ప్రశ్నలు మరియు జవాబులు హెబ్రీ పత్రిక ౩వ భాగము

 ప్రశ్నలు మరియు జవాబులు హెబ్రీ పత్రిక ౩వ భాగము

553…ఈ రాత్రి మరలా ఇక్కడ గుడారము వద్ద ఉండుటకు, ఈ అద్భుతమైన సహవాసములో ఎదురుచూస్తూ మరియు మనకు ఉచితంగా ఇవ్వబడిన దేవుని వాక్యము చెంత చేరి ఆరాధించుటను ఇష్టపడుచున్నాము. మరియు మనము…ఈ ఆశీర్వాదములో పాలిభాగస్థులమగుటను ఎంతగానో ఇష్టపడుచున్నాము.

554 మరియు దేవుడు ఈ ఉదయము, ఉదయకాల వర్తమానముతో ఆశీర్వదించినట్లే, ఈ రాత్రి కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముచున్నాను. మరియు నేను కొద్దిసేపటి క్రితం నా పొరుగువారైన, శ్రీమతి. ఉడ్‌తో మాట్లాడుచున్నాను, మరియు మేము, శ్రీ. ఉడ్ మరియు వారు, దాని గురించి చర్చిస్తూ ఉన్నాము. మరియు సహోదరుడు నెవిల్ బోధించిన చక్కటి ప్రసంగాలన్నిటిలోకంటే ఇదే అత్యుత్తమమైనదని నేను నమ్ముచున్నాను, అతడు ఇంతవరకు బోధించిన దేనికంటెను ఇదే నాకు ఉత్తమమైనదిగా ఉన్నది. నిశ్చయంగా నేను ఆ అద్భుతమైన ప్రసంగాన్ని మెచ్చుకొనుచున్నాను మరియు అభినందిస్తున్నాను. మరియు అది నాకు ధైర్యాన్ని ఇచ్చినది, మరియు అది నన్ను సవరించినది. కావున నేను—నేను వాస్తవాన్ని ఒప్పుకొనగోరతాను, మీకు తెలుసు కదా. కావున, ధైర్యముగల విషయాల గురించి, ధైర్యంగా ఉండటం గురించి, మీకు తెలుసు కదా, మరియు ఎలా…దావీదు అక్కడ ఉన్నాడు, మరియు అతడు ఏ విధంగా…ఆ గొప్ప పరీక్షలో ఉన్నప్పుడు, “మంచిది, ప్రభువా, నేను వెళ్ళి దీనిని చేస్తాను, నీవు కేవలం నాకు సహాయం చేయుము” అని చెప్పడానికి బదులు, అతను వేచియున్నాడు, వెళ్ళి మరియు ఏమి చేయాలని ప్రభువును అడిగాడు. అతడు ఎఫోదును తెచ్చి, మీకు తెలుసు కదా, మరియు ఇట్లన్నాడు, “ఇప్పుడు మనము నిలబడి మరియు ‘ఈ క్లిష్ట పరిస్థితిలో మేము ఏమి చేయాలి?’ అని దేవుణ్ణి అడుగుదాము.” ఓ, అది నిజంగా ఘనముగా ఉన్నది. దేశంలో ఉన్న మందుల దుకాణాలన్నీ కలిగియున్నదాని కంటే ఎక్కువ విటమిన్లను అది కలిగియున్నది. అవును, అయ్యా, అది నిజంగా మీకు మేలు చేస్తుంది.

555 ఇప్పుడు, ఈ రాత్రి, మనకు వీలైతే, మేము—మేము ఈ ప్రశ్నలపై, అర్ధరాత్రి కంటే ఎక్కువ సమయం ఉండాలని అనుకోవడంలేదు. కావున మనము—మనము వెంటనే, నేరుగా వాటిలోనికి వెళ్ళబోవుచున్నాము. ఇది ఈ ప్రశ్నలను పూర్తి చేయడమైయున్నది, మరియు నేను వాటిని పూర్తిచేయడం ప్రారంభించిన ప్రతీసారీ…ఇప్పుడు, సహూదరీ హ్యాటీ, నా భావము అది కాదు, అది నీకు తెలుసు. నేను—నేను కేవలం దానిని చెప్పుచున్నాను, చూడండి; మరియు, సరి. అయితే నాకు ఒక సేవకుని వద్ద నుండి ఇక్కడ కొన్ని సరైన గట్టి ప్రశ్నలు వచ్చినవి, మరియు వాటికి సమాధానమివ్వడం చాలా కష్టం. మీకు తెలుసు కదా, ఆ బోధకులు, వారు దానిని పరిశుద్ధ గ్రంథముగుండా చుట్టూ త్రిప్పుతారు మరియు వారు మిమ్మల్నిఅడుగుటకు ముందే తమ స్వంత సమాధానమును కనుగొనుటకు ప్రయత్నిస్తారు, మీరు చూడండి. మరియు పిదప…మరి ఇది టేపు రికార్డింగు చేయబడి, జార్జియాకు నా స్నేహితుడైన ఒక సేవకుని వద్దకు వెళ్ళుచున్నది అతడు ఇక్కడ ఎనిమిది అసాధారణమైన బైబిలు ప్రశ్నలను కలిగియున్నాడు, అవి చాలా చాలా కఠినముగా ఉన్నవి.

556 మరియు ఇప్పుడు, ఈ రానున్న వారము, మర్చిపోకుండా మా కొరకు ప్రార్థించండి.

557 మరియు నా భార్యకు చాలా నయమైనది; ఆమె ఇప్పుడు లేచినది, మరియు ఆమె ఈ రోజు వంట చేయుటకు, సహాయం చేసినది. కెనడా నుండి మా ప్రియమైన స్నేహితులు, సహోదరుడు, సహోదరి సాత్‌మన్, ఇక్కడ మమ్మల్ని దర్శించారు, మరియు వారు దర్శించడాన్ని నిశ్చయంగా మేము అభినందిస్తున్నాము. మరియు నా భార్య, వారు వస్తున్నారని ఎరిగియుండి, అంతెందుకు, ఆమె ఈ ప్రియమైన క్రైస్తవ ప్రజలతో కొంత వినోదము మరియు సహవాసము కలిగియుండునట్లు ఆమె మెలకువతో ఉండనైయున్నది. ఈ రాత్రి సహోదరుడు ఫ్రెడ్డీ మనతో ఉన్నందుకు మనము సంతోషిస్తున్నాము, మరియు ఆమె…ఈ ఉదయం ఆమె ఇక్కడ ఉన్నది, అయితే నేను నమ్ముచున్నాను ఆమె…లేదు, అది సరియే, మేము ఇక్కడకు వచ్చుచుండగా ఆమెతో ఉండేందుకు, ఆమె మేడాతో ఉన్నది; ఎందుకనగా ప్రభువు రాత్రి భోజనం మరియు పాదశుద్ధి కార్యక్రమము ఉన్నది గనుక, ఈ రాత్రి కొంచెం ఆలస్యం అవుతుందని నాకు తెలుసు. కావున వారు మరియు ఆ సందర్శకులు మాతో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము.

558 ఇప్పుడు, మనము ఆ ప్రశ్నలకు జవాబునిచ్చే బాధ్యతను తీసుకోవడానికి ప్రయత్నించుటను ప్రారంభించడానికి ముందు…మరియు కేవలం గుర్తుంచుకోండి—నేను తప్పైయుండవచ్చును, మీరు చూడండి, నేను—నేను చేసే ప్రతీది సరైనదని నేను చెప్పడంలేదు. నేను—నేను సరిగ్గా ఉండటానికి ప్రయత్నిస్తాను, కానీ నేను—నేను తప్పైయుండవచ్చును. మరియు—మరియు నేను తప్పైనయెడల, అప్పుడు మీరు నన్ను క్షమించండి; మరియు దేవుడు కూడా క్షమిస్తాడని, నేను ప్రార్థిస్తాను, ఎందుకనగా తప్పైయుండాలన్నది నా ఉద్దేశ్యం కాదు. నేను వాటికి కేవలం-…కేవలం నేను…ఊహాత్మకంగా సమాధానమిచ్చుటకు ప్రయత్నించను, నేను వాటికి నాకు తెలిసినంతవరకు ఉత్తమమైన సమాధానమిస్తాను, చూడండి. మరియు నేను ఒక బైబిలు ప్రశ్నపై నా ఆలోచనలను మార్చుకోవలసి వచ్చినచో, చేయవలసిన పని అదియే అని నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యము మాట్లాడినప్పుడు, అది ఎప్పుడైనాగాని, మనము మార్చుకోవాల్సిందే; ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యమైయున్నది.

559 మరియు ఇప్పుడు, మనము ఎప్పటిలాగానే, ఈ రాత్రి మరలా రోగుల కొరకు ప్రార్థన చేయబోవుచున్నామని నేను తలంచుచున్నాను. మరియు కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోతారు; ఓ, ఇటువంటి ఒక చిన్న గుంపువంటి దానిని, చిన్నదైన, ఇక్కడున్న ఈ చిన్న గుడారమును మీరు తీసుకుంటారు, మరియు కొన్నిసార్లు మీరు చూడగోరిన ఫలితాలను మీరు చూడరు. కానీ విషయం ఏమిటంటే, మీరు ఏమి చేస్తున్నారంటే, మీరు కేవలం రెండు వందలమంది ప్రజల నుండి తీసుకొనుచున్నారు. మరియు పెద్ద కూటములలో ఒకదానిలో, బహుశా మీరు మూడు నుండి పది వేల మంది వరకు మీరు తీసుకుంటారు, మీరు చూడండి, మరియు—మరియు బహుశా అంతకంటే ఎక్కువ ఉండవచ్చును. కావున ఆ విధంగా, మీరు పెద్ద ఎత్తున చూడగలుగుతారు. కానీ ఈ రాత్రి, నేను ఇంతకుముందే ఫోన్ లో మాట్లాడుచున్నాను…దినమంతా ప్రతి కొన్ని నిమిషాలకు మరియు రాత్రి కొంత సమయము వరకు మా ఫోను మ్రోగుతూనే ఉంటుంది.

560 ఇక్కడ కూర్చొనియున్నది, నేను చూస్తున్నది శ్రీమతి. రైసర్టుయేనా? సహోదరి, మీ బైబిలు, అక్కడ వెనుక సహోదరి ఉడ్ దగ్గర ఉన్నది. నేను ఈ ఉదయం దానిని మీ కొరకు తీసుకువచ్చాను, మరియు నేను—నేను దానిని మీకు ఇవ్వడం కుదరలేదు. మరియు ఈ ఉదయం నేను—నేను మిమ్మల్ని చూడలేదు, మరియు శ్రీమతి ఉడ్ దానిని కలిగియున్నది.

561 కావున ఫోన్‌లో మాట్లాడటం మరియు జరిగినటువంటి ఆ—ఆ గొప్ప విషయాలను కనుగొనడమైనది. ఒక స్త్రీ నాకు ఫోను చేసినది, ఆమె ఇలా అన్నది, “బ్రెన్‌హామ్ సహోదరుడా, నేను ఒక ఫలానా—ఫలానా కూటములో ఉన్నాను మరియు నేను చాలా కాలంగా ఫలానా-ఫలానా సమస్యతో బాధపడుతున్నాను. మరియు, మీకు తెలుసా, మీరు అక్కడ ఆ వెనుక మాట్లాడారు మరియు కేవలం…” ఇట్లన్నది, “అక్కడ అది గత జీవితాన్ని తీసుకువచ్చినప్పుడు, నేను దాదాపు మూర్ఛపోయాను.” మరియు ఇలా చెప్పినది, “మరియు అప్పటి నుండి నేను మరలా ఎన్నడూ బాధపడలేదు.”

562 మరియు ఒక స్త్రీ లోపలికి వచ్చి మరియు ఇలా చెప్పింది…ఆమె ఈ రాత్రి ఇక్కడ ఉందని నేను నమ్ముతున్నాను, లేదా ఆమె బెడ్‌ఫోర్డ్ నుండి, లేదా అక్కడెక్కడి నుండో రాబోవుచున్నదని, నేను నమ్ముతున్నాను. గుండె సమస్యను కలిగియుండి, అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్న, వారి కుమారుడు ఇక్కడ ఉండియున్నాడని, నేను నమ్ముతున్నాను. మరియు అతడు ఇక్కడ కూటములో కూర్చొనియున్నాడు, మరియు—మరియు ప్రభువు కదలాడి మరియు తాకాడు…తన సమస్య గురించి ఆ అబ్బాయితో చెప్పాడు, మరియు అతడు తన చేయిని పైకి ఎత్తలేకున్నాడు, మరియు గుండెపోటుతో, మరియు అతని చేయి మొత్తం తిమ్మిరి పట్టి, మరియు అతని గుండె ఈ విధంగా ఉన్నది. మరియు వెంటనే అతడు కారు ఎక్కి మరియు దానిని నడుపుకుంటూ ఇంటికి వెళ్ళాడు, అప్పటి నుండి మరెన్నడూ దానితో బాధపడలేదు. ఆమె బెడ్‌ఫోర్డ్ నుండి వచ్చిన స్త్రీనా? స్త్రీ, నీవు ఇక్కడ ఉన్నావా? అదిగో ఆమె అక్కడ, ఆ వెనుక ఉన్నది. అవును, కొంత సమయం క్రితమే, ఆమె నాకు ఫోన్ చేసినది.

563 పిదప ఇవాన్స్‌విల్ నుండి ఒక స్త్రీ నాకు ఫోన్ చేసినది. మరియు ఆమె ఇక్కడకు రాలేకపోయింది ఎందుకంటే ఆమె చాలా దూరములో ఉన్నది, మనము ఇక్కడ ఈ రాత్రి స్వస్థతా కూడికను కలిగియుంటామని ఆమెకు తెలియదు. మరియు ఆమె ఇట్లన్నది, “సహోదరుడా బ్రెన్‌హామ్, నేను ఇవాన్స్‌విల్ లోని కూటములో కూర్చొనియున్నాను,” మరియు ఇలా చెప్పినది, “మీరు ఆ గుంపు వైపు తిరిగి చూసి మరియు ఇలా చెప్పారు…నేను ఎవరినో, మరియు నేను ఏమి చేశానో నాకు చెప్పారు, మరియు నేను దేనితో బాధపడ్డానో, మరియు అటువంటివాటిని చెప్పారు.” మరియు ఆమె ఇట్లన్నది, “నాకు ఆ ఆస్తమా ఉన్నది, మరియు నేను చిన్న అమ్మాయిగా ఉన్నప్పటి నుండి గదిలో ఆస్తమాడోర్ పొగను మరియు అటువంటివాటిని పీల్చవలసియుండేది.” ఇలా చెప్పినది, “అది రెండు సంవత్సరాల క్రితం జరిగినది, మరియు అప్పటి నుండి దాని యొక్క ఒక్క లక్షణము కూడా నాలో లేదు.” చూశారా?

564 మరియు ఈ సాక్ష్యమును ఆస్వాదించడానికి ఈ ఉదయం ఇక్కడ లేనివారై, ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారి కోసం చెప్పుచున్నాను; నేను, నిన్న, పది-సెంట్ల దుకాణానికి వెళ్ళి ఒక బొమ్మను కొనుచున్నాను. ఇప్పుడు, అది నా కోసం కాదు, చూడండి. అది నా చిన్న అమ్మాయి, రిబ్కా, కోసం. మరియు—మరియు శారా ఈ రోజు, దేనికో, వెళ్ళుచున్నది. తన చిన్న పాఠశాల విద్యార్థులలో కొందరు, ఒక పుట్టినరోజు కొరకో లేదా అటువంటి ఒకదాని కొరకు ఒక చిన్న-సమావేశాన్ని కలిగియుంటున్నారు, మరియు ఆమె కొరకు తను ఒక చిన్న బహుమతిని తీసుకెళ్ళినది; మరియు నేను, దాదాపు అంత పొడవు ఉన్న ఒక చంటిబిడ్డ బొమ్మను కొనుచున్నాను. మరియు అక్కడకు ఒక స్త్రీ నడుచుకుంటూ వచ్చి, ఇలా అన్నది, “మీకు నేను గుర్తున్నానా?”

565 మరియు నేను ఇలా చెప్పాను, “నాకు గుర్తున్నారని నేను అనుకోవడంలేదు.”

566 మరియు ఆమె, ఇక్కడనున్న సహోదరుడు నెవిల్ యొక్క బంధువు అని తరువాత తెలిసింది, దాదాపు…నేను స్వీడెన్‌కు వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు, వారు…ఆమె ఇక్కడికి వచ్చినది, అక్కడున్న చిన్న ఈడిత్ వలెనున్న, ఒక చిన్న పిల్లవానిని చక్రాల కుర్చీలో కలిగియున్నది, మరియు ఆ చిన్నవానికి క్యాన్సర్ ఉన్నది, తన మెదడులో కణితి పెరుగుచున్నది. మరియు అతని చిన్న తల క్రిందకు వాలియున్నది, మరియు అతడు…మరియు అతడు కేవలం మూడు వారాలు బ్రతుకుతాడని వైద్యులు చెప్పారు. వారు దానిని బయటకు తీసి మరియు దానిని పరీక్షించారు, మరియు అది…అది ఏమిటన్నది చూసి, మరియు జీవించడానికి అతనికి కేవలం మూడు వారాల గడువును ఇచ్చారు. మరియు వారు అతణ్ణి ఒక కుర్చీలో పెట్టి తిప్పవలసి వచ్చింది, ఆపై అతడు పరీక్ష గదికి వెళ్ళినప్పుడు అతణ్ణి స్ట్రెచర్‌పై ఉంచి, అతణ్ణి పరీక్షించి, మరియు పిదప అతణ్ణి తిరిగి క్రిందికి తీసుకొని వచ్చారు. వెళ్ళి ఆ చిన్న పిల్లవాడి కోసం ప్రార్థించి, మరియు అతణ్ణి స్వస్థపరచమని ప్రభువును వేడుకున్నాను. మరియు ఆ మరుసటి రోజే, వారు అతణ్ణి అక్కడికి తీసుకువెళ్తున్నప్పుడు, “నాకు ఆ చక్రాల కుర్చీ వద్దు,” అని అన్నాడు.

567 కారులోకి ఎక్కి మరియు అక్కడికి నడుపుకుంటూ వెళ్ళాడు, మరియు ఆ వైద్యుడు స్ట్రెచర్‌ని బయటకు తీయగా, ఇలా చెప్పాడు, “నాకు ఆ స్ట్రెచర్ వద్దు.”

568 అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి కూర్చున్నాడు, వైద్యుడు అతణ్ణి పరీక్షించి, ఇలా చెప్పాడు, “మంచిది,” ఇట్లన్నాడు, “మూడు వారాలకు బదులుగా నేను నీకు నూట ఎనిమిది సంవత్సరాలు ఇవ్వబోవుచున్నాను, నీవు బ్రతుకబోవుచున్నావు.”

569 మరియు, నిన్న, ఆ తల్లి నన్ను కలిసినది. మరియు నాకు తెలిసినంతవరకు, ఆమె ఈ రాత్రి, ఇక్కడ ఉండవచ్చును. మరియు ఆ చిన్న పిల్లవాడు ఫుట్‌బాల్ ఆడుచూ బయట ఉన్నాడు, ఇప్పుడు ఒక యువకుడు అయిపోయాడు. మెదడులో, క్యాన్సర్ కణితి, మరియు అది కేవలం దీనిని చూపించుచున్నది…

570 ఓ, వేల కొలది విషయాలు, చూడండి. దేవుడు విఫలం కాలేడు. ఆయన—ఆయన అస్సలు విఫలమవ్వలేడు.

571 సహోదరుడా జాన్, నీ కన్ను బాగైనదా, సహూదరుడా? అతనికి ప్రమాదం జరిగినది, ఒక మేకును కొట్టుచుండగా మరది అతని కన్నులో తగిలినది. మరియు మేమంతా సహోదరుడు జాన్ ఓ’బన్నన్ కోసం ప్రార్థించుచున్నాము, అతడు తన కంటిలో మేకు గుచ్చుకొని ప్రమాదానికి గురైన లూయివిల్ కి చెందిన మన సహోదరుడైయున్నాడు.

572 ఇప్పుడు, ఈ ప్రశ్నలు—ఎవరో ఒకరి హృదయలోతుల నుండి వచ్చియున్నవి; వారు లేఖనములలో చదివి మరియి ఈ విషయాలను కనుగొన్నారు, మరియు వారు…బహుశా తమకు తాము సంతృప్తి చెందకయుండవచ్చును, కావున మనము వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించడం కోసం వారు వాటిని ఇక్కడ ఇచ్చారు. మరియు అది మనల్ని ఎలాంటి ఒక సంకటస్థితిలో ఉంచుతుందో మీరు చూడండి; ఎందుకనగా, మీరేమి చెప్తారో, వారు దానిపై ఆధారపడతారు. కావున మీరు సరైనది చెప్పుచున్నారన్న నిశ్చయత మీకు ఉండాలి, మరియు నేను…మీరు ఎంత నిశ్చయంగా ఉండగలరో అంత నిశ్చయతను కలిగియుండాలి. కావున అప్పుడు, మనము సరియేనన్న నిశ్చయతను కలిగియుండుటకు, మన తలను వంచియుండగా, దీనిని మన కొరకు అనువదించమని మనము కేవలం పరిశుద్ధాత్మను అడుగుదాము.

573 ఇప్పుడు, పరలోకపు తండ్రీ, ఓ, భూమ్యాకాశముల యొక్క సృష్టికర్తను “తండ్రీ” అని పిలుచుట ఎటువంటి ఒక భాగ్యము. మరియు ఇప్పుడు ఈ ప్రశ్నలకు స్వయంగా నీవే శ్రద్ధ వహిస్తావని మేము అడుగుచున్నాము. అవి అత్యంత యధార్థతతో ఇక్కడ ఇవ్వబడినవి. దేవా, మాకు తెలిసినంత ఉత్తమంగా వాటికి జవాబునిచ్చుటకు, ఆ అత్యంత యధార్థత, మా హృదయాలలో నుండి వచ్చును గాక; దానిని అనుగ్రహించండి.

574 మరియు నీ కనికరము ప్రతి ఒక్కరిపై ఉండును గాక. మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సహాయపడునట్లు ఏదో ఒకటి ఈ రాత్రి ఇక్కడ చెప్పబడును గాక. రోగుల కొరకు ప్రార్థించడం, మరియు ప్రభురాత్రి భోజనం తీసుకోవడం మరియు అటువంటివి ముగిసిన తర్వాత మేము వెళ్ళేటప్పుడు, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా?” అని ఎమ్మాయి నుండి వచ్చిన వారు చెప్పిన రీతిగా మేము చెప్పుదుము గాక. మేము దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

575 ఇప్పుడు, నేను చాలా సార్లు చెప్పినట్లుగా, ఇవి—ఇవి ఇక్కడ ఏవైతే ఉన్నవో అవి—అవి వాటిని గూర్చిన నా ఉత్తమమైన అభిప్రాయమైయున్నది, మరియు పిదప కొన్నిసార్లు అది ఒక చిన్న చర్చను లేవనెత్తుతుంది. ఇక్కడున్న మొదటిది, ఇది నేను ఇంతకుముందు చెప్పినదానిగా నాకు కన్పించుచున్నది, అది మళ్ళీ తిరిగి అడుగబడినది. నేను…మీకు కావాలంటే, దానిని ఇప్పుడు నేను చదువగోరుచున్నాను.

65. ఆదాము మరియు హవ్వ ఏదెనులో తమ పిల్లలను కలిగియున్నప్పుడు, ఆ సమయంలో భూమి మీద ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆదికాండము 5వ అధ్యాయం మరియు 16వ వచనంలో, కయీను నోదు దేశంలో నివసించినట్లు మరియు అతను ఒక భార్యను పెండ్లి చేసుకున్నట్లు ఉన్నది.

576 ఇప్పుడు, అది ఒక—ఒక అద్భుతమైన ప్రశ్న. ఇప్పుడు, మనకు బైబిలు గ్రంథములో బోధించబడింది…మరియు చాలా సార్లు ఇవి…కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా…నేను ఒక చిన్న కాగితమును పెట్టి, మరియు ఇట్లు చెప్తుంటాను, “అడగండి. ఏ బైబిలు ప్రశ్నకైనా సమాధానం చెప్పబడుతుంది.”

577 మరియు ఎవరో ఇట్లడిగారు, “మంచిది, కయీను యొక్క భార్య ఎవరు?”

578 ఓ, చిన్న జోకు లాగా లేదా అటువంటిదిగా, నేను ఇట్లు చెప్పేవాణ్ణి, “ఓ, ఆమె అతని అత్త-కూతురు,” లేదా అలాంటిదేదో, మీకు తెలుసా, లేదా—లేదా “ఆమె శ్రీమతి. కయీను అయ్యున్నది.” అయితే అది ఆ ప్రశ్నకు జవాబునివ్వదు. అక్కడ…

579 అక్కడ కయీను ఒక భార్యను కలిగియున్నాడు, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము అట్లు చెప్పుచున్నది. మరియు కయీనుకు ఒక భార్య ఉన్నచో, అతడు ఆమెను ఎక్కడినుండో పొందుకొనియుండాలి. మరియు అది ఇక్కడ సరిగ్గా దీనితో సరిపోతుంది:

ఏదెను తోటలో ఆదాము మరియు హవ్వ తమ పిల్లలను కలిగియున్నప్పుడు భూమిపై ఇతర ప్రజలు ఉన్నారా?

580 ఇప్పుడు, మీరు గమనించినట్లైతే, బైబిలు గ్రంథములో ఒక స్త్రీ జన్మించడం గురించి చాలా అరుదుగా నమోదు చేయబడింది. ఎల్లప్పుడూ మగబిడ్డను గూర్చియే వారు బైబిలులో నమోదు చేసారు, ఆడబిడ్డలను గూర్చి కాదు. బైబిలులో ఆడపిల్ల పుట్టుక గురించి, చాలా అరుదుగా ప్రస్తావించబడింది. లేదా, నిజంగా చెప్పాలంటే, ఒక ఆడబిడ్డ యొక్క పుట్టుక, నమోదు చేయబడిన ఒక్క చోటునైనా, నేను ఇప్పుడు నేరుగా నా మనస్సులో గుర్తు తెచ్చుకోగలనో లేదో నాకు తెలియదు; ఇట్లు చెప్పబడినది, “వారికి కుమారులు మరియు కుమార్తెలు జన్మించిరి.”

581 ఇప్పుడు, ఆదాము మరియు హవ్వలకు జన్మించిన ముగ్గురు పిల్లల గురించి మాత్రమే పరిశుద్ధ గ్రంథములో నమోదు చేయబడింది, మరియు వారు కయీను, హేబెలు, మరియు షేతుయైయున్నారు. ఇప్పుడు, ఆ ముగ్గురూ పురుషులైయుండుటనుబట్టి, ఇక ఏ ఆడవారు పుట్టనట్లైతే, మరి పిదప ఆ ఒక్కగానొక్క స్త్రీ (హవ్వ) చనిపోయినప్పుడు, సరిగ్గా అప్పుడే మానవజాతి యొక్క మనుగడ ఆగిపోయి ఉండేది, ఎందుకనగా వారికి ఇక—ఇక మానవజాతి కొనసాగడానికి…వేరే ఏ మార్గము ఉండేది కాదు, ఎందుకనగా ఇక అక్కడ ఏ స్త్రీలు ఉండేవారు కాదు. హవ్వ ఒక్కతే స్త్రీయైయుండేది. అయితే, మీరు చూడండి, బైబిలు గ్రంథములో వారు ఆ—ఆ ఆడబిడ్డల పుట్టుకలను నమోదు చేయరు, కావున, అందుబట్టి మగబిడ్డల వలెనే వారు ఆడబిడ్డలను కూడా కలిగియండవలసియున్నది.

582 ఇప్పుడు, ఆ పురాతన రచయిత, మనము కలిగియున్న అత్యంత పురాతన రచయితలలో ఒకరైన జోసెఫస్, ఆదాము మరియు హవ్వ, వారు డెబ్బై మంది పిల్లలను, కలిగియున్నారని పేర్కొన్నాడు; అతడు పురాతన రచయితలలో ఒకడు, “డెబ్బై మంది పిల్లలు ఉన్నారు, మరియు వారిలో కుమారులు మరియు కుమార్తెలు ఉన్నారు.”

583 ఇప్పుడు, ఒకవేళ…మరియు పిదప కయీను నోదు దేశానికి వెళ్ళినట్లైతే…ఇప్పుడు, మీరు గమనిస్తే, వ్రాసినవారు ఇక్కడ చాలా, చాలా తెలివిగా వ్రాసారు. అతడు దానిని ఎలా నొక్కి చెప్పాడో మీరు గమనించారా?

ఏదెనులో, ఏదెనులో వారు పిల్లలను కలిగియున్నప్పుడు…ఇప్పుడు, ఏదెను తోటలో కాదు, వ్రాసినవారికి అది తెలుసు. ఇక్కడ ఈ చిట్టీని వ్రాసింది ఎవరోకాని, ఇలా అన్నాడు: ఏదెనులో ఆదాము మరియు హవ్వ పిల్లలను కలిగియున్నప్పుడు…

584 ఏదెను తోటలో కాదు, ఎందుకనగా వారు ఏదెను తోట నుండి తరిమివేయబడ్డారు. అయితే వారు ఇంకను ఏదెనులోనే ఉన్నారు, మరియు ఏదెను తోట ఏదెనులో తూర్పున ఉన్నది. అయితే ఏదెను ఒక ప్రాంతము వంటిది లేదా—లేదా ఏమిటి…లేదా ఒక రాష్ట్రము వంటిది, మరియు పిదప నోదు దాని ప్రక్కనేగల మరొక రాష్ట్రము లేదా ప్రాంతమైయున్నది.

585 ఇప్పుడు, కయీను కలిగియుండగలిగే, లేదా వివాహం చేసుకోగలిగే ఏకైక వ్యక్తి, అతని యొక్క స్వంత సహోదరియై ఉండవలసియున్నది. అతడు అట్లు చేసుకొనవలసియున్నది. ఎందుకనగా వారు రావడానికి అక్కడ ఒక్క పురుషుడు మరియు ఒక్క స్త్రీ మాత్రమే ఉన్నారు, చూడండి, కావున అతడు తన స్వంత సహోదరిని వివాహము చేసుకోవలసియుండెను. ఇప్పుడు, ఆ రోజుల్లో అది చట్టబద్ధమైయున్నది.

586 మరియు ఇస్సాకు, దేవునిచేత నిర్ణయించబడినదై, తన స్వంత రక్త సంబంధియగు మొదటి దాయాదుయైన రిబ్కాను వివాహము చేసుకున్నాడు. శారా కూడా అబ్రాహాముకు సహోదరియే, అతని రక్తసంబంధ సహోదరి; తన తల్లి ద్వారా కాదు, తన తండ్రి ద్వారాయైయున్నది. చూడండి, అబ్రాహాము వివాహము చేసుకున్నది ఒక—ఒక రక్త సంబంధియైన సహోదరినైయున్నది; తల్లి వేరే, కానీ తండ్రి ఒక్కడే.

587 కావున, మీరు చూడండి, అప్పుడు, మానవ జాతి యొక్క ఆ—ఆ రక్త ప్రవాహం బలహీనపడకముందు రక్త సంబంధులను వివాహము చేసుకోవడం అనేది, అది చట్టబద్ధమైనదే మరియు సరైనదే. ఇప్పుడు అది అట్లు కాదు. మీరు ఈ రోజు మీ సహోదరిని వివాహం చేసుకొని, మరియు పిల్లలను పొందుకుంటే, వారు దాదాపు ఖచ్చితంగా…సరి, వారు అంగవైకల్యంతో మరియు ఆ విధంగా ఉంటారు. కనీసం మొదటి మరియు రెండవ దాయాదులు కూడా ఎన్నడూ వివాహం చేసుకోకూడదు, చూడండి, ఎందుకనగా రక్తప్రసరణ తక్కువగా మరియు బలహీనంగా అగుచున్నది.

588 కాని అప్పుడు కయీను చేయగలిగియుండే ఒకే ఒక్క విషయమేదనగా, తన స్వంత సహోదరిని, వివాహం చేసుకోవడమే. మరియు అక్కడే పిల్లలు…అతడు తన భార్యను పొందుకొని, నోదు దేశానికి వెళ్ళి మరియు ఆమెను వివాహము చేసుకున్నాడు, మరియు అక్కడ నుండి ఆ—ఆ పిల్లలు వచ్చారు. చూడండి, ఆ…

589 మరియు మీరు గమనించినట్లైతే, కయీను వంశావళి నుండి మేధావులు వచ్చారు. షేతు వంశావళి నుండి భక్తిపరులు వచ్చారు, నా ఉద్దేశ్యము ఏమిటనగా, నీతి యొక్క—యొక్క ద్రాక్షావల్లి వచ్చియున్నది. సరిగ్గా అక్కడే, ఆ ఇద్దరూ, ఈనాడు మనం జీవిస్తున్నటువంటి వంశావళులను తీసుకొనివచ్చారు.

590 ఇప్పుడు నేడు మీరు గమనించినట్లైతే (ఈ ప్రశ్నను ముగించుచుండగా): కయీను యొక్క ఆ వంశావళి ఇప్పటికీ ఉనికిలో ఉన్నది, మరియు షేతు యొక్క వంశావళి ఇప్పటికీ ఉనికిలో ఉన్నది. ఆ రెండూ అదే విధంగా వచ్చాయి. కయీను పిల్లలు ఈ రాత్రి ఇక్కడ జెఫెర్సన్‌విల్ లో ఉన్నారు, మరియు షేతు పిల్లలు ఈ రాత్రి ఇక్కడ జెఫెర్సన్‌విల్ లో ఉన్నారు. ఆ రక్తప్రవాహం బలహీనమై క్షీణించుచున్నది గాని, ఆ వంశావళి ఇంకను ఉనికిలో ఉంటుంది.

591 ఇప్పుడు, గమనించండి. కయీను పిల్లలు ఎప్పుడూ…మరియు జలప్రళయము యొక్క నాశనమునకు ముందు కూడా, వారు ఆ తెలివిగల ప్రజలైయున్నారు: శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు; మరియు చాలా భక్తిపరమైనవారు, కానీ ఖండించబడిన గుంపైయున్నారు. చూశారా? ఇప్పుడు గమనించండి, వారు సరిగ్గా వారి తండ్రియైన కయీను వలె ఉండియున్నారు. కయీను, అతడు ఒక భక్తిపరుడైన వ్యక్తి. అతడు ఒక అందమైన బలిపీఠమును కట్టాడు, మరియు ఒక సుందరమైన ఆలయమును కట్టాడు, మరియు ఆ దిగువున షేతు కలిగియున్న ఆ చిన్న గుంపు కంటెను అది అందముగా కన్పించునట్లు చేయుటకు ప్రయత్నించాడు. అది మీకు తెలుసా? అతడు నిశ్చయంగా…అతడు బలిపీఠాన్ని పువ్వులతో అలంకరించాడు, మరియు దానిని అందంగా అమర్చి, మరియు దానిని మనోహరముగా చేసి; మరియు ఒక గొప్ప, పెద్ద, పలుకుబడిగల ఆలయమును తయారు చేసాడు, ఎందుకనగా అతడు అట్లు చేయుట వలన దేవుని దయను పొందగలడని అతడు అనుకున్నాడు.

