెళ్ళి స్త్రీల కొరకు, సుఖభోగముల కొరకు మరియు లోక సంబంధమైనవాటి కొరకు తపించిపోతుంటాడు, దేవుడు తనను ప్రేమించడానికి పెట్టినట్టి, ఆ పరిశుద్ధమైన సృష్టిని తృప్తిపరచుటకు ప్రయత్నిస్తూ అవన్నీ చేస్తాడు. అతడు దానిని లోక సంగతుల మీద వెచ్చిస్తాడు. కానీ, సహోదరుడా, ఒక్కసారి అతడు మార్చబడిన తర్వాత, పురుగులను కలిగియున్న ఆ ఊట, ఆ నీటి తొట్టియొక్క అన్ని విధములైన ఆ—ఆ గందరగోళములు, పవిత్రపరచబడి మరియు శుద్ధీకరించబడి, మరియు దేవునియొక్క స్వచ్ఛమైన జలములు ఆ లోపల పెట్టబడినప్పుడు మాత్రం, పాపము దానిని ఎన్నడూ తాకలేదు. ఆమేన్.

ఓ నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నానో! నేను ఆయనను ఎంతగా ఆరాధిస్తున్నానో!

నా జీవము, నా సూర్యరశ్మి, నా సర్వస్వము!

ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను,

మరియు దేవునియొక్క సర్వ సంపూర్ణత ఆయనలో నివసించెను.

ఆ నిత్యమైన గాథ ఇదియే, ఆయనయొక్క మహిమ నుండి,

నా దేవుడును రక్షకుడును అయినవాడు క్రిందకు దిగి వచ్చెను, మరియు ఆయన పేరే యేసు.

ఒక పశువుల తొట్టిలో జన్మించాడు, తన స్వంత వారికే ఒక అన్యుడయ్యాడు,

దేవుడు దుఃఖముతో, కన్నీటితో మరియు వేదనతో నిండినాడు.

ఓ, నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నానో! నేను ఆయనను ఎంతగా ఆరాధిస్తున్నానో!

నా ఊపిరి, నా సూర్యరశ్మి, నా సర్వస్వము ఆయనే!

645 ఓ దేవా! ఆయన దానిని ఎలా చేయగలిగాడు? మానవుడు దానిని వ్రాయడానికి ప్రయత్నించాడు. ఒకరు ఇట్లు వ్రాసారు:

మనము సముద్రమును సిరాతో నింపినా,

మరియు భూమి మీదనున్న ప్రతి గడ్డి పూచ ఒక కలమైనా;

ఆకాశమంతయు చర్మపు కాగితముతో చేయబడినా,

మరియు ప్రతి మనుష్యుడు తన వృత్తిరీత్యా ఒక కవియైనా;

పైనున్న దేవునియొక్క ప్రేమను వ్రాయడానికి

ఆ గొప్ప పరలోకపు దేవుడు ఏ విధంగా శరీరధారియై, నా పాపములను తీసుకున్నాడు అనేదాని గురించి వ్రాయడానికి!

పైనున్న దేవునియొక్క ప్రేమను వ్రాయడానికి

సముద్రము ఎండిపోతుంది;

ఆ గ్రంథపు చుట్టను ఆకాశమునుండి ఆకాశమునకు పరచినా గాని,

అదంతయు వ్రాయబడుటకు అది సరిపోదు.

646 మరియు ఈ రక్షణకు వారసులైనవారికి ఒక నిశ్చయమైన నిరీక్షణను ఇవ్వడానికి, అంత్య దినములలో ఆయన మనల్ని లేపుతాడని, మనకు నిత్యజీవమును ఇస్తాడని, ఆయన తనపై తానే ప్రమాణము చేసాడు. “మరియు ఏ మనుష్యుడును వారిని నా చేతిలో నుండి అపహరించలేడు.” ఆమేన్.

మనము ప్రార్థించుకుందాము.

647 ఆయనయొక్క ప్రేమను తృణీకరించినందుకు నీవు దోషిగా భావిస్తున్నావా? నీవు ఏమైయున్నావో, అలా నిన్ను కలుగజేసిన ఈ గొప్ప వ్యక్తిని, ఆయనయొక్క ధన్యకరమైన ఉనికిని నీవు తిరస్కరించావా? మరియు ఇప్పుడు నీవు ఇక్కడ, ఈ ఉదయమున, జీవితములో ఇంత దూరము వచ్చియున్నావు, మరియు అది నీకు ఒక అవకాశమును ఇస్తుంది. నీవు జీవించడాన్ని కొనసాగించగోరుచున్నావా? జీవించడానికి ఒకే ఒక్క మార్గమున్నది, మరది ప్రభువైన యేసును నమ్మడమేయైయున్నది. నీవు, నీ హృదయ అంతరంగమునుండి, ఆయన దేవుని కుమారుడని నమ్ముచు మరియు నీ రక్షకునిగా ఆయనను స్వీకరించి, మరియు నిన్ను నీతిమంతునిగా తీర్చుటకు దేవుడు ఆయనను పైకి లేపాడని నమ్ముచున్నయెడల, దాని ఆధారంగా నీవు దానిని స్వీకరించగోరుచున్నయెడల, ఇప్పుడు అది నీదే.

648 మీరు మీ చెయ్యిని పైకెత్తుతారా? పశ్చాత్తాపపడని ఏదో ఒక ఆత్మ, ఈ ఉదయం పశ్చాత్తాపపడగోరుచున్న యెడల, ఇట్లు చెప్పండి, “సహోదరుడా, బోధకుడా, మనము ప్రార్థన చేయబోవుతుండగా, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నేను కూడా విఫలమయ్యాను. నేను సంఘములో చేరాను, కానీ నీవు దేని గురించైతే మాట్లాడుతున్నావో దానిని నేను—నేనెన్నడూ కలిగిలేనని నాకు—నాకు తెలుసు. సహోదరుడా బ్రెన్హామ్, ఆ ఆత్మ మూలంగా నేనెన్నడూ జన్మించలేదు. నేను—నేనసలు దానిని కలిగిలేను, అంతే. ఈ ఉదయం దేవుడు దానిని నాకు ఇచ్చునట్లు, నీవు నా కొరకు ప్రార్థించాలని నేను కోరుచున్నాను.” అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇట్లు చెప్పండి “దేవా, నేను ఎలా ఉండాలని నీవు కోరుచున్నావో నన్ను అలా మార్చుము. నేను కోరుచున్నాను నీవు…నేను ఎలా ఉండాలని నీవు కోరుచున్నావో నేను అలా ఉండగోరుచున్నాను. నేను నీ ప్రేమను తిరస్కరించాను.” కుమారుడా, దేవుడు నిన్ను దీవించును గాక.

649 ఇపుడు ఒక్క క్షణము.

మనము సముద్రమును సిరాతో నింపినా,

మరియు ఆకాశము చర్మపు కాగితముతో చేయబడినా;

మరియు భూమి మీదనున్న ప్రతి గడ్డి పూచ ఒక కలమైనా,

మరియు ప్రతి మనుష్యుడు వృత్తిరీత్యా ఒక కవియైనా;

పైనున్న దేవుని ప్రేమను వ్రాయడానికి

సముద్రము ఎండిపోతుంది;

ఆ గ్రంథపు చుట్టను ఆకాశమునుండి ఆకాశమునకు పరచినా గాని,

అదంతయు వ్రాయబడుటకు అది సరిపోదు.

ఓ, దేవుని ప్రేమ, ఎంత ఐశ్వర్యవంతమైనది మరియు ఎంత స్వచ్ఛమైనది!

ఎంత లోతైనది మరియు ఎంత బలమైనది!

అది ఎప్పటికీ నిలిచియుంటుంది,

అది పరిశుద్ధులు మరియు దేవదూతలయొక్క పాటయైయున్నది.

