హెబ్రీ పత్రిక, ఏడవ అధ్యాయము #2  

 హెబ్రీ పత్రిక, ఏడవ అధ్యాయము #2  

438నీవు దీవించబడుదువు గాక! మొదటిగా, మనము ఇక్కడ ఒక చిన్న బిడ్డను కలిగియున్నామని, నేను అనుకుంటున్నాను, కొద్ది నిమిషముల క్రితం, నా సహోదరుడైన డాక్ నాతో చెప్పాడు, శరీరసంబంధమైన ఒక సహోదరుడైయున్నాడు, ప్రతిష్టింపబడుటకు…కోరియున్నారని చెప్పాడు. మరియు ఇప్పుడు ఆ తల్లులు ప్రభువునకు ప్రతిష్టించాలనుకున్న తమ చిన్న బిడ్డలను కలిగియున్నట్లైతే, ఇప్పుడే వారు వచ్చి, వారి పిల్లలను పైకి తీసుకొనివస్తే మేము సంతోషిస్తాము.

239 ఇప్పుడు, మరియు అనేకమంది ప్రజలు, వారు, వారు దానిని ఏమంటారంటే, వారికి బాప్తిస్మము ఇస్తారు. మెథడిస్టు సంఘము ఇస్తుంది, మరియు నాజరీనువారు కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు. కాదు. ఆ విషయం మీదనే, శిశు బాప్తిస్మము గురించే, వారు అనగా నాజరీనువారు మరియు స్వతంత్ర మెథడిస్టులు వేరయ్యారని నేను అనుకుంటున్నాను. అయితే, ఏది ఏమైనను, వారిలో కొందరు, వారు ఏదో ఒకటి చేస్తుంటారు. అయితే, మరియు కొందరు వారి మీద కొద్దిగా నీళ్ళు పోస్తారు. కొందరు వారిపై చిలకరిస్తారు. మరియు, కానీ మనమైతే ఎల్లప్పుడు మనకు తెలిసినంతమట్టుకు బైబిలుకు అత్యంత సమీపంగా ఉండటానికే ప్రయత్నిస్తాము. ఇప్పుడు, ఒక బిడ్డ చిలకరింపబడాలనే ఏ లేఖనము బైబిలులో లేదు, అంతేకాదు ఏ వ్యక్తియైనా చిలకరించబడాలనే ఏ లేఖనము బైబిలులో లేదు. అది లేఖనానుసారమైనది కాదు. అది క్యాథలిక్ సంఘముయొక్క క్రమమైయున్నది.

240 కాని వారు—అయితే వారు, తీసుకొనివచ్చారు…వారు చిన్న పిల్లలను యేసునొద్దకు తెచ్చారు. మరియు—మరియు మనము ఆయనకు ప్రతినిధులుగా ఉండవలసియున్నాము. ఆయన చేసిన కార్యమునే మనము చేయగోరుతున్నాము. ఆయన వారిపై తన చేతులను ఉంచి మరియు—మరియు వారిని ఆశీర్వదించాడు, మరియు ఇట్లన్నాడు, “చిన్న పిల్లలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు, ఏలయనగా పరలోకరాజ్యము అటువంటివారిదే.” మరియు మనకు తెలిసినంత ఉత్తమముగా నిజమైన బైబిలును, సమర్పించబడిన విధానమును, కొనసాగించుటకు ప్రయత్నిస్తుండగా, ఇక్కడ ఆలయమువద్ద మనము దానిని చేయుటనే కొనసాగిస్తున్నాము.

241 కాబట్టి ఇప్పుడు, ఆ తల్లి, లేదా ఏ ఇతర తల్లులైనా ప్రతిష్టించబడుటకు తమ చిన్న బిడ్డలను కలిగియున్నట్లైతే, సహోదరి గెర్టీ వారిని లోపలికి తీసుకురండి అనుదానిని వాయించుచుండగా, ఇంకేమిటీ, మీరు వారిని బలిపీఠము నొద్దకు తీసుకొనిరండి. సహోదరుడు మరియు నేను వచ్చి మరియు ఆ చిన్న బిడ్డలను ప్రభువుకు ప్రతిష్ఠిస్తాము. మంచిది.

సహోదరుడా నెవిల్…[టేపులో ఖాళీగా ఉన్నది—సంపా.]

242 సహోదరి గెర్టీ, నీకు ధన్యవాదములు. అది చాలా బాగుంది. ఎంతమంది చిన్న పిల్లలను ప్రేమిస్తున్నారు? మీరు ప్రేమించనియెడల, మీలో ఏదో లోపము ఉన్నది, ఏదో లోపము ఉన్నది.

243 ఇప్పుడు, ఈ రాత్రి, ఇప్పుడు మిగతా కూటములలోనికి వెళ్ళాలి. మనము…ఈ రాత్రి నేను మరలా వచ్చుటకు కారణము. సాధారణంగా మనము స్వస్థత కూటములను కలిగియున్న ఈ దినములలో, నేను రోజుకు ఒకటి మాత్రమే తీసుకుంటాను, ఎందుకనగా అది నాకు అటువంటి ఒక వణుకును కలుగజేస్తుంది. అది మీకు ఎప్పటికీ తెలియదు. మరియు ఇక్కడ గృహము వద్ద అది ఇంకెక్కడి కంటెను రెండింతలు ఎక్కువగా ఉంటుంది.

244 మరియు ఈ ఉదయం నేను దాని విషయములో చేసినటువంటి పొరపాటుకై నేను క్షమాపణ కోరుతున్నాను. అయితే నన్ను కలవరపరచిన మొదటి విషయం ఏమిటంటే, బిల్లీ వచ్చి ప్రార్థనా కార్డులను ఇవ్వడానికి తగినంత మంది ప్రజలను అతడు కనుగొనలేకపోతున్నాడని చెప్పినప్పుడైయున్నది. అతడు కేవలం పన్నెండు లేదా పద్నాలుగు కార్డులను మాత్రమే ఇవ్వగలిగాడు. మరియు అతడు ఒక…ఎవరును ప్రార్థనా కార్డులను కోరలేదు. అంతా బాగానే ఉందని నేను అనుకున్నాను. అయితే అప్పుడు, దాని ద్వారా, నేనెన్నడూ ఊహించలేదు…మరియు పిదప నేను ఆ ప్రార్థనా కార్డులను పిలవడం మొదలుపెట్టినప్పుడు, ఆ పది లేక పన్నెండు, లేక వారెంతమంది ఉంటే అంతమందిని పిలుద్దామని నేను అనుకున్నాను. వారిని పైకి పిలిచాను. నేను ఒక ఫలానా అంకె వద్దకు వచ్చాను, ఏదో అంకె, మరియు వారు పలుకలేదు. మరియు నేను పిలిచాను. వారు జవాబునివ్వలేదు. మరియు శ్రీమతి. ఉడ్ నాకు ఫోన్ చేసేవరకు నేను దాని గురించి అసలు ఆలోచించలేదు. ఆమె ఇట్లన్నది, “బ్రెన్హామ్ సహోదరుడా, బిల్లీ ఆ కార్డులను తీసుకొని మరియు వాటిని తికమకగా కలిపివేసి, మరియు వాటిని అలాగే పంచుతాడు. అతడు ఆ మూడవ అంకెను కలిగియుండవచ్చును,” (అదేనా?) “మూడవ అంకె అతని జేబులో ఉన్నది.”

245 నిశ్చయంగా, సాధారణంగా అతడు మొత్తం యాభై కార్డులను ఇచ్చేస్తాడు. అతడు వాటిని ప్రజల ఎదుటకు తెచ్చినప్పుడు, అతడు వాటిని తికమకగా కలుపుతాడు. కావున ప్రతి ఒక్కరూ…“నాకు ఒకటవ అంకెను ఇవ్వండి” అని చెప్పునట్లుగా అది ఉండదు. లేదా, మేము ఒకటవ అంకె నుండి ప్రారంభించకపోవచ్చును. మేము యాభైయవ్వ అంకెనుండి ప్రారంభించి, మరియు వెనుకకు రావచ్చును, మీకు తెలియదు. మేము ఎనిమిదవ అంకె వద్ద ప్రారంభించి మరియు ముందుకు వెళ్ళవచ్చును. ఇరవై వద్ద ప్రారంభించి మరియు ముందుకు వెళ్ళవచ్చును. మనకు తెలియదు. అయితే అతడు కేవలం వాటిని తారుమారు చేసి మరియు ప్రజలకు వారు అడిగిన కొలది వాటిని ఇస్తాడు. మరియు నేను, ఈ ఉదయమున దానిని ఆలోచించకుండా, నేను బహుశా ఇంకా నలుగురిని లేదా ఐదుగురిని పిలిచాననుకుంటా, మరియు వారు అక్కడ ఉండియుండరు, ఎందుకనగా అది ఇరవైలలో లేదా ముప్పైలలో ఎక్కడో ఉండవచ్చును, మీరు చూడండి. మరియు, పిదప, కాని ప్రభువు దానిని సవ్యంగా జరిగించాడు, అయితే గృహము నుండి దూరప్రాంతములో ఉన్నట్లుగా, దాని విషయమై అసలు ఆ—ఆ నిజమైన ఒత్తిడి ఉండదు. నేను దానిని—దానిని మరల ఎన్నడూ ప్రయత్నించకపోవచ్చును.

246 అయితే, ఈ మధ్యనే ఇక్కడ, ఆయన మనకు ఒక మంచి కూడికను ఇస్తాడా అని నేను ప్రభువును అడిగాను, ఎంతగా అంటే నేను—నేను ఆయనను ఇక ఎంతమాత్రము దానిని అడుగనని నేను ప్రమాణము చేశాను, ఎందుకనగా అది ఎంతో కఠినముగా ఉండియున్నది. మరియు అది లేఖనమునకు విరుద్ధమైనది. చూశారా? మరియు మీరు…దానివలనే అది నాపై అంత కఠినముగా ఉంటుంది. ఎందుకనగా, దానిని ఎరిగియున్నాను కాబట్టి, ఆరంభము నుండే, అది నాకు ఒక—ఒక ఓటమిని ఇస్తుంది. చూశారా? ఆరంభములోనే, నేను ఓడిపోయాను.

247 అయితే ఎలాగైనను, ఈ మధ్యాహ్నము ఒకరు ఒకరికి ఫోన్ చేశారు. శ్రీమతి. ఉడ్‌కు ఎవరో ఫోన్ చేశారు. మరియు ఇట్లు చెప్పినది, అదేమిటనగా, “ఈ ఉదయం సంఘములో ఒకరికి ఫోన్ వచ్చినది, అది చాలా, చాలా అనారోగ్యముతో ఉండిన ఒక వ్యక్తి గురించైయున్నది, అతడు, తర్వాత, ఈ మధ్యాహ్నము క్రీస్తు నొద్దకు వచ్చాడు.” చాలా అనారోగ్యముతో ఉన్న ఆ—ఆ మనుష్యుడు క్రీస్తు నొద్దకు వచ్చాడు.

248 మరియు మరొక విషయమేమిటంటే శ్రీమతి ఉడ్, నేను ఆమెయొక్క సహోదరితో, అక్కతో మాట్లాడానని చెప్పినది, ఒక రోజున దిగువున కెంటకీలో, నేను నిజంగా తన ఇంట్లో ఉండి మరియు తనతో కలిసి రాత్రివేళ భోజనమును, లేదా సాయంకాల భోజనమును చేశానని చెప్పినది. మరియు నేను ఆ స్త్రీని గుర్తుపట్టలేదని సర్వశక్తిమంతుడైన దేవునికి తెలుసు. చూశారా? అది నిజము. కేవలం…దర్శనములు దైవాధీనములో ఉన్నవి. అవి ఎలా జరుగబోవుచున్నవో లేదా ఏమి జరుగబోవుచున్నదో మనకు ఎన్నడూ తెలియదు. మరియు ఏమి—ఏమి జరుగుతుందో, అది దేవునిపై ఆధారపడియున్నది. అయితే, వాటి కొరకు వేచియుండటం, ఆ సందర్భం కొరకు వేచియుండటం నాకు తెలుసు.

249 మరియు మరొక దినమున ఈ చిన్న అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు, మరి ఆమె వివేచనా శక్తిగలదిగా తెలియబడుచున్నది, దానిని నేను, కాదు…చూడండి, దేవుడు ప్రపంచమంతటికీ దానిని ఇచ్చినట్లైతే, అది మంచిగానే ఉంటుంది; కాని అది ఆ విధంగా ఉన్నయెడల, కొన్ని సంవత్సరాల క్రితం, మీరు చూడండి, ఈ వీధి అవతల ఆయన నాతో చెప్పినదానికి అది విరుద్ధంగా ఉంటుంది. మరియు అది సరియైనదని మేము నిశ్చయత కలిగియుండగోరాము, మరియు సంఘము, అది ఇక్కడ ఉండుటను బట్టి, దానిని చూడటానికి అనుమతించాము. మరియు కాబట్టి నేను శ్రీమతి స్నైడర్ ను పిలిచాను. సహోదరి స్నైడర్. ఆమె ఇక్కడే ఎక్కడో ఉన్నది. ఆమెకు వినికిడి కొంచెం కష్టంగా ఉంటుంది. మరియు ఆ చిన్న స్త్రీ దానిని మెల్లగా మాట్లాడి, మరియు ఇట్లన్నది, “నీవు కీళ్ళవాపు వ్యాధిని కలిగియున్నావు,” లేదా కీళ్ళ నొప్పులు అని, అటువంటిదేదో చెప్పినది.

250 మరి, అది ఒక విరిగిన నడుము అని నాకు తెలుసు. మరియు కావున, మరియు పిదప ఈ ఉదయం పరిశుద్ధాత్మ ఆ విషయాన్ని తీసుకొనివచ్చినది. చూశారా?

251 ఇప్పుడు, అది ఏమిటంటే, అది ఒక దైవికమైన వరమైయున్నది, మరియు అది దానియొక్క సార్వభౌమ అధికారములో పని చేస్తుంది. అయితే ఇక్కడ పట్టణములో అది ఎందువలన అంత కష్టమవుతుందంటే, నిజానికి, ఇక్కడ ఎల్లవేళలా, నేను—నేను రోగుల కొరకు ప్రార్థించడంలో చిక్కులబడుతుంటాను. లేక—లేక…నేను వెళ్ళి, ప్రజలకు దీనిని చెప్తాను. నేను వెళ్ళి, ఇట్లంటాను, “ప్రభువు నిన్ను బాగుచేశాడు. పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం, ఆయన నీ కొరకు మరణించినప్పుడే, యేసు నిన్ను స్వస్థపరిచాడు. సరిగ్గా అక్కడే నీవు స్వస్థపరచబడ్డావు. ఇప్పుడు, దేవునికి సంబంధించినంతవరకు, క్రీస్తుకు సంబంధించినంతవరకు, పందొమ్మిది వందల సంవత్సరాల క్రితమే, నీవు స్వస్థపరచబడ్డావు. నీ వ్యాధి పోయినది. దానిని చేయడానికి నీ విశ్వాసము అవసరమైయున్నది.”

252 మరియు పిదప ఆ వ్యక్తి వెళ్ళి మరియు బాగవ్వకపోవచ్చును. పిదప ఆ వ్యక్తి వచ్చి, ఇట్లంటాడు, “నేను బాగయ్యానని సహోదరుడు బ్రెన్హామ్ నాతో చెప్పాడు.” చూశారా? దేవుడు ఏమి చెప్పాడో నేను మీకు చెప్తున్నాను.

253 ఇప్పుడు, అది నేరుగా ఒక వ్యక్తితో, నేరుగా మాట్లాడినప్పుడు, జరుగనైయున్న ఒక ఫలానా విషయము గురించి, “అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అయ్యున్నప్పుడు, మీ స్వస్థత ఇదివరకే భద్రపరచబడినదని సరిగ్గా అక్కడే అది మీకు రుజువు చేస్తుంది. మీ విశ్వాసము దానిని ముద్రించినది. చూశారా? వాగ్దానము మీదే. అది నా మాట కాదు. మీరు ఇదివరకే స్వస్థపరచబడ్డారు అనేది, అది దేవునియొక్క మాటయైయున్నది. చూశారా? కానీ మీరు…ఏదో ఒక విధంగా, ఇక్కడ జెఫర్సన్విల్ లోని ప్రజలకు, నేను—నేను వారికి దానిపై అసలు నమ్మకము కలిగించలేకపోతున్నాను. నేను—నేను దానిని అసలు జరిగించలేకపోతున్నాను. నాకు తెలుసు. నాకు సాధ్యమైనంత చక్కగా దానిని వివరించుటకు నేను ప్రయత్నిస్తాను, మరియు అది అసలు—అది అసలు జరుగదు. అంతే. నేను చెప్తాను…

254 ఇక్కడ, ఈ మధ్యనే, నేను ఒక గృహమునకు, ఒక వ్యక్తి నొద్దకు వెళ్ళాను, మరియు ఆ వ్యక్తి మరణమగుచున్నాడు. మరియు, “వచ్చి, అతనికి ప్రార్థన చేయండి. అతడు ఉదయము వరకు బ్రతకడని వైద్యుడు చెప్పాడు,” అంటూ వారు నాకు ఫోన్ చేశారు.

255 నేను లోపలికి వెళ్ళాను. మరియు ఆ యౌవనస్థుడు నాతో ఇట్లన్నాడు, “మిస్టర్. బ్రెన్హామ్, నాకు చనిపోవాలని లేదు.” ఏమిటీ, నిశ్చయంగా ఆ యవ్వనస్థుడు అలా కోరలేదు. అక్కడ అతనికి ఇద్దరు పిల్లలు గల కుటుంబమున్నది.

256 సరే, నేను క్రిందకు వంగాను. నేను ఇట్లన్నాను, “ఇప్పుడు, చూడు, నీ వైద్యుడు ఎవరు?” అతడు నాతో చెప్పాడు. నేను ఇట్లన్నాను, “ఇప్పుడు, నీవు మరణించబోతున్నావని— ఆ వైద్యుడు చెప్పియుండవచ్చును, కాని నీవు మరణించబోతున్నావని దేవుడు ఇంకను చెప్పలేదు.” నేను ఇట్లన్నాను, “ఇప్పుడు, బైబిలు ప్రకారంగా, నీవు ఇదివరకే స్వస్థపరచబడ్డావు, ఎందుకనగా యేసు నీ స్వస్థత కొరకు మరణించాడు.”

257 అతడు ఇట్లన్నాడు, “నేను బాగవుతానని నీవు నమ్ముతున్నావా?”

258 నేను ఇట్లు చెప్పాను, “నేను దానిని ఖచ్చితంగా నమ్ముతున్నాను.”

259 మంచిది, నేను ఒక వ్యక్తి కొరకు ప్రార్థించడానికి వెళ్ళినట్లైతే, మరియు అతని కొరకు నమ్మడానికి, అటువంటి విశ్వాసమును ఉపయోగించకుండా; “ఓ, లేదు, లేదు, నీవు చనిపోబోతున్నావని వైద్యుడు చెప్పినట్లైతే, నీవు చనిపోబోతున్నావు. అది ఇక అంతే,” అని చెప్పినయెడల ఏమిటి. ఇప్పుడు, రోగుల కొరకు ప్రార్థించడానికి వచ్చేది అటువంటి వ్యక్తియా? అటువంటి వ్యక్తి నా కొరకు ప్రార్థించడానికి, నా ఇంటికి రావడాన్ని నేను కోరుకోను. అతడు దానిని చూసినా, చూడకపోయినా, విశ్వాసమును తీసుకొని, మరియు నా కొరకు వాగ్దానముపై నిలబడే ఒక వ్యక్తి నాకు కావాలి. అది నిజము. మరియు నేను ఇట్లు చెప్పాను…అతడు…

260 మేము వెళ్ళి ప్రార్థన చేశాము. నేను ఇట్లన్నాను, “ఇప్పుడు ధైర్యముగా ఉండుము.”

261 అతడు ఇట్లన్నాడు, “నేను బాగవుతానని నీవు చెప్తున్నావా?”

262 నేను ఇట్లన్నాను, “ఏమిటీ, ఖచ్చితంగా. నీవు బాగవుతావని దేవుని వాక్యము చెప్పినది. చూశారా, ‘నీవు నమ్మినట్లైతే, సమస్తము సాధ్యమే.’”

263 అతడు ఇట్లన్నాడు, “సరే, నేను దానిని నమ్ముతాను.” మరియు బయటకు వెళ్ళి తన భార్యతో ఇట్లన్నాను…

264 “ఆ మనిషి చనిపోతున్నాడు, అవునా?”

265 “అవును, అతడు చనిపోతున్నాడు” అని అన్నది. మరియు కావున ఆ మరుసటి రోజు, లేదా దానికి కొద్ది రోజుల తర్వాత, ఆ మనిషి చనిపోయాడు.

266 అప్పుడు ఈ స్త్రీ బయటకు వెళ్ళి త్రాగుతూ మరియు ఆ విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టినది. మరియు అది ఈ సంఘముయొక్క సంఘపెద్దలలో ఒకరని, నేను నమ్ముతున్నాను, వారు ఆ స్త్రీయొద్దకు వెళ్ళి మరియు ఆమె తిరిగివచ్చి మరియు సంఘమునకు వస్తుందా అని ఆమెను అడిగారు. ఆమె, “నేను ఎవరిని నమ్మను. బోధకుడైన బ్రెన్హామ్ ఇక్కడికి వచ్చి, నా భర్త కొరకు ప్రార్థించాడు, అతడు జీవించబోతున్నాడని చెప్పాడు, మరియు రెండు లేదా మూడు రోజుల తర్వాత అతడు మరణించాడు. కాబట్టి, నేను నమ్మను,” అని అన్నది. ఇప్పుడు ఆమె చనిపోవుచున్నది. సరే.

267 అయితే, ఏది ఏమైనను, మీరు చూడండి, మీరు చెప్పుచున్నదానికి ప్రజలు అసలు శ్రద్ధవహించడంలేదని అది చూపిస్తుంది. చూశారా? నిశ్చయంగా. నేను ఒక వ్యక్తి కొరకు ప్రార్థించినట్లైతే, వారు బ్రతుకబోవుచున్నారని నేను ఆ ప్రజలతో చెప్తాను. వారు బ్రతుకబోవుచున్నారని నేను నమ్ముతాను. అయితే, నా మాట ఖచ్చితంగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నా లెక్కలేదు, మరి మీరు దానిని నమ్మనట్లైతే, ఏది ఏమైనను, మీరు చనిపోతారు. నిశ్చయంగా. ఇక్కడ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఉన్నది, మరి వారిలో అనేకులు దానిని పొందుకొని మరియు చనిపోతున్నారు. “మీరు వెళ్ళవలసిన అవసరంలేదు,” అని చెప్పుచున్న, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఉండగా వారిలో అనేకులు పాతాళమునకు వెళ్తున్నారు. అది నిజమేనా? ఖచ్చితంగా. చూశారా? అది ఏమిటంటే…అదంతా మీ విశ్వాసం పైనే ఆధారపడియున్నది.