592 అయితే హేబెలు వెళ్ళి మరియు ఒక చిన్న గొఱ్ఱెపిల్లను తీసుకున్నాడు, మరియు దానిని బలిపీఠం వద్దకు ఈడ్చుకుంటూ వచ్చి, దానిని ఒక బండపైన పెట్టి మరియు దానిని చంపాడు.

593 మరియు ఇప్పుడు, దేవుడు న్యాయవంతుడైయ్యుండగా, ఆయన కోరినదంతయు ఆరాధనే అయినయెడల, హేబెలు ఆరాధించినంత యధార్థతతోనే కయీను దేవుణ్ణి ఆరాధించాడు. వారిరువురు యధార్థంగానే ఉన్నారు. వారిరువురు దేవుని దగ్గర కృపను పొందటానికి ప్రయత్నిస్తున్నారు. వారిలో ఏ ఒక్కరూ అవిశ్వాసులు కాదు. వారిద్దరూ, ఖచ్చితంగా, యెహోవా యందు విశ్వాసము గలవారైయున్నారు. ఇప్పుడు, అక్కడ, అది మనలను ఆలోచింపజేసే విషయమైయున్నది.

594 ఈ రాత్రి ఇక్కడున్న కొంత మంది ప్రజలను, నేను ఎన్నడూ చూడలేదు; నేను మిమ్మల్ని ముందెన్నడూ చూడలేదు. అయితే మీరు దీనిని గ్రహించి, మరియు దీనిని మీ మనస్సులో ఉంచుకోవాలి. చూశారా? మీరు ఎంత భక్తిపరులైనా గాని, దానితో ఎటువంటి సంబంధమూ లేదు. మీరు సంఘములో నివసించవచ్చు, మీరు ఎంతో యధార్థంగా ఉండవచ్చు, మరి అయిననూ మీరు నశించినట్లే! చూశారా?

595 మరియు మీరు ఇట్లంటారు, “మంచిది,” మీరు ఇట్లంటారు, “మా సంఘ కాపరులు చాలా తెలివైనవారు, వారు ఉత్తమ విద్యను కలిగియుండడానికి సెమినరీల ద్వారా వచ్చారు. వారు వేదపండితులు, వారికి పూర్తి—పూర్తి వేదపాండిత్యము మరియు మొదలగునవి తెలుసు. మరియు వారు తెలివైనవారు, శిక్షణ పొందినవారు, వారు…మాకు తెలిసినంతవరకు ఎన్నుకోబడిన ఉత్తమమైనవారు.” మరి అయిననూ వారు నశించిపోగలరు! చూశారా?

596 ఇప్పుడు కయీను, అతని వంశావళిలో: వారు, ప్రతి ఒక్కరూ, చాలా మతపరమైనవారు; చాలా ప్రసిద్ధిచెందిన ప్రజలు; మరియు వారు శాస్త్రవేత్తలు, వైద్యులు, మరియు భవన నిర్మాణకులు, మరియు కార్మికులు, మరియు తెలివైన వ్యక్తులు. అయితే కయీను మొదలుకొని ఇప్పటివరకు, ఆ వంశావళి అంతయూ తృణీకరించబడినది.

597 మరియు హేబెలు వైపున: వారు భవన నిర్మాణకులు లేదా విద్యావేత్తలు లేదా తెలివైన వ్యక్తులు కారు; వారంతా, దాదాపుగా, దీనమైన, గొఱ్ఱెల కాపరులు, మరియు వ్యవసాయకులు, వారు కేవలం ఆత్మ ద్వారా నడిచినవారైయున్నారు.

598 ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పినది, “క్రీస్తు యేసునందున్న వారికి అనగా, శరీరమును బట్టి కాక ఆత్మను బట్టి నడిచేవారికి ఏ శిక్షావిధియు లేదు.” ఆత్మ సంబంధమైన మానవుడు ఎన్నడూ మరణించనటువంటి ఒక ఆత్మ సంబంధమైన అంతరాత్మను కలిగియుంటాడు. మరియు శరీర సంబంధమైన మానవుడు తన చుట్టూ మతపరమైన వాతావరణాన్ని కలిగియుంటాడు (మరియు ఆరాధన చెయ్యాలని మరియు మొదలగువాటిని కోరుకుంటాడు) అయితే అది శరీర సంబంధమైనదే; ఒక అవిశ్వాసి కాదు, కానీ ఒక శరీర సంబంధమైన విశ్వాసి; మరియు తృణీకరించబడినది అటువంటిదే.

599 ఇప్పుడు, అక్కడ నుండి, కయీను వెళ్ళి నోదు దేశములో తన భార్యను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు, షేతు ఎవరిని వివాహం చేసుకున్నాడో, లేదా ఇతరులు ఎవరిని వివాహం చేసుకున్నారో అది చెప్పబడలేదు. మరియు కయీను వివాహము చేసుకున్నదాని—దాని గూర్చి తెలుసుకొనుటలో, చాలా మంచి విషయమేమిటంటే, దాని కొరకు మనకు జవాబున్నది. ఎందుకనగా అతడు తన సహోదరిని వివాహం చేసుకోవలసివచ్చెను, లేదా అతడు…లేదా అక్కడ ఒక…

600 భూమి మీద హవ్వ నుండి కాకుండా, వచ్చినటువంటి ఏ స్త్రీలు లేరు. ఆమె జీవము గల ప్రతిదానికినీ తల్లియైయున్నది. అనగా, జీవిస్తున్న ప్రజలందరికీ, వారందరికి ఆమె తల్లియైయున్నది. ఆ కారణము చేతనే ఆమె…హవ్వ అనే పదానికి అర్థం “జీవము గల వారికి తల్లి.” కావున ఆమె వచ్చి ఈ బిడ్డను తెచ్చినది. మరియు కయీను తన స్వంత సహోదరిని వివాహం చేసుకున్నాడు అనేదే, నేను దాని నుండి చూడగలిగే ఏకైక విధానమైయున్నది. కాబట్టి వాస్తవంగానే, ఆ రోజులో ప్రజలు జీవించుచున్నారు. చూశారా? మంచిది, మరియు…

ఆదాము మరియు హవ్వ ఏదెనులో తమ పిల్లలను కలిగియున్నప్పుడు…ఇప్పుడు గమనించండి, ప్రశ్న అదే: ఏదెనులో వారు తమ పిల్లలను కలిగియున్నప్పుడు, ఈ సమయంలో భూమిపై ఇతర ప్రజలు ఉన్నారా? లేరు! అప్పుడు ఆదికాండము 5:16 లో, మీరు చూడండి, కయీను నోదు దేశములో కాపురమున్నాడు మరియు అతని భార్యను వివాహము చేసుకున్నాడు. నిశ్చయంగా. చూశారా?

601 అది ఆదికాండము 1లో, ఆయన నరుని తన స్వరూపమందు సృజించెను, అది థియోఫనియై యున్నది. మరియు ఆదికాండము 2 లో, ఆయన నేలమంటితో నరుని నిర్మించాడు, అతడు ఇప్పుడు మనము కలిగియున్న ఈ మానవ మాత్రుడైయున్నాడు. మరియు పిదప, 3లో పడిపోవుట జరిగి, ఏదెను తోట నుండి తరిమివేయబడటం జరిగినది; మరియు అప్పుడు పిల్లలు పిల్లల్ని కన్నారు. మరియు కయీను తన భార్యను తీసుకొని నోదు దేశంలో ఆమెతో కాపురమున్నాడు, అది వెలుపటయైయున్నది, ఎందుకనగా దేవుడు అతణ్ణి తన స్వంత సోదరుడితోనున్న సహవాసం నుండి వేరు చేసాడు (అది హేబెలు యొక్క—యొక్క మరణమువలనైయున్నది). మరియు అతడు కలిగియున్నది ఆమెనే, తన స్వంత సహోదరినే, మరియు ఆమెను వివాహం చేసుకున్నాడు; అతడు ఎలా వివాహము చేసుకున్నాడనేదానిని—దానిని నేను, నా మట్టుకు నేను, చూడగలిగే ఏకైక విధానము అదేయైయున్నది.

602 ఇప్పుడు, ఇలా చెప్పబడినది…మరియు ఇక్కడున్న నా నల్లజాతి స్నేహితులు ఈ వ్యాఖ్యానమును మన్నిస్తారని నేను ఆశిస్తున్నాను, ఎందుకనగా అది ఖచ్చితంగా సరి కాదు. నేను మార్పునొందిన తర్వాత, నా జీవితంలో ఎవరినైనా మొట్ట మొదటిసారి కలిశానంటే…నేను…సహోదరుడు జార్జ్ డిఆర్క్ మరియు అక్కడనున్నవారినే నేను కలిశాను. మరియు నేను నడిపించబడ్డాను, మరియు ప్రభువు నన్ను ఒక చిన్న స్థలానికి నడిపించాడు. మరియు నల్లజాతివారు ఎక్కడి నుండి వచ్చారని వారు చర్చించుచున్నారు. మరియు వారు నల్లజాతివారి గురించి…కయీను ఒక కోతి వంటి జంతువును పెండ్లి చేసుకున్నాడని, మరియు అక్కడ నుండి నల్లజాతి వచ్చిందని చెప్పుటకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు, అది తప్పు! ఖచ్చితంగా, అది తప్పు! మరియు ఎన్నడూ దాని పక్షమున నిలబడకండి. ఎందుకనగా నలుపు లేదా తెలుపు, లేదా మరే భిన్నమైన జాతి లేకుండెను, జలప్రళయం వరకు ఒక్క జాతి ప్రజలు మాత్రమే ఉన్నారు. పిదప జలప్రళయము మరియు బాబెలు గోపురము తరువాత, ఎప్పుడైతే వారు చెదిరిపోవటం ప్రారంభించారో, అప్పుడు వారు తమ రంగులను మరియు మొదలగువాటిని పొందుకున్నారు. వారందరూ ఒకే వృక్షము నుండి వచ్చియున్నారు. అది ఖచ్చితంగా సరియే. భూమి మీద ఎన్నడైన జీవించినటువంటి, మానవ జాతిలోని ప్రతి వ్యక్తికి, ఆదాము మరియు హవ్వ భూసంబంధమైన తల్లిదండ్రులైయున్నారు. అది వాస్తవము. నలుపు, తెలుపు, పాలిపోయిన, గోధుమ, పసుపు, మీరు ఏ రంగులో ఉన్నా సరే, అది ఖచ్చితంగా మీరు నివసించే ప్రదేశం బట్టి ఉంటుంది, మరియు అది—అది ఆ…అలాగే…

603 నేను దాని గూర్చి మాట్లాడుచున్నప్పుడే దీనిని వ్యక్తపరచెదనని నేను అనుకొనుచున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ విభజనలలో ఉన్న ప్రజలు మరియు వారు విడుదల చేస్తున్నట్టి చట్టాలు మరియు ఆ విషయాలు, అవి విడ్డూరంగా ఉన్నవని నేను అనుకొనుచున్నాను. నేను నిజంగా అట్లనుకొనుచున్నాను. వినండి, కేవలం ఆ ప్రజలను అలాగే వదిలేయండి, వారికేమి కావాలో వారికి తెలుసు. దేవుడు ఒక మనిషిని ఒక నల్లజాతివానిగా చేసాడు, మరియు అతడు దాని విషయమై సంతోషంగా ఉన్నాడు. ఖచ్చితంగా! దేవుడు నన్ను ఒక నల్లజాతివానిగా చేస్తే, నేను దాని విషయమై సంతోషిస్తాను; ఆయన నన్ను ఒక గోధుమ రంగువానిగా చేసినా, నేను సంతోషిస్తాను; ఆయన నన్ను ఒక తెల్లవానిగా చేసియున్నయెడల, నేను సంతోషంగా ఉన్నాను; ఆయన నన్ను పసుపు రంగువానిగా చేస్తే, నేను సంతోషిస్తాను. దేవుడు మనలను మన రంగులలో చేసాడు, మరియు ఆయన కోరిన విధంగా ఆయన మనలను చేసాడు, మరియు మనమందరము ఆయన యొక్క పిల్లలమైయున్నాము. ఖచ్చితంగా! మరియు వారు ఆ రీతిగా గొడవపడుతూ మరియు ఆ విధంగా కొనసాగకూడదు. అలా చేయడం తప్పు. వారు అలా చేయకూడదు. మనము ఉండవలసిన విధంగా…దేవుడు మనలను కలుగజేసాడు.

604 మరియు నల్లజాతీయుడు, అతడు అక్కడికి వెళ్ళి తన—తన తరమును లేదా తన రంగును బ్రద్దలు చేసి, మరియు తెలుపు మరియు అటువంటి వాటితో కలగలుపు చేయకూడదు. నేను అతణ్ణి నిందించడంలేదు. నేను నిందించను. తెల్ల జాతీయుడు కలిగిలేని సంగతులను నల్ల జాతీయుడు కలిగియున్నాడు. ఖచ్చితంగా! అది ఖచ్చితంగా నిజము. మరియు వారు అలా ఉండాలని దేవుడు ఎన్నడూ ఉద్దేశించలేదు.

605 మంచిది, చూడండి. నల్ల జాతీయుడు…అతను—అతను ఒక…ఒక తెల్ల జాతీయుడు ఎన్నడూ కలిగిలేనటువంటి ఒక స్వభావాన్ని అతడు—అతడు కలిగియున్నాడు. అతడు భవిష్యత్తు-గురించి-చింత లేనటువంటి, “దేవుని నమ్మి, మరియు ఆ మిగతాదానిని వదిలివేయుము” అనే వైఖరిని కలిగియున్నాడు; అతడు దానిని పొందుకున్నా పొందుకోకపోయినా, ఎలాగైనను అతడు సంతోషంగా ఉంటాడు. ఈ రాత్రి, నేను దానిని ఎంతో కలిగియుండాలని కోరుచున్నాను, నేను నిశ్చయంగా కోరుచున్నాను. మంచిది, అతడు దానిని కలిగియున్నాడు, మరియు అది అతని స్వాస్థ్యమైయున్నది; వారు వేరే జాతితో దానిని కలిపి కూడా, దానిని బ్రద్దలు చేయకూడదు. అది ఖచ్చితంగా వాస్తవము.

606 నా జీవితంలో నేను విన్నటువంటి ఉత్తమమైన—ఉత్తమమైన వ్యాఖ్యానములలో ఒకటి దిగువున అక్కడ శ్రీవ్‌పోర్ట్‌లోనున్న ఆ స్త్రీ చేసినదని నేను అనుకొనుచున్నాను. ఆమె ఒక వ్యాఖ్య చేసినది, మరియు వారు దానిని పత్రికలో వేసారు. ఆమె అక్కడికి వెళ్ళి, ఆమె ఇట్లు చెప్పింది, “ఇక్కడ, ఈ విభజనలో జరుగుచున్న ఈ విషయాల తీరును బట్టి, నా పిల్లలు బడికి వెళ్ళేందుకు ఆ తెల్లవారి పాఠశాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు.” ఇట్లన్నది, “ఒక నల్లజాతీయురాలైన ఉపాధ్యాయురాలును వారు కలిగియుంటే వారికి లభించే శ్రద్ధ వారికి లభించదు.” ఆ స్త్రీ ఒక తెలివైన స్త్రీ. ఆమె దేని గూర్చి మాట్లాడుతుందో ఆమెకు తెలుసు, వారు శ్రేష్ఠమైన విద్యను పొందుతారు. అది ఖచ్చితంగా నిజము. కావున ప్రజలు అలా చేయడం ద్వారా తప్పు చేస్తారని నేను భావిస్తున్నాను.

607 ఆపై వారు ఇట్లంటారు, “కయీను మరియు హేబెలు…” మొదలగునవి. కాదు, అయ్యా! రంగుకు దానితో ఏ సంబంధం లేదు. ఆ లోపలనున్న ఆత్మను బట్టియే విషయం ఉంటుంది. అది ఖచ్చితంగా సరైనది.

608 కావున కయీను తన భార్యను వివాహము చేసుకున్నాడు, మరియు ఆమె అతని సహోదరియైయున్నది. మరియు వారు…అతడు ఆమెను నోదు దేశమునకు తీసుకువెళ్ళాడు, మరియు అక్కడ భూమి యొక్క గొప్ప తెగలు వచ్చాయి: మతవాదులు మరియు ఆరాధికులు.

609 మరియు ఈ రోజు ఆలోచించు, స్నేహితుడా, కేవలం ఆగి మరియు ఒక్క క్షణం ఆలోచించు. అదేమనగా పదివేల రెట్లు పదివేల కొలది మరియు వేలకు వేల కొలదిగా, ఖచ్చితంగా సంఘానికి-వెళ్ళే ప్రజలు, ఆ సంఘానికి వారు ఉండగలిగేంత యధార్థంగా మరియు సమర్పితంగా ఉండే ప్రజలు ఉన్నారు, వారు సరిగ్గా కయీను వలెనె నశించినవారైయున్నారు. చూశారా? ఎన్నుకునేది దేవుడే! ఏర్పరచుకునేది దేవుడేయైయున్నాడు! చూశారా? కనికరము చూపేది దేవుడు! మట్టి కుమ్మరితో చెప్పలేదు, అయితే ఆ మట్టి మీద అధికారము గలవాడు కుమ్మరియైయున్నాడు. అది నిజము.

610 ఇప్పుడు ఇక్కడ తదుపరిది, ఒక మంచిది ఉన్నది:

రెండవ పేతురులో 2:4—2:4…

611 బైబిలును కలిగియున్న ఎవరైనా, నేను వాటిని చదువుచుండగా త్వరగా ఈ లేఖనములను తీయగోరినట్లైతే, మీరు కోరినయెడల దానిని చేయండి. మరియు మనము ఈ ప్రశ్నలోనికి వెళ్తుండగా, నాకు సాహాయము చేయండి.

612 ఇప్పుడు, ఈ కయీను మరియు—మరియు ఈ మొదలగువాటి మీద, ఇప్పుడు అది సంతృప్తిపరచనియెడల, మీరు మాకు తెలియజేయండి. మేము సంతోషిస్తాము…

613 ఇప్పుడు రెండవ పేతురు 2:4. మంచిది, అయ్యా, మనము ఇక్కడకు వచ్చాము:

66. రెండవ పేతురు 2:4, “ఏలయనగా దేవుడు…దేవదూతలు పాపము చేసినప్పుడు, దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళములోనికి త్రోసివేసినయెడల,” మరి అటువంటప్పుడు మొదటి పేతురు 3:19 లో, క్రీస్తు చెరలోనున్న ఆత్మలకు ఎందుకు ప్రకటించాడు?

614 ఇప్పుడు, మొదట, మనము పేతురు 2:4 ను కలిగియున్నాము. సరి:

ఏలయనగా దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక—మందలి, కటిక చీకటిగల బిలములోకి త్రోసివేసి, మరియు—మరియు ఆ తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించినయెడల;

615 ఇప్పుడు, మనము మొదటి పేతురు లో కనుగొందాము (అది రెండవ పేతురు), మొదటి పేతురు 3:19, దీనిని వినండి. సరిగ్గా ఇదే, ఇదేయైయున్నది. నేను వాటిని వ్రాయకపోవడానికి కారణమేదనగా, అవి ఇప్పుడే వచ్చినవి.

…ఆయన…వెళ్ళి మరియు చెరలో ఉన్న ఆత్మలకు ప్రకటించాడు;

616 ఓ, అవును, ఇదియే. దానికి కొంచెము ముందు నుండి మనము ప్రారంభించుదాము, 18వ వచనం:

ఏలయనగా…మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు, నీతిమంతుడైన క్రీస్తు, శరీర విషయములో, చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను:

చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి ప్రకటించెను;

అవి పూర్వము అవిధేయులైన ఆత్మలైయున్నవి,…

617 నా ప్రియమైన స్నేహితుడా, నీవు కేవలం ఆ తరువాత వచనమును చదివితే, మరి అక్కడే అది దానిని వివరించినది. చూశారా?

దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు, అవి నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా పూర్వము, అవిధేయులైన ఆత్మలైయున్నవి, ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది, నీటి ద్వారా రక్షణ పొందారు. (చూశారా?)

618 ఇప్పుడు, మీరు గనుక ఇక్కడ గమనించినట్లయితే, ఈ బోధకుడు మరొకదానిని కలిగియున్నాడని నేను అనుకుంటున్నాను…కొద్దిగా దీనివంటిదే, దానికి కొద్దిసేపటి తర్వాత జవాబు ఇవ్వబడుతుంది.

619 మొదటి పేతురు 4…లేదా 2:4, మీరు గమనించినయెడల, “దూతలను దేవుడు విడిచిపెట్టక,” ఆ దూత [angel—తర్జుమాదారుడు] అనేది ఎలా వ్రాయబడినది? చిన్న అక్షరం “a.” [ఆంగ్లములో దూతను angel అంటారు. బైబిలులోని ఈ సందర్భములో angel అను పదముకు చిన్న అక్షరం ‘a’ వాడబడినది.—తర్జుమాదారుడు.] చూశారా? ఇప్పుడు, ఇక్కడ, “ఆ చెరలో ఉన్న ఆత్మలు నోవహు యొక్క దీర్ఘశాంతపు దినములలో పశ్చాత్తాపపడని ఆత్మలైయున్నవి,” అవే దూతలు. వారు మనుష్యులు: వర్తమానికులు, బోధకులు; “దూతలను విడిచిపెట్టలేదు.” ఒక…దూత అనే పదము “ఒక వర్తమానికుడు” అనే పదము నుండి వచ్చినదని మీకు తెలుసా? దూత అనగా “వర్తమానికుడు” అని ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగా, దూత అనగా ఒక వర్తమానికుడు, “మరియు ఆయన దూతలను విడిచిపెట్టలేదు.” చూశారా?

620 మరియు ఇక్కడ హెబ్రీ పత్రికలో, మనము కొన్ని వారాల క్రితం “ఆ దూతలు” అనే దానిగుండా వెళ్ళామని, మీకు గుర్తున్నదా?

621 మరియు ఇక్కడ హె-…ప్రకటన గ్రంథములో, “సార్దీసు సంఘపు దూతకు ఈ సంగతులు వ్రాయుము. ఎఫెసు సంఘపు దూతకు ఈ సంగతులు వ్రాయుము. సంఘపు దూతకు…” అది గుర్తున్నదా? మరియు ఆ దూత అనే పదమును మనము పరిశీలించి, మరియు నిఘంటువు నుండి, దాని అర్థము “ఒక వర్తమానికుడు” అని కనుగొన్నాము. దూత అనే ఆ పదము, అది “భూమి మీద ఒక వర్తమానికుడై యుండవచ్చును, ఒక సహజాతీతమైన వర్తమానికుడై” యుండవచ్చును.

622 కావున ఈ దశలో, మనము ఆ పదకోశమును తీసుకొని మరియు దానిని మరలా పరిశీలించినయెడల, అది “వర్తమానికులు, మొదటి వర్తమానికులు” అనుదాని నుండి ప్రారంభమవుతుందని మీరు కనుగొంటారు. చూడండి, “అయితే…ఆయన విడిచిపెట్టనియెడల…పాపము చేసిన దూతలను దేవుడు విడిచిపెట్టనియెడల,” (చూశారా?) “మరియు ఆ సహజాతీతమైన జీవులు,” (చూశారా?) “నిరీక్షించిన తర్వాత…”

ఇప్పుడు గమనించండి, అతడు చెప్పెను:

…అయితే…పాపము చేసిన దూతలను విడిచిపెట్టక, వారిని పాతాళలోకమందలి, కటిక చీకటిగల బిలములోనికి త్రోసివేసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను;

623 పిదప ఇక్కడ, మొదటి పేతురు 3:19 లో మరలా చూడండి, ఇప్పుడు ఇది ఎట్లు చదువబడుతుందో గమనించండి:

ఏలయనగా చెరలో ఉన్న ఆత్మలకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను;

దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, అవి పూర్వము నోవహు దినములలో అవిధేయులైన ఆత్మలైయున్నవి,…(చూడండి, అది ఆ దినపు వర్తమానికులైయున్నారు, వర్తమానికులు)…ఆ ఓడ సిద్ధపరచ బడుచుండగా, అందులో కొందరు…అనగా, ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

624 ఇప్పుడు మీరు గమనించినయెడల వారు ఆకాశములో ఉన్నప్పుడు. ఇప్పుడు, ప్రకటన 11 లో…లేదా 7వ అధ్యాయమని, నేను నమ్ముచున్నాను…లేదా కాదు, కాదు, అది 12వ అధ్యాయము. ఒక స్త్రీ నిలబడియున్న దృశ్యమును ఆయన ఇచ్చుచున్నాడు; ఆమె చంద్రుడిని శిరస్సు మీద మరియు సూర్యుడిని…లేదా, సూర్యుడుని ఆమె శిరస్సు మీద మరియు చంద్రుడుని ఆమె పాదముల క్రింద కలిగియున్నది. మరియు శిశువు పుట్టగానే అతడిని మ్రింగివేయుటకు ఎర్రని ఘటసర్పము నిలుచుండెను, మరియు అది దాని తోకను తీసుకొని ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఈడ్చి భూమి మీద పడవేసెను. మీరు దానిని గమనించారా? ఇప్పుడు, దాని అర్థం సాతానుకి ఒక—ఒక పొడవైన తోక ఉండి వాడు దానితో ప్రజలను చుట్టివేసాడని కాదు, అయితే “వాడు చెప్పిన ఆ కథ,” మరియు ఆ నక్షత్రాలలో మూడవ భాగమును లాగివేసాడు. ఆ నక్షత్రాలు అబ్రాహాము యొక్క సంతానమైయుండెను.

625 అబ్రాహాము ఇట్లు చెప్పెను, “ఓ…”

626 దేవుడు అబ్రాహాముతో ఇట్లు చెప్పెను, “ఆకాశము వైపు తేరి చూడుము, మరియు నీకు చేతనైతే ఆ నక్షత్రాలను లెక్కించుము.”

627 అతడిట్లన్నాడు, “నేను లెక్కించలేను.”

628 అందుకాయన ఇట్లు చెప్పెను, “అలాగునే నీవు నీ సంతానమును కూడా లెక్కించలేవు,” ఆ నక్షత్రాలు.

629 ప్రకాశమానమైన ఆ వేకువ చుక్క ఎవరు? నజరేయుడైన యేసే, మానవ శరీరములో జీవించినట్టి అత్యంత ప్రకాశవంతుడు. ఆయనే ప్రకాశమానమైన వేకువ చుక్క. మరియు ఇస్సాకు ద్వారా వచ్చుచున్న, అబ్రాహాము యొక్క సంతానము ఆయనే. మరియు మనము, క్రీస్తునందు మరణించినవారమై, అబ్రాహాము యొక్క సంతానముగా మారి మరియు వాగ్దాన ప్రకారము వారసులమైయున్నాము.

630 కావున ఆకాశమందున్న నక్షత్రాలు ఇక్కడున్న మనుష్యులయొక్క ఆత్మలను సూచిస్తున్నవి. మరియు ఆ ఎర్రని ఘటసర్పము (రోము, దాని హింసాత్మక చర్యలో) అరవై-శాతం యొక్క…లేదా నక్షత్రాలలో మూడవ భాగమును పట్టుకొని, మరియు వాటిని క్రింద పడవేసినది, అది మన ప్రభువైన యేసు యొక్క సిలువ మరణము వద్ద వారు ఆయనను త్రోసివేసినప్పుడైయున్నది మరియు ఆయన…మరియు ఆయనతో ఎటువంటి సంబంధము లేకుండా ఆయనను బయటకు వెళ్ళగొట్టినప్పుడైయున్నది; ఆ మూడవ భాగపు దూత నక్షత్రాలు, ఆ దూతలు వారేయైయున్నారు.

631 చూడండి, మీ శరీరంలో, మీ లోపల…(దానికి మెరుగుగా జవాబు ఇవ్వడానికి, నేరుగా, దానిపై మనకు మరొక ప్రశ్న వచ్చినది). కావున…మీ లోపల ఒక ఆత్మ ఉన్నది, అది వేరొక మనుష్యుడు. మీ బాహ్యమైనది ఒక మనుష్యుడు, మీ అంతరంగములోనిది మరొక మనుష్యుడు. కావున మీ అంతరంగములోనిది సహజాతీతమైనది, మీ బాహ్యమైనది భౌతికమైనది. చూశారా? మరియు ఇట్లుండగా, మీరు గనుక దేవునిచేత, ఆత్మ-నడిపింపును కలిగియుంటే, మీరు దేవుని యొక్క వర్తమానికుడు, లేదా ఒక దూత అవుతారు. దేవునియొక్క వర్తమానికుడు, దేవునియొక్క దూత, ఒక్కటే పదమైయున్నది; దానిని వేరు చేయలేరు: దేవునియొక్క వర్తమానికుడు, లేదా, దేవునియొక్క దూత.

632 మరియు ఎవరికి ఎక్కువ అధికారం ఉన్నది? పరలోకపు దూతకా లేదా ప్రసంగ వేదిక వద్దనున్న దూతకా? దానిని ఎవరు కలిగియున్నారు? ప్రసంగ వేదిక వద్దనున్న దూతయే! పౌలు ఇట్లు చెప్పెను, “పరలోకము నుండి ఒక దూత వచ్చి మరియు నేను ఇదివరకే మీకు ప్రకటించిన దీనిని కాకుండా వేరే ఏ సువార్తనైనా మీకు ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవును గాక.” కావున పరిశుద్ధాత్మతో మరియు వాక్యముతో అభిషేకించబడిన దూత దేవుని తర్వాత స్థానములో ఉంటాడు. అది వాస్తవము. పరలోకములో, అతని అధికారము…

633 “భూమ్యాకాశములలో సర్వాధికారము నా చేతికి ఇవ్వబడెను. వెళ్ళుడి, మరియు నేను మీతో వచ్చెదను. భూమి మీద మీరు వేటిని బంధింతురో, నేను వాటిని పరలోకమందు బంధింతును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో, నేను వాటిని పరలోకమందు విప్పుదును.”

634 ఓ, గొప్ప పరిశుద్ధ సంఘము ఈ కార్యములను చేయుటకు కేవలం దానికున్న అధికారమును గ్రహిస్తే చాలును. అయితే “అది జరుగగలదా?” అది జరుగుతుందా, అని ఆలోచిస్తూ ఎంతో సందేహము మరియు భయము మరియు వణుకు ఉండియున్నవి. అది ఉన్నంత కాలము, సంఘము ఎన్నడూ సరిగ్గా నిలబడలేదు. మరియు ఎప్పుడైతే భయమును గూర్చిన ప్రతీ మాట తొలగిపోయి మరియు పరిశుద్ధాత్మ చేత సంఘము పూర్తిగా నియంత్రించబడుతుందో, అప్పుడు భయాలన్నీ తొలగిపోతాయి, మరియు ఆ సంఘము అధికారమును కలిగియుంటుంది. చూశారా? అంతేకాదు, పరలోకానికి చెందిన ప్రతీ దానిని వారు తమ వెనుక కలిగియున్నారు. వారు సింహాసనానికి రాయబారులైయున్నారు. ఖచ్చితంగా! క్రీస్తుయొక్క రాయబారికి అధికారము ఉంటుంది, మరియు క్రీస్తుకు స్వంతమైయున్న ప్రతీది ఆ రాయబారికి చెందుతుంది. మరియు ఆయన ఇట్లు చెప్పాడు, “సర్వలోకమునకు వెళ్ళుడి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన తర్వాత మీరు నాకు సాక్షులైయుంటారు.” మరియు ఒక సాక్షి అనగా ఏమిటి? ఒక రాయబారి; అతడు వచ్చి మరియు ఏదో ఒక దాని గూర్చి సాక్ష్యమిచ్చుటయైయున్నది. పరలోకపు అధికారమంతయు సరిగ్గా మీ చేతుల్లో ఉన్నది! ఓ, మనమెందుకు ఇట్లున్నాము? మరియు సంఘము గొడ్రాలిగా ఉన్నది, మరియు మనము ఎదుగుదల లేకుండా ఉన్నాము. దానికి కారణం మనము ఈ కార్యములను గుర్తించకపోవడమే.

635 ఇప్పుడు, చెరలో ఉన్న ఆ ఆత్మలు (పశ్చాత్తాపపడనివారు), వారు దూతల రూపములో క్రిందకు తీసుకురాబడిన ఆ—ఆ దేవదూతలు కారు, అయితే అవి జగత్తుపునాది వేయబడక ముందే పడిపోయిన ఆ దేవదూతల యొక్క ఆత్మలైయున్నవి, అది ఆ వెనుక అక్కడ పరలోకములో యుద్ధము జరిగినప్పుడైయున్నది. మరియు సాతాను మరియు—మరియు ఆ ఘటసర్పము పోరాడినవి, మరియు అప్పుడు…లేదా మిఖాయేలు మరియు—మరియు ఆ—ఆ ఘటసర్పము (లూసీఫర్) యుద్ధము చేసారు. మరియు లూసీఫర్ వాడి పిల్లలందరితో (వాడు మోసగించిన దూతలందరితో) పడద్రోయబడినాడు, మరియు ఆ దూతలు భూమి మీదకి వచ్చి మరియు పిదప మానవులుగా మారుటకు బద్దులయ్యారు. మరియు వారు అట్లు చేసినప్పుడు, మరప్పుడే “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూసి, వారిని తమకు భార్యలనుగా తీసుకొనిరి.”

636 వారు దేవుని కుమారులు. ఈ భూమి మీద పుట్టిన ప్రతీ మనిషి ఒక దేవుని కుమారుడైయున్నాడు. అతడు పాపియైయున్నాడా లేక అతడు ఏమైయున్నాడు అనేదానితో నిమిత్తము లేకుండా, అతడొక దేవుని కుమారుడైయున్నాడు. దేవుని ఘనత కొరకు దేవుని స్వరూపమందు సృష్టించబడినాడు, అతడు ఆ విధంగా సృష్టించబడినాడు. అయితే ఆయనను ఎవరు అంగీకరిస్తారో మరియు ఆయనను ఎవరు అంగీకరించరో దేవుడు ఆదిలోనే ఎరిగియున్నాడు. కాబట్టి ఆయన ఎన్నుకోవచ్చును, లేదా, ఎన్నుకోవడం గురించి కాదు, కానీ ముందు జ్ఞానము చేత ఎవరు రక్షింపబడతారో మరియు ఎవరు రక్షింపబడరో ఆయన చెప్పగలడు, ఏలయనగా ఏ వ్యక్తి ఏ ఆత్మను పొందుకుంటాడో ఆయనకు తెలిసేయున్నది.