650 ప్రియమైన దేవా, నిజముగా ఆ మాటలను వ్రాసిన ఆ కవి, దానిని వ్యక్తపరచడానికి పదములను వెదకుచు, వాటిని కనుగొనుటకు ప్రయత్నించినట్టి, నీయొక్క అనేకమైన ఇతర విశ్వాసుల వలెనే ఉన్నాడు. మరియు బైబిలులో ఈ విధంగా వ్రాయబడియున్నది, “ఇంకా, ప్రసంగి జ్ఞాని గనుక, అతడు సంగతులను పరిశీలించి అనేక మాటలను అనుక్రమపరిచాడు.” ఓ, అది నిజంగా ఏమైయున్నదో ప్రజలకు వివరించగలుగునట్లు ఆ భాషను మరియు పదజాలమును కలిగియుండుటకు మేము ఎంతగా ఇష్టపడుచున్నామో, కానీ అది మర్త్యమైన పెదవుల మీద కనుగొనబడజాలదు. నిత్యత్వమంతా ఉన్ననూ, దరిద్రులైన, తప్పిపోయిన, దౌర్భాగ్యులైన పాపులను రక్షించడానికి, పరలోకపు దేవుడు అసలు ఎలా భూమి మీదకు వచ్చాడన్నదానిని, అది బయలుపరచలేదనుటలో సందేహమే లేదు.

651 తండ్రీ, ఈ కొద్దిపాటి విరుగని మాటలు, లేదా నేను చెప్పవలసినదేమిటంటే, ఈ విరిగిన మాటల ద్వారా, ఈ ఉదయం, ఆశ్రయం కొరకు పరుగెత్తినవారు ఎవరైనా, సమాధానమును మరియు ఒక సంతృప్తిని మరియు ఒక బలమైన ఓదార్పును పొందియుండాలని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. మరియు అంత్య దినమున ఆయన వారిని లేపుతాడని, దేవుడు చేసిన వాగ్దానమునకు వారియొక్క ప్రాణము లంగరు వేయబడును గాక. ఈ భవనములో, సరిగ్గా ఇక్కడే ఈ ఆలయములో, అనేక చేతులు పైకి లేచినవి. దేవా, సరిగ్గా ఇప్పుడే, వారికి ఆ స్థిరమైన నిరీక్షణను దయచేయుము. వారు ఆ యుగముల బండకు లంగరు వేయబడుదురు గాక. సముద్రము ఎంతగా అల్లకల్లోలమైనప్పటికినీ మరియు వారి చిన్న దోనెలు ఎంతగా ఎగిరిపడినప్పటికినీ, వారు ఒక లంగరును కలిగియున్నారు, దేవునియొక్క వాగ్దానమును కలిగియున్నారు. “దేవుడు దానిని చెప్పాడు. ఆయన అబద్ధమాడలేడు,” అంటూ వారు అక్కడే నిలిచియుంటారు.

652 ఈ ఉదయం నేను బోధించుటకు ప్రయత్నించినట్టి, “నా మాటలు విని,” “మరియు, నన్ను పంపిన యెహోవాయందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు; మరియు అతడు తీర్పులోనికి రాక, మరణమునుండి జీవములోనికి దాటియున్నాడు.”

653 ఓ నిత్యుడా, ఈ దినమున వారిని ఆశీర్వదించుము. మరియు రక్తము క్రింద లేకుండా ఉన్నవారు, వారి ఆత్మ ఎన్నడూ మార్పుచెందకుండా ఇక్కడున్నట్టి ప్రతీ వ్యక్తి, ప్రభువా, ఇప్పుడే అది జరుగును గాక. నీవే మర్మమును జరిగించుము. అదంతా నీదేయైయున్నది. అది నీకు అప్పగించబడియున్నది. నీవు వారికి దానిని అనుగ్రహిస్తావని, నిత్యజీవమును అనుగ్రహిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. మేము, ఒకరి తరువాత ఒకరము ఆ లోయ గుండా అక్కడికి వెళ్తుండగా, ఏదో ఒక దినమున, ఆ అవతలి ఒడ్డున, ఎక్కడైతే వారు ఇక ఎన్నడూ “వీడ్కోలు” చెప్పుకోరో అటువంటి ఆ చోటున మేము కలుసుకొందుము గాక.

దుఃఖము యొక్క చివరి తలంపులు తొలగిపోయినప్పుడు;

ఏదో ఒక రోజు ముగింపు సమయములో మనం ఆ నది యొద్దకు వస్తాము,

మనకు మార్గము చూపే ఒకాయన అక్కడ వేచియుంటాడు,

నేను యోర్దానును ఒంటరిగా దాటవలసిన అవసరంలేదు.

నాకు మార్గమును చూపే ఒకాయన, అక్కడ వేచియుంటాడు,

నేను యోర్దానును దాటవలసిన అవసరంలేదు…

654 ఆ నిరీక్షణను కలిగియున్న వారందరూ, ఇప్పుడు మీరు మీ తలను పైకెత్తుచుండగా మీ చెయ్యిని పైకెత్తండి.

నేను…

ఇప్పుడు కేవలం ఆయనను ఆరాధించండి. వర్తమానము ముగిసినది. మీరు సంతోషంగా లేరా? దేవుడు ప్రమాణము చేసాడు…దేవుడు తాను నిన్ను అక్కడ కలుస్తాడని ప్రమాణము చేసాడు.

నా పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు యేసు మరణించాడు;

చీకటి కమ్మినప్పుడు నేను…(మీరేమని చెప్తారు? ముల్లు విరిగిపోయినది.) ఆయన నా కొరకు వేచియుంటాడు,

నేను యోర్దానును ఒంటరిగా దాటవలసిన అవసరంలేదు.

అనేక పర్యాయాలు నేను విడిచిపెట్టబడ్డాను, మరియు అలసిపోయాను…

ఇప్పుడే కేవలం ఆయనను ఆరాధించండి.

…నా స్నేహితులందరూ వెళ్ళిపోయినట్లు కనబడుచున్నది;

మీరెన్నడైనా ఆ పరిస్థితికి చేరుకున్నారా?

అయితే నన్ను ఉత్సాహపరిచే…(వాగ్దానము ఏమిటి?)…నా హృదయమును సంతోషపరిచే ఒక ఆలోచన ఉన్నది,

నేను యోర్దానును దాటవలసిన అవసరంలేదు…

655 ఇప్పుడు, వాగ్దానపు పిల్లలారా, దానిని చేసినందుకు కేవలం ఆయనను ఆరాధించండి.

నేను యోర్దానును ఒంటరిగా దాటవలసిన అవసరంలేదు,

నా పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు యేసు మరణించాడు;

ఇప్పుడు ఏమి జరుగుతుంది?

నేను ఆ అంధకారమును చూసినప్పుడు, ఆయన నా కొరకు వేచియుంటాడు,

నేను యోర్దానును ఒంటరిగా దాటవలసిన అవసరంలేదు.

నేను ఆ నది యొద్దకు వచ్చినప్పుడు…

మీలో ప్రతి ఒక్కరూ వస్తున్నారు. అక్కడ మీ ఎదుట పెద్ద, అంధకారపు ఛాయ ఒకటి ఉన్నది. అది ఒక పెద్ద ద్వారమైయున్నది. ఈ దినములలో ఏదో ఒక రోజు, మీరు దానిలోనికి వెళ్ళబోతున్నారు, బహుశా ఈ రోజు పూర్తవ్వకముందే కావచ్చును, బహుశా ఈ ఉదయం సంఘము మూయబడుటకు ముందే కావచ్చును. మీరు అందులోనికి వెళ్తున్నారు. ఆ గుండె కొట్టుకున్న ప్రతిసారి, మీరు ఒక అడుగు దగ్గరవుతున్నారు.

అయితే నేను అంధకారమును చూసినప్పుడు, ఆయన అక్కడ వేచియుంటాడు,

ఆయన అలా చేస్తానని చెప్పాడు. ఆయన అలా చేస్తానని ప్రమాణం చేసాడు.

అప్పుడు నేను యోర్దానును ఒంటరిగా దాటవలసిన అవసరముండదు.

656 ఓ ధన్యకరమైన ప్రభువా, ఈ ఉదయం, మా హృదయములు, పొంగిపోయేంతగా నిండియున్నవి.

