హెబ్రీ పత్రిక, ఏడవ అధ్యాయము #1

హెబ్రీ పత్రిక, ఏడవ అధ్యాయము #1

 …రాత్రి, మరియు జాయిస్ పాడటాన్ని వినడం ఆనందంగా ఉంది. అదే ఒక అద్భుత కార్యమని మీకు తెలుసా? ఆ చిన్న అమ్మాయి, ఆమె దానంతటినీ ఎలా గుర్తుంచుకోగలుగుతుంది? మరియు ప్రతీ రాత్రి ఆమె మనకు ఒక క్రొత్తదానిని వినిపిస్తున్నది. ఆమె వాటన్నిటినీ ఎలా గుర్తుంచుకోగలుగుతుంది కదా, అది నిజంగా ఒక చిన్న మేధావి మెదడుయైయున్నది. ప్రభువు ఆ బిడ్డను దీవించును గాక.

2 ఇప్పుడు, రేపు, రెండున్నర-గంటలకు, ఇండియానా, చార్లెస్ టౌన్ లో, అంత్యక్రియల గృహము వద్దనైయున్నది. వీడిపోయినట్టి, మన ప్రియ సహోదరియైన, సహోదరి కాల్విన్ కు, రేపు మధ్యాహ్నం, ఆ—ఆ అంత్య క్రియల గృహము వద్ద మరియు సమాధి వద్ద, మనము ఆమెకు చివరి నివాళులను అర్పిస్తాము. ఈ రాత్రి మీరున్నట్లే ఒకప్పుడు జీవించి, మరియు ఏదో ఒక సమయమున మీరు కూడా దాటునటువంటి ఆ తెరను దాటియున్నది. మరియు కూటమునకు హాజరవ్వడానికి ఇష్టపడువారందరూ, ఇంకేంటి, రావడానికి మీకు స్వాగతమే. వారందరూ ఎంతో కాలంగా సంఘానికి వచ్చి, మరి ఆ విధంగా ఉన్నట్టి ఇక్కడున్న ఈ మందిరపువారు, వస్తారని ఎరుగుటకు, కాల్విన్ కుటుంబానికి నిశ్చయంగా అది ఒక గొప్ప సహాయంగా ఉంటుంది, సరి…మీరు అక్కడికి వస్తే మేము ఎంతో ఆనందిస్తాము. మరియు…అనేక సంవత్సరాల క్రితం, నా సహోదరుని భూస్థాపిత కార్యక్రమంలో ప్రసంగించినట్టి మన ప్రియ సహోదరుడు మెక్ కెన్నీ, ఈ భూస్థాపిత కార్యక్రమంలో, ముఖ్య భాగమును కలిగియున్నాడని నేను అనుకుంటున్నాను, మరియు వచ్చి ఆ—ఆ భూస్తాపిత కార్యక్రమాలలో అతనికి సహాయం చేయాలని నన్ను కోరినారు.

3 ఇప్పుడు, ఈ రాత్రి, నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను. నాకు చాలా పనులున్నాయి, ఎటు వెళ్ళాలో నాకు తెలియదు. అనేక ఫోన్లు వస్తున్నాయి, మరియు ఈ ప్రమాదాలు జరగడం మరియు ధ్వంసమైపోవడం, మరియు ప్రజలు ఫోన్లు చేయడం, రావడం వంటివి జరుగుతున్నాయి. ఎంతగా అంటే, నేను త్వరగా ఇక్కడికి రావడానికి, కేవలం కొద్ది క్షణముల ముందే, లూయీవిల్ నుండి బయలుదేరాను, మరి అనేక ఫోన్ కాల్స్ ను వదిలేసి వచ్చాను, అది చాలా శ్రమతో కూడిన పనైయున్నది మరియు ఇంకా, ఈ రాత్రి కూడా, చేయవలసియున్నానని నేను అనుకుంటున్నాను. మరియు ఇప్పుడు మేము వెళ్తుండగా మా కొరకు ప్రార్థించండి.

4 మరియు ఈ ఉదయమున, నేను—నేను నా—నా పాఠ్యభాగములోనికి, ఆ—ఆ—ఆ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములోనికి అసలు వెళ్ళనేలేదు. మరియు ఈ రాత్రి, మనము దానిని తీస్తుండగా, సహోదరుడు గ్రాహమ్ స్నెల్లింగ్ యొక్క కూటము గురించి నేను ప్రకటన చేయగోరుతున్నాను, ఆ బ్రిగ్హామ్ వీధి చివరన, ఆ టెంటు వద్ద జరుగుతున్నది. ప్రభు చిత్తమైతే, బుధవారం రాత్రికి నేను తిరిగి రావాలని కోరుతున్నాను. మరియు అప్పుడు కూటములో సహోదరుడు గ్రాహమ్ ను దర్శించడానికి, ఈ వారములో ఏదో ఒక సమయమున, మనము ఒక బృందముగా వెళ్ళనైయున్న ఒక ఫలానా రాత్రిని మనము నిర్ణయించుకుంటాము. మరియు…“ప్రజలు బాగా వస్తున్నారు,” అని అతడు చెప్తున్నాడు. మరియు—మరియు మనం వెళ్తే, ఈ సహాయమునకై అతడు మనల్ని అభినందిస్తాడు. సహోదరుడు గ్రాహమ్ స్నెల్లింగ్, మీలో ఎవరైనా ఆ కూటమునకు హాజరవుతున్నయెడల, లేదా హాజరవ్వగోరినయెడల, అది కేవలం ఇక్కడున్న ఆ బ్రిగ్హామ్ వీధి చివరన జరుగుతున్నది. అది ఎక్కడున్నదో ఎవరైనా మీకు చెప్తారు. సరిగ్గా ఆ ఆటస్థలముల చివరన, ఆ టెంటు వేయబడియున్నది. మీ సహకారాన్ని అతడు అభినందిస్తాడు. ఎందుకంటే, మనము ఒక మందిరముగా, అతనితో మన సహకారాన్ని నూరుశాతం ప్రతిజ్ఞ చేసాము, కావున మనము సహాయము చేయడానికి ప్రయత్నిస్తున్నాము.

5 ఇప్పుడు, పిదప త్వరలో, ప్రభు చిత్తమైనయెడల, కొన్ని రాత్రులలో, దేవుని చిత్తమైతే, మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయమునకు వస్తున్నాము, మరియు అక్కడ కూడా మనం ఒక గొప్ప సమయాన్ని కలిగియుండబోతున్నామని నేను అనుకుంటున్నాను.

6 ఓ, ఈ ఉదయం అద్భుత రీతిగా ప్రభువు మనల్ని ఆశీర్వదించాడు, ఆయన తన ఆత్మను మన మీద ఎలా కుమ్మరించాడు కదా! మరియు ఇప్పుడు, ఈ రాత్రి, ఆయన మరలా దానిని చేస్తాడని మనం ఎదురుచూస్తున్నాము; మరియు పిదప బుధవారం రాత్రి, మరియు ఇంకా అలాగే చేస్తాడని ఎదురుచూస్తున్నాము. మరియు—మరియు నేను రాలేని రాత్రులు, నేను బయటకు వెళ్ళినట్లైతే, దానిని కొనసాగించడానికి సహోదరుడు నెవిల్ ఇక్కడే ఉంటాడు.

7 నేను ఏమి చేయబోతున్నానో నాకు ఎన్నడూ తెలియదు, ఈ గంట ఇక్కడ ఉండవచ్చును, మరియు తరువాతి గంట కాలిఫోర్నియాకు పిలువబడవచ్చును. చూశారా, ప్రభువు ఎక్కడికి పంపుతాడో మనకు అసలు తెలియదు. ఆ కారణంచేతనే ప్రయాణ ప్రణాళికలను తయారు చేసి మరియు మేము—మేము ఫలానా-మరియు-ఫలానా దానిని చేస్తాము అని చెప్పడం నాకు కష్టము. నేను ఒక ఫలానా దానిని చేయడం ప్రారంభించవచ్చును, అయితే ప్రభువు నన్ను ఇంకెక్కడికో పంపిస్తాడు. చూశారా? కావున ఆయన ఏమి చేస్తాడో మనకు అసలు తెలియదు. కానీ, “ప్రభువు చిత్తమైతే” అని మనము అంటాము. మరియు “ప్రభువు చిత్తమైతే, మేము ఫలానా-మరియు-ఫలానా వాటిని చేస్తాము,” అని చెప్పవలెనని, బైబిలు గ్రంథములో, మనకు నియమించబడినదని లేదా ఆజ్ఞాపించబడినదని నేను అనుకుంటున్నాను. కావున మనము ఆ నిర్ణయాలను తీసుకోలేనియెడల…లేదా ఆ నిర్ణయాలను నెరవేర్చలేకపోయినయెడల, అది జరగాలన్నది ప్రభువు చిత్తం కాదేమో అని మనము అనుకుంటాము.

8 ఈ మధ్యనే ఒక రోజు, సహోదరుడు రాబర్సన్ మరియు సహోదరుడు ఉడ్ మరియు నేను ఆపివేయబడ్డాము. మరియు మేము, “ఎందుకు?” అని ఆశ్చర్యపోతూ ఉన్నాము. అక్కడ కూర్చొని, ఒక పటమును చూస్తూ, తిన్నగా క్రిందికి వస్తున్నాము, మరియు మేము ఒక రహదారి మీద నేరుగా ఉత్తరం వైపునకు యాభై మైళ్ళు నడుపుకుంటూ వెళ్ళిపోయాము. మరియు నాకు పద్నాలుగు సంవత్సరముల వయస్సు ఉన్నప్పటినుండి నేను ఆ రహదారి మీద ప్రయాణిస్తున్నాను. మరియు నేను దానిని అసలు ఎలా చేశానా అని నేను ఆశ్చర్యపోతున్నాను. మేము, మేము ముగ్గురము అక్కడ నిలబడియున్నాము. మేమంతా రహదారులలో ప్రయాణించినవారమే. సరిగ్గా పటమును చూస్తూనే, 130 రోడ్డు మీదనే వెళ్తూ, ఇల్లినాయిస్ గుండా వస్తూ, ఒక చిన్న మలుపు తిరిగాము, సూర్యుడు మాకు ఎదురుగా ఉండటానికి బదులు మా వెనుక ఉన్నాడని గమనించుకోలేదు. మేము దక్షిణమునకు బదులుగా ఉత్తరమునకు వెళ్తున్నాము. మరియు మొదటి విషయం మీకు తెలుసా, ఆ రోడ్డును దాటిన వెంటనే, నేను ఇట్లన్నాను, “ఇది సరియైన దారి కాదు.” అక్కడ చూసాము, మరియు ఆ మార్గమును దాటి, మేము యాభై మైళ్ళ దూరం వెళ్ళిపోయామని కనుగొన్నాము. నేరుగా అలాగే వెనుకకు వెళ్ళిపోయాము…?…

9 తర్వాత మేము తిరిగి వచ్చినపుడు, మేము—మేము మాట్లాడుకుంటున్నాము. నేను ఇట్లన్నాను, “ఎందుకలా జరిగినదో మీకు తెలుసా? మనము…ఇక్కడే ఎక్కడో జరిగియుండే ఒక భయంకరమైన ప్రమాదము నుండి తప్పించడానికి, ప్రభువు మనల్ని ఈ మార్గములోనికి దాటించి యుండవచ్చును, అది జరిగియుంటే వేరే విధంగా ఉండేది. ప్రభువును ప్రేమించువారికి సమస్తము సమకూడి మేలు కొరకు పనిచేయునని మనకు తెలుసు. దానిని మాత్రమే మనము మనస్సులో ఉంచుకోవలసియున్నాము.”

10 ఇప్పుడు, ఈ రాత్రి, ఒక చిన్న ఉపదేశ పాఠము కొరకు మనము ప్రారంభిస్తున్నాము. మరియు నేను…మనము ముగింపుకు చేరుకుంటామని నేను అనుకోవడం లేదు, బహుశా ఈ రాత్రి మనం చేరుకోవచ్చును, ఇది…ఇది సంఘమునకు, దశమభాగముల గురించి బోధించే గొప్ప అధ్యాయమైయున్నది. మరియు అది ఒక గొప్ప అంశమైయున్నది, ఎంతగా అంటే, మనము ఆ ఒక్క విషయం మీదనే, అనగా అబ్రాహాము మెల్కీసెదెకుకు దశమభాగములను ఎలా చెల్లించాడు, మరియు అది అవసరమా అనేదాని మీదనే వారములతరబడి ఉండవచ్చును.

11 ఈ ఫ్యాను వలన ఆ వెనుక ఎవరికైనా ఇబ్బంది కలుగుచున్నదా? దానిని ఆపివేస్తే మీకు బాగుంటుందా? ఆ ఫ్యానులలో దేనివలనైనా, ఎవరికైనా ఇబ్బంది కలుగుతున్నయెడల, మీ ముఖము మీదికి గాలి వీస్తున్నయెడల చెప్పండి. అట్లున్నయెడల, కేవలం మీ చేతులను పైకెత్తండి. మరియు, లేదా ద్వారపాలకులలో ఒకరిని పంపండి, ఇక్కడున్న సహోదరుని దగ్గరికి ఎవరినైనా పంపండి, మీ కొరకు అతడు దానిని ఆపివేస్తాడు. మరియు నేను దానిని నాకు దూరంగా ఉంచుతాను; నాకు ఉడకపోస్తుంది మరియు నాకు చెమటపడుతుంది, అసలు, మొదటి విషయమేమిటో మీకు తెలుసా, నా—నా గొంతు బొంగురుపోయింది. కావున, అది మీ ఇష్టం, ఎలాగైనా అది నాకు ఇబ్బంది కలిగించదు. ఇప్పుడు మీకు సౌకర్యవంతముగా ఉండాలని మేము కోరుతున్నాము.

మేము మీ సమయమును ఎక్కువగా తీసుకోడానికి ప్రయత్నించబోవడంలేదు, కానీ నేరుగా వాక్యములోనికి చూడబోతున్నాము. మరియు మనము దానిని చేయడానికిముందు, మనం కేవలం ఒక్క నిమిషము ఆ గ్రంథకర్తతో మాట్లాడుదాము.

12 ఇప్పుడు, పరలోకపు తండ్రీ, ఏమి దాచబడియున్నదో మాకు తెలియదు. అయితే మా ఎదుట మంచి సంగతులు ఉంచబడ్డాయన్న ఒకే ఒక్క విషయమును మేము ఎరిగియుండి, మరియు ఒప్పించబడ్డాము. ఏలయనగా, “దేవుడు తనను ప్రేమించువారి కొరకు ఏమి సిద్ధపరచెనో, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు,” అని వ్రాయబడియున్నది.

13 మరియు ఈ రాత్రి నీ గోదాములో, పరలోకపు కిటికీలను తెరచి, మరియు నీ వాక్యమును మాకు ఇస్తావని మేము ప్రార్థిస్తున్నాము, అది ఒక తగిన విషయమై, క్రైస్తవులుగా మా విశ్వాసమును పెంచుటకైన ఒక విషయమైయుండి, మరియు మేము లోపలికి వచ్చినప్పుడు మేము ఉన్నదానికంటే, సువార్తపై మమ్మల్ని మరింత—మరింత ఎక్కువగా స్థిరపరచునట్టి విషయమైయుండును గాక. తండ్రీ, దానిని అనుగ్రహించుము. పరిశుద్ధాత్మ దేవునియొక్క వాక్యమును తీసుకొని మరియు మా అవసరత కొలది ప్రతీ హృదయమునకు దానిని అందజేయును గాక. నీ ప్రియ కుమారుడైన, యేసు నామములో, మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్.

14 ఇప్పుడు, మనము నేరుగా 7వ అధ్యాయములోనికి వెళ్ళగలుగుటకు, ఈ ఉదయమున, 6వ అధ్యాయంలోని చివరి వచనము దగ్గర ఆపివేసాము.

ముందుగా వెళ్ళువాడైయుండి నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన కొరకు ప్రవేశించెను.

15 ఇప్పుడు మనము నేరుగా ప్రారంభించుకోడానికి, 7వ అధ్యాయములోని మొదటి మూడు వచనములను, లేదా మొదటి రెండు వచనములను, లేదా మొదటి మూడు వచనములను, మనము చదువబోతున్నాము.

రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును, ఎవడు కలుసుకొని, అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో (అక్కడే మీ దశమభాగములున్నవి) ఆ షాలేము రాజును, మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు;

నిరంతరము యాజకుడుగా ఉన్నాడు, అతని పేరుకు మొదట నీతికి రాజనియు,…తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి, షాలేము రాజని, అర్థము;

అతడు తండ్రిలేనివాడును, తల్లిలేనివాడును, వంశావళి లేనివాడును,…ఆదియైనను…జీవితకాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేనివాడునైయుండి; దేవుని కుమారుని పోలియున్నాడు.

16 ఎటువంటి ఒక అద్భుతమైన ప్రకటన! ఇప్పుడు ఈ గొప్ప లోతైన సత్యాలను త్రవ్వడానికి, మనము పాత నిబంధనలోనికి వెళ్ళవలసియుంటుంది. మరియు, ఓ, నేను వాటిని ఎంతగా ప్రేమిస్తున్నానో!

17 మీకు తెలుసా, ఆరిజోనాలో, మేము ఖనిజాన్వేషణ చేసేవారము. మిస్టర్. మెక్ ఎనాలి మరియు నేను, ఒక సరియైన భూభాగము వద్దకు వెళ్ళేవారము. మరియు ఎక్కడైతే ఒక చిన్న కాలువలో, చిన్న గుంటలలో, “ఖనిజములు” అని వారు పిలచునట్టివి ఉంటాయో, ఆ చోటును మేము కనుగొనేవారము. మరియు నేను…అతడు నన్ను క్రింద కూర్చోబెట్టి మరియు నా చేత ఇసుకను రుద్దించి “ఫూ,” అని ఊదించేవాడు. మరలా రుద్ది “ఫూ,” అని ఊదాలి. మరియు అతడు ఎందుకు అలా చేపించాడో అని నేను ఆశ్చర్యపోయాను. దీనిని కనుగొన్నాను, ఏమిటంటే మీరు చూడండి, మీరు ఇసుకను ఊదుతున్నప్పుడు, అది తేలికగా ఉంటుంది. మరియు అన్నీ, ఆఖరికి సీసము కూడా, బంగారము కంటే తేలికగా ఉంటుంది. సీసం కంటే బంగారము బరువుగా ఉంటుంది. కాబట్టి మీరు ఊదుతున్నప్పుడు, ఆ మిగతా లోహములు మరియు ఇసుక మరియు చెత్తంతా ఎగిరిపోతుంది, కానీ బంగారము మాత్రమే నేల మీద మిగిలియుంటుంది. కావున, మీరు ఇక్కడ కొన్ని ఖనిజములను కనుగొన్నారంటే, ఆ పైన ఎక్కడో ఒక దగ్గర బంగారపు చార ఉన్నదని అది చూపిస్తుంది. ఈ వర్షము ఈ చిన్న ముక్కలను బయటకు పారేటట్లు చేసినది. కాబట్టి మేము నాగలిని మరియు మొదలగువాటిని తీసుకొని, మరియు ఈ బంగారమును కనుగొనడానికి ప్రయత్నిస్తూ, దాదాపు ఆ కొండనంతా త్రవ్వేవారము. భూమిలో రంధ్రాలు చేసి, వాటిని త్రవ్వేవారము. ప్రేలుడు పదార్థమును అమర్చి, దానిని పేల్చేవారము. ఆ లోపలి దారులలో యంత్రములతో గాలిని వీస్తూ, ఆ ముఖ్యమైన నాళమును కనుగొనుటకు, క్రిందకు వెళ్తూనే ఉండేవారము. ఇప్పుడు, మనము దానినే “ఖనిజాన్వేషణ” అని అంటాము.

18 మరియు ఈ రాత్రి మనము, వ్యత్యాసమంతటినీ మరియు సందేహములన్నిటినీ మన నుండి దూరంగా ఊదివేయుటకు, దేవునియొక్క వాక్యమును తీసుకొని మరియు పరిశుద్ధాత్మయొక్క శక్తి ద్వారా దానిని ఉపయోగించుటకు ప్రయత్నిస్తున్నాము, ఎటువంటి పునాది లేనివి, మన జీవితములో ఎటువంటి విలువ కలిగిలేని ఆ చిన్న తేలికైన సంగతులన్నిటినీ, ఈ మహిమకరమైన నాళమును కనుగొనుటకు మనము వాటన్నిటినీ ఊదివేయగోరుతున్నాము. ఆ నాళము క్రీస్తే.

19 మరియు ఇప్పుడు మనము ఆయనయొక్క వాక్యమును చదివి మరియు పఠనము చేస్తుండగా దేవుడు మనకు సహాయము చేయును గాక. దాదాపు, చివరి, ముందు మూడు అధ్యాయములలో, మెల్కీసెదెకు గురించి, కేవలం అప్పుడప్పుడు మాత్రమే మనం మాట్లాడుకున్నాము, విన్నాము.

20 ఇప్పుడు, పౌలు సరియైన అనువాదమును ఇచ్చాడని నేను అనుకుంటున్నాను.

షాలేము రాజైన, ఈ మెల్కీసేదెకు,…

“షాలేము రాజు.” మరియు మునుపు షాలేము అనగా…యెరూషలేము మునుపు “షాలేము” అని పిలువబడిందని ఏ బైబిలు పండితుడికైనా తెలుసు. మరియు ఆయన యెరూషలేమునకు రాజైయున్నాడు. ఆయనను గమనించండి.

…మహోన్నతుడగు దేవుని యాజకుడు, (అనగా ఒక విజ్ఞాపనకర్త), ఎవరు అబ్రాహామును కలుసుకొనెనో…

ఆయన, అనగా ఈ గొప్ప వ్యక్తియొక్క వంశావళిని నేను తీయగోరుతున్నాను, తద్వారా మొదట, ఆయన ఎవరన్నది మీకు తెలుస్తుంది, మరియు అప్పుడు మీరు…మనము కథను కొనసాగిస్తాము.

…రాజులను సంహారము చేసి తిరిగివచ్చుచున్న అతణ్ణి, ఎవరు కలుసుకొని ఆశీర్వదించెనో;

ఎవరికి…అబ్రాహాము పదియవవంతు ఇచ్చెనో…అతనికి మొదట…అనువాదము ద్వారా…నీతికి రాజనియు,…

ఇపుడు గమనించండి, “నీతి.” ఇప్పుడు, మనం స్వ-నీతిని కలిగియుంటాము, మనం వేష-ధార నీతిని కలిగియుంటాము, మనం వంకర చేయబడిన నీతిని కలిగియుంటాము, అన్ని రకములైనవాటిని కలిగియుంటాము. అయితే ఒక్క నిజమైన నీతి ఉన్నది, మరియు ఆ నీతి దేవుని యొద్దనుండి వస్తుంది. మరియు ఈ మనుష్యుడు నీతికి రాజైయున్నాడు. ఆయన ఎవరైయుండవచ్చును?

21 ఇప్పుడు, ఆయన నీతికి రాజైయున్నాడు, యెరూషలేమునకు రాజైయున్నాడు, నీతికి రాజైయున్నాడు, సమాధానపు రాజైయున్నాడు. యేసు, “సమాధాన అధిపతి” అని పిలువబడ్డాడు. మరియు ఒక రాకుమారుడు అంటే ఒక రాజుయొక్క కుమారుడు. కావున, ఈ మనుష్యుడు సమాధానమునకు రాజుయైయున్నాడు, అటువంటప్పుడు ఈయన సమాధాన అధిపతికి తండ్రియైయుండవలసి యున్నాడు. అది అర్థమైందా?

22 ఇప్పుడు మనం చూద్దాము, మనం ఎక్కడికి వెళ్తున్నామో చూడటానికి, ఆయనయొక్క వంశావళిలో కొంచెము వెనుకకు వెళ్దాము.

తండ్రి లేనివాడును,…

ఇప్పుడు, యేసుకు ఒక తండ్రి ఉన్నాడు. మీరు దానిని నమ్ముతున్నారా? నిశ్చయంగా ఆయన కలిగియున్నాడు.

…తల్లి లేనివాడును,…

యేసుకు ఒక తల్లి ఉన్నది. అయితే ఈ వ్యక్తికి తండ్రియైనను తల్లియైనను లేరు.

…వంశావళి లేనివాడును,…

ఆయన ఎవరినుండైనా రావడానికి అసలు ఆయనకు ముందు ఎవరినీ కలిగిలేడు, ఎటువంటి వంశావళిని కలిగిలేడు. ఆయన నిత్యమూ ఉన్నాడు. “వంశావళి లేనివాడు.”

…జీవితకాలమునకు ఆదియైనను లేనివాడు,…

ఆయన ప్రారంభమైనట్టి ఒక సమయమును ఆయన కలిగిలేడు.

…జీవమునకు అంతమైనను లేనివాడునైయుండి;…

అది దేవుడు తప్ప మరొకటి కానేరదు. అది అంతేయైయుండగలదు.

23 ఇపుడు, మనము తరువాతి వచనమును చదువుతుండగా మీరు గమనించినట్లైతే. చూశారా? “మొదటిగా, అనువాదము ద్వారా, నీతికి రాజని అర్థము.” నేను చదవాలనుకున్నది అది కాదు. ఆ—ఆ 3వ వచనము:

…జీవమునకు అంతమైనను లేనివాడునైయుండి; దేవుని కుమారుని పోలియుండెను;…

ఇప్పుడు, ఆయన దేవుని కుమారుడు కాడు, ఏలయనగా, ఆయన ఒక కుమారుడైనట్లైతే, ఆయన ఒక ఆరంభమును కలిగియున్నాడు. మరియు ఈ వ్యక్తికి ఆరంభము లేదు. ఆయన ఒక కుమారుడైయున్నట్లైతే, ఆయన తల్లిని మరియు తండ్రిని ఇద్దరిని కలిగియుండవలసి యున్నాడు. “మరి ఈ వ్యక్తికి తల్లియైనను తండ్రియైనను లేరు. అయితే ఆయన దేవుని కుమారుని పోలికలో చేయబడ్డాడు.”

…నిరంతరము యాజకుడుగా ఉన్నాడు.

24 ఇప్పుడు, డాక్టర్ స్కోఫీల్డ్, ఇట్లు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, “అది ‘మెల్కీసెదెకు యాజకత్వము’ అని పిలువబడుచున్న ఒక యాజకత్వమైయున్నది.”

కానీ నేను మీ కొరకు కేవలం కొద్ది నిమిషాలు దాని మీద తీసుకొనగోరుతున్నాను. అది ఒక యాజకత్వమైనయెడల, అప్పుడు అది ఒక ఆరంభమును కలిగియుండవలసియున్నది, మరియు అది ఒక అంతమును కలిగియుండవలసియున్నది. కానీ, “దీనికి ఆదియైనను లేదా అంతమైనను లేదు.” మరియు అతడు ఒక యాజకత్వమును కలుసుకున్నాడని అతడు చెప్పలేదు. అతడు ఒక మనిషిని కలుసుకున్నాడు, మరియు ఆయన పేరును “మెల్కీసెదెకు” అని పిలిచాడు. ఆయన ఒక వ్యక్తియైయున్నాడు, ఒక సంఘశాఖ కాదు, ఒక—ఒక—ఒక యాజకత్వము లేదా ఒక పితృత్వము కాదు. ఆయన ఖచ్చితంగా మెల్కీసెదెకు అను పేరుగల ఒక మనిషియైయున్నాడు, ఆయన యెరూషలేముకు రాజైయున్నాడు. ఒక యాజకత్వము కాదు, అయితే తండ్రిని కలిగిలేనటువంటి ఒక రాజు. యాజకత్వములకు తండ్రి ఉండరు. “మరియు ఈ మనుష్యుడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేనివాడైయున్నాడు.” ఇప్పుడు, దేవుని కుమారుడు…

25 ఈయన ఎవరంటే, ఈయన యెహోవా అయ్యున్నాడు. ఈయన స్వయంగా సర్వశక్తిమంతుడైన దేవుడే. అది ఇంకెవరునూ అయ్యుండలేరు.