268 సహోదరుడు కాలిన్స్, ఈ రాత్రి అతడు ఇక్కడ ఉన్నాడని నేను అనుకోవడంలేదు. అయితే ఈ ఉదయమున అతడు చెప్పినది వింటున్నప్పుడు, అతడు దాని గురించి ఎంతో గంభీరమైన విషయాలను మాట్లాడినాడు. చూశారా? చూశారా? అతడు మాట్లాడినాడు. అతడు ఇట్లన్నాడు, “ఇప్పుడు, ఇక్కడ మీరు కలిగియున్న అదే విశ్వాసమును, అక్కడ కూడా మీరు కలిగియుండవలసియున్నారు. ఎందుకనగా, అది మీ సంఘశాఖలో కాదు గాని, క్రీస్తులో ఉన్న, మీయొక్క వ్యక్తిగత విశ్వాసమైయున్నది. మీరు తప్పక ఆ విశ్వాసమును కలిగియుండవలసియున్నారు.” అది ఖచ్చితంగా సరియే. ఖచ్చితంగా.

269 మరియు దైవిక స్వస్థత మీ విశ్వాసము మీద ఆధారపడియున్నది. అయితే దేవుని వాక్య ప్రకారముగా మాత్రం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అదేమిటనగా యేసు కల్వరిలో మరణించినప్పుడే ప్రతీ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు, “మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలిగియున్నది.” అది నిజమేనా? మనకు కలిగియున్నది. “మీకు స్వస్థత కలిగియున్నది,” అని బైబిలు గ్రంథము చెప్పినది. కాబట్టి నాలో తప్పు కనుగొనకండి, నేను కేవలం వాక్యముయొక్క బోధకుడనైయున్నాను. మీరు వెళ్ళి దేవుడు ఏదో తప్పు చెప్పాడని ఆయనతో చెప్పండి, అప్పుడు దేవుడు మీ బలహీనత ఎక్కడున్నదో మీకు చెప్తాడు. చూశారా? కాబట్టి, అది మీ విశ్వాసమైయున్నది. యేసు ఇట్లన్నాడు, “నీవు నమ్మగలిగితే. నీవు నమ్మగలిగితే.”

270 ఇప్పుడు, పరిశుద్ధాత్మ మీ విశ్వాసమును ధృవీకరించి మరియు దానిని దృఢపరచి, మరియు “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ‘రేపు ఈ ఫలానా సమయములో, నీవు ఒక ఫలానా కార్యమును పొందుకుంటావు. ఒక ఫలానా కార్యము జరుగుతుంది. ఇక్కడ అది ఒక ఫలానా విధంగా ఉంటుంది, మరియు నీవు ఇక్కడ ఒక ఫలానాదానిని కలుసుకుంటావు. అది నీకు ఒక సూచనగా ఉంటుంది,’” అని చెప్పినప్పుడు, ఇప్పుడు, మీరు దానిని గమనించండి. సరిగ్గా ఇప్పుడు ఇక్కడే, అది ఒక ముగించబడిన కార్యమైయున్నది.

271 అయితే దైవిక స్వస్థత గురించి చెప్పాల్సివచ్చినప్పుడు, రక్షణా విధానము, ఎలాగున్నదో, దాని మీదనే నేను దైవిక స్వస్థతను కూడా ఆధారము చేయవలసియుంటుంది. మీలో ప్రతియొక్కరూ, మీరు ఏమి చేసినప్పటికినీ, యేసు మరణించినప్పటి నుండి మీరు రక్షించబడియున్నారు, ఎందుకనగా ఆయన లోక పాపములను మోసుకొనిపోవుటకే మరణించాడు. కానీ మీరు వ్యక్తిగతంగా దానిని అంగీకరించి మరియు దానిని అనుభవించనంతవరకు అది మీకు ఎన్నడూ ఏ మేలు చేయదు. కానీ మీ పాపముల విషయమైతే, అవి ఇదివరకే క్షమించబడ్డాయి. అది నిజము. ఆయన…“ఇదిగో లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల.” చూశారా? విషయం అదేయైయున్నది. ఇప్పుడు దానిని గుర్తుంచుకోండి.

272 ఇప్పుడు, లేఖనములలోనుండి బోధించడానికి, మనము ఒక మిశ్రమ సంఘ సమూహముగా ఉన్నామని, నాకు తెలుసు. మరియు చాలాసార్లు, ఈ హెబ్రీ పత్రికలో, మరిది చాలా లోతైన పత్రికయైయున్నది…ఇప్పుడు నేను కొద్దిసేపు దానిని వదిలిపెట్టవలసియుంటుంది. నేను ఈ రాత్రి ఆ 7వ అధ్యాయముయొక్క చివరి భాగమును ముగించడానికి ప్రయత్నించబోవుచున్నాను.

273 మరియు ఇప్పుడు మీ మనస్సులో అనేక ప్రశ్నలు ఉన్నాయి, దానిలో ఎటువంటి సందేహము లేదు. మీలో చాలామందికి ప్రశ్నలు ఉన్నాయి, మరియు నాకు కూడా, ఉంటాయి. ఇప్పుడు, తరువాత సారి, ప్రభువు చిత్తమైతే, నేను వచ్చినప్పుడు…

274 నేను ఇప్పుడు మిషిగన్ కు వెళ్తున్నాను. మరియు పిదప, మిషిగన్ నుండి, నేను కొలరాడోకు వెళ్తున్నాను. మరియు కొలరాడో నుండి, పశ్చిమ తీరమునకు వెళ్తున్నాను. ఇప్పుడు—ఇప్పుడు మేము వచ్చినప్పుడు, ప్రభువు చిత్తమైతే…ఇప్పుడు, నాకు తెలియదు. ఆదివారము, నేను చికాగోలో ఉండకపోతే, రాబోవు ఆదివారము రాత్రికి నేను తిరిగి ఇక్కడే ఉండవచ్చును.

275 ఇప్పుడు మనము మన సంఘకాపరిని దాదాపు ఆరు వారములనుండి ఇక్కడ ప్రసంగవేదికకు దూరంగా ఉంచుతున్నాము, ఇక్కడ, ఈ—ఈ—ఈ పూర్తి పత్రిక సమయములోయై యున్నది. చూశారా? ఇప్పుడు మనము…నేను దానిని చేయడానికి ఇష్టపడను. సహోదరుడు నెవిల్ ఒక ప్రియమైన, మాధూర్యమైన, దయగల సహోదరుడైయున్నాడు. మరియు ఈ సంఘము సహోదరుడు నెవిల్‌ను ప్రేమిస్తుందని నేను నిశ్చయత కలిగియున్నాను.

276 ఇంతకీ విషయమేమిటంటే, నేను మాట్లాడుతున్న ఈ సమయములోనే చెప్తున్నాను, సహోదరుడు నెవిల్‌ను ఈ ప్రసంగవేదిక మీదనుండి తొలగించడానికి, ఈ దేశములో ఎక్కడో, ఎవరో, ఏవో కార్డులను వ్రాస్తున్నందుకు దోషిగా కనుగొనబడ్డారు. మీరు దానిని నాతో తేల్చుకోవలసియుంటుంది. అహ-హ. అది నిజము. అహ-హ. అవును, వాస్తవంగా. ఇప్పుడు, నేను మిమ్మల్ని కోరుతున్నాను…సంఘపెద్ద-…సంఘపెద్దల గురించి ఏదో చెప్పారు. ఆ సంఘకాపరితో సంఘపెద్దల బోర్డుకు ఎటువంటి సంబంధము లేదు. లేదు, అయ్యా. సంఘము, అంతయు, పూర్తి అధికారమును కలిగియుంటుంది. అది కాదు…ఒక సంఘపెద్దల బోర్డు, కేవలం క్రమమును మరియు మొదలగువాటిని కాపాడుటకు, ఇక్కడ ఈ సంఘములో ఉండే పోలీసు వంటివారు మాత్రమే. కానీ నియమముల విషయానికి వస్తే, సంఘమంతా దానిని చెప్పవలసియుంటుంది. ఈ సంఘము స్థానిక సంఘముయొక్క సార్వభౌమాధికారముపై నిర్మించబడినది. కాబట్టి, ఈ సంఘకాపరిని తీసివేయడంలో గాని, లేదా ఒకరిని నియమించడంలో గాని నేను ఏమియు చెప్పలేను. ఈ స్థలము నాకు చెందినది; అది సంఘమునకు ఇవ్వబడినది. మీరందరూ సంఘమైయున్నారు. ప్రజలైన మీరే నియంత్రించువారైయున్నారు. స్వయంగా మీరే, సంఘమైయున్నారు. మరియు సంఘము, దేవునియొక్క పరిశుద్ధ సంఘము, ఆ సంఘములో పరిశుద్ధాత్మయొక్క సార్వభౌమాధికారమైయున్నది. మరియు నేను చేసే ఒకే ఒక్క పని ఏమిటంటే ఈ స్థలమును కలిగియుండి, దానిని ఈ సంఘమునకు అప్పగించడమైయున్నది, దానిని ఒక సంఘము కొరకు ఇవ్వడమైయున్నది, మరియు అది పన్ను రహితమైనది. మరియు సంఘము తమ స్వంత కాపరులను ఎన్నుకుంటుంది. దానితో నాకు ఏ సంబంధమూ లేదు. మరియు ఈ కాపరి వెళ్ళగలిగే ఒకే ఒక్క మార్గమేదనగా, కాపరి తనకు తానుగా వెళ్ళాలని నిర్ణయించుకోవడమే, లేదా సంఘముయొక్క అధిక సంఖ్యాకుల ఓట్లు, “కాపరిని మార్చుము,” అని చెప్పవలసియున్నది. అదొక్కటే మార్గము. ఏ సంఘపెద్దల బోర్డు దానిని చేయలేదు. సంఘపెద్దల బోర్డు కేవలం సంఘములో క్రమమును మరియు మొదలగువాటిని చూసుకుంటుంది.

277 ధర్మకర్తలు, వారికి దానితో ఏ సంబంధము లేదు, ఆలయమును బాగుచేయడంవరకే వారి పనియైయున్నది. మరియు అది…ధర్మకర్తల బోర్డువారంతా కలుసుకొని మరియు, “మనము దీనిని నిర్మించుదాము, లేదా మనము దానిని చేద్దాము,” అని చెప్పేవరకును వారు దానిని చేయలేరు. పిదప వారు దానిని చేయడానికి డబ్బు ఉన్నదో లేదో అని ఖజానాదారుడిని అడుగవలసియున్నది. అవును, అయ్యా.

278 అయితే ఏ సభ్యునికి వ్యతిరేకముగానైనా ఏదైనా ఫిర్యాదు ఉందంటే, ఒక సభ్యునికి మరొక సభ్యునికి వ్యతిరకముగా ఒక ఫిర్యాదు ఉన్నట్లైతే, లేదా ఏదైనా తప్పు ఉన్నట్లైతే, స్వయంగా, నీవు ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి, మరియు అతనితో మాట్లాడవలసియున్నావు, నీవు మరియు అతడు ఒంటరిగా మాట్లాడవలసియున్నారు. పిదప వారు దానిని స్వీకరించకపోతే, అప్పుడు తర్వాత జరుగవలసిన విషయమేమిటంటే, మీరు సంఘపెద్దలలో ఒకరిని లేదా ఇంకెవరినైనా మీతోపాటు తీసుకొని, ఆ సహోదరుడి దగ్గరికి వెళ్తారు. పిదప అతడు మిమ్మల్ని స్వీకరించకపోతే, అప్పుడు మీరు వచ్చి దానిని సంఘమునకు చెప్తారు. పిదప సంఘము మాట్లాడుతుంది…పిదప అతడు సంఘమును స్వీకరించకపోతే, అప్పుడు బైబిలు ఇట్లు చెప్పినది, “అతడిని ఒక అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.” అది సరియైయున్నది.

279 మరియు ఎవరైనా ఒక దోషియైన వ్యక్తిని ఎరిగియుండి, మరియు మీరు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే, అప్పుడు దేవుని సంఘములో భాగమైయున్న మీరు ఆ పాపము నిమిత్తము జవాబు ఇవ్వబోవుచున్నారు. అది నిజము.

280 మరియు ఒక సంఘపెద్దకు వ్యతిరకంగా, లేదా సంఘపెద్దకు లేదా సంఘములో ఎవరో ఒకరికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక ఫిర్యాదును కలిగియుంటే, దానికి ముగ్గురు వ్యక్తులు అవసరమవుతారు. ముగ్గురు వ్యక్తులు వస్తారు, ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల నోట సాక్ష్యము స్థిరపరచబడుతుంది. వచ్చి ఒక సంఘపెద్దకు వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు ఉన్నదని కాపరికి చెప్తారు. అప్పుడు ఒక సంఘపెద్దకు వ్యతిరేకంగా ఏదైనా ఫిర్యాదు ఉన్నట్లైతే, ఆ సంఘపెద్ద ఒక—ఒక నీతిమంతుడు, ఒక—ఒక పరిపూర్ణమైన వ్యక్తి కాదనుకోండి. మరి అతడు తప్పకుండా ఒక నిర్దోషిగా, ఒక సంఘపెద్ద పనిని చేయవలసియున్నాడు, మరియు పిదప నిర్దోషిగా గుర్తించబడవలసియున్నాడు. మరియు ఆ సంఘపెద్ద ఆ పనిని సరిగ్గా చేయడంలేదని సంఘపువారు కనుగొనినయెడల, అతడు తనతో ముగ్గురిని వెంటబెట్టుకొని మరియు ఆ విషయమును సంఘకాపరి యొద్దకు తీసుకొనివెళ్తాడు. ఆ సంఘపెద్ద ఆ రాత్రి ఇంట్లోనే ఉండమని కోరబడతాడు. మరియు పిదప సంఘకాపరి…వచ్చి మరియు సంఘమును సమకూర్చి, ఆ ఫిర్యాదును చేస్తాడు. మరియు సంఘము ఆ సంఘపెద్ద కొనసాగాలని ఓటు వేస్తే, ఆ సంఘపెద్ద కొనసాగుతాడు. ఒకవేళ అతడు-…ఆ సంఘపెద్ద తొలగించబడాలని ఓటు వేస్తే, ఆ రాత్రే వారు ఒక క్రొత్త సంఘపెద్దను ఎన్నుకుంటారు. చూశారా?

281 కావున, దీనిలో ఏ ఒక్క వ్యక్తి చేసేది ఏదియు లేదు. అది అధిక సభ్యులు చెప్పేదియైయున్నది. అవును, అయ్యా. ఒకవేళ ఇరవైమంది అతని కొరకు ఓటు వేసి, మరియు ఇరవై-ఒక్క మంది అతనికి వ్యతిరేకంగా ఓటు వేస్తె, అతడు వెళ్ళిపోతాడు; లేదా, ఉండడమైనా అంతే. చూశారా? అది, అది స్థానిక సంఘముయొక్క సార్వభౌమ అధికారమైయున్నది మరియు, పిదప, సంఘములో ప్రతియొక్క సభ్యునికి చెప్పుటకు-హక్కు ఉన్నది. ఏదైనా, తప్పు జరిగితే, అప్పుడు వారు నేరుగా ఇక్కడికి రావచ్చు, మరియు వారు చేయవలసిన ఒకే ఒక్క పని ఏమిటంటే వారు దేవుని యెదుట ఉండి సంఘముయొక్క కదలికకు ఏదియు ఆటంకముగా ఉండకుండునట్లు ఖచ్చితంగా చూసుకోవడమైయున్నది.

282 అయితే సంఘముయొక్క సంపూర్ణమైన పూర్తి అధికారము సంఘకాపరిదైయున్నది. దానిని బైబిలులో చదవండి, అది బైబిలు క్రమము కాదేమో చూడండి. అది ఖచ్చితంగా నిజము. ఆ పెద్దకు పైన ఎవ్వరూ లేరు. ఇక్కడ సహోదరుడు నెవిల్ చేసేదానితో నాకు ఎటువంటి సంబంధము లేదు. అది మీకు మరియు సహోదరుడు నెవిల్ కు సంబంధించినది. సహోదరుడు నెవిల్ యెహోవా సాక్షి సిద్ధాంతమును బోధించాలనుకుంటే, అది అతనికి మరియు మీకు సంబంధించినది. చూశారా? అతడు కోరిన దేనినైన అతడు బోధించగోరితే, అది మీకు మరియు అతనికి మధ్య విషయమైయున్నది. అంతే. అతడు దానిని బోధించడానికి, సంఘము అక్కడ అతనికి ఓటు వేస్తే, అది మంచిదే. అది అతని ఇష్టం.

283 నేను చేసే ఒకే ఒక్కటి ఏమిటంటే, కేవలం ఈ స్థలమును కలిగియుండటమే. మరియు ఇంకేదైనా విషయము వచ్చిందంటే, అనగా సంఘకాపరిని తొలగించడం వంటిది ఏదైనా వస్తే, మరియు దాని విషయమై వారు ఓట్లు తీసుకోవాలనుకుంటే, దానిని చేయమని మీరు ఒక సంఘపెద్దను అడగలేరు. మీరు వచ్చి నన్ను అడగాలి. నేను ఇక్కడికి వచ్చి, ఇట్లంటాను, “మీరు సంఘకాపరిని తొలగించాలనుకుంటే, ఎందుకో నాకు చెప్పండి. అతడు ఏదైనా చేశాడా?”

284 “అవును. అతడు త్రాగియుండటాన్ని, మేము కనుగొన్నాము.” లేదా, “అతడు దీనిని చేస్తుండగా, లేదా సరికాని ఒక విషయమును చేస్తుండగా మేము అతణ్ణి పట్టుకున్నాము.”

285 “దాని విషయమై మీరు ముగ్గురు సాక్షులను కలిగియున్నారా?”

286 “అవును. మేము కలిగియున్నాము.”

287 ఆ సాక్షులు మొదటిగా విచారణ చేయబడాలి. “ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము, మరియు పెద్దకు వ్యతిరేకముగా; మొదట వారు పరీక్షింపబడవలెను.” అప్పుడు మీరు దానిని చూశారని, మీరు దాని విషయమై ప్రమాణము చేయవలసియున్నారు; మరియు మీరు దానిని చూశారని, నిరూపించవలసియున్నారు.

288 మరియు పిదప, మీరు అలా చేసినట్లైతే, అప్పుడు ఆ పాపము, “అది తప్పు,” అని బహిరంగముగా గద్దించబడుతుంది. అప్పుడు ఇట్లంటాను, “సంఘమా, మీరు మీ కాపరిని మార్చగోరుచున్నారా?”

289 మరియు సంఘము, “అతణ్ణి క్షమించి, మరియు అతణ్ణి కొనసాగనివ్వండి” అని ఓటు వేస్తే, అది ఆ విధంగానే స్థిరపరచబడవలసియున్నది. చూశారా? అది, అది న్యాయము కాదా? సంఘమును నడిపించవలసిన విధానము అది కాదా? బైబిలు దానినే చెప్పినది. ఇతణ్ణి తొలగించగలిగి మరియు చాలా అధికారమును కలిగియున్న బిషప్పులు మరియు పైవిచారణకర్తలు, మరియు బోర్డులు మరియు మొదలగువారు ఎవ్వరూ మనకు లేరు. పరిశుద్ధాత్మకు తప్ప ఇక్కడ ఎవరికీ అధికారము లేదు. అది నిజము. తొలగించడమైనా నియమించడమైనా ఆయనే చేస్తాడు. మరియు మనము ఆయనను అధిక సంఖ్యాకుల చొప్పున తీసుకుంటాము, ప్రజలు ఎంచుకునేదానిని బట్టి తీసుకుంటాము.

290 మరి పిదప ఒక పక్షము దీనిని చేయాలనుకుంటే, మరొక పక్షము దానిని చేయాలనుకుంటే, మరియు ఒక పక్షము గెలిచినప్పుడు, ఓడిపోయిన పక్షమువారు, వారు దాని విషయమై ఏమి చేస్తారు? నేరుగా ఆ మిగతావారితో కలిసిపోడమే, ఇట్లు చెప్పాలి, “అలాగైతే, మాదే తప్పు. మేము నేరుగా కొనసాగుతాము, ఎందుకనగా పరిశుద్ధాత్మయే ఆ ఎంపికను చేశాడు.” చూశారా? అది ఖచ్చితంగా సరియే.

291 డెమొక్రాట్ మరియు రిపబ్లికన్ పార్టీల వారివలె ఉన్నది, మనము ప్రజాస్వామ్యముగా, అమెరికన్లుగా నిలబడినంతకాలం అంతే. డెమొక్రాట్ వారు గెలుస్తే, రిపబ్లికన్ వారు నేరుగా వారితో ముందుకు కొనసాగవలసియున్నది; రిపబ్లికన్ వారు గెలుస్తే, డెమొక్రాట్ వారు కొనసాగవలసియున్నది. చూశారా? సరిగ్గా అదే మనలను ఒక దేశముగా చేస్తుంది. మనము దానిని బ్రద్దలు చేసినప్పుడల్లా, మనం మన ప్రజాస్వామ్యాన్ని బ్రద్దలు చేస్తాము. అది నిజము. ప్రజాస్వామ్యవాదులు ఇట్లన్నారనుకోండి, “రిపబ్లికన్లు గెలిచారు, నేను ఏమియు చేయబోవడంలేదు.” అప్పుడు మనము పతనమైపోతాము. నేను ఒక కెంటకీవాడను: కలసియుంటే మనము నిలబడతాము, మరియు విభజించబడితే మనము పతనమైపోతాము.

292 ఇప్పుడు, సంఘములో మీకు తెలిసిన ఒక తప్పిదమేదైనా ఉన్నయెడల, ఒక మనిషి లేదా ఒక వ్యక్తి లేదా ఏదైనా ఉన్నయెడల, మీరు ఆ కర్తవ్యమునకు బద్దులైయున్నారు మరియు మీరు ఆ విషయమును సరి చేయనియెడల దేవుని యెదుట జవాబునిస్తారు; సంఘమైయున్న, మీరు జవాబునిస్తారు. ఇప్పుడు, గుర్తుంచుకోండి, అది నా భుజములపై లేదు. అది మీ భుజములపై ఉన్నది. మరియు సంఘములో ఏదైనా తప్పు ఉన్నయెడల, దేవుడు మీరు దానికి జవాబునిచ్చేలా చేస్తాడు. అది నిజము. ఆ విధంగానే ఆయన తన సంఘమును నడుపుతాడు. బైబిలులో అది ఆ విధంగానే ఉన్నది. అది బైబిలుయొక్క క్రమమైయున్నది. అది స్థానిక సంఘముయొక్క సార్వభౌమ అధికారమైయున్నది. సంఘకాపరి శిరస్సైయున్నాడు. అది నిజము. ఆమేన్.

293 ఇప్పుడు, ఇక్కడ ఈ ధన్యకరమైన, పాత వర్తమానము నొద్దకు వస్తున్నాను. మీరు, ఇప్పుడు మీరు దానిని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది, ఈ వర్తమానము టేపులో రికార్డు చేయబడినది, గుర్తుంచుకోండి. మరియు సంఘముయొక్క టేపు రికార్డింగులు, సంఘముయొక్క క్రమములు మరియు నియమములు, అది టేపులో ఉన్నది. అది బైబిలు ప్రకారముగా ఉన్నది. మనము దానిని నడిపించము; శిరస్సుగా ఎవ్వరూ లేరు. లేరు. అందరము, మనమందరము ఒక్కటే. అయితే, మనము ఒక నాయకుణ్ణి కలిగియున్నాము, అది సంఘకాపరియే, అతడు పరిశుద్ధాత్మచేత నడిపించబడినంత కాలం అది అతడే. నిజము. సరి.

294 ఇప్పుడు, ఇక్కడ, చాలా ప్రశ్నలు ఉండబోవుచున్నవి. కావున తరువాత సారి వారు బయటకు తెలియజేసినప్పుడు, మరియు నేను ఇక్కడికి రాబోతున్నానని సహోదరుడు నెవిల్ రేడియోలో ప్రకటించినప్పుడు, మీరు మీ ప్రశ్నను వ్రాసుకోండి, తద్వారా మీరు మరియు నేను కలసి దానిని తర్కించగలము. మీరలా చేస్తారా? సరి.