657 నాడి కొట్టుకోవడం ఆగిపోతున్న ఆ సమయం గురించి ఆలోచించుటకే ఎలాగున్నదో, మరియు నర్సు మీ తల చుట్టూ దిండును సర్దుతుంది. మరియు మీ చేతులను, మీరు ఇక ఎంతమాత్రము కదిలించలేరు. మీ చేతులు గడ్డకట్టినట్లు అయిపోతాయి. మీ పిల్లలు, మీ తల్లి, మీ ప్రియమైనవారు కేకలు పెడుతూ ఏడుస్తుంటారు. ఆవలిన ఆ పెద్ద తలుపు తెరుచుకుంటుంది. ఆయన వేచియుంటాడు.

658 దావీదు ఇట్లన్నాడు, “నేను పాతాళమందు పండుకొనినను, ఆయన అక్కడను ఉంటాడు.” నేను దానిని ఒంటరిగా దాటవలసిన అవసరంలేదు. ఆ నదియొక్క జల్లు మన ముఖము మీద ఎగిసిపడుతుండగా, దేవుడు ఆ రక్షక నౌకను తీసుకొని, మనలను నేరుగా దాని ఆవలికి నడిపిస్తాడు. ఆయన అలా చేస్తానని వాగ్దానము చేసాడు. ప్రవక్తయైన దావీదు ఇట్లన్నాడు, “అవును, మరణఛాయ లోయలో నేను నడచినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాతో ఉన్నావు. నీ దుడ్డుకర్ర మరియు నీ దండము, అవి నన్ను ఆదరించును.”

659 ప్రభువా, మేము వాగ్దానమునకు వారసులముగా ఎంచబడినందుకు, ఈ రోజు మేము ఎంతో సంతోషముగా ఉన్నాము. ఈ రోజు మేము మాలో నిత్యజీవమును కలిగియున్నాము, ఎందుకనగా మేము ప్రభువైన యేసును ప్రేమించి మరియు ఆయనను నమ్మియున్నాము, మరియు ఆయనయొక్క వాక్యమును మరియు ఆయనయొక్క ఉపదేశమును అంగీకరించియున్నాము. మరియు మా విశ్వాసమునకు ముద్రగా, పరిశుద్ధాత్మను, పరిశుద్ధాత్మ అనే ముద్రను, ఆయన మాకు అనుగ్రహించాడు. మాలో ఉన్న మా విశ్వాసము లంగరు వేయబడియున్నది. మరియు అనేకసార్లు మేము అంధకార ఛాయలగుండా నడచి వెళ్తున్ననూ, అనేకసార్లు మేము మార్గములో తడబడుచున్ననూ, మా లంగరు ఇంకనూ పట్టియుంచుతుంది. మార్గదర్శకత్వము చేస్తూ, “ముందుకు కొనసాగుతూనే ఉండండి. మనం ముందుకు వెళ్తున్నాము,” అని చెప్తున్నది ఏదో, ఆ ఆవలిన, దానిలో ఉన్నది.

660 దేవా, మమ్మల్ని దీవించుము. మాకు నీవు అవసరమైయున్నావు. నీవు మా కొరకు వచ్చేవరకు మమ్మల్ని ఎంతో విశ్వాసనీయముగాను నమ్మకముగాను ఉంచుము, అంతము లేని ఆ యుగములలో మేము నిన్ను స్తుతిస్తాము. మరియు ఆ రోజు మేము భూమి మీద నిలబడినప్పుడు…మరి ఆయనయొక్క ధన్యకరమైన పాదములు ఇంకనూ భూమిని తాకలేదు. అదిగో ఆయన అక్కడ గాలిలో నిలబడతాడు; మరియు పరిశుద్ధులందరూ మరియు అన్ని కాలముల నుండి, ప్రతీ జామునుండి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, మరియు ఏడవ దానినుండి, విమోచించబడిన వారందరూ ఆయనయొక్క నీతి వస్త్రములో అక్కడ నిలబడతారు; రాజులకు రాజుగాను మరియు ప్రభువులకు ప్రభువుగాను మేమాయనకు కిరీటము ధరింపజేసి, మరియు ఆ విమోచనా గాథలను పాడుతాము. మమ్మల్ని ప్రేమించి మరియు మా కొరకు తననుతాను అర్పించుకున్న ఆయనను మేము చూడగా మా దీనమైన హృదయాలు వణుకుతాయి. మేము ప్రేమించబడలేనివారమై మరియు పాపులమైయ్యుండగనే, మేము రక్షించబడునట్లు క్రీస్తు మా కొరకు మరణించాడు. తండ్రీ, దానిని బట్టి మేము నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాము, క్రీస్తు నామములో. ఆమేన్.

661 మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? ఓ, ఆయన ఎంత వాస్తవమైయున్నాడు కదా. మీరు కేవలం ఏదో ఒక విధంగా ఆయనను కౌగిలించుకోవాలని కోరుచున్నట్లు మీకు అనిపించడంలేదా? మీకు తెలుసు కదా, కేవలం అలా ప్రాకుతూ వెళ్ళి మరియు ఆయన పాదములను ముట్టుకొనుటకు మీరు ఇష్టపడరా?

662 మీకు తెలుసా, ఆరిజోనాలోని, ఫినిక్స్ లో, నా కూటములకు వచ్చే కొందరు ప్రజలు, ఇట్లనేవారు, “నేను ఆయనతో దాని గురించి మాట్లాడగోరతాను. ‘ప్రభువా, నా మార్గము ఎంతో మసకబారినప్పుడు నీవు నన్ను ప్రేమించావు,’ అని చెప్పుటకు నేను ఇష్టపడతాను.” నేనైతే మనం దాటివెళ్ళడానికి ముందే ఆయనతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నాను. నేను—నేను ఆయనను చూడగోరుతున్నాను. నేను—నేను—నేను ఆయనను చూడగోరుతున్నానంతే. ఆయన అక్కడ నిలబడియుండుటను నేను చూసినప్పుడు నాకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది, నా దీనమైన హృదయం ఎలా వణికిపోతుంది అనేదాని గురించి ఆలోచించడానికి ఎలాగున్నదో.

663 “‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న, సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను’ అని ఆ స్వరము చెప్పుటను నేను వినగలిగియుంటే బాగుండును,” అని నేను తరచుగా అనుకునేవాణ్ణి.

664 అచ్చంగా అప్పుడు ఆయన దానిని పలికిన అదే విధంగా బహుశా నేను దానిని ఎన్నడూ వినలేకపోవచ్చును, కానీ ఆయన ఇట్లు చెప్పడాన్ని నేను వినగోరుతున్నాను, “ఇది చివరి దినమైయున్నది. భళా, నమ్మకమైన నా మంచి దాసుడా, ఇప్పుడు నీ కొరకు సిద్ధపరచబడిన ప్రభువుయొక్క సంతోషములలోనికి ప్రవేశించుము.” ఎప్పటినుండి సిద్ధపరచబడినది?

665 “నీవు రక్షించబడినప్పటినుండా?” కాదు, సహోదరుడా.

666 “జగత్తు పునాది వేయబడినప్పటి నుండే, నేను నిన్ను చూసి మరియు నిన్ను ముందుగా ఎరిగియుండి, మరియు నిత్యజీవమునకై నిన్ను ముందుగా నిర్ణయించినప్పుడేయై యున్నది,” అప్పుడే నీవు ఆశీర్వదించబడ్డావు. “ఆయన ముందుగా ఎరిగియున్న వారందరినీ, ఆయన పిలిచాడు.” అది నిజమేనా? “ఆయన పిలిచినవారందరినీ, ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో, ఆయన వారిని ఇదివరకే మహిమపరిచాడు.” విషయం అదేయైయున్నది. ఆయన మనల్ని ముందుగా ఎరిగియున్నాడు, మనల్ని పిలిచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మరియు మనము ఇదివరకే ఆయనతో మహిమపరచబడియున్నాము, ప్రపంచముయొక్క అంతములో, మన బహుమానము నొద్దకు వెళ్తున్నాము. మీకు సంతోషంగా లేదా? నిశ్చయంగా, అది మీరు ఆయనను ప్రేమించేలా చేస్తుంది. మీకు మీరే సహాయము చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మరి ఇదిగో ఆయన వచ్చి మీ కొరకు దానిని చేసాడు.