26 ఇప్పుడు గమనించండి, “ఆయన నిరంతరము నిలిచియుండును.” ఆయన ఇక్కడ ఒక సాక్ష్యమును కలిగియున్నాడు, అదేమిటనగా, “ఆయన జీవించుచున్నాడు. ఆయన ఎన్నడూ మరణించడు.” ఆయన ఎన్నడూ…ఆయన సజీవుడుగా కాకుండా ఎన్నడునూ వేరే ఏ విధంగాను లేడు. “ఆయన నిరంతరము నిలిచియుండును.”

27 ఇప్పుడు, యేసు, ఆయన పోలికలో చేయబడ్డాడు. ఇప్పుడు, దేవునికి మరియు యేసుకు మధ్య వ్యత్యాసము ఉండటానికి కారణము ఏమిటనగా: యేసు ఒక ఆరంభమును కలిగియున్నాడు; దేవునికి ఆరంభము లేదు. మెల్కీసెదెకు ఆరంభమును కలిగిలేడు, మరియు యేసుకు ఆరంభమున్నది. అయితే యేసు, ఆయన పోలికలో చేయబడ్డాడు. “నిరంతరముండు, ఒక యాజకుడు.”

28 ఇప్పుడు, మెల్కీసెదెకు భూమి మీద ఉన్నప్పుడు, సృష్టి ద్వారా ప్రత్యక్షపరచబడిన ఆ—ఆ యెహోవా దేవుడు తప్ప, ఆయన మరొకటి కాదు, ఒక థియోఫని వలె ఆయన ఇక్కడ ఉన్నాడు. అబ్రాహాము ఒకసారి, తన గుడారములో ఆయనను కలుసుకున్నాడు. మరియు ఈ ఉదయమున మనము చెప్పుకున్నట్లుగా, “అబ్రాహాము ఆయనను గుర్తుపట్టాడు. మరియు ఆయన తానేమి చేయబోతున్నాడన్నది అబ్రాహాముతో చెప్పాడు, ఎందుకనగా ఆయన తాను చేయబోవు కార్యములయెడల ప్రపంచమునకు వారసుడైనవానిని గ్రుడ్డివానిగా విడిచిపెట్టబోవడంలేదు.”

29 దేవుడు ఆయనయొక్క సంఘము గురించి ఇంకనూ అదే అభిప్రాయమును కలిగియున్నాడు, అని చెప్పడానికి, ఒక్క నిమిషం నన్ను ఇక్కడ ఆగనివ్వండి. మీరు చీకటి పిల్లలు కారు. మీరు వెలుగు పిల్లలైయున్నారు. మరియు…మనము…“సాత్వికులు ధన్యులు, ఏలయనగా వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” మరియు భూమిని స్వతంత్రించుకోనైయున్న, ఆ—ఆ అబ్రాహామునకు, క్రియ జరిగించిన దేవుడు…ఆయన ఇట్లన్నాడు, “భూమిని స్వతంత్రించుకోబోవుచున్న మనుష్యునికి నేను ఈ సంగతులను దాచిపెట్టను.” అటువంటప్పుడు భూమిని స్వతంత్రించుకోబోవుచున్న తన సంఘమునకు ఆయనయొక్క రహస్యములను ఎంత ఎక్కువగా బయలుపరుస్తాడు కదా!

30 దానియేలు ఇట్లన్నాడు, “ఆ దినమున చాలమంది నలుదిశల సంచరించినందున, తెలివి అధికమగును.” మరియు అతడు ఇట్లన్నాడు, “ఆ దినమున, బుద్ధిగలవారు తమ దేవుని ఎరుగుదురు, మరియు ఆ దినమున గొప్ప కార్యములు చేయుదురు. అయితే దుష్టులు పరలోకపు దేవుడిని ఎరుగరు.” మన మొదటి పాఠము చెప్పినట్లుగా, వారు ఆయనను ఒక రూపములో మరియు ఒక ఆచారములో ఎరుగుతారు, కానీ వారు ఆయనను పరిపూర్ణమైన విధానములో ఎరుగరు.

31 మరియు దేవుడు పరిపూర్ణతలో మాత్రమే పనిచేయగలడు, ఎందుకనగా ఆయన పరిపూర్ణుడైయున్నాడు. ఆయన నామము స్తుతింపబడును గాక! దేవుడు దేనిగుండా పనిచేస్తాడో అది ఒక పరిపూర్ణమైన మార్గమైయుండవలసి యున్నది, ఎందుకనగా ఆయన పరిపూర్ణతలో పనిచేయడం తప్ప మరేమియు చేయలేడు. ఏ విధానములోను ఆయన తనకు తాను మచ్చ తెచ్చుకోజాలడు. మరియు పిదప అందుకే యేసు మన పాపములను తీసివేయడానికి వచ్చాడు, తద్వారా దేవుడు తన సంఘములోనుండి పనిచేయగలుగునట్లు, మనము పరిపూర్ణులుగా చేయబడుటకైయున్నది. అక్కడే రహస్యము దాగియున్నది.

ఆ విషయమునకే లోకము గ్రుడ్డిదైయున్నది. ఆ విషయంలోనే, “నీవు నీ మతిని కోల్పోయావు,” అని వారు చెప్పగోరుతారు. ఆ విషయంలోనే, “నీవేం మాట్లాడుతున్నావో నీకే తెలియదు,” అని వారు చెప్పగోరుతారు.

ఎందుకనగా, “ప్రభువుయొక్క కార్యములు ఈ లోక జ్ఞానమునకు వెర్రితనము. అయితే ఈ లోక సంగతులు విశ్వాసికి శరీర సంబంధమైనవిగా ఉన్నాయి.” కావున, నీవు ఒక భిన్నమైన వ్యక్తివి, నీవు ఒక భిన్నమైన పరిమాణములో జీవిస్తున్నావు. నీవు ఇక ఎంతమాత్రము ఈ లోకసంబంధివి కావు. నీవు ఈ జీవములోనుండి ఒక నూతనమైన జీవములోనికి దాటియున్నావు.

32 కావున, దేవుడు లోకమునకు కాదు, మనస్తత్వవేత్తకు కాదు, చదువుకున్న సేవకులకు కాదు, కానీ దీనమైన హృదయము గలవారికి బయలుపరుస్తాడు. సాత్వీకులైన ఆయన ప్రజలకు, దేవుని గొప్ప కార్యములయొక్క రహస్యములను, ఆయన వారికి బయలుపరుస్తాడు. మీరు దానిని చూస్తున్నారా?

33 ఇపుడు, అబ్రాహాము లోకమును స్వతంత్రించుకోనైయున్నాడు. అబ్రాహాము సంతానము ద్వారా…దేశములన్నియు ఆశీర్వదించబడనైయున్నవి. కావున దేవుడు ఒక మానవ రూపములో దిగివచ్చి, మరియు అతనితో మాట్లాడినాడు.

ఇప్పుడు, దేవుడు ఎల్లప్పుడూ భూమి మీదనే ఉన్నాడు. దేవుడు ఎన్నడూ భూమిని విడిచిపెట్టలేదు. ఆయన గనుక ఎన్నడైనా భూమిని విడిచిపెడితే, దానికి ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు. అయితే దేవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఓ, ఆయన నామమును స్తుతించండి!

34 ఐగుప్తులోనుండి బయటకు వస్తూ, అరణ్యములోనున్న పిల్లలతో, ఆయన వెలుగు రూపములో ఉన్నాడు. ఆయన అబ్రాహాముతో ఒక మనిషి రూపములో మాట్లాడినాడు. ఆయన మోషేతో ఒక మనిషి రూపములో మాట్లాడినాడు. ఆయన ఒక మనిషి రూపములో, ఆయన కుమారుడైన క్రీస్తుయేసు రూపములో, సంఘముతో మాట్లాడినాడు.

మరియు ఈనాడు ఆయన తన సంఘములోనుండి, జీవముగల దేవునియొక్క అభిషేకించబడిన సంఘములోనుండి, మట్టి పాత్రలలోనుండి మాట్లాడుతున్నాడు. “మీరు తీగెలు. నేను ద్రాక్షావల్లిని.” దేవుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు, మరియు మీరు యేసును ప్రదర్శించిన విధంగా లోకము ఆయనను చూస్తుంది. ఆ విధంగానే లోకము చూస్తుంది…“మీరు మనుష్యులందరి చేత చదువబడుతున్న వ్రాయబడిన పత్రికలైయున్నారు.” మీరు ఏమిటన్నది మీ జీవితమే చెప్తుంది.

35 ఇపుడు, ఈ అబ్రాహాము, వెనుకకు తిరిగివస్తూ తన దారిలో ఉన్నాడు. మనము వెనుకకు వెళ్ళి మరియు ఆదికాండము గ్రంథములో, కొద్ది క్షణములు అతని గురించి చదవబోతున్నాము. ఆదికాండము 14వ అధ్యాయములో, అది ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఓ, ఇక్కడ ఆ కథ ఎంత చక్కగా ఉంటుందో! ఇప్పుడు, అబ్రాహాము గురించి, దేవుడు అతడిని ఏ విధంగా కల్దీయ దేశము నుండి మరియు ఊరను పట్టణము నుండి పిలిచాడన్నది, మరియు అతని సహచరుల నుండి తననుతాను వేరు చేసుకోమని ఎలా చెప్పాడన్నది మనందరికీ తెలుసు.

దేవుడు పురుషులనైనా స్త్రీలనైనా పిలిచినప్పుడు, ఆయన ఒక వేరుపాటు కొరకు పిలుస్తాడు.

36 ఇప్పుడు, ఈనాడు సంఘములతో సమస్య అదే, వారు ఆ పాత శరీరసంబంధమైన విశ్-…అవిశ్వాసుల నుండి, తమను తాము వేరు చేసుకొనుటకు ఇష్టపడరు. అందుచేతనే మనము ఇక ఎంతమాత్రము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. మనము కేవలం ఆ ఒక్క శరీరసంబంధమైన ప్రవాహములోనికి వెళ్తాము, మరియు మనము—మనము ఇట్లంటాము, “ఓ, అతడు త్రాగినా కూడా, జిమ్ మంచివాడు. అతడు…మరియు నేను అతనితో పాటు స్నూకర్ ఆట గదికి వెళ్తాను, అయితే నేను స్నూకర్ ఆడను. నేను—నేను—నేను ఆమెతో కలిసి పార్టీకి వెళ్తాను. వారు నీచమైన జోకులు చెప్తారు, మరియు మొదలగునవి చేస్తారు, అయితే నేను ఎటువంటివాటిని చెప్పను.”

37 “వారి మధ్య నుండి బయటకు రండి.” అది నిజము. “మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. వారి అపవిత్రమైన వాటిని ముట్టకండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను,” అని ప్రభువు చెప్పుచున్నాడు. “అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, భిన్నమైనవారితో జోడుగా ఉండకండి.” నీవు దానిని చేయవద్దు. నిన్ను నీవు వేరు చేసుకో.

38 మరియు తన బంధువులందరి నుండి తనను తాను వేరుచేసుకొని, మరియు ఆయనతో నడవడానికి దేవుడు అబ్రాహామును పిలిచాడు. సహోదరుడా, కొన్నిసార్లు దాని అర్థము సంఘమును విడిచిపెట్టడం కావచ్చును. పౌలుకు అది ఆ విధంగానే ఉన్నది. అతడు తన సంఘమును వదిలిపెట్టవలసివచ్చినది. అనేకులకు అది ఆ విధంగానే ఉండినది. కొన్నిసార్లు దాని అర్థం గృహమును విడిచిపెట్టడం కావచ్చును. కొన్నిసార్లు దాని అర్థం తండ్రిని మరియు తల్లిని విడిచిపెట్టడం కావచ్చును, మరియు అందరిని వదిలివేయడం కావచ్చును. ప్రతిసారి దాని అర్థం అదే అని నేను చెప్పడంలేదు, కానీ కొన్నిసార్లు దాని అర్థం అదేయౌతుంది. దాని అర్థం ఏమిటంటే నీకు మరియు దేవునికి మధ్యనున్న ప్రతిదానిని నీవు తీసివేసి, మరియు ఆయనతో మాత్రమే నడవవలసియున్నావు. ఓ, లోకపు కార్యముల నుండి మరియు నిన్ను ఎగతాళి చేస్తున్న శరీర సంబంధులైన అవిశ్వాసుల నుండి నిన్ను నీవు వేరుచేసుకొని, మరియు క్రీస్తుతో మాత్రమే నడిచినప్పుడు నీవు పొందుకునే ఆ ధన్యకరమైన, మాధూర్యమైన అనుబంధము, ఆ సహవాసము ఎటువంటిదో చెప్పలేను!

39 నేను దేవునికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెల్లించానో! ఆయన ఇట్లు చెప్పాడు, “ఈ ప్రస్తుత లోకములో నేను మీకు తల్లిదండ్రులను ఇస్తాను. నేను మీకు స్నేహితులను మరియు సహచరులను ఇస్తాను. మరియు నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, నేను మిమ్మల్ని యెడబాయను. లోకమంతయు మిమ్మల్ని విడిచిపెట్టినా, నేను మీతో, మార్గాంతము వరకు వస్తాను.”

40 ఒక మనుష్యుడు ప్రభువైన యేసును వెంబడించడానికి, అతని శరీర సంబంధులైన సహచరులందరి నుండి తననుతాను వేరుచేసుకుని, ప్రభువును వెంబడించే ఆ సవాలును కలిగియుండటం, ఎటువంటి ఒక ధన్యకరమైన భాగ్యము కదా! మరియు ఏ వ్యక్తియైనా తాము సరిగ్గా ప్రవర్తించకుండా, మరియు తమను తాము క్రైస్తవులుగా చూపించుకొనగోరుతూ, శరీర సంబంధమైన కార్యములను ప్రేమిస్తున్నట్లైతే, నీవు వెంటనే వేరొక భాగస్వామి కొరకు వెతుక్కోవడం నీకు మంచిది. అది నిజము. మరియు ఎవరును నీతో నడవనియెడల, నీతో నడుస్తానని వాగ్దానము చేసిన ఒకాయన ఉన్నాడు. ఆయనే, ధన్యకరమైన ప్రభువైన యేసు అయ్యున్నాడు, ఆయన నీతో నడుస్తాడు.

41 దేవుడు అబ్రాహాముతో ఇట్లు చెప్పాడు, “నిన్ను నీవు వేరుచేసుకో.” మరియు అబ్రాహాము మానవుడే అయ్యుండగా, అతడు తన తండ్రిని తనవెంట తీసుకెళ్ళాడు, అతడు తన సహోదరుని కుమారుడిని, తన మేనల్లుడిని తనవెంట తీసుకెళ్ళాడు; అందరు అతనికి వ్రేలాడుతూ ఉన్నారు. మరియు దేవుడు అతనికి ఏమి చేయమని చెప్పాడో దానిని అతడు చేసేవరకు దేవుడు అతణ్ణి అస్సలు ఆశీర్వదించలేదు.

42 నీవు ఒక క్రైస్తవుడవు కాదని నేను చెప్పడంలేదు. అంటే, నేను ఎవరినీ క్రైస్తవులు కారని తేల్చడంలేదు. అయితే నేను దీనిని చెప్తాను, దేవుడు నీకు ఏదైనా చేయమని చెప్పినట్లైతే, నీవు దానిని చేసేవరకు ఆయన నిన్ను అస్సలు ఆశీర్వదించడు. అటువంటి ఒక విషయం నాపై ఉండగా ఈ రాత్రి నేను వేదిక మీద ఉన్నాను. గత రెండు సంవత్సరాలుగా, నా కూటములు అవి ఉండవలసిన విధంగా లేవు. ఎందుకనగా నేను ప్రభువును విఫలపరిచాను. “ఆఫ్రికాకు వెళ్ళు, తరువాత ఇండియాకి వెళ్ళు,” అని ఆయన నాతో చెప్పాడు. ఇక్కడ, సరిగ్గా ఇప్పుడు, సరిగ్గా ఇక్కడే ఈ గ్రంథము వెనుక, అది వ్రాయబడియున్నది.

43 మేనేజరు నాకు ఫోను చేసి, “ఆ ఆఫ్రికావారిని వదిలిపెట్టు. ఇండియా సిద్ధంగా ఉన్నది,” అని చెప్పాడు.

44 పరిశుద్ధాత్మ నన్ను కలుసుకొని, ఇట్లు చెప్పాడు, “నేను నీకు చెప్పినట్లుగా నీవు ఆఫ్రికాకు వెళ్ళాలి.”

45 మరియు మరొక సంవత్సరం గడిచిపోయినది. మరియు మేనేజర్లు…నేను దాని గురించి మర్చిపోయాను. అతడు ఇట్లన్నాడు, “మనము ఇండియాకు వెళ్తున్నాము. టిక్కెట్లు ఇదివరకే వచ్చేసాయి.”

46 నేను బయలుదేరాను, లిస్బన్ కు చేరేవరకు నాకు అది గుర్తులేదు. ఒక రాత్రి, నేను చనిపోతున్నానని, నేను అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం, నేను స్నానము చేయడానికి, స్నానపు గదిలోనికి వెళ్ళాను. ఓ, నేను ఎంతగానో అనారోగ్యముతో ఉన్నాను, ఎంతగా అంటే నేను లేచి నిలబడలేకపోయాను. అక్కడ, స్నానపు గదిలో అక్కడ ఆ వెలుగు వ్రేలాడుచున్నది, ఇట్లన్నది, “‘మొదట ఆఫ్రికాకు వెళ్ళమని,’ నేను నీతో చెప్పానని నేను అనుకుంటున్నాను.”

47 ఆ సమయము నుండి, నా కూటములు మెల్లగా విఫలమౌతున్నాయి. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు, అక్కడ దాదాపు ఐదు లక్షలమంది నిలబడియున్నప్పటికినీ, అది దేవుడు చేయమని చెప్పినదానిని చేయడం కాదు. నేను నేరుగా వెనుకకు వెళ్ళి మరియు దానిని సరిచేసుకునే వరకు, నా కూటములు ఎన్నడూ విజయవంతము కావని నేను భావిస్తున్నాను. నేను ఏమి చేసినా లెక్కలేదు, అది మొదట, ఆఫ్రికాయైయున్నది, ఎందుకనగా నీవు దానిని చేయవలసియున్నావు. దేవునియొక్క నిత్యమైన వాక్యము అక్కడ ఉన్నది, అక్కడే ఉన్నది. నేను దానికి లోబడియుండాల్సింది. అయితే నేను తప్పక వెనుకకు వెళ్ళవలసియున్నాను. మరియు ప్రభువుయొక్క సహాయము ద్వారా, నేను ఆ సంకోచము విడిచి బయటకు వచ్చే సమయము, ఈ రాబోవు సంవత్సరమేనని నేను భావిస్తున్నాను.

48 ఈ మహిమకరమైన, పాతకాలపు సువార్త, ఒక సింధూర వృక్షము వలె, తేలికగా ఎదుగుతున్నది, అయితే ఇప్పుడు అది దాని కొమ్మలను చాచుటకు సిద్ధముగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. నేను దానిని నమ్ముతున్నాను, ఈ గొప్ప వర్తమానము మరియు గొప్ప విషయము, దేవునియొక్క మహిమార్థమై లోకమును మరలా కుదిపివేయడానికి ప్రభువు మనకు అనుమతిస్తాడని నేను నమ్ముతున్నాను.

49 దేవుడు నీకు ఏమి చేయమని చెప్పాడో నీవు తప్పక దానిని చేయవలసియున్నావు. మరియు అబ్రాహాము అలాగే కొనసాగిపోయాడు, తన ప్రజలను తనవెంట తీసుకెళ్ళాడు. అతడు వారిని ప్రేమించాడు. అది మానవ భాగమైయున్నది. కానీ కొంతకాలం తర్వాత, మెల్ల మెల్లగా, అతని తండ్రి మరణించాడు మరియు అతడు అతణ్ణి సమాధి చేశాడు. పిదప అతడు తన సహోదరుని కొడుకును కలిగియున్నాడు, తర్వాత కలహాలు మరియు వాదనలు జరిగాయి. మరియు చివరికి, లోతు తన ఎంపికను చేసుకొని సొదొమలోనికి వెళ్ళాడు. మరియు మీరు అబ్రాహామును గమనించండి, అతడు లోతుతో గొడవపడలేదు. అతడు ఇట్లన్నాడు, “మనము సహోదరులము. మనము వాదించుకోకూడదు. అయితే నీవు నీ తలను పైకెత్తి, నీకు నచ్చిన ఏ వైపునకైనా వెళ్ళుము. నీవు తూర్పునకు వెళ్తే, నేను పశ్చిమమునకు వెళ్తాను. నీవు ఉత్తరమునకు వెళ్తే, నేను దక్షిణమునకు వెళ్తాను.” అదియే క్రైస్తవ వైఖరియైయున్నది, అవతలి వ్యక్తికి శ్రేష్ఠమైన అవకాశమును ఇచ్చే మనస్సు కలిగియుండటం. ఎల్లప్పుడు దానిని అతని యెదుట ఉంచండి, అతని ఎంపిక చేసుకోడానికి అతనికి అవకాశమును ఇవ్వండి.

50 ఎందుకని? అబ్రాహాము అలా చేయునట్లు చేసినది ఏమిటి? ఎలాగైనా, అతడు ఆ సమస్తమును స్వతంత్రించుకుంటాడని దేవుని ద్వారా అతనికి వాగ్దానము చేయబడినదని అతడు ఎరిగియున్నాడు. ఆమేన్. కాబట్టి, అటువంటప్పుడు, ఒక డేరానా లేదా ఒక కుటీరమా అని, మనమెందుకు లెక్క చేయాలి? ఆ సమస్తము మనకే చెందియున్నది. “సాత్వికులు ధన్యులు ఏలయనగా వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” అదంతా మనకే చెందియున్నది. దేవుడు అలా చెప్పాడు. కాబట్టి అతడు కోరినట్లైతే, ఉత్తమమైన దానిని, ఆ వ్యక్తికి ఇచ్చేయండి. బహుశా అతడు పొందుకునేదంతా అది మాత్రమే కావచ్చును. అయితే అదంతయూ, వాగ్దానము ద్వారా రక్షణకు వారసులైన మీకు చెందియున్నది. అదంతా మీదేయైయున్నది.

51 కాబట్టి, శారా, ఆ దేశములోనే అత్యంత అందమైన స్త్రీయైయున్నది, ఆమె చేయవలసిన విధంగానే ఆమె తన భర్తతో కలిసి అక్కడ ఆ కొండ పైన కూర్చుంది. ఆమె సాదా సీదాగా, సరి, సాధారణమైన కాటన్ వస్త్రములను, లేదా మీరు దానిని ఏమని పిలుస్తారో దానిని వేసుకొనియుండవచ్చును. మరి, శ్రీమతి. లోతు అయితే ఒక లక్షాధికారివలె వస్త్రధారణ చేసుకున్నది. మరియు ఆమె భర్త ఆ నగరానికి మేయరైయున్నాడు. అతడు గవినివద్ద కూర్చున్న ఒక న్యాయాధిపతియైయున్నాడు. ఆమె సమస్తమును కలిగియున్నది; సొదొమ గొమొఱ్ఱాలో జరిగే కుట్టు సమావేశములన్నిటికీ మరియు కార్డు పార్టీలన్నిటికీ హాజరయ్యేది. కానీ శారా, ఐశ్వర్యమును లేదా ఐశ్వర్యమువలన కలుగు తాత్కాలికమైన సుఖభోగములో ఆనందించడం కంటే, చాలీ చాలని వసతులు కలిగియుండి, తన భర్తతో జీవిస్తూ, మరియు ఆమె దేవునియొక్క చిత్తములో ఉన్నదని ఎరిగియుండుటకే ఎక్కువగా ఇష్టపడినది. అది నిజము. అప్పుడే దేవుడు దర్శిస్తాడు.

52 మరియు ఒక రోజు, నీవు, నీవు తప్పు దారిని ఎన్నుకున్నంత నిశ్చయంగానే, అది ఏదో ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది. నీవు బాగానే బయటపడతావని నీవు అనుకోవచ్చును. నీవు తప్పించుకుంటున్నావని నీవు అనుకోవచ్చును, అయితే నీవు తప్పించుకోవడంలేదు. అదంతా కప్పబడియున్నట్లుగా అగుపించవచ్చును, కానీ అది కప్పబడలేదు. దేవునికి సమస్తమూ తెలుసు. నీవు నిజంగా నీ ఒప్పుకోలును చేస్తున్నావా లేదా అనేది ఆయనకు తెలుసు. నీవు నిజంగా ఆయనను నమ్మి రక్షించబడ్డావా అనేది, మరియు ఆయనను అంగీకరించావా అనేది, మరియు నీవు ఈ లోక కార్యములకు చనిపోయి, మరియు నీవు క్రీస్తులో జీవిస్తున్నావా అనేది ఆయనకు తెలుసు. అది ఆయనకు తెలుసు.

53 ఇప్పుడు, మనము అబ్రాహామును గమనిస్తాము, ఈ అసలైన ఆత్మను మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఓ, ఇక్కడున్న దీవెనకరమైన విషయమంతా కృపయే. ఇప్పుడు ఒక్క క్షణం మీరు నాతో కలిసి, నిర్గమకాండము 14వ అధ్యాయము నుండి చదవాలని నేను కోరుతున్నాను.

54 ఇప్పుడు, వారు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన మొదటి విషయమేమిటంటే, లోతు సమస్యలో పడ్డాడు. ఎందుకు? అతడు దేవుని చిత్తమునకు వెలుపల ఉన్నాడు. మరియు నీవు దేవుని చిత్తములో ఉన్నప్పుడు, నీవు సమస్యలో పడితే, దేవుడు నీకు సహాయము చేస్తాడు. కానీ నీవు దేవుని చిత్తమునకు వెలుపల ఉండి, సమస్యలో పడితే, చేయడానికి ఒకే ఒక్కటి ఉన్నది, తిరిగి దేవుని చిత్తములోనికి రావడమే.

55 ఇప్పుడు, రాజులందరూ సమకూడి, మరియు వారు దిగువున మైదానములకు నీరు బాగా అందుతున్నదని కనుగొన్నారు, మరియు వారు అక్కడికి వెళ్ళి మరియు ఈ చిన్న సొదొమ, గొమొఱ్ఱాను స్వాధీనపరచుకోవాలని అనుకున్నారు. మరియు వారు అట్లే చేశారు. మరియు వారు అక్కడికి వెళ్ళి దానిని స్వాధీనపరచుకున్నప్పుడు, వారు తమతోపాటు లోతును కూడా తీసుకొనివెళ్ళారు.

56 ఇక్కడ అబ్రాహాములో క్రీస్తుయొక్క ఆత్మను మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు 14వ వచనమును గమనించండి.

మరియు అబ్రాహాము తన సహోదరుని గూర్చి వినినప్పుడు…(దానిని గ్రహించారా?)…తన తమ్ముడు చెరపట్టబడెనని వినినప్పుడు, తన యింట పుట్టి, అలవరచబడిన, మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని, దాను మట్టుకు వారిని తరిమెను.