295 పరిశుద్ధులయొక్క పట్టుదల గురించి నేను బోధించానని నాకు తెలుసు. యేసుయొక్క సర్వోన్నతమైన దైవత్వము గురించి నేను బోధించాను. విశ్వాసియొక్క భద్రత గురించి నేను బోధించాను, ముందు నియమము, ముందు నిర్ణయము, మరియు అటువంటి అనేక సంగతుల గురించి నేను బోధించాను. మరి, నాకు తెలుసు, నా సంఘములో అనేకమంది నియమవాదులు ఉన్నారు, మరది పరిపూర్ణముగా మంచిదే. ఖచ్చితంగా. అయితే, ఇప్పుడు, ఆ విషయాలు, నేను కూడా, ఒక నియమవాదినే, మరియు నేను కృప ద్వారా రక్షణను నమ్మేవాడినైయున్నాను. నేను కేవలం బైబిలును నమ్ముతాను. అంతే.

296 ఇప్పుడు, వాటిలో కొన్ని, ప్రశ్నలు. మరియు నేను సాక్ష్యాధారములపై, ఉద్రేకములపై, మరియు మొదలగువాటిపై, మరియు బహుశా మీరు ఏకీభవించని ఆ విషయములన్నిటిపై బోధించాను. కావున ఈ రాత్రులలో ఒక రాత్రి, బహుశా, మనము దానిని చేద్దాము…

తిరిగి ఇక్కడికి రావాడానికి నీవు తొందరపడుతున్నావా? [సహోదరుడు నెవిల్, “లేదు” అని చెప్పాడు.—సంపా.]

మనము దానిని బుధవారము రాత్రి పెట్టుకుందాము, ఈ వచ్చే బుధవారము రాత్రి, అప్పుడు నేను—నేను అప్పుడు నేను—నేను దానిని తీసుకోగలనని నేను అనుకుంటున్నాను. బుధవారము రాత్రి మీ ప్రశ్నను తెచ్చి, ఇక్కడ వేదిక మీద పెట్టండి, మరియు బైబిలును గూర్చిన ప్రశ్న, సరి, ఇప్పుడు నేను బోధిస్తున్నదానిని గూర్చిన ప్రశ్నయైయుండవలెను. మరి బుధవారం రాత్రి. మరియు పిదప వచ్చే ఆదివారము నాటికి, అప్పుడు, ఎలాగైనా, నేను—నేను చికాగోలో ఉండవలసియున్నానని నేను అనుకుంటున్నాను. మరియు నేను అక్కడనుండి మిషిగన్ లోనికి వెళ్తున్నాను. ప్రభువు చిత్తమైతే, ఆ ప్రశ్నలకు నాకు తెలిసినంత ఉత్తమముగా జవాబునిచ్చుటకు ప్రయత్నించడానికి, బుధవారం రాత్రి నేను ఇక్కడ ఉంటాను. మరియు ఇప్పుడు ప్రభువు కనికరము చూపును గాక.

ఇప్పుడు మనం, ఒక్క క్షణము మన తలలు వంచుదాము.

297 ఇప్పుడు, ధన్యకరమైన ప్రభువా, ఇది నీయొక్క గొప్ప స్వాస్థ్యమైయున్నది. ఇది నీ సంఘమైయున్నది. ప్రభువా, కదులుచున్నది నీవే, మరియు దేవునియొక్క ఆత్మ మమ్మల్ని కదిలించిన విధంగా మేము కదలగోరుచున్నాము. మరియు ఇప్పుడు నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. మరియు మేము ఈ వర్తమానమును అధ్యయనం చేస్తూ, మరియు ఈ లోతైన విషయాలలోనికి వెళ్తుండగా, సరిగ్గా మా అవసరత కొలది పరిశుద్ధాత్మ వాటిని మాకు బయలుపరుస్తాడని మేము ప్రార్థిస్తున్నాము. ఏలయనగా ఆయన నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్.

298 ఇపుడు, ఓ, నేను…ఈ హెబ్రీ పత్రికను, గొప్ప గ్రంథాలలో ఒకటిగా నేను ఎంచుతాను.

299 కొద్ది కాలం తర్వాత, బహుశా నేను—నేను…విదేశాలకు వెళ్ళవలసియున్నది, మరది, దేవుడు అనుమతిస్తే, నేను అతి త్వరలో వెళ్ళబోతున్నాను. ఒక దర్శనము ప్రకారముగా నేను ఆఫ్రికాకు వెళ్ళవలసియున్నాను. నేను ఆఫ్రికాకు వెళ్ళి ఆ దర్శనమును నెరవేర్చేవరకు, నేను నా కూటములలో ఎన్నడూ ఎక్కువగా ఫలభరితమవ్వలేనని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు, పిదప, అది బహుశా ఈ రాబోవు వసంతకాలంలో ఉండవచ్చును.

300 అయితే ఆ సమయానికి మధ్యలో, నేను హెబ్రీ పత్రిక నుండి మరొక పుస్తకమును తీసుకోడానికి ఇష్టపడుతున్నాను, అదేమిటనగా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, మరియు ఆ 11వ అధ్యాయములో దాదాపు ఒక వారం ఉండి, మరియు ఆ గుణలక్షణములలో లేదా ఆ పాత్రలలో ఒకొక్కరిని తీసుకొని, మరియు వారి గుణలక్షణమును బయటకు తీసుకొనిరాగోరుతున్నాను. చూశారా? “విశ్వాసమును బట్టి, నోవహు,” పిదప నోవహు జీవితమును తీసుకుంటాను. “విశ్వాసమును బట్టి, అబ్రాహాము,” పిదప అబ్రాహాము జీవితమును తీసుకుంటాను. “విశ్వాసమును బట్టి, హేబెలు,” పిదప హేబెలు జీవితమును తీసుకుంటాను. చూశారా? మరియు దానిని దిగువునకు తీసుకొనివస్తాను. మీరు దానిని ఇష్టపడతారా? [సంఘము, “ఆమేన్” అని చెప్తున్నది.—సంపా.] ఓ, అది, అలాగైతే మనము బైబిలు మొత్తాన్ని తీసుకుందాము. మరియు అప్పుడు, బహుశా, ఒక వారం, అనుకుందాము, లేదా పది రోజుల కూటములలో గాని మనం దానిని ప్రయత్నించుదాము, ఒక ఉజ్జీవములో వలె, సరిగ్గా ఒక కూటము తర్వాత మరొకదానిని కలిగియుండవచ్చును, క్రిస్మస్ సెలవులలో, లేదా ప్రభువు చిత్తమైనయెడల, అటువంటి ఏదో ఒక సమయములో కలిగియుందాము.

301 ఇప్పుడు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో, మనము ఈ గొప్ప పాత్రను కలుసుకున్నాము. ఆయన పేరు ఏమిటో నాకు ఎవరు చెప్పగలరు? [సంఘము “మెల్కీసెదెకు,” అని చెప్తున్నది.—సంపా.] మెల్కీసెదెకు. ఇపుడు, ఈ మెల్కీసెదెకు ఎవరు? అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అతడు షాలేముకు రాజు, అనగా యెరూషలేముకు రాజైయున్నాడు. అతనికి ఏ తండ్రి లేడు, లేదా అతనికి ఏ తల్లి లేదు. అతడు జన్మించినటువంటి ఏ సమయము ఎన్నడూ లేదు, లేదా అతడు మరణించునట్టి ఏ సమయమును ఎన్నడూ ఉండదు. ఇప్పుడు, అది నిత్యమైనదై ఉండవలసియున్నదని మనము కనుగొన్నాము.

302 ఎప్పటికీ అనే పదానికి అర్థం “ఒక కాల పరిమితి,” అని మనము కనుగొన్నాము. అది మీకు ఇంకా గుర్తున్నదా? ఒక కాల పరిమితి, అది ఎప్పటికీ మరియు ఎప్పటికీయై యున్నది. మరియు బైబిలు గ్రంథములో ఎప్పటికీ అనేది, “ఒక—ఒక కాల పరిమితి” గా, అనేకసార్లు కనుగొనబడినది.

303 కాని, నిత్యత్వము, మరియు ఒకే ఒక్క విధమైన నిత్యజీవము కలదని, మనము కనుగొన్నాము. అది నిజమేనా? దేవుడు మాత్రమే, ఆ నిత్యజీవమును కలిగియున్నాడు. అది నిజమేనా? ఒకే ఒక్క విధమైన నిత్యజీవము ఉన్నది. “నిత్యమైన శిక్ష” అనే పదము ఏదియు లేదు. ఎందుకనగా, మీరు నిత్యము శిక్షించబడనైయుంటే, నిత్యమూ శిక్షించబడుటకు మీరు తప్పక నిత్యజీవమును కలిగియుండాలి. మీరు నిత్యజీవమును కలిగియుండాలి-…మరియు మీరు నిత్యజీవమును కలిగియున్నారంటే మీరు శిక్షింపబడలేరు, చూడండి, మీరు నిత్యజీవమును కలిగియుంటే అలాగుంటుంది. “నా మాటలు విని, నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు.” అది నిజమేనా? నిత్యజీవము, మీరు విశ్వసించుటవలనైయున్నది. సరే, మీరు నిత్యజీవమును కలిగియున్నట్లైతే, మీరు శిక్షింపబడలేరు, ఎందుకనగా మీరు నిత్యజీవమును కలిగియున్నారు. కాబట్టి, అలాగైతే, మీరు ఎన్నటెన్నటికీ నరకములో బాధను అనుభవించవలసి యున్నట్లైతే, మీరు తప్పక నిత్యజీవమును కలిగియుండవలసియున్నారు.

304 అయితే, ఇప్పుడు, బైబిలు అచ్చంగా మండుచున్న ఒక నరకము గురించి బోధిస్తుందని నేను నమ్ముతాను. బైబిలు దానిని బోధిస్తుంది, అదేమిటనగా పాపములు మరియు దుష్టత్వము ఎప్పటికీ మరియు ఎప్పటికీ శిక్షించబడును అని బోధిస్తుంది. [తెలుగు బైబిలులో “యుగయుగములు” అనే పదం వాడబడినది.—తర్జుమాదారుడు.] ఇప్పుడు, అది నిత్యత్వము కాదు. అది బహుశా పదివేల కోట్ల సంవత్సరములు కావచ్చును. అది వంద కోట్ల సంవత్సరాలు వరకు కావచ్చును, కానీ ఏదో ఒక సమయములో అది అంతమవ్వవలసియున్నది. ఏలయనగా, ఆరంభమును కలిగియున్న ప్రతీదానికి, అంతము కలదు. ఆరంభమును కలిగిలేని సంగతులే, అంతమును కలిగియుండని సంగతులైయున్నవి.

305 ఆ పాఠము ఇప్పుడు మీకు గుర్తున్నదా? మనము ఏ విధంగా వెనుకకు వెళ్ళి, ఆరంభమును కలిగియున్న ప్రతీది వంకర చేయబడటాన్ని కనుగొన్నాము కదా, చూడండి, ప్రధానమైన దానినుండి ఒక వక్రీకరణ. మరియు, చివరకు, అది ఒక నిత్యత్వము వద్దకు తిరిగి వస్తుంది. మరియు పిదప నరకమంతయు, బాధ అంతయు, మరియు అటువంటివాటిని గూర్చిన జ్ఞాపకమంతయు, సదా కనుమరుగైపోతుంది. ప్రారంభమైన ప్రతీది, అంతమవుతుంది.

306 మరియు ఈ మెల్కీసెదెకు యేసు కాదు, ఏలయనగా ఆయన దేవుడైయున్నాడు. మరియు యేసుకు మరియు దేవుడికి మధ్య వ్యత్యాసము కలుగజేసినది ఏమిటనగా, యేసు, దేవుడు నివసించినట్టి ఆలయమైయున్నాడు. చూశారా? ఇప్పుడు, మెల్కీసెదెకు. యేసుకు తల్లి మరియు తండ్రి ఇద్దరూ ఉన్నారు. మరియు ఈ వ్యక్తికి ఏ తండ్రియైనను లేదా తల్లియైనను ఎన్నడూ లేరు. యేసు జీవమునకు ఆరంభమును కలిగియున్నాడు మరియు ఆయన జీవమునకు అంతమును కలిగియున్నాడు. ఈ వ్యక్తికి ఏ తండ్రి లేడు, ఏ తల్లియు లేదు, జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేదు. అయితే, అది ఒకటే వ్యక్తియైయున్నాడు. అది, మెల్కీసెదెకు మరియు యేసు ఒక్కడే; కానీ యేసు భూసంబంధమైన శరీరమైయున్నాడు, పాపపూరితమైన ఆకారములో జన్మించి రూపింపబడినవాడు. దేవుని స్వంత శరీరము, ఆయన స్వంత కుమారుడు, మరణపు ముల్లును విరచి, విమోచనా క్రయధనమును చెల్లించి, మరియు ఆయన వద్దకు కుమారులను మరియు కుమార్తెలను స్వీకరించుటకు, పాపపూరితమైనదానిలో రూపించబడి మరియు జన్మించాడు. మీకు అది అర్థమవుతుందా? ఆ కారణమును బట్టియే—ఆయన ఒక ఆరంభమును కలిగియున్నాడు, ఆయన ఒక ముగింపును కలిగియున్నాడు.

307 కాని ఈ పరిపూర్ణమైన శరీరము, మన పునరుత్థానముయొక్క సంచకరువుకు, జ్ఞాపకార్థముగా, దేవుడు ఆ పరిశుద్ధ శరీరమును కుళ్ళుపట్టనివ్వలేదు, ఎందుకనగా స్వయంగా ఆయనే దానిని సృష్టించాడు. మరియు దానిని ముందుకు తీసుకొనివచ్చి, దానిని పునరుత్థానము చేసి, మరియు తన కుడి పార్శ్వమున దానిని కూర్చుండబెట్టాడు.

308 మరియు, ఈనాడు, ఆ శరీరమును లేపిన అదే పరిశుద్ధాత్మ ఇక్కడ సంఘములో ఉన్నాడు. ప్రభువు నామము స్తుతించబడును గాక! మరియు అవే ఆశ్చర్యకార్యములను మరియు అదే శక్తిని కనబరచుచున్నాడు. మరియు ఏదో ఒక దినమున, సంఘములోనున్న ఈ పరిశుద్ధాత్మ, కేక వేసి మరియు పైకి లేచి, మరియు మహోన్నతుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చొనియున్న ఈ శరీర రూపములోనికి దానికదే చేరుతుంది, పాపులమైన మన కొరకు విజ్ఞాపన చేయుటకు అది అక్కడున్నది. మరియు దాని ద్వారా మనం పరిపూర్ణముగా పాపము నుండి కాపాడబడుచున్నాము. మనం పాపము చేయమని కాదు; అయితే దేవుని సన్నిధిలో, పాపము లేనివారిగా ఉంచబడుచున్నాము. ఎందుకనగా, నాకు మరియు దేవునికి మధ్య, నీకు మరియు దేవునికి మధ్య రక్తసిక్తమైన ఒక బల్యర్పణ అక్కడ నిలబడియున్నది. ఆ కారణమును బట్టియే, “దేవుని మూలముగా పుట్టినవాడు, పాపము చేయడు, అతడు పాపము చేయలేడు,” అని ఆయన చెప్పాడు. ఏలయనగా, మీరు తిరిగి జన్మించినట్లైతే, ఆ శరీరములో నివసించిన అదే పరిశుద్ధాత్మ మీలో నివసిస్తుంది. మరియు అది పాపము చేయజాలదు; బల్యర్పణ ఆయన యెదుట పడియున్నది. పిదప మీరు ఉద్దేశపూర్వకముగా దానిని చేసినట్లైతే, మీరు ఆ శరీరములో ఉండటం అసాధ్యమని అది చూపిస్తుంది. ఆమేన్. అది సువార్తయైయున్నది. విషయం అదేయైయున్నది.

309 కావున, మీరు చూడండి, అది ఏ లేఖనముతోను విరుద్ధంగా లేదు. అది లేఖనములను కలిపి ముడివేస్తుంది. చూశారా? “ఒకసారి వెలిగింపబడినవారికి అది అసాధ్యము.” ఆ విషయం మీదనే నన్ను అనేక ప్రశ్నలు అడుగుతారు. ఏలయనగా, వాటిని తీసుకురండి, మనకు అదే కావాలి.

310 ఇప్పుడు గమనించండి, “ఒకసారి వెలిగింపబడినవారు మరలా పశ్చాత్తాపపడునట్లు, తమను తాము నూతనపరచుకోడానికి పతనమైపోవుట అసాధ్యము, వారు మరలా దేవుని కుమారుడిని తాజాగా సిలువవేయుట, మరియు ఆయనను…బాహాటముగా అవమానపరచుట వంటివి చూడటం అసాధ్యము.” వారు దానిని చేయలేరు.

311 పిదప మీరు హెబ్రీ 10 లోనికి వెళ్తే, అక్కడ అది ఇట్లు చెప్తున్నది, “మనము సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము పొందిన తరువాత, మనము బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల…” మరి పాపము అనగా ఏమిటి? అవిశ్వాసమే.

312 ఈ ఉదయమున సరిగ్గా ఇక్కడ పరిశుద్ధాత్మ తాను చేసిన అవే కార్యములను చేయడాన్ని మీరు చూసి, మరియు క్రీస్తు మృతులలో నుండి లేచాడని చూసి, మరియు ఆయన తన సంఘములో మరియు తన ప్రజల మధ్యన జీవించుచున్నాడని చూసి, మరియు మీరు బుద్ధిపూర్వకముగా దానిని త్రోసివేసినట్లైతే, మీరు ఎన్నడైనా దేవుని యొద్దకు రావడం అసాధ్యము, ఎందుకనగా మీరు పరిశుద్ధాత్మను దూషించారు.

313 యేసు ఆ ఆశ్చర్యకార్యములను చేస్తున్నప్పుడు, ఆయన అవే సంగతులను చెప్పాడు.

314 వారు ఇట్లన్నారు, “ఏమిటీ, అతడు బయెల్జెబూబు. అతడు సోదె చెప్పువాడు. అతడొక దయ్యము.”

315 యేసు వెనుకకు తిరిగి, మరియు ఇట్లన్నాడు “దానిని బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ పరిశుద్ధాత్మ వచ్చి దానిని చేసినప్పుడు, దానికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినా ఈ యుగమందైనను లేదా రాబోవు యుగమందైనను అది ఎన్నడూ క్షమించబడదు.” ఎందుకనగా ఆయనలో ఉన్న దేవునియొక్క ఆత్మను, “ఒక అపవిత్రాత్మ,” అని మీరు పిలిచారు.

316 అలాగైతే, మనము బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల, మనము పాపము చేసినయెడల, అనగా బుద్ధిపూర్వకముగా అవిశ్వాసముంచుటయై యున్నది. మనము సత్యమును స్వీకరించిన తర్వాత కాదు, తిరిగి జన్మించిన తర్వాత కాదు; అప్పుడు మనము పాపము చేయలేము. ఒక పాపి క్షమించబడరా…ఒక క్రైస్తవుడు క్షమించబడరాని పాపమును చేయలేడు. అతడు దానిని చేయలేడు. దానిని చేసేది భక్తిహీనులే. అది వేష-దారియే, విశ్వాసి కాదు.

317 ఆ యూదా రబ్బీలు, ఓ, వారు నిఖచ్చితమైనవారని వారు అనుకున్నారు, మరియు వారు D.D. లను మరియు Ph.D. లను కలిగియున్నారు. వారు వాటన్నిటిని ఒక సంచిలో పెట్టి, కుట్టివేసారని వారు అనుకున్నారు, కానీ వారు అత్యంత నీచమైన పాపులైయున్నారు. ఓ, వారు…మీరు వారి జీవితంపై—వేలెత్తి చూపించలేకపోవచ్చును. వారు శుభ్రముగా, నైతికముగా, మరియు నీతిమంతులుగా, ఆ విధంగా ఉన్నారు. కానీ వారు అవిశ్వాసులు.

318 మరియు మీరు పాపము అనే పదమును తీసుకొని, మరియు దాని అర్థం ఏమిటో కనుగొనండి. పాపము అనే పదమునకు “అవిశ్వాసము,” అని అర్థము. రెండే రెండు వర్గాలు ఉన్నాయి, అవేమిటనగా, ఒక విశ్వాసి లేదా ఒక అవిశ్వాసి. అనగా, నీతిమంతునిగా తీర్చబడిన ఒక వ్యక్తి లేదా ఒక పాపి. అంతే. నీవు ఒక అవిశ్వాసివైనయెడల, నీవు ఒక పాపివే; నీవు ఎంత మంచివాడవైనా, నీవు ఎంతగా సంఘమునకు వెళ్ళినా, లేదా నీవు ఒక బోధకుడవైనా సరే అది అంతే. నీవు ఇంకనూ ఒక అవిశ్వాసివే.

319 ఆ పరిసయ్యులు బోధకులైయున్నారు, మరియు వారు అవిశ్వాసులైయున్నారు, మరియు ఈ రోజున దాని నిమిత్తము పాతాళములో ఉన్నారు. వారు ఎంతో మతభక్తి కలిగియున్నారు, మరియు పరిశుద్ధతను కలిగియున్నారు, కానీ వారు ఆయనను నమ్మలేదు. మరియు వారు ఆయనను “ఒక దయ్యము,” అని పిలిచి, మరియు ఆయనయొక్క వాక్య విషయమై వాదించారు. మరియు వారిలో కొందరు ఇట్లన్నారు, “నీవు అదే అయితే, ఇప్పుడు సిలువ మీదనుండి దిగిరమ్ము. ఒక ఆశ్చర్యకార్యమును ప్రదర్శించుము. నీవు దానిని చేయుటను మమ్మల్ని చూడనిమ్ము.” ఒకడు కర్రతో, ఆయన తల మీద కొట్టి, ఇట్లన్నాడు, “ఓ ప్రవక్తా, నిన్ను ఎవరు కొట్టారో, ప్రవచించి మరియు మాతో చెప్పు, మరప్పుడు మేము నిన్ను నమ్ముతాము.” చూడండి, అవిశ్వాసులు! వారు విశ్వాసులన్నట్లుగా వారు నటిస్తారు, కానీ వారు అవిశ్వాసులైయున్నారు, వారు పరిశుద్ధులు మరియు భక్తిగలవారు అయినప్పటికినీ, తిరిగి జన్మించనివారైయున్నారు, వేరు చేయబడినవారైయున్నారు.

320 ఇంకను, ఈనాడు కూడా అదే కార్యము నిలబడియున్నది. స్త్రీ పురుషులు సంఘమునకు వెళ్ళి మరియు ముఖం బిర్రుగా పెట్టుకొని, మరియు—మరియు వారు ఎంతో భక్తిగలవారై, ఎన్నడూ అబద్ధమాడక, దొంగిలించక, మరియు వారికి సాధ్యమైనంత ఉత్తమముగా వారి మతమును జీవించుటకు ప్రయత్నిస్తూ ఉండవచ్చును. కానీ, వారు ఒక విశ్వాసియైతేనే తప్ప, వారు నశించినట్లే. కావున బైబిలులో ఎటువంటి నియమవాదులు లేరు. కృప మూలముగా రక్షణను నమ్మేవారు…కృప అనేది దేవుడు మీ కొరకు చేసినదైయున్నది, మరియు క్రియలు మీరు దేవుని కొరకు చేసేదైయున్నది. అవి ఖచ్చితంగా వేరు వేరు సంగతులైయున్నవి.

