ప్రశ్నలు మరియు జవాబులు హెబ్రీ పత్రిక 1వ భాగము
1దేవుడు లేకుండా ఆమె దానిని ఎలా చేయగలదు? అది అత్యంత కష్టతరముగా ఉంటుంది, అవును కదా? ప్రభువు లేకుండా దానిని చేయడం అసాధ్యం.
నేను వాటన్నిటిలో నుండి బోధించబోవడంలేదు. అయితే నేను కఠినమైనవాటిని తీసుకోవచ్చని అనుకున్నాను, మీకు తెలుసా, కాబట్టి నేను సిద్ధపడి ఉండడం మంచిది అని నేను అనుకున్నాను. కానీ, ఓ, అవి చాలా, చాలా తేలికగా ఉన్నవి. కావున అలాగైతే బహుశా ప్రజల మధ్య ఎక్కువ ప్రశ్నలు లేవనుకుంటా, అవి కేవలం చాలా సాధారణమైన తేలిక ప్రశ్నలైయున్నవి. మంచిది, ప్రభువుయొక్క సహాయముతో, నాకు సాధ్యమైనంత శ్రేష్ఠముగా వాటికి జవాబునిచ్చుటకు ప్రయత్నించడానికి నేను సంతోషిస్తున్నాను.
2 మరియు ఈ రాత్రి సహోదరి ఆర్గన్ బ్రైట్ ఇక్కడ ఉన్నట్లైతే…సహోదరి రూత్. సహోదరి రూత్, నీవు ఇక్కడ ఉన్నావా? ఇక్కడ. నేను…ఓ, అవును, నేను ఇక్కడ చిరునామాను కలిగియున్నాను, మరియు…లేదు, నేను కలిగిలేను. సరే, నేను దానిని నేరుగా ఇక్కడికి తెప్పించగలను. నేను దానిని నా పర్సులో పెట్టాను, మరియు నేను నా పర్సును ఇంట్లో వదిలిపెట్టాను. ఇప్పుడు, నేను ఇంటికి వెళ్తుండగా పోలీసులు గనుక నన్ను పట్టుకుంటే ఎలా, సహోదరుడా ఫ్లీమన్, నీవు నన్ను కాపాడు. నేను…నా పర్సును ఇంట్లో విడిచిపెట్టానని, ఈ రాత్రి నేను లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయాల్సివస్తుందని బిల్లీతో చెప్పు. అది నా జేబులో ఉన్నదని నేను అనుకున్నాను; నేను ఇందాకే బట్టలు మార్చుకున్నాను. ఈ మధ్యాహ్నం, నేను హడావిడిగా వచ్చాను, గడ్డి కోస్తూ ఉన్నాను మరియు వెంటనే ఆపివేసి త్వరపడి మరియు లోపలికి వెళ్ళి, బట్టలు మార్చుకొని మరియు ఇక్కడికి వచ్చాను. మరియు నేను—నేను భాషా నిఘంటువును తెచ్చాను, అయితే మీరు తర్వాత దానినుండి సులభంగా చూడవచ్చు.
3 ఆ ఉత్తరము గురించి బాధపడవద్దు. నాకు అంతకంటే దారుణమైనవి వచ్చాయి, కాబట్టి అది ఒక మంచి ఉత్తరమే. అది మంచిగానే ఉన్నది. అది చాలా, చాలా బాగున్నది. నేను దానిని చదవనని నీతో చెప్పాను, కాని నీకు తెలుసు కదా, నేను దానిని అనుకోకుండా చదివేశాను, మరియు ఇక ఎంతమాత్రము ఆగలేకపోయాను. నీవు ఏమి చెప్పావా అని నేను ఆశ్చర్యపోయాను. మరియు అది చాలా చాలా బాగుంది, ఒక అసలైన పాఠశాల ఉపాధ్యాయురాలు వ్రాయవలసినట్లే వ్రాశావు. అది బాగుంది, మరియు నేను దానిని అభినందిస్తున్నాను. మరియు అది—అది మీకు…
4 మీరు చూడండి, మనతో కొంచెం భిన్నాభిప్రాయమును కలిగియుండే—కలిగియుండే వారినుండి వచ్చే ఉత్తరాలంటే నాకు చాలా ఇష్టం. చూడండి, ఎవ్వరూ మీతో విభేదించకుండా, మీరు అన్నివేళలా సజావుగా కొనసాగుచున్నట్లైతే, మీరు పాతబడిపోతారు. మీరు గ్రహించగలుగునట్లు మరియు ఇంకా లోతుగా ఆలోచించునట్లు మీరు కొద్దిగా భిన్నమైనదానిని ఎదుర్కోవలసియున్నారు. మరియు—మరియు మీరు గమనించుకోనియెడల, మీరు కేవలం ఒకే విధమైన పద్ధతిలో చిక్కుకుంటారు; అప్పుడు మీరు—మీరు అలా చిక్కుకున్నప్పుడు మీరు సమస్యలో పడతారు. మీరు కేవలం ముందుకు కదులుతూనే ఉండవలసియున్నారు మరియు ఎవరినైనా మీతో విభేదించనిచ్చి మరియు అప్పుడప్పుడు మీ ఈకలను విదిలించుకోవలసియున్నారు.
5 అక్కడ ఆఫ్రికాలో నేను రెండు చిన్న సింహాలను కనుగొన్నాను, మరియు అవి చిన్న పిల్లలైయున్నవి, దాదాపు అంత సైజులో ఉన్నాయి. మచ్చలున్నాయి, చిన్న, చిట్టి సింహము; ఒక చిన్న మగ సింహము, ఒక చిన్న ఆడ సింహము. మరియు ఇప్పుడు, అవి చూడడానికి పిల్లిపిల్లల వలె ఉన్నాయి, అవి అలా చాలా చిన్నగా ఉన్నాయి, చిన్న…అత్యంత అందముగా ఉన్న చిన్నవి, అవి కేవలం ఆడుతూ ఉండేవి. మరియు నేను వాటిని ఇక్కడ అమెరికాకు తీసుకురాబోతున్నాను, నేను వాటిని ఒక పక్షి పంజరములో పెట్టించాను. నేను వాటిని ఇక్కడికి తీసుకురాబోతున్నాను, కానీ వాటికి టీకాలు వేయడానికి నేను—నేను దేనినీ కనుగొనలేకపోయాను, దానికి అవసరమైన ఎటువంటి మందు పదార్థమును కనుగొనలేకపోయాను. మరియు మొదటిగా వాటికి టీకాలు వేయకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వాటిని తీసుకురావడానికి వారు నన్ను అనుమతించలేదు, మరియు ఆఫ్రికా అంతటిలోను నేను దానిని ఎక్కడా కనుగొనలేకపోయాను. అయితే అది ఒక సింహమా కాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే, కేవలం దానిని కొద్దిగా తట్టి చూడండి. అది పోరాడడానికి సిద్ధమై అది ఒక సింహమని మీకు తెలియజేస్తుంది, కాబట్టి—కాబట్టి అది ఒక విధంగా అది ఎక్కడ నిలబడియున్నదో మీకు తెలియజేస్తుంది.
6 మీరు అప్పుడప్పుడు ఆ విధంగానే చేయవలసియున్నారు, మీకు తెలుసు కదా, కనుగొనడానికి ఈకలను వెనుకకు విదిలించడం వంటిది చేయవలసియుంటుంది. అయితే, ఇప్పుడు, మనం సింహములాగా కోపపడము; మనం కేవలం—మనం కేవలం దానిని ప్రేమిస్తాము, అది…ప్రజలు ప్రశ్నలు వేయడాన్ని ప్రేమిస్తాము. మరియు సహోదరి రూత్, అలాంటి ప్రశ్నలు, నాకు చాలా, చాలా మంచివి. అది…నేను—నేను దానిని ప్రేమిస్తున్నాను, చూడండి. నేను అసహ్యించుకునేది ఆ నీచమైనవాటినైయున్నది. కానీ ఇది…ఇది బాగానే ఉన్నది.
7 ఇప్పుడు మనకు కొన్ని మంచి, ఉత్తేజపరిచే, సూటియైన ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడే ఆ వెనుక గదిలో ఒక బోధకుడు ఉన్నాడు, నన్ను అడిగాడు, ఇట్లన్నాడు, “ప్రకటన 11లోని ఇద్దరు ప్రవక్తలు, వారు ఎత్తబడుటకు ముందు వస్తారా? లేదా సరిగ్గా ఇశ్రాయేలీయులు తీసుకొనిపోబడుటకు ముందు వస్తారా? మరియు ఏమిటి…” ఇప్పుడు, ఆ—ఆ—ఆ విధమైన ప్రశ్నలు మిమ్మల్ని చిక్కున పెడతాయి. కానీ ఇటువంటి ఈ సాధారణమైన ప్రశ్నలు బాగానే ఉంటాయి.
అయితే ఇప్పుడు, మనం ప్రారంభించడానికిముందు, ప్రార్థన కొరకు మనం మన తలలు వంచుదాము.
8 తండ్రీ, నీకు పన్నెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, నీవు ఆలయములో శాస్త్రులతో మరియు పండితులతో, వారితో లేఖనములను చర్చించుచూ కనుగొనబడటం గుర్తించబడినది. మరియు వారు—వారు…పూర్వకాలపు మనుష్యులైయుండి, మరియు లేఖనములలో బాగుగా తర్ఫీదు పొందినవారైయుండగా, మరైనను దాదాపు పన్నెండు సంవత్సరాల వయస్సు గల ఒక చిన్న అబ్బాయి లేఖనములను వివరించడంలో, అసలు—అసలు వాటిని ముడివేయగలుగుటను చూచి ఆశ్చర్యపోయారు. నీవు నీ తండ్రి పని మీద ఉన్నావు. నీవు నీ తల్లితో ఇట్లన్నావు, “నేను నా తండ్రి పని మీద ఉండవలెనని నీకు తెలియదా?” మరది లేఖనములను వాటియొక్క ఆత్మసంబంధమైన అర్థములతో వివరించుటయైయున్నది.
9 మరియు ప్రభువా, మేము ఎంత బలహీనులమో మరియు ఎంత సుళువుగా విరిగెడివారమో, మరియు పొరపాట్లు చేయుటకు మేమెంతగా బద్దులమైయున్నామో నీవు ఎరిగినవాడవై, కేవలం నీవు పరిశుద్ధాత్మ రూపములో ఈ రాత్రి మాయొద్దకు వచ్చి, మరియు మాకు లేఖనములను వివరిస్తావని మేము ఇప్పుడు ప్రార్థిస్తున్నాము. నేను నీపై ఆధారపడుతూ వేచియున్నాను. మరియు నేను దానిని వివరించుచున్న విధానము సరియైనదని అనిపించేటట్లు చేయడానికి, నేను ఎన్నడైనా, ఏ సమయములోనైనా, నా స్వంత తలంపులను లేదా అనువాదమును లేదా స్వార్థపూరితమైన దేనినో ఉంచుటకు ప్రయత్నించినట్లైతే, నీవు…సింహములు దానియేలు కొరకు వచ్చినప్పుడు, నీవు వాటికి చేసినట్లే, ప్రభువా, నా నోరును కూడా మూసివేయుము. నీవు ఇంకనూ అదే దేవుడవైయున్నావు.
10 మరియు అది పూర్తిగా…మేము పరిశుద్ధాత్మపై ఆధారపడుచుండగా, ఆయనే ఈ సంగతులను మాకు బయలుపరచును గాక. మరియు పిదప ఆయన వాటిని మాట్లాడుచుండగా, ఆ ప్రశ్నను అడిగినవారు దానిని పొందుకోగలుగునట్లు, వాటిని ఎంతగానో తేటపరచుము. మరియు నేను ఎల్లప్పుడూ నమ్మినదానికి వ్యతిరేకముగా అది జవాబునిచ్చినయెడల, అప్పుడు ప్రభువా, నేను ఒక క్రొత్త సంగతిని, మరియు ప్రభువుయొక్క మంచి మార్గమును కనుగొన్నానని తెలుసుకొనుటకు, నా హృదయము కూడా సంతోషించును గాక. ఎందుకనగా, “లేఖనములను పరిశోధించుడి, ఏలయనగా వాటియందు నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు, మరియు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” అని నీవు అన్నావు.
11 ఇప్పుడు, ఈ లేఖన ఉపదేశము తర్వాత, అది నిశ్చయంగా అనేక తలంపులను మరియు మొదలగువాటిని రేపుతుంది. మరియు దేవా, నేను ప్రార్థిస్తున్నాను, ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎంతో మాధూర్యముగాను మృదువుగాను అడుగబడినట్లు ఉండగా, పరిశుద్ధాత్మ వాటికి మృదువుగాను మాధూర్యముగాను జవాబునిచ్చును గాక. ఏలయనగా దేవునియొక్క మహిమ నిమిత్తము, మరియు ఆయన సంఘముయొక్క ఎదుగుదల కొరకు, యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
12 అనేకసార్లు దేని విషయములోనైనా స్వార్థపూరితమైన ఉద్దేశ్యాలు, దాని రుచినంతటిని పాడుచేస్తాయి. మరియు ఇప్పుడు, ఈ లేఖనము గురించి ప్రశ్నలు అడిగారు.
13 ఇప్పుడు, ఈ రాత్రి నేను కొంచెం బుసవంటి శబ్దము చేసినయెడల కారణమేమిటంటే, నా పెట్టుడుపన్ను ఒకటి ఊడిపోయింది. మరియు నేను దానిని లోపల పెడితే, మరి నేను బోధించలేకపోతున్నాను, నేను బోధించేటప్పుడు నేను నెమ్మదిగా మాట్లాడాల్సివస్తుంది; నేను దానిని బయటకు తీస్తే, మరి నేను దాదాపు ఈల వేస్తున్నట్లు ఉంటుంది.
14 శ్రీమతి. బిల్లీ గ్రాహమ్ అతని మీద ఒక కథ చెప్పింది, అదేమిటనగా, అతడెంతో తబ్బిబ్బు అయిపోవడాన్ని ఆమె చూసినది, అదెప్పుడంటే, అతని ముందు పన్ను ఊడిపోయినప్పుడైయున్నది. మరి అతడు దానిని పోగొట్టుకున్నాడు, మరియు అతనికి వెంటనే ఒక టెలివిజన్ కార్యక్రమం ఉందట, మరియు—మరియు అతడు…అది ఒక ప్లేటు మీద మరికొన్ని వెనుక పళ్ళతో కలిసి ఉందట. మరియు అతడు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, అతడు తన పన్ను సందులగుండా “ఫ్యూ, ఫ్యూ” అని ఈల వేసినట్లు ఉందట. మరియు టెలివిజన్ ప్రసారానికి పది నిమిషాల ముందు, అతడు మోకాళ్ళ మీద ఉండి, చెమటలు కక్కుతూ ప్రార్థిస్తున్నాడని ఆమె చెప్పింది, మరియు చివరకు అది అతని ప్యాంటులోనుండి జారి అతని బూట్లలో ముందు భాగమున పడినచోట వారు దానిని కనుగొన్నారు. సామాను మోసేవారిలో ఒకరు దానిని, ఆ నకిలీ పంటిని కనుగొన్నారు. మరియు శ్రీమతి. గ్రాహమ్ ఇక్కడ, అతని గురించి దానిని చెప్పినది. మరైతే నేను దానిని ఒక చిన్న కాగితపు ముక్కలో పెట్టుకున్నాను, నేను దానిని సరిగ్గా ఇక్కడే నా బైబిలులో కలిగియున్నానని అనుకుంటున్నాను.
15 మరియు కాబట్టి అది ఒక విధంగా…మనం కొంచెము వృద్ధులమై మరియు క్షీణించిపోయినప్పుడు, మీకు తెలుసు కదా, మరియు వీటిని కోల్పోవలసివచ్చినప్పుడు, అది దానిని ఇబ్బందికరముగా చేస్తుంది. మరియు కావున నేను…నేను అక్కడ రాబర్సన్ సహోదరునితో, మరియు వారితో కలిసి బయట ఉండగా, ఒక ఉదయమున నేను దాని మీద బ్రష్ చేస్తూ మరియు దాని నుండి ఒక ముక్కను విరుగగొట్టుకున్నాను, మరియు దానిని సరిచేపించుటకు, నేను దానిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాల్సివచ్చింది. అయితే ప్రభువు తన ఆశీర్వాదములను జతచేయును గాక.
16 ఇప్పుడు మనము ముందుకు సాగుతున్నాము, ఇప్పుడు, నాకు వీలైతే, వాటిలో ప్రతిదానిని చూడటానికి నేను ప్రయత్నించబోతున్నాను. మరియు, సహోదరుడా టోనీ, దేవుని కృపను బట్టి, నీ కలకు అనువాదమును నేను పొందుకున్నాను, మరియు అది అద్భుతంగా ఉన్నది. దానిని చూడడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. మరియు అది ఒక మంచి అనువాదమైయున్నది, మరి నేను దానిని ఇక్కడ బహిరంగముగా చెప్పకూడదని నేను అనుకుంటున్నాను, కావున నీవు—నీవు…దానిని వ్యక్తిగతంగా కోరుకుంటే నేను దానిని నీకు ఆ విధంగానే చెప్తాను. ఈ మధ్యనే ఒక రాత్రి అతడు నన్ను అడిగాడు, అతనికి ఒక కల వచ్చింది, మరియు నేను ప్రభువు యొద్దకు వెళ్ళి మరియు దాని గురించి ప్రార్థించేవరకు అది సరిగ్గా ఏమిటో నేను అతనికి చెప్పలేకపోయాను. పిదప ప్రభువు తిరిగి దానిని నాకు బయలుపరచాడు మరియు ఆ అనువాదము ఏమిటో నాకు చెప్పాడు. అది అద్భుతంగా ఉన్నది, మరియు సహోదరుడా టోనీ, నీకు శుభవార్త.
17 ఇప్పుడు, మొదటి ప్రశ్నలో. ఇప్పుడు, మొదట ఎక్కడ ప్రారంభించాలో నాకు తెలియడంలేదు, ఎందుకనగా అవన్నీ మంచివే. అయితే, ఇప్పుడు, మనం ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించుదాము, మరియు మనం వాటిని పూర్తి చేయనియెడల, వాటిని ఆదివారము ముగించవచ్చును.
51. మత్తయి 25:46లో, “యుగయుగముల శిక్ష” అనేదానికి అర్థం ఏమిటో వివరించండి. [తెలుగు బైబిలులో నిత్యశిక్ష అని వాడబడినది.—తర్జుమాదారుడు.] “అయితే…” ప్రశ్న అదే.
52. పిదప, రెండవ ప్రశ్న: “అయితే రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు,” అది వారిని దేవుని మనస్సులోనుండి త్రోసివేయడంతో సమానమేనా?
18 మంచిది, ఇప్పుడు, మీ మొదటి ప్రశ్నను పొందుకోండి, మరది పరిశుద్ధ మత్తయిలో, ఇరవై-…25వ అధ్యాయములో కనుగొనబడుతుంది. ఇప్పుడు మనము…ఇప్పుడు, నేను వీటిని అసలు అధ్యయనం చేయలేదు, అక్కడ ఆ వెనుక ఉన్నప్పుడు కేవలం వీటిని చూశాను, మరియు ఎలాగని నాకు—నాకు తెలిసినంత శ్రేష్ఠముగా వాటిని పరిశీలించడానికి ప్రయత్నించాను. మరియు నా…మనం దానిని అధ్యయనం చేస్తుండగా, మీరు నాతోపాటు మీ బైబిళ్ళలో తీయండి. ఇప్పుడు, నేను దీనిని గ్రీకు భాషా నిఘంటువు నుండి కూడా తీయగోరుచున్నాను, తద్వారా అది అసలైనదానిలో ఎలాగున్నదో మీకు తెలియుటకైయున్నది. మరియు నాకు—నాకు అది ఇష్టము. కాబట్టి పిదప మనం దానిని ఆ రెండిటిలో—ఆ రెండిటిలో—ఆ గ్రీకులో మరియు ఆ వేరొకదానిలో చూస్తాము. మరియు ఇప్పుడు ఇది—ఒక విధంగా నెమ్మదిగా, మరియు అధ్యయనంలాగా ఉంటుంది, ఎందుకనగా నేను వాటిని కనుగొన్న చోటల్లా లేఖనములను తెరచి మరియు వాటిని తీసుకొని, మరియు వాటిని వాటి స్థానములో పెట్టవలసియున్నాను. మంచిది.
19 ఇప్పుడు, అధ్యయనం చేయడానికి ఎవరికైనా బైబిలు కావాలా? మీకు కావాలంటే, మీ చేతిని పైకెత్తండి. మరియు మా…మా వద్ద ఈ వెనుక మూడు లేదా నాలుగు ఉన్నాయి. మీరు లేఖనము వెంబడి అధ్యయనం చేయగోరినట్లైతే, మంచిది. సహోదరుడా కాక్స్, నీవు ఇక్కడికి వచ్చి మరియు నాకు ఈ బైబిళ్ళను అందిస్తావా? మరియు అది—అది మీకు మంచిది, మీరు చేయగలిగితే, ఆ…(ఇదిగో ఒకటి, మరియు మీకు—మీకు కావాలంటే, వాటన్నిటినీ మీరు క్రిందకు తీసుకెళ్ళండి). మరియు ఎవరికైనా ఒకటి కావాలంటే, కేవలం మీ చేయి పైకెత్తండి, ఆ అబ్బాయి నేరుగా వాటిని మీ దగ్గరికి తీసుకువస్తాడు, చూడండి. మరియు మనం కలిసి వీటిని అధ్యయనం చేయాలనుకుంటున్నాము, మరియు కేవలం…
20 ఇప్పుడు, ఈ పఠనములో మరియు చివరి అధ్యాయములు…హెబ్రీ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయములు. ఉపదేశము ఇవ్వబడిన తర్వాత, మరి అవును, వీటిని, ఈ అంశములను రికార్డు చేసిన ఆ అబ్బాయి, సహోదరుడు మెర్సియర్ మరియు సహోదరుడు గోడ్, వాటిని తీసుకొని మరియు ఇప్పుడు వాటిని పుస్తక రూపములో ప్రచురించడానికి సిద్ధము చేస్తున్నారు. మరియు వారు వాటిని కలిగియున్నారు. ఇప్పుడు…మనం వాటిని ఇంకా సగం కూడా పరిశీలించలేదు, మనం పైపైన మాత్రమే చూశాము. మరియు వారు వాటికి పేరు పెట్టి…మరియు వాటినుండి ఆ—ఆ ఆణిముత్యాలను బయటకు తీసి…మరియు ఆ ఆణిముత్యాలను, కేవలం హెబ్రీ బోధనలోని కొన్ని ఆణిముత్యాలను తీసుకొని మెరుగుదిద్దుతున్నారని నేను అనుకుంటున్నాను. సహోదరుడు మెర్సియర్, అతిత్వరలో, వాటిని ముద్రణ రూపములో అందుబాటులో కలిగియుంటాడు, కావాలనుకునేవారి కొరకు చెప్తున్నాను.
21 ఇప్పుడు ఇది ఇక్కడ, ఇది తీసుకొనివస్తుంది…మీరు కేవలం అలా పూర్తి చేయలేరు…ఒక సువార్తిక సంఘములో, మరి ఇది ఒక సువార్తిక సంఘమైయున్నది. అనేకమంది ప్రజలకు అనుమానములను మరియు ఆలోచనలను పుట్టించకుండా మీరు ఒక—ఒక ఉపదేశమును పూర్తిచేయలేరు. మీరు అలా చేయవలసిందే. ఇప్పుడు, నేను ఒక ఉపదేశకుడిని కాదు, బైబిలు విశ్లేషకుడిని అసలే కాదు. కానీ నేను ఒక విషయము గురించి మొదటిగా—మొదటిగా నాకు సాధ్యమైనంత శ్రేష్ఠమైనదానిని అడగడానికి లేదా కనుగొనడానికిముందు, నేను దానిని చెప్పడానికైనా లేదా కనీసం చేయడానికైనా ఎన్నడూ ప్రయత్నించను.
22 నిన్న రాత్రి, ఒక ప్రియమైన సహోదరుడు నన్ను అడిగాడు, అతడు ఇట్లన్నాడు, “బ్రెన్హామ్ సహోదరుడా, నిన్ను నీవు—నీవు ఎక్కడ కూడా ఇరుకులోపడే స్థితిలో ఉంచుకోవని సహోదరుడు సీవార్డ్ చెప్పాడు. చూడు, దానినుండి బయట పడటానికి లేదా దానికి దూరంగా వెళ్ళడానికి నీవు ఎల్లప్పుడూ ఏదో ఒక మార్గమును కలిగియుంటావని చెప్పాడు.”
23 నేను ఇట్లు చెప్పాను, “మంచిది, దానికి కారణము ఏమిటంటే, నేను ఏదైనా చేయడానికిముందు, నేను ఎల్లప్పుడూ ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. చూశారా? మరియు పిదప ప్రజలు నన్ను అడిగితే, అప్పుడు నేను వారికి నా తలంపులు ఏమిటో చెప్పగలుగుతాను. చూశారా?” కానీ అది మీరు సరిగ్గా ఆలోచించినప్పుడేయై యున్నది. మరియు మీరు దేనినైనా చేయడానికిముందు, మీరు ఏమి చేయాలని దేవుడు కోరుతాడో మీరు ఆ పక్షమును తీసుకోడానికి ప్రయత్నించండి, అప్పుడు మిమ్మల్ని ఇరుకున పెట్టడం కష్టమవుతుంది.
24 ఆహాబు ఏలీయాను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన ఆ—ఆ సమయమును మీరు ఊహించలేరు. పరిసయ్యులు యేసును ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన సమయమును మీరు ఊహించగలరా? చూడండి, ఆయన—ఆయన వెంటనే జవాబును కలిగియున్నాడు, ఎందుకనగా ఆయన చేసిన ప్రతీది, ఆయన దానిని దేవుని చిత్తము ద్వారా చేశాడు, మరియు ఆయన…ఆయన—ఆయన ఆ విధంగానే దానిని పొందుకోగలడు. ఇప్పుడు, దీనిలో మనం దానిని అలాగే పొందగోరుచున్నాము.
ఇప్పుడు ప్రశ్న అడుగబడినది, మనం ఆ ప్రశ్నను కొనసాగించుదాము:
మత్తయి 25:46లో “యుగయుగముల శిక్ష” అనేదానికి అర్థమేమిటో వివరించండి. [తెలుగు బైబిలులో నిత్యశిక్ష అని వాడబడినది.—తర్జుమాదారుడు.]
25 ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రతియొక్కరూ, మత్తయి 25:46:
మరియు వీరు యుగయుగముల శిక్షకు పోవుదురు:… [తెలుగు బైబిలులో నిత్యశిక్ష అని వాడబడినది.—తర్జుమాదారుడు.]
26 ఇప్పుడు, ప్రశ్న ఏమిటనగా, “ఏమిటి…వివరించండి…” ఇప్పుడు యుగయుగములు అనే పదము “ఎప్పటికీ మరియు ఎప్పటికీ” అనే పదమునుండి వచ్చినది, మరియు ఎప్పటికీ అనేది “ఒక కాల వ్యవధియైయున్నది.” ఎప్పటికీ అనేదాని లాగానే “ఇంత సమయము,” అని మాత్రమే దాని అర్థమైయున్నది. ఇప్పుడు మీరు గనుక చదివితే…ఆ ప్రశ్నలను ఎవరు వ్రాశారో నాకు తెలియదు, ఎందుకనగా ఎవ్వరూ వాటి మీద తమ పేరును వ్రాయలేదు; వాటిని వ్రాయవలసిన అవసరంలేదు, నేను వాటిని కోరడంలేదు, చూడండి.
అయితే వీరు యుగయుగముల శిక్షకు పోవుదురు:…(ఇప్పుడు గమనించండి, వారు దుష్టులైయున్నారు.)
27 ఇప్పుడు, ఈ ప్రశ్నను అడిగిన ప్రియమైన—ప్రియమైన వ్యక్తి, కేవలం ఆ మిగతా భాగాన్ని చదవండి:
…అయితే నీతిమంతులు నిత్యజీవమునకు పోవుదురు.
28 దుష్టులు యుగయుగముల శిక్షలోనికి పోవుదురు (ఒక నిర్ణీత కాలమైయున్నది), అయితే నీతిమంతులు నిత్యజీవమును కలిగియుంటారు. మీరు ఎన్నడూ నిత్యమైన శిక్షను కనుగొనలేరు, అది ఉండజాలదు. చూడండి, వారు నిత్యశిక్షను పొందినట్లైతే, వారు నిత్యజీవమును పొందినట్లే; వారు నిత్యజీవమును పొందారంటే, వారు రక్షించబడినట్లే. చూడండి, అది అలా ఉండజాలదు. ఇప్పుడు మీరు గమనించినట్లైతే, ఆ—ఆ ప్రశ్న దానికదే జవాబును ఇస్తుంది. చూశారా?