57 ఓ, కృపను గూర్చి అది ఎటువంటి ఒక ధన్యకరమైన తలంపు కదా! అబ్రాహాము, అతని తమ్ముడు, కృప నుండి పడిపోయినప్పటికినీ, ఈ భక్తి విడచిన స్థితిలో ఉన్నప్పటికినీ, లోకము అతణ్ణి పట్టుకొని, మరియు అతణ్ణి చంపడానికి, అతణ్ణి చెరపట్టుకొని మరియు అతణ్ణి తీసుకొనిపోయిందని అతడు విన్నప్పుడు, అబ్రాహాము క్రీస్తుయొక్క ఆత్మ ద్వారా పనిచేశాడు. అతడు వచ్చి తన ఇంట పుట్టిన తన మనుషులందరినీ ఆయుధములతో సిద్ధం చేసి, మరియు వారి వెంటపడి, వారందరినీ దాను వరకు తరిమాడు. మరియు దాను అనేది పాలస్తీనాయొక్క చిట్టచివరి భాగమైయున్నది, “దాను నుండి బెయేర్షెబా వరకు,” అనగా ఒక చివర నుండి మరొక చివరి వరకైయున్నది. మరియు అది క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది, లోకము…పడిపోయినదని ఆయన చూసినప్పుడు, ఆదాముయొక్క పడిపోయిన జాతిని తిరిగి స్వీకరించడానికి, ఆయన శత్రువును చివరి వరకు తరిమాడు.

58 తరువాతి వచనములో, ఇక్కడ ఆత్మ అతనిలో నుండి ఎంత మాధూర్యముగా మాట్లాడతాడో మీరు గమనించాలని నేను కోరుతున్నాను. మంచిది, ఇప్పుడు 15వ వచనము.

మరియు అతడు ఆస్తి యావత్తు (యావత్తు) తిరిగి తెచ్చి, మరియు తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొనివచ్చెను.

59 అబ్రాహాము తన తమ్ముడిని చెరపట్టుకొనిపోయిన శత్రువు వెంటపడినప్పుడు, అతడు దేశమందంతటి నుండి, దాను వరకు అతణ్ణి తరిమి, మరియు పతనములో ఇతడు పోగొట్టుకున్న దానంతటినీ తిరిగి తీసుకొనివచ్చాడు.

60 మనము తప్పిపోయామని పరలోకమునుండి విని, మరియు వచ్చి మరియు పాతాళముమట్టుకు, శత్రువును తరిమి, మరియు తప్పిపోయిన ఆత్మలను పట్టుకొని మరియు మనల్ని తిరిగి తెచ్చి మరియు పతనమునకు ముందు మనము కలిగియున్న సమస్తమునకు మనల్ని పునరుద్ధరించిన క్రీస్తుకు అది ఎటువంటి ఒక అందమైన పోలికగా ఉన్నది కదా! భక్తి విడిచిన మనము, దేవుని కుమారులుగా ఉండటానికి జన్మించి, అపవాది కుమారులుగా వక్రీకరించబడిన మనము, మరియు…లోక కార్యముల వెంబడి వెళ్ళి, మరియు తప్పు చేసి, మరియు లోతు చేసినట్లు అత్యాశతో పరుగెత్తి, మన జన్మ హక్కులను అమ్మివేసుకొని మరియు లోక సంబంధమైన కార్యముల వెంబడి వెళ్తూ ఉన్నాము. క్రీస్తు దిగివచ్చాడు. పడిపోయినప్పటికినీ; ఎవరు రక్షింపబడతారు మరియు ఎవరు రక్షింపబడరు అనేది, దేవుడు ఆదిలోనే ఎరిగియున్నాడు, కావున దిగివచ్చి మరియు శత్రువును జీవముగుండా, మరణముగుండా, పరదైసుగుండా, పాతాళములోనికి తరిమాడు. మరియు మహిమ నుండి పాతాళముమట్టుకు వచ్చి, మరియు పాతాళపు అధికారాలను, మరియు తాళపుచెవులను దయ్యము దగ్గరనుండి తీసుకున్నాడు, మరియు తిరిగి లేచి, మరియు వారు మరలా దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా ఉండగలిగే అధికారమును, తిరిగి మానవాళికి పునరుద్ధరించాడు.

61 అక్కడ అబ్రాహాములో ఉన్న ఆత్మను చూస్తున్నారా, క్రీస్తుయొక్క ఆత్మ అతనితో కూడ రావడాన్ని చూస్తున్నారా?

62 ఇప్పుడు మనము చదువుతుండగా, మీరు ఇంకొంచెం ముందుకు గమనించాలని నేను కోరుతున్నాను.

అతడు కదొర్లాయోమెరను ఈ రాజును మరియు…అతనితో కూడనున్న…రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు, సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజు లోయ అను షావే లోయ మట్టుకు, బయలుదేరి వచ్చెను.

63 వారు బయటకు వెళ్ళారు. సొదొమ రాజు తిరిగి తీసుకురాబడ్డాడు. అతని సహోదరుడు తిరిగి తీసుకురాబడ్డాడు. పిల్లలు కూడా తిరిగి తీసుకురాబడ్డారు. మరియు అతడిని కలుసుకోడానికి రాజులు బయలుదేరి వెళ్ళారు. మరియు, ఇక్కడే, నేను ఇప్పుడు నా వర్తమానమును తీసుకొనగోరుతున్నాను. ఇక్కడ గమనించండి.

మరియు—మరియు షాలేము రాజు (యెరూషలేమునకు రాజు, సమాధానపు రాజైన) మెల్కీసెదెకు, రొట్టెను ద్రాక్షారసమును తీసుకొనివచ్చెను: అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు.

మరియు ఆయన అతణ్ణి ఆశీర్వదించి, ఇట్లన్నాడు, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును, సర్వోన్నతుడునైన దేవునివలన, అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక:

64 షాలేము రాజైన, మెల్కీసెదెకు కూడా, ఇతర రాజుల మధ్య తనను తాను ప్రదర్శించుకున్నాడు. మరియు గమనించండి, యుద్ధము ముగిసినది, దేవునియొక్క ఆత్మ, అనగా క్రీస్తు ఆత్మ అబ్రాహాములో ఉన్నది, అతడు పడిపోయిన తన సహోదరుడిని తిరిగి తీసుకొనివచ్చాడు, పిదప అతడు పోగొట్టుకున్న సమస్తమునకు, అతనియొక్క అసలైన స్థితికి అతణ్ణి పునరుద్ధరించాడు. అతడు దానిని తిరిగి తీసుకొనివచ్చాడు. మరియు అతడు దానిని చేసినప్పుడు, ఆయన రొట్టెను మరియు ద్రాక్షారసమును తీసుకొనివచ్చాడు, ప్రభురాత్రి భోజనము. ఆ మెల్కీసెదెకు ఎవరో మీరు చూడటంలేదా? అది దేవుడే. యుద్ధము తర్వాత, ప్రభురాత్రి భోజనమును తీసుకొనివచ్చాడు.

65 ఇప్పుడు మనము మరలా, త్వరగా, మత్తయి 26:26 ను తీద్దాము, మరియు దాని గురించి యేసు ఇక్కడ ఏమి చెప్పాడో చూద్దాము. మత్తయి గ్రంథములో, 26వ అధ్యాయము మరియు 26వ వచనములోనే, మనం ఇక్కడ కొద్దిగా చదవగోరుతున్నాము. మంచిది, మత్తయి 26:26.

అంతట యేసు వారితో కూడ గొల్గొతా, గొల్గొతా, లేదా, (నా భావము,) గెత్సెమనే అనబడిన ప్రదేశమునకు వెళ్ళెను, మరియు తన శిష్యులతో, మీరిక్కడనే కూర్చొనియుండుడి, నేను ప్రార్థించడానికి అవతలికి వెళ్తాను అని చెప్పాడు.

66 నేను తప్పు లేఖనమును తీసానని నేను అనుకుంటున్నాను. మత్తయి, ఇరవై-…26వ అధ్యాయములోని 26వ వచనము. ఎవరైనా దానిని తీసినట్లైతే, మీరు—మీరు దానిని కనుగొనగలిగితే, నా కొరకు దానిని చదవండి. ఒక్క నిమిషం. ఇక్కడ ఇది ఒక అందమైన పోలికయైయున్నది. మీరు దానిని తప్పిపోవాలని నేను కోరడంలేదు. ఇదిగో ఇక్కడున్నది. సహోదరీ, అది దొరికినది.

మరియు వారు భోజనము చేయుచుండగా, యేసు ఒక రొట్టెను పట్టుకొని, దానిని ఆశీర్వదించి,…

అది ఏమిటి? యుద్ధం ముగిసినది.

…దానిని విరిచి, తన శిష్యులకిచ్చి, తీసుకొని తినుడి; ఇది నా శరీరము, అని చెప్పెను.

67 ఆ మెల్కీసెదెకును చూశారా? వందల సంవత్సరాల క్రితం, యుద్ధం ముగిసిన తర్వాత, ఆయన అబ్రాహామును కలుసుకున్నప్పుడు, ఆయన రొట్టెను మరియు ద్రాక్షారసము ఇచ్చాడు. మరియు ఇక్కడ యేసు, ఆయనయొక్క కఠినమైన యుద్ధము ముగిసిన తర్వాత, శిష్యులకు ఇస్తున్నాడు, ఆయన వారికి రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు. గమనించండి. భవిష్యత్తులోని రాకడను గమనించండి.

మరియు ఆయన గిన్నెను పట్టుకొని, మరియు—మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మరియు దానిని వారికిచ్చి, దీనిలోనిది మీరందరు త్రాగుడి;

ఏలయనగా ఇది నా రక్తము, అనగా పాపముల నిమిత్తము మరియు పాప క్షమాపణ నిమిత్తము…చిందింపబడియున్న క్రొత్త నిబంధన రక్తము.

అయితే నా తండ్రి రాజ్యములో మీతో కూడ, నేను ఈ ద్రాక్షరసమును క్రొత్తదిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను.

68 మనము ఇప్పుడు యుద్ధములో ఉన్నాము. మనము భక్తి విడచినట్టి మన సహోదరుని వెంబడి పడుతున్నాము, జగత్తుపునాది వేయబడకముందే, దేవుడు అతణ్ణి చూసి, నిత్యజీవమునకై ముందుగా ఏర్పరచుకున్నాడు. మరియు లోక కార్యములు అతణ్ణి ఒక సుడిగాలిలోనికి చెరపట్టుకున్నాయి. అతడు బయట సమాజములలోనికి మరియు వర్గాలలోనికి వెళ్తున్నాడు, అతడు మరియు అతని భార్య, వీధులలో అటు ఇటు తిరుగుతూ, ధూమపానం చేస్తూ మరియు మద్యం సేవిస్తూ మరియు కేరింతలు పెడుతూ విశ్రాంతిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. మరియు క్రీస్తుయొక్క ఆత్మ అబ్రాహాములో ఉన్నట్లే, అది మనలో ఉన్నది, మనము అతని వెంబడిపడుతున్నాము. దేవునియొక్క కవచములన్నిటిని కలిగియుండి, దేవుని దూతలు చుట్టుముట్టియుండగా, మనము మన పడిపోయిన సహోదరుణ్ణి తిరిగి తీసుకొనిరావడానికి వెళ్ళాము.

69 మరియు చివరకు ఈ యుద్ధము ముగిసినప్పుడు, మనము మరలా మెల్కీసెదెకును కలుసుకుంటాము, అక్కడ అబ్రాహామును ఆశీర్వదించి, మరియు అతనికి దీవెనలను ఇచ్చి, మరియు అతనికి రొట్టెను ద్రాక్షారసమును, ఆ ప్రభురాత్రి భోజనమును ఇచ్చిన దేవుడు, స్తుతింపబడును గాక. మరియు యుద్ధము ముగిసినప్పుడు, మనము ఆయనను కలుసుకుంటాము. అబ్రాహాముయొక్క వాగ్దానమునకు వారసులమైన మనము, రాజ్యములో క్రీస్తు తోడి వారసులమైన మనము, యుద్ధము ముగిసినప్పుడు, మార్గాంతమున ఆయనను కలుసుకొని, మరలా, రొట్టెను మరియు ద్రాక్షారసమును తీసుకొంటాము.

70 ఈ మెల్కీసెదెకు ఎవరు? “ఆయన తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేనివాడైయున్నాడు.” మరలా ప్రభురాత్రి భోజనమును ఇవ్వడానికి ఆయన అక్కడ ఉంటాడు. మీకు అది అర్థమైందా?

71 కొన్ని రాత్రులు, మనము వచ్చి, మనము కూడుకొని మరియు సేవకుల చేతుల నుండి ప్రభురాత్రి భోజనమును తీసుకుంటునప్పుడు, ప్రభువైన యేసుయొక్క మరణము, సమాధి, మరియు పునరుత్థానమును మనము నమ్ముతున్నామని సూచిస్తూ, ఆ ముసుగును, అనగా, దేవుడు తానే ముసుగుగా ధరించిన ఆయనయొక్క శరీరమును, మనము దానిని, “మనము లోకసంబంధమైన కార్యములకు చనిపోయి, ఆత్మ ద్వారా నూతనముగా జన్మించాము,” అనుటకు సూచనగా తీసుకుంటున్నాము. మరియు మనము క్రీస్తుయొక్క శరీరముతో నడుస్తాము, విశ్వాసులందరము కలసి నడుస్తాము.

72 ఆ గొప్ప యుద్ధము ముగించబడి, మరియు మనము క్రీస్తుతో మరలా వచ్చినప్పుడు, మనము దేవునియొక్క రాజ్యములో ఆయనతో కలిసి ప్రభురాత్రి భోజనమును, క్రొత్తదిగా తీసుకుంటాము; మరియు దేవుని రాజ్యములో, మరలా శరీరమును తిని, ఆ ద్రాక్షా రక్తమును త్రాగుతాము. ఓ! అదియే మెల్కీసెదెకు. ఆయన అదేయైయున్నాడు.

73 ఇప్పుడు ఆయన గురించి ఇక్కడ కొంచెము ముందుకు చదువుదాము, 18వ వచనము.

మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొనివచ్చెను:…(మీకు అది అర్థమైందా?)…అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు.

మరియు ఆయన అతణ్ణి ఆశీర్వదించి, ఇట్లన్నాడు, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును, సర్వోన్నతుడునైన దేవునివలన, అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక:

మరియు ఆయన అతణ్ణి ఆశీర్వదించాడు,…ఆయన ఆశీర్వదించాడు…

నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడును గాక అనియు చెప్పెను. మరియు అతడు అన్నిటిలో ఈయనకు పదియవవంతు ఇచ్చెను.

అతడు మెల్కీసెదెకుకు దశమభాగములు చెల్లించాడు. అబ్రాహాము కొల్లగొన్న శ్రేష్ఠమైన వాటన్నిటిలో పదియవవంతు ఆయనకు ఇచ్చాడు.

74 ఇప్పుడు పౌలు ముందుకు కొనసాగుతుండగా మీరు గమనించాలని నేను కోరుతున్నాను, ఇప్పుడు రాబోవు పాఠము కొరకు నేపథ్యమును ఇస్తున్నాను.

సొదొమ రాజు, మనుష్యులను నాకిచ్చి, ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాహాముతో చెప్పెను.

ఇప్పుడు, సొదొమ రాజు ఇట్లన్నాడు, “ఇప్పుడు, నీవు నా ప్రజలను నాకు తిరిగి ఇచ్చి, మరియు ఆ ఆస్తిని నీవే తీసుకో.”

మరియు అబ్రాహాము సొదొమ రాజుతో ఇట్లన్నాడు, సర్వోన్నతుడును దేవుడునైన, యెహోవా యెదుట నేను నా చెయ్యియెత్తియున్నాను,…

ఎల్ ఎలియోన్, “ఆకాశమునకు భూమికిని సృష్టికర్త,” అని అర్థము.

…ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును, సర్వోన్నతుడునైన దేవుని యెదుట చెప్పుచున్నాను,

ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నేను తీసుకొనను,…

డబ్బును తీసుకోడానికి అతడు ఒక గొప్ప ప్రచార సభను నిర్వహించలేదు. అతడు తన పడిపోయిన సహోదరుడిని మాత్రమే కోరుకున్నాడు.

…మరియు నేను అబ్రాహామును ధనవంతునిగా చేసితినని, నీవు చెప్పకుండునట్లు, నీవాటిలో ఏదైనను తీసికొనను:

అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప, నాతో కూడ వచ్చినవారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములను వారిని తీసికొననిమ్ము,…

75 ఇపుడు, మీరు గమనించాలని నేను కోరుతున్నాను, అబ్రాహాము ఇట్లు చెప్పాడు, “నూలుపోగు నుండి చెప్పుల వారు వరకు నేను దేనిని తీసుకోను.” అతడు ఎంతో డబ్బును సంపాదించడానికి, యుద్ధము చేయలేదు. మరియు అసలైన నిజమైన పోరాటములు స్వార్థపూరిత ఉద్దేశ్యములతో చేయబడవు. యుద్ధములు డబ్బు కొరకు జరుగవు. ఉద్దేశ్యముల కొరకు—కొరకు, సిద్ధాంతముల కొరకు యుద్ధములు జరుగుతాయి. మనుష్యులు సిద్ధాంతముల కొరకు యుద్ధము చేస్తారు. మరియు అబ్రాహాము లోతును తీసుకొనిరాడానికి వెళ్ళినపుడు, అతడు అక్కడికి వెళ్ళినది అతడు ఆ రాజులను ఓడించి మరియు వారి సంపదను స్వాధీనం చేసుకోగలడని ఎరిగియున్నందుకు కాదు, అతడు “తన సహోదరుడిని రక్షించాలి” అనే సిద్ధాంతము కొరకే అక్కడికి వెళ్ళాడు.

76 మరియు పరలోకపు రాజుయొక్క ప్రేరేపణ ద్వారా పంపబడిన ఏ సేవకుడైనా, డబ్బు కొరకు వెళ్ళడు; లేదా పెద్ద సంఘాలను తయారు చేయడానికైనా, లేదా సంఘశాఖలను ప్రేరేపించడానికైనా అతడు వెళ్ళడు. అతడు ఒకే ఒక్క సిద్ధాంతము కొరకు వెళ్తాడు, మరియు అదేమిటంటే, “పడిపోయిన తన సహోదరుని తిరిగి తీసుకొనిరావడమే.” కానుకలలో అతనికి ఒక్క రూపాయి వచ్చినా రాకపోయినా, అది అతనికి కొంచెం కూడా వ్యత్యాసమును కలిగించదు.

77 నేను చెప్పినట్లుగా, “నిజమైన యుద్ధములు డబ్బు కొరకు కాదు గాని సిద్ధాంతముల కొరకు పోరాడబడతాయి మరియు జరిగింపబడతాయి.” మరియు పేరుప్రఖ్యాతులు పొందడానికి, సంఘములో చేరి సంఘములోనికి వచ్చే స్త్రీ పురుషులు, జోనెసెస్ దానికి చెందియున్నందుకు వచ్చేవారు, లేదా ఒక చిన్న సంఘము నుండి పెద్ద సంఘమునకు మారినవారు, మీరు ఒక స్వార్ధపూరితమైన ఉద్దేశ్యము కొరకు దానిని చేస్తున్నారు మరియు సరియైన సిద్ధాంతము దాని వెనుక లేదు. మీరు యుద్ధరంగములో నిలబడటానికి ఇష్టపడవలసియున్నారు.

78 ఇక్కడున్న ఈ మందిరములో, విషయాలు తప్పుగా జరిగినప్పుడు, స్త్రీ పురుషులైన మీరు పరుగెత్తి మరియు ఇంకెక్కడికో వెళ్తే, లేదా ఆ చిన్న గొడవ లేదా ఆ కలహం ముగిసేవరకు వెలుపలే వేచియుంటే, మీ అనుభవంలో ఏదో తప్పున్నది. నిజము.

79 ఇక్కడ మనకు ఒక పద్దతి ఉన్నది. ఇక్కడ మనము ఒక—మనము ఒక క్రమమును కలిగియున్నాము. ఈ సంఘము బైబిలుయొక్క నియమములపై ఆధారపడియున్నది. సరియైనదానిని చేయని ఎవరైనా ఇక్కడున్నయెడల, మరియు అతడు సరియైనదానిని చేయడంలేదని మీరనుకుంటే, మీరు అతని దగ్గరికి వెళ్ళి మరియు అతనితో మాట్లాడండి. మీరు అతణ్ణి సమాధానపరచలేకపోతే, అప్పుడు ఎవరో ఒక సహోదరుణ్ణి, ఒకరిని లేదా ఇంకా ఇద్దరిని మీతోపాటు తీసుకెళ్ళండి. అప్పుడు కూడా అతడు సమాధానపడకపొతే, అప్పుడు దానిని సంఘమునకు చెప్పండి. మరియు సంఘము అతణ్ణి పంపివేస్తుంది, అతనితో ఇక ఎంతమాత్రము సహవాసము కలిగియుండదు. మరియు యేసు ఇట్లు చెప్పాడు, “భూమి మీద మీరు వేటిని విప్పుదురో, వాటిని నేను పరలోకమందును విప్పుదును.”

80 ఆ కారణముచేతనే, మీరు బైబిలు సిద్ధాంతములను అనుసరించడంలేదు గనుకనే మీరు అనేక సమస్యలను కలిగియుంటున్నారు. సంఘములో ఎవరైనా ఒక అంతరాయమును కలుగజేస్తున్నయెడల, లేదా ఏదైనా తప్పు జరుగుతున్నయెడల, ఆ పురుషుని గురించి లేదా ఆ స్త్రీ గురించి మాట్లాడటం నీ పని కాదు. ఆ స్త్రీ దగ్గరికే లేదా ఆ పురుషుని దగ్గరికే వెళ్ళి, మరియు అతని తప్పును అతనికి చెప్పడం నీ బాధ్యతైయున్నది. మరియు అతడు నీవు చెప్పేది విననియెడల, మరొకరిని నీతో తీసుకొనివెళ్ళు. అతడు దానిని కూడా వినకపోతే, అప్పుడు సంఘము అతణ్ణి వదిలిపెడుతుంది. యేసు ఇట్లు చెప్పాడు, “భూమి మీద మీరు వేటిని విప్పుదురో, వాటిని నేను పరలోకమందును విప్పుదును. భూమి మీద మీరు వేటిని బంధింతురో, వాటిని నేను పరలోకమందును బంధింతును.” అదియే సంఘమునకు ఉన్న అధికారమైయున్నది.

81 ఇక్కడే కొంతకాలం క్రితం, నా మంచి స్నేహితుడైన ఒక బోధకుడున్నాడు, అతనికి ఒక అబ్బాయి ఉన్నాడు, మరియు ఆ అబ్బాయి తన సంఘమునకు, తన స్వంత సంఘమునకు వెళ్తుండేవాడు. అతడు ఎటువంటి ఒక స్థితికి వచ్చాడంటే ధూమపానము చేస్తూ మరియు మద్యము సేవిస్తూ మరియు ఆ విధంగా కొనసాగే ఒక అమ్మాయి వెంటపడటం అతడు మొదలుపెట్టాడు. బోధకుడు ఇట్లన్నాడు, “సరి, అది అతని విషయం.” నాకు చాలా ఆప్త మిత్రుడు, మరియు ఒక మంచి అబ్బాయి. కానీ అతడు ఒక యవ్వన స్త్రీకి ఆకర్షితుడయ్యాడు; మరియు ఆమెకు ఇదివరకే పెండ్లైనది, కొందరు పిల్లల్ని కలిగియున్నది, ఆమె భర్త బ్రతికే ఉన్నాడు. వారు…ఆ అబ్బాయి ఆమెను పెండ్లి చేసుకొంటాడేమోనని అతడు భయపడ్డాడు. కాబట్టి, ఆ సహోదరుడు ఎంతో బాధతో కృంగిపోయాడు. మరియు అతడు నాతో ఇట్లన్నాడు, “సహోదరుడా బ్రెన్హామ్, నీవు నా ఈ ఫలానా-ఫలానా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలని నేను కోరుతున్నాను. నీవు అతనితో మాట్లాడాలని నేను కోరుతున్నాను.”

82 నేను ఇట్లన్నాను, “సహోదరుడా…” నేను దాదాపు అతని పేరు చెప్పబోయాను. “నీకు శ్రేష్ఠమైన మార్గమున్నది. నన్ను పంపవద్దు. ఆ అబ్బాయి సరిగ్గా జీవించడంలేనియెడల, మరియు అతడు తప్పు చేయడాన్ని సంఘము చూసినయెడల, అప్పుడు ఈ విషయాన్ని చూసుకోవడము సంఘము పనైయున్నది. అది సంఘమునకు విడిచిపెట్టబడుతుంది. మరియు సంఘము వెళ్ళి అతనికి చెప్తారు.”

83 కావున అతడు ఒక సహోదరుడిని తీసుకొని, మరియు అతని దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాడు. మరియు అతడు ఆ సహోదరుని మీద తిరగబడ్డాడు, అతడు తన సంగతి తాను చూసుకుంటున్నాడని, ఇతను కూడా దానినే చేయాలని అన్నాడు. అతడు ఇంకొక సహోదరుడిని, మరొక ఇద్దరిని, ఇద్దరు సంఘపెద్దలను తీసుకొనివెళ్ళి మరియు ఆ అబ్బాయికి చెప్పాడు. అతడు దానిని వినలేదు. వారు దానిని సంఘమునకు చెప్పారు. మరియు అతని పాపము సంఘము యెదుట చెప్పబడిన తర్వాత సంఘముతో సమాధానపరచబడటానికి, అతడు అనేక రాత్రులు అసలు రాలేదు. అప్పుడు, సంఘము అతడిని విడిచిపెట్టినది.

84 మరియు అప్పటినుండి ఒక నెల తర్వాత అతడు నిమోనియాతో మొత్తబడ్డాడు, మరియు, “అతడు బ్రతకడానికి అసలు అవకాశమే లేదు” అని వైద్యుడు చెప్పాడు. అప్పుడు అతడు వెనుకకు ప్రాకాడు. దానిని ఎలా చేయాలో దేవునికి తెలుసు.

85 మనంతట మనమే దానిని చేయడానికి మనం ప్రయత్నిస్తాము, “ఓ, నీవు ఫలానా-ఫలానా-వారిని సంఘము నుండి తరిమివేయాలి. నీవు దీనిని, దానిని, లేదా ఆ మరొకదానిని చేయవలసియున్నది.” దాని విషయములో ఒక సంఘముగా నీ వంతు నీవు చేశావా? విషయం అదే. వారిని వెనుకకు ప్రాకునట్లు చేసే విధానం అదేయైయున్నది, ఒక్కసారి వారిని దయ్యానికి విడిచిపెట్టండి.

86 అక్కడ తన సవతి తల్లితో జీవిస్తున్న ఈ వ్యక్తి గురించి పౌలు ఏమి చెప్పాడు? వారు అతణ్ణి సమాధానపరచలేకపోయారు. “అతణ్ణి దయ్యానికి విడిచిపెట్టండి” అని చెప్పాడు. ఏమి జరుగుతుందో గమనించండి. మరియు తరువాతి పత్రికలో, ఈ వ్యక్తి సరిచేయబడ్డాడని పౌలు వ్రాసాడు. నిశ్చయంగా. మనము కేవలం ఆయనయొక్క నియమాలను పాటించినట్లైతే, ఈ కార్యములు చేయడానికి దేవుడు ఒక మార్గమును కలిగియున్నాడు.