321 మీరు అబద్ధమాడటం మానివేసినా, ధూమపానం మానివేసినా, దొంగతనమును మానివేసినా, వ్యభిచరించుటను మానివేసినా, అన్నీ మానివేసి, సమస్తమును చేసి, ఆజ్ఞలను పాటించి, మరియు సంఘమునకు వెళ్ళి, ప్రతి ఆదివారము బాప్తిస్మము పొంది, ప్రభురాత్రి భోజనమును తీసుకొని, పరిశుద్ధుల పాదములు కడిగి, సమస్తమును చేసినా, రోగులను స్వస్థపరచి, మరియు ఈ ఇతర కార్యములన్నిటినీ చేసినా గాని, మీరు దేవునియొక్క ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప, ఎన్నుకోబడియుంటేనే తప్ప, మీరు నశించినట్లే. “పొందగోరువాని వలనైనను లేదా ప్రయాసపడువాని వలనైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే జరుగును.”

322 ఏశావు ఒక క్రైస్తవుడిగా మారుటకు తన శాయశక్తులా ప్రయత్నించాడు, మరియు దానిని చేయలేకపోయాడు. అతడు సంతాపపడి ఏడ్చుచు, పశ్చాతాపపడుటకు ఒక అవకాశము కొరకు వెతికాడు గాని, దానిని కనుగొనలేకపోయాడని బైబిలు గ్రంథము చెప్పినది. అతడు పుట్టకముందే, దేవుడు అతడిని ఖండించాడు, ఎందుకనగా అతడు తన హృదయములో ఒక కుళ్ళిపోయిన మోసగాడని ఆయన ఎరిగియున్నాడు. దేవుడు ముందుజ్ఞానము ద్వారా దానిని ఎరిగియున్నాడు. ఆయన ఇట్లన్నాడు, “నేను యాకోబును ప్రేమించుచున్నాను, మరియు నేను ఏశావును ద్వేషించుచున్నాను.” మరియు ఏశావు ఒక మర్యాదస్థుని వలె అగుపించాడు. అతడు ఇంటి వద్దనే ఉండి, అంధుడైన తన వృద్ధ తండ్రిని చూసుకుంటూ, పశువులకు మేత పెడుతూ, మరియు సమస్తమును చేస్తున్నాడు, ఒక మంచి అబ్బాయిగా ఉన్నాడు.

323 మరియు యాకోబు తల్లి చాటు బిడ్డయైయున్నాడు, కథలు చెప్పే ఒక చిన్న ఆడంగివాడిలా ఉన్నాడు. అతడు అదేయైయున్నాడు. మీరు దానిని ఒప్పుకోవాల్సిందే. బైబిలు దానిని ఒప్పుకుంటుంది, దానిని చెప్తుంది. పారిపోయి, మరియు ప్రతీది చేసాడు. మరియు—మరియు, అమ్మ, అమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కానీ, అయినను, యాకోబు, అతని ఒడిదొడుగులన్నిటితో, మరియు అతనియొక్క ఆడంగి విధానములన్నిటితో, అతడు ఇంకనూ ఆ జన్మహక్కును గౌరవించాడు. మరదే ముఖ్యాంశమైయున్నది.

324 ఏశావు యాకోబు కంటే రెండింతలు ఎక్కువ మర్యాదస్థుడు. మన సంఘములో సభ్యునిగా ఉండుటకు, ఈనాడు మనము గనుక అతడిని తీర్పు తీర్చవలసియుంటే, మీకు అతని గురించి తెలియకపోతే, మీరు వెయ్యికి వెయ్యిమంది, అతడినే ఎన్నుకుంటారు. కానీ దేవుడు యాకోబును తీసుకున్నాడు.

325 పరిశుద్ధ పౌలు ఒక సేవకుడిగా ఉండగోరితే, మీరు అతడిని ఏమి చేస్తారు? వంకర-ముక్కు గల, ఒక చిన్న యూదుడు, మరియు అతని నోరు ఒక ప్రక్కకు వంగియున్నది, కేవలం గొడవలాడుతూ అలా కొనసాగుతున్నాడు, మరియు అతడు సంఘమును ఎలా చీల్చివేయనైయున్నాడో కదా, అతడు సమస్తమును చేయబోవుచున్నాడు. అతడు క్షమించబడరాని పాపము చేసాడని మీరు అనుకుంటారు, కాని దేవుడు ఇట్లన్నాడు, “అతడు నా సేవకుడు.”

326 దేవుడు మనుష్యులను తీసుకొని మరియు వారిని భిన్నముగా చేస్తాడు, మనుషులు దేవుణ్ణి తీసుకొని భిన్నముగా మారడం కాదు. దేవుడే మనిషిని తీసుకొని మరియు అతడిని భిన్నముగా చేస్తాడు. అది నీవు ఏమి చేస్తున్నావు, నీవు ఏమి చేస్తావు, నీవు ఏమి అనుకుంటున్నావు అనేది కాదు. అది దేవుడు చేసేదియైయున్నది. విషయం అదేయైయున్నది. మరియు కథ అదేయైయున్నది.

327 ఇప్పుడు, ఈ గొప్ప మెల్కీసెదెకు, ఆయన గురించి ఇక్కడ ఎటువంటి ఒక కథ ఉన్నది కదా! మనము కొంచెము చదవగోరుచున్నాము, కేవలం కొద్దిగా…మనము దానిని త్వరగా చూడవలసియున్నాము. మనం తిరిగి ఇక్కడ లేఖనములోని ఒక నిర్దిష్టమైన భాగము వద్ద ప్రారంభించబోవుచున్నాము, మరియు మనం దాదాపు 15వ వచనం వద్ద ప్రారంభించబోవుచున్నాము.

అది…మరింత విశదమైనది: అదేమిటనగా…మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చును.

328 ఇప్పుడు, మెల్కీసెదెకు ఒక యాజకుడు. ఆయన అదేనా? ఆయన ఏమైయున్నాడో ఇక్కడున్నది. దేవుడు, ఆదియందు, ఒక్క గొప్ప ఆత్మ ఊటగా ఉన్నాడని మనము కనుగొన్నాము. అది నిజమేనా? ఆయనకు ఏ జన్మస్థలము లేదు. ఆయనకు ఏ మరణస్థలము లేదు. ఆయనయొక్క జీవిత దినములకు ఆది లేదు. ఆయనయొక్క జీవిత సంవత్సరములకు అంతము లేదు. నిత్యత్వము ఎంత నిత్యమైనదో ఆయన సరిగ్గా అంతే నిత్యుడైయున్నాడు. ఆయన ఎన్నడూ జన్మించలేదు. ఆయన ఎన్నడూ మరణించలేదు.

329 మరియు అక్కడ, ఆయన ఏడు విధములైన ఆత్మను కలిగియున్నాడని, మనము కనుగొంటాము. అది నిజమేనా? ప్రకటనలో, బైబిలు గ్రంథము ఇట్లు చెప్పినది, అదేమిటనగా, “దేవుని సింహాసనము యెదుటనున్న ఏడు ఆత్మలు.” అది నిజమేనా? ఆ ఏడు, విధములైన, ఏడు ఆత్మ. ఏడు రంగులున్నాయని, మనము కనుగొన్నాము. ఏడు సంఘకాలములు ఉన్నాయి. ఓ, అది అలా వెళ్తూనే ఉంటుంది. ఏడు సంపూర్ణమైయున్నది, మరియు దేవుడు సంపూర్ణమైయున్నాడు. మరియు ఏడు ఆత్మలు, మరియు ఆ ఆత్మలు పరిపూర్ణమైనవి. మొదటిది ఎర్రని రంగుయైయున్నది; పరిపూర్ణ ప్రేమ, విమోచనయైయున్నది. మరియు ఆ రంగులను ఇచ్చి మరియు ఆ రంగులలో ప్రతి ఒక్కటి దేవునియొక్క స్వచ్ఛతను సూచిస్తున్నవని చూపించుటకు, మనకు సమయముంటే బాగుండునని, ఎంతగానో కోరుతున్నాను. ఆమేన్. ఆ రంగులలో, ఏడు సహజమైన రంగులు ఉన్నాయి. ఆ రంగులు దేవునియొక్క స్వచ్ఛతను సూచిస్తున్నాయి. మరియు…ఆ రంగులు దేవునియొక్క ఉద్దేశ్యములను, దేవునియొక్క వైఖరిని సూచిస్తున్నాయి. ఆ ఏడు రంగులు, అవి ఏడు సంఘకాలములను, ఏడు నక్షత్రాలను, ఏడు దూతలను సూచించాయి. లేఖనమంతటిలో, ఏడుగురు సేవకులు, ఏడుగురు వర్తమానికులు, ఏడు వర్తమానములు, సమస్తము ఏడులలో ఉన్నది. ఏడు దినములు. ఆరు దినములు, మరియు ఏడవది సబ్బాతు; పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. ఓ, అది అద్భుతమైనది, దానిలోనికి త్రవ్వి మరియు దానిని బయటకు తీయడానికి మనకు సమయముంటే బాగుంటుంది, ఆ రంగులు!

330 ఎర్రని రంగును తీసుకోండి. మనము మొదటి రంగును తీసుకుందాము, అది ఎరుపు అయ్యున్నది. ఎరుపు అంటే ఏమిటి? ఎరుపు ప్రమాదమునకు ఒక గురుతైయున్నది. ఎరుపు విమోచనకు గురుతైయున్నది. మరియు మీరు ఎర్రనిదానిలో నుండి ఎర్రనిదానిని చూడండి, ఏ రంగు కనబడుతుంది? తెలుపు. అది సరియే. కాబట్టి ఎర్రని పాపమును కప్పడానికి, ఎర్రని రక్తము చిందించబడియుండగా, దేవుడు, ఆ ఎర్రని రక్తముగుండా చూస్తూ, ఎర్రని పాపమును చూస్తున్నప్పుడు, అది తెల్లగా మారుతుంది. విశ్వాసి పాపము చేయలేడు. ఖచ్చితంగా చేయలేడు. దేవునియొక్క విత్తనము, దేవునియొక్క ఆశీర్వాదములు, అతనిపై నిలిచి ఉంటాయి. దేవుడికి తన స్వంత కుమారునియొక్క రక్తము తప్ప మరేదియు కనబడదు. ఆయనయొక్క సంఘములో ఉన్నది అది ఏమైనా గాని, అది ఏమైనా గాని, దేవుడు దానిని చూడడు, ఎందుకనగా ప్రధాన యాజకుడైన, యేసు, ఎడతెగక విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి ఒక బల్యర్పణ, అతని కొరకు అక్కడ పడియుండగా, అతడు పాపము చేయడానికి మార్గమే లేదు. నిశ్చయంగా లేదు.

331 మరియు ఇప్పుడు, “మంచిది, అది నాకు మంచి అవకాశాన్ని ఇస్తుంది…” అని నీవు చెప్పినట్లైతే, అప్పుడు నీవు సరియైనవాడవు కావని అది చూపిస్తుంది.

332 నీవు దానిని అభినందిస్తావు. నీవు ఒక నిజమైన క్రైస్తవుడవైనయెడల, నీవు ఎంతగా దానిని ప్రేమిస్తావంటే, పాపము నిన్ను వెంటాడుతుంది కానీ నీవు దానిని చేయలేవు. “ఏలయనగా దేవునియొక్క బీజము అతనిలో నిలుచును, మరియు అతడు పాపము చేయలేడు.” బైబిలు ఇట్లు చెప్పినది, “యేసుయొక్క రక్తముచేత ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత, పాపము కొరకు కోరిక ఇకను ఉండదు.” నీవు ఒక కోరికను కలిగియున్నావంటే, నీ హృదయము దేవునితో సరిగ్గా లేదన్నట్లే.

333 ఇప్పుడు, నీవు తప్పు చేస్తావు, కానీ నీవు దానిని బుద్ధిపూర్వకముగా చేయవు. చూశారా? నీవు—నీవు చిక్కుబడ్డావు, మరియు నీవు దేనిలోనైనా చిక్కుబడినా, లేదా నీవు బుద్ధిపూర్వకముగా చేయని ఒక కార్యమును చేసినా, అది ఇంకను పాపము కాదు, నీవు తప్పైయున్నావని చూసిన ఆ నిమిషమే నీవు పశ్చాత్తాపపడతావు. నీవు వెంటనే తిరిగి మరియు ఇట్లంటావు, “నేను కావాలని చేయలేదు…దానిని చూడలేదు.” నీ జీవితమంతా, నీవు దానిని చెప్తావు. ఒక మనిషి అలా చేయగోరడు, ఆ కారణముచేతనే మనము, ఇక్కడ భూమి మీద, ఇంత బుద్ధిహీనులుగాను మరియు ఇంత చీకటిలోను ఉన్నాము, అందుకే మనల్ని కప్పి ఉంచుటకు, ఎల్లవేళలా, ఒక రక్తపు ప్రాయశ్చిత్తము ఉన్నది. ఎందుకనగా, మనము ఎదుర్కున్న మొదటి పొరపాటు…

334 ఇప్పుడు, అదియే మీ నియమవాదుల ఆలోచనైయున్నది. “ఓ, మీకు తెలుసా? ఆ స్త్రీ పరిశుద్ధపరచబడినది. అయితే, విషయం తెలుసా, ఆమె తప్పు చేసినది. ఆమె పడిపోయినదని నాకు తెలుసు.” అది తప్పు. ఆమె పడిపోలేదు. ఆమె ఒక పొరపాటు చేసింది. ఆమె బుద్ధిపూర్వకంగా దానిని చేసినట్లైతే, ఆరంభము నుండే, ఆమె సరికాదు.

335 ఆమె దానిని బుద్ధిపూర్వకముగా చేయనియెడల, మరి ఆమె దేవునియొక్క పరిశుద్ధ సంఘము యెదుటకు నడిచి వచ్చి మరియు దానిని ఒప్పుకొని, మరియు, “నేను తప్పు చేశాను, మరియు మీరు నన్ను క్షమించండి,” అని చెప్పినట్లైతే, దానిని చేయుటకు మీరు బద్ధులైయున్నారు. మీ హృదయములో మీరు దానిని చేయనియెడల, అప్పుడు స్వయంగా మీరే బలిపీఠము నొద్దకు వెళ్ళవలసియున్నారు. నిజము. సంఘములో నిజమైన పరిశుద్ధత అదేయైయున్నది. అసలైన పరిశుద్ధత ఉన్నది, మీ పరిశుద్ధత కాదు గాని, క్రీస్తుయొక్క పరిశుద్ధతయైయున్నది.

336 ఆయనకు సమర్పించడానికి నాకు ఏ పరిశుద్ధత లేదు. అయితే నేను ఆయన పరిశుద్ధతలో నమ్మికయుంచుతున్నాను, ఓ, ఆయనయొక్క కృప, మరియు నేను దానిని నా హృదయంలో కలిగియున్నాను. నేను దానికి యోగ్యతను పొందలేదు, దానికి అర్హత పొందడానికి నేను చేయగలిగేది ఏదియు లేదు, కానీ కృప ద్వారా ఆయన నన్ను పిలిచి మరియు రమ్మని నన్ను ఆహ్వానించాడు. మరియు నేను ఆయన వైపు చూశాను, మరియు ఆయన నా నుండి ఆ కోరికను తీసివేశాడు. ప్రతి నెలలో, ప్రతి సంవత్సరములో నేను కొన్ని వేల పొరపాట్లు చేస్తాను. నిశ్చయంగా, నేను చేస్తాను. కానీ నేను తప్పైయున్నానని నేను చూసినప్పుడు, నేను ఇట్లంటాను, “దేవా, నేను దానిని చేయాలని నా భావము కాదు, నీకు నా హృదయము తెలుసు. అలా చేయాలని నా భావము కాదు. నేను దానిలో చిక్కుబడ్డాను. దానిని చేయాలని నా భావము కాదు. ప్రభువా, నీవు నన్ను క్షమించుము.”

337 నేను నా సహోదరుడి పట్ల తప్పు చేస్తే, నేను ఇట్లు చెప్తాను, “సహోదరుడా, నన్ను క్షమించు. అలా చేయాలని నా భావము కాదు. నిశ్చయంగా, దేవునికి నా హృదయము తెలుసు.”

338 ఓ, విషయం అదేయైయున్నది. రక్తపు బల్యర్పణ అక్కడే ఉన్నది. అక్కడ సువార్తయొక్క శక్తి ఉన్నది, ముందుకు కదిలి వెళ్తున్న పరిశుద్ధ సంఘమైయున్నది. నీవు ఏదో చేసినందువలన కాదు; అది నీవు చేయవలసినది ఏమియు లేనటువంటి ఒక విషయమైయున్నది. అక్కడ ప్రాయశ్చిత్తమున్నది.

339 ఇప్పుడు, ఈ మెల్కీసెదెకు, ఆయన వచ్చినప్పుడు.

340 నేను మీకు మరొక విషయము చెప్పగోరుతున్నాను. మీరు ఎన్నడైనా ఒక—మూడు మూలలు గల గాజుముక్కను తీసుకున్నారా? మీరు మూడు మూలలు గల ఒక గాజుముక్కను తీసుకొని, మరియు సూర్యుడు దానిని తాకే విధంగా దానిని ఉంచినప్పుడు, అది ఏడు పరిపూర్ణమైన రంగులను ఉత్పత్తి చేస్తుంది. మూడు మూలలు గల గాజుముక్క వర్షధనస్సును ఉత్పత్తి చేస్తుంది. అది ఖచ్చితంగా నిజము. ఇప్పుడు, మనకు సమయమున్నట్లైతే, మనము దానిలోనికి వెళ్తాము. మూడు పరిపూర్ణతను తెస్తుంది: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ; నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. విషయం అదే. పరిపూర్ణత మూడులో వస్తుంది. దేవుడు, మానవుడి పైన; దేవుడు, యేసు అనబడిన మానవునిలో; దేవుడు, సంఘములో. అప్పుడు, పరిపూర్ణత.

341 దేవుడు పైన ఇక్కడ అగ్నిస్తంభములో ఉన్నంత కాలం, మానవుడు పాపము చేశాడు. దేవుడు…లేదా, మానవుడు, దేవుడు అగ్ని స్తంభములో ఉన్నంత కాలం, దేవుని యెదుట పాపము చేశాడు, ఎందుకనగా అతడు ఇంకనూ ఒక అపవిత్రమైన జీవియైయున్నాడు, జంతు రక్తము ఆయన యెదుట ఉంచబడింది.

342 పిదప దేవుని గొర్రెపిల్ల వచ్చినది, దేవునియొక్క రెండవ నిశ్చయమైన అడుగు; అదే దేవుడు, మరొక కార్యాలయము. మరియు అప్పుడు క్రీస్తులో ఉన్న…ఈ దేవుడు, అగ్నిస్తంభములో ఉన్న అదే దేవుడైయున్నాడు. మరియు అదే దేవుడు శరీరధారియై మన మధ్య నివసించాడు. మరియు పిదప మానవుడు ఆయనను ఎగతాళి చేశాడు, మరైనను అది జవాబు చెప్పుకోదగినట్లుగా ఉన్నది. అప్పటికింకా రక్తము చిందించబడలేదు. అది నిజము. యేసు ఇట్లన్నాడు, “నేను మిమ్మల్ని క్షమిస్తాను.”

343 అయితే పిదప శరీరధారియైన ఆయనే, మరలా అగ్ని స్తంభములోనికి మారాడు. “నేను దేవుని యొద్దనుండి వచ్చియున్నాను. నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను.” దమస్కు మార్గములో, పౌలు ఆయనను కలుసుకొనుటను మనము ఇక్కడ కనుగొంటాము, అదే అగ్నిస్తంభము. చెరసాలలో పేతురు ఆయనను కలుసుకొనుటను మనము కనుగొంటాము, అదే అగ్నిస్తంభము. నిశ్చయంగా. మరియు ఈనాడు మన మధ్య, మనము ఆయనను చూస్తున్నాము, అదే అగ్నిస్తంభము.

344 అయితే పరిపూర్ణత ఎటువంటి చోటుకు వచ్చిందంటే, ఆ మధ్య వ్యక్తి…ఇప్పుడు, ఒక యూదుడు గాని, లేదా పాతనిబంధన అర్థమయ్యే ఎవరైనా గాని ఇక్కడ ఉన్నయెడల దానిని నిరూపించనివ్వండి, నన్ను మీకు చూపించనివ్వండి. సరిగ్గా ఇప్పుడు, నా దగ్గర పాతనిబంధన లేదు. ఇది—ఇది క్రొత్తనిబంధనైయున్నది. అయితే కోషేరు పళ్ళెం మీదనున్న సముఖపు రొట్టె అర్పణలో, గుడారములు శుద్ధిచేసే సమయములో యూదుల బల్యర్పణలో; ఏ యూదుడినైనా అడగండి; ఆ మూడు రొట్టె ముక్కలలో, మధ్యనున్న ముక్క విరువబడుతుంది. అది క్రీస్తే. మధ్యనున్న ముక్క విరువబడుతుంది; మధ్యలో-ఉన్న, క్రీస్తు. విమోచన కొరకు, ఎక్కడో ఒక విరువబడటం, జరుగవలసియున్నదని చూపించినది. మరియు కోషేరు రొట్టెలోని ఆ ముక్క, విమోచనగా పరిగణించబడినది.

345 మరియు ఇక్కడ ఆయన ఉన్నాడు. మరియు ఈ రాత్రి, మనము ప్రభురాత్రి భోజనమును తీసుకునేటప్పుడు, మనము ఆ కోషేరు రొట్టెను విరుస్తాము, ఏలయనగా అది క్రీస్తుయొక్క శరీరమైయున్నది. మరియు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకై, ఆయన కల్వరి యొద్ద విరువబడ్డాడు, తద్వారా ఆయనయొక్క నీతి వలన మనము ఆయనయొక్క నీతిగా మారుటకైయున్నది. ఎందుకనగా, మనము ఆయనయొక్క నీతిగా మారునట్లు, ఆయన మనయొక్క పాపముగా మారాడు. సహోదరుడా, అది స్వచ్చంగా కృపయైయున్నది. ఖచ్చితంగా. ఏ మార్గము లేదు, మీరు నీతిమంతులుగా తీర్చుకొనుటకు వేరే ఏ మార్గము లేదు.

346 ఇప్పుడు, ఈ మెల్కీసెదెకు, దారిలో కలుసుకోబడిన ఈ గొప్ప వ్యక్తికి, అతడు చెల్లించాడు, అబ్రాహాము ఆయనకు దశమ భాగములు చెల్లించాడు. ఆయన ఎంత గొప్ప వ్యక్తియైయుండాలి కదా! ఇపుడు గమనించండి, త్వరగా.

ఆయన, శరీరరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల గల…ధర్మశాస్త్రమును బట్టి కాక,…

347 ఇప్పుడు ఆ నియమవాద ధర్మశాస్త్రమును చూస్తున్నారా? ధర్మశాస్త్రము ఇట్లు చెప్పింది, “నీవు చంపరాదు. నీవు వ్యభిచారము చేయరాదు. నీవు దొంగిలివద్దు.”