667 పట్టియుంచే ఆ బంధము దీవించబడును గాక, సహోదరి గెర్టీ. “క్రైస్తవ ప్రేమయందు మన హృదయములను పట్టియుంచే బంధము,” మనమిప్పుడు ఆరాధనతో కూడిన ఈ చిన్న సహవాసమును కలిగియుంటుండగా దానిని వాయించుము, పిదప మనము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయం క్రీస్తునకు మీ చేతులను ఎత్తిన మీరు, ఆయనను ఆరాధించడానికి ఒక స్థలమును కనుగొనండి, ఆయనను సేవించండి.

668 ఇప్పుడు, మనము, మెథడిష్టులు, చర్చ్ ఆఫ్ గాడ్ కు చెందినవారు, అసెంబ్లీ ఆఫ్ గాడ్ కు చెందినవారు, ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, కాథలిక్కులు, మనమంతా కలిసి, ఒక సంఘ సమూహముగా ఆయనను ఆరాధించుదాము. ఇప్పుడు అందరము కలసి, ఇప్పుడు మనం పాడదాము.

క్రైస్తవ ప్రేమయందు మన హృదయములను

పట్టియుంచే ఆ ధన్యకరమైన బంధము దీవించబడును గాక;

ఏకమనస్సుగల సహవాసము

పైనున్న దానిని పోలియున్నది.

మన తండ్రియొక్క సింహాసనము యెదుట,

మన ప్రగాఢమైన ప్రార్థనను మనము కుమ్మరిస్తాము;

మన భయనిరీక్షణలు, మరియు మన ఆశయాలు, ఒక్కటే,

మన ఆదరణ మరియు మన చింత ఒక్కటే.

మనము వెళ్ళిపోతున్నప్పుడు,

అది మనకు అంతరంగ వేదనను కలుగజేస్తుంది;

అయితే మనం ఇంకనూ కలుపబడియుంటాము…(ఎంతమంది మెథడిస్టులు, బాప్టిస్టులు, ఇంకా మిగతావారున్నారు?)

మరియు మరలా కలుసుకుంటామని నిరీక్షణ కలిగియుంటాము.

669 అది మీకు మేలు చేయదా? ఇప్పుడు మనం దానిని మరలా పాడుచుండగా, మనం చుట్టూ తిరిగి ఒకరితోనొకరము కరచాలనం చేద్దాము.

యెదుట…

మీ వెనుక, మీ ముందు, ఇరువైపులా ఉన్న ఎవరితోనైనా, కరచాలనము చేయండి.

…సింహాసనము,

మన ప్రగాఢమైన ప్రార్థనను మనము కుమ్మరిస్తాము;

మన ఆదరణ మరియు మన చింత ఒక్కటే.

ఇప్పుడు మనము వెళ్ళిపోతున్నప్పుడు,

మనము ఒకరినొకరము ప్రేమిస్తాము.

అది కలుగజేస్తుంది…

కూడిక ఇంకా కొనసాగాలని కోరుచున్నారా? చూశారా? మనం అలాగే ఆలోచిస్తాము.

…అంతరంగ వేదనను కలుగజేస్తుంది;

అయితే మనము ఇంకనూ హృదయములో కలుపబడియుంటాము, (ఏకముగా కలుపబడియుంటాం)

మరియు మరలా కలుసుకుంటామని నిరీక్షణ కలిగియుంటాము.

ఇక ఇక్కడ కానియెడల, ఆ గొప్ప దినమున మనము కలుసుకుంటాము.

670 ఇప్పుడు, తండ్రీ, ఈ ఉదయం మా ఆరాధనను స్వీకరించుము. వాక్యమును తీసుకొని మరియు దానిని విశ్వాసుల హృదయాలలో నాటుము. వారు కేవలం కొట్టుకొనిపోతూ, మరియు ఈ రోజు ఉత్సాహంగా మరియు రేపు నిరుత్సాహంగా ఉండకుందురు గాక, అయితే ఈ మాటలు ప్రతి విశ్వాసి హృదయములో వాటియొక్క విశ్రాంతి స్థలమును కనుగొనును గాక. అవేమిటనగా, “దేవుడు ఒక వాగ్దానము ద్వారా ప్రమాణము చేసాడని, మరియు రెండు నిశ్చలమైన సంగతులు కలవు అని ఎరుగుటయైయున్నది. దేవునియొక్క నిశ్చలమైన తత్వము, అదేమిటనగా, అది, ఆయన అబద్ధమాడటం అసాధ్యము, తద్వారా ఈ రక్షణకు వారసులైనవారు ఈ బలమైన నిరీక్షణను కలిగియుండి, స్థిరముగాను, నిశ్చయతతోను, ఆత్మలో ఒక లంగరును కలిగియుండుటకైయున్నది.” దీనిని ఎరిగియున్నాము, అదేమిటనగా, “ఒక ప్రమాణము చేయబడిన ఒట్టు ద్వారా, దేవుడు మాకు వాగ్దానము చేసాడు. ఒకటి, ఆయన అబద్ధమాడలేడు; మరొకటి, దానికి పైగా, అంత్య దినమున ఆయన మమ్మల్ని పైకి లేపి, మరియు మాకు నిత్యజీవమును ఇస్తాడని ఆయన ప్రమాణము చేసాడు.” దీనిని ఎరిగియున్నాము, అదేమిటనగా “మేము పిలువబడిన తర్వాత, జగత్తు పునాది వేయబడకమునుపే, ఆయన మమ్మల్ని ఎరిగియున్నాడని, మరియు యేసుక్రీస్తు ద్వారా పిల్లలమగునట్లు మమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నాడని ఆయన చెప్పాడు. మరియు ఆయన మమ్మల్ని ముందుగా ఎరిగియున్నాడు. ఆయన మమ్మల్ని పిలిచాడు. మరియు ఆయన మమ్మల్ని పిలిచినప్పుడు, ఆయన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు.” మమ్మల్ని మేము నీతిమంతులుగా తీర్చుకోలేము, కావున ఆయన తన స్వంత కుమారునియొక్క మరణము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. “ఆయన ఎందరినైతే నీతిమంతులుగా తీర్చాడో, ఆయన వారిని ఇదివరకే మహిమపరిచాడు.” వాక్యము ఇదివరకే పలుకబడినది. మరియు మేము కేవలం మా దారిలో ఉన్నాము, కొనసాగుతూ, మహిమకు వెళ్ళే మా మార్గములో ఆనందిస్తూ వెళ్తున్నాము.

671 ప్రజలకు విశ్వాసమును దయచేయుము, మరియు ప్రజలను పట్టుకొని వ్రేలాడుతున్న ఆ చిన్న అలవాట్లు మరియు ఆ సంగతులు, నిశ్చలమైనదియు నిశ్చయమైనదియునైన అంతరంగపు లంగరైయున్న ఈ దేవునియొక్క వాక్యముతో, ఈ ఉదయం, వారు, తమనుండి వాటిని దులుపుకొందురు గాక. వారు తమ అలవాట్ల నుండి, వారి చిన్న కోపముల నుండి తమను తాము కుదిపివేసుకొందురు గాక. మరియు చెప్పబడిన సంగతులు…కొద్ది రోజుల తర్వాత వర్తమానముయొక్క తరువాతి భాగంలో, పౌలు చెప్పినట్లుగా, “మేము ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టుదుము గాక, తద్వారా మేము మా విశ్వాసమునకు కర్తయు దానిని ముగించువాడునుయైన; యేసుక్రీస్తు వైపు చూస్తూ, మా యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుటకైయున్నది, ఆయన సమస్త విషయములలోను మా వలెనే శోధింపబడినను, పాపము చేయలేదు.” ఆయన శోధించబడుటకు అనుమతించబడ్డాడు, అయితే ఆయన శోధనను లక్ష్యపెట్టలేదు. మరియు మేము కూడా పాపమునకై శోధించబడతాము, అయితే దానిని లక్ష్యపెట్టడానికి కానే కాదు. ఎందుకనగా మాలో ఉన్న జీవమే మా నిత్యమైన గమ్యమునకు లంగరైయున్నది, మరియు మేము దానిని పవిత్రముగా మా హృదయమునకు హత్తుకొనియుంటాము.