87 సంఘములో ఏదైనా తప్పు జరిగినట్లైతే, అది సంఘసభ్యుల మధ్య జరిగినట్లైతే, సహోదరులైన మీలో ప్రతి ఒక్కరూ. అది సంఘపెద్దల మధ్య విషయమైతే, సంఘపెద్దలైన మీలో ఒకరు సరిగా ప్రవర్తించడంలేనియెడల, మిగితా సంఘపెద్దలు వచ్చి ఒక సమావేశమును కలిగియుండండి, ఆ సహోదరుణ్ణి సమాధానపరచుటకు ప్రయత్నించండి, అతడు ఏమి చేస్తున్నాడో అతనికి చెప్పండి; లేదా సభ్యులైన మీలో ఒకరు, మీరు ఎవరైనప్పటికినీ చెప్పండి. పిదప అది అతని యెదుటకు తీసుకురాబడవలసి యున్నది. అతడు దానిని చేయనియెడల, అప్పుడు వచ్చి సంఘకాపరికి చెప్పండి. అప్పుడు, అతడు సంఘము నుండి విడిచిపెట్టబడతాడు, మరియు పిదప అతడిని ఒక అన్యుడిగా మరియు ఒక లోకానుసారుడిగా ఉండనివ్వండి. అప్పుడు ప్రభువు అతని మీద పనిచేయడాన్ని గమనించండి. చూడండి, అప్పుడే అతడు స్పృహలోనికి వస్తాడు. అప్పుడే అతడు లోపలికి ప్రాకడం ప్రారంభిస్తాడు. అయితే మనము దానిని మనంతట మనమే చేయడానికి ప్రయత్నిస్తాము, మీకు తెలుసు కదా, ఆ…ప్రతిదానిని మనం చేయాలనుకున్న విధంగా చేయడానికి ప్రయత్నిస్తాము, ఇప్పుడు, మనము ఎన్నడూ విజయం సాధించము.

88 ఇప్పుడు, ఈ మెల్కీసెదెకు, షాలేము రాజు, అధిపతి, సర్వోన్నతుని యాజకుడు, అబ్రాహామును కలుసుకొని మరియు అతణ్ణి ఆశీర్వదించాడు. మరియు తన దశమభాగములను ఆయనకు ఇచ్చాడు, అబ్రాహాము ఇచ్చాడు. మరియు ఆయన షాలేము రాజైయున్నాడు. మరియు ఆయన రొట్టెను ద్రాక్షారసమును బయటకు తీసి, ప్రభురాత్రి భోజనమును తీసి, మరియు యుద్ధము తర్వాత, ఆ మనుష్యుల మీద జయము పొందిన తర్వాత, దానిని అబ్రాహామునకు ఇచ్చాడు.

89 ఇప్పుడు, “యుద్ధములన్నీ,” నేను చెప్పినట్లుగా, “సిద్ధాంతముల కొరకు పోరాడబడతాయి.” ఇప్పుడు, సంఘములో మీరు ఒక చిన్న యుద్ధమును కలిగియుంటున్నయెడల, అది తప్పక సరియైన సిద్ధాంతము కొరకైయుండవలసి యున్నది. మీరు తప్పక సరియైన దానికొరకు పోరాడవలసియున్నారు. మరియు సంఘములోని ప్రతి సభ్యుడు దానిని చేయవలసియున్నాడు. ఇప్పుడు, ఈ ఉపదేశము సంఘము కొరకైయున్నది. దాని కొరకే మనము ఇక్కడున్నాము. దాని కొరకే నేను ఇక్కడ నిలబడియున్నాను. దేవుని వాక్యము దాని కొరకే ఉన్నది, సంఘము కొరకే ఉన్నది.

90 ఈ సంఘమునకు దేనిని ఆటంకముగా ఉండనీయవద్దు. అది అలా జరిగినట్లైతే, మీలో ప్రతి ఒక్కరూ, దోషులైయున్నారు. మరియు, మీయొక్క వివిధమైన సంఘములలో ఉన్న మీరు, మీ సంఘములో ఏదైనా తప్పు జరుగుతున్నట్లైతే, మీరు దోషులైయున్నారు, ఎందుకనగా మీరే ఆ సంఘమునకు అధ్యక్షులైయున్నారు. అది సంఘకాపరి పని కాదు. అది సంఘపెద్ద పని కాదు. ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి మరియు అతణ్ణి సమాధానపరచగలవేమో చూడటం, అది వ్యక్తిగతంగా, నీ పనియైయున్నది. అలా జరుగకపోతే, అప్పుడు ఇద్దరు లేదా ముగ్గురిని నీతో తీసుకొని, పిదప తిరిగి అక్కడికి వెళ్ళండి. అతడు దానిని వినలేదంటే, దానిని సంఘమునకు చెప్పండి. అప్పుడు అతడు దేవుని రాజ్యము నుండి విడిచిపెట్టబడతాడు. దేవుడు ఇట్లు చెప్పాడు, “మీరు ఈ క్రమము ప్రకారంగా చేసినయెడల, మీరు అతణ్ణి అక్కడ విడిచిపెట్టినట్లైతే, నేను అతణ్ణి ఇక్కడను విడిచిపెడతాను.” అప్పుడు ఆయన అతని శరీరముయొక్క నిర్మాణము కొరకు…నాశనము కొరకు అపవాదిని అతని మీదకు వదులుతాడు. మరియు అప్పుడు అతడు తిరిగి వస్తాడు. అది నిజము. అతణ్ణి తిరిగి వచ్చేటట్లు చేసే మార్గము అదియే. అతడు దేవుని కుమారుడైతే, అతడు తిరిగి వస్తాడు. అతడు కాకపోతే, ఏంటీ—ఇంకేంటీ, అతడు అలాగే కొనసాగుతాడు, మరియు పిదప అపవాది అతణ్ణి అతనియొక్క నిత్యమైన స్థానమునకు పంపుతాడు.

91 ఇప్పుడు, దాని వెనుకనున్న ఉద్దేశాలను చూడండి. నీవు కేవలం ఎవరి కోసమో వారిని లోపలికి తెస్తే, అప్పుడు అది వేరే విషయం. కానీ, ఆ వ్యక్తి అపరాధ భావమును కలిగియుంటే అది భిన్నమైన విషయం! మరియు లోతు ఒక హెబ్రీయుడైనప్పటికినీ, అక్కడికి వెళ్ళి మరియు అతడు పడిపోయాడు. అతడు అక్కడికి వెళ్ళి మరియు పడిపోయాడు. అతడు కృపలో ఉన్నాడు, కానీ అతడు దానినుండి పడిపోయాడు. మరియు అతడు బయటకు వెళ్ళినప్పుడు…అయితే లోతు—లోతు రక్షించబడ్డాడు. లోతు రక్షించబడలేదని ఎన్నడూ అనుకోకండి. అతడు రక్షించబడ్డాడు. ఎందుకనగా, అతడు తప్పుడు స్థలములో ఉన్న సమయమంతా, “సొదొమయొక్క పాపములు నీతిగల తన మనస్సును అనుదినము నొప్పించెను,” అని బైబిలు గ్రంథము చెప్పినది. ఇప్పుడు, అతని శరీరము ఒక కార్యమును చేస్తున్నది. మరియు అతని అంతము ఏమిటి? అతడు మరింత అవమానమును తెచ్చాడు. అతని భార్య ఉప్పు స్తంభముగా మారిపోయినది. అతడు అతని కుమార్తెల ద్వారా పిల్లలను కన్నాడు. కావున, అది ఎటువంటి అవమానమును తెచ్చిందో మీరు చూడగలరు, ఎందుకనగా అతడు కృపనుండి పడిపోయి మరియు మరలా తననుతాను పునరుద్ధరించుకోలేదు. మరియు దేవుడు అతణ్ణి భూమి మీదనుండి తీసుకొని వెళ్ళవలసివచ్చినది.

92 కానీ, ఇంకనూ, అతడు పడిపోయిన సహోదరుడైయున్నాడు, మరియు అబ్రాహాము అతణ్ణి వెనుకకు తీసుకురావడానికి అతడు చేయగలిగినదంతా చేశాడు. మరియు అబ్రాహాములో ఉన్న ఆత్మ, ఈనాడు సంఘములో ఉన్నట్టి క్రీస్తుయొక్క ఆత్మయైయున్నది. ఆ సహోదరుడు ఏమి చేసినాగాని, అతణ్ణి తిరిగి క్రీస్తుతో సహవాసములోనికి తీసుకురాడానికి మీరు చేయగలిగినదంతా మీరు చేస్తారు. అతడు ఏమి చేసినా లెక్కలేదు, మీరు గట్టిగా ప్రయత్నిస్తారు.

93 ఇప్పుడు, షాలేములోని ఈ గొప్ప యాజకుడు, మరియు భూమ్యాకాశములకు సృష్టికర్తయైన ఈ మెల్కీసెదెకును గూర్చిన, ఈ పాఠములో మనము కొనసాగుతుండగా, ఇప్పుడు ఇక్కడ మరలా మనము గమనించగోరుతున్నాము, ఇప్పుడు, మొదటిగా:

తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేనివాడునైయున్నాడు; అయితే దేవుని కుమారుని పోలికలో చేయబడి; నిరంతరము యాజకునిగా ఉన్నాడు.

ఇపుడు గమనించండి. ఆయన దేవునియొక్క కుమారుడు కాడు, ఆయన కుమారునియొక్క దేవుడైయున్నాడు. ఆయన, అనగా మెల్కీసెదెకు దేవునియొక్క కుమారుడు కాడు, కానీ ఆయన దేవుని కుమారునియొక్క తండ్రియైయున్నాడు.

94 ఇప్పుడు, ఆయన కలిగియున్న ఈ శరీరమును, ఆయన సృష్టించాడు. అది ఒక స్త్రీ ద్వారా తీసుకురాబడలేదు. కావున సృష్టించబడిన ఆ శరీరముతో, ఆయన…అది తనను తాను బయలుపరచుకొనుటకు, తానే, తయారు చేసుకున్న ఒక వ్యక్తియైయున్నాడు.

“ఏ నరుడును దేవుని ఎన్నడూ చూడలేడు. దేవుడు ఒక ఆత్మయైయున్నాడు.” అది ఒక అగ్నిస్తంభము రూపములో, లేదా అది ఏదైతే ఆ రూపములో, లేదా వారు దర్శనము ద్వారా చూసినట్టి ఎవరో ఒకరి రూపములో ఉంటేనే తప్ప, మర్త్యమైన కన్నులు ఆ సంగతులను చూడవు. అయితే…ఏదో ఒక మార్గముగుండా దేవుడు తనను తాను బయలుపరచుకోవలసియున్నాడు. మరియు దేవుడు అబ్రాహామునకు, ఒక మానవ రూపములో తనను తాను బయలుపరచుకున్నాడు. ఆయన మోషేకు, ఒక మానవ రూపములో తనను తాను బయలుపరచుకున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకు, ఒక అగ్నిస్తంభము రూపములో తనను తాను బయలుపరచుకున్నాడు. ఆయన బాప్తిస్మమిచ్చు యోహానుకు ఒక పావురము రూపములో, తనను తాను బయలుపరచుకున్నాడు. మీరు చూడండి, ఆయన ఆ రూపములలో తనను తాను బయలుపరచుకున్నాడు.

ఒక మానవ రూపములో, షాలేము, అనగా యెరూషలేము రాజుగా; ఆయన తననుతాను బయలుపరచుకుంటున్నప్పుడు; మరది భూసంబంధమైన యెరూషలేము కాదు, కానీ పరలోకపు యెరూషలేమైయున్నది. ఆయన ఆ రూపములో తనను తాను బయలుపరచుకున్నాడు. ఆయన దేవుని కుమారుని “పోలికలో” చేయబడ్డాడు.

95 ఇప్పుడు, ఇక్కడ సృష్టించబడుటకు, దేవుని కుమారుడు ఒక స్త్రీ ద్వారా రావలసియున్నది; ఒక స్త్రీయొక్క గర్భము ద్వారా రావలసియున్నది, ఎందుకనగా సరిగ్గా దాని ద్వారానే మరణము వచ్చినది.

96 మరియు ఆదిలో దేవుడు చేసినట్లుగా ఆయన సృష్టి ద్వారా రాలేడు. ఆదిలో దేవుడు పురుషుడిని చేసినప్పుడు, స్త్రీకి దానితో ఎటువంటి సంబంధమూ లేదు. దేవుడు కేవలం, “కలుగును గాక” అని పలికాడు, మరియు ధూళిలోనుండి ఒక మనిషి వచ్చాడు. స్త్రీకి దానితో ఎటువంటి సంబంధము లేకుండా, ఆయన అతణ్ణి పిలిచాడు. అయితే, ఆ స్త్రీ, అప్పుడు ఆమె ఆ పురుషునిలోనే ఉన్నది.

97 మరియు దేవుడు ఆదాము ప్రక్కనుండి స్త్రీని తీసాడు. అది నిజమేనా? మరియు పిదప స్త్రీ వెళ్ళి లైంగిక సంపర్కము ద్వారా పురుషుని తీసుకొనివచ్చింది. కాబట్టి దేవుడు రాగలిగే ఒకే ఒక్క మార్గము…ఆయన ఆ థియోఫనీలో రాలేడు. ఆయన మెల్కీసెదెకు వలె రాలేడు. ఆయన ఒక మానవుడిగా రావలసియున్నది, మరియు ఆయన స్త్రీ ద్వారా రావలసియున్నది. “నీ సంతానము సర్పముయొక్క తల మీద కొట్టును, మరియు దాని తల నీ మడిమె మీద కొట్టును.” అది అర్థమైందా? దేవుడు ఒక స్త్రీ ద్వారా రావలసియున్నది; మరియు ఆయన తన కుమారుడైన, క్రీస్తుయేసు యొక్క శరీరములో నివసించినప్పుడు, ఆయన దానిని చేశాడు. “దేవుడు క్రీస్తులో ఉండి, లోకమును తనతో సమాధానపరచుకొనుచున్నాడు.” మరియు ఆయన తన స్వంత రక్తమును బలిగా అర్పించాడు. మరియు మరణము అనే ఆ మార్గముగుండా, ఆయన నిన్ను నిత్యజీవములోనికి రక్షించునట్లు, ఆయన తన ప్రాణమును అర్పించాడు.

98 కాబట్టి అప్పుడు దేవుడు వచ్చాడు, మరియు ఆయన దేవుని కుమారుని “పోలికలో” చేయబడ్డాడు. చూశారా? ఆయన దేవుని కుమారుని పోలికలో చేయబడిన ఒక మానవుడైయున్నాడు. ఇప్పుడు, ఆయన దేవుని కుమారుడైయుండలేడు, ఎందుకనగా ఈ మనుష్యుడు నిత్యుడైయున్నాడు.

99 దేవుని కుమారుడు ఒక ఆదిని కలిగియున్నాడు, ఆయన ఒక అంతమును కలిగియున్నాడు. ఆయన తాను పుట్టిన ఒక—ఒక సమయమును కలిగియున్నాడు, ఆయన తాను మరణించిన ఒక సమయమును కలిగియున్నాడు. ఆయన ఆదిని మరియు అంతమును రెండిటిని కలిగియున్నాడు. ఆయనకు తల్లి మరియు తండ్రి ఇద్దరూ ఉన్నారు.

100 ఈ వ్యక్తికి తండ్రియైనను లేదా తల్లియైనను లేరు, జీవితకాలమునకు ఆదియైనను అంతమైనను లేవు. అయితే ఆయన, ఈ వ్యక్తి, మెల్కీసెదెకు, దేవుని కుమారుని పోలికలో చేయబడ్డాడు.

101 ఇప్పుడు, దేవుని కుమారుడు, ఒక స్త్రీ రూపములో, లేదా, ఒక స్త్రీ ద్వారా, ఆయన ఒక మానవుడి రూపములో, లోకములోనికి వచ్చి, మరియు చంపబడి, మూడవ దినమున తిరిగి లేపబడి, మన నీతికరణ కొరకు తిరిగి లేచాడు, ఇప్పుడు ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. మరియు ఆ శరీరము నిలిచియున్నంత కాలము, మనము కూడా నిలిచియుంటాము. మరియు ఆయన ధూళినుండి లేచాడు కాబట్టి, మనము కూడా ఆయన పోలికలో లేపబడతాము. అదియే సువార్త గాధయైయున్నది. ప్రభువు నామము స్తుతింపబడును గాక. దేవదూతలు కారు, సహజాతీతమైన జీవులు కావు, అటు ఇటు ఎగరడానికి తట్టెడు ఈకలను కలిగియున్నవారు కారు, కాని స్త్రీలు మరియు పురుషులు, ఆమేన్, ఆయన పోలికలో నిలబడతారు. అవును, అయ్యా.

102 నేను దీనిని తరచుగా చెప్పినట్లే, ఈ సమయములో కూడా నేను మరలా ఇక్కడ దీనిని చెప్తున్నాను. ఇది తగిన సమయమన్నట్లు అగుపిస్తున్నది. నాకు మిగిలియున్న ఈ ఐదు లేక ఆరు వెంట్రుకలను, నేను దువ్వుకుంటున్నాను. మరియు నా భార్య ఇట్లన్నది, “బిల్లీ, నీకు బట్టతల వస్తున్నది.”

103 నేను ఇట్లన్నాను, “కానీ నేను వాటిలో ఒక్కదానిని కూడా కోల్పోలేదు.”

104 ఆమె ఇట్లన్నది, “అవి ఎక్కడున్నాయి?”

105 నేను ఇట్లన్నాను, “నేను వాటిని పొందుకోడానికిముందు అవి ఎక్కడున్నాయో నాకు చెప్పు, అవి నా కొరకు ఎక్కడ వేచియుంటున్నాయో నేను నీకు చెప్తాను.” అది నిజము.

106 నేను ఒక—ఒక యోధునిగా, బాక్సింగ్ చేసేవానిగా ఉండేవాణ్ణి. నేను బలంగా మరియు పెద్దగా ఉండేవాణ్ణి. మరియు మీరు ఈ చర్చీని నా వీపుపైన పెట్టినట్లైతే, నేను దానితో వీధిగుండా నడుచుకుంటూ వెళ్ళగలనని, నాకు అనిపించేది. అయితే నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు ప్రతి ఉదయం నేను మేల్కొన్నప్పుడు, నలభై ఏళ్ళకు పైగా గడిచిపోయినవని నేను గ్రహిస్తున్నాను. చూశారా? నేను ఒకప్పటిలాగా లేను. ప్రతి రోజు, నేను క్షీణించిపోతున్నాను. నేను నా చేతులను చూస్తుండగా ఇట్లనుకుంటాను, “ఇదిగో చూడు. సరే, నేను ఒక వృద్ధుడనవుతున్నాను.” నేను నా భుజములను చూస్తున్నాను. నేను చాలా బరువు పెరిగానని నేను గ్రహిస్తున్నాను. నేను ఒక ఇరవై-ఎనిమిది సైజు బెల్టును పెట్టుకునేవాణ్ణి. ఇప్పుడు నేను ముప్పై సైజు బెల్టును పెట్టుకుంటున్నాను. చూడండి, నేను వృద్ధుడవుతున్నాను, లావుగా అవుతున్నాను, బలహీనమైపోతున్నాను.

107 అది ఏమిటి? నేను ఇంతకుముందు తినేవాటినే ఇప్పుడు తింటున్నాను. నేను ఇంతకుముందు జీవించిన దానికంటె శుభ్రముగాను శ్రేష్ఠముగాను జీవిస్తున్నాను, అలాగే ఉంటున్నాను. అయితే దేవుడు నా కొరకు ఒక సమయమును నియమించాడు, మరియు నేను తప్పక దానిని స్వీకరించవలసియున్నాను. అయితే ధన్యకరమైన తలంపు, ఏమిటనగా, ఆ దినమున, ఆయన నన్ను మరలా పైకి లేపుతాడు. మరియు నేను ఇరవై-ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నేను ఎలాగున్నానో, నేను మరలా అలాగే ఎప్పటికీ ఉంటాను. ఆమేన్. విషయం అదే. వృద్ధాప్యం నాకు ఏమి ఇబ్బంది కలుగజేస్తుంది? నేను ఆయనను నమ్ముతున్నానని ఎరిగియుండి, సంవత్సరముల తరబడి సంవత్సరములు నేను దాని నుండి దయ్యమును వెళ్ళగొట్టాను. ఈ చిన్న కాలపరిమితి, ఎలాగైనా, ఇది కేవలం ఒక చిన్న, వ్యవధియైయున్నది. మనకు వాగ్దానము చేయబడిన సమయమైనట్టి, ఏడు దశకాలు, అనగా డెబ్బై సంవత్సరములు మాత్రమే మనము నిలిచియున్నట్లైతే, అది దుఃఖము మరియు బాధ కాక ఇంకేమిటి—ఇంకేమిటి? అది ఏమిటి? ఆవలిన ఉన్న ఆ మహిమకరమైన దానికొరకు మీరు ఈ రోగశాలను మార్చుకోరా?

108 ఏమిటి, ప్రభువు నామము స్తుతించబడును గాక! ఒక దినమున నా అంతరంగములోనున్న ఏదో ఆ మెల్కీసెదెకును కలుసుకున్నది, మరియు ఆయన నాతో సమాధానమును పలికాడు మరియు నాకు నిత్యజీవమును ఇచ్చాడు. మరియు ఈ జీవితము సువార్తను ప్రకటించడం కొరకైన ఒక గుడారము తప్ప మరేమియు కాదు. ఈ రెండు బైబిళ్ళు నా యెదుట తెరువబడియుండగా, సంపూర్ణ యధార్థతతో నేను దీనిని చెప్తున్నాను. నేను సువార్తను ప్రకటించే విషయంలో దేవునికి నాతో పని అయిపోయినయెడల, మరియు నేను ఇక ఎంతమాత్రము ఆయన కొరకు పని చేయలేనియెడల, నా పిల్లలు తమను తాము చూసుకోగలిగే వయస్సులో ఉండి, మరియు సరిగ్గా ఇప్పుడే ఆయన నన్ను తీసుకొనగోరుతున్నయెడల, “ఆమేన్,” అదియే దానిని స్థిరపరుస్తుంది. అవును, అయ్యా.

109 నాకు ఎనభై సంవత్సరాలు ఉన్నాయా లేదా ఇరవై సంవత్సరాలు ఉన్నాయా అనేది ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది? నేను కేవలం ఒకే ఒక్క విషయం కొరకు ఇక్కడ ఉన్నాను: అది ప్రభువును సేవించడం కొరకేయైయున్నది. అంతే. నాకు ఎనభై సంవత్సరములు వచ్చినప్పుడు కూడా, నేను ఇప్పుడు ప్రకటిస్తున్నట్లే సువార్తను ప్రకటించగలిగితే, అప్పుడు నాకు నలభై సంవత్సరాలా లేదా ఎనభై సంవత్సరాలా అనేది ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది? ఈ రాత్రి ఎనభై సంవత్సరాల వయస్సు గలవారు చాలామంది ఉన్నారు. మరియు ఎనభై-ఏండ్లు గల ఒక వక్తి వారిలో అనేకమందిని దాటి బ్రతుకుతుండగా, చాలామంది పిల్లలు చనిపోతున్నారు. అది ఎటువంటి వ్యత్యాసమును కలుగజేస్తుంది? మీ ఉద్దేశములు, మీ నియమములు ముఖ్యమైయున్నవి, మరియు ప్రభువైన యేసును సేవించడానికే మనము ఇక్కడ ఉన్నాము. అది అంతే.

110 దీనిని ఎరిగియున్నాము, అదేమిటనగా, “మనుష్యుడు దేనిగురించైతే మాట్లాడుతున్నాడో అటువంటి ఈ జీవము; కొంతసేపు కనబడి, అంతలో మాయమైపోవు ఆవిరివంటిదే.” కానీ మనము గనుక నిత్యజీవమును కలిగియుంటే, ఆయన మనల్ని తిరిగి లేపుతాడని దేవుడు వాగ్దానము చేసాడు. మరియు దినములు ముగిసిపోయి, మరియు “జగత్తుపునాది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడియున్న, ప్రభువుయొక్క ఆనందములో ప్రవేశించండి,” అని ఆయన పలికినప్పుడు మనము ఆయనతో కలిసి ప్రభురాత్రి భోజనమును తీసుకుంటాము.

111 అటువంటప్పుడు మనమిక్కడ దేనినైనా కలిగియున్నామా, లేదా మనము కలిగిలేమా అన్నది ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది? మనము యవ్వనస్థులమా లేక వృద్ధులమా అనేది, ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది? ముఖ్యమైన విషయమేమిటంటే, ఆయనను కలుసుకోడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? నీవు ఆయనను సేవించగలవా? నీవు లోకపు కార్యములను పూర్తిగా త్యజించావా? యుద్ధం ముగించబడినది గనుక నీవు మెల్కీసెదెకును కలుసుకున్నావా?

112 దేవునికి స్తుతి కలుగును గాక! నాకు, దాదాపు ఇరవై-ఒక్క సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, మరి ఒక రోజు నాకు దీనితో, దానితో, మరియు ఆ మరొకదానితో యుద్ధము జరిగినది. నేను ఒక బాక్సింగ్ చేసేవాడిగా అవ్వగోరుతున్నానో, లేదా నేను ఒక వలలు బిగించేవాడిగా, లేదా వేటగాడిగా అవ్వగోరుతున్నానో, అసలు నేను ఏమి అవ్వగోరుతున్నానో నేను కనుగొనలేని స్థితిలో ఉన్నాను. అయితే నేను మెల్కీసెదెకును కలుసుకున్నాను, మరియు ఆయన నాకు ప్రభురాత్రి భోజనమును ఇచ్చాడు, మరియు అప్పటినుండి అది ఎప్పటికీ స్థిరపరచబడినది. హల్లెలూయా! నేను ఆయన పక్షమునకు వెళ్ళాను. నేను దారిలో ఆనందిస్తూ ఉన్నాను. మరియు మార్గాంతమునకు వచ్చినప్పుడు, మరియు మరణము నా ముఖములోనికి తేరి చూస్తున్నప్పుడు, నేను ఇప్పుడు కలిగియున్న అనుభూతిని బట్టి, నేను దానికి ఎన్నడూ భయపడను. నేను నడుస్తాను, వాగ్దానము చేసిన ఆయన నాకు తెలుసు అనే విషయమును ఎరిగియుండి, అది నిజము, ఆయనయొక్క పునరుత్థానపు శక్తిలో నేను ఆయనను ఎరుగుదును అనే విషయమును ఎరిగియుండి, నేను దాని ముఖము యెదుటకు నడువగోరుతున్నాను. ఆయన మృతులలోనుండి పిలిచినప్పుడు, నేను వారి మధ్యనుండి బయటకు వస్తాను. అది నిజము, ఆయనయొక్క పునరుత్థానపు శక్తిలో ఆయనను ఎరిగియుండుట. నేను వృద్ధుడనా లేదా యౌవ్వనస్థుడనా అనేది, ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది? నేను చిన్నగా ఉన్నానా లేదా నేను పెద్దగా ఉన్నానా? నా కడుపు నిండియున్నదా లేదా నేను ఆకలితో ఉన్నానా? నేను పడుకోడానికి ఒక స్థలమును కలిగియున్నానా కలిగిలేనా అనేది ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది?

113 “పక్షులకు గూళ్ళు, నక్కలకు గుహలు ఉన్నాయి, కానీ మనుష్యకుమారునికి తన తలవాల్చుకొనుటకైనా స్థలము లేదు,” అయితే ఆయన మహిమగల రాజైయున్నాడు.

114 ఈ రాత్రి మనము రాజులును యాజకులునైయున్నాము. మనము కలిగియున్నామా లేదా మనము కలిగిలేమా అనేది ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది? మనము దేవుణ్ణి కలిగియున్నంతకాలం, మనము జయశీలులమైయున్నాము. మనము జయశీలులమైయున్నాము. మనము దేవుని సన్నిధిలో కూర్చొని, పరిశుద్ధాత్మయొక్క సహవాసములో ఉండి, “మృతినొంది, మరలా సజీవుడైనవాడను నేనే, మరియు నేను ఎన్నటెన్నటికీ జీవించుచున్నాను,” అని సాక్ష్యమిచ్చిన ఆయన చేతులనుండి ఆత్మసంబంధమైన ప్రభురాత్రి భోజనమును తీసుకుంటున్నాము. క్రీస్తుయేసులో పరలోకపు స్థలములలో కలిసి కూర్చొనియున్నాము. ఓ, ఆయనయొక్క పరిశుద్ధ నామము స్తుతించబడును గాక! అది ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది?