మరియు ఈ…
ఇప్పుడు గమనించండి, నేను దానికి ముందునుండి చదువుతాను:
…మరియు వారు…
29 20వ…44వ వచనములో:
…మరియు వారు కూడా జవాబిచ్చి, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొనియుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, ఒక పరదేశివైయుండుటయైనను, దిగంబరివైయుండుటయైనను,…మరియు చెరసాలలో ఉండుటయైనను, చూసి నీకు పరిచర్య చేయకపోతిమి? అని ఆయనతో అన్నారు.
అప్పుడు—అప్పుడు ఆయన వారికి జవాబిచ్చి, ఇట్లన్నాడు, నిశ్చయంగా నేను మీతో చెప్పునదేమనగా, మీరు దానిని…మిక్కిలి అల్పులైన ఈ చిన్నవారిలో ఒకరికి చేసినారు గనుక, మీరు నాకు…దానిని చేసినట్లే.
మరియు వీరు యుగయుగముల (యుగయుగముల) శిక్షలోనికి పోవుదురు: (వారు దుష్టులైయున్నారు)…అయితే నీతిమంతులు నిత్యజీవములోనికి పోవుదురు.
30 తేడా గమనించారా? దుష్టులకు యుగయుగముల శిక్ష ఉంటుంది, అయితే యుగయుగములు అనేది “ఒక కాలపరిమితియైయున్నది.” ఇప్పుడు, అది ఒక్కటే అయినట్లైతే, అది ఇట్లు వ్రాయబడియుండేది, “మరియు వీరు యుగయుగముల శిక్షలోనికి పోవుదురు, ఆ ఇతరులు యుగయుగముల జీవములోనికి పోవుదురు.” చూశారా? లేదా ఇట్లుండేది, “వారు నిత్యశిక్షలోనికి, మరియు ఆ ఇతరులు నిత్యజీవములోనికి పోవుదురు.” చూడండి, ఎన్నటెన్నటికీ శిక్షించబడుటకు, ఒక నిత్యమైన శిక్ష అనేది ఉన్నట్లైతే, అప్పుడు ఒక నిత్యమైన…అతడు నిత్యజీవమును కలిగియున్నట్లే; మరియు ఉన్న ఒకేఒక్క నిత్యజీవము, మరది దేవుని యొద్దనుండే వస్తుంది. ఆరంభము లేని ప్రతిదానికి అంతము ఉండదు, ఆరంభమును కలిగియున్న ప్రతిదానికి అంతము ఉంటుంది. నా భావమేమిటో చూస్తున్నారా?
31 ఇప్పుడు, ఆ—ఆ ప్రియమైన వ్యక్తి జవాబిచ్చిన లేఖనము దానికదే…ఇప్పుడు మీరు దానిని నిఘంటువులో తీసుకున్నట్లైతే, “మరియు వీరు ఏయినన్ లోనికి పోవుదురు, తొలగించబడి, మరియు యుగ-…మరియు అగ్నిలోనికి, అగ్నిగుండములోనికి వెళ్ళుదురు.” ఇప్పుడు, a-i-n-i-o-n అనే పదమునకు “శిక్షాకాల వ్యవధి” అని అర్థము. గ్రీకు నిఘంటువులో, సరిగ్గా ఇక్కడ, “శిక్షాకాల వ్యవధి,” లేదా, “శిక్షా కాలము” అని ఉన్నది. చూడండి, “వారు ఒక శిక్షా కాలములోనికి పోవుదురు.” వాడబడిన పదము, a-i-n-i-o-n అయ్యున్నది. ఏయాన్, అనగా “కాలములు, ఒక కాలము, ఒక పరిమితిగల కాలము” అని అర్థము. పిదప దానిని తిరిగి ఇక్కడ ఆ—ఆ అనువాదములో, ఇంగ్లీషులో దానిని తీసుకోండి, ఎవర్ లాస్టింగ్ అనేది “పరిమితిగల కాలమైయున్నది.” చూడండి, అది గ్రీకు భాష నుండి వచ్చినది, “ఒక పరిమితిగల కాలము.” ఏయాన్ అనే పదము, లేదా a-i-n-i-o-n, ఏయాన్ అనగా “ఒక పరిమితిగల శిక్షా కాలము” అని అర్థము.
32 అయితే పిదప మిగతావారి గురించి చదవండి, “అయితే వీరు నిత్యమైనదానిలోనికి పోవుదురు.” అది భిన్నమైనది. చూడండి, నిత్యజీవము. నిత్యమైన అనేది “నిత్యత్వము” అనే పదము నుండి వచ్చినది, మరియు నిత్యత్వమునకు ఆదియైనను అంతమైనను లేదు. అది ఎన్నటెన్నటికీ ఉంటుంది. ఇప్పుడు అదే దానికి తప్పక జవాబు ఇవ్వవలసియున్నది, చూడండి, ఎందుకంటే మీరు కేవలం లేఖనమును చాలా జాగ్రత్తగా చదివితే, మీరు చూస్తారు.
33 “మరియు వీరు యుగయుగముల శిక్షలోనికి పోవుదురు, కానీ నీతిమంతులు…” దుష్టులు యుగయుగముల శిక్షలోనికి వెళ్తారు, ఒక కాల వ్యవధి వరకు శిక్షించబడతారు; బహుశా ఒక బిలియన్ సంవత్సరాలు కావచ్చును, నాకు తెలియదు, కానీ మీ పాపముల నిమిత్తము మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు. అయితే పాపమునకు ఎంత నిశ్చయంగా ప్రారంభము ఉన్నదో, అంతే నిశ్చయంగా పాపమునకు అంతము ఉన్నది. శిక్షకు ఒక ఆరంభమున్నది, మరియు శిక్షకు ఒక అంతమున్నది. మరియు నరకము అపవాది కొరకు మరియు వాని దూతల కొరకు సృష్టించబడినది. చూశారా? మంచిది. ఇప్పుడు, దీనికి సంబంధించినదై నేను జవాబునివ్వవలసిన వేరొక ప్రశ్నను నేను ఇక్కడ కలిగియున్నాను, కేవలం కొద్ది నిమిషాలలో అక్కడికి వస్తాను, మరది ఒక అందమైన ప్రశ్నయైయున్నది, దీనిలోకి ముడివేయబడియున్నది.
ఇప్పుడు, అయితే ఇక్కడున్న వీటిని చూద్దాము: “అయితే రాజ్యసంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు,” అది దేవుని మనస్సులో నుండి వారిని బయటకు త్రోసివేయడం వంటిదేనా?
34 కాదు, అది అటువంటిది కాదు. ఇప్పుడు, నీవు ఇక్కడ పెండ్లివిందు గురించి ప్రస్తావిస్తున్నావు. ఇప్పుడు, “మరియు రాజ్యసంబంధులు,” అని మనకు ఇక్కడ ప్రశ్న వేయబడినట్లుగా. రాజ్యసంబంధులు యూదులైయున్నారు, మరియు వారు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడ్డారు. మరియు వారు—వారు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడ్డారు, మరియు వారు ఏడ్పు మరియు రోదన మరియు పండ్లు కొరుకు సమయముగుండా వెళ్ళారు. మీకు మరియు నాకు పశ్చాత్తాపడే సమయము ఇవ్వబడటానికి వారు వెలుపటి చీకటిలోనికి పడద్రోయబడ్డారు, కానీ వారు దేవునియొక్క మనస్సులో నుండి ఎన్నడూ త్రోసివేయబడలేదు. ఆయన ఇశ్రాయేలును ఎన్నడూ మరువడు. మరియు ఇశ్రాయేలు, ఏ బైబిలు పాఠకుడైనా ఎరిగియున్నట్లుగా, వారు “రాజ్యసంబంధులు” అని ప్రస్తావించబడ్డారు. చూడండి, అది రాజ్యమైయున్నది, వాగ్దానమైయున్నది. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు ఇశ్రాయేలీయులతో వ్యవహరించినప్పుడు, ఆయన దేశముతో వ్యవహరిస్తున్నాడు, మరి వారు రాజ్యసంబంధులైయున్నారు.
35 ఇప్పుడు, ఒక చోట, “అబ్రాహాము మరియు ఇస్సాకు మరియు యాకోబులు,” మీకు గుర్తున్నదా, “వచ్చి అంత్యకాలములో రాజ్యములో కూర్చుంటారు,” అని ఆయన అక్కడ చెప్పాడు. చూడండి, మరియు ఆ అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులు రాజ్యములో ఉంటారు; వారు, వారు రాజ్యమును దీవించు ప్రజలైయున్నారు. అయితే రాజ్యసంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు.
36 ఇప్పుడు, పెండ్లి కుమారుని గురించి చెప్పబడిన చోటనుండి ఈ ప్రస్తావన వస్తుంది. పెండ్లికుమారుడు వచ్చినప్పుడు, వారు ఇంకను…ఐదుగురు కన్యకలు ప్రభువును ఎదుర్కొనుటకు బయటకు వెళ్ళారు, మరియు—మరియు వారు తమ దివిటీలో ఎటువంటి నూనెను తీసుకొనిపోలేదు. మరి ఆ—ఆ మిగతా ఐదుగురు తమ దివిటీలో నూనెను తీసుకొనిపోయారు. ఇప్పుడు, మీరు గమనించినట్లైతే, త్రోసివేయబడినవారిగా, యూదులు మరియు అన్యజనులు ఇరువురి విషయంలో, అది ఒక అందమైన చిత్రమైయున్నది. ఎల్లప్పుడూ, మూడు తరగతుల ప్రజలు ఉన్నారన్నది మనస్సులో ఉంచుకోండి: యూదులు, అన్యులు (నామకార్థమైనవారు),…; యూదులు, అన్యజనులు మరియు సంఘము. మీరు వాటిని కలగలుపు చేసినట్లైతే, మీరు ప్రకటన గ్రంథమును తాకినప్పుడు, మీరు నిశ్చయంగా సమస్యలో పడతారు. ఏలయనగా మీరు అలా చేయకపోతే…
37 ఒకసారి మిస్టర్. బోహానన్ నాతో చెప్పినట్లుగానే ఉన్నది, ఇట్లన్నాడు, “బిల్లీ, ప్రకటన గ్రంథమును చదవడానికి ప్రయత్నించే ఎవరికైనా పీడకలలు వస్తుంటాయి. ఏంటీ,” అతడు ఇంకా ఇట్లన్నాడు, “ఇదిగో దిగువున ఇక్కడ భూమి మీద ఒక వధువు ఉన్నది, మరియు ఆమెతో యుద్ధము చేయడానికి ఆ—ఆ ఘటసర్పము దాని నోటి నుండి నీళ్ళను వెళ్ళగ్రక్కుచున్నది.” మరియు ఇట్లన్నాడు, “పిదప ఆ సమయములోనే వధువు ఒక లక్షా నలభై-నాలుగువేల మందిగా” (యెహోవా సాక్షుల సిద్ధాంతము) “సీనాయి కొండమీద నిలబడియున్నది. మరి అదే సమయములో వధువు పరలోకములో ఉన్నది.” కాదు, కాదు, నీవు పొరబడ్డావు.
38 మూడు తరగతుల ప్రజలు ఉన్నారు. చూడండి, వారు, త్రోసివేయబడిన యూదులు, మరియు అక్కడ నిద్రిస్తున్న కన్యక ఉన్నది మరి ఆ నీళ్ళు…ఆ ఘటసర్పము నీళ్ళు వెళ్ళగ్రక్కుచున్నది, స్త్రీ సంతానము మీద కాదు, అది స్త్రీ సంతానములోని శేషము మీదనైయున్నది…ప్రకటన 11. మరియు పిదప, వాస్తవానికి, ఆ ఒక లక్ష నలభై-నాలుగు వేలమంది యూదులు ఖచ్చితంగా వధువు కాదు, వారు యూదా సంఘముయొక్క శేషమైయున్నారు. మరియు వారిని వధువుగా భావించే యెహోవా సాక్షి సిద్ధాంతపువారు, మీరు దానిని ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థం కావడంలేదు, ఎందుకంటే, వారు వధువు కానే కాదు.
39 మీరు గనుక అక్కడ ప్రకటన గ్రంథములో గమనించినట్లైతే, “వారు కన్యకలు,” అని అది చెప్పబడినది. మరియు వారు నపుంసకులు. మరియు ఒక నపుంసకుడు అనగా ఏమిటి? వారు…రాణికి కాపలాగా ఉండే కాపలాదారులైయున్నారు, ఎందుకనగా వారు…ఆ-…వారు సంతానోత్పత్తి సామర్థ్యము తీసివేయబడిన పురుషులైయున్నారు. వారు…“వారు స్త్రీలతో తమనుతాము అపవిత్రపరచుకోలేదు,” అని చెప్పబడుటను, మీరు గమనించారా? వారు ఆలయపు నపుంసకులైయున్నారు. మరియు అది దేవుడు యూదులలోనుండి ఏర్పరచుకొని బయటకు తీసినట్టి ఎన్నుకోబడిన సంఖ్యయైయున్నది. ఇప్పుడు, మీరు గమనించినట్లైతే…మనము గనుక ఒక్క క్షణము దానిని పొందగలిగితే చాలు, తద్వారా అది ఒక విధంగా దానిని మీ మనస్సులో స్థిరపరుస్తుంది, తద్వారా మీరు నిజంగా…
40 మనము ప్రకటన 7వ అధ్యాయము, తీసుకుందాము, మరియు అది ఈ విధంగా చెప్పినదగ్గర…మనము ఇక్కడ కనుగొంటాము. అది ఒక అందమైన విషయం:
మరియు దీని తరువాత…భూమియొక్క నాలుగు మూలలలో నలుగురు దేవదూతలు నిలిచియుండుటను నేను చూచితిని,…(ఇప్పుడు, ఇది యెహెజ్కేలు 9వ అధ్యాయమునకు సమాంతరంగా ఉన్నది, అక్కడ అతడు యూదుల నాశనములను చూశాడు. మరియు ఇక్కడ అతడు అన్యజనుల నాశనములను చూస్తాడు, ప్రకటన 7వ అధ్యాయము)…మరియు భూమియొక్క నాలుగు మూలలలో నలుగురు దేవదూతలు నిలబడి, భూమి మీదనైనను, సముద్రము మీదనైనను,…లేదా ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు (గాలి అనగా “యుద్ధము మరియు కలహమైయున్నది”) వాయువులను పట్టుకొనియుండుట నేను చూచితిని. (మరి అది, యుద్ధమును “ఆపుటయైయున్నది”)
41 ఓ, ఈ ప్రశ్న మీద వివరంగా చెప్పుకోడానికి మనకు సమయముంటే బాగుండేది. అది జరిగినది…అక్కడే రస్సెల్ గందరగోళంలో పడ్డాడు. ఇది జరగడం చూసి, రస్సెల్ ఇట్లు ప్రవచించాడు. అది—అది సంఘము ముద్రించబడటం అని ఎరుగక, “అది ప్రభువైన యేసుయొక్క రాకడయై యుంటుంది,” అని అతడు ప్రవచించాడు. చూశారా?
42 మరియు ప్రపంచ యుద్ధము…మొదటి ప్రపంచ యుద్ధము గురించి వారు ఆశ్చర్యపోతుంటారు. చూడండి, అది నవంబరు పదకొండువ తేదీన, దినములోని పదకొండవ ఘడియలో ఆగిపోయినది; పదకొండవ నెల, పదకొండవ రోజు, మరియు పదకొండవ గంట. మరియు అది జరిగిన వెంటనే, యేసు నామములో నీటి బాప్తిస్మము బయలుపరచబడినది మరియు సంఘమునకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము బయలుపరచబడినది. సరిగ్గా, అది జరిగిన వెంటనేయైయున్నది.
43 మీరు దానిని ప్రకటన గ్రంథములో తీసుకున్నట్లైతే, మనము దానిని ఏ విధంగా ముడివేశాము కదా, మరియు ఫిలదెల్ఫియా మరియు లవొదికయ కాలము మధ్యనైయున్నది. మరియు మెథడిస్టులు ఫిలదెల్ఫియా కాలమును కలిగియున్నారు, సహోదర ప్రేమ. మరియు చివరి కాలము, సంఘకాలము, లవొదికయ కాలమైయున్నది, అది నులివెచ్చని కాలమైయున్నది. మరియు అక్కడ ఆయన ఇట్లు చెప్పాడు, “నేను మీ ముందు ఒక ద్వారమును (తెరవబడిన ద్వారమును) ఉంచాను.” ఒక తెరవబడిన ద్వారము! మరియు మీరు గనుక తిరిగి ఆ లేఖనములను చూసినట్లైతే, మీకు సరిగ్గా చూపించడానికి, అది అక్కడ పూర్తి వర్తమానమును నేరుగా ఒక్క చోటకే ముడివేస్తుంది.
44 గమనించండి! ఇక్కడ బాప్తిస్మములో, సమస్తము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా చెప్పబడినది, (మరి మనం నేరుగా దానిలోనికి వెళ్ళనైయున్నాము) అది ఖచ్చితంగా ఒక క్యాథలిక్ మతసిద్ధాంతమే గాని ఒక క్రైస్తవ బోధన ఎన్నడూ కాదు. లేదు, అయ్యా. నేను కేవలం…ఈ రాత్రి, దానిలోనికి వచ్చుటకు, మనం దానిని సరిగ్గా ఇక్కడ కలిగియున్నాము; భాషా నిఘంటువుతో కూడా, ఉన్నాము. చూశారా? అవును, అయ్యా, మరియు చరిత్రతో కూడా ఉన్నాము. బైబిలు గ్రంథములోనైనా, లేదా బైబిలు గ్రంథము తర్వాత మొదటి ఆరు వందల సంవత్సరాలలో అయినా, ఎవ్వరికీ ఆ విధంగా ఎన్నడూ బాప్తిస్మము ఇవ్వబడలేదు. మరియు నేను క్యాథలిక్కుల స్వంత సిద్ధాంతము ద్వారానే సరిగ్గా ఇక్కడ దానిని, దానిని మొదలుపెట్టింది వారేనని, చిలకరించుటను మరియు కుమ్మరించుటను మొదలుపెట్టింది వారేనని ఋజువు చేయగలను.
45 వారు అక్కడనుండి బయటకు వచ్చి వెస్లీ సంఘములోనికి, మరియు మెథడిస్టు సంఘములోనికి వచ్చారు, మెథడిస్టు దానిని బాప్టిస్టు యొద్దకు తెచ్చినది, బాప్టిస్టు దానిని ఇంకా ముందుకు తెచ్చినది, మరియు అది ఇంకనూ ఒక తప్పుడు సిద్ధాంతమైయున్నది! మరియు తిరిగి బైబిలులోనికి వచ్చి మరియు “నీవు జీవించుచున్నావను పేరును కలిగియున్నావు గాని, నీవు మృతుడవే” అని బైబిలు గ్రంథము చెప్పిందని మీకు ఋజువు చేయగలను. అది ఖచ్చితముగా నిజము. మరియు వారు…
46 అంధకార యుగమువరకు బాప్తిస్మములో వారు ఆయన నామమును వాడతారని బైబిలు గ్రంథము బోధించినదని నేను ఋజువు చేయగలను, ఆ—ఆ సంఘకాలములోని…ఆ—ఆ నాలుగవ కాలము వరకైయున్నది, ఆ పెర్గమ సంఘకాలము. మరియు ఆయన ఇట్లు చెప్పాడు, ఆ పదిహేను వందల సంవత్సరాల అంధకార యుగముల వ్యవధిలో, ప్రతిదానిలో, ఇట్లన్నాడు, “నీవు కొంచెము వెలుగును కలిగియున్నావు, ఎందుకనగా నీవు నా నామమును నిరాకరించలేదు.”
47 అయితే అక్కడ ఆ వేరే కాలమునకు, ఆ క్యాథలిక్ కాలమునొద్దకు వచ్చినప్పుడు మాత్రం, ఆయన ఇట్లన్నాడు, “నీకు ‘జీవించుచున్నావన్న’ పేరు మాత్రమున్నది గాని, నీవు మృతుడవే! మరియు నీవు నా నామమును నిరాకరించితివి.” విషయం అదేయైయున్నది. చూశారా? అదంతయూ కేవలం ఒక పెద్ద అందమైన దృశ్యమును, సంపూర్ణ బైబిలును కలిపి ముడివేస్తుంది.
48 ఇప్పుడు దీనిని గమనించండి:
…నాలుగు వాయువులను పట్టుకొని…
మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత, పరలోకము నుండి పైకి వచ్చి:…(ముద్ర)
49 ఇప్పుడు, సజీవుడగు దేవుని ముద్ర ఏమిటి? ఇప్పుడు, అడ్వెంట్ సహోదరులైన మీరు, “సబ్బాతును ఆచరించడం” అని చెప్తారు. మీరు నాకు దానిని లేఖనములో చూపించాలని నేను కోరుతున్నాను. అది అక్కడ లేదు. ఒక్క చోట కూడా అది…ముద్రగా లేదు…
50 మీరు గనుక ఎఫెసీ 4:30 ను చదివితే, వెంటనే, సజీవుడగు దేవుని ముద్ర ఏమిటో మీరు కనుగొంటారు. ఎఫెసీ 4:30 ఇట్లు చెప్తున్నది, “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి మీ విమోచనా దినము వరకు మీరు ఆయనయందు ముద్రించబడియున్నారు.” తదుపరి ఉజ్జీవము వరకు కాదు, కానీ అది నిత్య భద్రతను కలిగియున్నది (హ-హ). “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి మీ విమోచనా దినము వరకు మీరు ఆయనయందు ముద్రించబడియున్నారు.” ఎఫెసీ 4:30 దానిని చెప్పడంలేదేమో చూడండి, పిదప, మీ ఉపాంత పఠనాలను తీసుకొని మరియు ఆ మిగతా అన్నిటినీ అక్కడున్న లేఖనములతో సరిచూడండి, మరియు కనుగొనండి. ఇప్పుడు, “మీ విమోచనా దినము వరకు ముద్రించబడియున్నారు. సజీవుడగు దేవుని ముద్రను కలిగియున్నారు.”
51 ఇప్పుడు గుర్తుంచుకోండి, మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత వరకు కూడా పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ బాప్తిస్మముగా బోధించబడలేదు. మనం ఈ మధ్యనే మన—మన సువర్ణోత్సవమును, నలభై సంవత్సరములను, లేదా నలభై ఏండ్ల సునాద సంవత్సరమును జరుపుకున్నాము.
…భూమికి లేదా సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో, ఇతడు,
మేము దాసులను ముద్రించువరకు, భూమికైనను, సముద్రమునకైనను, లేదా ఏ చెట్టుకైనను, హాని చేయవద్దని…(ఇప్పుడు మీరు మీ ప్రశ్న దగ్గరకు వస్తున్నారు, “పిల్లలు,” చూడండి)…మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించువరకు హానీ చేయవద్దని బిగ్గరగా చెప్పెను. (హానిచేయవద్దు, భూమిని నాశనము చేయవద్దు, ఒక అణుబాంబును పేలనీయవద్దు, మా దేవుని దాసులు ముద్రించబడేవరకు పూర్తిగా నాశనము చేయకండి)
52 ఇప్పుడు, మనము గనుక దానిని వెనుకకు తీసుకెళ్ళి మరియు అక్కడ చూడగలిగితే చాలు, ద డిక్లైన్ ఆఫ్ ద వరల్డ్స్ వార్ లో కూడా, రెండవ సంపుటిలో చూడవచ్చు, జనరల్ ఆలెన్బీ తాను యెరూషలేము సరిహద్దులను తాకేవరకు పోరాడినప్పుడు, మరియు అతడు ఇంగ్లాండు రాజుకు టెలిగ్రాఫ్ ద్వారా సమాచారం పంపి, మరియు ఇట్లన్నాడు, “ఆ పట్టణముయొక్క పరిశుద్ధతను బట్టి, నేను దాని మీద కాల్పులు జరుపగోరడంలేదు.” అతడు ఇట్లన్నాడు, “నేనేమి చేయాలి?”
53 అతడు ఇట్లు చెప్పాడు, “ప్రార్థించు.”
54 మరియు అతడు మరలా అక్కడికి ప్రయాణమై వెళ్ళాడు, మరియు వారు అలా వెళ్ళినప్పుడు, “ఆలెన్బీ వస్తున్నాడు,” అని వారన్నారు. మరి అక్కడ మహమ్మదీయులు ఉన్నారు, అతడు “అల్లా వస్తున్నాడు,” అని చెప్పాడని వారు అనుకున్నారు. మరియు వారు తెల్లని జెండాను ఎగురవేసి లొంగిపోయారు మరియు ఆలెన్బీ యెరూషలేములోనికి కవాతు చేస్తూ వెళ్ళి మరియు ప్రవచనముల ప్రకారంగా, ఒక్క బుల్లెట్టును కూడా పేల్చకుండా దానిని స్వాధీనం చేసుకున్నాడు, అది నిజము, మరియు దానిని తిరిగి యూదులకు అప్పగించాడు.
55 పిదప యూదులను హింసించడానికి వారు ఒక హిట్లర్ ను లేపారు, మరి ప్రపంచమంతటి నుండి, మరి వారిని తిరిగి అక్కడికి పంపించారు.
56 మరియు ఆయన “పక్షిరాజు రెక్కల మీద వారిని తిరిగి తెస్తాడని” బైబిలు గ్రంథము చెప్పినది. మరియు వారు తిరిగి రావడం మొదలుపెట్టినప్పుడు…ద లైఫ్ మ్యాగజీన్ మరియు మొదలగునవి కొన్ని వారల క్రితమే దాని గురించి ప్రచురించినవి, మరి అది వారిని వేలకొలదిమందిని, తిరిగి యెరూషలేమునకు తీసుకొచ్చినదాని గురించైయున్నది, మరియు వారు ఆ వృద్ధులను వారి వీపు మీద మోసుకొనిరావడానికి వెళ్ళారు. వారిని ఇంటర్వ్యూ చేశారు. నా దగ్గర ఆ వీడియోలు మరియు ఫోటోలు అన్నీ ఉన్నాయి. మరియు అతడు ఇట్లన్నాడు…అక్కడ దావీదుయొక్క నాలుగు-నక్షత్రాల జెండా వ్రేలాడదీయబడియున్నది; అది ప్రపంచములోనే అతి పురాతనమైన జెండా అయ్యున్నది, రెండువేల సంవత్సరాలలో మొదటిసారి ఎగురవేయబడినది.
57 యేసు ఇట్లు చెప్పాడు, “అంజూరపు చెట్టు చిగురించినప్పుడు, ఈ తరము గతించదు.”
58 మరి ఇదిగో వారు ఆ వృద్ధులను లోపలికి తీసుకువస్తున్నారు, మరియు, “ఏంటీ? స్వదేశములో చనిపోవడానికి మీరు తిరిగి వస్తున్నారా?” అని అడిగారు.
59 అందుకు ఇట్లు జవాబునిచ్చారు, “లేదు, మేము మెస్సీయాను చూడటానికి వచ్చాము.”
60 మరియు, సహోదరుడా, నేను మీతో చెప్తున్నాను, మనము అత్యంత సమీపములో ఉన్నాము! అదిగో అక్కడ వేచియున్న వారే, వారే ఆ దాసులైయున్నారు. వారికి వీలైతే మీ పెట్టుడుపళ్ళ విషయంలో కూడా మిమ్మల్ని మోసం చేసే ఈ యూదులు కాదు, ఆయన మాట్లాడుచున్నది ఆ యూదుల గురించి కాదు. కానీ అది ఆ దిగువున ధర్మశాస్త్రమును మరియు అటువంటివాటిని పాటించి, మరియు ఒక మెస్సీయా ఉన్నాడనే విషయం కూడా తెలియనివారి గురించైయున్నది.
61 మరియు సహోదరుడు…స్టాక్‌హోమ్ వద్ద, సహోదరుడు పెత్రస్, వారికి పదిలక్షల క్రొత్త నిబంధన బైబిలులను పంపించాడు, మరియు వారు వాటిని పొందినప్పుడు, వారు వాటిని చదువుతున్నారు. వారు ఇట్లన్నారు, “సరి, ఈయనే మెస్సీయా అయితే, ఆయన ఒక ప్రవక్తయొక్క సూచనను చేయడం మమ్మల్ని చూడనివ్వండి, మరియు మేము ఆయనను నమ్ముతాము.”