348 యేసు తిన్నగా వెనుకకు తిరిగి, ఇట్లన్నాడు, “ఆ పాతకాలములో వారికి, ‘నీవు చంపరాదు’ అని చెప్పబడినది, అయితే ఒక కారణము లేకుండా, తన సహోదరుని మీద కోపగించినవాడు, ఇదివరకే అతణ్ణి చంపివేసాడని నేను చెప్పుచున్నాను. పాతకాలములో, వారికి, ఇట్లు చెప్పబడినది, ‘నీవు వ్యభిచరించవద్దు,’ అయితే నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” విషయం అదేయైయున్నది. అదియే స్త్రీలకు ఎలా వస్త్రధారణ చేసుకోవాలో, సరియైన దానిని ఎలా చేయాలో నేర్పించవలసియున్నది. మీరు తప్పుగా వస్త్రధారణ చేసుకొని, పురుషులు మిమ్మల్ని తప్పుడు విధంగా చూసేటట్లు చేసినయెడల, మీరు వ్యభిచారము చేసినందుకు దోషి అయ్యున్నారు, మీరు ఆ చర్యగుండా వెళ్ళినంత ఖచ్చితంగానే అయ్యున్నది. యేసు ఆలాగు చెప్పాడు.

349 మరియు ఈ రంపపు-కోపములను కలిగియున్న మీరు, ఎల్లప్పుడూ ఎవరో ఒకరి మీద గొణుగుతూ ఉండే మీరు, సహించలేకుండా, మరియు అటువంటివి చేసే మీరు. జాగ్రత్తా. మీరు మీ సహోదరునికి వ్యతిరేకముగా సరికాని దానిని, న్యాయము కానిదానిని ఒక్క మాటను పలికినా మీరు దోషియౌతారు, వెళ్ళి దానిని చీల్చివేస్తారు. ఒక మనిషిని చంపడానికి మీరు అతని వీపులో కత్తిని గుచ్చవలసిన అవసరంలేదు. మీరు అతని గుణలక్షణమును బ్రద్దలు చేసి, అతని పలుకుబడిని చంపి, అతడిని చంపవచ్చు. ఇక్కడ మీ సంఘకాపరికి వ్యతిరేకంగా మాట్లాడితే, అతని గురించి ఏదైనా చెడుగా మాట్లాడితే, మీరు దానికంటే అతడిని తుపాకితో కాల్చి చంపడం మంచిది. అతని గురించి సరికాని దానిని చెప్పినయెడల, మంచిది, అది ప్రజలతో మరియు అటువంటివాటిలో అతడి పలుకుబడిని చంపివేస్తుంది, మరియు మీరు దానికి దోషియౌతారు. యేసు చెప్పినది అదే.

350 ఇప్పుడు, ఇక్కడ వినండి, పౌలు ఇక్కడ ఏమి—ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో వినండి. నేను ఈ పాత బైబిలును ప్రేమిస్తున్నాను. అది మిమ్మల్ని సరి చేస్తుంది. చూడండి, ఓ, కేవలం ఇక్కడ చూడండి. ఇప్పుడు, మనము చదువుతుండగా నాలుగు-…“అది…మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే-…” ఆగండి, ఇక్కడ నేను చదవబోతున్న మరొక వచనము ఉన్నదని నేను నమ్ముతున్నాను. లేదు, ఇక్కడ 16వ వచనము దగ్గరైయున్నది.

ఆయన, శరీరరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల…ధర్మశాస్త్రమును బట్టి కాక,…

351 అది చట్టబద్ధమైనది, మీరు చూడండి. “ఓ, సహోదరుడా, నేను—నేను చేయకూడదు. నేను చేయకూడదు. నాకు తెలుసు, కాని నేను…” విషయం అది కాదు. ప్రేమయే దానిని చేస్తుంది.

352 మనము దానిని ఎలా చూసాము కదా! నేను ఇలా చెప్పాను, “ఒకవేళ నేను నా…నా భార్య విషయములో, ‘ఓ, మంచిది, నేను—నేను—నేను ఇద్దరు భార్యలను కలిగియుండగోరుతున్నాను. నేను ఈమెతో తిరిగి, అక్కడ ఆమెతో ఉండగోరుతున్నాను. కానీ, నేను అలా చేసినట్లైతే, నా భార్య నాకు విడాకులు ఇస్తుంది, మరియు నా పిల్లలు…నా పరిచర్య పాడైపోతుంది’ అని చెప్పినయెడల ఎలాగుంటుంది.” కుళ్ళిపోయిన, మురికి వేషధారీ. అది నిజము. మొదటిగా, నీవు ఆమెను సరిగ్గా ప్రేమించడంలేదు. అది ఖచ్చితంగా వాస్తవము.

353 నీవు ఆమెను ప్రేమించినట్లైతే, దాని విషయమై ఎటువంటి చట్టము ఉండదు. ఎలాగైనా, నీవు ఆమెను ప్రేమిస్తావు, మరియు నీవు ఆమెతో నిలిచియుంటావు. అది ఖచ్చితంగా వాస్తవము. మరియు స్త్రీలైన మీరు కూడా మీ భర్త విషయంలో అదే కార్యమును చేస్తారు. అది నిజము.

354 కొన్నిసార్లు స్త్రీలు ఎలా మారతారంటే, లేదా…

355 ఒక చిన్న యెజెబెలు మొత్తం రంగులు పూసుకొనియుండటాన్ని పురుషుడు చూస్తాడు, మీకు తెలుసా, మరియు—మరియు మీరు వెళ్ళి, ఆమె కొరకు పడిపోతారు; బహుశా ఒక మంచి భార్యను కలిగియుండి కూడా అలా చేస్తారు. మరియు పిదప మిమ్మల్ని మీరు ఒక క్రైస్తవుడని పిలుచుకుంటారు. మీకు సిగ్గుచేటు. మీకు మరొక మోతాదు బలిపీఠము అవసరమైయున్నది. అది నిజము.

356 మరియు మీలో కొందరు—మరియు మీలో కొందరు స్త్రీలు తన వెంట్రుకలు ముందుకు జారవేసుకున్న ఎవరో ఒక పురుషుణ్ణి చూస్తారు, దాని మీద…అతని నోరు తెరవడానికి చాలినంత వ్యాజిలిన్ ఉంటుంది. మరియు పిదప మీరు…

357 ఇక్కడ కొంతకాలం క్రితం, ఒక చిన్న అమ్మాయి…ఇది ఒక తమాషా కాదు, ఎందుకనగా దీనిని ఒక హాస్యముగా చెప్పాలని నా భావము కాదు. అయితే ఇది తమాషా చేసే స్థలము కాదని ప్రజలకు తెలుసు. అయితే ఇక్కడ ఒక చిన్న అమ్మాయి, ఆమె…ఇక్కడ చక్కని అబ్బాయిలు, క్రైస్తవ అబ్బాయిలు ఉన్నారు. చాలా కాలం క్రితం, నేను ఇక్కడ కాపరిగా చేస్తున్నప్పుడు, మేము ప్రత్యేకించి యవ్వనస్థుల కూడికలను కలిగియుండేవారము. మరియు ఆదివారము మధ్యాహ్నము నేను యౌవన స్త్రీలతో లైంగిక విషయములు మరియు మొదలగువాటి గురించి మాట్లాడేవాడిని. పిదప ఆ తరువాతి ఆదివారము మధ్యాహ్నము, యవ్వన పురుషులతో మాట్లాడేవాణ్ణి, మరియు ఆ విషయాలు అరికట్టబడునట్లు చేయడానికి ప్రయత్నించేవాణ్ణి.

358 ఇక్కడ పట్టణపు ముఖ్య భాగములో, ఒక చిన్న అమ్మాయి ఏదో ఒక రొయ్యతో తిరగడం మొదలుపెట్టింది, అతడు సిగరెట్లు త్రాగేవాడు మరియు జేబులో ఒక సీసాను కలిగియుండేవాడు. మరియు అతడు టౌనులో ఒక చిన్న రోడ్‌స్టర్ కారును నడిపేవాడు. ఆ అబ్బాయిలో ఆమె ఏమి చూసిందో నేను చూడలేకపోయాను. అతడు సంఘమునకు వచ్చేవాడు కాదు. అతడు బయట అక్కడ కూర్చునేవాడు. ఆమెను ఇక్కడ సంఘములో దిగబెట్టి, పిదప అతడు బయట, తన కారులో కూర్చొని, మరియు వేచియుండేవాడు, సంఘములోనికి వచ్చేవాడు కాదు. ఒక రోజు నేను ఆమెతో చెప్పాను. ఆమె న్యూ ఆల్బనీలో నివసించినది. నేను ఇట్లన్నాను, “అమ్మాయి, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆ అబ్బాయిలో నీకు అసలు ఏమి కనబడుతుంది?” నేను ఇట్లన్నాను, “మొదటిగా, నీవు—నీవు కలిగియున్న మతమునే అతడు ద్వేషిస్తున్నాడు. అతడు నీ క్రీస్తును ద్వేషిస్తున్నాడు. అతడు నీకు ఎన్నడూ ఒక భర్తగా ఉండలేడు. నీ జీవితమంతా, అతడు నీకు దుస్థితిని కలుగజేస్తాడు.” మరియు నేను ఇట్లన్నాను, “మంచిది, ఇక్కడ నీవు కలవగలిగే చక్కని క్రైస్తవ అబ్బాయిలు ఉన్నారు. మరియు అక్కడ నీ తల్లిదండ్రులు నీవు బయటకు వెళ్ళుటను గూర్చిన ఆలోచనలనే ద్వేషిస్తున్నారు, కానీ ఎలాగైనా నీవు వెళ్తున్నావు, మరియు, ‘నాకు మధురమైన పదహారు సంవత్సరాలు కలవు’ అని నీవు అనుకుంటున్నావు.”

359 ఆమె రంగులు పూసుకోడం మరియు బయట తిరగడం ప్రారంభించింది, మరియు మొదటి విషయమేమిటంటే, ఆమె క్లబ్బులలోనికి వెళ్ళినది. ఇప్పుడు ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. కానీ, అప్పుడు, ఆమె ఇక్కడ నిలబడినది. మరియు ఆమె ఆ అబ్బాయిని ప్రేమించడానికి, ఆ వెనుక ఆ అమ్మాయి నాకు చెప్పిన సాకు ఏమిటో మీకు తెలుసా? ఆమె ఇట్లన్నది, “అతనికి చాలా ముద్దుగా ఉండే చిన్న పాదములున్నవి, మరియు అతని దగ్గర చాలా మంచి వాసన వస్తుంది.” మీరు దానిని ఊహించగలరా? తనను తాను పరిమళపరచుకొనుచున్నాడు, అతడు ఒక ఆడంగివాడైయున్నాడు, ఒక పురుషుడు కాదు.

360 “చూడు,” నేను ఇట్లన్నాను, “సహోదరీ, దానికంటే కంకర మోసే ట్రక్కుల వంటి కాళ్ళను కలిగియుండి మరియు కంపుకొట్టే వరడునక్క వంటి దుర్వాసన గల ఒక క్రైస్తవ అబ్బాయితో నేను వెళ్తాను, అతడు ఖచ్చితంగా ఒక క్రైస్తవుడైతే వెళ్తాను.” అది నిజము. సత్యము. అవును.

361 అది సాకుయైయున్నది, “ఎంతో ముద్దుగానున్న చిన్న పాదములు, మరియు చాలా మంచి వాసన.” బారులకు వెళ్ళే అతడు, చివరికి ఆ అమ్మాయి జీవితమును నాశనము చేశాడు. అది సిగ్గుకరము, అవమానకరము.

362 వివాహము ఘనమైనది, అయితే అందులోనికి ప్రార్థనాపూర్వకముగా మరియు భక్తిపూర్వకముగా ప్రవేశించవలసియున్నది. మరియు ఆ స్త్రీ కొరకైన నిజమైన ప్రేమ మిమ్మల్ని ఎప్పటికీ ఒక్కటిగా బంధిస్తుంది. “నీవు భూమి మీద దేనిని బంధిస్తావో, దానిని నేను పరలోకమందు బంధిస్తాను.” మీరు ఆ వీధిగుండా నడిచి వెళ్తున్నప్పుడు, ఆమె వృద్ధురాలిగా మరియు తెల్లని తలవెంట్రుకలు కలిగి మరియు ముడతలు పడియుండవచ్చును, కానీ ఆమె ఒక యవ్వనస్థురాలైన, అందమైన స్త్రీగా ఉన్నప్పుడు నీవు ఆమె కొరకు కలిగియున్న అదే ప్రేమను, ఇంకను నీవు దానిని కలిగియుంటావు.

363 నీవు నీ భుజములు-వంగిపోయి, బట్టతల వచ్చి, ముడతలు పడిన-ముఖమును కలిగియుండి మరియు ఆ విధంగా ఉండవచ్చును, కానీ నీవు వెడల్పైన భుజములతో, ఉంగరాల జుట్టుతో నిలబడినప్పుడు ఆమె నిన్ను ప్రేమించినట్లే ఇప్పుడును నిన్ను ప్రేమిస్తుంది, అది నిజంగా దేవుడైతే అలాగుంటుంది. ఏలయనగా మీరు ఆ నదిని దాటిన సమయము కొరకు, ఎప్పుడైతే మీరు తిరిగి యవ్వన స్త్రీ పురుషులుగా మారుతారో, అటువంటి సమయము కొరకు ఎదురుచూస్తున్నారు. అది దేవునియొక్క నిత్యమైన వాగ్దానమైయున్నది. ఆయన దానిని చేస్తానని ఆయన చెప్పాడు. ఆయన, అది మాత్రమే కాదు, ఒక నిమిషములో మనము దాని వద్దకు వస్తాము, ఆయన దానిని చేస్తానని ఆయన ప్రమాణము చేశాడు.

364 మనము కొనసాగుతుండగా, దీనిని వినండి.

ఆయన,…శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక,…అయితే నాశనములేని జీవముకున్న…శక్తిని బట్టి నియమించబడ్డాడు.

365 ఇప్పుడు మనము దానిని చేరునట్లు, మనము త్వరగా చదవబోతున్నాము.

ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవైయున్నావు అని, ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను.

ఒక యాజకుడు అవసరమైనంతకాలం, ఆయన ఒక యాజకునిగా ఉంటాడు.

ముందియ్యబడిన ఆజ్ఞలు నిశ్చయముగా బలహీనమైనందునను నిష్ ప్రయోజనమైనందునను…అది నివారణ చేయబడియున్నది.

ఏలయనగా ఆ ధర్మశాస్త్రము దేనిని పరిపూర్ణము చేయలేదు,…

366 నీవు ఏమి చేసినప్పటికినీ, నీవు చేయలేవు. నీవు మద్యపానం మానేసినా, పొగత్రాగడం మానేసినా, అబద్ధాలు చెప్పడం మానేసినా, సంఘమునకు వెళ్ళి మరియు దీనిని చేయడానికి ప్రయత్నించినా మరియు దానిని చేయడానికి ప్రయత్నించినా, నీవు ఇంకను శరీరసంబంధివైయున్నావు. అది కేవలం ధర్మశాస్త్రమైయున్నది. ధర్మశాస్త్రము దేనినీ పరిపూర్ణము చేయదు. అయితే ఏది పరిపూర్ణముగా చేస్తుంది? క్రీస్తే. మహిమ! నేను అబద్ధమాడటం మానేయవచ్చు, దొంగతనం మానేయవచ్చు, వ్యభిచరించడం మానేయవచ్చు, పొగాకు వంటివి నమలడం మానేయవచ్చు, అన్నిటిని మానేయవచ్చు, మరైనా గాని నేను ఇంకను శరీరసంబంధినే. దేవుడు దానిని స్వీకరించడు, ఎందుకనగా ప్రాయశ్చిత్తముగా ఆయనకు అర్పించడానికి నా దగ్గర ఏదియు లేదు.

367 అయితే ప్రభువైన యేసు యొక్క ధన్యకరమైన శిరస్సుపై నేను నా చేతులను ఉంచి, మరియు, “ప్రభువా, నేను ఎంతమాత్రము పనికిరానివాడను. నీవు నన్ను నీ సేవకునిగా తీసుకుంటావా?” అని చెప్పగా మరి దేవుడు ప్రేమతో నా పాపమును పూర్తిగా తొలగించిన ఆ నిమిషమే, నేను దేవుని దృష్టిలో పరిపూర్ణుడిగా నిలబడతాను. అది నిజము. ఎందుకు? నేను నా స్వంత యోగ్యత మీద నిలబడటంలేదు. నేను ఆయన యోగ్యత మీద నిలబడుతున్నాను. మరియు ఆయన తన శ్రమ ద్వారా మరియు తన రక్తము ద్వారా, మనల్ని పరిపూర్ణము చేశాడు.

368 ముగించడానికి సమయమైనదని నేను చూస్తున్నాను. కానీ నాకు సాధ్యమైతే, త్వరగా దీనిని చదవడం ముగించాలని నేను కోరుతున్నాను.

…ముందియ్యబడినది బలహీనమును నిష్ ప్రయోజనమును అయ్యున్నది.

ఏలయనగా ధర్మశాస్త్రము దేనిని పరిపూర్ణము చేయలేదు, కానీ అంతకంటే శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడటం వలన పరిపూర్ణత కలిగినది; (శ్రేష్ఠమైన నిరీక్షణ ఏమిటి? క్రీస్తే.) దాని ద్వారా మనము దేవునియొద్దకు చేరుచున్నాము.

369 ఎందుకు? మన మంచితనమంతటితో, మన మంచితనమంతటితో, మరియు మన మంచితనమంతటితో, మనము ఇంకనూ శరీరసంబంధులమే. కానీ ఒక్కసారి దేవునియొక్క సన్నిధిలో, యేసుక్రీస్తు యొక్క యోగ్యతల ద్వారా తప్ప, మనమెన్నడూ అక్కడ నిలబడలేమని గుర్తిస్తుండగా, అప్పుడు మనము ఆయన కుమారునియొక్క యోగ్యతల ద్వారా, దేవుని యొద్దకు చేరతాము. “ప్రభువా, ఒక నిర్దోషమైన హృదయముతో, నేను నీ దగ్గరికి వస్తున్నాను. నీ కుమారుడైన యేసు నామములో, దయచేసి నన్ను స్వీకరించుము.” ఓ, సహోదరుడా, అప్పుడు నీవు ఒక సజీవమైన మార్గముగుండా వస్తున్నావు.

370 “ప్రభువా, నేను మద్యపానము మానివేసానని నీకు తెలుసు. నేను నా భార్యతో సరిగ్గా వ్యవహరిస్తానని నీకు తెలుసు. నేను దీనిని చేస్తానని, నేను దానిని చేస్తానని నీకు తెలుసు,” అని కాదు. అర్పించడానికి నీ దగ్గర ఏదియు లేదు.

371 “ఏలయనగా శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రము దేనిని సాధించలేకపోయినది, అయితే వేరొక నిరీక్షణ ప్రవేశపెట్టబడటమనేది సాధించినది. క్రీస్తేయైయున్న ఆ నిరీక్షణను, మనము మన అంతరాత్మయొక్క లంగరుగా కలిగియున్నాము, అది స్థిరమును మరియు నిశ్చలమునైయున్నది.” గమనించండి.

మరియు ఆయన ప్రమాణము లేకుండా కాదు…

మీరు ఇక్కడ గమనించినట్లైతే, సర్వనామము, వంపు అక్షరములతో ఉన్నది.

…ఆయన యాజకునిగా నియమించబడ్డాడు:

ఊరకే ఒక యాజకునిగా కాదు, కానీ ఆయన ప్రమాణ పూర్వకముగా యాజకునిగా చేయబడ్డాడు. అంతే కాదు…

372 ఇపుడు గమనించండి. మనము ఆ మిగిలిన యాజకత్వమును చూద్దాము.

(ఆ యాజకులు, ఆ లేవీయులు, నీతిమంతులు, నిజాయితీపరులు, యదార్థవంతులైన పురుషులు, ఆ యాజకులు ప్రమాణము లేకుండా యాజకులుగా చేయబడ్డారు;…)

373 “క్రమము చొప్పున—అహరోను క్రమము చొప్పున, ఆయన వీరిని యాజకులుగా చేసాడని,” దేవుడు చెప్పాడు. వారు వంశపారపర్యముగా కొనసాగుతారు. వారు పాఠశాలకు వెళ్ళి మరియు బోధకులుగా మరియు మొదలగువాటిగా ఉండటం నేర్చుకుంటారు. వారు అలా కొనసాగుతారు. కాబట్టి దేవుడు వారిని ఆ విధంగా యాజకులుగా చేశాడు. వారు తమ విద్య ద్వారా, తమ వారసత్వము ద్వారా, మరియు మొదలగువాటి ద్వారా, తమను తాము యాజకులుగా చేసుకున్నారు. “కానీ ఈ మనుష్యుడు దేవుడు చేసిన ప్రమాణము ద్వారా యాజకుడయ్యాడు.” ఇప్పుడు జాగ్రత్తగా వినండి.

(…ప్రమాణము లేకుండా చేయబడ్డారు; కానీ ఈయనైతే నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవైయున్నావని ప్రభువు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపపడడు, ఆమేన్, అని ఆయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను:)

అందువలన యేసు మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను.

ఇప్పుడు, త్వరగా.

మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున అనేకులైరి:

వేలకు వేలసార్లు వేలకొలది, యాజకులు వచ్చారు, ఎందుకనగా వారు మరణమును మరియు మరణమును మరియు బలహీనతలను, మరియు మరణమును మరియు మరణమును మరియు మరణమును తప్ప వారు మరిదేనిని కలిగిలేరు.

374 అయితే ఆయనను గమనించండి.

కానీ ఈ మనుష్యుడు, (ఏ మనుష్యుడు?) యేసు, ఈయన ఎల్లప్పుడు నిరంతరము ఉన్నవాడు గనుక, మార్పులేని యాజకత్వమును కలిగినవాడాయెను. ఎక్కడైతే…

అందుచేత ఈయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు; ఎంత దూరములో ఉన్నా గాని, ఎంత దిగజారిపోయినా గాని, ఎంత దూరంగా ఉన్నా గాని, ఈయన తన ద్వారా దేవునియొద్దకు వచ్చువారిని; సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు,…

ఆ…నీ నీతి మీద కాదు; కానీ నీ ఒప్పుకోలు మీదయైయున్నది. చూశారా?

…తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనలు చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుకనైయున్నది.

ఆయన సరిగ్గా అక్కడే, నిరంతరము, విజ్ఞాపనలు చేస్తున్నాడు.

పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలములో ప్రధానయాజకునిగా చేయబడినవాడునైన, ఇట్టి యాజకుడు మనకు సరిపోయినవాడు;

375 విషయం అదేయైయున్నది. ఇప్పుడు, నా స్వంత కేసును నేను వాదించుకోడానికి ప్రయత్నిస్తే, నేను ఓడిపోతాను. “సరి, మా నాన్న ఒక మంచి వ్యక్తియైయున్నాడు. మా నాన్న ఒక బోధకుడు. మంచిది, నేను సంఘములో జీవించాను,” అని చెప్తూ, నేను వాదించుకోడానికి ప్రయత్నిస్తే, నేను ఇంకనూ ఓడిపోయినట్టే. కానీ ఈ మనుష్యుడైతే పరిపూర్ణుడైయున్నాడు, అది క్రీస్తే. ఆయన అక్కడ ఉండి నా పాపముల కొరకు నిరంతరము తన రక్తమును అర్పిస్తాడు. విషయం అదేయైయున్నది.

ఈయన ఆ…యాజకులవలె, మొదటిగా తన స్వంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు, దినదినము బలులు అర్పించవలసినవాడు కాడు: ఏలయనగా తన్ను తాను అర్పించుకున్నప్పుడు, ఒక్కసారే ఆ పని చేసి ముగించెను.