ఒక డేరానా లేదా ఒక కుటీరమా అని, నేను ఎందుకు పట్టించుకోవాలి?

అక్కడ వారు నా కొరకు ఒక అంతఃపురమును నిర్మించుచున్నారు!

కెంపులు మరియు వజ్రాలు, మరియు వెండి మరియు బంగారముతో కట్టుచున్నారు,

ఆయనయొక్క ఖజాన నిండుగాయున్నది, ఆయనకు చెప్పలేనంత ఐశ్వర్యమున్నది.

115 ఒక రోజు నేను యుద్ధము నుండి వచ్చినప్పుడు నేను ఆయనను కలుసుకున్నాను. నేను నా ట్రోఫీలను క్రింద పెట్టాను. అప్పటినుండి నేను ఒక్క పోరాటమును పోరాడలేదు; నా కొరకు ఆయనే వాటిని పోరాడుతాడు. ఆయనయొక్క పునరుత్థానపు శక్తిలో నేను ఆయనను ఎరిగియున్నాను, అనే ఈ విషయమును, ఎరిగియుండి, నేను కేవలం ఆయనయొక్క వాగ్దానముపై విశ్రాంతి తీసుకుంటున్నాను. ముఖ్యమైనది అది మాత్రమే. ముఖ్యమైనది ఇంకేమి ఉంటుంది?

116 మనము ఏమి చేయగలము? చింతించుటవలన నీ ఎత్తు ఒక మూరెడు పెరుగుతుందా? నీకు ఉంగరాల జుట్టున్నదా, లేక నీకు అసలు జుట్టు ఉన్నదా లేదా అనేదాని గురించి నీవెందుకు పట్టించుకోవాలి? అది ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది? నీవు వృద్ధుడవైనా, నీ వెంట్రుకలు తెల్లగా ఉన్నా, నీ భుజములు-వంగిపోయినా, నీవు అలా లేకపోయినా, అది ఏమి వ్యత్యాసమును కలుగజేస్తుంది? ఆమేన్. ఇది కేవలం కొంతకాలము వరకు, స్వల్పకాల వ్యవధి వరకు మాత్రమే ఉంటుంది, కానీ అది ఎన్నటెన్నటికీ ఉంటుంది. మరియు అనేక శతాబ్దాల కాలము దొర్లుచున్నా గాని, యుగములు దొర్లుచున్నా గాని, నీవు ఎన్నడూ మారవు, మరియు ఆయనయొక్క అంతములేని నిత్యమైన యుగములగుండా వెళ్తావు. అది ఎటువంటి వ్యత్యాసమును కలుగజేస్తుంది?

117 నేను ఆయనను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషముగా ఉన్నది. రాజులను సంహరించి వస్తున్న అబ్రాహమును కలిసిన అదే మెల్కీసెదెకు, ఆయన ఒక దినమున నాకు ప్రభురాత్రి భోజనమును ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిశ్చయముగా. “పరలోకపు దేవుడు,” ఎల్ ఎలియోన్; “నేను ఉన్నవాడను,” అనే ఆ గొప్పవాడు, నేను ఒకప్పుడు ఉన్నవాడను కాదు; నేను ఉన్నవాడను, వర్తమానకాలము. “మరియు ఆయన అతణ్ణి ఆశీర్వదించాడు.”

118 ఇక్కడ కేవలం ఇంకొంచెము ముందుకు వినండి, తద్వారా మనము పాఠమును కొంచెము బాగుగా పొందుకుంటాము. ఇప్పుడు 4వ వచనము.

ఇప్పుడు ఇతడెంత ఘనుడో చూడండి,…

నేను కూడా దానిని ఆలోచిస్తుంటాను. “ఈయన ఎంత ఘనుడో చూడండి.” ఆయన దేవుని కుమారునికి మించినవాడు. దేవుని కుమారునికి తల్లి మరియు తండ్రి ఉన్నారు; ఈయనకు లేరు. దేవుని కుమారుడు కాలమునకు ఆదిని మరియు కాలమునకు అంతమును కలిగియున్నాడు; ఈయన కలిగిలేడు. అది ఎవరు? అది కుమారునియొక్క తండ్రి. అది ఆయనేయైయున్నాడు.

…ఇతడెంత ఘనుడో చూడండి, మూలపురుషుడైన అబ్రాహామే…అతనికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చాడు.

119 ఇప్పుడు జాగ్రత్తగా వినండి.

మరియు లేవి కుమాళ్ళలోనుండి, యాజకత్వము పొందువారు, తమ సహోదరులు…అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున, వారి యొద్ద, అనగా ప్రజల యొద్ద పదియవవంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞలను పొందియున్నారు గాని:

120 ఇప్పుడు మీరు దేనినైనా చూడగోరుతున్నయెడల దీనిని గమనించండి.

వారికి…వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన ఈయన అబ్రాహాము నొద్ద పదియవవంతు పుచ్చుకొని, వాగ్దానమును పొందినవానిని ఆశీర్వదించెను.

121 అబ్రాహాము వాగ్దానమును కలిగియున్నాడు, మరియు వాగ్దానము కలిగియున్న అబ్రాహామును ఈ మనుష్యుడు ఆశీర్వదించాడు. ఈయన ఎవరు? లేవీ కుమారులు వారి సహోదరులకు దశమభాగములు చెల్లించారు లేదా…వారి సహోదరులే వీరికి దశమభాగములు చెల్లించారు. వారి సహోదరులు జీవనము కొరకు సంపాదించిన దానిలోనుండి, పదియవ వంతును తీసుకోమని వారు ప్రభువు యొద్దనుండి ఆజ్ఞను పొందుకున్నారు, ఎందుకనగా వారు యాజకత్వమైయున్నారు. ఇప్పుడు, మీరు మాట్లాడుతున్నట్లు, సరిగ్గా అక్కడే అది మెల్కీసెదెకు యాజకత్వమును చూపిస్తుంది. అది నిజము. అయితే ఈ మనుష్యుని విషయంలో…వాగ్దానము కలిగియున్నవాడే, భూమి మీద అత్యంత గొప్పవాడైన, అబ్రాహామే, ఈయనను కలుసుకొని మరియు ఈయనకు దశమభాగములు చెల్లించాడు. [టేపులో ఖాళీ ఉన్నది—సంపా.] ఆయన ఇంకా గొప్పవాడై యుండవలసియున్నది.

122 వినండి.

తక్కువ వాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమైయున్నది.

నిశ్చయముగా. ఆయన ఎవరో గమనించండి.

మరియు ఇక్కడ చావునకు లోనైనవారు పదియవ వంతులను పుచ్చుకొనుచున్నారు;…

అది యాజకులు మరియు బోధకులు మరియు మొదలగువారి క్రమము చొప్పునైన యాజకత్వమైయున్నది. చావునకు లోనైనవారు, పదియవ వంతులను పుచ్చుకొనుచున్నారు. చూశారా?

…అయితే ఇక్కడ జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు, వాటిని పుచ్చుకొనుచున్నాడు.

123 ఒక మనిషి దశమభాగములను దేనికొరకు తీసుకుంటాడు, అతడు ఎటువంటి…అసలు ఎన్నడూ జన్మించనివాడై, మరియు ఎన్నడూ మరణించలేనివాడై, మరియు ఆదినుండి అంతమువరకు ఉండియున్నవాడై, మరియు—మరియు తండ్రినైనను లేదా తల్లినైనను లేదా వంశావళినైనను కలిగిలేనివాడై, మరియు భూమ్యాకాశములును మరియు వాటిలో ఉన్న సమస్తమును అతనికే చెందియున్నయెడల, అతడు దశమభాగమును ఎందుకు తీసుకుంటాడు? దశమభాగములు చెల్లించమని అతడు అబ్రాహామును ఎందుకు అడుగుతాడు? దశమభాగములు చెల్లించడమనేది ఎంత ఖచ్చితమైన విషయమో మీరు చూస్తున్నారా? దశమభాగము చెల్లించడమనేది సరైన విషయము. ప్రతీ క్రైస్తవుడు దశమభాగము చెల్లించ బద్ధుడైయున్నాడు. అది నిజము. ఎన్నడూ మార్చబడలేదు.

124 ఇప్పుడు:

అంతేకాక నేను ఒక విధమున చెప్పినయెడల, పదియవవంతులను పుచ్చుకొను, లేవియు, అబ్రాహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను.

125 ఇపుడు, ఓ, ఇక్కడ ఒక విషయమున్నది.

ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు, అతడు తన పితరుని నడుములో ఉండెను.

126 ఏమిటి? లేవీనా? అబ్రాహాము లేవీయొక్క ముని-ముత్తాతయైయున్నాడు. మరియు ఇక్కడ బైబిలు గ్రంథము, ఇట్లు చెప్పినది, “అబ్రాహాముయొక్క నడుములో ఉన్నప్పుడే లేవి దశమభాగములను చెల్లించాడు.” అతడు అసలు భూమి మీదకు రావడానికి నాలుగు తరములముందే, అతడు మెల్కీసెదెకుకు దశమభాగములు చెల్లిస్తున్నాడు. ప్రభువు నామము స్తుతించబడును గాక!

127 అటువంటప్పుడు, ముందు ఏర్పాటును, లేదా ముందు నిర్ణయమును నమ్మలేని మీరు చూడండి; మరియు ఇక్కడేమో, లేవి అబ్రాహాము నడుము నుండి అసలు బయటకు రావడానికి నాలుగు తరములముందే, మెల్కీసెదెకుకు దశమభాగములు చెల్లిస్తున్నాడు. దీనిని లేఖనములో నుండి చూపించడానికి మనకు సమయముంటే బాగుండునని కోరుతున్నాను.

128 యిర్మీయా 1:4 లో ఉన్నట్లుగా మీరు దానిని తీసుకొన్నట్లైతే, దేవుడు ఇట్లు చెప్పాడు, “నీ తల్లి గర్భములో నీవు రూపింపబడకమునుపే నేను నిన్ను ఎరిగితిని. మరియు నేను నిన్ను ప్రతిష్ఠించితిని మరియు జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.” అప్పుడు నీవు ఏమి చేశావని నీవు చెప్పగలవు? నేనేమి చేశానని నేను చెప్పగలను? కరుణించువాడు దేవుడే. జగత్తుపునాదికి ముందే దేవుడు మనల్ని ఎరిగియున్నాడు.

129 ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకు ఇష్టము లేదు. ఖచ్చితంగా ఇష్టము లేదు. కానీ ఆయన దేవుడైతే, ఎవరు రక్షింపబడతారో మరియు ఎవరు రక్షింపబడరో ఆయన ఎరిగియుంటాడు, లేదంటే ఆయనకు ఏమియు తెలియనట్లే. ఆయన ఎరుగని యెడల…లోకము అసలు రూపించబడకముందే, ఎవరు ఎత్తబడతారో ఆయన ఎరిగియుండకపోతే, అప్పుడు ఆయన దేవుడు కానట్లే. ఆయన అనంతుడైనయెడల, ఆయన…అసలు భూమి రూపించబడకముందే, భూమి మీద ఉండబోవు, ప్రతి గోమరును, ప్రతి ఈగను, ప్రతి పేనును, ప్రతీ కీటక పురుగును ఎరిగియున్నాడు. అది నిజము. ఆయన సమస్త విషయములను ఎరిగియున్నాడు. జగత్తుపునాది వేయబడకమందే, ఆయన మనల్ని ఎరిగియున్నాడు. “ఆయన మనల్ని ఎరిగియుండి మరియు మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు,” అని, బైబిలు గ్రంథము చెప్పినది.

130 మనం కేవలం ఒక్కసారి దీనిని పరిష్కరించుదాము. మనము తిరిగి ఎఫెసీ పత్రిక, 1వ అధ్యాయమునకు వెళ్దాము. 5వ అధ్యా-…ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఒక్క క్షణము. నేను ఒక్క నిమిషము ఇక్కడ చదవాలనుకుంటున్నాను, తద్వారా అది కేవలం నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టి ఏదో ఒక విషయము కాదు గాని, అది దేవుడు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టి ఒక విషయమైయున్నదని మీరు నిజంగా గ్రహించగలుగుటకై యున్నది. చూశారా? ఇప్పుడు దీనిని, చాలా జాగ్రత్తగా వినండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము.

దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడైన, పౌలు,…

హెబ్రీ పత్రికను వ్రాసిన అదే వ్యక్తి, ఈ పత్రికను వ్రాస్తున్నాడు.

…పరిశుద్ధులకు…

ఇది అవిశ్వాసులకు కాదు గాని, పరిశుద్ధులకైయున్నది, పరిశుద్ధ-…పరిశుద్ధులకైయున్నది.

…ఎఫెసులోనున్న పరిశుద్దులును, క్రీస్తుయేసు నందు విశ్వాసులైనవారికి వ్రాయునది:

మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు, మీకు కృపయు, సమాధానమును కలుగును గాక.

మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, స్తుతింపబడును గాక, ఆయన పరలోక స్థలములలో ఆత్మసంబంధమైన ఆశీర్వాదములన్నిటితో మనలను ఆశీర్వదించెను…

“ఎట్లనగా తన…” ఇప్పుడు, 4వ వచనమును, ఇప్పుడు జాగ్రత్తగా వినండి.

జగత్తుపునాది వేయబడకముందు ఆయనలో మనలను ఎన్నుకున్న ప్రకారము,…

అక్కడున్న ఆ “మనలను” అనగా ఎవరు? సంఘమే.

…ఆయన భూమికి పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయనలో (క్రీస్తులో) మనలను ఎన్నుకున్నాడు, తద్వారా మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని:

తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా ఏర్పరచుకొనెను,

131 ఎవరు దానిని చేశారు? దేవుడే దానిని చేశాడు. ఎవరు రక్షింపబడతారు మరియు ఎవరు రక్షింపబడరు అనేది దేవుడు ఆదినుండి ఎరిగియున్నాడు. నిశ్చయముగా, ఎవడును నశింపవలెనని ఆయన కోరలేదు. అయితే “సరి, దయనీయమైన యేసు, నేను అతని కొరకు జాలి కలిగియున్నాను. బహుశా నేను రక్షించబడి మరియు దానిని అంగీకరిస్తే మంచిది,” అన్నట్లు నీవు—నీవు ప్రవర్తిస్తావో లేదో చూడనిటాకి, ఆయన యేసును ఇక్కడికి పంపలేదు. లేదు, అయ్యా.

132 ఎవరు రక్షించబడతారో మరియు ఎవరు రక్షించబడరో దేవుడు ఆదిలోనే ఎరిగియున్నాడు. కావున, అందునుబట్టి, కొందరు రక్షించబడతారని ఆయనకు తెలుసు, కావున ఆయన ముందుగా ఎరిగిన వారికొరకు ప్రాయశ్చిత్తమును కలుగజేయడానికి ఆయన యేసును పంపించాడు. “ఏలయనగా ఆయన ఎందరినైతే ముందుగా ఎరిగియున్నాడో, ఆయన వారిని పిలిచాడు. మరియు ఆయన ఎందరినైతే పిలిచాడో, ఆయన వారిని నీతిమంతులుగా తీర్చాడు. మరియు ఆయన ఎందరినైతే నీతిమంతులుగా తీర్చాడో, ఆయన వారిని (భూతకాలము) మహిమపరిచాడు.” విషయం అదేయైయున్నది.

133 కాబట్టి నిన్ను కాపాడుకునేది నీవు కాదు, నిన్ను కాపాడేది దేవుని కృపయే. నిన్ను నీవు రక్షించుకోలేదు, లేదా రక్షించబడటానికి యోగ్యమైనదిగా నీవు ఏమియూ చేయలేదు. దేవుని కృపయే నిన్ను రక్షించినది. దేవుని కృపయే నిన్ను పిలిచినది. దేవునియొక్క ముందుజ్ఞానము నిన్ను ఎరిగియున్నది. ఆయన అనంతుడైతే, ఈ రాత్రి నీవు ఈ సంఘములో ఉంటావని, జగత్తుపునాది వేయబడకముందే, ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకపోతే, ఆయన దేవుడు కాడు. ఆయన సమస్తమును ఎరిగియున్నట్లైతే, ఆయన దేవుడైయున్నాడు. ఆయన సమస్తమును ఎరిగియుండకపోతే, ఆయన దేవుడు కాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడైతే, ఆయన సమస్త కార్యములను చేయగలడు. ఆయన సమస్త కార్యములను చేయలేనియెడల, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాడు. విషయం అదే.

134 కాబట్టి అది నీవు చేయగలిగే ఏదో ఒక కార్యమని నీవు ఎలా చెప్పగలవు? అది నీవు చేయగలిగినదేదియు కాదు. అసలు నీవు ఇక్కడ ఉన్నావన్నది కూడా, అది నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ మరియు కృపయైయున్నది. నీవు చేయగలిగేది ఏదియు లేదు, దేవుడు ఆయనయొక్క కృప ద్వారా నిన్ను పిలిచాడు; నీవు ఆలకించావు, విన్నావు, అంగీకరించావు.

135 “మంచిది,” నీవు ఇట్లంటావు, “సహోదరుడా బ్రెన్హామ్, అది విషయాన్ని విపరీతంగా వదులుగా చేస్తుంది.” ఖచ్చితంగా చేస్తుంది. మీరు స్వతంత్రులు. “మంచిది, ఆ వ్యక్తి అతడు కోరిన దేనినైనా చేయగలడు.” ఖచ్చితంగా. నేను ఎల్లప్పుడూ నేను చేయాలనుకున్నదే చేస్తాను. కానీ నీవు ఒక క్రైస్తవుడవైతే, నీవు తప్పు చేయాలని కోరవు.

136 ఒక చిన్న స్త్రీ ఆ వెనుక కూర్చొనియున్నది, నా భార్యయైయున్నది. నాలో ఉన్న సమస్తముతో నేను ఆమెను ప్రేమిస్తున్నాను. మరియు నేను వేరొక స్త్రీతో తిరిగి మరియు దానివలన ఎటువంటి పరిణామాలను ఎదుర్కోనని, మరియు తన దగ్గరికి వెళ్ళి, మరియు, “మేడా, నేను తప్పు చేశాను,” అని చెప్పవచ్చునని ఎరిగియున్నయెడల నేను దానిని చేస్తానని మీరు అనుకుంటున్నారా? నేను ఆమెను సరిగ్గా ప్రేమిస్తున్నయెడల, నేను దానిని చేయను. అది నిజము.

137 ఇప్పుడు, నేను ఈ విధంగా అంటే ఏమిటి “ఓ, నేను దానిని చేయలేను. ఎందుకో, నేను మీకు చెప్తాను. ఆమె నాకు విడాకులు ఇస్తుంది, మరియు నేను…ఓ, నేను ఒక బోధకుడను. అది ఏమి కలుగజేస్తుందో చూస్తున్నారా? ఆమె నాకు విడాకులు ఇస్తే, ఆ విషయం నన్ను వేదిక మీదనుండి తీసివేస్తుంది. ‘ఒక విడాకులు తీసుకున్న వ్యక్తి, ఓ!’ నాకు ముగ్గురు పిల్లలున్నారు; నేను దానిని ఊహించలేను. అయితే, అబ్బాయ్, నేను…”? సరే, అది ఆ విధంగా ఉన్నట్లైతే, నీవు చట్టబద్ధమైన వ్యక్తివే. నేను ఆమెను పెండ్లి చేసుకున్నది చట్టబద్ధమైన విషయముల మీద కాదు. నన్ను ఆమెకు యధార్థముగా జీవించునట్లు చేసేది చట్టబద్ధమైన విషయాలు కావు. అది నేను ఆమెను ప్రేమిస్తున్నందువలనై యున్నది. నేను ఏమి చేయనవసరం లేదు. అది ఒక ప్రేమ వ్యవహారమైయున్నందున నేను ఇష్టపూర్వకంగా ఆ విధంగా ఉంటాను. మరియు నీవు నీ భార్యను ప్రేమిస్తే, నీవును అలాగే చేస్తావు.

138 మరియు ఫిలియో ప్రేమతో, నీవు నీ భార్యను ఆ విధంగా ప్రేమిస్తే, మరి నీవు నిజంగా దేవుడిని ప్రేమించినయెడల, దానికంటే మిలియన్లరెట్లు బలముగా ఉండే, అగాపే ప్రేమతో నీవు క్రీస్తుకు ఏమి చేయవలసియున్నావు? ఈ రాత్రి నేను వెళ్ళి త్రాగవచ్చునని నాకు తెలిసినయెడల, ఈ రాత్రి నేను వెళ్ళి అనైతికముగా ప్రవర్తించవచ్చునని నాకు తెలిసినయెడల, ఈ రాత్రి, నాకు తెలిసినయెడల; ఆ విధంగా చేయాలన్నది అసలు నా హృదయములో ఉన్నయెడల, మరియు నేను వెళ్ళి దానిని చేసినా గాని, ఆయన నన్ను క్షమిస్తాడని తెలిసినా గాని, నేను దానిని చేయను. నేను ఆయన గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాను. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. నిశ్చయంగా. ఖచ్చితంగా.

139 ఆ కారణముచేతనే నేను నా అనుభవమును ఏ సంఘశాఖకు అమ్ముకోలేదు, (లేదు, అయ్యా), ఏ అసెంబ్లీ ఆఫ్ గాడ్ వారికి, ఏ చర్చ్ ఆఫ్ గాడ్ వారికి, ఏ పిలిగ్రిమ్ హోలినెస్ కి, మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, కాథలిక్కు వారికి అమ్ముకోలేదు. ఈ అనుభవముకు మారుగా, సమర్పించబడిన దేనిని నేను తీసుకోలేదు. ఎందుకనగా, అది మానవుడి ద్వారా ఎన్నడూ రాలేదు. అది దేవుని ద్వారా వచ్చినది. లేదు, అయ్యా. ఏ ఎల్విస్ ప్రెస్లీ యొక్క రాక్-అండ్-రోల్ కొరకు, లేదా అతని కాథలిక్కుల గుంపు కొరకు లేదా అతనియొక్క, లేదా, క్యాడిలాక్ కార్ల కొరకు, లేదా ప్రతీ నెల అతనికి వచ్చే, అతనియొక్క మిలియన్ డాలర్లు, మరియు మొదలగువాటికొరకు, నేను నా జన్మహక్కులను అమ్ముకోలేదు. లేదు, అయ్యా. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. మరియు ఒకవేళ నేను…నేను ఆ విధంగా ఆయనను ప్రేమించినంత కాలం, నేను ఆయనకు నమ్మకముగా ఉంటాను. మరియు దేవుడు నన్ను పిలిచి మరియు నన్ను ఎన్నుకున్నట్లైతే, ఆయన నాలో దేనినో పెట్టాడు, మరియు నేను ఆయనను ప్రేమిస్తున్నాను.

140 మిస్టర్. ఐస్లర్ నాకు గుర్తున్నాడు. మీ అందరికి, మీలో దాదాపు అందరికి అతడు తెలుసు. అతడు సరిగ్గా ఇక్కడికి వచ్చాడు, ఇండియానా రాష్ట్ర శాసన సభ్యుడైయున్నాడు; ఇక్కడికి వచ్చి, తన గిటారును వాయించేవాడు. నా బిడ్డ చనిపోయినప్పుడు, నా భార్య చనిపోయినప్పుడు, మరి వారంతా ఇక్కడ స్మశానవాటిక వద్ద ఉన్నారు. మరియు నేను నా చేతులను వెనుకకు పెట్టుకొని, ఏడుస్తూ, రోడ్డు మీద వెళ్తున్నాను. అతడు తన చిన్న, పాత ట్రక్కులో నుండి బయటకు దూకి, మరియు వచ్చి నా మీద తన చెయ్యి వేసి, ఇట్లన్నాడు, “బిల్లీ, నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.” ఇట్లన్నాడు, “నీవు దాదాపు వేదిక మీద పడిపోయేంతగా బోధించడాన్ని నేను విన్నాను. నీవు వీధి మూలలలో మరియు ప్రతిచోట, క్రీస్తు కొరకు కేకలు వేయడాన్ని విన్నాను.” ఇట్లన్నాడు, “ఇప్పుడు ఆయన నీ తండ్రిని తీసుకున్నాడు. ఆయన నీ తమ్ముణ్ణి తీసుకున్నాడు. వారిద్దరిని లాక్కున్నాడు, మరియు వారు నీ చేతులలో మరణించారు. అక్కడ అతడు చనిపోయాడు. నీ చేతులు పట్టుకొని, నీ భార్య మరణించినది. మరియు నీ బిడ్డ చనిపోయినది, మరియు నీకు సహాయము చేయడానికి నీవు ఆయనను పిలుస్తున్నావు. మరియు ఆయన నిరాకరించాడు. ఆయన గురించి నీవు ఏమనుకుంటున్నావు?”

141 నేను ఇట్లు చెప్పాను, “నాలోని సమస్తముతో నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను పాతాళమునకు పంపినా గాని, నేను ఇంకనూ ఆయనను ప్రేమిస్తాను.” ఆయన నీతిమంతుడు. నేను ఊరకే దానిని చెప్పడంలేదు; ఈ ఇరవై-ఆరు సంవత్సరాలు దానిని ఋజువు చేశాయి. అది నిజము.

142 నీవు ఆయనను ప్రేమిస్తే! “నేను దీనిని చేయలేను, మరియు నేను దానిని చేయలేను,” అన్నట్లు, ఒక విధి కాదు. నీవు దానిని చేయలేనంతగా ఆయనను ప్రేమిస్తున్నందుకై యున్నది, ఎందుకనగా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఎన్నడూ ఆయనను ఎన్నుకొనలేదు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు.

143 “నేను ప్రభువును వెదికాను, మరియు ప్రభువును వెదికాను,” అని నీవన్నావు.

ఏ మానవుడు కూడా దేవుడిని వెదకడు. మానవుడిని వెదికేది, దేవుడే. నీవు ఆయన నుండి ఏదైనా సహాయము కొరకు వెతుకుతూ ఉండవచ్చును, కానీ నీవు అసలు ఆయనను వెదకడానికిముందు దేవుడు నీ స్వభావమును మార్చవలసియున్నది, ఎందుకనగా నీవు ఒక పాపివి, నీవు ఒక పందివి. అది నిజము.

144 మరియు మీలో కొందరు సంఘమునకు వెళ్ళి మరియు మీ సభ్యత్వముపై ఆధారపడి జీవిస్తూ, బయట ఇక్కడికి వెళ్ళి మరియు లోకములో ఉన్న సమస్తమును చేస్తూ, మరియు పిదప ఇంకనూ వెనుకకు వెళ్ళి, “అవును, నేను సంఘమునకు చెందియున్నాను,” అని చెప్తారు. మంచిది, దేవునికి చెందియుండుటకు అది ఎంతో దూరములో ఉన్నది. ఖచ్చితంగా. నేను…కానీ ప్రజలు అలా చేయడాన్ని మీరు చూస్తారు, మీరు ఇట్లనవచ్చును. ఓ, వారు మంచి సంఘ సభ్యులు. అది నిజమే. నీవు ఒక సంఘ సభ్యునివైయ్యుండి కూడా ఆ కార్యములను చేయగలవు, కానీ నీవు ఒక క్రైస్తవుడవైయ్యుండి వాటిని చేస్తూ ఉండలేవు.