637 మరియు దేవునియొక్క సింహాసనము నుండి వచ్చి, మరియు దేవునియొక్క సింహాసనము ఎదుట నిలబడి, మరియు…లోకారంభమునకు ముందు లక్షలకొలది సంవత్సరాలు మరియు యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించిన ఆ ఆత్మలు, వారికి ఆరాధన గూర్చి తెలియదని మీరు అనుకొనుచున్నారా? మరియు వారు దిగి వచ్చి నేరుగా మనుష్యునిలోనికి ప్రవేశించి, మరియు వారు దేవుని ఆరాధించారు! ఖచ్చితంగా, వారు దేవుని ఆరాధించారు; మరియు వారు దేవుని గూర్చిన జ్ఞానమును కలిగియున్నారు, వారు ఎల్లప్పుడూ, తెలివైనవారు, వివేకము గలవారు, మరియు విద్యావంతులైయున్నారు. కానీ ఆది నుండి దేవుడు వారిని తృణీకరించాడు!

638 కావున, స్నేహితుడా, ఒక సంఘ సభ్యత్వము, లేదా—లేదా ఏదైనా వేద పాండిత్యమును గూర్చిన జ్ఞానము లేదా ఇంకేదైనా, దానితో ఎటువంటి సంబంధమును కలిగిలేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము మరియు ఒక క్రొత్త జన్మ మాత్రమే మిమ్మల్ని ఆయనతో ఒక్క వ్యక్తిగా జతచేయవలసియున్నది. విషయము అదే.

639 దేవుడు, ఆదిలో ఆయన దానిని ఎరిగియున్నప్పుడు…పురుషులు మరియు స్త్రీలు ఒక్కటిగా చేయబడినారు, ఇరువురిగా కాదు, వారు ఒక్కటిగా చేయబడ్డారు. వారు వేరు చేయబడ్డారు, ఒకరు శరీరములో మరియు ఒకరు ఒక థియోఫెనీలో ఉంచబడ్డారు. ఆయనకి అది తెలుసు. కావున దానిని మీకు నిరూపించుటకు: దేవుడు స్త్రీని చేసినప్పుడు, ఆయన పురుషుడిని చేసినట్లే కొంత మట్టిని తీసుకొని ఆమెను చేయలేదు; ఆయన ఆదాము ప్రక్కటెముకలలో నుండి ఒకదానిని తీసాడు, మరియు ఆమె పురుషునియొక్క ఒక ప్రత్యు-త్పత్తి అయినది (ఎందుకనగా ఆమె అతనిలో భాగమైయున్నది). ఇప్పుడు దానిని మీరు పొందుకున్నారా? చూశారా? అదియే.

640 ఆ దూతలు అట్లేయున్నారు. మరియు దేవుడు మరియు దేవునితో జతచేయబడిన ఆత్మ ఒక్క ఆత్మయే. అది వాస్తవం. ఇప్పుడు, సంఘములో నివసించే దేవునియొక్క ఆత్మ, అది పరలోకము నుండి వచ్చిన ఆత్మయైయున్నది, దానిని దేవుడు జగత్తుపునాది వేయబడకముందే ఎరిగియున్నాడు, అది అపవాదియొక్క అబద్ధమును తృణీకరించినది. మరియు ఆ ఆత్మ తన పరీక్షలగుండా వచ్చుటకు…ఒక మాంసపు దేహమును తీసుకోవలసియున్నది. ఈ ఇతరులు చేసినట్లే ఆయన శరీరములో రావలసియున్నది, మరియు వారందరిపైన సమానమైన కాడి ఉంచబడినది. మరియు, ఏ ఆత్మలు అంగీకరించునో, ఏవి అంగీకరించవో, దేవుడు ఆది నుండి ఎరిగియున్నాడు. విషయము అదే. అపవాది సాధ్యమైతే, ఏర్పరచబడినవారిని సైతం మోసపరిచేంత తెలివి గలవాడైయున్నాడు.

641 కావున ఈ ఆత్మలు, ప్రకటించబడిన ఈ దూతలు, చెరలో ఉన్నారు; దూతలు, దానిని ఇక్కడ మీరు గమనించినట్లైతే, అది ఒక చిన్న “a” దాని అర్థం “మానవుడు”; దూతలు, ఇక్కడ భూమి మీదనున్న వర్తమానికులు. వారు పాపము చేసారు, మరియు వారు పాపము చేయగల ఒకే ఒక మార్గమేదనగా అవిశ్వాసముంచుటయే! మరియు ఆ మార్గము…వారికి వారి స్వంత మతాలు ఉన్నవి, మరియు వారు నోవహు యొక్క వర్తమానమును నమ్మలేదు. వారు హనోకు యొక్క వర్తమానమును నమ్మలేదు. మరియు వారు వారి వర్తమానమును త్రోసివేసారు, “మరియు శిక్షించబడ్డారు,” వారు శిక్షించబడ్డారని బైబిలు చెప్పినది.

642 హనోకు వారికి ప్రవచించి, ఇట్లు చెప్పాడు, “తన పది వేలమంది పరిశుద్ధులతో ప్రభువు వచ్చుచున్నాడు.”

643 మరియు వారు ప్రవచించారు. మరియు నోవహు ఒక ఓడను కట్టాడు, మరియు వారు ఇట్లన్నారు, “అతడు ఒక పరిశుద్ధ-గుండ్రాయి! అతడొక మూఢ భక్తిగలవాడు! అసలు వర్షము కురవడం వంటిది ఏదియు లేదు.” మరియు ఒక నూట ఇరవై సంవత్సరాలు గడిచాయి, అయితే దానిలో రక్షణను కలిగియున్నటువంటి ఒక మతాన్ని అతడు కలిగియున్నాడు, తప్పించుకొనుటకు ఒక మార్గము కలుగజేయబడినది, కానీ వారున్న స్థితిలోనే వారు సంతృప్తి చెందారు.

644 ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది, మానవులు వారున్న స్థితిలోనే సంతృప్తి కలిగియున్నారు. అయితే తప్పించుకొనుటకు ఒక మార్గమున్నది, మరియు ఆ మార్గము యేసుక్రీస్తు ద్వారానేయైయున్నది. ఆమేన్. అదియే: అదే గోత్రము, అవే ఆత్మలు.

645 మరియు వారు ఖచ్చితంగా భక్తిపరులైన మనుష్యులు, చాలా భక్తిపరులే, కానీ వారు నిబంధన ప్రమాణమును తప్పిపోయారు.

646 ఈనాడు ఆ విధంగానే ఉన్నది. మనుష్యులు సంఘానికి వెళ్తారు, మరియు పెద్ద సంఘాలలో చేరుతారు, మరియు పట్టణములోనే అత్యంత పేరుగాంచిన వ్యక్తిగా ఉండుటకు ప్రయత్నిస్తారు. వారు ఒక సంఘములో చేరాలనుకుంటే, వారు ఉత్తమమైనదియు, మరియు పట్టణములో బాగా-పేరుగాంచినది-యునైన ఒక పెద్ద సంఘములో చేరతారు. వారు ఎంతగా ఆ పిలుపును తప్పిపోవుచున్నారో! వారు దానిని ఎంతగానో తప్పిపోవుచున్నారు!

647 మీరు ఎన్నడైనా యేసుక్రీస్తుని తెలుసుకునే ఒకే ఒక్క మార్గము ఆత్మీయ ప్రత్యక్ష్యత ద్వారాయైయున్నది, వేద పాండిత్యము ద్వారానో మరియు మీరు బైబిలును ఎంతగా అధ్యయనం చేస్తారన్నదాని ద్వారానో కాదు. మీరు క్రిస్టియన్ సైన్సు, మెథడిస్టు, యెహోవా సాక్షి, లేదా మీరేమైనప్పటికీ; మీరు ఎవరైనప్పటికీ, మీరు వాక్యమును బట్టి దానిని ఎన్నడూ తెలుసుకొనరు, ఆయనను మీకు బయలుపరిచేది దేవుని యొక్క ఆత్మయైయున్నది. అది ఒక ఆత్మీయ ప్రత్యక్ష్యతయైయున్నది!

648 ఎప్పుడైతే, ఏదెను తోటలో, ఆదాము మరియు హవ్వ, ఆ పిల్లలు బయటకు వెళ్ళగొట్టబడినప్పుడు, కయీను చక్కని పాండిత్యముతో వచ్చాడు. అతడు ఇట్లన్నాడు, “మనము దీనిని నా హృదయ—హృదయపూర్వకంగా చేయుచున్నామని దేవుడికి తెలిసేయుంటుంది. నేను ఒక బలిపీఠమును కడతాను, నేను దానిపై పువ్వులను పెడతాను, నేను దానిపైన ఫలములను పెడతాను, నేను దానిని అందంగా అలంకరిస్తాను. నిశ్చయంగా దీనితో నేను దేవుడిని సంతోషపరిచి మరియు నేను హృదయమందు యధార్థంగా ఉన్నానని ఆయనకు తెలియజేయగలను.” వాక్యమును తీసుకున్నంతవరకు అతడు సరియే; దేవుడు ఆరాధనను కోరాడు, అతడు ఆరాధించడానికి వెళ్ళాడు. అతడు ఆరాధించడానికి ఒక అందమైన స్థలమును, గొప్పదైన, చక్కని ప్రధాన ఆలయమును కట్టాడు (ఈనాడు వారు దానిని అలా పిలుస్తారు). మరియు అతడు దానిని సరిగా చేసాడు, అతడు దానిని సరిగ్గానే నిర్మించాడు మరియు దానిలో ఒక బలిపీఠమును పెట్టాడు; అతడు ఒక అవిశ్వాసి కాదు.

649 అయితే హేబెలు, దేవుని యొక్క వాక్యముపై…అప్పటికింకా బైబిలు వ్రాయబడలేదు, కానీ ఏదెను తోటనుండి మనల్ని బయటకు తీసుకువచ్చినది ఆ పండు కాదని దేవుడు అతనికి బయలుపరిచాడు, అది ఆదాము మరియు హవ్వ తిన్నటువంటి యాపిల్ పండ్లు కాదని, వారిని వేరు చేసినది మరియు విభజించినది ఖచ్చింతంగా లైంగిక విషయాలేనని బయలుపరిచాడు. మరియు ఆదాముయొక్క రక్తము ద్వారా, మరియు దానిని ప్రారంభించిన సర్పముయొక్క రక్తము ద్వారానే, వారు మర్త్యులయ్యారని తెలుసుకున్నవాడై, హేబెలు, దైవిక ప్రత్యక్ష్యత ద్వారా, వెళ్ళి ఒక గొఱ్ఱెపిల్లను తీసుకొని మరియు దానిని అర్పించాడు. మరియు దేవుడిట్లు చెప్పెను, “అదీ విషయం!” నిశ్చయంగా.

650 వారు రూపాంతరకొండ దిగి వచ్చినప్పుడు, యేసు ఇట్లు అన్నాడు, “మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు?”

651 “కొందరు నీవు ‘మోషే,’ అనియు మరియు కొందరు నీవు ‘ఏలీయా,’ అనియు మరియు కొందరు నీవు ‘యిర్మియా,’ అనియు మరియు కొందరు నీవు ‘ఆ ప్రవక్తవనియు,’ చెప్పుచున్నారు.”

652 అందుకాయన ఇట్లన్నాడు, “అయితే నేను ఎవడనని మీరు చెప్పుకొనుచున్నారు?”

653 పేతురు ఇట్లు చెప్పాడు, “నీవు సజీవుడగు, దేవుని కుమారుడవైన క్రీస్తువు.”

654 ఆయన ఇట్లున్నాడు, “సీమోను బర్-యోనా, నీవు ధన్యుడవు, ఎట్లనగా రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు.” (గమనించండి!) “అక్షరము ద్వారా ఎంతమాత్రము కాదు, పాఠశాల ద్వారా ఎంతమాత్రము కాదు; నీవెన్నడూ ఒక సెమినరీలో దానిని నేర్చుకోలేదు, ఎవ్వరూ నీతో చెప్పనూ లేదు. రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరచాడు. మరియు ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.” అక్కడే మీరున్నారు. అక్కడే జీవముగల దేవుని సంఘము ఉన్నది. అంతే. ఆ సంఘము మీద…ఆ ప్రత్యక్ష్యత మీద, ఈ సంఘము కట్టబడినది. అది, యేసుక్రీస్తు దేవుని కుమారుడని దేవుడు బయలుపరచిన ఒక దైవిక ప్రత్యక్ష్యతయైయున్నది, మరియు మీరు ఆయనను మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించారు, మీరు మరణము నుండి జీవములోనికి దాటియున్నారు.

655 మరియు ఈ శరీరము యొక్క అవయవాలలో పరిశుద్ధాత్మ కదలాడుచు మరియు పనిచేయుచున్నాడు. అదియే సంఘమైయున్నది! అది పేదదైనా, మరియు ఒక సువార్త బృందములో ఉన్నా, మరియు మీరు బయట ఒక దేవదారు చెట్టు క్రింద నిలబడినా, లేదా అది ఎక్కడైనాగాని, అది ఎవరో ఒకరి గృహములో ఒక వ్యక్తిగత కూటములోనైనా, అది ఎక్కడ ఉన్నప్పటికినీ లెక్కలేదు. అందము మరియు అట్టి సంగతులు దేవుడిని మెప్పించలేవు. అది మన వ్యక్తిగత రక్షకుడైయున్న యేసుక్రీస్తు దేవుని కుమారునిగా, సమర్పించబడినాడన్న ప్రత్యక్ష్యతను కలిగియున్న హృదయము యొక్క యధార్థతయైయున్నది. ఆమేన్!

656 మై, మనం…అలా వెళ్ళడం వలన, మీరెన్నడూ వీటిని పొందుకోలేరు, మనము పొందుకుంటామా?

657 అది వారే…ఆయన అక్కడకు వెళ్ళెను; ఆ దూతలు: ఆ వర్తమానికులు, ఆ బోధకులు, ఆ తెలివైనవారు, నోవహు ప్రసంగించడానికి వారి యొద్దకు వెళ్ళి, “ఎందుకు, ఓడలోకి రండి” అని చెప్పినప్పుడు నమ్మనటువంటి ఆ వర్తమానికులు.

658 వారు ఇట్లన్నారు, “ఈ పరిశుద్ధ-గుండ్రాయి చెప్పేది వినండి. ఆ మూఢ భక్తిగలవాడు చెప్పేది వినండి. అసలు, వర్షమనేదే లేదు. అటువంటి విషయాన్ని ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? అంతెందుకు, ఓ, మనకు సంఘాలు లేవా? మనము భక్తిపరులము కాదా?” ఎందుకు, వారు భక్తిపరులే!

659 సరిగ్గా అప్పుడున్న ఆ తరము వంటి ఒక తరమే, సరిగ్గా ఆయన రాకడకు ముందు మరలా పునరావృతం అవుతుందని యేసు చెప్పాడు, “నోవహు దినములలో జరిగినట్లే, మనుష్యకుమారుని రాకడలో జరుగును. ఎట్లనగా వారు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుచు నుండిరి.” వారు అప్పుడు ఎక్కడో ఒక దగ్గర, ఒక రీనో, నెవెడా ను కలిగియున్నారు. ఈనాడు వీరు కలిగియున్న అన్ని రకాల బుద్ధిహీనతను వారు కలిగియున్నారు; ఊరేగింపులు, మరియు వినోదాలు, మరియు ఎగతాళి చేసేవారు, అపహసించేవారు మరియు మొదలగువారు ఉన్నారు; పైకి భక్తిగలవారమని చెప్పుకుంటున్నారు, కానీ నిజ సత్యమును అనగా: ఆ నిబంధనను, కృపా వర్తమానమును నిరాకరిస్తున్నారు. వారు తప్పించుకోగలుగునట్లు, దేవుడు తన మార్గమును కలుగజేస్తూ, ప్రజలకు తన—తన నిబంధనను ఇస్తున్నాడు; అది దానిలో రక్షణను కలిగియున్నది, రక్షణయనేది తప్పించుకొనుటకు ఒక స్థలమైయున్నది.

660 “రక్షణతో మనకు ఏంటి అవసరం?” ఈనాడు ప్రజలు ఇట్లంటారు, “మనము ఒక మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జీవించడం లేదా? మనకు ఇంకేమి కావాలి?”

661 మనము ఎటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జీవిస్తున్నామన్నది నేను లెక్కచేయను, మనకు యేసుక్రీస్తు యొక్క రక్తము అవసరమైయున్నది. నిజం! మనకు క్రీస్తు అవసరమైయున్నాడు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నేను అభినందిస్తాను; అయితే ఆత్మ యొక్క రక్షణ విషయంలో, దానికి ఎటువంటి సంబంధము లేదు. ఖచ్చితంగా! ఆ ప్రభుత్వాలన్నీ గతించిపోతాయి, మరియు ప్రతీ దేశము గతించిపోతుంది. మరియు నేను…ఆ ఫరోలు నిలుచున్న చోట నేను నిలబడ్డాను, మరియు వారి సింహాసనాలు ఎక్కడ ఉన్నాయో కనుగొనాలంటే మీరు భూమిలో ఇరవై అడుగులు త్రవ్వాల్సియుంటుంది. ఆ ఫరోలందరూ మరియు భూమి మీద వారి రాజ్యాలు, మరియు వాటి యొక్క అస్థిరమైన కార్యాలన్నీ తప్పిపోతాయి మరియు గతించిపోతాయి, కానీ యెహోవా నిత్యమూ పారిపాలిస్తాడు, ఏలయనగా ఆయన అమర్త్యుడైన దేవుడైయున్నాడు. క్రీస్తు యేసు అనే బండ మీద మనం స్థిరంగా నిలబడినాము, ఏలయనగా మిగతా నేలంతయూ మునిగిపోవు ఇసుకవంటిదే.

662 అది ఏదైనా గాని…రాజ్యాలు లేస్తాయి మరియు పతనమవుతాయి, కానీ ఓ, ఏదియు లేదు…అది ఏదైనా నేను లెక్కచేయను…ఏదైనా; ప్రస్తుత కాలములోనైనా, భవిష్యత్తులోనైనా, ఏదియు (కరువైనా లేదా ఉపద్రవమైనా లేదా ఏదైనా) క్రీస్తునందున్న దేవుని ప్రేమనుండి మనలను ఎన్నడూ ఎడబాపనేరదు. ఒక మనిషి దేవుని ఆత్మ ద్వారా జన్మించినప్పుడు, అతడు ఇకపై కాలము యొక్క జీవి కాదు, కానీ అతడు ఒక నిత్యత్వపు జీవియైయున్నాడు. ఆమేన్. అతడు మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు. అతడు దానినుండి…అతడు కాలము నుండి, నిత్యత్వము లోనికి దాటియున్నాడు. అతడు ఎప్పటికీ నశించిపోడు! మరియు అంత్య దినములలో ఆయన అతడిని పైకి లేపుతాడని దేవుడు ప్రమాణము చేసాడు.

663 కావున వారు మీ పెద్ద సంఘాలను, మరియు మీ గొప్ప సమయాలను కలిగియుండవచ్చును, మరియు మీరు కోరుకున్నదంతా కలిగియుండి, మీ చెత్త జోకులను చెప్తూ మరియు మీ బంకో ఆటలను కలిగియుండవచ్చును, మరియు సూపు విందులను మరియు మీరు కోరిన ప్రతీది కలిగియుండి; అక్కడ విద్యావంతుడైన ఒక బోధకుడిని నిలబెట్టియుండవచ్చును. బహుశా అఆఇ లు అయినా తెలియని ఈ అబ్బాయిల కంటే అతడు దానిని బాగా చేయవచ్చను. కానీ నేను మీకు నిజమే చెప్పుచున్నాను, మీ విద్యంతటిని కలిగియున్న గొప్ప వేదపండితులనబడే వారికంటే అఆఇ లు కూడా తెలియని (క్రీస్తుని ఎరిగియున్న) ఒక పిల్లవాడు నాకు బోధించడాన్ని నేను ఇష్టపడతాను. ఖచ్చితంగా!

664 ఇక్కడ కెంటకీలో, ఈ మధ్యనే, తన స్వంత పేరును కూడా చదవలేని ఒక చిన్న పిల్లవాడు, ప్రభువు తనను బోధించడానికి పిలిచాడని మరియు అతనికి ఒక పాఠశాల నిలయం కావాలని చెప్పాడు. ఎందుకు, ఆ అధికారులు అతడు దానిని తీసుకొనుటకు అనుమతించలేదు. ఎవరో ఒక గొప్ప బోధకుడు తన పేరుతో ఆ విధంగా ఒక బిరుదును కలిగియుండి, ఒక గొప్ప డాక్టర్ ఆఫ్ డివినిటీ అక్కడకు వచ్చాడు, ఇంకేమి, వారు ఆ పాఠశాలను అతనికి ఇచ్చారు. నిశ్చయంగా. రెండు వారాల ఉజ్జీవ సభలు నిర్వహించారు, ఒక్క ఆత్మ కూడా పట్టబడలేదు. మరియు అతని తండ్రి వెళ్ళి, ఇట్లన్నాడు, “ఇప్పుడు అతడు దానిని తీసుకొనుటకు మీరు అనుమతించండి, నేను పన్ను చెల్లించువాడను, నా అబ్బాయి దానిని తీసుకునేందుకు నేను హక్కును కలిగియున్నాను. మరియు నా అబ్బాయి కూడా దానిని కలిగియుండవలసియున్నది.”

665 కావున అతడు దానిని కనుగొనుటకు వెళ్ళి, మరియు వారిని అడుగగా, వారు ఇట్లన్నారు, “సరి, అతడు దానిని కేవలం రెండు రాత్రులు మాత్రమే తీసుకొనుటకు మేము అనుమతిస్తాము.” మరియు వారు వెళ్ళి రెండు రాత్రులు అతడు దానిని తీసుకొనుటకు అనుమతించారు.

666 మరియు ఆ రాత్రి ఆ చిన్న అబ్బాయి అక్కడ పైకి ఎక్కాడు మరియు కనీసం బైబిలును చదవలేక, ఎవరితోనో తన పాఠ్యభాగమును చదివించాడు. అయితే అతడు వేదిక మీదకు నడిచి వచ్చినప్పుడు మాత్రం, అతడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినాడు. మరియు అతడు బోధించినప్పుడు, సుమారు ఇరవై మంది వేదిక వద్దకు వచ్చారు; మరియు తన స్వంత-బిరుదును పెట్టుకున్న ఆ బోధకురాలు వేదిక నొద్ద, ఏడ్చుకుంటూ కల్వరిని చేరుకుంది.

667 నిశ్చయంగా, సహోదరుడా, మీకు ఏమి తెలుసన్నది కాదు—కాదు, మీకు ఎవరు తెలుసన్నదైయున్నది. విషయం అదేయైయున్నది, అవసరమైనది అదే, క్రీస్తును ఎరిగియుండటం అవసరమైయున్నది. ఆయనను ఎరుగుటయే, జీవము; ఆయనను త్రోసివేయడం, మరణమే.

668 త్వరగా మన మిగతా ప్రశ్నలు చూద్దాం, ఇప్పుడు జార్జియాకు వెళ్ళే ప్రశ్నలు:

67. ప్రకటన 21:19 మరియు 20 లోని…ఆ రాళ్ళు దేనిని సూచిస్తున్నవి?

669 మీ బైబిలు గ్రంథాలు తెరవడానికి సమయాన్ని తీసుకొనుటకు మీరు ఇష్టపడినట్లైతే, మరి ఇప్పుడు మనకు ఎక్కువ సమయము లేదు, కానీ వాటికి త్వరగా జవాబిచ్చుటకు నేను ప్రయత్నిస్తాను. ప్రకటన ఇరవై-…అది 21:19 మరియు 20 అని నేను నమ్ముచున్నాను. అవును.

670 సరియే, అక్కడ అతడు భవనములోనున్న ఆ రాళ్ళను గూర్చి మాట్లాడుటను మీరు కనుగొంటారు. మరియు ఆ రాళ్ళు పునాదులైయున్నవి. మీరు గమనించినయెడల…సహోదరుడా నెవిల్, నీవు దానిని అక్కడ కలిగియున్నావని నేను నమ్ముచున్నాను. మరియు ప్రతీ రాయి ఒక పునాది. ఒక రాయి పునాదియైయ్యుండి, మరియు మరొకటి ఇంకేదో కాదు…కానీ ప్రతీ రాయి ఒక పునాదియైయున్నది. ప్రతీ రాయి ఒక స్థిరమైన పునాదియైయున్నది. మరియు అక్కడ పన్నెండు రాళ్ళు ఉన్నవి. మరియు మీరు గమనించినయెడల ఆ పన్నెండు రాళ్ళు, ఒక్కొక్క…మొదటిగా సూర్యకాంతపు రాయితో ప్రారంభమై, మరియు నీలము, మరియు మొదలగునవి ఆ రీతిగా, ప్రతీ రాయి సూచిస్తున్నవి.

671 బైబిలులో అక్కడ ఆ రాళ్ళు ఫలానా పేర్లతో పిలువబడుటను మీరు కనుగొంటారు. వాటిలో కొన్ని కొంచెం భిన్నంగా ఉన్నాయి, మీరు ఎన్నడూ వాటిని వినియుండరు. మీరు గనుక నిఘంటువులో చూసినట్లైతే అది అదే రాయి గాని, కేవలం ఒక భిన్నమైన పేరుగా, మార్చబడినదని; మీరు కనుగొంటారు.

672 అయితే అది—అది సూర్యకాంతపు రాయితో ప్రారంభమవుతుంది. ఆ—ఆ సూర్యకాంతపు రాయి బెన్యామీను రాయి, లేదా, ఆ…ఓ, మొదటి కుమారుడైన, రూబెను యొక్క రాయి. ఆ మొదటి రాయి రూబెనుది, అది సూర్యకాంతపు రాయి. చివరి రాయి బెన్యామీనుది, పైనున్న ఆ చివరి రాయి.

673 ఇప్పుడు, ఈ పన్నెండు రాళ్ళతో ఆ పునాది వేయబడినది, ఆ—ఆ పన్నెండు రాళ్ళు అహరోను యొక్క ఏఫోదు పతకమునకు వ్రేలాడుచున్నవి. మరియు—అతడు ఈ గోత్రాలకు ప్రథాన యాజకుడు అని, అవి—అవి సూచిస్తున్నాయి. వారి జన్మపు రాళ్ళలో ప్రతి ఒక్కటి, ఇక్కడ ఈ—ఈ పతకముపై ఉన్నవి. మరియు ప్రజలు ఈ పతకమును చూసినప్పుడు, వారు ఈ పతకములో జన్మపు రాయిని చూసినప్పుడు, ఆ గోత్రాలన్నిటికీ అహరోనే ప్రథాన యాజకుడు అని వారు గుర్తించారు.

674 ఇప్పుడు, ఈ ఉదయం సహోదరుడు నెవిల్ యొక్క ప్రసంగాన్ని మనం పొందుకున్నప్పుడు. మరి అనేక సార్లు వారు ఆ ఊరీము తుమ్మీమును తీసుకువచ్చారు. వారి వర్తమానము నిజమా కాదా అని తెలుసుకునే మార్గము అదేనని బైబిలులో చెప్పబడినట్లు మీరు చూస్తారు. ఆ మనుష్యుడు చెప్పిన దానిని, ఆ ప్రవక్త ప్రవచించిన దానిని వారు చెప్పుచునప్పుడు ఆ రాళ్ళు, ఆ రాళ్ళన్నీ ఒక్కసారిగా ప్రతిబింబించాయి. అది ఒక కాంతుల మిశ్రమమును చేసినది అది నీలము, మరియు సూర్యకాంతము, మరియు మరకతము, మరియు ఆ ఇతర రాళ్ళన్నీ వాటి కాంతిని ప్రతిబింబింపజేస్తూ, అది దానినంతా ఒక్కటిగా కలిపివేసిన ఒక గొప్ప పెద్ద అందమైన వర్షధనస్సు రంగును చేసినది.

675 ఇప్పుడు, ఇప్పుడు, ఈనాడు, ఆ యాజకత్వముతో పాటు ఆ ఊరీము తుమ్మీము తీసివేయబడియుండగా, ఇప్పుడు ఈనాడు ఈ బైబిలు గ్రంథమే దేవునియొక్క ఊరీము తుమ్మీము. మరియు ఒక బోధకుడు ప్రసంగించినప్పుడు, అతడు దాని మీద మాత్రమే ఆశపెట్టుకునే, ఇక్కడున్న ఒక చిన్న చోటు కాదు గాని; ఆ మనుష్యుడు ప్రసంగించే వర్తమానమును పూర్తి బైబిలు గ్రంథము ప్రతిబింబించవలసియున్నది. అదీ విషయం. కేవలం ఒక్క చోటును తీసుకొని మరియు, “మంచిది, బైబిలు దీనిని చెప్పుచున్నది,” అని చెప్పడం కాదు. ఓ, నిశ్చయంగా, అది చాలా సంగతులను చెప్తుంది. అయితే మీరు వాటన్నిటినీ కలిపి తీసుకోవలసియున్నది. మరియు దేవునియొక్క ఆత్మ వచ్చి మరియు ఆ—ఆ వాక్యమును తీసుకున్నప్పుడు, అది దానంతటినీ జతచేసి మరియు ఒక పెద్ద గొప్ప వెలుగును ప్రతిభింబిస్తుంది, మరియు ఆ వెలుగు యేసుక్రీస్తే. ఆమేన్.

676 ఇప్పుడు, ఈ పన్నెండు రాళ్ళు రూబెను నుండి మొదలై గాదు, మరియు బెన్యామీను వరకు, పన్నెండు పునాదులైయున్నవి; పన్నెండు గోత్రాలు, పన్నెండు రాళ్ళు. మరియు ఆలయములోని ఆ రాళ్ళు, నూతన పరలోకపు యెరూషలేములో ప్రతీ పునాది, మూలపురుషులలో ఒకరిపై వేయబడుతుంది.

677 ఇప్పుడు గమనించండి, మీరు ఆ రాళ్ళను గమనించండి, ఇప్పుడు ఆ మూలపురుషులు నేరుగా వేరొక దానిలోనికి ప్రతిభింబించుటను, ఇప్పుడు వేరొక ప్రశ్నలో మీరు చూస్తారు.

68. ప్రకటన 5 లోని నాలుగవ…ఆ నాలుగు జీవులను వివరించుము—వివరించుము.

678 సహోదరుడా నెవిల్, నీవు గనుక లేదా మీలో ఎవరైనా, దానికి దగ్గరలో తెరిచియున్నట్లైతే, ప్రకటన 5లో, మనం దీనిని కేవలం ఒక క్షణం చదువుదాము. అది ఒక—అది ఒక అందమైన చిత్రమైయున్నది…ఇక్కడ, స్వయంగా నేను ఇక్కడ దానిని తెరిచాను, ప్రకటన 5వ అధ్యాయము:

మరియు సింహాసనముపై ఆసీనుడైయున్నవాని కుడిచేతిలో నేను—నేను చూచితిని అది లోపటను మరియు వెలుపటను మరియు—మరియు—మరియు వెనుకను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథమైయున్నది.

మరియు నేను…

679 ఇప్పుడు, ఆ చోట కాదు. నేను ఇంకొంచెము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఆ నాలుగు జీవులు. మనము చూద్దాము, 14వ వచనము. అయ్యా, అది సరియే. ఇప్పుడు మనం దానిని మొదలు పెడదాము, అది సరియే. ఇప్పుడు మనం ఇక్కడ 12వ వచనం వద్ద—వద్ద ప్రారంభించుదాము, కాదు, నేను అనుకున్నది…“మరియు ఆ నాలుగు జీవులు ఇట్లు చెప్పెను, ‘ఆమేన్.’” కాదు, దానికి ముందు కొంచెం ఉంటుంది, సహోదరుడా నెవిల్. “ఇదిగో, నేను ఆ స్వరము విన్నాను…”

680 కేవలం ఒక నిమిషం, మనం చూద్దాము, నేను కొద్దిసేపటి క్రితమే దానిని చదివియున్నాను. ఓ, ఇదిగో దొరికినది, మనం 6వ వచనం వద్ద ప్రారంభించుదాము. 5వ వచనం:

మరియు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇట్లన్నాడు, ఏడువకుము: ఇదిగో, దావీదుకు చిగురైన, యూదా గోత్రపు సింహము, ఏడు ముద్రలను తీసి, మరియు ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని…నాతో చెప్పెను.

మరియు నేను చూడగా, మరియు,…సింహాసనమునకును మరియు…ఆ నాలుగు జీవులకును, మరియు, పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన, ఒక గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని, ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును మరియు ఏడు కన్నులు నుండెను, ఆ కన్నులు…భూమి యందంతటికి పంపబడిన…యేడు ఆత్మలు.

681 మీరు ఆ ప్రశ్నను గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నాను, మరియు నేను ఇక్కడ ఒక్క నిమిషంలో దాని వద్దకు రాకపోతే, మీరు మరలా వెనుకకు తీసుకురావలెనని నేను కోరుచున్నాను, నేను దానిని పరిశీలించగోరుచున్నాను, “ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను.” ఓ, అది ఒక నిజమగు అందమైన విషయమైయున్నది. (మంచిది, ఇప్పుడు ఈ సహోదరుని ప్రశ్నను మనం చూడగోరుచున్నాము.) అది సరియే, ఇప్పుడు దానిని మర్చిపోకండి.

మరియు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై యుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.

మరియు ఆయన దానిని తీసుకున్నప్పుడు, ఆ నాలుగు జీవులును మరియు ఆ యిరువదినలుగురు పెద్దలును ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి,…వారిలో ప్రతీ ఒక్కరూ వీణలను పట్టుకొని యుండిరి,…

682 ఇప్పుడు, అది ఆ—ఆ నాలుగు—మీరు గమనిస్తే, ఇక్కడ నాలుగు జీవులు కలవు. ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళి మరియు ఇంకొంచెము చదువుదాము:

…సువర్ణ వీణలు,…ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలు,…మరియు పరిశుద్ధుల ప్రార్థనలు.

మరియు వారు ఒక క్రొత్త కీర్తన పాడిరి,…నీవే అర్హుడవు…(మరియు అలాగే కొనసాగి వారి…వారి ఆరాధనంతటినీ ప్రభువుకు చెల్లించారు)

683 ఇప్పుడు, ప్రకటనలోని ఈ నాలుగు జీవులు, వాటిని మీరు గమనించినట్లయితే, ప్రతీ చోటా…(బైబిలు చదువరులైన మీరు, మరియు ఈ టేపు రికార్డింగును వినబోయే ఆ మనుష్యుడు). ఆ నాలుగు జీవులు, వాటికి నాలుగు ముఖములున్నవి: ఒకటి మనుష్యునివంటి ముఖమును కలిగియున్నది, ఇంకొకటి ఎద్దు వంటి ముఖమును కలిగియున్నది, మరియు ఇంకొక ముఖము పక్షిరాజువలె ఉన్నది, మరియు మరొక ముఖము ఒక సంహమువలె ఉన్నది. మరియు అవి ఎన్నడూ వెనుకకు వెళ్ళలేదు, అవి వెనుకకు వెళ్ళలేవు.

684 సంవత్సరాల క్రితం వారికి బోధించబడినప్పుడు నేను ఇక్కడ ఆ ప్రకటన గ్రంథముపై, దాదాపు రెండు సంవత్సరాలు తీసుకున్నప్పటి ఆ ప్రకటన గ్రంథము ఎంత మందికి గుర్తున్నది? చాలా మంది పాత-కాలపు వారికి గుర్తుంటుంది.