62 నా పరిచర్యకు ఎలాంటి ఒక ఏర్పాటు! యెరూషలేము గుమ్మములకు, వాటిలోనికి వెళ్ళడానికి నేను రెండు గంటల దూరంలో ఉన్నాను, మరియు నేను, ఐగుప్తులోని కైరోలో ఉన్నాను. మరియు నేను అక్కడ నడుస్తూ ఉన్నాను, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పాడు, “ఇప్పుడు వెళ్ళవద్దు.”
63 నేను ఇట్లనుకున్నాను, “నేను కేవలం ఊహిస్తున్నాను. నా టిక్కెట్టు కొనబడినది, నేను నా దారిలో ఉన్నాను. నన్ను కలుసుకోడానికి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఆ గుంపువారంతా ఉన్నారు, పాఠశాలలు మరియు మొదలగునవి ఉన్నవి.”
64 నేను కొంచెం ముందుకు నడిచాను, మరియు ఆత్మ ఇట్లు చెప్పినది, “వెళ్ళవద్దు! నీవు వెళ్ళవద్దు.”
65 నేను టిక్కెట్ ఏజెంటు దగ్గరకు తిరిగి వెళ్ళి, ఇట్లు చెప్పాను, “నేను ఈ టిక్కెట్టును రద్దు చేస్తున్నాను. నేను గ్రీసులోని, ఏథెన్సులోని, మార్స్ హిల్ కు వెళ్ళగోరుతున్నాను.
66 మరియు అతడు ఇట్లన్నాడు, “మంచిది, అయ్యా, మీ టిక్కెట్టులో గమ్యము యెరూషలేము అని ఉంది.”
67 నేను ఇట్లన్నాను, “నేను యెరూషలేముకు వెళ్ళడానికి బదులు ఏథెన్సుకు వెళ్ళగోరుతున్నాను.” పరిశుద్ధాత్మ వేచియుంటున్నాడు, ఆ ఘడియ ఇంకనూ రాలేదు. అది అసలు సరి కాదు.
68 గమనించండి:
…మా దేవుని దాసులను వారి నొసటియందు ముద్రించువరకు,
మేము…మా దేవుని దాసుల నొసటిని ముద్రించువరకు భూమికైనను…హానిచేయవద్దని కేకవేసెను. (అది పరిశుద్ధాత్మయొక్క ముద్ర అని ఎవరికైనా తెలుసు; గమనించండి)
మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా నేను వింటిని:…(ఇప్పుడు, వారు యూదులు కాదంటే, దీనిని గమనించండి)…మరియు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు ఒక లక్ష నలువది-నాలుగు వేలమంది. (వారిలో ఒక్క అన్యుడు కూడా లేడు. అది అంత్యకాలములోయైయున్నది)
69 గమనించండి! యూదా గోత్రము, పన్నెండు వేలమంది; రూబేను గోత్రము, పండ్రెండు వేలమంది; మరియు ఇంకా అలాగే, గాదు, పన్నెండు వేలమంది; నఫ్తాలి, మరియు—మరియు—మరియు ఇంకా అలాగే ఆషేరు వరకును, మరియు—మరియు జెబూలూను వరకును, మరియు ఇశ్రాయేలుయొక్క ఈ పన్నెండు గోత్రములన్నిటిలో నుండియైయున్నది. మరియు పన్నెండును పన్నెండుతో హెచ్చవేస్తే ఎంత? లక్ష నలభై-నాలుగు వేలు. వారే లక్ష నలభై-నాలుగు వేలమంది, యూదులైయున్నారు! అన్యజనులు కాదు, యూదులు! దానితో వధువుకు ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి యెహోవా సాక్షులు వారి సిద్ధాంతము విషయంలో తప్పైయున్నారు. వారు “యూదులు” అని, మరియు అన్యజనులు కాదని బైబిలు స్పష్టంగా చెప్తున్నది. వారు దేవునియొక్క దాసులైయున్నారు, మరియు అన్యజనులు ఎన్నడూ ఒక దాసునిగా పరిగణించబడలేదు. మనము కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము, దాసులము కాదు.
70 ఇప్పుడు ఆ మిగిలిన దానిని చదవండి. పుచ్చకాయను తింటున్న ఆ వ్యక్తి, “అది బాగుంది, అయితే మనం దానిని ఇంకా ఎక్కువ తిందాము,” అని చెప్పినట్లుగా ఉన్నది. మంచిది, దేవుడు ఇక్కడ దానిని పుష్కలంగా కలిగియున్నాడు. ఇప్పుడు, కేవలం గమనించండి. ఇప్పుడు, మనం 8వ వచనములో ఉన్నాము:
మరియు జెబూలూను గోత్రములో…పన్నెండు వేలమంది ముద్రించబడ్డారు. యోసేపు గోత్రమంతటిలో పన్నెండు వేలమంది ముద్రించబడ్డారు. బెన్యామీను గోత్రములో పన్నెండు వేలమంది ముద్రించబడ్డారు.
71 చూడండి, యోహాను, ఒక యూదుడైయుండి, వారిలో ప్రతి ఒక్కరినీ గుర్తించాడు, ఇశ్రాయేలుయొక్క పన్నెండు గోత్రములను చూశాడు; ప్రతి గోత్రము నుండి పన్నెండు వేలమంది, పన్నెండును పన్నెండుతో హెచ్చవేస్తే ఒక లక్ష నలభై-నాలుగు వేలు అవుతుంది. అదిగో అది వారేయైయున్నారు, సంఘము కాదు, యూదులైయున్నారు. వారందరూ “ఇశ్రాయేలు పిల్లలని,” బైబిలు ఇక్కడ చెప్పినది, ప్రతీ గోత్రము పేర్కొనబడినది.
72 ఇప్పుడు గమనించండి, 9వ వచనము:
దీని తరువాత (ఇప్పుడు ఇక్కడ వధువు వస్తున్నది)…
దీని తరువాత నేను చూడగా,…ఇదిగో, ఎవడును లెక్కింపజాలని, ఒక గొప్ప సమూహము కనబడెను,…
73 వారేమో ఆలయపు నపుంసకులైయున్నారు, వారు ఒక లక్ష నలభై-నాలుగు వేలమంది మాత్రమే ఉన్నారు, కేవలం ఒక చిన్న భాగమైయున్నారు, వధువుతో ఉండబోవుచున్న ఒక చిన్న ఆలయపు కాపలాదారులైయున్నారు; కేవలం ఆమె—కేవలం ఆమెయొక్క రక్షణదళమైయున్నారు. ఒక లక్ష నలభై-నాలుగు వేలమంది అదేయైయున్నారు, వధువుయొక్క రక్షణదళమైయున్నారు; ఆలయపు నపుంసకులైయున్నారు.
74 గమనించండి! అవును, మీరు తిరిగి ఇక్కడ 14వ దాని దగ్గరకు వెళ్ళి, మరియు, “ఏంటీ, వధువు ఎక్కడికి వెళ్ళినా వారు ఆమెతో ఉన్నారు…” అని అంటారని నాకు తెలుసు. ఖచ్చితంగా! రాణి వెళ్ళిన చోటుకల్లా నపుంసకులు ఆమెతో ప్రయాణిస్తారు. నిజంగా! అయితే వారు ఏమైయున్నారు? వారు రక్షణదళం తప్ప ఇంకేమియు కారు, మరియు అది సరిగ్గా అదేనని లేఖనము ఇక్కడ ప్రకటిస్తున్నది.
75 గమనించండి:
మరియు దీని తరువాత…మరియు, ఇదిగో, ప్రతి జనములోనుండియు,…వంశములోనుండియు,…వంశములోనుండియు, మరియు ఆయా భాషలు మాట్లాడువారిలోనుండియు, ఎవడును లెక్కింపజాలని, ఒక పెద్ద సమూహము వచ్చి…(అదియే వస్తున్న మీ అన్య వధువైయున్నది, మంచిది)…వీరు…గొఱ్ఱెపిల్ల యెదుట నిలబడ్డారు, (అదిగో ఆయనే వారి రక్షకుడు, గొర్రెపిల్ల, ధర్మశాస్త్రము కాదు; గొర్రెపిల్ల, కృప)…తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై,…(గమనించండి, కొన్ని నిమిషములలో, తెల్లని వస్త్రములంటే పరిశుద్ధులయొక్క నీతి కాదేమో చూడండి)…మరియు ఖర్జూరమట్టలు చేతపట్టుకొని;
మరియు వారు మహాశబ్దముతో ఎలుగెత్తి కేకవేసి,…(ఇది గనుక ఒక పెంతెకొస్తు ఉజ్జీవము కాదంటే, నేనెన్నడూ ఒకదానిని విననట్లే)…ఇట్లన్నారు, సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము.
మరియు దేవదూతలందరును సింహాసనము చుట్టును, మరియు పెద్దల చుట్టును మరియు ఆ నాలుగు జీవుల చుట్టును నిలబడియుండిరి,…వారు ఆ…సింహాసనము యెదుట సాష్టాంగపడి, మరియు దేవుడిని ఆరాధించిరి,
ఆమేన్: యుగయుగముల వరకు మా దేవునికి, స్తోత్రమును,…మహిమయు,…జ్ఞానమును,…కృతజ్ఞతాస్తుతియు,…ఘనతయు,…బలమును, శక్తియు, కలుగును గాక అని చెప్పిరి. ఆమేన్.
76 అది ఒక శిబిరపు కూటము సమయమువలె ఉన్నది, కాదా? అలాగే ఉంటుంది! అది ఎవరు? లక్షా నలభై-నాలుగు వేలమందా? అస్సలు కాదు! ఏ మనుష్యుడును…ఈ గొప్ప సంఖ్యాకులు, ప్రతి వంశములోనుండి, ఆయా భాషలు మాట్లాడువారిలోనుండి మరియు ప్రతి జనములోనుండి వచ్చినవారు. నా ప్రియమైన స్నేహితుడా, నీవు దానిని చూడలేకపోతున్నావా?
77 ఇప్పుడు గమనించండి, కేవలం దానిని చదవండి. ఇప్పుడు:
మరియు పెద్దలలో ఒకడు జవాబునిచ్చి, నాతో ఇట్లన్నాడు, వీరు ఎవరు మరియు…తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? మరియు వీరు ఎక్కడనుండి వచ్చిరి?
78 ఆ లక్షా నలభై-నాలుగు వేలమందిని గుర్తించిన యూదుడైనట్టి యోహానుతో, ఆ పెద్ద చెప్పాడు, ఇట్లన్నాడు, “ఇప్పుడు, వారు నీకు తెలుసు, వారందరూ యూదులైయున్నారు. కానీ వీరెవరు? వీరు ఎక్కడనుండి వచ్చారు?” పెద్ద ఏమి చెప్పాడో చూశారా? “పెద్దలలో ఒకడు జవాబునిచ్చి,” (మరది సింహాసనము యెదుట ఉన్న పెద్దలైయున్నారు) “నాకు జవాబిచ్చాడు, ఇట్లన్నాడు, ‘తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరు ఎవరు? మరియు వీరు ఎక్కడనుండి వచ్చారు? ఇప్పుడు, యూదుల గురించి మరియు వారి నిబంధన మరియు మొదలగువాటి గురించి మనందరికీ తెలుసు, కానీ వీరు ఎప్పుడు వచ్చారు?’” ఇప్పుడు గమనించండి:
మరియు నేను అతనితో, అయ్యా, నీకే తెలియునని అన్నాను. (“నాకు—నాకు—నాకు తెలియదు,” యోహాను ఇట్లన్నాడు, “అది నా జ్ఞానముకు మించిన విషయమైయున్నది. నాకు తెలియదు.”) మరియు అతడు నాతో ఇట్లు చెప్పెను, వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు, (“పరీక్షలు మరియు ఈ అనేక ఆపదలు, శ్రమలు మరియు ఉచ్చులలోనుండి, నేను ఇదివరకే వచ్చేశాను.” చూశారా?)…వీరు మహా శ్రమలలోనుండి వచ్చి, మరియు తమ వస్త్రమును ఉదుకుకున్నారు,…(సంఘములోనా? అది సరియేనా?)…గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని, వాటిని తెల్లగా చేసికొనిరి.
…వారు దేవుని సింహాసనము యెదుట ఉండి, రాత్రింబగళ్ళు ఆయనను సేవించుచున్నారు…(నా ఇంటిలో నాకు ఎవరు సేవ చేస్తారు? నా భార్య. అది సరియేనా?)…మరియు ఆయన ఆలయములో:…(నా గృహములో మరియు నా ఇంటి వ్యవస్థలో నాతోపాటు నిలిచియుండేది ఆమెనేయైయున్నది, నా భార్యనేయైయున్నది. నాతోపాటు ఉంటూ, నా బట్టలను ఉతుకుతూ, నా కొరకు అన్నిటినీ సిద్ధం చేసి ఉంచేది ఆమెనేయైయున్నది)…మరియు సింహాసనము మీద ఆసీనుడైనవాడు వారి మధ్యన నివసించును. (ఓ, మై, వినండి!)
మరియు వారికి ఇకమీదట ఆకలి ఉండదు,…(వచ్చేటప్పుడు వారు కొన్ని భోజనములను తినకుండా వదిలేసినట్లు అగుపిస్తున్నది)…వారికి ఇకమీదట దాహమును ఉండదు; సూర్యుని ఎండయైనను, వడగాలియైనను వారికి తగులదు.
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారిని మేపును, మరియు జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును: మరియు దేవుడే వారి కన్నులనుండి…ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. (అదిగో అక్కడే ఆమె ఉన్నది, అక్కడే మీ వధువు ఉన్నది)
79 అక్కడే మీ లక్షా నలభై-నాలుగు వేలమంది ఉన్నారు, వారు దాసులైయున్నారు. కావున ఇక్కడ “రాజ్యపు పిల్లలు”, ఈ ప్రశ్నను అడిగిన ప్రియమైన వ్యక్తి, అది…ఈ గుర్తింపదగిన ప్రశ్నను అడిగినవారు. నేను దానిని వెనుక ఇక్కడ…ఎక్కడో ఒకదగ్గర విడిచిపెట్టియుంటానని నేను అనుకుంటున్నాను, అయితే “వారు పడద్రోయబడుదురు అన్నప్పుడు,” దాని అర్థం వారు దేవుని మనస్సునుండి పడద్రోయబడతారని కాదు. కొంత కాలమువరకు వారు ఆత్మసంబంధమైన లాభముల నుండి పడద్రోయబడతారు. చూడండి, కేవలం కొంత కాలమువరకు మాత్రమే.
80 ఎందుకనగా, ప్రవక్త ఇశ్రాయేలును అది ఇటువంటి స్థితికి చేరుకునే ఆ దినములో దానిని చూసినప్పుడు, అతడు ఇట్లడిగాడు, “మంచిది, విశ్రాంతి దినము తీసివేయబడునప్పుడు, మరియు—మరియు ఏ ఇతర దినమున జరుగునట్లే, వారు విశ్రాంతి దినమున అమ్మకాలు చేసినప్పుడు, మరియు ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు, ఇశ్రాయేలు నిలిచియుంటుందా?” అతడు ఇట్లు అడిగాడు, “మంచిది, నీవు—నీవు ఎన్నడైనా…ఇశ్రాయేలు పూర్తిగా మరువబడుతుందా?”
81 అందుకాయన ఇట్లన్నాడు, “ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నది? భూమి ఎంత లోతుగా ఉన్నది? నీ ముందున్న ఆ కర్రతో దానిని కొలువుము.”
అతడు ఇట్లు చెప్పాడు, “నేను కొలువలేను!”
82 అప్పుడాయన ఇట్లు చెప్పాడు, “అలాగే నేను కూడా ఇశ్రాయేలును ఎన్నడూ మరువలేను.” ఖచ్చితంగా మరువలేదు! ఇశ్రాయేలు ఎన్నడూ మరువబడదు.
83 కాబట్టి, మీరు చూడండి, యుగయుగములు మరియు నిత్యత్వము అనేవి రెండు భిన్నమైన సంగతులైయున్నవి. ఇశ్రాయేలు పడద్రోయబడినది, కానీ దేవునియొక్క మనస్సులోనుండి కాదు. మరియు పౌలు దాని గురించి ఇక్కడ మాట్లాడుతాడు, నాకు…అధ్యయనం చేయడానికి సమయముంటే, తద్వారా నేను నా మనస్సులోకి వచ్చే లేఖనములను, త్వరగా తీసి…నేను వాటిని మీకు చూపించగలిగేవాణ్ణి, చూడండి.
84 పౌలు అక్కడ మాట్లాడుతూ, అన్యులమైన మనము, మన నడత విషయములో మరియు మనము చేసే క్రియల విషయములో జాగ్రత్తపడాలని చెప్పాడు. చూశారా? ఎందుకనగా దేవుడు మొదటి తీగెను శిక్షించకుండా వదిలిపెట్టనట్లైతే, చూడండి, మరి మనం కేవలం అంటుకట్టబడియున్నాము, చూడండి,…మరియు ఇశ్రాయేలీయులు, కొంత కాలమువరకు గ్రుడ్డివారిగా చేయబడ్డారని, అతడు చెప్పాడు. కేవలం కొంత కాలమువరకే, ఇశ్రాయేలీయులు గ్రుడ్డివారిగా చేయబడ్డారు. అది నిజము, అయితే వారి కన్నుల మీదనుండి ఆ తెర తీసివేయబడుతుంది. మరియు అది ఆ చివరి అన్యుడు దేవుని రాజ్యములోనికి జన్మించినప్పుడైయున్నది, అప్పుడు ఇశ్రాయేలీయుల కన్నుల మీదనుండి వారి తెర తీసివేయబడుతుంది. మరియు వారు ఇట్లంటారు, “మేము చూడటానికి ఎదురుచూసిన మెస్సీయా ఈయనే.” అది నిజము, అయితే అన్యజనుల ద్వారము మూసివేయబడియుంటుంది (ఓడ మూయబడినది), ఆ సమయములో అన్యజనులకు ఇక—ఇక ఏ కృప మిగిలియుండదు.
85 ఇప్పుడు, నేను ఒక్క ప్రశ్న మీద చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. మరియు ఎవరో ఒకరు, “ఇప్పుడు నీవు నా ప్రశ్న దగ్గరకు రాలేదు” అని అంటారు. సరే, మనము త్వరపడి మరియు మనం దానిని చేరగలమో లేదో చూద్దాం.
86 మంచిది, ఇక్కడ ఒక—ఒక పెద్ద ప్రశ్న ఉన్నది. మరియు దానిని అడిగిన స్త్రీ లేదా అడిగిన పురుషుడు, లేదా అది ఎవరైనా గాని, మరి దానిలోని ప్రతీ భాగము సరియైయున్నది.
53. యేసు ప్రభువు చనిపోయినది లోకమంతటి కొరకు, అనగా లోకములో ఉన్న ప్రతీ ఒక్కరి కొరకు కాదు, కానీ…(ఇప్పుడు, నేను దానిని వివరిస్తాను, అయితే ఆమె, అతడు లేదా ఆమె, అది ఎవరైనా గాని, అది ఒక స్త్రీయొక్క వ్రాతలాగా కనబడుతుంది.)…కానీ, తండ్రిచేత ఆయనకు అనుగ్రహించబడి, ప్రపంచములోని ప్రాంతములన్నిటిలో ఉన్న వీరి కొరకు—వీరి కొరకు మాత్రమే అన్నది సత్యము కాదా? జగత్తుపునాది వేయబడకముందే, దేవుడు ఎవరినైతే తన దయాసంకల్పము చొప్పున ఎన్నుకొని, నిత్యజీవమునకు నిర్ణయించాడో వారి కొరకే కదా?
87 ఖచ్చితంగా, అది సరియే! అది ఖచ్చితముగా సరియే. యేసు చనిపోయింది…ఊరకే కాదు…ఆయన ఉద్దేశ్యమును కలిగియున్నాడు.
88 మనము చూద్దాము…వారు…దీనిలో ఒక—ఒక ప్రశ్న వస్తుందని…నేను నమ్ముతున్నాను:
54. వీరు—వీరు రక్షింపబడనివారని లేఖనము నిస్సందేహముగా మనకు చెప్తుంది. కావున…
89 అది ఖచ్చితముగా నిజము. తీర్పు తీర్చబడుటకు దేవునిచేత ముందుగా నిర్ణయించబడిన ప్రజలు ఉన్నారని లేఖనము మనకు చెప్తున్నది.
90 అది ఎప్పటికీ మీ మనస్సులోనుండి తొలగిపోవునట్లు, మీరు దానిని చదువగోరుతున్నారా? మంచిది, ఇప్పుడు మనం యూదా పత్రికను తీద్దాము, ఇక్కడ యూదా మాట్లాడుచున్నాడు.
యేసుక్రీస్తు దాసుడను, యాకోబు సహోదరుడనైన, యూదా, తండ్రియైన దేవునిచేత పరిశుద్ధపరచబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది:
91 అతడు దానిని ఎవరికి వ్రాస్తున్నాడో చూశారా? పాపికి కాదు, కేవలం సువార్త పరిచారకులకు మాత్రమే కాదు, కానీ పరిశుద్ధపరచబడి మరియు పిలువబడినవారికైయున్నది. చూడండి, ఇదివరకే రాజ్యములో ఉన్నవారికైయున్నది.
మీకు కనికరము, సమాధానము, ప్రేమయు, విస్తరించును గాక.
ప్రియులారా,…మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయుటకు విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తము మనస్ఫూర్తిగా పోరాడవలెనని, మిమ్మును వేడుకొనుచు వ్రాయుచున్నాను.
ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు, వారు ఈ తీర్పుపొందుటకు పూర్వమందే నిర్ణయించబడినవారు,…(ఎలా?)…మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు,…
92 పూర్వమందే నిర్ణయించబడినవారు! దేవుడు సింహాసనము మీద కూర్చొని, “నేను ఈ వ్యక్తిని రక్షిస్తాను, నేను ఆ వ్యక్తిని వదిలేస్తాను” అని అనడం కాదు. అది అలా కాదు! దేవుడు చనిపోయాడు, మరి యేసు చనిపోయినప్పుడు, ప్రతీ వ్యక్తి కొరకు ప్రాయశ్చిత్తము భూమినంతటిని కప్పివేసింది. అయితే దేవుడు, ముందుజ్ఞానము ద్వారా…ఆయన కోరాడని కాదు…ఎవడును నశించాలని ఆయన కోరడంలేదు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆయన కోరుకున్నాడు. అదే ఆయనయొక్క—అదే ఆయనయొక్క నిత్యమైన ఉద్దేశ్యమైయున్నది. కానీ ఆయన దేవుడైతే, ఎవరు రక్షింపబడతారో మరియు ఎవరు రక్షింపబడరో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియనట్లైతే, అప్పుడు ఆయన అనంతుడైన దేవుడు కాదు. కాబట్టి బైబిలు దానిని బోధిస్తుంది. అది మనము…
93 ఇక్కడ రోమా పత్రిక, 8వ అధ్యాయమును తీయడానికి మనకు సమయముంటే బాగుండేది, మరి మీరు దానిని చదువగలరు. రోమా, 9వ అధ్యాయము, బైబిలులో అనేక ఇతర చోట్లు ఉన్నాయి. ఎఫెసీ, 1వ అధ్యాయము. మరియు దేవునియొక్క ఎన్నిక, స్థిరముగా ఉండు నిమిత్తము, దేవుడు షరతులు లేకుండా నిబంధనను ఇచ్చాడని మీరు చూడగలరు. ఆయన ముందుగా ఎరిగియున్నవారి కొరకు మరణించడానికి ఆయన యేసును పంపాడు. చూశారా?
94 కేవలం, “మంచిది, ఆమె రక్షించబడుతుందో లేదో దేవునికి తెలియదని నీవు చెప్తున్నావా?” అని అనడానికి మాత్రమే కాదు. లోకము ప్రారంభమవ్వకముందే, నీవు రక్షించబడతావో, లేదా నీవు రక్షించబడవో దేవునికి తెలుసు, లేదంటే ఆయన దేవుడు కానట్టే.
95 అనంతము అనే పదానికి అర్థం ఏమిటో మీకు తెలుసా? చూడండి…నిఘంటువులో చూసి అనంతము అనే పదానికి అర్థమేమిటో కనుగొనండి. అంతెందుకు, భూమి మీద ఉండే ప్రతీ పేనును, ప్రతీ ఈగను, ప్రతీ గడ్డిదోమను, ప్రతీ పురుగును ఆయన ఎరిగియున్నాడు. అవి అసలు ఉనికిలోనికి రాకముందే ఆయన వాటిని ఎరిగియున్నాడు, లేదంటే ఆయన దేవుడు కాదు. నిశ్చయంగా, ఆయన దానిని ఎరిగియున్నాడు. మంచిది.
96 పిదప, అక్కడ, దేవుడు “నేను నిన్ను తీసుకొని, మరియు నిన్ను పాతాళమునకు పంపిస్తాను; మరియు నేను నిన్ను తీసుకొని, నిన్ను పరలోకమునకు పంపిస్తాను,” అని చెప్పలేడు—చెప్పలేడు. మీరిద్దరూ పరలోకమునకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ముందుజ్ఞానము ద్వారా ఒకరు అవినీతిపరుడవుతాడని, మరియు మరొకరు సరియైన వ్యక్తిగా మరియు ఒక క్రైస్తవునిగా అవుతాడని ఆయన ఎరిగియున్నాడు. చూశారా? కావున ఆయనచేత ముందుగా ఎరుగబడి రక్షించబడాలని కోరుతున్న ఆ వ్యక్తిని రక్షించుటకు మరణించడానికి ఆయన యేసును పంపవలసివచ్చినది. మీకు అది అర్థమైందా?
ఇప్పుడు ఇక్కడ చూడండి:
రక్షింపబడనివారు వీరేనని లేఖనములు సందేహముగా మనకు చెప్తున్నవి.
55. కావున ప్రాయశ్చిత్తము…ఆదాము జాతి అంతటిని కప్పియుండి, మరియు తాము వాగ్దానమును, లేదా నిబంధనను ఉపయోగించుకోకపోవడం వలన కొందరు నశించిపోయినట్లైతే, అప్పుడు…బహుశా-…సర్వశక్తిమంతుడైన దేవునియొక్క నిత్య ప్రణాళికలు మరియు ఉద్దేశ్యములకంటే అతడు…స్వేచ్ఛాచిత్తము…ఒక బలమైన శక్తిగా అవ్వదా? అది…(ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ రెండవ ప్రశ్నలో, ఇట్లు అడుగుచున్నారు.) సర్వశక్తిమంతుడైన దేవునియొక్క నిత్య ప్రణాళికలు మరియు ఉద్దేశ్యముకంటే మానవునియొక్క స్వేచ్ఛాచిత్తము ఒక బలమైన శక్తిగా ఉండదా?
97 లేదు, నా సహోదరుడా లేదా సహోదరి. ఖచ్చితంగా కాదు! అంతకంటే శక్తివంతమైనది ఏదియు లేదు…మానవుని చిత్తము దేవుని తీర్పుయొక్క నిత్యమైన ఉద్దేశ్యముతో ఎన్నడూ సరిపోల్చబడలేదు. అది ఆ విధంగా ఉండజాలదు, చూడండి.
98 ఇప్పుడు, మీ మొదటి ప్రశ్న సరైనదే. స్నేహితుడా, మీ రెండవ ప్రశ్న అలా ఉండజాలదు. ఎందుకనగా చూడండి, అది ఇక్కడ వ్రాయబడిన విధానమును చూడండి, చూడండి: “సర్వశక్తిమంతుడైన దేవునియొక్క నిత్యప్రణాళికలు మరియు ఉద్దేశ్యముకంటే మానవునియొక్క స్వేచ్ఛాచిత్తము ఒక బలమైన శక్తిగా ఉండదా?” ఏంటీ, ఖచ్చితంగా కాదు. సర్వశక్తిమంతుడైన దేవునియొక్క ఉద్దేశ్యముకంటే మానవునియొక్క చిత్తము ఒక బలమైన శక్తిగా ఎలా ఉండగలదు? మరియు మానవుడు తనకు నచ్చినదానిని కోరుకునే శరీరసంబంధమైన స్థితిలో ఉండగా, ఒక నిత్యమైన, పరిపూర్ణమైన దేవుడు ఉండుదానికంటే బలమైన శక్తిగా ఉండటమా? ఖచ్చితంగా కాదు! అది ఆ విధంగా ఉండజాలదు, చూడండి. ఆయన పరిపూర్ణమైన ఉద్దేశ్యముగల, నిత్యుడగు దేవుడైయ్యుండగా, క్రింద ఇక్కడ ఉన్న ఒక—ఒక శరీరసంబంధమైన వ్యక్తి గురించి మీరు అలా ఎలా అనగలరు, అతడెంత నీతిమంతుడైనను (మరి అతడు అయ్యుండవచ్చును), అయినను అతని ఉద్దేశ్యములు ఏ కోశాన కూడా దీనితో: అనగా నిత్యుడైన సర్వశక్తిమంతుడైన దేవునియొక్క ఉద్దేశ్యముతో సరిపోల్చబడవు.