376 ఇపుడు చివరి వచనము గమనించండి.

ఏలయనగా ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుష్యులను ప్రధానయాజకులుగా నియమించును;…

377 ధర్మశాస్త్రము, శరీర సంబంధమైన ధర్మశాస్త్రము, దానినే చేస్తుంది. ఇప్పుడు, సరిగ్గా ఇక్కడే నేను రెండు గంటలు తీసుకోగలిగితే బాగుండునని నేను కోరుతున్నాను. ధర్మశాస్త్రము ఇంకనూ ఆ విధంగానే మనుష్యులను బోధకులుగా చేస్తుంది. అది నిజము.

378 ఏంటీ, వారు ఇట్లంటారు, “మంచిది, ఈ వ్యక్తికి సెమినరీ అనుభవమున్నది.” ప్రపంచములోని సెమినరీలన్నిటి కొరకైనా నేను నా చిన్న పరలోకపు అనుభవమును అమ్ముకోను.

379 “ఏంటీ, మేము ఈ వ్యక్తిని విద్యావంతునిగా చేసాము. అతడు—అతడు జాగ్రత్తగా ఎన్నుకోబడినవాడు. అతడు స్వయంకృషితో తయారైన మనిషియైయున్నాడు.” అటువంటివారు నాకు ఇష్టముండదు. నాకు దేవుని-చేత తయారుచేయబడిన మనిషి ఇష్టము. చూశారా చూశారా?

380 అయితే ధర్మశాస్త్రము ఇంకనూ యాజకులను తయారుచేస్తుంది. ధర్మశాస్త్రము ఇంకనూ బోధకులను తయారుచేస్తుంది. ఆ—ఆ బాప్టిస్టు సంఘము, వారు బోధకులను పంపిణీ చేస్తారు; వారిని అనేకులను పంపిణీ చేస్తారు, వారిని తయారుచేసే ఒక యంత్రమును కలిగియున్నారు. మెథడిస్టులు వాటిని కలిగియున్నారు. బాప్టిస్టులు వాటిని కలిగియున్నారు. ప్రెస్బిటేరియన్లు, నాజరీనువారు, పిలిగ్రిమ్ హోలీనెస్ వారు, పెంతెకొస్తువారు, ఒక పెద్ద వ్యవస్థవలె, ఒక పెద్ద యంత్రమువలె, వారికి సాధ్యమైనంత తొందరగా వారిని తయారుచేస్తారు. అక్కడ నిలబడి ఒక…

381 “ఒక కరెంటు కోడిపిల్ల కొరకు నేను—నేను నిశ్చయంగా జాలిపడ్డాను,” అని నేను ఎల్లప్పుడూ చెప్పాను. మీకు తెలుసా, ఒక పొదుగుడు యంత్రము క్రింద పొదగబడిన ఒక చిన్న కోడిపిల్ల, అది సరిగ్గా పొదగబడలేదు. లేదు. కోడిపిల్లను కోడి పొదగవలసియున్నది. కానీ ఒక కరెంటు కోడిపిల్ల, అది బయటకు వచ్చినప్పుడు, అది “చర్ప్, చర్ప్, చర్ప్,” అని అంటుంది, మరియు అది వెళ్ళడానికి దానికి తల్లి లేదు. చూశారా? ఒక తల్లి అంటే ఏమిటో దానికి తెలియదు. అది నిజము. అది ఒక తల్లి కొరకు చర్ప్ చర్ప్ అంటుంది, కానీ అది ఒక తల్లిని కలిగిలేదు.

382 అయితే సహజమైన విధానములో, కోడి క్రింద పొదగబడిన చిన్న కోడిపిల్ల, అది చర్ప్ చర్ప్ అంటుంది మరియు తల్లి జవాబిస్తుంది. అది నిజము.

383 మరియు లూయిస్‌విల్‌లో మరియు ప్రపంచమంతటానున్న ఈ పెద్ద పొదుగు యంత్రముల క్రిందనుండి వచ్చిన ఈ సెమినరీ అనుభవము గురించి కొన్నిసార్లు నేను ఆలోచిస్తుంటాను, అవి పొదుగుతూ వేలకొలది బోధకులను ఉత్పత్తి చేస్తున్నాయి. పెంతెకొస్తు పొదుగుడు యంత్రములు, మరియు ప్రెస్బిటేరియన్ పొదుగుడు యంత్రములు, మరియు—మరియు బాప్టిస్టు పొదుగుడు యంత్రములు, అవన్నియు వాటి—వాటి—వాటి చిన్న కోడిపిల్లలను పొదిగి ఉత్పత్తి చేస్తున్నాయి. వారు, “చర్ప్, చర్ప్, చర్ప్” అంటూ మరియు వారు దేనినుండైతే ఉత్పత్తి చేయబడ్డారో ఆ పొదుగుడు యంత్రము గురించి మాట్లాడతారు.

384 కానీ నేను ఒక తండ్రిని, ఒక తల్లిని కలిగియుండుటకు ఇష్టపడతాను. ప్రభువు నామము స్తుతించబడును గాక! నాతో జన్మించినవారు ఎంతోమంది కాదు, కానీ ఉన్నవారు నా సహోదరులైయున్నారు. ఆమేన్. జవాబునిచ్చే ఒక తల్లిని మనము కలిగియున్నాము…అది మనందరికి తల్లి పరిచర్య చేయునట్టి, పరలోకమందున్న తల్లియైయున్నది. “కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో, మరియు వాటినేలాగు పిలుచునో, మరియు—మరియు దాని…దాని పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో, అలాగే నేనును మిమ్మును చేర్చుకొందును. ఓ యెరూషలేమా, యెరూషలేమా, ఒక కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో, అలాగే నేనును ఎన్నో మార్లు మిమ్మును చేర్చుకొన వలెననుకొంటిని! మిమ్మును నా సొంతము చేసుకొనుటకు నేను ఎన్నోసార్లు కోరియున్నాను, కానీ మీరొల్లకపోతిరి. మీరు మీ స్వంత సెమినరీలను కలిగియున్నారు, మీ యాజకులను ఉత్పత్తి చేసుకున్నారు. వారు నాకు వ్యతిరేకముగా మీకు బోధించారు. ఇప్పుడు మీరు విడువబడ్డారు. మీ నాశనము మీ ముందున్నది.”

385 ఇప్పుడు నేను దీనిని చెప్పుచున్నాను: ఓ, ప్రజలారా, ఓ, ప్రజలారా, ఒక కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నోమారులు పరిశుద్ధాత్మ మిమ్మును చేర్చుకొనవలెనని కోరియున్నాడు, కాని మీరు మీ స్వంత మార్గమును కోరుకున్నారు, దాని విషయమై మీరు మీ స్వంత మార్గమును తీసుకుంటారు!

386 ఈ రాత్రులలో ఏదో ఒక రాత్రి నేను, “నీ స్వంత మార్గము,” అనుదానిపై బోధించగోరుతున్నాను. మీకు తెలుసా, కయీను తన స్వంత మార్గాన్ని కోరుకున్నాడు. ఈనాడు, మానవుడు తన స్వంత మార్గమును కోరుకుంటాడు. “అయితే సరియైనదిగా కనబడు మార్గము కలదు, కాని దాని అంతము మరణమైయున్నది.”

387 ఇపుడు గమనించండి, “‘ఒక క్రొత్త—ఒక క్రొత్త నిబంధన…’ అని ఆయన చెప్పుచున్నాడు,” నేను నమ్ముచున్నాను, ఇప్పుడు అది…లేదు, నేను తప్పు చోటును తీసాను.

388 28వ వచనము:

ఏలయనగా ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుష్యులను ప్రధానయాజకులుగా నియమించును గాని; ధర్మశాస్త్రము తరువాత వచ్చిన, ప్రమాణపూర్వకమైన వాక్యము, నిరంతరముండు కుమారుని, నియమించెను.

389 దేవుడు ఎప్పటికీ స్తుతింపబడును గాక! మెల్కీసెదెకు క్రమము చొప్పున, “…నిరతరముండు కుమారుడు”. మరియు ఆయనకు ఒక ఆరంభమనేది ఎన్నడూ లేదు, ఆయనకు ఒక అంతము ఎన్నడూ ఉండదు. మరియు ధర్మశాస్త్రము అటువంటి దేనినీ ఉత్పత్తి చేయలేకపోయినది, ఎందుకనగా అది శరీర సంబంధమైనది; సంఘము, సంఘశాఖలు అటువంటి దేనినీ ఉత్పత్తి చేయలేవు, ఎందుకనగా అవి శరీర సంబంధమైనవి; ఆ—ఆ సెమినరీలు అటువంటి దేనినీ ఎన్నడూ ఉత్పత్తి చేయలేవు. వారు ప్రపంచానికి దానిని నేర్పుటకు ప్రయత్నించారు, వారు దానిని సంస్థగా చేయుటకు ప్రయత్నించారు, వారికి సాధ్యమైన ప్రతిదానిని తయారుచేయుటకు వారు ప్రతి విధానములో ప్రయత్నించారు, మరియు ముఖ్యమైన దానిని విడిచిపెట్టారు: “నీవు దానిలో జన్మించవలసియున్నావు.” నీవు ఏమైయున్నావో దేవుడు నిన్ను ఆ విధంగా తయారు చేస్తాడు, నిశ్చయంగా, అయితే అది నీవు దీనిని చేయడం మానేసినందుకు కాదు.

390 ఇప్పుడు, నాజరీనులు, మీరు ఒక ఉంగరమును పెట్టుకోకూడదు, మీరు చేతి గడియారాన్ని పెట్టుకోలేరు, మరియు మీరు ఫలానా-ఫలానా విషయాలను కలిగియుండవలసియున్నారు, మీ చేతులు అనగా, మీ వస్త్రముల చేతి భాగము ఇంత పొడవుగా ఉండాలి, మీ మిడ్డీలు అంత పొడుగుగా ఉండాలి, మరియు పురుషులు ఒక రహస్య సంస్థకు చెందియుండకూడదు. మరియు మీరు ఆ విధంగా లేకపోతే వారు మీకు బాప్తిస్మము ఇవ్వరు. మంచిది. ఇదిగో కాథలిక్కులు వస్తారు, మరియు వారు వారి పద్దతులను కలిగియున్నారు. మరియు ఇదిగో మెథడిస్టులు వస్తారు, వారు వారి పద్దతులను కలిగియున్నారు. ఇంత అని కొలవడానికి వారిలో ప్రతియొక్కరు ఒక కొలతకర్రను కలిగియున్నారు. నీవు దానికి సరిపోకపోతే, సరి, ఇక అంతే. చూశారా?

391 మరియు పిదప, కానీ అసలు విషయం, ఇదైయున్నది, “నా చేతులలో నేను దేనినీ తీసుకొనిరావడంలేదు! నేను కేవలం నీ సిలువను పట్టుకొని వ్రేలాడుతున్నాను. ఓ దేవా, దిగంబరినైయున్నాను, గాయపడియున్నాను, సహాయము కావాలి. ఓ, క్రీస్తూ, నేను ఏమియు కానని మరియు నాలో ఏమియు లేదని ఒప్పుకుంటూ, నేను చాలా దీనముగా వస్తున్నాను. ఓ దేవా, నన్ను స్వీకరించుము.” అప్పుడు దేవుడు నిన్ను స్వీకరిస్తాడు.

392 ఇప్పుడు, మీకు మీ ABCలు కూడా తెలియకపోవచ్చును. మీకు కాఫీకి మరియు కందిపప్పుకి ఉన్న తేడా కూడా తెలియకపోవచ్చును. మీకు, జీ కి మరియు హా కి మధ్య తేడా తెలియకపోవచ్చును. [జీ అనగా కుడివైపుకు తిరుగు అని, హా అనగా ఎడమవైపుకు తిరుగు అని జంతువులకు ఇచ్చే సూచనలైయున్నవి.—తెలుగు అనువాదకుడు]. కుడి మరియు ఎడమ చేతికి తేడా తెలియకపోవచ్చును. మీకు ఏమి తెలియదు అనేది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. నీవు తప్పక ఎరుగవలసియున్న విషయము ఒకటున్నది, అదేమిటనగా, ఒక పాపిగా నీ స్థానమును యేసుక్రీస్తు తీసుకున్నాడు అనే విషయమైయున్నది. మరియు ఆయన నీతిలో నిలబడటానికి, నీవు నీ స్థానమును తీసుకొని, ప్రతి రోజు నీవు తప్పు అని ఒప్పుకుంటూ, మరియు నీ పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమిస్తూ, మరియు నీ పూర్తి ఉద్దేశ్యములను ఆయన వైపు ఉంచినట్లైతే, నీవు పరలోకమును చేరతావు. దానిలోని విషయమంతా అదేయైయున్నది, ఏలయనగా క్రీస్తులో ఉన్న జీవము నీలో ఉండవలసియున్నది, లేదంటే నీవు నశించిపోయినట్లే.

393 ముగించడానికి ముందు, దేవుడు అబ్రాహాముతో చేసిన షరతులు లేని నిబంధన మీకు గుర్తున్నదా? “నన్ను చూడనిమ్ము…” అని దేవుడు అన్నప్పుడు, “నీవు దానిని ఎలా చేయబోతున్నావో నన్ను చూడనిమ్ము,” అని అబ్రాహాము అన్నప్పుడు, ఆ సాయంకాలమున ఆయన ఏమి చేసాడు. అది ఆదికాండములో, 16వ అధ్యాయమని, నేను అనుకుంటున్నాను. “నీవు దానిని ఎలా చేయబోతున్నావో నన్ను చూడనిమ్ము.”

394 ఇట్లన్నాడు, “అబ్రాహామా, ఇక్కడికి రమ్ము.” మరియు ఆయన అబ్రాహామును తీసుకొనివెళ్ళాడు, ఇట్లన్నాడు, “వెళ్ళి నాకు ఒక—ఒక పొట్టేలును తీసుకొనిరమ్ము, మరియు వెళ్ళి నాకు ఒక—ఒక—ఒక మేకను తీసుకొనిరమ్ము, మరియు వెళ్ళి ఒక పెయ్యను నా యొద్దకు తీసుకొనిరమ్ము. మరియు నీవు వాటిని ఇక్కడికి తీసుకొనివచ్చి మరియు ఒక బల్యర్పణను చేయవలెనని నేను కోరుతున్నాను.”

395 మరియు అబ్రాహాము వెళ్ళి గొర్రెను, మరియు—మరియు మేకను, మరియు ఆ—ఆ—ఆ గొర్రెపిల్లను, లేదా, పెయ్యను తీసుకొనివచ్చాడు. మరియు అతడు వాటిని చంపాడు. అవన్నియు శుద్ధమైన బలులైయున్నవి. మరియు వాటిని రెండుగా మధ్యకు నరికి, మరియు వాటిని బయట పరిచాడు. పిదప అతడు వెళ్ళి రెండు గువ్వలను తెచ్చి, మరియు వాటిని అక్కడ పెట్టాడు. పిదప అబ్రాహాము దేవుడు రావడం కొరకు ఎదురుచూస్తూ, పక్షులు వాటి మీద వాలకుండా చూసుకున్నాడు. “ఇప్పుడు, ప్రభువా, అదిగో బల్యర్పణ అక్కడున్నది, నీవు దీనిని ఎలా చేయబోతున్నావు? ఒక మనిషిని తన స్వంత ఇష్టానికి వ్యతిరేకంగా నీవు ఎలా రక్షించబోతున్నావో నాకు తెలియదు. నీవు దీనిని ఎలా చేయబోతున్నావో నాకు తెలియదు. ప్రభువా, నీవు దానిని ఎలా చేయగలవు?”

396 ప్రభువు ఇట్లు చెప్పాడు, “ఇప్పుడు అబ్రాహామా, గమనించు. నీవు ఒక ప్రవక్తవు. నీవు ఆత్మసంబంధమైనవాడవు, మరియు నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీవు గ్రహిస్తావు.”

397 “సరే, ప్రభువా, నేను చూడగోరుతున్నాను.” ఇప్పుడు నేను నాటకీయముగా చెప్తున్నాను.

398 “కావున, అబ్రాహామా, నీవు ఇప్పుడు ఇక్కడికి వచ్చి, ఇక్కడ కూర్చొని మరియు ఆ పక్షులను తోలివేయుము.” కాబట్టి అతడు ఆ పక్షులన్నిటిని తోలివేసాడు, ఇక సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనది.

399 మరియు మొదటి విషయమేమిటో మీకు తెలుసా, దేవుడు దిగివచ్చాడు. ఆయన దిగి వచ్చినప్పుడు, అబ్రాహాముకు నిద్రమత్తు కలగడం ప్రారంభమైనది. దేవుడు ఇట్లన్నాడు, “అబ్రాహామా, నేను నిన్ను నిద్రపోవునట్లు చేయబోతున్నాను.”

400 నియమవాదియైన స్నేహితుడా, ఇప్పుడు విను. చూడండి, దేవుడు అబ్రాహామును పూర్తిగా చిత్రము నుండి తీసివేసాడు, దానిలో అతడు చేయవలసినది ఏదియు లేదు. మరియు ఆ విధంగానే ఆయన నిన్ను పొందుకున్నాడు. నీవు ఇట్లన్నావు, “ఓ, నేను దేవుడిని వెదికాను.” నీవు వెదకలేదు.

401 దేవుడే నిన్ను వెదికాడు, “మొదటగా నా తండ్రి వానిని ఆకర్షించనియెడల ఏ మనుష్యుడును నా యొద్దకు రాలేడు.” చూశారా?

402 అది దేవుడే నిన్ను వెదకడమైయున్నది, నీవు దేవుడిని వెదకడం కాదు. నీవు ఎన్నడూ దానిని చేయలేదు. నీ స్వభావము తప్పైయున్నది. నీవు ఒక పందివి. నీకు శ్రేష్టమైనది తెలియదు. నీవు కేవలం ఒక పందుల దొడ్డిలో జీవిస్తున్నావు. నీకు తెలిసినదంతా అది మాత్రమే. నీవు దానిని ప్రేమిస్తున్నావు. బీరు త్రాగి, అటు ఇటు తిరుగుతూ, పొరుగువాని భార్యతో తిరుగుతూ, మరియు నీవు చేయగలిగిన ప్రతి దుష్టమైనదానిని చేస్తూ ఉన్నావు, అది నీకు బాగుగా అనిపిస్తుంది. “ఓ, సహోదరుడా, మేము గొప్ప సమయాన్ని కలిగియుంటున్నాము!” అది మంచిదని నీవు అనుకుంటావు.

403 కానీ దేవుడే నీ హృదయమును తట్టుతాడు. [సహోదరుడు బ్రెన్హామ్ గారు వేదికను తట్టాడు—సంపా.] మార్చివేసేది అదియే. నీవు దేవుని వద్ద తట్టడం కాదు; దేవుడే నిన్ను తట్టుతాడు. ఆదాము ఎన్నడూ దేవుని హృదయమును తట్టలేదు; దేవుడే ఆదాముయొక్క హృదయమును తట్టాడు. మరియు నీవు ఆదాము కుమారుడవైయున్నావు. అది నిజము. ఆదాము మరలా, దేవుని కుమారుడై యుండగలుగుటకుముందు, దేవుడు అతని హృదయముపై తట్టవలసివచ్చినది. నీవు ఒక దేవుని కుమారుడిగా మారగలుగుటకుముందు, దేవుడే నీ హృదయమును తట్టవలసియున్నది.

404 పిదప, అబ్రాహాము నిద్రలోకి వెళ్ళాడు. మరియు అతడు నిద్రలోకి వెళ్ళినపుడు, అతడు చూసిన మొదటి విషయం ఏమిటి? ఎంతో ఘోరమైన, భయంకరమైన, కటికచీకటియై యున్నది. అది మానవాళియంతటి మీదకు వచ్చునట్టి, మరణమైయున్నది. పిదప అతడు దానినుండి కొంచెం దూరంగా చూశాడు, మరియు అతనికి పొగ రాజుచున్న ఒక పొయ్యి కనబడినది. పొగ రావడానికిముందు, మంట ఉండవలసియున్నది. ఆ కారణమును బట్టియే నరకము ఒక మండుచున్న స్థలమని నేను నమ్ముతాను. మంచిది.

405 మనలో ప్రతి ఒక్కరము మరణమునకు బద్ధులైయున్నామని, మరియు మనము పాపులము గనుక, మనలో ప్రతి ఒక్కరము నరకమునకు వెళ్ళవలసియున్నామని, ఆయన చూపించాడు.

406 ఇప్పుడు, కానీ, దానికి ఆవలిన, అతడు ఒక చిన్న, తెల్లని వెలుగును చూశాడు.

407 మరియు ఈ చిన్న, తెల్లని వెలుగు, ఆ వెలుగు ఏమిటి? ఆ తెల్లని వెలుగు ఏమిటి? ఇశ్రాయేలు పిల్లలకు ముందుగా వెళ్ళిన ఆ అగ్నిస్తంభమైయున్నది. దమస్కు మార్గములో పౌలును కలిసిన ఆ అగ్నిస్తంభమైయున్నది. పేతురును చెరసాలలో నుండి బయటకు తీసిన ఆ అగ్నిస్తంభమైయున్నది. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి అగ్నిస్తంభమైయున్నది.

408 ఆ నిత్యుడైన, నిరంతరముండు దేవుడు, స్వయంగా ఆయనే ఈ విభజించబడిన బలుల మధ్య నడిచాడు, (ఓ, మై), ఒక్కొక్కదాని మధ్య ముందుకు వెనుకకు నడిచాడు. “అబ్రాహామా, నేను దానిని ఈ విధంగా చేయబోవుచున్నాను. నన్ను గమనించు, నేను ఏమి చేయబోవుచున్నానో గమనించు. నేను ఇక్కడ ఒక నిబంధనను చేయుచున్నాను. మరియు ఆ సంతానము ప్రకారము, నేను ఒక విజ్ఞాపనకర్తను లేపుతానని, నేను ప్రమాణము చేస్తాను. నేను మరణముతో ఒక నిబంధనను చేస్తాను. మరియు నేను శరీరములో, మరణమును ఓడిస్తాను, ఎందుకనగా స్వయంగా నేనే వచ్చి దానిని తీసుకుంటాను. అబ్రాహామా,” ఇట్లన్నాడు, “అబ్రాహామా, నీ సంతానము నుండి, వస్తాను, నీ సంతానము ద్వారా, నీవు జనములకు తండ్రివి అవుతావు. మరియు నీతో, నీతో మాత్రమే కాదు గాని, నీ తరువాత వచ్చు నీ సంతానమునకు కూడా నేను ఈ వాగ్దానము చేయుచున్నాను.” ప్రతీ ఒక్కరూ అలా ఉంటారని ఆయనకు తెలుసు. “వారు కాదు; కానీ నేను ఏమి చేస్తానో అదే ముఖ్యము. అబ్రాహామా, నేను దానిని చేయబోవుచున్నాను. నేను ఆదామును నమ్మియున్నాను, మరియు అతడు తనదానిని బ్రద్దలుచేసాడు. మరియు ప్రతి ఒక్కరు తమదానిని బ్రద్దలుచేస్తారు. అయితే నేను దీనిని నాతోనే చేస్తాను, మరియు ‘నేను దానిని నిలబెట్టుకుంటాను,’ అని స్వయంగా నా పైనే ప్రమాణము చేస్తాను.” ఆమేన్. ఆమేన్. ఆమేన్.