685 చూడండి, అవి వెనుకకు వెళ్ళలేవు, ఎందుకనగా అవి వెళ్ళిన ప్రతీ మార్గములో అవి ముందుకే వెళ్ళుచున్నవి. అవి ఈ వైపుకు వెళ్తే, అవి ఒక మనుష్యునివలె పోవుచున్నవి; అవి ఈ వైపుకు వెళ్తే, అవి ఒక సింహమువలె పోవుచున్నవి; ఈ వైపుకు వెళ్తే, అవి ఒక పక్షిరాజువలె వెళ్ళుచున్నవి; అవి ఈ వైపుకు వెళ్తే, అవి ఒక ఎద్దువలె వెళ్ళుచున్నవి. చూడండి, అవి వెనుకకు వెళ్ళలేవు, అవి అన్నివేళలా ముందుకే వెళ్ళుచున్నవి.

686 ఇప్పుడు ఆ నాలుగు జీవులు. ఇప్పుడు దీనిని త్వరగా చూడటానికి, ఎందుకనగా నేను దీనిపై ఎక్కువసేపు ఉండాలనుకోవడం లేదు. అయితే ఆ నాలుగు జీవులు…బైబిలులో, జీవి అనేది, “శక్తిని” సూచిస్తుంది. మరియు ఈ జీవులు పైకి వచ్చుచు ఎక్కడో కొలనులోనో లేదా ఎక్కడో సముద్రములోనో లేవు, కానీ అవి దేవునియొక్క సింహాసనము వద్దనున్నవి, మరియు అవి దేవుని ఆరాధించుచున్నవని మీరు గమనిస్తారు. ఆ నాలుగు జీవులు అంటే భూమి నుండి వచ్చిన నాలుగు శక్తులైయున్నవి, మరియు ఆ నాలుగు శక్తులు నాలుగు సువార్తలైయున్నవి: మత్తయి, మార్కు, లూకా, మరియు యోహాను; ఒకటి మరొక దానిని వ్యతిరేకించదు.

687 మరియు వాటిలో ఒకటి, ఆ…ఆ సువార్త ఒక సింహమువలె వెళ్ళుచుండగా, అది రాజీపడలేదు, అది ధైర్యంగా వెళ్ళినది; సువార్త ఒక సింహమువలె ధైర్యముగా ఉండినది, మరియు అది ఒక సింహమువలె ఒక రాజుయైయున్నది. అది ఒక మనుష్యుని ముఖములాగా ముందుకు వెళ్ళినప్పుడు, అది ఒక మనుష్యునివలె తెలివిగా మరియు వివేకముగా ఉన్నది. అది ఒక పక్షిరాజులాగా వెళ్తే, అది వాడియైన రెక్కలను మరియు ఉన్నత ఎత్తులను కలిగియున్నది. అది…నా భావాన్ని మీరు చూస్తున్నారా? అది ఒక ఎద్దులాగా వెళ్తే, అది ఆ—ఆ—ఆ సువార్త భారమును లాగే ఒక పని గుఱ్ఱము, ఒక పని ఎద్దుయైయున్నది. ఆ నాలుగు జీవులు నాలుగు శక్తులైయున్నవి, అవి: మత్తయి, మార్కు, లూకా, మరియు యోహాను; దేవుని యొక్క సన్నిధిలో మ్రోగుచున్న నాలుగు సువార్తలైయున్నవి. అవి…

688 మీరు గమనించినయెడల, వాటికి ముందు మరియు వెనుక కళ్ళు ఉండినవి. అవి—అవి…అవి వెళ్ళిన ప్రతీచోటా, అవి ప్రతిభింబించినవి. అవి వెళ్ళుచున్న ప్రతీచోటను అవి చూస్తున్నవి. మరియు సువార్తలు బయటకు వెళ్ళుచుండగా అదే వాటి యొక్క శక్తియైయున్నది, అది…అది ఒక మనుష్యుని యొక్క వివేకమును కలిగియున్నది; అది ఒక పక్షిరాజు యొక్క వేగమును కలిగియున్నది; అది ఆ—ఆ—ఆ—ఆ శక్తిని, లాగే శక్తిని కలిగియున్నది, ఒక ఎద్దు వలె భారమును-మోసేదైయున్నది; అది ఒక సింహము యొక్క ఆ—ఆ ధృఢత్వమును మరియు ధైర్యమును కలిగియున్నది. చూడండి, అవి నాలుగు సువార్తలైయున్నవి, ప్రకటన, 4వ అధ్యాయము యొక్క నాలుగు శక్తులైయున్నవి.

అది సరియే, ఇప్పుడు తర్వాతది:

69. ఇరువది నలుగురు పెద్దలు ఎవరు? మంచిది, అది ఆ—ఆ దానిపై ఉంటుందని నేను నమ్ముచున్నాను…ఆ ఇరువది-నలుగురు పెద్దలు ఎవరు?

689 ఇప్పుడు అది చాలా సామాన్యమైనది, మనం దానిని పొందుకోగలము. ఆ ఇరువది-నలుగురు పెద్దలు సింహాసనము ఎదుట కూర్చుండియున్నారు. అది…అది కనుగొనబడేది, 4వ వచనంలో అని నేను నమ్ముచున్నాను. “మరియు మరొకటి బయలువెళ్ళినది…” నేను…మనం చూద్దాము, నేను…4:10.

690 మంచిది, ప్రకటన, 4వ అధ్యాయము, మరియు 10వ వచనం. అది సరియే. మనం దానిని చూద్దాము.

మరియు ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమందు ఆసీనుడైయున్న ఆయన యెదుట సాగిలపడి, మరియు యుగయుగములు జీవించుచున్న వానిని ఆరాధించుచు, మరియు తమ కిరీటములు సింహాసనము యెదుట పడవేసి,

ఓ ప్రభువా, మహిమను మరియు ఘనతను పొందుటకు, అర్హుడవు నీవే: ఏలయనగా నీవు సమస్తమును సృష్టించితివి మరియు నీ చిత్తమునుబట్టియే అవి ఉన్నవి మరియు అందునుబట్టియే సృష్టించబడినవి, అని చెప్పిరి.

691 ఇప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలు. ఒక పెద్ద అనగా ఒక విచారణ కర్త. ఇప్పుడు గమనించండి, వారు పన్నెండుగురు మూలపురుషులు మరియు పన్నెండుగురు అపొస్తలులైయున్నారు. మరియు వారు, పన్నెండుగురు ఒక ప్రక్కన మరియు పన్నెండుగురు మరొక ప్రక్కన కూర్చునియున్నారు. వారే ఆ ఇరువది నలుగురు పెద్దలు, పాత నిబంధన యొక్క పన్నెండుగురు మూలపురుషులు, ఒక ప్రక్క; క్రొత్త నిబంధన యొక్క అపొస్తలులు, మరొక ప్రక్క. “మీరును పన్నెండు సింహాసనములమీద ఆసీనులై, ఇశ్రాయేలు పన్నెండు గోత్రములవారికి తీర్పు తీర్చుదురు,” అని యేసు చెప్పలేదా?

692 ఇప్పుడు, ఆ పునాదులు. చూడండి, అక్కడ ఒక వృక్షము కూడా ఉన్నది. మరియు ఈవలను ఆవలను ఉన్న ఆ వృక్షము పండ్రెండు రకాల ఫలములు కాయును. మరియు అవి నెలకు ఒక్కసారి ఫలమునిస్తాయి, మరి సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్నవి. ప్రతీ సంవత్సరము గడుచుచుండగా అవి ఫలించుచు పండ్రెండు రకాల ఫలములు కాయును. పన్నెండు, “ఆరాధన” సంఖ్యను, మీరు చూడండి. మరియు అక్కడ ఇరవై మరియు నాలుగు, అనగా ఇరువది-నలుగురు ఉన్నారు, పన్నెండుగురు అపొస్తలులు మరియు పన్నెండుగురు మూలపురుషులు. వారు సింహాసనము వద్ద ఆసీనులైయున్నారు.

693 మంచిది, ఇప్పుడు 4వ వచనం, లేదా, నాల్గవ ప్రశ్న:

70. ఆదికాండము 38 లోని ఎర్రని దారము దేనిని సూచిస్తుంది?

694 ఆ ఎర్రని దారము, మీరు గమనించిన యెడల, అది యూదా విషయము. మరియు అతనికి కుమారులు కలరు, మరియు అతని కుమారులలో ఒకడు ఒక కనానీయ స్త్రీని వివాహము చేసుకున్నాడు. మరియు ఈ కనానీయ స్త్రీకి పిల్లలు కలుగలేదు, మరియు అతని కుమారుడు చనిపోయాడు. పిదప, అప్పుడున్న చట్టము ఏమిటనగా…తదుపరి కుమారుడు తన సహోదరుని భార్యను తీసుకొని, మరియు ఆ మృతునికి సంతానాన్ని నిలబెట్టవలెను. మరియు ఆ మరొక వ్యక్తి సహకరించలేదు మరియు తాను చేయుచున్నట్లే చేస్తుండెను, గనుక ప్రభువు అతనిని చంపెను. పిదప అతనికి ఒక యౌవనస్తుడైన కుమారుడు ఉన్నాడు; కావున యూదా ఇట్లన్నాడు, “ఈ కుమారుడు వయస్సుకి వచ్చేవరకు…నీవు అతణ్ణి వివాహము చేసుకొనే స్థాయికి అతడు ఎదిగేవరకు వేచియుండుము.”

695 మరియు అతడు తన ఇద్దరి సహోదరుల యొక్క మాజీ భార్యను వివాహము చేసుకోవలసిన ఒక స్థాయికి ఎదిగినప్పుడు, సరి, అతడు తనకు ముందుగా చనిపోయిన, తన సహోదరులకి సంతానమును నిలబెట్టుటకు…అతడు ఆమెను తీసుకొనవలసియుండెను. యూదా ఆ స్త్రీకి (ఆ కనానీయ స్త్రీకి) తన కుమారుణ్ణి, ఆ అబ్బాయిని ఇవ్వలేదు, మరియు అతణ్ణి అలాగే వెళ్ళనిచ్చెను. కావున ఆమె తప్పుచేస్తున్నట్లు కనుగొన్నది, కావున ఆమె బయటకు వెళ్ళి మరియు తన ముఖముపై ఒక ముసుకు వేసుకొని, మరియు ఒక బహిరంగ ప్రదేశములో ఒక వేశ్య కూర్చొనునట్లు కూర్చున్నది.

696 యూదా వచ్చి మరియు ఆ స్త్రీని తన భార్యగా తీసుకున్నాడు, మరి ఆమె ఒక వేశ్యగానున్నది, మరియు ఆమెతో జీవించాడు. మరియు ఆమె, ఆమె ఇట్లన్నది, “సరి, నీవు నాకు ఏమి ఇచ్చెదవు?” మరియు అతడు…ఆమె అన్నది…

697 అతడు ఇట్లన్నాడు, “నేను అతడికి ఒక—ఒక మేకపిల్లను ఇస్తాను.” ఆమె ఇట్లన్నది, “సరి, నీవు దానిని చేస్తావనుటకు నాకు ఒక సూచనను ఇమ్ము.” కావున ఆమె అతని చేతికర్రను మరియు అతని ముద్రను మరియు మొదలగువాటిని తీసుకొని, వాటిని ఉంచుకున్నది.

698 మరియు వారు ఆ మేకపిల్లను తీసుకువచ్చినప్పుడు, వారు ఆ వేశ్యను కనుగొనలేకపోయారు, ఎందుకనగా ఆమె ఒక వేశ్య కాదు.

699 కొంత కాలానికి, ఆమె తల్లి కాబోవుచున్నదని ఆమె తెలియజేసినది. మరియు ఆమె తల్లి కాబోవుచున్నదని ఆమె తెలియజేసినప్పుడు, వారు వచ్చి యూదాతో ఇట్లు చెప్పారు, “నీ-కోడలు జారత్వము చేసినది.” ఇట్లు చెప్పారు “ఎందుకనగా నీ ఇద్దరు కుమారులు చనిపోయారు, మరి ఆమె—ఆమె తల్లి కాబోవుచున్నది.”

700 అతడు ఇట్లన్నాడు, “సరి, ఆమెను పిలువనంపించి, మరియు ఆమెను కాల్చివేయవలెను.”

701 మరి కావున ఆమె యూదాకి కబురు పంపి, మరియు ఆమె ఇట్లు చెప్పినది, “ఈ చేతికర్ర మరియు ఈ ముద్ర ఎవరివో, ఆ మనిషే దీనిని చేసాడు.” మంచిది, అది ఆమె యొక్క మామ-యే.

702 మరియు అతడు ఇట్లు చెప్పాడు, “ఆమె నాకంటే నీతిమంతురాలు.”

703 ఇప్పుడు, ఆమె పిల్లల్ని ప్రసవించబోతుందని ఆమెకు తెలిసినప్పుడు, వారు కవలలైయున్నారు. మరియు ఆ కవలలలో…మొదటిగా పుట్టనైయున్న బిడ్డ, ఆ పాత యూదా ఆచారము చొప్పున, మొదటిగా బయటకు వచ్చే బిడ్డకు, ఆ మొదటి బిడ్డకు జేష్టత్వపు హక్కు ఉంటుంది. మరియు, గుర్తుంచుకోండి, అతడు ఆమె యొక్క మొదటి బిడ్డయైయున్నాడు. ఆ మిగతా అబ్బాయిలు ఎవ్వరూ ఆమె ద్వారా పిల్లలను కనలేదు. ఈ సమయం వరకూ ఆమెకు ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు.

704 మరియు ఆమె మొదటి బిడ్డ బయటకు వచ్చినప్పుడు, అతని చెయ్యి మాత్రమే బయటకు వచ్చినది. మరియు ఆ మంత్రసాని ఒక ఎర్రనూలు దానికి కట్టినది, ఎందుకనగా ఎర్రని చార విమోచన గూర్చి మాట్లాడుచున్నది అది కన్య మరియ యొక్క మొదటి కుమారుడు…విమోచనయొక్క ఆ ఎర్రని చారను కలిగియుంటాడని చెప్పుచున్నది.

705 మరియు అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు, ఇంకొకడు ముందుగా వచ్చాడు. మరియు అతడు వచ్చినప్పుడు, ఇట్లన్నది, “నీవు దీనిని ఎందుకు చేసావు? ఇంకొకడు జేష్టత్వపు హక్కును పొందుకున్నాడు.”

706 కావున మీరు చూడండి, ఆదికాండము 38 యొక్క అర్థము అదేయైయున్నది. అదేమనగా ఆ మొదటి బిడ్డ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ వరకు వేచియున్నాడు అనునదైయున్నది. ఆ మొదటిది విమోచన చట్టం క్రింద ఉన్నది అనునదైయున్నది.

707 మీకు తెలుసా…ఆ చిన్న గాడిద పిల్ల గురించి, నేను చెప్పింది, మీకు తెలుసు కదా, దాని కండ్లు…మరేదైనా గాని, దాని చెవులు విరిగియున్నాగాని, అది జేష్టత్వపు హక్కుతో జన్మించియుంటే, ఒక నిర్దోషమైన, పరిపూర్ణమైన గొఱ్ఱెపిల్ల, దాని స్థానములో మరణిస్తుంది. అదియే.

708 కావున అది జేష్టత్వపు హక్కు కొరకైయున్నది. తల్లి నుండి బయటకు వచ్చిన ఆ మొదటి బిడ్డ, మరియు వారు ఆ చెయ్యిని చూసారు (మరియు అది తిరిగి మరలా వెనుకకు పోవచ్చని ఎరిగియున్నారు). మరియు అతడు దానిని కలిగియున్నాడని, మరతడే మొదటివాడని చూపించుటకు అతడు తన చెయ్యిని ముందుకు పెట్టినప్పుడు, ఆ మంత్రసాని ఎర్రని దారమును దానికి కట్టినది మరియు అతడు తన చెయ్యిని వెనకకు లాక్కున్నాడు. చూశారా? అయితే, ఖచ్చితంగా, అతడే మొదటివాడు. అది ఆ ఎర్రని చారయైయున్నది, ఆ ఎర్రని చార…బైబిలు గ్రంథమంతటిలో, అది విమోచనని సూచిస్తుంది; అది రానున్న జేష్టకుమారుడి వైపు చూపిస్తుంది.

709 మొదట పుట్టిన గుఱ్ఱము, మొదట పుట్టిన ఆవు, అది ఏమైనప్పటికీ, మొదట పుట్టిన ప్రతీది (బయటకు వచ్చినది) విమోచన క్రింద ఉన్నది, అది విమోచింపబడవలసి యున్నది; ప్రతీది విమోచింపబడవలసియున్నది! హలేలూయా! ఓ, అది నన్ను పులకరింపజేస్తుంది. మీకు అది అర్థమైందా? మొదటిది విమోచించబడవలసి యున్నది. అది ఒక చట్టమైయున్నది. ప్రభువు నామము ఆశీర్వదించబడును గాక!

710 మరియు యేసుక్రీస్తు జన్మించినప్పుడు, ఆయన ప్రపంచమంతటినీ విమోచించాడు. నిశ్చయంగా, ఆయన చేసాడు. భూమి మీద సృష్టించబడిన ప్రతీ జీవికి ఆయన విమోచకుడైయున్నాడు. ఆయనే ఆ విమోచకుడు. మరియు…విమోచన అంతయు ఆయనలోనే ఉన్నది మరియు మీరు మంచి క్రియల ద్వారానో, సంఘములో చేరుట ద్వారానో, లేదా ఇంకే విధంగానో రావడానికి, అసలు ఏ ఇతర మార్గము లేదు; మీరు ఆ ఎర్రని చార ద్వారా, ఆ విమోచకుడి ద్వారా, ఆ బంధువుడగు విమోచకుని ద్వారానే రావలసియున్నది.

అది సరియే, ఇప్పుడు తర్వాతది:

71. ఆ కానుకలు…ప్రకటన 11 లోని ఆ ఇద్దరు సాక్ష్యుల మరణము విషయమై పంపవలసిన కానుకలు ఏమిటి?

ఓ, సహోదరుడా పామర్, నీవు ఇంకేమైనా ప్రశ్నలు అడగవచ్చుకదా!

711 ఇప్పుడు, విమోచన, ఇక్కడ ఈ చారలు, ఈ ఎర్రని చార, దాని అర్థము విమోచన అని మనం చూస్తున్నాము.

712 ఇప్పుడు తదుపరి ప్రశ్న ఏదనగా:

ప్రకటన 11 లోని కానుకలు ఏమిటి?

713 ఒక సమయం వస్తుంది…ఇప్పుడు ఇక్కడ గత రాత్రి జవాబిచ్చిన ప్రశ్నకే జవాబివ్వబోవుచున్నాను, అది నా స్నేహితుడైన ఒక బోధకుడు అది ఎట్లుండునని, యూదుల గురుంచి వ్రాసినదైయున్నది.

714 ఇప్పుడు ఈ యూదులకు మూడు-న్నర సంవత్సరాలు వాగ్దానము చేయబడినవి. అది ఎంతమందికి తెలుసు? డెబ్బది వారములు వాగ్దానము చేయబడినవి. ఇట్లు చెప్పబడినది, “మెస్సీయ వచ్చి మరియు మధ్యలోనే తీసివేయబడతాడు.” క్రీస్తు మూడు-న్నర సంవత్సరాలు బోధించాడు, సరిగ్గా మూడు-న్నర సంవత్సరాలకు చంపబడ్డాడు, మూడు సంవత్సరాల ఆరు నెలలు ఆయన బోధించాడు.

715 మరియు పిదప నాశనకరమైన హేయ వస్తువు, ఆ—ఆ ఒమారు మసీదు పరిశుద్ధ నేలపై పెట్టబడినది; అది జరగడానికి ఇరువై-ఐదు వందల సంవత్సరాలకు ముందే, అది అక్కడ ఉంటుందని, దేవుడు చెప్పినట్లే జరిగినది. ప్రవక్త దానిని చూసాడు, మరియు దానిని చూసి, ఇట్లన్నాడు, “వారు…అన్యుల కాలము సంపూర్ణమగువరకు అది అన్యుల స్వాధీనంలో ఉంటుంది.”

716 ఇప్పుడు ఇంకా వాగ్దానము చేయబడిన మూడు-న్నర సంవత్సరాలు ఉన్నవి. మీరు గమనించినయెడల, ప్రకటన 11 లోని ఈ సాక్ష్యులు వెయ్యిన్ని రెండు వందల, అరువది దినములు ప్రవచిస్తారు; ఖచ్చితంగా మూడున్నర సంవత్సరాలు. ఇప్పుడు…మరియు వారు గోనెపట్టలో ఉండియున్నారు. ఇప్పుడు, వారి పరిచర్యను, వారేమైయున్నారన్నదానిని గమనించండి. ఇప్పుడు, ఈ ఇద్దరు సాక్షులు చంపబడ్డారు.

717 ఇప్పుడు, ఆ…అన్య సంఘము ఎత్తబడిన తరువాత వారు యూదుల వద్దకు తిరిగివెళ్ళారు. అన్య సంఘము పెండ్లి విందుకొరకు గృహమునకు వెళ్తుంది, మరియు రిబ్కా ఇస్సాకుతో అబ్రాహాము యొక్క స్థలమునకు తీసుకొనిపోబడి మరియు అక్కడ వివాహము జరిగినట్లుగా అది ఉంటుంది. మరియు రిబ్కా మరియు ఇస్సాకు అబ్రాహాము కలిగియున్న ప్రతీదానిని పూర్తిగా పొందుకొని బయటకు వచ్చారు, అదంతయు ఇస్సాకుకు వెళ్ళినది. ఖచ్చితంగా! మరియు మొదట ఇస్సాకుకి వివాహము జరిగితేనే గాని అది ఇస్సాకుకి రాలేకపోయింది. ఓ హల్లేలూయా! విషయం అదే.

718 మరియు క్రీస్తు…దేవుడు ఆ పరిపూర్ణమైన, కుళ్ళిపోని శరీరంలో పూర్తిగా ఎప్పటికీ మరియు శాశ్వతంగా నివసిస్తాడు. గొఱ్ఱెపిల్ల మరియు వధువుకు పరలోకములో వివాహము జరిగినప్పుడు, ఆమె పూర్తిగా స్వాస్థ్యముతో బయటకు నడుచుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా! ఇస్సాకు మరియు రిబ్కా పూర్తి స్వాస్థ్యముతో వచ్చారు.

719 మరియు వధువు యొక్క ఈ వేడుక, పరలోకములో జరుగుచుండగా, మహిమలో యువరాజుతో (దేవుని కుమారుడితో), అన్య వధువుకి వివాహము జరుగుచున్నప్పుడు; వారికి వివాహము జరుగుచుండగా, అప్పుడు సంభవించవలసిన మూడు-న్నర సంవత్సరాలు జరుగును…మోషే మరియు ఏలీయా…

720 అది, మోషే ఎన్నడూ అదృశ్యమైపోలేదు…లేదు, అతని శరీరము తీసుకొనిపోబడినది. దూతలు అతణ్ణి తీసుకుపోయారు, అతడు పాడైపోలేదు, అతడు కుళ్ళుపట్టలేదు. అతడు క్రీస్తుకు ఒక పరిపూర్ణమైన మాదిరియైయున్నాడు. అతడు చనిపోయాడు మరియు దూతలు అతడిని తీసుకొనిపోయారు, మరియు కనీసం అతడు ఎక్కడ పాతిపెట్టబడ్డాడన్నది కూడా దయ్యానికి తెలియదు, మరియు అతని సమాధి విషయమై మిఖాయేలుతో వివాదము చేయడానికి ప్రయత్నించాడు. బైబిలు అట్లు చెప్పినది. ఎత్తబడుటలో దేవుడు అతణ్ణి తీసుకున్నాడు.

721 మరియు ఏలీయా, అతడు అక్కడ నడుస్తున్నప్పుడు, ఒక దేవుని ప్రవక్తయైయుండి, యోర్దానుకు నడుచుకుంటూ వెళ్ళాడు, అతని దుప్పటిని తీసి మరియు ఆ నీటిని కొట్టాడు, మరియు అది కుడికి మరియు ఎడమకి పాయలు అయినది. అతడు ఆ పర్వతమునకు నడిచి వెళ్ళాడు. ఎలీషా ఇట్లు చెప్పెను…ఇట్లన్నాడు, “నీవు నన్ను ఎందుకొరకు వెంబడిస్తున్నావు?”

722 అతడు ఇట్లు చెప్పాడు, “నీవు కలిగియున్న ఆత్మలో నాకు రెండుపాళ్ళు కావలెను.”

723 ఇట్లన్నాడు, “నీవు కష్టతరమైనది అడిగావు, అయితే నేను పోవునప్పుడు నీవు నన్ను చూసినట్లైతే అది జరుగుతుంది.” అతడు ఆయనపై తన దృష్టిని నిలిపాడు.

724 మరియు కొంతసేపైన తర్వాత, ఆకాశమునుండి ఒక అగ్నిరధము మరియు అగ్నిదూతలు, అగ్ని గుఱ్ఱములు వచ్చినవి, మరియు ఏలీయా దానిని ఎక్కి, మరియు మహిమలోనికి వెళ్ళిపోయాడు. అతడు ఎన్నడూ మరణమును రుచి చూడలేదు, అతడు రూపాంతరము చెందాడు, అతడు మరణించవలసియున్నది!

725 మరియు మీరు ప్రకటన 11లోని ఈ ఇద్దరు ప్రవక్తలను గమనించినయెడల, వారు సరిగ్గా మోషే మరియు ఏలీయా చేసిన అదే కార్యమును చేస్తారు. మీరు ఇట్లనవచ్చు, “సహోదరుడా బ్రెన్హామ్, ఏలీయా మరియు మోషేలు ఇంకా సజీవులుగా ఉన్నారని నీవు నాకు చెప్పాలనుకుంటున్నావా?” ఖచ్చితంగా!

726 అంతెందుకు, రూపాంతర పర్వతము కంటే ముందు…రూపాంతర పర్వతము వద్ద, యేసు కల్వరికి వెళ్ళడానికి ముందు, మోషే మరియు ఏలీయా ఇరువురు ఆయనతో మాటలాడుచు అక్కడ నిలబడ్డారు. నిశ్చయంగా, వారు అలా చేసారు, వారు మరణించలేదు. మరియు వారెన్నడూ మరణించలేదు; అయితే వారు మర్త్యులు, వారు మరణించవలసియున్నది. కావున వారు కేవలం ఆ సమయం కొరకు వేచిచూస్తూ ఒక మహిమకరమైన స్థితిలో ఉండియున్నారు.

727 మరియు పిదప వారు తిరిగి వచ్చినప్పుడు మరియు పరిశుద్ధాత్మ బాప్తీస్మము యొక్క అభిషేకముతో ఖచ్చితంగా మూడు-న్నర సంవత్సరాలు ప్రసంగిస్తారు, అది అన్యజనుల నుండి ఆశీర్వాదాలు తీసివేయబడి (మరియు సంఘము పైకి కొనిపోబడినప్పుడై యున్నది); మరియు చల్లబడిన నామకార్ధ సంఘము, కమ్యూనిస్టు మరియు రోమా దళము చేత, కుక్కలవలె వేటాడబడతారు, మరియు వారు వేటాడబడి చంపబడతారు. వారు—వారు అప్పుడు చంపబడతారు; ఈ ప్రవక్తలు మూడు-న్నర సంవత్సరాలు బోధిస్తారు, మరియు వారు ఆ గొప్ప…ఆత్మ సంబంధముగా సొదొమ మరియు ఐగుప్తు అని పిలువబడిన ఆ వీధిలో, చంపబడ్డారని, బైబిలు చెప్పినది, అక్కడే మన ప్రభువు సిలువవేయబడినాడు. అది ఆ వెనుక యెరూషలేములోయైయున్నది; చూడండి, యెరూషలేములో, ఆత్మీయంగా చెప్పబడినది.

728 మరియు వారు వీధిలో మూడు పగళ్ళు మరియు రాత్రులు పడియున్నారు. మరియు పిదప మూడు-న్నర రోజుల చివరలో, జీవాత్మ వారిలోనికి రాగా వారు లేచారు. వారు ఇతర మర్త్యులవలె మరణించవలసియున్నది, వారు అట్లు చేయవలసియున్నది. మరియు వారు ఈ ఇద్దరు ప్రవక్తలను చంపినప్పుడు…

729 వారు తప్పుకు వ్యతిరేకముగా బోధించారు, మరియు వారు ఆకాశమునుండి అగ్నిని కురిపించారు. దానిని ఎవరు చేశారు? చూశారా? వారు కోరిన ఏ సమయములోనైనా…వారు ఆకాశమునుండి తెగుళ్ళను కుమ్మరించి, మరియు భూమిని కొట్టారు. మరియు వారు ఆకాశమునుండి అగ్నిని కురిపించారు. మరియు వారికి కావలసినంత కాలము, వర్షింపకుండునట్లు ఆకాశమును మూసివేసారు. అది ఎవరు? ఖచ్చితంగా మోషే మరియు ఏలీయానే. మరియు వారే ఆ ఇద్దరు సాక్ష్యులు.

730 మరియు వారు సంఘమును, లేదా లోకమును, వారి బోధన ద్వారా బాధించినప్పుడు; మరియు తిరిగి యూదులను స్వీకరించుచు, మరియు వారిని తిరిగి పశ్చాత్తాపమునకు తీసుకువచ్చుచు, నమ్ముట కొరకు వారిని తిరిగి తీసుకువచ్చుచున్నప్పుడు…యేసు వధువు కొరకు వచ్చుటను వారు చూసినప్పుడు, వారు ఇట్లంటారు, “ఇదిగో, మనము వేచియున్న దేవుడు ఈయనే. అది ఆయనే!” అయితే ఆయన వారి కొరకు రావడంలేదు; ఆయన తన వధువు కొరకు వచ్చుచున్నాడు. మరియు ఆయన యొక్క వధువు…

731 యోసేపు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, అతడు తన సహోదరులను తనతోపాటు తీసుకొనివెళ్ళలేదు, అయితే అతడు తన వధువును అక్కడ పొందుకున్నాడు. ఖచ్చితంగా! అయితే అతడు తననుతాను తన సహోదరులకు తెలియజేసుకున్నప్పుడు, అక్కడ ఎవ్వరునూ లేరు. అది ఖచ్చితంగా సరియే. మరియు ఆయన తననుతాను ఈ యూదులకు తెలియజేసుకునేటప్పుడు, అక్కడ ఆ యూదులు తప్ప మరెవ్వరునూ ఉండరు. యోసేపును చంపినది వారే, అక్కడ నిలబడియున్నారు; మరియు, “మంచిది, నేను, మీ సహోదరుడనైన యోసేపును,” అని అతడన్నాడు. మరియు అతడు ఏడ్చాడు.

732 మరియు వారు ఇట్లన్నారు, “మనము అతణ్ణి చంపాము గనుక, ఇప్పుడు మనకు మూడిందని మనము ఎరిగియున్నాము.”

733 అదే విషయము, సరిగ్గా ఇప్పుడు రాకడకు ముందు ఆ యూదులు ఆ గొప్ప శ్రమ సమయమును, వారిని తిరిగి స్వదేశానికి నడిపించే ఆ హింసా సమయమును కలిగియుంటారు. అది ఒక గొఱ్ఱెల మంద వలె వారిని తిరిగి కర్మెలు పర్వతము వద్దకు తరుముచున్నది.

734 ప్రభువైన యేసు తన వధువు కొరకు వచ్చునప్పుడు, మరియు వారు ఆయనను చూసినప్పుడు, వారు ఇట్లంటారు, “మనము కనిపెట్టుకొనియున్నది ఆయన కొరకే, ఇదిగో ఆయన ఇక్కడున్నాడు!” తన రెక్కలయందు స్వస్థతతో ఆయన ఉదయిస్తాడు. అది వాస్తవము.

735 మరియు సంఘము, యూదులలోని శేషము, వారు చివరికి ఈ ఇద్దరు ప్రవక్తలను చంపినప్పుడు, ఎక్కడైతే మన ప్రభువు సిలువవేయబడినాడో, ఆత్మసంబంధముగా సొదొమ మరియు ఐగుప్తు అని పిలువబడినట్టి ఆ వీధిలో వారు పడియున్నప్పుడు, వారు ఒకరికొకరు బహుమతులు పంపించుకుంటారు (లోకము అట్లు చేస్తుంది).

736 ఇప్పుడు, సహోదరుడా పామర్, ఇదిగో విషయము ఇదే. రోమా చరిత్రలోనికి చూడండి మరియు ఒక యుద్ధము తర్వాత బహుమతులు పంపించుకునే దేశము ప్రపంచమంతటిలో ఒకే ఒక్కటి ఉన్నదని మీరు కనుగొంటారు, అది రోమా సామ్రాజ్యమైయున్నది.

737 ఆ కారణము చేతనే క్రీస్తు విరోధి రోము నుండి వస్తాడని నేను చెప్తాను. ఆ మృగము రోము నుండి వస్తుంది, అది మాస్కో నుండి రాజాలదు. అది రోము నుండి వస్తుంది, ఆమె యొక్క శిశువు పుట్టిన వెంటనే అతడిని మింగివేయుటకు ఆ స్త్రీ వద్ద నిలుచున్న ఆ ఎర్రని ఘటసర్పమైయున్నది. ఆ దయ్యము, ఆ దయ్యము ఎక్కడ ఉండియున్నది? అది ఎవరు? రెండు సంవత్సరాల లోపు వయస్సు గలవారిని చంపుటకు పంపించి మరియు వారిని చంపించిన కైసరు అగస్టస్ అయ్యున్నాడు. ఆ ఎర్రని ఘటసర్పము, ఆ ఘటసర్పము, మృగము అనగా “అధికారము.” ఆ రోమా అధికారము హింసించి మరియు ఆ శిశువైయున్న క్రీస్తును కనుగొనుటకు ప్రయత్నించినది.

738 మరియు సరిగ్గా అదే కార్యము! ఆ రోమనులు, ఆ పాత అన్య రోమనులు ఒక గొప్ప విజయమును పొందినప్పుడల్లా, వారు ఒకరికొకరు తెల్లని రాళ్ళను మరియు వాటన్నిటిని, ఆ విధంగా బహుమతుల వలె, జ్ఞాపకార్థాలుగా పంపించుకుంటారు. కావున ఆ రాళ్ళు…అవి ఏమిటంటే, రోమా సంఘము మధ్యన పంపించుకోబడిన చిన్న బహుమతులైయున్నవి. ఖచ్చితంగా! సరిగ్గా అంతే. అది అట్లుండవలసియున్నది.

739 నేను సరిగ్గా ఆ వ్యాటికను పట్టణములో నిలిచి మరియు దానిని బైబిలు గ్రంథముతో సరిచూసాను. పోపు ఆ ముక్కోణపు కిరీటమును ధరించుట, వకారివ్స్ ఫిలి డీయై, నేను వినిన ఆ సంగతులన్నియు మరియు అటువంటివన్నియు, అవి ఖచ్చితంగా సత్యమైయున్నవి; ఆకాశము క్రిందనున్న ప్రతి దేశమును నియంత్రించే ఒక మతపరమైన గుంపు, మరియు అది అట్లు చేస్తూనేయున్నది. అదిగో అది ఉన్నది, అది ఆ విధంగానే ఉన్నది.