672 ఇప్పుడు, సాతానుడు బాధలతో పీడిస్తున్న అనేకులు ఇక్కడున్నారు. తండ్రీ, మేము వారి కొరకు ప్రార్థించబోతున్నాము. వారు, ఈ రోజు వారు దేవునియొక్క వాక్యము క్రిందనుండి వెళ్తుండగా…బోధించబడిన ఆ ప్రశస్తమైన వాక్యము, మరి బైబిలు సాక్ష్యమిచ్చుచున్నది, దేవుని దూతలు సమీపముగా నిలబడియున్నారు, మరియు సమస్తమునకు పైగా ఆ గొప్ప పరిశుద్ధాత్మ, వాక్యము గురించి సాక్ష్యమిచ్చుటకు ఇక్కడ నిలబడియున్నాడు. ఇప్పుడు, తండ్రీ, వారు వాగ్దాన వాక్యము క్రిందనుండి వెళ్తుండగా, ఈ ఉదయం, బాగుచేయబడి వారు ఇక్కడ నుండి వెళ్ళుదురు గాక. వారి కట్లను తీసివేసి, వారి కుర్చీలను మరియు—మరియు వారు పడుకొనియున్న మంచాలను వదిలివేసి, మరియు పూర్తిగా బాగుచేయబడి వెళ్ళుదురు గాక. ప్రభువా, దానిని దయచేయుము. వారు రావడానికి అనుమతించబడిన ఈ తరువాతి కూటమునకు వారు తిరిగి వచ్చెదరు గాక, లేదా వారు సంతోషిస్తూ, క్రీస్తు చేసిన గొప్ప కార్యములను చూపిస్తూ తమ స్వంత సంఘములకు, వెళ్ళుదురు గాక. నీ మహిమార్థమై మేము ఈ పరిచర్యను చేస్తున్నాము, యేసు నామములో. ఆమేన్.

673 నేను చేసిన ఒక వాగ్దానము కొరకు నేను క్షమాపణ చెప్పవలసియున్నది, అదేమిటనగా ఈ ఉదయం మనం 7వ అధ్యాయమును తీసుకుంటామని చెప్పాను, కాని నేను దాని యొద్దకు రాలేదు. మరియు ఈ—ఈ ప్రార్థనా వరుస కొరకు మనము ఇక్కడ కొంచెము సమయము ఇవ్వవలసియున్నాము. మరియు ఇప్పుడు, ఈ రాత్రి, ప్రభువు చిత్తమైతే, మనము 7వ అధ్యాయమును తీసుకొని, మరియు ఈ మెల్కీసెదెకు ఎవరో కనుగొంటాము. ఎంతమంది తెలుసుకోడానికి ఇష్టపడుతున్నారు? ఓ, మనం నేరుగా ఆయన యొద్దకు వెళ్తున్నాము, సరిగ్గా ఆయన ఎవరన్నది కనుగొంటాము. మరియు ఆయన ఎవరన్నది లేఖనము చెప్పుచున్నది. చూశారా?

674 మరియు అది “ఒక యాజకత్వము” అని స్కోఫీల్డ్ చెప్పాడు. ఆదియైనా అంతమైనా లేకుండా, అది ఒక యాజకత్వము ఎలా అవుతుంది? మీరు చూడండి, అది యాజకత్వము కాదు. అది ఒక మనుష్యుడైయున్నాడు, మెల్కీసెదెకు (ఒక పేరు), ఒక వ్యక్తియైయున్నాడు.

675 ఎలాగంటే, తక్కువ చేయడం కాదు గాని, క్రిస్టియన్ సైన్సు పరిశుద్ధాత్మ అనేది “ఒక ఆలోచన” అని చెప్తుంది. మరియు బైబిలు గ్రంథమేమో, “ఆయన, పరిశుద్ధాత్ముడు” అని చెప్పినది. మరియు ఆయన అనేది ఒక వ్యక్తిగత సర్వనామము. అది ఒక వ్యక్తియైయున్నాడు; ఒక ఆలోచన కాదు. అది ఒక వ్యక్తియే. ఖచ్చితంగా.

676 మరియు మెల్కీసెదెకు ఒక మనిషైయున్నాడు, దినములయొక్క ఆదియును లేదా సంవత్సరములకు అంతమును కలిగిలేని ఒక మనిషైయున్నాడు. ఆయనకు తల్లియైనా లేదా తండ్రియైనా, లేదా వంశావళియైనా లేదు. మరియు ప్రభువు చిత్తమైతే, ఈ రాత్రి, వాక్యము ద్వారా, ఆయన ఎవరో మనము కనుగొంటాము. మీరు దానిని ప్రేమిస్తున్నారా? ఓ! “నీ వాక్యము నా త్రోవకు మరియు నా పాదములకు ఒక దీపమైయున్నది.” ఓ!

677 ఇప్పుడు, మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, నాకు అదంతా అర్థం కావడంలేదు.” నాకు కూడా అర్థం కాదు.

678 అయితే, ఒకసారి, నేను కెంటకీలో బోధిస్తున్నాను. మరియు లేఖనముయొక్క ఈ లోతైన, ఘనమైన సంగతులు బహుశా అర్థం కానటువంటి, క్రొత్తగా వచ్చినవారు, మరియు క్యాథలిక్కులు మరియు వివిధమైనవారి కొరకు చెప్తున్నాను. నేను దైవిక స్వస్థత గురించి బోధిస్తున్నాను. కాళ్ళకు చెప్పులు-లేకుండా ఉన్న ఒక చిన్న అమ్మాయి…ఆమెకు పదిహేను సంవత్సరాలైనా లేవు, ఒక చిన్న బిడ్డను కలిగియున్నది, మరియు ఆ బిడ్డకు పక్షవాతమున్నది. నేను ఇట్లన్నాను, “సహోదరీ, నీ బిడ్డకు ఉన్న, సమస్య ఏమిటి?”

679 ఇట్లు చెప్పినది, “బిడ్డకు కుదుపులు వస్తున్నాయి.” పక్షవాతమును, ఏమని చెప్పాలో ఆమెకు తెలియలేదు. దానిని ఏమనాలో ఆమెకు తెలియలేదు.

680 బహుశా తన జీవితంలో ఎన్నడూ, ఒక జత చెప్పులను వేసుకొనని ఒక చిన్నది. ఎవరో ఒక పురుషునికి ప్రియమైనది, పొడవాటి తల వెంట్రుకలు క్రిందికి వ్రేలాడుతున్నాయి. నేను ఇట్లన్నాను, “నీవు నమ్ముతున్నావా?”

681 మరియు ఉక్కు-బూడిద రంగులో ఉన్న ఆ చిన్న కళ్ళు నా వైపు చూసాయి. ఆమె ఇట్లన్నది, “అవును, అయ్యా. నేను నిశ్చయంగా నమ్ముతున్నాను.”

682 నేను ఆ చిన్న బిడ్డను తీసుకున్నాను. మరియు నేను తన కొరకు ప్రార్థిస్తుండగా, తాను కుదపడమును ఆపివేసినది. అహ-హ. మరియు అది వదిలిపెట్టినది, వదిలిపెట్టినది.