145 ఈ ఉదయం, నేను చెప్పినట్లు, “ఆ కాకి, అసలు ఒక వేషధారి అనేది ఉన్నట్లైతే, అది ఆ కాకియే.” అది నిజము. అది మరియు పావురము ఒకే ఓడలో ఉన్నాయి, ఒకే గూడులో కూర్చున్నాయి. మరియు ఆ కాకి అది విడిచిపెట్టబడినప్పుడు అది సంతృప్తి చెందినది, మరియు ఆ సంఘము నుండి బయటకు వెళ్ళినది, తద్వారా అది బయటకు వెళ్ళి మరియు ఒక పాత చచ్చిన శవము మీద కూర్చొని మరియు “కావు, కావుమని,” దీనిని తిని, గుఱ్ఱమును తిని, ఆవును తిని, మరియు అది ఏదైనను దానిని తినగలుగుటకు అలా చేసినది, అది సంతృప్తి చెందినది. కానీ నోవహు పావురమును విడిచిపెట్టినప్పుడు మాత్రం, అది దాని కాలును మోపడానికి ఒక్క చోటునైనా కనుగొనలేకపోయినది. చచ్చిన జంతువు మీద వాలడానికి కాకికి ఎంత హక్కున్నదో దానికి కూడా సరిగ్గా అంతే హక్కున్నది, కానీ అవి రెండు భిన్నమైన స్వభావములైయున్నవి. వాటిలో ఒకటి, ఆరంభము నుండే, అది ఒక పావురమైయున్నది. ఆరంభము నుండే, ఇది ఒక కాకియైయున్నది.

146 అయితే, మీరు గమనించినట్లైతే, ఈ కాకి ఒక పూటంతా, ఇక్కడ ఒక చచ్చిన శవము మీద కూర్చొని తినగలదు. ఆ పావురము ఒక పూటంతా, గోధుమ పొలములో కూర్చొని తింటూ ఉంటుంది. మరియు ఈ కాకి నేరుగా అక్కడికి ఎగిరివెళ్ళి మరియు పావురపు ఆహారాన్ని కూడా, దానికి కావలసినంతగా తినగలదు. సరిగ్గా కాకి తినగలిగినంత, లేదా, ఆ పావురము తినగలిగినంత గోధుమలనే అది కూడా తినగలదు. అయితే అది, ఆ కాకి, పావురపు ఆహారమును తినగలదు, కానీ పావురము కాకియొక్క ఆహారమును తినలేదు. అది నిజము.

147 కాబట్టి, ఆ వేషధారి సంఘమునకు వచ్చి, మరియు ఆనందించి మరియు కేకలు వేసి మరియు ప్రభువును స్తుతిస్తూ, ఆ విధంగా కొనసాగుతూ, మరియు నేరుగా తిరిగి బయటకు వెళ్ళి మరియు లోకపు సంగతులను ఆనందించగలడు. కానీ ఒక తిరిగి-జన్మించిన క్రైస్తవుడు దానిని చేయలేడు, ఎందుకనగా అతడు దానిని చేయలేనటువంటి ఒక స్థితిలోనికి దేవుని ప్రేమ అతణ్ణి నిర్బంధిస్తుంది.

148 కాబట్టి నీవు కేవలం సంఘములో చేరడం ద్వారా, మరియు దీనిని మరియు దానిని చేయుటను మానివేయడం ద్వారా ఒక క్రైస్తవునిగా మారి, మరియు ఇంకను అదే కోరికను నీలో కలిగియున్నట్లైతే, నీకు మరొక ముంచుడు అవసరమైయున్నది. అది ఖచ్చితముగా నిజము.

149 మరియు ఆ పొట్టి నిక్కర్లను ధరించుకొని, మరియు సరిగ్గా ఇక్కడే వీధిలో తిరిగే స్త్రీలైన మీరు, మరియు పిదప మిమ్మల్ని మీరు ఒక “విశ్వాసి” అని చెప్పుకుంటారు. నీవు ఒక విశ్వాసివి, కానీ విశ్వాసి అనడానికి నీవు ఒక దయనీయమైన, మాదిరియైయున్నావేమో. నీవు నిజంగా క్రీస్తును నీ హృదయములో కలిగియున్నట్లైతే, నీవు అటువంటి సంగతుల గురించి ఆలోచించవలసిన అవసరంలేదు. ఆ మిగతా స్త్రీలు ఏమి చేసినా, ఆ మిగతా అమ్మాయిలు ఏమి చేసినా నాకు అనవసరం, నీవు భిన్నంగా ఉంటావు, ఎందుకనగా నీవు క్రీస్తును ఎక్కువగా ప్రేమిస్తావు.

150 ఈ మధ్య ఒక రోజు ఒక ఇంటిలో, నేను ఒక స్త్రీతో మాట్లాడాను, మరియు ఆమె తన చేతులను ఈ విధంగా పైకి పెట్టుకొని, “గౌరవనీయులైన. బ్రెన్హామ్ గారు, ఇక్కడ నా ఇంటిలో నేను దాదాపు నగ్నంగా ఉన్నాను. నేను అటు ఇటు తిరుగుతున్నాను,” అని అన్నది.

151 నేను ఇట్లనుకున్నాను, “నీకు సిగ్గుచేటు.” నీ స్వంత ఇంటిలోనా, నీవు ఎక్కడ ఉన్నావన్నది నేను లెక్కచేయను. అది నిజము. ఒక స్త్రీ లాగా, ఒక గౌరవప్రదమైన స్త్రీ ఉండవలసిన విధంగా వస్త్రధారణ చేసుకొని మరియు ఆ విధంగా ప్రవర్తించండి. మీకు సిగ్గుచేటు. అయితే మీరు…అవును, బైబిలు ఇట్లు చెప్పినది, “మీరు ఆ సంగతులను, లోక సంబంధమైన సంగతులను ప్రేమించినట్లైతే, క్రీస్తు ప్రేమ మీలో అసలు లేనే లేదు.” మరియు మీరు మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ మనస్సుతో, ప్రభువును ప్రేమించినట్లైతే, మీరు ఆ చిన్న నీచమైన, చెత్తవాటిని ధరించరు. అది నిజము.

152 మరియు బయట ఇక్కడ వీధిలోనికి వెళ్ళి, మరియు మీ మెడను చాచి, మరియు ఆ స్త్రీలలో ప్రతీ ఒక్కరినీ చూసే, సంఘపెద్దయైన నీవు మరియు ఇక్కడున్న ఇతరులు. మీకు సిగ్గుచేటు; మరియు మిమ్మల్ని మీరు “దేవుని కుమారులు” అని చెప్పుకుంటున్నారు. అది మంట కలిగిస్తుందని నాకు తెలుసు, అయితే అక్కడ శాశ్వతముగా కాల్చబడుట కంటే ఇక్కడ కొద్దిగా మంట తగలడం మంచిది. కావున మీరు ఆ కార్యములను చేసినట్లైతే…ఇప్పుడు, ఒక స్త్రీ అర్థనగ్నంగా, వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నయెడల మీరు ఏమి చేయలేరు. మీరు, మీరు చూస్తున్నట్లైతే, మీరు ఆమెను చూస్తూ ఉండిపోతారు, కానీ మీరు మీ తలను త్రిప్పుకోగలరు. బైబిలు ఇట్లు చెప్పినది, “ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.”

153 ప్రియమైన సహోదరీ, నన్ను నీకు ఒకటి చెప్పనివ్వు, నీవు జవాబు ఇవ్వబోతున్నావు. నీవు ఒక లిల్లీ పువ్వంత స్వచ్ఛముగా ఉన్నాగాని, నేను లెక్కచేయను. నీ జీవితములో నీవు ఎన్నడూ అటువంటి ఒక పాపమును, అనైతికమైన పాపమును, చేసియుండకపోవచ్చును. కానీ నీవు ఆ విధంగా వస్త్రధారణ చేసుకుంటే, నిన్ను చూసిన ప్రతీ వ్యక్తితో వ్యభిచారము చేసినందుకు తీర్పులో నీవు జవాబు ఇవ్వబోతున్నావు. బైబిలు అట్లు చెప్పినది. మరియు అలా వీధిలో నడుస్తుంటావు, దోషి ఎవరు, ఆ పురుషుడా? కాదు, అయ్యా. నీవే. నిన్ను నీవే ఆ విధంగా ప్రదర్శించుకున్నావు.

154 స్త్రీకి ఒక గొప్ప స్థానమున్నది. అది ఒక పవిత్రమైన, చక్కని, అద్భుతమైన స్థానమైయున్నది. అయితే, ఆమె చేయవలసిన విధంగా ఒక తల్లిగా, ఒక స్త్రీగా మరియు ఒక స్త్రీ తత్వముగా, ఆమె తన పాత్రను నిలబెట్టుకోడానికి, ఆమె తప్పక తననుతాను ఆ విధంగా నిలుపుకోవలసియున్నది. స్త్రీ తత్వం బ్రద్దలైనప్పుడు, అది ఏ దేశమైనా దాని వెన్నెముక విరిగిపోయినట్లే. మరియు ఆ కారణమును బట్టియే, ఈనాడు, మన దేశము పాడైపోయినది, అది మన స్త్రీలయొక్క అనైతికమైన కార్యములవలనే అయ్యున్నది. అది ఖచ్చితముగా నిజము. నిశ్చయంగా. మన మధ్యనున్న కుళ్ళే, దానిని బ్రద్దలు చేస్తున్నది.

155 నీకు అవసరమైనది ఏమిటంటే ఒక్కసారి ఈ మెల్కీసెదెకును కలుసుకోవడమే. ఆమేన్. ఆయన—ఆయన నిన్ను ఆశీర్వదించి మరియు నీకు ద్రాక్షారసమును, రొట్టెను, నిత్యజీవమును ఇవ్వనిమ్ము. అప్పుడు నీవు విషయాలను భిన్నంగా చూస్తావు. అప్పుడు నీవు…అది భిన్నంగా ఉంటుంది. కుర్రవాళ్ళు నిన్ను చూసి ఒక…నక్క ఈలను, ఆ తోడేలు ఈలను, లేదా నీవు దానిని ఏమని పిలువగోరితే అది, ఆ ఈలను వేయాలని నీవు కోరుకోవు. నిశ్చయంగా కోరుకోవు. నీవు భిన్నంగా ఉంటావు.

156 మరియు నీవు వేరే ఏ ఉద్దేశ్యము కొరకో, ఆ విధంగా వస్త్రధారణ చేసుకుంటున్నావని, నాకు చెప్పాలనుకుంటున్నావా? నీవు ఇట్లంటావు, “ఏంటీ, అది చల్లగా ఉంటుంది.” నీవు కథలు-చెప్తున్నావు. అది చల్లగా ఉండదు. అది చల్లగా ఉండదని విజ్ఞానశాస్త్రము రుజువు చేస్తుంది. అది…సహోదరీ, అది నీ మీదికి వచ్చిన కామమైయున్నది. నీవు దానిని గ్రహించడంలేదు. నేను మిమ్మల్ని బాధపెట్టడానికి ప్రయత్నించడం లేదు, కానీ నేను మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాను. అనేకమంది నీతిగల స్త్రీలు, ఒక చక్కని స్త్రీ, ఆమె ఎంతో శుద్ధముగా ఉండియు, అటువంటివాటిని ధరించి, వీధిలో తిరుగుతున్నది, ఆమె ఏమి చేస్తున్నదో ఎరుగకయున్నది, ఎందుకనగా నీ భర్త సంఘములో తన దశమ భాగములు చెల్లించడేమోనని ఎవరో ఒక భక్తిహీనుడైన బోధకుడు భయపడుతున్నాడు. అతడు ఎన్నడైనా మెల్కీసెదెకును కలుసుకున్నట్లైతే, అతడు ఆ విషయాల గురించి ఆలోచించడు. అతడు సువార్తను బోధిస్తాడు. అది వారి వీపుపైనుండి తోలు లేచిపోయేలాగా మంటపెట్టినా గాని, ఎలాగైనా, అతడు దానిని బోధిస్తాడు. అది ఖచ్చితముగా వాస్తవము.

157 మీరు దానిని చేస్తారు, మరియు ఒక మోహపు ఆత్మ పట్టినది గనుక మీరు దానిని చేస్తారు. మరియు ఆ విధమైన కార్యములను చేయడానికి మీ భార్యలకు అనుమతించే పురుషులైన మీరు, మిమ్మల్ని పురుషులనడానికి నేను ఎక్కువ ఆశలు పెట్టుకోలేను. అది నిజము. అది నిజము. ఇప్పుడు, దాని మీద ఎటువంటి వ్యాఖ్యానములు, లేదా, ఎటువంటి క్షమాపణ చెప్పడమనేది లేదు, ఎందుకనగా, అది సత్యమైయున్నది. తన భార్యను వీధిలోనికి వెళ్ళనిచ్చి మరియు ఆ విధంగా ప్రవర్తించడానికి అనుమతించే ఏ పురుషుడైనా గాని, సహోదరుడా, నీవు ఆమె వస్త్రములను వేసుకోవలసియున్నావు. అది నిజము. నీవు, ఏంటీ, మై!

158 నా భార్య దానిని చేయదని నేను చెప్పలేను. అయితే ఆమె అలా చేస్తుండగా నేను అసలు ఆమెతో జీవిస్తే, నేను ఇప్పుడేమైయున్నానో, దానినుండి మారిపోయి మరియు వక్రీకరించబడవలసి యుంటుంది. మరియు అది ఖచ్చితంగా నిజము.

నా కుమార్తెలు, వారు స్త్రీలుగా మారినప్పుడు వారు దానిని చేయవచ్చును. వారు అలా చేయరని నేను అనడంలేదు. నాకు తెలియదు. అది దేవుని దయపై ఆధారపడియున్నది. వారు అలా చేయకూడదని నేను ఆశిస్తున్నాను. వారు అలా చేసినట్లైతే, వారు ఒక నీతిమంతుడైన తండ్రియొక్క ప్రార్థనల మీదనుండి దాటిపోతారు. వారు ఎన్నడైనా దానిని చేసినయెడల, సరిగ్గా జీవించడానికి ప్రయత్నించిన ఒకరి జీవితము మీదనుండి వారు దాటివెళ్తారు. అది నిజము. అయితే నేను సరిగ్గా జీవించగోరుతున్నాను, సరిగ్గా బోధించగోరుతున్నాను, సరిగ్గా ఉండగోరుతున్నాను, మరియు వారికి సరిగ్గా ఉపదేశించగల స్థితిలో ఉన్నాను. వారు దానిని చేసినట్లైతే, వారు నా బోధనను దాటిపోయి, మరియు నా క్రీస్తును దాటిపోయి, మరియు నా హెచ్చరికలను దాటిపోయి, నరకమునకు దారి చేసుకుంటూ వెళ్తారు, అది నిజము, వారెన్నడైనా దానిని చేస్తే అలాగుంటుంది. నిశ్చయముగా. అది నిజము.

159 మీకు సిగ్గుచేటు. నీవు ఎన్నడైనా, క్రీస్తును ముఖాముఖిగా కలుసుకున్నట్లైతే, మరియు ఆయన నిన్ను ఆశీర్వదించి, మరియు నీ హృదయముపై ఆ ఆమోదపు ముద్దును పెట్టినయెడల, నరకములోనున్న దయ్యములన్ని కూడా నిన్ను ఎన్నడూ మరలా వాటిని ధరించుకునేటట్లు చేయలేవు. అది నిజము. నీవు మరణమునుండి జీవములోనికి మారిపోయావు, మరియు నీ ప్రేమలు భూసంబంధమైనవాటి మీద కాదు గాని పైనున్న సంగతుల మీద ఉంటాయి. ఆమేన్. నేను ఆ అంశమును విడిచిపెట్టడం మంచిది. అది సున్నితమైన విషయమైయున్నది. మంచిది. అయితే అది సత్యమైయున్నది.

160 మంచిది, ఇప్పుడు మనము కొనసాగుతుండగా కేవలం ఇంకొంచెం ముందుకు చూద్దాము, పిదప మనము ముగించుకుంటాము.

…నిశ్చయంగా లేవి కుమ్మాళ్ళలో నుండి,…యాజకత్వము పొందువారు దశమభాగమును పుచ్చుకుంటారు, మరియు తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసము నుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజల యొద్ద, పదియవ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని:

వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన ఈయన అబ్రాహాము యొద్ద పదియవ వంతు పుచ్చుకొని, వాగ్దానము పొందినవానిని ఆశీర్వదించెను.

మరియు వ్యతిరేకతలన్నీ ఉన్నను తక్కువ వాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదించబడెను.

మరియు ఇక్కడ చావుకు లోనైనవారు పదియవ వంతులను పుచ్చుకొనుచున్నారు; అయితే ఇక్కడ జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు, వాటిని పుచ్చుకొనుచున్నాడు. మరియు నేను…

అంతేగాక నేను ఒక విధమున…చెప్పినయెడల, పదియవ వంతును తీసుకున్న, పదియవ వంతును తీసుకున్న,…లేవియు, అబ్రాహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను.

ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు, అతడు తన పితరుని నడుములో ఉండెను.

161 క్రీస్తుపట్ల మీరు—మీరు కలిగియున్న వైఖరియే మీ పిల్లలు ఏమౌతారన్నదానిపై గొప్ప ప్రభావమును చూపిస్తుంది. మీ కుటుంబము యెదుట మీరు జీవించే మీ జీవితమే మీ పిల్లలు ఏమౌతారన్నదానిపై గొప్ప ప్రభావమును చూపిస్తుంది. ఎందుకనగా, బైబిలు ఇట్లు చెప్పినది, అదేమిటనగా, “ఆయన మూడు నాలుగు తరముల వరకు తల్లిదండ్రుల దోషములను పిల్లల మీదికి రప్పించును.”

162 ఇప్పుడు, ముగించడానికి ముందు, కేవలం కొద్ది క్షణములు.

మరియు కావున లేవీయులు యాజకులైయుండగా (ప్రజలకు ధర్మశాస్త్రమీయబడెను గనుక) ఆ యాజకత్వము వలన పరిపూర్ణత కలిగినయెడల, (అదిగో మరలా మీ పరిపూర్ణత గురించి వచ్చినది,) అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక…మెల్కీసెదెకు క్రమము చొప్పున, వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?

163 ధర్మశాస్త్రము, క్రియల వలన రక్షణ అనేవారు, చూడండి, “ఓ, నీవు దీనిని చేయాలి. నీవు దీనిని చేయకపోతే, నీవు ఒక క్రైస్తవుడవు కావు. నీవు విశ్రాంతి దినమును ఆచరించకపోతే అంతే! నీవు…నీవు మాంసము తింటే ఇక అంతే! నీవు ఈ కార్యములను చేస్తే ఇక అంతే!” క్రియల ద్వారా రక్షణ అనే ఈ ఆలోచనలన్నీ కలవు. “మరియు నీవు సంఘమునకు వెళ్ళవలసియున్నది. నీవు వెళ్ళకపోతే, దానికి నీవు జరిమానా చెల్లించవలసియున్నది. నీవు తొమ్మిది దినములు జపములు వల్లించవలసియుంటుంది.” అదంతా బుద్ధిహీనతయైయున్నది. మీరు దేవునియొక్క కృప ద్వారా, దేవునియొక్క ముందుజ్ఞానముచేత, ఆయనయొక్క ముందునిర్ణయమువలన రక్షించబడియున్నారు. దేవుడు ముందుజ్ఞానముచేత, ముందునిర్ణయమువలన అబ్రాహామును పిలిచాడు. ఆయన పిలిచాడు. వారిరువురిలో ఎవరైనా జన్మించకముందే, ఆయన ఏశావును ద్వేషించాడు, మరియు యాకోబును ప్రేమించాడు. అది వాస్తవము. ఈ సంగతులను ఎరిగియున్నది అది—అది దేవునియొక్క ముందుజ్ఞానమైయున్నది.

164 మీరు ఇట్లంటారు, “అలాగైతే సువార్తను ప్రకటించడం వలన ప్రయోజనమేమిటి?”

165 ఇప్పుడు నేను మీకు, దీనిని చెప్తాను. పౌలు దానికి జవాబిచ్చాడు, లేదా, యేసు జవాబిచ్చాడు. యేసు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఇట్లు చెప్పాడు, “పరలోక రాజ్యము ఒక మనుష్యుడు ఒక—ఒక కొలను, లేదా సరస్సు యొద్దకు వెళ్ళి, మరియు దానిలోనికి వలను విసిరినట్లుగా ఉన్నది. అతడు దానిని లాగాడు. దానిలోనుండి, అతనికి తాబేళ్ళు వచ్చాయి. అతనికి ఉభయచర తాబేళ్ళు వచ్చాయి. అతనికి సర్పములు వచ్చాయి. అతనికి బల్లులు వచ్చాయి. అతనికి కప్పలు వచ్చాయి. అతనికి సాలీడు పురుగులు వచ్చాయి. అతనికి ఎండ్రకాయలు వచ్చాయి. అతనికి—అతనికి చేపలు వచ్చాయి.” ఇప్పుడు, ఆ మనుష్యుడు కేవలం వల వేస్తున్నాడు.

166 అది సువార్తవలె ఉన్నది. ఇప్పుడు అదే జరుగుతున్నది, నేను సువార్తను ప్రకటిస్తున్నాను. నేను కేవలం వలను బయటకు విసురుతాను. నేను దానిని లాగి, నేను ఇట్లంటాను, “అందరూ, ఇచ్ఛయించు వారందరూ, రండి.” ఇదిగో కొందరు, బలిపీఠము నొద్దకు వస్తారు. వారందరు బలిపీఠము చుట్టూ గుమిగూడుతారు. వారు ప్రార్థిస్తారు. వారు ఏడుస్తారు. వారు ఎటువంటివారన్నది నాకు తెలియదు. అది నా పని కాదు. నేను తీర్పు తీర్చడానికి పంపబడలేదు.

167 అయితే, అందులో కప్పలవంటివారు కొందరు ఉన్నారు. బల్లులవంటివారు కొందరు ఉన్నారు. పాములవంటివారు కొందరు ఉన్నారు. వారు, కొందరు, తాబేళ్ళైయున్నారు. మరియు చేపలవంటివారు కొందరు ఉన్నారు. తీర్పు తీర్చడం నా పని కాదు. నేను ఇట్లంటాను, “తండ్రీ, ఇదిగో నేను బయటకు లాగింది వీరినే.”

168 అయితే, ఒక కప్ప ప్రారంభము నుండి, ఒక కప్పనేయైయున్నది.

169 ఆ సాలీడు, ఆ పాత సాలీడు పురుగు అక్కడ కూర్చొని మరియు చుట్టూ చూసి, కొద్దిసేపటికే, ఆ పెద్ద కళ్ళను గుండ్రంగా తిప్పి, చుట్టూ చూసి, ఇట్లంటుంది, “మీకు తెలుసా? నేను సహించగలిగినంత వరకు నేను సహించాను.” ప్లాప్, ప్లాప్, ప్లాప్, ప్లాప్, అవి బయటకు వెళ్ళిపోతాయి.

170 ఆ ఆడ పాము దాని తలను పైకెత్తి, మరియు ఇట్లంటుంది, “మంచిది, మీకు తెలుసా? పొట్టి దుస్తులను ధరించడం మరియు అటువంటి కార్యములకు వ్యతిరేకంగా, వారు బోధిస్తున్నట్లైతే, అది నాకు కోపం తెప్పిస్తుంది. కాబట్టి నేను ఆ పరిశుద్ధ-గుండ్రాళ్ళ గుంపు నుండి దూరంగా వెళ్ళిపోతాను. వారు అది మాత్రమే అయ్యున్నారు.” ఆరంభము నుండి నీవు ఒక పామువే. అది ఖచ్చితంగా నిజము. అవును.

171 మరియు ఇక్కడ ఆ మిష్టర్ గోండ్రు కప్ప, దాని నోటిలో ఆ పెద్ద చుట్టపీకతో కూర్చొనియున్నది, ఒక కొమ్ములు కత్తిరించబడిన ఎద్దువలె ఉన్నది, అక్కడ నిలబడి మరియు చుట్టూ చూసి, ఇట్లంటుంది, “సరి, పొగత్రాగడం తప్పని నాకెప్పుడూ అనిపించలేదు. సరిగ్గా ఇప్పుడే, నేను దీనినుండి బయటకు వెళ్ళిపోతాను.” మంచిది, ఓ పాత కప్పా, ఆరంభము నుండి, నీవు అదేయైయున్నావు. అది ఖచ్చితంగా సరియే. అది ఖచ్చితంగా వాస్తవము.

172 నీవు ఏమైయున్నావన్నది నీ స్వభావమే రుజువు చేస్తుంది. ఆదిలో నీవేమైయున్నావన్నది, నీ జీవితము చూపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. దానిని చూడటం నాకు కష్టము కాదు. దానిని చూడటం నీకు కష్టము కాదు.

173 ఇక్కడ కూర్చున్నట్టి రైతు రాయ్ స్లాటర్ స్థలానికి నేను వెళ్ళాను, మరియు ఆ పేడ కుప్ప మీద, పందులు ఎరువును తింటూ ఉండటాన్ని నేను చూసినయెడల, నేను దాని గురించి చెడుగా ఏమి అనుకోను. అది ఒక పందియైయున్నది. కానీ ఆ పేడ కుప్ప మీద ఒక గొర్రెపిల్లను నేను చూసినట్లైతే, నేను ఆశ్చర్యపోతాను. అహ-హ. చూశారా? బాధపడకండి, మీరు దానిని అక్కడ చూడరు. అది దానిని అసలు సహించలేదు. అది నిజము.

174 మరియు దేవుని ఆత్మ మూలముగా జన్మించిన మనుష్యుడు లోక సంగతులను ద్వేషిస్తాడు. అది వాస్తవము, “ఏలయనగా మీరు లోకమును గాని లోక సంగతులను గాని ప్రేమిస్తున్నయెడల, దేవుని ప్రేమ మీలో లేనే లేదు.”

175 నేను ప్రతిరోజు స్త్రీలతో తిరుగుతూ, లోపలికి వచ్చి, నా భార్యకు నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్తే, నేను ఒక అబద్ధికుడనని ఆమెకు తెలుస్తుంది. నా మాటల కంటే నా క్రియలు బిగ్గరగా మాట్లాడతాయి. నిశ్చయంగా. నేను ఆమెకు నమ్మకముగా ఉండలేదు గనుక, నేను ఆమెను ప్రేమించడంలేదని ఆమెకు ఋజువు చేస్తున్నాను.

176 ఆమె నన్ను ప్రేమిస్తున్నదని నాతో చెప్పి, మరియు నేను ఎక్కడికైనా వెళ్ళిన ప్రతిసారి, ఆమె ఇంకెవరితోనో వెళ్ళినయెడల, ఆమె నన్ను ప్రేమించలేదని అది రుజువు చేస్తుంది. నిజము. ఆమె క్రియలు దానిని రుజువు చేస్తాయి. “బిల్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరియు నీవు తప్ప ఈ లోకములో ఇంకెవ్వరూ లేరు,” అంటూ ఆమె నాకు ఎంత చెప్పడానికి ప్రయత్నించినా నేను లెక్కచేయను, ఆమె ఒక అబద్ధికురాలని నాకు తెలుస్తుంది.

177 మరియు నీవు “ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” అని చెప్పడానికి ప్రయత్నిస్తూ, అలాగే లోక కార్యములను చేస్తూ ఉంటే, ఆరంభము నుండే, నీవు ఒక అబద్ధికుడవని దేవునికి తెలుసు. కాబట్టి ఎందుకు? పరలోకపు గొప్ప ఆకాశములు నిజమైన సంగతితో నిండియుండగా, ఒక అసంపూర్ణమైన అనుభవమును, లేదా అటువంటి వేరే ఏదో విషయమును అంగీకరించడం వలన ఉపయోగమేమిటి? నీవు దేవునియొక్క నిజమైన తిరిగి-జన్మించిన బిడ్డగా, నీ హృదయములో పరలోకముయొక్క ఆనందపు గంటలు మ్రోగుతూ, సంతోషిస్తూ, మరియు దేవుని స్తుతిస్తూ, యేసుక్రీస్తు ద్వారా విజయవంతమైన జీవితమును జీవించుచుండగలిగే స్థితిలో ఉండగా, నీవు ఎందుకని ఒక దౌర్భాగ్యమైన, పేరుకు మాత్రమే చెప్పుకుంటూ, అసంపూర్ణమైనట్టి, పూర్తిగా-మార్పు చెందని, నామకార్థ-క్రైస్తవునిగా ఉండగోరుతున్నావు?