740 క్యాథలిక్ ప్రజలకు వ్యతిరేకంగా చెప్పడం కాదు (లేదు, అయ్యా), వారు కూడా మిగతావారి వలెనే మంచివారైయున్నారు, కానీ బైబిలు ప్రకారంగా వారి మతము తప్పైయున్నది. బైబిలు సరియైన యెడల, వారు తప్పైయున్నారు. వారు ఇలా చెప్తారు…“బైబిలు ఏమి చెప్తుందో దానితో పని లేదు, సంఘము చెప్పేదే ముఖ్యం.” బైబిలు సర్వాధికారముతో మాట్లాడుతుందని మనము నమ్ముతాము! ఖచ్చితంగా, అది దేవుని వాక్యమైయున్నది.

741 కావున మీరు అక్కడ చూడండి, ఇక్కడ ప్రకటనలో, అప్పుడు పంపబడిన రాళ్ళు, అవి—అవి ఒకరికొకరు బహుమతులుగా పంపించుకొనిన రాళ్ళైయున్నవి. అది దేనిని చూపిస్తుందంటే…బైబిలు ఇట్లు చెప్పినది, ఇక్కడ ప్రకటనలో, ఇట్లు చెప్పబడినది, “బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. బుద్ధిగలవాడు ఫలానా-మరియు-ఫలానా విషయమును చేయును గాక. నిర్దిష్టమైన వరముల యొక్క ఆత్మగలవాడు ఫలానా-మరియు-ఫలానా దానిని చేయును గాక.” సంఘము ఎంత కొదువతో ఉన్నదో మీరు చూస్తున్నారా?

742 ఆత్మసంబంధమైన వరములను గూర్చి, భాషలలో మాట్లాడుటను గూర్చి ఒక యౌవనస్థుడు ఈ ఉదయము నన్ను అడిగాడు. ఒక యౌవనస్థుడు, ఎంతో యధార్థపరుడు, ఈ దినములలో ఏదో ఒక రోజు అతడు ఒక సేవకుడు కానున్నాడని నేను నమ్ముచున్నాను. మరియు సంఘము గురించి, నేను ఇట్లు చెప్పాను, “దానిలో శరీర సంబంధమైనది చాలా ఉన్నది. మనకు అది వద్దు, అయితే మనకు అసలైనది కావలెను. మనము దానిని కలిగియుండుటకు తృష్ణగొనుచున్నాము.”

743 మీరు దానిని సంఘములో బోధించలేరు; మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా, ఒకరు ఒక భాషను కలిగియుండుటను, ఒకరు ఒక కీర్తనను కలిగియుండుటను, మీరు కనుగొంటారు, పిదప మీరు నిర్ధారణ కోసం దానితో ఇబ్బంది పడవలసియుంటుంది. అయితే దేవుడు సర్వాధికారంతో ఒక వరమును ఇచ్చినప్పుడు, అది దానికదే కార్యరూపణ దాల్చుకుంటుంది. అది నిజము. చూడండి, అవి దేవుని యొక్క వరములు, జయించడానికి ఆయన సంఘమునకు వాటినే పంపుతాడు.

744 ఇప్పుడు, క్రీస్తు విరోధి అనుకూల ప్రతికూలత వంటిదానిని కలిగియుంటాడు, దానిని చేయుటకు ఆ—ఆ—ఒక వంకర విధానమును అది కలిగియుంటుంది. మరియు అది ఒకరికొకరు బహుమతులను, భౌతికమైన బహుమతులను పంపించుకునే రోమా సామ్రాజ్యమైయున్నది. దేవుడు జయించువారికి ఆత్మసంబంధమైన వరములను పంపుతాడు; రోమీయులు ఒకరికొకరు భౌతికమైన బహుమతులను పంపించుకుంటారు.

745 పరిశుద్ధాత్మ ఒక ఆత్మ అని మనము నమ్ముతాము, పైనుండి వచ్చు ఒక బాప్తిస్మము ద్వారా మనము దానిని పొందుకుంటాము.

746 క్యాథలిక్ సంఘము ఈ విధంగా బోధిస్తుంది, “క్రీస్తు యొక్క శరీరమైయున్న ఒక పవిత్ర భోజనము; మీరు ఈ అప్పమును మరియు కోషేరును తీసుకున్నప్పుడు, అదియే పరిశుద్ధాత్మ, ఆ పవిత్ర భోజనమే, ఆ పరిశుద్ధాత్మ.” చూశారా?

747 అది ఒక రొట్టె ముక్క అని మనము నమ్ముతాము, అది క్రీస్తు యొక్క శరీరమని మనము నమ్మము, (కొద్ది నిమిషాలలో మనము దానిని తీసుకొనబోవుచున్నాము). అది క్రీస్తు యొక్క శరీరమును సూచిస్తుందని మనము నమ్ముతాము. కాని అది…

748 క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంటువారి యొక్క సిద్ధాంతము మధ్య తేడా అదే. చూశారా? క్యాథలిక్ సంఘము ఇట్లు చెప్తుంది, “శరీరము…ఆ రొట్టె అక్షరాలా శరీరమైయున్నది. దీనిని రూపాంతరపరచడానికి సంఘముకు శక్తి ఉన్నది.” ఒక క్యాథలిక్కువాడు ఒక సంఘమును దాటి వెళ్ళుచున్నప్పుడు, తన తలను దించుకొని, సిలువ గురుతులు వేసుకొనుటను మీరు ఎప్పుడైనా చూశారా? మరియు సంఘములో ఆ చిన్న గుడారము క్రింద ఆ చిన్న వెలుగు వెలుగుచూ ఉండుటవలనైయున్నది. అక్కడ ఒక చిన్న వెలుగును అది కలిగియున్నది, మరియు ఆ కోషేరు రొట్టె అక్కడ ఉంటుంది. “మరియు అది క్రీస్తు యొక్క శరీరము. మరియు మీ యొక్క మొట్టమొదటి ప్రభురాత్రి భోజనములో, మరియు మీ ఒప్పుకోలు మరియు అటువంటివాటితో మీరు దానిని తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అక్షరాల క్రీస్తు యొక్క శరీరమును తీసుకొనుచున్నారు. మీరు, అక్షరాలా, క్రీస్తు యొక్క శరీరమును తీసుకొనుచున్నారు.”

749 అది క్రీస్తు యొక్క శరీరమును సూచిస్తుందని మనము చెప్తాము, చూడండి, అది ఒక రొట్టె ముక్క తప్ప మరేమియు కాదని చెప్తాము. మరియు ఒకవేళ అది రొట్టె కాకపోయినా, అది ఇంకేమైనా గాని, అది అదే విషయమును సూచించుటకైయున్నది. ఖచ్చితంగా—ఖచ్చితంగా అంతే. వారు…

750 “నేను ఒక తొట్టిలో బాప్తీస్మము పొందను, నేను ఒక నదిలో బాప్తీస్మము పొందగోరుచున్నాను,” అని చెప్పే ఈ ప్రజల వలెనేయున్నది.

751 మీరు బాప్తీస్మము పొందుచున్నంతవరకు, అది ఏమి వ్యత్యాసమును కలిగిస్తుంది? అది ఒక తొట్టిలోనైనా, మరియు…అంతెందుకు, ఫిలిప్పు ఒక తొట్టిలో బాప్తీస్మము పొందాడు…నపుంసకుడు బాప్తీస్మము పొందినప్పుడైయున్నది. ఫిలిప్పు ఆ నపుంసకుడికి తొట్టిలో బాప్తీస్మము ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఫిలిప్పును కొనిపోయాడు, రెండువందల మైళ్ళు వరకు అతడు కనబడనంతగా ఆయన అతణ్ణి తీసుకొనిపోయాడు. ఆత్మలో అతణ్ణి కొనిపోయాడు, రెండువందల మైళ్ళ వరకు నేరుగా పరలోకమునుండి అతనికి ఒక—ఒక రధమును ఇచ్చాడు. ఆమేన్. అద్భుతం!

ఇప్పుడు:

వెయ్యి-ఏండ్ల-పాలన తర్వాత పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? మరియు వారు ఎటువంటి శరీరాన్ని కలిగియుంటారు? ఒక్క నిమిషములో నేను దాని వద్దకు తిరిగి వస్తాను. [బ్రెన్హామ్ సహోదరుడు ఈ ప్రశ్నకు 820 పేరా వద్ద, 74 ప్రశ్నగా జావబునిస్తారు—సంపా.] వారు యేసుతో ఉంటారు.

752 సరి, ఆ—ఆ ఏడవ ప్రశ్న:

72. మనము దూతలకు ఎలా తీర్పు తీర్చుతాము?

753 అది ఎక్కడ కనుగొనబడుతుందంటే…మనము దూతలకు ఎలా తీర్పు తీర్చుతాము? దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా ఉండుటద్వారాయైయున్నది. దూతలు సేవకులైయున్నారు; మనము దేవుని కుమారులు మరియు కుమార్తెలమైయున్నాము. మరియు మనము దూతలకు తీర్పు తీరుస్తామని బైబిలు చెప్పినది. అది వాస్తవము. ఇప్పుడు, ఇప్పుడు మీరు గనుక…

8వ ప్రశ్న:

73. మొదటి కొరింథీలో దేవదూతలనుబట్టి తలవెంట్రుకలు ఎందుకు?

754 ఇప్పుడు ఎవరైనా నా కొరకు మొదటి కొరింథీ, ఆ—ఆ 11వ అధ్యాయమును తీయండి, మరియు మనము అక్కడ చూస్తాము, మీరు అక్కడ కనుగొంటారు అది—అది…మొదటి కొరింథీలో, ఆ—ఆ 11వది, పౌలు మాట్లాడుచున్నాడని మనము కనుగొంటాము. ఒక్క నిమిషము నన్ను దానిని తీయనివ్వండి, మరియు పిదప మనము దానిని త్వరగా చదువుదాము మరియు అప్పుడు అది మనకు—మనకు అర్థమవుతుంది.

755 ఇక్కడ ఈ వేరొక వచనముపై చెప్పడానికి నేను ఒకటి కలిగియున్నాను, మనము పొందుకోవలసిన విధంగా దేవుడు దానిని మనకు ఇస్తాడని నేను ఆశపడుచున్నాను. ఎవరైనా దానిని కనుగొనిన యెడల…అది 11వ అధ్యాయమని నేను అనుకొనుచున్నాను, అవును, మంచిది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు అర్థమగునట్లు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను దీనిని చదివి, మీరు చూడండి, మరియు దీనిపై మాట్లాడేంతవరకు మీ యొక్క మనఃసాక్షినంతటినీ తీసుకొని మరియు దానిని మీ కోటు యొక్క జేబులో పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా వినండి, ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది:

నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, మీరును…నన్ను పోలి నడుచుకొనుడి. (పౌలు ఇలా చెప్పాడు, “నేను క్రీస్తును వెంబడించుచున్నట్లే, మీరును నన్ను వెంబడించండి.”)

ఇప్పుడు, సహోదరులారా, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను, గైకొనుచున్నందున…నేను మిమ్మును మెచ్చుకొనుచున్నాను.

అయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, మరియు; స్త్రీకి శిరస్సు పురుషుడనియు; క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని నేను కోరుచున్నాను.

756 అది ఎలా ఉందో చూశారా? దేవుడు, క్రీస్తు, పురుషుడు, స్త్రీ. ఇప్పుడు:

ఏ పురుషుడు తలమీద ముసుకు వేసికొని, ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, అతడు క్రీస్తును అవమానపరుస్తాడు.

కాని ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థన చేస్తుందో లేక ప్రవచిస్తుందో ఆమె తన తలను అవమానపరుస్తుంది:…

757 ఇప్పుడు మేము ఒక్క నిమిషమును తీసుకొని, మరియు వెంట్రుకలే స్త్రీకి తన ముసుకు అని మీకు చూపిస్తాము:

…ఏలయనగా…అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉన్నది. (దాని అర్థం ఏమిటనగా ఒకవేళ—ఆమె తన జుట్టును కత్తిరించుకోబోవుచున్న యెడల, అప్పుడు బోడగుండు చేసేయండి.)

ఏలయనగా స్త్రీకి ముసుకు లేనియెడల, ఆమె క్షౌరము చేయబడవలెను: (క్షౌరము అనగా బోడగుండు చేయబడుట, చూడండి)…అయితే క్షౌరము లేదా బోడగుండు చేయించుకొనుట స్త్రీకి అవమానమైతే, ఆమె ముసుకు వేసికొనవలెను.

758 ఇప్పుడు మనము సరిగ్గా మీరు ఇక్కడ అడుగుచున్న ప్రశ్న వద్దకే వచ్చుచున్నాము. చూశారా? మంచిది, ఇప్పుడు బైబిలు ప్రకారంగా, ఒక—ఒక స్త్రీ తన జుట్టు కత్తిరించుకొనుట తప్పైయున్నది. ఇప్పుడు మీరు సరిగ్గా దీనిని విని మరియు ఒక పురుషుని యొక్క భార్య తన జుట్టును కత్తిరించుకున్న యెడల ఆమెను విడిచిపెట్టుటకు బైబిలు అతనికి ఒక చట్టపరమైన హక్కును ఇస్తుందో లేదో చూడండి, ఇది సరియో కాదో చూడండి.

ఒకవేళ ఒక పురుషుడు…ఒక పురుషుడు వాస్తవంగానే తన తలకు ముసుకు వేసుకోకూడదు (అదేమనగా, పొడవాటి జుట్టును కలిగియుండకూడదు), ఏలయనగా అతడు దేవుని యొక్క పోలికలో మరియు మహిమలోయున్నాడు: అయితే స్త్రీ పురుషుని యొక్క మహిమలోయున్నది. (మీరు ఎన్నడైనా దాని గురించి ఆలోచించారా?)

759 ఇప్పుడు నేను ఇక్కడ ఆపగోరుచున్నాను, ఎందుకనగా ఇది బాగుగా ఇంకిపోవాలని నేను కోరుచున్నాను, చూడండి. మరియు ఇప్పుడు గుర్తుంచుకోండి, నేను పదివేల కొలది ప్రియమైన స్త్రీలను చూశాను (వారిని సరిగ్గా ఇప్పుడు ఎరిగియున్నాను, మరియు వారిలో చాలా మంది ఈ సంఘములో కూర్చొనియున్నారు) క్రైస్తవులైయ్యుండి, పొట్టి జుట్టును కలిగియున్నవారు ఉన్నారు. మరియు నేను మిమ్మల్ని అనడంలేదు, అది మీకు బోధించబడిన విధానమైయున్నది. చూశారా? అంతే. మీ బోధకుడు ఎన్నడూ దీనిని మీకు చెప్పలేదు. అయితే ఈ ఆలయమువారు ఎవరైనా అలా ఉంటే, అప్పుడు వారు దోషులైయున్నారు. చూడండి, ఎందుకంటే మేము నిశ్చయంగా దాని గురించి వారికి చెప్తాము.

760 ఇప్పుడు, ఇప్పుడు దీనిని గమనించండి:

…ఒక పురుషుడు…ఏలయనగా…(7వ వచనము)…ఏలయనగా ఒక పురుషుడు…

761 ఇప్పుడు, ఇక్కడ ఎవరు మాట్లాడుచున్నారు? ఇప్పుడు, ఒకసారి ఒక స్త్రీ ఇట్లన్నది, “ఓ, పౌలు ఒక స్త్రీ-ద్వేశకుడైయున్నాడు.”

762 సరి, ఇప్పుడు మనము దాని వద్ద ఉండగనే, ఇక్కడ గలతీ 1:8 కి త్రిప్పుదాము, మరియు గలతీ 1:8 లో, చూడండి, పౌలు దీని గురించి ఏమి చెప్పుచున్నాడో చూద్దాము. ఇక్కడ గలతీ 1:8 లో పౌలు ఇట్లు చెప్పుటను మీరు కనుగొంటారు:

…మీరు ఇదివరకే విన్న దీనినిగాక, మరియొక సువార్తను మేమైనను, లేక పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవునుగాక.

763 ఇప్పుడు నన్ను నిందించకండి, మీరు అతణ్ణి నిందించండి, చూడండి.

ఏలయనగా పురుషుడు వాస్తవంగానే తన తలకు ముసుకు వేసుకోకూడదు, ఏలయనగా అతడు దేవుని యొక్క మహిమలో మరియు పోలికలో ఉన్నాడు: అయితే స్త్రీ పురుషుని యొక్క మహిమలో మరియు పోలికలో ఉన్నది.

764 ఇప్పుడు ఆ తరువాత వచనమును గమనించండి:

ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెనే గాని; పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు.

ఒక స్త్రీ పురుషుని కొరకే గాని; ఒక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు.

765 ఇప్పుడు, నేను ఇప్పుడు దీనిని నిజమైన ప్రేమ మరియు మాధూర్యముతో చెప్పుచున్నాను, మరియు నేను దీనిని చెప్పిన విధంగానే మీరు దీనిని అర్థము చేసుకుంటారని నేను ఆశపడుచున్నాను. అయితే అమెరికా…ఒక అంతర్జాతీయ ప్రయాణికుడిగా చెప్తున్నాను, ప్రపంచములోని ఏ దేశాములోకల్లా అమెరికానే దాని స్త్రీల కొరకు అత్యంత-నీచమైన, దిగజారిన నియమాలను కలిగియున్నది. అమెరికా వారు తమ స్త్రీలకు అనుమతించే విధానాలను ప్యారిస్, ఫ్రాన్స్ కూడా అందుకో-లేకున్నవి. అది సిగ్గుచేటు!

766 అమెరికా యొక్క దేవుడు స్త్రీ అని మీరు గ్రహించారా? ఈ బైబిలు ద్వారా నేను దానిని మీకు ఋజువు చేయగలను. అది వాస్తవము. కన్యక మరియ అను వారి సిద్ధాంతమును క్యాథలిక్ సంఘము తీసుకురాగలుగునట్లు అది ఆ విధంగా మారవలసియున్నదని మీరు గ్రహించుచున్నారా?

767 ఇప్పుడు, ఒక స్త్రీ పురుషుని కొరకు చేయబడనియెడల, కాదు…ఒక పురుషుడు స్త్రీ కొరకు కాదు గానీ, ఒక స్త్రీ పురుషుని కొరకు చేయబడినయెడల, అప్పుడు మీరు ఒక స్త్రీని ఎలా ఆరాధిస్తారు? చూశారా? ఇప్పుడు, దానిని చేసింది ఏమిటంటే, అది ప్యారిస్ లో ప్రారంభమై మరియు హాలీవుడ్ లో అడుగుపెట్టినది. ఇప్పుడు ప్యారిస్ వాళ్ళు తమ కొరకు మోడలింగ్ అమ్మాయిలను మరియు వారి ఫ్యాషన్లను మరియు అట్టివాటిని పొందుకొనుటకు హాలివుడ్ కు రావాల్సివస్తుంది, అది మన అమెరికా స్త్రీలు దిగజారుటయైయున్నది.

768 అదేమిటి? మన దేశం ఎంత అధమ స్థాయికి వచ్చిందంటే వారు పురుషుల యొద్ద నుండి ఉద్యోగాలు కూడా తీసేశారు, మరియు ఇక్కడ ఈ స్థానాలలో స్త్రీలను పెట్టారు, వారిలో, దాదాపు తొంభై శాతం మంది, వేశ్యలైయున్నారు. మరియు పురుషులు కనబడకపోవుటను గూర్చి మాట్లాడితే, నిశ్చయంగా, అది ఎందుకంటే అక్కడ వీరి ఉద్యోగాల్లో వారు స్త్రీలను పెట్టారు. మరియు వారు ఎంతగా దిగజారి-పోయారంటే వారు వీధుల్లో స్త్రీలను శాంతి అధికారులుగా నియమించారు. అది ఏ దేశముకైనా ఒక అవమానమైయున్నది. అవును, అయ్యా. దాని విషయమై నీవేమి చేయబోవుచున్నావు?

769 “సహోదరుడా బ్రెన్హామ్, దాని విషయంలో నీవేమి చేస్తావు?” నేను ఒక అమెరికా పౌరుడను గనుక, నేను దానిని గౌరవించాల్సియున్నది, బిగ్ బాస్ ఏమి చేయమని చెప్తే నేను దానిని చేస్తాను. నేను గనుక…ఒక—ఒక కుటుంబము ఎప్పుడైనా ఆ కుటుంబము పట్ల గౌరవాన్ని కోల్పోయినట్లయితే (పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కోల్పోతే), ఆ కుటుంబము ముక్కలైపోయినట్లే. ఒక—ఒక సంఘము ఎన్నడైనా దాని సంఘకాపరి పట్ల గౌరవాన్ని కోల్పోతే, ఆ సంఘము పనైపోయినట్లే. మరియు ఒక దేశము ఎప్పుడైనా సుప్రీం కోర్టు పట్ల మరియు దాని ఆదేశాల పట్ల గౌరవాన్ని కోల్పోతే, ఆ దేశము ముక్కలైపోయినట్లే. అది ఖచ్చితంగా సరియే. వారు బిగ్ బాస్ అయ్యున్నారు గనుక మనం ఆ విషయాలను గౌరవించాల్సియున్నది, చూడండి. కానీ ప్రారంభములోనే అది సరైనది కాదు. ఖచ్చితంగా!

770 మీకు తెలుసా బైబిలులో ఒక పురుషుడు…ఆదికాండము, 1వ అధ్యాయము, దేవుడు స్త్రీని మరియు—మరియు పురుషుని సృష్టించినప్పుడు, మరి పురుషుని మరియు స్త్రీని చేసి, మరియు దేవుడు హవ్వతో ఈలాగు చెప్పెను “నీ భర్త నిన్ను ఏలుతాడు, నీకు పాలకునిగా ఉంటాడు”? అమెరికాలో దానిని చెప్పి మరియు మీరెక్కడ ఉంటారో చూడండి! అబ్బాయ్, అది అలా కాదు, స్త్రీయే పురుషుని పరిపాలిస్తుంది; వారు దానిని చేయవలసియున్నది, బహిరంగ స్థలాలు ఏర్పాటు చేయబడినవి…

771 నేను తీసుకురావాల్సివస్తే, నేను అక్కడ నా గది నుండి, డజన్ల కొలది, మర్యాదగల స్త్రీలను, తీసుకురాగలను…స్త్రీలందరూ ఎప్పుడో ఒకసారి కూడా పనిచేయకూడదని నేను చెప్పడం లేదు; బహుశా వారికి ఒక వ్యాధిగ్రస్తుడైన భర్త ఉండవచ్చును లేదా అటువంటి పరిస్థితి ఉండవచ్చును, మరియు వారు పనిచేయవలసి యుండవచ్చును. అయితే వారు చేయనవసరం లేకపోతే, వారు చేయకూడదు. వారి స్థానం ఇంటివద్దనైయున్నది, వారి చిన్న కోట, ఖచ్చితంగా వారు ఉండవలసింది అక్కడేయైయున్నది.

772 మరియు మన అమెరికా స్త్రీలు బయటకు వెళ్ళి తమకు తాముగా బ్రతికే స్వేచ్ఛను కలిగియున్నారు. జంతువులలో మరియు అట్టివాటిలో కూడా, ఆ విషయం నిలిచినప్పుడు, అది జరుగుతుంది మరియు దాని జాతంతటిని అది దిగజార్చుతుంది.

773 ఆఫ్రికాలో ఒక చిన్న పక్షి ఉన్నది, మరియు అదొక చిన్న చెకుముకు పక్షి వంటిది.

774 ఇప్పుడు, సాధారణంగా, రెండిటిలో ఎల్లప్పుడూ ఆడదే అసహ్యంగా ఉంటుంది. మగది ఎప్పుడూ అందంగా ఉంటుంది, మగ జింక, మగ కణుజు, మగ జముడు పక్షి, ఆ—ఆ మగ కోడి, మరియు ఎప్పుడూ…ఎందుకనగా, ఆడది ఇంటి పక్షియైయున్నది. అది గూడులో కూర్చుంటుంది, అది దాని చిన్న పిల్లల్ని పెంచుతుంది. అది గ్రద్ద, పాము, తోడేలు, ఇంకా ఏమున్నాగాని, వాటి నుండి దాచిపెడుతుంది, చూడండి, దాని పిల్లల్ని పెంచుటకైయున్నది.

775 కానీ ఏ జాతిలో అయితే…లేదా లింగపరంగా ఎక్కడైతే ఆ—ఆ—ఆ స్త్రీ, లేదా ఆడది, అందంలో గెలుస్తుందో, అది ఎప్పుడూ ఒక దిగజారిపోయే రకముగా ఉంటుంది. ఆఫ్రికాలో, మీరు ఒక పక్షిని తీసుకుంటే…అక్కడ ఒక చిన్న పక్షి ఉన్నది, మరియు నాకు తెలిసిన ఖండములన్నిటిలో, మగదాని కంటే ఆడదే ఎక్కువ అందంగా ఉండే ఒకే ఒక్క పక్షి అదేయైయున్నది. మరియు అది అట్లుండగా…ఆ—ఆ పక్షి స్థిరంగా ఒక వేశ్యయైయున్నది. అది తిరిగి తిరిగి ఒక జతను కనుగొంటుంది, మరియు అది ఆ జతతో కలిసిన పిమ్మట కొన్ని గుడ్లను పెడుతుంది, మరియు ఆ జతను గుడ్లపై కూర్చుండబెట్టి అది వెళ్ళి వేరొక జతను వెతుక్కుంటుంది. అది ఖచ్చితంగా సరియే. చూశారా? నా భావమును గ్రహించారా?

776 ఇందులో, ఇప్పుడు చూడండి, ఈనాడు అమెరికాలో, మన స్త్రీల విషయము. కొన్ని రోజుల క్రితం, కెంటకీలోని ఒక యౌవనస్తుడు నాతో ఇట్లన్నాడు, ఇక్కడ కెంటకీలోని ఒక ఫలానా కంపెనీలో ఎనిమిది వందలమంది స్త్రీలు పనిచేస్తున్నారని చెప్పాడు. మరియు అతడు ఇట్లన్నాడు, “వారిలో నాలుగు వందల మంది వీధి వేశ్యలని మరియు పిల్లలుగల వివాహితులైన స్త్రీలని చెప్పుటలో, నేను ఒట్టుపెట్టడంలో కూడా వెనుకాడను.” ఒక వ్యక్తి తన భార్యను అక్కడ బయటకు తీసుకెళ్ళి ఒక సంస్థతో పని చేపించి, మరియు తర్వాత ఆమెను చంపగోరాడు. మరియు మరొకడు ఒక వ్యక్తిని కాల్చడానికి వెళ్ళాడు. మరియు మరొకడు కోయుచు గొడవపడుచున్నాడు. అది అట్లు జరగకూడదు. అది సరియైనది కాదు.

777 స్త్రీని ఆమె దేనికైతే చెందియున్నదో అక్కడ ఆ వంట గదిలో పెట్టండి, అప్పుడు ప్రతీదీ సరియవుతుంది. కానీ మీరు ఆమెను బహిరంగ పనులలో పెట్టడం వలన, ఆమె పనైపోతుంది. ఖచ్చితం-…నేను చెప్పేది…

778 అమెరికా స్త్రీలు ఎగతాళిగా నవ్వి మరియు, “దానితో ఏమి సంబంధము లేదు.” మరియు, “మీరు నాకు చూపించండి,” అని అంటారు. నిశ్చయంగా, మీరు దానిని చేయవలసియున్నది, ఎందుకనగా మీరు దానిని చేస్తారని బైబిలు ముందుగానే చెప్పినది. మీరు దానిని చేయవలసియున్నది.

779 మరియు ఇక్కడ…అది ఇలా ఉండేది, చాలా కాలం క్రితం, ఒక మెథడిస్టు సంఘములో, ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకున్నయెడల, ఆమె సంఘము నుండి బహిష్కరించబడేది. నిశ్చయంగా, వారు దానిని చేశారు. అవును, నిజంగా. నాజరీనులు, పిలిగ్రిం హోలీనెస్ వారు, పెంతెకొస్తువారు, వారందరూ దానిని చేసేవారు. ఏమి జరిగినది?

780 ఎందుకో మీకు తెలుసా? మీరు ప్రసంగ వేదిక వెనుక కొందరు ఆడంగివారిని కలిగియున్నారు. అది ఖచ్చితంగా సరియే. ఎవరో వారి భోజనపు టికెట్టు గూర్చి భయపడుచున్నారు…మీరు వారిని సంఘము నుండి వెలివేస్తారని, వారిని బయటకు వెళ్ళగొడతారని భయపడుచున్నారు. అది గాయపరచినా లేదా అది గాయపరచకపోయినా, దేవుని వాక్యముపై నిలుచునే దమ్ము వారికి లేదు. అది ఖచ్చితంగా వాస్తవము.

781 ఇక్కడ వినండి, పురుషుడే పరిపాలకుడు. మీరు ఇంటిని పరిపాలిస్తారని మీరు అనుకోకండి. మీరు ఇంటిని పరిపాలించువారు కారు. మీరు ఖచ్చితంగా…ఇప్పుడు మీరు ఒక బానిస కాదు, అయితే మీరు ఒక సాటియైన సహాయమైయున్నారు. మరియు ఆదాము…పురుషుడు తన భార్యపై ఏలిక చేయువాడు, మరియు తన భార్య విషయంలో అతడు పూర్తి బాధ్యతను కలిగియున్నాడు. దేవుడు మానవుడిని తన భార్య విషయంలో జవాబుదారిగా చేస్తాడు. ఇప్పుడు, చదివి మరియు దేవుడు దానిని చెప్పాడో లేదో చూడండి.

పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు, గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు:…

782 దేవుడు ఒక స్త్రీ కాదు, దేవుడు పురుషుడైయున్నాడు. మీకు తెలుసా వారు కన్య మరియ మరియు అటువంటివి చేస్తున్నప్పుడు, మరియు మధ్య-…లేదా మధ్యవర్తిత్వము మరియు అటువంటివన్నీ చేస్తున్నప్పుడు, మరియు కన్య మరియకు ప్రార్థన చేస్తున్నప్పుడు, అది నాకు దేనిని జ్ఞాపకం చేస్తుందో మీకు తెలుసా? పౌలు గద్దించి మరియు తరిమికొట్టిన, ఆ గొప్ప దేవతయైన డయానను జ్ఞాపకము చేస్తుంది. అది వాస్తవం. అతడు ఇట్లు చెప్పాడు, “ఏంటి, దేవుడు స్త్రీ కాడు!”

783 ఒక బండ పొలములో పడినది, మరియు ఆ దేవత తమ ప్రతిమను క్రింద పడవేసినది అని వారు చెప్పారు, ఆ కారణముచేతనే కొరింథీలో, మరియు అక్కడనున్న ఆ స్త్రీలు, ఆ…ఆ డయానాను ఆరాధించినవారు, వారు బోధకులు అవ్వగోరారు.

784 వారు ఇట్లన్నారు, “అంతెందుకు, మేము బోధించవచ్చని ఆత్మ మాతో చెప్పినది.”

785 అతడు ఇట్లన్నాడు, “ఏమిటి? దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళెనా, మరియు అది మీ యొద్దకు మాత్రమే వచ్చెనా? ఎవడైనను తాను ప్రవక్తననియైనను లేదా ఆత్మసంబంధినని యైనను తలంచుకొనిన యెడల, నేను మీకు చెప్పుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను: సంఘములో స్త్రీ మౌనముగా ఉండి మరియు లోబడియుండవలసిందే కానీ, బోధించుటకైనను లేదా ఎటువంటి అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు లేదు.” అది ఖచ్చితంగా అంతే! లేఖనము చెప్పినది అదేయైయున్నది. చూశారా? మరియు దాని విషయమై తీర్పు దినమున దేవుడు చాలామంది బోధకులను లెక్క అడుగబోవుచున్నాడు.

786 సరి, వినండి! మీరు ఇట్లంటారు, “సరి, నేను మీకు చెప్తాను, నాకు అది నేర్పించబడినది.” ఇప్పుడు మీకు దానికంటే బాగుగా తెలిసియున్నది! అది నిజం. మీరైనా లేదా ఎవరైనా ఒక మోతాదు ఔషధాన్ని తీసుకోబోవుచున్నప్పుడు, మరియు అది విషం అని ఎవరైనా మీకు చెప్పినయెడల, మరియు మీరు—మీరు అలాగే వెళ్ళి మరియు ఎట్లైనా దానిని తీసుకున్నయెడల, ఆ మీదట అది మీ తప్పే అవుతుంది. చూశారా?

787 ఇప్పుడు దీనిని వినండి:

ఏలయనగా పురుషుడు స్త్రీనుండి కలుగలేదు; కానీ స్త్రీ పురుషునినుండి కలిగెను.

ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన ఒక స్త్రీకి తలమీద ఉండవలెను.

788 మీలో ఎవరైనా దానిని చదువుతారా? మొదటి కొరింథీ, 11వ అధ్యాయం, మరియు 10వ వచనం. మీరు గమనించినయెడల, “అధికారము,” (ఎందుకు?) “దేవదూతలనుబట్టి,” మొదటి కొరింథీ, ఎందుకనగా దూతలు అనగా పురుషుడు, వర్తమానికుడైయున్నారు. చూడండి, అది మరలా “a” చిన్న అక్షరమైయున్నది. దూతల గూర్చి, పరలోక సంబంధమైన దూతల గూర్చియున్న చోట అదొక పెద్ద “A,” ఉంటుంది పెద్దక్షరం “A.” ఒక చిన్న “a,” ఉన్నచోట అది మానవులైన దూతలు.

అయితే ప్రభువునందు పురుషునికి…లేదా స్త్రీకి,…వేరుగా పురుషుడు లేడు, పురుషునికి—పురుషునికి వేరుగా స్త్రీ లేదు.

స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగెనో, అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను;…గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి.

మీలో మీరే…యోచించుకొనుడి: ఒక స్త్రీ ముసుకులేనిదై (అనగా పొట్టి జుట్టుతో) దేవునికి ప్రార్థించుట తగునా? (దాని గూర్చి ఇప్పుడు ఆలోచించండి)

789 ఇప్పుడు గమనించండి:

పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట, అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా,…

790 ఇట్లంటారు, “అది దేనికి సంబంధించినది?” తలవెండ్రుకలు. పౌలు దేనిగూర్చి మాట్లాడుచున్నాడో మీరు చూడటం లేదా? తలవెండ్రుకలు, పొడవైన వెండ్రుకలు! ఒకవేళ…స్త్రీలు పొడవైన వెండ్రుకలను కలిగియుండవలసియున్నది. ఇప్పుడు 14వ వచనం:

పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట, అది, అతనికి ఒక అవమానమని, స్వభావసిద్ధముగా మీకు తోచును గదా?