409 మనము నిబంధన చేసినప్పుడు, మనము ఏమి చేస్తాము? నేను ఇట్లంటాను, “సహోదరుడా నెవిల్…” ఇపుడు ఒక్క నిమిషం, దీనిని గమనించండి. నేనంటాను, “సహోదరుడా నెవిల్, నేను ఏమి చేస్తానో నీకు చెప్తాను. నీవు…రేపు రాత్రి వరకు, మరియు ఆ మరుసటి రాత్రి వరకు, అలాగే బుధవారం వరకు ప్రసంగిస్తే, నేను, బుధవారము నుండి, ఆదివారము వరకు ప్రసంగిస్తాను.” [టేపులో ఖాళీ ఉన్నది—సంపా.] “నీవు ఆ ఒప్పందము చేస్తావా?”

410 “చేస్తాను, అయ్యా.”

411 ఇదిగో మేము దానిని ఈ విధానములో చేస్తాము. “అబ్బాయ్, కరచాలనమివ్వు.” అంతే. అమెరికాలో అది ఒక నిబంధనైయున్నది. ఆ విధంగానే మనము ఒక నిబంధన చేస్తాము.

412 ఇప్పుడు, జపాన్ లో వారు ఒక నిబంధనను ఎలా చేస్తారు? మేము, “నీవు ఫలానా-ఫలానా దానిని చేయుము, మరియు నేను ఫలానా-ఫలానా దానిని చేస్తాను,” అని చెప్తాము. మేము చిటికెడు ఉప్పును తీసుకుంటాము, ఎందుకనగా ఉప్పు స్థిరత్వమునకు సాదృశ్యమైయున్నది. మరియు మేము ఉప్పును తీసుకొని, మరియు నేను దానిని సహోదరుడు నెవిల్ మీద వేస్తాను, మరియు సహోదరుడు నెవిల్ ఉప్పును—ఉప్పును తీసుకొని మరియు దానిని నా మీద వేస్తాడు. అది ఒక బద్ధులుగా చేసే నిబంధనైయున్నది.

413 ఒక ఆఫ్రికా నీగ్రోయొక్క దేశములోనికి వెళ్ళడానికి, అతనితో డేవిడ్ లివింగ్‌స్టన్ ఏ విధంగా నిబంధన చేశాడు? సువార్తను ప్రకటించి మరియు ఆ పనిని చేయడానికి, అక్కడికి వెళ్ళగలుగుటకు, అతడు వెళ్ళి మరియు ప్రధాన నాయకుణ్ణి కలిసాడు. మరియు వారు ఒక గ్లాసు ద్రాక్షారసమును తీసుకున్నారు. ఇదిగో ఆఫ్రికాలోని నీగ్రోతో నిబంధన ఈ విధంగా జరిగినది. వారు ఒక గ్లాసు ద్రాక్షారసమును తీసుకున్నారు. మరియు ఆ నీగ్రో నాయకుడు తన స్వంత నరములను చీల్చి, మరియు ఈ ద్రాక్షారసపు గ్లాసులో ఆ రక్తాన్ని కార్చాడు. మరియు డేవిడ్ లివింగ్‌స్టన్ తన స్వంత నరములను చీల్చి, మరియు ద్రాక్షారసపు గ్లాసులో ఆ రక్తాన్ని కార్చాడు. వారు దానిని బాగుగా కలిపారు. లివింగ్‌స్టన్ దానిలో సగం త్రాగాడు, మరియు నీగ్రో నాయకుడు దానిలో సగం త్రాగాడు. పిదప వారు, ఒకరికొకరు ఒక కానుకను ఇచ్చుకున్నారు. నీగ్రో నాయకుడితో, డేవిడ్ లివింగ్‌స్టన్ ఇట్లన్నాడు, “నా నుండి మీరు ఏమి కోరుతున్నారు?”

414 అతడు ఇట్లు చెప్పాడు, “నీవు వేసుకున్న ఆ తెల్లని కోటు కావాలి.” కాబట్టి లివింగ్‌స్టన్ తన కోటును తీసి ఆ నీగ్రో నాయకుడికి ఇచ్చాడు. అతడు ఇట్లన్నాడు, “నీవు ఏమి కోరుతున్నావు?”

415 అతడు ఇట్లు చెప్పాడు, “నీ చేతిలో ఉన్న ఆ పవిత్రమైన ఈటె కావాలి.” ఎందుకనగా, దానితో అతడు లోపలికి వెళ్ళగలడని అతనికి తెలుసు, కాబట్టి అతడు ఆ ఈటెను తీసుకున్నాడు. మరియు వారు ఒక నిబంధన చేసుకున్నారు గనుక, వారు సహోదరులైయున్నారు.

416 మరియు అతడు ముందుకు వెళ్తున్నాకొద్ది, మరి ఆ తెగలు అతడిని చంపడానికి పరుగెత్తుకొని వచ్చినప్పుడు, అతడు ఆ పవిత్రమైన ఈటెను పైకి లేపాడు. మరియు అతడు అలా చేసినప్పుడు, వారు చూసి, “ఓ, ఓ, మనము ఆ వ్యక్తిని తాకలేము” అని అన్నారు. ఎందుకు? “అతడు తెల్లవాడైనప్పుటికినీ, మనము అతడిని ముందెన్నడూ చూడనప్పటికినీ, అతడొక నిబంధన సహోదరుడైయున్నాడు.” వారు అతణ్ణి చూసేవరకు, వారు నల్లగా ఉన్నారని వారికి అసలు తెలియదు. అటువంటివారిని వారు ముందెన్నడూ చూడలేదు. “అయితే అతడు ఒక నిబంధన సహోదరుడు. అతడు తన చేతిలో నాయకునియొక్క ఈటెను కలిగియున్నాడు.”

417 ఈనాడు, ప్రభువైన యేసుయొక్క నిబంధన రక్తమును త్రాగుచు, పరిశుద్ధాత్మయొక్క శక్తిని మనపై కలిగియుండటం ఎటువంటి ఒక అద్భుతమైన దృశ్యముగా ఉన్నది కదా! యేసు నామములో మనం ముందుకు వెళ్తాము, మరియు చెందియున్నవారిని ఈ సూచకక్రియలు వెంబడిస్తాయి. అది నాయకుడియొక్క పవిత్రమైన ఈటెయైయున్నది. ఆ నిబంధన, ఎలా జరిగినదో చూశారా?

418 పూర్వ కాలములో వారు దానిని ఎలా చేశారు? వారు ఒకరితో ఒకరు, ఒక ప్రమాణము చేసేవారు. వారు ఒక మృగమును చంపి, దానిని చీల్చి, మరియు సరిగ్గా దాని మధ్యలో నిలబడేవారు. ఆ—ఆ ఇద్దరు వ్యక్తులు, నరకబడిన ఆ మృగము మధ్యలో నిలబడేవారు. మరియు వారు ఒక నిబంధనను వ్రాసేవారు. “నేను దీనిని నిలబెట్టుకోవడంలో విఫలమైతే, నేను దీనిని, ఏమిటీ, దీనిని మరియు ఫలానా-ఫలానా దానిని చేయడంలో విఫలమైతే, నా శరీరము ఈ చచ్చిన మృగమువలె అగును గాక. నా శరీరము ఈ చచ్చిన మృగమువలె అగును గాక.” మరియు వారు అలా చేసినప్పుడు, వారు ఈ నిబంధన పత్రమును తీసుకొని మరియు దీని మధ్యన నిలబడతారు; ఒక ప్రమాణము చేసి, వారు దానిని చేస్తారని ఒట్టుపెట్టుకునేవారు. మరియు వారు కలిసి, ఆ కాగితమును, రెండుగా చింపి, మరియు ఒకరికొకరు, దానిని ఇచ్చుకునేవారు. ఒక నిర్ణీత సమయములో వారు కలుస్తారు. మరియు వారు ఆ ప్రమాణమును నిలబెట్టుకోవడంలో విఫలమైతే, వారు ఆ విధనమైన మరణమే పొంది; మరియు ఆ చనిపోయిన మృగములవలె ఉండునట్లు అప్పజెప్తారు. సరి.

419 మీరు మూడు జంతువులను గమనించారా? పరిపూర్ణత; గొర్రెపిల్ల, మేక, మరియు మూడుగా పరిపూర్ణమైన బల్యర్పణ. గొఱ్ఱెపిల్ల అనగా ఏమిటి…గువ్వ అనగా ఏమిటి? మరియు ఆ రెండు గువ్వలకు అర్థం ఏమిటి? ఆ—ఆ దానిలోనికి వెళ్ళిన…ఆ రెండు గువ్వలు రక్షణ మరియు స్వస్థత రెండిటి కొరకు బల్యర్పణగా ఇవ్వబడ్డాయి. చూశారా? ప్రాయశ్చిత్తము వేరుగా జరిగినది, కాని స్వస్థత అదే రీతిగా కొనసాగినది, అలాగే రక్షణ కూడా అదే రీతిగా కొనసాగినది. ఖండింపబడని, రెండు గువ్వలు, అనగా అవి రెండిటికీ, ప్రాతినిథ్యం వహించాయని అర్థం. రక్షణ…“ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలిగియున్నది. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బలచేత మనము స్వస్థత పొందియున్నాము.” అవి ప్రక్కకు పెట్టబడియున్నవి, ఖండింపబడలేదు. అయితే నిబంధనలో, మృగముయొక్క భాగము (ఆ మూడును) వేరుగా ఖండింపబడినవి. మీరు చూస్తున్నారా? పిదప వారు దానిని చేసినప్పుడు, వారు దానిని చీల్చి మరియు తమ నిబంధనను చేసేవారు.

420 దేవుడు అబ్రాహాముతో ఏమి చెప్తున్నాడో గమనించండి: “కల్వరిలో, కల్వరిలో, నీ సంతానము ప్రకారము. నీ నుండి ఇస్సాకు వస్తాడు, ఇస్సాకు నుండి ఫలానా-మరియు-ఫలానావాడు, యాకోబు వస్తాడు, యాకోబు నుండి యోసేపు వస్తాడు, యోసేపు నుండి, ఆ తరువాతివారు, ఆ తరువాతివారు, ఆ తరువాతివారు, ఆ వారసులు వస్తారు, చివరకు, దానిగుండా ఆ నీతిమంతుడైన సంతానము!” అతని…

421 ఇందాక, ఇక్కడే, మన ప్రభువు ఎరుగబడని ఒక దేశము నుండి పుట్టియున్నాడని అతడు చెప్పాడు. మోషే ఎన్నడూ దాని గురించి మాట్లాడలేదు, యాజకత్వమునకు వెలుపటిదాని నుండి వచ్చాడు. “మన ప్రభువు యూదా గోత్రము నుండి పుట్టాడు.” లేవీ గోత్రము నుండి కాదు, ఏలయనగా వారు శరీరసంబంధమైన నియమవాదులైయున్నారు. అయితే మన ప్రభువు యూదా నుండి వచ్చాడు. మహిమ! విషయం అదే. వాగ్దానము అక్కడే చేయబడినది!

422 మనము ముగిస్తుండగా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరియు కల్వరి వద్ద, దేవుడు దిగివచ్చి మరియు తాను నివసించినట్టి, తన స్వంత కుమారుని శరీరమును తీసుకొని, మరియు ఆయన కల్వరిలో దానిని చీల్చివేసాడు. ఆయన కొట్టబడిన భాగము, రక్తము కారుచు, గాయపడియున్నది, మరియు ఈటె దానిగుండా దూసుకొనిపోయి మరియు ఆయనను చీల్చివేసినది, మరియు ఆయనయొక్క రక్తము చిమ్మి ప్రవహించినది. మరియు ఆయన ఇట్లన్నాడు, “తండ్రీ, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను.” ఆయన తన తలను వాల్చాడు. మరియు భూమి కంపించినది, మరియు మెరుపులు మెరిసినవి, మరియు ఉరుములు ఉరిమినవి. దేవుడు తనయొక్క నిత్యనిబంధనను వ్రాయుచున్నాడు.

423 మరియు ఆయన వారముయొక్క మొదటి దినమున, ఆయనయొక్క మృత దేహమును సమాధిలో నుండి తీసి, మరియు దానిని పరలోకములోనికి తెచ్చాడు, మరియు ఒక ప్రధానయాజకునిగా, ఒక జ్ఞాపకార్థముగా; దానిని అక్కడ కూర్చోబెట్టాడు; ఎప్పటికీ, పరిపూర్ణముగా, అక్కడ కూర్చొనియున్నాడు. మరియు ఆయన ఆ శరీరము నుండి చీల్చివేసిన ఆత్మను, తిరిగి నేరుగా సంఘము మీదకు పంపాడు. మరియు ఆ సంఘము ఆ శరీరములోనున్న అదే ఆత్మను కలిగియుండవలసియున్నది, లేనియెడల పునరుత్థానములో అది దానితో సరిగ్గా ఇమడదు. ఆ రెండు భాగములు తప్పక పరిపూర్ణముగా ఇమడవలసియున్నవి. మరియు ఈ సంఘము పరిపూర్ణముగా, సరిగ్గా క్రీస్తులో ఉన్న అదే ఆత్మను కలిగిలేనియెడల, మీరు ఎన్నడూ ఎత్తబడుటలోనికి వెళ్ళరు.

424 సహోదరుడా, అదియే నిత్యనిబంధనయై యున్నది. నీ హృదయములో ఉన్నదానితో, నీకు నీవుగా, దానిని వెదకుము. ప్రభువును ప్రేమించు. నీవు రక్షించబడ్డావన్న నిశ్చయతను నిజంగా కలిగియుండు. దాని విషయమై నిర్లక్ష్యంగా ఉండకు. నీవు జూదమాడుతున్నట్లే ఉంటుంది. ఓ, మీరు, అమెరికా ప్రజలమైన మనము, జూదమాడుటకు ఇష్టపడతాము, కానీ మీరు దాని మీద జూదమాడవద్దు. మీరు సరియేనన్న నిశ్చయతను కలిగియుండండి. మీరు సంఘములో చేరినందుకు కాదు, కానీ మీరు నిజముగా తిరిగి జన్మించినందువలనై యున్నది, పరిశుద్ధాత్మయొక్క వ్యక్తిలో, క్రీస్తు మీ యొద్దకు వచ్చాడు.

425 ఇప్పుడు, నేను ముగించుచుండగా, కేవలం అభినందనగా కూడా, చెప్తున్నాను. యేసుక్రీస్తులో ఉన్న అదే ఆత్మ, సరిగ్గా మన మధ్యన ఉండుటను చూడటానికి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన అవే కార్యములను చేయుటను చూడటానికి మనమెంత సంతోషముగా ఉండవలసియున్నాము కదా! మనమెంత సంతోషముగా ఉండాలి కదా!

మనము తలలు వంచియుండగా, ఇప్పుడు మనము ప్రార్థించుకుందాము.

426 ప్రభువా, ఇది ఒక గొప్ప దినముగా ఉన్నది. నాకు ఎల్లప్పుడు అనిపించినట్లే, తోచుచున్నది, నేను విఫలమవుతుంటాను. ప్రభువా, నేను దానికి సరిగ్గా ప్రాతినిధ్యం వహించలేను. నా బుద్ధిహీనపు మార్గములకై నీవు నన్ను క్షమించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓ, నేను నీ యెదుట నా పాపములను ఒప్పుకొని, మరియు కనికరము కొరకు అడుగుచున్నాను, ఆవలిన పరలోకములో, దేవుని కుడి పార్శ్వమున ఒక గొప్ప ప్రధానయాజకుడు నిలబడియున్నాడని ఎరిగియుండి దానిని చేస్తున్నాను, ఆయన అహరోను క్రమము చొప్పున, ధర్మశాస్త్రము మరియు చట్టములు మరియు అటువంటి కార్యముల చొప్పున చేయబడలేదు. కానీ జగత్తుపునాది వేయబడకముందే, మీదటికి చూసి, మరియు దిగువున ఇక్కడ లోకములో నన్ను చూసి, మరియు నన్ను తిరిగి దేవుని రాజ్యములోనికి తీసుకురావడానికి, నా పాపముల కొరకు మరణించినట్టి దేవునియొక్క కృపను బట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టబడినాడు. తండ్రీ, దీని నిమిత్తమై, నేను నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను.

427 ఎందుకనగా, దేవుడు నిత్యుడైయున్నట్లే ఇప్పుడు నీ ప్రజలలో రాజ్యము చేయుచున్న ఈ ఆత్మ నిత్యమైనది. “నేను వారికి నిత్యజీవమును, నిత్యమైన జీవమును, శాశ్వతమైన జీవమును ఇచ్చుచున్నాను, మరియు వారు ఎన్నటికీ నశించరు.” మరియు తీర్పునొద్ద, వారు ఎన్నడూ అక్కడ ఉండరు. వారు తీర్పును దాటిపోయారు. వారు మహిమలోనికి వెళ్ళారు. “మరియు భూమి మీదనున్న ఈ గుడారము శిథిలమైపోయినను, మనయొద్దకు వచ్చుటకై ఆవలిన మన కొరకు ఒకటి వేచియున్నది.” ప్రభువా, దానిని బట్టి నీకు కృతజ్ఞతలు.

428 ఈ రాత్రి, నిజమైన నిబంధన రక్తమును ఎన్నడూ త్రాగనివారు, అసలు దాని అర్థమేమిటో తెలియనివారు, తిరిగి జన్మించడం అంటే ఏమిటో తెలియనివారు, వారి హృదయములో, లేదా ఆమె హృదయములో క్రీస్తుతో ఒక నిజమైన సహవాసమును కలిగియుండటమంటే ఏమిటో తెలియనివారు, ఎవరైనా ఒకరు ఇక్కడ ఉన్నయెడల, నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను, మేము వేచియుండి మరియు ఈ అవకాశమును ఇస్తుండగా, ఇప్పుడే వారు ఆయనను స్వీకరించుదురు గాక. మరియు ఆ దినమున, మేము సువార్తను సరియైన వెలుగులో ప్రదర్శించినవారిగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. క్రీస్తు నామములో, మేము ప్రార్థిస్తున్నాము.

429 మనము మన తలలు వంచియుండగా, క్రీస్తుకు మీ చేతులను ఎత్తి, మరియు ఇట్లు చెప్పువారు ఎవరైనా ఉన్నారా, “దేవునియొక్క క్రీస్తూ, నా యెడల కనికరము చూపుము. నీయొక్క, యోగ్యతలేని సేవకునిగా, ఇప్పుడు నా హృదయములోనికి పరిశుద్ధాత్మను స్వీకరించనిమ్ము. మరియు నాకు నిజంగా అవసరమైయున్న నిశ్చయతను మరియు ప్రేమను నాకు ఇవ్వుము”? మీరు దానిని కలిగిలేనియెడల, “ప్రభువా, నేను దానిని కోరుతున్నాను అనుటకు ఇది ఒక గురుతైయున్నది,” అని చెప్తూ, మీ చేతులను ఆయన తట్టు ఎత్తుతారా? నీ చెయ్యి పైకెత్తుతావా? ఆ వెనుకనున్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, ఇక్కడున్న నిన్ను దేవుడు దీవించును గాక. అయ్యా, ఇక్కడున్న నిన్ను దీవించును గాక. దేవుడు నీకు తోడైయుండును గాక. అది మంచిది. ఈ చివరన ఉన్న ఈ వ్యక్తి, నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. మరియు ఇంకెవరైనా, ఇప్పుడు మనము ముగించకముందు, కొన్ని క్షణాలు వేచియుంటున్నాము. కుమారుడా, ఆ వెనుకనున్న నిన్ను దేవుడు దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా?

430 “నేను ఇప్పుడు కోరుచున్నాను. ప్రభువైన దేవా, నేను కోరుచున్నాను. నా హృదయము నీకు తెలుసు. నా మనస్సులో ఏముందో నీకు తెలుసు. నీవు, ‘దేవునియొక్క ఆత్మ రెండంచులుగల-ఖడ్గము కంటెను వాడిగలదై మరియు వేగముగలదై, కీళ్ళను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను వివేచించుచున్నది.’” దాని గురించి ఆలోచించండి. మీ తలంపులు, మీ ఉద్దేశాలు సైతం ఆయనకు తెలుసు.

431 మీరు మీ చెయ్యి పైకెత్తుతారా? ఇట్లు చెప్పండి, “దేవా, ఇప్పుడే, నన్ను కనికరించుము. నేను తప్పైయున్నానని నేను తెలుసుకున్నానని నీవు ఎరుగవలసినదిగా నేను—నేను కోరుతున్నాను, మరియు నేను దానిని గ్రహించాను, అయితే నేను సరిగా ఉండగోరుతున్నాను.” మంచిది, మనము మన తలలు వంచి, ఇప్పుడు ప్రార్థించుచుండగా, ఒక్క క్షణము ఆలోచించండి. దాని విషయమై మనము తొందరపడగోరడంలేదు.

నాకై చీల్చబడ్డ, యుగముల బండా,

నన్ను నీలో దాగనిమ్ము;

నీ ప్రక్కనుండి స్రవించుచున్న,

నీరు మరియు రక్తము…

పాపమునకు రెండింతలు…(రెండింతల ప్రాయశ్చిత్తము, ఆయన దానిని ప్రమాణము చేసాడు, నిశ్చలమైన రెండు సంగతులు.)

ఉగ్రత నుండి రక్షించి మరియు నన్ను శుద్ధి చేయును గాక.

నేను తీసుకొనుచుండగా…

432 ఓ ప్రభువా, మేము పీల్చుకునే ఈ శ్వాసలు క్షణికమైనవని సరిగ్గా ఇప్పుడే మేమందరము గుర్తించునట్లు అనుగ్రహించుము. మా యెదుట ఇంకా ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు. అదంతా నీ గొప్ప ఆలోచన ద్వారా ఉంటుంది. అది నీ ద్వారా నిర్ణయించబడుతుంది. ఓ, మా యెడల కనికరము చూపుము. మరియు తమ చేతులను పైకెత్తినవారు, ప్రభువా, వారి గురించి చెప్పనవసరంలేదు. వారిలో ప్రతి ఒక్కరూ నీకు తెలుసు. అయితే నేను వారి కొరకు కేవలం ఈ మధ్యవర్తిత్వపు ప్రార్థనను చేస్తున్నాను. నీవు వారి హృదయము నుండి దోషారోపణను తీసివేస్తావని, మరియు సరిగ్గా ఇప్పుడే, వారిని ధైర్యముగా, సింహాసనము నొద్దకు రానిస్తావని; నేరుగా దేవుని సింహాసనము నొద్దకు ధైర్యముగా నడిచి, దేవుడు-అనుగ్రహించిన భాగ్యమును తీసుకోనిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. వారు తమ చేతులను ఎత్తునట్లు చేసినది నీవే. తమకుతాముగా వారు దానిని చేయలేరు. మరియు దేవా, నీవు దీనిని అనుగ్రహిస్తావని, యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

…నన్ను నీలో;

ఇప్పుడు, కేవలం ఇప్పుడు ఆయనను ఆరాధించండి.

నీరు మరియు…(ఓ, మై!)

గాయపడిన నీ ప్రక్క నుండి స్రవించినవి

పాపమునకు రెండింతల ప్రాయశ్చిత్తముగా ఉండును గాక,

ఉగ్రత నుండి రక్షించి మరియు నన్ను శుద్ధి చేయును గాక.