178 నీయంతట నీవు దానిని చేయడానికి ప్రయత్నించడం కాదు, ఎందుకనగా ప్రారంభములోనే, నీవు విఫలమౌతావు. అయితే ఆయనను తీసుకో, అది ఆయన వాక్యమైయున్నది, మరియు ఆయన దేనిని సత్యము అని చెప్పాడో దాని మీద ఆనుకో. మరియు ఆయనను నమ్ము, మరియు ఆయనను ప్రేమించు, మరియు సమస్తము నీ కొరకు సరిగ్గా పనిచేసేటట్లు ఆయన చేస్తాడు. అంతే. ఆలోచన అదియే.

179 ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని తిట్టాలని లేదు, కానీ, సహోదరుడా, కొంచెం తిట్లు తినడం ఉత్తమమే. మీరు నా పిల్లలైయున్నారు. చూశారా? మరియు తన పిల్లలను ప్రేమించే ఏ తండ్రియైనా ఖచ్చితంగా వారిని సరిచేస్తాడు, లేదంటే అతడు సరియైన తండ్రి కాడు. అది సరియేనా? అది సరియే. మరియు ఈ తండ్రికి ఒకే ఒక్క నియమమున్నది, అది గృహముయొక్క నియమమైయున్నది. మరియు దేవునికి ఒకే ఒక్క నియమమున్నది, మరియు అది ఆయనయొక్క వాక్యమైయున్నది.

180 మనము ఆయనయొక్క వాక్యమును నమ్మినట్లైతే, అప్పుడు మనము ఆయనయొక్క వాక్య ప్రకారంగా జీవిస్తాము. మనం ఎన్నడైనా దేవుడిని కలుసుకున్నట్లైతే, అది మన కర్తవ్యమైయున్నది. మీరు ఇట్లు చెప్తున్నందుకు కాదు, “మంచిది, నేను సంఘానికి వెళ్తాను, మరియు నేను దీనిని చేయవలసియున్నాను.” మీరు దౌర్భాగ్యులైయున్నారు. అలా చేయకండి. మీరు ఒక పావురముగా ఉండగలిగినప్పుడు, మీరు ఎందుకని ఒక దౌర్భాగ్యమైన, బలహీనమైన, భక్తిహీనమైన కాకిగా ఉండగోరుతున్నారు? నిశ్చయంగా. మీకు కేవలం మీ స్వభావము మార్చబడటం అవసరమైయున్నది. మరియు మీరు మీ స్వభావమును మార్చుకొని, దేవుని కుమారుడిగా మరియు కుమార్తెగా మారి, దేవునితో సమాధానముగా ఉండండి.

181 యేసు! “కాబట్టి యేసు కూడా, తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, గవిని వెలుపట శ్రమపొందెను,” హెబ్రీ 13:12 మరియు 13. రోమీయులు 5:1, “కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి,” కరచాలనము ద్వారా కాదు, నీటి బాప్తిస్మము ద్వారా కాదు, హస్తనిక్షేపణము ద్వారా కాదు, కేకలు వేయడం ద్వారా కాదు, భాషలలో మాట్లాడటం ద్వారా కాదు, ఏ ఉద్రేకము ద్వారా కాదు. “కానీ విశ్వాసమూలమున నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుంటున్నాము.” మనము మరణము నుండి జీవములోనికి దాటి, నూతన సృష్టిగా మారాము, ఎందుకనగా మనము దేవునియొక్క అద్వితీయ కుమారుని మీద విశ్వాసముంచి, మరియు ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాము. మరియు ఆయన రక్తము, ఈ రాత్రి, మన స్థానములో నిలబడటానికి, మన పాపము కొరకు ప్రాయశ్చిత్తముగా పనిచేస్తుంది.

182 పాత నిబంధనలో, సహవాసమును కలిగియుండటానికి ఒకే ఒక్క స్థలమున్నది, అది రక్తము క్రిందనేయైయున్నది. ప్రతీ విశ్వాసి రక్తము క్రిందకు రావలసియున్నాడు. ఎఱ్ఱని పెయ్య వధించబడినప్పుడు, అది పాప-పరిహారార్థ బలిగా అర్పించబడినది. అది ఎఱ్ఱగా ఉండాలి. మరియు మీలో ఎవరైనా దానిని చదువగోరినయెడల, నిర్గమకాండము 19వ అధ్యాయము. మరియు తప్పకుండా దానిని తీసుకొని, డెక్కలు, సమస్తము, కలిపి దహించివేయవలసియున్నది. మరియు పిదప అది వేరుపరచు జలముగా చేయబడుతుంది. అది గవిని వెలుపల ఉంచబడుతుంది. దానిని పవిత్రమైన చేతితో పట్టుకోవలసియున్నది. ఈ పెయ్యయొక్క రక్తము…సంఘము యెదుటకు తీసుకెళ్ళబడి, మరియు ద్వారముపై ఏడుసార్లు ప్రోక్షింపబడుతుంది. మరియు ఇప్పుడు, అక్కడికి వెళ్తున్న ప్రతీ అపవిత్రమైన వ్యక్తి, మొదట తప్పకుండా ఆ రక్తమును చూసి మరియు గుర్తించి, మరియు ఆ రక్తము క్రింద మాత్రమే సహవాసము ఉన్నదని గ్రహించవలసియున్నాడు. ఒక ఆరాధికుడు వాస్తవంగా అధికారికంగా ఆరాధించగల ఒకే ఒక్క స్థలము అదేయైయున్నది, రక్తము క్రిందనేయైయున్నది.

183 పిదప, అతడు రక్తము క్రిందికి రాగలుగుటకు ముందు, అతడు మొదట చేయవలసి విషయం ఏమిటనగా, ఈ వేరుపరచు జలము అతని మీద ప్రోక్షింపబడవలసియున్నది, మరియు అపవిత్రమైనవాడు పవిత్రునిగా చేయబడతాడు.

184 మరియు వారు వేరుపరచు జలమును తీసుకొని మరియు దానిని మార్గమున పోవువాని మీద ప్రోక్షించి, మరియు అతడిని అతని పాపములనుండి వేరు చేస్తారు. మరియు అప్పుడు అతడు ఈ ఏడు చారల రక్తము క్రిందనుండి నడిచి, మరియు దేవుని సన్నిధిలో మిగతా విశ్వాసులతో సహవాసము కలిగియుంటాడు.

185 దానిని చేయడానికి ఒకే ఒక్క మార్గమున్నది. కరచాలనము చేయడం కాదు, సంఘములో చేరడం కాదు, బాప్తిస్మముల ద్వారా కాదు, ఉద్రేకముల ద్వారా కాదు; కానీ వేరుపరచు జలముల యొద్దకు నడిచి, విశ్వాసము ద్వారా, యేసుయొక్క శిరస్సుపై మీ చేతులను ఉంచి, మరియు, “నేను ఒక పాపిని, నా స్థానములో నీవు మరణించావు. మరియు నీవు నా పాపములను క్షమిస్తావని నాలో ఏదో నాకు చెప్తున్నది, మరియు ఇప్పుడు నేను నిన్ను నా వ్యక్తిగత రక్షకునిగా అంగీకరిస్తున్నాను,” అని చెప్పడమైయున్నది. ఆవలిన, ఆ రక్తము క్రిందకి నడిచివెళ్ళి, దేవుని పిల్లలతో సహవాసము కలిగియుండడమే. అంతే. రొట్టెను తిని, ద్రాక్షారసమును త్రాగి, సంఘముతో సహవాసమును కలిగియుండటమే.

186 ఓ, ఆయన అద్భుతమైనవాడు కాడా? ఆయన మంచివాడు కాడా? ఇప్పుడు, స్నేహితుడా, ఇది నీకు వింతగా అనిపించవచ్చును. కానీ దేనికొరకు—దేనికొరకు నేనిక్కడ నిలబడి ఈ సంగతులను చెప్తున్నాను? ఇంకెవరి నుండో నన్ను నేను భిన్నంగా చేసుకొనుటకు ప్రయత్నించడానికి నేను వాటిని చెప్తానా? నేను అలా చేస్తే, అప్పుడు నేనే పశ్చాత్తాపపడవలసియుంటుంది. దేవుడు దానిని చెప్పాడు గనుక, అది దేవునియొక్క వాక్యమైయున్నది గనుక నేను దానిని చెప్తున్నాను. మరియు వినండి. ఒక సమయము వస్తున్నది, మరియు ఇప్పుడు వచ్చేయున్నది, ప్రజలు తూర్పు నుండి పడమర వరకు వెళ్తూ, దేవునియొక్క వాక్యమును కనుగొనుటకు ప్రయత్నిస్తుంటారు, మరైనను దానిని కనుగొనలేరు.

187 నీవు ఒక కూటములోనికి వెళ్ళినప్పుడు, నీవు చేసే మొదటి కార్యమేదనగా, నీవు అక్కడ లోపలికి వెళ్తావు మరియు భాషలు మాట్లాడటాన్ని మరియు అనువదించడాన్ని, మరియు ఎవరో లేచి లేఖనములను ఉల్లేఖించడాన్ని వారు కలిగియుంటారు; మరియు అది శరీర సంబంధమైనదైయున్నది. ఖచ్చితంగా. దేవుడు మనకు ఇట్లు చెప్పాడు “వ్యర్ధమైన మాటలు వచింపవద్దు,” ఆయన విషయం ఏమిటి? ఆయన ఒక్కసారి దానిని వ్రాసినట్లైతే, మీరు దానిని నమ్మండి. ఆయన దానిని మరలా చెప్పవలసిన అవసరంలేదు. భాషలు మరియు అనువాదములు సరియే, అయితే అవి సంఘమునకు మరియు ఎవరో ఒకరికి నేరుగా ఒక సందేశమైయుండవలసి యున్నవి, కేవలం శరీర సంబంధమైన సంగతులు మరియు అటువంటి సంగతులైయుండకూడదు. మరియు పిదప మీరు ఈ ఇతర విషయములన్నిటిలో విపరీతముగా ప్రవర్తిస్తుంటారు.

188 ఈ మధ్యనే ఇక్కడ ఒక రోజు, ఇద్దరు మనుష్యులు లోపలికి వచ్చారు…ఒక పురుషుడు మరియు ఒక భార్య, మరియు మరొక పురుషుడు మరియు ఒక భార్య వచ్చారు. యుక్త వయస్సులో వివాహమైనవారు, ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళడానికి, ఒక చోటుకు నడుచుకుంటూ వచ్చారు. ఎవరో లేచి నిలబడి, మరియు ఒక ప్రవచనము చెప్పారు, మరియు, “వారు ఒకరి భార్యను మరొకరు కలిగియున్నారు.” అది, “అది ఆ విధంగా ఉండకూడదు. వారు తప్పుడు వ్యక్తిని పెండ్లి చేసుకున్నారు,” అని భాషలలో మాట్లాడి అనువాదములు ఇచ్చారు. మరియు ఆ రెండు జంటలు విడిపోయి, మరియు మరలా వివాహము చేసుకున్నారు. ఒక వ్యక్తి ఆ మరొకని భార్యను తీసుకున్నాడు, ఆ మరొకరు అలాగే చేసారు, ఒక ప్రముఖ పెంతెకొస్తు సంఘశాఖలో జరిగినది, మరియు మిషనరీలుగా ఆఫ్రికాకు వెళ్ళారు.

189 సహోదరుడా, నీవు నీ ప్రమాణమును చేసినప్పుడు, మరణము నిన్ను విడిపించువరకు నీవు ఆ ప్రమాణమునకు బద్ధుడవైయుంటావు. ఖచ్చితముగా నిజము. నిశ్చయంగా. నీవు నీ ప్రమాణమును చేసినప్పుడు, అది బద్ధునిగా చేస్తుంది.

190 అదంతయు, బుద్ధిహీనతైయున్నది! మరియు అది ఎటువంటి ఒక స్థితికి వచ్చిదంటే మీరు సంఘములకు వెళ్ళినప్పుడు, అవి మొద్దుబారి మరియు నామకార్థమైపోయి మరియు ఎండిపోయి ఉంటాయి, ఎంతగా అంటే ఆత్మీయ థర్మామీటరు మైనస్ యాభై డిగ్రీలకు వెళ్తుంది. ప్రజలు కేవలం పచ్చడిలో ఒక పులిపిరి వలె కూర్చుంటారు, కఠినముగా మరియు లెక్కలేకుండా మరియు అసహ్యకరముగా కూర్చుంటారు. మరియు ఆ వెనుక మూలన, ఎవరో ఒకరు, అప్పుడప్పుడు, వారికేదో నొప్పొస్తున్నట్లుగా, గుర్రుమన్నట్లు “ఆమేన్” అని చెప్తే, వారందరూ చుట్టూ చూసి, ఏమి జరిగిందో కనుగొనడానికి, గూజు బాతులవలె తమ మెడను చాపుతారు. అది సత్యమని మీకు తెలుసు. నేను దానిని తమాషా కొరకు చెప్పడం లేదు. ఇది హాస్యమాడే స్థలము కాదు. అది సత్యమైయున్నది. నిజము. అది సువార్త సత్యమైయున్నది గనుక నేను దానిని చెప్తున్నాను.

191 మరియు మరొక వైపున, మీరు శరీర సంబంధమైన ఉద్రేకాలతో నిండిన ఒక గుంపును కనుగొంటారు, మరియు దేవునియొక్క నిజమైన వాక్యము ఆఖరికి ఎటువంటి ఒక స్థితికి వచ్చిందంటే మీరు దానిని చాలా అరుదుగా వింటారు: అది ఆ పాత మధ్య-మార్గము, ఆ సువార్త, నా మార్గమునకు వెలుగు, హల్లెలూయా, గొర్రెపిల్లయొక్క రక్తము, లోక కార్యముల నుండి మనల్ని వేరు చేసే దేవునియొక్క ప్రేమ.

192 “సహోదరుడా, నీవు భాషలతో మాట్లాడావా? నీవు దానిని కలిగిలేవు. ఆ చల్లని స్పర్శ నీ వీపు మీదుగా పైకి వెళ్ళేంతవరకు నీవు కేకలు వేసావా? అగ్ని గోళములను నీవు చూశావా?” ఓ, బుద్ధిహీనత! అటువంటిదేది కాదు.

193 నీవు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి మరియు నీ వ్యక్తిగత రక్షకునిగా ఆయనను స్వీకరించావా? మరియు మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలని దేవునియొక్క ఆత్మ మీ ఆత్మతో కూడ సాక్ష్యమిస్తాడు. మరియు మీ జీవితము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, దయాళుత్వముయొక్క ఫలమును ఫలిస్తుంది. అప్పుడు నీవు ఒక క్రైస్తవుడవు. అది ఫలించకపోతే, నీవు ఏమి చేస్తున్నావన్నది నేను లెక్కచేయను.

పౌలు ఇట్లన్నాడు, “ఒక బల్యర్పణగా దహించబడటానికి నేను నా శరీరమును ఇవ్వవచ్చును. దేవుని మర్మములన్నిటిని నేను ఎరిగియుండవచ్చును. నా విశ్వాసముతో నేను పర్వతములను కదిలించవచ్చును. నేను మనుష్యులయొక్క మరియు దేవదూతలయొక్క భాషలతో మాట్లాడవచ్చును. అయినను నేను ఏమీయు కాను.” దాని విషయం ఏమిటి? మొదటి కొరింథీ 13; అది నిజమో కాదో కనుగొనండి.

194 ఇప్పుడు కనుగొనండి ఒకవేళ—ఒకవేళ కొరింథీ, అది రెండవ కొరింథీ 13, అని నేను నమ్ముతున్నాను. లేదా, సరి, అది మొదటిదైనా లేదా రెండవ కొరింథీయైనా అయ్యుంటుంది. అదిగో మొదటి కొరింథీ, మొదటి కొరింథీ 13, అది సరియే. “మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను,” అనగా అనువదించబడగలవి మరియు, అనువదించబడలేనివైయున్నవి, “మరైనను నేను వ్యర్థుడను.” కావున అలాగైతే, దానితో సమయం వృధా చేయడంవలన ప్రయోజనం ఏమిటి?

195 “నేను దేవుని మర్మములన్నిటిని గ్రహించినను అంతే.” మీరెందుకని సెమినరీలకు వెళ్ళి మరియు అంతగా నేర్చుకోడానికి ప్రయత్నిస్తారు? మొదటిగా, మీరు దేవునితో సరిచేసుకోవడం మంచిది. నిశ్చయంగా. “నేను, ‘ఓ, ధన్యకరమైన హల్లెలూయా!’”

196 మీరు ఒక స్వస్థతా సభను లేదా ఏదో ఒక విధమైన అద్భుతములు జరుగుటను కలిగియుంటేనే గాని మీరు ఒక సంఘ సమాజమును కలిగియుండలేని ఒక స్థితికి వచ్చారు. “వ్యభిచారులైన బలహీనమైన ఒక తరము అటువంటిదాని కొరకు వెతుకుతారు.” దానితో మీకు ఏమి కావాలి?

197 పౌలు, తాను అన్ని రకములైన కార్యములను చేయగలిగియుండి, చివరికి పర్వతములను కదిలించినా గాని, మరి ఇంకనూ తాను వ్యర్థుడే అని చెప్పాడు. “భాషలైనను, అవి ఆగిపోతాయి. జ్ఞానమైనను, అది నిరర్థకమౌతుంది. ప్రవచనములైనను, అవి తప్పిపోతాయి. అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, అది నిరంతరము నిలిచియుంటుంది,” మరియు ప్రేమయే పరిపూర్ణతైయున్నది. “దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిని అనుగ్రహించాడు, తద్వారా, వణికే ప్రతివాడు, ఊగే ప్రతివాడు, మాట్లాడే ప్రతివాడు, ఎవరు-…? “ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకైయున్నది.” పిల్లలారా, దానిని నమ్మండి.

198 ఈ కార్యములు మరియు ఆ సంగతులు అంటూ, వారు దానిని ఎంతో క్లిష్టముగా చేయడానికి ప్రయత్నిస్తారు. మరి, దానిలోని ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేదనగా: దేవునియందు మీ యొక్క వ్యక్తిగత విశ్వాసమే. అంతే. అదే దానిని చెప్తుంది. “ఏలయనగా విశ్వాసము ద్వారా,” ఒక అనుభూతి ద్వారా కాదు. “విశ్వాసము ద్వారా,” ఉద్రేకము ద్వారా కాదు. “విశ్వాసము ద్వారా,” భావోద్వేగము ద్వారా కాదు. “అయితే విశ్వాసము ద్వారా మీరు రక్షించబడియున్నారు; మరియు దాని ద్వారా…” మీరు ప్రభువును వెదకినందుకా? మీరు ఒక మంచి వ్యక్తియైనందుకా? ఎందుకనగా, “దేవుడు, కృప ద్వారా, నిన్ను ముందుగా ఎరిగియుండి మరియు నిత్యజీవమునకు నిన్ను నియమించుకున్నందుకై యున్నది.”

199 యేసు ఇట్లు చెప్పాడు, “నా తండ్రి ఒకని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. మరియు నా యొద్దకు వచ్చిన వారందరికి, నేను అతనికి నిత్యజీవము ఇస్తాను. నా చేతిలో నుండి ఏ మనుష్యుడు వారిని అపహరింపలేడు. వారు నావారైయున్నారు. వారు ఎప్పటికీ రక్షించబడ్డారు. నేను వారిని పట్టుకొనియున్నాను. నా తండ్రి చేతిలో నుండి ఏ మనుష్యుడును వారిని అపహరింపలేడు, మరియు ఆయనే వారిని నాకు అనుగ్రహించాడు. వారు నాకు ప్రేమ కానుకలైయున్నారు.”

200 “మరియు ఆయన ముందుగా ఎరిగిన వారందరిని, ఆయన పిలిచాడు.” ఆయన ముందుగా ఎరిగియున్నవారిని తప్ప, ఆయన ఎవరినీ పిలువడు. “ఆయన పిలిచిన వారందరిని, ఆయన నీతిమంతులుగా తీర్చాడు; ఆయన నీతిమంతులుగా తీర్చిన వారందరినీ, ఆయన మహిమపరిచాడు.” కాబట్టి, మీరు చూడండి, మనము పరిపూర్ణమైన విశ్రాంతిలో ఉన్నాము.

201 ఇప్పుడు, ఇక్కడ చాలామంది క్రియల ద్వారా రక్షణ అని నమ్మేవారు ఉన్నారని నాకు తెలుసు, మీలో తొంభై తొమ్మిది శాతంమంది వారేయైయున్నారు. అయితే, చూడండి, మీరు కేవలం దీనిని తీసుకొని మరియు నేను మీకు దేనినో చెప్పడానికి ప్రయత్నించడంలేదని గ్రహిస్తే చాలును.

202 అప్పుడు మీరు ఇట్లంటారు, “మంచిది, సహోదరుడా బ్రెన్హామ్, నేను దీనిని చేయాలి మరియు నేను దానిని చేయాలి అని నేను ఎల్లప్పుడూ అనుకునేవాణ్ణి.” సహోదరుడా, నీవు ఏమి చేయవలసియున్నావు మరియు నీవు ఏమి చేయాలని కోరుతున్నావు అనేదానిలో, ఎంతో—ఎంతో తేడా ఉన్నది. నీవు రక్షించబడినది, నీవు దానిలో ఒక్క విషయమైనా చేయవలసియున్నందుకు కాదు. జగత్తు పునాది వేయబడకముందే దేవుడు నిన్ను రక్షించాడు గనుక నీవు రక్షింపబడ్డావు.

203 వినండి, ఇక్కడ వినండి, ప్రకటన గ్రంథములో, బైబిలు ఇట్లు చెప్పినది, నేను మిమ్మల్ని మొదటి నుండి చివరి వరకు తీసుకెళ్ళబోతున్నాను, ప్రకటన గ్రంథములో, బైబిలు ఇట్లు చెప్పినది, అదేమిటనగా, ఆ క్రూరమృగము వచ్చినప్పుడు, “వాడు భూమి మీదనున్న సమస్తమును మోసపుచ్చెను,” ఆ క్రూరమృగము మోసపుచ్చెను, “గొఱ్ఱెపిల్ల జీవగ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడలేదో, వారందరినీ వాడు మోసపుచ్చెను,” ఉజ్జీవము ప్రారంభమైనప్పటి నుండి, అది సరియేనా? సరి, బోధకుడు ఆ బలమైన ప్రసంగమును ప్రసంగించినప్పటినుండా? ఆ మనిషి స్వస్థతపరచబడినప్పటినుండా? “జగత్తు పునాది వేయబడినప్పటినుండి.”

204 యేసు ఎప్పుడు వధించబడ్డాడు, కల్వరి వద్దనా? కాదు, అయ్యా. యేసు జగత్తుపునాది వేయబడకముందే వధించబడ్డాడు. “ఇదిగో జగత్తుపునాది వేయబడకమునుపే వధింపబడిన, దేవుని గొఱ్ఱెపిల్ల.” దేవుడు, ఆదియందు, ఆయన పాపమును చూసినప్పుడు, ఏమి సంభవించినదో ఆయన చూశాడు, ఆయన మాటను పలికాడు. మరియు యేసు జగత్తుపునాదికి ముందే వధించబడ్డాడు. మరియు బైబిలు ప్రకారంగా, రక్షించబడిన ప్రతీ వ్యక్తి, జగత్తుపునాది వేయబడకముందే, దేవునియొక్క మనస్సులో, గొఱ్ఱెపిల్ల వధించబడినప్పుడే రక్షించబడ్డాడు. అప్పుడే నీవు రక్షణలో జోడించబడ్డావు. కాబట్టి దాని విషయంలో నువ్వేమి చేయబోతున్నావు?

205 అది దేవుడే. ప్రభువు నామము స్తుతించబడును గాక! “జరిగించువాడు దేవుడే; పొందగోరు వానివలనైనను లేదా ప్రయాసపడు వానివలనైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే జరుగును.”

యేసు జగత్తుపునాది వేయబడకముందే వధింపబడితే, మరది వాస్తవంగా జరగడానికి నాలుగు వేల సంవత్సరాలు పట్టింది. అయితే వెనుక ఇక్కడ దేవుడు దానిని పలికినప్పుడు, దేవునియొక్క ప్రతి మాట స్థిరమైనది. అది మార్పులేనిది. అది విభజించబడలేనిది. అది విఫలమవ్వజాలదు. మరియు జగత్తుపునాది వేయబడకముందే దేవుడు కుమారుణ్ణి వధించినప్పుడు, ఆయన కల్వరి వద్ద ఎంతగా వధించబడ్డాడో అప్పుడు కూడా సరిగ్గా అంతే వధించబడ్డాడు. దేవుడు ఆలాగు పలికినప్పుడు, అది ఒక పూర్తి చేయబడిన ఉత్పత్తియైయున్నది. మరియు గుర్తుంచుకోండి, గొఱ్ఱెపిల్ల వధించబడినప్పుడు, మీ రక్షణ ఆ బల్యర్పణలో జోడించబడియున్నది, ఎందుకనగా మీ పేరు “జగత్తుపునాది వేయబడకముందే గొఱ్ఱెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడియున్నదని” బైబిలు చెప్పినది.

దాని సంగతి ఏమిటి? అటువంటప్పుడు మనము ఏమి చేయబోతున్నాము? కరుణించువాడు దేవుడే. నిన్ను పిలిచినది దేవుడే. జగత్తుకుపునాది వేయబడకముందే క్రీస్తులో నిన్ను ఎన్నుకున్నది దేవుడే. యేసు ఇట్లన్నాడు, “మీరెన్నడూ—మీరెన్నడూ నన్ను ఎన్నుకోలేదు. నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. మరియు జగత్తుకుపునాది వేయబడకముందే నేను మిమ్మల్ని ఎరిగియున్నాను.” విషయం అదేయైయున్నది.

206 కాబట్టి, చూడండి, అది మీలో నుండి భయమును తీసివేస్తుంది. “ఓ, నేను పట్టుకొని ఉండగలనా అని నేను ఆశ్చర్యపోతున్నాను? నేను దానిని చేస్తాను, దేవునికి స్తుతి కలుగును గాక, నేను పట్టుకొనియుంటే చాలును.” నేను పట్టుకొనియున్నానా లేదా అనేది కాదు. ఆయన పట్టుకున్నాడా లేదా అనేది అసలైన విషయం. అది ఆయన ఏమి—ఏమి చేసాడన్నదైయున్నది, నేను ఏమి చేసానన్నది కాదు. అది ఆయన ఏమి చేసాడన్నదైయున్నది.

విమోచనా చట్టము క్రింద ఉండే విధంగా ఉన్నది. ముగించడానికి ముందు ఇది నేను చెప్పగోరుతున్న ఒక చిన్న విషయము.

207 ఒక గుఱ్ఱము ఒక చిన్న కంచర గాడిదకు జన్మనిస్తే ఎలాగుంటుంది? మరియు ఆ చిన్న కంచర గాడిదకు రెండు చెవులు విరిగిపోయినవి. అది మెల్ల-కన్ను కలిగియున్నది, మరియు దొడ్డి-కాళ్ళను, వంకర-కాళ్ళను కలిగియున్నది. దాని తోక తిన్నాగా గాలిలోనే ఉన్నది. ఎంత వికృతంగా-కనిపిస్తున్న జంతువు కదా! ఏంటీ, ఎవరైనా…ఆ చిన్న కంచర గాడిద గనుక, ఆలోచించగలిగితే, ఇట్లంటుంది, “ఇప్పుడు, ఒక్క నిమిషం ఆగు. ఈ ఉదయం వారు ఇంట్లోనుండి బయటకు వచ్చినప్పుడు, నేను నీకు చెప్తున్నా కదా, నన్ను ఖచ్చితంగా నెత్తి మీద కొడతారు. ఎందుకంటే, వారు నాకు ఎన్నడూ ఆహారం పెట్టరు. నేను ఎంతటి ఒక వికృత-మైన జీవినో చూడు. నాకు కనీసం ఒక్క అవకాశమైనా లేదు.”