791 అది మీకు అర్థమవుతుందా? ఒక పురుషుడు పొడవైన వెండ్రుకలు కలిగియుండుట అవమానకరము, కానీ ఒక స్త్రీ-…అది ఒక స్త్రీయొక్క స్థానము. లింగపరంగాను మరియు రూపములోను, మరియు ప్రతీ దానిలోనూ, దేవుడు ఒక స్త్రీ కంటెను పురుషుని భిన్నముగా కలుగజేసెను. ఆమె ఒక వస్త్రమును…బైబిలు ఇట్లు చెప్పినది “ఒక స్త్రీ ప్యాంటులను లేదా పురుషునికి చెందిన ఎటువంటి దుస్తులనైనా ధరించినయెడల, అది దేవుని ఎదుట ఒక మురికి చెత్త మరియు హేయమైన దృశ్యముగా ఉన్నది.” మరియు దేవుడు ఆమెను దాని విషయమై మూల్యాన్ని చెల్లింపజేస్తాడు. మీరు ఎవరు చెప్పేది వినబోతున్నారు? అయితే ఇది బైబిలు గ్రంథమైయున్నది!

792 మరియు మీరు తిరిగులాడుచు ఇలా అంటారు, “ఎందుకు, స్త్రీలు ప్యాంటులను ధరించుటను చూడటానికి…చాలా బాగుందని నేను అనుకొనుచున్నాను.” అయితే దేవుడు వారిని భిన్నంగా చేశాడు, వారు భిన్నంగా వస్త్రధారణ చేసుకోవాలని ఆయన కోరతాడు.

793 మరియు బైబిలు ఇట్లు చెప్పినది, “ఒక స్త్రీ పురుషునికి చెందిన వస్త్రమును ధరించినయెడల, అది హేయము.” హేయము అంటే ఏమిటో మీకు తెలుసా? అది “దేవుని దృష్టిలో నీచమైనది.” మరియు నీవు ఒక నీచమైన కార్యముగా ఉండుటను చూస్తున్న ఆ గొప్ప యెహోవా…మరియు బైబిలు ఇట్లు చెప్పినది…

794 మరియు…ఇప్పుడు మీలో కొందరు స్త్రీలు, యౌవ్వనస్తులైన మీ అమ్మాయిలకు ఇలా చెప్పే మీరు, పద్దెనిమిది, ఇరువై సంవత్సరాలు గలవారిని, వారున్న విధంగానే వస్త్రధారణ చేసుకొని బయటకు వెళ్ళనిస్తున్నారు!

795 మరియు మీరు, కూడా, అమ్మా! చూశారా? మీరు ఆ ప్యాంటులను మరియు అటువంటివాటిని ధరించుకొని బయటకు వెళ్ళి మరియు జీవిస్తున్నప్పుడు…మరియు వీధులలోకి వచ్చినప్పుడు, మరియు—మరియు ఈ దినాల్లో వారు తయారు చేస్తున్న ఆ దుస్తులను ధరించి, మరియు మీరు కానిదాని వలె కనబడునట్లు చేయుచున్నారు. చూశారా? మరియు మీరు పూర్తిగా శృంగారంగా కనబడుచూ అక్కడ వీధులలోనికి వెళ్ళుచున్నారు, మీరు మీ భర్త ఎదుట ఎంతో నిర్దోషులుగా మరియు స్వచ్ఛముగా ఉండవచ్చును మరియు ప్రతివిధంగా ఉండవచ్చును, కానీ మీరు వీధిలోనికి వెళ్ళినప్పుడు మరి మీరు ఆ విధంగా కనబరచుకున్నందువలన ఒక పురుషుడు మోహపు చూపుతో మిమ్మల్ని చూసినయెడల, మీరు దోషియౌతారు, మరియు మీ వైపు ఆ విధంగా చూసిన ప్రతీ పురుషునితో మీరు వ్యభిచరించిన కారణంగా తీర్పు దినమున మీరు జవాబు ఇవ్వవలసియున్నది. బైబిలు దానినే చెప్పినది.

796 బైబిలు ఇట్లు చెప్పినది, “ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతీవాడు, ఆమెతో ఇదివరకే తన హృదయంలో వ్యభిచరించాడు,” మరియు మీరు దోషులైయున్నారు మరియు…

797 మీరు న్యాయతీర్పునకు వచ్చి మరియు ఇట్లంటారు, “ప్రభువా, నీకు నా హృదయం ఏమిటో తెలుసు; నేనెన్నడూ వ్యభిచరించలేదు, నేను నా భర్తకు నమ్మకంగా జీవించాను.”

798 అయితే ఇదిగో ఒక పురుషుడు వస్తాడు, ఇక్కడ మరొకడు వస్తాడు, ఇక్కడ ఇంకొకడు, ఇంకొకడు, ఇంకొకడు, వారు పదిహేను, ఇరవై, ముప్పై, నలభై మంది నిలబడి ఇట్లంటారు, “వ్యభిచార నేరం!” ఎందువలన? ఎవరో ఒక పురుషుడు నిన్ను మోహపు చూపుతో చూశాడు.

799 “సరి, దానితో నాకేమి సంబంధం లేదు.” సరి, అలాగైతే నిన్ను నీవు ఎందుకని అలా చూపించుకున్నావు? వాటిని ధరించవద్దని దేవుడు నీతో చెప్పినప్పుడు, దానిని చేయడం హేయము, మరియు మీరు వెళ్ళి సుజీని ఎవరు ప్రేమిస్తున్నారు? అనేదానిని వింటారు. లేదా అదేంటి…

800 ఆ సుజీని ఎవరు ప్రేమిస్తున్నారు? లోని భర్తకు ఏమి జరిగినదో మీరు కనుగొన్నారా? ఈ మధ్యే మీరందరూ దానిని ఇక్కడ పత్రికలో చూశారు. మేము క్యాస్పర్, వ్యోమింగులో ఉన్నప్పుడు, ఆ విషయం బయటకు వచ్చినది. మరియు అతని పేరు ఏమిటి? ఆ అబ్బాయి…ఆ మేము సుజీని ప్రేమిస్తున్నాము అనుదానిలో, లేదా అది—అసలు అది ఏమిటి? ఆ…ఓ, దానిని చూడటానికి మీరు బుధవారము ప్రార్థనా కూటమును వదులుకొని ఇంటి వద్దనే ఉండిపోయే ఆ కార్యక్రమం. ఇప్పుడు అదేమిటి? మేము ప్రేమిస్తున్నాము…దాని పేరు ఏమిటి? [ఒక సహోదరి చెప్పుచున్నది, “నేను లూసీని ప్రేమిస్తున్నాను.”—సంపా.] నేను లూసీని ప్రేమిస్తున్నాను, ఆమె భర్త…వాయించేవాడు, రెనో, నెవెడా వద్ద, ఒక నల్ల జాతియురాలితో పట్టుబడ్డాడు, కొన్ని సంవత్సరాలుగా ఆమెతో జీవిస్తున్నాడు. మరియు మీరు వెళ్ళి సువార్తను వినుటకు బదులు, అటువంటి దానిని చూడటానికి ఇంటి వద్ద ఉండిపోతున్నారు. ఆ స్త్రీ దానిని ఒప్పుకుంది. ఓ, కనికరము! యేసు క్రీస్తుకు వెలుపల పరిశుద్ధమైనది ఏదియు లేదు!

801 సహోదరుడా, నీ హృదయం దీవించబడునుగాక, నేను—నేను నీకు చెప్తాను—నీవు, మీలో ఒకరు…మీరు ఇట్లంటారు, “ఓ, మై, ఆ అందాన్ని చూడు.” మనం కలిగియున్న ఆ—ఆ కొన్ని అతి దరిద్రమైన రాబందులు, గోకరాయి పక్షులు, అందమైన పక్షులే. మీరు ఒక పక్షిని దాని ఈకలను బట్టి తీర్పు తీర్చలేరు, చూడండి. కావున కేవలం దానిని గుర్తుంచుకోండి. ఓ, మై!

802 ఇప్పుడు గమనించండి:

స్వభావసిద్ధముగా…(అది 14వ వచనం)…అది మీకు, పురుషుడు పొడవైన వెండ్రుకలు కలిగియుండుట అవమానకరమని, బోధించును కదా? (అది స్త్రీకి చెందినది.)

అయితే ఒక స్త్రీ పొడవైన వెండ్రుకలు కలిగి యుంటే, అది ఆమెకు మహిమకరము:…

803 ఇప్పుడు ఆయన దేనిగూర్చి మాట్లాడుచున్నాడు? క్యాథలిక్కులైన మీరు సంఘములో ధరించే టోపీ గురించా? కానే కాదు! చేతిరుమాలుతో, మీ తలపైన వేసుకునే ఒక చిన్న ముసుకు గురించా? అతడు మీ తలవెండ్రుకల గురించి మాట్లాడుచున్నాడు!

804 ఇప్పుడు! ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకున్నయెడల, ఆమె తన మహిమను కత్తిరించుకుంటుంది, మరియు ప్రార్థన చేయడానికి వేదిక మీదకు ఆమెకు అనుమతి లేదు. చూడండి, ఇక్కడ చెప్పబడినది సరిగ్గా అదే విషయము, “ఒక స్త్రీ తలమీద ముసుకులేనిదై ప్రార్థించుట తగునా?” ఇక్కడ చెప్పబడినది, ఇట్లు చెప్పబడినది, “సరి, ఆమె తన వెండ్రుకలు కత్తిరించుకోవలెను.” అలాగైతే ఆమెను బొత్తిగా బోడగుండు చేసుకోనివ్వండి. “మరియు ఆమె బొత్తిగా బోడగుండు చేసుకోబోవుచున్న యెడల,” ఇట్లు చెప్పబడినది, “అది అగౌరవము, ఒక స్త్రీ అలా చేయడం సిగ్గుచేటు.” పిదప ఇట్లు చెప్పబడినది, “ఆమె ముసుకు వేసుకోవలెను.” ఇప్పుడు, నేను కేవలం—నేను కేవలం పౌలు యొక్క పత్రికను చదువుచున్నాను. మీరందరూ, అది మీ ఇష్టం, చూడండి.

అయితే స్త్రీ పొడవైన వెండ్రుకలు కలిగియున్నయెడల, అది ఆమెకు మహిమకరము: ఏలయనగా ఆమె తలవెండ్రుకలే ఆమెకు ముసుకుగా ఇవ్వబడెను.

805 ఆమెకు ఒక టోపీ ఇవ్వబడుతుందని అది చెప్పబడినదా? సంఘానికి వెళ్ళి మరియు ఒక టోపీని ధరించుకోవాలనుకునే, క్యాథలిక్ లేదా ప్రొటెస్టంటు ప్రజలైన మీరు, మీలో ఎవరైనా, ఇట్లంటారు, “సరి, నేను చర్చికి వెళ్తున్నాను, ఒక టోపీ పెట్టుకోవాలి.” కాదు, మీరు మీ తలవెండ్రుకలు పెంచుకోవలసియున్నది. అదీ వ్యత్యాసము. చూశారా?

…ఏలయనగా ఆమె తలవెండ్రుకలే ఆమెకు ముసుకుగా ఇవ్వబడెను. (మరియు ఆమె ముసుకు లేకుండా సంఘమునకు వచ్చి, ప్రార్థన చేయుటకై వేదిక మీదకు వెళ్ళుట అవమానకరము.)

అయితే ఒక పురుషుడు గనుక—గనుక…(ఆ పదాన్ని నేను పలుకగల్గుతానని నేను నమ్మడంలేదు, క-ల-హ-ప్రి-యు-…)…కలహప్రియుడు—కలహప్రియుడైతే (కలహప్రియుడు అంటే ఏమిటో మీకు తెలుసు కదా), మాలోనైనను, దేవుని సంఘములోనైనను అట్టి ఆచారము లేదు.

806 ఇప్పుడు దాని గురించి మీరు వాదించాలనుకుంటే, మీరు దానితో వాదించండి. అది సరియే, దాని గురించి మీరు కలహము పెట్టుకోవాలనుకుంటే, “ఓ, అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. మనం వారిని ఆ విధంగా కొనసాగనిద్దాము. ఎందుకని, అది ఏమీ కాదని నేను అనుకుంటున్నాను. నేను…ఎట్లైనను, ఆ తలవెండ్రుకలు ఎలాగున్నవని కాదు గానీ, ఆ హృదయం ఎటువంటిదన్నదే విషయమైయున్నది.” అది సత్యము; హృదయము సరిగ్గా ఉన్నయెడల, తలవెండ్రుకలు సరిగ్గా ఉంటాయి (అహ-హహ్).

807 మీరు కలహప్రియుడిగా ఉండాలనుకుంటే, అలాగే కొనసాగండి, పౌలు ఇలా చెప్పాడు, “మాలోనైనను, దేవుని సంఘములోనైనను అట్టి ఆచారము లేదు.” ఇట్లన్నాడు, “మీరు కయీను పక్షమునకు చెందియుండాలని అనుకుంటే, మంచిది, కేవలం అలాగే కొనసాగండి.” అయితే పౌలు మాత్రం దీనిని చెప్పుచున్నాడు.

808 ఓ, మరి నవ్వాలని నా భావం కాదు, ఎందుకనగా ఇది ఒక నవ్వే విషయం కాదు. కానీ స్నేహితులారా నేను మీకు చెప్తున్నాను, ఈ కార్యములు చేయుటకు అనుమతించబడిన విధానాన్ని చూడటం సిగ్గుకరంగా ఉన్నది. నేను…

809 వినండి! నా ప్రియమైన సహోదరీలైన, మీకు చెప్పుచున్నాను, మీరు మీకు సాధ్యమైనంత చక్కగా కనబడాలని మరియు మీకు సాధ్యమైనంత ఉత్తమంగా ఉండాలని నేను కోరుచున్నాను, మీరు ఆ విధంగానే ఉండవలసియున్నది. మీరు ఉండవలసినది అట్లేయైయున్నది. మరియు మీ భర్త వచ్చినప్పుడు మీరు ఉండగల్గినంత మాధూర్యముగా మరియు శుభ్రంగా మరియు ఆ విధంగా ఉండవలసియున్నది, అతడు మీ ప్రాణేశ్వరుడన్నట్లుగా ఉండవలసియున్నది. మరియు నీకు భర్తగా ఉండుటకు వేదిక మీద నీవు అతడిని ముద్దు పెట్టుకున్న ఆ—ఆ దినమున ఉన్నట్లే అంతే మాధూర్యముతో నిండిన ఒక ముద్దుతో నీవు అతణ్ణి తలుపునొద్దనే ఎదుర్కొనవలసియున్నది. అది వాస్తవం. మీరు మీకు సాధ్యమైనంత చక్కగా కనిపిస్తున్నందుకు మరియు మీకు సాధ్యమైనంత ఉత్తమంగా ఉంటున్నందుకు నేను మిమ్మల్ని నిందించను. మరియు మీరు ఆ విధంగా ఉండాలని నేను కోరుచున్నాను, నేను అట్లు కోరుచున్నానని దేవునికి తెలియును.

810 ఇక్కడ కొంత కాలం క్రితం, నేను జాక్ షూలర్ తో మాట్లాడుచున్నాను. ఎంత మంది జాక్ షూలర్ గురించి విన్నారు? మెథడిస్టులు కలిగియున్న అత్యంత పేరుగాంచిన బోధకుడు. అతడు ఇట్లన్నాడు, “ఒక స్త్రీ వచ్చి…జుట్టంతా మురికిగా, బబుల్-గమ్ నములుతూ, మరియు ఆమె సగం దుస్తులు ధరించినదై, ఇట్లు చెప్పినది, ‘మీకు తెలుసా, నా భర్త నన్ను ఇక ఎంత మాత్రమూ భరించడంలేదు.’”

811 అతడు ఇట్లన్నాడు, “నేను అతణ్ణి నిందించను.”

812 అది వాస్తవం. అయితే ఇప్పుడు, మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు సరైన మార్గములో ఉండవలసియున్నది. మీ సౌందర్యాన్ని మరియు అందాన్ని హాలీవుడ్ నుండి తీసుకోకండి, దేవుని యెదుట, దానిని బైబిలు నుండి తీసుకోండి. ఒక మహిళగా ఉండండి, ఒక మహిళ వలె ప్రవర్తించండి, ఒక మహిళ వలె వస్త్రధారణ చేసుకోండి, శుభ్రముగా ఉండండి. ఒక మహిళ వలె ప్రవర్తించండి, అటువంటివాటిని ధరించకండి…

813 బయటకు వెళ్ళి పురుషుల యెదుట ఆ పొట్టివాటిని ధరించుకొనుటకు తన భార్యకు అనుమతించిన ఏ పురుషుడైనా, మరియు ఆ పొట్టివాటిని ధరించి…తోటలోనికి వెళ్ళి మరియు పెరటిలో కత్తిరించుటకు, మరియు అట్టి కార్యములు చేయుటకు అనుమతిస్తే, మిస్టర్, నేను నీకు చెప్తున్నాను, సహోదరుడా! కఠినంగా ఉండాలని నా—నా భావము కాదు, నేను…దేవుడికి అది తెలుసు అది నా హృదయమైయున్నది. అయితే నేను…నా వారిని ఆ విధంగా చేయుటకు అనుమతించేముందు నేను చాలా మారవలసియున్నది. నేను చేయగలిగినంతకాలం నేను ఆ కొండపైన అధికారం చేయవలసియుంటుంది, మీరు చూడండి; మరియు నేను చేయలేనప్పుడు, నేను అక్కడి నుండి తొలగిపోతాను. అది వాస్తవం.

814 ఓ, సహోదరుడా, అలా చేయడం స్త్రీలకు సిగ్గుకరము మరియు అవమానకరమైయున్నది. మరియు నా—నా భావం, సహోదరీ…నేను—నేను మిమ్మల్ని కించపరచడం లేదు, కేవలం నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను…ఇక్కడున్న మా సంఘానికి సభ్యులు ఉండరు, ప్రజలు కేవలం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇది దేవుని ఇల్లైయున్నది, మరియు అటువంటివి ధరించకూడదని మేము ఖచ్చితంగా ప్రజలకు చెప్తుంటాము. అది…దాని గూర్చి మీరు తీర్పు దినమున జవాబు ఇవ్వవలసియుంటుందని చెప్తాము. ఇప్పుడు ఇక్కడ గమనించండి. మరియు మీ తలవెండ్రుకలను పెరగనీయండి, చూడండి, మరియు ఒక స్త్రీ వలె ఉండండి.

815 ఇప్పుడు:

ఇప్పుడు ఇందులో…నేను మిమ్మును మెచ్చుకొనుటలేదని మీకు తెలియజేయుచున్నాను, ఏలయనగా మీరు కూడి వచ్చుట, ఎక్కువ కీడుకేగాని…ఎక్కువ మెలుకు కాదు.

మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు, మీలో విభేదాలు కలవని వినుచున్నాను; మరియు అటువంటివి,…(ఇప్పుడది ప్రభురాత్రి భోజనపు బల్ల వద్దకు వెళ్తుంది)

816 ఇప్పుడు దానిని వినండి. అందునుబట్టియే దూతలు…

817 ఇప్పుడు, సహోదరుడా పామర్, నేను ఈ టేపు పై నీకు దీనిని చెప్పడం లేదు నేను ఇక్కడ బోధిస్తున్న అదే విషయాన్ని నీవు అక్కడ బోధిస్తావు. కానీ నీకు బాగుగా తెలియును, మరియు సహోదరుడా, నీవు ఒక బోధకుడవైయ్యుండుటను బట్టి, అది సత్యమని నీకు తెలియును. అది సరియే.

818 కావున ఇక్కడ దూతలు అనగా “మనుష్యులైయున్నారు.” నీవు దానిని గమనించినట్లైతే, సహోదరుడా పామర్, అది చిన్న అక్షరంలో ఉన్నది, “దూతలు.” మరియు బైబిలు ఇంకా ఇట్లు చెప్తుంది…అతడు పురుషుడు మరియు అతని భార్యనుద్దేశించి మాట్లాడుచున్నాడు, చూడండి, ఆ అంశము అదేయైయున్నది.

819 ఆ విధంగానే బైబిలు విషయమై ప్రజలు చాలా గందరగోళానికి గురవుతుంటారు, వారు ఇట్లంటారు, “సరి, దేవుడు ఇక్కడ ఒకటి చెప్తాడు, మరియు ఒకటి…” కాదండి, మీరు—మీరు అంశమును దాటిపోవుచున్నారు. సరిగ్గా అదే అంశముపై నిలిచియుండండి, అంతే. అతడు పురుషుడు మరియు భార్య గురించి మాట్లాడుచున్నాడు.

820 ఇప్పుడు మనం ముగించడానికి ముందు మరొక విషయమును నేను చెప్పగోరుచున్నాను, అందుకు నాకు రెండు నిమిషాలు పడుతుంది:

74. ఒక-వెయ్యి-సంవత్సరాల పరిపాలన తర్వాత పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? మరియు వారు ఎటువంటి శరీరమును కలిగియుంటారు?

821 అది చాలా మాధూర్యమైన ప్రశ్న అని నేను అనుకొనుచున్నాను, నేను దానిని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మనం నేరుగా దానిలోకి చూద్దాము.

822 ఆదియందు, దేవుడు…మనము కొన్ని నిమిషాలు తిరిగి మన హెబ్రీ బోధనలవైపుకు వెళ్దాము. దేవుడు ఏడు రంగులుగల ఈ గొప్ప, పెద్ద ఊటయైయున్నాడు. అది ఎంతమందికి తెలుసు? చూశారా? మరియు దేవుడు ఏడు ఆత్మలను కలిగియున్నాడని ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగా, ఏడు ఆత్మలు. మరియు ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కన్నులు కలవు, మరియు ఆ విధంగా ఉండెను, ఇప్పుడు అదంతా కూడి వచ్చుచున్నది. చూశారా? ఇప్పుడు, అది దేవుడైయుండెను.

823 ఇప్పుడు ఆయన (ఆ లోగాస్) దేవుని నుండి బయటకు వెళ్ళినప్పుడు, అది ఈ ఒక్క పెద్ద ఊటనుండి ఒక శరీరములోనికి ఒక—ఒక మానవ రూపములో దేవుడు వచ్చుటయైయున్నది; మరియు అది ఆ లోగాస్ గా తయారైనది, దానినే మనం థియోఫెని అంటాము.

824 ఇప్పుడు, మీరు దానిని చూస్తుండగా మీరు ఆ థియోఫెని ని తీసుకుంటే, అది ఒక మనుష్యుడు. ఇప్పుడు మనము…ఇప్పుడు, మనం ఆదిలో అక్కడే ఉండియున్నాము. ఇప్పుడు, అది మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఆదిలో అక్కడ మీరు ఆ విధంగానే ఉండియున్నారు. ఎప్పుడైతే మానవుడు…దేవుడు మానవుడిని తన స్వరూపమందు చేసినప్పుడు, ఆయన అతణ్ణి ఒక థియోఫెనిగా చేసాడు. మరియు ఆయన అతణ్ణి శరీరములో ఉంచినది…దేవుడు తన స్వరూపమందు, తన పోలికలో మానవుడిని చేసినప్పుడు, వారు…ఆదికాండము 2 లో, అక్కడ…లేదా ఆదికాండము 1:28, అని నేను నమ్ముచున్నాను, “నేలను సేద్యపరచుటకు నరుడు లేడు,” మరియు దేవుడు అప్పటికే పురుషుని మరియు స్త్రీని కలుగజేసాడు. అది నిజము, “నేలను సేద్యపరచుటకు నరుడు లేడు.”

825 అంతట దేవుడు మానవుణ్ణి కొంచెం క్రిందిస్థాయికి తీసుకువచ్చి మరియు అతడిని జంతు జీవములో ఉంచాడు, అది ఈ శరీరమైయున్నది, సరిగ్గా జంతువుల వలెనే చేసాడు తద్వారా అతడు నేలను సేద్యపరచగలుగుటకైయున్నది, తాకగలుగుటకైయున్నది. ఆ థియోఫెని తాకదు, అది చూడదు, రుచిచూడదు, వాసన చూడదు, వినదు; మనం కలిగియున్న ఈ ఇంద్రియాలను కలిగియుండదు. కావున తాకుటకు మరియు అనుభూతి చెందుటకు—దేవుడు మానవుని అక్కడ క్రింద ఉంచెను.

826 మరియు—మరియు అతడు ఏదెను తోటలో మొదట, ఒక థియోఫెనివలె నడుచుచుండగా (అది ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండి ఇక్కడ నడుచుచున్నట్లేయై యున్నది), అది ఆ జంతు జీవమును నడిపించినది. అది ప్రతీదానిని నియంత్రించినది, కానీ అది నేలను సేద్యపరచలేకున్నది, చూడండి. కావున అతడు నేలను సేద్యపరచగలుగునట్లు దేవుడు అతడిని శరీరములో ఉంచాడు. ఆ నేలను సేద్యపరచి, మరియు ఆ—ఆ ద్రాక్షాతోటలను మరియు—మరియు మొదలగువాటిని సరిచేయుటకు అతనికి తన యొక్క ఐదు ఇంద్రియములను ఇచ్చాడు, మరియు పిదప మానవుడు ఇంకనూ ఒంటరిగా అగుపించాడు. ఓ, ఇది ఒక అందమైన దృశ్యమైయున్నది.

827 చూడండి, ఎట్లనగా అతడు మొదటిగా చేయబడినప్పుడు, అతడు ఇద్దరు వ్యక్తులను కలిపి ఒకటిగా చేయబడినాడు. ఆ మానవుడు, అతడు పురుషునిగాను స్త్రీగాను చేయబడినాడు. అతడు అలా చేయబడినాడని బైబిలు గ్రంథము చెప్పినది. దేవుడు మానవుడిని పురుషునిగాను స్త్రీనిగాను చేశాడు, “ఆయన అతడిని సృజించెను.” ఇప్పుడు గమనించండి, మానవుడు థియోఫెని నుండి వేరుచేయబడి మరియు శరీరములో పెట్టబడినప్పుడు, అతడు—అతడు అక్కడ పూర్తిగా లేడు; అతనిలో కొంత భాగము ఇంకనూ థియోఫెనిగానే ఉన్నది, కావున అది సరిగ్గా అగుపించలేదు.

828 అక్కడ ఆవులలో మగది మరియు ఆడది వెళ్ళెను, గుఱ్ఱము వెళ్ళెను, మరియు అక్కడ ఎద్దు వెళ్ళెను, మరియు అక్కడ ఆ మిగతావన్నీ, జతలుగా వెళ్ళినవి. కానీ ఆదాము, అతడు…అది…చూడండి, అక్కడ ఏదో కొదువగా ఉన్నది. ఆ తృష్ణయే అతని కొరకు ఒక జత వేచియున్నదని చూపించినది. మీకు అది అర్థమైనదా? మరియు మనము ఇక్కడ చనిపోవలసియున్నదని, మనము కలవరపడుచు మరియు ఆందోళనపడుచున్న ఆలోచనలే, మరియు మనము మరణం లేనటువంటి ఒక జీవితం కొరకు తృష్ణగొనుటయే, అది మన కొరకు వేచియున్నదని చూపిస్తుంది. చూశారా?

829 మరియు ఆదాము ఒంటరిగా ఉన్నాడు. మరియు దేవుడు, వారు వేరు చేయబడలేరని చూపించుటకు…ఇప్పుడు కేవలం ఒక్క క్షణములో, నేను తిరిగి ఇదే విషయములోనికి వస్తాను.

830 చూడండి, ఆయన ఎన్నడూ వెళ్ళి మరియు మట్టిని తీసుకొని మరియు ఒక హవ్వను తయారు చేయలేదు, అయితే ఆయన అసలైన మట్టి నుండి, ఆదామును కలుగజేసాడు. ఆయన అతని ప్రక్కనుండి ఒక ప్రక్కటెముకను తీసి మరియు అతనికి ఒక సాటియైన సహాయమును చేసాడు, మరియు అదియే హవ్వ. ఆమె ఆ పురుషుని కొరకు చేయబడినది, మరియు ఆ పురుషునిలో భాగమైయున్నది. ఆమె ఆదియందు, సృష్టిలో, ఒక థియోఫెనిలో అతనిలో భాగమైయున్నది. ఇక్కడ క్రింద ఈ సృష్టిలో ఆమె అతనిలో భాగమైయున్నది. ఆమె వేరొక సృష్టిలోనికి వేరుచేయబడజాలదు, ఆమె అదే సృష్టిలో చేయబడవలసియున్నది.

831 ఖచ్చితంగా అందువల్లనే క్రీస్తు మరియు దేవుడు ఒకే వ్యక్తియై ఉండవలసియున్నది, అది భిన్నంగా ఉండలేదు. ఆయన ఒక మంచి వ్యక్తియో లేక ఒక ప్రవక్తయో అయ్యుంటే, ఆయన ఒక విమోచకుడైయ్యుండలేడు; ఆయన స్వయంగా సృష్టికర్తేయై ఉండవలసియున్నది. అయితే ఇప్పుడు ఆయన ఇంకనూ ఒక థియోఫెనిగా ఉన్నాడు, మీరు చూడండి, మరియు ఆయన అప్పుడున్నట్లే ఉన్నాడు.

832 ఇప్పుడు ఒక మనుష్యుడు ఇక్కడ క్రిందికి వచ్చాడు మరియు అతడు—అతడు అద్భుతంగా ఉన్నాడు; మరియు దేవుడు దానిని ప్రేమించాడు, ఆయన ఇట్లన్నాడు, “అది బాగుంది, వారు భూమి మీద ఉండి మరియు నిత్యమూ అక్కడ జీవింతురుగాక. అంతే; నిత్యత్వము వరకు—వరకు, సదా మరియు సదా మరియు సదా జీవింతురుగాక. కేవలం అది మొలకెత్తునుగాక, మరియు ప్రతీ మొక్క, మరియు ప్రతీది ఆలాగు మొలిపించును గాక. మరియు మానవుడు, మరియు జంతువులు, మరియు ప్రతీది, ఎన్నటెన్నటికి జీవించునుగాక. అది సరియే.” చూశారా?

833 మరియు పిదప పాపము ప్రవేశించినది. మరియు నేను ఈ ప్రకటన చేయగోరుచున్నాను. ఆ…ఈ ఒక్క లేఖనముపై చాలా మంది ప్రజలు అటువంటి ఒక భయంకరమైన పొరపాటును చేస్తుంటారు, మరియు అది 23వ కీర్తన మీదయైయున్నది. వారు దానిని ఈ విధంగా చదువుతారు, “అవును, మరణఛాయపు గాడాంధకార లోయలో నేను సంచరించినను.” ఇప్పుడు, అటువంటిది ఏదియు లేదు. బైబిలు అట్లు చెప్పడం లేదు, అది, “గాడాంధకార లోయ…మరణఛాయల యొక్క గాడాంధకార లోయ.”

834 ఇట్లు చెప్పుచున్నది, “మరణఛాయపు లోయలో నేను సంచరించినను.” ఇప్పుడు, ఒక నీడ ఉండటానికి ముందు, ఆ నీడను కలుగజేయడానికి వెలుగు ఉండవలసియున్నది. చూడండి, దావీదు ఒక ప్రవక్తయైయుండి మరియు అభిషేకము క్రింద, అతడు పొరపాటు చేయలేదు, అతడు కేవలం సత్యమునే పలికాడు: “అవును, నేను…” గాడాంధకార లోయలో సంచరించినా, కాదు, అయితే, “మరణ ఛాయల లోయలో నేను సంచరించినను.”

835 పిదప ఒక నీడను కలుగజేయుటకు మీరు కొంత శాతం వెలుగును కలిగియుండవలసియున్నది. మరియు ఇక్కడ అది ఆ విధంగానే ఉన్నది. మనం ప్రకృతి సంబంధము మరియు సహజాతీతము రెండిటిగా ఉన్నాము. ఈ శరీరము మరణమునకు లోనైయున్నది, మరియు ఒక స్త్రీ ద్వారా తీసుకురాబడినది; మరి దేని ద్వారానో కాదు గాని…దేవుని ద్వారా కాదు, మీరు ఆదాము మరియు హవ్వ యొక్క పునరుత్పత్తియైయున్నారు. నలుపైనా, తెలుపైనా, లేదా మీరు ఏదైనాగాని, మీరు ఆదాము మరియు హవ్వ నుండి వచ్చిన ఒక ఉత్పత్తియైయున్నారు, ఒక సంతానమైయున్నారు. అదే మీ శరీరాన్ని “పాపములో జన్మించి, అతిక్రమములో రూపించబడి, అబద్ధములు ఆడుచూ లోకములోనికి వచ్చినదిగా,” చేస్తుంది. మీ జీవితము యొక్క ప్రారంభములోనే, కనీసం ఒక అవకాశమనేదే లేకుండా, మీరు దోషులుగా ఎంచబడి మరియు ఖండించబడినారు.

836 ఇప్పుడు, ఎందుకనగా మీరు కలిగియున్న ఆత్మను స్వభావమును బట్టి మీరు పొందుకుంటారు, మరియు అది లైంగీక సంభోగం నుండి వచ్చుచున్న స్వభావమును బట్టియైయున్నది, స్త్రీ మరియు పురుషుల యొక్క కోరిక భూసంబంధమైన బిడ్డను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఆ పిల్లవాణ్ణి వదిలివేయండి, మరియు అతనికి మంచిదేదియు బోధించకండి, అతడు చెడ్డ దారిలోకి వెళ్తాడు. అతనికి మంచియైనా లేదా చెడుయైనా నేర్పించకండి, అతడు చెడ్డ మార్గమునే తీసుకుంటాడు. ఎందుకనగా అలా చేయడం అతని స్వభావమైయున్నది.

837 ఒక చిన్న బిడ్డను, అంత ఎత్తు కూడా లేని ఒక బిడ్డను గమనించండి, అసలు ఎంతో కోపం తెచ్చుకుంటాడు; అతడు కేవలం…అతడు—అతడు చేతులు పిండుకుంటూ, మరియు ఊపిరి బిగబట్టుకొని, మరియు ముఖము ఎర్రజేసుకుంటాడు. నిశ్చయంగా. అదేమిటి? అది అతని స్వభావమైయున్నది. అది అతనికి తన తండ్రి నుండి గాని లేదా తన తల్లి నుండి గాని, ఎవరో ఒకరి నుండి వచ్చియున్నది; ఆమె, లేదా అతని తండ్రి ఒక క్రూరమైన దాడికి పోరాడేంత కోపమును కలిగియున్నారు. ఒకవేళ వారు కలిగిలేని యెడల, అతని తాతయ్య లేదా నానమ్మ కలిగియుండవచ్చును. చూడండి, ఇతడు సంతానమైయున్నాడు.

838 కావున అది…మిమ్మల్ని లోకములో జన్మించినవారిగా చేస్తుంది. మీరు స్వభావమును బట్టి వచ్చారు, మరియు మీ యొక్క ఉనికంతయు నల్లనిదై మరియు మురికిదై, మరియు దోషము కలిగినదై, మరియు శపించబడినదై మరియు నరకమునకు పోవుచున్నది. అది నిజము!