99 [ఒక సహోదరి బ్రెన్హామ్ సహోదరునితో మాట్లాడుచున్నది—సంపా.] అవును. [“నన్ను మన్నించండి. నేను ఒక ప్రశ్నను అడగాలనుకున్నాను, మరియు—మరియు అక్కడ నా భావాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.”] అవును, మంచిది, సహోదరీ. [“నేను దానిని అస్సలు నమ్మను, ‘దేవునియొక్క నిత్యమైన ఉద్దేశ్యము మానవునియొక్క స్వేచ్ఛాచిత్తమును అధిగమిస్తుంది’ అనేది నా భావము.”]
100 అది నిజము. ఓ, మంచిది, అలాగైతే నేను—నేను దానిని తప్పుగా చదివాను, చూడండి. మంచిది. అవును, సహోదరీ, అలాగైతే నీవు ఖచ్చితంగా సరియైనదే చెప్పావు. మీ—మీ ప్రశ్న అది అని నాకు తెలియలేదు. మంచిది. అయితే, చూడండి, ఇక్కడ అది ఉన్నచోట, చూడండి,…ఇప్పుడు నన్ను చూడనివ్వండి, “ఆదాము జాతినంతటిని కప్పివేసియుండగా, మరియు కొందరు దాని నిబంధనను తమ—తమ కొరకు తాము ఉపయోగించుకోనందున నశించిపోయినట్లైతే, సర్వశక్తిమంతుడైన దేవునియొక్క నిత్యప్రణాళికలు మరియు ఉద్దేశ్యముకంటే మానవునియొక్క స్వేచ్ఛాచిత్తము ఒక బలమైన శక్తిగా ఉండదా?” చూడండి, నేను—నేను అక్కడ మీ తలంపును తప్పుగా అనువదించాను. అవును, సర్వశక్తిమంతుడైన దేవునియొక్క నిత్యమైన ఉద్దేశ్యము. మంచిది, అది దానిని పరిష్కరిస్తుంది.
101 అది అందరికీ అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే, మీ చేతులను పైకెత్తండి. అది—అది సర్వశక్తిమంతుడైన దేవునియొక్క నిత్యమైన ఉద్దేశ్యమే, నిశ్చయంగా మానవుడు చేయగలిగే దానికంటే ఎంతో—ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది.
ఇప్పుడు:
56. మత్తయి 28వ అధ్యాయము…19వ వచనములోని నీటి బాప్తిస్మమును గూర్చిన వెలుగు, నాకు అర్థము కాలేదు. దీని అర్థం ఏమిటి?
102 సరే, ఇప్పుడు, బహుశా దానికై నాకు ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదు. మరియు మీరు తీసినట్లైతే ఎవరినైనా నాతోపాటు, మత్తయి 28వ అధ్యాయము, 19వ వచనమును, తీయనిద్దాము. మరియు మనం కనుగొంటాము, సరిగ్గా ఆ వ్యక్తి ఏమి…ఇరవై-ఐదు…ఇప్పుడు, మీరు కేవలం దీనితో నిలిచియున్నట్లైతే, ఇది మిమ్మల్ని బలపరుస్తుంది. అది—అది మంచిది, మీరు చూడండి. అది సువార్త పరమైనది కాదు, కానీ అది…
103 ఇప్పుడు మనము…ఇప్పుడు ఇక్కడే, “బైబిలు గ్రంథములో ఒక వ్యతిరేకత ఉన్నది” అని చెప్పడానికి ప్రజలు ప్రయత్నిస్తారు. ఇప్పుడు, ఎవరైనా…మత్తయి 28:19 ని తీయాలని నేను కోరుతున్నాను. లేదా, కాదు, ఎవరైనా…మత్తయి 28:19 ని తీయాలని నేను కోరుతున్నాను. ఎవరైనా అపొస్తలుల కార్యములు 2:38 ని తీయాలని నేను కోరుతున్నాను. సహోదరుడా నెవిల్, నీవు అక్కడ నీ బైబిలును కలిగియున్నావా?
104 మరియు ఇప్పుడు మీయంతట మీరే చదవాలని నేను కోరుతున్నాను. “మరియు బైబిలులో ఒక ఖచ్చితమైన వ్యతిరేకతను నేను మీకు చూపిస్తాను. మరియు బైబిలు ఏమి…‘బైబిలు దానినదే వ్యతిరేకించుకోదు’ అని ప్రజలు అంటారు, మీరు దీనిని పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను.”
105 మరియు ఇది ప్రొఫెసర్లకు కలవరము పుట్టిస్తుంది. అయితే ఇది—ఇది సామాన్యమైనది. ఇప్పుడు నేను మత్తయి 28:19 ని చదువుతాను, మీరు నన్ను అనుసరించండి. మరియు మీలో కొందరు అపొస్తలుల కార్యములు 2:38 ని తీసి, దానితో సిద్ధంగా ఉండండి. నేను 18వ వచనము దగ్గర ప్రారంభిస్తాను, ఇది మత్తయి యొక్క ముగింపు అధ్యాయమైయున్నది:
మరియు యేసు వచ్చి మరియు తన శిష్యుల-…వారితో మాట్లాడి, ఇట్లు చెప్పెను, పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇవ్వబడియున్నది. (మరి తండ్రియొక్క అధికారము ఎక్కడా?)
106 పరలోకమందును భూమిమీదను సర్వాధికారము యేసుకు ఇవ్వబడినట్లైతే, అప్పుడు దేవుడు అధికారము లేనివాడయ్యాడు, కాదా? లేదా ఆయన కేవలం ఒక కథను చెప్పాడా? ఆయన హాస్యమాడుతున్నాడా? ఆయన భావము అదేయైయున్నది! ఆయన అదే అర్థముతో దానిని చెప్పాడని మీరు నమ్మడంలేదా? సరే, సర్వాధికారము ఆయనకు ఇవ్వబడినట్లైతే, మరప్పుడు దేవునియొక్క అధికారము ఎక్కడున్నది? ఆయనే దేవుడైయున్నాడు! అది సరియైయున్నది. దానిలోని విషయం అది మాత్రమేయైయున్నది. విషయం అదేయైయున్నది. చూడండి, ఆయనే దేవుడైయున్నాడు; లేదంటే ఎవరో అక్కడ కూర్చొనియుండి, కొంత అధికారమును కలిగియుండి, ఇకమీదట దానిని కలిగిలేరన్నట్లుగా ఉంటుంది. చూశారా? కాబట్టి మీరు—మీరు దానిని గందరగోళపరచలేరు. ఇక్కడ ఈ విషయములో కూడా మనం అటువంటిదానినే చూస్తాము. మంచిది:
…పరలోకమందును భూమిమీదను సర్వాధికారము…పరలోకమందును భూమిమీదను.
కాబట్టి మీరు వెళ్ళి,…సమస్త జనులకు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, మరియు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇచ్చుచు వారికి బోధించుడి:
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి:…ఇదిగో, నేను యుగసమాప్తివరకు, సదాకాలము మీతో కూడా ఉన్నాను.
107 అపొస్తలుల కార్యములు 2:38, ఇప్పుడు ఎవరైనా చదవండి. ఒక్క నిమిషం ఆగండి. అపొస్తలుల కార్యములు, 2వ అధ్యాయము, 38వ వచనము. ఇప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి, మరియు ఓపికతో ఉండండి, మరియు ఇప్పుడు మనము చూస్తాము. ఇప్పుడు, ఇది, మత్తయి 28:19 లో యేసు వారితో, “కాబట్టి మీరు వెళ్ళి, సమస్త జనులకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, మరియు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇచ్చుచు, వారికి బోధించుడి” అని చెప్పిన పది దినముల తర్వాత విషయమైయున్నది.
108 ఇప్పుడు, పేతురు, పది రోజుల తర్వాత…వారు ఎన్నడూ మరొక ప్రసంగము బోధించలేదు. వారు యెరూషలేములో మేడ గదిలోనికి వెళ్ళి, మరియు పరిశుద్ధాత్మ రావడం కోసం (పది రోజులు) అక్కడ వేచియున్నారు. అది ఎంతమందికి తెలుసు? ఈ చోటులోయై యున్నది. ఇదిగో పేతురు ఇక్కడున్నాడు, పేతురు రాజ్యముయొక్క తాళపుచెవులను కలిగియున్నాడు. మంచిది, అతడేమి చేస్తాడో మనము చూద్దాం. మత్తయి, లేదా నా భావము అపొస్తలుల కార్యములు 2, మనము 36వ వచనము తీసుకుందాము:
కావున ఇశ్రాయేలు వంశమంతయు దీనిని రూఢిగా తెలుసుకొనవలెను, అదేమిటనగా మీరు…సిలువవేసిన ఈ యేసునే, దేవుడు, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.
“ప్రభువుగాను క్రీస్తుగాను.” పరలోకమందును భూమిమీదను సర్వాధికారము ఆయనకు ఇవ్వబడటంలో, ఎటువంటి ఆశ్చర్యము లేదు.
ఇప్పుడు వారు ఈ మాట విని, వారి హృదయములో నొచ్చుకొని, మనుష్యుడా మరియు సహోదరులారా, మేము ఏమి చేతుము? అని పేతురును మరియు…కడమ అపొస్తలులను అడుగగా,
పేతురు జవాబునిచ్చాడు…పేతురు, మీలో ప్రతివాడును, పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, మరియు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురని వారితో చెప్పెను.
109 ఇప్పుడు, అక్కడ ఒక వ్యతిరేకత ఉన్నది, “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయొక్క నామములో: బాప్తిస్మమియ్యుడి” అని మత్తయిలో చెప్పబడినది, మరియు పది రోజుల తర్వాత, అపొస్తలుల కార్యములు 2:38 లో, “పశ్చాత్తాపపడి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి,” అని పేతురు చెప్పాడు.
110 పిదప పశ్చాత్తాపము, లేదా, బాప్తిస్మము గురించి, బైబిలులో చెప్పబడిన—చెప్పబడిన మరొక సమయము, అది అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో, ఫిలిప్పు వెళ్ళి మరియు సమరయులకు బోధించినప్పుడైయున్నది. మరియు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మరియు వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందారు.
111 తరువాతిసారి దాని గురించి చెప్పబడినది, అన్యజనులు దానిని స్వీకరించినప్పుడైయున్నది, అపొస్తలుల కార్యములు 10:49:
మరియు పేతురు…ఈ మాటలు చెప్పుచుండగా, ఇదిగో, వాటిని విన్నవారి మీదకు…పరిశుద్ధాత్మ దిగివచ్చెను.
ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు, మరియు దేవుని మహిమపరచుండగా వారు వినిరి. అప్పుడు పేతురు ఇట్లన్నాడు,
ఆదిలో మనము పొందినట్లే, వీరును పరిశుద్ధాత్మను పొందుటను చూస్తుండగా…ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా?
మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని అతడు వారికి ఆజ్ఞాపించెను.
112 ఇప్పుడు ఇక్కడ నన్ను ఒకటి చెప్పనివ్వండి, మీరు దానిని మరచిపోకుండా ఉండునట్లు ఒక చిన్న దానిని మీకు చూపిస్తాను; ఒక చిన్న ఉదాహరణను ఇవ్వబోతున్నాను. నేను…ప్రపంచములో ఎన్ని తరము-…ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారు? మూడు రకములు ఉన్నారు: హాము, షేము, మరియు యాపెతు ప్రజలు. అది ఎంతమందికి తెలుసు? మనము నోవహుయొక్క ఆ ముగ్గురు కుమారుల నుండి వచ్చాము. హాముయొక్క ప్రజలు, షేముయొక్క ప్రజలు…యాపెతుయొక్క ప్రజలు ఆంగ్లో-సాక్సన్ ప్రజలైయున్నారు, షేముయొక్క ప్రజలు…మూడు తరములు, అవేమిటనగా: యూదులు, అన్యులు, మరియు సగం యూదులు మరియు అన్యులు. ఇప్పుడు, గమనించండి, అది అక్కడ…మరియు ఇది హాము…షేము, హాము మరియు యాపెతు.
113 ఇప్పుడు, మొట్టమొదటిసారిగా బాప్తిస్మము గురించి చెప్పబడినది, బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా చెప్పబడినది. అది నిజమని ఎంతమందికి తెలుసు? మంచిది, నేను దానిని ఇక్కడ ఉంచబోతున్నాను, ఇక్కడ ఉంచబోతున్నాను, బాప్తిస్మమిచ్చు యోహాను. మరియు యోహాను ప్రజలకు యోర్దాను నదిలో బాప్తిస్మము ఇచ్చాడు, వారు పశ్చాత్తాపపడి మరియు దేవునితో సరిచేసుకోవాలని వారికి ఆజ్ఞాపించాడు, మరియు వారికున్న సమస్తమును అమ్మి, పేదలకు ఆహారము పెట్టాలని, మరియు సైనికులు తమ జీతములతో తృప్తిచెందియుండాలని, మరియు దేవునితో సరి చేసుకోవాలని చెప్పాడు. అది ఎంతమందికి తెలుసు? మరియు అతడు వారికి యోర్దాను నదిలో బాప్తిస్మము ఇచ్చాడు, వారిపై చిలకరించలేదు, వారిపై కుమ్మరించలేదు, కానీ వారిని ముంచాడు! మీరు దానిని నమ్మనియెడల, ఇదిగో భాషా నిఘంటువు ఇక్కడున్నది, అది బ్యాప్టైజో అని లేదేమో కనుగొనండి, అనగా “బాప్తిస్మము, ముంచబడుట, దిగువున పెట్టబడుట, పాతిపెట్టబడుట.” ఇప్పుడు, మొట్టమొదటిసారిగా బాప్తిస్మము గురించి మాట్లాడబడినది, అక్కడేయైయున్నది.
114 రెండవసారి బాప్తిస్మము గురించి చెప్పబడినది ఎప్పుడంటే, యేసు దానిని ఆజ్ఞాపించాడు, మత్తయి 28:19.
115 తరువాత బాప్తిస్మము గురించి చెప్పబడినది, అపొస్తలుల కార్యములు 2:38 లో యైయున్నది.
116 తరువాత బాప్తిస్మము గురించి మాట్లాడబడినది, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో యైయున్నది.
117 తరువాత బాప్తిస్మము గురించి మాట్లాడబడినది, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయములోయై యున్నది.
118 మరియు పిదప మనము, “కావున మీరు వెళ్ళి, సమస్త జనులకు బోధిస్తూ, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి,” అని యేసు చెప్పిన సమయము నుండి వద్దాము.
119 ఇప్పుడు మనము మొదటిగా, ఈ లేఖనమును తేటపరచుదాము. “బైబిలులో ఏ ఒక్క లేఖనము కూడా మరొకదానికి వ్యతిరేకంగా ఉండదు,” అని నేను మీతో చెప్పాను. మీరు దానిని నా దగ్గరకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఇరవై-ఆరు సంవత్సరాలుగా నేను దానిని అడుగుతూ ఉన్నాను, మరి ఇంకను నేను దానిని కనుగొనలేదు. వ్యతిరేకముగా ఏ లేఖనము లేదు-…అది దానికి వ్యతిరేకముగా ఉందంటే, అప్పుడది మానవునిచేత-వ్రాయబడిన వ్యవహారమౌతుంది. లేదు, అయ్యా, బైబిలులో ఎటువంటి వ్యతిరేకత లేదు!
120 ఇప్పుడు నీవు దీనిని చెప్పావు, “మరి దాని సంగతేమిటి?”
121 ఇదిగో యేసు ఇక్కడ నిలబడి, “కాబట్టి మీరు వెళ్ళి, సమస్త జనులకు బోధిస్తూ, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమియ్యుడి” అని చెప్పాడు.
122 మరియు పేతురు సరిగ్గా దానికి భిన్నంగా, మరి, “మీలో ప్రతి ఒక్కరు పశ్చాత్తాపపడి, మరియు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి” అని చెప్పాడు.
123 “అక్కడే మీ వ్యతిరేకత ఉన్నది.” ఉన్నట్లు కనబడుచున్నది. ఇప్పుడు, మీరు ఒక తెరువబడిన హృదయముతో కాకుండా, శరీరసంబంధమైన మనస్సుతో చదువుతున్నట్లైతే, అది ఒక వ్యతిరేకతగానే ఉంటుంది.
124 కానీ మీరు దానిని తెరువబడిన-మనస్సుతో చదివితే చాలు, “పరిశుద్ధాత్మ దీనిని జ్ఞానులు మరియు వివేకుల కన్నులకు మరుగుచేసాడు,” యేసు ఆ విధంగా చెప్పాడు, మరియు దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు, “మరియు నేర్చుకునే పసిబాలురకు దానిని బయలుపరిచాడు.” మీరు మనస్సును కలిగియుంటే, ఒక స్వార్థపూరితమైన మనస్సును కాదు గాని, నేర్చుకొనుటకు ఇష్టపడే హృదయమును కలిగియుంటే, పరిశుద్ధాత్మ ఈ విషయాలను మీకు బోధిస్తాడు.
125 ఇప్పుడు అది సరితూగకపోతే…మీరు ఇట్లన్నారు, “నీవు చెప్పేది సరియేనని నీకెలా తెలుసు?” మంచిది, అది మిగతా లేఖనములతో సరితూగుచున్నది. అది గనుక సరితూగకపోతే, ఇక్కడ మీకు ఒక స్పష్టమైన వ్యతిరేకత ఉన్నట్లే.
126 ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇది మత్తయిలో చివరి అధ్యాయమైయున్నది. నేను దానిని ఒక చిన్న రూపములో చెప్తాను, తద్వారా మీలో ప్రతి ఒక్కరికీ…పిల్లలకు అది అర్థమౌతుంది.
127 ఉదాహరణకు, మీరు ఒక ప్రేమ కథను చదివితే, మరి దాని వెనుక, “మరియ మరియు యోహానులు ఇకమీదట ఎప్పటికీ సంతోషంగా జీవించారు,” అని వ్రాయబడియున్నదనుకోండి. సరి, ఇకమీదట ఎప్పటికీ సంతోషంగా జీవించిన ఆ యోహాను మరియు మరియ ఎవరని మీరు ఆలోచిస్తారు. ఇప్పుడు, మీరు గనుక యోహాను మరియు మరియ ఎవరో తెలుసుకోవాలనుకుంటే, మీరు ఆ పుస్తకము యొక్క ప్రారంభమునకు వెళ్ళి యోహాను మరియు మరియ ఎవరో కనుగొనడం మంచిది. అప్పుడు తిరిగి ఇక్కడికి వచ్చి మరియు మరియ ఎవరు, ఆమె ఏ కుటుంబము నుండి వచ్చింది; మరియు యోహాను ఎవరు, మరియు అతడు ఏ కుటుంబము నుండి వచ్చాడు, మరియు అతని పేరు ఏమిటి, మరియు వారు ఎలా వివాహము చేసుకున్నారు, మరియు దాని గురించి అంతా కనుగొనండి. అది సరియేనా?
128 మంచిది, ఇక్కడ బైబిలును చదవడంలో కూడా అది ఆ విధంగానే ఉన్నది. ఎప్పుడైతే…చూడండి, “వెళ్ళి, ప్రజలకు తండ్రియొక్క నామములో, కుమారునియొక్క నామములో, పరిశుద్ధాత్మయొక్క నామములో బాప్తిస్మము ఇవ్వండి” అని యేసు ఎన్నడూ చెప్పలేదు, అది త్రిత్వవాదులు బాప్తిస్మమిచ్చే విధానమైయున్నది. బైబిలులో దాని కొరకు ఎటువంటి లేఖనము లేదు. ఆయన ఎన్నడూ, “నామములలో (నా-మ-ము-ల-లో), తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మ యొక్క నామములలో” అని చెప్పలేదు.
129 “(నా-మ-ము) నామములో,” ఆని ఆయన చెప్పాడు, ఏకవచనము. అక్కడ మీ బైబిలులో చూసి మరియు అది సరియేనా అని కనుగొనండి, మత్తయి 28, “నామములో.”
130 “తండ్రియొక్క నామములో, కుమారునియొక్క నామములో,…” కాదు, అది ఒక త్రియేక బోధకుడు బాప్తిస్మమిచ్చే విధానమైయున్నది. “తండ్రియొక్క నామములో, కుమారునియొక్క నామములో, మరియు పరిశుద్ధాత్మయొక్క నామములో.” అది అసలు బైబిలులో లేనేలేదు.
131 “పిదప నామములో…” మీరు ఇట్లన్నారు, “సరి, అలాగైతే ‘తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మయొక్క నామములో.’” అలాగైతే అక్కడ ఒక ఖచ్చితమైన నామము ఉన్నది.
132 సరే, తండ్రి అనేది ఒక నామమా? తండ్రి అనేది నామము కాదని ఎంతమందికి తెలుసు? తండ్రి అనేది ఒక బిరుదైయున్నది. కుమారుడు అనేది ఒక నామము కాదు. కుమారుడు అనేది నామము కాదని ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎంతమంది తండ్రులున్నారు? మీ చేతిని పైకెత్తండి. ఇక్కడ ఎంతమంది కుమారులున్నారు? మీ చేతులను పైకెత్తండి. సరే, మీలో ఎవరికి “కుమారుడు” అనే నామము పెట్టబడినది? మీలో ఎవరికి “తండ్రి” అని నామము పెట్టబడినది? సరే, పరిశుద్ధాత్మ అనేది ఒక నామము కాదు, పరిశుద్ధాత్మ అనగా అదేమిటో అదేయైయున్నది. ఇక్కడ ఎంతమంది మానవులున్నారు? మీ చేతిని పైకెత్తండి. చూశారా? విషయం అదేయైయున్నది, పరిశుద్ధాత్మ అనగా అదేమిటో అదేయైయున్నది. తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ, వాటిలో ఏవి కూడా నామములు కాదు; వాటిలో ఏ నామము లేదు.
133 మంచిది, అలాగైతే, “తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మయొక్క నామములో బాప్తిస్మము ఇవ్వండి,” అని ఆయన చెప్పినట్లైతే, మనము వెనుకకు వెళ్ళి మరియు తండ్రీ, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ ఎవరన్నది కనుగొనడం మంచిది. అలాగైతే మనం మత్తయి 1వ అధ్యాయమును తెరుద్దాము, మనము ఎవరి నామములోనైతే బాప్తిస్మము ఇవ్వవలసియున్నామో అట్టి ఈ వ్యక్తి ఎవరో చూద్దాము. మరియు ఇప్పుడు మనం మత్తయి 1వ అధ్యాయము, మరియు 18వ వచనముతో ప్రారంభించుదాము. మీరందరూ, జాగ్రత్తగా చదవండి.
134 ఇప్పుడు, ఈ ప్రశ్నను అడిగిన మీకు, నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను ఇవ్వగోరుతున్నాను. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమగునట్లు నేను మూడు వస్తువులను ఇక్కడ ఉంచబోతున్నాను, (ఒక ఉదాహరణను చూపిస్తాను) ఒక ఉదాహరణగా, ఈ బైబిళ్ళను మరియు పుస్తకములను ఉపయోగిస్తాను.
135 మంచిది, మీరు నన్ను జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతున్నాను, మరియు ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు, ఇక్కడున్న ఇది తండ్రియైన దేవుడు. ఇక్కడున్న ఇది కుమారుడైన దేవుడు. ఇక్కడున్న ఇది పరిశుద్ధాత్మయైన దేవుడు. ఇప్పుడు, ఎంతమందికి అర్థమైంది? నా వెంట మీరు చెప్పండి. ఇక్కడున్న ఇది ఎవరు? [సంఘము “పరిశుద్ధాత్మ,” అని చెప్తున్నది.—సంపా.] పరిశుద్ధాత్మ. ఇక్కడున్న ఇది ఎవరు? [“తండ్రి.”] ఇక్కడున్న ఇది ఎవరు? [“కుమారుడు.”] ఇప్పుడు, ఒక త్రిత్వవాది దానిని నమ్మే విధానం అదేయైయున్నది, చూడండి, అది మనల్ని, అసలు పచ్చి అన్యజనులుగా చేస్తుంది.
136 యూదుడు; ఆ కారణమును బట్టియే మీరు ఒక యూదునికి అసలు చెప్పలేరు. “మీరు దేవుడిని మూడు ముక్కలు చేసి, ఆయనను ఒక యూదునికి ఇవ్వలేరు,” అని అతడు చెప్పాడు. అయితే, ఖచ్చితంగా ఇవ్వలేరు, మీరు నాకు కూడా ఇవ్వలేరు. చూశారా? లేదు, అయ్యా. ఆయన ఒక్క దేవుడైయున్నాడు. అది ఖచ్చితంగా వాస్తవం. ముగ్గురు దేవుళ్ళు కాదు. ఇప్పుడు అది ఎంత—ఎంత—ఎంత సామాన్యముగా ఉన్నదో గమనించండి.
137 ఇప్పుడు మనం కనుగొనబోతున్నాము. ఇప్పుడు, ఎవరు…ఇది ఎవరు? ఇప్పుడు ఎవరైనా మాట్లాడండి. కుమారుడైన దేవుడు. అది నిజమేనా? ఇది కుమారుడు. సరే, అలాగైతే ఆయనయొక్క తండ్రి దేవుడైయున్నాడు. అది సరియేనా? ఆయనయొక్క తండ్రి దేవుడని ఎంతమంది నమ్ముతున్నారు? మీ చేతిని పైకెత్తండి. దేవుడు యేసుక్రీస్తు యొక్క తండ్రి అని ఎంతమంది నమ్ముతున్నారు? మంచిది.
ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క జనన విధమెట్లనగా:…
138 ఇప్పుడు మనం మత్తయిలో “నామములో బాప్తిస్మమియ్యుడి” అని చెప్పబడిన, ఆ తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ ఎవరో కనుగొనడానికి వెనుకకు వెళ్తున్నాము. చూడండి, నామము; ఇప్పుడు నామములు కాదు, ఎందుకనగా అవి నామములై యుండజాలవు, ఎందుకనగా అవి నామములే కావు.
ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క జనన విధమెట్లనగా: ఎప్పుడైతే…ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడినప్పుడు, వారు ఏకము కాకమునుపు, ఆమె తండ్రియైన దేవుని వలన గర్భవతిగా ఉండెను. (బైబిలు అలా చెప్తుందా? బైబిలు ఏమి చెప్తుంది?)…ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.
139 అలాగైతే వీరిలో ఆయన తండ్రి ఎవరు? ఇప్పుడు, ఇది ఆయనయొక్క తండ్రి అని బైబిలు చెప్పింది, మరియు ఇది ఆయనయొక్క తండ్రి అని యేసు చెప్పాడు. ఇప్పుడు, ఆయనయొక్క తండ్రి ఎవరు? ఇప్పుడు, ఆయనకు ఇద్దరు తండ్రులు ఉన్నట్లైతే, ఇప్పుడు దాని విషయమేమిటి? ఆయనకు ఇద్దరు తండ్రులు ఉన్నట్లైతే, ఆయన అక్రమ సంతానమన్నట్లే.
140 ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు చదువుదాము:
అప్పుడు ఆమె భర్తయైన యోసేపు, ఒక నీతిమంతుడైయుండి, ఆమెను బహిరంగముగా అవమానపరచనొల్లక, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
కానీ అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో, ప్రభువుయొక్క దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఇట్లు చెప్పెను, దావీదు కుమారుడవైన, యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము: ఏలయనగా ఆమె గర్భము ధరించినది…[సంఘము “పరిశుద్ధాత్మ వలనైనది,” అని చెప్పుచున్నది—సంపా.]