208 సరి, అది నిజమే. నీకు ఒక్క అవకాశమైనా లేదు. “సరి, నేను ఈ లోకములో పుట్టాను, కానీ ఇదిగో, నేను ఎంతటి ఒక వికృత-మైన జీవినైయున్నానో చూడు. కాబట్టి నేను—నేను—నేను—నాకు ఎన్నడూ ఒక అవకాశముండదు. నేను దానిని సాధించను. నేను దానిని సాధించలేను.” చూశారా?

209 అయితే దాని తల్లి నిజంగా ధర్మశాస్త్రములో బోధన పొందినట్లైతే ఏమిటి? అది ఇట్లు చెప్తుంది, “కుమారుడా, అది నిజమే. నీవు పూర్తిగా వికారంగా ఉన్నావు, మరియు కనీసం భూమి మీదనున్న ఆహారమును తినడానికి కూడా నీవు యోగ్యుడవు కావు. అది నిజమే. నీవు సరిపోవు. కానీ, కుమారుడా, ఏదో ఒక విధంగా, నీవు నా తొలిచూలువయ్యావు. మరియు, నీకు తెలుసా, నీవు జన్మహక్కు క్రింద పుట్టావు. మరియు యాజకుడు నిన్ను ఎన్నడూ చూడడు. అయితే, నీవు బ్రతుకునట్లు, నీ పేరుకు ప్రతిగా, ఒక నిర్దోషమైన గొఱ్ఱెపిల్ల, నీ స్థానములో మరణించవలసియున్నది.”

210 మంచిది, ఆ చిన్న కంచర గాడిద దాని మడిమెల మీద గెంతుకుంటూ ఒక గొప్ప సమయాన్ని కలిగియుండగలదు. అది ఏమైయున్నది అనే విషయం ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు, ఎందుకనగా అది ఆ న్యాయాధిపతి చేత, ఆ యాజకుని చేత ఎన్నడూ చూడబడదు. ఆ యాజకుడు చూసేది ఆ గొఱ్ఱెపిల్లనేయైయున్నది. ఆ కంచర గాడిదను కాదు గాని; ఆ గొఱ్ఱెపిల్లనే!

211 మరియు దేవుడు చూసేది క్రీస్తునే, నిన్ను కాదు. అది క్రీస్తే. కాబట్టి ఆయనలో ఏ దోషమూ లేనట్లైతే, అప్పుడు అక్కడ దోషము ఎలా ఉండగలదు? నీవు మృతిపొందినవాడవై మరియు నీ జీవము దేవుని ద్వారా క్రీస్తులో దాచబడి, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడియుండగా, ఆయన తప్పును ఎలా కనుగొనగలడు? “దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, ఏలయనగా అతడు పాపము చేయలేడు.” ఒక పరిపూర్ణమైన బల్యర్పణ అతని స్థానములో ఉండగా అతడు ఎలా పాపము చేయగలడు? దేవుడు ఎన్నడూ నన్ను చూడడు, ఆయన క్రీస్తును చూస్తాడు, ఎందుకనగా మనము క్రీస్తులో ఉన్నాము.

212 ఇప్పుడు, నేను క్రీస్తును ప్రేమించినట్లైతే, నేను ఆయనతో జీవిస్తాను. ఆయన ఎరిగియుంటేనే తప్ప ఆయన నన్ను ఎన్నడూ లోపలికి తీసుకొనివచ్చియుండేవాడు కాడు. ఈ రోజు నుండి ఆరు వారములలో ఆయన నన్ను కోల్పోతాడని ఎరిగియుండి, దేవుడు ఈ రోజు నన్ను రక్షించినట్లైతే, ఆయన తన స్వంత ఉద్దేశ్యమును విఫలపరచుచున్నట్లే అవుతుంది. నిజము. దానిని ఎరిగియుండి కూడా, ఆయన నన్ను రక్షించినట్లైతే, అప్పుడు ఆయనకు అసలు భవిష్యత్తు తెలియదన్నట్లే. ఆయన నన్ను కోల్పోబోతున్నాడని ఎరిగియుండి, ఆయన ఎందుకని నన్ను రక్షించగోరతాడు? దేవుడు తన వాగ్దానమును నిలబెట్టుకోడానికి, కార్యములను చేసి, పిదప రెండు వారములలో దానిని వెనుకకు తీసుకోడు. ఆయన నిన్ను రక్షించినప్పుడు, అది కాలము మరియు నిత్యత్వమునకైయున్నది.

213 ఇపుడు, నీవు భావోద్వేగముచెంది, మరియు ఇట్లనవచ్చును, “ఓ, అవును, దేవునికి స్తుతి కలుగును గాక! హల్లెలూయా! నేను భాషలతో మాట్లాడాను. నేను కేకలు వేసాను. నేను దానిని పొందుకున్నాను. హల్లెలూయా!” దాని అర్థం నీవు దానిని కలిగియున్నావని కాదు. కానీ, సహోదరుడా, ఏదో ఇక్కడికి వచ్చి, మరియు నీవు క్రీస్తుతో లంగరు వేయబడినప్పుడు, అప్పుడు ఆత్మ ఫలములు నిన్ను వెంబడిస్తాయి. మనము దేవుని కుమారులము మరియు కుమార్తెలమని, మనము, మన ఆత్మ ఆయన ఆత్మతో కూడ సాక్ష్యమిస్తుంది. స్నేహితులారా, దయచేసి దానిని పొందుకోండి.

214 దాని గురించి మాట్లాడుతూ, నేను మిమ్మల్ని రాత్రంతా ఇక్కడే ఉంచుతాను. నేను దానిని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు గనుక నా ప్రాణమును కాపాడినట్లైతే, నేను ఈ చిన్న మందిరమునకు, మరలా మరలా వస్తుంటాను. మీరు ఆ పరిశుద్ధ విశ్వాసములో వేరుపారి మరియు స్థిరపడియుండుటను నేను చూడగోరుతున్నాను. మిమ్మల్ని కుదిపివేయడానికి వచ్చే, ప్రతి చిన్న సిద్ధాంతపు గాలికి, మీరు కొట్టుకొనిపోవుటను నేను చూడగోరడంలేదు, మరియు వారి చేతుల మీద కొంచెం రక్తమును, లేదా వారి ముఖము మీద మంచును, లేదా మరిదేనినో కలిగియుండి, మరియు ఆ విధంగా కొనసాగుతూ, మరియు వారి యెదుట ఏదో ఒక—ఒక—ఒక విధమైన వెలుగులను చూస్తూ, మరియు ఏదో ఒక—ఒక స్వార్ధపూరితమైన విషయముతో, “తన హృదయములో అతిశయపడి, మరియు దేనినీ చూడలేదు,” అని బైబిలు గ్రంథము చెప్పినట్లుగా ఉంటారు. అది నిజము. మీరు వాక్యముపై దృఢముగా నిలబడాలని నేను కోరుతున్నాను. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయినయెడల, దానితో నిలిచియుండండి, దానితో జీవించండి. అదియే ఈ దినముయొక్క ఊరీము తుమ్మీము అయ్యున్నది. మీరు దాని ప్రకారంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అది వాక్యములో లేనట్లైతే, అప్పుడు దాని గురించి మరచిపోండి. దేవుని కొరకు బ్రతకండి, క్రీస్తు కొరకు బ్రతకండి.

215 మరియు మీ హృదయము అటు ఇటు వెళ్ళడం మొదలుపెడితే, ఏదో జరిగిందని మీకు తెలుసు, తిరిగి బలిపీఠము నొద్దకు వెళ్ళి మరియు, “క్రీస్తూ, నా…నా రక్షణానందమును నూతనపరచుము. ఒకప్పుడు నేను కలిగియున్న ఆ ప్రేమను నాకు దయచేయుము. ప్రభువా, అది కారిపోవుచున్నది. నేను ఒక విషయమును చేసాను. నన్ను మరలా పరిశుద్ధపరచుము, నిలబెట్టుము. ఓ ప్రభువా, నేను చేయగలిగేది ఏదియు లేదు. నేను దీనిని విడిచిపెట్టలేను మరియు దానిని విడిచిపెట్టలేను. ప్రభువా, నీవే దానిని నా నుండి బయటకు తీసివేయాలని నేను ఎదురు చూస్తున్నాను, మరియు నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” అని చెప్పండి.

216 మరియు క్రీస్తుయేసులో ఒక నూతన వ్యక్తిగా, ఆ బలిపీఠము యొద్దనుండి వెళ్ళిపోండి. అప్పుడు మీరు మీ సంఘముపై, మీ యాజకునిపై, మీ సంఘకాపరిపై ఆధారపడవలసిన అవసరముండదు. ప్రభువైన యేసుయొక్క చిందించబడిన రక్తము మీద మీరు ఆధారపడుతున్నారు. “కృప ద్వారా మీరు రక్షించబడ్డారు.”

మనము ప్రార్థించుకుందాము.

217 ప్రభువా, ఎంతటి బలమైన బోధనలు! ఈ చిన్న సంఘము ఇక ఎంతమాత్రము వాక్యపు పాలు కాదు గాని, మాంసమును తీసుకోగల సమయము వచ్చినది. ఇప్పుడు మేము బిడ్డకు తన సీసాను ఇస్తూ, చాలా కాలంగా పాలు త్రాగించాము. అయితే మేము బలమైన మాంసములను తినవలసియున్నాము, ఏలయనగా దినము ముగియనున్నది. గొప్ప అపాయకరమైన సమయములు సమీపించియున్నవి, మరియు మార్గములో మరియెక్కువ ప్రమాదము పొంచియున్నది. మరియు ఇంతకంటే మంచి సమయాలు ఎన్నడూ ఉండవని మాకు తెలుసు. మేము అంతములో ఉన్నామని మాకు తెలుసు. లేఖనముల ప్రకారము, యేసు వచ్చువరకు కాలములు ఇంకా ఇంకా దరిద్రముగా మారుతూనే ఉంటాయి.

218 ఈ జీవితములో మేము వారికి ఏమియు వాగ్దానము చేయలేము. కానీ వారు గనుక దేవుని కుమారుడిని నమ్మి మరియు ఆయనను తమ పాపములకు ప్రాయశ్చిత్తముగా, తమ స్థానములో నిలబడినవానిగా, తమ పాపములను మోసినవానిగా అంగీకరిస్తే, మేము నీ వాక్యము ద్వారా వారికి రాబోవు జీవితంలో, నిత్యజీవమును వాగ్దానము చేయగలము. ఇప్పుడు దానిని అనుగ్రహించుము.

219 అవిశ్వాసులు విశ్వాసులుగా మారుదురు గాక. ఈ రాత్రి ఇక్కడ, భక్తిగలవారని చెప్పుకొని మరియు కేవలం సంఘములోనే జీవిస్తున్నటువంటి, సంఘమునకు వెళ్తున్నామని చెప్పుకునేవారు, వారు దేవునితో ఒక అనుభవమును పొందుకొందురు గాక; అటువంటి ప్రేమ వారి హృదయములోనికి వచ్చి, వారు తమ పాపముల విషయమై ఏడ్చి, తమకు తాము మరణించి, మరియు పరిశుద్ధాత్మ ద్వారా నూతనముగా జన్మించి, సాత్వికులుగాను మరియు దయగలవారిగాను, ప్రేమగలవారిగాను జీవిస్తూ, ఆనందము మరియు ఆశీర్వాదములతో నింపబడుదురు గాక. వారు తమ చుట్టూ ఉన్న ప్రజలను వారిలాగా ఉండాలని కోరుకునేటట్లు చేసేంతగా, ఉప్పువలె రుచిగలిగినటువంటి ఒక జీవితమును, జీవించెదరు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము, ఏలయనగా ఆయన నామములో మేము దానిని అడుగుచున్నాము.

మరియు మన తలలు వంచియుండగా.

220 ఈ రాత్రి, “సహోదరుడా బ్రెన్హామ్, నేను గనుక ఆ సమయములో దేవునియొక్క త్రాసులో కొలవబడియుంటే, నీవు ఈ రాత్రి మాట్లాడుతున్న ఆ అర్హతకు నేను ఎన్నడూ, ఎన్నడూ, ఎన్నడూ చేరియుండలేను. నేను నా విధానములను మార్చుకోవాలని, మరియు దేవుడు లోపలికి వచ్చి మరియు ఈ చెత్తంతటినీ నాలోనుండి బయటకు తీసివేసి మరియు నన్ను ఒక నిజమైన క్రైస్తవునిగా చేయునట్లు, నీవు నన్ను ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని నేను కోరుతున్నాను,” అని చెప్పే ఒకరు, ఇక్కడున్నారా అని, నేను ఆశ్చర్యపోతున్నాను? మీరు కోరినయెడల, మీరు మీ చేయిని, పైకెత్తుతారా? దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. ఆ వెనుక, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.

పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు ప్రభువైన దేవా.

ఆకాశము మరియు భూమి నీతో నిండియున్నవి,

ఆకాశము మరియు భూమి నిన్ను స్తుతించుచున్నవి,

ఓ మహోన్నతుడవైన ప్రభువా.

పరిశుద్ధుడు…

221 ఇప్పుడు మీరు ఆలోచిస్తుండగా, ప్రార్థిస్తుండగా, మీరు తప్పైయున్నారని ఒప్పించబడి, మరియు మీరు సరిగ్గా ఉండాలని కోరుతుండగా, “దేవా, నేను ఏమైయుండవలసియున్నానో నన్ను అలా చేయుము,” అని చెప్తూ, మీ చెయ్యిని పైకెత్తుతారా? చిన్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. “దేవా, నేను ఏమైయుండవలసియున్నానో నన్ను అలా చేయుము.” నిన్ను, సహోదరుడా, సహోదరీ, నిన్ను, నిన్ను, ఇక్కడున్న నిన్ను కూడా దేవుడు దీవించును గాక.

222 దినము ముగిసిపోతున్నది. స్నేహితులారా, అది కష్టంగా ఉంటుందని నాకు తెలుసు, కానీ ఇప్పుడే సత్యమును తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు నెమ్మదిగా ప్రార్థించండి.

పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువైన దేవా…

ఆయన మాత్రమే, పరిశుద్ధుడు.

…నీతో నిండియున్నవి,

ఆకాశము మరియు భూమి నిన్ను స్తుతించుచున్నవి,

ఓ మహోన్నతుడవైన ప్రభువా.

223 పరలోకపు తండ్రీ, సాయంకాలమున సూర్యుడు అస్తమించుచుండగా, రాబిన్ పక్షులు వాటి ప్రియమైన వాటితో చెట్ల మీద గుమిగూడుతాయి. పక్షులన్నీ వాటి గూళ్ళకు వెళ్ళిపోతాయి. రాత్రియందు పాములు వాటిని ఇబ్బంది పెట్టకుండునట్లు, పావురములు పైకి, తీగెల మీదకు ఎగిరిపోతాయి. అవి అక్కడ కూర్చొని, అవి నిద్రపోయే వరకు ఒకదానితో ఒకటి కూత కూస్తూ ఉంటాయి. చివరకు ఆ సూర్యుడు అస్తమిస్తాడు.

224 ఏదో ఒక రోజు మేము ఆ ఘడియకు వస్తాము. సూర్యాస్తమయము సంభవించబోవుచున్నది. ప్రభువా, అది ఎప్పుడో నాకు తెలియదు. అయితే వారు తప్పైయున్నారని ఒప్పించబడిన ప్రజలు ఈ రాత్రి ఇక్కడున్నారు, మరియు వారు ఆ స్థలమునకు, లింకను మరణమగుచున్నప్పుడు అతడు దానియొద్దకు వచ్చినట్లుగా రాగోరుతున్నారు, అతడిట్లన్నాడు, “అస్తమిస్తున్న సూర్యుని వైపు నా ముఖమును త్రిప్పండి.” మరియు అతడు, “పరలోకమందున్న మా తండ్రీ,” అని మొదలుపెట్టాడు.

225 పాత కాలపు మూడీ, “ఇది మరణమా? ఇది నా పట్టాభిషేకపు దినము” అని చెప్పినట్లుగా రాగోరుతున్నారు.

226 ఓ నిత్యుడా, విశ్వాసముతో, వారు తమ స్థలములలో కూర్చొనియుండగా, సరిగ్గా ఇప్పుడే వారిని స్వీకరించుము. ఆ కుర్చీలో ఉండగా, నీవే వారి హృదయమును తట్టావు. అదే వారి బలిపీఠమైయున్నది. నీవు వారిని స్వీకరించుటకు ఇదియే సమయమైయున్నది, సరిగ్గా ఇప్పుడేయైయున్నది. “నా యొద్దకు వచ్చువానిని, నేనెంతమాత్రము త్రోసివేయను,” అని నీవు చెప్పావు.

227 మరియు ఏదో ఒక రోజు సూర్యుడు అస్తమించుచున్నప్పుడు, భార్య లేదా భర్త మంచం ప్రక్కన నిలబడియుండగా, వైద్యులు వెళ్ళిపోతారు. ఓ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సూర్యుడు అస్తమించడానికి కొద్దిసేపటి ముందు, ఆ అందమైన, మాధూర్యమైన నిశ్శబ్దము. మేము లేచి మరియు ఇట్లు చెప్పగలిగే సమయము:

సూర్యాస్తమయం మరియు సాయంకాల నక్షత్రము,

మరియు నా కొరకు వచ్చిన ఒక స్పష్టమైన పిలుపు!

మరియు నేను సముద్రపు ఆవలికి బయలుదేరినప్పుడు,

అక్కడ ఎటువంటి ఏడుపులు ఉండకుండును గాక.

228 ఓ దేవా, వారు వేచియుండగా, దేవుని ఆశీర్వాదము వారి మీదకు వచ్చుటకు కనిపెట్టుచుండగా, ఈ ఘడియలోనే వారికి దానిని దయచేయుము. కోపమంతటిని, లోకమంతటిని, వారి నుండి దూరముగా తీసివేసి, మరియు వారిలో ఒక నూతన హృదయమును సృష్టించుము. నీవు ఇట్లు చెప్పావు, “నేను ఆ పాత హృదయమును తీసివేసి, మరియు మాంసపు హృదయమును ఇచ్చెదను. మరియు ఆ హృదయములో నేను నా ఆత్మను ఉంచెదను, మరియు వారు నా కట్టడల ప్రకారము నడుచుకొందురు, నా ఆజ్ఞలను గైకొందురు.” ఎందుకనగా, అది ఒక ప్రేమ నియమమైయున్నది గాని, విధి నిర్వహణ కాదు. అది ప్రేమతో కూడినది. మరియు దానిని చేయడానికి ప్రేమ మమ్మల్ని బలవంతపెడుతుంది. మమ్మల్ని బలవంతపెట్టడం, అది ప్రేమయొక్క పనియైయున్నది. ప్రేమను వెంబడించడం మా పనియైయున్నది. మరియు, దేవా, ఈ రాత్రి తమ చేయి పైకెత్తిన ప్రతి హృదయమునకు నీవు దానిని దయచేస్తావని నేను ప్రార్థిస్తున్నాను.

229 మరియు ఎవరైతే తమ చేతులను పైకెత్తలేదో, వారు ఇప్పుడు, కృప ద్వారా, నిన్ను అంగీకరించడానికి, మరియు ఈ సాత్వికమైన, మాధూర్యమైన, నిశ్శబ్దమైన, దీనమైన విధానములో నీ ఆత్మతో నింపబడుటకు; మరియు కృపతో నిండియుండి, ఒక మారిపోయిన వ్యక్తిగా ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి తమ చేతులను పైకెత్తుదురు గాక. ఈ ఘడియ తర్వాత, ఏ విధంగా పక్షులు భిన్నంగా పాడతాయో, ప్రతి ఒక్కరూ ఎలా భిన్నంగా ఉంటారో, ఓ మహోన్నతుడవైన ప్రభువా.

పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, భూమికి ప్రభువైన దేవా.

ఆకాశము మరియు భూమి నీతో నిండియున్నవి,

ఆకాశము మరియు భూమి నిన్ను స్తుతించుచున్నవి,

ఓ మహోన్నతుడవైన ప్రభువా.

230 ఇప్పుడు మీరు మీ తలలు వంచియుండగా, ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోబడుటకు మీ చేతులను పైకెత్తిన మీరు, ఉద్రేకము ద్వారా కాదు గానీ, మీ అంతరంగములో ఏదో జరిగినట్లు, దేవుడు అటువంటి ఒక విధానములో మీతో మాట్లాడినాడన్న అనుభూతి మీకు కలుగుచున్నదా, దేవుడు మీకు నిత్యజీవమును ఇచ్చాడన్న భావన మీకు కలుగుచున్నదా? ఈ రాత్రి మీరు సంఘము నుండి ఒక భిన్నమైన వ్యక్తిగా బయటకు వెళ్తున్నారని మీకు అనిపించుచున్నదా? ఈ రాత్రి ఆ వెనుక మీరు మీ చేతులను పైకెత్తుతారా? కుమారుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. అది నిజము. “ఈ రాత్రి, నేను ఒక నూతనమైన వ్యక్తిగా, ఈ సంఘము నుండి వెళ్తాను.” దేవుని రాజ్యములో జన్మించిన నూతనమైన బిడ్డలు.

231 ఏమి జరిగినది? అది బలిపీఠము నొద్దకు వచ్చే ఒక క్రమమని నాకు తెలుసు. అది ఒక మెథడిస్టు బలిపీఠము, ఒక మెథడిస్టు క్రమము అని, నా ఉద్దేశము. జాన్ వెస్లీ దినములలో, అది మెథడిస్టు సంఘములో స్థాపించబడినది. అది బైబిలు దినములలో ఎన్నడూ లేదు. “విశ్వసించినవారందరూ సంఘములో చేర్చబడ్డారు.” మీరున్న స్థలములోనే మీరు విశ్వసించగలరు, బయట పొలములోయైనా, ఒక వీధిలోయైన, ఎక్కడైనా విశ్వసించవచ్చును. ఎక్కడైనా, మీరు క్రీస్తును మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినంతవరకు, అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. అది మీ హృదయములోనికి వచ్చునట్టి పరిశుద్ధాత్మయొక్క కార్యమైయున్నది. మీరు ఆయనను నమ్మి, ఆయనను అంగీకరించినప్పుడు, మీరు మరణము నుండి జీవములోనికి దాటియున్నారు, మరియు మీరు క్రీస్తుయేసులో నూతన సృష్టిగా మారతారు.

ఓ దయగల రక్షకుడా, నన్ను దాటి వెళ్ళకుము,

ఇప్పుడు మీరు లేచి నిలబడండి.

…నా దీనమైన ఆర్తనాదము;

నీవు ఇతరులను పిలుచుచుండగా,

నన్ను దాటిపోకుము.

232 ఇప్పుడు నేను ఆ యవ్వనస్థుడిని మరియు ఆ స్త్రీని, మరి ఆమె అతని భార్య అని నేను గ్రహిస్తున్నాను, ఇందాక మీ చేతులను పైకెత్తారు, ఆ వెనుక మీరు మరలా మీ చేతిని ఎత్తాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను; ఎర్రని కోటు వేసుకొనియున్న, కుమారుడా, మరియు ఆ స్త్రీ, వారు క్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినవారు. ఇక్కడ చక్రాల కుర్చీలో కూర్చున్న యవ్వనస్థుడు, క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించాడు, దేవుడు అతణ్ణి రక్షించిన అనుభూతిని పొందుకున్నాడు. మరియు ఆ వెనుక చేతులెత్తిన ఇతరులు, ప్రజలు చూసి, మీతో సహవాసము కలిగియుండునట్లు చేతులను మరలా పైకెత్తండి.

233 వారి దగ్గర నిలబడియున్న, ఎవరైనా, వారితో కరచాలనము చేయండి. “దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా సహోదరుడా, నా సహోదరీ, దేవుని రాజ్యములోనికి స్వాగతం,” అని చెప్పండి. సహవాసము, మనకు కావలసినది అదే. దేవుడు ఆశీర్వదించును గాక…ఇక్కడ కుర్చీలో ఉన్న ఈ యవ్వనస్థునితో కరచాలనము చేయండి. ప్రభువు అతనికి తోడైయుండును గాక. అది నిజము. పరిశుద్ధాత్మయొక్క సహవాసములోనికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము.

234 మీరు ఇదివరకెన్నడూ బాప్తిస్మము పొందనివారై, మరియు బాప్తిస్మము పొందాలని కోరుతున్నయెడల, పైకి వచ్చి మరియు సంఘ కాపరికి దాని గురించి చెప్పండి. మీరు బాప్తిస్మము పొందగోరుతున్నయెడల, ఈ రాత్రి, ఇక్కడున్న ఈ నీటి కుంటలో నీళ్ళు కూడా ఉన్నాయి. ప్రతీది సిద్ధంగా ఉన్నది. (ఇది గాక, వేరే ఏ విధంగానైనా మీరు బాప్తిస్మము పొందారా?) అయితే ఎవరైనా బాప్తిస్మము పొందగోరినట్లైతే, నీటి కుంట సిద్ధంగా ఉన్నది. బైబిలు ఇట్లు చెప్పినది, “మీలో ప్రతి ఒక్కరూ, మారుమనస్సుపొంది, మీ పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, మరియు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఏలయనగా వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని, మన దేవుడైన ప్రభువు పిలిచిన వారందరికి చెందును.”

235 మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? మీ చేతులను పైకెత్తండి. ఓ, ఆయన అద్భుతమైనవాడు కాడా? ఈ హెబ్రీ పత్రికను మీరు ఎలా ఆనందిస్తున్నారు? మీరు దానిని ఇష్టపడుతున్నారా? [సంఘము, “ఆమేన్” అని చెప్తున్నది—సంపా.] అవును. అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు, అది దిద్దుబాటైయున్నది. ఓ, అది కఠినమైనది మరియు అది సూటిగా ఉంటుంది, కానీ మనము దానిని ప్రేమిస్తాము. ఆ విధంగానే మనము దానిని కలిగియుండగోరుతున్నాము. అది వేరే ఏ విధంగాను ఉండాలని మనం కోరుకోము.

236 ఇప్పుడు, దానిని ఆ విధంగా బోధించడానికి పౌలుకు అధికారమున్నదని మీరు నమ్ముతారా? పౌలు ఇట్లన్నాడు, “ఒక దూత వచ్చి మరియొక సువార్తను ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవును గాక.” అది నిజమేనా? కాబట్టి మనము ఆయనను మన హృదయమంతటితో ప్రేమిస్తున్నాము.

237 ఇప్పుడు నేను ఒక్క క్షణము మన సంఘకాపరిని ఇక్కడికి రమ్మని అడుగబోతున్నాను, మన అత్యంత ప్రశస్తమైన సహోదరుడు, సహోదరుడా నెవిల్, మరియు అతడు మీతో ఒక మాట మాట్లాడుతాడు. మరియు ఇప్పుడు, ప్రభువు చిత్తమైతే, బుధవారము రాత్రి మేము మిమ్మల్ని కలిసి, మరియు ఒక సంఘ సమూహపు రాత్రి కొరకు సహోదరుడు గ్రాహామ్ స్నెల్లింగ్స్ వద్దకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాము. మరియు పిదప 7 మరియు 8వ అధ్యాయముల మీద బోధన కొనసాగించబడుతుంది, రానైయున్న ఈ బుధవారం రాత్రియైయున్నది. సహోదరుడా నెవిల్. 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...