839 అయితే మీరు తిరిగి జన్మించినప్పుడు, అప్పుడు దేవునియొక్క వెలుగు లోపల ఆ అంతరాత్మలో ప్రకాశిస్తుంది (హల్లేలూయా) అప్పుడు అది ఇక ఎంతమాత్రము ఒక గాడాంధకారపు లోయ కాదు, కానీ అది దానిలో ఒక ఛాయను కలిగియున్న లోయయైయున్నది. మీరు ఇక్కడ చర్మముతో కప్పబడియుండవచ్చును, మరియు మన ముఖముపై వాటిని కలిగియుండవచ్చును, కానీ అక్కడ లోపల మాత్రం సరిపడా వెలుగు ఉన్నది. మరియు ఏదో ఒక దినమున ఆ వెలుగు మరియు చీకటి వేరవ్వవలసియున్నది! మరియు వెలుగు ప్రకాశించినప్పుడు, చీకటి పారిపోతుంది. మరియు ఆ శరీరములో మనం క్రీస్తుతో ఉండటానికి వెళ్ళినప్పుడు, చీకటి మరియు మరణము అదృశ్యమౌతాయి, మరియు మనం పరిపూర్ణమైన వెలుగులోనికి ప్రవేశిస్తాము. దేవునికి మహిమ! విషయము అదే; వ్యాధి ఇకను లేదు, ఇక దానితో చీకటి ఎంతమాత్రము కలపబడిలేదు.

840 సరిగ్గా ఇప్పుడు మనము వ్యాధి మరియు ఆనందము రెంటిని కలిగియున్నాము, మరియు ఆరోగ్యము మరియు బలమును కలిగియున్నాము, మరియు మనము క్లిష్ట పరిస్థితులను, హెచ్చు తగ్గులు, మరియు సంతోషము మరియు దుఃఖము, మొదలగువాటిని కలిగియున్నాము. మంచిది, అది కేవలం ఒక ఛాయయైయున్నది. అక్కడ వెలుగు ఉన్నదని తెలుసుకొనుటకు సరిపడా వెలుగును మనము కలిగియున్నాము; మరియు మనమింకనూ శరీరములో, అనగా మాంసములో ఉన్నాము. కానీ ఏదో ఒకరోజు సూర్యోదయము కానున్నది. అది ఆ సంహారక దూత పడక వద్ద కూర్చున్నప్పుడైయున్నది, అది వైద్యుడు అంతా అయిపోయినది అని చెప్పినప్పుడైయున్నది; మరియు సహజాతీతమైన దానిలోనుండి ఈ ప్రకృతి సంబంధమైనది వేరైనప్పుడైయున్నది, మరియు వెలుగు తిరిగి వెలుగును చేరుతుంది, మరియు చీకటి తిరిగి చీకటిలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుంది. అప్పుడే ఈ క్షయత అక్షయతను ధరిస్తుంది. మరప్పుడే ఈ మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుంది, మరియు మనము ఒక కాలము యొక్క జీవి నుండి ఒక నిత్యత్వపు జీవిగా మారుతాము. పూర్తిగా చీకటియుండి మీరు అక్కడికి వెళ్ళలేరు, మీరు ఆ చీకటిలో వెలుగును కలిగియుండవలసియున్నది. విషయము అదే. ఆ శరీరమునే మీరు పొందుకుంటారు.

841 మనము ఏమి చేద్దాము? మంచిది, నా ప్రియమైన పరిశుద్ధ సహోదరుడా, నా ప్రియమైన పరిశుద్ధ సహోదరీ, జగత్తు పునాది వేయబడకముందు, దేవుడు నిన్ను తన స్వరూపమందు సృష్టించినప్పుడు, లేదా ఆ—ఆ మానవుడిని తన స్వరూపములో సృష్టించినప్పుడు, మరియు పురుషుని యొక్క మహిమార్థమై స్త్రీని పురుషుని యొక్క స్వరూపములో సృష్టించినప్పుడు, ఆయన నిన్ను ఒక థియోఫెనిగా చేసాడు. సరిగ్గా ఆయన వలెనేయై యున్నది, “మనము” అని ఆయన చేసిన జీవులతో ఆయన చెప్పినప్పటివలె నున్నది, “మన స్వరూపమందు, మన పోలిక చొప్పున మనము నరుని చేయుదము, ఒక థియోఫెనిగా చేయుదము.” దేవుడు ఇంకను శరీరముగా మారలేదు, ఆయన ఒక థియోఫెనిలో ఉండెను.

842 మరియు మోషే ఆయనను చూసాడు. మోషే ఇట్లు మొఱ్ఱపెట్టాడు, “ప్రభువా, నిన్ను చూడనిమ్ము.”

843 ఆయన ఇట్లు చెప్పెను, “అటుగా వెళ్ళి మరియు బండలో, ఆ బండ సందులో దాగుకొనుము.” మరియు మోషే వెనుక ఆ బండ సందులోనికి వెళ్ళెను; మరియు దేవుడు ఆ ప్రక్కగా వెళ్ళినప్పుడు, మెరియుచు మరియు ఉరుముచుండెను…మరియు దేవుడు దాటి వెళ్ళుచుండగా, ఆయన తన వీపును ఈ విధంగా త్రిప్పుకొనియున్నాడు.

మరియు మోషే ఇట్లన్నాడు, “అది ఒక మనుష్యుని యొక్క వీపు.” హల్లేలూయా!

844 ఆయన ఎవరు? క్రిందికి దిగివచ్చిన, షాలేము రాజైన మెల్కీసెదెకు, తండ్రియు లేదా తల్లియు లేనివాడు, జీవితకాలమునకు ఆదియైనను లేదా జీవమునకు అంతమైనను లేనివాడు. అది ఆయనే! మరియు ఆయన దిగి వచ్చాడు. అబ్రాహాముతో మాట్లాడినది ఆయనే; తన కొరకు ఆ విధంగా ఒక చిన్న శరీరమును సమకూర్చుకున్నాడు, మరియు “వ్యూ!” అని దానిలోనికి ఊది, దానిలోనికి అడుగుపెట్టాడు, మరియు క్రిందికి వచ్చి ఒక దూడను తిన్నాడు, ఆవు పాలు త్రాగాడు, మరియు కొంత వెన్నను మరియు కొన్ని మొక్కజొన్న రొట్టెలను తిన్నాడు. మరియు ఇద్దరు దూతలున్నారు.

845 మరియు వారు అక్కడికి నడిచి వెళ్ళినప్పుడు, మరియు ఆ విషయమంతా కేవలం, “వ్యూ!” అదృశ్యమై వెళ్ళిపోయారు.

846 నేనెప్పుడూ దాని గూర్చి ఆలోచించలేదు. ఇక్కడ కొంత కాలం క్రితం, ఒక రైఫల్ తూటాను నింపుతున్నాను, నేను ఒక .22 రైఫల్ ను కలిగియున్నాను, అదొక .220 స్విఫ్ట్ అయ్యున్నది. మరియు ఇక్కడ రైఫల్ ను ఉపయోగించే సహోదరులకి తెలుసు. ఆ చిన్న బుల్లెట్టు, అది ఒక నలభై-ఎనిమిది గ్రెయిన్ బుల్లెట్టు, కేవలం అంత పొడవు ఉన్న, సాధారణ .22 బుల్లెట్టు. అది దాదాపు .30-06 ఛాంబర్ పవర్ లో నింపబడియున్నది. ఇప్పుడు నేను…కర్మాగారము దానిని దాదాపు సెకండుకు నలభై-నాలుగు వందల అడుగుల వరకు మాత్రమే నింపుతుంది. అది సరియే, కానీ మీరు సరిపడా…స్వయంగా మీరే నింపుకోవచ్చు, మరియు మీరు దానిని సెకండుకు ఐదు వేల అడుగుల వరకు పెట్టుకోవచ్చు. మరియు—మరియు అలా కాకుంటే, మీరు షూటింగు చేస్తున్నయెడల…ఒక రోజు, మేము రెండు వందల గజాల దూరం నుండి, షూటింగు చేస్తున్నాము, మరియు ఆ బుల్లెట్టు దుమ్మును తాకుచున్నది, తుపాకీ ప్రతిధ్వనించే లోపే అది వెళ్ళిపోవుచున్నది. అది అంత వేగంగా ఉన్నది.

847 పిదప మీరు ఒక పంటి పుల్లను తీసుకొని (మీకు తెలుసు కదా, పంటి పుల్లలో నున్నటి వైపు తీసుకొని) మరియు మీ మందుగుండులో ముంచి మరియు దానికి మొత్తం ఆ మందుగుండును, కేవలం నాలుగు లేదా ఐదు గింజలను అంటించి, మరియు దానిని అక్కడ పైన ఉంచి, మరియు పిదప మీ బుల్లెట్టును అక్కడ పెడతారు. ఇక్కడ నిలుచోండి, మరియు ఒక క్షణంలో మీ చేతిలో ఒక బుల్లెట్టు ఉంటుంది. మరియు మీ నుండి రెండువందల అడుగుల దూరంలో ఉన్న పందికొక్కును పేల్చితే, మరి ఆ పందికొక్కు కదలనైనా కదలలేదు. ఆ బుల్లెట్టు తిరిగి దాని యొక్క అసలైన స్థితిలోనికి, తిరిగి వాయువులలోనికి మారుతుంది. రాగి మరియు సీసము రెండిటితో చేయబడిన ఒక బుల్లెట్టు ఇక్కడున్నది, మరియు కేవలం ఒక్క క్షణంలో, మీరు మరలా దానిని కనుగొనలేనట్టి స్థితికి అది వెళ్ళిపోతుంది. ఒక వంద బిలియన్ సంవత్సరాల క్రితం అది ఎలాగున్నదో ఆ స్థితిలోనికి అది వెళ్ళినది, తిరిగి వాయువులలోనికి వెళ్ళినది. ఆ వాయువులు ఏర్పడి మరియు మరలా రాగి మరియు సీసము వలె, మరియు అటువంటివాటి వలె, మారవలసియున్నది. ఆ వాయువులు స్థిరపడవలసియున్నది.

848 ఇప్పుడు, విషయము అదే. ఆ విధంగానే మనము ఇక్కడ ఉండియున్నాము, మనము ఒక ఉన్నత జీవిగా ఉండుట నుండి వచ్చియున్నాము. ఆదిలో మనం దేవుని యొక్క స్వరూపములో ఉన్నాము. ఇప్పుడు ముసుకు మరియు చీకటి దానిని మనం తెలుసుకోకుండా చేస్తుంది. అయితే యేసు “జగత్తు పునాది వేయబడకముందే తాను వారితో ఉండియున్నాడు” అని తన శిష్యులతో చెప్పాడు. చూశారా? మనం ఉండియున్నాము! ఇప్పుడు మీరు దానిని తెలుసుకోలేరు, కానీ మీరు ఆదిలో ఉండియున్నారు. “మరియు భూమి మీదనున్న ఈ గుడారము శిథిలమైపోయినను, ఇదివరకే మన కొరకు ఒకటి వేచియున్నది!” హల్లేలూయా! మరియు పిదప మనం తినగలుగుచు మరియు కరచాలనం చేయగలుగుటకై, ఒకప్పుడు మనము నివసించినట్టి, ఈ థియోఫనిలోనికి మనం ప్రవేశిస్తాము. మరియు బలిపీఠము క్రిందనున్న ఆత్మలు ఇట్లు కేకలు వేయుచున్నవి, “ప్రభువా, ఎంతకాలము?”

849 దేవుని యొద్దకు వెళ్ళునట్టి ఏడు మెట్లు ఉన్నవి, ఏలయనగా అది—అది క్రిందకు వచ్చుచుండగా ఏడు ఆత్మలు ఉండియున్నవి. అది సరియే, మీరు దేవుని యొక్క బలిపీఠము క్రిందకి వెళ్ళుచుండగా, వారు ఇట్లు కేకలు వేయుచున్నారు, “ప్రభువా, ఎంతకాలము? మేమిక్కడి నుండి, వెనుకకు వెళ్ళగలమా?”

850 దేవుడు ఇట్లు చెప్పెను, “మీరు శ్రమపడినట్లే మీ సహదాసులు శ్రమపడువరకు, కేవలం కొద్ది సమయం వేచియుండవలెను.” చూశారా?

851 మరియు పిదప ఆత్మలు తిరిగి వచ్చి, మరియు వారు మరలా స్త్రీ పురుషులుగా మారుతారు, మరియు రాత్రి యొక్క అంధకారము మరియు మరణం మరియు వ్యాధి మరియు బాధ అంతయు తొలగిపోయినప్పుడు నిత్యమూ జీవిస్తారు; ఇక ఛాయా ఎంతమాత్రము లేదు, అది ఖచ్చితంగా సూర్యుని కాంతియే!

852 వినండి. విషయం ఇది. అది అవ్వగలిగేంత చీకటిగా అవ్వనీయండి; అయితే అది ఎంతో చీకటిగా మారేలోపు సూర్యుడు ఆ చీకటిలోని ప్రతీ అణువును బ్రద్దలు చేస్తాడు. చీకటి మరియు వెలుగు కలిసి ఎక్కువ కాలం ఉండలేవు. ఏలయనగా…ఏది ఎక్కువ శక్తివంతమైనది? వెలుగే. మరియు వెలుగు ప్రకాశించినప్పుడు, చీకటి తొలగిపోతుంది. ఆమేన్. మీరు సంతోషంగా లేరా? మీకు తెలిసినందుకు సంతోషంగా లేదా? ఇక ఎక్కడా ఛాయ అనేది లేదనుటలో, ఎటువంటి సందేహము లేదు. అయితే సరిగ్గా ఇప్పుడు మన హృదయములలో ఉన్నటువంటి ఈ ధన్యకరమైన వెలుగు: దేవుని కుమారుడు, దేవుని యొక్క శక్తిని గూర్చి, సాక్ష్యమిస్తున్నది.

853 మరియు మనము ఇక్కడికి వచ్చి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగివచ్చి మరియు ఒక కూటములోనికి ప్రవేశించి, మరియు ఇట్లు చెప్పుటను గమనిస్తున్నాము, “నీవు శ్రీమతి. ఫలాన-మరియు-ఫలాన, నీవు ఒక ఫలానా స్థలములో ఒక ఫలానా కార్యమును చేశావు. నీవు ఎంతో కాలంగా దీనితో బాధపడుతున్నావు, కానీ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ‘నీవు లేచి నిలబడుము, నీవు స్వస్థపరచబడినావు.’” మరియు ఒక కుంటివాడు మరియు గ్రుడ్డివాడు వారి పాదాల మీద లేచి నిలబడుటను గమనిస్తున్నాము. మరియు క్యాన్సర్ తో తినివేయబడి, ఛాయను కలిగియున్న ఒక మనుష్యుడు, జీవమును పొందుకొని మరియు మరలా నూతన ఆరోగ్యమును పొందుకొనుటను గమనిస్తున్నాము.

854 యేసు ఇట్లు చెప్పడంలో, ఎటువంటి సందేహము లేదు, “నేను చేయు ఈ క్రియలు, మీరును చేయుదురు.” మరియు ఆయన ఇట్లు చెప్పాడు, “తండ్రి నాకు చూపించే వరకు నేను ఏమియు చేయను.”

855 అదేమిటి? అది మనల్ని విమోచించుటకు, ఈ చీకటి లోనికి వచ్చిన వెలుగైయున్నది, మీరు చూడండి. నా భావము అర్థమైనదా?

856 ఇప్పుడు, ఏదో ఒక రోజు నేరుగా అక్కడికి తిరిగి వెళ్తుంది, మరియు అది ప్రారంభంలో ఉన్నట్లే ఆ థియోఫనీ మళ్ళీ అమర్త్యమైన శరీరంగా మారినప్పుడు, అప్పుడు యేసు వచ్చును, మరియు దేవుడు…క్రీస్తు ఒక్కటి అయినప్పుడైయున్నది. క్రీస్తు సింహాసనము మీద ఆసీనుడవుతాడు, మరియు ప్రజలందరూ మానవమాత్రులుగా ఉంటారు. క్రీస్తు దావీదు సింహాసనము మీద ఉంటాడు, ఒక మానవునిగా, ప్రభువైన యేసు; ఎన్నటికీ అమర్త్యునిగా ఉంటాడు. మనము ఎన్నటికీ మరణించము, మనము ఎన్నటికీ రోగులము కాము, ఇక దుఃఖము ఎంతమాత్రము ఉండదు, మరియు మనము వెయ్యి సంవత్సరాలు జీవిస్తాము.

857 మరియు ఆ వెయ్యి సంవత్సరాలు పూర్తయిన తర్వాత, అప్పుడు దయ్యము బయటకి వచ్చును; మరియు రెండవ పునరుత్థానము జరుగును, అనీతిమంతుల పునరుత్థానము. వారు సముద్రము యొక్క ఇసుక రేణువులవలె ఒక గొప్ప సైన్యమును పోగుచేయుదురు, మరియు పరిశుద్ధుల గుడారమును చుట్టుముట్టడానికి వచ్చెదరు, మరియు అది జరిగినప్పుడు, దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించి వారిని నాశనము చేస్తాడు.

858 మరియు యోహాను ఇట్లు చెప్పాడు, “నేను క్రొత్త ఆకాశమును మరియు క్రొత్త భూమిని చూశాను, ఏలయనగా మొదటి ఆకాశమును మరియు మొదటి భూమియు గతించిపోయెను, మరియు సముద్రమును ఇకను లేదు. మరియు యోహాను, అను నేను, నూతన యెరూషలేము, అను ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి, పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.” విషయం అదేయైయున్నది.

859 అక్కడ అతడు ఇట్లు చెప్పాడు, “భార్య…గొఱ్ఱెపిల్ల మరియు పెండ్లికుమార్తె అక్కడ సదాకాలం ఉంటారు.” లక్షలు మరియు లక్షల చదరపు మైళ్ళ వరకు, ఒక క్రొత్త భూమి ఉంటుంది. ఓ, మై. ఆ పట్టణము, పరిశుద్ధ గ్రంథము పదిహేను వేల చదరపు మైళ్ళ పట్టణాన్ని కొలుస్తుంది. అది పదిహేను వేల మైళ్ళ పొడవు, పదిహేను వేల మైళ్ళ వెడల్పు, మరియు పదిహేను వేల మైళ్ళ ఎత్తు ఉన్నది. అది ఖచ్చితంగా ఆ పట్టణమును గూర్చి బైబిలు గ్రంథము ఇచ్చిన వివరణయైయున్నది. సముద్రము ఇకను లేదనుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు, దాని కొరకు ఎటువంటి స్థలము లేదు.

860 ఓ, అటువంటి సౌందర్యం ఉంటుంది! మరియు అక్కడ, దేవుని సింహాసనము వద్ద ఒక ఊట ఉండియున్నది, అది ఆ సింహాసనముకెదురుగా ప్రవహించుచున్నది. అక్కడ చెట్టుకి…ఆ జీవనదికి ఇరువైపులా ఒక చెట్టు ఉండియున్నది. మరియు ఈ చెట్టులో పన్నెండు రకాల ఫలములు ఉండియున్నవి, మరియు ప్రతీ నెల అది దాని ఫలములను ఇస్తుంది.

861 అక్కడ ఇరువది నలుగురు పెద్దలు ఉండియున్నారు. అక్కడ వధువు ఉన్నది. అక్కడ నలుబది నాలుగు వేలమంది, ఆలయపు నపుంసకులు ఉండియున్నారు. ఓ సహోదరుడా, మనము ఎక్కడికో పోవుచున్నాము! మనకొరకు మీదటికి విషయాలు ఉండియున్నవి. నాలుగు…ఆ ఇరువది నలుగురు పెద్దలు. ఒక లక్ష నలుబది-నాలుగు వేలమంది నపుంసకులు. వధువు క్రీస్తుతో కూర్చునియుండుట. మై, మీరు మాట్లాడండి…నా గృహము, మాధూర్యమైన గృహము! ఆమేన్.

862 నేను అక్కడికి వెళ్ళే భాగ్యమును కలిగియున్నాను, మరియు మీరు అక్కడికి వెళ్ళే భాగ్యమును కలిగియున్నారని ఆలోచించడానికే అద్భుతంగా ఉన్నది. మరి మీరు ఈ అంధకారంలో నడుస్తూ మరియు అసలు వెలుగును చూడకుండా, మరియు చనిపోయి అగాధములోనికి వెళ్ళి మరియు ఏమీ కాకుండా పోవడాన్ని ఎందుకు ఎంచుకుంటారు? ఏలయనగా వెలుగు దాని సర్వాధికారాన్ని తీసుకున్నప్పుడు, చీకటికి ఇక ఎక్కడా చోటు లేదు. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎక్కడికి పోయినదో వెళ్ళి కనుగొనండి. సమస్త కార్యములు తిరిగి దేవుని వైపుకు మరలినప్పుడు, అది ఆ విధంగానే ఉంటుంది. అది, చీకటికి ఒక ప్రారంభము ఉన్నది, చీకటికి ఒక అంతము ఉంటుంది. వెలుగుకు ఎన్నడూ ఒక ప్రారంభము లేదు లేదా దానికి ఎన్నడూ ఒక అంతము ఉండదు. దేవునికి ఎన్నడూ ఒక ప్రారంభము లేదు లేదా ఎన్నడూ ఒక అంతము ఉండదు. కావున, ఏదో ఒక రోజు, ఈ సమస్త దుర్మార్గపు ప్రపంచము దాని పాపము మరియు దాని అందము, అని-పిలువబడే వాటన్నిటితో, మరియు దాని అద్భుతాలు మరియు ఉద్రేకాలు, మరియు దాని యొక్క సమస్త సౌందర్యము మరియు ప్రతీది గతించిపోతాయి, మరియు అవి ఇక ఉండవు. అవి ఇక మీదట ఉండవు, ఇక జ్ఞాపకము చేసుకొనబడవు! అది ఇట్లు చెప్పబడినది, కనీసం, “ఇకమీదట అవి కనీసం జ్ఞాపకము చేసుకొనబడవు.”

863 అయితే ప్రభువుచేత ఆశీర్వాదము నొందినవారు ఎప్పుడూ ఆయనతో ఉంటారు. ఆయన స్వంత మహిమా శరీరములాంటి ఒక శరీరమును మనము కలిగియుంటాము; మరియు ఆయనతో జీవిస్తాము, మరియు ఆయనతో తింటాము, మరియు ఆయనతో కూర్చుంటాము, మరియు ఎన్నటెన్నటికీ మరియు యుగయుగములు ఆయనతో నివసిస్తాము; మరియు ఆ నిత్య యుగములు ముగింపు లేకుండా ప్రపంచముతో గడుస్తాయి.

864 మరియు ఈ రాత్రి మీకు ఎంచుకునే అవకాశం ఉన్నది. మీరు ఆ స్థలమును కలుసుకొనుటకు సిద్ధపడనియెడల, మీరు ఎంతగా చర్చీకి వెళ్ళినా, మీరు ఎంతగా ఒక మంచి సంఘ సభ్యులైనా, మీరు నడుస్తున్న ఆ చీకటిలో క్రీస్తు మీకు ఒక నూతన జీవమును ఇవ్వనంతవరకు మీరు నశించినట్లే. మీరు మతభక్తిగలవారై యుండవచ్చును. మతభక్తి, వినండి, స్నేహితులారా, మతము మేధస్సంబంధమైనది. చూశారా? కయీను పిల్లలందరూ ఎప్పుడూ మతాన్ని కలిగియున్నారు. యేసు వచ్చినప్పుడు ఆ యూదులు కూడా మతాన్ని కలిగియున్నారు, కానీ వారు రక్షణను త్రోసివేశారు.

865 ఈ రాత్రి మీరు చాలా మతసంబంధులై యుండవచ్చును. మీరు ప్రెస్బిటేరియన్, మెథడిస్టు, పెంతెకొస్తు, నాజరీను, పిలిగ్రిం హోలీనెస్ ప్రజలైయ్యుండవచ్చును. మీరు ఎంతో భక్తిపరులైయుండి; మీ సంఘమునకు వెళ్ళి సాక్ష్యమివ్వవచ్చును, మీరు పాడి మరియు కేకలువేసి దేవుడిని స్తుతించవచ్చును, మీరు సంఘమునకు మీ దశమభాగములను తీసుకొనిరావచ్చును, మీరు మీ పొరుగువారితో చక్కగా వ్యవహరించవచ్చును, అయితే మీ యొక్క నిత్యమైన గమ్యముతో దానికి ఎటువంటి సంబంధమూ లేదు. కయీను వాటిలో ప్రతీదానిని చేసాడు. ఖచ్చితంగా.

866 బైబిలు ఇట్లు చెప్పియున్నది “గోధుమలు మరియు గురుగులు కలిసి ఎదుగుతాయి.” ఆ చిన్న గోధుమలు అక్కడ ఉండి, వర్షము కొరకు పరితపిస్తున్నవి, మరియు ఆ—ఆ గురుగులు కూడా అట్లేయున్నవి. వర్షం కురిసినప్పుడు, వర్షమును పొందుకొనుటకు గోధుమలు ఎంత సంతోషించాయో గురుగులు కూడా అంతే సంతోషించాయి. “అయితే, వారి ఫలములను బట్టి, మీరు వారిని తెలుసుకుంటారు.”

ఇప్పుడు మీరు మీ ఫలములను పరీక్షించుకొనుచుండగా మనము ప్రార్థించుకుందాము:

867 ఇప్పుడు, తండ్రివైన దేవా, ఈ రాత్రి ఇక్కడ చాలా కఠినమైన ప్రశ్నలు ఉండియున్నవి. నేను సరియైనది చేసియుండకపోవచ్చును, కానీ నాకు తెలిసినంతవరకు ఉత్తమమైనదానిని చెప్పాను; నా హృదయము నీకు తెలియును. దేవా, నీవు దానిని స్వీకరిస్తావని, నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఇప్పుడు, బహుశా, ఈ ప్రశ్నలు కొన్నింటిలో, నేను వాటిని సరిగా చెప్పనియెడల, అప్పుడు నీవే ఈ ప్రజల హృదయాలతో మాట్లాడుము, మరియు సరిగ్గా అవి ఎలా ఉండవలెనో నీవే వాటిని అట్లుంచుము. నీవే నాకు చెప్పినట్లు నాకు అనిపించుచున్నది. కానీ నేను తప్పైయున్నయెడల, అప్పుడు నీవు నన్ను క్షమించుము.

868 మరియు దేవా, నేను ఇట్లు ప్రార్థించుచున్నాను, వీరిలో ప్రతీఒక్కరూ ఈ కార్యములను వారి హృదయములోనికి తీసుకొని, మరియు వాటిని గూర్చి తలపోయుచు మరియు ఈ విధంగా అనుకొందురు గాక, “అవును, అదిగో అక్కడ సంఘము ఉన్నది, అదిగో ఈ సంగతులు ఉన్నవి. బైబిలు చెప్పినది అదే.”

869 బహుశా స్త్రీలు, ప్రభువా, వాటిని నేను ఏ వ్యక్తిగతమైన ఉద్దేశ్యముతో చెప్పలేదని నీవు ఎరిగియున్నావు. అయితే, దేవా, నేను—నేను నా సహోదరీలను ప్రేమిస్తున్నాను, మరియు తండ్రీ, నీవు దానిని ఎరిగియున్నావు. నేను వారి గురించి ఏ విధంగా ఆలోచిస్తానో నీవు ఎరిగియున్నావు. అయితే నిలబడి మరియు తప్పైయున్న దేనినైనా వారికి చెప్తే, నేను వారికి ఒక—ఒక మోసగాణ్ణి అవుతాను. నేను నా సహోదరీలను మోసపరిచేవాడిగా ఉండగోరుటలేదు, నేను వారికి సత్యమును చెప్పగోరుచున్నాను. మరియు, తండ్రీ, సరిగ్గా నీ వాక్యమునుండియే నేను దానిని తీసుకొనుచున్నాను.

870 మరియు ఇప్పుడు నేను నా సహోదరులను ఖండించడంలేదు, అయితే, ప్రభువా, ఈ కార్యములను వారు అనుమతించినప్పుడు వారు తప్పైయున్నారని నేను చెప్పుచున్నాను. మరియు ఆ స్త్రీ భిన్నముగా ఎరిగియుండి మరియు వెళ్ళి దానిని చేసిన యెడల, అప్పుడు ఆ సంఘకాపరి దోషి కాదుగాని, అది ఆమె పూచీయైయున్నది.

871 అబ్బా తండ్రీ, ఆ కార్యములు నీ వాక్యమైయున్నవి, మరియు వారు నీ కొరకైయున్నారు. ఇప్పుడు నీవు ప్రజల యొక్క హృదయాలతో మాట్లాడుము. వారందరిని నేను నీకు అప్పగిస్తున్నాను. నీవు ఏమి చేశావో నేను చూస్తాను, తండ్రీ; నీకు తెలిసేయున్నది. ప్రతీ హృదయముతో మాట్లాడుము. క్రీస్తు నామములో మేము అడుగుచున్నాము.

మరియు మన తలలు వంచియుండగా:

872 ఎవరైనా తమ చెయ్యిని ఎత్తి ఇట్లు చెప్తారేమోనని, నేను ఆలోచిస్తున్నాను, “సహోదరుడా బ్రెన్హామ్, నేను సంపూర్ణముగా జయించువాని వలె ఉండగలుగునట్లు, మరియు కడవరి దినమున పెండ్లి వస్త్రమును ధరించి క్రీస్తుతో కూడా ఉండునట్లు నన్ను జ్ఞాపకము చేసుకొనుము.” మీరు మీ చెయ్యి పైకెత్తి, ఇట్లు చెప్తారా, “నా కొరకు ప్రార్థించుము”?

873 అందరూ ఇప్పుడు కేవలం, మీ తలను క్రిందికి వంచియుంచండి. దేవుడు మిమ్మల్ని దీవించును, అది బాగున్నది. అక్కడ, చేతులెత్తుచున్న, నా సహోదరీలైన మిమ్మల్ని; మరియు, నా సహోదరులైన మిమ్మల్ని కూడా, దేవుడు దీవించును గాక. అది అద్భుతంగా ఉన్నది.

874 ఇప్పుడు, తండ్రీ, నీవు వారి చేతులను చూస్తున్నావు. (కొన్నిసార్లు మీరు, “సరి, అటువంటి ఒక చిన్న ప్రార్థనా?” అని అనుకుంటారని నాకు తెలుసు.) దేవా, నేను ఆ తల్లి గూర్చి ఆలోచిస్తున్నాను, నిన్న ఇట్లు చెప్పినది, “బ్రతుకుటకు మూడు వారాలే కలిగియుండి, మెదడులో క్యాన్సరు కణితితో ఆ దినమున ఆ అబ్బాయి మరణమౌతున్నప్పుడు, ఆమె ఇంటిలో చేయబడిన ఒక చిన్న ప్రార్థనయే, ఇప్పుడు పరిస్థితులను మార్చివేసినది.”

875 నేను హిజ్కియాను గూర్చి ఆలోచిస్తున్నాను, అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని, ఈ విధంగా ఏడ్చాడు, “ప్రభువా, నాపై కనికరము చూపమని, నేను నిన్ను వేడుకొనుచున్నాను. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, ఏలయనగా నేను నీ యెదుట యధార్థ హృదయుడనై నడుచుకున్నాను.” అది మరణము నుండి జీవమునకు మార్చివేసినది.

876 దేవుని కుమారుడి నుండి వచ్చిన ఒక్క కేక, “లాజరూ, బయటకు రమ్ము!” మరియు చనిపోయినవాడు బయటకు వచ్చాడు.

877 ఓ దేవా, నీవు ఇట్లు చెప్పావు, “పలుకుడి, అడుగుడి, మరియు అది ఇవ్వబడును. మీరు ఏదైనా పలికినప్పుడు, మీరు పలికినది జరుగుతుందని విశ్వాసముంచండి, మీరు పలికినది మీరు పొందుకుంటారు.”

878 ఇప్పుడు, తండ్రీ, తమ చేతులెత్తిన ప్రతీఒక్కరూ వారి చేతులను దేని కొరకు ఎత్తారో దానిని పొందుకుంటారని నేను ప్రార్థించుచున్నాను. మరియు వారు ఆశీర్వదించబడుదురు గాక. మరియు దేవా, నీవు మా సహోదరీలకు సహాయము చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను, వారు…వారు సరిగ్గా నడుచుకొందురు గాక, టెలివిజను ద్వారా మరియు ట్రూ స్టోరీ అనే పత్రిక మరియు, తేలికగా అందుబాటులో పెట్టబడిన అటువంటివాటి ద్వారా, మరియు అశ్లీలమైన కార్యక్రమాలు, ఆ టెలివిజన్లలో తుచ్చమైన మరియు అసహ్యమైనవి మరియు అటువంటివి, అది…నీ కొరకు లక్షల కొలది ఆత్మలను గెలిచేందుకు ఒక సాధనముగా ఉండవచ్చు గాని, అవి ఎంతో అశ్లీలమైపోయినవి, మరియు ఈ తుచ్చమైనవి అందులో ప్రసారము చేయబడుచున్నవి…ఓ, ఎంత దయనీయకరము! మరియు దయ్యపు ఆత్మ మా సహోదరీలలోనికి మరియు వారి చుట్టు వచ్చియున్నదని, మరియు వారు ఆ విధంగా వస్త్రధారణ చేసుకొని మరియు ఆ విధంగా తయారగునట్లు చేసేందుకు ప్రయత్నిస్తుందని తెలుసుకొనుట బాధకరముగా ఉన్నది.

879 మరియు మేము ఇట్లు కనుగొనుచున్నాము…మా సహోదరులలో, కూడా, ప్రభువా, వారు పొగ త్రాగుచు మరియు మధ్యము సేవిస్తూ, మరియు ఆ విధంగా కొనసాగుతూ, మరి అయిననూ వారు “నమ్ముచున్నాము” అని చెప్పుచున్నారు గనుక క్రైస్తవులుగా ఉండగలరని వారు అనుకొనుచున్నారు. అయితే వారికి ఇది తెలియబడును గాక “దయ్యము కూడా, నమ్ముచున్నది.” మరియు వాడు రక్షించబడలేదు, “వాడు నమ్ముచు వణుకుచున్నాడు.”

880 మరియు ఇప్పుడు, తండ్రీ, మా అందరికి నీవు కనికరము చూపుతావని, మరియు మా పాపములను క్షమిస్తావని మేము ప్రార్థించుచున్నాము, మరియు బహుశా కొందరు తమ చేతులను ఎత్తకపోవచ్చును, ఓ దేవా, కనికరము చూపుము. బహుశా వారు పొందుకునే తదుపరి అవకాశములో, వారు తమ చేతులను ఎత్తుదురు గాక.

881 ప్రభువా, మేము ప్రభు రాత్రి భోజనమును తీసుకొనబోవుచున్నాము. జీవితములో మా అతిక్రమాలకు మరియు మా గతంలోని విషయాలకు మమ్మల్ని క్షమించుము. మరియు మేము నీ ఆశీర్వాదమును పొందుకొందుము గాక, ఏలయనగా క్రీస్తు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

882 ప్రభువు మిమ్మల్ని దీవించును. మిమ్మల్ని ఈ విధంగా ఉంచినందుకు నన్ను మన్నించండి. సరిగ్గా ప్రభు రాత్రి భోజనముకు ముందు, ప్రార్థన కొరకు వచ్చినవారు, ప్రార్థనను కోరువారు ఎవరైనా ఉన్నారేమో అని నేను ఆలోచిస్తున్నాను, సరి, ప్రార్థన కొరకు ఎవరైనా ఉన్నయెడల, సరిగ్గా ఈ సమయంలో దానిని చేయుటకు మేము సంతోషిస్తాము.