141 దేనివలన? పరిశుద్ధాత్మ వలనా? సరే, తండ్రి ఆయనయొక్క తండ్రియైయుండగా, మరి అదే సమయములో పరిశుద్ధాత్మ ఆయనకు తండ్రిగా ఎలా ఉండగలడు? ఇప్పుడు, అలాగైతే, అది సరియైనట్లైతే ఆయనకు ఇద్దరు తండ్రులున్నట్లే. కాదు, అయ్యా! పరిశుద్ధాత్మయే దేవుడైయున్నాడు. పరిశుద్ధాత్మయే దేవుడు. కావున దేవుడు మరియు పరిశుద్ధాత్మ ఒకే వ్యక్తియైయున్నాడు, లేదంటే ఆయనకు ఇద్దరు తండ్రులున్నట్లే అవుతుంది.
142 చూడండి, కొంచెంసేపు తర్వాత, యోహాను మరియు మరియ ఎవరన్నది మనము కనుగొంటాము. మంచిది, పేతురు మరియు మత్తయి ఒకరితో ఒకరు విభేదించుటకు ప్రయత్నిస్తున్నారో లేదో మనం కనుగొంటాము, లేఖనము దానినదే వ్యతిరేకిస్తున్నదేమో కనుగొంటాము. అది ఆత్మసంబంధమైన అవగాహనయొక్క కొరతయైయున్నది. అది నిజము.
కానీ అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా…
143 నేను దానిని, 20వ వచనమును చెప్పేశాను. ఇప్పుడు 21వ వచనము:
మరియు ఆమె ఒక కుమారుని కనును,…(ఈ వ్యక్తిని, ఆయన వీరిలో ఎవరు? ఒక్క వ్యక్తి, దేవుడైయున్నాడు.)…మరియు నీవు అతనికి…పేరు పెట్టుదువు (ఏమని?) [సంఘము “యేసు,” అని సమాధానమిస్తున్నది—సంపా.]…ఏలయనగా ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును.
…ఇదిగో, ఒక కన్యక గర్భవతియై ఒక కుమారుని కనును, వారు ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు,
అని, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు…ఇదంతయు జరిగెను,…దానికి భాషాంతరమున, దేవుడు మనతో ఉండుట అని అర్థము.
144 కాబట్టి ఇక ఎప్పటికీ సంతోషంగా జీవించిన యోహాను మరియు మరియ ఎవరు? “మీరు వెళ్ళి, సమస్త జనులకు బోధించుచు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమీయుడి,” అని చెప్పిన ఆయన ఎవరు? తండ్రి ఎవరు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము ఏమిటి? [ఎవరో, “యేసు” అని చెప్పారు.—సంపా.] ఖచ్చితంగా, అది అదే. నిశ్చయంగా, దానికి ఎటువంటి వ్యతిరేకత లేదు. కొంచెం కూడా లేదు. అది కేవలం లేఖనమును తేటపరుస్తుంది. ఆయనే తండ్రీ, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మయైయున్నాడు. దేవుడు “యేసు” అని పిలువబడే ఒక శరీరమును గుడారముగా చేసుకొని, (ఇమ్మానుయేలుగా) మనతో నివసిస్తూ ఉన్నాడు.
145 ఇప్పుడు, ఏకత్వపు సంఘముయొక్క ఏకత్వపు బోధ, నేను ఖచ్చితంగా దానితో, అనగా యేసు మీ వ్రేలులో ఒకటిగా ఉన్నట్లు ఆలోచించడంతో విభేదిస్తాను. ఆయన ఒక తండ్రిని కలిగియుండవలసియున్నాడు. ఆయన కలిగియుండకపోతే, ఆయన ఎలా తన స్వంత తండ్రి కాగలడు? మరియు త్రిత్వపువారు చెప్పినట్లుగా ఆయనయొక్క తండ్రి ఒక మనిషియైతే, అప్పుడు ఆయన ఇద్దరు తండ్రులను కలిగి అక్రమంగా జన్మించినట్లే అవుతుంది. కాబట్టి, మీరు చూడండి, వాదన ప్రకారంగా మీరిద్దరూ తప్పైయున్నారు. చూశారా?
146 కానీ దానిని గూర్చిన సత్యమేమిటనగా, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఇరువురూ, ఒకే వ్యక్తిత్వమైయున్నాడు. [టేపులో ఖాళీగా ఉన్నది—సంపా.]…లోకము నుండి పాపమును తీసివేయుటకు, చర్మపు గుడారములో నివసించుచున్నాడు. అది ఖచ్చితంగా నిజము, “దేవుడు మనతో ఉన్నాడు.” కాబట్టి, మత్తయి 28:19…
147 ఇప్పుడు, మీరు లేఖనములను పరిశోధించండి, మరియు మీరు బైబిలులో ఒక్క వ్యక్తిని కనుగొనగలిగినప్పుడు…(ఇప్పుడు దాని గురించి ఆలోచించండి, ఇప్పుడు దీనిని మిమ్మల్ని దాటిపోనివ్వవద్దు.)…బైబిలులో ఎన్నడైనా ఒక్క వ్యక్తియైనా “తండ్రి,” మరియు “కుమార,” మరియు “పరిశుద్ధాత్మ,” నామములో బాప్తిస్మము పొందినట్లు కనుగొంటే, నా దగ్గరికి తిరిగి వచ్చి మరియు నేను ఒక వేషధారినని నాతో చెప్పండి, మరియు నేను నా వీపు మీద ఒక బోర్డును పెట్టుకొని మరియు పట్టణమంతా తిరుగుతాను. ఆదికాండము నుండి ప్రకటన వరకును, అది లేఖనములలో ఎక్కడా లేదు. కానీ బైబిలులో ప్రతీ వ్యక్తి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాడు!
148 మీరు ఇట్లంటారు, “బోధకుడా, ఒక్క నిమిషం ఆగు. యోహాను సంగతేమిటి? అతడు అసలు ఏ నామములోను బాప్తిస్మము ఇవ్వలేదే!”
149 మంచిది, ఏమి జరిగినదో మనము కనుగొందాము; మనము అపొస్తలుల కార్యములు, 19వ అధ్యాయమును తీద్దాము. అక్కడే మనము యోహాను శిష్యులను కనుగొంటాము. ఇక్కడ ఈ గుంపు మనము కనుగొనే వరకును, ప్రతీ వ్యక్తి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాడు. అపొస్తలుల కార్యములు, 19వ అధ్యాయము. మరియు ఇప్పుడు మనము చదవడం ప్రారంభిద్దాము, మరియు మనము యోహాను శిష్యులను కనుగొంటాము:
మరియు,…అపొల్లో (మరి అతడొక న్యాయవాదియైయున్నాడు, మారుమనస్సు పొందినాడు) కొరింథిలో ఉన్నప్పుడు, పౌలు…ఎఫెసు యొక్క…పై ప్రాంతములలో సంచరించి వచ్చినప్పుడు: అతడు కొందరు శిష్యులను కనుగొన్నాడు, (వారు యేసుయొక్క అనుచరులైయున్నారు)
150 మీరు గనుక దానికి ముందున్న అధ్యాయమును గమనించినట్లైతే, వారు కేకలువేస్తూ మరియు సంతోషిస్తూ ఉండేంతగా వారు ఎంతో గొప్ప సమయాన్ని కలిగియుంటున్నారు. అది నిజమని ఎంతమందికి తెలుసు? మరియు అకుల మరియు ప్రిస్కిల్ల ఆ కూడికకు హాజరవుతున్నారు. మరియు పౌలు మరియు సీలలు వస్త్రహీనులుగా చేయబడి మరియు కొట్టబడి, చెరసాలలో వేయబడ్డారు. అది నిజమేనా? మరియు వారు ఇక్కడికి వచ్చి, అకుల మరియు ప్రిస్కిల్లను కనుగొన్నారు. మరియు అపొల్లో అను పేరుగల ఒక బాప్టిస్టు బోధకుని ద్వారా, వారు అక్కడ ఒక ఉజ్జీవమును కలిగియుంటున్నారు, అతడు “యేసే క్రీస్తని” లేఖనాల ద్వారా ఋజువు చేస్తున్నాడు. ఇప్పుడు పౌలు అతణ్ణి కనుగొంటాడు:
…పౌలు ఎఫెసు యొక్క…పై ప్రదేశములలో సంచరించి…వచ్చినప్పుడు:…కొందరు శిష్యులను కనుగొని,
అతడు వారితో ఇట్లన్నాడు, మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా?…
151 ఇప్పుడు, ప్రియమైన బ్యాప్టిస్టు మిత్రుడా, ఆ విషయము నీ సిద్ధాంతము యొక్క పునాదులన్నిటినీ కూల్చివేయకపోతే ఇంకేమి చేస్తుంది, “మీరు విశ్వసించినప్పుడే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు” అని నీవు చెప్పావు.
152 కానీ పౌలు ఈ బ్యాప్టిస్టులను, “మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా?” అని అడుగగోరాడు. ఇప్పుడు వారు ఏమి చెప్పారో గమనించండి:
…మరియు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు…అని అతనితో చెప్పిరి.
అప్పుడు అతడు వారితో ఇట్లన్నాడు, దేనినిబట్టి…(ఇప్పుడు, ఇక్కడ మీరు గ్రీకు నిఘంటువును తీసుకోవాలనుకుంటే, అది మీకు చూపిస్తుంది, “మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరి?”)…మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరి? మరియు వారు, ఇక్కడ వెనుక యోహానును బట్టి పొందాము అని అతనితో చెప్పిరి. యోహాను మాకు బాప్తిస్మమిచ్చాడు.
153 ఇప్పుడు నేను అడుగగోరుతున్నాను: మీరు ఆ బాప్తిస్మమును పొందుకుంటే, మీరు దానితో తృప్తిచెందుతారా? యేసును నదిలోకి తీసుకెళ్ళి, మరియు యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చిన అదే వ్యక్తి, అదే వ్యక్తి ఈ ప్రజలకు బాప్తిస్మమిచ్చాడు. అది చాలా చక్కని బాప్తిస్మము: చిలకరించడం కాదు, కుమ్మరించడం కాదు, కానీ ఆ పాత యోర్దానుయొక్క బురద నీటిలో యేసు బాప్తిస్మము పొందిన అదే చోట ముంచబడుట. దాని గురించి ఆలోచించండి.
154 పౌలు ఇట్లన్నాడు, “మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా?” వారు…అతడు…
వారు ఇట్లు చెప్పారు, “పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే…మాకు తెలియదు.”
అందుకతడు ఇట్లన్నాడు, “మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందారు?”
వారు ఇట్లన్నారు, “మేము బాప్తిస్మము పొందాము.”
“మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందారు?”
“యోహానును బట్టి!”
155 ఇప్పుడు పౌలు ఏమి చెప్పాడో గమనించండి. ఇక్కడ గమనించండి:
మరియు అతడు వారితో ఇట్లన్నాడు,…మీరు బాప్తిస్మ-…యోహానును బట్టి…మరియు వారు…
మరియు అప్పుడు పౌలు ఇట్లు చెప్పాడు, యోహాను తన వెనుక వచ్చినవానియందు, అనగా యేసుక్రీస్తునందు, వారు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, నిశ్చయంగా…ఆ బాప్తి-…మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ఇచ్చెను.
156 చూడండి, యోహాను కేవలం మారుమనస్సు విషయమైన బాప్తిస్మమే ఇచ్చాడు, కానీ యేసు నామములో నీటి బాప్తిస్మము పాపక్షమాపణ కొరకైనది. అప్పటికింకా ప్రాయశ్చిత్తము చేయబడలేదు, పాపములు క్షమించబడజాలవు. ఇప్పుడు…అది కేవలం ధర్మశాస్త్రము క్రింద ఉన్నట్లే, మనస్సాక్షికి జవాబునివ్వడమైయున్నది. లూకా 16:16, ఇట్లు చెప్పినది, “యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి, అప్పటినుండి రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది.” ఇప్పుడు గమనించండి. మరియు…గమనించండి.
మరియు పౌలు ఇట్లన్నాడు-…(ఇప్పుడు గమనించండి)…మీరు పొందితిరా…
157 5వ—5వ వచనం:
మరియు వారు ఈ మాటలు విన్నప్పుడు, వారు (తిరిగి) యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి.
158 అది నిజమేనా? పిదప ఈ ప్రజలు, అపొస్తలుల కార్యములు 2లోని ప్రజలు, యేసు నామములో బాప్తిస్మము పొందారు. యూదులు యేసు నామములో బాప్తిస్మము పొందారు. అన్యులు యేసు నామములో బాప్తిస్మము పొందారు. మరియు బైబిలు గ్రంథమంతటిలో ప్రతీయొక్క వ్యక్తి యేసు నామములో బాప్తిస్మము పొందాడు.
159 ఇప్పుడు వేరే ఎవరైనా వేరే ఏ విధానములోనైనా బాప్తిస్మము పొందిన ఒక్క చోటును కనుగొనండి, మరియు నేను తిన్నగా వెనుక ఇక్కడికి వచ్చి మరియు క్యాథలిక్ సంఘము ఎక్కడ దానిని మార్చిందని ఒప్పుకొని మరియు మీరు దానికి సాగిలపడాలని చెప్తుందో మీకు చూపిస్తాను. మరియు, “కొంతమంది ప్రొటెస్టంట్లు రక్షించబడవచ్చును ఎందుకనగా వారు, ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ’ నామములో బాప్తిస్మము వంటి కొన్ని క్యాథలిక్ సిద్ధాంతములను కలిగియున్నారని; ఆ పవిత్రమైన కార్యమును యేసు నామము నుండి ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు’ మార్చడానికి, క్యాథలిక్ సంఘానికి అధికారమున్నదని, మరియు ప్రొటెస్టెంట్ సంఘము దానిని ఒప్పుకుంటుందని” వారు అంటారు. ఇది కాదు, నేను బైబిలుతో నిలబడతాను. నేను బైబిలును నమ్ముతాను.
160 మీరు ఇట్లంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, ప్రజలు తిరిగి బాప్తిస్మము పొందాలని నీవు ఆజ్ఞాపిస్తావా?” ఖచ్చితంగా! ఇక్కడ, పౌలు దానినే చేశాడు.
161 ఇప్పుడు గమనించండి, మనము గలతీ 1:8 ని తీసి, మరియు పౌలు ఏమి చెప్పాడో కనుగొందాము:
…మరియొక సువార్తను మేమైనను, పరలోకమునుండి వచ్చిన ఒక దూతయైనను, మీకు ప్రకటించినయెడల…అతడు శాపగ్రస్తుడవును గాక.
162 విషయం అదే, “మేమైనను లేక ఒక దూతయైనను.” మరియు పౌలు, అదే వ్యక్తి, నా సహోదరుడా, నీవు కలిగియున్న దానికంటే ఎంతో శ్రేష్ఠమైన బాప్తిస్మమును కలిగియున్న ఆ ప్రజలకు, మరలా బాప్తిస్మము పొందాలని ఆజ్ఞాపించాడు; ఎందుకనగా బాప్తిస్మమిచ్చు యోహాను యేసుయొక్క స్వంత దాయాదు, రెండవ దాయాదుయైయున్నాడు; యోర్దాను నదిలో తన స్వంత దాయాదుకు బాప్తిస్మమిచ్చి, మరియు తిరిగి నేరుగా యోహాను తనయొక్క శిష్యులకు బాప్తిస్మమిచ్చాడు. మరియు యేసు ఇట్లన్నాడు, “అది పనిచేయదు!” లేక పౌలు దానిని చెప్పాడు, మరియు వారు కేకలువేస్తూ మరియు దేవుడిని స్తుతిస్తూ మరియు ఒక గొప్ప సమయమును కలిగియుంటూ, ఒక గొప్ప—గొప్ప ఉజ్జీవమును కలిగియుంటూ, మరియు బైబిలు ఆధారంగా (తమ సిద్ధాంతముతో) యేసే క్రీస్తని ఋజువు చేస్తూ ఉన్న తర్వాత; వారు పరిశుద్ధాత్మను పొందుకోడానికిముందు మరలా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలని వారికి ఆజ్ఞాపించాడు. అది లేఖనమైయున్నదని ఎంతమందికి తెలుసు? 18వ అధ్యాయము. ఖచ్చితంగా అది లేఖనమే. విషయం అదే. కాబట్టి దాని విషయంలో ఎటువంటి ప్రశ్నా లేదు.
163 ఇప్పుడు నన్ను మీకు ఒక చిన్న ముఖ్య విషయమును చెప్పనివ్వండి. ఇప్పుడు, అతడు ఎన్నడూ క్రమము తప్పలేదు, కానీ లూకాలో…మత్తయి 16వ అధ్యాయములో. యేసు, వారు కొండ మీదనుండి దిగి వచ్చినప్పుడు, ఆయన ఇట్లంటాడు, “మనుష్య కుమారుడనైన నేను ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారు?”
164 “కొందరు నీవు ‘ఏలీయా’ అని, కొందరు ‘ప్రవక్త’ అని, మరికొందరు నీవు ‘ఇది, అది’ అని చెప్పుచున్నారు.”
165 ఆయన ఇట్లన్నాడు, “మీరైతే ఎవరినని చెప్పుచున్నారు?”
166 అందుకు పేతురు ఇట్లన్నాడు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన, క్రీస్తువు.”
167 గమనించండి! “సీమోను బర్-యోనా (యోనా కుమారుడా), నీవు ధన్యుడవు, రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు.” ఆమేన్!
168 చూడండి, అది ఆత్మసంబంధమైన ప్రత్యక్షతగా రావలసియున్నది. రక్తమాంసములు ఎన్నడూ హేబెలుకు తాను తప్పని చెప్పలేదు (కయీనుకు, తాను తప్పని) హేబెలుకు “కయీను తప్పని” అవి ఎన్నడూ చెప్పలేదు. అయితే “అది రక్తము!” అని హేబెలు పొందుకున్న ఒక ప్రత్యక్షతైయున్నది, కొన్ని నిమిషములలో మనము ఆ ప్రశ్నలోనికి రాబోతున్నాము. అది రక్తమైయున్నది, ఏదెను తోట నుండి మనల్ని తీసివేసినది, పండ్లు కాదు. “అది రక్తమైయున్నది,” మరియు హేబెలుకు, అది రక్తమైయున్నదని ఆత్మసంబంధమైన ప్రత్యక్షత ద్వారా, దేవునిచేత బయలుపరచబడినది, మరియు అతడు, “విశ్వాసమును బట్టి,” హెబ్రీ 11:1 ఇట్లు చెప్తుంది, “అతడు కయీను కంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించాడు. మరి, దేవుడు అతని బల్యర్పణను స్వీకరించాడు.” విషయం అదే. చూడండి, విశ్వాసము ద్వారా, ప్రత్యక్షత ద్వారా అతడు దానిని అర్పించాడు.
169 ఇప్పుడు గమనించండి, “రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు,” (తిరిగి ప్రభువైన యేసు దగ్గర విషయానికి వచ్చాము) “కానీ పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరిచాడు. మరియు ఈ బండ మీద (అనగా యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత మీద)…ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.” ఆయన దానినే చెప్పాడు. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత-…“మరియు నీవు పేతురువని, మరియు నేను రాజ్యపు తాళపుచెవులను నీకు ఇచ్చెదనని నేను చెప్పుచున్నాను. మరియు ఏదైనను…ఎందుకనగా నీవు ఇక్కడికి మరియు పరలోకమునకు మధ్య ఒక తెరవబడిన ఆత్మసంబంధమైన మార్గమును కలిగియున్నావు. రక్తమాంసములు: నీవు ఎన్నడూ ఒక సెమినరీకి వెళ్ళలేదు, నీవు ఎన్నడూ పాఠశాల విద్య పొందుకోలేదు, నీవు ఎన్నడూ ఒక—ఒక—ఒక వేదాంతశాస్త్ర కోర్సును తీసుకోలేదు. కానీ నీవు దేవునిపై ఆధారపడ్డావు, మరియు దేవుడు దానిని నీకు బయలుపరిచాడు, మరియు దానిని కలిపి ముడివేసేది ఖచ్చితంగా స్పష్టమైన లేఖనములేయైయున్నవి. నీవు పేతురువని నేను చెప్పుచున్నాను, అది నిజము, మరియు నేను నీకు తాళపుచెవులను ఇస్తాను; మరియు నీవు భూమి మీద దేనిని బంధిస్తావో, నేను పరలోకములో దానిని బంధిస్తాను; మరియు భూమి మీద నీవు దేనిని విప్పుతావో, నేను పరలోకములో దానిని విప్పుతాను.”
170 మరియు పెంతెకొస్తు దినమున పేతురు ప్రతినిధియైయున్నాడు, వారందరూ మాట్లాడటానికి భయపడినప్పుడు, అతడు మాట్లాడి మరియు ఇట్లన్నాడు, “యూదయ మనుష్యులారా మరియు యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియబడునుగాక మరియు చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులుకారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు, అయితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ‘అంత్య దినములయందు,’ అని దేవుడు చెప్పుచున్నాడు, ‘మనుష్యులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును కుమార్తెలును ప్రవచించెదరు. మరియు నా దాసురాండ్ర మీద, దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించెదను. మరియు పైన ఆకాశమందును మరియు క్రింద భూమి మీదను సూచక క్రియలను, పొగ మరియు ఆవిరి స్తంభములను నేను చూపించెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ భయంకరమైన మహాదినము రాకముందే, ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు.’” విషయం అదేయైయున్నది. ఓ, మై.
171 “మూలపురుషుడైన దావీదు గురించి నన్ను మీతో ధారాళముగా మాట్లాడనివ్వండి,” అని అతడన్నాడు, “అతడు చనిపోయి మరియు సమాధి చేయబడ్డాడు, మరియు అతని సమాధి నేటివరకు మన మధ్యనున్నది. కావున, ఒక ప్రవక్తయైయుండెను గనుక, అతడు చూశాడు…ఆయనను ఆయనయొక్క కుడిపార్శ్వమునందు ముందుగా చూశాడు, ‘మరియు నేను కదల్చబడను. నా శరీరము కూడ నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును ఎందుకనగా ఆయన నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు.’”
172 “దావీదు చనిపోయాడు,” అని అతడు చెప్పాడు, “మరియు సమాధి చేయబడ్డాడు కూడా, మరియు నేటివరకును అతని సమాధి మన మధ్యనున్నది. కానీ ఒక ప్రవక్తయైయుండి, అతడు నీతిమంతునియొక్క రాకడను ముందుగానే చూశాడు, మరి ఆయననే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు.” ఓ, మై. అదిగో మీ లేఖనములు. విషయం అదేయైయున్నది. అంతే.
173 ఇప్పుడు మనమిక్కడ కనుగొంటాము, పిదప, సరియైన విధానము, మరియు నిజమైన విధానము, మరియు నిర్ణయించబడిన ఏకైక విధానము ఏమిటంటే…మరియు పేతురు తాళపుచెవులను కలిగియున్నాడు, మరియు అతడు బోధించిన రోజున, వారు ఇట్లన్నారు…ఇప్పుడు గమనించండి, మొదటి సంఘము ఇక్కడున్నది. క్యాథలిక్కులైన మీరు దీనిని వినండి. క్యాంప్బెలైట్లు అయిన మీరు దీనిని వినండి. బ్యాప్టిస్టులు మరియు మెథడిస్టులైన మీరు దీనిని వినండి. మరియు పెంతెకొస్తులైన మీరు దీనిని వినండి. చర్చ్ ఆఫ్ గాడ్ వారలారా, నజరీనులారా, పిలిగ్రిమ్ హోలీనెస్ వారలారా, దీనిని వినండి.
174 పేతురు తాళపుచెవులను కలిగియున్నాడు, మరియు అతడు అధికారమును కలిగియున్నాడు, లేదంటే యేసు అబద్ధమాడినట్లే. మరియు ఆయన అబద్ధమాడటమనేది అసాధ్యము, “నిశ్చలమైన రెండు సంగతులు, దేవుడు అబద్ధమాడటం అసాధ్యము.” అతడు తాళపుచెవులను కలిగియున్నాడు. యేసు అతనికి తాళపుచెవులను ఇచ్చాడు. మూడవ రోజు ఆయన ఆ విధంగా లేచినప్పుడు, ఆయన మరణముయొక్కయు పాతాళముయొక్కయు తాళపుచెవులను కలిగియున్నాడు, కానీ రాజ్యపు తాళపుచెవులను కాదు. పేతురు వాటిని కలిగియున్నాడు! అది ఖచ్చితంగా సరియే.
175 మరియు ఇప్పుడు గమనించు, పేతురు, నీ నడుము ప్రక్కలో తాళపు చెవులు వ్రేలాడుతున్నాయి, మరియు నీవు బోధిస్తున్నావు. మొదటిగా మారుమనస్సు పొందిన నూతన సంఘములో, ప్రశ్న వచ్చినది. ఆదిమ క్రైస్తవ సంఘము. ఇప్పుడు క్యాథలిక్కు, ఇప్పుడు బ్యాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్బిటేరియను, మీరు నూతన సంఘపు సిద్ధాంతముపై ఉన్నారా? మీరు ఉన్నారేమో కనుగొనండి.
…మనుష్యుడా మరియు సహోదరులారా, మేమేమి చేయగలము?
…పేతురు లేచి నిలబడి మరియు ఇట్లు చెప్పెను…పశ్చాత్తాపపడి,…మీలో ప్రతివాడును…(అబ్బాయ్, జాగ్రత్తా; నీవు ఇక్కడ ఆ తాళపుచెవులను ఏ విధంగా వాడతావో, క్రీస్తు దానిని పరలోకములో అలాగే వాడతాడు)…మీలో ప్రతివాడును, పశ్చాత్తాపపడి, మరియు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి…(ఆ విధంగానే మీరు దీనిలోనికి ప్రవేశిస్తారు)…మీ పాపక్షమాపణ నిమిత్తము అలాగు చేయుడి, మరియు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.
176 తాళపుచెవులు ఇక్కడ “క్లిక్” అన్నవి, మరియు అవి అక్కడ “క్లిక్” అన్నవి. ఆ కారణముచేతనే, యోహాను శిష్యులు వచ్చి మరియు యేసుక్రీస్తు నామములో, తిరిగి, బాప్తిస్మము పొందాల్సివచ్చింది (వారు పరలోకములోనికి ప్రవేశించగలుగుటకు ముందు), పరిశుద్ధాత్మను పొందుకోగలుగుటకు ముందు అలాగు చేయాల్సివచ్చింది. ఆయన తన మాటను నిలబెట్టుకున్నాడు. కావున ఇప్పుడు అది మీకు గందరగోళం కలుగజేయడంలేదు, అవునా? చూశారా? నిశ్చయంగా, మత్తయి 28:19 బిరుదులైయున్నవి, నామము కాదు.
177 మంచిది, మనకు ఇంకా ఎంత సమయమున్నది? మరికొన్ని ప్రశ్నలకు త్వరగా సమాధానమివ్వడానికి మనం ఇంకా పదిహేను నిమిషాలు తీసుకోవచ్చా? మనం తీసుకోవచ్చా? మంచిది, మనం త్వరపడతాము. నేను ఇక్కడ క్రింద రెండిటిని కలిగియున్నాను, నేను త్వరగా చెప్పగోరుతున్నాను, నాకు సాధ్యమైతే, నేరుగా దీనితో కలుపగోరుతున్నాను. పిదప ఆ మిగతావాటిని ఆదివారము ఉదయం నేను తీసుకోవచ్చు.
57. కయీను సర్పముయొక్క సంతానమా? (ఇది ఒక గట్టి ప్రశ్న.) అది అలాగైనట్లైతే, ఆదాము ఆమెను కూడేవరకు హవ్వ ఎందుకని గర్భము దాల్చలేదు?
అదే…తరువాతి ప్రశ్న కూడా ఆ విధంగానే ఉన్నది:
58. హవ్వ ఫలమును తిన్నది ఒక—ఒక అచ్చమైన చెట్టునుండేనా? అది ఆహారమునకు మంచిదని ఆమె చూసినది.
178 మంచిది, సహోదరుడా, సహోదరీ, అది ఎవరైనాసరే, మనం తిరిగి ఆదికాండములోనికి వెళ్ళి మరియు ఇక్కడ ఒక విషయాన్ని కనుగొందాము. మీరు చూసినయెడల, మనం ఆదికాండము 3:8కి వెళ్దాము. సరి, మరియు ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
179 ఇప్పుడు నేను ఆ కథను చెప్తాను. అదంతా స్వచ్ఛమైనది మరియు పరిశుద్ధమైనది, అక్కడ ఏ పాపము లేదా ఏ అపవిత్రత లేదు. ఇప్పుడు నేను…మీ…ఈ మొదటి ప్రశ్నను తీసుకుంటాను. జీవములో…తోట మధ్యలో, చెట్ల మధ్యన ఉన్న వృక్షము. వృక్షము “స్త్రీ” అయ్యున్నది. ఇప్పుడు మీరు గనుక కొన్ని నిమిషాలు ఓపికతో ఉంటే నేను లేఖనముల ద్వారా దానిని మీకు ఋజువుచేస్తాను.