683 మరుసటి రోజు, నేను ఒక కొండ ప్రక్కన, ఉడుతలను వేటాడుతున్నాను. ఒక వ్యక్తి మాట్లాడుతూ అక్కడ కూర్చొనియుండటాన్ని నేను చూసాను, పాత రంపము శబ్దము వస్తున్నది. మరియు నేను క్రిందకు వెళ్ళాను. నేను ఉడుతలను వేటాడుతూ ఉన్నాను. వారు నా గురించి మాట్లాడుకుంటున్నారు, అక్కడ కూర్చొని, పొగాకు నములుతూ మరియు ఉమ్మి వేస్తూ ఉన్నారు, ఆ ఆకులు, అలా ఎగిరిపడుతున్నవి. మరియు వారు, ఇప్పుడు, ఆ గడిచిన రాత్రి జరిగిన కూటము గురించి వారు మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒకరు ఇట్లన్నారు, “నేను ఆ బిడ్డను చూసాను. ఈ ఉదయం, నేను అటువైపుగా వెళ్ళాను. ఈ ఉదయం వరకు కూడా, ఆ బిడ్డలో కుదుపులు లేవు.” చూశారా? “అది నిజము,” అని అన్నాడు. మరియు అతడు ఉమ్మివేస్తున్నాడు.

684 మరియు వారు తుపాకీలను చెట్టుకు ఆనించియున్నారు, కావున నన్ను నేను తెలియజేసుకోవడం మంచిదని నేను అనుకున్నాను. మీకు తెలుసా, అక్కడ కూడా వారు వైరములను కలిగియున్నారు. కావున, నేను అక్కడికి నడిచి వెళ్ళాను. “సహోదరులారా, శుభోదయము,” అని నేను అన్నాను.

685 భారీ కాయముతోనున్న ఆ వ్యక్తి, మాట్లాడుతున్నట్లు అగుపించినది, అతని నోటిలో పొగాకు ముక్క ఉన్నది, ఆ విధంగా, ఆ విధంగా బయటకు వచ్చినది, మరియు పెద్ద, పొడవైన మెడ కలిగియున్నాడు. మరియు అతడు ఒక పెద్ద పాత టోపీని పెట్టుకొనియున్నాడు, అతని ముఖము మీదుగా పెట్టబడియున్నది. అతడు తిరిగి నన్ను చూసాడు. అతడు పైకి లేచి ఆ టోపీని తీసివేసి, దీనిని దులుపుకొని, ఆ పొగాకు ముక్కను మింగివేసాడు, ఇట్లన్నాడు, “సంఘకాపరి గారు, శుబోధయం.” చూశారా? అవును, అయ్యా. గౌరవం. మరియు అది సరియైనది. అతడు దానిని ఎలా తట్టుకున్నాడో, నాకు తెలియదు, కానీ అతడు తట్టుకున్నాడు.

686 కావున, మరుసటి రాత్రి, తిరిగి వస్తుండగా, నాతో కొద్దిగా వాదించగోరిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. దైవిక స్వస్థతను నమ్మనటువంటి ఒక సంఘమునకు అతడు వెళ్తాడు. అయితే, ఇది కెంటకీ, వైట్ హిల్ లోని, ఒక మెథడిస్టు సంఘమైయున్నది. కావున అతడు—అతడు వెళ్ళాడు…అతడు బయట నిలబడియున్నాడు. అతని చేతిలో ఒక లాంతరు ఉన్నది. మరియు అతడు ఇట్లన్నాడు, “బోధకుడా, నేను ఒకటి చెప్పగోరుచున్నాను. నేను దానినసలు అంగీకరించలేను, ఎందుకనగా నేను దానిని చూడలేకపోతున్నాను.”

687 నేను ఇట్లన్నాను, “నీవు దానిని చూడలేకపోతున్నావా?”

688 అతడు ఇట్లన్నాడు, “లేదు.” ఇట్లన్నాడు, “స్వయంగా నేనే, ఒక వ్యాధిగ్రస్తుడను. కానీ,” ఇట్లన్నాడు “నేను దానిని అసలు చూడలేకపోతున్నాను.”

నేను ఇట్లన్నాను, “నీవు ఎక్కడ నివసిస్తావు?”

అందుకతడు ఇట్లన్నాడు, “ఆ వెనుక బిగ్ రేనక్స్ దగ్గర.”

నేను ఇట్లన్నాను, “సరి, నీవు ఇంటికి ఎలా వెళ్ళబోతున్నావు?”

అందుకతడు ఇట్లన్నాడు, “మంచిది, నేను ఇంటికి నడిచి వెళ్ళబోతున్నాను.”

నేను ఇట్లన్నాను, “నీకు నీ ఇల్లు కనబడుచున్నదా?”

అతడు ఇట్లు చెప్పాడు, “లేదు, అయ్యా.”

నేను ఇట్లన్నాను, “ఈ రాత్రి చాలా చీకటిగా ఉన్నది, మేఘాలు కమ్మియున్నాయి.”

అతడు ఇట్లన్నాడు, “అవును.”

నేను ఇట్లన్నాను, “మరి నీవు ఇంటికి ఎలా వెళ్తావు?”

అతడు ఇట్లన్నాడు, “ఈ లాంతరు ద్వారా.”

నేను ఇట్లన్నాను, “ఆ లాంతరు ఇక్కడనుండి ఒకేసారి ఇంటి వరకు వెలుగును ప్రకాశించదు కదా.” నేను ఇట్లడిగాను “మరి నీవు ఎలా వెళ్తావు?”

అందుకతడు ఇట్లన్నాడు, “ఓ, ఆ లాంతరు వెలుగును చూపించినంతవరకు నేను నడుస్తాను.”

689 నేను ఇట్లన్నాను, “అంతే. ఇప్పుడు నీవు లాంతరు వెలుగును కలిగియున్నావు, మరియు నీవు ఈ వైపునకు అడుగు వేసిన ప్రతిసారి, ఆ వెలుగు ఇంకా నీ ముందుకు చూపిస్తూనే ఉంటుంది. నీవు కేవలం నడుస్తూ ఉంటే చాలు, ఆ వెలుగు నీతో కొనసాగుతూనే ఉంటుంది.”

690 మరియు ఈ ఉదయం మీ అనారోగ్యం కొరకు, లేదా మీ రోగముల కొరకు, లేదా మీ అంతరాత్మ కొరకు, విజ్ఞాపనకర్తయును, గొప్ప ప్రధానయాజకుడునుయైన క్రీస్తు, మీకు కావాలంటే మీరు దానినే చేయండి. మీకు అది అర్థం కాకపోవచ్చును. మనకు అర్థం కాదు. అయితే “ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, మనమును వెలుగులో నడవవలెనని” మనకు ఆజ్ఞాపించబడినది. మీరు ఆ వెలుగులో ఒక్క అడుగు వేయండి. మరియు మీరు ఆ వెలుగును మీతో కలిగియున్నప్పుడు, ఆ వెలుగే పరిపూర్ణమైన దినమునకు ప్రకాశిస్తుంది. అదియే మార్గమును మీ ముందు ఉంచుతుంది.

మరియు మేము ఈ పాత గొప్ప రహదారిలో నడుస్తాము,

నేను ఎరిగియున్న దేనికంటెను,

ప్రభువా, నేను ఒక పాత-కాలపు క్రైస్తవుడిగానే ఉంటానని,

నేను వెళ్ళిన ప్రతి చోటా చెప్తూ ఉంటాను.

ఆ పాత పాటను ఎప్పుడైనా విన్నారా?

ఒక పాత-కాలపు క్రైస్తవుని వంటిది ఏదియు లేదు;

క్రైస్తవ ప్రేమ వంటిదేదియు లేదు;

మేము ఆ గొప్ప పాత రహదారిలో నడుస్తున్నాము,

మరియు మేము ఎరిగియున్న దేనికంటెను,

ప్రభువా, నేను ఒక పాత-కాలపు క్రైస్తవుడిగానే ఉంటానని,

మేము వెళ్ళిన ప్రతి చోటా చెప్తూ ఉన్నాము.

691 నాకు అది చాలా ఇష్టం. మంచిది. ఇప్పుడు మనము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. మేము…మేము రోగులను స్వస్థపరచగలమని మేము చెప్పుకోడంలేదు. మేము అలా చేసినట్లైతే, మేము ఏదో ఒక తప్పుడు విషయమును చెప్తున్నట్లవుతుంది. ఇక్కడున్న ప్రతీ వ్యాధిగ్రస్తుడు ఇదివరకే స్వస్థపరచబడియున్నాడు. లేఖనము దానినే చెప్పినది. “ఆయన పొందిన దెబ్బలచేత మనము స్వస్థతపరచబడియున్నాము.” అది నిజమేనా?