883 మంచిది, సహోదరుడా, నీవు ఆమెను నేరుగా పైకి తీసుకొనిరా, అది పర్వాలేదు. మరియు ఒక్క క్షణంలో, మరియు మనము—మనము ముగించబోవుచున్నాము. మరియు మనము ముగించుకున్న తర్వాత, అప్పుడు ప్రభురాత్రి భోజము కొరకు ఉండాలనుకునేవారు, ఉండవచ్చును. అయితే ఇప్పుడు మాత్రం మేము రోగుల కొరకు ప్రార్థన చేయబోవుచున్నాము. బైబిలు గ్రంథము ఏమి చెప్పినది?

884 ఆ సహోదరుడు లేవలేని యెడల…అది పర్వాలేదు, కేవలం అతణ్ణి అక్కడ ఉండనివ్వండి, మేమే అతని దగ్గరకు వస్తాము. మంచిది, అతణ్ణి అక్కడే కూర్చోనివ్వండి. మరియు మేము క్రిందకు వచ్చి మరియు అతని కొరకు పార్థిస్తాము. మరేం పర్వాలేదు. మంచిది, అయ్యా, కేవలం అతణ్ణి—అతణ్ణి అక్కడే ఉండనివ్వండి. ఇక్కడ నిలబడటం అతనికి కష్టంగా ఉంటుంది, ఎందుకు, మేము నేరుగా అతని దగ్గరకు రావడానికి సంతోషిస్తాము.

885 ఇప్పుడు నా ప్రియమైన స్నేహితుడా, నేను ఈ ఒక్క చిన్న విషయాన్ని చెప్పగోరుచున్నాను. చూడండి, దేవుడు మళ్ళీ మళ్ళీ అనేకసార్లు దీనిని రుజువు చేసాడని నాకు—నాకు తెలుసు. చూశారా? నేను అంత పెద్ద బోధకుడనేమీ కాను, విద్య మరియు అటువంటిదేదీ నాకు లేదు. నేను ప్రభువైన యేసును ప్రేమిస్తున్నాను, నేను ఆయనను ప్రేమిస్తున్నానని దేవుడికి తెలుసు. అయితే ఒకటి చేయడానికి నేను పిలువబడ్డాను, అది రోగుల కొరకు ప్రార్థించుటయైయున్నది. దానిని మీరు నమ్ముతున్నారా? నాకు అసలు ఆ వరమును గూర్చి తెలియడానికి ముందే, నేను బయట ఈ ఆసుపత్రికి వెళ్ళేవాడిని; మరియు ఆ నర్సులు ఇలా చెప్పడం నాకు గుర్తున్నది, “ఇప్పుడు నీవు బాగవ్వబోవుచున్నావు.” చూశారా? మరియు ఏదో ఉండియున్నది, ప్రజల కొరకైన నా ప్రార్థనలను ఘనపరచుటకు దేవుడు ఎంతో కృపగలిగియున్నాడు.

886 ఈ రాత్రి, ప్రపంచమంతటా, ఒక ప్రపంచ-వ్యాప్తమైన కుదుపు సంభవించి, ఒక పిలుపు వచ్చిన యెడల ఎట్లుండునని, నేను ఊహించుచున్నాను. మరియు ఇట్లు చెప్పబడినదని అనుకుందాము, సహోదరుడు బ్రెన్హామ్ ప్రార్థన చేసిన ప్రతియొక్కరు, ఇక్కడికి రండి, ఒక ఉత్తరముతో, మీరు అమెరికా ప్రభుత్వానికి జవాబునివ్వాలని నేను కోరుచున్నాను. మరియు అది ప్రపంచ-వ్యాప్తంగా ప్రసారము చేయబడుతుంది. అది తెలియజేయబడితే, బహుశా నలభై లేదా యాభై లక్షలమంది ప్రజలు ఆ పిలిపుకు సమాధానమిస్తారని నేను అనుకొనుచున్నాను. చూశారా?

887 మరియు ఆ ప్రజలు, లేదా వారిలో కొందరు ఇదివరకే మరణించి, వైద్యుని ద్వారా, మరియు—మరియు అంత్యక్రియలు చేయువాని ద్వారా సమాధికి సిద్ధపరచబడినారు. వారిలో కొందరు ప్రమాదాలలో చనిపోయారు; కొందరు సహజ మరణం పొందారు. వారిలో కొందరు గ్రుడ్డివారు, కుంటివారు, అంగవైకల్యం గలవారు, వికారంగా ఉన్నవారు, వ్యాధి పీడితులు, మానసిక వ్యాధిగలవారు…ఆసుపత్రిలో ఉండి, మరియు మేము వారి కొరకు ప్రార్థన చేయడానికి ఆసుపత్రిలో ఉన్నామని కూడా ఎరుగకయున్నారు. వారిని లోపలికి, తీసుకొనిరావలసి వచ్చినది. వారు దారిన కొట్టుకుంటూ వస్తారు మరియు తమను తాము ముక్కలుగా కోసుకుంటారు, కనీసం తాను ఎక్కడ ఉన్నాడో కూడా అతనికి తెలియదు. కాని ఐదు నిమిషాలలో, సాధారణంగా మారిపోయి, మాధుర్యమైన, ప్రియమైన ప్రజలుగా మారి, వారి తక్కిన దినములన్నియు సరియైన మతిస్తిమితము గలవారిగా ఉన్నారు. చూశారా?

888 అది…అది ఏమిటి? అది బ్రెన్‌హామ్ సహోదరుడు కాదు. అది యేసుక్రీస్తు, రోగుల కొరకు ప్రార్థించడానికి ఆయన నన్ను పంపాడు. ఇప్పుడు విషయము ఇదే. అది జఫర్సన్ విల్ లో అంత విజయవంతంగా ఉండలేదు, ఎందుకనగా, ఇదిగో వినండి. ఇప్పుడు, నా యొక్క అత్యంత సన్నిహితమైన ఆప్తమిత్రులలో కొందరు సరిగ్గా ఈ పట్టణములోనే ఉన్నారని నేను మీకు తెలియజేయగోరుచున్నాను. ఈ పట్టణము మాత్రము, ఈ పట్టణము యొక్క స్థితి, నాకు నచ్చదు. నాకు ఈ పరిస్థితి నచ్చదు, ముందెన్నడూ కూడా నచ్చియుండలేదు; నేను ఒక చిన్న పిల్లవానిగా ఉండి, కూర్చొని, నా యొక్క చరిత్ర పుస్తకాలను చదువుచున్నప్పుడు, ఇట్లనుకున్నాను, “ఏదో ఒక రోజు నేను ఇక్కడినుండి వెళ్ళిపోతాను.” చూశారా?

889 నాకు జఫర్సన్ విల్ ఇష్టముండదు, ఇది ఒక బురదనేలగా, ఇక్కడ క్రింద ఉన్నది. అది ఎంతో బురదతో నిండియున్నది, మరియు—మరియు అది అస్సలు బాగోదు. మీరు చూడగోరినయెడల ఇక్కడ స్పికర్ట్ నాబ్ కైనా లేదా మరెక్కడికైనా ఆ పైకి వెళ్ళి, మరియు క్రిందకు, న్యూ ఆల్బనీ మరియు జఫర్సన్ విల్ వైపునకు చూడండి. ఇక్కడ చూడండి, వైద్యులు కూడా దీనిని చెప్పుచున్నారు, అదేమనగా, “ఈ లోయలో ఉన్న ప్రజలు అక్కడున్న పరిస్థితివలన రక్తహీనతకు గురవుతున్నారు.”

890 ఇక్కడున్న ఒక చిన్న స్త్రీ, శ్రీమతి. మోర్గన్, క్యాన్సరు నుండి స్వస్థత పొందినది, తన కుక్కను వైద్యశాలకు తీసుకొని వెళ్ళినది, దానికి గజ్జి ఉన్నదని ఆమె అనుకున్నది. అదేమిటో మీకు తెలుసా? అది ఎక్కడైతే తిరిగినదో ఆ కలుపు మొక్కలపై కోల్గేట్ యొక్క చెత్తపోగు మరియు అటువంటివన్ని ఉండుటవలనైయున్నది. అది అత్యంత అనారోగ్యకరమైన స్థలమైయున్నది.

891 ఒక వ్యక్తి సైన్యములో ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు మరియు…అతనికి ఉబ్బసం జబ్బు వచ్చినది. ఇక్కడ ఫ్లోరిడాకు వెళ్ళాడు మరియు అతని కళ్ళు చాలా నల్లగా మారాయి, మరియు అతడు వైద్యుని దగ్గరకు వెళ్ళాడు, మరియు అతడు ఇట్లన్నాడు, “డాక్టర్ గారు…”

892 డాక్టర్ ఇట్లన్నాడు, “ఇప్పుడు, నీవు కొట్లాటకు వెళ్ళావు, కాదా?”

893 అందుకతడు ఇట్లన్నాడు, “లేద, అయ్యా, నేను వెళ్ళలేదు.”

894 అతనెవరో మీరు తెలుసుకోగోరిన యెడల, అతని పేరు హీర్బీ. ఇప్పుడు, నేను కేవలం ఆలోచించగలిగితే…అది—అది న్యూ ఆల్బనీలోని, యూనియన్ నేషనల్ బ్యాంకులో, అతడొక అధికారియైయున్నాడు. కేవలం అక్కడికి వెళ్ళి మరియు “హీర్బీ” అను పేరుగల అతణ్ణి కనుగొనండి, అతణ్ణి అడగండి.

895 మరియు అతడు…అతడు వెళ్ళి, అతడు ఇలా అన్నాడు, “డాక్టరు గారు,” ఇట్లన్నాడు, “నాకు సైనస్ వ్యాధి వచ్చినది.”

896 మరియు అతడు అతణ్ణి పరీక్షించి, ఇట్లన్నాడు, “అది నిజమే.” ఇంకా ఇట్లన్నాడు, “నీవు కొట్లాటకు వెళ్ళావేమో అని నేను అనుకున్నాను.” ఇట్లన్నాడు, “అబ్బాయ్, నీవు ఎక్కడ నివసిస్తావు?”

897 అతడు ఇలా చెప్పాడు, “మీకు ఆ స్థలము తెలిసియుండదు,” ఇట్లన్నాడు, “కెంటకీ, లూయివిల్ కు ఆవలిన, ఇండియానా, న్యూ ఆల్బని అని పిలువబడే ఒక చిన్న పట్టణంలో నేను నివసిస్తాను.”

898 అందుకతడు ఇట్లన్నాడు, “ఇక్కడికి వచ్చుట వలన, ఇక్కడ ఈ మయామీ ఉప్పునీరు వలన నీకు సైనసు వ్యాధి వచ్చిందని నీవు నాకు చెప్పాలనుకుంటున్నావా?” ఇంకా ఇట్లన్నాడు, “నీవు ఇండియానాలోని, జఫర్సన్ విల్ లో, లేదా ఇండియానాలోని, న్యూ ఆల్బనీలో నీవు నివసించగలిగితే, అమెరికా దేశపు సైన్యము నిన్ను ప్రపంచములో ఎక్కడికి పంపినా నీవు అక్కడ బ్రతుకగలవు.” అంతే. చూశారా?

899 మలేరియాతో నిండిన ఒక బురదగుంట అనేది లేదంటే, నాకు తెలిసినంతవరకు, ఇదే ప్రపంచములోకెల్ల అత్యంత అనారోగ్యకరమైన స్థలమైయున్నది. చూశారా? మరియు నాకు—నాకు—నాకు—నాకు ఇక్కడ స్నేహితులున్నారు.

900 ఇక్కడ చూడండి, నేను వారిని ఈ విధంగా పిలువగలను. డాక్టర్. శ్యాం అడైర్ ను చూడండి, నా దోస్తైయున్నాడు. మంచిది, అక్కడ కూర్చొనియున్న, మైక్ ఈగన్ ఉన్నాడు. ఓ, మై, ఎంతమందినని నేను చెప్పగలను! వందల కొలది నిజమైన మంచి స్నేహితులు, నేను స్నేహము చేసినటువంటి, నా పాత స్నేహితులు…నేను ఎంతమంది కొత్త స్నేహితులను కనుగొన్నాగాని, ఒక పాత స్నేహితుని యొక్క స్థానమును తీసుకునేది ఏదియు లేదు. అది మీకు తెలుసు.

901 అక్కడ వృద్ధురాలైన నా తల్లి ఆ వెనుక కూర్చొనియున్నది, భూమిపై ఇంకెన్నో రోజులను కలిగిలేదు, ఆమె ఇప్పుడు తన అరవైలలో ఉన్నది. నా భార్య యొక్క తల్లి ఉన్నది, ఆమెకు డెబ్బై, డెబ్బై- ఒకటవ సంవత్సరం కొనసాగుచున్నది; ఈ రాత్రి, ఆ వెనుక ఎక్కడో కూర్చొనియున్నదని, నేను అనుకొనుచున్నాను. మరియు అక్కడ, ఆమె విషయం వదిలేయండి. మా నాన్న గారు ఇక్కడ పాతిపెట్టబడ్డారు; నా భార్య ఇక్కడ వాల్‌నట్ రిడ్జ్‌లో పాతిపెట్టబడినది; నా బిడ్డ అక్కడే పెట్టబడినది. నా భావము అర్థమైందా?

902 నాకు—నాకు—నాకు ఇష్టం లేదు…నేను—నేను—నేను—నేను ఇక్కడ ఉండాలని కోరుకోవడం లేదు, మరియు నేను త్వరలో, వెంటనే, బయలుదేరవలసి ఉంటుందని నేను నమ్ముచున్నాను. చూడండి, అది స్థిరముగా, నా వద్దకు వచ్చుచున్నది, నేను దీనిని ప్రసంగ వేదికపైనుండి మరియు నా బైబిలు గ్రంథము ఎదుట చెప్పుచున్నాను.

903 నేను నా భార్యకు చెప్పియున్నాను, కాపరి గృహాన్ని కట్టుకోవడానికి వారు మాకు డబ్బును ఇచ్చినప్పుడు మరి నేను దానిని ఈ సంఘానికి ఇచ్చివేసాను…ఆ కాపరి గృహము ఈ సంఘానికి చెందియున్నది; ఇక్కడకు వెళ్ళి, అది నిజమో కాదో తెలుసుకోండి. చూడండి, నేను దానిని నా కొరకు తీసుకొనలేదు.

904 ఇప్పుడు, నేను అక్కడ నిర్మించబోతున్నప్పుడు, మేడా ఇట్లన్నది, “మా అమ్మ నిమిత్తము నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను.”

905 నేను ఇట్లు చెప్పాను, “ప్రియా, మనం దానిని చేసినంత నిశ్చయంగానే, మనము దాని గురించి చింతిస్తాము. చూడు, అది అసలు పనిచేయదు. ‘వేరుకమ్ము,’ అని దేవుడు చెప్పాడు, నేను దానిని చేయవలసియున్నది.”

906 అయితే ఇట్లన్నది, “మరి, మా అమ్మ!”

907 నేను ఇట్లన్నాను, “మా అమ్మ, కూడా. ‘అయితే తన స్వకీయులను విడిచిపెట్టి, నన్ను వెంబడించనివాడు, నావాడని పిలువబడుటకు పాత్రుడు కాడు.’ మరియు అది వాస్తవమైయున్నది.”

908 త్వరలోనే, ఏదో ఒక రోజు, నేను వెళ్ళాల్సియుంటుందని, దూరంగా వెళ్ళాల్సియుంటుందని, నాకు అనిపించుచున్నది. అయితే దానికి మార్గం ఇక్కడున్నది, ఈ కూటములు ఇక్కడ పనిచేయవు. మరెక్కడైనా పనిచేసినంతగా ఇక్కడ అది పనిచేయదు, మరియు ఎన్నడైనా ఆ కూటములలో ఉండిన ఎవరికైనా అది నిజమని తెలియును, ఎందుకనగా అది సరిగ్గా ఇక్కడ నా స్వగ్రామములోయై యున్నది. అంతే.

909 యేసు వచ్చినప్పుడు ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.

910 వారు ఇలా అడిగారు, “ఈ అబ్బాయి ఎవరు? ఇతడు ఇక్కడున్న ఆ వడ్రంగివాని కుమారుడు కాడా? అతడు అసలు ఏ పాఠశాలకు వెళ్ళాడు? ఈ పాండిత్యాన్ని అతడు ఎక్కడ నుండి పొందుకున్నాడు? ఇప్పుడు నీవు చేయడాన్ని నన్ను చూడనివ్వు…నీవు అక్కడ అద్భుతాలు చేశావని నీవు చెప్పావు కదా, నీవు అదే కార్యమును ఇక్కడ చేయుటను నన్ను చూడనివ్వు. నీవు కపెర్నహోములో ఏమి చేసావో, దానినే నీవు ఇక్కడ చేయుటను నన్ను చూడనివ్వు.”

911 యేసు ఇట్లన్నాడు…“ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను.” ఆయన వెనక్కి తిరిగి ఇట్లన్నాడు, “నిశ్చయంగా, నేను మీతో, చెప్పుచున్నదేమనగా, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడు.” అది సరియేనా?

912 మరియు మనకు తెలుసు…అటు చూడండి…ఫిన్నీని తీసుకోండి, సాంకీని తీసుకోండి, మూడీ; జాన్ వెస్లీని తీసుకోండి, తన ప్రాంతాన్ని విడిచిపెట్టేవరకు, చూడండి, అతడు ఎన్నడూ సఫలము కాలేకపోయాడు. చూడండి—చూడండి—మూడీ వైపు—చూడండి. బోస్టన్ కు చెందియున్న, ఒక బూట్లు కుట్టువాడైన మూడీ, అస్సలు సఫలమవ్వలేకపోయాడు, అతను ప్రసిద్ధి చెందడానికి ముందు అతడు చికాగోకు వచ్చాడు. చూశారా? అతడు తన స్వంతవారి నుండి వేరవ్వవలసియున్నది. మీరు ఎల్లప్పుడూ దానిని చేయవలసియున్నది.

913 కానీ ఇప్పుడు, ఇక్కడ, అది విలియం బ్రెన్‌హామ్‌ అని మీరు మర్చిపోతే దేవుడు మీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు (చూశారా?), దానిలో విలియం బ్రెన్‌హామ్‌ చేసేది ఏదైనా ఉందని మీరు మర్చిపోతే చాలు, అతడు కేవలం నిలబడి మీ కొరకు ప్రార్థన చేయువాడైయున్నాడు. మీరు దానిని నమ్మగలిగినట్లైతే, మీరు చేయమని అడిగినదానిని ఇదివరకే చేసినది యేసుక్రీస్తైయున్నాడు. చూశారా? చేయడానికి ఏమియు లేదు…కేవలం సాక్ష్యమివ్వడం తప్ప, నేను దానిలో చేయవలసింది ఏమియు లేదు. కానీ ఇక్కడ మీతో కలిసి ఎదిగియున్న తర్వాత, మరియు నా ప్రతి బలహీనత, మరియు నా ప్రతి తప్పిదము మీకు తెలుసు…మరియు సరిగ్గా ఈ నగరంలో, దేవుడు ఏమి చేసాడో మీకు తెలుసు.

914 ఏదో ఒక రోజు, తీర్పు దినమున, ఈ నగరం ఎంతో లెక్క చెప్పవలసియుంటుంది, ఎందుకనగా సరిగ్గా ఇక్కడే వందల వేల కొలది అసాధారణమైన స్వస్థతలు జరిగియున్నవి (అది నిజము.), సరిగ్గా ఇక్కడే. సూచనలు మరియు అద్భుతాలు, మరియు ఆ దిగువున దూత ప్రత్యక్షమవ్వడం జరిగినవి, మరియు వార్తాపత్రికలు దానిని ముద్రించినవి మరియు అదంతా జరిగినది, మరి ఇంకనూ ప్రజలు నమ్ముటలేదు…అది ఎందువలన?

915 ఇప్పుడు ఏదో ఒక రోజు, నేను ఇక్కడి నుండి వెళ్ళబోవుచున్నాను. నేను ఇలా ఆశ్చర్యపోవుచున్నాను: “నా ముగింపు ఏమైయ్యుంటుంది? అంతా అయిపోయినదా? ఇది ముగియనున్నదా? నాకు నలభై-ఎనిమిది సంవత్సరాలు. ఇది ఇప్పుడే ముగియనున్నదా?” నేను ఈ విధంగా ఆశ్చర్యపోవుచున్నాను. అది అట్లయినయెడల…

916 చూడండి, ఎందుకని ప్రపంచము అక్కడున్న ఆ చిత్రపటమును గ్రహించలేదు? ఎందుకని వారు వెంటనే దానిని గ్రహించలేదు? ఎందుకని వారు ఈ ఇతర విషయాలను గ్రహించలేకున్నారు? ఎందుకని వారు ఈ ప్రవచనాలను మరియు అట్టి విషయాలను గ్రహించలేకున్నారు? మీకు తెలుసా, వారు ఇప్పుడు గ్రహించలేరు, కానీ ఒక రోజు నేను లోకాన్ని విడిచిపెట్టబోవుచున్నాను, మరియు నేను వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు వారు దానిని గుర్తిస్తారు. మీలో కొందరు యౌవనస్థులు నేను వెళ్ళిపోయిన తర్వాత దానిని గ్రహించుతారు. చూశారా? అయితే ఇప్పుడు అది జరగడానికి దేవుడు అనుమతించడంలేదు. అది ఏమిటో చూడండి…నా ఉద్దేశ్యం మీకు అర్థమౌతుంది కదా. [టేపుపై ఖాళీ ఉన్నది—సంపా.]

917 …కేవలం ఒక చిన్న పాప యొక్క చేతి గొలుసు. ఎవరైనా దానిని కలిగియుండవచ్చును. మరియు నేను నమ్ముచున్నాను, సహోదరుడు సాత్‌మన్ పోయినసారి ఇక్కడకు వచ్చినప్పుడు ఒక బైబిలు గ్రంథమును ఇక్కడ విడిచిపెట్టాడని చెప్పినట్లు నేను నమ్ముచున్నాను. ఒక బైబిలు గ్రంథమును, ఇక్కడ వదిలివేయబడియున్న ఒక—ఒక బైబిలు గ్రంథమును ఎవరైనా కనుగొన్నారా? మీరు కనుగొనినయెడల, అది కెనడా నుండి వచ్చిన సహోదరుడు ఫ్రెడ్ సోత్‌మన్‌కు చెందినది. ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము.

918 ప్రభువా, కనికరము చూపుము, సంగీతం మాధూర్యంగా మ్రోగుచుండగా సోదరుడు నెవిల్ నూనెతో అభిషేకించబోవుచుండగా, నేను యేసు నామంలో రోగులపై చేతులు ఉంచటానికి వెళ్ళుచున్నాను. ప్రభువా, వారి స్వస్థత కొరకు, దానిని అనుగ్రహించుము. ఆమేన్.

919 అందరూ, ఇప్పుడు, ప్రతీ ఒక్కరూ ప్రార్థించండి. మంచిది.

ప్రభువా, ఆ చిన్న పిల్లవాడు, అతని తాతయ్య అతని కొరకు ఇక్కడ నిలబడియున్నాడు. పాలు, ఏ రకం పాలైనా అతని శరీరానికి పడటంలేదు. అయితే నీవు సర్వశక్తిని కలిగియున్నావు మరియు ఆ చిన్నవాడు తన కొరకు తాను విశ్వాసాన్ని కలిగియుండలేడు. మరియు పిదప, ప్రభువా, ఆ తల్లిదండ్రులు మరియు తాతామామ్మలతో కలసి, నేను దాని కొరకు విశ్వాసాన్ని కలిగియున్నాను మరియు మేము ఇట్లు పలుకుచున్నాము, యేసు నామములో, ఈ శిశువు పాలు త్రాగునుగాక మరియు దేవుని మహిమ కొరకు జీవించును గాక. ఆమేన్. అది అలాగే జరుగుతుంది.

ఓ, దేవా, ఆమె తన తండ్రి కొరకు ప్రార్థిస్తున్నది. నీవు ఆమె తండ్రిని స్వస్థపరచి మరియు అతనికి అవసరమైనదానిని అతనికి అనుగ్రహిస్తావని నేను ఆమెతో కలిసి, క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

920 ఇప్పుడు, ఇది సామాన్యంగా ఉన్నది కదా? ప్రజలు ప్రార్థిస్తున్నారు, కానీ ప్రజలు…వారు ఒక పెద్ద విషయం కొరకు చూస్తారు మరియు వారు దానిని క్లిష్టమైనదిగా చేస్తారు. దేవుడు దానిని సామాన్యంగా చేస్తాడు. మీరు దానిని క్లిష్టమైనదిగా చేసి మరియు దానిని తప్పిపోతారు. చూశారా? కేవలం…దేవుడు చెప్పినట్లుగా దానిని సామాన్యంగానే ఉండనివ్వండి: “నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థతనొందుదురు,” అని దేవుడు చెప్పినట్లు ఉండనివ్వండి.

921 ప్రభువా, మేము ఈ స్త్రీపై చేతులుంచుచున్నాము, ఇక్కడ నిలబడియున్న మా ఈ సహోదరి, మరియు యేసుక్రీస్తు నామంలో మేము దీనిని అడుగుచుండగా, ఆమె స్వస్థత పొందును గాక. ఆమేన్.

922 తండ్రీ, మేము యేసుక్రీస్తు నామంలో, మా సోదరిపై చేతులుంచుచుండగా, బైబిలు గ్రంథము మరియు ప్రభువు యొక్క బోధనల జ్ఞాపకార్థంగా, ఆమె స్వస్థత పొందును గాక.

తండ్రీ, క్రీస్తు నామములో, మేము మా సోదరి యొక్క స్వస్థత కొరకు అడుగుచున్నాము, మరియు మేము నీ వాక్యమునకు లోబడుచుండగా నీవు ఆమెను సంపూర్ణంగా స్వస్థపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను, ఆమె స్వస్థ పడగలదా అని నా మనస్సులో ఒక్క సందేహం కూడా లేదు…?…ఆమేన్.

923 తండ్రీ, మేము మా సహూదరిపై చేతులుంచి, మరియు మేము, ప్రభువైన యేసు నామములో, నీవు ఆమెను స్వస్థపరచి మరియు ఆమెను బాగుచేయుదువని అడుగుచున్నాము. ఆమేన్.

ప్రభువైన యేసు నామములో, మేము మా సహూదరునిపై చేతులుంచి, దేవుని మహిమార్థమై నీవు అతనిని సంపూర్ణంగా స్వస్థపరచుదువని అడుగుచున్నాము.

తండ్రీ, ప్రభువైన యేసు నామములో, మేము ఈ సహూదరిని అభిషేకిస్తున్నాము, మరియు యేసు నామములో ఆమెపై చేతులుంచి ఆమె స్వస్థత కొరకు అడుగుచున్నాము.

తండ్రివైన దేవా, మేము మా సహోదరుడిపై చేతులుంచి, మేము, అతణ్ణి అభిషేకిస్తుండగా నీవు అతణ్ణి బాగుచేయుదువని, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము.

తండ్రీ, ఇక్కడ, అతని ప్రియమైన భార్య…?…ఆమెను అభిషేకించి, మరియు ఆమెపై చేతులుంచి, యేసుక్రీస్తు నామంలో దీనిని అడుగుచున్నాము.

924 ప్రభువైన దేవా, చిన్న ఈడిత్ ను మేము అభిషేకిస్తున్నాము, ఆమెపై చేతులుంచి, మరియు నీవు ఆమె విన్నపమును అనుగ్రహిస్తావని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము.

తండ్రి, ఆమె తల్లికి, మేము ఆమెను కూడా అభిషేకించి మరియు ఆమెపై చేతులుంచి మరియు ఆమె యొక్క స్వస్థత కొరకు అడుగుచున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ఆమె స్వస్థత పొందును గాక.

925 తండ్రీ, ఈ కుటుంబము యొక్క ప్రశస్తమైన ఈ చిన్ని రత్నమును, చిన్ని గుండె చప్పుడును, ప్రభువైన యేసు నామములో మేము అభిషేకిస్తున్నాము, ఒక రోజున ఆయనకు సమర్పించబడినది, మరియు నీవు దానిని స్వస్థపరుస్తావని నేను ప్రార్థిస్తున్నాను…?…

926 ఓ దేవా, మా సహోదరి యొక్క విన్నపము నీకు తెలియును మరియు ఈమె యొక్క దృఢమైన విశ్వాసానికై మేము నీకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు, ఆమె అడిగినట్టి ఆ సంగతులు, అవి…?…ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె ఎవరితోనైతే ఆడుకున్నదో, మరియు దేవా, శత్రువు ఆ స్త్రీని విడిచిపెట్టునుగాక మరియు ప్రభువా, ఆమె బాగయ్యి ఇంటికి వచ్చును గాక. ఈమె విన్నవించిన, ఆ వ్యక్తి కొరకు కూడా, మేము ప్రార్ధిస్తున్నాము, “మీరు నా నామమున ఏది అడిగినను, నేను దానిని చేతును,” అని నీవు వాగ్దానం చేసావు. నీవు ఈ విన్నపాన్ని అనుగ్రహిస్తావని, యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక.

927 ప్రభువా, నా సహోదరుడి నుదిటిలో ఈ నరము పనిచేయకపోవుచుండగా, జీవము మరలా పుంజుకోవాలని మేము అడుగుచున్నాము, అతని మీద మేము చేతులుంచగా, యేసు నామములో, ఆ నరము బాగవ్వాలని మేము అడుగుచున్నాము.

తండ్రివైన దేవా, మేము మా సహోదరిని నూనెతో అభిషేకించిన తర్వాత ఆమెపై చేతులుంచుచున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, మేము ఆమె స్వస్థత కొరకు అడుగుచున్నాము. ఆమేన్.

928 పరలోకపు తండ్రీ, నీవు అందించిన అనేక గొప్ప విజయాలకు మా సహోదరి నిలబడియుండగా, ఆమె నీ సేవకులలో ఒకరి కొరకు నిలబడుచున్నది, అతడొక సేవకుడు, ఎంతో ఒత్తిడితోనున్నాడు; మా హృదయంలో అతని కొరకు సానుభూతి కలిగియున్నాము అతడు ఎటువంటి పరిస్థితిగుండా వెళ్ళుచున్నాడో మాకు తెలుసు. దేవా, అతని కొరకు ఇక్కడ నిలబడినందున మా సహోదరిని నీవు అభిషేకిస్తావని మరియు అతని స్వస్థత కొరకు అతడిని అభిషేకిస్తావని, నేను ప్రార్థిస్తున్నాను. క్రీస్తు నామములో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్…?…ప్రభువునకు తెలుసు…?…

929 బాగున్నది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అది నిజంగా దేవుని యొక్క అభిషేకమైయున్నది. ప్రభువైన దేవా, ఈ స్త్రీ కొన్ని సంవత్సరాలుగా పోరాడినట్టి ఆ దయ్యము నుండి విడిపించబడిన తరువాత, ఒకరోజు నీవు ఆమెను అక్కడ ఆ ఇంటి ప్రక్కగా వచ్చేలా చేసావు మరియు అప్పుడు ఆత్మ దిగి వచ్చి, “యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు” అని చెప్పాడు, ఆమె ఏడ్చిన తర్వాత, ఆమె వేదిక మీద పడినది, ఆమెకు తెలిసినదంతా ఆమె చేసినది, అయితే దానికి యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు అవసరమైనది. ఇప్పుడు ఆమె, తన సోదరి యొక్క వాంతులు చేసుకుంటున్న బిడ్డ కొరకు వచ్చుచున్నది; ఇప్పటికే ఒక సంవత్సరం వయస్సు దాటి కూడా, ఇంకనూ నడవలేకపోవుచున్నది. ప్రభువా, నీవు యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆమెకు అనుగ్రహిస్తావని, నేను ప్రార్ధిస్తున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది, సహోదరి, భిన్నంగా కనిపిస్తున్నావు, కూడా. మరియు ఇప్పుడు నీవు మరణానికి ఎంతో దూరంలో ఉన్నావు, కదా?

తండ్రివైన దేవా, మేము మా సహూదరిని అభిషేకిస్తుండగా నీవు ఆమెను ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము మరియు ఆమెపై చేతులుంచి నీవు చెప్పిన ఈ విషయమును అడుగుచున్నాము అదేమనగా: “నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగులు మీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థత నొందుదురు.” ప్రభువా, మేము విశ్వాసులమని ఒప్పుకొనుచున్నాము, కావున నీవు ఏదైనా చేస్తావని, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము…?…

930 తండ్రివైన దేవా, ఈ దీనురాలు తన హృదయాన్ని కుమ్మరించియుండగా, దానిని ఎరిగియుండి, నీవు ఆమెను కరుణించి మరియు ఆమె అడిగిన విన్నపాన్ని అనుగ్రహిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. తండ్రివైన ఓ దేవా, ఆమె కుటుంబం కొరకు, ఆమె పిల్లల కొరకు, ప్రత్యేకించి, ఆమె కుమారుని కొరకు, దేవా, నీవు వీటిని అనుగ్రహిస్తావని, నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను…?…నా హృదయమంతటితో, యేసు నామములో, నేను దానిని అడుగుచున్నాను. ఆమేన్.

తండ్రివైన దేవా, మేము ఈ స్త్రీని నూనెతో అభిషేకిస్తుండగా, నీవు ఆమెను స్వస్థపరుస్తావని మరియు దేవుని మహిమార్థమై ఆమెను బాగుచేస్తావని, ప్రభువైన యేసు నామములో ఆమె కొరకు ప్రార్థించుచున్నాము.

931 మీ పేరు వెస్ట్ కాదు, కదా?

తండ్రీ, మేము ఈ దీన స్త్రీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఆమె తన తండ్రి కొరకు అడుగుచున్నది. ఇప్పుడు, నీవు ఆమె తండ్రిని అనుగ్రహిస్తావని నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా, అతని హృదయాన్ని పిలువుము. అతడు రక్షింపబడాలని ఆమె కోరుకుంటుంది. అతడు ఇప్పుడున్న విధంగా అతడు లోకములో ఉండాలని ఆమె కోరడంలేదు, ఆమె, అతని స్వంత కుమార్తె, అతని బిడ్డయైయున్నది. తండ్రీ, నీవు అతనిపై కనికరము చూపుతావని, క్రీస్తు నామములో, నేను ప్రార్థిస్తున్నాను.

932 నా కుమార్తె, నిన్ను దీవిస్తున్నాను, నీవు అడిగినదానిని, దేవుడు నీకు అనుగ్రహించును గాక.

ప్రియమైన దేవా, ఆమె పట్ల కనికరము కొరకు మేము ప్రార్థిస్తున్నాము, మరియు మేము ఆమెను అభిషేకిస్తుండగా, నీవు దయచూపుతావని మేము కోరుచున్నాము…?… 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...