180 మొదటిగా ఆమె…ఆదాము ఆమెను కూడకముందే ఆమె గర్భము ధరించినదా లేదా అన్నది, మనం చూద్దాము…వినండి:
మరియు చల్లపూట, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును వారు వినిరి: మరియు ఆదామును అతని భార్యయు దేవుడైన యెహోవా సన్నిధికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనిరి.
మరియు యెహోవా…ఆదామును పిలిచి ఇట్లనెను…నీవు ఎక్కడ ఉన్నావు?
అందుకతడు ఇట్లన్నాడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, నేను దిగంబరిగానుంటిని గనుక, నేను భయపడి;…(ఇప్పుడు, అంతకుముందు రోజు అతనికి అది తెలియలేదు; ఏదో జరిగినది, అతడు దిగంబరిగా ఉన్నాడని ఏదో అతనికి బయలుపరచినది) మరియు నేను దాగుకొంటిని.
అందుకాయన ఇట్లన్నాడు, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు ఆ వృక్షఫలమును తింటివా,…?
181 ఆ వృక్షఫలమును తినడం అతడు తాను దిగంబరిగా ఉన్నాడని గ్రహించేటట్లు చేసిందా? నేను తరచుగా చెప్పినట్లు, (ఇది ఎటువంటి జోకు కాదు, ఒక జోకు కోసం నేను దీనిని చెప్పడంలేదు) “కానీ యాపిల్ పండ్లను తినడం స్త్రీని తాను దిగంబరిగా ఉన్నదని గ్రహించేలా చేస్తే, మనం మరలా యాపిల్ పండ్లను పంచడం మంచిది.” చూశారా? అది అచ్చమైనది కాదు. వారు తిన్నది అది ఒక చెట్టు, ఒక యాపిల్ పండు కాదు, అది లైంగిక సంబంధమైనది. గమనించండి:
…నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును నీవు తింటివా?
మరియు మనుష్యుడు ఇట్లు చెప్పాడు, నాతో ఉండుటకు నీవు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీయే, ఆమెయే ఆ వృక్షమునుండి…నాకు ఇచ్చినది, మరియు నేను తింటిని.
అప్పుడు యెహోవా…స్త్రీని ఇట్లడిగెను, నీవు చేసినది ఏమిటి? మరియు స్త్రీ ఇట్లు జవాబిచ్చినది, సర్పము నన్ను మోసపుచ్చినది,…(హా?)…సర్పము నన్ను మోసపుచ్చినది గనుక, నేను తింటిని. (చూడండి, ఆదాము ద్వారా, ఆమె గర్భము దాల్చడానికి చాలాసేపటి క్రితమేయైయున్నది)
182 ఆదాము ఆమెను కూడెను, మరియు ఆమె గర్భము ధరించి మరియు—మరియు హేబెలును కనెను.
183 అయితే కేవలం ఒక అక్షరార్థమైన కోణము నుండి నేను మిమ్మల్ని అడుగగోరుతున్నాను. ఇప్పుడు ఆమె ఆ వృక్షమైయున్నదని మీకు నిరూపించడానికైయున్నది, ప్రతి స్త్రీ ఒక ఫలవృక్షమైయున్నది. అది ఎంతమందికి తెలుసు? మీరు మీ తల్లియొక్క ఫలము కాదా? నిశ్చయంగా, మీరు అదేయైయున్నారు. “మరియు ఫలము మధ్యలో, లేదా చెట్టు మధ్యలో, ఆమె ముట్టకూడని ఫలము.”
184 మీరు గమనించినట్లైతే, యేసు జీవవృక్షము కాడా? పరిశుద్ధ మత్తయిలో, లేదా, పరిశుద్ధ యోహాను, 6వ అధ్యాయములో, “దేవుని యొద్దనుండి పరలోకము నుండి వచ్చిన జీవాహారమును నేనే” అని ఆయన వాగ్దానము చేయలేదా?
185 ఒక పురుషుడు ఆ స్త్రీ నుండి తినినట్లైతే…మరియు చూడండి, ఆ స్త్రీ వలనైన…జన్మ ద్వారా, మనమందరము మరణిస్తాము; ఎందుకనగా మనము మరణమునకు బద్దులమైయున్నాము (అది నిజమేనా?) అది ఒక స్త్రీ వలనైన జన్మ ద్వారాయైయున్నది. పురుషుని వలనైన జన్మ ద్వారా, మనమందరము నిరంతరము జీవిస్తాము. స్త్రీ ఒక మరణపు వృక్షమైయున్నది, పురుషుడు జీవవృక్షమైయున్నాడు; ఏలయనగా స్త్రీ తనలో కనీసం జీవమునైనా కలిగియుండదు. అది ఖచ్చితముగా నిజము. ఆ—ఆ జీవ కణము పురుషుని లోనుండి వస్తుంది, నిజము. స్త్రీలోనికి వెళ్తుంది, మరియు ఒక స్త్రీ ఒక పొదుగుడు యంత్రము తప్ప మరేమియు కాదు; మరియు బిడ్డ నాభిపేగు వలన తప్ప, మరేవిధంగాను సంబంధము కలిగియుండదు. తల్లి రక్తముయొక్క ఒక్క చుక్కైనా బిడ్డలో ఉండదు; ఆమెయొక్క రక్తములో జన్మిస్తుంది, కానీ బిడ్డలోపల ఒక్క చుక్క కూడా ఉండదు. వెళ్ళి కనుగొనండి…లేక డాక్టర్ పుస్తకమును చదవండి, లేదా మీ వైద్యుడిని అడగండి, మీరు గ్రహిస్తారు. అది అక్కడ లేదు, లేదు, అయ్యా, దానిలోనిది ఒక్క చుక్క కూడా ఉండదు. ఆమె కేవలం అండము మాత్రమే, అది మాత్రమేయైయున్నది. మరియు జీవము పురుషునినుండి వస్తుంది.
186 స్త్రీ ద్వారా, సహజమైన జన్మ ద్వారా, మనమందరము చనిపోవాలి అని చూపించడానికి, అది ఒక అందమైన సాదృశ్యమైయున్నది, ఎందుకనగా ప్రారంభమే మనము మృతులమైయున్నాము; మరియు కేవలం క్రీస్తుయేసు అనే పురుషుని ద్వారా మాత్రమే మనం జీవించగలము. మరియు అక్కడ ఏదెను తోటలో రెండు వృక్షములు ఉన్నాయి. మీరు దానిని చూడటంలేదా?
187 మరియు గమనించండి! మరియు ఆ దినమున ఒక కెరూబు ఈ వృక్షమునకు కాపలాగా పెట్టబడినది. ఎందుకనగా వారు ఎన్నడైనా ఆ జీవవృక్షము నుండి తిన్నట్లైతే, వారందరు నిరంతరం జీవిస్తారు. అది ఎంతమందికి తెలుసు? వారందరు నిరంతరం జీవిస్తారు. మరియు మొదటిసారి వారు దానిని రుచి చూడగలిగినప్పుడు…దూత ఇట్లు చెప్పాడు, “మనము దానికి కాపలా కాయుదుము.” మరియు దానికి కాపలా కాయడానికి తూర్పున ఆ ఖడ్గజ్వాలలతో కెరూబులను వారు అక్కడ పెట్టారు. వారు దానిని తిరిగి తూర్పునకు తీసుకొనివెళ్ళి, మరియు వీరు దానిని (ఈ వృక్షమును) పొందుకోడానికి లోపలికి రాకుండా, ఖడ్గజ్వాలలతో ఆ వృక్షమునకు కాపలాకాశారు.
188 మరియు యేసు వచ్చినప్పుడు, ఆయన ఇట్లన్నాడు, “జీవాహారమును నేనే, ఈ రొట్టెను తిను మనుష్యుడు ఎన్నడూ చనిపోడు.” అదిగో అదే మీ వృక్షము.
189 అక్కడేమో మీకు ఆ స్త్రీ ఉన్నది, మరణమును తీసుకొచ్చే లైంగిక సంపర్కం ఉన్నది. ఒక లైంగిక వాంఛ ఉన్నంత నిశ్చయంగానే, దానివెంట మరణము వస్తుంది. మరియు ఒక ఆత్మసంబంధమైన జన్మ ఉన్నంత నిశ్చయంగానే, దానివెంట నిత్యజీవము వస్తుంది. ఒక స్త్రీయొక్క జన్మ ద్వారా మరణము వచ్చినది, మరియు ఒక పురుషునియొక్క జన్మ ద్వారా జీవము వచ్చినది. ఆమేన్! విషయం అదేయైయున్నది.
190 ఇప్పుడు మనం తిరిగి కయీను దగ్గరకు వెళ్దాము. ఆ ఆత్మ మరియు ఆ నీచత్వము ఎక్కడనుండి వచ్చాయో మీరు నాకు చెప్పగలరా? కయీను గనుక…చూడండి, కయీను గనుక దేవుని కుమారుడైనట్టి ఆదాముయొక్క కుమారుడైతే, ఆ దుష్ట స్వభావము ఎక్కడనుండి వచ్చింది? మొదటి విషయమేమిటంటే అతడు జన్మించినప్పుడు, అతడు ద్వేషించాడు, అతడు ఒక హంతకుడైయున్నాడు, అతడు అసూయపడ్డాడు. మరియు ఇప్పుడు అతని తండ్రియొక్క స్వభావమును తీసుకోండి, ఆదిలో ప్రారంభములోనే, లూసిఫరు, మరి వాడు ఆదిలో…వాడు మిఖాయేలుపై అసూయపడ్డాడు, అదే సమస్యంతటినీ ప్రారంభించినది. అది ఎంతమందికి తెలుసు? మరియు కయీను తన తండ్రియొక్క స్వభావము గలవాడు, మరందుకే అతడు తన సహోదరునిపై అసూయపడి అతడిని చంపేశాడు. ఆ స్వచ్ఛమైన…ఆ స్వచ్ఛమైన ప్రవాహమునుండి ఆ స్వభావము బయటకు రాజాలదు. అది…ఈ వక్రీకరించబడిన ప్రవాహమునుండే బయటకు రావలసియున్నది. మరియు కయీనును గమనించండి, అతడు జన్మించిన వెంటనే.
191 మరియు పిదప అతనివెంటే హేబెలు జన్మించాడు, అప్పుడు ఆమె ఆదాము ద్వారా గర్భము ధరించినది, మరియు అతడు ఆమెను కూడినాడు మరియు ఆమె కుమారుడైన హేబెలును కన్నది. మరియు హేబెలు క్రీస్తుకు ఒక సాదృశ్యమైయున్నాడు; మరియు హేబెలు చంపబడినప్పుడు, షేతు అతని స్థానమును తీసుకున్నాడు; క్రీస్తుయొక్క మరణము, సమాధి, మరియు పునరుత్థానమునకు సాదృశ్యముగానున్నది.
192 అయితే, ఇప్పుడు, కయీను ఆరాధించాడు; ఈనాడు ఉన్నట్టి శరీరసంబంధమైన సంఘమువలె, అతనియొక్క శరీరసంబంధమైన క్రియలన్నీ ఉన్నాయి: వారు సంఘానికి వెళ్తారు, వారు ఆరాధిస్తారు. కయీను ఆరాధించాడు; అతడు ఒక అవిశ్వాసి కాదు, అతడు ఒక కమ్యూనిస్టు కాదు. కయీను ఒక విశ్వాసియే; అతడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, అతడు ఒక బలిపీఠమును కట్టాడు. హేబెలు చేసిన ప్రతీ మతసంబంధమైన కార్యమును అతడు చేశాడు, కానీ అతడు దేవుని చిత్తమును గూర్చిన ఆత్మసంబంధమైన ప్రత్యక్షతను కలిగిలేడు. ప్రభువు నామము స్తుతింపబడును గాక! విషయం అదే. మీరు దానిని చూస్తున్నారా? అతడు ఆత్మసంబంధమైన ప్రత్యక్షతను కలిగిలేడు, మరియు ఈనాడు సంఘముతో ఉన్న సమస్య అదే. మరియు ఆ ఆత్మసంబంధమైన ప్రత్యక్షత మీదనే ఆయన తన సంఘమును కడతాడని యేసు చెప్పాడు. మీకు అది అర్థమైందా? ఓ, మై, ఇప్పుడు మీ కన్నులు తెరువబడవచ్చును. చూడండి, ఆత్మసంబంధమైన ప్రత్యక్షత.
193 కయీను వచ్చి, అతడు ఒక బలిపీఠమును కట్టాడు, అతడు ఆరాధించాడు, అతడు బల్యర్పణను తెచ్చాడు, అతడు మోకరించాడు, అతడు దేవుడిని స్తుతించాడు, అతడు దేవుణ్ణి ఆరాధించాడు, హేబెలు చేసిన ప్రతీ మతభక్తి సంబంధమైనదానిని అతడు చేశాడు. మరియు అతడు ఆత్మసంబంధమైన ప్రత్యక్షతను కలిగిలేనందున, దేవుడు అతడిని బొత్తిగా తిరస్కరించాడు!
194 అదే కయీను వరుసను వెంబడించండి: తిన్నగా ఓడ వరకు, ఓడ నుండి నేరుగా ఇశ్రాయేలు వరకు, ఇశ్రాయేలు నుండి నేరుగా యేసు వరకు, మరియు యేసు నుండి తిన్నగా ఈ దినము వరకు గమనించండి; మరియు ఆ శరీరసంబంధమైన, నియమబద్ధమైన సంఘము, మొండిదై మరియు చాదస్తపుదై, పాండిత్యముగలదిగా లేదేమో చూడండి, నా ఉద్దేశ్యము ఏమిటంటే లేఖనములను కలిగియున్న ప్రజలు, సమస్త సిద్ధాంతమును మరియు వేదాంతములను ఎరిగియున్నవారు, అబ్బాయ్, వారు దానిని, కేవలం అలా వివరించగలరు, కానీ అది ఆత్మసంబంధమైన ప్రత్యక్షత లేకుండాయై యున్నది! [సహోదరుడు బ్రెన్హామ్ చిటుక వేశారు—సంపా.] అది నిజము. అది కయీనుయొక్క సిద్ధాంతమైయున్నది.
195 బైబిలు ఇట్లు చెప్పింది, “వారికి శ్రమ! ఏలయనగా వారు కయీను సిద్ధాంతములో నడిచిరి, బిలాము నడచిన తప్పుత్రోవలో పరుగెత్తిరి, మరియు కోరహు చేసినట్టు తిరుగుబాటు చేసి నశించిరి.” అదే గ్రంథము, యూదా, అతడు ఇట్లు చెప్పాడు, “వారు ఈ శిక్షావిధి పొందుటకు ముందుగా నిర్ణయించబడిరి.” ఖచ్చితంగా, వారు ముందుగా నిర్ణయించబడ్డారు. చూశారా? బిలాము ఏమైయున్నాడు? అతడు ఒక బిషప్పుయై యున్నాడు. అతడు సంఘమంతటికి అధిపతిగా ఉన్నాడు. అతడు ఎంతో నియమబద్ధంగా అక్కడికి వచ్చాడు. అతడు అర్పణ చేశాడు…అతడు అక్కడ ఆ ప్రఖ్యాతిగాంచినవారి మధ్య నిలబడియుండుటను చూడండి, అక్కడ వారియొక్క ఆ గొప్ప ప్రఖ్యాతిగాంచినవారి మధ్య నిలబడియున్నాడు. మరియు వారు మతవిరోధులు కారు, వారు విశ్వాసులే.
196 ఆ—ఆ మోయాబు గోత్రము లోతు కుమార్తె నుండి వచ్చినది. లోతు సహజీవనం…లోతుయొక్క కుమార్తె తన తండ్రితో సహజీవనం చేసి, గర్భవతియై మరియు కుమారుడిని కనినది, మరియు ఆ కుమారుడి నుండి…మోయాబు గోత్రము పుట్టినది. మరియు వారు ఒక గొప్ప సంఘశాఖయైయున్నారు. గొప్పవారు, ఆడంబరాలుగల ప్రజలు, మరియు వారు రాకుమారులను, రాజులను మరియు ప్రముఖులను కలిగియున్నారు. వారు బిషప్పులను మరియు మతాధిపతులను మరియు సమస్తమును కలిగియున్నారు.
197 మరియు ఇదిగో పరిశుద్ధాత్మలో దొర్లేవాళ్ళ గుంపు ఒకటి, ఈ మరొక గుంపు అక్కడికి వచ్చినది, అనగా ఇశ్రాయేలువారు; ఒక సంఘశాఖ కానట్టి ఒక చిన్న గుంపైయున్నారు, అందరినీ ఆహ్వానించేవారైయున్నారు. మరియు వారు చేయవలసియున్న ప్రతిదానిని వారు చేశారు, చెడ్డవాటిని కూడా చేశారు. అయితే అదేమిటనగా, వారు ఆత్మసంబంధమైన ప్రత్యక్షతను కలిగియున్నారు, మరియు ఒక అగ్నిస్తంభములో దేవుడు వారితో ఉన్నాడు.
198 ఓ, వారు శరీరసంబంధమైన విషయాలను కలిగియున్నారని నాకు తెలుసు, మరియు, “అటువంటి ఒక నీచమైన గుంపు, వారిని గెంటివేయడంకంటే చేసేదేమీ లేదు” అని ప్రజలు అన్నారు. కానీ వారు ఆత్మసంబంధమైన ప్రత్యక్షతను కలిగియున్నారు, మరియు వారు ఒక కొట్టబడిన బండను కలిగియున్నారు, వారు ఒక ఇత్తడి సర్పమును కలిగియున్నారు, వారితో వెళ్తున్న ఒక అగ్నిస్తంభమును వారు కలిగియున్నారు. హల్లెలూయా! నేను ఉత్సాహభరితుడను అవుతున్నానని మీరు—మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ నేను అలా అవ్వడంలేదు. నాకు కేవలం బాగుగా అనిపిస్తున్నది.
199 గమనించండి! “అదే దేవుడు, ఈ రోజు, మనతో జీవిస్తున్నాడు” అనేదాని గురించి నేను ఆలోచించినప్పుడు అట్లున్నది. అది ఇంకనూ వాక్యముయొక్క ఆత్మసంబంధమైన ప్రత్యక్షతయైయున్నది. నిశ్చయంగా, అది అదేయైయున్నది. అది నిత్య సత్యమైయున్నది. ప్రభువు నామము స్తుతింపబడును గాక! అవును, అయ్యా.
200 ఇదిగో ఆ నియమబద్ధుడు, అతడు ఆ పైన అక్కడ నిలబడ్డాడు; ఆ బ్యాప్టిస్టులు మరియు ప్రెస్బిటేరియన్ల గుంపు ఆ కొండ పైన నిలబడ్డారు, మరియు వారు వారి బిషప్పును అక్కడికి తెచ్చుకున్నారు. మరియు వారు అంతే మతపరమైనవారై యున్నారు, మరియు ఒకే రకమైన మతస్థులైయున్నారు, వారు ఒకే దేవుడిని ఆరాధించారు. వారు ఇట్లన్నారు, “అక్కడ దిగువున ఉన్న ఆ చెత్త గుంపును చూడండి. ఏమిటీ, వారికి కనీసం ఒక సంఘశాఖయైనా లేదు. వారు కేవలం కేకలు పెడుతూ, అరుస్తూ, పరిశుద్ధాత్మలో దొర్లేవారి గుంపు తప్ప ఇంకేమీ కారు.
201 అది నిజమేనా? ఖచ్చితంగా, వారు అదేయైయున్నారు. వారు పరిశుద్ధాత్మలో దొర్లేవాళ్ళని మీరు నమ్మకపోతే, వెనుక ఆదికాండములోనికి వెళ్ళి మరియు వారు దాటివెళ్ళినప్పుడు ఏమి జరిగిందో కనుగొనండి. మరి ఒక అద్భుతము జరిగించబడినది, మరియు మిర్యాము ఒక కంజెర తీసుకొని మరియు ఆ ఒడ్డున వెళ్ళినది, దానిని వాయించుకుంటూ, ఆత్మలో నాట్యం చేస్తూ వెళ్ళినది, మరియు మోషే ఆత్మలో పాడినాడు. వారు గనుక మనం పేరు పెట్టినట్లు స్వేచ్ఛ…పరిశుద్ధాత్మలో దొర్లేవాళ్ళు కాకపోతే, ఇంకెవరు అవుతారో నాకు తెలియదు; పాడుతూ మరియు గెంతుతూ మరియు స్తుతిస్తూ వెళ్ళారు. మరియు అన్నివేళలా దేశాలు వారిని ద్వేషించాయి, కానీ దేవుడు వారితో ఉన్నాడు. వారు ఆత్మసంబంధమైన ప్రత్యక్షతను కలిగియున్నారు, ఆ అగ్నిస్తంభమును వెంబడిస్తున్నారు.
202 మరియు, “ఇప్పుడు, ఇక్కడ చూడండి. మనము మతాధిపతులందరినీ మరియు బిషప్పులందరినీ, మరియు ప్రెస్బిటర్లందరినీ పిలిపించి, మరియు వారిని ఇక్కడికి రప్పిద్దాము. మనము దాని విషయంలో ఏదో ఒకటి చేద్దాము, ఎందుకంటే మనము ఒక మతభక్తిగల దేశమైయున్నాము. మనము మన చక్కని సంఘశాఖలో ఆ ప్రచారమును కలగలుపు కానివ్వొద్దు” అని మోయాబు అన్నాడు.
203 మరియు కాబట్టి వారు వారిని అక్కడికి రప్పించారు. మరియు వారు పన్నెండు బలిపీఠములను కట్టారు; సరిగ్గా ఇశ్రాయేలు కలిగియున్నది అదేయైయున్నది, పన్నెండు బలిపీఠములు. వారు దాని మీద పన్నెండు బల్యర్పణలను పెట్టారు, కోడెలు; సరిగ్గా ఇశ్రాయేలు కలిగియున్నది, దేవుడు కోరినది అదేయైయున్నది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను సూచిస్తూ, వారు దాని మీద పన్నెండు గొర్రెపిల్లలను పెట్టారు; రెండు చోట్లా పన్నెండు గొర్రెపిల్లలను పెట్టారు.
204 ప్రముఖులందరూ, బిషప్పులు మరియు అందరూ చుట్టూ నిలబడియున్నారు. వారు అర్పణను మండించారు. వారు ప్రార్థించి, యెహోవాకు తమ చేతులనెత్తి, మరియు ఇట్లన్నారు, “యెహోవా, మా మనవి ఆలకించుము!” వారేమి చేయడానికి ప్రయత్నిస్తున్నారు? మరి వారియొక్క ఆ బిలాము ఆ విధంగా ముందుకు వెళ్ళాడు, మరియు ఆత్మ అతని మీదకు దిగివచ్చినది. నిశ్చయంగా (కానీ అతడు ఒక శరీరసంబంధియైయున్నాడు).
205 ఆత్మ ఒక వేషధారి మీద కుమ్మరించబడగలదు, అని బైబిలు చెప్పింది. ఇప్పుడు, నేను దానిని బోధించడాన్ని మీరు విన్నారు. “వర్షము నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను కురుస్తుంది.” అయితే అది వాక్యముతో సరితూగవలసియున్నది, అక్కడే మీరు దానిని పట్టుకుంటారు.
206 పిదప అతడు అలా చేసినప్పుడు, మరియు ఆ…ఆత్మ, అతని మీద ఉన్ననూ, సత్యమును చెప్పినది, అతడు ఇశ్రాయేలీయులను శపించడానికి ప్రయత్నించాడు, మరి అతడు ఇశ్రాయేలీయులను దీవించాడు.
207 ఇప్పుడు, దేవుడు గనుక ఒక చక్కని సంఘమును, ఒక చక్కని బిషప్పును, మరియు ఒక అద్భుతమైన సంఘకాపరిని, వేదపాండిత్యముగల ఒక గుంపు ప్రజలను గౌరవించినట్లైతే, ఆ బల్యర్పణను స్వీకరించడానికి ఆయన బద్ధుడైయుంటాడు, ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఎంత సరియైయున్నారో నియమబద్ధంగా అతడు కూడా అంతే సరియైయున్నాడు; కానీ అతడు వాక్యముయొక్కయు దేవుని చిత్తముయొక్కయు ఆత్మసంబంధమైన ప్రత్యక్షతను కలిగిలేడు. విషయం అదేయైయున్నది, ఈనాడు వ్యత్యాసము అదే.
208 యేసును చూడండి. వారు ఇట్లన్నారు, “ఆ వ్యక్తికి దూరంగా ఉండండి. అతడు ఒక సమరయుడని మాకు తెలుసు. అతడు వెర్రివాడు. నీవు మాకు బోధిస్తావా? మంచిది, నీవు వ్యభిచారములో పుట్టావు. అసలు ముందే నీవు అక్రమసంతానము తప్ప ఇంకేమీ కాదు. నీ తండ్రి ఎవరు? దేవుడు నీ తండ్రి అని చెప్తున్నావ్, దైవదూషకుడా! ఏంటీ, నీవు మాకు చెప్పాలనుకుంటున్నావా? మేము బోధకులమైయున్నాము, మేము బిషప్పులమైయున్నాము; మా తాత-తాత-తాత-తాత-తాత-తాత-తాత-ముత్తాతల నుండే బోధకులు మరియు బిషప్పులైయున్నారు. మేము సంఘములో పుట్టి పెరిగాము. మేము అత్యున్నతమైన సెమినరీలగుండా వచ్చాము. మాకు ప్రతీ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా తెలుసు. మరియు నీవు మాకు బోధించడానికి ప్రయత్నిస్తున్నావా? నీవు అసలు ఏ పాఠశాలకు వెళ్ళావు? నీవు ఈ జ్ఞానమును ఎక్కడనుండి పొందావు?”
209 ఆయన ఇట్లన్నాడు, “మీరు…మీ తండ్రియగు అపవాది సంబంధులు,” అని యేసు అన్నాడు.
210 వారు వారి మధ్యన ఎటువంటి సూచనలను మరియు అద్భుతాలను కలిగిలేరు. వారు వారి మధ్యన ఏ దైవిక స్వస్థతలను మరియు అటువంటి ఏ కార్యములను కలిగిలేరు. వారు వారి మధ్య ఎటువంటి ఆశీర్వాదములను కలిగిలేరు. అయితే యేసు ఖచ్చితంగా లేఖనములయొక్క ఆత్మసంబంధమైన ప్రత్యక్షతయైయున్నాడు.
211 వారు ఇట్లన్నారు, “ఏంటీ, ఫలానా-ఫలానా విధంగా వ్రాయబడియున్నది.”
212 మరియు యేసు ఇట్లన్నాడు, “అవును, ఈ విధంగా కూడా వ్రాయబడియున్నది.” కానీ దేవుడు ఆయనయొక్క మనిషిని ఆయనయొక్క సూచకక్రియల ద్వారా నిర్ధారించాడు.
213 అపొస్తలుల కార్యములు 2 లో, పేతురు కూడా దానినే చెప్పాడు, అతడు ఇట్లన్నాడు, “ఇశ్రాయేలు వారలారా; దేవుడు నజరేయుడైన యేసు చేత, సూచకక్రియలను మరియు మహత్కార్యములను మీ మధ్యన చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను, ఇది మీరే ఎరుగుదురు.” (విషయం అదే) “ఆయన…భవి-…అక్కడున్న ఆ పెద్ద సన్హెద్రిన్ సభ ద్వారా అప్పగించబడ్డాడు. అయితే అది దేవునియొక్క భవిష్యద్ జ్ఞానము ద్వారా, ఆయన ఇట్టి మరణమువలన చనిపోవలెనని దేవుడు ఆయనను ముందుగా నిర్ణయించుట వలనైయున్నది. ఈయనను మీరు క్రూరమైన దుష్ట చేతులతో అప్పగించిరి. మీరు జీవాధిపతిని సిలువవేసితిరి, దేవుడు ఆయనను లేపెను. మరియు దీనికి మేము సాక్షులము.”
214 ఫ్యూ, ఎటువంటి ఒక బోధకుడు! చేయలేదు…అతడు కనీసం తన స్వంత పేరునే సంతకం చేయలేడు, కానీ అతడు దేవుడిని ఎరిగియున్నాడు. “అతడు యేసుతో కూడా ఉండినాడని వారు గుర్తెరిగిరి” అని వారు చెప్పారు. ఖచ్చితంగా, అది ఒక ఆత్మసంబంధమైన ప్రత్యక్షతైయున్నది. ఓ, మై. ఇప్పుడు, విషయం అదేయైయున్నది.