692 ఇక్కడున్న ప్రతీ పాపి, ఒకవేళ ఇక్కడ ఒకరు ఉన్నట్లైతే, యేసు మరణించినప్పటినుండే నీవు రక్షించబడియున్నావు. అయితే ఆయన సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు దానిని అంగీకరించుటకు ప్రయత్నించడానికి, నీకు ఎక్కడైతే అవకాశము ఇవ్వబడినదో అట్టి ఈ స్థలములో నీవు మరణించబోకు. అది ఇప్పటి కొరకే ఇవ్వబడినది. సరిగ్గా ఇప్పుడే నీవు దానిని స్వీకరించవలసియున్నది. నీవు ఆ రక్తమును దాటి వెళ్ళినట్లైతే, అప్పుడు నీవు ఇక వ్యర్థమే…నీవు ఇదివరకే తీర్పు తీర్చబడ్డావు, ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తముతో నీవు ఏమి చేసావన్నదానిని బట్టియే నీవు తీర్పు తీర్చబడతావు. చూశారా? మీరు…అక్కడ మీకు మీరే తీర్పు తీర్చుకుంటారు.

693 “అయితే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మరియు ఆయన పొందిన దెబ్బలచేత మనము స్వస్థపరచబడియున్నాము.” కాబట్టి, మిమ్మల్ని స్వస్థపరచడానికి, నేను కలిగియుండేది ఏదియు లేదు. మిమ్మల్ని స్వస్థపరచడానికి, సంఘము కలిగియుండేది ఏదియు లేదు. మీ విశ్వాసము విఫలమవ్వకూడదనియు, మీ రక్షకునిగా మీరు ఆయనను స్వీకరించినట్లే, క్రీస్తును మీ స్వస్థకునిగా కూడా స్వీకరించుటకు మీరు బలిపీఠము నొద్దకు రావలెనని మాత్రమే, మేము ప్రార్థన చేయగలము. మరియు…దేవుడు అద్భుతాలను చేస్తాడు. ఆయన గొప్ప సూచనను చూపిస్తాడు. గ్రుడ్డివారు, చెవిటివారు, మూగవారు, ప్రతి విధమైనవారు, సరిగ్గా ఇక్కడే ఆలయము వద్ద స్వస్థత పొందారు. అయితే అది జరిగినా జరుగకపోయినా, ఎలాగైనను, మేము దానిని స్వీకరిస్తాము. అనేకసార్లు ఆ కార్యములు దర్శనముల ద్వారా జరుగుతాయి.

694 మూడు లేదా నాలుగు ఆదివారముల క్రితం, గ్రుడ్డివాడును పక్షవాతము గలవాడునై, లేదా అసమతుల్య నరము కలిగియుండి, ఒక కుర్చీలో కూర్చొనియున్న ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మరి నేను ఇంటినుండి బయలుదేరకముందే, నేను అతణ్ణి ఒక దర్శనములో చూసాను, “తెల్లబడుచున్నట్టి, నల్లని వెంట్రుకలు కలిగి, ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు. అతని భార్య ఒక ఆకర్షణీయమైన-స్త్రీయైయున్నది, సుమారు అరవై ఏండ్ల వయస్సు గలది. ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటుందని,” మరియు ఆమె నన్ను అడుగుతుందని చూసాను. “మరియు తిరిగి వచ్చి తన భర్త కొరకు ప్రార్థించమని అడుగుతుంది.” అతడు సరిగ్గా అక్కడే కూర్చున్నాడు.

695 మరియు నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా సహోదరులైన కొందరితో నేను ఇట్లన్నాను, “దీనిని గమనించండి.”

696 మరియు మేము బలిపీఠము నొద్దకు వెళ్ళినప్పుడు, ఇతరులు ప్రార్థించారు. నేను ప్రార్థించుటకు వెళ్ళినప్పుడు, నేను వెంటనే దూరంగా వెళ్ళి మరియు తిరిగి ఇక్కడికి వచ్చాను. మరియు అతని భార్య లేచి మరియు అది ఎలా జరుగుతుందని ప్రభువు చెప్పాడో సరిగ్గా అలాగే పైకి వచ్చినది. అది ఆ విధంగా జరుగుతుందో లేదో అని, ప్రజలు గమనిస్తున్నారు. అది ఎన్నడూ విఫలం కాలేదు. మరియు కావున అతడు నడిచినప్పుడు…

697 అతణ్ణి ఇక్కడికి పంపినది, ఇండియానాలోని, బర్డ్స్ ఐ లో ఉన్నట్టి, డాక్టర్. ఆకెర్మన్, అనే వ్యక్తియని, తెలిసింది; అతడు ఒక క్యాథలిక్కైయున్నాడు, మరియు అతని కుమారుడు సెయింట్ మెయిన్రాడ్ లోని ఆశ్రమములో ఒక యాజకుడైయున్నాడు. మరియు డాక్టర్. ఆకెర్మన్ నా వేట సహచరుడైయున్నాడు, మరియు అతడే ఆ వ్యక్తిని ఇక్కడికి పంపించాడు. మరియు అతడిని పంపించునట్టి నల్లని-తలవెంట్రుకలు గల ఒక వ్యక్తిని ప్రభువు నాకు చూపించాడు, కానీ అతడెవరో నాకు తెలియలేదు.

698 నేను ఇట్లన్నాను, “అది డాక్టర్ ఆకెర్మెనేనా?”

699 అతడు ఇట్లు చెప్పాడు, “అది అతడే.” చూశారా? మరియు పిదప ఆ వ్యక్తి…

700 “అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది,” అని నేను చెప్పాను. క్రిందకు వెళ్ళాను. నేను ఇట్లన్నాను, “అయ్యా, లేచి నిలబడు.” గ్రుడ్డివాడును మరియు…అతనికి…ఆ—ఆ సమతుల్యత నరము పాడైపోయి ఉన్నాడు. అతడు తనను తాను అలా నిలబెట్టుకోలేకున్నాడు. చూశారా? సంవత్సరాల తరబడి ఆ విధంగానే ఉన్నాడు, మేయోస్ వారి దగ్గరకు మరియు అందరి దగ్గరకు వెళ్ళాడు. మరియు కేవలం అతని కొరకు ప్రార్థన చేసాను, మరియు అతడు లేపబడ్డాడు. అతడు నడుచుకుంటూ, అక్కడినుండి వెళ్ళిపోయాడు.

701 మొదట అతడు ఇట్లన్నాడు, “నేను నిన్ను చూడలేకపోతున్నాను.” పిదప అతడు ఇట్లు కేకవేసాడు, “అవును. నేను చూడగలుగుచున్నాను.” అక్కడ అతని కన్నులు తెరువబడినవి, అతడొక సాంప్రదాయబద్దుడు, అతని భార్య, ప్రెస్బిటేరియనైయున్నది.

702 “ప్రెస్బిటేరియనువారు, మరియు సాంప్రదాయవాదులు కేకలు వేయరు,” అని కొందరు అనుకుంటారు. అయితే మీరు వారిని వినియుండాల్సింది. నిశ్చయంగా. వారు కేకలు వేస్తూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వెనుకకు వచ్చి తన చక్రాల కుర్చీని తీసుకొని, మరియు ఏ ఇతర మనిషివలెనే, నడుచుకుంటూ వెళ్ళి మెట్లు దిగి వెళ్ళిపోయాడు, చూడగలిగాడు మరియు మాట్లాడగలిగాడు మరియు—మరియు మొదలగునవి చేయగలిగాడు.