433 ఇప్పుడు ఎంతమంది మంచి అనుభూతిని కలిగియున్నారు? మీ చెయ్యి పైకెత్తి, ఇట్లు చెప్పండి, “ప్రభువుకు స్తోత్రము!” [సంఘము ఇట్లు చెప్తున్నది, “ప్రభువుకు స్తోత్రము!”—సంపా.] ఓ, ఆయన అద్భుతమైనవాడు! ఓ!

ఊట వద్ద స్థలమున్నది. సహోదరి గెర్టీ, అది నీకు తెలుసా? పాడుదాం. ఆ పాట ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు కేవలం ఒక నిమిషంలో, మనము బాప్తిస్మపు కార్యక్రమమును కలిగియుండబోతున్నాము. (మీరు వారికి బాప్తిస్మము ఇవ్వబోతున్నారా?) మంచిది.

…స్థలము, అవును, స్థలమున్నది,

నీ కొరకు ఊట వద్ద స్థలమున్నది;

స్థలము, స్థలము…

434 మంచిది. బాప్తిస్మము కొరకు ఉన్న ఆ అభ్యర్థులు, పురుషులు ఈ గదిలోనికి వెళ్తారు, స్త్రీలు ఈ గదిలోనికి వెళ్తారు, సరే, మన ప్రభువు నామములో బాప్తిస్మము పొందవలసినవారు.

…నీకు మేలు,

నీ కొరకు ఊట వద్ద స్థలమున్నది;

దేవుడు నా పట్ల ఎంతో మంచిగా ఉన్నాడు,

నీ కొరకు ఊట వద్ద స్థలమున్నది.

435 ఇప్పుడు అందరూ:

స్థలము, స్థలము, అవును, స్థలమున్నది,

నీ కొరకు ఊట వద్ద స్థలమున్నది;

ఓ, స్థలము, స్థలము, అవును, స్థలమున్నది,

నీ కొరకు ఊట వద్ద స్థలమున్నది.

436 ఓ, నేను ఆ పాత పాటను ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించడంలేదా?

నీ కొరకు ఊట వద్ద స్థలమున్నది;

ఓ, స్థలము, స్థలము, చాలా స్థలమున్నది,

ఊట వద్ద స్థలమున్నది.

437 ఇప్పుడు, బాప్తిస్మము కొరకు సిద్ధపరచడానికి, పెద్ద లోపలికి వెళ్ళగా, నేను జనసమూహమునకు వివరించగోరుతున్నాను. మరియు గదిలో ఉన్న సంఘపెద్దలు, వారికి నేను చెప్పేది వినబడుతున్నట్లైతే నేను వారిని అడుగుతాను, వారు సిద్ధంగా ఉన్నప్పుడు, వచ్చి—మరియు నాకు చెప్పండి, తద్వారా మనము మైకులను ప్రక్కకు జరుపవచ్చు. మీరందరూ దీనిని చూడాలని మేము కోరుతున్నాము. ఇంకా పది నిముషాలు పడుతుంది, మరియు సంఘము పంపివేయబడతారు.

438 ఇప్పుడు నేను మీ కొరకు కొన్ని పరిశుద్ధ లేఖనములను చదవగోరుతున్నాను. నేను వాటిని అపొస్తలుల కార్యముల నుండి చదవగోరుతున్నాను. మరియు నేను అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 12వ వచనము నుండి ప్రారంభించగోరుతున్నాను.

439 ఇప్పుడు, పరిశుద్ధ లూకా 16వ అధ్యాయములో మీరు గమనించాలని నేను కోరుతున్నాను, లేదా పరిశుద్ధ మత్తయి అని, నేను నమ్ముతున్నాను, అది యేసు కొండ మీదనుండి వస్తున్న విషయమైయున్నది. వారు…ఆయన శిష్యులతో ఇట్లన్నాడు, “మనుష్యకుమారుడనైన నేను ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారు?”

440 “మరి వారిలో కొందరు, నీవు ‘ఏలీయావని’ అన్నారు. మరియు కొందరు నీవు—నీవు ‘ప్రవక్తవని’ చెప్పుచున్నారు. మరియు కొందరు నీవు ఇది అని లేదా మరొకటి అని చెప్పుచున్నారు.”

441 ఆయన ఇట్లన్నాడు, “మీరైతే నేను ఎవరినని చెప్పుచున్నారు?”

442 మరియు పేతురు ఇట్లన్నాడు, “నీవు సజీవుడగు, దేవుని కుమారుడవైన క్రీస్తువు.” అది నిజమేనా?

443 యేసు ఇట్లన్నాడు, “సీమోను బర్-యోనా నీవు ధన్యుడవు, ఏలయనగా రక్తమాంసములు దీనిని బయలుపరచలేదు. నీవు ఎన్నడూ ఒక సెమినరీలో దీనిని నేర్చుకోలేదు. నీవు ఎన్నడూ మనుష్యుని ద్వారా దీనిని నేర్చుకోలేదు.” ఇట్లన్నాడు, “అయితే పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరిచాడు. మరియు నీవు పేతురువని నేను నీకు చెప్తున్నాను. ఈ బండమీద నేను నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు. మరియు పరలోక రాజ్యపు తాళపుచెవులను నేను నీకు ఇచ్చుచున్నాను.” అది నిజమేనా? “నీవు భూలోకమందు దేని విప్పుదువో, నేను దానిని పరలోకమందు విప్పుదును. నీవు భూలోకమందు దేని బంధించుదువో, నేను దానిని పరలోకమందు బంధించుదును.” నిజంగా ఆయన భావం అదేనా? కానియెడల ఆయన దానిని చెప్పియుండేవాడు కాడు. ఇపుడు, కాలం గడుస్తున్నాకొద్దీ, ఇప్పుడు, పేతురు రాజ్యపు తాళపుచెవులను కలిగియున్నాడు.

444 ఇప్పుడు, క్యాథలిక్ ప్రజలైన మీరు, మీరు ఈ విధంగా తలంచవచ్చును, మీరు ఇట్లంటారు, “క్యాథలిక్ సంఘము పేతురు మీద కట్టబడినది.” సరే, మనము కనుగొందాము. “వారు తాళపుచెవులను కలిగియున్నారు. క్యాథలిక్ సంఘము ఇంకనూ తాళపుచెవులను కలిగియున్నది.”

445 తాళపుచెవుల విషయమై పేతురు ఏమి చేశాడో మనము కనుగొందాము, చూడండి, అప్పుడు మనకు తెలుస్తుంది. బైబిలు గ్రంథము, పేతురుతో మరియు ఆ మిగతా అపొస్తలులతో ఇట్లు చెప్పినది, “మీరు సర్వలోకమునకు వెళ్ళండి. మీరు ఎవరి పాపములను క్షమిస్తారో, అవి వారికి క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములను నిలిచియుండనిస్తారో, అవి వారికి నిలిచియుంటాయి.” అది, నా భావము ఏమిటన్నది కొందరికి అర్థం కాకపోవచ్చును గనుక…నేను దీనిని చెప్తున్నాను. అపొస్తలులతో యేసు ఇట్లన్నాడు, “మీరు ఎవరి పాపములను క్షమిస్తే, నేను కూడా వారిని క్షమిస్తాను. మరియు మీరు ఎవరి పాపములనైతే క్షమించకుండా, వారికి విరోధముగా వాటిని పట్టియుంచుతారో, నేను కూడా వారికి విరోధముగా వాటిని పట్టియుంచుతాను.” యేసు చెప్పినది అదే.

446 క్యాథలిక్ సంఘము దాని వైపునకు వెళ్ళడాన్ని గమనించండి.

447 అయితే వారు దానిని ఎలా చేశారో మనం కనుగొందాము. పిదప వారు దానిని ఎలా చేశారో మనము కనుగొన్నట్లైతే, అప్పుడు మనము కూడా దానిని ఆ విధంగానే చేయవలసియున్నాము. ఇపుడు మనము కనుగొందాము.

448 అది పెంతెకొస్తు దినమైయున్నది. సంఘము ప్రారంభించబడుచున్నది. వారందరూ ఒక మేడ గదిలో ఉన్నారు. వివిధమైన భాషలు మాట్లాడుతున్న ప్రజలు, అక్కడనుండి బయటకు వచ్చారు. ఎందుకు? ఆకాశము క్రిందనున్న ప్రతి భాష అక్కడ చూపించబడినది. ఇంగ్లీషు కూడా, అక్కడ ఉన్నది. ఆ దినమున మాట్లాడబడుచున్న భాషలలో, ఆకాశము క్రిందనున్న ప్రతీ భాష అక్కడ ఉండవలసియున్నది. ఇక్కడ అలా కొనసాగుతూ అనేక భాషలు ఉద్భవించినవి, మరియు క్రేతీయులు మరియు పరవాసులు, మరియు రోము నుండి వచ్చిన అన్యమతస్థులు, మరియు—మరియు—మరియు అరేబియన్లు, మరియు అందరూ మాట్లాడి మరియు…ఇప్పుడు, వారు తెలియని భాషలలో మాట్లాడటంలేదు. వారు, ప్రజలకు తెలిసిన భాషలలోనే మాట్లాడుతున్నారు. తెలియని భాషలు కాదు, అయితే ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే భాషలు. పాపి, అవిశ్వాసి కూడా, అతడు ఏమి చెప్పుచున్నాడో వినగలిగారు. “మనము పుట్టిన స్థలమందుండు, మన స్వంత భాషలో వీరు మాట్లాడుటను మనము ఎలా వింటున్నాము?”

449 ఇపుడు గమనించండి. ఇప్పుడు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు, “ఇతరులు వెక్కిరించారు.” 12వ వచనము, మంచిది.

మరియు వారందరు విభ్రాంతినొంది, మరియు…ఎటుతోచక, ఇదేమగునో అని, ఒకనితో ఒకడు చెప్పుకొనిరి?

కొందరైతే అపహాస్యముచేసి, వీరు…కొత్త మద్యముతో నిండియున్నారు అని అన్నారు.

450 వారు వారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే, వారు ఎలా ప్రవర్తిస్తున్నారు? వారు మద్యముతో నిండినవారివలె, త్రాగినవారివలె తడబడుచున్నారు. వారేమి మాట్లాడుతున్నారో ఎరుగకయే, మాట్లాడుచున్నారు, అయితే తమకు తెలియని భాషలలో జనసమూహమునకు ప్రసంగించుచున్నారు, కాని జనసమూహము దానిని ఎరిగియున్నారు. చూశారా? మంచిది.

కొందరైతే…వారు క్రొత్త మద్యముతో నిండియున్నారు, వారు ఎలా ప్రవర్తించుచున్నారో చూడండి, అని అన్నారు.

కొందరైతే అపహాస్యము చేయుచూ, ఇట్లన్నారు, వీరు…నిండియున్నారు…

“అయితే పేతురు…” అబ్బాయ్, గమనించు! నీవు తాళపుచెవులను కలిగియున్నావు.

అయితే పేతురు, ఆ పదునొకరితో కూడా లేచి, బిగ్గరగా తన స్వరమెత్తి, వారితో ఇట్లన్నాడు,…

ఇప్పుడు, గుర్తుంచుకోండి, ఇది సంఘముయొక్క మొదటి ప్రారంభోత్సవమైయున్నది.

…యూదయ మనుష్యులారా, మరియు…యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి:

ఏలయనగా, మీరు ఊహించినట్లు, వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయినా కాలేదు.

అప్పటికింకా మద్యం దుకాణములు తెరువబడనేలేదు. చూశారా?

అయితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే;

…అంత్యదినములయందు, నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను, అని దేవుడు చెప్పుచున్నాడు: మీ కుమారులు మీ కుమార్తెల మీదను కుమ్మరించెదను, మరియు వారు ప్రవచించెదరు, మీ యౌవనులు దర్శనములు చూసెదరు, మరియు మీ వృద్ధులు కలలు కందురు:

ఆ దినములలో నా దాసుల మీదను…నా దాసీ మీదను నా ఆత్మను కుమ్మరించెదను;…వారు ప్రవచించెదరు:

మరియు నేను పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను చూపించెదను;…

ఇప్పుడు, తాళపుచెవులు కలిగినవాడైన, పేతురు ప్రసంగించుచున్నాడు.

…రక్తమును,…అగ్నిని,…పొగ ఆవిరిని కలుగజేసెదను:

ప్రభువు ప్రత్యక్షమగు ఆ గుర్తింపదగిన మహాదినము రాకమునుపు, సూర్యుడు చీకటిగాను,…చంద్రుడు రక్తముగాను మారుదురు:

మరియు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరును, రక్షణ పొందుదురు.

ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినండి; నజరేయుడైన యేసుచేత, దేవుడు అద్భుతాలను, మహాత్కార్యములను, మరియు సూచనను చేయించి ఆయనను నిర్దారించెను, ఆయన వాటిని…మీ మధ్యన చేసెను,…ఇది మీరే…ఎరుగుదురు:

ఒక గద్దింపు గురించి మాట్లాడతారా? అతడు తాళపుచెవులను కలిగియున్నాడు, మీకు తెలుసా. అది…

దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన ముందుజ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన, ఈయనను,…

విషయం అదేయైయున్నది. ఆయన ఎన్నడైనా ఎలా అప్పగించబడగలడు? ఎందుకనగా అది ఆ విధంగా ఉండునట్లు దేవుడు దానిని ముందుగా నిర్ణయించాడు. చూశారా? దేవునియొక్క ముందుజ్ఞానము!

451 [ఒక సహోదరుడు చెప్తున్నాడు, “సిద్ధమేనా?”—సంపా.] కేవలం ఒక్క క్షణంలో. నేను లేఖనమును వివరించే వరకు, కేవలం ఒక్క నిమిషము ఆగమని, వారికి చెప్పండి.

…మీరు పట్టుకొని, దుష్టులచేత, ఆయనను సిలువ వేయించి మరియు చంపిరి:

మరణము ఆయనను బంధించియుంచుట…అసాధ్యము గనుక: దేవుడు మరణవేదనలు తొలగించి, ఆయనను లేపెను.

ఏలయనగా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడు ప్రభువును చూచుచుంటిని…ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, మరియు నేను కదల్చబడను:

కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను; మరియు…నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును:

ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు.

నీవు నాకు…నాకు—నాకు మార్గములను, నాకు జీవ మార్గములను తెలిపితివి; నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు.

సహోదరులారా మరియు జనులారా, మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును,…అతడు చనిపోయి సమాధిచేయబడెను, అతని సమాధి నేటివరకు…మన మధ్యనున్నది.

అతడు ప్రవక్తయైయుండెను గనుక, దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఈలాగు ఒట్టుబెట్టుకొనిన సంగతి అతడు ఎరిగియున్నాడు…

నేను ఇప్పుడే దానిని బోధించాను.

…అదేమనగా అతని గర్భఫలములో నుండి—నుండి, ఆయన…అతని శరీరమును బట్టి, అతని సింహాసనము మీద క్రీస్తును కూర్చుండబెట్టును అనునదైయున్నది;

నేనిప్పుడు బోధించినది అదేయైయున్నది. పేతురు అదే విషయాన్ని బోధిస్తున్నాడు.

మరియు దీనిని ముందుగా చూచినవాడై (ప్రవక్త దీనిని ముందుగానే చూశాడు.) క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు, ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.

ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులమైయున్నాము.

కాగా ఆయన హెచ్చింపబడి, మరియు కుడిపార్శ్వమునకు…కుడిపార్శ్వమున ఉండి, పరలోకములో హెచ్చింపబడెను, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును…తండ్రివలన పొంది, ఆయన…మీరు చూస్తూ వినుచున్న దీనిని, కుమ్మరించియున్నాడు.

ఏలయనగా దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, (ఆ ప్రవక్త): అయితే అతడు ఇట్లన్నాడు, నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచువరకు, నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని,

ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.

కావున (దీనిని వినండి) మీరు…సిలువవేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, దీనిని ఇశ్రాయేలు వంశమంతయు, రూఢీగా తెలుసుకొనవలెనని చెప్పెను.

అదియే దానిని స్థిరపరచవలసియున్నది, కాదా?

ఇప్పుడు వారు దీనిని విని, ఆ పాపులు, తమ హృదయములలో నొచ్చుకొని, పేతురును…జనులను…మరియు పేతురును మరియు…కడమ…అపొస్తలులను ఇట్లడిగిరి, జనులారా మరియు సహోదరులారా, మేము ఏమి చేతుము?

452 మంచిది. ఇదిగో విషయం ఇదే. అతడు దేనిని కలిగియున్నాడు? తాళపుచెవిని, రాజ్యమునకు తాళపుచెవిని కలిగియున్నాడు. రాజ్యము ఎక్కడున్నది? అది మీలోనే ఉన్నది. అది నిజమేనా? పరిశుద్ధాత్మయే దేవుని రాజ్యమైయున్నాడు. అది మనకు తెలుసు. ప్రజలుగా మరియు ప్రతినిధులుగా, మనము రాజ్యములోనికి జన్మిస్తాము. చూడండి. అతడు తన నడుము ప్రక్కలో తాళపుచెవులను కలిగియున్నాడు. “దానితో నీవు ఏమి చేయబోతున్నావు?” ద్వారము తెరవబడిన మొట్టమొదటి సారి ఇదేయైయున్నది.

453 ఇప్పుడు, తాళపుచెవులను కలిగియున్న బోధకుడికి, మొట్టమొదటి సారిగా, ఈ ప్రశ్న వేయబడినది. “మీ తలపై నిలబడండి,” అని అతడు చెప్పినట్లైతే, అది అధికారికంగా మారియుండేదని నేను నమ్ముతున్నాను.

454 “భూమి మీద నీవు దేనిని బంధించినా, పరలోకమందు నేను దానిని బంధిస్తాను.” మంచిది. “నీవు ఏమి చెప్పినా, నేను దానినే చెప్పబోవుచున్నాను. నీవు తాళపుచెవిని కలిగియున్నావు.” మంచిది. అతడు తాళపుచెవిని తలుపులోనికి దూర్చాడు.

…మీరు ఏమి చేస్తారు? జనులారా మరియు సహోదరులారా, మేము ఏమి చేతుము?

ఇప్పుడు వారు దీనిని విని, వారు తమ హృదయములో నొచ్చుకొని, మరియు ఇట్లన్నారు…జనులారా మరియు సహోదరులారా,…

…పేతురు వారితో ఇట్లన్నాడు, మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము మీలో ప్రతీవాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, మరియు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.

ఏలయనగా ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, మరియు దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలుచు వారందరికి చెందును.

అది దానిని ఎప్పటికీ పరిష్కరించినది. ఏ వ్యక్తియైనా, ఏ సమయములోనైనా, ఎన్నడూ, ఎన్నడూ దానిని వ్యతిరేకించలేడు.

455 క్యాథలిక్ సంఘము వచ్చారు, ముంచబడటానికి బదులుగా, వారు చిలకరిస్తారు. యేసు నామమును ఉపయోగించడానికి బదులుగా, వారు, “తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మను” తీసుకున్నారు. అది బైబిలులో ఎన్నడూ బోధించబడలేదు.

456 అప్పటినుండి, ప్రతీ వ్యక్తి, యేసుక్రీస్తు నామములో ముంచబడుట ద్వారా బాప్తిస్మము పొందారు. మరియు యేసుకు బాప్తిస్మము ఇచ్చినట్టి, బాప్తిస్మమిచ్చు యోహానుచేత కొందరు ముంచబడినారు, మరియు వారు ఆ విధంగా పరిశుద్ధాత్మను పొందలేరని పౌలు వారితో చెప్పాడు. వారు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుటకు ముందు, వారు తిరిగి వచ్చి, మరియు యేసు నామములో, మరలా బాప్తిస్మము పొందాల్సివచ్చినది. అది లేఖనమైయున్నదని ఎంతమందికి తెలుసు? అపొస్తలుల కార్యములు, 19వ అధ్యాయము. విషయం అదేయైయున్నది. ఏలయనగా, ప్రమాణము ద్వారా యేసుక్రీస్తు ద్వారా, అదియే పరలోకములో అధికారికముగా ఉండునట్లు, వేరే ఏ విధానమునకైనా అవకాశము లేకుండా పరలోక రాజ్యము ముద్రించబడియున్నది.

…మారుమనస్సు పొంది, మీ పాపక్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి,…అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.

ఎందుకనగా, వాగ్దానము మీకును, మీ పిల్లలకును,… దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలచిన వారందరికిని చెందును.

ఆమేన్. మనము ప్రార్థించుకుందాము.

457 తండ్రివైన దేవా, ఈ రాత్రి, పందొమ్మిది వందలకు పైగా ఎన్నో సంవత్సరములు గడిచిపోయినవి, మరైనను మానవ హృదయముల యొక్క నిజాయితీ మరియు యథార్థత ఇంకను దేవుని కొరకు మొర్రపెట్టుచున్నవి, తమ తల్లియొక్క రొమ్ము పాల కొరకు ఏడ్చుచున్న చిన్న బిడ్డలవలె ఉన్నది. ప్రభువా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము. నీవు లేకుండా మేము బ్రతుకలేము. “దుప్పి నీటివాగు కొరకు దప్పిగొనునట్లు, నా ప్రాణము నీ కొరకు దప్పిగొనుచున్నది,” అని దావీదు చెప్పినట్లుగా ఉన్నది. అది తప్పక దానిని పొందుకోవాలి, లేదంటే చనిపోతుంది.

458 మరియు, తండ్రీ, మేము లేఖనములలో ముందుకు వెనుకకు పరిశోధించాము. భిన్నముగా ఉండటానికి అలా చేయలేదు, అయితే దేవునియొక్క ఆజ్ఞల ప్రకారము కాక, మనుష్యుల ఆజ్ఞల ప్రకారముగా బోధించుచున్న, ఈ సెమినరీలను, ఈనాడు ఉన్న ఈ వేదపాండిత్య విద్యార్థులను మేము చూస్తున్నాము. కావున, ప్రభువా, మేము ఆ మనుష్యులను తృణీకరించడంలేదు, కాని వారు బోధించే విషయాలను మేము తృణీకరిస్తున్నాము. కావున, ప్రభువా, వారు మా సహోదరులుగా మారాలని మేము అడుగుచున్నాము. వారి తప్పిదమునకై నీవు వారిని క్షమించాలని మేము నిన్ను అడుగుచున్నాము. మరియు వారు లేఖనము యొద్దకు వచ్చి, ఏదో ఒక సెమినరీ దానిని బోధించిన విధానములో కాదు గాని, దేవుడు దానిని వ్రాసిన విధంగా, వారు దానిని చదవాలని మేము ప్రార్థిస్తున్నాము.

459 దేవా, ఇప్పుడు, నీటి బాప్తిస్మము కొరకు వచ్చుచున్న, ఈ వ్యక్తులను, మా ధైర్యవంతుడైన సంఘకాపరి, ఈ సువార్తను, ఇదే సువార్తను బోధించడానికి ప్రసంగవేదిక మీదకు వచ్చి, మరియు పిదప పాతిపెట్టడానికి, బాప్తిస్మపు కొలను వద్దకు వస్తుండగా, ప్రభువా, వీరిలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకొనునట్లు అనుగ్రహించుము, ఎందుకనగా, “మీరు పరిశుద్ధాత్మను పొందెదరు,” అని నీవే వాగ్దానము చేసావు. దేవునియొక్క ఆత్మ, ఈ రాత్రి ఆ వ్యక్తిని స్వీకరించడానికి నీటి పైన వేచియుండును గాక, ఏలయనగా యేసుక్రీస్తు నామములో, మేము వారిని నీ చేతులకు అప్పగించుచున్నాము. ఆమేన్. 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...