215 కయీను సరిగ్గా అదే వరుసలో ఉన్నాడు, ఆ శరీరసంబంధమైన సంఘము ఈనాడు అదే వరుసలో ఉన్నది. ఆత్మసంబంధమైన సంఘము ఇంకను అగ్నిస్తంభమును కలిగియున్నది, ఇంకను సూచకక్రియలను, అద్భుతాలను కలిగియున్నది, ఇంకను అదే క్రీస్తును కలిగియున్నది; మరి ఆవియే ఏదెను తోటలో, గొర్రెపిల్లయొక్క మరణము నుండి, గొర్రెపిల్లయొక్క రెండవ రాకడవరకును నిర్ధారిస్తున్నవి. ఖచ్చితంగా, నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడు.
216 మరియు కయీనుయొక్క ఆ వంశము, మతపరమైనవారు మరియు మెరుగుదిద్దబడినవారు మరియు వేదపండితులు, సరిగ్గా ఇంకను అదే విధంగా ఉన్నారు; సరిగ్గా అలాగే ఉన్నారు, ప్రతీ రోజు ఖచ్చితంగా అదే విధంగా ఉన్నారు. విమర్శకులు మరియు హింసకులు, హేబెలు విషయంలో కయీను ఉన్నట్లే, ఈనాడు వారు ఉన్నారు, మరియు ఇదివరకు అలాగే ఉన్నారు మరియు ఎల్లప్పుడూ అలాగే ఉంటారు; శరీరసంబంధులు, అవిశ్వాసులు. అది నిజము.
217 ఇప్పుడు ఆదికాండము 3:8, మరియు నేను ఇక్కడ 20వ దానిని కూడా ఉంచుతాను, కొద్దిసేపటి క్రితం నేను చూస్తున్నాను:
మరియు ఆదాము పేరుపెట్టెను…మరియు ఆదాము తన భార్యకు…హవ్వ అని పేరుపెట్టెను; ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికి తల్లి. (చూడండి, అది ఈ మోసము ఇదివరకే జరిగిపోయిన తరువాతైయున్నది)
218 కయీను…“ఇప్పుడు అగండి!” మీరు ఇట్లాంటారు, “ఒక పాము, ఒక సర్పము ఎలా?”
219 కానీ, సహోదరుడా, ఇక్కడ గమనించు, వాడు ఒక సర్పమని బైబిలు చెప్పడంలేదు; “వాడు భూజంతువులన్నీటిలో అత్యంత యుక్తిగలవాడని,” బైబిలు చెప్పినది. వాడు ఒక ప్రాకెడి ప్రాణి కాదు, వాడొక మృగమైయున్నాడు. వాడు ఒక…మరియు అక్కడ…
220 మరియు మీరు స్వీకరించినట్లైతే, మన మధ్య ఒక చిన్న గురుతుగా దీనిని మీకు ఇవ్వనీయండి. విజ్ఞానశాస్త్రమంతా గందరగోళమైనది అక్కడేయైయున్నది. వారు మనిషికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు కనుగొనగలిగేది, ఒక చింపాంజీ అయ్యున్నది. అది ఎంతమందికి తెలుసు? కానీ ఆ మధ్యలో ఒకటి ఉన్నది. వారు చింపాంజీ ఎముకలను మనిషియొక్క ఎముకలతో సరితూగునట్లు చేయలేరు, మరైనను అది అత్యంత సమీపమైనదిగా ఉన్నది. వారు అతణ్ణి తోకకప్ప నుండి వచ్చాడని పోల్చగలరు. వారు అతణ్ణి ఒక పిల్లకప్ప నుండి వచ్చాడని పోల్చగలరు. వారు అతణ్ణి జంతువుతో మరియు ప్రతీ జంతువుతో పోల్చగలరు. వారు అతణ్ణి ఎలుగుబంటితో పోల్చగలరు. మీరు ఒక ఎలుగుబంటిని తీసుకొని మరియు దాని చర్మమును తీసివేయండి, అది సరిగ్గా ఒక చిన్న స్త్రీ వలె ఉంటుంది. ఆ ఆకృతి సరిగ్గా ఒకేలాగా ఉంటుంది. దాని వీపును మరియు సమస్తమును గమనించండి, వారిని అక్కడ నిలబెట్టండి, మరియు అక్కడ ఆ స్త్రీని…ఆ స్త్రీని ఆ విధంగా నిలబెట్టండి. అది సరిగ్గా ఒక ఎలుగుబంటి వలెనే ఉంటుంది. పాదం ఒకే విధంగా ఉంటుంది, మరియు చెయ్యి ఈ విధంగా ఉంటుంది, సరిగ్గా ఒక మానవుని వలె ఉంటుంది. కానీ ఒక చింపాంజీ దానికంటే దగ్గరగా ఉంటుంది. అది దాదాపు అట్లే ఉంటుంది, కానీ వారు దానిని కనుగొనలేరు.
221 మీరు దానిని తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ ఒక చిన్న రహస్యమున్నది. అది ఎక్కడుందో మీకు తెలుసా? అది వారికి మరుగుచేయబడినది. వారు వారికి కావాల్సినన్ని ఎముకలను త్రవ్వవచ్చును. వారు త్రవ్వవచ్చును…శిల్పకారులు త్రవ్వవచ్చును, మరియు విజ్ఞానశాస్త్రము ఏదైనా చేయవచ్చును, మరియు—మరియు ఆ కాలక్రమవేత్త పరమాణువు కొలతలతో కాల ప్రమాణములను కొలవవచ్చును, కానీ వారు దానిని ఎన్నడూ పట్టుకోలేరు. ఏలయనగా భూమి మీదనున్న దేనికంటెను మానవునికి అత్యంత దగ్గర పోలిక కలిగియున్నది సర్పమైయున్నది, మరియు దేవుడు వాడిని శపించి మరియు వాడిని పొట్టతో ప్రాకునట్లు చేశాడు, మరియు వాడు అసలు మనిషి పోలికే లేకుండా ఒక పాముగా మారిపోయాడు. ఇప్పుడు, కేవలం మీ తలను గోక్కోండి, ఆ శాస్త్రవేత్తలతో అంటున్నాను, మరియు వారిని కొద్దిసేపు దానిని తీసుకోనివ్వండి.
222 అయితే బైబిలు దానిని చెప్తున్నది, “వాడు భూజంతువులన్నీటిలో అత్యంత యుక్తిగలవాడు.” అది నిజము. మనిషికి మరియు కోతికి మధ్య నిలిచే ఆ కొక్కెము వాడేయైయున్నాడు, మరియు వారు చేసిన క్రియనుబట్టి దేవుడు వాడిని శపించి మరియు వాడిని వాని పొట్ట మీద ప్రాకునట్లు చేశాడు. వాడు ఈ స్త్రీని మోసగించాడు, మరియు ఆమె తన మొదటి కుమారుడైన కయీనును కనినది, అతడు సర్పముయొక్క, అనగా సర్పములో దూరి దానిని చేసినట్టి ఆ అపవాదియొక్క స్వంత ప్రేరేపణా స్వభావమును కలిగినవాడైయున్నాడు.
223 మరియు పిదప ఆమె గర్భము ధరించి కనినది, ఆమె మోసపరచబడిన తర్వాత మరలా గర్భము దాల్చినది. ఇప్పుడు గమనించండి, ఆమె మోసపరచబడినది, ఆమె దాదాపు…సరి, ఆమె తప్పు చేసింది. అయితే ఆమె, తన భర్త ద్వారా గర్భవతియైనప్పుడు మాత్రం, అది ఖచ్చితంగా చట్టబద్ధమైనదే, ఏలయనగా చాలా, చాలా సార్ల తర్వాత కావచ్చును, చాలా నెలలు మరియు చాలా రోజుల తర్వాత కావచ్చును; మీరు దానిని చెప్పలేరు, మనకు తెలియదు, అయితే ఆమె ఆదాము ద్వారా కూడా కనినది.
224 మరియు ఎవరో ఆ ప్రశ్నను కూడా కలిగియున్నారు, ఇట్లన్నారు, “మంచిది, కుమారుడు…అతడు ఇట్లు చెప్పాడు ఆమె…కయీను పుట్టినప్పుడు, ఆమె ‘ప్రభువు దయవలన ఒక కుమారుని సంపాదించుకున్నానని’ చెప్పింది.” ఖచ్చితంగా, నిశ్చయంగా, అది అలాగే ఉండవలసియున్నది. అది ప్రకృతియొక్క నియమమైయున్నది. ఈనాడు మీరు వచ్చింది సరిగ్గా ఆ విధంగానేయై యున్నది. మీరు పుట్టినప్పుడు, దేవుడు ఊరకే దిగివచ్చి మిమ్మల్ని తయారుచేయడు. మీరు మీ తల్లి మరియు తండ్రియొక్క సంతానమైయున్నారు. మరియు మీరు ఒక…ఒక…మీ పిల్లలు మీ సంతానమైయుంటారు. అది అన్నివేళలా ఒక సంతానోత్పత్తియైయున్నది, అలాగే క్రిందకు కొనసాగుటయైయున్నది, విత్తనపు చెట్లు మరియు మొదలగువాటివలె ఉన్నది; అయితే తిరిగి అసలైనదాని వద్దకైయున్నది. అది దానిని వివరిస్తుందని నేను ఆశపడుతున్నాను.
225 మనకు ఎంత సమయమున్నది? ఇంకెంత సమయమూ లేదు. ఈ మంచిదానిని వినండి…మనము వచ్చే ఆదివారము చూడబోయేవాటి కొరకైయున్నది: “ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము…” (మనము దానిని తెలుసుకోవాలని కోరుతున్నాము.) “…క్రీస్తు.” ఆ సమయములో…ఇప్పుడు, నేను కొన్ని లేఖనములను తీసుకోవచ్చని అనుకుంటున్నాను, దాని మీద మంచి లేఖనములైయున్నవి [సహోదరుడు బ్రెన్హామ్ గారు దీనికి రెండవ భాగములో, 60వ ప్రశ్నలో జవాబునిస్తారు—సంపా.].
226 ఇదిగో మంచిది ఒకటున్నది, ఎటువంటిదంటే…దీనికి జవాబునివ్వడానికి, మీరు నాకు కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు ఇస్తారా? అది దానిలోనే జవాబును కలిగియున్నది.
59. “దుష్టులు నిత్యము కాలుతూ ఉండరు” అని మీరు చెప్పినప్పుడు—చెప్పినప్పుడు,…(మంచిది, ఇప్పుడు నేను యెహోవా సాక్షులను ఇరుకునపెడుతున్నాను, కాదా?)…దుష్టులు నిత్యము కాలుతూ ఉండరు అని మీరు చెప్పినప్పుడు, మీ ఉద్దేశ్యము పాతాళములో అనియా లేక అగ్నిగుండములో అనియా? పాతాళము అగ్నిగుండములోనికి పడద్రోయబడునని ప్రకటనలో చెప్పబడుతుందని నాకు తెలుసు (అది 20వ అధ్యాయమైయున్నది). వారు నిత్యమూ కాల్చబడనియెడల, మరి వారికి ఏమి సంభవిస్తుంది?
227 సహోదరుడా లేక సహోదరీ, అది ఎవరైనా గాని, నేను సరిగ్గా ఇందాకే చెప్పినట్లు; వారు అంతరించిపోతారు, ఇక వారి విషయంలో ఏమీ ఉండదు. వారు ఒక ప్రారంభమును కలిగియున్నారు, మరియు అక్కడ వారు అంతమౌతారు; వారు ఇక ఎంతమాత్రము ఉండరు. ఎంత…వారు ఎంత కాలము కాలుతారు, అది చెప్పడం కష్టం. అయితే, చూడండి, అక్కడ…
228 మీరు గనుక కేవలం దీనిని గ్రహించగలిగితే చాలు, చూడండి, ఇది చాలా సామాన్యమైనది. ఒకే ఒక్క రకమైన నిత్యజీవము ఉన్నది, మరియు అది స్వయంగా దేవుని నుండే వస్తుంది. మరియు దేవుడు మాత్రమే నిత్యజీవమైయున్నాడు. మీరు గనుక ఇక్కడ భాషా నిఘంటువులో చూసినట్లైతే, జోయీ అనే గ్రీకు పదమును వెదకండి. జోయీ అంటే “నిత్యజీవము.” నిత్యజీవము అంటే “దేవుడు.” మరియు యేసు, “నేను వారికి నిత్యజీవమును ఇచ్చుచున్నాను” అని అన్నాడు. మరియు మీరు ఇక్కడ ఆ భాషా నిఘంటువులో చూస్తే, అది “జోయీ” అని వ్రాయబడియున్నది. ఉన్నటువంటి ఒకే ఒక్క నిత్యజీవము అదేయైయున్నది. నిత్యమైన నరకము ఉన్నదని బైబిలులో ఎక్కడా చెప్పబడలేదు, వారు “ఎప్పటికీ మరియు ఎప్పటికీ” కాలుదురని అది చెప్పినది. [తెలుగు బైబిలులో యుగయుగములు అని వాడబడినది.—తర్జుమాదారుడు.]
229 ఇప్పుడు, ఎప్పటికీ అనే పదమును తెలుసుకోడానికి, ఏయాన్, అనేదానిని చూడండి. మీరు బైబిలులో, ఇక్కడ గమనించారా? “ఏయాన్ లు మరియు ఏయా-…” అని అది చెప్పడాన్ని ఎంతమంది విన్నారు? ఏయాన్ అనగా “ఒక కాల వ్యవధి” అని ఎంతమందికి తెలుసు? ఏంటీ, నిశ్చయంగా, ఏయాన్ అంటే “ఒక కాల వ్యవధి” అని ఎవరికైనా తెలుసు.
230 “మరియు వారు ఏయాన్ ల వరకు కాలుదురు,” అనగా కొన్ని కాల వ్యవధులైయున్నవి. “అగ్నిగుండములో పడద్రోయబడుదురు, మరియు ఏయాన్ ల వరకు కాలుదురు.” ఏయాన్ లు అనగా “కాల వ్యవధులు” అని అర్థము. వారు శిక్షలో వంద మిలియన్ సంవత్సరాలు కాలవచ్చును, కానీ, చివరికి, మొత్తానికే, అంతరించిపోడానికి; వారు అంతమునకు రావలసియున్నారు. చూడండి, ఎందుకనగా పరిపూర్ణము కాని ప్రతీది పరిపూర్ణమైనదాని నుండి తీయబడి వక్రీకరించబడినదే; మరియు దానికి ఒక ఆరంభము ఉంటుంది, కావున అది తప్పక ఒక అంతమును కలిగియుండవలసియున్నది.
231 కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచే మనము జోయీ ని, అనగా “దేవునియొక్క స్వంత జీవమును” మనలో కలిగియుండి, నిత్యజీవమును కలిగియుంటాము. యుగయుగముల జీవమును కలిగియుండము, పాపి యుగయుగముల జీవమును కలిగియుంటాడు, కానీ మనము “నిత్యజీవమును” కలిగియుంటాము.
232 సహోదరుడు కాక్స్, ఈ మధ్యనే, మేము ముందు…మేము అక్కడ ఆ రాళ్ళను పేర్చిన తర్వాత అతడు మా ఇంటి ప్రవేశదారిలో కూర్చొనియున్నాడు, మరియు అతడు ఒక చిన్న, పాత శిలాజమును తీసుకొని, మరియు అతడు ఇట్లన్నాడు, “సహోదరుడా బ్రెన్హామ్, అది ఎన్ని సంవత్సరాలది?”
233 “ఓ,” నేను ఇట్లన్నాను, “కాలక్రమానుసారముగా, అది పదివేల సంవత్సరాల నాటిదని చెప్పవచ్చును. ఒకప్పుడు జీవించిన, ఒక విధమైన చిన్న సముద్రపు జంతువు, ఒక చిన్న సముద్రపు జంతువు, గతించిన కాలములలో జీవించియుండవచ్చును.”
234 అతడు ఇట్లన్నాడు, “ఆ జీవముతో పోలిస్తే మానవ జీవము ఎంత తక్కువ కాలపుదో ఆలోచించు.”
235 నేను ఇట్లన్నాను, “ఓ, కానీ, సహోదరుడా, అది ఒక అంతమును కలిగియున్నది, కానీ క్రీస్తులో మనము కలిగియున్న జీవమునకు ఏ అంతము లేదు. అది రెండు లేదా మూడు యుగములు జీవించవచ్చును, కానీ అది ఎన్నడూ నిత్యజీవమును కలిగియుండదు, ఎందుకనగా నిత్యజీవము దేవుని నుండి మాత్రమే వస్తుంది.”
236 నిత్యమైనది, “నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు మరియు ఎన్నడూ తీర్పునొద్దకు రాక మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు.” విషయం అదేయైయున్నది, మీరు ఒక విశ్వాసియైయుండుట ద్వారా నిత్యజీవమును పొందుతారు. ఒక అవిశ్వాసి యుగముల జీవమును కలిగియుంటాడు. ఒక నిత్యమైన…ఒక విశ్వాసి నిత్యజీవమును కలిగియుంటాడు, మరియు అది నిత్యమైనది గనుక నశించిపోజాలడు.
237 కానీ ఒక విశ్వాసి, అతడు వెళ్తాడు…ఒక అవిశ్వాసి లోకములో వెళ్తాడు, అతడు బాధలను, శ్రమలను కలిగియుంటాడు; ఒక ఆహ్లాదకరమైన సమయమును కలిగియుండుట అని అతడు పేరు పెట్టినదానిని కలిగియుంటాడు, ఇట్లాంటారు, “వూపీ, ఒక ఆహ్లాదకరమైన సమయమును కలిగియుంటున్నా.” స్త్రీలు, ద్రాక్షారసము, మరియు ఆహ్లాదకరమైన సమయాన్ని, అతడు గడుపుతున్నాడని అతడు అనుకుంటాడు. అతడు చనిపోతాడు, మండుచున్న అగ్నిగంధకములుగల గుండములోనికి అతడు వెళ్తాడు, అక్కడ ఆ మండటమనేది యుగయుగముల వరకు కొనసాగుతూ ఉంటుంది, మరియు అతని ఆత్మ బహుశా ఒక వంద మిలియన్ సంవత్సరాలు అగ్నిగంధకములుగల గుండములో యాతనపడవచ్చును.
238 నేను…“అది సాధారణమైన గంధకమువలె ఉంటుందా?” అని మీరనవచ్చు. అది దానికంటే ఒక మిలియన్ రెట్లు భయంకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీరు అగ్ని అని, అచ్చమైన అగ్ని అని చెప్పడం ద్వారా దానిని వివరించలేరు. “అగ్ని గల” అని వ్రాయబడుటకు ఒకే ఒక్క కారణము ఏమిటంటే, మనం కలిగియున్నవాటిలో అత్యంత ఎక్కువగా దహించిపోవునట్లు చేసేది అగ్నియే అయ్యున్నది. అది ఖచ్చితంగా అన్నిటినీ దహించివేసి మరియు నాశనము చేస్తుంది, అగ్ని ఆ విధంగా చేస్తుంది. సరి, పిదప, అది అక్కడ ఉంటుంది, అయితే ఏదో ఒక విధంగా శిక్షించబడవలసిన ఒక ఆత్మను మీరు కలిగియుంటారు…
239 ఇప్పుడు, మీరు అగ్ని అనే పదమును గమనించవలసియున్నది, ఎందుకనగా పరిశుద్ధాత్మ విషయంలో “పరిశుద్ధాత్మతోను మరియు అగ్నితోనూ” అని ఉపయోగించబడింది; ఏలయనగా పరిశుద్ధాత్మ అగ్ని పాపమును దహించివేస్తుంది, చూడండి, మరియు శుద్ధి చేస్తుంది.
240 కానీ ఈ అగ్ని, అది పాతాళము నుండి వస్తుంది, “అగ్నిగుండము” అని చెప్పబడినది. మరియు అది ఏమైనాగాని, అది యాతనతో కూడిన శిక్షయైయున్నది. ఆ ధనవంతుడు పాతాళములో ఉండగా, తన కన్నులను పైకెత్తి, “నా పెదవులను తడుపుటకు, లాజరును తన వ్రేళ్ళ మీద కొద్దిగా నీళ్ళను వేసి పంపుము, ఏలయనగా ఈ అగ్నిజ్వాలలు నన్ను యాతనపెట్టుచున్నవి,” అని అన్నాడు. ఒక మండుచున్న పాతాళము, మరి అచ్చంగా ఒక పాతాళము లేదని అనుకోకండి, అది ఉన్నది. అచ్చంగా ఒక దయ్యము ఉందంటే, అచ్చంగా ఒక పాతాళము కూడా ఉన్నది.
241 కానీ, మీరు చూడండి, వంకర చేయబడిన ప్రతీది ఒక అంతమును కలిగియుంటుంది, ఎందుకనగా మళ్ళీ ఆఖరికి అది దేవునియొక్క ఆ స్వచ్ఛత యొద్దకు మరియు పరిశుద్ధత యొద్దకు తిరిగి రావాల్సిందే. మరియు దేవుడు నిత్యుడైయున్నాడు; మరియు మనం గనుక నిత్యజీవమును కలిగియున్నట్లైతే, దేవుడు మనలో ఉన్నాడు, మరియు దేవుడు మరణించలేకపోవడం ఎంత వాస్తవమో అంతే వాస్తవంగా మనం కూడా మరణించలేము. అదిగో విషయం అదేయైయున్నది.
242 ఇప్పుడు, ఆ వచనము నిజంగా దానినదే వివరిస్తుంది, చూడండి, మరియు దానిని సరియైనదిగా చేస్తుంది. ఇప్పుడు, మనము చూద్దాము, నేను ఒక…నాకు తెలియదు…అవును:
“వారికి ఏమి—ఏమి సంభవిస్తుంది?”
243 వారు అంతరించిపోతారు, వారు ఇక ఉండరు: అంతరాత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది, జీవము వెళ్ళిపోతుంది, శరీరము వెళ్ళిపోతుంది, తలంపులు వెళ్ళిపోతాయి, జ్ఞాపకము వెళ్ళిపోతుంది.
244 మరియు మహిమలో, దుష్టత్వము గురించైనా, లేదా అసలు అది ఎన్నడైనా జరిగిందన్న తలంపులైనా ఇక ఉండవు. అది సరియే, అదంతా…మీరు ఇలా ఊహించగలరా, ఇక్కడ ఈ భాగములో ప్రజలు ఉండి…?
245 “దుష్టుల తలంపులు సైతం నశించిపోవును” అని బైబిలు చెప్పడంలేదా? దానిని గూర్చిన ఆలోచనలు సైతం నశించిపోతాయి.
246 ఇదిగో ఇక్కడ ఒక మనిషి ఉండి, ఇదిగో ఇక్కడ ఆ గొప్ప పరిశుద్ధుడైన దేవుడు ఉండి, మరియు సరిగ్గా ఆ అవతలే ఒక అగాధములో ఆత్మలు దహించబడుతున్నాయని ఎరిగియుండటం? ఏంటీ, అది ఒక పరలోకముగా ఉండజాలదు. తలంపులు సైతం, జ్ఞాపకము సైతం, వంకర చేయబడిన ప్రతీది, ప్రతీ చెడు తలంపు, సమస్తము, మరియు దానిలో ఉన్న ప్రతీ దుష్టమైనది నశించిపోతుంది. మరియు మనము జోయీ తో, అనగా దేవునియొక్క జీవముతో నిండి, స్వచ్ఛమైనవారిగా ఉంటాము, నిత్యమూ ఉంటాము, మరియు యుగములు అలాగే, అలాగే, అలాగే, అలాగే మరియు అలాగే గడిచిపోతుంటాయి; అది ఎన్నడూ అంతము కాదు, నిత్యమైనవారిగా ఉంటాము!
247 “వారు యుగయుగముల శిక్షలోనికి [తెలుగు బైబిలులో నిత్యశిక్ష అని వాడబడినది.—తర్జుమాదారుడు.] వెళ్ళారు, కానీ నీతిమంతులు నిత్యజీవములోనికి వెళ్ళారు.” మీకు అది అర్థమైందా? యుగయుగముల శిక్ష, నిత్యజీవము, ఎంత వ్యత్యాసము!
248 ఇప్పుడు, చూడండి, అది…ఇప్పుడు, నాకు తెలుసు, నా ప్రియమైన, చిన్న యవ్వనస్థులైన మీకు చెప్తున్నాను, అన్ని-తెలుసు అన్నట్లుగా నన్ను నేను ప్రదర్శించుకోవాలన్నది నా ఉద్దేశ్యము కాదు. నేను అలా చేసినట్లైతే,…
249 ఇప్పుడు, నేను మూడు లేదా నాలుగు మంచి ప్రశ్నలను కలిగియున్నాను. ప్రభువు చిత్తమైతే, ఆదివారము ఉదయమున నేను వాటిని తీసుకుంటాను.
250 ఇప్పుడు, చూడండి. చూడండి, ఇవి ప్రశ్నలను పుట్టిస్తాయి. నేనొక వృద్ధ బోధకుణ్ణి. నేను—నేను—నేను—నేను ఇరవై ఆరు సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాను. మరియు నేను దీనిని చెప్పగలుగుచున్నందుకు, నేను—నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను, నా…మొదటిగా అది బయలుపరచబడకుండా దేనినైనా ప్రదర్శించడానికి ప్రయత్నించుటకు నా జీవితంలో నేనెన్నడూ ప్రయత్నించలేదు. మరియు ప్రభువుయొక్క దూత నిమిత్తము నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను…మరి నాకు ఏ విద్య లేదు, ఏ సామర్థ్యము లేదు. మరియు ఈ దూత దిగివచ్చి, మరియు నాకు దేవుని యొద్దనుండి పంపబడిన సహాయముగా ఉన్నాడు. మరియు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దానితో ఇమిడిపోనట్టి ఒక్క విషయమును కూడా ఆయన ఎన్నడూ నాతో చెప్పలేదు, ఎంతగా అంటే…“మరియు నీవు—మరియు నీవు దైవిక స్వస్థత అనే ఒక వరమును తీసుకుంటావు” అని ఆయన చెప్పినప్పుడు నేను వెంటనే దానిని వ్రాసుకున్నాను. మరియు సరిగ్గా ఆయన చెప్పిన విధంగానే నేను దానిని వ్రాశాను.
251 మరియు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, మేనేజరు దానిని నా దృష్టికి తెచ్చాడు, “సహోదరుడా బ్రెన్హామ్, నీవు దానిని గమనించావా? అది ఎంత ఖచ్చితంగా ఉందంటే ఆయన నీకు ‘ఒక వరము’ అని చెప్పాడు.”
252 చూడండి, “నిర్దిష్ట వరము” అని ఎన్నడూ చెప్పలేదు. మరియు బైబిలులో ప్రతి—ప్రతి ఒక్కటి…దైవిక స్వస్థత తప్ప ప్రతీ వరము “నిర్దిష్ట వరము” అయ్యున్నది, మరియు ఇది “ఒక వరమైయున్నది.” “స్వస్థతా వరములు,” అని ఉన్నది. మీరు వివిధమైన విధానములలో, అన్ని రకముల స్వస్థతా వరములను కలిగియుండవచ్చును. కానీ, మిగతా ప్రతీది “నిర్దిష్ట వరమైయున్నది”: “నిర్దిష్ట” ప్రవచన వరము, ఈ యొక్క “నిర్దిష్ట” వరము. కానీ దైవిక స్వస్థత బహువచనములో ఉన్నది: “వరములు.” మరియు నేను దానిని ఎన్నడూ గమనించలేదు, పరిశుద్ధాత్మ ఎంతో పరిపూర్ణమైనవాడు. ఓ, ప్రభువు స్తుతించబడును గాక!
253 వందల సంవత్సరముల వ్యత్యాసముతో, వందలమంది పురుషుల ద్వారా, బైబిలు గ్రంథమును వ్రాసిన అదే పరిశుద్ధాత్మ…మరి వాటిలో ఒక్కటి కూడా మరొకరు చెప్పినదానికి వ్యత్యాసముగా లేదని మీరు గ్రహిస్తున్నారా, వాటిలో ప్రతీ ఒక్కటి సంపూర్ణముగా ఉన్నది; మరియు ఒకరు చెప్పినదానిని మరొకరు ఎన్నడూ వినియుండలేదు.