703 గడచిన దినమున అతని నుండి ఒక ఉత్తరము వచ్చినది, లేదా, ఫోను వచ్చినది. సహోదరుడు కాక్స్ అతని యొద్దకు వెళ్ళాడని, నేను నమ్ముచున్నాను. “అతనికి కన్నులు మండుతున్న అనుభూతి కలుగుచున్నది,” అని చెప్పాడు. నిశ్చయంగా. అది నరమైయున్నది, కంటి నరములు పెరుగుతూ మరియు తిరిగి జీవమునకు వచ్చుచున్నవి, మీకు తెలుసా, మరియు వాటి స్థానమును తీసుకుంటున్నవి. శాపం తొలగించబడినది.

704 ప్రకృతి దాని పనిని అది చేసుకోడానికి మీరు అనుమతిస్తే, ప్రకృతికి ఏదియు అడ్డుగా లేకపోతే, అప్పుడది—అది సంపూర్ణ పట్టును పొందుకుంటుంది. ఒక రబ్బర్ పట్టీని మీ చేతి చుట్టూ వేసి, రక్తప్రసరణను ఆపివేసినట్లైతే, చివరకు మీ చెయ్యి చచ్చుబడిపోతుంది. ఇప్పుడు, ఎందుకనగా, సహజంగా, మీరు దానిని యదావిధిగా ఉండనిస్తే అది బాగానే ఉంటుంది. అయితే ప్రకృతికి ఏదో అంతరాయం కలిగించినది. అప్పుడు, మీరు దానిని చూడలేనియెడల, దానిని గ్రహించడానికి వైద్యుడికి ఏ మార్గమూ లేదు. అతడు ఏమి చూడగలడు, అతడు ఏమి అనుభూతి చెందగలడు: అనే రెండు విషయముల ద్వారా మాత్రమే అతడు పనిచేయగలడు. అతడు ఏమి చూస్తాడో మరియు అతడు ఏమి అనుభూతి చెందుతాడో: దాని ద్వారా మాత్రమే అతడు పనిచేయగలడు.

705 అతడు దానిని చూడలేకపోతే, అప్పుడు అది ఆత్మ సంబంధమైన విషయమై యుండవలసియున్నది. అప్పుడు, ఒకే ఒక్క కార్యమున్నది, ఒక్కటి మాత్రమే సంభవించగలదు; అదేమిటంటే మనము ప్రార్థిస్తాము, క్రీస్తు శాపమును తొలగిస్తాడు, దయ్యమును వెళ్ళగొడతాడు, మరియు అది సాధారణముగా, మంచిగా మారడం మొదలవుతుంది. అది బాగవుతుంది, మరియు దానిలోని విషయమంతా అదేయైయున్నది. “నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు.” అది నిజమేనా? అది సంఘమునకు ఒక వాగ్దానమైయున్నది. అది శక్తిని గూర్చిన ఒక వాగ్దానమైయున్నది. అది ఏమిటి? అది, అది మనతోనున్న ఆయనయొక్క సన్నిధియైయున్నది. ఇప్పుడు, ఈ ఉదయం పరిపూర్ణులుగా ఉండి సరిగ్గా ఆయన చేసిన అవే కార్యములను చేయకుండా, మనల్ని అడ్డగిస్తున్నది ఏమిటంటే, అది మనమింకను ఈ తెరలో ఉండుటవలనైయున్నది. చూశారా? అయితే, “ఓ, అవును” అని మనకు చెప్తున్న ఏదో ఒక అనుభూతిని మనమక్కడ కలిగియున్నాము. చూశారా?

706 మరియు మీరు మీ స్వస్థతను అంగీకరించినప్పుడు, ఆ తెర ఏమి చెప్పినప్పటికినీ లెక్క లేదు, వాక్యము ఏమి చెప్పినదో అదే ముఖ్యమైయున్నది. చూశారా? అంతే. అంతే. మరియు ఆ—ఆ—వాక్యము ఎల్లప్పుడు దేనికంటెను ప్రధానమైనదైయున్నది. దేవునియొక్క నిత్యమైన వాక్యము!

707 శారా వైపు చూడండి, ఆమె గర్భము మృతతుల్యమైయున్నది, తొంభై ఏండ్ల వయస్సు గలది, ఆమెకు పదహారు లేదా పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పటినుండి తన భర్తతో జీవించినది, కానీ పిల్లలు లేరు; అబ్రాహామునకు, వంద సంవత్సరాలు కలవు. దేవుడు పరిస్థితిని తారుమారు చేసి మరియు వారికి బిడ్డను ఇచ్చాడు. చూశారా? ఎందుకనగా, వారు నమ్మినారు. వారు లేనివాటిని, ఉన్నట్లుగా పలికారు. స్నేహితుడా, ఈ ఉదయం ఆ విధంగా ప్రవేశించు.

708 మరియు ఈ రాత్రి, మేము ఆశిస్తున్నాము…మీరందరూ మమ్మల్ని దర్శిస్తున్నయెడల, ఈ ఉదయం మిమ్మల్ని ఇక్కడ కలిగియుండుటకు మేము సంతోషిస్తున్నాము. దేవుడు మీకు తోడైయుండును గాక. మరియు ఈ సాయంకాలమునకు మీరు పట్టణములోనే ఉన్నట్లైతే, ఈ సాయంకాలము, మెల్కీసెదెకును గూర్చిన ఈ మిగతా కూటములో మిమ్మల్ని కలిగియుండుటకు మేము సంతోషిస్తాము. మరియు పిదప మీరు ఇక్కడ ఉండబోవడంలేని యెడల, మీరు మీ స్వంత సంఘమును కలిగియున్నట్లైతే, మీరు మీ స్వంత సంఘమునకు వెళ్ళండి. అది—అది మీయొక్క విధి నిర్వహణయైయున్నది. మీరు ఒక సంఘమునకు చెందియున్నట్లైతే, మీరు అక్కడికి వెళ్ళండి. ఇది కేవలం మేమిక్కడ కూడుకొని మరియు ఒకరితోనొకరు సహవాసము కలిగియుండే ఒక చిన్న ఆలయమైయున్నది. ఇప్పుడు, ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.

709 మరియు సహోదరి గెర్టీ మన కొరకు, గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు అనేదానిని వాయిస్తుంది. మరియు ప్రార్థన కొరకు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్రార్థనా వరుసలోనికి రావాలనుకున్నవారు, మీ విశ్వాసమును క్రీస్తుకు సమర్పించడానికి, మీ చెయ్యిని పైకెత్తండి. మంచిది. మీరు సంఘమునకు ఈ వైపున వరుస కట్టినట్లైతే, దయచేసి మీరు అలా చేసినయెడల బాగుంటుంది. మరియు వారు ఆ సీటును కేవలం కొద్దిగా క్రిందకు తీసుకుంటే, సహోదరుడా, దయచేసి, నీవు తీసుకుంటే బాగుంటుంది, తద్వారా అక్కడ నుండి ప్రజలను తీసుకొనివచ్చుటకు, మనకు అక్కడ కొంచెం స్థలం ఏర్పడుతుంది. ఇటు వైపునకు రండి.

710 మరియు ఇప్పుడు మనం పాడుచుండగా, మనము ప్రార్థన చేయబోవుచున్నాము. మరియు నేను ఇక్కడున్న సంఘపెద్దలను అడుగబోవుచున్నాను, మీరు ఏ సంఘశాఖకైనా లేదా ఏ సంఘమునకు చెందియున్నా, అది ఏమైనా ఫర్వాలేదు, మీరు దైవిక స్వస్థతను నమ్ముచున్నట్లైతే, రోగుల కొరకు ప్రార్థించడానికి, మీరు నాతో కూడా ఈ వేదిక మీద నిలబడతారా? మిమ్మల్ని ఇక్కడ కలిగియుండుటకు మేము సంతోషిస్తాము. ఏ సంఘశాఖయైనా, లేదా ఏ సంఘశాఖ కాకపోయినా, లేదా మీరు ఏమైయున్నా, మిమ్మల్ని కలిగియుండుటకు మేము సంతోషిస్తాము. ప్రార్థన కొరకు, ఇప్పుడు మీరు వస్తారా? పైకి వచ్చి నాతో కలిసి నిలబడండి.

సహోదరుడా నెవిల్, నీవు నూనెతో వచ్చినట్లైతే బాగుంటుంది.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...