254 మరియు పౌలు అక్కడికి వెళ్ళాడు, మరియు అరేబియాలో ఉన్నాడు, మరియు పద్నాలుగు సంవత్సరముల వరకు కూడా ఎన్నడూ యెరూషలేమును సందర్శించలేదు, కానీ యెరూషలేములో ఉన్నాడు మరియు దిగువున…వెళ్ళి…యెరూషలేమునకు ఎన్నడూ వెళ్ళలేదు. కానీ అరేబియాలో ఉన్నాడు, మరియు బోధించడం ప్రారంభించాడు, పద్నాలుగు సంవత్సరాల వరకు పేతురును మరియు ఆ మిగతావారిని కూడా ఎన్నడూ చూడలేదు. మరియు వారు కూడివచ్చినప్పుడు, వారు ఒకే విషయమును బోధిస్తున్నారు: యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిస్మము, మరియు దైవిక స్వస్థత, మరియు దేవునియొక్క శక్తి.
ఓ!
నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని,
నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్ననందుకు నేను ఎంతగానో సంతోషించుచున్నాను; (హల్లెలూయా!)
వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని,
నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్నందుకు నేను అసలు ఎంతగానో సంతోషిస్తున్నాను.
రగులుచున్న హృదయములు గల ప్రజలు,
దాదాపు అంతటా ఉన్నారు,
అది పెంతెకొస్తు దినమున కురిసిన ఈ అగ్ని వలనైయున్నది,
అది వారిని శుభ్రపరచి మరియు వారిని శుద్ధి చేసినది;
ఓ, ఇప్పుడు అది నా హృదయములో మండుచున్నది,
ఓ, ఆయన నామమునకు మహిమ కలుగును గాక!
నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
వారు మేడ గదిలో గుమిగూడారు,
అందరు ఆయన నామములో ప్రార్థించుచున్నారు,
వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకున్నారు,
మరియు సేవ కొరకై శక్తి వచ్చినది;
ఇప్పుడు ఆయన ఆ దినమున వారికి ఏమి చేశాడో
ఆయన నీకు కూడా దానినే చేస్తాడు,
నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
నేను వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని,
నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను; (హల్లెలూయా!)
వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,
నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
255 వినండి, నేను మీ కొరకు ఒక చిన్న సందేశమును కలిగియున్నాను:
నా సహోదరుడా, రమ్ము, ఈ దీవెన కొరకు వెదకుము
అది నీ హృదయమును పాపము నుండి శుద్ధి చేస్తుంది,
అది ఆ ఆనందపు-గంటలు మ్రోగిస్తుంది
మరియు నీ ఆత్మను మండిస్తుంది;
ఓ, అది ఇప్పుడు నా హృదయములో మండుచున్నది,
ఓ, ఆయన నామమునకు మహిమ,
నేను వారిలో ఒకడినని చెప్పగలుగుచున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
256 వారిలో మీరు ఒకరిగా ఉన్నందుకు మీకు సంతోషంగా లేదా? అది ఏమిటి? బయలుపరచేది ఆత్మయే. అది దేవునియొక్క ప్రత్యక్షతయైయున్నది, “ఈ బండ మీద.” ఒక ఆర్చ్ బిషప్పు గురించి నేను లెక్కచేయను…
257 ఈ మధ్యనే, ఆ క్యాథలిక్ యాజకుడు, మా ఇంటిలో కూర్చున్నాడు. మరియు అతడు ఇట్లన్నాడు, “మిస్టర్. బ్రెన్హామ్, నేను నిన్ను ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను.”
అందుకు నేను “సరే, అయ్యా,” అని అన్నాను.
258 ఇట్లన్నాడు, “బిషప్పు నుండి నేను మీకు ఒక ఉత్తరమును తెచ్చాను.”
నేను “మంచిది, అయ్యా,” అని చెప్పాను.
259 అప్పుడతడు, “నీ చెయ్యిని పైకెత్తి, నీవు చెప్పే విషయాలలో, నిజం మాత్రమే చెప్తానని ప్రమాణము చేస్తావా?” అని అన్నాడు.
260 అందుకు నేను ఇట్లు చెప్పాను, “నేను చెయ్యను.” ఇంకా నేను ఇట్లన్నాను, “‘ఆకాశము మీద గానీ, భూమి మీద గానీ, అస్సలు ప్రమాణము చేయవద్దు (ఏలయనగా అది ఆయన పాదపీఠము). మీ మాట అవునంటే అవును మరియు కాదంటే కాదు అని ఉండవలెను,’ అని బైబిలు చెప్పింది. బిషప్పు నేను చెప్పేదానిని వినగోరినట్లైతే, దాని విషయమై అతడు నా మాటను తీసుకోవాలి. అతడు తీసుకోకపోతే, నేనైతే ప్రమాణము చేయను.”
261 ఇక్కడ సేక్రేడ్ హార్ట్ సంఘము వద్దనున్న ఈ చిన్న యాజకుడు, అతడు ఇట్లడిగాడు, “నీవు ఫలానా-ఫలానా తేదీన పౌలీన్ ఫ్రేజియర్‌కు బాప్తిస్మమిచ్చావా?”
262 నేను ఇట్లు చెప్పాను, “నేను ఇచ్చాను, అయ్యా, ఓహియో నదిలో ఇచ్చాను.”
263 ఇట్లడిగాడు, “నీవు ఆమెకు ఎలా బాప్తిస్మము ఇచ్చావు?”
264 నేను ఇట్లు చెప్పాను, “ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమెను నీటిలోనికి ముంచడం ద్వారా నేను ఆమెకు బాప్తిస్మమిచ్చాను.”
265 అతడు దానిని వ్రాసుకున్నాడు. “నీకు తెలుసా, క్యాథలిక్ సంఘము ఇదివరకు ఆ విధంగా బాప్తిస్మమిచ్చేది,” అని అన్నాడు.
“ఎప్పుడు?” అని నేను అడిగాను,
“ఆదిమ కాలములో,” అని అతడు చెప్పాడు.
“ఏ ఆదిమ కాలము?” అని నేను అడిగాను,
“సరి, ప్రారంభములో,” అని అతడు చెప్పాడు.
“ఏ ప్రారంభము?” అని నేను అన్నాను,
“బైబిలులో,” అని అతడు చెప్పాడు.
అందుకు నేను ఇట్లన్నాను, “ప్రారంభ-…ఆ—ఆ శిష్యులలో అని నీ ఉద్దేశ్యమా?”
అతడు ఇట్లన్నాడు, “నిశ్చయంగా.”
నేను ఇట్లన్నాను, “నీవు క్యాథలిక్కులని పిలుస్తున్నావా, లేదా, ఆ—ఆ…? ఆ శిష్యులు క్యాథలిక్కులని నీవు చెప్తున్నావా?”
అతడు ఇట్లన్నాడు, “నిశ్చయంగా, వారు అదేయైయున్నారు.”
నేను ఇట్లన్నాను, “క్యాథలిక్ సంఘము మారలేదని నేను అనుకున్నానే?”
అందుకతడు ఇట్లన్నాడు, “అది మారదు.”
266 నేను ఇట్లన్నాను, “అలాగైతే పేతురు, ‘పశ్చాత్తాపపడి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి’ అని ఎందుకు చెప్పాడు? మరియు అతడు…అతడొక పోపు అని మీరంటారు కదా?”
267 “అవును.”
268 “అలాగైతే మీరెందుకని ‘తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ’ నామములో బాప్తిస్మము ఇస్తారు? మరియు అతడు ముంచాడు, మరియు మీరేమో చిలకరిస్తారు. ఇప్పుడు ఏమి జరిగింది?”
269 అతడు ఇట్లన్నాడు, “కానీ, నీవు చూడు,” ఇంకా ఇట్లన్నాడు, “క్యాథలిక్ సంఘము వారు చేయగోరిన దేనినైనా చేయడానికి అధికారమును కలిగియున్నది.” హహ్.
270 నేను ఇట్లన్నాను, “మరియు నీవు శిష్యులను క్యాథలిక్కులు అని అన్నావా?”
271 అందుకతడు, “అవును” అని అన్నాడు.
272 నేను ఇట్లన్నాను, “అయ్యా, నేను జోసీఫస్ వ్రాసినవి కలిగియున్నాను, నేను ఫాక్స్ యొక్క హతసాక్షుల పుస్తకమును కలిగియున్నాను, నేను పెంబెర్ యొక్క ప్రారంభ కాలములు అనుదానిని కలిగియున్నాను, నేను హిస్లోపు యొక్క రెండు బబులోనులు అనుదానిని కలిగియున్నాను, అవి ప్రపంచంలోకల్లా అత్యంత ప్రాచీనమైన చరిత్రలైయున్నవి, చివరి అపొస్తలుడు మరణించిన ఆరువందల సంవత్సరాల తర్వాత వరకు కూడా…క్యాథలిక్ సంఘము అసలు ఎక్కడ నియమించబడినదో లేదా ఎక్కడ ఒక సంఘసంస్థగా మారినదో దానిలో నాకు చూపించండి.”
“ఓ,” అతడు ఇట్లన్నాడు, “సంఘము ఏమి చెప్తుందో మేము దానిని నమ్ముతాము.”
నేను ఇట్లు చెప్పాను, “బైబిలు ఏమి చెప్తుందో నేను దానిని నమ్ముతాను.” చూశారా?
“అంతెందుకు,” అంటూ అతడు ఇట్లన్నాడు, “దేవుడు తన సంఘములో ఉన్నాడు.”
273 నేను ఇట్లు చెప్పాను, “దేవుడు తన వాక్యములో ఉన్నాడు.” మరియు నేనింకా ఇట్లన్నాను, “ఒకవేళ…” అతడు ఇట్లన్నాడు…నేను ఇట్లన్నాను, “దేవుడు తన సంఘములో ఉన్నాడని బైబిలు చెప్పడంలేదు, కానీ దేవుడు తన వాక్యములో ఉన్నాడని బైబిలు చెప్తున్నది. ‘ఆదియందు వాక్యముండెను, మరియు వాక్యము దేవునియొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడైయుండెను; మరియు మనమధ్య నివసించెను.’” అది నిజము. నేను ఇట్లన్నాను, “దేవుడు తన వాక్యములో ఉన్నాడు.”
274 అతడు ఇట్లంటూ బయటకు వెళ్ళాడు. అతడు ఇట్లన్నాడు, “మంచిది, మనము వాదించుకోలేము,” ఇట్లన్నాడు, “ఎందుకంటే నీవు బైబిలును నమ్ముతావు, నేను సంఘమును నమ్ముతాను.”
275 నేను ఇట్లు చెప్పాను, “బైబిలు దేవునియొక్క ప్రేరేపించబడిన వాక్యమని మరియు దానిలో ఒక్క వ్యతిరేకత కూడా లేదని నేను నమ్ముతాను. మరియు అది దేవునియొక్క వాక్యమైయున్నది, రాబోవు కాలములన్నిటి కొరకు ఆయనయొక్క నిత్యమైన ప్రణాళికలైయున్నవి. ‘భూమ్యాకాశములు గతించును గాని నా మాటలు గతించవు,’ అని ఆయన చెప్పాడు. అది నిజము. నేను వాక్యమును నమ్ముతాను.”
276 అతడు శ్రీమతి. ఫ్రేజియర్ దగ్గరికి వెళ్ళాడు. అతడు ఇట్లన్నాడు, “శ్రీమతి. ఫ్రేజియర్, మీ అమ్మాయి క్యాథలిక్ సంఘములో సభ్యురాలిగా ఉండవచ్చని సమ్మతిస్తూ ఇక్కడ ఒక కాగితంపై మీరు సంతకం చేస్తారా?”
277 అందుకామె “దానికంటే నేను ఆమె మరణమునైనా స్వీకరిస్తాను,” అని చెప్పింది.
278 “నీకు సిగ్గుచేటు,” అని అన్నాడు. ఇంకా, “ఆ అమ్మాయి ఆ అర్థంపర్థం లేని దానిలోనుండి బయటకు వచ్చి, క్యాథలిక్ సంఘములోనికి వస్తున్నదని నీవు కృతజ్ఞత కలిగియుండవలసియున్నదని” అన్నాడు.
279 అప్పుడు ఇట్లన్నది, “అదే మీ అమ్మాయి గనుక మా సంఘానికి వస్తున్నట్లైతే ఏమిటి, దాని గురించి నువ్వేమంటావు?”
280 “ఓ,” అతడు, “అది వేరే విషయం” అని అన్నాడు.
281 “కాదు, అది వేరే విషయం కాదు,” అని అన్నది. అతడు ఆ చిన్న స్త్రీని అక్కడ విడిచి వెళ్తున్నప్పుడు, అతడు ఒక సరియైన చోటుకి వచ్చాడని అతనికి తెలిసింది. అతడు ఒక ధీటైన వ్యక్తిని కలుసుకున్నాడని అతనికి అర్థమైంది. “నీవు లోపలికి వచ్చిన అదే తలుపు, ఇప్పుడు కూడా తెరిచేయున్నది” అని ఆమె చెప్పినది.
282 చూడండి, విధానము అదేయైయున్నది. ఒత్తిడి చేయబడుటకు అనుమతించకండి, మీరు ఒత్తిడికి గురి కావలసిన అవసరంలేదు. దేవుడు మీ పక్షమున ఉన్నట్లైతే, మీకు విరోధముగా ఎవడు ఉండగలడు? నిజము! ఈనాడు దానిలోని సమస్య ఏమిటంటే, మీరు ఒక వెన్నెముకవంటి ధైర్యమునకు బదులు కోడి ఎముకతో కోరికలు కోరుకున్నట్లు ఆశలనే కలిగియున్నారు. దేవుని కొరకు మరియు సరియైనదాని కొరకు నిలబడండి!
283 ఆ అపొస్తలుల మీదకును మరియు ఆ వెనుకటి కాలములలోను దిగివచ్చిన అదే పరిశుద్ధాత్మ, ఈనాడు ఇంకను ఆయనయొక్క సంఘములో, అనగా దేవుడు తననుతాను ఎవరికైతే బయలుపరచుకున్నాడో వారిలో ఉన్నాడు. “ఇచ్ఛయించువాని వలనకాదు, లేదా ప్రయాసపడువాని వలనకాదు, కానీ కరుణించు దేవునివలనే అగును.” అది దేవుడే, తన ఎన్నిక ద్వారా, ప్రజలను తీసుకువచ్చి మరియు వారి కన్నులు తెరచుటయైయున్నది. నీవు దానిని ఎన్నడూ చూడలేవు, నీవు గ్రుడ్డివాడవైయున్నావు, మరియు దేవుడు నీ గ్రహింపును తెరిస్తేనే తప్ప లేదంటే ఎన్నడూ చూడలేవు. నీవు గ్రుడ్డివాడవు, మరియు నీవు చూడలేవు అని బైబిలు చెప్పింది. నీవు ప్రయత్నించవలసిన అవసరము లేదు. నీవు పొందగలిగిన విద్య, పాండిత్యమంతటితో, నీవు స్థిరముగా అంధుడిగా మారుతూ ఉంటావు.
284 ఇప్పుడు, ఇక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారలారా, మీరు “బైబిలు మాట్లాడిన చోట మాట్లాడుతారు, మరియు అది నిశ్శబ్దముగా ఉన్న చోట నిశ్శబ్దముగా ఉంటారు,” మరి దీని సంగతేమిటి? మీరు దాని విషయంలో ఎంతో మౌనంగా ఉన్నారే. నిజము.
285 చూడండి, దానికి బయలుపరచబడిన ఆత్మసంబంధమైన సత్యము అవసరమైయున్నది. అప్పుడు దేవుడు దిగివచ్చి మరియు తననుతాను బయలుపరచుకొని మరియు అది సత్యమని నిర్ధారిస్తాడు. ఆమేన్! మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? నేను కూడా ప్రేమిస్తున్నాను. ఆమేన్.
286 మంచిది, ఇప్పుడు మెథడిస్టులైన మీరంతా బ్యాప్టిస్టులతో కరచాలనం చేయగోరుతున్నారా? ప్రెస్బిటేరియన్లైన మీరు?
287 “ఇప్పుడు,” మీరు ఇట్లుంటారు, “సహోదరుడా బ్రెన్హామ్, బాప్-…బ్యాప్టిస్టులను మరియు ప్రెస్బిటేరియన్లను నీవు బహిష్కరిస్తావా?”
288 లేదు, అయ్యా, నేను అలా చేయను. నేను వారిని నా సహోదరులుగా భావిస్తాను. ఖచ్చితంగా! మీరు అసలు బాప్తిస్మమే పొందకపోయినా, మీరు “షారోను రోజా, లోయలోని లిల్లీ, మరియు వేకువ చుక్క” యొక్క నామములో బాప్తిస్మము పొందినా నేను పట్టించుకోను, అది…అది కూడా సరిగ్గా “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ” వలెనే ఉంటుంది. కేవలం మూడు బిరుదులు. ఆయన షారోను రోజా అయ్యున్నాడు. ఆయన కాడా? లోయలోని లిల్లీ, వేకువ చుక్క, అవన్నియు అయ్యున్నాడు. నిశ్చయంగా, ఆయన అయ్యన్నాడు. కేవలం ఒకటి లేదా మరొకటి. అయితే ఇదిగో దాని విషయమేమిటంటే: సరియైన లేఖన విధానం ఏమిటంటే యేసుక్రీస్తు నామములోయై యున్నది. మీకు లేఖనానుసారమైన విధానము కావాలంటే, అది ఖచ్చితమైనది. అదే సరియైన విధానమైయున్నది.
289 ఇప్పుడు, మీరు “తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మ” నామములో బాప్తిస్మము పొంది, అది మంచిదేనని భావిస్తే, ఆమేన్. దేవుని యెదుట ఒక స్వచ్ఛమైన మనసాక్షితో ఉండునట్లు దేవునికి సరియైన సమాధానముగా అది ఉంటే, ఆమేన్. నేరుగా అలాగే కొనసాగండి, చూడండి.
290 కానీ నాకు సంబంధించినంత వరకు, నా వంతుగా మాత్రం, మీరు నన్ను అడుగనైయుంటే, “సహోదరుడా బ్రెన్హామ్, నేను మరలా బాప్తిస్మము పొందాలా?” అని అంటే, నా నుండైతే, నేను “అవును,” అని చెప్తాను.
291 ఈ మధ్యనే ఒక రోజు ఆ చిన్న స్త్రీ ఇక్కడికి వచ్చి, “ఒక బోధకురాలుగా ఉండుటకు ప్రభువు నన్ను పిలిచాడు,” అని చెప్పింది. ఆమె చంద్రుని మీదకు దూకగలదని నేను ఎలాగైతే నమ్మనో, సరిగ్గా అంతే ఖచ్చితంగా నేను దానిని నమ్మలేదు. మరియు ఆమె…
292 నేను ఇట్లన్నాను, “సరే, సహోదరీ, అది చాలా మంచిది.” నేను ఇట్లడిగాను, “నీకు వివాహమైందా?”
“అవును.”
“ఇద్దరు పిల్లలున్నారా?”
“అవును.”
నేను ఇట్లాడిగాను, “ఏమిటి…? నీ భర్త రక్షించబడ్డాడా?”
“లేదు.”
నేను ఇట్లన్నాను, “నీవు అతణ్ణి ఏమి చేయబోతున్నావు?”
“అతణ్ణి ఇంటి దగ్గర విడిచిపెట్టబోతున్నాను.”
293 నేను ఇట్లు చెప్పాను, “అది దయ్యం ఎన్నడైనా కలిగియున్నట్టి అత్యుత్తమమైన ఎర అయ్యున్నది. ముందుగానే నీవు ఒక అందమైన స్త్రీయైయున్నావు, మరియు నీవు ఇక్కడ రంగములోకి దూరుతున్నావు, నీవు ఎప్పటిలాగే ఒక ఎరగా మరియు దయ్యమునకు గురిగా అవుతావు. మరియు నీ భర్త, ఇంటివద్ద ఉండి, ఒక యవ్వనస్థుడు, మరి నీవు అతణ్ణి ఈ ఇద్దరు పిల్లలతో విడిచిపెడితే; అతడు మరొక స్త్రీతో తిరగడం మొదలుపెడతాడు, మరియు ఈ దినములలో ఏదో ఒక రోజు ఈ పిల్లలు మరొక తండ్రిని కలిగియుంటారు.” నేను ఇట్లు చెప్పాను, “మొదటి విషయం ఏమిటంటే, దేవుడు ఒక స్త్రీని పిలిచినట్లైతే, ఆయన తన వాక్యమును వ్యతిరేకించినట్లే.” నేనింకా ఇట్లన్నాను, “ఇప్పుడు, నీవు అలా చేయగోరితే, మంచిది.” నేను ఇట్లన్నాను, “ఇప్పుడు, వివేచన విషయము, ప్రభువు నీకు వివేచన ఇచ్చాడని నీవు చెప్పావు కదా. నీవు బయట, వేదిక మీదకు వెళ్ళి, దానిని ప్రయత్నించగోరుతున్నావా?”
294 ఆమె, “అవును” అని అన్నది. మరియు ఏమి జరిగిందో మీరు చూడండి.
295 మీరు చూడండి, అది ఉత్సాహమైయున్నది. అది వాక్యము నొద్దకు రావలసియున్నది. అది వాక్యములో లేనట్లైతే, అప్పుడు అది సరియైనది కాదు. మీ భావోద్రేకాలు ఏమిటో నేను లెక్కచేయను, అది సరికాదు. ఆమేన్! అది బాగుంది. ఆమేన్!
296 మంచిది:
మనము వెలుగులో నడిచెదము, ఒక మనోహరమైన వెలుగు,
కనికరపు మంచుబిందువులు ప్రకాశవంతముగా ఉన్న చోటుకు వచ్చెదము;
అవి రాత్రింబగళ్ళు మన చుట్టూ ప్రకాశిస్తాయి,
యేసే, లోకమునకు వెలుగైయున్నాడు.
వెలుగుయొక్క పరిశుద్ధులైన మీరంతా,
లోకమునకు వెలుగైన యేసును, ప్రకటించండి;
అప్పుడు పరలోకపు గంటలు మ్రోగుతాయి,
యేసే, లోకమునకు వెలుగైయున్నాడు.
మనము వెలుగులో నడిచెదము, ఒక మనోహరమైన వెలుగు,
కనికరపు మంచుబిందువులు…
రాత్రింబగళ్ళు మన చుట్టూ ప్రకాశిస్తాయి,
యేసే, వెలుగైయున్నాడు…
297 ఇప్పుడు మనం దీనిని మరలా పాడుతుండగా, ప్రతియొక్కరూ అటు ఇటు తిరిగి, నాలుగు ప్రక్కలా, మరి అందరితో, కరచాలనము చేయాలని నేను కోరుతున్నాను:
మనము వెలుగులో నడిచెదము, మనోహరమైన వెలుగు, (ఆమేన్!)
కనికరపు మంచు బిందువులు ప్రకాశవంతముగా ఉన్న చోటుకు వచ్చెదము;
రాత్రింబగళ్ళు మన చుట్టూ ప్రకాశిస్తాయి,
యేసే, వెలుగైయున్నాడు…
298 మీరు మెథడిస్టులను ప్రేమిస్తున్నారా? “ఆమేన్,” అని చెప్పండి. [సంఘము, “ఆమేన్” అని చెప్తున్నది.—సంపా.] బ్యాప్టిస్టులను? ప్రెస్బిటేరియన్లను? క్యాథలిక్కులను? ఆ…ఓ, మీరు వారందరినీ ప్రేమిస్తున్నారా? “ఆమేన్,” అని చెప్పండి. [“ఆమేన్.”]
మనము వెలుగులో నడిచెదము, మనోహరమైనది…
మనం వెళ్తుండగా, కరచాలనము చేస్తున్నాము.
ఓ, కనికరపు మంచుబిందువులు ప్రకాశవంతముగా ఉన్న చోటుకు వచ్చెదము;
రాత్రింబగళ్ళు మన చుట్టూ ప్రకాశిస్తాయి,
యేసే, వెలుగైయున్నాడు…
299 మనం వీడ్కోలు పాటను పాడుటకుముందు…ఇప్పుడు, ఆదివారము మరలా నేను ఇక్కడ ఉండవచ్చును. ఇప్పుడు, ఆ తర్వాత క్రిస్మస్ అయిపోయిన తర్వాత వరకు నేను తిరిగి రాను. చూడండి, ఎందుకనగా నేను మిషిగన్ కు వెళ్తున్నాను, మిషిగన్ నుండి కొలరాడోకు, కొలరాడో నుండి ఐడహోకు, ఐడహో నుండి కాలిఫోర్నియాకు వెళ్తున్నాను, మరప్పుడు మేము తిరిగి వస్తాము. మరియు (మీరు నా కొరకు ప్రార్థించాలని నేను కోరుతున్నాను) జనవరి ఇరవై-నాల్గవ తేదీ మొదలుకొని ఫిబ్రవరి రెండవ తేదీ వరకు, నేను అయోవా, వాటర్లూ లో ఉండవచ్చును. చూడండి, అక్కడ ఆ పెద్ద కార్యక్షేత్రమున్నది, కొద్దిసేపటి క్రితమే నాకు ఫోను వచ్చింది, మరియు ప్రార్థించుకోడానికి ఇప్పటినుండి ఆదివారము వరకు నాకు సమయమున్నది. చూడండి, వాటర్లూ, అయోవా, మరి ఇప్పుడు అవి సమీపంగా ఉన్నవి.
300 అయితే ఇప్పుడు, గుర్తుంచుకోండి, శనివారము ఉదయం తొమ్మిది గంటలకు, సహోదరుని ప్రసారమును వినండి. మేము అతనికి ఫోన్ చేసి మరియు అతనికి తెలియజేస్తాము. మరియు అది శనివారము ఉదయం, తొమ్మిది గంటలకు, నెవిల్ చతుష్టయమైన WLRP లో ప్రసారమవుతుంది. మనము…నేను—నేను గనుక వాటిని తీసుకోకపోతే, ఆ ప్రశ్నలను సహోదరుడు నెవిల్ ముగిస్తాడు. సహోదరుడా నెవిల్, ఆదివారము ఉదయమున, నీవు ముగిస్తావా? [సహోదరుడు నెవిల్ నవ్వుతూ, “పెద్ద బాధ్యతే!” అని అన్నాడు—సంపా.] సరే, చూడు, నీవు ఇబ్బందిలో పడితే, నేను నీతోపాటు నిలబడతాను. అతడు చూస్తాడట. మంచిది.
301 మంచిది:
దుఃఖముతోను శ్రమతోను నిండియున్న బిడ్డా,
యేసు నామమును నీ వెంట తీసుకొనివెళ్ళుము;
అది నీకు ఆనందమును మరియు ఓదార్పును ఇస్తుంది,
ఓ, నీవు వెళ్ళే ప్రతిచోటకు దానిని తీసుకొనివెళ్ళుము.
శ్రేష్ఠమైన నామము, ఓ ఎంత మధురమైనది!
భూమియొక్క నిరీక్షణయు పరలోకముయొక్క ఆనందమునైయున్నది;
శ్రేష్ఠమైన నామము, (శ్రేష్ఠమైన నామము!) ఓ ఎంత మధురమైనది! (ఎంతో మధురమైనది!)
భూమియొక్క నిరీక్షణయు పరలోకముయొక్క ఆనందమునైయున్నది.
302 ఇప్పుడు, కేకలు వేయడాన్ని నమ్మే ఒక బ్యాప్టిస్టును మీరు తెలుసుకోవాలనుకుంటే, నేను ఆ రకమైన కేకలు వేయడాన్నే నమ్ముతాను. ఆ వృద్ధ తల్లి అక్కడ కూర్చొనియున్నది, మరియు ఆత్మ ఆమె మీదికి వచ్చినది. ఆమె కేకలు వేయడం మొదలుపెట్టింది, ఆమె దానిని బిగబట్టలేకపోయినది, ఆమె వెనుకకు వెళ్ళి మరియు తన కుమార్తెను కౌగిలించుకుంది. నేను దానిని ఆ విధంగా చూడటానికే ఇష్టపడతాను. ఆమేన్. అవి నిజమైన మంచి, పాత-కాలపు, హృదయ-పూర్వకమైన భావములైయున్నవి. ఓ, మై, ఒక వృద్ధ—ఒక వృద్ధ, సారవంతమైన, పరిపక్వముచెందిన పరిశుద్ధురాలు, మహిమలోని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. కేవలం పిలుపు కొరకు వేచియున్నది, మీరు చూడండి, కేవలం ఒక అద్భుతమైన సమయాన్ని కలిగియుంటున్నది.
మంచిది, ఇప్పుడు సహోదరుడు నెవిల్, అతడు ఏమి చేయగోరితే అదే.